NRI
-
న్యూజెర్సీలో ఘనంగా శంకర నేత్రాలయ సంగీత–నృత్య సేవా కార్యక్రమం
అమెరికాలోని శంకర నేత్రాలయ ఆధ్వర్యంలో నిర్వహించిన సంగీత–నృత్య సేవా కార్యక్రమం న్యూజెర్సీ రాష్ట్రంలో ఘనంగా జరిగింది. మార్చి 14, 2026 శనివారం సాయంత్రం ఆల్బర్ట్ ప్యాలెస్‌లో జరిగిన ఈ కార్యక్రమం భారతీయ సాంప్రదాయ కళలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రసాద్ రెడ్డి కటమరెడ్డి హాజరై సేవా కార్యక్రమాల ప్రాముఖ్యతను వివరించారు. మాజీ కమిషనర్ ఉపేంద్ర చివుకుల కూడా కార్యక్రమంలో పాల్గొని సందేశం ఇచ్చారు. కార్యక్రమంలో ప్రముఖ గాయకులు రాము, అంజనా సౌమ్య తమ గాన ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించారు. వారి సంగీత ప్రదర్శనలు సభలోని ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందాయి.అలాగే అనేక నృత్య సంస్థలు భారతీయ సాంప్రదాయ నృత్యాలను అద్భుతంగా ప్రదర్శించాయి. అందులో కళాగంగోత్రి ఫౌండేషన్, సౌపర్ణిక నృత్య అకాడమీ, కూచిపూడి నృత్య కేంద్రం, సిద్ధేంద్ర కూచిపూడి కళా అకాడమీ, నాట్య తత్వ శ్రీ సాయి వెంకటేశ్వర లలిత కళలు, చిన్మయి నృత్యాలయ, లిటిల్ మ్యూజీషియన్స్ అకాడమీ అమెరికా సంస్థలు పాల్గొని ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.గ్రామీణ ప్రాంతాల్లో కంటి వైద్య సేవలను అందించేందుకు శంకర నేత్రాలయ సంస్థ మొబైల్ కంటి శస్త్రచికిత్స యూనిట్లను నిర్వహిస్తూ వేలాది మంది పేదలకు కంటి వెలుగు అందిస్తోంది. ఈ సేవా కార్యక్రమం ద్వారా సేకరించిన విరాళాలను పేదలకు కంటి శస్త్రచికిత్సలు, వైద్య సేవలు అందించేందుకు వినియోగించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.అమెరికాలోని న్యూజెర్సీ బృంద సభ్యులు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సేవా కార్యక్రమాలకు మద్దతుగా నిర్వహించిన ఈ వేడుకకు స్థానిక భారతీయులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.(చదవండి: సింగపూర్‌లో ఘనంగా ఉగాది వేడుకలు) -
సింగపూర్‌లో ఘనంగా ఉగాది వేడుకలు
సింగపూర్: దేశ విదేశాలు ఉగాది వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. తెలంగాణ కల్చరల్ సొసైటీ, సింగపూర్ (TCSS) ఆధ్వర్యంలో పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు ఇక్కడి పోటోన్గ్ పాసిర్లోని శ్రీ శివ దుర్గ ఆలయంలో ఘనంగా నిర్వహించారు. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో అందరికి మంచి జరగాలని ఉగాది పర్వదినాన సొసైటీ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. వేడుకల్లో భాగంగా శ్రీ పేరి కృష్ణ శర్మ పంచాంగ శ్రవణం చేశారు. ఈ వేడుకల్లో 300పైగా ప్రవాస తెలుగు భక్తులు పాల్గొన్నారు. సందర్భంగా ఎలాంటి లాభాపేక్ష లేకుండా తెలంగాణ కల్చరల్ సొసైటీ వారు చేస్తున్న కార్యక్రమాలు స్ఫూర్తి దాయకం అని వేడుకల్లో పాల్గొన్న భక్తులు కొనియాడారు.ఈ కార్యక్రమానికి సమన్వయ కర్తలుగా ప్రాంతీయ కార్యదర్శులు సంతోష్ వర్మ మాదారపు, భాస్కర్ నడికట్ల, శశిధర్ ఎర్రమ రెడ్డి, ఉపాధ్యక్షులు నల్ల భాస్కర్, దుర్గ ప్రసాద్ , సంతోష్ కుమార్ జూలూరి ప్రశాంత్ బసిక, ఉపాధ్యక్షురాలు సునీత రెడ్డి మిర్యాల, ప్రధాన కార్యదర్శి బొందుగుల రాము, కార్యవర్గ సభ్యులు పెరుకు శివ రామ్ ప్రసాద్ తదితరులు వ్యవహరించారు. ఉగాది వేడుకలు విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేసిన వారికి టీసీఎస్ఎస్ అధ్యక్షులు గడప రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి బొందుగుల రాము, కోశాధికారి నంగునూరి వెంకటరమణ, సంస్థాగత కార్యదర్శి కాసర్ల శ్రీనివాస రావు, ప్రాంతీయ కార్యదర్శులు బొడ్ల రోజా రమణి, రవి కృష్ణ విజాపూర్, కార్యవర్గ సభ్యులు శివ ప్రసాద్ ఆవుల, భాస్కర్ రావు పులిగిళ్ల, విజయ మోహన్ వెంగళ, ప్రవీణ్ మామిడాల, సతీష్ పెసరు, మణికంఠ రెడ్డి, రావుల సుగుణాకర్ రెడ్డి, చల్ల కృష్ణ ధన్యవాదాలు తెలిపారు. -
అమెరికాలో గుండెపోటుతో వరంగల్ వాసి మృతి
రామన్నపేట: వరంగల్ దేశాయిపేటలోని రామనాథ కాలనీకి చెందిన తా డిపత్రి రాకేశ్(40) అమెరికాలో గుండె పోటుతో మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. రాకేశ్ 2007 సంవత్సరంలో ఎంఎస్ చదివేందుకు యూఎస్ఏకు వెళ్లాడు. అనంతరం అక్కడే అమెజాన్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం సాధించి వర్జీనియాలో స్థిరపడ్డాడు. 2014లో కరీంనగర్‌కు చెందిన తేజస్వినితో వివాహం జరిగింది. వీరికి ఐదు సంవత్సరాల వయసున్న కవల పిల్లలు ఉన్నారు. ఈ క్రమంలో భారత కాలమానం ప్రకారం ఆదివారం మధ్యాహ్నం తేజస్విని యోగా తరగతులకు వెళ్లింది. పిల్లలతో ఇంట్లో ఉన్న రాకేశ్ గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, బంధువులు బోరున విలపించారు. పరామర్శించిన ప్రముఖులు మృతుడి కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యేలు ధ ర్మారావు, రాజేశ్వర్‌రావు, చాంబర్ ఆఫ్ కామ ర్స్ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్‌రెడ్డి పరామర్శించారు. అమెరికా నుంచి మృతదేహాన్ని స్వదేశానికి తెప్పించేందుకు ఎంబసీతో మాట్లాడి త్వరగా రప్పించేందుకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో నేతలు చర్చించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రాకేశ్ మృతదేహం భారతదేశానికి వచ్చేందుకు ఐదు రోజుల సమయం పడుతుందని తెలిపారు. -
అల్ఫారెట్టాలో వైభవంగా ‘నాట్యాంజలి-2026’
అల్ఫారెట్టా, జార్జియా: స్థానిక నటరాజ నాట్యాంజలి కూచిపూడి డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన వార్షిక నృత్యోత్సవం నాట్యాంజలి-2026’ అల్ఫారెట్టాలోని డెన్మార్క్ హైస్కూల్లో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి 700 మందికి పైగా ప్రేక్షకులు హాజరయ్యారు. మూడు సేవా సంస్థలకు నిధులు సమీకరించేందుకు తమ మద్దతు తెలిపారు.ఈ నృత్యోత్సవంలో 168 మంది విద్యార్థులు పాల్గొని 28 రంగురంగుల కూచిపూడి నృత్య ప్రదర్శనలు చేశారు. నాలుగేళ్ల చిన్నారుల నుండి 45 సంవత్సరాల వయస్సు గల కళాకారుల వరకు పాల్గొనడం ద్వారా భారతీయ శాస్త్రీయ నృత్యకళను అన్ని తరాల మధ్య విస్తరింపజేయాలనే అకాడమీ లక్ష్యం ప్రతిఫలించింది. ఈ కార్యక్రమం ద్వారా సమీకరించిన నిధులను శాంతినికేతన్ రిహాబిలిటేషన్ సెంటర్ ఫర్ ది డిసేబుల్డ్ చిల్డ్రెన్, ది ప్లేస్, శంకర నేత్రాలయ(యూఎస్ఏ) సేవా సంస్థలకు అందజేయనున్నారు.ఈ వేడుకల్లో బాల ఇందుర్తి, మాధవి ఇందుర్తి (శంకర నేత్రాలయ యూఎస్ఏ ప్రతినిధులు), గిరిధర్ కొటగిరి (ఇండియన్ ఫ్రెండ్స్ ఆఫ్ అట్లాంటా అధ్యక్షులు), జ్యోత్స్న పాలకుర్తి (గేట్స్ గ్లోబల్ అసోసియేషన్ ఫర్ తెలుగు ఎంట్రప్రెన్యూర్స్ చైర్మన్), రమణ గంద్ర (గేట్స్ అధ్యక్షులు), సునీత పోట్నూరు (తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా అధ్యక్షురాలు), ఆది శ్రీనివాసన్ (ఒస్మోస్ యుటిలిటీస్ సర్వీసెస్ అధ్యక్షులు), శ్రీరామ్ రోయ్యాల, క్రిస్టీ ఫెరెన్సీ (ప్రెసిడెంట్ అండ్ సీఈఓ), జనార్ధన్ పన్నెల (శాంతినికేతన్ రిహాబిలిటేషన్ సెంటర్ ప్రతినిధి) పాల్గొన్నారు. -
దుబాయ్‌లో హౌస్ షేరింగ్.. కొత్త రూల్స్
దుబాయ్‌లో భాగస్వామ్య వసతి (హౌస్ షేరింగ్/బెడ్ స్పేస్ రెంటల్స్)పై కఠిన నిబంధనలు తీసుకొచ్చారు. దుబాయ్ పాలకుడు, యూఏఈ ఉపాధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ మార్చి 11న ఈ మేరకు లా నెం. (4) ఆఫ్ 2026 జారీ చేశారు. భాగస్వామ్య వసతిని నియంత్రించి, నివాసుల హక్కులను కాపాడటం, సురక్షితమైన, ఆరోగ్యకరమైన జీవన పరిస్థితులను నిర్ధారించడం, అధిక జనసాంద్రతను నివారించడం, అక్రమ భవన మార్పులను అరికట్టడం ఈ చట్టం లక్ష్యాలు.కీలక నిబంధనలు ఇవే.. ఏ వ్యక్తి లేదా సంస్థ అయినా, యూనిట్‌ను భాగస్వామ్య వసతిగా కేటాయించాలంటే దుబాయ్ మున్సిపాలిటీ నుండి ముందస్తు అనుమతి (పర్మిట్) తీసుకోవాలి. అనుమతి లేకుంటే ఇది చట్టవిరుద్ధం. అనుమతులు ఒక సంవత్సరం చెల్లుబాటు అవుతాయి. యజమాని అభ్యర్థన మేరకు రెండేళ్ల పర్మిట్ కూడా ఇవ్వవచ్చు. పునరుద్ధరణ కోసం గడువు ముగియడానికి కనీసం 30 రోజుల ముందు దరఖాస్తు చేయాలి. భాగస్వామ్య యూనిట్లలో గరిష్ట ఆక్యుపెన్సీ లిమిట్, ప్రతి వ్యక్తికి కనీస స్థలం, అవసరమైన షేర్డ్ ఫెసిలిటీలు (వెంటిలేషన్, షేర్డ్ ఏరియాలు) నిర్ధారించాలి. అద్దెదారులు లేదా ఇతరులు యూనిట్లో ఏ భాగాన్నైనా సబ్-లీజ్‌కు ఇవ్వకూడదు లేదా పార్టిషన్లు (తాత్కాలిక గోడలు) ఏర్పాటు చేయకూడదు – ఇది నిషేధం. భాగస్వామ్య వసతి మార్కెట్‌పై ప్రత్యేక అద్దె సూచిక (రెంటల్ ఇండెక్స్) ఏర్పాటు చేస్తారు. ఇది సాధారణ అద్దె మార్కెట్ సూచిక నుండి వేరుగా ఉంటుంది.భారీ జరిమానాలుఉల్లంఘనలకు 500 నుండి 500,000 దిర్హమ్ల వరకు జరిమానా విధిస్తారు. ఒక క్యాలెండర్ ఇయర్లో పదేపదే ఉల్లంఘనలు జరిగితే గరిష్టంగా 1 మిలియన్ దిర్హమ్లు (సుమారు రూ.2.25 కోట్లు) వరకు జరిమానా పడవచ్చు.ఎందుకీ కొత్త చట్టం?గతంలో దుబాయ్‌లో అక్రమ విభజనలు (పార్టిషన్లు), బెడ్ స్పేస్ రెంటల్స్ వల్ల అగ్నిప్రమాదాలు, భద్రతా సమస్యలు తలెత్తుతున్నాయి. ఉదాహరణకు, గత జూలైలో దుబాయ్ మెరీనాలో అక్రమంగా పార్టీషన్ చేసిన ఒక భవనంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ భవనంలో 3,800 మందికి పైగా జనం నివసిస్తున్నారు. ఇలాంటి పార్టీషన్ల కోసం ఉపయోగించే తాత్కాలిక గోడలతో (చెక్క లేదా జిప్సమ్ బోర్డులు) అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. వెంటిలేషన్ కూడా సక్రమంగా ఉండదు. అత్యవసర నిష్క్రమణ మార్గాలకు ఆస్కారం ఉండదు. -
న్యూయార్క్‌లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు
న్యూయార్క్: అమెరికాలోని ప్రముఖ ప్రవాస భారతీయుల సంస్థ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ (FIA) న్యూయార్క్, న్యూజెర్సీ, కనెక్టికట్, న్యూఇంగ్లాండ్ చాఫ్టర్ల ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు న్యూయార్క్ నగరంలోని ఇండియా హౌస్‌లో ఘనంగా నిర్వహించారు.గత ఎనిమిదేళ్లుగా నిర్వహిస్తున్న ఈ వేడుకల్లో వ్యాపారం, మీడియా, ఫైనాన్స్, సామాజిక సేవ తదితర రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచి అమెరికాలో భారతీయ సమాజానికి స్ఫూర్తిగా నిలిచిన మహిళలను ఈ సందర్భంగా సత్కరించారు.FIA అధ్యక్షుడు శ్రీకాంత్ అక్కపల్లి మాట్లాడుతూ, మహిళా సాధికారతకు తమ సంస్థ ఇస్తున్న ప్రాధాన్యతను వివరించారు. సమాజంలో మహిళలు తీసుకొచ్చిన సానుకూల మార్పులకు కృతజ్ఞతలు తెలుపుతూ అవార్డు గ్రహీతలను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన భారత కాన్సుల్ జనరల్ బినయ శ్రీకాంత ప్రధాన్‌ను ప్రత్యేక అతిథిగా పరిచయం చేశారు.కాన్సుల్ జనరల్ బినయ శ్రీకాంత ప్రధాన్ మాట్లాడుతూ.. దేశ అభివృద్ధికి మహిళా సాధికారత కీలకమని చెప్పారు. 'బేటీ బచావో బేటీ పడావో', 'ఉజ్వల యోజన' వంటి పథకాల ద్వారా భారత్ మహిళా సాధికారతలో ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోందని చెప్పారు. అలాగే 100 మిలియన్ కుటుంబాలను మహిళల స్వయం సహాయక సంఘాలతో అనుసంధానం చేయడం ద్వారా ఆర్థికంగా శక్తివంతం చేయడంపై దృష్టి పెట్టినట్టు తెలిపారు.ఈ కార్యక్రమంలో సత్కారం పొందిన మహిళలకు న్యూయార్క్ గవర్నర్ కాథీ హోచుల్ తరఫున గుర్తింపు సర్టిఫికెట్లు, FIA శాలువాలు, ట్రోఫీలు అందజేశారు.నార్త్‌స్టార్ స్ట్రాటజీస్ COO జోడి లిన్ హెర్క్లోజ్, రోబర్ట్ వుడ్ జాన్సన్ బార్నబాస్ హెల్త్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ బాల్‌ప్రీత్ గ్రేవాల్ విర్క్, ప్రముఖ అమెరికన్ నటి రేష్మా శెట్టి, NYPD ఫస్ట్ డిప్యూటీ కమిషనర్ టానియా కిన్సెల్లా తదితరులు మహిళలు ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా పురస్కార గ్రహీతలు తమ అభిప్రాయాలు పంచుకున్నారు. కాన్సుల్ జనరల్ సతీమణి మోనాలిసా శువదర్షిణి ప్రధాన్ కూడా ఈ గుర్తింపుకు కృతజ్ఞతలు తెలిపారు. డాక్టర్ బల్ప్రీత్ గ్రేవాల్-విర్క్ మాట్లాడుతూ, కమ్యూనిటీ నిర్మాణంలో FIA పాత్రను కొనియాడుతూ, తన విజయానికి తల్లిదండ్రుల ప్రోత్సాహమే కారణమని తెలిపారు. అమెరికన్ నటి రేష్మా శెట్టి.. మాతృత్వం, సాంస్కృతిక వారసత్వం గురించి భావోద్వేగంగా మాట్లాడారు. NYPD ఫస్ట్ డిప్యూటీ కమిషనర్ తానియా కిన్సెల్లా మాట్లాడుతూ, ఈ గౌరవాన్ని తన తల్లి, అమ్మమ్మలకు అంకితం ఇస్తూ.. అడ్డంకులను అధిగమించిన వైనాన్ని వివరించారు.కార్యక్రమ ప్రారంభంలో దివంగత అవార్డు గ్రహీత రాధా సుబ్రమణ్యం జ్ఞాపకార్థం మౌనం పాటించారు. రిద్ది పారిఖ్ పటేల్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. కార్యక్రమం ముగింపులో FIA ప్రధాన కార్యదర్శి సృష్టి కౌల్ నరులా ధన్యవాదాలు తెలిపారు. FIA జనరల్ సెక్రటరీ సృష్టి కౌల్ నరుల వందన సమర్పణతో వేడుకలను ముగిశాయి.ఎఫ్ఐఏ సంస్థ 1970 నుండి భారత్-అమెరికా సంబంధాలను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తోంది. భారతీయ సంస్కృతి, సేవా కార్యక్రమాలు, సామాజిక అవగాహన కార్యక్రమాల ద్వారా అమెరికాలోని భారతీయ సమాజాన్ని బలోపేతం చేస్తూ, ఇండో–అమెరికా సంబంధాలను మరింత బలపరుస్తోంది. -
మరో దుబాయ్ వ్యాపారవేత్త ఔదార్యం, 64 ఫ్లాట్స్ ఫ్రీగా
మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, అనిశ్చిత పరిస్థితుల మద్య దుబాయ్‌లో భారతీయ వ్యాపారవేత్త మానవత్వాన్ని చాటుకున్నారు. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య జరుగుతున్న భీకరపోరులో చిక్కుకున్న భారతీయ పౌరులను ఆదుకోవడానికి ముందుకు వచ్చారు. వారికోసం తన 64-యూనిట్ అపార్ట్‌మెంట్‌ను వసతిని ఆహారంతో సహా ప్రాథమిక సౌకర్యాలతో ఉచితంగా అందించారు.అల్ మిజాన్ గ్రూప్ చైర్మన్ యోగేష్ దోషి మానవతా దృక్పథంలో స్పందించిన తీరు ప్రశంసలందుకుంది. నగరంలో చిక్కుకున్న భారతీయులకు 64 అపార్ట్మెంట్లతో కూడిన తన నివాస భవనాన్నివసతిని ఆహారంతో సహా ప్రాథమిక సౌకర్యాలతో ఉచితంగా అందించడం విశేషంగా నిలిచింది.ఈ ప్రక్రియను ఇండియన్ పీపుల్స్ ఫోరం UAE, దుబాయ్‌లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియాతో సమన్వయంతో నిర్వహిస్తున్నామని తెలిపారు. పిల్లలతో ఉన్న కుటుంబాలతో సహా 125 మందికి పైగా భారతీయులకు క్లిష్ట కాలంలో తాత్కాలిక ఆశ్రయం కల్పించడంలో సహాయం చేశామని దోషి చెప్పారు. కీలకమైన సమయంలో ఈ సహాయం లభించడం చాలా ఊరటనిచ్చిందని బాధితులు సంతోషం వ్యక్తం చేశారు.రియా మకాడియా, పరాస్ భలోడియా మరియు గ్రిష్మా భలోడియాతో పాటు మోహిత్ వచ్చానీ, వారి హోటల్ బుకింగ్‌లు ముగియడంతో, పొడిగింపులు సాధ్యం కాక క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నామని చెప్పారు. నిరంతరం ఫోన్లో అలర్ట్‌లు రావడం కూడా ఆందోళనను పెంచిందని వారు చెప్పారు.UAEలో భారతీయ వ్యాపారవేత్త ఫామ్‌హౌస్‌ను ఆశ్రయందుబాయ్లో చిక్కుకుపోయిన భారతీయుల కోసం, యుఎఇకి చెందిన వ్యాపారవేత్త ధీరజ్ జైన్ కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న అజ్మాన్‌లోని పెద్ద ఫామ్‌హౌస్‌ను వారికోసం తాత్కాలిక వసతిగా మార్చారు. అనేక ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులకు ఉచిత వసతి భోజనం అందించారు. హోటళ్ళు, వివిధ ప్రదేశాల్లో చిక్కుకున్న వారిని ఫామ్‌హౌస్‌కు తీసుకొచ్చేందుకు ఆరు రోల్స్ రాయిస్ వాహనాలతో సహా 11 కార్లను కూడా వినియోగించడం విశేషం. ఫిబ్రవరి 28న అమెరికా ఇజ్రాయెల్, రెండు మిత్రదేశాలు ఇరాన్‌పై సంయుక్త దాడులు చేసి, సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని హత మార్చడంతో మధ్యప్రాచ్యంలో యుద్ధం ప్రారంభమైంది. అప్పటి నుండి, ఇరాన్ గల్ఫ్ దేశాలలోని ఇజ్రాయెల్, యుఎస్ సైనిక స్థావరాలపై దాడి చేస్తోంది. దాడులు, ప్రతిదాడులు కొనసాగుతున్నాయి.(International Women's Day ప్రతీ అడుగు కన్నీటి మడుగు) -
సింగపూర్‌లో ఘనంగా ‘శంకరాభరణం వెండితెర నవల’ పుస్తకావిష్కరణ
శ్రీ సాంస్కృతిక కళాసారథి, సింగపూర్ ఆధ్వర్యంలో ‘శంకరాభరణం వెండితెర నవల’ పుస్తకావిష్కరణ కార్యక్రమం ప్రముఖ దర్శకులు కె. విశ్వనాథ్ గారి తనయులు కే నాగేంద్రనాథ్ చేతుల మీదుగా ఆదివారం సాయంత్రం 43, బర్గండీ క్రిసెంట్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దాదాపు 70 మంది దర్శకుడు కె. విశ్వనాథ్ అభిమానులు హాజరయ్యారు.సంస్థ అధ్యక్షులు రత్నకుమార్ కవుటూరు మాట్లాడుతూ, కె. నాగేంద్రనాథ్‌తో తనకు దాదాపు పదేళ్లకు పైగా అనుబంధం ఉందని తెలిపారు. సామవేదం షణ్ముఖ శర్మ 2017లో సింగపూర్ విచ్చేసిన సందర్భంగా నిర్వహించిన శివపదం కార్యక్రమానికి ఆయన అందించిన సహకారాన్ని గుర్తుచేసుకున్నారు. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే వీడియో సందేశాలు అందించిన పుస్తక రచయిత, ప్రముఖ దర్శకులు సీనియర్ డైరెక్టర్ వంశీకి, ‘శంకరాభరణం’ చిత్ర నిర్మాత ఏడిద నాగేశ్వరరావు తనయులు ఏడిద రాజాకి ధన్యవాదాలు తెలియజేశారు.ముఖ్య అతిథి కె. నాగేంద్రనాథ్ మాట్లాడుతూ శంకరాభరణం’ చిత్రం విడుదల సమయంలో వచ్చిన ఈ పుస్తకం అప్పట్లో తెలుగు ప్రజల అభిమానాన్ని విశేషంగా పొందిందని తెలిపారు. ప్రస్తుతం పుస్తక రచయిత వంశీని సంప్రదించి పునర్ముద్రణ చేయించామని చెప్పారు. విశ్వనాథ్ జయంతి సందర్భంగా ఫిబ్రవరి 19న హైదరాబాద్‌లో ఈ పుస్తకాన్ని ఆవిష్కరించామని, దానికి విశేష స్పందన వచ్చిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ‘శంకరాభరణం’ చిత్రంలోని గీతాలు, విశేషాలు వినిపించడంతో ఇది ఒక అచ్చ తెలుగు పండుగలా అనిపించిందని తెలిపారు.ఈ సందర్భంగా తొలి పుస్తకాన్ని ఆంధ్రప్రదేశ్ నుంచి విచ్చేసినసంస్కార భారతి అధ్యక్షులు రమణమూర్తి కి, తెలుగు సమాజం పూర్వ అధ్యక్షులు బి.వి.ఆర్. చౌదరి దంపతులకు, తంగిరాల రాజశేఖర్, సౌభాగ్యలక్ష్మి దంపతులకు కె. నాగేంద్రనాథ్ చేతుల మీదుగా అందజేశారు.కార్యక్రమంలో ‘శంకరాభరణం’ చిత్రంలోని గీతాలను చంద్రహాస్ ఆనంద్, షర్మిల, కిరీటి దేశిరాజు, సౌభాగ్యలక్ష్మి, శేషు యడవల్లి ఆలపించగా, శేషశ్రీ వీణపై ఒక గీతాన్ని వాయించి ప్రేక్షకులను అలరించారు. అలాగే దర్శకుడు కె. విశ్వనాథ్ తో ఉన్న వ్యక్తిగత పరిచయాలను పూజా కండ్రప, రామచంద్రరావు ప్రేక్షకులతో పంచుకోగా, చిత్ర మరియు పుస్తక విశేషాలను వేణు రెడ్డి, రాధికా మంగిపూడి, రాంబాబు పాతూరి, శేషు యడవల్లి, సుబ్బు పాలకుర్తి, కోనాల కాళీకృష్ణ తదితరులు వివరించారు.కార్యక్రమానికి విచ్చేసిన అతిథుల కోసం రాజశేఖర్–సౌభాగ్యలక్ష్మి దంపతులు ప్రత్యేకంగా తెలుగు వంటకాలతో భోజనాన్ని సిద్ధం చేశారు. ఈ ఏర్పాట్లలో శ్రీలలిత, మాధవి పాలకుర్తితోపాటు, సుబ్బు పాలకుర్తి వ్యాఖ్యాతగా వ్యవహరించగా, రాంబాబు పాతూరి, శ్రీధర్ భరద్వాజ్, సత్య జాస్తి, రాజ్ కుమార్ తదితరులు సహాయ సహకారాలను అందించారు. -
అమెరికాలో ఘనంగా మహిళా దినోత్సవం
అమెరికా ప్రధాన నగరం న్యూయార్క్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా జరిగింది. న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం (నైటా) ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. శివరాత్రితో పాటు మహిళా దినోత్సవం రెండు వేడుకలను కలిపి నైటా సంబరాలను అద్వితీయంగా జరిపారు. న్యూయర్క్, న్యూజెర్సీతో పాటు పరిసర ప్రాంతాల్లో ఉన్న తెలుగువారందరూ పెద్ద సంఖ్యలో ఈ వేడుకల్లో పాల్గొన్నారు.ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మ్యూజికల్ కన్సర్ట్ అందరినీ అలరించింది. భక్త కన్నప్ప స్కిట్, టీ&టీ సిస్టర్స్ నృత్య ప్రదర్శన, ఘర్షణ బ్యాండ్, అంజనా సౌమ్య, సృష్టి చిల్లాల ఫెర్మార్మెన్స్లు ఆహుతులను ఆకట్టుకున్నాయి. చిన్నారులు ప్రదర్శించిన కళారూపాలు, వివిధ స్కిట్లు ఆహా అనిపించాయి. నైటా ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక, సామాజిక కార్యక్రమాల సమాహారంతో రూపొందించిన ప్రత్యేక నైటా సంబరాల సావనీర్-2026ను ప్రముఖ ఎన్ఆర్ఐ వ్యాపారవేత్త, వితరణశీలి డాక్టర్ పైళ్ల మల్లారెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. సంస్కృతీ సంప్రదాయాల కలబోతగా న్యూయార్క్ వేదికగా నైటా నిర్వహిస్తున్న కార్యక్రమాలను ప్రశంసిస్తూ ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, న్యూయార్క్ కాన్సులేట్ జనరల్ ప్రత్యేక సందేశాలు పంపారు. అమెరికాలో స్థిరపడినా పుట్టినప్రాంత పండగలు, సంప్రదాయాలను గౌరవిస్తూ కొనసాగిస్తున్నామని, వేడుకల విజయాన్ని ఆకాంక్షిస్తూ సహకరించిన అందరికీ నైటా అధ్యక్షుడు రవీందర్ కోడెల కృతజ్ఞతలు తెలిపారు.కార్యక్రమంలో నైటా వైస్ ప్రెసిడెంట్ హరిచరణ బొబ్బిలి, సెక్రటరీ మహేష్ బాబు, ట్రెజరర్ డాక్టర్ సౌమ్య శ్రీ, ఇతర కార్యకవర్గ సభ్యులు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, అడ్వయిజరీ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.(చదవండి: లండన్‌లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం) -
చాయ్‌వాలాగా ఐటీ ఉద్యోగి..!
ఐఐటీ విద్యార్థి చాయ్ అమ్ముతూ జీవనం సాగిస్తున్నాడు. అది కూడా అమెరికాలో. ఈ భారత సంతతి వ్యక్తి కథ నెట్టింట సెన్సేషన్‌గా మారింది. ఈ టెకీ కథ ప్రతి ఒక్కర్ని కదలించడమే కాదు, ఆలోచింపచేసేలా చేసింది. అతడే చాయ్‌వాలా లేదా చాయ్గుయ్గా ప్రసిద్ధి చెందిన ప్రభాకర్ ప్రసాద్. బిహార్ పాట్నా సమీపంలోని బార్ అనే చిన్న పట్టణానికి చెందిన ప్రభాకర్ ఈ ఫిబ్రవరి 2025లో టెక్ లేఆఫ్‌లు నేపథ్యంలో అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో చాయ్స్టాల్ని ప్రారంభించి ఒక్కో టీ కప్పుని రూ. 780లకు విక్రయిస్తున్న అతడి కథ నెట్టింట వైరల్ అవ్వడంతో..ఒక్కసారిగా అతడి బిజినెస్ కూడా లాభాసాటిగా పుంజుకోవడం విశేషం. ఎక్కడో బిహార్ నుంచి అగ్రరాజ్యం అమెరికాకు ఎలా వలస వచ్చాడంటే.. నిజానికి ప్రభాకర్ కుటుంబం కడు పేదరికంతో ఇక్కట్లు పడుతుండేది. కనీసం దుప్పట్లు కూడా కొనుక్కోలేని దారుణ పరిస్థితి. దాంతో వాళ్లు శీతాకాలం వచ్చిందంటే చాలు వెచ్చదనం కోసం పప్పుబస్తాల కింద నిద్రించేవారట. ప్రభాకర్ తండ్రి అనేక వ్యాపారాలు చేసినా..ఎందులోనే విజయం సాధించలేకపోయేవాడట. కానీ అతడి తల్లిదండ్రులు విద్య శక్తిని మాత్రం గట్టిగా విశ్వసించేవారట. ఇక ప్రభాకర్ చిన్నతనంలో బిహార్‌లోని ఓ హిందీ పాఠశాలలో చదువుకున్నాడు. అక్కడ ప్రభాకర్ క్లాస్ ఫస్ట్, లీడర్ కూడా. క్రికెట్ దగ్గర నుంచి పాటలు పాడటం వరకు అన్నింట్లోనూ మనోడే ఫస్ట్. అయితే తన సోదరుడు కిడ్నాప్‌కి గురవ్వడంతో తన జీవితం అనూహ్యమైన మలుపులు తిరిగిందని చెబుతున్నాడు. తన కుటుంబం అకస్మాత్తుగా బీహార్ వదిలి భోపాల్‌కు వెళ్లిపోయింది. ఆ మార్పుని తట్టుకోవడం చాలా కష్టంగా అనిపించింది ప్రభాకర్‌కి. భోపాల్‌లో తోటి విద్యార్థులంతా ఇంగ్లీస్‌లో అనర్గళంగా మాట్లాడంతో..తన ఆంగ్లయాసను చూసుకుని అంత నవ్వేవారంటూ నాటి ఘటనను గుర్తుచేసుకున్నాడు. బిహార్ బోర్డు స్కూల్ నుంచి ఇంగ్లీష్ సీబీఎస్ఈ స్కూల్ వరకు కనీసం ప్రాథమిక పదాలు అర్థమయ్యేవి కాదని చెప్పుకొచ్చాడు. అయితే కష్టపడి ఏదో రకంగా నేర్చుకున్నానని, అలా ఐఐటీ స్క్రీనింగ్ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యానని చెప్పుకొచ్చారు. ఐఐటీ అడ్మిషన్ తన జీవిత గమనాన్ని మార్చిందని చెబుతున్నాడు. ఐఐటీ పూర్తి అయిన వెంటనే 2008లో మొట్టమొదటి ఉద్యోగాన్నిపొందాను, అయితే టెక్ ప్రపంచం నాకెందుకో అంతగా నచ్చలేదు. కోడింగ్ నన్ను ఎప్పుడు ఉత్సాహపరచలేదని అంటున్నాడు. దాంతో అక్కడి కార్పొరేట్ ఒత్తిడి తట్టుకునేందుకు జిమ్‌లో గడుపుతుండేవాడినని, అలా బాడీబిల్డింగ్ తన అభిరుచిగా మారిందని అంటున్నాడు. దాంతో కొత్తగా వేరే ఏదైనా ప్రయత్నించాలనే ఉద్దేశ్యంతో ముంబైకి వెళ్లి మోడలింగ్ ఆడిషన్లకు వెళ్తుండేవాడినని చెప్పుకొచ్చాడు. అలా మోడలింగ్‌లో రాణించే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతుండగా అతడి స్నేహితురాలు అమెరికా వెళ్లిపోయింది. దాంతో ప్రభాకర్ కూడా అమెరికా వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. కానీ వీసా రెండుసార్లు తిరస్కరణకు గురైంది. చివరికి 2014లో మాత్రమే ఎంబిఏ చేయడానికి యూఎస్ వెళ్లగలిగానంటూ తన గతాన్ని గుర్తుచేసుకున్నాడు. అయితే అనుకున్నంత అందంగా అమెరికా జీవితం ఉండదు అని తెలుసుకోవడానికి ఎంతో కాలం పట్టలేదు. అక్కడ ఆరోగ్య సమస్యలు, పని ఇబ్బందులు తదితరాలన్నింటిని ఎదుర్కొన్నాడు. దాదాపు పదేళ్లు అమెరికాలో ఒక నగరం నుంచి మరొక నగరానికి తిరుగుతూనే ఉన్నానని, ఎన్నో కార్పొరేట్ ఉద్యోగాలు కూఆ చేశానని, అయితే తాను లేఆఫ్ వేటుకి గురయ్యానంటూ బాధగా చెప్పుకొచ్చాడు. ఇంతలో తన ఆరోగ్యం కూడా కుదుటపడింది. అయితే నా గమ్యం ఎటు వెళ్తుందో తెలియని ఈ అస్థిరతకు ఎలా చెక్ పెట్టాలా అని ఆలోచిస్తుండగా..ఒక స్నేహితుడి సూచన మేరకు చాయ్‌వాలాగా మారినట్లు చెప్పుకొచ్చాడు. తాను బిహారీ శైలి చాయ్ అమ్ముతూ ఓ వీడియోని నెట్టింట పోస్ట్ చేశాను. ఇది తన వ్యాపార ప్రచారంలో భాగంగా చేశానని, అనుకున్నట్లుగా చాలామందికి ఆ వీడియో చేరువై వ్యాపారం కూడా పుంజుకుందని అంటున్నాడు ప్రభాకర్. అయితే కార్పొరేట్ జాబ్‌లలో పనిచేస్తున్నప్పుడు చేతినిండా డబ్బు ఉంది..స్వేచ్ఛ, ఆనందం లేకుండా పోయాయి. కానీ ఇవాళ్ల తన వద్ద డబ్బు తక్కువగానే ఉంది, కానీ స్వేచ్ఛ ఆనందం చాలా గరిష్టస్థాయిలో ఉన్నాయని అంటున్నాడు. అంతేగాదు తన స్వంత ఇష్టానికి తానే యజమానిని అని చెబుతున్నాడు కూడా. తాను కార్పొరేట్ బానిసను కాదని ఆత్మవిశ్వాసంగా చెబుతున్నాడు. గౌరవంగా బతకాలనుకుంటే..ఎంత చిన్న ఉద్యోగమైనా.. మంచిదే..అదే స్వేచ్ఛ, ఆనందం నిల్ అయితే కోట్లు గడించే ఉద్యోగమైనా వేస్టే కదా అని ప్రభాకర్ గాథ చూస్తే తెలుస్తోంది కదూ..!.(చదవండి: ప్రసవానంతరం బరువు తగ్గాలంటే..! ఈ వర్కౌట్లు తప్పనిసరి..) -
లండన్‌లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం
లండన్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ‘‘సహకారం, స్నేహం, సిస్టర్హుడ్-మహిళల విజయానికి మూడు బలమైన స్థంభాలు.” అనే భావంతో యూకేలో నివసిస్తున్న తెలుగు మహిళలు “తెలుగు లేడీస్ యుకే” ఫేస్బుక్ గ్రూప్ ద్వారా కలుసుకుని ఘనంగా మహిళా దినోత్సవాన్ని జరుపుకున్నారు. మహిళా సాధికారత, పరస్పర సహకారం, సోదరీమణుల ఐక్యతకు ప్రతీకగా ఈ వేడుక నిలిచింది.సాయం కోరే వారికి, సహాయం అందించే వారికి వారధిగా నిలిచిన తెలుగు లేడీస్ ఇన్ యుకే గ్రూపున శ్రీదేవి మీనావల్లి 15 ఏళ్ల క్రితం స్థాపించారు. ప్రస్తుతం ఈ గ్రూపులో యూకేలో నివసిస్తున్న ఐదు వేలకుపైగా తెలుగు మహిళలు సభ్యులుగా ఉన్నారు. యూకేకు కొత్తగా వచ్చిన తెలుగు ఆడపడుచులకు ఆదరణగా నిలిచి, వారికి అవసరమైన సూచనలు, సలహాలు అందిస్తూ విద్య, వైద్యం, ఉద్యోగ రంగాలలో సహాయం చేయడం ఈ గ్రూప్ ప్రధాన ఆశయమని శ్రీదేవి తెలిపారు. మహిళలు ఒకరికొకరు అండగా నిలిచి ముందుకు సాగాలనే సంకల్పంతో ఈ వేదిక అనేకమందికి ధైర్యం, మార్గదర్శనం అందిస్తోంది.ఈ సంవత్సరం యూకేలోని పలు ప్రాంతాల నుండి 300కు పైగా తెలుగు మహిళలు పాల్గొని ఆటపాటలతో, ఫ్యాషన్ షో తో సందడి చేశారు. కార్యక్రమంలో నిర్వహించిన ఇన్స్పైరింగ్ స్టోరీస్ సెగ్మెంట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచి, మహిళలు తమ జీవిత ప్రయాణంలో ఎదురైన అనుభవాలు, విజయ కథలను పంచుకుని అందరికీ స్ఫూర్తినిచ్చారు. అలాగే ప్రముఖ బ్రాండ్స్‌తో జరిగిన ఫ్యాషన్ షో కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కార్యక్రమ ప్రాంగణంలో షాపింగ్ స్టాళ్లు సందర్శకులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో జ్యోతి సిరపు, లక్ష్మి చిరుమామిళ్ల, సువర్చల మాదిరెడ్డి, స్వాతి డోలా, స్వరూప పంతంగి, శిరీష టాటా, దీప్తి నాగేంద్ర, , సవిత గుంటుపల్లి, చరణి, జ్యోతి బాలుసు తదితరులు పాల్గొన్నారు. -
గత 23 ఏళ్లుగా రంజాన్ దీక్ష చేస్తున్న 56 ఏళ్ల ఎన్ఆర్ఐ
పవిత్ర రంజాన్ (Ramadan) మాసం వేళ మత సామరస్యానికి సంబంధించి అపురూపమైన విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. రంజాన్‌మాసం అంతా ముస్లిం సోదరులు ఉపవాస దీక్ష చేస్తారు ఇది అందరికీ తెలిసిందే. కానీ దుబాయ్‌లో 56 ఏళ్ల నాన్ ముస్లిం గత 23 ఏళ్లు ఉపవాస దీక్ష చేస్తుండటం విశేషంగా నిలుస్తోంది. 2002 నుండి సతీష్ కుమార్‌న దుబాయ్‌లో ఉంటున్నారు. స్వయంగా తాను హిందువు అయినప్పటికీ పవిత్ర రంజాన్ నెలలో ఉపవాసం పాటిస్తున్నారు. రంజాన్ అంటే మంచి పనులను పంచుకుంటూ, జీవించడం అంటే సమాజంతో ఐక్యంగా ఉండటం అంటారు సతీష్. తన చుట్టూ ఉన్న ప్రజల పట్ల గౌరవం ఉందని, వారిమీద ప్రేమతోనే ఈ దీక్ష చేస్తానని చెప్పుకొచ్చారు. గల్ఫ్ న్యూస్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో, కుమార్ రోజువారీ ఉపవాసం కేవలం శారీరక సవాలు మాత్రమే కాదు, ఆధ్యాత్మిక ప్రక్రియగా విశ్వసిస్తానని తెలిపారు. ఇది ఆహారం, పానీయం, పాప ప్రవర్తనకు దూరంగా ఉండటంతోపాటు స్వీయ-క్రమశిక్షణ, ఆధ్యాత్మిక శుద్ధిని పెంపొందించుకునే మార్గం ఇదని చెప్పారు.ఇదీ చదవండి: పరీక్షలకు వెళుతుండగా పిల్లల్ని కొట్టి చంపేశాడు.. సొంత బాబాయే!దీంతోపాటు, వారి రోజువారీ అవసరాలను తీర్చుకోవడానికి కష్టపడే వ్యక్తుల ఇబ్బందులను స్పష్టంగా అర్థం చేసుకోవడానికి చూడటానికి ఉపవాసం తనకు సహాయపడిందన్నారు. ఆకలిదప్పుల బాధను అనుభవించడం వల్ల పేదల దుస్థితిని అర్థం చేసు కోచ్చని, తద్వారా మనలో దాతృత్వం,కరుణ అనే భావం పెరుగుతుందని తెలిపారు. ఉపవాసంతో అనేక శారీరక, ఆధ్యాత్మిక ప్రయోజనాలున్నాయన్నారు. ముఖ్యంగా ఉపవాసంద్వారా జీర్ణవ్యవస్థకు విరామం ఇవ్వడం అంటే శారీరక ప్రయోజనాలను పొందమే అన్నారు. దీంతో మానసిక బలం పెరుగుతుంది, ఉత్పాదకత పెరుగుతుంది అనేది తన అనుభవంలో తెలిసిందన్నారు.ఇదీ చదవండి: ఎప్స్టీన్ ఫైల్స్ : మైనర్‌పై దారుణం, ట్రంప్‌కు మరో షాక్ -
కెనడాలో భారతీయ ఇన్ఫ్లుయెన్సర్ నాన్సీ దారుణ హత్య
కెనడాలో నివసిస్తున్న భారతీయ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ నాన్సీ గ్రేవాల్ (Nancy Grewal) దారుణ హత్యకు గురయ్యారు. కెనడాలోని లాసల్లె పోలీసులు ఈ హత్యను నిర్ధారించారు. దర్యాప్తు కొనసాగుతోంది. పంజాబీ మూలానికి చెందిన 45 ఏళ్ల నాన్సీ సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ పంజాబ్‌లో జరుగుతున్న పరిణామాలపై తన అభిప్రాయాలను, ముఖ్యంగా ఖలిస్తానీలను విమర్శిస్తూ పాపులర్ అయ్యారు. ప్రసిద్ధి చెందింది.ఈ హత్య కెనడాలోని భారతీయ వర్గాల్లోనూ, సోషల్ మీడియాలో ఆగ్రహాన్ని రేకెత్తించింది .ఘటన వివరాలు ఇలా ఉన్నాయి మార్చి 3, 2026, రాత్రి సుమారు 9:30 గంటల సమయంలో. కెనడాలోని లాసల్లే (LaSalle) నగరంలోని టాడ్ లేన్ (Todd Lane) ప్రాంతంలోని ఆమె నివాసంలో గుర్తు తెలియని వ్యక్తి ఆమెను కత్తితో పొడవడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను ఎసెక్స్-విండ్సర్ ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ ఆసుపత్రికి తరలించినప్పటికీ, చికిత్స పొందుతూ ఆమె మరణించారు.షల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. రాజకీయ అంశాలపై ఆమె చాలా నిర్మొహమాటంగా, కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడేవారు. సోషల్ మీడియా వేదికల ద్వారా పలు వివాదాస్పద అంశాలపై స్పందించేవారు. ముఖ్యంగా భారత్-కెనడా ఉద్రిక్తతల మధ్య ఖలిస్తానీ సానుభూతి పరులను ఆమె బహిరంగంగానే ఖండించేవారు. అకాలీదళ్ నాయకత్వంపై, ముఖ్యంగా బిక్రమ్ సింగ్ మజితియాపై ఆమె తరచుగా విమర్శలు చేసేవారు. అలాగే జైలులో ఉన్న ఎంపీ అమృత్‌పాల్ సింగ్, డేరా బియాస్ అధిపతి గురీందర్ సింగ్ ధిల్లాన్‌కు వ్యతిరేకంగా కూడా ఆమె మాట్లాడారు. దీంతోపాటు 2025 జూన్‌లో భటిండాలో అనుమానాస్పద స్థితిలో మరణించిన మరో ఇన్ఫ్లుయెన్సర్ కాంచన్ కుమారి (కమల్ కౌర్ భాభి) మరణంపై కూడా ఆమె గళమెత్తారు.(విజయ్ దేవరకొండ నయా ట్రెండ్ : డైమండ్ ఎమరాల్డ్ నెక్లెస్ స్పెషల్ ఎట్రాక్షన్)లాసల్లే పోలీసులు ఈ కేసును యాక్టివ్ ఇన్వెస్టిగేషన్‌గా పరిగణిస్తున్నారు. టాడ్ లేన్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు తమ ఇంటి వద్ద ఉన్న సీసీటీవీ దృశ్యాలను పోలీసులకు అందించి సహకరించాలని కోరారు. ప్రస్తుతానికి నిందితుడి ఆచూకీ ఇంకా లభించలేదు. ఎవరికైనా సమాచారం తెలిస్తే పోలీసులకు లేదా 'క్రైమ్ స్టాపర్స్'కు సమాచారం ఇవ్వాలని కోరారు. ఇదీ చదవండి: సంగీత్ వేడుకలో చిన్నారి స్టెప్పులు వైరల్, 82 లక్షల మంది ఫిదా! -
రణరక్కసి కోరల్లో ప్రవాసాంధ్రులు
రాజంపేట : పశ్చిమాసియాలో ఇరాన్–ఇజ్రాయల్ మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో అక్కడ గల్ఫ్ దేశాలకు ఉపాధి కోసం ఉమ్మడి కడప జిల్లా వాసులు లక్షలాదిమంది చిక్కుకుపోయారు. దీంతో ఆ కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. కువైట్, దుబాయ్, సౌదీ, బహ్రెయిన్, ఒమన్, ఖతార్ వంటి గల్ఫ్ దేశాల్లో ఉపాధి కోసం వెళ్లిన కడప జిల్లా వాసులు సుమారు రెండులక్షల మంది ఉన్నట్టు సమాచారం. ప్రవాసాంధ్రులు 12 లక్షల మంది ఉన్నట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.ఆయా దేశాల్లో యుద్ధం నేపథ్యంలో బాంబుల వర్షం కురుస్తుండడంతో వీరంతా బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా తమ పరిస్థితిని ఎప్పటికప్పుడు ఇక్కడ ఉన్న బంధువులకు చేరవేస్తున్నారు. జనావాసాల మధ్య క్షిపణులు, బాంబు దాడులు జరుగుతుండడంతో భయం గుప్పెట్లో బతుకుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గదులకే పరిమితం యుద్ధ వాతవరణం నేపథ్యంలో చాలామంది ప్రవాసాంధ్రులు (Telugu NRIs) స్వగ్రామాలకు తిరిగి వచ్చేందుకు సామగ్రితో విమానాశ్రయాలకు వెళ్లినా ఫలితం లేకపోయిందని సమాచారం. విమానాలు రద్దవడంతో ఏం చేయాలో పాలుపోక అక్కడే ఉండిపోయినట్టు తెలుస్తోంది. బాంబు దాడుల నేపథ్యంలో తమ గదులకే పరిమితమవుతున్నట్టు సమాచారం. అప్రమత్తంగా ఉండాలని అక్కడి భారత రాయబార కార్యాలయాల అధికారులు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్నట్లు తెలిసింది. ప్రవాస భారతీయుల కోసం.. ప్రవాస భారతీయుల కోసం భారత రాయబార శాఖ అధికారులు నిరంతరం శ్రమిస్తున్నారు. ఎప్పటికప్పుడు గల్ఫ్‌దేశాల్లో పరిస్ధితిని సమీక్షిస్తూ, బాధితులకు అవసరమైన సాయాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈమేరకు ఇప్పటికే వివిధ దేశాల్లో అత్యవసర హెల్ప్‌లైన్ (Helpline) నంబర్లను అధికారులు ప్రకటించారు. ఎవరైనా ఇబ్బందులు ఎదుర్కొటుంటే వెంటనే సంప్రందించాలని కూడా సూచించారు. చదవండి: భారతీయులను రప్పించే ప్రయత్నాలు షురూదోహాలో ఉన్న మా కుమార్తెను క్షేమంగా తీసుకురండి ప్రభుత్వానికి బాధితురాలి తల్లిదండ్రుల విజ్ఞప్తినరసన్నపేట: ఖతర్ రాజధాని దోహాలో తమ కుమార్తె బంకుపల్లి సంజనా చంద్ ఉందని, అక్కడ బాంబు దాడుల నేపథ్యంలో ప్రాణ భయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతోందని శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం సూరజ్ నగర్‌కు చెందిన బంకుపల్లి చంద్రశేఖర్, సుమబాల ఆందోళన వ్యక్తం చేశారు. తమ కుమార్తెను ఎలాగైనా స్వదేశానికి తీసుకురావాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దోహాలో తమ కుమార్తె సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తోందని పేర్కొన్నారు.జర్మనీ వెళ్తుండగా..బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న శ్రీకాకుళం జిల్లా సింగుపురానికి చెందిన వెంకటగౌతం కంపెనీ పనిపై జర్మనీ వెళ్తుండగా మధ్యలో ఖతార్ దేశ రాజధాని దోహాలో దిగి అక్కడ చిక్కుకుపోయాడు. -
లండన్‌లో అగ్ని ప్రమాదం.. తెలుగు రాష్ట్రాల్లో విషాదం
నిజమాబాద్ జిల్లా: లండన్‌లో జరిగిన అగ్ని ప్రమాదం ఇద్దరు తెలుగు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఈ నెల 23న దక్షిణ లండన్‌లోని క్రోయ్డన్ప్రాంతంలో ఉన్న రెండంతస్తుల భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భవనం అంతా మంటలు, దట్టమైన పొగ వ్యాపించడంతో అందులో నివసిస్తున్న ముగ్గురు తెలుగు విద్యార్థులు ప్రమాదంలో చిక్కుకున్నారు.ఈ ఘటనలో పెద్దాపురం (కాకినాడ జిల్లా)కు చెందిన గంటి అభిషేక్ అక్కడికక్కడే సజీవదహనమయ్యాడు. నిజమాబాద్ జిల్లాకు చెందిన సాయి శ్రీకర్ తీవ్రంగా గాయపడ్డాడు. మరో యువకుడు గాయాలతో బయటపడ్డాడు. తీవ్ర గాయాలపాలైన శ్రీకర్‌ను అత్యవసర సిబ్బంది ఆసుపత్రికి తరలించగా, వైద్యులు అతడిని బ్రెయిన్ డెడ్‌గా నిర్ధారించారు. మూడు రోజుల పాటు మృత్యువుతో పోరాడిన శ్రీకర్ శుక్రవారం మృతి చెందాడు. మరో యువకుడు ప్రస్తుతం చికిత్స పొందుతున్నట్లు సమాచారం.ముగ్గురు యువకులు ఉన్నత విద్యాభ్యాసం కోసం లండన్‌కు వెళ్లి, చదువు పూర్తి చేసి ఉద్యోగాల్లో చేరినట్లు తెలిసింది. క్రోయ్డన్ ప్రాంతంలోని అద్దె ఇంట్లో కలిసి నివసిస్తున్న సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. శ్రీకర్ మృతితో నిజామాబాద్‌లోని శ్రీనగర్ కాలనీలో విషాద వాతావరణం నెలకొంది. తమ బిడ్డ మృతదేహాన్ని వీలైనంత త్వరగా స్వదేశానికి తరలించేందుకు సహకరించాలని ఆయన తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. -
విమాన ప్రయాణికులకు ఊరట
విమాన ప్రయాణికుల కోరికను నెరవేరుస్తూ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై విమాన టికెట్ బుక్ చేసుకున్న 48 గంటల లోపు ఎటువంటి అదనపు ఛార్జీలు లేకుండా టికెట్‌ను రద్దు చేసుకోవడానికి లేదా మార్పులు చేసుకోవడానికి వీలు కల్పిస్తూ ‘లుక్-ఇన్ ఆప్షన్’ను తప్పనిసరి చేస్తూ కొత్త సివిల్ ఏవియేషన్ రిక్వైర్మెంట్ (సీఏఆర్)ను జారీ చేసింది.ఎందుకీ నిర్ణయం?గత కొంతకాలంగా విమానయాన సంస్థల కఠినమైన విధానాలు, టికెట్ రద్దు చేసినప్పుడు రిఫండ్ ఇవ్వడంలో జరుగుతున్న జాప్యంపై ప్రయాణికుల నుంచి భారీగా ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో ప్రయాణికుల హక్కులను కాపాడేందుకు డీజీసీఏ ఈ నిబంధనలను రూపొందించింది. నవంబర్ 2025లోనే ఈ ప్రతిపాదనలపై ప్రాథమిక నివేదికలు వచ్చినప్పటికీ ఇప్పుడు ఇది అధికారికంగా అమలులోకి రానుంది.‘లుక్-ఇన్’ సదుపాయంఈ కొత్త నిబంధన ప్రకారం ప్రయాణికులు టికెట్ బుక్ చేసిన 48 గంటల లోపు రద్దు చేసుకుంటే ఎటువంటి క్యాన్సిలేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.ప్రయాణ తేదీ లేదా సమయాన్ని మార్చుకోవాలనుకుంటే ఎయిర్‌లైన్స్ ఎటువంటి అదనపు సవరణ ఛార్జీలు వసూలు చేయవు.అయితే, కొత్తగా ఎంచుకున్న విమాన టికెట్ ధరలో వ్యత్యాసం ఉంటే మాత్రం ప్రయాణికుడే భరించాల్సి ఉంటుంది.డొమెస్టిక్ ఫ్లైట్స్ పరంగా ప్రయాణ తేదీకి కనీసం ఏడు రోజుల ముందు టికెట్ బుక్ చేసుకున్న వారికి మాత్రమే ఈ సదుపాయం వర్తిస్తుంది.ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ పరంగా ప్రయాణానికి కనీసం 15 రోజుల ముందు బుకింగ్ చేసుకున్న వారికి ఇది వర్తిస్తుంది.ఈ సౌకర్యం ప్రస్తుతం నేరుగా ఎయిర్‌లైన్ వెబ్సైట్ల ద్వారా బుక్ చేసుకున్న టికెట్లకే అమలవుతుంది.రిఫండ్ ప్రక్రియపై గడువుకేవలం రద్దు సదుపాయమే కాకుండా ప్రయాణికులకు రావాల్సిన నగదును తిరిగి చెల్లించే విషయంలో కూడా డీజీసీఏ కఠినమైన కాలపరిమితిని నిర్ణయించింది. విమానయాన సంస్థలు ప్రయాణికుల ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని, రిఫండ్ ప్రక్రియలో పారదర్శకత పాటించాలని ఈ కొత్త సీఏఆర్ స్పష్టం చేస్తోంది. విమాన ప్రయాణికులు తమ ప్రయాణ ప్రణాళికల్లో అనివార్య కారణాల వల్ల మార్పులు చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఈ నిర్ణయం ఉపశమనం కలిగించనుంది.ఇదీ చదవండి: షాపింగ్ బిల్లుకు నో ఫోన్‌నెంబర్! -
ఇంట్లో అగ్నిప్రమాదం.. లండన్‌లో ఆంధ్రప్రదేశ్ యువకుడు మృతి
లండన్: ఇంగ్లాండ్‌లో విషాదం చోటు చేసుకుంది. ఇంట్లో జరిగిన అగ్నిప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన గంటి అభిషేక్ (26) ప్రాణాలు కోల్పోయాడు. కాకినాడ జిల్లా పెద్దాపురం పట్టణానికి చెందిన అభిషేక్, ఉన్నత విద్య కోసం 2023లో లండన్‌కి వెళ్లాడు. ఎంబీఏ పూర్తి చేసి అక్కడే ఒక సంస్థలో ఉద్యోగం పొందాడు.ఈ క్రమంలో దక్షిణ లండన్‌లోని క్రోయ్డన్ ప్రాంతంలో ఆయన నివసిస్తున్న ఇంట్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఆ సమయంలో ఇంట్లో ఉన్న మరో ఇద్దరు బయటకు తప్పించుకోగలిగారు. అయితే, అభిషేక్ మాత్రం బయటకు రాలేకపోయాడు. కమ్ముకున్న పొగ కారణంగా ఊపిరాడక మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.ఈ అగ్నిప్రమాదంలో రెండు అంతస్తుల భవనం తీవ్రంగా దెబ్బతింది. కిటికీలు, గోడలు పూర్తిగా కాలిపోయాయి. ప్రమాదం నుంచి బయటపడిన వారిలో ఒకరు ప్రస్తుతం లండన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉందని సమాచారం. ఈ ఘటనపై స్థానిక పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది. భిషేక్ మృతి వార్త స్వగ్రామంలో తీవ్ర విషాదాన్ని కలిగించింది. పెద్దాపురం ప్రాంతంలో ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. చదువులో ప్రతిభావంతుడైన అభిషేక్, ఎంబీఏ పూర్తి చేసి మంచి కెరీర్ అవకాశాలు పొందాలని కలలు కనేవాడు. కానీ ఈ అగ్నిప్రమాదం ఆ కలలను మధ్యలోనే చిదిమేసింది. -
కన్నబిడ్డను హతమార్చిన వైద్యురాలు, 911 కాల్ రికార్డు సంచలనం
భారతీయ సంతతికి చెందిన వైద్యురాలు డాక్టర్ నేహా గుప్తా కన్నకూతుర్నే హతమార్చి ఏమీ తెలియ నట్టుగా 911 కాల్ చేసింది. ఒక్లహోమాకు చెందిన పిల్లల వైద్యురాలు కాల్ రికార్డును దర్యాప్తు అధికారులు తాజాగా విడుదల చేశారు. అలాగే 2025 జూన్‌లో జరిగిన సంఘటనను వివరించేందుకు గాను నిందితురాల్ని తాజాగా విడుదల చేసినట్లు అమెరికా అధికారులు తెలిపారు. ఫ్లోరిడాలోని స్వల్పకాలిక అద్దె ఇంటిలోని తన నాలుగేళ్ల కుమార్తెను కొలనులో ముంచి చంపినట్లు పై అభియోగం మోపబడిన నెలల తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది. ఏం జరిగిందంటే..ఒక్లహోమాకు చెందిన 36 ఏళ్ల నేహా గుప్తా పిల్లల డాక్టర్. వైద్యుడైన భర్త సౌరభ్ నుంచి ఆమె విడిపోయింది. నాలుగేళ్ల కుమార్తె అరియా ప్రస్తుతం తల్లి వద్ద ఉంటున్నది. ఆ బాలిక కస్టడీ వివాదం కోర్టులో ఉంగానే నాలుగేళ్ల అరియా కన్నుమూయడం విషాదాన్నినింపింది. కుమార్తె అరియాతో కలిసి నేహా గుప్తా ఫ్లోరిడాకు వెళ్లింది. అక్కడ తాత్కాలిక అద్దె ఇంట్లో బస చేసింది. అయితే అక్కడి నీటి కొలనులో పడి అరియా మునిగినట్లు పోలీసులకు సమాచారం అందించింది. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ చిన్నారిని హాస్పిటల్‌కు తరలించారు. ఆ బాలిక అప్పటికే మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు.పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో అసలు విషయం తెలియడంతో ఆమెను అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు.పోస్ట్‌మార్టం నివేదికశవపరీక్షలో బాలిక ఊపిరితిత్తులలో లేదా కడుపులో నీరు కనిపించలేదు. ఆమెను ఊపిరి ఆడకుండా చేసి హత్య చేసి, ఆ తరువాతే ఆమెను కొలనులో వేసినట్టు నిర్ధారించారు. సంఘటన జరిగిన సమయంలో, ఆరియా తలతి తండ్రి పూర్తి కస్టడీని కోరుతూ ఆందోళన వ్యక్తం చేశారు. గుప్తా మానసిక స్థితి గురించి. తన కుమార్తెను ఫ్లోరిడాకు తీసుకెళ్లారని తనకు తెలియదని వాపోయాడు.🇺🇸 📹 PEDIATRA ACUSADA POR MUERTE DE SU HIJA EN PISCINA Las cámaras de seguridad captaron a la madre y la niña en la vivienda de alquiler antes del hallazgo en la piscina. ¿Noticias y tendencias? ¡Sigue @ULTIMAHORAENX para MAS!🔔 Neha Gupta pediatra de Oklahoma… pic.twitter.com/ol8cVhh9BR— ⓍULTIMAHORAENX (@ULTIMAHORAENX) February 26, 2026911 రికార్డింగ్ వివరాలు"మేము నిద్రపోతున్నాము, నాకు ఏదో శబ్దం వినిపించింది ఆమె కొలనులో ఉంది, ఆమెను కాపాడటానికిప్రయత్నించాను, కానీ నాకు ఈత రాదు" అని అధికారులు విడుదల చేసినమె చెప్పినట్లు వినబడుతుంది. "నేను ఆమెను బయటకు తీసుకురావడానికి ప్రయత్నించాను." అని ఆమె డిస్పాచర్తో చెప్పింది.ఆ అమ్మాయిని బయటకు తీసుకురావడానికి ఇంకెవరైనా ఉన్నారా అని అడిగినప్పుడు, గుప్తా, "లేదు, ఇక్కడ మేమిద్దరం మాత్రమే ఉన్నాము... నేనే... ఆమెను బయటకు తీసుకురావడానికి నా వంతు ప్రయత్నం చేసాను" అని తెలిపింది. ఆ అమ్మాయి మేల్కొని ఉందా అని డిస్పాచర్ ఆమెను అడిగారు., గుప్తా, "లేదు, ఆమె కొలను అడుగున ఉంది... కదలడం లేదు" అని చెప్పింది.ఆ తర్వాత గుప్తా తన కూతురిని కొలను నుండి బయటకు లాగడానికి ప్రయత్నించమని అడిగాడు. అప్పుడు మీరు ఎప్పటికీ చేరుకుంటారని ఆమె డిస్పాచర్ను అడిగింది. "వారు దారిలో ఉన్నారు, కానీ మీరు ఆమెకు సహాయం చేయడానికి ప్రయత్నించాలి, ఆమెను బయటకు తీసుకురావడానికి మీరు ఏదైనా మార్గాన్ని కనుగొనాలి" అని డిస్పాచర్ ఆమెకు చెప్పారు.ఆ తర్వాత డిస్పాచర్ ఆమెను కొలను ఎంత లోతు ఉంటుంది లాంటి వివరాలు అడిగాడు. ""తొమ్మిది అడుగులు ఉందని నేను అనుకుంటున్నాను, ఎంత లోతు ఉందో నాకు తెలియదు," అని గుప్తా చెప్పింది. "సరే, మీరు ఆమెను బయటకు తీసుకురావడానికి ప్రయత్నించాలి, మేడమ్," అని డిస్పాచర్ మళ్ళీ చెప్పినపుడు నేను ప్రయత్నిస్తున్నాను," అని సమాధాన మిచ్చింది. కొన్ని క్షణాల తర్వాత, పోలీసు అధికారులు వచ్చినప్పుడు, గుప్తా వారి కోసం తలుపు తెరిచింది. అప్పుడు అధికారులు తన కుమార్తెను నీటిలో నుండి బయటకు తీశారు.మరోవైపు ఆరియా మరణం ప్రమాదవశాత్తు జరిగిందేనని గుప్తా, ఆమె న్యాయవాదులు వాదిస్తున్నారు. ఆమె మే నెలలో తిరిగి కోర్టులో హాజరు కావాల్సి ఉంటుంది.ఇదీ చదవండి: ప్రెగ్నెంట్ మహిళ,ముగ్గురు కుమార్తెల హత్య , పరారీలో భర్త -
‘లక్ష్మి’ వినియోగదారుడికి లెక్సస్ కారు గిఫ్ట్
అమెరికాలోని దక్షిణాసియా కమ్యునిటీకి ఎఫ్ఎంసీజీ విభాగంలో సర్వీసులందిస్తున్న హెచ్ఓఎస్ గ్లోబల్ ఫుడ్స్ తమ ఫ్లాగ్షిప్ బ్రాండ్ ‘లక్ష్మి’ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘గ్రాబ్ మోర్, విన్ మోర్’ దీపావళి ఆఫర్ విజేతను ప్రకటించింది. ఈ ఆఫర్‌ను గతేడాది దీపావళికి ప్రవేశపెట్టారు. తాజాగా విజేతను ప్రకటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పోటీలో న్యూజెర్సీకి చెందిన ప్రవాస భారతీయుడు ఉదయకుమార్ బాలతాండాయుధం విజేతగా నిలిచారు. ఇందులో భాగంగా లెక్సస్ ఆర్ఎక్స్ 350 కారు(సుమారు రూ.80 లక్షలు)ను సొంతం చేసుకున్నారు. యూఎస్‌లోని బ్రిడ్జ్‌వాటర్ ప్రాంతంలో ఉన్న లెక్సస్ షోరూమ్‌లో జరిగిన కార్యక్రమంలో ‘లక్ష్మి’ బ్రాండ్ ప్రతినిధుల సమక్షంలో ఉదయకుమార్ కుటుంబానికి కారు తాళాలను అందజేశారు.ఈ సందర్భంగా హెచ్ఓఎస్ గ్లోబల్ ఫుడ్స్ సీఈఓ నీల్ సోనీ మాట్లాడుతూ.. ‘చాలా కుటుంబాల్లో తమ సంప్రదాయాలు, రుచుల పట్ల మాకున్న అంకితభావానికి ఈ బహుమతి నిదర్శనం. ప్రామాణిక ఆహారం, రుచి ద్వారా కుటుంబ సంస్కృతిని సజీవంగా ఉంచాలని కోరుకుంటున్నాం’ అని పేర్కొన్నారు. కంపెనీ సీఓఓ అమ్రపాలి సోనీ మాట్లాడుతూ ‘గత 50 ఏళ్లుగా లక్ష్మి బ్రాండ్ ప్రవాస భారతీయుల ఇళ్లలో భాగమైంది. సొంత ప్రాంతాలకు దూరంగా ఉన్నవారికి స్వదేశీ రుచులను అందిస్తున్నందుకు గర్విస్తున్నాం’ అని తెలిపారు.కారు తాళాలు అందుకున్న అనంతరం విజేత ఉదయకుమార్ తన సంతోషాన్ని పంచుకుంటూ.. ‘మేము గెలిచామంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. ఏళ్ల తరబడి మా ఇంట్లో లక్ష్మి ఉత్పత్తులు వాడుతున్నాం’ అని ఉద్వేగానికి లోనయ్యారు. అమెరికాలో దక్షిణాసియా కమ్యూనిటీకి నాణ్యమైన, స్వచ్ఛమైన ఆహార ఉత్పత్తులను అందించడంలో ‘లక్ష్మి’ ప్రముఖంగా నిలుస్తోందని అధికారులు చెప్పారు.ఇదీ చదవండి: స్వల్పంగా తగ్గిన పసిడి ధర.. వెండి మాత్రం.. -
వాషింగ్టన్ డీసీలో శంకర నేత్రాలయ నిధుల సేకణ కార్యక్రమం
గతేడాది డిసెంబర్ 6. 2025న వాషింగ్టన్ డి.సి. మెట్రో ప్రాంతంలో నిర్వహించిన శంకర నేత్రాలయ (SN) నిధుల సేకరణ కార్యక్రమం విశేష విజయాన్ని సాధించింది. ఈ కార్యక్రమం ద్వారా ప్రతిష్టాత్మక నేత్ర వైద్య సంస్థ కోసం మొత్తం $150,000 నిధులు సమీకరించారు. సంస్కృతి,కరుణను ప్రతిబింబించే ఈ వేడుకకు చాప్టర్ వైస్ ప్రెసిడెంట్ రమణ రెడ్డి మడ్డికుంట CapEx సభ్యుడు తిరుమల రెడ్డి మునుకుంట్ల నాయకత్వం వహించారు.ఆ సాయంత్రం థీమ్ కరుణ ప్రతిధ్వనులు: కళ హృదయాన్ని కలిసే స్థలం (Echoes of Compassion: Where Art Meets Heart)గా నిర్వహించబడింది. శాస్త్రీయ మరియు సాంప్రదాయ నృత్య కళలతో సేవా భావాన్ని మేళవిస్తూ ఈ కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. స్థానిక అకాడమీలు పాల్గొని యువ వయోజన నర్తకుల అద్భుత ప్రదర్శనలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. సాంస్కృతిక బృంద సభ్యురాలు లక్ష్మి బాబు సమన్వయంతో నృత్య ప్రదర్శనలు అత్యంత కన్నులపండుగగా నిర్వహించారుఈ వేడుకకు గౌరవ అతిథిగా ఎస్. వి. ఆచార్య గారు హాజరై తమ ప్రోత్సాహకర సందేశంతో కార్యక్రమానికి మరింత గౌరవాన్ని చేకూర్చారు. అలాగే 11 మంది MESU స్పాన్సర్ల మద్దతు ఈ కార్యక్రమ విజయానికి కీలకమైంది.ఉదార హృదయంతో సహకరించిన MESU స్పాన్సర్లు:సెల్వ, ప్రతిభ జయరామన్, భువనేశ్ బూజాల, భానుమతి రామకృష్ణ, శ్రవణ్ పడూరు, కృష్ణకాంత్ కుచ్చలకంటి, ప్రవీణ్ పాల్‌రెడ్డి, రఘు పాల్‌రెడ్డి, వెంకట్ దోమా, తిరుమల మునుకుంట్ల, రఘు జువ్వాది గారు. వీరి ఆర్థిక కార్యనిర్వహణ సహకారం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసింది.ఇంకా SNUSA నేషనల్ మరియు డి.సి. మెట్రో చాప్టర్ సభ్యులు విశేషంగా సహకరించారు. ముఖ్యంగా శ్రీమతి నీలిమ గడ్డమనుగు, కృష్ణ రాజ్ భట్, సౌమ్య నారాయణన్, డి.సి. చాప్టర్ నాయకులు — బాలాజీ రాధాకృష్ణన్, హరిత రెడ్డి, అర్జున్ కామిసెట్టి, దిలీరాజ్ చాంతివేలు, రూపేష్ చిన్నకంపల్లి, కార్తిక్ గౌడ్ తదితరుల కృషి ప్రశంసనీయం.SNUSA అధ్యక్షుడు బాలా రెడ్డి ఇందుర్తి గారి నాయకత్వం తోపాటు బోర్డు ఆఫ్ ట్రస్టీస్ సభ్యుల మార్గదర్శకత్వం ఈ విజయానికి బలమైన ఆధారంగా నిలిచాయి. ట్రెజరర్ మూర్తి రేకపల్లి గారు లాజిస్టిక్స్ నిర్వహణలో విశేష కృషి చేయగా, మీడియా సహకారం అందించిన శ్రీగిరి కోటగిరి సేవలు అభినందనీయం. కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యాయులు, విద్యార్థులు, యువ వాలంటీర్లు, మీడియా,ఫోటోగ్రఫీ బృంద సభ్యులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. మాస్టర్ ఆఫ్ సెరిమనీగా వ్యవహరించిన శ్రియా బాబు తన చక్కని వ్యాఖ్యానంతో కార్యక్రమాన్ని చురుకుగా, సమర్థవంతంగా ముందుకు నడిపించారు.ఈ కార్యక్రమంలో సమీకరించిన నిధులు శంకర నేత్రాలయ లక్ష్యమైన అవసరమైన వారికి నాణ్యమైన నేత్ర వైద్య సేవలు అందించేందుకు వినియోగించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమం ముగిసే సమయానికి సేవా భావం, ఐక్యత, సామాజిక బాధ్యత స్పష్టంగా ప్రతిఫలించాయి. ఈ వేడుక కేవలం కళలు, సంస్కృతిని మాత్రమే కాకుండా, సమాజానికి తిరిగి ఇవ్వాల్సిన బాధ్యతను ప్రతి ఒక్కరి హృదయంలో మరింత బలంగా నాటింది.(చదవండి: అమెరికాలో రూ. 2 కోట్లుపైనే వేతనం..! ఐనా..) -
కడు పేదరికం నుంచి మేయర్ రేసు దాకా, ఎవరీ నిత్య రామన్
న్యూయార్క్ మేయర్‌గా భారత సంతతికి చెందిన జోహ్రాన్ మమ్దానీ రికార్డు సృష్టించగా, ఇపుడు భారత్‌కు చెందిన నిత్య రామన్ (Nithya Raman) లాస్ ఏంజిల్స్ మేయర్ రేసులో నిలిచారు. మమ్దానీ తరహాలోనే ప్రచారంలో దూసుకుపోతున్నారు. 2026 లాస్ ఏంజిల్స్ మేయర్ రేసులో ప్రముఖంగా నిలుస్తున్న నిత్య రామన్ ఎవరు? ఆ వివరాలు మీకోసం.లాస్ ఏంజిల్స్ నగర రాజకీయాల్లో ప్రస్తుతం నిత్య రామన్ పేరు మారుమోగుతోంది. భారతీయ సంతతికి చెందిన నిత్య లాస్ ఏంజిల్స్ నగర పాలక మండలి సభ్యురాలు. ప్రస్తుతం మేయర్ పదవికి పోటీ పడుతున్నారు. కేరళలోజన్మించారు నిత్య రామన్. ఢిల్లీ , చెన్నైలలో తీవ్ర పేదరికాన్ని ఎదుర్కొంటూ, నీరు, ప్లంబింగ్ , ఆశ్రయం వంటి ప్రాథమిక అవసరాల కష్టాలు పడింది. ఆమెకు ఆరేళ్ల వయసులోనే నిత్య కుటుంబం, అమెరికాకు వలస వెళ్లింది. 44 ఏళ్ల నిత్య ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుండి పొలిటికల్ థియరీలో డిగ్రీ, MIT నుండి అర్బన్ ప్లానింగ్‌లో మాస్టర్స్ పూర్తి చేశారు.ఇదీ చదవండి: సినీ ఫక్కీలో మైనర్ల దాడి, ఫుటేజ్ సోషల్ మీడియాలో పోస్ట్రాజకీయాల్లోకిరాకముందు ఆమె అర్బన్ ప్లానర్ (నగర ప్రణాళికా నిపుణురాలు) గా పని చేశారు. 2020లో లాస్ ఏంజిల్స్ సిటీ కౌన్సిల్ (డిస్ట్రిక్ట్ 4)కు ఎన్నికై చరిత్ర సృష్టించారు. లాస్ ఏంజిల్స్సిటీ కౌన్సిల్‌కు ఎన్నికైన మొదటి దక్షిణాసియా మహిళగా ఆమె రికార్డు సృష్టించారు.కరెన్ బాస్‌కు గట్టి పోటీప్రస్తుత మేయర్ కరెన్ బాస్ (Karen Bass)కు వ్యతిరేకంగా ఆమె రంగంలోకి దిగడం అమెరికా రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. తన ఎన్నికల ప్రచారంలో "లాస్ ఏంజిల్స్ ఒక కీలక దశలో ఉంది, మార్పు అత్యవసరం" అని పిలుపుతో నిత్య ముందు కెళుతున్నారు. ప్రధానంగా నివాస గృహాల కొరత, నిరాశ్రయుల సమస్య పరిష్కారంపై దృష్టి పెట్టారు. నగరంలో అందరికీ అందుబాటులో ఉండే ఇళ్లను అందించాలని ఆమె పోరాడుతున్నారు. పర్యావరణ మార్పులపై ఆమె చేస్తున్న కృషికి గాను 'సియెర్రా క్లబ్' వంటి సంస్థల నుండి అవార్డులు అందుకున్నారు. భారతదేశంలోని మురికివాడల్లో మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం కూడా ఆమె కృషి చేశారు. ఇదీ చదవండి: ద్వారకలో నెమలి ఫించంతో అరుదైన చేప, నెటిజన్లు ఫిదా! -
అమెరికా కోడలు.. మూడు రోజుల పెళ్లి!
