breaking news
Sagubadi
-
Sagubadi: కుండీలోనే అల్లం పండించండి.. ఈ టిప్స్ పాటిస్తే చాలు!
మిద్దె/పెరటి తోటల్లో అల్లం పెంచడం చాలా సులభం. గ్రో బ్యాగులు లేదా కుండీలలో, తక్కువ స్థలంలోనే ఎక్కువ అల్లం పండించుకోవచ్చు.1. మొలకలు వచ్చి ఉన్న తాజా, లావు΄ాటి అల్లం దుంపలను తీసుకోవాలి. 2. 10–12 అంగుళాల లోతు, వెడల్పు ఉన్న కుండీలు లేదా గ్రో బ్యాగులు ఉత్తమం. నీరు బయటకు పోవడానికి రంధ్రాలు ఉండాలి.3. 40% తోట మట్టి + 30% వర్మీ కంపోస్ట్/పశువుల ఎరువు + 20% ఇసుక/ వరి పొట్టు+10% వేప పిండి కలిపి మిశ్రమం సిద్ధం చేసుకోవాలి.4. అల్లం దుంపను చిన్న చిన్న ముక్కలుగా (ప్రతి ముక్కకు కనీసం 1–2 మొలకలు ఉండేలా) కత్తిరించాలి. కత్తిరించిన ముక్కలను 1–2 రోజులు నీడలో ఆరబెట్టాలి.5. కుండీలో మట్టి నింపి, మొలకలు పైకి ఉండేలా 2–3 అంగుళాల లోతులో దుంపలను నాటాలి.6. ఏప్రిల్/ మే నెలలో నాటుకోవాలి. ఏప్రిల్/మే నెలల్లో నాటితే, డిసెంబర్ నుండి ఫిబ్రవరి మధ్యలో తీయవచ్చు. రుతుపవనాలు ప్రారంభం కాకముందే నాటుకుంటే, వర్షాలు పడే సమయానికి మొక్క భూమిలో బాగా నిలదొక్కుకుంటుంది. 7. మట్టి ఎప్పుడూ తేమగా ఉండాలి, కానీ నీరు నిల్వ ఉండకూడదు. కుండీలో నీరు నిలిస్తే దుంప కుళ్ళిపోతుంది.8. అల్లం మొక్కలకు ప్రత్యక్ష సూర్యకాంతి కంటే కొద్దిగా నీడ ఉండాలి. 9. నెలకొకసారి వర్మీ కంపోస్ట్ లేదా సేంద్రియ ఎరువులు వేస్తే దుంపలు బాగా పెరుగుతాయి.10. కుండీలో కలుపు మొక్కలు లేకుండా జాగ్రత్తపడాలి.11. నాటిన సుమారు 8–9 నెలలకు అల్లం పంట కోతకు వస్తుంది.12. ఆకులు పసుపు రంగులోకి మారి, ఎండిపోవడం ప్రారంభించినప్పుడు మట్టిని జాగ్రత్తగా తవ్వి, దుంపలను బయటకు తీయాలి.13. అల్లం నాటేటప్పుడు తెగుళ్లు రాకుండా ఉండటానికి, దుంపలను నాటే ముందు సూడోమోనాస్ ద్రావణంలో కొద్దిసేపు నానబెట్టడం మంచిది.14. కుండీలలో పెంచేటప్పుడు, తేమను నిలుపుకోవడానికి మట్టిపై ఎండుగడ్డి లేదా ఆకులతో మల్చింగ్ (ఆచ్ఛాదన) చేయడం మంచిది.15. నాటిన 45 రోజులకు మొక్కలు కొంచెం పెరిగిన తర్వాత ఒక గుప్పెడు వర్మీ కంపోస్ట్ లేదా ఘన జీవామృతం వేసి మట్టిని ఎగదోయాలి. ప్రతి 15–20 రోజులకోసారి జీవామృతం లేదా ద్రవ రూపంలోని సేంద్రియ ఎరువులను వాడటం ఉత్తమం.16. నాటిన 90 రోజులకు దుంపలు ఊరడం (గడ్డ కట్టడం) మొదలవుతుంది. కాబట్టి ఆముదం పిండి లేదా ఎక్కువ మొత్తంలో వర్మీ కంపోస్ట్ అందించాలి. పొటాష్ కోసం చెక్క బూడిదను కొద్దిగా మట్టిపై చల్లడం వల్ల దుంపలు లావుగా అవుతాయి. 17. నాటిన 120 – 150 రోజులకు పశువుల ఎరువు వేసి మట్టిని మొక్క మొదలు దగ్గర గట్టిగా నొక్కాలి.18. కోతకు 1–2 నెలల ముందు (సుమారు 7వ నెల తర్వాత) ఎరువులు వేయటం ఆపేయాలి.19. అల్లం మొక్క మొదళ్లలో ఎండుటాకులు లేదా గడ్డితో కప్పి ఉంచితే తేమను నిలుపుతుంది. కుళ్ళిన తర్వాత ఎరువుగా మారుతుంది.20. ఇంట్లో రోజూ వచ్చే బియ్యం, పప్పు కడిగిన నీళ్లను ΄ారబోయకుండా మొక్కలకు పోయాలి.చీడపీడలను తట్టుకోవటం ఎలా?21. ఆకులపై ఏవైనా పురుగులు కనిపిస్తే వేప నూనెను నీటిలో కలిపి స్ప్రే చేయాలి.22. దుంప కుళ్ళు తెగులు: అల్లం పంటకు వచ్చే అత్యంత ప్రమాదకరమైన వ్యాధి. దుంపలు మెత్తగా మారి కుళ్ళిపోతాయి, మొక్కలు పసుపు రంగులోకి మారి ఎండిపోతాయి. మురుగు నీరు నిల్వ ఉండకుండా చూడాలి. నాటే ముందు దుంపలను ట్రైకోడెర్మా విరిడి ద్రావణంలో శుద్ధి చేయాలి. మట్టిలో వేప పిండి కలపడం వల్ల ఈ తెగులును అరికట్టవచ్చు.23. ఆకు మచ్చ తెగులు: ఆకులపై చిన్న చిన్న పసుపు లేదా తెల్లటి మచ్చలు ఏర్పడి క్రమంగా ఆకులు ఎండిపోతాయి. వ్యాధి సోకిన ఆకులను వెంటనే తెంపి నాశనం చేయాలి. 24. గొంగళి పురుగు కాండం లోపలికి వెళ్లి తినడం వల్ల మొవ్వు ఎండిపోతుంది. ఆకులపై పురుగు కనిపిస్తే చేతితో ఏరివేయాలి. నివారణకు 15 రోజులకోసారి వేప నూనె పిచికారీ చేయడం మంచిది.25. దుంప కుళ్ళు ఈగ పురుగు దుంపల లోపలికి రంధ్రాలు చేసి తింటుంది. మట్టిలో వేప పిండి లేదా ఆముదం పిండి కలపడం వల్ల ఈ పురుగుల బెడద తక్కువగా ఉంటుంది.26. 50 గ్రాముల అల్లం+ 50 గ్రాముల వెల్లుల్లి+ 60 గ్రాముల పచ్చిమిర్చి మెత్తగా నూరి.. ఆ ముద్దను లీటర్ నీటిలో కలిపి వడకట్టాలి. వడకట్టిన ద్రావణాన్ని 10 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయడం ద్వారా ఆకులను ఆశించే పురుగులను నివారించవచ్చు.27. క్రమం తప్పకుండా జీవామృతాన్ని మొక్క మొదళ్లలో పోయడం వల్ల మొక్కకు రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.28. 5–10 గ్రాముల ట్రైకోడెర్మా పొడిని ఒక లీటరు నీటిలో కలిపి మొక్క మొదళ్లలో పోయటం వలన కుళ్ళు తెగులు తగ్గుతుంది. 29. కొద్దిగా పసుపు కలిపిన నీటిని మొక్క మొదళ్లలో పోయడం వల్ల యాంటీ–ఫంగల్ లక్షణాలతో తెగులు తగ్గుతుంది.30. ఒకవేళ మొక్క పూర్తిగా కుళ్ళిపోయి ఉంటే, ఆ మొక్కను దుంపతో సహా తీసి ΄ారేయాలి. అదే మట్టిని మళ్ళీ వాడాల్సి వస్తే, ఎండలో బాగా ఆరబెట్టి, వేప పిండి కలిపిన తర్వాతే వాడాలి.31. అల్లం మొక్క ఆకులు పసుపు రంగులోకి మారి, క్రమంగా ఎండిపోయి, కాండం కూడా వాడిపోయి నేలకి వాలినట్లు కనిపిస్తే దుంపలు పూర్తిగా ఊరాయని అర్థం.32. కూరల్లోకి పచ్చి అల్లం కావాలంటే, నాటిన 5– 6 నెలల తర్వాత కూడా కొన్ని దుంపలను తీసుకోవచ్చు. ఈ సమయంలో అల్లం తక్కువ పీచు, తక్కువ ఘాటు ఉంటుంది.33. ఎండిన అల్లం (శొంఠి) లేదా విత్తనం కోసం అయితే ఆకులు పూర్తిగా ఎండిపోయే వరకు (8–10 నెలలు) ఆగాలి.34. దుంపలు తీయడానికి 15 రోజుల ముందే నీరు పోయడం ఆపేయాలి. దీనివల్ల మట్టి పొడిగా మారి దుంపలు తీయడం సులభమవుతుంది. దుంపలకు గాయం కాకుండా జాగ్రత్తగా మట్టిని తవ్వి బయటకు తీయాలి.- కొల్లి కృష్ణ కుమారి, అడ్మిన్, గుంటూరు జిల్లా, మిద్దె తోటల బృందం, మొబైల్: 94906 02366నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ఇవీ చదవండి: పోషకాల దుర్వినియోగంతో ముప్పు! రైతులకు ఎఫ్ఏఓ హెచ్చరిక! -
పోషకాల దుర్వినియోగంతో ముప్పు! రైతులకు ఎఫ్ఏఓ హెచ్చరిక!
రైతుల పొలాల్లో పోషకాల అసమతుల్యత లేదా దుర్వినియోగం వల్ల నేల సారం క్రమంగా క్షీణిస్తోంది. అవసరం ఎంతో తెలుసుకోకుండా కొన్ని ఎరువులను ఎక్కువ ఎవయ్యటం, కొన్నిటిని తక్కువ వెయ్యటం సమస్య. ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏఓ) రూపొందించిన ‘స్టేటస్ ఆఫ్ ది వరల్డ్స్ సాయిల్ రిసోర్సెస్’ తాజా నివేదిక ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా నేల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్న ప్రధాన సమస్యల్లో మొదటిది: ‘నీరు, గాలి వల్ల పైపొర మట్టి కొట్టుకుపోవటం’. రెండోది: ‘నేలలోని సహజ సేంద్రియ పదార్థం, సారం తగ్గిపోవటం’. ‘పోషకాల నిర్వహణ లోపం లేదా దుర్వినియోగం’ (న్యూట్రియంట్ మిస్మేనేజ్మెంట్) మూడో అతిపెద్ద ముప్పుగా నిలిచింది.ప్రపంచవ్యాప్తంగా 63 శాతం ప్రాంతాలు, ఉప్రపాంతాలు పోషకాల దుర్వినియోగాన్ని అరికట్టే స్థానికంగా అవసరమైన సుస్థిర వ్యవసాయ పద్ధతులను అవలంబించటంలో దారుణంగా విఫలమవుతున్నాయని ఎఫ్ఏఓ నివేదిక ఎత్తిచూపింది. 50 శాతం ప్రాంతాల్లో పరిస్థితులు మెరుగుపడకపోగా క్షీణిస్తున్నాయని పేర్కొంది. ఉత్తర అమెరికాలో మాత్రమే మాత్రమే పోషకాల దుర్వినియోగాన్ని అరికట్టే పద్ధతుల అమలులో మెరుగ్గా ఉందని ఎఫ్ఏఓ తెలిపింది.రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలునేలలో పోషకాల అసమతుల్యతకు సంబంధించి ఎఫ్ఏఓ నివేదికలో మూడు ముఖ్య అంశాలను ప్రస్తావించింది:1. పోషకాల కొరత (న్యూట్రియెంట్ మైనింగ్): పంటల ద్వారా గ్రహించే లేదా నేల నుంచి ఆహారోత్పత్తుల ద్వారా మనం పొందే పోషకాల కంటే నేలకు తక్కువ మోతాదులోనే ఎరువులను అందించటం. దీనివల్ల కాలక్రమేణా నేలలోని సహజ పోషక నిల్వలు, సేంద్రియ పదార్థం పూర్తిగా తగ్గిపోతాయి.2. ఎరువుల అధిక వినియోగం (న్యూట్రియెంట్ ఎక్సెస్): పంటకు అవసరమైన దానికంటే ఎక్కువగా నత్రజని, భాస్వరం ఎరువులు వేయటం. మితిమీరిన ఈ రసాయనాలు కాలువలు, భూగర్భ జలాల్లో చేరి నీటిని కలుషితం చేస్తున్నాయి. నైట్రేట్లు మానవ ఆరోగ్యానికి ముప్పుగా మారుతుండగా, నత్రజని అధిక వాడకం వల్ల ప్రమాదకర వాయువులైన నైట్రస్ ఆక్సైడ్, అమ్మోనియా విడుదలై వాతావరణం దెబ్బతింటోంది.3. నేల ఆమ్లీకరణ (సాయిల్ అసిడిఫికేషన్): ఆమ్ల గుణం కలిగిన రసాయన ఎరువులను విచ్చలవిడిగా వాడటం వల్ల నేలలో ఆమ్లతత్వం పెరిగి, నేలలో ఉండే ఉపయోగకరమైన సూక్ష్మజీవులు నశించి నేల సారం నాశనమవుతోంది.భారత్, దక్షిణాసియా దేశాల్లో పరిస్థితిదక్షిణాసియా ప్రాంతంలో భారత్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ దేశాల్లో పంటలకు అవసరానికి మించి నత్రజని, భాస్వరం ఎరువులను వేస్తున్నట్లు ఎఫ్ఏఓ నివేదిక వెల్లడించింది. మరోవైపు, పంట కోతల అనంతరం మిగిలిన పంట వ్యర్థాలను (వరి గడ్డి, చొప్ప, పత్తి కట్టె, కంది కట్టె వంటివి ) పొలం మట్టిలో తిరిగి కలిసేలా చెయ్యకుండా పూర్తిగా తొలగించటం వల్ల నేలలో పొటాషియం వంటి పోషకాలు వేగంగా తరిగిపోతున్నాయి.భవిష్యత్తుపై ప్రభావం.. నివారణ మార్గాలుపోషకాల అసమతుల్యత వల్ల వ్యవసాయం అస్తవ్యస్తమవుతుంది. అంతేకాదు, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలైన ‘ఆకలి నిర్మూలన’, ‘మంచి ఆరోగ్యం’, ‘స్వచ్ఛమైన నీరు’, ‘వాతావరణ పరిరక్షణ చర్యలు’, ‘భూమిపై జీవవైవిధ్యం’ దెబ్బతింటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 63 శాతం ప్రాంతాల్లో స్థిరమైన నేల నిర్వహణ పద్ధతుల అమలు చాలా నాసిరకంగా ఉంది.రైతులు మోతాదుకు మించి రసాయన ఎరువులు వేయటం ఆపాలి. పంట అవసరాన్ని బట్టి కచ్చితమైన మోతాదులో ఎరువులు అందించే ‘సైట్–స్పెసిఫిక్ న్యూట్రియెంట్ మేనేజ్మెంట్’ (ఎస్ఎస్ఎన్ఎం), భూసార పరీక్షలు, సేంద్రియ ఎరువుల వాడకం, పంట వ్యర్థాల పునర్వినియోగం వంటి చర్యలను సమర్థవంతంగా అమలు చెయ్యటం ద్వారానే నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని నివేదిక స్పష్టం చేస్తోంది.మన దేశంలోనూ దుర్వినియోగమే!భారత వ్యవసాయ రంగంలో పోషకాల దుర్వినియోగం తీవ్రంగా ఉంది. భారతదేశం సహా దక్షిణాసియా ప్రాంతంలో ఎరువుల దుర్వినియోగాన్ని అరికట్టే సుస్థిర వ్యవసాయ పద్ధతుల అమలు సరిగ్గా లేకపోవటంతో నేల ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తోందని ఆహార వ్యవసాయ సంస్థ నివేదిక హెచ్చరించింది. ప్రధానంగా రెండు విరుద్ధ సమస్యలతో భారతీయ వ్యవసాయ రంగం సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది.భారతదేశంలో రైతులు పంటల అవసరానికి మించి నత్రజని, భాస్వరం ఎరువులను విచ్చలవిడిగా వాడుతున్నారు. దీనివల్ల ఎరువులు వృథా అవ్వడమే కాకుండా భూగర్భ జలాలు కలుషితం కావటం, నైట్రస్ ఆక్సైడ్ వంటి గ్రీన్ హౌస్ వాయువులు, అమ్మోనియా విడుదల కావటం వల్ల పర్యావరణానికి, మానవ ఆరోగ్యానికి తీవ్ర ముప్పు కలుగుతోంది.పంట కోతల అనంతరం మిగిలిన పంట వ్యర్థాలను పొలం నుంచి పూర్తిగా తొలగించటం వల్ల నేలలో సహజంగా ఉండే పొటాషియం నిల్వలు వేగంగా క్షీణిస్తున్నాయి.- నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ఇవి కూడా చదవండి: అమెరికా ఉద్యోగాన్ని కాదని వ్యవసాయం..! ఏకంగా ఆరుసార్లు దివాళ అంచుకు.. -
దుక్కి లేని ఎస్ఆర్టీ సాగు!
రైతాంగానికి సాగు ఖర్చులు పెరిగిపోవటం, కూలీల కొరత, మారుతున్న వాతావరణ పరిస్థితులు సవాళ్లుగా మారిన తరుణంలో సగుణా రీజెనరేటివ్ టెక్నిక్ (ఎస్ఆర్టీ) వ్యవసాయ రంగంలో ఒక కొత్త ఆశాకిరణంగా నిలుస్తోంది. నేలను మొదట ఎత్తుమడులు చేసేటప్పుడు తప్ప తర్వాత దున్నే అవసరం లేదు. దమ్ము చేసి నాట్లు వేసే శ్రమ లేదు. నేరుగా విత్తనం వెయ్యటమే. అత్యంత తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించే ఈ వినూత్న సాగు విధానం ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏఓ) ఆమోదించింది. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో 7 ప్రధాన లక్ష్యాలను నెరవేర్చే సాంకేతికతగా దీన్ని ధృవీకరించటం విశేషం.మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లా నేరళ్ వద్దగల సగుణా బాగ్‌లో వ్యవసాయ శాస్త్రవేత్త చంద్రశేఖర్ హరిభావూ భడ్సావాలే 2011లో ఈ సాగు పద్ధతిని రూపొందించారు. సగుణా రూరల్ ఫౌండేషన్ ద్వారా విస్తృత ప్రచారంలోకి తెచ్చారు. ఈ పద్ధతి మొదట బెడ్స్‌పై ఆరుతడి వరి సాగుకే పరిమితమైనప్పటికీ, ప్రస్తుతం ఏటా 30 నుండి 35 రకాల విభిన్న పంటలను విజయవంతంగా పండించే స్థాయికి చేరింది.ఏమిటీ ఎస్ఆర్టీ ప్రత్యేకత?సాధారణ వ్యవసాయంలో ప్రతి సీజన్లో పంట విత్తే/నాటే ముందు పొలాన్ని దున్నటం, నేలను చదును చేయటం అత్యంత ఖర్చుతో కూడుకున్న పని. కానీ ఎస్ఆర్టీ విధానంలో ఒకసారి తయారుచేసిన ఎత్తయిన శాశ్వత మడులపై తర్వాత 25 సంవత్సరాల వరకు పొలం దున్నాల్సిన అవసరమే ఉండదు. 136 సెం.మీ వెడల్పుతో తయారు చేసే ఈ మడుల వల్ల మొక్కల వేర్లకు ఆక్సిజన్, తగినంత తేమ సమృద్ధిగా అందుతాయి. ఫలితంగా తెల్లని వేర్ల వ్యవస్థ బాగా అభివృద్ధి చెంది, పంట ఏకరీతిగా ఎదుగుతుంది. ఈ–జెబు మినీ ట్రాక్టర్ ద్వారా సరియైన రూరంలో (ఉదాహరణకు వరిలో 25 “ 25 సెం.మీ) విత్తనాలను నేరుగా నాటుతారు. దీనివల్ల ఎకరాకు కావలసిన సరైన మొక్కల సంఖ్య నిర్వహించబడుతుంది. ముందటి పంట కోత తర్వాత పాత వేర్లను నేలలోనే వదిలేసి, గడ్డిమందు పిచికారీ ద్వారా వాటిని కుళ్ళింపజేస్తారు. ఇది నేలలో సేంద్రియ కర్బనాన్ని వేగంగా పెంచుతుంది.40% నీరు, ఖర్చు ఆదా.. 50% తగ్గిన శ్రమసాంప్రదాయ వరి సాగుతో పోలిస్తే ఎస్ఆర్టీ విధానం వల్ల పంటకు అవసరమయ్యే నీటి వాడకం 40 శాతం వరకు తగ్గుతుంది. నాట్లు వేయడం, దుక్కి దున్నడం వంటి పనులు లేకపోవడం వల్ల ల్యాండ్ ప్రిపరేషన్ ఖర్చు తగ్గడమే కాకుండా ఉత్పత్తి ఖర్చు 40 శాతం, శ్రమ 50 శాతం వరకు ఆదా అవుతుంది.చిగురిస్తున్న ఆశలు...వ్యవసాయ రంగంలో నేలను దున్నాల్సిన అవసరం లేని నో టిల్ సమగ్ర సేద్య పద్ధతులకు ఆదరణ పెరుగుతోంది. నేల సారాన్ని పరిరక్షిస్తూ, సమర్థవంతమైన పంటల సాగుకు తోడ్పడే ఈ సాంకేతికతను మొదట వరి పంట కోసం అభివృద్ధి చేశారు. అయితే ప్రస్తుతం దీని ద్వారా దాదాపు 30 నుంచి 35 రకాల విభిన్న పంటలను విజయవంతంగా పండిస్తున్నారు.ఎస్ఆర్టీ శాశ్వత ఎత్తు మడులపై ఏడాది పొడవునా పండించగల పంటలు:→ ఖరీఫ్ కాలం (జూన్ – అక్టోబర్): వరి, రాగులు (చోళ్ళు), జొన్నలు, వేరుశనగ, పత్తి, సోయాబీన్, కందులు, మినుములు వంటి ప్రధాన పంటలను సాగు చేయవచ్చు. → రబీ కాలం (నవంబర్ – ఫిబ్రవరి): అనుములు, శనగలు, అలసందలు (బొబ్బర్లు), నల్ల పెసలు, ఉలవలు, బఠానీ, మసూర్ పప్పు వంటి పప్పుధాన్యాలతో పాటు ఉల్లి, వెల్లుల్లి, క్యాబేజీ, బెండ, మొక్కజొన్న, ప్రొద్దుతిరుగుడు, గోధుమ, జొన్నలు, పలు రకాల ఆకుకూరలు పండించడానికి ఇది అనుకూలం. → వేసవి కాలం (జనవరి – మే): పంట మార్పిడిలో వైశాఖి పెసలు, వేరుశనగ, బెండ, ప్రొద్దుతిరుగుడు, సజ్జలు సాగు చేసుకోవచ్చు.15–25 రోజుల ముందే కోతలుమట్టి కోతను పూర్తిగా నివారించడం, నేలలో కార్బన్ నిర్బంధం(సేకరణ) ద్వారా గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారాలను అడ్డుకోవడం ఈ పద్ధతిలో అతిపెద్ద పర్యావరణ ప్రయోజనం. నేలను దున్నకపోవడం వల్ల వానపాములు, మిత్ర బూజులు, ఉపయోగకరమైన సూక్ష్మజీవులు పెరిగి నేల సారం స్వయంచాలకంగా పెరుగుతుంది. నాట్లు వేయడానికి నీరు, ఎద్దులు లేదా ట్రాక్టర్లు, కూలీలపై ఆధారపడే భయం పూర్తిగా తొలగిపోయింది. వరి పంటను ఇతర రైతుల కంటే 15– 25 రోజుల ముందే మార్కెట్లో విక్రయించగలుగుతున్నాము అని ఎస్ఆర్టీ విధానాన్ని అనుసరిస్తున్న రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రకృతి విపత్తులు, అతివృష్టి లేదా వర్షాభావ పరిస్థితులను తట్టుకుని స్థిరమైన దిగుబడినిచ్చే ఈ పరిరక్షణ వ్యవసాయం, గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా గిరిజన కుటుంబాల వార్షిక ఆదాయాన్ని 4 రెట్లు పెంచడంలో కీలక పాత్ర పోషిస్తోంది. ప్రకృతికి హాని చేయకుండా రూపకల్పన చేసిన ఎస్ఆర్టీ సాంకేతికత రాబోయే రోజుల్లో దేశీయ వ్యవసాయ రంగానికి దిశా నిర్దేశం చేయనుంది. పత్తి, మొక్కజొన్న అధిక దిగుబడి!శాస్త్రవేత్తల సూచనలు, క్షేత్రస్థాయి మార్గదర్శకత్వంలో ఎస్ఆర్టీ విధానంపై అవగాహన పెంచుకొని గత సంవత్సరం నుంచి ఒక ఎకరంలో బెడ్స్‌పైనే వానాకాలం పత్తి, యాసంగిలో మొక్కజొన్న పండించా. పత్తి 12 క్వింటాళ్లు, మొక్కజొన్న 40 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఆ బెడ్స్‌పైనే ఈ ఏడాది పత్తి విత్తాను. పంట బాగుంది. మామూలు పొలాల్లో మొక్కల కన్నా మా పత్తి మొక్కలు ఎత్తుగా పెరుగుతున్నాయి. తడి తక్కువ వున్నా పంటకు ఇబ్బంది లేదు. స్ప్రింక్లర్ పైపులతో నీరు పారిస్తున్నా. ప్రభుత్వం డ్రిప్ ఇస్తే ఇంకా బాగుంటుంది. మమ్మల్ని చూసి 25 ఎకరాల్లో రైతులు ఎస్ఆర్టీ పద్ధతిలో పంటలు ఈ సంవత్సరం వేశారు. ఎస్ఆర్టీ విధానంలో నేలలో తేమ నిల్వ ఉండటం, పొలంలో పంట అవశేషాలను ఉపయోగించుకోవటం వంటి అంశాలు ఉపయోగకరంగా అనిపించాయి. – సంది భగవాన్‌రెడ్డి (98491 25635), ఎల్లమ్పల్లి, సైదాపూర్ఎకరంలో ఎస్ఆర్టీ వరి సాగు చేస్తున్నానాకు ఐదెకరాల భూమి, 4 ఆవులు ఉన్నాయి. కేవీకే శాస్త్రవేత్తల మార్గదర్శకత్వంలో ఈ సంవత్సరం ఒక ఎకరంలో ఎస్ఆర్టీ వరి పంట సాగు చేస్తున్నాను. ఒక ఎకరంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో, మరో ఎకరంలో రసాయనిక వ్యవసాయంలో నాట్లు వేసి సాగు చేస్తున్నా. మూడు పద్ధతుల్లో పంట ఎట్లా ఉంటుందో చూద్దామని పక్క పక్కనే సాగు చేస్తున్నా. రెండెకరాల్లో పామాయిల్ మొక్కలు వేశాను. ఎస్ఆర్టీ పద్ధతిలో సాగు ఖర్చులు తగ్గటంతో పాటు నేల ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆశిస్తున్నాను. – నీళ్ళ సమ్మయ్య (95506 29004), రంగంపల్లి, జమ్మికుంట మం., కరీంనగర్ జిల్లాఎస్ఆర్టీ విధానం రైతులకు ఉపయోగకరంకరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో నాబార్డ్ వారి ఆర్థిక సహకారంతో సగుణ పునరుత్పాదక వ్యవసాయ పద్ధతిపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. ౖక్షేత్రస్థాయి ప్రదర్శనలు, రైతుల అనుభవాల ఆధారంగా ఈ విధానంపై మరింత అవగాహన కల్పిస్తున్నాం. రెతులు తమ పొలాల పరిస్థితులు, పంట రకం, నీటి లభ్యత, నేల స్వభావాన్ని పరిగణనలోకి తీసుకొని ఎస్ఆర్టీ విధానంలోని సాంకేతిక అంశాలను క్రమపద్ధతిలో అమలు చేస్తే సత్ఫలితాలు వస్తాయి. సాగు ఖర్చులను తగ్గించటం, నేల ఆరోగ్యాన్ని మెరుగుపరచటం, సహజ వనరులను సమర్థవంతంగా వినియోగించటం వంటి లక్ష్యాలతో ఎస్ఆర్టీ వంటి పునరుత్పత్తి వ్యవసాయ పద్ధతులు భవిష్యత్తులో రైతులకు ఉపయోగకరంగా మారే అవకాశం ఉంది.– డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ రావు (98485 73710), సీనియర్ సైంటిస్టు–హెడ్, కృషి విజ్ఞాన కేంద్రం, జమ్మికుంట, కరీంనగర్ జిల్లాకథనం: డా. వెంకటేశం తుమ్మనగోటి, సాక్షి, రామగిరి (నల్లగొండ)ఫొటోలు: కంది భజరంగ్ ప్రసాద్, సాక్షి ఫొటోగ్రాఫర్, నల్లగొండనిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ -
బెల్లం ద్రావణం ఉపయోగాలెన్నో..!
కూరగాయ తొక్కలు, పండ్ల తొక్కలు వంటి వంట గది వ్యర్థాల (కిచెన్ వేస్ట్)తో కంపోస్ట్ తయారు చేసి మిద్దె తోటలు, ఇంటిపంటల్లో మొక్కలకు వేస్తుంటాం. అయితే, ఈ కంపోస్టు తయారు కావటానికి చాలా రోజులు పడుతుంది. ఈ ప్రక్రియలో బెల్లం ద్రావణాన్ని ఉపయోగించటం వల్ల ప్రక్రియ వేగవంతం అవ్వడమే కాకుండా, ఎరువు నాణ్యత కూడా పెరుగుతుంది.1. కంపోస్ట్ త్వరగా తయారవ్వడానికి వంటగది వ్యర్థాలు సాధారణంగా కుళ్ళడానికి ఎక్కువ సమయం పడుతుంది. బెల్లం ద్రావణం ఈ సమయాన్ని తగ్గిస్తుంది.2. ఒక లీటర్ నీటిలో 50–100 గ్రాముల బెల్లం కలిపి ద్రావణం తయారు చేయాలి. కంపోస్టు బిన్లో వంటింటి వ్యర్థాలను వేసిన ప్రతిసారీ, ఈ బెల్లం నీటిని కొద్దిగా దానిపై చల్లాలి.3. బెల్లంలోని చక్కెర సూక్ష్మజీవులకు తక్షణ శక్తిని ఇస్తుంది, దీనివల్ల అవి వ్యర్థాలను వేగంగా విచ్ఛిన్నం చేస్తాయి. 4. బెల్లం ద్రావణం వాసన నియంత్రణకు, పురుగుల నియంత్రణకు చాలా ఉపయోగకరం.5. బెల్లం నీటితో పాటు కొద్దిగా పుల్లని మజ్జిగ కలిపి కంపోస్ట్‌పై చల్లితే ప్రయోజనకరమైన బ్యాక్టీరియాను పెంచి, చెడు వాసన కలిగించే బ్యాక్టీరియాను అణచివేస్తుంది. 6. ఇది ఇన్స్టంట్ లిక్విడ్ ఫెర్టిలైజర్‌గా కూడా పనిచేస్తుంది.7. ఒక పాత్రలో కూరగాయల తొక్కలు వేసి, అవి మునిగేలా నీరు పోయాలి. అందులో 1–2 స్పూన్ల బెల్లం వేసి బాగా కలిపి, మూత పెట్టి 3–5 రోజుల పాటు పులియబెట్టాలి. ఈ ద్రవాన్ని వడకట్టి, దానికి 10 రెట్లు నీటిని కలిపి (1:10 నిష్పత్తిలో) నేరుగా మొక్కల మొదళ్లలో పోయవచ్చు. 8. బెల్లం నీరు చల్లేటప్పుడు కంపోస్ట్ మరీ ముద్దగా అవ్వకుండా చూసుకోవాలి. తేమ మాత్రమే ఉండాలి.9. బెల్లం నీరు వాడినప్పుడు, తేమను బ్యాలెన్స్ చేయడానికి కొన్ని ఎండు ఆకులు లేదా కార్డ్బోర్డ్ ముక్కలు కలపడం మంచిది.10. బెల్లం ద్రావణాన్ని ఉపయోగిస్తున్నప్పుడు కంపోస్ట్ బిన్స్‌లో మాంసం, పాలు లేదా నూనె పదార్థాలు వేయకూడదు. ఎందుకంటే ఇవి బెల్లం ఉన్నా కూడా దుర్వాసన కలిగిస్తాయి. చదవండి: కామాంచి/కాశబుడ్డ.. గుండె జబ్బులను అరికట్టడంలో ఫస్ట్!11. 200 లీటర్ల నీటిలో 2 కిలోల బెల్లాన్ని కలిపి, అందులో వేస్ట్ డీకంపోజర్ కల్చర్‌ను కలిపి 5 రోజుల పాటు పులియబెట్టాలి. ఈ ద్రావణాన్ని కంపోస్ట్ పొరల మీద చల్లడం వల్ల వ్యర్థాలు వేగంగా ఎరువుగా మారుతాయి.12. పశువుల ఎరువు లేదా వర్మీ కంపోస్ట్‌లో బెల్లం నీటిని చిలకరిస్తూ 15 రోజుల పాటు కలియదిప్పితే నాణ్యమైన బయోచార్ కంపోస్ట్ తయారవుతుంది. 13. జీవామృతం తయారీలో ఆవు పేడ, మూత్రంతో పాటు బెల్లాన్ని కలపడం వల్ల సూక్ష్మజీవుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. ఇది మట్టి సారాన్ని పెంచుతుంది.14. చేపల అమైనో ఆమ్లం తయారీలో – చేపల వ్యర్థాలను, సమాన మోతాదులో బెల్లంతో కలిపి పులియబెట్టడం ద్వారా మొక్కలకు అద్భుతమైన పోషక ద్రావణం లభిస్తుంది.చదవండి: మరిన్ని సాగుబడి కథనాలు15. పండ్ల ద్రావణం తయారు చేయటానికి కుళ్ళిన పండ్లను సమాన మోతాదులో బెల్లంతో కలిపి 5 రోజుల పాటు పులియబెట్టి, ఆ ద్రావణాన్ని మొక్కల పెరుగుదలకు ఉత్ప్రేరకంగా వాడవచ్చు. 16. బెల్లంలోని చక్కెర ప్రయోజనకరమైన బ్యాక్టీరియా, శిలీంధ్రాలకు తక్షణ శక్తిని ఇస్తుంది. 17. బెల్లం పులియబెట్టే ప్రక్రియను వేగవంతం చేస్తుంది.18. మట్టిలో ప్రయోజనకరమైన సూక్ష్మజీవులను పెంచడం ద్వారా మొక్కల వ్యాధులను అణచివేసి తెగుళ్ల నియంత్రణకు సహాయపడుతుంది. ముఖ్య గమనిక: బెల్లం ద్రావణాన్ని నేరుగా కాకుండా, తగినంత నీటితో పలచబరిచి (ఉదాహరణకు 1:10 నిష్పత్తిలో) మొక్కలకు అందించడం మంచిది.కొల్లి కృష్ణ కుమారి,అడ్మిన్, గుంటూరు జిల్లా మిద్దె తోటల బృందంమొబైల్: 94906 02366 -
కోలజెమ్మెడు.. పంటగా మారితే.. మెట్ట రైతులకు కొత్త ఆదాయ మార్గం!
Name: Columnar Cactusశాస్త్రీయ నామం: సెరెస్ ప్టెరొ గోనస్Scientific Name: Cereus pterogonus LemSynonym (s) : Cereus repandus (L.) Mill. కుటుంబం: క్యాక్టేసిFamily: Cactaceaeకోలజెమ్మెడు పండును వేర్వేరు భాషల్లో ఏమని పిలుస్తారంటే.. ఇంగ్లీష్: సెంటి నేల్ క్యాక్టస్, డాగ్ టేల్ క్యాక్టస్, హెడ్జ్ క్యాక్టస్ తమిళం: సిప్పాల్ కథలై;మలయాళం: పుచ్చముళ్ళు;బెంగాలీ: మానస తెలుగు: కోలజెమ్మెడు, జెమ్మడు, నిటారు జెమ్మెడు.వేరే భాషల్లో దీనికి గుర్తింపు తక్కువ. గ్రామాల్లో ఉండే జెమ్మెడు రకాలలో కోలజెమ్మెడు ఒకటి. ఊర్లలో చాలామందికి తెలిసిన చెట్టు. ఈ జెమ్మెడులో కూడా డ్రాగన్ ఫ్రూట్ మాదిరిగా మే నుంచి నవంబర్ మాసం వరకు అంచెలంచెలుగా పూత–కాత వస్తుంది. దీన్ని నైట్ బ్లూమింగ్ సెరెస్ అని కూడ అంటారు. దీనిలో దాదాపు 33 జాతులు ఉన్నాయని అంచనా.ఉనికి:ఇవి మెట్ట ప్రాంత మైదానాలు, అడవుల్లో ఎక్కువగా పెరుగుతాయి. నిటారుగా గుంపులుగా పెరుగుతాయి. దాదాపు 3–6 మీటర్ల ఎత్తువరకు పెరగగలవు. వీటికి కణుపులు ఉంటాయి. వీటి ఉనికి ఎక్కువగా ప్రపంచ వ్యాప్తంగా ఉష్ణమండలపు ప్రాంతాల్లో ఉంది. దీనికి డ్రాగన్ పండు చెట్టుకు అతిదగ్గరి పోలిక ఉంది. దీనికి ముళ్లతో కూడుకున్న ఆరు నుంచి ఎనిమిది భుజాలు ఉంటాయి. వీటి స్వస్థలం, బ్రెజిల్, ఊరుగామ్, అర్జెంటీనా. వీటి ఉనికి దక్షిణ అమెరికా, ఇండియా, చైనా, శ్రీలంక, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో కూడా ఉంది. ఇండియాలో చాలా రాష్ట్రాలలో వీటి ఉనికి ఉంది. నల్లమల అడవులతో పాటు మైదానపు ప్రాంతాలు, పొలం గట్లు తదితర చోట్ల పెరుగుతుంది. ఈ చెట్లు వాతావరణ మార్పులను తట్టుకోగలవు.పోషక ఔషధ నిధులుకోలజెమ్మెడు చెట్లను పొలం చుట్టూ జీవ కంచెగా పెంచుతారు. వీటిని అందం కోసం కుండీలలో పెంచుకోవచ్చు. పండ్లను తింటారు, చప్పటి రుచి ఉంటాయి. కాని నల్లమల అడవుల్లో ఈ పండ్లను జనం తినరు. ఈ పండ్లు డ్రాగన్ ఫ్రూట్‌ని పోలిన రంగులో ఉంటాయి. వీటిలో ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్ ఉన్నాయి. ఇతర దేశాల్లో ప్రజలు ఈ పండ్లను బాగా ఇష్టపడతారు. ఇవి అన్నికాలాల్లో వాతావరణ మార్పులను తట్టుకొని నిలువగలవు. తక్కువ నీరు మాత్రమే ఈ చెట్లకు అవసరం.సమగ్ర పరిశోధనలు జరిపి, పంట పొలాలకు తేగల్గితే, మెట్ట రైతులకు ఎంతో లాభసాటిగా ఉంటుంది. దీనికి మంచి ఔషధ గుణాలున్నాయి. ముఖ్యంగా ఛాతి నొప్పి, మూత్ర సంబంధిత సమస్యలను నయం చేయటానికి వాడతారు. కోలాజెమ్మెడు జన్యువులను ఉపయోగించుకొని డ్రాగన్ ఫ్రూట్, కొలజెమ్ముడు కొత్తరకాలను తీసుకువస్తే వాటిని బంజరు భూముల్లో కూడా సాగు చేయవచ్చు. కాబట్టి ఈ జీవ వైవిధ్యాన్ని పరిశోధకులు, ఇతరులు ప్రయోగాలకు ఊతమిస్తే, ఈ క్యాక్టేసి కుటుంబంలో ఒక కొత్త ఒరవడి వెలుగు చూడగలదు. డ్రాగన్ ఫ్రూట్ లో ఉండే పోషకాలు ఇందులో కూడా ఉంటాయి. వీటిపైన అధ్యయనం ఎంతో అవసరం. పోషక విలువల్లో డ్రాగన్ ఫ్రూట్ కు తీసిపోని పండు కోలజెమ్మెడు. టీఎస్ఎస్ కూడా డ్రాగన్ ఫ్రూట్లో ఉన్నంత స్థాయిలో ఉంది.- డాక్టర్ మొరుపోజు పద్మయ్య, విశ్రాంత ప్రధాన శాస్త్రవేత్త, ఐసీఏఆర్ – ఐఐఓఆర్, రాజేంద్రనగర్, హైదరాబాద్. మొబైల్: 94407 08924నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ -
Sagubadi: పంట వేర్లకు పోషకాలు అందించే అజ్ఞాత సైన్యం..
వ్యవసాయంలో పంట ఎదుగుదల, దిగుబడి కేవలం వేసే ఎరువులు, నీటిపైనే కాకుండా మట్టిలోని ‘అజ్ఞాత సూక్ష్మజీవుల ప్రపంచం’ పైనే ఆధారపడి ఉంటుంది. తాజా పరిశోధనా వివరాల ప్రకారం.. సారవంతమైన సాగు భూములు క్రమంగా ఎడారులుగా మారిపోవడాన్ని (ఎడారీకరణ) అంటాం. ఈ ముప్పును మట్టిలో సూక్ష్మజీవులు ముందే పసిగడతాయి. నీటి కరువుతో మొక్కలు చనిపోవటానికి ఎంతో ముందే నేలలోని సూక్ష్మజీవులు కనిపెట్టి హెచ్చరిస్తాయని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు.సూక్ష్మజీవుల సామ్రాజ్యంమట్టిలో ఉండే ఒకే ఒక్క ఇసుక రేణువుపై కూడా వేల సంఖ్యలో బ్యాక్టీరియా, శిలీంధ్రాలు (ఫంగస్), వైరస్లు కలిసి ఒక మహానగరం లాంటి వ్యవస్థను (మైక్రోబయోమ్) నిర్మించుకుంటాయి. ఇవి సేంద్రియ పదార్థాలను కుళ్ళింపజేసి పంటలకు అవసరమైన నత్రజని, భాస్వరం వంటి పోషకాలను వాటి వేర్లకు అందిస్తాయి. అంతేకాకుండా, వాతావరణంలోని కర్బనాన్ని నేలలో నిల్వ ఉంచడంలో (కార్బన్ సైకిల్) కీలక పాత్ర పోషిస్తాయి. ప్రస్తుతం వైద్యరంగంలో వాడుతున్న 70%–80% యాంటీబయాటిక్ ఔషధాలు కూడా నేలలోని ‘స్ట్రెప్టోమైసిస్’ వంటి బ్యాక్టీరియా నుంచే ఉత్పత్తి అవుతుండటం గమనార్హం.‘‘మట్టిలో ఉండే ఒకే ఒక్క ఇసుక రేణువుపై కూడా వేల సంఖ్యలో బ్యాక్టీరియా, శిలీంధ్రాలు (ఫంగస్), వైరస్లు కలిసి ఒక మహానగరం లాంటి వ్యవస్థను (మైక్రోబయోమ్) నిర్మించుకుంటాయి. ఇవి సేంద్రియ పదార్థాలను కుళ్ళింపజేసి పంటలకు అవసరమైన నత్రజని, భాస్వరం వంటి పోషకాలను వాటి వేర్లకు అందిస్తాయి..’’మొక్కల కంటే వేగంగా స్పందనసాధారణంగా నేలలో తేమ తగ్గినా, ఉష్ణోగ్రత పెరిగినా లేదా పీహెచ్ (క్షార/ఆమ్ల స్వభావాన్ని తెలిపే ఉదజని సూచిక) మారినా ఆ ప్రభావం పంటపై వెంటనే పైకి కనిపించదు. మొక్కలు వాలిపోవడం లేదా ఎండిపోవడం ప్రారంభించే సమయానికే నేల స్వభావం చాలావరకు దెబ్బతింటుంది. అయితే, నేలలోని సూక్ష్మజీవులు ఈ మార్పులను మానవుల కంటికి కనిపించకముందే గుర్తిస్తాయి. వాతావరణ ప్రతికూలతలకు అత్యంత వేగంగా స్పందిస్తాయి. పరిస్థితికి అనుగుణంగా తమ సంఖ్యను, కార్యకలాపాలను మార్చుకుంటాయని పరిశోధకులు గుర్తించారు.ఎడారీకరణకు అడ్డుకట్టదక్షిణాఫ్రికాలోని ప్రిటోరియా విశ్వవిద్యాలయానికి చెందిన సూక్ష్మజీవ పర్యావరణ శాస్త్రవేత్త మార్క్ వాన్ గోథెమ్ ఎడారీకరణకు అడ్డుకట్ట వేసే మార్గాలను తన పరిశోధనల ద్వారా అన్వేషిస్తున్నారు. ఆఫ్రికాలోని సహారా, నమీబ్, కలహరి, సాహెల్ ఎడారులలో మట్టి నమూనాలను సేకరించి ‘మెటాజెనోమిక్ సీక్వెన్సింగ్’ ద్వారా పరిశోధిస్తున్నారు. ఆయన ఏమంటున్నారంటే..మట్టిలో ఒక నిర్దిష్ట జాతి బ్యాక్టీరియా అంతరించిపోతే లేదా పంటలకు పోషకాలను అందించే జీవక్రియలు ఆగిపోతే, ఆ నేల క్షీణదశకు చేరుతోందని, భూసారం ఆందోళనకర స్థాయిలో అడుగంటుతున్నదని ముందే పసిగట్టవచ్చు.ఈ ముందస్తు సమాచారం ఆధారంగా భూములు పూర్తిగా ఎడారిగా మారకముందే రైతులు, శాస్త్రవేత్తలు దిద్దుబాటు చర్యలు చేపట్టే అవకాశం లభిస్తుంది.రైతులు ఏం చెయ్యాలి?పంట భూముల్లో సూక్ష్మజీవరాసి నశించి భూసారం కోల్పోకుండా ఉండాలంటే రైతులు వ్యవసాయ పద్ధతులను అనుసరించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని ఈ పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. రసాయన ఎరువులు, పురుగుమందుల అతి వినియోగం వల్ల నేలలోని సహజ సూక్ష్మజీవుల వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటోంది. పంట పొలాలను రక్షించుకోవాలంటే ఈ పనులు చెయ్యాలి:1. పచ్చిరొట్ట ఎరువులు, సేంద్రియ ఎరువులు, జీవామృతం వంటి దేశీ పద్ధతుల ద్వారా నేలలోని సూక్ష్మజీవులను వృద్ధి చేయాలి.2. పంట మార్పిడి పద్ధతులు పాటించి నేల సజీవంగా ఉండేలా చూసుకోవాలి. నేలలో సూక్ష్మజీవులు సమృద్ధిగా ఉంటేనే వర్షాభావ పరిస్థితులను, వాతావరణ మార్పులను తట్టుకుని సాగు భూమి పచ్చగా నిలబడుతుందని ఈ పరిశోధన తేటతెల్లం చేస్తోంది.నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ -
వేగంగా ఆరిపోతున్న నేలలోని తేమ!
దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ, దేశంలోని మూడోవంతు భూభాగం తీవ్ర వర్షాభావ, కరవు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఐఐటీ బాంబే ‘ఎకోహైడ్రాలజీ గ్రూప్’ చేపట్టిన ‘ఆల్ ఇండియా అగ్రికల్చరల్ డ్రాట్ ఫోర్కాస్ట్స్’ అధ్యయనంలో తాజా సమాచారం ప్రకారం వర్షాలు భారీగా పడుతున్న చోట్ల కూడా నేలలో తేమ నిలవటం లేదు.వేగంగా ఆరిపోతున్న తేమ ఉపరితల మట్టిలోని పై 5 సెం.మీ లోతులో తేమ వర్షం పడిన వెంటనే పెరిగినప్పటికీ.. ఎండలు, ఆవిరి కావటం వల్ల అంతే వేగంగా ఆరిపోతోంది. సాధారణంగా పంటల వేర్ల వ్యవస్థ విస్తరించే 100 సెం.మీ (రూట్–జోన్) లోతులో తేమ స్థిరంగా ఉంటుంది. కానీ, తాజా పరిస్థితుల్లో 100 సెం.మీ లోతులోనూ తీవ్ర స్థాయిలో తేమ హెచ్చుతగ్గులు, లోటు ఏర్పడుతోందని ఐఐటీ బాంబే పరిశోధకుల బృందం గుర్తించింది. వర్షపు నీరు భూమిలోకి ఇంకకుండా వేగంగా కొట్టుకుపోతుండటం, సుదీర్ఘ ΄÷డి వాతావరణం కారణంగా వేర్ల ప్రాంతంలో తేమ వేగంగా అడుగంటుతోంది.రాబోయే వారాల్లో..?∙ఆగస్టు నెలాఖరు వరకు (ఆగస్టు 17–23, 24–30 వారాల్లో) మన దేశంలో తీవ్రమైన కరవు పరిస్థితులు కొనసాగే అవకాశముందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ∙దక్షిణాదిలో 40% భూభాగం కరవు నీడలో ఉంది. ∙దేశంలోనే అత్యధికంగా కరవు బారిన పడిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ 72.4 శాతం విస్తీర్ణంతో మూడో స్థానంలో ఉంది. వారాల తరబడి నేలలో తేమ కోలుకోలేని స్థాయికి పడిపోయింది.∙తెలంగాణలో పరిస్థితి కొంత మెరుగ్గా ఉన్నప్పటికీ కొన్ని జిల్లాల్లో వర్షాభావ/తేమ కొరత పరిస్థితులు నెలకొన్నాయి. చెదురుమదురు వర్షాలు పంటల వేర్లకు తగినంత తేమను అందించలేకపోతున్నాయి.ఖరీఫ్, రబీ దిగుబడులకు గండంఖరీఫ్లో కీలక దశలో ఉన్న వరి, పత్తి, పప్పుధాన్యాలు, నూనెగింజల దిగుబడులపై ఈ తేమ కొరత తీవ్ర ప్రభావం చూపనుంది. రైతులు పంటలను కాపాడుకోవటానికి భూగర్భ జలాలపై ఆధారపడితే, రాబోయే రబీ సీజన్ కు తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడే ప్రమాదముంది. పంటల ఎంపిక, సాగు ప్రణాళికలపై ఇప్పటినుంచే ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎల్‌నినోను మనం ఆపలేం. కానీ దాని వల్ల వచ్చే నష్టాన్ని తగ్గించవచ్చు. వాన మారినప్పుడు పంటను, రకాన్ని, నీటి వినియోగాన్ని, రైతు నిర్ణయాన్ని మార్చగలిగితేనే భవిష్యత్తు వ్యవసాయం నిలబడుతుంది.నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ -
వాన మారితే... సాగూ మారాలి!
