శెభాష్‌ బామ్మ..! ఆ ధైర్యమే అందరికీ కావాల్సింది.. | Elderly Kerala woman stands in front of moving scooter on footpath | Sakshi
Sakshi News home page

శెభాష్‌ బామ్మ..! ఆ ధైర్యమే అందరికీ కావాల్సింది..

Feb 13 2026 11:06 AM | Updated on Feb 13 2026 11:51 AM

Elderly Kerala woman stands in front of moving scooter on footpath

కొన్ని విషయాలు చూడటానికి సాధారణ చిన్న చిన్న తప్పులుగా కనిపిస్తున్నా ..అవే ఒకరకంగా ఘోర ప్రమాదాలకు మూలం కూడా. పోనీలే అని వదిలేయడం కూడా ఒక కారణం. ఎవ్వరు అనడం లేదు కదా మనం ఒక్కరమే వ్యతిరేకించడం దేనికని వదిలేస్తుంటాం. కానీ కొందరు విభిన్నంగా ఉంటారు. డిఫెరెంట్‌గా ఆలోచించడమే కాదు..ఒక్కరిగా.. హీరోలా వీరోచితంగా పోరాడి శెభాష్‌ అని ప్రశంసలందుకుంటారు. ఔను కదా..! మనమెందుకు అలా చేయలేకపోయాం అని ఆలోచింపచేసేలా స్ఫూర్తిని కలిగిస్తారు కూడా. 

ఇంతకీ ఏం జరిగిందంటే..కేరళకు చెందిన ఓ వృద్ధ మహిళ రద్దీగా ఉండే రోడ్డుకి ఒకపక్కను ఉన్న ఫుట్‌పాత్‌పై నడుస్తుంటుంది. ఇంతలో ఒక ద్విచక్ర వాహనదారుడు స్కూటీపై దర్జాగా ఫుట్‌పాత్‌పై వచ్చేస్తుంటాడు. అది గమనించిన మహిళ అతడిని వెళ్లనివ్వకుండా అడ్డగిస్తుంది. పాదాచారులు నడవకుండా మీది నుంచి వెళ్లిపోతావా అని అరుస్తూ అతడిని వెళ్లనివ్వకుండా అడ్డుకునే యత్నం చేస్తుంది. 

ఇక్కడ ఆ స్కూటర్‌ రైడర్‌ కూడా ఏదో విధంగా ఆమెను తప్పించి వెల్లిపోయే సాహసం చేస్తుంటాడు ఓ పక్కన. అయితే ఆ వృద్ధ మహిళ ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా అతడి స్కూటర్‌ని ఫోటోతీసి భయపెట్టి ప్రయత్నం చేస్తుండగా..దెబ్బకు చేసేది లేక వెనక్కి తగ్గి.. నెమ్మదిగా స్కూటర్‌ని టర్న్‌ చేసుకుంటూ రోడ్డ మీదకు వెళ్లిపోతాడు. చివర్లో బొటనవేలుని చూపిస్తూ..యాహు గెలిచా..! అన్నట్లుగా చిరునవ్వు చిందించింది ఆ బామ్మ. 

అలా మనలో ఎంతమంది సాహసం చేయగలం అని ఆలోచిస్తే..సమాధానమే రాదు కదా..!. నిజానికి మనందరికీ కావాల్సింది ఇలాంటి ధైర్యమే అప్పుడు పెను రోడ్డు ప్రమాదాలను కొంతైనా నివారించగలుగుతాం. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. కానీ చాలామంది అవతల వ్యక్తి దూకుడుగా ప్రవర్తిస్తే మనం ఇబ్బదుల్లో పడే అవకాశం లేకపోలేదు కదా అని ప్రశ్నిస్తున్నారు. చాలామటుకు ఇలా చేయడం వల్ల కాస్త భయంతో అయినా..అలా ఫుట్‌పాత్‌పై వెళ్లేందుకు జంకుతారని కొందరు వాదిస్తూ పోస్టులు పెట్టారు. 

కాగా, ఫుట్‌పాత్‌పై ద్విచక్ర వాహనాన్ని నడపడం చట్టవిరుద్ధం. ఫుట్‌పాత్‌లు కేవలం పాదచారుల కోసం మాత్రమే. దీన్ని ఉల్లంఘిస్తే..జరిమానా, ఆరు నెలల పాటు లైసెన్స్‌ సస్పెండ్‌ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే అక్కడ కేరళ మోటార్ వాహనాల నియమాలు, 1989 ప్రకారం, ఫుట్‌పాత్‌పై ద్విచక్ర వాహనాన్ని నడపడం చట్టవిరుద్ధం కూడా.

 

(చదవండి: గిఫ్ట్‌గా 24 క్యారెట్ల బంగారు బిస్కెట్లు..! ఎక్కడంటే..)

 

Advertisement
 
Advertisement
Advertisement