చిత్తూరు రూరల్ (కాణిపాకం): పిల్లల చదువుల కోసం ప్రభుత్వ ఉద్యోగాలను సైతం వదులుకుని అమెరికా వెళ్లిన ఓ పూజారి కుటుంబం అక్కడే స్థిరపడినాం తమ మూలాలను మాత్రం మరువలేదు. ఎంఎస్ పూర్తి చేసిన తన కుమారుడికి అమెరికా దేశానికి చెందిన యువతిని కోడలుగా చేసుకున్న ఆ కుటుంబం, పెళ్లి వేడుకను మాత్రం అచ్చం తెలుగు సంప్రదాయంలో ఘనంగా నిర్వహించింది. చిత్తూరులోని మామిడి రిసార్ట్‌లో మూడు రోజుల పాటు మంగళ వాయిద్యాల నడుమ పెళ్లి వేడుక జరిగింది.సంగీత్, హల్దీ, మెహందీ కార్యక్రమాలు ఉత్సాహంగా సాగగాం.. ఇరు కుటుంబాల పెద్దలు సంప్రదాయ నృత్యాలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. దేశ విదేశాల నుంచి బంధువులు, స్నేహితులు తరలివచ్చారు. అమెరికా కోడలు తెలుగు ఆచారాలను ఆచరించడం అక్కడికి వచ్చిన వారిని ఆశ్చర్యపరిచింది. విదేశాల్లో పెరిగిన యువతీ, యువకులు సైతం తెలుగు సంస్కృతిని గౌరవిస్తూ మూడు రోజుల పెళ్లి జరపడం అందరికీ ఆదర్శంగా నిలిచింది. -
అమెరికా డ్రీమ్ Vs రియాలిటీ
అమెరికాలో మాస్టర్స్ డిగ్రీ (ఎంఎస్) చేస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, డాలర్లలో జీతం పొందుతూ స్థిరపడొచ్చని భావించే భారతీయ విద్యార్థుల కలలకు ప్రస్తుత మార్కెట్ పరిస్థితులు సవాలు విసురుతున్నాయి. వీసా ఆంక్షలు, ఆర్థిక మందగమనం నేపథ్యంలో అమెరికాలో ఉంటున్న ఐటీ నిపుణులు అక్కడ ఉండలేక.. అక్కడి నుంచి రాలేక.. సతమతమవుతున్నారు. తాజాగా ఒక భారతీయ టెక్కీ సోషల్ మీడియా వేదికగా పంచుకున్న అంశం నెట్టింట చర్చనీయాంశమైంది.అవమానకరమైన ఆఫర్కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ పూర్తి చేసి ఒక ఎంఎన్సీ సంస్థలో ఆరు నెలల పాటు ఇంటర్న్‌గా పనిచేసిన ఒక భారతీయ నిపుణుడు తన ఆవేదనను రెడ్డిట్‌లో పంచుకున్నారు. అజూర్, ఎస్‌క్యూఎల్ వంటి కీలక టెక్నాలజీలపై పని చేసినప్పటికీ కంపెనీ ఇచ్చిన ఫుల్ టైం ఆఫర్ ఆ విద్యార్థిని విస్మయానికి గురిచేసింది.ప్రస్తుత ఇంటర్న్‌షిప్ స్టైపెండ్ కంటే గంటకు కేవలం మూడు డాలర్లు (సుమారు రూ.250) మాత్రమే పెంచుతామని కంపెనీ ప్రతిపాదించింది. సదరు కంపెనీ హెచ్1బీ వీసా స్పాన్సర్షిప్ ఇవ్వడానికి నిరాకరించింది. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజినీర్ కావాలని లక్ష్యంగా పెట్టుకున్న ఆ అభ్యర్థికి ‘బిజినెస్ ఆటోమేషన్ అనలిస్ట్’ అనే రోల్‌ను ఆఫర్ చేశారు. ఇది భవిష్యత్తులో కెరీర్ వృద్ధిని దెబ్బతీస్తుందని ఆ టెక్కీ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘ఎంఎస్ డిగ్రీ ఉన్న వ్యక్తికి గంటకు మూడు డాలర్లు పెంచడం అంటే అది నైపుణ్యాన్ని అవమానించడమే. ఇక్కడ ఉండటం వృధా అనిపిస్తోంది. భారతదేశానికి తిరిగి వెళ్లిపోవాలని ఉంది’ అని ఆ నిపుణుడు పేర్కొన్నారు.నెటిజన్ల భిన్నాభిప్రాయాలుఈ పోస్ట్‌పై స్పందించిన నెటిజన్లు ప్రస్తుత పరిస్థితుల్లో ఆచితూచి అడుగు వేయాలని సూచిస్తున్నారు. ‘ప్రస్తుతం మార్కెట్ చాలా దారుణంగా ఉంది. 20 ఏళ్ల అనుభవం ఉన్నవారికే కాల్స్ రావడం లేదు. కాబట్టి చేతిలో ఉన్న ఉద్యోగాన్ని వదులుకోవద్దు’ అని కొందరు కామెంట్ చేస్తున్నారు. ‘జీతం కంటే అమెరికాలో చట్టబద్ధంగా ఉండటానికి ఉపాధి ముఖ్యం. ఉద్యోగాన్ని కాపాడుకోవడంపై దృష్టి పెట్టాలి’ అని ఇంకొందరు చెబుతున్నారు. ‘స్వదేశానికి వెళ్లడం మంచిదే కానీ, అక్కడ కూడా పోటీ తీవ్రంగా ఉందని గుర్తించాలి. ఏదైనా ఆఫర్ చేతిలో ఉన్నప్పుడే నిర్ణయం తీసుకోవడం ఉత్తమం’ అని కొందరు సలహా ఇస్తున్నారు.ఇదీ చదవండి: ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు ప్రశ్నలు -
అమెరికా తెలుగువారి ఆత్మీయుడు
ఫిబ్రవరి 7వ తేదీన వేలూరి వేంకటేశ్వరరావు అమెరికాలోని ఫీనిక్స్ నగరంలో చనిపోయారు. దాదాపు 40 ఏళ్ళకుపైగా కలిసి ఉండిన తెలుగు సాహితీ ప్రియులకు ముఖ్యంగా అమెరికాలో ఉన్నవారికి ఓ పెద్దదిక్కు, ఓ గురుతుల్యుడు, ఓ ఆప్తుడు, ఓ అల్లరి మాటకారి దూరమయ్యారు. ఓ నిలువెత్తు సాహిత్య విగ్రహం, ప్రచురణలో లేని సాహిత్య కథనాలు, సుదీర్ఘ ప్రయాణ ముచ్చట్లు, అపరిమిత జిజ్ఞాస, ఇంకా మరెన్నో ఆయనతో పాటు నిష్క్రమించాయి. వేలూరి గారంటే...లింక్డిన్లో చూస్తే ఈయన ఓ చికాగో యూనివర్సిటీలో 25 ఏళ్ళు పని చేసిన భౌతిక శాస్త్రవేత్త అని తెలుసుకోవచ్చు. 1971లో అటామిక్, మాలిక్యులర్ విభాగంలో చేసిన పరిశోధనతో డాక్టరేట్ చేశారని తెలుసుకోవచ్చు. విశాఖపట్టణంలో మొదలైన భౌతికశాస్త్రంతో వృత్తిగా చివరంటా దాంతోనే ఉన్నారని తెలుస్తుంది. కానీ, ఆయనతో మూడు దశాబ్దాల పరిచయం ఉన్న నేను ఒక్కసారి కూడా ఆయనతో సైన్సు గురించిన మాట్లాడిన గుర్తులేదు. ఆయన జీవనోపాధికి ఏం చేశాడో నాబోటి వాళ్ళకు పెద్దగా తెలీదు కానీ, మాకు తెలిసిన వేలూరి పూర్తిగా సైన్సుకు బయటివాడు. వేలూరి స్నేహాలు ఈయన ఎక్కడికి వెళ్తే అక్కడ ఓ స్నేహ బృందాన్ని తయారు చేసుకున్నారు. ముఖ్యంగా ఏలూరు కథలు వేలూరి గారే చెప్పాలి. వేల్చేరు నారాయణరావు, పెమ్మరాజు వేణుగోపాలరావు, పోణంగి రామకృష్ణారావు, సూర్యనారాయణ రాజు కొన్నిపేర్లు. దశాబ్దాలూ, సముద్రాలూ, సాహిత్య శిబిరాలన్నింటినీ దాటి సమాంతరంగా చివరంటా సాగిన స్నేహాలు అవి. యవ్వనంలో ఉండే అల్లరి, ఆవేశం, బేఖాతర్ జీవన శైలి నించి వైజ్ఞానికులుగా, పెద్దలుగా, గౌరవనీయులుగా ఎదిగి నిష్క్రమించే దాకా సాగిన స్నేహాలు ఇవి. ఆయన విశాఖపట్టణం వెళ్ళాక అక్కడ స్నేహితులతో చేసిన ‘కావ్య దహనోత్సవం’ పేరుతో చేసిన అల్లరి బహుశా తెలుగు సాహిత్య చరిత్రలో నిలిచిపోయే ప్రహసనం.వేలూరి వేంకటేశ్వరరావు (Veluri Venkateswara Rao) సంభాషణల్లో తరచూ దొర్లే కొన్ని విశాఖపట్నం పేర్లు బొమ్మకంటి శ్రీనివాసాచార్యులు, దేవులపల్లి కృష్ణశాస్త్రి, జ్యేష్ఠ, రత్నం, రావిశాస్త్రి, చేకూరి రామారావు. ఒరిస్సాలో ఉన్న రోజుల్లో ఒరియా సాహిత్యంతోనూ, కొంత బెంగాలీ సాహిత్యంతోనూ, సాహిత్యకారులతోనూ ఈయనకి అక్కడ పరిచయం లభించింది. ఎంతలా అంటే అయ్యో ఫలానా విషయం తెలుగులో లేదే అని బాధపడేంత. ఆయన అమెరికా చేరిన తర్వాత ఇంటర్నెట్ రాక ముందు నుంచే చేతిరాతలతోనూ, డయల్ ఫోన్లతోనూ పరిచయాలని నెరిపి దాదాపు మొదటితరం తెలుగు సాహిత్యానికీ, సాహిత్య స్నేహాలకీ పునాది వేశారు. నేను 1996, 1997 ప్రాంతాల్లో ఈ సమూహాల్లో ప్రవేశం మొదలెట్టేటప్పటికే ఈయన పరుచూరి శ్రీనివాస్, జంపాల చౌదరి, సురేష్ కొలిచాల, చంద్ర కన్నెగంటి, రామారావు కన్నెగంటి, పాణిని శంఖవరం వంటి వాళ్ళచే పెద్దవారిగా, గురుస్థానంలో ఉన్నారు.ఆయనతో విభేదించినా, గొడవ పడ్డా, వాదించినా, సలహా అడిగినా అవన్నీ ఆయన్ని గురుస్థానంలో ఉంచే జరిగేవి అని నా అభిప్రాయం. ఇప్పటికీ పబ్లిక్‌గా ఉన్న రచ్చబండ, తెలుసా ఇంటర్నెట్ గ్రూపుల పాతపోస్టులనీ, చర్చలనీ చూస్తే ఈ సంగతి అర్థమవుతుంది. ‘తెలుగు డయాస్పోరా’ (Telugu Diaspora) అన్న మాటని మొదట తీసుకు వచ్చింది వేలూరి అని అంటారు. ఆ డయాస్పోరా అన్నా, డయాస్పోరా సాహిత్యం అన్నా ఏమిటి అనే నిర్వచనాలని స్పష్టంగా ఆయన చెప్పారు.వేలూరికి మనుషులు కావాలి! వేలూరి ఈ ప్రపంచాన్ని వదిలే సమయానికి ఆయన్ని స్నేహితుడిగా చెప్పుకునే వాళ్ళ వయసులు 15 నించి 100 దాకా ఉంటాయని నా నమ్మకం. మనకి ఓపిక ఉండాలిగానీ ఆయన మాట్లాడుతూనే ఉండగలడు. తిలక్, కృష్ణశాస్త్రి, శ్రీశ్రీ, రావిశాస్త్రులూ మా ఫ్రెండ్‌కి ఫ్రెండే అనేంత దగ్గరగా తీసుకురాగలడు. వేలూరి మంచి హోస్టు. మన ఇండియా, తెలుగు భోజనలకి ఎలాంటి వైన్ పక్కన ఉండాలో చెప్పినవాళ్ళు లేరు. పెసరట్టుకి ఎలాంటి వైన్, గోంగూర పచ్చడి అన్నం పక్కన ఎలాంటి వైన్ లాంటివి మనం అడగాలేగానీ ఆయన చెప్పేస్తారు. ఇప్పుడనిపిస్తోంది ఎందుకు మేమెవ్వరం ఆయన్ని ఈ విషయాల మీద రాయమని అడగలేదా అని! కానీ ఆయన నాలుక ఎంత పదునంటే ఏదో ఒకటి సడెన్‌గా కోపమొచ్చేలా అంటారు. ఆ నిర్మొహమాటమే ఆయనకి బలం, బలహీనత. మొదట్లో ఉడుక్కునేవాణ్ణి. కానీ ఆయనకి ఎలా సముదాయించాలో కూడా తెలుసు. ఈ వ్యాసాన్ని పూర్తిగా వేలూరి అనే ఓ వ్యక్తి పరిచయంగా జ్ఞాపకాల్లోంచి రాద్దామని మొదలెట్టినా, చివరి పేరా వచ్చేసరికి కళ్ళు చెమరుస్తున్నాయి. వేలూరి నాకు తెలుసు అని చెప్పుకోవడం గొప్ప మర్యాద. ఆయన ఇప్పుడు లేరు అని గుర్తుంచుకుని బాధ పడాలని లేదు. ఆయన జీవితాన్ని ఎంతలా సెలబ్రేట్ చేసుకోగలమూ, ఎలాంటి పాఠాల్ని నేర్చుగోగలమూ అన్నదే ప్రశ్న. 👉 సోల్‌మేట్ కథ చదివారా? న్యూయార్కర్ లాంటి సాహిత్య పత్రిక ఉండాలనీ, ‘ఈమాటా’ వెబ్ పత్రికని ఆ టెంప్లేట్లో రూపొందించాలనీ ఆయన చాలా కృషి చేశారు. సైన్సు పేపర్లకి ముందు ఉండే పియర్ రివ్యూ లాంటి పద్ధతి సాహిత్యానికి కూడా ఉండాలని ఆయన స్థిరాభిప్రాయం. నృత్యం చేసేవాడూ, పెయింటింగ్ వేసేవాడూ, పాట పాడేవాడూ ఏదో ఒకటి నేర్చుకుని, బోల్డెంత ప్రాక్టీస్ చేస్తారు. రచయితకి మాత్రం ఎందుకు అలాంటి శిక్షణ, క్రమశిక్షణ లేదు అనేది ఆయన ప్రశ్న. – అక్కిరాజు భట్టిప్రోలు, రచయిత -
అమెరికాలో రూ. 2 కోట్లుపైనే వేతనం..! ఐనా..
అమెరికాలో ఉండే మన భారతీయులు ఏ రేంజ్లో ప్యాకేజ్‌లు అందుకుంటారో తెలిసిందే. అంతలా వేతనాలు వస్తాయనే..విదేశాలంటే మోజు మనవాళ్లకు. కానీ ఆ వ్యక్తి కోట్లలో వచ్చే వేతనం కాదనుకుని మరి భారత్‌కి వచ్చేయాలని ప్లాన్ చేస్తున్నాడట. అంతేగాదు దానికి గల కారణాన్ని వివరిస్తూ..అది సరైనదో కాదో సలహా ఇవ్వండి అంటూ రెడ్డిట్‌లో పోస్ట్ పెట్టాడు. అది నెటిజన్లను ఆకర్షించడమే కాదు..అతడి ఉద్దేశానికి ఫిదా అవ్వతూ ప్రశంసలజల్లు కురిపిస్తూ పోస్టులు పెట్టారు.ఇంతకీ కారణం ఏంటేంటే..అమెరికాలో 12 ఏళ్లకు పైగా గడిపిన తర్వాత తిరిగి కుటుంబంతో సహా భారత వచ్చేయాలనకుంటున్నట్లు ఓ ఎన్నారై పోస్ట్‌లో తెలిపాడు. ఈ జూన్ కల్లా తాము ఐదుగురు ముంబైకి వచ్చేయాలని నిర్ణయించుకున్నామని రెడ్డిట్ పోస్ట్‌లో పేర్కొన్నారు. తన వయసు 36 ఏళ్లు అని, 2018లో నవంబర్ నుంచి హెచ్1బీ విసాతో అమెరికాలో నివశిస్తున్నట్లు తెలిపాడు. పైగా తన వార్షిక ఆదాయం రూ. 2.9 కోట్లు అని, నెట్‌వర్త్ వచ్చేసి రుణ రహిత ఇల్లుతో కలిపి దగ్గర దగ్గర రూ. 9 కోట్లు అని వెల్లడించారు. భారత్ తన ఉద్యోగ ఆఫర్ ఏడాదికి రూ. 1.5 కోట్ల ప్యాకేజ్ అని కూడా వివరించాడు. అయితే తన తల్లిదండ్రులు హైదరాబాద్‌లో ఉన్నారని, కుటుబానికి దగ్గరగా ఉండటమే మేలని ఇలా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. అందులోనూ తన పిల్లలు తాతయ్య నానమ్మల, దగ్గర బంధువులతో పెరగాలని ఆశిస్తున్నట్లు వెల్లడించాడు పోస్ట్‌లో. అక్కడ అమెరికాలో ఇంటి అద్దె చెల్లించకుండా లగ్జరియస్‌గా గడిపినా తన కుటుంబానికి ఈ నిర్ణయం కారణంగా.. చాలా పెద్ద మార్పుని స్వాగతించాల్సి ఉంటుందని అంటున్నాడు. ఎందుకంటే ముంబైలో అద్దె చెల్లిస్తూ..ఏడాదికి రూ. 1.5 కోట్లతో బతకడం సాధ్యమేనా? అని సందేహం వ్యక్తం చేశాడు. అలాగే యూఎస్‌లో పుట్టి..అక్కడే పెరిగిన పిల్లలు ఇక్కడ జీవనశైలికి, ఎడ్యుకేషన్‌కి సులభంగా అలవాటుపడగలరా, అసలు తన నిర్ణయం సరైనదేనా..? ఏదైనా సలహా ఉంటే చెప్పండి అని పోస్ట్ పెట్టాడు. అయితే నెటిజన్లు అది మంచి ప్యాకేజీ అని, ముంబైలో ధీమాగా బతకొచ్చు అని అన్నారు. పైగా ఇలా భారత్‌కి రావాలనుకుంటున్న మీ నిర్ణయానికి స్వాగతం అంటూ పోస్టులు పెట్టారు. మరికొందరు తల్లిదండ్రలు గురించి ఆలోచిస్తున్నందుకు మెచ్చుకుంటూ పోస్టులు పెట్టారు. (చదవండి: లే ఆఫ్‌ని ఎలా హ్యాండిల్ చేయాలంటే..?: మాజీ అమెజాన్ టెక్కీ) -
13 ఏళ్ల టీనేజర్ అమెరికాలో మైనర్లపై వేధింపులు, దొంగతనాలు
అమెరికాలో మైనర్లపై లైంగిక వేధింపులకు పాల్పడినందుకు ఒక భారతీయుడిని అరెస్టు చేశారు. ఓదెల యశస్వి కొత్తపల్లిగా గుర్తించబడిన నిందితుడు అక్రమ వలసదారు అమెరికా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ప్రకటించింది. న్యూజెర్సీలో పిల్లలపై లైంగిక వేధింపులతోపాటు, దొంగతనానికి సంబంధించిన ఆరోపణలు పెండింగ్‌లో ఉన్నాయని వెల్లడించింది.సరైన పత్రాలు లేకుండా అమెరికాలోని ప్రవేశించిన నిందితుడు యశస్విని చైల్డ్ రేపిస్తూ అని పేర్కొంది. అతడిపై యుఎస్ ఇమ్మిగ్రేషన్ చట్టం ప్రకారం తొలగింపు చర్యలు పెండింగ్‌లో ఉన్నాయని యుఎస్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్ మెంట్ (ఈసీఇ) ఎక్స్‌లో ప్రకటన విడుదల చేసింది. ఇదీ చదవండి: ఎప్స్టీన్ ఫైల్స్‌లో మరో కలకలం : ఉమ్మెత్త పూలతో అరాచకాలుమైనర్లపై లైంగిక నేరాలకుపాల్పడినట్లు అతడిపై అభియోగాలు నమోదయ్యాయి. అలాగే, దొంగతనం, శాంతిభద్రతలకు భంగం కలిగించడం వంటి నేరాలతోనూ అతనికి సంబంధాలున్నాయని అధికారులు పేర్కొన్నారు. అయితే నిందితుడిపై కేసు ఎప్పుడు, ఎక్కడ నమోదైంది, ఎప్పుడు అరెస్టు చేశారనే విషయాలపై స్పష్టతనివ్వలేదు.—SEXUAL ASSAULT OF A CHILD UNDER 13 —SHOPLIFTING —PUBLIC DISORDER Vodela Yashaswi Kottapalli, a criminal illegal alien from India, has pending charges for sexual assault and larceny in New Jersey. We’ll keep him in custody pending removal proceedings. pic.twitter.com/VM97e9KUD9— U.S. Immigration and Customs Enforcement (@ICEgov) February 16, 2026 ఇదీ చదవండి: పెళ్లయ్యి ఆరునెలలే.. వాలెంటైన్స్‌డే రోజే హత్య -
తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ఆధ్వర్యంలో శివాలయాల సందర్శన యాత్ర
తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ఆధ్వర్యంలో మహా శివరాత్రి పర్వదినం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ ఏడాది కూడా శివాలయాల సందర్శన యాత్ర ఫిబ్రవరి 15వ తేదీ రాత్రి 9 గంటల నుండి ఫిబ్రవరి 16వ తేదీ ఉదయం 6.30 గంటల వరకు నిర్వహించారు. సింగపూర్‌లోని జురాంగ్ ఈస్ట్ ,బుకిత్ పంజాంగ్, సెంగ్ కాంగ్- పుంగ్గోల్ మరియు టాంపనీస్-బెడోక్ ప్రాంతాల నుండి బస్సులను సమకూర్చి యాత్రను నిర్వహించారు. సుమారు 230 మంది భక్తులు వివిధ దేవాలయాలను సందర్శించి ఆ పరమ శివుని దీవెనలు పొందారు. భక్తుల శివనామస్మరణలతో ప్రముఖ దేవాలయాలు కిటకిటలాడాయి. ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా సురక్షితంగా యాత్రను నిర్వహించిన సొసైటీ వారికి ఈ యాత్రలో పాల్గొన్న భక్తులు తమ కృతజ్ఞతలు తెలిపారు. ఎలాంటి లాభాపేక్ష, ఆడంబరాలు లేకుండా సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు వివిధ సేవ, భక్తి కార్యక్రమాలు నిర్వహిస్తున్న తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) వారిని ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు కొనియాడారు. ఈ కార్యక్రమానికి సమన్వయ కర్తలుగా ప్రాంతీయ కార్యదర్శులు సంతోష్ వర్మ మాదారపు, భాస్కర్ నడికట్ల, శశిధర్ ఎర్రమ రెడ్డి, ఉపాధ్యక్షులు నల్ల భాస్కర్, దుర్గ ప్రసాద్ , సంతోష్ కుమార్ జూలూరి మరియు ప్రశాంత్ బసిక, ఉపాధ్యక్షురాలు సునీత రెడ్డి మిర్యాల మరియు ప్రధాన కార్యదర్శి బొందుగుల రాము మొదలగు వారు ఉన్నారు.వీరితో పాటు యాత్రలో సహాయపడిన పెరుకు శివ రామ్ ప్రసాద్,సమ్మయ్య మొలుగూరి, లక్ష్మణ్ రాజు కల్వ, వేణు గోపాల్ ఐరేని, రావుల సుగుణాకర్ రెడ్డి మరియు అందరికి కృతజ్ణతలు తెలియజేశారు. ఈ వేడుకలకు ఆర్థిక సహకారం అందించిన నాగులపల్లి శ్రీనివాస్ గారికి సొసైటీ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ప్రతిఒక్కరికి సొసైటీ అధ్యక్షులు గడప రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి రాము బొందుగుల మరియు కోశాధికారి నంగునూరి వెంకట రమణ , సొసైటీ ఉపాధ్యక్షులు బసిక ప్రశాంత్ రెడ్డి, దుర్గ ప్రసాద్, భాస్కర్ గుప్త నల్ల, జూలూరి సంతోష్ కుమార్ ఉపాధ్యక్షురాలు మిర్యాల సునీత రెడ్డి, సంస్థాగత కార్యదర్శి కాసర్ల శ్రీనివాస రావు, ప్రాంతీయ కార్యదర్శులు బొడ్ల రోజా రమణి, నడికట్ల భాస్కర్, శశిధర్ రెడ్డి, రవి కృష్ణ విజాపూర్,సంతోష్ వర్మ మాదారపు మరియు కార్యవర్గ సభ్యులు శివ ప్రసాద్ ఆవుల, పెరుకు శివ రామ్ ప్రసాద్, భాస్కర్ రావు పులిగిళ్ల, విజయ మోహన్ వెంగళ, ప్రవీణ్ మామిడాల, సతీష్ పెసరు, మణికంఠ రెడ్డి, రావుల సుగుణాకర్ రెడ్డి , చల్ల కృష్ణ మొదలగు వారు గత సంవత్సరం లాగే ఈ సారి కూడా భారీ స్పందన వచ్చిందని, సొసైటీ చేస్తున్న వినూత్న కార్యక్రమాలకు సహకారం అందిస్తూ ప్రోత్సహిస్తున్న సభ్యులందరికి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. -
అమెరికాలో అదృశ్యమైన శ్రీనివాసయ్య మృత దేహం లభ్యం
అమెరికాలోని కాలిఫోర్నియాలో కనిపించకుండా పోయిన 22 ఏళ్ల భారతీయ విద్యార్థి ఉదంతం విషాదాంతమైంది. తప్పిపోయిన ఆరు రోజుల తర్వాత కర్నాటకకు చెందిన సాకేత్ శ్రీనివాసయ్య(22) మృతదేహం లభ్యమైంది. పోలీసులు అతని మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారని శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ ధృవీకరించింది. దీంతో అతని కుటుంబ సభ్యులు, స్నేహితులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.అతని మృతదేహాన్నివీలైనంత త్వరగా స్వదేశానికి తీసుకురావడానికి అవసరమైన అన్ని సహాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చింది. అత్యంత క్లిష్ట సమయంలో అతని కుటుంబానికి, ప్రియమైనవారికి తమ హృదయపూర్వక సానుభూతిని తెలియ జేస్తున్నామని ప్రకటనలో పేర్కొంది.Consulate General of India in San Francisco is deeply concerned about the disappearance of Saketh Sreenivasaiah, an Indian post-graduate student of UC Berkeley, hailing from the State of Karnataka. The Consulate is in touch with the family and also is in contact with the…— India in San Francisco (@CGISFO) February 14, 2026 కాలిఫోర్నియా బర్కిలీ విశ్వవిద్యాలయంలో కెమికల్ అండ్ బయోమాలిక్యులర్ ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థి సాకేత్ శ్రీనివాసయ్య ఫిబ్రవరి 9న అదృశ్యమయ్యాడు.మద్రాస్ ఐఐటీ నుంచి ఇతడు 2025లో కెమికల్ ఇంజనీరింగ్ పట్టా అందుకున్నాడు. సాకేత్ మంగళవారం చివరిసారిగా డ్వైట్ వేలోని 1700 బ్లాక్ వద్ద కనిపించినట్లు పోలీసులు తెలిపారు. ల్యాప్‌టాప్, పాస్‌పోర్టు తదితరాలున్న సాకేత్ బ్యాగు లేక్ ఆంజా ప్రాంతంలోని పార్క్హిల్స్లో ఓ ఇంటి ఆవరణలో పడి ఉండగా గుర్తించారు. తమ కొడుకు ఎలాగైనా క్షేమంగా తిరిగి వస్తాడని ఎదురు చూసిన కుటుంబీకుల్లో శ్రీనివాసయ్య మరణవార్త తీరని విషాదాన్ని మిగిల్చింది. -
అమెరికాలో కర్నాటక విద్యార్థి అదృశ్యం
న్యూయార్క్/బెంగళూరు: అమెరికాలోని కాలిఫోరి్నయాలో పీజీ చదువుకునే భారతీయ విద్యార్థి ఒకరు కనిపించకుండా పోయారు. కర్నాటకకు చెందిన సాకేత్ శ్రీనివాసయ్య(22) అమెరికాలోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ బర్కిలీలో కెమికల్, బయోమాలిక్యులర్ ఇంజనీరింగ్ పీజీ చేస్తున్నాడు. మద్రాస్ ఐఐటీ నుంచి ఇతడు 2025లో కెమికల్ ఇంజనీరింగ్ పట్టా అందుకున్నాడు. సాకేత్ మంగళవారం చివరిసారిగా డ్వైట్ వేలోని 1700 బ్లాక్ వద్ద కనిపించినట్లు పోలీసులు తెలిపారు. ల్యాప్‌టాప్, పాస్‌పోర్టు తదితరాలున్న సాకేత్ బ్యాగు లేక్ ఆంజా ప్రాంతంలోని పార్క్హిల్స్లో ఓ ఇంటి ఆవరణలో పడి ఉండగా గుర్తించారు. ఈ విషయాన్ని శాన్ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ ధ్రువీకరించింది. సాకేత్ అదృశ్యంపై ఆందోళన వ్యక్తం చేసింది. అతడి ఆచూకీ కనుగొనే విషయమై స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని, కర్నాటకలోని కుటుంబసభ్యులతో మాట్లాడుతున్నామని శనివారం వెల్లడించింది. ఈ నెల 9వ తేదీ నుంచి సాకేత్ కనిపించకుండాపోయాడంటూ అతడి రూమ్మేట్ బనీత్ సింగ్ ఈ నెల 13వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అన్ని చోట్లా వాకబు చేసిన తను ఎటువంటి ఫలితం కనిపించకపోవడంతో పోలీసులకు తెలిపినట్లు బనీత్ తెలిపాడు. ప్రభుత్వానికి సాకేత్ తండ్రి వినతి అమెరికాలో గల్లంతైన తమ కుమారుడిని కనుగొనేందుకు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞాపన అందజేసినట్లు తండ్రి శ్రీనివాసయ్య తెలిపారు. చివరిసారిగా తమ కుమారుడితో ఈ నెల 9వ తేదీన ఫోన్లో మాట్లాడామన్నారు. 12వ తేదీ నుంచి కనిపించడం లేదంటూ అతడి రూమ్మేట్ తమకు తెలిపాడన్నారు. కుమారుడి కోసం అమెరికా వెళ్లే విషయమై తాము ఆలోచిస్తున్నామన్నారు. సాకేత్ విషయంలో కాలిఫోర్నియాలోని భారత కాన్సులేట్ అధికారులు అక్కడి పోలీసులతో మాట్లాడాలని, అవసరమైన సహాయ సహకారాలు అందించాలని కర్నాటక ప్రభుత్వం శనివారం కేంద్ర విదేశాంగ శాఖను కోరింది. -
పవర్ఫుల్ పాస్‌పోర్ట్‌ల్లో భారత్ స్థానం ఎంతంటే..
అంతర్జాతీయ ప్రయాణ విభాగంలో భారత పాస్‌పోర్ట్ తన ప్రభావాన్ని చాటుతోంది. తాజాగా విడుదలైన 2026 హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో ఇండియా గతేడాదితో పోలిస్తే ఏకంగా 10 స్థానాలు ఎగబాకి 75వ స్థానానికి చేరుకుంది. భారతీయ పౌరుల అంతర్జాతీయ ప్రయాణ స్వేచ్ఛ గణనీయంగా పెరిగిందని ఈ ర్యాంకింగ్ స్పష్టం చేస్తోంది.హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ అనేది ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) అందించే అధికారిక డేటా ఆధారంగా రూపొందుతుంది. ఒక దేశ పాస్‌పోర్ట్ హోల్డర్లు ముందస్తు వీసా అవసరం లేకుండా ఎన్ని దేశాలకు వెళ్లగలరు అనే అంశంపై ఈ ర్యాంకింగ్స్ ఆధారపడి ఉంటాయి. ప్రస్తుత నివేదిక ప్రకారం, భారతీయ పాస్‌పోర్ట్ కలిగి ఉన్నవారు ప్రపంచవ్యాప్తంగా 56 దేశాలకు వీసా-ఫ్రీ, వీసా-ఆన్-అరైవల్ లేదా ఇ-వీసా సౌకర్యంతో సులభంగా ప్రయాణించవచ్చు.ప్రయాణికులకు ప్రయోజనాలుఈ మెరుగైన ర్యాంకింగ్ వల్ల సెలవులు, వ్యాపార పర్యటనలు లేదా సాంస్కృతిక సందర్శనల కోసం విదేశాలకు వెళ్లే భారతీయులకు వీసా అవాంతరాలు తగ్గుతాయి. ముఖ్యంగా ఆసియా, ఓషియానియా, కరేబియన్ దీవులు, ఆఫ్రికా ఖండంలోని దేశాల్లో భారతీయులకు మెరుగైన ప్రవేశ సౌకర్యాలు లభిస్తాయి.భారత్ ఈ ర్యాంకింగ్స్‌లో గత దశాబ్ద కాలంగా ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. 2006లో 71వ ర్యాంకులో ఉన్న భారత్ గత ఏడాది 85వ స్థానానికి పడిపోయింది. అయితే, 2026 ప్రారంభంలో 80వ స్థానానికి, ఇప్పుడు ఏకంగా 75వ స్థానానికి చేరుకోవడం గమనార్హం.ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్‌లు..ర్యాంకుదేశంవీసా రహిత పర్యటన(దేశాల సంఖ్య)1సింగపూర్1922జపాన్, దక్షిణ కొరియా1873స్వీడన్, యూఏఈ1864జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్ (మరో 8 ఐరోపా దేశాలు)1855ఆస్ట్రియా, గ్రీస్, పోర్చుగల్, మాల్టా184 టాప్ 10లో ఇతర దేశాలు..ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, యునైటెడ్ స్టేట్స్ వంటి దేశాలు టాప్ 10 జాబితాలో కొనసాగుతున్నాయి. అమెరికా పాస్‌పోర్ట్ హోల్డర్లు ప్రస్తుతం 179 దేశాలకు ముందస్తు వీసా లేకుండా ప్రయాణించగలరు.75వ ర్యాంకు అనేది భారత పాస్‌పోర్ట్ చరిత్రలో అత్యుత్తమ స్థానం కాకపోయినప్పటికీ, గత కొన్నేళ్లుగా కనిపిస్తున్న వృద్ధి రేటు సానుకూల ధోరణిని సూచిస్తోంది. ప్రపంచ దేశాలతో భారత్ కుదుర్చుకుంటున్న ద్వైపాక్షిక ఒప్పందాలు, దౌత్య సంబంధాల మెరుగుదల కారణంగా భవిష్యత్తులో భారత పాస్‌పోర్ట్ మరింత శక్తివంతంగా మారే అవకాశం ఉంది.ఇదీ చదవండి: రాజ్‌పాల్ యాదవ్ గ్యారేజీలోని కార్ల లిస్ట్ ఇదే.. -
జాహ్నవి కుటుంబానికి రూ.262 కోట్ల పరిహారం
కర్నూలు (సెంట్రల్)/ఆదోని సెంట్రల్: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన కందుల జాహ్నవి కుటుంబానికి రూ.262 కోట్ల పరిహారాన్ని వాషింగ్టన్‌లోని సియోటెల్ సిటీ అటార్నీ జనరల్ ఎరికా ఇవాన్స్ అధికారికంగా ప్రకటించారు. ‘‘జాహ్నవి మృతి మా హృదయాలను కలచివేసింది. ఈ ఆర్థికసాయమైనా ఆమె కుటుంబానికి కాస్తంత ఓదార్పు అందిస్తుందని ఆశిస్తున్నాం’’ అని ఇవాన్స్ వెల్లడించారు. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన జాహ్నవి కర్నూలు జిల్లా ఆదోనిలోని తిరుమలగిరిలో నివాసం ఉంటున్న హెడ్ కానిస్టేబుల్ శ్రీకాంత్, విజయలక్ష్మి దంపతులు కౌతాళం మండలం కుంబళనూరు నుంచి వచ్చి స్థిరపడ్డారు. వీరికి ఇద్దరు సంతానం. మొదటి కుమార్తె జాహ్నవి ఉన్నత చదువుల కోసం 2021లో అమెరికా వెళ్లింది. అక్కడి నార్త్ ఈస్ట్రన్ యూనివర్సిటీలో మాస్టర్ డిగ్రీ కోర్సులో చేరింది. అయితే 2023 జనవరి 23న జాహ్నవి రోడ్డు దాటుతుండగా పోలీసు పెట్రోలింగ్ వాహనం వేగంగా వచ్చి ఢీకొట్టింది. ప్రమాదంలో 100 అడుగుల దూరంలో ఎగిరిపడిన జాహ్నవి అక్కడికక్కడే ప్రాణాలను కోల్పోయింది. ఈ ప్రమాదానికి పోలీసు వాహనం నడుపుతున్న కెవిన్ డవే అనే అధికారి కారణమయ్యారు. అయితే ఆమె మృతిపై మరో అధికారి డేనియల్ అడరర్ అత్యంత నిర్లక్ష్యంగా జోకులు వేస్తూ మరో అధికారితో మాట్లాడడం అప్పట్లో తీవ్ర వివాదాస్పదమైంది. ‘‘ఈమెకు 26 ఏళ్లు ఉంటాయేమో. అయినా సాధారణ వ్యక్తి. ఈమె మరణానికి ఎలాంటి విలువ లేదు’’ అని అడరర్ వ్యాఖ్యానించడం మరో అధికారి బాడీ కెమెరాలో రికార్డయింది. భారత విద్యార్థి మృతి, అధికారి అనుచిత వ్యాఖ్యలపై భారత్ భగ్గుమంది. అమెరికా పౌరులూ డేనియల్ అడరర్ తీరును ఖండించారు. దీంతో అతనిపై వేటు పడింది. విధుల నుంచి పోలీసు ఏజెన్సీ తప్పించింది. ఈ క్రమంలో సియాటెల్ సిటీ అధికారులే తమ కుమార్తె మరణానికి కారణమని 110 మిలియన్ డాలర్లు పరిహారంగా చెల్లించాలని జాహ్నవి కుటుంబం 2024 సెప్టెంబర్‌లో దావా వేసింది. ఈ క్రమంలో పూర్తి స్థాయి విచారణ జరిపిన వాషింగ్టన్ రాష్ట్రంలోని సియాటెల్ సిటీ అటార్నీ జనరల్ ఎరికా ఇవాన్స్ అధికారుల నిర్లక్ష్యం, అలసత్వంతోనే ప్రమాదం జరిగినట్లు నిర్ధారించి బాధిత కుటుంబానికి పరిహారం ప్రకటించారు. ఆమె కుటుంబానికి 29 మిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.262 కోట్ల పరిహారం చెల్లించేలా అగ్రిమెంట్ జరిగినట్లు తెలుస్తోంది. త్వరలోనే బాధిత కుటుంబానికి భారత ఎంబసీ ద్వారా ఆ పరిహారం అందించేందుకు చర్యలు తీసుకునే అవకాశం ఉంది.మూడు రోజుల క్రితమే జాహ్నవి తండ్రి మృతి ఆదోనిలోని తిరుమలగిరిలో నివాసం ఉంటున్న జాహ్నవి తల్లిదండ్రులు కుమార్తె మరణంతో తీవ్ర మనోవేదనకు గురైనట్లు చుట్టుపక్కల వారు చెబుతున్నారు. ఈ క్రమంలో మూడు రోజుల క్రితమే తండ్రి శ్రీకాంత్ గుండెపాటుతో మరణించారు. దీంతో తల్లి విజయలక్ష్మీ, చిన్న కూతురు మాత్రమే ఉన్నారు. ఈ క్రమంలో వారికి భారీ పరిహారం అందితే ఎంతో అండగా ఉంటుంది. అయితే ఈ విషయం వారికి తెలియదు. ప్రస్తుతం వారు శ్రీకాంత్ మరణంతో తీవ్ర విషాదంలో ఉన్నారు. -
అమెరికాలో జాహ్నవి మృతి కేసు : రూ. 262 కోట్ల పరిహారం
అమెరికాలోని సియాటిల్‌లో జరిగిన ఘోర కారు ప్రమాదంలో తెలుగు సంతతికి చెందిన గ్రాడ్యుయేట్ జాహ్నవి కందులకుటుంబానికి భారీ పరిహారం లభించనుంది. జాహ్నవి మృతి చెందిన దాదాపు మూడేళ్ల తర్వాత, ఆమె కుటుంబానికి గణనీయమైన ఆర్థిక పరిహారం అందనుంది.ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాకు చెందిన జాహ్నవిది ఒక సాధారణ మధ్యతరగతి నేపథ్యం. విదేశాల్లో ఉన్నత చదువులు చదువుకుని మరెంతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్న కోటి కలలతో సియాటెల్‌లోని నార్త్ఈస్టర్న్ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ చేసేందుకు 2021లో అమెరికాకు వెళ్లింది.కానీ 2023, జనవరి 23వ తేదీ రాత్రి ఒక మలుపు దగ్గర రోడ్డు దాటుతున్న 23 ఏళ్ల జాహ్నవిని, కెవిన్ డవే అనే పోలీస్ అధికారి నడుపుతున్న పెట్రోలింగ్ వాహనం వేగంగా ఢీకొట్టింది. ఆ ధాటికి దాదాపు 100 అడుగుల దూరం ఎగిరిపడిన ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన తర్వాత బయటకు వచ్చిన వీడియో సంచలనం రేపింది. ప్రమాదం జరిగిన తర్వాత మరో పోలీస్ అధికారి డేనియల్ ఆడరర్ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఏముంది మామూలు మనిషేగా...11 వేల డాలర్లు చెల్లిస్తే సరిపోతుందిగా అంటూ ఎద్దేవా చేశాడు. అయితే తన బాడీ కెమెరా ఆన్ చేసి ఉందనే సంగతి మరిచిపోయాడు. అతని మాటలు వైరల్ కావడంతో తీవ్ర ఆగ్రహ జ్వాలలు రగిలాయి.మరోవైపు సియాటిల్‌లో ప్రమాదం, తమ బిడ్డ మృతిపై జాహ్నవి కుటుంబం దావా వేసింది. ఈ సంఘటన తెలుగు, భారతీయ వర్గాల నుండి మాత్రమే కాకుండా, స్థానికులు కూడా ప్రజల ఆగ్రహాన్ని వ్యతిరేకతను రేకెత్తించింది. దీంతో భారీ పరిహారంతో ఈ కేసును పరిష్కరించు కుంది. సియాటిల్ నగరం దాదాపు రూ. 262 కోట్ల (28 మిలియన్ డాలర్ల) పరిహారం చెల్లించేందుకు అంగీకరించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన పోలీసు అధికారి ఎటువంటి నేరారోపణలు లేకుండా, 5000 డాలర్లు జరిమానా విధించారు. అలాగే విధుల నుండి గత ఏడాది సస్పెండ్ చేశారు. సియాటెల్ ప్రకటనకందుల మరణం "హృదయ విదారకం" అని సియాటెల్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ పరిష్కారం ఆమె కుటుంబానికి కొంత ఆత్మవిశ్వాసాన్ని తెస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది. ఆమె నష్టం ఊహించలేని బాధను మిగిల్చింది. ఆమె కుటుంబానికి, ఆమె స్నేహితులకు మరియు మా సమాజానికి కూడా జాహ్నవి కందుల జీవితం చాలా ముఖ్యమైనదే అంటూ విచారం వ్యక్తం చేసింది. ఈ ఆర్థిక పరిష్కారం కందుల కుటుంబానికి కొంత ఆత్మవిశ్వాసాన్ని తెస్తుందని నగరం ఆ శాభావాన్ని వ్యక్తం చేసింది. కందుల దుర్మరణం జాతీయ ఆగ్రహాన్ని రేకెత్తించింది. ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ సర్వీసెస్ (ICS)తో సహా న్యాయవాద సంఘాలు విస్తృత పోలీసు సంస్కరణల కోసం పిలుపునిచ్చాయి. 110 మిలియన్ డాలర్ల నష్టపరిహారం కావాలని డిమాండ్ చేశాయి. అలాగే ఆ పోలీసు అధికారిని ఉద్యోగం నుండి తొలగిస్తామని చెప్పడం సరికాదని, స్పష్టమైన మార్గదర్శకాలను డిమాండ్ చేస్తున్నామని IACS లలితా ఉప్పల అన్నారు.ఇదీ చదవండి: ఎన్ఆర్ఐకి అక్రమ జైలు శిక్ష : సుమారు రూ. 210 కోట్ల దావా -
టెన్షన్ లేని లైఫ్ కావాలి..అందుకే భారత్‌కి వచ్చేశా..!
విదేశాలకు వెళ్లడం అక్కడే స్థిరపడటం చాలామంది డ్రీమ్. 'దూరపు కొండలు నునుపు' అన్నట్లుగా విదేశాల్లోని అక్కడి సౌకర్యాలు, విలాసవంతమైన జీవితం రా..రమ్మని ఆకర్షిస్తుంటుంది. తీరా వెళ్లాక గానీ తెలియదు. అక్కడి సమస్యలు..పరిస్థితులు. ఇక్కడొక భారత మహిళకు కూడా అలా అనిపించే తక్షణమే భారత్‌కు కుటుంబంతో సహా వచ్చి వాలిపోయింది. ఎందువల్ల తాను ఈ ఆకస్మిక నిర్ణయం తీసుకుందో సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది. కానీ ఆమె చెబుతున్న మాటలు ఆలోచింపదగినవిగానూ విదేశాలకు చెక్కేద్దామనే ఔత్సాహుకులకు గొప్ప పాఠాలుగానూ ఉన్నాయి. మరి ఇంతకీ ఎందవల్ల ఇలా కుటుంబంతో సహా ఆమె భారత్‌కు వచ్చేసిందో తెలుసా..!?..లీబా సుబిన్ అనే మహిళ కుటుంబం దుబాయ్ నుంచి భారత్‌లోని తన స్వస్థలం కేరళకు వచ్చేసింది. తాను ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందో ఇన్స్టాగ్రామ్ వేదికగా నెటిజన్లతో షేర్ చేసుకుంది. ఆమె కారణాన్ని వివరిస్తూ..ఇది హఠాత్తుగా తీసుకున్న నిర్ణయం కాదని, మానసిక ప్రశాంతత కోసం ఇలా చేశానని అంటోంది. ఈ నిర్ణయాన్ని సమయా పాలన, మానసిక శాంతికి సంబంధించిన విషయంగా పేర్కొంది. అదీగాక తమ ఫ్యామిలీ వీసా రెన్యువల్, అలాగే ఇంటి అద్దె రెన్యువల్ చేయాల్సి ఉండగానే.. చకచక ఈ నిర్ణయం తీసుకుని వచ్చేసినట్లు తెలిపారు. అలాగని ఏదో హడావిడిగా తీసుకున్న నిర్ణయం అయితే కాదని, బాగా ఆలోచించి, తన భాగస్వామితో, పిల్లలతో మాట్లాడి ఈ నిర్ణయానికి వచ్చినట్లు వెల్లడించింది. ముఖ్యంగా ఇలా వెనక్కి వచ్చేసి కేరళలో తమ సొంతింటిలో నివశించడం వల్ల దుబాయ్‌లోని అద్దె టెన్షన్ తగ్గింది, అలాగే ఇక్కడి సమాజంలో నివశించడం వల్ల సామాజిక సంబంధాలు పునరుద్ధరింపబడతాయి. పైగా ఎలాంటి అప్పులు, ఈఎంఐల బెడద లేకుడా మానసిక ప్రశాంతతో గడపొచ్చు అని చెప్పుకొచ్చిందామె. పైగా పిల్లవాడికి కేరళలో అంతర్జాతీయ స్కూల్ ఇంటికి సమీపంలోనే ఉంది పదినిమిషాల్లో వెళ్లొచ్చు. కానీ దుబాయ్‌లో 90 నిమిషాలు ప్రయాణించాల్సి వస్తుందని జోడించారామె. బహుశా మాకు అనిపించింది..మీకు వర్కౌట్ కాకపోవచ్చు, పైగా మీరు విదేశాల్లోనే కంఫర్ట్ లైఫ్‌ని లీడ్ చేస్తుండొచ్చని, అది వారి వ్యక్తిగత విషయమని తేల్చి చెప్పింది. అయితే ఇలాంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడూ..మొత్తం కుటుబ సభ్యులు కలసి చర్చించుకుని ఒక నిర్ణయానికి రావడం అన్ని విధాల శ్రేయస్కరం అంటూ తన పోస్ట్‌ని ముగించింది లీబా సుబిన్. చాలా మంది నెటిజన్లు ఆమె నిర్ణయంతో ఏకభవించారు, పైగా తిరిగి వెళ్లకూదనుకుంటున్న ఆమె నిర్ణయానికి స్వాగతం, శుభాకాంక్షలు అని పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by leeba (@unfilteredvoiceswithinme) (చదవండి: ఆ హోటల్ కోసం..ఆ బామ్మ తపన చూస్తే కళ్లు చెమ్మగిల్లుతాయ్! -
ఎన్ఆర్ఐకి అక్రమ జైలు శిక్ష : సుమారు రూ. 210 కోట్ల దావా
అమెరికాలోని జార్జియాలో ఉండే భారతీయ అమెరికన్‌కి చేదు అనుభవం ఎదురైంది. చేయని నేరానికి ఆరు వారాల జైలు శిక్ష అనుభవించారు. కానీ విచారణలో కోర్టు ఈ కేసు కొట్టి వేసింది. దీంతో ఆయన న్యాయాపోరాటానికి సిద్ధపడ్డారు. జార్జియాలోని వాల్‌మార్ట్ స్టోర్‌లో ఒక చిన్నారిని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించాడనే తప్పుడు ఆరోపణతో ఆరు వారాల పాటు జైలు శిక్ష అనుభవించిన భారతీయ అమెరికన్ 57 ఏళ్ల మహేంద్ర పటేల్ ఉదంతం చర్చనీయాంశమైంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.జార్జియాలోని అక్వర్త్లోని వాల్‌మార్ట్‌లోతన కొడుకును కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించా డని రెండేళ్ల బాలుడి తల్లి కరోలిన్ మిల్లర్ ఆరోపించింది. ఈ సంఘటనను వాల్‌మార్ట్ ఉద్యోగికి, తదనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో 57 ఏళ్ల మహేంద్ర పటేల్‌ను 2025, మార్చి 24న అరెస్టు చేశారు. ఈ విషయంలో తనకి, పటేల్‌కి మధ్య బాబు కోసం "టగ్ ఆఫ్ వార్" జరిగిందని కూడా పేర్కొంది. అయితే తాను నిరపరాధి నని మొదటినుంచి గట్టిగా వాదించారు మహేంద్ర పటేల్. 2025 మార్చి 18న, తాను వాల్‌మార్ట్‌లో షాపింగ్ చేస్తున్నప్పుడు, టైలెనాల్ (టాబ్లెట్స్) ఎక్కడ ఉన్నాయోమిల్లర్‌ను దిశానిర్దేశం చేయమని అడిగానని పటేల్ చెప్పాడు. అప్పుడు ఆమె కొడుకు బ్యాలెన్స్ కోల్పోతున్నాడని గమనించి, అతను పడిపోకుండా ఉండటానికి చేయి చాచానని చెప్పుకొచ్చాడు.SHOCKING & SAD !! Mahendra Patel has filed a federal civil rights lawsuit after being jailed for 47 days over a Walmart incident.He was arrested after a shopper accused him of trying to kidnap her child. Police video later showed no force, no injury, and no kidnapping… pic.twitter.com/cRlPZfwvEH— M9 USA🇺🇸 (@M9USA_) February 11, 2026 తప్పుడు ఆరోపణల వల్ల పటేల్ 46 రోజుల పాటు కాబ్ కౌంటీ జైలులో గడపాల్సి వచ్చింది. ఆరు వారాల తర్వాత బెయిల్‌పై విడుదలయ్యారు. చివరికి ఆగస్టు 2025లో జిల్లా అటార్నీ కార్యాలయం ఈ కేసును కొట్టివేసింది. రెండు పార్టీలు ఒక పరిష్కారానికి వచ్చాయని కోబ్ కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ చెప్పింది.నిజం నిరూపించిన సీసీటీవీ ఫుటేజ్అతను బిడ్డను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించలేదని సీసీటీవీ ఫుటేజ్ ద్వారా నిరూపితమైంది.పటేల్ చాలా ప్రశాంతంగా ఆమె పక్క నుంచి నడుచుకుంటూ వెళ్లడం, ఆమె అతనికి 'థంబ్స్ అప్' చూపించడం స్పష్టంగా కనిపించింది. అలాగే మిల్లర్ చెప్పినట్లుగా అక్కడ ఎలాంటి పెనుగులాట జరగలేదు. ఇదీ చదవండి: రైల్లో శాండ్విచ్...నెటిజన్ల రియాక్షన్స్ వైరల్ వీడియో మానసిక వేదన, వ్యాపార నష్టం ఈ అనుభవాన్ని "పీడకల"గా అభివర్ణించారు. ఈ దారుణమైన అనుభవం తనను మానసికంగా కుంగ దీసిందనీ, ఆర్థికంగా దెబ్బతీసిందని పటేల్ ఆవేదన వ్యక్తం చేశారు. "టైలెనాల్ కోసం వెళ్తే, నా జీవితంలోనే అతిపెద్ద తలనొప్పి ఎదురైంది" అని ఆయన పేర్కొన్నారు. తన కుటుంబం కూడా నరకం చూసిందన్నారు. ఒకవేళ వాల్‌మార్ట్ వీడియో లేకపోయి ఉంటే. ఆమె మాట వర్సెస్ నా మాటగా మారింది. నేనిక జైల్లో మగ్గిపోవాల్సి వచ్చేదన్నారు. ఆ ఫుటేజ్‌అక్షరాలా తన ప్రాణాన్ని కాపాడిందన్నారు.సుమారు రూ. 210 కోట్లుతాను అనుభవించిన మానసిక క్షోభకు పరిహారం చెల్లించాల్సిందిగా ఆయన దావా వేశారు. తనను అన్యాయంగా అరెస్ట్ చేసిన ఆక్వర్త్ నగరంపై, తప్పుడు ఫిర్యాదు చేసిన మిల్లర్‌పై , పోలీసులపై 25 మిలియన్ల డాలర్లు ( సుమారు (రూ.210 కోట్లు) నష్టపరిహారం కోరుతూ ఆయన దావా వేశారు.ఇదీ చదవండి: ఇండియన్ ఫోటోగ్రాఫర్‌కు చిక్కిన తొమ్మిది రంగుల అద్భుతంసీసీటీవీ ఫుటేజ్‌లో ఎలాంటి తప్పు కనిపించకపోయినా పోలీసులు కేసు నమోదు చేయడం అధికార దుర్వినియోగమేనని పటేల్ తరపు న్యాయవాది మార్క్ గ్రాస్మన్ అన్నారు. ఇదీ చదవండి: క్రెడిట్ కార్డ్ పోయింది.. కానీ ఒక్క క్షణం కూడా : జర్మనీ యువతి వైరల్ వీడియో -
టీడీపీది రాక్షసానందం.. జగనన్న మాకు ధైర్యం చెప్పారు
సాక్షి, విజయవాడ: టీడీపీ నేతల దాడిపై మాజీ మంత్రి అంబటి రాంబాబు చిన్న కుమార్తె శ్రీజ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికా నుంచి వీడియో విడుదల చేసిన శ్రీజ.. జగనన్న తమ ఇంటికి వచ్చి అండగా నిలిచారని.. మా తల్లి, అక్కలతో మాట్లాడి ధైర్యం నింపారన్నారు. ‘‘టీడీపీ వాళ్లు మా ఇంటిపై రాళ్లతో దాడి చేశారు. కానీ నిన్న వేలమంది అభిమానంతో మా ఇంటికి వచ్చారు. మా నాన్న చెప్పినట్టే మాకు అండగా వెంకటేశ్వరస్వామి ఉన్నారు’’ అని శ్రీజ పేర్కొన్నారు.‘‘దేవుడి అండ ఉన్నంతవరకు మాపై వేసే ప్రతీ రాయి పువ్వుగా మారుతుంది. ఆయనే మాకు ఓ రక్షణ కవచంలా ఉంటారు. మా ఇంటిపై అత్యంత దారుణంగా అటాక్ చేశారు. 9 గంటల పాటు తండోపతండాలుగా జనం దాడి చేశారు. ఉదయం గుడికి వెళ్లిన నాన్నపై టీడీపీ వాళ్లు దాడి చేశారు. కర్రలతో వచ్చి అంబటి రాంబాబుపై దాడి చేశారు. టీడీపీ మహిళలు బూతులతో ఆయనను తిట్టారు. ఆ సమయంలోనే మా నాన్న అలా మాట్లాడారు. దానికి ఆయన రియలైజ్ అయ్యి ఆ మాట అనకూడదన్నారు. లీగల్‌గా ఎదుర్కొంటానని కూడా చెప్పారు..కానీ మా ఇంట్లో ఆడవాళ్లని దారుణంగా తిడుతూ అటాక్ చేశారు. కాపు కులంకి బూతులు జోడించి తిట్టారు. ఒక డాక్టర్ అయిన కేంద్రమంత్రి దీనిని నడిపించడం దారుణం. ఆయన మేథస్సు ఆయన్ని సరైన మార్గంలో పెట్టలేదా అని అనిపిస్తోంది. అంబటి రాంబాబుని నాలుగు గోడల మధ్య భౌతికంగా వేధించడం దారుణం. ఆయనను వేధించి రాక్షసానందం పొందారు. రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు అని తెలుసుకొవాలి. దాడి చేసిన దానికంటే.. నాలుగు రెట్ల జనం అభిమానంతో వచ్చారు’’ అని శ్రీజ చెప్పారు. -
ఎవరీ వంది వర్మ...? మార్స్ రోవర్స్ తొలి ప్లాన్ డ్రైవ్..
అంగారక గ్రహంపై నాసా తొలి ఏఐ ప్లాన్ డ్రైవ్ వెనుక ఉన్న ప్రధాన శాస్త్రవేత్తగా భారత సంతతి మహిళ వంది వర్మ చరిత్ర సృష్టించారు. భారత్‌కి చెందిన ఈ రోబోటిక్స్ ఇంజనీర్ వంది వర్మ విమానాయనానికి సంబంధించిన కుటుంబంలోనే పెరగడంతో సాంకేతికను అన్వేషించడం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య. నాసా ప్రకారం..వర్మ జేపీఎల్ ప్రిన్సిపాల్ ఇంజనీర్‌గా, కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలోని NASA జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీలో మొబిలిటీ అండ్ రోబోటిక్స్ విభాగానికి డిప్యూటీ సెక్షన్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. అమెరికన్ అంతరిక్ష సంస్థకు ముందు, అధికారికంగా ధృవీకరించిన ప్లాన్ అములు చేసే భాష PLEXIL, రోవర్లు, మానవ అంతరిక్ష ప్రయాణ ప్రాజెక్టులకు సంబంధించిన సాంకేతికతను డెవలప్‌చేయడానికి రూపొందించిన బృందానికి ఆమె నాయకత్వం వహించినట్లు నాసా పేర్కొంది. ఆ కారణంతోనే రోబోటిక్ ఇంజనీరింగ్‌నే కెరీర్‌గా ఎంచుకుంది..వర్మ తండ్రి భారత వైమానిక దళంలో పనిచేశారు. విమానాలు,ఇంజనీరింగ్ వాతావరణాలతో ఆమెకు తొలి దశలో పరిచయం ఉండటం వల్ల ఆమెకు టెక్నాలజీపై ఆసక్తి పెరిగింది. చండీగఢ్‌లోని పంజాబ్ ఇంజనీరింగ్ కళాశాల నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిగ్రీని పూర్తి చేసి, తర్వాత కార్నెగీ మెల్లన్ విశ్వవిద్యాలయం నుంచి రోబోటిక్స్‌లో మాస్టర్స్ అండ్ పిహెచ్డి పొందారామె. ఇక వర్మ డిసెంబర్ 8 నుంచి 10 తేదీల్లో ఏఐ ప్లాన్ పెర్సెవరెన్స్ మార్స్ రోవర్ మొదటి డ్రైవ్‌లను పూర్తి చేసినట్లు నాసా ధృవీకరించింది. ఈ ప్రదర్శనం మన సామర్త్యాలు ఎంతవరకు అభివృద్ధి చెందాయో చెబుతుండటమే గాక, ఇతర ప్రపంచాలను ఎలా అన్వేషించాలో తెలుపుతుందని నాసా అడ్మినిస్ట్రేర్ జారెడ్ ఐజాక్మాన్ చెబుతున్నారు. (చదవండి: మళ్లీ పెళ్లి చేసుకుంటారా..? వృద్ధ మహిళలు ఏమన్నారో తెలుసా..!) -
పావురాలకు దాణా వేస్తే 2.2 లక్షల జరిమానా
సింగపూర్: భారత్‌లో పలు నగరాల్లో విపరీతంగా కన్పించే పావురాలను అమితంగా ఇష్టపడుతూ వాటికి జొన్నల వంటి తిండి గింజలను దాణాగా వేస్తూ పిల్లలుపెద్దలు ఎంతో ఆనందపడతారు. అచ్చం అదే పని చేసి సింగపూర్‌లో ఓ భారతీయ వృద్ధురాలు లక్షల రూపాయల జరిమానా కట్టాల్సి వచ్చింది. పావురాల రెట్ట, వ్యర్థాల్లో పలు రకాల శ్వాసకోశ వ్యాధికారక క్రిములు ఉంటాయి.గాలిలో ఇవి కలిశాక మనుషులు పీలిస్తే ఇబ్బందుల్లో పడతాము. దీంతో పావురాల సంతతి ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోవద్దనే ఉద్దేశంతో వీటికి దాణా వేసి ప్రక్రియపై సింగపూర్‌లో నిషేధం విధించారు. ఈ విషయం తెలీక 71 ఏల్ల షణ్ముగనాథన్ శ్యామల అనే పెద్దావిడ గత ఆరు నెలల్లో తొమ్మిదిసార్లు పావురాలకు దాణా వేశారు. విషయం తెల్సి అధికారులు ఈమెపై కేసు నమోదుచేశారు. విచారించిన కోర్టు ఈమెకు 2,518 డాలర్ల(దాదాపు రూ.2,27,753) జరిమానా విధించింది. -
ఎన్నారైలకు గుడ్‌న్యూస్.. అంత బంగారంపై నోట్యాక్స్
భారత ప్రభుత్వం 2026-27 బడ్జెట్లో ఎన్నారైలకు బంగారంపై కలిపించిన వెసులుబాటు పట్ల వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ఏడాది బడ్జెట్ ప్రవేశ పెట్టే సమయంలో ఎన్నార్లైలకు విధించిన బంగారం పరిమితి నిబంధనలను మారుస్తున్నట్లు తెలిపింది.ఇదివరకూ ప్రవాస భారతీయులు భారత్ వచ్చే సమయంలో వారి వెంట ఉన్న బంగారు ఆభరణాలకు విలువ ఆధారంగా సుంకం ఉండేది. మహిళలకు రూ. లక్షలోపు, పురుషులకు రూ. 50 వేల లోపు విలువ ఉన్న పసిడికి ఎటువంటి సుంకం ఉండేది కాదు. ఆ పైన విలువ ఉన్న వాటికి మత్రమే సుంకం చెల్లించే విధంగా నియమాలు ఉండేవి.అయితే ప్రస్తుత బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బంగారం పరిమితిపై వెసులుబాటును మార్చుతున్నట్లు ప్రకటించింది. ప్రవాస భారతీయులు స్వదేశానికి వచ్చే సమయంలో మహిళలకు 40 గ్రాములు, పురుషులకు 20 గ్రాముల బంగారాన్ని ఎటువంటి సుంకం లేకుండా తీసుకరావచ్చని పేర్కొంది. ఆ పైన ఉన్న వాటికి మాత్రమే పన్ను చెల్లించాలని తెలిపింది. ఇదివరకూ ఉన్న ద్రవ్య విలువ ఆధారంగా రూ. లక్షకు కేవలం ఆరు గ్రాములు, రూ. 50 వేలకు మూడు గ్రాముల పరిమితే ఉంటుంది. ప్రస్తుతం అది 20 నుంచి 40 గ్రాములకు చేరుకుంది. భారత ప్రభుత్వం ఆ పరిమితిని గణనీయంగా పెంచడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
అంబటి, జోగి ఇళ్లపై దాడి.. ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ
వైఎస్సార్సీపీ నేతలు అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై టీడీపీ గూండాల దాడిని వైఎస్సార్సీపీ సెంట్రల్ సౌదీ అరేబియా ఎన్ఆర్ఐ వింగ్ తీవ్రంగా ఖండించింది. ప్రపంచంలోని వివిధ దేశాల్లో తెలుగు ప్రజలు.. ఏపీలో జరుగుతున్న చంద్రబాబు సర్కార్ అరాచకాలను గమనిస్తున్నారని పేర్కొంది. కూటమి సర్కార్.. ప్రజా సంక్షేమాన్ని విస్మరించి, అభివృద్ధిని అడ్డుకుందని.. కేవలం రాజకీయ కక్ష సాధింపులకే ప్రాధాన్యం ఇస్తోందని వైఎస్సార్సీపీ సెంట్రల్ సౌదీ అరేబియా ఎన్ఆర్ఐ బృందం ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో రైతులు, మహిళలు, విద్యార్థులు, నిరుపేదలు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు.అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై జరిగిన విధ్వంసం ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ అని పార్టీ కన్వీనర్ సయ్యద్ రబ్బానీ మండిపడ్డారు. ఈ అక్రమ చర్యలకు పాల్పడిన ప్రతి ఒక్కరూ భవిష్యత్తులో చట్టం ముందు తప్పకుండా జవాబుదారీగా నిలబడాల్సిందేనన్నారు. న్యాయం తప్పక గెలుస్తుందని మేము దృ ఢంగా విశ్వసిస్తున్నామన్నారు. ఇవాళ వైఎస్ జగన్ గుంటూరు పర్యటనకు మద్దతు ప్రకటిస్తున్నామన్నారు. ప్రజలు ఇప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా ముందడుగు వేసి.. ఈ అన్యాయ ప్రభుత్వాన్ని రాజకీయంగా ఎదుర్కొని ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. వైఎస్ జగన్ చూపిన సంక్షేమ మార్గమే.. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అని.. మేమంతా ఆయన వెంటే ఉంటామని సయ్యద్ రబ్బానీ ఒక ప్రకటనలో తెలిపారు. -
Operation CyStrike: నకిలీ వీసా రాకెట్.. గుట్టురట్టు చేసిన సీబీఐ
కువైట్ నకిలీ ఈ-వీసాలను సృష్లించి.. ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసాలకు పాల్పడుతున్న అంతర్జాతీయ నెట్‌వర్క్‌ను భారత కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) ఛేదించింది. అంతర్జాతీయ సైబర్ నేరాల అదుపులో భాగంగా చేపట్టిన ఆపరేషన్ సై-స్ట్రైక్ (Operation CyStrike)తో ముఠా ఆటకట్టించారు. జనవరి 30న ఢిల్లీతో పాటు బీహార్, మహారాష్ట్ర, కర్ణాటక, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని 35 ప్రాంతాల్లో సీబీఐ ఏకకాలంలో దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో కీలక సైబర్ నేరగాడిని అరెస్ట్ చేశారు. కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు, హార్డ్ డ్రైవ్‌లు, నకిలీ వీసాలు, నకిలీ నియామక పత్రాలతో పాటు రూ. 60,000 నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.నిందితులు కువైట్ అధికారిక ఈ-వీసా వెబ్సైట్లను పోలిన నకిలీ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లను సృష్టించారు. తద్వారా నిరుద్యోగులను ఆకర్షించి.. వారి నుంచి పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేస్తూ ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్నారు. ఈ ముఠా కేవలం భారతీయులనే కాకుండా అమెరికా, బ్రిటన్, ఐర్లాండ్ మరియు సింగపూర్ వంటి దేశాల్లోని వ్యక్తులను కూడా లక్ష్యంగా చేసుకుంది. గుర్తింపు దొరక్కుండా ఉండేందుకు వీరు నకిలీ బ్యాంక్ ఖాతాలను ఉపయోగించినట్లు దర్యాప్తులో తేలింది. అధికారులు eservicemoi-kw.com అనే వెబ్‌సైట్‌ను ప్రధాన నకిలీ పోర్టల్‌గా గుర్తించారు.కువైట్ వెళ్లే భారతీయులు జాగ్రత్తగా ఉండాలని.. ఆ దేశంలోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. ఎలక్ట్రానిక్ వీసా దరఖాస్తుల కోసం www.indianvisaonline.gov.in మాత్రమే అధికారిక పోర్టల్ అని స్పష్టం చేసింది. అనధికారిక వెబ్సైట్ల ద్వారా దరఖాస్తు చేసుకుంటే ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా, వ్యక్తిగత డేటా దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది. -
వైఎస్సార్సీపీ గల్ఫ్ దేశాల కన్వీనర్ల నియామకం
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పదవుల భర్తీలో భాగంగా పలు నియామకాలను ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టారు. గల్ఫ్ దేశాలలో వైఎస్సార్సీపీ కన్వీనర్లను నియమిస్తూ.. ఈ మేరకు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.కువైట్-ముమ్మడి బాలిరెడ్డి, రియాధ్(సౌదీ అరేబియా)-ప్రొఫెసర్ సయ్యద్ రబ్బానీ, జుబైల్- శేఖ్ మహెబూబ్ ఇలాహీ, బహ్రెయిన్- ఒర్సు నాగరాజు, దుబాయి-సయ్యద్ అక్రం, ఒమాన్- జి.జి. భాస్కర్‌రావులను కన్వీనర్లుగా పార్టీ నియమించింది. -
లండన్‌లో పానీ పూరీ అమ్ముతున్న ఐఐటీ గ్రాడ్యుయేట్..!