అనేక ప్రాంతాల్లో రుతుపవనాల ఆలస్యం రెండు వారాల నుంచి ఆరు–ఏడు వారాల వరకు నమోదైంది. రైతులు, కేవీకేల శాస్త్రవేత్తలు పరిస్థితిని బట్టి విత్తే తేదీని మార్చటం, పంటను మార్చటం, రకాన్ని మార్చటం వంటి నిర్ణయాలు తీసుకున్నారు.భారతీయ వ్యవసాయం తరతరాలుగా ఒక నమ్మకంపై నడిచింది. అదేమిటంటే ‘కాలం వస్తే వాన వస్తుంది, వాన వస్తే విత్తనం పడుతుంది’. ఇప్పుడు ఆ నమ్మకమే మారుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రుతుపవనాలు ఆలస్యంగా రావటం, వానల మధ్య విరామం పెరగటం, ఒక్కసారిగా భారీ వర్షాలు కురవటం తరచుగా కనిపిస్తున్నాయి. ఎల్‌నినో వంటి పరిస్థితులు ఈ అనిశ్చితిని మరింత పెంచుతున్నాయి. అందువల్ల ఇప్పుడు మన ముందున్న ప్రశ్న ‘ఎంత వర్షం పడుతుంది?’ అన్నది మాత్రమే కాదు. ‘వర్షం మనం ఊహించినట్లు పడకపోతే మన వ్యవసాయం ఎలా స్పందించాలి?’ అన్నదే కీలకం.ఈ ఏడాది పరిస్థితులు ఒక హెచ్చరికను సూచిస్తున్నాయి. ఈ ఏడాది జూలై 28 నుంచి ఆగస్టు 12 మధ్య కాలానికి సంబంధించిన భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ (ఐసీఏఆర్ – ఐఏఆర్ఐ) కరువు అంచనా ప్రకారం దేశంలోని సుమారు 64 శాతం ‘వ్యవసాయ విస్తీర్ణం’ ఏదో ఒక స్థాయి కరువులో ఉంది. అయితే, అందులో ఎక్కువ భాగం ‘స్వల్ప కరువు’ కేటగిరీలోనే ఉందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం సుమారు 88 శాతం ‘వ్యవసాయ విస్తీర్ణం’లో కరువు నమోదైంది. గత ఏడాది ఇదే కాలంలో ఇది 21 శాతం మాత్రమే. అంటే రాష్ట్రంలో 88 శాతం పంట నష్టపోయిందని కాదు; ముందుగానే జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందని చెప్పే హెచ్చరిక ఇది.జిల్లాల వారీగా చూస్తే పరిస్థితి మరింత స్పష్టమవుతుంది. బాపట్ల జిల్లాలో 9.9 శాతం, కాకినాడలో 4.6 శాతం, కృష్ణా జిల్లాలో 3.8 శాతం ప్రాంతం తీవ్ర కరువు నెలకొంది. పశ్చిమ గోదావరి, ప్రకాశం, అనకాపల్లి జిల్లాల్లోనూ ఇటువంటి ప్రాంతాలు కనిపిస్తున్నాయి. చిత్తూరు, విజయనగరం, పార్వతీపురం మన్యం, తిరుపతి జిల్లాల్లో తీవ్రమైన కరువు పరిస్థితులు ఉన్నాయి.తెలంగాణ పరిస్థితి కొంత భిన్నంగా ఉంది. రాష్ట్రం మొత్తంగా చూస్తే ఆంధ్రప్రదేశ్‌తో పోలిస్తే మెరుగ్గా ఉన్నా, కొన్ని ప్రాంతాల్లో తీవ్ర కరువు నెలకొంది. ఖమ్మంలో స్వల్ప విస్తీర్ణం తీవ్ర కరువులో ఉంది. సూర్యాపేట, ములుగు, కుమురం భీమ్, భద్రాద్రి కొత్తగూడెం, యాదాద్రి భువనగిరి, నాగర్‌కర్నూల్‌లో తీవ్రమైన కరువు జాడలు నమోదయ్యాయి. మేడ్చల్–మల్కాజిగిరిలో 10.9 శాతం ప్రాంతం ఒక మోస్తరు కరువు కేటగిరీలో ఉంది. నారాయణపేటలో 30.5 శాతం, మెదక్‌లో 26.7 శాతం, కామారెడ్డిలో 22.7 శాతం, నిజామాబాద్‌లో 21.6 శాతం విస్తీర్ణం స్వల్ప కరువులో ఉంది.2 నుంచి 6–7 వారాల ఆలస్యం అంటే ఎల్‌నినోను ఎదుర్కొనే విధానం రెండు రాష్ట్రాల్లో ఒకేలా ఉండకూడదు. ఆంధ్రప్రదేశ్‌కు విస్తృత స్థాయి ముందస్తు సంసిద్ధత అవసరమైతే, తెలంగాణకు హాట్‌స్పాట్ ఆధారిత చర్యలు అవసరం. కృషి విజ్ఞాన కేంద్రాల క్షేత్రస్థాయి అనుభవం మరో ముఖ్యమైన విషయం చెబుతోంది. అనేక ప్రాంతాల్లో రుతుపవనాల ఆలస్యం రెండు వారాల నుంచి ఆరు–ఏడు వారాల వరకు నమోదైంది. రైతులు, కేవీకే శాస్త్రవేత్తలు పరిస్థితిని బట్టి విత్తే తేదీని మార్చటం, పంటను మార్చటం, రకాన్ని మార్చటం వంటి నిర్ణయాలు తీసుకున్నారు.మొదటి మార్పు పంట ఎంపికలో రావాలి. వర్షం ఆలస్యమైతే ముందుగా అనుకున్న పంటనే ఎట్టి పరిస్థితుల్లోనూ వేయాలనే పట్టుదల ప్రమాదకరం. నేల, మిగిలిన పంటకాలం, అందుబాటులో ఉన్న నీటిని బట్టి కంది, పెసర, మినుము, ఉలవ, చిరుధాన్యాలు, ఆముదం వంటి ప్రత్యామ్నాయాలను ఎంచుకోవాలి. రెండోది స్వల్పకాలిక రకాలు. మూడు నాలుగు వారాలు ఆలస్యంగా విత్తిన రైతు దీర్ఘకాలిక రకాన్ని వేస్తే చివరి దశలో నీటి కొరత ఎదురయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకే వరి, కంది, పెసర తదితర పంటల్లో తక్కువ కాలంలో కోతకు వచ్చే రకాలు అత్యంత కీలకం.మూడోది.. పడిన ప్రతి వాన చుక్కను ΄÷లంలోనే నిలబెట్టుకోవటం. నీటి కుంటలు, వాన నీటిని ఇంకించే గొడ్డు సాళ్లు, ఆచ్ఛాదన, బోదెలు–కాలువలు, అంతరకృషి, సబ్ సాయిలింగ్, డ్రిప్, స్ప్రింక్లర్, రక్షణాత్మక తడులు వంటి చర్యలు రెండు రాష్ట్రాల్లో మంచి ఫలితాలు చూపుతున్నాయి.పచ్చిరొట్ట ఎరువులు, పంట అవశేషాలను నేలలో కలపటం, సమగ్ర పోషక యాజమాన్యం, అంతర పంటలు, జీవ ఎరువులు, ప్రీ–మాన్సూన్ డ్రై సోయింగ్ వంటి పద్ధతులు నేలలో తేమ నిల్వ సామర్థ్యాన్ని పెంచుతాయి.ఇకపై రైతుకు ‘కరవు రావచ్చు జాగ్రత్త’ అనే సాధారణ సందేశం సరిపోదు. ‘ఈ తేదీలోపు వర్షం వస్తే ఈ పంట; మరో పది రోజులు ఆలస్యమైతే ఈ రకం; ఇంకా ఆలస్యమైతే ఈ ప్రత్యామ్నాయ పంట’ అనే నిర్ణయాత్మక సలహాలు కావాలి. ఎల్‌నినోను మనం ఆపలేం. కానీ దాని వల్ల వచ్చే నష్టాన్ని తగ్గించవచ్చు. ?వాన మారినప్పుడు పంటను, రకాన్ని, నీటి వినియోగాన్ని, రైతు నిర్ణయాన్ని మార్చగలిగితేనే భవిష్యత్తు వ్యవసాయం నిలబడుతుంది. డా. షేక్ ఎన్. మీరాడైరెక్టర్, ఐసీఏఆర్–అటారీ,హైదరాబాద్నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ -
ఈ 3జీ కటింగ్‌తో.. ఒక్క మొక్క 3 రెట్లు దిగుబడి!
మిద్దె తోటల్లో మొక్కలు గుబురుగా పెరిగి, ఎక్కువ దిగుబడి రావటానికి చేసే ఒక ముఖ్యమైన పద్ధతే 3జీ కటింగ్. ప్రధానంగా తీగ జాతి మొక్కలైన సొర, కాకర, దోస, బీర వంటి పంటలకు ఇది బాగా ఉపయోగపడుతుంది.1. మొక్క మొదటి తరాన్ని 1జీ అని, దాని నుంచి వచ్చే కొమ్మలను 2జీ అని, ఆ కొమ్మల నుంచి వచ్చే మరిన్ని కొమ్మలను 3జీ అని అంటారు. మొక్కకు కేవలం మగ పూలు కాకుండా, ఎక్కువ ఆడ పూలు (కాయలుగా మారేవి) రావటానికి ఈ పద్ధతిని వాడతారు.2. మొదటి తరం (1G -1st Generation) : మొక్క పెరగడం ప్రారంభించినప్పుడు, ప్రధాన కాండం సుమారు 7–8 అడుగుల పొడవు పెరిగే వరకు ఉంచాలి. ఆ తర్వాత, ఆ ప్రధాన కాండం చివరను (కొనను) కత్తిరించాలి. దీన్నే 1జీ కటింగ్ అంటారు.3. రెండో తరం (2G -2nd Generation) : ప్రధాన కాండం కత్తిరించిన తర్వాత ఆకు మూలల నుంచి కొత్తగా 2–3 కొమ్మలు వస్తాయి. వీటిని 2జీ కొమ్మలు అంటారు. ఈ 2జీ కొమ్మలు కూడా 2–3 అడుగులు పెరిగిన తర్వాత, వాటి చివరలను కూడా కత్తిరించాలి.4. మూడో తరం(3G -3rd Generation) : ఇప్పుడు 2జీ కొమ్మల నుంచి మరిన్ని కొత్త కొమ్మలు (3జీ) వస్తాయి.ఈ 3జీ కొమ్మలపైనే అత్యధికంగా ఆడ పూలు వస్తాయి, ఫలితంగా కాయలు ఎక్కువగా కాస్తాయి.5. మొక్క ఆరోగ్యంగా ఉన్నప్పుడు, కనీసం 10–12 ఆకులు ఉన్నప్పుడే కటింగ్ ప్రారంభించాలి.6. పొద జాతి మొక్కలకు (మిరప, టమోటా, మందార, మల్లె వంటివి) మనం చేసే కటింగ్‌ను సాధారణంగా ‘పించింగ్’ అని కూడా అంటారు. మొక్క 10–12 ఆకులతో ఒక అడుగు ఎత్తు పెరిగినప్పుడు, పై భాగంలోని లేత చిగురును తుంచేయాలి.7. చిగురు తుంచిన చోట నుండి రెండు, మూడు కొత్త కొమ్మలు వస్తాయి. అవి కొంచెం పెరిగిన తర్వాత వాటి చిగుర్లను కూడా తుంచితే, మొక్క మరింత గుబురుగా మారి ఎక్కువ పూలు, మొగ్గలు వస్తాయి.8. గోరుచిక్కుడు మొక్కకు సాధారణంగా 3జీ కటింగ్ అవసరం ఉండదు, ఎందుకంటే ఇది సహజంగానే కొమ్మలతో పెరుగుతుంది. అయితే మరీ పొడవుగా పెరుగుతుంటే పైభాగాన్ని తుంచవచ్చు.9. టమాటాలో 3జీ కటింగ్ కంటే సక్కర్స్ తొలగించటం, ప్రూనింగ్ చేయటం దిగుబడి పెంచడానికి బాగా పనిచేస్తుంది.10. టమాటాలో ΄ాకే రకాలు ఉంటాయి. ఇవి చాలా ఎత్తు పెరుగుతాయి. వీటి చివరలను కట్ చేస్తే పెరుగుదల ఆగిపోతుంది. కాబట్టి, సాధారణంగా వీటి కాండం పక్కల నుండి వచ్చే అనవసరమైన చిన్న రెమ్మలను తీసేయాలి. 11. పొద రకం టమాటా మొక్కలు కొంత ఎత్తు పెరిగి ఆగిపోతాయి. వీటిని ఎక్కువగా కత్తిరించాల్సిన అవసరం లేదు, కేవలం కింద నేలకు తగిలే ఆకులను తీసేస్తే సరిపోతుంది.12. టమాటా మొక్కలు లో అనవసరమైన కొమ్మలను లేదా చివరలను కత్తిరించడం వల్ల మొక్క తన శక్తిని పండ్లు పెద్దవిగా పెరగడానికి, త్వరగా పక్వానికి రావడానికి ఉపయోగిస్తుంది. సీజన్ చివరలో మొక్క చివరలను కత్తిరించడం వల్ల కొత్తగా పూలు పూయడం ఆగి, అప్పటికే ఉన్న కాయలు త్వరగా పండుతాయి.13. కటింగ్ చేసిన వెంటనే మొక్కకు లిక్విడ్ ఫెర్టిలైజర్ (జీవామృతం లేదా బియ్యం కడిగిన నీళ్లు) లేదా వర్మీ కంపోస్ట్ ఇవ్వడం మర్చిపోవద్దు. ఎందుకంటే కొత్త కొమ్మలు రావడానికి మొక్కకు శక్తి కావాలి. ఆవు పేడ, మూత్రం, బెల్లం, శనగపిండితో తయారుచేసే జీవామృతం మొక్కకు అమృతంలా పనిచేస్తుంది. ఇది వారానికి ఒకసారి. పోయవచ్చు.14. గోళ్లతో తుంచడం కంటే పదునైన కత్తెర వాడటం మేలు. కత్తిరించిన భాగం వద్ద కొంచెం పసుపు రాస్తే ఇన్ఫెక్షన్ సోకకుండా ఉంటుంది. 15. కటింగ్ తరువాత మొక్క పైన నీరు చల్లకుండా, మొదట్లో మాత్రమే పోయాలి. 16. తీగ జాతి మొక్కలలో (సొర, బీర, కాకర వంటివి) పూత, పిందె దశలో ఉన్నప్పుడు 3జీ కటింగ్ చేయడం సరైన పద్ధతి కాదు. 3జీ కటింగ్ ప్రక్రియను మొక్క చిన్నగా ఉన్నప్పుడే (సుమారు 1 మీటర్ లేదా 6–8 ఆకులు ఉన్నప్పుడు) ప్రారంభించాలి. దీని ఉద్దేశ్యం కొత్త రెమ్మలను (2జీ, 3జీ కొమ్మలను) పుట్టించి, వాటిపై ఎక్కువ ఆడ పూలను వచ్చేలా చేయడం.17. పూత, పిందె దశలో కొమ్మలను కత్తిరించడం వల్ల ఇప్పటికే ఉన్న పూలు, పిందెలు రాలిపోయే అవకాశం ఉంది. అలాగే, మొక్క తన శక్తిని కొత్త కొమ్మల ఉత్పత్తికి మళ్లిస్తుంది, దీనివల్ల ఉన్న కాయలు సరిగ్గా పెరగవు. తగినంత ఎరువులు, నీరు అందిస్తే కాయలు నాణ్యంగా పెరుగుతాయి.18. ఒకవేళ మొక్క కేవలం మగ పూలనే పూస్తూ, అసలు పిందెలు పడకపోతే, అప్పుడు చివరి రెమ్మలను కొద్దిగా తుంచవచ్చు (పించింగ్). కానీ పద్ధతి ప్రకారం చేసే 3జీ కటింగ్ మాత్రం పంట ప్రారంభ దశలోనే పూర్తి చేయాలి. 19. 3ఎ కటింగ్ ద్వారా ఒకే మొక్క నుండి సాధారణం కంటే 2 నుండి 3 రెట్లు ఎక్కువ దిగుబడిని సాధించవచ్చు.20. మొక్కకు నత్రజని ఎక్కువగా అందడం వల్ల ఆకులు, మగ పూలు విపరీతంగా వస్తాయి. బూడిద లేదా అరటిపండు తొక్కల పొడి వంటివి వేయడం ద్వారా పొటాషియం, ఫాస్పరస్ అంది, ఆడ పూల సంఖ్య పెరుగుతుంది. అరటిపండు తొక్కలను 2–3 రోజులు నీటిలో నానబెట్టి, ఆ నీటిని మొక్కలకు పోయడం వల్ల పొటాషియం అందుతుంది.21. ఇంట్లో వాడిన కోడిగుడ్డు పెంకులను పడేయకుండా, వాటిని పొడి చేసి మట్టిలో కలపడం లేదా నీటిలో వేసి మరిగించి ఆ నీటిని చల్లార్చి మొక్కలకు పోయటం ద్వారా కాల్షియం అంది పిందెలు కుళ్ళిపోకుండా ఉంటాయి. పూత రాలకుండా బలంగా ఉంటుంది.22. హ్యాండ్ ΄ాలినేషన్ చేయాలి. ఒకవేళ తోటలో తేనెటీగలు లేకపోయినా లేదా ఆడ పూలు తక్కువగా ఉన్నా పిందెలు కాయలుగా మారవు. అప్పుడు మనమే స్వయంగా పరాగ సంపర్కం చేయవచ్చు. బాగా వికసించిన మగ పూవును కోసి, దాని రేకులను తీసివేసి ఆ మగ పూవు మధ్యలో ఉండే పరాగ రేణువులను ఆడ పూవు (పువ్వు కింద చిన్న పిందె ఉండేది) మధ్య భాగంలో మెల్లగా తాకించాలి.. ఈ పనిని ఉదయం 6 నుండి 9 గంటల లోపు చేస్తే ఫలితం బాగుంటుంది.23. బాగా పులిసిన మజ్జిగలో కొద్దిగా ఇంగువ కలిపి ఒక లీటరుకు 10 లీటర్ల నీరు కలిపి మొక్క అంతా తడిచేలా పిచికారీ చేయడం వల్ల పూత బాగా వస్తుంది. ఇది ‘మిరకిల్ లిక్విడ్’ లాగా పనిచేస్తుంది. ఇంగువను పిచికారీ చేయటం వల్ల పూత రాలదు. మగ పూల కంటే ఆడ పూలు వచ్చే అవకాశం పెరుగుతుంది.24. మట్టి ఎప్పుడూ తడిగా ఉండేలా చూసుకోవాలి. కానీ నీరు నిలవకుండా జాగ్రత్త పడాలి. ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటే మగ పూలు పెరిగే అవకాశం ఉంటుంది.- కొల్లి కృష్ణ కుమారి, అడ్మిన్, గుంటూరు జిల్లా, మిద్దె తోటల బృందం. మొబైల్: 94906 02366 -
కోరమాను.. ధాన్యానికి పురుగులు పట్టకుండా రక్షణ!
English Name: Spinons Kino tree/ Indian Laurel figశాస్త్రీయ నామం: బ్రిడేలియా రేటుScientific Name: Bridelia retusa (L) A. Juss Synonym(s): Bridolia spinosa (Roxb.) Wild. / Clutia retusa L.కుటుంబం: యుఫర్బేసిFarm-ily: Euphorbiaceaeవివిధ భాషల్లో ‘కోరమాను’ చెట్టు పేర్లు: అస్సామీ: కుహిర్, కుహిట్, కున్ హి ఇంగ్లిష్: సైనోంన్స్ కినోటి, ఇండియన్ లారెల్ ఫిగ్ కన్నడ: మల్లు హన్నె మర, కోవే ముల్లు హన్నె, ముల్లు జోగల, ఆసన, గుజ్జు, కోమంచి, కొయ్యముంచి, బీల్ కుంబెతమిళం: ముల్లు వెంగై, అదమరుడు, కడుగా తెలుగు: బొంతవేగి, కొరమాను, కోరమద్ధి, కోడేరు, దుర్వమద్ది, మల్లుమద్ది, పైమద్ది మరాఠీ: ఆసనమలయాళం: ముల్కెని, ఉల్లు వెంగ బెంగాలీ: జైయో హిందీ: కాజి, ఖజ, కస్సై కట్టి దామన్ సంస్కృతం: ఆసన, ఏకవీర, మహావీరపూత:ఏప్రిల్ – మే పండ్లు:జులై – ఆగస్టు (పూత, కాతలో కొంత వ్యత్యాసం ఉండవచ్చు. నేల, వాతావరణం ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు).ఉనికి...కోరమాను చెట్టు దాదాపు 10–15 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. ఈ చెట్ల లేత దశలో కాండంపై కురుచటి ముళ్లు ఉంటాయి. చెట్లు ఎదుగుతున్నపుడు ముళ్లు మొద్దుబారతాయి. ఈ చెట్లు సముద్ర మట్టానికి 650 – 1000 మీటర్ల ఎత్తయిన ్రపాంతాల్లోని అడవుల్లో కూడా పెరుగుతాయి. ఈ చెట్లు బెట్టెను తట్టుకోగలవు.కోరమద్దికి సక్కర్లు (వేరు బయటకు కనబడ్డ దగ్గర నేల పైకి పొడుచుకు వచ్చే మొలకలు) వచ్చే గుణం ఉంది. వీటి ఆవాసం ఈస్ట్ ఆసియా, చైనా, భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్, మయన్మార్, థాయిలాండ్, లావోస్, వియత్నాం, మలేషియా, ఇండోనేషియా. నల్లమల అడవుల్లో కూడా వీటి ఉనికి కనిపిస్తుంది. ఇదే తెగకు చెందిన దాదాపు 10 జాతులు నల్లమలలో ఉన్నవి. (Reddy et al., 1991). ఈ చెట్లు ఎక్కువగా ఆకులు రాల్చే ఉష్ణమండలపు అడవుల్లో ఉంటాయి.ఉపయోగాలు...కొరమాను పండ్లు ముదురు గోధుమ రంగులో గుండ్రంగా ఉంటాయి. వీటిని తింటారు. వగరు+తీపి రుచితో ఉంటాయి. వీటి పూలు మంచి వాసనను వెదజల్లుతూ ఉంటాయి. చెట్లు పూత దశలో ఉన్నప్పుడు తేనెటీగలకు మంచి నేస్తాలుగా మారతాయి.ఎండిన చెట్లు వంట చెరుకుగా, ఫర్నీచర్ తయారికి ఉపయోగపడతాయి.ఈ చెట్టుకు కీటక నాశక గుణాలున్నాయి.ధాన్యాన్ని నిల్వ చేయటానికి గాదెపై కోరమద్ది చెక్క వేస్తే గింజలకు పురుగు పట్టదు.ఈ చెట్టు బెరడును విరేచనాలు తగ్గించడానికి వాడతారు.వీటి ఆకులు, బెరడు, వేర్లను నాటు వైద్యంలో అనేక రోగాలను ముఖ్యంగా మలేరియా, రక్తహీనత, ఆస్తమా, చక్కెర రోగం, విరేచనాలు, క్యాన్సర్, సుఖరోగాలు, కీళ్ల నొప్పులు, కడుపు నొప్పి, మూత్ర నాళ సమస్యలు, కామెర్లు, పుండ్లు తదితర రోగాలను నయం చేయటానికి వాడుతుంటారు.జీవ వైవిధ్యంలో ఈ చెట్టుకు కూడా స్థానం ఉంది. ఈ చెట్లను పంటలతో పాటు కలిపి ఆగ్రో ఫారెస్ట్రీలో పెంచవచ్చు.ఈ చెట్ల పండ్ల నుంచి జ్యూస్ తయారు చేయవచ్చు. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది.వీటి ఆకులు, పండ్లు, బెరడు, వేర్లలో ఫైటోకెమికల్స్ (స్టెరాయిడ్స్, ట్యానిన్స్, ఫినాల్స్, ఫ్లెవోనైడ్స్, సపోనిన్స్ ఉంటాయి. Rupali et a ., 2016).ఈ చెట్లకు ఆయుర్వేదంలో, సిద్ధ వైద్యంలో, నాటు వైద్యంలో, యునానీ, హోమియోపతిలో మంచి పేరుంది.మాగిన కోరమాను పండ్లలో ఆల్ఫా–సిటోస్టిరాల్, గ్యాలిక్, ఎల్లెజిక్ ఆమ్లాలు ఉంటాయి. (Mahapatra and Panda, 2009).ఎన్నో విలువలు ఉన్న ఈ జాతి పండ్ల చెట్లు పంట పొలాల్లో పెంచితే జనాలకు ఎంతో ప్రయోజనం జరుగుతుంది. కాబట్టి ఈ పండ్ల చెట్లపై పరిశోధనలు ఎంతో అవసరం. అట్లే ఈ చెట్ల ఉనికిని కాపాడటానికి నల్లమలలో అధిక మొత్తంలో నాటటం ఎంతైనా అవసరం.కోరమాను పండ్లను పక్షులు బాగా ఇష్టపడతాయి.- డాక్టర్ మొరుపోజు పద్మయ్య, విశ్రాంత ప్రధాన శాస్త్రవేత్త, ఐసీఏఆర్ – ఐఐఓఆర్, రాజేంద్రనగర్, హైదరాబాద్. మొబైల్: 94407 08924 -
పురుగుమందులు విఫలం.. పంట మార్పిడి సఫలం!
పంటలను వ్యాధులు, తెగుళ్ల నుంచి కాపాడుకోవటానికి నేడు చాలా మంది రైతులు క్రిమిసంహారక రసాయనాలపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. అయితే, మితిమీరిన రసాయనాల వాడకం అనుకున్న ఫలితాలను ఇవ్వకపోగా, రైతులపై పెట్టుబడి భారాన్ని విపరీతంగా పెంచుతోంది. ఒడిశాలోని సినాపాలి బ్లాక్ బార్గావ్ గ్రామానికి చెందిన రైతు మురళీధర్ నాయక్ అనుభవాలే దీనికి స్పష్టమైన నిదర్శనం. ఈ రైతు అనుభవాన్ని ప్రాతిపదికగా చేసుకొని, ప్రస్తుత వ్యవసాయంలో క్రిమిసంహారక మందుల పరిమితులు, పంట మార్పిడి ప్రాముఖ్యతను వివరించే కథనం.మురళీధర్ తన 2.5 ఎకరాల పొలంలో బిందు సేద్యం (డ్రిప్), సోలార్ పంప్, ప్లాస్టిక్ మల్చింగ్ వంటి ఆధునిక సాంకేతికతలతో టొమాటోలు, వంకాయలు, పుచ్చకాయలను ఏక పంటలుగా సాగు చేస్తున్నారు. కానీ, ఇటీవలి భారీ వర్షాలు, నీటి పారుదల సమస్యల కారణంగా ఆయన టొమాటో పంటకు ‘ఎండు తెగులు’ సోకింది. పంటను కాపాడుకోవటానికి వేల రూపాయలు వెచ్చించి ఎంతగా క్రిమిసంహారక మందులు పిచికారీ చేసినా తెగులు అదుపులోకి రాలేదు.పంట మార్పిడే శాశ్వత పరిష్కారంఈ రసాయన వ్యర్థాల చక్రబంధం నుంచి బయటపడటానికి ‘పంట మార్పిడి’ ఒక్కటే సరైన మార్గమని నిపుణులు చెబుతున్నారు. ఒకే భూమిలో ప్రతి సీజన్లో లేదా ప్రతి ఏటా వేర్వేరు కుటుంబాలకు చెందిన పంటలను మార్చి మార్చి సాగు చేయటం వల్ల తెగుళ్ల జీవచక్రం తెగిపోతుంది. ఉదాహరణకు: పప్పుధాన్యాలు, తృణధాన్యాలు, ఆకుకూరలు. దీనివల్ల నేలలో వ్యాధికారక క్రిముల ఉనికి తగ్గి, మట్టి సారవంతమవుతుంది.జైవిక సమతుల్యతే కీలకండ్రిప్ ఇరిగేషన్, ప్లాస్టిక్ మల్చింగ్ వంటి సాంకేతికతలు నీటిని, శ్రమను ఆదా చేయగలవు. కానీ నేలలో జీవ సంబంధమైన సమతుల్యతను పునరుద్ధరించలేవు. పంటకు తెగులు రాగానే రసాయనిక పురుగు మందుల వాడటం వల్ల ఖర్చు పెరగటమే తప్ప పంట దిగుబడి పెరగదు. సాంకేతికతతో పాటు నేల స్వభావానికి అనుగుణంగా ‘పంట మార్పిడి’ పద్ధతిని పాటించటమే రైతుల ఆర్థిక భద్రతకు, సుస్థిర దిగుబడులకు అసలైన మార్గమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.ఇవీ ప్రధాన పంట కుటుంబాలుతెగుళ్ల చక్రాన్ని తెగ్గొట్టి వాటి తీవ్రతను తగ్టించటానికి, భూసారాన్ని పరిరక్షించటానికి వేర్వేరు కుటుంబాలకు చెందిన పంటలను మార్చి మార్చి సాగు చేయాలి. ప్రధాన పంట కుటుంబాలు, వాటి ఉదాహరణలు...పప్పుధాన్యాలు (లెగ్యుమినేసి / ఫాబేసే): పెసర, మినుము, కంది, బఠాణీలు, శనగలు, వేరుశనగ తదితర పప్పుధాన్యాలు. ఇవి నేలలో నత్రజనిని స్థిరీకరించి భూసారాన్ని పెంచుతాయి.ధాన్యపు పంటలు (గ్రామినేసి / పోయేసే): వరి, గోధుమ, జొన్న, సజ్జ, మొక్కజొన్న, రాగి తదితరాలు.బంగాళదుంప కుటుంబం (సోలనేసే): టొమాటో, వంగ, మిరప, బంగాళదుంప తదితరాలు.ఆవాలు/ క్యాబేజీ కుటుంబం (బ్రాసికేసే / క్రసిఫెరే): క్యాబేజీ, కాలీఫ్లవర్, ముల్లంగి, ఆవాలు, బ్రోకలీ తదితరాలు.తీగజాతి కూరగాయలు (కుకుర్బిటేసే): గుమ్మడి, దోస, కాకర, సొరకాయ, కీర తదితరాలు.క్యారెట్ కుటుంబం (అంబెలిఫెరే / అపిసే): క్యారెట్, కొత్తిమీర తదితరాలు.ఈ విధంగా ఒక కుటుంబానికి చెందిన పంట తర్వాత వేరే కుటుంబానికి చెందిన పంటను వేయటం వల్ల ఒకే రకమైన తెగుళ్లు లేదా పురుగులు ఆశించకుండా వాటి జీవచక్రం తెగిపోతుంది.రసాయనాలకు లొంగని తెగుళ్లు: అసలు కారణం ఏమిటి?ఉద్యానవన శాఖ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. టొమాటోలు, వంకాయలు, బంగాళాదుంపలు, మిరప కాయలు వంటివి ఒకే ‘సోలనేసి’ అనే వృక్ష కుటుంబానికి చెందిన పంటలు. ఒకే పొలంలో వరుసగా ఒకే కుటుంబానికి చెందిన పంటలను సాగు చేయటం వల్ల ఆ నేలలో వ్యాధికారక శిలీంధ్రాలు, బాక్టీరియాల తీవ్రత భారీగా పెరిగిపోతుంది. ఒకసారి నేల ద్వారా సంభవించే ఎండు తెగులు తీవ్రత పెరిగితే, ఎలాంటి క్రిమిసంహారక రసాయనాలు చల్లినా పెద్దగా ప్రయోజనం ఉండదు. -
కాంక్రీట్ మిల్లర్‌తో విత్తన గుళికల తయారీ!
ప్రకృతి వ్యవసాయంలో విత్తన గుళికల (సీడ్ పెల్లెట్ల) తయారీకి ఎంతో ప్రాధాన్యం ఉంది. అయితే, సాధారణంగా గోనె సంచిని ఉపయోగించి ముగ్గురు వ్యక్తులు ఎటువంటి యంత్రం వాడకుండా విత్తన గుళికలు తయారు చేస్తుంటారు. ఈ పద్ధతిలో సమయం, శ్రమ ఎక్కువగా ఖర్చవుతాయి. ఈ సమస్యకు పరిష్కారంగా భవన నిర్మాణ పనుల్లో ఉపయోగించే కాంక్రీట్ మిల్లర్ (స్లాబ్ మిక్సర్) ద్వారా తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతోనే నాణ్యమైన విత్తన గుళికలను తయారుచేసే విధానాన్ని తూర్పు గోదావరి జిల్లా ప్రకృతి వ్యవసాయ విభాగం ప్రాజెక్ట్ మేనేజర్ బొర్రా తాతారావు కొత్తగా ఆలోచించి ప్రారంభించారు.50–60 కిలోలుకాంక్రీట్ మిల్లర్ బక్కెట్లో ఒకేసారి సుమారు 50 నుంచి 60 కేజీల విత్తనాలను విత్తన గుళికలు తయారు చేసుకోవచ్చు. ముందుగా బీజామృతంతో శుద్ధి చేసిన విత్తనాలను ఇందుకు ఉపయోగించాలి. మిల్లర్ తిరుగుతున్నప్పుడు క్రమంగా మట్టి పొడిని విత్తనంపై చల్లుతూ ఉండాలి. మట్టి పొడి విత్తనాల చుట్టూ సరిగ్గా అంటుకోవడానికి తడి అవసరం. బ్యాటరీ స్ప్రేయర్‌తో నీటిని తగుమాత్రంగా స్ప్రే చేయాలి. ఆ తర్వాత ఘనజీవామృతం పొడిని చల్లాలి. గుళికలు తయారయ్యాక, చివరగా బూడిద లేదా బొగ్గు పొడిని చల్లితే చాలు.. విత్తన గుళికలు సిద్ధమైనట్లే. అరగంటలో విత్తన గుళికలు సిద్ధమవుతాయి.వెద వరి, పత్తి, మినుము, కందులు వంటి ఏకపంట విత్తనాలకే కాక, ప్రీ–మాన్సూన్ డ్రై సోయింగ్ (పీఎండీఎస్) పద్ధతిలో వాడే 30 రకాల విత్తనాలతో గుళికల తయారీకి కూడా ఈ యంత్రం బాగా ఉపయోగపడుతుందని తాతారావు తెలిపారు. చాలా ఎకరాల్లో విత్తన గుళికలు చల్లుకునే రైతాంగానికి కాంక్రీట్ మిల్లర్ విధానం ఎంతో సమయాన్ని, ఖర్చును ఆదా చేసే ఉత్తమ పద్ధతని తాతారావు తెలిపారు. కిలోకు ఖర్చు రూ.7–8 మాత్రమేకాంక్రీట్ మిల్లర్ ద్వారా కేవలం ఇద్దరు లేదా ముగ్గురు మనుషులతో రోజుకు (7–8 గంటల్లో) సుమారు 1 టన్ను నుంచి 1.2 టన్నుల (1200 కేజీల) విత్తన గుళికలు తయారు చేసుకోవచ్చు. మెషిన్ అద్దె, డీజిల్, కూలీలు, బంక మట్టి పొడి, ఘనజీవామృతం.. తదితర ఖర్చులన్నింటినీ కలిపితే కేజీ తయారీకి సుమారు రూ. 7 నుంచి 8 మాత్రమే ఖర్చవుతుంది. కిలో విత్తనంతో కిలోన్నర గుళికలుఒక కిలో విత్తనాలను విత్తన గుళికలుగా తయారు చెయ్యటానికి అవసరమయ్యే పదార్థాలు, ఏయే మోతాదుల్లో కావాలంటే.. 1 కేజీ (మినుము, కందులు లేదా ఏవైనా ఇతర పంటల విత్తనాల) గుళికల తయారీకి ముందు విత్తనాన్ని తేమ చేసి శుద్ధి చేయటానికి 50–100 మి.లీ. బీజామృతం, సుమారు 250–300 గ్రాముల పుట్టమట్టి/మట్టి పొడి, 250–300 గ్రాముల ఘనజీవామృతం పొడి, 100–150 గ్రాముల బూడిద లేదా బొగ్గు పొడితో పాటు స్ప్రేయర్ ద్వారా చిలకరించడానికి కొద్దిగా నీరు అవసరం అవుతాయి. 1 కేజీ విత్తనాలతో తయారు చేసిన విత్తన గుళికల బరువు 1.5 కిలోల నుంచి 1.7 కేజీల వరకు ఉంటుంది. విత్తన గుళికలను విత్తిన తర్వాత వర్షం ఆలస్యమైనా విత్తనం వృథా కాదు. తేమ ఎక్కువ రోజులు ఉంటుుంది. నీటి ఎద్దడిని, చీడపీడలను తట్టుకొని మొక్క దృఢంగా పెరుగుతుంది.ఏ పంటల కోసమైనా విత్తన గుళికలు చెయ్యొచ్చుకాంక్రీట్ మిల్లర్‌తో విత్తన గుళికలు తయారు చేసుకోవటం చాలా సులభం. గోనె సంచులతో విత్తన గుళికలు చేసుకోవటం పెద్ద రైతులకు ఇబ్బందికరంగా ఉండటంతో తూర్పుగోదావరి జిల్లాలో కాంక్రీట్ మిల్లర్‌తో తయారు చెయ్యటం గత ఏడాదే మొదలుపెట్టాం. మొలక శాతం చాలా బాగుంది. ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో 900 ఎకరాల్లో పీఎండీఎస్ పచ్చిరొట్ట పంటలు సాగు చేశాం. ఆ గడ్డిని కోసిన తర్వాత ఊడ్పులు కూడా పూర్తయ్యాయి. ఎల్‌నినో నేపథ్యంలో ప్రధాన పంట విత్తనాలను ఇప్పుడు కూడా కాంక్రీట్ మిల్లర్‌తో విత్తన గుళికలు తయారు చేస్తున్నాం. వెద వరి/ నారుమళ్లు పోసే వరి విత్తనాలు, కంది, మినుము, సజ్జతో పాటు కొర్ర వంటి అన్ని రకాల పంటల విత్తనాలను కూడా దీనితో చేస్తున్నాం. మొలక శాతం కూడా బాగుంది. ఈ పద్ధతి రైతులకు చాలా ఉపయోగంగా ఉంది.– బొర్రా తాతారావు (94404 97033), జిల్లా ప్రాజెక్టు మేనేజర్, తూ.గో. జిల్లానిర్వహణ: పంతంగి రాంబాబుసాక్షి సాగుబడి డెస్క్ -
Sagubadi: దుంపలు ఎప్పుడు నాటాలి?
ఇంటిపంటలు, మిద్దె తోటల్లో కుండీలు, మడుల్లో క్యారెట్, బీట్రూట్, ముల్లంగి, కంద, చేమదుంప వంటి దుంపలు పండించడానికి సరైన కాలం, సరైన సాగు పద్ధతులు ఏమిటో తెలుసుకుందాం. క్యారెట్, బీట్రూట్, ముల్లంగి వంటి దుంప పంటలను ప్రధానంగా చలికాలంలో లేదా వర్షాకాలం అంటే సెప్టెంబర్ /అక్టోబర్ నుంచి జనవరి వరకు నాటుకోవడం ఉత్తమం.ఈ కాలంలో ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల సెల్సియస్ నుంచి 25 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండటం వల్ల దుంపలు బాగా ఊరతాయి. ముల్లంగిని ఆగస్టు నుంచి కూడా నాటుకోవచ్చు. కంద, చేమదుంప వేసవి, వర్షాకాలం పంటలు. వీటిని సాధారణంగా ఏప్రిల్ నుంచి జూలై మధ్యలో నాటుకోవచ్చు. మార్కెట్లో దొరికే దుంపలు తెచ్చి నాటుకోవచ్చు.దుంప జాతి మొక్కలకు నత్రజని కంటే భాస్వరం, పొటాషియం ఎక్కువగా అవసరం. విత్తనాలు నాటేటప్పుడే మట్టిలో బాగా చివికిన పశువుల ఎరువు లేదా వర్మీ కంపోస్ట్ కల΄ాలి. మొక్కలు 4–6 అంగుళాల ఎత్తు పెరిగినప్పుడు (నాటిన 30–45 రోజుల తర్వాత) ఒకసారి ద్రవ ఎరువులు లేదా కొద్దిగా వర్మీ కంపోస్ట్ ఇవ్వాలి.తాజా పశువుల ఎరువు వాడకూడదు. వాడితే క్యారెట్, ముల్లంగి దుంపలు రెండుగా చీలిపోయే అవకాశం ఉంది. దుంపలు భూమిలో సులభంగా పెరగడానికి మట్టి చాలా గుల్లగా, మెత్తగా ఉండాలి.1 వంతు ఇసుకతో ఉన్న ఎర్రమట్టి లేదా తోట మట్టి (మామూలు ఎర్ర మట్టి అయితే కొద్దిగా ఇసుక కల΄ాలి), 1 వంతు కోకోపీట్ /వరి పొట్టు (మట్టి గుల్లగా ఉండటానికి), 1 వంతు వర్మీ కంపోస్ట్ లేదా బాగా చివికిన పశువుల ఎరువు కొద్దిగా వేప పిండి (మట్టిలో పురుగులు చేరకుండా ఉండటానికి)తో కలిపి మట్టి మిశ్రమం తయారు చేసుకోవాలి.ఎప్పటికప్పుడు కలుపు మొక్కలు తీసేయాలి..క్యారెట్ – బీట్రూట్ నాటుకోవటం కోసం కనీసం 12–14 అంగుళాల లోతు, 12 అంగుళాల వెడల్పు ఉన్న కుండీలు లేదా గ్రో బ్యాగ్స్ వాడాలి. ముల్లంగి నాటుకోవటానికి 8–10 అంగుళాల లోతు సరిపోతుంది.కంద – చేమదుంప నాటుకోవటానికి పెద్ద కుండీలు అవసరం. కనీసం 15–20 లీటర్ల సామర్థ్యం ఉన్న కుండీ లేదా పెద్ద టబ్బులు వాడితే దుంపలు పెద్దగా పెరుగుతాయి.మట్టిలో రాళ్లు, గడ్డలు లేకుండా చూసుకోవాలి, లేదంటే దుంపల ఆకారం దెబ్బతింటుంది. బీట్రూట్, క్యారెట్ విత్తనాల మధ్య కనీసం 2–3 అంగుళాల దూరం ఉండాలి.కంద/చేమదుంప నాటేటప్పుడు దుంప మొలక పైకి ఉండేలా చూసి, 2–3 అంగుళాల లోతులో నాటాలి. ఈ మొక్కలకు రోజుకు కనీసం 6 గంటల ఎండ అవసరం.కుండీ అడుగున రంధ్రాలు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. లేకపోతే నీరు నిల్వ ఉంటే దుంపలు కుళ్ళిపోతాయి.ముల్లంగి అన్నిటికంటే వేగంగా వస్తుంది. విత్తనాలు నాటిన 25 నుంచి 45 రోజులలోపు తీసి వాడుకోవచ్చు. బీట్రూట్ విత్తనాలు నాటిన 50 నుంచి 80 రోజుల్లో తీసుకొని వాడుకోవచ్చు.. కొన్ని రకాలు 3 నెలల వరకు సమయం తీసుకోవచ్చు. క్యారెట్ కొంచెం నిదానంగా పెరుగుతుంది. సాధారణంగా విత్తనాలు నాటిన తరువాత 60 నుంచి 100 రోజులు పడుతుంది. కొన్ని రకాలకు 120 రోజుల వరకు సమయం పట్టవచ్చు. క్యారెట్, ముల్లంగి, బీట్రూట్ దుంపలు పెరిగినప్పుడు వాటి పైభాగం మట్టి పైన కొద్దిగా కనిపిస్తాయి. చేమదుంపలు నాటిన 150 నుంచి 180 రోజులకు (అంటే 5 నుంచి 6 నెలలు) తవ్వి తీసుకోవచ్చు.కంద.. ఇది అన్నిటికంటే ఎక్కువ సమయం తీసుకుంటుంది. నాటిన తరువాత సాధారణంగా 210 నుంచి 240 రోజులు (7 నుంచి 8 నెలలు) పడుతుంది. కంద, చేమదుంప మొక్క ఆకులు పసుపు రంగులోకి మారి ఎండిపోవటం జరిగిన తరువాత తీసుకొని వాడుకోవాలి. ముల్లంగి విత్తనాలను ఆగస్టు మొదటి వారంలో నాటుకోవచ్చు. క్యారెట్, బీట్రూట్ విత్తనాలను సెప్టెంబర్ /అక్టోబర్‌లో నాటుకోవచ్చు.- కొల్లి కృష్ణ కుమారి, అడ్మిన్, గుంటూరు జిల్లా, మిద్దె తోటల బృందం, మొబైల్: 94906 02366నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ -
కామాంచి/కాశబుడ్డ.. గుండె జబ్బులను అరికట్టడంలో ఫస్ట్!
ఈ పండ్ల జాతిలో నల్ల కామాంచి, ఎరుపు కామంచి రకాలు ఉంటాయి. ఇవి మాత్రం గుల్మములు. వీటి జీవిత కాలం చాలా తక్కువ. పండ్లు మాత్రం బఠాణీ గింజంత ఉంటాయి. నలుపు, ఎరుపురంగుతో కూడుకుని గుత్తులుగా ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ మొక్క అన్ని భాగాలు ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి. ఎక్కువగా వర్షాకాలంలో పూత పండ్లు వస్తుంటాయి. చలికాలంలో కొంతవరకు పూత–పండ్లు కాస్తాయి. సామాన్యంగా దీన్ని యూరోపియన్ బ్లాక్ షేడ్, బ్లాక్ బెర్రి నైట్ షేడ్ అని అంటారు. వీటి కుటుంబంలో 2000–3000 ప్రజాతులు ఉంటాయని అంచనా.ఉనికి...కామంచి సహజంగా పరపరాగ సంపర్కం చెందే పండ్ల జాతి. ఈ రకాలతో సంబంధం ఉన్న మొక్కలు – సొలానం నైగ్రం, సొలానం అమెరికానం, సొలానం డొగ్లాస్, సొలానం ఒపకు, సొలానం పిచాంతం, సొలానం రిట్రోప్లెక్జం, సొలానం సర్రచోడైస్, సొలానం స్కబ్రం, సొలానం విల్లోసం. ఈ మొక్కల పొదలు ఎక్కువగా అడవులు, పెంటకుప్పలు, రోడ్ల వెంబడి మొదలగు ప్రాంతాల్లో పెరుగుతుంటాయి. ఈ మొక్కలు అర మీటరు కంటే ఎక్కువ ఎత్తు పెరగవు. సపోర్ట్ ఉన్న దగ్గర నేల సారం బాగా ఉన్నచోట్ల ఇంకొంత పెరగగలవు.శీతల ప్రదేశాలు మొదలుకొని ఉష్ణమండలం వరకు దాదాపు సముద్ర మట్టానికి 3,500 మీటర్ల ఎత్తు వరకు ఉండే ప్రాంతాల్లో ఈ మొక్కల ఉనికి ఉంది. దీని స్వస్థలం యూరాసియా. అక్కడి నుంచి అమెరికాకు, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికాకు వెళ్ళిందని చరిత్ర చెతున్నది. ఇంచుమించు ప్రపంచంలోని అనేక దేశాల్లో వీటి ఉనికి ఉన్నదనవచ్చు. ఇండియాలోని అన్ని రాష్ట్రాల్లో ఈ మొక్కలు కనిపిస్తాయి. ఒకప్పుడు నల్లమలలోని చెంచు పెంటల (చెంచు నివాసాల) దగ్గర బాగా ఉండేవని వాళ్ళు చె΄్పారు. కానీ, ఇప్పుడు వీటి ఉనికి చాలా తగ్గిందని వాపోతున్నారు. అందుకు అనేక కారణాలు ఉన్నాయంటారు.ఉపయోగాలు...కామంచి పండ్లు తినదగినవి. రుచిలో పులుపు తీపితో కూడుకొని ఉంటాయి.ఇది యాంటిసెప్టిక్ గా ఉపయోగ పడుతుంది. అలాగే దగ్గు, జ్వరం, ఆస్తమా నివారణకు మంచి ఔషధం అని చెప్పవచ్చు.ఇది విరేచనకారిగా, జీర్ణకారిగాను పనిచేస్తుంది. అల్సర్లు, అజీర్తి, నిసత్తువ వంటి లక్షణాలను తగ్గిస్తుంది.మూత్ర విసర్జన సక్రమంగా అయ్యేలా ఉపయోగపడుతుంది.గుండె జబ్బులను అరికట్టడానికి మంచిగా పనిచేస్తుంది. నీళ్ళతో కడిగిన మొక్కను, శుభ్రంగా తుడిచి, దాన్ని నీళ్ళలో మరగనిచ్చి, వడకాచి తాగితే గుండెకు సంబంధించిన సమస్యలు తగ్గుతాయని నమ్మకం. అలాగే రక్తపోటునూ నియంత్రించగలదంటారు.కడుపు నొప్పి, టాన్సిల్స్, వింగ్ వాయ్స్, గడ్డలు, వాపు మొదలగునవి తగ్గించటానికి వాడతారు. దీని ఆకులను దంచి రసం తీసి, సెప్టిక్ అయిన దెబ్బలపైన రెండు–మూడు రోజులు పూస్తే పుండు మానిపోతాయి.కొన్ని ఆఫ్రికా దేశాల్లో కూడా కామంచి పండ్లను తింటారు. ఆకులను ఉడకబెట్టి అందులో ఉప్పు, ఇతర దినుసులు వేసి మొక్కజొన్నతో చేసిన ఆహారంతో కలిపి తింటారు. ఎక్కువగా కెన్యా దేశ ప్రజలు ఈ విధంగా తింటారు. టాంజనియా దేశంలో కామంచి ఆకులను మంచి ఆకుకూరగా వాడుతారు.ఇథియోపియాలో ఈ పండ్లను అందరూ తింటారు. కరువు కాలంలో ఈ పండ్లను చాలా ఉపయోగిస్తారు. అలాగే ఆకులను ఆకుకూరలా వాడతారు.బహుశా అందుకేనేమో ఈ మొక్కకు ‘ఫెమైన్ ఫుడ్’గా గుర్తింపు వచ్చింది.దక్షిణ భారతంలో తమిళనాడులో జనం ఎక్కువగా ఇష్ట పడతారు.ఇన్ని ప్రత్యేకతలున్న కామంచి పండ్లపై సరైన పరిశోధనలు చేసి పంట పొలాలు, మిద్దె తోటలకు పాకే విధంగా చేయగలిగితే ఆరోగ్యపరంగా ఎంతో లబ్ది పొందడానికి వీలు ఉంటుంది. నల్లమలలో ఉన్న ఈ మొక్కలకు ప్రత్యేకత ఉందన్నది అక్కడి జనాల అనుభవం. వీటితో పాటు థయామిన్, రిబోఫ్లేవిన్, నియాసినమైడ్, పైరిడాక్షిన్, ఫోలిక్ ఆమ్లం, ఆర్కర్బి ఆమ్లం, బీటా కరొటీన్ మొదలైన విటమిన్లు ఉన్నాయి.సూచన... కామంచి కాయలు, ఆకులు క్షారంగా ఉంటాయి. వీటిని తింటే వాంతులు, జ్వరం, విరేచనాలు రావచ్చు. అందుకే కొన్ని ప్రాంతాల్లో ఈ కాయలు, ఆకులను ఉడికించి తింటారు.- డాక్టర్ మొరుపోజు పద్మయ్య, విశ్రాంత ప్రధాన శాస్త్రవేత్త, ఐసీఏఆర్ – ఐఐఓఆర్, రాజేంద్రనగర్, హైదరాబాద్. మొబైల్: 94407 08924నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ -
Sagubadi: విలక్షణ పంట లవంగం!
సుగంధ ద్రవ్య పంటలకు నిలయమైన కేరళప్రాంతంలో పండే ‘తలనాడన్ గ్రాంబూ’ (లవంగం) తన ప్రత్యేకతతో భౌగోళిక గుర్తింపు (జీఐ) దక్కించుకుంది. కొట్టాయం జిల్లాలోని ఈరాట్టుపేట బ్లాక్ పంచాయతీ పరిధిలోని తలనాడ్, ఈరాట్టుపేట, ఈకోయ్, మేలుకావు, పూంజర్ వంటి పశ్చిమ కనుమల కొండప్రాంతాల్లో ఈ పంట విశేషంగా సాగవుతోంది. తలనాడన్ లవంగ రైతు సహకార సంఘం, కేరళ వ్యవసాయ విశ్వవిద్యాలయం కృషి ఫలితంగా ఈ గుర్తింపు లభించింది. ఇది మనప్రాంతంలో పండే పంట కాకపోయినా, లవంగాలు మనమూ వాడుతూ ఉంటాం కాబట్టి ఈ పంటకు సంబంధించిన విశేషాలు సరదాగా తెలుసుకుందాం..ప్రత్యేక గుణాలు.. నాణ్యత..సాధారణ లవంగాలతో పోలిస్తే తలనాడన్ లవంగాలు పరిమాణంలో పెద్దవిగా, బరువుగా ఉంటాయి. గ్రాము బరువుకు కేవలం 8 నుంచి 10 మొగ్గలు మాత్రమే తూగుతాయి. ఇవి లేత ఆకుపచ్చ నుంచి గులాబీ రంగులోకి మారి, ఎండబెట్టిన తర్వాత ఆకర్షణీయమైన గోధుమ రంగు సంతరించుకుంటాయి. కొట్టాయంప్రాంతంలో ఉండే చల్లని వాతావరణం, దట్టమైన ΄÷గమంచు, అటవీ నేలల తేమ కారణంగా వీటిలో ‘యూజెనాల్’ అనే సుగంధ నూనె శాతం, పాలిఫెనాల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల ఇవి మంచి సువాసన, ఘాటు, అధిక ఔషధ గుణాలను కలిగి ఉంటాయి.చెట్టుకు 10–15 కిలోలులవంగం చెట్ల విత్తనాలతో మొక్కలు పెంచి నాటుతారు. నాటిన 4–5 సంవత్సరాల్లో కాపు ప్రారంభమై, 7–8 సంవత్సరాల నుంచి పూర్తిస్థాయి దిగుబడి ఇవ్వటం ప్రారంభిస్తాయి. ప్రతి ఏటా జూన్–జూలై నెలల్లో మొగ్గ తొడిగి, డిసెంబర్–జనవరి నాటికి కోతకు వస్తాయి. మొగ్గలు విచ్చుకోకముందే చేతితో సేకరించి వెంటనే ఎండబెడతారు. సరిగ్గా ఎండబెట్టకపోతే నాణ్యత తగ్గి ‘ఖోకర్‘ అనే నిరుపయోగ రకంగా మారే ప్రమాదం ఉంది. ఎదిగిన ఒక చెట్టు నుంచి ఏడాదికి 10–15 కిలోల వరకు దిగుబడి వస్తుంది. రైతులకు ఆర్థిక ప్రయోజనంసాగు వ్యయంతో పోలిస్తే తలనాడన్ లవంగం రైతులకు మంచి ఆదాయాన్ని అందిస్తోంది. మార్కెట్లో ఎండు లవంగాల ధర నాణ్యతను బట్టి కిలో రూ. 500 నుంచి రూ. 2000 వరకు పలుకుతుంది. లవంగ కాడలు కూడా కిలో రూ. 100 నుంచి రూ. 250 వరకు అమ్ముడవుతున్నాయి. జీఐ ట్యాగ్ లభించటం వల్ల నకిలీల భయం లేకుండా రైతులకు అంతర్జాతీయ స్థాయి మార్కెటింగ్ అవకాశాలు, మంచి మద్దతు ధర లభిస్తున్నాయి. నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ -
రెండెకరాల్లో దేశీ ఆవులతో... నెలకు రూ. 1.4 లక్షల ఆదాయం!
