breaking news
-
లవ్... లైట్స్... డైరెక్షన్ మా ఆయన చాలా సపోర్టివ్ : రాధికా శరత్ కుమార్
‘దీపావళి అంటే దీపాలు... రంగు రంగుల ముగ్గులు... లక్ష్మీ పూజ. టపాసులకు మాత్రం నేను దూరం’’ అంటున్నారు వరలక్ష్మీ శరత్‌కుమార్ (Varalaxmi Sarathkumar). అది మాత్రమే కాదు... తన జీవితంలో వెలుగులు నింపిన వ్యక్తి ఎవరో కూడా చె΄్పారు. ఈ విశేషాలతోపాటు దీపావళి ముచ్చట్లను ‘సాక్షి’తో వరలక్ష్మి ప్రత్యేకంగా పంచుకున్నారు. నా చిన్నప్పటి దీపావళి పండగలన్నీ నాకు తీపి గుర్తులే. పండగ అంటే నాకు ముఖ్యంగా నచ్చేది కుటుంబ సభ్యులందరం కలవడం. ఇక దీపావళి అంటే మాకు పిండి వంటలు మాత్రమే కాదు... బిర్యానీ కూడా. టపాసులు, బిర్యానీ... ఈ రెండూ ఉంటేనే నాకు పరిపూర్ణంగా పండగ జరుపుకున్నట్లు ఉంటుంది. నేను టపాసులు కాల్చను... జస్ట్ చూడడం వరకే. ఇప్పుడు ఈ దీపావళికి బిర్యానీ లాగించడానికి రెడీ అయిపోయాను (నవ్వుతూ).మా ఫ్యామిలీలో ఎవరు ఎంత బిజీగా ఉన్నా పండగల సమయంలో అందరం ఇంట్లో ఉండాలనే నియమం పెట్టుకున్నాం. నేను వేరే షూటింగ్స్‌తో బిజీగా ఉన్నప్పటికీ బ్రేక్ తీసుకుని, చెన్నై వెళ్లాను. నా పుట్టింటివాళ్లు, అత్తింటివాళ్లు, స్నేహితులు... ఇలా అందరం కలుసుకునేలా ఏర్పాట్లు చేసుకున్నాం. మాకు అత్తింటిల్లో దీ΄ావళి పండగకి ప్రత్యేకంగా ఆచరించాల్సిన నియమాలు ఏమీ లేవు. సో... చిన్నప్పట్నుంచి మా ఇంట్లో జరుపుకున్నట్లే అత్తింటికి వెళ్లిన తర్వాత కూడా జరుపుకుంటున్నాను.దీపావళి అంటే రంగు రంగుల లైట్లు... బోలెడన్ని పువ్వులు. చాలా చక్కగా అలంకరిస్తాం. ఉదయం లక్ష్మీ పూజ చేయడం నుంచి సాయంత్రం దీపాలు పెట్టడం వరకూ ఇంట్లో ఉన్న అందరం కలిసి అన్నీ చేస్తాం. చిన్నప్పట్నుంచి నేను క్రాకర్స్‌కి కాస్త దూరం అని చె΄్పాను కదా... నా హజ్బెండ్ నికొలయ్ సచ్దేవ్ (Nicholai Sachdev )కూడా క్రాకర్స్‌కి దూరమే. కుటుంబం అంతా పండగపూట కలిసి ఉండటం ఆయనకు ఇష్టం. ఇక టపాసులు కాల్చాలనే మా సరదా పర్యావరణానికి హాని కలిగించేదిగా ఉండకూడదన్నది మా ఇద్దరి ఒపీనియన్. నా జీవితంలో వెలుగులు నింపిన వ్యక్తి అంటే మా ఆయనే. ఎందుకంటే నిక్ నన్ను బాగా అర్థం చేసుకున్నారు. సపోర్టివ్‌గా ఉంటారు. డైరెక్షన్ చేయాలనే నా ఇష్టం తెలిసి, చేయమని ఆయనే ఎంకరేజ్ చేశారు. నిక్ నన్ను ప్రేమించడంతో పాటు నా మాటలకు విలువ ఇస్తారు. భార్యాభర్తల మధ్య ప్రేమతో పాటు ఒకరంటే మరొకరికి గౌరవం ఉండాలి. అప్పుడే ఆ బంధం బాగుంటుంది. చదవండి: పనిమనిషి జీతం రూ. 45 వేలు : అంత అవసరమా, నెట్టింట చర్చ! -
పరమ పవిత్రం.. కార్తీకం
హిరమండలం: పరమ పవిత్రమైన కార్తీక మాసం రానే వస్తోంది. ఈ నెల రోజులూ దైవ భక్తిలో ఉంటే ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖసంతోషా లు కలుగుతాయన్నది భక్తుల ప్రగాడ విశ్వాసం. ఈ మాసంలో దీపారాధనకు అనేక శుభ ఫలితాలు కలుగుతాయని నమ్ముతారు. దీపాన్ని దైవ స్వరూపంగా భావించి పూజలు చేస్తారు. కార్తీక సోమవారాల్లో చేసే దీపారాధన, ఉసిరి చెట్టు కింద పూజలు, వనభోజనాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని పండితులు చెబుతున్నారు. అక్టోబర్ 22 నుంచి ప్రారంభమయ్యే కార్తీక మాసంలో నాలుగు వారాలు ఈ పూజలు కొనసాగుతాయి. దీపారాధన ప్రత్యేకత కార్తీక మాసంలో ఒక్కో రకమైన ప్రమిదలో దీపం వెలిగిస్తే ఒక్కో రకమైన మంచి జరుగుతుందని నమ్ముతారు. మట్టి ప్రమిదలో వెలిగిస్తే దైవానుగ్రహం కలుగుతుందని, పింగాణి ప్రమిదలో దీపం వెలిగిస్తే ఆ ఇంటి వారికి అలంకరణ వస్తువులు సమకూరుతాయని, ఇత్తడి ప్రమిదలో దీపాలు వెలిగిస్తే ఆ ఇంట్లో దైవశక్తి అధికవవుతుందని, కంచు ప్రమిదలో వెలిగిస్తే ఆయుష్సు పెరుగుతుందని పెద్దలు చెబుతుంటారు. నిమ్మ ప్రమిదల్లో వెలిగిస్తే అన్ని కార్యాల్లోని విజయం సిద్ధిస్తుందని, అరటి దోనెలో దీపం వెలిగించి నీటిలో వదిలితే మానసిక సంతృప్తి, ధన రక్షణ కలుగుతుందని, ఉసిరికాయల దీపం వెలిగిస్తే పాపాలు తొలగిపోతాయని కూడా చాలా మంది విశ్వసిస్తారు. శివకేశవులకు సమప్రాధాన్యం కార్తీకమాసం శివుడికి, విష్ణువుకి ప్రతీకరమైంది. అందుకే ఈ మాసం ప్రతి సోమవారం శివుడికి, ప్రతి శుక్ర, శని వారాల్లో విష్ణుమూర్తికి ప్రత్యేక పూజ లు చేస్తారు. శివపార్వతుల పుత్రుడైన అయ్యప్ప దీక్షలు ఈ మాసంలోనే ప్రారంభమవుతాయి. శివుడికి రుద్రాబిషేకం, బిళ్వార్చన, విష్ణువుకి తులసీ దళార్చన ఈ మాసంలోనే అత్యంత భక్తిశ్రద్దలతో నిర్వహిస్తారు. లక్ష్మీదేవి, కార్తికేయుడు, చంద్రుడు, ఇంద్రుడు, తులసిమాత, ఉసిరి చెట్టుకు ప్రత్యేక పూజలు చేయడం కూడా ఆనవాయితీగా వస్తోంది.సంపూర్ణ ఆరోగ్యం కార్తీక మాసం చాలా పవిత్రమైన మాసం. ఈ నెల రోజుల పాటు దీపారాధన చేస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయి. దీపారాధన ద్వారా ప్రశాంతత చేకూరుతుంది. – పి.లావణ్య, యంబరాంమానసిక ప్రశాంతత నెలరోజుల పాటు ఆలయాల్లో దీపారాధన చేయడం వల్ల మనసుకు ప్రశాంతత లభిస్తుంది. కుటుంబంలో సుఖశాంతులు లభిస్తాయి. – కె.రోజా, కోవిలాం, ఎల్‌ఎన్‌పేట -
దీపావళి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
సాక్షి, ఢిల్లీ: దేశవ్యాప్తంగా దీపావళి సందడి కొనసాగుతోంది. ఈ సందర్బంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. దేశ ప్రజలకు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా..‘దీపావళి వెలుగుల పండగ మన జీవితాలను సౌభాగ్యంతో, సంతోషంతో నింపాలి. సానుకూలత మన చుట్టూ వ్యాపించాలి’ అని పోస్ట్‌లో పేర్కొన్నారు.ఇదిలా ఉండగా.. దీపావళిని పురస్కరించుకుని అయోధ్య నగరం దీపకాంతులతో వెలిగిపోయింది. తొమ్మిదవ దీపోత్సవంలో భాగంగా సరయూ నదీ తీరం వెంబడి ఈ ఏడాది 26 లక్షల 17 వేలకు పైగా దీపాలు వెలిగించారు. ఏకకాలంలో 2 వేల 128 మందితో హారతి నిర్వహించారు. ఈ రెండూ గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కినట్లు ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది. పెద్దఎత్తున భక్తులతో నదీ తీరంలోని ఘాట్లు కిటకిటలాడాయి. రామ్‌లీలా వంటి సాంస్కృతిక ప్రదర్శనలు, లేజర్ షో విశేషంగా ఆకట్టుకున్నాయి. రామ్ కీ పైడీ ఘాట్‌లో ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ హారతి నిర్వహించారు.Greetings on the occasion of Diwali. May this festival of lights illuminate our lives with harmony, happiness and prosperity. May the spirit of positivity prevail all around us.— Narendra Modi (@narendramodi) October 20, 2025 2.6 million lamps light up Ayodhya, Indiapic.twitter.com/1acBsbRCBr— Massimo (@Rainmaker1973) October 20, 2025 -
ఆ ఊళ్లే దీపావళి
గార, టెక్కలి: శ్రీకాకుళం జిల్లాలో దీపావళి పేరిట రెండు గ్రామాలు ఉన్నాయి. గార మండలంలోని ఓ గ్రామం ఉంటే.. టెక్కలి మండలంలో మరో గ్రామం ఉంది. గార మండలంలోని దీపావళి గ్రామానికి ఆ పేరు రావడానికి ఓ కథ ప్రచారంలో ఉంది. దాని ప్రకారం.. ఓ కళింగ రాజు ఇటుగా వస్తూ ఈ గ్రామానికి దీపావళి అనే పేరు పెట్టారు. అప్పటి వరకు ఈ ప్రాంతాన్ని గూడెం అని పిలిచేవారట. ఆ రాజు ప్రతి రోజూ శ్రీకాకుళం నుంచి శ్రీకూర్మం వరకు గుర్రంపై వెళ్లేవారట. మార్గం మధ్యలో లక్ష్మీనారాయణ స్వామి ఆలయం వద్ద ఆగి స్వామిని దర్శించుకునేవారు. ఒక రోజు శ్రీకూర్మం వెళ్లి వస్తూ ఇక్కడ సొమ్మసిల్లి పడిపోయారు. ఇక్కడి వారు ఆయనకు సాయం చేయగా కోలుకున్నారు. ఊరి వారిని గ్రామం పేరు అడగ్గా పేరేమీ లేదని చెప్పారు. ఆ రోజు దీపావళి కావడంతో ఆ ఊరికి దీపావళి అనే పేరును పెట్టారు. రెవెన్యూ రికార్డుల్లోనూ ఈ పేరే ఉంది. టెక్కలి మండలం అయోధ్యపురం పంచాయతీ పరిధిలో ‘దీపావళి’ గ్రామం ఒకటి. టెక్కలి నుంచి బన్నువాడ గ్రామం మీదుగా సుమారు 7 కిలోమీటర్ల దూరంలో మారుమూల ప్రాంతంలో ఈ దీపావళి గ్రామం ఉంది. పండగ పేరుతో ఉన్న ఈ గ్రామంలో మొత్తం 50 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. దీపావళి పేరుతో గ్రామానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. -
Income tax: కొత్త చట్టం వస్తోంది కానీ...
ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు.. ఆదాయపన్ను చట్టం 1922, ఆ తరువాత చట్టం 1961 ... ఇప్పుడు కొత్తం చట్టం 2025 పేరుతో వస్తోంది. ఈ ఏడాది ఆగస్టులో రాష్ట్రపతి ఆమోదముద్ర పొందిన ఈ చట్టం 1.4.2026 నుంచి అమల్లోకి రానుంది. కొత్త చట్టం అత్యంత సరళీకృతంగా ఉంది. నిడివి, సెక్షన్లు తగ్గించారు. ‘పన్ను సంవత్సరం’ అనే కొత్త నిర్వచనంతో వర్చువల్ డిజిటల్ ఆస్తులను కూడా కలుపుతూ, సెర్చ్, సీజర్ అధికారాలను విస్తృత పరుస్తూ, ఎన్నో సంస్కరణలతో రూపుదిద్దుకొని ఇది ముస్తాబయింది.ఈ సంవత్సరంలో అన్నీ పూర్తయినా, అమలు మాత్రం 1.4.2026 నుండే ఉంటుంది. అయితే 2025 బడ్జెట్లో తెచ్చిన మార్పులు 2025–26 ఆర్థిక సంవత్సరంలో వర్తిస్తాయి. 2026లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో కొన్ని మార్పులు రావడం సహజం. ముఖ్యంగా బేసిక్ లిమిట్, మినహాయింపులు, శ్లాబులు, రేట్లు, ఇవి రావచ్చు. లేదా రాకపోవచ్చు. వచ్చేవి వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి వస్తాయి. వాటి గురించి ఇప్పుడు ఆలోచించడం అనవసరం. కొత్త విధానాన్ని ప్రతిపాదించినప్పటి నుంచే ప్రభుత్వం దాన్ని సమర్థిస్తూ, వెనకేసుకొస్తోంది. మధ్య తరగతి వర్గాన్ని దృష్టిలో పెట్టుకొని శ్లాబులు, రేట్లు తెచ్చారు. దీని ప్రకారం రూ.12,00,000కు పన్ను ఉండదు. శ్లాబులు మార్చారు. రేట్లు మారాయి.రూ.12,00,000 ఆదాయాల విషయంలో శ్లాబులను మార్చకుండా రిబేటును 87 అ ప్రకారం రూ.60వేల వరకు పెంచి ఎంతో ఉపశమనం ఇచ్చారు. నికర ఆదాయం పెరిగితే వైకుంఠపాళి ఆటలో పాము నోట్లో పడినట్లే. శ్లాబుల వారీగా పన్ను కట్టాల్సి వస్తోంది. సాండర్డ్ డిడక్షన్ని కొత్త విధానంలో రూ.75వేలకు పెంచారు.ఈ ఆర్థిక సంవత్సరం నుంచి వ్యక్తులు రెండు సొంత ఇళ్ల మీద పన్ను కట్టాల్సిన అవసరం లేదు. గతంలో ఒక ఇంటికే ఉన్నా.., ఇప్పుడు మినహాయింపుని రెండో ఇంటికీ కల్పించారు.కొత్త విధానంలో ఫ్యామిలీ పెన్షను మినహాయింపుని రూ.25వేలకు పెంచారు. గతంలో ఇది రూ.13,000గా ఉండేది. ఈ విధంగా కొత్త విధానాన్ని సమర్ధిస్తూ.., ఉపశమనం ఇచ్చారు. కొత్త విధానం కొంగు బంగారం అయ్యింది. ఆర్థికపరంగా ఎందరో చిన్న చిన్న అస్సెస్సీలకు పెద్ద రిలీఫ్ ఇచ్చారు. టాక్స్ ప్లానింగ్ పేరుతో ఎటువంటి అక్రమ మార్గాలకు పాల్పడకుండా రాచమార్గంలో రాజహంసలాగా రాజీ పడకుండా, రాంగ్ రూటు వెళ్లకుండా రైట్వే ఇది. యూలిప్ ద్వారా వచ్చే మొత్తాలను క్యాపిటల్ గెయిన్ పరిధిలోకి తీసుకొచ్చారు. మొదటి రూ.25వేలకు మినహాయింపు ఉంది. టీడీఎస్ (టాక్స్ డిడక్షన్ సోర్స్) వర్తించే విషయాల్లో పరిమితిని పెంచారు. దానివల్ల కొంతమంది టీడీఎస్‌కి గురికారు. విదేశాల చెల్లింపుల్లో వర్తించే టీసీఎస్(టాక్స్ కలెక్టెడ్ సోర్స్) విషయంలో పరిమితి పెంచారు.కొన్ని వస్తువుల అమ్మకపు విషయంలో పరిమితి రూ.50,00,000 ఇక నుంచి లేదు.అప్డేటెడ్ రిటర్నులను ఫైల్ చేసుకోవడానికి 24 నెలల నుంచి 48 నెలలకు వెనక్కి వెళ్లవచ్చు. ఇది మంచి అవకాశం. అయితే షరతులకు లోబడి మాత్రమే.రిటర్నులు వేయనివారిని నాన్ఫైలర్స్ అంటారు. గతంలో ఎక్కువ టీడీఎస్/టీసీఎస్ రేట్లు వేసేవారు. ఇప్పుడు ఆ వివక్ష లేదు.భాగస్వాములకు చెల్లించే చెల్లింపుల మీద టీడీఎస్ ప్రవేశపెట్టారు. నాన్ రెసిడెంట్లకి సంబంధించి కొన్ని డిజిటల్ వ్యవహారాల మీద వేసే పన్ను 6% ఎత్తివేశారు. ఈ మార్పులను పెట్టుకొని టాక్స్ ప్లానింగ్ వైపు అడుగులు వేయండి. -
ఒక్కరాత్రిలోనే ఫ్యామిలీ అంతా కోల్పోయింది.. ఎవరికీ తెలీదు!
ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని (Ram Pothineni) చాలాకాలంగా వరుస ఫెయిల్యూర్స్ అందుకుంటున్నాడు. అందుకే, ఈసారి 'ఆంధ్ర కింగ్ తాలుకా' సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితో ఉన్నాడు. పి. మహేశ్‌బాబు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నవంబర్ 28న విడుదల కానుంది. ఇదలా ఉంటే సీనియర్ నటుడు జగపతిబాబు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న 'జయమ్ము నిశ్చయమ్మురా' షోకి హాజరైన రామ్.. తన కుటుంబం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.ఒక్కరాత్రిలోనే అంతా పోయిందిరామ్ మాట్లాడుతూ.. నా కుటుంబం గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. అమ్మది హైదరాబాద్, నేనిక్కడే పుట్టాను. నాన్నది విజయవాడ. 1988లో కుల ఘర్షణలు జరిగి చాలా పెద్ద గొడవలు జరగాయి. అప్పుడే నాన్న జపాన్ నుంచి తిరిగొచ్చాడు. ఆ గొడవల్లో మా కుటుంబం అంతా కోల్పోయింది. ఒక్క రాత్రిలోనే మళ్లీ జీరోకు వచ్చేశాం. ఇక విజయవాడలో ఉండటం సరికాదని భావించి చెన్నై షిఫ్ట్ అయ్యాం. సర్వం పోగొట్టుకున్న నాన్న మళ్లీ మొదటి నుంచి ప్రారంభించాడు. కిందనుంచి పైకి రావడం వేరు.. కానీ కింది నుంచి పైకొచ్చి, అంతా పోగొట్టుకుని ఇంకో సిటీకి వెళ్లి మళ్లీ లైఫ్ స్టార్ట్ చేయడం వేరు.లగ్జరీ ఇంటి నుంచి..అందుకే నాన్నంటే నాకు ఎనలేని గౌరవం. నేను గోల్డెన్ స్పూన్‌తో పుట్టాను.. మధ్యలో అంతా పోగొట్టుకున్నాను.. నాన్న కష్టం వల్ల మళ్లీ ఒకప్పటి స్థాయికి చేరుకున్నాను. అందుకు మీకో ఉదాహరణ చెప్తా.. విజయవాడలోని మా ఇంట్లో నాకు పెద్ద బొమ్మల గదుండేది. చెన్నైకి షిఫ్ట్ అయ్యాక మేమున్న ఇల్లు.. నా బొమ్మల గదిలో సగం కూడా లేదు. లగ్జరీ భవంతి నుంచి చిన్న ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. అప్పుడు నాన్న జీతం రూ.4-5 వేలుండేది అని రామ్ పోతినేని చెప్పుకొచ్చాడు.చదవండి: నా కుమారుడి కెరీర్.. అక్కగా తనే చూసుకుంటుంది: రవితేజ -
కారులో వచ్చి 50 కోతులు కొన్న వ్యాపారి.. ఎన్ని లక్షలంటే?
వరంగల్ అర్బన్: వరంగల్ మహానగర పాలక సంస్థ పరిధిలోని కోతులను పట్టుకున్న కాంట్రాక్టర్ హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపారికి విక్రయించినట్లు ఆదివారం సోషల్ మీడియా లో వైరల్ అయ్యింది. ఎర్టిగా కారులో ఒకరు 50 కోతులకు ఓ కాంట్రాక్టర్‌కు రూ.2 లక్షల వరకు సొమ్ము చెల్లించి తరలించినట్లు విశ్వస నీయ వర్గాల ద్వారా తెలిసింది. పట్టుకున్న కోతులను ఏటూరునాగారం అడవుల్లోకి తర లించాల్సిన కాంట్రాక్టర్ వ్యాపారికి విక్రయిస్తు న్నారనే సమాచారం మేరకు ఓ జర్నలిస్టు బల్దియా ప్రధాన కార్యాలయాన్ని సందర్శించగా.. కుక్కలను వదిలి భయభ్రాంతులకు గురిచేసినట్లు సమాచారం. కోతుల విక్రయాలకు సంబంధించిన కార్యకలాపాలు బల్దియా ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూం సీసీ కెమెరాల్లో రికా ర్డు అయినట్లు చర్చ జరుగుతోంది. ఈవిషయ మై సీఎంహెచ్ఓ రాజారెడ్డిని వివరణ కోరగా.. తనకు కూడా సమాచారం అందిందని, సోమ వారం ఉదయం బల్దియా ప్రధాన కార్యాల యంలోని సీసీ కెమెరాలను పరిశీలించి వివరా లు వెల్లడిస్తామని పేర్కొన్నారు. ఒకవేళ కోతు లను విక్రయించినట్టు తేలితే సదరు కాంట్రాక్ట ర్‌పై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. -
తమిళనాడులో కుండపోత వర్షం.. చెన్నై పరిస్థితి దారుణం..
చెన్నై: తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా చెన్నైలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. చెన్నై విమానాశ్రయంలో రన్‌వేపైకి నీళ్లు చేరడంతో ఎక్కడికక్కడే విమానాలు నిలిచిపోయాయి. విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.ఆదివారం రాత్రి నుంచి తమిళనాడులోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. దీంతో, నగరంలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. తూర్పు తీర రోడ్డు (ECR) వెంబడి ఉన్న వేలచేరి, మేదవాక్కం, పల్లికరణై, నీలంకరై ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా రోడ్లు దెబ్బతిన్నాయి. రహదారులపై నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దక్షిణ చెన్నైలోని అనేక ప్రాంతాల్లో ప్రయాణికులు మోకాలి లోతు నీటితో ఇబ్బంది పడ్డారు. వర్షాల నేపథ్యంలో జాగ్రత్త వహించాలని అధికారులు కోరారు.మరోవైపు.. భారీ వర్షం నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అధికారులతో సమావేశం అయ్యారు. ఎప్పటికప్పుడు పరిస్థితులను ఆరా తీశారు. ప్రజలకు అన్ని రకాల సదుపాయాలు అందించాలని ఆదేశించారు. Heavy rain @aaichnairport. The runways are water-logged. @NewIndianXpress @ChennaiRains @praddy06 @IMDWeather #Chennaiairport #TamilNadu #ChennaiRains pic.twitter.com/lxlx6bdLYe— S V Krishna Chaitanya (@Krish_TNIE) October 20, 2025భారత వాతావరణ శాఖ (IMD) తాజా అంచనా ప్రకారం.. చెన్నై, చెంగల్పట్టు, కడలూరు, తంజావూరు, తిరువారూర్, నాగపట్నం, పుదుచ్చేరి, కారైకల్, పరిసర జిల్లాల్లో రాబోయే కొన్ని గంటల్లో ఉరుములతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అక్టోబర్ 22 వరకు తమిళనాడు తీరప్రాంతంలో వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.@ChennaiRains @RainStorm_TN Heavy rains with gusty wind at Thoraipakkam #wetdiwali pic.twitter.com/rMl98JVZwV— Lakshmanan S (@Laxman190566) October 20, 2025కొండ ప్రాంతాలైన నీలగిరి, కల్లార్, కూనూర్ మధ్య కొండచరియలు విరిగిపడటంతో నీలగిరి మౌంటైన్ రైల్వే (NMR)లో రైలు సర్వీసులు రద్దు చేసింది. చెట్లు కూలిపోవడం వల్ల ఈ మార్గంలో రాకపోకలకు అంతరాయం కలిగిందని దక్షిణ రైల్వే తెలిపింది. అక్టోబర్ 19న మెట్టుపాళయం–ఉదగమండలం (రైలు నం. 56136 మరియు 06171), ఉదగమండలం–మెట్టుపాళయం (రైలు నం. 56137) సహా మూడు రైళ్ల సర్వీసులను నిలిపివేశారు. Heavy rain on the bypass road in Chinnamanur, Theni districtand drizzling continues @ChennaiRains @MasRainman @RainStorm_TN @kalyanasundarsv @praddy06 pic.twitter.com/tudC0r5Gbn— Michael 🌿 (@michaelraj_GD) October 19, 2025 -
విలక్షణం, విశిష్టం 'కుమార్ సాను' గాత్రం!
(అక్టోబర్ 20 ప్రముఖ గాయకుడు 'కుమార్ సాను'(Kumar Sanu) పుట్టినరోజు)“సాంసోం కీ జరూరత్ హై జైసే జిందగీ కే లియేబస్ ఎక్ సనమ్ చాహియే ఆషికీ కే లియే!”80s కిడ్స్‌కి పరిచయం అక్కర్లేని పాట ఇది. ఈ పాట పాడినవారికి కూడా పరిచయం అక్కర్లేదనుకోండి! దశాబ్దానికి పైగా బాలీవుడ్ సినీ సంగీతాన్ని ఏలిన మెలోడీ కింగ్ కేదార్ నాథ్ భట్టాచార్య ఉరఫ్ కుమార్ సాను పాడిన పాట ఇది.నదీమ్-శ్రవణ్‌తో స్వర ప్రయాణం:నదీమ్-శ్రవణ్ జోడీతో కలిసి 'కుమార్ సాను'(Kumar Sanu) పాటలు పాడిన కాలాన్ని బాలీవుడ్ కి స్వర్ణ యుగంగా చెప్పకోవచ్చు. ‘ఆషికీ’లో ప్రతి పాటా ఎన్ని వందలసార్లు విన్నా ఎప్పటికీ పాతబడదు. ‘సాంసోంకీ జరూరత్’, ‘తూ మేరీ జిందగీ హై’, ‘నజర్ కే సామ్ నే’ ఎంత మెలోడీయస్ గా ఉంటాయో ‘అబ్ తేరే బిన్’ అంత ఆవేశపరుస్తుంది. కాబట్టే ఈ పాట కుమార్ సానుకి ఫిలింఫేర్ అవార్డు తెచ్చి పెట్టింది. 1991లో ఈ పాటకుగాను మొదటిసారి ఫిలింఫేర్ అవార్డు అందుకున్న కుమార్ సాను వరసగా ఐదేళ్ళు, అంటే 1995 వరకు ఈ అవార్డు అందుకుంటూనే ఉన్నారు. ‘సాజన్’లోని ‘మేరా దిల్ భీ కిత్నా పాగల్ హై’ కుమార్ సాను ఫిలింఫేర్ అవార్డు గెలుచుకున్న పాటల్లో ఒకటి. గొంతులో ఒక రకమైన జీరతో, నాసల్ వాయస్లో పాడే కుమార్ సాను మెలోడీస్ వింటే చాలు అప్పట్లో సంగీత ప్రియుల గుండెలు విలవిల్లాడిపోయేవి. ‘దిల్ హై కె మాన్తా నహీ’ టైటిల్ సాంగ్, ‘తుమ్హే అప్నా బనానే కీ కసమ్’ (సడక్), ‘ధీరే ధీరే ప్యార్ కో బఢానా హై’ (ఫూల్ ఔర్ కాంటే), ‘గవా హై చాంద్ తారే’ (దామిని), ‘సోచేంగే తుమ్హే ప్యార్ కర్కే నహీ’ (దీవానా), ‘ఘూంఘట్ కీ ఆడ్ సే’ (హమ్ హై రాహీ ప్యార్ కే), ‘పర్ దేసీ జానా నహీ’ (రాజా హిందూస్తానీ), ‘దో దిల్ మిల్ రహే హై’, ‘మేరీ మెహబూబా’ (పర్ దేస్)- ఇలా నదీమ్-శ్రవణ్ స్వరపరిచిన పాటలను కుమార్ సాను తన గొంతుకతో ఎవర్ గ్రీన్ హిట్స్ గా మలిచారు. మొత్తమ్మీద ఈ జోడీ కాంబినేషన్ లో కుమార్ సాను 300 దాకా పాటలు పాడారు. అను మల్లిక్‌తో :నదీమ్ శ్రవణ్ తర్వాత కుమార్ సాను ఎక్కువగా పని చేసింది అను మల్లిక్ కే. ‘బాజీగర్’ కోసం కుమార్ సాను పాడిన ‘యే కాలీ కాలీ ఆంఖే’ ఫిలింఫేర్ సాధించుకుంది. అనుమల్లిక్ స్వర కల్పనలో కుమార్ సాను ‘చురాకే దిల్ మేరా’ లాంటి ఎన్నో హిట్ నంబర్స్ పాడారు. ‘దిల్ జలే’ లోని ‘జిస్కే ఆనే సే’ అనే పాట లిరిక్స్, కంపోజిషన్ పరంగా ‘ఎక్ లడ్కీ కో దేఖా తో’ పాటను పోలి ఉన్నా దానికి వచ్చినంత గుర్తింపు అయితే రాలేదు. కానీ కుమార్ సాను పాడిన క్లాసిక్ సాంగ్స్ లో ఇదీ ఒకటి. 1990ల నాటి బ్యాక్ గ్రౌండ్ తో ఆయుష్మాన్ ఖురానా, భూమి పడ్నేకర్ హీరో హీరోయిన్లుగా 2015లో వచ్చిన సినిమా ‘దమ్ లగాకే హైషా’. 90ల నాటి సినిమా గనక నేచరల్ గానే ఇందులోని హీరో హీరోయిన్లకు కుమార్ సాను పాటలంటే పిచ్చి అన్నట్లు చూపిస్తారు. ఈ సినిమాలో అను మల్లిక్, కుమార్ సానుతో రెండు పాటలు పాడించారు. ఒక పాటలో ఆయన కేమియో అప్పియరెన్స్ కూడా ఇచ్చారు. జతిన్-లలిత్‌తో:జతిన్-లలిత్ కాంబినేషన్ లో కుమార్ సాను పాడిన మెలొడీలు శ్రోతలను తన్మయత్వంలో ఓలలాడిస్తాయి. "దిల్ వాలే దుల్హనియా లేజేయేంగే" కోసం కుమార్ సాను లతా మంగేష్కర్ తో కలిసి పాడిన ‘తుఝే దేఖా తో యే జానా సనమ్’ ఇప్పటికైనా ఎప్పటికైనా మర్చిపోగలమా? ‘సీనే మే దిల్ హై’, ‘తు మేరే సాథ్ సాథ్’ (రాజు బన్ గయా జంటిల్ మ్యాన్), ‘ఐ కాష్ కే హమ్’(కభీ హా కభీ నా), ‘మై కోయీ ఐసా గీత్ గావూ’, ‘ఏక్ దిన్ ఆప్’(యస్ బాస్),‘దుష్మన్’ కోసం లతా మంగేష్కర్తో కలిసి పాడిన ‘ప్యార్ కో హో జానే దో’ లాంటి పాటలు షారుఖ్ ఖాన్ కెరీర్ లో మైలురాళ్ళ లాంటివి. కానీ జతిన్ లలిత్ కాంబినేషన్ లో కుమార్ సాను పాడిన ‘జబ్ కిసీ కీ తరఫ్’ (ప్యార్ తో హోనా హీ థా) వీటన్నింటినీ మించిన ఆల్ టైం హిట్. ఇక ‘ఖూబ్ సూరత్’సినిమా కోసం కవితా కృష్ణమూర్తితో కలిసి కుమార్ సాను పాడిన‘మేరా ఎక్ సప్నా హై’వింటే కలల్లో తేలిపోవడం ఖాయం. రాజేశ్ రోషన్‌తో:‘జబ్ కోయి బాత్ బిగడ్ జాయే’ – జుర్మ్ సినిమా కోసం రాజేశ్ రోషన్ మ్యూజిక్ డైరెక్షన్ లో కుమార్ సాను పాడిన ఈ పాట ఎవర్ గ్రీన్ హిట్. ఆ తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్ లో ‘కరణ్ అర్జున్’, ‘సబ్సే బడా ఖిలాడీ’, ‘కోయ్ లా’, ‘క్యా కెహ్ నా’ లాంటి సినిమాలు వచ్చాయి. 1996లో వచ్చిన ‘పాపా కెహ్తే హై’ అట్టర్ ఫ్లాప్ సినిమా. కానీ రాజేశ్ రోషన్ పాటలు మాత్రం సూపర్ హిట్. ఇందులో ఉదిత్ నారాయణ్ పాడిన ‘ఘర్ సే నికల్తే హీ’తో పాటు కుమార్ సాను పాడిన ‘యే జో థోడే సే హై పైసే’, ‘ప్యార్ మే హోతా హై క్యా జాదూ’ పాటలు చాలా కాలం పాటు గుర్తుండిపోతాయి. ఇక ‘కహో నా ప్యార్ హై’లో కుమార్ సాను పాడిన ‘చాంద్ సితారే’ చాలా ఎలిగెంట్ గా అనిపిస్తుంది. ఆర్డీ బర్మన్తో: 1995కిగాను ‘ఎక్ లడ్కీ కో దేఖా తో’ (1942 ఎ లవ్ స్టోరీ) అనే పాట కుమార్ సానుకి ఫిలింఫేర్ సాధించింది. ఆర్డీ బర్మన్ చివరిసారిగా కంపోజ్ చేసిన ఈ పాట కుమార్ సాను జర్నీకి ఒక క్లాసిక్ టచ్ ఇచ్చింది. సంగీతం, స్వరం, విధు వినోద్ చోప్రా పిక్చరైజేషన్తో పాటు జావేద్ అఖ్తర్ లిరిక్స్ వల్ల ఈ పాట అప్పట్లో పెను సంచలనం సృష్టించింది. ఇదే సినిమాలో కుమార్ సాను పాడిన ‘కుఛ్ నా కహో’ చాలా హాయిగా అనిపిస్తుంది. ఎ. ఆర్. రెహమాన్‌తో సింగిల్ సాంగ్! ఎందుకంటే...:ఉదిత్ నారాయణ్ లాంటి సింగర్స్ తో ఎన్నో పాటలు పాడించిన రెహమాన్, కుమార్ సానుతో ఒకే ఒక్క పాట పాడించడం జీర్ణం కాదు. ‘కభీ న కభీ’ లో ‘మిల్ గయీ మిల్ గయీ’ అనే ఈ పాట ‘అంజలి అంజలి పుష్పాంజలి’ అనే పాట ట్యూన్ లో సాగుతుంది. ఒక ఇంటర్ వ్యూలో రహమాన్ని అసలు మ్యూజిక్ డైరెక్టర్ గానే గుర్తించను అని కుమార్ సాను చెప్పారు. ఎందుకని అడిగితే ఆయన నన్ను సింగర్ గా గుర్తించలేదు కాబట్టి అని సమాధానమిచ్చారు. ఈ మాటలు వింటే ఇద్దరికీ ఎక్కడో కుదరలేదని అర్థమవుతుంది.బెస్ట్ కో-సింగర్ ఎవరంటే...: కుమార్ సాను లతా మంగేష్కర్, అనురాధా పౌడ్వాల్, సాధనా సర్గమ్ లాంటి సింగర్స్ తో కలిసి ఎన్ని పాటలు పాడినా అల్కా యాగ్నిక్ తో పాడిన పాటలు వింటే మాత్రం తేనెలో ముంచి తేల్చినట్లే అనిపిస్తుంది. ‘ముఝ్ సే మొహబ్బత్ కా’, ‘యే ఇష్క్ హై క్యా’, ‘తేరీ మొహబ్బత్ నే’, ‘హమ్ కో సిర్ఫ్ తుమ్ సే ప్యార్ హై’, ‘జాదూ హై తేరా హీ జాదూ’, ‘జో హాల్ దిల్ కా’ లాంటి పాటలు ఈ కాంబినేషన్‌కి గొప్ప ఉదాహరణలు. కుమార్ సాను పేరు వెనక కథ:కుమార్ సానుకి లెజెండరీ సింగర్ కిశోర్ కుమార్ అంటే గొప్ప గౌరవం. 1983లో సాను భట్టాచార్యగా బెంగాలీలో సింగింగ్ కెరీర్ ఆరంభించిన కేదార్ నాథ్ భట్టాచార్య, 1988లో ‘హీరో హీరాలాల్’ అనే హిందీ సినిమాలో తొలిసారి పాడారు. 1989లో జగ్ జీత్ సింగ్ ఆయన్ను కల్యాణ్ జీ-ఆనంద్ జీ జోడీలోని కల్యాణ్ జీకి పరిచయం చేశారు. వాళ్ళ సూచనతో కిశోర్ కుమార్ పేరులోని కుమార్ కి ‘సాను’ కలిపి కుమార్ సాను గా తన పేరు మార్చుకున్నారు. అంతే కాదు ‘కిశోర్ కుమార్ కీ యాదే’ పేరుతో కిశోర్ దా పాపులర్ సాంగ్స్ పాడుతూ ఒక ఆల్బమ్ కూడా రిలీజ్ చేశారు.కుమార్ సాను తెలుగులో ఏ పాటలు పాడారంటే...:మన తెలుగులోనూ కుమార్ సాను ‘దేవుడు వరమందిస్తే’, ‘మెరిసేటి జాబిలి నువ్వే’, ‘ఒక్కసారి చెప్పలేవా’, 'నీ నవ్వులే వెన్నలని' లాంటి హిట్ సాంగ్స్ పాడారు. ఆయన విలక్షణమైన గొంతుక తెలుగువారికి బాగా నచ్చేసింది. కుమార్ సాను సెకండ్ ఇన్నింగ్స్:2004లో పాలిటిక్స్ లోకి వెళ్ళిన కుమార్ సాను ఎనిమిదేళ్ళ తర్వాత మళ్ళీ సినిమాల్లోకి తిరిగి వచ్చారు. ‘రౌడీ రాథోడ్’, ‘గన్స్ & గులాబ్స్’ లాంటి సినిమాల్లో పాడారు. అక్టోబర్ 20, 1957లో పుట్టిన కుమార్ సానుకి ఇప్పుడు 68 ఏళ్ళు. ఈ వయసులోనూ ఆయన గొంతు ఏమాత్రం చెక్కుచెదరలేదు. ఈ మధ్యనే ‘కుమార్ సాను అఫీషియల్’ పేరుతో యూట్యూబ్‌లో ఆయన సొంత మ్యూజిక్ లేబుల్ ఒకటి ప్రారంభించారు. అందులోని పాటలు వింటే ఈ విషయం అర్థమవుతుంది.మొత్తం ఎన్ని పాటలు పాడారంటే...:కుమార్ సాను మాతృభాష అయిన బెంగాలీతో పాటు హిందీ, తెలుగు సహా 16కి పైగా భాషల్లో పాటలు పాడారు. ఒకే రోజు 28 పాటలు పాడిన గాయకుడిగా గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించుకున్నారు. బీబీసీ రూపొందించిన ‘ఆల్ టైం 40 సాంగ్స్ ఆఫ్ బాలీవుడ్’లో కుమార్ సాను పాటలే ఎక్కువగా కనిపిస్తాయి. 2009లో పద్మశ్రీ అందుకున్నారు. మెలోడీ కింగ్ అని శ్రోతలతో పిలిపించుకున్న కుమార్ సాను ఇప్పుడు ఎక్కువగా పాడలేకపోతుండవచ్చు. కానీ ఆయన పాడిన ప్రతి పాటా ఇప్పటికీ అభిమానుల గుండెల్లో మార్మోగుతూనే ఉంటుంది.-శాంతి ఇషాన్ (Shanti Ishan) -
అతడిని ఎక్స్పోజ్ చేయండి.. దాచి పెడతారెందుకు?.. జస్సీ లేనపుడు..
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన నాటి నుంచి చర్చనీయాంశమైన పేరు హర్షిత్ రాణా (Harshit Rana). హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) ప్రియ శిష్యుడైన కారణంగానే అతడికి జట్టులో చోటు దక్కిందనే విమర్శలు వచ్చాయి. భారత మాజీ క్రికెటర్లు క్రిష్ణమాచారి శ్రీకాంత్, రవిచంద్రన్ అశ్విన్ ప్రధానంగా ఈ విషయంపై వీడియోలు చేశారు.27 పరుగులు ఇచ్చిఅయితే, గంభీర్ కూడా వారికి అదే రీతిలో బదులిచ్చాడు. యూట్యూబ్ చానెళ్ల వ్యూస్ కోసం 23 ఏళ్ల కుర్రాడి భవిష్యత్తు నాశనం చేస్తారా? అంటూ మండిపడ్డాడు. ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియాతో తొలి వన్డే (IND vs AUS 1st ODI) తుదిజట్టులోనూ హర్షిత్ రాణాకు స్థానం దక్కింది. ఈ రైటార్మ్ యువ పేసర్ కేవలం నాలుగు ఓవర్ల బౌలింగ్‌లోనే 27 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు.ఇక బ్యాటింగ్ ఆర్డర్లో ఎనిమిదో స్థానంలో వచ్చి రెండు బంతులు ఎదుర్కొని ఒక్క పరుగు చేసి అవుటయ్యాడు హర్షిత్ రాణా. ఈ నేపథ్యంలో భారత-‘ఎ’ జట్టు మాజీ కెప్టెన్ ప్రియాంక్ పాంచల్ హర్షిత్‌కు మేనేజ్మెంట్ ప్రాధాన్యం ఇవ్వడాన్ని విమర్శించాడు.అతడిని ఎక్స్పోజ్ చేయండి.. దాచి పెడతారెందుకు?ఈ మేరకు.. ‘‘ఒకవేళ హర్షిత్ రాణాను ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ చేయడానికే జట్టులోకి తీసుకుంటే.. అతడిని తనను తాను నిరూపించుకునే అవకాశం ఇవ్వండి. ఎక్స్పోజ్ చేయండి. రెండేళ్ల పాటు ఆ పాత్రలో తనను కొనసాగించండి.అంతేగానీ.. అదనపు బ్యాటర్‌ను జట్టులోకి తీసుకుని హర్షిత్‌ను కాపాడటం ఎందుకు? జస్సీ లేనపుడు..ఆల్‌రౌండర్లు నితీశ్ రెడ్డి లేదంటే వాషింగ్టన్ సుందర్ స్థానంలో కుల్దీప్ యాదవ్‌ను ఆడించాల్సింది. జస్సీ (జస్ప్రీత్ బుమ్రా) గైర్హాజరీలో.. అతడు లేని లోటు పూడుస్తూ కుల్దీప్ వికెట్లు తీసేవాడు కదా!’’ అని ప్రియాంక్ పాంచల్ సోషల్ మీడియా వేదికగా మేనేజ్మెంట్ తీరుపై తన అభిప్రాయాలను నిక్కచ్చిగా పంచుకున్నాడు.ఓటమితో మొదలుకాగా పెర్త్‌లో జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. వర్షం కారణంగా 26 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో గిల్ సేన తొమ్మిది వికెట్ల నష్టానికి 136 పరుగులే చేసింది. డీఎల్ఎస్ పద్ధతి ప్రకారం ఆసీస్ తమ లక్ష్యాన్ని కేవలం మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. 21.1 ఓవర్లలో 131 పరుగులు చేసి జయభేరి మోగించింది.చదవండి: నితీశ్ రెడ్డిని అందుకే తీసుకున్నారు.. కానీ ఇదేం పద్ధతి?: అశూ ఫైర్ -
Telangana: పోతే రూ.10 వేలు.. వస్తే నాలుగెకరాలు
భీమిని: మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలానికి చెందిన ఓ రైతు తనకున్న భూమిని అమ్మడానికి లక్కీ డ్రా పెట్టడం చర్చనీయాంశంగా మారింది. మండలంలోని జన్కాపూర్ గ్రామానికి చెందిన ఓ రైతు టేకులపల్లి శివారులో తనకున్న నాలుగు ఎకరాల భూమిని లక్కీ డ్రా పెట్టాడు. రూ.10 వేల నగదు చెల్లించి టోకెన్ పొందాలని పేర్కొన్నారు. 1,500 మంది కాగానే అందరి సమక్షంలో లక్కీ డ్రా తీస్తామంటూ తన చేనుకు వెళ్లే దారిలో పెద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేశాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఫ్లెక్సీలో సర్వే నంబర్లతోపాటు రూట్ మ్యాప్, పూర్తి వివరాలు పొందుపర్చాడు. లక్కీడ్రా ద్వారా మార్కెట్ ధర కంటే అధికంగా లాభం వస్తుందని పలువురు చర్చించుకుంటున్నారు. డ్రా కోసం ఫోన్‌పే, గూగుల్‌పే ద్వారా కూడా చెల్లించవచ్చని తన ఫోన్ నంబర్ కూడా పేర్కొన్నాడు. కాగా, లక్కీడ్రా తీసే తేదీ ప్రకటించకపోవడంతో 1,500 టోకెన్లు పూర్తి అయ్యేదెప్పుడు లక్కీడ్రా తీసేదెప్పుడు అన్న చర్చ కూడా జరుగుతోంది.సరైన ధర రాకపోవడం వల్లే..భూమి అమ్మకానికి లక్కీడ్రా కోసం ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన రైతు భీమేశ్‌ను వివరణ కోరగా, తన సొంత అవసరాల కోసం భూమి విక్రయించేందుకు ప్రయత్నించగా, సరైన ధర రాకపోవడంతో లక్కీడ్రా కూపన్ ఆలోచన వచ్చినట్లు తెలిపాడు. డ్రా నిర్వహణకు సంబంధించి ఎలాంటి రిజిస్ట్రేషన్ చేసుకోలేదని పేర్కొన్నాడు. నవంబర్ మొదటి వారంలో లక్కీడ్రా తీసే తేదీని ప్రకటిస్తానని తెలిపాడు. -
మా ఓటమికి కారణమదే.. చాలా బాధగా ఉంది: టీమిండియా కెప్టెన్
ఐసీసీ మహిళల ప్రపంచకప్-2025లో భారత జట్టు ఓటముల పరంపర కొనసాగుతోంది. ఆదివారం ఇండోర్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో నాలుగు పరుగుల తేడాతో పరాజయం పాలైంది. 289 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో చివరి ఓవర్లలో తడబడిన భారత జట్టు.. ఈజీగా గెలవాల్సిన మ్యాచ్‌ను చేజార్చుకుంది.ఇది భారత్‌కు వరుసగా మూడో ఓటమి. ఈ ఓటమితో భారత్ సెమీఫైనల్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. ఇక మిగిలిన రెండు మ్యాచ్‌లను గెలిస్తేనే మన అమ్మాయిల జట్టు నేరుగా సెమీఫైనల్స్‌కు ఆర్హత సాధించనుంది. ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ స్పందించింది. స్మృతి మంధాన వికెట్‌తో మ్యాచ్ ఇంగ్లండ్ వైపు టర్న్ అయిందని హర్మన్ చెప్పుకొచ్చింది."గెలవాల్సిన మ్యాచ్‌లో ఓడిపోయినందుకు చాలా బాధగా ఉంది. స్మృతీ మంధాన వికెట్‌తో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. అప్పటివరకు మేము గేమ్‌లో ఉన్నాము. ఈజీగా గెలుస్తామనుకున్నాము. మంధాన వికెట్ పడిన తర్వాతే మేము పట్టు కోల్పోయాము. కానీ ఇంగ్లండ్ బౌలర్లకు కూడా క్రెడిట్ ఇవ్వాలి.వారు ఆఖరి వరకు అద్భుతంగా బౌలింగ్ చేసి మాపై ఒత్తడి పెంచారు. వరుస క్రమంలో వికెట్లు పడగొట్టి మ్యాచ్‌ను మా నుంచి లాగేసుకున్నారు. ఈ మ్యాచ్‌లో మేము అన్ని విభాగాల్లో మెరుగైన ప్రదర్శన కనబరిచాము. ప్రతీది మేము అనుకున్నట్లు సాగింది. కానీ చివరి ఐదు-ఆరు ఓవర్లలో విఫలమయ్యాము. నిజంగా మాకు ఇది హార్ట్ బ్రేకింగ్ మూమెంట్. గత కొంతకాలంగా మా బ్రాండ్ ఆఫ్ క్రికెట్‌ను కొనసాగిస్తున్నాము. కానీ దురదృష్టవశాత్తూ ఓడిపోతున్నాము. మాకు తదుపరి మ్యాచ్ చాలా కీలకం. ఈ మ్యాచ్‌లో మెరుగైన ప్రదర్శన కనబరిచి విజయం సాధిస్తాము అని ఆశిస్తున్నాను.ఈ మ్యాచ్‌లో బౌలర్లు కూడా మెరుగ్గా రాణించారు. నాట్ స్కీవర్, హీథర్ క్రీజులో ఉన్నప్పుడు ఇంగ్లండ్ భారీ స్కోర్ చేస్తుందని భావించాము. కానీ మా బౌలర్లు కమ్‌బ్యాక్ ఇచ్చి వారిని 300 పరుగులలోపు కట్టడి చేశారు. కానీ బౌలింగ్‌లో కూడా చివరి ఐదు ఓవర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నాము. మేము ఈ విషయంపై డ్రెస్సింగ్ రూమ్‌లో చర్చించుకుంటున్నాము. ఈ మ్యాచ్‌లో అదనపు బౌలర్‌తో ఆడాలనుకున్నాము. అందుకే జెమిమా స్దానంలో రేణుకాను ఆడించాలనుకున్నాము. స్మతి, నేనూ కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాము. ఆ తర్వాత రిచా, అమన్ జోత్, దీప్తి లాంటి ప్లేయరర్లు ఉండడంతో ఈజీగా గెలుస్తామనుకున్నాము. ఏదేమైనప్పటికి ఈరోజు అదృష్టం మా వైపు లేదు. తర్వాత మ్యాచ్‌లో తిరిగి పుంజుకుంటామన్న నమ్మకం ఉంది అని హర్మన్ పేర్కొంది.చదవండి: నితీశ్ రెడ్డిని అందుకే తీసుకున్నారు.. కానీ ఇదేం పద్ధతి?: అశూ ఫైర్ -
స్కూటీపై వచ్చి.. కోడిపుంజు అపహరించి
జడ్చర్ల: స్కూటీపై వచ్చిన ఇద్దరు యువకులు ఇంటి ముందు ఉన్న ఓ కోడిపుంజును అపహరించుకెళ్లారు. విషయం తెలుసుకున్న కోడి యజమాని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో.. విచారించిన పోలీసులు ఎట్టకేలకు దొంగలను గుర్తించి వారి వద్ద నుంచి కోడిపుంజును స్వా«దీనపర్చుకుని యజమానికి అప్పగించడంతో కథ సుఖాంతమైంది.ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా.. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని నాగసాల గ్రామంలో గొర్రెల కాపరి గోపాల్ కోడిపుంజులు పెంచుతున్నాడు. అయితే శనివారం ఇద్దరు యువకులు స్కూటీపై వచ్చి ఇంటి ముందు ఉన్న కోడిపుంజును పట్టుకుని వెళ్లిపోయారు. ఈ విషయాన్ని గమనించిన గోపాల్ కూతురు తండ్రికి చెప్పడంతో అతను ఇంటికి వచ్చి ఇంటి వద్ద గల సీసీ పుటేజీలను పరిశీలించి పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయడంతోపాటు చుట్టుపక్కల వారికి చెప్పారు. ఆదివారం నిమ్మబాయిగడ్డ ప్రాంతంలో సదరు యువకులు కోడిపుంజును విక్రయిస్తుండగా అప్పటికే కోడిపుంజు చోరీ గురించి విన్నవారు గోపాల్‌కు తెలిపారు. అతను పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే వారు వచ్చి కోడిపుంజును అపహరించిన ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వారి నుంచి కోడిపుంజు, స్కూటీని స్వా«దీనపర్చుకున్నారు. తర్వాత కోడిపుంజను యజమాని గోపాల్‌కు అప్పగించారు. కోడిపుంజు విలువ రూ.10 వేలు ఉంటుందని, కోడిపుంజులు పెంచి విక్రయించడం తనకు అలవాటు అని గోపాల్ పేర్కొన్నారు. కాగా.. పోలీసులు చోరీకి పాల్పడిన ఇద్దరు యువకులను మందలించి వదిలిపెట్టినట్లు తెలిసింది. -
కష్టపడ్డారు.. ఉన్నతికి చేరుకున్నారు
మహేశ్వరం/కొత్తూరు: ప్రభుత్వ వివిధ శాఖల్లో ఉద్యోగాలు చేస్తూనే.. మరింత ఉన్నత స్థితికి చేరుకోవాలని కలగన్నారు. కష్టపడ్డారు. ఫలితం దక్కించుకున్నారు. వారిలో ఒకరు జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తూ.. డీటీకి ఎంపికగా, మరో ఇద్దరు కానిస్టేబుల్‌గా పనిచేస్తూ.. ఏఎస్ఓగా ఒకరు, ఎస్ఐగా మరొకరు ఎంపికయ్యారు. నగరంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, తదితర అధికారుల చేతుల మీదుగా నియామక పత్రాలు అందుకొన్నారు.పేద రైతు కుటుంబంలో.. పేద రైతు కుటుంబంలో పుట్టి, ప్రభుత్వ పాఠశా లలో చదివాడు. గ్రూప్– 2లో రాష్ట్ర స్థాయిలో 171 ర్యాంకు సాధించి, డిప్యూటీ తహసీల్దార్‌గా ఉద్యో గం సాధించాడు గిరిజన బిడ్డ దేవేందర్. మండల పరిధి పెద్దమ్మ తండా అనుబంధ నల్లచెర్వుతండా కు చెందిన కాట్రావత్ లక్ష్మీ– రాములు నాయక్ దంపతుల కుమారుడు దేవేందర్ నాయక్ శనివారం రెవెన్యూ అధికారుల చేతుల మీదుగా నియామక పత్రం అందుకున్నాడు. వికారాబాద్ జిల్లాలో రెవె న్యూ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్‌గా ఎంపికయ్యాడు. ఇంతకు ముందే.. దేవేందర్ గ్రూప్– 3లో 305 మార్కులు సాధించి, రాష్ట్ర స్థాయిలో 63వ ర్యాంకు సాధించారు. గ్రూప్– 4లో 141వ ర్యాంకు సాధించి, శంషాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. గ్రూప్– 1లో 433 మార్కులు సాధించినప్పటికీ.. కొద్దిపాటి తేడాతో అదృష్టం చేజారింది. అయినా నిరుత్సాహం చెందకుండా.. డీటీ కొలువు సాధించాడు.కానిస్టేబుల్‌గా కొనసాగుతూ.. కొత్తూరు: కానిస్టేబుల్‌గా ఉద్యోగం చేస్తూనే గ్రూప్– 2లో ఉత్తమ ర్యాంకు సాధించి, సెక్రటేరియట్లో ఏఎస్ఓగా ఉన్నతస్థితికి చేరుకుంది. పట్టణానికి చెందిన గాలిగాని యాదయ్య మూడో కూతురు ఉమ.. చిన్నప్పటి నుంచి చదువుల్లో మేటి. సర్కారు బడుల్లో విద్యనభ్యసించి గ్రూప్– 1, ఎస్ఐ, ఉద్యోగానికి పలుమార్లు పరీక్షలు రాసి కొద్దిపాటి మార్కులతో రాణించలేక పోయింది. ఆ తరువాత కానిస్టేబుల్ ఉద్యోగం సాధించింది. అయినప్పటికీ.. పట్టువదలక.. పోటీ పరీక్షలు రాసి.. గ్రూప్–2లో మెరిసింది. ప్రస్తుతం ఉమకేశంపేట పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తోంది.కానిస్టేబుల్ నుంచి ఎస్ఐగా..యాచారం: ఎక్సైజ్ శాఖలో కానిస్టేబుల్‌గా పనిచేస్తూ.. ప్రస్తుతం అదే శాఖలో ఎస్ఐగా ఉన్నతికి చేరుకుంది మండల పరిధి నందివనపర్తి అనుబంధ గ్రామం పిల్లిపల్లికి చెందిన అయ్యాగాని ప్రవళిక. నిరుపేద కుటుంబానికి చెందిన ఆమె.. బీపార్మసి పూర్తి చేసింది. తాజాగా వెలువడిన గ్రూపు– 2లో రాణించి, ఎస్ఐగా ఎంపిౖకైంది. గతంలో గ్రూప్– 4లో వార్డు ఆఫీసర్‌గా ఉద్యోగం వచ్చింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రూప్– 1లో ఉద్యోగం సాధించడమే లక్ష్యమని పేర్కొంది. ప్రవళిక తల్లిదండ్రులు పాండు, శోభలు గ్రామంలో వ్యవసాయ పనులు చేస్తూ జీవనోపాధి పొందుతున్నారు. -
వార్నీ.. ఇవేం సెలబ్రేషన్స్ భయ్యా!! దీపావళి-2025 ధమాకా.. వీటిని చూశారా?
దీపావళి వేళ.. ఒక చిన్న వీడియో, ఒక సరదా ఫోటో అసాధారణ స్పందనను తెచ్చుకుంటున్నాయి. లక్షల మంది హృదయాలను గెలుచుకుంటూ వైరల్ కంటెంట్‌గా మారుతున్నాయి. ఆ సాధారణ దృశ్యాలు, వినూత్న ఆలోచనలను సోషల్ మీడియా మరింత సంబరంగా మార్చుతోంది. వాటిల్లో కొన్ని మీకోసం..దీపావళి పండుగ వేళ.. ఇంటి డెకరేషన్లు, తమ ముస్తాబులు, తాము చేసుకునే సంబురాలను కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. అదే సమయంలో సరదాగానూ కొంత కంటెంట్ వైరల్ అవుతుంది. సినీ నటులు రజినీకాంత్, బ్రహ్మానందాలు నోట్లో బాంబులు పెట్టుకోవడం.. సినిమాల్లో దీపావళి శుభాకాంక్షలు చెప్పడం.. ఓ తెలుగమ్మాయి ధైర్యంగా సుతిల్ బాంబులను చేత్తో అంటించి విసిరేయడం, కుక్క నోటితో బాణాసంచాని కరుచుకుపోయి పదే పదే ఇంట్లో పడేయడం, పొల్యూషన్‌తో సంబంధం లేకుండా బాంబ్ఫ్రూఫ్ వేడుకలు(డప్పులు, తినే కంచాలతో సౌండ్లు).. ఇలాగన్నమాట. అయితే ఈసారి కొంత కొత్త స్టఫ్ నెట్లో వైరల్ అవుతోంది. ఇదేం సెలబ్రేషన్ భయ్యా.. అది అత్యంత ఖరీదైన ఏరియా. అలాంటి చోట ‘వెరీ లేజీ సెలబ్రేషన్స్’ను ఎవరూ కలలో కూడా ఊహించని పరిణామం ఇది!. అవును.. నోయిడాలో ఓ బ్యాచిలర్ బద్మాషుగాళ్లు చేసిన పని నెట్టింట తెగ వైరల్ అయ్యింది. దీపావళి సెలబ్రేషన్స్‌లో భాగంగా.. కుల్వంత్ సింగ్, యాగేశ్వర్ అనే ఇద్దరు కుర్రాళ్లు తమ బాల్కనీకి అలంకరించారు. ఓ గ్రీన్ లైట్ దండ బల్బ్ సెట్‌ను వేలాడదీసి దానిని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. అంతే.. View this post on Instagram A post shared by Kulwant Singh Rangra (@kulwant_singh0810)రాత్రికి రాత్రే అది ఆ ఇద్దరినీ ఫేమస్ చేసింది. లక్షల మంది దానికి స్పందిస్తూ.. ఆ యువకులపై చిత్రవిచిత్రమైన కామెంట్లు చేశారు. దీంతో తమ బాల్కనీని మరిన్ని లైట్ సెట్లతో కలర్ఫుల్గా మార్చేశారు. కావాలని చేశారో.. అనుకోకుండా జరిగిందోగానీ లక్షల మందిని ఆకట్టుకున్న ఈ వీడియో వైరల్ సంబరంగా మారింది. నువ్వో ఆణిముత్యానివి!దీపావళి వేడుకల్లో ఓ వ్యక్తి ల్యాప్‌ట్యాప్‌తో చిందులేసిన ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైభవ్ చంద్ర అనే వ్యక్తి ఆఫీస్ దీపావళి సెలబ్రేషన్స్ వీడియో అంటూ దానిని పోస్ట్ చేశారు. అయితే.. ఈ వీడియో కొత్తేదేనా? వైభవ్ ఎందుకు పోస్ట్ చేశాడన్నదానిపై స్పష్టత లేదు. ఆఫీస్‌లో పని ఎక్కువగా ఉన్నా.. దీపావళి వేడుకలను మిస్ కాలేదు అంటూ క్యాప్షన్ ఉంచాడు. దీంతో ఆ ఎంప్లాయిపై ఆణిముత్యం అంటూ ప్రశంసలు గుప్పిస్తున్నారు. అదే సమయంలో వర్క్-లైఫ్ బ్యాలెన్స్ గురించి కూడా చర్చ మొదలైంది. View this post on Instagram A post shared by Vaibhav Chhabra (@vaibhav9497)టచ్ చేశావ్ భయ్యా.. హైదరాబాద్(తెలంగాణ)కు ఓ వ్యక్తి వెరైటీగా జరిపిన దీపావళి సంబురాలు ఇప్పుడు నెట్టింట వైరల్ అయ్యాయి. సాధారణంగా మనకు డెలివరీలు వస్తే ఏం చేస్తాం.. వెంటనే పెమెంట్ చేసేసి మన పార్శిల్స్ అందుకుని వచ్చేస్తాం. కానీ, ఇక్కడో హైదరాబాదీ వివిధ డెలివరీ యాప్స్‌లో స్వీట్లను ఆర్డర్ చేసి.. తీసుకొచ్చిన ఆ డెలివరీ బాయ్స్ చేతికి అందించాడు. పైగా షేక్‌హ్యాండ్‌తో హ్యాపీ దీపావళి చెప్పడంతో నెట్టింట యూజర్లు తెగ ఖుషీ అయిపోతున్నారు. View this post on Instagram A post shared by Gundeti Mahendhar Reddy (@_the_hungry_plate_)యూ నెయిల్డ్ ఇట్ బ్రో!ఇక్కడో ఆర్టిస్ట్ వెరైటీగా చేసిన ప్రయత్నం.. నెట్టింట సందడి చేస్తోంది. తన సృజనాత్మతకు పని చెబుతూ.. చేతి గోళ్ల మీద ఓ వ్యక్తి పెయింటింగ్ వేశాడు. ఈ త్రీడి నెయిల్ ఆర్ట్‌లో.. బాణాసంచాతో పాటు హ్యాపీ దీపావళి అనే అక్షరాలనూ అతను చెక్కాడు. ఈ క్రమంలో.. ఓ గోటిపై ఏకంగా దీపాన్ని వెలిగించడం గమనార్హం. దీనిపై అతనికి ప్రశంసలతో పాటు కొంత మంది ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Yogesh Kumar (@love_nail_yogesh) -
బోరుమని ఏడ్చిన తనూజ, దివ్య.. ఆ ఒక్కడికి సారీ చెప్పిన భరణి!
బిగ్‌బాస్ 9వ షోలో దీపావళి ఎపిసోడ్ థౌజండ్‌వాలా పటాకాలా పేలింది. అటు గేమ్స్, ఇటు ఫ్యామిలీ నుంచి వీడియో సందేశాలు, జటాధర టీమ్ అట్రాక్షన్, స్పెషల్ డ్యాన్స్.. ఎలిమినేషన్.. ఎమోషన్స్.. ఇలా అన్నీ పండాయి. మరి ఇంకా ఏమేం జరిగాయో నిన్నటి (అక్టోబర్ 19వ) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం.. పేరడీ సాంగ్స్నాగార్జున (Nagarjuna Akkineni) హౌస్‌మేట్స్‌కు కొత్త బట్టలు కానుకగా ఇచ్చాడు. అవి చూసి కంటెస్టెంట్లు మురిసిపోయారు. తర్వాత గేమ్స్ ఆడిస్తూనే మధ్యమధ్యలో వీడియో సందేశాలు చూపించారు. సింగర్ సాకేత్ వచ్చి హౌస్‌మేట్స్‌పై పేరడీ సాంగ్స్ పాడాడు. హైపర్ ఆది.. కంటెస్టెంట్లపై పంచులు పేలుస్తూనే చాలా హింట్లు ఇచ్చేశాడు. ఎవరిపైనా ఆధాపడకూడదని తనూజ, రీతూకు సలహా ఇచ్చాడు. నేను స్ట్రాంగ్, ఏడ్చే కంటెస్టెంట్ కాదన్నారు. ఇప్పుడేమో ఏడుస్తూనే ఉన్నారు.. అది మార్చుకోమని దివ్యకు సూచించాడు. హైపర్ ఆది హింట్స్మంచి కమ్‌బ్యాక్ ఇవ్వాలని రాము రాథోడ్‌కు, కంటెస్టెంట్లు ఆరువారాల్లో ఇచ్చిన కంటెంట్ అంతా ఒక్కవారంలోనే ఇచ్చారని మాధురితో అన్నాడు. నెగెటివ్ మైండ్‌సెట్ తీసేసి పాజిటివ్‌గా ఆలోచించమని రమ్యకు.. ఆట మార్చమని నిఖిల్‌కు సలహా ఇచ్చాడు. పొటెన్షియల్, ఇండివిడ్యువల్, ఎమోషనల్.. ఈ మూడు కారణాలు చెప్పి తనూజ (Thanuja Puttaswamy)ను నామినేట్ చేశావు.. కానీ ఆ మూడు తప్పులు నువ్వే చేస్తున్నావని ఆయేషాకు చురకలంటించాడు. సాయి శ్రీనివాస్.. ఏజెంట్లా ప్రవర్తిస్తున్నాడని.. ఇతరులపై చాడీలు చెప్తున్నట్లుందని అభిప్రాయపడ్డాడు.భరణి ఎలిమినేట్ఇక నాగార్జున అందర్నీ సేవ్ చేసుకుంటూ రాగా చివర్లో రాము, భరణి (Bharani Shankar) మాత్రమే మిగిలారు. వీరిలో ఎవరికైనా పవరాస్త్ర వాడాలనుకుంటున్నావా? అని నాగార్జున ఇమ్మాన్యుయేల్‌ను అడిగాడు. అందుకతడు ఆలోచించి.. ఆరువారాల ఆట ప్రకారం రాము రాథోడ్‌ను సేవ్ చేయాలనుకుంటున్నట్లు తెలిపాడు. దీంతో భరణి ఎలిమినేట్ అయ్యాడు. ప్రేక్షకుల ఓట్ల ద్వారా కూడా భరణి ఎలిమినేట్ అయినట్లు నాగ్ తెలిపాడు. నాన్న వెళ్లిపోతుంటే తనూజ, దివ్య వెక్కెక్కి ఏడ్చేశారు. నావల్ల నీ ఒక్కడికే అన్యాయంస్టేజీపైకి వచ్చిన భరణి.. తనూజతో నీకు ఒకటే చెప్తున్నా.. ఎవర్నీ నమ్మకు, ఎవరిపైనా ఆధారపడకు. నీకు తోచినంత ఆడు, ఏడవకు అని బుజ్జగించాడు. అప్పటికీ తనూజ కన్నీళ్లు పెట్టుకుంటూనే ఉంది. దివ్యతో.. నువ్వు నా స్వీట్హార్ట్.. నిన్ను చూశాక నాకు ఒక చెల్లి ఉంటే బాగుండనిపించింది. నా ఆశీస్సులు నీకెప్పుడూ ఉంటాయి అన్నాడు. ఆ మాటతో దివ్య.. నా కుటుంబం తర్వాత ఎవరితోనూ రిలేషన్ కలుపుకోలేదు. హౌస్‌లో మీకోసం తప్ప దేనికోసమూ ఏడవలేదు. మీరెప్పటికీ నా అన్నయ్యే అంటూ ఏడ్చేసింది. ఇక చివరగా భరణి.. నా వల్ల ఎవరికైనా అన్యాయం జరిగిందంటే పవన్‌కు ఒక్కడికే.. నీకు చాలాసార్లు సారీ చెప్పాను. నువ్వు కప్పు కొట్టి బయటకు వచ్చాక నా మాటపై నిలబడతాను అంటూ వీడ్కోలు తీసుకున్నాడు.చదవండి: బిగ్‌బాస్ నుంచి 'భరణి' ఎంత సంపాదించారంటే.. -
ఇంకా సగం మంది ఇంటర్నెట్కు దూరమే!
దేశీయంగా 47 శాతం మంది ప్రజలు ఇంకా ఇంటర్నెట్కి దూరంగా, ఆఫ్‌లైన్‌లోనే ఉన్నారని గ్లోబల్ టెలికం పరిశ్రమ జీఎస్ఎంఏ ఓ నివేదికలో తెలిపింది. మొబైల్ ఇంటర్నెట్ వినియోగంలో పురుషులతో పోలిస్తే మహిళలు 33 శాతం తక్కువగా ఉంటున్నారని వివరించింది.హ్యాండ్సెట్స్ ధర అధికంగా ఉండటం, సాంకేతిక నైపుణ్యాలు తక్కువగా ఉండటం వంటి అంశాలు కనెక్టివిటీ మధ్య అంతరాలకు కారణమని ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2025లో పాల్గొన్న సందర్భంగా జీఎస్ఎంఏ ఆసియా పసిఫిక్ హెడ్ జులియన్ గోర్మన్ తెలిపారు. దీన్ని సత్వరం పరిష్కరించకపోతే సమ్మిళిత వృద్ధికి అవరోధంగా నిల్చే అవకాశం ఉందని పేర్కొన్నారు.దశాబ్దం క్రితం 108 బిలియన్ డాలర్లుగా ఉన్న భారత డిజిటల్ ఎకానమీ 2023లో మూడు రెట్లు పెరిగి 370 బిలియన్ డాలర్లకు చేరిందని, 2030 నాటికి 1 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందనే అంచనాలు ఉన్నాయని నివేదిక వివరించింది. అయితే, కీలకమైన ఆవిష్కరణలు, వినియోగం మధ్య అంతరాలను పూడ్చకపోతే ఈ వేగం గతి తప్పే అవకాశం ఉందని, పేర్కొంది.డిజిటల్ పబ్లిక్ మౌలిక సదుపాయాలు, మొబైల్ వినియోగాల్లో భారత్ అగ్రగామిగా ఉన్నప్పటికీ, పరిశోధనలు..అభివృద్ధి కార్యకలాపాలపై పెట్టుబడులు పెట్టడం, ప్రైవేట్ రంగంలో ఆవిష్కరణలు, సుశిక్షితులైన నిపుణులను అట్టే పెట్టుకోవడం వంటి విషయాల్లో వెనుకబడి ఉందని నివేదిక తెలిపింది. -
నా కుమారుడి కెరీర్.. అక్కగా తనే చూసుకుంటుంది: రవితేజ
టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండానే సినిమా పరిశ్రమలో నిలదొక్కున్నారు. తనకంటూ ప్రత్యేకమైన అభిమానులను సంపాదించుకున్నారు. అయితే, ప్రస్తుతం ఆయన పిల్లలు కుమారుడు మహాధన్, కుమార్తె మోక్షధ ఇండస్ట్రీలో అడుగుపెడుతున్నారు. తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో రవితేజ ఈ విషయం గురించే మాట్లాడారు.రవితేజ నటిస్తున్న 75వ చిత్రం ‘మాస్ జాతర’.. భాను భోగవరపు దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ మూవీని నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అక్టోబర్ 31న విడుదల కానుంది. ఈ క్రమంలోనే దర్శకుడు వెంకీ అట్లూరితో ప్రత్యేక చిట్‌చాట్‌లో రవితేజ పాల్గొన్నారు. ఆ సమయంలోనే రవితేజ పిల్లల గురించి మాట్లాడారు. ప్రస్తుతం తమిళ హీరో సూర్యతో ఒక సినిమా చేస్తున్నానని రవితేజతో దర్శకుడు వెంకీ అట్లూరి చెప్పారు. అయితే అదే మూవీకి మహాధన్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడని పంచుకున్నారు. వెంటనే రవితేజ కూడా "నా కుమారుడితో పని చేయడం ఎలా అనిపించింది..?" అని సరదాగా అడగ్గానే.. వెంకీ నవ్వుతూ.. 'అతను చిన్నప్పటి నుంచే సినిమా సెట్ల మధ్యే పెరిగాడు కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు.. చాలా నేచురల్‌గా అనిపించింది' అని పేర్కొన్నారు. మహాధన్, చిన్నప్పుడు 'రాజా ది గ్రేట్' సినిమాలో రవితేజ చిన్నప్పటి పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన సూర్య సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేయనున్నారు. రాబోయే రోజుల్లో మహాధన్ హీరోగా నటిస్తాడా.. దర్శకుడిగా పరిచయం కానున్నాడా అనేది క్లారిటీ ఇవ్వలేదు.కుమారుడి గురించి రవితేజ ఇలా చెప్పాడు. మహాధన్ కెరీర్ గురించి అక్కగా మోక్షధ గ్గరగా గమనిస్తోంది. వాడు ఏ విషయం అయినా సరే వాళ్ల అక్కతోనే పంచుకుంటాడు. తను కూడా వాడికి అంతే ప్రాముఖ్యత ఇస్తుంది. వాడి కెరీర్ గురించి చూసుకునేందుకు మోక్షిధ ఉంది. అంటూ క్లారిటీ ఇచ్చారు. మోక్షధ కూడా నిర్మాణ రంగం వైపు అడుగులేస్తుంది. ప్రస్తుతం ఆనంద్ దేవరకొండ, వినోద్ అనంతోజు కాంబినేషన్లో నెట్‌ఫ్లిక్స్ కోసం రూపొందుతున్న 'తక్షకుడు' చిత్రానికి ఆమె ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా ఉంది. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ కోసం ఆమె పనిచేస్తుంది. రాబోయే రోజుల్లో రవితేజ ప్రొడక్షన్ హౌస్ పేరుతో సినిమాలు కూడా ఆమె నిర్మించే ఛాన్స్ ఉంది. -
తెల్లారితే కేఫ్ ఓపెనింగ్.. అంతలోనే అనంతలోకాలకు..
నల్గొండ జిల్లా: తెల్లారితే కేఫ్ ఓపెనింగ్.. అందుకోసం కేఫ్ నిర్వాహకుడు తన కుటుంబ సభ్యులతో కలిసి ఒక రోజు ముందుగాను కేఫ్ వద్దకు చేరుకుని ఏర్పాట్లు చేసుకుని రాత్రి అక్కడే నిద్రించారు. తెల్ల వారుజామున కేఫ్ పైకప్పుపై ఏర్పాటు చేసిన వాటర్ ట్యాంక్ కూలి కేఫ్ నిర్వాహకుడి భార్య, కుమారుడు మృతిచెందారు. ఈ ఘటన చిట్యాల మండల పరిధిలోని పెద్దకాపర్తి శివారులో జరగగా.. మృతుల స్వస్థలం మాడుగులపల్లి మండల కేంద్రం కావడంతో స్థానికంగా విషాధచాయలు అలుముకున్నాయి.వివరాలు.. మాడుగులపల్లి మండల కేంద్రానికి చెందిన తగుళ్ల వెంకన్న, నాగమణి(30) దంపతులకు కుమారుడు విరాట్‡కృష్ణ(7), కుమార్తె నందిని సంతానం. వెంకన్న రైల్వే శాఖలో గ్యాంగ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. వీరు ఆర్ధికంగా ఉన్నతంగా బతకాలన్న ఉద్ధేశంతో చిట్యాల మండలం పెద్దకాపర్తి శివారులో విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారి పక్కన నూతనంగా కేఫ్ ఏర్పాటు చేసుకున్నారు. ఆదివారం కేఫ్ ప్రారంభించాలని అనుకుని శనివారం రాత్రి కుటుంబ సభ్యులందరూ కలిసి కేఫ్ వద్దకు వెళ్లి రాత్రి అక్కడే నిద్రించారు. ఆదివారం తెల్లవారుజామున వెంకన్న నిద్రలేచి పనులు చేసుకుంటున్నాడు. అదే సమయంలో కేఫ్ రేకుల పైన ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ ట్యాంక్ అక్కడే నిద్రిస్తున్న వెంకన్న కుటుంబ సభ్యులపై పడిపోయింది. వెంకన్న వెంటనే వారిని ఆస్పత్రికి తరలించగా అతడి భార్య నాగమణి(30), కుమారుడు విరాట్‡కృçష్ణ(7) అప్పటికే మృతిచెందారు. అతడి కుమార్తె కూతురు నందిని, తల్లి పార్వతమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. పార్వతమ్మను మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని యశోదా ఆస్పత్రికి తరలించారు. మృతిచెందిన నాగమణి, విరాట్ కృష్ణకు నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. గ్రామానికి చేరుకున్న మృతదేహాలను స్థానికులు సందర్శించి కన్నీరుమున్నీరుగా విలపించారు. అనంతరం నాగమణి, విరాట్ కృష్ణ మృతదేహాలకు మాడుగులపల్లిలో అంత్యక్రియలు నిర్వహించారు.నేత్రదానం..నాగమణి, విరాట్ కృష్ణ నేత్రాలను దానం చేసేందుకు గాను ఐ డొనేషన్ సెంటర్ వారు నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రిలో కుటుంబ సభ్యులను అవగాహన కల్పించగా.. వారు ఒప్పుకున్నారు. దీంతో నాగమణి, విరాట్ కృష్ణ కంటి కార్నియాను టెక్నీషియన్ బచ్చలకూరి జాని సేకరించారు. -
Stock Market: ఎగిసిన సెన్సెక్స్, నిఫ్టీ
దీపావళి సందర్భంగా భారతీయ స్టాక్ మార్కెట్లు దలాల్ స్ట్రీట్‌లో టపాసుల్లా పేలాయి. ప్రారంభ ట్రేడింగ్ లో బెంచ్ మార్క్ సూచీలు అర శాతానికి పైగా ఎగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ ఇండెక్స్ 661 పాయింట్లు లేదా 0.8 శాతం పెరిగి 84,614 వద్ద ట్రేడవగా, నిఫ్టీ 50 సూచీ 191 పాయింట్లు లేదా 0.74 శాతం పెరిగి 25,901 వద్ద ట్రేడవుతోంది.సెన్సెక్స్ ఇండెక్స్‌లో కోటక్ మహీంద్రా బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బాన్, బజాజ్ ట్విన్స్ టాప్ గెయినర్లుగా నిలిచాయి. అయితే క్యూ 2 ఫలితాల తరువాత పెట్టుబడిదారులు స్టాక్ లో లాభాలను బుక్ చేయడంతో ఐసీఐసీఐ బ్యాంక్ టాప్ లూజర్‌గా నిలిచింది. అల్ట్రాటెక్ సిమెంట్, ఎం అండ్ ఎం స్టాక్స్ కూడా నష్టపోయాయి.విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.66 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.19 శాతం పెరిగాయి. బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ 0.7 శాతం లాభపడింది. ఇతర రంగాల సూచీలు కూడా లాభాల్లో ఉన్నాయి. నిఫ్టీ ఐటీ, ప్రైవేట్ బ్యాంక్, ఫార్మా సూచీలు ఒక్కొక్కటి 0.7 శాతం దాకా పెరిగాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
నితీశ్ రెడ్డిని అందుకే తీసుకున్నారు.. కానీ ఇదేం పద్ధతి?: అశూ ఫైర్
ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో టీమిండియా ఘోర పరాజయం (IND vs AUS 1st ODI) పాలైంది. ఏడు వికెట్ల తేడాతో ఆతిథ్య జట్టు చేతిలో ఓటమిని చవిచూసింది. ఈ నేపథ్యంలో భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) టీమిండియా యాజమాన్యం తీరుపై విమర్శలు గుప్పించాడు.పెర్త్ వన్డేలో భారత తుదిజట్టు కూర్పు సరిగ్గా లేదని.. బ్యాటింగ్ డెప్త్ కోసం బౌలింగ్ విభాగాన్ని నీరుగార్చారని అశూ మండిపడ్డాడు. వన్డే కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్ (Shubman Gill) ఆసీస్‌తో సిరీస్‌తో తన ప్రయాణం మొదలుపెట్టాడు. పెర్త్ స్టేడియంలో టాస్ ఓడిన భారత్.. ఆస్ట్రేలియా ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగింది.రో- కో ఫెయిల్ఆసీస్ బౌలర్ల ధాటికి టీమిండియా టాపార్డర్ కుప్పకూలింది. రోహిత్ శర్మ 8, గిల్ 10 పరుగులు చేయగా.. వన్‌డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli) డకౌట్ అయి తీవ్రంగా నిరాశపరిచాడు. శ్రేయస్ అయ్యర్ (11) కూడా విఫలం కాగా.. అక్షర్ పటేల్ 31, కేఎల్ రాహుల్ 38 పరుగులతో రాణించి జట్టు పరువు కాపాడారు. ఆల్రౌండర్లలో వాషింగ్టన్ సుందర్(10), నితీశ్ కుమార్ రెడ్డి 19 (నాటౌట్) ఫర్వాలేదనిపించారు.రాణించిన మిచెల్ మార్ష్వర్షం కారణంగా 26 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో టీమిండియా తొమ్మిది వికెట్లు నష్టపోయి 136 పరుగులే చేయగలిగింది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్ 21.1 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు నష్టపోయి 131 పరుగులు చేసి.. డీఎల్ఎస్ పద్ధతితో ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. కెప్టెన్ మిచెల్ మార్ష్ (46 నాటౌట్), జోష్ ఫిలిప్ (37), మ్యాట్ రెన్షా (21 నాటౌట్) రాణించారు.Just when #TeamIndia needed it most! @Sundarwashi5 breaks a crucial partnership. 👏#AUSvIND 👉 1st ODI | LIVE NOW 👉 https://t.co/FkZ5L4CrRl pic.twitter.com/6e1VZmbAjz— Star Sports (@StarSportsIndia) October 19, 2025 తేలిపోయిన భారత బౌలర్లువికెట్ తీయడానికి తిప్పలు పడ్డ భారత బౌలర్లలో పేసర్ అర్ష్‌దీప్ సింగ్, స్పిన్నర్లు అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ చెరో వికెట్ తీశారు. ఈ నేపథ్యంలో భారత బ్యాటింగ్, బౌలింగ్ వైఫల్యం గురించి అశ్విన్ మాట్లాడుతూ.. చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ విషయంలో మేనేజ్మెంట్ తీరును తప్పుబట్టాడు.నితీశ్ రెడ్డిని అందుకే తీసుకున్నారు‘‘వాళ్లు కేవలం ఇద్దరు స్పిన్నర్లతోనే ఎందుకు ఆడారో నేను అర్థం చేసుకోగలను. పేస్ ఆల్‌రౌండర్ నితీశ్ రెడ్డిని ఆడించింది బ్యాటింగ్‌లో డెప్త్ కోసమే. ఇక స్పిన్ ఆల్‌రౌండర్లు వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ కూడా బ్యాటింగ్ చేయగలరు కాబట్టి నితీశ్‌ను వారికి జతచేశారు.కానీ ఇదేం పద్ధతి?అసలు మీరెందుకు బౌలింగ్‌పై దృష్టి పెట్టడం లేదు బాస్. ఇలాంటి పెద్ద మైదానాల్లో కాకపోతే కుల్దీప్ యాదవ్ ఇంకెక్కడ స్వేచ్ఛగా బౌలింగ్ చేయగలడు? ఈ పిచ్‌పై బంతిని తిప్పుతూ అతడు బౌన్స్ కూడా రాబట్టగలడు.అత్యుత్తమ బౌలర్లను పక్కన పెడతారా?ఏమైనా అంటే.. బ్యాటింగ్ డెప్త్ అని మాట్లాడతారు. బ్యాటింగ్ ఆర్డర్ రాణించాలంటే... బ్యాటర్లే పూర్తి బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది కదా! పరుగులు రాబట్టడం బ్యాటర్ల పని. అదనపు బ్యాటర్ కోసం ఆల్రౌండర్లను దించి వారి పని మరింత సులువు చేయాల్సిన అవసరం ఏముంది? జట్టులో అత్యుత్తమ బౌలర్లను పక్కనపెట్టడం ఎంత వరకు సమంజసం?కేవలం బ్యాటింగ్ ఆర్డర్‌ను పొడిగించుకోవడానికి తుదిజట్టు కూర్పు విషయంలో ఇలాంటి పొరపాట్లు చేయకండి’’ అని అశ్విన్.. టీమిండియా యాజమాన్యం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. కాగా మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆసీస్- భారత్ మధ్య గురువారం రెండో వన్డేకు షెడ్యూల్ ఖరారైంది. ఇందుకు అడిలైడ్ వేదిక.చదవండి: CWC 2025: ఇంగ్లండ్ చేతిలో ఓటమి.. అయినా భారత్‌కు సెమీస్ ఛాన్స్! ఇలా జరగాల్సిందే? -
న్యూజిలాండ్ జట్టు ప్రకటన.. కేన్ మామ వచ్చేశాడు
స్వదేశంలో ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు 14 మంది సభ్యులతో కూడిన జట్టును న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ తిరిగొచ్చాడు. ఛాంపియన్స్ ట్రోఫీ-2025 తర్వాత విలియమ్సన్ గాయం కారణంగా జట్టుకు దూరంగా ఉంటున్నాడు.ఇప్పుడు పూర్తి ఫిట్నెస్ సాధించడంతో సెలక్టర్లు అతడికి అవకాశమిచ్చారు. అతడితో ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ నాథన్ స్మిత్ కూడా పునరాగమనం చేసేందుకు సిద్దమయ్యాడు. ఈ జట్టు కెప్టెన్‌గా ఆల్‌రౌండర్ మిచెల్ సాంట్నర్ వ్యవహరించాడు. అదేవిధంగా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ టామ్ లాథమ్ గాయం కారణంగా దూరమయ్యాడు.లాథమ్‌తో పాటు మొహమ్మద్ అబ్బాస్ ఫిన్ అల్లెన్, లాకీ ఫెర్గూసన్, ఆడమ్ మిల్నే, విల్ ఓ'రూర్కే , గ్లెన్ ఫిలిప్స్, బెన్ సియర్స్ గాయాల కారణంగా ఈ సిరీస్‌కు అందుబాటులో లేరు. టీ20ల్లో సత్తాచాటుతున్న జాక్ ఫాల్క్స్కు కివీస్ సెలక్టర్లు వన్డేలకు పిలుపునిచ్చారు.ప్రస్తుతం కివీస్ జట్టు ఇంగ్లండ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడుతోంది. తొలి టీ20 వర్షర్పాణం కాగా.. రెండో టీ20 సోమవారం జరగనుంది. అక్టోబర్ 26 నుంచి ఇరు జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది.ఇంగ్లండ్‌తో వన్డేలకు న్యూజిలాండ్ జట్టు: మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), మైఖేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్మన్, డెవాన్ కాన్వే, జాకబ్ డఫీ, జాక్ ఫౌల్క్స్, మాట్ హెన్రీ, కైల్ జామిసన్, టామ్ లాథమ్ (వికెట్ కీపర్), డారిల్ మిచెల్, రాచిన్ రవీంద్ర, నాథన్ స్మిత్, కేన్ విలియమ్సన్, విల్ యంగ్చదవండి: CWC 2025: ఇంగ్లండ్ చేతిలో ఓటమి.. అయినా భారత్‌కు సెమీస్ ఛాన్స్! ఇలా జరగాల్సిందే? -
విమాన ప్రమాదం.. అదుపుతప్పి సముద్రంలోకి దూసుకెళ్లి..