కార్పోరేట్ లైఫ్‌ని వద్దనుకుని మరి ఆతిథ్య రంగాన్ని ఎంచుకుంది భారత సంతతి మహిళ. ఒకప్పుడు శామ్మ్సంగ్ డిజైనర్‌గా పనిచేసిన ఆమె లండన్‌లో తన భర్తతో కలిసి సప్పర్ క్లబ్‌ని రన్ చేస్తుంది. అక్కడ ఆమె పానీపూరితో అపరిచిత భారతీయలును ఒకచోటకుకు చేర్చడమే కాదు వివిధ భారతీయ వంటకాలను పరిచయం చేస్తోంది, లాభాలు ఆర్జిస్తోంది కూడా. అయినా ఐఐటీ చదివి ఇలాఇదే ఎందుకంటే..ఆ దంపతులే అంకిత ఖాంతే, భర్త అమన్ కృష్ణ కలిసి 'ది బౌజీ క్లబ్' అనే సప్పర్ క్లబ్‌ను నిర్వహిస్తున్నారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో పుట్టిన ఖాంతే నాగ్‌పూర్‌లో ఆర్కిటెక్చర్లో బ్యాచిలర్ డిగ్రీని పూర్తిచేసి, ఐఐటీ గుహతిలో మాస్టర్ డిగ్రిని పూర్తి చేసింది. ఆ తర్వాత 2024లో అమన్ కృష్ణను వివాహం చేసుకుని యూకేకి వెళ్లి స్థిరపడింది. ఇక ఆమె భర్త కృష్ణ ఉత్తరప్రదేశ్‌లోని ఓబ్రాలో జన్మించాడు. అతడు ఐఐటీ ధన్‌బాద్ కంప్యూటర్ సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ, ఐఐఐటీ హైదరాబాద్‌లో మాస్టర్ డిగ్రీని పూర్తిచేశాడని చెప్పుకొచ్చింది. తామిద్దరం లండన్ స్థిరపడ్డాక జాబ్ మార్కెట్‌ని పూర్తిగా స్టడీ చేశాం. అంతకుముందు తాను బెంగళూరులో శామ్సంగ్లో ప్రొడక్ట్ డిజైనర్‌గా మూడేళ్లు పనిచేసినట్లు పేర్కొంది. స్నేహితులను అందరికి ఒక చోటకు చేర్చి హోస్టింగ్ చేయడం తనకు హాబీ అని ఆ అలవాటే..ఇలా 'ది బౌజీ క్లబ్' నిర్వహించాలనే ఆలోచనకు నాందిపలికిందన్నారు. పైగా దీని సాయంతో ఇంకా కొత్తవారు పరిచయమవ్వక ఇబ్బంది పడుతున్న భారతీయ ఎన్నారైలకు ఇది హెల్ప్ అవ్వడమే కాకుండా ఆహారంతోనే సులభంగా అందర్నీ ఒకచోటకు చేర్చగలమని దీన్ని ప్రారంభించినట్లు వివరించింది. మొదట్లో కొంతమంది స్నేహితులతో ప్రారంభించామని, ఆ తర్వాత టిక్కెట్టు పొందాక సప్పర్ క్లబ్‌గా మారిందని చెప్పుకొచ్చింది. కొన్ని ఈవెంట్ల తర్వాత ప్రతి మొదటి పదినిమిషాలు చాలా ముఖ్యమైనవి అర్థమైందో దాంతో ..పానీపూరిని ఐస్ బ్రేకర్‌గా పరిచయం చేశాం. అలా ప్రతి విందులో ఇది సిగ్నేచర్ విందుగా పానీపూరితోనే ప్రారంభిస్తామని చెప్పుకొచ్చింది అంకిత. నెలకు సుమారు పది నుంచి 12 మంది ఆతిథ్యం ఇస్తామని..ఇక్కడ ఏడు కోర్సుల ఇండియన్-ఫ్యూజన్ మెనూను అందిస్తున్నట్లు వెల్లడించింది. టికెట్ట ధర ఒక్కొక్కరికి రూ. 6000. అయితే ఈ జంట ఎంత టర్నోవర్ వస్తుందో మాత్రం వెల్లడించలేదు. పండుగ సమయల్లో ఆ పండు నేపథ్య సిరీస్‌తో ఫుడ్‌ని అందిస్తారట కూడా. అంతేగాదు తాము ఐఐటీ గ్రాడ్యుయేట్లు కావడంతోనే వేగంగా అర్థంచేసుకోవడం, రిస్క్ తీసుకోవడం వంటివి చేయగలిగామని సగర్వంగా చెబుతోంది అంకిత. సప్పర్ క్లబ్ అంటే ఏమిటి?ప్రైవేట్ డిన్నర్ పార్టీ, రెస్టారెంట్‌కి మాధ్యమంగా ఉంటుంది ఈ సప్పర్ క్లబ్. దీన్ని సామాజికి భోజన అనుభవంగా చెప్పొచ్చు. విభిన్న నేపథ్యాలున్న వ్యక్తులంతా ఒకచోట చేరి హాయిగా నచ్చిన ఆహారాన్ని ఆస్వాదించే అనుభూతిని అందిస్తుంది. రెస్టారెంట్లో కూడా ఇలానే ఉన్నా..అక్కడ వేరువేరుగా డైనింగ్ టేబుల్‌పై కూర్చొని ఆస్వాదిస్తాం. ఇక్కడ అలా కాదు ఒకచోట సమావేశమైన వ్యక్తుల్లా సహపంక్తి భోజనంలా తింటారు ఈ సప్పర్ క్లబ్లో. (చదవండి: బరువు తగ్గడం అంటే వ్యాయామాలు కాదు..! ఆ ఎనిమిది మార్పులు..) -
Budget 2026 : NRIలకు గుడ్‌న్యూస్, మార్కెట్లకు ఊతం, డైరెక్ట్ పెట్టుబడులు
సాక్షి, న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా 2026-27 బడ్జెట్లో విదేశీ పెట్టుబడిదారులకు శుభ వార్త చెప్పారు. లోక్‌సభలో తొమ్మిదో బడ్జెట్‌ను ప్రవేశ పెడుతున్న ఆమె భారతదేశ ఆర్థిక మార్కెట్లను మరింత బలోపేతం చేయడానికి, మరింత ప్రపంచ మూల ధనాన్ని ఆకర్షించేందుకు సీతారామన్ ఈ రోజు మూడు కీలక అంశాలను ప్రకటించారు కార్పొరేట్ బాండ్లకు మార్కెట్-మేకింగ్ ఫ్రేమ్‌వర్క్, విదేశీ వ్యక్తులు భారతీయ ఈక్విటీలలో పెట్టుబడి పెట్టడానికి కొత్త మార్గం, లిస్టెడ్ కంపెనీలలోఅటువంటి పెట్టుబడిదారులకు యాజమాన్య పరిమితులను పెంచడం.NRI లకు గుడ్న్యూస్పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ (PIS) ద్వారా NRIలు ఇప్పుడు భారతీయ స్టాక్‌లలో పెట్టుబడి పెట్టవచ్చు. విదేశీ పెట్టుబడిదారులు RBI ఆమోదించిన ప్రత్యేక బ్యాంక్ ఖాతా ద్వారా భారతీయ స్టాక్లను కొనుగోలు చేయడానికి , విక్రయించడానికి అనుమతిస్తుంది. ఈ స్కీమ్ ద్వారా భారతీయ స్టాక్‌లలో పెట్టుబడి పెట్టవచ్చని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం కేంద్ర బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. ముఖ్యంగా భారత స్టాక్ మార్కెట్లలో విదేశీ పెట్టుబడుల ప్రవాహాన్ని మరింత పెంచే లక్ష్యంతో విదేశాల్లో నివసిస్తున్న వ్యక్తులు (PROI) ఇకపై భారతీయ లిస్టెడ్ కంపెనీల ఈక్విటీ షేర్లలో నేరుగా పెట్టుబడి పెట్టేందుకు ఉన్న పరిమితిని పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న వ్యక్తిగత పరిమితిని 5 శాతం పెట్టుబడి పరిమితిని 10 శాతానికి పెంచుతూ ప్రతిపాదించారు. అయితే అటువంటి పెట్టుబడిదారులందరికీ కలిపి పరిమితిని 10శాతం నుంచి 24శాతానికి పెంచాలని ప్రతిపాదించారు. ఈ మార్పు తీవ్రమైన విదేశీ వ్యక్తిగత పెట్టుబడిదారులు భారతీయ కంపెనీలలో మరింత అర్థవంతమైన వాటాలను తీసుకోవడానికి వీలు ల్పిస్తుంది. ధరల ఆవిష్కరణను, వాటాలను మరింతగా పెంచుతుంది. దీర్ఘకాలిక మూలధన నిర్మాణాన్ని ప్రోత్సహిస్తుంది. పోర్ట్‌ఫోలియో పెట్టుబడి పథకం ద్వారా నేరుగా భారతీయ ఈక్విటీలలో పెట్టుబడి పెట్టడానికి ప్రభుత్వం అనుమతించాలని కూడా భావిస్తోంది. ప్రస్తుతం, చాలా విదేశీ పోర్ట్‌ఫోలియో ప్రవాహాలు రిజిస్టర్డ్ విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారులు (FPIలు) లేదా నిర్దిష్ట నాన్-రెసిడెంట్ ఇండియన్ (NRI) మార్గాల ద్వారా వస్తాయి. ఇది సాధారణ విదేశీ వ్యక్తికి సంక్లిష్టంగా ఉంటుంది. అటువంటి పెట్టుబడిదారులకు నియంత్రిత, ప్రామాణిక ఈక్విటీ పెట్టుబడి మార్గాలను సులభ తరం చేస్తుంది.అలాగే కార్పొరేట్ బాండ్ల కోసం ప్రతిపాదిత మార్కెట్-మేకింగ్ ఫ్రేమ్‌వర్క్ భారత రుణ మార్కెట్లోని అతిపెద్ద సమస్యలలో ఒకటైన పూర్ లిక్విడిటీని పరిష్కరించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఫ్రేమ్‌వర్క్ కింద, నియమిత సంస్థలు ఎంపిక చేసిన కార్పొరేట్ బాండ్లలో నిరంతర కొనుగోళ్లు, అమ్మకాల కోట్లను అందించేలా సాయపడతాయి. పెట్టుబడిదారులు మరింత సులభంగా మరియు సరసమైన ధరలకు స్థానాల్లోకి ఎంట్రీకి, ఎగ్జిట్‌కి సహాయపడుతుంది. ఇది సేవర్లు , సంస్థలకు సమానంగా, కార్పొరేట్ బాండ్లను బ్యాంకు రుణాలు, స్థిర డిపాజిట్లకు చక్కటి ప్రత్యామ్నాయంగా ఉంటుంది. కంపెనీలు మరింత పోటీ ధరల వద్ద డబ్బును సేకరించడంలో సహాయపడుతుంది. -
హార్వర్డ్ వర్సిటీలో లీడర్షిప్ కోర్సు పూర్తి, సీఎం రేవంత్ ఏమన్నారంటే..
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి అరుదైన ఫీట్ సాధించారు. అమెరికాలోని ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీలోని ‘కెనెడీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్’లో లీడర్షిప్ కోర్సు పూర్తి చేశారు. హార్వర్డ్ కెన్నెడీ స్కూల్ నుంచి సర్టిఫికెట్ అందుకున్న విషయాన్ని తన ఎక్స్ ఖాతాలో స్వయంగా తెలియజేశారాయన. ఈ నెల 25 నుంచి 30 వరకు ‘లీడర్షిప్ ఫర్ ది ట్వంటీ ఫస్ట్ సెంచరీ’ పేరిట నిర్వహించిన తరగతులకు ఆయన హాజరైన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని ఆయన ఎక్స్‌లో షేర్ చేసుకున్నారు. 20 దేశాల నుంచి వచ్చిన 60 మంది విద్యార్థులతో కలిసి తరగతులకు హాజరైనట్లు.. టీచర్స్, తోటి విద్యార్థుల నుంచి ఎంతో నేర్చున్నట్లు తెలిపారు.హార్వర్డ్ కెన్నెడీ స్కూల్లో నిర్వహించిన ‘లీడర్షిప్ ఫర్ ది ట్వంటీ ఫస్ట్ సెంచరీ’ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్‌ను పూర్తి చేసిన సంతోషాన్ని మీతో పంచుకుంటున్నాను. ఇక్కడి ప్రతికూల వాతావరణంలోనే నా ఈ కోర్సు పూర్తైంది. ఆ సమయంలో అధ్యాపకులు, తోటి విద్యార్థుల రూపంలో అద్భుతమైన వ్యక్తులను కలుసుకున్నాను. వాళ్ల నుంచి ఎంతో విలువైన పాఠాలు నేర్చుకున్నాను అని ట్వీట్ చేశారాయన.With great delight and modest accomplishment I wish to share that I have completed my executive education program “Leadership in the 21st century”at the prestigious #Harvard @Kennedy_School today. The class of over 60 students from 20 countries meant acquiring learnings not… pic.twitter.com/54azRDuL3v— Revanth Reddy (@revanth_anumula) January 30, 2026 -
కుక్క కోసం రూ. 15 లక్షలా..? ఎన్నారై దంపతులు..
శునకాలను చాలమంది ఎంతో ఇష్టంగా పెంచుకుంటారు. వాటిని ఎంత ప్రేమగా, లాలనగా చూస్తోరో తెలిసిందే. కానీ మరీ ఇంతలా పెంపుడు జంతువు కోసం డబ్బు ఖర్చే చేసిన వాళ్లను చూసుండరు. అది కూడా లక్షల్లో అంటే..ఇదేం పిచ్చిరా బాబు అనేస్తాం. కానీ ఈ ఎన్నారై దంపతులు అది కేవలం కుక్క కాదు తమ బిడ్డ అని చెబుతుండటం విశేషం. ఇంతకీ ఆ ఎన్నారై దంపతులు ఆ కుక్క కోసం ఎందుకు అంతలా ఖర్చు చేశారంటే..ఎన్నారై దంపతులు దివ్య, జాన్‌లు తమ కుక్క కోసం ఎంతలా కష్టపడి భారత్ నుంచి ఆస్ట్రేలియాకు తెచ్చుకున్నామో 'కహానీ ఆఫ్ టేల్స్' అనే ఇన్స్టాగ్రామ్ ఖాతాలో వివరించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌కు చెందిన ఈ జంట ఆస్ట్రేలియా వెళ్లాలనుకున్నప్పుడూ..తామెంతో ప్రేమగా పెంచుకున్న స్కై అనే కుక్కని కూడా తమతోపాటే తెచ్చుకోవాలని అనుకున్నారు. అయితే భారత్ నుంచి కుక్క నేరుగా ఆస్ట్రేలియాకు తెచ్చుకోవడానికి అక్కడి ప్రభుత్వం అనుమతించదు. భారతదేశం నుంచి వచ్చే కుక్కలు ర్యాబిస్ లేని దేశంలో ఆరు నెలలపాటు ఉంచాలి. అప్పుడే దాన్ని ఆస్ట్రేలియాకి తీసుకురావడానికి అనుమితిస్తుంది అక్కడ ప్రభుత్వం. పైగా ఆ తతంగం అంతా చాలా వ్యయప్రయాసలతో కూడుకున్నది. అయినప్పటికీ తగ్గేదే లే అంటూ..ఈ జంట దుబాయ్‌లో తమ ప్రియమైన కుక్కతో కలిసి ఆరు నెలలు ఉన్నారు. మొత్తం ప్రక్రియకు 190 రోజులు పట్టింది. చాలా పేపర్ వర్క్, పలు పశువైద్య పరీక్షలు, టీకాలు, క్వారంటైన్ ఫీజులు అన్ని పూర్తయ్యాక..తాము ముగ్గురం కలిసి అనుకున్నట్లుగానే ఆస్ట్రేలియా వెళ్లే క్షణం రానే వచ్చింది. ఆక్షణం తమకెంతో అపురూపమైనదని, ఎన్నో త్యాగాలు, వ్యయప్రయాసాలు తర్వాత దక్కిన ఉద్విగ్నభరిత క్షణం అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో తమ భావోద్వేగ ప్రయాణాన్ని షేర్ చేసుకున్నారు. ఇంతకీ ఆ ఎన్నారై జంట ఆ కుక్క కోసం ఎంత ఖర్చు చేశారో వింటే షాకవ్వడం ఖాయం. ఎందుకంటే ఆ కుక్క కోసమే దాదాపు రూ. 15 లక్షలకు పైనే ఖర్చు చేశారట. పైగా ఆ దంపతులు ఇదేం పిచ్చి వ్యామోహం అనుకోవచ్చు. కానీ అది తమకు కేవలం కుక్క కాదని..తమ బిడ్డేనని..అందువల్ల ఇలా చేశామని ఆ దంపతులు పోస్ట్‌లో పేర్కొనడం విశేషం. View this post on Instagram A post shared by Kahaanioftails (@kahaanioftails) (చదవండి: ఎవరీ సోఫీ రెయిన్? సోషల్ మీడియా సాయంతో అన్ని కోట్లా..!) -
చాట్‌జీపీటీతో చిక్కుల్లో పడ్డ గొట్టుముక్కల మధు
ఏఐ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. వీలైనన్ని ఎక్కువ మార్గాల్లో వినియోగించుకుంటున్నారు యూజర్లు. ఈ క్రమంలో అమెరికాలో సంచలనం చోటు చేసుకుంది. అమెరికా సైబర్ ఏజెన్సీ అధికారి ఒకరు చాట్‌జీపీటీ వినియోగంతో చిక్కుల్లో పడ్డారు. ఆయన భారతీయ మూలాలు, అందునా తెలుగు మూలాలు ఉన్న వ్యక్తి కావడం ఇక్కడ విశేషం. అమెరికా ప్రభుత్వ నెట్‌వర్క్‌లను రక్షించే బాధ్యత కలిగిన సీఐఎస్ఏ(Cybersecurity & Infrastructure Security Agency) చూసుకుంటుంది. దానికి తాత్కాలిక డైరెక్టర్ ఉన్న డాక్టర్ మధు గొట్టుముక్కల(Madhu Gottumukkala) ఏఐతో కొత్త తలనొప్పి తెచ్చి పెట్టుకున్నారు. చాట్‌జీపీటీలో ఆయన సంస్థకు చెందిన కీలకమైన పత్రాలను అప్లోడ్ చేశారట. అది పబ్లిక్ వెర్షన్లో కావడంతో వివాదం రాజుకుంది. పొలిటికో నివేదిక ప్రకారం.. కిందటి ఏడాది జులై-ఆగస్టు మధ్యకాలంలో మధు గొట్టుముక్కల కాంట్రాక్టింగ్ అండ్ సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన పత్రాలను చాట్‌జీపీటీకి అప్లోడ్ చేశారు. అవి అంత గోప్యమైనవి కాకపోయినా.. కేవలం అధికారిక సంబంధిత పత్రాలే(For Official Use Only) కావడంతో రచ్చ మొదలైంది. ఆయన అలా అప్లోడ్ చేయగానే.. ఆటోమేటెడ్ సెక్యూరిటీ అలర్ట్ మోగింది. దీంతో డీహెచ్ఎస్ (Department of Homeland Security) అప్రమత్తమైంది. మధు గొట్టుముక్కల చేసిన పని వల్ల ఏదైనా నష్టం జరిగిందా? అనేదానిపై డీహెచ్ఎస్ సమీక్ష జరిపింది. అయితే ఆ ఇంటర్నల్ రివ్యూలో ఏం తేలిందో మాత్రం ఇంకా వెల్లడించలేదు. ఆయనపై ఏమైనా చర్యలు ఉంటాయా? అనేదానిపైనా స్పష్టత రావాల్సి ఉంది. సాధారణంగా.. డీహెచ్ఎస్ పరిధిలోని ఉద్యోగులకు చాట్‌జీపీటీ, ఇతర ఏఐ టూల్స్‌ను ఉపయోగించడానికి యాక్సెస్ ఉండదు. కానీ, మధు గొట్టుముక్కల మాత్రం ప్రత్యేక అనుమతి తీసుకున్నారట. ప్రత్యేక అనుమతులతో పరిమితంగా ఉపయోగించేందుకు వీలుందట. అయితే అందులో డాక్యుమెంట్లను అప్లోడ్ చేయడం అభ్యంతరాలకు దారి తీసింది. ఈ క్రమంలో ఆయనపై సస్పెన్షన్ వేటు లేదంటే బదిలీ వేటులాంటి చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. లేదంటే.. ఏఐ టూల్స్ వినియోగంపై మరింత కఠినంగా వ్యవహరించే అవకాశం ఉందని తెలుస్తోంది. మధు గొట్టుముక్కల.. భారతీయ మూలాలు కలిగిన అమెరికన్ అధికారి. ఆయన స్వస్థలం ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంగా తెలుస్తోంది. కుటుంబం గురించి వివరాలు తెలియాల్సి ఉంది. రష్యా, చైనా వంటి దేశాల నుండి వచ్చే అధునాతన సైబర్ ముప్పులను సీఐఎస్ఏ డైరెక్టర్ ఎదుర్కోవడం ఆయన బాధ్యత. డకోటా స్టేట్ యూనివర్సిటీలో పీహెచ్డీ, డల్లాస్‌లో ఎంబీఏ, అర్లింగ్టన్లో ఎంఎస్, విశాఖ ఆంధ్రా యూనివర్సిటీలో బీఈ చేశారు. ఆయన చేసిన పని అమెరికా సైబర్ సెక్యూరిటీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ప్రభుత్వ సున్నితమైన పత్రాలను AI ప్లాట్‌ఫారమ్‌లలో ఉపయోగించడం ఎంతవరకు సురక్షితం అనే ప్రశ్న ముందుకు తెచ్చింది. -
కెనడియన్ సిటిజన్ షిప్ వేడుక : చీరలో ‘దివ్య’ ముస్తాబు
ఏదైనా ప్రత్యేక సందర్భం అనగానే మహిళలకు ముందుగా గుర్తొచ్చే దుస్తులు చీర. అలా కెనడా పౌరసత్వం తీసుకునే సందర్భంగా మహారాష్ట్రకు చెందిన మహిళ ఈ వేడుకను మరింత ప్రత్యేకంగా నిలిచిపోవాలని భావించింది. తమ ప్రాంతానికి చెందిన చీర, ముస్తాబులో స్పెషల్‌గా కనిపించాలని నిర్ణయించుకుంది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది పలువురిని ఆకట్టుకుంటోంది.మహారాష్ట్రకు చెందిన దివ్య లాట్లికర్ కెనడా పౌరసత్వ ప్రమాణ స్వీకారోత్సవానికి నౌవారీ చీరతో హాజరై అందర్నీ ఆకర్షించారు. తన సొంత రాష్ట్రం నుండి వచ్చిన సాంప్రదాయ చీరను ధరించి, నుదిటిపై బిందీతో ముస్తాబైంది. ఈ వేడుకును ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె పంచకుంది. నౌవారీ చీర ధరించడం తన జీవితంలోని అత్యంత ముఖ్యమైన క్షణాలలో ఒకటని ఆమె తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ చీర బలం, గౌరవం, సహనం, కొనసాగింపుకు చిహ్నం అని ఆమె అన్నారు. పౌరసత్వ ప్రమాణాన్ని స్వీకరిస్తూ, సర్టిఫికేట్ అందుకుంటున్న ఆ క్షణం ఆమెలో ఇన్నేళ్ల కృషి, సంకల్పం ప్రతిబింబించింది.ఇదీ చదవండి: నిపా వైరస్ కలకలం : ఎయిర్‌పోర్ట్స్‌లో హై అలర్ట్ఇన్స్టాగ్రామ్లో వీడియోను పంచుకుంటూ, దివ్య దేశం పట్ల తనకున్న ప్రేమను వ్యక్తం చేసింది. తాను ఉన్న చోట ఉండటం గర్వంగా ఉందని, అలాగే ఏ దేశమేగినా, పుట్టిన నేలను మర్చిపోకూడదని, మూలాలను సజీవంగా ఉంచుకోవడం తనకెంతో గర్వకారణమని వ్యాఖ్యానించారు. View this post on Instagram A post shared by Divya (@divyalotlikar) ఆ వేడుకలో ఆమె ధరించిన చీర, సాంప్రదాయ వేషధారణపై సోషల్ మీడియా వినియోగదారులు ప్రశంసలు కురిపించారు. చాలా సహజంగా, అందంగా ఆత్మవిశ్వాసంతో కనిపించారంటూ దివ్యను కొనియాడారు. అచ్చమైన మరాఠీ అమ్మాయిలా ఉన్నారన్నారు. అలాగే తన అమెరికా పౌరసత్వ స్వీకరణ సందర్బంగా తాను కూడా మరాఠీ దుస్తులు ధరిస్తానని, మంచి ఐడియా ఇచ్చినందుకు థ్యాంక్స్ అంటూ మరొకరు వ్యాఖ్యానించడం విశేషం. -
వలస కార్మికులకు బంపర్ ఆఫర్
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) వెళ్లాలనుకునే వలస కార్మికుల ఉచిత వీసాల కోసం అక్కడి ఏడీఎన్‌హెచ్ సంస్థ, తెలంగాణలోని జీటీఎం సంస్థలు రిక్రూట్మెంట్ ర్యాలీకి సన్నాహాలు చేస్తున్నాయి. ఫిబ్రవరిలో నాలుగు చోట్ల ఇంటర్వ్యూలను నిర్వహించడానికి ఏర్పాట్లు చేశాయి. క్లీనింగ్ విభాగంలో పనిచేసేందుకు ఉచితంగా వీసాలను జారీ చేసి, ఉచిత విమాన టికెట్, వసతి, భోజన సదుపాయం కల్పించి.. మన కరెన్సీలో రూ.23 వేల వరకు వేతనాలను చెల్లించనున్నారు. వచ్చే నెల 6న జగిత్యాల, సిరిసిల్లలో, 7న నిజామాబా ద్, ఆర్మూర్‌లలోని జీటీఎం సంస్థ కార్యాలయాలలో ఇంటర్వ్యూలను నిర్వహించనున్నారు. వివ రాల కోసం ఆర్మూర్ (8332062299), నిజామాబాద్ (8686860999), జగిత్యాల (83320422 99), సిరిసిల్ల (9391661522) నంబర్లలో సంప్రదించవచ్చని కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు. దళారుల్ని నమ్మొద్దు ఈనెల 9, 10 తేదీలలో ఇంటర్వ్యూలకు హాజరైన వంద మందిని రెండు మూడు రోజుల్లో యూఏఈకి పంపించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. దళారులను నమ్మి మోసపోవద్దు. – చీటీ సతీశ్‌రావు, చైర్మన్, జీటీఎం ఇంటర్నేషనల్ (చదవండి: 90 నిమిషాల ఎమర్జెన్సీ రూమ్‌కి..హడలెత్తించేలా బిల్లు..!) -
వైభవంగా తానా మిడ్-అట్లాంటిక్ సంక్రాంతి సంబరాలు
సంక్రాంతి సంబరాలను చూడటానికి వచ్చిన జనసందోహం, మరోవైపు తమ ఆట, పాటలతో మైమరపింపజేసిన చిన్నారులతో తానా మిడ్-అట్లాంటిక్ టీమ్ నిర్వహించిన సంక్రాంతి సంబరాలు సూపర్ హిట్టయింది. వెస్ట్ చెస్టర్ లో జనవరి 17వ తేదీన జరిగిన ఈ సంక్రాంతి సంబరాల్లో దాదాపు 1500మందికిపైగా వచ్చిన జనసందోహం నిర్వాహకులకు, కళాకారులకు ఉత్సాహాన్ని ఇచ్చింది. దానికితోడు సంక్రాంతి థీమ్ ను ప్రతిబింబించేలా చేసిన కార్యక్రమాలు, పోటీలు అందరిలోనూ పాల్గొనేలా చేశాయి.తానా మిడ్ అట్లాంటిక్ కు చెందిన బోర్డ్ డైరెక్టర్ రవిపొట్లూరి ఆధ్వర్యంలో తానా మిడ్-అట్లాంటిక్ రీజినల్ రిప్రజెంటేటివ్ ఫణి కంతేటి, తానా బెనిఫిట్ కోఆర్డినేటర్ వెంకట్ సింగుల మార్గదర్శకత్వంలో ఈ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు పెద్ద పీట వేస్తూనే మరోవైపు చిన్నారులు పాడిన సినిమా పాటలు ఎంతోమందిని అలరింపజేశాయి. యాంకర్లు శ్వేత కొమ్మోజి, మనీషా మేక కూడా కార్యక్రమాల విజయానికి తమవంతుగా వ్యాఖానాలను జోడించి ప్రేక్షకుల మనస్సులను దోచుకున్నారు. సాంప్రదాయ భోగిపళ్లు కార్యక్రమంలో ఎంతోమంది పిల్లలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెద్దలు వారిపై భోగిపళ్ళు పోసి ఆశీర్వదించారు. సంక్రాంతి వేడుకలను పురస్కరించుకుని నిర్వహించిన ముగ్గుల పోటీలు, కిడ్స్ విలేజ్ థీమ్ కాంటెస్ట్ కు మంచి స్పందన వచ్చింది. ఎంతోమంది తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ ఈ పోటీల్లో పాల్గొన్నారు. పోటీల్లో పాల్గొన్నవారిని తానా నాయకులు అభినందించారు. ఇటీవల తానా మిడ్ అట్లాంటిక్ తన సేవా కార్యక్రమాల్లో భాగంగా స్థానిక ఫుడ్ బ్యాంకుల కోసం 7,000 పౌండ్లకు పైగా ఆహారాన్ని విరాళంగా సేకరించడంలో ప్రతిభ కనబరిచిన యువ వలంటీర్లను ఈ సంక్రాంతి వేడుకల్లో సత్కరించడం హైలైట్ గా నిలిచింది. వెస్ట్ వైట్ ల్యాండ్ టౌన్ షిప్ బోర్డ్ ఆఫ్ సూపర్ వైజర్స్ వైస్-ఛైర్ మిస్టర్ రాజేష్ కుంభార్దరే ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసి వలంటీర్లను సత్కరించారు.తానా అధ్యక్షుడు డాక్టర్ నరేన్ కొడాలి, తానా బోర్డ్ డైరెక్టర్ రవి పొట్లూరి తదితరులు ఈ వేడుకలను వైభవంగా నిర్వహించిన తానా మిడ్-అట్లాంటిక్ టీమ్ ను అభినందించారు. ఈవెంట్ కోఆర్డినేటర్లు సురేష్ యలమంచిలి, కృష్ణ నందమూరితోపాటు మిడ్ అట్లాంటిక్ టీమ్ నాయకులు, వలంటీర్లు ఈ వేడుకల విజయవంతానికి కృషి చేశారు. ఈ వేడుకలకు గ్రాండ్ స్పాన్సర్ గా వ్యవహరించిన క్రాస్ రోడ్స్, గోల్డెన్ స్పాన్సర్స్ గా ఉన్న శ్రీధర్ అంచూరి మరియు సురేష్ బందుగులకు, కమలం ది డెకర్ కంపనీకి, అతిథులకు, వలంటీర్లకు కమ్యూనిటీ నాయకులకు, ఈ వేడుకకు సహకరించిన అందరికీ తానా మిడ్-అట్లాంటిక్ టీమ్ ధన్యవాదాలు తెలియజేసింది.తానా మిడ్ అట్లాంటిక్ టీమ్`సరోజ పావులూరి, దీప్తి కోక, మనీషామేక, శైలజ కస్తూరి, సునీత వాగ్వాల, మైత్రి నూకల, బిందు ఆలపాటి, రమ్య మాలెంపాటి, ఇందు సందడి, రాణి తుమ్మల, భవానీ క్రొత్తపల్లి, అనుపమ యలమంచి, భవానీమామిడి, నీలిమ వోలేటి, రవీన తుమ్మల, శ్రావణి రాయలతోపాటు, విశ్వనాథ్ కోగంటి, శ్రీధర్ సాధినేని, శ్రీకాంత్ గూడురు, గోపి వాగ్వాల, ప్రసాద్ క్రొత్తపల్లి, కోటి యాగంటి, వెంకట్ ముప్పా, రమేష్ గుట్ట, శ్రీనివాస్ కోట, శ్రీనివాస్ అబ్బూరి, ప్రసాద్ కస్తూరి, రంజిత్ కోమటి, రంజిత్ మామిడి, మూర్తి నూతనపాటి, చందు భాతుస్కర్, సంతోష్ రౌతు, సత్య పొన్నగంటి, రాజు గుండాల, రాధాకృష్ణ మూల్పూరి, నాయుడమ్మ యలవర్తి, చలం పావులూరి, మోహన్ మల్ల ఈ వేడుకల విజయవంతానికి సహకరించారు. -
భార్యను, బంధువులను కాల్చి చంపాడు!
న్యూయార్క్: అమెరికాలో ఘోరం జరిగింది. కుటుంబ కలహాల కారణంగా ఓ భారత సంతతి వ్యక్తి క్షణికావేశంలో విచక్షణ కోల్పోయాడు. భార్య, ఆమె తరఫు ముగ్గురు బంధువులపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. వారు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. కళ్లముందే జరిగిన దారుణం చూసి బెంబేలెత్తిపోయిన అతని 12 ఏళ్ల కొడుకు, బంధువుల తాలూకు మరో ఇద్దరు పిల్లలు వెంటనే ఓ గదిలోకి దూరి గడియ పెట్టుకుని బతికిపోయారు. కొడుకు 911కు ఫోన్ చేయడంతో పోలీసులు సకాలంలో స్పందించి హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. అప్పటికే పారిపోయిన నిందితున్ని కొద్ది దూరంలోనే అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఈ దారుణం అందరినీ కలచివేస్తోంది. నిందితున్ని విజయ్‌కుమార్ (51)గా, మృతులను అతని భార్య మీమూ డోగ్రా (43), మిగతా వారిని గౌరవ్ కుమార్ (33), నిధీ చందర్ (37), హరీశ్ చందర్ (38)గా గుర్తించారు. ఇది మాటలకందని ఘోరమని అట్లాంటాలోని భారత కాన్సులేట్ జనరల్ పేర్కొంది. బాధిత కుటుంబానికి అన్నివిధాల సాయమూ అందిస్తున్నట్టు పేర్కొంది. గదిలో దాక్కున్న పిల్లలు విజయ్‌కుమార్ దంపతులు జార్జియా రాష్ట్రంలోని అట్లాంటాలో నివసిస్తుండేవారు. శుక్రవారం అర్ధరాత్రి ఏదో విషయమై ఇద్దరూ తీవ్రంగా గొడవ పడ్డారు. ఘర్షణ నడుమే కొడుకుతో కలిసి శివారు నగరమైన లారెన్స్విలేలోని బ్రూక్స్ ఐవీ కోర్ట్‌లో ఉంటున్న డోగ్రా తాలూకు బంధువులు గౌరవ్, నిధి, హరీశ్ ఇంటికి చేరుకున్నారు. ఆ తర్వాత కాసేపటికే ఘర్షణ శ్రుతిమించి కాల్పులకు దారితీసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. గొడవకు దారితీసిన కారణమేమిటో తెలియాల్సి ఉందని చెప్పారు. ‘‘విజయ్ దంపతుల 12 ఏళ్ల కొడుకు తెల్లవారుజాము 2:30 ప్రాంతంలో మాకు కాల్ చేసి దారుణం గురించి చెప్పాడు. రాపిడ్ రెస్పాన్స్ బృందం నిమిషాల్లోనే ఘటనాస్థలికి చేరుకుంది. నలుగురు వ్యక్తు లు ఇంట్లో తూటా గాయాలతో పడిపోయి కన్పించారు. ముగ్గురు పిల్లలు సకాలంలో స్పందించి పక్క గదిలోకి పరుగెత్తి దాక్కోవడంతో దాడి నుంచి బయ ట పడ్డట్టున్నారు’’అని పోలీసులు వివరించారు. -
TPAD అధ్యక్షురాలిగా వరుసగా మూడోసారీ మహిళకే పట్టం
డల్లాస్, టెక్సాస్‌లో శక్తివంతమైన, ప్రభావవంతమైన తెలుగు సంస్థగా అక్కడి తెలుగు ప్రజల మన్ననలు పొందుతున్న “డల్లాస్ తెలంగాణ ప్రజా సమితి (TPAD)”.. 2026 సంవత్సరానికి గాను తన నూతన కార్యవర్గ బృందానికి బాధ్యతలు అప్పగించింది. గత 12 ఏళ్లలో టీప్యాడ్, డల్లాస్‌లోని తెలుగు సమాజంలో స్వచ్ఛంద సేవకులు, కమ్యూనిటీ సభ్యులను విస్తృతంగా ఆకర్షిస్తూ అనేక కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తోంది. బలమైన సంస్థాగత నిర్మాణం ద్వారా అనేక మందిని నాయకులుగా తీర్చిదిద్దింది.సమాజ సేవ, సంస్కృతి పరిరక్షణతో పాటు మంచి నాయకులను తీర్చిదిద్దడంలో అద్భుతమైన చరిత్ర కలిగిన టీప్యాడ్, ఫ్రిస్కో, టెక్సాస్‌లోని ఎలిగెన్స్ బాల్రూమ్లో స్థానిక కమ్యూనిటీ నాయకులు, మద్దతుదారుల సమక్షంలో తన 13 వ ఎగ్జిక్యూటివ్ టీమ్ తో ప్రమాణస్వీకారం చేయించింది. టీప్యాడ్ అధ్యక్షురాలిగా లక్ష్మి పోరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. మహిళలే అధ్యక్ష పీఠాన్ని అధిరోహించడం ఇది వరుసగా మూడోసారి కావడం విశేషం. మహిళా సాధికారతకు, మహిళా నాయకత్వాన్ని ప్రోత్సహించడానికి టీప్యాడ్ ఇస్తున్న ప్రాధాన్యానికి నిదర్శనం.టీప్యాడ్ చరిత్ర, నేపథ్యంపై విస్తృత అవగాహన కలిగిన వీణా యలమంచిలి కార్యక్రమాన్ని సాఫీగా నిర్వహించారు. సీనియర్ టీప్యాడ్ నాయకులు మరియు ఫౌండేషన్ కమిటీ సభ్యుడు రావు కల్వాల — రఘువీర్ బండారు (FC ఛైర్), అజయ్ రెడ్డి (FC వైస్ ఛైర్)లతో ప్రమాణ స్వీకారం చేయించారు. టీప్యాడ్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సభ్యుడు సుధాకర్ కలసాని — కార్యవర్గ సభ్యులు మరియు పదాధికారులతో ప్రమాణ స్వీకారం చేయించారు.కొత్త కమిటీ సభ్యులు లక్ష్మి పోరెడ్డి (అధ్యక్షురాలు), శ్రీనివాస్ అన్నమనేని (ఉపాధ్యక్షుడు), గాయత్రి గిరి (కార్యదర్శి), శివ కొడిత్యాల (సహ కార్యదర్శి), ఆదిత్య రెడ్డి (ఖజాంచీ), దీపిక దీపికా రెడ్డి (సహ ఖజాంచీ) .నూతన ఈసీ సభ్యులు:బాల గణపవరపు, మాధవి ఓంకార్, శ్రవణ్ కుమార్ నిడిగంటి, హరిక పల్వాయి, సాధన రెడ్డి, ధాత్రి బల్లమూడి, బద్రి బియ్యపు, తిలక్ కుమార్ వన్నంపుల.రవికాంత్ మామిడి, అశోక్ పొద్దుటూరి, రోజా అడెపు, మాధవి సుంకిరెడ్డి, రామ్ అన్నాడి, అశోక్ కొండాల, పాండురంగ రెడ్డి పల్వాయి, బుచ్చి రెడ్డి గోలితో ప్రమాణ స్వీకారం చేయించారు. అలాగే రవికాంత్ మామిడి (BOT ఛైర్), లింగా రెడ్డి ఆల్వా (BOT కోఆర్డినేటర్), రోజా అడెపు (BOT వైస్ ఛైర్)లకు కూడా ప్రమాణ స్వీకారం చేయించారు.ప్రమాణ స్వీకార అనంతరం మాట్లాడిన FC ఛైర్ రఘువీర్ బండారు, BOT ఛైర్ రవికాంత్ మామిడి, అధ్యక్షురాలు లక్ష్మి పోరెడ్డి, కోఆర్డినేటర్ లింగా రెడ్డి ఆల్వా, BOT వైస్ ఛైర్ రోజా అడెపు-రక్తదాన శిబిరాలు, ఆహార పంపిణీ కార్యక్రమాలు, తెలంగాణ సాంస్కృతిక వేడుకల నిర్వహణ, బతుకమ్మ, దసరా సంబరాలను డీఎఫ్‌డబ్ల్యూ తెలుగు సమాజం ఆశించే స్థాయిలో ఘనంగా నిర్వహించేందుకు నూతన బృందం కట్టుబడి ఉందని తెలిపారు. గత 12 సంవత్సరాలుగా టీప్యాడ్‌కు నిరంతర మద్దతు అందిస్తున్న సపోర్టర్లు, స్పాన్సర్లకు టీప్యాడ్ నాయకత్వం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసింది.టీప్యాడ్ 2026 కార్యవర్గం:ఎగ్జిక్యూటివ్ కమిటీ:లక్ష్మి పోరెడ్డి (President), అనురాధ మేకల (Past President), శ్రీనివాస్ అన్నమనేని (Vice President), గాయత్రి గిరి (Secretary), శివ కొడిత్యాల (Joint Secretary), ఆదిత్య రెడ్డి (Treasurer), దీపిక దీపికా రెడ్డి (Joint Treasurer), స్వప్న తుమ్మపాల, నిఖిల్ కందుకూరి, ప్రశాంత్ నిమ్మని, మాధవి ఓంకార్, స్నేహా రెడ్డి, సంతోష్ రెగొండ, సాధన రెడ్డి, ధాత్రి బల్లమూడి, బద్రి బియ్యపు, శ్రవణ్ కుమార్ నిడిగంటి, హరిక పల్వాయి, తిలక్ కుమార్ వన్నంపుల, రత్న వుప్పల, బాల గణపవరపు.బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్:రవికాంత్ మామిడి (BOT ఛైర్), రోజా అడెపు (BOT వైస్ ఛైర్), లింగా రెడ్డి ఆల్వా (BOT కోఆర్డినేటర్), మాధవి సుంకిరెడ్డి, రమణ లష్కర్, పాండురంగ రెడ్డి పల్వాయి, రామ్ అన్నాడి, బుచ్చి రెడ్డి గోలి, అశోక్ కొండాల, పవన్ గంగాధర, సుధాకర్ కలసాని, అశోక్ పొద్దుటూరి.ఫౌండేషన్ కమిటీ:రఘువీర్ బండారు (FC ఛైర్), అజయ్ రెడ్డి (FC వైస్ ఛైర్), జనకిరామ్ మండాది, ఉపేందర్ తెలుగు, రాజ్ గోంధి, మహేందర్ కమిరెడ్డి -
90 నిమిషాల ఎమర్జెన్సీ రూమ్‌కి..హడలెత్తించేలా బిల్లు..!
చాలామంది భారతీయ యువత డ్రీమ్ అమెరికా. కానీ ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పుణ్యమా అని ఆ కలలన్నీ దాదాపు కనుమరుగనే చెప్పాలి. అయినా కూడా అమెరికా అంటే మోజు మాములుగా ఉండదు. అక్కడ ఉండే సౌకర్యాలు, ఉన్నత చదువులు, మంచి వేతనం తదితరాల రీత్యా ఆ దేశం అంటే మహా మక్కువ చాలామంది యువతకు. కానీ దూరపు కొండలు నునుపు అన్నట్లుగా అక్కడకు అడుగుపెడితేగానీ అసలు విషయం అవగతమవ్వదు. బహుశా అప్పటికి గానీ జన్మభూమికి మించిన స్వర్గసీమ మరొకటి లేదని తెలిసిరాదేమో. సౌకర్యాలు, జీతాలు పరంగా బాగున్నా..కొన్ని విషయాలు చూడగానే మన దేశం కచ్చితంగా గుర్తొచ్చేస్తుంది. అలాంటి ఘటనే ఇక్కడ ఓ ఎన్నారై ఎదుర్కొన్నాడు. ఇదేం అమెరికా లైఫ్ అంటూ బాధపడుతున్నాడు. అసలేం జరిగిందంటే..ప్రవాస భారతీయుడు పార్థ్ విజయ వర్గియాకు ఐస్ స్కేటింగ్ చేస్తుండగా చిన్న గాయమైంది. అయితే అక్కడ అంబులెన్స్‌కి అయ్యే అధిక ఖర్చుకి భయపడి..నొప్పి భరిస్తూ మరి తనే కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్లాడు. అక్కడ ఆస్పత్రిలోని ఎమర్జెన్సీ రూమ్‌లో చికిత్స పొందాడు. అయితే ఆ ఎమర్జెన్సీ రూంలో గడిపింది జస్ట్ 90 నిమిషాలే..దానికే మనోడుకి వేసిన బిల్లు చూస్తే..కళ్లు బైర్లుకమ్ముతాయ్. పాపం ఇక్కడ వర్గియాకు కూడా ఆ ఆస్పత్రి వేసిన బిల్లు చూసి కళ్లుగిర్రున తిరిగాయి. ఏడుపు ఒక్కటే తక్కువ అన్నంత పనైంది. ఆ విషయాన్నే సోషల్ మీడియా వేదికగా తన బాధనంతో ఓ వీడియో రూపంలో షేర్ చేసుకున్నాడు. ఇంతకీ వర్గియాకు ఎంత బిల్లు వేశారంటే..అక్షరాల రూ. 1.5 లక్షలు. సర్జరీ లేదు ఏం లేదు..జస్ట్ కొద్దిపాటి ట్రీట్మెంట్కి గుబగుయ్యిమనిపించేలా బిల్లు వేసింది ఆస్పత్రి. అదృష్టం ఏంటంటే వర్గియాకు హెల్త్ ఇన్సురెన్సూ ఉండటంతో అది క్లైయిమ్ చేసుకున్నాడు లేండీ. అలా క్లైయిమ్ చేసుకునేటప్పుడే వర్గియాకు తెలిసింది తన వైద్యానికి అంత ఖర్చు అయ్యిందని. తనకు సుమారు రూ. 3.5 లక్షలపైనే హెల్త్ ఇన్సురెన్స్ ఉంది కాబట్టి సరిపోయింది అంటూ బావురమన్నాడు. అందుకే అమెరికా..అమెరికా..అంటు సంబరపడొద్దు..ఇక్కడ జీవితం చాలా ఖరీదైనది అంటూ వీడియోని ముగించాడు. ఈ వీడియోని చూసిన నెటిజన్లు అక్కడ అధిక జీతానికి తగ్గట్టు..ఖర్చులు కూడాను అంటూ కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టడం గమనార్హం. View this post on Instagram A post shared by Parth Vijayvergiya (@parthvijayvergiya) (చదవండి: అందుకేనా జపాన్ అంత క్లీన్‌గా ఉంటోంది..!) -
అమెరికాలో తెలుగు కమ్యూనిటీకి బిగ్ అలర్ట్!
ట్రంప్ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక చేసిన మొదటి పని.. వలసవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేయడం. ఇందుకోసం డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (DHS) తరపున ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ICE) అన్లిమిటెడ్ పవర్ కట్టబెట్టారు. అమెరికా భద్రత పేరిట లైంగిక దాడులు, గృహ హింస, మాదక ద్రవ్యాల కేసులు, మానవ అక్రమ రవాణా వంటి తీవ్ర నేరాలకు పాల్పడినవారిని ఐస్ లోకల్ పోలీసులతో గుర్తించి అరెస్టులు చేసి చర్యలు తీసుకునేది. అయితే ఇప్పుడు ఆ దృష్టి పార్ట్‌టైం జాబులు చేసే భారతీయ విద్యార్థులు.. ప్రొఫెషనల్ జాబులు చేసేవాళ్లపైకి మళ్లడం ఇండియన్ కమ్యూనిటీలో ఆందోళన రేకెత్తిస్తోంది..తాజాగా.. మిన్నెసోటాలోని సెయింట్ లూయిస్ పార్క్‌లోని ఒక భారతీయ రెస్టారెంట్లో పనిచేస్తున్న ఇద్దరు భారతీయ విద్యార్థులను ఐస్ (Immigration and Customs Enforcement) అధికారులు అరెస్టు చేశారు. అలాగే.. ఓ ప్రముఖ ఐటీ కంపెనీలో పని చేసే ఉద్యోగిని ఏకంగా కంపెనీలోకి వెళ్లి మరీ బేడీలు వేసి లాళ్లినట్లు ఓ ప్రచారం నడుస్తోంది. ఈ రెండు కేసుల్లో తమ వద్ద అధికారిక ప్రతాలు చూపించినా.. తమకేం తెలియదని వాళ్లు ఎంత మొత్తుకున్నా అక్కడి అధికారులు వినలేదు. అధ్వాన్నమైన పరిస్థితులు ఉండే డిటెన్షన్ సెంటర్లో గంటల తరబడి కూర్చోబెట్టి.. చివరాఖరికి పంపించేశారు.అమెరికాకు ఉన్నత విద్య కోసం భారత్‌తో పాటు ఇతర దేశాలకు చెందిన లక్షల మంది విద్యార్థులు వెళ్తుంటారు. ముఖ్యంగా F1 స్టూడెంట్ వీసాపై ఉన్నవారు ఖర్చులు తీర్చుకోవడానికి పార్ట్‌టైమ్ ఉద్యోగాలు చేస్తుంటారు. అయితే, అమెరికా వీసా నిబంధనల ప్రకారం క్యాంపస్ వెలుపల నిర్దిష్ట గంటలకు మించి పనిచేయడం చట్టవిరుద్ధం. అలా అక్రమంగా పార్ట్‌టైమ్ ఉద్యోగాలు చేస్తే అరెస్టులు తప్పవని ఐస్ గత కొంతకాలంగా హెచ్చరిస్తూ వస్తోంది. అయితే..ట్రంప్ పదవిలోకి వచ్చాక ఐస్ తన తనిఖీలను మరింత ఉధృతం చేసింది. గత ఏడాది వేలాది మందిని అరెస్ట్ చేసి డిపోర్ట్ చేసింది. అందులో అక్రమంగా చొరబడిన భారతీయులు కూడా ఉన్నారు. అమెరికాలో రాజకీయ నాయకుల వ్యాఖ్యలు.. సోషల్ మీడియా వేదికలలోని చర్చలు భారతీయులపై పెరిగిపోతున్న వ్యతిరేకతకు సంకేతాలను ఇస్తున్నాయి. అందుకే ప్రత్యేకించి భారతీయులే మీద ఐసీఈ ఫోకస్ పెట్టిందన్న చర్చ జోరందుకుంది. ఈ పరిస్థితుల్లో భారతీయులు అత్యంత జాగ్రత్తగా ఉండడం అవసరం. కాబట్టి.. చట్టవిరుద్ధంగా ఉద్యోగాలు చేయవద్దని విద్యార్థులను నిపుణులు హెచ్చరిస్తున్నారు. జాగ్రత్త.. తెలుగోడా!పైన చెప్పిన రెండు అరెస్టులలో.. బాధితులు తెలుగువాళ్లే కావడం గమనార్హం!. వాళ్లను ఎందుకు నిర్బంధించారో కూడా అధికారులు వివరణ ఇవ్వలేదని తెలుస్తోంది. అంటే.. ఏ రకంగా వాళ్ల దృష్టిలో పడ్డ తాట తీస్తారనే సంకేతాలు పంపించినట్లయ్యిందన్నమాట. ఈ పరిస్థితుల్లో న్యూమన్ గ్రూప్ లాయర్లు ఒక ముఖ్యమైన హెచ్చరికను జారీ చేసింది..మా నాయకుడు గొప్పని.. మా కులం గొప్పని కొందరు దేశంకాని దేశంలో ఉంటూ వ్యాఖ్యలు చేస్తుండడం, సోషల్ మీడియాలో పోస్టులు తరచూ చూస్తుండేదే. అలా అమెరికాలో ఉండి ఇక్కడి సినిమాలు, రాజకీయాల కోసం అడ్డగోలుగా మాట్లాడడం, సో.మీ.లో పోస్టులు చేయడం ఏమాత్రం మంచిది కాదని న్యూమన్ గ్రూప్ లాయర్లు సూచిస్తున్నారు. అలాగే కులం పేరిట అతి ప్రదర్శనలు కూడా చేయొద్దంటున్నారు. ఇవి చట్ట విరుద్ధమైన చర్యలు కావు కదా అని ఫీల్ అయిన కూడా.. అక్కడి అధికారుల దృష్టిలో పడే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ఒకవేళ ఈ హెచ్చరికను బేఖాతరు చేస్తే అరెస్టు, డిపోర్టేషన్ ప్రమాదం తప్పదని కుండబద్ధలు కొడుతున్నారు.మనిషి చచ్చాక యమ భటులు వచ్చి లాక్కెళ్తారు కదా.. ఒకవేళ భారతీయులు గనుక అదుపులో ఉండకపోతే ఐస్(ICE) అధికారులు అంతకు మించి ట్రీట్మెంట్తో లాక్కెళ్లే ప్రమాదం ఉందనేది సోషల్ మీడియాలో ఓ యూజర్ చేసిన పోస్ట్ సారాంశం.. అమెరికాలో అటు రాజకీయ నాయకుల్లో, ఇటు సోషల్ మీడియాలో భారతీయుల మీద పెరుగుతున్న వ్యతిరేకత..ఇలాంటి సమయాల్లో అత్యంత జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం అంటున్న అమెరికా లాయర్ న్యూమన్ గ్రూప్..అమెరికాలో సినిమాల కోసం, రాజకీయాల కోసం అతి చేయొద్దు అని ముఖ్యమైన సలహా ఇస్తున్న లాయర్లు..సినిమా ఇంకా… pic.twitter.com/uIZKc9TGKD— UttarandhraNow (@UttarandhraNow) January 21, 2026 -
ఆంధ్రా అల్లుడు.. మళ్లీ తండ్రి కాబోతున్నాడు
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి గుడ్‌న్యూస్‌ను అందరితో పంచుకున్నారు. మరోసారి తండ్రి కాబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ఆయన ప్రకటించారు. ఈ విషయాన్ని అటు ఆయన సతీమణి, అమెరికా సెకండ్ లేడీ ఉషా వాన్స్ కూడా ధృవీకరించారు. దీంతో వాళ్లకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. వాన్స్ దంపతులు త్వరలోనే నాలుగో బిడ్డకు జన్మనివ్వనున్నట్లు సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. జులై చివరిలో పండంటి మగబిడ్డ తమ జీవితాల్లోకి రానున్నట్లు తెలిపారు. జేడీ- ఉషా వాన్స్‌లకు 2014లో వివాహం జరిగింది. వీరికి ఇప్పటికే ఈవాన్, వివేక్, మిరాబెల్ అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. జేడీ వాన్స్ (James David Vance).. 1984 ఆగస్టు 2న ఓహియో స్టేట్‌లోని మిడిల్‌టౌన్‌లో జన్మించారు. స్థానిక స్టేట్ యూనివర్సిటీలో చదివి, తరువాత యేల్ లా స్కూల్లో న్యాయ విద్య పూర్తి చేశారు. 2016లో ఆయన ఆత్మకథ “Hillbilly Elegy” అమెరికా అంతటా విశేష ఆదరణ పొందింది. ఈ పుస్తకం ఆధారంగా Netflix చిత్రం కూడా రూపొందింది. 2022లో ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీ చేసి, ఓహాయో నుంచి సెనేటర్‌గా ఎన్నికయ్యారు. తన స్పష్టమైన అభిప్రాయాలు, ప్రజల సమస్యలపై దృష్టి పెట్టడం వల్ల జనాదరణ పొందగలిగారు. 2025 జనవరి 20న జేడీ వాన్స్ అమెరికా ఉపాధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో కలిసి ఆయన వైట్ హౌస్‌లో పనిచేస్తున్నారు.ఉషా చిలుకూరి అమెరికాలో కాలిఫోర్నియాలోని శాండియాగో ప్రాంతంలో పుట్టి పెరిగిన తెలుగమ్మాయి. యేల్ యూనివర్సిటీ నుంచి చరిత్రలో బ్యాచిలర్ డిగ్రీ పొందారు. కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం నుంచి తత్వశాస్త్రంలో మాస్టర్స్ పూర్తి చేశారు. న్యాయ విభాగంలో సుదీర్ఘ కాలం పనిచేశారు. We’re very happy to share some exciting news. Our family is growing! pic.twitter.com/0RohEBYXM7— Second Lady Usha Vance (@SLOTUS) January 20, 2026యేల్ లా స్కూల్లోనే ఉషా, జేడీ వాన్స్ (JD Vance) తొలిసారి కలుసుకున్నారు. ఈ క్రమంలోనే పరస్పరం ఇష్టపడ్డారు. ఈ క్రమంలో కెంటకీలో వారు వివాహం చేసుకున్నారు. హిందూ సంప్రదాయంలో వీరి వివాహం జరగడం విశేషం. జేడీ వాన్స్ క్రిస్టియానిటీ, ఉష హిందూ మతాన్ని అనుసరిస్తున్నారు. -
థాంక్యూ అమెరికా..కానీ భారత్ అంటే ప్రేమ..!