మాగాణి భూముల్లో పాడి పరిశ్రమ తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో, దేశవాళీ పాడి ఆవుల సంతతిని పెంచడంతో పాటు రైతులకు స్థిరమైన, నిరంతర ఆదాయం అందించేందుకు సేవ్ స్వచ్ఛంద సంస్థ ఒక ప్రణాళికను అందుబాటులోకి తెచ్చింది.కేవలం రెండు ఎకరాల భూమి ఉన్న రైతులు కూడా సరైన ప్రణాళికతో సమగ్ర పాడి పరిశ్రమను చేపడితే నెలకు కనీసం రూ. 1,40,000 ఆదాయం పొందవచ్చని సేవ్ వ్యవస్థాపకులు మేకపోతుల విజయరామ్ వెల్లడించారు. తక్కువ భూమి ఉన్న చిన్న, సన్నకారు రైతులు కూడా సమగ్ర పద్ధతిలో దేశవాళీ గోవులను పోషిస్తూ లాభదాయక పాడి వ్యాపారవేత్తలుగా మారటానికి ఈ నమూనా మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు. ఎకరంలో హీరామణి గడ్డి సాగుఈ మోడల్లో 2 ఎకరాల భూమిని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవడానికి ప్రణాళిక రూపొందించారు. ఒక ఎకరంలో పశుగ్రాసం సాగుకు కేటాయించాలి. ఆవులకు అవసరమైన పోషక విలువలు కలిగిన ‘హీరామణి గడ్డి’తో పాటు అధిక ్రపోటీన్ ఉండే అవిశ మొక్కలను కూడా కలిపి సాగు చేయాలి. చాప్ కట్టర్ ద్వారా గడ్డిని ముక్కలుగా కట్ చేసి పశువులకు ఆహారంగా అందించాలి.ఆవులు స్వేచ్ఛగా తిరగాలిపావెకరంలో ఆవుల రక్షణ, పోషణ కోసం షెడ్డు నిర్మించుకోవాలి. ఎండా కాలమైనా వర్షాకాలమైనా కూడా ఆవులను నిరంతరం కట్టేసి ఉంచకూడదు. అవి ఉల్లాసంగా తిరగటానికి అనువుగా భూమిని ఎత్తు లేపి ఒక పావెకరం మెరక స్థలం ఏర్పాటు చేయాలి. ఎండుగడ్డి/ వరిగడ్డి వాము వేసుకోవటానికి మరో పావెకరం కేటాయించాలి. మిగతా పావెకరం భూమిని కేటాయించి ΄÷లం చుట్టూ వెడల్పాటి గట్లు ఏర్పాటు చేసుకోవాలి. అరటి, మామిడి, కొబ్బరి వంటి పండ్ల చెట్లను పెంచాలి. తద్వారా అదనపు ఫలసాయం పొందే వీలుంది.పాలు లేదా నెయ్యి...ఈ విధానంలో 10 దేశవాళీ ఆవులతో పాటు ఒక దేశీ గోజాతి నంది (ఆబోతు)తో పాడి ఫారమ్‌ను ్రపారంభించాలి. ఒక్కో ఆవు రోజుకు సగటున 8 లీటర్ల పాలు (పూటకి 4 లీటర్లు) ఇస్తుంది. ఏడాది ΄÷డవునా 8 ఆవుల ద్వారా రోజుకు కనీసం 60 నుంచి 64 లీటర్ల పాల దిగుబడి వస్తుంది. దేశీ ఆవు పాలలో ఔషధ గుణాలున్నందున లీటరు రూ. 80కి తగ్గకుండా అమ్ముకునే ఏర్పాట్లు చేసుకోవచ్చు. ఒక వేళ పాలు అమ్మలేకపోతే సంప్రదాయ పద్ధతిలో నెయ్యి తయారు చేసి అమ్ముకున్నా అందుకు తగినంత ఆదాయం వస్తుంది.ఈ లెక్కన రోజుకు 60 లీటర్ల పాల అమ్మకం ద్వారా రోజుకు రూ. 4,800 సంపాదించవచ్చు. తద్వారా నెలకు ఎంత లేదన్నా రూ. 1.4 లక్షల వరకు ఆదాయం లభిస్తుంది. తమ దగ్గర శిక్షణ పొంది ఆవు పేడ, మూత్రంతో అనేక ఇతర విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు చేసి విక్రయించుకోవటం ద్వారా మరింత ఆదాయం పొందవచ్చని విజయరామ్ వివరించారు. ‘మచిలీపట్నం సమీపంలోని తరకటూరు, వికారాబాద్ జిల్లా ధారూరు మండలం నాగసముందర్ దగ్గర గల తమ గోశాలల్లో 15 అడుగుల ఎత్తు హీరామణి గడ్డి సాగులో ఉంది. ఆసక్తిగల రైతులు సందర్శించవచ్చు’ అని విజయరామ్ (63091 11427) తెలిపారు.నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ -
Sagubadi: ఏఐతో తెగుళ్లకు చెక్!
వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికత నూతన దారులు చూపుతోంది. పంటలకు సోకే తెగుళ్లను ఆరంభ దశలోనే గుర్తించి, సరైన నివారణో΄ాయాలు సూచించేలా హైదరాబాద్‌లోని ‘విఎన్ ఆర్ విజ్ఞాన జ్యోతి ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ’ పరిశోధకులు ఒక అత్యాధునిక ఏఐ వ్యవస్థకు రూపకల్పన చేశారు.కన్వొల్యూషనల్ న్యూరల్ నెట్‌వర్క్స్‌ను ఉపయోగించి ఆకుల తెగుళ్లను గుర్తించే విధా రూపొందించారు. ఈ ఆవిష్కరణను సీఎస్ఈ విభాగానికి చెందిన సీనియర్ అసిస్టెంట్ ్ర΄÷ఫెసర్ డాక్టర్ ఆర్ విజయ సరస్వతి మరో 9 మంది పరిశోధకులతో కలసి రూపొందించిన ఈ సాంకేతికతకు భారత ప్రభుత్వ పేటెంట్ లభించింది. పంటలకు వచ్చే రకరకాల తెగుళ్లను సకాలంలో గుర్తించకపోవటం వల్ల రైతులు ప్రతి సంవత్సరం తీవ్ర దిగుబడి నష్టాన్ని చవిచూస్తున్నారు.టొమాటో, బంగాళాదుంప, క్యాప్సికమ్ పంటలకు చెందిన 20 వేల ఆకుల చిత్రాల డేటాసెట్‌ను ఉపయోగించి వీఎన్ ఆర్ వీజీఐఈటీ నిపుణులు పరిశోధన చేశారు. పంటల్లో సాధారణంగా కనిపించే ప్రధాన తెగుళ్లను అత్యంత కచ్చితత్వంతో గుర్తించేలా దీన్ని తీర్చిదిద్దారు. ఈ ఏఐ వ్యవస్థ పంట ఆకుల చిత్రాలను విశ్లేషించి 97.7% కచ్చితత్వంతో ఆరంభ దశలోనే తెగుళ్లను పసిగడుతుంది. అంతేకాకుండా, ఆ తెగులు నివారణకు వాడాల్సిన తగిన క్రిమిసంహారక మందులను కూడా సూచిస్తుంది. దీనివల్ల కిరణజన్య సంయోగక్రియ, పరాగసంపర్కం, మొక్క పెరుగుదల దెబ్బతినక ముందే జాగ్రత్తపడొచ్చని డా. విజయ సరస్వతి తెలి΄ారు.రైతులకు త్వరలోనే అందుబాటులోకి..!నేను రైతు కుటుంబంలో పుట్టి పెరిగాను. పంటలను ఆశించే తెగుళ్లను ఆలస్యంగా గుర్తించటం వల్ల ఎకరాలకు ఎకరాలు పంట నాశనమై రైతులు పడే ఆవేదనను దగ్గర్నుంచి చూశాను. ఆ అనుభవమే ఈ పరిశోధనకు పునాది వేసింది. ప్రస్తుతం వెబ్ ఇంటర్ఫేస్లో ఈ సాంకేతికత అందుబాటులో ఉంది. మొబైల్ అప్లికేషన్‌ను రూపొందిస్తున్నాం. ఇది త్వరలోనే రైతులకు అందుబాటులోకి వచ్చి పంట నష్టాలను తగ్గిస్తుందని ఆశిస్తున్నాను.– డాక్టర్ విజయ సరస్వతి, వీఎన్ ఆర్ వీజీఐఈటీ, ప్రధాన పరిశోధకురాలునిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ -
Sagubadi: మట్టి సారాన్ని పెంచే తవుడు ద్రావణం..
మిద్దెతోటలు, ఇంటిపంటల్లో తవుడు (రైస్ బ్రాన్)ను మొక్కల పెంపకంలో అద్భుతమైన ఎరువుగా ఉపయోగించే విధానం గురించి తెలుసుకుందాం. తవుడు మొక్కల పెరుగుదలకు, నేల స్వభావాన్ని మెరుగుపరచడానికి ఎంతో తోడ్పడుతుంది. తవుడులో విటమిన్ బి, మెగ్నీషియం, పొటాషియం, ఫాస్పరస్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.తవుడును నేరుగా మట్టిలో చల్లడం లేదా కంపోస్ట్‌లో కలపడం వల్ల అది నెమ్మదిగా కుళ్ళి మొక్కలకు అవసరమైన పోషకాలను అందిస్తుంది.ఇది మట్టిలోని మేలు చేసే సూక్ష్మజీవుల పెరుగుదలకు దోహదపడుతుంది. మొక్కలకు బలం చేకూరుతుంది.తవుడును నీటిలో నానబెట్టి, పులియబెట్టి మొక్కలకు వాడవచ్చు. ఇది మొక్కలకు ఒక అద్భుతమైన సహజ ఎరువుగా, నేల సారాన్ని పెంచే బూస్టర్‌గా పనిచేస్తుంది.కుళ్లే ప్రక్రియలో తవుడులో ఉండే సంక్లిష్ట కర్బన పదార్థాలు విచ్ఛిన్నమై, మొక్కలకు సులభంగా అందే నత్రజని, భాస్వరం, పొటాషియం వంటి పోషకాలుగా మారుతాయి.తవుడు ద్రావణంలో లాక్టిక్ యాసిడ్ బాక్టీరియా, ఇతర మేలు చేసే సూక్ష్మజీవులు పెరుగుతాయి. ఇవి నేలలోని హానికర వ్యాధికారకాలను అరికట్టి, వేర్ల పెరుగుదలను ప్రోత్సహిస్తాయి.తవుడు ద్రావణం నేల నిర్మాణాన్ని మెరుగుపరిచి, వానపాములు వంటి జీవులను ఆకర్షిస్తుంది, తద్వారా నేల గుల్లగా మారుతుంది.ఈ ద్రావణాన్ని పిచికారీ చేయడం వల్ల మొక్కలకు చీడపీడల నుండి రక్షణ లభిస్తుంది, మొక్కల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మిశ్రమం నుండి పుల్లటి లేదా మంచి వాసన వచ్చినప్పుడు అది తయారైనట్లు గుర్తు. ఒకవేళ కుళ్ళిన వాసన వస్తే అది వాడకూడదు.తయారైన ద్రావణాన్ని 1 లీటరు ద్రావణానికి 10 లీటర్ల నీరు కలిపి మొక్కల మొదళ్లలో పోయవచ్చు లేదా ఆకులపై పిచికారీ చేయవచ్చు.దీన్ని నెలకు ఒకటి లేదా రెండుసార్లు వాడితే సరిపోతుంది. అతిగా వాడితే మట్టి గట్టిపడే అవకాశం ఉంటుంది.తవుడు ఫెర్మెంటేషన్ నీరు పూల (గులాబీ, మల్లె, జాజి, మందార..) మొక్కలకు చాలా బాగా పనిచేస్తుంది. తవుడులోని భాస్వరం, పొటాషియం వల్ల పూల సైజు పెరుగుతుంది అలాగే ఎక్కువ మొగ్గలు కూడా వస్తాయి.ఇందులోని పోషకాలు పూలకు మంచి రంగును, సువాసనను ఇస్తాయి.ముఖ్యంగా గులాబీ మొక్కల మొదళ్లలో ఈ ద్రావణాన్ని పోస్తే వేర్లు దృఢంగా మారి, మొక్క ఆరోగ్యంగా పెరుగుతుంది.కూరగాయల (టమాటో , మిరప , వంగ..) మొక్కలకు వాడితే నత్రజని అందుతుంది. ఆకులు ముదురు పచ్చగా మారి, కిరణజన్య సంయోగ క్రియ బాగా జరుగుతుంది.టమాటా, మిర్చి వంటి మొక్కల్లో పూత రాలడం తగ్గుతుంది. కాయలు నాణ్యంగా, రుచిగా వస్తాయి.తవుడు ద్రావణాన్ని ఆకులపై స్ప్రే చేయడం వల్ల ఆకు ముడత వంటి సమస్యలు తగ్గుతాయి.మనం తయారు చేసుకున్న ద్రావణం గాఢత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి 1 లీటరు ద్రావణానికి కచ్చితంగా 10 లీటర్ల నీటిని కలిపి వాడాలి. లేదంటే మొక్కల వేర్లు దెబ్బతినే ప్రమాదం ఉంది.ఎప్పుడైనా ఎరువులను ఉదయం పూట లేదా సాయంత్రం ఎండ తగ్గిన తర్వాత ఇస్తే మొక్కలు త్వరగా గ్రహిస్తాయి.తవుడు ద్రావణాన్ని 15–20 రోజుల లోపు వాడేయడం మంచిది. ఎక్కువ రోజులు ఉంచితే దుర్వాసన వచ్చే అవకాశం ఉంటుంది.తవుడు నీటిలో ఉండే అమినో ఆమ్లాలు మొక్కలు త్వరగా కొమ్మలు వేయడానికి సహకరిస్తాయి. మొక్క చిన్న దశలో ఉన్నప్పుడు (4–5 ఆకులు ఉన్నప్పుడు) దీన్ని ఇస్తే ఎదుగుదల బాగుంటుంది.మొక్క కాండం దృఢంగా మారడానికి, ఆకులు వెడల్పుగా పెరగడానికి ఇందులో ఉండే నత్రజని ఎంతో అవసరం.కుండీలో ఉండే మట్టి గట్టిపడకుండా, ఈ ద్రావణం మట్టిని గుల్లగా ఉంచుతుంది. దీనివల్ల వేర్లకు గాలి ఆడి మొక్క చురుగ్గా పెరుగుతుంది.తవుడు నీటిని పులియబెట్టేటప్పుడు అందులో కొంచెం పుల్లటి మజ్జిగ కూడా కలిపితే, అది మరింత శక్తివంతంగా మారుతుంది. ఇది మొక్కలకు ‘గ్రోత్ ప్రమోటర్’లా పనిచేస్తుంది.ఈ ద్రావణాన్ని వారానికి ఒకసారి కాకుండా, 15 రోజులకు ఒకసారి మాత్రమే వాడాలి. మిగిలిన రోజుల్లో సాధారణ నీటిని పోయవచ్చు.తవుడుతో తయారు చేసిన ఫెర్మెంటేషన్ నీరు వాడటం మొదలుపెట్టిన 15 రోజుల్లోనే కూరగాయల మొక్కల ఆకుల్లో మంచి మెరుపును గమనించవచ్చు.వంటింటి వ్యర్థాలతో కంపోస్ట్ తయారు చేస్తున్నట్లయితే, అందులో అప్పుడప్పుడు కొంచెం ఎండు తవుడు చల్లవచ్చు. ఇది వ్యర్థాలు త్వరగా కుళ్లి ఎరువుగా మారడానికి సహాయపడుతుంది. వంటింటి వ్యర్థాల నుండి వచ్చే చెడు వాసనను అరికట్టడానికి తవుడు బాగా పనిచేస్తుంది.తవుడును కంపోస్ట్ బిన్ లోని పొరల మధ్య చల్లడం వల్ల అందులోని సూక్ష్మజీవులు వేగంగా వృద్ధి చెందుతాయి. దీనివల్ల కంపోస్ట్ తయారయ్యే సమయం తగ్గుతుంది.ఒకవేళ కిచెన్ వేస్ట్ వల్ల బిన్లో తేమ ఎక్కువగా ఉంటే, కొంచెం పొడి తవుడు చల్లితే అదనపు తేమను పీల్చుకుని, ముక్కిపోయిన వాసన రాకుండా చేస్తుంది.కంపోస్ట్ బిన్ పొడిగా ఉంటే లోపల సూక్ష్మజీవుల చర్య మందగిస్తుంది. దీనివల్ల వ్యర్థాలు ఎరువుగా మారడానికి చాలా సమయం పడుతుంది. కంపోస్ట్ పక్రియ వేగంగా జరగాలంటే అది తడిసిన స్పాంజిలా (తేమగా మరీ నీరు కారకుండా) ఉండాలి. (బిన్ లోని మట్టిని లేదా వ్యర్థాలను చేత్తో పట్టుకుని పిండినప్పుడు, ఒకటి రెండు చుక్కల నీరు వస్తే తేమ సరిగ్గా ఉన్నట్లు).తవుడును బెల్లం నీటితో కలిపి, పులియబెట్టి కంపోస్ట్ బిన్లో కొద్దిగా చల్లినట్లు వేస్తే వ్యర్థాలు చాలా త్వరగా విచ్ఛిన్నమవుతాయి. తవుడు ఫెర్మెంటేషన్ నీరు కంపోస్ట్ బిన్ కు ఒక ‘బూస్టర్‘లా పనిచేస్తుంది.తవుడును నీటిలో నానబెట్టి ఫెర్మెంటేషన్ చేసిన తర్వాత మిగిలిన తవుడు పిప్పిని పారవేయకుండా, కంపోస్ట్ బిన్లో కలిపితే మంచి ఎరువుగా మారుతుంది.తవుడును పులియబెట్టిన నీటిలో, కూరగాయల తొక్కలు నానబెట్టిన నీటిని కూడా కలిపి మొక్కలకు పోయవచ్చు. దీనివల్ల మొక్కకు అవసరమైన అన్ని రకాల సూక్ష్మ పోషకాలు అందుతాయి.తవుడు రైస్ మిల్లులో దొరుకుతుంది. ఒక్కసారే ఎక్కువ కొనవద్దు, పురుగులు పడతాయి. నెలకు 1 లేక 2 కేజీలు తీసుకుని వాడుకుంటే సరిపోతుంది. ఆది వాడిన తరువాత మళ్లీ తెచ్చుకోవచ్చు.తయారీ విధానం..ఒక పెద్ద ΄్లాస్టిక్ బకెట్లో 10 లీటర్ల నీరు తీసుకుని, అందులో కేజీ తవుడు మరియు బెల్లం వేసి బాగా కలపాలి. తవుడు డైరెక్ట్ గా నీటిలో వేయవచ్చు లేదా ఒక కాటన్ క్లాత్ లో మూట కట్టి వేయవచ్చు.బకెట్ పై పలచని బట్ట లేదా కొద్దిగా మూత పెట్టి నీడలో ఉంచాలి. ఎండ తగిలితే లోపల ఉన్న మేలు చేసే బ్యాక్టీరియా చనిపోయే అవకాశం ఉంటుంది.3 నుండి 5 రోజుల పాటు పులియబెట్టాలి. రోజుకు రెండుసార్లు (ఉదయం, సాయంత్రం) ఒక కర్రతో మిశ్రమాన్ని బాగా కలపాలి . దీనివల్ల గాలి ఆడి మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది.5 రోజుల తర్వాత ఆ నీటిని వడకట్టి తవుడు పిప్పిని వేరు చేయాలి. ఈ తవుడు పిప్పి ని కంపోస్ట్ బిన్ లో వేయవచ్చు.తయారు చేసిన ద్రావణం చాలా గాఢంగా ఉంటుంది, కాబట్టి 1 లీటరు తవుడు ద్రావణానికి 10 లీటర్ల సాధారణ నీటిని కలిపి పలచగా చేయాలి.అంటే, తయారు చేసిన 10 లీటర్ల ద్రావణంతో మొత్తం 100 లీటర్ల ఎరువును సిద్ధం చేసుకోవచ్చు.ఎక్కువ మొక్కలు ఉంటే ఈ 100 లీటర్ల నీటిని అన్నింటికీ పోయవచ్చు. ఒకవేళ మొక్కలు తక్కువగా ఉంటే, తవుడు పరిమాణాన్ని తగ్గించి (అర కేజీ తవుడు – 5 లీటర్ల నీరు) తయారు చేసుకోవచ్చు.నల్ల తవుడు మేలు!దొరికితే నల్ల తవుడు (బ్లాక్ రైస్ బ్రాన్) వాడవచ్చు. దీనిలో పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయి. నల్ల తవుడులో ఆంథోసైనిన్స్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి దీనికి ఆ నలుపు లేదా ముదురు ఊదా రంగును ఇస్తాయి. ఇవి మొక్కలకు చీడపీడల నుండి సహజమైన రక్షణను అందిస్తాయి.సాధారణ తెల్ల తవుడుతో పోలిస్తే, నల్ల తవుడులోప్రోటీన్, ఫైబర్, ఇనుము వంటి ఖనిజాలు అత్యధికంగా ఉంటాయి. ఇది మొక్కల పెరుగుదలకు అవసరమైన 18 రకాల అమైనో ఆమ్లాలను కలిగి ఉంటుంది. నల్ల తవుడు కొంచెం ఖరీదైనది. మార్కెట్లో తక్కువగా దొరుకుతుంది. ఒకవేళ ఇది దొరక్కపోతే సాధారణ తవుడు కూడా వాడవచ్చు. అది కూడా మొక్కలకు చాలా మేలు చేస్తుంది.- కొల్లి కృష్ణ కుమారి, అడ్మిన్, గుంటూరు జిల్లా, మిద్దె తోటల బృందం, మొబైల్: 94906 02366నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ -
Sagubadi: కల్జివ్వ.. ప్రకృతి ప్రసాదించిన ఔషధ వృక్షం!
కల్జివ్వి పండ్లు మేడి పండ్ల ఆకారంలో, సైజులో చిన్నగా ఉంటాయి. ఈ చెట్లకు బండజువ్వి, జువ్వి అనే పేర్లు కూడా∙ఉన్నాయి. బండజువ్వి రకం ఎక్కువగా బండకొరుకులు, మొరం నేలలో, చెట్లపై గమనించవచ్చు. జువ్వి, కల్జివ్వి ఒకటే అంటారు. ఈ జాతిలో పొదలు, గుల్మాలు, చెట్లు ఉన్నాయి. వీటిలో ఇతరాలు పైకస్ అసినిన, పైకస్ ప్యూజెసెన్స్, ఉరోస్టిగ్మ టొమెన్ టోసం మొదలగునవి ఉన్నాయి. ఉనికి: పండ్లు జూన్–జులై నెలల్లో వస్తాయి. మేడి పండ్ల చెట్టులో వలెనే ఇందులో కూడా పూలు బయటికి కనపడవు. వీటిల్లో కూడా చీమలు, కందిరీగలు ఫలదీరకణకు దోహదపడతాయి. వీటి పూలను గాల్ ఫ్లవర్ అని అంటారు. ఈ చెట్ల పూలల్లో మూడు రకాలు ఉంటాయి. ఒకటి మొగ్గ, పొడవాటి కాడ ఆడ, కురుచ కాడ ఆడ పువ్వులు ఉంటాయి. ఈ చెట్టు దాదాపు 12 మీటర్ల ఎత్తు వరకు పెరగలదు. వీటి పక్క కొమ్మలకు నూగు పోచలుంటాయి. ఆకుల తొడిమ దగ్గర పండ్లు వస్తాయి. ఇవి మైదాన ప్రాంతాల్లో, అడవుల్లోనూ పెరుగుతాయి. ఇంచుమించు అన్ని నేలల్లో వస్తాయి. ఈ చెట్లు సామాన్యంగా సతతహరితంగా ఉంటాయి. కానీ కాలం అనుకూలించకుండా ఉంటే ఆకులు రాల్చుతుంది. ఈ చెట్లు ఎక్కువగా ఉష్ణమండలం, ఉప–ఉష్ణమండలం ప్రాంతంలో వీటి ఉనికి ఉంటుంది.కానీ ఇవి భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్‌లలో ఉన్నట్లు గుర్తించారు. భారత్‌లో మాత్రం అండమాన్, నికోబార్ దీవులు, బీహార్, మధ్య–దక్షిణ ప్రాంతాలు, జార్ఖండ్, మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అడవుల్లో వీటి ఉనికి ఉంది. ముఖ్యంగా నల్లమల అడవులు వీటికి పెట్టింది పేరు. వీటిపై జరిగిన ప్రయోగాలు చాలా తక్కువ. వీటిని సాగుకు మరల్చితే లాభసాటిగా ఉంటుంది. ఆకులను మేకలు, పశువులు తింటాయి!వీటి ఆకులు మేకలు, పశువులు తింటాయి. కరువు కాలాల్లో వీటిని మేతగా వాడతారు. పండ్లు తింటారు. కలప అంత గట్టిగా ఉండదు, వంట చెరకుగా వాడుకోవచ్చు. మాను లావు ఉంటే దాన్ని పెట్టెల తయారీకి వాడవచ్చు. ముఖ్యంగా పండ్ల రవాణకు ఉపయోగపడుతుంది. రోడ్లకు ఇరు పక్కలా ఈ చెట్లను నాటవచ్చు. ఈ చెట్లు కూడా ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి. ఆకులను రుబ్బగా వచ్చిన రసాన్ని బొగ్గలను తగ్గించడానికి ఉపయోగిస్తారు. బెరుడును దంచగా వచ్చే గుజ్జును దెబ్బలకు, కోసుకుపోయిన చోట్ల రుద్దినట్లయితే అవి కొన్నిరోజుల్లో మానుతాయి. ఇప్పటికీ చెంచులు వైద్యంలో వాడుతున్నారు. ఈ జాతి మొక్కలను విత్తనం ద్వారా ప్రవర్ధనం చేయవచ్చు. బోన్సాయి (మరుగుజ్జు) మొక్కల పెంపకానికీ ఉపయోగించవచ్చు. ఈ జాతి పండ్లపై అనుకున్నంతగా పరిశోధనలు జరగలేదనవచ్చు.- డాక్టర్ మొరుపోజు పద్మయ్య, విశ్రాంత ప్రధాన శాస్త్రవేత్త, ఐసీఏఆర్ – ఐఐఓఆర్, రాజేంద్రనగర్, హైదరాబాద్. మొబైల్: 94407 08924నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ -
మిద్దెతోటలో.. రసాయన అవశేషాలు లేని దానిమ్మ పండ్లు..
క్యాన్సర్‌తో బాధపడుతున్న కన్న తల్లికి రసాయన అవశేషాలు లేని దానిమ్మ పండ్లు అందించాలనే ఒక కొడుకు తపన, నేడు నగర వ్యవసాయంలో ఆదర్శవంతమైన సాగు విప్లవానికి నాంది పలికింది. బంగ్లాదేశ్‌లోని తంగైల్ జిల్లా బాసాయిల్కు చెందిన 28 ఏళ్ల అల్ అమీన్ అనే మిద్దెతోట సాగుదారు విజయగాధ గాథ ఇది.అమ్మ ఆరోగ్యం కోసం..2023లో అల్ అమీన్ తల్లి లవ్లీ బేగం క్యాన్సర్ బారిన పడినప్పుడు, వైద్యులు ఆమెకు ప్రతిరోజూ దానిమ్మ పండ్లు తినిపించాలని సూచించారు. అయితే, మార్కెట్లో లభించే విదేశీ పండ్లు ఒక్కొక్కటి 500 నుంచి 600 (ఒక టకకు మన కరెన్సీలో 78 పైసలు) టకాల వరకు ఉండటమే కాకుండా, వాటి సాగులో వాడే రసాయనాల భయం వెంటాడింది. దీంతో అమీన్ తన గార్మెంట్ ఉద్యోగాన్ని వదిలేసి, తమ డాబాపైనే స్వచ్ఛమైన దానిమ్మ మొక్కలను పెంచటంప్రారంభించాడు. యూట్యూబ్ వీడియోల ద్వారా మెలకువలు నేర్చుకొని, గాజీపూర్ నుంచి మొక్కలు తెచ్చి నాటాడు. దురదృష్టవశాత్తు 2025 మే నెలలో అతని తల్లి కన్నుమూసినప్పటికీ, ఆమె స్మృత్యర్థం మిద్దెతోట సాగును కొనసా గించటమే కాదు మరింత విస్తరించాడు.26 దేశవాళీ, విదేశీ రకాలుఅల్ అమీన్ తన ఇంటిపైన 70కి పైగా పెద్ద ప్లాస్టిక్ డ్రమ్ముల్లో దానిమ్మ చెట్లను సాగు చేస్తున్నాడు. ఆయన వద్ద ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన 26 రకాల దానిమ్మ జాతులు ఉన్నాయి. వీటిలో భారతీయ రకాలైన ‘సూపర్ భగవా’, ‘మృదుల’, ‘గుజరాతీ’తో పాటు థాయ్‌లాండ్‌కు చెందిన ‘థాయ్ దానిమ్మ’, ఆస్ట్రేలియాకు చెందిన ‘బిగ్ థాయ్’, మెక్సికన్, పాకిస్తానీ, రూబిన్ రకాలు ముఖ్యమైనవి. ప్రతి చెట్టు ఏడాదికి వర్షాకాలం, శీతాకాలంలో రెండుసార్లు దిగుబడినిస్తూ, చెట్టుకు 20 నుంచి 25 నాణ్యమైన పండ్లను ఇస్తోంది.యువతకు స్ఫూర్తిఅల్ అమీన్ విజయం స్థానిక రైతులను, నిరుద్యోగ యువతను విశేషంగా ఆకట్టుకుంటోంది. గతంలో దానిమ్మ సాగులో విఫలమైన స్థానిక రైతు మిజానుర్ రెహమాన్, కళాశాల విద్యార్థిని తాంజియా అక్తర్ వంటివారు అల్ అమీన్ మార్గదర్శకత్వంలో డాబా తోటలనుప్రారంభించేందుకు ముందుకు వస్తున్నారు.స్థానిక వ్యవసాయ సహాయక అధికారి ముహమ్మద్ అబు ఇలియాస్ తాలుక్దార్ మాట్లాడుతూ ‘అల్ అమీన్ ఆధునిక సాంకేతికతను ఉపయోగిస్తూ యువతకు ఉపాధి మార్గం చూపించాడు. వ్యవసాయ విస్తరణ శాఖ ద్వారా ఆయనకు నిరంతరం సాంకేతిక ఉచిత సలహాలు, సహకారం అందిస్తున్నాం’ అన్నారు. తల్లిపై ఉన్న ప్రేమతో రూపుదిద్దుకున్న ఈ చిన్న ప్రయత్నం, నేడు లాభసాటి వ్యాపారంగా మారి బంగ్లాదేశ్ వ్యాప్తంగా ‘రూఫ్‌టాప్ ఫార్మింగ్’కు కొత్త దిశను చూపిస్తోంది.భారీ రాబడికేవలం పండ్ల విక్రయమే కాకుండా, అంటుకట్టిన దానిమ్మ మొక్లలను ఉత్పత్తి చేయటం ద్వారా అమీన్ వ్యాపారాన్ని విస్తరించాడు. మొక్క పరిమాణం, రకాన్ని బట్టి ఒక్కో మొక్కను 200 నుంచి 2,000 టకాల వరకు విక్రయిస్తున్నాడు. ప్రస్తుతం తన మేడపైన, దగ్గర్లోని ఒక భూమిలో 1,500 నుంచి 2,000 అంటు మొక్కల నర్సరీని ఏర్పాటు చేశాడు. దానిమ్మతో పాటు ద్రాక్ష, నారంజ మొక్కలు కూడా అమ్ముతున్నాడు. తన ‘ఫేస్బుక్’ పేజీ ద్వారా దేశవ్యాప్తంగా ఆర్డర్లు పొందుతున్నాడు. స్వయంగా వినియోగదారుల ఇళ్లకు వెళ్లి మిద్దెతోటల ఏర్పాటుపైప్రాక్టికల్ సూచనలు ఇస్తున్నాడు. ఖర్చులు ΄ోను ఏడాదికి దాదాపు 10 లక్షల టకాలు (రూ. 7.8 లక్షలు) నికర లాభం ఆర్జిస్తున్నాడు.– సాక్షి, సాగుబడి డెస్క్నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ -
సౌరశక్తితో నడిచే విత్తన గుళికల యంత్రం!
సాధారణంగా చిన్నసైజులో ఉండే, తేలికపాటి విత్తనాలను రైతులు పొలంలో వెదజల్లి సాగు చేస్తుంటారు. విత్తనాలు వెద పెట్టిన తర్వాత నీరు పారించినప్పుడు లేదా పెద్ద వర్షం పడినప్పుడు అవి కొట్టుకుపోయి ఒకే చోట పోగుపడటం లేదా మట్టిలో ఎక్కువగా పూడిపోవడం జరుగుతుంటుంది. దీనివల్ల మొలకలు సరిగ్గా రాక దిగుబడి తగ్గుతుంది. ఈ సమస్యకు ఒడిశా, గుజరాత్ యూనివర్సిటీల పరిశోధకులు సులువైన పరిష్కారం కనుగొన్నారు. సౌరశక్తితో నడిచే విత్తనాల పెల్లెటింగ్ (కోటింగ్) యంత్రానికి రూపకల్పన చేశారు. క్యాబేజీ, ఉల్లి, నువ్వులు వంటి అతిచిన్న, తేలిక విత్తనాలతో పంటలు సాగు చేసే రైతులతో పాటు.. వానకు ముందే పొడి దుక్కిలో విత్తనాలు విత్తుకునే ‘ప్రీమాన్సూన్ డ్రై సోయింగ్ (పీఎండీఎస్)’ పద్ధతిని అనుసరించే రైతులకు ఈ యంత్రం బాగా ఉపయోగపడుతుంది.రెండు యూనివర్సిటీల కృషికోరాపుట్లోని సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఒడిశా(సీయూఓ), గుజరాత్‌లోని నవ్‌సరి అగ్రికల్చరల్ యూనివర్సిటీ(ఎన్‌ఏయూ) పరిశోధకులు డా. మంజుశ్రీ సింగ్, డా. విపుల్ టి. షిండే, డా. ఆశిష్ సొనావనే, ఎర్. సుభమ్ ధాకడ్ బృందం, విద్యార్థినులు స్వప్నరాణి బిస్వాల్, అభిసిక్త సాహు సహకారంతో ఈ వినూత్న యంత్రాన్ని రూపొందించారు. ఈ యంత్రానికి ఇటీవలే పేటెంట్ మంజూరైందని సీయూఓ వ్యవసాయ విభాగం అధిపతి డా. మంజుశ్రీ సింగ్ ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు. దీనితో తయారు చేసిన విత్తన గుళికలను పొలంలో వెదజల్లి నీరు పెట్టినా కొట్టుకుపోకుండా ఉండి, పొలమంతా సరిగ్గా మొలుస్తాయన్నారు.క్యాబేజీ, ఉల్లి, నువ్వులు.. ఈ యంత్రం 330 వాట్ల సోలార్ ΄్యానెల్, 24 వీ డీసీ మోటార్, 35 ఏహెచ్ బ్యాటరీలు, లిక్విడ్ ట్యాంక్‌తో పనిచేస్తుంది. క్యాబేజీ, ఉల్లి, నువ్వులు వంటి చిన్న విత్తనాలకు అనువైన కోటింగ్ ఇవ్వటానికి దీన్ని రూపొందించారు. చిన్న విత్తనాల చుట్టూ మట్టి, పోషకాలతో లేపనం చేసి సీడ్ పెల్లెట్లు తయారు చేయటం వల్ల విత్తన పరిమాణం, బరువు పెరుగుతాయి.పోషకాల లభ్యత విత్తనానికి లేపనం చేసేటప్పుడే ఎరువులు, సూక్ష్మ పోషకాలు కలిపి కోటింగ్ చెయ్యటం వల్ల విత్తనం మొలకెత్తిన వెంటనే మొక్కకు అవసరమైన బలం లభిస్తుంది. విద్యుత్తు అందుబాటు లేని గ్రామీణ ప్రాంతాల్లో కూడా సోలార్ ఎనర్జీతో ఖర్చులేకుండా పర్యావరణహితంగా ఈ యంత్రాన్ని నడుపుకోవచ్చు.సమాన మొలక శాతంవిత్తన గుళికలు నీటి ఉధృతికి కొట్టుకుపోకుండా సరైన దూరంలో నిలిచి ఉండి సమానంగా మొలకెత్తుతాయి. నాణ్యమైన కోటింగ్ వల్ల విత్తనాలు వృథా కాకుండా పంట దిగుబడి పెరుగుతుంది. సాంప్రదాయ విద్యుత్‌పై ఆధారపడాల్సిన అవసరం లేకపోవటం వల్ల నిర్వహణ ఖర్చు ఉండదు. చిన్న, సన్నకారు రైతులు తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించడానికి, స్థిరమైన వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించటానికి ఈ సోలార్ కోటింగ్ యంత్రం ఎంతగానో తోడ్పడుతుందని డా. మంజుశ్రీ సింగ్ తెలిపారు. ఇతర వివరాలకు అమెను సంప్రదించవచ్చు: జిౌఛీ.్చజటజీఃఛిఠౌ.్చఛి.జీn -
ఆకాశమే హద్దుగా స్కై ఫార్మింగ్!
తక్కువ భూమి, పెరుగుతున్న పెట్టుబడి ఖర్చులు, మట్టి ద్వారా వ్యాపించే తెగుళ్లు, ముఖ్యంగా అడవి పందుల దాడులు... చిన్న, సన్నకారు రైతులను నిరంతరం వేధించే ప్రధాన సమస్యల్లో ఇవి కొన్ని. వీటన్నింటికీ ఒకే ఒక్క సృజనాత్మక పరిష్కారం చూపారు రత్నం అనే మహిళా రైతు. కేరళలోని త్రిస్సూర్ జిల్లా ముల్లాస్సేరికి చెందిన ఆమె క్యాన్సర్ మహమ్మారినే కాదు సాగులో సవాళ్లనూ జయించారు. అడవిపందులు తదితర వ్యవసాయంలో ఎదురవుతున్న ప్రతికూల పరిస్థితులను అధిగమించేందుకు ‘స్కై ఫార్మింగ్‘ విధానాన్ని రూపొందించారు. కేరళ వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల దృష్టిని ఆమె కృషి ఆకర్షించింది. నేడు చిన్న రైతులకు, ఇంటిపంటలు, పెరటి/మిద్దె తోటలు పెంచే వారికి గొప్ప వరంగా మారింది.కొబ్బరి ఆకులతో కుండీలురత్నం ప్లాస్టిక్ గ్రో బ్యాగ్‌లకు స్వస్తి చెప్పి పూర్తిగా కుళ్లి మట్టిలో కలిసిపోయే పర్యావరణహిత కుండీలను తయారు చేశారు. స్థానికంగా విరివిగా దొరికే కొబ్బరి ఆకులతో కుండీలను అల్లారు. తక్కువ ఖర్చుతో తయారయ్యే ఈ కుండీలకు లోపలి వైపు నాన్–వోవెన్ ఫ్యాబ్రిక్‌ను పరచి, దృఢత్వం కోసం స్వల్పంగా సిమెంట్‌తో లేపనం చేస్తారు. ఈ కుండీలు దాదాపు 5 సంవత్సరాల కాలం మన్నికగా ఉంటాయని ఆమె నిరూపించారు. సాధారణంగా 2–3 గ్రో బ్యాగ్‌లు పెట్టే చిన్న స్థలంలో కొబ్బరి ఆకుల కుండీలను నిలువుగా దృఢమైన స్తంభాలకు వేలాడదీయటం ద్వారా ఏకంగా 12 కుండీలను అమర్చవచ్చని రత్నం చెప్పారు.అడవి పందుల నుంచి రక్షణ నేలపైన కొన్ని అడుగుల ఎత్తులో వేలాడే కుండీల్లో పంటలు పండిస్తున్నారు. దీని వల్ల అడవి పందులు, ఇతర జంతువుల దాడి నుంచి పంటకు 100% రక్షణ లభిస్తోంది. అంతేకాదు, నేల ద్వారా వ్యాపించే అనేక తెగుళ్లు, శిలీంధ్ర వ్యాధులు రాకుండా పంటలు సురక్షితంగా పెరుగుతున్నాయి. రత్నం అభివృద్ధి చేసిన వినూత్న సాగు పద్ధతిలో సొంత ఆర్గానిక్ కంపోస్టు వాడతారు. కోళ్ల పెంట, మేకల ఎరువు, కొబ్బరి పొట్టు, ఎండిన/పచ్చి ఆకులు, ఆవు మూత్రంతో ఇంట్లోనే 45 రోజుల్లో అత్యంత పోషకాలతో కూడిన కంపోస్ట్ తయారు చేస్తారు. ఈ కంపోస్టును కుండీల్లో నింపి, అందులో ఆకుకూరలు, బెండ, వంగ, మిరప, సొర వంటి కూరగాయలతో పాటు కంద, ఔషధ గుణాలున్న అరుదైన బూడిద గుమ్మడి వంటి పంటలను రత్నం సాగు చేస్తున్నారు. వివిధ రకాల పంటలను ఏడాదంతా సాగు చేస్తున్నారు. నిరంతరం దిగుబడి పొందుతూ అదనపు ఆదాయంతో పాటు కుటుంబ పోషకాహార భద్రతను సాధిస్తున్నారు. రైతులకు మార్గదర్శనంరత్నం కేవలం తన పనులకే పరిమితం కాకుండా, ఊళ్లోని ఇతర రైతులకు, పెరటి/మిద్దె తోటల పెంపకం దారులకు తోడ్పాటునందిస్తున్నారు. నాణ్యమైన విత్తనాలు, నారు అందిస్తూ ప్రకృతి వ్యవసాయ పద్ధతులను విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. స్థలా భావం ఉన్న పట్టణ పరిసర ప్రాంత రైతులకు, టెర్రస్ గార్డెన్ ప్రియులకు, చిన్న రైతులకు ఆమె ఆవిష్కరించిన ‘స్కై ఫార్మింగ్’ ఒక విప్లవాత్మకమైన మార్గదర్శిగా మారిందని కేరళ వ్యవసాయ విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. కేపీ స్మిత ప్రశంసించారు. -
ఈ చెట్టుతో పాములు పారిపోతాయి..
కలిమి పండు చాలా మందికి తెలిసిన పండే. కానీ కొండ ప్రాంతాలు, బంజరు భూములు, పొలంగట్లు మొదలగు ప్రాంతాల్లో వచ్చే కలిమి మాత్రం అతి తక్కువ మందికి మాత్రమే తెలుసు.వీటికాయలు వగరు రుచి కలిగి ఉంటాయి. ఇవి నేరుగా తినటానికి అంత అనుకూలంగా లేకున్నా ఇతర ఉపయోగాలెన్నో ఉన్నాయి. పండుగా మారినప్పుడు తియ్యగా ఉండి (నలుపు రంగుకు మారుతుంది) తినటానికి యోగ్యంగా ఉంటుంది. ఈ కాయలు కోసినప్పుడు తొడిమ దగ్గర పాలు కారతాయి. కాబట్టి పండ్లను కడిగి తినటం మంచిది. పండ్లు గుత్తులుగా, ఒకటి, రెండుగా కూడా ఉంటాయి. పండ్లు బఠాణీ గింజ సైజు ఉంటాయి. మేలు రకమైన కలిమి పండ్లను ‘వాక్కాయ’లు అంటారు. ఇవి గచ్చకాయంత ఉంటాయి.‘కలిమి కాస్తే కాలం అవుతుంది’ అంటారు. అంటే.. సుభిక్షంగా పంటలు పండుతాయని రైతులు, పల్లెవాసుల ప్రగాఢ నమ్మకం. కరువును తట్టుకొని నిలబడే సత్తా ఈ చెట్టుకుంది.శాస్త్రీయ నామం: క్యారస్స క్యరండస్కుటుంబం: ఆపోసైనేసికలిమి పండు పేర్లు: ఉరూ: కశౌండ ఒరియా: సుశేన కన్నడ: కవలి, హువు, కవలి కాయ్. గరిచే, గర్ని, గర్తి, కరండ, అస్సామీ: కరెంజా, కర్ణటెంగ ఇంగీష్: కరండస్ బెర్రి, క్రేన్ బెరీ, కరౌండ కరమకిరె తమిళం: కాలక్కాయి, కలక్కాయి తెలుగు: కలిమి, కలిమిక్కాయ, వాక్కాయ(పెద్ద పండ్లు) మరాఠీ: కర్వండ, కర్విండ, కాలిమైన, బోరోండ మలయాళం: కరక్కా పంజాబీ: గర్న బెంగాలీ: కరోంమ్చా హిందీ: కరోండ, కరౌండ, కరండ సంస్కృతం: కరమర్డ్, కరమర్ది, కరోండ అని పిలుస్తారు. ఇంగ్లాండ్‌లో కరండస్ ప్లం, ఇండోనేసియాలో కరండన్, కరెండంగ్ అని, చైనీస్‌లో కు హౌంగీ అని, పాకిస్తాన్లో గర్నే, కరండ, కక్రుండ అని, వియత్నాంలో క్యాసిరో, క్జోరో అని, మలేసియాలో బెరెండ, కరెండ, కరెండింగ్ అని పిలుస్తారు.పూత: ఏప్రిల్ – మే. పండ్లు కోత: నవంబర్– డిసెంబర్.ఉనికి:ఇది సతతహరిత ఆకులురాల్చే గుల్మం (పొదలాంటిది). నేల స్వభావాన్ని బట్టి 2–5 మీటర్ల ఎత్తు పెరగగలదు. గుబురైన మండలు (కొమ్మల), కురుచైన ముళ్లు ఉంటాయి. అందువల్ల దీన్ని క్రిష్ థార్న్ అని అంటారు.గుత్తులుగా తెలటి పూలు, అందంగా ఉంటాయి. కాయలు కూడా గుత్తుగా కాస్తాయి. పెద్ద వాక్కాయ పండు నల్లగా ఉంటుంది. కానీ రుచిగా ఉండదు. అదే కలిమి (చిన్నది) పండు నల్లగానే వుంటాయి. కానీ రుచిగా ఉంటాయి.ఈ చెట్లు మన దేశంలో తూర్పు, పడమటి కనుమల అడవుల్లో, నేపాల్, శ్రీలంక, సౌత్ ఈస్ట్ ఆసియాలోని దేశాల్లో ఉన్నాయి. వాక్కాయ చెట్లను మాత్రం రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, బీహార్, గుజరాత్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో పండిస్తున్నారు.వాక్కాయి చెట్టు ఆకులు పశుగ్రాసంగా పనికొస్తాయి..కలిమి చాలా ఉపయోగకరమైన చెట్టు. పెద్ద ఎత్తుగా పెరగకపోయినా ఎక్కువ పంగలు/కొమ్మలతో గుబురుగా ఉంటుంది. ముళ్లతో కూడుకున్న ఈ చెట్లను పొలం చుట్టూ కంచెగా బాగా పని చేస్తాయి.దీని వేర్లను దంచగా వచ్చిన లేపనాన్ని పశువుల పుళ్లపై రుద్దితే పురుగులు చనిపోయి పుళ్లు త్వరగా మానిపోతాయి.దీని వేర్లతో చేసిన పౌడరు/పొడిని నీళ్లలో కలిపి చల్లితే ఆ ప్రదేశాల నుంచి పాములు పారిపోతాయి.వీటి ఆకులను పూల దండల్లో అందం కోసం పెడతారు. త్వరగా వాడిపోవు.కాయలను పచ్చడి తయారు చేయటానికి, అట్లే పూలిహోరలో కూడా వాడుతారు. దీని పచ్చడికి మంచి గిరాకీ ఉంది.ఈ పండ్లతో జామ్, జల్లీ, పానీయాలు తయారు చేస్తారు.ఆకులు గొర్రెలు, మేకలకు గ్రాసంగా ఉపయోగపడతాయి.ట్యానింగ్ పరిశ్రమల్లో ఎండిన ఆకులను వాడుతారు.పండ్లు రుచికరంగా ఉండటం వల్ల పిల్లలు బాగా ఇష్ట పడతారు.ఈ చెట్టు బెట్టెను తట్టుకోగలదు, అన్ని నేలల్లో వస్తుంది.దీని పండ్లను ఆయుర్వేదంలో విరివిగా వాడతారు. ముఖ్యంగా అసిడిటీ, అజీర్తి, పుండ్లు, చర్మవ్యాధులు, మూత్ర సంబంధిత, డయాబెటిక్ అల్సర్, కడుపు నొప్పి, అజీర్తి, రక్తహీనత, ఆకలి లేకపోవటం, పైత్యం, మనోవికల్పం మొదలగునవి నయం చేయటానికి వాడతారు.ఆకుల కషాయాన్ని, జ్వరాన్ని, విరేచనాలను, చెవి పోటును తగ్గించడానికి ఉపయోగిస్తారు.పోషక విలువలు మెండుకలిమి పోషక విలువలను గమనిస్తే చాలా విస్తృతంగా ఉంటాయి. విటమిన్–సి, విటమిన్ బిలు, ఇనుము ఉండటం వల్ల రక్తహీనత త్వరగా నయమవుతుంది. ఈ పండ్లలో మైరేడ్ యాంటిఆక్సిడెంట్స్, అవియే ఫ్లేవనాయిడ్స్, అల్కలాయిడ్స్, టానిన్స్, క్యారిస్సోన్, ట్రైటర్ ఫెనాయిడ్స్.. ఇవి ఉండటం వల్ల యాంటిపైరెడిక్, కార్డియోటానిక్, అనాల్జిన్ కారకాలుగా ఉపయోగపడతాయి.ఇందులోని పీచు పదార్థం ఉదర సంబంధిత రోగాల అదుపునకు ఉపయోగపడుతుంది. విటమిన్–సి జ్వరాలను అడ్డుకోడానికి, అదుపునకు ఉపయోగపడుతుంది. ఈ పండ్లలోని మెగ్నీషియం ఇతర విటమిన్లు, ట్రిప్టెఫాన్ వల్ల న్యూరోట్రాన్స్‌మిట్టర్ సెరటోనిన్ ఉత్పత్తి పెరిగి మానసిక వొత్తిడిని అదుపు చేసి ఆరోగ్యంగా ఉంచగలదు.కలిమి పండులో పెక్టిన్ అధికంగా ఉండడంవల్ల జాం, జెల్లీల తయారీలో ఉపయోగిస్తారు.కాయల రసం మధుమేహ రోగ నివారిణిగా ఉపయోగపడుతుంది. ∙ప్రతిరోజు వాక్కాయల రసం తీసుకోవటం వలన ఊపిరితిత్తులు, బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా కొంతవరకు నివారించుకోవచ్చు. ∙దంతాలు పుచ్చిపోకుండా, నోటి నుంచి దుర్వాసన రాకుండా కలిమి పండు కాపాడగలదు. ప్రాంతాలను బట్టి పండ్ల పోషక విలువలలో వ్యత్యాసం ఉంటుంది. నల్లమలలో ఉండే పండ్ల విలువలపై విశ్లేషణ తరుచూ చేయడం అవసరం. ఈ కలిమి లేక వాక్కాయపై వైద్యపరంగా ఎంత పరిశోధన జరిగినప్పటికీ, వీటిలో అనువైన, అధిక దిగుబడులనిచ్చ వంగడాల తయారీలో క్షేత్రస్థాయి పరిశోధనలు తక్కువని చెప్పవచ్చు.పొలం చుట్టూ కంచెకలిమి తెలుగు రాష్ట్రాలలో విరివిగా పెరిగే గుల్మం లేక చిరు చెట్టు అనవచ్చు. నల్లమల అడవుల్లో కలిమి ఎక్కువగానే ఉన్నప్పటికీ కొన్ని పరిస్థితుల వల్ల వీటి ఉనికికే ముప్పు పొంచి ఉంది. కాబట్టి పూత దశ నుంచి మొదలుకొని, పండు దశ వరకు పరిశీలించటం ముఖ్యం. అందులోని వేరియంట్స్‌ను గమనించి క్షేత్రస్థాయికి తీసుకురాగలిగితే రైతులకు ఎంతో మేలు జరుగుతుంది.ప్రస్తుతానికి రైతులు ఈ చెట్టును పొలం చుట్టూ కంచెగా వాడుతున్నారు. కాయలను (అడవి కలిమికాదు, వాక్కాయను) మార్కెట్ చేసుకోవచ్చు. అక్కడక్కడా వాక్కాయ తోటలు పెంచుతున్నట్లు దాఖలాలు ఉన్నాయి. కాబట్టి, అడవి కలిమిపై సరైన పరిశోధనలు చేపట్టి తినటానికి అనువుగా మార్చటం, నిల్వ సామర్థ్యాన్ని పెంచే దిశగా కృషి చెయ్యాలి. కలిమి పండ్లను అతిగా తింటే వాంతులు, విరేచనాలు రావచ్చు. కాబట్టి, ఎందుకైనా మంచిది మితంగా తినాలి.- డాక్టర్ మొరుపోజు పద్మయ్య, విశ్రాంత ప్రధాన శాస్త్రవేత్త, ఐసీఏఆర్ – ఐఐఓఆర్, రాజేంద్రనగర్, హైదరాబాద్. మొబైల్: 94407 08924నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ -
ఈ కుండీలో నాచు ఎందుకుందో తెలుసా?