హాంకాంగ్: హాంకాంగ్‌లో ఘోర విమాన ప్రమాద ఘటన చోటుచేసుకుంది. హాంకాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో(Hong Kong Airport) కార్గో విమానం రన్‌వేపై అదుపు తప్పి సముద్రంలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు సిబ్బంది చనిపోయినట్టు సమాచారం.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. హాంకాంగ్‌లో అంతర్జాతీయ విమానాశ్రయంలో(cargo Flight Accident) సోమవారం తెల్లవారుజామున 3.50 సమయంలో బోయింగ్ 747-481 మోడల్‌కి చెందిన కార్గో విమానం ప్రమాదానికి గురైంది. దుబాయ్ నుంచి హాంకాంగ్ చేరుకొన్న ఎమిరేట్స్ విమానం అత్యంత రద్దీగా ఉండే నార్త్ రన్‌వేపై దిగి అదుపుతప్పి ఓ వాహనాన్ని ఢీకొని సముద్రంలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు విమానాశ్రయ గ్రౌండ్ సిబ్బంది మృతి చెందారు. విమానంలో ఉన్న నలుగురు సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు.New footage of the Air ACT 747 that ran off the runway at Hong Kong International Airport this morning. pic.twitter.com/3tHlBwruwu— OSINTtechnical (@Osinttechnical) October 20, 2025ప్రమాదం కారణంగా విమానం పాక్షికంగా నీటిలో మునిగిపోయింది. బోయింగ్ 737 శ్రేణికి చెందిన EK9788 విమానాన్ని ఎమిరేట్స్ నుంచి తుర్కియే సంస్థ ఏసీటీ ఎయిర్ లైన్స్ లీజుకు తీసుకొని నడుపుతోంది. ప్రమాదం జరిగిన రన్‌వేను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. అయితే విమానాశ్రయంలోని మిగతా రెండు రన్వేలు కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి.‼️Sortie de piste d’un Boeing 747 Cargo à Hong Kong🔸L’appareil de la compagnie turque Air Act opérait un vol depuis Dubaï pour le compte d’Emirates🔸Le Boeing était à l’atterrissage piste 07L, quand il a fait une sortie latérale de piste et a terminé sa course dans la mer… pic.twitter.com/1LRFBnzv24— Aero Gazette ✈️ (@AeroGazette) October 20, 2025 -
షేర్లు అమ్ముకుంటున్న శాంసంగ్ యాజమాన్య కుటుంబీకులు
శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ (Samsung Electronics) యాజమాన్య కుటుంబీకులు తమ షేర్లను అమ్ముకుంటున్నారు. ముగ్గురు కుటుంబ సభ్యులు దక్షిణ కొరియాలో సుమారు 1.73 ట్రిలియన్ వాన్ (దాదాపు రూ.10,200 కోట్లు) విలువైన కంపెనీ వాటాలను విక్రయించనున్నారు. ఇటీవల కొరియా ఎక్స్చేంజ్కు అందజేసిన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో ఈ వివరాలను కంపెనీ వెల్లడించింది.విక్రయించే వాటాల్లో 17.7 మిలియన్ షేర్లు ఉండగా, ఇవి చైర్మన్ జే వై.లీ తల్లి హాంగ్ రా-హీ, ఆయన సోదరీమణులు లీ బూ-జిన్, లీ సియో-హ్యూన్లకు చెందినవి. 2020లో లీ కుటుంబ పెద్ద లీ కున్-హీ మరణించిన తర్వాత విధించిన సుమారు 12 ట్రిలియన్ వాన్ల (దాదాపు రూ.66,800 కోట్లు) వారసత్వ పన్ను చెల్లించేందుకు ఈ విక్రయం చేపడుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు.ఈ విక్రయ ప్రక్రియను (stake sale) షిన్హాన్ బ్యాంక్, ట్రస్ట్ కాంట్రాక్టు కింద నిర్వహించనుండగా, 2026 ఏప్రిల్ నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. లీ బూ-జిన్, లీ సియో-హ్యూన్, హాంగ్ రా-హీ తమ వాటాలో 0.3% వాటాను విక్రయించనున్నట్లు పేర్కొన్నారు. ఇది వారసత్వ పన్ను చెల్లింపులో సహాయపడే దిశగా ముందడుగుగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ఈ సంవత్సరం ఇంతవరకు శాంసంగ్ స్టాక్ ధర 84% పైగా పెరిగింది. శుక్రవారం 0.2% పెరిగి 97,900 వాన్లకు చేరుకుంది. జూలైలో టెస్లాతో చిప్ సరఫరా ఒప్పందం ప్రకటించిన తర్వాత, కంపెనీ షేర్లు 48% వృద్ధి చెందిన సంగతి తెలిసిందే. అదే సమయంలో శాంసంగ్.. ఓపెన్ ఏఐ, ఎన్విడియా వంటి కీలక కస్టమర్లతో సరఫరా ఒప్పందాలు కుదుర్చుకుంది.కార్పొరేట్ విశ్లేషణ సంస్థ లీడర్స్ ఇండెక్స్ అధిపతి పార్క్ జు-గన్ మాట్లాడుతూ.. “గత ఏడాది ప్రకటించిన 10 ట్రిలియన్ వాన్ షేర్ బైబ్యాక్ ప్రణాళిక ద్వారా స్టాక్ విలువను రక్షించడంతోపాటు, వారసత్వ పన్నుకు నిధులు సమకూర్చేందుకు కూడా కుటుంబానికి ఇది తోడ్పడింది" అన్నారు.అయితే, ప్రస్తుతం లాభాల్లో ఉన్న సమయంలో ఇలా వాటాలు విక్రయించడం రిటైల్ పెట్టుబడిదారుల సెంటిమెంట్‌పై ప్రతికూల ప్రభావం చూపవచ్చని ఆయన హెచ్చరిస్తున్నారు. "శాంసంగ్ స్టాక్ దేశవ్యాప్తంగా సుమారు 5 మిలియన్ల రిటైల్ వాటాదారుల యాజమాన్యంలో ఉంది. వారు షేర్ ధర 100,000 వాన్ మార్కును చేరాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు" అని ఆయన తెలిపారు.ఇదీ చదవండి: వారెన్ బఫెట్ చెప్పిన సక్సెస్ సీక్రెట్.. -
సోదరా... రోహిత్‌కు పాప్‌కార్న్ ఇవ్వకు: అభిషేక్
భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి వన్డే సందర్భంగా జరిగిన ఓ సంఘటన చర్చనీయాంశమైంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆదివారం జరిగిన తొలి వన్డేలో శుబ్‌మన్ గిల్ సారథ్యంలోని భారత జట్టు 7 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. వర్షం కారణంగా మ్యాచ్‌కు పలుమార్లు అంతరాయం వాటిల్లగా... చివరకు 26 ఓవర్లకు కుదించాల్సి వచ్చింది.అయితే మ్యాచ్‌కు పదేపదే వర్షం ఆటంకం కల్పించినప్పుడు ప్లేయర్లు డ్రెస్సింగ్ రూమ్‌లో సేదతీరుతూ కనిపించారు. ఆ సమయంలో వ్యాఖ్యాతగా ఉన్న టీమిండియా మాజీ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ తన స్నేహితుడైన రోహిత్ శర్మపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌తో కలిసి పాప్‌కార్న్ తింటున్న రోహిత్‌ను చూస్తూ... ‘అరే భాయ్ ఉసే పాప్‌కార్న్ మత్ దే’ (సోదరా అతడికి పాప్‌కార్న్ ఇవ్వకు) అంటూ కామెంట్ చేశాడు.టెస్టు, టి20 ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ... ప్రస్తుతం వన్డే ఫార్మాట్లో మాత్రమే టీమిండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 2027 వన్డే ప్రపంచకప్ వరకు జట్టులో కొనసాగాలని భావిస్తున్న హిట్‌మ్యాన్... ఇటీవల ఫిట్‌నెస్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాడు. చాంపియన్స్ ట్రోఫీ విజయం అనంతరం వచ్చిన విరామంలో... ఏకంగా 11 కేజీల బరువు తగ్గాడు. దీనిపై మ్యాచ్‌కు ముందు అభిషేక్ మాట్లాడుతూ... ‘రోహిత్ పూర్తిగా మారిపోయాడు. మరింత ఫిట్‌గా, మరింత దృఢంగా మారాడు. ఫిట్నెస్ పెంపొందించుకుంటే... నైపుణ్యం దానంతటదే పెరుగుతుంది. ఈ విషయంలో రోహిత్ చాలా కష్టపడ్డాడు. ఇదంతా 2027 వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకునే కావచ్చు. అప్పటి వరకు ఆటలో కొనసాగాలంటే మొదట తన బరువు తగ్గించుకోవాలని రోహిత్ బలంగా అనుకున్నాడు. దాని వల్లే ఇదంతా సాధ్యమైంది. ఇప్పుడతడు నవ యువకుడిలా కనిపిస్తున్నాడు’ అని అన్నాడు.చదవండి: CWC 2025: ఇంగ్లండ్ చేతిలో ఓటమి.. అయినా భారత్‌కు సెమీస్ ఛాన్స్! ఇలా జరగాల్సిందే? -
అంతర్జాతీయ డ్రైవింగ్ పర్మిట్లకు మస్తు డిమాండ్
సాక్షి,హైదరాబాద్: హైదరాబాదీలు విదేశీ రహదారులపై రయ్‌మంటూ దూసుకెళ్తున్నారు. ఉద్యోగ, వ్యాపార, పర్యాటక అవసరాల కోసం వివిధ దేశాలకు వెళ్లేవారు పాస్‌పోర్టులు, వీసాలతో పాటు అంతర్జాతీయ డ్రైవింగ్ పర్మిట్లను కూడా ఒక తప్పనిసరి అవసరంగా భావించడం విశేషం. రవాణాశాఖ అందజేసే ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ (ఐడీపీ)కి ఏడాది పాటు చెల్లుబాటు ఉంటుంది. ఈ ఐడీపిపైన అక్కడ వాహనాలను నడిపేందుకు అవకాశం ఉంటుంది. ఆ తరువాత ఆ దేశ నిబంధనలకు అనుగుణంగా డ్రైవింగ్ లైసెన్సు తీసుకోవాలి. సాధారణంగా యూఎస్‌కు వెళ్లేవారి నుంచి ఐడీపీలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. కానీ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తరువాత డాలర్ కలలు కరిగిపోవడంతో విద్యార్థులు ఎక్కువగా యూరోప్ బాట పడుతున్నారు. దీంతో ఇప్పుడు యూఎస్‌కు వెళ్లే వాళ్లు మాత్రమే కాకుండా బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, తదితర దేశాలకు వెళ్లే వాళ్లు కూడా ఇంటర్నేషనల్ పరి్మట్ల కోసం బారులు తీరుతున్నారు. ఏటా సగటున 10 వేల నుంచి 12 వేల అంతర్జాతీయ డ్రైవింగ్ పర్మిట్లను అందజేస్తున్నట్లు ఆర్టీఏ అధికారులు తెలిపారు. ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు 13,151 పరి్మట్లను అందజేశారు. ఈజీగా డ్రైవింగ్.. లక్షలకొద్దీ వాహనాలు, కిక్కిరిసిన రోడ్లు, ట్రాఫిక్ రద్దీ నడుమ హైదరాబాద్‌లో బండి నడిపిన వాడు ప్రపంచంలో ఎక్కడైనా ఈజీగా దూసుకుపోగలుగుతాడనేది జగమెరిగిన సత్యం. అందుకే హైదరాబాద్ నుంచి విదేశాలకు వెళ్లే వాళ్లు అక్కడి రోడ్లపైన తమ డ్రైవింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శించేందుకు ఎంతో ఆసక్తి చూపుతున్నారు. మరోవైపు విదేశాల్లో ఉద్యోగాలు చేసేవాళ్లకు సొంత డ్రైవింగ్ తప్పదు. ఈ క్రమంలోనే ఇంటర్నేషనల్ పరి్మట్లకు డిమాండ్ పెరిగింది. విద్యార్ధులు, ఉద్యోగులతో పాటు మహిళలు సైతం ఐడీపీల కోసం పెద్ద సంఖ్యలో పోటీపడుతున్నారు. ప్రతి ఒక్కరికి వాహనం తప్పనిసరిగా మారడంతో డ్రైవింగ్ కూడా అనివార్యమైంది. మరోవైపు మన ఐడీపీలు ఉన్న వాళ్లకు ఆయా దేశాల్లో డ్రైవింగ్ లైసెన్సులు లభించడం కూడా తేలిక. పెద్దగా కఠినమైన డ్రైవింగ్ పరీక్షలు లేకుండానే లైసెన్సులు అందజేస్తారు. ఐడీపీలు పొందడం ఇలా.... పాస్‌పోర్టు కలిగిన వారు అంతర్జాతీయ డ్రైవింగ్ పర్మిట్ లను తీసుకోవచ్చు.ఇందుకోసం రవాణాశాఖ కొత్తగా ప్రవేశపెట్టిన ‘సారథి’ వెబ్సైట్లో స్లాట్ నమోదు చేసుకోవాలి. అలాగే రూ.1500 ఫీజు కూడా ఆన్లైన్లోనే చెల్లించాలి. అనంతరం పాస్‌పోర్టు,ఆధార్. డ్రైవింగ్ లైసెన్సు, తదితర డాక్యుమెంట్లతో సంబంధిత ప్రాంతీయ రవాణా కార్యాలయంలోని అధికారులను సంప్రదిస్తే అప్పటికప్పుడు ఇంటర్నేషనల్ డ్రైవింగ్పరి్మట్లను అందజేస్తారు. ఇది తీసుకున్న రోజు నుంచి ఏడాది పాటు చెల్లుబాటులో ఉంటుంది.ఆ తరువాత దీన్ని పొడిగించుకొనేందుకు అవకాశం లేదు. మరోసారి స్వయంగా అధికారులను సంప్రదించవలసి ఉంటుంది. ఒకవేళ ఆ దేశాల్లోనే స్థిరపడేవారైతే ఏడాదిలోపు అక్కడి నిబంధనల మేరకు లైసెన్సు తీసుకోవలసి ఉంటుంది.నగరంలోని ఖైరతాబాద్, సికింద్రాబాద్, మలక్‌పేట్, బండ్లగూడ, మణికొండ, మేడ్చల్, ఇబ్రహీంపట్నం, మెహదీపట్నం, తదితర ప్రాంతీయ రవాణాకార్యాలయాల నుంచి సగటున 120 నుంచి 150 పర్మిట్ ను అందజేస్తున్నట్లు అంచనా.కొన్ని దేశాల్లో మన ఐడీపీ చెల్లుబాటు కాదుమన అంతర్జాతీయ డ్రైవింగ్ పరి్మట్లకు సుమారు 150 దేశాల్లో ఆమోదం ఉంది.కానీ కొన్ని దేశాల్లో మాత్రం చెల్లుబాటు కాదు.జపాన్, చైనా, సౌత్ కొరియా వంటి దేశాల్లో భారతీయ ఐడీపీలను పరిగణనలోకి తీసుకోవడం లేదని, అక్కడ రవాణాశాఖ నిబంధనల మేరకు డ్రైవింగ్ లైసెన్సులను తీసుకోవలసి ఉంటుందని అధికారులు తెలిపారు. యూఎస్,బ్రిటన్,న్యూజిలాండ్, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, సింగపూర్, దుబాయ్, తదితర దేశాల్లో ఏడాది పాటు చెల్లుబాటులో ఉంటే కొన్ని దేశాల్లో మాత్రం 6 నుంచి 9 నెలల వరకు అనుమతినిస్తారు.డ్రైవింగ్ నిబంధనల్లో మార్పు దృష్ట్యానే ఈ అనుమతుల్లో తేడాలు ఉన్నట్లు రహదారిభద్రతా నిపుణులు పేర్కొంటున్నారు. -
మూసాపేట్లో బుల్లెట్ కలకలం
హైదరాబాద్: మూసాపేట మెట్రో స్టేషన్లో ఓ బాలుడి వద్ద బుల్లెట్ దొరకడంతో కలకలం రేగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఓ బాలుడు (12) మూసాపేట పరిధి ప్రగతినగర్‌లో తల్లితో పాటు ఉంటూ స్థానిక పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. బాలుడి తల్లి.. తండ్రితో విడిపోయి గత ఆరేళ్లుగా బిహార్‌కు చెందిన మహమ్మద్ ఆలంతో కలిసి ఉంటోంది. అతను మూసాపేటలోని ప్రగతినగర్‌లో నివాసముంటూ ఫ్యాబ్రికేషన్ పనులు చేస్తుంటాడు. ఈ క్రమంలో బాలుడిని బాగా చదువుకోవాలని, ఆటలాడవద్దని తండ్రి మందలించటంతో ఇంటి నుంచి పారిపోవాలని, ఇంట్లో ఉన్న బ్యాగులో బట్టలు, డబ్బు తీసుకుని బయటకు వచ్చాడు. మూసాపేట మెట్రో స్టేషన్ వద్ద ఉండగా బాలుడి బ్యాగ్‌ను తనిఖీ చేయగా బుల్లెట్ కనిపించింది. సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమై వెంటనే కూకట్పల్లి పోలీసులకు సమాచారం ఇవ్వటంతో పోలీసులు బాబును స్టేషన్‌కు తీసుకువెళ్లారు. అక్కడ సమాచారం రాబట్టగా ఇళ్లు వదిలి పెట్టి బయటకు వెళ్లిపోతున్నానని, బ్యాగులో బట్టలు, డబ్బులు తీసుకుని వెళుతున్నానని, తనకేమీ తెలియదన్నాడు. తల్లిదండ్రుల వివరాలు చెప్పటంతో ప్రగతినగర్‌కు వెళ్లి విచారించగా... మహమ్మద్ ఆలం తాత అన్సారీ ఆర్మీలో పనిచేసే వారని, తను చనిపోయినప్పటికి ఆయన బుల్లెట్ అలాగే ఉందని, ఇటీవల బిహార్‌కు వెళ్లినప్పుడు బుల్లెట్‌ను శుభ్రం చేసి జ్ఞాపకంగా పర్సులో దాచుకున్నానని తెలిపాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 9 ఎంఎం కేట్రిడ్జ్ బుల్లెట్‌గా పోలీసులు అనుమానిస్తున్నారు. -
Tirumala : నేడు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
తిరుమల: తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. ఉచిత సర్వదర్శనానికి 30 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు. అదివారం అర్ధరాత్రి వరకు 84,017 మంది స్వామివారిని దర్శించుకోగా 30,097 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.97 కోట్లు సమర్పించారు. టైమ్ స్లాట్ ( ఈ) దర్శనానికి సుమారు 6 గంటల సమయం. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 18 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 5 గంటల్లో దర్శనం లభిస్తోంది. -
మహారాష్ట్రలో కోటి బోగస్ ఓట్లు
ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ఓటర్ల జాబితాలో కనీసం కోటి బోగస్ ఓట్లున్నాయని ప్రతిపక్ష పార్టీలు ఆరోపించాయి. ఈ ఓట్లను ఎన్నికల కమిషన్‌ను డిమాండ్ చేస్తూ నవంబర్ ఒకటో తేదీన ముంబైలో ఉమ్మడిగా ర్యాలీ చేపడతామని ప్రకటించాయి.ఆదివారం మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన(ఎంఎన్ఎస్)నేత బాల నంద్గావోంకర్, శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్, కాంగ్రెస్ నేత సచిన్ సావంత్, ఎన్సీపీ(ఎస్పీ)నేత జయంత్ పాటిల్‌లు మీడియాకు ఈ విషయం తెలిపారు. త్వరలో గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలను నకిలీ ఓటర్లను తొలగించాకే నిర్వహించాలని వారు ఈసీని కోరారు. అంతకుముందు, ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రే కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ..స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే 96 లక్షల ఫేక్ ఓటర్లను జాబితాల్లో చేర్చారని ఆరోపించారు. ఒక్క ముంబైలోనే సుమారు 10 లక్షల నకిలీ ఓట్లున్నాయన్నారు. నకిలీ ఓట్లతో ఎన్నికలు జరపడం ఓటర్లను అవమానించడమేనన్నారు. -
ఇంగ్లండ్ చేతిలో ఓటమి.. అయినా భారత్‌కు సెమీస్ ఛాన్స్! ఇలా జరగాల్సిందే?
మహిళల ప్రపంచకప్-2025లో భారత జట్టు హ్యాట్రిక్ ఓటములు చవిచూసింది. ఆదివారం ఇండోర్ వేదికగా ఇంగ్లండ్ మహిళల జట్టుతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా అనుహ్యంగా 4 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఓ దశలో సునయాసంగా గెలిచేలా కన్పించిన హర్మన్ సేన.. ఆఖరిలో వరుస క్రమంలో వికెట్లు కోల్పోయి మ్యాచ్‌ను చేజార్చుకుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన ఇంగ్లండ్ జట్టు సెమీస్‌కు ఆర్హత సాధించింది. ఇప్పటికే ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా సెమీస్‌లో అడుగు పెట్టగా.. మూడో జట్టుగా ఇంగ్లండ్ తమ సెమీస్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. మిగిలిన ఒక్క స్ధానం కోసం భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య పోటీ నెలకొంది.భారత్ సెమీస్ చేరాలంటే?ఇక ఈ ఓటమితో భారత్ సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానం 4లో కొనసాగుతున్నప్పటికి.. సెమీస్ చేరాలంటే తీవ్రంగా శ్రమించాల్సి ఉంది. ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌లు ఆడిన భారత్ కేవలం రెండింట మాత్రమే విజయం సాధించింది.మన అమ్మాయిల జట్టు ఖాతాలో ప్రస్తుతం నాలుగు పాయింట్లు ఉన్నాయి. అదేవిధంగా న్యూజిలాండ్ వద్ద కూడా నాలుగు పాయింట్లు ఉన్నాయి. అయితే కివీస్(-0.245) కంటే భారత్(+0.526) రన్ రేటు మెరుగ్గా ఉండడంతో మూడో స్ధానంలో నిలిచింది. కాగా వరుసగా కివీస్ ఆడాల్సిన రెండు మ్యాచ్‌లు రద్దు అయ్యాయి.శ్రీలంక, పాకిస్తాన్‌లపై న్యూజిలాండ్ గెలవడం అంత కష్టమేమి కాదు. ఒకవేళ అదే జరిగింటే భారత్ సెమీస్ ఆశలు గల్లంతు అయ్యి ఉండేవి. భారత్‌కు, న్యూజిలాండ్‌కు ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. అక్టోబర్ 23న ముంబై వేదికగా కివీస్‌తో హర్మన్ సారథ్యంలోని భారత్ తలపడనుంది.ఈ మ్యాచ్ ఫలితంతో టీమిండియా సెమీస్ భవితవ్యం దాదాపు తేలిపోతుంది. కివీస్‌పై భారత్ విజయం సాధిస్తే 6 పాయింట్లతో మెరుగైన స్థితికి చేరుకుంటుంది. అప్పుడు టీమిండియా తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడనుంది. బంగ్లాపై భారత్‌కే గెలిచే ఛాన్స్‌లు ఎక్కువ. కాబట్టి ఎటువంటి సమీకరణాలు లేకుండా మన జట్టు సెమీస్ చేరుతుంది. ఇక న్యూజిలాండ్ జట్టుకు కూడా రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఒకవేళ కివీస్ చేతిలో భారత్ ఓటమి పాలైనప్పటికి నకౌట్కు అర్హత సాధించే అవకాశముంది. ఎలా అంటే న్యూజిలాండ్ తమ ఆఖరి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో తలపడనుంది. ప్రస్తత పరిస్థితుల్లో ఇంగ్లండ్‌ను న్యూజిలాండ్ ఓడించడం అంత సులువు కాదు. అదే సమయంలో భారత్ తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఘన విజయం సాధించాలి. అప్పుడు ఇంగ్లండ్ చేతిలో న్యూజిలాండ్ ఓడిపోయి.. బంగ్లాపై మనం ఘన విజయం సాధిస్తే పాయింట్ల పరంగా ఇరు జట్లు సమంగా నిలుస్తాయి. అప్పుడు మెరుగైన రన్‌రేట్ కలిగిన జట్టు సెమీస్‌కు అర్హత సాధిస్తుంది. ఒకవేళ కివీస్ రెండు మ్యాచ్‌లు గెలిచిందంటే భారత్ టోర్నీ నుంచి నిష్క్రమించిక తప్పదు.చదవండి: టీమిండియా జైత్రయాత్రకు బ్రేక్.. కోహ్లి సరసన గిల్ -
నాగచైతన్య,శోభిత సహా 'తల'దీపావళి..మరికొందరికి కూడా...
పెళ్లిని మించి జీవితంలో పెద్ద పండుగ ఏదీ ఉండదు. అలాగే పెళ్లి అయిన తర్వాత వచ్చే తొలి పండుగ కూడా అంతే ప్రధానంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా కొత్త దంపతుల జీవితంలో తొలి దీపావళికి మరింత ప్రాధాన్యత ఉంది. దీనిని 'తల' దీపావళి అని పిలుస్తారు. తల దీపావళి’’ అనేది కొత్తగా పెళ్లైన దంపతులు జరుపుకునే మొదటి దీపావళి అని ప్రత్యేక పండుగ అని అర్థం. ‘‘తల’’ అంటే ‘‘మొదటి’’ అని అర్థం. అంటే పెళ్లైన తర్వాత మొదటి దీపావళి అదే ‘‘తల దీపావళి’’. సాధారణంగా, భార్య భర్తల్లో ఎవరి ఇంట్లో మొదటి దీపావళి అయితే, ఆ ఇంట్లో పెద్ద పండుగగా జరుపుతారు. పెళ్లి తర్వాత మొదటి దీపావళి రోజున అమ్మాయిని తల్లిదండ్రుల ఇంటికి ఆహ్వానిస్తారు. ఆమె భర్త కూడా ఆమెకు తోడుగా వెళ్తాడు. అమ్మాయి తల్లిదండ్రులు వారికి కొత్త దుస్తులు, బహుమతులు వగైరాలు ఇస్తారు. పండుగ రోజున తెల్లవారుఝామున దంపతులు నూనె రాసుకొని అభ్యంగ స్నానం చేస్తారు . కొత్త బట్టలు ధరించడం. పటాకులు పేల్చడం, దీపాలు వెలిగించడం, స్వీట్లు పంచుకోవడం వంటివి మామూలే. అయితే బంధువులు, మిత్రులు వచ్చి భార్య భర్తలకు మంగళసూక్తాలు, ఆశీర్వాదాలు అందించడం కూడా ప్రత్యేకంగా ఉంటుంది. తల దీపావళి రోజున కొత్తగా పెళ్లైన జంటను ‘శుభారంభం‘గా పరిగణిస్తారు. ఇది వారికి ఆశీర్వాదాల పండుగ, భవిష్యత్తులో సుఖసంతోషాలతో జీవితం గడపడం కోసం జరుపుతారు.ఈ సంవత్సరం దీపావళి పండుగ దక్షిణ భారత సినిమా రంగంలో పలువురు తారలకు తల దీపావళిగా మారనుంది. ఈ మొదటి దీపావళిని సంతోషంగా ఆస్వాదించడానికి పలు సెలబ్రిటీ జంటలు సిద్ధంగా ఉన్నారు, అలాంటి జంటలలో...–మన మహానటి కీర్తి సురేష్- ఆంటోనీ థటిల్ గత డిసెంబర్లో వివాహం చేసుకుని కొత్త జీవితానికి నాంది పలికారు. వారి మొదటి దీపావళి వారి కొత్త ఇంట్లో కుటుంబంతో జరుపుకోవడానికి చిరస్మరణీయ పండుగ.–అక్కినేని యువ సామ్రాట్... నాగ చైతన్య శోబిత ధూళిపాల వివాహం తర్వాత వారి జీవితాల్లో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. ఈ దీపావళి వారి మొదటి పండుగ. –వరలక్ష్మి శరత్‌కుమార్ నిచోలాయ్ సచ్దేవ్ వారి వివాహం తర్వాత వారి జీవితాల్లో కొత్త ఆనందాన్ని ఆస్వాదిస్తున్నారు. ఈ తొలి దీపావళి వారి కొత్త ఇంట్లో, కుటుంబం స్నేహితులతో జరుపుకునే వారి మొదటి వేడుక అవుతుంది. –గత జనవరిలో వివాహం చేసుకున్న , సాక్షి అగర్వాల్, నవనీత్ వారి జీవితాల్లో కొత్త ఆనందాలలో మునిగి తేలుతున్నారు. అదే ఊపులో వారి మొదటి దీపావళిని ఇంట్లో , కుటుంబ అనురాగం స్నేహితుల సమక్షంలో జరుపుకోనున్నారు.–రమ్య పాండియన్, లవ్వెల్ ధావన్ వివాహం తర్వాత వారి మొదటి దీపావళిని సోమవారం జరుపుకోనున్నారు. ప్రేమ, ఆప్యాయత, కుటుంబ బంధాల నడుమ ఉత్సాహంతో రమ్య పాండియన్ లవ్వెల్ ధావన్ వెలుగుల పండుగను ఆస్వాదించనున్నారు. -
దీపావళి కోణంలో స్టాక్ మార్కెట్ పెట్టుబడులు..
దీపావళి పండగకి సంబంధించి తినుబండారాల కోణంలో మార్కెట్లను అభివర్ణించాల్సి వస్తే .. జిలేబీగా అభివర్ణించవచ్చు. అవును, మార్కెట్లు కూడా జిలేబీలాగే మెరిసిపోతూ, వంకర్లు తిరుగుతూ, అనూహ్యమైన విధంగా ఉంటాయి. వీటిని అర్థం చేసుకోవాలంటే బోలెడంత సహనం ఉండాల్సిందే.జిలేబీ ఆకారంలాగే ఈ ఏడాదంతా అంతర్జాతీయంగా ఒడిదుడుకులు, వడ్డీ రేట్ల అంచనాల్లో మార్పులు, భౌగోళికరాజకీయపరంగా ఆశ్చర్యపర్చే పరిణామాలు, సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో రణగొణ ధ్వనులతో గడిచింది. అయినప్పటికీ ప్రశాంతంగా, పెట్టుబడులను కొనసాగించిన ఇన్వెస్టర్లకు చాలా తియ్యని అనుభవాలే ఎదురయ్యాయి. స్పెక్యులేషన్‌కి పోకుండా క్రమశిక్షణతో ఉంటూ, ఓర్పు వహించినందుకు బహుమతిగా చిన్న చిన్న విజయాలు, నేర్చుకునే అవకాశాలు లభించాయి.ఈ ఏడాది బంగారం, వెండి టపాసుల్లాగా పేలాయి. సంప్రదాయ సిద్ధంగా సురక్షిత పెట్టుబడి సాధనంగా పసిడి తన పాత్రను చక్కగా పోషించింది. అనిశ్చితి నెలకొన్న తరుణంలో స్థిరత్వాన్ని అందించింది. ఒక్కసారిగా ఎగిసిన వెండి దీనికి మరింత హంగులు దిద్దింది. పాతతరం వివేకం, కొత్త తర పు ఉత్సాహం రెండూ కూడా కలిసి మెరిసేందుకు అవకాశం ఉందని ఇవి తెలియజేశాయి. అవకాశం, భద్రత మధ్య సమతుల్యతను పాటించడమే పోర్ట్‌ఫోలియో పటిష్టతకు కీలకమని తెలియజేశాయి. ఒకవేళ దీపావళి బహుమతులను తనదైన ప్రత్యేకత ఉన్న అసెట్ క్లాస్‌గా వరి్ణంచాల్సి వస్తే బంగారాన్ని వారసత్వ నెక్లెస్‌గా అభివరి్ణంచవచ్చు. కాలాతీతమైనదై, భావోద్వేగాలతో కూడుకున్నదై, తరతరాలుగా తన విలువను కాపాడుకుంటూ వస్తోంది పసిడి. ఇక బాండ్లను డ్రై ఫ్రూట్ బాక్సుగా అభివర్ణించవచ్చు. ఆకట్టుకునే మెరుపులు ఉండకపోయినా, ఇవి నమ్మకమైనవిగా, నిశ్శబ్దంగా అండగా నిలుస్తాయి.ఈక్విటీల విషయానికొస్తే.. ఇంట్లో తయారు చేసిన స్వీట్లలాంటి. చాలా ఓపిగ్గా, నమ్మకంతో, ఆశాభావంతో ఇవి తయారవుతాయి. అప్పుడప్పుడు గందరగోళంగా అనిపించినా ఆ తర్వాత చాలా సంతృప్తిని కలిగిస్తాయి. మరి క్రిప్టో విషయమేంటి? ఇవి పక్కింటివాళ్ల డ్రోన్ షో లాంటివి. చాలా ఆర్భాటంగా, పట్టించుకోకుండా ఉండలేని విధంగా ఉంటాయి. కానీ వీటిని కాస్త సురక్షితమైన దూరం నుంచే ఆస్వాదించడం మేలు. సంక్షోభ సమయాల్లోనే పసిడి రాణిస్తుందనే అపోహ ఒకటుంది. ఈ పండుగ సీజన్లో దాన్నుంచి బైటపడాలి. వాస్తవానికి బంగారమంటే, మార్కెట్లు బాగా లేనప్పుడు నీడనిచ్చే సాధనం మాత్రమే కాదు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా పోర్ట్‌ఫోలియోకు స్థిరత్వాన్నికూడా అందిస్తుంది. పర్ఫెక్ట్ దీపావళి పోర్ట్‌ఫోలియో ఎలా ఉంటుందంటే.. సమతూకంగా గల మల్టీ–అసెట్ థాలీలాగా ఉంటుంది. వృద్ధి కోసం ఈక్విటీలు .. స్థిరత్వం కోసం పసిడి .. క్రమశిక్షణ కోసం బాండ్లు .. ఇక సమర్ధత, డైవర్సిఫికేషన్, ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ కోసం మ్యుచువల్ ఫండ్‌లో చక్కగా చుట్ట చుట్టినట్లుగా ఉంటుంది. సాధారణంగా పండుగల సందర్భంలో మార్కెట్ సెంటిమెంటు ఉత్సాహంగా ఉంటుంది. కానీ, ఊదరగొట్టే అన్‌లిస్టెడ్ ఐడియాలు, సైక్లికల్ థీమ్‌లు ఇక ముగింపు దశకొస్తున్నాయనే వార్తలు, ‘దీపావళి టిప్’ స్టాక్‌లు మొదలైన వాటి విషయంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలి. మార్కెట్లు ఉత్సాహభరిత వాతావరణాన్ని ప్రతిబింబించవచ్చు కానీ అంతిమంగా మాత్రం ఎమోషన్లను కాకుండా ఆదాయాలనే ఫాలో అవుతాయి. వచ్చే దశాబ్దకాలం కోసం పోర్ట్‌ఫోలియోను రూపొందించుకోవడమే ఈ దీపావళికి మీకు మీరు ఇచ్చుకునే అత్యుత్తమ బహుమతి అవుతుంది. ఎందుకంటే సిసలైన సంపద కూడా, అందమైన రంగవల్లిలాంటిదే. ఓ లక్ష్యం పెట్టుకుని, ఎంతో ఓపిగ్గా, సమతూకాన్ని పాటిస్తూ డిజైన్ చేసుకోవాల్సి ఉంటుంది. కొన్నాళ్లకి దీపం కొండెక్కినా, ఈ సుగుణాలే దీర్ఘకాలం పాటు నిలిచి ఉంటాయి. -
‘భారత్‌కు భారీ సుంకాల మోతే..’ ట్రంప్ తీవ్ర హెచ్చరిక!
రష్యా-భారత్ చమురు వాణిజ్యంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. చమురు కొనుగోలును భారత్ తక్షణమే ఆపకపోతే భారీ సుంకాలు విధిస్తామని హెచ్చరించారాయన. ఈ క్రమంలో మోదీకి తనకు మధ్య ఫోన్ సంభాషణేదీ జరగలేదన్న భారత విదేశాంగ శాఖ ప్రకటనపైనా ఆయన స్పందించారు. ఆదివారం రాత్రి కొందరు రిపోర్టర్ల నుంచి ఆయనకు ఈ ప్రశ్న ఎదురైంది. దానికి స్పందిస్తూ.. ‘‘ఆయన(మోదీ) రష్యాతో ఇకపై చమురు వ్యాపారం ఉండబోదని నాతో స్పష్టంగా చెప్పారు. అయినా కూడా కొనుగోళ్లు జరుపుతున్నట్లు నా దృష్టికి వచ్చింది. ఇది ఇలాగే కొనసాగితే భారీ సుంకాలను ఆ దేశం ఎదుర్కొనక తప్పదు’’ అని ట్రంప్ హెచ్చరించారు(Trump On India Russia Oil Trade). ఆ సమయంలో.. ‘‘ప్రధాని మోదీ మీకు మధ్య ఇటీవలి ఫోన్ సంభాషణ జరిగిందన్న తమకు తెలియదని భారత ప్రభుత్వం చెబుతోంది కదా’’ అని ఓ రిపోర్టర్ ట్రంప్ వద్ద ప్రస్తావించారు. దానికి ఆయన స్పందిస్తూ.. ‘వాళ్లు అలా చెప్పాలనుకుంటే కచ్చితంగా భారీ సుంకాలు చెల్లించాల్సి వస్తుంది. కానీ, వాళ్లు అలా చేయాలనుకోరని నేను అనుకుంటున్నా’(Trump Warn India) అని బదులిచ్చారు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లను గణనీయంగా తగ్గించేసిందని, రాబోయే రోజుల్లో పూర్తిగా ఆపేస్తుందని, ఈ మేరకు తన స్నేహితుడు, భారత ప్రధాని మోదీ నుంచి తనకు స్పష్టమైన హామీ లభించిందని ట్రంప్ గత బుధవారం తన ఓవెల్ ఆఫీస్‌లో స్వయంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఇద్దరు నేతల మధ్య అలాంటి ఫోన్ సంభాషణేది జరగలేదన్న భారత విదేశాంగ శాఖ.. ఎవరి ఒత్తిళ్లు తమపై పని చేయబోవని, దేశ ప్రజల ప్రయోజనాల మేరకే ఎలాంటి నిర్ణయం అయినా ఉంటుందని తేల్చి చెప్పింది. అయితే ఆ మరుసటిరోజు కూడా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో భేటీ సమయంలో మాట్లాడుతూ.. రష్యా చమురును భారత్ కొనుగోలు చేయబోదని, ఢిల్లీ వర్గాల నుంచి తనకు స్పష్టమైన హామీ వచ్చిందని, ఉక్రెయిన్ యుద్ధంలో ఇది కీలక అడుగు అని, ఈ ప్రభావంతో రష్యా ఆర్థిక స్థితిపై ప్రభావం పడి యుద్ధం ఆగిపోతుందని అన్నారు.ఇదిలా ఉంటే.. భారత్‌తో వాణిజ్య ఒప్పందాలు సజావుగా లేవని, అమెరికా ఉత్పత్తులపై అధిక సుంకాలు వసూలు చేస్తోందని.. పైగా రష్యాతో చమురు వాణిజ్యం జరుపుతూ పరోక్షంగా ఉక్రెయిన్ యుద్ధానికి సహకరిస్తోందంటూ ట్రంప్ సంచలన ఆరోపణలకు దిగారు. ఈ క్రమంలో సుంకాల యుద్ధానికి దిగారు. భారత్‌పై జులై 31వ తేదీన 25 శాతం అదనపు సుంకాన్ని(ప్రతీకార సుంకాన్ని) విధిస్తున్నట్లు ప్రకటించారు. అయితే.. ఆ వెంటనే రష్యా చమురు కొనుగోలు నేపథ్యంతో ఆగస్టు 6వ తేదీన మరో 25 శాతం సుంకాన్ని పెనాల్టీగా విధించారు. అలా.. ఆగష్టు 27వ తేదీ నుంచి భారత్‌పై అమెరికా వివధించిన 50 శాతం టారిఫ్‌లు అమల్లోకి వచ్చాయి. ఈ సుంకాలను భారత్ అన్యాయంగా పేర్కొంటూనే.. మరోవైపు అమెరికాతో వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ట్రంప్ తాజా హెచ్చరికలపై భారత్ ఎలా స్పందిస్తుంది.. ఈ ప్రభావం ట్రేడ్ డీల్‌పై పడుతుందా? అనేది చూడాలి(Trump Massive Tariff Warn To India).ఇదీ చదవండి: ట్రంప్‌ది ముమ్మాటికీ నిరంకుశ పాలనే! -
కొడుకును వెళ్లగొట్టినా.. కోడలికి హక్కుంటది
న్యూఢిల్లీ: కుటుంబ కలహాల కారణంగా తమ ఆస్తిపై కుమారుడికి హక్కు ఇవ్వకుండా నిర్ణయం తీసుకున్నప్పటికీ.. వారి ఉమ్మడి ఇంట్లో నివసించే హక్కు కోడలికి (కుమారుడి భార్యకు) ఉంటుందని ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. వివాహ బంధంతో అత్తగారింట్లోకి అడుగుపెట్టి కాపురం ఉన్న కోడలికి ఆ ఇంట్లో నివసించే హక్కును తిరస్కరించటం గృహసింహ చట్టం ప్రకారం సాధ్యం కాదని ఈ నెల 16న జస్టిస్ సంజీవ్నారుల్ స్పష్టంచేశారు. ఆ ఇంట్లో నుంచి కోడలిని వెళ్లగొట్టాలంటే చట్టప్రకారం మాత్రమే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని తేల్చి చెప్పారు. ఇదీ కేసు.. ఢిల్లీకి చెందిన ఓ కుటుంబం తమ కుమారుడికి 2010లో వివాహం జరిపించింది. అప్పటినుంచి అత్త, మామ, కొడుకు, కోడలు ఒకే ఇంట్లో ఉన్నారు. అయితే, 2011 నుంచి తల్లిదండ్రులతో కుమారుడికి గొడవలు మొదలు కావటంతో కొంతకాలం కొడుకు, కోడలు తమ సొంత ఇంటిని వదిలి అద్దె ఇంట్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో తమ ఆస్తిపై కొడుక్కు ఎలాంటి హక్కులు లేవని తల్లిదండ్రి ప్రకటించారు. ఆ ఆస్తి తమ స్వార్జితమని, దానిపై తమకే పూర్తి హక్కులు ఉంటాయని పేర్కొన్నారు. కానీ, ఆ తర్వాత కొంతకాలానికి కోడలు తిరిగి అత్తగారింటికి రావాలని నిర్ణయించుకుంది. కానీ, అప్పటికే ఆమె వస్తువులన్నీ ఆ ఇంట్లో నుంచి తీసివేశారు. అయినా, ఆమె ఆంట్లోకి తిరిగి వచ్చింది. ఈ చర్యను వ్యతిరేకిస్తూ అత్తమామ హైకోర్టును ఆశ్రయించారు.తమ కుమారుడినే త్యజించామని, అలాంటప్పుడు కోడలికి తమ ఇంట్లో నివసించే హక్కు లేదని వాదించారు. ఈ వాదనను ధర్మాసనం తిరస్కరించింది. కోడలిగా అత్తగారింట్లోకి అడుగు పెట్టిన తర్వాత ఆమెకు ఆ ఇంట్లో నివసించే హక్కు ఉంటుందని స్పష్టంచేసింది. అత్తమామలు తన భర్తకు హక్కులు నిరాకరించినా, ఆమె హక్కులను కాదనలేరని తేల్చి చెప్పింది. అత్తమామ ఇంట్లో మొదటి అంతస్తులో, కోడలు గ్రౌండ్‌ఫ్లోర్‌లో నివసించాలని సూచించింది.గృహసింహ చట్టంలోని సెక్షన్ 17(1) ప్రకారం కుటుంబసభ్యురాలిగా ఉన్న మహిళలకు వారి ఉమ్మడి ఇంట్లో నివసించే అధికారం, హక్కు ఉంటాయని తెలిపింది. సెక్షన్ 17(2) ప్రకారం ఆ మహిళలను ఉమ్మడి ఇంట్లో నుంచి ఖాళీ చేయించాలంటే కచ్చితంగా చట్టప్రకారమే వెళ్లాలని స్పష్టంచేసింది. కొడుకు కోడలు తమ ఉమ్మడి కుటుంబ వాతావరణాన్ని నాశనం చేశారన్న పిటిషనర్ల వాదనను తోసిపుచ్చింది. కొడుకు, కోడలు ఇంట్లో నుంచి వెళ్లిపోయినంత మాత్రాన ఉమ్మడి కుటుంబ వాతావరణం చెడిపోయినట్లు కాదని వివరణ ఇచ్చింది. -
బిగ్‌బాస్ నుంచి 'భరణి' ఎంత సంపాదించారంటే..
బిగ్‌బాస్ 9 తెలుగు నుంచి బుల్లితెర నటుడు భరణి ఎలిమినేట్ అయిపోయారు. సుమారు వారాల పాటు ఆయన హౌస్‌లో కొనసాగారు. ఆదివారం జరిగిన దీపావళి ఎపిసోడ్లో నటుడు నాగార్జున (Nagarjuna) వ్యాఖ్యతగా వ్యవహరించారు. ప్రేక్షకుల ఓటింగ్ ప్రకారంగా భరణి ఎలిమినేట్ అయ్యారని నాగ్ ప్రకటించారు. దీంతో ఆయన హౌస్ నుంచి బయటకు రావాల్సి వచ్చింది. అయితే, ఎలాంటి నెగటివిటీ లేకుండానే ఆయన బయటకు వచ్చేశారు. ఈ క్రమంలో బిగ్‌బాస్ నుంచి ఆయన ఎంత సంపాదించారనేది సోషల్‌మీడియాలో వైరల్ అవుతుంది.బిగ్ బాస్‌లోకి వెళ్లే కంటెస్టెంట్లకు రెమ్యునరేషన్ ఎంత అనేది ముందే అగ్రిమెంట్ చేసుకుంటారు. ఈ సీజన్లో ఎక్కువ పేరున్న సెలబ్రిటీగా భరణి ఉన్నారు. అందుకే ఈ సీజన్లో ఆయనకే ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చినట్లు సమాచారం. వారానికి రూ. 3.5 లక్షలు పైగానే భరణికి బిగ్‌బాస్ ఇచ్చినట్లు తెలుస్తోంది. బిగ్‌బాస్‌లో ఉన్న 6వారాలకు గాను రూ. 21 లక్షలకు పైగానే ఆయన అందుకున్నట్లు సమాచారం. డబ్బు కంటే ఎక్కువ ఆయన మంచి పేరు సంపాదించాడని చెప్పవచ్చు. అయితే, హౌస్‌లో చాలామందితో ఎక్కువ బంధాలు పెట్టుకోవడం వల్లే ఎలిమినేట్ అయ్యారని తెలిసిందే.ఈ వారం నామినేషన్స్‌లో ఉన్న ఆరుగురిలో ఒక్కొక్కరూ సేవ్ అవుతూ.. ఫైనల్‌గా భరణి, రాము రాథోడ్ నిలిచారు. వీరిద్దరిలో భరణి ఎలిమినేట్ అయ్యారని నాగార్జున ప్రకటించారు. దీంతో తనూజ, దివ్య కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇమ్మాన్యుయేల్ వద్ద ఉన్న పవర్ అస్త్ర భరణి కోసం ఉపయోగించి ఉండుంటే సేవ్ అయిండేవాడు. కానీ, అతను రాము రాథోడ్‌కు ఉపయోగించడం.. ఆపై ఓట్ల పరంగా కూడా రాము సేఫ్ జోన్లో ఉండటంతో అందరూ షాక్ అయ్యారు. -
తాడిపత్రిలో హైటెన్షన్.. జేసీ గూండాగిరి
తాడిపత్రి టౌన్: అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో టీడీపీ నేత, మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి మరోసారి వీరంగం సృష్టించారు. పట్టపగలు అందరూ చూస్తుండగా.. వైఎస్సార్సీపీ నాయకుడిపై తన అనుచరులతో దాడి చేయించి తీవ్రంగా గాయపరిచారు. బాధితుడు తెలిపిన వివరాలు.. వైఎస్సార్సీపీ నాయకుడు యర్రగుంటపల్లి నాగేశ్వరరెడ్డి ఆదివారం తాడిపత్రిలోని ఆనంద్ భవన్ హోటల్ వద్ద టీ తాగుతుండగా.. వాహనంలో అటుగా వెళ్తున్న జేసీ ప్రభాకర్‌రెడ్డి చూశారు. ఆ వెంటనే ‘వీణ్ని ఎందుకురా ఇంత వరకు వదిలేశారు’ అంటూ అనుచరులను రెచ్చగొట్టారు. దీంతో రవీంద్రారెడ్డి, యాసిన్, బద్రీ, విష్ణు, శేఖర్‌తో పాటు సుమారు పది మంది జేసీ అనుచరులు ఇనుప రాడ్లతో నాగేశ్వరరెడ్డిపైకి దూసుకెళ్లారు. వారి నుంచి తప్పించుకునేందుకు ప్రయతి్నంచిన నాగేశ్వరరెడ్డిని.. రోడ్డుపై వెంబడిస్తూ దాడి చేశారు. సమీపంలో వైఎస్సార్సీపీ నాయకురాలు పేరం స్వర్ణలత ఇల్లు కనిపించడంతో.. నాగేశ్వరరెడ్డి అందులోకి పరుగెత్తుకెళ్లి తలదాచుకున్నాడు. జేసీ అనుచరులు అక్కడి నుంచి వెళ్లిపోగానే.. పేరం అమరనాథ్‌రెడ్డి స్థానికులతో కలిసి బాధితుడిని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. ఆస్పత్రి వద్దకు చేరుకుని దాడి వివరాలను ఆరా తీశారు. జేసీ ప్రభాకర్‌రెడ్డిపై పోలీసులు చర్యలు తీసుకుంటారన్న నమ్మకం తనకు లేదంటూ.. కేసు పెట్టడానికి బాధితుడు నిరాకరించారు. కాగా, నాగేశ్వరరెడ్డిని వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఫోన్లో పరామర్శించారు. -
అమరావతి ఓఆర్ఆర్.. 190 కిలో మీటర్లు.. 24,790 కోట్లు
సాక్షి, అమరావతి: హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్) కంటే పెద్దగా అమరావతి ఓఆర్ఆర్ నిర్మించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇందుకోసం 190 కి.మీ.మేర 140 మీటర్ల వెడల్పులో భూసేకరణకు సిద్ధమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళిక మేరకు అమరావతి ఓఆర్ఆర్ నిర్మాణం కోసం నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్హెచ్ఏఐ) సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)ను ఢిల్లీలోని ఎన్హెచ్ఏఐ ప్రధాన కార్యాలయానికి సమర్మించింది. మొత్తం 190 కి.మీ. మేర నిర్మించాలని ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టుకు రూ.24,790 కోట్ల అంచనా వ్యయంతో డీపీఆర్‌ను అందజేసింది.అమరావతి ఓఆర్ఆర్ డీపీఆర్‌లో ప్రధాన అంశాలు ఇవీ... 👉హైదరాబాద్ ఓఆర్ఆర్ పొడవు 158 కి.మీ. కాగా, అమరావతి ఓఆర్ఆర్ను 190 కి.మీ. మేర నిర్మించాలని నిర్ణయించారు. ఆరు లేన్లుగా ఓఆర్ఆర్ను నిర్మిస్తారు. అందుకోసం అమరావతిలో 190 కి.మీ. పొడవునా 140 మీటర్ల వెడల్పుతో భూసేకరణ చేస్తారు. భూసేకరణ వ్యయంలో రూ.వెయ్యి కోట్లను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. 👉ఓఆర్ఆర్లో భాగంగా కృష్ణా నదిపై రెండు వంతెనలు నిర్మిస్తారు. ముప్పలూరు వద్ద 3.15 కి.మీ. మేర మొదటి వంతెన, మున్నంగి వద్ద 4.8 కి.మీ. మేర రెండో వంతెన నిర్మించాలని నిర్ణయించారు. గంగినేనిపాలెం అటవీప్రాంతంలో రెండు టన్నెళ్లు నిర్మించాలని ప్రతిపాదించారు. మొదటి టన్నెల్ 1.64 కి.మీ., రెండో టన్నెల్ 2.68 కి.మీ. మేర నిర్మిస్తారు. ఇందుకోసం పర్యావరణ అనుమతులు తీసుకోవాల్సి ఉంది. 👉అమరావతి ప్రాంతాన్ని ఓఆర్ఆర్తో అనుసంధానిస్తూ రెండు స్పర్ రోడ్లు నిర్మిస్తారు. తెనాలి నుంచి కాజ టోల్ ప్లాజా వరకు 17.5 కి.మీ. మేర మొదటి స్పర్ రోడ్డు, నారా కోడూరు నుంచి గుంటూరు శివారులోని బుడంపాడు వరకు 5.20 కి.మీ. మేర రెండో స్పర్ రోడ్డు నిరి్మస్తారు. 👉అమరావతి ఓఆర్ఆర్ కోసం రూ.24,790 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. అందులో రాష్ట్ర ప్రభుత్వం రూ.3,117 కోట్లు భరించనుంది. ప్రాజెక్టును 12 ప్యాకేజీలుగా పనులు చేపట్టాలని ప్రతిపాదించారు. -
గాజా యుద్ధం మళ్లీ మొదటికి! ట్రంప్ ఏమన్నారంటే..
గాజా సంక్షోభం మళ్లీ మొదటికి వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాల్పుల విమరణ ఒప్పందం కుదిరినప్పటి నుంచి ఇప్పటిదాకా జరిగిన దాడుల్లో.. ఇద్దరు ఇజ్రాయెల్ సైనికులు, 97 మంది పాలస్తీనీయులు మరణించారు. శాంతి ఒప్పందం ఉల్లంఘనపై ఇరు దేశాలు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఈ తరుణంలో.. తాజా పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఆదివారం రాత్రి మార్-ఎ-లాగో నుంచి వాషింగ్టన్కు తిరుగు ప్రయాణం అవుతుండగా.. ఓ రిపోర్టర్ గాజా తాజా పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ప్రశ్నించారు. గాజా కాల్పుల విరమణ ఒప్పందం ఇంకా అమల్లో ఉందని భావిస్తున్నారా? అనే అడగ్గా.. ఆయన ‘అవును’ అనే సమాధానం ఇవ్వడం కొసమెరుపు. ‘‘గాజా శాంతి ఒప్పందానికి వచ్చిన ఢోకా ఏం లేదు. మేము హమాస్‌తో పరిస్థితి చాలా శాంతియుతంగా ఉండేలా చూసుకోవాలనుకుంటున్నాం. కానీ, మీకు తెలుసు కదా.. వాళ్లు కొంచెం అతి చేస్తున్నారు. కొన్ని చోట్ల కాల్పులకు దిగుతున్నారు. అయితే.. ఆ దాడులకు హమాస్ నాయకత్వానికి సంబంధం లేదేమో అనిపిస్తోంది. బహుశా రెబల్స్ ఈ తరహా ఘటనలకు పాల్పడుతున్నారేమో. అయినా సరే.. ఈ వ్యవహారాన్ని పరిష్కరిస్తాం. అందుకోసం కఠినంగా అయినా వ్యవహరిస్తాం’’ అని ట్రంప్ సున్నితంగా హెచ్చరికలు జారీ చేశారు.ఏం జరిగిందంటే.. దక్షిణ గాజాలోని రఫా (Rafah) వద్ద ఇజ్రాయెల్ రక్షణ బలగాలపై హమాస్ దాడి జరిపింది. ఈ దాడిలో ఇద్దరు సైనికులు చనిపోయారు. ప్రతిగా ఇజ్రాయెల్ బలగాలు జరిపిన వైమానిక దాడుల్లో 19 మంది పాలస్తీనీయులు మరణించారు.ఇజ్రాయెల్ యాక్షన్.. అక్టోబర్ 19వ తేదీన ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్(Israel Defense Forces) ఇంజనీరింగ్ వాహనంపై ఓ ఆంటీ-ట్యాంక్ మిస్సైల్ దూసుకొచ్చింది. ఈ దాడిలో ఇద్దరు ఇజ్రాయెల్ సైనికులు మరణించారు. ఈ ఘటనను ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తీవ్రంగా పరిగణించారు. ఇది హమాస్ పనేనని, కాల్పుల విరమణ ఒప్పందానికి స్పష్టమైన ఉల్లంఘనగా పేర్కొంటూ.. గాజాకు మానవతా సాయం ఆపేశారు. అంతేకాదు.. ప్రతిదాడులతో ప్రతీకారం తీర్చుకోవాలని సైన్యాన్ని ఆదేశించారు.దీంతో.. గాజాలోని రఫా నగరంపై ఇజ్రాయెల్ బలగాలు దాడులు జరిపాయి. ఈ తాజా దాడుల్లో 19 మంది పాలస్తీనయులు మరణించారు. హమాస్ ఏమందంటే.. ఇదిలా ఉంటే రఫా దాడికి హమాస్.. రక్షణాత్మక చర్యలుగా చెబుతోంది. ఇజ్రాయెల్ బలగాలే తమపై ముందుగా దాడులు చేశాయని, ప్రతిగానే తామూ దాడులు చేయాల్సి వచ్చిందని చెబుతోంది. దీంతో ఇరు దేశాలు శాంతి ఒప్పందానికి తూట్లు పొడిచినట్లైంది. ఈ పరస్పర ఆరోపణలు.. గాజాలో శాంతి స్థితిని మరింత సంక్లిష్టంగా మార్చేసే పరిస్థితి నెలకొంది. అయితే.. ఈ దాడులతో గాజా శాంతి ఒప్పందానికి వచ్చిన నష్టమేమీ లేదని ట్రంప్ అంటున్నారు. ఇదీ చదవండి: నువ్వేం రాజువి కాదయ్యా బాబూ! -
క్యూ2 ఫలితాల ఎఫెక్ట్
దీపావళి సందర్భంగా మంగళవారం(21) నిర్వహించనున్న మూరత్ ట్రేడింగ్‌ను మినహాయిస్తే ఈ వారం మార్కెట్లు మూడు రోజులే పనిచేయనున్నాయి. అయితే క్యూ2 ఫలితాలతోపాటు పలు అంశాలు మార్కెట్లను నడిపించనున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. గత వారాంతాన మార్కెట్లు ముగిశాక డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్(ఆర్ఐఎల్)సహా.. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, యస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ జూలై–సెపె్టంబర్ ఫలితాలు ప్రకటించాయి. దీంతో నేడు(20న) ఈ కౌంటర్లు యాక్టివ్‌గా ట్రేడ్‌కానున్నట్లు నిపుణులు తెలియజేశారు. ఈ బాటలో ఈ వారం హిందుస్తాన్ యూనిలీవర్, కాల్గేట్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, కోఫోర్జ్, ఐటీసీ హోటల్స్, కొటక్ మహీంద్రా బ్యాంక్ క్యూ2 పనితీరు వెల్లడించనున్నాయి. దీంతో నేడు ఫలితాల ప్రభావంతో ట్రెండ్ నిర్దేశితంకానున్నట్లు రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్వీపీ అజిత్ మిశ్రా అభిప్రాయపడ్డారు. హెచ్‌యూఎల్, డాక్టర్ రెడ్డీస్ కార్పొరేట్ ఫలితాల సీజన్‌కు దారి చూపనున్నట్లు స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ సీనియర్ టెక్నికల్ అనలిస్ట్ ప్రవేశ్ గౌర్ అంచనా వేశారు. సంవత్ 2082 షురూ స్టాక్ మార్కెట్లలో మంగళవారం కొత్త ఏడాది సంవత్ 2082 ప్రారంభంకానుంది. దీపావళి పండుగ సందర్భంగా స్టాక్ ఎక్సే్ఛంజీలు(బీఎస్ఈ, ఎన్ఎస్ఈ) మధ్యాహ్నం 1.45 నుంచి 2.45 వరకూ ప్రత్యేక(ముహూరత్) ట్రేడింగ్‌ను నిర్వహించనున్నాయి. మరుసటి రోజు(22న) బలిప్రతిపాద సందర్భంగా మార్కెట్లకు సెలవు. ఆపై గురు, శుక్రవారాలు యథావిధిగా పనిచేయనున్నాయి. ఫలితాలు, పండుగ జోష్ సంవత్ 2082 తొలి రోజు సెంటిమెంటుకు బలాన్నివ్వనున్నట్లు మార్కెట్ విశ్లేషకులు అంచనా వేశారు. గణాంకాలు.. దేశీయంగా 21న సెపె్టంబర్ నెలకు మౌలిక రంగ గణాంకాలు వెలువడనున్నాయి. 2025 ఆగస్ట్‌లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఔట్పుట్ 6.3 శాతం ఎగసింది. ఇది 13 నెలల గరిష్టంకాగా.. కోల్, స్టీల్, సిమెంట్ తదితరాలు ఇందుకు సహకరించాయి. ఇక 24న అక్టోబర్ తయారీ, సరీ్వసులు, కాంపోజిట్ పీఎంఐ గణాంకాలు వెల్లడికానున్నాయి. తయారీ పీఎంఐ సెపె్టంబర్లో 57.7కు నీరసించగా.. ఆగస్ట్‌లో 59.3కు బలపడింది. అంతర్జాతీయ అంశాలు చైనాపై యూఎస్ విధించిన తాజా టారిఫ్‌లు, వీటిపై చైనా స్పందనతోపాటు.. పరిష్కారం వంటి అంశాలు ప్రపంచ మార్కెట్లను ప్రభావితం చేయనున్నట్లు నిపుణులు తెలియజేశారు. యూఎస్, చైనా మధ్య వాణిజ్య ఆందోళనలకు తెరపడితే సెంటిమెంటు పుంజుకోవచ్చని గౌర్ అభిప్రాయపడ్డారు. జూలై–సెపె్టంబర్‌కు చైనా జీడీపీ గణాంకాలు 20న విడుదలకానున్నాయి. ఏప్రిల్–జూన్‌లో 5.2 శాతం వృద్ధి చూపింది. 23న యూఎస్ సెపె్టంబర్ గృహ విక్రయ గణాంకాలు వెలువడనున్నాయి. 24న యూఎస్ ద్రవ్యోల్బణ వివరాలు వెల్లడికానున్నాయి. ఇవికాకుండా ముడిచమురు ధరలు, ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు తీరు వంటి అంశాలకూ ప్రాధాన్యత ఉన్నట్లు మిశ్రా, గౌర్ పేర్కొన్నారు.కొనుగోళ్లకు ఎఫ్‌పీఐలు సై ఈ నెలలో రూ. 6,480 కోట్లు గత మూడు నెలలుగా దేశీ స్టాక్స్‌పట్ల విముఖత చూపుతున్న విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) అక్టోబర్‌లో కొనుగోళ్ల యూటర్న్ తీసుకున్నారు. తద్వారా ఈ నెలలో ఇప్పటివరకూ నికర పెట్టుబడిదారులుగా నిలిచారు. స్థూల ఆర్థిక పరిస్థితులు పటిష్టపడటంతో కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నారు. వెరసి ఈ నెల 1–17 మధ్య రూ. 6,480 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. అంతక్రితం సెపె్టంబర్లో రూ. 23,885 కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకోగా.. ఆగస్ట్‌లో రూ. 34,900 కోట్లు, జూలైలో రూ. 17,700 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించిన సంగతి తెలిసిందే.గత వారమిలా..13–17 మధ్య ముగిసిన గత వారం వరుసగా మూడోసారి దేశీ స్టాక్ మార్కెట్లు లాభాలతో నిలిచాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 1,625 పాయింట్లు(2 శాతం) ఎగసి 83,952 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ సైతం 483 పాయింట్లు(2 శాతం) బలపడి 25,710 వద్ద స్థిరపడింది. అయితే బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు స్వల్పంగా 0.2 శాతం పుంజుకున్నాయి. -
ప్రెగ్నెంట్ అని అబద్దం చెప్పాను: రెజీనా
నటి రెజీనా(Regina Cassandra) తెలుగులోనే కాదు తమిళ్, మలయాళం, కన్నడం, హిందీ తదితర భాషల్లోనూ నటించి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. పలు చిత్రాల్లో ఐటమ్స్ సాంగ్స్‌తో కూడా మెప్పించిన ఆమెకు అనుకున్నంత రేంజ్ విజయాలు దక్కకపోయినప్పటికీ ఫ్యాన్స్ మాత్రం భారీగానే ఉన్నారు. తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఒక సందర్భంలో తాను ప్రెగ్నెంట్ అని అబద్ధం చెప్పాల్సిన అవసరం ఎందుకొచ్చిందో సరదాగా పంచుకుంది.సుమారు పదేళ్ల క్రితం ఒకసారి బెంగళూరులో అర్ధరాత్రి 12 గంటల ప్రాంతలో స్నేహితురాళ్లతో కలిసి వెళుతుండగా తనకు లస్సీ తాగాలనిపించిందని గుర్తు చేసుకున్నారు. అప్పుడే మూస్తున్న ఒక షాప్ వద్దకు వెళ్లి లస్సీ కావాలని అడిగానన్నారు. అందుకు ఆ షాప్ యజమాని చిరాకుగా లస్సీ లేదు ఏమీలేదు వెళ్లు అని అన్నాడని తెలిపారు. వెంటనే తాను గర్భంతో ఉన్నాను. నాకు లస్సీ ఇస్తే ఆ భగవంతుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు అని అన్నానన్నారు. దీంతో తన స్నేహితురాళ్లు షాక్‌కు గురయ్యారన్నారు.అయితే, ఆ షాప్ అతను ఎక్కడ రెజీనా గర్భవతి అని అందరికీ చెబుతారో అని తన ఫ్రెండ్స్ కూడా భయపడ్డారన్నారు. అదృష్టవశాతు అతను ఎవరికీ చెప్పలేదని తెలిపారు. ఇలాంటి తమాషాలు చాలా చేశానని, ఇప్పటికీ చేస్తుంటానని రెజీనా అన్నారు. అయితే, కొంత కాలం తర్వాత మీడియాలో మాత్రం ఇదే విషయంపై మరో విధంగా ప్రచారం జరిగిందని గుర్తుచేసుకున్నారు. -
నువ్వో డ్రగ్ డీలర్
పామ్ బీచ్(అమెరికా): అగ్రరాజ్యాధినేతననే అహంకారంతో తనకు నచ్చని ప్రతి దేశంపై ఆంక్షలు, నిషేధాజ్ఞల కొరడా ఝళిపిస్తున్న డొనాల్డ్ ట్రంప్ ఈసారి కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రోను లక్ష్యంగా చేసుకున్నారు. కొలంబియాలో తయారైన మాదకద్రవ్యాలు అమెరికాలోకి పోటెత్తుతున్నాయని, ఇందుకు గుస్తావోనే కారణమని ఆయనపై అంతెత్తున లేచారు. ఈ మేరకు ట్రంప్ తన సొంత సామాజిక మాధ్యమం ‘ట్రూత్ సోషల్’లో ఆదివారం ఒక పోస్ట్ చేశారు. ‘‘గుస్తావో ఒక పెద్ద అక్రమ మాదకద్రవ్యాల డీలర్. పేరు ప్రఖ్యాతలు లేని, అసలు ప్రాముఖ్యతే లేని రాజకీయనేత. కొలంబియా డ్రగ్స్ దందాను వెంటనే ఆపేయాలి. లేదంటే మిమ్మల్ని బాధపెడుతూ మేమే బలవంతంగా ఆపుతాం. కొలంబియా వ్యాప్తంగా చిన్న, మధ్యతరహా పరిశ్రమ స్థాయిలో మాదకద్రవ్యాల తయారీని గుస్తావో పరోక్షంగా ప్రోత్సహిస్తున్నారు. దేశీయంగా డ్రగ్స్‌ను ఆయన అరికట్టడంలో పూర్తిగా విఫలమయ్యారు. అమెరికా నుంచి భారీస్థాయిలో నగదు సబ్సిడీలు, వెసులుబాట్లు పొందుతూ కూడా గుస్తావో డ్రగ్స్ ఉరవడికి అమెరికాలోకి రాకుండా ఆపలేకపోతున్నారు. ఇది నిజంగా అమెరికాను మోసంచేయడమే. ఇకపై కొలంబియాకు అమెరికా చేసే సాయం ఆపేస్తా’’అని ట్రంప్ హెచ్చరించారు. -
ప్రమాదకరంగా ఢిల్లీలో వాయు కాలుష్యం
సాక్షి, ఢిల్లీ: దేశ రాజధానిలో వాయుకాలుష్యం మరోసారి ప్రమాదకర స్థాయికి చేరుకుంది(Delhi Pollution). సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (Central Pollution Control Board) ప్రకారం.. ఆదివారం వాయునాణ్యత(AQI) సూచీ 300 మార్కు దాటింది. ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో గాలి నాణ్యత పడిపోవడంతో విజిబిలిటీ తగ్గింది. దీంతో గ్రాప్-2 చర్యలను అమల్లోకి తెచ్చారు. గ్రాప్-2(GRAP-2) చర్యల నేపథ్యంలో.. ఢిల్లీలో నిర్మాణ కార్యకలాపాలపై ఆంక్షలు అమల్లో ఉంటాయి. డీజిల్ జనరేటర్లు, కట్టెల పొయ్యిపై నిషేధం ఉంటుంది. రానున్న రోజుల్లో ఈ కాలుష్యం మరింత ప్రమాదకరంగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గత ఐదు రోజులుగా దేశరాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం (Air Pollution) అధ్వాన స్థితిలోనే కొనసాగుతోంది. దీంతో దగ్గు, గొంతు నొప్పి, కళ్ల మంటలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 0-100 మధ్య ఉంటే గాలి నాణ్యత బాగా ఉండి కాలుష్యం లేదని.. అదే 100-200 మధ్య ఉంటే గాలి నాణ్యత మధ్యస్తంగా ఉందని.. ఇక 200-300 మధ్య ఉంటే గాలి నాణ్యత అధ్వాన్నంగా ఉందని, 300-400 మధ్య ఉంటే గాలి నాణ్యత మరింత అధ్వాన్నంగా ఉందని, AQI 400-500 మధ్య ఉంటే కాలుష్యం తీవ్ర స్థాయిలో ఉందని ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్కాస్టింగ్ అండ్ రిసెర్చ్ చెబుతుంది. ఇదీ చదవండి: ‘దీపాలపై డబ్బులు తగలేయొద్దు!’ -
చెట్టుకు వేలాడదీసిన మంచంపై కూర్చుని నిరాహారదీక్ష
జల్నా/థానే: తమ హక్కులు సాధించుకునేందుకు శాంతియుత మార్గంలో చేపట్టే నిరసనల్లో ప్రధానమైనది నిరాహారదీక్ష. సాధారణంగా ఓ ప్రాంతంలో టెంటు వేసుకొని నిరాహారదీక్షలు చేయటం మనం చూస్తుంటాం. కానీ, మహారాష్ట్రలో ఓ వ్యక్తి ఒక చెట్టుకు నులక మంచాన్ని వేలాడదీసి, అందులో కూర్చొని ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నాడు. మహారాష్ట్రలో బంజారాలను ఎస్టీలుగా పరిగణించరు. వారిని విముక్త, సంచార జాతుల (వీజేఎన్టీ) జాబితాలో చేర్చారు. అయితే, హైదరాబాద్ గెజిట్ ప్రకారం తమను ఎస్టీల్లో చేర్చాలని వారు ఎంతోకాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఆ డిమాండ్ సాధనకోసం మహారాష్ట్రలోని జల్నా పట్టణానికి సమీపంలో ఉన్న అంబద్ చౌఫుల్లీ ప్రాంతంలో విజయ్ చవాన్ అనే వ్యక్తి ఇలా మంచాన్ని చెట్టుకు వేలాడదీసి శనివారం నుంచి ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించాడు. పూర్వపు హైదరాబాద్ స్టేట్‌లో తమ జాతిని ఎస్టీల్లో చేర్చి రిజర్వేషన్లు ఇచ్చారని, మండల్ కమిషన్ సమయంలో మహారాష్ట్రలోని బంజారాలను వీజేఎనీ్టలుగా వర్గీకరించటంతో ఆ హోదా కోల్పోయామని ఆగ్రహం వ్యక్తంచేశాడు. తిరిగి ఎస్టీ హోదా సాధనకోసమే తీను నిరాహార దీక్షకు పూనుకున్నట్లు వెల్లడించాడు. నిజానికి జిల్లా కలెక్టర్ ఆఫీస్ వద్దే దీక్షకు ప్రయత్నించినప్పటికీ అధికారులు అనుమతి ఇవ్వలేదని తెలిపాడు. ఎస్టీ హోదా కోసం మహారాష్ట్రలో బంజారాలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల మరాఠాలను ఓబీసీల్లో చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించటంతో ఇతర వర్గాలు కూడా తమ రిజర్వేషన్ల సాధన కోసం పోరాటాలు ఉధృతం చేశాయి. ఎస్టీ హోదా కోసం నవంబర్ 9న ముంబైలోని శివాజీ పార్కులో నిరసన చేపట్టనున్నట్లు మాజీ ఎంపీ హరిభావ్ రాథోడ్ ప్రకటించారు. -
బిహార్‌లో హోరాహోరీ
సాక్షి, న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికల సంగ్రామానికి రంగం సిద్ధమైంది. మొత్తం రెండు దశల్లో జరగనున్న ఎన్నికల్లో తొలి అంకానికి తెరలేచింది. నవంబర్ 6వ తేదీన మొదటి దశ పోలింగ్ జరగనుంది. ఈ దశలో 18 జిల్లాల పరిధిలోని 121 శాసనసభ స్థానాలకు ఓటింగ్ నిర్వహించనున్నారు. తొలి విడత పోరు ముఖ్యంగా అధికార, విపక్ష కూటముల్లోని ప్రధాన పార్టీలైన ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నేతృత్వంలోని జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ), లాలు ప్రసాద్ యాదవ్ సారథ్యంలోని రా్రïÙ్టయ జనతాదళ్ (ఆర్జేడీ)లకే అగ్నిపరీక్షగా మారింది. తొలి దశలోని అత్యధిక స్థానాల్లో ఈ రెండు పార్టీలే పోటీ పడుతుండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. బరిలో ఎవరెవరు? తొలి దశ ఎన్నికల బరిలో వివిధ పార్టీల తరఫున, స్వతంత్రులు కలిపి మొత్తం 1698 మంది నామినేషన్లు దాఖలు చేశారు. సోమవారం నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు. ఎన్డీయే, మహాఘట్బంధన్ కూటముల మధ్యే తీవ్ర పోటీ నెలకొంది. మహాఘట్బంధన్ కూటమి నుంచి ఆర్జేడీ ఏకంగా 71 స్థానాల్లో పోటీ చేస్తుండగా, కాంగ్రెస్ 25, సీపీఐ (ఎంఎల్) 13 చోట్ల బరిలో ఉన్నాయి. ఎన్డీయే తరఫున జేడీయూ 57 సీట్లలో, బీజేపీ 48, చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్‌జనశక్తి (రామ్ విలాస్) పార్టీ 14 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. ముఖాముఖి పోరు.. హోరాహోరీ! ఈ 121 స్థానాల్లో అనేక చోట్ల నువ్వా–నేనా అన్నట్లుగా పోటీ ఉంది. ముఖ్యంగా 36 కీలక స్థానాల్లో ఆర్జేడీ, జేడీయూ అభ్యర్థులు నేరుగా తలపడుతున్నారు. మరో 23 స్థానాల్లో ఆర్జేడీకి బీజేపీ గట్టి పోటీ ఇస్తుండగా, ఇంకో 23 సీట్లలో కాంగ్రెస్–బీజేపీ మధ్య ముఖాముఖి పోరు జరగనుంది. దిగ్గజాల భవితవ్యం.. పరువు కోసం పోరు! తొలి దశ ఎన్నికలు పలువురు రాజకీయ దిగ్గజాలు, ప్రముఖుల భవితవ్యాన్ని తేల్చనున్నాయి. ప్రతిపక్ష నేత, ఆర్జేడీ అగ్రనేత తేజస్వీ యాదవ్ రాఘోపూర్ నుంచి పోటీ చేస్తున్నారు. ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు, బీజేపీ నేతలు సామ్రాట్ చౌదరి (తారాపూర్), విజయ్ కుమార్ సిన్హా (లఖిసరాయ్) భవితవ్యం కూడా ఈ దశలోనే తేలనుంది. వీరితో పాటు భోజ్‌పురి సూపర్‌స్టార్ పవన్ సింగ్ (చప్రా నుంచి), జానపద గాయని మైథిలీ ఠాకూర్ (అలీనగర్ నుంచి) వంటి సెలబ్రిటీ అభ్యర్థులు కూడా బరిలో ఉండటం ఆసక్తిని రేపుతోంది. వీరే కాకుండా పలువురు మంత్రులు, సీనియర్ నేతలు సైతం తొలి విడతలోనే తమ అదష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. దీంతో మొదటి దశ ఫలితాలు తదుపరి దశలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. -
అమ్మాయిలకు విద్య..అందని ద్రాక్షే!
న్యూఢిల్లీ: అమ్మాయిలకు అన్యాయం జరిగినప్పుడల్లా వినిపించే ఒకే ఒక మాట లింగసమానత్వం. దశాబ్దాలుగా లింగసమానత్వం కోసం ప్రపంచదేశాలు పోరాడుతున్నా ఏదో ఒక రంగంలో లింగఅసమానతలు పెచ్చరిల్లుతున్నాయి. వీటికితోడు అమ్మాయిలు పాఠశాల విద్యకు దూరమవుతున్న ధోరణిలో ఏమాత్రం మార్పురావట్లేదని తాజాగా యునెస్కో ప్రపంచ విద్యా పర్యవేక్షణ(జెమ్) బృంద పరిశోధనలో తేలింది. విద్యసహా అన్ని రంగాల్లో లింగసమానత్వ సాధనే ధ్యేయంగా 1995లో చేసిన బీజింగ్ డిక్లరేషన్ ఇంకా లక్ష్యాన్ని చేరుకోలేదని యునెస్కో ఆవేదన వ్యక్తంచేసింది. దశాబ్దాలుగా కోట్లాది మంది అమ్మాయిలు ఇంకా కనీసం పాఠశాల విద్యకు కూడా నోచుకోవట్లేదని యునెస్కో జెమ్ బృందం వెల్లడించింది. మారని పరిస్థితి‘‘1995 ఏడాది నుంచి చూస్తే నేటి ఆధునిక ప్రపంచంలో విద్యావ్యవస్థలో లింగసమానత్వ సాధనకు కృషి అధికమైంది. ఇప్పుడు ప్రాథమిక, దిగువ, ఎగువ మాధ్యమిక పాఠశాలల్లో బాలురతో సమానంగా బాలికలు విద్యనభ్యసిస్తున్నారు. మూడు దశాబ్దాల క్రితంతో పోలిస్తే ఇప్పుడు అన్ని దేశాల్లో 9.1 కోట్ల మంది అమ్మాయిలు ప్రాథమిక విద్య చదువుతున్నారు. కానీ మాధ్యమిక విద్య విషయానికి వచ్చేసరికి ఏకంగా 13.3 కోట్ల మంది అమ్మాయిలు పాఠశాలకు దూరంగా ఉండిపోతున్నారు. ఈ వైరుధ్యం అంతటా ఒకేలా లేదు. ప్రాంతాల వారీగా చూస్తే మధ్యాసియా, దక్షిణాసియా దేశాల్లో బాలికలు విద్యలో రాణిస్తుండగా సహారా ఆఫ్రికా ప్రాంతంలో బాలికలకు పాఠశాల విద్య అనేది అందని ద్రాక్షలా మిగిలిపోతోంది’’అని జెమ్ బృంద సభ్యులు ఒకరు మీడియాతో చెప్పారు. లాటిన్ అమెరికాలో మరోలా.. ‘‘ఆ్రస్టేలియా, న్యూజిలాండ్, వేలాది పాలినేసియా, మైక్రోనేసియా, మెలనేసియా దీవుల సమాహారమైన ‘ఓషేనియా’లో గతంలో విద్యలో లింగసమానత్వం ఉండేది. ఇప్పుడది కరువైంది. ఇక లాటిన్ అమెరికా, కరేబియన్ దీవుల్లో మాధ్యమిక విద్యలో అబ్బాయిల కంటే అమ్మాయిలే అధికంగా రాణిస్తుండటం విశేషం. అయితే గినియా, మాలీ లాంటి దేశాల్లో పరిస్థితి అమ్మాయిల విషయంలో అధ్వాన్నంగా ఉంది. కొన్ని పాఠశాలల్లో అసలు విద్యారి్థనులే లేరు. కడు పేదరికం, బాల్య వివాహాలు, సౌకర్యాల లేమి, అనారోగ్యం వంటి కారణాలతో అమ్మాయిలకు పాఠశాల విద్య అనేది సుదూర స్వప్నంగా మారింది’’అని జెమ్ బృందసభ్యుడు వెల్లడించారు. మహిళా టీచర్ల ప్రాతినిథ్యం పెరగాలి విద్యలో నాయకత్వ స్థాయిలో మహిళల ప్రాతినిథ్యం సైతం తక్కువగా ఉంటోంది. పురుష టీచర్లతో పోలిస్తే మహిళా టీచర్ల సంఖ్య సైతం చాలా తక్కువగా ఉంది. ఉన్నత విద్యలో ఇంకా మహిళా టీచర్ల సంఖ్య 30 శాతమే. ఇలాంటి వ్యవస్థాగత అసమానతలు సైతం విద్యలో సమానత్వ సాధనకు ప్రతిబంధకాలుగా పరిణమిస్తున్నాయి. బాలికలు, అమ్మాయిల విద్యావకాశాలు మెరుగుపడేలా విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెస్తూ ప్రపంచం సంస్కరణపథంలో దూసుకుపోవాలని బీజింగ్ డిక్లరేషన్ చాటుతోంది. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్,మ్యాథమేటిక్స్(స్టెమ్) కోర్సు ల్లో అమ్మాయిల ప్రాతినిథ్యం పెరగాలని ఆనాడు ప్రపంచదేశాలు ఆకాంక్షించాయి. బాలికావిద్య అనేది కేవలం వాళ్ల హక్కు కాదు. అది మహిళల, చిన్నారుల, సమాజ భవిష్యత్తు. నాటి బాసలను నిలబెట్టుకున్ననాడే భవిష్యత్తుకు భరోసా ఉంటుంది’’అని నివేదిక హెచ్చరించింది. నెరవేరని ఆశయాలు, ఆకాంక్షలు ‘‘ప్రపంచవ్యాప్తంగా పాఠశాల్లో అమ్మాయిల చేరికలు అధికంగా ఉండాలని, ఆమేరకు అన్ని దేశప్రభుత్వాలు కృషిచేయాలని బీజింగ్ డిక్లరేషన్ ఉద్ఘాటించింది. కానీ ఆ లక్ష్యం ఇంకా నెరవేరలేదు. పాఠశాలల్లో లైంగిక విద్య సైతం ఖచి్చతంగా బోధించాలి. లేదంటే అదే లైంగిక అంశాలను చిన్నారులు పాఠశాల విద్యకు ఆవల తప్పుడు కోణంలో తెల్సుకుంటారు. బ్యాడ్ టచ్, గుడ్ టచ్ వంటి అంశాలను చిన్నారులకు ప్రపంచంలో మూడింట రెండొంతుల దేశాల్లో ప్రాథమిక స్థాయిలోనే నేర్పించాలి. మాధ్యమిక విద్య స్థాయిలో నాలుగింట మూడొంతుల దేశాల్లో నేర్పించాలి’’అని నివేదిక అభిప్రాయపడింది. -
సర్కారీ స్కూల్లో ఎందుకు చేర్చాలి?
సాక్షి, హైదరాబాద్: ‘ప్రభుత్వ పాఠశాలల్లో మా పిల్లల్ని ఎందుకు చేర్చాలి?’ ఇదీ బడిబాట కార్యక్రమంలో భాగంగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్న ఉపాధ్యాయులకు తల్లిదండ్రుల నుంచి ఎదురవుతున్న ప్రశ్న. ఇదే విషయాన్ని పాఠశాల విద్యాశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించింది. విద్యార్థుల చేరికలు, అందులో ఎదురవుతున్న ఇబ్బందులు, క్షేత్రస్థాయిలో జరగాల్సిన కృషిని తెలియజేస్తూ సవివర నివేదిక సమర్పించింది. స్పందన ఏదీ? బడిబాటను ఈసారి పెద్ద ఎత్తున చేపట్టాలని ప్రభుత్వం భావించినా క్షేత్రస్థాయిలో ఆశించిన ప్రయోజనాలు కనిపించలేదని విద్యాశాఖ వర్గాలు అంగీకరిస్తున్నాయి. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల వద్దకు టీచర్లు వెళ్లినప్పుడు పెద్దగా స్పందన రావడం లేదని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేకతలు ఏమిటనేవి ప్రజలకు చెప్పలేకపోతున్నామని టీచర్లు అంటున్నారు. అలాంటప్పుడు వారిని ఆకర్షించడం సాధ్యం కావడం లేదని పేర్కొంటున్నారు. ఏఐ జోరు పెంచితేనే.. ప్రైవేటు విద్యాసంస్థల్లో డిజిటల్ విద్యా బోధన చేస్తుండగా ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఈ తరహా ప్రాధాన్యత పెంచాలని విద్యాశాఖ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో పేర్కొంది. ముఖ్యంగా కృత్రిమ మేధ (ఏఐ) బోధన అందించేందుకు అనేక ప్రైవేటు కంపెనీలు ముందుకొస్తున్నాయి. వాటిని ఉపయోగించుకునే అవకాశాలున్నాయి. అయితే ఏఐ యాప్‌లను వాడుకోవడానికి స్కూళ్లలో అనేక మార్పులు తేవాలని అధికారులు అంటున్నారు. ఇంటర్నెట్ స్పీడ్ పెంచడం, కంప్యూటర్లను అప్‌గ్రేడ్ చేయడం, డిజిటల్ లేబొరేటరీల ఏర్పాటు, అవసరమైన యాప్‌లను డౌన్లోడ్ చేసే, సాంకేతిక సహకారం అందించే నిపుణుల నియామకం బడుల్లో అవసరమని పాఠశాల విద్యాశాఖ అభిప్రాయపడింది. తగ్గుతున్న ప్రవేశాలు ప్రభుత్వ పాఠశాలల్లో గత పదేళ్లలో విద్యార్థుల ప్రవేశాలు 32 శాతం మేర తగ్గాయి. 2014–15లో 24.85 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ బడుల్లో చేరగా 2024–25లో ఈ సంఖ్య 16.68 లక్షలకు తగ్గింది. మరోవైపు ఇదే కాలానికి ప్రైవేటు స్కూళ్లలో ప్రవేశాలు పెరిగాయి. 2014–15లో 31.17 లక్షల మంది విద్యార్థులు ప్రైవేటు స్కూళ్లలో ఉంటే 2024–25లో ఆ సంఖ్య 36.73 లక్షలకు పెరిగింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పడిపోవడం కూడా దీనికి కారణంగా భావిస్తున్నారు. విద్యార్హతలున్న టీచర్లు ప్రభుత్వ స్కూళ్లలోనే ఉన్నా, పాఠశాలల నిర్వహణ, ఉపాధ్యాయులు యాంత్రికంగా పనిచేస్తున్నారన్న విమర్శలు ప్రైవేటు వైపు ఆకర్షణకు కారణమవుతున్నాయి. విశ్వాసం పెంచితే తప్ప విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్ల బాట పట్టరని ప్రభుత్వం భావిస్తోంది. అయితే బడిబాటపై చాలామంది టీచర్లు పెద్దగా ఆసక్తి చూపడం లేదని.. తూమంత్రంగానే పాల్గొంటున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. త్వరలో కమిటీ ఏర్పాటు ఈ నివేదిక ఆధారంగానే ప్రభుత్వం కొన్ని కొత్త ప్రతిపాదనలను విద్యాశాఖ ముందుకు తెచ్చింది. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో నమ్మకం, విశ్వాసం కల్పించేలా స్కూళ్లను తీర్చిదిద్దాలని ఆదేశించింది. ఆట స్థలాలు, మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించింది. అయితే నిధుల కొరత నేపథ్యంలో కార్పొరేట్ సంస్థల సామాజిక బాధ్యత కింద వాటిని సమకూర్చుకోవాలని సూచించింది. అయితే దీనికి క్షేత్రస్థాయి ప్రజాప్రతినిధుల తోడ్పాటు ఉంటేనే సాధ్యమవుతుందని విద్యాశాఖ అధికారులు అంటున్నారు. దాతలు, పారిశ్రామికవేత్తల ద్వారా నిధుల సమీకరణపై ప్రభుత్వం ఏ తరహా అడుగులు వేయాలనే విషయమై విద్యాశాఖ అధికారులతో త్వరలో ఓ కమిటీ ఏర్పాటు చేసే వీలుందని అధికార వర్గాలు తెలిపాయి. -
కొత్తగా 10,650 ఎంబీబీఎస్ సీట్లు
న్యూఢిల్లీ: వైద్య విద్య అభ్యసించాలని కోరుకొనే ఔత్సాహికులకు శుభవార్త. దేశంలో 2024–25 విద్యా సంవత్సరంలో కొత్తగా 10,650 ఎంబీబీఎస్ సీట్లకు జాతీయ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) ఆమోదం తెలియజేసింది. అలాగే కొత్తగా 41 వైద్య కశాళాలలు కూడా రాబోతున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీల సంఖ్య 816కి చేరుకోనుంది. రాబోయే ఐదేళ్లలో కొత్తగా 75 వేల ఎంబీబీఎస్ సీట్లకు అనుమతి ఇవ్వనున్నట్లు 2024లో స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. వైద్య విద్యను ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. ఈ నేపథ్యంలోనే 10,650 సీట్లకు తాజాగా ఆమోదం లభించింది. మరో 5,000 పీజీ మెడికల్ సీట్లు అండర్గ్రాడ్యుయేట్(యూజీ) మెడికల్ సీట్ల విస్తరణకు వైద్య కళాశాలల నుంచి 170 దరఖాస్తులు వచ్చాయని ఎన్ఎంసీ చైర్పర్సన్ డాక్టర్ అభిజాత్ సేథ్ చెప్పారు. ఇందులో 41 దరఖాస్తులు ప్రభుత్వ కాలేజీల నుంచి, 129 దరఖాస్తులు ప్రైవేట్ కాలేజీల నుంచి వచ్చినట్లు తెలిపారు. కొత్తగా 10,650 సీట్ల రాకతో 2024–25లో మొత్తం ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 1,37,600కు చేరుకోనున్నట్లు వెల్లడించారు. ఇక పోసు్ట్రగాడ్యుయేట్ సీట్ల విషయంలో 3,500 దరఖాస్తులు వచ్చాయన్నారు. ఈసారి మరో 5,000 పీజీ మెడికల్ సీట్లకు అనుమతి ఇచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీంతో దేశమంతటా మొత్తం పీజీ సీట్ల సంఖ్య 67,000కు చేరుతుందని స్పష్టంచేశారు. ఈ ఏడాది మొత్తంగా 15,000 యూజీ, పీజీ సీట్లు కొత్తగా అందుబాటులోకి రాబోతున్నట్లు చెప్పారు. ఐసీఎంఆర్‌తో వైద్య విద్య అనుసంధానం యూజీ, పీజీ సీట్లకు తుది అనుమతి, కౌన్సెలింగ్ ప్రక్రియ కొంత ఆలస్యమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. అయితే, నిర్దేశిత గడువులోగానే ఈ ప్రక్రియ పూర్తవుతుందని, అభ్యర్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. అక్రెడిటేషన్, పరీక్షలు, సీట్ల ఆమోదానికి త్వరలో బ్లూప్రింట్‌ను ప్రచురించబోతున్నారు. 2025–26లో దరఖాస్తులకు పోర్టల్ వచ్చే నెలలో ప్రారంభమవుతుందని అధికారులు వివరించారు. వైద్య విద్యలో నాణ్య తను పెంచడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టామని డాక్టర్ అభిజాత్ సేథ్ తెలిపారు. మెడికల్ పాఠ్య ప్రణాళిక(కరిక్యులమ్)లో క్లినికల్ రీసెర్చ్‌ను అంతర్భాగంగా చేర్చబోతున్నట్లు స్పష్టంచేశారు. -
గాజాకు సాయం సరఫరా ఆపేశాం: ఇజ్రాయెల్
టెల్ అవీవ్: గాజాలోకి మానవతా సాయం సరఫరాను నిలిపివేసినట్లు ఇజ్రాయెల్ భద్రతాధికారి ఒకరు ఆదివారం తెలిపారు. తదుపరి ప్రకటన వెలువడే వరకు అనుమ తించబోమన్నారు. హమాస్ కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనకు పాల్పడి నట్లు ఆరోపించిన ఇజ్రాయెల్, అనంతరం ఈ మేరకు ప్రకటన చేయడం గమనార్హం. అమెరికా సారథ్యంలో రెండేళ్ల యుద్ధానికి ముగింపు పలుకుతూ కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం అనంతరం కనీసం వారంపాటు కూడా మానవతా సాయం సరఫరా కొనసాగకమునుపే ఈ పరిణా మం చోటుచేసుకుంది. ఆదివారం తమ బలగాలపైకి హమాస్ శ్రేణులు కాల్పులకు పాల్పడ్డాయంటూ ఇజ్రాయెల్ గాజాలోని పలుప్రాంతాలపై దాడులకు దిగింది. పాలస్తీనియన్ల కోసం ఆహారం, మందులు, దుప్పట్లు, టెంట్లు తదితర అత్యవసరాలను తీసుకువస్తున్న ట్రక్కులు ఈజిప్టు నుంచి రఫా క్రాసింగ్ ద్వారా గాజాలోకి ప్రవేశిస్తుండటం తెలిసిందే. -
దీపాలపై డబ్బులు తగలేయొద్దు
లక్నో: దీపావళి వేడుకలపై సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. దీపాలు, కొవ్వొత్తులపై అనవసరంగా డబ్బులు తగలేయడం ఎందుకని ఆయన ప్రశ్నించారు. దీపాలు వెలిగించడానికి ప్రజల సొమ్ము వృథా చేయొద్దని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి సూచించారు. తాజాగా ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘‘సలహాలు ఇవ్వాలన్న ఉద్దేశం నాకు లేదు. కానీ, రాముడి పేరిట ఒక సలహా ఇవ్వాలనుకుంటున్నా. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా అన్ని నగరాల్లో ఘనంగా వేడుకలు నిర్వహిస్తారు. కొన్ని నెలలపాటు ఈ ఉత్సవాలు జరుగుతాయి. నగరాలు, ఇళ్లను విద్యుత్ దీపాలతో అందంగా అలంకరిస్తారు. మనం కూడా అలా ఎందుకు చేయకూడదు? క్రిస్మస్ నుంచి మనం ఎందుకు నేర్చుకోకూడదు. దీపాలు, కొవ్వొత్తుల కోసం డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది. ఈ విషయం అందరూ ఆలోచించాలి. డబ్బులు వృథా చేయొద్దు. ప్రభుత్వం నుంచి మనం కోరుకొనేది ఆదే. విద్యుత్ దీపాలతో దీపావళి వేడుకలు చేసుకుందాం’’ అని ప్రజలకు అఖిలేశ్ యాదవ్ సూచించారు. ఆ దుర్గతి హిందువులకు పట్టలేదు: వీహెచ్‌పీ అఖిలేష్ యాదవ్ వ్యాఖ్యలపై విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) జాతీయ అధికార ప్రతినిధి వినోద్ బన్సల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి దీపావళి సందర్భంగా క్రిస్మస్ను ప్రశంసిస్తున్నాడని, ఈ విషయం ప్రజలు గమనించాలని కోరారు. వరుస దీరిన దీపాలు అఖిలేశ్ హృదయాన్ని కాల్చేస్తున్నాయని చెప్పారు. అందుకే దీపాలపై డబ్బులు ఖర్చు చేయొద్దని చెబుతున్నాడని, క్రిస్మస్ను చూసి నేర్చుకోవాలని చెబుతున్నాడని విమర్శించారు. అఖిలేశ్ వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు స్పష్టంచేశారు. ఆయన ఆంటోనీ లేదా అక్బర్: బీజేపీ అఖిలేశ్ యాదవ్‌పై మధ్యప్రదేశ్ కేబినెట్ మంత్రి, బీజేపీ నాయకుడు విశ్వాస్ సారంగ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అఖిలేశ్‌ను ఆంటోనీ లేదా అక్బర్ అని పిలవాలని అన్నారు. ఆయన మతం మారినట్లు కనిపిస్తోందని చెప్పారు. ప్రమిదలు తయారు చేసి, మన ఇళ్లల్లో వెలుగులు నింపే పేద కారి్మకులను అవమానిస్తారా? అని విశ్వాస్ సారంగ్ నిప్పులు చెరిగారు. -
లా కోర్సుల్లో ప్రవేశాలకు షెడ్యూల్ విడుదల
సాక్షి, అమరావతి: న్యాయ విద్య కోర్సుల్లో ప్రవేశాలకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి షెడ్యూల్ విడుదల చేసింది. ఏపీ లాసెట్, పీజీఎల్ సెట్–2025లో అర్హత సాధించిన అభ్యర్థులు ఈ నెల 21, 22 తేదీల్లో సంబంధిత కోర్సులకు రిజిస్ట్రేషన్ చేసుకుని వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని, 25న సీట్లు కేటాయిస్తారని ఉన్నత విద్యామండలి కార్యదర్శి బి.తిరుపతిరావు తెలిపారు. సీట్లు పొందిన అభ్యర్థులు ఈ నెల 27 నుంచి 29 మధ్య ఆయా కాలేజీల్లో రిపోర్టు చేయాలన్నారు.అయితే, ఈ నెల 27 నుంచే తరగతులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. కాగా, చిత్తూరులోని రాయలసీమ లా కాలేజీ, కేఎంఆర్ లా కాలేజీలకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(బీసీఐ) ఆమోదం, యూనివర్సిటీ గుర్తింపు లేనందున వీటిలో ప్రవేశాలు కోర్టు తీర్పునకు లోబడి జరుగుతాయని తెలిపారు. అనంతపురంలోని బెస్ట్ యూనివర్సిటీకి బీసీఐ ఆమోదం లేదని, శ్రీకాకుళంలోని ఎంపీఆర్ లా కాలేజీకి సైతం బీసీఐ ఆమోదంతోపాటు యూనివర్సిటీ గుర్తింపు కూడా లేదని వివరించారు. ఆయా విద్యాసంస్థల్లో అడ్మిషన్లకు ఆప్షన్లు ఇచ్చే అభ్యర్థులు ఈ అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. -
కర్నాటకలో ఆర్ఎస్ఎస్ మార్చ్‌కి నో
కలబురిగి: కర్నాటకలో రాష్ట్రీయ స్వయం సేవక్(ఆర్ఎస్ఎస్) తలపెట్టిన ర్యాలీకి అధికారులు అనుమతి నిరాకరించారు. మంత్రి ప్రియాంక్ ఖర్గే సొంత నియోజకవర్గం చిట్టాపూర్‌లో ఆదివారం ఆర్ఎస్ఎస్ ‘రూట్ మార్చ్’నిర్వహించాలని భావించింది. ఈ మేరకు తహశీల్దార్‌కు దరఖాస్తు చేసుకుంది. అయితే, శాంతిభద్రతలకు భంగం కలిగే అవకాశముందంటూ తహశీల్దార్ అనుమతి నిరాకరించారు. ఆ దరఖాస్తును తిరస్కరించారు. కలబురిగి జిల్లా చిట్టాపూర్ పట్టణంలో అక్టోబర్ 19వ తేదీన ఆర్ఎస్ మార్చ్ నిర్వహణకు అనుమతి కోరిందని తహశీల్దార్ చెప్పారు. భీమ్ ఆర్మీ, ఇండియన్ దళిత్ పాంథర్స్ కూడా అదే రోజు ర్యాలీలు జరుపుతామని దరఖాస్తు చేసుకున్నాయన్నారు. వీటితో శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశాలున్నాయంటూ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ నుంచి అందిన నివేదిక మేరకు ఆర్ఎస్ఎస్ ర్యాలీకి నో చెప్పామన్నారు. అదేవిధంగా, ర్యాలీకి అనుమతివ్వక మునుపే ఏర్పాటు చేశారంటూ పట్టణ ప్రధాన రహదారిపైని ఆర్ఎస్ఎస్ కటౌట్లు, బ్యానర్లను శనివారం భారీ పోలీసు బందోబస్తు నడుమ మున్సిపల్ సిబ్బంది తొలగించి వేశారు. ప్రభుత్వ ప్రాంగణాలు, భవనాల్లో అనుమతి లేకుండా ఏ సంస్థలు గానీ వ్యక్తులు గానీ ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించరాదంటూ శనివారం రాష్ట్ర ప్రభుత్వం సైతం ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. -
నా చిరునవ్వే ‘అమ్మ’కు వెలుగు: వైష్ణవీ చైతన్య
‘‘పర్యావరణం బాగుంటే మన పరిసరాలన్నీ బాగుంటాయి. అందుకే ‘ఎకో ఫ్రెండ్లీ’ దీపావళికి ప్రాధాన్యం ఇస్తాను’’ అంటున్నారు ‘బేబీ’ మూవీ ఫేమ్ వైష్ణవీ చైతన్య. అంతేకాదు... దీపావళి అంటే తన ‘పెట్’ సౌకర్యం కూడా ఆలోచిస్తారీ బ్యూటీ. బుజ్జి కుక్కపిల్ల గురించి, ఇంకా తమ ఇంటి దీపావళి పండగ విశేషాల గురించి అచ్చ తెలుగు కథానాయిక వైష్ణవీ చైతన్య ‘సాక్షి’తో ప్రత్యేకంగా పంచుకున్న విశేషాలు.⇒ మా ఇంట్లో వారం రోజుల ముందే పండగ సందడి మొదలైపోయింది. హాల్లో ఎలాంటి దీపాలు పెట్టాలి... బాల్కనీని ఎలా అలంకరించాలని నేను, మా అమ్మ రకరకాల ప్లాన్స్ చేసుకున్నాం. మార్కెట్‌కి వెళ్లి స్వయంగా దీపాలు, పువ్వులు కొనడం నాకు చాలా ఇష్టం. కానీ ఈ సంవత్సరం కుదరలేదు. అయితే మా అమ్మ వెళ్లి, అన్నీ తీసుకొచ్చింది కాబట్టి హ్యాపీ. దీపావళి రోజు బంధువులకు, స్నేహితులకు ఇవ్వడానికి గిప్ట్స్ రెడీ చేయడం కూడా వారం రోజులు ముందే మొదలుపెట్టాం.⇒ మేం లక్ష్మీదేవి పూజ బాగా చేసుకుంటాం. పోద్దున్నుంచీ సాయంత్రం వరకూ చాలా హడావిడిగా ఉంటుంది. మాది లేట్ నైట్ పూజ. రాత్రి దాదాపు పదకొండు గంటలకు పూజ పూర్తవుతుంది. ఆ తర్వాత ఇంటి బయటికొచ్చి, దీపావళి సెలబ్రేట్ చేస్తాం.⇒ మా ఇంట్లో ఒక పెట్ ఉంది. ప్రతి దీపావళిని మేం గ్రాండ్‌గా జరుపుకుంటున్నా మరోవైపు మనసులో మా పెట్ గురించి ఆలోచించుకుని, కొంచెం ఫీల్ అవుతాం. ఎందుకంటే వాడికి (పెట్ని ఉద్దేశించి) క్రాకర్స్ స్మెల్ పడదు... పైగా సౌండ్స్ అంటే భయం. పండగ టైమ్‌లో సిక్ అయిపోతాడు. అందుకే మేం సింపుల్ క్రాకర్స్ కాలుస్తాం. పైగా పర్యావరణం కలుషితం కాకూడదనే ఫీల్ కూడా ఉండటంతో ‘ఎకో ఫ్రెండ్లీ’ దీపావళిని ప్రిఫర్ చేస్తాం.⇒ దీపావళి అవుట్‌ఫిట్ అంటే... చీర లేదా చుడీదార్. అయితే ఎక్కువగా చీర కట్టుకుంటాను. డెకరేషన్ చేస్తున్నప్పటి నుంచి పూజ వరకూ దాదాపు చీరలోనే ఉంటాను. క్రాకర్స్ కాలుస్తున్నప్పుడు చీర అంత సౌకర్యంగా ఉండదు కాబట్టి షరారా లేకపోతే చుడీదార్ వేసుకుంటాను.⇒ నా జీవితంలో వెలుగు తెచ్చిన వ్యక్తి అంటే మా ‘అమ్మ’. నా బలం, స్ఫూర్తి, శక్తి అన్నీ తననుంచే నాకు వచ్చాయి. ఇంకా నా మొత్తం ఫ్యామిలీ. అమ్మా, నాన్న, బ్రదర్స్, ఇంకా నా చిన్ని పెట్... నా జీవితానికి వీళ్లంతా చాలా ముఖ్యం. నా ముఖంలో కనిపించే చిరునవ్వే వారికి వెలుగు. అయితే నీ జీవితానికి వెలుగు ఎవరు అంటే... మా ‘అమ్మ’ని చెబుతాను. ఇవాళ నేను ఇంత మోటివేటెడ్‌గా ఉన్నానంటే తనే కారణం.⇒ నా లైఫ్‌లో ఇప్పటివరకూ బిగ్గెస్ట్ దీపావళి అంటే ప్రత్యేకంగా ఒకటని చెప్పలేను. అన్ని పండగల్లోకల్లా మా ఫ్యామిలీకి దీపావళి చాలా ముఖ్యం. ఆ రోజు ‘నోము’ అని ఒక పూజ చేస్తుంటాం. సత్యనారాయణ వ్రతం కూడా చేస్తాం. మా అమ్మా నాన్న ఉపవాసం ఉంటారు. ఇయర్లో ఇదే పెద్ద ఫెస్టివల్ అన్నట్లుగా జరుపుకుంటాం. బంధువులను కూడా పూజకు పిలుస్తాం. అందుకే దీపావళి మా కుటుంబానికి ఓ అందమైన పండగ.⇒ ఊహ తెలిశాక దీపావళి పండగను ఎంజాయ్ చేయడం మొదలుపెట్టాను. నేను, అమ్మ మార్కెట్‌కి బోలెడన్ని పువ్వులు, ఇంకా డెకరేషన్‌కి కావల్సినవి చాలా కొనేవాళ్లం. ఇన్నిన్ని ఎందుకు కొంటారు? అని డాడీ సరదాగా అంటుంటారు. మూడు రోజుల పాటు డెకరేషన్ అలానే ఉంచుతాం. దీపావళి రోజు సాయంత్రం చేసే పూజ కోసం పోద్దున్నుంచే పనులు మొదలుపెట్టేస్తాం. చివరికి అలసిపోతుంటాం (నవ్వేస్తూ). ⇒ ఇప్పటివరకూ మూవీ సెట్స్‌లో దీపావళి పండగ చేసుకోలేదు. అయితే ఆ అవకాశం రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే సెట్స్‌లో చాలామంది ఉంటారు. అందరితో సరదాగా మాట్లాడు కుంటూ, స్వీట్స్ షేర్ చేసుకుంటూ, ఫొటోలు దిగుతూ పండగ చేసుకుంటే ఆ హ్యాపీనెస్ వేరుగా ఉంటుంది. దీపావళి ... తీపి గుర్తునాకు చిన్నప్పుడు దీపావళి అంటే ఫుల్ భయం. టపాసుల సౌండ్‌కి భయపడి దాక్కోవడమే (నవ్వుతూ). సో... మా అమ్మా నాన్న, బ్రదర్స్... ఇలా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ దగ్గరుండి నాకు ధైర్యం చెప్పి, కాకర పువ్వొత్తులు వంటివి కాల్పించేవారు. దీపావళికి సంబంధించి నాకు అదో తీపి గుర్తు. -
పాక్, అఫ్గాన్ కాల్పుల విరమణ
ఇస్లామాబాద్: పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ మధ్య శాంతి దిశగా ముందడుగు పడింది. తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని ఇరుపక్షాలు ఆదివారం అంగీకారానికి వచ్చాయి. రెండు దేశాల మధ్య సుదీర్ఘకాలం శాంతియుత పరిస్థితులు, స్థిరత్వం నెలకొనేలా చర్యలు తీసుకోవడానికి ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించుకున్నాయి. పాక్–అఫ్గాన్ సరిహద్దుల్లో కొన్ని రోజులుగా దాడులు, కాల్పులు, ఘర్షణలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇరుదేశాల్లో పలువురు సైనికులు, సామాన్య ప్రజలు, ఉగ్రవాదులు మరణించారు. కాల్పుల విరమణ కోసం పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా అసిఫ్, అఫ్గాన్ రక్షణ మంత్రి ముల్లా యాకూబ్ మధ్య ఖతార్ రాజధాని దోహాలో సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. ఈ చర్చల కోసం ఖతార్, తుర్కియే దేశాలు చొరవ తీసుకున్నాయి. కాల్పులు వెంటనే ఆపేయాలని పాక్, అఫ్గాన్ అంగీకారానికి వచి్చనట్లు ఖతార్ విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. అలాగే రాబోయే రోజుల్లో తరచుగా సమావేశం కావాలని, శాంతి ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని, భద్రత, స్థిరత్వానికి కట్టుబడి ఉండాలని రెండు దేశాలు నిర్ణయించుకున్నట్లు తెలియజేసింది. -
లవ్... లైట్స్... డైరెక్షన్: వరలక్ష్మీ శరత్‌కుమార్
‘‘దీపావళి అంటే దీపాలు... రంగు రంగుల ముగ్గులు... లక్ష్మీ పూజ. టపాసులకు మాత్రం నేను దూరం’’ అంటున్నారు వరలక్ష్మీ శరత్‌కుమార్. అది మాత్రమే కాదు... తన జీవితంలో వెలుగులు నింపిన వ్యక్తి ఎవరో కూడా చెప్పారు. ఈ విశేషాలతో పాటు దీపావళి ముచ్చట్లను ‘సాక్షి’తో వరలక్ష్మి ప్రత్యేకంగా పంచుకున్నారు.⇒ నా చిన్నప్పటి దీపావళి పండగలన్నీ నాకు తీపి గుర్తులే. పండగ అంటే నాకు ముఖ్యంగా నచ్చేది కుటుంబ సభ్యులందరం కలవడం. ఇక దీపావళి అంటే మాకు పిండి వంటలు మాత్రమే కాదు... బిర్యానీ కూడా. టపాసులు, బిర్యానీ... ఈ రెండూ ఉంటేనే నాకు పరిపూర్ణంగా పండగ జరుపుకున్నట్లు ఉంటుంది. నేను టపాసులు కాల్చను... జస్ట్ చూడడం వరకే. ఇప్పుడు ఈ దీపావళికి బిర్యానీ లాగించడానికి రెడీ అయిపోయాను (నవ్వుతూ).⇒ మా ఫ్యామిలీలో ఎవరు ఎంత బిజీగా ఉన్నా పండగల సమయంలో అందరం ఇంట్లో ఉండాలనే నియమం పెట్టుకున్నాం. నేను వేరే షూటింగ్స్‌తో బిజీగా ఉన్నప్పటికీ బ్రేక్ తీసుకుని, చెన్నై వెళ్లాను. నా పుట్టింటివాళ్లు, అత్తింటివాళ్లు, స్నేహితులు... ఇలా అందరం కలుసుకునేలా ఏర్పాట్లు చేసుకున్నాం. మాకు అత్తింటిల్లో దీపావళి పండగకి ప్రత్యేకంగా ఆచరించాల్సిన నియమాలు ఏమీ లేవు. సో... చిన్నప్పట్నుంచి మా ఇంట్లో జరుపుకున్నట్లే అత్తింటికి వెళ్లిన తర్వాత కూడా జరుపుకుంటున్నాను.⇒ దీపావళి అంటే రంగు రంగుల లైట్లు... బోలెడన్ని పువ్వులు. చాలా చక్కగా అలంకరిస్తాం. ఉదయం లక్ష్మీ పూజ చేయడం నుంచి సాయంత్రం దీపాలు పెట్టడం వరకూ ఇంట్లో ఉన్న అందరం కలిసి అన్నీ చేస్తాం. చిన్నప్పట్నుంచి నేను క్రాకర్స్‌కి కాస్త దూరం అని చెప్పాను కదా... నా హజ్బెండ్ (నికొలయ్ సచ్దేవ్) కూడా క్రాకర్స్‌కి దూరమే. కుటుంబం అంతా పండగపూట కలిసి ఉండటం ఆయనకు ఇష్టం. ఇక టపాసులు కాల్చాలనే మా సరదా పర్యావరణానికి హాని కలిగించేదిగా ఉండకూడదన్నది మా ఇద్దరి ఒపీనియన్. ⇒ నా జీవితంలో వెలుగులు నింపిన వ్యక్తి అంటే మా ఆయనే. ఎందుకంటే నిక్ నన్ను బాగా అర్థం చేసుకున్నారు. సపోర్టివ్‌గా ఉంటారు. డైరెక్షన్ చేయాలనే నా ఇష్టం తెలిసి, చేయమని ఆయనే ఎంకరేజ్ చేశారు. నిక్ నన్ను ప్రేమించడంతో పాటు నా మాటలకు విలువ ఇస్తారు. భార్యాభర్తల మధ్య ప్రేమతో పాటు ఒకరంటే మరొకరికి గౌరవం ఉండాలి. అప్పుడే ఆ బంధం బాగుంటుంది. దీపావళి స్పెషల్ డైరెక్షన్ఈ దీపావళికి నా కెరీర్ పరంగా స్పెషల్ అంటే ‘డైరెక్షన్’. దర్శకురాలిగా మారాలనే ఆలోచన ఎప్పట్నుంచో ఉంది. అయితే టైమ్ కుదరాలి. ఇప్పుడు సెట్ అయింది. దోస డైరీస్ బేనర్‌పై నా డైరెక్షన్లో ‘సరస్వతి’ టైటిల్‌తో రానున్న ఈ సినిమాని నా∙సోదరి పూజా శరత్‌కుమార్ నిర్మిస్తారు. ఈ సినిమాలో నేను నటిస్తాను కూడా. థ్రిల్లర్ మూవీగా ‘సరస్వతి’ ఉంటుంది. త్వరలో షూటింగ్ ఆరంభిస్తాం. -
నమ్మక ద్రోహుల ఓట్లు నాకు అక్కర్లేదు
పట్నా: తరచూ వివాదాస్పద వ్యాఖ్యలుచేసే కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ మరోసారి మైనారిటీలపై అనుచితంగా మాట్లాడారు. బిహార్‌లో ఎన్నికల ర్యాలీలో భాగంగా ఆదివారం అర్వాల్ జిల్లాలో గిరిరాజ్ మాట్లాడారు. ‘‘ఒకసారి నేను మౌల్వి(ముస్లిం మతాధికారి)ని ఒక ప్రశ్న వేశా. మీకు కేంద్ర ప్రభుత్వ పథకమైన ఆయుష్మాన్ భారత్ ఆరోగ్యకార్డ్ ఉందా? అని అడిగితే ఉంది అని చెప్పారు. హిందూ–ముస్లిం ప్రాతిపదికన మాత్రమే ప్రభుత్వం ఈ కార్డ్‌లు ఇచ్చిందని భావిస్తున్నారా? అని అడిగితే లేదు అని సమాధానం చెప్పారు. మీకు నాకు ఓటేశారా? అంటే అవునన్నారు. మరి ఖుదా (దైవం) మీద ప్రమాణంచేసి నిజం చెప్పండి అంటే ఆయన చెప్పలేదు. ముస్లింలు కేంద్ర ప్రభుత్వ పథకాలన్నింటినీ వాడుకుంటారు. వాటి ప్రయోజనాలు, లబ్ధి పొందుతారు. కానీ ఓటు మాత్రం మాకు వేయరు. ఇలాంటి వాళ్లనే నమ్మకద్రోహులు అంటారు. మీలాంటి వాళ్ల ఓటు నాకు వద్దు అని ఆయన ముఖం మీదనే చెప్పేశా’’ అని ర్యాలీలో గిరిరాజ్‌సింగ్ వెల్లడించారు. ‘‘బిహార్‌లో మొత్తం మౌలికసదుపాయాల కల్పనకు ఎన్డీఏ ప్రభుత్వం ఎంతో చేసింది. బిహార్‌లో రోడ్డు కేవలం ఎన్డీఏ నేతల కోసం వేయలేదు. మొత్తం ప్రజల కోసం వేశారు. ఇప్పుడు బిహార్ ఎంతో మారింది. సమాజంలోని ప్రతి వర్గం కోసం ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తోంది. అయినాసరే ముస్లింలు బీజేపీకి ఓటు వేయట్లేరు’’ అని ఆయన అన్నారు. మైనారిటీలపై వివాదాస్పద వ్యాఖ్యలుచేసిన కేంద్ర మంత్రి గిరిరాజ్‌సింగ్ -
పండగ సీజన్లో స్వదేశీ ఉత్పత్తులనే కొనండి
న్యూఢిల్లీ: పర్వదినాల సందర్భంగా స్వదేశీ వస్తువులను కొనుగోలుచేయాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు సూచించారు. ఈ మేరకు ప్రధాని మోదీ తన సామాజిక మాధ్యమ ‘ఎక్స్’ ఖాతాలో ఆదివారం ఒక పోస్ట్ పెట్టారు. ‘‘ 140 కోట్ల మంది భారతీయుల కృషి, సృజనాత్మక వస్తువులైన స్వదేశీ ఉత్పత్తులను కొనుగోలు చేయడం ద్వారా ఈ పండగ సీజన్‌ను ఆనందాలతో గడపండి. భారతీయ ఉత్పత్తులను కొనండి. మేం కొన్నది స్వదేశీ ఉత్పత్తి అని గర్వంతో చెప్పండి. పండగ సీజన్లో ఏఏ స్వదేశీ ఉత్పత్తులను కొన్నారో వాటి వివరాలను మీమీ సొంత సామాజికమాధ్యమ ఖాతాల్లో పోస్ట్‌చేసి అందరితో షేర్‌చేసుకోండి. స్వదేశీ ఉత్పత్తులను, వాటి కొనుగోళ్లను ప్రోత్సహించండి. కొన్నవి అన్నీ సోషల్ మీడియాలో పెట్టండి. ఇలా మీరు ఇంకొకరిలో స్ఫూర్తిని రగిలించగలరు’’ అని మోదీ హితవు పలికారు. -
పల్లెలపై బాబు బాంబు 'తాగునీటికీ బాదుడే'!