అమెరికాలో నివశిస్తున్న ఓ భారత సంతతి వ్యక్తి చేసిన పోస్ట్ నెట్టింట అందర్నీ అమితంగా ఆకర్షించింది. ఓ పక్క అమెరికాను మెచ్చుకుంటూనే.. భారత్‌పై ఉన్న తన ఇష్టాన్ని గురించి కూడా వివరించాడు. అతడి పోస్ట్ అత్యంత ఆలోచనాత్మకంగ..విదేశాల్లో ఉండే సౌకర్యాలు, అక్కడి తీరు తెన్నులు..వలస వచ్చిన భారతీయలుకు ఎలాంటి ఛాలెంజ్‌లు, అవకాశాలు అందిస్తుందో వివరించాడు. ఈ పోస్ట్ ఎన్నారైలందర్నీ బాగా ఆకట్టుకుంది. ఇంతకీ ఆ వ్యక్తి పోస్ట్‌లో ఏం రాశాడంటే..యునైటెడ్ స్టేట్స్లో నివసిస్తున్న భారత సంతతికి చెందిన ఇన్వెస్టర్ వేణు తాను అమెరికా వెళ్లడంతో తన జీవిత గమనం ఎలా పూర్తిగా మారిపోయిందో షేర్ చేసుకున్నారు. అమెరికాలో లభించే అవకాశాల గురించి ప్రశంసల వర్షం కురిపించారు. అయితే తాను అమెరికాలో సక్సెస్ అందుకున్నప్పటికీ..తాను పుట్టిన మాతృగడ్డ భారతదేశాన్ని జీవిత కాలం ప్రేమిస్తానంటూ దేశభక్తిని కూడా చాటుకున్నారు. ఆయన పోస్ట్‌లో తాను అమెరికాకు వెళ్లడాన్ని తన జీవిత గమనాన్ని ఊహించని విధంగా మార్చేసిన అరుదైన అవకాశంగా అభివర్ణించారు. "కృషి, క్రమశిక్షణ, స్థిరత్వానికి ప్రతిఫలమిచ్చే అమెరికన్ వ్యవస్థను ఎంతగానో కొనియాడారు. కష్టపడి పనిచేయడానికి ఇష్టపడే వ్యక్తులు, ముఖ్యంగా రిస్కులు తీసుకోవడానికి సిద్ధపడే వారికి, ఓపికతో ఉండేవారికి తప్పక మంచి ఫలితాలు అందించి లైఫ్‌నే అద్భుతంగా మార్చుకునే అద్భుత అవకాశాన్ని అందిస్తుందని పోస్ట్‌లో వేణు రాసుకొచ్చారు. అంతేగాదు చాలామంది ఇతర దేశాల్లో జీవితాన్ని అనుభవించకుండానే అమెరికాని విమర్శిస్తుంటారని కూడా అన్నారు. ప్రపంచంలో మరోవైపు నిశిసించిన తర్వాత..ఈ స్థాయి అవకాశం ఎంత అరుదైనదో అర్థమవుతుంది. ఇక్కడ జన్మించడం లేదా ఇక్కడే మంచిగా జీవితాన్ని నిర్మించుకోవడం ఓ అద్భుతమైన ప్రయోజనమని అందుకు తాను ఎల్లప్పుడూ కృతజ్ఞుడై ఉంటానంటూ తన పోస్ట్‌ని ముగించారు. ఈ పోస్ట్ భారతీయ ప్రవాసులలో చాలామందిని ఆకట్టుకుంది. అతడి పోస్ట్‌లోని కృతజ్ఞత, అమెరికన్ డ్రీమ్ గురించి అతడు రాసిన విలువైన భావాలు ప్రతి భారతీయుడి మనసుని తాకడమే గాక భారత వలసదారుల నుంచి పెద్ద ఎత్తున మద్దతులో కూడిన స్పందన రావడం విశేషం. సోదరా మీరు చెప్పింది నూటికి నూరు శాతం కరెక్ట్ అంటూ పోస్టులు కూడా పెట్టారు. Since it’s a long weekend, a small thought.I’m genuinely grateful to the United States. It was a one-time opportunity that completely changed my life. I love India and always will, but coming here altered my trajectory in ways I couldn’t have imagined.This country rewards…— Venu (@Venu_7_) January 19, 2026 (చదవండి: కళ్లకు గంతలు...సహా ఆ సిటీలో వెరైటీ డేటింగ్స్ ఎన్నో...) -
ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం టాంటెక్స్ నూతన అధ్యక్షురాలిగా లోకిరెడ్డి మాధవి
తెలుగు భాష, సాహిత్య, సాంస్కృతిక రంగాలకు పట్టం కట్టే ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం - టాంటెక్స్ నూతన అధ్యక్షురాలిగా ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన లోకిరెడ్డి మాధవి బాధ్యతలు చేపట్టారు. ఇటీవల డాలస్‌లో జరిగిన గవర్నింగ్ బోర్డు సమావేశంలో 2026 నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. ఈ మేరకు లోకిరెడ్డి మాధవి మాట్లాడుతూ..1986లో ప్రారంభమై 40వ వార్షికోత్సవం జరుపుకుంటున్న ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం - టాంటెక్స్ సంస్థకు అధ్యక్షురాలిగా సేవలందించడం తన అదృష్టంగా భావిస్తున్నా. తనకు ఈ బాధ్యత ఇచ్చిన సంస్థ సభ్యులకు ధన్యవాదాలు. సంస్థ ప్రమాణాలను పెంచే నూతన కార్యక్రమాలు చేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని వెల్లడించారు." లోకిరెడ్డి మాధవి.2026 కార్యవర్గం :అధ్యక్షురాలు- మాధవి లోకిరెడ్డిఉపాధ్యక్షుడు- సునీల్ సూరపరాజుకార్యదర్శి- ఎల్ఎన్ కోయాకోశాధికారి- దీప్తి సూర్యదేవరసహాయ కార్యదర్శి- వీర లెనిన్ తుళ్లూరిసహాయ కోశాధికారి- లక్ష్మినరసింహ పోపూరిఉత్తరాధ్యక్షుడు- ఉదయ్ కిరణ్ నిడిగంటితక్షణ పూర్వాధ్యక్షుడు- చంద్రశేఖరరెడ్డి పొట్టిపాటికార్యవర్గ సభ్యులు- దీపికా రెడ్డి, RBS రెడ్డి, శివా రెడ్డి వల్లూరు, రవి కదిరి , అర్పిత ఓబులరెడ్డి, అనిత ముప్పిడి, పార్థ సారథి గొర్ల, శాంతి నూతి, మల్లికార్జున మురారి, పవన్ నర్రా, కమలాకర్ దేవరకొండ, వెంకట్ బొల్లాపాలక మండలి అధ్యక్షుడు- దయాకర్ మాడాపాలక మండలి ఉపాధ్యక్షురాలు- జ్యోతి వనంపాలక మండలి సభ్యులు- శ్రీనాధ వట్టం, శ్రీనాధరెడ్డి పలవల, రాజారెడ్డి, ప్రవీణ్ బిల్లా, కల్యాణి తాడిమేటికొత్త పాలక మండలి, కార్యవర్గ బృందాల సూచనలు, సహాయ సహకారాలతో, సరికొత్త ఆలోచనలతో 2026లో అందరిని అలరించే మంచి కార్యక్రమాలు చేయనున్నామని, స్థానిక తెలుగు వారి ఆశీస్సులు, ఆదరణ ఉంటాయని ఆశిస్తున్నానని సంస్థ నూతన అధ్యక్షులు మాధవి లోకిరెడ్డి తెలిపారు. 2025 సంవత్సరంలో టాంటెక్స్ అధ్యక్షుడుగా పని చేసి, పదవీ విరమణ చేస్తున్న తక్షణ పూర్వాధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి పొట్టిపాటి మాట్లాడుతూ మాధవి లోకిరెడ్డి నేతృత్వంలో ఏర్పడిన 2026 కార్యవర్గ బృందం నిర్వహించబోయే కార్యక్రమాలకు సంపూర్ణ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నాను అని తెలిపారు.ప్రమాణ స్వీకారోత్సవానికి విచ్చేసిన విశిష్ట అతిథులందరికీ మాధవి లోకిరెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. TPAD సభ్యులు అజయ్ రెడ్డి ఏలేటి, రావు కలవల, రఘువీర్ బండారు మరియు జానకిరామ్ మందాడి, TANTEX నుండి సుబ్బు జొన్నలగడ్డ, మహేష్ ఆదిభట్ల, డా. యు. నరసిమ్హారెడ్డి, సతీష్ బండారు, శారద సింగిరెడ్డి, DARA నుంచి శివారెడ్డి లేవంక, తిరుమల రెడ్డి కుంభం తదితరులు ఈ ప్రమాణస్వీకారోత్సవంలో పాల్గొని మాధవికి అభినందనలు తెలిపారు.(చదవండి: అమెరికాలో ఘనంగా సంక్రాంతి సంబరాలు) -
ఎన్నారై సుప్రియ కేసులో బిగ్ ట్విస్ట్
ఆస్ట్రేలియా అడిలైడ్‌లో జరిగిన ఎన్నారై మహిళ సుప్రియ హత్య కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొంటున్న ఆమె భర్త విక్రాంత్ ఠాకూర్ ఎట్టకేలకు నోరు విప్పారు. ఉద్దేశపూర్వకంగా తన భార్యను చంపలేదని.. తన కొడుకు కోసమైనా తనను క్షమించి వదిలేయాలని కోర్టును బతిమిలాడుకుంటున్నాడు.భారత మూలాలు ఉన్న విక్రాంత్ ఠాకూర్(42), భార్య కొడుకుతో అడిలైడ్‌లో స్థిరపడ్డాడు. గతేడాది డిసెంబర్ 21వ తేదీన తన నివాసంలో సుప్రియ(36) అపస్మారక స్థితిలో కనిపించింది. ఎమర్జెన్సీ టీం ప్రయత్నాలు చేసినా ఆమెను కాపాడలేకపోయింది. ఈ ఘటనలో అనుమానాల కింద భర్తను అప్పటికప్పుడు అదుపులోకి తీసుకన్నారు స్థానిక పోలీసులు. ఆపై హత్య కేసు నమోదు చేసి స్థానిక మెజిస్ట్రేట్ కోర్టులో ప్రవేశపెట్టారు. అయితే.. అదే ఏడాది(డిసెంబర్ 23) జరిగిన కోర్టు విచారణలో విక్రాంత్ నోరు విప్పలేదు. బెయిల్ కోసం కూడా అప్లై చేసుకోలేదు. దీంతో భార్యను అతనే చంపి ఉంటాడని అంతా భావించారు. ఆ సమయంలో డీఎన్ఏ రిపోర్ట్స్, పోస్ట్‌మార్టం నివేదిక వంటి ఆధారాలు సిద్ధం కావడానికి సమయం కావాలని ప్రాసిక్యూటర్లు కోరారు. దీంతో విచారణ వాయిదా పడింది. తాజాగా జనవరి 14న మరోసారి విచారణ జరగ్గా.. తన భార్యను తాను కావాలని హత్య చేయలేదంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇది అనుకోకుండా జరిగిన మరణం(manslaughter). నేనేమీ కావాలని ఆమెను చంపలేదు అంటూ వాదించాడు. తన బిడ్డ కోసం తనను వదిలేయాలంటూ వేడుకున్నాడు. ఈ కేసులో తదుపరి విచారణను ఏప్రిల్‌కు వాయిదా వేసింది కోర్టు. విక్రాంత్-సుప్రియ కొడుకు సంరక్షణను అక్కడి ఇండియన్ కమ్యూనిటీ చూసుకుంటోంది. ఫండ్ రైజింగ్ ద్వారా విరాళాలు సేకరిస్తోంది. "సుప్రియా తన కొడుకు భవిష్యత్తు కోసం కష్టపడి పనిచేసింది. నర్సుగా మారి ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యం ఆమెకు ఉండేది. ఆమె ఆకస్మిక మరణం కుమారుడి జీవితాన్ని ఒక్కసారిగా తారుమారు చేసింది" అని ఆ పేజీలో పేర్కొన్నారు. -
ఎన్ఆర్ఐ జంటను రూ. 15 కోట్లకు ముంచేసిన కేటుగాళ్లు
డిజిటల్ అరెస్ట్ అంటూ కోట్ల రూపాయలు మోస పోతున్న కథనాలు రోజుకొకటి వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఒక ఎన్ఆర్ఐ డాక్టర్ దంపతులు ఏకంగా రూ. 15 కోట్లు పోగొట్టుకున్న వైనం పలువుర్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. వివరాలు ఇలా ఉన్నాయి..డాక్టర్ ఇంద్ర తనేజా (77),ఆమె భర్త డాక్టర్ ఓం తనేజాను సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేశారు. పోలీసులమని చెప్పి, మనీలాండరింగ్ ఆరోపణలు అంటూ భయపెట్టి గత సంవత్సరం డిసెంబర్ 24 -జనవరి 9 వరకు దక్షిణ ఢిల్లీలోని గ్రేటర్ కైలాష్-IIలోని డిజిటల్ అరెస్ట్ చేశారు. వీరినుంచి రూ.14.85 కోట్లను దోచేశారు.నిందితులలో ఇద్దరు వ్యక్తులు తమ బ్యాంకు ఖాతాలను స్కామర్లకు అందించగా, మూడవ వ్యక్తి సహాయకుడిగా వ్యవహరించాడుఅశ్లీల వీడియోలు, మనీలాండరింగ్ కేసులో 20 కి పైగా ఫిర్యాదులు నమోదయ్యాయని ఈ జంటను భయపెట్టేశారు. . మొత్తం రూ. 14.85 కోట్లలో, గరిష్టంగా రూ. 4 కోట్లు గుజరాత్‌లోని వడోదరలోని బ్యాంకు ఖాతాకు బదిలీ చేయించారు. పోలీసులు రూ. 2.10 కోట్లను నిలిపివేయగలిగారు. డిసెంబర్ 26, 2025న అస్సాంలోని గౌహతిలోని జలుక్‌బరికి రూ.1.99 కోట్లు, ఆ తర్వాత డిసెంబర్ 29 , 30 తేదీల్లో ఒక్కొక్కరికి రూ.2 కోట్లు వడోదరలోని సామ సావ్లికి బదిలీ అయినట్టు పోలీసులు గుర్తించారు. ఇలా రకరకాలుగా ఖాతాలు ఛారిటబుల్ ఫౌండేషన్లు, కెమికల్ ట్రేడింగ్ కంపెనీలు, రిక్రూట్మెంట్ సంస్థలు, టూర్, ట్రావెల్ వ్యాపారాల పేర్లతో నమోదైన బ్యాంకు ఖాతాలకు ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. An elderly NRI doctor couple was tricked over the phone, accused of money laundering, and lost ₹14.85 crore.Two fraudsters, Divyank Patel & Krutik Shitoli, caught in Vadodara.Gujarat model, once again#DrugFreeIndia #INDvsNZ @tanmoyofc @MdHafiz59473117 @NasirHussainINC pic.twitter.com/rOkpcxRdJs— Dr Kaalika (@DrKaalika) January 19, 2026అరెస్ట్ వారెంట్లు అంటూ వరుస వీడియో కాల్స్తోటెలికాం అధికారులు, పోలీసు అధికారులుగా నటిస్తూ వరుస నకిలీ కాల్స్ ,వీడియో కాల్స్ తమను ఉక్కిరి బిక్కిరి చేసేశారని బాధితులు వాపోయారు. మహారాష్ట్రలో FIR ,అరెస్ట్ వారెంట్లు జారీ అయ్యాయని బెదిరించారు. అలాగే ఆమె నా పేరు మీద ఉన్న కెనరా బ్యాంక్ ఖాతాను ఒక ఒక పెద్ద మోసంలో ఉపయోగించారని భయపెట్టాడు. దీంతో తన భర్త AIIMSలోఅపరేషన్ తరువాత కోటుకుంటున్నారని, పైగా తమకు ఎవరూ సామయం చేసేవారు లేకపోవడంతో రూ. 14.85 కోట్లు కోల్పోయాని తెలిపారు. ఇదీ చదవండి: తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం : ఆ కాఫ్ సిరప్ బ్యాన్ఈ కేసులోగుజరాత్‌లోని వడోదర నివాసితులు దివ్యాంగ్ పటేల్, కృతిక్ షిటోలి, ప్రయాగ్‌రాజ్‌కు చెందిన కెఎస్ తివారీ నిందితులుగా గుర్తించారు. చైనా, కంబోడియాకు చెందిన స్కామర్లతో వీరికేమైనా సంబంధాలున్నాయనే కోణంలో పోలీసులు పరిశీలిస్తున్నారు.ఇదీ చదవండి: మ్యాట్రిమోనియల్ స్కాం : కోట్లు నష్టపోయిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ -
అమెరికాలో ఘనంగా సంక్రాంతి సంబరాలు
అమెరికా వాణిజ్య రాజధాని న్యూయార్క్ లో స్థిరపడిన తెలుగువారు ఈ వారాంతంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. న్యూయార్క్ తెలంగాణ తెలుగు అసోసియేషన్ (నైటా) ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా చిన్న పిల్లలకు భోగి పండ్ల కార్యక్రమం చేశారు. స్థానిక సౌతెర్న్ పార్క్ వేలో ఉన్న సాయి మందిర్ కు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన కుటుంబాలు ఉత్సాహంగా ఈ వేడుకలో పాల్గొన్నాయి.అమెరికాలోనే పుట్టి పెరిగిన చిన్నారులకు మన పండుగలు, సంప్రదాయాలు తెలిసేలా పండుగలను ప్రతీ యేటా నైటా నిర్వహిస్తోంది. రేగు పండ్లు, నాణేలు, పూలు, చెరకు ముక్కలతో భోగి పండ్లు పోసి, పిల్లలందరూ శ్రీమన్నారాయణుడి ఆశీర్వాదంతో ఆయురారోగ్యాలతో ఉండాలని పెద్దలందరూ దీవించారు.పద్మశ్రీ నోరి దత్తాత్రేయుడు, పైళ్ల సాధన మళ్లారెడ్డి పిల్లలందరికీ ఆశీర్వచనాలు అందించారు. కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారులు అందరికీ నైటా తరపున బహుమతులు అందించారు. నైటా ప్రెసిడెంట్ రవీందర్ కోడెల, ఎగ్జిక్యూటివ్ కమిటీ, బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ అందరూ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు.(చదవండి: జపాన్‌లో ఘనంగా తెలుగువారి సంక్రాంతి సంబరాలు) -
జపాన్‌లో ఘనంగా తెలుగువారి సంక్రాంతి సంబరాలు
సంక్రాంతి-2026 సందర్భంగా తెలుగు అసోసియేషన్ అఫ్ జపాన్ (TAJ–తాజ్) ఆధ్వర్యంలో గత కొద్ది రోజులుగా వనభోజనాలు, టగ్ ఆఫ్ వార్, పిల్లలకి డ్రాయింగ్ ఈవెంట్, క్రికెట్ పోటీలు, మహిళలకి ముగ్గుల పోటీలు, కైట్ ఫెస్టివల్ నిర్వహించారు. కొసమెరుపుగా జనవరి 10న రోజంతా సాగిన శాస్త్రీయ మరియు సినీ నృత్యాలు, పాటలు, ఇతర సాంస్కృతిక ప్రదర్శనలు పెద్ద ఎత్తున పాల్గొన్న తెలుగు, జపనీస్ వారికి చిరస్మరణీయ అనుభూతిని కలిగించాయి. ఉద్యోగ రీత్యా విదేశాల్లో ఉన్నప్పటికీ తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను మరిచిపోకుండా తదుపరి తరాలకు అందించే రీతిలో తెలుగు అసోసియేషన్ అఫ్ జపాన్ (TAJ–తాజ్) నిరంతరం కృషి చేస్తూ అందరి ప్రశంసలు అందుకుంటోంది.(చదవండి: కెంట్ అయ్యప్ప ఆలయంలో వైభవంగా మకరవిళక్కు మహోత్సవం) -
ఇంటర్నెట్ లేదు.. ఇరాన్లో ఇదీ పరిస్థితి
ఇరాన్లో అల్లకల్లోల పరిస్థితుల వేళ.. భారతీయుల తరలింపును భారత ప్రభుత్వం చేపట్టింది. ఆ ఆపరేషన్‌లో భాగంగా పలువురితో బయల్దేరిన రెండు విమానాలు గత అర్ధరాత్రి సురక్షితంగా ఢిల్లీకి చేరుకున్నాయి. అక్కడి పరిస్థితులు దారుణంగా ఉన్నాయంటూ విదేశీ మీడియా సంస్థలు కథనాలు ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వీళ్ల ద్వారా అక్కడి పరిస్థితులను లోకల్ మీడియా సంస్థలు అడిగి తెలుసుకుంటున్నాయి.ఢిల్లీకి చేరుకున్నవాళ్లలో విద్యార్థులు ఎక్కువగా ఉన్నారు. తాము సురక్షితంగా రావడానికి కేంద్రం అందించిన సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం నిరంతరం అక్కడి భారతీయులతో సంప్రదింపులు జరుపుతోందని.. పలు సూచనలు జారీ చేస్తోందని వివరించారు. ఎంబీబీఎస్ చదువుతున్న ఓ విద్యార్థి మాట్లాడుతూ.. ‘‘నిరసనల గురించి విన్నాను. కానీ ప్రత్యక్షంగా చూడలేదు. ఇంటర్నెట్ లేకపోవడం పెద్ద సమస్యగా అనిపించింది’’ అని తెలిపింది. మరో యువకుడు మాట్లాడుతూ.. ‘‘వీధుల్లోకి వెళ్తే నిరసనకారులు కార్లను అడ్డుకునేవారు. ఇంటర్నెట్ లేకపోవడంతో కుటుంబాలకు కూడా సమాచారం ఇవ్వలేకపోయాం. చాలా భయమేసింది’’ అని అన్నాడు. ఇక.. ఇరాన్లో ఉద్యోగం కోసం వెళ్లిన ఒక ఇంజనీర్ ప్రస్తుతం పరిస్థితి కొంత మెరుగుపడిందని చెప్పాడు. ‘‘ఇరాన్లో పరిస్థితుల నేపథ్యంలో తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. కానీ, పరిస్థితి మరీ ఘోరంగా ఏం లేదు. నెట్వర్క్ సమస్య తప్ప పెద్ద ఇబ్బందులేం లేవు’’ అని అన్నాడు. మరో యువతి మాట్లాడుతూ.. టెహహ్రాన్ నిరసనలు ప్రమాదకరంగానే సాగాయని, ఘర్షణల్లో పలు భవాలకు నిప్పు పెట్టారని.. ఆ పరిస్థితుల్లో భయంగా గడిపామని తెలిపింది. అదే సమయంలో.. ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినవారు ఎక్కువగానే కనిపించారు అని వివరించింది. డిసెంబర్ చివరిలో అయతొల్లా ఖమేనీ పాలనకు వ్యతిరేకంగా ఇరాన్లో మొదలైన భారీ నిరసనలు.. భద్రతా బలగాల ప్రతిఘటనలతో 3,000 మందిని బలిగొన్నాయి. ఇందులో సిబ్బంది కూడా పెద్ద సంఖ్యలోనే మరణించినట్లు తెలుస్తోంది. అదే సమయంలో వేల మందిని అరెస్ట్ చేయించింది ఖమేనీ ప్రభుత్వం. ఒకానొక తరుణంలో.. నిరసనకారులకు మద్దతుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జోక్యం చేసుకోవడం, ఇరాన్ ఖండన, మాటల యుద్ధం.. సైనిక ఘర్షణకు దారి తీయొచ్చనే భయాందోళనలు నెలకొన్నాయి. ఆ సమయంలో భారత ప్రభుత్వం తన పౌరులకు ఇరాన్ ప్రయాణాలు మానుకోవాలని హెచ్చరికలు జారీ చేసింది. సరిగ్గా అదే సమయంలో.. జనవరి 15న ఇరాన్ గగనతలం తాత్కాలికంగా మూసివేయడంతో కొన్ని భారతీయ విమానాలు ప్రభావితమయ్యాయి. అయితే గల్ఫ్ దేశాల మధ్యవర్తిత్వంతో ప్రస్తుతం పరిస్థితి కొంత చల్లారింది. అయినప్పటికీ భారతీయులు స్వదేశానికే వచ్చేందుకు మొగ్గుచూపుతున్నారు. ఇరాన్లో సుమారు 10 వేలమంది భారతీయులు(విద్యార్థులు, ఉద్యోగులు, భారత మూలాలు ఉన్నవాళ్లు) ఉన్నట్లు విదేశాంగ గణాంకాలు చెబుతున్నాయి. భారతీయుల్ని తీసుకొచ్చిన రెండు విమానాలు కమర్షియల్ ప్లైట్సే. అయితే ఇవి రెగ్యులర్ విమానాలేనని.. ఎలాంటి ప్రత్యేక తరలింపు కాదని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది. అయినప్పటికీ ఈ తరలింపును నిశితంగా పరిశీలిస్తున్నట్లు పేర్కొంది. -
అమెరికా ‘కస్టడీ’లో ఇద్దరు భారత విద్యార్థులు
న్యూఢిల్లీ: అమెరికాలో ఉన్నత చదువుల కోసం వెళ్లిన భారతీయ విద్యార్థులకు ఆందోళన కలిగించే ఘటన చోటుచేసుకుంది. సెయింట్ లూయిస్ పార్క్‌లోని ఓ ప్రముఖ భారతీయ రెస్టారెంట్లో అమెరికా ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ఐసీఈ) అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా అక్కడ పనిచేస్తున్న పలువురు సిబ్బందిని ప్రశ్నించిన అధికారులు.. ఇద్దరు భారతీయ విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు.ప్రాథమిక సమాచారం ప్రకారం వీసా నిబంధనలను ఉల్లంఘించారన్న ఆరోపణలతోనే ఈ ఇద్దరు విద్యార్థులను కస్టడీలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కాగా ఈ విద్యార్థులు తమ వీసా నిబంధనలకు విరుద్ధంగా పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేస్తున్నందువల్లే ఈ చర్యలు తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అంతర్జాతీయ విద్యార్థులకు ఉపాధి కల్పిస్తున్న ప్రదేశాలపై ఇటీవలి కాలంలో అమెరికా ఇమిగ్రేషన్ అధికారులు నిఘా పెంచారు. గత కొన్ని నెలలుగా అనధికారిక ఉపాధి,వీసా నిబంధనల అమలుపై ఐసీఈ అధికారులు పలు రాష్ట్రాల్లో ఈ తరహా చర్యలను ముమ్మరం చేశారు. BREAKINGICE reportedly detained two Indian students at an Indian restaurant in St. Louis Park yesterday afternoon.STUDENTS, BE VERY CAREFUL. DO NOT TAKE UP ANY PART TIME JOBS THAT ARE NOT LEGALLY ALLOWED. pic.twitter.com/WmEwnAAIVf— M9 USA🇺🇸 (@M9USA_) January 16, 2026విద్యార్థులు చట్టవిరుద్ధంగా పనిచేస్తున్నారన్న అనుమానంతో పలు చోట్ల సోదాలు నిర్వహిస్తుండటానికి తోడు తాజా అరెస్టులతో అక్కడి భారతీయ విద్యార్థుల్లో ఆందోళన మరింతగా పెరిగింది. ఈ ఘటన నేపథ్యంలో విద్యార్థి సంఘాలు, నిపుణులు భారతీయ విద్యార్థులను అప్రమత్తం చేస్తున్నారు. ఇమిగ్రేషన్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, సరైన అనుమతులు లేకుండా క్యాంపస్ బయట ఉద్యోగాలు చేయడం లాంటి పొరపాట్లు చేయవద్దని సూచిస్తున్నారు. ఇటువంటి ఉల్లంఘనలు.. డిటెన్షన్, వీసా రద్దు లేదా దేశ బహిష్కరణ వంటి తీవ్ర పరిణామాలకు దారితీయవచ్చని హెచ్చరిస్తున్నారు.ఇది కూడా చదవండి: కెనడాలో హత్య చేసొచ్చి.. పంజాబ్‌లో హల్చల్! -
అమెరికా దెబ్బకు విదేశీ విద్యా రుణ వ్యవస్థ డీలా
విదేశీ విద్యను అభ్యసించాలనుకునే భారతీయ విద్యార్థులకు అమెరికా వీసా నిబంధనలు సవాలుగా మారుతున్నాయి. అమెరికా వీసా విధానంలో వస్తున్న మార్పుల కారణంగా విదేశీ విద్యా రుణాల మార్కెట్ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ముఖ్యంగా నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు (ఎన్బీఎఫ్సీ), ఎడ్యుకేషన్ లోన్ ప్లాట్‌ఫారమ్‌ల గణాంకాల ప్రకారం, 2024తో పోలిస్తే 2025 సంవత్సరంలో విదేశీ విద్యా రుణాలు 30 నుంచి 50 శాతం వరకు క్షీణించాయి.తగ్గుతున్న రుణాల పరిమాణంఅమెరికాకు వెళ్లే విద్యార్థుల సంఖ్య తగ్గడంతో ఆ దేశానికి సంబంధించిన రుణాల పరిమాణం ఏకంగా 60 శాతం పడిపోయింది. విద్యార్థులు యూకే, ఫ్రాన్స్, జర్మనీ, తూర్పు యూరప్ దేశాల వైపు మొగ్గు చూపుతున్నప్పటికీ అమెరికా యూనివర్సిటీల స్థాయిలో రుణాల పరిమాణం ఉండటం లేదని నిపుణులు విశ్లేషిస్తున్నారు.ఆర్బీఐ డేటారిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన విదేశీ రిమిటెన్సుల గణాంకాలు ఈ పరిస్థితికి అద్దం పడుతున్నాయి. విదేశీ విద్య కోసం భారత్ నుంచి పంపే నిధుల ప్రవాహంలో (రిమిటెన్సులు) స్పష్టమైన తగ్గుదల కనిపిస్తోంది. ముఖ్యంగా జనవరిలో ప్రారంభమయ్యే ‘స్ప్రింగ్ అడ్మిషన్ సీజన్’ను పరిశీలిస్తే.. 2024 జనవరిలో 449 మిలియన్ డాలర్లుగా ఉన్న రిమిటెన్సులు 2025 జనవరి నాటికి 368 మిలియన్ డాలర్లకు పడిపోయాయి. అంటే ఈ కాలంలో సుమారు 18 శాతం మేర తగ్గుదల నమోదైంది.అత్యధిక అడ్మిషన్లు జరిగే ఆగస్టు ‘ఫాల్ సీజన్’లో ఈ క్షీణత మరింత తీవ్రంగా ఉంది. 2024 ఆగస్టులో విదేశీ విద్యా అవసరాల కోసం 416 మిలియన్ డాలర్లు భారత్ నుంచి వెళ్లగా, 2025 ఆగస్టు నాటికి ఆ మొత్తం 319 మిలియన్ డాలర్లకు పరిమితమైంది. గత ఏడాదితో పోలిస్తే ఈ సీజన్లో ఏకంగా 23 శాతం తగ్గుదల కనిపిస్తోంది. ఇది విదేశీ విద్యా రుణ మార్కెట్‌పై ఉన్న ఒత్తిడిని, విద్యార్థుల విదేశీ ప్రయాణాల్లో వచ్చిన మార్పును స్పష్టంగా సూచిస్తోంది.(గమనిక: పైన తెలిపిన గణాంకాల్లో విద్యార్థుల జీవన వ్యయం కూడా కలిసి ఉంది)నిపుణుల హెచ్చరికఅభివృద్ధి చెందిన దేశాల్లో నెలకొన్న అనిశ్చితి వల్ల సమీప భవిష్యత్తులో విద్యా రుణాల వృద్ధి మందగించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇన్‌క్రెడ్ ఫైనాన్షియల్ తన ఆస్తుల నిర్వహణలో 24 శాతం విద్యా రుణాలు ఉండటంతో ఈ ఒత్తిడిని అధిగమించేందుకు ప్రాపర్టీ లోన్ల వంటి ఇతర విభాగాలపై దృష్టి సారిస్తున్నట్లు తెలిపింది. విద్యా రుణాలిచ్చే బోర్డర్‌ప్లస్ కంపెనీ ఒకటి రెండు సంవత్సరాల వరకు కొత్త రుణాల మంజూరు బలహీనంగానే ఉంటుందని తెలిపింది.ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ, యాక్సిస్ వంటి బ్యాంకులు.. అవాన్స్, క్రెడిలా వంటి ఎన్బీఎఫ్సీలు ఈ విభాగంలో ప్రధానంగా సర్వీసులు అందిస్తున్నాయి. అమెరికా వీసా విధానాల్లో సానుకూల మార్పులు వచ్చే వరకు ఈ రంగంలో ఇదే రకమైన స్తబ్దత కొనసాగే అవకాశం కనిపిస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.ఇదీ చదవండి: భారత వలసదారులపై అమెరికాకు కోపమెందుకు? -
పురుషులు గర్భం దాల్చగలరా? భారత సంతతి వైద్యురాలు ఏమన్నారంటే..
అమెరికాలోని డిర్క్‌సెన్ సెనేట్ కార్యాలయంలో జరిగిన "మహిళల రక్షణ: కెమికల్ అబార్షన్ డ్రగ్స్ ముప్పు" అనే అంశంపై జరిగిన చర్చ వివాదాస్పదంగా మారింది. మందుల ద్వారా జరిగే అబార్షన్ నుంచి మహిళలను కాపాడటం.. అనే అంశంపై సెనేట్‌లో జరుగుతున్న చర్చకు భారత సంతతి గైనకాలజిస్ట్, డాక్టర్ నిషా వర్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా సెనేటర్‌కు, డాక్టర్ మధ్య జరిగిన వాగ్వాదం హాట్‌టాపిక్‌గా మారి చర్చనీయాంశమైంది.ఆ ఒక్క ప్రశ్నతో దద్దరిల్లిన పార్లమెంట్..చర్చలో భాగంగా సెనేటర్ జోష్ హాలే నేరుగా డాక్టర్ నిషా వర్మను ఉద్దేశించి.. " మగవారు గర్భం దాల్చగలరా ?" అని ప్రశ్నించారు. అందుకు ఆమె నేరుగా అవును లేదా కాదు అని సమాధానం చెప్పకుండా దాటవేస్తూ.. తాను మహిళలుగా గుర్తింపులేని వివిధ జెండర్ ఐడెంటిటీలు ఉన్న రోగులకు కూడా చికిత్స అందించాను అని బదులిచ్చారు. ఆ సమాధానంపై తీవ్ర అసంతృప్తికి గురైన సెనేటర్ హాలే తాను అడిగిన ప్రశ్న..సైన్స్, జీవశాస్త్ర వాస్తవాలకు సంబంధించినదని, దీనికి రాజకీయ రంగు పులమాల్సిన పని లేదంటూ మండిపడ్డారు. దాంతో డాక్టర్ నిషా వర్మ తన వాదనను కొనసాగిస్తూ.. ఇలాంటి ప్రశ్నలను ముమ్మాటికి రాజకీయ ప్రయోజనాల కోసమే వాడుకుంటారంటూ ధ్వజమెత్తారామె. అంతేగాదు తాను సైన్స్ నమ్మే వ్యక్తినని, రకరకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కొనే రోగులకు చికిత్స అందిస్తుంటాను. ఆ నేపథ్యంలోనే ఈ చర్చలో పాల్గొనేందుకు వచ్చాను. కానీ ఇలాంటి ప్రశ్నలు పక్కదారి పట్టిస్తాయంటూ ఘాటుగా సమాధానమిచ్చారు నిషా. అయితే "జీవశాస్త్రపరంగా పురుషులు గర్భం దాల్చలేరనే కనీస సత్యాన్ని మీరు అంగీకరించలేకపోతున్నారు.. కాబట్టి మిమ్మల్ని సైన్స్ తెలిసిన వ్యక్తిగా ఎలా నమ్మాలి?" అంటూ హాలే ఆగ్రహం వ్యక్తం చేశారు. అబార్షన్ మందుల భద్రతపై ఆందోళనకేవలం జెండర్ వివాదమే కాకుండా అబార్షన్ కోసం వాడే మందుల భద్రతపై కూడా సెనేటర్ హాలే కీలక గణాంకాలను ప్రస్తావించారు. "అబార్షన్ డ్రగ్స్ వాడటం వల్ల 11 శాతం కేసుల్లో ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతోందని సైన్స్ చెబుతోంది. ఇది ఎఫ్‌డీఏ లేబుల్‌పై ఉన్న దానికంటే 22 రెట్లు ఎక్కువ" అని ఆయన ఆరోపించారు. మరోవైపు డాక్టర్ నిషా వర్మ ఈ వాదనను తోసిపుచ్చారు. 2000 సంవత్సరంలో ఆమోదం పొందిన నాటి నుంచి ఇప్పటి వరకు అమెరికాలో 75 లక్షల మందికి పైగా ఈ మందులను సురక్షితంగా వాడారని, వందకు పైగా అత్యున్నత స్థాయి సమీక్షలు ఈ మందులు సురక్షితమని నిరూపించాయని ఆమె చెప్పడం విశేషం. కేవలం రాజకీయ కారణాల వల్లే అబార్షన్ హక్కులపై ఆంక్షలు విధిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారామె. ఇంతకీ ఎవరీ భారత సంతతి వైద్యురాలు నిషా వర్మ..ఆమె ఎవరంటే..నిషా వర్మ నార్త్ కరోలినాలోని గ్రీన్స్బోరోలో భారత వలస తల్లిదండ్రులకు జన్మించారు. ఆమె జీవశాస్త్రం,మానవ శాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీని, కరోలినా విశ్వవిద్యాలయం నుంచి వైద్య డిగ్రీ (MD)ని పొందారు.ఆమె బెత్ ఇజ్రాయెల్ డీకనెస్ మెడికల్ సెంటర్లో ఇంటర్న్‌షిప్ OB/GYN (ప్రసూతి మరియు గైనకాలజీ) రెసిడెన్సీని పూర్తి చేసింది. వర్మ ఆ తర్వాత కాంప్లెక్స్ ఫ్యామిలీ ప్లానింగ్ ఫెలోషిప్‌ను పూర్తి చేసి ఎమోరీ విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (MPH) డిగ్రీని పొందారు.ఆమె డబుల్-బోర్డ్-సర్టిఫైడ్ ప్రసూతి వైద్యురాలు, పైగా కుటుంబ నియంత్రణలో స్పెషలిస్ట్ కూడా. వర్మ ప్రస్తుతం జార్జియాలో సమగ్ర పునరుత్పత్తి ఆరోగ్య సంరక్షణపై ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆమె ఫిజిషియన్స్ ఫర్ రిప్రొడక్టివ్ హెల్త్‌లో ఫెలో కూడా.అంతేగాదు ఆమె అమెరికన్ కాలేజ్ ఆఫ్ అబ్స్టెట్రిషియన్స్ అండ్ గైనకాలజిస్ట్స్ (ACOG)లో రిప్రొడక్టివ్ హెల్త్ పాలసీ అండ్ అడ్వకేసీకి సీనియర్ అడ్వైజర్‌గా పనిచేయడమే గాక ఎమోరీ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌లో అనుబంధ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా సేవలందిస్తోందామె. Sen. Hawley: “Can men get pregnant?”Dr. Nisha Verma: “I'm not really sure what the goal of the question is.”Sen. Hawley: “The goal is just to establish a biological reality...Can men get pregnant?”pic.twitter.com/exjxLqJBTC— America (@america) January 14, 2026 (చదవండి: అలాంటి ఇలాంటి నమ్మకం కాదు..! అడగంగానే..'బంగారుపు గాజులను'..) -
భారత వలసదారులపై కోపమెందుకు?
అమెరికా అభివృద్ధిలో భాగస్వాములైన భారతీయ వలసదారులు ప్రస్తుతం క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. దశాబ్దాలుగా అత్యంత శాంతియుతమైన, విజయవంతమైన వర్గంగా పేరుగాంచిన భారతీయులపై ఇటీవల కాలంలో ఆన్లైన్ వేదికగా, రాజకీయంగా అసహనం పెరుగుతోంది. అమెరికాను వివిధ సంస్కృతుల కలయికగా అభివర్ణించే ‘మెల్టింగ్ పాట్’(Melting Pot- వివిధ సంస్కృతుల సమ్మేళనం) సిద్ధాంతానికి ఈ పరిణామాలు సవాలుగా మారుతున్నాయి.ఆన్లైన్ వేదికలపై..2025 నుంచి సోషల్ మీడియాలో భారతీయులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న ప్రచారం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా హెచ్-1బీ వీసా నిబంధనలపై జరుగుతున్న చర్చలు ద్వేషపూరిత వ్యాఖ్యలకు దారితీస్తున్నాయి. అమెరికా టెక్ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న భారతీయులు స్థానిక అమెరికన్ల ఉద్యోగాలను కొల్లగొడుతున్నారనే తప్పుడు ప్రచారం ఊపందుకుంది. దీనికి తోడు కృత్రిమ మేధ (ఏఐ) కారణంగా ఉద్యోగ మార్కెట్లో వస్తున్న మార్పులు కూడా వలసదారులపై వ్యతిరేకత పెరగడానికి కారణమవుతున్నాయి.రాజకీయ దుమారంప్రస్తుత అమెరికా రాజకీయ పరిణామాలు భారతీయుల్లో మరింత అభద్రతాభావాన్ని పెంచుతున్నాయి. అక్కడి వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ (JD Vance) గతంలో చేసిన ‘అధిక సంఖ్యలో ఉన్న వలసల వల్ల అమెరికా ప్రయోజనాలు నీరుగారుతున్నాయి’ అనే వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. అయితే, ఈ క్రమంలో ఆయన భార్య భారత సంతతికి చెందిన ఉషా వాన్స్ కూడా ఆన్లైన్లో ట్రోల్ అయ్యారు. నిక్ ఫ్యుయెంటెస్ వంటి తీవ్రవాద భావజాలం ఉన్న వ్యక్తులు ఉషా వాన్స్‌ను లక్ష్యంగా చేసుకుని జాతి వివక్షతో కూడిన వ్యాఖ్యలు చేయడం సంచలనం సృష్టించింది. దీనిపై భారత సంతతికి చెందిన రిపబ్లికన్ నాయకుడు వివేక్ రామస్వామి ఘాటుగా స్పందించారు. ఇటువంటి ద్వేషపూరిత భావజాలానికి పార్టీలో చోటు ఉండకూడదని స్పష్టం చేశారు.చారిత్రక పునరావృతంచరిత్రను గమనిస్తే అమెరికాలో ఆర్థిక మాంద్యం లేదా ఉద్యోగాల కోత ఉన్న సమయాల్లో వలసదారులపై దాడులు పెరగడం కొత్తేమీ కాదు. గతంలో ఐరిష్, ఇటాలియన్, జపనీస్ వలసదారులు కూడా ఇటువంటి వివక్షను ఎదుర్కొన్నారు. ప్రస్తుతం భారతీయుల పట్ల కనిపిస్తున్న అసహనం కూడా అటువంటి ఆర్థిక అభద్రతాభావం నుంచే పుట్టుకొస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.తాజా గణాంకాల ప్రకారం వివక్ష ఇలా..49 శాతం భారతీయ అమెరికన్లు గడిచిన ఏడాది కాలంలో ఏదో ఒక రూపంలో వివక్షను ఎదుర్కొన్నారు. చర్మం రంగు, భాష యాస, మతపరమైన ఆచారాల ఆధారంగా భారతీయులను వేరుగా చూస్తున్నట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి.అమెరికా ఆర్థిక వ్యవస్థకు కీలకంగా నిలుస్తున్న భారతీయ నిపుణులపై ఈ విధమైన అసహనం ప్రదర్శించడం ఇరు దేశాల సంబంధాలపైనే కాకుండా, అమెరికా ప్రజాస్వామ్య విలువలపై కూడా ప్రభావం చూపుతుంది. రాజకీయ ప్రయోజనాల కోసం వలసదారులను విమర్శించడం ఆపేయాలని, ఆన్లైన్లో ద్వేషాన్ని అరికట్టాలని పౌర సమాజం కోరుతోంది.ఇదీ చదవండి: వన్ ప్లస్ సీఈఓపై అరెస్ట్ వారెంట్! -
కెంట్ అయ్యప్ప ఆలయంలో వైభవంగా ‘మకరవిళక్కు మహోత్సవం’
కెంట్: ఇంగ్లండ్‌లోని కెంట్ అయ్యప్ప ఆలయంలో నిన్న (జనవరి 14, బుధవారం) మకరవిళక్కు మహోత్సవం వైభవంగా జరిగింది. పూజా కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఇంగ్లండ్ నుంచి వచ్చిన అయ్యప్ప భక్తులు వేడుకల్లో పాల్గొన్నారు. ఉదయం 7 గంటలకు ఆలయం తెరవడంతో ఉత్సవం ప్రారంభమైంది. ఆ తర్వాత ఉదయం 7:10 గంటలకు నిర్మాల్య దర్శనం. ఉదయం 7:30 గంటలకు ఉష పూజ, ఉదయం 8 గంటలకు గణపతి హోమం, ఉదయం 9 గంటలకు ఉచ్చ పూజ నిర్వహించారు.సాయంత్రం 5.30 గంటల నుంచి విశేష అభిషేకం, పూజ, దీపారాధన, సహస్రనామార్చనలు నిర్వహించారు. రాత్రి ఉత్సవాల్లో రాత్రి 9 గంటలకు అథజా పూజ, 9.30 గంటలకు పడిపూజ, 9.45 గంటలకు హరివరాసనం నిర్వహించారు. అభిజిత్, తాజూరు మన హరినారాయణన్ నంబితీశ్వరర్ పూజలు నిర్వహించారు. వెల్లిఒత్తిల్లం అద్రిత్ వాసుదేవ్ కూడా పూజలు నిర్వహించారు. విశ్వజిత్ త్రిక్కాకర సోపాన సంగీతం, తత్త్వమసి బృందం, భజనలు, రమ్య అరుణ్ కృష్ణన్ భరతనాట్యం ప్రదర్శించారు. -
లక్షకు పైగా యూఎస్ వీసాల రద్దు..
అమెరికా ఇమ్మిగ్రేషన్ విధానాల్లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. భద్రతా కారణాలు, చట్టపరమైన నిబంధనలు ఉల్లంఘనల నేపథ్యంలో యూఎస్ విదేశాంగ శాఖ ఏడాది కాలంలో ఏకంగా 1,00,000 కంటే ఎక్కువ వీసాలను రద్దు చేసినట్లు ప్రకటించింది. రద్దు చేసిన వాటిలో దాదాపు 8,000 విద్యార్థి వీసాలు, 2,500 ప్రత్యేక వర్క్ పర్మిట్లు ఉండటం గమనార్హం. క్రిమినల్ రికార్డులు లేదా చట్టపరమైన నిబంధనలు అతిక్రమించిన విదేశీ పౌరులపై చేపట్టిన చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.సురక్షిత అమెరికా లక్ష్యంగా..ఇటీవల తన అధికారిక ఎక్స్(గతంలో ట్విట్టర్) ఖాతా ద్వారా యూఎస్ విదేశాంగ శాఖ ఈ వివరాలను వెల్లడించింది. అమెరికాను సురక్షితంగా ఉంచడానికి వీసారద్దును, కఠినమైన నిబంధనలను కొనసాగిస్తామని స్పష్టం చేసింది. ట్రంప్ పరిపాలనలో వీసా అమలును కఠినతరం చేయడం, యూఎస్‌లోకి ప్రవేశించిన తర్వాత కూడా వీసా హోల్డర్ల ప్రవర్తనను పర్యవేక్షించే స్క్రీనింగ్ విధానాల విస్తరణ వల్లే ఈ స్థాయిలో రద్దులు జరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.భారతీయులపై ప్రభావంఅమెరికా వీసా హోల్డర్లలో అధిక సంఖ్యలో ఉన్న భారతీయులపై ఈ నిర్ణయం నేరుగా ప్రభావం చూపుతోంది. అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య పరంగా చైనాను అధిగమించిన భారత్, ఇప్పుడు కఠినమైన యూఎస్ స్క్రీనింగ్ విధానాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటోంది. 2025లో భారతీయ విద్యార్థులకు వీసా జారీ ప్రక్రియ నెమ్మదించింది. హెచ్-1బీ వీసాలపై ఉన్న భారతీయ ఐటీ నిపుణులు కూడా అనిశ్చితిని ఎదుర్కొంటున్నారు. కొత్త H-1B వీసాలపై ప్రతిపాదిత 1,00,000 డాలర్ల ఫీజు విధించే నిబంధన కంపెనీలకు భారంగా మారింది. ప్రస్తుతం ఈ అంశం యూఎస్ కోర్టుల్లో చట్టపరమైన సవాలును ఎదుర్కొంటోంది. ఒకవైపు భారత్‌లోని రాయబార కార్యాలయం వరుసగా రెండో ఏడాది 10 లక్షల కంటే ఎక్కువ నాన్-ఇమ్మిగ్రెంట్ వీసాలను జారీ చేసినప్పటికీ, ఈ వీసాల రద్దు ఆందోళన కలిగిస్తోంది.🚨BREAKING: The State Department has now revoked over 100,000 visas, including some 8,000 student visas and 2,500 specialized visas for individuals who had encounters with U.S. law enforcement for criminal activity.We will continue to deport these thugs to keep America safe. pic.twitter.com/wuHVltw1bV— Department of State (@StateDept) January 12, 2026రంగంలోకి భారత ప్రభుత్వంపెరుగుతున్న వీసా రద్దులు, కఠిన నిబంధనలపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందించింది. అమెరికాలో ఉంటున్న భారతీయ విద్యార్థులు, కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తాము నిశితంగా గమనిస్తున్నట్లు తెలిపింది. ‘ప్రభావిత భారతీయ పౌరులతో సంప్రదింపులు జరుపుతున్నాం. వీసా ఆందోళనలను అధికారికంగా యూఎస్ దృష్టికి తీసుకెళ్లాం’ అని ప్రభుత్వం ప్రకటించింది.ఇదీ చదవండి: పండగ ముందు పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే.. -
ఇరాన్ ఆందోళనల్లో భారతీయుల అరెస్ట్?!
ఇరాన్ అమెరికా మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఆందోళనకారులను అణచివేస్తే చూస్తూ ఊరుకోబోమని, అవసరమైతే సైనిక చర్యకు దిగుతామని ట్రంప్.. తమ దేశ వ్యవహారంలో జోక్యం చేసుకుంటే అంతు చూస్తామంటూ ఖమేనీ సవాల్-ప్రతిసవాల్ విసురుకుంటున్నారు. అయితే ఆందోళనలతో ఇరాన్ నెత్తురోడుతున్న వేళ.. ఆ దేశంలోని ఇతర దేశాల పౌరుల భద్రతపై ఆందోళన నెలకొంది. ఇరాన్ సంక్షోభంలో(Iran Crisis) మరణాలను అక్కడి ప్రభుత్వం తక్కువగా చూపెడుతోందంటూ మానవ హక్కుల సంఘాలు విమర్శిస్తున్నాయి. ఇప్పటిదాకా 548 మరణించారని.. అందులో 48 భద్రతా సిబ్బంది ఉన్నారని తెలుస్తోంది(హెచ్ఆర్ఏఎన్ఏ అనే అమెరికా మానవ హక్కుల సంఘం లెక్కల ప్రకారం). అలాగే 10 వేల మంది ఆందోళనకారుల్ని అరెస్ట్ చేశారని సమాచారం. అయితే.. అరెస్ట్ అయిన వాళ్లలో ఇతర దేశా పౌరులు ఉన్నట్లు పలు కథనాలు వైరల్ అవుతున్నాయి. నిరసనల్లో పాల్గొనకపోయినా.. కొందరి చేతులకు బేడీలు వేసి తీసుకెళ్తన్నట్లుగా దృశ్యాలు అందులో ఉన్నాయి. అందులో భారతీయులు, అఫ్గనిస్థాన్ జాతీయులు ఎక్కువగా ఉన్నట్లు ఆ ప్రచార సారాంశం. పైగా విదేశీ వ్యవహారాల శాఖ సంబంధిత పేర్లతో ఉన్న అకౌంట్లలో ఆ వీడియోలు పోస్టు కావడం గమనార్హం. దీంతో.. ఆ దేశంలో పనుల నిమిత్తం వెళ్లిన భారత పౌరులు.. విద్యార్థుల భద్రతపై ఢిల్లీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి. అయితే.. భారత్‌లో ఇరాన్ రాయబారి మహ్మద్ ఫతాలి(Mohammad Fathali) ఆ కథనాలను ఖండించారు. అలాంటిదేమీ.. ఇరాన్‌లోని భారతీయులతో సహా ఇతర దేశాల పౌరుల భద్రతకు వచ్చిన ముప్పేమీ లేదని స్పష్టత ఇచ్చారు. సోషల్ మీడియాలో జరిగిన ఫేక్ ప్రచారం ఆధారంగానే ఆ కథనాలు పుట్టుకొచ్చాయని అంటున్నారు. పుకార్లను నమ్మొద్దంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో ఆయన క్లారిటీగా ఓ పోస్ట్ చేశారు. అయితే.. అటు ఇరాన్ ఈ తరహా కథనాలు మొదటి నుంచే ఖండిస్తోంది. ఇదంతా ఉద్దేశపూర్వకంగానే జరుగుతున్న కుట్ర అని ఆరోపించింది. ఇరాన్ నిరసనలను కొందరు విదేశీ నటులు.. మీడియా వక్రీకరిస్తున్నాయని.. తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నాయని ఆరోపిస్తోంది. మన పిల్లలు సేఫ్!భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం.. ఇరాన్లో 10,000 నుంచి 12,000 మంది భారతీయులు ఉన్నారు. ఇందులో పనుల నిమిత్తం వెళ్లేవాళ్లు, భారతీయ మూలాలు ఉన్నవాళ్లు కూడా ఉన్నారు. అయితే అక్కడికి భారత్ నుంచి అత్యధికంగా వెళ్లేది వైద్య విద్య అభ్యసించేందుకు వెళ్లే విద్యార్థులే. ఈ నేపథ్యంలో.. వాళ్ల భద్రతపై కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే.. వాళ్లు సురక్షితంగా ఉన్నారని ఆల్ ఇండియా మెడికల్ స్టూడెంట్స్ అసోసియేషన్ (AIMSA), ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్స్ (FAIMA) ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ విషయంలో భారత రాయబార కార్యాలయం, సీనియర్ అధికారులు పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నారని.. విద్యార్థులతో, అక్కడి అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారని పేర్కొంది. -
క్లీవ్‌ల్యాండ్‌లో శంకర నేత్రాలయ తొలి నిధి సమీకరణ కార్యక్రమం దిగ్విజయం
శంకర నేత్రాలయ U.S.A. ఆధ్వర్యంలో “Echoes of Compassion – Where Arts Meet Heart” అనే శీర్షికతో, ఒహియో చాప్టర్ యొక్క తొలి నిధి సమీకరణ కార్యక్రమం క్లీవ్‌ల్యాండ్‌లో గర్వంగా నిర్వహించబడింది. ఈ చారిత్రక కార్యక్రమం డిసెంబర్ 13, శనివారం సాయంత్రం 4:00 గంటల నుండి 7:00 గంటల వరకు, ఒహియో రాష్ట్రం మెడినా నగరంలోని మెడినా పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ సెంటర్ (మిడిల్ స్టేజ్) లో ఘనంగా జరిగింది.ఒహియో రాష్ట్ర సాంస్కృతిక కమిటీ సభ్యురాలు శ్రీమతి కల్యాణి వేటూరి గారి సమర్థ మార్గదర్శకత్వంలో నిర్వహించబడిన ఈ కార్యక్రమంలో, గ్రేటర్ క్లీవ్‌ల్యాండ్ ప్రాంతానికి చెందిన అనేక సంగీత మరియు శాస్త్రీయ నృత్య పాఠశాలలు పాల్గొని, చూపు సంరక్షణ ద్వారా మానవ సేవ చేయాలనే శంకర నేత్రాలయ యొక్క మహత్తర సేవా లక్ష్యానికి తమ మద్దతును అందించాయి.ఈ సాయంత్రం శాస్త్రీయ సంగీతం మరియు భారతీయ శాస్త్రీయ నృత్య సంప్రదాయాల అద్భుత సమ్మేళనంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రతి ప్రదర్శనకు ప్రేక్షకుల నుండి హర్షాతిరేక చప్పట్లతో అపూర్వ స్పందన లభించింది.సంగీత ప్రదర్శనలు⇒ సప్త స్వర అకాడమీ విద్యార్థులు(గురు శ్రీ విష్ణు పసుమర్తి మరియు గురు శ్రీ కృష్ణ పసుమర్తి గారి నాయకత్వంలో)⇒ మధురాలయ స్కూల్ ఆఫ్ మ్యూజిక్ విద్యార్థులు(గురు శ్రీ లలిత్ సుబ్రహ్మణియన్ గారి మార్గదర్శకత్వంలో)శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు⇒ కూచిపూడి — శ్రీమతి కల్యాణి వేటూరి గారి శిష్యులు, శ్రీ మయూరి డాన్స్ అకాడమీ⇒ భరతనాట్యం — గురు శ్రీమతి సుజాత శ్రీనివాసన్ గారి శిష్యులు, శ్రీ కలామందిర్⇒ కథక్ — గురు శ్రీమతి అంతర దత్తా గారి శిష్యులు, అంగకళ కథక్ అకాడమీ⇒ కూచిపూడి — గురు శ్రీమతి సుధా కిరణ్మయి తోటపల్లి గారి శిష్యులు, నర్తనం డాన్స్ అకాడమీతీవ్రమైన మంచు తుఫాను మరియు ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ, సేవాభావం ప్రకాశవంతంగా వెలిగింది. “వర్షమైనా మంచైనా, కార్యక్రమం కొనసాగాల్సిందే” అనే నమ్మకంతో ఈ కార్యక్రమం సజావుగా నిర్వహించబడింది. 150 మందికి పైగా సమాజ సభ్యులు హాజరై, అపూర్వమైన సమాజ మద్దతును చాటిచెప్పారు.ఈ కార్యక్రమానికి ఇండియా ఫెస్ట్ U.S.A. స్థాపకులు శ్రీ భరత్ పటేల్ ప్రత్యేక అతిథిగా హాజరై, కార్యక్రమానికి మరింత గౌరవం మరియు ప్రోత్సాహాన్ని అందించారు.“ఎకోస్ ఆఫ్ కంపాషన్” కార్యక్రమం కళ, సంస్కృతి, సమాజం ఏకమై ఎలా అర్థవంతమైన మార్పును తీసుకురాగలవో స్పష్టంగా చాటింది. కరుణ మరియు సహకారంతో సేవ చేయాలనే శంకర నేత్రాలయ U.S.A. లక్ష్యాన్ని మరింత బలపరిచింది.ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో నాయకత్వం మరియు లాజిస్టిక్ మద్దతు అందించిన SNUSA అధ్యక్షులు శ్రీ బాల రెడ్డి ఇందుర్తి, శ్రీమతి నీలిమ గడ్డమనుగు, శ్రీ మూర్తి రేకపల్లి, డా. రెడ్డి ఊరిమిండి, శ్రీ వంశీ ఏరువరం, శ్రీ శ్యామ్ అప్పల్లి, శ్రీ రత్నకుమార్ కవుటూరు, శ్రీ గిరి కోటగిరి, శ్రీ అమర్ అమ్యరెడ్డి మరియు శ్రీ గోవర్ధన్ రావు నిడిగంటి గారికి SNUSA ఒహియో చాప్టర్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసింది. -
అలస్కాలో ‘గుంటూరు విద్యార్థి’ అదృశ్యం
అలాస్కా: అమెరికాలోని అలాస్కాకు ఒంటరిగా బయలుదేరిన ఆంధ్రప్రదేశ్ విద్యార్థి అదృశ్యం కావడం మిస్టరీగా మారింది. ప్రకృతి అందాలను తిలకించడానికి వెళ్లి.. మంచు కొండల మధ్య ఆచూకీ లేకుండా పోయాడు. గుంటూరు జిల్లా అద్దంకికి చెందిన హరి కరసాని హ్యూస్టన్‌లో నివాసం ఉంటున్నారు. క్రిస్మస్ సెలవుల నేపథ్యంలో హరి డిసెంబర్ 22, 2025న ఒంటరిగా అలాస్కా పర్యటనకు వెళ్లారు.అక్కడ హీలీ పట్టణంలోని ఔరోరా డెనాలి లాడ్జ్‌లో బస చేశారు జనవరి 4 నాటికి తిరిగి వస్తానని తన రూమ్‌మేట్స్‌కు కూడా సమాచారం ఇచ్చారు. అయితే, డిసెంబర్ 30న చివరిసారిగా కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడిన హరి.. ఆ మరుసటి రోజు డిసెంబర్ 31 హోటల్ నుంచి చెక్-ఔట్ కాగా.. అప్పటి నుండి అతని ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది.డిసెంబర్ 31న ఆయన హోటల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక క్యాబ్ సర్వీస్ వాడినట్లు సమాచారం. హరికి డ్రైవింగ్ రాకపోవడంతో ఆయన క్యాబ్‌లు, స్థానిక రవాణాపైనే ఆధారపడ్డారు. హోటల్ నుంచి బయలుదేరిన హరి ఆ క్యాబ్‌లో ఎక్కడికి వెళ్లారు? ఆ డ్రైవర్ ఎవరు? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డిసెంబర్ 31 తర్వాత డెనాలి ప్రాంతంలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల ఫారన్‌హీట్ వరకు పడిపోయాయని, హరి గురించి ఎలాంటి సమాచారం లభించలేదని అతని స్నేహితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
భారతీయ విద్యార్థులకు అమెరికా బిగ్ వార్నింగ్
భారతీయ విద్యార్థులకు అమెరికా తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. వీసా అనేది హక్కేం కాదని.. తమ చట్టాలను ఉల్లంఘిస్తే పరిణామాలు తీవ్రంగానే ఉంటాయని హెచ్చరించింది. వీసా రద్దుతో పాటు దేశ బహిష్కరణ కూడా ఖాయమని స్పష్టం చేసింది. భారత్‌లోని యూఎస్ ఎంబసీ బుధవారం ఎక్స్ ఖాతాలో ఓ ట్వీట్ చేసింది. అందులో అమెరికాలో చదువుతున్న భారతీయ విద్యార్థులకు హెచ్చరిక జారీ చేసింది. అందులో.. ‘‘అమెరికాలో చదువుతున్న భారతీయ విద్యార్థులు చట్టాలను ఉల్లంఘిస్తే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వీసా అనేది హక్కు కాదు. అది ఒక ప్రత్యేక అవకాశం మాత్రమే’’ అని స్పష్టం చేసింది. ఈ క్రమంలో.. దేశం నుంచి వెల్లగొట్టడమే కాకుండా భవిష్యత్తులో వీసా అర్హత కోల్పోవచ్చని స్పష్టం చేసింది. Breaking U.S. laws can have serious consequences for your student visa. If you are arrested or violate any laws, your visa may be revoked, you may be deported, and you could be ineligible for future U.S. visas. Follow the rules and don’t jeopardize your travel. A U.S. visa is a… pic.twitter.com/A3qyoo6fuD— U.S. Embassy India (@USAndIndia) January 7, 2026ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక.. స్టూడెంట్ వీసా ప్రక్రియలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఫీజులను గణనీయంగా పెంచడంతో పాటు సోషల్ మీడియా తనిఖీలు తప్పనిసరిగా మారాయి. అలాగే స్టూడెంట్ స్టేకు టైమ్ లిమిట్ వంటి నిబంధనలు ప్రవేశపెట్టబడ్డాయి. ఈ మార్పులు అమెరికాలో చదవాలని భావిస్తున్న భారతీయ విద్యార్థులపై నేరుగా ప్రభావం చూపుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా బెదిరింపులు రావడం గమనార్హం. -
రెండేళ్ల నిరీక్షణ.. రూ.24 లక్షలు గెల్చుకున్నాడు
దుబాయ్‌లో డ్రైవర్‌గా పనిచేస్తున్న భారతీయుడికి జాక్‌పాట్ తగిలింది. లాటరీలో ఒకటీ రెండూ కాదు ఏకంగా పాతిక లక్షల రూపాయలను గెల్చుకున్నాడు. గత రెండేళ్లుగా లాటరీ టికెట్లను కొనుగోలు చేస్తున్న 57 ఏళ్ల బషీర్‌ను ఎట్టకేలకు అదృష్టదేవతవరించింది.కేరళకు చెందిన బషీర్ కైపురత్ గత పాతికేళ్లుగా యూఏఈలో నివసిస్తున్నాడు. అతని వృత్తి డ్రైవర్. ఏదో ఒక రోజు ఫలితం దక్కకపోతుందా అనే ఆశతో ప్రతీ నెలా క్రమం తప్పకుండా బిగ్ టికెట్ టిక్కెట్లను కొనుగోలు చేయడం అతనికి అలవాటు. చివరికి రెండేళ్లకు పైగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న అతని కల ఫలించింది. బిగ్ టికెట్ ఈ-డ్రాలో 276640 నంబర్ టిక్కెట్‌తో Dh100,000 (సుమారు రూ. 24 లక్షలు) గెలుచుకున్నాడు. చదవండి: అధికారులే షాక్ : పౌర్ణమి, గుప్త నిధులు, 8 నెలల బాలుడుఆసక్తికర విషయం ఏమిటంటే.. 'రెండు కొంటే మూడు ఉచితం అనే పరిమిత కాల ఆఫర్ కింద దీన్ని కొనుగోలు చేశాడు. ఈ నిర్ణయం అతని జీవితాన్ని మార్చేసింది. ఈ డ్రా గెల్చుకున్నట్టు ఫోన్ రాగానే తొలుత తాను అస్సలు నమ్మలేదని ఆ గెలుపును ఇంకా జీర్ణించుకోలేకపోతున్నా అంటూ పట్టరాని సంతోషాన్ని ప్రకటించాడు. ఈ డబ్బులో కొంత భాగాన్ని భారతదేశంలోని తన కుటుంబానికి ఇవ్వాలని భావిస్తున్నాడు. ఓపిక, పట్టుదల తప్పకుండా గెలుస్తాయంటున్నాడు. అంతేకాదు భవిష్యత్తులో కూడా డ్రాలలో కూడా పాల్గొంటానని చెప్పాడు.ఇంతకు ముందు గుజరాత్‌కు చెందిన 52 ఏళ్ల కంప్యూటర్ టీచర్ రితేష్ ధనక్ సుమారు రూ. 25 లక్షలు గెలుచుకున్నాడు. గత 30 సంవత్సరాలుగా తన కుటుంబంతో కలిసి దుబాయ్‌లో నివసిస్తున్న రితేష్, దశాబ్దానికి పైగా క్రమం తప్పకుండా బిగ్ టిక్కెట్లను కొనుగోలు చేసే అలవాటున్న రితేష్ తన స్నేహితులతో కలిసి దీన్ని కొనుగోలు చేసి, గెల్చుకున్నాడు. ఇదీ చదవండి: గాయని చిత్ర అయ్యర్ సోదరి దుర్మరణం, ఇన్‌స్టా పోస్ట్ వైరల్‌కాగా బిగ్ టికెట్ యూఏఈలోని అత్యంత ప్రజాదరణ పొందిన రాఫెల్ డ్రాలలో ఒకటి. ఇందులో గెలుపొందిన విజేతలు భారీ నగదు బహుమతులు, లగ్జరీ కార్లను దక్కించుకోవచ్చు. ఇది అబుదాబిలో ఉన్నప్పటికీ, దుబాయ్‌తో సహా దేశవ్యాప్తంగా ఇది ఆకర్షిస్తుంది. ఈ డ్రాలు నెలవారీగా జరుగుతాయి. 18 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు న్నవారు ఈ టిక్కెట్లను అధికారిక బిగ్ టికెట్ వెబ్సైట్ ద్వారా లేదా అబుదాబి అంతర్జాతీయ విమానాశ్రయం, లేదా ఎంపిక చేసిన అధీకృత అవుట్లెట్లలో వీటిని కొనుగోలు చేయవచ్చు. -
అమెరికాలో తెలుగు దంపతుల దుర్మరణం
వాషింగ్టన్ : అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు రాష్ట్రానికి చెందిన దంపతులు దుర్మరణం చెందారు. ఈరోజు(సోమవారం) వాషింగ్టన్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో కృష్ణ కిషోర్, ఆశలు మృతిచెందారు. అమెరికాలో కృష్ణకిషోర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తన్నాడు. ఓ కార్యక్రమం మీద బయటకు వెళ్లి తిరిగి కారలో వస్తుండగా వీరు రోడ్డు ప్రమాదం బారిన పడ్డారు. ఈ ఘటనలో ఇద్దరూ అక్కడికక్కడే మృతించెందారు. ఈ ప్రమాదంలో వారి కుమారుడు, కూతురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిది భారత్‌లోని తెలుగు రాష్ట్రం ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుగా గుర్తించారు. పది రోజుల క్రితమే కిషోర్ పాలకొల్లుకు వచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న అతని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తన్నారు. పాలకొల్లు వచ్చిన సమయంలో తమ కలిసి వెళ్లాడని పలువురు స్నేహితులు గుర్తు చేసుకుంటున్నారు. -
అమెరికాలో తెలుగు యువతి దారుణ హత్య!
అమెరికాలో తెలుగు యువతి దారుణ హత్యకు గురైంది. న్యూ ఇయర్ వేడుకల రోజున అదృశ్యమైన నికితా గోడిశాల అనే యువతి తన మాజీ ప్రియుడు ఫ్లాట్‌లో శవమై కనిపించింది. మేరీల్యాండ్లోన మాజీ ప్రియుడు అర్జున్ శర్మ ఫ్లాట్‌లో ఆమె మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. దాంతో అర్జున్ శర్మనే ఆమెన హత్య చేసినట్లు పోలీసుల భావిస్తున్నారు. ప్రస్తుతం అర్జున్ శర్మ పరారీలో ఉన్నాడు. అతని కోసం యూఎస్ పోలీసులు గాలిస్తున్నారు.ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన నిఖిత.. ప్రస్తుతం ఆమె హోవర్డ్ కౌంటీలో ఉన్న ఎల్లికాట్ సిటీలో డేటా మరియు స్ట్రాటజీ అనలిస్ట్‌గా పనిచేస్తుంది.మాజీ ప్రియుడిపై ఫస్ట్- సెకండ్ డిగ్రీ హత్య అభియోగాలు మోపుతూ అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. జనవరి 2వ తేదీన ఆమె అవృశ్యమైన ఫిర్యాదు తమకు వచ్చిందని, ఈ మేరకు విచారణ చేపడితే ఆమె హత్య గావించబడ్డ విషయం తాజాగా వెలుగుచూసిందన్నారు. మేరీల్యాండ్ సిటీలోని అర్జున్‌శర్మ ఫ్లాట్‌లో ఆమె డిసెంబర్ 31వ తేదీన చివరిసారి కనిపించినట్లు పోలీసులకు అపార్ట్మెంట్ వాసులు తెలిపారు. అదే అపార్ట్మెంట్లో సెర్చ్ వారెంట్ అమలు చేసి దర్యాప్తు ప్రారంభించగా, కత్తిపోట్లతో పడి ఉన్న ఆమె మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. ఆమెది తెలంగాణ రాష్ట్రంగా అనుమానిస్తున్నారు. ఆమె స్వస్థలంపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే అర్జున్ శర్మది కూడా ఇండియానే. హత్య చేసిన తర్వాత అర్జున్ శర్మ భారత్‌కు వచ్చేశాడు.హత్యోదంతం తర్వాత భారత్‌కు వచ్చేసిన అర్జున్ శర్మను తమిళనాడులో అరెస్టు చేశారు. అర్జున్ శర్మది తమిళనాడు రాష్ట్రంగా తెలుస్తోంది. -
శ్రీ సాంస్కృతిక కళాసారథి ఆధ్వర్యంలో మాజీ ఉపరాష్ట్రపతి ఆత్మీయ సమ్మేళనం
శ్రీ సాంస్కృతిక కళాసారథి ఆధ్వర్యంలో భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడుతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం శుక్రవారం సాయంత్రం సింగపూరులోని నేషనల్ పబ్లిక్ స్కూలు ఆవరణలో దాదాపు 400 మంది ఆహూతులు సమక్షంలో ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి సంస్థ అధ్యక్షులు కవుటూరు రత్న కుమార్ అధ్యక్షత వహిస్తూ మాట్లాడుతూ, శ్రీ సాంస్కృతిక కళాసారథి సంస్థ ప్రారంభమే వెంకయ్య నాయుడు ఆశీస్సుల సందేశంతో జరిగిందని, అప్పటి నుంచి ప్రతి దశలోనూ వారి మార్గదర్శకత్వం, సూచనలు, ప్రోత్సాహం తమకు నిరంతరం లభిస్తూనే ఉన్నాయని తెలిపారు. అలాగే అతి తక్కువ సమయంలో సమాచారం అందించినప్పటికీ, సమయాన్ని సర్దుబాటు చేసుకుని కార్యక్రమానికి హాజరైన సింగపూరు భారతీయ హైకమిషనర్ డా. శిల్పక్ అంబులే గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ముఖ్య అతిథి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ కుటుంబంలో, సమాజంలో, దేశంలో ఐక్యత ఉన్నప్పుడే ప్రపంచం ప్రశాంతంగా ఉంటుంది. దేశంలో ఉన్న ప్రతిఒక్కరూ, నేతలందరూ ఐక్యంగా ఉండాలి. ఎన్నికల వరకే ప్రత్యర్థులు. ఆ తర్వాత అందరం భారతీయులం. ఐక్యంగా ఉంటే శాంతి ఉంటుంది. ‘‘భాష పోతే శ్వాస పోతుంది" అంటూ మాతృభాషను కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను శ్రీ వెంకయ్యనాయుడు నొక్కి చెప్పారు. తెలుగులోని గొప్ప సాహిత్యాన్ని ఇతర భాషల్లోకి అనువదించి ప్రపంచానికి అందించాలని విదేశాల్లోని తెలుగువారికి పిలుపునిచ్చారు.శ్రీ సాంస్కృతిక కళాసారథి గాయని–గాయకులు ఆలపించిన “మా తెలుగు తల్లికి” గీతంతో ప్రారంభమైన ఈ కార్యక్రమం ఆద్యంతం ఆహ్లాదకరంగా సాగింది. సింగపూరులోని ప్రముఖ తెలుగు సంస్థలైన తెలంగాణ కల్చరల్ సొసైటీ, తెలుగుదేశం ఫోరమ్, కాకతీయ సంస్కృతిక పరివారం, APNRT ప్రతినిధులు హాజరై శ్రీ వెంకయ్య నాయుడు గారిని ఘనంగా సన్మానించారు.తదుపరి కార్యక్రమానికి హాల్‌ను సమకూర్చిన కొత్తమాస్ వెంకటేశ్వర రావు (KV Rao, SIFAS) , నేషనల్ పబ్లిక్ స్కూల్ సిబ్బందిని అభినందించారు. అలాగే ఈ కార్యక్రమానికి స్పాన్సర్షిప్ అందించిన హనుమంత రావు మాదల, నాగులపల్లి శ్రీనివాసు, శివప్రసాద్ టీమ్, సరిగమ గ్రాండ్, సూపర్ డీలక్స్, కూల్ టైం, వీర ఫ్లేవర్స్, దివ్యజ్యోతి ప్రొడక్షన్స్ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. గాయని–గాయకులు సౌభాగ్యలక్ష్మి తంగిరాల, చంద్రహాస్ ఆనంద్, శేషుకుమారి యడవల్లి, ఉషాగాయత్రి నిష్టల, అలాగే శరజ అన్నదానం, సౌమ్య ఆలూరు, కృష్ణ కాంతి లను శ్రీ వెంకయ్య నాయుడు గారి చేతుల మీదుగా శాలువాలతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో శ్రీ సాంస్కృతిక కళాసారథి సభ్యులు రాంబాబు పాతూరి, శ్రీధర్ భరద్వాజ, రామాంజనేయులు చామిరాజు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి సుబ్బు వి. పాలకుర్తి వ్యాఖ్యానం అందించగా, వంశీ కృష్ణ శిష్ట్లా, కుమారస్వామి గుళ్లపల్లి సాంకేతిక సహకారం అందించారు. అలాగే మాధవి పాలకుర్తి, మమత మాదాబత్తుల సత్య జాస్తి, రేణుక చామిరాజు, ప్రసన్న భరద్వాజ్, శ్రీలలిత తదితరులు వాలంటీర్ సేవలతో కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కార్యక్రమానంతరం విచ్చేసిన ఆహుతులందరికీ సరిగమ గ్రాండ్ వారు ఏర్పాటు చేసిన విందు భోజనంతో కార్యక్రమం సౌహార్ద వాతావరణంలో ముగిసింది. -
యువ దంపతుల విషాదం
ఒక్కోసారి అంతే. జీవితం ఎప్పుడు ఎలాంటి మలుపు తిరుగుతుందో ఎవరూ ఊహించలేరు. అంతా బాగానే ఉందనుకున్న సమయంలో అనుకోని విధంగా ఏదైనా జరిగితే జీవితం తలకిందులవుతుంది. అంతా చీకటి అవుతుంది. రేష్మ జీవితంలోనూ అలాగే జరిగింది. ఊహించని విధంగా భర్త చనిపోవడంతో ఆమె బాగా కుంగిపోయింది. తన భర్త మరణానికి కారణం తెలుసుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో విరక్తితో తాను కూడా అర్థాంతరంగా తనువు చాలించింది. ఎవరీ రేష్మ, ఆమె కథేంటి?అసలేం జరిగింది?కేరళ (Kerala) వయనాడ్‌లోని కొలయాడి గ్రామానికి చెందిన 32 ఏళ్ల రేష్మ విషం తాగి బుధవారం (డిసెంబర్ 31) మరణించింది. 5 నెలల క్రితం ఆమె భర్త జినేష్ సుకుమారన్ (38) ఇజ్రాయెల్‌లో అనుమానాస్పద పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోయాడు. గత జూలైలో జెరూసలేంకు సమీపంలో ఉన్న మెవాస్సెరెట్ పట్టణంలోని ఓ అపార్ట్మెంట్లో ఉరేసుకుని చనిపోయినట్టు అక్కడి పోలీసులు గుర్తించారు. అక్కడే 80 ఏళ్ల వృద్ధురాలు కూడా కత్తి గాయాలతో చనిపోయి కనిపించింది. మంచాన పడిన ఆ మహిళ భర్తను చూసుకోవడానికి సంరక్షుడిగా జినేష్ ఉద్యోగం చేసేవాడు. కాగా, వృద్ధురాలిని చంపి అతడు ఆత్మహత్య చేసుకున్నాడన్న అనుమానాలు అప్పట్లో వ్యక్తమయ్యాయి. అయితే ఈ ఆరోపణలను రేష్మ తోసిపుచ్చింది.వీడని మిస్టరీ..తన భర్త మరణానికి గల కారణాలు తెలుసుకునేందుకు రేష్మ శతవిధాలా ప్రయత్నించింది. జినేష్ మరణం వెనుకున్న మిస్టరీని ఛేదించాలని పలుమార్లు ఇజ్రాయెల్‌లోని భారత రాయబార కార్యాలయానికి వెళ్లి స్వయంగా విన్నవించుకుంది. ఈ కేసులో కోర్టు పరిధిలో ఉందని ఆమెకు సమాధానం వచ్చేది తప్పా ఎటువంటి పురోగతి లభించలేదు. జినేష్ అపార్ట్మెంట్లో ఉరి వేసుకుని కనిపించగా, ఆ వృద్ధురాలు కత్తిపోట్ల గాయాలతో మరణించినట్టు మాత్రమే ఆమెకు రాయబార కార్యాలయం తెలిపింది. వయనాడ్‌కు తిరిగి వచ్చిన తర్వాత భారత ప్రభుత్వంతో పాటు ఇజ్రాయెల్ రాయబార కార్యాలయాన్ని సంప్రదించింది. నెలలు గడుస్తున్నా ఎటువంటి పురోగతి లేకపోవడంతో నిరాశతో రేష్మ బలవన్మరణానికి పాల్పడింది. తల్లితండ్రులు ఇద్దరూ చనిపోడంతో పదేళ్ల వారి కుమార్తె అనాథగా మిగిలింది.ఇజ్రాయెల్‌కు వెళ్లిన 2 నెలలకే.. ఊహించని విధంగా భర్త ప్రాణాలు కోల్పోవడంతో రేష్మ బాగా కుంగిపోయిందని కొలయాడి పంచాయతీ మాజీ సభ్యురాలు సుజా జేమ్స్ తెలిపారు. “జినేష్ మరణం తర్వాత రేష్మ తీవ్ర నిరాశకు గురైంది. వృద్ధురాలిని చంపిన తర్వాత తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని ఆమె అస్సలు నమ్మలేదు. తన భర్త హత్య చేసేంత కర్కోఠకుడు కాదని ఆమె నమ్మకం. అసలేం జరిగిందో కనిపెట్టాలని అధికారులకు చాలా ఆమె ఈ-మెయిళ్లు పంపింది, కానీ ప్రయోజనం లేకపోయింది” అని మీడియాతో చెప్పారు.చదవండి: ఇండియా అబ్బాయి.. జపాన్ అమ్మాయి!ఇజ్రాయెల్‌కు వెళ్లడానికి ముందు మెడికల్ రిప్రజెంటేటివ్‌గా జినేష్ పనిచేశాడని, గ్రాడ్యుయేట్ అయిన రేష్మ ఇంట్లోనే ఉండేదని సుజా జేమ్స్ తెలిపారు. కొలయాడిలో కట్టుకున్న ఇల్లు అప్పులు తీర్చడానికే జినేష్ ఇజ్రాయెల్‌కు వెళ్లినట్టు వెల్లడించారు. వీసా కోసం చాలా డబ్బులు ఖర్చు చేశాడని కూడా తెలిపారు. మరోవైపు ఇజ్రాయెల్ ప్రభుత్వం నుంచి రేష్మకు ఎటువంటి పరిహారం అందలేదు. జినేష్ ఆత్మహత్య చేసుకున్నట్టుగా అక్కడి అధికారులు నమోదు చేశారు. జినేష్ ఇజ్రాయెల్‌కు వెళ్లి కేవలం రెండు నెలలు మాత్రమే అవడంతో ఎటువంటి పరిహారం దక్కలేదని వివరించారు. -
ఇరాన్‌ను ఈసీఆర్ కేటగిరీలో చేర్చిన భారత ప్రభుత్వం
భారత ప్రభుత్వం ఇటీవల ఇరాన్ దేశాన్ని ఈసీఆర్ (ఎమిగ్రేషన్ చెక్ రిక్వయిర్డ్ – విదేశాలకు ఉద్యోగానికి వెళ్లేందుకు అనుమతి అవసరమైన) దేశాల జాబితాలో చేర్చింది. ఈ మేరకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని ఓవర్సీస్ ఎంప్లాయిమెంట్ & ప్రొటెక్టర్ జనరల్ ఆఫ్ ఎమిగ్రెంట్స్ విభాగం గత ఏడాది ఆగస్టున సర్కులర్‌ను జారీ చేసింది. దీంతో ఇప్పటి వరకు 18గా ఉన్న ఈసీఆర్ దేశాల సంఖ్య 19కి పెరిగింది.ఈ నిర్ణయం ప్రకారం, ఈసీఆర్ పాస్‌పోర్టు కలిగిన భారతీయ కార్మికులు ఉద్యోగం కోసం ఇరాన్‌కు వెళ్లాలంటే ఇక నుంచి తప్పనిసరిగా భారత ప్రభుత్వ ఎమిగ్రేషన్ క్లియరెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ-మైగ్రేట్ పోర్టల్‌లో నమోదైన సమాచారాన్ని ఆధారంగా చేసుకుని, బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ (బీఓఐ) ద్వారా ఎయిర్‌పోర్టులలోని ఇమిగ్రేషన్ చెక్ పోస్టుల (ఐసీపి) వద్ద ధృవీకరణ జరుగుతుంది.ఇవే 19 ఈసీఆర్ దేశాలుఎమిగ్రేషన్ యాక్ట్–1983 ప్రకారం భారత ప్రభుత్వం నోటిఫై చేసిన ఈసీఆర్ దేశాలు ఇవి: ఈ దేశాలను స్పెసిఫైడ్ / నోటిఫైడ్ ఈసీఆర్ కంట్రీస్ గా కూడా పిలుస్తారు.గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జీసీసీ) దేశాలు (6): బహరేన్, సౌదీ అరేబియా, కువైట్, ఖతార్, ఓమాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ).ఇతర దేశాలు (13): ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్, జోర్డాన్, లెబనాన్, లిబియా, మలేసియా, సుడాన్, సౌత్ సుడాన్, సిరియా, యెమెన్, ఇండోనేసియా, థాయిలాండ్, ఇరాన్.ఈసీఆర్ పాస్‌పోర్ట్ అంటే ఏమిటి?ఈసీఆర్ (ఎమిగ్రేషన్ చెక్ రిక్వాయిర్డ్) పాస్‌పోర్ట్ అంటే – ఈ 19 దేశాలకు ఉద్యోగం కోసం వెళ్లే ముందు, భారత ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అని అర్థం.సాధారణంగా 10వ తరగతి కంటే తక్కువ విద్యార్హత ఉన్నవారికి ఈసీఆర్ పాస్‌పోర్ట్ జారీ చేస్తారు. తక్కువ చదువు, తక్కువ లోకజ్ఞానం కలిగిన బలహీన వర్గాల కార్మికులను విదేశాల్లో దోపిడీ నుంచి రక్షించడమే ఈ విధాన ప్రధాన ఉద్దేశం. ముఖ్యంగా విదేశాల్లో శారీరక శ్రమ చేసే 'బ్లూ కాలర్ వర్కర్స్' సంక్షేమం కోసం ఈసీఆర్ వ్యవస్థను అమలు చేస్తున్నారు.ఎమిగ్రేషన్ క్లియరెన్స్ ఎలా?ఈసీఆర్ పాస్‌పోర్ట్ కలిగిన వారు ఈ దేశాలకు ఉద్యోగానికి వెళ్లే ముందు, లైసెన్స్ పొందిన రిక్రూటింగ్ ఏజెన్సీ ద్వారా హైదరాబాద్ లోని 'ప్రొటెక్టర్ ఆఫ్ ఎమిగ్రెంట్స్' (పిఓఈ) కార్యాలయంలోఎమిగ్రేషన్ క్లియరెన్స్ తీసుకోవాలి.వలస కార్మికుని పాస్‌పోర్ట్, ఉద్యోగ సంస్థ, జీతం ఒప్పందం, రిక్రూటింగ్ ఏజెన్సీ వివరాలు అన్నీ ఈ-మైగ్రేట్ సిస్టమ్‌లో నమోదు అవుతాయి.అలాగే, ఈసీఆర్ పాస్‌పోర్ట్ కలిగిన వారికి ప్రవాసి భారతీయ బీమా యోజన (పిబిబివై) కింద రూ.10 లక్షల ప్రమాద బీమా తప్పనిసరిగా వర్తిస్తుంది.రెండేళ్ల బీమాకు కేవలం రూ.325 ప్రీమియం చెల్లించాలి. ఆ తర్వాత ఆన్లైన్లో పునరుద్ధరణ చేసుకోవచ్చు. ఈసీఎన్ఆర్ పాస్‌పోర్ట్ అంటే?ఈసీఎన్ఆర్ (ఎమిగ్రేషన్ చెక్ నాట్ రిక్వయిర్డ్) అంటే – విదేశాలకు ఉద్యోగానికి వెళ్లేందుకు భారత ప్రభుత్వ అనుమతి అవసరం లేదు అన్నమాట.ఈసీఎన్ఆర్ కేటగిరీకి వీరు అర్హులు:* 10వ తరగతి ఉత్తీర్ణులు* విదేశాల్లో కనీసం 3 ఏళ్ల అనుభవం ఉన్నవారు* ఆదాయపు పన్ను చెల్లింపుదారులు* 50 సంవత్సరాల పైబడిన వారువీరు లోకజ్ఞానం కలిగినవారు, అవసరమైతే తమను తాము రక్షించుకునే సామర్థ్యం ఉన్నవారిగా ప్రభుత్వం భావిస్తుంది. వీరు కూడా ఐచ్చికంగా ప్రవాసి భారతీయ బీమా యోజన పొందవచ్చు.విజిట్ / టూరిస్ట్ వీసాలకు వర్తించదుఏ పాస్‌పోర్ట్ కలిగిన వారైనా – విజిట్ వీసా, టూరిస్ట్ వీసా, వైద్య అవసరాలు లేదా విహారయాత్రల కోసం ఈ 19 దేశాలకు వెళ్లేవారికి ఎమిగ్రేషన్ క్లియరెన్స్ అవసరం లేదు.రాను–పోను విమాన టిక్కెట్, చెల్లుబాటు అయ్యే వీసా ఉంటే సరిపోతుంది.–మంద భీంరెడ్డి, గల్ఫ్ వలస వ్యవహారాల విశ్లేషకులు 91 98494 22622 -
చరిత్ర సృష్టించిన జోహ్రాన్ మామ్దానీ
భారతీయ మూలాలున్న జోహ్రాన్ మమ్దానీ చరిత్ర సృష్టించారు. అమెరికాలోని అతిపెద్ద నగరమైన న్యూయార్క్‌కు తొలి ముస్లిం మేయర్‌గా బాధ్యతలు స్వీకరించారు. అనూహ్యంగా గురువారం అర్ధరాత్రి చారిత్రక మాన్హట్టాన్ సబ్వే స్టేషన్లో ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఈ పరిణామంపై అటు నగర ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.న్యూయార్క్ మేయర్ ప్రమాణ స్వీకార వేడుకను ఆయన స్నేహితురాలు లెటిటియా జేమ్స్ నిర్వహించారు. డెమొక్రాట్ అయిన మమ్దానీ అమెరికాలోని అతిపెద్దదే కాదు.. విలాసవంతమైన నగరానికి మేయర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఖురాన్ పై చేయి ఉంచి ఆయన ప్రమాణం చేసిన ఆయన.. తన జీవిత కాలంలో లభించిన అరుదైన గౌరవంగా చెప్పారు. అంతేకాదు.. కొత్త రవాణా శాఖ కమిషనర్‌గా మైక్ ఫ్లిన్‌ను నియమిస్తున్నట్లు ప్రకటించారు.న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి, ఉగాండ-భారత సంతతికి చెందిన 34 ఏండ్ల జోహ్రాన్ మమ్దానీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అతి చిన్న వయస్సులో ఈ పదవికి ఎన్నికైన వ్యక్తిగా ఆయన రికార్డు సృష్టించారు. మేయర్ పదవిని దక్కించుకున్న తొలి ఇండో అమెరికన్ ముస్లిం గానూ, తొలి దక్షిణాసియా సంతతి వ్యక్తిగానూ జోహ్రాన్ మమ్దానీ నిలిచారు.🚨BREAKING: Zohran Mamdani, a 34-year-old immigrant from Uganda, just made history as the first Muslim, first South Asian, and youngest in a century to become Mayor of New York City.He was sworn in alongside his wife minutes into the new year of 2026 by NYS AG Letitia James. pic.twitter.com/NHgE6NVK5l— CALL TO ACTIVISM (@CalltoActivism) January 1, 2026మమ్దానీ తండ్రి మహమూద్ మమ్దానీ ఉగాండా జాతీయుడు. తల్లి ప్రముఖ ఇండియన్ సినీ డైరెక్టర్ మీరానాయర్. కాగా, మేయర్ ఎన్నికల్లో మమ్దానీకి 50.40 శాతం ఓట్లు (10,36,051) పోల్ అయ్యాయి. ప్రధాన ప్రత్యర్థి, న్యూయార్క్ మాజీ గవర్నర్ ఆండ్ర్యూ క్యూమోకు 41.6 శాతం ఓట్లు (8,54,995) వచ్చాయి. దాదాపు 1.81 లక్షల ఓట్ల మెజార్టీతో మమ్దానీ విజయం సాధించారు. రిపబ్లికన్ అభ్యర్థి కర్టిస్ స్లివాకు 7.10% (1,46,137) ఓట్లు వచ్చాయి.నవంబర్ 4వ తేదీన జరిగిన ఈ ఎన్నికలో దాదాపు 20 లక్షల మందికి పైగా ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. గత 56 ఏండ్లలో ఈ స్థాయిలో ఓటింగ్ నమోదు కాలేదు. ఎన్నికల ప్రచారంలో స్వయంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ అభ్యర్థి కర్టిస్ స్లివా తరఫున ప్రచారం చేశారు. ఈ క్రమంలో జోహ్రాన్‌ను చిత్తుగా తిట్టారు. అయినా కూడా జోహ్రాన్నే విజయం వరించింది.అయితే.. ఆ మధ్య వైట్‌హౌజ్ వెళ్లి ట్రంప్‌ను కలిసి కాసేపు భేటీ అయ్యాడు మమ్దానీ. ఆ సమయంలో న్యూయార్క్ అభివృద్ధికి కలిసి పని చేస్తామంటూ ట్రంప్ ప్రకటించారు. -
జర్మనీలో తెలుగు విద్యార్థి మృతి
విదేశాల్లో మరో భారతీయ విద్యార్థి మృతి చెందాడు. జర్మనీలో జరిగిన అగ్నిప్రమాదంలో తెలుగు విద్యార్థి ఒకరు చనిపోయినట్లు అక్కడి అధికారులు ధృవీకరించారు. మరణించిన విద్యార్థి పేరు తోకల హృతిక్ రెడ్డి.హృతిక్ స్వస్థలం తెలంగాణ జనగామ జిల్లా చిల్పూర్ మండలం మల్కాపూర్ గ్రామం. ఉన్నత విద్య కోసం అతను జర్మనీకి వెళ్లాడు. అయితే.. బుధవారం అతను నివాసం ఉంటున్న భవనంలో అగ్ని ప్రమాదం జరిగింది. మంటల నుంచి తప్పించుకునే క్రమంలో భవనం నుంచి దూకి గాయాలతో మరణించాడని తెలుస్తోంది.తీవ్రంగా గాయపడిన అతన్ని ఆస్పత్రిలో చేర్పించారు. అయితే.. చికిత్స పొందుతూ కన్నుమూశాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న హృతిక్ కుటుంబం బోరున విలపిస్తోంది. తమ బిడ్డ మృతదేహాన్ని రప్పించాలని ప్రభుత్వాల్ని వేడుకుంటోంది. ఈ ఘటనతో మల్కాపూర్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
ద్వంద్వ పౌరసత్వం ఇవ్వండి..!