మిద్దె తోటలు, ఇంటి పంటలు, పెరటి తోటల్లో మొక్కలు ఆరోగ్యంగా పెరగటానికి నీటి యాజమాన్యం చాలా ముఖ్యం. ముఖ్యంగా కుండీల్లో పెంచే మొక్కలకు నీటిని అందించేటప్పుడు అదనంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కుండీల్లో మొక్కలకు నీరిచ్చే ఉత్తమ పద్ధతేమిటో తెలుసుకుందాం.మొక్కలకు నీటిని ఎప్పుడూ ఉదయం ఎండ రాకముందే లేదా సాయంత్రం వేళల్లో అందించాలి. దీనివల్ల నీరు ఆవిరి కాకుండా వేర్లకు చేరుతుంది.మొక్కలకు అవసరానికి మించి నీరు పెడితే బ్యాక్టీరియా అభివృద్ధి చెంది ఆక్సిజన్ కొరత ఏర్పడుతుంది, దీనివల్ల వేర్లు కుళ్ళిపోయే ప్రమాదం ఉంది.వేసవిలో కుండీల్లో లేదా నేల పైభాగంలో ఎండుటాకులు, గడ్డి లేదా పాత గోనె సంచులను కప్పటం ద్వారా మట్టిలోని తేమను ఎక్కువ కాలం నిలుపుకోవచ్చు.కుండీల్లో అడుగున రంధ్రాలు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. నీరు నిలిచిపోతే మొక్కలు వ్యాధుల బారిన పడతాయి.ఆకుకూరలు, పూల మొక్కలపై నీటిని తుంపర్లలా చల్లడం వల్ల ఆకులపై ఉన్న దుమ్ము పోవడమే కాకుండా మొక్కలు తాజాగా ఉంటాయి.మట్టిలో నీరు ఎక్కువగా ఉంటే వేర్లకు ఆక్సిజన్ అందదు. దీనివల్ల వేర్లు కుళ్ళిపోయి మొక్క చనిపోతుంది.ఆకులు రంగు మారి, వాలిపోయినట్లు కనిపిస్తాయి. ఇది మొక్కకు నీరు ఎక్కువైందని చెప్పే ప్రాథమిక సంకేతం.ఎక్కువ నీరు పోయటం వల్ల మట్టిలోని ముఖ్యమైన పోషకాలు కొట్టుకుపోతాయి, ఫలితంగా మొక్క ఎదుగుదల ఆగిపోతుంది.తడిగా ఉన్న నేల బ్యాక్టీరియా, ఫంగస్ పెరగటానికి అనువుగా ఉంటుంది. దీనివల్ల మొక్కల మొదళ్లు, ఆకులపై తెగుళ్లు వస్తాయి.నిరంతరం నీటితో నిండి ఉండటం వల్ల మట్టిలోని రంధ్రాలు మూసుకుపోయి మట్టి గట్టిగా మారుతుంది, ఇది వేర్ల విస్తరణను అడ్డుకుంటుంది.కుండీలోని మట్టి నుంచి దుర్వాసన రావటం, మట్టి పైన పాచి పట్టటం, కొత్తగా వచ్చే ఆకులు లేదా చిగుర్లు నల్లగా మారి రాలిపోతుంటే.. ఈ మూడు సమస్యలకు కారణం ఒక్కటే కావచ్చు. అదేమిటంటే.. మొక్కల కుండీల్లో నీరు బయటకు సరిగ్గా వెళ్లటం లేదని. నీరు వెళ్లడానికి తగినంత రంధ్రం ఉందో లేదో ఒకసారి తనిఖీ చేయండి.మట్టిలో నీరు ఎక్కువగా నిలిచి ఉంటే వేర్లు ఊపిరి తీసుకోలేవు. ఈ ఒత్తిడి వల్ల మొక్క తనపై ఉన్న భారాన్ని తగ్గించుకోవటానికి పువ్వులు, మొగ్గలు, కాయలను రాల్చేస్తుంది.అధిక నీరు పోయడం వల్ల మట్టిలోని పోషకాలు కొట్టుకుపోతాయి. పూత నిలబడటానికి అవసరమైన కాల్షియం, పొటాషియం వంటి పోషకాలు అందక పిందెలు రాలిపోతాయి.మట్టిలో నీరు ఎక్కువ ఉంటే శిలీంధ్రాలు చేరి వేర్లు కుళ్ళిపోతాయి. దీనివల్ల మొక్క బలహీనపడి పిందెలను పోషించలేక వాటిని రాల్చేస్తుంది.నీరు ఎక్కువవటం వల్ల మొక్కలో ఎథిలిన్ వంటి హార్మోన్లు పెరిగి, పూలు, కాయలు కాండం నుంచి∙విడిపోయేలా చేస్తాయి.మట్టి పై పొర 1–2 అంగుళాల వరకు ఆరితేనే నీరు పోయాలి, వేలితో తాకి చూస్తే ఇది తెలుస్తుంది.మొక్క పూత మీద ఉన్నప్పుడు నీటిని తగ్గించి, నేల తేమగా ఉండేలా మాత్రమే చూసుకోవాలి.మొక్క కాయను పెంచడానికి చాలా శక్తి కావాలి. నీరు ఎక్కువగా ఉండి వేర్లు సరిగ్గా పని చేయకపోతే, మట్టిలోని పోషకాలు కాయలకు చేరవు, ఫలితంగా కాయలు రాలిపోతాయి.కొన్నిసార్లు మట్టి బాగా ఎండిపోయినప్పుడు ఒక్కసారిగా ఎక్కువ నీరు పోస్తే, ఆ తేమలో వచ్చే మార్పును భరించలేక మొక్క కాయలను రాల్చుతుంది.కాయలు ఎదుగుతున్న దశలో నీరు సమానంగా అందాలి. ఒకరోజు తక్కువ, ఒకరోజు ఎక్కువ ఇవ్వకూడదు.మట్టిలో నీరు ఎక్కువగా ఉంటే వేర్లకు ఆక్సిజన్ అందదు. దీనివల్ల వేర్లు కుళ్ళిపోయి మొక్క చనిపోతుంది. నీరు కుండీలో నిల్వ వుంటే మట్టిలోని పోషకాలు కాయలకు చేరవు, ఫలితంగా కాయలు రాలిపోతాయి.- కొల్లి కృష్ణ కుమారి, అడ్మిన్, గుంటూరు జిల్లా, మిద్దె తోటల బృందం, మొబైల్: 94906 02366నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ -
పావు ఎకరంలో.. ప్రకృతి విప్లవం!
భగవతీ లాల్, రేఖ రసాయనాలు వాడకుండా ఏటా 30 రకాల పంటలు, పండ్లు, కూరగాయలు పండిస్తున్నారు. పశువుల పేడ, మూత్రంతో సేంద్రీయ ఎరువులు తయారుచేస్తూ, తక్కువ ఖర్చుతో పర్యావరణ పరిరక్షణ, మంచి ఆరోగ్యం, స్థిరమైన ఆదాయాన్ని పొందుతున్నారు.నీటి కొరతను జయించిన తీరుఎడారి సరిహద్దు ప్రాంతాల్లో నీటి కొరత, మారుతున్న వాతావరణ పరిస్థితులు వ్యవసాయానికి ప్రధాన అడ్డంకులు. ఈ సవాళ్లను అధిగమించడానికి భగవతీ లాల్ దంపతులు బహుళ అంతస్థుల్లో అనేక రకాల పంటలను కలిపి సాగు చేసే పద్ధతిని ఆశ్రయించారు.నేలలో సేంద్రియ పదార్థాన్ని పెంచడానికి జనుము వంటి పచ్చిరొట్ట పైర్లను పెంచి, తిరిగి నేలలోనే కలియదున్నారు. దీనివల్ల మట్టిలో నీటిని పట్టి ఉంచే సామర్థ్యం గణనీయంగా పెరిగింది.వివిధ ఎత్తుల్లో పెరిగే బొ΄్పాయి, అంజీర వంటి పండ్ల చెట్లతో పాటు వాటి నీడలో వివిధ రకాల కూరగాయలను సాగుచేస్తున్నారు. దీనివల్ల నేరుగా ఎండ తగలకుండా భూమిలోని తేమ ఆవిరి కాకుండా కాపాడుతున్నారు.నీటి ఎద్దడి ఉన్న సమయాల్లో కూడా ఈ సమగ్ర సాగు విధానం వల్ల పంటలు ఎండిపోకుండా నిలదొక్కుకుంటున్నాయి.ఏడాదిలో 30 పంటలుఈ దంపతులు తమ చిన్న పొలంలోనే ఏడాది పొడవునా దాదాపు 30 రకాల ఆహార ధాన్యాలు, పండ్లు, కూరగాయలను పండిస్తున్నారు. మూడు ఆవులు, ఒక గేదెలను పెంచుకుంటూ పాలపై అదనపు ఆదాయం పొందుతున్నారు.ఎటువంటి పురుగుమందులు, రసాయనిక ఎరువులు వాడరు. ఆవు పేడ, మూత్రంతో జీవామృతం, కీటక నాశక కషాయాలను సొంతంగా తయారు చేసుకుంటారు. తమ పొలానికి కావలసిన దానికంటే ఎక్కువ సేంద్రియ ఎరువులను తయారుచేస్తున్నారు. తమ పొలంలో వాడగా మిగిలిన సేంద్రియ ఎరువులను పొరుగు రైతులకు అమ్ముతున్నారు.ఖర్చు తక్కువ రాబడి ఎక్కువఈ నమూనాలో అత్యంత ముఖ్యమైన అంశం పెట్టుబడి ఖర్చులను తగ్గించుకుంటూ నికర లాభం పెంచుకోవటమే.విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల కొనుగోలు ఖర్చు సున్నాకు చేరింది. ఇంధన వినియోగం తగ్గడం వల్ల ఉత్పత్తి వ్యయం పడిపోయింది. ∙ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పండించిన కూరగాయలు, పండ్లు తినడం వల్ల కుటుంబ ఆరోగ్యం మెరుగైంది. ‘మాకు డాక్టర్లు, మందుల ఖర్చు పూర్తిగా లేకుండా పోయింది’ అని రేఖ ఆనందంగా చెబుతారు.రసాయనాలు లేని నాణ్యమైన పండ్లు, కూరగాయల కోసం కొనుగోలుదారులే నేరుగా వీరి పొలం వద్దకు వచ్చి కొనుగోలు చేస్తున్నారు. దీంతో రవాణా ఖర్చులు, దళారుల కమీషన్ల భారం తప్పి అధిక నికరాదాయం లభిస్తోందని రేఖ వివరించారు.‘సేవా మందిర్’ అనే స్వచ్ఛంద సంస్థ అందించిన సాంకేతిక సహకారం, మెరుగైన విత్తనాలతో పునాది వేసుకున్న భగవతీ లాల్–రేఖ దంపుతుల ప్రకృతి వ్యవసాయ మోడల్, పరిమిత వనరులు ఉన్న ప్రతి చిన్నకారు రైతుకూ లాభదాయకమైన దిక్సూచిగా నిలుస్తోంది.భూమి విస్తీర్ణం చిన్నదైనా, ఆలోచన పెద్దదైతే అద్భుతాలు సృష్టించవచ్చని నిరూపిస్తున్నారు రాజస్థాన్ లోని రాజ్‌సమంద్ జిల్లా సేమా గ్రామానికి చెందిన భగవతీ లాల్, రేఖ అనే రైతు దంపతులు. పావు ఎకరం (అర బిఘా) భూమి ఉంటే ‘దీనితో ఏం చెయ్యలం?’ అని చాలామంది రైతులు నిరాశపడతారు. కానీ ఈ దంపతులు అదే పావు ఎకరం పొలాన్ని పచ్చని ప్రకృతి నందనవనంగా, లాభసాటి వ్యవసాయ వ్యాపార నమూనాగా మార్చి గ్రామీణ ప్రాంతాలకు ఆదర్శంగా నిలిచారు.నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ -
సాగుబడి: వానను బట్టి పంట విస్తీర్ణం..
వాతావరణ మార్పుల నేపథ్యంలో వర్షాధార భూముల్లో పెట్టుబడి నష్టపోకుండా పంటలు పండించే వినూత్న మెళకువలను అంతర్జాతీయ మెట్ట ప్రాంత వ్యవసాయ పరిశోధన కేంద్రం (ఐసీఏఆర్డీఏ) ఐక్యరాజ్యసమితితో కలిసి ప్రచారం చేస్తోంది. పంటకు పూర్తిగా సరిపడా వర్షపాతం కురిసే పరిస్థితి లేనప్పుడు, రైతు తనకున్న వర్షాధార భూమి మొత్తంలో పంటలు వేసుకుంటే తేమ చాలక పంట అసలేమీ చేతికి రాదు. దీనివల్ల రైతుకు పూర్తి నష్టం వాటిల్లుతుంది.దీనికి ప్రత్యామ్నాయంగా, వాన నీటి సంరక్షణ పద్ధతుల ద్వారా పొలంలో కురిసే వర్షాన్ని వీలైన పద్ధతిలో ఒడిసిపట్టుకోవాలని సంస్థ సూచిస్తోంది. పొలంలో కొంత భాగాన్ని ఖాళీగా ఉంచి, మిగతా భాగంలో పంట వేసుకుంటే ఆ కాస్త పంటయినా దక్కుతుంది. పొలంలో ఎత్తయిన ప్రాంతంలో కురిసి, లోతట్టు భాగంలోకి ప్రవహించే నీటిని మాత్రమే మనం సంరక్షించుకోగలమని, దీనివల్ల కరువును కొంతవరకు అధిగమించవచ్చని ఐసీఏఆర్డీఏ పేర్కొంది.ఉదాహరణకు.. ఒక రైతుకు 4 హెక్టార్ల భూమి ఉంది. ఏడాదికి 150 మి.మీ. వర్షపాతం కురిస్తే అక్కడ సాధారణంగా ఏ పంటా పండదు. కానీ వాన నీటిని బయటకు పోనివ్వకుండా సంరక్షించుకుంటూ.. సగం పొలాన్ని ఖాళీగా ఉంచి, రెండో సగంలో పంటలు వేస్తే ఆ భాగానికి 300 మి.మీ. నీరు లభిస్తుంది. ఆ నీటితో కరువును తట్టుకునే పంటలు చేతికొస్తాయి. అదేవిధంగా, ము΄్పావు వంతు (3 హెక్టార్లు) భూమిలో వాన నీటిని సంరక్షించుకొని, మిగిలిన పావు వంతు (1 హెక్టారు) భూమికి మళ్లిస్తే, అక్కడ ఏకంగా 600 మి.మీ. నీరు అందుబాటులోకి వచ్చి పంటలు సమృద్ధిగా పెరుగుతాయి. వర్షపు నీటి సేకరణ ద్వారా తక్కువ వర్షపాతంలోనూ లాభదాయక వ్యవసాయం చేయవచ్చన్నది ఐసీఏఆర్డీఏ భావన. నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ -
సాగుబడి: బత్తాయితో 'టీ' కూడా!
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో బత్తాయి తోటలు విస్తారంగా సాగులో ఉన్నాయి. ముఖ్యంగా అనంతపురం, కడప, నల్గొండ, మహబూబ్‌నగర్ వంటి పూర్వపు జిల్లాల్లో ఎక్కువగా ఈ తోటలు విస్తరించాయి. గిట్టుబాటు కాకపోవటం, క్లైమేట్ ఛేంజ్, చీడపీడల దాడి తదితర సమస్యలతో కొన్ని జిల్లాల్లో బత్తాయి సాగు విస్తీర్ణం తగ్గుతున్న పరిస్థితి.మార్కెట్లో ధర బాగా తగ్గినప్పుడు బత్తాయి రైతులు తీవ్రంగా నష్టపోతుండటాన్ని శివరామ్ దగ్గరగా గమనించారు. ఈ విపత్కర పరిస్థితి నుంచి రైతులకు విముక్తి కల్పించి, వారి ఆదాయ వనరులను పెంచాలనే ఆశయంతో శివరామ్ ‘సహస్తి సొల్యూషన్స్ అండ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్’ పేరిట వినూత్న స్టార్టప్‌ను ప్రాంభించారు. బత్తాయి పంట ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మక మార్పునకు శ్రీకారం చుట్టారు.శాస్త్ర, సాంకేతిక తోడ్పాటుఅనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలోని ‘అటల్ ఇంక్యుబేషన్ సెంటర్’, కేంద్ర ప్రభుత్వానికి చెందిన సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సీఎస్ఐఆర్– సీఎఫ్టీఆర్ఐ), బయో–నెస్ట్ వంటి ప్రతిష్టాత్మక జాతీయ పరిశోధనా సంస్థల సాంకేతిక సహాయం, శాస్త్రీయ మార్గదర్శనంతో వినూత్న పరిష్కారాలను అన్వేషించారు. బాలారిష్టాలను అధిగమించి తన ఆలోచనలకు కార్యరూపం ఇవ్వటంలో విజయం సాధించారు.పండులో ప్రతిదీ పనికొచ్చేదే..బత్తాయి తోటల ఆధారంగా సరికొత్త ‘వాల్యూ యాడెడ్’ (విలువ ఆధారిత) వెల్నెస్ ఉత్పత్తులను తయారు చేసిన శివరామ్ మార్కెట్లోకి ప్రవేశపెట్టారు. సాధారణంగా బత్తాయి పండును కేవలం జ్యూస్ తీసుకోవడానికే ఉపయోగిస్తారు, ఆ తర్వాత మిగిలిన తొక్కలను పారేస్తుంటారు. కానీ పండులోని ప్రతి భాగాన్నీ.. అంటే రసం, గుజ్జు, తొక్క, చివరికి విత్తనాలను కూడా వంద శాతం సద్వినియోగం చేసుకుంటూ అనేక ఉత్పత్తులను తయారు చేశారు. ‘జీరో–వేస్ట్ సర్క్యులర్ ఎకానమీ’ వినూత్న మోడల్‌ను విజయవంతంగా ఆవిష్కరించారు.ఈ సరికొత్త ప్రయోగాలలో అత్యంత ప్రజాదరణ ΄÷ందుతున్న ఆవిష్కరణలు ‘బత్తాయి ఇ¯Œ ఫ్యూజ్డ్ టీ క్యూబికల్స్’, బత్తాయి టీ బ్యాగులు, ప్రత్యేక హెర్బల్ టీ ΄ûడర్. బత్తాయి తొక్కలను సౌర శక్తితో ఎండబెట్టి, బయోటెక్నాలజీ సాంకేతికత ద్వారా శుద్ధి చేస్తు్తన్నారు. దీనివల్ల సహజసిద్ధమైన సిట్రస్ ఫ్లేవర్, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్–సి, ముఖ్యమైన పోషకాలు నశించిపోకుండా 95% పైగా సురక్షితంగా ఉంటాయి. వీటితో పాటు బత్తాయి స్క్వాష్, అత్యవసర సుగంధ తైలాలు, ఫేస్ ΄ûడర్లు, న్యూట్రాస్యూటికల్ బయో–్ర΄÷డక్ట్స్‌ను కూడా శివరామ్ తయారు చేస్తున్నారు. రైతులకు అదనపు ఆదాయంమార్కెట్లో బత్తాయి ధర కిలో ఆరు రూపాయలకు పడిపోయిన తరుణంలో సైతం, రైతు ఉత్పత్తిదారుల సంఘాల (ఎఫ్పీఓల) ద్వారా బత్తాయి తొక్కలను సేకరించి, వాటికి మంచి ధర చెల్లించటం ఈ ఆధునిక సాంకేతికత వల్ల సాధ్యమవుతోంది. దీనివల్ల రైతులకు అదనపు ఆదాయం సమకూరుతోంది. నల్గొండ, అనంతపురం జిల్లాల పరిధిలోని గ్రామీణ మహిళా స్వయం సహాయక సంఘాలకు సోలార్ డీహైడ్రేషన్ ప్రక్రియలపై శిక్షణ ఇచ్చి, వారి ద్వారా ఈ ఉత్పత్తులను పాక్షికంగా ప్రాసెస్ చేయిస్తున్నారు. తద్వారా గ్రామీణ మహిళలకు పనుల్లేని కాలంలోనూ స్థిరమైన ఉపాధి లభిస్తోంది.పర్యావరణ పరంగా కూడా ఈ ఆవిష్కరణ ఎంతో మేలు చేస్తోంది. సాధారణంగా కుళ్ళిపోయే బత్తాయి వ్యర్థాలను చెత్తకుప్పల్లో వేయటం వల్ల ప్రమాదకరమైన మీథేన్ వాయువు విడుదలవుతుంది. ఈ వ్యర్థాలను సేకరించి వివిధ ఉత్పత్తులను తయారు చేయటం ద్వారా వాయు కాలుష్యాన్ని అరికడుతున్నారు. సాంప్రదాయ వ్యవసాయాన్ని లాభసాటి వ్యాపారంగా మారుస్తూ, అటు రైతులకు, ఇటు పర్యావరణానికి మేలు చేస్తున్న ఈ ఆవిష్కరణ జాతీయ పురస్కారానికి ఎంపిక కావటం ప్రశంసనీయం.బత్తాయి (చీనీ) తోటలు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా సాగవుతున్నప్పటికీ గిట్టుబాటు ధర రాక రైతులు తరచూ ఇక్కట్ల పాలవుతున్నారు. బత్తాయి రైతుల కష్టాలకు ముఖ్య కారణం విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు చెయ్యకపోవటమే. ఈ దిశగా క్రియాశీలకంగా కృషి చేసిన ఒక స్వతంత్ర వ్యవసాయ శాస్త్రవేత్త సరికొత్త సాంకేతిక ఆవిష్కరణలతో రైతుల ఆర్థిక సమస్యలకు పరిష్కారం చూపుతున్నారు. ఆయనే తెలంగాణకు చెందిన బండారు ఉషన్న శివరామ్.అగ్రికల్చర్ బీఎస్సీ చదివిన శివరామ్ అనేక సంవత్సరాలు కృషి చేసి బత్తాయి ఆధారిత వెల్నెస్ ఉత్పత్తుల సాంకేతకతలను ఆవిష్కరించి గ్రామీణ పారిశ్రామికవేత్తగా మారారు. ఆయన కృషికి జాతీయ స్థాయిలో సముచిత గుర్తింపు లభించింది. నీతి ఆయోగ్‌కు చెందిన ‘అటల్ ఇన్నోవేషన్ మిషన్ (ఏఐఎం)’ ద్వారా ఈ ఏడాది ఎంపికైన ‘గ్రామీణ ఆవిష్కర్త’ పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ నెల 31న న్యూఢిల్లీలో పురస్కారాన్ని అందుకోబోతున్నారు బలరామ్.రైతులకు ఆదాయం... మహిళలకు ఉపాధిబత్తా కాయలతో రసం ఒక్కటే పనికొచ్చేది అనుకోవటం వల్ల రైతులకు పెద్దగా ఆదాయం రావటం లేదని గుర్తించి.. వాల్యూ ఎడిషన్‌పై పరిశోధనలు చేపట్టాను. ప్రతిష్టాత్మక సంస్థల శాస్త్ర,సాంకేతికతల తోడ్పాటుతో బత్తాయితో ఆరోగ్యదాయకమైన టీ క్యూబికల్స్, టీ బ్యాగులు, ప్రత్యేక హెర్బల్ టీ ΄÷డి, స్క్వాష్, సుగంధ తైలాలు, ఫేస్ ΄ûడర్లు, పోషకాలతో కూడిన బయో ఉత్పత్తులను తయారు చేసే సాంకేతికతలను ఆవిష్కరించాం. పైలట్ ప్రాజెక్టుల ద్వారా ఇప్పటికే బత్తాయి రైతుల ఆదాయం సుమారు 20–35 శాతం వరకు పెంచాం.గ్రామీణ మహిళల ద్వారా ఈ ఉత్పత్తులను తయారు చేయిస్తూ ఉపాధి కల్పిస్తున్నాం. నీతి ఆయోగ్‌కు చెందిన ‘అటల్ ఇన్నోవేషన్ మిషన్ (ఏఐఎం)’ ద్వారా గ్రామీణ ఆవిష్కర్త జాతీయ పురస్కారాన్ని ఈ నెల 31న అందుకోనుండటం సంతోషంగా ఉంది. రాబోయే మూడు నుంచి ఐదేళ్లలో 5 వేల మందికి పైగా బత్తాయి రైతులకు లబ్ధి చేకూర్చటం, వందలాది మహిళా స్వయం సహాయక సంఘాలకు ఉపాధి కల్పించటమే ధ్యేయంగా కార్యకలాపాలను దేశవ్యాప్త విస్తరణకు సిద్ధమవుతున్నాం.– బండారు ఉషన్న శివరామ్ (99854 77736), వ్యవసాయ పట్టభద్రుడు, బత్తాయి ఉత్పత్తుల ఆవిష్కర్తనిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ -
మట్టి ద్రావణంతో ఎన్నో మేళ్లు!
మిద్దెతోటలు లేదా ఇంటిపంటలు లేదా పెరటి తోటల్లో కుండీలలో పెరిగే మొక్కలకు మట్టి ద్రావణం అత్యంత చౌకైన, శక్తివంతమైన సేంద్రియ పోషకంగా పనిచేస్తుంది. స్థల పరిమితి ఉండే మిద్దె తోటలలో మొక్కలు ఆరోగ్యంగా పెరగడానికి ఇది ఎలా సహాయపడుతుందో తెలుసుకుందాం.1. మిద్దె తోటలో కుండీలలోని మట్టి కాలక్రమేణా తన సారాన్ని కోల్పోవచ్చు. మట్టి ద్రావణాన్ని అందించడం వల్ల మట్టిలోని సూక్ష్మజీవుల సంఖ్య పెరిగి, అది మళ్లీ సారవంతంగా మారుతుంది.2. మిద్దె /పెరటి తోటల్లో సాధారణంగా వచ్చే ఆకుముడత, పేనుబంక, తెల్ల దోమ వంటి సమస్యలను మట్టి ద్రావణం పిచికారీ చేయడం ద్వారా సమర్థవంతంగా అరికట్టవచ్చు.3. కుండీలలో పెరిగే కూరగాయలు, పండ్ల మొక్కలకు వేర్ల కంటే ఆకుల ద్వారా పోషకాలు త్వరగా అందుతాయి. మట్టి ద్రావణాన్ని స్ప్రే చేయడం వల్ల ఆకులు పచ్చగా, బలంగా పెరుగుతాయి.4. రసాయన ఎరువులు లేకుండానే టమాటా, మిర్చి, ఆకుకూరల దిగుబడిని పెంచడానికి ఇది సహాయపడుతుంది.5. ఆకులపై మట్టి ద్రావణం ఒక పొరలా ఏర్పడి, కీటకాలు గుడ్లు పెట్టకుండా అడ్డుకుంటుంది. 6. మొక్కలకు చీడపీడలు ఉన్నప్పుడు లేదా తక్షణ పోషకాలు కావాలనుకున్నప్పుడు ఆకులపై పిచికారీ చేయాలి. 7. ఆకుల పైన, ఆకుల అడుగు భాగంలో, కొమ్మల మీద పూర్తిగా తడిసేలా పిచికారీ చేయాలి.8. ఎండ లేని సమయంలో, అంటే ఉదయం 8 గంటల లోపు లేదా సాయంత్రం 4 గంటల తర్వాత, మాత్రమే స్ప్రే చేయాలి.9. మొక్క వేర్లు బలంగా పెరగడానికి, మట్టి సారవంతం కావడానికి ఈ ద్రావణాన్ని మొక్క మొదళ్లలో పోయాలి. దీనివల్ల మట్టిలోని సూక్ష్మజీవులు అభివృద్ధి చెందుతాయి.10. మట్టి ద్రావణం తయారీ కోసం భూమిపై పొరను 1 అడుగు వరకు తీసివేసి, లోపలి నుండి తీసిన జిగటగా ఉండే మట్టి (నల్లరేగడి లేదా ఎర్రమట్టి)ని 1 నుండి 2 కిలోలు తీసుకోవాలి.11. పది నుండి ఇరవై లీటర్లు నీరు తీసుకోవాలి.12. ఆముదం 20 నుండి 50 మి.లీ. (చీడపీడల నివారణకు) తీసుకోవాలి. 13. కుంకుడు కాయలు 2–3ని నీటిలో నానబెట్టి తీసిన రసం.. మట్టి ద్రావణం ఆకులకు అంటుకోవడానికి కలపాలి.14. మట్టి ద్రావణం తయారీ విధానం: సేకరించిన లోపలి మట్టిలో రాళ్లు, గడ్డలు లేకుండా మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ మెత్తని మట్టిలో ఆముదం, ముందుగా నానబెట్టి తీసిన కుంకుడు రసాన్ని వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని నీటిలో వేసి ఒక కర్రతో 5 నిమిషాల పాటు బాగా తిప్పాలి. దీనివల్ల మట్టిలోని పోషకాలు నీటిలోకి విడుదలవుతాయి.15. కలిపిన తర్వాత ద్రావణాన్ని 15 నుండి 20 నిమిషాల పాటు కదపకుండా వదిలేయాలి. అప్పుడు బరువైన మట్టి రేణువులు అడుగుకు చేరుకుంటాయి.16. పైన తేరిన గోధుమ రంగు తేట నీటిని మాత్రమే వడపోసి స్ప్రే బాటిల్లో పోయాలి.17. స్ప్రేయర్ నాజిల్‌కు మట్టి అడ్డుపడకుండా ఉండాలంటే ద్రావణాన్ని పల్చటి గుడ్డతో రెండుసార్లు వడపోసుకోవాలి. వడపోసిన తేట నీటిని స్ప్రేయర్ బాటిల్లో పోసి మొక్కల ఆకుల పైన, కింద తడిచేలా పిచికారీ చేయాలి. అప్పుడే ఆకుల అడుగున దాక్కున్న పురుగులు కూడా నశిస్తాయి.18. మట్టి ద్రావణాన్ని తయారు చేసిన 24 గంటల లోపు వాడుకోవడం మంచిది. నిల్వ ఉంచితే దాని ప్రభావం తగ్గుతుంది.19. సాధారణంగా వారానికి ఒకసారి లేదా 10 రోజులకు ఒకసారి ఇలా స్ప్రే చేయడం వల్ల మొక్కలు ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటాయి.20. మట్టి ద్రావణంను కేవలం నీటిలా కాకుండా, ఒక సహజ సిద్ధమైన ‘టానిక్‘, ‘రక్షణ కవచం’గా భావించవచ్చు. 21. భూమి లోపలి మట్టిలో మొక్కలకు అవసరమైన మైక్రో, మాక్రో న్యూట్రియెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ ద్రావణాన్ని ఆకులపై స్ప్రే చేసినప్పుడు, అవి వేర్ల కంటే 8 నుండి 20 రెట్లు వేగంగా పోషకాలను గ్రహిస్తాయి.22. ద్రావణంలో ఉండే ఆముదం, జిగట మట్టి ఒక పొరలా ఆకులపై ఏర్పడి, పురుగులు గుడ్లు పెట్టకుండా అడ్డుకుంటాయి.23. ఆకుముడత, తెల్లదోమ, పేనుబంక, లద్దెపురుగు వంటి మొండి చీడలను ఇది సమర్థవంతంగా నియంత్రిస్తుంది.24. పోషక లోపాల వల్ల ఆకులు పసుపు రంగులోకి మారినప్పుడు ఈ ద్రావణం పిచికారీ చేస్తే, కేవలం 48 గంటల్లోనే మొక్క తిరిగి పచ్చగా మారుతుంది.25. పూత రాలడం తగ్గుతుంది. కాయల పరిమాణం, నాణ్యత పెరుగుతాయి. ఇది మొక్క రోగనిరోధక శక్తిని పెంచుతుంది.26. రసాయన ఎరువులు, ఖరీదైన పురుగుమందుల అవసరం లేకుండానే కేవలం మట్టితో తోటను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.27. అధిక వర్షాలు వల్ల వేర్లు పనిచేయని స్థితిలో ఉన్నప్పుడు, ఈ ఫోలియర్ స్ప్రే మొక్కకు ్రపాణం పోస్తుంది. 28. మిద్దె తోటలోని మొక్కలు ఆరోగ్యంగా, పచ్చగా ఉండాలంటే వారానికి ఒకసారి పిచికారీ చేయడం సరిపోతుంది.29. ఒకవేళ ఆకుముడత, తెల్లదోమ లేదా పేనుబంక వంటివి ఎక్కువగా ఉంటే, 3 నుండి 4 రోజుల వ్యవధిలో రెండు మూడు సార్లు పిచికారీ చేయాలి. సమస్య తగ్గిన తర్వాత మళ్లీ వారానికి ఒకసారికి మార్చుకోవచ్చు.30. మొక్కలు పూత మీద ఉన్నప్పుడు 10 రోజులకు ఒకసారి ఇస్తే పూత రాలకుండా కాయ బాగా వస్తుంది.31. పశువుల ఎరువు మట్టిలో కలిసి వేర్ల ద్వారా నెమ్మదిగా పోషకాలను అందిస్తుంది. మట్టి ద్రావణం ఆకుల ద్వారా తక్షణమే అందుతుంది. కాబట్టి, వారానికి ఒకసారి మట్టి ద్రావణాన్ని పిచికారీ చేయవచ్చు. 32. ఒక వారం మట్టి ద్రావణం, తర్వాతి వారం జీవామృతం లేదా తౌడు ద్రావణం వంటివి మార్చి మార్చి ఇవ్వటం వలన మొక్కకు రకరకాల సూక్ష్మపోషకాలు అందుతాయి.- కొల్లి కృష్ణ కుమారి, అడ్మిన్, గుంటూరు జిల్లా, మిద్దె తోటల బృందం, మొబైల్: 94906 02366నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ -
పోషకలోపాన్ని తగ్గించే 'ఎర్రజాన'
ఎర్ర జాన కూడా ఉష్ణ మండలపు ఆకులురాల్చే చెట్ల తెగకు సంబంధించినది. ఈ చెట్లు 5–8 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతాయి. ఆకులు, పూలు ఇంచు మించు ఫాల్సా ఆకులను పోలి ఉంటాయి. కొమ్మలు కిందికి సాగి ఉంటాయి.ఈ చెట్లు నలమల అడవి అంతటా లేవు. మల్లాపూర్, అప్పాపూర్ పోయే దారిలో తారసపడుతాయి. ఎర్ర జాన ఎక్కువగా ఇండియన్ సబ్ కాంటినెంట్ మొదలు చైనా వరకు ఉంటాయి. యున్సోవ్, మలేషియా, మైన్మార్, లాహోస్, శ్రీలంక, థాయిలాండ్, వియత్నాం, బంగ్లాదేశ్, కంబోడియా తదితర దేశాలు వీటి స్థలాలు. ఈ చెట్లు దాదాపు సముద్ర మట్టం నుంచి 100 మీటర్ల ఎత్తులో కూడ ఆటు పోట్లను తట్టుకొని పెరుగుతాయి.తెలుగు: ఎర్ర జానబెంగాలీ: ధమిన్మరాఠీ: థమన్మలయాళం: చడచి, దనౌనిఇంగ్లీష్: థమన్కన్నడ: బుటలెగుజరాతీ: థమన్తమిళం: వృక్షం, అన్నంహిందీ: థమన్, కహ్ రాచిసంస్కృతం: దన్ వృక్షం అని పిలుస్తారు. ప్రాంతాలను బట్టి ఉచ్ఛారణలో కొంత తేడా ఉంటుంది.పూత: మార్చి– ఏప్రిల్పండ్లు: మే– జూన్ ఉపయోగాలు...ఈ చెట్ల అన్ని భాగాలు ఉపయోగపడుతాయి. ఎర్ర జాన పండ్ల పై పొట్టు ఎరుపు– కాషాయ వర్గం కలిగి ఆకరణీయంగా ఉంటాయి.పండ్లలో ఒక గింజ, రెండు గింజలు, కొన్నిటిలో మూడు, నాలుగు గింజలు కూడా ఉంటాయి.గింజలపై ఉండే పలుచటి పొర రుచికరంగా తీపిదనం కలిగి ఉంటుంది. ఈ పండ్లను చెంచులు ఇష్టంగా తింటారు.ఆకులను పశువులు, జీవాలు ఇష్టంగా తింటాయి. కలపను చిన్న చిన్న వ్యవసాయ పనిముట్లకు, ఇతర కట్టె వస్తువుల తయారీలో వాడవచ్చు.వంట చెరకుగా కూడా ఉపయోగపడుతుంది.బెరడు నుండి కషాయం చేసి, దాన్ని అనేక రుగ్మతలను ముఖ్యముగా పుండ్లు నయం చేయటానికి, వాత, పిత్త, కఫాలను తగ్గించటానికి వైద్యంలో వాడతారు.కడుపులో మంట పోటానికి ఈ బెరడు ఎంతో ఉపయోగపడుతుందని చెంచులు చెప్పారు.ఎర్ర జాన పండ్లలో సూక్ష్మ ధాతువులు, ముఖ్యంగా విటమిన్లతో పాటు యాంతోసైనిన్స్, ఫినాల్స్, ప్లేవనైడ్స్ మొదలగునవి ఉంటాయి.పండ్లలో ఓ మోస్తరు యాంటిఆక్సిడెంట్స్ ఉండడం వల్ల ఆరోగ్యానికి మేలు చేస్తాయి.వ్యవసాయం పంటలు, చెట్లతో కలిపి (ఆగ్రో–ఫారెస్ట్రీ) పెంచదగిన అనువైన చెట్టు.ఎన్నో ఉపయోగాలు కలిగిన ఈ చెట్ల జాతిని అభివృద్ధి ఎంతో అవసరం.ఎర్ర జాన చెట్లపై తగిన పరిశోధనలు జరిపి పల్లపు ప్రాంతాల్లో వీటి ఉనికిని చాటాలి.తద్వారా ప్రజల్లో, ముఖ్యంగా పేద ప్రజల్లో, పోషకలోపాన్ని తగ్గించటంలో ఎంతో ఉపయోగపడగలదని ఆశించవచ్చు.- డాక్టర్ మొరుపోజు పద్మయ్యవిశ్రాంత ప్రధాన శాస్త్రవేత్త, ఐసీఏఆర్ – ఐఐఓఆర్, రాజేంద్రనగర్, హైదరాబాద్. మొబైల్: 94407 08924నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ -
Sagubadi: ఆ దేశాల్లో 20 రెట్లు ఎక్కువ!
2035 నాటికి సంపన్న దేశాల్లో వ్యవసాయ కార్మికుల ఆదాయాలు దక్షిణాసియా, సబ్–సహారా ఆఫ్రికా కంటే 20 రెట్లు ఎక్కువగా ఉండవచ్చని ఒక నివేదిక పేర్కొంది. 2035 నాటికి ప్రపంచ వ్యవసాయ ఉత్పత్తి 13% పెరుగుతుంది. అదే సమయంలో అధికాదాయ దేశాల్లో వ్యవసాయ కార్మికుల వార్షిక ఆదాయం 22,155 డాలర్లు ఉంటుందని అంచనా.దక్షిణాసియా, ఉప–సహారా ఆఫ్రికాలో ఈ ఆదాయాలు 1,100 డాలర్ల స్థాయిలోనే ఉండిపోతాయని అంచనా. ప్రత్యక్ష వ్యవసాయ గ్రీ¯Œ హౌస్ వాయు ఉద్గారాలు పెరుగుతున్నప్పటికీ, అల్పాదాయ దేశాల్లో ఆహార భద్రత, పోషకాహార అంతరాలు కొనసాగే అవకాశం ఉందని ఆర్థిక సహకార అభివృద్ధి సంస్థ (ఓఈసీడీ), ఐక్యరాజ్యసమితి ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏఓ) సంయుక్తంగా విడుదల చేసిన కొత్త నివేదిక హెచ్చరిస్తోంది.ఉత్పాదకత మెరుగుదల కారణంగా రాబోయే దశాబ్దంలో ప్రపంచవ్యాప్తంగా ప్రతి కార్మికునికి సగటు స్థూల వ్యవసాయ ఆదాయం 9 శాతం మేర పెరుగుతుందని అంచనా. ముడిసరుకుల ఖర్చులు పెరుగుతున్నప్పటికీ, వాస్తవ వ్యవసాయ ధరలు స్థిరంగానే ఉంటాయని ఆశిస్తున్నారు.ఈ నివేదిక ప్రకారం, ప్రతి వ్యవసాయ కార్మికుని వాస్తవ స్థూల ఆదాయంగా లెక్కించిన ప్రపంచ సగటు వ్యవసాయ కార్మిక ఉత్పాదకత 2035 నాటికి 3,800 డాలర్లుగా ఉంటుంది. ఇది సగటు మాత్రమేన. అధికాదాయ, అల్పాదాయ దేశాల్లోని కార్మికుల మధ్య అంతరం కూడా పోరిగిపోతోంది. అధిక ఆదాయ దేశాలలో 2023–25లో వ్యవసాయ కార్మిక ఉత్పాదకత 21,100 డాలర్ల కంటే కొంచెం ఎక్కువగా ఉంది. 2035 నాటికి ఇది 22,155 డాలర్లకు పెరుగుతుందని భావిస్తున్నారు.ఉత్తర అమెరికా, పశ్చిమ ఐరోపా, ఓషియానియాప్రాంతాల్లో అత్యధిక తలసరి వ్యవసాయోత్పత్తి నమోదవుతుందని అంచనా. ఈప్రాంతాల్లో విస్తారమైన భూకమతాలు ఉంటాయి. తక్కువ శ్రమ, అత్యధిక స్థాయి యాంత్రీకరణ జరుగుతుందని నివేదిక పేర్కొంది. మరోవైపు, సహారా ఉప–్రపాంత ఆఫ్రికా, దక్షిణాసియాలోని అల్ప ఆదాయప్రాంతాల్లో వ్యవసాయ కార్మికులు ప్రస్తుతం సగటున సంవత్సరానికి సుమారు 930 డాలర్లు సంపాదిస్తున్నారు. ఈ ఆదాయం 2035 నాటికి కేవలం 1,100 డాలర్లకు మాత్రమే పెరుగుతుంది. అంటే దశాబ్ద కాలంలో సుమారు 170 డాలర్లు మాత్రమే పెరుగుతుందని నివేదిక అంచనా వేస్తోంది.వ్యవసాయ కార్మికుల సగటు ఆదాయాల్లో అంచనా వేసిన 9 శాతం పెరుగుదల ఏమాత్రం సురక్షితం కాదు. వ్యవసాయ మార్కెట్లు అస్థిరతకు గురవుతూ ఉంటాయి. ఈ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే, 2035లో ప్రతి కార్మికునికి స్థూల వ్యవసాయ ఆదాయం, అంచనా వేసిన ్రపాథమిక స్థాయి కంటే కనీసం 12 శాతం తక్కువగా ఉండే అవకాశం లేకపోలేదని నివేదిక చెబుతోంది. అల్పాదాయ దేశాల్లో అ లోటు 20 శాతానికి మించి ఉండవచ్చని అంచనావేస్తున్నారు.ఆదాయాల్లో ఈ వ్యత్యాసం ఆహార భద్రత, వినియోగ సరళిలో కూడా ప్రతిబింబిస్తుందని నివేదిక కనుగొంది. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను ్రపోత్సహించడానికి నిరంతర ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ, సంపన్న దేశాల్లో అధిక ఆహార వినియోగం కొనసాగే అవకాశం ఉంది. మరోవైపు, తక్కువ గృహ ఆదాయాలు, ఆర్థిక ఒత్తిళ్ల కారణంగా, అల్పాదాయ దేశాలు ఆహార భద్రత, పోషణలో వెనుకబడి ఉంటాయని అంచనా.పెరగనున్న వ్యవసాయ ఉద్గారాలువ్యవసాయ ఉత్పత్తిలో అధిక వృద్ధి నమోదవుతుందని అంచనా వేసినప్పటికీ, సాగుభూమి, పశువుల సంఖ్యను రానున్న పదేళ్లలో ఇంకా కొంత విస్తరించాల్సి ఉంటుంది. దీని ఫలితంగా, రాబోయే దశాబ్దంలో ప్రత్యక్ష వ్యవసాయ గ్రీ¯Œ హౌస్ వాయు ఉద్గారాలు 6.5 శాతం మేర పెరుగుతాయని అంచనా. రానున్న పదేళ్లలో పెరిగే వ్యవసాయ ఉద్గారాలలో సుమారు 77 శాతం వాటా పశువుల పెంపకందే ఉంటుందని అంచనా. అధిక నైట్రస్ ఆక్సైడ్ ఉద్గారాల ద్వారా కృత్రిమ ఎరువులు మిగిలిన 23 శాతానికి దోహదం చేస్తాయని భావిస్తున్నారు.‘ఉత్పాదకత వృద్ధిని వేగవంతం చేయటం, సాంకేతిక అంతరాలను పూడ్చటం ద్వారా ఉద్గారాల పెరుగుదలను నెమ్మదింపజేయడానికి లేదా తగ్గించటానికి వీలు కల్పించటమే విధానపరమైన సవాలు. పెరుగుతున్న జనాభాలో మారుతున్న ఆహారపు అలవాట్ల నేపథ్యంలో.. ప్రపంచ ఆహార భద్రతను, మెరుగైన పోషకాహారాన్ని అందిస్తూనే వ్యవసాయ ఉద్గారాలను నియంత్రించాలి’ అని నివేదిక పేర్కొంది.నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ -
తక్కువ పెట్టుబడి.. ఎక్కువ ఉపాధి!
మన దేశంలో గ్రామీణ కుటుంబాల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడానికి, పోషకాహార భద్రతను పటిష్టం చేయడానికి పెరటి కోళ్ళ పెంపకం ఒక శక్తివంతమైన సాధనంగా అవతరించిందని భువనేశ్వర్‌లోని కేంద్రీయ మహిళా వ్యవసాయ సంస్థ (ఐసిఎఆర్–సిఐడబ్ల్యూఏ) శాస్త్రవేత్త డాక్టర్ అరుణ్ కుమార్ పాండా తన పరిశోధనా పత్రంలో వెల్లడించారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఉపాధిని, మహిళా సాధికారతను అందించే ఈ రంగంపై డా. అరుణ్ కుమార్ పాండా ఏమంటున్నారంటే..అంతరం... దేశ జనాభాలో దాదాపు 70 శాతం మంది గ్రామీణ ప్రాంతాల్లోనే నివసిస్తున్నారు. అయితే, వాణిజ్యపరమైన కోళ్ళ పరిశ్రమల లాభాలు కేవలం పట్టణ ప్రాంతాలకే పరిమితమయ్యాయి. ఉత్పత్తి అవుతున్న కోడిగుడ్లు, కోడిమాంసంలో 75–80 శాతాన్ని పట్టణాల్లో ఉండే 25 శాతం జనాభా తింటుంటే.. గ్రామీణ ప్రజలు ఇప్పటికీ పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. ఈ అంతరాన్ని తొలగించడానికి పెరటి కోళ్ళ పెంపకం ఎంతో దోహదపడుతుంది. 2019 పశుగణన ప్రకారం.. దేశంలో పెరటి కోళ్ళ సంఖ్య 31.37 కోట్లకు చేరింది. మొత్తం గుడ్ల ఉత్పత్తిలో పెరటి గుడ్ల వాటా 21 శాతం ఉంటుంది.మహిళా సాధికారత... సాధారణంగా గ్రామాల్లో పెరటి కోళ్ళ నిర్వహణ, వాటికి మేత వేయటం, గుడ్ల అమ్మకం వంటి పనులన్నీ మహిళలే చూసుకుంటారు. దీనివల్ల వచ్చే అదనపు ఆదాయం వల్ల వారి కుటుంబ నిర్ణయాధికారం పెరిగి, సామాజిక హోదా మెరుగుపడుతుంది. ఇది స్త్రీ పురుష సమానత్వానికి దారితీస్తుంది.లాభసాటి కావాలంటే..? పెరటి కోళ్ళ పెంపకంలో తక్కువ ఉత్పాదకత, కొక్కెర వ్యాధి వంటి ప్రాణాంతక వ్యాధులు, సరైన మార్కెటింగ్ సదుపాయాలు లేకపోవడం ప్రధాన సమస్యలు. వీటిని అధిగమించడానికి గిరిరాజ, వనరాజ, గ్రామప్రియ, స్వర్ణధార, శ్రీనిధి వంటి మేలు రకం కోడి పిల్లలను ప్రభుత్వాలు పంపిణీ చేయాలి. స్థానికంగా లభించే మేతను వాడుకోవటం, మహిళలకు వ్యాక్సినేష¯Œ పై శిక్షణ ఇవ్వటం, మహిళా సహకార సంఘాల ద్వారా గ్రామీణ మార్కెట్లను ఏర్పాటు చేయటం వంటి చర్యలు చేపడితేనే కుటుంబ స్థాయిలో పెరటి కోళ్ళ పెంపకం మరింత లాభసాటిగా మారుతుంది. గిరిరాజ, వనరాజ, గ్రామప్రియ, శ్రీనిధి వంటి మేలైన పెరటి కోడి పిల్లల కోసం హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని ఐసీఏఆర్ అనుబంధ సంస్థ ‘డైరెక్టరేట్ ఆఫ్ పౌల్ట్రీ రీసెర్చ్’ను సంప్రదించవచ్చు. హెల్ప్ లైన్: 040–24015651.కోడిగుడ్డులో 44 పోషకాలుగ్రామీణప్రాంతాల్లో ఐదు సంవత్సరాల్లోపు పిల్లల మరణాలకు 69 శాతం కారణం పోషకాహార లోపమే. సంప్రదాయ భారతీయ ఆహారంలోప్రోటీన్ల లోపం ఉంటుంది. మానవ శరీరానికి అవసరమైన 45 రకాల పోషకాల్లో 44 పోషకాలు కోడిగుడ్డులో లభిస్తాయి. వంద గ్రాముల కోడిగుడ్లలో లభించే 6.9 గ్రాముల నాణ్యమైనప్రోటీన్ తక్కువ ధరకే లభిస్తుంది. కోడి మాంసంలో కూడా 22 శాతంప్రోటీన్ ఉండి, కొవ్వు పదార్థాలు తక్కువగా ఉంటాయి.- ఇంటర్వ్యూ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ -
ఏఎంఆర్ ముప్పు తప్పించే ఈవీఎం చికిత్సలు!