సాక్షి, అమరావతి: ఉద్యోగులు, ఉపాధ్యాయులకు గట్టి షాక్ ఇచ్చి ఒకరోజు గడవక ముందే పండగ పూట చంద్రబాబు సర్కారు మరో బాదుడుకు తెర తీసింది! కాకపోతే ఈసారి ఆయన సంధించిన బాంబు పల్లెల్లో పేలనుంది! గ్రామాల్లో తాగునీటి చార్జీల మోత మోగనుంది! దీపావళి కానుకగా.. గ్రామీణ ప్రాంత ప్రజల నుంచి ఏటా రూ.వెయ్యి కోట్లకుపైగా తాగునీటి చార్జీల వసూలుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. సూపర్ సిక్స్, సెవెన్ పేరుతో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా.. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి విద్యుత్తు చార్జీలు, భూముల విలువ పెంపు ద్వారా రిజిస్ట్రేషన్ చార్జీల మోత, ముక్కు పిండి ఆస్తి పన్ను వసూలుతో తమ నడ్డి విరుస్తోందని ప్రజలు మండిపడుతున్నారు. అటు ఎన్నికల హామీలను నెరవేర్చకుండా.. ఇటు ఎడాపెడా బాదుడుతో చంద్రబాబు తన ట్రేడ్‌మార్కు మోసాలను కొనసాగిస్తున్నారని అన్ని వర్గాలు ఆక్రోశిస్తున్నాయి. వైఎస్ జగన్ ఇచ్చిన వాటితోపాటు ఇంకా ఎక్కువ సంక్షేమాన్ని అందిస్తామని ఎన్నికల ముందు నమ్మబలికిన చంద్రబాబు తమను దగా చేశారని సర్వత్రా చర్చ జరుగుతోంది. బాధ్యత వదిలించుకుని బాదుడు..! రక్షిత తాగునీటి పథకాల ద్వారా గ్రామీణ ప్రజలకు అందించే మంచినీటిపైనా యూజర్ చార్జీలు వసూలు చేయాలని టీడీపీ కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో రక్షిత మంచినీటి పథకాలు, బోర్ల నిర్వహణ, మరమ్మతులకు ఏటా రూ.1,680.29 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేయగా ఏకంగా రూ.1,036.97 కోట్లు ప్రజల నుంచి యూజర్ ఛార్జీల రూపంలో వసూలు చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. ఇప్పటిదాకా గ్రామీణ ప్రాంతాల్లో రక్షిత మంచినీటి పథకాల నిర్వహణ వ్యయాన్ని ఆయా గ్రామ పంచాయతీలు, జిల్లా పరిషత్‌లకు కేంద్రమిచ్చే ఆర్థిక సంఘం నిధుల నుంచి లేదంటే రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తూ వస్తుండగా.. ఇప్పుడు చంద్రబాబు సర్కారు ఆ బాధ్యత వదిలించుకుని యూజర్ చార్జీల రూపంలో ప్రజలపై భారం మోపడానికి సిద్ధపడింది. ప్రజల నుంచి వసూలు చేయనున్న యూజర్ చార్జీల వివరాలు మంత్రివర్గం ఆమోదం.. జీవో జారీ తాగునీటిపై యూజర్ చార్జీల వసూలుకు రెండు నెలల క్రితమే మంత్రివర్గం ఆమోదం తెలుపగా ఇటీవల ఆంధ్రప్రదేశ్ గ్రామీణ తాగునీటి సరఫరా పథకాల నిర్వహణ పాలసీ నోటిఫికేషన్ జారీ అయింది. దీని ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారి నుంచి యూజర్ చార్జీలు వసూలును లెక్క గట్టారు. రెండు కంటే ఎక్కువ గ్రామాలకు ఒకే రక్షిత మంచినీటి పథకం ద్వారా నీటి సరఫరా జరిగే చోట్ల ప్రతి వ్యక్తిపై సగటున ఏడాదికి రూ. 320 చొప్పున వసూలు చేయనుండగా, గ్రామ పరిధిలో అంతర్గతంగా రక్షిత తాగునీటి పథకం ఉన్నచోట్ల ఏటా రూ.240 చొప్పున యూజర్ చార్జీల భారం పడనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే జీవో రూపంలో ఆదేశాలు వెలువడ్డ నేపథ్యంలో ఇక ఏ క్షణమైనా యూజర్ చార్జీలు వసూలు చేసే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రజల నుంచి రూ.1,036.97 కోట్లు వసూలు.. గ్రామీణ ప్రాంతాల్లోని మొత్తం 3.81 కోట్ల జనాభాలో 60 శాతం మందికి చిన్న తరహా రక్షిత మంచినీటి పథకాలు, బోర్ల ద్వారానే తాగునీటి సరఫరా జరుగుతున్నట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలోని గ్రామీణ నీటి సరఫరా, పారిశుధ్య (ఆర్డబ్ల్యూఎస్) గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో 549 సమగ్ర రక్షిత మంచినీటి పథకాలకు నిర్వహణకు ఏటా రూ.518.69 కోట్లు వ్యయం కానుండగా, 29,469 చిన్న తరహా రక్షిత మంచినీటి పథకాల నిర్వహణకు రూ.1,031.42 కోట్లు, సత్యసాయి ట్రస్టు ఆధ్వర్యంలో నడిచే పథకాలకు మరో రూ.130.18 కోట్లు ఖర్చవుతుందని ప్రభుత్వం అంచనాలు వేస్తోంది. ఈ నేపథ్యంలో వీటి నిర్వహణకయ్యే మొత్తం ఖర్చు రూ.1,680.29 కోట్లలో కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలు, జిల్లా పరిషత్‌లకు ఇచ్చే 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి రూ.503.67 కోట్లు వ్యయం చేయనున్నట్లు పాలసీ ప్రణాళికలో పేర్కొన్నారు. మిగిలిన రూ.1,176.62 కోట్లలో రూ.1,036.97 కోట్లు ఆయా గ్రామాల్లో నివసించే ప్రజల నుంచి యూజర్ చార్జీల రూపంలో వసూలు చేయనుండగా కేవలం రూ.139.65 కోట్లు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని పాలసీ ప్రణాళికలో పేర్కొన్నారు. పంచాయతీల్లో రక్షిత మంచినీటి పథకాల నిర్వహణ పాలసీలో యూజర్ చార్జీల గురించి పేర్కొన్న వివరాలు నిర్వహణ ఖర్చులు పెరిగితే అదనపు భారం.. రక్షిత మంచినీటి పథకాల పరిధిలో పనిచేసే సిబ్బంది నెలవారీ జీతభత్యాలతోపాటు మోటర్ల విద్యుత్ చార్జీలు, బ్లీచింగ్ పౌడర్, నీటి శుద్ధిపై నాణ్యత పరీక్షలు లాంటివి నిర్వహణ వ్యయంలో ఉంటాయని ప్రభుత్వం పాలసీలో పేర్కొంది. పైపులైన్ లీకేజీలు, మోటర్ల మరమ్మతులు, విడిభాగాల కొనుగోలు దీనికి అదనం. భవిష్యత్‌లో సిబ్బంది వేతనాలు పెరిగినా.. విద్యుత్ చార్జీలు పెరిగినా ఆ మేరకు నిర్వహణ కూడా పెరుగుతుంది. అందుకు అనుగుణంగా యూజర్ చార్జీల భారం ప్రజలపై పడే అవకాశం ఉంది. కేంద్రం వాటా తగ్గితే మరిన్ని తిప్పలు..! ప్రస్తుతం అమలులో ఉన్న 15వ ఆర్థిక సంఘం సిఫార్సులకు అనుగుణంగా ఈ ఏడాది రూ.2,099 కోట్లు రాష్ట్రంలో గ్రామీణ స్థానిక సంస్థలకు కేంద్రం నుంచి నిధులు అందుతాయి. 15వ ఆర్థిక సంఘం గడువు 2026 మార్చి నెలాఖరుతో ముగియనుంది. 2026 ఏప్రిల్ నుంచి 16 ఆర్థిక సంఘం సిఫార్సులు అమలులోకి వస్తాయి. 16వ ఆర్థిక సంఘం సిఫార్సు ల అనంతరం గ్రామీణ స్థానిక సంస్థలకు కేంద్రం విడుదల చేసే మొత్తం ఒకవేళ తగ్గినా.. లేదంటే ఆ నిధులను ప్రత్యేక అవసరాలకు మాత్రమే వినియోగించాలని ఏవైనా నిబంధనలు విధించినా.. ఆ మేరకు రక్షిత మంచినీటి పథకాలపై కేంద్రం వాటా కు గండి పడుతుంది. ఆ రకంగా చూసినా ప్రజలపై యూజర్ చార్జీల భారం మరింత పెరిగే వీలుంది. వసూలు బాధ్యత కమిటీలకు.. గ్రామ స్థాయిలో రక్షిత మంచినీటి పథకాల నిర్వహణకు ప్రత్యేకంగా కమిటీలు ఏర్పాటు చేయనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ఇందుకోసం రూపొందించిన పాలసీలో పేర్కొంది. తాగునీటి పథకం నిర్వహణ వ్యయం ఆధారంగా ఎప్పటికప్పుడు యూజర్ చార్జీలను నిర్ణయించడం, వసూలు చేసే బాధ్యత ఆయా గ్రామ పంచాయతీలు, నిర్వహణ కమిటీలదేనని ప్రభుత్వం పేర్కొంది. రెండు కంటే ఎక్కువ గ్రామాలకు నీటిని సరఫరా చేసే 549 సీపీడబ్ల్యూఎస్ స్కీంల పరిధిలో యూజర్ చార్జీల నిర్ణయం, వసూలు బాధ్యత ఆయా జిల్లా పరిషత్‌లకు చెందిన ప్రత్యేక స్టాండింగ్ కమిటీకి ఉంటుందని పాలసీ ప్రణాళికలో పేర్కొన్నారు. నూతన పాలసీపై ఇప్పటికే ఎస్ఈ, ఈఈ, డిప్యూటీ ఎంపీడీవోలు, ఏఈ స్థాయి వరకు శిక్షణ పూర్తి అయింది. గ్రామ స్థాయి సిబ్బందికి నవంబర్, డిసెంబర్లో శిక్షణ ఇచ్చేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. భారమైన పన్నులు.. ఆస్తి ఉందన్న ఆనందాన్ని కూడా చంద్రబాబు ప్రభుత్వం మధ్య తరగతి ప్రజలకు మిగలనివ్వడం లేదు. కూటమి ప్రభుత్వంలో ఆస్తి పన్నులు భారీగా పెరిగాయి. ప్రజల నుంచి ముక్కుపిండి వసూలు చేయాలంటూ సచివాలయ సిబ్బందికి ప్రభుత్వం లక్ష్యాలు నిర్దేశించింది. రోజూ ఆస్తిపన్ను వసూళ్లపై సమీక్షలు చేస్తూ తీవ్ర ఒత్తిడి పెంచుతోంది. ఆస్తి పన్ను వసూలు లక్ష్యాలను చేరుకోలేకపోతే చర్యలు తీసుకుంటామంటూ వారిని హెచ్చరిస్తోంది. పాత బకాయిలు ఉన్నాయంటూ నోటీసులు జారీ చేస్తూ, అన్నీ కలిపి ఒకేసారి కట్టాల్సిందేనంటూ పెనుభారం మోపుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో గతంలో స్థానిక పరిస్థితులను బట్టి పంచాయతీలు ఇంటి పన్ను వసూలు చేసే పరిస్థితులు ఉండగా ఇప్పుడు ప్రతి చోటా వంద శాతం పన్ను వసూలు చేయాలంటూ క్షేత్రస్థాయి సిబ్బందికి టీడీపీ కూటమి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇక భూముల క్రయ విక్రయాల సమయంలో రిజిస్ట్రేషన్ చార్జీలు నిర్ధారించే భూముల విలువను ఈ ఏడాది ఫిబ్రవరిలో 40 నుంచి 50 శాతం దాకా పెంచారు. దీనివల్ల కొనుగోలుదారులపై చార్జీల భారం అదనంగా పడింది. కేంద్రం ఊరట.. బాబు బాదుడు!ఒకవైపు కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ భారాన్ని తగ్గించి ఊరటనిస్తే.. రాష్ట్రంలో మాత్రం కూటమి సర్కారు ప్రజలపై పన్నుల భారం మోపుతోంది. ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం దసరా, దీపావళి వేళ చాలా వరకు నిత్యావసరాలపై జీఎస్టీ పూర్తిగా మినహాయింపు లేదంటే తగ్గింపు ద్వారా ప్రజలపై ఆర్థిక భారం పడకుండా చర్యలు చేపడితే.. చంద్రబాబు సర్కారు మాత్రం పండుగ సమయంలో జీవనాధారమైన తాగునీటిపై యూజర్ చార్జీల వసూలు పాలసీని ప్రకటించడం గమనార్హం. వివిధ వస్తువులపై జీఎస్టీని తగ్గించిన కేంద్రం ఆ నిర్ణయాన్ని సెపె్టంబరు 22వ తేదీ నుంచి అమలులోకి తీసుకురాగా.. చంద్రబాబు ప్రభుత్వం అదే రోజు యూజర్ చార్జీల వసూలుకు సంబంధించి ‘‘ఆంధ్రప్రదేశ్ గ్రామీణ తాగునీటి సరఫరా పథకాల నిర్వహణ’ పాలసీ జీవో విడుదల చేసింది. అయితే జీవో నెంబరు 83 వెంటనే ఆన్లైన్లో అందుబాటులో ఉంచకుండా ఆలస్యంగా వెలుగులోకి తెచ్చింది. గ్రామాల్లో ఇంటి పన్ను రూపంలో వసూలు చేసే మొత్తం కంటే నీటిపై ప్రతిపాదిత యూజర్ చార్జీలు చాలా ఎక్కువగా ఉండడం గమనార్హం. షాకులే షాకులు..విద్యుత్తు చార్జీల వాత.. ఆస్తి పన్ను మోత ⇒ టీడీపీ కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర పాలనలో భారీగా పెరిగిన విద్యుత్ బిల్లులు వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఓట్లేసి గెలిపించండి.. కరెంటు చార్జీలు ఇంకా తగ్గిస్తామని ఎన్నికల ముందు నమ్మబలికిన చంద్రబాబు అధికారంలోకి రాగానే ప్రజలపై ఏకంగా రూ.17,348.64 కోట్లు విద్యుత్ చార్జీల భారం వేశారు. ⇒ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యుత్ బిల్లులు రెట్టింపు అయ్యాయి. ఇప్పటికే వసూలు చేస్తున్న చార్జీలకు తోడు మరో పిడుగు కూడా సిద్ధంగా ఉంది. మూడు విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కమ్స్) 4వ నియంత్రణ కాలానికి వాస్తవ ఆదాయ, ఖర్చుల వ్యత్యాసాన్ని రూ.12,771.96 కోట్లుగా లెక్కించాయి. ఈ మొత్తాన్ని విద్యుత్ బిల్లుల్లో కలిపి వసూలు చేసుకునేందుకు అనుమతించాలని ఇటీవల కమిషన్‌ను కోరాయి. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించకపోతే ప్రజలపైనే భారీగా బండ పడుతుంది. -
విహంగాల విహారం
దొరవారిసత్రం: ఆసియా ఖండంలోనే విదేశీ శీతాకాలపు వలస విహంగాలకు అతి పెద్ద సంతానోత్పత్తి కేంద్రంగా బాసిల్లుతున్న తిరుపతి జిల్లాలోని నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రంలో నాలుగు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు విహంగాల ఆగమనం మొదలైంది. దీంతో పక్షుల కిలకిలరావాలు వినిపిస్తున్నాయి. సకాలంలో వర్షాలు కురిసి చెరువులు నీటితో నిండి ఉంటే ఈ పాటికే అన్ని రకాల పక్షుల విచ్చేసి వాటి పనుల్లో నిమగ్నమై ఉండాలి. కాని ఈ దఫా విహంగాల సీజన్(అక్టోబర్‌లో మొదలై ఏప్రిల్‌లో ముగుస్తుంది) మొదలైనప్పటికీ విదేశీ వలస విహంగాలు సందడి ఆలస్యంగా మొదలైంది. ప్రస్తుతం పక్షుల కేంద్రంలో పదుల సంఖ్యలో పక్షుల్లో రారాజుగా పిలిచే గూడబాతుల(పెనికాన్స్)తోపాటు తెల్లకంకణాయిలు(వైట్ ఐబీస్) వందల సంఖ్యలో నత్తగుళ్లకొంగలు విచ్చేసినట్లు స్థానిక వన్యప్రాణి విభాగం సిబ్బంది తెలియజేశారు. పక్షుల కేంద్రంలో ఈపాటికే... వర్షాలు సకాలంలో కురిసి ఉంటే పక్షుల కేంద్రం పరిధిలోని అత్తిగుంట చెరువు, నేరేడుగుంట చెరువు, మారేడుగుంట చెరువుల్లో నీరు చేరి ఉంటే వలస విహంగాల్లో ప్రధాన పక్షులు అన్ని ఈ పాటికే చేరి, చెరువుల్లో ఉన్న కడప చెట్లపై చేరి ఆడ, మగ పక్షులు ఒకదాని ఒక్కటి స్నేహం కుదుర్చుకుని పుల్లలతో గూళ్లు కట్టుకుంటూ ఉండాలి. కాని వానలు సక్రమంగా కురవకపోవడంతో వలస విహంగాల సీజన్ ఆలస్యం కాకతప్పలేదు. ఇప్పుడైన పుష్కలంగా వానలు కురవందే వలస విహంగా పూర్తి స్థాయిలో కేంద్రానికి వచ్చే పరిస్థితి ఉండదు.ఇప్పటి వరకు కురిసిన వానలకు చెరువుల్లోకి అరకొరగానే సాగు నీరు చేరాయి. కేంద్రంలో విదేశీ వలస విహంగాలకు పూర్తి స్థాయిలో వాతవరణం అనుకూలిస్తేనే వేల సంఖ్యలో గూడబాతులు, నత్తగుళ్లకొంగలు, తెల్లకంకణాయిలు, స్వాతికొంగలు, వందల సంఖ్యలో తెడ్డుముక్కుకొంగలు, నీటికాకులు, బాతుజాతికి చెందిన పలు రకాల పక్షుల విచ్చేసి వాటి వాటి సంతానాన్ని అభివృద్ధి చేసుకోలేవు. స్వదేశీ విహంగాలైన నత్తగుళ్లకొంగలు పక్షుల కేంద్రంలోకి గత నెలలోనే వందల సంఖ్యలో విచ్చేశాయి. ఈపక్షుల్లో కొన్ని జత కట్టె పనుల్లో ఉండగా మరి కొన్ని కడప చెట్లపై గూళ్లు కట్టుకునే పనిలో ఉన్నాయి. -
ప్చ్.. సేవలు బాలేవు!
భారతీయ రైల్వే... దూర ప్రయాణానికి అత్యంత చవకైన, సౌకర్యవంతమైన మార్గం. అయితే కోవిడ్ అనంతర ఆర్థిక సంస్కరణల పేరుతో వృద్ధుల రాయితీలు సహా పలు రాయితీలను రద్దు చేసిన రైల్వే మంత్రిత్వ శాఖ, ప్రయాణికులకు సేవలందించే విషయంలో మాత్రం అదే నిర్లక్ష్యాన్ని కొనసాగిస్తోంది. రైలు ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నా, వాటిని పరిష్కరించి, పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవడంలో రైల్వే బోర్డు అలసత్వం ప్రదర్శిస్తోంది.సాక్షి, విశాఖపట్నం: రెండేళ్ల కాలంలో (2023–24, 2024–25) రైల్వే సేవలపై దేశవ్యాప్తంగా ప్రయాణికులు ఏకంగా 60.96 లక్షలకు పైగా ఫిర్యాదులు చేశారు. ‘రైల్ మదద్’ హెల్ప్‌లైన్ (139), సోషల్ మీడియా, వెబ్సైట్ల ద్వారా ఈ ఫిర్యాదులు నమోదయ్యాయి. ఫిర్యాదులలో అత్యధికంగా భద్రతా లోపాలపై ఉండటం గమనార్హం. గత వార్షిక సంవత్సరంలో (2024–25) భద్రతకు సంబంధించిన ఫిర్యా దులే ఏకంగా 7.50 లక్షల వరకు నమోదయ్యాయి. దీనికి అదనంగా రైళ్లలో పరిశుభ్రత లేమి, విద్యుత్ పరికరాల వైఫల్యాలు, ఆహారం నాణ్యతపైనా ప్రయాణికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అప్‌గ్రేడ్ ఒకవైపు.. లోపాలు మరొకవైపు దేశంలో వందే భారత్, అమృత్ భారత్ వంటి అత్యాధునిక రైళ్లను ప్రవేశపెడుతూ రైల్వే శాఖ అప్‌గ్రేడ్ అవుతున్నా, రైలు ఎక్కిన దగ్గర నుంచి దిగే వరకూ ప్రయాణికులకు అందించే ప్రాథమిక సేవలైన సీటింగ్, శుభ్రత, నాణ్యమైన ఆహారం విషయంలో మాత్రం లోపాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆహారం నాణ్యతపై ఫిర్యాదులు వస్తున్నా వాటికి సరైన విధంగా స్పందించకపోవడం విమర్శలకు తావిస్తోంది. రాయితీలను రద్దు చేసి, ఆదాయాన్ని పెంచుకున్న రైల్వే శాఖ, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంలో, వారి ఫిర్యాదులను పరిష్కరించడంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తుందనేది ప్రశ్నార్థకంగా మారింది. ఆహారమంటే.. ఆమడ దూరం.! రైల్వేలలో నాణ్యత లేని ఆహారం వడ్డించారనే ఫిర్యాదులు ఎప్పటికప్పుడు వస్తూనే ఉన్నాయి. అయినా ఆహారం అందిస్తున్న కాంట్రాక్టు సంస్థలపై చర్యలు మాత్రం.. నామమాత్రంగానే తీసుకుంటున్నారు. ప్రయాణికులకు అవసరమైన శుచి, రుచికరమైన ఆహారం అందించాలన్నదానిపై మాత్రం రైల్వే మంత్రిత్వ శాఖ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. 2020–21లో 253 ఫిర్యాదులు మాత్రమే అందగా, 2021–22లో 1082కి పెరిగింది. ఫిర్యాదుల సంఖ్య ఏడాదికేడాది పెరుగుతూవస్తోంది. 2022–23లో 4421 ఫిర్యాదులు నమోదు కాగా, 2023–24లో 7026, 2024–25లో 6645కి చేరుకుంది.గత ఐదేళ్లలో ఒక్క ఫిర్యాదుకే తీవ్రంగా స్పందించిన రైల్వే శాఖ.. ఆహారం అందిస్తున్న కాంట్రాక్టు సంస్థ లైసెన్స్‌ని రద్దు చేసింది. 3137 ఫిర్యాదులకు జరిమానాలు విధించగా.. 9627 ఫిర్యాదుల్ని పరిగణనలోకి తీసుకొని సదరు కాంట్రాక్టు సంస్థలకు హెచ్చరికలతో సరిపెట్టింది. ట్రైన్లలో ఆహారం అందించేందుకు దేశ వ్యాప్తంగా 20 సంస్థలతో రైల్వే బోర్డు ఒప్పందాలు కుదుర్చుకుంది. అయినా కఠిన చర్యలు తీసుకోవడంలో మాత్రం రైల్వే మంత్రిత్వ శాఖ మీనమేషాలు లెక్కిస్తూ నాణ్యత లేని ఆహారం సరఫరా చేస్తున్న సంస్థలపై కనీస చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.భద్రత శూన్యం.. శుభ్రత మృగ్యం 2023–24లో రైల్వే సేవల్లోని అన్ని ఫిర్యాదులు కలిపి 28.96 లక్షలు వచ్చాయి. 2024–25 సంవత్సరంలో ఏకంగా 11 శాతానికిపైగా పెరిగి 32 లక్షలకు చేరుకుందంటే.. లోపం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. రైల్వే ప్రయాణంలో భద్రత అనేది ప్రయాణికులకు అతి పెద్ద సమస్యగా మారిందని ఫిర్యాదుల ద్వారా అవగతమవుతోంది. రైళ్లలో భద్రతకు సంబంధించిన ఫిర్యాదులు గతేడాదితో పోలిస్తే.. 64 శాతం వరకూ పెరిగాయి. 2023–24లో 4.57 లక్షల ఫిర్యాదులు భద్రతకు సంబంధించి కాగా.. 2024–25లో 7.50 లక్షలకు చేరుకోవడం బాధాకరం.ప్రతి నాలుగు ఫిర్యాదుల్లో ఒకటి భద్రతకు సంబంధించింది ఉండటం చూస్తే.. రైలు ప్రయాణికులు ఎంతలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో స్పష్టమవుతోంది. అదేవిధంగా.. తర్వాత లోపం.. కోచ్‌లలో పరిశుభ్రత కరువవ్వడం. ఏడాది కాలంలో వచ్చిన ఫిర్యాదుల్లో కోచ్‌లలో అపరిశుభ్ర వాతావరణంపై 16.5శాతం వరకూ ఉంటున్నాయి. గతేడాదిలో ఏకంగా 8.44 లక్షల ఫిర్యాదులు అందాయి.విద్యుత్ పరికరాల వైఫల్యాలపైనా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. అయితే.. సమయపాలన గురించి ఫిర్యాదులపై 15 శాతం వరకూ తగ్గడం కాస్తా ఉపశమనం. 2023–24లో సమయపాలనపై 3.25 లక్షల కంప్లైంట్స్ రాగా.. 2024–25లో 2.77 లక్షలకు తగ్గడం విశేషం. రైల్వే స్టేషన్ల స్థాయి ఫిర్యాదులు కూడా తగ్గుముఖం పట్టాయి. 2023–24లో స్టేషన్ స్థాయి ఫిర్యాదులు 5.55 లక్షలు రాగా.. 2024–25లో 4.39 లక్షలకు తగ్గాయి. ⇒ 2023–24లో రైలు సేవలపై ఫిర్యాదులు– 28.96 లక్షలు ⇒ 2024–25లో ఫిర్యాదులు 32 లక్షలు ⇒ భద్రతపై 2024–25లో వచ్చిన ఫిర్యాదులు– 7.50 లక్షలు ⇒ అపరిశుభ్రవాతావరణంపై వచ్చిన ఫిర్యాదులు– 8.44 లక్షలు ⇒ సమయపాలనపై 2024–25లో వచ్చిన ఫిర్యాదులు– 2.77 లక్షలు ⇒ 2020–21లో ఆహారంపై వచ్చిన ఫిర్యాదులు– 253 ⇒ 2024–25లో వచ్చిన ఫిర్యాదులు– 6,645 -
డీఏ పీఆర్సీ అలవెన్స్ పేమెంట్స్ - తుస్స్
డీఏ పీఆర్సీ అలవెన్స్ పేమెంట్స్ - తుస్స్ -
రష్యా గ్యాస్ ప్లాంట్‌పై ఉక్రెయిన్ డ్రోన్ దాడి
కీవ్: కజఖ్‌స్తాన్ సరిహద్దుల్లో ఉన్న రష్యాకు చెందిన గ్యాస్ ప్రాసెసింగ్ ప్లాంట్‌పై శనివారం రాత్రి ఉక్రెయిన్ డ్రోన్లతో దాడి చేసింది. భారీ పేలుళ్లు సంభవించడంతోపాటు పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. దీంతో, ప్లాంట్‌ను మూసివేసినట్లు రష్యా, కజకిస్తాన్ అధికారులు తెలిపారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోని గాజ్ప్రోమ్ సంస్థకు చెందిన ఒరెన్‌బర్గ్ ప్లాంట్‌లో కజఖ్‌స్తాన్ నుంచి వచ్చే గ్యాస్‌ను ప్రాసెసింగ్ చేస్తారు. ప్రపంచంలోనే అతిపెద్దదైన ఒరెన్‌బర్గ్ ప్లాంట్ వార్షిక సామర్థ్యం 45 బిలియన్ క్యూబిక్ మీటర్లు. డ్రోన్ దాడి కారణంగా ఈ ప్లాంట్‌లోని వర్క్‌షాప్ తీవ్రంగా దెబ్బతిందని అధికారులు తెలిపారు. ప్లాంట్‌లో తాత్కాలికంగా గ్యాస్ ప్రాసెసింగ్‌ను నిలిపివేశామన్నారు. రష్యా తమపై సాగిస్తున్న యుద్ధానికి ఇంధన వనరులే కీలకమని భావిస్తున్న ఉక్రెయిన్ తరచూ ఆయిల్, గ్యాస్ రిఫైనరీలపై డ్రోన్ దాడులకు తెగబడుతోంది. మరో డ్రోన్ దాడితో ఒరెన్‌బర్గ్ సమీపంలో నొవొకుయి బషెవ్స్క్ ఆయిల్ రిఫైనరీ ప్రధాన శుద్ధి విభాగం దెబ్బతిందని ఉక్రెయిన్ ప్రకటించింది. ఇలా ఉండగా, రష్యా ఆధునీకరించిన గ్లైడ్ బాంబును ఖర్కీవ్‌లోని లొజావా నగరంపై శనివారం మధ్యాహ్నం ప్రయోగించిందని వెల్లడించింది. యూఎంపీబీ–5 ఆర్ అని పిలిచే రాకెట్ అమర్చిన ఈ రకం బాంబులు 130 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించిన తర్వాత సంభవించే పేలుడుతో తీవ్ర విధ్వంసం సంభవిస్తుంది. -
22న లద్దాఖ్ ప్రతినిధులతో కేంద్రం భేటీ
లేహ్: ఈ నెల 22వ తేదీన కేంద్ర ప్రభుత్వం లద్దాఖ్ ప్రతినిధులతో చర్చలు జరపనుంది. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ సారథ్యంలో ఏర్పాటైన ఉప సంఘం ఢిల్లీలో లేహ్ అపెక్స్ బాడీ(ఎల్ఏబీ), కార్గిల్ డెమోక్రాటిక్ అలయెన్స్(కేడీఏ) ప్రతినిధులతోపాటు లద్దాఖ్ ఎంపీ మహ్మద్ హనీఫా జాన్‌తో సమావేశం కానుందని ఎల్ఏబీ సహాధ్యక్షుడు చెరింగ్ డోర్జె లక్రుక్ ఆదివారం వెల్లడించారు. లద్దాఖ్‌కు రాష్ట్ర హోదా కల్పించడం, రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్లో చేర్చడంపైనే ప్రధానంగా చర్చలు జరుగుతాయని లక్రుక్ మీడియాకు వివరించారు. తమను కేంద్రం చర్చలకు ఆహ్వానించడాన్ని ఆయన స్వాగతించారు. చర్చలతో సానుకూల ఫలితం వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. లద్దాఖ్‌కు రాష్ట్ర హోదా, రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్లో చేర్చాలనే డిమాండ్‌తో ఎల్ఏబీ సెప్టెంబర్ 24వ చేపట్టిన బంద్ హింసాత్మకంగా మారడం. ఉద్యమకారుడు సోనమ్ వాంగ్చుక్ను అధికారులు జాతీయ భద్రతా చట్టం కింద అరెస్ట్ చేయడం తెల్సిందే. కాగా, తనతోపాటు ఎల్ఏబీ లీగల్ అడ్వైజర్, అంజుమన్ ఇమామియా అధ్యక్షుడు అఫ్రాఫ్ అలీ బర్చా, కేడీఏ తరఫున మరో ముగ్గురు చర్చల్లో పాల్గొంటారని లక్రుక్ వివరించారు. -
ఉద్యోగులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?
సాక్షి, అమరావతి: ఎన్నికల్లో ఉద్యోగులకు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయకుండా పెండింగ్ డీఏల్లో ఒక్కటే ఇస్తూ దాన్నే గొప్పగా ప్రభుత్వం ప్రచారం చేసుకోవడం బాధాకరమని గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు కె. వెంకట్రామిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తమకిచ్చిన 9 హామీలు అమలు చేస్తారని ఉద్యోగులు ఆశగా ఎదురుచూస్తుంటే అవి వదిలేసి రెగ్యులర్‌గా ఇవ్వాల్సిన డీఏల్లో ఒక్కటి ఇవ్వడానికి ప్రభుత్వం అంత హడావుడి చేయడం ఏమిటని ప్రశ్నించారు. తాడేపల్లిలోని తమ సంఘ కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. గత ప్రభుత్వాలన్నీ ఏడాదికి రెండు డీఏలు ఇచ్చాయని, ఇప్పుడు ఒక్క పెండింగ్ డీఏ కోసం ఇంత హడావుడి చేయడాన్ని ఉద్యోగులు ఎప్పుడూ చూడలేదన్నారు.16 నెలలపాటు ఉద్యోగులను పట్టించుకోకుండా డీఏ ఇవ్వడమే గొప్ప విషయమని చెప్పడానికే హంగామా చేసినట్లు కనబడుతోందని చెప్పారు. ఎన్నికల్లో ఉద్యోగులకు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా ప్రభుత్వం అమలు చేయలేదని విమర్శించారు. ఆ హామీల్లో డీఏ లేదని అది రెగ్యులర్‌గా వచ్చేదేనని తెలిపారు. గత సంక్రాంతికి పోలీసులకు రెండు ఎస్ఎల్లు ఇస్తామని ఆర్థిక మంత్రి చెప్పారని, కానీ ఇప్పుడు సీఎం మాత్రం ఒక్కటి మాత్రమే ఇస్తామని అది కూడా రెండు విడతలుగా ఇస్తామని చెప్పారని అన్నారు. ఉద్యోగులకు ఇచ్చిన హామీల్లో ఐఆర్ ఒకటని దాని గురించి తమ సంఘాల నాయకులు అడిగారో లేదో తెలియదని పేర్కొన్నారు. ఉద్యోగుల వైపు చూసేందుకే 16నెలలు ఉద్యోగుల వైపు చూడ్డానికే సీఎంకు 16 నెలలు పట్టిందని ఇక పీఆర్సీ ఎప్పుడు ఇస్తారని వెంకట్రామిరెడ్డి ప్రశ్నించారు. ఉద్యోగులంతా పీఆర్సీపై ప్రకటన వస్తుందని ఎదురు చూశారని, కనీసం పీఆర్సీ కమిషన్‌ను నియమిస్తారని ఆశించారని, కానీ దాన్నే నియమించకపోతే ఇక పీఆర్సీ ఎలా ఇస్తారని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. ఉద్యోగులకు ఇవ్వాల్సిన పెండింగ్ బకాయిలు ఎప్పుడు విడుదల చేస్తారో కూడా చెప్పలేదన్నారు. ఉద్యోగులు తమ బకాయిలను మరచిపోవాల్సిందేనా అని ప్రశ్నించారు. ప్రభుత్వానికి ఉద్యోగుల పట్ల చిత్తశుద్ధి ఎక్కడ ఉందని ప్రశ్నించిన ఆయన సమావేశానికి హాజరైన తమ సంఘాల నాయకులు ఎందుకు సైలెంట్‌గా ఉన్నారో అర్థం కావడం లేదన్నారు.సీపీఎస్ హామీపైనా మాట్లాడకపోవడం విచారకరమని పేర్కొన్నారు. కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులను ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను ప్రభుత్వం మోసం చేసిందన్నారు. కరోనా వంటి ఏదైనా ఉపద్రవం వస్తే ఉద్యోగులు అర్థం చేసుకుంటారని కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి ఏదీ లేకపోయినా ఉద్యోగులకు ఇస్తామన్న వాటిని ఇవ్వడంలేదని విమర్శించారు.ఒక్క డీఏ ఇవ్వడానికి సంవత్సరన్నర పడితే మిగతా సమస్యలు ఎప్పుడు పరిష్కరిస్తారని ప్రశ్నించారు. ఉద్యోగ సంఘాలను భయపెట్టి ఒప్పించినా ఉద్యోగులు ఊరుకోరని అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఉద్యోగుల ఆవేదనను అర్థం చేసుకోవాలన్నారు. గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులు 1.26 లక్షల మంది కలిశారు కాబట్టే గ్రామస్థాయిలో సేవలు బాగున్నాయని, వాళ్ల జీతా లు చాలా తక్కువని వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. -
రికార్డుల దీపోత్సవం
అయోధ్య: దీపావళి వేళ భారతదేశమంతటా టపాసుల మోత మోగుతుంటే ఆధ్యాత్మిక నగరి అయోధ్య ఒక్కసారిగా గిన్నిస్ రికార్డుల మోత మోగించింది. ఇందుకు సరయూ నదీతీర ఘాట్లు వేదికగా నిలిచాయి. దీపావళి సందర్భంగా ప్రతిఏటా నిర్వహించే దీపోత్సవంలో భాగంగా ఈ సారి మరిన్ని ఎక్కువ ప్రమిదలను వెలిగించి కొత్త గిన్నిస్ ప్రపంచరికార్డ్‌ను అయోధ్యవాసులు సృష్టించారు. ఒకేసారి 26,17,215 దీపపు ప్రమిదలను ఆదివారం రాత్రి సరయూ నదీ ఘాట్ల వెంట వెలిగించారు. డ్రోన్ల సాయంతో ప్రమిదలను లెక్కించి గిన్నిస్ పుస్తక ప్రతినిధులు ప్రపంచ రికార్డ్‌ను ధ్రువీకరించారు. 2,128 మంది ఒకేసారి హారతి పట్టి మరో గిన్నిస్ ప్రపంచ రికార్డ్‌ను నెలకొల్పారు. యూపీ పర్యాటక శాఖ, అయోధ్య పాలనా యంత్రాంగం, రామ్మనోహర్ లోహియా అవధ్ విశ్వవిద్యాలయం సమష్టిగా ఒకేసారి 26 లక్షలకుపైగా దీపం ప్రమిదలను వెలిగించి ఈ కొత్త రికార్డ్‌ను సృష్టించారు. హారతి కార్యక్రమాన్ని పర్యాటక శాఖ, జిల్లా యంత్రాంగం, సరయూ హారతి సమితులు సంయుక్తంగా చేపట్టాయి. సరయూ వెంట 56 ఘాట్లలో దీపాలు వెలిగించారు. ముఖ్యంగా 10వ నంబర్ ఘాట్‌లో 80,000 ప్రమిదలతో చేసిన స్వస్తిక్ గుర్తు డ్రోన్ నుంచి చూస్తే ఎంతగానో ఆకట్టుకుంటోంది.అయోధ్యకు పోటెత్తిన అశేష భక్తజనంఈ ఏడాది జనవరి నుంచి జూన్కాలంలో ఏకంగా 23.82 కోట్ల మంది భక్తులు అయోధ్య నగరం, అయోధ్య భవ్య రామమందిరాన్ని దర్శించుకున్నారని యూపీ ప్రభుత్వం ప్రకటించింది. దీపోత్సవం సందర్భంగా ఇటీవల దేశ, విదేశీ పర్యాటకుల తాకిడి మరింత ఎక్కువైందని ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. -
జనవరి 21 నుంచి జేఈఈ మెయిన్
సాక్షి, హైదరాబాద్: జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశానికి ఉమ్మడి ప్రవేశపరీక్ష (జేఈఈ మెయిన్–2026)ను వచ్చే ఏడాది జనవరి 21 నుంచి 30 వరకు నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ప్రకటించింది. ప్రవేశపరీక్ష తొలిదశకు ఈ నెలలోనే ఆన్లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని తెలిపింది. అలాగే ఏప్రిల్ ఒకటి నుంచి 10 వరకు రెండో దశను నిర్వహిస్తామని పేర్కొంది. రెండో దశ కోసం జనవరి చివరి వారంలో దరఖాస్తులు స్వీకరిస్తామని వివరించింది. ఈ మేరకు తాత్కాలిక షెడ్యూల్ ప్రకటించింది. ఈలోగా విద్యార్థులంతా వారి ఆధార్ కార్డుల్లో తప్పులు సరిచేసుకోవాలని సూచించింది. అయితే నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తుల స్వీకరణ తేదీలను ఎన్టీఏ ఇంకా ఖరారు చేయలేదు. త్వరలో నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు అధికార వర్గాల సమాచారం. కాగా, దేశవ్యాప్తంగా విద్యార్థుల నుంచి వచ్చిన సూచనలను పరిగణనలోకి తీసుకున్న ఎన్టీఏ.. ఈసారి జేఈఈ మెయిన్ పరీక్ష కేంద్రాలను పెంచాలని నిర్ణయించింది. -
ట్రంప్ రాజు కాదు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిరంకుశ పరిపాలనకు వ్యతిరేకంగా జనం తిరుగుబాటు ప్రారంభించారు. ‘నో కింగ్స్’ పేరిట శనివారం దేశవ్యాప్తంగా వేర్వేరు నగరాల్లో నిరసన ప్రదర్శనలు, ర్యాలీలు నిర్వహించారు. లక్షల మంది ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ట్రంప్‌కు వ్యతిరేకంగా గళమెత్తారు. ట్రంప్ రాజు కాదని, ఇక్కడ రాజులెవరూ లేరని, నిరంకుశ పరిపాలన ఆపాలని పెద్ద ఎత్తున నినదించారు. ప్లకార్డులు ప్రదర్శించారు. దేశాన్ని నాశనం చేయొద్దని డిమాండ్ చేశారు. నియంతృత్వ పరిపాలనను ప్రతిఘటించడం, నిరసన తెలపడమే అసలైన దేశభక్తి అని ప్రజలు తేల్చిచెప్పారు. న్యూయార్క్‌లోని ప్రఖ్యాత టైమ్స్ స్క్వేర్తోపాటు బోస్టన్, అట్లాంటా, షికాగో తదితర నగరాల్లో నిరసనకారులు కదం తొక్కారు. వాషింగ్టన్, లాస్ ఏంజెలెస్ సహా వివిధ నగరాల్లో వేలాది ప్రదర్శనలు జరిగాయి. ట్రంప్ తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తూ జనం వీధుల్లోకి వచ్చారు. గాలితో నింపిన దుస్తుల్లాంటివి ధరించారు. అమెరికా రాజ్యాంగ ప్రవేశికను ముద్రించిన బ్యానర్లపై సంతకాలు చేశారు. తాము ముమ్మాటికీ అసలైన ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటున్నామని తేల్చిచెప్పారు. నియంతగా మారుతున్న ట్రంప్ నిరసన ప్రదర్శనలపై అధికార రిపబ్లికన్ పార్టీ అభ్యంతరం వ్యక్తంచేసింది. అవన్నీ ‘అమెరికాను ద్వేషించే’ ర్యాలీలు అంటూ ఆరోపించింది. ట్రంప్ మద్దతుదారులు సైతం ఈ ర్యాలీలను తప్పుపట్టారు. ట్రంప్‌కు వ్యతిరేకంగా కుట్రలు జరుగుతున్నాయని మండిపడ్డారు. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచి్చన తర్వాత ఆయనకు వ్యతిరేకంగా జనం సామూహికంగా నిరసన తెలపడం ఇది మూడోసారి కావడం గమనార్హం. కొన్నిరోజుల క్రితం అమెరికాలో షట్టౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ సేవలు, ఇతర ముఖ్యమైన కార్యక్రమాలు నిలిచిపోయాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ట్రంప్ నిర్వాకం వల్లే తమకు ఈ కష్టాలు వచ్చాయని వారు మండిపడ్డారు. అమెరికా కాంగ్రెస్ నిర్ణయాలను తప్పుపట్టారు. నిరంకుశ అధికారం చెల్లబోదని తేల్చిచెప్పారు. ట్రంప్ విధానాలు తమకు ఎంతమాత్రం నచ్చడం లేదని ఇరాక్ యుద్ధంలో పాల్గొన్న మాజీ సైనికురాలు షాన్ హోవార్డ్ చెప్పారు. తాను గతంలో ఎన్నడూ నిరసన కార్యక్రమాల్లో పాల్గొనలేదని, ఇదే మొదటిసారి అని తెలిపారు. ట్రంప్ ప్రభుత్వం చట్టవిరుద్ధంగా ముందుకెళ్తోందని, వలసదారులను అక్రమంగా నిర్బంధించడం ఏమిటని మండిపడ్డారు. ప్రధాన నగరాల్లో సైన్యాన్ని మోహరించడం సరైంది కాదన్నారు. ఇదంతా ‘అన్–అమెరికన్’ అని విమర్శించారు. దేశంలో ప్రజాస్వామ్యం ధ్వంసమవుతున్న సూచనలు కనిపిస్తున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. తమ అధ్యక్షుడు ట్రంప్ నియంతగా మారిపోతున్నారని మరో నిరసనకారుడు ధ్వజమెత్తారు. ఇదిలా ఉండగా, నిరసన కార్యక్రమాల విషయంలో ఎవరినీ అరెస్టు చేయలేదని పోలీసులు తెలియజేశారు. జెట్ విమానంలో ‘కింగ్ ట్రంప్’ తనకు వ్యతిరేకంగా దేశమంతటా నిరసన కార్యక్రమాలు జరుగుతున్న సమయంలో ట్రంప్ గోల్ఫ్ ఆడుతూ ఉల్లాసంగా గడిపారు. ‘నో కింగ్స్’ నినాదాన్ని హేళన చేస్తూ కింగ్ ట్రంప్ పేరిట ఒక కృత్రిమ మేధ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇందులో కిరీటం ధరించిన ట్రంప్ జెట్ విమానంలో కూర్చొని దూసుకెళ్తున్నారు. బాంబుల తరహాలో ఈ విమానం బురదను చిమ్ముతోంది. ఆ బురదంతా అమెరికాలో నగరాల్లోని నిరసనకారులను కమ్మేస్తోంది. ట్రంప్ తనను తాను బలమైన రాజుగా పరోక్షంగా ప్రకటించుకున్నారు. నిరసన ర్యాలీలను లెక్కచేయబోనని, బురదతో సన్మానిస్తానని సంకేతాలు పంపించారు. -
ఒక్క డీఏతో ‘పండుగ’ చేసుకోమంటారా?
సాక్షి, అమరావతి: చంద్రబాబు తమకు ఇచ్చిన హామీలన్నింటినీ గాలికి వదిలేసి దీపావళి కానుక అంటూ ఒక్క డీఏ ఇచ్చి సరిపెట్టడంపై ప్రభుత్వ ఉద్యోగుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. తమకు రావాల్సిన నాలుగు డీఏల్లో ఒక దాన్ని.. అది కూడా 16 నెలల తర్వాత ఇవ్వడాన్ని గొప్పగా చెప్పుకోవడంపై వారంతా మండిపడుతున్నారు. వాట్సప్ గ్రూపుల్లో చంద్రబాబును దుమ్మెత్తిపోస్తున్నారు. వైఎస్ జగన్ 2019లో అధికారంలోకి రాగానే 10 రోజుల్లోనే ఇచ్చిన హామీ మేరకు 27% ఐఆర్ ఇస్తే, చంద్రబాబు 2024 ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక వాటిని అటకెక్కించారనే చర్చ ఉద్యోగ వర్గాల్లో పెద్దఎత్తున జరుగుతోంది. ఐదేళ్లలో 11 డీఏలు ఇచ్చిన జగన్ ఏ ప్రభుత్వం ఉన్నా ఏడాదికి రెండుసార్లు డీఏ ఇస్తుంది. కానీ నాలుగు డీఏలు పెండింగ్‌లో ఉంటే చంద్రబాబు ఇప్పుడు ఒకటి ఇవ్వడానికే పెద్ద హడావుడి చేయడం ఉద్యోగ వర్గాలను తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తోంది. ఉద్యోగ సంఘాల నాయకులతో మంత్రివర్గ ఉపసంఘం సుదీర్ఘ సమావేశం నిర్వహించడం, ఆ తర్వాత సీఎం చంద్రబాబు వారితో సమావేశమవడం వంటి పరిణామాలను చూసి, ఐఆర్, పీఆర్సీసహా తమ డిమాండ్ల పరిష్కారం దిశలో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారని ఉద్యోగులు ఎదురు చూశారు.కానీ అంత కసరత్తు తర్వాత డీఏ తప్ప ఇతర ఏ ముఖ్యమైన ప్రకటనా లేకపోవడంతో లక్షలాది మంది ఉద్యోగులు హతాశులయ్యారు. వైఎస్ జగన్ 2019–24 మధ్య ఐదేళ్లలో 11 డీఏలు ఇచ్చారని, చంద్రబాబు 2014–19 మధ్య ఏడు డీఏలు మాత్రమే ఇచ్చారని చర్చించుకుంటున్నారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా డీఏల కోసం పోరాటం తప్పని పరిస్థితి నెలకొందనేది ఉద్యోగ సంఘాల ఆవేదనగా ఉంది. అధికారంలోకి వచ్చిన తర్వాత 16 నెలలుగా ఐఆర్ విషయాన్ని పట్టించుకోకపోవడంపై నిరాశ చెందుతున్నారు. పీఆర్సీ ఇచ్చే ఉద్దేశమే లేదా? వెసులుబాటు ఉన్నప్పుడు పీఆర్సీ ఇస్తామనడం, దాని గురించి అడగవద్దనడం ఏమిటని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పీఆర్సీ రెండు, మూడేళ్ల తర్వాతైనా ఇచ్చే ఉద్దేశం ఉంటే కనీసం కమిషన్‌ను నియమించేవారని ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం 12వ పీఆర్సీ కమిషన్ ఉనికిలో లేదు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన కోటరీ ఒత్తిడితో పీఆర్సీ కమిషనర్ అనూహ్యంగా రాజీనామా చేశారు. ఆయన స్థానంలో చంద్రబాబు మరొకరిని నియమించలేదు. పీఆర్సీ ఇచ్చే ఉద్దేశం ఉంటే కనీసం కమిషనర్‌ను నియమించడానికి అంగీకరించేవారు.కమిషన్ ఏర్పాటైతే పరిశీలన, అధ్యయనం తర్వాత ఏడాదికో, రెండేళ్లకో నివేదిక ఇచ్చేది. ఆ తర్వాత దానిపై ఉద్యోగ సంఘాలతో చర్చలు, ప్రభుత్వం సమాలోచనలు జరిపి ఒక ఏడాది తర్వాతైనా ఆ నివేదికనో, అందులోని కొన్ని అంశాలనో ఆమోదించి, పీఆర్సీ ఇవ్వడానికి వీలవుతుంది. అయితే పరిస్థితి చూస్తుంటే, 2029 ఎన్నికల్లోపు పీఆర్సీ ఇచ్చే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని స్పష్టమవుతోందని ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. బకాయిలపైనా మోసమే ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్ బకాయిలు రూ.34,125 కోట్లు ఎప్పుడు ఎంత ఇస్తారో కూడా చెప్పకపోవడాన్ని బట్టి ఉద్యోగులు ఆ విషయంలోనూ మోసపోయినట్లేనని భావిస్తున్నారు. ఈ బకాయిల్లో పోలీసులకు సంబంధించి ఇవ్వాల్సిన రెండు ఎర్న్డ్ లీవుల్లో ఒకటి ఇవ్వడానికి అంగీకరించారు. దాని విలువ రూ.210 కోట్లు. ఆ మొత్తాన్ని రెండు విడతలుగా నవంబర్, డిసెంబర్లో ఇస్తామని చెప్పారు. అంటే రూ.34 వేల కోట్లకుపైగా బకాయిల్లో రూ.210 కోట్ల బకాయిలను జనవరికి విడుదల చేసేందుకు ఒప్పుకున్నారు.మిగిలిన రూ.33,915 కోట్ల బకాయిలు ఎప్పటికి వస్తాయో ఆ దేవుడేకి తెలియాలనేలా పరిస్థితి ఉందని ఉద్యోగులు వాపోతున్నారు. పోలీసులకు ఇస్తామన్న ఎర్న్డ్ లీవులపైనా చంద్రబాబు ట్విస్ట్ ఇచ్చారు. రెండు ఎర్న్డ్ లీవ్‌లు ఇవ్వడానికి గతంలోనే ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఒప్పుకున్నారు. గత సంక్రాంతికే వాటిని ఇస్తామని చెప్పారు. కానీ ఇవ్వలేదు. ఇప్పుడు చంద్రబాబు ఇస్తానన్న రెండింటిలో ఒక దానికి ఎగనామం పెట్టి ఒకటి ఇవ్వడానికి తలూపడంతో పోలీసులు నివ్వెరపోతున్నారు. సీపీఎస్‌పైనా కప్పదాటు వైఖరి కూటమి ఎన్నికల మేనిఫెస్టోలో సీపీఎస్, జీపీఎస్ విధానాలను సమీక్షించి జీపీఎస్ కంటే మెరుగైన అందరికీ ఆమోదయోగ్యమైన విధానాన్ని తెస్తామని ప్రకటించారు. కానీ ఇప్పటివరకూ ఆ ఊసే ఎత్తలేదు. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబదీ్ధకరిస్తూ వైఎస్ జగన్ ప్రభుత్వం చట్టం చేయగా చంద్రబాబు దాన్ని తుంగలో తొక్కారు. మరోవైపు అవుట్సోర్సింగ్ ఉద్యోగాలపై మళ్లీ పాత విధానం తెచ్చేందుకు ప్రయత్నిస్తూ ఆప్కాస్‌ను ఎత్తివేయడానికి సిద్ధమవుతుండడంతో వారు లబోదిబోమంటున్నారు. సచివాలయాల ఉద్యోగుల ఆవేదన సచివాలయ వ్యవస్థను చంద్రబాబు ప్రభుత్వం నిర్వీర్యం చేయడం పట్ల ఉద్యోగుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. తమను వాలంటీర్లుగా మార్చి పింఛన్లు, సర్వేలు వంటి పనులు చేయించుకుంటూనే, ఆ వ్యవస్థ పట్ల సీఎం చంద్రబాబు తక్కువగా మాట్లాడటం వారిని బాధిస్తోంది. పరిపాలనా వ్యవస్థను గడపగడపకూ తీసుకెళ్లేందుకు గత జగన్ ప్రభుత్వం ఈ వ్యవస్థ ద్వారా 1.26 లక్షల మందిని నియమించి చక్కటి ఫలితాలు సాధించగా, ప్రస్తుతం తమకు తగిన సౌకర్యాలు కల్పించకపోవడమే కాకుండా, అవమానకరంగా వ్యవహరిస్తున్నారని ఉద్యోగులు విమర్శిస్తున్నారు. ఇదే సమయంలో విద్యుత్ ఉద్యోగుల సమస్యలపై కూడా ప్రభుత్వం స్పందించకపోవడం ఆందోళనకు దారితీస్తోంది.ఉద్యోగులంటే చంద్రబాబుకు అలుసా..! ఉద్యోగులపై పెడుతున్న వ్యయాన్ని వైఎస్ జగన్ అనవసరంగా పెంచేశారన్న బాధ ముఖ్యమంత్రిలో స్పష్టంగా కనిపిస్తోందని ఉద్యోగ సంఘాల నేతలు పేర్కొంటున్నారు. మనసులో వారి పట్ల వ్యతిరేకతను నింపుకునే ఎన్నికల్లో ఓట్ల కోసం ఇష్టం వచ్చినట్లు హామీలు గుప్పించారని, ఇప్పుడు మాత్రం తన అసలు స్వరూపాన్ని బయటపెట్టుకున్నారని ఉద్యోగులు విమర్శిస్తున్నారు.అనుద్పాతక వ్యయం పెరిగిపోతుందని చెబుతున్న ఆయన, ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యోగులకు అలవికాని హామీలు ఎందుకు ఇచ్చారని, తద్వారా వారిని ఎందుకు మోసం చేశారని ఉద్యోగ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. తమకు చంద్రబాబు చేసిన ద్రోహం తీరనిదని, నమ్మించి గొంతు కోయడంలో ఆయన దిట్టన్న విషయం మరోసారి రుజువైందని ఉద్యోగులు వాపోతున్నారు. -
వారు కోవర్టులు.. విప్లవ ద్రోహులు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: పార్టీ విచ్ఛిన్నకులుగా..విప్లవ ప్రతిఘాతకులుగా మారి శత్రువులకు లొంగిపోయిన సోను, సతీశ్, వారి అనుచరులకు తగిన శిక్ష విధించాలని ప్రజలకు భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) పిలుపునిచ్చింది. ఈ మేరకు ఆ పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతిని«ధి అభయ్ పేరిట 16న రాసిన లేఖ ఆదివారం వెలుగుచూసింది. లేఖలోని ప్రధానాంశాలివి... సోను రాజకీయ బలహీనతలు బయటపడుతూ వచ్చాయి 2011 నుంచి దండకారణ్యంలో పార్టీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. దేశవ్యాప్తంగా 2018 నాటికి తాత్కాలిక వెనుకంజకు గురైంది. అప్పటి నుంచే సోనులో రాజకీయ బలహీనతలు బయటపడుతూ వచ్చాయి. 2020 డిసెంబర్లో జరిగిన కేంద్ర కమిటీ సమావేశంలో దండకారణ్య విప్లవాచరణలో కొన్ని లోపాలపై సోను ప్రవేశపెట్టిన పత్రాన్ని కేంద్ర కమిటీ తిరస్కరించింది. ఆ తర్వాత జరిగిన కేంద్ర కమిటీ, పొలిట్‌బ్యూరో సమావేశాల్లో సోనులోని తప్పుడు రాజకీయ భావాలను విమర్శించి, సరిదిద్దడానికి పార్టీ కృషి చేసింది. ఆయనలో పొడసూపుతున్న వ్యక్తివాదం, అహంభావం, పెత్తందారీతనాన్ని సరిద్దుకోవాలని కోరింది. అయితే 2025 మేలో మా పార్టీ ప్రధాన కార్యదర్శి బసవరాజు మరణం తర్వాత సోనులో దీర్ఘకాలంగా పేరుకుపోయిన సైద్ధాంతిక, రాజకీయ, నిర్మాణాత్మక బలహీనతలు గుణాత్మక మార్పును సంతరించుకొని శత్రువు ముందు మోకరిల్లేలా చేశాయి. నిజాలు దాచి .. నిందలు మోపుతూ.. ఆపరేషన్ కగార్తో ప్రతీరోజు ప్రాణాలు ఎదురొడ్డి విప్లవవోద్యమాన్ని ముందుకు నడిపించాల్సిన పరిస్థితి ఎదురైంది. అయితే సోనులో పెరుగుతూ వచ్చిన సుఖలాలస, స్వార్థాలు త్యాగానికి సిద్ధపడని స్థితికి, ప్రాణభీతికి దారి తీశాయి. తన బలహీనత, ప్రాణభీతికి ముసుగు కప్పి, పార్టీ అనుసరిస్తున్న తప్పుడు రాజకీయ సైనిక పంథా (వ్యూహం) ఫలితంగానే భారత విప్లవోద్యమం ఓటమి పాలయ్యే స్థితికి దారితీసిందని, ఈ స్థితిలో ఆయుధాలను శత్రువుకు అప్పగించి, తాత్కాలిక సాయుధ పోరాట విరమణ చేయడం మినహా మరో మార్గం లేదనే మితవాద అవకాశవాద, రివిజనిస్టు వైఖరితో కూడిన లొంగుబాటు ప్రకటన సెపె్టంబరు 15న సోను నుంచి వచ్చింది. తన అభిప్రాయాలపై నమ్మకముంటే సోను వాటిని పార్టీ ముందు పెట్టి చర్చించాల్సింది. కానీ శత్రువు ముందు లొంగిపోయాడు. బహిష్కరిస్తున్నాం సోను, అతని అనుచరులు ఆయుధాలు పారీ్టకి అప్పగించి లొంగిపోవాలని కేంద్ర కమిటీ సూచించినా, దాన్ని పాటించకుండా ఆయుధాల్ని శత్రువుకు అప్పగించారు. ఇదివిప్లవ ప్రతిఘాతుకత (కౌంటర్ రివల్యూషన్) అవుతుంది. విప్లవ ద్రోహిగా మారిన సోను, అతనితోపాటు లొంగిపోయిన డీకే ఎస్జెడ్సీ సభ్యుడు వివేక్, దీపలతో పాటు మరో పదిమందిని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నాం. ఈ విప్లవ ద్రోహులకు తగిన శిక్ష విధించాల్సిందిగా విప్లవ ప్రజలకు పిలుపునిస్తున్నాం. గతేడాది నుంచి వారు కాంటాక్ట్‌లో ఉన్నారు.. గతేడాది చివర్లో తన జీవిత సహచరితోపాటు మరికొందరిని మహాæరాష్ట్ర సీఎం దేవంద్ర ఫడ్నవీస్ సమక్షంలో పోలీసులకు లొంగిపోవడానికి పథకం రూపొందించినప్పటి నుంచే పోలీస్ ఉన్నతాధికారులతో సోను, ఆశన్న కాంటాక్ట్‌లో ఉన్నారు. ఆ తర్వాత కోవర్టుగా మారినట్టు ఈ మధ్య జరిగిన ఘటనల ద్వారా అర్థమవుతోంది. కోవర్టులుగా మారిన సోను, సతీశ్‌లకు నూతన పద్ధతుల్లో భారత విప్లవోద్యమాన్ని నిర్మిస్తాననే నైతిక అర్హత లేదు. ఇకనైనా పార్టీని చీల్చే పనులు మానుకోవాలని సోను, సతీశ్లను హెచ్చరిస్తున్నాం. భవిష్యత్ కార్యాచరణ భారీ లొంగుబాట్లు విప్లవోద్యమానికి నష్టమే అయినా ఇవి తాత్కాలిక నష్టాలే. వీటి ప్రభావం దీర్ఘకాలం ఉండొచ్చు. కానీ విప్లవోద్యమం శాశ్వత ఓటమికి గురికాదు. పీడన, సామాజిక అంతరాలు ఉన్నంత వరకు వర్గ పోరాటం ఉంటుంది. మారిన సామాజిక పరిస్థితులు, మారుతున్న విప్లవ స్వాభావిక లక్షణాలకు తగినట్టుగా మన రాజకీయ – సైనిక పంథాను సుసంపన్నం చేసుకొని భారత విప్లవోద్యమాన్ని కొనసాగిద్దామని యావత్ దేశ ప్రజలకు పిలుపునిస్తున్నాం. -
పసిడి పైపైకే..
అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొన్న తరుణంలో పసిడి, వెండి ధరలు రాకెట్లలాగా దూసుకెళ్తున్నాయి. గత దీపావళి నుంచి చూస్తే పసిడి దాదాపు 63 శాతం, వెండి అంతకు మించి 72 శాతం స్థాయిలో రాబడులిచ్చాయి. గత పదేళ్ల వ్యవధిలో రెండు దీపావళి పండుగల మధ్య మూడేళ్లు మినహా ఏడు సందర్భాల్లో ఈ రెండూ సానుకూల రాబడులనే ఇచ్చాయని మార్కెట్ వర్గాలు తెలిపాయి. కొత్త సంవత్‌లో కూడా ప్రపంచ సెంట్రల్ బ్యాంకులు గోల్డ్ షాపింగ్‌ను కొనసాగిస్తాయని అంచనాలు ఉన్నాయి. 2026 దీపావళి నాటికి అంతర్జాతీయ మార్కెట్లలో 4,500–5,000 డాలర్లకు చేరొచ్చని, దేశీయంగా మల్టీ కమోడిటీ ఎక్సే్చంజ్ (ఎంసీఎక్స్)లో రూ.1,40,000 – రూ.1,50,000 స్థాయికి చేరొచ్చని నిపుణులు తెలిపారు. అటు వెండి సైతం అంతర్జాతీయంగా ఔన్సుకు (31.1 గ్రాములు) 60–70 డాలర్లకు, దేశీయంగా ఎంసీఎక్స్‌లో రూ. 1,80,000 – రూ. 2,00,000కు చేరొచ్చని పేర్కొన్నారు. అంతర్జాతీయంగా అనిశి్చతులు తగ్గితే తప్ప, సురక్షితమైన పెట్టుబడి సాధనాలైన పసిడి, వెండి ర్యాలీ ఇకపైనా కొనసాగుతుందని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ అనలిస్ట్ మానవ్ మోదీ తెలిపారు. రిస్క్ ప్రొఫైల్‌ని బట్టి పోర్ట్‌ఫోలియోల్లో కనీసం 10 శాతం వాటాని పసిడి, వెండికి కేటాయించాలని పేర్కొన్నారు. -
పోతే రూ.10 వేలు.. వస్తే నాలుగెకరాలు
భీమిని: మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలానికి చెందిన ఓ రైతు తనకున్న భూమిని అమ్మడానికి లక్కీ డ్రా పెట్టడం చర్చనీయాంశంగా మారింది. మండలంలోని జన్కాపూర్ గ్రామానికి చెందిన ఓ రైతు టేకులపల్లి శివారులో తనకున్న నాలుగు ఎకరాల భూమిని లక్కీ డ్రా పెట్టాడు. రూ.10 వేల నగదు చెల్లించి టోకెన్ పొందాలని పేర్కొన్నారు. 1,500 మంది కాగానే అందరి సమక్షంలో లక్కీ డ్రా తీస్తామంటూ తన చేనుకు వెళ్లే దారిలో పెద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేశాడు.ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఫ్లెక్సీలో సర్వే నంబర్లతోపాటు రూట్ మ్యాప్, పూర్తి వివరాలు పొందుపర్చాడు. లక్కీడ్రా ద్వారా మార్కెట్ ధర కంటే అధికంగా లాభం వస్తుందని పలువురు చర్చించుకుంటున్నారు. డ్రా కోసం ఫోన్‌పే, గూగుల్‌పే ద్వారా కూడా చెల్లించవచ్చని తన ఫోన్ నంబర్ కూడా పేర్కొన్నాడు. కాగా, లక్కీడ్రా తీసే తేదీ ప్రకటించకపోవడంతో 1,500 టోకెన్లు పూర్తి అయ్యేదెప్పుడు లక్కీడ్రా తీసేదెప్పుడు అన్న చర్చ కూడా జరుగుతోంది.సరైన ధర రాకపోవడం వల్లే..భూమి అమ్మకానికి లక్కీడ్రా కోసం ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన రైతు భీమేశ్‌ను వివరణ కోరగా, తన సొంత అవసరాల కోసం భూమి విక్రయించేందుకు ప్రయత్నించగా, సరైన ధర రాకపోవడంతో లక్కీడ్రా కూపన్ ఆలోచన వచ్చినట్లు తెలిపాడు. డ్రా నిర్వహణకు సంబంధించి ఎలాంటి రిజిస్ట్రేషన్ చేసుకోలేదని పేర్కొన్నాడు. నవంబర్ మొదటి వారంలో లక్కీడ్రా తీసే తేదీని ప్రకటిస్తానని తెలిపాడు. -
దీపావళి స్టాక్స్ పటాకా!