అమెరికాలో నివాసం ఉంటున్న ప్రవాస భారతీయులకు ద్వంద్వ పౌరసత్వం కల్పించాలని అక్కడి ప్రవాసీ లీగల్ సెల్ డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు ప్రవాసీ లీగల్ సెల్ ప్రతినిధులు బుధవారం యుఎస్, హూస్టన్‌లోని ఇండియన్ కాన్సులేట్ కార్యాలయాన్ని సందర్శించారు. ప్రవాసీ లీగల్ సెల్ గ్లోబల్ ప్రతినిధి సుధీర్ తీరునిలత్ను కలిసి వినతి పత్రం అందించారు. ద్వంద్వ పౌరసత్వం కల్పించడానికి ఉన్న చట్టపరమైన అంశాలను పరిశీలిస్తామని ఆయన వారికి తెలిపారువిదేశాల్లో ఉన్న భారతీయులకు తమ మాతృభూమితో సరైన సంబంధాలు ద్వంద్వ పౌరసత్వం ఇవ్వాలని గ్లోబల్ సెల్ ప్రతినిధులు సూచించారు. తద్వారా ప్రవాస భారతీయుల హక్కులను పరిరక్షించడమే కాకుండా భారత్‌కు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ఎన్నారైలకు దంద్వ పౌరసత్వం కల్పించే అంశంపై ప్రవాసీ లీగల్ సెల్ తీవ్రంగా కృషి చేస్తోందని లీగల్ సెల్ హెచ్ఓసీ ప్రశాంత్ కుమార్ సోనా అన్నారు. కనుక అమెరికాలోని ఎన్నారైలు ఈ పోరాటంలో భాగం పంచుకోవాలని కోరారు.ప్రస్తుతం విదేశాల్లో ఉన్న ప్రవాస భారతీయులకు భారత్ ఓసీఐ కార్టు అందజేస్తుంది. ఈ కార్డు ఉన్నవారు జీవిత కాలం పాటు భారత్‌లో పర్యటించవచ్చు. ఆస్తులు కొనుగోలు చేయవచ్చు. కానీ ఓటు హక్కు, రాజకీయ పదవులు, ప్రభుత్వ ఉద్యోగాలకు వీరు అర్హులు కారు. రాజ్యాంగం అమలు సమయం నుంచి భారత్ ఏక పౌరసత్వ విధానాన్ని అనుసరిస్తుంది. అయితే అమెరికా, కెనడా, యూకే లాంటి కొన్ని దేశాలు ద్వంద్వ పౌరసత్వాన్ని అనుమతిస్తాయి. -
త్వరలోనే పెళ్లి, గుండెపోటుతో ఎన్ఆర్ఐ మృతి
విదేశాల్లో నివసిస్తున్న తెలుగు ఎన్నారైల వరుస మరణాలు కలకలం రేపుతున్నాయి. అమెరికాలో నివసిస్తున్న తెలంగాణకు చెందిన యశ్వంత్ కుమార్ గోషిక (33) శనివారం డల్లాస్‌లో గుండెపోటుతో మరణించారు. యశ్వంత్ ఆకస్మిక మరణంతో కుటుంబం తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది. స్నేహితులను, తెలుగు ఎన్నారై సమాజాన్ని కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.యశ్వంత్ కుమార్ తెలంగాణలోని చౌటప్పల్ గ్రామంలోని దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందినవారు. అమెరికాలోనే మాస్టర్స్ పూర్తి చేశాడు. ఆ తరువాత టాప్ MNCలో సాఫ్ట్వేర్ ఉద్యోగం సంపాదించి గత కొన్ని సంవత్సరాలుగా అక్కడే నివాసం ఉంటున్నారు. స్లీప్ అప్నియాకు సంబంధించిన ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నాడని, ఆకస్మిక గుండెపోటు కారణంగా నిద్రలోనే మరణించాడని సన్నిహితులు వెల్లడించారు. తోటి తెలుగువారితో సన్నిహితంగా ఉండేవారని గుర్తు చేసుకొని కంటతడి పెట్టుకున్నారు. మరోవైపు యశ్వంత్ మృతదేహాన్నిఅంతిమ సంస్కారాల కోసం భారతదేశానికి తిరిగి పంపడానికి NRI సంఘం ప్రయత్నాలు చేస్తోంది.విషాదం ఏమిటంటేయశ్వంత్కు ఇటీవలే పెళ్లి నిశ్చయమైనట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 21న వివాహం జరగాల్సి ఉంది. ఇరు కుటుంబాలు పెళ్లి పనుల్లో నిమగ్నమై ఉన్నారు. పెళ్లికోసం స్వదేశానికి వచ్చేందుకు ఏర్పాటు చేసుకున్న తరుణంలో, పెళ్లికొడుకుగా చూడాలనుకున్న యశ్వంత్ అకాలమరణం వారిని తీరని విషాదంలోకి నెట్టేసింది. -
తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్‌కు కొత్త కార్యవర్గం ఎన్నిక
కెనడాలో స్థిరపడిన తెలంగాణ వాసుల ప్రత్యేక సంస్థ తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరమ్ (TDF - CANADA) రానున్న రెండేళ్ల కోసం కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకుంది. జితేందర్ రెడ్డి గార్లపాటి అధ్యక్షుడిగా, వెంకట్ రెడ్డి పోలు ప్రధాన కార్యదర్శిగా పనిచేయనున్నారు. 2026-27 రెండేళ్ల పాటు ఈ కొత్త కార్యవర్గం పనిచేయనుంది.కొత్త కార్యవర్గంలో ఫౌండేషన్ కమిటీ చైర్ పర్సన్‌గా అమిత పినికేశి, ఉపాధ్యక్షుడిగా మహేందర్ కీస్రా, సంయుక్త కార్యదర్శిగా అనికేత్ రెడ్డి శామీర్ పేట, ట్రెజరర్‌గా కృష్ణా రెడ్డి చాడ, జాయింట్ ట్రెజరర్‌గా రవీందర్ రెడ్డి కొండం, బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ చైర్మన్‌గా అర్షద్ ఘోరి, కమిటీ చైర్మన్లుగా బిజినెస్ కౌన్సిల్ చైర్ పర్సన్‌గా ఇందు రెడ్డి, స్పోర్ట్స్ క్లబ్ చైర్మన్‌గా కె. మహేందర్ రెడ్డి ఎన్నికయ్యారు.కెనడాలో స్థిరపడిన తెలంగాణ వాసుల కోసం 2005లో టీడీఎఫ్ కెనడా సంస్థ ఏర్పాటైంది. తెలంగాణ ఉద్యమ సమయంతో పాటు రాష్ట్రం ఏర్పటయ్యాక కూడా ఈ సంస్థ క్రియాశీలకంగా పనిచేస్తోంది. ప్రతీ ఏటా తెలంగాణ నైట్‌ను నిర్వహిస్తూ అక్కడి తెలుగువారిని ఏకం చేసే ప్రయత్నం చేస్తోంది. తంగేడు అనే అనుబంధ సాంస్కృతిక సంస్థ ద్వారా బతుకమ్మ పండగతో పాటు వివిధ కార్యక్రమాలను క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు. కెనడాలో స్థిరపడిన వందలాది మంది తెలుగువారు తమ కుటుంబాలతో ఈ కార్యక్రమాల్లో పాల్గొనటం ద్వారా తమ పిల్లలకు తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలను తెలిపే ప్రయత్నం చేస్తున్నారు. అవసరమైన అన్ని సమయాల్లో సమాజ సేవ కార్యక్రమాలను కూడా విసృతంగా ఈ సంస్థ నిర్వహిస్తోంది. టీడీఎఫ్ కెనడా ఆధ్వర్యంలో ఏర్పాటైన క్రికెట్ క్లబ్లో వందలాది మంది తెలుగు విద్యార్థులు భాగస్వామ్యులుగా ఉన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి విద్య కోసం వెళ్లిన విద్యార్థులకు కూడా ఈ సంస్థ తగిన సహాయం అందిస్తోంది.(చదవండి: విజయవంతంగా 'TTA సేవా డేస్–2025' వేడుకలు) -
భారతీయులు సహ వలసదారుల్లో సరికొత్త భయం!
H-1B వీసాలపై అమెరికాకు వెళ్లిన భారతీయులు గుబులు.. గుబులుగా కనిపిస్తారు. ఇప్పటికే కఠినమైన నియమాలు అమలు చేస్తున్న ట్రంప్ ప్రభుత్వం.. ఇంకా ఏం మెలికలు పెడుతుందా? అని ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో భారతీయులే కాదు.. విదేశీ వలసదారులు సైతం ఇమిగ్రేషన్ అధికారుల దృష్టిలో పడటానికి ఇష్టపడడం లేదు. ఎందుకైనా మంచిదని టోటల్‌గా ప్రయాణాలు రద్దు చేసుకొని ఇళ్లకే పరిమితం అవుతున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రభుత్వం వలస నియంత్రణ చర్యలను మరింత కఠినతరం చేస్తుండటంతో.. వలసదారులు దేశీయంగా, అంతర్జాతీయంగా ప్రయాణాలకు భయపడుతున్నారట. కైసర్ ఫ్యామిలీ ఫౌండేషన్ (KFF)-న్యూయార్క్ టైమ్స్ సంయుక్తంగా నిర్వహించిన 2025 సర్వేలో ఈ విషయం బయటపడింది. ప్రస్తుతం అమెరికాలోని వలసదారులలో 27% మంది జర్నీలు చేయకుండా జాగ్రత్త పడుతున్నారన్నది ఈ సర్వే సారాంశం. ఈ క్రమంలో.. చట్టబద్ధంగా ఉన్నవారు కూడా భయాందోళన వ్యక్తం చేస్తుండడం గమనార్హం. సరైన H-1B వీసాలు కలిగినవారు (32 శాతం), పౌరసత్వం పొందినవారు (15 శాతం) కూడా ప్రయాణాలకు వెనుకడుగు వేస్తున్నారు. ఇక.. అక్రమ వలసదారులలో ఈ సంఖ్య 63% గా ఉంది. ఇటు దేశీయంగానూ ప్రయాణాలపై వలసదారుల్లో భయం నెలకొంది. ఇందుకు కారణం లేకపోలేదు.. ట్రాన్స్పోర్ట్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ (TSA) దేశీయ విమాన ప్రయాణికుల వివరాలను ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ICE)కు షేర్ చేస్తోంది. దీంతో వలస దారులు తమపై దృష్టి పడకుండా ఉండేందుకు ప్రయాణాలకు దూరంగా ఉంటున్నారని సర్వేలో వెల్లడైంది. టెక్సాస్‌లో పనిచేస్తున్న భారతీయ ఐటీ నిపుణురాలు శిఖా ఎస్.. తన తల్లిదండ్రులను చూసేందుకు భారత్‌కి రావాలనుకుంటోంది. అయితే.. H-1B వీసా దారులపై పెరుగుతున్న పరిశీలన, ఆలస్యమవుతున్న ఇంటర్వ్యూల కారణంగా తన ప్రయాణాన్ని అర్ధాంతరంగా వాయిదా వేసుకుంది.ఈ ఏడాది జూలైలో H-1B వీసా రీన్యువల్స్‌ను స్వదేశంలోనే చేయాలని నిబంధన విధించగా.. సెప్టెంబర్‌లో కొత్త H-1B దరఖాస్తులపై 100,000 డాలర్ల ఫీజు విధించారు. అటుపై ట్రంప్ ప్రభుత్వం డిసెంబర్లో సోషల్ మీడియా స్క్రీనింగ్‌ను కూడా కఠినతరం చేసింది.ఇక.. వీసా ఇంటర్వ్యూలు 2026–2027 వరకు వాయిదా పడటంతో.. వందలాది మంది ఉద్యోగాలు, కుటుంబాల నుండి దూరమయ్యారు. దీనితో మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి కంపెనీలు, ఇమ్మిగ్రేషన్ న్యాయవాదులు వలసదారులు అత్యవసర పరిస్థితులు తప్ప విదేశీ ప్రయాణం చేయవద్దని సూచిస్తోంది. ఈ మొత్తం పరిణామాలన్నీ అమెరికాలో వలసదారులలో భయాన్ని పెంచి.. వారి రోజువారీ నిర్ణయాలను ప్రభావితం చేస్తున్నాయి. ఉద్యోగాలు, కుటుంబాలు, చట్టబద్ధ స్థితి కాపాడుకోవడానికి, వలసదారులు ప్రయాణం పూర్తిగా నివారించడం సురక్షిత మార్గంగా భావిస్తున్నారని సర్వేలతో స్పష్టమవుతోంది. -
ఘనంగా 'GTA మెగా కన్వెన్షన్ 2025'
హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ప్రజలను ఒకే వేదికపైకి తీసుకురావడమే లక్ష్యంగా గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ (GTA) ఆధ్వర్యంలో 'GTA మెగా కన్వెన్షన్ 2025' వేడుకలు ఘనంగా జరిగాయి. గండిపేట మండలం ఫైనాన్స్ డిస్ట్రిక్ట్ లోని అక్షయ కన్వెన్షన్‌లో శని, ఆదివారం పలు కార్యక్రమాలతో వేడుకలు ఘనంగా జరిగాయి.కార్యక్రమంలో త్రిదండి చినజీయర్ స్వామి, హంపి పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ విరూపాక్ష విద్యారణ్య భారతి స్వామి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ మంత్రి వివేక్ వెంకట్ స్వామి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు కాటిపల్లి వెంకటరమణా రెడ్డి, పైడి రాకేష్ రెడ్డి, పాల్వాయి హరీష్ బాబు, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, పెద్దిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, గువ్వల బాలరాజు, బొల్లం మల్లయ్య యాదవ్ తదితర రాజకీయ, ఆధ్యాత్మిక ప్రముఖులు పాల్గొన్నారు.ఈ కాన్వెన్షన్ కేవలం ఒక వేడుక మాత్రమే కాకుండా తెలంగాణ భవిష్యత్తు కోసం ప్రవాస భారతీయుల మేధస్సు, వనరులు, నెట్వర్క్ శక్తిని అనుసంధానం చేసే మహోద్యమమని జిటీఎ ఫౌండర్ అండ్ గ్లోబల్ చైర్మన్ అలుమల్ల మల్లారెడ్డి పేర్కొన్నారు. ఈ వేడుకలకు ప్రపంచ వ్యాప్తంగా సుమారు 30 దేశాల నుండి వేలాది మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారు.జీటీఏ ఫౌండర్ అండ్ గ్లోబల్ చైర్మన్ అలుమల్ల మల్లారెడ్డి, యూఎస్ఏ ఫౌండర్ చైర్మన్ విశ్వేశ్వర్ రెడ్డి కల్వల, ఇండియా ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి పాడురి, ప్రెసిడెంట్ ఎలక్ట్ కంకణాల అభిషేక్ రెడ్డి, అడ్వైజరీ చైర్ ప్రతాప్ రెడ్డి పెండ్యాల, సహ వ్యవస్థాపకుడు శ్రవణ్ రెడ్డి పాడురు, యూఎస్ఎ ప్రెసిడెంట్ ప్రవీణ్ రెడ్డి, వాషింగ్టన్ ప్రెసిడెంట్ రాము ముండ్రాతి, తదితరులు GTA లో కీలక పాత్ర పోషిస్తూ ఈ వేడుకలను విజయవంతం చేయడంలో తోడ్పాడ్డారు.తెలంగాణలో జిల్లాల వారిగా GTA చాప్టర్లు ప్రారంభించారు. జిల్లాల కార్యవర్గాన్ని ఈ వేదికపై పరిచయం చేశారు. కార్యక్రమంలో 100 మందికి పైగా కళాకారులతో తెలంగాణ జానపద, శాస్త్రీయ కళారూపాల ప్రదర్శనలు జరిగాయి. మిట్టపల్లి సురేందర్, రసమయి బాలకిషన్, మంగ్లీ లైవ్ మ్యూజికల్ నైట్, మోహన భోగరాజు ప్రత్యేక ప్రదర్శన జరిగింది. ఆహా ఇండియన్ ఐడల్ గ్రాండ్ ఎంటర్టైన్మెంట్ షో నిర్వహించారు.రియల్ ఎస్టేట్, స్టార్టప్‌లు, ఎన్ఆర్ఐ లీగల్ అంశాలు, ఆరోగ్య రంగ ఆవిష్కరణలపై ప్రత్యేక సెషన్లు ఏర్పాటు చేయడం విశేషం. “తెలంగాణ రైజింగ్ 2047” విజన్ కింద - రాష్ట్ర అభివృద్ధి, గ్లోబల్ భాగస్వామ్యం, పెట్టుబడుల ఆహ్వానం వంటి అంశాలపై లోతైన చర్చలు జరిగాయి. లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డులు, జిటీఎ కొత్త నాయకత్వ ప్రమాణ స్వీకారం, గ్రాండ్ లైవ్ కన్సర్ట్‌తో ఈ వేడుకలు ఘనంగా ముగిసాయి. ప్రపంచ తెలంగాణ బిడ్డలను ఒకే తాటిపైకి తెచ్చేందుకు ఈ మహాసభలు నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. -
కాలిఫోర్నియాలో తెలంగాణ యువతుల దుర్మరణం
మహబూబాబాద్: ఉన్నత చదువులు.. ఉద్యోగాల పేరిట విదేశాలకు వెళ్తున్న భారతీయులు.. అనూహ్య రీతిలో ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా.. అమెరికాలో ఘోర ప్రమాదంలో భారతీయ విద్యార్థినిలు మృతి చెందారు. కాలిఫోర్నియాలో జరిగిన కారు ప్రమాదంలో తెలంగాణకు చెందిన ఇద్దరు యువతులు దుర్మరణం పాలయ్యారు. తెలంగాణ మహబూబాబాద్ జిల్లా గార్ల మండలానికి చెందిన పులఖండం మేఘనారాణి (25), ముల్కనూరుకు చెందిన కడియాల భావన (24) మూడేళ్ల క్రితం అమెరికా వెళ్లారు. అక్కడ ఎమ్మెస్ పూర్తిచేసి ఉద్యోగాన్వేషణలో ఉన్నారు. అమెరికా కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం మేఘన, భావన సహా మొత్తం 8 మంది స్నేహితులు రెండు కార్లలో కాలిఫోర్నియాలో టూర్‌కి బయల్దేరారు. ఈ క్రమంలో.. అలబామా హిల్స్ రోడ్డులో మలుపు వద్ద మేఘన, భావన ప్రయాణిస్తున్న కారు లోయలో పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. ఈ విషయాన్ని అక్కడి అధికారులు.. ఇటు కుటుంబ సభ్యులు ధృవీకరించారు. ఈ ఇద్దరి మృతితో గార్ల మండలంలోని వాళ్ల స్వగ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మేఘన తండ్రి నాగేశ్వరరావు గార్ల మీసేవా సెంటర్ నిర్వహకుడు కాగా.. భావన ముల్కనూర్ ఉపసర్పంచ్ కోటేశ్వర్రావు కుమార్తె అని తెలుస్తోంది. ఉన్నత చదువుల కోసం వెళ్లి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో, యువతుల కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. తమ బిడ్డల మృతదేహాలను రప్పించేందుకు ప్రభుత్వం సాయం చేయాలని ఆ కుటుంబాలు వేడుకుంటున్నాయి.అమెరికాలో రోడ్డు ప్రమాదం మహబూబాబాద్ యువతులు మృతిఅమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహబూబాబాద్ జిల్లా గార్ల మీసేవ కేంద్రం నిర్వాహకుడు నాగేశ్వరరావు కూతురు మేఘన, ముల్కనుర్ ఉప సర్పంచ్ కోటేశ్వరరావు కూతురు భావన మృతిఉన్నత చదువుల కోసం వెళ్లి రోడ్డు ప్రమాదంలో మృతి… pic.twitter.com/rnCljzTWtP— Telugu Scribe (@TeluguScribe) December 29, 2025 -
ఆస్ట్రేలియా ఎన్నికల బరిలో ఓరుగల్లు ఆడబిడ్డ
సాక్షి ప్రతినిధి, వరంగల్: హనుమకొండ జిల్లా పరకాల మండలం రామకృష్ణాపూర్‌కు చెందిన యారాల ఆదిరెడ్డి సతీమణి యారాల హరిత సౌత్ ఆస్ట్రేలియాలో లిబరల్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఆమె 2011 నుంచి సౌత్ ఆస్ట్రేలియా లిబరల్ పార్టీకి బలమైన మద్దతురాలిగా ఉన్నారు. 2023లో టోరెన్స్ ఎస్ఈసీ బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్‌గా ఎంపికయ్యారు. ప్రస్తుతం రెండోసారి ఆ పదవిలో కొనసాగుతున్నారు. అక్కడి తెలుగు వారందరినీ ఐక్యపరచి తెలుగు సంప్రదాయాన్ని చాటుతున్నారు. మార్చి 18న జరగనున్న ఎన్నికల్లో ఎంపీగా గెలిచి తెలుగు వారి సత్తా చాటుతామంటున్నారు. 2022లో క్లెమ్ జిగ్ వార్డు కౌన్సిలర్‌గా ఎన్నికల్లో పోటీ చేసి ప్రత్యర్థికి గట్టి పోటీ ఇచ్చారు. -
క్వీన్స్ కామన్ వెల్త్ వ్యాసరచన పోటీలో విజేతగా తెలుగమ్మాయి..!
వసుధైవకుటుంబకమ్ అనే సార్వజనీన సార్వకాలిక దృక్పథం.. ప్రపంచ సాహిత్యంలో వలసవాద ధోరణుల ప్రాబల్యాన్ని ప్రశ్నిస్తూ అల్లాడిన ప్రపంచవ్యాప్తంగా ఉండే దీనప్రజానీకానికి మద్దతు తెలిపే కవిత్వ ధోరణి.. ఇలాటి పెద్దపెద్ద విషయాలు ఒక చిన్నారి కవితలలో కనపడటం మామూలు విషయం కానేకాదు. సింగపూర్‌లో క్రెసెంట్ గర్ల్స్ స్కూల్ నుంచి సెకండరీ 2 విద్యార్థిని అయిన ఆచంట లక్ష్మీ మనోజ్ఞ ఇలాటి గొప్ప అద్భుతాన్నే చేసి చూపించింది. పూవు పుట్టగానే పరిమళిస్తున్న చందంగా చదువుతో పాటు సంగీత సాహిత్యాలు పియానో వాదన, నృత్యం ఇలా బహువిధాలుగా తన ప్రజ్ఞను వికసింపజేసుకుంటున్న మనోజ్ఞ ఈ సంవత్సరం రాయల్ కామన్వెల్త్ సొసైటీ (RCS), పాఠశాలల కోసం ప్రపంచంలోనే అత్యంత పురాతన అంతర్జాతీయ రచనల పోటీ అయిన 'ది క్వీన్స్ కామన్వెల్త్ ఎస్సే కాంపిటీషన్ (QCEC) 2025' విజేతలలో ఒకరిగా ఎంపిక అవడం విశేషం. ఈమె తన కవిత్వం ద్వారా, విశ్వమానవాళికి సంబంధించిన సంవేదనలతో తాదాత్మ్యాన్ని పొందుతుంది. వారి జీవితాలలో నిండిన దైనందిన భావావేశాల లయలను తన కవితలద్వారా స్పృశిస్తుంది. పియానో పట్టుకోని వేళలను ప్రపంచ పౌరుల సుఖదుఃఖాలను ప్రతిబింబించే కవితలను అల్లడానికి సమయాన్ని వినియోగిస్తుంది. పిన్న వయస్కురాలైనప్పటికీ ఈమె కవితా ధోరణులలో ఎలిజబెత్ లిమ్ మరియు ఆన్ లియాంగ్ వంటి రచయితలచే పొందిన ప్రభావాలున్నాయి.మనోజ్ఞ రాసిన, బహుమతి గెలుచుకున్న 'ఇండియా టు మారిషస్' అనే కవిత, తన తల్లి నుంచి వేరు చేయబడి, భారతదేశంలోని తన ఇంటి నుండి మారిషస్‌లోని ఒక ఎన్‌క్లోజర్‌కు తరలించబడిన ఒక చిన్న కోతి కథను చెబుతుంది. భారతదేశంలో జన్మించినా ఆరు నెలల వయస్సులో సింగపూర్‌కు వెళ్లి అక్కడ శాశ్వత నివాసం చేసే కుటుంబానికి చెందిన మనోజ్ఞ, ఈ పోటీకోసం ఎన్నుకునే ఇతివృత్తంగా - 'అవర్ కామన్వెల్త్ జర్నీ'కి సంబంధించి భారతదేశం గురించి రాయాలనుకుంది.ఆమెకు భారతదేశం, మారిషస్‌లను కలిపే బానిస కార్మిక వ్యాపారం గురించి అవగాహన ఉంది. దానితో ఆ దేశాల మధ్య మార్గం గురించి, అలాగే మన భారతదేశం నుండి మారిషస్‌కు వచ్చిన వారి అనుభవాల గురించి పరిశోధించడం ప్రారంభించింది. కార్మికులతో పాటు అన్యదేశ వన్యజీవులతో కూడా వలస వ్యాపారం చేస్తున్నారని తెలుసుకొని వేదనపడ్డది. ఆ విషయమే కోతికి సంబంధించిన ప్రతీకాత్మక దృష్టికోణం నుండి రాయడానికి ఆమెకు ప్రేరణగా మారింది. ఆమె బహుమతి పొందిన కవితలో భారతదేశం నుంచి మారిషస్‌కు దాని దయనీయమైన ప్రయాణాన్ని వర్ణిస్తూ, మరియు తల్లిచెంత, స్వంత భూమిలో లభించే ఆత్మీయమైన వాతావరణం హఠాత్తుగా కోల్పోయి, పరాయి చోటున బందీయై పలుబాధలు పడుతూ తిరిగి తల్లి ప్రేమను ఆశిస్తూ అది లభించక పడే తపన...జాలికొలిపే తీరులో దాని ఆర్ద్రమైన కోరికను తన తల్లికి స్వగతంగా విన్నవించుకునే -పసికోతి ద్వారా చెప్పబడిన హృదయవిదారకమైన ఒక ఘటనకు చెందిన కవిత ఇది.. బందిఖానాలో ఉన్నప్పుడు , స్వానుభవాలపట్ల గమనిక..తను పొందిన తీపి అనుభవాలకూ.. ప్రస్తుతం అనుభవించే మనోవేదనకూ మధ్య జరిగే సంఘర్షణను ప్రతి ఒక్కరి హృదయాలను తాకేటట్టు వర్ణించే మనోహరమైన కవిత ఇది. ఈ కవితను రాయడానికి భూమికగా - ఇండియానుండి సింగపూర్‌కు వచ్చి, ఇక్కడ శాశ్వత నివాసం ఏర్పరచుకొని, తన మరియు తన సోదరి కోసం వారిదైన నూతన జీవితాన్ని ఏర్పరచుకున్న తీరుతెన్నులను గురించి తన తల్లిదండ్రులు చెప్పిన సంగతులు తనకు స్ఫూర్తినిచ్చాయని మనోజ్ఞ చెప్తుంది. ఇలాటి గంభీరమైన, ప్రభావశీలమైన కవితా రచనతోనే ప్రతిష్టాత్మకమైన క్వీన్స్ కామన్వెల్త్ వ్యాసరచన పోటీలో తను రన్నరప్‌గా ఎంపికైంది. ఈ అవార్డు ప్రదానోత్సవం వైభవంగా సెయింట్ జేమ్స్ ప్యాలెస్‌లో జరిగింది. తన కుటుంబ సభ్యులు ఆమె తండ్రి శ్రీనివాస్, తల్లి ప్రసన్న, సోదరి శ్రీ మేఘనల సమక్షంలో చిరంజీవి మనోజ్ఞ ఈ అవార్డును హర్ మెజెస్టీ క్వీన్ కెమిల్లా నుంచి అందుకుంది.(చదవండి: మేరీల్యాండ్‌లో మెరిసిన తెలుగు ఆణిముత్యాలు) -
విజయవంతంగా 'TTA సేవా డేస్–2025' వేడుకలు
హైదరాబాద్: తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA) ఆధ్వర్యంలో డిసెంబర్ 8 నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన “TTA సేవా డేస్ - 2025” సేవా కార్యక్రమాలు ఘనంగా ముగిశాయి. ఆరోగ్యం, విద్య, మౌలిక వసతులు, అవసరమైన సామగ్రి పంపిణీ వంటి ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు రెండు వారాల పాటు పలు జిల్లాల్లో నిర్వహించారు.హైదరాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, వరంగల్, ములుగు, రంగారెడ్డి, యాదాద్రి, మహబూబ్‌నగర్, సూర్యాపేట, నల్గొండ, మెదక్ సహా పలు జిల్లాల్లో వైద్య శిబిరాలు చేపట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ లైబ్రరీలు, కంప్యూటర్ ల్యాబ్‌లు ప్రారంభించి, బెంచీలు, యూనిఫామ్‌లు, ఎగ్జామ్ ప్యాడ్లు, జ్యామెట్రీ బాక్సులు అందజేశారు. పాఠశాలల మరమ్మతులు, సీసీ కెమెరాల ఏర్పాటు, ఆలయాల పునర్నిర్మాణం కూడా చేపట్టారు. గచ్చిబౌలి స్టేడియంలో 10కే రన్‌ను కూడా నిర్వహించారు. వృద్ధుల కోసం రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసిన క్యారం బోర్డు ఛాంపియన్షిప్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.ఈ మహా సేవా కార్యక్రమాలను టీటీఏ (TTA) అధ్యక్షుడు నవీన్ రెడ్డి మల్లిపెడ్డి నాయకత్వంలో టీటీఏ సేవా డేస్ కోఆర్డినేటర్ విశ్వ కంది, ఫౌండర్ డా. పైళ్ళ మల్లా రెడ్డి, అడ్వైజరీ కౌన్సిల్ చైర్ డా. విజయపాల్ రెడ్డి, కో-చైర్ మోహన్ రెడ్డి పటలోల్ల, అడ్వైజరీ సభ్యులు భరత్ రెడ్డి మాదడి, శ్రీని అనుగు, పూర్వ అధ్యక్షుడు వంశీరెడ్డి కంచరకుంట్ల, ఇండియా కోఆర్డినేటర్ డా. ద్వారకానాథ రెడ్డి, ఇండియా సేవా డేస్ కోఆర్డినేటర్ మధుకర్ రెడ్డి బీరాం, ఎగ్జిక్యూటివ్ కమిటీ, బోర్డు సభ్యుల మార్గదర్శకత్వం ఈ భారీ సేవా కార్యక్రమాలకు తోడ్పడింది.అమెరికా నుండి వచ్చి ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న టీటీఏ టీమ్ సభ్యులకు, ఈ మహోన్నత కార్యక్రమాన్ని ప్రోత్సహించిన స్పాన్సర్లకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా టీటీఏ మహాసభలు “టీటీఏ మెగా కన్వెన్షన్ - 2026” జూలై 17–19, 2026లో షార్లెట్, నార్త్కరోలైనాలో జరుగనున్నట్లు టీటీఏ నాయకులు వెల్లడించారు -
పదేళ్లుగా బాధపడ్డ ఆ వ్యాధితో..! హాట్‌టాపిక్‌గా భారత సంతతి వ్యక్తి పోస్ట్
భారత ఆరోగ్య రక్షణ వ్యవస్థపై ఓ ఎన్నారై ప్రశంసల జల్లు కురింపించాడు. తాను అమెరికాలో ఆ వ్యాధి కోసం చాలా డబ్బులు ఖర్చుపెట్టానని, కానీ నయం కాలేదని వాపోయాడు. పదేళ్లుకు పైగా ఆ వ్యాధితో నరకం చూశానని..కానీ తన మాతృభూమిలో సులభంగా నయమైపోయిందంటూ భారత చికిత్స విధానాన్ని మెచ్చుకుంటూ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారడమే గాకా ఆ అంశం హాట్‌టాపిక్‌గా మారింది. అంతేగాదు భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న ఆధునిక వైద్య విధానంపై చర్చలకు తెరలేపింది కూడా. ఎవరా ఆ ఎన్నారై?, ఏమా కథ చూద్దామా..అమెరికాలో స్టాప్ డేటా సైంటిస్ట్‌గా పనిచేస్తున్న ఓ ఎన్నారై ఓ వ్యాధి విషయంలో అమెరికాలో తాను ఎదుర్కొన్న అనుభవాన్ని రెడ్డిట్‌లో షేర్ చేసుకున్నాడు. ఆ పోస్ట్‌లో ఆ ఎన్నారై ఇలా రాసుకొచ్చాడు. "నేను అమెరికాలో పదేళ్లకు పైగా ఉన్నాను. అక్కడే తన చదువు, కెరీర్ అద్భుతం సాగింది. కానీ ఇంటిని, ఫ్యామిలీని బాగా మిస్ అయ్యా. అయితే అక్కడ సైంటిస్ట్‌గా పనిచేస్తున్నప్పుడు 2017లో స్కిజోఆఫెక్టివ్ డిజార్డర్ అనే మానసిక సమస్యతో బాధపడ్డాను. దీనివల్ల రోగులు నమ్మశక్యం కానీ బ్రాంతులకు గురై ఉద్యోగ కెరీర్, వ్యక్తిగత సంబంధాలు ఇబ్బందిగా మారపోతుంటాయి. ఈ మానసిక రోగంతో చాలా ఇబ్బంది పడ్డ. అందుకోసం అమెరికాలో చికిత్స కూడా తీసుకున్నా. అయితే అక్కడ అమెరికా డాక్టర్లు తనను డబ్బులు ఇచ్చే యంత్రంలా చూశారే గానీ, సరైన విధంగా చికిత్స చేయడంలో విఫలమయ్యారు. చాలా డబ్బు ఖర్చే చేశాను, ఏకంగా పదేళ్లకుపైగా బాధపడ్డను. కానీ, ఆ సమస్య నుంచి భయటపడింది కూడా లేదు. అయితే తనకు అక్కడ వైద్యులు ఆందోళన వల్ల ఈ సమస్య వస్తుందని, దాన్నితగ్గించుకునే ప్రయత్నంచేయమని సూచించేవారు, అందుకు సంబంధించి మందులే ఇచ్చారు. అంతేగాదు దీన్ని అధిగమించగలమే కానీ, నయం కాదని కూడా తేల్చి చెప్పారు. అయితే తాను మరో డాక్టర్ని సంప్రదించి సలహా తీసుకోవాలనే ఉద్దేశ్యంతో భారత్‌కి తిరిగి వచ్చి బెంగళూరులోని నిమ్హాన్స్లోని ప్రముఖ మానసిక వైద్యుడిని సంప్రదించాను. అక్కడ ఆ వైద్యలు ఆధ్వర్యంలో తీసుకున్న చికిత్స కారణంగా కాస్త రీలిఫ్ లభించడమే కాకుండా..చాలమటుకు క్యూర్ అయ్యింది. అంతేగాదు..ఈ మానసిక రుగ్మత నుంచి బయటపడ్డానని, కానీ ఆందోళన మాత్రం దరిచేరకుండా చూసుకోమని వైద్యులు సూచించారు అని "రాసుకొచ్చాడు". అందువల్లే తాను సాధ్యమైనంత తొందరలో భారత్‌కు వచ్చేసేలా ప్లాన్ చేసుకుంటున్నట్లు కూడా ఆ పోస్ట్‌లో పేర్కొన్నాడు. కాగా, నెటిజన్లు కూడా అతడి పోస్ట్‌తో ఏకభవిస్తూ..తాము కూడా అక్కడ ఉన్నప్పుడూ ఎదుర్కొన్న మానసిక సమస్యలను షేర్ చేసుకున్నారు. అంతేగాదు అక్కడ వాతావరణం కారణంగా రోగనిరోధక వ్యవస్థ సన్నగిల్లి మానసిక రుగ్మతలు బారినపడతామని అక్కడ వైద్యులు చెప్పారని మరికొందరూ పోస్ట్‌లు పెట్టడం గమనార్హం.(చదవండి: సంపాదన కంటే అదే అత్యంత ముఖ్యం! వైరల్‌గా ఎన్నారై పోస్ట్) -
మేరీల్యాండ్‌లో మెరిసిన తెలుగు ఆణిముత్యాలు
అమెరికాలో మన తెలుగు వారు అనేక రంగాల్లో దూసుకుపోతున్నారు. తాజాగా మేరీల్యాండ్‌లో తెలుగు బాలికలు టెక్నాలజీతో ఓ సమస్య పరిష్కారం కనిపెట్టి.. ఫస్ట్ లెగో లీగ్ ఛాలెంజ్‌లో క్వాలిఫయర్ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకున్నారు. టెక్నాలజీ రంగంలో విశేష ప్రతిభను ప్రదర్శించి రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు పొందారు. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్( స్టెమ్)లో విద్యార్ధుల మేధాశక్తిని, సాంకేతిక ప్రతిభను, సామాజిక బాధ్యతను గుర్తించేలా నిర్వహించే ఫస్ట్ లెగో లీగ్ ఛాలెంజ్'లో పాల్గొన్న ఆరుగురు తెలుగు బాలికల బృందం, క్వాలిఫయర్ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకుంది. హృతిక, సియోన, ప్రజ్ఞ, జాసు, ధృతి, లాస్య అనే ఆరుగురు తెలుగు విద్యార్ధినులు టెక్నోటియారాస్ పేరుతో జట్టుగా ఏర్పడ్డారు. గత నాలుగు నెలలుగా నిరంతర శ్రమ, సాంకేతిక పరిజ్ఞానం, టీమ్ వర్క్‌ను జోడించి తమ ప్రాజెక్టును తీర్చిదిద్దారు. కేవలం రోబోలను తయారు చేయడమే కాకుండా, సమాజానికి ఉపయోగపడే ఒక వినూత్న పరిష్కారాన్ని వీరు కనుగొన్నారు.ప్రాణాపాయం లేని ఆస్బెస్టాస్ తొలగింపు!పాత భవనాల్లో ఉండే 'ఆస్బెస్టాస్' వల్ల కార్మికులకు కలిగే ఆరోగ్య ప్రమాదాలను ఈ బృందం గుర్తించింది. దానికి పరిష్కారంగా ఒక అత్యాధునిక రోబోటిక్ వ్యవస్థను ప్రతిపాదించింది. నిపుణుల సలహాలు తీసుకుంటూ, క్షేత్రస్థాయి పరిశోధనలు చేసి వీరు రూపొందించిన ఈ 'ఇన్నోవేషన్ ప్రాజెక్ట్' అందరి ప్రశంసలు అందుకుంది.మెక్‌డొనో స్కూల్ క్వాలిఫైయర్ పోటీల్లో పాల్గొన్న టెక్నో టియారాస్ తెలుగు విద్యార్ధుల అద్భుత ప్రదర్శనకు ప్రశంసలు, పురస్కాలు లభించాయి. సామాజిక సమస్యకు పరిష్కారం చూపినందుకు అత్యున్నత 'క్వాలిఫైయర్ ఛాంపియన్షిప్' అవార్డును కైవసం చేసుకున్నారు.రోబోట్ డిజైన్ దాని పనితీరులో రెండో స్థానాన్ని సాధించి తమ సాంకేతిక సత్తాను చాటారు. తెలుగు బాలికల మధ్య ఉన్న సమన్వయం, నాయకత్వ లక్షణాలు, వారిలో ఉన్న ఉత్సాహాన్ని చూసి జడ్జీలు సైతం ఆశ్చర్యపోయారు. తెలుగు విద్యార్ధినులు సాధించిన ఈ విజయాల వెనుక కోచ్‌లు ఆలోక్, అభిజిత్‌ల మార్గదర్శకత్వం చాలా ఉపకరించింది. అలాగే వారి కుటుంబ సభ్యులు, నాట్స్ మేరీల్యాండ్ చాప్టర్ ప్రతినిధులు ఈ చిన్నారులను నిరంతరం ప్రోత్సహించారు. తెలుగు వారందరికి గర్వకారణంగా నిలిచిన ఈ బాలికలు ఇప్పుడు మేరీల్యాండ్ స్టేట్ కాంపిటీషన్ కోసం సిద్ధమవుతున్నారు. ఈ యువ టెక్నాలజిస్ట్‌ల బృందం మరో మూడు నెలల్లో జరగనున్న ప్రతిష్టాత్మక స్టేట్ లెవెల్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనడానికి అర్హత సాధించింది. క్వాలిఫయర్ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకున్న బాలికల బృందానికి నాట్స్ ఛైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి మందాడి, నాట్స్ మేరీల్యాండ్ నాయకులు, సభ్యులు అభినందించారు. స్టేట్ లెవెల్ పోటీల్లోనూ వారు విజయం సాధించాలని ఆకాంక్షించారు.(చదవండి: సంపాదన కంటే అదే అత్యంత ముఖ్యం! వైరల్‌గా ఎన్ఆర్ఐ పోస్ట్) -
కెనడాలో కాల్పులు.. భారతీయ విద్యార్థి మృతి
కెనడా టోరంటోలో మరో దారుణం చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో భారత్ విద్యార్థి ఒకరు మరణించారు. ఈ ఘటనపై భారత కాన్సులేట్ తాజాగా ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. బాధిత కుటుంబానికి సాయం అందిస్తామని ప్రకటించింది. అయితే ఇది జాత్యంహకార హత్య.. మరేదైనా కారణమా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది.శివాంక అవస్థీ(20) స్థానిక యూనివర్సిటీ ఆఫ్ టొరంటో స్కార్బరో క్యాంపస్ స్టూడెంట్. అయితే క్యాంపస్ ఆవరణలో మంగళవారం కాల్పలు జరిగాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరకునేలోపే నిందితులు పారిపోయారు. సంఘటన హైలాండ్ క్రీక్ ట్రైల్-ఓల్డ్ కింగ్స్టన్ రోడ్ ప్రాంతంలో జరిగిందని.. బుల్లెట్ గాయాలతో శివాంక అక్కడికక్కడే మృతి చెందాడని స్థానిక అధికారులు తెలిపారు. కాల్పులకు గల కారణాలు తెలియాల్సి ఉందని.. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు జరుపుతున్నట్లు వెల్లడించారు. టోరంటోలో ఈ ఏడాది జరిగిన 41వ హత్య ఇది. ఈ ఘటనపై యూనివర్సిటీ ఆఫ్ టొరంటో స్కార్బరో విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. లైఫ్ సైన్సెస్ మూడో ఏడాది చదువుతున్న శివాంక్ అవస్థీని పట్టపగలే కాల్చి చంపారని.. ఇది దర్మార్గమని ఒక ప్రకటన విడుదల చేశారు. క్యాంపస్‌లో భద్రతా లోపాలపై విద్యార్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆ ప్రాంతంలో నిత్యం విద్యార్థుల సంచారం ఉంటుందని.. ఇకనైనా భద్రత కట్టుదిట్టం చేయాలని కోరుతున్నారు. శివాంక్ అవస్థీ యూనివర్సిటీ చెర్లీడింగ్ టీమ్ సభ్యుడు కూడా. ఆయన మరణంపై జట్టు ఇన్‌స్టాగ్రామ్‌లో నివాళి అర్పించింది. View this post on Instagram A post shared by UTSC Cheer (@utsccheerleading)భారత కాన్సులేట్ జనరల్ (టొరంటో) ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, అవస్థీ కుటుంబానికి అవసరమైన సహాయం అందిస్తామని తెలిపింది. అయితే ఈ కుర్రాడి నేపథ్యం.. ఇతర వివరాలపై స్పష్టత రావాల్సి ఉంది.టోరంటోలో తాజాగా హిమాంశి ఖురానా(30) అనే భారతీయ యువతి దారుణ హత్యకు గురైంది. ఈ కేసులో అబ్దుల్ ఘఫూరి అనే వ్యక్తిని పోలీసులు వెతుకుతున్నారు. అయితే ఇది ‘‘ఇంటిమేట్ పార్టనర్ వైలెన్స్’’ కేసు అని అధికారులు పేర్కొన్నారు. అటు హిమాంశి కుటుంబానికి కూడా భారత కాన్సులేట్ సహాయం అందిస్తోంది. టొరంటోలో వరుస హింసాత్మక ఘటనలు భారతీయ కమ్యూనిటీలో ఆందోళనకు గురి చేస్తున్నాయి.ఇదీ చదవండి: భారతీయులకు ఆ దేశాల్లో భద్రతే లేదా?.. -
సంపాదన కంటే అదే అత్యంత ముఖ్యం ! వైరల్‌గా ఎన్ఆర్ఐ పోస్ట్
సంపాదన కంటే ప్రశాంతమైన జీవితం మంచిది అనే సూక్తులు వినడానికే బాగుంటాయి. నిజజీవితంలో కాస్త కష్టమే అంత ఈజీ కూడా కాదు. పోనీ అలాంటి సాహసం చేస్తే..సమాజంలో, బంధువుల్లో మన స్థాయి తక్కువుగా ఉంటే మనం తట్టుకున్నా.. మన కుటుంబసభ్యలు అందుకు సిద్ధంగా ఉంటారా అంటే సమాధానం దొరకడం చాలా కష్టం. కానీ నార్వేలో నివశిస్తున్న భారత యువకుడు అదే మంచిదంటూ తాను అనుభవ పూర్వకంగా తెలుసుకున్నా అంటూ పెట్టిన పోస్ట్ తెగ వైరల్ అవ్వడమే కాదు..అందర్నీ విపరీతంగా ఆకర్షించింది.అందులోనూ ఈ ఉరుకుల, పరుగుల జీవితంతో విసిగివేశారిన వారికి ఈ పోస్ట్ ఓ మంచి ఎనర్జిటిక్‌గా కనిపించింది. పైగా ఆయన ఏం చెబుతున్నాడో అంటూ ఆ వీడియోని అంతా ఆస్తక్తిగా చూసేశారు కూడా. ఇంతకీ ఈ నార్వే యుకుడు ఆ ఇన్స్టాగ్రామ్ వీడియో పోస్ట్‌లో ఏం చెప్పాడంటే..తన పేరు సచిన్ అని తాను నార్వేలో నివశిస్తున్నట్లు పేర్కొన్నాడు. తాను దాదాపు 35 దేశాలకు పైగా పర్యటించాక ఓ విషయాన్ని గ్రహించానానని అంటూ చెప్పుకుంటూ రావడం వీడియోలో చూడొచ్చు. జీవితానికి ఎల్లప్పుడూ డబ్బు అవసరం లేదని, జీవించడానికి కేవలం సమయమే కావలని అన్నాడు. ఇక్కడ నార్వేలో ఉద్యోగం మనిషి విలువను ప్రతిబింబించదని, కేవలం వాళ్లు మనుషులుగా చూడటం అత్యంత ప్రశంసించదగ్గ విషయమని అన్నాడు. అక్కడ జీతం, హోదా, జెండర్, ఎక్కడ నుంచి వచ్చారు వంటి వాటికి పెద్దగా విలువ ఇవ్వరని అన్నాడు. అక్కడ కుటుంబం, ఆరోగ్యం, అభిరుచులు, పర్యటనలు, మానసిక ప్రశాంతత తదితరాలే ముఖ్యమనే విషయం ఇక్కడకు వచ్చాక తప్పక గుర్తిస్తారని అన్నాడు. కేవలం జీవన నాణ్యత, భద్రత, శాంతి అనేవి ఎంత ముఖ్యమో కచ్చితంగా తెలుస్తుందంటున్నాడు. అలాగని నార్వే ఏదో గొప్పదని చెప్పుకురావడం తన ఉద్దేశ్యం మాత్రం కాదని, కేవలం నిజంగా మనం కోసం మనం జీవించే జీవితాన్ని ఎంచుకోవడానికి మించిన ప్రశాంతత మరొకటి ఉండదని తెలియజేసేందకేనని పోస్ట్‌లో పేర్కొన్నాడు. అంతేగాదు నార్వేలో పని అనేది జీవితంలో ఒక భాగమేనని, అక్కడ ప్రజలు కుటుంబం, పర్యటనలు, అభిరుచులపై పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తారని చెప్పాడు. అంతేగాదు ఇక్కడ ప్రజలు మనుగడ కోసం జీవించరని, పూర్తి స్థాయిలో జీవితాన్ని ఆస్వాదిస్తారని ఆ వీడియోలో చెప్పుకొచ్చాడు సచిన్. అయితే నెటిజన్లు ఈ పోస్ట్‌ని చూసి బ్రదర్ మీరు చాలా అదృష్టవంతులు అని కొందరు, అలాంటి మంచి భారతీయ కమ్యూనిటీ ఉంటే కచ్చితంగా మేము అక్కడకి వచ్చేస్తాం అంటూ కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Sachin | Life in Norway 🇳🇴 | Ship to Shore 🚢 (@sachinoffshore) (చదవండి: IAS Officer Anu Garg: ఎవరీ అను గర్గ్..? అత్యున్నత పదవిని చేపట్టిన తొలి మహిళగా..) -
మెల్బోర్న్లో ఘనంగా వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఆస్ట్రేలియాలోని వైఎస్సార్సీపీ మెల్బోర్న్ (ఎన్ఆర్ఐ విభాగం) ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో జూమ్ మీటింగులో పలువురు సీనియర్ పార్టీ నాయకులు సాకే శైలజానాథ్,ఆరే శ్యామల, చింతలపూడి అశోక్ కుమార్ పాల్గొన్నారు. గత కొన్ని ఏళ్లుగా వైఎస్సార్సీపీ పార్టీకి, ఆ పార్టీ అధినేత జగనన్నకు మద్దతుగా నిలుస్తున్నటువంటి ఆస్ట్రేలియా వైయస్సార్సీపీ ఎన్నారై లకి పార్టీ సీనియర్ నాయకులు అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేశారు. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో జరిగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బర్త్ డే ప్రోగ్రామ్‌లో సీనియర్ నాయకులని ఉద్దేశించి మాట్లాడుతూ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి పట్ల మీరు చూపిస్తున్న ఆధారాభిమానాలకు పార్టీ ఎల్లప్పుడూ కృతజ్ఞతగా ఉంటుందని అన్నారు నాయకులు. ఈ సందర్భంగా పలువురు ఎన్నారైలు మాట్లాడుతూ జగన్ గారు తన పరిపాలన హయాంలో ప్రజలకు ఎంతో మేలు చేశారని తమలో చాలామంది వారి తండ్రి పెట్టిన పథకాలను ఉపయోగించుకుని వచ్చి విదేశాల్లో స్థిరపడ్డామని వారి రుణం జగన్మోహన్ రెడ్డి గారికి ఎల్లప్పుడూ మద్దతిచ్చి తీర్చుకుంటామని తెలియజేశారు. సాకే శైలజానాథ్, ఆరే శ్యామల, చింతలపూడి అశోక్ కుమార్ మాట్లాడుతూ..మీ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ పార్టీకి ఇదేవిధంగా కొనసాగాలని ఆకాంక్షించారు. రేపు రాబోయే జగనన్న ప్రభుత్వంలో కార్యకర్తలకు అన్ని విధాలాగా భరోసా ఉంటుందని పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆస్ట్రేలియా వైసీపీ నాయకులు నాగార్జున యలగాల, అనీల్ పెదగాడ, హరి చెన్నుపల్లి, శరత్ కుమార్ రెడ్డి తోట్లీ, విష్ణు వర్ధన్ రెడ్డి వాకమల్ల తదితరులు పాల్గొన్నారు.(చదవండి: అక్లాండ్లో ఘనంగా వైఎస్ జగన్ బర్త్‌డే సెలబ్రేషన్స్) -
మానసిక అస్వస్థతతో అబుదాబిలో తెలంగాణా కార్మికుడు, ప్రజావాణిలో వినతి
కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం పెరుమాల్ల గ్రామానికి చెందిన గిరిజన కార్మికుడు మాలోత్ శ్రీరాం యూఏఈ రాజధాని అబుదాబి ముసఫ్ఫా ప్రాంతంలో ఆశ్రయం, ఆహారం లేక రోడ్లపై భిక్షాటన చేస్తూ కాలం గడుపుతున్నాడు. గ్రామంలో చెడు అలవాట్లకు బానిసై దాన్నుంచి బయటపడాలని గల్ఫ్ దేశానికి వెళ్లి అక్కడ దుర్భర జీవితాన్ని వెళ్ల దీస్తున్నాడు.నవంబర్ 11న క్లీనర్ వీసాపై అబుదాబికి వెళ్లిన శ్రీరాం, రెండు రోజులకే మతిస్థిమితం కోల్పోయి లేబర్ క్యాంప్ నుంచి అదృశ్యమయ్యాడు. నెల రోజుల అనంతరం అతడిని గుర్తించి క్యాంప్‌కు తీసుకువచ్చినా, కంపెనీ మానవత్వం మరిచి లోపలికి అనుమతించకుండా బయటకు తోసివేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ అమానుష వైఖరి కారణంగా అతడు మళ్లీ రోడ్ల పాలయ్యాడు.ఇంకా బాధాకరమైన విషయం ఏమిటంటే, కంపెనీ అతడిపై ‘అబ్స్కాండింగ్’ కేసు నమోదు చేసి, స్వదేశానికి పంపాలంటే 4,500 దిర్హముల (సుమారు రూ.1.10 లక్షలు) జరిమానా చెల్లించాలని డిమాండ్ చేస్తోంది. దీంతో ఆందోళన చెందిన బాధితుడి భార్య సునీత మంగళవారం (23.12.2025) హైదరాబాద్‌లోని ‘సీఎం ప్రవాసీ ప్రజావాణి’లో ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి పేరిట వినతిపత్రం సమర్పించారు. ఈ వినతి ప్రతులను ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కె. మదన్ మోహన్ రావు, జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్, తెలంగాణ ఎన్నారై అడ్వయిజరీ కమిటీ వైస్ ఛైర్మన్ మంద భీంరెడ్డి లకు అందజేశారు.మంద భీంరెడ్డి వెంట రాగా, బాధితుడి భార్య సునీత 'సీఎం ప్రజావాణి' ఇంచార్జి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డా. జి. చిన్నారెడ్డిని కలిసి తన ఆవేదనను వ్యక్తం చేశారు. వెంటనే స్పందించిన చిన్నారెడ్డి తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ముఖ్య కార్యదర్శి, సీనియర్ ఐఏఎస్ అధికారి వి. శేషాద్రికి లేఖ రాశారు.ఇదిలా ఉండగా, శ్రీరాంను స్వదేశానికి పంపించే ప్రయత్నాల్లో అబుదాబి తెలంగాణ సామాజిక సేవకురాలు, వేములవాడకు చెందిన ప్రియా సింగిరెడ్డి కంపెనీ యాజమాన్యం, భారత రాయబార కార్యాలయంతో సమన్వయం చేస్తున్నారు.“నా భర్తను తక్షణం స్వదేశానికి తీసుకువచ్చి, కుటుంబ సభ్యుల సమక్షంలో మానసిక వైద్యం, పునరావాసం కల్పించండి. అత్యంత పేద గిరిజన కుటుంబం. ఈ ఖర్చులు భరించే స్థితిలో లేము” అంటూ సునీత ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై స్పందించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఢిల్లీలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు, అబుదాబి లోని భారత రాయబార కార్యాలయంకు లేఖ రాశారు. -
కెనడాలో సాక్షి టీవీ గ్రాండ్ లాంచ్
తెలుగు వారి మనస్సాక్షి… సాక్షి టీవీ కెనడాలో గ్రాండ్‌గా లాంచ్ అయింది. సరిహద్దులు దాటి భారతీయ పరిమళాలను ప్రపంచమంతా వెదజల్లుతూ…కెనడాలో మొట్టమొదటిసారిగా ఓ నూతన ఆధ్యాయానికి శ్రీకారం చుడుతూ సాక్షి టీవీ కెనడా ప్రారంభమైంది. టొరంటో, మిస్సిసాగాలోని హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ సెంటర్ వేదికగా ఈ కార్యక్రమం వైభవంగా జరిగింది. భారత జాతీయగీతంతో కార్యక్రమం ప్రారంభమై ప్రవాసుల హృదయాల్లో దేశభక్తి స్ఫూర్తిని నింపింది. ఈ కార్యక్రమంలో సాక్షి టీవీ కెనడా హెడ్ కె.కె. రెడ్డి, సాక్షి టీవీ స్టాఫ్, బిజినెస్ ఓనర్స్, కమ్యూనిటీ లీడర్స్, వివిధ అసోసియేషన్ల ప్రతినిధులు, సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ భారీ సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ప్రదర్శించిన సాక్షి టీవీ కెనడా ప్రత్యేక AVను ప్రవాసులు ఎంతో ఆసక్తిగా తిలకించారు. అనంతరం సాక్షి టీవీ కెనడాకు తమ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.నార్త్ అమెరికా వ్యాప్తంగా విస్తరిస్తూ, అమెరికాలో నెంబర్ వన్ నెట్‌వర్క్‌గా ఎదిగిన సాక్షి టీవీ, ఇప్పుడు కెనడాలో కూడా సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించిందని కె.కె. రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. సాక్షిటీవీ కెనడా ద్వారా అందించబోయే ప్రత్యేక కార్యక్రమాలను నిశ్చల్ వివరించారు.సాక్షి టీవీ నార్త్ అమెరికా చీఫ్ కరస్పాండెంట్ సింహా జూమ్ ద్వారా టొరంటోలో సాక్షి టీవీ కెనడా లాంచింగ్‌పై హర్షం వ్యక్తం చేశారు. కెనడాలోని తెలుగు ప్రజల గుండె చప్పుడును ప్రపంచానికి వినిపించబోయే గొప్ప అడుగు అని కొనియాడారు. మార్కెటింగ్ మేనేజర్ వెన్నెల రెడ్డి జూమ్ ద్వారా ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి రీనా హోస్ట్ గా వ్యవహరించారు. ఈ సందర్భంగా పలువురు ప్రవాసులు తమ సూచనలు, సలహాలు అందించారు. సాక్షి టీవీ కెనడా లాంఛ్ ఈవెంట్‌ను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కె.కె.రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. సాక్షి టీవీ కెనడాను ఆదరించి, ఆశీర్వదించాలని కోరారు. ఈ వేడుకల్లో పాల్గొన్న ప్రవాసులు : వరాహసూరి అప్పారావు, ప్రవీణ్ నీలా,రాజ్ సజ్జా, విశ్వ శ్రీనివాసన్, వేణుగోపాల్ రోకండ్ల, ప్రదీప్ కుమార్ కనమర్లపూడి, మహమ్మద్ సిద్ధిఖీ, సుధాకర్ రెడ్డి సింగన, ర్యాన్ సెక్వేరా, రాజేష్ ప్రసాద్, రంజిత్ పింగిలేటి, భావన పగిదేల, మురళీధర్ పగిదేల, రుక్మిణి మద్దులూరి, మధుసూధన్ కొట్టురి, యశ్వంత్ వుమ్మనేని, సూర్య కొండేటి, ప్రసన్న తిరుచిరాపల్లి, విజయ్, లక్ష్మి రాయవరపు, శ్రీనివాసులు, నూర్ అహ్మద్,విజయ్ చేగిరెడ్డి,కౌశిక్ నారాల, శ్రీని ఇజ్జాడ, సౌజన్య కసుల, ప్రతాప్ బి, విద్యా సాహితి, శైలేష్ పాలెం, అల్లంపాటి కృష్ణా రెడ్డి, విజయ్ సేతుమాదవన్, షాలిని బెక్కం, యశ్వంత్ రెడ్డి నిమ్మకాయల, గుణశేఖర్ కోనపల్లి, శ్రీనివాసులు రెడ్డి మరిక్కగారి నరసింహారెడ్డి గుత్తిరెడ్డి , చెన్న కేశవరెడ్డి కుమ్మెత, వెంకట కృష్ణా రెడ్డి గోపిరెడ్డి ,అస్లాం బేగ్, శశివర్ధన్ పట్లోళ్ల, విష్ణు వంగల , సుబ్బారావు నాయక్ బాణావతు, కళ్యాణ్ జి, కాయం పురుషోత్తం రెడ్డి, వి వి ఎన్ మూర్తి, రామ్, రమేష్ తుంపెర ,భరత్ కుమార్ సత్తి, శ్రీకాంత్ బి, నరేన్ తాడి, స్వాతి మిరియాల, పావని పులివర్తి , రవి కాసుల, సౌజన్య కాసుల, రామ్ చిమట, సుధీర్ కుమార్ సూరు, శ్రీనివాస్ కస్తూరి, వలియుద్దీన్ , లక్ష్మీ రాయవరపు, రవీందర్, వెంకట్ రామ్ రెడ్డి పలిచెర్ల, గౌతమ్ కొల్లూరి, పృధ్వీ, మహేశ్వర కనాల, నాగ వెంకట చిరంజీవి చాడ, క్రాంతి ఆర్, జగపతి రాయల, నిశ్చల్ వి, అనంత్ కందసామి, నాగార్జున, కోటేశ్వర్ రావు, వేణుగోపాల్, మణిదీప్, పలువురు పాల్గొన్నారు -
ప్రపంచ శాంతి కోసం ధ్యానం..ఐక్యరాజ్యసమితిలో గురుదేవ్ ప్రసంగం