సాంప్రదాయ పశువైద్య విధానాలకు (ఎత్నోవెటర్నరీ మెడిసిన్–ఈవీఎం) శాస్త్రీయ గుర్తింపు తీసుకురావడంలో విజయం సాధించిన తమిళనాడుకు చెందిన వెటర్నరీ ప్రొఫెసర్ ఎన్. పుణ్యమూర్తి(69) ఇటీవలే పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. దేశంలో ఇప్పటి వరకు పద్మశ్రీ అందుకున్న ఐదుగురు వెటర్నేరియన్లలో ఒకరు. ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన ఆయనతో బుధవారం ‘సాక్షి’ ప్రత్యేకంగా ముచ్చటించింది. ఈ మూలికా వైద్యంతో యాంటీబయాటిక్స్ వాడకం తగ్గుతుంది. తద్వారా భవిష్యత్తులో యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ (ఏఎంఆర్) ముప్పును సమర్థవంతంగా అడ్డుకోవచ్చు అంటున్నారాయన. ముఖాముఖిలో కొన్ని ముఖ్యాంశాలు...→ ఎత్నోవెటర్నరీ మెడిసిన్(ఈవీఎం) చికిత్సలు అంటే?విశ్రాంత వెటర్నరీ ప్రొఫెసర్‌గా నాకున్న శాస్త్రీయ జ్ఞానం, పురాతన సిద్ధ వైద్య రీతిలోని సంప్రదాయం విజ్ఞానాన్ని మేళవించి పాతికేళ్లుగా ఈవీఎంలపై కృషి చేస్తున్నాను. ఇంటి పట్టున దొరికే సాధారణ మూలికలతో రైతులే పశువైద్యం చేసుకోవటానికి తోడ్పడేవే ఎత్నోవెటర్నరీ మెడిసిన్(ఈవీఎం) చికిత్సలు. → సాంప్రదాయ పశువైద్యానికి శాస్త్రీయత ఉందా?ప్రతిష్టాత్మక అంతర్జాతీయ జర్నల్ ‘మైక్రోబియల్ పాథోజెనిసిస్’లో ఈవీఎం చికిత్సలపై ఇటీవల ప్రచురితమైన తొలి వ్యాసం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. నాతో పాటు చాలా మంది శాస్త్రవేత్తలు, వివిధ ప్రభుత్వ పరిశోధన సంస్థలు సాధించిన విజయాలే ఇందుకు దోహదపడ్డాయి. ఉదాహరణకు.. పాడి పశువులకు వచ్చే ముఖ్య వ్యాధుల్లో పొదుగు వాపు ఒకటి. కలబంద ఆకులు 250 గ్రాములు, పసుపు 50 గ్రాములు, సున్నం 15 గ్రాముల మిశ్రమాన్ని వాడితే 85% పశువుల్లో 3–5 రోజుల్లోనే పొదుగువాపు తగ్గిపోతుంది. మొత్తం 34 పశు వ్యాధులకు ఇటువంటి నిర్థారిత ఈవిఎం చికిత్సలు ఉన్నాయి. సాధారణంగా శాస్త్రీయ పరిశోధనల్లో మొక్కల నుంచి ఒకే ఒక అణువును వేరు చేసి పరీక్షిస్తారు. కానీ, ఈ పరిశోధనలో మొదటిసారిగా ఈ మూడు పదార్థాల పూర్తి మిశ్రమాన్ని (హోల్ కాంబినేషన్‌ను) ఒక ‘ఫంక్షనల్ రెమెడీ’గా పరీక్షించి విజయం సాధించాం.→ మీ పరిశోధనలకు నిధులు ఎలా సమకూరాయి?ఎత్నోవెటర్నరీ మెడిసిన్ పద్ధతులు కేవలం అనుభవపూర్వకమైనవి మాత్రమే కావు, వాటి వెనుక బలమైన శాస్త్రీయ ఆధారం కూడా ఉందని మా పరిశోధనలు నిరూపించాయి. ప్రభుత్వాల నిధులతో గత 20 ఏళ్లుగా పరిశోధనలు జరుగుతున్నాయి. తమిళనాడు ప్రభుత్వం 2007లో మొదట రూ. 18 లక్షలు, తర్వాత రూ. 13.72 కోట్లు మంజూరు చేసింది. భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్) రూ. 80 లక్షలు, కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ రూ. 32 కోట్లు కేటాయించింది. → ఈవీఎం చికిత్సల క్షేత్రస్థాయి ఫలితాలెలా ఉన్నాయి?నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డ్ (ఎన్డీడీబీ) దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో పాడి రైతులతో అమలు చేయిస్తోంది. గుజరాత్‌లోని ‘సాబర్ మిల్క్ యూనియన్’లో ఈ చికిత్సలను ఎన్ డీడీబీ విజయవంతంగా పరీక్షించింది. 2017 నుంచి దీన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నారు. దాదాపు 3 లక్షలకు పైగా పాడి పశువుల చికిత్స ఫలితాలతో డిజిటల్ డేటాను ఎన్డీడీబీ సేకరించింది. పొదుగు వాపు వ్యాధి నివారణలో 85% పైగా అద్భుతమైన క్లినికల్ సక్సెస్ రేట్ నమోదైంది. కేవలం 3–5 రోజుల్లోనే పశువులు కోలుకున్నాయి. 34 రకాల పశువ్యాధుల నివారణకు ఎన్ డీడీబీ ఈ చికిత్సలను అనుసరిస్తోంది. → యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ కట్టడి అవుతుందా?పశువైద్యంలో యాంటీబయాటిక్స్ వాడకం పెరగటం వల్ల బ్యాక్టీరియా వాటిని తట్టుకునే శక్తిని (యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ –ఏఎంఆర్)ను పెంచుకుంటోంది. ఈ మూలికా వైద్యం వల్ల యాంటీబయాటిక్స్ వాడకం తగ్గి, భవిష్యత్తులో ఈ ముప్పును సమర్థవంతంగా అడ్డుకోవచ్చు. ‘స్టాండర్డ్ వెటర్నరీ ట్రీట్మెంట్ గైడ్‌లైన్స్ ’(ఎస్వీటీజీ)లో కూడా ఈవీఎం చికిత్సలను చేర్చారు. కేంద్ర పశుసంవర్ధక శాఖ, ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ భాగస్వామ్యంతో ఈ మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈవీఎం చికిత్స విధానాన్ని వెటర్నరీ విద్యార్థుల సిలబస్‌లో చేర్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.ఇంటర్వ్యూ:పంతంగి రాంబాబుసాక్షి సాగుబడి డెస్క్ -
జీవవైవిధ్య పరిరక్షణలో ఊడుగ చెట్ల పాత్ర..
ఊడుగ పండు పేర్లు వేర్వేరు భాషల్లో: తెలుగు: నల్ల అంకోలము, నల్ల ఊడుగ ఇంగ్లీష్: సేజ్ లీవ్డ్ ఆలంజియం, హిల్ సాక్ ట్రీ, సోన్ మ్యాంగో ఉర్దూ: అంకోల్ ఒరియా: మొరట, బంగ అంకోల్ తమిళం: ఏలంజి, ఎరలిన్సిల్ పంజాబీ: ఆకోల్ బెంగాలీ: ఆకర కాంటా మరాఠీ: అంకోల్ మలయాళం: అంకోలం. కరంకొలం హిందీ: అంకోల, అంకోల్ సంస్కృతం: అంకోల, అంకోలక, అంకోత నేపాలీ: ఆంఫీ, అంకోల్ అని అంటారు.పూత : ఫిబ్రవరి – ఏప్రిల్. పండ్లు : మే – జూన్.ఊడుగ చెట్టుకు ముళ్లు ఉంటాయి. పండ్లు ఒగరుతో కూడుకొని జిగటగా ఉంటాయి. గుత్తులుగా కాస్తుంటాయి. పండ్లు నశ్యం రంగులో ఉంటాయి. ఈ చెట్టు ఎన్నో ఔషధ గుణాలు కల్గి ఉంది.ఉపయోగాలు...ఊడుగ చెట్లను రైతులు వీటిని జీవ కంచెగా పెంచుతారు.పండ్లు తింటారు. వగరు, తీపి కలయిక రుచితో ఉంటాయి.ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు. వీటి వేర్లు, పండ్లను కీళ్ళ నొప్పులు, పైల్స్ తగ్గించడానికి ఉపయోగిస్తారు.వేర్ల బెరడును నులి పురుగులను విసర్జించడానికి వినియోగిస్తారు.వెన్ను నొప్పిని అదుపులో ఉంచడానికి ఉపకరిస్తుంది.పండ్లు, విత్తులు చలువనిస్తాయి. అట్లే శరీరానికి సత్తువనియ్యగలవు.ఆకులు కూడా వాపును, ఎముకల పెళుసుదనాన్ని తగ్గించడానికి వాడుతారు.జ్వరాలను తగ్గించడానికి వాడుతారు.పచ్చి పుల్లలతో పండ్లు తోముకుంటే మంచిది. చిగుర్లు గట్టి పడుతాయి.విత్తనాల నుండి తీసిన నూనెను చర్మంపై పూసినటైతే దురదలు తగ్గుతాయి. అలాగే గజ్జి కూడా తగ్గుతుంది. ఈ నూనెను బొడ్డు చుట్టు పూసుకుంటే మగత సమస్యకు చెక్ పెట్టవచ్చు.కొమ్మల కషాయంతో విరేచనాలు, వాంతులను తగ్గించవచ్చు. ఆకులను ఉబ్బసాన్ని, కీళ్ల నొప్పులను తగ్గించడానికి వాడుతారు.పండ్ల రసాన్ని కంటి సమస్యలకు ఉపయోగిస్తారు.వేర్ల బెరుడును పసుపుతో కలిపి సుఖరోగాలను తగ్గించడానికి పై పూతగా వాడుతారు.డెంగ్యూను తగ్గించడానికి వాడుతారు. మూడు గ్రాముల వేర్లు, రెండు గ్రాముల శొంఠిని దంచి పొడిని సేవించడం వల్ల డెంగ్యూ రోగం నుండి విముక్తి చెందవచ్చని చెబుతారు.రేబీస్ రోగాన్ని నయం చేసే గుణం వీటి వేర్లకున్నది. వీటి వేర్ల కషాయం చేసి రోజుకు రెండుసార్లు, ఈ విధంగా ఒక నెల సాధన చేసే రేబీస్ రోగం నుండి విముక్తి పొందవచ్చునంటారు.పాము కాటు నుండి ఉపశమనానికి వేర్ల బెరుడు పొడిని దాదాపు 350 ఎం.ఎల్.ను గ్లాసు ఆవు పాలలో బాగా కలిపి రోజుకు మూడుసార్లు సేవించడం వల్ల (వారం రోజులైనా చేయవలసి ఉంటుంది. పాము పాము కాటు నుండి విముక్తి పొందవచ్చని చెబుతారు. విషానికి విరుగుడుగా పనిచేస్తుంది).మూత్ర విసర్జన మంటగా ఉంటే 5 గ్రాముల వేర్లను శుభ్రంగా కడిగి, 400 మిల్లి లీటర్ల నీళ్ళల్లో మరగనిచ్చి (ఆ నీళ్ళు ఒక భాగం అయ్యే వరకు) చల్లారిన తరువాత రోజుకు రెండుసార్లు తాగితే ఈ సమస్య నుండి విముక్తి పొందవచ్చు.ఏదైనా అతిగా తీసుకుంటే కడుపు నొప్పి వచ్చే ఆస్కారం ఉంటుంది. అలాగే అజీర్తి, విరేచనాలు కూడా కావచ్చు. మోతాదుకు మించి వాడరాదు.కట్టెలను వంట చెరుకుగా వాడుతారు. పెద్ద మండలను ఇటుక బట్టీలను కాల్చటానికి కూడి వాడుతారు.జీవవైవిధ్య పరిరక్షణలో ఊడుగ చెట్టు పాత్ర ఎంతో ఉంటుంది.ఉనికి...ఊడుగ చెట్లు ఎక్కువగా వాగులు వంకలు, అడవులు, ఒడ్డుల వెంబడి పెరుగుతాయి. పొదలుగానే ఎక్కువగా ఎదుగుతాయి. కానీ అక్కడక్కడా ఎత్తు చెట్లుగా పెరుగుతాయి. ఇవి రమారమి 5–10 మీటర్ల వరకు స్థలాన్ని బట్టి పెరుగుతుంది. ఈ చెట్లు ఆకులను రాల్చుతాయి. ఇది ఉష్ణమండలానికి చెందిన చెట్టు. పవిత్ర వృక్షంగా గుర్తింపు వుంది. ఈ చెట్లు ఉన్న దగ్గర దేవాలయాలు వెలుస్తాయి. అలాగే గ్రామ దేవతల గుళ్ళ దగ్గర ఈ చెట్లు ఉంటాయి. వీటి స్వస్థలం భారత ఉపఖండం, కొమోరో ద్వీపాలు, ఆఫ్రికా తూర్పు ఉష్ణమండలం. భారత దేశంలో ఇంచుమించు అన్ని రాష్ట్రాలలో వీటిని గమనించవచ్చు. ఇతర దేశాలలో కూడా వీటి ఉనికి ఉంది. ముఖ్యంగా బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్, కెన్యా, టాంజనియాలలో ఉంది.- డాక్టర్ మొరుపోజు పద్మయ్య, విశ్రాంత ప్రధాన శాస్త్రవేత్త, ఐసీఏఆర్ – ఐఐఓఆర్, రాజేంద్రనగర్, హైదరాబాద్. మొబైల్: 94407 08924నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ -
వాతావరణ మార్పులను తట్టుకునే సమీకృత వ్యవసాయం!
వ్యవసాయం అంటే పంటలు పండించటం. సమీకృత వ్యవసాయం అంటే ఒకే భూమిలో పంటల సాగుతో పాటు పశువులు/ కోళ్లు/ చేపల పెంపకం వంటివి కలిపి చెయ్యటం. దీనివల్ల ఖర్చులు తగ్గి, లాభాలతో పాటు భూసారం పెరుగుతాయి. వర్షాధార వ్యవసాయంపైనే ఆధారపడి జీవించే చిన్న, సన్నకారు రైతులకు సైతం ఆహార, ఆరోగ్య భద్రత కలుగుతాయి. ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ వర్షాధార సమీకృత వ్యవసాయంపై విస్తృతమైన కృషి చేస్తోంది. ఒడిషాలో ఈ ఫౌండేషన్ అనుభవాలపై కథనం..ఒడిషాలోని కోరాపుట్ జిల్లాలో వర్షాధారంగా వ్యవసాయం చేసే (మెట్ట) రైతులు సమీకృత వ్యవసాయాన్ని అనుసరించి బాగుపడుతున్నారు. వర్షపు నీటిని నిల్వ చేసుకొని.. ఆ నీటిని పంటలు, కూరగాయల సాగుకు ఉపయోగించుకోవడానికి వ్యవసాయ చెరువులు సహాయపడుతున్నాయి. వర్షాధారంగా వ్యవసాయం చేసే రైతులు వర్షాకాలంలో మాత్రమే ముఖ్యంగా వరి సాగు చేస్తుంటారు. అయితే, కోరాపుట్, నబరంగ్‌పూర్‌లోని ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ ప్రాజెక్ట్ పరిధిలో రైతులు ఒకడుగు ముందుకు వేశారు. ఈ రైతులకు చేపల సాగు, కూరగాయలు, పండ్ల చెట్లు, పప్పుధాన్యాలు, చిరుధాన్యాల సాగు, పుట్టగొడుగుల పెంపకంతో పాటు వర్మీకంపోస్ట్ తయారు చేసుకొని బహుళ పంటలను సాగు చేయటంలో ఫౌండేషన్ రైతులకు శిక్షణ ఇచ్చింది.ఈ నమూనా కాలానుగుణ ఇబ్బందులను తగ్గించిందని, ప్రతి ఇంట్లో ఆహార భద్రతను మెరుగుపరిచిందని, అలాగే వాతావరణంలో ఏర్పడే పెను మార్పులకు తట్టుకునే వ్యవసాయాన్ని మార్చుకునేలా చేసిందని రైతులు అంటున్నారు.2017 నుంచి ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలో ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ అమలు చేస్తున్న సమీకృత వ్యవసాయ వ్యవస్థప్రాజెక్ట్ చక్కటి ఫలితాలనిస్తోంది.ప్రారంభంలో 20 మంది చేపలæ రైతులతో పైలట్‌ప్రాజెక్ట్‌గా ప్రారంభించిన ఈ కార్యక్రమం ద్వారా ఆదాయాలు రెట్టింపయ్యాయి. ఈ ఫలితాల నేపథ్యంలో, కోరాపుట్, నబరంగ్‌పూర్ జిల్లాల్లోని 193 మంది రైతులకు ఈ కార్యక్రమాన్ని విస్తరించారు.చేపల పెంపకంఈ వ్యవస్థకు ప్రధానమైనది వర్షపు నీటిని సేకరించే చెరువు. దీన్ని చేపల పెంపకం, అదనపు నీటిపారుదల కోసం ఉపయోగిస్తారు. ఉదజని సూచిక (పిహెచ్)ని సరిచేయటానికి చెరువుల్లో సున్నం వేసి శుభ్రపరుస్తారు. ఆవు పేడతో కూడిన స్లర్రీ వెయ్యటం వల్ల నీటిలో ΄్లాంక్టన్(ప్లవకాలు) పెరుగుతాయి. ఇది చేపలకు సహజమైన మేతగా ఉపయోగపడుతుంది. రైతులు బొచ్చె తదితర మంచినీటి కార్ప్ చేపలను కలిపి ఒకే చెరువులో తగిన నిష్పత్తిలో పెంచుతారు. తక్కువ ఖర్చుతో ఇంట్లో తయారుచేసిన చేపల మేతను, నీటిపై తేలియాడే పెల్లెట్ల మేతను వేసి పెంచుతారు. క్రమం తప్పకుండా చేపల నమూనాలను సేకరించి పరీక్షిస్తూ మేత పద్ధతులను సర్దుబాటు చేస్తుంటారు.సమీకృత సేద్యం ఓ పరిష్కారం వర్షపు నీటిని సేకరించి, ఆ నీటిపై ఆధారపడి చేసే సమీకృత వ్యవసాయ పద్ధతులు కేవలం ఆదాయాన్ని పెంచడమే కాకుండా, ఇంకా ఎన్నో ప్రయోజనాలను అందిస్తాయి. అవి వాతావరణ మార్పులను తట్టుకునే సామర్థ్యాన్ని బలోపేతం చేస్తాయి, పోషకాల వైవిధ్యాన్ని మెరుగుపరుస్తాయి, నేల, నీటి వనరులను పరిరక్షిస్తాయి, భూగర్భ జలాలపై ఒత్తిడిని తగ్గిస్తాయి. వాతావరణ మార్పుల వల్ల వర్షపాతం అస్తవ్యస్థంగా మారిపోవటం తీవ్రమవుతున్నందున, ఇటువంటి వికేంద్రీకృత, సమాజ ఆధారిత పరిష్కారాలు అత్యంత కీలకంగా మారాయి.వర్షం పడిన చోటనే పొలంలోనే ఆ నీటిని సేకరించడం అత్యంత సరళమైన పద్ధతి. భారతదేశ ఆహార భవిష్యత్తును కాపాడటానికి ఇది అత్యంత శక్తివంతమైన వ్యూహాలలో ఒకటిగా నిలుస్తుందని ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ చెబుతోంది. సమీకృత వ్యవసాయ వ్యవస్థ నమూనాని రైతులందరికీ విస్తరించాల్సిన అవసరం ఉంది, దీనికి విధానపరమైన ప్రోత్సాహం, క్షేత్రస్థాయిలో రైతుల సామర్థ్యం పెంపుదల, సామాజిక భాగస్వామ్యం అవసరం. రైతులు వాన నీటిని ఒక ఉమ్మడి పర్యావరణ వనరుగా గుర్తించి ఒడిసిపట్టినప్పుడు వ్యవసాయం సుస్థిరతకు మరింత చేరువ అవుతుందని ఫౌండేషన్ సూచిస్తోంది.అదేవిధంగా, రైతులు మెట్ట భూములలో ఖరీఫ్ కాలంలో రాగుల సాగును, ఖరీఫ్ చివరి కాలంలో ఉలవల సాగును చేపట్టారు. ఈ వైవిధ్యభరితమైన పంటల విధానం నేల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రైతుల జీవనోపాధిని బలపరుస్తుంది. ఆహార భద్రతను ప్రోత్సహిస్తుంది. కుటుంబ పోషణకు తోడ్పడుతుంది.వరి, రాగి పంటల గడ్డితో ఆయిస్టర్ పుట్టగొడుగుల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నారు. వర్మీకంపోస్టు ఉత్పత్తి కేంద్రాల ద్వారా వ్యర్థాలను పునర్వినియోగిస్తున్నారు. తద్వారా రసాయన ఎరువులపై ఆధారపడటాన్ని తగ్గింది.సాంప్రదాయ పద్ధతులతో పోలిస్తే సమీకృత వ్యవసాయ విధానం వల్ల కలిగే ప్రయోజనాలు చాలా ఎక్కువ. అంతకంటే ముఖ్యంగా, సంవత్సరం పొడవునా పంటల ద్వారానో, కోళ్ల ద్వారానో, చేపల ద్వారానో ఏదో ఒక ఆదాయం వస్తుంటుంది. దీనివల్ల కాలానుగుణ ఇబ్బందులు తగ్గి, రైతులు మరింత సురక్షితమైన జీవితాలను గడపడానికి వీలు కలుగుతోంది.చెరువు గట్లపై పంటలు..సాంప్రదాయకంగా ఉపయోగించకుండా వదిలేసే చెరువు గట్లపై అరటి, బొ΄్పాయి, మునగ, జామ, నిమ్మ, దానిమ్మ, కొబ్బరి వంటి పండ్ల చెట్లను నాటుతున్నారు. చెరువు నీటితో చెరువు గట్లపైనా, దాన్ని ఆనుకొని ఉన్న భూముల్లోనూ ఏడాది పొడవునా కూరగాయలు పండిస్తున్నారు. మెట్ట భూములలో వరి తర్వాత పండించే పెసర, మినుము వంటి పప్పుధాన్యాలు అదనపు ఆదాయాన్ని అందించడమే కాకుండా, నేలను సారవంతం చేస్తున్నాయి. తద్వారా కాలక్రమేణా పెట్టుబడి ఖర్చులను తగ్గింది.అదేవిధంగా, రైతులు మెట్ట భూములలో ఖరీఫ్ కాలంలో రాగుల సాగును, ఖరీఫ్ చివరి కాలంలో ఉలవల సాగును చేపట్టారు. ఈ వైవిధ్యభరితమైన పంటల విధానం నేల ఆరోగ్యాన్ని, రైతుల జీవనోపాధిని మెరుగుపరుస్తుంది. ఆహార భద్రతకు, కుటుంబ పోషణకు తోడ్పడుతోంది. వరి, రాగుల గడ్డితో ఆయిస్టర్ పుట్టగొడుగులు పెంచుతున్నారు. వర్మీకంపోస్టు తయారు చేస్తూ రసాయన ఎరువుల అవసరాన్ని తగ్గించుకుంటున్నారు.నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ -
Sagubadi: చీడపీడల నివారణ..
కూరగాయ మొక్కలు పూత, కాత దశలో ఉన్నప్పుడు చీడపీడలు (ముఖ్యంగా ఆకు ముడత, తెల్ల దోమ లేదా పేనుబంక) రావడం సహజం. మిద్దెతోటల్లో వీటిని వదిలించుకోవడానికి రసాయనాల కంటే ఇంట్లోనే తయారు చేసుకునే కషాయాలు బాగా పనిచేస్తాయి:1. వేప నూనె స్ప్రే అన్నిటికన్నా ఉత్తమమైనది. ఒక లీటరు గోరువెచ్చని నీటిలో 5 ఎం.ఎల్. వేప నూనె, 2 స్పూన్లు శనగపిండి కలిపి బాగా గిలకొట్టాలి. ఈ మిశ్రమాన్ని ఆకులపైన, ముఖ్యంగా ఆకుల వెనుక భాగంలో (అక్కడే పురుగులు ఎక్కువగా ఉంటాయి) స్ప్రే చేయాలి. దీన్ని వారానికి ఒకసారి సాయంత్రం వేళల్లో స్ప్రే చేస్తే పురుగులు మాయమవుతాయి.2. అల్లం–వెల్లుల్లి–మిర్చి కషాయం – టమోటా, మిర్చి మొక్కలకు వచ్చే ఆకు ముడతకు ఇది బాగా పనిచేస్తుంది. 3. సమాన భాగాలుగా (50 గ్రాముల చొప్పున) అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి తీసుకుని పేస్ట్ చేయాలి. దీన్ని లీటరు నీటిలో కలిపి ఒక రాత్రంతా ఉంచి, మరుసటి రోజు వడకట్టాలి.4. ఇలా వాడకట్టిన లీటర్ ద్రావణం కు మరో 10 నుండి 15 లీటర్ల సాధారణ నీటిని కలిపి మొక్కలపై స్ప్రే చేయాలి. ఈ ద్రావణం గాఢత ఎక్కువ ఉంటే మొక్కలు మాడిపోతాయి. 5. వేప నూనె లేదా అల్లం–వెల్లుల్లి కషాయాన్ని వారానికి ఒకసారి చొప్పున వరుసగా మూడు వారాలు స్ప్రే చేయాలి. ఒక్కసారి స్ప్రే చేస్తే పురుగులు పూర్తిగా పోవు, వాటి గుడ్లు కూడా నశించాలంటే క్రమం తప్పకుండా చేయాలి.6. పురుగులు ఆకుల అడుగునా దాక్కుంటాయి, కాబట్టి స్ప్రే చేసేటప్పుడు ఆకులను పైకి ఎత్తి మరీ కొట్టాలి.7. పుల్లటి మజ్జిగ (నిమ్మ మొక్కలకు): బాగా పులిసిన మజ్జిగను (3–4 రోజుల పాతది) నీటిలో కలిపి (1:5 నిష్పత్తి) మొక్కలపై స్ప్రే చేస్తే తెగుళ్లు తగ్గడమే కాకుండా, మొక్కకు మంచి పోషకాలు అందుతాయి.8. 1 లీటరు నీటిలో అర టీస్పూన్ బేకింగ్ సోడా, కొద్దిగా వంట నూనె, లిక్విడ్ సోప్ కలపాలి. ఆకులపై మచ్చలు లేదా బూజు ఉన్నప్పుడు దీనిని పిచికారీ చేయాలి. 9. ఆకు ముడతను వ్యాపింపజేసే తెల్లదోమలు, తామర పురుగులు పసుపు రంగుకు ఆకర్షితమవుతాయి. తోటలో అక్కడక్కడా పసుపు రంగు జిగురు అట్టలు కడితే పురుగులు వాటికి అతుక్కుపోతాయి. దీనివల్ల సమస్య పెరగకుండా ఉంటుంది.10. ³క్షులను ఆకర్షించడం ద్వారా అంటే వాటికి ఏమైనా ఆహారం, నీరు అందిస్తే పక్షులు మిద్దె /పెరటి తోటకు రావటానికి అలవాటు పడి మొక్కలపై ఉన్న పురుగులను తింటాయి. ఇది సహజమైన నియంత్రణ పద్ధతి.11. ఏ రకమైన కషాయం లేదా స్ప్రే అయినా సరే సాయంత్రం ఎండ తగ్గాక మాత్రమే చేయాలి. ఎండలో చేస్తే ఆకులు మాడిపోయే ప్రమాదం ఉంది.12. పూత మీద నేరుగా స్ప్రే చేయకూడదు. ఇది పరాగసంపర్కానికి అడ్డుపడవచ్చు. ఆకులపై మాత్రమే స్ప్రే చెయ్యాలి.13. బాగా ముడత వచ్చి పాడైపోయిన ఆకులు లేదా కొమ్మలు ఉంటే, వాటిని తుంచేసి దూరంగా పారవేయాలి. అవి ఉంటే పురుగులు మళ్ళీ వ్యాపిస్తాయి.14. మొక్కకు లోపలి నుండి బలం ఉంటేనే అది రోగాలను తట్టుకోగలదు. కాబట్టి మనం ఇంతకుముందు తెలుసుకున్న ద్రవ పశువుల ఎరువును 15 రోజులకు ఒకసారి అందిస్తూ ఉండాలి.- కొల్లి కృష్ణ కుమారి, అడ్మిన్, గుంటూరు జిల్లా, మిద్దె తోటల బృందం, మొబైల్: 94906 02366నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ -
కష్టకాలంలో కూరగాయల సాగు వ్యూహాలు!
ఎల్‌నినో వల్ల ఏర్పడిన అనిశ్చిత వర్షపాత పరిస్థితులు, వాతావరణ మార్పులకు అనుగుణంగా ఉద్యాన పంటలు ముఖ్యంగా కూరగాయ పంటల సాగులో రైతులు కొన్ని ముఖ్యమైన మెళకువలు పాటించాల్సిన అవసరం ఉంది. కొన్నిప్రాంతాల్లో ఇప్పటికే ‘రుతుపవనాలు ఆలస్యం’ అయ్యాయి. మరికొన్నిప్రాంతాల్లో ‘తొలి కరువు’ నెలకొంది. ఇతరప్రాంతాల్లో మొదట్లో వర్షాలు కురిసినా తర్వాత ‘మధ్యకాలపు కరువు’ ఏర్పడింది.ఇటువంటి పరిస్థితుల్లో కూరగాయలు సాగు చేసే రైతులు ఎటువంటి ఏయే పంటలు పండించాలి? ఏయే రకాలను ఎంచుకోవాలి? ఎలాంటి మెళకువలు పాటించాలి? ఇటువంటి విషయాలను, మెళకువలను శ్రీకొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ దండా రాజిరెడ్డి ఈ ప్రత్యేక వ్యాసంలో వివరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రైతులకు ఈ సూచనలు ఉపకరిస్తాయి.జూన్ 15 నుంచి జూలై 15వ తేదీ వరకు వానాకాలం (ఖరీఫ్) పంటలు విత్తే కాలం. మరొక వారం రోజులు మాత్రమే విత్తే కాలం మిగిలి ఉంది. ఆరుద్ర కార్తె వెళ్లి, పునర్వసు కార్తె వచ్చింది. ఇప్పటికీ 60–75 మి.మీ. వర్షం కూడా కురవనిప్రాంతాల్లో ‘రుతుపవనాలు ఆలస్యం’ అయ్యాయని గుర్తించాలి. కొన్నిప్రాంతాల్లో ఇప్పటికే రెండు, మూడు వర్షాలు పడి భూమిలో తేమ సరిపోను ఉంది. అయితే, వర్షాల మధ్య 15–20 రోజుల విరామం వచ్చింది. కాబట్టి, ఆయాప్రాంతాలు ఇప్పటికే ‘తొలి కరువు’ పరిస్థితిని ఎదుర్కొంటున్నట్లే అర్థం.తొలి దశలో వర్షాలు పడినప్రాంతాల్లో రైతులు ఇప్పటికే విత్తుకొని ఉంటారు. మొలకవచ్చిన తర్వాత 15–20 రోజులు మళ్లీ వర్షం పడకపోతే ఆ పరిస్థితిని ‘మధ్యకాలపు కరువు’గా గుర్తించాలి. తొలి దశలో వర్షపాతం ఆధారంగా సాగు చేసిన పంటల్లో మొలక బాగా వచ్చినా, తర్వాత నెలకొన్న మధ్యకాలపు కరువు వల్ల మొక్కలు నీటి ఎద్దడికి గురవుతాయి. విత్తినా అసలు మొలకలే రాకపోతే మళ్లీ విత్తనాలు వేయాలి. కానీ, కచ్చితంగా నేలలో దున్నే పదును ఉన్నప్పుడే విత్తుకోవాలి. 1. వర్షాలు ఆలస్యమైనప్పుడు సాగు వ్యూహాలుస్వల్పకాలిక, కరువును తట్టుకునే కూరగాయ పంటలకు వెళ్లండి. వర్షాలు ఆలస్యమైన పరిస్థితుల్లో ఇక్కడ పేర్కొన్న అనువైన రకాలను సాగు చేసుకోవాలి.టొమోటో: అర్కా వికాస్, అర్కా రక్షక్, అర్కా సామ్రాట్, సాహూ, బాహూ, వీఎన్ఆర్ 3348, వీఎన్ఆర్ 3348, ఆదియా, ఆర్య ఎఫ్1. వంగ: శ్యామల, భాగ్యమతి, పూస క్రాంతి, అర్క నీలకంఠ, మంజరి, ఉత్కర్ష, వినాయక్మిరప: తేజ, ఎల్సీఏ–334, అర్కా లోహిత్, ఐఐహెచ్ఆర్ ఎస్ఇఎల్ 132, వీఎన్ఆర్ 978, ఉజాలా ఎఫ్1.బెండ: అర్కా నిఖితా, అర్క నామిక, వర్షా ఉపార్, హిసార్ ఉన్నత్, ఖాసీ లలిమా, వివాన్, వీబీహెచ్–11 (వీఎన్ఆర్), బ్రిగేడియర్, గౌరీ మునగ: పీకేఎం–1, పీకేఎం–2, కోకన్ రుచిరాచిక్కుడు: ఆర్ఎన్డీ–01, అర్కా జే గోరుచిక్కుడు: పూసా నవబహార్ బొబ్బర: అర్కా గరిమ, పూసా, కోమల్, తెలంగాణ కూర బొబ్బర తీగ జాతులు: సొర/ఆనప– అర్కా బహార్, కాకర– అర్కా హరిత్, బీర– అర్కా సుజాత్, దోసకాయ, వంట పుచ్చకాయ పాలకూర: ఆల్ గ్రీన్, అర్కా అనుపమ ∙తేమ ఒత్తిడి ప్రభావాన్ని తగ్గించడానికి స్వల్పకాలిక రకాలు, హైబ్రిడ్లను సాగు చేయాలి.కరువును తట్టుకునే శక్తిని మెరుగుపరచడానికి, తేమ ఒత్తిడి పరిస్థితుల్లో పంట మనుగడను పొడిగించడానికి అంటుకట్టిన టొమాటో, వంగ నారుమొక్కలు నాటుకోవటం మంచిది. దశలవారీగా నర్సరీలను పెంచాలి.2. తొలి కరువు పరిస్థితుల్లో సాగు వ్యూహాలు∙నేలలో తేమను కాపాడటానికి, కలుపును అరికట్టడానికి, నేల ఉష్ణోగ్రతను నియంత్రించడానికి సేంద్రియ ఆచ్ఛాదనగా ఎండుగడ్డి లేదా ఇతర పంట అవశేషాలను హెక్టారుకు 7–10 టన్నుల చొప్పున వేసుకోండి. ∙నేల నిర్మాణాన్ని మెరుగుపరచడానికి, నీటిని నిలుపుకునే సామర్థ్యాన్ని పెంచడానికి మాగిన పశువుల ఎరువు హెక్టారుకు 15 టన్నులు లేదా వర్మీకంపోస్ట్ 10 టన్నుల చొప్పున నేలలో కలపండి. ∙నీటి వినియోగ సామర్థ్యం, నీటి పారుదల, వేర్ల అభివృద్ధిని మెరుగుపరచడానికి ఎత్తు మడుల (గట్టు–కాలువ లేదా వెడల్పాటి ఎత్తు మడుల)పై పంటల సాగు పద్ధతులను అవలంబించండి.పంట పెరుగుదలలోని కీలక దశల్లో, ముఖ్యంగా చురుకైన శాఖీయ పెరుగుదల, పూత, కాయల అభివృద్ధి దశల్లో ప్రాణరక్షక నీటి తడులు అందించండి. నీటి లభ్యత పరిమితంగా ఉన్నప్పుడు, నీటి వినియోగ సామర్థ్యాన్ని గరిష్ఠంగా పెంచడానికి ఒక కాలువ విడిచి ఒక కాలువ పద్ధతిలో నీటిపారుదల చేయండి.తేమ, పోషకాల కోసం మొక్కల మధ్య పోటీని తగ్గించడానికి, ముఖ్యంగా తొలి పెరుగుదల దశల్లో పంట పొలాన్ని కలుపు లేకుండా శుభ్రంగా ఉంచండి.నేలలోని తేమ నష్టాన్ని తగ్గించడానికి, లోతైన నేల తేమ నిల్వలకు అంతరాయం కలగకుండా ఉండేందుకు, దున్నే పనులను నేల పైభాగంలోని 5 సెం.మీ. పొర మట్టి వరకే పరిమితం చేయండి.పంట నాటిన 30 రోజుల తర్వాత,ప్రారంభ పెరుగుదలను ప్రోత్సహించడానికి, ఒత్తిడి పరిస్థితుల్లో మొక్క బలంగా ఉండేలా చేయడానికి, నీటిలో కరిగే ఎరువును (19:19:19 ఎన్పీకే) లీటరు నీటికి 5–7 గ్రాముల చొప్పున రెండుసార్లు ఆకులపై పిచికారీ చేయండి.చీడపీడల నుంచి రక్షణ వ్యూహాలుకరువు పరిస్థితుల్లో తెల్లదోమ, పేనుబంక, నల్లి వంటి రసం పీల్చే పురుగులు తరచుగా కూరగాయల ఉత్పత్తికి ప్రధాన ఆటంకాలుగా మారతాయి. పొడి వాతావరణంలో చాలా శిలీంధ్ర, బాక్టీరియా వ్యాధుల ప్రభావం సాధారణంగా తక్కువగా ఉంటుంది. అయినప్పటికీ వాహకాలైన ఈ రసం పీల్చే పురుగుల కార్యకలాపాలు పెరగడం వల్ల వైరస్ వ్యాధులు ప్రబలవచ్చు. తెగుళ్లు, వ్యాధులను సమర్థవంతంగా నిర్వహించడానికి, పంట నష్టాలను తగ్గించడానికి, సకాలంలో పర్యవేక్షణ, మొక్కల రక్షణకు తగిన చర్యలు తీసుకోవండి. సిఫారసు చేసిన సమీకృత తెగులు, వ్యాధి నిర్వహణ పద్ధతులను అనుసరించండి.విత్తన శుద్ధి: రసం పీల్చే పురుగుల నుండి ముందస్తు రక్షణ కల్పించడానికి, విత్తనాలకు ఇమిడాక్లోప్రిడోర్ థియామెథాక్సామ్ను కిలో విత్తనానికి 3–5 గ్రాముల చొప్పున చల్లండి.రసం పీల్చే పురుగుల నివారణకు:- ఇమిడాక్లోప్రిడ్ 17.8 ఎస్ఎల్: 0.5 మి.లీ/లీటరు నీటిలో- థియామెథోక్సామ్ 25 డబ్ల్యూజి: 0.35 గ్రా/లీటరు నీటిలో- థియాక్లోప్రిడ్ 21.7 ఎస్సి: 0.65 మి.లీ/లీటరు నీటిలో.నల్లి నివారణకు..- అబామెక్టిన్ 1.9% ఈసీ: 0.5 మి.లీ/లీటరు- స్పైరోమెసిఫెన్ ః 1.0 మి.లీ/లీటరు- క్లోర్ఫెనాపైర్: 1.0 మి.లీ/లీటరు- ప్రోపార్గైట్: 2–3 మి.లీ/లీటరు,- ఫెనాజాక్విన్ 1.9% ఈసీ: 2.5 మి.లీ/లీటరు.వృక్ష, జీవ నియంత్రణకు..- వేప ఆధారిత పురుగుమందులు: 5 మి.లీ/లీటరు నీటిలో- రసం పీల్చే పురుగులపై జీవ నియంత్రణ కారకంగా వెర్టిసిలియం లెకాని: 5 గ్రా/లీటరు నీటిలోపిండి నల్లి నివారణకు..- స్పైరోటెట్రామాట్ 0.5 మి.లీ/లీటరు నీటిలో, లేదా ఇమిడాక్లోప్రిడ్: 0.5 మి.లీ/లీటరు నీటి నిర్వహణలెపిడోప్టెరాన్ గొంగళి పురుగుల నిర్వహణ..- ఇండోక్సాకార్బ్: 0.5 మి.లీ/లీ- ఎమామెక్టిన్ బెంజోయేట్: 0.35 గ్రా/లీ- ఫ్లూబెండియామైడ్: 0.5 మి.లీ/లీ3. ‘మధ్యకాలపు కరువు’ ఉత్పత్తి వ్యూహాలుఅధిక వర్షపాతం సమయంలో నీటి పారుదలని మెరుగుపరచడానికి మరియు నీరు నిలిచిపోవడాన్ని తగ్గించడానికి, గట్లు–కాలువల పద్ధతిలో నాటటం (25–30 సెం.మీ. ఎత్తు గట్లు) లేదా కాలువల ద్వారా నీరు పెట్టేందుకు వీలుగా ఎత్తయిన మడుల(90 సెం.మీ. వెడల్పు, 20 సెం.మీ. ఎత్తు)పై పంటలు వేసుకోండి ∙తేమ కొరత ఏర్పడినప్పుడల్లా, ముఖ్యంగా పంట చురుకైన పెరుగుదల, పూత, కాయల అభివృద్ధి దశల్లో, కీలకమైన పంట పెరుగుదల దశల్లో రక్షక నీటి తడులను అందించండి ∙తేమ, పోషకాలు, సూర్యరశ్మి కోసం పోటీని తగ్గించడానికి, పంట పెరుగుదల తొలి దశల్లో పొలాల్లో కలుపు లేకుండా చూసుకోండి.– డాక్టర్ దండా రాజిరెడ్డి, వైస్ ఛాన్సలర్, శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ, ఉద్యాన విశ్వవిద్యాలయంనిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ -
జ్వరాన్ని తగ్గించడంలో.. ఉల్లింద పండ్ల ప్రత్యేకత
ఉల్లింద జీనస్‌లో అనేక రకాల జాతులున్నాయి. అడవి పండ్ల జాతుల్లో ఉల్లింద పండ్లకు ప్రత్యేకత ఉంది. వీటికి ఉన్న ఔషధ గుణాలే అందుకు కారణం. దీనిపై గతంలో ఎన్నో పరిశోధనలు జరిగాయి.ఉనికి: ఉల్లింద చెట్టు ఉష్ణమండలంలోని చిట్టడవులు, అడవులు, మైదానం ప్రాంతాల్లో పెరుగుతుంది. ఆకులు రాల్చే తత్వం గలది. ఈ చెట్టు కొన్ని సందర్భాల్లో గొడుగు ఆకారం 6–10 మీటర్ల ఎత్తువరకు పెరుగుతుంది. ఇంచుమించు అన్నిరకాల నేలల్లో (చౌడు భూములు తప్ప) పెరుగుతుంది. విత్తనం ద్వారానే దీని ప్రవర్ధనం జరుగుతుంది. దీని పండు మొదలు ఆకుపచ్చగా ఉండి, పండినప్పుడు ఆరంజ్–ఎరుపుగా మారుతుంది.దీని స్వస్థలం మధ్య–దక్షిణ ఇండియా, బంగ్లాదేశ్ ఇతర ఉష్ణమండల దేశాలై ఉండవచ్చు. ఇండియాలో మాత్రం దక్షిణాదిన అన్ని రాష్ట్రాల్లో ఉంది. ఆంధ్రప్రదేశ్ (నల్లమల అడవులు), కర్నాటక, తమిళనాడు, తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్, ఒడిషా, గుజరాత్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో వీటి ఉనికి ఉంది. ఇది ఎక్కువగా అటవీ ప్రాంతాల్లో ఉంటుంది. నల్లమల అడవుల్లో ఈ చెట్లు అధికంగానే ఉన్నాయి. అడవి విస్తరించిన అన్ని జిల్లాల్లోనూ ఉన్నాయి. మొత్తానికి దీనిపై పరిశోధన చెప్పుకున్నంత జరగలేదు.ఉల్లింద ఉపయోగాలు:ఆకులు వగరుగా ఉన్నా మేకలు ఇష్టంగా తింటాయి. ఇది సతత హరితం. కాబట్టి వేసవిలో కూడా ఆకుల లభ్యత ఉంటుంది.పండ్లు వగరు–తీపిని కలబోసినట్లుగా ఉంటాయి. పండ్లు చిన్నవిగా, గుండ్రంగా ఉండి నిగనిగలాడుతుంటాయి. ఈ పండ్లను చక్కెర భీమారి ఉన్న వాళ్ళు కూడా తినవచ్చు.వంట చెరకుగా ఉపయోగపడుతుంది.వీటి ఆకుల రసం రెండు పూటలా తాగిస్తే విరేచనాలు తగ్గుతాయి.ఈ పండ్లు తింటే అజీర్తి నివారింపబడుతుంది.ఎండిన పూల పొడిని నీటిలో కలిపి తాగించడం వల్ల మూత్రకోశ వ్యాధులు నివారించబడతాయి.ఉల్లిందను సిద్ధ ఔషధంలో విరివిగా వాడతారు.జ్వరాన్ని తగ్గించడంలో ఈ చెట్టుకు మంచి పేరుంది. చెట్టు బెరుడు/మాను పెచ్చులను నానబెట్టి మొక్కలపై చల్లినట్లైతే రసం పీల్చే పురుగుల బెడద నుంచి పంటను రక్షించుకోవచ్చు.నల్లమల అడవులు..నలమల అడవులు ఆవరించిన అన్ని జిల్లాల్లో ఈ చెట్లు ఉన్నాయి. పశువుల కాపరులకు ఈ చెట్లు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే, ఇది ఎప్పుడూ ఆకులతో పచ్చగా ఉండడం వల్ల ఎండాకాలంలో నీడతో ΄ాటు పండ్లు కూడా లభిస్తాయి. సేద తీర్చుకోవటానికి నీడనిచ్చే మంచి చెట్టు.ఈ చెట్లపై లోతైన పరిశోధనలు జరగలేదు. దేశంలో కొన్నిప్రాంతాలకే పరిమితం కావడం ఒక కారణం అయితే ఎక్కువగా అడవుల్లోనే ఇవి ఉండటం కూడా ఒక కారణం కావచ్చు. ఈ పండ్లకు ఔషధ, పోషక విలువలు ఉన్నందు వల్ల లోతైన పరిశోధనల అవసరం ఎంతైనా ఉంది. అట్లే వీటిని ఆగ్రోఫారెస్ట్రీలో భాగం చేస్తే ఎంతో ఉపయోగంగా ఉంటుంది. ఉల్లింద పండ్ల చెట్లు ఆదిలాబాద్, ఉమ్మడి వరంగల్ జిల్లా అడవుల్లో కూడా ఉన్నాయి. ఈ పండ్లలో పీచు పదార్ధం అధికంగా ఉన్నందున తినే ఆహారం అరుగుదలకు బాగా ఉపయోగపడుతుంది.ఉల్లింద చెట్టు పేర్లు: ఇంగ్లీష్: గ్రీన్ ఎబోని పర్సిమోన్ ఒరియా: బండోడి, గౌర్కస, కొసై కన్నడ: జగలగంటి, నిన్నె, నేన్సి, కరగరి యంతుమర తమిళం: కరువక్కనై, పెరియులిన్సి, వక్కనై తెలుగు: ఇల్లింటు, కవకీమాను, ఉల్లింద, కోషవో, నేల ఇల్మీర, ఇల్లింద, తొరిక, వల్లంజ, పుల్లిండే, పెద్ద ఉల్లింద, పెద్దఉలిని, కాయకిమాను మరాఠీ: నేన్సి, నినై హిందీ: కలటెండు, కిన్నూ. - డాక్టర్ మొరుపోజు పద్మయ్య, విశ్రాంత ప్రధాన శాస్త్రవేత్త, ఐసీఏఆర్ – ఐఐఓఆర్, రాజేంద్రనగర్, హైదరాబాద్. మొబైల్: 94407 08924నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ -
కమిషన్ లేని ఆన్లైన్ స్టోర్: రైతుల జీవితాల్లో వెలుగులు!
మహారాష్ట్రకు చెందిన ఇద్దరు స్నేహితులు ఐటీ ఉద్యోగాల వైపు వెళ్లకుండా, రైతుల కష్టాలను తీర్చడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. వారే అనికేత్ ఘార్గే, జయ్ సిద్ధపురా. వీళ్లిద్దరూ ఇంజనీరింగ్ చదివేటప్పటి నుంచి స్నేహితులు. మధ్యవర్తుల దోపిడీకి గురవుతున్న రైతులను ఆదుకోవటానికి ‘ఇండియన్ ఫార్మర్ ఆంట్రప్రెన్యూర్స్’ (ఐఎఫ్ఈ) స్టోర్ అనే ఆన్ లైన్ మార్కెట్‌ను 2022లో ప్రారంభి దిగ్విజయంగా నడుపుతున్నారు. కమిషన్ లేని ఆన్లైన్ మార్కెట్ కావటంతో దేశవ్యాప్తంగా వినియోగదారులకు వీరు ఉత్పత్తులను అమ్మగలుగుతున్నారు. దీంతో రైతుల ఆదాయం రెట్టింపైందని చెబుతున్నారు.సతారాలోని వడగావ్ గ్రామానికి చెందిన అనికేత్ రైతు కుటుంబంలో పుట్టాడు. అతనికి బాల్యం నుంచే వ్యవసాయంపై మక్కువ ఉండేది. కంప్యూటర్ ఇంజనీరింగ్‌లో పట్టభద్రుడయ్యాక, అతను పూణేలోని ఒక వెబ్ డెవలప్మెంట్ కంపెనీలో ఒక సంవత్సరం పాటు పనిచేశాడు. అయితే, 2017లో అతను ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని, రైతుల కథలను పంచుకోవడానికి తన సొంత యూట్యూబ్ ఛానెల్‌ను ప్రారంభించాడు. స్కూల్లో చదువుకునే రోజుల నుంచే రైతులతో మాట్లాడి వారి సమస్యలను అర్థం చేసుకోవాలని అనుకునేవాడిని అంటాడాయన. ప్రస్తుతం ఆయన యూట్యూబ్ ఛానెల్లో సుమారు 2.5 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు.ప్రభుత్వం సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నప్పటికీ, రైతులు మధ్యవర్తుల సహాయం లేకుండా తమ ఉత్పత్తులను అమ్ముకోవటానికి ప్రత్యేకమైన మార్కెట్ దాదాపుగా లేదని అతను గుర్తించి ప్రత్యామ్నాయం వైపు ఆలోచన సారించాడు. వ్యవసాయంపై తనకున్న ఆసక్తిని, టెక్నాలజీ నేపథ్యాన్ని మేళవించి కళాశాల స్నేహితుడైన జయ్‌తో కలిసి రైతుల కోసం అనికేత్ ఒక ఆన్లైన్ మార్కెట్‌ప్లేస్ వెబ్‌సైట్‌ను ప్రారంభించాడు.సాధారణంగా రైతులు పండించిన పంటను అమ్ముకోవటానికి మధ్యవర్తులపై ఆధారపడాల్సి వస్తుంది. వారు దాదాపు 30 శాతం వరకు కమిషన్ వసూలు చేస్తూ లాభాలన్నీ తామే గడిస్తున్నారు. ఫలితంగా రైతులు అప్పులపాలై ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారు. ఈ సమస్యకు పరిష్కారంగా ‘ఐఎఫ్ఈ స్టోర్’ ఎలాంటి కమిషన్ లేకుండా రైతులు తమ ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు విక్రయించడానికి, మధ్యవర్తుల బెడదను తొలగించడానికి సహాయపడుతోంది.రైతులు పండించిన ఆర్గానిక్ పంటలతో పాటు బెల్లం క్యాండీలు, పసుపు పొడి, మిల్లెట్ ఉత్పత్తులు, పచ్చళ్లు, మసాలాలు వంటి దాదాపు 25 రకాల విలువ ఆధారిత ఉత్పత్తులను ఈ వెబ్సైట్లో ఉంచుతారు. అనికేత్ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా రైతులను సంప్రదించి, వారి పొలాలను సందర్శించి, ఆహార భద్రతా ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) లైసెన్స్ ఉన్న ఉత్పత్తులను సేకరిస్తారు. కేవలం రూ.10 ప్యాకేజింగ్ ఖర్చు మినహా ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయరు. ఈ విధానం వల్ల కేవలం ఏడాది కాలంలోనే రైతుల ఆదాయం రెట్టింపు అయింది.మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని రైతులకు చెందిన ఉత్పత్తులు ఈ ఆన్ లైన్ మార్కెట్ ద్వారా ఇప్పుడు గుజరాత్, కేరళ, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, అస్సాం సహా 15కు పైగా రాష్ట్రాల్లోని వినియోగదారులకు చేరుతున్నాయి. కొరియర్ సేవల పరంగా కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ, వాటిని అధిగమిస్తూ వీరు ముందుకు సాగుతున్నారు. తల్లిదండ్రులు ఐటీ ఉద్యోగం చేయాలని కోరినప్పటికీ, అనికేత్ తన అభిరుచిని నమ్ముకుని సామాజిక మార్పు కోసం కృషి చేస్తున్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని రాష్ట్రాల రైతులను ఈ వేదికపైకి తీసుకురావడమే వీరి లక్ష్యం. టెక్నాలజీని సరైన మార్గంలో ఉపయోగిస్తే రైతుల జీవితాల్లో వెలుగులు నింపవచ్చని ఈ ఇద్దరు స్నేహితులు నిరూపించారు.నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ -
ఐఐఎంఆర్‌లో చిరుధాన్య విత్తనాలు
ఎల్‌నినో నేపథ్యంలో తక్కువ నీటితో, అధిక ఉష్ణోగ్రతల్లోనూ మంచి దిగుబడిని ఇవ్వగలిగే సీ4 పంటలే చిరుధాన్య పంటలు. ప్రస్తుత రోజుల్లో మారుతున్న జీవనశైలి వల్ల వస్తున్న ఆరోగ్య సమస్యల నివారణకు చిరుధాన్యాల ఆహారమే ఉత్తమ ప్రత్యామ్నాయంగా మారిన విషయం తెలిసిందే. దేశంలో చిరుధాన్యాల సాగును మరింత విస్తరింపజేసేందుకు హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ ఐసీఏఆర్ సంస్థ భారతీయ చిరుధాన్యాల పరిశోధనా సంస్థ (ఐసీఏఆర్–ఐఐఎంఆర్) కృషి చేస్తోంది. రైతులు మంచి దిగుబడి సాధించాలంటే నాణ్యమైన విత్తనాలు వాడటం ఎంతో ముఖ్యం.ప్రస్తుత ఖరీఫ్ పంట కాలంలో విత్తుకోవటానికి అనువైన నాణ్యమైన చిరుధాన్యాల విత్తనాలను హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని తమ ప్రధాన కార్యాలయం నుంచి రైతులు నేరుగా కొనుగోలు చేయొచ్చని ఐసీఏఆర్–ఐఐఎంఆర్ సంచాలకులు డాక్టర్ తార సత్యవతి ‘సాక్షి సాగుబడి’తో చె΄్పారు.జొన్న, సజ్జ, రాగు, కొర్ర, అరికె, సామ, ఒరిగ వంటి అన్ని రకాల చిరుధాన్యాలు తమ వద్ద అందుబాటులో ఉన్నాయని ఐఐఎంఆర్ విత్తన శాస్త్రవేత్త డాక్టర్ సూగన్న తెలిపారు. అన్ని రకాల చిరుధాన్య విత్తనాలు అందుబాటులో ఉన్నప్పటికీ.. సూటి రకం పచ్చజొన్న, కొర్ర (సూర్యనంది) విత్తనాలు అధిక మొత్తంలో ఉన్నాయన్నారు. తెల్లజొన్న హైబ్రిడ్ రకాల విత్తనాలు కూడా తమ వద్ద అందుబాటులో ఉన్నాయని ఆయన అన్నారు.జొన్న వంటి పెద్ద గింజ చిరుధాన్యాలు ఎకరానికి 3 కిలోల విత్తనం అవసరం. కొర్ర వంటి చిన్న గింజ చిరుధాన్యాలు ఎకరానికి 2 కిలోల విత్తనం సరిపోతుందని డా. సూగన్న ‘సాక్షి సాగుబడి’కి వివరించారు. హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ భారతీయ చిరుధాన్యాల పరిశోధనా సంస్థకు స్వయంగా వచ్చి రైతులు విత్తనాలు కొనుక్కోవాల్సి ఉంటుంది. అదనపు సమాచారం కోసం 040–24599305 నంబరులో పని దినాల్లో ఉదయం 9 గం. నుంచి సాయంత్రం 4 గం. మధ్య సంప్రదించవచ్చు. వ్యవసాయ పరిశోధనా కేంద్రం నంద్యాల, విజయనగరం, పాలెం, రాజేంద్రనగర్‌లోని పీజేటీఏయూలలో కూడా చిరుధాన్యాల విత్తనాలు అందుబాటులో ఉంటాయని చెబుతున్నారు.నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ -
వాన నీరు ఇంకిస్తే చాలు!