కొత్త సంవత్ 2082లో కొంత ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ మార్కెట్లు ముందుకే సాగుతాయనే విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆదాయాల వృద్ధి వేగం పుంజుకోవడం, మళ్లీ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రవాహం మొదలు కావడం, వాణిజ్య విధానాలపై స్పష్టత, భౌగోళిక రాజకీయ స్థిరత్వం వంటి అంశాలు సానుకూలంగా ఉంటాయని భావిస్తున్నారు. దేశీయంగా పాలసీలు స్థిరంగా కొనసాగడం, భారీ పెట్టుబడులు, సానుకూల ద్రవ్యపరపతి విధానాలు మొదలైనవి కీలక చోదకాలుగా నిలుస్తాయనే అంచనాలు ఉన్నాయి. ద్రవ్యోల్బణం నెమ్మదించడం, ఆర్థిక క్రమశిక్షణ, కార్పొరేట్ల రుణభారం తగ్గడం తదితర అంశాల దన్నుతో కంపెనీల ఆదాయాలు మెరుగుపడొచ్చని నువామా రీసెర్చ్ అభిప్రాయపడింది. 2026 ఆర్థిక సంవత్సరంలో అమెరికా ఫెడ్, ఈసీబీలు వడ్డీ రేట్లను మరికాస్త తగ్గించవచ్చని పేర్కొంది. ద్రవ్యోల్బణం కాస్త అదుపులో ఉన్న నేపథ్యంలో దేశీయంగా ఆర్బీఐ కూడా ఇదే బాటలో పయనించవచ్చని తెలిపింది. వేల్యుయేషన్స్ సముచిత స్థాయిలో ఉన్నాయని, అయితే గణనీయంగా పెరిగిన మిడ్–స్మాల్ క్యాప్స్‌లో మాత్రం కన్సాలిడేషన్‌కి ఆస్కారం ఉందని వివరించింది. జీఎస్టీ 2.0 సరళీకరణ, ఆదాయపు పన్నుపరమైన ఊరట, పండుగల సీజన్ మొదలైన అంశాల కారణంగా వినియోగం గణనీయంగా రికవర్ అవుతుందని మోతీలాల్ ఓస్వాల్ తెలిపింది. ఆటో, కన్జూమర్ డ్యూరబుల్స్, ట్రావెల్, హోటల్స్, రిటైల్ వంటి రంగాలు మెరుగ్గా ఉండొచ్చని పేర్కొంది. మరోవైపు, ఆటో, బ్యాంకింగ్, క్యాపిటల్ గూడ్స్, రియల్టీ, తదితర రంగాలు ఆకర్షణీయంగా ఉంటాయని సెంట్రమ్ బ్రోకింగ్ తెలిపింది. నిఫ్టీ 28,500కి, సెన్సెక్స్ 95,000కు చేరొచ్చని అంచనా వేస్తున్నట్లు పేర్కొంది. వినియోగ ఆధారిత సంస్థలు, ప్రైవేట్ బ్యాంకులు మెరుగ్గా రాణించవచ్చని ట్రేడ్జినీ సీవోవో త్రివేష్ తెలిపారు. వచ్చే ఏడాది కాలానికి వివిధ బ్రోకరేజీ సంస్థలు అందిస్తున్న స్టాక్ సిఫార్సులు సాక్షి పాఠకులకు ప్రత్యేకం! బ్రోకరేజ్: జేఎం ఫైనాన్షియల్ మారుతీ సుజుకీప్రస్తుత ధర: రూ. 16,399 టార్గెట్ ధర: రూ. 19,000 (వృద్ధి: 16%) కార్యకలాపాలు స్థిరపడే కొద్దీ విస్తరణ వ్యయాలు తగ్గుముఖం పట్టడం, ప్రోడక్టుల మేళవింపు సానుకూలంగా ఉండటం మార్జిన్లు మెరుగుపడేందుకు దోహదపడొచ్చు. ఇన్‌హౌస్ బ్యాటరీ ప్లాంటుతో మరిన్ని హైబ్రిడ్ వాహనాలను ప్రవేశపెట్టొచ్చు. హైబ్రిడ్ సెగ్మెంట్లో వ్యయాలు తగ్గి, లాభదాయకత పెరుగుతుంది. అయితే, తీవ్రమైన పోటీ, కొత్తగా ప్రవేశపెట్టిన ప్యాసింజర్ వాహనాలకు స్పందన అంతంతమాత్రంగానే ఉండటం వంటివి ప్రతికూలాంశాలుగా ఉండొచ్చు. యాక్సిస్ బ్యాంక్ ప్రస్తుత ధర: రూ. 1,200 టార్గెట్ ధర: రూ. 1,330 (వృద్ధి: 11%)ఆకర్షణీయమైన వేల్యుయేషన్, అసెట్ క్వాలిటీ రిస్కులు తక్కువగా ఉండటం, నిర్వహణ వ్యయాలు నెమ్మదించడం వంటివి సానుకూలాంశాలు. రాబోయే త్రైమాసికాల్లో వృద్ధి వేగం మరింత పుంజుకోవచ్చు. నికర వడ్డీ మార్జిన్లు ఊహించిన దానికంటే క్షీణించే అవకాశాలు ప్రతికూలాంశం. ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ ప్రస్తుత ధర: రూ. 498 టార్గెట్ ధర: రూ. 600 (వృద్ధి: 20%)వేల్యుయేషన్ మెరుగ్గా ఉండటం, ఆదాయ రికవరీ వల్ల రీ–రేటింగ్‌కి అవకాశం ఉంది. పసిడి ధరల పరుగు కొనసాగుతుండటమనేది ఆదాయ అంచనాల పెంపునకు, రుణాల పోర్ట్‌ఫోలియో మెరుగుపడేందుకు ఉపయోగపడొచ్చు. అయితే, రుణ సంబంధ వ్యయాలు ఊహించిన దానికన్నా ఎక్కువగా ఉండటం కీలక రిసు్కల్లో ఒకటిగా ఉంటుంది.ఎల్అండ్టీ ఫైనాన్స్ ప్రస్తుత ధర: రూ. 266 టార్గెట్ ధర: రూ. 300 (వృద్ధి: 13% )మాతృ సంస్థ పటిష్టంగా ఉండటం, వైవిధ్యమైన ప్రోడక్టుల పోర్ట్‌ఫోలియో, లోన్ బుక్‌లో రిటైల్ ఫైనాన్స్ వాటా 90 శాతానికి పెరగడం వంటివి సానుకూలాంశాలు. ద్వితీయార్ధంలో పండగ సీజన్ డిమాండ్‌తో వృద్ధి వేగం పటిష్టంగా ఉండొచ్చు. అసెట్ క్వాలిటీపరమైన రిసు్కలు మళ్లీ తలెత్తే అవకాశాలుండటం ప్రతికూలాంశాల్లో ఒకటిగా నిలవొచ్చు. అపోలో హాస్పిటల్స్ ప్రస్తుత ధర: రూ. 7,909 టార్గెట్ ధర: రూ. 9,000 (వృద్ధి: 14% )కొత్తగా 1,717 పడకలు జతకానుండటం, ఫార్మసీ ఔట్లెట్స్ సంఖ్య 8 శాతం పెరుగుదల, పోటీ సంస్థ మ్యాక్స్ హెల్త్‌కేర్‌తో పోలిస్తే డిస్కౌంటులో ట్రేడవుతుండటం మొదలైనవి పాజిటివ్ అంశాలు. పడకల సామర్థ్యం పెంపు ఊహించిన దానికన్నా నెమ్మదిగా ఉండటం, రెగ్యులేటరీ రిస్కుల్లాంటివి ప్రతికూలాంశాలుగా ఉండొచ్చు.బ్రోకరేజ్: చాయిస్ ఈక్విటీ బ్రోకింగ్ ఫెడరల్ బ్యాంక్ ప్రస్తుత ధర: రూ. 212 టార్గెట్ ధర: రూ. 245 (వృద్ధి: 16% )టెక్నికల్‌గా కొన్నాళ్ల నుంచి పటిష్టమైన బేస్ ఏర్పర్చుకుంటోంది. రూ. 195–215 శ్రేణిలో తిరుగాడుతోంది. కరెక్షన్ జరిగిన ప్రతిసారి సపోర్ట్ బలపడుతోంది. 220పై నిలకడగా కొనసాగితే రూ. 245–255 వైపు ర్యాలీ చేయొచ్చు. రూ. 207–205 వరకు తగ్గితే కొనుగోళ్లకు అవకాశంగా భావించవచ్చు. రూ. 195 దిగువకి పడిపోతే బలహీనపడటాన్ని సూచిస్తుంది. సిప్లా ప్రస్తుత ధర: రూ. 1,578 టార్గెట్ ధర: రూ. 1,770 (వృద్ధి: 12%) నిర్దిష్ట శ్రేణిలో కన్సాలిడేట్ అవుతూ షేరు బలపడుతున్న సంకేతాలిస్తోంది. రూ. 1,580 వద్ద తక్షణ రెసిస్టెన్స్ ఉండగా, దీన్ని నిర్ణయాత్మకంగా దాటితే మధ్యకాలికంగా, దీర్ఘకాలికంగా రూ. 1,770–1,850 వైపుగా వెళ్లొచ్చు. తగ్గితే రూ. 1,480 వద్ద సపోర్ట్ లభిస్తుంది. మొమెంటమ్ ఇండికేటర్ల ప్రకారం చూస్తే బులి‹Ùగానే కనిపిస్తోంది. అశోక్ లేల్యాండ్ ప్రస్తుత ధర: రూ. 134 టార్గెట్ ధర: రూ. 151 (వృద్ధి: 13% )కనిష్ట స్థాయిల్లో కన్సాలిడేట్ అవుతూ, స్థిరంగా రికవర్ అవుతోంది. ప్రస్తుతం వీక్లీ చార్ట్‌లో బులి‹Ùగా కనిపిస్తోంది. టెక్నికల్‌గా రూ. 140 తక్షణ రెసిస్టెన్స్‌ని దాటితే మధ్య, దీర్ఘకాలికంగా రూ. 151–రూ. 158 వరకు పెరగవచ్చు. దిగువ వైపున రూ. 131 వరకు కొనుగోలుకు అవకాశం ఉంటుంది. రూ. 126 వద్ద పటిష్టమైన మద్దతు ఉంటుంది. దానికన్నా దిగువకి పడిపోతే ర్యాలీకి స్వల్పకాలిక రిస్కులు ఉంటాయి. సెయిల్ ప్రస్తుత ధర: రూ. 129 టార్గెట్ ధర: రూ.147 (వృద్ధి: 14% )టెక్నికల్‌గా పటిష్టమైన బేస్ ఏర్పర్చుకున్న స్టాక్, ప్రస్తుతం నిర్ణయాత్మక బ్రేకవుట్కి సిద్ధంగా ఉన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. భారీ వాల్యూమ్స్‌తో రూ. 138కి ఎగువన నిలకడగా క్లోజయితే, తదుపరి దశ ర్యాలీకి దారితీయొచ్చు. దిగువన రూ. 125 స్థాయి వరకు మరింతగా షేర్లను మరింతగా కొనుగోలు చేయొచ్చు. రూ. 116 వద్ద సపోర్ట్ ఉంటుంది. బీడీఎల్ ప్రస్తుత ధర: రూ. 1,540 టార్గెట్ ధర: రూ. 1,700 (వృద్ధి: 10% )ఫిబోనకీ రిట్రేస్‌మెంట్ లెవెల్‌కి 50 శాతం వద్ద కన్సాలిడేట్ అవుతోంది. ఇదే జోన్లో సపోర్ట్ లభిస్తోంది. సాధారణంగా ర్యాలీ చేసే ముందు, ఇలాంటి కన్సాలిడేషన్ కనిపిస్తుంది. తక్షణ రెసిస్టెన్స్ రూ. 1,560 వద్ద ఉంటుంది. దీన్ని నిర్ణయాత్మకంగా దాటితే బులిష్ ధోరణి బలపడి, సమీప భవిష్యత్తులో మరింత ర్యాలీకి దోహదపడొచ్చు. తగ్గితే, రూ. 1,440 వరకు కొనుక్కోవచ్చు. రూ. 1,380 బలమైన సపోర్ట్ జోన్‌గా ఉంటుంది.బ్రోకరేజ్: మిరే అసెట్ షేర్‌ఖాన్ అంబర్ ఎంటర్ప్రైజెస్ ప్రస్తుత ధర: రూ. 8,245 టార్గెట్ ధర: రూ. 9,300 (వృద్ధి: 13%) ఈ సంస్థ రెసిడెన్షియల్, కమర్షియల్ ఏసీలు, రిఫ్రిజిరేషన్ ఉత్పత్తులను అందిస్తోంది. కన్జూమర్ డ్యూరబుల్స్ విభాగంలో ఏసీలతో పాటు కంపెనీ వాషింగ్ మెషీన్ల మార్కెట్లోకి, అటు ఎల్రక్టానిక్స్లోకి, సెమీకండక్టర్ సబ్్రస్టేట్ పీసీబీలు మొదలైన వాటిల్లోకి ప్రవేశిస్తుండటం ద్వారా మార్కెట్ పరిధిని విస్తరించుకుంటోంది. ఎల్రక్టానిక్స్‌పై వచ్చే అయిదేళ్లలో రూ. 3,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. చాలెట్ హోటల్స్ ప్రస్తుత ధర: రూ. 975 టార్గెట్ ధర: రూ. 1,172 (వృద్ధి: 20%)వ్యూహాత్మక కొనుగోళ్లు, గదుల పెంపు, నిర్వహణ సామర్థ్యాలను మెరుగుపర్చుకోవడం వంటివి సంస్థకు సానుకూలంగా ఉండనున్నాయి. అలాగే, కమర్షియల్ బిజినెస్ వాటా పెరుగుతుండటమనేది వృద్ధికి కీలక చోదకంగా నిలవనుంది. 2027 ఆర్థిక సంవత్సరం నాటికి రూ. 2,000 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. 2025 డిసెంబర్ ఆఖరు నాటికి గదుల సంఖ్యను 4,500కి పెంచుకోనుంది. కమిన్స్ ఇండియా ప్రస్తుత ధర: రూ. 3,976 టార్గెట్ ధర: రూ. 4,500 (వృద్ధి: 13% )హై–హార్స్పవర్ (హెచ్‌హెచ్‌పీ) జెన్సెట్ల మార్కెట్లో అగ్రగామిగా నిలుస్తోంది. పటిష్టమైన బ్రాండింగ్, డి్రస్టిబ్యూషన్ నెట్వర్క్ ఉంది. 2025 తొలినాళ్ల నుంచి పవర్‌జెన్ వ్యాపారం పుంజుకుంది. డేటా సెంటర్లు, హాస్పిటల్స్, మొదలైన రంగాల నుంచి హెచ్‌హెచ్‌పీ జెన్సెట్లకు డిమాండ్ కొనసాగనుంది. ఎగుమతులు పటిష్టంగా ఉన్నాయి. యూరప్, ఆప్రికా, పశ్చిమాసియాలో డిమాండ్ స్థిరంగా ఉంది. హిందుస్తాన్ ఏరోనాటిక్స్ ప్రస్తుత ధర: రూ. 4,880 టార్గెట్ ధర: రూ. 6,000 (వృద్ధి: 23%) ఎయిర్‌క్రాఫ్ట్‌లు, హెలికాప్టర్లు, ఇంజిన్లు, యాక్సెసరీలు అందించే హెచ్ఏఎల్కి భారతదేశపు డిఫెన్స్ రంగంలో విశిష్టమైన స్థానం ఉంది. తయారీ సెగ్మెంట్ కార్యకలాపాలు పుంజుకోవడం వల్ల ఆదాయ వృద్ధి మెరుగుపడొచ్చు. రూ. 1.9 లక్షల కోట్ల ఆర్డర్ బ్యాక్లాగ్ ఉంది. రాబోయే 1–2 ఏళ్లలో రూ. లక్ష కోట్ల ఆర్డర్లు వచ్చే అవకాశం ఉంది. హడ్కో ప్రస్తుత ధర: రూ. 224 టార్గెట్ ధర: రూ. 260 (వృద్ధి: 16% )సామాజిక హౌసింగ్, అర్బన్ మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి ప్రభుత్వ నోడల్ ఏజెన్సీగా పని చేస్తోంది. ప్రభుత్వాలతో పటిష్టమైన సంబంధాలు ఉన్నాయి. 2026 ఆర్థిక సంవత్సరం నాటికి ఏయూఎం వార్షికంగా 25 శాతం పైగా, లాభం 23 శాతం పైగా వృద్ధి చెందవచ్చు. వచ్చే 18 నెలల్లో మొండిపద్దుల భారాన్ని పరిష్కరించుకోవాలని కంపెనీ నిర్దేశించుకుంది. బ్రోకరేజ్: మోతీలాల్ ఓస్వాల్ ఎస్బీఐ ప్రస్తుత ధర: రూ. 889 టార్గెట్ ధర: రూ. 1,000 (వృద్ధి: 12%)జీఎస్టీ 2.0, ఆదాయ పన్ను సంస్కరణలు, ద్రవ్య లభ్యతను పెంచేందుకు ఆర్బీఐ తీసుకున్న చర్యలు మొదలైనవి రుణ వృద్ధికి దారి తీయొచ్చని, బీఎఫ్ఎస్ఐ రంగం లాభదాయకతకు తోడ్పడవచ్చని అంచనాలు ఉన్నాయి. రిటైల్, ఎస్ఎంఈ, కార్పొరేట్ సెగ్మెంట్లవ్యాప్తంగా పటిష్టమైన కార్యకలాపాలు ఉండటం బ్యాంకుకు సానుకూలాంశం. ఎంఅండ్ఎం ప్రస్తుత ధర: రూ. 3,648 టార్గెట్ ధర: రూ. 4,091 (వృద్ధి: 12%)2026 క్యాలెండర్ సంవత్సరం నుంచి 2030 నాటికి కంపెనీ 7 ఐసీఈ ఎస్యూవీ వాహనాలను, 5 బీఈవీలను, 5 ఎల్‌సీవీలను ప్రవేశపెట్టే ప్రణాళికల్లో ఉంది. తద్వారా ఐసీఈ, ఈవీ సెగ్మెంట్లలో కంపెనీ తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకునే ప్రయత్నాల్లో ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో రికవరీ, కొత్త ఉత్పత్తుల దన్ను, ట్రాక్టర్ల మార్జిన్లు మెరుగుపడటం మొదలైనవి సంస్థకు కలిసి రానున్నాయి. భారత్ ఎల్రక్టానిక్స్ ప్రస్తుత ధర: రూ. 413 టార్గెట్ ధర: రూ. 490 (వృద్ధి: 19% )ఆర్మీ నుంచి రూ. 30,000 కోట్ల అనంత శస్త్ర ప్రాజెక్టు టెండర్లకు సంబంధించి కంపెనీ, లీడ్ ఇంటిగ్రేటరుగా వ్యవహరిస్తుండటం వల్ల కంపెనీ అర్డరు బుక్ రూ. లక్ష కోట్ల స్థాయిని దాటే అవకాశముంది. ఇది, వ్యూహాత్మక డిఫెన్స్ ప్రోగ్రాంలలో కంపెనీ నాయకత్వ స్థానాన్ని తెలియజేస్తోంది. ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్వ్యాప్తంగా అవకాశాలతో దీర్ఘకాలికంగా కంపెనీ వృద్ధి అవకాశాలు మెరుగ్గా కనిపిస్తున్నాయి. స్విగ్గీ ప్రస్తుత ధర: రూ. 432 టార్గెట్ ధర: రూ. 550 (వృద్ధి: 27% )పోటీ నెమ్మదిస్తుండటం, డార్క్ స్టోర్లను విస్తరణ క్రమంగా స్థిరపడుతుండటం మొదలైన వాటి కారణంగా కంపెనీకి చెందిన ఇన్‌స్టామార్ట్ విభాగం త్వరలో లాభదాయకంగా మారే అవకాశాలు ఉన్నాయి. జీఎస్టీ మార్పుల వల్ల వినియోగం మరింత పెరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో 2026–27 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి వ్యాపార వృద్ధి, గతంలో అంచనా వేసిన 20 శాతానికన్నా మెరుగ్గా 23 శాతం స్థాయిలో ఉంటుందని అంచనా. ఇండియన్ హోటల్స్ ప్రస్తుత ధర: రూ. 735 టార్గెట్ ధర: రూ. 880 (వృద్ధి: 20% )ఆక్యుపెన్సీ, ఏఆర్ఆర్ పెరుగుతుండటం వంటి అంశాల కారణంగా దేశీయంగా హాస్పిటాలిటీ పరిశ్రమ 2026 ఆర్థిక సంవత్సరంలో భారీగా వృద్ధి చెందనుంది. అలాగే ఎంఐసీఈ యాక్టివిటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ద్వితీయార్ధంలో పెళ్లిళ్ల సీజన్ మొదలైనవి కూడా కంపెనీ వృద్ధికి దోహదపడనున్నాయి. బ్రోకరేజ్: హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ అసోసియేటెడ్ ఆల్కహాల్స్ అండ్ బ్రూవరీస్ (ఏఏబీఎల్) ప్రస్తుత ధర: రూ. 1,058 టార్గెట్ ధర:రూ. 1,182 (వృద్ధి: 12% )క్రమంగా ప్రీమియం లిక్కర్ బ్రాండ్స్ వైపు మళ్లుతోంది. మధ్యప్రదేశ్‌లో 20–25 శాతం వరకు మార్కెట్ వాటా ఉంది. అలాగే, మహారాష్ట్ర, కర్ణాటక, గోవా, ఉత్తర్‌ప్రదేశ్ మార్కెట్లలోకి కూడా విస్తరిస్తోంది. ఇటీవలే నికోబార్ జిన్, హిల్‌ఫోర్ట్ విస్కీ అనే ప్రీమియం బ్రాండ్లను ప్రవేశపెట్టడంతో పాటు కొత్తగా బ్రాందీ, టెకీలాలో కూడా మరిన్ని ప్రోడక్ట్లను ప్రవేశపెట్టబోతోంది. వ్యయాలు తగ్గించుకుని, స్థిరమైన మార్జిన్లను సాధించేందుకు కసరత్తు చేస్తోంది. భారతి ఎయిర్టెల్ ప్రస్తుత ధర: రూ. 2,011 టార్గెట్ ధర: రూ. 2,244 (వృద్ధి: 12%) ఏఆర్ పీయూ, డిజిటల్ వ్యాపారాలు వృద్ధి చెందుతున్నాయి. 2026 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఏఆర్పీయూ రూ. 250గా ఉండగా, టారిఫ్‌ల పెంపుతో రూ. 300 సమీపానికి చేరే అవకాశం ఉంది. ఇక గూగుల్, ఒరాకిల్, యాపిల్, హ్యూస్‌లాంటి దిగ్గజాలతో జట్టు కట్టడం ద్వారా మొబైల్ సరీ్వసుల పరిధికి మించి ఇతర విభాగాల్లోకి ప్రవేశించడంలో కంపెనీకి తోడ్పడనుంది. జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ ప్రస్తుత ధర: రూ. 541 టార్గెట్ ధర: రూ. 639 (వృద్ధి: 18% )భారతదేశపు ఇంధన పరివర్తన లక్ష్యాలతో కంపెనీకి ప్రయోజనం చేకూరనుంది. కంపెనీ ఇప్పటికే నిర్దేశించుకున్న గడువు కన్నా ముందే 20 గిగావాట్ల స్ట్రాటెజీ 2.0 టార్గెట్‌ని సాధించింది. ఇప్పుడు 2030 నాటికి 30 గిగావాట్ల కెపాసిటీ, 40 గిగావాట్‌అవర్ స్టోరేజీని సాధించే దిశగా ముందుకెళ్తోంది. రూ. 1.3 లక్షల కోట్ల భారీ పెట్టుబడుల ప్రణాళికలు ఉన్నప్పటికీ పటిష్టమైన ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తోంది. ఎల్అండ్టీ ప్రస్తుత ధర: రూ. 3,839 టార్గెట్ ధర: రూ. 4,243 (వృద్ధి: 11%) క్యాపిటల్ గూడ్స్ విభా గానికి చెందిన ఈ సంస్థ కు రూ. 6.1 లక్షల కోట్ల ఆర్డర్ బుక్ ఉంది. ఇన్ఫ్రా, ఎనర్జీ, హైడ్రోకార్బన్ ప్రాజెక్టులకు సంబంధించి రూ. 14.8 లక్షల కోట్ల ఆర్డర్లు కుదిరే దశలో ఉన్నాయి. ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయడం ద్వారా కంపెనీ లాభదాయకత మరింత మెరుగుపడనుంది. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ ప్రస్తుత ధర: రూ. 72 టార్గెట్ ధర: రూ. 88.5 (వృద్ధి: 23%)కాసా డిపాజిట్లు 26 శాతం వృద్ధి చెందాయి. దీంతో కాసా నిష్పత్తి 48 శాతానికి, క్రెడిట్–డిపాజిట్ నిష్పత్తి 93.4 శాతానికి పెరిగాయి. నిధుల సమీకరణ వ్యయా లు తగ్గి, 2025–26 మూడో త్రైమాసికానికి మార్జిన్లు 5.7 శాతానికి చేరే అవకాశముంది. 2024–25లో రూ. 1,525 కోట్లుగా ఉన్న లాభాలు, 2026 కల్లా రూ. 4,560 కోట్లకు ఎగిసే అవకాశాలు ఉన్నాయి. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
ఈడీ అటాచ్ చేసినా.. ఆస్తులను అమ్మేశారు
సాక్షి, హైదరాబాద్: హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ పేరుతో వివిధ స్కీమ్‌ల ముసుగులో రూ.6,000 కోట్ల స్కామ్‌కు పాల్పడిన నౌహీరా షేక్ మరో కుంభకోణానికి తెరలేపారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అటాచ్ చేసిన ఆస్తుల్ని వివిధ మార్గాల్లో నకిలీ పత్రాల సాయంతో విక్రయించారు. హైదరాబాద్‌లోని కొన్ని ఆస్తుల్ని అమ్మేయగా... ముంబైలో విక్రయానికి సేల్ అగ్రిమెంట్ చేసుకున్నారు. ఈ విషయం గుర్తించిన ఈడీ అధికారులు ఆ ప్రయత్నాలు అడ్డుకోవడంతోపాటు ఈ దందాలో నౌహీరాషేక్‌కు సహకరించిన సబ్రిజిస్ట్రార్లపై చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధం చేస్తున్నారు.స్కీముల పేరుతో రూ.వేల కోట్ల మోసాలు హైదరాబాద్ కేంద్రంగా గోల్డ్ సహా వివిధ రకాలైన స్కీమ్‌ల పేరు చెప్పిన నౌహీరా షేక్ దేశవ్యాప్తంగా అనేకమంది నుంచి డిపాజిట్లు సేకరించింది. గరిష్టంగా 36 శాతం వడ్డీ చెల్లిస్తానంటూ నమ్మించి దాదాపు రూ.5 వేల కోట్ల మేర డిపాజిట్లు సేకరించి మోసం చేసింది. సీసీఎస్ పోలీసుల కేసు ఆధారంగా ముందుకెళ్లిన ఈడీ అధికారులు భారీగా ఆస్తులు సీజ్ చేశారు.అటాచ్మెంట్లో ఉన్న ఆస్తుల విక్రయం అటాచ్ చేసిన ఆస్తులను కోర్టు అనుమతితో వేలం వేయడం ద్వారా ఈడీ నగదుగా మారుస్తోంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ఆస్తుల్ని విక్రయించడం ద్వారా ఈడీ అధికారులు రూ.93 కోట్లు సమీకరించారు. అయితే ఈడీ అటాచ్మెంట్లో ఉన్న ఫ్లాట్లను విక్రయించడానికి నౌహీరా షేక్ పథకం వేసింది. హైదరాబాద్‌లో ఉన్న కొన్నింటిని అమ్మేసి సొమ్ము చేసుకుంది. వీటికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియలు కూడా పూర్తయ్యాయి. ఈడీ అటాచ్ చేసిన వాటిలో ముంబైలో ఉన్న రూ.12 కోట్ల విలువ చేసే మూడు ఫ్లాట్లు కూడా ఉన్నాయి. వీటిపై కొందరితో సేల్ అగ్రిమెంట్లు చేసుకున్న నౌహీరా షేక్ రూ.3 కోట్లు అడ్వాన్స్‌గా తీసుకుంది. ఓ ఫ్లాట్ ఖరీదు చేసిన యజమానిని విచారించిన ఈడీ వాంగ్మూలం సైతం నమోదు చేసింది.సుప్రీంకోర్టు దృష్టికి వెళ్లిన వ్యవహారం నౌహీరా షేక్ వేసిన కొన్ని పిటిషన్లు సుప్రీంకోర్టు విచారణలో ఉన్నాయి. ఈ నెల 10 తేదీన వీటి విచారణ జరిగింది. ఈ సందర్భంలో ఈడీ అధికారులు అటాచ్మెంట్లో ఉన్న ఆస్తుల విక్రయం విషయాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసు కువెళ్లారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన న్యా యస్థానం ఆయా ఆస్తుల్ని ఈడీకి రిజిస్ట్రేషన్ చేయాల్సిందిగా నౌహీరా షేక్‌ను ఆదేశించింది. అలా చేయకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. మరోపక్క ఈడీ అధికారులు హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న కొన్ని ఆస్తులనూ నౌహీరా షేక్ విక్రయించినట్టు గుర్తించారు. వీటి రిజిస్ట్రేషన్‌కు సహకరించిన సబ్రిజిస్ట్రార్ల వ్యవహారం ఆరా తీస్తోంది. -
సోమశిలకు నిర్లక్ష్య 'గండం'
‘నెల్లూరు సీమ నీట మునిగేను’.. అంటూ శ్రీపోతులూరు వీరబ్రహ్మంగారు చెప్పిన జోస్యం నిజం కాబోతుందా? అంటే.. సోమశిల జలాశయం నిర్వహణలో నిర్లక్ష్యం అందుకు దర్పణం పడుతోంది. సోమశిల డ్యామ్ వల్లే ఇలాంటి పరిస్థితి ఉత్పన్నం అవుతుందని జిల్లా ప్రజలు చర్చించుకుంటున్నారు. తాజా పరిస్థితి చూస్తే ప్రాజెక్ట్ గేట్ల నిర్వహణలో అధికారుల అలసత్వం కారణంగా గండం పొంచి ఉందనే అభిప్రాయం వెల్లడవుతోంది. ప్రస్తుతం జలాశయం 74 టీఎంసీలతో నిండుకుండగా ఉంది. డ్యామ్‌కు 12 క్రస్ట్‌గేట్లు ఉంటే.. అందులో రెండు గేట్లు పూర్తిగా బ్లాక్ అయిపోయాయి. ఇటీవల వరద దిగువకు మూడు గేట్లు ద్వారానే వదిలారు. మిగతా గేట్ల పరిస్థితిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈశాన్య రుతుపవనాల నేపథ్యంలో భారీ వరదలు వస్తే ప్రాజెక్ట్ భద్రతపై భయాందోళన నెలకొంది.సోమశిల: నెల్లూరు జిల్లా రైతాంగానికి తాగు, చెన్నై, తిరుపతి నగరాలకు తాగునీరందించే సోమశిల జలాశయం భద్రతపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ప్రాజెక్ట్ నిర్వహణలో అధికారుల నిర్లక్ష్యం గండం పొంచి ఉందని తెలుస్తోంది. ప్రాజెక్ట్ నిర్వహణకు గతంలో సుమారు 30 మంది వరకు సిబ్బంది విధుల్లో ఉండేవారు. అయితే ప్రస్తుతం కేవలం నలుగురికే పరిమితం కావడంతో జలాశయం నిర్వహణ లోపం కనిపిస్తోంది. ప్రాజెక్ట్ పూర్తి సామర్థ్యం 78 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 74 టీఎంసీలు ఉన్నాయి. ఎందుకీ భయం.. ఏమానుమానాలు? సోమశిల జలాశయానికి 12 క్రస్ట్ గేట్లు ఉన్నాయి. అన్ని క్రస్ట్ గేట్ల ద్వారా ఒకేసారి నీటిని విడుదల చేస్తే 24 గంటల వ్యవధిలో గరిష్టంగా 6 లక్షల నుంచి 6.50 లక్షల నీటి విడుదల చేసే అవకాశం ఉందని ప్రాజెక్ట్ ఇంజినీర్లు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం జలాశయంలో 11, 12వ క్రస్ట్ గేట్లు పూర్తిగా బ్లాక్ అయ్యాయి. గేట్లు లిఫ్ట్ చేసే రోప్‌లు పూర్తిగా దెబ్బతినడంతో అవి లిఫ్ట్ అయ్యే సమయంలో తెగిపోయే అవకాశం ఉండడంతో రోప్‌లు మార్చే ప్రక్రియ విషయంలో సంబంధిత అధికార యంత్రాంగం ఆది నుంచి అలవికాని నిర్లక్ష్యం ప్రదర్శించింది. జలాశయంలో నీటి సామర్థ్యం తక్కువగా ఉన్న సమయంలోనే చేయాల్సి ఉన్నా.. వేసవి కాలం అంతా పట్టించుకోలేదు. తాజాగా ఎగువ నుంచి ఇటీవల వరద రావడంతో ప్రాజెక్ట్ పూర్తి సామర్థ్యానికి చేరుకుంది. ఈ క్రమంలో ప్రాజెక్ట్ నుంచి కేవలం 5, 6, 7 క్రస్ట్ గేట్ల నుంచి మాత్రమే నీటిని దిగువకు విడుదల చేయడంతో మిగతా గేట్ల లిఫ్ట్‌పై అనేక అనుమానాలు ఉన్నాయి. 1, 2, 3, 4, 8, 9, 10 గేట్ల రోప్‌లు సైతం తుప్పు పట్టి ఉన్నాయి. దాదాపుగా నాలుగేళ్లుగా ఈ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసిన సందర్భం లేదు. ప్రధానంగా సిబ్బంది కొరత కారణంగా ప్రాజెక్ట్ క్రస్ట్ గేట్ల నిర్వహణలో నిర్లక్ష్యం కనిపిస్తోంది. భారీ స్థాయిలో వరదలు వస్తే పరిస్థితి ఏమిటనే భయం జిల్లా వాసులను వెంటాడుతోంది. వణికించిన 2021 నవంబర్ వరదలు సోమశిలకు నాలుగున్నర దశాబ్దాల కాలంలో ఎన్నడూ భారీ స్థాయిలో వరదలు వచ్చిన సందర్భం లేదు. 2021 నవంబర్‌లో ఎగువన అన్నమయ్య డ్యామ్ తెగి ప్రాజెక్ట్‌కు ఊహించని స్థాయిలో వరద వచ్చింది. రాత్రికి రాత్రే ఒక్కసారిగా ప్రాజెక్ట్ 12 క్రస్ట్ గేట్లు ఎత్తి సుమారుగా 6 లక్షల క్యూసెక్కులు విడుదల చేయడంతో దిగువన పెన్నానది తీరం వెంబడి అనేక ప్రాంతాల ముంపునకు గురయ్యాయి. ఎగువ నుంచి వచ్చిన వరదను ఆ స్థాయిలో దిగువకు విడుదల చేయకపోతే ప్రాజెక్ట్ ప్రమాదంలో పడేదని జలవనరుల నిపుణులు అప్పట్లో ఆందోళన వ్యక్తం చేశారు. అప్పట్లో గండం గడిచిపోయింది. ఆ తర్వాత ఆ స్థాయిలో గత మూడేళ్లుగా వరదలు రాలేదు. నూతన రోప్‌లు వచ్చి నాలుగు నెలలు రాష్ట్ర జలవనరుల సాంకేతిక సలహాదారు కన్నయ్యనాయుడు పరిశీలించిన రెండు నెలలకు కాంట్రాక్ట్ అప్పగించి నూతన రోప్‌లను ప్రాజెక్ట్ వద్దకు చేర్చారు. అప్పట్నుంచి సుమారు నాలుగు నెలలు అవుతున్న రోప్‌ల మరమ్మతులు చేయలేదు, ఇటీవల ఒకటో నంబర్ క్రస్ట్ గేటుకు స్టాప్ లాక్ అమర్చి మరమ్మతు చేయాలని ముందుకు వచ్చారు. ఈ తరుణంలో వరదలు వచ్చి జలాశయం పూర్తిగా నిండిపోయింది. ప్రస్తుతం నీటిలో రోప్లో మార్చేందుకు సంబంధిత వర్కర్లు రావడం లేదని జలాశయ అధికారులే చెబున్నారని సమాచారం.‘తుంగభద్రకు పట్టిన గతి తప్పదు’ఎనిమిది నెలల క్రితం రాష్ట్ర జలవనరుల సాంకేతిక సలహాదారు కన్నయ్యనాయుడు జలాశయ స్థితిగతులను తెలుసుకునేందుకు ప్రాజెక్ట్ పరిశీలనకు వచ్చారు. జలాశయ ఎస్ఈ, ఈఈ, డీఈ, సిబ్బందితో కలిసి జలాశయ ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం ఆయన క్రస్ట్ గేట్ల దుస్థితి చూసి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గేట్ల విషయంపై కనీస నిర్వహణ చేయకపోవడంతో ఆయన మండి పడ్డారు. ఆ సమయంలో ఆయన మాట్లాడుతూ ప్రాజెక్ట్ గేట్లకున్న రోప్‌లు పూర్తిగా దెబ్బతిన్నాయి.. ఇలానే మార్చకుండా మరమ్మతులు చేయకుండా వదిలేస్తే గతంలో తుంగభద్రకు పట్టిన గతి ఈ ప్రాజెక్ట్‌కు పడుతుందన్నారు. ఇప్పట్లో రోప్‌లు మార్చలేము జలాశయం పూర్తిసామర్థ్యానికి చేరుకోవడంతో క్రస్ట్ గేట్ల రోప్‌లు మార్చలేకున్నాం. నూతన రోప్‌ను ఏర్పాటు చేయాలంటే స్టాప్ లాక్ గేట్లను అమర్చుకున్న తర్వాత సుమారు నాలుగు రోజులు పడుతుంది. ఈలోపు వరద ఉధృతి పెరిగి నీటిని విడుదల చేయాల్సి వస్తే స్టాఫ్ లాక్ గేట్లు అడ్డొస్తాయి. అందువల్ల రోప్‌ల మార్పిడి పనులను ప్రస్తుతం నిలిపివేశాం. జలాశయంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది రిటైర్డ్ కావడంతో కొంత సిబ్బంది కొరత ఉంది. కేవలం 11 ,12 గేట్ల రోప్‌లు పూర్తిగా దెబ్బతిన్నాయి. అవి లిఫ్ట్ అయ్యే సమయంలో తెగిపోయే అవకాశం ఉంది. వాటిని ఆపరేట్ చేయవద్దని ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చారు. మిగతా గేట్లు బాగానే ఉన్నాయి. – శ్రీనివాసులు, సోమశిల జలాశయ ఈఈపొంచి ఉన్న ప్రమాదం గ్రేటర్ రాయలసీమపై ఈశాన్య రుతుపవనాల ప్రభావం అధికంగా ఉంటుంది. నైరుతి రుతుపవనాలు విస్తరించిన సమయంలో అడపాదడపా వర్షాలు కురిసినా రాయలసీమ జిల్లాలతోపాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలపై పెద్దగా వర్ష ప్రభావం ఉండదు. తాజాగా ఈశాన్య రుతుపవనాలు రాకతో వాతావరణ మార్పులు సంభవించాయి. ప్రస్తుతం ఎక్కడ పడితే అక్కడ ఆకస్మిక వర్షాలు, వరదలు వస్తున్నాయి. ఎప్పుడు ఎక్కడ ఏ స్థాయిలో వర్షాలు పడుతాయో ఎవరూ ఊహించలేని పరిస్థితి. అక్టోబరు నుంచి డిసెంబరు వరకు ఈశాన్య రుతుపవనాల ప్రభావంగా ఎగువ ప్రాంతాల్లో, జలాశయ ప్రాంతంలో కురిసే ప్రతి వర్షపు చుక్క నేరుగా సోమశిల జలాశయానికి చేరుతోంది. ఇప్పటికే నిండుకుండగా ఉన్న జలాశయానికి వచ్చే వరద జలాలను నిల్వ ఉంచేందుకు వీలులేనందున దిగువకు విడుదల చేయాల్సి పరిస్థితి ఉంటుంది. ఈ సమయంలో గతంలో వచ్చిన స్థాయిలో వరద వస్తే.. క్రస్ట్ గేట్లను లిఫ్ట్ చేసి వరద దిగువకు విడుదల చేయాలంటే.. 11, 12 క్రస్ట్ గేట్లు పూర్తిగా బ్లాక్ అయిపోవడంతో మిగిలిన పది గేట్లలో ప్రస్తుతం 5, 6, 7 క్రస్ట్ గేట్లు సేఫ్‌గానే ఉన్నాయని ఇటీవల స్పష్టమైంది. మిగతా గేట్ల విషయంలో జలాశయం అధికారులకే స్పష్టత లేదని సంబంధిత అధికార వర్గాల ద్వారా స్పష్టమవుతోంది. -
శుభాకాంక్షల మాటున సైబర్ మోసాలు
సాక్షి, హైదరాబాద్: దీపావళి పండుగ సందర్భంగా ఒకరికొకరు శుభాకాంక్షల సందేశాలు పంపుకోవడం అత్యంత సాధారణం. ఇటీవల వాట్సాప్‌లో ఇలాంటి సందేశాలు ట్రెండీగా మారాయి. తమ బంధువులు, స్నేహితులకు వినూత్నంగా శుభాకాంక్షలు చెప్పాలన్న తొందరలో కొందరు సైబర్ భద్రతా మరుస్తున్నారు. పండుగ శుభాకాంక్షల పేరిట సైబర్ నేరగాళ్లు ఏపీకే (ఆండ్రాయిడ్ ప్యాకేజీ కిట్) ఫైల్స్ పంపుతున్నట్టు సైబర్ భద్రత నిపుణులు హెచ్చరి స్తున్నారు. దీపావళి ఆఫర్లు, గిఫ్ట్ కూపన్లతోపాటు ఇప్పుడు శుభాకాంక్షలకు సంబంధించిన మోసపూ రిత లింక్‌లు పంపుతున్నట్టుగా వారు చెపుతున్నారు.ఏదైనా కంపెనీ తరఫున మీకు పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్టుగా పంపే ఈ లింక్‌లలో ‘మీ పేరు, ఫొటోతో మీకు తెలిసిన వారికి శుభాకాంక్షలు వినూత్నంగా చెప్పండి’అనే సందేశాన్ని జోడిస్తున్న ట్టు తెలిపారు. ఇలాంటి లింక్‌లపై క్లిక్ చేయగానే మన మొబైల్ ఫోన్ సైబర్ నేరగాళ్ల అధీనంలోకి వెళ్లడంతోపాటు వారు మన ఫోన్లో మాల్వేర్ యాప్‌లు ఇన్స్టాల్ చేసి ఆన్లైన్ బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులు కొల్లగొట్టే ప్రమాదం ఉందని సైబర్ భద్రతా నిపుణులు హెచ్చరిస్తున్నారు.తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీ సీఎస్బీ) సమాచా రం ప్రకారం అక్టోబర్ 1 నుంచి ఈనెల 16 వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 390 మంది బాధితులు ఈ తరహా నకిలీ లింక్‌లపై క్లిక్ చేయడం ద్వారా రూ.8.5 లక్షలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో తెలియనివారి వాట్సాప్ నంబర్ల నుంచి వచ్చే సందేశాల్లోని లింకులపై క్లిక్ చేయవద్దని, ఏపీకే ఫైళ్లను డౌన్లోడ్ చేయవద్దని నిపుణులు సూచిస్తున్నారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్‌కు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచిస్తున్నారు. -
ముమ్మాటికీ ప్రైవేటీకరణే
సాక్షి, అమరావతి: ‘పీపీపీకి.. ప్రైవేటీకరణకు చాలా తేడా ఉంది. మేం వైద్య కళాశాలలను పీపీపీలో అభివృద్ధి చేస్తున్నాం. ఈ విధానంలో విద్యార్థులు, సామాన్య ప్రజలకు ఎలాంటి నష్టం ఉండదు’ కొత్త వైద్య కళాశాలల విషయంలో చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న ప్రచారం ఇది. చేస్తున్న ప్రచారానికి.. ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలకు ఏ మాత్రం పొంతన లేకుండా పోయింది. విద్యార్థులకు నష్టం ఉండదంటూనే ప్రైవేట్ వైద్య కళాశాలల్లో మాదిరిగా ప్రభుత్వ వైద్య కళాశాలల్లోనూ ఫీజుల దోపిడీకి రెడ్ కార్పెట్ పరుస్తున్నారు. తద్వారా అస్మదీయుల ఆదాయం పెంపునకు ప్రభుత్వ కోటా ఎంబీబీఎస్ సీట్లకు గండికొట్టి విద్యార్థులకు తీవ్ర అన్యాయం తలపెడుతున్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సాధించిన 17 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పదింటిని పీపీపీ పేరిట ప్రభుత్వం ప్రైవేట్‌కు కట్టబెడుతున్న విషయం తెలిసిందే. ఆలిండియా కోటా సీట్లు యాజమాన్య కోటాకే.. కొత్తగా నిరి్మంచిన వైద్య కళాశాలలపై ప్రభుత్వానికి ఏమాత్రం అజమాయిషీ లేకుండా ప్రభుత్వ పెద్దలు చేస్తున్నారు. ఆలిండియా కోటా విధానానికి స్వస్తి పలకడం ద్వారా కళాశాలల్లో ప్రభుత్వ అజమాయిషీ అణుమాత్రం కూడా ఉండబోదని బాబు సర్కార్ ఇప్పటికే వెల్లడించింది. అంతేకాకుండా కారుచౌకగా కళాశాలలను కైవసం చేసుకునే వ్యక్తులు వైద్య విద్యారంగంలోనూ రూ.కోట్లు కొల్లగొట్టేందుకు వీలుగా ప్రభుత్వ కోటాలోని 110 సీట్లను యాజమాన్య కోటాకు మళ్లించి విద్యార్థులకు తీవ్ర అన్యాయం తలపెడుతున్నారు. ఒక్కో కళాశాలలో 11 చొప్పున.. దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాల అజమాయిషీలో నడిచే వైద్య కళాశాలల్లో 15 శాతం ఎంబీబీఎస్ సీట్లు ఆలిండియా కోటాకు కేటాయిస్తారు. పీపీపీకి ఇస్తున్న 10 వైద్య కళాశాలల్లో ఆల్ ఇండియా కోటా ఉండబోదని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. అంటే ఈ కళాశాలలు వంద శాతం ప్రైవేట్ వ్యక్తుల అజమాయిïÙలోనే నడుస్తాయనే విషయాన్ని ప్రభుత్వం చెప్పకనే చెబుతోంది. ఆల్ ఇండియా కోటా ఎత్తేయడం వల్ల మన విద్యార్థులు ఒక్కో కళాశాలలో 11 చొప్పున కన్వినర్ కోటా సీట్లను నష్టపోనున్నారు. ఒక్కో వైద్య కళాశాలలో 150 చొప్పున ఎంబీబీఎస్ సీట్లు ఉంటాయి. వీటిలో 15 శాతం అంటే 22 సీట్లు ఆలిండియా కోటాకు, మిగిలిన 128 సీట్లలో సగం (64) రాష్ట్ర స్థాయిలో కనీ్వనర్ కోటాకు, 45 సెల్ఫ్ ఫైనాన్స్, 19 ఎన్ఆర్ఐ కోటా కింద భర్తీ చేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన పరిశీలిస్తే ఆలిండియా, రాష్ట్ర కనీ్వనర్ కోటా కలిపి 86 సీట్లు ప్రభుత్వ కోటా కిందకు వస్తాయి. ఈ సీట్లకు రూ.15 వేలు మాత్రమే ఫీజు ఉంటుంది. ఆలిండియా కోటా రద్దుచేసి ప్రైవేట్ వైద్య కళాశాలల తరహాలో 150 సీట్లలో సగం కన్వినర్ కోటాకు, మిగిలిన సగం యాజమాన్య కోటా (బీ, సీ) కింద భర్తీ అవుతాయని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. అంటే ప్రస్తుత విధానంలో ప్రభుత్వ కోటా కింద 86 సీట్లు కొత్త వైద్య కళాశాలల్లో అందుబాటులో ఉండగా.. వాటిని ప్రైవేట్‌కు కట్టబెట్టడం వల్ల ఒక్కో కళాశాలలో 11 సీట్లకు గండి పడనుంది. 8 బీ కేటగిరీకి, మూడు ఎన్ఆర్ఐ కోటా కిందకు వెళతాయి. తద్వారా ఏడాదికి బీ కేటగిరి సీటుకు రూ.13.20 లక్షలు, సీ కేటగిరి సీటుకు రూ.39.60 లక్షలు చొప్పున ప్రైవేట్ వ్యక్తులకు ఆదాయం సమకూరనుంది.ఈ లెక్కన 10 వైద్య కళాశాలల్లో 110 సీట్లు యాజమాన్య కోటాకు మళ్లించి ఏడాదికి బీ కేటగిరి సీట్ల రూపంలో రూ.10.56 కోట్లు, సీ కేటగిరి సీట్ల రూపంలో రూ.11.88 కోట్ల చొప్పున విద్యార్థుల నుంచి ప్రైవేట్ వ్యక్తులు ముక్కుపిండి వసూలు చేసుకోవడానికి లైసెన్స్ ఇచ్చేస్తున్నారు. విద్యార్థులకు తీరని ద్రోహం ఇతర రాష్ట్రాలు, దేశాల్లో ఎంబీబీఎస్ చదివేవారు మెడికల్ పీజీ కోర్సులు చదవాలంటే.. అడ్మిషన్ల సమయంలో స్థానికేతరులుగా మారిపోతున్నారు. ఈ నేపథ్యంలో కొన్నేళ్లుగా విద్యార్థులు, తల్లిదండ్రుల ఆలోచన ధోరణిలో మార్పు వస్తోంది. ఢిల్లీ ఎయిమ్స్, ఇతర ప్రతిష్టాత్మక సంస్థల్లో సీట్లు వస్తే తప్ప.. మిగిలిన సందర్భాల్లో ఇతర రాష్ట్రాల్లో ఎంబీబీఎస్ చదవడానికి ఇష్టపడటం లేదు. నీట్ యూజీలో టాప్ స్కోర్ సాధించిన విద్యార్థులు ఆలిండియా కోటా కింద రాష్ట్ర కళాశాలల్లోనే చేరుతున్నారు. ఈ పోకడ రానురాను ఇంకా పెరగనుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వైద్య కళాశాలలను ప్రైవేటీకరిస్తూ విద్యార్థులపై ఫీజుల భారం మోపుతుండటమే కాకుండా.. ఏకంగా 110 సీట్లను యాజమాన్య కోటాకు మళ్లించడంపై విద్యార్థి లోకం మండిపడుతోంది. -
వేటగాళ్ల ఉచ్చుకు ఫారెస్ట్ ప్రొటెక్షన్ వాచర్ బలి
పాములపాడు: వన్యప్రాణుల కోసం వేటగాళ్లు ఏర్పాటు చేసిన విద్యుత్ తీగ ఉచ్చుకు తగిలి ఫారెస్ట్ ప్రొటెక్షన్ వాచర్ మృతి చెందగా.. మరో నలుగురు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఈ దుర్ఘటన నంద్యాల మండలం పాములపాడు మండలం బానకచెర్ల గ్రామ సమీపంలోని అడవిలో ఆదివారం జరిగింది. అటవీ అధికారుల కథనం మేరకు.. ఈ నెల 18న రాత్రి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు, ప్రొటెక్షన్ వాచర్లు రాముడు, రాంభూపాల్, విజయ్‌కుమార్, అరుణ్‌కుమార్, లక్ష్మణ్‌నాయక్ విధుల్లో భాగంగా వాహనంలో బయల్దేరారు. రోడ్డు పక్కన అడవిలో చెట్ల పక్కన ఒక ద్విచక్ర వాహనం కనిపించడంతో అనుమానం వచ్చి అడవిలోకి వెళ్లి చూశారు. దారిలో వేటగాళ్లు ఏర్పాటు చేసిన విద్యుత్ తీగ ఉచ్చు తగలి ప్రొటెక్షన్ వాచర్ లక్ష్మణ్‌నాయక్ (54) కిందపడ్డాడు. మిగతా వారు వస్తుండగా ‘విద్యుత్ ఉంది.. రావొద్దు’ అంటూ కేక వేసి కుప్పకూలిపోయాడు. అప్పటికే ఇద్దరికి స్వల్పంగా తీగ తగిలింది. లక్ష్మణ్‌నాయక్‌ను వెంటనే ఆత్మకూరు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. వాహనంపై టీడీపీ ఎంపీ శబరి ఫొటో స్టిక్కర్ ఘటనా స్థలంలో లభించిన ద్విచక్ర వాహనం నంద్యాల జిల్లా మిడుతూరు మండలం తలముడిపికి చెందిన వెంకటేశ్వర్లు అనే వ్యక్తికి చెందినదిగా పోలీసులు గుర్తించారు. వాహనంపై టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి ఫొటోతో కూడిన స్టిక్కర్ అతికించి ఉంది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు, అటవీ అధికారులు వేటగాళ్లు ఏర్పాటు చేసిన తీగను స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఒక్క మద్యం షాపు.. 34 దరఖాస్తులు
సాక్షి, హైదరాబాద్: ఈసారి ఒక్కో వైన్‌షాపు కోసం సగటున 34 దరఖాస్తులు వచ్చాయని ఎక్సైజ్ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. 2025–27 సంవత్సరాలకు గాను రాష్ట్రంలోని 2,620 వైన్ (ఏ4) షాపుల నిర్వహణ కోసం లైసెన్సులు మంజూరు చేసేందుకు తొలి విడత గడువు ముగిసే సమయానికి మొత్తం 89,344 దరఖాస్తులు వచ్చాయని ఎక్సైజ్ శాఖ అధికారికంగా వెల్లడించింది. తద్వారా దరఖాస్తు ఫీజు రూపంలో మొత్తం రూ.2,680 కోట్లు సమకూరింది. ఇది గత రెండేళ్ల కాలానికి దరఖాస్తు ఫీజు రూపంలో వచ్చిన దాని కంటే కొంచెం ఎక్కువ కావడం గమనార్హం.కాగా, ఈ దరఖాస్తు గడువును ఎక్సైజ్ శాఖ మరో మూడు రోజులు పెంచింది. ఈనెల 23 వరకు మద్యం షాపులకు దరఖాస్తు చేసుకోవచ్చని, ఈనెల 23న జరగాల్సిన డ్రాలు ఈనెల 27న తీస్తామని ఇప్పటికే ఎక్సైజ్ శాఖ ప్రకటించింది. ప్రస్తుతానికి వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తే అత్యధికంగా శంషాబాద్ ఎక్సైజ్ జిల్లాలో 8 వేలకు పైగా వచ్చాయి. అత్యల్పంగా ఆసిఫాబాద్‌లో కేవలం 622 దరఖాస్తులు మాత్రమే రాగా, ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలను మినహాయిస్తే నల్లగొండ జిల్లాలో అత్యధికంగా 4,620 దరఖాస్తులు వచ్చాయని గణాంకాలు చెబుతున్నాయి. ఎక్సైజ్ జిల్లాల వారీగా వచ్చిన దరఖాస్తుల వివరాలివి..ఆదిలాబాద్ (711), ఆసిఫాబాద్ (622), మంచిర్యాల (1,617), నిర్మల్ (942), హైదరాబాద్ (2,960), సికింద్రాబాద్ (2,787), జగిత్యాల (1,834), కరీంనగర్ (2,635), పెద్దపల్లి (1,378), సిరిసిల్ల (1,324), ఖమ్మం (4,094), కొత్తగూడెం (3,799), గద్వాల (723), మహబూబ్‌నగర్ (2,360), నాగర్‌కర్నూల్ (1,424), వనపర్తి (676), మెదక్ (1,369), సంగారెడ్డి (4,190), సిద్దిపేట (2,642), నల్లగొండ (4,620), సూర్యాపేట (2,617), భువనగిరి (2,649), కామారెడ్డి (1,444), నిజామాబాద్ (2,633), మల్కాజ్గిరి (4,879), మేడ్చల్ (5,203), సరూర్‌నగర్ (7,595), శంషాబాద్ (8,110), వికారాబాద్ (1,750), జనగామ (1,588), భూపాలపల్లి (1,658), మహబూబాబాద్ (1,674), వరంగల్ రూరల్ (1,825), వరంగల్ అర్బన్ (3,012). -
'నాడి' పట్టుకోవాలి
అల్జీమర్స్, స్ట్రోక్, మూర్ఛ.. ఇలాంటి నాడీ సంబంధ సమస్యలు ప్రపంచంలో 40 శాతానికిపైగా జనాభాను కుంగదీస్తున్నాయి అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ఇవి ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలకు పెనుభారంగా పరిణమిస్తున్నాయని వెల్లడించింది. సంస్థ చరిత్రలో తొలిసారి ఈ వ్యాధులపై ‘గ్లోబల్ స్టేటస్ రిపోర్ట్ ఆన్ న్యూరాలజీ’ పేరిట నివేదికను విడుదల చేసింది. మొత్తం సభ్య దేశాల్లో కేవలం 32 శాతం (63 దేశాలు) మాత్రమే.. నాడీ సంబంధ సమస్యల నివారణకు జాతీయ విధానం ప్రకటించాయని, ఇందులో భారత్ కూడాఉందని నివేదికలో ప్రత్యేకంగా ప్రస్తావించింది. – సాక్షి, స్పెషల్ డెస్క్ప్రపంచంలోని మూడో వంతు దేశాల్లో కూడా.. పెరుగుతున్న నాడీ సంబంధ సమస్యలపై ఇప్పటికీ నిర్దిష్ట జాతీయ విధానం అంటూ ఒకటి లేదు. 2021 నాటికి ప్రపంచ జనాభాలో సుమారు 42 శాతం మంది (దాదాపు 340 కోట్లకుపైగా) ప్రజలు నాడీ సంబంధ రుగ్మతలతో బాధపడుతున్నారు. వీటివల్ల ఏటా 1.1 కోట్ల మంది మరణిస్తున్నారు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ‘గ్లోబల్ స్టేటస్ రిపోర్ట్ ఆన్ న్యూరాలజీ’ వెల్లడించింది.జాతీయ విధానం 32%దేశాల్లోనే..ప్రపంచ ఆరోగ్య సంస్థలో ఉన్న మొత్తం 194 సభ్య దేశాల్లో 102 మాత్రమే ఈ సర్వేలో పాల్గొన్నాయి. ఈ జాబితాలో భారతదేశం కూడా ఉంది. ప్రపంచ జనాభాలో 71 శాతం ఈ దేశాల్లోనే ఉంది. మొత్తం సభ్య దేశాల్లో 32 శాతం (63 దేశాలు) మాత్రమే.. నాడీ సంబంధ సమస్యల నివారణకు జాతీయ విధానం ప్రకటించాయి. కేవలం 34 దేశాలే.. ఇందుకోసం నిధులు కేటాయించాయట. 49 దేశాలు (25 శాతం) మాత్రమే.. ఆయా దేశాల్లోని సార్వత్రిక ఆరోగ్య పథకాల్లో నాడీ సంబంధ సమస్యలను చేర్చాయి.ఒక డాలర్ ఖర్చు.. 10 డాలర్ల రాబడినాడీ సంబంధ సమస్యలు.. ముఖ్యంగా మెదడు ఆరోగ్యంపై అన్ని దేశాలూ విస్తృత అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. నాడీ సంబంధ వ్యాధుల నివారణకు చేపట్టే చర్యలు దీర్ఘకాలంలో ఆర్థికంగా ప్రయోజనకరమైనవేనని తెలిపింది. ‘ఉదాహరణకు స్ట్రోక్, హృద్రోగాలపై పెట్టే ఒక డాలర్ ఖర్చు.. 10 డాలర్ల కంటే ఎక్కువ రాబడి ఇస్తుంది. ఇలా ఆలోచిస్తే ఈ సమస్యలన్నింటిపైనా చేసే ఖర్చును వ్యయంలా భావించలేం. అవి భవిష్యత్తులో ఆర్థిక వ్యవస్థలను సుసంపన్నం చేసే పెట్టుబడులే’ అని పేర్కొంది.నివేదికలో మనదేశ ప్రస్తావనప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ నివేదికలో మనదేశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించింది. కర్ణాటక రాష్ట్రం ‘కర్ణాటక బ్రెయిన్ హెల్త్ ఇనీషియేటివ్ (కభీ)’ పేరిట ఆ రాష్ట్రంలో నాడీ సంబంధ రుగ్మతల నివారణకు సమగ్ర కార్యక్రమాన్ని చేపట్టింది. దీనికోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించి 2023లో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసింది. ఇందులో భాగంగా 32 క్లినిక్‌లు ఏర్పాటుచేసింది. రాష్ట్ర వ్యాప్తంగా స్ట్రోక్, డిమెన్షియా వంటి రుగ్మతలతో బాధపడేవారి వివరాలను డిజిటైజ్ చేసింది. అనేక రూపాల్లో అవగాహనా కార్యక్రమాలు నిర్వహించింది. ఈ కార్యక్రమ స్ఫూర్తితో భారత ప్రభుత్వం 2024లో మెదడు ఆరోగ్యంపై జాతీయ టాస్క్ ఫోర్స్ ఏర్పాటుచేసింది.2021లో మరణాలు లేదా అంగ వైకల్యానికి కారణమైన ప్రధాన నాడీ సమస్యలు..స్ట్రోక్, అప్పుడే పుట్టిన పిల్లల్లో మెదడులో సమస్యలు, మైగ్రెయిన్, అల్జీమర్స్, మతిభ్రమణం, డయాబెటిక్ న్యూరోపతి, మెనింజైటిస్ (మెదడు, వెన్నుపాము చుట్టూ ఉండే పొరల వాపు), నెలలు నిండక ముందే పుట్టే పిల్లల్లోని నాడీ సంబంధ సమస్యలు, ఆటిజం సంబంధిత సమస్యలు, నాడీ సంబంధ కేన్సర్లు.2021 గణాంకాల ప్రకారం చూస్తే.. మైగ్రెయిన్, మల్టిపుల్ స్కె›్లరోసిస్ (కేంద్ర నాడీ వ్యవస్థను ప్రభావితం చేసే దీర్ఘకాలిక వ్యాధి) మహిళల్లో ఎక్కువగా ఉంటే.. పార్కిన్సన్స్, స్ట్రోక్ పురుషుల్లో ఎక్కువగా ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 2021లో మూర్ఛ వ్యాధితో బాధపడుతున్నవారి సంఖ్య 5.17 కోట్లు. -
రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం
సాక్షి, అమరావతి: దక్షిణ అండమాన్ సముద్రం, దానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఈనెల 21న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం తదుపరి రెండు రోజుల్లో పశ్చిమ, వాయవ్య దిశగా కదులుతూ వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రానున్న నాలుగు రోజులపాటు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం తూర్పు గోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కృష్ణా, గుంటూరు జిల్లాలతో పాటు రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయని వెల్లడించారు. వాయుగుండం ప్రభావం పెరిగే కొద్దీ వర్షాల తీవ్రత కూడా పెరగవచ్చని తెలిపారు. 20న బాపట్ల, ప్రకాశం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వానలు పడొచ్చు. 21న పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ప్రకాశం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలకు ఆస్కారం ఉంది. 22న బాపట్ల, ప్రకాశం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, గుంటూరు, కృష్ణా, పల్నాడు, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడొచ్చని అధికారులు తెలిపారు. 23న కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. కాగా ఆదివారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షపాతం నమోదైంది. విజయనగరం జిల్లాలోని మెరకముడిదాం, అన్నమయ్య జిల్లా గాలివీడు, విజయనగరం జిల్లా గొల్లపాడులో 4.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. -
వారు కోవర్టులు.. విప్లవ ప్రతిఘాతకులు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: పార్టీ విచ్ఛిన్నకులుగా..విప్లవ ప్రతిఘాతకులుగా మారి శత్రువులకు లొంగిపోయిన సోను, సతీశ్, వారి అనుచరులకు తగిన శిక్ష విధించాలని ప్రజలకు భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) పిలుపునిచి్చంది. ఈ మేరకు ఆ పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతిని«ధి అభయ్ పేరిట ఈనెల 16న రాసిన లేఖ ఆదివారం వెలుగుచూసింది. లేఖలోని ప్రధానాంశాలివి...సోను రాజకీయ బలహీనతలు బయటపడుతూ వచ్చాయి2011 నుంచి దండకారణ్యంలో పార్టీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. దేశవ్యాప్తంగా 2018 నాటికి తాత్కాలిక వెనుకంజకు గురైంది. అప్పటి నుంచే సోనులో రాజకీయ బలహీనతలు బయటపడుతూ వచ్చాయి. 2020 డిసెంబర్లో జరిగిన కేంద్ర కమిటీ సమావేశంలో దండకారణ్య విప్లవాచరణలో కొన్ని లోపాలపై సోను ప్రవేశపెట్టిన పత్రాన్ని కేంద్ర కమిటీ తిరస్కరించింది. ఆ తర్వాత జరిగిన కేంద్ర కమిటీ, పొలిట్‌బ్యూరో సమావేశాల్లో సోనులోని తప్పుడు రాజకీయ భావాలను విమర్శించి, సరిదిద్దడానికి పార్టీ కృషి చేసింది. ఆయనలో పొడసూపుతున్న వ్యక్తివాదం, అహంభావం, పెత్తందారీతనాన్ని సరిద్దుకోవాలని కోరింది. అయితే 2025 మేలో మా పార్టీ ప్రధాన కార్యదర్శి బసవరాజు మరణం తర్వాత సోనులో దీర్ఘకాలంగా పేరుకుపోయిన సైద్ధాంతిక, రాజకీయ, నిర్మాణాత్మక బలహీనతలు గుణాత్మక మార్పును సంతరించుకొని శత్రువు ముందు మోకరిల్లేలా చేశాయి.నిజాలు దాచి .. నిందలు మోపుతూ..ఆపరేషన్ కగార్తో ప్రతీరోజు ప్రాణాలు ఎదురొడ్డి విప్లవవోద్యమాన్ని ముందుకు నడిపించాల్సిన పరిస్థితి ఎదురైంది. అయితే సోనులో పెరుగుతూ వచ్చిన సుఖలాలస, స్వార్థాలు త్యాగానికి సిద్ధపడని స్థితికి, ప్రాణభీతికి దారి తీశాయి. తన బలహీనత, ప్రాణభీతికి ముసుగు కప్పి, పార్టీ అనుసరిస్తున్న తప్పుడు రాజకీయ సైనిక పంథా (వ్యూహం) ఫలితంగానే భారత విప్లవోద్యమం ఓటమి పాలయ్యే స్థితికి దారితీసిందని, ఈ స్థితిలో ఆయుధాలను శత్రువుకు అప్పగించి, తాత్కాలిక సాయుధ పోరాట విరమణ చేయడం మినహా మరో మార్గం లేదనే మితవాద అవకాశవాద, రివిజనిస్టు వైఖరితో కూడిన లొంగుబాటు ప్రకటన సెప్టెంబరు 15న సోను నుంచి వచ్చింది. తన అభిప్రాయాలపై నమ్మకముంటే సోను వాటిని పార్టీ ముందు పెట్టి చర్చించాల్సింది. కానీ శత్రువు ముందు లొంగిపోయాడు.బహిష్కరిస్తున్నాంసోను, అతని అనుచరులు ఆయుధాలు పార్టీకి అప్పగించి లొంగిపోవాలని కేంద్ర కమిటీ సూచించినా, దాన్ని పాటించకుండా ఆయుధాల్ని శత్రువుకు అప్పగించారు. ఇదివిప్లవ ప్రతిఘాతుకత (కౌంటర్ రివల్యూషన్) అవుతుంది. విప్లవ ద్రోహిగా మారిన సోను, అతనితోపాటు లొంగిపోయిన డీకే ఎస్జెడ్సీ సభ్యుడు వివేక్, దీపలతో పాటు మరో పదిమందిని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నాం. ఈ విప్లవ ద్రోహులకు తగిన శిక్ష విధించాల్సిందిగా విప్లవ ప్రజలకు పిలుపునిస్తున్నాం. గతేడాది నుంచి వారు కాంటాక్ట్‌లో ఉన్నారు..గతేడాది చివర్లో తన జీవిత సహచరితోపాటు మరికొందరిని మహాæరాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో పోలీసులకు లొంగిపోవడానికి పథకం రూపొందించినప్పటి నుంచే పోలీస్ ఉన్నతాధికారులతో సోను, ఆశన్న కాంటాక్ట్‌లో ఉన్నారు. ఆ తర్వాత కోవర్టుగా మారినట్టు ఈ మధ్య జరిగిన ఘటనల ద్వారా అర్థమవుతోంది. కోవర్టులుగా మారిన సోను, సతీశ్‌లకు నూతన పద్ధతుల్లో భారత విప్లవోద్యమాన్ని నిర్మిస్తాననే నైతిక అర్హత లేదు. ఇకనైనా పార్టీని చీల్చే పనులు మానుకోవాలని సోను, సతీశ్లను హెచ్చరిస్తున్నాం. భవిష్యత్ కార్యాచరణభారీ లొంగుబాట్లు విప్లవోద్యమానికి నష్టమే అయినా ఇవి తాత్కాలిక నష్టాలే. వీటి ప్రభావం దీర్ఘకాలం ఉండొచ్చు. కానీ విప్లవోద్యమం శాశ్వత ఓటమికి గురికాదు. పీడన, సామాజిక అంతరాలు ఉన్నంత వరకు వర్గ పోరాటం ఉంటుంది. మారిన సామాజిక పరిస్థితులు, మారుతున్న విప్లవ స్వాభావిక లక్షణాలకు తగినట్టుగా మన రాజకీయ – సైనిక పంథాను సుసంపన్నం చేసుకొని భారత విప్లవోద్యమాన్ని కొనసాగిద్దామని యావత్ దేశ ప్రజలకు పిలుపునిస్తున్నాం. -
సీఎంకు రైతుల తిప్పలు కనిపించవా?
చిన్నకోడూరు (సిద్దిపేట): సీఎం రేవంత్‌రెడ్డికి ప్రతిపక్షాలను తిట్టడంపై ఉన్న సోయి రైతుల మీద లేదని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. ఆయన ఆదివారం సిద్దిపేట జిల్లా మండల పరిధిలోని మాచాపూర్‌లో మొక్కజొన్న రైతులతో మాట్లాడారు. రాష్ట్రంలో 6 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగు జరి గిందని, మక్కలు మార్కె ట్లో పెట్టుకుని రైతులు పడిగాపులు కాస్తున్నారన్నారు. ఇప్పటికే 30 శాతం వరకు రైతులు దళారులకు విక్రయించారన్నారు. ప్రభుత్వం వెంటనే మొక్క జొన్న, పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. సాగు ఎట్లుందమ్మా: వ్యవసాయం ఎట్లుందమ్మా.. ఇబ్బందులు వస్తున్నా యా అంటూ హరీశ్‌రావు రైతులను ఆప్యాయంగా పలకరించారు. ఏమున్న ది సారూ అన్నింటికీ ఇబ్బంది అవుతోందంటూ రైతులు బదులిచ్చారు. చిన్నకోడూరు మండల పరిధిలోని గంగాపూర్‌లో పొలాల వద్ద సద్ది తింటున్న రైతులతో హరీశ్‌రావు ముచ్చటించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ‘యూరియా కోసం రోజుల తర బడి పడిగాపులు కాసినా ఒక్క బస్తా దొరక లేదు. వ్యవసాయానికి సరిపడా కరెంట్ ఇవ్వడం లేదు. సీఎం రేవంత్‌రెడ్డి రుణమాఫీ చేయలేదు. సన్న బియ్యంతో అన్నం ముద్ద అవుతోంది. మూడు పంటలు పండిస్తున్నామంటే మీరు తెచ్చిన కాళేశ్వరం నీళ్లే ఆసరా’ అని రైతులు చెప్పారు. రేవంత్ పాలన రైతులను నట్టేట ముంచిందని, రైతుల ఉసురు తప్పక తగులుతుందని హరీశ్ పేర్కొన్నారు. -
కమీషన్ల కోసం మంత్రుల కొట్లాట
సాక్షి, హైదరాబాద్: కాంట్రాక్టులు, బిల్లులు మొదలుకొని అన్ని పనుల్లో కమీషన్ల కోసమే మంత్రులు కొట్లాడు కుంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ప్రభుత్వంపై ఎన్ని ఆరోపణలు వచ్చినా సమాధానం చెప్పాల్సిన మంత్రులు, ముఖ్యమంత్రి దాట వేత «ధోరణి అవలంభిస్తున్నారని మండిపడ్డారు. ఎయిర్ పోర్టు మెట్రో ఎక్స్‌ప్రెస్ వే రద్దు చేసి హైదరాబాద్ అభివృద్ధిపై రేవంత్ సర్కారు నీళ్లు చల్లిందన్నారు. ఫ్యూచర్ సిటీలో ఉన్న తన సొంత భూముల కోసం సీఎం రేవంత్ ప్రజల సొమ్మును అడ్డగోలుగా ఖర్చు చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. రంగారెడ్డి జిల్లా డీసీఎంఎస్ మాజీ చైర్మన్ చెక్కల ఎల్లయ్య ముదిరాజ్, జూబ్లీహిల్స్ నేత అంజిబాబుతోపాటు వివిధ పార్టీల నాయకులు ఆదివారం తెలంగాణ భవన్లో కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.కసరత్తు చేయకుండానే బీసీ రిజర్వేషన్లు‘ఎలాంటి కసరత్తు చేయకుండానే రిజర్వేషన్ల పెంపు పేరిట కాంగ్రెస్ బీసీలను మోసం చేసింది. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్, బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే గల్లీలో దొంగ పోరాటాలు చేయకుండా ఢిల్లీలో తమ అధిష్టానాలపై ఒత్తిడి తెచ్చి బీసీ బిల్లు పార్లమెంట్లో ఆమోదించేలా చూడాలి. ఢిల్లీలో జరిగే ప్రయత్నాలకు బీఆర్ఎస్ మద్దతు ఇస్తుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ పనితీరుకు పరీక్ష. ప్రజల జీవితాలను అల్లకల్లోలం చేసిన కాంగ్రెస్‌కు జూబ్లీహిల్స్‌లో ఓటర్లు బుద్ధి చెప్పాలి’అని కేటీఆర్ పిలుపునిచ్చారు.ప్రజలు బాధ పడుతున్నారు.. సబిత: ప్రతీ సందర్భంలో ప్రజలు కేసీఆర్‌ను గుర్తు చేసుకుంటున్నారని, దేవుడి పాలన కోల్పోయామని జూబ్లీహిల్స్ ప్రజలు బాధ పడుతున్నారని మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా ఎగిరితేనే సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పారు. జూబ్లీహిల్స్‌లో మైనారిటీ ఓటర్లు బీఆర్ఎస్కు మద్దతు పలుకుతున్నారని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎయిర్ పోర్టు మెట్రో పనులు ప్రారంభించడంతోపాటు 111 జీవో నుంచి విముక్తి కలిగిస్తామని బీఆర్ఎస్ నేత పట్లోళ్ల కార్తీక్ రెడ్డి ప్రకటించారు.పారా అథ్లెట్ అర్చనకు కేటీఆర్ అండరాజన్న సిరిసిల్ల జిల్లా చంద్రంపేటకు చెందిన పారా అథ్లెట్ మిట్టపల్లి అర్చనకు కేటీఆర్ అండగా నిలిచారు. కుట్టుపని ద్వారా జీవనోపాధిపొందుతున్న అర్చనకు పారా త్రోబాల్ క్రీడలో ఈ ఏడాది డిసెంబర్ 8 నుంచి 10 వరకు శ్రీలంకలో జరిగే అంతర్జాతీయ సౌత్ ఏషియన్ చాంపియన్ షిప్లో దేశానికి ప్రాతినిథ్యం వహించే అవకాశం లభించింది. అర్చన ఆదివారం కేటీఆర్‌ను కలవగా, అవసరమైన క్రీడా పరికరాలు, శిక్షణ సామగ్రిని అందజేశారు. -
ఆరోగ్యశ్రీ చరిత్రలో చీకటి అధ్యాయం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని 1.42 కోట్ల మంది ప్రజలకు సంజీవని అయిన ఆరోగ్యశ్రీ పథకం చరిత్రలోనే చీకటి అధ్యాయానికి చంద్రబాబు తెరతీశారు. పేద, మధ్యతరగతి ప్రజలకు ఉచిత చికిత్సలు అందించిన ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రులు బిల్లుల కోసం ఏకంగా ధర్నాకు దిగాల్సిన దుస్థితి తీసుకొచ్చారు. బకాయిల విడుదల డిమాండ్‌తో ఈ నెల 23/24 తేదీల్లో విజయవాడ ధర్నా చౌక్‌లో భారీ ధర్నా చేయడానికి ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ (ఆశ) సిద్ధమైంది. నెట్వర్క్ ఆస్పత్రుల యజమానులు, వైద్యులు, ఇతర సహాయ సిబ్బంది పెద్దసంఖ్యలో ధర్నాలో పాల్గొనాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో ధర్నాకు అనుమతి కోరుతూ విజయవాడ పోలీస్ కమిషనర్‌కు ఆశ లేఖ రాసింది. గత నెల 15 నుంచి ఆశ సమ్మెబాట పట్టింది. అదేరోజు నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆస్పత్రుల్లో ఉచిత ఓపీ, రోగనిర్ధారణ సేవలను ఆపేశారు. అయినా ప్రభుత్వం దిగిరాకపోవడంతో గత నెల 24 నుంచి ఏకంగా అన్నిరకాల వైద్యసేవలను పూర్తిస్థాయిలో నిలిపేసి సమ్మెను ఉధృతం చేశారు. సేవలన్నీ నిలిపేసి 10 రోజులైనా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో ఆస్పత్రుల యజమానులు ఏకంగా వీధి పోరాటానికి సిద్ధమయ్యారు. పేదప్రజలకు ఉచితంగా కార్పొరేట్ వైద్యసేవల కల్పన లక్ష్యంతో 2007లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారు. అనంతరం ఈ పథకం దేశానికి రోల్‌మోడల్‌గా నిలిచింది. దేశంలోని పేదప్రజలకు ఉచిత వైద్యసేవల కల్పనకు దిక్సూచిగా నిలిచిన ఈ మహోన్నత పథకాన్ని చంద్రబాబు కేవలం 17 నెలల పాలనలోనే అంపశయ్య ఎక్కించేశారు. పథకాన్ని కనుమరుగు చేయడంలో భాగంగా గద్దెనెక్కిన వెంటనే బీమా విధానం ప్రవేశపెడుతున్నట్టు ప్రకటించారు. పథకం అమలును గాలికి వదిలేసి, ఆస్పత్రులకు సకాలంలో బిల్లులు చెల్లించటం మానేశారు. ముందు రూ.670 కోట్లు చెల్లించమని అడిగినా..నెట్వర్క్ ఆస్పత్రులకు చికిత్సలు చేసిన 40 రోజుల్లో బిల్లు చెల్లించాల్సి ఉంది. అయితే చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటయిన నాటినుంచి ఆస్పత్రుల క్లెయిమ్‌లను కనీసం ప్రాసెస్ కూడా చేయకుండా ట్రస్ట్స్థాయిలోనే తొక్కిపెట్టడం మొదలుపెట్టారు. దీంతో ఏకంగా రూ.3 వేలకోట్లకు పైగా బిల్లులు నెట్వర్క్ ఆస్పత్రులకు నిలిచిపోయాయి. పెద్ద ఎత్తున బిల్లులు ఆగిపోవడంతో ఆస్పత్రులు కూడా నిర్వహించలేని దయనీయ పరిస్థితుల్లోకి యజమానులు వెళ్లిపోయారు. చేసిన అప్పులకు వడ్డీలు, ఈఎంఐలు కట్టకపోవడంతో కొత్తగా బ్యాంకులతోపాటు ప్రైవేట్‌గాను అప్పులు పుట్టని దుస్థితి నెలకొందని వారు పలుమార్లు ఆవేదన వ్యక్తం చేశారు. తమ దయనీయ పరిస్థితిపై పదేపదే ప్రభుత్వానికి లేఖలు రాసినా పట్టించుకోకపోవడంతో ఆరునెలల వ్యవధిలో రెండుసార్లు సమ్మె కు పిలుపు ఇచ్చారు. తొలిసారి సమ్మె చేసినప్పుడు సీఎం దగ్గర చర్చలు జరిగాయి. బిల్లులు ఇస్తామని సీఎం హామీ ఇవ్వడంతో వారు వెనక్కి తగ్గారు. అనంతరం పరిస్థితుల్లో మార్పురాకపోవడంతో ఇప్పుడు ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమయ్యారు. వాస్తవానికి మొత్తం బకాయిల్లో రూ.670 కోట్లు వెంటనే చెల్లించి, మిగిలిన నిధుల విడుదలపై స్పష్టమైన హామీ ఇవ్వాలని ఇప్పటివరకు ఆస్పత్రుల యజమానులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వచ్చారు. ఆ డిమాండ్‌ను ప్రభుత్వ పెద్దలు కనీసం పరిగణనలోకి కూడా తీసుకోలేదు. నెలరోజులకుపైగా సమ్మె చేస్తున్న వారిని వైద్యశాఖ మంత్రి, సీఎం స్థాయి వ్యక్తులు చర్చకు కూడా పిలవలేదు. సేవలు పూర్తిస్థాయిలో నిలిచిపోయి అనారోగ్య బాధితులు చికిత్స కోసం తీవ్ర అగచాట్లు పడుతున్నారు. ఇదిలా ఉండగా ఈవెంట్స్ మేనేజ్మెంట్పై పెట్టిన శ్రద్ధలో ఒకటో వంతు కూడా ప్రభుత్వ పెద్దలు ప్రజారోగ్యంపై పెట్టడం లేదు. -
21 ఏళ్లకే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించాలి
చార్మినార్: రాజకీయాల్లో పోటీ చేసి ప్రజాసేవ చేసేందుకు యువతకు ప్రాధాన్యం ఇవ్వాలని, 21 ఏళ్లకే పోటీ చేసే అవకాశం కల్పించే విధంగా రాజ్యాంగ సవరణ బిల్లు తీసుకురావాల్సిన అవసరముందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఇందుకోసం రాబోయేరోజుల్లో తాము శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదం తెలిపి కేంద్రానికి పంపుతామని చెప్పారు. ఆది వారం చార్మినార్ వద్ద రాజీవ్‌గాంధీ సద్భావన యాత్ర సంస్మరణ దినోత్సవ సభ జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన సీఎం రేవంత్‌రెడ్డి..కేంద్ర మాజీమంత్రి సల్మాన్ ఖుర్షీద్‌కు రాజీవ్‌గాంధీ సద్భావన అవార్డును టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిలతో కలిసి అందజేశారు.ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ రాజీవ్‌గాంధీ దేశాభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారని, ఓటుహక్కు వయసు పరిమితిని 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు తగ్గించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. ప్రస్తుతం 21 ఏళ్లకే యువత ఐఏఎస్, ఐపీఎస్ హోదాల్లో ప్రజాసేవ చేస్తుండగా, రాజకీయాల్లో మాత్రం ప్రజాప్రతినిధులుగా కొనసాగడానికి అవకాశం లేకుండా పోయిందని చెప్పారు. 42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలు కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.రాహుల్‌గాంధీ భారత్ జూడోయాత్ర చేపట్టి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారని, అన్నివర్గాల ప్రజల సంక్షేమాన్ని నిరంతరం కొనసాగిస్తామని అప్పుడు ఇచ్చిన హామీ మేరకు.. ప్రస్తుతం కుల మతాలకతీతంగా సంక్షేమ పథకాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. మహిళలకు ఉచిత ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్లు, సన్న బియ్యం పంపిణీ కేవలం మన రాష్ట్రంలోనే అమలు జరుగుతోందని మహేశ్ కుమార్‌గౌడ్ అన్నారు. ఈ కార్యక్రమంలో వేణుగోపాల్, జి.చిన్నారెడ్డి, మదన్మోహన్, బల్మూరి వెంకట్ తదితరులు పాల్గొన్నారు. -
బకాయిలు రూ.10,000 కోట్లు... ప్రోత్సాహకాలకూ ఎగనామం
సాక్షి, అమరావతి: పారిశ్రామిక ప్రోత్సాహకాల విడుదలలో కూటమి ప్రభుత్వం నమ్మించి మోసం చేసింది. ‘ఏ ఏడాది పారిశ్రామిక ప్రోత్సాహకాలు అదే ఏడాది ఇచ్చేస్తాం. ఇందుకోసం ప్రత్యేకంగా ఎస్క్రో అకౌంట్ తెరిచి మరీ బకాయిలు లేకుండా చెల్లిస్తాం..’ అంటూ చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడంలో ఘోరంగా విఫలమైంది. పారిశ్రామికవేత్తలకు రూ.10,000 కోట్లకు పైగా ప్రోత్సాహకాలను బకాయిపడిన చంద్రబాబు ప్రభుత్వం... కేవలం రూ.1,500 కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఆదివారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ‘దీపావళి వేళ మరో తీపి కబురు అందిస్తున్నాం. పరిశ్రమలకు ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ తొలి విడతగా రూ.1,500 కోట్లు విడుదల చేస్తున్నాం’ అని సీఎం తెలిపారు.అప్పు చేసిన మొత్తం కూడా చెల్లించరా..?పారిశ్రామిక ప్రోత్సాహకాల విడుదల కోసం చంద్రబాబు ప్రభుత్వం బ్యాంకుల నుంచి రూ.2,000 కోట్లు రుణం తీసుకుంది. దీనిలో కేవలం రూ1,500 కోట్లు మాత్రమే పారిశ్రామిక ప్రోత్సాహకాల కోసం విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. మిగతా రూ. 500 కోట్లు దారి మళ్లించిందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు బకాయి ఉన్న మొత్తంలో తొలి విడతగా 30శాతం మాత్రమే చెల్లించనున్నట్లు పరిశ్రమల శాఖ అధికారులు తెలిపారు. వైఎస్సార్ బడుగు వికాసం కింద గత ప్రభుత్వ హయాంలో యూనిట్లు ప్రారంభించిన ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకే రూ.3,000కోట్లకుపైగా ఈ ప్రభుత్వం బకాయిలు చెల్లించాల్సి ఉందని తెలిసింది. తనకు ప్రోత్సాహకాల కింద రూ.20లక్షలు రావాల్సి ఉండగా, ఇప్పుడు రూ.5లక్షల నుంచి రూ.6లక్షలు మాత్రమే విడుదల చేస్తామని అధికారులు చెబుతున్నారని ఓ పారిశ్రామికవేత్త ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ప్రోత్సాహకాల కోసం బ్యాంకు నుంచి రుణం తీసుకుని ఆ మొత్తాన్ని కూడా దారిమళ్లిస్తున్నారని ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. విశాఖ సదస్సు కోసమేనా?ప్రోత్సాహకాల విడుదలలో తీవ్ర జాప్యంపై పారిశ్రామికవేత్తలు ఆగ్రహంతో ఉన్నారు. దీంతో నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో జరిగే పెట్టుబడుల సదస్సుపై ప్రతికూల ప్రభావం పడుతుందన్న ఉద్దేశంతో కంటితుడుపు చర్యగా రూ.1,500 కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారని పలువురు పారిశ్రామికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. చిన్న పరిశ్రమలకు బకాయి ఉన్న ప్రోత్సాహకాలనే విడుదల చేయలేని ప్రభుత్వం... భారీ పరిశ్రమలకు ప్రకటిస్తున్న వేల కోట్ల రూపాయల ప్రోత్సాహకాలను ఎలా చెల్లిస్తుందని... ఇదేనా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజెనెస్ అంటే.. అని ప్రశి్నస్తున్నారు. -
బీఆర్ఎస్ తరపున నామినేషన్ వేసిన విష్ణు
బంజారాహిల్స్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు బీఆర్ఎస్ తరపున ఆ పార్టీ నేత, పీజేఆర్ తనయుడు పి.విష్ణువర్ధన్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఆయనే స్వయంగా రిటర్నింగ్ అధికారికి రెండుసెట్ల నామినేషన్ పత్రాలను అందజేశారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా బీఆర్ఎస్ విష్ణుతో నామినేషన్ వేయించింది. ఇప్పటికే బీఆర్ఎస్ తరపున మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీత మూడు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు.అయితే, సునీత నామినేషన్‌ను ఎన్నికల అధికారులు ఆమోదం తెలిపిన తర్వాత విష్ణువర్ధన్‌రెడ్డి నామినేషన్ ఉపసంహరించుకుంటారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ నెల 21న కూడా మాగంటి సునీత మరోసారి భారీ ర్యాలీతో వచ్చి నామినేషన్ దాఖలు చేస్తారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నామినేషన్ల స్క్రూటినీలో ఏదైనా తేడా వస్తే విష్ణు బరిలో ఉంటారని తెలుస్తోంది. -
లక్ష్మీనాయుడు హత్యలో మొదటి ముద్దాయి పవన్‌కళ్యాణే
కందుకూరు/పెదకాకాని/గుంటూరు మెడికల్ : కాపు యువకుడు తిరుమలశెట్టి లక్ష్మీనాయుడు హత్య కేసులో మొదటి ముద్దాయి ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ అవుతారని వైఎస్సార్సీపీ నేతలు స్పష్టం చేశారు. చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాలన్న ఏకైక లక్ష్యంతో ఎన్నికలకు ముందు కాపులను టీడీపీకి ఓట్లు వేసేలా ప్రోత్సహించి.. చివరికి టీడీపీ అధికారంలోకి రాగానే అదే కాపులను ఘోరంగా చంపుతుంటే కనీసం ప్రశి్నంచలేని స్థితిలో పవన్‌కళ్యాణ్ ఉండిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ కేసులో నిందితులకు కొమ్ముకాస్తూ కేసును నీరుగార్చేలా ఆదేశాలిస్తున్న సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్‌లను ఏ2, ఏ3లుగా చేర్చాలని డిమాండ్ చేశారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం దారకానిపాడులో ఇటీవల దారుణ హత్యకు గురైన లక్ష్మీనాయుడు కుటుంబాన్ని జక్కంపూడి రాజా, వంగవీటి నరేంద్రలు వేర్వేరుగా పరామర్శించారు. అలాగే, ఇదే ఘటనలో తీవ్రగాయాలపాలైన లక్ష్మీనాయుడు తమ్ముడు పవన్‌నాయుడు, బాబాయి కుమారుడు భార్గవ్నాయుడులను గుంటూరు ఉదయ్ ఆస్పత్రిలో జక్కంపూడితో పాటు, అంబటి రాంబాబు పరామర్శించారు. ఈ సందర్భంగా వారు వేర్వేరుగా మీడియాతో మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం ఎప్పుడు అధికారంలోకి వచి్చనా కాపులను హత్యచేయడం పరిపాటిగా మారిందని ధ్వజమెత్తారు. వంగవీటి రంగా హత్యతో పాటు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం, ఆయన కుటుంబంపై ఎలాంటి భాషను ఉపయోగించి ఇబ్బంది పెట్టారో అందరికీ తెలుసన్నారు. తాజాగా ఈ నెల 2న తిరుమలశెట్టి లక్ష్మీనాయుడు హత్య జరిగితే ప్రభుత్వం స్పందించడం లేదని.. పవన్‌కళ్యాణ్‌కు బాధిత కుటుంబాన్ని పరామర్శించే తీరిక కూడా లేదా.. అని ప్రశ్నించారు. ఏం చేసినా పైనుంచి కాపాడే ఓ అధికార వ్యవస్థ ఉందన్న ధైర్యంతోనే హరిచంద్రప్రసాద్ లాంటి మృగాలు రెచి్చపోతున్నాయన్నారు. హత్యకేసులో ప్రమేయం ఉన్న మిగిలిన నిందితులపై కేసు నమోదు చేయకపోవడం దారుణమని, కూటమి పెద్దల అండదండలతో వారిని తప్పించేందుకు కుట్ర జరుగుతోందన్నారు. నిందితులకు శిక్ష పడేవరకు బాధితుల తరఫున పోరాడతామని వారు స్పష్టం చేశారు. -
యాదవులకు రాజకీయాల్లో సముచిత స్థానం కల్పిస్తాం
కవాడిగూడ: యాదవులకు రాజకీయ రంగంలో సముచిత స్థానం కల్పిస్తామని...హైదరాబాద్ కా సదర్ ..యాదవుల ఖదర్ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. కులీకుతుబ్‌షాల కాలం నుంచి యాదవులపై నమ్మకం, విశ్వాసం ఉందని, యాదవులకు నమ్మిన వారికోసం ఏదైనా చేసే తెగువ ఉందని చెప్పారు. ఆదివారం ఇందిరాపార్కు ధర్నాచౌక్‌లో శ్రీ కృష్ణ సదర్ సమ్మేళనం ఆధ్వర్యంలో సదర్ వేడుకలను ఎంపీ అనిల్‌కుమార్‌యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించా రు.ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, వివేక్ వెంకటస్వామి, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్‌రావు, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్‌రెడ్డి, మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌యాదవ్, మాజీమంత్రి సి.కృష్ణాయాదవ్, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తదితరులు హాజరయ్యారు. ముందుగా, శ్రీకృష్ణ భగవానుడికి, దున్నపో తులకు ప్రత్యేక పూజలు నిర్వహించి సీఎం రేవంత్‌రెడ్డి ఉత్సవాలను ప్రారంభించారు.అనంతరం ఆయన మాట్లా డుతూ యాదవులు ఎదుర్కొంటున్న సమస్యలను యాదవ ప్రతినిధులు ఎప్పుడైనా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే ఆ సమస్యలను పరిష్కరించేందుకు తనవంతు కృషి చేస్తాన న్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో యాదవుల పాత్ర అత్యంత కీలకమైందని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సదర్‌ను రాష్ట్ర పండుగగా గుర్తించి ప్రత్యేక నిధులు మంజూరు చేస్తున్నట్టు చెప్పారు. ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత యాదవులకు సముచిత స్థా నం లభించిందన్నారు.సదర్ సందర్భంగా ఏర్పాటు చేసిన డప్పుడోలు.. కోలాటం.. బోనాలు, కళారూపాలు ఆకట్టుకు న్నాయి. ఈ సందర్భంగా జంటనగరాల నుంచి యాదవులు వారి దున్నపోతులను అందంగా అలంకరించి వాటితో చేయి ంచిన విన్యాసాలు అలరించాయి. సీఎం రేవంత్‌రెడ్డి మాట్లా డుతుండగా పాత పెద్దమ్మతల్లి దేవాలయ కమిటీ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. వారిని పోలీసులు అదుపులోకి తీసు కున్నారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. -
పరీక్షల్లో ప్రభుత్వం ఫెయిల్!
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో పరీక్షల నిర్వహణకు 2025–26 విద్యా సంవత్సరానికి అందుబాటులోకి తెచ్చిన కొత్త విధానం అమలులో కూటమి ప్రభుత్వం విఫలమైంది. కనీస అవగాహన కల్పించకుండా తెచ్చిన అసెస్మెంట్ పుస్తకాలు అటు విద్యార్థులకు ఇటు ఉపాధ్యాయులకు పరీక్ష పెడుతున్నాయి. రెండు నెలల క్రితం జరిగిన ఫార్మెటివ్ అసెస్మెంట్ (ఎఫ్ఏ 1) జవాబులను విద్యార్థులు ఫార్మెటివ్ అసెస్మెంట్ (ఎఫ్ఏ 2)లో రాశారు. దీంతో ప్రస్తుతం జరుగుతున్న ఎఫ్ఏ–2 పరీక్షల జవాబులు ఎక్కడ రాయించాలో తెలియక ఉపాధ్యాయులు తలలు పట్టుకుంటున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న సుమారు 32 లక్షల మంది విద్యార్థుల కోసం రూ.75 కోట్లు ఖర్చు చేసి 1.50 కోట్ల అసెస్మెంట్ పుస్తకాలను ముద్రించారు. ఈ పుస్తకాల్లో పరీక్షలు రాయడంలో విద్యార్థులు తికమక పడుతున్నా విద్యాశాఖ దిద్దుబాటు చర్యలు చేపట్టడం లేదు.టీచర్లకు తలకు మించిన భారం..పాత విధానంలో సమాధానానికి తగినట్లుగా ఉపాధ్యాయులే మార్కులు వేసేవారు. కానీ కొత్త విధానంలో మార్కులను ఉపాధ్యాయులు బబ్లింగ్ చేయాలి. వ్యాసరూప ప్రశ్నలకు 8 మార్కులు అనుకుంటే విద్యార్థి రాసిన జవాబుకు 0 – 8 మార్కులు కేటాయిస్తారు. ఆ మార్కులను నంబర్ రూపంలో కాకుండా ఓఎంఆర్ షీట్‌పై టీచర్ బబుల్ చేయాలి. అసెస్మెంట్ బుక్‌లో ప్రతి విద్యార్థికి ఉపాధ్యాయుడి నివేదిక రాత రూపంలో కచ్చితంగా చూపించాలి. దీంతోపాటు విద్యార్థులు రాసిన జవాబు పత్రాల ఓఎంఆర్ షీట్లను స్కాన్ చేసి లీప్ యాప్‌లో అప్లోడ్ చేయాలి. ప్రాథమిక తరగతుల్లో నాలుగు చొప్పున, ఉన్నత తరగతుల్లో ఆరు పరీక్షలకు సంబంధించిన పత్రాలను స్కాన్ చేయాలి. ఇది ఉపాధ్యాయులకు తలకు మించిన భారమని వాపోతున్నారు. ఎఫ్ఏ–1 పరీక్షల జవాబులు మూల్యాంకనం చేసేందుకు ఉపాధ్యాయులు నానా కష్టాలు పడ్డారు. ఈ క్రమంలో పరీక్షలంటేనే హడలిపోతున్నారు.రూ.75 కోట్లు వృథా ఖర్చు!విద్యార్థులకు ఉచితంగా అందించే పాఠ్య పుస్తకాల ముద్రణలో రూ.30 కోట్లు ఆదా చేసినట్టు గొప్పలు చెప్పుకుంటున్న కూటమి ప్రభుత్వం.. అసెస్మెంట్ పుస్తకాలకు రూ.75 కోట్లు వ్యయం చేసినట్లు తెలుస్తోంది. తమకు కావాల్సిన ప్రింటర్లకు కాంట్రాక్టులు కట్టబెట్టి భారీగా లబ్ధి పొందినట్లు ఆరోపణలున్నాయి. ఇంత పెద్ద మొత్తంలో ప్రజాధనాన్ని వెచ్చించి విఫల విధానాన్ని బలవంతంగా అమలు చేస్తోందని ఉపాధ్యాయులే విమర్శిస్తున్నారు. ప్రభుత్వ విధానాలపై ఇప్పటికే ఉపాధ్యాయులు ‘యాప్ డౌన్’ విధానాన్ని ప్రకటించారు. హాజరు, మధ్యాహ్న భోజనం యాప్‌లు మినహా మిగతా ఆన్లైన్ సర్వీసులు నిర్వహించబోమని ప్రకటించారు. ప్రస్తుతం జరుగుతున్న పరీక్షల మూల్యాంకనం సైతం యాప్‌లో నమోదు చేసే పరిస్థితి కనిపించడం లేదు.ఆరు పరీక్షలకు ఒక్కటే పుస్తకం..గతంలో సంప్రదాయ పరీక్షా విధానంలో ప్రశ్నా పత్రం ఇచ్చి పేపర్‌పై జవాబులు రాయించేవారు. జవాబు పత్రాలను ఉపాధ్యాయులు సులభంగా మూల్యాంకనం చేసేందుకు వీలుండేది. కూటమి ప్రభుత్వం పరీక్షల కోసం ఈ ఏడాది కొత్తగా అసెస్మెంట్ పుస్తకం విధానాన్ని తెచ్చింది. విద్యార్థులు మొత్తం ఆరు పరీక్షలను ఇదే పుస్తకంలో రాయాలి. అయితే చాలా మంది విద్యార్థులకు దీనిపై అవగాహన లేక ముగిసిన ఎఫ్ఏ–1 పరీక్షల జవాబులను ఎఫ్ఏ–2, ఎస్ఏ–1 (అర్ధవార్షిక పరీక్ష)లో రాశారు. దీంతో ఇప్పుడు జరుగుతున్న ఎఫ్ఏ–2 జవాబులు ఎక్కడ రాయాలో తెలియని పరిస్థితి నెలకొంది. -
ఏఐ వాణిజ్యం ఇంతింతై!
కృత్రిమ మేధ (ఏఐ) సంబంధిత ఉత్పత్తులు.. 2025 మొదటి ఆరు నెలల్లో అంతర్జాతీయ వాణిజ్యంలో కీలకపాత్ర పోషించాయని ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) తన తాజా నివేదికలో పేర్కొంది. సెమీకండక్టర్లు, ప్రాసెసర్లు, సర్వర్లు, టెలికమ్యూనికేషన్ పరికరాలు.. ఇలా ఏఐలో అభివృద్ధి, ఉత్పత్తికి అవసరమయ్యే పరికరాలకు ప్రపంచ వ్యాప్తంగా గిరాకీ పెరుగుతోంది. మనదేశం నుంచి ఏఐ సంబంధిత ఉత్పత్తుల ఎగుమతులు పెరుగుతున్నా.. ఇప్పటికీ దిగుమతులపైనే ఎక్కువగా ఆధారపడుతున్నాం.2024 మొదటి ఆరు నెలల్లో కృత్రిమ మేధ (ఏఐ) సంబంధిత ఉత్పత్తుల వాణిజ్యం విలువ 1.61 లక్షల కోట్ల డాలర్లు కాగా.. 2025లో ఇదే సమయంలో 1.92 లక్షల కోట్ల డాలర్లకు పెరిగింది. అంటే 20 శాతం వృద్ధి అన్నమాట. మనదేశంలో 2023–24తో పోలిస్తే 2024–25లో ఏఐ సంబంధిత దిగుమతులు 13.1 శాతం పెరిగాయి. వీటి మొత్తం విలువ 66.8 బిలియన్ డాలర్లు.ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. అత్యాధునిక కంప్యూటింగ్ హార్డ్‌వేర్ కోసం మనం ఇప్పటికీ అమెరికాపైనే ఎక్కువగా ఆధారపడుతున్నాం. మనదేశ మొత్తం దిగుమతుల్లో.. అమెరికా నుంచి వచ్చే 5 ఉత్పత్తులదే ఏకంగా 50 శాతం వాటా ఉందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మనదేశం నుంచి బోర్డులు, ప్యానెళ్లు వంటి వాటి ఎగుమతులు 2023–24తో పోలిస్తే అత్యధికంగా 58.5 శాతం పెరిగాయి.ప్రపంచ దేశాల్లో ఏఐకి సంబంధించి విధానపరమైన చర్యలు చేపట్టిన దేశాలు ఇప్పటికీ తక్కువే ఉన్నాయని డబ్ల్యూటీవో నివేదిక చెబుతోంది. అధిక ఆదాయ దేశాల్లో 68 శాతం దేశాలు ఈ చర్యలు చేపడితే.. ఎగువ మధ్య ఆదాయ దేశాల్లో కేవలం 30 శాతమే ఈ జాబితాలో ఉన్నాయి. -
రేపు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం
సాక్షి, హైదరాబాద్: విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అమర పోలీసులను స్మరించుకుంటూ ప్రతి ఏటా అక్టోబర్ 21న పోలీసు అమరవీ రుల సంస్మరణ దినం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్ గోషామహల్‌లోని పోలీస్ స్టేడి యంలో అమరవీరుల స్తూపానికి మంగళవారం నివాళులు అర్పించి శ్రద్ధాంజలి ఘటించనున్నారు. ఈ కార్య క్రమంలో రాష్ట్ర సీఎం రేవంత్‌రెడ్డి సహా పోలీస్ ఉన్నతాధికారులు, పోలీస్ అమరవీరుల కుటుంబాలు పాల్గొననున్నాయి. ఈ మేరకు డీజీ పీ శివధర్‌రెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో వివరాలు వెల్లడించా రు. ఈనెల 21నుంచి 31వ తేదీ వరకు పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుపను న్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల పో లీస్ కార్యాలయాలలో సంస్మరణ కార్యక్రమాలను నిర్వహించడంతోపాటు పోలీస్ స్టేషన్ పరి«ధులలో శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి రోజైన 31వ తేదీన జరగనున్న జాతీయ సమైక్యతా దినం వరకు కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. తెలంగాణ కు చెందిన పోలీస్ సిబ్బంది ఐదుగురు సహా దేశవ్యాప్తంగా 191 మంది పోలీసు సిబ్బంది విధి నిర్వహణలో తమ ప్రాణా లను అర్పించారని తెలిపారు. ‘అక్టోబర్ 22 –24 మధ్య మర ణించిన పోలీసు సిబ్బంది కుటుంబాలను సందర్శించి పెండింగ్ సమస్యలను పరిష్కరిస్తారు. అమరవీరుల విగ్రహాలకు, ఫొటోలకు వారి స్వగ్రామాలలో పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించే కార్యక్రమాలు జరుగుతాయి’ అని పేర్కొన్నారు. -
అద్భుతం ..వీరి సాహసం..
కాచిగూడ: హైదరాబాద్ నగరానికి గర్వకారణంగా నిలిచే విధంగా నగరానికి చెందిన తల్లీ కొడుకులు హిమలయ పర్వతాల మధ్యలో ఉన్న ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఎవరెస్ట్ బేస్ క్యాంప్ వరకు విజయవంతంగా ట్రెక్కింగ్ పూర్తి చేశారు. ఈ యాత్రలో తల్లీ కొడుకులిద్దరూ చూపిన పట్టుదల, దైర్య, సాహసాలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. జేపీ మెర్గాన్ సంస్థలో ఉద్యోగం చేస్తున్న రవ్వ శరణ్య (39), బాచుపల్లిలోని కెన్నెడీ గ్లోబల్ స్కూల్లో 7వ తరగతి చదువుతున్న ఆమె కుమారుడు మకం శ్రేయాన్షు (12) అక్టోబర్ 5, 2025న ఈ సహస యాత్రను ప్రారంభించారు.దాదాపు రెండు వారాల పాటు మంచు పర్వతాలపై కఠిన వాతావరణ పరిస్థితులు, తక్కువ ఆక్సిజన్‌తో కూడిన మార్గాలను అధిగమించి ఎవరెస్ట్ బేస్ క్యాంప్ చేరుకున్నారు. శనివారం వారు సురక్షితంగా హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు. ఈ సందర్భంగా శరణ్య తన అనుభవాన్ని పంచుకుంటూ ప్రయాణంలో అనేక ఒడిదుడుకులను ఎదుర్కొన్నామని చెప్పారు. ప్రత్యేక శిక్షణ.. శేయాన్షు తల్లిదండ్రులు గోవర్థన్–శరణ్య. యాత్రకు ముందు శ్రేయాన్షు ప్రత్యేక శారీరక దారుఢ్యంలోనూ, ట్రెక్కింగ్‌లోనూ శిక్షణ పొందాడు. పాఠశాల అధ్యాపకులతో పాటు పలువురు ప్రముఖులు, సహ విద్యార్థులు, తోటి సహచరులు తల్లీ కొడుకులిద్దరినీ అభినందించారు. ఇది కేవలం సాహసయాత్ర మాత్రమే కాదు, ‘ధైర్యం, పట్టుదల, కుటుంబ బంధం’ అనే విలువలకు ప్రతీకంగా నిలుస్తుంది. తల్లి, బిడ్డ కలిసి సాధించిన ఈ విజయం తెలంగాణకు గర్వకారణమని పలువురు కొనియాడారు. వయస్సు, వృత్తి, పరిస్థితులు కాదు.. మన సంకల్పమే పర్వతాలను అధిరోహించే శక్తినిస్తుందని చెబుతున్నారు యాత్రికులు.అంతసులభం కాదు.. చలిని తట్టుకోవడం అంత సులభం కాదు.. అదే విధంగా సముద్ర మట్టానికి అత్యంత ఎత్తులో ఉన్న శిఖరాన్ని చేరుకునే సమయంలో శ్వాస ఆడకపోవడం లాంటి ఆరోగ్యపరమైన సమస్యలు ఉత్పన్నమయ్యే పరిస్థితులు ఉన్నాయి. ఎంతో దృఢ సంకల్పంతో, పట్టు వీడకుండా తొలి ప్రయత్నంలోనే ఎవరెస్ట్ ఎక్కాలన్న లక్ష్యాన్ని చేరుకున్నాం.. ‘ఇది కేవలం శారీరక పరీక్ష మాత్రమే కాదు, మానసిక స్థైర్యం, పట్టుదల, ఈ యాత్రతో నా కుమారుడితో అద్భుతమైన బంధం ఏర్పడింది.’ ప్రతి అడుగు మా సంకల్పాన్ని మరింత దృఢం చేసింది. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను నా కుమారుడితో కలిసి అధిరోహించడం మాకు జీవితాతంతం గుర్తుండిపోయే గొప్ప యాత్ర. –రవ్వ శరణ్య క్లిష్టమైన ప్రయాణం.. ఇది చాలా క్లిష్టమైన ప్రయాణం. అయినప్పటికీ ప్రతి రోజూ కొత్త పాఠాలు నేర్పింది. ధైర్యం, క్రమశిక్షణ, కష్టాన్ని తట్టుకునే శక్తి అవసరాన్ని ఈ యాత్రలో తెలుసుకున్నా. భవిష్యత్తులో ఇంకా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని నా కల. హైదరాబాద్‌లోనే అని చిన్న వయసులో ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ట్రెక్ పూర్తి చేసిన పిల్లల్లో నేను ఒకడిని. – శ్రేయాన్షు -
'వెలుగులు' పంచుదాం..