భారతదేశం, శ్రీలంక, అండోరా, మెక్సికో, నేపాల్ దేశాల శాశ్వత ప్రతినిధులతో పాటు ఇతర సభ్య దేశాలు, ఐక్యరాజ్యసమితి సంస్థలు ఒకచోట చేరి ప్రాచీన ధ్యాన సాధనను జరుపుకున్నాయి. ప్రపంచ స్థాయి సామాజిక, రాజకీయ, మానసిక ఆరోగ్య సవాళ్లను ఎదుర్కొనేందుకు దీని ప్రాధాన్యతను పంచుకున్నాయి.ప్రాచీన జ్ఞానాన్ని ఆధునిక రాజనీతితో సమ్మిళితం చేసిన ఒక విశేష క్షణంలో, రెండవ ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని గుర్తుచేసేందుకు సభ్య దేశాలు, ఐక్యరాజ్యసమితి సంస్థలు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో సమావేశమయ్యాయి. ప్రపంచ శాంతి, మానసిక శ్రేయస్సు మరియు నాయకత్వానికి ధ్యానం ఎంతగా ప్రాసంగికమవుతోందో ఈ సమావేశం మరొకసారి స్పష్టం చేసింది.“ప్రపంచ శాంతి సమరసత కోసం ధ్యానం” అనే శీర్షికతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో, గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ కీలక ప్రసంగం చేయడంతో పాటు మార్గనిర్దేశిత ధ్యానాన్ని కూడా నిర్వహించారు. భారతీయ నాగరిక వారసత్వంలో పుట్టిన ఈ సాధనను ప్రపంచంలోని అత్యంత కీలకమైన దౌత్య వేదిక కేంద్రానికి తీసుకువచ్చిన ఘట్టమిది.వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వక్తలు ఇదే భావనలను ప్రతిధ్వనించారు. అండోరా రాయబారి జోన్ ఫోర్నర్ రోవిరా, తన దేశ విద్యా వ్యవస్థలో ధ్యానాన్ని సమీకరించడం వల్ల విద్యార్థుల దృష్టి సామర్థ్యం భావోద్వేగ నియంత్రణ మెరుగుపడిందని తెలిపారు. మెక్సికో ఉప శాశ్వత ప్రతినిధి రాయబారి అలీసియా గ్వాడలూపే బుయెన్‌రోస్త్రో మాసియూ, దీర్ఘకాలిక ప్రపంచ సమరసతకు అంతర్గత శాంతే పునాదిగా ఉంటుందని పేర్కొన్నారు.నేపాల్ రాయబారి లోక్ బహాదూర్ థాపా, హిమాలయ ప్రాంతంలో ధ్యానానికి ఉన్న లోతైన నాగరిక మూలాలను ప్రస్తావిస్తూ, వాతావరణ మార్పు నుంచి తప్పుడు సమాచారం వరకు పరస్పరంగా ముడిపడిన ప్రపంచ సంక్షోభాలను ఎదుర్కొనేందులో ధ్యానం పోషించే పాత్రను వివరించారు.ఈ కార్యక్రమంలో హాజరైన ఇతర ప్రముఖులు: మహర్షి ఇంటర్నేషనల్ యూనివర్సిటీకి చెందిన డా. రాబర్ట్ ష్నైడర్; యోగమాత ఫౌండేషన్‌కు చెందిన యోగమాత కేకో ఐకావా;బ్రహ్మ కుమారీస్ వరల్డ్ స్పిరిచువల్ యూనివర్సిటీ పరిపాలనా ఆధ్యాత్మిక అధిపతి బీకే మోహిని పంజాబీ; జీవన్ విజ్ఞాన్ ఫౌండేషన్ నేపాల్‌కు చెందిన ఎల్. పి. భాను శర్మ, రట్గర్స్ యూనివర్సిటీకి చెందిన డా. లసంత చంద్రన గూనెతిల్లేకె; భౌతిక శాస్త్రవేత్త, శాంతి కోసం శాస్త్రవేత్తల గ్లోబల్ యూనియన్ అధ్యక్షుడు మరియు ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ ఉద్యమ నాయకుడు డా. జాన్ హాగెలిన్.ఈ కార్యక్రమం ముగింపులో, గురుదేవ్ రాయబారులు, ప్రతినిధులను 20 నిమిషాల మార్గనిర్దేశిత ధ్యానంలో నడిపించారు. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో అరుదైన నిశ్శబ్ద క్షణాన్ని సృష్టిస్తూ, ప్రాచీన సంప్రదాయాల్లో పుట్టిన సాధనలు నేటి ప్రపంచ వేదికపై కూడా ఎలా కొత్త ప్రాధాన్యతను సంతరించుకుంటున్నాయో గుర్తు చేశారు.డిసెంబర్ 21న జరగనున్న ప్రపంచ ధ్యాన దినోత్సవం వైపు ప్రపంచం ముందుకు సాగుతున్న వేళ, ఈ ఉద్యమం ఇప్పటికే ఐక్యరాజ్యసమితి పరిధిని దాటి శీర్షికల్లో నిలుస్తోంది. న్యూయార్క్‌లోని ప్రసిద్ధ టైమ్స్ స్క్వేర్ “World Meditates with Gurudev” అని ప్రకటించే బిల్లుబోర్డులతో వెలిగిపోతోంది ప్రపంచ వేదికపై ఒక భారతీయ ఆధ్యాత్మిక నాయకుడి నేతృత్వంలో జరుగుతున్న అరుదైన గ్లోబల్ ఘట్టానికి ఇది సంకేతం. న్యూయార్క్ నుంచే గురుదేవ్ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారంగా వేడుకలకు నాయకత్వం వహించనున్నారు. భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఈ ధ్యానంలో పాల్గొంటారు. -
ఏఐలో నార్కట్‌పల్లివాసికి అంతర్జాతీయ గుర్తింపు
యాదాద్రి: నార్కట్‌పల్లి మండలం మాధవ యడవెల్లి గ్రామానికి చెందిన కందగట్ల జయచందర్‌రెడ్డి ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్(ఏఐ) రంగంలో అంతర్జాతీయ గుర్తింపు పొందారు. జయచందర్‌రెడ్డి ప్రస్తుతం అమెరికాలోని ఓ ప్రముఖ కంపెనీలో ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. ఆయన ఏఐ రంగలో చేస్తున్న కృషికి గాను 4 ప్రతిష్టాత్మక మార్కమ్ గోల్డ్ అవార్డులు, డావీ సిల్వర్ అవార్డులు పొందారు.గ్రామీణ ప్రజలు ఇంగ్లిష్ వైద్య నివేదికలు అర్థం చేసుకోవడంలో పడుతున్న ఇబ్బందులను గమనించిన ఆయన హెల్త్ నీమ్ అనే ఏఐ ప్లాట్‌ఫామ్‌ను రూపొందించారు. ఈ ప్లాట్‌ఫామ్ సంక్షిప్త వైద్య సమాచారాన్ని తెలుగు వంటి ప్రాంతీయ భాషల్లోకి అనువదించి సామాన్యులకు సులభంగా అర్థమయ్యేలా వివరిస్తుంది. అంతేకాకుండా.. గూగుల్ వ్యవస్థాపకుడు లారీ పేజ్, నాసా వ్యోమగాములు సభ్యులుగా ఉన్న ప్రతిష్టాత్మకమైన ఐఈఈఈహెచ్‌కెఎన్ హారన్ సొసైటీలో జయచందర్‌రెడ్డికి సభ్యత్వం లభించడం విశేషం. తనకు వచ్చిన అవార్డులు, గుర్తింపును తన తల్లిదండ్రులు యాదవరెడ్డి-రజితలకు, సొంతూరికి అంకితమిస్తున్నట్లు జయచందర్‌రెడ్డి తెలిపారు. -
అక్లాండ్లో ఘనంగా వైఎస్ జగన్ బర్త్‌డే సెలబ్రేషన్స్
వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పుట్టినరోజు వేడుకలు వైఎస్సార్సీపీ న్యూజిలాండ్ (ఎన్ఆర్ఐ విభాగం) ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. అక్కడి పార్టీ కన్వీనర్ బుజ్జి బాబు నెల్లూరి నిర్వహించిన ఈ వేడుకల్లో పార్టీ శ్రేణులు, జగన్ అభిమానులు పాల్గొన్నారు.ఈ వేడుకలకు రాజ్యసభ సభ్యుడు అయోధ్య రామిరెడ్డి చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. అలాగే, ఈ కార్యక్రమానికి మౌంట్ ఆల్బర్ట్ నియోజకవర్గ పార్లమెంట్ సభ్యురాలు హెలెన్ వైట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇంకా ఈ కార్యక్రమంలో.. గోవర్ధన్ మల్లెల, NZICA అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ కళ్యాణ్ కసుంగాటి, సైంటిస్ట్ బాల బీరమ్, లింక్ టు గ్రూప్ సర్వీసెస్‌కు చెందిన ఇందిరా సిరిగిరి, ఎస్జి కన్సల్టెన్సీ వాసు కునపల్లి, ప్రవీణ్ మోటుపల్లి, యూనివర్సల్ గ్రానైట్స్ శివ కిలారి, NZTA అధ్యక్షుడు జనక్, NZTA మాజీ అధ్యక్షుడు అరుణ్ రెడ్డి, TANZ అధ్యక్షుడు చంద్రశేఖర్ కొడూరి , నిధి చిట్స్ మురళి, ట్రాన్స్ఫసిఫిక్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ రోహిత్‌రెడ్డి, రామ్ మోహన్ దంతాల, లుక్స్ స్మార్ట్ డైరెక్టర్ పండు, ప్యారడైస్ ఇండియన్ రెస్టారెంట్ ప్రదీప్, మ్యాంగో బైట్ డైరెక్టర్ నిర్మల్ పాండే, కృష్టా రెడ్డి, శ్రీనివాస్ పనుగంటి తదితరులు పాల్గొని విజయవంతం చేశారు. -
అమెరికాలో నల్లగొండ యువకుడు మృతి
హైదరాబాద్: అమెరికాలో తెలంగాణ యువకుడు గుండెపోటుతో మృతి చెందాడు. నల్లగొండ మండలం మేళ్ల దుప్పలపల్లికి చెందిన పవన్ కుమార్ రెడ్డి అమెరికాలో మృతి చెందాడు. శనివారం తెల్లవారుజామున గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. రెండేళ్ల క్రితం ఉన్నత చదువుల కోసం పవన్ కుమార్ రెడ్డి అమెరికా వెళ్లాడు. ఇటీవలే ఎంఎస్ పూర్తి చేసి, ఉద్యోగానికి కూడా ఎంపికయ్యాడు. అంతలోనే పవన్ కుమార్ రెడ్డి ప్రాణాలు కోల్పోవడంతో అతని కుటుంబంలో తీవ్ర విషాదంలో మునిగిపోయింది. -
విశ్వవ్యాప్తంగా వైఎస్ జగన్ పుట్టిన రోజు వేడుకలు
సాక్షి, అమరావతి / నెట్వర్క్ : మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టిన రోజు సంబరాలు విశ్వవ్యాప్తంగా పలుచోట్ల ఘనంగా జరిగాయి. వైఎస్ జగన్ అభిమానులు, వివిధ దేశాల్లో స్థిరపడిన ప్రవాస భారతీయులు ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఎక్కడిక్కడ కేక్‌లు కట్ చేసి సంబరాలు జరిపారు. అనేకమంది వర్చువల్ విధానంలో సెలబ్రేషన్స్ నిర్వహించగా.. మరికొందరు జూమ్ కాలింగ్ వంటి విధానాల ద్వారా పుట్టిన రోజు వేడుకలతో సందడి చేశారు. పలుచోట్ల వైఎస్ జగన్ పాలనలో ముఖ్యఘట్టాల ప్రత్యేక ఆడియో విజువల్ ప్రదర్శనలు జరిగాయి. అమెరికా సంయుక్త రాష్ట్రాలు (యూఎస్), అమెరికా ఆగ్నేయ ప్రాంతంలోని నార్త్ కరోలినా, కెనడా, సింగపూర్, ఆస్ట్రేలియా, కువైట్, న్యూజిలాండ్ తదితర దేశాల్లో అభిమానులు కేక్‌లు కట్‌చేసి, సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు షేర్ చేసి తన అభిమానాన్ని చాటుకున్నారు.యూకేలో వేడుకలు వైఎస్సార్సీపీ యునైటెడ్ కింగ్డమ్ (యూకే) కమిటీ, వైఎస్సార్సీపీ మిడిల్స్బరో యూత్ ఆధ్వర్యంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. వైఎస్సార్సీపీ జనరల్ సెక్రటరీ(ఎన్ఆర్ఐ అఫైర్స్) డాక్టర్ ప్రదీప్ చింతా, వైఎస్సార్సీపీ యూకే కన్వీనర్ ఓబుల్‌రెడ్డి పాతకోట ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ డాక్టర్ ప్రదీప్ చింతా మాట్లాడుతూ.. మాజీ సీఎం జగన్ పుట్టిన రోజు వేడుకలను మూడు యూకే నగరాలైన కోవెంట్రీ , మిడిల్స్బరో, షెఫీల్డ్లలో నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమాలకు యూకే నలుమూలల నుండి జగన్ అభిమానులు హాజరయ్యారు. యూకేలోని ఎన్నారైలు శంతన్‌రెడ్డి, జానీ, వంశీ, రాజారెడ్డి, అనిల్, ఉదయ్, మధు, మిత్రుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగాయి.ఫీనిక్స్, ఆరిజోనాలో..వైఎస్సార్సీపీ ఫీనిక్స్ ఎన్ఆర్ఐ కమిటీ ఆధ్వర్యంలో ఫీనిక్స్, అరిజోనాలలో మాజీ సీఎం వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, గ్లోబల్ ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ ఆలూరు సాంబశివరెడ్డి వర్చువల్‌గా ప్రారంభించారు. కేక్ కటింగ్ చేసి.. వైఎస్ జగన్ పాలనలో ముఖ్యఘట్టాల ప్రత్యేక ఆడియో విజువల్ విధానంలో ప్రదర్శించారు. కార్యక్రమాల్ని సోమశేఖర్‌రెడ్డి యర్రాపురెడ్డి, వంశీ ఎరువారం, చెన్నారెడ్డి మద్దూరి, ధీరజ్ పోలా, గురు, లక్ష్మి, శ్రీనివాస్‌గుప్తా, శ్రీధర్ లక్కిరెడ్డి, రుక్మన్, రమేష్, శ్రీనివాస్ మొల్లాల, అంజిరెడ్డి, ఇంద్రసేనారెడ్డి, శ్రీనివాస్ మామిడి, విఘ్నేష్, కొండారెడ్డి, జగన్, రోహిత్ చెరుకుమిల్లి, జ్ఞానదీప్, అనుష, భవిష్య పర్యవేక్షించారు.న్యూజిలాండ్‌లోనూ.. వైఎస్సార్సీపీ న్యూజిలాండ్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్ నగరం ఫిక్లింగ్ కన్వెన్షన్ సెంటర్లో శనివారం రాత్రి జరిగిన వేడుకల్లో వివిధ ప్రాంతాల నుంచి ఎన్నారైలు పెద్దఎత్తున హాజరయ్యారు. కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ జూమ్ కాల్ ద్వారా ఏపీ వైఎస్సార్ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. వైఎస్సార్సీపీ న్యూజిలాండ్ కమిటీ సభ్యులు ఆనంద్ ఎద్దుల, సమంత్ డేగపూడి, రమేష్ పానాటి, రాజారెడ్డి, గీతారెడ్డి, విజయ్ అల్లా, బాలశౌర్య, సంకీర్త్‌రెడ్డి, పార్థ పిల్ల, అమర్ ముదిమి, బాల బీరం, కృష్ణారెడ్డి, రఘునాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.యూరప్ దేశాల్లో సందడినెదర్లాండ్లోని వైఎస్సార్సీపీ యూరప్ యూనిట్ సభ్యులు, జర్మనీ, బెల్జియం, స్విట్జర్లాండ్ దేశాల్లో మాజీ సీఎం వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు ఆదివారం సందడిగా సాగాయి. ఎయిండోవెన్లో వైఎస్సార్సీపీ జాతీయ అధికార ప్రతినిధి, యూరప్ కన్వీనర్ కార్తిక్ యల్లాప్రగడ, యూరప్ కోర్ టీమ్ ప్రతినిధులు సారథిరెడ్డి వంగా, కృష్ణతేజరెడ్డి గడ్డం, శ్రీనివాస్‌రెడ్డి సానికొమ్ము పాల్గొన్నారు. వేడుకలు నిర్వహించిన ప్రదేశాలన్నీ జైజగన్ నినాదాలతో మార్మోగాయి.సింగపూర్‌లో జగన్ వైబ్స్ సింగపూర్‌లో వైఎస్సార్సీపీ సింగపూర్ ఎన్ఆర్ఐ విభాగం ఆధ్వర్యంలో వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలను ఆదివారం నిర్వహించారు. జై జగన్ నినాదాల నడుమ కేక్ కట్ చేశారు. వైఎస్ జగన్ ఆయురారోగ్యాలు, నిండు నూరేళ్లు ఇవ్వాలని, ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. కార్యక్రమానికి వైఎస్సార్సీపీ సింగపూర్ ఎన్ఆర్ఐ కన్వీనర్ దువ్వూరు మురళీకృష్ణ నేతృత్వం వహించగా.. వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎన్నారై కో–ఆర్డినేటర్ ఆలూరు సాంబశివారెడ్డి జూమ్ కాల్ ద్వారా హాజరయ్యారు. సింగపూర్ ఎన్ఆర్ఐ అడ్వైజర్ కొమ్మిరెడ్డి కోటిరెడ్డి, మలేషియా కన్వీనర్ విజయభాస్కర్‌రెడ్డి, మేడపాటి సందీప్, రామ్‌రెడ్డి, చంద్ర, సుహాస్, కిరణ్, సుధీర్, భాస్కర్, ప్రసాద్, పవన్, కుమార్, దొర హాజరయ్యారు.ఆస్ట్రేలియాలో..మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టిన రోజు వేడుకలు ఆస్ట్రేలియాలో సందడిగా సాగాయి. ఆస్ట్రేలియా ఎన్ఆర్ఐ వింగ్ ఆర్గనైజర్‌గా కిరణ్‌సాయి ప్రసన్ననాయుడు అక్కడి ఎన్ఆర్ఐ సహచరులతో కలిసి వైఎస్ జగన్ జన్మదిన కేక్‌ను కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.అరబ్ దేశాల్లోనూ సంబరాలుఅరబ్ దేశాలైన ఖతర్, కువైట్లలో ఆదివారం ఘనంగా వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. కేక్‌లు కట్ చేసి సంబరాలు జరిపారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఎన్ఆర్ఐ విభాగం గ్లోబల్ కో–ఆర్డినేటర్ ఆలూరు సాంబశివారెడ్డి మాట్లాడుతూ.. జగనన్న పుట్టినరోజు సందర్భంగా ఖతర్‌లో రక్తదాన శిబిరం నిర్వహించామన్నారు. రక్తదానం చేసిన అందరికీ జగనన్న సంతకంతో ప్రశంసా పత్రాలను సాంబశివారెడ్డి అందజేశారు. కార్యక్రమంలో గల్ఫ్ కన్వీనర్ బీహెచ్ ఇలియాస్, కో–కన్వీనర్లు, అడ్వైజర్లు హాజరయ్యారు. కువైట్ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. శనివారం షర్క్ బెనైదాల్ గార్ పిస్తా హౌస్ పక్కనున్న బ్లూమ్ హోటల్ బేస్మెంట్లో 600 మంది కువైట్ కమిటీ సభ్యుల నడుమ వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ గ్లోబల్ కన్వీనర్ ఎ.సాంబశివారెడ్డి కేక్ కట్‌చేశారు. వైఎస్ జగన్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో గడపాలని ఆకాంక్షిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో గల్ఫ్, కువైట్ కన్వీనర్లు ఇలియాస్ బి.హెచ్ ముమ్మడి బాలిరెడ్డి, గల్ఫ్ కో–కన్వీనర్ గోవిందు నాగరాజు, కువైట్ కో–కన్వీన్లు రమణ యాదవ్, మర్రి కళ్యాణ్, షా హుస్సేన్, గల్ఫ్ కోర్ కమిటీ సభ్యులు పులపత్తూరు సురేషష్రెడ్డి, గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు ఎస్.లక్ష్మీప్రసాద్ యాదవ్, షేక్ రహంతుల్లా, షేక్ అప్సర్ అలీ, షేక్ యాసి, గల్ఫ్ అడ్వైజర్ ఎన్.మహేశ్వర్‌రెడ్డి, కో–కన్వీనర్ ఎం.చంద్రశేఖర్‌రెడ్డి, గల్ఫ్ కోర్ కమిటీ సభ్యుడు ఎన్.చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు. -
బ్రిటన్, కువైట్‌లో వైఎస్ జగన్ ముందస్తు పుట్టినరోజు
వేంపల్లె/కడప కార్పొరేషన్: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ముందస్తు పుట్టినరోజును యునైటెడ్ కింగ్డమ్ బ్రిటన్‌లో గురువారం రాత్రి ఘనంగా నిర్వహించినట్లు వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ గ్లోబల్ కో–ఆర్డినేటర్లు ఆలూరి సాంబశివారెడ్డి, డాక్టర్ చింతా ప్రదీప్ రెడ్డి, ఎల్.ఎన్.జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనం మెచ్చిన నాయకుడిగా, జననేతగా మాజీ సీఎం వైఎస్ ప్రఖ్యాతి పొందారన్నారు. ఆయన పుట్టినరోజును బ్రిటన్‌లో నిర్వహించడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో ఎన్ఆర్ఐ యూకే కన్వీనర్లు సహాయ కన్వీనర్లు, కోర్ కమిటీ సభ్యులు, మహిళా విభాగం సభ్యులు, పెద్ద ఎత్తున యువ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కువైట్‌లో మెగా రక్తదానం వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందస్తు పుట్టినరోజు వేడుకలు కువైట్‌లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ కువైట్ కమిటీ ఆధ్వర్యంలో కువైట్‌లోని జాబ్రియా బ్లడ్ బ్యాంకులో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ గ్లోబల్ కన్వీనర్ ఎ.సాంబశివారెడ్డి, గల్ఫ్ కన్వీనర్ బీహెచ్. ఇలియాస్, కువైట్ కన్వీనర్ ముమ్మడి బాలిరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కువైట్‌లో ఉన్న జగనన్న అభిమానులు భారీ వర్షం పడుతున్నా లెక్క చేయకుండా దూర ప్రాంతాల నుంచి వచ్చారని, కువైటీల ఇళ్లలో పని చేస్తున్న మహిళలు, డ్రైవర్లు అనుమతి తీసుకొని వచ్చి 82 మంది రక్తదానం చేయడం గొప్ప విషయమన్నారు. రక్తదానం చేసిన వారికి జగనన్న సంతకంతో కూడిన సరి్టఫికెట్‌ను అందజేశారు. ఈ కార్యక్రమంలో గల్ఫ్ కో–కన్వీనర్ గోవిందు నాగరాజు, కువైట్ కో కన్వీనర్లు కె. రమణయాదవ్, మర్రి కళ్యాణ్, షా హుసేన్, గల్ఫ్ కోర్ కమిటీ సభ్యులు పులపత్తూరు సురేష్ రెడ్డి, గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు ఎస్. లక్ష్మీ ప్రసాద్ యాదవ్, షేక్ రహమతుల్లా, షేక్ అఫ్సర్ అలీ, కార్యవర్గ సభ్యులు షేక్ యాసిన్ తదితరులు పాల్గొన్నారు. -
మరోసారి అందరి మనసులు దోచేసిన దుబాయ్ క్రౌన్ ప్రిన్స్
దుబాయ్ క్రౌన్ ప్రిన్స్, యుఏఈ ఉప ప్రధాని మరియు రక్షణ మంత్రి షేక్ హమ్దాన్ బిన్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవల ఓ రెస్టారెంట్లో అందరి బిల్లులు చెల్లించి దాతృత్వాన్ని చాటుకున్న ఆయన.. తాజాగా తన సింప్లిసిటీతో మరోసారి అందరి మనసులు దోచేశారు.సామాజిక సంబంధాలను బలపరిచేందుకు దుబాయ్ ప్రభుత్వం కొత్తగా ప్రారంభించిన ‘దుబాయ్ లంచ్’ ప్రాజెక్ట్‌లో భాగంగా షేక్ హమ్దాన్ బిన్, దెయ్రా ప్రాంతంలోని 200 కుటుంబాలను కలిశారు. అల్ ఖవానీజ్ మజ్లిస్ వద్ద జరిగిన సమావేశంలో వారితో చాలాసేపు గడిపారు. దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ అయినా ఏమాత్రం ఆడంబరాలకు పోకుండా సాధారణ వ్యక్తిలా ప్రజలతో మమేకమైపోయారు. లంచ్ చేస్తూ వారిలో ఒకరయ్యారు. అందరిని పలకరిస్తూ విశేషాలు తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆయన ఓ చిన్నారిని కౌగిలించుకున్న హృద్యమైన దృశ్యం సోషల్ మీడియాలో వైరలవుతుంది. షేక్ హమ్దాన్ సింప్లిసిటీకి నెటిజన్లు ముగ్దులవుతున్నారు. షేక్ హమ్దాన్ను అతని తండ్రి, దుబాయ్ రాజు షేక్ మహమ్మద్‌తో పోలుస్తున్నారు. రాజకుటుంబం మంచితనాన్ని, సింప్లిసిటీని కొనియాడుతున్నారు. షేక్ హమ్దాన్ తండ్రి షేక్ మహమ్మద్ కూడా దుబాయ్ వాసులందరితో సాధారణ వ్యక్తిలా కలిపోతారు. తాను రాజునన్న అహంకారాన్ని ఎక్కడా ప్రదర్శించరు.దుబాయ్ లంచ్ కార్యక్రమ లక్ష్యం ఏంటంటే..?దుబాయ్ లంచ్ కార్యక్రమ లక్ష్యం స్థానిక కమ్యూనిటీ మజ్లిస్ల ద్వారా సామాజిక ఐక్యతను పెంపొందించడం. పరస్పర సహకారం, స్నేహాన్ని బలపరచడం. మజ్లిస్ల పూర్వపు సంప్రదాయ ప్రాధాన్యాన్ని తిరిగి తీసుకురావడం. ప్రజలతో నేరుగా సంభాషణకు వేదిక కల్పించడం.దుబాయ్ లంచ్ సందర్భంగా షేక్ హమ్దాన్ వ్యాఖ్యలు..దుబాయ్ లంచ్ కార్యక్రమ సందర్భంగా షేక్ హమ్దాన్ ఇలా అన్నారు. దుబాయ్ శక్తిని భవనాలతో కాదు, ప్రజల మధ్య ఐక్యతతో కొలవాలి. దుబాయ్ చరిత్రను కారుణ్యం, అతిథి సత్కారం, బాధ్యతా భావం నిర్మించాయి. ఈ విలువలను భవిష్యత్ తరాలకు అందించడానికి ఇలాంటి సమావేశాలు అవసరం.2026.. కుటుంబ సంవత్సరంకమ్యూనిటీ డెవలప్మెంట్ అథారిటీ డైరెక్టర్ జనరల్ హెస్సా బింత్ ఈసా బుహుమైద్ తెలిపిన వివరాల ప్రకారం.. దుబాయ్ 2026ను కుటుంబ సంవత్సరంగా జరుపుకోడానికి సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా రాబోయే రోజుల్లో దుబాయ్‌లోని వివిధ ప్రాంతాల్లో ‘దుబాయ్ లంచ్’ కార్యక్రమాలు జరుగుతాయి. -
తండ్రిని హత్య చేసిన ఎన్ఆర్ఐ, ట్విస్ట్ ఏంటంటే..!
ఇల్లినాయిస్లోని షామ్‌బర్గ్‌లో భారత సంతతికి చెందిన 28 ఏళ్ల వ్యక్తి, 67 ఏళ్ల వృద్ధ తండ్రిని సుత్తితో మోది దారుణంగా హత్య చేశాడు. థాంక్స్ గివింగ్ వారాంతంలో తండ్రిని చంపినట్లు ఆరోపణలపై అభిజిత్ పటేల్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు ఫస్ట్-డిగ్రీ హత్య కేసు నమోదు చేశారు. కుక్ కౌంటీ ప్రాసిక్యూటర్ల ప్రకారం బాధితుడు అనుపమ్ పటేల్ డయాబెటిస్తో బాధపడుతున్నకారణంగా ఇంట్లోనే ఉంటున్నాడు. నవంబర్ 29న కుమారుడు చేతిలో హత్యకు గురయ్యాడు.కేసు ఏంటీ అంటేఅనుపమ్ పటేల్ భార్య ఉదయం డ్యూటీకి వెళ్లిపోయింది. తండ్రీ కొడుకులిద్దరు ఇంట్లో ఒంటరిగా ఉన్నారు. ప్రతీరోజు ఉదయం 8 గంటల తన బ్లడ్ షుగర్ లెవల్స్ గురించి భార్యకు ఫోన్ చేయడం అలవాటు. పైగా అతని గ్లూకోజ్ మానిటర్ భార్య ఫోన్‌కు కనెక్ట్ అయ్యి ఉంది. హత్య జరిగిన రోజు భర్త నుంచి ఫోన్ రాకపోవడం, అతని గ్లూకోజ్ స్థాయిలు పడిపోవడం గమనించింది. ఫోన్లో వారితో సంప్రదించాలని ప్రయత్నించినా సమాధానం లేకపోవడంతో ఆందోళన ఇంటికి పరుగు తీసింది. ఎదురుగా కనిపించిన కొడుకు నాన్న బాగానే ఉన్నాడులే అని చెప్పాడు. ఏదో అనుమానం వచ్చి తల్లి చెక్ చేయగా, మంచం మీద రక్తపు మడుగులో పడి ఉన్న భర్తను చూసి హతాశురాలైంది. వెంటనే పోలీసులకు ఫోన్ చేసింది. వారి సాయంతో భర్తను ఆసుపత్రికి తరలించింది. కానీ అప్పటికే ప్రాణం పోయిందని వైద్యులు ప్రకటించారు. సంఘటనా స్థలంలో ఒక పెద్ద సుత్తిని గుర్తించారు పోలీసులు. అనుపమ్ పటేల్ తలకు తీవ్ర గాయాలు, పుర్రె, ముక్కు ఎముక విరిగినట్టు పోస్ట్ మార్టం రిపోర్ట్‌లో తేలింది. మరోవైపు నిందితుడు అభిజిత్ పటేల్ పోలీసులకు లొంగిపోయాడు. విచారణ సమయంలో, చిన్నతనంలో తండ్రి తనను లైంగికంగా వేధించాడని, అందుకే చంపేశానని, ఇది తన డ్యూటీని అని చెప్పుకొచ్చాడు. అయితే స్కిజోఫ్రీనియా బాధితుడైన అభిజిత్, గతంలో చికిత్స కోసం గతంలో ఆసుపత్రిలో చేరినట్లు రికార్డుల ద్వారా తెలుస్తోంది. దీంతో అభిజిత్ ఆరోపణలన్నీ భ్రమలు కావచ్చని పోలీసుల అంచనా. దీనికి తోడు గతంలో చాలా సార్లు తండ్రిని చంపేస్తానని బెదరించేవాడట. దీంతో అభిజిత్ తండ్రిని సంప్రదించకుండా చట్టబద్ధంగా నిషేధం 2027 జనవరి వరకు అమల్లో ఉంది. అయితే అతని తల్లిదండ్రులు ఇంట్లో నివసించడానికి అనుమతించారు. కానీ ఇంతలోనే ఘోరం జరిగింది. ఈ నేపథ్యంలో అభిజిత్ పటేల్ నాన్ బెయిలబుల్ కేసులు నమోదైనాయి. అంతేకాదు తల్లిని సంప్రదించకుండా ఉండేలా పోలీసులు చర్యలు తీసుకున్నారు. తదుపరి విచారణ డిసెంబర్ 19న జరగనుంది.చదవండి: భార్య, ఇద్దరు బిడ్డల్ని చంపి ఇంట్లోనే..వాళ్లు బతికిపోయారురణరంగంగా సెంట్రల్ జైలు : సూపరింటెండెంట్ పరిస్థితి విషమం -
ప్రవాస భారతీయులకు ప్రాణ గండం.. అసలేం జరుగుతోంది?
విదేశాల్లో నివసిస్తున్న భారతీయుల భద్రత ప్రస్తుతం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. సిడ్నీ నుండి టొరంటో వరకు.. అక్కడి ప్రవాస భారతీయులు భయం భయంగా కాలం వెళ్లదీస్తున్నారు. విదేశాలకు వెళ్లడమంటే ప్రాణాలను పణంగా పెట్టడమేనా? అనే విధంగా ప్రస్తుత పరిస్థితులు కనిపిస్తున్నాయి. తాజాగా సిడ్నీలోని బోండి బీచ్‌లో భారతీయ విద్యార్థులపై జరిగిన దాడి అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. ఈ ఘటనలో ఒక విద్యార్థి ప్రాణాలు కోల్పోగా, మరికొందరు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు. ఇటువంటి ఘటనల నేపధ్యంలో విదేశాల్లో ఉంటున్న తమవారు ఎలా ఉన్నారోనని భారతదేశంలోని వారి కుటుంబ సభ్యులు అనునిత్యం ఆవేదన అనుభవిస్తున్నారు.జాత్యహంకార కోరలుకొన్ని పాశ్చాత్య దేశాల్లో జాత్యహంకారం అధికంగా కనిపిస్తుంది. ఈ జాబితాలోని దేశాలలో అమెరికా, కెనడా పేర్లు ముందుగా వినిపిస్తాయి. ఈ దేశాల్లో ఇటీవలి కాలంలో భారతీయులపై ద్వేషపూరిత నేరాలు (Hate Crimes) మునుపెన్నడూ లేనంతగా పెరిగాయి. కెనడాలో భారతీయుల పట్ల విద్వేషం మరింతగా పెరగడం వెనుక సోషల్ మీడియాలో జరుగుతున్న విష ప్రచారం ప్రధాన పాత్ర పోషిస్తోంది. అమెరికాలో 2024 నుంచి ఇప్పటివరకు 11 మందికి పైగా భారతీయ విద్యార్థులు అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. ఇది స్థానిక భద్రతా వైఫల్యాలను ఎత్తిచూపుతోంది. డబ్లిన్‌లో ఒక భారత సంతతి వ్యక్తిపై జరిగిన పాశవిక దాడి, సభ్య సమాజం తలదించుకునేలా చేసింది.అభద్రతా భావంవిద్యా కేంద్రాల్లో అభద్రతా భావం మరింతగా పెరిగిపోయింది. భారతీయ విద్యార్థులు ఎక్కువగా వెళ్లే ఆస్ట్రేలియా, ఐరోపా దేశాల్లో ఇది ప్రత్యక్షంగా కనిపిస్తోంది. ఆయా దేశాల్లో భారతీయ విద్యార్థులకు క్యాంపస్ భద్రత అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇటీవల టెహ్రాన్‌లోని భారతీయ వైద్య విద్యార్థులు తమపై దాడులు జరుగుతున్నాయని మొరపెట్టుకున్నా, స్థానిక అధికార యంత్రాంగం స్పందించలేదనే వార్తలు వచ్చాయి. ఈ ఘటన దౌత్యపరమైన వైఫల్యంగా కనిపిస్తోంది. విద్యాభ్యాసం కోసం లక్షల రూపాయలు ఖర్చు చేసి, వెళ్తున్న విద్యార్థులు, అక్కడ కనీస రక్షణ లేక జాత్యహంకార దాడులకు బలవుతుండటం గమనార్హం.సైద్ధాంతిక విద్వేషంవిదేశాల్లో భారతీయులపై దాడులకు జాత్యహంకారం ఒక్కటే కాదు.. రాజకీయం, మతం లేదా సామాజిక పరమైన అసహనం కూడా కారణంగా నిలుస్తోంది. ఈ తరహా దాడులు కేవలం దొంగతనాలు లేదా స్థానిక గొడవలకు మాత్రమే పరిమితం కావడం లేదు. ఆన్లైన్ వేదికలపై భారతీయులకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారాలు పలుచోట్ల హింసకు దారితీస్తున్నాయి. దీనికి తోడు నేరస్తులకు సరిహద్దులు దాటి ఉన్న సంబంధాలు దర్యాప్తు సంస్థలకు పెద్ద సవాలుగా మారాయి. సిడ్నీ ఘటనలో హైదరాబాద్ లింకులు బయటపడటం దీనికి ఉదాహరణగా నిలిచింది. విదేశాంగ శాఖ అప్రమత్తం విదేశాలలో పెరుగుతున్న ఈ హింసాత్మక ధోరణిని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) తీవ్రంగా పరిగణిస్తోంది. గత ఐదేళ్ల గణాంకాలను పరిశీలిస్తే భారతీయులపై దాడులు క్రమంగా పెరుగుతున్నాయనే విషయాన్ని ప్రభుత్వం అంగీకరించింది. ఇటువంటి సందర్భాల్లో విదేశీ ప్రభుత్వాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మార్పు అనుకున్నంతగా కనిపించడం లేదు. భారతీయ రాయబార కార్యాలయాలు విద్యార్థులకు, వలసదారులకు రక్షణ కల్పించడంలో మరింత చురుకైన పాత్ర పోషించాలని పలువురు అంటున్నారు.భద్రతా సంక్షోభం?ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు ఆయా దేశాలు తక్షణ చర్యలు తీసుకోకుంటే ఇవి పునరావృతం అవుతాయని పలువురు అంటున్నారు. ప్రవాస భారతీయులు ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలకు వెన్నెముకగా నిలుస్తున్నారనడంలో సందేహం లేదు. దీనిని గుర్తించి అయినా అక్కడి ప్రభుత్వాలు వారికి రక్షణ కల్పించాలనే వాదన వినిపిస్తుంటుంది. ప్రవాస మేధావులు, విద్యార్థులపై దాడులు కొనసాగితే, అది ప్రపంచ భద్రతా సంక్షోభానికి దారితీస్తుందనేవారూ ఉన్నారు. ఇటువంటి సందర్భాల్లో కేవలం నిరసనలు తెలపడమే కాకుండా, అంతర్జాతీయ చట్టాలను బలోపేతం చేయడం ద్వారా ఇటువంటి ఘటనలను నివారించవచ్చని పలువురు సూచిస్తున్నారు. లేనిపక్షంలో విదేశీ కలలు కనే వేలాది మంది భారతీయుల భవిష్యత్తు అంధకారంలో పడిపోయే ప్రమాదం ఉందని పలువురు హెచ్చరిస్తున్నారు. ఇది కూడా చదవండి: బోండి బీచ్ ఘటన: వృద్ధ దంపతుల త్యాగం.. వీడియో వైరల్ -
గేదెల దాముకు సేవారత్న అవార్డు
అమెరికాలో నివసిస్తూ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రవాసాంధ్ర వాసి, మన అమెరికా తెలుగు అసోసియేషన్- మాట కో కన్వీనర్ దాము గేదెలను సేవారత్న అవార్డుతో సత్కరించారు. విజయనగరం జిల్లాలోని రాజాంకు చెందిన పోలిపల్లి పైడితల్లి కళాకారుల సంక్షేమ సేవా సంఘం నెలవారీ సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించింది. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు పద్మశ్రీ యడ్ల గోపాలరావు... శ్రీకాకుళం జిల్లా కత్తులకవిటికి చెందిన ఎన్నారై, సామాజిక సేవా కార్యకర్త గేదెల దాము దంపతులను సేవారత్న అవార్డుతో సత్కరించారు.అవార్డు అందుకున్న దాము మాట్లాడుతూ… తనకు చిన్నప్పటి నుంచి సేవా కార్యక్రమాలు అంటే ఎంతో ఇష్టమని తెలిపారు. కుటుంబీకులు, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఈ ఉత్సాహం రెట్టింపు అయ్యిందని, సేవా కార్యక్రమాలు బాధ్యతను, సమాజంలో గౌరవాన్ని తెచ్చిపెట్టాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా దామును పలువురు కళాకారులు సత్కరించారు.అంతకు ముందు జగన్మోహిని పద్య నాటక ప్రదర్శన, కేవీ పద్మావతి శిష్య బృందంతో భరత నాట్య నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. స్థానిక జీఎంఆర్ వరలక్ష్మీ కళాక్షేత్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో పోలిపల్లి పైడితల్లి కళాకారుల సంక్షేమ సేవా సంఘం కమిటీ సభ్యులు, రాజాంతో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన పలువురు కళాకారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.(చదవండి: ఘనంగా శంకర నేత్రాలయా ఫండ్‌రైజింగ్ సంగీత విభావరి) -
అంతర్జాతీయ వేదికపై డా. తెన్నేటి సుధాదేవికి ఘన నివాళి
వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వంశీ ఇంటర్నేషనల్ & శ్రీ సాంస్కృతిక కళాసారథి- సింగపూర్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో, అంతర్జాలంలో శనివారం సాయంత్రం, ప్రఖ్యాత కథా నవలా రచయిత్రి, తెలుగు అకాడమీ పూర్వ ఉపసంచాలకులు, వంశీ అధ్యక్షురాలు డా. తెన్నేటి సుధాదేవి సంస్మరణ సభ నిర్వహించారునవంబర్ 23వ తేదీ హైదరాబాదులో స్వర్గస్తులైన, డా. తెన్నేటి సుధాదేవి (Dr.Tenneti Sudha Rani), వంశీ సంస్థల వ్యవస్థాపకులైన డా. వంశీ రామరాజు ధర్మపత్ని. "సుధాదేవి స్మరణలో, వివిధ దేశాల తెలుగు ప్రవాస సంస్థల ప్రతినిధులు, భారతదేశంలో చెన్నై ముంబై విశాఖపట్నం మొదలైన ప్రాంతాలలో ఉండే ప్రముఖులు ఆప్తులు కలిసి ఆమెకి నివాళులు అర్పించే విధంగా ఈ అంతర్జాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని నిర్వహకులు వంగూరి ఫౌండేషన్ అధ్యక్షులు వంగూరి చిట్టెన్ రాజు, శ్రీ సాంస్కృతిక కళాసారథి సంస్థ అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్, కార్యక్రమ సమన్వయకర్త రాధిక మంగిపూడి తెలియ జేశారు.సుమారు నాలుగు గంటల పాటు కొనసాగిన ఈ కార్యక్రమంలో శిరోమణి డా వంశీ రామరాజు అంతర్జాల వేదిక మాధ్యమంగా అన్ని దేశాలనుండి తమ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన వారందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. భారత్ నుండి మాత్రమే కాక సుమారు పది దేశాల నుండి 50 మంది వరకు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.భారతదేశం నుండి వంశీ సంస్థలతో అవినాభావ సంబంధం ఉన్న పద్మభూషణ్ డా.యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్, డా. మేడసాని మోహన్, సినీ దర్శకులు రేలంగి నరసింహారావు, సినీ రచయిత భువనచంద్ర, సంగీత విద్వాంసులు గరికపాటి ప్రభాకర్, గాయకులు గజల్ శ్రీనివాస్, గాయని సురేఖ మూర్తి, హాస్యబ్రహ్మ శంకరనారాయణ, సినీ నటులు సుబ్బరాయశర్మ, సాహితీవేత్త ఓలేటి పార్వతీశం, రచయిత్రి జలంధర చంద్రమోహన్, రాజకీయవేత్త వామరాజు సత్యమూర్తి, అవధాని పాలపర్తి శ్యామలానంద ప్రసాద్, జుర్రు చెన్నయ్య, పొత్తూరి సుబ్బారావు తదితర వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో అమెరికా, సింగపూర్, ఖతార్, కువైట్, సౌదీ అరేబియా, ఉగాండా, మలేషియా, హాంకాంగ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తదితర దేశాల నుండి కృష్ణవేణి శ్రీ పేరి, సుచిత్ర, బూరుగుపల్లి వ్యాసకృష్ణ, సత్య మల్లుల, పద్మ మల్లెల, జయ పీసపాటి, స్వాతి జంగా, విక్రమ్ సుఖవాసి, వెంకప్ప భాగవతుల, సీతాపతి అరికరేవుల , తాతాజీ & పద్మజ ఉసిరికల, శ్రీసుధ, మాధవీలలిత, సాహిత్య జ్యోత్స్న, కోనేరు ఉమామహేశ్వర రావు, శారదా పూర్ణ శొంఠి, శారద ఆకునూరి, రాధిక నోరిరాధ కాసినాథుని, కె ధర్మారావు గుణ కొమ్మారెడ్డి, డా. సత్యమూర్తి , డా. సుజాత కోటంరాజు, డా. బి కె మోహన్ పాల్గొని వంశీ సంస్థలతో సుధ గారితో తమకున్న అనుబంధాన్ని గురించి నెమరు వేసుకుంటూ ఆమెను స్మరించు కున్నారు. కల్చరల్ టీవీ వారు సాంకేతిక సహకారం అందించగా ప్రపంచవ్యాప్తంగా ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం చేశారు. -
ఘనంగా శంకర నేత్రాలయా ఫండ్‌రైజింగ్ సంగీత విభావరి
శంకర నేత్రాలయ దృష్టి సేవా కార్యక్రమాల కోసం నిధులు సమీకరించేందుకు 2025 నవంబర్ 22న బోటెల్ నగరంలోని ఎంపైర్ బ్యాంక్వెట్ హాల్లో నిర్వహించిన ఫండ్‌రైజింగ్ కార్యక్రమం సంగీత విభావరి ఘనంగా, అత్యంత విజయవంతంగా జరిగింది.కార్యక్రమం చిన్నారులు మిత్రా, మీనాక్షి, విష్ణు, జస్మితా ఆలపించిన పవిత్ర గణేశ వందనాలతో ఆరంభమైంది. కార్యక్రమం నిరంతరాయంగా సాగాలని వినాయకుడిని ప్రార్థించిన ఈ చిన్నారుల గాన ప్రదర్శన సభలోని ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్న ప్రత్యేక ఘట్టంగా నిలిచింది. కార్యక్రమాన్ని సుందరంగా, శ్రద్ధగా ముందుకు తీసుకెళ్లిన ఎంసీలు వర అక్కెల్ల, సృజనా ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. ప్రముఖ గాయకులు సుమంగళి, అంజనా సోమ్య, పార్థు, మల్లికార్జున అందించిన సంగీత ప్రదర్శనలు కార్యక్రమానికి ముఖ్య ఆకర్షణగా నిలిచి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి.స్థానిక కమ్యూనిటీ సభ్యులు, కమ్యూనిటీ సంస్థలు, నాయకులు, వాలంటీర్లు మరియు మిత్రుల సమిష్టి సహకారంతో ఈ సంగీత విభావరి విజయవంతంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా బోటెల్ సిటీ డిప్యూటీ మేయర్ రామి గారు, అలాగే కొత్తగా ఎన్నికైన సిటీ కౌన్సిల్ సభ్యుడు అంగులూరి తమ భార్యతో కలిసి హాజరై, శంకర నేత్రాలయ చేస్తున్న సేవా కార్యక్రమాలను అభినందిస్తూ తమ మద్దతును తెలియజేశారు.2023 ‘Adopt a Village’ స్పాన్సర్లుగా శ్భాస్కర్ గంగిపాముల, శ్రీ రామ్ కొట్టీ;2024 స్పాన్సర్లుగా Quadrant Technologies (వంశీ రెడ్డి , శ్రీ రామ్ పాలూరి, భాస్కర్ జీ ), విక్రమ్ గార్లపాటి, వర అక్కెల్ల గారు, రాహుల్ & అనీలా, నంద కిషోర్ గజుల ;అలాగే 2025 స్పాన్సర్లుగా అశోక్ గల్లా, రాజేశ్ గుడవల్లి, అశోక్ పసుపులేటి, వినోద్ నాగుల, కృష్ణ ఉంగర్ల, శ్వేత సానగపు, రాజేశ్ అర్జా Seattle Boys Club — తదితరాలు ముందుకు వచ్చి ఈ మహత్తర సేవా కార్యక్రమానికి అందించిన మద్దతుకు శంకర నేత్రాలయ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.డెకరేషన్ టీమ్ – Seattle Decors and Events కార్యక్రమాన్ని అద్భుతంగా అలంకరించగా, ప్రతి క్షణాన్ని అందంగా బంధించిన హ్యాష్‌ట్యాగ్ ఫోటోగ్రఫీ, అలాగే రుచికరమైన భోజనం అందించిన Aroma Bothell, Biryani Bistro, Curry Point ఫుడ్ వెండర్ల సేవలు సభలోని వారి నుంచి విశేష ప్రశంసలు అందుకున్నాయి.SNUSA జాతీయ అధ్యక్షుడు బాలా రెడ్డి ఇందూర్తి నాయకత్వం, మార్గదర్శకత్వం, SNUSA బృందంలోని మూర్తి రేకపల్లి, డా. రెడ్డి ఊరిమిండి, వంశి ఏరువారం, శ్యామ్ అప్పలీ, రత్నకుమార్ కవుటూరు, త్యాగరాజన్ గారి కీలక మద్దతు, అలాగే స్థానిక చాప్టర్‌కు సకాలంలో అందిన సహకారం ఈ కార్యక్రమం ఘనవిజయానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి.శంకర నేత్రాలయ బోర్డ్ ట్రస్టీలు సోమ జగదీశ్ కుటుంబం, వినోద్ కుటుంబంతో ముందుండి కీలక పాత్ర పోషించగా, చాప్టర్ వైస్ ప్రెసిడెంట్ జయపాల్ రెడ్డి దొడ్డ మార్గదర్శకత్వంలో చాప్టర్ లీడర్లు, వాలంటీర్లు సమిష్టిగా శ్రమించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఉచితంగా లేదా తక్కువ ఖర్చుతో దృష్టి సేవలు అందించే శంకర నేత్రాలయ సేవా కార్యక్రమాలకు ఈ ఫండ్‌రైజింగ్ సంగీత విభావరి విలువైన మద్దతును అందించింది.(చదవండి: ఘనంగా ‘ఆటా’ అంతర్జాతీయ సాహిత్య సదస్సు!) -
ఘనంగా ‘ఆటా’ అంతర్జాతీయ సాహిత్య సదస్సు!
అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA – ‘ఆటా’) ఆధ్వర్యంలో, హైదరాదాద్‌లోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ‘ఆటా అంతర్జాతీయ సాహిత్య సదస్సు-2025’ ఘనంగా జరిగింది. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన ఒక రోజు అంతర్జాతీయ సదస్సులో ఈ ఏటి జ్ఞానపీఠ పురస్కార గ్రహీత, సుప్రసిద్ధ హిందీ రచయిత వినోద్ కుమార్ శుక్లా సాహిత్యంపై విస్తృత సమాలోచన జరిగింది. ఆయన హిందీ సాహిత్య సృష్టి, భావనా ప్రపంచం, ఆలోచనలు, అభిప్రాయాలు, సృజనాత్మక దృష్టికోణాన్ని తెలుగు సాహితీ వేదికకు పరిచయం చేస్తూ వివిధ ప్రాంతాలకు చెందిన సాహిత్యవేత్తలు, కవులు, రచయితలు లోతైన చర్చలు జరిపారు. ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేసిన తెలంగాణ సాహిత్య అకాడెమీ తొలి అధ్యక్షుడు – కవి నందిని సిధారెడ్డి, ప్రముఖ కవి - హైదరాబాద్ బుక్ ఫెయిర్ చైర్మన్ యాకూబ్ తదితరులు జ్యోతి ప్రజ్వలన చేసి, ఈ సాహిత్య సదస్సును ప్రారంభించారు. జనరంజక సాహిత్యంతో శుక్లా జ్ఞానపీఠ్ పురస్కారాన్ని అందుకొని, అందరికీ స్ఫూర్తిగా నిలిచారని వక్తలు అన్నారు. ఆయన రచనలు ఇతర భాషలలోకి అనువాదం కావడం, అనేక అవార్డులు సొంతం చేసుకోవడం విశేషమని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో భాష, సాహిత్య వికాసం కోసమే కాక, అమెరికాలోనూ తెలుగు సంస్కృతి కోసం ‘ఆటా’, ‘తానా’ లాంటి సంస్థలు నిర్వహిస్తున్న కార్యక్రమాలు ప్రశంసనీయమని సిధారెడ్డి అన్నారు. తెలుగులో నవలల పోటీలు నిర్వహించిన ఘనత ‘ఆటా’కు దక్కుతుందన్నారు. ఈ డిసెంబర్ చివరివరకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వివిధ సాహిత్య, సాంస్కృతిక, వైద్య సేవా కార్యక్రమాలను ‘ఆటా’ నిర్వహిస్తోంది. అందులో భాగంగా ఆదివారం జరిగిన అంతర్జాతీయ సాహిత్య సదస్సులో సాహితీవేత్తలు ప్రసేన్, డాక్టర్ ఆర్. సుమన్ లత, ప్రొఫెసర్ సర్రాజు, శ్రీనివాస్ గౌడ్, రూప్ కుమార్, వారాల ఆనంద్, డాక్టర్ రెంటాల జయదేవ తదితరులు పాల్గొని, జ్ఞానపీఠ విజేత అయిన శుక్లా రచనా ప్రస్థానం, ఆయన రచనా శైలి, కవిత్వం, కథలు, కథావస్తువులు, నవలలోని ప్రత్యేకత, సినిమాలుగా – దృశ్య రూపాలుగా వచ్చిన ఆయన రచనలు తదితర అంశాలపై విశ్లేషణాత్మక ప్రసంగాలు చేశారు. ‘ఆటా’ ఇండియా బోర్డు సభ్యులు రవీందర్ రెడ్డి, జ్యోత్స్న రెడ్డి, అలాగే సాహితీవేత్త రాధిక సూరి తదితరులు సమన్వయకర్తలుగా ఈ సుదీర్ఘ సాహిత్య సదస్సు నిర్వహణలో కీలకంగా వ్యవహరించారు. వేదికపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.వచ్చే జూలైలో... బాల్టిమోర్‌లో ఆటా సదస్సు‘ఆటా’ ప్రస్తుత అధ్యక్షుడు జయంత్ చల్లా, అలాగే రానున్న అధ్యక్షులు – ప్రస్తుత ‘ఆటా’ వేడుకల చైర్ సతీశ్ రెడ్డి పర్యవేక్షణలో, అమెరికాలో సాఫ్ట్వేర్ రంగంలో స్థిరపడ్డ రచయిత వేణు నక్షత్రం సమన్వయంతో ఈ సదస్సు నిర్వహించారు. మూడున్నర దశాబ్దాలుగా నిత్యం వివిధ సామాజిక, సాహిత్య, సాంస్కృతిక, సేవా కార్యక్రమాలు చేస్తూ, ముందుకు సాగున్న ‘ఆటా’ లక్ష్యాలనూ, కృషినీ జయంత్, సతీశ్‌రెడ్డి తదితరులు వివరించారు. హిందీ – తెలుగు భాషల సాహిత్య శక్తిని ఒకే వేదికపైకి తీసుకువచ్చే ప్రయత్నంగా ఈ సదస్సు నిలిచిందని నిర్వాహకులు తెలిపారు. దీని ద్వారా ‘ఆటా’ ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిందని వారు పేర్కొన్నారు.అలాగే, అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రం బాల్టిమోర్ నగరంలో ‘ఆటా’ వారి 19వ మహాసభలు, యువజన సదస్సు వచ్చే 2026 జూలై 31 నుండి ఆగస్టు 2 వరకు జరగనున్నట్లు ‘ఆటా’ ప్రతినిధులు తెలిపారు. ప్రవాసంలో ఉన్న తెలుగువారినీ, వ్యాపారవేత్తలనూ, ఐటీ నిపుణులనూ, యువతరాన్నీ ఒకే వేదికపైకి తీసుకువచ్చి, పరస్పరం అభిప్రాయాలు పంచుకోవడానికీ, కలసికట్టుగా ముందుకుపోవడానికీ మూడు రోజుల ఆ భారీ సదస్సు ఉపకరిస్తుందని వివరించారు.ఆదివారం రోజంతా జరిగిన సాహిత్య సదస్సులో యండమూరి వీరేంద్రనాథ్, నాళేశ్వరం శంకరం, కందుకూరి శ్రీరాములు, స్వర్ణ కిలారి లాంటి పలువురు ప్రముఖ రచయితలు, అమెరికా నుంచి పెద్దయెత్తున వచ్చిన ‘ఆటా’ ప్రతినిధులు జయంత్ చల్లా, సతీష్ రెడ్డి, నరసింహ, సాయి సుధుని తదితరులు, వారి కుటుంబ సభ్యులు, సాహిత్యాభిమానులు పాల్గొనడం విశేషం. ఈ సందర్భంగా అతిథులు, కవులు, రచయితలు, ‘ఆటా-ఇండియా టీమ్’ సభ్యులను ప్రస్తుత ‘ఆటా’ బోర్డు సభ్యులు ఘనంగా సత్కరించారు.(చదవండి: తెలంగాణ వాసి అరుదైన ఘనత..యూకే హౌస్ ఆఫ్ లార్డ్స్ సభ్యుడిగా ఉదయ్ నాగరాజు) -
H-1B వీసా: భారతీయుల విషయంలో ఏం జరగొచ్చు!
న్యూఢిల్లీ: హెచ్–1బీ, హెచ్–4 వీసాల కోసం దరఖాస్తు చేసుకున్నవారి సోషల్ మీడియా ఖాతాల ప్రొఫైల్స్‌ను, వారు చేసిన పోస్టులను అమెరికా ఇమ్మిగ్రేషన్ విభాగం క్షుణ్నంగా తనిఖీ చేయబోతోంది. సోమవారం నుంచే ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందని అమెరికా స్టేట్ డిపార్టుమెంట్ వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు ఉత్తర్వు జారీ చేశాయి. విద్యార్థులు, ఎక్స్ఛేంజ్ విజిటర్ల విషయంలో ఇప్పటికే ఈ నిబంధన అమలవుతోంది. అమెరికా స్టేట్ డిపార్టుమెంట్ డిసెంబర్ 15, 2025 నుంచి హెచ్–1బీ, హెచ్–4 వీసా దరఖాస్తుదారుల సోషల్ మీడియా ఖాతాలను తప్పనిసరిగా పరిశీలించనుంది. ఇది ఇప్పటికే విద్యార్థులు మరియు ఎక్స్ఛేంజ్ విజిటర్లకు అమలులో ఉన్న నిబంధనను విస్తరించడం ద్వారా జరుగుతోంది.కొత్త నిబంధన వివరాలుఈ కొత్త విధానం ప్రకారం, వీసా దరఖాస్తుదారులు తమ సోషల్ మీడియా ప్రొఫైల్స్‌ను “పబ్లిక్” సెట్టింగ్స్‌లో ఉంచాలి. కనీసం గత ఐదు సంవత్సరాల పోస్టులు, కామెంట్లు, వీడియోలు, ఫోటోలు వంటి సమాచారం పరిశీలనకు వస్తుంది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఎక్స్(ట్విటర్), లింక్డిన్.. తదితర ప్రధాన ప్లాట్‌ఫార్మ్‌లలోని కంటెంట్‌ను కాన్సులర్ అధికారులు పరిశీలిస్తారు. ఈ ప్రక్రియలో అభ్యర్థుల ఆన్లైన్ ప్రెజెన్స్ రివ్యూ తప్పనిసరి అవుతుంది.ప్రభావం-ఆందోళనలుఈ చర్యతో భారతీయ ఐటీ ప్రొఫెషనల్స్ ఎక్కువగా ప్రభావితమవుతారు, ఎందుకంటే హెచ్–1బీ వీసా హోల్డర్లలో 70% పైగా భారతీయులే ఉన్నారు. వీసా ఇంటర్వ్యూలు లేదంటే స్టాంపింగ్ ప్రక్రియలో ఆలస్యం జరిగే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో, సోషల్ మీడియా కంటెంట్ ఆధారంగా వీసా ఆమోదం ఆలస్యం కావొచ్చు. ఒక్కోసారి తిరస్కరించబడే ప్రమాదం ఉంది. నిపుణులు దీనిని ప్రైవసీ హక్కులపై ప్రభావం చూపే చర్యగా భావిస్తున్నారు, కానీ అమెరికా ప్రభుత్వం మాత్రం ఇది జాతీయ భద్రతా కారణాల కోసం అవసరం అని చెబుతోంది.ఇప్పటికే అమలులో ఉన్న విధానం విస్తరణఇప్పటికే విద్యార్థులు (F-1 వీసా) మరియు ఎక్స్ఛేంజ్ విజిటర్ల (J-1 వీసా) సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించే విధానం అమలులో ఉంది. ఇప్పుడు అదే విధానాన్ని తాత్కాలిక ఉద్యోగ వీసాలు (H-1B), వాటి ఆధారిత వీసాలు (H-4) వరకు విస్తరించారు. ఈ మార్పు వల్ల అమెరికాలో ఉద్యోగ అవకాశాల కోసం దరఖాస్తు చేసే విదేశీ ప్రొఫెషనల్స్ మరింత జాగ్రత్తగా సోషల్ మీడియా వాడకాన్ని కొనసాగించాల్సి ఉంటుంది. -
FIA అమెరికా అధ్యక్షుడిగా శ్రీకాంత్ అక్కపల్లి
న్యూయార్క్: 1970లో స్థాపించిన అమెరికా ఈస్ట్‌కోస్ట్‌లోని ఎనిమిది రాష్ట్రాల్లో విస్తరించి, ఎన్నరైలకు ప్రతినిధిగా భావించే అతిపెద్ద గ్రాస్‌రూట్ నాన్–ప్రాఫిట్ సంస్థ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ ఆఫ్ USA (FIA NY–NJ–CT–NE) తన 2026 నాయకత్వ బృందాన్ని ప్రకటించింది. స్వతంత్రంగా నియమితులైన ఎన్నికల సంఘం సభ్యులు అలోక్ కుమార్, జయేష్ పటేల్, కెన్నీ దేశాయి ఎంపిక చేసిన తర్వాత సూచించిన పేర్లకు FIA బోర్డు ఆమోదం తెలిపింది. ప్రస్తుత అధ్యక్షుడు సౌరిన్ పరిక్ స్థానంలో 2026 అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా శ్రీకాంత్ అక్కపల్లిని ఎంపిక చేశారు.ఉపాధ్యక్షురాలిగా పృత్యి రే పటేల్, జనరల్ సెక్రటరీగా శృష్టి కౌల్ నరులా కొనసాగనున్నారు. ఈ సంవత్సరం FIA కార్యవర్గాన్ని కుదించి, కౌన్సిల్‌ను విస్తరించేందుకు నిర్ణయం తీసుకుంది. సంస్థకు స్వతంత్రంగా షా అకౌంటెంట్స్ ట్రెజరర్‌గా పనిచేయనున్నారు.కొత్త కార్యవర్గం 2026 జనవరి 1 నుంచి బాధ్యతలు స్వీకరించనుంది. టెక్నాలజీ, రియల్ ఎస్టేట్, మీడియా, హెల్త్‌కేర్, ట్రాన్సిట్ టెక్నాలజీ, స్పోర్ట్స్ మాన్యుఫ్యాక్చరింగ్ వంటి అనేక రంగాల్లో వ్యాపార సామ్రాజ్యం నిర్మించిన ఔత్సాహిక పారిశ్రామిక వేత్తగా శ్రీకాంత్ అక్కపల్లి పేరు నిలిచింది. అమెరికా–భారత దేశాల్లో ఆయన చేపట్టిన వివిధ రంగాల వ్యాపారాల విజయాలు ఆయన ప్రతిభకు నిదర్శనం.అధ్యక్షుడిగా ఎంపికైన అనంతరం, అక్కాపల్లి బోర్డు తనపై పెట్టుకున్న నమ్మకానికి ధన్యవాదాలు తెలుపుతూ, ఈ అవకాశం ఎంతో గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు. FIA చైర్మన్ అంకుర్ వైద్యకు తనకు “పెద్ద కుటుంబం లాంటి సంస్థలో చోటు కల్పించినందుకు” ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.తొలి తెలుగు రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా FIA అధ్యక్షుడిగా అవతరించడం చారిత్రాత్మకమని పేర్కొంటూ, ఇన్స్టిట్యూషన్ పట్ల నిబద్ధత, నైతికత, సేవా భావంతో పని చేస్తానని హామీ ఇచ్చారు.అనేక దశాబ్దాలుగా సంస్థతో ఉన్న సీనియర్ సభ్యులు ఆయనను ప్రశంసిస్తూ.. “నిజాయితీ, కష్టపడి పనిచేసే స్వభావం, నమ్మకానికి నిలువెత్తు నిదర్శనం అక్కపల్లి ఎంపిక FIA లో విస్తృతమైన ప్రాంతీయ వైవిధ్యానికి నిదర్శనమని అభిప్రాయం వ్యక్తం చేశారు. పూర్తిగా సేవా భావంతో నడిచే ఈ 55 ఏళ్ల సంస్థకు అమెరికా కాంగ్రెస్ రికార్డ్‌లో అధికారిక గుర్తింపు ఉంది. భారత దేశ ప్రవాసి భారతీయ సమ్మాన్ అవార్డుతో పాటు రెండు గిన్నిస్ వరల్డ్ రికార్డులు సాధించింది. అనేక గౌరవాలను అందుకుంది. -
యూకే హౌస్ ఆఫ్ లార్డ్స్ సభ్యుడిగా తెలంగాణ వాసి..!