ఎల్ నినోతో రుతుపవనాలు అస్తవ్యస్థంగా మారుతున్న పరిస్థితుల్లో బోర్‌వెల్స్ కింద వ్యవసాయం చేసే రైతులు వాన నీటిని ఒడిసిపట్టి భూమిలోకి ఇంకింపజేసుకునే పనులు చేపట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. వర్షపు నీరు భూమిలోకి ఇంకే దానికంటే ఎక్కువ నీటిని తోడటం వల్ల అనేక ప్రాంతాల్లో భూగర్భ జల మట్టాలు అడుగంటాయి. అనేక ప్రాంతాల్లో 200 నుంచి 400 మీటర్ల (650–1300 అడుగుల) లోతు వరకు కూడా బోర్వెల్లు, ట్యూబ్వెల్లు తవ్వడం సర్వసాధారణమైంది. భూగర్భ జలాల లభ్యత రుతుపవనాలపై ఆధారపడి ఉంటుంది. భూమిలోకి తగినంత వాన నీటిని ఇంకింపజేసే (రీఛార్జ్) ప్రయత్నాలు చెయ్యకుండా భూగర్భ జలాలను నిరంతరం ఎక్కువగా తోడుతుండటమే సమస్య. బోరుబావులు నిత్యం జలకళతో కళకళలాడాలంటే వాటి దగ్గర రీఛార్జ్ గుంతలు లేదా నీటి కుంటలు నిర్మించుకోవటం మేలు అంటున్నారు నిపుణులు.తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోని భూగర్భంలో గట్టి రాతి జల పొరలు విస్తరించి ఉన్నాయి. మట్టి కింద 5 నుంచి 15 మీటర్ల లోతు వరకు రాతి పొరలు ఉంటాయి. నీటిని ఎక్కువగా నిల్వ చేయగల సామర్థ్యం ఈ పొరలకే ఉంటుంది. రాతి సమూహాల మధ్య ఉండే పగుళ్లు భూగర్భ జలాల నిల్వకు, కదలికలకు దోహదపడతాయి. ఒక బోర్వెల్ ద్వారా రీఛార్జ్ అయ్యే వర్షపు నీటి పరిమాణం, అక్కడి భూగర్భంలోని జల పొరల లక్షణాలపై ఆధారపడి ఉంటుంది. రాళ్లలో పగుళ్లు, చీలికలు బాగా ఉంటే బోర్‌వెల్స్ ద్వారా ఎక్కువ వర్షపు నీరు భూగర్భంలోకి ఇంకుతాయి. కొన్నిసార్లు, ఈ పగుళ్ల అనుసంధానం చాలా పరిమితంగా ఉంటే వాన నీరు ఇంకే సామర్థ్యం తక్కువగా ఉండవచ్చు. సాధారణ వాన నీటి సంరక్షణ పద్ధతుల ద్వారా సుమారు 15% మాత్రమే భూగర్భంలోని పైపైన ఉండే నీటి పొరల్లోకి ఇంకుతోంది. సుమారు 20–40% ఆవిరైపోవచ్చు. లోతైన భూగర్భ జల పొరలు తిరిగి నిండటానికి కూడా ఎక్కువ సమయం పడుతుంది. తక్కువ కాలం పాటు కురిసే భారీ వర్షాలను ఈ నిర్మాణాలు సమర్థవంతంగా సంగ్రహించలేకపోవచ్చు. ఇటీవలి కాలంలో లోతైన బోర్వెల్లను రీఛార్జ్ చేయడానికి, వాటి దిగుబడిని పెంచడానికి, సహేతుకంగా తక్కువ ఖర్చుతో ‘బోర్వెల్ రీఛార్జ్’ అనే పద్ధతి ఒక సమర్థవంతమైన విధానంగా ఆవిర్భవించింది.ఎండిన బోర్లకు తిరిగి జలకళఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం దమగట్ల గ్రామానికి చెందిన రైతు నాగిరెడ్డి తనకున్న రెండు ఎండిపోయిన బోరుబావులకు చుట్టూ వాన నీరు ఇంకేలా రీఛార్జ్ గుంతను నిర్మించారు. దీంతో ఆ బోరుబావులు వర్షపు నీటిని 70% వరకు భూమి లోపలికి ఇంకింపజేశాయి. ఆ బోర్లు తిరిగి జలకళను సంతరించుకున్నాయి. రోజంతా అపరిమితంగా నీటిని అందించడం ప్రారంభించాయి. ప్రకృతి వ్యవసాయ పద్ధతుల గురించి ఇప్పటికే ప్రచారం చేస్తున్న ఈ ప్రగతిశీల రైతు, బోర్ రీచార్జ్ గుంత ద్వారా నీటి భద్రత పొందటంపై కూడా రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. నందికొట్కూరు చుట్టుపక్కల ప్రాంతం అంతా ఈ పద్ధతి ద్వారా భూగర్భ జలాలను రీఛార్జ్ చేయడానికి అనువైన ప్రాంతమని తమ పరిశీలనలో తేలిందని వాటర్ అండ్ లైవ్లిహుడ్స్ ఫౌండేషన్ (డబ్ల్యూఎల్ఎఫ్) వ్యవస్థాపకులు డా. రామ్మోహన్ అన్నారు. నీటి కుంటలతో బోర్ల రీఛార్జ్నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం, దాని పరిసర ప్రాంతాల్లో వేరుశనగ, మొక్కజొన్న, వరి పంటల సాగు పూర్తిగా భూగర్భ జలాలపైనే ఆధారపడి ఉంటుంది. బోరుబావులు విఫలమైనప్పుడు, వారు అధిక ఖర్చుతో రైతులు కొత్త బోరుబావులను వేయిస్తుంటారు. ప్రత్యక్ష రీఛార్జ్ ప్రయోజనం కోసం బోరుబావులకు దగ్గరగా వర్షపు నీటి నిల్వ కుంటలను నిర్మించుకుంటే భూమిలోకి నీరు బాగా ఇంకుతుందని డబ్ల్యూఎల్ఎఫ్ చెబుతూ రైతుల ఆలోచనా విధానంలో మార్పు తెస్తోంది. ఉన్న బోరుబావులను కాపాడుకోవడానికి బోర్లకు దగ్గర్లో నీటి కుంటలు నిర్మించుకోవటానికి గత 2–3 సంవత్సరాలుగా చిన్న రైతులకు తోడ్పాటునందిస్తోంది. రైతులు తమ వంతుగా కొంత మొత్తం చెల్లిస్తే పొలంలో బోరుకు దగ్గరగా నీటి కుంటను ఏర్పాటు చేయిస్తోంది. తమ ప్రయత్నాలు సానుకూల ఫలితాలు ఇస్తున్నాయని, ఇప్పటివరకు 74 మంది రైతులు వర్షపు నీటి కుంటల నిర్మాణంతో లబ్ది పొందారని డా. రామ్మోహన్ తెలిపారు. బోరుకు 5 అడుగుల దూరంలో నీటి కుంట తవ్వుకుంటే బోరు నిండుగా నీరు పోస్తోందని నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలం అ΄్పాయిపల్లి గ్రామానికి చెందిన రైతు మార్కం రాములు యాదవ్ తెలిపారు. ఈ కుంటలో భవిష్యత్తులో చేపలు కూడా పెంచుతానన్నారు. 70% వాననీటి సంరక్షణబోర్వెల్ చుట్టూ వాన నీటి రీఛార్జ్ గుంతల నిర్మాణం, బోర్లకు దగ్గర్లో వ్యవసాయ చెరువుల నిర్మాణం వంటి పద్ధతులు కొద్దిపాటి వర్షం కురిసినా భూగర్భ జలాల పెంపుదలకు ఉపయోగపడతాయి. ఎల్‌నినో గడ్డు కాలాన్ని తట్టుకోవటానికి ఇవి ప్రభావశీలంగా పనిచేస్తాయి. పొలంలో కురిసిన వర్షపు నీటిలో 30 నుంచి 70% వరకు రీఛార్జ్ చేయడానికి వీలుంది. సాంప్రదాయ పద్ధతులకు భిన్నంగా, బోరుబావిలో నీటి మట్టం తక్షణమే పెరుగుతుంది. స్థానికంగా లభించే వస్తువులతో బోర్ రీఛార్జ్ గుంతలను, బోర్లకు దగ్గర్లో నీటి కుంటలు నిర్మించవచ్చు. ఇవి సాపేక్షంగా చౌకైనవి. రైతులు సులభంగానే వీటిని నిర్వహించుకోవచ్చు. అనేక ప్రాంతాల్లో రైతుల అనుభవాలు ఈ విషయాన్ని నిర్థారిస్తున్నాయి.– డా. ఆర్. రామ్మోహన్ (94401 94866), భూగర్భ జల నిపుణులు, వాటర్ అండ్ లైవ్లిహుడ్స్ ఫౌండేషన్, సికింద్రాబాద్నిర్వహణ: పంతంగి రాంబాబుసాక్షి సాగుబడి డెస్క్ -
ఆల్–ఇన్–వన్ లిక్విడ్ ఫెర్టిలైజర్..
సేంద్రియ ఇంటిపంటలు, మిద్దె తోటల పెంపకంలో నిరంతర పోషణ ముఖ్యమైన విషయం. ఇందుకు ఉపయోగపడే ద్రావణం ఆల్–ఇన్–వన్ లిక్విడ్ ఫెర్టిలైజర్. ఇది అన్ని మొక్కలకూ ఉపయోగపడుతుంది. పొటాషియంతో పాటు ఇతర పోషకాలను కూడా అందిస్తుంది.1. ఒక బకెట్లో 2–3 లీటర్ల బియ్యం కడిగిన నీటిని తీసుకొని అందులో 4–5 అరటి తొక్కలు, రెండు గుప్పిళ్ల ఉల్లిపాయ పొట్టు వేయాలి.2. ఈ మిశ్రమాన్ని 2–3 రోజులు నీడలో ఉంచాలి (రోజూ ఒకసారి కలపాలి). 3. మూడు రోజుల తర్వాత ఆ నీటిని వడకట్టి, ఒక వంతు ద్రావణానికి రెండు వంతుల సాధారణ నీటిని కలిపి మొక్కల మొదళ్లలో పోయాలి.4. గులాబీ, మందార లాంటి పువ్వులు మొక్కలు మొగ్గలు వచ్చే సమయంలో పైన చెప్పిన అరటి తొక్కల నీటిని వారానికి ఒకసారి ఇస్తే పూలు పెద్దవిగా పూస్తాయి. 5. టమోటా, మిర్చి, బెండ లాంటి కూరగాయ మొక్కలు పూత, పిందె మీద ఉన్నప్పుడు ఈ ఎరువు ఇస్తే కాయలు రాలిపోకుండా బలంగా పెరుగుతాయి. 6. ఆకుకూరలకు పొటాషియం కంటే నత్రజని (నైట్రోజన్) ఎక్కువ అవసరం. కాబట్టి, వీటికి బియ్యం కడిగిన నీరు లేదా పప్పులు కడిగిన నీరు సరిపోతుంది.7. ఇండోర్ ΄్లాంట్స్కు నెలకు ఒకసారి మాత్రమే చాలా తక్కువ పరిమాణంలో ఈ ఆల్–ఇన్–వన్ ద్రవ ఎరువును ఇవ్వాలి.8. ద్రవ ఎరువులు తయారు చేసిన 3–4 రోజుల్లోనే వాడేయాలి. ఎక్కువ రోజులు ఉంచితే వాసన వస్తుంది.9. ఎరువు వేసే ముందు మొక్క మొదల్లో మట్టి కొంచెం తేమగా ఉండేలా చూసుకోవాలి. ఈ ఎరువులను ఉదయం పూట లేదా సాయంత్రం ఎండ తగ్గాక మాత్రమే వేయాలి. ఎండలో వేయకూడదు.- కొల్లి కృష్ణ కుమారి, అడ్మిన్, గుంటూరు జిల్లా, మిద్దె తోటల బృందం మొబైల్: 94906 02366నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ -
ఈత చెట్టు.. కల్లు, పండ్లకే కాకుండా విలువాధారిత..
ఈత చెట్టు రూపురేఖలు ఖర్జూరపు చెట్టుకు అతి దగ్గరగా ఉంటాయి. పుష్పించే విధానం, పండ్ల గుత్తులూ ఒకేలాగ ఉంటాయి. ఈ చెట్టు తెలియని వారుండరు. తరతరాల నుండి గుర్తున్న చెట్లల్లో ఈత చెట్టు ఒకటి. పల్లెవాసులకే కాకుండా పట్టణవాసులకూ సుపరిచితమైన చెట్టు ఈత. దీని ఔషధ విలువల వల్ల ఈ చెట్టుకు చాలా ప్రాచుర్యమున్నది. దీన్ని ‘సిల్వర్ డేట్ పాం’ అని కూడా పిలుస్తుంటారు.ఉనికి..ఈ చెట్టు సుమారు 4 నుండి 15 మీటర్ల ఎత్తు పెరుగుతుంది. పూత–కాత మాత్రం కొంత అటు–ఇటు అయినా (పరిస్థితులను బట్టి) ఏప్రిల్ నుండి ఆగష్టు మధ్య ఉంటుంది. తేమ ఎక్కువగా ఉన్న నేలల్లో పెరుగుతుంది. అట్లని ఇతర నేలల్లో రాదని కాదు. ఈత పల్లపుప్రాంతాల్లో కూడ వస్తుంది. ఎక్కువగా వాగులు, వంకలు ఉన్న దగ్గర పెరుగుతుంది. వీటి స్వస్థలం దక్షిణ పాకిస్తాన్, ఇండియా, శ్రీలంక, నేపాల్, భూటాన్, మైన్మార్, బంగ్లాదేశ్, మారిషస్, చగోస్ ఆర్చిపిలాగై, పుర్టోరికో, ‘లీవర్డ్ ఐలాండ్’లు.ఈత చెట్టు సముద్రమట్టానికి 1300 మీటర్ల ఎత్తువరకు ఉండే ప్రాంతాలలో కూడా రాగలదు. దీని కాయలు ఆకు పచ్చరంగులో ఉండి పక్వానికి వచ్చిన తరువాత పసుపు రంగుకు, పండుగా మారినప్పుడు కాషాయ రంగుకు మారతాయి. ఈత చెట్లు దేశంలో ఇంచుమించు అన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి. వీటి జీవితకాలం దాదాపు 40–60 సంవత్సరాలు. కానీ కల్లు గీసే చెట్లు త్వరగా చనిపోతాయి. ఈత చెట్లపై ఆధారపడి కొన్ని వేల కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి.ఉపయోగాలుఈత ఆకులతో రకరకాల వస్తువులను తయారు చేస్తారు. చాలా మందికి ఇది ఉపాధి కూడా (చాపలు, ఈత పొరకలు, చిన్న చిన్న ఆట వస్తువులు)గుడిసెల పైకప్పుకు ఈ ఆకులను ఉపయోగిస్తారు.మొగిలోన పిండి పదార్థం రుచిగా ఉంటుందని గ్రామస్తులు దాన్ని సేకరించి వాడుతారు. మొగి తీయడం వల్ల చెట్టు చనిపోయే ఆస్కారం ఉంటుంది. ఈ మొద్దును రెండుగా చీల్చి మధ్యన ఉన్న భాగాన్ని తీసి అనేక విధాలుగా వాడుతారు. (ఉ: చిన్న చిన్న కాలువలు దాటటానికి అడ్డంగావేస్తారు. దానిపై కాలినడక సాగిస్తారు. పందిళ్లకు పోల్స్‌గా వాడుతారు.ప్రధానంగా ఈత చెట్టు నుండి ‘నీరా, కల్లు’ తీస్తారు. ఉదయం సూర్యోదయం కాకముందు చెట్టు నుండి తీసేది ‘నీరా’. ఆ తర్వాత నీరా పులిసి కల్లుగా మారుతుంది. నీరాకు మార్కెట్లో చాలా మంచి డిమాండ్ ఉంది.నీరాను సేవించడం వల్ల కిడ్నీలోని రాళ్ళు కరిగి పోతాయని ప్రజల ప్రగాఢ విశ్వాసం.నీర నుండి ‘ఈత బెల్లాన్ని’ తయారు చేస్తారు. ఇది ఆరోగ్యానికి మంచిదని ఆయుర్వేద వైద్యులు అంటారు.ఈత పండ్లు రుచిగా ఉంటాయి.ఈత పండ్ల నుండి జామ్, జల్లి వంటి విలువ ఆధారిత పదార్ధాలను తయారు చేస్తారు.ఈ పండ్లు తినడం వల్ల బ్యాక్ పెయిన్, పిరుదులపై కండరాలు పట్టినట్లు ఉంటే తగ్గుతాయి. (ఇవి టానిక్ లా పనిచేస్తాయి).పండ్లు కూడా ఎన్నో పోషక విలువలు కలవి.చెట్లను ల్యాండ్ స్కేపింగ్‌లో అందం కోసం నాటుతారు.వేర్లను పండ్ల నొప్పులను, నర్వస్ డెబిలిటీ, హెల్మింథియాసిస్ జబ్బులను నయం చేయటానికి ఉపయోగిస్తారు.నీరాను ఎండకాలంలో తాగితే చలువ చేకూర్చుతుంది. ఇందులో కూడా అనేక పోషక విలువలున్నవి.ఔషధంగా ఈతకు ప్రత్యేకత ఉంది. ఉదర సంబంధిత జబ్బులు, జ్వరాలు, మూర్ఛ, అజీర్తి, హృదయ సంబంధిత జబ్బులను నయం చేయటంలో ఈత నీరా గాని, బెల్లంగాని, మొగి గాని వాడుతారు.నీరాలోని ఇనుము వంటి సూక్ష్మపోషకాలు, బి12 వంటి విటమిన్లు రోగులకు చాలా మంచిది. రెగ్యులర్ గా సేవిస్తే వారిలో రక్తశుద్ధి జరిగి హిమోగ్లోబిన్ పెరుగుతుంది.పండ్లలో ఉండే కాల్షియం ఎముకలు, దంతాల పటుత్వానికి దోహద పడుతుంది.ఈతకు పెద్ద ఈత, ఈత అని రెండు పేర్లున్నాయి. ఇంగ్లిష్: వైల్డ్ డేట్ పాం, డేట్ సుగర్ పాం, ఇండియన్ వైల్జ్ డేట్, ఇండియన్ వైన్ పామ్ అస్సామీ: ఖాజురి;ఉర్దూ: ఖాజర్;ఒరియా: ఖర్జుర్;గుజరాతీ: ఖజ్జార్, ఖజా; కన్నడ: ఇచలు;తమిళంలో: ఇచం, పేరియా, ఇలచం;బెంగాలీ: ఖర్జూర, ఖఝూర్; పంజాబీ: ఖజుర్;మణిపురి: తంగటప్; మరాఠీ: సెండి, బైచంగ్, ఖర్జూర్, షిండ్రీ, షింధీ;మలయాళం: కట్టింతా, కట్టింతై, నీలన్ తెంట్ హిందీ: ఖజూర్;సంస్కృతం: ఖర్జూరహా, ఖర్జూర్ నేపాలీ: ఖండేలా, ధడ అంటారు.నల్లమల అడవులు:నలమలప్రాంతంలో ఈత చెట్లు ఉన్నాయి. ఇవి అంది నేలల్లో (చౌడు నేలల్లో) కూడా ఉన్నాయి. దేశంలో అనేక రాష్ట్రాలలో ఉన్నాయి. అడవిలోని సెలయేర్లు/వంకలు/ డొంకల దగ్గర ఉన్న వాటిలో పోషక విలువల్లో వ్యత్యాసం ఉండవచ్చు. కాబట్టి వీటిపై పరిశోధన చేపట్టి కొత్త వంగడాల అన్వేషణ మొదలు కావలసిన అవసరం ఎంతైనా ఉంది.ఈ చెట్టు కల్లు, పండ్లకే కాకుండా విలువాధారిత ఉత్పత్తులపై శోధించగలితే ఎంతో లాభసాటిగా ఉంటుంది. ఈ విధంగా చేస్తే ఈత వనాలతో ఉపాధి దొరుకుతుంది. ఇప్పటికే కొందరు ఈత వనాలు పెంచి కేవలం నీరా–కల్లు కోసమే ఉపయోగిస్తున్నారు. ఈత చెట్లు తెలుగు రాష్ట్రాల్లోని అడవుల్లో కూడా ఉన్నాయి.- డాక్టర్ మొరుపోజు పద్మయ్య, విశ్రాంత ప్రధాన శాస్త్రవేత్త, ఐసీఏఆర్ – ఐఐఓఆర్, రాజేంద్రనగర్, హైదరాబాద్. మొబైల్: 94407 08924నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ -
నిలకడైన రొయ్యల సాగు.. కొన్ని మార్గదర్శకాలు!
రొయ్యల సాగు రంగం ప్రస్తుతం అధిక ఉత్పత్తి వ్యయం, వ్యాధులు, నాణ్యత లేని సీడ్, మేత ధరలు, విద్యుత్ ఛార్జీల వంటి అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. ఇటువంటి సంక్షోభ సమయంలో పంట విరామం (క్రాప్ హాలిడే) ప్రకటించడం శాశ్వత పరిష్కారం కాదు. దీనివల్ల మౌలిక సదుపాయాల నష్టం, కార్మికుల కొరత, మార్కెట్ నమ్మకం కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి, శాస్త్రీయ నిర్వహణతో సాగు విధానాన్ని మార్చడమే నిజమైన పరిష్కారం.ఉత్పత్తి కాదు లాభమే లక్ష్యంఅధిక స్టాకింగ్ సాంద్రత వ్యాధులు, ఒత్తిడి, మరణాల రేటును పెంచుతుంది. 90% సర్వైవల్‌తో మధ్యస్థ దిగుబడి సాధించిన రైతు, 65% సర్వైవల్‌తో అధిక దిగుబడి సాధించిన రైతు కంటే ఎక్కువ లాభం పొందగలడు. కాబట్టి ‘తక్కువ సాంద్రత – ఎక్కువ సర్వైవల్’ విధానమే ఉత్తమం.నాణ్యమైన సీడ్ – నీటి నిర్వహణనాణ్యత లేని చౌక సీడ్ చివరికి భారీ నష్టాలకు కారణమవుతుంది. విశ్వసనీయ హేచరీల నుంచి జన్యుపరంగా నాణ్యమైన సీడ్‌ను ఎంపిక చేయాలి. అలాగే వ్యాధులు వచ్చిన తర్వాత చికిత్స కంటే, మూడు దశల నీటి రిజర్వాయర్ వ్యవస్థ ద్వారా ముందస్తు నివారణకు ప్రాధాన్యం ఇవ్వాలి. రైతులకు నచ్చిన లాబ్‌లలో నాణ్యతా పరీక్షలు చేయించుకొని సీడ్ చెక్ చేసుకోవాలి.ఖర్చుల నియంత్రణమేత సాగులో అత్యధిక వ్యయం. ఫీడ్ ట్రేల ద్వారా మేత వినియోగాన్ని నిరంతరం పరిశీలించి, సరైన ఫీడ్ కన్వర్షన్ రేషియో సాధించాలి. అధిక సామర్థ్యం గల ఎయిరేటర్ల వినియోగం, శాస్త్రీయ ఎయిరేటర్ల ప్రణాళిక ద్వారా విద్యుత్ ఖర్చులను గణనీయంగా తగ్గించవచ్చు. అవకాశమున్నచోట్ల సోలార్ విద్యుత్‌ను ఏర్పాటు చేసుకోవాలి. సాగు ప్రాంతాల ప్రత్యేకతలుసముద్రపు ఉప్పు నీటితో సాగు చేసే ప్రాంతాల్లో సర్వైవల్ రేట్, షెల్ బలంగా ఉండి, ఖనిజాల ఖర్చు తక్కువగా ఉంటుంది. బోర్ నీరు లేదా మంచినీటి ప్రాంతాల్లో ఖనిజాల లోపం, అధిక ఎయిరేషన్ అవసరం వల్ల ఉత్పత్తి వ్యయం సుమారు 10–15% పెరుగుతుంది. సరైన ఖనిజ నిర్వహణ, నీటి నాణ్యత పర్యవేక్షణతో ఈ సమస్యలను అధిగమించవచ్చు.భద్రత, క్రమశిక్షణ, వ్యూహంపీతలు వంటి జీవులు రాకుండా చెరువు చుట్టూ కంచె (పీతలఫెన్సింగ్), బర్డ్ నెట్టింగ్, క్రిమిసంహారకాలతో పరికరాల శుద్ధి వంటి బయో సెక్యూరిటీ చర్యలు తప్పనిసరిగా పాటించాలి. చెరువులను సత్వరం రిజిస్ట్రేషన్ చేయించుకోవడం వల్ల, ప్రభుత్వం ఇచ్చే రాయితీలు పొందే అవకాశముంది. దైనందిన ఖర్చుల రికార్డులు నిర్వహించడం ద్వారా అనవసర రసాయనాల వినియోగాన్ని తగ్గించవచ్చు. మార్కెట్ ధరల హెచ్చు తగ్గులను ఎదుర్కోవడానికి పంట ప్రణాళిక ముందుగానే సిద్ధం చేసుకోవడం, రైతు సహకార సంఘాల ద్వారా విక్రయాలు నిర్వహించడం ప్రయోజనకరం.సమూహ సాగు విధానంఒంటరిగా సాగు చేయడం కంటే, ఒకేప్రాంతంలోని రైతులంతా ఒక సమూహంగా (క్లస్టర్‌గా) ఏర్పడి సాగు చేయడం వల్ల పెట్టుబడి తగ్గి, లాభాలు పెరుగుతాయి. దీని వల్ల కలిగే ప్రధాన ప్రయోజనాలు:క్లస్టర్‌లోని రైతులంతా కలిసి నాణ్యమైన సీడ్, మేత, మినరల్స్‌ను పెద్ద మొత్తంలో ఒకేసారి ఆర్డర్ చేయడం ద్వారా కంపెనీల నుండి భారీ డిస్కౌంట్లు పొందవచ్చు.నీటి శుద్ధి కోసం ఒకే పెద్ద రిజర్వాయర్ వ్యవస్థను, ఉమ్మడి ల్యాబ్ సౌకర్యాలను, పవర్ బ్యాకప్ కోసం పెద్ద జనరేటర్లను క్లస్టర్ తరఫున ఏర్పాటు చేసుకోవచ్చు.క్లస్టర్‌లోని రైతులంతా ఒకే పద్ధతిలో, ఒకే సమయంలో చెరువులు ఎండబెట్టడం, సీడ్ స్టాకింగ్ చేయడం, పంటను తీయడం చేయాలి. దీని వల్ల ఒకరి చెరువు నుండి మరొకరి చెరువుకు వ్యాధులు సంక్రమించే ప్రమాదం 80% వరకు తగ్గుతుంది.వ్యాపారులతో లేదా ఎగుమతిదారులతో మాట్లాడేటప్పుడు ఒంటరి రైతుకంటే, ఒక సమూహంగా ఎక్కువ టన్నుల రొయ్యలను ఒకేసారి ఆఫర్ చేసినప్పుడు మార్కెట్లో మంచి ధర లభిస్తుంది. దళారుల దోపిడీకి అడ్డుకట్ట పడుతుంది.ప్రభుత్వం లేదా ఆక్వా సొసైటీలు (ఉదాహరణకు ఎన్ఏసీఎస్ఏ వంటి సంస్థలు) అందించే సబ్సిడీలు, ఉచిత విద్యుత్ రాయితీలు, శిక్షణా తరగతులు క్లస్టర్ లేదా కో–ఆపరేటివ్ రూపంలో ఉన్న రైతులకు చాలా సులభంగా అందుతాయి.రైతులకు అదనపు సూచనలుప్రోబయోటిక్స్, ఎంజైమ్స్చెరువు అడుగు భాగంలో పేరుకు΄ోయే వ్యర్థాలను తొలగించడానికి, హానికర బ్యాక్టీరియాను అరికట్టడానికి మంచి నాణ్యత గల ప్రోబయోటిక్స్‌ను క్రమం తప్పకుండా వాడాలి. ఇది రొయ్యల జీర్ణశక్తిని పెంచి, వాటిలో వ్యాధుల నిరోధకతను మెరుగుపరుస్తుంది.క్రమం తప్పకుండా శాంప్లింగ్వారానికి కనీసం ఒకసారి రొయ్యల బరువును, వాటి మొప్పల రంగును, ఆరోగ్యాన్ని పరీక్షించాలి. దీనివల్ల రొయ్యలు ఎంత మేత తింటున్నాయో అర్థమవుతుంది. తద్వారా మేత వృథాను అరికట్టి, ఎఫ్.సి.ఆర్ని అదుపులో ఉంచుకోవచ్చు.విద్యుత్ బ్యాకప్ఎయిరేటర్లు నిరంతరం పనిచేయడం రొయ్యల మనుగడకు అత్యంత ముఖ్యం. పవర్ కట్ అయినప్పుడు ఎయిరేటర్లు ఆగి΄ోతే, ఆక్సిజన్ తగ్గి రొయ్యలు చని΄ోయే ప్రమాదం ఉంది. కాబట్టి, ఖచ్చితంగా జనరేటర్ లేదా సోలార్ బ్యాకప్ వ్యవస్థను సిద్ధంగా ఉంచుకోవాలి.వ్యర్థాల తొలగింపుచెరువు అడుగు భాగంలో పేరుకు΄ోయిన వ్యర్థాలను చేయడం లేదా ఎప్పటికప్పుడు తొలగించడం చాలా ముఖ్యం. ఇది అమోనియా సమస్యను తగ్గించి, నీటినాణ్యతను కాపాడుతుంది.రైతులతో నెట్వర్కింగ్రొయ్యల సాగులో వస్తున్న కొత్త టెక్నాలజీలు, మందుల వాడకం, మార్కెట్ పరిస్థితులపై అవగాహన కోసం స్థానిక విజయవంతమైన రైతులు లేదా వాట్సాప్ గ్రూపుల ద్వారా సమాచారాన్ని పంచుకోవడం వల్ల కష్టసమయాల్లో సరైన నిర్ణయాలు తీసుకోవచ్చు.వాతావరణ మార్పులపై అప్రమత్తతవర్షాకాలం లేదా వాతావరణం మారినప్పుడు నీటి ఉష్ణోగ్రత, పీహెచ్ స్థాయిలు అకస్మాత్తుగా మారవచ్చు. ఈ సమయంలో నీటి పారామీటర్లను రోజుకు రెండుసార్లు పరీక్షించి, అవసరమైన మినరల్స్ లేదా బఫర్స్ను అందించడం వల్ల రొయ్యలకు ఒత్తిడి కలగకుండా చూడవచ్చు. ఈ జాగ్రత్తలు పాటించడం ద్వారా రైతులకు నష్టభయం తగ్గి, సాగులో స్థిరమైన దిగుబడి పొందే అవకాశం ఉంటుంది.రొయ్యల సాగు భవిష్యత్తు అధిక ఉత్పత్తిలో కాదు, అధిక సర్వైవల్‌తో స్థిరమైన లాభాల్లో ఉంది. నాణ్యమైన సీడ్, సమర్థవంతమైన నీటి నిర్వహణ, సమతుల్య స్టాకింక్ సాంద్రత, బయోసెక్యూరిటీ, ఖర్చు నియంత్రణ, శాస్త్రీయ నిర్వహణను అవలంబించినప్పుడే రైతులకు దీర్ఘకాలికంగా లాభదాయకమైన, స్థిరమైన రొయ్యల సాగు సాధ్యమవుతుంది. నిరాశ వద్దు.. నిలకడైన సాగే మన ముందడుగు!- డా. పొన్నపల్లి రామమోహన్ రావు (98851 44557) డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ఫిషరీస్ (రిటైర్డ్), కాకినాడనిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ -
సాగుబడి: ‘బయో’ విత్తన పూతతో 25% అధిక దిగుబడి!
పంటల సాగులో ఎదురయ్యే వివిధ రకాల సమస్యలను పరిష్కరించటానికి తెలివైన ఏకైక మార్గం, రసాయనాలతో కాకుండా, సహజ సిద్ధమైన పదార్థాల పూతతో కూడిన విత్తనాలను వినియోగించటమేనని హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని భారతీయ నూనెగింజల పరిశోధనా సంస్థ (ఐసీఏఆర్ – ఐఐఓఆర్) శాస్త్రవేత్తలు ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు.సాధారణ విత్తనాలు వేసుకొని పంటలు మొలకెత్తాక తలెత్తే సమస్యలను పరిష్కరించుకునే పిచికారీలు చెయ్యటం కన్నా.. విత్తనం వెయ్యటనికి ముందే తెలివిగా అనేక రకాల రక్షణ కల్పించే పదార్థాలతో విత్తనాలకు పూత పూసి విత్తుకోవటం ఎంతో తెలివైన పద్ధతి అని ఐఐఓఆర్ కీటక శాస్త్ర విభాగం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఆర్.డి. ప్రసాద్, వ్యవసాయ రసాయనాల నిపుణురాలు డాక్టర్ కేఎస్‌వీపీ చంద్రిక ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు. చెప్పటమే కాదు.. చాలా ఏళ్లు శ్రమించి రసాయనాలు లేని సహజ పద్ధతిలో రొయ్యల పొట్టు నుంచి తీసిన కైటోసాన్ అనే నాచురల్ బయోపాలిమర్ పదార్థంతో అద్భుతమైన విత్తన పూత పద్ధతిని ఆవిష్కరించి పేటెంట్ అందుకున్నారు. బయోపాలిమర్–ఆధారిత బహుళ పొరల స్మార్ట్ సీడ్ కోటింగ్ టెక్నాలజీగా దీన్ని చెబుతారు. ఐసీఏఆర్ రూపొందించిన అత్యంత ఆశాజనకమైన ఆవిష్కరణలలో ఒకటిగా ఇది గుర్తింపు పొందటం విశేషం.ఈ సాంకేతికతను రూ. 25 లక్షలతో కొనుగోలు చేసిన మూడు కంపెనీలు నాచురల్ బయోపాలిమర్ ద్రావణాన్ని రైతులకు ఇప్పటికే అందుబాటులోకి తెచ్చాయని, రాజేంద్రనగర్‌లోని తమ కార్యాలయంలో కూడా ఇవి అందుబాటులో ఉన్నాయని డా. ప్రసాద్, డా. చంద్రిక తెలిపారు. ఈ ద్రావణాలను రైతులు కొనుగోలు చేసి తమ దగ్గరున్న సాధారణ విత్తనాలకు పూత పూసి అప్పటికప్పుడే నిమిషాల్లో విత్తుకోవచ్చు లేదంటే ఈ పూతలు పూసిన విత్తనాలనే కొనుగోలు చేసి విత్తుకోవచ్చు. ఏ పంటల విత్తనాలకైనా ఈ ద్రావణంతో పూత పూసి విత్తుకోవచ్చని వారు వివరించారు.25% అధిక దిగుబడిరక్షక మందులతో పూత పూయని సాధారణ విత్తనాలు విత్తుకుంటే పంటకు తొలి దశలోనే నానా ఇబ్బందుల వస్తాయి. మొలక శాతం తగ్గుతుంది. చీడపీడలు తొలి దశలోనే చుట్టుముడతాయి. అయితే, విత్తనానికి అవసరమైన పూతలు పూసి విత్తుకుంటే ఈ సమస్యలు ఉండవు కాబట్టి కనీసం 25% వరకు అధిక దిగుబడి సాధ్యమేనని గత రెండేళ్లుగా అనేక పంటల్లో రుజువైందని డా. ప్రసాద్, డా. చంద్రిక వివరించారు.శిలీంధ్రనాశకాలు, కీటకనాశకాలు, సూక్ష్మ పోషకాలు, జీవన ఎరువులు, ప్రయోజనకరమైన సూక్ష్మజీవులను విడివిడిగా పంటలపై వాడటానికి బదులుగా.. వీటన్నిటినీ ప్రత్యేకంగా రూపొందించిన పద్ధతిలో విత్తనాలకు పూతలుగా లేపనం చేసి విత్తుకుంటే చాలు. విత్తన పూతలు పంటలను బెట్ట నుంచి, పోషక లోపాల నుంచి, చీడపీడల నుంచి విత్తిన రెండు నెలల వరకూ రక్షిస్తాయని తెలిపారు.వికారాబాద్ జిల్లా ధరూర్ మండలం రాంపూర్‌లో 24 మంది వేరుశనగ రైతులు గత మూడేళ్లుగా బయోపాలిమర్ పూత పూసిన విత్తనాలు వాడి ఎకరానికి 3 క్వింటాళ్ల దిగుబడి పెంచుకున్నారు. రసాయనిక ఎరువుల వాడకం 20% తగ్గింది. 2 నీటి తడులు తగ్గాయి. పురుగుమందుల అవసరం సగానికి సగం తగ్గింది. ఆకుమచ్చ తగ్గటంతో వేరుశనగ చొప్ప పశుగ్రాసంగా చక్కగా ఉపయోగపడుతోందని రైతులు చెప్పారు.విత్తన పూతలతో ప్రయోజనాలు∙పోషకాలను అధిక సామర్థ్యంతో వినియోగించుకోవటం ∙పురుగుమందుల వినియోగ సామర్థ్యం మెరుగుపడటం ∙రసాయనిక ఎరువులు, పురుగు/తెగుళ్ల మందులు నేల, నీటి ద్వారా వృథా కావటం తగ్గుతుంది ∙విత్తన పూతలోని మేలుచేసే సూక్ష్మజీవులు మొక్క వేర్ల దగ్గర మొలక దశ నుంచే పెరుగుతూ రక్షణ కల్పిస్తాయి ∙ఎరువుల అవసరం తగ్గుతుంది. పురుగు/తెగుళ్ల మందుల పిచికారీలు తగ్గుతాయి ∙దిగుబడితో పాటు రైతుకు నికరాదాయం పెరుగుతుంది ∙పర్యావరణ కాలుష్యం తగ్గుతుంది.సహజ విత్తన పూతతో పంటకు సమగ్రమైన రక్షణ!అస్తవ్యస్తమైన వర్షపాతం, దీర్ఘకాలిక కరువులు, తీవ్రమైన ఉష్ణోగ్రతలు, తక్కువ సేంద్రియ కర్బనంతో క్షీణించిన నేలలు వంటి వాతావరణ మార్పుల పరిస్థితులలో ఈ సాంకేతికత ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది. సహజమైన పదార్థాలతో తయారు చేసిన బయోపాలిమర్ విత్తన పూతలు విత్తనం చుట్టూ అనుకూలమైన సూక్ష్మ వాతావరణాన్ని సృష్టిస్తాయి. మొలకెత్తడం, వేర్లు ఏర్పడటం, తేమ నిలుపుదల, పంట తొలిదశలో బలంగా పెరగటం వంటివి మెరుగుపడతాయి. అదే సమయంలో, వేర్ల చుట్టూ సూక్ష్మజీవులు పెరిగి చీడపీడలు, పర్యావరణ ఒత్తిళ్ల నుంచి పంట మొక్కలకు మరింతగా సహజ రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేస్తాయి. కీటకనాశకాలు తొలిదశలో కీటకాల వల్ల కలిగే నష్టం నుంచి లేత నారుమొక్కలను కాపాడతాయి. ఈ అంశాలన్నీ కలిసి, పంట పెరుగుదల తొలి దశల నుంచే సమగ్రమైన రక్షణ దొరుకుతుంది. అంతిమంగా 25% వరకు అదనపు దిగుబడి, ఆ మేరకు అదనపు ఆదాయం రైతుకు లభిస్తాయి. దేశవ్యాప్తంగా క్షేత్రస్థాయి ప్రయోగాల్లో అనేక పంటల్లో సత్ఫలితాలు వస్తున్నాయి.– డాక్టర్ ఆర్.డి. ప్రసాద్, (92473 36334) ప్రధాన శాస్త్రవేత్త, కీటక శాస్త్ర విభాగం, ఐసీఏఆర్–ఐఐఓఆర్, రాజేంద్రనగర్, హైదరాబాద్ 040–24598100– డాక్టర్ కేఎస్‌వీపీ చంద్రిక, శాస్త్రవేత్త (వ్యవసాయ రసాయనాలు)- నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ -
‘బోన్ మీల్’ ఉపయోగాలేంటి?
సేంద్రియ మిద్దెతోటలు, ఇంటిపంటల సాగులో బోన్ మీల్ వాడటం వలన కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.మిద్దెతోటల్లో పువ్వులు, పండ్లు, కూరగాయల మొక్కలకి బోన్ మీల్ పొడిని వేయడానికి కొన్ని ప్రత్యేక సమయాలు, పద్ధతులు ఉన్నాయి.ఇది మొక్కలకు కావలసిన ఫాస్పరస్, కాల్షియంను నెమ్మదిగా అందిస్తుంది.కొత్తగా మొక్కలు నాటేటప్పుడు లేదా విత్తనాలు వేసేటప్పుడు కుండీలోని మట్టి మిశ్రమంలో బోన్ మీల్ కలపడం చాలా మంచిది. దీని వల్ల వేర్లు బలంగా అభివృద్ధి చెందుతాయి.మొక్కలు పూతకు వచ్చే ముందు లేదా మొగ్గలు తొడిగే దశలో బోన్ మీల్ వేయడం వల్ల పూత రాలకుండా ఉంటుంది. కాయ సైజు పెరుగుతుంది. ముఖ్యంగా టమోటాలు, మిర్చి వంటి కూరగాయలకి ఇది బాగా ఉపయోగపడుతుంది.బీట్రూట్, క్యారెట్, బంగాళాదుంప వంటి నేల లోపల పెరిగే దుంప జాతి మొక్కలకు ఇవి ఊరే సమయంలో వేస్తే నాణ్యమైన దిగుబడి వస్తుంది.వర్షాకాలం ప్రారంభంలో మొక్కలు వేగంగా పెరిగే సమయంలో ఒకసారి వేయవచ్చు.బోన్ మీల్ చాలా నెమ్మదిగా కరిగే ఎరువు. కాబట్టి దీన్ని ప్రతి 3 నుండి 4 నెలలకు ఒకసారి వేస్తే సరిపోతుంది.కుండీలోని పై మట్టిని కొద్దిగా తవ్వి, మొక్క మొదలుకు కొంచెం దూరంగా వేసి తిరిగి మట్టితో కప్పేయాలి.బోన్ మీల్ వేసిన తర్వాత వెంటనే తగినంత నీరు పోయాలి. - కొల్లి కృష్ణ కుమారి, అడ్మిన్, గుంటూరు జిల్లా, మిద్దె తోటల బృందం, మొబైల్: 94906 02366నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ -
ఈ చెట్టుకు ఔషధ గుణాలు ఉన్నాయని చరిత్ర చెబుతోంది..!
ఉనికి.. ఇరికి పండ్ల చెట్లు 3–4 మీటర్ల ఎత్తు వరకు పెరిగి గొడుగు ఆకారంలో విస్తరించగలవు. బరువైన నేలలో వీటి సగటు ఎత్తుకంటే ఎక్కువగా పెరిగే ఆస్కారం ఉంటుంది. ఈ చెట్లు సముద్ర మట్టానికి 1500 మీటర్ల ఎత్తులో కూడా పెరగ గలవు. ఉప హిమాలయప్రాంతం నుండి కన్యాకుమారి వరకు ఈ చెట్లు విస్తరించాయి.పొడి – తడి ఆకులు రాల్చే అడవులలోనూ వీటి ఉనికి అధికంగా ఉంటుంది. ఈ చెట్టు స్వస్థలం చైనా, జపాన్, తైవాన్, ఇండియా అయినప్పటికీ.. పాకిస్తాన్, శ్రీలంక, కంబోడియా, లావోస్, ఫిలిప్పీన్స్, థాయిలాండ్, వియత్నాం, ఇండోనేషియా, మయన్మార్, మలేషియా, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో కూడ విరివిరిగా ఉన్నట్లు ఆనవాలు. మన దేశంలోని అన్ని రాష్ట్రాలలో బంక చెట్లకు మంచి గుర్తింపు ఉన్నది. పడమటి – తూర్పు కనుమలలో వీటి ఉనికి అధికమని చెప్పవచ్చు.కాబట్టి వీటిపై పరిశోధనలతో పాటు పల్లె ప్రజలకు ఈ చెట్ల ఉపయోగాలపై అవగాహన కలిగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఉపాధి కల్పించే విధంగా ప్రయోగ ఫలితాలు ఉంటే, గ్రామవాసులకే కాకుండా పట్టణ వాసులకు ఎంతో లబ్ది చేకూరుతుంది. ఉపయోగాలువీటి కలప గట్టిగా ఉన్నా వర్షానికి నానితే త్వరగా చెడిపోతుంది. దీన్ని ఫర్నీచర్, చిన్న చిన్న వ్యవసాయ పనిముట్లు తయారీలో వాడతారు.ఈ పండ్లు లేత గులాబీ రంగు కలిగి ఆకర్షణీయంగా ఉండి గుత్తులు గుత్తులుగా విపరీతంగా కాస్తాయి. గుజ్జు మాత్రం బంకతో కూడుకొని ఉండటం చేత దీనికి బంక పండు అని పేరొచ్చింది. పండ్లు ఓ మోస్తురు తీపి వగరుతో ఉంటాయి.వీటి ఆకులను మేకలు ఇష్టంగా తింటాయి. పచ్చి కాయలను ఊరగాయగా, కూరగాయగా గ్రామాలలో కొందరు వాడతారు.ఈ పండ్లలోని గుజ్జును పేపర్లు మొదలగు వాటిని అతికించటానికి ఉపయోగించేడివారని అమరాబాదు గ్రామస్తులు తెలిపారు.ఈ చెట్టుకు ఔషధ గుణాలు ఉన్నాయని చరిత్ర చెపుతున్నది. ఈ చెట్టు బెరుడు, వేర్లు, చిగుర్లు, ఆకులు మొదలగునవి అనేక రకాల రోగాలను నయం చేయటానికి నాటు వైద్యులు వాడేవారట. ముఖ్యంగా బెరుడుతో చేసిన కషాయాన్ని విరేచనాలు, జ్వరం, కడుపు నొప్పి, తల నొప్పి మొదలగు రుగ్మతల నుండి ఉపశమనం పొందటానికి మూలికా వైద్యులు ఇప్పటికీ వాడతారని చెంచులు చెప్పారు. బెరడు కషాయాన్ని నోటి అల్సర్లు ఉన్నపుడు నోటిలో పోసుకుని మూడు పూటలా పుక్కిలించాలి. మూడు రోజుల్లో తగ్గుతుంది.పండ్ల గుజ్జును దగ్గు, గొంతు నొప్పి, ఛాతీ నొప్పికి వాడే మందుల తయారీలో ఉపయోగిస్తారు.అట్లే పండ్లను పెరుగులో నాన బెట్టి రోజుకు రెండు సార్లు ఒళ్ళంతా పట్టిస్తే ఎండ పొడ నుంచి విముక్తి పొందవచ్చు. ఇరికి పండ్లలో అనేక పోషకాలు ఉన్నాయని పరిశీలనలో రుజువైంది.నల్లమల అడవులు, ఇతర అడవులతో పాటు మైదానపుప్రాంతాల్లో కూడా పెరుగుతాయి. రాను రాను ఈ చెట్లు నిరాదరణకు గురి కావడం చేత చాలా వరకు కొట్టి వేతకు గురవుతున్నాయి. బంక పండ్లపై ప్రత్యేకించి న్యూట్రీటివ్ విలువలపైన, ఔషధాల పరంగా ఎన్నో దేశాల్లో పరిశోధనలు చేశారు. ప్రయోగాల ఫలితాలు రైతుల చెంతకు చెరలేదనవచ్చు. కాబట్టి ఈ పండ్ల దిగుబడి, విలువ ఆధారిత ప్రయోజనాలపై తగినన్ని పరిశోధనలు చేయగలిగితే, ఈ పండ్ల చెట్లు రైతుల చెంతకే కాకుండా మిద్దె తోటలతో పాటు పెరటి పండ్లుగా మారే అవకాశం ఎంతగానో ఉంది. ఇందుకు ఉద్యాన శాఖ, ఫారెస్ట్ (పరిశోధన, అభివృద్ధి), ఇతర శాఖలు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరమున్నది.వివిధ భాషల్లో ఇరికి / బంక పండు పేర్లు- అస్సామీ: గోబోహాట్, బహుబర - ఇంగ్లీష్: ఇండియన్ చెర్రి, క్లమ్మి చెర్రి, ఫ్రాగ్రాంట్ మంజక్, స్పోట్టిగోబ్బల్స్, కుమ్మింగ్ కార్డియా, గ్లుచెర్రి, అనోనంగ్, పింక్ పర్, బర్ లైంట్రీ. - ఉర్దూ: లసుర, లస్సోర : ఒరియా: భురపత, లసోర. - కన్నడ: కెంజుల, చలైహన్ను, హడిగే, దొడ్డచల్లు, మన్నడికె కెండిల్, గోండెమర, కడుచలె. - గుజరాత్: వడ్ గుండ : తమిళం: నరువిలి, సిటం, నరువలి. - తెలుగు: బోటీగిరి, ఇరికి పండు, బంక పండ్లు, బంకనక్కెర.- మరాఠీ: బోకర్, సేలు. - హిందీ: లసోడ, లసోర, లంగ్రీ, గుండ- సంస్కృతం: బహు వరహా- పంజాబి: లసురే. - బెంగాలి: భోకరీ, బహుబర, బోచో. - నేపాలి: బొహొరి, కాలో బొహరి అని పిలుస్తుంటారు.ప్రాంతాలను బట్టి ఈ పండు పేరు ఉచ్ఛారణలో కొంత తేడా ఉండవచ్చు. - డాక్టర్ మొరుపోజు పద్మయ్య, విశ్రాంత ప్రధాన శాస్త్రవేత్త, ఐసీఏఆర్ – ఐఐఓఆర్, రాజేంద్రనగర్, హైదరాబాద్, మొబైల్: 94407 08924నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ -
ఎల్‌నినోను తట్టుకునే సీ4 పంటలు తెలుసా?