వెలుగులు విరజిమ్మే దీపావళి కాంతులు ప్రతి ఒక్కరి జీవితాల్లో చీకట్లను పారదోలి సంతోషాలను పంచుతుంది. అయితే అలాంటి దీపావళికి ప్రతి ఒక్కరూ అప్రమత్తతతో వ్యవహరించాలి. మన ఆనందం మరొకరికి బాధ కలిగించొద్దని, వ్యక్తిగత బాధ్యత, శ్రద్ధ, జాగ్రత్తలతో పాటు, పర్యావరణ స్పృహ, సామాజిక బాధ్యతను గుర్తించాలని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా టపాసులు కాల్చే క్రమంలో చుట్టుపక్కల వారికి హాని కలుగకుండా జాగురూకతతో మెలగాలి. భారీ శబ్దాలతో చిన్నపిల్లలు, వృద్ధులు, హార్ట్ పేషెంట్లకు ఇబ్బంది కలుగుతుంది. పశువులు, పెంపుడు జంతువులు, పక్షులకు ఇబ్బంది కలుగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని గుర్తెరగాలి. వీటితో పాటు టపాసుల నుంచి వచ్చే పొగ, స్పార్క్స్ వల్ల కళ్లకు, ఊపిరితిత్తులకు ప్రమాదం వాటిల్లే పరిస్థితి ఉంది. అగ్ని ప్రమాదాలు సంభవించే ఆస్కారం ఉందని గ్రహించి తదనుగుణంగా వ్యవహరించి సహజమైన, సంప్రదాయ వెలుగులతో పండుగను ఆస్వాదించాలని పర్యావరణ వేత్తలు, నిపుణులు సూచిస్తున్నారు. – సాక్షి, సిటీబ్యూరో మన జీవితాల్లో వెలుగులు పంచే దీపావళి మరొకరి జీవితాల్లో చీకట్లు నింపకుండా జాగురూకతతో వ్యవహరించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. నేడు దేశవ్యాప్తంగా దీపావళి సంబరాలు అంబరాన్నంటనున్నాయి. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా పండుగల్లోనూ అధునాత పోకడలు సంతరించుకుంటున్నాయి. ఈ దీపావళికి ముఖ్యంగా యువత పర్యావరణ సంరక్షణ, జంతు సంక్షేమం వంటి అంశాలను గౌరవిస్తూ.. నవ సమాజ నిర్మాణానికి నాంది పలుకుతున్నారు. సంబంధిత అధికారులు సైతం పండుగ నియమావళి, సూచనలపై ముందస్తుగానే ప్రచారం చేశారు. పండుగ ఉత్సాహం, సంతోషం బాధ్యతతో కూడిన సమతుల్యాన్ని పాటించాలని నగర పోలీసు శాఖ, పర్యావరణ సంస్థలు విజ్ఞప్తి చేస్తున్నాయి. జంతు సంరక్షణ, పర్యావరణ బాధ్యత.. భారీ శబ్దాల వల్ల జంతువులు భయపడి జనాలపై దాడికి దిగే ప్రమాదం ఉంది. ఒక్కోసారి మనం కాలి్చన టపాసుల కారణంగా అవి గాయపడే ప్రమాదం ఉంది. వీటిని గుర్తించాలి. ముందుగా ఇళ్లలోని పెంపుడు జంతువులను సురక్షిత ప్రాంతాల్లో ఉంచాలి. దీంతో పాటు వీధుల్లోని జంతువులకు హాని కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని గుర్తించాలి. మన చుట్టూ ఉండే ప్రదేశాల పట్ల కూడా బాధ్యతతో మెలగాలి. నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల మనతో పాటు ఇతర పౌరులూ ఇబ్బంది పడకుండా చూసుకోవాలి. కొద్దిసేపు ఆనందాన్ని ఇచ్చే స్మోక్ క్రాకర్స్ దీర్ఘకాలం పాటు మనకు హాని కలిగిస్తాయని గ్రహించాలి. ప్రభుత్వం సూచించిన గ్రీన్, ఎకో ఫ్రెండ్లీ క్రాకర్లను మాత్రమే వినియోగించి పర్యావరణ పరిరక్షణకు దోహదపడాలి. ప్రజల్లో కొత్త చైతన్యం.. నగరంలోని పలు హౌసింగ్ సొసైటీలు, యువజన సంఘాలు ‘గ్రీన్ దీపావళి’ కార్యక్రమాలను చేపట్టాయి. క్రాకర్ ఫ్రీ జోన్లను ఏర్పరచి, పర్యావరణ స్నేహపూర్వక పండుగకు ఆయా కమ్యూనిటీలు ప్రోత్సహిస్తున్నాయి. కేవలం విద్యుత్ కాంతులు, లేదా సంప్రదాయంగా వస్తున్న నూనె దీపాలు, కొవ్వుతులను వినియోగించి పండుగను జరుపుకోవాలని, పిల్లల్లోనూ ఆ దిశగా చైతన్యం తీసుకురావాలని, ఆటపాటలతో, సాంస్కృతిక కార్యక్రమాలతో పండుగను చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాయి. నిబంధనలు ఇవే.. సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్లు టపాసుల అమ్మకాలు, వినియోగానికి ప్రత్యేక నియమాలు అమలు చేస్తున్నాయి. అనుమతులు లేని చోట టపాసులు నిల్వ చేయడం, అమ్మకం చట్టరీత్యా నేరం. భారీ శబ్దాలు చేసే, అధికంగా పొగను విడుదల చేసే టపాసులకు పరిమితులు పెట్టారు. ప్రభుత్వ నిబంధనల మేరకు రాత్రి 10 గంటల తర్వాత టపాసులు పేల్చకూడదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు అపార్ట్మెంట్లలో, బహిరంగ ప్రదేశాల్లో టపాసులు పేల్చేటప్పుడు ఇతరుల ప్రైవసీ, వృద్ధులు, చిన్నపిల్లలు, రోగులను పరిగణలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.అగ్నిమాపక సూచనలు..నగరంలోని అగ్నిమాపక శాఖ, వైద్యులు పౌరులకు పలు సూచనలు జారీ చేశారు. టపాసులు వాడేటప్పుడు పిల్లల పక్కన పెద్దవారు తప్పనిసరిగా ఉండాలి. వదులుగా ఉండే దుస్తులు, పొడవైన దుపట్టాలు ధరించడం ప్రమాదకరం. ఇళ్లల్లో దీపాల వద్ద కర్టెన్లు, పేపర్ అలంకరణల విషయంలో జాగ్రత్త పాటించాలి. ఫస్ట్ ఎయిడ్ కిట్, నీటి బకెట్, ఫైర్ కంట్రోలర్స్ వంటి భద్రతా సామగ్రి ఇళ్లల్లో, గేటెడ్ కమ్యూనిటీల్లో సిద్ధంగా ఉంచుకోవాలి. ఏదైనా ప్రమాదవ శాత్తూ గాయాలైతే తక్షణ వైద్య సహాయం పొందలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. పొగతో కళ్లకు ప్రమాదం.. క్రాకర్స్ కాల్చే సమయంలో వచ్చే ప్రమాదకరమైన పొగ వల్ల కళ్లు దెబ్బతినే అవకాశం ఉంది. ఆ పొగ నేరుగా కంటికి తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కంటికి వీలైనంత దూరంగా కాల్చాలి. కొన్ని రకాల క్రాకర్స్ నుంచి వెలువడే నిప్పు రవ్వలు కంట్లో పడే ప్రమాదం ఉంటుంది. వీటితో పాటు క్రాకర్స్ నుంచి వెలువడే కాంతి కూడా కంటిలోని నల్లగుడ్డుని దెబ్బతీసే ప్రమాదం ఉంది. అందుకే అదే పనిగా ఆ వెలుగును చూడకుండా ఉంటే మంచిది.ఏవైనా జరిగి కళ్లు మండుతున్నట్లు అనిపిస్తే వెంటనే వాటిని నలపకుండా స్వచ్ఛమైన చల్లటి నీటితో కడుక్కోవాలి. కొద్ది సేపటి తర్వాత కూడా అదే పరిస్థితి ఉంటే వైద్యులను సంప్రదించాలి. కళ్లలో దురద వస్తే వైద్యుల సూచన మేరకు చుక్కల మందు స్వేస్తే సరిపోతుంది. కొందరు ఏడాది పిల్లలతో కూడా క్రాకర్స్ కాల్పిస్తుంటారు.. ఇది ప్రమాదకరమైన చర్యగా గుర్తించాలి. వీలైతే సన్‌గ్లాస్, సాధారణ కళ్ల జోడు పెట్టుకుంటే మంచిది. – పి.సత్యవాణి, ప్రొఫెసర్, సరోజినీదేవి నేత్రాలయం, మెహిదీపట్నం -
ఆర్టీఏ చెక్‌పోస్టుల్లో ఏసీబీ సోదాలు
సాక్షి, హైదరాబాద్/ఆదిలాబాద్‌టౌన్/తానూరు /వాంకిడి/భిక్కనూరు/మద్నూర్/పాల్వం చరూరల్/ అశ్వారావుపేట/పెనుబల్లి: రాష్ట్రంలోని పలు ఆర్టీఏ చెక్‌పోస్టుల్లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు శనివారం అర్ధరాత్రి సోదాలు నిర్వహించారు. అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు ల్లో మెరుపు దాడులు చేశారు. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం భోరజ్ సమీకృత చెక్‌పోస్టు, నిర్మల్ జిల్లా తానూర్ మండలం బెల్‌తరోడా చెక్‌పోస్టు, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల కేంద్రంలోని చెక్‌పోస్టుల్లో ఏసీబీ బృందాలు అర్ధరాత్రి 12 నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు తనిఖీలు చేపట్టాయి. భరోజ్ చెక్‌పోస్టులో లెక్కకు మించి ఉన్న రూ.1.26 లక్షలు, బెల్తరోడాలో రూ.3 వేలు, వాంకిడి చెక్‌పోస్టులో రూ.5,100 నగదు సీజ్ చేశారు. డబ్బాల్లో లంచాలుఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వాహనాల డ్రైవర్లు, క్లీనర్లు చెక్‌పోస్టుల వద్ద ఏర్పాటు చేసిన డబ్బాల్లో డబ్బు వేసి వెళ్తున్నట్లు గుర్తించారు. భిక్కనూరు మండలంలోని జంగంపల్లి వద్ద జాతీయ రహదారిపై ఉన్న ఆర్టీఏ చెక్‌పోస్టులో సోదాలు నిర్వహించి రికార్డుల్లో చూపని రూ.5 వేల నగదు, అక్కడే ఉన్న ప్రైవేటు వ్యక్తుల వద్ద రూ.46,300 నగదును గుర్తించారు. మొత్తం రూ.51,300ను స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ దాడుల సమయంలో చెక్‌పోస్టులో ఏంవీఐ మహ్మద్ అప్రోజొద్దీన్ విధుల్లో ఉన్నారు. మద్నూర్ మండలం సలాబత్పూర్ వద్ద జరిపిన దాడుల్లో రూ.36 వేల అక్రమ నగదు లభించినట్లు ఏసీబీ డీఎస్పీ శేఖర్‌గౌడ్ తెలిపారు. భద్రాద్రి జిల్లా పాల్వంచ మండలం జగన్నాథపురం చెక్‌పోస్టుతో పాటు అశ్వారావుపేట, ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం ముత్తగూడెంలోని అంతర్రాష్ట్ర చెక్‌పోస్టుల్లో కూడా తనిఖీలు చేపట్టారు. పాల్వంచ చెక్ పోస్టులో రూ.26 వేలు, ముత్తగూడెం చెక్‌పోస్టులో రూ.6,660 అక్రమ నగదును స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇటీవల ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064కు భారీగా ఫిర్యాదులు రావటంతో ఏసీబీ చీఫ్ చారుసిన్హా ఆకస్మిక తనిఖీలకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దుల్లోని చెక్‌పోస్టుల్లో ఆకస్మిక సోదాలు చేశారు. నల్లగొండ జిల్లా విష్ణుపురం చెక్‌పోస్ట్, కోదాడ, సలాబత్పూర్, పెందుర్తి, జహీరాబాద్ చెక్‌పోస్టుల్లో కూడా సోదాలు నిర్వహించారు. చెక్ పోస్టుల వద్ద వసూళ్లు చేస్తున్న ప్రైవేట్ వ్యక్తులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. మొత్తంగా లెక్కల్లో లేని రూ.4.18 లక్షల నగదు సీజ్ చేశారు. దీనిపై సంబంధిత ఆర్టీఏ అధికారులకు నోటీసులు ఇచ్చారు. -
గుజరాత్‌పై తెలుగు టైటాన్స్ గెలుపు
న్యూఢిల్లీ: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఆఖరి దశ పోటీల్లో తెలుగు టైటాన్స్ నిలకడగా రాణిస్తోంది. ఆదివారం జరిగిన తొలి మ్యాచ్‌లో టైటాన్స్ జట్టు 30–25 గుజరాత్ జెయింట్స్‌పై విజయం సాధించింది. టైటాన్స్ జట్టులో కెప్టెన్ విజయ్ మాలిక్ (8), భరత్ (7) పోటీపడి రాణించారు. ఇద్దరు ఆల్‌రౌండర్లు క్రమం తప్పకుండా పాయింట్లు తెచ్చిపెట్టారు. డిఫెండర్లు అజిత్ పవార్ (4), అంకిత్ (4)లు మెరుగ్గా ఆడారు. గుజరాత్ తరఫున రెయిడింగ్‌లో హిమాన్షు సింగ్ (6), కెప్టెన్ రాకేశ్ (5) రాణించగా, డిఫెండర్ లక్కీ శర్మ 4 పాయింట్లు సాధించాడు. మిగతా వారిలో ఆల్‌రౌండర్ మొహమ్మద్ రెజా (3), విశ్వనాథ్, నితిన్ పన్వార్ చెరో 2 పాయింట్లు చేశారు. 12వ సీజన్లో ఆరంభం నుంచే పట్టుదలగా ఆడుతున్న తెలుగు టైటాన్స్ 17 మ్యాచ్‌లాడి పదో విజయాన్ని నమోదు చేసింది.నేడు మ్యాచ్‌లకు విశ్రాంతి రోజు. రేపు జరిగే పోటీల్లో బెంగాల్ వారియర్స్‌తో తమిళ్ తలైవాస్ పోటీపడుతుంది. యూ ముంబాను జైపూర్ పింక్‌పాంథర్స్ ఢీకొంటుంది. హరియాణా స్టీలర్స్‌తో గుజరాత్ జెయంట్స్ తలపడుతుంది.ప్లేఆఫ్స్ చేరిన యూ ముంబాలీగ్లో మరో జట్టు యూ ముంబా కూడా ప్లే ఆఫ్స్ చేరింది. హరియాణా స్టీలర్స్‌తో హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో యూ ముంబా టై బ్రేకర్‌లో గెలిచి ముందంజ వేసింది. నిర్ణీత సమయం ముగిసే సరికి ఇరు జట్లు 37–37 స్కోరుతో సమంగా నిలిచాయి. దీంతో టైబ్రేక్ అనివార్యం కాగా యూ ముంబా రెయిడర్లు జట్టును గెలిపించారు. సందీప్ (9) అదరగొట్టాడు. 21 సార్లు కూతకెళ్లిన అతను 9 సార్లు విజయవంతంగా పాయింట్లు తెచ్చాడు. సహచరుల్లో అజిత్ చౌహాన్ (6), అమిర్ మొహమ్మద్ (6), సునీల్ కుమార్ (4), విజయ్ కుమార్ (3) రాణించారు. హరియాణా జట్టులో జైదీప్ (9) కడదాకా శ్రమించాడు. మిగతావారిలో సాహిల్ నర్వాల్ (6), శివమ్ పతారే (4), వినయ్ (3), రాహుల్ (3) మెరుగ్గా ఆడారు. ఆఖరి మూడో మ్యాచ్‌లో పట్నా పైరేట్స్ 38–27తో పుణేరి పల్టన్‌పై గెలుపొందింది. -
ఆల్ ఫార్మాట్ రౌండర్
సాక్షి, హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో మెరుపులు మెరిపించి జాతీయ సెలక్టర్ల దృష్టిలో పడ్డ నితీశ్ కుమార్ రెడ్డి... ఏడాది తిరిగేలోపు జాతీయ జట్టు తరఫున మూడు ఫార్మాట్లలో అరంగేట్రం చేశాడు. గతేడాది అక్టోబర్‌లో టీమిండియా తరఫున తొలి అంతర్జాతీయ టి20 మ్యాచ్ ఆడిన నితీశ్ రెడ్డి... ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనలో అదరగొట్టాడు. ‘బోర్డర్–గావస్కర్’ సిరీస్‌లో భాగంగా పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టు ద్వారా సుదీర్ఘ ఫార్మాట్ బరిలోకి దిగిన ఈ ఆంధ్ర ఆల్‌రౌండర్... ఆ సిరీస్‌లో జరిగిన ఐదు మ్యాచ్‌ల్లోనూ ఆడాడు. లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్‌కు వచ్చి ధాటిగా షాట్లు ఆడగల సత్తా... ఉపయుక్తమైన మీడియం పేస్ బౌలింగ్ అతడికి వరుసగా అవకాశాలు కల్పించింది. హార్దిక్ పాండ్యా టెస్టు ఫార్మాట్‌కు దూరం కావడంతో... సుదీర్ఘ ఫార్మాట్లో భారత జట్టు చాలా కాలంగా పేస్ ఆల్‌రౌండర్ కోసం నిరీక్షిస్తోంది. అందివచ్చిన అవకాశాలను వినియోగించుకున్న నితీశ్ ఇప్పుడు తాజాగా వన్డే ఫార్మాట్లో సైతం అవకాశం దక్కించుకున్నాడు. పాండ్యా గైర్హాజరీలో పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా ఆ్రస్టేలియాతో వన్డే సిరీస్‌కు ఎంపికయ్యాడు. పెర్త్ వేదికగా ఆదివారం జరిగిన పోరులో ఆఖర్లో బ్యాటింగ్‌కు వచి్చన ఈ ఆల్‌రౌండర్ 11 బంతులెదుర్కొని 2 సిక్సర్లతో 19 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. వర్షం కారణంగా మ్యాచ్ పూర్తిగా సాగకపోవడంతో అతడికి క్రీజులో ఎక్కువ సమయం గడిపే అవకాశం దక్కలేదు. బౌలింగ్‌లో మాత్రం 2.1 ఓవర్లు వేసిన నితీశ్ 16 పరుగులిచ్చాడు. వికెట్ తీయలేకపోయాడు. టెస్టు అరంగేట్రం చేసిన చోటే... ఆ్రస్టేలియా పర్యటనలో భాగంగా పెర్త్ టెస్టు ద్వారానే తొలి టెస్టు ఆడిన 23 ఏళ్ల నితీశ్ రెడ్డి... మళ్లీ ఇప్పుడు అక్కడే వన్డేల్లోనూ అరంగేట్రం చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో టాపార్డర్ మొత్తం విఫలమైన చోట... ధనాధన్ బ్యాటింగ్‌తో 41 పరుగులు చేసిన నితీశ్... రెండో ఇన్నింగ్స్‌లో అయితే ఏకంగా టి20 మ్యాచ్ ఆడాడు. 27 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో అజేయంగా 38 పరుగులు చేసి భారత జట్టు భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. మిచెల్ స్టార్క్, జోష్ హాజల్‌వుడ్, ప్యాట్ కమిన్స్ వంటి ప్రపంచ స్థాయి బౌలర్లను ఎదుర్కొంటూ అతడు చూపిన తెగువ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. దీంతో టీమ్ మేనేజ్మెంట్ సైతం నితీశ్‌కు విరివిగా అవకాశాలు ఇచి్చంది. వాటిని అతడు సద్వినియోగం చేసుకున్నాడు. ప్రతిష్టాత్మక మెల్బోర్న్ మైదానంలో జరిగిన పోరులో నితీశ్ వీరవిహారం చేశాడు. ఎనిమిదో స్థానంలో క్రీజులోకి వచి్చన అతను ఆసీస్ బౌలింగ్‌ను ఓ ఆటాడుకొని సెంచరీతో అదరగొట్టాడు. దీంతో ఒక్కసారిగా అతడి పేరు మార్మోగిపోయింది. ఆ తర్వాత మరో నాలుగు టెస్టులు మాత్రమే ఆడిన అతడు ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడంతో పాటు... గాయాల బారిన పడి కాస్త వెనుకబడ్డాడు. అయితే క్లిష్టమైన విదేశీ పర్యటనల్లో సత్తాచాటిన నితీశ్‌పై సెలెక్టర్లు నమ్మకముంచారు. గాయం నుంచి కోలుకొని... ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా మాంచెస్టర్‌లో ప్రాక్టీస్ చేస్తూ గాయపడిన నితీశ్ జట్టుకు దూరమయ్యాడు. గాయానికి శస్త్రచికిత్స చేయించుకున్న అనంతరం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. ఇంగ్లండ్ నుంచి తిరిగొచ్చాక అతడు పూర్తిగా మారిపోయాడు. సమయపాలన, క్రమశిక్షణ మొదటి నుంచే ఉన్న నితీశ్ రెడ్డి... వాటిని మరింత కఠినతరం చేశాడు. సరదాలు, షికార్లు పక్కనపెట్టి పూర్తిగా క్రికెట్‌పై దృష్టి పెట్టాడు. అదే సమయంలో తండ్రికి మోకాలి శస్త్రచికిత్స జరిగినా ఇంటికి వెళ్లకుండా పూర్తిగా సాధనకే పరిమితమయ్యాడు. విశాఖపట్నంలో ఉన్నన్ని రోజులు... జిమ్ లేదంటే మైదానంలోనే గడిపేవాడని అతడి తండ్రి ముత్యాల రెడ్డి పేర్కొన్నారు. అలా గంటల తరబడి శిక్షణ సాగిస్తూ మరింత రాటుదేలాడు. మోకాలి శస్త్రచికిత్స అనంతరం అతడి ఫిట్నెస్ మునుపటికంటే రెట్టింపు అయింది. అది ఇటీవల వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌లో ప్రస్ఫుటమైంది. సూపర్ క్యాచ్ వెస్టిండీస్‌తో స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్‌లో నితీశ్ ఫర్వాలేదనిపించాడు. స్పిన్‌కు సహకరించే భారత పిచ్‌లపై పేస్ ఆల్‌రౌండర్‌గా ఎక్కువ ఓవర్లు వేసే అవకాశం దక్కని ఆంధ్ర ప్లేయర్... బ్యాటింగ్‌లో రాణించాడు. వెస్టిండీస్‌తో అహ్మదాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో నితీశ్ పట్టిన క్యాచ్ చూస్తే... అతడి ఫిట్నెస్ స్థాయి ఏంటో అర్థమవుతుంది. స్క్యేర్ లెగ్‌లో విండీస్ బ్యాటర్ ఇచ్చిన క్యాచ్‌ను చిరుతలా దూకుతూ అందుకున్న తీరు చూసి తీరాల్సిందే. ప్రస్తుతం జట్టులో ఉన్న ఫిటెస్ట్ ప్లేయర్లలో అతడు ఒకడు అనడంలో సందేహం లేదు. యో–యో టెస్టు, బ్రంకో టెస్టుల్లో టీమిండియాలో అందరికంటే మెరుగైన స్కోరు నితీశ్ రెడ్డిదే అని సమాచారం. విండీస్‌తో టెస్టు సిరీస్‌లో ఎక్కువ బౌలింగ్ చేసే అవకాశం రాకున్నా... హెడ్ కోచ్ గంభీర్ మాత్రం నితీశ్‌పై నమ్మకముందని అతడికి అండగా ఉంటామని స్పష్టంచేశాడు. ‘నితీశ్ ఎన్ని ఓవర్లు వేశాడనేది ముఖ్యం కాదు. జట్టుతో ఉండటమే ప్రధానం. అది ఎంతో నేర్చుకునే అవకాశం కల్పిస్తుంది. 23 ఏళ్ల కుర్రాడిని కేవలం విదేశీ పిచ్‌లపైనే పరీక్షించాలనే ఆలోచన మాకు లేదు. అవకాశం ఉన్నప్పుడల్లా స్వదేశంలో సైతం అతడికి చాన్స్‌లు ఇస్తాం. ప్రస్తుతం పేస్ ఆల్‌రౌండర్లు చాలా తక్కువ మంది అందుబాటులో ఉన్నారు. అందుకే నితీశ్‌కు అండగా ఉంటాం’ అని గంభీర్ అన్నాడు. వన్డే, టి20 ఫార్మాట్లలో హార్దిక్ పాండ్యా వంటి నిఖార్సైన పేస్ ఆల్‌రౌండర్ అందుబాటులో ఉండగా... టెస్టుల్లో ఆ స్థానాన్ని భర్తీ చేయడంతో పాటు... పరిమిత ఓవర్లలోనూ తనదైన ముద్ర వేయాలని నితీశ్ భావిస్తున్నాడు. -
దస్ కా దమ్
న్యూఢిల్లీ: ఆసియా రోయింగ్ చాంపియన్‌షిప్‌లో భారత రోయర్లు సత్తాచాటారు. వియత్నాం వేదికగా జరిగిన టోర్నమెంట్లో ఒలింపియన్ బాల్‌రాజ్ పన్వర్ నేతృత్వంలోని భారత బృందం 10 పతకాల (3 స్వర్ణాలు, 5 రజతాలు, 2 కాంస్యాలు)తో మెరిసింది. పురుషుల సింగిల్స్ స్కల్ (ఎమ్1ఎక్స్) విభాగంలో బాల్‌రాజ్ పసిడి పతకం కైవసం చేసుకున్నాడు. లైట్ వెయిట్ డబుల్ స్కల్ (ఎల్ఎమ్2ఎక్స్) ఈవెంట్లో లక్ష్య, అజయ్ త్యాగి స్వర్ణ పతకం గెలుచుకోగా... పురుషుల క్వాడ్రపుల్ స్కల్ (ఎమ్4ఎక్స్) ఈవెంట్లో కుల్విందర్ సింగ్, నవ్‌దీప్ సింగ్, సత్నామ్ సింగ్, జకర్ ఖాన్‌తో కూడిన భారత బృందం బంగారు పతకం నెగ్గింది. ఇక మహిళల లైట్ వెయిట్ డబుల్స్ (ఎల్‌డబ్ల్యూ2) విభాగంలో గుర్బానీకౌర్–దిల్జ్యోత్ కౌర్ జంట రజత పతకం గెలుచుకుంది. తద్వారా ఆసియా చాంపియన్‌షిప్‌లో 15 ఏళ్ల భారత పతక నిరీక్షణకు ఈ జోడీ తెరదించింది. పురుషుల టీమ్ (ఎమ్8) విభాగంలో నితిన్ డియోల్, పర్విందర్ సింగ్, లఖ్వీర్ సింగ్, రవి, గుర్ప్రతాప్ సింగ్, భీమ్ సింగ్, జస్విందర్ సింగ్, కుల్బీర్, కిరణ్ సింగ్‌తో కూడిన భారత బృందం రజత పతకం ఖాతాలో వేసుకుంది. పురుషుల డబుల్ స్కల్ (ఎమ్2ఎక్స్)లో జస్పిందర్ సింగ్–సల్మాన్ ఖాన్ జంట రజతం గెలుచుకోగా... పురుషుల లైట్ వెయిట్ క్వాడ్రపుల్ స్కల్ (ఎల్ఎమ్4ఎక్స్)లో రోహిత్, ఉజ్వల్ కుమార్ సింగ్, లక్ష్య, అజయ్ త్యాగీతో కూడిన భారత బృందం రజతం చేజిక్కించుకుంది. లైట్‌వెయిట్ పురుషుల ఫోర్ (ఎల్ఎమ్4) ఈవెంట్లో సానీ కుమార్, ఇక్బాల్ సింగ్, బాబులాల్ యాదవ్, యోగేశ్ కుమార్‌తో కూడిన భారత జట్టు వెండి వెలుగులు విరజిమ్మింది. పురుషుల లైట్ వెయిట్ (ఎల్ఎమ్2)లో నితిన్ డియోల, పర్విందర్ సింగ్ కాంస్యం కైవసం చేసుకోగా... మహిళల టీమ్ (డబ్ల్యూ8) విభాగంలో గుర్బానీ కౌర్, దిల్జ్యోత్ కౌర్, సుమన్ దేవి, అలెనా ఆంటో, కిరణ్, పూనమ్, హౌబిజామ్ దేవితో కూడిన భారత జట్టు కాంస్యం నెగ్గింది. ఈ టోర్నమెంట్లో భారత్ నుంచి మొత్తం 37 మంది పోటీపడ్డారు. ఇందులో 25 మంది పురుష రోయర్లు కాగా, 12 మంది మహిళలున్నారు. -
ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో తన్వీ శర్మకు రజతం
భారత యువ షట్లర్ తన్వీ శర్మ ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో రజత పతకం కైవసం చేసుకుంది. గువాహటిలో జరిగిన టోర్నీ మహిళల సింగిల్స్ ఫైనల్లో తన్వీ పరాజయం పాలైంది. ఆదివారం జరిగిన తుదిపోరులో టాప్ సీడ్ తన్వీ శర్మ 7–15, 12–15తో రెండో సీడ్ అన్యాపత్ ఫిచిత్‌ఫోన్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడింది. ఈ మెగా ఈవెంట్ చరిత్రలో మహిళల సింగిల్స్‌లో భారత్ నుంచి అపర్ణ పోపట్ (1996లో రజతం), సైనా నెహ్వాల్ (2006లో రజతం, 2008లో స్వర్ణం) మాత్రమే పతకాలు గెలిచారు. మళ్లీ ఇప్పుడు 17 ఏళ్ల తర్వాత తన్వీ శర్మ ఆ జాబితాలో చోటు దక్కించుకుంది. మ్యాచ్ ఆరంభం నుంచే తన్వీ లయ కోల్పోయింది. ‘చాలా తప్పులు చేశా. మ్యాచ్ ప్రారంభం నుంచే తడబడ్డా. తొలి గేమ్ తర్వాత తేరుకొని... రెండో గేమ్‌లో గట్టి పోటీ ఇచ్చేందుకు ప్రయత్నించా. 8–5తో ఆధిక్యంలో ఉన్న సమయంలో చేసిన తప్పిదంతో థాయ్ షట్లర్‌కు పట్టుబిగించే అవకాశం దక్కింది. ప్రత్యర్థి నా ఆటతీరును సులువుగా పట్టేసింది’ అని తన్వీ పేర్కొంది. -
రైతును రాజును చేద్దాం: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: రైతుకు అన్యాయం చేస్తే సొంత కుటుంబానికి అన్యాయం చేసినట్టేనని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే లైసెన్స్డ్ సర్వేయర్లు నిజాయితీ, చిత్తశుద్ధితో పనిచేసి భూమి సమస్యలను పరిష్కరించాలని, రైతాంగానికి అండగా నిలబడాలని సూచించారు. రాష్ట్రంలో కొత్తగా నియమితులైన లైసెన్స్డ్ సర్వేయర్లకు ఆదివారం శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో ఆయన లైసెన్స్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. ‘రాజ్యాల మధ్య యుద్ధాలు జరిగినా, జల్ జంగిల్ జమీన్ నినాదంతో కొమురం భీమ్ పోరాడినా, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో భాగంగా నల్లగొండ, వరంగల్ జిల్లాల్లో ఎర్ర జెండా ఎగిరినా భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసమే జరిగాయి. కన్నతల్లిపై ఎంత మమకారం ఉంటుందో, తెలంగాణలో భూమిపై కూడా అదే అనుబంధాన్ని చూపిస్తారు. భూమిపై ఆధిపత్యం చెలాయించాలని చూసినప్పుడు దళితులు, గిరిజనులు, ఆదివాసీలైనా, నిరుపేద నిరక్షరాస్యులైనా నిటారుగా నిలబడి కొట్లాడిన చరిత్ర తెలంగాణ గడ్డకు ఉంది. విసునూరు దొరలు చెరబట్టాలనుకున్న ఎకరం భూమి కోసం వీరనారిగా మారిన చాకలి ఐలమ్మ తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తినిచ్చారు. భూ యజమానుల హక్కులు, ఆ భూముల సరిహద్దులను నిర్ణయించే అధికారం సర్వేయర్ల చేతుల్లో ప్రభుత్వం పెట్టబోతోంది. ఈ క్రమంలో తప్పులకు తావిస్తే ప్రజలు సర్వేయర్లతోపాటు ప్రభుత్వంపై కూడా తిరగబడే అవకాశం ఉంది’అని తెలిపారు. బంగాళాఖాతంలో విసిరేశారు గత ప్రభుత్వ హయాంలో ధరణి అనే చట్టం కొద్ది మంది దొరలకు చుట్టంగా మారిందని సీఎం రేవంత్ ఆరోపించారు. ‘ఈ ధరణి దరిద్రంతోనే ఒక ఎమ్మార్వోను పెట్రోల్ పోసి తగలబెట్టే పరిస్థితులు వచ్చాయి. ఇబ్రహీంపట్నం ప్రాంతంలో జంట హత్యలకు కారణమైంది కూడా ఈ చట్టమే. ధరణి చట్టాన్ని అడ్డుపెట్టుకుని భూమి మీద ఆధిపత్యం చెలాయించాలనుకున్న దొరలకు ప్రజలు గత ఎన్నికల్లో గుణపాఠం చెప్పి బంగాళాఖాతంలో విసిరేశారు. ఆ భూ దోపిడీ నుంచి విముక్తి కోసమే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. మేం అధికారంలోకి వచ్చాక భూ సమస్యల పరిష్కారానికి భూభారతి చట్టం తీసుకొచ్చాం. ఇప్పుడు 1.60 కోట్ల ఎకరాల వ్యవసాయ యోగ్య భూమి తెలంగాణ రైతాంగం దగ్గర ఉంది. భూ సమస్యలను పరిష్కరించేందుకు, రైతుకు అండగా ఉండేందుకే లైసెన్స్డ్ సర్వేయర్ల వ్యవస్థను తీసుకొచ్చాం’అని సీఎం తెలిపారు. త్వరలోనే గ్రూప్–3, 4 ఉద్యోగాలు భర్తీ చేస్తామని, 11 వేల మందికి నియామక పత్రాలు అందించబోతున్నామని వెల్లడించారు. మా సైన్యం మీరే.. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందిన, ఆదర్శ రాష్ట్రంగా దేశంలో మొదటి స్థానంలో నిలబట్టేందుకు తమ ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ –2047 విజన్ డాక్యుమెంట్‌ను తీసుకొస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి ఎలా ఉండాలో అందరూ సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. తమ ప్రభుత్వం ఏ చట్టం చేసినా ప్రజలను భాగస్వాములను చేస్తుందని, సమస్యలను తెలిసిన వారిని పరిష్కారం అడగడం ద్వారా నిజమైన అభివృద్ధికి బాటలు వేస్తుందని చెప్పారు. ‘తెలంగాణ రాష్ట్రాన్ని 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్లు, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. ఆ లక్ష్యం నెరవేరడంలో మీ సహకారం కావాలి. రైతుల సమస్యలు పరిష్కారం కావాలి. వ్యవసాయం దండుగ కాదు పండుగ చేయాలి. రైతు రాజు కావాలంటే మీరు కష్టపడి పనిచేయాలి. మీ శ్రమకు ఫీజు తీసుకోండి. కానీ రైతులకు అన్యాయం చేయొద్దు. క్షలాది మంది రైతుల సమస్యలను పరిష్కరించే బాధ్యతలను తీసుకుని మీరు వెళుతున్నారు. మాకెవరూ ప్రతినిధులు లేరు. మాకు సైన్యం లేదు. మీరే మా ప్రతినిధులు, మా సైనికులు మీరే. ప్రభుత్వ ఆలోచనలు, బాధ్యతలను మీ భుజస్కందాలపై పెట్టి పంపుతున్నాం. తెలంగాణ పునర్నిర్మాణం చేసేది మీరే’అని సర్వేయర్లకు సీఎం రేవంత్ తెలిపారు. కార్యక్రమంలో కొత్త లైసెన్స్డ్ సర్వేయర్లతో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రతిజ్ఞ చేయించారు. ధరణిని బంగాళాఖాతంలో వేసి, ప్రజలు మెచ్చే భూభారతి చట్టం తీసుకొచ్చామని తెలిపారు. తెలంగాణ రైతాంగానికి లైసెన్స్డ్ సర్వేయర్ల రూపంలో ప్రభుత్వం దీపావళి కానుక అందించిందని చెప్పారు. 3,456 మందికి సర్వే లైసెన్స్‌లు మంజూరు చేశామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, మందుల సామేల్, టి. రామ్మోహన్‌రెడ్డి, కె.ఆర్. నాగరాజు, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ, టీజీఐఐసీ చైర్మన్ టి.నిర్మలా జగ్గారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సాక్షి కార్టూన్ 20-10-2025
సాక్షి కార్టూన్ 20-10-2025 -
చీకటి వెలుగుల రంగేళి
భాషలో అదో విచిత్రం. వ్యతిరేక పదాలు పక్కపక్కనే ఉంటాయి, జంటగా సాగుతూ ఉంటాయి; మంచి–చెడు, పాపం–పుణ్యం, కీర్తి–అపకీర్తి; అలాగే, వెలుగు–చీకటి! అసలు జగత్తులో ఉన్నదంతా చీకటే, వెలుగు రాగానే అది మాయమవుతుంది. వెలుగు నిచ్చేది దీపం. ప్రకృతి వెలిగించిన అతిపెద్ద దీపం సూర్యుడు. ఆయన సంచారానికి వెడుతూ వెడుతూ తన కాంతిని నింపి ఆకాశపు నట్టింట ఉంచే చిన్నా, పెద్దా ప్రమిదలే నక్షత్రాలూ, చంద్రుడూ. తెలతెల్లని సూర్యుడు ఉదయించగానే, నల్లని పెనుచీకటులన్నీ కాకుల్లా ఎగిరిపోయాయంటాడు ఓ కవి. మనిషి జీవితంతో పడుగూ పేకలా అల్లుకుపోయిన ఉపమానం ‘చీకటి వెలుగు’లను మించి మరొకటి లేదు. అందుకే, ‘చీకటి వెలుగుల రంగేళి, జీవితమే ఒక దీపావళి’ అంటాడొక సినీకవి. ‘దీపాలు బాగుంటాయి, పాపల్లాంటి దీపాలు, కనుపాపల్లాంటి దీపాలు, దీపం ఆసరాతో చీకటి నైజాన్ని తెలుసుకో, పాపం ఆసరాతో మానవుడి నైజాన్ని తెలుసుకో’ అంటాడు – కవి తిలక్. దీపోపమానం మహాకవి కాళిదాసుకు ఏకంగా దీపశిఖ అనే బిరుదునే తెచ్చిపెట్టింది. విదర్భ రాకుమారి ఇందుమతీదేవి స్వయంవర సభలో వరమాల పుచ్చుకుని ఒక్కొక్క రాజునే దాటివెడుతున్నప్పుడు అచ్చం దీపశిఖలా ఉందని తన రఘు వంశ కావ్యంలో వర్ణిస్తాడాయన. ఆమె తనను సమీపించగానే ఆశతో వెలిగిపోయిన రాజుల ముఖాలు, తమను దాటిపోగానే నిరాశతో నల్లబడిపోయాయంటాడు. రఘు మహారాజు కొడుకు అజుడు – ఒక దీపం వెలిగించిన మరో దీపంలా – రూపంలో, శౌర్యంలో, ఔన్నత్యంలో ముమ్మూర్తులా తండ్రి పోలికేనంటాడు. అంటుకున్న అడవి దీపాలతో రాత్రిళ్ళు చీకటిని జయించే తొలిపాఠాలు మనిషికి నేర్పింది కూడా ప్రకృతే. అప్పటినుంచి సంస్కృతీ, నాగరికతల మీదుగా మనిషి వెలుగుల ప్రస్థానం బహుముఖ దీపతోరణాలతో ముందుకు సాగుతూ జీవితాన్ని నిత్య దీపావళిగా మలుస్తూనే ఉంది. ‘ఆరని ఎర్రని దీపంగా, నిరంతర జీవన తాపంగా, తనను తాను కాల్చుకుని భస్మ మయే మోహన శాపం’గా కూడా తిలక్ అభివర్ణించిన దీపం, దేశ కాల మత భేదాలకు అతీతంగా సర్వత్రా మనిషికి దారిదీపమవుతూనే ఉంది. దీపాల వరుసలతో ఇళ్ళు, గుళ్ళు, రహదారులతో సహా సమస్త పరిసరాలనూ సముజ్వలం చేయడం పితృదేవతా హ్వానంలో భాగంగానే మొదలైందంటారు. మెక్సికోతో మొదలుపెట్టి, కంబోడియా, బర్మా, చైనా, జపాన్, ఈజిప్టు, రోమ్ సహా దాదాపు ప్రపంచ వ్యాప్తంగా ఏదో ఒక రూపంలో దివ్వెల పండుగ జరుపుకోవడం పరిపాటిగా వస్తోంది. మన దగ్గర దీపావళి పండుగ మూలాలు అతిప్రాచీన కాలంలోనే ఉన్నాయనీ, ‘ఉల్కాదానం’ పేరిట అది మన పురాణాలకు ఎక్కిందనీ, దీపాలు వెలిగించడంతోపాటు, సూరేకారం వంటివి ఉపయో గించి పేలుళ్లను సృష్టించడం కూడా అప్పటినుంచీ ఉందని అంటున్నవారూ ఉన్నారు.నింగీనేలా దద్దరిల్లే పెను శబ్దాలతో, ఆకసాన చిత్రవిచిత్ర కాంతులతో రంగుల రంగ వల్లులు తీర్చే బాణాసంచా వాడకం మాత్రం మనకు పదిహేనవ శతాబ్దిలోనే పరిచయ మైందనీ, బహుశా అది చైనా నుంచి వ్యాపించిందనీ, తుపాకీ మందు కనిపెట్టడం దానికి ప్రారంభమనీ అంటున్నారు. ఆ విధంగా తుపాకీ మందుతో జమిలిగా అల్లుకున్న బాణా సంచా రాజులకు యుద్ధ, వినోదాలు రెంటితోనూ అలరిస్తూ వచ్చిందనీ, పోర్చుగీసు వర్తకుల ద్వారా తమకు పరిచయమైన బాణాసంచా ధగధగలను, ఫెళఫెళలను విజయ నగర రాజులు నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆస్వాదించేవారనీ చరిత్ర. అయితే, ‘చీకటి వెలుగుల’ మధ్య ఎడం లేకపోవడం భాషావైచిత్రే కాక, ప్రకృతి వైచిత్రి కూడా! పెద్ద ఎత్తున బాణసంచా జోడింపుతో రానురాను దీపావళి వెలుగులు పర్యావరణ, ప్రజారోగ్యపరమైన సమస్యల చీకట్లనూ వెంటబెట్టుకుని వస్తున్నాయి. సమస్య తీవ్రరూపం ధరించడంతో, ఢిల్లీలో బాణసంచా వాడకంపై పూర్తి నిషేధం విధించిన సుప్రీంకోర్టు తాజాగా కొన్ని ఆంక్షలూ, హెచ్చరికలతో ఆ నిషేధాన్ని సడలించింది. కాలుష్యాన్ని తగ్గించే బాణసంచా రకాల వాడకంతోపాటు నిర్దిష్ట సమయాల్లో, నిర్దిష్ట కాల పరిమితుల్లో మాత్రమే బాణసంచా వినియోగించాలని ప్రభుత్వాలూ చెవినిల్లు కట్టుకుని చెబుతున్నాయి. బాణసంచా కాల్పులకు ప్రత్యేక స్థలాలను కేటాయించడం ద్వారా అమెరికా లాంటి కొన్ని దేశాలు ఈ సమస్యను ఉభయతారకంగా పరిష్కరించుకున్నాయి. ఆ ఒరవడిని ఇప్పటికిప్పుడు మనం పూర్తిగా అనుసరించలేమనుకున్నా, ఇతోధిక జాగ్రత్తలు అత్యవసరం. కాటుక, కన్నే పోగొట్టకూడదు; వెలుగుల విస్ఫోటం చీకటి వాకిట మనల్ని నిలబెట్టకూడదు. అతి అనర్థం, మితిలోనే అందం, ఆనందం. -
చైనా డ్యామ్‌తో మహా విపత్తు
ప్రపంచ జల సంతులనాన్ని తలకిందులు చేసే పనికి చైనా ఒడిగడుతోంది. దాని పర్యవసానాలు వాతావరణ మార్పు అంశమంతటి తీవ్ర ప్రభావం చూపబోతు న్నాయి. చైనా 168 బిలియన్ డాలర్లతో హిమాలయ సూపర్–డ్యామ్ నిర్మిస్తోంది. ఇది ప్రపంచంలో అత్యంత ఖర్చుతో కూడిన మౌలిక వసతి ప్రాజెక్టు మాత్రమే కాక, అంతర్జాతీయంగా అత్యంత ముప్పుతో కూడుకున్నది కావడం వల్ల భయాలు వ్యక్తమవుతున్నాయి. బీజింగ్ దీన్ని ఇంజినీరింగ్ అద్భుతంగా వర్ణిస్తోంది కానీ, నిజానికి దాన్ని ముంచుకొస్తున్న జీవావరణ మహా విపత్తుగా పేర్కొనాలి. యాలంగ్ జింగ్పొ నది మలుపు తిరిగి భారతదేశంలోకి ప్రవే శిస్తున్న చోటుకు కొద్ది వెనుకగా ఈ ఆనకట్టను నిర్మిస్తున్నారు. దీన్ని మనం బ్రహ్మపుత్ర నదిగా పిలుచుకుంటాం. చైనా ప్రధాని లీ చాంగ్ గత జూలైలో ఈ ఆనకట్టకు శంకుస్థాపన చేసి ప్రాజెక్టు గురించి అధి కారికంగా ప్రకటించారు. కానీ, ఆనకట్ట నిర్మాణ పనులు కొంతకాలంగా సాగుతున్నాయని ఉపగ్రహ ఛాయాచిత్రాలు వెల్లడిస్తున్నాయి. రహస్య నిర్మాణంచైనా నాయకుడు ఒకరు ఒక ఆనకట్టకు శంకుస్థాపన చేయడం చివరిసారిగా 1994లో జరిగింది. యాంగ్ చి నదిపై నిర్మించిన త్రీ గార్జెస్ డ్యామ్‌కు అప్పటి ప్రధాని లి పెంగ్ శంకుస్థాపన చేశారు. దాని కన్నా కూడా బ్రహ్మపుత్ర మెగా డ్యామ్ పరిమాణంలో చాలా పెద్దది. ఈ ప్రతీకాత్మకత మారుతున్న ప్రపంచంలో పెరుగుతున్న చైనా ఆశ లతోపాటు, పెద్ద గండాన్ని సూచిస్తోంది. త్రీ గార్జెస్ డ్యామ్‌ను మొదట్లో ఆధునిక వింతగా కీర్తించారు. ఇపుడు దాన్ని పర్యావరణ, సామాజికపరమైన వైపరీత్యంగా గుర్తిస్తు న్నారు. దానివల్ల పది లక్షల మందికి పైగా నిర్వాసితులయ్యారు. ఈ డ్యామ్ తరచూ కొండచరియలు విరిగిపడటానికి కారణమవుతోంది. భూగోళ కంపన సుస్థిరత దెబ్బతింది. దాని బ్రహ్మాండ జలాశయం చివరకు భూ భ్రమణాన్ని కూడా కొద్దిగా మందగింప జేసింది. చైనా చేపట్టిన నూతన ప్రాజెక్టు స్థితిగతులు మరింత ప్రమాద కరంగా ఉన్నాయి. ప్రపంచంలో భూకంపాలకు ఎక్కువ అవకా శాలున్న ప్రాంతాల్లోని ఒకదానిలో దాన్ని నిర్మిస్తున్నారు. సైనిక దళాలు పెద్ద యెత్తున మోహరించి ఉండే∙సరిహద్దు ప్రాంతానికి దగ్గరలో అది ఉంది. భారతదేశపు విశాలమైన అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని చైనా ‘దక్షిణ టిబెట్’గా పరిగణిస్తోంది. నిర్మాణంలో బల హీనత వల్లగానీ లేదా జలాశయం పురికొల్పగల భూగర్భ ఫలకాల చలనం వల్లగానీ డ్యామ్ కుప్పకూలితే, భారతదేశపు ఈశాన్య ప్రాంతం, బంగ్లాదేశ్ మహా విధ్వంసాన్ని చవిచూడవలసి రావచ్చు. త్రీ గార్జెస్ డ్యామ్ కన్నా దాదాపు మూడింతల ఎక్కువ విద్యుదుత్పాదనకు వీలుగా రూపకల్పన చేసిన ఈ డ్యామ్‌కు నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ 2021లో ఆమోదం తెలిపింది. అంతర్జాతీయ నదుల పొడవునా పెద్ద పెద్ద ప్రాజెక్టులను రహస్యంగా నిర్మిస్తూ పోవడం చైనాకు రివాజుగా మారింది. జలం ఆధిపత్య సాధనంబ్రహ్మపుత్ర, మిగిలిన నదుల లాంటిది కాదు. హిమాలయ ఉత్తుంగ శిఖరాల నుంచి కిందకు దూకుతూ ప్రపంచంలోని అత్యంత నిటారైన, లోతైన లోయను సృష్టిస్తోంది. అమెరికాలోని గ్రాండ్ కాన్యన్ కన్నా ఇది రెండింతల లోతైనది. సాటిలేని నదీమ శక్తి కేంద్రీకృతమవుతున్న చోట డ్యామ్‌ను చైనా నిర్మిస్తోంది. టిబెట్‌లోని పర్వతాలపైన నీటి బుగ్గల నుంచి పుడుతున్న బ్రహ్మపుత్ర, ప్రపంచంలోని ఎత్తయిన ప్రాంతాల నుంచి ప్రవహించే ప్రధాన నదులలో ఒకటి. భారత్, బంగ్లాదేశ్ గుండా ప్రవహించే ఈ నది వ్యవసాయానికి, మత్స్యసంపదకు ఆలంబనగా ఉంటూ, జన సాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు మనుగడ కల్పిస్తోంది. బ్రహ్మపుత్రకు ఏటా వచ్చే వరదలు విధ్వంసకరమైనవే అయి నప్పటికీ, అవి విష పదార్థాలను తోసుకుపోతాయి. భూగర్భ జలాల మట్టాన్ని పెంచుతాయి. సేద్యానికి ఎంతో ముఖ్యమైన పోషక విలువ లున్న అవక్షేపాలను పొలాలకు చేకూర్చుతాయి. కానీ సూపర్– డ్యామ్ ఈ గతిని తలకిందులు చేస్తుంది. ఒండ్రుమట్టికి అడ్డుకట్ట వేస్తుంది. పెరుగుతున్న సముద్ర మట్టాలతో ఇప్పటికే సంకటంలోనున్న బంగ్లాదేశ్ డెల్టా కుంచించుకుపోతుంది. భారతీయ రైతులను సహజ ఫలదీకరణ ఆవృత్తాలకు దూరం చేస్తుంది. ఉప్పు నీరు చేరిపోవడం, వరదలు మరింత పరిపాటిగా మారతాయి. వచ్చిన చిక్కేమిటంటే, నీటిని వనరుగాకాక, ఒక శక్తి సము పార్జన సాధనంగా చైనా చూస్తోంది. నది టిబెట్‌ను విడిచిపెట్టే చోట మెగా–డ్యామ్ నిర్మించడం ద్వారా, దిగువ ప్రవాహ ప్రాంతాలలో నివసించే కోట్లమందికి ఇష్టముంటే నీరు ఇవ్వగలగాలని, లేకపోతే నీటిబొట్టు కూడా అందకుండా చేయగలగాలని చూస్తోంది. ఒకప్పుడు చమురుపై ఆధిపత్యం ప్రపంచ శక్తిని నిర్ణయించేది. ఈ 21వ శతాబ్దంలో, సరిహద్దులను దాటి ప్రవహించే నదులపై నియంత్రణ అంతే నిర్ణాయక శక్తిగా పరిణమించవచ్చు. ఈ డ్యామ్ ద్వారా చైనా, ఒక్క తూటా కూడా పేల్చనవసరం లేకుండా, నీటిని ఆయుధంగా మలచుకోగలుగుతుంది. ‘చమురు ఉత్పాదన, ఎగు మతి దేశాల కూటమి’ (ఒపెక్) చమురుపై ఒకప్పుడు ఎలాంటి వ్యూహాత్మక పట్టును అనుభవించిందో, నీటిపై అదే రకమైన శక్తిని చైనాకు ఈ డ్యామ్ కట్టబెట్టవచ్చు. ప్రమాదంలో జల భద్రతనిజానికి, ప్రపంచంలోని మిగిలిన దేశాలన్నీ కలిపి నిర్మించిన డ్యామ్లకన్నా కూడా ఎక్కువ సంఖ్యలో పెద్ద డ్యామ్‌లను చైనా నిర్మించింది. అదే ఊపులో, అది 1990ల నుంచి అంతర్జాతీయ నదు లపై దృష్టి పెట్టింది. మికాంగ్ నదిపై అది కట్టిన 11 పెద్ద డ్యామ్‌లు దిగువ ప్రవాహ ప్రాంతాలను ఇప్పటికే అతలాకుతలం చేస్తున్నాయి. దుర్భిక్షాలు తీవ్రమవుతున్నాయి. థాయిలాండ్, లావోస్, కంబో డియా, వియత్నావ్ులలో జీవనోపాధులకు ఎసరు పెడుతున్నాయి. ఏ రూపంలో నీటి పంపకానికైనా ససేమిరా అనడాన్ని బీజింగ్ కొనసాగిస్తోంది. పొరుగునున్న దేశాలతో నీటి పంపక ఒప్పందాలు వేటిపైనా అది సంతకం చేయలేదు. ఐక్యరాజ్య సమితి 1997లో చేసిన జలవనరుల ఒడంబడికలోనూ అది చేరలేదు. తన సరి హద్దుల లోపలనున్న జలాలన్నింటిపైన ‘నిర్ద్వంద్వ సార్వభౌమాధి కారం’ చాటుకునేందుకు ప్రాధాన్యం ఇస్తోంది. ఆసియాను మించి ప్రయోజనాలు ఇక్కడ పణంగా ఉన్నాయి. అంతర్జాతీయ సగటుకన్నా వేగంగా టిబెట్ వేడెక్కుతోంది. పీఠ భూమి హైడ్రాలజీని తారుమారు చేయడం ప్రాంతీయ జూదం మాత్రమే కాక, మొత్తం భూగోళానికి ముప్పు తేవడమే అవుతుంది. టిబెట్ నుంచి నదీ ప్రవాహాల గతులు మారుతున్న ప్రభావ ప్రకంప నాలు, ఆసియాను దాటి, బాహ్య వాతావరణ వ్యవస్థలు, ఆహార భద్రత, వలసల తీరుతెన్నులపైన కూడా కనిపిస్తాయి. దేశ సరిహద్దులను దాటి వెళ్ళే నదులపై ఏకఛత్రాధిపత్యం వహించడంలో బీజింగ్ సఫలమైతే, ఇతర దేశాలు కూడా అదే బాట పట్టవచ్చు. అది ఇతరత్రా బలహీనంగా ఉన్న సహకార నియమ నిబంధనలను నీరుగార్చవచ్చు. నైలు నదీ పరీవాహక ప్రాంతం నుంచి టైగ్రిస్–యూఫ్రటీస్ వరకు అదే పరిస్థితి నెలకొంటుంది. ఆ విధంగా, మెగా–డ్యామ్ ఒక్క ఆసియా సమస్య మాత్రమే కాదు, మొత్తం ప్రపంచానిది. అందుకే అంతర్జాతీయ జల నిబంధనలను గౌరవించేట్లుగా అంతర్జాతీయ సమాజం చైనాపై ఒత్తిడి తేవాలి. బ్రహ్మచేలానీవ్యాసకర్త న్యూఢిల్లీలోని ‘సెంటర్ ఫర్ పాలసీ రిసెర్చ్’లో వ్యూహాత్మక అధ్యయనాల ప్రొఫెసర్(‘ద గ్లోబ్ అండ్ మెయిల్’ సౌజన్యంతో) -
ఈ రాశి వారికి ఆస్తిలాభం.. వాహనసౌఖ్యం
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వయుజ మాసం, తిథి: బ.చతుర్దశి ప.2.38 వరకు, తదుపరి అమావాస్య, నక్షత్రం: హస్త రా.8.12 వరకు, తదుపరి చిత్త, వర్జ్యం: తె.4.55 నుండి 6.39 వరకు (తెల్లవారితే మంగళవారం), దుర్ముహూర్తం: ప.12.09 నుండి 12.55 వరకు, తదుపరి ప.2.28 నుండి 3.14 వరకు, అమృత ఘడియలు: ప.1.51 నుండి 3.32 వరకు, దీపావళి అమావాస్య, ధనలక్ష్మీ పూజలు.సూర్యోదయం : 5.57సూర్యాస్తమయం : 5.34రాహుకాలం : ఉ.7.30 నుండి 9.00 వరకుయమగండం : ఉ.10.30 నుండి 12.00 వరకు మేషం.... కొత్త ఆశలు చిగురిస్తాయి. ప్రతిభావంతులుగా గుర్తింపు పొందుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహంగా ఉంటుంది. ఆస్తిలాభం. వాహనసౌఖ్యం. వృషభం... ఆదాయానికి మించి ఖర్చులు. పనిభారం తప్పదు. కార్యక్రమాలలో ఆటంకాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు. ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి.మిథునం.... రాబడి అంతగా కనిపించదు. ఆస్తి వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కార్యక్రమాలలో అవరోధాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ∙ఇబ్బందికరంగా ఉంటుంది.కర్కాటకం.... ఉద్యోగయోగం. చర్చలు సఫలం. విందువినోదాలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. మీ అంచనాలు నిజం కాగలవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం తొలగుతుంది.సింహం... కుటుంబంలో చికాకులు. కార్యక్రమాలలో ఆటంకాలు. నిర్ణయాలు మార్చుకుంటారు. బాధ్యతలు మరింతగా పెరుగుతాయి. కష్టానికి తగ్గ ఫలితం కనిపించదు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.కన్య.... కుటుంబంలో ఆనందంగా గడుపుతారు. అదనపు రాబడి ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. కార్యజయం. కాంట్రాక్టులు పొందుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆశాజనకంగా ఉంటుంది.తుల.... ప్రయాణాలు వాయిదా వేస్తారు. కష్టానికి తగ్గ ఫలితం ఉండదు. కార్యక్రమాలలో ఆటంకాలు. దుబారా ఖర్చులు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు .వృశ్చికం... కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆత్మీయుల ఆదరణ పొందుతారు. ప్రత్యర్థులు అనుకూలంగా మారతారు. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.ధనుస్సు.... పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది. ఆలయాలు సందర్శిస్తారు.మకరం... చేపట్టిన కార్యక్రమాలలో అవరోధాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు. కళాకారులకు అంచనాలు తప్పుతాయి. కుంభం... ఆదాయానికి మించి ఖర్చులు. అదనపు బాధ్యతలు. దూరప్రయాణాలు. కుటుంబ, ఆరోగ్యసమస్యలు. కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.మీనం... కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆస్తి వివాదాల పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి. -
గోరంత దీపం జగమంత వెలుగు
శ్రీమహావిష్ణువు వామనావతారంలో బలి చక్రవర్తిని పాతాళ లోకానికి అణగ దొక్కి సుతల రాజ్యాధిపతిని చేసినందుకుగాను ఈ అమావాస్యను దీపావళిగా జరుపుకుంటారనీ, శ్రీరామచంద్రుడు రావణాసురుడిని వధించి శ్రీ సీతాలక్ష్మణ ఆంజనేయాదులతో అయోధ్యకేతెంచి, పట్టాభిషిక్తుడైనదీవేళే కనుక ఈ రోజును దీపావళిగా జరుపుకుంటారని, శ్రీ కృష్ణుడు సత్యభామా సమేతుడై నరకుని వధించిన సందర్భంగా ప్రజలు దీపావళి జరుపుకుంటున్నారని, కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగాలకు సంబంధించిన కథలు ప్రచారంలో ఉన్నాయి. ఇంకా, పంచపాండవులు వనవాస, అజ్ఞాతవాసాలు పూర్తి చేసుకుని విజయవంతులై తిరిగి వచ్చినందుకు ఆనందంతో ప్రజలు దీపావళి జరుపుతున్నారని కూడా ప్రచారంలో ఉంది. ఆదిపరాశక్తి శుంభ నిశుంభులనే రాక్షసులను సంహరించినందుకు ఆనందంతో వెలిగించిన జ్యోతులే దీపావళి అని కూడా ప్రచారంలో ఉంది. ఇవేకాక, క్షీరసాగర సమద్భూత అయిన శ్రీ మహాలక్ష్మి శ్రీమన్నారాయణుడిని వరించినందుకు దేవతలు, మానవులు, అందరూ ఆనందోత్సాహాలతో దీపావళిని జరుపుకుంటున్నారు అని కూడా చెప్తారు. భారతీయులందరూ అత్యంత ఆనందోత్సాహాలతో జరుపుకునే ముఖ్యమైన పండుగలలో ఒకటి దీపావళి. మన మహర్షులు ఏర్పరచిన పండుగలన్నీ ఆధ్యాత్మిక, సాంస్కృతిక విలువలు కలిగి, ఆచార వ్యవహారాలతో కలిసి ఉంటాయి. ఈ పండుగల వెనుక అపారమైన శాస్త్రీయత, సమాజానికి హితకరమైన అంశాలు అనేకం దాగి ఉంటాయి. కాలంలో వచ్చే మార్పులతోపాటు, ఖగోళంలో వచ్చే మార్పులను కూడా ఆధారంగా చేసుకుని మన మహర్షులు మనకు ప్రతి నెలలోనూ పండుగలను నిర్దేశించారు. అలా మన సంస్కృతికి, సంప్రదాయాలకు, నాగరికతకు, మానవతా విలువలకు ప్రతీకగా మారింది దీపావళి పండుగ. నేటి కాలంలో ప్రపంచ దేశాలలో ఎందరో దీపావళి పండుగను జరుపుకుంటున్నారు. అమెరికాలో వైట్‌హౌస్‌లో కూడా దీపావళి నాడు దీపాలు వెలిగిస్తున్నారు. ధనత్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి, బలి పాడ్యమి, భగినీ హస్త భోజనం అని, తరువాత నాగుల చవితి, నాగ పంచమి అని – ఇన్ని రోజులు పండుగ చేసుకుంటాము.దీపావళి పండుగనాడు సూర్యోదయానికి ముందే అభ్యంగన స్నానమాచరించి, పితృ తర్పణాలివ్వటం, దానం చెయ్యటం, వత్తులు వేసి, నూనె దీపాలను వెలిగించటం, ఆకాశదీపం పెట్టటం చేస్తాం. ఆకాశదీపం పెట్టడం వల్ల దూర్రపాంతాల వారికి కూడా ఈ దీప దర్శనమవుతుంది. దాని వెలుగు మార్గ దర్శనం చేస్తుంది.మనం ప్రతిరోజు ఉభయ సంధ్యలలోను మన ఇంట్లో దీపం వెలిగిస్తాము. దీపాన్ని, దీపజ్యోతిని ఆరాధిస్తాం. ఏ శుభకార్యాలు చేసినా, ఏ వేడుకలు జరిగేటప్పుడు అయినా ముందుగా దీప ప్రజ్జ్వలన చేసి, అప్పుడు ఆ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాము. వివాహాలు కూడా అగ్నిసాక్షిగా చేసుకుంటాం, అంటే దీపం, దీపంలో ఉన్న దేవతలు మన ప్రతి కర్మకు సాక్షిభూతులుగా ఉంటారన్నమాట. వారు మనల్ని అనుగ్రహిస్తారు. కనుక దీపం వెలిగించటం అన్నది అత్యంత ప్రధానమైనదని అందరికీ తెలియజేయటానికి, అందరూ దీపాలు వెలిగించేలా చేయడానికి దీపావళి పండగను మన మహర్షులు ఏర్పాటు చేశారు. దీపం సాక్షాత్తూ పరబ్రహ్మ స్వరూపం ఆశ్వయుజ బహుళ అమావాస్యకు ముందు మూడు రోజుల నుంచి ఇంటి ముందు దీపాలు పెట్టటం ప్రారంభిస్తాం. అలా వెలిగించడం ప్రారంభించిన ఈ దీపాలను కార్తీక మాసమంతా వెలిగిస్తాందీపాల కథపూర్వం హిరణ్యాక్షుడనే రాక్షసుడు దేవతలను, ధర్మాత్ములైన మానవులను హింసిస్తూ, యావద్భూమండలాన్ని క్షోభిల్లజేస్తుంటే, శ్రీమన్నారాయణడు వరాçహావతారంలో వచ్చి హిరణ్యాక్షుడిని సంహరించాడు, భూమాతను రక్షించాడు. ఆ సమయంలో భూదేవి తనకొక కుమారుడిని ప్రసాదించమని స్వామిని ప్రార్థిస్తుంది. వారి సంతానమే నరకాసురుడు. స్వామి రాక్షస సంహారం కోసం అవతరించిన తరుణంలో భూమాతకి కలిగిన పుత్రుడు కనుక, నరకుడు తమోగుణ భరితుడై రాక్షసుడయ్యాడు. అతడు బ్రహ్మదేవుని గురించి ఘోరమైన తపస్సు చేసి, మరణం లేకుండా వరం కోరాడు. బ్రహ్మదేవుడు అది సాధ్యం కాదని అంటే, ‘కన్నతల్లి బిడ్డలను పొరపాటున కూడా చంపదు కదా’ అని ఆలోచించి, ‘నాకు మా అమ్మ చేతిలో తప్ప మరణం లేకుండా వరం ఇవ్వండి‘ అని కోరాడు. బ్రహ్మదేవుడు తథాస్తు అన్నాడు. ఇంక తనకు చావే లేదనే భ్రమతో నరకుడు లోకకంటకుడై వేద సంస్కృతిని వ్యతిరేకిస్తూ, యజ్ఞయాగాదులు జరగకుండా అడ్డుకుంటూ, బ్రాహ్మణులను బాధిస్తూ రావణాసురుని వలె పరస్త్రీ వ్యామోహంతో 16 వేల మంది స్త్రీలను బంధించాడు. దుష్ట శిక్షణ కోసం పరమాత్మ శ్రీ కృష్ణునిగా అవతరించాడు. భూదేవి సత్యభామగా అవతరించింది. తన తల్లి అయిన సత్యభామ వదిలిన బాణాహతితో నరకుడు మృతి చెందాడు. శ్రీకృష్ణ పరమాత్మ నరకుని స్మృతిగా ఆ అమావాస్య నాడు దీపాలను వెలిగించి పండుగ చేసుకోవాలని నిర్దేశించాడు. నరకుని చెరలో ఉన్న 16,000 మంది స్త్రీలను విడిపించటమే కాక, నరకుని హస్తగతమైన ధనలక్ష్మిని విడిపించి, తన పాంచజన్య శంఖంతో, కామధేను క్షీరంతో, చతుస్సాగర జలాలతో ధనలక్ష్మికి ఈ రోజునే సామ్రాజ్య పట్టాభిషేకం చేశాడు. కనుకనే దీపావళి రోజున ప్రదోషకాలంలో లక్ష్మీపూజ చేయాలి అని శాస్త్రం చెప్తోంది. నరకుడు చనిపోయిన రోజును నరక చతుర్దశిగాను, ఆ మరునాడు అమావాస్యను దీపావళి గాను పండుగ చేసుకుంటున్నాము. నరకాసురుడి పీడ వదలగానే ప్రజలందరూ మంగళ వాద్యాలు మోగించి సత్యభామా శ్రీ కృష్ణులకు స్వాగతం చె΄్పారు. ఆ మంగళ ధ్వనులే నేటికీ బాణసంచా రూపంలో ప్రతిధ్వనిస్తున్నాయి.కొన్ని ప్రాంతాలలో బాణసంచా కాల్చి ఇంట్లోకి వచ్చాక, ఆడవాళ్ళందరూ కలిసి చేటలు, పళ్ళాలు వాయిస్తారు. అది దరిద్ర దేవతను తరిమి వేయటమన్నమాట. దీనిని ‘అలక్ష్మీ నిస్సరణము’ అంటారు. ఎలా జరుపు కోవాలంటే..?దీపావళి నాడు పితృదేవతలు సాయం సంధ్యా సమయాన ఆకాశంలో దక్షిణ దిక్కుగా వచ్చి, తమ సంతానాల గృహాలను సందర్శిస్తారట. వారికి దారి కనిపించటం కోసమే దివ్వెలు కొట్టే సంప్రదాయం ఏర్పడింది. ఇంట్లోని పెద్దవారు పిల్లలతో ఈ దివిటీను కొట్టిస్తారు. పొడుగాటి గోగు కాడలకు నూనెతో తడిపిన బట్ట వత్తులు కట్టి, వాటిని పిల్లల చేతులకిచ్చి, వారిని వీధి గుమ్మం ముందు నిలబెట్టి దివిటీలను వెలిగించి, ఆకాశంలో దక్షిణం వైపుకి చూపిస్తూ గుండ్రంగా మూడుసార్లు తిప్పి, నేలకు వేసి కొట్టిస్తూ, ‘దుబ్బు దుబ్బు దీపావళి, మళ్ళీ వచ్చే నాగుల చవితి‘ అని అనిపిస్తారు. ఆ తరువాత ఆ కాడలను ఒకపక్కగా పడేస్తారు. పిల్లల కాళ్లూ చేతులు కడిగి, కళ్ళు తడిచేతితో తుడిచి, నోరు పుక్కిలించి శుభ్రం చేసుకోమని, తరువాత ఆ పిల్లలచేత మిఠాయిలు తినిపిస్తారు. తరువాత ఇంటిల్లిపాది టపాకాయలు కాల్చడం ప్రారంభిస్తారు. బాణసంచా కాల్చటం లాంటి సంబరాలు పూర్తయ్యాక, అర్ధరాత్రి దాటాక, ఇళ్ళు వాకిళ్ళను తుడిపించుకోవాలని ధర్మశాస్త్రం చెప్తోంది.ఈసారి రికార్డ్ బ్రేక్ కావాల్సిందే!గత సంవత్సరం అక్టోబర్‌లో అయోధ్యలో 25.12 లక్షల దీపాలను వెలిగించి ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను సెట్ చేసింది. తాజాగా...28 లక్షల దీపాలను వెలిగించి తన రికార్డ్‌ను తానే బ్రేక్ చేయాలనుకుంటోంది.వారణాసిలో దేవతల దీపావళిదీపావళి తరువాత పదిహేను రోజులకు వారణాసిలో దేవ దీపావళిని జరుపుకుంటారు. కార్తిక పూర్ణిమ రాత్రి గంగానది వెంబడి ఉన్న ఘాట్లు లక్షలాది దీపాలతో వెలుగుతాయి. ఆ వెలుగుల ప్రతిబింబాలు నదిలో అందమైన చిత్రాలను ఆవిష్కరిస్తాయి. గంగానదిలో స్నానం చేయడానికి దేవతలు భూమి మీదికి దిగి వచ్చిన రోజుగా ఈ రోజును జరుపుకుంటారు.దీపావళి పూట...శివాజీ కోట!దీపావళి సీజన్లో మహారాష్ట్రలోని చాలా ప్రాంతాల్లో శివాజీ పాలించిన కోటకు ప్రతిరూపంగా మట్టికోటలను తయారుచేయడం అనేది ఆచారం. ఈ కోటను నిర్మించే క్రమంలో బురదలో విత్తనాలు నాటుతారు. కోట చుట్టూ పచ్చదనం ఉండేలా చేస్తారు. రాత్రివేళల్లో ఈ మట్టి కోటపై చిన్న చిన్న దీపాలను వెలిగిస్తారు.దేవతలకు స్వాగతంజార్ఖండ్లో దీపావళి పండగ సందర్భంగా సోహ్రై వేడుకను జరుపుకుంటారు. ఈ వేడుకలో భాగంగా దేవతలను స్వాగతించడానికి ఘరోండాలు (మట్టి బొమ్మల ఇళ్ళు) తయారుచేస్తారు. లక్ష్మీదేవిని స్వాగతించడానికి అగరువత్తులు కాల్చుతారు. సోహ్రై వేడుకలలో పశువులకు స్నానం చేయించి పూజ లు చేస్తారు.పేడ పూసుకుని వేడుక చేసుకుంటారు!కర్నాటక, తమిళనాడు సరిహద్దులలోని గుమతాపుర గ్రామంలో దీపావళి ముగింపును పురస్కరించుకొని ‘గోరెహబ్బ’ వేడుక జరుపుకుంటారు. ఈ వేడుకలో భాగంగా మగవాళ్లు ఆవు పేడను ఒకరిపై ఒకరు విసురుకుంటారు. ఆడవాళ్లు ఒంటికి రాసుకుంటారు. ఆవుపేడలో ఔషధగుణాలు ఉన్నాయనే నమ్మకంతో ఏర్పడిన శతాబ్దాల నాటి సంప్రదాయం ఇది.– డా. సోమంచి (తంగిరాల) విశాలాక్షి. విశ్రాంత సంస్కృతాచార్య -
ఆశలు రేపి... ఆఖర్లో కూల్చారు!
లక్ష్యఛేదనలో 253/4 స్కోరు వద్ద భారత్ 30 బంతుల్లో 36 పరుగుల సమీకరణమపుడు గెలుపే... భారత్‌వైపు తొంగిచూస్తోంది. కానీ తర్వాతి వరుస ఓవర్లలో హిట్టర్ రిచా ఘోష్, ఫిఫ్టీ చేసిన దీప్తిశర్మ అవుటవడంతోనే మహిళల జట్టు గెలుపునకు దూరమైంది. క్రీజులో ఉన్న అమన్‌జోత్, స్నేహ్రాణా సింగిల్స్‌కే పరిమితం కావడం... భారీ షాట్లు ఆడలేకపోవడంతో గెలుపు దారితప్పి ఓటమిబాట పట్టింది.ఇండోర్: ఇక గెలుపు ఖాయమేలే... విజయానికి చేరువయ్యామని అనుకుంటుండగా ఊహించని ఫలితం భారత శిబిరాన్ని ముంచేసింది. విజయం ఆశలు రేపిన మహిళలు ఆఖరికొచ్చేసరికి తమవల్ల కాదంటూ చేతులెత్తేశారు. దీంతో గెలుపుదాకా వచ్చిన భారత్ 4 పరుగుల దూరంలో ఆగిపోయింది. ఇంగ్లండ్ అమ్మాయిల చేతిలో ఓడిపోయింది. ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టు వరుసగా మూడో మ్యాచ్‌లోనూ పరాజయం పాలైంది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ మహిళల జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హీథర్‌నైట్ (91 బంతుల్లో 109; 15 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ సాధించింది. అమీ జోన్స్ (68 బంతుల్లో 56; 8 ఫోర్లు) అర్ధశతకం చేసింది. దీప్తిశర్మ (4/51) ప్రత్యర్థి బ్యాటింగ్‌కు దెబ్బతీయగా, శ్రీచరణి 2 వికెట్లు పడగొట్టింది. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన భారత మహిళల జట్టు 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసి ఓడింది. స్మృతి మంధానా (94 బంతుల్లో 88; 8 ఫోర్లు), కెపె్టన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (70 బంతుల్లో 70; 10 ఫోర్లు), దీప్తిశర్మ (57 బంతుల్లో 50; 5 ఫోర్లు)ల అర్ధశతకాల మోత బూడిదలో పోసిన పన్నీరైంది. ప్రత్యర్థి బౌలర్లలో నాట్ సీవర్ బ్రంట్ 2 వికెట్లు తీసింది. కదంతొక్కిన హీథర్‌నైట్ ఓపెనర్ బ్యూమోంట్ (22) తక్కువ స్కోరుకే అవుటైనా... మరో ఓపెనర్ అమీ జోన్స్ ఫిఫ్టీతో, టాపార్డర్ బ్యాటర్ హీథర్‌నైట్ శతకంతో ఇంగ్లండ్ భారీ స్కోరుకు బాటలు వేశారు. కెపె్టన్ నాట్ సీవర్ బ్రంట్ (38; 4 ఫోర్లు), హీథర్‌నైట్ మూడో వికెట్‌కు 113 పరుగులు జోడించారు. దీప్తి శర్మ వరుస విరామాల్లో వికెట్లు తీసి ప్రత్యర్థి స్కోరు మరింత పెరగకుండా చేసింది. 289 పరుగుల లక్ష్యఛేదనలో ప్రతీక (6) వికెట్‌ను కోల్పోయినప్పటికీ స్మృతి, హర్లీన్ (24), కెపె్టన్ హర్మన్, దీప్తిల రాణింపుతో విజయంవైపు అడుగులు వేసింది. అయితే 234 స్కోరు వద్ద మంధాన అవుటవడం మ్యాచ్ ఫలితాన్నే మార్చింది. రిచా, దీప్తిలు అవుటవడంతో పరాజయం ఖాయమైంది.స్కోరు వివరాలు ఇంగ్లండ్ మహిళల ఇన్నింగ్స్: బ్యూమోంట్ (బి) దీప్తి 22; అమీ జోన్స్ (సి) మంధాన (బి) దీప్తి 56; హీథర్‌నైట్ (రనౌట్) 109; నాట్ సీవర్ (సి) హర్మన్‌ప్రీత్ (బి) శ్రీచరణి 38; సోఫియా (సి) దీప్తి (బి) శ్రీచరణి 15; ఎమా లంబ్ (సి) మంధాన (బి) దీప్తి 11; అలైస్ క్యాప్సీ (సి) హర్లీన్ (బి) దీప్తి 2; చార్లీ (నాటౌట్) 19; సోఫీ ఎకిల్‌స్టోన్ రనౌట్ 3; లిన్సే స్మిత్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (50 ఓవర్లలో 8 వికెట్లకు) 288. వికెట్ల పతనం: 1–73, 2–98, 3–211, 4–249, 5–254, 6–257, 7–276, 8–280. బౌలింగ్: రేణుక 8–0–37–0, క్రాంతి 8–0–46–0, స్నేహ్ రాణా 10–0–56–0, శ్రీచరణి 10–0–68–2, దీప్తిశర్మ 10–0–51–4, అమన్‌జోత్ 4–0–26–0. భారత మహిళల ఇన్నింగ్స్: ప్రతీక (సి) అమీజోన్స్ (బి) లారెన్ బెల్ 6; స్మృతి (సి) క్యాప్సీ (బి) లిన్సే స్మిత్ 88; హర్లీన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) చార్లీ 24; హర్మన్‌ప్రీత్ (సి) ఎమా లంబ్ (బి) నాట్ సీవర్ 70; దీప్తి (సి) సోఫియా (బి) ఎకిల్‌స్టోన్ 50; రిచా (సి) హీథర్‌నైట్ (బి) నాట్ సీవర్ 8; అమన్‌జోత్ (నాటౌట్) 18; స్నేహ్ రాణా (నాటౌట్) 10; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (50 ఓవర్లలో 6 వికెట్లకు) 284. వికెట్ల పతనం: 1–13, 2–42, 3–167, 4–234, 5–256, 6–262. బౌలింగ్: లారెన్ బెల్ 9–0–52–1, లిన్సే స్మిత్ 10–0–40–1, నాట్ సీవర్ 8–0–47–2, చార్లీ డీన్ 10–0–67–1, సోఫీ ఎకిల్‌స్టోన్ 10–0–58–1, అలైస్ క్యాప్సీ 3–0–20–0. -
AP: హోంమంత్రి స్టేట్మెంట్పై కాపు సంఘాల ఆగ్రహం
విజయవాడ: దసరా పండుగ నాడు... నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం దారకానిపాడులో జరిగిన కాపు యువకుడు తిరుమలశెట్టి లక్ష్మీనాయుడు దారుణ హత్య కేసును నీరుగార్చేందుకు టీడీపీ పెద్దలు కుట్ర చేస్తున్నారనే వాదనకు మరింత బలం చేకూర్చింది హోంమంత్రి అనిత ప్రకటన. ఆర్థిక లావాదేవీల కారణంగానే తిరుమలశెట్టి లక్ష్మీనాయుడిని హత్య చేశారని అనిత వ్యాఖ్యానించడంపై కాపు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తన్నాయి. హత్య జరిగిన 17 రోజుల తర్వాత ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన అనిత.. ఆపై ఆర్థిక లావాదేవీలే కారణమని స్టేట్మెంట్ ఇచ్చారు. దీనిపై కాపు సంఘాలు భగ్గుమంటున్నాయి. హత్య జరిగిన 17 రోజులకి పరామర్శకి రావడమే కాకుండా ఈ తరహాలో వ్యాఖ్యానించడాన్ని కాపు సంఘాలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. కమ్మకొక న్యాయం.. కాపు బిడ్డకి మరొక న్యాయమా? అంటూ కాపు సంఘ నాయకులు ప్రశ్నిస్తున్నారు. కేసును తప్పుదోవ పట్టించే విధంగా హోంమంత్రి వ్యాఖ్యలు ఉన్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. ఈ హత్య కేసుపై స్పందించకపోవడాన్ని కూడా వారు నిలదీస్తున్నారు. జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టిని పంపి నగదు ఇవ్వడంపై విమర్శలు చేస్తున్నారు. ఇదొక మారణకాండ..నెల్లూరులో జరిగింది మారణకాండ అని కాపు సామాజిక వర్గానికి చెందిన వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. ముగ్గురిపై ఉద్దేశపూర్వకంగా కారుతో హత్యాయత్నం చేశారన్నారు. ప్రమాదం అని చిన్న కేసు నమోదు చేశారని, బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకూ పోరాడతామని స్పష్టం చేశారు. పరామర్శించడానికి వస్తే పోలీసులు ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు అంబటిలక్ష్మీనాయుడు దారుణ హత్య కేసును నీరుగార్చే కుట్ర! -
పోస్టల్ ఉద్యోగులకు బిగ్ న్యూస్.. దీపావళి కానుక ప్రకటన
దీపావళికి ముందు కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు ఆనందకరమైన బహుమతిని ప్రకటించింది. కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ పరిధిలోని తపాలా శాఖ 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఉత్పాదకత-లింక్డ్ బోనస్‌ను ప్రకటిస్తూ అధికారిక ఉత్తర్వులను జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం పోస్టల్ ఉద్యోగులకు 60 రోజుల వేతనానికి సమానమైన బోనస్ లభిస్తుంది.ఈ బోనస్‌ను పొందే ఉద్యోగుల వర్గాలుపోస్టల్ శాఖ ఉత్తర్వుల ప్రకారం.. ఈ బోనస్ పొందడానికి ఈ కింది వర్గాల ఉద్యోగులు అర్హులురెగ్యులర్ ఉద్యోగులు - గ్రూప్ సి, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్), నాన్ గెజిటెడ్ గ్రూప్ బి ఉద్యోగులు.గ్రామీణ డాక్ సేవకులు - రెగ్యులర్ సర్వీస్‌లో ఉన్నవారుతాత్కాలిక, ఫుల్‌టైమ్ క్యాజువల్ ఉద్యోగులుఅదనంగా, 2025 మార్చి 31 తర్వాత పదవీ విరమణ చేసిన, రాజీనామా చేసిన లేదా డిప్యుటేషన్‌కు వెళ్లిన ఉద్యోగులు కూడా ఈ బోనస్ కు అర్హులు.బోనస్ లెక్కింపు విధానంబోనస్ లెక్కించడానికి పోస్టల్ శాఖ స్పష్టమైన ఫార్ములాను కూడా అందించింది. రెగ్యులర్ ఉద్యోగులకు బోనస్ = (సగటు వేతనం × 60 రోజులు ÷ 30.4). అయితే, బోనస్ లెక్కించడానికి గరిష్ట జీతం పరిమితిని నెలకు రూ .7,000 గా నిర్ణయించారు.గ్రామీణ డాక్ సేవకులకు (జీడీఎస్)కు వారి టైమ్ రిలేటెడ్ కంటిన్యూటీ అలవెన్స్ (టీఆర్సీఏ), డియర్ నెస్ అలవెన్స్ ఆధారంగా బోనస్ నిర్ణయిస్తారు.తాత్కాలిక లేదా ఫుల్ టైమ్ క్యాజువల్ వర్కర్లకు వారి అంచనా వేతనం రూ.1,200 ఆధారంగా వారికి అడ్హాక్ బోనస్ ఇస్తారు.సర్వీసు విడిచిపెట్టిన అంటే 2025 మార్చి 31 తర్వాత పదవీ విరమణ చేసిన, రాజీనామా చేసిన లేదా బదిలీ అయిన ఉద్యోగులకు కూడా ప్రో-రేటా ప్రాతిపదికన బోనస్ లభిస్తుందని ఉత్తర్వులో పోస్టల్ శాఖ పేర్కొంది. -
‘ఎప్పుడు ఎన్నికలొచ్చినా వచ్చేది మన ప్రభుత్వమే’
కృష్ణాజిల్లా: దళితులతో చంద్రబాబుకు ఆనాడే సంబంధాలు తెగిపోయాయని వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ రాష్టర అధ్యక్షుల టీజేఆర్ సుధాకర్‌బాబు స్పష్టం చేశారు. దళితుల్లో ఎవరైనా పుట్టాలని అనుకుంటారా అన్న వ్యక్తి చంద్రబాబు అని, ఆనాడే ఆయనతో దళితులకు సంబంధాలు తెగిపోయాయన్నారు. ఈరోజ( ఆదివారం, అక్టోబర్ 19వ తేదీ) మచిలీపట్నంలో కృష్ణా జిల్లా వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. దీనిలో భాగంగా మాట్లాడిన టీజీఆర్ సుధాకర్ బాబు.. ‘ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వల్ల కలిగే నష్టాలను ప్రజలకు వివరించాలి. వచ్చేది మన ప్రభుత్వమే ... ఎవరికీ భయపడొద్దు. 2027లో ఎన్నికలొచ్చినా... 2029లో ఎన్నికలొచ్చినా వచ్చేది మనమే. మళ్లీ ముఖ్యమంత్రి అయ్యేది జగన్మోహన్రెడ్డి. టిడిపి నేతలు రౌడీయిజంతో వచ్చినా ...రాజకీయంతో వచ్చినా.. జగన్ కోసం గుండె చూపించి నిలబడదాం. దళితుల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్న వ్యక్తి చంద్రబాబు. చంద్రబాబుతో దళితులకు ఆనాడే సంబంధాలు తెగిపోయాయి. దళిత కుటుంబంలో పుట్టిన నన్ను యువజన కాంగ్రెస్ నాయకుడిగా చేసిన వ్యక్తి వైఎస్సార్. దళితులను రాజకీయంగా చైతన్య పరిచిన కుటుంబం వైఎస్సార్ కుటుంబం. దళితులకు జగన్ ఐదు మంత్రిపదవులిచ్చారు. చంద్రబాబు మాదిగలకు ఒకటి, మాలలకు ఒకటి మాత్రమే ఇచ్చారు. టిడిపిలో ఉండి చంద్రబాబుకోసం తబలా వాయించే దళిత నాయకులకు సిగ్గుందా. దళితుల కుటుంబాల్లో చంద్రబాబు పండుగ లేకుండా చేశారు. కల్తీ మద్యం తయారు చేసి..అమ్మేది టిడిపి వాళ్లు. ఆ మద్యం తాగి చనిపోయేది మా దళితులుకల్తీ మద్యం తాగి చనిపోయిన ప్రతీ ఒక్కరికీ కోటి రూపాయలు పరిహారం ఇవ్వాలి’ అని డిమాండ్ చేశారు. -
ఇంటర్నేషనల్ స్కూల్ ప్రారంభం.. హాజరైన టాలీవుడ్ ప్రముఖులు
హైదరాబాద్ మణికొండ గోల్డెన్ టెంపుల్ సమీపంలో సిస్ట్లా ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్‌ను గ్రాండ్‌గా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పలువురు టాలీవుడ్ నటీనటులు హాజరయ్యారు. కమెడియన్ అలీ చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేయించారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మానందం, శివాజీ, రఘుబాబు, కమెడియన్ ప్రవీణ్, జైల్ సూపరిండెంట్ దామర్ల కాళిదాసు, హీరోయిన్లు ఎస్తర్, దివిలతో పాటు ఇన్‌ఫ్లూయన్సర్ బెజవాడ బేబక్క (మధు), ఎక్స్ యంఎల్‌ఏ కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఆనందలహరి వెబ్ సిరీస్ ఫేం హీరో అభిషేక్ బొడ్డేపల్లి, దర్శకుడు సాయి వానపల్లి ఈ సందర్భంగా అలీ మాట్లాడుతూ– 'ఈ స్కూల్‌ను చూస్తుంటే మళ్లీ చిన్నప్పటిలా లాగు చొక్కా వేసుకుని స్కూల్‌కి వెళ్లాలని అనిపిస్తుంది. నాకు చదువంటే ఎంతో గౌరవం. అందుకే ఎంతో కష్టపడి ఆరు భాషలు మాట్లాడటం నేర్చుకున్నా' అని అన్నారు. బ్రహ్మానందం మాట్లాడుతూ.. 'మణికొండ లాంటి ఏరియాలో ఇలాంటి స్కూల్ ఏర్పాటు చేసినందుకు లోహిత్‌ను ఎంతగానో అభినందిస్తున్నా. చిన్నప్పటి నుండే పిల్లలకు మంచి విషయాలు నేర్పిస్తే వారి జీవితానికి పునాది అవుతుందని అభిప్రాయపడ్డారు.నటుడు శివాజీ మాట్లాడుతూ.. 'నేను డిగ్రీ వరకు చదువుకున్నా. చదువు అయిపోయిన తర్వాత ఇంకొంచెం బాగా చదువుంటే బాగుండేది అనుకున్నా. అందుకే నా పిల్లలకు ఒక్కటే చెప్పాను. నేను సంపాదించి మీకేం ఇస్తానో నాకు తెలియదు కానీ మీరు ఎంత చదువుకుంటే అంత చదివిస్తాను అని చెప్పా. అందుకే పిల్లలు బాగా చదువుకోవాలని పెట్టిన సిస్ట్లా స్కూల్ యాజమాన్యానికి ముఖ్యంగా లోహిత్‌కి అభినందనలు' అన్నారు. -
మెరిసిపోతున్న రష్మిక మందన్నా.. దివాళీ పార్టీలో బుట్టబొమ్మ పూజా హెగ్డే !
బ్లాక్ డ్రెస్‌లో బాలీవుడ్ బ్యూటీ అవనీత్ కౌర్.. దివాళీకి మెరిసిపోతున్న హీరోయిన్ రష్మిక మందన్నా.. ఫస్ట్ దివాళీ పార్టీ అంటోన్న బుట్టబొమ్మ పూజా హెగ్డే.. పారిస్‌లో చిల్ అవుతోన్న మాళివిక మోహనన్.. దివాళీ మూడ్‌లో చాహల్ గర్ల్‌ఫ్రెండ్ ఆర్జే మహ్వశ్.. View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Mahvash (@rj.mahvash) View this post on Instagram A post shared by Avneet Kaur (@avneetkaur_13) View this post on Instagram A post shared by renu desai (@renuudesai) -
ఓడినా సంతృప్తిగా ఉన్నాం.. ఆసీస్ చేతిలో ఓటమి అనంతరం గిల్
ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియాకు తొలి మ్యాచ్‌లోనే ఓటమి ఎదురైంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా పెర్త్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో (India vs Australia) భారత్ 7 వికెట్ల తేడాతో (డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం) పరాజయంపాలైంది. వర్షం అంతరాయాల నడుమ 26 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు.కేఎల్ రాహుల్ (38), అక్షర్ పటేల్ (31), ఆఖర్లో అరంగేట్రం ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి (19 నాటౌట్; 2 సిక్సర్లు) ఓ మోస్తరుగా రాణించి టీమిండియా పరువు కాపాడారు.నాలుగు నెలల విరామం తర్వాత (ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత) రీఎంట్రీ ఇచ్చిన స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ (8), విరాట్ కోహ్లి (0) ఈ మ్యాచ్‌లో దారుణంగా విఫలమయ్యారు. ఫుల్‌టైమ్ వన్డే కెప్టెన్‌గా గిల్ తొలి మ్యాచ్‌లోనే (10) నిరాశపరిచాడు. ఓవర్ హైప్ మధ్య శ్రేయస్ అయ్యర్ (11) పరుగులు చేసేందుకు చాలా ఇబ్బంది పడ్డాడు. మొత్తంగా భారత్ పవర్‌ప్లేలో మూడు కీలక వికెట్లు కోల్పోయి ఆదిలోనే మ్యాచ్‌పై పట్టు కోల్పోయింది.ఆసీస్ బౌలర్లలో జోష్ హాజిల్‌వుడ్, మిచెల్ ఓవెన్, కుహ్నేమన్ తలో 2 వికెట్లు.. స్టార్క్, ఎల్లిస్ చెరో వికెట్ పడగొట్టడంతో భారత్ 9 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేయగలిగింది.అనంతరం డక్‌వర్త్ లూయిస్ పద్దతిన కుదించిన 131 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆసీస్ 21.1 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. మిచెల్ మార్ష్ (46 నాటౌట్), రెన్షా (21 నాటౌట్) ఆసీస్‌ను విజయతీరాలకు చేర్చారు. ఆసీస్ ఇన్నింగ్స్‌లో ట్రవిస్ హెడ్ (8), మాథ్యూ షార్ట్ (8) విఫలం కాగా.. జోష్ ఫిలిప్ (37) పర్వాలేదనిపించాడు. భారత బౌలర్లలో అర్షదీప్, అక్షర్, సుందర్ తలో వికెట్ తీశారు. ఈ సిరీస్‌లో రెండో వన్డే అడిలైడ్ వేదికగా అక్టోబర్ 23న జరుగనుంది.గిల్ ఆసక్తికర వ్యాఖ్యలుమ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. "పవర్‌ప్లేలో మూడు వికెట్లు కోల్పోయినప్పుడు, ఆట మొత్తం క్యాచ్-అప్ గేమ్‌గా మారుతుంది. ఈ మ్యాచ్ నుంచి చాలా నేర్చుకున్నాం. కొన్ని పాజిటివ్‌లు కూడా ఉన్నాయి. 130 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకుంటూ మ్యాచ్‌ను చివరి వరకు తీసుకెళ్లాం. దానికి సంతృప్తిగా ఉన్నాం" అని అన్నాడు.అభిమానుల మద్దతుపై కూడా గిల్ స్పందించాడు. "అభిమానులు భారీగా వచ్చారు. మేము అదృష్టవంతులం. అడిలైడ్‌లో కూడా మాకు ఇలాగే మద్దతు లభిస్తుందని ఆశిస్తున్నాం" అని అన్నాడు.కాగా, గిల్ తన వన్డే కెప్టెన్సీ కెరీర్‌ను ఓటమితో ప్రారంభించాడు. తద్వారా విరాట్ కోహ్లి తర్వాత మూడు ఫార్మాట్లలో తొలి మ్యాచ్‌లో ఓటమిని ఎదుర్కొన్న భారత కెప్టెన్‌గా నిలిచాడు. ఈ ఓటమితో టీమిండియా జైత్రయాత్రకు కూడా బ్రేక్ పడింది. ఈ ఏడాది ఎనిమిది వరుస విజయాల తర్వాత (వన్డేల్లో) భారత్‌కు ఇది తొలి పరాజయం. చదవండి: చరిత్ర సృష్టించిన దీప్తి శర్మ.. తొలి భారత ప్లేయర్ -
అందరికీ దీపావళి శుభాకాంక్షలు.. కానీ ఓ చిన్న రిక్వెస్ట్: రేణు దేశాయ్
హీరోయిన్ రేణు దేశాయ్ తన అభిమానులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపింది. ఈ సమయంలో అందరూ పండుగను సంతోషంగా సెలబ్రేట్ చేసుకోవాలని ఆకాంక్షించింది. అదే సమయంలో ప్రజలకు ఓ చిన్న విజ్ఞప్తి చేసింది. దయచేసి రాత్రి 9 గంటల తర్వాత ఎక్కువ శబ్దం వచ్చే క్రాకర్స్‌ను పేల్చవద్దని కోరింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.రేణు దేశాయ్ తన ఇన్‌స్టాలో రాస్తూ..' మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఇది అందరూ సంతోషంగా పండుగ జరుపుకునే సమయమని నాకు కూడా తెలుసు. కానీ రాత్రి 9 గంటల తర్వాత చాలా ఎక్కువుగా శబ్ధం వచ్చే క్రాకర్లు పేల్చకండి. ఎందుకంటే చాలా మంది వృద్ధులు, చిన్న పిల్లలు నిజంగా ఆ విపరీతమైన శబ్దాలకు ప్రభావితమవుతారు. ఈ సమయంలో మీరు చాలా మెరుపులు, పూల కుండలు, చక్రాలతో ఆనందించండి. ఎక్కువ శబ్దం చేయకుండా కేవలం లైటింగ్‌తో పండుగను మరింత ఆనందంగా జరుపుకోండి' అంటూ విజ్ఞప్తి చేసింది.కాగా.. రేణు దేశాయ్, పవన్ కల్యాణ్ బద్రి, జానీ చిత్రాల్లో జంటగా నటించారు. 2009లో వీరిద్దరు వివాహం చేసుకున్నారు. ఈ జంటకు అకీరా నందన్, ఆద్య అనే ఇద్దరు పిల్లలు జన్మించారు. అయితే ఇద్దరి మధ్య రిలేషన్లో మనస్పర్థలు రావడంతో 2012లో విడాకులు తీసుకున్నారు. ఆమె చివరిసారిగా రవితేజ హీరోగా వచ్చిన టైగర్ నాగేశ్వరరావు చిత్రంలో కనిపించింది. View this post on Instagram A post shared by renu desai (@renuudesai) -
ఒకరికి భార్య.. మరొకరికి లవర్.. ఢిల్లీలో జంట హత్యలు!