బ్రిటన్‌లో మన తెలంగాణ (Telangana) వాసికి అరుదైన గౌరవం దక్కింది. తాజాగా యునైటెడ్ కింగ్డమ్ హౌస్ ఆఫ్ లార్డ్స్ (House of Lords)కు సిద్దిపేట జిల్లా కోహెడ మండల పరిధిలోని శనిగరం (Shanigaram) గ్రామానికి చెందిన ఉదయ్ నాగరాజు (Uday Nagaraju) నామినేట్ అయ్యారు. హౌస్ ఆఫ్ లార్డ్స్‌కు సభ్యులను ప్రధాన మంత్రి సలహా మేరకు కింగ్ ఆఫ్ ఇంగ్లండ్ నామినేట్ చేస్తారు. ఇందుకు రాజకీయ పార్టీలు, స్వతంత్ర కమిటీ, ప్రజల నుంచి కూడా నామినేషన్లు వస్తాయి. ప్రధానంగా నైపుణ్యం, అనుభవం, దేశానికి సేవ ఆధారంగా హౌస్ ఆఫ్ లార్డ్స్‌కు ఎంపిక చేస్తారు. ఈ పదవికి భారతీయ సంతతికి చెందిన వారిని కూడా నామినేట్ చేస్తారు. బ్రిటన్ హౌస్ ఆఫ్ లార్డ్స్ అనేది బ్రిటిష్ పార్లమెంట్ ఎగువ సభ. ఇది చట్టాలను రూపొందించడం, ప్రభుత్వాన్ని పర్యవేక్షించడం, ముఖ్యమైన అంశాలపై చర్చించడం వంటి ప్రధాన విధులను నిర్వర్తిస్తుంది. కాగా, గతంలో నాగరాజు బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల బరిలో నార్త్ బెడ్ ఫోర్డ్ షైర్ (North Bedfordshire) నుంచి లేబర్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన విషయం తెలిసిందే. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శనిగరం గ్రామానికి చెందిన ఒక సామాన్య మధ్య తరగతి కుటుంబంలో ఉదయ్ నాగరాజు జన్మించారు. శనిగరం గ్రామానికి చెందిన నాగరాజు హనుమంత రావు నిర్మలాదేవి దంపతుల కుమారుడు. చిన్నప్పటి నుంచి కష్టపడేతత్వం కలిగిన ఉదయ్ అంచెలంచాలుగా ఎదిగారు. ఆయన విద్యాభ్యాసం అంతా వరంగల్, హైదరాబాద్‌నే పూర్తయింది. ఆ తర్వాత బ్రిటన్‌లోని ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ లండన్ లో పాలనా శాస్త్రంలో పీజీ చేశారు.ప్రపంచ సమాజం, భావితరాలపై ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ పభ్రావం ముందుగానే పసిగట్టి ఏఐ పాలసీ లాబ్స్ అనే థింక్-ట్యాంక్ ని నెలకొల్పారు. అంతర్జాతీయ వక్తగా, రచయితగా మంచి పేరు సంపాదించారు. క్షేత్రస్థాయి సమస్యలపైన ఉదయ్ కు మంచిపట్టు ఉంది.(చదవండి: శంకరనేత్రాలయ ఆధ్వర్యంలో అట్లాంటాలో భూరినిధుల సేకరణ) -
శంకరనేత్రాలయ ఆధ్వర్యంలో అట్లాంటాలో భూరినిధుల సేకరణ
జార్జియాలోని కమ్మింగ్‌లోని వెస్ట్ ఫోర్సిత్ హై స్కూల్, శంకర నేత్రాలయ USA సంవత్సరాంతపు మ్యూజిక్ &డ్యాన్స్ ఫర్ విజన్ గ్రాండ్ ఫినాలే కార్యక్రమాన్ని నిర్వహించడంతో సంస్కృతి, కరుణ యొక్క శక్తివంతమైన వేదికగా రూపాంతరం చెందింది. ఇది గ్రామీణ భారతదేశంలో కంటి సంరక్షణను గరిష్టంగా విస్తరించడానికి మొబైల్ ఐ సర్జికల్ యూనిట్ (MESU) చొరవ విస్తరణకు మద్దతు ఇచ్చే దాతృత్వ వేడుక. ఈ కార్యక్రమం సాయంత్రం 4:00 గంటలకు ప్రారంభమైంది. గ్రామీణ భారతదేశంలో అంధత్వాన్ని నిర్మూలించే లక్ష్యంతో స కళ,సేవ శక్తిని ప్రదర్శించింది. శంకర నేత్రాలయ USA అధ్యక్షుడు బాల రెడ్డి ఇందుర్తి ఇలా నొక్కిచెప్పారు. “వైద్య మిషన్‌కు మించి, MESU సానుభూతి ఉద్యమంగా నిలుస్తుంది. ప్రయాణించిన ప్రతి మైలు దృష్టి, ఆశ పునరుద్ధరించబడుతుందనే హామీని అందిస్తుంది. ”అట్లాంటాలోని భారత కాన్సుల్ జనరల్ రమేష్ బాబు లక్ష్మణన్ ముఖ్య అతిథిగా హాజరై SNUSA బృందం, దాతలు, స్వచ్ఛంద సేవకులను ప్రశంసించారు. "నివారించగల అంధత్వాన్ని తొలగించే లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లడంలో SNUSA నా అంచనాలను మించిపోయింది. బాల రెడ్డి ఇందూర్తి నాయకత్వాన్ని నేను అభినందిస్తున్నాను" అని ఆయన అన్నారు. ప్రసాద్ రెడ్డి కాటంరెడ్డి, శంకర్ సుబ్రమోనియన్, డాక్టర్ జగదీష్ శేత్, డాక్టర్ కిషోర్ చివుకుల, ఉదయ భాస్కర్ గంటి వంటి బ్రాండ్ అంబాసిడర్లు, సలహాదారుల బోర్డు సహకారాన్ని కూడా ఆయన గుర్తించారు. సన్మాన కార్యక్రమంలో, గౌరవ భారత కాన్సుల్ జనరల్ రమేష్ బాబును శంకర నేత్రాలయ USA గౌరవ బోర్డు సలహాదారుగా అధ్యక్షులు బాలా రెడ్డి ఇందుర్తి ప్రకటించారు.ఆత్మ వెలుగుతో కలిసిన వేళ: ప్రసాద్ రెడ్డి కాటంరెడ్డి దాతృత్వం, నాయకత్వం మా లక్ష్యాన్ని గణనీయంగా బలోపేతం చేశాయి. 2025 వ్యవస్థాపకుడు సౌత్‌వెస్ట్ అవార్డు ఫైనలిస్ట్ ట్విస్టెడ్ ఎక్స్ గ్లోబల్ బ్రాండ్స్ వెనుక చోదక శక్తిలా ఆవిష్కరణ, స్థిరత్వం, కరుణను కలిగి ఉన్నారు. సత్కార సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “దృష్టి అంటే భవిష్యత్తును చూడటం మాత్రమే కాదు—అది దానిని రూపొందిస్తోంది. ఆవిష్కరణ, కరుణ కలిసి పురోగమించాలి. ఈ లక్ష్యాన్ని సాధించడం నాకు గర్వకారణం. ” ఘంటసాల బయోపిక్ “ఘంటసాల ది గ్రేట్” సృష్టికర్త దర్శకుడు సిహెచ్. రామారావు గారు, ఘంటసాలకు అసాధారణ నివాళి అర్పించినందుకు వేదికపై సత్కరించారు. మరుసటి రోజు, ఈ చిత్రాన్ని అట్లాంటాలోని హిందూ దేవాలయం ఆడిటోరియంలో, లార్డ్ బాలాజీ గర్భగుడి క్రింద ప్రదర్శించారు.తపన స్వరాన్ని కలిసిన చోటు: ఈ సాయంత్రం కార్యక్రమం టాలీవుడ్ గాయకులు మల్లికార్జున్, పార్థు నేమాని, సుమంగళిల హృదయపూర్వక సంగీత ఆవాహనతో ప్రారంభమైంది. వారి భక్తి, శాస్త్రీయ ప్రదర్శనలు ప్రేక్షకులను ఉత్సాహపరిచాయి. దీని తరువాత నటరాజ నాట్యాంజలి కూచిపూడి నృత్య అకాడమీ, అకాడమీ ఆఫ్ క్లాసికల్ మ్యూజిక్, కర్నాటిక్ స్ట్రింగ్స్ వయోలిన్ స్టూడియో, భరతకళా నాట్య అకాడమీ, విపంచి మ్యూజిక్ అకాడమీ వంటి ప్రముఖ అట్లాంటా నృత్య, సంగీత అకాడమీల నుంచి ఉత్సాహభరితమైన ప్రదర్శనలు జరిగాయి. గార్డియన్స్ ఆఫ్ సైట్: $1.625 మిలియన్లను సేకరించడం ద్వారా మన అడాప్ట్-ఎ-విలేజ్ స్పాన్సర్ల స్ఫూర్తిని గుర్తించారు. మ్యూజిక్ &డ్యాన్స్ ఫర్ విజన్ గ్రాండ్ ఫినాలే కార్యక్రమం అద్భుతమైన విజయాన్ని సాధించింది, 130 MESU అడాప్ట్-ఎ-విలేజ్ స్పాన్సర్లు, అనేక మంది కరుణామయ వ్యక్తిగత దాతల నిరంతర మద్దతు ద్వారా దాదాపు $1.625 మిలియన్ల కీలకమైన నిధులను సమీకరించింది. శ్రేయోభిలాషులు, డా. గోవింద విశ్వేశ్వర, డా. వలియా రవి, టి.ఆర్. రెడ్డి, ప్రకాష్ బేడపూడి, కాష్ బూటాని, అరవింద్ కృష్ణస్వామి, డా. వీణా భట్, జలంధర్ రెడ్డి, రఘు సుంకి, తిరుమల్ రెడ్డి కంభం,MESU అడాప్ట్-ఎ-విలేజ్ స్పాన్సర్లు, డాక్టర్. బి. కృష్ణమోహన్, డా. మాధవ్ దర్భా మరియు డా. అపర్ణ, వెంకట్ చుండి, కళ్యాణి, ప్రసన్న కుమార్,దివంగత డాక్టర్ ఉమ, ప్రభాకర్ రెడ్డి ఎరగం, నీలం జయంత్ -లావణ్య, ఆది మొర్రెడ్డి-రేఖ రెడ్డి, డాక్టర్ మంజుల మంగిపూడి, డాక్టర్ రూపేష్ రెడ్డి-మాధవి, వెంకట్ కన్నన్, డాక్టర్ ప్రసాద్ గరిమెళ్ల, అనిల్ జాగర్లమూడి, ప్యాడీ రావు -రాధ ఆత్మూరి, స్వర్ణిమ్ కాంత్, కోదండ బిందు, నారాయణ రేకపల్లి -శైలజ,డాక్టర్ ప్రియా కొర్రపాటి, ప్రతాప్ జక్కా, రాజేష్ తడికమల్ల, డాక్టర్ సుజాత &సూరి గున్నాల, డాక్టర్ శేషకుమారి మూర్తి -డాక్టర్ శ్రీనివాస మూర్తి, శివాని నాగ్‌పాల్, డా. సందీప్ శాండిల్య, డాక్టర్ నీతా సుక్తాంకర్ -విష్ ఈమని, వర ఆకెళ్ల, కృష్ణ-శుభా, శ్రీని SV, జోనాథన్ షులర్, డాక్టర్ రఘువీర్ రెడ్డి, మరియు పురప్రముఖులు రవి కందిమల్ల, అమర్ దుగ్గసాని, జేసీ శేకర్ రెడ్డి గార్లకు కృతజ్ఞతలు. ఈ అద్భుతమైన $1.625 మిలియన్ల దాతృత్వం సుమారు 130 MESU అడాప్ట్-ఎ-విలేజ్ కంటి శిబిరాలకు ఉపయోగపడింది. సేకరించిన నిధుల ద్వారా శంకర నేత్రాలయ మొబైల్ ఐ సర్జికల్ యూనిట్లు (MESUలు) మారుమూల ప్రాంతాలకు చేరుకోవడానికి, వేలాది మందికి దృష్టిని ప్రసాదించడానికి వీలు కల్పిస్తుంది. ఈ దాతలు సేవలు అందని ప్రాంతాలలో వందలాది ఉచిత శస్త్రచికిత్సలకు నిధులు సమకూరుస్తున్నారు. అధ్యక్షుడు బాల రెడ్డి ఇందుర్తి మాట్లాడుతూ, “ప్రతి అడాప్ట్-ఎ-విలేజ్ స్పాన్సర్ ఆశ, కరుణ, అవకాశాన్ని తెస్తాడు, గ్రామాలను దృష్టి ఆశతో ప్రకాశింపజేస్తాడు. శంకర నేత్రాలయ USA తరపున, నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.సృజనాత్మకత కరుణను స్వీకరించే చోట: సాయంత్రం శంకర నేత్రాలయ USA మిషన్‌కు మద్దతునిస్తూ సాంస్కృతిక కార్యక్రమానికి ప్రాణం పోసిన నృత్య ఉపాధ్యాయులు, గాయకులు, ప్రదర్శనకారులను సత్కరించారు. తెరవెనుక, SNUSA అట్లాంటా బృందం అవిశ్రాంతంగా పనిచేసింది. శంకర నేత్రాలయ కోశాధికారి మూర్తి రేకపల్లి, ట్రస్టీలు శ్రీని రెడ్డి వంగిమల్ల, మెహర్ చంద్ లంక, రాజశేఖర్ రెడ్డి ఐల, డాక్టర్ మాధురి నంబూరి, ఉపేంద్ర రాచుపల్లి, చాప్టర్ వైస్ ప్రెసిడెంట్ వెంకీ నీలం, కమిటీ సమన్వయకర్తలు నీలిమ గడ్డమణుగు, రమేష్ చాపరాల, డా. కిషోర్ రెడ్డి రాసమల్లు, గిరి కోటగిరి, చాప్టర్ లీడ్స్ వెంకట్ కుట్టువా, శిల్పా ఉప్పులూరి, డాక్టర్ జనార్దన్ పన్నెల, బిజుదాస్, రామరాజు గాదిరాజు, కార్యక్రమ వ్యాఖ్యాత వసంత చివుకుల గార్లకు కృతజ్ఞతలు. అమెరికా వివిధ నగరాల నుంచి విచ్చేసిన SNUSA అతిథులు శ్యామ్ అప్పాలి, వంశీ కృష్ణ ఏరువరం, డాక్టర్ రెడ్డి ఊరిమిండి, నారాయణరెడ్డి ఇందుర్తి, డా. శ్వేతా త్రిపాఠి, చంద్ర మౌళి సరస్వతి, శ్రీని గుప్తా, శశాంక్ రెడ్డి ఆరమడక, బుచ్చిరెడ్డి గోలి, తిరుమల్ మునుకుంట్ల, జగదీశ్ జొన్నాడ, వెంకట్రామిరెడ్డి మద్దూరి గార్లకు హృదయపూర్వక కృతజ్ఞతలు.ఇది సాధ్యం చేసిన హృదయాలకు, చేతులకు నివాళిలాజిస్టిక్స్ నిర్వహణకు కోశాధికారి మూర్తి రేకపల్లికి; వేదిక, అలంకరణలు, ప్రదర్శనకారులను సమన్వయం చేసినందుకు సాంస్కృతిక చైర్ నీలిమా గడ్డమణుగుకు; భోజన ఏర్పాట్లను పర్యవేక్షించిన చాప్టర్ వైస్ ప్రెసిడెంట్ వెంకీ నీలంకు; హోటల్, రవాణా ఏర్పాట్లను నిర్వహించినందుకు ట్రస్టీ మెహర్ లంకకు ప్రత్యేక ధన్యవాదాలు. టీవీ వీడియోలను రూపొందించిన EVP శ్యామ్ అప్పాలి, ప్రెస్ నోట్స్ సిద్ధం చేసిన డా. రెడ్డి ఊరిమిండి, సోషల్ మీడియా ప్రమోషన్‌ను నిర్వహించిన వంశీ కృష్ణ ఏరువరం, రత్నకుమార్ కవుటూరు, గోవర్ధన్ రావు నిడిగంటి గార్లకు కృతజ్ఞతలు. అతిథులు ఆచిస్ రెస్టారెంట్ నుంచి ఆహారాన్ని ఆస్వాదించారు. ఈవెంట్ ఫ్లైయర్లను రూపొందించినందుకు చెన్నై బృందం - త్యాగరాజన్, దీన్ దయాళన్ అండ్ సురేష్ కుమార్‌కు ప్రత్యేక ధన్యవాదాలు. (చదవండి: డిసెంబర్ 9 నుంచి 'టీటీఏ సేవాడేస్ 2025' ప్రారంభం) -
డిసెంబర్ 9 నుంచి 'టీటీఏ సేవాడేస్ 2025' ప్రారంభం
తెలుగు కళల తోట.. తెలంగాణ సేవల కోట.. అంటూ తెలంగాణ ప్రజల సంస్కృతి, సంప్రదాయాలను అమెరికాలో ఘనంగా నిలబెడుతున్న 'తెలంగాణ అమెరికా తెలుగు సంఘం' (TTA) తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ స్థాయిలో “సేవాడేస్ 2025” కార్యక్రమాలను ప్రారంభిస్తోంది. ఈ TTA సేవాడేస్ 2025 డిసెంబర్ 9 నుంచి డిసెంబర్ 23 వరకు తెలంగాణ జిల్లాల్లో నిర్వహిస్తారు. డిసెంబర్ 14న గచ్చిబౌలిలో “10K రన్”తో డ్రగ్స్‌పై భారీ స్థాయిలో అవగాహన కార్యక్రమం నిర్వహిస్తారు. డిసెంబర్ 25న TTA 10వ వార్షికోత్సవ వేడుకలు జరుపుతారు. ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీటీఏ నాయకులు 'టీటీఏ సేవాడేస్ 2025' ప్రకటించి, కార్యక్రమాల వివరాలు తెలిపారు.TTA ఏటా నిర్వహించే ఈ సేవాడేస్‌లో భాగంగా ఆరోగ్యం, విద్య, సమాజ అభివృద్ధి, యువత అవగాహనా కార్యక్రమాలు, మాదకద్రవ్యాల నివారణపై చైతన్యం, రక్తదానం, ఆహార పంపిణీ, గిరిజన ప్రాంతాలకు మద్దతు.. వంటి 40కి పైగా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తారు. TTA సేవాడేస్‌లో భాగంగా సేవ కార్యక్రమాలను తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, వరంగల్, హన్మకొండ, భూపాలపల్లి, మహబూబాబాద్, ఖమ్మం, సూర్యాపేట, జనగామ, నల్లగొండ, యాదాద్రితో పాటు మరిన్ని జిల్లాల్లో నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాలను TTA నాయకత్వ బృందం రూపొందించింది. TTA ఫౌండర్ పైల మల్లారెడ్డి, ప్రెసిడెంట్ నవీన్ మల్లిపెద్ది, ఏసీ-చైర్ విజయపాల్ రెడ్డి, ఏసీ కో చైర్ మోహన్ రెడ్డి పటలోళ్ల,సేవాడేస్ సలహాదారు డా. ద్వారకానాథ్ రెడ్డి, TTA కన్వెన్షన్ 2026 చైర్ ప్రవీణ్ చింతా, 10వ వార్షికోత్సవ చైర్ DLN రెడ్డి, జాయింట్ ట్రెజరర్ స్వాతి చెన్నూరి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ - ఇంటర్నేషనల్ సర్వీసెస్ డైరెక్టర్ జ్యోతి రెడ్డి దూదిపాల, EX BOD రమా కుమారి వనమా, అంతర్జాతీయ VP నర్సింహ పెరుక, సేవాడేస్ కోఆర్డినేటర్ విశ్వ కంది, 10వ వార్షికోత్సవ వేడుక కల్చరల్ చైర్ డా. వాణి గడ్డం.. అమెరికా నుంచి TTA నాయకత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులు, వాలంటీర్లు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు.TTA 10వ వార్షికోత్సవం2025 డిసెంబర్ 25న TTA తన 10వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించబోతోంది. గడిచిన దశాబ్ద కాలంలో TTA చేసిన సేవా కార్యక్రమాలు, సామాజిక సేవ, తెలంగాణతో ఉన్న అనుబంధం వంటి అంశాలు ఈ వేడుకలో ప్రధానంగా చోటు చేసుకుంటాయి. పదేళ్లుగా తెలంగాణతో తమ బంధం మరింత బలపడుతోందని టీటీఏ నాయకులు తెలిపారు.“10K రన్”తో డ్రగ్స్‌పై అవగాహనటీటీఏ సేవాడేస్ 2025లో భాగంగా డిసెంబర్ 14న గచ్చిబౌలిలో Say No To Drugs సందేశంతో “10K రన్” నిర్వహించబోతున్నారు. ఈ ఏడాది సేవాడేస్ ప్రధాన థీమ్ “Say No To Drugs” అని టీటీఏ నాయకులు తెలిపారు. ఈ రన్లో విద్యార్థులు, యువత, స్పోర్ట్స్ కమ్యూనిటీ, వాలంటీర్లు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారు. ఫిట్నెస్ను ప్రోత్సహించడంతో పాటు డ్రగ్స్ అవగాహన కోసం సమాజానికి బలమైన సందేశం ఇవ్వడం ఈ కార్యక్రమం లక్ష్యమని, యువత భవిష్యత్తును కాపాడేందుకు ఇటువంటి కార్యక్రమాలు కీలకమని TTA నాయకత్వం తెలిపింది. 2014లో అమెరికాలో స్థాపించిన TTA సంస్థ విద్య, ఆరోగ్యం, సామాజిక సేవ రంగాల్లో వేలాది మందికి సేవలు అందిస్తూ అమెరికాలో ఉన్న అతిపెద్ద తెలంగాణ సంఘాలలో ఒకటిగా నిలిచింది. (చదవండి: యూకేలో ప్రోస్టేట్ కాన్సర్పై అవగాహన) -
జేడీవాన్స్‌కు యూజర్ చురక.. నెట్టింట రచ్చ
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌కు ఒక అమెరికన్ మాస్టర్ స్ట్రోక్ ఇచ్చారు. అమెరికా పాత వలస విధానం ఆ దేశ ఆశలను హరిస్తుందని అమెరికన్ల అవకాశాలను వలస కార్మికులు కొట్టేస్తున్నారని వాన్స్ ఎక్స్ ఖాతాలో ఓ పోస్ట్ చేశారు. దీనికి రిప్లై ఇచ్చిన ఓ అమెరికన్ నీభార్య పిల్లలు కూడా అమెరికన్లు కాదు వారు కూడా అమెరికన్ల అవకాశాలు దొచుకెళ్తున్నారు అని కౌంటరిచ్చారు. పాటు మరికొందరూ ఆయనకు వ్యతిరేకంగా పోస్టులు చేశారు.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వలస కార్మికులపై గుర్రుగా ఉన్నారు. విదేశీ కార్మికులు అమెరికన్ల అవకాశాలను లాగేస్తున్నారని వారిని దేశంలోకి రాకుండా నియంత్రించాలనడంతో పాటు ఇమిగ్రేషన్ పాలసీ కఠినతరం చేశారు. అంతేకాకుండా విదేశీయులకు వ్యతిరేకంగా పలు రకాల చర్యలు చేపట్టారు. తాజాగా ఆ దేశ ఉపాధ్యక్షుడు సైతం అదే జాబితాలో చేరారు. అమెరికన్ల అవకాశాలను విదేశీయులు దొచుకెళుతున్నారంటూ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు."అమెరికా పాత మైగ్రేషన్ విధానం అమెరికా కలలను దొంగిలించింది. దానివల్ల దేశస్థులకు ఉద్యోగాలు లేకుండా పోయాయి. అమెరికన్లు నుంచి వారు ఉద్యోగాలు దొంగిలించి వారు ధనవంతులయ్యారు" అని ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ పోస్టుకు కౌంటర్ గా చాలా మంది రీపోస్టులు చేశారు. "మీ కుటుంబం విదేశీయులు కాదా అది వలస కుటుంబం కాదా" అని ఒకరు అన్నారు. "మీ భార్య,పిల్లలు కూడా అమెరికన్ల ఉద్యోగాలను లాక్కుంటున్నారు" అని మరో యూజర్ పోస్ట్ చేశారు. "మీఅత్తమామలు ద్వేషిస్తున్నావు" అని ఒక యూజర్ వ్యంగ్యంగా రీపోస్ట్ చేశారు. ఇలా అమెరికా ఉపాధ్యక్షుడు సోషల్ మీడియాలో ట్రోలయ్యారు.అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ 2014లో భారత సంతతికి చెందిన ఉషా చిలుకూరిని వివాహం చేసుకున్నారు. వారికి ముగ్గురు పిల్లలు కాగా వారి కుమారుడికి వివేక్ అని నామకరణం చేశారు. ఉషా వాన్స్ వృత్తి రీత్యా లాయర్. -
ఎప్పటికీ భారతీయుడిగానే ఉంటా : ఎన్ఆర్ఐ పోస్ట్ వైరల్
జర్మనీలో నివసిస్తున్న ఒక భారతీయ వ్యవస్థాపకుడు ,పరిశోధకుడు, మయూఖ్ పంజా దాదాపు దశాబ్ద కాలంగా విదేశాల్లో ఇక్కడి పౌరసత్వాన్ని తీసుకునేందుకు నిరాకరించాడు. తన భారతీయ పాస్‌పోర్ట్‌ను వదులుకోవడానికి సిద్ధంగా లేనని ప్రకటించాడు. తాను ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో కూడా వివరించాడు. దీంతో ఇది నెట్టింట సందడిగా మారింది.మయూఖ్ సోషల్ మీడియా పోస్ట్ ప్రకారం తొమ్మిది సంవత్సరాలకు పైగా జర్మనీలో నివసిస్తున్న అతనికి గత ఏడాది పౌరసత్వానికి అర్హత సాధించాడు. కానీ దరఖాస్తు చేయ కూడదని నిర్ణయించుకున్నాడు.తాను జర్మన్ పౌరుడిగా గాకుండా, ఎప్పటికీ భారతీయుడి గానే ఉంటాని ఆయన వివరించాడు. మయూఖ్ పంజా తొమ్మిదేళ్ల క్రితం జర్మనీ వెళ్లాడు.. డాక్టోరల్ రీసెర్చ్ కోసం వెళ్లిన మయూఖ్ అక్కడే పాపులేషన్స్ అనే ఏఐ సంస్థను స్థాపించాడు. గతేడాదే జర్మన్ పౌరసత్వం పొందేందుకు అర్హుత సాధించాడు. అయినా సిటిజన్ షిప్ కోసం దరఖాస్తు చేయలేదట. పాస్ పోర్ట్ అంటే తన దృష్టిలో కేవలం అదొక డాక్యుమెంట్ కాదని, అది వ్యక్తిత్వ గుర్తింపని చెప్పుకొచ్చాడు. భారతీయతను వదులుకోలేక పోతున్నానని వెల్లడించారు.జర్మనీ కథలు, చరిత్ర, భాష,సంస్కృతిని అర్థం చేసుకున్నాడు. వాటితో తాను మమేకం కాలేక పోతున్నానని, బెర్లిన్ వాతావరణం, సాంకేతిక శాస్త్రీయ పరిస్థితులలో తాను సుఖంగా ఉన్నప్పటికీ, అది తన సొంతఇంట్లో ఉన్నట్లు భావించడం లేదని ఆయన అన్నారు. ఫుట్‌బాల్ మ్యాచ్‌లో జర్మనీ గెలుపు లేదా ఓటమి తనకు పెద్దగా తేడాను కలిగించదని, భారతదేశం ప్రపంచ కప్ గెలిచినప్పుడు తన ఆనందమే వేరు అంటూ ఒక ఉదాహరణగా చెప్పుకొచ్చాడు. తాను జర్మనీ స్నేహితుడినే తప్ప ఆ దేశంలో భాగమని భావించే వ్యక్తిని కాదన్నాడుపంజా ప్రకారం, జర్మన్ పౌరుడిగా మారడం అంటే జర్మన్ విలువలు మరియు ఆదర్శాలతో తనను తాను సమలేఖనం చేసుకోవడం. కానీ కొత్త పౌరుడిగా, శతాబ్దాల నాటి సంస్కృతి తన ఇష్టానికి అనుగుణంగా ఉంటుందని ఆయన భావించడలేదు. పైగా భారత పౌరసత్వాన్ని కాపాడుకోవడం అనేది ఏదైనా చట్టపరమైన ప్రయోజనానికి సంబంధించిందికాదు,కానీ తన నిజమైన గుర్తింపుతో కనెక్ట్ అవ్వడానికి ఒక మార్గం అని మయూఖ్ పంజా తెలిపారు. I have been here 9 + years and I became eligible for the German passport a year back. I could have applied for citizenship a year ago, but I did not. I have thought about this a lot and I am increasingly coming to the conclusion that I can’t do this. Because I don’t feel German.… https://t.co/amUbrxgObK— Mayukh (@mayukh_panja) December 5, 2025 సోషల్ మీడియా మయూఖ్ నిర్ణయానికి సానుకూలంగా స్పందించింది. ఆయన నిర్ణయాన్ని నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. -
ఓవర్సీస్ మొబిలిటీ బిల్లులో ప్రవాసీల హక్కులు కాపాడాలి
భారతదేశం నుంచి విదేశాలకు ఉద్యోగాల కోసం వెళ్లే లక్షలాది మంది వలస కార్మికుల జీవితాలను ప్రభావితం చేసే ఓవర్సీస్ మొబిలిటీ (విదేశీ వలస) బిల్లు–2025 లో ప్రవాసీల హక్కులు రక్షించబడేలా చూడాలని, తెలంగాణ ప్రభుత్వ నియమిత ఎన్నారై అడ్వయిజరీ కమిటీ వైస్ ఛైర్మన్ మంద భీంరెడ్డి, సభ్యులు చెన్నమనేని శ్రీనివాస రావులతో కూడిన ప్రతినిధి బృందం తమ నాలుగు రోజుల ఢిల్లీ పర్యటనలో తెలంగాణకు చెందిన ఏడుగురు పార్లమెంటు సభ్యులను కలిసి వినతిపత్రాలను సమర్పించారు. భారతీయ వలస కార్మికులు విదేశాల్లో గౌరవంగా, భద్రతతో నివసించేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు.42 ఏళ్లుగా అమలులో ఉన్న ఎమిగ్రేషన్ యాక్ట్–1983 స్థానంలో భారత ప్రభుత్వం కొత్త చట్టం చేయనున్న నేపథ్యంలో... విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్థాండింగ్ కమిటీ సభ్యులు, బీజేపీ ఎంపీ డీకే అరుణ (మహబూబ్ నగర్), బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ కెఆర్ సురేష్ రెడ్డి, కాంగ్రేస్ ఎంపీలు మల్లు రవి (నాగర్ కర్నూల్), సురేష్ షెట్కార్ (జహీరాబాద్), డా. కడియం కావ్య (వరంగల్), గడ్డం వంశీక్రిష్ణ (పెద్దపల్లి), చామల కిరణ్ కుమార్ రెడ్డి (భువనగిరి), మాజీ ఎంపీ మధు యాష్కీలతో వారు చర్చించారు. 2021 ముసాయిదాలో ప్రవాసీ కార్మికులకు ప్రతిపాదించిన అనేక రక్షణలు కొత్త బిల్లులో లేవు. అధికారాలు కేంద్రీకృతమవడం ద్వారా దోపిడీ ప్రమాదం పెరుగుతుందని భీంరెడ్డి, శ్రీనివాస రావులు ఎంపీలకు వివరించారు.ప్రవాసుల హక్కులు బలహీనం కావద్దుబాధిత ప్రవాసీ కార్మికులు నేరుగా కోర్టులను ఆశ్రయించే హక్కు తొలగింపు.. మహిళలు, పిల్లల రక్షణలను ‘సున్నిత వర్గాలు’ అనే అస్పష్ట వర్గంలో విలీనం. రిక్రూట్మెంట్ ఏజెన్సీలు వసూలు చేసే ఫీజుల వివరాల వెల్లడి నిబంధన రద్దు వలన రుణ బానిసత్వానికి దారి తీస్తుంది. విదేశాలకు పంపిన అనంతరం కార్మికులపై ఏజెన్సీల బాధ్యత లేకపోవడం, విదేశాల నుంచి తిరిగివచ్చిన వారికి పునరేకీకరణ నిబంధనలు బలహీనపడ్డాయి. 182 రోజుల (ఆరు నెలల) లోపు విదేశాల నుండి వాపస్ పంపబడ్డ (డిపోర్ట్) అయిన వారిని ‘రిటర్నీలు’గా పరిగణించకపోవడం లాంటి విషయాలను భారత ప్రభుత్వ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దృష్టికి తీసికెళ్లాలని వారు కోరారు.‘ఎమిగ్రంట్’, ‘ఓవర్సీస్ ఎంప్లాయ్మెంట్’, ‘లేబర్’ వంటి పదాల నిర్వచనాల్లో విద్యార్థులు, ఆధారితులు, డిజిటల్ కార్మికులు వంటి వర్గాల వెలివేత. ‘మానవ అక్రమ రవాణా’ (హ్యూమన్ ట్రాఫికింగ్) కు స్పష్టమైన నిర్వచనం లేకపోవడం. కేంద్రీకృత పాలన – రాష్ట్రాలకు, కార్మిక సంఘాలకు చోటు లేదు. ప్రతిపాదిత 'ఓవర్సీస్ మొబిలిటీ & వెల్ఫేర్ కౌన్సిల్' లో వలస కార్మికులను విదేశాలకు పంపే రాష్ట్రాలు, కార్మిక సంఘాలు, హక్కుల సంస్థలకు ప్రాతినిధ్యం లేదు. రాష్ట్ర స్థాయి నోడల్ కమిటీలు తొలగించబడటం వల్ల స్థానిక సమస్యల పరిష్కారానికి ఆటంకం ఏర్పడుతుందని మంద భీంరెడ్డి, చెన్నమనేని శ్రీనివాస రావులు ఆందోళన వ్యక్తం చేశారు.డిమాండ్లుబిల్లుపై లోతుగా అధ్యయనం చేయాలిఎమిగ్రేషన్ చెక్ పోస్టులు రద్దు అయినప్పటికీ ప్రత్యామ్నాయ నియంత్రణ వ్యవస్థ లేదు.ప్రయాణానికి ముందు శిక్షణ, విదేశాల్లో సహాయక సేవల ప్రమాణాలు స్పష్టంగా లేవు.ఇంటిగ్రేటెడ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ — హక్కుల కంటే పర్యవేక్షణపైనే దృష్టి.24/7 హెల్ప్లైన్లు, విమానాశ్రయ–ఎంబసీ సహాయం తప్పనిసరి కాదని ముసాయిదా చెబుతోంది.శిక్షలు కేవలం రిక్రూట్మెంట్ ఏజెంట్లపైనే; విదేశీ యాజమాన్యాలపై చర్యలు లేవు.ట్రాఫికింగ్, చట్ట విరుద్ధ ఆన్లైన్ రిక్రూట్మెంట్పై ప్రత్యేక నిబంధనలు లేకపోవడం.విధించే జరిమానాల్లో బాధితులకు పరిహారం కేటాయింపు లేదు. -
'నైటా' కొత్త అధ్యక్షుడిగా రవీందర్ కోడెల
ప్రపంచ వాణిజ్య రాజధాని న్యూయార్క్‌లో నివసిస్తున్న తెలుగువారు ఏర్పాటు చేసుకున్న సంస్థ న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం (నైటా). రానున్న ఏడాది (2026) కోసం కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. నైటా కొత్త అధ్యక్షుడుగా ప్రముఖ ఫార్మసిస్ట్ రవీందర్ కోడెల ఎంపికయ్యారు. ఏడాది పాటు ఆయన న్యూయార్క్ తెలంగాణ తెలుగు అసోసియేషన్ కు నాయకత్వం వహించనున్నారు.అమెరికా ప్రధాన నగరమైన న్యూయార్క్ లో వేల సంఖ్యలో తెలుగు, తెలంగాణ ఎన్నారైలు కుటుంబాలతో సహా స్థిరపడ్డారు. వీరందరూ వివిధ వృత్తుల్లో పనిచేస్తూ ఒక సామాజిక సమూహంగా కలిసి ఉండేందుకు నైటాను ఆరేళ్లకిందట ఏర్పాటుచేసుకున్నారు. ఇప్పటివరకూ ఆరు సార్లు ఏర్పాటైన కార్యవర్గాలు తమ ప్రాంత సంస్కృతి, సంప్రదాయాలను పాటించటంతో పాటు, అమెరికాలోనే పుట్టిపెరిగిన తమ పిల్లలకు తెలుగు, తెలంగాణ పండగల ప్రాధాన్యత తెలిసేలా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అలాగే అమెరికా సమాజంలో భాగమై వివిధ స్వచ్ఛంద సంస్థల ద్వారా ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. సంప్రదాయాన్ని కొనసాగిస్తూ రానున్న ఏడాదిలో కొత్త కార్యవర్గం సహకారంతో సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తామని నూతన అధ్యక్షుడు రవీందర్ కోడెల (Ravinder Kodela) వెల్లడించారు. ఇటీవల మరణించిన ప్రజాకవి అందెశ్రీకి నైటా సభ్యులు సంతాపం ప్రకటించారు. వాణి అనుగు నేతృత్వంలోని తాజా మాజీ కార్యవర్గానికి వీడ్కోలు విందును ఏర్పాటుచేశారు.కార్యక్రమంలో న్యూయార్క్ అసెంబ్లీ సభ్యురాలు జెన్నిఫర్ రాజ్ కుమార్, ప్రముఖ ఎన్నారై పైళ్ల మల్లారెడ్డి, ఇతర కార్యవర్గ సభ్యులు, నైటా (NYTTA) సభ్యులు కుటుంబాలతో సహా పాల్గొన్నారు.రవీందర్ కోడెల ప్రస్థానంఉమ్మడి వరంగల్ జిల్లా, ప్రస్తుత జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చిట్యాల మండలం వాస్తవ్యులు. బాల్యం నుంచి పదవ తరగతిదాకా అక్కడే గడిచింది. ఆతర్వాత హన్మకొండలో ఇంటర్, డిగ్రీ, కాకతీయ యూనివర్సిటీలో ఆర్గానిక్ కెమిస్ట్రీలో మాస్టర్స్ చదివారు. ఆ తర్వాత ఫెలోషిప్ (CSIR)తో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో పీహెచ్డీ చేశారు. చదవండి: ఎన్ని కష్టాలున్నా ఇల్లు ఇల్లే.. వచ్చేస్తున్నా!తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలోనూ వివిధ వేదికల ద్వారా తన వంతు పాత్ర పోషించారు. ఆ తర్వాత డాక్టర్ రెడ్డీస్ తో పాటు పలు ప్రముఖ సంస్థల్లో పనిచేస్తూ అమెరికా వెళ్లి అక్కడే న్యూయార్క్‌లో స్థిరపడ్డారు. సిటీ కాలేజీ ఆఫ్ న్యూయార్క్ (మెడికల్ స్కూల్)తో పాటు సౌత్ వెస్ట్రర్న్ మెడికల్ సెంటర్లలో ప్రముఖ ఫార్మాసిస్టుగా క్యాన్సర్ నివారణ ఔషధాల తయారీలో గుర్తింపు పొందారు. -
అమెరికాలో అగ్ని ప్రమాదం.. ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
అమెరికా బర్మింగ్‌హామ్‌లో విషాదం చోటు చేసుకుంది. తెలుగు విద్యార్థులు నివసిస్తున్న ఓ అపార్ట్ మెంట్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు తెలుగు విద్యార్థులు దుర్మరణం చెందారు. మరణించిన వారిలో మేడ్చల్ జిల్లా పోచారానికి చెందిన ఉడుముల సహజ రెడ్డి, కూకట్‌పల్లికి చెందిన మరొక విద్యార్థి ఉన్నారు. మృతులిద్దరూ హైదరాబాద్ వాసులు. కాగా అగ్నిప్రమాదం జరిగిన అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లో పదిమంది తెలుగు విద్యార్థులు నివసిస్తున్నారు. హఠాత్తుగా చెలరేగిన మంటలకు అందులో చిక్కుకున్న విద్యార్థులు ఉక్కిరి బిక్కిరయ్యారు. విద్యార్థులు శ్వాస తీసుకోలేక పెద్దగా కేకలు పెట్టారు. దీంతో వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది వారిని రక్షించారు. తీవ్ర గాయాలైన విద్యార్థులను ఆసుపత్రికి తీసుకెళ్లాగా అక్కడ చికిత్స పొందుతూ ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. వీరంతా అక్కడి అలబామా యూనివర్సిటీలో విద్యనభ్యసిస్తున్నారు. -
నా వల్ల కాదు బ్రో..ఎన్ని కష్టాలున్నా ఇల్లు ఇల్లే, వచ్చేస్తున్నా!
మంచి ఉద్యోగం, మెరుగైన జీతం, సౌకర్యవంతమైన జీవితం, కెరీర్లో అవకాశాలు వీటికోసం కలలు కంటూ చాలామంది భారతీయులు విమానాల్లో విదేశాలకు ఎగిరిపోతున్నారు. కానీ కనిపెంచిన తల్లిదండ్రులను కన్నతల్లి లాంటి ఊరినీ, వదిలి ఉండటం అంత సులువు కాదు. దేశం కాని దేశం, మన భాషకాదు..మన తిండి కాదు, మన జాన్ జిగిరీ దోస్తులు ఆసలే లేని చోట ఉండటం చాలా వేదనతో కూడుకున్నదే. ఏ దేశమేగినా, ఎందుకాలిడినా అన్నట్టు ఒక పక్క ఒంటరితనం, మరోపక్క ఇంటి బెంగతో ఒక్కోసారి ఊపి రాడదు. ఇదీ నాన్-రెసిడెంట్ ఇండియన్ (NRI) అనుభవించే మానసిక బాధ అందుకే ఒక ఎన్ఆర్ఐ ఏం చేశాడో తెలుసా?కష్టపడి ఐదేళ్ల పాటు కెనడాలో జీవితాన్ని గడిపేసిన ఎన్ఆర్ఐ ఇక నావల్ల కాదు బాబోయ్ అంటూ ఇండియాకు తిరిగి రావాలని నిర్ణయించుకున్నాడు. స్వదేశానికి తిరిగి రావాలన్న తన నిర్ణయంపై సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు. దీంతో నెటిజన్లు అతనిపై ప్రశంసలు కురిపించారు. అయిదేళ్లు కెనడాలో ఉన్నాను.విదేశాలలో జీవితం రోబోటిక్‌గా అనిపించింది. అందుకే ఇక భరించ లేను. ఇక్కడ స్నేహితులు ఉన్నప్పటికీ, కానీ సామాజిక ఒంటరితనం బాధిస్తోంది. దాన్ని వర్ణించడం చాలా కష్టం అని పేర్కొన్న రెడ్డిట్ పోస్ట్ వైరలవుతోంది.చదవండి: అందంగా ఉన్నారని నలుగుర్ని..చివరికి కన్నకొడుకుని కూడాకెనడాలో మితిమీరిన క్రమశిక్షణ భరించడం కష్టంగా ఉంది. ప్రతీదీ పద్ధతిగా సిస్టమ్యాటిగ్గా జరగాలి. కనీసం బియ్యం కొనడానికి దుకాణానికి వెళ్లాలన్నా ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. స్వేచ్ఛను మిస్ అవుతున్నా అనిపిస్తోందన్నాడు. భారతదేశంలో వ్యవస్థీకృత గందరగోళం ఉంది. దానిని మిస్ అవుతున్నా. కానీ ఇండియాలో గడపబోయే జీవితంపై చాలా ఆసక్తిగా ఉన్నాను. ఇండియాలో మురికి, కనీస పౌర జ్ఞానం లేకపోవడం లాంటి లోపాలు ఉన్నాయి. ఏది ఏమైనా ఇది మన ఇల్లు. అందుకే ఇండియాకు తిగిరి వచ్చేస్తున్నానని పేర్కొన్నాడు.నెటిజన్లు అతని నిర్ణయాన్ని ప్రశంసించారు. మనసుకు నచ్చినట్టు జీవించాలి భయ్యా అని కొందరు, ప్రతి దేశానికి దాని సమస్యలు ఉంటాయి. ఏ దేశానికైనా దాని లాభనష్టాలు దానికి ఉంటాయి. ప్రాధాన్యతను తెలుసుకోవాలి. ఫైనల్‌గా ఎక్కడ సంతోషంగా ఉంటామో, అక్కడ ఉండటమే సరైంది అని మరికొందరు ఎంతైనా మన ఇల్లు ఇల్లే కదా భాయ్.. అనే కమెంట్లు వెల్లువెత్తాయి.ఇదీ చదవండి : ఇల్లు కట్టాలంటే రూ. 20 లక్షలు లంచం, టెకీ ఆత్మహత్య -
యూకేలో ప్రోస్టేట్ కాన్సర్పై అవగాహన
బిబిసి (బెర్క్‌షైర్ బాయ్స్ కమ్యూనిటీ) ఆధ్వర్యంలో ఇటీవల బ్రిట్‌వెల్ లైబ్రరీలో మువెంబర్ డేని ఘనంగా నిర్వహించారు. యూకె నలుమూలనుండి యువత పెద్ద ఎత్తున తరలి వచ్చి ప్రోస్టేట్ కాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రాంలో పాల్గొన్నారు . ఈ కార్యక్రము ద్వారా మగవాళ్ళ లో తరచుగా వచ్చే ప్రోస్టేట్ కాన్సర్ పైన అవగాహన కల్పించి , దాన్ని ఎలా నిర్ములించుకోవాలో సూచనలు చేసి ,చారిటీ ప్రోగ్రాం నిర్వహించామని నిర్వాహకులు తెలిపారు. ఈ ప్రోగ్రాంతో ప్రోస్టేట్ క్యాన్సర్ అవగాహన వంద మందికి పైగా పురుషులు హాజరైనారు. .ఈ ఈవెంట్లో భాగంగా మేము ప్రోస్టేట్ క్యాన్సర్ అవగాహన ఛారిటీ మొత్తానికి 809 GBP(85 K INR)** పౌండ్స్ కు పైగా సేకరించారు.. నవంబరు నెల ప్రోస్టేట్ క్యాన్సర్‌కు అంకితం చేయబడినందున తాము ప్రోస్టేట్ క్యాన్సర్ అవగాహన నడకను కూడా ప్రారంభించామని నిర్వాహకుతు తెలిపారు. ప్రతి సంవత్సరం ఇలాంటి ప్రోగ్రామ్స్ నిర్వహించి ,చారిటీ ద్వారా వచ్చిన ఆర్ధిక సహాయంతో ప్రోస్టేట్ కాన్సర్ వ్యాధితో బాధ పడుతున్న వారికి , రెండు తెలుగు రాష్ట్రాలలో, యుకెలో ఆర్ధికంగా ఆదుకుంటున్నామనీ నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. ఇలాంటి మంచి ఆలోచనతో ప్రోగ్రామ్స్ నిర్వహించడం తెలుగు వారందరికీ గర్వకారణమని పలువురు ప్రశంసించారు. ఈ ఈవెంట్ విజయానికి సహకరించిన సభ్యులు బి.బి.సి కోర్ టీం ఉన్నారు. ఈ కార్యక్రమానికి చేయూతనిచ్చిన స్పాన్సర్స్ అందరికి వినమ్ర పూర్వక అభినందనలు అని కమిటీ సభ్యులు తెలిపారు. -
బ్రిటన్‌లో భారతీయ విద్యార్థి దారుణ హత్య
న్యూఢిల్లీ: బ్రిటన్‌లో భారతీయ విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటనకు సంబంధించి ఐదుగురిని అరెస్ట్ చేసిన బ్రిటిష్ పోలీసులు.. అధికారిక ప్రకటన మాత్రం విడుదల చేయలేదు. వీలైనంత త్వరగా తమ కుమారుడి మృతదేహాన్ని దేశానికి తీసుకురావాలని అతడి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. హరియాణాలోని చర్కి దాద్రికి చెందిన విజయ్‌కుమార్ షియోరాన్(30) యూకేలో విద్యాభ్యాసం చేస్తున్నాడు. గురువారం తెల్లవారుజామున వెర్సెస్టర్లో గుర్తు తెలియని వ్యక్తులు అతడిపై కత్తులతో దాడి చేసి పారిపోయారు. స్థానికులు విజయ్ను ఆస్పత్రికి తరలించగా, పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు. ఇండియాలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్‌లో ఉద్యోగం చేసిన విజయ్ ఉన్నత విద్య కోసం ఈ ఏడాది ప్రారంభంలో యూకే వెళ్లాడు. బ్రిస్టల్‌లోని యూనివర్సిటీ ఆఫ్ ది వెస్ట్ ఆఫ్ ఇంగ్లాండ్‌లో చదువుతున్నాడు. హత్యకు కారణాలు ఇంకా తెలియరాలేదు. -
దాంపత్య బంధాన్ని దృఢం చేసే 'ఫోర్ లవ్స్' ఫార్ములా
అమెరికాలో తెలుగు వారి మేలుకోసం అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా దాంపత్య జీవితం దృఢం చేసుకునేలా వెబినార్ నిర్వహించింది. దాంపత్య జీవితాన్ని విజయవంతంగా నడిపించేందుకు, వివాహబంధాన్ని బలోపేతం చేసేందుకు అనుసరించాల్సిన కీలక మార్గాలపై నాట్స్ కాన్సస్ చాప్టర్ నుంచి వెంకట్ మంత్రి, ప్రసాద్ ఇసుకపల్లి తాజాగా 'మ్యారేజ్ మెయింటెనెన్స్ కిట్' పేరుతో ఈ వెబినార్ నిర్వహించింది. వివాహ బంధాలపై 30 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న రిలేషన్షిప్ సైకాలజీ నిపుణుడు ఛార్లెస్ రివర్స్ ఈ వెబినార్‌లో ముఖ్య వక్తగా పాల్గొన్నారు. వివాహ బంధం బలహీనపడటానికి ప్రధాన కారణాన్ని ఛార్లెస్ వెల్లడించారు. “జీవిత భాగస్వామి మీకు ప్రపంచంలోనే అత్యంత ప్రియమైన మిత్రులైతే, మీరు ఇప్పుడు వారితో వ్యవహరిస్తున్న తీరులోనే వ్యవహరించగలుగుతారా? లేదా మార్చుకోవాల్సి వస్తుందా?" అనే కీలకమైన ప్రశ్నను దంపతులు తమకు తాము వేసుకోవాలని ఆయన సూచించారు. దాంపత్యంలో పురుషులు తమ భార్యల నుండి గౌరవాన్ని ఆశిస్తే, మహిళలు తమ భర్తల నుంచి ప్రేమ, శృంగారం, సంభాషణను కోరుకుంటారని తెలిపారు. ఈ అవసరాలను గుర్తించి తీర్చడమే వైవాహిక జీవిత నిర్వహణకు ముఖ్యమని ఛార్లెస్ రివర్స్ వివరించారు. అలాగే, వాదనలు పెరిగిపోయి గొడవలకు దారితీయడానికి ప్రధాన కారణం ఒకరి మాట ఒకరు వినకపోవడమే అని, స్నేహితుల్లా వ్యవహరించడం ద్వారా వీటిని నివారించవచ్చని ఛార్లెస్ తెలిపారు. దాంపత్యంలో పిల్లల కంటే, భార్యాభర్తల బంధానికే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, అప్పుడే పిల్లలకు ప్రేమను పంచుకోవడంపై సరైన అవగాహన వస్తుందని ఆయన సలహా ఇచ్చారు. వివాహంలో అనేక సమస్యలకు మూలం, ప్రస్తుత దాంపత్యం కంటే, పరిష్కారం కాని బాల్య సమస్యలే అని వివరించారు. మనల్ని మనం మార్చుకోవడం ద్వారా మాత్రమే బంధాన్ని కాపాడుకోగలమని చార్లెస్ సూచించారు. ప్రతి కుటుంబానికి ఉపయోగపడే ఉత్తమ వెబినార్ నిర్వహించినందుకు సెయింట్ లూయిస్ చాప్టర్ సభ్యులను, నాట్స్ విభాగ నాయకులను నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి మందాడి ప్రత్యేకంగా అభినందించారు.(చదవండి: అమెరికా మోజుతో రూ.90 లక్షల ప్యాకేజీని కాలదన్నాడు! చివరికి..) -
సర్పంచ్‌గా పోటీ చేయాలని అమెరికా నుంచి వచ్చేశాడు..
చిన్నశంకరంపేట(మెదక్): అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం.. లక్షల్లో వేతనం.. అయినా గ్రామాభివృద్ధే ధ్యేయంగా సర్పంచ్ ఎన్నికల బరిలో దిగేందుకు తరలివచ్చాడు మెదక్ జిల్లా(Medak District) చిన్నశంకరంపేట మండల కేంద్రానికి చెందిన ఎన్ఆర్ఐ కంజర్ల చంద్రశేఖర్. చిన్నశంకరంపేట(Chinna Shankarampeta) సర్పంచ్‌గా తన తాత శంకరప్ప 40 ఏళ్ల పాటు పనిచేసి గ్రామాభివృద్ధిలో భాగస్వామి అయ్యారు. గ్రామంలో ఏ నోట విన్నా శంకరప్ప చేసిన అభి వృద్ధి గురించే చెప్పుకుంటారు. అదే స్ఫూర్తితో తాను సైతం గ్రామ అభివృద్ధిలో భాగస్వామి కావాలనే లక్ష్యంతో రూ.లక్షల వేతనం అందించే సాఫ్ట్వేర్ ఉద్యోగం(Software Engineer) వదిలాడు. ఆరునెలల క్రితం పంచాయతీ నోటిఫికేషన్ వెలువడుతుందనే ప్రభుత్వ ప్రకటనతో.. చంద్రశేఖర్ అమెరికా నుంచి గ్రామానికి చేరుకున్నాడు. మూడు నెలలుగా ప్రజలతో మమేకమై స్వచ్ఛంద సేవా కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నాడు. ఎవరికి ఏ అవసరం వచ్చినా, ముందు వరుసలో నిలిచి గ్రామస్తుల మన్ననలు పొందుతున్నాడు. ఈనెల 30న చిన్నశంకరంపేట సర్పంచ్ స్థానానికి నామినేషన్ వేసేందుకు సమాయత్తం అవుతున్నాడు. -
అమెరికా మోజుతో 90 లక్షల ప్యాకేజీని కాలదన్ని..
విదేశాల్లో ఉన్నత చదువు అనేది చాలామంది విద్యార్థుల డ్రీమ్. అందుకోసం ఎంతలా కష్టపడుతుంటారో తెలిసిందే. అయితే ఈ వ్యక్తి కూడా అలానే అనుకున్నాడు. కానీ అందుకోసం ఎంత పెద్ద డేరింగ్ స్టెప్ తీసుకున్నాడో తెలిస్తే షాక్ అవుతారు. పోనీ అంతలా సాహసం చేసినా.. మళ్లీ ఉద్యోగం సంపాదించడం కోసం ఎన్ని పాట్లు పడ్డాడో వింటే కన్నీళ్లు వచ్చేస్తాయి. అయితేనేం చివరికి ప్రతిష్టాత్మకమైన కంపెనీలోను ఉద్యోగం కొట్టి..తనలా చెయ్యొద్దంటూ యువతకు సూచనలిస్తున్నాడు. అతడే అభిజయ్ అరోరా. భారత్‌కి చెందిన అభిజయ్ చక్కగా స్విట్జర్లాండ్‌లో ఏడాదికి రూ. 90 లక్షల వేతనం ఇచ్చే ఉద్యోగాన్ని చేస్తున్నాడు. అయినా ఏదో అసంతృప్తితో యూఎస్‌తో చదవాలనే డ్రీమ్‌తో అంత మంచి ఉద్యోగాన్ని వదులుకునేందుకు రెడీ అయ్యాడు. విదేశాల్లో చదువుకున్న అనుభవమే గొప్పదని భావించాడు. అందులోనూ తన మేజనర్ కూడా మరిన్ని అర్హతలు లేకపోతే ప్రమోషన్లు పొందలేవని చెప్పడంతో రెండో ఆలోచన లేకుండా చేస్తున్న ఉద్యోగానికి రిజైన్ చేసేశాడు. ఆ తర్వాత గానీ అసలు విషయం తెలిసి రాలేదు..అరోరాకి. చేతిలో ఒక్క ఉద్యోగం ఆఫర్ లేకుండా హార్వర్డ్‌లో ఎంబీఏ డిగ్రీ పూర్తి చేస్తున్నాడు. ఆ తర్వాత మనోడి కష్టాలు అంత ఇంత కాదు. ఏకంగా 400కి పైగా ఉద్యోగాలు దరఖాస్తు చేసుకుంటే అన్ని రిజెక్ట్ అయిపోయాయి. ఒక్క కంపెనీ నుంచి కాల్ కూడా రాలేదు. తనకున్న జాబ్ నెట్వర్కింగ్ కూడా హెల్ప్ అవ్వలేదు. ఏ జాబ్ స్ట్రాటజీ వర్కౌట్ అవ్వలేదు. చివరికి మొత్తం వ్యూహాన్ని మార్చాక గానీ అతడి పరిస్థితిలో మార్పు రాలేదు. అలా ఆరు నెలల తర్వాత గూగుల్ (యూట్యూబ్)లో ప్రొడక్ట్ మేనేజర్ జాబ్‌ని సంపాదించాడు. అయితే తనలా ఇలా తప్పుడు నిర్ణయం తీసుకోవద్దని అంటున్నాడు. అలాగే విదేశాల్లో ఉన్నత చదవులు చదవద్దని చెప్పే ఉద్దేశ్యం కూడా కాదని అంటున్నాడు. కేవలం మంచి ఉద్యోగాన్ని వదిలేసేమందు కష్టనష్టాలు బేరీజు వేసుకోవడం మంచిది. పైగా ఆ తర్వాత ఎదురయ్యే సవాళ్లను కూడా ఎదుర్కొనేందుకు సిద్దపడిపోవాలని కోరాడు. ఇక్కడ ఒక్కటే మనపై మనకు నమ్మకం ఉన్నంత వరకు ఏ నిర్ణయం తప్పు కాదు. ఒక్కసారి నమ్మకం సడలితే మాత్రం అన్ని తప్పులుగా, కష్టాలుగా అనిపిస్తాయంటూ నెట్టింట తన స్టోరీని షేర్ చేసుకున్నాడు అరోరా. ఆ పోస్ట్‌ని చూసిన నెటిజన్లు ఎంబిఏ చేసే బదులు..అంతకుమించి వేతనం అందుకునే బెస్ట్ జాబ్‌ని వెతుక్కోవాల్సిందని కొందరు కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు. మరికొందరు భయ్యా ఇన్ని రిజెక్షన్లు ఎలా తట్టుకున్నావు, పైగా ఈ ఉద్యోగాన్ని సంపాదించడానికి ఎలాంటి వ్యూహాలు అనుసరించారో చెప్పరా ప్లీజ్ అని పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Abhijay Arora Vuyyuru | Study Abroad | Careers | AI (@abhijayarora_) (చదవండి: ఇంజనీర్ కమ్ డాక్టర్..! విజయవంతమైన స్టార్టప్ ఇంజనీర్ కానీ..) -
అమెరికాపై తగ్గని మోజు!
అమెరికాలో ఏటా రికార్డు స్థాయిలో అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. ఈ పెరుగుదలకు ప్రధానంగా భారతదేశం నుంచి వెళ్లే విద్యార్థులు అధికమవుతుండడం కారణంగా నిలిచింది. తాజాగా ఓపెన్ డోర్స్ 2025 నివేదికలోని వివరాలు ఈ విషయాలను వెల్లడిస్తున్నాయి. యూఎస్‌లో దాదాపు ముగ్గురు అంతర్జాతీయ విద్యార్థుల్లో ఒకరు భారతీయులే ఉండడం గమనార్హం. 2024-25 విద్యా సంవత్సరంలో భారతీయ విద్యార్థుల నమోదు 3,63,019కు చేరుకుంది. ఇది అంతకుముందు ఏడాదితో పోలిస్తే 9.5 శాతం పెరుగుదలను సూచిస్తుంది.యూఎస్ వెళ్లే భారతీయ విద్యార్థులు ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి మెట్రో నగరాలకే పరిమితం కావడం లేదు. ప్రాడిజీ ఫైనాన్స్ డేటా ప్రకారం ఇండోర్, భువనేశ్వర్, పంజాబ్, సూరత్, కోయంబత్తూర్, మైసూరు, నాగ్‌పుర్.. వంటి టైర్ 2, టైర్ 3 నగరాల నుంచి యూఎస్ వెళ్లే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.ఈ విద్యార్థులు తరచుగా ఉపాధ్యాయులు, చిన్న వ్యాపార యజమానులు, మిడ్ కెరియర్ నిపుణుల కుటుంబాల నుంచి ఎక్కువగా ఉన్నారు.STEM కోర్సులు2024-25లో యూఎస్ మొత్తంగా 11,77,766 అంతర్జాతీయ విద్యార్థులకు ఆతిథ్యం ఇచ్చింది. ఇది అంతకుముందు ఏడాది కంటే 4.5 శాతం ఎక్కువ. యూఎస్‌లోని ప్రతి 10 మంది భారతీయ విద్యార్థుల్లో దాదాపు 7 మంది సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్ (STEM) కోర్సుల్లో చేరుతున్నారు.43.4% మంది భారతీయ విద్యార్థులు గణితం, కంప్యూటర్ సైన్స్ లో చేరారు.22.8% మంది ఇంజినీరింగ్ కోర్సులను ఎంచుకున్నారు.ఓపీటీ..అమెరికా అందిస్తున్న ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (OPT)కు ఆదరణ పెరుగుతోంది. యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ అంతర్జాతీయ గ్రాడ్యుయేట్లు దేశీయ శ్రామిక శక్తిలోకి ప్రవేశించడానికి ఓపీటీ ఎంతో తోడ్పడుతుంది. భారతీయ పోస్ట్ గ్రాడ్యుయేట్లు ముఖ్యంగా STEMలో H-1B వీసాలు లేదా ఇతర వర్గాలకు మారడానికి ముందు వృత్తిపరమైన అనుభవాన్ని పొందడానికి ఓపీటీని ఉపయోగించుకుంటున్నారు.ఇదీ చదవండి: బంగారు నగలపై ఓవర్‌డ్రాఫ్ట్.. వివరాలివే.. -
సహజకవి అందెశ్రీకి మరణం లేదు
సహజ కవిత్వం, మాటపాటలతో తెలంగాణ సమాజాన్ని జాగృతం చేసిన అందెశ్రీకి మరణం లేదని తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్ (TDF) కెనడా అభిప్రాయపడింది. టొరెంటోలో స్థిరపడిన తెలంగాణ వాసులు అందెశ్రీ సంస్మరణ సభను నిర్వహించారు. స్థానిక తెలంగాణ వాసులు పెద్ద సంఖ్యలో హాజరై అందెశ్రీకి నివాళులు అర్పించారు.ఉద్యమానికి ముందూ, తర్వాత కూడా తెలంగాణ ఆత్మలా అందెశ్రీ (Ande Sri) నిలిచారని కొనియాడారు. రాష్ట్ర ఏర్పాటు కోసం తెలంగాణ భావజాల వ్యాప్తిలో ఆయన చేసిన సేవలు అనిర్వచనీయం అన్నారు. వివిధ దేశాల్లో స్థిరపడిన తెలంగాణ వాసులను కలుసుకొని తన మాట, పాటలతో జనాన్ని జాగృతం చేశారని అన్నారు. 2014లో కెనడాలో పర్యటించిన ఆయన అనుభవాలను గుర్తుచేసుకున్నారు. అందెశ్రీ కుటుంబాన్ని ఆదుకోవటంతోపాటు, ఆయన ఇంటి నిర్మాణం పూర్తి చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని కెనడా ఎన్.ఆర్.ఐలు (Canada NRIs) కోరారు. అలాగే అందెశ్రీ రచనలు, కవితలు, పాటలు డిజిటలైజేషన్ చేసి భవిష్యత్ తరాలకు అందేలా చూడాలన్నారు. కార్యక్రమంలో ప్రెసిడెంట్ జితేందర్ రెడ్డి గార్లపాటి, జనరల్ సెక్రటరీ వెంకట్ రెడ్డి పోలు, సురేందర్ పెద్ది, శ్రీకాంత్ నెరవెట్ల, కృష్ణారెడ్డి చాడ, రవీందర్, అమిత పినకేసి, సుమన్ ముప్పిడి, మహేందర్ రెడ్డి, రవీందర్ కొండం, అర్షద్, ఇతర టీడీఎఫ్ సభ్యులు పాల్గొన్నారు.చదవండి: 17 ఏళ్ల తర్వాత ఇండియాకు ఎన్నారై జంట -
ఆస్ట్రేలియాలోని ఎన్నారైల సహకారం మరువలేనిది : లక్ష్మీపార్వతి
గత కొన్ని సంవత్సరాలుగా వైఎస్ఆర్సిపి పార్టీకి జగనన్నకు మద్దతుగా నిలుస్తున్నటువంటి ఆస్ట్రేలియా వైయస్సార్సీపీ ఎన్నారై లకి పార్టీ సీనియర్ నాయకురాలు నందమూరి లక్ష్మీపార్వతి అభినందనలు మరియు కృతజ్ఞతలు తెలియజేశారు. ఆస్ట్రేలియాలోనీ మెల్బోర్న్ పర్యటనలో ఉన్న లక్ష్మీపార్వతి గారు మీట్ అండ్ గ్రీట్ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా సీనియర్ నాయకులని ఉద్దేశించి లక్ష్మీపార్వతి మాట్లాడుతూ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి పట్ల మీరు చూపిస్తున్న ఆధారాభిమానాలకు పార్టీ ఎల్లప్పుడూ కృతజ్ఞతగా ఉంటుందని తెలియజేశారు. ఈ సందర్భంగా పలువురు ఎన్నారైలు మాట్లాడుతూ జగన్ గారు తన పరిపాలన హయాంలో ప్రజలకు ఎంతో మేలు చేశారని తమలో చాలామంది వారి తండ్రి పెట్టిన పథకాలను ఉపయోగించుకుని వచ్చి విదేశాల్లో స్థిరపడ్డామని వారి రుణం జగన్మోహన్ రెడ్డి గారికి ఎల్లప్పుడూ మద్దతు తీర్చుకుంటామని తెలియజేశారు. మీ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ పార్టీకి ఇదేవిధంగా కొనసాగాలని ఆకాంక్షించారు.రాబోయే జగనన్న ప్రభుత్వంలో కార్యకర్తలకు అన్ని విధాలాగా భరోసా ఉంటుందని పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆస్ట్రేలియా వైసిపి నాయకులు నాగార్జున యలగాల, అనీల్ పెదగాడ, హరి చెన్నుపల్లి, శరత్ కుమార్ రెడ్డి తోట్లీ, విష్ణు వర్ధన్ రెడ్డి వాకమల్ల తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మెల్బోర్న్ టీం వైయస్ఆర్సీపీ సభ్యులకు ఆస్ట్రేలియా సీనియర్ వైసీపీ లీడర్ చింతలచెరువు సూర్యనారాయణ రెడ్డి గారు అభినందనలు తెలియజేశారు -
17 ఏళ్ల తరువాత ఇండియాకు ఎన్ఆర్ఐ జంట, వీడియో వైరల్
డాలర్ల వేటలో చాలామంది విదేశాల బాటపడతారు. కానీ అన్ని దేశాల్లోనూ, అన్ని రకాలుగా మనకు సౌకర్యంగా ఉండదు. కొన్నిచోట్ల కొన్ని సమస్యలు తప్పవు. ఇందులో అక్కడి నిబంధనలు, భాషా సంస్కృతి, వాతావరణ పరిస్థితులు, జీవన స్థితిగతులు, ఆరోగ్యం ఇలా ఈ జాబితాలోనే చాలానే ఉంటాయి. కొన్ని కావాలంటే కొన్ని సర్దుబాట్లు తప్పవు అని ఎడ్జస్ట్ అయిపోతూ ఉంటారు. కానీ అమెరిలో ఒకటిన్నర దశాబ్దానికి పైగా ఉన్న జంట ప్రవాస భారతీయ (NRI) జంట ఇండియాకు తిరిగి వచ్చేసింది.ఎందుకు? అనుకుంటున్నారా? పదండి తెలుసుకుందాం ఈ కథనంలోఅమెరికాలో ఆరోగ్య ఖర్చులు బీమా భారం కావడంతో దాదాపు 17 ఏళ్ల తరువాత అమెరికా నుంచి స్వదేశానికి తిరిగి వచ్చేసింది భారతేదేశానికి చెందిన ఎన్ఆర్ఐ జంట. వీరికి కవల పిల్లలు. యూఎస్‌లోని ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ తమ ఆర్థిక స్థితిపై ఒత్తిడి తెస్తోందని, బీమా చాలా ఖరీదైనదని, దీంతో అక్కడ హాస్పిటల్‌కి వెళ్లాలంటేనే భయం వేస్తోందని ఇన్‌స్టా పోస్ట్‌లో వెల్లడించారు.అమెరికాలో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఆరోగ్య బీమా సేవలకంటే ముందు, మీ జేబుకు చిల్లు తప్పదు. అంటే ఏ డాక్టర్ దగ్గరికెళ్లినా, ఎలాంటి పరీక్షలు చేయించుకున్నా, మినిమం డిడక్టబుల్ ఎమౌంట్ కట్టాల్సిందే అంటూ తమ ఇబ్బందుల గురించి చెప్పుకొచ్చారు.తాము ఎంచుకున్న చౌకైన పథకం నెలకు 1,600 డాలర్ల ప్లాన్. ఇందులో 15వేల డాలర్లు డిడక్టబుల్ ఎమౌంట్. అయితే ఈ కవర్లో ట్విన్స్ యాడ్ అవ్వలేదు.దీంతో పిల్లలకి ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చిన ఖర్చులు విపరీతం, దీనికి ఒత్తిడి ఎక్కువగా ఉంటోంది. అందుకే ఇండియాకు తిరిగి వెళ్లాలని నిర్ణయించు కున్నాం. మంచి వైద్యులు, వేగవంతమైన సంరక్షణ, చికిత్స అందుబాటులో ఉండేలా చక్కటి వ్యవస్థ ఉంది. మేం ఇండియాకు రావడం అంటే సమస్య నుంచి పారిపోవడం కాదు, ఆరోగ్య సంరక్షణ భరించేదిగా ఉండటంతోపాటు, ఒంటరిగా మాతృత్వ భారాన్ని భరించాల్సిన అవసరం లేని జీవితం వైపు పరుగెత్తడం అని వివరణ ఇచ్చారు. తాము కోల్పోతున్న సమన్వయం, మనశ్శాంతిని వెదుక్కోవడం అని పేర్కొన్నారు. View this post on Instagram A post shared by Dhara (@twinsbymyside) దీంతో నెటిజన్లు ఈ జంటతో ఏకీభవించారు. వారికి మద్దతుగా నిలిచారు. చక్కటి నిర్ణయం తీసుకున్న మీకు అభినందనలు అంటూ ప్రశంసించారు. అలాగే కొంత సర్దుబాటు అవవసరం అని కొందరు వ్యాఖ్యానిస్తే. ఇండియాలో 30వేలతో అయిపోయే అపెండిక్స్ ఆపరేషన్‌కు రూ. 3.74 కోట్లు అయిందంటూ ఒకరు,అక్కడ సాధారణ కట్టు , కుట్లు వేయడానికి చాలా ఖర్చవుతుంది అని మరొకరు తమ అనుభవాల్ని పంచుకున్నారు. రెండు దేశాల్లో వాటి ప్లస్‌లు మైనస్లూ ఉన్నాయి. కానీ చిన్న పిల్లలున్న కుటుంబాలకు ఇండియాలో మంచి ఆరోగ్య వ్యవస్థ ఉందన్నారు. ఎక్కడా పెర్ఫెక్ట్గా ఉండదు. కానీ మీకు మంచి జీవితం ఉండాలని భావిస్తున్నాను అని ఒకరు వ్యాఖ్యానించారు. వీడియో 10.6 లక్షలకు పైగా వీక్షణలు మరియు వందలాది వ్యాఖ్యలను సంపాదించింది. -
వచ్చేనెలలో తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున ఆటా వేడుకలు
గత ఇరవై సంవత్సరాలుగా ఆటా వేడుకలు పేరుతో అమెరికా తెలుగు సంఘం ఒక వినూత్న కార్యక్రమాన్ని మొదిలిపెట్టి నిర్విరామంగా నిర్వహిస్తుంది. తెలుగు భాష, సాహిత్యాలను ప్రేమిస్తూ విశేష కృషి చేస్తూ వస్తున్నది. ఉమ్మడి తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభమై నేడు రెండు తెలుగు రాష్ట్రాలలోనూ ఆటా వేడుకలు ఘనంగా జరగటం విశేషం.ఆటా సేవల్లో భాగమైన సాహిత్య, సాంస్కృతిక, విద్యా, ఆధ్యాత్మిక, వ్యాపార రంగాల్లాంటి మరెన్నో రంగాల్లో పలు స్ఫూర్తినిచ్చే కార్యక్రమాల ద్వారా ఆటా తన మిషన్ లక్ష్యాలను చేరుకోవడమే కాకుండా, ఆటా తెలుగు తేజాన్ని నాలుగు దిశల విస్తరింప చేస్తూ ఉన్నది. విశ్వఖ్యాతిగా మన తెలుగును బహుళ ప్రచారం చేస్తూ భవిష్యత్తు తరాలను ప్రభావితపరుస్తూ ఉన్నది. తేనెలొలుకు తెలుగు తియ్యదనాన్ని ప్రచారం చేస్తూ తెలుగు మాతృభాష గల ప్రజలను, భాషాభిమానులను ఆకర్షిస్తూ ఉన్నది. ఒక్క మాటలో చెప్పాలంటే భవిష్యత్తు నిర్మాణానికి ఎంతగానో ఈ ఆటా వేడుకలు ఉపయోగపడుతున్నాయి.ఆటా అధ్యక్షుడు జయంత్ చల్లసహాయ సహకారాలతో, ఆటా ప్రెసిడెంట్ ఎలెక్ట్ & ఆటా వేడుకల కమిటీ చైర్ సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో ఆటా వేడుకలు జరగబోతున్నాయి.డిసెంబర్ 12 - రంగా రెడ్డి జిల్లాలో స్కూల్ మౌలిక సదుపాయాల.అభివృద్ధి మరియు సాంస్కృతిక కార్యక్రమాలు డిసెంబర్ 13: – సంగారెడ్డి - ఐఐటీలో స్టార్ట్ అప్ పిచ్ డిసెంబర్ 14: – హైదరాబాద్ లో సాహిత్య కార్యక్రమండిసెంబర్ 16–17: బిజినెస్ సెమినార్స్ - హైదరాబాద్, విశాఖపట్నండిసెంబర్ 20–23: స్పోర్ట్స్, ఎడ్యుకేషన్ కార్యక్రమాలు , స్కూల్ మౌలిక సదుపాయాల.అభివృద్ధి , ,వాటర్ ప్లాంట్ మరియు ఉమెన్స్ హెల్త్ క్యాంప్స్.డిసెంబర్ 24–25: పిల్లల కొరకు హెల్త్ క్యాంప్స్ మరియు చారిటబుల్ ప్రోగ్రామ్స్డిసెంబర్ 27: గ్రాండ్ ఫినాలే రవీంద్ర భారతి లో - సాంస్కృతిక కార్యక్రమాలు మరియు ఆటా అవార్డ్స్ ప్రధానంరెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో జరిగే అన్ని కార్యక్రమాలని ముగించుకుని హైద్రాబాద్‌లోని రవీంద్రభారతిలో జరిగే గ్రాండ్ ఫినాలే కార్యక్రమంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో చక్కటి వినోదాన్ని అందించడానికి సిద్ధమవుతున్నారు ఎందరో కళాకారులు. చివరగా రుచికరమైన విందు భోజనంతో ముగియబోయే ఈ వేడుకలు అమెరికాలో బాల్టిమోర్ నగరంలో జులై 31 - ఆగష్టు 2 జరగబోయే ఆటా మహాసభల సన్నాహాల కోసం అందరిలో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతుందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఆటా ఆధ్వర్యంలో పలు సేవ కార్యక్రమాలు రెండూ రాష్ట్రాలలో నిర్వహిచటం గమనార్హం. డిసెంబర్ మాసంలో నిర్వహించే ఆటా వేడుకలలో ప్రవాసులు పెద్ద ఎత్తున పాల్గోవాలిసిందిగా ఆటా బోర్డ్ విజ్ఞప్తి చేసింది. తమ గ్రామాలూ, పట్టణాలలో సేవ కార్యక్రమాలు చేయాలనుకునే వారు www.ataworld.org సంప్రదించవలిసిందిగా కోరారు. -
40 ఏళ్ల సేవలు, రూ. 35 లక్షలు..ఎన్ఆర్ఐకి అరుదైన గౌరవం!