ఎల్‌నినో ప్రతికూల ప్రభావం ఈ ఖరీఫ్ కాలంలో పంటలను, రైతులను ఎక్కువగానే ఇబ్బంది పెట్టేలా కనిపిస్తోంది. ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా ఎక్కువగా ఉంటాయని, వర్ష΄ాతం తక్కువగా ఉంటుందని భారతీయ వాతావరణ విభాగం తాజా అంచనాలు చెబుతున్నాయి. రుతుపవనాలు ఆలస్యం కావటం, వర్షాల మధ్య 15–25 రోజుల పొడి విరామం, తర్వాత భారీ వర్షాలు రావచ్చు. అందువల్ల రైతులకు ముందస్తు ప్రణాళిక చాలా అవసరం. ఈ వాతావరణ సంక్షోభ పరిస్థితుల్లో సీ3 పంటలకన్నా సీ4 పంటలపై ఆధారపడటమే మేలని సుస్థిర/ప్రకృతి వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకో ఏమిటో ఎలాగో తెలుసుకుందాం.ప్రపంచవ్యాప్తంగా సాగులో ఉన్న పంట మొక్కల్లో 85–95% సీ3 పంటే. వరి, గోధుమ, సోయాబీన్స్, కంది, పత్తి, బంగాళదుంపలు, కూరగాయలు వంటి ప్రధాన ఆహార పంటలు ఈ కోవకే చెందుతాయి. నీటి ఎద్దడిని, అధిక ఉష్ణోగ్రతను ఇవి అంతగా తట్టుకోలేవు. కరువు పరిస్థితుల్లో, అధిక ఉష్ణోగ్రతల్లోనూ సీ4 పంటలు మెరుగైన ఫలితాలనిస్తాయని నిపుణులు చెబుతున్నారు. మొక్కజొన్న, చెరకుతో ΄ాటు జొన్న, రాగులు, జొన్నలు, సజ్జలు, కొర్రలు వంటి చిరుధాన్యపు పంటలు సీ4 కోవలోకి వస్తాయి.సీ4 పంటల ప్రత్యేకత ఏమిటి?పంటలు, మొక్కలు, చెట్ల ఆకులు గాలిలోని కార్బన్ డయాక్సైడ్, సూర్యరశ్మి సహాయంతో ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. ఈ ప్రక్రియను కిరణజన్య సంయోగ క్రియ అంటాం. కార్బన్ డయాక్సైడ్ను 3 కర్బన సమ్మేళనంగా (కాల్విన్ చక్రాన్ని ఉపయోగించి) స్థిరీకరించే పంటలను సీ3 పంటలు అంటాం. అందువల్ల ఇవి చల్లని, తేమతో కూడిన వాతావరణాలకు అనువైనవి. కార్బన్ డయాక్సైడ్ను 4 కర్బన సమ్మేళనంగా (క్రాంజ్ అనాటమీ అనే ప్రత్యేక నిర్మాణ అనుసరణను ఉపయోగించి) స్థిరీకరించే పంటలను సీ4 పంటలు అంటాం. ఇవి వేడి, పొడి, ఉష్ణమండల వాతావరణాల్లో సమర్థవంతంగా పెరగడానికి అనువైనవి.పత్రరంధ్రాలు కీలకం!వేడి పెరగటం, తేమ అధికం కావటం, వర్ష΄ాతంలో మార్పులు మొక్కలో శరీరధర్మ, జీవరసాయన మార్పులు తెస్తాయి. అప్పుడు బయటకు కనిపించే లక్షణాలు ఇవి.. ఆకులు వాలిపోవటం, పూత రాలిపోవటం, వేర్లు కుళ్లిపోవటం, దిగుబడి తగ్గటం.పత్ర రంధ్రాలు మొక్క ‘శ్వాస ద్వారాలు’. సీ3 పంటలు 30 డి.సె.ల నుంచి 35 డి.సె.లు దాటితే నీరు కోల్పోతున్నామనే సంకేతంతో శ్వాస ద్వారాలు మూసుకుపోతాయి. కార్బన్ డయాక్సైడ్ లోపలికి రాకపోతే కిరణజన్య సంయోగక్రియ ఆగిపోతుంది. ఫలితంగా ఆహార పదార్థాల తయారీ ఆగిపోతుంది. అప్పుడు మొక్క తన కాండాన్ని కా΄ాడుకోవటానికి ఆత్మరక్షణ స్థితిలోకి వెళ్లి తనలో నిల్వ ఉన్న శక్తినే వాడుకుంటుంది. సీ4 మొక్కల్లో అయితే 35–40 డి.సె.ల ఉష్ణోగ్రత వరకు కిరణజన్య సంయోగక్రియ అత్యధికంగా జరుగుతుంది. 45 డి.సె.ల తర్వాత మాత్రమే కిరణజన్య సంయోగ క్రియ ఆగిపోతుంది.సీ3 + సీ4 పంటలు కలిపి వేసుకోవాలిఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్‌కు పెరిగినప్పుడు కూడా సీ4 పంటల్లో కిరణజన్య సంయోగక్రియ తార స్థాయిలో జరుగుతుంది. కాబట్టి, సీ4 మొక్కలు వేడి ఒత్తిడికి గురికావు. అందువల్ల సీ4 పంటలు అధిక వేడి ఒత్తిడిలో కూడా దిగుబడులను ఇవ్వగలవు. ఉష్ణోగ్రతలు ఎక్కువగా, వర్షాలు తక్కువగా ఉండబోతున్న ఈ సంవత్సరం రైతులు సీ4 ప్రధాన పంటలుగా సాగు చేసుకోవటం ద్వారా ప్రతికూల పరిస్థితుల్లో కూడా దిగుబడి నష్టం రాకుండా చూసుకోవచ్చు.అయితే, సీ3 పంటలు సాగు చేసే రైతులు కూడా సీ4 పంటలను అనుబంధ పంటలుగా, జీవవైవిధ్య పంటలుగా, సరిహద్దు పంటలుగా వేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. తద్వారా సీ3 పంటలపై ఎల్‌నినో ఒత్తిడిని తగ్గించటానికి సీ4 పంటలు దోహదం చేస్తాయని అంటున్నారు. తమ నేల రకం, నీటి వసతి తదితర అంశాలపై ఆధారపడి స్థానిక వ్యవసాయ నిపుణులను సంప్రదించి రైతులు తమ పంటల ప్రణాళికను రూపొందించుకోవలసి ఉంటుంది.జీవామృతం ఎంతవరకూ రక్షిస్తుంది? వేడి ఒత్తిడి నుంచి పంటలను రక్షించుకోవటానికి ద్రవ జీవామృతం వంటి జీవ ఉత్ప్రేరకాలు పంటలపై చల్లాలి. వీటిలోని సూక్ష్మజీవులు, మొక్క కణజాలంలో అంతరజీవులు కూడా ఆర్ఓఎస్ (రియాక్టివ్ ఆక్సిజెన్ స్పీసీస్) ప్రభావం నుంచి రక్షించేందుకు అవే ఎంజైములను ఉత్పత్తి చేసి పంటలను రక్షిస్తాయి.ఒకవేళ వేడి ఒత్తిడి ఆగలేదంటే పంట ఆత్మరక్షణ స్థితిలోకి వెళ్లి, మొదట ఆబ్సిసిక్ ఆమ్లం ఉత్పత్తి చేసి పత్ర రంధ్రాలను మూసివేస్తుంది. తర్వాత ఇథిలిన్ ఉత్పత్తి చేసి పూత, పిందెలు, ఆకులు, కొమ్మలు పండి రాలిపోయేలా చేస్తుంది.ప్రధాన పంటలను అధిక ఉష్ణోగ్రతల నుంచి రక్షించాలంటే.. ప్రధాన పంట కంటే ఎత్తుగా పెరిగే అనుబంధ పంటలు, జీవవైవిధ్య పంటలను ఎంపిక చేసుకోవాలి. అంటే, ప్రధాన పంట పక్కనే సంవత్సరం పొడవునా ఉండేలా కంది, మునగ, ఆముదం మొదలైన పంటలు ఉండేలా ప్రణాళిక వేసుకోవాలి. తద్వారా కొంత నీడ, తేమ లభించటం ద్వారా పంట పొలంలో ఉష్ణోగ్రతలు తగ్గుతాయి.ఆచ్ఛాదనతో మేలుపత్ర రంధ్రాలు ఆకుల కింది భాగంలో ఉంటాయి. కాబట్టి నేలపై ఆచ్ఛాదన చేయకపోతే, సూర్యుని వేడి కాంతి కిరణాలు నేరుగా నేలను తాకి ఆకు కింద భాగంపై పరావర్తనం చెందుతాయి. దీని ఫలితంగా పత్రరంధ్రాలు మూసుకుపోతాయి. కాబట్టి, నేలను కప్పి ఉంచే మంద΄ాటి పంట వ్యర్థాలతో ఆచ్ఛాదన చేస్తే పత్ర రంధ్రాలు తెరిచి ఉండటానికి ఎంతగానో సహాయపడుతుంది.నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ -
ఎల్‌నినోను తట్టుకునే ఉపాయాలు!
ముందు నుంచే అనుకుంటున్నట్లు ఎల్‌నినో ప్రారంభమైందని భారతీయ వాతావరణ విభాగం కొద్ది రోజుల క్రితం అధికారికంగా ప్రకటించింది. దీని అర్థం ఏమిటి? ఈ ఏడాది వర్షాలు తక్కువ, వేడి ఎక్కువ. వర్షం ఎప్పుడు, ఎంత పడుతుందో తెలియదు.. వర్షాల మధ్య ఎంత గ్యాప్ ఉంటుందో తెలియదు.. ఉన్నట్టుండి ఎప్పుడు కుండపోత వర్షం పడుతుందో తెలియదు.. ఇటువంటి కరువు పరిస్థితులను రైతులు కొంతమేరకైనా తట్టుకునేందుకు ఉపయోగపడే వ్యవసాయ, నీటి సంరక్షణ పద్ధతులపై ‘సాక్షి సాగుబడి’ ప్రత్యేక కథనం.. విత్తన గుళికలుతక్కువ వర్షపాతం, అధిక ఉష్ణోగ్రతలు వంటి వాతావరణ ఒడిదుడుకులను తట్టుకోవడానికి విత్తనాలను గుళికలుగా మార్చడం ఎంతో లాభదాయకం. ఈ పద్ధతిని ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని, ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయంలో, రైతులు ఇప్పటికే అనుసరిస్తున్నారు. బీజామృతంతో శుద్ధి చేసిన విత్తనాలపై బంకమట్టి, ఘనజీవామృతం పొడి, కట్టె బూడిదను పొరలు పొరలుగా (గోనె పట్టా సహాయంతో ఒక ప్రత్యేక పద్ధతిలో) లేపనం చేయడం ద్వారా సాధారణ విత్తనం కంటే 3–5 రెట్లు పెద్దవైన విత్తన గుళికలు సిద్ధమవుతాయి. ఇవి పక్షులు, కీటకాల నుంచి విత్తనానికి రక్షణ కవచంలా పనిచేస్తాయి. మట్టిలో కేవలం 10–15 మి.మీ.ల వర్షపాతం కురిసినా సులభంగా మొలకెత్తుతాయి. తగిన తేమ లేకపోయినా ఆరు నెలల వరకు జీవంతో ఉండి, మొలకెత్తిన తర్వాత 25–40 రోజుల పాటు నీటి ఎద్దడిని తట్టుకోగలవు. పప్పుధాన్యాలు, జొన్న, సజ్జ, రాగి, పొద్దుతిరుగుడు, జనుము, జీలుగ, మొక్కజొన్న, కొన్ని రకాల నూనె గింజలు, కొన్ని రకాల కూరగాయ విత్తనాలు విత్తన గుళికల తయారీకి అనువైనవి. కచ్చితంగా 5 సెం.మీ. (2 అంగుళాల) లోతులో మాత్రమే విత్తుకోవాలి.కందకాలుకురిసిన వర్షపు నీరు బయటకు పోకుండా భూమిలోకి ఇంకింపజేసుకుంటే పంటలకు నీటి భద్రత దొరుకుతుంది. అందుకు కందకాలు ఉపయోగపడతాయి. పొలంలో వాలుకు అడ్డంగా.. ప్రతి 50 మీటర్లకు ఒక చోట.. 1 మీటరు లోతు, 1 మీటరు వెడల్పు, 25 మీటర్ల పొడవున కందకం తవ్వాలి. రెండు కందకాల మధ్య 5 మీటర్లు ఖాళీ వదలాలి. తవ్విన మట్టిని కందకం లోతట్టు వైపు కట్టగా పోయాలి. ఇసుక కలిసిన ఎర్ర నేలలు, చల్కా నేలలు ఏటవాలుగా ఉంటే పొలం మధ్యలో 50 మీటర్లకు ఒక్కటి చొప్పున కందకాలు తవ్వుకోవాలి. ఎర్ర చల్కా చేను సమతలంగా ఉంటే.. అర ఎకరం లేదా ఎకరానికి ఒక మడి చొప్పున ఏర్పాటు చేసుకోవాలి. మడుల కట్టలు కనీసం అర మీటరు ఎత్తుగా వేసి.. పక్కనే కందకం తవ్వాలి. నల్ల రేగడి నేలలు ఏటవాలుగా ఉన్నా, సమతలంగా ఉన్నా, పొలం మధ్యలో కందకాలు తవ్వకూడదు. పొలం చివరన బావి లేదా బోరు కింద వాలులో.. ఒకే ఒక పెద్ద కందకం 2,3 మీటర్ల లోతున తవ్వుకుంటే చాలు. ఇతర వివరాలకు.. తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల వేదిక సీనియర్ నేతలను సంప్రదించవచ్చు: సంగెం చంద్రమౌళి (ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ – రిటైర్డ్): 98495 66009, మేరెడ్డి శ్యాంప్రసాద్‌రెడ్డి (ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ – రిటైర్డ్) 99638 19074.ఎత్తు మడులుసాగు చేసే పంట ఏదైనా సరే ఎత్తుమడులు లేదా బోదెల (రెయిజ్డ్ బెడ్స్)పైనే పంటలు విత్తుకోవటమే రైతుకు అన్ని విధాలా మేలని నిపుణులు చెబుతున్నారు. వర్షాలు తక్కువైనా, ఎక్కువైనా.. వర్షానికి వర్షానికి మధ్య ఎక్కువ రోజుల వ్యవధి వచ్చినా.. నల్ల రేగడైనా, ఎర్ర నేలైనా, బంక మట్టి అయినా సరే.. ఎత్తు మడులు చేసి లేదా బోదెలు తోలి పంటలు విత్తుకుంటే రైతుకు ఆదాయ భద్రత చేకూరుతుందని ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డా. ప్రవీణ్‌కుమార్ రైతులకు సూచిస్తున్నారు. పత్తి + కంది, మిర్చి, పసుపు, సోయా, వేరుశనగ, కూరగాయలతో పాటు ఇంకా ఏ ఇతర ఆరుతడి పంటలైనా సరే ఎత్తుమడులపై విత్తుకుంటే అనావృష్టి / అతివృష్టి వంటి వైపరీత్యాల నుంచి పంటలను రక్షించుకోవచ్చని ఆయన తెలిపారు. ఎత్తుమడులపై పంటల సాగుపై అనేక ఏళ్లుగా ప్రయోగాలు చేస్తున్నారు. అనుసరిస్తున్న రైతులు సైతం చక్కటి ఫలితాలు సాధిస్తున్నారు. పత్తిలో అంతరపంటగా కందిని విత్తు కుంటే ఒక పంట దెబ్బతింటే, మరో పంటైనా రైతును ఆదుకుంటుందన్నారు. ఇతర వివరాలకు డా. ప్రవీణ్ కుమార్‌ను 91822 67666 నంబరులో సంప్రదించవచ్చు.లాం ఫారంలో అమ్మకానికి మేలు రకం మిరప విత్తనాలు గుంటూరు సమీపంలోని లాం ఫారంలో ఈ నెల 16వ తేదీ నుంచి ఎల్.సి.ఎ–625, ఎల్.సి.ఎ–643 మిరప రకాల ఫౌండేషన్ విత్తనం అమ్ముతున్నట్లు లాం ఫారం ప్రాంతీయ ఉద్యాన పరిశోధనా స్థానం అసోసియేట్ డైరెక్టర్ డాక్టర్ టి. సుశీల తెలిపారు. ఎల్.సి.ఎ–643 రకం పచ్చిమిర్చికి, ఎండు మిర్చికి అనువైనది. కాయలు ఎండిన తరువాత కొంచెం ముడత కలిగి ఆకర్షణీయమైన ఎరుపు రంగు కలిగి, బ్యాడగి రకంలా ఉంటాయి. బెట్టను బాగా తట్టుకొంటుంది. కొంతవరకు జెమిని వైరస్‌ను కూడా తట్టుకొంటుంది. నల్లతామర పురుగు ఉధృతి ఉన్నా కొద్దిపాటి పురుగు మందుల పిచికారీతో అధిక దిగుబడినివ్వగలిగిన రకం. ఎల్.సి.ఎ–625 రకం ఎండు మిరపకు అనువైనది. సూటి రకాల్లో కెల్లా అధిక ఘాటు (45,000–50,000 ఎస్.హెచ్.యు), మంచి ఆకర్షణీయమైన ఎరుపు రంగు (60–65 ఎ.ఎస్.టి.ఏ) కలిగిన రకం. కాయ తోలు పలచగా ఉండి, అధిక ఘాటు వలన కాయకుళ్ళు తెగులును కొంతవరకు తట్టుకుంటుంది. తాలు కాయలు చాలా తక్కువగా వస్తాయి.లాం ఫారంలో ఈ నెల 16వ తేదీ నుంచి ప్రతి రోజు ఉ. 9 గం.–సా. 4 గం. లోపు రైతులు నేరుగా వచ్చి కొనుక్కోవచ్చు. ఒక్క రైతుకు 250 గ్రాముల విత్తనం మాత్రమే రూ. 300లకు అమ్ముతారు. ఇవే పేర్లతో బయట ఎవరైనా ఈ విత్తనాలు అమ్మజూపితే రైతులు వాటిని ఖరీదు చేసి మోసపోవద్దని డా. సుశీల విజ్ఞప్తి చేశారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు: 99898 09554 / 94405 92982సేంద్రియ సేద్యంపై ‘అక్షయకల్ప’ ఫెలోషిప్వ్యవసాయ భూమి గల లేదా వ్యవసాయ నేపథ్యం ఉన్న యువతను సేంద్రియ రైతు పారిశ్రామికవేత్తలుగా లేదా రైతు విస్తరణ నిపు ణులుగా తీర్చిదిద్దటమే లక్ష్యంగా ’అక్షయకల్ప –రెయిన్ మ్యాటర్ ఫెలోషిప్’ కార్యక్రమం త్వరలో ప్రారంభం కానుంది. పాడి పశువుల పెంపకం, నాటు కోళ్ల పెంపకం,బయోగ్యాస్ ఉత్పత్తి, బయోడైజెస్టర్ ద్వారా తయారుచేసుకునే సేంద్రియ ఎరువులతో లాభదాయక సమీకృత సేంద్రియ వ్యవసాయ పద్ధతిపై 19–27 మధ్య వయస్కులైన యువతకు 9 నెలల పాటు ఉచిత శిక్షణ ఇస్తారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ సమీపంలోని ఈదులాపల్లిలోని అక్షయకల్ప సేంద్రియ వ్యవసాయ ప్రాంతీయ పరిశోధన–శిక్షణా కేంద్రంలో ఎంపికైన 30 మందికి మొదటి 3 నెలలు రెసిడెన్షియల్ శిక్షణ, తరు వాత 6 నెలలు ప్రాక్టికల్ శిక్షణ ఉంటుంది. ఉచిత భోజనం, వసతితో పాటు ఉపకార వేతనం ఇస్తారు. ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల అభ్యర్థులకు ప్రాధాన్యం. వివరాలకు.. 89043 96761 / 91132 03476 / 70222 77155 / 89043 96761 నిర్వహణ: పంతంగి రాంబాబు,సాక్షి సాగుబడి డెస్క్ -
Sagubadi: నేల వైద్యుడు జీలుగ!
పచ్చి రొట్ట పంటల్లో మేలైనది జీలుగ. శాస్త్రీయ నామం: సెస్బానియా సెస్బాన్. త్వరగా పెరిగే పప్పు జాతి మొక్క. నిస్సారమైన భూమిని బాగు చేస్తుంది. కాబట్టి దీన్ని ‘నేల వైద్యుడు’ అంటారు. పంటలకు ముందు పొలంలో జీలుగ సాగుతో భూసారం పెరిగి తర్వాత వేసే పంటకు యూరియా అవసరం తగ్గుతుంది. పనిలో పనిగా ఫ్లోరోసిస్ నియంత్రణ కూడా జరుగుతుందని చెబుతున్నారు ఫ్లోరోసిస్ విమోచన సమితి వ్యవస్థాపకులు డా. కె. గోవర్దన్ రెడ్డి.ప్రతి పొలంలో జీలుగ ఎందుకు సాగు చెయ్యాలి?గాలి నుంచి సేకరించి ఎకరం నేలకు 80–100 కిలోల నత్రజనిని అందిస్తుంది. ఎకరానికి యూరియాపై రూ. 2 వేలకు పైగా ఆదా.త్వరగా పెరుగుతుంది 45–60 రోజుల్లో సిద్ధం. 6 నెలల్లో 3–4 మీటర్లు పెరుగుతుంది.నీళ్లు అక్కర్లేదు ∙మొదటి నెల తర్వాత కరువును తట్టుకుంటుంది. మెట్ట భూములకు సరైనది.నేలను సారవంతం చేస్తుంది. లోతైన వేర్లు గట్టి నేలను వదులు చేస్తాయి. జీలుగ సాగుతో ఎకరానికి 8–12 టన్నుల సేంద్రియ పచ్చిరొట్ట ఎరువు లభిస్తుంది.దీని సాగుకు ఎరువుల ఖర్చు లేదు. యూరియా, డీఏపీ అవసరం లేదు. తన ఆహారాన్ని తానే తయారు చేసుకుంటుంది.జీలుగ ఏ ఇతర పంటలు పండని చౌడు నేలల్లో కూడా బాగా పెరుగుతుంది.ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాల్లో రసాయన ఎరువులు నేలను మరింతగా పాడు చేస్తాయి. జీలుగ భూగర్భ జలాలకు హాని చేయకుండా సహజ నత్రజనిని ఇస్తుంది. ఫ్లోరైడ్ సమస్య తీవ్రతను తగ్గిస్తుంది. నేలకు ప్రాణం పోయండి, ఆ నేల మీకు ప్రాణం పోస్తుంది.పచ్చిరొట్ట పంటగా జీలుగ సాగు ఎలా?ఎకరానికి 25 కిలోల విత్తనం తీసుకోండి..జూన్–జూలై నెలల్లో తొలకరి వానలకు వెదజల్లి, తేలికగా దున్నండి.45–60 రోజులు (50% పూత వచ్చే వరకు) పెరగనివ్వండి.కోసి, భూమిలో దున్నేయండి. 15 రోజులు ఆగండి.నత్రజని పెరిగిన ఆ నేలలో జొన్న, సజ్జ, పప్పు ధాన్యాలు వంటి పంటలు వేయండి. తరువాతి పంటకు యూరియా అవసరం 25–30% తగ్గిపోతుంది. నేల మెత్తగా, సారవంతంగా మారుతుంది.విత్తనాలు – సలహాల కోసం మీ దగ్గరలోని వ్యవసాయ శాఖ కార్యాలయం / కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలను గానీ, ఫ్లోరోసిస్ విమోచన సమితి వ్యవస్థాపకులు డా. కె. గోవర్దన్ రెడ్డి, (93933 13111)ని గానీ సంప్రదించండి. 1 ఎకరానికి ఖర్చు – లాభంఖర్చు.. విత్తనం 25 కిలోలుదుక్కి, విత్తనాలు వేసే ఖర్చు రూ. 1,500మొత్తం ఖర్చు: రూ. 3,300 ఆదా/లాభం..రూ. 1,800 / యూరియా ఆదా రూ. 2,200అధిక దిగుబడి రూ. 3,000 పైనే, మొత్తం లాభం రూ. 5,200 పైనే.మొదటి పంటలోనే రూ. 1,900పైగా లాభం.దానితో పాటు నేల సంవత్సరాల తరబడి ఆరోగ్యకరంగా ఉంటుంది.నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్. -
Sagubadi: మొక్కలకు ఫర్టిలైజర్, పేస్ట్ కంట్రోల్ గా ఉపయోగపడే వేప పిండి..
మొక్కలకు ఫర్టిలైజర్, పేస్ట్ కంట్రోల్ గా ఉపయోగపడే వేప పిండి గురించి తెలుసుకుందాం. మిద్దె తోటలోని పువ్వులు, పండ్లు, కూరగాయల మొక్కలకు వేప పిండిని ఇలా వాడవచ్చు..1. మొక్కలు నాటడానికి కుండీలలో మట్టిని సిద్ధం చేసేటప్పుడే వేప పిండిని కలపడం అత్యంత ఉత్తమమైన సమయం. 2. మట్టి మిశ్రమంలో తప్పనిసరిగా 10% వేప పిండి కలపాలి.3. ఇది మట్టిలో ఉండే హానికరమైన నులిపురుగులు, శిలీంధ్రాల నుండి వేర్లకు రక్షణ ఇస్తుంది. 4. మొక్కలు పెరుగుతున్న సమయంలో కూడా నెలకు ఒకసారి వేప పిండిని ఎరువుగా వేయవచ్చు. 5. కుండీలోని మట్టిని పైన కొద్దిగా తవ్వి మొక్క సైజును బట్టి ఒక గుప్పెడు వేప పిండిని వేసి, మట్టితో క΄్పాలి.6. ఇది మొక్కలకు నత్రజని, ఇతర పోషకాలను నిలకడగా అందిస్తుంది.వేప పిండి ద్రావణం 7. మొక్కలకు చీడపీడలు ఆశించినప్పుడు లేదా నివారణగా వేప పిండి ద్రావణాన్ని వాడవచ్చు. 8. అర కిలో వేప పిండిని 10 లీటర్ల నీటిలో కలిపి 2 రోజుల పాటు నానబెట్టాలి. ఆ తర్వాత ఆ ద్రావణాన్ని వడకట్టి, మరో 10 రెట్లు నీరు కలిపి మొక్కల మొదళ్లలో పోయవచ్చు.9. ఈ ద్రావణాన్ని ఆకులపై ఉదయాన్నే లేదా సాయంత్రం వేళల్లో పిచికారీ చేయడం వల్ల ఆకులను తినే పురుగులు దూరమవుతాయి. 10. అతిగా వేయకూడదు. 12 అంగుళాల కుండీకి 50–100 గ్రాముల ΄÷డి సరిపోతుంది.11. ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు ఆకులపై వేప ద్రావణాన్ని పిచికారీ చేయవద్దు, ఇది ఆకులను కమిలిపోయేలా చేస్తుంది.12. కల్తీ లేని, తాజాగా ఉండే వేప పిండిని ఎంచుకోవాలి. - కొల్లి కృష్ణ కుమారి, అడ్మిన్, గుంటూరు జిల్లా, మిద్దె తోటల బృందం, మొబైల్: 94906 02366నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ -
సాగుబడి: 'ఇప్ప పండు..'తో బోలెడు ఉపయోగాలు!
నల్లమల అడవుల్లో ఇప్ప చెట్ల సాంద్రత తగ్గింది. ప్రస్తుతం ఈ చెట్లను నరకడంపై పూర్తి నిషేధం ఉంది. ఇప్పపై సమగ్రంగా పరిశోధించి, విలువ ఆధారిత పదార్థాలను ప్రజల చెంతకు చేకూర్చిననాడు, దీని ఉనికికి సార్ధకం చేకూర్చిన వారమవుతాం.20 మీటర్ల ఎత్తు.. వందేళ్లు!ఇప్ప ఉష్ణమండలంలోని ఆకులురాల్చే చెట్ల జాతుల్లో ఒకటి. నిటారుగా పెరిగేతత్వం గలది. ఇంచుమించు 16–20 మీటర్ల ఎత్తు వరకు పెరగగలదు. మాను చేవ కలిగి బలిష్ఠంగా ఉంటుంది. దీని ఆవాసం ఇండియా అని చెప్పవచ్చు. కానీ శ్రీలంక, నేపాల్, మయన్మార్ మొదలగు దేశాలలో కూడా ఇప్ప చెట్లు కనిపిస్తాయి.ఎక్కువగా అడవులలో ఉన్నప్పటికీ, మైదాన ప్రాంతాల్లో కూడా విరివిగా పెరుగుతాయి. ఇండియాలో ఇంచుమించు, ఉత్తర, మధ్య, దక్షిణాది రాష్ట్రాలే కాకుండా బీహార్, జార్ఖండ్, గుజరాత్, ఒడిషాలలోనూ ఉన్నాయి. ఒకప్పుడు నల్లమల అడవులు ఈ చెట్లకు మంచి ఆవాసంగా ఉండేది. వీటి సాంద్రత చాలా వరకు తగ్గినదనవచ్చు. వీటి జీవిత కాలం దాదాపు వంద సంవత్సరాలంటారు. కానీ పూత, కాత మాత్రం అరవై ఏళ్ల వరకు ఉండగలదంటారు. ఇప్ప బహుళ ప్రయోజనకారి. కాబట్టి దీన్ని రక్షించటం అందరి కర్తవ్యం. తెలుగు రాష్ట్రాలు ఈ చెట్టుకు పెట్టింది పేరు. దీని ఉనికి అపారమైనది.ఇప్ప చెట్టు పేర్లు వివిధ భాషల్లో ... అస్సామీ: మహారువ ఇంగ్లీష్: హానిట్రీ, బట్టర్ ట్రీ ఉర్దూ: చికన్, గర్, గులు, మహువ ఒరియా: మహుల మహ్వా కన్నడ: హిప్పే, ఇప్పె తమిళం: ఇలుప్పయి, కట్టిరుప్పెయి తెలుగు: ఇప్ప, విప్ప, మధుకము బెంగాలీ: మౌల్, మహూయ మరాఠీ: మౌహ, మవద, కట్ – ఇల్లిపి మలయాళం: ఇరిప్ప, ఇలుపు హిందీ: మహువ, మొహవ, మొవరి, గిలౌడ్, గర్, వన్ ప్రస్త్ సంస్కృతం: మధుక, మధుకం, మోహ అని అంటారు.ఇప్ప ఉపయోగాలు:ఏ చెట్టుకూ లేని ఉపయోగాలు ఇప్ప చెట్టుకు ఉన్నాయి.ఒక చెట్టు నుంచి ఏడాదికి 60–80 కిలోల గింజలు పొందవచ్చు. అదే పెద్ద చెట్టులో ఒక క్వింటాలు వరకు పూమొగ్గలను పొందవచ్చు.విత్తనాలలో 30–35% వరకు నూనె ఉంటుంది.విత్తనాలలో 14–16% వరకు ప్రోటీనులు ఉంటాయి.విప్ప పువ్వుల నుండి తీసిన నూనె వంట కోసం ఉపయోగిస్తారు. దీనికి ఎన్నో ఔషధ గుణాలున్నాయి.గింజల నుండి తీసిన నూనెను చర్మ రక్షణ తైలంగా, కీళ్ళనొప్పులకు మర్దన తైలంగా కూడా వాడుతారు. శుద్దీకరించిన నూనెను వనస్పతి, సబ్బులు, కొవ్వొత్తులు, ఫ్యాటి ఆమ్లాలు తయారు చేయడంలో ఉపయోగిస్తారు.గిరిజనులు ఇప్ప పూల అంబలి తయారు చేసి వాడుతారు.దేశవాళి సారాయి (ఇప్పసార)ని తయారీకి ఉపయోగిస్తారు. ఒక టన్ను ఇప్ప పూల నుంచి దాదాపు 400 లీటర్ల పైననే సారాయి వస్తుందని అంచనా.ఇప్ప సారాను సేవిస్తే త్వరగా వృద్ధాప్య లక్షణాలు రాకుండా ఉంటాయని గిరిజనుల నమ్మకం.ఇప్ప పూల ఔషధాలను పక్షవాతం నయం చేయటానికి ఉపయోగిస్తారు. ఇప్ప పూలతో పండ్లు తోముకుంటే దగ్గు సమస్యలను నివారించవచ్చు.ఇప్ప పూల తైలానికి ఆయుర్వేదంలో మంచి విలువ ఉంది.ఇప్ప పూలతో లడ్డూలు, పచ్చళ్లు తయారు చేస్తారు.ఇప్ప గింజల (5.1%) నూనె నుంచి బట్టర్‌ను తయారు చేస్తారు.ఇప్ప పూలను పశువులకు మేతగా వేస్తారు. పశువులు ఇష్టంగా తింటాయి.ఇప్ప పండు తొక్కను తింటారు. పండు కింది పొరను పొడిచేసి కేక్‌ల తయారీకి ఉపయోగిస్తారు.ఇప్ప గింజల నూనె దీపాలకు కూడా వాడుతారు.నూనె తీయగా వచ్చిన చెక్కను ఎరువుగా వాడుతారు.ఇప్ప ఆకులను కరువు కాలంలో పశువులు తింటాయి.పూలలో ఉండే చక్కెర, విటమిన్లు, క్యాల్షియం, నూనె ఎంతో ఉపయోగకరమైనవి.ఆకులను,పూలను బ్రొంకైటీస్కు వైద్యంలో ఉపయోగిస్తారు.ఇప్పపూల లడ్డు..పదార్ధాల మోతాదు:ఇప్పపువ్వు – కిలో, మొలాసిస్ – 400 మిల్లీ లీటర్లు. రాగిపిండి–500 గ్రా., జీడిపప్పు– 100గ్రా., నువ్వులు 50 గ్రా., సోంపు పొడి 10 గ్రా., కొబ్బరిపొడి– 100 గ్రా., సిట్రిక్ ఆసిడ్–4 గ్రా., మెంతిపొడి–10 గ్రా., నెయ్యి 100 మీ.లీ. సొంఠి పొడి 5 గ్రా.తయారీ విధానం:- పొయ్యి మీద పాత్రలో మొలాసిస్‌ను 400 మి.లీ. నీళ్ళల్లో వేడి చేసి, దానికి 2 గ్రాముల సిట్రిక్ ఆమ్లాన్ని కలపాలి.- అది జిగటగా మారగానే నెయ్యిలో వేయించిన రాగి పొడిని అందులో కలపాలి.- ముందే నెయ్యిలో వేయించిన ఇప్ప పూలను అందులో కలపాలి.- ఆ తరువాత నువ్వులు, జీడిపప్పు, శొంఠి పొడి, మెంతి పొడి, సోంపు పొడిని కలుపాలి.- అన్నీ బాగా కలియ బెట్టాలి.- ఈ విధంగా చిరుమంటపై ఉంచి, పైన తెలిపిన పదార్థాలన్నీ దోరగా, చిక్కగా అయిన తర్వాత మంట ఆర్పివేయాలి.- వేడి తగ్గిన తర్వాత కొబ్బెర తురుముతో కలిపి లడ్డూల రూపం వచ్చే విధంగా గుండ్రంగా చేయాలి.- ఈ విధంగా తయారు అయిన లడ్లు చాలా రుచిగా ఉంటాయి.- మీరు చేసి చూడండి. ఏమైనా మార్పులు–చేర్పులు చేసి ఇంకా రుచికరంగా తయారుచేసే విధానాన్ని రూపొందించండి.ఇప్ప కలప గట్టిది..ఇప్ప చెట్టు కలప చాలా గట్టిది. దూలాలకు మిద్దె ర్యాప్టర్లకు, పలకలకు, ఫర్నీచర్ తలుపులు, కిటికీల ఫ్రేములకు, బ్రిడ్జిలు వేసేటప్పుడు సప్పోర్ట్ దిమ్మెలుగా, బండ్ల మణిగం, పలుగడి, పడవల చెక్కలు, ఓడల దిమ్మెలు, వ్యవసాయ పనిముట్లకు కూడా ఉపయోగపడుతుంది. ఇప్ప చెట్టు కలప, పూలు, కాయలు, పండ్లల్లో ఎన్నో తెలియని ఉపయోగాలున్నాయి. వీటిలోని యాంటి ఆక్సిడెంట్స్, ఆమ్లాలను మందుల తయారీలో వాడుతారు. దీని ఉపయోగాలపై ప్రయోగాలు చేసి, ఆ విషయాలను రైతుల చెంతకు చేర్చితే ఎంతో లాభసాటిగా ఉంటుంది. - డాక్టర్ మొరుపోజు పద్మయ్య, విశ్రాంత ప్రధాన శాస్త్రవేత్త, ఐసీఏఆర్ – ఐఐఓఆర్, రాజేంద్రనగర్, హైదరాబాద్. మొబైల్: 94407 08924నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ -
సాగుబడి: ఎత్తు మడులపై సేంద్రియ వంగ.. మండే ఎండల్లోనూ నో బెంగ!
దీర్ఘకాలం దిగుబడినిచ్చే కూరగాయ పంటల సాగు ఎల్‌నినో కారణంగా ఈ ఏడాది కరువు బారిన పడే ముప్పు పొంచి ఉందా? ఏడాది పొడవునా కూరగాయ తోటలను ఎల్‌నినో కరువు నుంచి రక్షించుకుంటూ అధిక దిగుబడిని పొందటానికి ప్రత్యేక లేక సేంద్రియ సాగు వ్యూహాలేమైనా ఉన్నాయా? ముమ్మాటికీ ఉన్నాయంటున్నారు రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌కు చెందిన సేంద్రియ వ్యవసాయ నిపుణులు శివశంకర్ షిండే! 47 డిగ్రీల సెల్సియస్ ఎండను, నీటి ఎద్దడిని దీటుగా తట్టుకునే వినూత్న సేంద్రియ సాగు పద్ధతిని తమ ‘న్యూలైఫ్ ఫౌండేషన్’ ప్రదర్శనా క్షేత్రంలో ఆవిష్కరించటం విశేషం. కరువొచ్చినా, భారీ వర్షాలొచ్చినా సరే భద్రత చేకూర్చే సంగతులతో ప్రత్యేక కథనం.నేల బాగా తడిచిన తర్వాతే..రుతుపవనాలు పూర్తిగా విస్తరించిన తర్వాత వారం వ్యవధిలో తగినంత వర్షం పడిందని నిర్ధారించుకున్న తర్వాతే వర్షాధార పంటలు విత్తుకోవాలని, ఒకటీ అరా వర్షాలు పడగానే తొందరపడి విత్తనాలు వేసుకోవద్దని నిపుణులు రైతులకు సూచిస్తున్నారు. తగినంత వర్షం అంటే?.. తేలికపాటి, ఎర్ర నేలల్లో 50 నుంచి 60 మి.మీ., బరువు, నల్లరేగడి నేలల్లో 60 నుంచి 75 మి.మీ. వర్షపాతం నమోదైన తర్వాత లేదా 15–20 సెం.మీ. (6 నుంచి 8 అంగుళాల) లోతు నేల తడిచిన తర్వాతే రైతులు వర్షాధార పంటలైన పత్తి, సోయాచిక్కుడు, మొక్కజొన్న, జొన్న, కంది, పెసర, మినుము, ఆముదం తదితర పంటలను విత్తుకోవాలి. వరి సాగు చేయదలచిన రైతులు జనుము, జీలుగ, పెసర, పిల్లిపెసర, ఉలవ వంటి పచ్చిరొట్ట పైరులు విత్తుకోవాలి. నీరు సమృద్ధిగా ఉన్న ప్రాంతాల్లో రైతులు దీర్ఘకాలిక వరి రకాల నారుమళ్లు పోసుకోవటానికి ఇది అనువైన సమయం.సేంద్రియ సేద్యంపై 9 నెలల ‘అక్షయకల్ప’ శిక్షణవ్యవసాయ భూమి గల లేదా వ్యవసాయ నేపథ్యం ఉన్న యువతను సేంద్రియ రైతు పారిశ్రామికవేత్తలుగా లేదా రైతు విస్తరణ నిపుణులుగా తీర్చిదిద్దటమే లక్ష్యంగా ‘అక్షయకల్ప–రెయిన్ మ్యాటర్ ఫెలోషిప్’ కార్యక్రమం త్వరలోప్రారంభం కానుంది. పాడి పశువుల పెంపకం, బయోగ్యాస్ ఉత్పత్తి, బయోడైజెస్టర్ ద్వారా తయారుచేసుకునే సేంద్రియ ఎరువులతో లాభదాయక వ్యవసాయ పద్ధతిపై 19–27 మధ్య వయస్కులైన యువతకు 9 నెలల పాటు ఉచిత శిక్షణ ఇస్తారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ సమీపంలోని ఈదులాపల్లిలోని అక్షయకల్ప సేంద్రియ వ్యవసాయ పరిశోధన–శిక్షణా కేంద్రంలో ఎంపికైన 30 మందికి మొదటి 3 నెలలు రెసిడెన్షియల్ శిక్షణ, తరువాత 6 నెలలుప్రాక్టికల్ శిక్షణ ఉంటుంది. ఉచిత భోజనం, వసతితో పాటు ఉపకారవేతనం ఇస్తారు. ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల అభ్యర్థులకుప్రాధాన్యం ఉంటుంది. వివరాలకు.. 70222 77155.శాశ్వత మడుల నిర్మాణంఈ సాగు పద్ధతిలో ఐదేళ్ల వరకు చెక్కుచెదరని శాశ్వత ఎత్తుమడులను (పర్మినెంట్ రెయిజ్డ్ బెడ్స్) ఒక అడుగు ఎత్తు, మూడు అడుగుల వెడల్పుతో నిర్మిస్తారు.భూమి తయారీ: మొదటి ఏడాది మాత్రమే దుక్కి అవసరం అవుతుంది.బయోచార్ వినియోగం: ఎకరానికి 5 టన్నుల వరి పొట్టు బొగ్గును (బయోచార్) మట్టిలో కలుపుతారు. ఇది మట్టి కన్నా 4 రెట్లు ఎక్కువగా నీటిని పట్టి ఉంచుతుంది.వీడ్ మ్యాట్: మడులపై డ్రిప్ లైన్లు పరిచి, నాలుగు అడుగుల నలుపు వీడ్ మ్యాట్ కప్పుతారు. ఇది వర్షపు నీటిని లోపలికి పంపిస్తూ, కలుపును పూర్తిగా నివారిస్తుంది.మొక్కలు నాటడం: ఈ మడులపై ఎకరానికి 2 వేల అంటుకట్టిన పర్పుల్ లాంగ్ వంగ మొక్కలను నాటుతారు.ద్రవరూప ఎరువులతో సమతుల్య పోషణపంటకు అవసరమైన స్థూల, సూక్ష్మ పోషకాలను పూర్తిగా సేంద్రియ పద్ధతిలోనే అందిస్తారు.బయోడైజెస్టర్: ఎకరానికి ఏడాదికి 3 టన్నుల మాగిన పశువుల లేదా కోళ్ల ఎరువును బయోడైజెస్టర్లో వేసి 24 గంటల్లో పోషక ద్రవాన్ని తయారుచేస్తారు. దీనిని డ్రిప్, పిచికారీ ద్వారా వారానికి రెండు సార్లు ఇస్తారు.ద్రావణాలు: వేపాకులు, వయ్యారిభామ, తలంబ్రాల ఆకులను పది రోజులు నిల్వ చేసి ఆ రసాన్ని అందించడం ద్వారా సూక్ష్మపోషకాల లోపాన్ని అధిగమిస్తున్నారు. కొనుగోలు చేసిన సేంద్రియ పురుగుమందును అడపాదడపా వాడుతూ చీడపీడలను సమర్థవంతంగా అరికడుతున్నారు.రసాయన సాగు – సేంద్రియ సాగు పోలికరంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం దేవరంపల్లిలో వడ్ల ఆనందాచారి రసాయనిక సేద్యంలో తెల్లవంగను పండిస్తున్నారు. రసాయన సాగుతో పోలిస్తే శివశంకర్ అనుసరిస్తున్న శాశ్వత మడులపై సేంద్రియ సాగులో పెట్టుబడి తొలి ఏడాది ఎక్కువగా ఉన్నప్పటికీ, దిగుబడి నాలుగింతలు వస్తుంది. ఐదేళ్ల పాటు మడుల నిర్మాణ ఖర్చు ఉండదు కాబట్టి, తర్వాతి సంవత్సరాలలో పెట్టుబడి తగ్గి నికర లాభం బాగా పెరుగుతుంది. వాతావరణ మార్పులను తట్టుకుని నిలబడే ఈ విధానం రైతులకు ఆర్థిక భద్రతను చేకూరుస్తుంది. సాధారణ వంగ రకాల పంటకాలం 6–8 నెలలు మాత్రమే కాగా, అంటుకట్టిన వంగ తోట 12 నుంచి 18 నెలల పాటు (కొన్నిసార్లు రెండేళ్లు) దిగుబడినిస్తుంది.పర్మినెంట్ బెడ్సే పంటకు పునాది!వరి పొట్టు బొగ్గుతో కూడిన పర్మినెంట్ బెడ్సే పంటకు పునాది. మట్టి కన్నా 4 రెట్లు ఎక్కువగా నీటిని పట్టి ఉంచే శక్తి దీనికి ఉంది. అందువల్లే, రోహిణీ కార్తెలోనూ రెండు రోజులకోసారి డ్రిప్ నీరిచ్చినా వంగ తోట చూస్తున్నారుగా ఎలా ఉందో? వీడ్ మ్యాట్ లోపలికి వర్షం దిగుతుంది. మట్టికి గాలి ఆడుతుంది. కానీ, కలుపు అసలు పెరగదు. ఒకసారి వేస్తే ఐదేళ్ల వరకు చెక్కుచెదరదు. ఒక పంట అయిపోయాక మరో పంట.. బెడ్స్‌పై మొక్కలు నాటుకోవటమే. ఏళ్ల తరబడి నిలిచే శాశ్వత బెడ్స్‌పై విజ్ఞతతో చేసే సేంద్రియ సేద్యం ఇది. సమతుల్య పోషణపై అవగాహన, క్రమం తప్పని ఆచరణే కీలకం.– శివశంకర్ షిండే (81210 08002), సేంద్రియ వ్యవసాయ నిపుణుడు, బుచ్చిగూడెం, ఫరూక్నగర్ మండలం, రంగారెడ్డి జిల్లానిర్వహణ: పంతంగి రాంబాబు -
మొక్కజొన్న చొప్పతో జెట్ ఇంధనం!
మొక్కజొన్న కంకుల్ని కోసిన తర్వాత మిగిలే ఎండు చొప్పతో జెట్ విమానాలను నడిపే ఖరీదైన ఇంధనాన్ని రూపొందించడం ద్వారా ఖర్చు తగ్గించుకోవటంతో పాటు పర్యావరణ కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు. పశ్చమాసియా యుద్ధం ్ర΄ారంభమైన తర్వాత విమానయాన ఇంధనం ధర రెట్టింపైంది. విమానయాన సంస్థలు పెట్రోలియంకు ప్రత్యామ్నాయాలను కనుగొని, తమ ఉద్గారాలను తగ్గించుకోవాలని చూస్తున్నాయి. మొక్కజొన్న పంట వ్యర్థాలను ఇంధనంగా మార్చడం దీనికి ఒక గొప్ప ఆరంభం కానుంది. ప్రతి పంట కోత కాలం తర్వాత అమెరికాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా మొక్కజొన్న పొలాలు ఎండిన చొప్ప, ఆకులతో నిండి΄ోతాయి. మొక్కజొన్న కంకులను సేకరించిన తర్వాత మిగిలి΄ోయే వ్యర్థాలు ఇవి. కొంతమంది రైతులు ఈ చొప్పను జంతువులకు మేతగా వేస్తారు లేదా పంటల మధ్యన ఆచ్ఛాదనగా లేదా సహజ కం΄ోస్టు ఎరువుగా తయారు చేసి భూసారాన్ని పెంచటానికి ఉపయోగిస్తారు. కానీ, అమెరికా వంటి దేశాల్లో మొక్కజొన్న వ్యర్థాల్లో చాలా భాగం సరిగ్గా ఉపయోగపడకుండానే మిగిలిపోతోంది.వరల్డ్ రిసోర్స్ ఇన్స్టిట్యూట్ (డబ్ల్యూఆర్ఐ) తాజా పరిశోధన ప్రకారం.. విమానయాన రంగంలో ఉద్గారాలను తగ్గించటం అత్యంత క్లిష్టతరమైన పని. అయితే, మొక్కజొన్న వ్యర్థాలను ఈ పని కోసం సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చని తేలింది. మొక్కజొన్న చొప్ప నుంచి జెట్ ఇంధనాన్ని తయారు చేయటం ద్వారా ఈ ఇంధనానికి పెరుగుతున్న డిమాండ్‌ను వాతావరణ మార్పులకు దోహదపడకుండా తీర్చవచ్చు.ఇరాన్‌పై యుద్ధం కారణంగా హోర్ముజ్ జలసంధి మూసివేతతో ముడి చమురుతో తయారయ్యే సాంప్రదాయ జెట్ ఇంధనం ధర ప్రపంచవ్యాప్తంగా ఇటీవల రెట్టింపు అయ్యింది. కానీ, ప్రపంచ ఉద్గారాల్లో 2.4% కాలుష్యానికి కారణమవుతున్న పెట్రోలియం జెట్ ఇంధనానికి ప్రత్యామ్నాయాలను అభివృద్ధి చేసే కృషి ఈ యుద్ధానికి ముందే మొదలైంది. విమాన ప్రయాణానికి డిమాండ్ పెరిగేకొద్దీ, 2050 నాటికి ఈ ఇంధన కాలుష్యం మూడు రెట్లు పెరుగుతుందని అంచనా.చొప్పతో 10% జెట్ ఇంధనంమొక్కజొన్న చొప్ప వ్యర్థాలతో జెట్ ఇంధనం తయారీ ప్రక్రియ మనుషులకూ, పర్యావరణానికీ కూడా మేలు చేసే ఒక మెరుగైన ప్రత్యామ్నాయం అని డబ్ల్యూఆర్ఐ పరిశోధనలో తేలింది. నేల ఆరోగ్యాన్ని కాపాడటానికి పొలాల్లోనే వదిలివేయాల్సిన భాగాన్ని మినహాయించిన తర్వాత, అమెరికాలో ప్రతి సంవత్సరం 9 కోట్ల టన్నుల మొక్కజొన్న చొప్ప అందుబాటులో ఉంటుందని అంచనా. ఇది 300 కోట్ల గ్యాలన్ల నిజమైన సుస్థిర ఇంధనాన్ని ఉత్పత్తి చేయడానికి సరిపోతుంది. ఈ మొత్తం అమెరికా వైమానిక ఇంధన కాలుష్యాన్ని 75% తగ్గింపునకు దోహదపడుతుంది. అంతేకాకుండా, అమెరికా జెట్ ఇంధన అవసరతను 10 శాతం వరకూ తీరుస్తుంది. ప్రస్తుతం అమెరికాలో మొక్కజొన్న ఇథనాల్‌ను జెట్ ఇంధనంగా మార్చుతున్నారు. ఈ పనికి స్వస్తి చెప్పటం ద్వారా ఆహార ధాన్యాలను ఇంధనానికి వాడటం మానుకోవచ్చు. దీని వలన కలిగే ప్రయోజనం కేవలం వాతావరణానికి మాత్రమే పరిమితం కాదు. మొక్కజొన్న చొప్ప ఇంధనోత్పత్తి అనేక ఉద్యోగాలను, ఇతర ఆర్థిక ప్రయోజనాలను సృష్టించగలదని నిపుణులు చెబుతున్నారు. డబ్ల్యూఆర్ఐ పరిశోధన ప్రకారం, సంవత్సరానికి 300 కోట్ల గ్యాలన్ల మొక్కజొన్న చొప్పతో వైమానిక ఇంధనం ఉత్పత్తిలో పెట్టుబడి పెట్టడం వల్ల 99 వేల నుంచి 2.14 లక్షల ఉద్యోగాలు సృష్టించవచ్చు. సంబంధిత ఆర్థిక కార్యకలా΄ాలు వేలాది కోట్ల డాలర్ల పన్ను రాబడి అదనంగా చేకూరుతుందని అంచనా.ప్రాథమిక దశలో పరిశోధనలుమొక్కజొన్న చొప్పను జెట్ ఇంధనంగా మార్చే సాంకేతికతలపై పరిశోధనలు ఇంకా ప్రాథమిక దశలో ఉన్నాయి. సాంప్రదాయ జెట్ ఇంధనాలతో ధరల పరంగా ఈ ప్రత్యామ్నాయ ఇంధనం ఇంతకుముందు వరకు ΄ోటీపడలేక΄ోవడం కూడా ఇందుకు ఓ కారణం. కానీ ఇరాన్‌పై యుద్ధం వంటి భౌగోళిక రాజకీయ సంఘర్షణల కారణంగా సాంప్రదాయ ఇంధన ధరలు భారీగా పెరగడంతో ఈ అంతరం తగ్గుతోంది. దీనివల్ల కొత్త రకాల విమానయాన ఇంధనోత్పత్తి రంగం పెట్టుబడిదారులకు, విమానయాన సంస్థలకు మరింత ఆకర్షణీయంగా మారుతోంది.పరిశోధన, అభివృద్ధికి విధానపరమైన మద్దతు, విస్తరణ ప్రోత్సాహకాలు లేకుండా మొక్కజొన్న చొప్పతో ఇంధనం ఉత్పత్తి సాంకేతికతల అభివృద్ధి యజ్ఞం నెరవేరదు. డబ్ల్యూఆర్ఐ పరిశోధన ప్రకారం, అన్ని సమస్యలకు ఒకే పరిష్కారంగా పనిచేసే సాంకేతికత అంటూ ఏదీ లేదు. దానికి బదులుగా, ఏ సాంకేతికతలకు అత్యధిక సామర్థ్యం ఉందో అర్థం చేసుకోవడానికి, విభిన్న రకాల సాంకేతికతల పరిశోధన, అభివృద్ధికి విధానాల మద్దతు ఇవ్వాలి. మొక్కజొన్న చొప్ప అమెరికాలో అత్యంత సవృద్ధిగా లభించే వ్యవసాయ వ్యర్థం. చొప్ప ఆధారిత విమానయాన ఇంధనోత్పత్తి పరిశ్రమ మన ఇంధన భద్రతకు దోహదపడటంతో పాటు, విమానయాన ఉద్గారాలను తగ్గించి, మొక్కజొన్న ఆధారిత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చెయ్యగలదని నిపుణులు భావిస్తున్నారు. (చదవండి: అడవి పండ్లు: ఆనె పరిగెతో ఇన్ని లాభాలా!) -
అడవి పండ్లు: ఆనె పరిగెతో ఇన్ని లాభాలా!