వివాహేతర సంబంధం కారణంగా తన ప్రాణాలే కోల్పోయింది ఓ మహిళ. తన భార్యను ప్రియుడు తన కళ్లముందే చచ్చేలా కొట్టడాన్ని భరించలేకపోయాడు భర్త. దాంతో ఆ ప్రియుడ్ని కూడా చంపేసి కసి తీర్చుకున్నాడు. భార్యను రక్షిద్దామని చేసిన ప్రయత్నంలో తీవ్ర కత్తిపోట్లకు గురైన భర్త కూడా ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. నైతికతను మరిచి వివాహేతర సంబంధం కొనసాగిస్తే ఎంతటి అనర్థాలకు దారి తీస్తుందో ఈ ఘటన ద్వారా మరోసారి రుజువైంది. వివరాల్లోకి వెళితే.. సెంట్రల్ ఢిల్లీలో జరిగిన జంట హత్యలు కలకలం ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. ఒకరు లవర్ కోసం, మరొకరు భార్య కోసం నడిరోడ్డుపైనే కొట్టుకున్నారు. అందరూ చూస్తుండగానే రామ్ నగర్ ఏరియాలో షాలిని(22) తనది అంటూ స్థానికంగా క్రిమినల్‌గా పేరొందిన అశూ అలియాస్ శైలేంద్ర రోడ్డుపైనే ఆమెను అడ్డగించాడు. ఇందుకు కారణంగా ఆ రౌడీ షీటర్‌తో షాలిని కొంతకాలం వివాహేతర సంబంధం నడపడమే. భర్తతో కలిసి బయటకు వెళుతన్న సమయంలో ఇది చోటు చేసుకుంది. తామిద్దరికీ ఒక బిడ్డ కూడా పుట్టాడని, తనతోనే కలిసుండాలని ఆమెపై ఒత్తిడి చేశాడు. ఈ హఠాత్తు పరిణామంతో ఒక్కసారిగా భయపడిపోయిన షాలిని.. లవర్‌తో విభేదించింది. తాను భర్తతో ఉంటానని తెగేసి చెప్పేసింది. దాంతో ఆమెను నడిరోడ్డుపైనే విచక్షణారహితంగా కొట్టాడు ప్రియుడు. దాన్ని చూసి తట్టుకోలేకపోయిన భర్త ఆకాశ్.. భార్యను కాపాడుకునే యత్నం చేశాడు. ఒకవైపు భార్యను లవర్ చావబాదుతంటే అదే స్థాయిలో ప్రతిఘటించాడు. ఈ క్రమంలోనే ముగ్గురికి కత్తిపోట్లు బలంగా దిగాయి. వీరు ముగ్గురు రక్తమడుగులో ఉన్న సమాచారాన్ని అందుకున్న పోలీసులు ఆస్పత్రికి తరలించారు. కానీ షాలిని, ఆమె ప్రియుడు ఆశూలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు డిల్లీ సెంట్రల్ డీసీపీ నిధిన్ వాల్సన్ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం భార్యను కాపాడే క్రమంలో తీవ్ర కత్తిపోట్లకు గురైన భర్త ఆకాశ్ పరిస్థితి కూడా విషమంగానే ఉందన్నారు.అతిపెద్ద మ్యూజియంలో అతిపెద్ద చోరీ.. ఏడు నిమిషాల వ్యవధిలోనే..! -
మహేష్ ఎక్కడ? నమ్రతకు ఫ్యాన్స్ ప్రశ్న...!
దీపావళి పండుగ సెలబ్రిటీలకు చాలా ఇష్టమైన పండుగ అని చెప్పొచ్చు. వ్యక్తిగతంగా జరుపుకోవడం మాత్రమే కాదు బిజీ జీవితంలో అరుదుగా మాత్రమే కలవగలుగుతున్న సన్నిహితులకు, పరిచయస్థులకు దీపావళి బాష్ పేరిట పార్టీలు ఇవ్వడానికి కూడా ఇదే చక్కని సందర్భంగా స్టార్స్ భావిస్తారు. దాంతో ఈ సమయంలో దీపావళి పార్టీలు జోరుగా సాగుతాయి. మన టాలీవుడ్‌తో పోలిస్తే బాలీవుడ్లో ఇవి ఒక సంప్రదాయంగా మారిపోయాయి. ఈ నేపధ్యంలో ముంబైలో ఝాన్సీరెడ్డి అనే సన్నిహితులు ఇచ్చిన ఈ పార్టీకి పలువురు బంధుమిత్రులతో పాటు మన సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రతా శిరోడ్కర్ కూడా హాజరయ్యారు. ఈ పార్టీకి ఆమె సోదరి శిల్పా శిరోడ్కర్ కూడా వచ్చారు. ఈ సందర్భంగా అక్కాచెల్లెళ్లు ఇద్దరూ పార్టీలో సరదాగా గడుపుతూ సందడి చేశారు. ఫొటోలకు ఫోజులు ఇచ్చారు. ఈ పార్టీలో మహేష్, నమ్రతల కుమార్తె తాజా యాడ్ వరల్డ్ యంగెస్ట్ సెన్సేషన్ సితార కూడా పాల్గొంది.ఈ సందర్భంగా నమ్రత తమ ఘట్టమనేని అభిమానులతో తన దీపావళి వేడుకల విశేషాలను పంచుకున్నారు. తన కుమార్తె సితార ఘట్టమనేని సోదరి శిల్పా శిరోద్కర్‌తో తాము కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేశారు.ఆ ఛాయా చిత్రాలను పంచుకుంటూ, నమ్రత ‘వెచ్చదనం, వెలుగులు అద్భుతమైన వ్యక్తులతో నిండిన సాయంత్రం... నిజంగా మరపురాని దీపావళి రాత్రులు... మమ్మల్ని ఆహ్వానించినందుకు ధన్యవాదాలు‘ అంటూ క్యాప్షన్‌లో రాశారు. ఈ ఫొటోలో హైదరాబాద్ నగర ప్రముఖులు పింకీ రెడ్డి వంటివారు కూడా నమ్రత బృందంలో కనిపించారు. అయితే సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఊరుకుంటారా? తమ అభిమాన కధానాయకుడు లేకుండా ఆయన భార్య వేడుకలు జరుపుకుంటే.. అడగకుండా ఉంటారా? అందుకే ఆ ఫొటోల కింద కామెంట్లు వెల్లువెత్తాయి. మహేష్ బాబు ఎక్కడ అంటూ పలువురు ఫ్యాన్స్ ప్రశ్నలు కురిపించారు. ఒకరు, ‘మన సూపర్ స్టార్ ఎక్కడ?‘ అని ఆరా తీయగా మరికొందరు, ‘బాబు ఎక్కడ‘ అనీ అడిగారు. నమ్రతను తన కుమార్తెతో కలిసి ఉన్న మరిన్ని ఫోటోలను షేర్ చేయమని కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు అభ్యర్ధించారు. మరోవైపు రాజమౌళి తీస్తున్న సినిమా షూటింగ్లో మహేష్ ప్రస్తుతం బిజీ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) -
వారెన్ బఫెట్ చెప్పిన సక్సెస్ సీక్రెట్..
ఒరాకిల్ ఆఫ్ ఒమాహాగా పేరుగాంచిన వారెన్ బఫెట్.. తన సంపత్తి కంటే ఎక్కువగా తన పెట్టుబడి మేథసంపత్తికి, పట్టుదలకి, దాతృత్వానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన వ్యాపారవేత్త. ప్రపంచంలోని అత్యంత వయోవృద్ధ బిలియనీర్లలో ఒకరైన ఆయన, టీనేజ్లోనే తన మొదటి పెట్టుబడి పెట్టారు. ‘1% క్లబ్’లో భాగంగా, తన సంపాదనలో 99 శాతాన్ని స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా ఇవ్వాలని ప్రతిజ్ఞ చేసిన బఫెట్.. తన దాతృత్వ ప్రయత్నాలు ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు.బఫెట్ విజయం వెనుక అలవాట్ల పాత్ర ఎక్కువవారెన్ బఫెట్ (Warren Buffett) జీవిత సూత్రం "తక్కువగా పనిచేయడం కాదు, కానీ తెలివిగా జీవించడం". ప్రతిరోజూ చదవడం, త్వరగా పడుకోవడం, ఏ పనినైనా ప్రారంభించే ముందు చక్కగా ఆలోచించడం ఆయన దైనందిన జీవితంలోని అలవాట్లు. ఇవి సింపుల్ కనిపిస్తాయి. కానీ ప్రభావవంతమైనవి. వాస్తవానికి, బఫెట్ రోజులో 80 శాతానికి పైగా చదవడం, ఆలోచించడానికే కేటాయిస్తారు. కొన్ని రోజుల్లో ఇది 6 గంటల దాకా ఉంటుంది.అలవాట్ల శక్తి గురించి బఫెట్ ఆసక్తికర ఉదహరణఒకసారి, యువ విద్యార్థులతో మాట్లాడుతుండగా, బఫెట్ అలవాట్ల రూపకల్పనలో ఉన్న "అదృశ్య శక్తి" గురించి ఆసక్తికరంగా వివరించారు. "మీరు గౌరవించే ఇద్దరు వ్యక్తులు, అలాగే మీకు అసహ్యంగా అనిపించే మరో వ్యక్తిని తీసుకోండి. తరువాత, ఈ ముగ్గురు వ్యక్తుల లక్షణాలను పేపర్‌పై రాయండి" అంటూ సూచించారు.ఈ ప్రక్రియ ద్వారా బఫెట్ చెప్పాలనుకున్న విషయం ఏంటంటే.. "మీరు ఆదర్శంగా భావించే వ్యక్తుల లక్షణాలు మీకూ సాధ్యమైనవే. కొంత అభ్యాసం చేస్తే మీరు కూడా అలాంటి వ్యక్తిగా మారగలరు. ఇవి అలవాట్లుగా మారినపుడు, అవే మీ వ్యక్తిత్వాన్ని నిర్మిస్తాయి".అలవాట్లు ఎలా ఏర్పడతాయో, వాటిని చిన్నవయస్సులో ఎలా మార్చగలమో స్పష్టంగా వివరించేందుకు బఫెట్ బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఉదాహరణను ప్రస్తావించారు. ఫ్రాంక్లిన్ "ఒక వ్యక్తి కావాలనుకునే లక్షణాన్ని తాను అభ్యసించి అలవాటుగా మార్చుకున్నాడు" అని బఫెట్ చెబుతూ.. "అలవాట్ల గొలుసులు మొదట తేలికగా ఉంటాయి. మనం గుర్తించలేము కూడా. కానీ, అవి గట్టిపడితే, విరగ్గొట్టడం కష్టమవుతుంది. కాబట్టి చిన్న వయస్సులోనే మంచి అలవాట్లను అభ్యసించండి" అన్నారు.ఇదీ చదవండి: రిచ్ అవ్వాలంటే కూడబెట్టాల్సింది ఆ ‘ఫేక్ డబ్బు’ కాదు.. -
రైల్వే స్టేషన్లలో ఏదైనా కొనుక్కుంటున్నారా? ఇలా కాలర్ పట్టుకుంటారు జాగ్రత్త!
భోపాల్: అది ఓ ప్రాంత రైల్వేస్టేషన్. ఓ పక్క ట్రైన్ కదులుతుంటే.. పక్కనే ఓ యువకుడి కాలర్ పట్టుకుని సమోసా వ్యాపారి బెదిరిస్తున్నాడు. ‘నా ట్రైన్ కదులుతోంది..నన్ను వదిలి పెట్టండి నమహాప్రభో అని బ్రతిమాలడుతున్న పట్టించుకోలేదు. పైగా ట్రైన్ పోతే పోనీ.. నన్నేం చేయమంటావు. నా డబ్బులు ఇస్తావా.. చస్తావా.. నా టైం వేస్టు చేశావు అంటూ సదరు సమోసా వ్యాపారి ప్రయాణికుడిని బెదిరించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇంతకీ ఏం జరిగిందంటే?మధ్యప్రదేశ్ జబల్పూర్ రైల్వే స్టేషన్లో సమోసా వ్యాపారికి, రైల్వే ప్రయాణికుడికి మధ్య జరిగిన ఘటనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్తున్న ఓ ట్రైన్ జబల్పూర్ రైల్వే స్టేషన్లో ఆగింది. అప్పటికే ఆకలితో ఉన్న ఓ ప్రయాణికుడు ఫ్లాట్‌ఫారమ్ మీద ఏదైనా దొరుకుతుందేమోనని పరిసరాల్ని నిశితంగా గమనించాడు. అటు పక్కనే సమోసాలు అమ్మే స్టాల్ అతని కంట్లో పడింది. వెంటనే ట్రైన్ దిగి సమోసాలు తీసుకుని.. ఓ సంస్థ యూపీఐ యాప్ నుంచి పేమెంట్ చేసే ప్రయత్నం చేశాడు. నెట్వర్క్ సమస్య వల్ల చెల్లింపులు జరగలేదు. వెంటనే తీసుకున్న సమోసాలు తిరిగి వ్యాపారికి ఇచ్చి బయల్దేరాడు ఆ యువకుడు. అంతే ఠాట్.. నా టైం వేస్ట్ చేశావు. సమోసాలు తీసుకుని డబ్బులు ఇచ్చి ముందుకు కదులు అంటూ ప్రయాణికుడికి సమోసా వ్యాపారి హుకుం జారీ చేశాడు. అంతలోనే ట్రైన్ మెల్లగా కదలడం మొదలైంది. క్షమించండి. సమోసాలు వద్దు. నా దగ్గర లిక్విడ్ క్యాష్ లేవుంటూ అక్కడి నుంచి వెళ్లే ప్రయత్నం చేశాడు. అంతే ఒక్క ఉదుటున.. అవన్నీ చెప్పకు.. డబ్బులు ఇచ్చి సమోసాలు తీసుకో అంటూ ప్రయాణికుడిని కాలర్ పట్టుకున్నాడు. కాలర్ విడిపించుకుని ముందుకు వెళుతుంటే అడ్డు తగిలాడు. అతని చేతికి ఉన్న చేతిగడియారం (wristwatch) బలవంతంగా తీసుకున్నాడు. నాలుగైదు సమోసాలు ప్రయాణికుడు చేతిలో పెట్టాడు. ట్రైన్ మరింత వేగంతో ముందుకు కదులుతుంటే పాపం ఏం చేయాలో పాలపోని యువ ప్రయాణికుడు సమోసాలు తీసుకుని ట్రైన్ ఎక్కి వెళ్లిపోయాడు. ఈ ఉదంతాన్ని ఎదురుగా ఉన్న మరో ప్రయాణికుడు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో వైరల్ కావడంతో జబల్పూర్ డివిజనల్ రైల్వే మేనేజర్ (DRM) స్పందించారు. ప్రయాణికుడి పట్ల దురుసుగా ప్రవర్తించిన సమోసా వ్యాపారిపై చర్యలకు ఉపక్రమించాం. రైల్వే పోలీసులు అతనిపై కేసు నమోదు చేసుకున్నారు. అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అతడి లైసెన్స్ రద్దు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు’అని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలను పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని రైల్వే శాఖ ఉన్నతాధికారులు హామీ ఇచ్చారు. మరోవైపు ఈ వీడియోపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది సమోసా వ్యాపారి ప్రవర్తనను తప్పుపడుతుండగా, మరికొందరు యూపీఐ చెల్లింపులపై ఆధారపడటం ప్రమాదకరమని అభిప్రాయపడుతున్నారు. యూపీఐ వ్యవస్థలో సాంకేతిక లోపాలు,నెట్వర్క్ సమస్యలు వల్ల చెల్లింపులు నిలిచిపోవడం సాధారణమే అయినా, విక్రేతలు దీనిపై ఎలా స్పందించాలి అనే అంశంపై స్పష్టత అవసరం అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.At Jabalpur railway station, a vendor forced a passanger to pay online and buy samosas as the train chugged out of platform. When the online payment didn't go through, the passanger took off his wrist watch and gave it to the vendor who then released the collar. pic.twitter.com/sCzv69pDCb— Piyush Rai (@Benarasiyaa) October 18, 2025 #WATCH | A passenger was forced to give a watch to a samosa seller after his UPI payment failed while his train was departing from Jabalpur.West Central Railway CPRO Harshit Srivastava says, "The incident occurred on the evening of 17th October. At Jabalpur station, a vendor… pic.twitter.com/3mHkMROq1E— ANI (@ANI) October 19, 2025 -
CWC 2025: చరిత్ర సృష్టించిన టీమిండియా ప్లేయర్
భారత మహిళా క్రికెటర్ దీప్తి శర్మ (Deepthi Sharma) వన్డే క్రికెట్లో అరుదైన ఘనత సాధించింది. 2000 పరుగులతో పాటు 150 వికెట్లు తీసిన తొలి భారత ప్లేయర్‌గా చరిత్ర సృష్టించింది. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఈ అరుదైన ఫీట్‌ను నమోదు చేసిన నాలుగో క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పింది.వన్డే ప్రపంచకప్‌లో (Women's CWC 2025) భాగంగా ఇండోర్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో (India vs England) ఈ గ్రాండ్ డబుల్‌ను సాధించింది. ఈ మ్యాచ్‌లో దీప్తి మొత్తం 4 వికెట్లు తీసి తన వన్డే వికెట్ల సంఖ్యను 153కి పెంచుకుంది. బ్యాటింగ్‌లో దీప్తి 2607 పరుగులు చేసింది.దీప్తికి ముందు స్టెఫనీ టేలర్ (వెస్టిండీస్, 5873 పరుగులు, 155 వికెట్లు), ఎలిస్ పెర్రీ (ఆస్ట్రేలియా , 4414, 166), మారిజన్ కాప్ (దక్షిణాఫ్రికా, 3397, 172) మాత్రమే వన్డేల్లో 2500 పరుగులతో పాటు 150 వికెట్లు తీసిన ఆల్రౌండర్లుగా ఉన్నారు.దీప్తి ప్రభంజనంప్రస్తుత వన్డే ప్రపంచకప్‌లో దీప్తి ప్రభంజనం కొనసాగుతుంది. ఈ మెగా టోర్నీలో ఆమె ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో 13 వికెట్లు తీసి లీడింగ్ వికెట్‌టేకర్‌గా కొనసాగుతోంది. టోర్నీ ఓపెనర్‌లో శ్రీలంకపై హాఫ్ సెంచరీ సహా 3 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచింది.మ్యాచ్ విషయానికొస్తే.. దీప్తి శర్మ (10-0-51-4) బంతితో రాణించినప్పటికీ ఇంగ్లండ్ భారీ స్కోర్ చేసింది. హీథర్ నైట్ (91 బంతుల్లో 109; 15 ఫోర్లు, సిక్స్) మెరుపు సెంచరీతో చెలరేగడంతో ఆ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. నైట్‌తో పాటు ఓపెనర్ యామీ జోన్స్ (56) రాణించింది. కెప్టెన్ నాట్ సీవర్ బ్రంట్ (38) పర్వాలేదనిపించింది.మరో ఓపెనర్ ట్యామీ బేమౌంట్ 22, సోఫీ డంక్లీ 11, అలైస్ క్యాప్సీ 2, సోఫీ ఎక్లెస్టోన్ 3 పరుగులు చేశారు. ఛార్లోట్ డీన్ (19), లిన్సే స్మిత్ (0) నాటౌట్‌గా నిలిచారు. భారత బౌలర్లలో దీప్తి శర్మతో పాటు శ్రీ చరణి (10-0-68-2) మాత్రమే వికెట్లు తీసింది.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన భారత్ 42 పరుగులకే ప్రతిక రావల్ (6), హర్లీన్ డియోల్ (24) వికెట్లు కోల్పోవడంతో ఆచితూచి ఆడుతుంది. స్మృతి మంధన (34), కెప్టెన్ హర్మన్ (33) మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతున్నారు. 19.1 ఓవర్ల తర్వాత జట్టు స్కోర్ 100/2గా ఉంది. చదవండి: టీమిండియా జైత్రయాత్రకు బ్రేక్.. కోహ్లి సరసన గిల్ -
పవన్ కల్యాణ్ ఓజీ.. ఆ సాంగ్ వచ్చేసింది
పవన్ కల్యాణ్ హీరోగా వచ్చిన చిత్రం ఓజీ(OG). ఈ సినిమాకు సుజిత్ దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 25న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది. ఈ చిత్రంలో ఇమ్రాన్ హష్మీ, ప్రకాశ్ రాజ్, శ్రియారెడ్డి, ప్రియాంక మోహన్ కీలక పాత్రల్లో నటించారు.తాజాగా ఈ మూవీ నుంచి సాంగ్‌ను రిలీజ్ చేశారు. గన్స్ అండ్ రోజెస్ అనే ఫుల్ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ పాటకు విశ్వ వేమూరి లిరిక్స్ అందించగా..హర్ష ఆలపించారు. ఈ మూవీకి తమన్ సంగీతమందించారు. ఈ సినిమా అక్టోబర్ 23 నుంచి ఓటీటీలో ప్రసారం కానుంది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. -
స్వల్ప యాంటీబయాటిక్ చికిత్సతోనే నవజాత ఇన్ఫెక్షన్లు నయం
హైదరాబాద్: స్వల్పకాలిక యాంటీబయాటిక్ చికిత్సలతోనే నవజాత శిశువుల్లో ఇన్ఫెక్షన్లను నయం చేయొచ్చని శిశు వైద్య నిపుణులు చేసిన తాజా అధ్యయనంలో వెల్లడైంది. హైదరాబాద్ ఫెర్నాండెజ్ హాస్పిటల్‌కి చెందిన డా. సాయికిరణ్.డితో సహా భారతీయ నియోనాటాలజీ నిపుణుల బృందం ప్రముఖ జర్నల్ ‘లాన్సెట్ క్లినికల్ మెడిసిన్’లో కీలక అధ్యయనాన్ని ప్రచురించింది. సాధారణంగా తీవ్రమైన నవజాత ఇన్ఫెక్షన్లకు 10–14 రోజుల యాంటీబయాటిక్ చికిత్సలు చేయాల్సి ఉంటుంది. కానీ వీటిలో చాలావాటిని 7 రోజుల స్వల్ప కాలిక చికిత్సలతోనే నయం చేయొచ్చని ఈ అధ్యయనంలో తేల్చారు.అధికంగా లేదా ఎక్కువకాలం యాంటీబయాటిక్స్ వాడకం ద్వారా వ్యాధికారక బ్యాక్టీరియా ప్రతిరోధకత పెరగడంతోపాటు దీర్ఘకాలం ఆసుపత్రిలో ఉండాల్సి రావడం, దీంతో ఖర్చులు పెరగడం వంటి సమస్యలు ఏర్పడుతున్నాయి. ప్రత్యేకంగా అకాల లేదా అనారోగ్యంతో జన్మించిన శిశువులు ఎక్కువగా యాంటీబయాటిక్స్‌కు లోనవుతున్నారు.శిశువుల ఇన్ఫెక్షన్లపై స్వల్ప కాలిక, దీర్ఘకాలిక యాంటీబయాటిక్ చికిత్సల ప్రభావాన్ని ఈ అధ్యయనంలో విశ్లేషించారు. ముఖ్యంగా “బయోమార్కర్స్” ఆధారంగా చికిత్స కొనసాగింపును నిర్ణయించడం మెరుగైన ఫలితాలను ఇచ్చిందని పేర్కొన్నారు. రక్త పరీక్షల ద్వారా సంక్రమణ తగ్గుతుందా లేదా అన్న విషయాన్ని గమనించి, అవసరమైనప్పుడు చికిత్స ఆపడం సాధ్యమవుతుంది.అధ్యయన ఫలితాల్లో కీలకాంశాలు10–14 రోజుల చికిత్సల స్థానంలో 7 రోజుల స్వల్పకాలిక చికిత్స చాలా సందర్భాల్లో సరిపోతుందని తేలింది.“బయోమార్కర్” పరీక్షలు చికిత్స నిర్ణయానికి సహాయపడతాయి.అయితే 3–4 రోజుల చికిత్సకు, 5–7 రోజుల చికిత్స మధ్య తేడాపై స్పష్టమైన ఆధారాలు లేవు. ఈ అంశంలో ఇంకా పరిశోధన అవసరం.మూత్ర సంక్రమణ, మెనింజైటిస్, ఫంగల్ ఇన్ఫెక్షన్లపై మరింత స్పష్టత అవసరం. -
మళ్లీ శతక్కొట్టిన సీవీ ఆనంద్
తెలంగాణ హోం శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరి, హైదరాబాద్ నగర మాజీ పోలీస్ కమిషర్ సీవీ ఆనంద్ మంచి క్రికెటర్ అన్న విషయం మనలో చాలామందికి తెలీకపోవచ్చు.సీవీ ఆనంద్ అండర్-19 క్రికెట్లో భారత జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించారు. అలాగే అండర్-19, 22 విభాగాల్లో హైదరాబాద్ జట్టుకు కూడా ఆడారు. ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకునే రోజుల్లో చాలా టోర్నీల్లో పాల్గొన్నారు.ఇండియన్ పోలీస్ సర్వీసెస్‌కు ఎంపిక కావడంతో సీవీ ఆనంద్ క్రికెటింగ్ కెరీర్‌కు బ్రేక్ పడింది. అయినా వీలు చిక్కినప్పుడల్లా క్రికెట్ ఆడుతుంటారు.తాజాగా సీవీ ఆనంద్ హెచ్‌సీఏ ‘సి’ డివిజన్ వన్డే లీగ్ ఛాంపియన్‌షిప్‌లో సికింద్రబాద్ క్లబ్‌కు ఆడుతూ మెరుపు సెంచరీ చేశారు. వారం రోజుల వ్యవధిలో అతనికి ఇది రెండో సెంచరీ.గత ఆదివారం బేగంపేటలో హెచ్‌పీఎస్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 89 బంతుల్లో 111 పరుగులు చేసిన ఆనంద్.. తాజాగా సికింద్రబాద్ క్లబ్లో తారకరామ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 94 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 108 పరుగులు చేశారు.ఈ మ్యాచ్‌లో సికింద్రబాద్ క్లబ్ జట్టు 36 పరుగుల తేడాతో తారకరామ జట్టుపై గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన సికింద్రబాద్.. సీవీ ఆనంద్ శతక్కొట్టడంతో 35 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 270 పరగులు చేసింది. ఛేదనకు దిగిన తారకరామ జట్టు 34.3 ఓవర్లలో 225 పరుగులకు ఆలౌటైంది. -
పారా త్రోబాల్ ప్లేయర్‌కు రామన్న భరోసా..!
రాజన్న సిరిసిల్ల జిల్లా, చంద్రంపేట గ్రామానికి చెందిన పారా త్రోబాల్ ప్లేయర్ మిట్టపల్లి అర్చన, స్వతహాగా ఎదిగి ఖేలో ఇండియా, నేషనల్ లెవెల్ పారా త్రోబాల్ స్థాయిలో సత్తా చాటి ఇప్పుడు ఇండియా తరపున తెలంగాణ నుంచి శ్రీలంకలో పారా త్రోబాల్ ఆడడానికి అర్హత సాధించారు.పేద కుటుంబానికి చెందిన అర్చనకు చిన్నతనం నుంచే క్రీడలంటే ఆసక్తి. అద్దె ఇంట్లో ఇద్దరు పిల్లలను పోషించుకుంటూ తనకు ఇష్టమైన ఆటలో గెలుపే లక్ష్యంగా కృషిచేస్తున్నారు.ఆమె కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉండడం సోషల్ మీడియా ద్వారా తెల్సుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. తనకు భరోసా ఇచ్చి క్రీడా పరికరాలు, ఆర్ధిక సహాయం చేసి మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నారని అంటున్నారు పారా త్రోబాల్ ప్లేయర్ మిట్టపల్లి అర్చన. ఈ విషయాన్ని ‘ఎక్స్’లో బీఆర్ఎస్ పార్టీ స్పష్టం చేసింది. ‘రామన్న అంటేనే ఒక భరోసా.. సామాన్యులకు కొండంత అండ’ అని బీఆర్ఎస్ పేర్కొంది. రామన్న భరోసా ❤️అన్నా అంటే చాలు.. నేనున్నానంటూ భుజం తట్టి ప్రోత్సాహిస్తాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా, చంద్రంపేట గ్రామానికి చెందిన పారా త్రోబాల్ ప్లేయర్ మిట్టపల్లి అర్చన, స్వతహాగా ఎదిగి ఖేలో ఇండియా, నేషనల్ లెవెల్ పారా త్రోబాల్ స్థాయిలో సత్తా చాటి ఇప్పుడు ఇండియా తరపున తెలంగాణ… https://t.co/Vjzaimft7r pic.twitter.com/mrI21wBFNe— BRS Party (@BRSparty) October 19, 2025 -
‘ఒక్క డీఏ ప్రకటించి పండగ చేసుకోమంటున్నారు’
కాకినాడ: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులను డీఏ పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మోసం చేశారని ఉత్తరాంధ్ర జిల్లాల వైఎస్సార్సీపీ కో ఆర్డినేటర్ కురసాల కన్నబాబు విమర్శించారు. ఉద్యోగులకు డీఏ పేరుతో ప్రచారం సాగిందని, అయితే చివరకు ఒక్క డీఏని ప్రకటించి పండుగ చేసుకోమంటున్నారని కురసాల మండిపడ్డారు. ‘ఉద్యోగులను కూడా చంద్రబాబు మోసం చేశారు. ఒక్క డిఎ ప్రకటించారు. దీంతో పండుగ చేసుకోమంటున్నారు.లెక్కప్రకారం నాలుగు డీఏలు ఇవ్వాలి,. ఒక్కసారి క్షేత్ర స్ధాయిలోకి వచ్చి ఉద్యోగులతో మాట్లాడితే తెలుస్తోంది. రైతులకు పెట్టుబడి సాయం అందించడంలో మోసం చేసి ముంచేశాడు. ఫీజు రియింబర్మెంట్ చెల్లించకుండా విద్యార్ధులను మోసం చేశాడు. వైఎస్ జగన్ తీసుకువచ్చిన నాడు-నేడును చంద్రబాబు నీరుగార్చేశారు. వారం రోజులుగా ఆరోగ్య శ్రీ సేవలను బంద్ చేశారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలల్ని ప్రైవేటీకరణ చేస్తున్నారు. పీహెచ్సీ వైద్యులు సమ్మె చేస్తున్నా...వారితో చర్చించేందుకు ప్రభుత్వం ముందుకు రావాడం లేదు. చంద్రబాబు మారేడేమో అని ఉద్యోగులు అనుకున్నారు. ఉద్యోగుల డిఎ విషయంలో పెద్ద హైడ్రామా చేసే ప్రభుత్వం ఏదీ ఉండదేమో.. 16 నెలల్లో జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఉద్యోగులకు మేలు చేసే ఒక్క నిర్ణయం తీసుకోలేదు. మసిబూసి మారేడు కాయ చేసి రాష్ట్రంలో ఏదో గొప్పగా జరిగిపోతుందని ప్రచారం చేసుకుంటున్నారు. ఓపిఎస్ నే అమలు చేస్తానని చంద్రబాబు గతంలో చెప్పారు. ఇప్పుడు ఈ విషయం సుప్రీంకోర్టు లో ఉందంటున్నారు. ఇప్పటి వరకు ఉద్యోగులకు ఏలాంటి అలవెన్సులు,బకాయిలు చెల్లించారు.పెన్షనర్ల కోసం ఒక కార్పోరేషన్ ఏర్పాటు చేస్తామన్న చంద్రబాబు.. ఆ కార్పోరేషన్ ఎక్కడ ఏర్పాటు చేశారు. ఉద్యోగ.ఉపాధ్య వర్గాలు ఆగ్రహంగా ఉన్నాయని... ఉద్యోగ సంఘాలను పిలిచి ఒక్క డిఎతో మమ అనిపించారు కూటమీ పాలనలో ఉద్యోగం ఉన్నవాడు..ఉద్యోగం లేని వాడు సంతోషంగా లేడు. 2.70 లక్షల వాలంటీర్లను పది వేలు ఇస్తానని మోసం చేశారు.ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం వల్ల ఖర్చు పెరిగిపోయిందని చంద్రబాబు మాట్లాడుతున్నారు. బేవరేజెస్లో 18 వేల ఉద్యోగులను తొలగించారు. ఫైబర్ నెట్ లో 2 వేల మంది ఉద్యోగులను తొలగించారు. ఎండియూ వాహనాల వ్యవస్థను రద్దు చేసి ఆనందం పొందుతున్నారు. ఆబ్కాస్ను రద్దు చేసే కార్యక్రమం చేస్తున్నారు.. చివరకు సచివాల ఉద్యోగులను కూడా మోసం చేశారు. చంద్రబాబు గతంలో బకాయిలు పెట్టిన రెండు డిఎలను వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెల్లించారు. ఆఖ వర్కర్లు, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు పెంచారు. వైఎస్ జగన్ వ్యవస్ధలను విస్తృత పరిచారు. ఉద్యోగులకు బకాయిలను మనస్పూర్తిగా చెల్లించేందుకు వైఎస్ జగన్ ప్రయత్నించారు.’ అని కురసాల తెలిపారు.ఇదీ చదవండి:‘లై డిటెక్టర్ టెస్టుకు సిద్ధం.. ఎక్కడికి రమ్మన్నా వస్తా -
తెలుగు ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు: వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: దీపావళిని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికి వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారాయన.‘ప్రతి ఇంటా దీపాలు వెలగాలి. ఆనందాలు వెల్లువలా పొంగాలి’.వెలుగుల పండుగ దీపావళి తెలుగువారి జీవితాల్లో వేల కాంతులు నింపాలని కోరుకుంటున్నాను. దీపావళి సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ శుభాకాంక్షలు. దీపావళి అంటేనే కాంతి, వెలుగుతో పాటు, చీకటిపై వెలుగు, చెడుపై మంచి, అజ్ఞానంపై జ్ఞానం, దుష్టశక్తులపై దైవశక్తి .. సాధించిన విజయాలకు ప్రతీకగా జరుపుకునే పండుగ. ఈ దీపావళి పండుగ, ప్రజలందరి జీవితాల్లో ఆనంద కాంతులు నింపాలి. తెలుగు ప్రజలందరికీ సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు, విజయాలు కలగాలని, దివ్వెల వెలుగులలో ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో విరాజిల్లాలని కోరుకుంటున్నా. చీకటిని జయించిన వెలుగుల పండుగ దీపావళి. అజ్ఞానంపై జ్ఞానం, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే ఈ దీపావళి పండుగ అందరి జీవితాల్లో మరిన్ని వెలుగులు తీసుకురావాలని కోరుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ దీపావళి శుభాకాంక్షలు అని ట్విట్టర్ వేదికగా పోస్టు పెట్టారు. చీకటిని జయించిన వెలుగుల పండుగ దీపావళి. అజ్ఞానంపై జ్ఞానం, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే ఈ దీపావళి పండుగ అందరి జీవితాల్లో మరిన్ని వెలుగులు తీసుకురావాలని కోరుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ దీపావళి శుభాకాంక్షలు.#Deepavali— YS Jagan Mohan Reddy (@ysjagan) October 20, 2025 -
శతక్కొట్టిన హీథర్ నైట్.. టీమిండియా ముందు భారీ లక్ష్యం
మహిళల వన్డే ప్రపంచకప్‌లో (Women's CWC 2025) ఇవాళ (అక్టోబర్ 19) భారత్, ఇంగ్లండ్ జట్లు (india vs England) తలపడుతున్నాయి. ఇండోర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ చేసింది. వన్ డౌన్ బ్యాటర్ హీథర్ నైట్ (Heather Knight) (91 బంతుల్లో 109; 15 ఫోర్లు, సిక్స్) మెరుపు సెంచరీతో చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. నైట్‌తో పాటు ఓపెనర్ యామీ జోన్స్ (56) రాణించింది. కెప్టెన్ నాట్ సీవర్ బ్రంట్ (38) పర్వాలేదనిపించింది. మరో ఓపెనర్ ట్యామీ బేమౌంట్ 22, సోఫీ డంక్లీ 11, అలైస్ క్యాప్సీ 2, సోఫీ ఎక్లెస్టోన్ 3 పరుగులు చేశారు. ఛార్లోట్ డీన్ (19), లిన్సే స్మిత్ (0) నాటౌట్‌గా నిలిచారు. భారత బౌలర్లలో దీప్తి శర్మ 4 వికెట్లు పడగొట్టగా.. శ్రీ చరణి 2 వికెట్లు తీసింది.ప్రస్తుత ప్రపంచకప్‌లో హీథర్ నైట్ చేసిన సెంచరీ ఎనిదవది. ఆమె తన 300వ అంతర్జాతీయ మ్యాచ్‌లో మూడంకెల మార్కును చేరుకుంది. హీథర్‌కు ముందు ప్రస్తుత ప్రపంచకప్‌లో అలైస్సా హీలీ 2 సెంచరీలు, సోఫీ డివైన్, నాట్ సీవర్ బ్రంట్, ఆష్లే గార్డ్నర్, తజ్మిన్ బ్రిట్స్, బెత్ మూనీ తలో సెంచరీలు చేశాడు.కాగా, ప్రస్తుత ఎడిషన్‌లో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా ఇదివరకే సెమీస్‌కు అర్హత సాధించాయి. భారత్‌తో మ్యాచ్‌లో గెలిస్తే ఇంగ్లండ్ కూడా సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంటుంది. ప్రస్తుతం ఆ జట్టు పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. మరోవైపు సెమీస్ బెర్త్ ఖరారు చేసుకునే విషయంలో భారత్‌కు కూడా ఈ మ్యాచ్ చాలా కీలకం. భారత్ ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో రెండింట ఓడి నాలుగో స్థానంలో ఉంది. చదవండి: బ్యాటర్ల వైఫల్యం.. ఆసీస్ చేతిలో చిత్తైన టీమిండియా -
రెట్టింపైన ఐడీబీఐ బ్యాంకు లాభం
నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ(ఎన్ఎస్డీఎల్)లో వాటా విక్రయం ద్వారా వచి్చన లాభంతో కలుపుకొని, ఐడీబీఐ బ్యాంకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెపె్టంబర్ త్రైమాసికంలో రూ.3,627 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. ఎన్ఎస్డీఎల్ పబ్లిక్ ఇష్యూలో భాగంగా 2.22 కోట్ల ఈక్విటీలు(11.11% వాటాకు సమానం) జారీ చేసి రూ.1,698.96 కోట్లు ఆర్జించినట్లు బ్యాంకు ఎక్స్ఛేంజీలకు సమాచారం ఇచ్చింది.గత ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్లో ఆర్జించిన రూ.1,836 కోట్ల నికర లాభంతో పోలిస్తే ఇది రెట్టింపు. ఇదే క్యూ2లో నిర్వహణ లాభం 17% వృద్ధి చెంది రూ.3,006 కోట్ల నుంచి రూ.3,523 కోట్లకు చేరింది. నికర వడ్డీ ఆదాయం రూ.3,875 కోట్ల నుంచి రూ.3,285 కోట్లకు దిగివచ్చింది. స్థూల ఎన్పీఏ రేషియో 3.68% నుంచి 2.65 శాతానికి మెరుగుపడింది.నికర ఎన్పీఏ స్వల్పంగా 0.20% నుంచి 0.21 శాతానికి పెరిగింది. మొత్తం వ్యాపార వార్షిక వృద్ధి 12% పెరిగి రూ.5,33,730 కోట్లకు చేరింది. సెపె్టంబర్ 30 నాటికి బ్యాంకు మొత్తం డిపాజిట్ల విలువ రూ.3 లక్షల కోట్లకు చేరుకుంది. కరెంట్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్స్ రూ.1,39,036 కోట్లుగా, కాసా రేషియో 45.81% నమోదైందని పేర్కొంది. -
లగ్జరీ కారు కొన్న కమెడియన్.. దివాళీ గిఫ్ట్ అంటూ పోస్ట్
ప్రముఖ స్టాండ్-అప్ కమెడియన్, యూట్యూబర్ సమయ్ రైనా లగ్జరీ కారును కొనుగోలు చేశారు. దాదాపు రూ.కోటి 30 లక్షల విలువైన టయోటా కారును తనకు తానే గిఫ్ట్‌గా ఇచ్చుకున్నాడు. ఈ దిపావళికి సరికొత్త బహుమతిని ఇంటికి తీసుకెళ్లాడు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కొత్త కారుతో దిగిన ఫోటోలను తన తల్లిదండ్రులతో కలిసి ఇన్‌స్టా స్టోరీస్‌లో పంచుకున్నారు. కొద్ది రోజుల క్రితమే బాలీవుడ్ భామ కృతి సనన్ కూడా ఇదే కారును కొనుగోలు చేశారు. పలువురు బాలీవుడ్ అగ్రతారలు సైతం ఈ ఖరీదైన కారును కొన్నారు.అయితే ఈ ఏడాది ప్రారంభంలో సమయ్ రైనా తన యూట్యూబ్ షోలో ఇండియాస్ గాట్ లాటెంట్పై వివాదం మొదలైంది. ఈ వివాదం తర్వాత అతనిపై కేసులు కూడా నమోదయ్యాయి. అంతేకాకుండా ఇండియాస్ గాట్ లాటెంట్ ఎపిసోడ్లను తన యూట్యూబ్ నుంచి తొలగించారు. వివాదం జరిగిన కొన్ని నెలల తర్వాత సమయ్ రైనా భారత్‌లో ప్రదర్శనలు ఇచ్చాడు. ఈ ఏడాది ఆగస్టు 15న బెంగళూరులో మొదలైన ప్రదర్శన ముంబయి, కోల్‌కతా, చెన్నై, పూణే, ఢిల్లీ లాంటి నగరాల్లో తన షోలు నిర్వహించాడు. -
టీమిండియా జైత్రయాత్రకు బ్రేక్.. కోహ్లి సరసన గిల్
వన్డే క్రికెట్లో టీమిండియా (Team India) జైత్రయాత్రకు బ్రేక్ పడింది. ఈ ఏడాది రోహిత్ శర్మ సారథ్యంలో వరుసగా 8 మ్యాచ్‌ల్లో గెలిచిన భారత జట్టు.. శుభ్‌మన్ గిల్ (Shubman Gill) నేతృత్వంలో తొలి పరాజయాన్ని ఎదుర్కొంది.పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో (India vs Australia) భారత్ 7 వికెట్ల తేడాతో (డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో) ఓటమిపాలైంది. వన్డేల్లో దాదాపుగా రెండేళ్ల తర్వాత భారత్‌కు ఇది తొలి పరాజయం. భారత్ చివరిగా 2023 డిసెంబర్ 19న సౌతాఫ్రికా చేతిలో ఓడింది.లేట్‌గా పలకరించిన పరాజయంఈ ఏడాది వన్డేల్లో భారత్‌ను పరాజయం చాలా లేట్‌గా పలకరించింది. 1991 తర్వాత ఓ ఏడాది అత్యంత లేట్‌గా పలకరించిన పరాజయం ఇది. నాడు భారత్‌కు తొలి వన్డే పరాజయం అక్టోబర్ 23న ఎదురైంది.టీమిండియా జైత్రయాత్రకు బ్రేక్ వేసిన గిల్వన్డేల్టో టీమిండియా జైత్రయాత్రకు శుభ్‌మన్ గిల్ బ్రేక్‌లు వేశాడు. భారత వన్డే జట్టుకు రెగ్యులర్ కెప్టెన్‌గా గిల్ తన ప్రయాణాన్ని ఓటమితో ప్రారంభించాడు.కోహ్లి సరసన గిల్ఈ ఓటమితో గిల్ మరో అప్రతిష్టను కూడా మూటగట్టుకున్నాడు. విరాట్ కోహ్లి తర్వాత మూడు ఫార్మాట్లలో తొలి మ్యాచ్‌లో ఓటమిపాలైన భారత కెప్టెన్‌గా చెత్త రికార్డును సొంతం చేసుకున్నాడు.మ్యాచ్ విషయానికొస్తే.. పెర్త్‌లో కొత్తగా నిర్మించిన ఓపస్ స్టేడియంలో ఆస్ట్రేలియా బోణీ కొట్టింది. వర్షం అంతరాయాల నడుమ 26 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో భారత్ తొలుత బ్యాటింగ్ చేసి 136 పరుగులకే పరిమితమైంది. అనంతరం ఆసీస్ 21.1 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. మిచెల్ మార్ష్ (46 నాటౌట్) ఆసీస్‌ను విజయతీరాలకు చేర్చాడు. భారత్ తరఫున కేఎల్ రాహుల్ (38) టాప్ స్కోరర్‌గా నిలువగా.. ఆఖర్లో అరంగేట్రం ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి (19 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.నాలుగు నెలల విరామం తర్వాత (ఛాంపియన్స్ ట్రోఫీ) రీఎంట్రీ ఇచ్చిన రోహిత్ శర్మ (8), విరాట్ కోహ్లి (0) ఈ మ్యాచ్‌లో దారుణంగా విఫలమయ్యారు. ఫుల్‌టైమ్ వన్డే కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ (10) కూడా తొలి మ్యాచ్‌లో నిరాశపరిచాడు.ఆసీస్ బౌలర్లలో జోష్ హాజిల్‌వుడ్, మిచెల్ ఓవెన్, కుహ్నేమన్ తలో 2 వికెట్లు తీయగా.. స్టార్క్, ఎల్లిస్ చెరో వికెట్ పడగొట్టారు. ఈ సిరీస్‌లో రెండో వన్డే అక్టోబర్ 23న అడిలైడ్ వేదికగా జరుగనుంది. కాగా, భారత జట్టు 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్, 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.చదవండి: Test Twenty: క్రికెట్లో సరికొత్త ఫార్మాట్.. వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభం -
ఫ్రాన్స్‌లో భారీ చోరీ
పారిస్: ఫ్రెంచ్ ్రౖఫైస్ దుంపల వేపుడును తినాలన్నా ఏడెనిమిది నిమిషాలు పడుతుంది. అంతకంటే తక్కువగా అంటే కేవలం నాలుగు నిమిషాల్లోనే చోరశిఖామణులు వెలకట్టలేని చారిత్రక వజ్రాభరణాలను దొంగలించిన ఉదంతం ఫ్రాన్స్‌లో జరిగింది. పారిస్ నగరంలో ప్రపంచ ప్రఖ్యాత లౌరీ మ్యూజియంలో ఆదివారం ఉదయం భారీ చోరీ చోటుచేసుకుంది. నెపోలియన్ చక్రవర్తి, రాణి సేకరించిన అరుదైన, పురాతన వజ్రాభరణాలను దొంగలు అలవోకగా కాజేసి ఎంచక్కా బైక్‌లపై ఉడాయించిన ఉదంతం ఇప్పుడు ఫ్రాన్స్‌సహా యూరప్ దేశాల్లో చర్చనీయాంశమైంది. విశ్వవిఖ్యాత లియోనార్డో డావిన్సీ ‘మోనాలిసా’ చిత్రరాజం సైతం ఇదే మ్యూజియంలో కొలువై రోజూ వేలాది మంది ప్రపంచపర్యాటకులను ఆకర్షిస్తున్న విషయం తెల్సిందే. వందేళ్ల క్రితం ఇదే మ్యూజియంలో ఇదే మోనాలిసా పెయింటింగ్ సైతం చోరీకి గురై రెండేళ్ల తర్వాత ఎట్టకేలకు దొరికింది. ఇప్పుడు ఆదివారం చోరీకి గురైన అత్యంత విలువైన వజ్రాభరణాలు ఎప్పుడు దొరుకుతాయో, అసలు దొరుకుతాయో లేదోనన్న చర్చ ఇప్పుడు ఫ్రాన్స్‌లో ఎక్కువైంది. మ్యూజియం తలపులు తెరచిన అరగంట తర్వాత ఈ చోరీ జరగడం గమనార్హం. అపోలో గ్యాలరీలోకి ఇంకా ఎవరూ రాకముందే ఈ చోరీ జరిగినట్లు తెలుస్తోంది.బాస్కెట్ లిఫ్ట్‌తో వచ్చి, కట్టర్‌తో కత్తిరించి..దొంగలు పక్కా ప్రణాళికతో వచ్చి దొంగతనం చేసినట్లు స్పష్టమవుతోంది. ఎక్కడా ఎలాంటి అనుమానం రాకుండా చడీచప్పుడులేకుండా తమ పని కానిచ్చేశారు. ఫ్రెంచ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ముగ్గురు లేదా నలుగురు ముసుగు ధరించిన వ్యక్తులు ఈ చోరీ చేశారు. మ్యూజియంకు కుడివైపున ‘సీన్’ నది ప్రవహిస్తోంది. అటువైపు మ్యూజియం గోడ వద్ద మరమ్మతులు జరుగుతున్నాయి. అదే ప్రాంతాన్ని దొంగలు తమకు అనువుగా మలచుకున్నారు. వీధుల్లో ఎత్తయిన వీధిలైట్లను మార్చేందుకు వాడే ‘బాస్కెట్’ హైడ్రాలిక్ లిఫ్ట్ సాయంతో పైకి వచ్చి ఉదయం 9.30 గంటలప్పుడు మ్యూజియం భారీ కిటికీ వద్దకు చేరుకున్నారు. వెంట తెచ్చుకున్న పదునైన రంపపు కోత మెషీన్లతో దానిని పరపరా కోసేశారు. తర్వాత నేరుగా డెనన్ వింగ్ విభాగం హాల్లో ఉన్న అపోలో గ్యాలరీలోకి ప్రవేశించారు. ఈ గ్యాలరీలో సాధారణంగా ఫ్రాన్స్ చక్రవర్తుల సంబంధిత 23 కిరీటాలు, ఆభరణాలను ప్రదర్శనకు ఉంచుతారు. అందులోనే నెపోలియన్–3 రాజు, రాణిలకు సంబంధించిన వజ్రా భరణాలు ఉన్నాయి. ప్రదర్శన పేటికలను బద్దలు కొట్టి వీటిల్లో తొమ్మిదింటిని దొంగలు ఎత్తుకెళ్లారు. అయితే వాటిల్లో రాణి యుజెనీకి చెందిన ఒక కిరీటంలోంచి విరిగిపడిన కొన్ని ముక్కలు మాత్రం మ్యూజియం ఆవరణలో కనిపించాయి. వీటిని పోలీసులు స్వాధీనంచేసుకున్నారు. మ్యూజియం వెబ్సైట్లో పేర్కొన్న ప్రకారం ఈ స్వర్ణకిరీటంలో 1,354 చిన్న వజ్రాలు, 56 మరకతమణులు పొదిగి ఉన్నాయి.ప్రపంచంలో అతిపెద్ద మ్యూజియంవిస్తీర్ణంపరంగా లౌరీ మ్యూజియం ప్రపంచంలోనే అతిపెద్దది. 73,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో అంటే ఏకంగా 10 ఫుట్‌బాల్ స్టేడియాల విస్తీర్ణంలో ఈ మ్యూజియం ఉంటుంది. ఏకంగా 35,000 పురాతన వస్తువులను ఇందులో ప్రదర్శిస్తారు. ప్రపంచంలో అత్యంత సందర్శకుల రద్దీ ఉన్న మ్యూజియం కూడా ఇదే.ఇంటిదొంగల పనా?మ్యూజియంలోని ఉద్యోగుల పాత్ర ఏదైనా ఉందా అనే కోణంలోనూ దర్యాప్తు జరుగుతోంది. దొంగలు ఉపయోగించిన బాస్కెట్ లిఫ్ట్‌ను పారిస్‌లో సర్వసాధారణంగా వాడతారు. అపార్ట్మెంట్లలో మూడు, నాలుగు అంతస్తుల ఫ్లాట్లలోకి ఫర్నీచర్‌ను తరలించేందుకు దీనినే వాడతారు. ఈ హైడ్రాలిక్ నిచ్చెనను చెర్రీ పికర్ అని కూడా పిలుస్తారు. ఇది అక్కడ ఉండటంతో అటుగా వెళ్లేవాళ్లకు ఎలాంటి అనుమానం రాలే దని తెలుస్తోంది. అపోలో గ్యాలరీలో అత్యంత విలువైన రీజెంట్, సాన్సీ, హోర్టెన్సియా వజ్రాలను సైతం ప్రదర్శనకు ఉంచారు. ఇవి చోరీకి గురయ్యాయో లేదో తెలియరాలేదు. ఇది మాత్రమేకాదు ప్రాన్స్‌లో మ్యూజియంలలో చోరీలు ఇటీవల కాలంలో ఎక్కువయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లో పురాతన వస్తువులకు విపరీతమైన డిమాండ్ పెరగడంతో వాటి కోసం దొంగలు మ్యూజియంలపై పడుతున్నారు. ఇదీ చదవండి:హమాస్ మరో డేంజర్ ప్లాన్.. అమెరికా సీరియస్ వార్నింగ్ -
జియో ఫైనాన్షియల్ లాభం అంతంతే..!
జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ (ముకేశ్ అంబానీకి చెందిన) సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికానికి (2025–26లో క్యూ2) రూ. 695 కోట్ల కన్సాలిడేటెడ్ లాభాన్ని ప్రకటించింది. క్రితం ఆర్థిక సంవత్స రం ఇదే త్రైమాసికంలో లాభం రూ. 689 కోట్లతో పోల్చితే 0.9% పెరిగింది.క్యూ2లో మొత్తం ఆదాయం రూ.981 కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో ఆదాయం రూ. 694 కోట్లు గా ఉంది. అంటే ఆదా యం 40% వృద్ధి చెందింది. వడ్డీ ఆదా యం దాదాపు రెట్టింపు రూ.392 కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో వడ్డీ ఆదాయం రూ.205 కోట్లుగానే ఉంది.ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్.. ఫర్వాలేదు ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో (2025–26 క్యూ2) రూ.561 కోట్ల లాభాన్ని ప్రకటించింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో లాభం రూ.571 కోట్లతో పోల్చి చూస్తే 2 శాతం తగ్గింది. ఆదాయం ఇదే కాలంలో 9 శాతం వృద్ధితో రూ.2,857 కోట్లుగా నమోదైంది. ప్రధానంగా వ్యయాలు 11 శాతం ఎగసి రూ.1,647 కోట్లకు చేరడం లాభాలపై ప్రభావం చూపించింది.వసూలు కాని మొండి రుణాలకు (ఎన్పీఏలు) చేసిన కేటాయింపులు 29 శాతం పెరిగి రూ.481 కోట్లుగా ఉన్నాయి. క్యూ2లో డిపాజిట్లు 21 శాతం పరిగి రూ.1.32 లక్షల కోట్లకు చేరాయి. సంజయ్ అగర్వాల్‌ను ఎండీ, సీఈవోగా మరో మూడేళ్ల కాలానికి కొనసాగించాలని బోర్డు నిర్ణయించింది. వాటాదారులు, ఆర్బీఐ ఆమోదం తెలిపితే 2026 ఏప్రిల్ 19 నుంచి 2029 ఏప్రిల్ 18 వరకు ఎండీ, సీఈవోగా కొనసాగేందుకు అవకాశం ఉంటుంది. -
రెండో వారంలోకి అడుగుపెట్టిన ‘అరి’.. థియేటర్ లో దర్శకుడు !
‘పేపర్‌బాయ్’ ఫేం జయశంకర్ దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ‘అరి’. వినోద్ వర్మ, అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్, వైవా హర్ష కీలక పాత్రల్లో నటించారు. ఈ నెల 10న ఈ చిత్రం ఏసియన్ సురేష్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా రిలీజైన సంగతి తెలిసిందే. రెండు వారాలుగా థియేటర్స్‌లో రన్ అవుతూనే ఉంది. దీపావళి సందర్భంగా నాలుగు కొత్త చిత్రాలు (మిత్ర మండలి, డ్యూడ్, తెలుసు కదా, కె ర్యాంప్) బరిలోకి దిగాయి. అయినా కూడా అరి ఈ రెండో వారంలో కొనసాగుతోంది. పదో రోజు కూడా అరికి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోందని దర్శకుడు జయ శంకర్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. పదో రోజు సినిమాని వీక్షిస్తున్నట్టు జయ శంకర్ వేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.అరి కంటెంట్ బేస్డ్ మూవీ కావడంతో రెండో వారం కూడా కొనసాగించాలని మేకర్లు ఫిక్స్ అయ్యారు. అసలు ఈ మూవీ కోసం ఆర్టిస్టులంతా కలిసి ముందుకు వచ్చి ప్రమోట్ చేస్తే నెక్ట్స్ లెవెల్లో ఉండేది. ఆడియెన్స్‌లోకి మరింత ఎక్కువగా వెళ్లే అవకాశం ఉండేది. మరి ఈ రెండో వారంలోనూ అరిని మేకర్లు ప్రమోట్ చేసి ఆడియెన్స్‌లోకి మరింతగా వెళ్తారా? లేదా? అన్నది చూడాలి. View this post on Instagram A post shared by Jayashankarr (@jayashankarr_) -
‘కొత్త’ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు.. కోట్లలో జీతాలు
టెక్ రంగంలో నూతన ఉద్యోగాల కోసం పోటీ తీవ్రంగా ఉన్న ప్రస్తుత తరుణంలో ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా (Meta) తాజాగా గ్రాడ్యుయేట్లను లక్ష్యంగా చేసుకుని ఎంట్రీ లెవల్ టెక్నికల్ ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టింది. అనుభవం తక్కువగా ఉన్నప్పటికీ, అర్హత ఉన్న అభ్యర్థులకు మెటా మంచి జీతాలు, స్టాక్ ఆప్షన్లు, ఆరోగ్య ప్రయోజనాలువంటి ఆకర్షణీయమైన ప్యాకేజ్‌లను అందిస్తోంది.కావాల్సిన అర్హతలు ఇవే..మెటా ప్రస్తుతం ఫుల్-స్టాక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ (full-stack software engineers), ప్రోడక్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ (product software engineer)లాంటి ఉద్యోగాల కోసం అభ్యర్థులను నియమిస్తోంది. ఈ ఉద్యోగాలకు..కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్ లేదా అప్లైడ్ సైన్సెస్‌లో బ్యాచిలర్ డిగ్రీ తప్పనిసరి.అభ్యర్థులు గ్రాడ్యుయేషన్ సమయంలో లేదా తరువాత ఈ కిందివాటిలో కనీసం ఒకదాన్నైనా కలిగి ఉండాలి..సంబంధిత యూనివర్సిటీ కోర్సు, ఇంటర్న్‌షిప్, థీసిస్PHP, Hack, C++, Python లాంటి లాంగ్వేజెస్‌లో 12 నెలల పని అనుభవంReact వంటి ఫ్రేమ్‌వర్క్‌లో పని చేసిన అనుభవంలార్జ్ స్కేల్ స్టోరేజ్ సిస్టమ్‌లతో పని చేయగల సామర్థ్యంiOS సాఫ్ట్వేర్ ఇంజనీర్ పాత్రలకు మాత్రం అభ్యర్థులకు ఒక సంవత్సరం అనుభవం.. ముఖ్యంగా ఆబ్జెక్ట్-ఒరియెంటెడ్ ప్రోగ్రామింగ్, మల్టీ థ్రెడింగ్, Linux/Unix సిస్టమ్స్‌లో ఉండాలి.జీతం ఎంతంటే.. ఫార్చ్యూన్ నివేదిక ప్రకారం, ఈ ఎంట్రీ లెవల్ పాత్రలకు వార్షిక జీతం 176,000 డాలర్ల నుంచి 290,000 డాలర్ల వరకు ఉంటుంది. భారతీయ కరెన్సీలో చెప్పాలంటే సుమారు రూ.1.46 కోట్ల నుంచి రూ.2.41 కోట్లు అన్న మాట. జీతంతో పాటు వార్షిక బోనస్‌లు, స్టాక్ ఈక్విటీలు, ఆరోగ్య భద్రతా ప్రయోజనాలు, * ఇతర కార్మిక సంక్షేమ పథకాలు ఉంటాయి.అయితే గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఈ ఉద్యోగాలు ఆన్-సైట్ మాత్రమే. అంటే వాషింగ్టన్ లేదా కాలిఫోర్నియాలోని మెటా కార్యాలయాల్లో పని చేయాల్సి ఉంటుంది. రిమోట్ వర్క్ ఆప్షన్ ఉండదు.ఈ అవకాశాల ప్రాముఖ్యత ప్రస్తుతం చాలా కంపెనీలు నూతన గ్రాడ్యుయేట్లను నియమించుకోవడంలో జాప్యం చేస్తుండగా, మెటా మాత్రం యువ ప్రతిభను గుర్తించి, వారిని ఉద్యోగాలలో చేర్చుకోవడంలో చురుకుగా వ్యవహరిస్తోంది. ఆటోమేషన్ పెరుగుతున్న ప్రస్తుత ఉద్యోగ విపణిలో, ఇది ఒక దిగ్గజ కంపెనీ నుంచి వచ్చిన సువర్ణావకాశంగా నిలిచింది.మార్క్ జుకర్‌బర్గ్ అభ్యర్థుల్లో చూసేదిదే..మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ (Mark Zuckerberg) సాంప్రదాయ విద్యా ప్రమాణాల కంటే ప్రయోజనకర నైపుణ్యాలకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. ఆయన మాటల్లోనే.."ఒకరు ఏదైనా పనిని లోతుగా నేర్చుకొని అద్భుతంగా చేయగలరని చూపగలిగితే, వారు ఆ నైపుణ్యాన్ని ఇతర రంగాల్లో కూడా వర్తింపజేయగలరు"కాబట్టి, అభ్యర్థులు తమ అభ్యాస నైపుణ్యాలను, సమస్యలపై అవగాహనను స్పష్టంగా చూపగలగాలి. మెటా లాంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో అవకాశాలను అందుకోవాలంటే జ్ఞానం కలిగి ఉండటం ఒక్కటే సరిపోదు.. దాన్ని ప్రయోగించగలగడం ముఖ్యమైంది.ఇదీ చదవండి: ఇన్ఫోసిస్ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. చిగురించిన ఆశలు -
బ్యాటర్ల వైఫల్యం.. ఆసీస్ చేతిలో చిత్తైన టీమిండియా
ఆస్ట్రేలియా పర్యటనను టీమిండియా (Team India) ఓటమితో ప్రారంభించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా పెర్త్ వేదికగా జరిగిన తొలి వన్డేలో (India vs Australia) 7 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. వరుణుడి ఆటంకాల నడుమ సాగిన ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా (Australia) టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.వరుణుడి ఆటంకాలు.. 26 ఓవర్ల మ్యాచ్పలు అంతరాయాల తర్వాత మ్యాచ్‌ను 26 ఓవర్లకు కుదించారు. ఆసీస్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 9 వికెట్ల నష్టానికి 136 పరుగులు మాత్రమే చేయగలిగింది.ఆదుకున్న రాహుల్, అక్షర్.. నితీశ్ మెరుపులువికెట్కీపర్ కేఎల్ (38), అక్షర్ పటేల్ (31) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఆఖరి ఓవర్లో అరంగేట్రం ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి (19 నాటౌట్) రెండు సిక్సర్లు బాది గౌరవప్రదమైన స్కోర్ అందించాడు.దారుణంగా విఫలమైన రోహిత్, కోహ్లినాలుగు నెలల విరామం తర్వాత (ఛాంపియన్స్ ట్రోఫీ) రీఎంట్రీ ఇచ్చిన రోహిత్ శర్మ (8), విరాట్ కోహ్లి (0) దారుణంగా విఫలమయ్యారు. ఫుల్‌టైమ్ వన్డే కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే శుభ్‌మన్ గిల్ (10) నిరాశపరిచాడు. శ్రేయస్ అయ్యర్ (11) పరుగులు చేసేందుకు చాలా ఇబ్బంది పడ్డాడు. వాషింగ్టన్ సుందర్ 10, హర్షిత్ రాణా 1, అర్షదీప్ సింగ్ డకౌటయ్యారు. సత్తా చాటిన ఆసీస్ బౌలర్లుఆసీస్ బౌలర్లలో జోష్ హాజిల్‌వుడ్, మిచెల్ ఓవెన్, కుహ్నేమన్ తలో 2 వికెట్లు తీయగా.. స్టార్క్, ఎల్లిస్ చెరో వికెట్ పడగొట్టారు.సునాయాసంగా ఛేదించిన ఆసీస్26 ఓవర్లలో భారత్ 136 పరుగులు చేసినప్పటికీ.. డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం ఆసీస్ లక్ష్యాన్ని అన్నే ఓవర్లలో 131 పరుగులకు కుదించారు. ఆసీస్ 21.1 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. మిచెల్ మార్ష్ (46 నాటౌట్), రెన్షా (21 నాటౌట్) ఆసీస్‌ను విజయతీరాలకు చేర్చారు. ఆసీస్ ఇన్నింగ్స్‌లో ట్రవిస్ హెడ్ (8), మాథ్యూ షార్ట్ (8) విఫలం కాగా.. జోష్ ఫిలిప్ (37) పర్వాలేదనిపించాడు. భారత బౌలర్లలో అర్షదీప్, అక్షర్, సుందర్ తలో వికెట్ తీశారు.ఈ సిరీస్‌లో రెండో వన్డే అక్టోబర్ 23న అడిలైడ్ వేదికగా జరుగనుంది. కాగా, భారత జట్టు 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్, 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. చదవండి: Test Twenty: క్రికెట్లో సరికొత్త ఫార్మాట్.. వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభం -
Bomb Movie Review: రెండు ఊళ్ళను కలిపిన మరణం
ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో తమిళ చిత్రం ‘బాంబ్’ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం. ఆలోచన... ఓ అణువంత ఆలోచన కూడా పరమాణువంత ఫలితాన్ని ఇస్తుందనడంలో సందేహం లేదు. ఇక ఇదే ఆలోచనకు సృజనాత్మకత తోడైతే వెండితెరకు ప్రేక్షకులు పూర్తిగా కట్టుబడిపోతారు. అదే పంథాలో విడుదలైన సినిమా ‘బాంబ్’(Bomb Movie Review). ఈ టైటిల్ చూసి ఇదేదో ఫక్తు క్రైమ్ థ్రిల్లర్ అనుకునేరు! అస్సలు కానే కాదు. ఈ సినిమా ప్రేక్షకుడి అంచనాలకు ఏమాత్రం అందదు. అందుకే ఈ సినిమా ఆలోచన ఓ అద్భుతం. మణికందన్, అభిషేక్‌తోపాటు విశాల్ వెంకట్ అందించిన ఈ కథను విశాల్ వెంకట్ దర్శకత్వం వహించి దృశ్య కావ్యంగా మలిచిన విధానం అభినందనీయం. అంతలా ఈ ‘బాంబు’లో ఏముందో ఓసారి చూద్దాం. కాలకమ్మాయిపట్టి అనే ఊరు పెద్ద గాలివాన సమయంలో ఓ బండ పగలడం వల్ల కాలపట్టి, కమ్మాయిపట్టి అని రెండు గ్రామాలుగా విడిపోతుంది. బండ పగిలి ఒకటి చిన్న ముక్కగా, మరొకటి పెద్ద ముక్కగా... రెండు వేరు వేరు ప్రాంతాలలో పడడం వల్ల ఆ ఊరులోని జనాల మధ్య భేదాభ్రిపాయాలు రగిలి రెండు ఊళ్ళుగా విడిపోతారు. ఎంతో అన్యోన్యంగా ఉండే ఆ ఊరు ముక్కలవడంతో ఊరిలో పాటించే కట్టుబాట్లతో పాటు జరగబోయే పండగ పబ్బాలు కూడా కళ తప్పుతాయి. ఊరు కలిసున్నప్పటి నుండి ఉంటున్న కదిరవన్ అనే వ్యక్తి రెండుగా విడిపోయిన ఊరుని చూసి బాధతో ఉన్నట్టుండి చనిపోతాడు. కదిరవన్నే అంటిపెట్టుకుని ఉండే స్నేహితుడైన మణిముత్తు మాత్రం తను చనిపోలేదనే వాదిస్తుంటాడు. దానికి తోడు చనిపోయిన కదిరవన్ శరీరం నుండి అపానవాయువు వింత వింత శబ్దాలతో ఇంకా వస్తూనే ఉంటుంది. ఇంతలో కదిరవన్ శరీరాన్ని ఊరు మధ్యలో ఉన్న ఓ కుర్చీలో శవంగా కూర్చోపెడతారు. చనిపోయిన కదిరవన్ శరీరం విడిపోయిన రెండు గ్రామాలను ఎలా కలుపుతుందనేది మాత్రం ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతున్న ‘బాంబ్’ సినిమాలోనే చూడాలి. రాబోయే దీపావళికి చెవులు దద్దరిల్లే శబ్దాలతో ఎన్నో బాంబులు మన చెవులను అదరగొడతాయి. కానీ ఈ సినిమా బాంబు మాత్రం మీ అంచనాలకు అందకుండా ఆహ్లాదపరుస్తుంది. కాబట్టి మీ దీపావళి బాంబులతో పాటు ఈ ‘బాంబు’ను కూడా ఓసారి చూసేయండి. వర్త్ టు వాచ్ ఫర్ దిస్ దివాలి. – హరికృష్ణ ఇంటూరు -
కానిస్టేబుల్ హత్య కేసు నిందితుడు రియాజ్ దొరికాడు
సాక్షి.హైదరాబాద్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కానిస్టేబుల్ ప్రమోద్ను హత్య కేసు నిందితుడు దొరికినట్లు నిజామాబాద్ సీపీ చైతన్య అధికారిక ప్రకటన విడుదల చేశారు. నిందితుడు రియాజ్‌ను పోలీసులు ఎన్కౌంటర్ చేశారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. నిందితుడిపై ఎలాంటి కాల్పులు జరపలేదని స్పష్టం చేశారు. ఈ మేరకు నిజామాబాద్ పోలీసు కార్యాలయం అధికారిక ప్రకటన చేసింది. అందులో..‘నిజామాబాద్ టౌన్ 6 పోలిస్‌స్టేషన్ పరిధిలోని సారంగపూర్ ప్రాంతంలో ఆసిఫ్ అనే వ్యక్తిపై రియాజ్‌పై హత్యాయత్నానికి ప్రయత్నించాడు. ఆ సమయంలో జరిగిన పెనుగులాటలో ఆసిఫ్,రియాజ్‌లు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో ఘటనస్థలానికి చేరుకున్న పోలీసులు రియాజ్ అదుపులోకి తీసుకున్నారు. అనంతరం,అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు’ పేర్కొన్నారు. -
బిడ్డకు జన్మనిచ్చిన పరిణీతి చోప్రా.. సోషల్ మీడియాలో పోస్ట్
బాలీవుడ్ భామ పరిణితి చోప్రా (Parineeti Chopra) పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఏడాది ఆగస్టులో అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన బ్యూటీ.. ఈ దివాళీని మరింత హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోనుంది. తమకు బాబు పుట్టాడని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది ముద్దుగుమ్మ. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు, సినీతారలు విషెస్ చెబుతున్నారు. కాగా.. 2023లో పరిణీతి చోప్రా.. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దాను పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఇక సినిమాల విషయానికొస్తే గతేడాది అమర్ సింగ్ చంకీలా చిత్రంలో దిల్జీత్ దోసాంజ్ సరసన పరిణీతి చోప్రా కనిపించింది. ఈ ఏడాది కేవలం ఓ సినిమాతో పాటు వెబ్ సిరీస్‌లో మాత్రమే నటించింది. ఇటీవల పరిణితి చోప్రా ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో పాల్గొన్న తర్వాత తాను గర్భంతో ఉన్నట్లు శుభవార్తను పంచుకున్న సంగతి తెలిసిందే.(ఇది చదవండి: ప్రెగ్నెన్సీతో పరిణీతి చోప్రా.. పుట్టబోయే బిడ్డకు స్టార్ హీరోయిన్ గిఫ్ట్!)అంతేకాకుండా పరిణీతి చోప్రా ఇటీవలే తన యూట్యూబ్ ఛానెల్‌ను తిరిగి ప్రారంభించింది. ఓ వీడియోను సైతం తన ఛానెల్లో అప్లోడ్ చేసింది. బాలీవుడ్లో ఆమె నటించిన ఇష్క్ జాదే, శుద్ద్ దేశీ రొమాన్స్, మేరీ ప్యారీ బిందు, కేసరి, అమర్ సింగ్ చమ్కీలా లాంటి బాలీవుడ్ చిత్రాలు పరిణీతి చోప్రాకు మంచి పేరు తీసుకొచ్చాయి. View this post on Instagram A post shared by Raghav Chadha (@raghavchadha88) -
క్రికెట్లో సరికొత్త ఫార్మాట్.. వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభం
క్రికెట్‌కు సరికొత్త ఫార్మాట్ పరిచయం కాబోతుంది. టెస్ట్, టీ20ల కలబోతతో ఈ ఫార్మాట్‌కు టెస్ట్ ట్వంటీగా (Test Twenty) నామకరణం చేశారు. ఈ ఫార్మాట్ టెస్ట్ క్రికెట్ వ్యూహాత్మకతను, టీ20ల వేగాన్ని కలిపిన హైబ్రిడ్ ఫార్మాట్‌గా ఉండబోతుంది.దీని తొలి ఎడిషన్‌ను వచ్చే ఏడాది జనవరిలో నిర్వహించనున్నట్లు నిర్వహకులు ప్రకటించారు. ఈ ఫార్మాట్‌కు దిగ్గజాలు ఏబీ డివిలియర్స్, మాథ్యూ హేడెన్, హర్భజన్ సింగ్, సర్ క్లైవ్ లాయిడ్ మద్దతిచ్చారు. యువ ఆటగాళ్లకు టెస్ట్ క్రికెట్ పట్ల ఆసక్తి పెంచడమే లక్ష్యంగా ఈ ఫార్మాట్‌ను కనిపెట్టినట్లు నిర్వహకులు తెలిపారు. క్రికెట్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చడమే ఉద్దేశమని వారు పేర్కొన్నారు.టెస్ట్ ట్వంటీ నియమాలు.. ఈ ఫార్మాట్లో మ్యాచ్‌లు ఒకే రోజులో పూర్తవుతాయి. మ్యాచ్ మొత్తం 80 ఓవర్ల పాటు జరుగుతుంది. టెస్ట్‌ల తరహాలో రెండు ఇన్నింగ్స్‌లు ఉంటాయి. ఒక్కో ఇన్నింగ్స్‌లో ఒక్కో జట్టు 20 ఓవర్లు ఆడుతుంది. టెస్ట్‌ల తరహాలో స్కోర్ క్యారీ ఫార్వర్డ్ ఉంటుంది. రెండు ఇన్నింగ్స్‌ల స్కోర్లు కలిపి ఫలితం నిర్ణయించబడుతుంది.ఫలితాలు విజయం, ఓటమి, టై, డ్రాగా ఉంటాయి.డ్రా అయితే చివరి బంతి వరకు 5 వికెట్లు మిగిలి ఉండాలి.డ్రా అయితే సూపర్ ఓవర్ కూడా ఉంటుంది.ప్రతి మ్యాచ్‌కు ఒక్క పవర్ ప్లే ఉంటుంది.ఇందులో 4 ఓవర్లు మాత్రమే ఉంటాయి.పవర్ ప్లేను కెప్టెన్ ఎంచుకుంటాడు.మొదటి ఇన్నింగ్స్‌లో తీసుకుంటాడా లేదా రెండో ఇన్నింగ్స్‌లో తీసకుంటాడా అన్నది అతని ఛాయిస్. పవర్ ప్లేలో ఫీల్డింగ్ పరిమితులు ఉంటాయి.30-యార్డ్ సర్కిల్ వెలుపల కేవలం ఇద్దరు ఫీల్డర్లు మాత్రమే ఉంటారు.ఈ ఫార్మాట్లో ఫాలో ఆన్ నిబంధన కూడా ఉంటుంది. కనీసం 75 పరుగుల వెనకబడితేనే ఫాలో ఆన్ అమల్లోకి వస్తుంది.ఈ ఫార్మాట్లో అర్లీ కొలాప్స్ క్లాజ్ (early collapse clause) అనే సరికొత్త నిబంధన ఉండనుంది. ఈ నబంధన ప్రకారం ప్రత్యర్థిని 10 ఓవర్లలోపు ఆలౌట్ చేస్తే, వారికి అదనంగా 3 ఓవర్లు పొందే అవకాశం ఉంటుంది.ఈ ఫార్మాట్లో మ్యాచ్‌లో ఐదుగురు మాత్రమే బౌలింగ్ చేయాలి.ఒక్కో బౌలర్ గరిష్టంగా 8 ఓవర్లు వేయవచ్చు.ఆరు ఫ్రాంచైజీలు..ఈ ఫార్మాట్ తొలి ఎడిషన్‌కు ఆరు ఫ్రాంచైజీలు ఖరారైనట్లు తెలుస్తుంది. దుబాయ్, లండన్, అమెరికా దేశాల నుంచి తలో ఫ్రాంచైజీ.. భారత్ నుంచి మూడు ఫ్రాంచైజీలు ఉండనున్నట్లు సమాచారం. ఒక్కో ఫ్రాంచైజీలో 16 మంది ఆటగాళ్లు ఉంటారు. ఇందులో ఎనిమిది మంది భారతీయులు, ఎనిమిది మంది అంతర్జాతీయ ఆటగాళ్లకు అవకాశం ఉంటుంది. ఈ టోర్నీలో పాల్గొనాలనుకునే ఆటగాళ్లు అక్టోబర్ 16 నుంచి వారి పేర్లు నమోదు చేసుకుంటున్నారు. చదవండి: విరాట్ కోహ్లి డకౌట్.. చరిత్రలో తొలిసారి..! -
టీమిండియా మహిళ స్టార్ క్రికెటర్‌తో పెళ్లి.. హింట్ ఇచ్చిన దర్శకుడు
భారత మహిళల క్రికెట్ జట్టు స్టార్ క్రికెటర్ స్మృతి మందాన త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నట్లు తెలుస్తోంది. ఆమె ప్రముఖ దర్శకుడు, మ్యూజిక్ కంపోజర్‌ను పెళ్లాడనున్నట్లు సమాచారం. అయితే ఈ విషయంపై స్మృతి బాయ్‌ఫ్రెండ్‌గా భావిస్తోన్న డైరెక్టర్ పలాశ్ ముచ్చల్ క్లారిటీ ఇచ్చారు. తాజాగా ఓ ఈవెంట్‌కు హాజరైన పలాశ్ ముచ్చల్‌కు స్మృతితో పెళ్లి విషయం గురించి ప్రశ్న ఎదురైంది. ఈ ప్రశ్నకు ముచ్చల్.. ఆమె త్వరలోనే ఇండోర్‌కు కోడలిగా రానుంది.. ప్రస్తుతానికి నేను చెప్పదలచుకున్నది ఇంతే అంటూ ఆ వార్తలను ధృవీకరించారు.కాగా.. గతంలో స్మృతి మందాన, పలాష్ ముచ్చల్ సోషల్ మీడియాలో తెగ వైరలైన సంగతి తెలిసిందే. స్మృతి బర్త్ డే సందర్భంగా అతను విషెస్ తెలియజేశాడు. ఆ తర్వాత నుంచి వీరిద్దరిపై సోషల్ మీడియాలో రూమర్స్ వినిపించాయి. కానీ వీరిద్దరు తమపై వస్ుతన్న ఊహాగానాలపై స్పందించలేదు. కాగా.. పలాష్ ముచ్చల్ ప్రస్తుతం 'రాజు బజేవాలా'మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో అవికా గోర్, చందన్ రాయ్ జంటగా నటిస్తున్నారు. ముచ్చల్ తన సోదరి పాలక్ ముచ్చల్‌తో కలిసి అనేక బాలీవుడ్ చిత్రాలకు సంగీతమందించారు.తాజాగా ఇవాళ ఇంగ్లాండ్‌తో టీమిండియా తలపడుతున్న సందర్భంగా భారత మహిళా క్రికెట్ జట్టుకు ముచ్చల్ తన శుభాకాంక్షలు తెలియజేశారు. భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మందనకు నా శుభాకాంక్షలు' తెలిపారు. భారత క్రికెట్ జట్టు ప్రతి మ్యాచ్‌లో గెలిచి దేశానికి కీర్తి తీసుకురావాలని తాను ఎల్లప్పుడూ కోరుకుంటున్నానని అన్నారు. -
పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్స్‌లో బాంబు పేలుడు
సాక్షి, పార్వతీపురం మన్యం జిల్లా: పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్స్‌లో బాంబు పేలుడు కలకలం రేగింది. పార్శిల్ సర్వీస్ సెంటర్లో బాంబు పేలింది. నలుగురికి గాయాలు కాగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. విజయనగరం నుంచి పార్శిల్ వచ్చినట్లు గుర్తించారు. పేలుడు ధాటికి పార్శిల్ సర్వీస్ గోడౌన్ ధ్వంసమైంది. పార్శిల్ ప్యాకింగ్‌లు చెల్లాచెదురయ్యాయి. -
రావణుడు... మా ఊరి అల్లుడు!
దీపావళి అంటేనే సంబరాలు అంబరాన్ని అంటుతాయి. అయితే రాజస్థాన్‌లోని జోద్‌పూర్‌కు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న మండోల్లో దీపావళి రోజు దీపాలు వెలిగించడం, బాణసంచ కాల్చడం ఉండదు. నిశ్శబ్దాన్ని పాటిస్తారు. కారణం ఏమిటి? అనే విషయానికి వస్తే స్థానిక పురాణం తెలుసుకోవాల్సిందే. దీని ప్రకారం... రావణుడి భార్య మండోదరి జన్మస్థలం మండేరే. రావణుడు మండోదరిని ఈ గ్రామంలోనే వివాహం చేసుకున్నాడని నమ్ముతారు. మండేరేకి చెందిన మౌద్గిల్ బ్రాహ్మణులు తమను తాము మండోదరి కుటుంబ వారసులుగా భావిస్తారు. అందువల్ల వారు రావణుడిని రాక్షస రాజుగా కాకుండా గౌరవనీయమైన బంధువుగా చూస్తారు! (చదవండి: మధుమేహ వ్యాధిగ్రస్తులకు దీపావళి ‘స్వీట్’ వార్నింగ్..!) -
‘లై డిటెక్టర్ టెస్టుకు సిద్ధం.. ఎక్కడికి రమ్మన్నా వస్తా’
హైదరాబాద్: నకిలీ మద్యం, నకిలీ సారాలో చంద్రబాబు సర్కార్ మునిగిపోయిందని విమర్శించారు వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్. ఫేక్ ప్రభుత్వం,. ఫేక్ బాబు, ఫేక్ లోకేష్.. కట్టు కథలు, పచ్చి అబద్ధాలు ఇవే టీడీపీ ప్రభుత్వం చేస్తుందని ధ్వజమెత్తారు. ఈరోజు(ఆదివారం, అక్టోబర్ 19వ తేదీ) హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ప్రెస్మీట్లో మాట్లాడిన జోగి రమేష్.. చంద్రబాబు నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ‘బాబు చేసిన కల్తీని వైఎస్సార్సీపీపై రుద్దే యత్నం చేస్తున్నారు. ఎన్నికల ప్రచారం కోసం చేసే ఐవిఆర్ఎస్ కాల్స్ ను నకిలీ మద్యం కోసం టీడీపీ వాడుతుంది. నకిలీ మద్యం ఎక్కడ తయారయింది... ఎక్కడకు సరఫరా అయిందో ఎందుకు ఎంక్వరీ చేయడం లేదు.డైవర్షన్ కోసం చంద్రబాబు ప్రభుత్వం మాపై విమర్శలు చేస్తుంది. అద్దెపల్లి జనార్థన్‌కు రెడ్ కార్పెట్ వేసింది టీడీపీ ప్రభుత్వమే. అద్దెపల్లి జనార్థన్, టీడీపీ కుమ్మక్కయ్యాయి. ఏ విచారణకైనా సిద్ధమని చెప్పినా ప్రభుత్వం నంచి స్పందనలేదు. జైలుకు పంపించి రాక్షసానందం పొందడం బాబుకు అలవాటు. దమ్ముంటే నాకు లై డిటెక్టర్ టెస్ట్ చేయండి. ప్రభుత్వం ఎక్కడికి రమ్మన్నా.. వస్తా. ఏపీలో మంచినీటి ుకుళాయిల కన్నా.. బెల్ట్ షాపులే ఎక్కువ. నారా వారి సారా పాలనను డోర్ డెలివరీ చేస్తున్నారు’ అని మండిపడ్డారు. -
కచ్చా బాదం సింగర్ గుర్తున్నాడా? గుడిసెలో నుంచి కొత్తింట్లోకి!
ఫేమస్ అవడం ఈజీనా? ఈ ప్రశ్నకు సమాధానం లేదు. ఎందుకంటే కొందరు ఎంత కష్టపడ్డాసరే పెద్దగా గుర్తింపు అందుకోరు. మరికొందరు ఏం చేయకపోయినా సరే ఇట్టే ఫేమస్ అవుతుంటారు. అయితే ఒకటి మాత్రం నిజం! వచ్చిన ఫేమ్‌ను కాపాడుకోవడం అంత ఈజీ అయితే కాదు. అందుకే ఇండస్ట్రీకి చాలామంది తారలు వస్తుంటారు, పోతుంటారు. సోషల్ మీడియాలోనూ అంతే.. సడన్‌గా కొందరు వైరలవుతుంటారు.. అంతలోనే కనుమరుగవుతుంటారు. అలా అప్పట్లో కచ్చా బాదమ్ సింగర్ భూబన్ బద్యాకర్ బాగా పాపులర్ అయ్యాడు.పాత సామాన్లకు పల్లీలుపశ్చిమ బెంగాల్‌కు చెందిన భూబన్ (Bhuban Badyakar).. పాత సామాన్లు, పగిలిన వస్తువులకు పల్లీలు ఇస్తానంటూ వీధుల్లో తిరిగేవాడు. పాట రూపంలోనే పల్లీలు అమ్ముకున్నాడు. ఆ పాట సోషల్ మీడియాలో క్లిక్కవడంతో బాగానే డబ్బు సంపాదించాడు. ఇకపై పల్లీలు అమ్ముకోను, సింగర్‌గా కొనసాగుతా.. నా క్రేజ్ చూసి కిడ్నాప్ చేస్తారేమోనని భయంగా ఉందని పోలీసులను ఆశ్రయించాడు. అతడి బిల్డప్ చూసి అందరూ అవాక్కయ్యారు.కారు కొన్నాక యాక్సిడెంట్కొందరు విమర్శించారు కూడా! దీంతో అతడు నాలుక్కరుచుకున్నాడు. ఆర్టిస్ట్‌గా కొనసాగుతానని, అవకాశాల్లేనప్పుడు మళ్లీ పల్లీలు అమ్ముకోక ఇంకేం చేస్తానని మాట మార్చాడు. అప్పటికీ ఆగలేదు.. సంతోషం, డబ్బు రెండూ ఎక్కువైపోయేసరికి కారు కొన్నాడు. కానీ కారు నేర్చుకునే క్రమంలో యాక్సిడెంట్ అయి కొద్దిరోజులు ఆస్పత్రిపాలయ్యాడు. తర్వాత అడిగినవారికల్లా అప్పులిచ్చుకుంటూ పోయి వసూలు చేయలేకపోయాడు. కొంతకాలంగా కనిపించని సింగర్చూస్తుండగానే సంపాదించినదంతా కరిగిపోవడంతో సొంత ఊరుకు దూరంగా మళ్లీ పల్లీలు అమ్ముకోవడం మొదలుపెట్టాడు. చాలాకాలంగా మళ్లీ ఎక్కడా కనిపించలేదు. ఈ మధ్య ఓ యూట్యూబర్ పుణ్యమా అని అతడెలా ఉన్నాడో తెలిసింది. ఒకప్పుడు పూరి గుడిసెలో ఉన్న భూబన్ అదే స్థానంలో ఇల్లు కట్టుకున్నాడు. అతడు మాట్లాడుతూ.. వైరల్ సాంగ్ వల్ల నాకు బాగా సంపాదించాను. కానీ, ఆ పాట కాపీ రైట్స్ ఇప్పుడు నావి కావు, ఓ కంపెనీ సొంతం చేసుకుంది. అలా అని నా జీవితం అక్కడితో ఆగిపోలేదు.జీవితం మెరుగైందిజనాలు నన్ను గుర్తుపట్టడం మొదలుపెట్టారు. ఎక్కడికి వెళ్లినా సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఈవెంట్స్‌కు, రియాలిటీ షోలకు రమ్మని పిలుస్తున్నారు. నా జీవితం కాస్త మెరుగుపడింది. జనాలు నన్ను గౌరవిస్తున్నారు అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం భూబన్ గౌరవంగా బతుకుతున్నట్లు పేర్కొన్నాడు. అతడి ఇంట్లో అవార్డులతో పాటు భూబన్ పెయింటింగ్ ఉండటం విశేషం.చదవండి: దీపావళి సినిమాలు.. జోరు మీదున్న హీరో.. వెనకబడ్డ సిద్ధు! -
ఎవరీ పుష్పం ప్రియా చౌదరి..? రాజకీయాల్లో సరికొత్త ఫైర్ బ్రాండ్లా..