ఒక ఉద్యోగికగా తాను చేసిన సేవలకు గుర్తింపు లభించడం అంటే ఆస్కార్ వరించినంత ఆనందం. అది వ్యక్తిగత లేదా,బహిరంగ ప్రశంస అయినా, అవార్డులు, రివార్డు, నగదు బహుమతి అయినా, ఏదైనా ఎంత చిన్నదైనా కూడా గొప్ప గౌరవమే. అది వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపడమే కాదు, నిబద్దతను పెంచుతుంది. తమ కృషికి విలువ లభిస్తుందనే భావన, ఆరోగ్యకరమైన పోటీ, పనితీరును మెరుగుకు దారితీస్తుంది. అంతిమంగా ఇది సంస్థకు ఎనలేని మేలు చేస్తుంది. ఇపుడు ఇదంతా ఎందుకూ అంటే.. భారత సంతతి వ్యక్తికి తన సంస్థనుంచి లభించిన అరుదైన గౌరవంగా నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.మెరికాలోని మసాచుసెట్స్‌లో ఉన్న మెక్‌డొనాల్డ్స్‌లో పనిచేస్తున్న భారత సంతతికి చెందిన ఉద్యోగి బల్బీర్ సింగ్‌ను సంస్థ చాగా గొప్పగా సత్కరించుకుంది 40 ఏళ్ల పాటు అంకిత భావంతో పనిచేసిన మెక్‌డొనాల్డ్స్ ఫ్రాంచైజ్ లిండ్సే వాలిన్కు సుమారు రూ. 35 లక్షల బహుమతిని (40 వేల డాలర్లు) అందించింది. ఈవెంట్ వేదిక వద్దకు బల్బీర్ సింగ్‌ను లిమోజిన్ కారులో తీసుకువచ్చి, రెడ్ కార్పెట్‌తో స్వాగతం పలికి మరీ దీనికి సంబంధించిన చెక్కును అందించారు. అలాగే సేవా పురస్కారం, స్మారక "వన్ ఇన్ ఎయిట్" జాకెట్నుకూడా అందుకున్నారు. ఈసందర్బంగా ఫ్రాంచైజ్ యజమాని లిండ్సే వాలిన్ మాట్లాడుతూ, బల్బీర్ సింగ్ తమ సంస్థకు గుండెలాంటి వారని కొనియాడారు. మొత్తం తొమ్మిది అవుట్లెట్లను కలిగి ఉన్న లిండ్సే వాలిన్, సింగ్ ఈ విజయాన్ని ఇతర ఉద్యోగులతో ఘనంగా సెలబ్రేట్ చేశారు. బల్బీర్ తనతో కలిసి చేసిన 40 ఏళ్ల ప్రయాణం గురించి చెప్పలేమని చెప్పలేననీ, తొమ్మిది రెస్టారెంట్లలో నాలుగు రెస్టారెంట్లను చాలా గొప్పగా, అచంచల దృష్టితో నడుపుతున్నాడు ఆమె ప్రశంసించారు. చదవండి: H-1B వీసాలు ట్రంప్ దెబ్బ : టాప్‌లో ఆ కంపెనీల జోరుబల్బీర్ సింగ్ కెరీర్బల్బీర్ సింగ్ 40 ఏళ్ల క్రితం భారతదేశం నుండి అమెరికాకు వచ్చిన కొద్ది రోజులకే మెక్‌డొనాల్డ్స్‌లో కెరీర్ ప్రారంభించారు. తొలుత 1985లో సోమర్విల్లేలోని రెస్టారెంట్ కిచెన్‌లో పనిచేశారు. అలా కష్టపడి, పూర్తి నిబద్ధతతో పనిచేసి, ఒక్కో మెట్టు ఎదుగుతూ తాను పనిచేస్తున్న సంస్థలోని తొమ్మిది రెస్టారెంట్లలో నాలుగుంటిని పర్యవేక్షించే స్థాయికి చేరుకోవడం విశేషం. మొదట బల్పీర్ సింగ్ తన తండ్రి బాబ్కింగ్ వద్ద పనిచేసేవారని కంపెనీ మోటో అయిన వై నాట్ అనే పద్ధతిని స్వీకరించారని, ఇంకా ఎదగాలి, ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్న ఆలోచనా విధానమే మా విజయానికి కారణమని లిండ్సే వాలిన్. మరోవైపు ఈ కంపెనీలో పనిచేయడం తనకు చాలా గర్వకారణమంటూ సంతోషాన్ని ప్రకటించారు బల్బీర్ సింగ్ . -
అమెరికాలో ఆంధ్రా తల్లి,కొడుకుల హత్య కేసులో ట్విస్ట్
అనూహ్య పరిస్థితుల్లో భార్య బిడ్డలు చనిపోయి కనిపించారు. తీరని దుఃఖంలో ఉండగానే నువ్వే నిందితుడని బంధువులు ఆరోపించారు. అనుమానాలున్నాయంటూ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎనిమిదేళ్ల తరువాత అసలు నిజం తెలిసింది. సంచలనంగా మారిన ఈ స్టోరీ వివరాలు తెలుసుకోవాలంటే ఈ కథనాన్ని చదవాల్సిందే.2017, మార్చి 23, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నర్రా శశికళ, ఆమె కుమారుడు అనిష్ న్యూజెర్సీలోని వారి అపార్ట్మెంట్లోశవాలై కనిపించారు. మహిళ భర్త నర్రా హనుమంతరావునే ప్రాథమికంగా నిందితుడిగా భావించారు. కానీ అనూహ్యం ఎనిమిదేళ్ల తరువాత నజీర్ హమీద్ అనే వ్యక్తిపై అభియోగాలు మోసారు. న్యూజెర్సీలోని ఒక కంపెనీలో శశికళ నర్రా భర్త సహోద్యోగే ఈ హత్యలకు పాల్పడినట్టు ప్రాసిక్యూటర్లు తెలిపారు.శశికళ, అనిష్ హత్యఏపీకి చెందిన నర్రా హనుమంతరావు న్యూజెర్సీలోని మాపుల్ షేడ్‌లోని ఫాక్స్ మేడో అపార్ట్‌మెంట్స్‌లో భార్య శశికళ నర్రా(38), 6 ఏళ్ల కుమారుడు అనిష్‌తో కలిసి ఉండేవారు. ఒక రోజు ఆఫీసునుంచి ఇంటికి వచ్చేసరికి భార్య, కుమారుడు ఒళ్లంతా రక్తమోడుతూ తీవ్రమైన కత్తిపోట్లతో చనిపోయి కనిపించారు. వెంటనే హనుమంత రావు పోలీసులకు సమాచారం ఇచ్చాడు.అయితే మరో మహిళతో వివాహేతర సంబంధం ఉన్న నేపథ్యంలోనే ఈ హత్యలకు పాల్పడి ఉంటాడని బంధువులు ఆరోపించారు. ఈ కేసులో పోలీసులు హనుమంతరావును అరెస్ట్ చేశారు. ఈ సమయంలో దర్యాప్తు అధికారులు తమ విచారణలో భాగంగా సంఘటనా స్థలంనుంచి రక్తపు మరకల నమూనాలను సేకరించి, డీఎన్ఏ పరీక్షలు చేయించారు. అయితే అది హనుమంతరావు డీఎన్ఏతో మ్యాచ్ కాకపోవడంతో ఇది మరో మలుపు తిరిగింది.ఎలా ఛేదించారంటే..బర్లింగ్టన్ కౌంటీ ప్రాసిక్యూటర్ ఆఫీస్ చీఫ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ పాట్రిక్ థోర్న్టన్ అందించిన వివరాల ప్రకారం హనుమంతరావు ఇంటికి సమీపంలోనే ఉండే హమీద్ మధ్య గొడవలు ఉన్నట్టు గురించారు. కాగ్నిజెంట్ టెక్నాలజీస్‌లో పనిచేస్తున్న సమయంలో హను నర్రాను వేధించినట్లు గతంలో నజీర్ హమీద్ పై ఆరోపణలు రావడంతో ఆ వైపుగా దర్యాప్తు మెుదలుపెట్టారు. డీఎన్ఏ నమూనాను సేకరించాలనే ఉద్దేశంతో అధికారులు 2024లో కోర్టుకు వెళ్లారు. కాగ్నిజెంట్ కంపెనీ,హమీద్‌కు జారీ చేసిన ల్యాప్‌టాప్‌ను తమకు పంపమని కోరారు. చివరికి ల్యాప్‌టాప్ నుండి డీఎన్ఏ సేకరించారు అధికారులు. నేరస్థలంలో దొరికిన నమూనాతో హమీద్ డీఎన్ఏ సరిపోలడంతో గుట్టు రట్టయింది.మరోవైపు జంట హత్యలు జరిగిన 6 నెలల తర్వాత హమీద్ ఇండియాకు చెక్కేశాడు. అయినా కాగ్నిజెంట్ ఉద్యోగిగా కొనసాగాడు. అంతేకాదు అమెరికా పోలీసులు హమీద్ డీఎన్ఏ కోసం చాలాసార్లు ప్రయత్నించారు. భారతీయ అధికారుల ద్వారా సంప్రదించినా స్పందించలేదు. చివరికి అతడి ల్యాప్‌ట్యాప్ మీద నమూనాల ఆధారంగా కేసును ఛేదించారు. మరోవైపు హమీద్‌ను అమెరికాకు రప్పించేందుకు భారత విదేశాంగశాఖ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు.చదవండి: H-1B వీసాలు ట్రంప్ దెబ్బ : టాప్‌లో ఆ కంపెనీల జోరుఈ దారుణమైన హత్యల వెనుక హమీద్ ఉద్దేశం ఏమిటనేది దర్యాప్తు అధికారులకు స్పష్టత లేదు కానీ హనుమంతరావుపై కోపంతోనే అతడి భార్య శశికళ, కుమారుడిపై ప్రతీకారం తీర్చుకున్నాడని పోలీసులు భావిస్తున్నారు.ఇదీ చదవండి: ఇన్వెస్టర్ల క్యూ : కొత్త ఐటీ నగరం వచ్చేస్తోంది! -
BMW కారు బీభత్సం: భారత సంతతి గర్భిణి దుర్మరణం
డ్రైవింగ్ సరిగ్గా రాకుండానే స్టీరింగ్ పట్టుకున్న ఒక మైనర్ అత్యుత్సాహం ఒక కుటుంబాన్ని అంతులేని విషాదంలోకి నెట్టేసింది. రెండో బిడ్డ రాక కోసం కలలు కంటున్న నిండు గర్భిణి తన కల తీరకుండానే అనంత లోకాలకు చేరింది.ఆస్ట్రేలియాలోని సిడ్నీలో జరిగిన ఘోర కారు ప్రమాదంలో 33 ఏళ్ల గర్భిణి భారతీయ మహిళ కన్నుమూసింది. ఎనిమిది నెలల గర్భిణి అయిన సమన్విత ధరేశ్వర్ తన భర్త, మూడేళ్ల కొడుకుతో కలిసి నడుచుకుంటూ వెళుతుండగా అదుపు తప్పిన లగ్జరీ BMW కారు ఢీకొట్టింది. గత వారం ఈ విషాదం చోటు చేసుకుంది.శుక్రవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో హార్న్స్బైలోని జార్జ్ సెయింట్ వెంబడి ఉన్న ఫుట్‌పాత్‌పై వాకింగ్ చేస్తోంది ధరేశ్వర్. వేగంగా వస్తున్న BMW కారు, ముందున్న కియా కార్నివాల్ కారును వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో కియా కారు ధరేశ్వర్‌ను బలంగా ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో ధరేశ్వర్ కు తీవ్ర గాయాలు అయ్యాయని, వెంటనే వెస్ట్ మీడ్ ఆసుపత్రికి తరలించినా, వారిని కాపాడలేక పోయామన్నారు. ఈ ఘటనలో రెండు కార్ల డ్రైవర్లకు ఎలాంటి గాయాలు కాలేదు. ధరేశ్వర్ భర్త, ఆమె మూడేళ్ల బిడ్డ ఎలా ఉన్నారనే దానిపై సమాచారం లేదు. ఇదీ చదవండి: మాజీ ప్రియుడి లైంగిక వేధింపులు, నాలుక కొరికేసిన యువతినిందితుడు 19 ఏళ్ల P-ప్లేటర్ (తాత్కాలిక లేదా ప్రొబేషనరీ లైసెన్స్ ఉన్న డ్రైవర్) ఆరోన్ పాపాజోగ్లుగా గుర్తించిన పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. నిందితుడిని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా బెయిల్ నిరాకరించారు. కాగా మృతురాలు ధరేశ్వర్ IT సిస్టమ్స్ ఎనలిస్ట్‌గా పని చేస్తున్నారు. చదవండి: అరగంటలో రూ. 10 లక్షలు : సేల్స్‌మేన్‌కు దిమ్మ తిరిగింది -
గ్రామాలను దత్తత తీసుకున్న శంకర నేత్రాలయ USA మిల్వాకీ దాతలు
శంకర నేత్రాలయ USA నిర్వహించిన మిల్వాకీలో ఒక చిరస్మరణీయ రాత్రి, అడాప్ట్-ఎ-విలేజ్ కంటి శిబిరాలకు మద్దతుగా $50,000(రూ. 43 లక్షలు) దాక సేకరించారు. భారతదేశంలోని పేద వర్గాలకు కంటి శస్త్రచికిత్సలు చేయడానికి రూపొందించబడిన అడాప్ట్-ఎ-విలేజ్ కార్యక్రమానికి మద్దతుగా శంకర నేత్రాలయ USA లైట్ మ్యూజికల్ కన్సర్ట్ను నిర్వహించడంతో పెవాకీలోని విస్కాన్సిన్ హిందూ దేవాలయం సంస్కృతి, కరుణల శక్తిమంతమైన వేదికగా రూపాంతరం చెందింది. ఈ కార్యక్రమం దాదాపు ౩50 మంది ప్రేక్షకులతో మధ్యాహ్నం 3:00 గంటలకు ప్రారంభమైంది. గ్రామీణ భారతదేశంలో నివారించదగిన అంధత్వాన్ని నిర్మూలించే లక్ష్యంలో సమాజం, కళ, సేవ, శక్తిని ప్రదర్శించింది. వారి ప్రారంభ వ్యాఖ్యలలో, పాలకమండలి సభ్యుడు చంద్ర మౌళి సరస్వతి, చాప్టర్ వైస్ ప్రెసిడెంట్-మిల్వాకీ సత్య జగదీష్ బాదం ఇలా పంచుకున్నారు. “మిల్వాకీ సేవా స్ఫూర్తితో పసిగడుతుంది. ఈ రాత్రి, మేము కలిసి వచ్చాం. కేవలం సేకరించడానికికాదు, ఉమ్మడి ఉద్దేశ్యం ద్వారా జీవితాలను ప్రకాశవంతం చేయడానికి.” "శంకర నేత్రాలయ USA టైర్ 2 మరియు టైర్ 3 నగరాల్లోకి తన పరిధిని విస్తరిస్తూనే ఉంది. దృష్టి లోపాలతో బాధపడుతున్న నిరుపేద వ్యక్తులకు సేవ చేయాలనే మా లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లడంలో మిల్వాకీ నుంచి ఉత్సాహభరితమైన మద్దతు మాకు ప్రోత్సాహాన్నిచ్చింది" అని శంకర నేత్రాలయ USA అధ్యక్షుడు బాలారెడ్డి ఇందూర్తి పేర్కొన్నారు.ఈ కార్యక్రమం జయప్రదం కావడంలో..పాలకమండలి సభ్యుడు చంద్ర మౌళి సరస్వతి, చాప్టర్ వైస్ ప్రెసిడెంట్ సత్య జగదీష్ బాదం, కమిటీ సభ్యులు డాక్టర్ హరి బండ్ల, పోలిరెడ్డి గంటా, చాప్టర్ లీడ్స్ మహేష్ బేలా మరియు అర్జున్ సత్యవరపు, వాలంటీర్లు ఆనంద్ అడవి, సాయి యార్లగడ్డ, రవి నాదెళ్ల, శ్రీని కిలిచేటి, చండీ ప్రసాద్, క్రాంతి మల్రెడ్డి, గుప్తా కళ్లేపల్లి, పవన్ శ్రీభాష్యం, విజయ్ వల్లూరి, చంద్రశేఖర్ గుడిసె, కరుణాకర్ రెడ్డి దాసరి, రత్నాకర్ రెడ్డి, నవీన్ రెడ్డి, కొండారెడ్డి, వెంకట్ శశి కొద్దంరెడ్డి, వౌనద్ శవధరి, వెంకట్ జాలరి రెడ్డి రెడ్డి, గోపాల్ గారు, రాజా బాబు నేతి, విక్రాంత్ రెడ్డి, గోపాల్ సింగ్, శ్రీనివాస్ నిమ్మ, రంజిత్, శ్రావణి మీసరగండ, వాసవి బాదం, ప్రీతి, కీర్తి, లావణ్య, సునీత, పావని గంట, చంద్రిక, సంతోషి, భాను, సరోజిని, కావ్య వి, రాధిక పెబ్బేటి, శరణ్య రాఘవ, శరణ్య జాలరి, కిరణ్య జ్ఙాపక ముత్తూరు, డీఎస్ రెడ్డి, రవి కుమార్ గుంత, రమేష్ పుసునూరు, శ్రీనివాస్ యూర్కేరి, ప్రమోద్ అల్లాణి, పవన్ జంపాని, ప్రీతి శర్మ, అనిల్ పబ్బిశెట్టి. రాజ్ వధేరాజ్, యాజులు దువ్వూరు, ఫణి చప్పిడి, దుర్గ, ధనలక్ష్మి, కార్తీక్ పాసెం, భారతి కొల్లి, ఉమాదేవి పువ్వాడి, దుర్గా బండారుపల్లి, వెంకట కుందూరి, డా. రెడ్డి ఊరిమిండి, మూర్తీ రేకపల్లి,శ్యాంఅప్పాలి, వంశీ ఏరువారం, రత్నకుమార్కవుటూరు, త్యాగరాజన్, దీన్ దయాళన్, సురేశ్ కుమార్‌లు అందించిన సేవలకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ అద్భుతమైన బృందం శంకర నేత్రాలయ సేవా లక్ష్యం పట్ల అంకితభావం, సహకారం, భాగస్వామ్య నిబద్ధతను ఉదహరించారు. చంద్ర మౌళి తమ వందన సమర్పణలో కార్యక్రమ వ్యాఖ్యాతలు మాలతి కర్రి, శ్రీ వల్లిల సహకారాన్ని గుర్తించి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు . -
సింగపూర్‌లో కార్తీకమాస స్వరారాధన
సింగపూర్ నుంచి ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి పొందిన సాంస్కృతిక సంస్థ "శ్రీ సాంస్కృతిక కళాసారథి", ఈ పవిత్ర కార్తీకమాస సందర్భంగా అంతర్జాల మాధ్యమంలో శనివారం "కార్తీకమాస స్వరారాధన" అనే ఒక ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.ప్రముఖ సంస్కృతాంధ్ర పండితులు, రాష్ట్రపతి పురస్కార గ్రహీత అయిన డాక్టర్ అద్దంకి శ్రీనివాస్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై కార్తీకమాస వైశిష్ట్యం గురించిన వివిధ అంశాలను ఒక చక్కటి ప్రవచనంగా అందించారు. పోలండ్ దేశస్తుడైన యువ గాయకుడు (Zach)బుజ్జి పాత తెలుగు సినిమాలలోని ఘంటసాల పాడిన శివ భక్తిగీతాలను, శివతాండవ స్తోత్రాన్ని పాడి వినిపించడం అందరినీ ప్రత్యేకంగా ఆకర్షించింది.సంస్థ అధ్యక్షులు కవుటూరు రత్న కుమార్ మాట్లాడుతూ "డాక్టర్ అద్దంకి శ్రీనివాస్ తమ సంస్థ కార్యక్రమంలో తొలిసారి పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని, అలాగే సింగపూర్ గాయని గాయకులతో పాటుగా మాతృభాష తెలుగు కానీ ఒక విదేశీయుడైన బాలుడు చక్కగా తెలుగు భక్తి పాటలు నేర్చుకొని పాడడం చాలా అభినందనీయం" అని తెలియజేశారు.డాక్టర్ అద్దంకి శ్రీనివాస్ తమ ప్రసంగంలో మాట్లాడుతూ కార్తీకమాసంలో వచ్చే వివిధ పర్వదినాల గురించి ఆయా రోజులలో ఆచరించే పూజలు, వాటి వెనుక ఉన్న కథలు, ప్రత్యేకతలు, కారణాల గురించి సోదాహరణంగా విశ్లేషిస్తూ వివరిస్తూ, అన్ని వర్గాలవారినీ ఆకట్టుకునే విధంగా, అన్ని వయసుల వారికి అర్థమయ్యే విధంగా సులభమైన భాషలో తెలియజేశారు.సంస్థ ప్రధాన నిర్వహకవర్గ సభ్యురాలు రాధిక మంగిపూడి సభా సమన్వయం చేయగా, సుబ్బు వి పాలకుర్తి సహ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ సభలో, సింగపూర్ గాయనీగాయకులు విద్యాధరి కాపవరపు, సౌభాగ్యలక్ష్మి తంగిరాల, శేషుకుమారి యడవల్లి, షర్మిల చిత్రాడ, స్నిగ్ధ ఆకుండి, శ్రీవాణి, చంద్రహాస్ ఆనంద్, హరి మానస శివ భక్తిగీతాలను ఆలపించారు. వానిలో త్యాగరాజ కృతులు వంటి సంప్రదాయ సంగీతం, శివపదం గీతాలు, చలనచిత్ర గీతాలు, లలిత గీతాలు కూడా ఉండడం విశేషం.కల్చరల్ టీవీ సాంకేతిక సహకారంతో ప్రపంచవ్యాప్తంగా 'శ్రీ సాంస్కృతిక కళాసారథి' యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేసిన ఈ కార్యక్రమం ఎప్పటివలే అన్నిదేశాల తెలుగు ప్రజల మన్ననలు అందుకుంది. (చదవండి: జపాన్‌లో 'తాజ్' ఆధ్వర్యంలో ఘనంగా కార్తీక వనభోజనాలు) -
సౌదీ ప్రమాదంలో మృతులంతా హైదరాబాదీలే!
హైదరాబాద్: సౌదీ అరేబియా బస్సు ప్రమాదంలో మృతుల సంఖ్యపై గందరగోళం నెలకొంది. అయితే ఈ ప్రమాదంపై తెలంగాణ హజ్ కమిటీ స్పందించింది. ఘటనలో 45 మంది మరణించారని.. అంతా హైదరాబాద్‌కు చెందిన వాళ్లేనని స్పష్టత ఇచ్చింది. మరోవైపు మృతుల పూర్తి వివరాలను సమర్పిస్తామని పోలీసులు అంటున్నారు.నాలుగు ఏజెన్సీల ద్వారా యాత్రికులు అక్కడికి వెళ్లారు. మక్కా యాత్ర తర్వాత మదీనాకు బయల్దేరారు. మదీనాకు 25కి.మీ. దూరంలో ముఫ్రిహాత్ వద్ద యాత్రికుల బస్సు డీజిల్ ట్యాంకర్‌ను ఢీ కొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో 45 మంది ఉన్నారు. ప్రమాదంలో అంతా మరణించారు. మృతుల్లో 17 మంది పురుషులు, 28 మంది మహిళలు ఉన్నారు. అంతా హైదరాబాద్‌కు చెందిన వాళ్లే అని హజ్ కమిటీ పేర్కొంది. మృతుల్లో మల్లేపల్లి, బజార్‌ఘాట్, ఆసిఫ్‌నగర్ తదితర ప్రాంతాలకు చెందిన వారు ఉన్నట్లు తెలుస్తోంది.మరోవైపు.. ఈ ఘోర ప్రమాదంపై నగర పోలీసులు ప్రకటన చేశారు. మొత్తం 54 మంది బృందం నవంబరు 9న హైదరాబాద్ నుంచి జెడ్డాకు వెళ్లింది. నవంబరు 23 వరకు టూర్ ప్లాన్ చేశారు. వీరిలో నలుగురు వ్యక్తులు నిన్న కారులో మదీనాకు వెళ్లారు. మరో నలుగురు మక్కాలోనే ఉండిపోయారు. మిగతా 46 మంది మక్కా నుంచి మదీనాకు బస్సులో బయల్దేరారు. మదీనాకు 25 కిలోమీటర్ల దూరంలో ఈ బస్సు చమురు ట్యాంకర్‌ను ఢీకొట్టింది. ప్రమాదంలో 45 మంది చనిపోయారు. అబ్దుల్ షోయబ్ అనే వ్యక్తి ఒక్కరే బయటపడ్డారు. ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో ఉన్నాడు అని సజ్జనార్ తెలిపారు. సోమవారం తెల్లవారుజామున 1.30 గంటల ప్రాంతంలో (భారత కాలమానం ప్రకారం) ఈ ఘటన చోటుచేసుకుంది. డీజిల్ ట్యాంకర్‌ను ఢీకొనగానే మంటలు చెలరేగి బస్సు మొత్తం వ్యాపించాయి. ప్రమాద సమయంలో యాత్రికులంతా గాఢ నిద్రలో ఉండటంతో మృతుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదం నేపథ్యంలో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు జెడ్డాలోని భారత ఎంబసీ వెల్లడించింది.ప్రధాని సహా పలువురి దిగ్భ్రాంతిసౌదీ అరేబియాలో జరిగిన ఘోర ప్రమాదంపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. రియాద్‌లోని ఎంబసీ, జెడ్డాలోని కాన్సులేట్ కావాల్సిన సహాయం అందిస్తున్నాయని ప్రధాని మోదీ తన ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. సౌదీ అరేబియా ప్రభుత్వ అధికారులతో భారత ప్రతినిధులు నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు. -
సౌదీ ఘటనలో హైదరాబాదీ యువకుడు సురక్షితం
సౌదీ అరేబియా మదీనా సమీపంలో జరిగిన ఘోర ప్రమాదంలో 42 మంది భారతీయ ఉమ్రా యాత్రికులు సజీవ దహనం అయ్యింది తెలిసిందే. మృతుల్లో అత్యధికంగా తెలంగాణ హైదరాబాద్‌కు చెందినవాళ్లే ఉన్నారు. అయితే ఈ ప్రమాదం నుంచి ఇద్దరు సురక్షితంగా బయటపడినట్లు తెలుస్తోంది.హైదరాబాద్ అసిఫ్ నగర్, హబీబ్ నగర్‌కు చెందిన 44 మంది మక్కా యాత్ర కోసం అల్ మక్కా, ఫ్లై జోన్ ట్రావెల్స్ నుంచి టికెట్లు బుక్ చేసుకున్నారు. ఈ నెల 9వ తేదీన వాళ్లు అక్కడికి వెళ్లారు. మొత్తం 46 మంది ప్రయాణికులతో కూడిన బస్సు మక్కా యాత్ర తర్వాత గత రాత్రి మదీనాకు వెళ్తోంది. ఆ సమయంలో దాటాక వాళ్లు ప్రయాణిస్తున్న బస్సు డీజిల్ ట్యాంకర్‌ను ఢీ కొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో 42 మంది మరణించగా.. మృతుల్లో హైదరాబాద్‌కు చెందిన వాళ్లే 16 మంది ఉన్నారు. అయితే మృతుల్లో నగరానికి రెండు కుటుంబాలకు చెందిన 15 మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఒక కుటుంబంలో 8 మంది, మరో కుటుంబంలో ఏడుగురు ప్రమాదంలో సజీవ దహనం అయ్యారు. ఆ కుటుంబాల వివరాలపై స్పష్టత రావాల్సి ఉంది. బస్సు డ్రైవర్‌తో పాటు హైదరాబాద్‌కు చెందిన షోయబ్ అనే యువకుడు ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఈ విషయాన్ని హైదరాబాద్ సీపీ సజ్జనార్ ధృవీకరించారు.‘‘మక్కా యాత్రికులు మరణించడం దురదృష్టకరం. హైదరాబాద్ నుంచి 44 మంది యాత్రికులు వెళ్లారు. ప్రమాద సమయంలో బస్సులో 46 మంది ఉన్నారు. నగరానికి చెందిన 16 మంది మరణించారు. వాళ్ల వివరాలు సేకరిస్తున్నాం. షోయబ్ అనే యువకుడు మాత్రం సురక్షితంగా బయటపడ్డాడు’’ అని తెలిపారు. మరోవైపు.. ప్రమాద సమాచారం అందుకున్న బంధువులు ట్రావెల్ ఏజెన్సీలకు వద్దకు చేరుకుంటున్నారు. అయితే ఫ్లై జోన్ ట్రావెల్స్ నిర్వాహకులు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.సాయంత్రానికే ఆ స్పష్టత: నాంపల్లి ఎమ్మెల్యే మజీద్ హుస్సేన్సౌదీ అరేబియాలో బస్సు ప్రమాదం దిగ్భ్రాంతిని గురిచేసింది. మెహదీపట్నం నుంచి ఒక యువకుడు ఉదయాన్నే నాకు కాల్ చేశాడు. ఇక్కడ బాధిత కుటుంబాలను కలిసాను. సంబంధిత ట్రావెల్స్ నుంచి బాధిత కుటుంబాలకు సరైన సమాచారం ఇవ్వడం లేదు. మా పార్టీ అధినేత, ఎంపీ అసరుద్దీన్ ఓవైసీ ఇండియన్ ఎంబసీ, సౌదీ ఎంబసీతో మాట్లాడుతున్నారు. బాధ్యత కుటుంబాలను ఆదుకుంటాం. ప్రతి కుటుంబాన్ని స్వయంగా వెళ్లి కలుస్తాం. మృతదేహాలను ఇక్కడికి రప్పించడంపై సందేహాలు నెలకొన్నాయి. మా బృందం ఒకటి సాయంత్రానికి సౌదీ చేరుకుంటుంది. ఆ తర్వాతే మృతదేహాల తరలింపునకు అవకాశం ఉందా? లేదా? అనే దానిపై క్లారిటీ వస్తుంది. -
సౌదీ ప్రమాదం: మృతి చెందిన హైదరాబాదీలు వీళ్లే..
సౌదీ అరేబియాలో ఘోర బస్సు ప్రమాదంలో ఉమ్రా యాత్రికులు దుర్మరణం పాలయ్యారు. బస్సు డీజిల్ ట్యాంకర్‌ను ఢీ కొట్టి మంటలు చెలరేగడం.. అంతా గాఢ నిద్రలో ఉండడంతో సజీవ దహనం అయ్యారు. వీళ్లంతా భారత్ నుంచే అక్కడికి వెళ్లినట్లు సమాచారం. అయితే మృతులు హైదరాబాద్‌కు చెందిన యాత్రికులే. ‘‘సీఎం ఆదేశాల మేరకు మృతుల వివరాల కోసం సౌదీ ఎంబసీని సంప్రదించాం. ఇప్పటిదాకా అందిన నివేదికల ప్రకారం మృతుల్లో దాదాపు 16 మంది తెలంగాణ వాళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. ’’ అని మంత్రి దుదిళ్ల శ్రీధర్‌బాబు చెబుతున్నారు. Click here for the list of Passengers Detailsహైదరాబాద్ నుంచి మొత్తం 44 మంది యాత్రికులు అక్కడికి వెళ్లారు. మరణించిన 16 మంది మల్లేపల్లి బజార్‌ఘాట్ ప్రాంతానికి చెందిన వాళ్లని తెలుస్తోంది. రహీమున్నీసా, అబ్దుల్ ఖాదీర్ మహమ్మద్, ఫర్హీన్ బేగం, మహ్మద్ మస్తాన్, గౌసియా బేగం, మహ్మద్ మౌలానా, ఫర్వీన్ బేగం, షెహనాజ్ బేగం, షౌకత్ బేగం, మహ్మద్ సోహైల్, జకీన్ బేగం, జహీయా బేగం, మరో నలుగురు మల్లేపల్లి నుంచి వెళ్లినట్లు తెలుస్తోంది. పైన చిత్రాల్లో ఉన్నవాళ్లంతా హైదరాబాద్ నుంచి ఉమ్రా యాత్రకు వెళ్లినవాళ్లే. వీళ్లలో చాలా మంది తమ బంధువుల ఫోన్లకు స్పందించడం లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మరణించిన వివరాలపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. ట్రావెల్ ఏజెన్సీ వద్దకు బంధువులుహైదరాబాద్ నుంచి మొత్తం 44 మంది ఉమ్రా యాత్రకు వెళ్లారు. మల్లేపల్లిలోని అల్ మీనా ట్రావెల్స్ నుంచి 20 మంది, ఫ్లైజోన్స్ ట్రావెల్స్ నుంచి 24 మంది టికెట్లు బుక్ చేసుకున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. ప్రమాదం నేపథ్యంలో ఏజెన్సీల వద్దకు వద్దకు జనాల తాకిడి పెరిగింది. తమ వాళ్లు ఎలా ఉన్నారనే ఆందోళనతో పలువురు అక్కడికి చేరుకుని ఆరా తీస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం.. ఘటన నుంచి బస్సు డ్రైవర్‌తో పాటు హైదరాబాద్‌కు చెందిన షోయబ్ అనే వ్యక్తి సురక్షితంగా బయటపడినట్లు తెలుస్తోంది.ఈ ఘోర ప్రమాదంపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ‘‘ఈ ఘటనపై రియాద్‌లోని భారత రాయబార కార్యాలయంలో డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ అయిన అబూ మాథెన్ జార్జ్‌తో నేను మాట్లాడా. వారు ఈ ఘటనపై సమాచారం సేకరిస్తున్నామని చెప్పారు. హైదరాబాదుకు చెందిన రెండు ట్రావెల్ ఏజెన్సీలను నేను సంప్రదించాను. ప్రయాణికుల వివరాలను రియాద్ ఎంబసీకి, విదేశాంగ కార్యదర్శికి పంపించాను. మృతదేహాలను భారత్‌కు తీసుకురావాలని, ఎవరైనా గాయపడినట్లయితే వారికి తగిన వైద్య చికిత్స అందేలా చూడాలని కేంద్ర ప్రభుత్వాన్ని, ముఖ్యంగా విదేశాంగ మంత్రి డా. ఎస్. జైశంకర్‌ను కోరుతున్నా అని అన్నారు. #WATCH | Delhi | On the bus accident in Saudi Arabia, Hyderabad MP Asaduddin Owaisi says, "...Forty-two Hajj pilgrims who were travelling from Mecca to Medina were on a bus that caught fire...I spoke to Abu Mathen George, Deputy Chief of Mission (DCM) at the Indian Embassy in… pic.twitter.com/z88Pa8GmsS— OTV (@otvnews) November 17, 2025స్పందించిన విదేశాంగ శాఖసౌదీ అరేబియా మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని, తగిన సహాయ సహకారాలు అందిస్తామని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ భరోసా ఇచ్చారు. మరోవైపు.. సౌదీలో జరిగిన బస్సు ప్రమాదంపై ఉన్నతాధికారులు అప్రమత్తం అయ్యారు. జెడ్డాలో ఉన్న కాన్సులేట్ జనరల్, రియాద్‌లోని డిప్యూటీ అంబాసిడర్‌తో సంప్రదింపులు జరుపుతున్నారు. యాత్రికుల వివరాలపై పూర్తి సమాచారం తెలియజేయాలని కోరారు. మరోపక్క.. విదేశీ వ్యవహారాల శాఖ అధికారులతో సమన్వయం చేసుకొని పూర్తి వివరాలు అందజేయాలని ఢిల్లీలో ఉన్న రెసిడెంట్ కమిషనర్, కో ఆర్డినేషన్ సెక్రెటరీకి తెలంగాణ ప్రభుత్వం నుంచి అదేశాలు జారీ అయ్యాయి. -
సౌదీలో ఘోర ప్రమాదం.. హైదరాబాదీలు దుర్మరణం!
సాక్షి, ఢిల్లీ/హైదరాబాద్: సౌదీ అరేబియాలో ఘోర ప్రమాదం సంభవించింది(Saudi Arabia Bus Accident). మక్కా నుండి మదీనాకు ఉమ్రా యాత్రికులతో వెళ్తున్న బస్సు అగ్నికి ఆహుతైంది. ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా కాలిపోయి అందులోని 45 మంది సజీవ దహనం అయ్యారు. మృతులంతా హైదరాబాద్(తెలంగాణ) వాసులేనని తేలింది.స్థానిక కాలమానం ప్రకారం.. ఆదివారం అర్ధరాత్రి దాటాక 1.30గం. ప్రాంతంలో ముఫ్రిహాత్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. డీజిల్ ట్యాంకర్‌ను బస్సు ఢీ కొట్టడంతో రెండు వాహనాలు మంటల్లో చిక్కుకున్నాయి. ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉండడంతో అగ్నికి ఆహుతి అయ్యారు. మక్కా యాత్ర ముగించుకుని మదీనాకు వెళ్తున్న సమయంలో ఈ ఘోరం జరిగినట్లు తెలుస్తోంది. మృతుల్లో 11 మంది మహిళలు, 10 మంది చిన్నారులు ఉన్నట్లు సమాచారం. ప్రమాద స్థలంలో అత్యవసర సేవలు కొనసాగుతున్నాయి. డ్రైవర్‌తో పాటు షోయబ్ అనే యువకుడు ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ప్రస్తుతం యువకుడికి ఐసీయూలో చికిత్స అందుతోంది.సీఎం రేవంత్ దిగ్భ్రాంతిఈ ఘోర ప్రమాదం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. కేంద్రం, సౌదీ ఎంబసీతో మాట్లాడాలని సూచించారు. ఈ నేపథ్యంలో విదేశాంగ మంత్రిత్వ శాఖతో ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు సంప్రదింపులు జరుపుతున్నారు. కంట్రోల్ రూమ్ నెంబర్లు సౌదీలో బస్సు ప్రమాదానికి సంబంధించిన వివరాలు, సహయచ చర్యల వివరాలు తెలుసుకునేందుకు తెలంగాణ సచివాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. బాధిత కుటుంబాలు 24X7 సమాచారం కోసం +91 79979 59754, +91 99129 19545 ఫోన్నెంబర్లను ఆశ్రయించాలని అధికారులు సూచిస్తున్నారు. ఢిల్లీలోని రెసిడెంట్ కమిషనర్‌తో సమన్వయం చేయాలని అధికారులకు ఇప్పటికే సీఎస్ అదేశాలు జారీ చేశారు. జెడ్డా హెల్ప్‌లైన్ నెంబర్ ఇదే.. సౌదీ అరేబియాలో మదీనా సమీపంలో జరిగిన దుర్ఘటనలో భారతీయ ఉమ్రా యాత్రికులు దుర్మరణం పాలయ్యారు. ఈ నేపథ్యంలో జెడ్డాలోని భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయంలో 24x7 కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. టోల్ ఫ్రీ నంబర్: 8002440003 ద్వారా బాధితుల సమాచారం కోసం ఎప్పుడైనా సంప్రదించవచ్చని అధికారులు సూచిస్తున్నారు. -
ట్రంప్, జేడీ వాన్స్ పరస్పరం విభిన్న వ్యాఖ్యలు
అమెరికాలో హెచ్-1బీ నాన్-ఇమ్మిగ్రెంట్ వీసా ప్రోగ్రామ్ ఇటీవల కాలంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. యూఎస్ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ విదేశీ కార్మికుల సమస్యపై సాహసోపేతమైన ప్రకటన చేశారు. విదేశీ ఉద్యోగులను చౌక కార్మికులని పేర్కొనడంతో పాటు అమెరికాకు వారి అవసరం లేదని స్పష్టం చేశారు. సీన్ హన్నిటీతో జరిగిన పాడ్‌కాస్ట్ సంభాషణలో వాన్స్ మాట్లాడుతూ.. డెమొక్రాట్ మోడల్ ప్రకారం.. తక్కువ వేతనాలు తీసుకునే ఎక్కువ మంది విదేశీ ఉద్యోగులు యూఎస్‌లో ఉన్నారని చెప్పారు. ఇది దేశంలోని ఉద్యోగాలు, వేతనాల శ్రేయస్సుకు హాని కలిగిస్తుందని పేర్కొన్నారు. అమెరికన్ కార్మికులను శక్తివంతం చేయడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడంపై దృష్టి పెట్టాలని సూచించారు. తద్వారా వారు అధిక వేతనాలు పొందుతారని, దేశం మెరుగుపడుతుందని తెలిపారు.భారతీయ టెక్నాలజీ రంగం, వైద్య రంగం నిపుణులు, వైట్ కాలర్ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో లబ్ధిదారులుగా ఉన్న హెచ్-1బీ వీసాపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ సంస్కరణల ప్రక్రియ మొదలైంది. ఇది గ్రీన్ కార్డ్, పౌరసత్వం కోసం భారతీయుల మార్గాలను నేరుగా ప్రభావితం చేయనుంది.వీసా సంస్కరణలుసెప్టెంబర్ 2025లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొంతమంది నాన్ ఇమ్మిగ్రెంట్ కార్మికుల ప్రవేశంపై పరిమితి విధించాలని భావించారు. దాంతో హెచ్-1బీ వీసా కార్యక్రమాన్ని సంస్కరించడానికి సిద్ధమయ్యారు. సెప్టెంబర్ 21, 2025 తర్వాత దాఖలు చేసిన కొన్ని హెచ్-1బీ పిటిషన్లకు అర్హత షరతుగా అదనంగా రూ.1,00,000 డాలర్లు చెల్లించాలి. ఈ భారీ రుసుము పెంపు వీసా ప్రోగ్రామ్ లక్ష్యాన్ని, లబ్ధిదారులను గణనీయంగా ప్రభావితం చేయనుంది.ట్రంప్ వైఖరి నుంచి వాన్స్ ‘యూటర్న్’వలస ఉద్యోగులకు సంబంధించి వాన్స్ చేసిన వ్యాఖ్యలు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల తీసుకున్న వైఖరితో భిన్నంగా కనిపిస్తున్నాయి. ట్రంప్ ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. అమెరికాలో నిర్దిష్ట ప్రతిభ ఉన్న కార్మికులు లేరని చెప్పారు. ఆ కొరతను తీర్చడానికి విదేశీ ప్రతిభను తీసుకురావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అయితే, వాన్స్ అభిప్రాయం దీనికి భిన్నంగా ఉంది. ఈ చర్చ అమెరికన్ శ్రామిక శక్తికి కీలకం ఉంది. ఒకవైపు తక్కువ వేతనాల కోసం విదేశీ కార్మికులను తీసుకురావడం ద్వారా దేశీయ ఉద్యోగాలు దెబ్బతింటాయని విమర్శకులు భావిస్తున్నారు. మరోవైపు, ట్రంప్ సూచించినట్లుగా కొన్ని ప్రత్యేక నైపుణ్యాల్లో ఉన్న అంతరాన్ని భర్తీ చేయడానికి, ఆవిష్కరణలను కొనసాగించడానికి, తయారీ రంగంలో శిక్షణ ఇవ్వడానికి హెచ్-1బీ వీసాదారులు అవసరం అని పరిశ్రమ నిపుణులు వాదిస్తున్నారు.ఇదీ చదవండి: ఏడు పవర్ఫుల్ ఏఐ టూల్స్.. -
ఆస్ట్రేలియా ఎన్నారైల మద్దతు చిరస్మరణీయం:లక్ష్మీపార్వతి
సిడ్నీ: వైఎస్సార్సీపీకి మద్దతుగా నిలుస్తున్న ఆస్ట్రేలియా ఎన్నారై వైఎస్సార్సీపీ కార్యకర్తలకు పార్టీ సీనియర్ నాయకురాలు నందమూరి లక్ష్మీపార్వతి అభినందనలు,కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పర్యటనలో ఉన్న ఆమె పార్టీ నాయకుడు చింతల చెరువు సూర్యనారాయణ రెడ్డి ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘పార్టీ కష్టకాలంలో ఉన్న వైఎస్ జగన్‌పై మీరు చూపిన ఆధారాభిమానానికి పార్టీ ఎప్పటికీ కృతజ్ఞతగా ఉంటుంది. మీ మద్దతు చిరస్మరణీయంగా నిలుస్తుంది’అని పేర్కొన్నారు. ‘మీ సహాయ సహకారాలు ఇదే విధంగా కొనసాగాలని ఆకాంక్షిస్తున్నాను. రేపు రాబోయే జగనన్న ప్రభుత్వంలో కార్యకర్తలకు అన్ని విధాలుగా భరోసా ఉంటుంది. పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఎన్నారైలు మాట్లాడుతూ వైఎస్ జగన్ పరిపాలన హయాంలో ప్రజలకు ఎంతో మేలు జరిగిందని గుర్తు చేసుకున్నారు. తమలో చాలామంది మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన పథకాల వల్ల విదేశాల్లో స్థిరపడ్డామని తెలిపారు. ఆ రుణం తీర్చుకునేందుకు మేము ఎల్లప్పుడూ వైఎస్ జగన్‌కు మద్దతుగా ఉంటాం’అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో చింతల చెరువు సూర్యనారాయణ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, వీరం రెడ్డి, గజ్జల చంద్ర ఓబుల రెడ్డి, కోట శ్రీనివాస్ రెడ్డి, దూడల కిరణ్ రెడ్డి, నరెడ్డి ఉమా శంకర్, కృష్ణ చైతన్య కామరాజు, నల్ల జగదీశ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆస్ట్రేలియాలో లక్ష్మీపార్వతికి వైఎస్సార్సీపీ శ్రేణుల ఘనస్వాగతం
ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతికి అక్కడ వైఎస్సార్సీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. లక్ష్మీపార్వతికి నాయకులు చింతలచెరువు సూర్యనారాయణ రెడ్డి ,గజ్జల చంద్ర ఓబుల రెడ్డి,వీరం రెడ్డి శ్రీధర్ రెడ్డి ,దూడల కిరణ్ రెడ్డి, కామరాజు కృష్ణ చైతన్య ,కోటా శ్రీనివాసరెడ్డి, దుగ్గింపుడి కిరణ్ రెడ్డి, సిద్ధన సురేష్ రెడ్డి తదితరులు ఘనస్వాగతం పలికారు. ప్రస్తుతం బ్రిస్బేన్‌లో ఉన్న లక్ష్మీపార్వతి.. వారం రోజుల పాటు ఆస్ట్రేలియాలోనే ఉంటారు. అక్కడ వివిధ నగరాల్లో జరిగే ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమాకు ఆమె హాజరుకానున్నారు. -
అమెరికాలో అందెశ్రీకి ఘన నివాళి
ప్రజా కవి, గాయకుడు అందెశ్రీ అకాల మృతిపై అమెరికాలో ఘన నివాళి అర్పించారు. నార్త్ కరోలినా ఛార్లెట్ లో స్థిరపడిన తెలంగాణ ప్రవాసులు అందెశ్రీ మాట, పాటలను స్మరించుకున్నారు.తెలంగాణ భూమి పుత్రుడిగా, నిస్వార్థ స్వరాష్ట్ర సాధన స్వాప్నికుడిగా అందెశ్రీని తెలంగాణ సమాజం కలకాలం గుర్తుపెట్టుకుంటుందని ఎన్.ఆర్.ఐ లు అభిప్రాయపడ్డారు. ఉద్యమ సమయంలో, ఆ తర్వాత కూడా ఆయన ప్రవాసులతో అత్మీయ అనుబంధాన్ని కొనసాగించారని కొనియాడారు.అందెశ్రీ రచనలు, ఆయన గాత్రం చరిత్రలో నిలిచిపోయేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రవాసులు కోరారు. రానున్న తరాలకు ఆయన రచనలు పరిచయం అయ్యేలా పాఠ్య పుస్తకాల్లో చేర్చటంతో పాటు, అందెశ్రీ పేరుపై రాష్ట్ర స్థాయిలో డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే ప్రత్యేక స్మృతివనం ఏర్పాటు చేయాలని ఈ సమావేశానికి హాజరైన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) – ఎన్ఆర్ఐ సెల్ కన్వీనర్ వై. నరేందర్ రెడ్డికి విన్నవించారు.అందెశ్రీని స్మరించుకోవటంతో పాటు, నివాళులు అర్పించిన ఈ కార్యక్రమంలో తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA) అధ్యక్షుడు నవీన్ రెడ్డి మలిపెద్ది, కోర్ టీం సభ్యుడు, చార్లెట్ చాప్టర్ దిలీప్ రెడ్డి స్యాసని, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ నరేంద్ర దేవరపల్లి, గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ (GTA) చార్లెట్ చాప్టర్ అధ్యక్షుడు కదిరి కృష్ణ, చార్లెట్ తెలంగాణ అసోసియేషన్ (CTA) కార్యదర్శి ప్యారం పుట్టలి, తెలంగాణ ఎన్ఆర్ఐ ప్రముఖుడు పవన్ కుమార్ రెడ్డి కొండ, స్థానిక తెలంగాణ ప్రవాసులు హాజరయ్యారు. -
మా అమ్మ రష్యాలో సెలబ్రిటీ..! మురిసిపోతున్న కుమారుడు..
ఒక వ్యక్తి నెట్టింట షేర్ చేసిన వీడియో నెటిజన్లను తెగ ఆకర్షించింది. అలాంటి క్షణం అత ఈజీగా మర్చిపోలేం కదూ..ఒక్కసారిగా స్టార్డమ్ వచ్చిన ఫీలింగ్ వస్తుంది కదూ అని కామెంట్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు నెటిజన్లు. అసలేం జరిగిందింటే..శుభం గౌతమ్ అనే వ్యక్తి ఒక వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో అప్లోడ్ చేశారు. "నా అమ్మ రష్యాలో సెలబ్రిటీ" అనే క్యాప్షన్‌తో షేర్ చేయడంతో మరింత వైరల్‌గా మారింది. ఆ వీడియోలో అతడు తన తల్లితో రష్యా వీధుల్లోకి రాగానే.. సంప్రదాయ దుస్తుల్లో ఉన్న ఆ తల్లిని చూసి రష్యన్ ప్రజలు ఆశ్చర్యపోవడమే కాదు..ఒక్క సెల్ఫీ అంటూ ఎగబెట్టారు. ఏదో సెలబ్రిటీ మాదిరిగా అంతా దగ్గరకు వచ్చి ఫోటోలు దిగుతుంటే..మా అమ్మకు ఒక్కసారిగా ఎంత క్రేజ్ పెరిగిపోయిందో అంటూ మురిసిపోయాడు ఆమె కుమారుడు. విదేశాల్లో మన సంప్రదాయ దుస్తులో గనుక మనం కనిపిస్తే కచ్చితంగా ప్రత్యేకంగా నిలబడటమే గాక, అందరి దృష్టిని ఆకర్షిస్తాం..అందుకు ఈ తల్లే నిదర్శనం. అంతేగాదు ఆమె కొడుకు నా తల్లి రష్యాకు ఇష్టమైన సెలబ్రిటీ అని వీడియోలో చెబుతుండటం స్పష్టంగా వినిపిస్తుంది. ఆమె కూడా అక్కడి వాళ్ల రియాక్షన్‌కు సంభ్రమాశ్చర్యాలకు లోనవ్వుతూ వారితో సెల్ఫీలు దిగడం స్పష్టంగా కనిపిస్తుంది వీడియోలో. భారతదేశం వెలుపల మన దేశ సంస్కృతిని ప్రతిబింబించేలా దుస్తులు దరిస్తే..అవి మనల్ని ప్రత్యేకంగా నిలబడేల చేయడమే గాక, రియల్ సెలబ్రిటీకి అర్థం చెప్పేలా మనల్ని నిలబెడతాయి కూడా. ఈ వీడియోకి లక్షల్లో వ్యూస్ రావడమే కాదు..ఆ తల్లి నిజంగా భారతదేశ బ్రాండ్ అంబాసిడర్ అని ప్రేమగా పిలుస్తూ పోస్టులు పెట్టారు నెటిజన్లు. View this post on Instagram A post shared by Shubham Gautam (@samboyvlogs) (చదవండి: సాత్విక ఆహారంతో బరువు తగ్గగలమా..? నటి, గాయని షెహ్నాజ్ సైతం..) -
జపాన్‌లో 'తాజ్' ఆధ్వర్యంలో ఘనంగా కార్తీక వనభోజనాలు
తెలుగువారు ఏ దేశంలో ఉన్న వారి సంస్కృతి, సంప్రదాయాలను చాటి చెప్పడంలో ఎపుడు ముందుంటారు. అందుకు నిదర్శనం జపాన్‌లో టోక్యో నగరంలో తెలుగు అసోసియేషన్ అఫ్ జపాన్ (తాజ్) అధ్వర్యంలో జరిగిన కార్తీక మాసం వనభోజనాలు. నవంబర్ 8న ఈ వేడుక స్థానిక కొమట్సుగవ పార్కులో ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమంలో పిల్లలు, పెద్దలు అందరు పాల్గొని ఆట పాటలతో సరదాగా గడిపారు. ఒక్కో కుటుంబం నుంచి ఒక్క తినుబండారం తెచ్చి వనభోజన కార్యక్రమం నిర్వహించడం విశేషం. ప్రతి ఏటా ఇలాగే వేడుక జరుపుకోవాలని వారంతా ఆకాంక్షించారు. (చదవండి: ఆటా, ఎస్ఏఐ ఆధ్వర్యంలో స్టూడెంట్స్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్) -
టెక్సాస్‌లో కారంచేడు యువతి మృతి
బాపట్ల జిల్లా: ఆమె ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లింది. తన డిగ్రీ పూర్తిచేసి మంచి ఉద్యోగం కోసం ఎదురుచూస్తోంది. ఇంతలోనే మృత్యువు కబళించింది. ఛాతీలో నొప్పి, దగ్గు ఉన్నా పెద్దగా లెక్కచేయలేదు. దీంతో.. ఎప్పటిలాగే పడుకున్న ఆమె మరుసటి రోజు లేవలేదు. స్నేహితులు గుర్తించి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. ఈ సంఘటన శుక్రవారం సాయంత్రం అమెరికాలోని టెక్సాస్‌లో చోటుచేసుకుంది. వివరాలివీ..బాపట్ల జిల్లా కారంచేడు గ్రామంలో చిన్న వ్యవసాయ కుటుంబానికి చెందిన యార్లగడ్డ రామకృష్ణ, వీణాకుమారిలకు ఒక కుమారుడు, ఒక కుమార్తె. కుమార్తె యార్లగడ్డ రాజ్యలక్ష్మి (23) ఇంజినీరింగ్ అయిన తరువాత ఎంఎస్ చేసేందుకు అప్పులుచేసి కుమార్తెను అమెరికాకు పంపించారు. తను కూడా ఎంతో కష్టపడి చదివి మాస్టర్స్ డిగ్రీ పొందింది. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న ఆమెకు రెండు, మూడ్రోజులుగా దగ్గు, ఛాతీలో నొప్పి వచి్చనా పెద్దగా పట్టించుకోలేదు. దీంతో ఆమె శుక్రవారం నిద్రలోనే మృతిచెందినట్లు తెలుస్తోంది. రాజ్యలక్ష్మి మృతి తల్లిదండ్రులతో పాటు, స్థానికులను కూడా కలచివేసింది. ఆమె మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఎంతో కష్టపడి తనను మంచి స్థాయిలో చూడాలని ఆశపడిన తల్లిదండ్రుల కల నెరవేర్చకుండానే తనువు చాలించిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తంచేశారు. మృతదేహాన్ని అమెరికా నుంచి తీసుకురావడానికి కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడుతున్నారు. -
ఫీనిక్స్‌లో సాంస్కృతిక వేడుకలు.. శంకర నేత్రాలయ యూఎస్ఏకు భారీ విరాళం
మెసా(అరిజోనా): ఫీనిక్స్‌లోని భారతీయ యువత ఆధ్వర్యంలో మెసా ఆర్ట్స్ సెంటర్లోని వర్జీనియా జి. పైపర్ రిపర్టరీ థియేటర్ వేదికగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమం, హాస్య ప్రదర్శన ప్రేక్షకులను అలరించడమే కాకుండా.. సేవా సంకల్పానికి నిదర్శనంగా నిలిచింది. ఈ వేడుక ద్వారా శంకర నేత్రాలయ యూఎస్ఏ నిర్వహించే గ్రామ దత్తత కార్యక్రమం కోసం 1,45,000 డాలర్లు విరాళంగా సమీకరించబడ్డాయి.“డాన్స్ ఫర్ విజన్” కార్యక్రమంలో 160 మంది యువ కళాకారులు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల నృత్య రూపకాలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. యువ నాయకులు యోగాంశ్, విశాల్, జోషిత, ఆదిత్య తదితరులు సమర్థంగా కార్యక్రమాన్ని నడిపారు. మహిళా కమిటీ సమన్వయంతో నిర్వహణ విజయవంతమైంది. నృత్య గురువులకు సన్మాన పతకాలు, విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేశారు.దాతలకు సన్మానంగ్రామ దత్తత కార్యక్రమానికి ముఖ్యంగా పది మంది దాతలు తమ విరాళాలతో మద్దతు అందించారు. వీరిని వేదికపై ఘనంగా సన్మానించారు. వారి సేవా దృక్పథం, అరిజోనా బృందం సమిష్టి కృషికి పలువురు అభినందనలు తెలిపారు.హాస్యంతో హృదయాల హరివిల్లు“విజన్ కోసం నవ్వులు” పేరుతో రామ్‌కుమార్ నిర్వహించిన తమిళ స్టాండ్‌అప్ హాస్య ప్రదర్శన ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించింది. కార్యక్రమం అనంతరం ఆయన అభిమానులతో ఫొటోలు దిగారు, శాలువా, సత్కార పతకంతో సన్మానితులయ్యారు.శంకర నేత్రాలయ సేవా లక్ష్యం1978లో ప్రారంభమైన శంకర నేత్రాలయం, గ్రామీణ భారతదేశంలో కంటి చికిత్స అందించడంలో అగ్రగామిగా నిలుస్తోంది. 1988లో స్థాపితమైన శంకర నేత్రాలయ యూఎస్ఏ, మెసు ద్వారా మొబైల్ నేత్ర శిబిరాలు నిర్వహిస్తూ, గ్రామీణ ప్రాంతాల్లో కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తోంది.నిర్వాహకుల కృషివంశీ కృష్ణ ఇరువారం, ఆది మోర్రెడ్డి, శ్రీని గుప్తా, డాక్టర్ రూపేష్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమ విజయానికి కీలకంగా వ్యవహరించారు. స్థానిక నాయకులు, స్వచ్ఛంద సేవకులు, కళాకారులు, గాయకులు, నృత్య పాఠశాలలు అందరూ తమదైన పాత్ర పోషించారు. ఈ సందర్భంగా.. టికెటింగ్, ప్రచారం, ఫోటోగ్రఫీ, ఫ్లయర్ రూపకల్పన వంటి విభాగాల్లో సహకరించిన ప్రతి ఒక్కరికి నిర్వాహకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. చివరగా, పాల్గొన్నవారందరికీ భోజన పెట్టెలు అందజేయడం ద్వారా కార్యక్రమాన్ని ముగించారు. -
అక్కడా మన వైద్యులే!
అభివృద్ధి చెందిన దేశాల్లోని వైద్య రంగంలో మన భారతీయ వైద్యులు, నర్సులు వెన్నెముకగా నిలిచారు. ఈ దేశాల్లో పనిచేస్తున్న వైద్యుల సంఖ్య పరంగా తొలి స్థానంలో, నర్సుల సంఖ్యలో రెండవ స్థానంలో నిలిచి భారత్ తన హవాను కొనసాగిస్తోంది.ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగంలో భారతీయుల సత్తా ప్రపంచానికి తెలియనిది కాదు. ఒక్క ఐటీ నిపుణులే కాదు.. మన వైద్య నిపుణులకూ ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. అభివృద్ధి చెందిన దేశాల్లోని ఆరోగ్య వ్యవస్థలకు భారతీయ వైద్య నిపుణులు ముఖ్య భూమిక పోషిస్తున్నారని ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో–ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ (ఓఈసీడీ) విడుదల చేసిన ఇంటర్నేషనల్ మైగ్రేషన్ అవుట్‌లుక్–2025 నివేదిక వెల్లడించింది. అమెరికా, కెనడా, యూరోపియన్ దేశాలు, ఆస్ట్రేలియాతో సహా 38 ఓఈసీడీ సభ్య దేశాలు ఆరోగ్య సంరక్షణ సిబ్బంది కోసం ఇతర దేశాలపై ఆధారపడటం పెరుగుతోందని తెలిపింది. మనమే టాప్ఓఈసీడీ సభ్య దేశాల్లో ఇతర దేశాలకు చెందిన 8.30 లక్షల మంది వైద్యులు, 17.5 లక్షల మంది నర్సులు విధులు నిర్వర్తిస్తున్నారు. 38 ఓఈసీడీ సభ్య దేశాల్లోని మొత్తం వైద్యుల్లో 25 శాతం, నర్సుల్లో ఆరింట ఒక వంతు ఇతర దేశాలకు చెందినవారు. వైద్యుల్లో 40%, నర్సుల్లో 37% మంది ఆసియాకు చెందినవారు కావడం విశేషం. ఓఈసీడీ దేశాల్లో సేవలు అందిస్తున్న వైద్యుల విషయంలో సంఖ్య పరంగా భారత్, జర్మనీ, చైనా టాప్–3లో నిలి^éయి. ఇక నర్సుల విషయంలో ఫిలిప్పీన్స్, భారత్, పోలాండ్ మొదటి మూడు స్థానాలను కైవసం చేసుకున్నాయి. ఐదుగురు వైద్యులు, నర్సులలో ఒకరు యూరోపియన్ ఎకనామిక్ ఏరియాకు (ఈఈఏ) చెందినవారు.ఆ నాలుగు దేశాలేవిశ్వవిద్యాలయాలు, కళాశాలలు, వృత్తిపరమైన ఉన్నత విద్యా కార్యక్రమాలలో 18 లక్షల నూతన విద్యార్థులకు 2024లో ఓఈసీడీ దేశాలు ఆతిథ్యం ఇచ్చాయి. యునైటెడ్ స్టేట్స్ 3.90 లక్షలు, యునైటెడ్ కింగ్డమ్ 3.84 లక్షల మంది విద్యార్థులకు అనుమతులను జారీచేసి అగ్రగామిగా నిలిచాయి. కెనడా 2.13 లక్షలు, ఆస్ట్రేలియా 1.82 లక్షల మంది విద్యార్థులతో ఆ తరువాతి స్థానాల్లో ఉన్నాయి.ప్రధాన దేశంగా..చాలా కాలంగా ఓఈసీడీ దేశాలకు వలస వెళ్తున్నవారిలో అత్యధికులు భారత్, చైనాకు చెందినవారే. కోవిడ్–19 మహమ్మారి సమయంలో ప్రధాన దేశంగా ఉన్న చైనాను అధిగమించి 2023 వరకు కూడా భారత్ ఆధిక్యంలో కొనసాగింది. ఆ ఏడాది దాదాపు 6,00,000 మంది భారతీయ పౌరులు ఓఈసీడీ సభ్య దేశాలకు వలస వెళ్లారు. 2022తో పోలిస్తే ఈ సంఖ్య 8% పెరిగింది.నలుగురిలో ఒకరు బ్రిటన్‌కు2023లో భారత్ నుంచి వలసదారులలో దాదాపు నలుగురిలో ఒకరు యునైటెడ్ కింగ్డమ్ను (1,44,000) ఎంచుకున్నారు. ఇందులో 97,000 మంది ఆరోగ్య, సంరక్షణ కార్మిక వీసాలపై వెళ్లారు. కెనడాలో 2023లో 1,40,000 మంది అడుగుపెట్టారు. యునైటెడ్ స్టేట్స్కు 68,000 మంది భారతీయులు ఉపాధి కోసం వలస వెళ్లారు.75వేల డాక్టర్లు మనవాళ్లే2021–23 మధ్య.. ఓఈసీడీ సభ్య దేశాల్లో పనిచేస్తున్న 6.06 లక్షల మంది విదేశీ వైద్యుల్లో 12 శాతం (75,000) మంది భారతీయ డాక్టర్లు. అలాగే 7.33 లక్షల మంది విదేశీ నర్సుల్లో 17 శాతం మంది (1.22 లక్షలు) భారతీయ నర్సులు కావడం విశేషం. అత్యధిక డాక్టర్లు యూకేలో, అత్యధిక నర్సులు యూఎస్‌లో ఉన్నారు. -
రష్యాలో ఇండియా విద్యార్థి అదృశ్యం : విషాదాంతం
రష్యాలో గత కొన్ని రోజులుగా కనిపించకుండా పోయిన భారతీయ MBBS విద్యార్థి కథ విషాదాంతమైంది. రాజస్థాన్‌లోని అల్వార్‌కు చెందిన 22 అజిత్ సింగ్ చౌదరి మృతదేహం ఆనకట్టలో లభ్యమైంది. దీంతో బాధిత విద్యార్థి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.రష్యాలో దాదాపు మూడు వారాలుగా తప్పిపోయిన వైద్య విద్యార్థి అజిత్ సింగ్ చౌదరి మృతదేహాన్ని ఉఫా నగరంలోని ఆనకట్ట సమీపంలో గుర్తించారు. మాస్కోలోని భారత రాయబార కార్యాలయం ఈ సంఘటన గురించి కుటుంబ సభ్యులకు , అల్వార్‌లోని స్థానిక ప్రతినిధులకు సమాచారం అందించింది.అజిత్ సింగ్ చౌదరి 2023 నుండి రష్యాలోని బష్కిర్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో M ఎంబీబీఎస్ డిగ్రీ చదువుతున్నాడు. అక్టోబర్ 19న ఉదయం 11 గంటల ప్రాంతంలో తన హాస్టల్ నుండి బయటకు వచ్చిన తర్వాత అజిత్ అదృశ్యమయ్యాడు. పాలు కొనుక్కుని అరగంటలోపు తిరిగి వస్తానని స్నేహితులకు చెప్పి వెళ్లిన అతను ఎంతకీ తిరిగిరాకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు.స్థానిక అధికారులు వైట్ నది సమీపంలో అతని బట్టలు, ఫోన్ ,బూట్లు కనుగొన్నారు. పంతొమ్మిది రోజుల తరువాత, అదే నదికి ఆనుకుని ఉన్న ఆనకట్ట వద్ద అజిత్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.తోటి విద్యార్థులు మృతదేహాన్ని గుర్తించారు పోస్ట్‌మార్టం అనంతరం అతని మృతదేహాన్ని ఇండియాకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. భారత రాయబార కార్యాలయం, రష్యన్ అధికారుల మధ్య సమన్వయంతో స్వదేశానికి తిరిగి పంపే ప్రక్రియ రెండు మూడు రోజుల్లో పూర్తి కావచ్చని అధికారులు తెలిపారు.చదవండి: నటికి జర్నలిస్టు అవమానకర ప్రశ్న : సిగ్గుచేటంటూ నెటిజన్లు ఫైర్కన్నీరుమున్నీరవుతున్న కుటుంబం అజిత్ అనుమానాస్పద మరణంతో అజిత్ తల్లిదండ్రులు రూప్ సింగ్ ,సాంత్రా దేవి శోకానికి అంతులేకుండా పోయింది. వైద్యవిద్య కోసం మూడెకరాల భూమి అమ్మినట్టు బంధువులు తెలిపారు. ఎన్నో కలలతో అజిత్‌ను విదేశాలకు పంపించాం, కానీ మనిషినే కోల్పోతామని అనుకోలేదంటూ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీ రవుతున్నారు. ఎలా చనిపోయాడనే దానిపై వివరణాత్మక దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.మరోవైపు అజిత్ గ్రామస్తులను కూడా దిగ్భ్రాంతికి గురిచేసింది. అజిత్ అదృశ్యం పట్ల త్వరగా స్పందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అతని మృతదేహాన్ని త్వరగా తిరిగి తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరుతూ కమ్యూనిటీ సభ్యులు అల్వార్ జాట్ హాస్టల్లో సమావేశం నిర్వహించారు.దీనిపై కాంగ్రెస్ నాయకుడు జితేంద్ర సింగ్ అల్వార్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఏదో అనుమానాస్పదంగా అనిపిస్తోందంటూ ట్వీట్ చేశారు. మృతదేహాన్ని తరలించేలా ఏర్పాటు చేయాలనీ, దీనిపై సమగ్ర దర్యాప్తు చేయాలని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌ను కోరారు. ఇదీ చదవండి: Betting App Case: శిఖర్ ధావన్, రైనాపై సజ్జనార్ ఆగ్రహం -
NRI భాస్కర్‌రెడ్డి అక్రమ అరెస్ట్.. పోలీసుల ఓవరాక్షన్!
NRI భాస్కర్ రెడ్డి అరెస్ట్ అప్డేట్స్...విజయవాడ..విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో ఎన్నారై భాస్కర్ రెడ్డి, అతని సోదరుడు ఓబుల్ రెడ్డికి ముగిసిన వైద్య పరీక్షలువైద్య పరీక్షల అనంతరం విజయవాడ ప్రభుత్వాసుపత్రి నుంచి కోర్టుకు తరలింపుకోర్టుకు తీసుకొచ్చిన సమయంలో నడవలేని స్థితిలో భాస్కర్ రెడ్డితనను పోలీసులు తీవ్రంగా కొట్టారంటున్న భాస్కర్ రెడ్డిసోషల్ మీడియా పోస్టుల కేసుతో పాటు భాస్కర్ రెడ్డిపై మరో అక్రమ కేసు నమోదు చేసిన పోలీసులు.సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టానని ఒప్పుకోవాలంటూ కోర్టు ప్రాంగణంలో భాస్కర్ రెడ్డిపై పోలీసుల ఒత్తిడిపోలీసుల బెదిరింపులపై ఆగ్రహం వ్యక్తం చేసిన భాస్కర్ రెడ్డి👉కూటమి ప్రభుత్వం ఎన్నారైలపై కూడా కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. ఎన్నారైలపై రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ వేధింపులకు గురిచేస్తోంది. తాజాగా వైఎస్సార్సీపీకి అనుకూలంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న ఓ ఎన్నారైను అక్రమంగా అరెస్ట్ చేసింది. దీంతో, ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.👉వివరాల ప్రకారం.. మాలపాటి భాస్కర్ రెడ్డి లండన్‌లో సూపర్ మార్కెట్ నిర్వహిస్తున్నారు. భాస్కర్ రెడ్డి స్వగ్రామం కృష్ణాజిల్లా పెనమలూరు మండలంలోని చోడవరం. అయితే, భాస్కర్ రెడ్డి సోషల్ మీడియాలో వైఎస్సార్సీపీకి అనుకూలంగా పోస్టులు పెడుతుంటారు. ఈ నేపథ్యంలో భాస్కర్ రెడ్డిని టార్గెట్ చేసిన కూటమి సర్కార్ ఆయనపై కక్ష సాధింపు చర్యలకు దిగింది. ఈనెల ఒకటో తేదీన తన తండ్రి మరణంతో భాస్కర్ రెడ్డి.. లండన్ నుంచి స్వగ్రామం చోడవరం చేరుకున్నారు.👉అనంతరం, వైద్య పరీక్షల కోసం తాడిగడపలోని కామినేని ఆసుపత్రికి భాస్కర్ రెడ్డి వెళ్లారు. ఈ క్రమంలో మఫ్టీలో వచ్చిన పోలీసులు.. భాస్కర్ రెడ్డితో పాటు అతని సోదరుడు ఓబుల్ రెడ్డిని కూడా అరెస్టు చేశారు. అయితే, ఏ కేసులో తనను అరెస్ట్ చేశారో.. ఎక్కడికి తీసుకువెళ్లారో అనే కనీస సమాచారం కూడా భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యులకు పోలీసులు ఇవ్వలేదు. అరెస్ట్‌పై ప్రశ్నిస్తే పెనమలూరు పోలీసులు నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నారు. ఇక, తాజాగా వారిద్దరినీ వైద్య పరీక్ష నిమిత్తం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి పోలీసులు తీసుకువచ్చారు. -
వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా హైదరాబాదీ
సాక్షి, హైదరాబాద్: అమెరికా రాజకీయాల్లో మన హైదరాబాదీ మెరిశారు. వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా న్యూ మలక్పేటవాసి గజాలా హష్మీ గెలుపొంది చరిత్ర స్పష్టించారు. తొలిసారి ముస్లిం మహిళ అమెరికాలో రాజ్యాంగ పదవిలోకి రావడం ద్వారా సరికొత్త రికార్డు నమోదు చేశారు. వర్జీనియా సెనేట్‌లో పనిచేసిన తొలి ముస్లిం, తొలి దక్షిణాసియా అమెరిక¯న్గా ఆమె ఇప్పటికీ కీర్తి సాధించారు. గజాలా విజయం ఆమె కుటుంబ సభ్యులను ఆనందంలో ముంచెత్తింది. చిన్నప్పటి నుంచే చురుగ్గా ఉండే గజాలా.. సామాజిక రంగంలోనూ పేరొందారని ఆమె సోదరి డాక్టర్ రసియా హష్మీ ‘సాక్షి’కి చెప్పారు. తమ కుటుంబ ప్రతిష్టతోపాటు హైదరాబాద్ విశిష్టతను కూడా తన సోదరి నిలబెట్టారని ఆమె హర్షం వ్యక్తం చేశారు. ఐదేళ్ల క్రితం హైదరాబాద్‌లో పర్యటించారని, చారిత్రక ప్రదేశాలను సందర్శించారని గుర్తు చేసుకున్నారు. హైదరాబాద్‌తో అనుబంధం ఇలా... జియా హష్మీ–తన్వీర్ హష్మీ దంపతులకు గజాలా జూలై 5, 1964లో జని్మంచారు. తన బాల్యాన్ని మలక్‌పేటలోని అమ్మమ్మ ఇంట్లో గడిపారు. నాలుగేళ్ల వయసులో తన తల్లి, సోదరుడితో కలిసి అమెరికాలోని జార్జియాకు వలస వెళ్లారు. ఆమె తండ్రి అంతర్జాతీయ వ్యవహారాల్లో పీహెచ్డీ పూర్తి చేసి, ఓ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేశారు. గజాలా జార్జియా సదరన్ విశ్వవిద్యాలయం నుంచి బీఏ ఆనర్స్ పూర్తి చేసి, అట్లాంటాలోని ఎమరీ విశ్వవిద్యాలయం నుంచి సాహిత్యంలో పీహెచ్డీ పట్టా పొందారు. గజాలా వివాహం హైదరాబాద్‌కు చెందిన అమెరికాలోనే నివసించే అజహర్ రఫీక్‌తో జరిగింది. వీరికి ఇద్దరు అమ్మాయిలు. అజహర్ ప్రస్తుతం నాసాలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. 1991లో రిచ్మండ్ ప్రాంతానికి వెళ్లారు.రేనాల్డ్స్ కమ్యూనిటీ కళాశాలలో 30 ఏళ్ల పాటు ప్రొఫెసర్‌గా పనిచేసి.. వేలాది మంది విద్యార్థులకు గజాలా మార్గదర్శకత్వం వహించారు. విద్యారంగంలో చేసిన సేవలు ఆమె రాజకీయ ప్రవేశానికి పటిష్టమైన పునాదిగా నిలిచాయి. ప్రొఫెసర్‌గా సుదీర్ఘ అనుభవం తర్వాత.. గజాలా 2019లో తొలిసారిగా అమెరికా ఎన్నికల్లో గెలుపొందారు. గజాలాకు సీఎం అభినందనలు వర్జీనియా రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన డెమోక్రటిక్ పార్టీ నేత గజాలా హష్మీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. హైదరాబాద్‌లో జని్మంచిన గజాలా ఆ తర్వాత కాలంలో అమెరికాలో స్థిరపడి ఈ ఘనత సాధించారని కొనియాడారు.