విదేశీ విద్య నేపథ్యంతో రాజకీయాల్లో సరికొత్త బ్రాండ్లా ప్రభంజనం సృష్టించాలనుకుంటోంది. మత, కులాలకు అతితంగా ఫైర్‌బ్రాండ్ పాలిటిక్స్‌తో దూసుకుపోవాలనుకుంటోంది. అంతేగాదు బిహార్ రాష్ట్రానికి సరికొత్త పాలిటిక్స్‌ని పరించయం చేస్తూ..నాయకురాలిగా పెనుమార్పుకి శ్రీకారం చుట్టాలనుకుంటోంది. ఆమె పొలిటికల్ వ్యూహం, డ్రెస్సింగ్ విధానం రాజకీయనాయకుల వేషధారణ, ఆలోచనలకే అత్యంత విరుద్ధం. గెలుస్తుందో లేదో తెలియదు గానీ..ఆమె ఆహార్యం నుంచి..రాజకీయ వ్యూహాల వరకు ప్రతీది అత్యంత విభిన్నం. యువ రాజకీయ నాయకురాలికి సీఎం రేసులో గెలిస్తే..సరికొత్త చరిత్రను క్రియేట్ చేయడమే కాదు..పాలిటిక్స్‌లో యువ సత్తా ఏంటన్నది తెలుస్తుంది. ఇంతకీ ఎవరామె..? రాజకీయాల్లో ఎలాంటి బ్రాండ్ సెట్ చేయాలనుకుంటుంది అంటే..ఆ అమ్మాయే యునైటెడ్ కింగ్డమ్ నుండి తిరిగి వచ్చిన పుష్పం ప్రియా చౌదరి. రాజకీయాల్లో పెనుమార్పు తీసుకురావాలనేది ఆమె ప్రగాఢ ఆకాంక్ష. 2020లో 'ది ప్లూరల్స్ పార్టీ'ని స్థాపించిన పుష్పం ప్రియా చౌదరి కుల, మతాలకు అతీతంగా సరికొత్త బ్రాండ్ రాజకీయాలను బిహార్ రాష్ట్రానికి పరిచయం చేయాలనుకుంటోంది. ఈ ఏడాది బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి..సరికొత్త నారీశక్తిగా ఓ వెలుగు వెలగాలనే ఉత్సాహంతో ఉంది. ఆమె బిహార్‌లోని దర్భంగా నుంచి పోటీ చేస్తోంది. ప్రియా 2020లో తన పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలోకి దిగనున్నట్లుగా మెగా అడ్వర్టైస్మెంట్ ఇచ్చి మరీ..రాజకీయల్లోకి ప్రవేశించింది. అయితే ఆమె గెలుపుని అందుకునేంత వరకు నలుపు దుస్తులు, బ్లాక్మాస్క్లోనే ఉండాలని ప్రతిజ్ఞ చేయడం విశేషం. కుటుంబ నేపథ్యం..పుష్పం ప్రియ దర్భంగాకు చెందిన మాజీ జెడీయూ శాసనసభ్యుడు వినోద్ కుమార్ చౌదరి కుమార్తె. ఆమె తాత ప్రొఫెసర్ ఉమాకాంత్ చౌదరి, ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కు సన్నిహితుడు. ఆమె మామ వినయ్ కుమార్ చౌదరి 2020 అసెంబ్లీ ఎన్నికల్లో బెనిపూర్ నుంచి గెలిచిన జేడీయూ నాయకుడు. జూన్ 13, 1987న జన్మించిన పుష్పం ప్రియ దర్బంగాలోనే తన పాఠశాల విద్యను పూర్తిచేసింది. ఆ తర్వాత యూకేలో ఉన్నత విద్యను అభ్యసించింది. 2019లో సస్సెక్స్ విశ్వవిద్యాలయం నుంచి డెవలప్మెంట్ రీసెర్చ్‌లో మాస్టర్ డిగ్రీ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి ప్రజా పరిపాలనలో మాస్టర్స్ డిగ్రీని పూర్తించేసిందామె. అతేగాదు తన పార్టీ పేరు ప్రజల సమస్యలను ప్రతిబింబిస్తుందని చెబుతోందామె. ది ప్లూరల్స్ పార్టీ అనగా అన్ని కులాల, మతాల ప్రజలు కలిసి పాలించడం అని సరికొత్త అర్థం వివరించింది. ఇంతవరకు ప్రజలు కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పదాలను ఉచ్ఛరించిలేకపోయారు. మరి ఈ పదం వారికి ఎలా అలవాటవుతుందో వేచి చూడాల్సిందేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఆ రంగు దుస్తులే ఎందుకంటే..రాజకీయ నాయకులు అనగానే తెల్లటి దుస్తులే ఎందుకు ధరిస్తారనేది తనకు అస్సలు తెలియదని అంటోంది. అయతే తాను మాత్రం నలుపు రంగు దుస్తులనే ధరిస్తానని, రాజకీయాల్లో పూర్తిస్థాయిలో విజయం సాధించే వరకు ఇలా నల్లటి దుస్తులు, ముసుగుతోనే ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. అయినా అందరి రాజకీయ నాయకులలా కాదని, తనకంటూ ఒక సిద్ధాంతం ఉందని అంటోంది. కాగా, ప్రస్తుత రాజకీయాలపై మాట్లాడుతూ..అఖిలేష్ యాదవ్ కాంగ్రెస్ అధినేత రాహుల్‌గాంధీ కంటూ తీవ్రమైన నాయకుడని అభిప్రాయం వెలిబుచ్చింది. ఇక నితీష్ కుమార్ ఇప్పటి వరకు బిహార్‌ని పాలించిన వారి జాబితాలో అత్యత్తుమ ముఖ్యమంతిగా పేర్కొనడం విశేషం. అలాగే ప్రశాంత్ కిషోర్ వ్యహకర్తగానే ఉండాలి, రాజకీయ నాయకుడిగా ఎదగాలని భావించకూడదంటూ తన అభిప్రాయాన్ని వెలిబుచ్చింది.(చదవండి: ఎందరో నరకాసురుల పాలిట సత్యభామలుగా ఆ'షీ'సర్లు..) -
ఐసీఐసీఐ బ్యాంక్ లాభం.. 3 నెలల్లో రూ. 12359 కోట్లు
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ లాభం 3.2 శాతం పెరిగి (కన్సాలిడేటెడ్) రూ. 13,357 కోట్లకు చేరింది. ప్రొవిజనింగ్ తగ్గడమనేది మార్జిన్ క్షీణత ప్రభావాలను అధిగమించేందుకు తోడ్పడింది. స్టాండెలోన్ ప్రాతిపదికన లాభం రూ. 11,746 కోట్ల నుంచి 5 శాతం వృద్ధితో రూ. 12,359 కోట్లకు చేరింది.మరోవైపు, 10.6 శాతం రుణాల వృద్ధి దన్నుతో కీలకమైన నికర వడ్డీ ఆదాయం 7.4 శాతం పెరిగి రూ. 21,529 కోట్లకు చేరింది. అయితే, నికర వడ్డీ మార్జిన్ మాత్రం 4.36 శాతం నుంచి 4.30 శాతానికి పరిమితమైంది. రాబోయే రోజుల్లో నికర వడ్డీ మార్జిన్లు స్థిర శ్రేణిలో తిరుగాడవచ్చని బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సందీప్ బాత్రా తెలిపారు.అయితే, రిజర్వ్ బ్యాంక్ గానీ నగదు నిల్వల నిష్పత్తిని తగ్గిస్తే ఇది మెరుగుపడొచ్చని, పోటీ తీవ్రత వంటి అంశాలు ప్రతికూల ప్రభావం చూపొచ్చని పేర్కొన్నారు. చిన్న వ్యాపార సంస్థల రుణాల నాణ్యత దిగజారే అవకాశాలపై స్పందిస్తూ.. బిజినెస్ బ్యాంకింగ్ సెగ్మెంట్లో రుణాల పరిస్థితి మెరుగ్గానే ఉందని బాత్రా చెప్పారు. అందుకే ఆ విభాగానికి రుణాలను పెంచుకుంటున్నట్లు తెలిపారు.ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో రిటైల్ రుణాలు సహా క్రెడిట్ వృద్ధి పుంజుకోవచ్చని అంచనా వేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. దేశీ కార్పొరేట్ల వద్ద పుష్కలంగా నిధులున్నాయని, రుణాలను సమకూర్చుకునేందుకు ఇతరత్రా మార్గాలు కూడా ఉన్నాయని బాత్రా చెప్పారు. ఆర్థిక ఫలితాల్లో ఇతర ముఖ్యాంశాలు.. క్యూ2లో వార్షిక ప్రాతిపదికన రూ. 1,233 కోట్ల నుంచి, త్రైమాసికాలవారీగా రూ. 1,815 కోట్ల నుంచి ప్రొవిజనింగ్ రూ. 914 కోట్లకు తగ్గింది. స్థూల మొండిబాకీలు (జీఎన్‌పీఏ) రూ. 5,073 కోట్ల నుంచి స్వల్పంగా రూ. 5,034 కోట్లకు తగ్గాయి. జీఎన్‌పీఏ నిష్పత్తి 1.97 శాతం నుంచి 1.67 శాతానికి తగ్గింది. డిపాజిట్ వృద్ధి 9.1 శాతంగా ఉంది. రిటైల్ రుణాలు 6.6 శాతం పెరిగాయి. మొత్తం లోన్ బుక్‌లో వీటి వాటా 52.1 శాతంగా ఉంది. బిజినెస్ బ్యాంకింగ్ పోర్ట్‌ఫోలియో 24.8 శాతం వృద్ధి చెందింది. కార్పొరేట్ రుణాలు 3.5 శాతం పెరిగాయి. క్యాపిటల్ అడెక్వసీ 17.31 శాతంగా ఉంది. ట్రెజరీ లావాదేవీలు మినహా వడ్డీయేతర ఆదాయం 13.2 శాతం పెరిగి రూ. 7,356 కోట్లుగా నమోదైంది. ట్రెజరీ ఆదాయం మాత్రం రూ. 680 కోట్ల నుంచి ఏకంగా రూ. 220 కోట్లకు పడిపోయింది. -
కోటిన్నర విలువైన కారు కొన్న ప్రముఖ బుల్లితెర నటి
ప్రముఖ బుల్లితెర నటి నియా శర్మ ఖరీదైన కారు కొనుగోలు చేసింది. తాజాగా మెర్సిడెస్-బెంజ్‌ను తన సొంతం చేసుకుంది. ఈ లగ్జరీ కారు విలువ దాదాపు రూ. 1.50 కోట్లకు పైగానే ఉన్నట్లు తెలుస్తోంది. తన కొత్త కారుకు సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ కారు కొనడంతో తన డబ్బు అంతా అయిపోయిందని.. ఇప్పుడు ఈఎంఐ మాత్రమే అందుబాటులో ఉందని నియా శర్మ ఫన్నీగా పోస్ట్ చేసింది.కాగా.. ఢిల్లీకి చెందిన నియా శర్మ పదేళ్లకు పైగా బుల్లితెర నటిగా రాణిస్తోంది. 2010లో కాళీ - ఏక్ అగ్నిపరీక్ష సీరియల్‌తో తన కెరీర్‌ను ప్రారంభించింది. ఆ తర్వాత ఏక్ హజారోన్ మే మేరీ బెహ్నా హై షో సీరియల్‌తో ఫేమస్ అయింది. అంతేకాకుండా జమై రాజా, ఇష్క్ మే మార్జావాన్, నాగిన్- 4, సుహాగన్ చుడైల్ లాంటి షోలలో కనిపించింది. ఆమె చివరిసారిగా రియాలిటీ షో లాఫర్ చెఫ్స్ సీజన్- 2లో మెరిసింది. అయితే నియా బిగ్ బాస్‌లో పాల్గొంటుందని గతంలో వార్తలొచ్చాయి. కానీ తాను బిగ్‌బాస్‌లో పాల్గొనడం లేదని సోషల్ మీడియా ద్వారా నియా స్పష్టం చేసింది. ఆమె ప్రస్తుతం ఎలాంటి సీరియల్‌ను ప్రకటించలేదు. View this post on Instagram A post shared by Nia Sharma (@niasharma90) -
విరాట్ కోహ్లి డకౌట్.. చరిత్రలో తొలిసారి..!
పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో ఇవాళ (అక్టోబర్ 19) జరుగుతున్న తొలి వన్డేలో (India Vs Australia) టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి(Virat Kohli) డకౌటయ్యాడు. 8 బంతులు ఆడి ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు. తొలి బంతి నుంచే ఇబ్బంది పడిన కోహ్లి.. మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో కూపర్ కొన్నోలీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆస్ట్రేలియా గడ్డపై వన్డేల్లో కోహ్లికి ఇది తొలి డకౌట్.ఇప్పటివరకు ఆస్ట్రేలియాలో 29 మ్యాచ్‌లు ఆడిన కోహ్లి ఐదు సెంచరీలు, 51కు పైగా సగటుతో పరుగులు చేశాడు. కానీ ఒక్కసారి కూడా డకౌట్ కాలేదు. చాలా విరామం తర్వాత భారీ అంచనాల నడుమ బరిలోకి దిగిన కోహ్లి డకౌట్ కావడంతో అతని అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.ఓవరాల్‌గా కోహ్లికి వన్డేల్లో ఇది 17వ డకౌట్. భారత్ తరఫున వన్డేల్లో అత్యధిక డకౌట్లైన రికార్డు సచిన్ టెండూల్కర్ (20) పేరిట ఉంది. ఓవరాల్‌గా ఈ రికార్డు సనత్ జయసూర్య (34) ఖాతాలో ఉంది.మ్యాచ్ విషయానికొస్తే.. వరుణుడి ఆటంకాల నడుమ 26 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో భారత్ తొలుత బ్యాటింగ్ చేసి 9 వికెట్ల నష్టానికి 136 పరుగులు మాత్రమే చేయగలిగింది. వికెట్‌కీపర్ కేఎల్ (38), అక్షర్ పటేల్ (31) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఆఖరి ఓవర్లో నితీశ్ కుమార్ రెడ్డి (19 నాటౌట్) రెండు సిక్సర్లు బాది గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత రీఎంట్రీ ఇచ్చిన రోహిత్ శర్మ (8), విరాట్ కోహ్లి (0) దారుణంగా విఫలమయ్యారు. ఫుల్‌టైమ్ వన్డే కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే శుభ్‌మన్ గిల్ (10) నిరాశపరిచాడు. శ్రేయస్ అయ్యర్ (11) పరుగులు చేసేందుకు చాలా ఇబ్బంది పడ్డాడు. వాషింగ్టన్ సుందర్ 10, హర్షిత్ రాణా 1, అర్షదీప్ సింగ్ డకౌటయ్యారు. ఆసీస్ బౌలర్లలో జోష్ హాజిల్‌వుడ్, మిచెల్ ఓవెన్, కుహ్నేమన్ తలో 2 వికెట్లు తీయగా.. స్టార్క్, ఎల్లిస్ చెరో వికెట్ పడగొట్టారు.కాగా, భారత జట్టు 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్, అనంతరం 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. చదవండి: IND vs AUS: రోహిత్ శర్మ అరుదైన రికార్డు.. సచిన్, ధోని సరసన -
జేఈఈ మెయిన్స్-2026 షెడ్యూల్ విడుదల
జేఈఈ మెయిన్స్-2026 షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల నుంచి మొదటి సెషన్ దరఖాస్తులు స్వీకరించనున్నారు. జనవరి 21 నుంచి 30 వరకు జేఈఈ మెయిన్స్-1 పరీక్షలు జరగనున్నాయి. జేఈఈ మెయిన్స్-2కు జనవరి చివరి వారం నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. 2026 ఏప్రిల్ 1 నుంచి 10 వరకు జేఈఈ మెయిన్స్-2 పరీక్షలు నిర్వహించనున్నారు.విద్యార్థులు ముందుగానే తమ ఆధార్ కార్డులను తప్పులు లేకుండా అప్డేట్ చేసుకోవాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) వెల్లడించింది. ఆధార్ కార్డులో పేరు, పుట్టిన తేదీ టెన్త్ సర్టిఫికెట్ ప్రకారం ఉండేలా చూసుకోవాలని పేర్కొంది. షెడ్యూల్ పూర్తి వివరాల కోసం jeemain.nta.nic.in వెబ్ సైట్‌ను సందర్శించాలని పేర్కొంది. ఈ పరీక్షలు జరిగే కచ్చితమైన తేదీలను తర్వాత ప్రకటించనున్నారు. -
కాంగ్రెస్‌పై బీఆర్ఎస్ మొదటి దెబ్బ అక్కడే కొట్టబోతుంది: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: పార్టీ ఫిరాయింపులపై మరోసారి సుప్రీంకోర్టుకు వెళ్తామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్‌పై బీఆర్ఎస్ మొదటి దెబ్బ జూబ్లీహిల్స్‌లో కొట్టబోతుందన్న కేటీఆర్.. రెండో దెబ్బ రాజేంద్రనగర్ లేదా ఖైరతాబాద్‌లో కొడతాం. కడియం శ్రీహరి ఏ పార్టీలో ఉన్నాడో చెప్పుకోలేని దౌర్భాగస్థితిలో ఉన్నాడు. దమ్ముంటే ఉప ఎన్నికకు రావాలి’’ అంటూ సవాల్ విసిరారు. ‘‘రెండేళ్ల తర్వాత బీఆర్ఎస్ అధికారంలోకి రాబోతుంది. కేసీఆర్ సీఎం కాబోతున్నారు. రాష్ట్రంలో ఉప ఎన్నికలు తథ్యం’’ అంటూ కేటీఆర్ జోస్యం చెప్పారు. -
నాగార్జున లానే...మాకూ న్యాయం కావాలి అంటున్న నటీనటులు
ఓ చేత్తో భారతీయ సినిమాల స్థాయిని అమాంతం పెంచేస్తున్న సాంకేతిక విప్లవం మరో చేత్తో భారతీయ సినీ ప్రముఖుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. విఎఫ్ఎక్స్లూ, ఏఐలూ వాడేస్తూ తెరపై అద్భుతాలను ఆవిష్కరిస్తున్న తెరవేల్పులు.. అదే టెక్నాలజీ తమ కొంప ముంచుతుందేమోనని బెంబేలెత్తుతుండడం సాంకేతికత అనే కత్తికి ఉన్న రెండు వైపులా పదనుకు అద్దం పడుతోంది.ఇటీవల తమ పర్సనాలిటీ రైట్స్(Personality Rights) కాపాడాలంటూ న్యాయ స్థానాల గడప తొక్కిన వారిలో బాలీవుడ్ నుంచి ఐశ్వర్యరాయ్ బచ్చన్ ఆ తర్వాత మన టాలీవుడ్ నుంచి నాగార్జునలు ఉండగా ప్రస్తుతం అదే బాటలో అనేక మంది న్యాయం కావాలంటూ న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. తన గొంతు, రూపం...తదితర తనకు సంబంధించిన వాటిని తన అనుమతి లేకుండా దుర్వినియోగం చేయడాన్ని నిరోధించాలని నాగార్జున కోరగా ఢిల్లీ హైకోర్ట్ దీనిపై సానుకూలంగా స్పందించింది. దీంతో అభిషేక్ బచ్చన్, ఆశా భోంస్లే, సునీల్ శెట్టి, కరణ్ జోహార్ అక్షయ్ కుమార్ హృతిక్ రోషన్ అనేక మంది బాలీవుడ్ నటులతో పాటు గాయకులు దర్శకులు కూడా తమ వ్యక్తిత్వ హక్కుల రక్షణ కోరుతూ న్యాయస్థానాల బాట పట్టడం కనిపిస్తోంది. తమ వ్యక్తిత్వ హక్కులను కాపాడాలని, తమ సెలబ్రిటీ స్టేటస్ దుర్వినియోగం కాకుండా రక్షణ కల్పించాలని బాంబే హైకోర్టు ఢిల్లీ హైకోర్టులను వీరు ఆశ్రయిస్తున్నారు.భయపెడుతున్న ఏఐ..ఓ వైపు సోషల్ మీడియాతోనే నానా ఇబ్బందులు పడుతున్న సెలబ్రిటీలను కృత్రిమ మేధస్సు (ఏఐ) మరింత ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీల డీప్ ఫేక్ వీడియోలు వెలుగు చూడడం మిగిలిన వారిని కూడా అప్రమత్తం చేస్తోంది. ఏఐ దుర్వినియోగం నుంచి రక్షణ కల్పించాలని కూడా నాగార్జున, అక్షయ్ కుమార్ లు తమ పిటిషన్ లో కోరడం గమనార్హం. దాదాపు 150 కి పైగా చిత్రాలలో పనిచేసిన అక్షయ్ కుమార్, స్క్రీన్ మేయర్ ‘అక్షయ్ కుమార్‘, చిత్రాలు, పోలిక, వాయిస్, విలక్షణమైన ప్రదర్శన శైలి, ప్రవర్తన ఇతర గుర్తించదగిన లక్షణాలను దుర్వినియోగం చేయడాన్ని నివారించాలనుకుంటున్నారు. అదే విధంగా హృతిక్ రోషన్ దాఖలు చేసిన దావాలో ’ఏదో ఒక రకమైన ’ఏఐ సృష్టించిన నకిలీ చిత్రాలు వీడియోలు, నకిలీ వస్తువులు, మోసపూరిత ప్రకటనలు, తప్పుడు బ్రాండ్ ఎండార్స్మెంట్లు ప్లాట్‌ఫారమ్‌లలో సోషల్ మీడియా ప్రొఫైల్‌లను అనుకరించడం ద్వారా తన వ్యక్తిత్వాన్ని పెద్ద ఎత్తున దుర్వినియోగం చేయడాన్ని అడ్డుకోవాలని కోరారు. ఆయన తన దావాలో వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు ఇ–కామర్స్ సైట్లను కూడా ప్రతివాదులుగా ఆయన చేర్చాడు.న్యాయస్థానాలు ఏం చేయనున్నాయి?సెలబ్రిటీల వ్యక్తిత్వ హక్కుల పరిరక్షణపై న్యాయస్థానాలు కూడా సానుకూలంగా స్పందిస్తున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఢిల్లీ హైకోర్టు బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్ వ్యక్తిత్వ హక్కులను కాపాడుతూ, ఆన్ లైన్ ప్లాట్‌ఫారమ్‌లు ఆమె పేరు, చిత్రాలను వాణిజ్య లాభం కోసం చట్టవిరుద్ధంగా ఉపయోగించకుండా నిషేధించింది. ప్రముఖ వ్యక్తి గుర్తింపును వారి అనుమతి లేదా అనుమతి లేకుండా ఉపయోగించినప్పుడు, అది సంబంధిత వ్యక్తికి వాణిజ్యపరంగా హాని కలిగించడమే కాకుండా, గౌరవంగా జీవించే హక్కును కూడా ప్రభావితం చేస్తుందని ఈ సందర్భంగా కోర్టు పేర్కొంది. ‘ఒకరి వ్యక్తిత్వ హక్కులను అనధికారికంగా దోపిడీ చేసే కేసుల్లో కోర్టులు వాటిని చూసి కళ్ళు మూసుకోలేవు ఆ అనధికార దోపిడీ ఫలితంగా బాధిత పార్టీలకు ఏదైనా హాని జరగకుండా వారిని రక్షించాలి‘ అని జస్టిస్ తేజస్ కరియా సెప్టెంబర్ 9న జారీ చేసిన ఒక ఉత్తర్వులో పేర్కొన్నారు. అదే విధంగా సునీల్ శెట్టి దావాపై ఇచ్చిన ఆదేశాలలో, ‘సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వాది (షెట్టి) డీప్‌ఫేక్ చిత్రాలను అనధికారికంగా సృష్టించడం/అప్లోడ్ చేయడం అతని వ్యక్తిత్వ హక్కులను మాత్రమే కాకుండా గౌరవంగా జీవించే హక్కును కూడా తీవ్రంగా ఉల్లంఘించడమే‘ అని కోర్టు స్పష్టం చేసింది.అయితే రెండు వైపులా పదును ఉన్న టెక్నాలజీ చట్టాలు, నిబంధనలపై అవగాహన లేని పిచ్చోళ్ల చేతిలో రాయిలా అవుతుండగా . మరోవైపు చట్టాల్ని లెక్కచేయని అతి తెలివి మంతులూ పెరుగుతున్నారు. ఈ నేపధ్యంలో భవిష్యత్తులో పర్సనాలిటీ రైట్స్‌కు సంబంధించిన న్యాయ వివాదాలు పెద్ద సంఖ్యలో చోటు చేసుకునే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. -
మొన్న జెడ్900.. ఇప్పుడు వెర్సిస్ 1100: కవాసకి కొత్త బైక్
జపనీస్ వాహన తయారీదారు.. కవాసకి ఇండియన్ మార్కెట్లో జెడ్900 బైక్ లాంచ్ చేసిన తరువాత, 2026 వెర్షన్ వెర్సిస్ 1100 లాంచ్ చేసింది. దీని ధర రూ. 13.79 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ అడ్వెంచర్ టూరర్ ఫిబ్రవరి 2025లో భారతదేశంలో తొలిసారిగా వెర్సిస్ 1000 స్థానంలో లాంచ్ అయింది.2026 వెర్షన్ వెర్సిస్ 1100 డిజైన్, ఫీచర్లలో ఎలాంటి మార్పులు కనిపించినప్పటికీ.. పనితీరు పెరిగిందని తెలుస్తోంది. ఇందులోని 1099 సీసీ లిక్విడ్-కూల్డ్, ఇన్-లైన్ ఫోర్ ఇంజన్.. 133 హెచ్‌పి పవర్, 112 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. పవర్, టార్క్ రెండూ కూడా స్టాండర్డ్ మోడల్ కంటే కొంత ఎక్కువే. కాబట్టి పనితీరు మెరుగ్గా ఉంటుంది.2026 కవాసకి వెర్సిస్ 1100 బైకులో కవాసకి ట్రాక్షన్ కంట్రోల్ (KTRC) సిస్టమ్, కవాసకి కార్నరింగ్ మేనేజ్మెంట్ ఫంక్షన్ (KCMF), కవాసకి ఇంటెలిజెంట్ యాంటీ లాక్ బ్రేక్ సిస్టమ్ (KIBS) వంటి చాలా ఫీచర్స్ ఉన్నాయి. ఈ బైక్ ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 21 లీటర్లు. కాబట్టి ఇది రోజువారీ వినియోగానికి.. లాంగ్ రైడ్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది.ఇదీ చదవండి: టీవీఎస్ కొత్త అడ్వెంచర్ బైక్: ధర ఎంతో తెలుసా? -
నేషనల్ అవార్డ్ వచ్చినా సరే చెత్తకుండిలో పడేస్తా : విశాల్
నటుడు విశాల్‌కు తమిళ, తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు ఉన్నారు. ఈ ఏడాదిలో మదగజరాజ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్నారు. ఆపై నటి ధన్సికతో నిశ్చితార్థం కూడా జరిగింది. త్వరలోనే కొత్త జీవితాన్ని ప్రారంభించనున్నారు. ప్రస్తుతం మకుటం చిత్రం కోసం పనిచేస్తున్న విషయం తెలిసిందే. దర్శకుడు రవి అరసుతో పలు విభేదాలు రావడంతో ఈ మూవీని తానే తెరకెక్కిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఆయన ఒక పాడ్‌కాస్ట్‌లో ఇంటర్వ్యూ ఇచ్చారు. అయితే, అవార్డ్స్ గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు కోలీవుడ్‌లో దుమారం అవుతున్నాయి.సినిమా, నటీనటులకు వచ్చే అవార్డ్స్ గురించి విశాలు ఇలా అన్నారు. కోట్ల మంది ప్రజలున్న ఈ దేశంలో కేవలం ఏడెనిమిది మంది కలిసి ఒక జ్యురీగా ఏర్పడి ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు అంటూ అవార్డుల కోసం ఎలా ఎంపిక చేస్తారని విశాల్ అభిప్రాయపడ్డారు. ఇదంతా నాన్సెన్స్ అంటూనే తనకు జాతీయ పురస్కారం దక్కినా సరే చెత్తబుట్టలోనే పారేస్తానని ఆ ఇంటర్వ్యూలో అన్నారు. అవార్డులను తానంతగా నమ్మనని, అవి పనికిరాని విషయం అంటూ పేర్కొన్నారు. ఇది కేవలం తనకు అవార్డు రాకపోవడం వల్ల చేస్తున్న కామెంట్ కాదన్నారు. ఒకవేళ భవిష్యత్‌లో తనకు అవార్డ్ వచ్చినా సరే ఇదే మాటపై కట్టుబడి ఉంటానన్నారు. నిజమైన గుర్తింపు అనేది ప్రేక్షకుల నుంచి మాత్రమే వస్తుందనే క్లారిటీ తనకు ఉందన్నారు. తాను ఎప్పటికీ అది మాత్రమే నమ్ముతానని విశాల్ చెప్పారు. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.సినిమా కోసం ఎలాంటి స్టంట్స్ అయినా సరే తానే స్వయంగా చేస్తానని విశాల్ అన్నారు. దీంతో ఇప్పటి వరకు చాలా గాయాలు అయ్యాయి అన్నారు. ఇప్పటివరకూ 119 కుట్లు పడ్డాయని విశాల్ చెప్పారు. తన సినిమాలకు డూప్ ఉండరని క్లారిటీ ఇచ్చారు. డూప్‌తో చేయించడం తనకు ఇష్టం లేదన్నారు. "I don't believe in awards🏆. Awards are Bull sh!t. 8 people can't decide what 8 Crore people will like❌. I'm saying including national Awards. Not because I don't get awards. If they give awards, I will just throw in Dustbin🚮"- #Vishal recent podcastpic.twitter.com/IjsO6CIoYL— AmuthaBharathi (@CinemaWithAB) October 18, 2025 -
దీపావళి సినిమాలు.. జోరు మీదున్న హీరో.. వెనకబడ్డ సిద్ధు!
ఈసారి దీపావళి పండగ అక్టోబర్ 20వ తారీఖున వస్తోంది. కానీ బాక్సాఫీస్ వద్ద మాత్రం అప్పుడే పండగ మొదలైంది. తెలుగులో పోటాపోటీగా సినిమాలు రిలీజయ్యాయి. అందులో ఒకటి ఉల్లిగడ్డ బాంబ్లా సౌండ్ చేస్తుంటే మరోటి చిచ్చుబుడ్డిలా వెలుగుతోంది. ఒకటైతే మందుగుండు లేని పటాకాలా మిగిలిపోయింది. అవేంటి? వాటి కలెక్షన్స్ ఏంటో చూద్దాం..రేసులో లేని మిత్రమండలిప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం మిత్రమండలి. అక్టోబర్ 16న రిలీజైన ఈ మూవీ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది అన్న చందంగా మారింది పరిస్థితి! మొదటిరోజే ఈ పటాకా ఎవరికీ నచ్చలేదు. ఇప్పుడిక వేరే సినిమాల ఆప్షన్స్ ఉండటంతో రేసులో చివరి స్థానానికి వెళ్లిపోయింది. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన మూవీ తెలుసు కదా. ఈ మూవీ అక్టోబర్ 17న విడుదలైంది. కథ బాగున్నా కాస్త ల్యాగ్ అవడంతో మిక్స్డ్ టాక్ అందుకుంటోంది.స్పీడు మీదున్న డ్యూడ్తొలి రోజు ఈ సినిమా రూ.3 కోట్ల మేర వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఇది జాక్ కంటే కూడా తక్కువ! అయితే మొదటి రోజు కంటే రెండో రోజు వసూళ్లు కాస్త మెరుగయ్యాయని చెప్తున్నారు. ఇక అక్టోబర్ 17న తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్ నటించిన డ్యూడ్ (Dude Movie) కూడా రిలీజైంది. ఈ మూవీ సెకండాఫ్‌పై కాస్త అసంతృప్తి ఉన్నప్పటికీ ప్రేక్షకులు ఎగబడి మరీ చూస్తున్నారు. ఈ సినిమా రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.45 కోట్లు రాబట్టిందని అధికారిక ప్రకటన విడుదల చేశారు.కె-ర్యాంప్ ఫస్ట్ డే కలెక్షన్స్అన్నిటికంటే ఆలస్యంగా (అక్టోబర్ 18న) వచ్చిన మూవీ కె-ర్యాంప్ (K-Ramp Movie). ఎప్పుడొచ్చామన్నది కాదు, బుల్లెట్టు దిగిందా? లేదా? అంటూ బరిలోకి దిగిన కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) సినిమాకు హిట్ టాక్ వస్తోంది. తొలిరోజు ఈ చిత్రానికి రూ.4.5 కోట్ల కలెక్షన్స్ వచ్చాయని చిత్రయూనిట్ ప్రకటించింది. మరి ఏ సినిమా వసూళ్లు పెరగబోతున్నాయి? దీపావళి హిట్ బొమ్మ ఏదనేది చూడాలి! DAY 2 > DAY 1 for #TelusuKada ❤🔥DIWALI'S RADICAL BLOCKBUSTER sees massive growth on Saturday with housefulls all over 💥💥Book your tickets now!🎟️ https://t.co/QvC10IjSqS#LoveU2 #UnapologeticallyRadicalSTAR BOY @Siddubuoyoffl @NeerajaKona #RaashiiKhanna… pic.twitter.com/UdtkfHUrmu— People Media Factory (@peoplemediafcy) October 18, 2025 DUDE DIWALI BLAST is unstoppable at the box office with massive love from the audience ❤️#Dude collects a gross of 45 CRORES WORLDWIDE in 2 days & going super strong ❤🔥Book your tickets now and celebrate #DudeDiwali 🔥🎟️ https://t.co/JVDrRd4PZQ🎟️ https://t.co/4rgutQNl2n… pic.twitter.com/TLNPYTpNsV— Mythri Movie Makers (@MythriOfficial) October 19, 2025Box-Office daggara tana Mass Madness chupinchina Kumar Abbavaram 🤙🔥𝟰.𝟱 𝗖𝗿𝗼𝗿𝗲 Day1 GROSS for the 𝐃𝐈𝐖𝐀𝐋𝐈 𝐖𝐈𝐍𝐍𝐄𝐑 #KRamp 💥❤️🔥Grab Your Seats Now!!— https://t.co/nS9p8rSUlZ#KRampKaDiwali pic.twitter.com/BoeIifohez— Hasya Movies (@HasyaMovies) October 19, 2025చదవండి: కోటిలో బ్యాగులు అమ్ముకున్నా.. బాత్రూమ్లు కడిగా: ‘జబర్దస్త్’ కమెడియన్ -
‘దీపోత్సవ్’కు అయోధ్య ముస్తాబు.. ఈసారి ప్రత్యేకతలివే..
అయోధ్య: శ్రీ రాముని జన్మస్థలమైన అయోధ్య నేడు (ఆదివారం) జరిగే ‘దీపోత్సవ్’కు ముస్తాబయ్యింది. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలో ఈ వేడుక ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి కార్యాలయం సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. ‘దీపోత్సవం-2025’కు అందరినీ ఆహ్వానించింది.2017లో ఆదిత్యనాథ్ నాయకత్వంలో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక అయోధ్యలో దీపోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది తొమ్మిదవ దీపోత్సవానికి విస్తృత సన్నాహాలు చేశారు. ధరంపత్ నుండి లతా చౌక్, రామ్‌కథా పార్క్, సరయు ఘాట్ వరకు అంతటా వెలుగులు విరజిమ్మనున్నాయని ఒక అధికారి తెలిపారు. ఈ కార్యక్రమంలో 33 వేల మంది వాలంటీర్లు పాల్గొననున్నారు. 26 లక్షల11 వేల 101 దీపాలను వెలిగించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించనున్నారు.దీపోత్సవ్ నోడల్ అధికారి ప్రొఫెసర్ సంత్ శరణ్ మిశ్రా మాట్లాడుతూ ఇప్పటికే రెండు లక్షలకు పైగా దీపాలను వెలిగించారని తెలిపారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ బృందం ఘాట్ల వారీగా దీపాల సంఖ్యను లెక్కిస్తోందన్నారు. ఘాట్ నంబర్ 10 వద్ద, విశ్వవిద్యాలయ వాలంటీర్లు 80 వేల దీపాలతో స్వస్తిక్ చిహ్నాన్ని రూపొందించడానికి ఏర్పాట్లు చేశారు. కాగా ఐడి కార్డు లేకుండా ఘాట్లలోకి ప్రవేశించడాన్ని నిషేధించారు. ఆదివారం సాయంత్రం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. రాత్రి 8:30 గంటలకు రామ్ కీ పైడిలో లేజర్ షో, లైట్ అండ్ సౌండ్ షో, డ్రోన్ షో నిర్వహించనున్నారని మీడియాకు అయోధ్య జిల్లా మేజిస్ట్రేట్ నిఖిల్ తెలిపారు. -
పావురాలు Vs పౌరులు: ఎవరు ముఖ్యం? పెటాపై ప్రజాగ్రహం...
పావురాల విసర్జన ప్రాణాంతకంగా మారుతోందంటూ భారతీయ నగరాల్లో గత కొంతకాలంగా తీవ్రమైన ఆందోళన వ్యక్తం అవుతోంది. దీనిపై ముంబై వంటి మెట్రోలకు చెందిన కొందరు న్యాయస్థానాలను కూడా ఆశ్రయించారు. ఈ నేపధ్యంలో ఇటీవల పావురాలకు ఆహారం (దాణా) వేయడాన్ని నియంత్రించడానికి మహారాష్ట్ర ప్రభుత్వం నిషేధ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ ఆదేశాలను నిరసిస్తూ జంతు సంరక్షణ కార్యకర్తలు పెటా ఆధ్వర్యంలో ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు.‘‘ముంబైలోని మూడు అతిపెద్ద ఆసుపత్రుల డేటా ప్రకారం, గత ఏడాదిలో వచ్చిన శ్వాసకోశ అనారోగ్య కేసుల్లో కేవలం 0.3% మాత్రమే పావురాలతో ముడిపడి ఉన్నాయి. అంతర్జాతీయ పరిశోధన కూడా పావురాల నుంచి మానవులకు వ్యాధి వ్యాప్తి చెందే ప్రమాదం చాలా తక్కువగా ఉందని తేల్చింది. పావురాలు సహజంగా బర్డ్ ఫ్లూకు నిరోధకతను కలిగి ఉంటాయి’’ అని పెటా వాదిస్తోంది. అంతేకాకుండా ప్రభుత్వాలకు పలు సూచనలు కూడా చేస్తోంది. కబుతర్ ఖానా దగ్గర నిర్దిష్ట దాణా సమయాలు కేంద్రాలను నియమించడం, ఈ ప్రదేశాలను క్రమం తప్పకుండా శుభ్రపరచడం పారిశుధ్యాన్ని నిర్వహించడం సరైన దాణా పద్ధతులు పావురాల వల్ల కలిగే కనీస ఆరోగ్య ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించే బహుభాషా సందేశాలను ఇన్స్టాల్ చేయడం వంటివి చేయాలని సూచిస్తోంది.‘పావురాలు లేకుండా ముంబై ఆకాశం ఎలా ఉంటుంది? దాణా నిషేధాలతో, ఈ సున్నితమైన పక్షులు ఆకలి బారిన పడతాయి. ‘ప్రతి ఒక్కరూ పావురాలు కూడా నగరవాసులే అంటూ గుర్తు చేస్తూ పలువురు ముంబైకర్లు ’పావురాలు’గా మారారు‘ భారీ పావురాల ముసుగులు ధరించి ప్రజలు తమ దైనందిన జీవితాన్ని గడుపుతున్నట్లు చూపించే వీడియోను పెటా షేర్ చేసింది.అయితే ఈ విషయంలో పెటాపై ప్రజల నుంచి ఆగ్రహం వ్యక్తం అయింది. గతంలో ఎన్నడూ ఏ అంశంపైనా రానంతగా ఈ విషయంలో ప్రజలు వ్యతిరేకంగా స్పందిస్తున్నారు. ‘‘ ‘పావురాలు వాటి విసర్జన ద్వారా క్రిప్టోకోకోసిస్, హిస్టోప్లాస్మోసిస్ సిట్టాకోసిస్ వంటి వ్యాధులను వ్యాపింపజేస్తాయి.‘ అంటూ ఒక వ్యక్తి ఆన్లైన్లో ద్వజమెత్తారు. ‘పావురాలు ఎగిరే ఎలుకలుగా అనొచ్చు. అవి తక్కువ సంఖ్యలో ఉంటే పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు. కానీ సమూహాలుగా ఉంటే, నగర నివాసితుల ఆరోగ్యంపై (శ్వాసకోశ సమస్యలు, వ్యాధి వ్యాప్తి మొదలైనవి) చాలా హానికరమైన ప్రభావాన్ని చూపుతుంది. మీరు భారతీయుల ఆరోగ్యం గురించి పట్టించుకోండి అంటూ మరో వ్యక్తి సూచించాడు. ‘ఈ జంతు హక్కుల కార్యకర్తలు దేశం గురించి ఎప్పుడూ ఆలోచించరు. పావురాల మలం మానవ ఆరోగ్యానికి ప్రమాదకరం. కుక్కలు పావురాలు దేశానికి అతిపెద్ద ముప్పు. రాబోయే సంవత్సరాల్లో వాటి జనాభాను తగ్గించాలి అంటూ మరొకరు తీవ్రంగా దుయ్యబట్టారు. -
సీనియర్ వేధింపులు.. రాలిన విద్యా కుసుమం
సాక్షి, బెంగళూరు: భార్యను చంపిన భర్త, యువతిని చంపిన దుండగుడు.. ఇంతలోనే బెంగళూరులో మరో దుర్ఘటన జరిగింది. సీనియర్ వేధింపులను తాళలేక బాగలూరులో ఓ పీజీ హాస్టల్లో విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలిని సనా పర్వీన్ (19)గా గుర్తించారు. సనా మరణానికి కాలేజీలో సీనియర్ రిఫాన్ వేధింపులే కారణమని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు. సనా చదివే కాలేజీలోనే రిఫాన్ చదువు పూర్తి చేసుకుని కాలేజీ వదిలి వెళ్లిపోయాడు. అయినప్పటికీ సనాకు వేధింపులు ఆపలేదు. కేరళకు చెందిన రిఫాన్ గత పది నెలల నుంచి తరచుగా కాలేజీకి వచ్చి వెళ్లేవాడు. పీజీ వద్దకు కూడా వచ్చి సనాను ప్రేమ పేరుతో ఒత్తిడి చేసేవాడు. పలుమార్లు కాలేజీలో గొడవలు కూడా జరిగినట్లు ఆమె స్నేహితులు తెలిపారు. ఇది తట్టుకోలేక ఆమె పీజీలోని గదిలో ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన పై బాగలూరు పోలీసు స్టేషన్లో కేసు నమోదు అయింది. మహిళా సంఘాల నిరసన మరోవైపు మహిళలకు, యువతులకు భద్రత కల్పించాలని, దౌర్జన్యాలను అరికట్టాలని ఏఐడీఎస్ఓ సహా పలు స్త్రీవాద, వామపక్ష సంఘాల కార్యకర్తలు బెంగళూరు ఫ్రీడంపార్క్‌లో ధర్నా చేశారు. మహిళలు సమాజంలో స్వేచ్ఛగా తిరగలేకపోతున్నారని, దాడులు అధికమైనట్లు వాపోయారు. ప్రభుత్వం దుండగులకు ముకుతాడు వేయాలని నినాదాలు చేశారు. -
ఆ కుట్రలను తిప్పి కొట్టాలి: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: మూడు తరాలుగా గాంధీ కుటుంబం దేశం కోసం పనిచేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన చార్మినార్ వద్ద రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర సంస్మరణ కార్యక్రమంలో మాట్లాడుతూ.. దేశ సమగ్రతను కాపాడేందుకు ఆనాడు రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర చేశారు. రాజీవ్ గాంధీ స్ఫూర్తిని కొనసాగించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నామన్నారు.రాజీవ్ గాంధీ సద్భావన అవార్డును సల్మాన్ ఖుర్షీద్‌కు అందించిన నిర్వాహకులను అభినందిస్తున్నా. దేశంలో గాంధీ అనే పదం భారతదేశానికి పర్యాయ పదం. గాంధీ కుటుంబం దేశానికి స్పూర్తినిచ్చింది. దేశ సమగ్రతను కాపాడేందుకు ఉక్కు మహిళ ఇందిరా గాంధీ ప్రాణాలు అర్పించారు. ఇందిర వారసత్వాన్ని కొనసాగిస్తూ రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణాలర్పించారు. దేశం కోసం మూడు తరాలు ప్రాణాలర్పించిన చరిత్ర గాంధీ కుటుంబానిది’’ అని సీఎం రేవంత్ పేర్కొన్నారు.‘‘గాంధీ కుటుంబంతో సల్మాన్ ఖుర్షీద్ అనుబంధం ఈనాటిది కాదు. మూడు తరాలుగా వారి కుటుంబం గాంధీ కుటుంబంతో కలిసి పనిచేస్తోంది. సల్మాన్ ఖుర్షీద్‌కు రాజీవ్ సద్భావన అవార్డ్ అందించడం మనందరికీ గర్వకారణం. 18 ఏళ్లకే ఓటు హక్కును కల్పించి దేశ అభివృద్ధిలో యువతను భాగస్వామ్యం చేసిన మహనీయుడు రాజీవ్ గాంధీ. 21 ఏళ్లకే శాసనసభ్యుడిగా పోటీ చేసే అవకాశం కల్పిస్తూ రాజ్యాంగ సవరణ తీసుకు రావాల్సిన అవసరం ఉంది. రాజీవ్ స్ఫూర్తితో రాహుల్ గాంధీ దేశ సమగ్రత కోసం భారత్ జోడో యాత్ర చేశారు...రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి బీ టీమ్‌గా మారింది. గత పార్లమెంట్ ఎన్నికల్లో రహస్య ఒప్పందంతో బీజేపీకి బీఆర్ఎస్ మద్దతు ఇచ్చింది. పార్లమెంట్ ఎన్నికల్లో 21 శాతం బీఆర్ఎస్ ఓట్లు ఎవరికి చేరాయి?. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలోనూ అదే చేయాలని కుట్రలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ ఓట్లు చీల్చాలని కుట్ర చేస్తున్నారు. ఈ కుట్రలను తెలంగాణ సమాజం తిప్పి కొట్టాలి’’ అని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. -
రోహిత్ శర్మ అరుదైన రికార్డు.. సచిన్, ధోనిల సరసన
టీమిండియా స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ(Rohit Sharma) అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్లో 500 మ్యాచ్‌ల మైలు రాయిని అందుకున్నాడు. ఆదివారం పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో తొలి వన్డే సందర్భంగా రోహిత్ ఈ ఫీట్‌ను నమోదు చేశాడు. ఈ ఫీట్ అందుకున్న ఐదో భారత క్రికెటర్‌గా హిట్‌మ్యాన్ నిలిచాడు.ఈ జాబితాలో దిగ్గజ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లి, రాహుల్ ద్రవిడ్, ఎంఎస్ ధోని లు ఉన్నారు. 38 ఏళ్ల రోహిత్ భారత తరపున ఇప్పటివరకు 274 వన్డేలు, 67 టెస్టులు,159 టీ20లు ఆడాడు. గత ఏడాది జూన్‌లో టీ20లకు వీడ్కోలు పలికిన రోహిత్.. నాలుగు నెలల కింద టెస్టుల నుంచి తప్పుకొన్నాడు. ఈ ముంబైకర్ ప్రస్తుతం కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. రోహిత్ శర్మ తన అంతర్జాతీయ కెరీర్లో 19,708 పరుగులు చేశాడు. అతడి అత్యధిక వ్యక్తిగత స్కోరు 264(వన్డేల్లో)గా ఉంది. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ-2025 విజయం తర్వాత రోహిత్ భారత్ తరపున ఆడుతున్న తొలి మ్యాచ్ ఇది. అయితే ఈ మ్యాచ్‌లో రోహిత్ తీవ్ర నిరాశపరిచాడు. కేవలం 8 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు.500 పైగా అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన టీమిండియా ప్లేయర్స్ వీరే👉 సచిన్ టెండూల్కర్ – 664 మ్యాచ్‌లు👉విరాట్ కోహ్లి – 551 మ్యాచ్‌లు👉ఎంఎస్ ధోని – 535 మ్యాచ్‌లు👉 రాహుల్ ద్రవిడ్ – 504 మ్యాచ్‌లు👉రోహిత్ శర్మ – 500 మ్యాచ్లుచదవండి: IND vs AUS: చరిత్ర సృష్టించిన నితీశ్ కుమార్ రెడ్డి.. 93 ఏళ్లలో ఒకే ఒక్కడు -
ఇద్దరూ విప్లవ ద్రోహులే.. శిక్ష తప్పదు.. మావోయిస్టు కేంద్ర కమిటీ సంచలన లేఖ
సాక్షి, హైదరాబాద్: దేశంలో మావోయిస్టుల లొంగుబాట్లు జరుగుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. లొంగుబాట్లపై మావోయిస్టు కేంద్ర కమిటీ(Maoists Central Committee) తాజాగా లేఖ విడుదల చేసింది. ఈ లేఖలో పోలీసులు ఎదుట లొంగిపోయిన వారికి ప్రజలకే బుద్ధి చెబుతున్నారని హెచ్చరించడం సంచలనంగా మారింది.ఇటీవల మావోయిస్టుల(Maoists) కీలక నేతలు మల్లోజుల వేణుగోపాల్(Mallojula Venu gopal), ఆశన్నలు(Ashanna) పోలీసులు ఎదుట లొంగిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మావోయిస్టు కేంద్ర కమిటీ స్పందించింది. తాజాగా అభయ్ పేరుతో నాలుగు పేజీల లేఖ విడుదల చేసింది. ఈ లేఖలో లొంగుబాట్లపై మావోయిస్టు పార్టీ కీలక ప్రకటన చేసింది. మల్లోజుల, ఆశన్నలు విప్లవ ద్రోహులుగా అభివర్ణించింది. విప్లవ ద్రోహులుగా మారి శత్రవులు ఎదుట లొంగిపోయిన ఇద్దరికి తగిన శిక్ష ప్రజలే విధిస్తారు. అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. అలాగే, 2018లో ఒకసారి పార్టీ తాత్కాలిక వెనుకంజ వేసింది. అప్పటి నుంచి మల్లోజుల బలహీనతలు బయటపడ్డాయి. 2020 కేంద్ర కమిటీ సమావేశంలో మల్లోజుల తప్పుడు భావజాలాన్ని లేవనెత్తారు. ఆయుధాలను వదిలిపెట్టడంపై మల్లోజుల వితండవాదాన్ని తెరపైకి తెచ్చారు. ఇప్పుడు లొంగిపోతున్న వ్యవహారం.. పార్టీకి తాత్కాలిక నష్టం మాత్రమే. ప్రాణ భీతితో ఎవరైనా లొంగిపోతే లొంగిపోవచ్చు కానీ.. పార్టీకి నష్టం కలిగితే ప్రజలే బుద్ధి చెబుతారు. కేంద్ర కమిటీతో చర్చించకుండానే మల్లోజుల లొంగిపోయాడు అని రాసుకొచ్చింది. ఈ నేపథ్యంలో లేఖ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. -
కలర్‌ఫుల్ స్వింగ్ 'దివాలి' డ్రెస్సింగ్..!
దీపావళి అంటే ఒక పండుగ మాత్రమే కాదు.. విభిన్న రకాల సంబరాల కలగలుపు వేడుక. బహుమతులు ఇచ్చి పుచ్చుకోవడం మొదలు.. క్రాకర్స్ కాల్చడం వరకూ ఈ పండుగ ఆస్వాదించదగిన ఎన్నో అనుభూతులను మనకు అందిస్తుంది. అందుకే ఈ ఫెస్టివల్లో మన లుక్స్ ద్వారా గుడ్‌విల్ అందుకోవాలంటే, తగిన వస్త్రధారణ తప్పనిసరి. ఇందుకోసం తరచూ బాలీవుడ్ నటీనటుల స్టైల్స్‌ను సిటీ యూత్ అనుసరిస్తుంటారు. ఈ నేపథ్యంలో నగరానికి చెందిన హామ్స్టెక్ కాలేజ్ ఆఫ్ క్రియేటివ్ ఎడ్యుకేషన్‌కు చెందిన ఫ్యాషన్ డిజైనింగ్ ఫ్యాకల్టీ అందిస్తున్న కొన్ని సూచనలు.. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ధరించిన ఒక డ్రెస్.. ఒక టాంగీ నారింజ మిర్రర్–వర్క్ బ్లేజర్ కోర్డ్ సెట్ దీపావళి పార్టీకి సరైన ఎంపిక. ముఖ్యంగా పండుగ వేళ మెరుపులు విరజిమ్ముతూ.. అదే సమయంలో సౌకర్యవంతంగా ఉండాలనుకునేవారికి ఇవి సరైనవి. మినిమలిస్ట్ లుక్.. ఉత్తరాది ప్రేక్షకుల్ని ఉర్రూతలూంచే అనన్య పాండే దీపావళి కోసం మినిమలిజాన్ని సూచిస్తున్నారు. సున్నితమైన తెల్లటి ఎంబ్రాయిడరీతో అలంకరించిన లేత గులాబీ రంగు స్లీవ్‌లెస్ కుర్తాను, మ్యాచింగ్ పలాజో ప్యాంటు జత చేశారు. ఓపెన్ హెయిర్ మినిమల్ మేకప్‌తో, పండుగ డ్రెస్సింగ్‌కు ‘తక్కువలో ఎక్కువ’ విధానాన్ని సంపూర్ణంగా ప్రతిబింబిస్తున్నాయి. రెడ్ గ్లామ్ లుక్.. దీపావళికి మరో సిల్వర్ స్క్రీన్ క్వీన్ మౌని రాయ్ లాగా ఆల్–రెడ్ లెహంగాలో అబ్బురపరిచవచ్చు. కాంబినేషన్‌గా ఫుల్–స్లీవ్డ్ బ్లౌజ్, ప్రింటెడ్ బోర్డర్లతో మ్యాచింగ్ స్కర్ట్, గోల్డెన్ షిమ్మర్‌తో అంచులున్న కో–ఆర్డినేటింగ్ దుపట్టా ఉన్నాయి. బంగారు చోకర్ నెక్లెస్, మాంగ్ టిక్కాతో తన అద్భుతమైన ఎథి్నక్ లుక్ కంప్లీట్‌గా తీర్చిదిద్దుకుంది. లాంగ్ ఎథినిక్ జాకెట్లు.. పొడవాటి ఎథ్నిక్ జాకెట్లు పండుగ వార్డ్‌రోబ్‌కు చక్కదనాన్ని జోడిస్తాయి. సరళమైన కుర్తాపై అందంగా ఎంబ్రాయిడరీ చేసిన జాకెట్‌ను జత చేయాలి లేదా క్యాజువల్, చిక్ ఫ్యూజన్ లుక్ కోసం క్రాప్ టాప్ స్కర్ట్‌తో స్టైల్ సెట్ చేసుకోవచ్చు. ఈ స్టైలిష్ లేయర్ డ్రెస్సింగ్.. ట్రెండీగా సాయంత్రపు సమావేశాలకు సౌకర్యవంతంగా ఉంటూనే సంప్రదాయాన్ని జోడిస్తుంది.సింపుల్ లాంగ్ గౌన్లు.. సొగసైన పాస్టెల్ లేదా మ్యూట్ షేడ్స్‌లో ఉన్న పొడవైన, తక్కువగా అలంకరించిన గౌన్లు దీపావళికి స్టైలిష్ ఎంపిక. అవి చక్కదనంపై రాజీ పడకుండా సౌకర్యంపై దృష్టి పెడతాయి. పండుగ రూపాన్ని పూర్తిగా ప్రతిబింబించాలంటే.. దీనికి దుపట్టా లేదా లైట్ జ్యువెలరీ జోడించాలి. పాతవే కొత్తగా.. ప్రస్తుత వార్డ్రోబ్ నుంచి కొన్నింటిని విడివిడిగా తీసి కలపడం ద్వారా అదనపు ఖర్చు చేయకుండా కూడా తాజా పండుగ స్టైల్‌ను సృష్టించవచ్చు. కొత్త పలాజోలతో పాత కుర్తీని జత చేయడం లేదా సరదాగా ఫ్యూజన్ వైబ్ కోసం జీన్స్‌తో భారీ దుపట్టాను కలిపేయడం.. వంటి ట్రిక్స్ ఫాలో అవ్వవచ్చు. ఇది మన డబ్బు ఆదా చేయడమే కాకుండా దుస్తులకు వ్యక్తిగత సృజనాత్మక ట్విస్ట్‌ను అందిస్తుంది. దేశీ డ్రీమ్.. మరీ సింపుల్‌గా వద్దు అనుకుంటే, అలంకరించబడిన షరారా సెట్లు రెడీగా ఉన్నాయిు. సీక్విన్స్, జెమ్స్ మెరుపులతో ఇవి లేట్–నైట్ డిన్నర్లు, రూఫ్‌టాప్ పార్టీలకు బెస్ట్. దీని కోసం నటి జాన్వి కపూర్ డ్రెస్ స్టైల్ పరిశీలించవచ్చు. ఆధునిక, ఆకర్షణీయమైన ట్విస్ట్ కోసం దుపట్టాను కేప్‌గా ధరించవచ్చు. బాలీవుడ్ నటుడు సిద్ధాంత్ చతుర్వేది లాగా నల్ల కుర్తా స్ట్రెయిట్–ఫిట్ ప్యాంటు లుక్ కూడా బాగుంటుంది. లీనియర్ రెడ్ మోటిఫ్ డీటెయిలింగ్‌తో అలంకరించిన, వదులుగా ఓపెన్ జాకెట్‌తో పొరలుగా ధరించడం ఆధునిక సంప్రదాయాల స్టైలిష్ మిశ్రమం.వేదంగ్ రైనా లా నల్ల కుర్తా స్ట్రెయిట్ ప్యాంటులో మెరిసిపోవచ్చు, సమకాలీన పండుగ లుక్ కోసం మెరిసే నల్ల బ్లేజర్‌తో లుక్‌ను మరింత మెరిపించవచ్చు. బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్‌ని గమనిస్తే.. తరచూ క్లాసిక్ సిల్హౌట్‌లతో సమకాలీన కట్లను మిళితం చేస్తాడు. ఇటీవలి దీపావళి లుక్‌లో పొట్టి కుర్తా ఎరుపు రంగు స్ట్రెయిట్ ప్యాంటు నమూనా నెహ్రూ జాకెట్‌తో కలిగి ఉంది ఆధునిక పండుగ డ్రెస్సింగ్‌కి ఇది సరైన ఉదాహరణ. బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్‌లా చాలా సింపుల్ స్టైల్‌ని ఎంచుకోవచ్చు. ఆయన ధరించిన పాస్టెల్–రంగు లినెన్ కుర్తా–పైజామా సౌకర్యం, సరళమైన కాలాతీత శైలి అని చెప్పొచ్చు. -
న్యూజిలాండ్, ఇంగ్లండ్ తొలి టీ20 రద్దు
న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్ల మధ్య తొలి టి20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శనివారం జరిగిన తొలి పోరు భారీ వర్షం కారణంగా ఫలితం తేలకుండానే ముగిసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ జట్టు... నిర్ణీ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది.సామ్ కరన్ (35 బంతుల్లో 49 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్. ఇన్నింగ్స్ చివరి ఓవర్లో అతడు రెండు ఫోర్లు, ఒక సిక్స్‌తో మొత్తం 19 పరుగులు రాబట్టడంతో ఇంగ్లండ్ జట్టు ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. జోస్ బట్లర్ (29; 2 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ హ్యారీ బ్రూక్ (20; 1 ఫోర్, 2 సిక్స్‌లు) తలా కొన్ని పరుగులు చేశారు. న్యూజిలాండ్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ, జాకబ్ డఫీ, కైల్ జెమీసన్, మిచెల్ సాంట్నర్, జేమ్స్ నీషమ్, బ్రాస్‌వెల్ తలా ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం న్యూజిలాండ్ ఇన్నింగ్స్ ప్రారంభానికి ముందు భారీ వర్షం ముంచెత్తింది. ఎంతసేపటికీ తెరిపినివ్వకపోవడంతో అంపైర్లు పలుమార్లు పరీక్షించిన అనంతరం మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇరు జట్ల మధ్య సోమవారం ఇక్కడే రెండో టి20 జరగనుంది. -
పేరుకే పల్లె.. అందరికీ ఫారిన్ కొలువులే!
ఇల్లంతకుంట(మానకొండూర్): అది పేరుకే పల్లెటూరు. ఆ ఊరిలోని యువత దారి అమెరికా, యూరప్ దేశాలు. దాదాపు ప్రతీ ఇంటిలో ఉన్నత విద్యావంతుడు ఉంటారు. ఇప్పటికే 34 మంది విదేశాల్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా స్థిరపడగా.. గ్రామంలోనే ఉంటున్న 17 మంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. వీరిని స్ఫూర్తిగా తీసుకున్న నేటి యువత ఉన్నత చదువులు.. విదేశాల్లో కొలువులే లక్ష్యంగా హైదరాబాద్, బెంగళూర్ నగరాల్లో చదువుకుంటున్నారు. కుగ్రామం ముస్కానిపేట విజయగాథపై సండే స్పెషల్.1961లోనే అమెరికా పయనంఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే అమెరికాకు వెళ్లిన మొట్టమొదటి వ్యక్తిగా ఇల్లంతకుంట మండలంలోని ముస్కానిపేటకు చెందిన కోమటిరెడ్డి నరసింహారెడ్డి గుర్తుకొస్తారు. 1954లో గ్రామపంచాయతీగా ఏర్పడ్డ ముస్కానిపేటలో 3,625 మంది జనాభా నివసిస్తున్నారు. మండల కేంద్రం ఇల్లంతకుంటకు రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. గ్రామంలో అతి పురాతనకాలం నాటి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం ఆధ్యాత్మికతను పంచుతుండగా.. గ్రామం మొదట్లో దేవతామూర్తుల చిత్రాలతో ఆర్చి స్వాగతం పలుకుతుంటుంది. గ్రామం నుంచి అమెరికాకు వెళ్లిన వారు 11 మంది, లండన్‌లో ఇద్దరు, ఆస్ట్రేలియాలో ఒకరు, ఇండియాలో 21 మందితో కలిపి 34 మంది సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగాలు చేస్తున్నారు. కె.లక్ష్మారెడ్డి అనస్తీషియా డాక్టర్‌గా యశోద ఆస్పత్రిలో సేవలు అందిస్తున్నారు. బద్దం అనిల్, సారా నరేశ్‌గౌడ్, సింగిరెడ్డి రమణారెడ్డి వివిధ బ్యాంకుల్లో మేనేజర్లుగా ఉద్యోగాలు చేస్తున్నారు. గ్రామంలో 17 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉండగా ఇటీవల ఏడుగురు ఉద్యోగ విరమణ పొందారు. ముస్కానిపేట టు అమెరికా వయా ఆర్ఈసీముస్కానిపేటకు చెందిన కోమటిరెడ్డి నరసింహారెడ్డి వరంగల్‌లోని రీజినల్ ఇంజినీరింగ్ కాలేజీ(ఆర్ఈసీ)లో ఇంజినీరింగ్ చదివారు. గ్రామంలో నిధులు సమకూర్చుకొని అమెరికాకు వెళ్లారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మొట్టమొదటి వ్యక్తిగా 1961లో అమెరికాకు వెళ్లారు. నరసింహారెడ్డిని స్ఫూర్తిగా తీసుకొని గ్రామంలోని చాలా మంది యువకులు అమెరికాకు వెళ్లి సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా స్థిరపడ్డారు.సంతోషంగా ఉన్నాంనేను 2008లో యూఎస్ ఏ వెళ్లాను. టెక్సాస్ స్టే ట్లోని డల్లాస్‌లో ఒక కంపెనీలో సీనియర్ సాఫ్ట్వేర్ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నాను. కుటుంబం ఆర్థిక పరిస్థితి బాగాలేని సమయంలో అతి కష్టం మీద ఇక్కడికి వచ్చాను. ఇద్దరు అమ్మాయిలు. ఇప్పుడు ఆర్థికంగా స్థిరపడ్డాం. – కె.వంశీధర్‌రెడ్డి, యూఎస్ఏ భార్యాభర్తలం ఉద్యోగం చేస్తున్నాం2018లో అమెరికాకు వెళ్లా ను. నా భార్య సరిత, నేను ఒకే కంపెనీలో పనిచేస్తున్నాం. మాకు ఒక కూ తురు. నార్త్ కరోలినా స్టే ట్లోని కెరీలో ఉంటున్నా ము. ఆర్థికంగా స్థిరపడ్డాం. సంతోషంగా ఉంది. – కాట్నపల్లి గోపాల్రెడ్డిఆస్ట్రేలియాలో ఉంటున్నానేను ఆస్ట్రేలియాకు 2017 లో వెళ్లాను. ఎన్ఐటీ పూర్తి చేసి సాఫ్ట్‌వేర్‌గా స్థిరపడ్డాను. మెల్బోర్న్లో ఉంటున్నాను. మా ది వ్యవసాయ కుటుంబం. – కొమ్ముల మహేందర్రెడ్డిలండన్లో ఉద్యోగం చేస్తున్ననేను 2023లో లండన్ వెళ్లాను. ఇక్కడ ఎంబీఏ పూ ర్తి చేశాను. ప్రైవేట్ కంపెనీ లో ఉద్యోగం చేస్తున్నాను. ఇక్కడ ఉద్యోగం చేయడం సంతోషంగా ఉంది. – గుర్రం అజయ్‌రెడ్డి2006 నుంచి సాఫ్ట్‌వేర్‌గా.. 2006లో హైదరాబాద్‌లోని జేఎన్టీయూలో బీటెక్ పూర్తిచేసి అదే సంవత్సరం సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగం పొందాను. మేద సర్వో డ్రైవ్‌్సలో ఇండియన్ రైల్వే సిగ్నలింగ్ సిస్టంలో పనిచేస్తున్నాను. మొదట్లో నా సాలరీ రూ.10వేలు, ప్రస్తుతం సంవత్సరం ప్యాకేజీ రూ.50లక్షలు. ఊరి నుంచి సాఫ్ట్‌వేర్‌గా ఉద్యోగం పొందిన మొదటి వ్యక్తిని నేనే. చాలా సంతోషంగా ఉన్నాను. – కొమిరే లింగమూర్తిగౌడ్, హైదరాబాద్బ్యాంకు మేనేజర్‌గా పనిచేస్తున్నఎమ్మెస్సీ కంప్యూటర్ పూర్తి చేసి 2011లో కర్ణాటక బ్యాంకులో ప్రొహిబిషనరీ ఆఫీసర్‌గా ఎంపికయ్యాను. 2017లో బ్యాంకు మేనేజర్‌గా ప్రమోట్ అయ్యాను. 2011 నుంచి 19 వరకు గుజరాత్లో పనిచేశాను. ప్రస్తుతం హైదరాబాద్‌లోని నారాయణగూడ బ్రాంచ్‌లో మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్నాను. – బద్దం అనిల్జీవితం సంతోషంగా ఉందినా కొడుకు అమెరికాలోని డల్లాస్‌లో సాఫ్ట్‌వేర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. దేశం పోయేటప్పుడు ఆర్థికంగా కష్టంగా ఉండేది. దేశం పోయి 17 ఏళ్లు అయ్యింది. ఇప్పుడు చేతిలో డబ్బు ఉంది. చాలా సంతోషంగా ఉంది. కష్టపడి చదివినందుకు ఫలితం దక్కింది. – కోమటిరెడ్డి చిన్ననరసింహారెడ్డి, ముస్కానిపేట -
మావోయిస్టులకు మద్దతిస్తారా?.. బండి సంజయ్ సంచలన ట్వీట్
సాక్షి, హైదరాబాద్: కేంద్రమంత్రి బండి సంజయ్(bandi Sanjay) సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో మావోయిస్టులకు మద్దతిస్తున్న నేతలను హెచ్చరించారు. దేశ భద్రతకు ముప్పుగా పరిగణించే వాళ్లు ఎవరైనా సరే తప్పించుకోలేరు.. అంతర్గత భద్రత విషయంలో రాలే లేదు అంటూ వ్యాఖ్యలు చేశారు.కేంద్ర మంత్రి బండి సంజయ్ ట్విట్టర్ వేదికగా..‘రాజకీయ రంగ స్థలంలో ప్రజాస్వామ్యం గురించి వల్లె వేస్తూ.. మావోయిస్టులకు మద్దతిస్తున్న నేతలారా.. ఇదే మా హెచ్చరిక. సాయుధ వర్గాలతో సంబంధాలను తెంచుకోండి. లేనిపక్షంలో మీ గుట్టు బయటపడుతుంది. ప్రధాని నరేంద్రమోదీ ఆధ్వర్యంలో, అమిత్ షా మార్గదర్శకత్వంలో కేంద్ర సంస్థలు మావోయిస్టు నిర్మూలనకే పరిమితం కావడం లేదు. అవినీతి, మాఫియా, ఉగ్రవాద సంబంధాల నెట్‌వర్క్‌ను సైతం వెలికి తీస్తున్నాయి.దేశ భద్రతకు ముప్పుగా పరిగణించే వాళ్లు ఎవరైనా సరే తప్పించుకోలేరు. కరుణ లేకుండా కఠిన చర్యలు తీసుకోబోతున్నాయి. ఎంత పెద్ద వారైనా సరే అంతర్గత భద్రత విషయంలో రాజీ లేదు. మావోయిస్టుల వైపు నిలబడే వారెవరైనా సరే పడిపోక తప్పదు అంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదే సమయంలో మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ హిడ్మా కర్రెగుట్టల నుంచి తెలంగాణ వైపు వెళ్లినట్లు ఆయన అనుచరుడు పోలీసులకు తెలిపినట్లు వచ్చిన వార్త కథనాన్ని కూడా ఇవాళ బండి సంజయ్ పోస్టు చేయడం సంచలనంగా మారింది.Telangana politicians - consider this a warning.Those allegedly supporting armed networks while preaching democracy on stage, cut your links or get exposed.Central agencies won’t stop at Maoist cadres. Under the guidance of Hon’ble PM Shri @narendramodi ji and Hon’ble HM Shri… pic.twitter.com/ucicID1msj— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) October 19, 2025ఇదిలా ఉండగా.. మావోయిస్టులతో తెలంగాణ ప్రాంతానికి చెందిన పలువురు రాజకీయ నాయకులకు సంబంధాలు ఉన్నాయని ఇటీవల సరెండర్ అయిన మావోయిస్టు అగ్రనేత మల్లోజుల తెలిపిన విషయం ఇపుడు సంచలనంగా మారింది. అసలు మావోయిస్టులతో సంబంధాలున్న నాయకులు ఎవరా? అని చర్చ మొదలైంది. ఒకవేళ ఈ పేర్లు బహిర్గతమైతే పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనే విషయం ఆసక్తికరంగా మారింది.మరోవైపు.. ఇటీవల లొంగిపోయిన మావోయిస్ట్ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ భూపతి, మావోయిస్ట్ పార్టీలో అంతర్గత విభేదాలు ఉన్నాయని వెల్లడించారు. మావోయిస్టు గెరిల్లాలు ,కొంతమంది తెలంగాణ రాజకీయ నాయకుల మధ్య రహస్య కుమ్మక్కు జరిగిందని ఆయన వివరించినట్లు జాతీయ మీడియా తన కథనంలో పేర్కొంది. అలాగే హిడ్మా తెలంగాణ వైపు వచ్చారని ఆయన సన్నిహితులు పోలీసులకు వెల్లడించినట్లు మరో కథనం పేర్కొంది. ఈ నేపథ్యంలో బండి సంజయ్ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో దుమారం లేపుతున్నాయి. -
Bihar Elections: 25 మంది అభ్యర్థులను ప్రకటించిన ఏఐఎంఐఎం
పట్నా: బీహార్‌లో నవంబర్‌లో ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం తొలిదశ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా ముస్లిం నేత అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) పార్టీ.. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయబోయే 25 మంది అభ్యర్థులతో కూడిన మొదటి జాబితాను ఆదివారం విడుదల చేసింది. బీహార్‌లో నవంబర్ 6, 11 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. నవంబర్ 14న లెక్కింపు ఉంటుంది. ఏఐఎంఐఎం పార్టీ తన అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో.. ఎన్నికల్లో పోటీచేయబోయే అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. బీహార్‌లో అత్యంత అణగారిన ప్రజల గొంతుకగా పార్టీ నిలుస్తుందని దానిలో పేర్కొంది. పార్టీ జాతీయ నాయకత్వం అభ్యర్థులను ఎంపికచేసింది. అమౌర్ నుండి అఖ్తరుల్ ఇమాన్(పార్టీ సీనియర్ నేత), గోపాల్‌గంజ్ నుండి అనస్ సలాం, కిషన్‌గంజ్ నుండి న్యాయవాది షమ్స్ ఆగాజ్, నర్కటియా నుండి షమీముల్ హక్, బహదూర్‌గంజ్ నుండి తౌసీఫ్ ఆలం, నవాడా నసీమా ఖాటూన్ తదితరుల పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. बिहार विधानसभा चुनाव के AIMIM प्रत्याशियों के नाम कुछ इस तरह हैं। इंशाअल्लाह उम्मीद है कि हम बिहार के सबसे मज़लूम लोगों की आवाज़ बनेंगे। यह सूची AIMIM बिहार यूनिट ने तैयार की है और इस सिलसिले में पार्टी की क़ौमी कियादत से भी मशविरा किया गया है।We are happy to announce the list… pic.twitter.com/9ec1t4KpR2— AIMIM (@aimim_national) October 19, 2025243 స్థానాలు కలిగిన బీహార్ అసెంబ్లీకి రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ప్రధాని మోదీ నాయకత్వంలో ఎన్డీఏ భారీ స్థాయిలో ప్రచారానికి శ్రీకారం చుట్టింది. బీజేపీ,జేడీయూలతో కూడిన అధికార జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఏ) ఇందుకు ముమ్మర కసరత్తు చేసింది. అక్టోబర్ 24 నుండి ప్రధాని నరేంద్ర మోదీ బీహార్ అంతటా 12 ర్యాలీలు నిర్వహించనున్నారు. అలాగే ముఖ్యమంత్రి నితీష్ కుమార్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తదితరులు కీలక నియోజకవర్గాలలో ర్యాలీలు, ప్రచార కార్యక్రమాలు చేపట్టనున్నారు.ఎన్డీఏలో సమన్వయం కనిపిస్తుండగా, ‘మహాఘట్ బంధన్’ (గ్రాండ్ అలయన్స్)లో సీట్ల పంపకాల వ్యవహారం ఒక కొలిక్కి రాలేదు. కాంగ్రెస్, వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ), వామపక్ష పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించినప్పటికీ, సంకీర్ణ వ్యూహం ఇంకా అస్పష్టంగానే ఉంది. తాజాగా జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) ఆరు నియోజకవర్గాల్లో స్వతంత్రంగా పోటీ చేస్తామని ప్రకటించింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అక్టోబర్ 18న తన రెండవ జాబితాను విడుదల చేసింది. దానిలో శాశ్వత్ పాండే (నర్కటియాగంజ్), జితేందర్ యాదవ్(పూర్నియా), మహమ్మద్ కమ్రుల్ హోడా(కిషన్‌గంజ్), మహమ్మద్ ఇర్ఫాన్ ఆలం (కస్బా), మోహన్ శ్రీవాస్తవ (గయా టౌన్) తదితరులు ఉన్నారు. -
మధుమేహ వ్యాధిగ్రస్తులకు దీపావళి ‘స్వీట్’ వార్నింగ్..!
దీపావళి అనగానే నోరూరించే వివిధ రకాల మిఠాయిలు గురొస్తాయి. టపాసులు ఎంత ఫేమస్సో.. అంతే రీతిలో స్వీట్లు ఫేమస్.. పండగ శుభాకాంక్షలతో పరిశ్రమలు, ప్రైవేటు, కార్పొరేట్ సంస్థలు, వ్యాపార వేత్తలు ప్రత్యేంగా ఆర్డర్ ఇచ్చి స్వీట్స్ తయారు చేయిస్తున్నారు. ఆది, సోమవారాల్లో నేరుగా వచ్చే వినియోగదారుల కోసం స్వీట్ దుకాణాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈ సమయంలో వినియోగదారులు జాగ్రత్తగా వ్యవహరించాలి. సందట్లో సడేమియా అన్నట్లు డిమాండ్ ఉన్నప్పుడే నాసిరకం ఉత్పత్తులు తయారు చేసి, ఎక్కువ రోజులు నిల్వ ఉంచుతారు. రుచి, వాసన, జిగేల్ మని మెరిసే రంగుల కోసం వివిధ రకాల రసాయనాలు వినియోగించే అవకాశం ఉందంటున్నారు వైద్యులు. ఫలితంగా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. దీనికి ప్రత్యామ్నాయంగా ఇంట్లోనే తయారు చేసుకోవడం ఉత్తమమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో మిఠాయిలకు ఫుల్ డిమాండ్ కనిపిస్తోంది. పండగ రెండు రోజులు ఎగబడి మరీ కొంటారు. అయితే వీటిని తయారు చేసే సమయంలో ఎలాంటి పదార్థాలు వినియోగిస్తున్నారనేది తెలియదు. ఆహార భద్రత అధికారులు సైతం దీనిపై దృష్టిసారించే పరిస్థితి లేదు. దీంతో కల్తీ జరిగే అవకాశాలు ఎక్కువ. ఇటువంటి సమయంలో మితంగా తింటే సరే.. అతిగా తిన్నామా ఆరోగ్య సమస్యలు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పిల్లలు, వృద్ధులు, గర్భిణులు మరింత అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. స్వీట్స్‌లో చక్కెర, కొవ్వు పదార్థాలు అధికంగా వినియోగిస్తారు. దీని వల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. కొవ్వు పదార్థాలు గుండె జబ్బులకు దారితీయవచ్చు. పిల్లల్లో అవయవాల పనితీరు దెబ్బతినే అవకాశం ఉంది. వీటన్నింటికీ మించి అవసరాలకు సరిపడా పిండి వంటలను ఇంట్లోనే తయారు చేసుకుంటే మేలు. తద్వారా కల్తీ ఆహార పదార్థాలు, కలుషిత, నిల్వ ఉంచిన వాటి నుంచి జాగ్రత్తపడే అవకాశం ఉంటుంది.దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశం.. పిండి వంటల తయారీ ప్రక్రియలో నూనె, చక్కెర, రంగులు, డ్రైఫ్రూట్స్ ఎలాంటివి వినియోగిస్తున్నారో గుర్తించడం కష్టం. రుచి, వాసన, రంగు కోసం కెమికల్స్ వినియోగించే అవకాశం లేకపోలేదు. ఇవి పిల్లలు, గర్భిణులు, వృద్ధులుపై దీర్ఘకాలిక ప్రభావం చూపిస్తాయి. కెమికల్స్, కల్తీ పదార్థాలు తినడం వల్ల ఫుడ్ పాయిజన్ కావచ్చు. దీర్ఘకాలంలో కేన్సర్, లివర్, కిడ్నీపై ప్రభావం చూపిస్తాయి. ఇటువంటి వాటిపై ప్రభుత్వ శాఖాపరమైన పర్యవేక్షణ ఉండాలి. తయారు చేసిన వంటకాల ప్యాక్‌పై వినియోగించిన పదార్థాలు, ఫ్యాట్, ఇతర వివరాలు ముద్రించాలి. – కిరణ్ కుమార్ మాదాల, ఐఎంఏ తెలంగాణ మీడియా కో–కన్వీనర్ -
చెత్త షాట్ ఆడి ఔట్.. కట్ చేస్తే! పాప్ కార్న్ తింటూ రిలాక్స్(వీడియో)
టీమిండియా టెస్టు కెప్టెన్సీని అద్బుతమైన సెంచరీతో ఆరంభించిన శుభ్‌మన్ గిల్.. వన్డేల్లో మాత్రం తన మార్క్‌ను చూపించలేకపోయాడు. భారత వన్డే సారథిగా తొలి మ్యాచ్‌లో గిల్ విఫలమయ్యాడు. పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో గిల్ కేవలం 10 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు.స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఔటైన సమయంలో బాధ్యతయతంగా ఆడాల్సిన గిల్.. పేలవ షాట్ ఆడి తన వికెట్‌ను కోల్పోయాడు. భారత ఇన్నింగ్స్ 9 ఓవర్ వేసిన నాథన్ ఈల్లీస్.. తొలి బంతిని గిల్‌కు లైగ్ సైడ్ డెలివరీగా సంధించాడు. బౌలర్ ట్రాప్‌లో పడ్డ గిల్ ఆ డెలివరీని డౌన్‌ది లెగ్ సైడ్ ఆడటానికి ప్రయత్నించాడు.కానీ షాట్ సరిగ్గా కనక్ట్ కాకపోవడంతో వికెట్ కీపర్ ఫిలిప్ తన ఎడమ వైపునకు డైవ్ చేస్తూ క్యాచ్‌ను అందుకున్నాడు. అయితే గిల్ ఔటయ్యాక మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. దీంతో డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిన గిల్.. మాజీ కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి పాప్ కార్న్ తింటూ రిలాక్స్‌గా కన్పించాడు.ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్లు కొంచెం బాధ లేకుండా పాప్ కార్న్ తింటూ రిలాక్స్ అవుతున్నావా అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ 48 పరుగులకు 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. వర్షం కారణంగా మ్యాచ్‌ను 32 ఓవర్లకు కుదించారు. ఇంకా 17 ఓవర్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ(8), విరాట్ కోహ్లి(0), శ్రేయస్ అయ్యర్(11) తీవ్ర నిరాశపరిచారు.చదవండి: IND vs AUS: చరిత్ర సృష్టించిన నితీశ్ కుమార్ రెడ్డి.. 93 ఏళ్లలో ఒకే ఒక్కడు😭😭 #RohitSharma𓃵 #ShubmanGillpic.twitter.com/DCNj5q3Spu— 𝓗𝓲𝓽𝓶𝓪𝓷 (@Slefless45) October 19, 2025 -
పవన్ కల్యాణ్ సినిమాలో యాక్ట్ చేయను: కిరణ్ అబ్బవరం
ఈ సారి దీపావళికి థియేటర్స్ కళకళలాడుతున్నాయి. ఏకంగా నాలుగు సినిమాలు రిలీజయ్యాయి. మిత్రమండలి, తెలుసు కదా, డ్యూడ్, కె-ర్యాంప్ ఒకటీరెండు రోజుల వ్యవధిలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వీటన్నింటిలో కె-ర్యాంప్ సినిమాకి ఎక్కువ మార్కులు పడుతున్నాయి. ఈ పండక్కి హాయిగా నవ్వుకునేలా ఉందంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి.షార్ట్ ఫిలింస్ నుంచి హీరోగా..దీంతో కిరణ్ అబ్బవరానికి (Kiran Abbavaram) పెద్ద హిట్టే అందినట్లు కనిపిస్తోంది. ఇకపోతే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇతడు మాట్లాడుతూ.. సైడ్ క్యారెక్టర్లు చేయనని చెప్తున్నాడు. కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. అమ్మానాన్న వ్యవసాయం చేస్తారు. రచయిత అవుదామని ఇండస్ట్రీకి వచ్చాను. అనుకోకుండా షార్ట్ ఫిలింస్ చేశాను. నాకంటూ ఏదో గుర్తింపు కావాలనిపించింది. షార్ట్ ఫిలింస్ ద్వారా వచ్చిన గుర్తింపుతో రాజావారు రాణిగారు సినిమా ఛాన్స్ వచ్చింది. ఈ మూవీ హిట్టవడంతో పేరొచ్చింది. లైఫ్ చేంజ్జనాల్లోకి వెళ్లాలంటే ఏం చేయాలి? అని ఆలోచించి ఎస్ఆర్ కళ్యాణమండపం కథ రాసుకున్నాను. అలా ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చాను. కాలేజీలో ఉన్నప్పుడు పవన్ కల్యాణ్ అభిమానినే! ఆయన సినిమాలు ఎంజాయ్ చేశాను. కానీ, సినిమా ఇండస్ట్రీకి వచ్చాక జీవితం మారిపోయింది. హీరోగా నా కెరీర్‌ను నిర్మించుకునే పనిలో ఉన్నాను. క్యారెక్టర్స్ చేయనుపెద్ద సినిమాలు చేయాలనుకుంటున్నా.. నాకంటూ సొంత గుర్తింపు కోరుకుంటున్నా.. కాబట్టి ఈ సమయంలో క్యారెక్టర్స్ చేయలేను. ఆయన సినిమాలో నటించే అవకాశం వస్తే రిజెక్ట్ చేస్తా! ఒకవేళ.. కిరణ్ అబ్బవరం మాత్రమే చేయగలిగే క్యారెక్టర్ అంటే అప్పుడు కచ్చితంగా చేస్తాను. కేవలం పవన్ సినిమాలో కనిపించాలని మాత్రం చేయను అని కిరణ్ అబ్బవరం చెప్పుకొచ్చాడు.చదవండి: ఏంటి సంజనా.. నీకు, నాకు పెళ్లిచూపులా?: నాగార్జున -
పెరిగిన యస్ బ్యాంక్ లాభం: రూ. 654 కోట్లు
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ప్రైవేట్ రంగ యస్ బ్యాంక్ నికర లాభం రూ. 654 కోట్లకు చేరింది. గత క్యూ2లో నమోదైన రూ. 553 కోట్లతో పోలిస్తే 18 శాతం పెరిగింది. ఇక లోన్‌బుక్ 6.4 శాతం వృద్ధి చెందడంతో కీలకమైన నికర వడ్డీ ఆదాయం 0.10 శాతం మెరుగుపడి 4.6 శాతానికి చేరింది. ఇతర ఆదాయం 16.9 శాతం పెరిగి రూ. 1,644 కోట్లుగా నమోదైంది.తాజా స్లిప్పేజీలు అంతక్రితం త్రైమాసికంలో ఉన్న రూ. 1,458 కోట్ల నుంచి రూ. 1,248 కోట్లకు దిగివచ్చాయి. స్థూల నిరర్థక ఆస్తుల నిష్పత్తి పెద్దగా మార్పు లేకుండా 1.6 శాతం స్థాయిలో కొనసాగుతోంది.ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 10 శాతం స్థాయి రుణ వృద్ధి సాధించాలని నిర్దేశించుకున్నట్లు బ్యాంక్ ఎండీ ప్రశాంత్ కుమార్ చెప్పారు. ఇకనుంచి నికర వడ్డీ మార్జిన్లు మరింత మెరుగుపడగలవని ఆయన పేర్కొన్నారు. జపాన్ దిగ్గజం ఎస్ఎంబీసీ 24 శాతం పైగా వాటాను కొనుగోలు చేసినప్పటికీ, తక్షణమే వ్యాపార ప్రణాళికల్లో మార్పులేమీ ఉండబోవని కుమార్ వివరించారు. భవిష్యత్ ప్రణాళికలను నిర్దేశించే వార్షిక సర్వసభ్య సమావేశం యథా ప్రకారంగానే జరుగుతుందని చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 80 శాఖలను ప్రారంభించే ప్రణాళికలు ఉన్నట్లు వివరించారు. -
కోఠిలో బ్యాగులు అమ్ముకున్నా.. బాత్రూమ్లు కడిగా: ‘జబర్దస్త్’ కమెడియన్
‘పనే నాకు దేవుడు. మనం చేసే పనే డబ్బుతో పాటు గుర్తింపు, గౌరవం తెచ్చిపెడుతుంది. నిజాయితీగా పని చేసేవాడికే దేవుడు సక్సెస్ ఇస్తాడని నేను నమ్ముతాను’ అంటున్నాడు నటుడు కుమార్ అలియాస్ ‘జబర్దస్త్’ కొమురక్క. లేడీ గెటప్‌తో అందరిని అలరిస్తున్న కొమురం.. ఇప్పుడు ఈ స్థాయిలో ఉండడానికి చాలానే కష్టపడ్డాడు. ఒకప్పుడు హోటల్లో పని చేయడమే కాదు.. బాత్రూంలు కడిగాడట. వచ్చిన ప్రతీ రూపాయిని భూమిపై ఇన్వెస్ట్ చేయడంతో ఇప్పుడు సంతోషంగా ఉన్నాను అంటున్నాడు ఈ కమెడియన్. తాజాగా ఓ యూట్యూబ్ చానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్ ప్రారంభంలో పడిన కష్టాల గురించి చెప్పుకొచ్చాడు.కోఠిలో బ్యాగులు అమ్ముకున్నా..పదో తరగతి అయిపోగానే నేను హైదరాబాద్‌కి వచ్చాను. డబ్బులు సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. హోటల్లో పని చేశాను. కిరాణం దుకాణం పెట్టి స్టాఫ్‌కి ఉద్దెర ఇచ్చేవాడిని. హోటల్లో పని అయిపోగానే కోటిలో ఎఫ్ఎమ్ రేడీయోలు, బ్యాగులు అమ్ముకునేవాడిని. వర్షాకాలం వస్తే గొడుగులు, పర్సులు అమ్ముకునేవాడిని. అలా ఎమిమిదేళ్ల పాటు కష్టపడి పని చేశాను. ఒకవైపు హోటల్లో పని.. కిరాణ దుకాణం.. గ్యాప్‌లో కోటిలో బ్యాగులు అమ్ముకోవడం..ఇలా రెస్ట్ లేకుండా పని చేసేవాడిని. ఫ్యామిలీని వదిలి హైదరాబాద్‌కు వచ్చిందే డబ్బుల కోసం. అందుకే నేను ఖాళీగా ఉండేవాడిని కాదు.రూ.4500 జీతం.. బాత్రూంలు కడిగా..హైదరాబాద్‌లో ఎనిమిదేళ్లు పని చేసిన తర్వాత తిరిగి సొంతూరు(షాద్‌నగర్)కు వచ్చేశా. పెళ్లి తర్వాత ఓ కంపెనీలో హమాలీ పనికి చేరాను. అప్పుడు నా జీతం రూ. 4500 మాత్రమే. హమాలీ పనితో పాటు అక్కడ బాత్రూంలు కూడా కడిగేవాడిని. అందరూ నన్ను హేళన చేసిన పట్టించుకునేవాడిని కాదు. ఏ పని చేసినా నిజాయితీగా చేయడమే నా లక్ష్యం. బాబు పుట్టిన తర్వాత కూడా కొన్నాళ్ల పాటు హమాలీ పని చేశాడు. సినిమాల కోసం ప్రయత్నాలుఓ రోజు నా భార్య ‘ ఎన్నాళ్లు ఇలా దుమ్ములో పని చేస్తావ్?, నీకు సినిమాలు అంటే ఇష్టం కదా.. ఆ ప్రయత్నాలు చెయ్. బాబుని నేను చూసుకుంటా’అని చెప్పింది.మూడేళ్ల పాటు సినిమా ప్రయత్నాలు చెయ్..అప్పటికీ సక్సెస్ కాకపోతే తిరిగి వచ్చేసి ఏదైనా పని చేసుకుందాం’ అని ఆమె చెప్పింది. నేను ఐదేళ్ల పాటు చాన్స్‌ల కోసం తిరిగాను. ఆ సమయంలో నా భార్యే నాకు నెలకు రూ. 3000 పంపించేది. కుట్టు మిషన్ కుడుతూ పిల్లాడిని పెంచింది. బంధువులంతా నానా మాటలు అనేవాళ్లు. సినిమా ఇండస్ట్రీపై చెడుగా చెప్పేవారు. నా భార్య మాత్రం అవేవి పట్టించుకునేది కాదు.కొమురక్క పాత్ర అలా పుట్టిందిఓసారి ఓ న్యూస్ చానల్‌కి నేనే ఓ కొత్త ప్రోగ్రాం ఐడియా ఇచ్చాను. ఓ లేడీ ఉంటుందని, ఇలా మాట్లాడుతుందని చెప్పి ఓ గెటప్‌ని నాకు నేనే క్రియేట్ చేసుకున్నా. ఆ పాత్రకు ముందుగా పోచమ్మ అని పేరు పెట్టుకున్నాను. కానీ అప్పటి ఆంథోల్ ఎమ్మెల్యేగా ఉన్న క్రాంతి కుమార్ ‘కొమురమ్మ’అని పెట్టు అని సలహా ఇచ్చాడు. ఆయన తల్లిగారి పేరు అది. నేను గెటప్ వేస్తే తన తల్లిలాగే అనిపించిందని.. ఆ పేరు పెట్టుకోమని చెప్పాడు. నేను అమ్మ అని పెడితే ఏది పడితే అది మాట్లాడలేమని చెప్పి ‘కొమురక్క’అని పెట్టుకున్నాను. అప్పటి నుంచి అది ఫేమస్ అయిపోయింది. జబర్దస్త్‌లో ‘పశువులు అంటే ప్రాణం’అంటూ నేను చేసిన ఓ కామెడీ ఎపిసోడ్ బాగా వైరల్ కావడంతో ‘కొమురక్క’పేరు అందరికి తెలిసింది.ప్రతిపైసా భూమిపై పెట్టా..ఒకప్పుడు మాకు షాద్‌నగర్‌లో 20 ఎకరాల వరకు భూమి ఉండేది. మా నాన్న అమ్ముకుంటూ వచ్చి చివరకు 5 ఎకరాలకు తీసుకొచ్చాడు. అప్పటి నుంచే నాకు భూమి కొనాలనే ఆశ ఉండేది. నేను, నా భార్య సంపాదించిన ప్రతి పైసా భూమిపై పెట్టా. నాకు ఏ చెడు అలవాట్లు లేవు. అప్పట్లో చాలా తక్కువ ధరకు భూమిని కొన్నాను. ఇప్పుడు దాని విలువ పెరిగింది. నా చుట్టుపక్కల వారికి కూడా అదే చెప్తాను. డబ్బులు వృథా చేయకుండా.. ఇలా ల్యాండ్‌పై ఇన్వెస్ట్ చేస్తే భవిష్యత్ బాగుంటుందని చెప్తాను’ అని కొమురం చెప్పుకొచ్చాడు. ‘మీ ఆస్తి మొత్తం విలువ దాదాపు రూ. 200 కోట్ల వరకు ఉంటుందా?’ అని యాంకర్ అడిగిన ప్రశ్నకు..నవ్వుతూ ‘అంత ఉందని చెప్పలేను కానీ.. అదృష్టం కొద్ది అప్పట్లో తక్కువ ధరకు ల్యాండ్ కొంటే.. ఇప్పుడు దాని విలువ పెరిగింది’ అని చెప్పాడు. -
అరుదైన ఘటన: ఇద్దరు బాల్య స్నేహితురాళ్లను పెళ్లాడిన వ్యక్తి..!
మనదేశంలో బహుబభార్యత్వం చట్టవిరుద్ధం. పైగా ఇద్దరమ్మాయిలను పెళ్లి చేసుకోవడం అనేది అంత ఈజీ కాదు. ఎక్కడో అరుదుగా జరుగుతుంటాయి. అది కూడా మహా అయితే ఇద్దరు కవలలు, లేదా తోడబుట్టిన అక్కా చెల్లెళ్లను పెళ్లాడిన ఘటనలు చూసుంటారు. కాని ఇద్దరు బాల్య స్నేహితురాళ్లును పెళ్లి చేసుకోవడం అనేది అత్యంత అరుదు. అలాంటి విచిత్ర ఘటనే కర్ణాటకలో చోటు చేసుకుంది. ఈ అరుదైన విచిత్రమైన పెళ్లిని చూసేందుకు జనాలు వేలాదిగా తరలి వచ్చారు. కర్ణాటకకు చెందిన 25 ఏళ్ల వసీం షేక్ తన చిన్న నాటి ప్రాణ స్నేహితులైన షిఫా షేక్, జన్నత్ మఖందర్ల పెళ్లి చేసుకున్నాడు. చిత్రదుర్గ జిల్లాలోని హోరాపేటలోని ఎంకే ప్యాలెస్‌లో ఈ కార్యక్రమం జరుగుతోంది. ఒకే వేడుక వద్ద పెళ్లితో ఒక్కటి కానున్న ఈ ముగ్గురి వివాహాన్ని చూసేందుకు బంధు మిత్రులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. కొందరూ ఈ పెళ్లిని స్వాగతించగా, మరికొందరు ఇదేం పెళ్లి అన్నట్లు ముఖం చిట్లించారు. ఈ ముగ్గురి వివాహాన్ని వారివారి కుటుంబాలు అంగీకరించడం, పెళ్లిచేయడం విశేషం. ఆ వేడుకకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవ్వడంతే ఈ పెళ్లి పెద్ద చర్చనీయాంశంగా మారింది. కాగా, బహుభార్యత్వం భారతీయ పౌర చట్టం ప్రకారం..అనుమతి లేకపోయినా, కొన్ని వ్యక్తిగత చట్టాలకింద మినహాయింపులు ఉన్నాయట. ఇలాంటి పెళ్లిళ్లు చెల్లుబాటు అనేది సామాజిక అంగీకారం, నిబంధనలు, ఆయా సంఘాలు చట్టబద్ధత, మతపరమైన అంశాలు వంటి వాటిపై ఆధారపడి ఉంటుందట. View this post on Instagram A post shared by Logkyakahenge (@log.kya.kahenge) (చదవండి: బాణసంచా కాల్చడం ఎలా మొదలైందో తెలుసా..!) -
ఆర్యన్- ఎ పర్ఫెక్ట్ క్రైమ్ స్టోరీ.. ట్రైలర్ చూశారా?
తమిళ నటుడు విష్ణు విశాల్ నటిస్తున్న కొత్త చిత్రం ఆర్యన్.. ఎ పర్ఫెక్ట్ క్రైమ్ స్టోరీ అనేది ట్యాగ్‌లైన్. తాజాగా ఈ మూవీ నుంచి ట్రైలర్ విడుదలైంది. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా దర్శకుడు కె ప్రవీణ్ తెరకెక్కిస్తున్నారు. ఇందులో శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్గా నటిస్తుంది. అక్టోబర్ 31న విడుదల కానున్న ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల హక్కులను హీరో నితిన్ తండ్రి, ప్రముఖ పంపిణీదారుడు సుధాకర్‌రెడ్డి పొందారు.ఆర్యన్ సినిమాలో విష్ణు విశాల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. ప్రముఖ నటుడు, దర్శకుడు సెల్వరాఘవన్ కీలకమైన పాత్రలో కనిపించనున్నారు. సంగీతం జిబ్రాన్ అందించగా.. విష్ణు విశాల్ స్టూడియోస్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుంది. తాజాగా విడుదలైన ట్రైలర్లో ఒక సీరియల్ కిల్లర్ కోసం పోలీసులు వేస్తున్న ప్లాన్లు ఎలా ఉంటాయో చూపించారు. వాటి నుంచి ఆ కిల్లర్ ఏ విధంగా తప్పించుకుంటున్నాడో చెప్పారు. చాలా ఆసక్తిగా ఆర్యన్ ట్రైలర్ ఉంది. -
ఇంత మోసమా చంద్రబాబు: వెంకట్రామిరెడ్డి
సాక్షి, విజయవాడ: ఉద్యోగులను చంద్రబాబు దారుణంగా మోసం చేశారని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ వెంకట్రామిరెడ్డి మండిపడ్డారు. ఉద్యోగులకు పీఆర్సీ ఇవ్వాలనే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని.. ఇప్పటివరకు పీఆర్సీ కమిషన్ అపాయింట్ చేయలేదంటూ ఆయన దుయ్యబట్టారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఉద్యోగులకు పెండింగ్ బకాయిలు రూ.34 వేల కోట్లు ఉన్నాయి. ఆ బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారు? అంటూ నిలదీశారు.‘‘ఉద్యోగుల సమస్యలను పట్టించుకోవడం లేదు. ఉద్యోగులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలి. కాంట్రాక్ట్ ఉద్యోగులను ఎందుకు రెగ్యులర్ చేయడం లేదు. ఉద్యోగుల సమస్యలను పట్టించుకోవడం లేదు. మాకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఇవ్వకపోగా పని ఒత్తిడి పెంచారు. ఇంటింటి సర్వేల పేరుతో ఉద్యోగులను ప్రభుత్వం వేధిస్తోంది. ఉద్యోగులను మోసం చేయడమే పనిగా ప్రభుత్వం పెట్టుకుంది’’ అని వెంకట్రామిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఒక డీఏ ఇవ్వడానికి ప్రభుత్వానికి 16 నెలలు సమయం పట్టింది. తక్షణమే ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి. ఉద్యోగుల ఆవేదనను ప్రభుత్వం అర్థం చేసుకోవాలి’’ అని వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఉద్యోగులకు బాబు దగా -
హమాస్ మరో డేంజర్ ప్లాన్.. అమెరికా సీరియస్ వార్నింగ్
వాషింగ్టన్: గాజాలోని పౌరులపై దాడులు చేసేందుకు హమాస్ (Hamas) ప్రణాళికలు రచిస్తోందని కలకలం రేపింది. హమాస్ దాడుల ప్రణాళిక గురించి తమ వద్ద విశ్వసనీయ సమాచారం ఉందని అమెరికా (USA) విదేశాంగ శాఖ తాజాగా ఓ ప్రకటనలో వెల్లడించింది. దీంతో, రంగంలోకి దిగిన అమెరికా.. హమాస్‌కు హెచ్చరికలు జారీ చేసింది. ఇలాంటి చర్యలకు దిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చింది.ఇజ్రాయెల్-హమాస్ మధ్య సుదీర్ఘ యద్ధం జరిగిన విషయం తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చొరవతో ఇజ్రాయెల్- హమాస్ (Israel- Hamas)ల మధ్య ఇటీవల కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. ఇందులో భాగంగా ఇజ్రాయెల్ బందీలను సైతం హమాస్ విడుదల చేసింది. అయితే, గాజాలోని పౌరులపై దాడులు చేసేందుకు హమాస్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం బయటకు రావడం తీవ్ర కలకలం రేపింది. ఈ సందర్బంగా అమెరికా (USA) విదేశాంగ శాఖ అలర్ట్ అయ్యింది. పాలస్తీనా పౌరులపై హమాస్ దాడి ప్రణాళిక.. కాల్పుల విరమణ ఒప్పందాన్ని తీవ్రంగా ఉల్లంఘించడమేనని అమెరికా పేర్కొంది.తమ మధ్యవర్తిత్వ ప్రయత్నాలతో సాధించిన గణనీయమైన పురోగతిని ఇది దెబ్బతీస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది. హమాస్ ఈ దాడులకు పాల్పడితే.. గాజా ప్రజలను రక్షించడానికి, కాల్పుల విరమణ సమగ్రతను కాపాడేందుకు తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. తమకు అందిన ఈ సమాచారాన్ని ఈజిప్టు, ఖతార్, తుర్కియేతో సహా శాంతి ఒప్పందానికి హామీగా ఉన్న దేశాలకు తెలియజేసినట్లు యూఎస్ తెలిపింది. దీంతో, మరోసారి గాజాలో ఉద్రిక్త పరిస్థితులు ఉంటాయా అని ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. -
పాలు కలిపిన టీ తాగే అలవాటు.. ఇలా మొదలైంది...
మన సంస్కృతిలో భాగంగా కలిసిపోయినప్పటికీ టీ జన్మస్థలం భారత దేశం కాదు ఈ పానీయంపై చైనా గుత్తాధిపత్యాన్ని సవాలు చేయడానికి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ 19వ శతాబ్దంలో పెద్ద ఎత్తున టీ సాగును ప్రవేశపెట్టింది. మొదట్లో, భారతీయులను అది లక్ష్యం చేసుకోలేదు. టీ ఎగుమతి ఇతర ప్రముఖ సంపన్న దేశాలకు ఉండేది. కానీ అనూహ్యంగా భారతీయులు ఆ విదేశీ అలవాటును తమ స్వంతం చేసుకున్నారు.అయితే 1900లలో బ్రిటిష్ కంపెనీలు స్థానికంగా టీని ప్రోత్సహించడం ప్రారంభించినప్పుడు, దానిని మరింత రుచికరంగా మార్చడానికి పాలు చక్కెరను జోడించమని వారే మనవాళ్లని ప్రోత్సహించారు. ఈ ఆలోచన వారు ఊహించిన దానికంటే బాగా పనిచేసింది. భారతీయులు ఆ పానీయాన్ని స్వీకరించడమే కాదు, దానిని తిరిగి తమదైన శైలిలో ఆవిష్కరించారు.కలిసి...కరిగిపోయి...భారతీయ వంటశాలలలో పాలు అంటే ఒక పదార్ధం కంటే ఎక్కువ ఇది పోషణ, స్వచ్ఛత సంప్రదాయం. బాల్యంలో హల్దీ దూద్ గ్లాసుల నుంచి పండుగ స్వీట్ల వరకు, పాలు అనేక రకాలుగా భారతీయుల్ని వారి అభిరుచుల్ని అంటిపెట్టుకునే ఉంటుంది. కాబట్టి అది మనం తాగే టీలో కూడా సులభంగా, వేగంగా కలిసిపోయింది. భారతదేశంలోని చిన్న పట్టణాలు మార్కెట్లలో టీ వ్యాపించడంతో, ప్రతి ప్రాంతం దాని స్వంత రుచులను దానికి జోడించింది.ఆ తర్వాత మసాలా చాయ్ వచ్చింది. వెచ్చదనం కోసం అల్లం, సువాసన కోసం ఏలకులు, కిక్ కోసం లవంగం, గాఢత కోసం దాల్చిన చెక్క... పాల తర్వాత టీలో కలిపే జాబితా లో చేరిపోయాయి.చాయ్...రాజా చాయ్...20వ శతాబ్దం మధ్య నాటికి, చాయ్‌వాలా రైల్వే ప్లాట్‌ఫామ్‌లు వీధి మూలలను ఆక్రమించి, ప్రయాణికులకు కార్మికులకు ఆవిరితో కూడిన పాల టీ గ్లాసులను అందించారు. వలసరాజ్యాల ఎగుమతిగా ప్రారంభమైన ఈ పానీయం రోజువారీ అలవాటుగా ఎన్ని విధాలుగా అయినా మార్పు చేర్పులకు అనుకూలించేదిగా మారింది. భాష, కులం వంటకాల ద్వారా వ్యత్యాసాలున్న మన దేశంలో, టీ ఒక విధంగా ఉమ్మడి అభిరుచిని నిర్మించింది. ఇద్దరు అపరిచితులు ఒక మాటను పంచుకోకపోవచ్చు, కానీ పంచుకున్న కప్పు చాయ్ ఎంతటి దూరాన్ని అయినా కరిగించగలదు అన్నంతగా ప్రభావాన్ని చూపుతోంది.మరికొన్ని దేశాలకూ విస్తరించిన మిల్క్ టీ...భారతదేశం వెలుపల, టీ వేరే రూపాల్లో సంచరిస్తోంది. టీ పుట్టిన చైనా జపాన్లలో తేనీటి స్వచ్ఛతకు విలువ ఇస్తారు. వారి దృష్టి ఆకుపై, దాని వాసనపై మాత్రమే ఉంటుంది. వారు పాలు కలపరు. బ్రిటిష్ వారు కూడా పాలు అతి తక్కువగానే కలుపుతారు.మన దేశం కాకుండా యునైటెడ్ కింగ్డమ్, ఇండియా, పాకిస్తాన్, నేపాల్, శ్రీలంక, మలేషియా, సింగపూర్, హాంకాంగ్, తైవాన్ థాయిలాండ్ వంటి దేశాలలోనూ పాలతో టీ అనే అలవాటు ఉన్నప్పటికీ మన దేశంతో పోటీపడే స్థాయిలో కాదు. మంగోలియా, ఇథియోపియా, బురుండి, కెన్యా ఆఫ్రికాలోని అనేక ఇతర దేశాలు ముఖ్యమైన మిల్క్ టీ సంప్రదాయాలు ఉన్నాయి. -
చరిత్ర సృష్టించిన నితీశ్ కుమార్ రెడ్డి.. 93 ఏళ్లలో ఒకే ఒక్కడు
టీమిండియా యువ ఆల్‌రౌండర్, ఆంధ్ర స్టార్ క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి ఇకపై ఆల్ ఫార్మాట్ ప్లేయర్‌గా కొనసాగనున్నాడు. ఇప్పటికే టీ20, టెస్ట్ ఫార్మాట్లలో భారత్‌కు వహిస్తున్న నితీశ్ .. తాజాగా వన్డేల్లోకి కూడా అడుగుపెట్టాడు.పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో తొలి వన్డే సందర్భంగా నితీశ్ భారత్ తరపున 50 ఓవర్ల క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. తేడాది నవంబర్ 22వ తేదీ విరాట్ కోహ్లీ చేతుల మీదుగా టెస్ట్ డెబ్యూ క్యాప్ అందుకున్న ఈ తెలుగు కుర్రాడు.. ఇప్పుడు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ చేతుల మీదగా వన్డే క్యాప్‌ను తీసుకున్నాడు. ఈ క్రమంలో నితీశ్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు.చరిత్ర సృష్టించిన నితీశ్..93 ఏళ్ల భారత క్రికెట్ చరిత్రలో పెర్త్ వేదికగా టెస్ట్, వన్డే క్రికెట్లోకి అరంగేట్రం చేసిన ఏకైక ఆటగాడిగా నిలిచాడు. 1932 నుంచి భారత్ క్రికెట్ ఆడుతున్నప్పటికి ఎవరూ ఈ ఫీట్ సాధించలేకపోయారు. 2024/25 బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో పెర్త్ వేదికగా టెస్టుల్లో డెబ్యూ చేసిన నితీశ్.. యాదృఛ్చికంగా ఏడాది తర్వాత అదే మైదానంలో వన్డే అరంగేట్రం చేశాడు.ఇంతకముందు పెర్త్ వేదికగా బరిందర్ శ్రణ్, సుబ్రోతో బెనర్జీలు భారత్ తరఫున వన్డేల్లోకి అరంగేట్రం చేయగా.. హర్షిత్ రాణా, వినయ్ కుమార్‌లు టెస్టుల్లో అరంగేట్రం చేశారు. కానీ నితీష్ ఒక్కడే రెండు వైట్ బాల్ ఫార్మాట్లలోనూ పెర్త్‌లో డెబ్యూ చేశాడు.ఇక ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ దారుణ ప్రదర్శన కనబరుస్తోంది. 37 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ(8), కోహ్లి(0), గిల్(10) తీవ్ర నిరాశపరిచారు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్, హాజిల్ వుడ్, ఈల్లీస్ తలా వికెట్ సాధించారు. అయితే వర్షం కారణంగా ఆట ఆగిపోయింది.చదవండి: Virat Kohli: రీ ఎంట్రీలో అట్టర్ ప్లాప్.. విరాట్ కోహ్లి డకౌట్! ఇలా అయితే కష్టమే? -
ఏంటి సంజనా.. నీకు, నాకు పెళ్లిచూపులా?: నాగార్జున
బిగ్‌బాస్ షో (Bigg Boss Telugu 9)లో నేడు దీపావళి సెలబ్రేషన్స్ జరగనున్నాయి. హోస్ట్ నాగార్జున సహా కంటెస్టెంట్లు అందరూ సాంప్రదాయంగా ముస్తాబయ్యారు. ఈ మేరకు ఓ ప్రోమో కూడా వదిలారు. పండగ పూట హౌస్‌మేట్స్‌కు కొత్త బట్టలు కానుకగా పంపించాడు నాగ్. అలాగే వారి ఫ్యామిలీస్‌తో వీడియో కాల్ మాట్లాడించాడు. దీంతో కంటెస్టెంట్లు ఎమోషనలయ్యారు. భర్త, ఇద్దరు పిల్లల్ని చూడగానే సంజనా కళ్లలో నీళ్లు తిరిగాయి.ఎమోషనల్‌గా దీపావళి స్పెషల్ ఎపిసోడ్అటు డిమాన్ పవన్, సుమన్‌ల పరిస్థితి కూడా అలాగే ఉంది. దాదాపు నెలన్నర తర్వాత ఇంట్లోవాళ్లను స్క్రీన్‌పై చూడగానే భావోద్వేగానికి లోనయ్యారు. ఇక కుర్తాపైజామాలో ఉన్న నాగార్జునను చూసి సంజనా ఓ డైలాగ్ వేసింది. పెళ్లిచూపులకు రెడీ అయినట్లుగా ఉన్నారని కాంప్లిమెంట్ ఇచ్చింది. అందుకు నాగ్.. ఏంటి? నీకు, నాకా? అని సరదాగా అన్నాడు. అది విని హౌస్మేట్స్ ఆశ్చర్యపోయారు. ఈ దీపావళి ఎపిసోడ్ నేడు రాత్రి 7 గంటలకు ప్రసారం కానుంది.చదవండి: Bigg Boss: ఇదేం ట్విస్టు! మాధురి 200% కరెక్ట్ అన్న నాగ్ -
బాణసంచా కాల్చడం ఎలా మొదలైందో తెలుసా..!
దీపావళి వేడుక అంటే..మోద మోగిపోవాల్సిందే.. ఆ పండుగ సంబంరం అలా ఇలా ఉండదు. టపాసులు, బాణసంచా వెలుగులు విరజిమ్ముతూ..అదిరిపడే శబ్దాలతో ఆనంద హేళిలా సాగిపోతుంది. అలాంటి వేడుకలో కాల్చే బాణసంచా కాల్చడం తప్పనిసరిగా ఉంటుంది. మరి ఇదెలా వాడుకలోకి వచ్చింది, ఎలా మొదలైంది అంటే..ఇది ప్రపంచంలోనే అత్యంత అరుదైన బాణసంచా మ్యూజియం. ఈ మ్యూజియం జపాన్ రాజధాని టోక్యో పరిధిలోని ర్యోగోకు జిల్లాలో ఉంది. ‘ర్యోగోకు హనాబి’ పేరుతో సుమిదా నది ఒడ్డున ఈ మ్యూజియం 1733 సంవత్సరంలో ఏర్పాటైంది. జపాన్‌లో పదహారో శతాబ్ది నుంచి బాణసంచా వాడుక మొదలైంది. పలు వేడుకల్లో జపాన్ ప్రజలు బాణసంచా కాలుస్తుంటారు. (చదవండి: ఆ రాష్ట్రాల్లో దీపావళి పండుగను ఎలా జరుపుకుంటారంటే..!) -
'కాంతార' హిట్ సాంగ్.. వీడియో వర్షన్ విడుదల
కన్నడ నటుడు రిషబ్‌శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘కాంతార:చాప్టర్1’ (Kantara Chapter 1). అక్టోబర్ 2న విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 720 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టింది. అయితే, తాజాగా ఈ మూవీ నుంచి రావే ఇక ప్రియ భామిని అనే సాంగ్‌ను విడుదల చేశారు. రిషబ్, రుక్మిణి వసంత్ మధ్య చిత్రీకరించిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి, చిన్మయి శ్రీపాద ఆలపించారు. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం ఇచ్చారు. కాంతార ఛాప్టర్-1 విజయవంతమైన తర్వాత రిషబ్ శెట్టి పలు ఆలయాలను సందర్శిస్తున్నారు. తాజాగా చాముండి బెట్టపై చాముండేశ్వరి ఆలయంలో పూజలు నిర్వహించారు. కాంతార సినిమా విజయంలో కన్నడిగుల పాత్ర చాలా ఉందన్నారు. దైవాన్ని తాను ఎక్కువగానే విశ్వసిస్తానని చెప్పారు. ఈ చిత్రం ద్వారా మూఢ నమ్మకాలను ప్రోత్సహించానని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. తన తదుపరి చిత్రం ‘జై హనుమాన్’ అని ఆయన వెల్లడించారు. ఇప్పటివరకు అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన కన్నడ చిత్రాల లిస్ట్‌లో ‘కాంతార -1’ రెండో స్థానంలో ఉంది. రూ.1200 కోట్ల కలెక్షన్లతో ‘కేజీయఫ్ 2’ తొలి స్థానంలో నిలిచింది. -
Hyderabad: బాలుడి దగ్గర బుల్లెట్.. మెట్రో స్టేషన్లో కలకలం
సాక్షి, హైదరాబాద్: కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో బుల్లెట్ కలకలం రేపింది. మూసాపేట్ మెట్రోలో ప్రయాణించేందుకు వచ్చిన ఓ బాలుడు వద్ద బుల్లెట్ లభించింది. దీంతో మెట్రో సిబ్బంది.. పోలీసులకు సమాచారం అందించారు. బుల్లెట్‌ను స్వాధీనం చేసున్న కూకట్పల్లి పోలీసులు.. బాలుడిని విచారిస్తున్నారు.నిన్న రాత్రి(అక్టోబర్ 18, శనివారం) మెట్రోలో ప్రయాణించేందుకు బాలుడు మూసాపేటలోని స్టేషన్‌కు రాగా.. మెట్రో భద్రతా సిబ్బంది ఆ బాలుడిని తనిఖీ చేశారు. ఆ బాలుడి వద్ద ఏదో అనుమానాస్పద వస్తువు ఉన్నట్లు బీప్ సౌండ్ రావడంతో సిబ్బంది అలర్ట్ అయ్యారు. బాలుడి వద్ద 9 ఎంఎం బుల్లెట్‌ను గుర్తించారు. బుల్లెట్ ఎలా వచ్చిందంటూ ఆ బాలుడిని మెట్రో సిబ్బంది ప్రశ్నించారు.సరైన సమాధానం చెప్పకపోవడంతో మెట్రో సిబ్బంది.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలుడిని పోలీస్ స్టేషన్‌కు తరలించిన పోలీసులు.. ఆ బుల్లెట్‌పై ఆరా తీశారు. పలు కోణాల్లో ఆ బాలుడిని విచారిస్తున్నారు. ఆ బాలుడి తల్లిదండ్రులను కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు. -
ఆ రాష్ట్రాల్లో దీపావళి పండుగను ఎలా జరుపుకుంటారంటే..!
దీపాల కాంతితో ధగధగ మెరిసే ఈ దీపాల పండుగ ఇష్టపడని వారుండరు. అలాంటి మిరుమిట్లు గొలిపే ఈ పండుగ.. టపాసుల మోత మోగిపోయేలా ఆనందహేలి తాండవించేలా అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. మరి అలాంటి పండుగా మన దేశంలోనే పలు రాష్టాలు అత్యంత విభిన్నంగా జరుపుకుంటాయి. ఈ దీపావళి పండుగ నేపథ్యంలో ఆ విశేషాలు గురించి సవిరంగా తెలుసుకుందామా..!చీకటి దీపావళి!దీపావళి వేడుకల తర్వాత హిమాచల్‌ప్రదేశ్‌లో బుద్ది దీపావళి(చీకటి దీపావళి లేదా పాత దీపావళి) జరుపుకుంటారు. దీపావళి తర్వాత మొదటి అమావాస్య రోజు బుద్ది దీపావళి వేడుకలు మొదలవుతాయి. రాముడి రాక వార్త ఒక నెల తర్వాత మాత్రమే హిమాచల్‌ప్రదేశ్‌కు చేరిందట. అందుకే ఆలస్యంగా పండగ జరుపుకునే సంప్రదాయం మొదలైంది అంటారు.దేవరి రాత్రిఛత్తీస్ఘడ్లోని గోండు తెగలు దీపావళిని ‘దేవరి’గా జరుపుకుంటాయి. దేవరి రాత్రి గ్రామంలోని మహిళలు తలలపై ఒక కుండలో నూనె దీపాన్ని వెలిగించి శ్రావ్యంగా పాటలు పాడుతూ, ప్రతి ఇంటి తలుపు తడుతూ తమతో చేరాలని ఆ ఇంటి మహిళలను అభ్యర్థిస్తారు. బియ్యపు పిండితో చేసిన దీ΄ాలను ప్రతి ఇంటి ముందు ఉంచుతారు.ఆవులను తమపై నడిపించి..మధ్యప్రదేశ్ ఉజ్జయిని జిల్లాలోని బిదావాద్ గ్రామంలో ఒక వింత ఆచారం ఉంది. దీ΄ావళి రోజు తరువాత నేలపై పడుకొని ఆవులను తమపై నడిపించుకుంటారు. 33 కోట్ల దేవుళ్లు, దేవతలు ఆవులో కొలువై ఉన్నారని, వాటిని తమపై నడిపించుకోవడం ద్వారా దేవతల ఆశీర్వాదం దొరుకుతుందనేది భక్తుల నమ్మకం.భర్త కోసం రాత్రంతా దీపాలు...మహారాష్ట్రలో దీపావళి వేడుకలకు సంబంధించి ఒక ఆసక్తికరమైన జానపద కథ ప్రచారంలో ఉంది. వివాహం జరిగిన నాలుగు రోజుల తరువాత చనిపోతాడని యువ రాజుకు శాపం. విషయం తెలిసిన వధువు తన భర్త ప్రాణాలు రక్షించుకోవడం కోసం రాత్రంతా అవిశ్రాంతంగా దీపాలు వెలిగిస్తూనే ఉంటుంది. ఆమె ప్రయత్నాల వల్ల భర్త బతుకుతాడు.శ్రీవిష్ణువు భూలోకానికి...గుజరాత్లో దీపావళి రోజు కొత్త వ్యాపారాలు ప్రారంభించడం అనేది తరతరాలుగా వస్తోంది. మహాలక్ష్మీదేవి భర్త విష్ణువు భూలోకానికి వచ్చిన గుర్తుగా మధ్యప్రదేశ్‌లో దీపావళి జరుపుకుంటారు. కోల్‌కత్తాలో దీపావళికి కాళీపూజ చేస్తారు.సోదర, సోదరీమణులు...మన దేశంలోని కొన్ని ప్రాంతాలలో దీపావళి అనేది సోదర, సోదరీమణుల అనుబంధానికి ముడి పడి ఉన్న పండగగా జరుపుకుంటారు. దీపావళి తర్వాత రోజు జరుపుకునే ఈ పండగను ‘యమ–ద్విత్య’ అని పిలుస్తారు. యమున తన సోదరుడు, మృత్యుదేవుడు యముడికి ఆతిథ్యం ఇచ్చిన రోజు ఇదే అని పురాణ కథలు చెబుతాయి.లక్ష దీపాల ఆగ్రా కోట అక్బర్ చక్రవర్తి పాలనలో దీపావళిని ఆనందోత్సాహాలతో జరుపుకునేవారు. ఈ సంప్రదాయాన్ని ‘జష్నే చిరాఘన్’ అని పిలిచేవారు. లక్షలాది దీపాలతో ఆగ్రా కోట వెలిగి΄ోయేది. కోట ముందు ఉన్న మైదానంలో బాణసంచా కాల్చేవారు. -
బీసీ బంద్‌లో దాడులు.. ఎనిమిది మంది అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీసీ బంద్ విజయవంతమైంది. బీసీ బంద్‌లో అన్ని పార్టీల నేతలు పాల్గొన్నారు. ఇక, బంద్ సందర్భంగా దాడులకు పాల్పడుతూ ఓవరాక్షన్ చేసిన ఎనిమిది మందిని తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు. పలు స్టేషన్లలో కేసులు నమోదు కావడంతో వారిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్టు తెలిపారు.తెలంగాణవ్యాప్తంగా బీసీ బంద్ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో షాపులపై దాడులు చేసిన వారిపై పోలీసులు పలు సెక్షన్స్ కింద కేసులు నమోదు చేశారు. బంద్ సందర్బంగా విద్యానగర్ నుంచి బర్కత్‌పురా వరకు బీసీ జేఏసీ నేతలు ర్యాలీగా వచ్చారు. అనంతరం, పలువురు కార్యకర్తలు, నేతలు.. పలు షాపులు, షోరూమ్స్, పెట్రోల్ బంకులపై దాడులు చేశారు. దీంతో, దాడులపై నల్లకుంట, కాచిగూడ పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు చేయడంతో కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో దాడులకు పాల్పడిన ఎనిమిది మంది బీసీ జేఏసీ ప్రతినిధులను అర్థరాత్రి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. -
బాలికపై మేనమామ వేధింపులు
కై కలూరు: మేనమామ వేధించడంతో పాటు తల్లి, అమ్మమ్మ, తాత చిత్రహింసలకు గురిచేశారని 9వ తరగతికి చెందిన బాలిక బావురుమంది. నరకం నుంచి బయటపడ్డానని గాయాలను చూపించింది. కై కలూరు మండలం చటాకాయికి చెందిన బాలికపై వైఎస్సార్ కడప జిల్లా బద్వేలు సమీప అగ్రహారంలో ఈ ఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగు చూసింది. శనివారం ఆమెను తండ్రి కై కలూరు ప్రభుత్వాస్పత్రికి తీసుకువచ్చాడు. పోలీసులకు ఆమె వివరాలు వెల్లడించింది. బాధితురాలు, ఆమె తండ్రి తెలిపిన వివరాల ప్రకారం.. చటాకాయికి చెందిన జయమంగళ కుమార అభిమన్యుడుకి ఏలూరు మండలం శ్రీపర్రుకు చెందిన కా మాక్షితో 2009లో వి వాహమైంది. వీరికి 2012లో అమ్మాయి జన్మించింది. అనంతరం ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకున్నారు. అప్పటినుంచి కుమార్తె తండ్రి వద్ద ఉంటోంది. కామాక్షి మరో వ్యక్తిని వివాహం చేసుకోగా.. అభిమన్యుడు మరో మహిళను వివాహం చేసుకున్నాడు. మొదటి భార్య కుమార్తె (14) తండ్రి అభిమన్యుడు వద్దే ఉంటూ భుజబలపట్నం హైస్కూల్లో 9వ తరగతి చదువుతోంది.దసరా పండక్కి తీసుకెళ్లి.. తండ్రి లేని సమయంలో కామాక్షి, ఆమె తల్లి చటాకాయలో ఉంటున్న బాలిక వద్దకు వచ్చి దసరా పండగకు దుస్తులు కొంటామని ప్రత్తికోళ్లలంక, అక్కడ నుంచి కామాక్షి సోదరుడు ఉమాశంకర్, తల్లిదండ్రులు నాగులమ్మ, వెంకటరమణ ఉంటున్న కడప జిల్లా బద్వేలుకు తీసుకువెళ్లారు. బాలికను అక్కడే ఉండాలని బలవంతం చేయడంతో ఆమె నిరాకరించి తండ్రి వద్దకు వెళతానని చెప్పింది. దీంతో తన తల్లి కామాక్షి ఇష్టానుసారం తనను కొట్టిందని బాలిక వాపోయింది. మేనమామ ఉమాశంకర్ తనతో అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు పక్కనే పడుకోవాలని అనే వా డని పోలీసుల వద్ద తెలిపింది. బద్వేలులో బాలిక పరిస్థితిని చూసిన ఓ వ్యక్తి తండ్రి అభిమన్యుడికి ఫోన్ చేయగా అక్కడికి వెళ్లి శుక్రవారం రాత్రి చటకాయికి తీసుకువచ్చారు. మేనమామ బాలికతో అసభ్యకంగా ప్రవర్తించాడా? లేదా అన్న విషయాన్ని బద్వేలు పోలీసులు విచారిస్తారని కై కలూరు రూరల్ ఎస్సై వి.రాంబాబు తెలిపారు. బాలిక విషయంలో తల్లిదండ్రులకు విభేదాలు ఉన్నాయన్నారు. ఫిర్యాదును పోలీసుతో బద్వేలు పంపామని చెప్పారు. -
యూఏఈ రూల్: ఎంత బంగారానికి డిక్లేర్ అవసరం..
భారతీయులకు బంగారం అంటే చాలా ఇష్టం. ఈ కారణంగానే ఎప్పటికప్పుడు, ఎక్కడికి వెళ్లినా గోల్డ్ కొనేస్తూ ఉంటారు. ఇంకొందరైతే గోల్డ్ కొనుగోలు చేయడానికి ప్రత్యేకించి.. అరబ్ దేశాలకు వెళ్తున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) నిబంధనల ప్రకారం.. భారతీయ ప్రయాణికుల వద్ద ఎంత విలువైన బంగారం ఉంటే డిక్లేర్ చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం.భారతీయులు యూఏఈ (UAE)కి ప్రయాణించే సమయంలో తమ వద్ద ఉన్న బంగారం విలువ రూ.13.5 లక్షల(AED 60,000)కు మించి ఉంటే, దానికి డిక్లేర్ (declare) చేయాల్సి ఉంటుంది. అంటే, మీరు వెంట తీసుకెళ్లే బంగారం విలువ.. ఈ పరిమితికి మించి ఉంటే, సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలి.పరిమితికి మించి బంగారం తీసుకెళ్లడానికి లీగల్‌గా ఎలాంటి అనుమతి ఉండదు. కాబట్టి దీనికి ట్యాక్స్, డ్యూటీ చెల్లించాల్సి ఉంటుంది. వివాహాలు, పండుగలు లేదా గిఫ్ట్ రూపంలో.. సాంప్రదాయకంగా బంగారు ఆభరణాలను తీసుకెళ్లే భారతీయ పర్యాటకులు, NRIలు, వ్యాపార ప్రయాణికులు ఆ విషయాన్ని తప్పకుండా గమనించాలి.ఇదీ చదవండి: గోల్డ్ వార్నింగ్ సిగ్నెల్: శ్రీధర్ వెంబు ట్వీట్బంగారం అక్రమ రవాణాను తగ్గించేందుకు, ట్యాక్స్ ఎగవేతను అడ్డుకునేందుకు ఈ నిబంధనను అమలు చేస్తున్నారు. డిక్లేర్ చేయకుండా ఎక్కువ బంగారం తీసుకెళితే, దానిని సీజ్ చేయవచ్చు. లేదా మీకు భారీ జరిమానా పడవచ్చు లేదా జైలుశిక్షను కూడా అనుభవించాల్సి ఉంటుంది. -
ఎందరో నరకాసురుల పాలిట సత్యభామలుగా ఆ'షీ'సర్లు..
దుష్ట ప్రవృత్తి గల నరకాసురుడిపై సత్యభామ సాధించిన విజయానికి గుర్తుగా దీపావళి జరుపుకుంటాం. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో నేరాలు చేసే ఎందరో నరకాసురులకు సత్యభామలుగా మారిన పోలీసు ఆ‘షీ’సర్లు చెక్ చెప్తున్నారు. నేడు నరక చతుర్దశి సందర్భంగా మహిళా పోలీస్ అధికారుల ప్రాధాన్యం గురించి... హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడెమీలో (ఎన్పీఏ) తాజాగా శిక్షణ పూర్తి చేసుకున్న ఐపీఎస్ అధికారుల్లో 36 శాతం మహిళలే. ఎన్పీఏ చరిత్రలో ఇదో రికార్డు. దీనికిముందే ఇలాంటి అరుదైన దృశ్యం తెలంగాణలో ఆవిష్కృతమైంది. సెప్టెంబర్‌లో చోటు చేసుకున్న ఐపీఎస్ అధికారుల బదిలీతో రాష్ట్ర పోలీసు విభాగంలోని హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్లో మకుటాలను 33.3 శాతం మహిళలే ధరించారు. ఉమ్మడి రాష్ట్రంలో 1979 వరకు మహిళా ఐపీఎస్‌లే లేరు. ఆ ఏడాది ఎన్పీఏలో శిక్షణ పూర్తి చేసుకున్న హైదరాబాదీ యువతి అరుణ బహుగుణ చిత్తూరు జిల్లా మదనపల్లె అదనపు ఎస్పీగా పోస్టింగ్ పొందారు. ఇది అప్పట్లో సంచలనం. ఆపై కాలక్రమంలో మహిళ ఐపీఎస్‌ల సంఖ్య పెరుగుతూ వచ్చింది. అయినప్పటికీ 2014 వరకు వీరికి సముచిత పోస్టింగ్స్ ఉండేవి కాదు. అత్యవసర సందర్భాల్లో అక్కరకు రావడానికి కమిషనరేట్‌కు ఒక మహిళ ఐపీఎస్‌కు పోస్టింగ్ ఇచ్చేవాళ్లు. మిగిలిన అధికారుల్ని అంతగా ప్రాధాన్యం లేని పోస్టుల్లో నియమించే వారు. రానురాను ఆ సీన్ పూర్తిగా మారిపోతూ వచ్చింది. పోలీసు విభాగంలో మహిళ ఐపీఎస్ అధికారుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండటంతో పోస్టింగ్స్ ఇవ్వడం అనివార్యంగా మారింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత మహిళల భద్రతకు పెద్ద పీట వేస్తూ మహిళ భద్రత విభాగం, షీ–టీమ్స్ ఏర్పాటైన తర్వాత వీటిలో అనివార్యంగా మహిళ ఐపీఎస్‌లకే పోస్టింగ్ ఇస్తూ వచ్చారు. కమిషనరేట్లలో డీసీపీ పోస్టులతో పాటు కొన్ని జిల్లాలకు మహిళల్ని ఎస్పీలుగా నియమించారు. ప్రస్తుతం పరిస్థితులు పూర్తి భిన్నంగా మారిపోయాయి. రాష్ట్ర పోలీసు విభాగంలో ఉన్న మూడో వంతు హెచ్ఓడీ పోస్టులతో పాటు హైదరాబాద్, రాచకొండల్లోని డీసీపీ పోస్టుల్లో అత్యధికంగా మహిళా ఐపీఎస్‌లే ఉన్నారు. ఎస్సైల నుంచి డీఎస్పీల వరకు శిక్షణ ఇచ్చే తెలంగాణ రాష్ట్ర పోలీసు అకాడెమీకి అభిలాష్ బిస్త్, నేరగాళ్లలో మార్పునకు కృషి చేసే జైళ్లశాఖకు సౌమ్య మిశ్ర, రాష్ట్ర నేర పరిశోధన విభాగానికి (సీఐడీ) చారు సిన్హా, మావోయిస్టు వ్యతిరేక నిఘా విభాగమైన బి.సుమతి, హోంగార్డ్స్ వింగ్‌కు స్వాతి లక్రా నేతృత్వం వహిస్తూ తమ సత్తా చాటుతున్నారు. ఈ ప్రకారం చూస్తే 15 హెచ్ఓడీ పోస్టుల్లో ఏడింటికి ఐదుగురు మహిళ ఐపీఎస్‌లు నేతృత్వం వహిస్తున్నట్లు లెక్క. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కు శిఖా గోయల్ చీఫ్‌గా, అవినీతి నిరోధక శాఖకు చారు సిన్హా ఇన్చార్జ్గా ఉన్నారు. ఇక రాష్ట్రంలోనే అత్యంత కీలకమైన హైదరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో మహిళా పోలీసుల సంఖ్య తక్కువగా ఉండటంతోపాటు ఉన్నత స్థాయిలో కూడా ఉండేవారు కారు. అయితే కాలక్రమంలో వీరి సంఖ్య కాస్త పెరిగినా... నగరంలో హఠాత్తుగా తలెత్తే పరిణామాలతోపాటు మతకలహాలను అదుపు చేయడం, వేళాపాళా లేని విధులు వీరితో సాధ్యం కాదనే భావన గతంలో ఉండేది. కాలక్రమంలో చోటు చేసుకున్న పరిస్థితులు, పరిణామాల నేపథ్యంలో నగర పోలీసు విభాగంలోనూ ఒక మహిళ ఉన్నతాధికారి ఉండాలని ప్రభుత్వమూ భావించినప్పటికీ చాన్నాళ్ళ వరకు కేవలం నార్త్‌జోన్‌కు మాత్రమే మహిళ అధికారిని నియమిస్తూ వచ్చారు. ఆ జోన్‌కు ఉండే ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో సిటీ పోలీసువింగ్లో మహిళ ఉన్నతాధికారి ΄ోస్టు ఇదొక్కటే అనే భావన కొనసాగింది.ప్రస్తుతం పరిస్థితులు మాత్రం పూర్తిగా మారిపోయాయి. హైదరాబాద్ కమిషనరేట్‌లో ఏడు జోన్లు ఉన్నాయి. ఒక్కో జోన్‌కు ఒక్కో డీసీపీ నేతృత్వం వహిస్తుంటారు. ప్రస్తుతం ఈ ఏడు జోన్లలో మూడింటికి మహిళ ఐపీఎస్‌లే డీసీపీలుగా ఉన్నారు. మధ్య మండలానికి శిల్పవల్లి, ఉత్తర మండలానికి సాధన రష్మీ పెరుమాళ్, దక్షిణ మండలానికి స్నేహ మెహ్రా డీసీపీలుగా ఉన్నారు. వీరికి తోడు పరిమళ నూతన్, పరిపాలన విభాగం సంయుక్త సీపీగా, రక్షితమూర్తి, సీఏఆర్ హెడ్–క్వార్టర్స్ డీసీపీగా, అపూర్వ రావు– స్పెషల్ బ్రాంచ్ డీసీపీగా, ఎన్ .శ్వేత డిటెక్టివ్ డిపార్ట్మెంట్ డీసీపీ గా, డి.కవిత,సైబర్ క్రైమ్ విభాగం డీసీపీగా, లావణ్య జాదవ్– ఉమెన్ సేఫ్టీ డీసీపీగా పని చేస్తున్నారు. హైదరాబాద్ చుట్టూ విస్తరించి ఉన్న సైబరాబాద్‌లోని అత్యంత కీలకమైన మాదాపూర్ జోన్‌కు డీసీపీగా రితిరాజ్ వ్యవహరిస్తున్నారు. ఇక రాచకొండలో మొత్తం నాలుగు జోన్లు ఉన్నాయి. వీటిలో మల్కాజ్గిరి, ఎల్బీనగర్, మహేశ్వరానికి పద్మజ రెడ్డి, అనురాధ, సునీత రెడ్డి డీసీపీలుగా ఉన్నారు. వీరిలో సునీత రెడ్డి మాత్రమే నాన్ ఐపీఎస్ అధికారి. ఈ జోనల్ డీసీపీలతోపాటు మహిళ భద్రత విభాగం, సైబర్ క్రైమ్ వింగ్స్లను ఆ‘షీ’సర్స్ నేతృత్వం వహిస్తున్నారు.– శ్రీరంగం కామేష్, క్రైమ్ రిపోర్టర్, సాక్షి, హైదరాబాద్ -
నారా రోహిత్ పెళ్లి సందడి.. హీరోయిన్ ఇంట హల్దీ ఫంక్షన్
టాలీవుడ్లో హీరో నారా రోహిత్ (Nara Rohith) పెళ్లికి సమయం ఆసన్నమైంది. రోహిత్-శిరీష (Siree Lella) జంట ఇంట పెళ్లి పనులు మొదలయ్యాయి. ఈ విషయాన్ని శిరీష సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. పసుపు దంచే కార్యక్రమం జరిగిందంటూ కొన్ని ఫోటోలను షేర్ చేసింది. చీర కట్టుకుని సాంప్రదాయంగా ముస్తాబైన శిరీష.. తన కుటుంబసభ్యులతో కలిసి పసుపు దంచింది.ఆ సినిమాతో ప్రేమ షురూనారా రోహిత్ ప్రధాన పాత్రలో నటించిన ప్రతినిధి 2 సినిమాలో శిరీష యాక్ట్ చేసింది. ఈ మూవీలో రోహిత్ ప్రియురాలిగా నటించింది. నిజ జీవితంలోనూ వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. అదే విషయాన్ని ఇంటి సభ్యులకు చెప్పారు. మనసులు ఒక్కటయ్యాక ఆశీర్వదించకుండా ఎలా ఉంటామంటూ ఇరు కుటుంబాలు గతేడాది అక్టోబర్‌లో వీరికి ఎంగేజ్మెంట్ చేశారు. ఏడాది తర్వాత ఇప్పుడు పెళ్లి బంధంతో ఒక్కటి కానున్నారు.సినిమాబాణం సినిమాతో వెండితెరపై హీరోగా పరిచయమయ్యాడు రోహిత్. సోలో మూవీతో హిట్ కొట్టాడు. ఒక్కడినే, ప్రతినిధి, రౌడీ ఫెల్లో, అసుర, జ్యో అచ్యుతానంద, శమంతకమణి.. ఇలా అనేక సినిమాలు చేశాడు. 2018లో వచ్చిన వీర భోగ వసంత రాయలు సినిమా తర్వాత దాదాపు ఆరేళ్లు బ్రేక్ తీసుకున్నాడు. ప్రతినిధి 2తో రీ ఎంట్రీ ఇచ్చాడు కానీ ఈ చిత్రం ఘోర పరాజయం పాలైంది. ఈ ఏడాది భైరవం, సుందరకాండ సినిమాలతో మెప్పించాడు. View this post on Instagram A post shared by Siree Lella (@siree_lella) చదవండి: బండ్ల గణేశ్ దీపావళి పార్టీ.. హాజరైన టాలీవుడ్ స్టార్స్ -
ఆ రెండు చిత్రాల కంటే ‘డ్యూడ్’కే ఎక్కువ కలెక్షన్స్: ప్రదీప్ రంగనాథన్
‘‘డ్యూడ్’ సినిమాను అద్భుతంగా రిసీవ్ చేసుకుంటున్న తెలుగు ప్రేక్షకులకు థ్యాంక్స్. మీరు అందిస్తున్న ప్రేమ మర్చిపోలేనిది. నేను హీరోగా నటించిన ‘లవ్ టుడే, రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఆదరించారు. ఇప్పుడు ఆ రెండు చిత్రాలకు మించిన ఆదరణ, అభిమానం ‘డ్యూడ్’ సినిమాకి చూపిస్తున్నారు. నా గత చిత్రం ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ కంటే తొలి, మలి రోజుల్లోనే నాలుగైదు రెట్లు ఎక్కువ కలెక్షన్స్ ‘డ్యూడ్’ సినిమాకు వచ్చాయని మా నిర్మాతలు చెబుతుంటే ఆనందంగా ఉంది. ఇందుకు కారణమైన దర్శకుడు, నిర్మాతలకు ధన్యవాదాలు’’ అని ప్రదీప్ రంగనాథన్ అన్నారు. ప్రదీప్ రంగనాథన్, మమిత బైజు హీరో హీరోయిన్లుగా, ఆర్. శరత్‌కుమార్ మరో కీలక పాత్రలో నటించిన చిత్రం ‘డ్యూడ్’. కీర్తీశ్వరన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 17న విడుదలైంది. తమ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోందని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ సందర్భంగా ‘డ్యూడ్ దివాళి బ్లాస్ట్’ పేరిట నిర్వహించిన సమావేశంలో ప్రదీప్ రంగనాథన్ మాట్లాడుతూ– ‘‘తమిళనాడులోనూ నా గత చిత్రాలకంటే ‘డ్యూడ్’కు ఎక్కవ కలెక్షన్స్ వస్తున్నాయి’’ అని తెలిపారు. నవీన్ ఎర్నేని మాట్లాడుతూ– ‘‘ప్రదీప్‌గారి గత సినిమాలతో పోల్చుకుంటే కొన్ని ఏరియాల్లో నాలుగైదు రెట్లు ఎక్కువ కలెక్షన్స్ ‘డ్యూడ్’కు వస్తున్నాయి. తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 22 కోట్ల గ్రాస్ వచ్చింది. ‘డ్యూడ్’ దివాళి బిగ్ విన్నర్’’ అని ప్పారు. ‘‘జెన్ జి కాన్సెప్ట్‌తో ఫ్యామిలీ ఎమోషన్స్ బ్లెండ్ అయిన ఈ సినిమాను ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు’’ అని తెలి΄ారు వై. రవిశంకర్. మైత్రి డిస్ట్రిబ్యూటర్ శశిధర్ రెడ్డి మాట్లాడారు. -
తిరుమల ఘాట్ రోడ్డులో విరిగిపడిన కొండచరియలు.. ట్రాఫిక్ జామ్
సాక్షి, తిరుమల: తిరుమలలో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా తిరుమల రెండో ఘాట్ రోడ్డులో కొండ చరియలు విరిగి పడ్డాయి. బండ రాళ్లు రోడ్డుపై పడటంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. టీటీడీ ఇంజనీరింగ్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.వివరాల ప్రకారం.. తిరుమలలో గత నాలుగు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా రెండో ఘాట్ రోడ్డులో తొమ్మిదో కిలోమీటర్ వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. భారీ బండరాళ్లు రోడ్డు మీద పడిపోవడంతో వాహనాలు వెళ్లడానికి తీవ్ర ఇబ్బంది కలిగింది. దీంతో, ఘటనా స్థలానికి చేరుకున్న టీటీడీ ఇంజనీరింగ్ అధికారులు విరిగిపడిన కొండ చరియలను తొలగిస్తున్నారు. ఘాట్ రోడ్లో ట్రాఫిక్‌కి అంతరాయం లేకుండా జేసీబీలతో బండరాలను తొలగిస్తున్నారు. -
Bihar Elections: గేదెనెక్కి ఒకరు.. సంకెళ్లతో మరొకరు.. తెగ నవ్విస్తున్న అభ్యర్థులు
పట్నా: బీహార్‌కు ఎన్నికల పండుగొచ్చింది. ప్రస్తుతం నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపధ్యంలో చిత్రవిచిత్రాలు మీడియా కంటపడుతున్నాయి. నామినేషన్లకు వస్తున్న అభ్యర్థులు అందరినీ అకట్టకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కొందరు గేదెపై ఊరేగుతూ నామినేషన్ వేసేందుకు వస్తుండగా, మరికొందరు చేతులకు సంకెళ్లు వేసుకుని, మద్దతుదారులను వెంటేసుకుని వస్తున్నారు. गोपालगंज के बरौली में हथकड़ी में बंद धर्मेंद्र कुमार 'क्रांतिकारी' पुलिस की सुरक्षा में नामांकन करने पहुंचे. हथकड़ी हाथ में थी, आंखों में आंसू थे, और जुबान पर गाना था. लोगों की भीड़ जमा हो गई, कोई वीडियो बना रहा था, कोई लाइव चला रहा था.नेताजी बोले, “मैं साजिश का शिकार हूं, जनता… pic.twitter.com/kW5ZXwomWF— NDTV India (@ndtvindia) October 19, 2025లాలూ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్‌కు చెందిన జనశక్తి జనతాదళ్ పార్టీ అభ్యర్థి ధర్మేంద్ర కుమార్ శుక్రవారం బరౌలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసేందుకు నామినేషన్ దాఖలు చేయడానికి వచ్చారు. ఈ సందర్బంగా అతని చేతులకు సంకెళ్లు ఉన్నాయి. ఈయన కలెక్టరేట్ వద్దకు చేరుకోగానే విలేకరులు, జనం ఆయన చుట్టూ గుమిగూడారు. ఈ సందర్బంగా ధర్మేంద్ర కుమార్ మాట్లాడుతూ ‘నేను కుట్రకు బలైపోయాను. అయితే ఇప్పుడు ప్రజల నుండి న్యాయం కోరుకుంటాను’ అని అన్నారు. ఇతనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. तेज प्रताप यादव के प्रत्याशी अरुण यादव भैंस पर चढ़कर नामांकन करने पहुंचे#BiharElection2025 pic.twitter.com/X86XD0BRjo— NDTV India (@ndtvindia) October 18, 2025ఇదేవిధంగా అర్వాల్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీకి దిగిన అరుణ్ యాదవ్ తన నామినేషన్ దాఖలు చేసేందుకు గేదెపై స్వారీ చేస్తూ జిల్లా కలెక్టరేట్‌కు వచ్చారు. ఇది అక్కడున్నవారిని అమితంగా ఆకట్టుకుంది. లాలూ యాదవ్ ఫొటోను పట్టుకుని.. ‘రాజకీయాల్లో తన ఏకైక రోల్ మోడల్ లాలూ అని, అతని ఆశీర్వాదంతో నామినేషన్ దాఖలు చేయడానికి వచ్చాను" అని అరుణ్ యాదవ్ మీడియాకు తెలిపారు. తేజ్ ప్రతాప్ యాదవ్ పార్టీకి చెందిన అభ్యర్థులు విచిత్ర తీరుతెన్నులతో నామినేషన్లు దాఖలు చేసేందుకు కలెక్టరేట్లకు తరలిరావడం విశేషంగా మారింది. -
ఎప్పుడూ చేయని వెరైటీ వంటకాలు టేస్టీ.. టేస్టీగా చేసేద్దాం ఇలా..!
ఒడిశా కనికా కావలసినవి: బాస్మతి బియ్యం– ఒక కప్పు, నెయ్యి– 5 టేబుల్ స్పూన్లు, జీలకర్ర– ఒక టీస్పూన్, లవంగాలు– 5, ఏలకులు– 3 (కచ్చాపచ్చా చేసుకోవాలి), దాల్చిన చెక్క– చిన్న ముక్క, జాజికాయ పొడి– కొద్దిగా, బిర్యానీ ఆకు– 1, కిస్మిస్, జీడిపప్పు– 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు– రుచికి సరిపడా, పంచదార– 4 టేబుల్ స్పూన్లు (రుచికి సరిపడా పెంచుకోవచ్చు), పసుపు– పావు టీస్పూన్, నీళ్లు– 2 కప్పులుతయారీ: ముందుగా బాస్మతి బియ్యాన్ని శుభ్రం చేసి, సుమారు 30 నిమిషాలు నానబెట్టి, ఆ తర్వాత పూర్తిగా నీళ్లు లేకుండా వడకట్టుకుని పక్కనపెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కుకర్‌లో నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడయ్యాక జీలకర్ర, లవంగాలు, ఏలకులు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు వేసి అవి వేగిన తర్వాత జీడిపప్పు, కిస్మిస్ వేసి దోరగా వేయించాలి. ఇప్పుడు బియ్యాన్ని కుకర్‌లో వేసి, నెయ్యిలో 2 నిమిషాలు గరిటెతో తిప్పుతూ, వేయించాలి. వేగిన బియ్యంలో పసుపు, ఉప్పు, పంచదార వేసి బాగా కలపాలి. ఆ తర్వాత నీళ్లు పోసి, ఒకసారి కలిపి, కుకర్ మూత పెట్టాలి. ఒక విజిల్ వచ్చేవరకు మీడియం మంట మీద ఉడికించాలి. విజిల్ వచ్చాక స్టవ్ ఆపి, కుకర్ లోపల ఆవిరి మొత్తం పోయేవరకు అలాగే కదపకుండా ఉంచాలి. అనంతరం కుకర్ మూత తీసి, జాజికాయ పొడి వేసి, నెమ్మదిగా అన్నం మెతుకులు విరగకుండా కలపాలి. (ఇది పూరీజగన్నాథ ఆలయ ఛప్పన్న నైవేద్యాల్లో ఒకటి). ఈ టేస్టీ కనికాను పప్పుతో కలిపి తింటే భలే రుచిగా ఉంటుంది.నూడుల్ వెజిటబుల్ కట్లెట్స్కావలసినవి: నూడుల్స్– ఒక కప్పు (ఉడికించినవి)కూరగాయ ముక్కలు– అర కప్పు (చిన్నచిన్నగా కట్ చేసుకోవాలి, నచ్చిన కూరగాయలు తీసుకోవచ్చు)బంగాళ దుంపలు– 2 (మెత్తగా ఉడికించి, గుజ్జులా చేసుకోవాలి. కొత్తిమీర తరుగు– 2 టేబుల్ స్పూన్లు, ఉల్లికాడ ముక్కలు– కొద్దిగాపచ్చిమిర్చి ముక్కలు– కొద్దిగాబ్రెడ్ పౌడర్– కొద్దిగా, మొక్కజొన్న పిండి– ఒక టేబుల్ స్పూన్, ఉప్పు– తగినంత, నూనె– సరిపడా,టొమాటో కెచప్– కొద్దిగాతయారీ: ఒక గిన్నెలో ఉడికి, చల్లారిన నూడుల్స్, కూరగాయ ముక్కలు, బంగాళ దుంప గుజ్జు, పచ్చిమిర్చి ముక్కలు, మొక్కజొన్న పిండి, బ్రెడ్ పౌడర్, తగినంత ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. అభిరుచిని బట్టి క్యారట్ తురుము వంటివి కలుపుకోవచ్చు. కొత్తిమీర తురుము, ఉల్లికాడ ముక్కలు కలుపుకుని కట్లెట్స్లా చేసుకుని నూనెలో దోరగా వేయించుకోవాలి. వేడివేడిగా ఉన్నప్పుడే టొమాటో కెచప్ కలిపి తింటే చాలా బాగుంటాయి.ఇటాలియన్ టొమాటో బ్రుషెట్టాకావలసినవి: బ్రెడ్ ముక్కలు– 6 (చీజ్ బ్రెడ్ లేదా రస్క్ ముక్కలు కూడా తీసుకోచ్చు), టొమాటోలు– 3 (పండినవి ఎన్నుకోవాలి, చిన్నగా తరిగినవి), వెల్లుల్లి రెబ్బలు– 2 (చిన్నగా తరగాలి), ఆలివ్ నూనె– 3 చెంచాలు, తరిగిన తాజా తులసి ఆకులు– కొన్ని, ఉప్పు– సరిపడా, మిరియాల పొడి– కొద్దిగాతయారీ: ముందుగా ఒక గిన్నెలో చిన్నగా తరిగిన టొమాటో ముక్కలు, ఆలివ్ నూనె, వెల్లుల్లి తరుము, తరిగిన తులసి ఆకులు, ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు బ్రెడ్ ముక్కలను లేదా రస్క్ ముక్కలను ఒక టోస్టర్ లేదా పాన్‌లో ఆలివ్ నూనెతో దోరగా బేక్ చెయ్యాలి. బ్రెడ్ ముక్కలు వేడిగా ఉన్నప్పుడే, ఒక వెల్లుల్లి రెబ్బను తీసుకుని వాటిపై రుద్దాలి. ఇది బ్రెడ్‌కు మంచి ఫ్లేవర్‌ని ఇస్తుంది. అనంతరం ప్రతి బ్రెడ్ ముక్కపైన టొమాటో మిశ్రమాన్ని సమానంగా వేసి సర్వ్ చేసుకుంటే అదిరిపోతుంది. వీటికి సాస్‌తో కలిపి తింటే ఇంకా బాగుంటాయి. -
డబుల్ సెంచరీతో చెలరేగిన రాహుల్
అనంతపురం కార్పొరేషన్: ఆంధ్ర ఆటగాడు ఎస్వీ రాహుల్ డబుల్ సెంచరీతో చెలరేగాడు. వికెట్ కీపర్ ఎస్డీఎన్వీ ప్రసాద్ మెరుపు ఇన్నింగ్స్ తోడవడంతో ఆంధ్ర జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 630/6 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అనంతరం ఢిల్లీ జట్టు ఆటముగిసే సమయానికి 5 వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసి ఎదురీదుతోంది. వివరాలిలా ఉన్నాయి. సీకే నాయుడు ట్రోఫీ అండర్–23లో భాగంగా శనివారం అనంత క్రీడా గ్రామంలో మూడో రోజు ఓవర్‌నైట్ స్కోర్ 470/4తో ప్రారంభించిన ఆంధ్ర జట్టు స్కోర్ వేగాన్ని చకచకా పెంచింది.ఎస్వీ రాహుల్, వికెట్ కీపర్ ప్రసాద్‌లు ఢిల్లీ బౌలర్లను ఓ ఆట ఆడుకున్నారు. అవకాశం దొరికినప్పుడుల్లా బౌండరీలు బాదారు. ఈ క్రమంలో ఎస్వీ రాహుల్ 386 బంతుల్లో 18 ఫోర్లు, 2 భారీ సిక్సర్ల సహాయంతో 203 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మరో బ్యాటర్ ప్రసాద్ కూడా అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. 91 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్ల సహాయంతో 94 పరుగులు చేశాడు. రాహుల్, ప్రసాద్‌లు ఆరో వికెట్‌కు 146 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఢిల్లీ బౌలర్లలో దేవ్ లక్ర, మన్నన్ భరద్వాజ్, యుగల్ షైనీ చెరి రెండు వికెట్లు పడగొట్టారు.ఢిల్లీ 200/5 ఆంధ్ర బౌలర్ల ధాటికి ఢిల్లీ జట్టు తొలి ఇన్నింగ్స్ ఆటముగిసే సమయానికి 63 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసింది. జట్టులో ఆల్‌రౌండర్ దేవ్ లక్ర 91 పరుగుల(13 ఫోర్లు, 2 సిక్సర్లు)తో నాటౌట్‌గా నిలిచాడు. యుగల్ షైనీ 44 పరుగులు చేశాడు. ఆంధ్ర బౌలర్ ఆదిత్యరెడ్డి 3/39 వికెట్లు తీసుకుని ఢిల్లీని కట్టడి చేశాడు. -
బిగ్‌బాస్ కోసం జాబ్ వదిలేశాను.. కన్నీళ్లు పెట్టుకున్న శ్రీజ
బిగ్‌బాస్ 9 నుంచి దమ్ము శ్రీజను ఎలిమినేషన్ పేరుతో కావాలనే హౌస్ నుంచి పంపించేశారని ప్రేక్షకుల అభిప్రాయం. దీంతో రీఎంట్రీ కోసం ఆమెకు మద్ధతు కూడా తెలిపారు. అయితే, బిగ్‌బాస్ మనసు మాత్రం కరగలేదు. తనకు నచ్చిన వారిని మాత్రమే హౌస్‌లో ఉంచుతాననే సంకేతాన్ని ఈ సీజన్‌తో బిగ్‌బాస్ ఇచ్చేశాడు. దీంతో ఈ షో అంతా ఒక ఫేక్ అంటూ ఓట్లేసిన వారే అంటున్నారు. తమ ఓటింగ్‌తో సంబంధం లేకుండా శ్రీజను ఎలా ఎలిమినేట్ చేస్తారని ఫైర్ అయ్యారు. అయితే, ఎన్నో ఆశలతో బిగ్‌బాస్‌లోకి అడుగుపెట్టిన శ్రీజ మాత్రం ఇప్పటికీ ఆ ట్రామా నుంచి కోలుకోలేదని తెలుస్తోంది. తాజాగా ఆమె కన్నీళ్లు పెట్టుకుంటూ ఒక వీడియో షేర్ చేసింది.శ్రీజ తండ్రి విశాఖ మున్సిపాలిటీ 92వ వార్డులో పారిశుధ్య విభాగంలో అవుట్సోర్సింగ్ సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. చిన్న తనం నుంచే కష్టాలతో పెరిగిన శ్రీజ కూడా చాలా కష్టపడి చదవి ఉన్నత చదువులు పూర్తి చేసింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా నెలకు రెండు లక్షలకు పైగా జీతంతో ఉద్యోగం సాధించింది. అయితే, ఇండస్ట్రీ మీద ఉన్న ఫ్యాషన్‌తో బిగ్‌బాస్ వైపు అడుగులేసింది. అందులో ఛాన్స్ రాగానే తన ఉద్యోగానికి రాజీనామా చేసింది. కానీ, బిగ్‌బాస్ మాత్రం ప్రేక్షకుల ఓటింగ్స్తో సంబంధం లేకుండా ఆమెను హౌస్ నుంచి పంపించేశాడు. దీంతో ఆమె జీవితంలో తీరని నష్టాన్ని బిగ్‌బాస్ మిగిల్చాడని చెప్పవచ్చు.ఉద్యోగం కూడా వదిలేశాను: శ్రీజబిగ్బాస్ నుంచి ఎలిమినేట్ అయిన తర్వాత ఇప్పటికీ కూడా నేను ఒక్క ఎపిసోడ్ చూడలేదు. దీపావళి సెలబ్రేషన్స్ టైమ్‌లో హౌస్‌లో నేను ఉండాల్సింది కదా అనిపిస్తుంది. అగ్నిపరీక్ష దాటుకునేందుకు చాలా కష్టపడ్డాను. 5 లెవల్స్ దాటుకొని అక్కడి వరకు చేరుకున్నాను. బిగ్‌బాస్ కోసం ఒక పర్మినెంట్ టాటూ కూడా చేతిపై వేయించుకున్నాను. ఈ షో కోసం నా జాబ్‌ను కూడా వదులుకున్నాను. హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చాక గెలుపు కోసం వంద శాతం ప్రయత్నం చేసిన సరే లక్ కలిసిరాలేదు. ఎలిమినేషన్ రౌండ్లో కూడా ప్రతి టాస్క్‌లో చివరి వరకు వెళ్లాను. కానీ, గెలుపు మాత్రం దక్కలేదు. ఇప్పటి వరకు జరిగిన బిగ్‌బాస్ సీజన్స్‌లో కూడా నా మాదిరి ఎవరూ ఎలిమినేట్ కాలేదు. 5వారాలు హౌస్‌లో ఉన్నా కూడా ఒక జర్నీ లేకుండానే బయటకు వచ్చేశాను. అని కన్నీళ్లు పెట్టుకుంది. View this post on Instagram A post shared by Srija Dammu (@srija_sweetiee) -
రీ ఎంట్రీలో అట్టర్ ప్లాప్.. విరాట్ కోహ్లి డకౌట్! ఇలా అయితే కష్టమే?
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి(Virat Kohli) తన రీ ఎంట్రీ మ్యాచ్‌లో ఘోరంగా విఫలమయ్యాడు. ఆతృతగా ఎదురు చూసిన అభిమానులను కింగ్ కోహ్లి తీవ్ర నిరాశపరిచాడు. పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో విరాట్ డకౌటయ్యాడు. 8 బంతులు ఆడిన కోహ్లి తన పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు.కెప్టెన్ రోహిత్ శర్మ త్వరగా ఔట్ కావడంతో క్రీజులోకి వచ్చిన కోహ్లి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దుతాడని అంతా భావించారు. కానీ ఈ ఢిల్లీ ఆటగాడు అందరి అంచనాలను తారుమారు చేశాడు. తను ఎదుర్కొన్న తొలి బంతి నుంచే అతడు ఇబ్బంది పడుతూ కన్పించాడు. వరుసుగా ఏడు బంతుల్లో సింగిల్ రన్ కూడా రాకపోవడంతో విరాట్‌పై ఒత్తడి పెరిగింది. ఈ క్రమంలో 7 ఓవర్ వేసిన మిచెల్ స్టార్క్ తొలి బంతిని ఆఫ్ స్టంప్‌కు వెలుపుల లెంగ్త్ డెలివరీగా సంధించాడు. ఆ బంతిని కోహ్లి డ్రైవ్ ఆడాలని ప్రయత్నించాడు. అయితే షాట్ సరిగ్గా కనక్ట్ కాకపోవడంతో బ్యాక్వర్డ్ పాయింట్లో కూపర్ కొన్నోలీ అద్బుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు. దీంతో కోహ్లి డకౌట్‌గా మైదానాన్ని వీడాడు. ఆస్ట్రేలియాపై వన్డేల్లో కోహ్లి డకౌట్ కావడం ఇదే తొలిసారి.అయితే వన్డే ప్రపంచకప్-2027లో ఆడడమే లక్ష్యంగా పెట్టుకున్న విరాట్ కోహ్లి.. ఈ తరహా ప్రదర్శనలు కనబరిస్తే భారత జట్టులో చోటు గల్లంతే అని చెప్పుకోవాలి. ఫిట్నెస్ పరంగా అతడికి ఎలాంటి ఇబ్బందులు లేవు. కానీ వరల్డ్‌కప్ టోర్నీకి ఇంకా రెండేళ్ల సమయం ఉండడంతో అప్పటివరకు అతడు ఫామ్ ఎలా ఉంటుందన్నది ప్రశ్నర్థకంగా మారింది. మరోవైపు యువ ఆటగాళ్ల నుంచి కోహ్లి తీవ్ర పోటీ ఎదురు అవుతోంది. దీంతో కనీసం మిగిలిన రెండు వన్డేల్లోనైనా అతడు సత్తాచాటాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. మరోవైపు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ సైతం తన రీఎంట్రీలో నిరాశపరిచాడు. కేవలం 8 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు.చదవండి: IND vs AUS: ఏంటి రోహిత్ ఇంత చెత్తగా ఆడావు..? ఎన్నో ఆశలు పెట్టుకున్నాముగాMitchell Starc gets Virat Kohli. pic.twitter.com/zsdEltOHRe— Mufaddal Vohra (@mufaddal_vohra) October 19, 2025 -
పోటీలోనూ వసూళ్లు బాగున్నాయి
‘‘ఈ పండక్కి మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని, చిన్న మెసేజ్ ఇవ్వాలని, ఒక వైబ్ క్రియేట్ అవ్వాలని మేం చేసిన ప్రయత్నం ‘కె–ర్యాంప్’ సినిమా. ప్రేక్షకుల నుంచి ΄పాజిటివ్ రెస్పాన్స్ లభిస్తోంది. ఇప్పుడున్న పోటీలో ఇంతమంచి కలెక్షన్స్ రావడం మామూలు విషయం కాదు. ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాకు వెళ్తున్నారు. షో బై షో కలెక్షన్స్ పెరుగుతున్నాయి. స్క్రీన్స్ యాడ్ అవుతున్నాయి. ఈ దీపావళికి ‘కె–ర్యాంప్’తో నాకు మంచి సక్సెస్ అందించిన అందరికీ ధన్యవాదాలు’’ అని కిరణ్ అబ్బవరం అన్నారు. కిరణ్ అబ్బవరం హీరోగా, యుక్తీ తరేజా హీరోయిన్గా నటించిన తాజా చిత్రం ‘కె–ర్యాంప్’. జైన్స్ నాని దర్శకత్వంలో రాజేశ్ దండ, శివ బొమ్మకు నిర్మించిన ఈ చిత్రం శనివారం విడుదలైంది. శనివారం సాయంత్రం యూనిట్ నిర్వహించిన సక్సెస్‌మీట్‌లో రాజేశ్ దండ మాట్లాడుతూ– ‘‘ఇలాంటి సినిమాల్లో లాజిక్స్ వెతక్కూడదు. అయితే కొందరు మా సినిమా పట్ల పక్షపాతం చూపిస్తున్నారు. దీపావళికి రిలీజైన సినిమాల్లో ఏ సినిమా కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూసి, నిజాలు తెలుసుకోవాలి’’ అని చెప్పారు. ‘‘కె–ర్యాంప్’ను హీరో కిరణ్‌గారు భుజాన వేసుకుని మోశారు కాబట్టి మంచి రిజల్ట్ వచ్చింది. ప్రేక్షకుల స్పందన బాగుంది’’ అన్నారు జైన్స్ నాని. ‘కె–ర్యాంప్’ విజయం పట్ల వీకే నరేశ్, యుక్తీ తరేజా సంతోషం వ్యక్తం చేశారు. -
ఫన్ అండ్ ఫవర్‌ఫుల్ టీవీ!
ఇంట్లో కుటుంబం మొత్తానికి ఆనంద కేంద్రం టీవీ. కాని, దాని వలన ఎక్కువసార్లు సంతోషం కంటే సమస్యలే ఎదురవుతాయి. ఇప్పుడు ఈ చిన్న చిన్న సమస్యలకు పరిష్కారం ఇచ్చే అద్భుతమైన గాడ్జెట్లు ఇవీ!కామ్‌గా చూడొచ్చు!రాత్రి హాయిగా పిల్లలు పడుకొని ఉంటే, అప్పుడే పేరెంట్స్ ‘ఇప్పుడు మనం ప్రశాంతంగా సినిమా చూడొచ్చు’ అనుకుంటారు. కాని, టీవీలో వచ్చే ఒక్క మాస్ సీన్ సౌండ్‌తో మొత్తం ఇంటి సీనే రివర్స్ అవుతుంది. ఇలాంటి పరిస్థితి రాకుండా, బ్లూటూత్ అడాప్టర్‌తో టీవీని హెడ్సెట్ సాయంతో చూడవచ్చు. దీనిని టీవీకి జత చేస్తే, ఇక మీరు ఏ హెడ్సెట్నైనా కనెక్ట్ చేసుకునే వీలుంటుంది. ఒకేసారి నాలుగు హెడ్సెట్లను కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. అలా మీరు సీరియస్‌గా సీరియల్ లేదా సినిమా చూస్తున్నప్పుడు పక్కన వాళ్లని ‘షుష్..’ అని చెప్పాల్సిన అవసరం లేదు. బటన్లతో వాల్యూమ్‌ను తక్కువ లేదా ఎక్కువ చేయడం సులభం. ధర రూ. 1,799 మాత్రమే!అన్ని పరికరాకలకూ ఒక్కటే రిమోట్సోఫాలో హాయిగా కూర్చుని, పక్కన స్నాక్స్ పెట్టుకుని, ఫ్యామిలీతో సినిమా చూడటానికి సిద్ధమయ్యే క్షణంలో ‘రిమోట్ ఎక్కడ?’ అనే ప్రశ్న! ఆ తర్వాత ఏసీ ఆన్ అవ్వకపోయినా, సెటప్‌బాక్స్ సిగ్నల్ రాకపోయినా, సేమ్ ప్రశ్నే రిపీట్! ఇలా పలు రకాల రిమోట్ల కోసం అవసరం లేకుండా చేస్తుంది. ‘సోఫా బటన్ ఎక్స్‌వన్ యూనివర్సల్ రిమోట్’. ఇది ఒక్కటి ఉంటే చాలు, అన్ని పరికరాల రిమోట్లకు గుడ్‌బై చెప్పేయొచ్చు. టీవీ, ఏసీ, సెటప్ బాక్స్, లైట్స్ అన్నీ ఒక్క బటన్తోనే నియంత్రించవచ్చు. వాయిస్ కంట్రోల్‌తో కూడా ఆపరేట్ చేయవచ్చు. అంటే చేతులు బిజీగా ఉన్నపుడు ‘రిమోట్, టీవీ ఆన్ చేయి’ అని చెప్తే చాలు, వెంటనే చేసేస్తుంది. ఇన్ఫ్రారెడ్ కనెక్టివిటీతో అతి తక్కువ సమయంలో సులభంగా అమర్చుకోవచ్చు. ఒకేసారి ఐదు లక్షల పరికరాల వరకు కనెక్ట్ చేసుకునే వీలుంది. ధర రూ. 3,999 మాత్రమే!ఎక్కడినుంచైనా చూడొచ్చు!ఇక టీవీ చూడటానికి మెడ తిప్పే రోజులు పోయాయి! వంటగదిలో ఉన్నా, హాల్లో ఉన్నా, టీవీనే మీ వైపు తిరిగి ‘కనిపిస్తునున్నానా, ఇంకొంచెం జరగాలా?’ అంటుంది. ఇదే ‘రోబోస్టు టీవీ వాల్ మౌంట్ బ్రాకెట్’ మ్యాజిక్. గోడపై తిప్పుతూ, వంచుతూ, టీవీని మీ చూపు కోణానికి సరిపడేలా సర్దేస్తుంది. ఇక వంట చేసేటప్పుడు సీరియల్ మిస్ కానివ్వదు, క్రికెట్ స్కోర్ కూడా బాల్కనీలో కాఫీతో కలిపి చూడొచ్చు. చిన్న నుంచి పెద్ద వరకు ఏ టీవీ అయినా, ఇది తన భుజాల మీద సేఫ్‌గా మోస్తుంది. మెటల్ బాడీ, తుప్పు, ధూళి భయం లేదు. ఇన్స్టాలేషన్ కూడా చాలా సులభం. ధర కేవలం రూ. 568 మాత్రమే! -
రైలు ఇంజన్‌పై పడ్డ బండరాయి.. తప్పిన పెను ప్రమాదం
సాక్షి, అల్లూరి జిల్లా: అల్లూరి జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఐరన్ లోడ్‌తో వెళ్తున్న రైలు ఇంజన్‌పై బండరాయి పడింది. దీంతో గూడ్స్ రైలు ఇంజన్ ముందు భాగం దెబ్బతింది. ఇవాళ (అక్టోబర్ 19, ఆదివారం) తెల్లవారుజామున తైడా- చిమిడిపల్లి రైల్వే స్టేషన్ల మధ్య ఘటన జరిగింది. కొత్తవలస-కిరండోల్ లైన్లో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది.విశాఖ- కిరండోల్, కిరండోల్-విశాఖ రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించారు. ఆ మార్గంలో రైళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది తక్షణమే ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.ఇదీ చదవండి: ధనత్రయోదశి ప్రభావం.. బంగారం ఎంత కొన్నారంటే? -
పేరెంటింగ్ టిప్స్: స్మార్ట్‌ఫోన్ వాడకంలో సరిహద్దులు తప్పనిసరి..!
‘‘డాక్టర్! మా బిడ్డ ఫోన్లో కార్టూన్ పెడితేనే తింటాడు.’’ ‘‘సర్! నా భర్తకు నాతో మాట్లాడటానికి టైం లేదు. ఆయన ఎప్పుడూ వాట్సాప్‌లోనే ఉంటాడు. చూస్తేనే చిరాకేస్తుంది.’’ ‘‘మా అమ్మానాన్న ఎప్పుడూ రీల్స్‌లోనే బిజీ. వాళ్లతో మాట్లాడాలంటే కూడా వెయిట్ చేయాలి.’’ ఇవి నా కౌన్సెలింగ్ రూమ్‌లో ప్రతిరోజూ వినిపించే మాటలు. చాలామంది తల్లిదండ్రులు తమ పనులకు అడ్డు రాకుండా ఉంటారని పిల్లలకు ఫోన్ ఇస్తారు. ‘‘పని చేసుకోవాలి కదా’’ అని సమర్థించుకుంటారు. కాని, ఆ రెండు నిమిషాల కంఫర్ట్ వల్ల పిల్లల మనసులు క్రమంగా ఖాళీ అవుతున్నాయి. భార్యాభర్తల మధ్య కూడా ఒక సైలెంట్ గ్యాప్ వస్తోంది. ‘‘నువ్వు నాకు టైమ్ ఇవ్వవు’’ అనే మాటకు బదులు – ఇద్దరూ ఒకే మంచం మీద పక్కపక్కన పడుకుని స్క్రీన్లతో బతుకుతున్నారు. ఒకప్పుడు కుటుంబ సమస్యలంటే కుర్రాళ్ల ప్రేమలు, అత్తాకోడళ్ల గొడవలు, భార్యాభర్తల వివాదాలు, పిల్లల మార్కుల టెన్షన్లు. కాని, ఇప్పుడు కౌన్సెలింగ్ రూమ్‌లోకి వస్తున్న కొత్త సమస్య – స్మార్ట్‌ఫోన్. ఈ చిన్ని యంత్రం – ఒక వైపు మనిషికి వరం, మరో వైపు నిశ్శబ్దంగా మన కుటుంబాల్ని కాలుస్తున్న శాపం.వరం లాంటి అద్భుతంమన జీవితంలో స్మార్ట్‌ఫోన్ తీసుకువచ్చిన విప్లవం అపారమైనది. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ లేని జీవితాన్ని ఊహించలేం. · ఇది కొద్ది సెకన్లలో జ్ఞానం, విద్య, సమాచారాన్ని అందిస్తుంది. · మ్యాప్‌లు, మెడిసిన్, బ్యాంకింగ్ అన్నీ ఒక క్లిక్ దూరంలో. దూరంగా ఉన్నవారిని వాట్సాప్, వీడియో కాల్స్ ద్వారా దగ్గర చేస్తుంది. కరోనా కాలంలో పాఠశాలలు, ఉద్యోగాలు, వైద్య సలహాలు అన్నీ ఫోన్ ద్వారానే నడిచాయి. · ఒక్క మాటలో చెప్పాలంటే, స్మార్ట్‌ఫోన్ మనిషిలో భాగంగా మారిపోయింది. శాపంగా మారిన వరం‘అతి సర్వత్ర వర్జయేత్’ అంటారు పెద్దలు. స్మార్ట్ ఫోన్ విషయంలో ఇది నూటికి నూరుపాళ్లు నిజం. అతిగా వాడటంతో మన చేతిలోని ఫోన్ ఒక డిజిటల్ జైలుగా మారిపోయింది. · పసిపాపలు తినడానికి ఫోన్ కావాలి. పిల్లలు ఆడుకోవడానికి స్క్రీన్ కావాలి. యువత రీల్స్, గేమ్స్‌కు బానిసలైపోయారు. భార్యాభర్తల మధ్య దూరం పెరిగింది. పెద్దలకు నిద్ర, ప్రశాంతత దూరమయ్యాయి. మనిషి తల వంచి నడవడం ఇప్పుడు సిగ్గుతో కాదు – నోటిఫికేషన్ చూడటానికి. ఒకప్పుడు డైనింగ్ టేబుల్ చుట్టూ కూర్చుని తినేవారు, ఇప్పుడు టేబుల్ చుట్టూ కూర్చుని మొబైల్ స్క్రోల్ చేస్తున్నారు. ఇది ఒక సామాజిక విపత్తుగా మారింది అనడంలో ఆశ్చర్యం లేదు.అతి వాడకంతో అనర్థాలుసైకాలజిస్టుల దృష్టిలో, స్మార్ట్‌ఫోన్ వినియోగానికి మూడు స్థాయులు ఉన్నాయి. వాడుక – అవసరమైన పనులకే వాడటం. దుర్వినియోగం – అవసరం లేకపోయినా గంటలు గంటలు స్క్రోల్ చేయడం. వ్యసనం – చేతిలో ఫోన్ లేకపోతే ఆందోళన, కోపం, మనసంతా శూన్యంలా అనిపించడం. జనాభాలో చాలామంది ఇప్పటికే మూడో దశలో ఉన్నారు. దీనివల్ల పిల్లల నుంచి పెద్దల వరకు అనేకానేక కొత్త కొత్త సమస్యలు వస్తున్నాయి. నిరంతర నోటిఫికేషన్లతో మెదడు ఫోకస్ కోల్పోతుంది. పిల్లలు ఏకాగ్రత నేర్చుకోలేరు. సోషల్ మీడియాలో పోలికల వల్ల డిప్రెషన్, అసూయ పెరుగుతుంది. ఫోన్ వల్ల భర్త–భార్యలు, తల్లిదండ్రులు– పిల్లలు ఒకరితో ఒకరు నేరుగా మాట్లాడడం తగ్గిపోతుంది. మనిషి విలువను లైక్స్, ఫాలోవర్స్‌తో కొలుస్తున్నాం. · ఫోన్ నుంచి వచ్చే బ్లూ లైట్ వల్ల నిద్ర తగ్గిపోతుంది, ఆందోళన పెరుగుతుంది.సరిహద్దులు తప్పనిసరిస్మార్ట్ఫోన్ ఒక వరం. కాని అది మనసు, బంధాలు, పిల్లల వికాసం కన్నా పెద్దదిగా మారితే – అదే శాపంగా మారుతుంది. అందుకే స్మార్ట్‌ఫోన్ ప్రభావాలు, దుష్ప్రభావాల గురించి, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, అడిక్షన్ నుంచి తప్పించుకునే మార్గాల గురించీ వారం వారం సవివరంగా తెలుసుకుందాం, మన జీవితాలను మార్చుకుందాం. ముందుగా గ్రౌండ్ రూల్స్... రెండు సంవత్సరాల లోపు పిల్లలకు ఫోన్ అస్సలు ఇవ్వకూడదు.డైనింగ్ టేబుల్, బెడ్రూమ్ ఫోన్ ఫ్రీ జోన్లుగా మార్చాలి.వారంలో ఒక రోజు డిజిటల్ ఫాస్టింగ్ చెయ్యాలి.ఫ్యామిలీ టైమ్‌లో ఫోన్ పక్కన పెట్టేయాలి.ముందుగా తల్లిదండ్రులే రోల్ మోడల్స్‌గా నిలవాలి. · పేరెంట్స్, స్పౌసెస్, ఇండివిడ్యువల్స్– ఈ రోజు ఒక ప్రశ్న అడగండి: ‘‘నా చేతిలో ఉన్న ఫోన్ నా జీవితానికి వరమా? శాపమా? ఆక్సిజనా? జైలా?’’సైకాలజిస్ట్ విశేష్‌ఫౌండర్, జీనియస్ మేట్రిక్స్ హబ్www.psyvisesh.com(చదవండి: గర్భం కోస్ల ప్లాన్ చేస్తే..ఆ మందలు వాడాల్సిందేనా..?) -
బండ్ల గణేశ్ దీపావళి పార్టీ.. హాజరైన టాలీవుడ్ స్టార్స్
టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేశ్ (Bandla Ganesh) ఇంట దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ దీపావళి సెలబ్రేషన్స్ కోసం పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలను తన ఇంటికి ఆహ్వానించాడు. ఆయన ఆహ్వానం మేరకు మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేశ్, సిద్ధు జొన్నలగడ్డ, శ్రీకాంత్, రోషన్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, తేజ సజ్జ, జేడీ చక్రవర్తి, తరుణ్, మౌలి, దర్శకుడు హరీశ్ శంకర్, నిర్మాత నవీన్ యెర్నేని తదితరులు శనివారం నాడు ఈ పార్టీకి హాజరయ్యారు.అందుకోసమే ఈ పార్టీ!ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అందులో చిరంజీవి, శ్రీకాంత్ ఒకే కారులో నుంచి దిగారు. చిరు కారు దిగగ్గానే బండ్ల గణేశ్ ఆయన పాదాలకు నమస్కరించాడు. తర్వాత చేతులు పట్టుకుని ఇంట్లోకి తీసుకెళ్లాడు. ప్రత్యేకమైన కుర్చీలో కూర్చోబెట్టాడు. కాగా కొంతకాలంగా సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నాడు బండ్ల గణేశ్. మళ్లీ ఇండస్ట్రీలో యాక్టివ్ అయ్యే క్రమంలోనే శనివారంనాడు దీపావళి పార్టీ ఇచ్చినట్లు తెలుస్తోంది. View this post on Instagram A post shared by Bandla Ganesh (@bandlaganesh_official) View this post on Instagram A post shared by Bandla Ganesh (@bandlaganesh_official)చదవండి: Bigg Boss: ఇదేం ట్విస్టు! మాధురి 200% కరెక్ట్ అన్న నాగ్.. -
ఏంటి రోహిత్ ఇంత చెత్తగా ఆడావు..? ఎన్నో ఆశలు పెట్టుకున్నాముగా
టీమిండియా స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ(Rohit sharma) తన పునరాగమనంలో తీవ్ర నిరాశపరిచాడు. పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు.7 నెలల తర్వాత భారత జట్టులోకి హిట్‌మ్యాన్‌పై అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.కానీ అందరి ఆశలను ఈ మాజీ కెప్టెన్ ఆడియశలు చేశాడు. క్రీజులోకి వచ్చినప్పటి నుంచే ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కొవడానికి రోహిత్ ఇబ్బంది పడ్డాడు. మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్‌లు బౌన్సర్లతో రోహిత్‌ను భయపెట్టారు.భారత్ ఇన్నింగ్స్ 4 ఓవర్ వేసిన హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో రోహిత్ స్లిప్స్‌లో దొరికిపోయాడు. ఆ ఓవర్లో నాలుగో బంతిని హేజిల్‌వుడ్ షార్ట్ ఆఫ్ గుడ్ లెంగ్త్ డెలివరీగా సంధించాడు. బౌన్స్ ఎక్కువగా ఉండడంతో ఆ బంతిని రోహిత్ ఆడకుండా వదిలేయాలని నిర్ణయించుకున్నాడు. కానీ బంతిని ఎడ్జ్ తీసుకుని సెకెండ్ స్లిప్‌లో ఉన్న మాట్ రెన్షా చేతికి వెళ్లింది. దీంతో 14 బంతులు ఆడి కేవలం 8 పరుగులు మాత్రమే చేసిన రోహిత్ శర్మ.. మైదానం వీడాల్సి వచ్చింది. పెర్త్‌లో మంచి ట్రాక్ రికార్డు ఉన్న రోహిత్ శర్మ.. ఈ విధంగా ఔట్ అవ్వడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.ఏంటి రోహిత్ ఇంత చెత్తగా ఆడావు అని సోషల్ మీడియాలో నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. కాగా ఆసీస్ పర్యటనకు ముందు రోహిత్ శర్మను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించిన సంగతి తెలిసిందే. అతడి స్దానంలో శుభ్‌మన్ గిల్‌కు జట్టు పగ్గాలను అప్పగించారు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత రోహిత్‌కు భారత్ తరపున ఇదే తొలి మ్యాచ్ కావడం గమనార్హం. టీ20లు, టెస్టులకు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ ప్రస్తుతం వన్డేలు మాత్రమే ఆడుతున్నాడు.తుది జట్లుభారత్: రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, మహమ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్ఆస్ట్రేలియా: ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్ (కెప్టెన్), మాథ్యూ షార్ట్, జోష్ ఫిలిప్ (వికెట్ కీపర్), మాట్ రెన్షా, కూపర్ కొన్నోలీ, మిచెల్ ఓవెన్, మిచెల్ స్టార్క్, నాథన్ ఎల్లిస్, మాథ్యూ కుహ్నెమాన్, జోష్ హాజిల్వుడ్చదవండి: కొంచెం కూడా సిగ్గు లేదు.. జింబాబ్వేను బ్రతిమాలుకున్న పాకిస్తాన్ -
ఎంపీ కేశినేని చిన్నిపై ఎమ్మెల్యే కొలికపూడి సంచలన ఆరోపణలు
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: బెజవాడ ఎంపీ కేశినేని చిన్నిపై తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సంచలన ఆరోపణలు చేశారు. ఎంపీ చిన్ని పార్టీ పదవులు అమ్ముకుంటున్నారంటూ వ్యాఖ్యానించారు. ఎంపీ కార్యాలయంలో కూర్చుని పార్టీ కమిటీలు వేస్తారు. గతంలో సూరపనేని రాజా తిరువూరులో పార్టీ పదవులను అమ్మేశాడు. పార్టీ పదవులు, నామినేటెడ్ పోస్టులకు డబ్బులు వసూలు చేశాడు. ఇప్పుడు ఎంపీ పీఏ కిషోర్ మొత్తం దందా నడిపిస్తున్నాడు’’ అంటూ కొలికపూడి మండిపడ్డారు.తిరువూరులో కిషోర్ ఇసుక, రేషన్ మాఫియా నడిపిస్తున్నాడు. పార్టీ పదవులను సైతం కిషోర్ అమ్ముకుంటున్నాడు. అన్ని విషయాలను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళదాం. ఈ నెల 24న అందరం కలిసి పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళదాం. తాడోపేడో తేల్చుకుంటా’’ అంటూ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఉద్యోగులకు బాబు దగా -
అవే నా స్టయిల్ ఆఫ్ లవ్: నటి చైత్ర జే ఆచార్
సింపుల్ నుంచి బోల్డ్ వరకు, ట్రెండ్ నుంచి ట్రెడిషనల్ వరకు ఏ స్టయిల్లోనైనా తన స్వాగ్‌ని చూపే నటి చైత్ర జే ఆచార్. జీన్స్, షార్ట్స్ ప్లస్ టీ షర్ట్ నా స్టయిల్ ఆఫ్ లవ్. బయటకు వెళ్లేటప్పుడు ఇదే లుక్‌ను కాస్త బోల్డ్‌గా స్టయిల్ చేస్తా. ప్రత్యేక సందర్భాల్లో చీరల్లో మెరుస్తాను. అవి నాకు సంప్రదాయబద్ధమైన, కంఫర్ట్ లుక్‌ను ఇస్తాయి. దుస్తులు ఏవైనా, మినిమల్ జ్యూలరీని ప్రిఫర్ చేస్తా అంటోంది చైత్ర జే ఆచార్. ఇక్కడ ఆమె ధరించిన చీర బ్రాండ్: ఇజాయి ధర: రూ. 3,850, జ్యూలరీ బ్రాండ్: ఫైన్ షైన్ జ్యూలరీ, ధర: ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. క్రిస్టల్ క్రష్!రాళ్ల నగలు నేటి యువత స్టయిల్‌కి ర్యాప్ సాంగ్లాంటి ఎనర్జీని ఇస్తున్నాయి. అందుకే, బంగారం మెరుపు కంటే, క్రిస్టల్ జ్యూలరీనే వారి ఫేవరెట్ క్రష్‌గా మారింది. నిజానికి, రాళ్ల ఆభరణాలకు ఫ్యాషన్‌లో ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంది. ఇవి కేవలం మెరుపుతోనే కాదు, ట్రెండ్, లగ్జరీ మిక్స్ చేసిన మోడర్న్ డిజైన్లతో వస్తాయి. విశేషంగా, వైట్ స్టోన్ జ్యూలరీకి ఒక అదనపు ఆర్భాటం అందిస్తాయి. ఒక్కసారి రాళ్ల ఆభరణాలు ధరించగానే సాధారణ దుస్తులు కూడా ప్రత్యేకంగా మెరుస్తాయి. డైలీ వేర్‌కు, మినిమలిస్టిక్ వైట్ సఫైర్ స్టడ్స్, సింపుల్ బ్యాంగిల్స్ ఎప్పటికీ బెస్ట్ ఆప్షన్. ఆఫీస్ స్టయిల్‌కు క్లాసిక్ వైట్ స్టోన్ పీసులు, జెంటిల్ డిజైన్, ప్రొఫెషనల్ లుక్ అందిస్తాయి. వివాహాది శుభకార్యాల కోసం పెద్ద హారాలు, చోకర్స్, గ్రాండ్ స్టేట్మెంట్ లుక్ ఇస్తాయి. ప్రతి సందర్భానికి ప్రత్యేకంగా మోడర్న్ స్టోన్ డిజైన్స్ అందుబాటులో ఉన్నాయి. జుట్టు పోనీగా కట్టి వెళ్ళితే రాయల్టీ లుక్, వేవీ హెయిర్ లేదా కర్ల్స్ వేసుకుంటే క్యూట్ టచ్ గ్యారంటీ. (చదవండి: beauty: ముఖం మెరుస్తూ..కాంతిగా ఉండాలంటే..! కుంకుమ పువ్వుతో..) -
బీహార్ ఎన్నికలు.. ఎన్డీయే కూటమికి బిగ్ షాక్
పట్నా: బీహార్ అసెంబ్లీ(Bihar Assembly Election) ఎన్నికల నేపథ్యంలో అధికార ఎన్డీయే(NDA Alliance) కూటమికి ఊహించని షాక్ తగిలింది. మధుర అసెంబ్లీ స్థానం నుంచి కూటమి తరఫున ఎల్జేపీ అభ్యర్థిగా నిలిచిన సీమా సింగ్(Seema Singh) నామినేషన్ రద్దైంది. దీంతో, మధుర అసెంబ్లీ స్థానంలో ఎన్డీయే అభ్యర్థి పోటీలో లేకుండా ఎన్నికలు జరగనున్నాయి. ప్రధాన పోటీ ఆర్జేడీ, జన్ సురాజ్ పార్టీల మధ్య ఉండనుంది.వివరాల ప్రకారం.. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా చాప్రా జిల్లాలోని మధుర అసెంబ్లీ స్థానం నుంచి ఎన్డీఏ కూటమి తరఫున ఎల్జేపీ అభ్యర్థిగా సీమా సింగ్ నామినేషన్ వేశారు. మొదటి విడత నామినేషన్ వేయడానికి అక్టోబర్ 17 చివరి తేదీ కావడంతో ఆమె.. శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ పత్రాలను అధికారులు శనివారం పరిశీలించగా సీమా సింగ్ నామినేషన్లో లోపం ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆమె నామినేషన్ రద్దు చేసినట్లు డిప్యూటీ ప్రొవిన్షియల్ ఎలక్షన్ ఆఫీసర్ (డీపీఆర్వో) ఓ ప్రకటనలో వెల్లడించారు. అలాగే, ఈ నియోజకవర్గంలో నామినేషన్లో లోపం కారణంగా సీమా సింగ్‌తో పాటు మొత్తం నాలుగు నామినేషన్లు తిరస్కరణకు గురైనట్టు ఎన్నికల అధికారి తెలిపారు.సినిమా నుంచి పాలిటిక్స్‌లోకి.. సీమా సింగ్ పలు భోజ్‌పురి సినిమాల్లో నటించారు. తన మార్క్ నటనతో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే, సినిమా రంగం నుంచి ఆమె రాజకీయాల్లోకి వచ్చి అందరనీ ఆశ్చర్యపర్చారు. కాగా, చిరాగ్ పాశ్వాన్ తనకు మధుర స్థానాన్ని కేటాయించిన తర్వాత ఆమె చాలా నియోజకవర్గంపై ఫోకస్ పెట్టి రాజకీయంగా యాక్టివ్‌గా ప్రచారం చేసుకుకున్నారు. మరోవైపు.. ఆమె తన అఫిడవిట్లో తొమ్మిదో తరగతి చదివినట్లు పేర్కొన్నారు. దీంతో, ఆమెపై ప్రజల్లో మరింత ఫోకస్ పెరిగింది. ఇదిలా ఉండగా.. 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు సీమా సింగ్‌పై కేసు నమోదైంది. ప్రభుత్వ అనుమతి లేకుండా షేక్‌పురాలో ఆమె హోలీ నిర్వహించిన కారణంగా పోలీసులు కేసు నమోదు చేశారు.ఇదిలా ఉండగా.. బీహార్‌లోని మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 6, 11 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఈసారి అధికార ఎన్డీయే కూటమి, ప్రతిపక్ష ఇండియా కూటమి, జన్ సురాజ్ పార్టీ మధ్య త్రిముఖ పోరు జరిగే అవకాశం ఉంది. బీహార్ అసెంబ్లీకి గడువు నవంబర్ 22తో ముగియనుంది. -
Jubilee Hills by poll: 127కు చేరిన నామినేషన్లు
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం నామినేషన్ల పర్వం కొనసాగుతూనే ఉంది. శనివారం ఒక్కరోజే 48 నామినేషన్లు దాఖలయ్యా యి. ఇప్పటివరకు మొత్తం నామినేషన్ల సంఖ్య 127కు చేరింది. నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థుల సంఖ్య 94కు చేరింది. నామినేషన్లకు ఆదివారం, సోమవారం సెలవు దినాలు కాగా, మంగళ వారం ఒక్కరోజే నామినేషన్లకు తుది గడువు కాగా ఆ రోజు ఎంతమంది వేస్తారనేది చూడాల్సి ఉంది.