ఈ అడవి పండుకు ఇంగ్లీష్ పేరు: వైల్డ్ జుజుబె. తెలుగు పేర్లు: గొట్టె తీగ, పిండి పరిఘము, ఆనె పరిగె, తెల్ల పరిగె. అస్సామీస్: బిధావో భోగారి, బోన్ బాగరి, బోన్ బొగోరి, డిండవో బోగన్. ఒరియా: తినకోలి. కన్నడ: కట్టిలండల్, బేలహదు, బిళీముళ్ళిహను, కనిక, కొట్ట ముల్లుహణ్ణు.గుజరాతీ: తోరన్. తమిళం: కట్టిలండల్, తోతరి, తోటన. మలయాళం: జాలి, కొట్టముళ్ళు, తొడలి, తుటరి, మలంతుటలీ. మరాఠీ: తురన్, తోరణ. హిందీ: చూర్ణ, సూరన్. సంస్కృతం: ఘంటా అని పిలుస్తారు. ప్రాంతాలను బట్టి ఉచ్ఛారణలో కొంత తేడా ఉంటుంది. ఇది జిట్ట రేగు కుటుంబానికి చెందినది. దీనికి కూడా ముండ్లు కురచగా జంటగా కానీ ఒంటరిగా కానీ ఉంటాయి. తెల్ల పరిగె దాదాపు 5–7 మీటర్లు ఎత్తు వరకు పెరుగుతుంది. మానుకు దగ్గరలో వేరే చెట్టు ఉంటే దాని సహాయంతో తీగలా కూడా పెరుగుతుంది. రేగు చెట్టులా ఇది కూడా ఆకులు రాల్చుతుంది. పండ్లు తెల్లగా ఉండి, అడుగు భాగాన కొద్ది నాటి కాషాయం రంగు ఉంటుంది. పండ్లు తెల్లగా ఉన్నందున దీనికి చెంచులు ‘తెల్ల పరిగె’ లేక ఆనె పరిగె అని పిలుస్తారు.థాయిలాండ్‌లో దీని ఉనికి ఎక్కువగా ఉంది. ఇండియా, చైనా, మయన్మార్, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక, బాంగ్లాదేశ్ తదితర దేశాల్లోని ఉష్ణ మండల అడవుల్లో పెరుగుతుంటాయి. భారతదేశంలో మాత్రం ఉత్తరప్రదేశ్, బీహార్, వెస్ట్ బెంగాల్, అస్సాం, మధ్య ప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అండమాన్–నికోబార్ దీవుల్లో ఈ చెట్లు ఉన్నాయి. తెలంగాణలోని నల్లమల అడవులలో అక్కడక్కడా ఉన్నాయి. ముఖ్యంగా మల్లాపూర్, కుడిచింత బయలు మొదలగు ప్రాంతాలలో గమనించవచ్చు. అక్కడి చెంచుల అభిప్రాయం మేరకు ఈ చెట్లు చాలా వరకు కనుమరుగవుతున్నాయి. వీటిని అభివృద్ధి పరిచే అవసరం ఎంతైనా ఉంది.ఆనె పరిగె పండు ఉపయోగాలుపండ్లు తెలుపు రంగులో ఆకర్షణీయంగా ఉంటాయి. పండులో గుజ్జు కొంత వరకు పిండిగా ఉండి రుచికరంగా ఉండటం వలన చెంచులు ఈ పండ్లను బాగా ఇష్ట పడుతారు. జీవాలు వీటి ఆకులను బాగా ఇష్టపడతాయి. పంటపొలం చుట్టూ తెల్లపరిగె కొమ్మలను కంచెగా వేసుకొని పశువులు ఇతర జంతువుల నుండి పంటను కాపాడుకోవచ్చు. రాలిన పండ్లను ఉడుతలు, కుందేళ్లు ఇతర జంతువులు ఇష్టంగా తింటాయని చెంచులు అన్నారు.తెల్ల పరిగెను చెంచులు, ఇతరులు అనేక రోగాలను నయం చేయటానికి వాడుతారు. ముఖ్యంగా విరేచనాలు, అల్సర్లు, చర్మ వ్యాధులు, దగ్గు, రక్తపోటు మొదలైన వాటికి వాడతారు.ఈ పండులో ఉన్న ఔషధ, పోషక గుణాలు ఉన్నందు వల్ల పోషక లోపాలను కొంతవరకు అరికట్టవచ్చు. ఆ పండ్లలో కూడా ఇతర పంటల్లో మాదిరిగానే చక్కెర, కొవ్వు, పీచు మొదలైన పదార్ధాలు ఉంటాయి. పోషకాల విశ్లేషణ ఈ పట్టికలో పొందుపరిచాం...పండ్లు: మార్చ్ – ఏప్రిల్ నెలలోకాస్తాయి. 5–7 మీటర్ల ఎత్తు పెరుగుతుందిడాక్టర్ మొరుపోజు పద్మయ్య,విశ్రాంత ప్రధాన శాస్త్రవేత్త, ఐసీఏఆర్ – ఐఐఓఆర్, రాజేంద్రనగర్, హైదరాబాద్.మొబైల్: 94407 08924 (చదవండి: ఏడు నెలల్లో 101 కేజీల నుంచి 65 కేజీలకు..! డైట్ ప్లాన్..) -
సాగుబడి: నీటి భద్రత కోసం.. బోరుకు నీరు తాపండి!
పంట పొలాల్లో లేదా ఇళ్ల దగ్గర ఉన్న బావులు లేదా బోర్ల ద్వారా ఎప్పుడూ నీటిని తీసుకోవటమే కాకుండా.. వర్షాకాలంలో నీటిని తాపి వాటి దాహం తీర్చితే అవి ఎండిపోకుండా ఉంటాయి. పెద్ద వర్షాలు పడినప్పుడు వాన నీటిని వృథాగా మురుగు కాలువల్లోకి, వాగులు వంకల్లోకి పోనివ్వకుండా ఎక్కడివక్కడ ఇంకింపజేసుకుంటే.. అక్కడి బావులు, బోర్లలో కరువు కాలంలో కూడా పంటలకు లేదా ఇంటి అవసరాలకు నీటి కరువే ఉండదు అని భూగర్భ జల నిపుణులు చెబుతున్నారు.నీరు ఎండిపోయిన బోర్ల ద్వారా అయినా లేదా నీరు కొద్దోగొప్పో పోస్తున్న బోర్ల ద్వారా అయినా వర్షపు నీటిని ఇంకింపజేసుకునే అవకాశం ఉంది. నీటికి ఇంకింపజేసుకోవటం చెప్పినంత సులభం కాదు. అలాగని, అసాధ్యమూ కాదు. కొంచెం మనసు పెట్టి బోరు చుట్టూతా గుంత తీసి రాళ్లు, చిప్స్, ఇసుకతో పూడ్చ వలసి వుంటుంది.అయితే, బోరు చుట్టూతా ఇంకుడుగుంత తవ్వుకోవడానికి ముందు మనం తెలుసుకోవలసిన ముఖ్యవిషయం ఏమిటంటే.. అది ఇంటి దగ్గరైనా, పొలంలో అయినా.. మన బోరుకు– నీటిని ఇంకింపజేసుకునే సామర్థ్యం ఉందా? లేదా? అనేది తెలుసుకోవాలి. ఆ సామర్థ్యం ఉంటే, ఎంత మేరకు ఉంది? అనే విషయాలను నిపుణులను సంప్రదించి తెలుసుకోవాలి.మన బోరుకు నీటిని రీచార్జ్ చేయటానికి అవకాశం ఉందని పరీక్షలో తేలితే.. బోరు చుట్టూతా గుంత తవ్వి రాళ్లు, చిప్స్, ఇసుకతో నింపి ఇంకుడుగుంత తయారు చేయాలి. దాని చుట్టూ సిమెంటు పిట్ట గోడ కట్టాలి. వాన నీరు వాలును బట్టి బోరు చుట్టూ నిర్మించిన ఇంకుడుగుంతలోకి వెళ్లేలా దారి ఏర్పాటు చేస్తే.. వర్షాలు పడినప్పుడు పారే నీరు బోరు దగ్గరకు చేరి భూమి లోపలికి ఇంకుతుంది. బోరు కరువు కాలంలో కూడా ఎండిపోకుండా నీటిని అందిస్తుంది. నీటి భద్రత చేకూరుతుంది. బోరు చుట్టూ రీచార్జ్ పిట్గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో బోరు చుట్టూ ఇంకుడు గుంత నిర్మించుకునే విధానం తెలుసుకుందాం. నిర్మాణంలో వివిధ పద్ధతులు ఉన్నాయి. బోరు చుట్టూ గుంత తవ్వాలి. కేసింగ్ పైపుకు సన్నని గాట్లు పెట్టాలి. గుంతను రాళ్లు, చిప్స్, ఇసుకతో దొంతర్లుగా నింపాలి. రాళ్ళపై మెష్‌ని పరచాలి. గుంత చుట్టూ రాతి గోడను నిర్మించాలి. వర్షపు నీటిని వాలుకు అనుగుణంగా గుంత వైపు మళ్ళించాలి. బోరు చుట్టూ ఇంకుడుగుంతను నిర్మించిన తర్వాత ఏడాదికోసారి దానిపై మొక్కలు తీసేసి శుభ్రం చేసుకోవటం ద్వారా నీటి సంరక్షణ సక్రమంగా జరుగుతుంది.- నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ -
పాత మట్టిని మళ్లీ వాడుకోవచ్చా?
టెర్రస్ గార్డెన్ లో ఒకసారి వాడిన మట్టిని తీసి పారెయ్యాలా? మళ్లీ వాడుకోవచ్చా? అని చాలా మందికి సందేహం ఉంటుంది. నిస్సందేహంగా మళ్లీ మళ్ళీ వాడుకోవచ్చు. ప్రతి సారీ కొత్త మట్టి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు.ఎటువంటి పరిస్థితి లో పాత మట్టి మార్చాలి?1. ఎక్కువ ఫంగస్ ఉంటే2. వేరుకుళ్లు వస్తే3. ఉప్పుదనం పెరిగితే.4. మట్టి బిగుసుకుపోతే మార్చాలిపాత మట్టిని మళ్లీ వాడే ముందు చేయాల్సిన పనులు:మొక్క కుండీలోనో మడిలోనో ఒక సీజన్ అంతా పెరిగిన తర్వాత ఆ మట్టిలో ఉన్న నత్రజని, భాస్వరం, పొటాషియం వంటి ప్రధాన పోషకాలు తగ్గిపోతాయి. అలాగే మట్టిలో ఉన్న ఉపయోగకర సూక్ష్మజీవులు తగ్గి, కొన్నిసార్లు హానికర ఫంగస్ పెరుగుతుంది. ఎరువులు లేదా హార్డ్ వాటర్ వాడటం వల్ల ఉప్పదనం పెరిగి.. పోషకాలు తీసుకునే శక్తి వేర్లకు తగ్గుతుంది.పాత మట్టి గట్టిపడి గాలి ప్రసరణ కూడా తగ్గుతుంది. అందుకే పాత మట్టిని నేరుగా కాకుండా, శుభ్రపరచి, మళ్లీ జీవన ఎరువులు కలిపి వాడాలి. పాత మట్టిలో ఉన్న వేర్లు, ఎండిన ఆకులు తీసెయ్యకూడదు. వాటిని అలాగే ఉంచితే మట్టిలో సేంద్రియ కర్బనం పెరుగుతుంది. వేర్లు, ఎండిన ఆకులకు ఫంగస్ ఉంటే తీసేయాలి. మట్టిలో చెత్త తీసేయాలి.మడులు, కుండీల్లో వాడిన మట్టిలో మళ్లీ మొక్కలు, విత్తనాలు వేసే ముందు 2 నుంచి 3 రోజులు ఎండలో ఎండ బెట్టాలి. దీనివల్ల ఫంగస్ తగ్గుతుంది. పురుగు గుడ్లు నశిస్తాయి. మట్టి సహజ శుద్ధి అవుతుంది.నీరు ఎంత పోయాలి?కుండీలో, మడిలో మొక్కలు/విత్తనాలు పెట్టుకున్న తర్వాత ఎప్పుడూ మట్టి ఎండిపోకుండా చూడాలి. మట్టి ఎండిపోతే మనం వేసిన జీవన ఎరువుల్లోని సూక్ష్మ జీవులు చనిపోతాయి. మట్టి ఎప్పుడూ తేమగా ఉండేలా చూడాలి. నీరు ఎక్కువ పోస్తే మనం ఇచ్చిన పోషకాలు కుండీ నుంచి నీటితో పాటు కారిపోతాయి. ఇపుడు ఎండలు బాగా ఉన్నాయి. మిద్దె/పెరటి తోట సేద్యదారులు పాత మట్టి ఎండబెట్టి ఎరువులు కలిపి సిద్ధం చేసుకోవచ్చు.మట్టి మిశ్రమం (పాటింగ్ మిక్స్) తయారీ ఎలా?60% పాత మట్టి20% కంపోస్ట్ (సేంద్రియ ఎరువు)10% కోకోపీట్/వరి పొట్టు 10% వర్మికంపోస్ట్ లేదా ఇసుక కొద్దిగా వేపపిండి, చెక్క బూడిద కొద్దిగా.. కలపాలి. వేరు కుళ్ళుడు రాకుండా కొద్దిగా ట్రైకోడెర్మా కలపవచ్చు. ఈ నిష్పత్తిలో మట్టి మిశ్రమాన్ని కలపడం వల్ల కుండీలు, మడుల్లో గాలి ప్రసరణ పెరుగుతుంది. అదనపు నీరు నిల్వ ఉండదు. వేర్లు బాగా పెరుగుతాయి. మట్టి మిశ్రమం తయారు చేసిన తర్వాత 5 నుంచి 7 రోజులు అలాగే ఉంచితే సూక్ష్మజీవులు చురుకుగా పనిచేస్తాయి. తరువాత కుండీలో, మడిలో వేసుకొని విత్తనాలు, మొక్కలు నాటుకోవటానికి సిద్ధం చేసుకోవచ్చు.- కొల్లి కృష్ణ కుమారి, అడ్మిన్, గుంటూరు జిల్లా,మిద్దె తోటల బృందం, మొబైల్: 94906 02366 - నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ -
సాగుబడి: అల్లిపండు ప్రయోజనాలెన్నో...!
అల్లి పండుకు ఔషధ చెట్టుగా గుర్తింపు ఉంది. సామాన్యంగా దీన్ని కాయం, డెలెక్ బంగాస్, డెలక్ ఏర్, నెమారు అని అంటారు. ఈ చెట్టు గుత్తులుగా పర్పుల్ రంగు పూలు పూస్తుంది. ఈ చెట్లు సామాన్యంగా ఫిబ్రవరి–మార్చి నెలల్లో పూత పూస్తాయి. ప్రాంతాన్ని బట్టి కొంత వ్యత్యాసం ఉండవచ్చు. ఈ చెట్టు ఎక్కువగా ఒక సంవత్సరం పూస్తే ఒక సంవత్సరం పూయదు. పరిస్థితులు అనుకూలిస్తే ప్రతి సంవత్సరం పూస్తుంది. ఈ చెట్టు పూత మీద ఉన్నప్పుడు చాలా అందంగా కనిపిస్తుంది.వాడుక భాషలో అల్లి పండు పేరు:ఇంగీష్ లో ఇరన్ వుడ్. ఒరియాలో నెమరు. కన్నడలో ఒళ్ళయకడి, అరచటే, అలమారు, ఉడి తల్లీ, కన్నవు. తమిళంలో కాయంపు, సిరుగస. తెలుగులో అల్లి చెట్లు. మరాఠీలో అంజనీ, ఆంజన్. మలయాళంలో కన్నావ్, కాయాబూ, కసవు. హిందీలో అంజన్. సంస్కృతంలో అంజన్ అని అనిపిలుస్తారు.పూత:ఫిబ్రవరి – మార్చి వరకుపండ్లు:అక్టోబర్ – నవంబర్ వరకు15 మీటర్ల ఎత్తు: అల్లి చెట్లు మధ్యస్థంగా దాదాపు 15–22 మీటర్ల ఎత్తు పెరిగి సతతహరితంగా ఉంటాయి. చాలా సందర్భాల్లో నేల స్వభావాన్ని బట్టి ఒక మోస్తరుగా పెరుగుతుంది. నల్లమలలో మాత్రం దాదాపు 15 మీటర్ల ఎత్తు వరకు అల్లి చెట్లు పెరిగాయి. అడవుల్లోని కాలువలు, వంకల దగ్గర ఈ చెట్లు ఉంటాయి. ఇవి సముద్ర మట్టానికి దాదాపు 1400 మీటర్ల ఎత్తుప్రాంతాల్లో కూడా పెరుగుతాయి.స్వస్థలం: అల్లి చెట్ట నివాసం (స్వస్థలం) భారతదేశం. వీటి ఉనికి థాయిలాండ్, శ్రీలంక, మైన్మార్, కంబోడియా, లాఓస్, వియత్నాం, మలేషియా, ఇండోనేషియా, ఫిలిప్పైన్స్ తదితర దేశాల్లోనూ ఉంది. మన దేశంలో మాత్రం దక్కను పీఠభూమిప్రాంతంలో అంటే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్రలోని కొన్నిప్రాంతాల్లో ఉంది. నల్లమల అడవుల్లో అల్లి చెట్లు ఒకప్పుడు విస్తారంగా ఉండేవి. కానీ వాటి ఉనికి తగ్గుతుందనవచ్చు. ఈ చెట్టు ఎన్నో ఔషధగుణాలు కలిగినది.ప్రయోజనాలెన్నో...వీటి ఆకుల నుంచి పసుపు రంగు(డ్రై)ని తయారు చేసి అద్దకాలలో వాడుతారు (థాయిలాండ్).నలుపు రంగుకి మారిన పండ్లు చాలా రుచిగా ఉంటాయి. గిరిజనులతో పాటు ఆప్రాంత ప్రజలు ఎక్కువ ఇష్టంగా తినే పండ్లలో ఇది ఒకటి.కలప గట్టిగా ఉండటం వల్ల చిన్న చిన్న వ్యవసాయ పనిముట్ల తయారీకి వాడతారు.మోడుబారిన చెట్లు వంట చెరకుగా బాగా ఉపయోగపడతాయి.బొగ్గు తయారీలో కూడా కలపను వాడతారు.ఈ చెట్ల భాగాలను ఆయుర్వేదం, సిద్ధవైద్యం, నాటు వైద్యంలో వాడతారు.గనేరియా రోగాన్ని తగ్గించచటానికి వీటి ఆకులను ఇతర పదార్థాలలో కలిపి పైపూతకు వాడతారు.దీని వేరు, మానులోని చేవను కలిపి చేసిన కషాయాలను చలి జ్వరం, చికెన్ ఫాక్స్, మీజిల్స్ జబ్బులను తగ్గించడానికి వాడతారు.అల్లి చెట్లు జీవవైవిధ్యానికి పెట్టింది పేరు.అల్లి చెట్టుపై అనేక ప్రయోగాలు జరిగాయి. ముఖ్యంగా ఆకులు, వేర్లు, కాండంపై పరిశోధనలు జరిగాయి. ఈ పండ్లలో ఉండే పోష విలువలను గూర్చి విశ్లేషణ అరుదు.ఈ పండ్లలో విటమిన్లు, ్రపోటీన్లతో పాటు స్థూల, సూక్ష్మ మూలకాలు ఉంటాయి. వీటిపై అధ్యయనం ఎంతైనా అవసరం.వీటి ఆకులలో మాత్రం కొవ్వు, పీచు పదార్ధం క్రూడ్ ప్రోటీన్లు, పిండి పదార్థాలు, సూక్ష్మ, స్థూల పోషకాలు ఉంటాయి. అందువల్ల వైద్య రంగంలో ఎంతో ఉపయోగకారిణి ఈ చెట్టు.ఇంతటి వైవిధ్యమైన ప్రయోజనాలున్న ఈ చెట్టు జీనస్‌లో ఎన్నో జాతులు ఉన్నందున, పరిశోధనలు జరిపి చక్కటి రకాలను అభివృద్ధి చేయొచ్చు.నల్లమల అడవుల్లో అన్ని చోట్లా ఈ పండ్ల చెట్లు లేవు. కాబట్టి, వీటి ఉనికిని కాపాడవలసిన బాధ్యత అందరిపై ఉన్నది.- డాక్టర్ మొరుపోజు పద్మయ్య, విశ్రాంత ప్రధాన శాస్త్రవేత్త,ఐసీఏఆర్ – ఐఐఓఆర్, రాజేంద్రనగర్, హైదరాబాద్. మొబైల్: 94407 08924- నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ -
పొలాల్లో గడ్డిని కాదు.. కర్బనాన్ని కాల్చుతున్నారు!
ఉత్తరాది నుంచి దక్షిణాది వరకు రైతులు చాలా మంది ఏ పంట పండించినా ఆ పంట కోతలయ్యాక మిగిలే (గడ్డి, కొయ్యకాళ్లు, మోళ్లు, కట్టె వంటి) పంట వ్యర్థాలను అనాలోచితంగా తగులబెడుతున్నారు. దీని వల్ల గాలి కలుషితమై వాతావరణం వేడెక్కటంతో పాటు రైతుకు తరాతరాలుగా అన్నం పెడుతున్న పొలంలోని మట్టి నిర్జీవంగా మారుతోంది. మట్టిలో ఉండి పంటకు, రైతుకు మేలు చేసే సూక్ష్మజీవ రాశులు నశిస్తున్నాయి. రైతులు మరింత ఎక్కువగా రసాయనిక, సేంద్రియ ఎరువులు వెయ్యాల్సి వస్తోంది. పంట పూర్తయ్యాక మిగిలే గడ్డి, కట్టె, మోళ్లలో కూడా చాలా పోషకాలు ఉంటాయి. అందుకే, వాటిని కాల్చకుండా తిరిగి మట్టికే ఇచ్చేయాలి. మట్టిలో కలియదున్నటమో, గుంతలో వేసి సేంద్రియ ఎరువును తయారు చేసి పంటలకు వేసుకోవటమో నేర్చుకోవాలని రైతులకు శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.పొలంలో కేవలం రైతులు వేసే ఎరువులతో మాత్రమే పంట పండదు. కంటికి కనిపించకుండా వేర్ల చుట్టూ పనిచేసే సూక్ష్మజీవరాశి సహాయంతో చాలా పోషకాలను పంట మొక్కలు పొందుతాయి. అంటే, మట్టిలో ఉండే సూక్ష్మజీవులు బాగుంటేనే పొలంలో పంట ఆరోగ్యం బాగుంటుంది. దిగుబడి కూడా బాగా వస్తుంది. అయితే, పంట కోసుకున్న వెంటనే గడ్డీ గాదాన్ని, మోళ్లను, కట్టెను సులువైన పని అనుకొని చాలా మంది రైతులు తగులబెడుతున్నారు. ఆ వేడికి మట్టిలో పంటలకు మేలు చేసే సూక్ష్మజీవులు చనిపోతున్నాయి. ఆ తర్వాత అక్కడ సాగు చేసే పంటకు అంతకు ముందు కన్నా ఎక్కువ ఎరువు వెయ్యాల్సి వస్తుంది. పంటకు సూక్ష్మజీవులు చేసే మేలేంటి?ఒక మొక్క లేదా చెట్టు తాను సమకూర్చుకునే పోషకాలను ఏయే విధంగా ఉపయోగిస్తుందో తెలుసా? భూమి పైన పెరిగే కాండం, ఆకులు, కంకులు/ ధాన్యం/ పూలు/కాయల కోసం 40% పోషకాలను ఖర్చు చేస్తుంది. భూమి లోపల పెరిగే వేర్ల కోసం 30% పోషకాలను కేటాయిస్తుంది. మిగతా 30% పోషకాలను తన వేర్లకు చుట్టూ ఉండే మట్టిలోని కోటానుకోట్ల సూక్ష్మజీవరాశి పెరుగుదల కోసం పోషక ద్రవాల (రూట్ ఎక్సుడేట్స్) రూపంలో స్రవిస్తుంది. ఈ పోషక ద్రవాలతో పెరిగే సూక్ష్మజీవులు అందుకు కృతజ్ఞతగా వేర్లకు ఎలా సాయం చేస్తాయో తెలుసా? మట్టిలో నిగూఢంగా ఉన్న అనేక సూక్ష్మ పోషకాలను కరిగించి లేదా రూపం మార్చి వేర్లకు అందిస్తాయి. ఇంకా వివరంగా చెప్పాలంటే.. పంటలు లేదా మొక్కలు ఆరోగ్యంగా ఎదగాలంటే కనీసం 16 రకాల పోషకాలు అవసరం. ఇందులో మూడింటిని వాతావరణం నుంచి తీసుకుంటాయి. 13 పోషకాల్లో కొన్నిటిని మనం రసాయనిక/ సేంద్రియ ఎరువుల రూపంలో అందిస్తున్నాం. మిగతా వాటిని మట్టిలోని సూక్ష్మజీవులు, వానపాములు మాత్రమే అందించగలవు. అంటే.. పంట మొక్కల వేర్లు, మట్టిలోని సూక్ష్మజీవులు పరస్పరం ఆధారపడి జీవిస్తాయన్న మాట. మనం ఇది తెలుసుకోలేక పొలంలోనే కొయ్యకాళ్లు, మోళ్లు వంటి పంట వ్యర్థాలకు నిప్పు పెట్టినప్పుడు ప్రకృతిలోని ఈ సమతుల్యతను మనమే చేజేతులా పాడు చేసుకుంటున్నా మని రైతులు గుర్తించాలి. ధాన్యం కన్నా గడ్డి బరువు ఎక్కువ‘వరి పంట ద్వారా కిలో ధాన్యం దిగుబడి వస్తుంటే కిలో కన్నా 15 గ్రాముల బరువైన గడ్డి (ధాన్యం–గడ్డి నిష్పత్తి 1:1.5) మనకు అందుబాటులోకి వస్తుంది. ఈ గడ్డిలో ఉండే పోషకాలను కాల్చి వృథా చెయ్యకుండా తిరిగి ఆ మట్టిలోనే కలియదున్ని కుళ్లింపజెయ్యటమో లేదా గుంతలో వేసి కుళ్లించి సేంద్రియ ఎరువుగా మార్చి పంటలకు వెయ్యటమో చెయ్యటం ద్వారా ఎరువుల ఖర్చు తగ్గుతుంది. పంటలకూ మేలు జరుగుతుంద’ని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో మట్టి శాస్త్ర విభాగం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ మేకల శంకర్ ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు. ఒక అంచనా ప్రకారం మన దేశంలో 50 కోట్ల టన్నుల పంట వ్యర్థాలు వస్తున్నాయి. వివిధ అవసరాలకు వాడుకోగా 10 కోట్ల టన్నుల గడ్డి, కట్టె మిగులుతోంది. ఇతర ఇబ్బందులతో పాటు అవగాహన లేమితో రైతులు 2.5 కోట్ల టన్నుల వ్యర్థాలను తగులబెడుతున్నారు. వరి గడ్డి, కొయ్యకాళ్లు, పత్తి కట్టె, మొక్కజొన్న చొప్ప, కంది కట్టె వంటి వాటిని కాల్చేస్తున్నారు. వెయ్యబోయే రెండో పంటకు ఎక్కువ రోజుల వ్యవధి లేదనో, కూలీలు దొరకలేదనో, ఖర్చు పెట్టలేకనో నిప్పుపెడుతున్నారు. మనది ఉష్ణమండల ప్రాంతం కావటంతో భూమిలో సేంద్రియ కర్బనం అతి తక్కువగా 0.01 నుంచి 0.3% వరకు మాత్రమే ఉంది. రైతుల దగ్గర ఆవులు, ఎద్దులు, పాడి పశువులు తగ్గిపోవటంతో పశువుల ఎరువు వెయ్యటం లేదు. పైగా కొయ్యకాళ్లు, తదితర వ్యర్థాలను తగులబెట్టటం చాలా అనర్థాలకు దారితీస్తోంది. పొలంలో ఒక టన్ను పంట వ్యర్థాలను తగులబెడితే ఆ వేడికి మట్టిలోని 400 కిలోల సేంద్రియ కర్బనం, 20 కిలోల నత్రజని, భాస్వరం 12–13 కిలోలు, పొటాషియం 30–35% వరకు గాలిలో కలిసి పోతుంది. ఈ విధంగా మట్టిలో జీవవైవిధ్యం తగ్గిపోవటంతో ఆ పొలంలో పోషకాల అసమతుల్యత ఏర్పడుతున్నది. వ్యర్థాలను మట్టిలో కలియదున్ని, డీకంపోజర్ చల్లితే కుళ్లి నేల సారవంతం అవుతుంది. లేదంటే గుంత తవ్వి గడ్డీ గాదాన్ని అందులో వేసి, పేడ నీళ్లు, సింగిల్ ఫాస్పేట్ వేసి మట్టితో కప్పి పెడితే 3 నెలల్లో మంచి సేంద్రియ ఎరువు తయారవుతుంది. ఎంత చెప్పినా రైతుల్లో మార్పు రావట్లేదు. భూమిని ముందు తరాలకు అందించాలన్న తపన ఉన్న రైతులైనా కదలాలి. ఏదైనా చెయ్యండి, పంట వ్యర్థాలకు నిప్పు మాత్రం పెట్టొద్దు. – డాక్టర్ మేకల శంకర్, ప్రధాన శాస్త్రవేత్త, మట్టి శాస్త్ర విభాగం, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం నిర్వహణ: పంతంగి రాంబాబు -
వ్యవసాయానికి జీవవైవిధ్యం ఎందుకు ముఖ్యమైనది?
ప్రపంచవ్యాప్తంగా మే 22న పాటించే అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం ఈ ఏడాది ‘ప్రపంచవ్యాప్త ప్రభావం కోసం స్థానికంగా పనిచెయ్యటం’ అనే అంశంపై దృష్టి కేంద్రీకరిస్తోంది. అంతర్జాతీయ జీవవైవిధ్య సదస్సు సచివాలయం సమన్వయంతో ఈ సంవత్సరం జీవవైవిధ్య దినోత్సవం ముఖ్య ఉద్దేశం కున్మింగ్–మాంట్రియల్ గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్‌వర్క్‌లో ΄పొందుపరిచిన 23 ప్రతిష్టాత్మక లక్ష్యాలను నెరవేర్చేందుకు ఎక్కడికక్కడ స్థానికంగా చేసే అనేక రోజువారీ పనులు నేరుగా దోహదపడతాయి. వీటిలో వ్యవసాయం కీలక పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే ప్రపంచంలోని నివాసయోగ్యమైన భూమిలో వ్యవసాయం దాదాపు సగభాగాన్ని ఆక్రమిస్తుంది. ఇది పర్యావరణ వ్యవస్థపై ఒత్తిడికి ప్రాథమిక చోదకంగానూ, పర్యావరణ పునరుద్ధరణకు కీలక పరిష్కారంగానూ పనిచేస్తుంది.ముఖ్యాంశాలు:ప్రపంచంలోని 75% పైగా ఆహార పంటలు, 35% ప్రపంచ పంట దిగుబడులు తేనెటీగలు, సీతాకోకచిలుకల వంటి మేలుచేసే వాటి ద్వారా జరిగే పరాగ సంపర్కంపై ఎక్కువగా ఆధారపడి ఉంటాయి.వ్యవసాయంలో అధిక స్థానిక రకాల విత్తనాలు, పశు జాతుల వైవిధ్యం ద్వారా తీవ్ర వాతావరణ సంఘటనలు, తెగుళ్ల వ్యాప్తి, మారుతున్న వాతావరణ ఒత్తిళ్లను తట్టుకునే శక్తిని పెంపొందుతుంది.భూమిలోని ఎన్నెన్నో విభిన్న సూక్ష్మజీవుల సమూహాలు, శిలీంధ్రాలు, సూక్ష్మజీవులు ఉంటాయి. పోషకాలను విచ్ఛిన్నం చేసి, కార్బన్‌ను సంగ్రహించి, దీర్ఘకాలంలో నేల సారాన్ని పెంపొందిస్తాయి.విభిన్నమైన దేశవాళీ లేదా స్థానిక విత్తన రకాలను పరిరక్షించడం ఎందుకు అవసరమంటే.. ఏదో ఒకటే పంటను నిరంతరం సాగు చేసే ఏక పంటల వైఫల్యాల ముప్పు నుంచి తరతరాల పంట పొలాలను కాపాడుతుంది.2026 థీమ్‌కు అనుగుణంగా ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం(యూఎన్ఈపీ), ఆహార – వ్యవసాయ సంస్థ(ఎఫ్ఏఓ)లు ప్రకృతి/ సేంద్రియ/ బయోడైనమిక్/ ఆగ్రోఫారెస్ట్రీ తదితర స్థానిక సుస్థిర వ్యవసాయ మార్గాలను ప్రోత్సహించమని వివిధ దేశాల, రాష్ట్రాల ప్రభుత్వాలకు సూచిస్తున్నాయి.రైతులు, స్థానిక సంఘాలు స్థానికంగా అనుసరిస్తున్న తేనెటీగల పరిరక్షణ చర్యలను పెంపొందించటానికి విషపూరిత రసాయన వ్యవసాయంపై ఆధారపడటాన్ని తగ్గించటం, సామూహిక విత్తన బ్యాంకులను స్థాపించటం అవసరమని ఎఫ్ఏవో నొక్కి చెబుతోంది.స్థానిక ప్రజలను వైవిధ్యమైన సంప్రదాయ ఆహారోత్పత్తుల వినియోగం వైపు ప్రోత్సహించటం జీవవైవిధ్య పరిరక్షణకు ముఖ్యం. శాకాహారపు అలవాట్ల వైపు మళ్లించడం, అలాగే స్థానిక పంటలను ప్రోత్సహించటం వల్ల బహుళ పంటల సాగు పెరిగి, ఆ మేరకు జీవవైవిధ్యానికి నష్టం చేసే ఏక పంట(మోనోకల్చర్) వ్యవసాయాన్ని తగ్గిస్తుంది.ఈ సంవత్సరం చివర్లో ఆర్మేనియాలో జరగనున్న ఐక్యరాజ్యసమితి జీవవైవిధ్య సదస్సు (కాప్17)లో పర్యావరణంలో జీవవైవిధ్యానికి కలుగుతున్న నష్టాన్ని అరికట్టడానికి ప్రపంచ దేశాలు పునరంకితం కావాల్సిన అవసరం ఉంది.నిర్వహణ: పంతంగి రాంబాబు సాక్షి సాగుబడి డెస్క్( చదవండి: Rice Husk: వరిపొట్టుతో ఇన్ని ఉపయోగాలా..!) -
అడవి ద్రాక్షతో ఇన్ని ప్రయోజనలా..!
వాడుక భాషలో అడవి ద్రాక్షకు వేర్వేరు భాషల్లో వేర్వేరు పేర్లున్నాయి: అస్సామీలో గోవాలియా లత, పానిలత అని, ఇంగ్లీష్ లో వైల్డ్ గ్రేప్, జంగల్ అంగూర్, దిబ్రోలి అని, ఒరియాలో పనికచో, పానినోహ, దిబ్రోయి, కంజినోయి, పానిపరు అని, కన్నడలో చితహంబు, కడుద్రాక్ష, కట్టుకోడి మిండ్రి అని, గుజరాతీలో జంగ్లీ డ్రక్ అని, తెలుగులో అడవి ద్రాక్ష, అడవి తీగ ద్రాక్ష, బెడసతివ్వ, దొబ–తీగ, పుల్ల తీగ, బెంగాలీ లో గొవాలియా–లత అని, మరాఠీలో ఒకేల, నడెన, రాన్ ద్రాక్ష గోలింద్ అని, మలయాళంలో వియ–పిర–పిటిచ, కరంట వల్లీ, చంబ్రవల్లీ అని, హిందీలో గొలిండ, కట్టిబేల్, పనిబేల్ అని, సంస్కృతంలో ఆమ్ల వెటసహ, వన ద్రాక్ష అని అంటారు. నేపాలీలో పురేని అంటారు. పూత : మే – ఆగస్టు పండ్లు : డిసెంబర్ – జనవరిదీనికి 1824లో ‘విటిస్ లాటి ఫోలియా’ అనే శాస్త్రీయ పేరు పెట్టిన 60 ఏళ్ల తర్వాత ‘అంపెలోస్పిస్ లటిఫోలియా’గా పేరు మార్చారు. వీటి పండ్లు ద్రాక్ష గుత్తుల మాదిరిగా ఉంటాయి. పండిన తర్వాత ఎరుపు నలుపు రంగుకు మారుతాయి.English Name:Wild Grape/Jungal Angoorశాస్త్రీయ నామం: అంపేలో సిస్సన్ లటిఫోలియాScientific Name: Ampelocissus latifolia (Roxb.) Planch.Synonym (s): Vitis latifolia Roxb. Cissus latifolia (Roxb.) Walp.కుటుంబం: విటేసిFamily: Vitaceaeఉనికి: ద్రాక్ష మాదిరిగానే దీనికి కూడా పాకుడు గుణం ఉంది. వీటికి వేరు గడ్డలు ఉంటాయి. గడ్డలు నాటుకోవచ్చు లేదా∙విత్తనం కూడా వేసుకోవచ్చు. ఎంతో విలువైన తీగ చెట్టు. ఈ పండ్లలో 2–4 గింజలు ఉంటాయి. ఈ తీగ చెట్టు స్వస్థలం భారత ఉపఖండం, బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక మాల్దీవులు మొదలగు దేశాలలో గుర్తించారు.మన దేశంలో ఎక్కువగా అస్సాం, ఈస్ట్ హిమాలయాల వరుస, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్, కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మొదలగు రాష్ట్రాల్లో అడవి ద్రాక్ష కనిపిస్తుంది. అధిక వర్షపాతం ఉన్న అడవుల్లో ఎక్కువగా ఉంటుంది. నల్లమల అడవుల్లో ఒకప్పటి సాంద్రత ప్రస్తుతం లేదు. దీనిపై ఉన్నత స్థాయి పరిశోధనలు జరిగినప్పటికీ దీని ప్రయోజనాలు ప్రజల చెంతకు చేరలేదు.ప్రయోజనాలుఅడవి ద్రాక్ష పండ్లు తినదగినవే. ఇవి సాధారణ ద్రాక్ష గుత్తుల్లాగే మొదట ఆకుపచ్చగా ఉండి ఎరుపునకు మారి ఆ తరువాత నలుపు రంగుకు మారతాయి. వగరు తీపితో కూడుకొని ఉంటాయి.ఈ తీగ చెట్టుకు ఔషధగుణాలు ఉన్నాయి.ఎన్నో పోషక విలువలు ఉన్నందున వీటిని తినడం వల్ల రోగ నిరోధకశక్తి పెరుగుతుంది.వీటి నుంచి ఎర్రరంగును తయారు చేస్తారు. ఈ రంగుకు మార్కెట్లో గిరాకీ ఉంది. ఈ గింజల నుంచి పలుకులను వేరు చేసి తింటారు. ఈ పలుకులు మొర్లి పలుకులను పోలి ఉంటాయి.అనేక రోగాలను తగ్గించటానికి నాటు వైద్యంలో వీటిని ఉపయోగిస్తారు. ముఖ్యంగా విరేచనాలు, బొల్లి, పంటి సమస్యలు, కడుపు నొప్పి, గౌట్, టీబీ అజీర్తి, శరీరపు వీక్ నెస్ తదితర సమస్యల నుంచి ఉపశమనం కోసం వాడుతారు.ఎముకల పటిష్టతకు ఉపయోగిస్తారు.ఆయుర్వేద, హోమియో మందుల తయారీలో కూడా ఉపయోగిస్తారు. ఈ తీగ చెట్ల వినియోగం తప్ప భద్రపరచడం తక్కువ కాబట్టి రానున్న రోజుల్లో ఈ జాతి అంతరించే ప్రమాదం ఉంది.దీనిపై నిర్దిష్టమైన పరిశోధనలు చేసి ఫలితాలను రైతుల చెంతకు చేర్చితే అనేక విధాలుగా లబ్దిపొందవచ్చు. అంటు ద్రాక్ష మొక్కల తయారీకి వీటి కొమ్మలను రూట్ స్టాక్‌గా వాడవచ్చు.ఈ పండ్లలో ఆల్కేన్ ఈస్టర్స్, అమెన్స్, కిటోన్స్, హల్డే హైట్స్ తదితర ఆమ్లాలు ఉంటాయి. డాక్టర్ మొరుపోజు పద్మయ్య,విశ్రాంత ప్రధాన శాస్త్రవేత్త, ఐసీఏఆర్ – ఐఐఓఆర్, రాజేంద్రనగర్, హైదరాబాద్.మొబైల్: 94407 08924 నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడిడెస్క్ (చదవండి: Rice Husk: వరిపొట్టుతో ఇన్ని ఉపయోగాలా..!) -
వరిపొట్టుతో ఇన్ని ఉపయోగాలా..!
వరిపొట్టు (ఊక)ను ఇంటిపంటలు, పెరటి తోటలు, మిద్దె తోటల్లో మొక్కల పెంపకంలో ఉపయోగించవచ్చు. ఊక మొక్కల పెరుగుదలకు, నేల స్వభావాన్ని మెరుగుపరచడానికి ఎంతో తోడ్పడుతుంది. వరి పొట్టును ప్రధానంగా మట్టి నిర్మాణాన్ని మెరుగుపరచడానికి వాడవచ్చు. కుండీల్లో లేదా తోట మట్టిలో వరిపొట్టును కలపడం వల్ల మట్టి గట్టిపడకుండా గుల్లగా ఉంటుంది. ఇది వేర్లు సులభంగా వ్యాపించడానికి సహాయపడుతుంది. మట్టిలో తేమను ఎక్కువ కాలం పట్టి ఉంచడమే కాకుండా, అదనపు నీరు కుండీలు, మడుల్లో నుంచి బయటకు వెళ్లేందుకు సహాయపడుతుంది. ఎండకాలంలో మొక్కల మొదళ్లలో వరి పొట్టును మల్చింగ్ చెయ్యటం లేదా పరచడం ద్వారా మట్టిలోని తేమ ఆవిరి కాకుండా కాపాడవచ్చు.కాల్చిన వరి పొట్టు లేదా వరిపొట్టు బయోచార్ను కూడా వాడొచ్చు. దీని వల్ల మట్టికి పొటాషియం అందుతుంది. హానికరమైన శిలీంధ్రాల నుండి రక్షణ లభిస్తుంది. కుండీలకు మట్టిని సిద్ధం చేసేటప్పుడు సుమారు 10–20% వరకు వరి పొట్టును కలిపితే మంచి ఫలితం ఉంటుంది. పచ్చి వరి పొట్టు నేరుగా వాడటం కంటే, కొద్దిగా ఎండినది లేదా కాల్చినది వాడటం వల్ల తెగుళ్ల భయం ఉండదు. వరి పొట్టులో సిలికాన్ ఉంటుంది. దీన్ని మట్టిలో కలపటం లేదా పొట్టు కాల్చిన బూడిదను వాడటం వల్ల మొక్కలకు సహజంగా సిలికాన్ అందుతుంది. సిలికాన్ వల్ల మొక్క కాండం గట్టిగా మారుతుంది. దీనివల్ల గాలికి లేదా వర్షానికి మొక్కలు నేలవాలకుండా నిటారుగా పెరుగుతాయి. మట్టిలో మాంగనీస్, అల్యూమినియం వంటి లోహాల విషపూరిత ప్రభావాన్ని తగ్గించి, ఇతర పోషకాలు మొక్కకు సరిగ్గా అందేలా వరిపొట్టు చేస్తుంది.- కొల్లి కృష్ణ కుమారి,అడ్మిన్, గుంటూరు జిల్లా మిద్దె తోటల బృందంమొబైల్: 94906 02366 చదవండి: మిద్దెతోటల్లో కోకో పీట్తో ఇన్ని ఉపయోగాలా..?! -
పంటల దిగుబడులపై ఎల్‌నినో తీవ్ర ప్రభావం : ఐసీఏఆర్ వార్నింగ్
సాక్షి, న్యూఢిల్లీ: ఈ ఏడాది దేశంలో సూపర్ ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉంటుందని, దీని కారణంగా పంటల దిగుబడులు గణనీయంగా తగ్గే ప్రమాదముందని భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్) వెల్లడించింది. గతంలో ఇదేమాదిరి ఎల్‌నినో పరిస్థితులు తలెత్తినప్పుడు వరి సహా మొక్కజొన్న, సజ్జ వంటి వర్షాధార పంటల ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడిందని తెలిపింది. ఈసారి పంటల దిగుబడులు కనీసం 10 శాతం మేర తగ్గుతాయని అంచనా వేసింది. నైరుతి రుతు పవనాలతో సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఇప్పటికే అంచనా వేసింది. జూన్– సెప్టెంబర్ మధ్య కాలంలో తక్కువ వర్షాల కారణంగా నీటి కొరత తలెత్తే ప్రమాదం ఉందని ఐసీఏఆర్ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో 2002, 2004, 2009 సీజన్లలో ఎల్‌నినో ఏర్పడినప్పుడు 77 జిల్లాల్లో వరి దిగుబడి 10 శాతానికి పైగా పడిపోగా, మొక్కజొన్న ఉత్పత్తి 65 జిల్లాల్లో ఇదే స్థాయిలో తగ్గినట్లు గుర్తించింది. ఇదీ చదవండి: 120 ఏళ్ల తర్వాత చిగురించిన ఆశముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, బిహార్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాల్లో వరిపై ఎల్‌నినో ప్రభావం ఎక్కువగా కనిపించి నట్లు తెలిపింది. ఇదే సమయంలో జొన్న, సజ్జ దిగుబడులు కూడా 36 జిల్లాల్లో 10 శాతానికి పైగా తగ్గినట్లు గుర్తించామంది. వర్షాధార ప్రాంతాలే ఎల్‌నినో ప్రభావానికి ఎక్కువగా గురవుతున్నాయని వివరించింది. ఈ ఏడాది సైతం ఎల్‌నినో పరిస్థితులు కొనసాగనున్న నేపథ్యంలో ముందస్తు చర్యలు చేపట్టాలని ఐసీఏఆర్ సూచించింది. కరువును తట్టుకునే విత్తనాల ప్రోత్సాహం, వాతావరణ ఆధారిత వ్యవసాయ సలహాలు, సమర్థవంతమైన నీటి నిర్వహణ, ప్రాంతాల వారీగా ప్రత్యేక వ్యూహాల అమలు ద్వారా రైతుల నష్టాలను తగ్గించాలని రాష్ట్రాలకు సూచించింది. ఇదీ చదవండి: మేయర్ పీఠంపై ఇండియన్ ఎవరీ తుషార్ కుమార్? -
సమతుల్య పోషణతోనే సేంద్రియ దిగుబడులు
సేంద్రియ కూరగాయల సాగులో ఒకటికి నాలుగు రకాల సేంద్రియ ఎరువులు, జీవన ఎరువులు కలిపి వాడినప్పుడు మాత్రమే అన్ని రకాల పోషకాలు సమతుల్యంగా అందుతాయని, తద్వారా అత్యుత్తమ దిగుబడులు సాధించగలమని తాజా పరిశోధనలు రుజువు చేస్తున్నాయి. హైదరాబాద్‌లోని మల్లారెడ్డి విశ్వవిద్యాలయం, పరివృద్ధి ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో పాలీహౌస్లో రెడ్ క్యాబేజీ, కాలీఫ్లవర్ పంటలను ప్రయోగాత్మకంగా పూర్తిగా సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో సాగు చేస్తూ 2025–26 శీతాకాల పంటలో ఉత్తమ ఫలితాలు సాధించారు. మల్లారెడ్డి యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ డీన్ డాక్టర్ ఎ. రాజారెడ్డి పర్యవేక్షణలో హార్టికల్చర్ అసిస్టెంట్ ్రపొఫెసర్లు డా. సీహెచ్ షణ్ముఖి, డా. టి. శిరీష నిర్వహిస్తున్న ఈ మూడేళ్ల పరిశోధనా ప్రాజెక్టుకు భారతీయ కిసాన్ సంఘ్‌కు చెందిన సేంద్రియ/ప్రకృతి వ్యవసాయ నిపుణులు ఎం.ఎస్. సుబ్రహ్మణ్యం రాజు సాంకేతిక సలహాదారుగా వ్యవహరిస్తున్నారు.కాలీఫ్లవర్ ఎకరానికి 8 టన్నులుపూర్తిగా సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లో పాలీహౌస్లో ఎత్తు మడులపై కాలీఫ్లవర్‌ను వివిధ రకాల, వివిధ మోతాదుల్లో సేంద్రియ ఎరువులను వినియోగిస్తూ 9 రకాల కాంబినేషన్లతో ప్రయోగాత్మక సాగు చేశారు. హెక్టారుకు 25 టన్నుల పశువుల ఎరువు మాత్రమే వాడుతూ పాలీహౌస్లో కాలీఫ్లవర్ సాగు చేస్తే 5.8 టన్నుల దిగుబడి వచ్చింది. అయితే, కోళ్ల ఎరువుతో పాటు 3 రకాల జీవన ఎరువులు వాడితే అత్యధికంగా హెక్టారుకు 8 టన్నులకుపైగా సేంద్రియ కాలీఫ్లవర్ దిగుబడి వచ్చింది. హెక్టారుకు 7.5 టన్నుల కోళ్ల ఎరువుతో పాటు వామ్ 5 కిలోలు, అజోస్పిరిల్లం 2 కిలోలు, పీఎస్బీ 5 కిలోలు వాడినప్పుడు అత్యధికంగా ఒక్కో కాలీఫ్లవర్ బరువు 825 గ్రాములు తూగింది. ఎకరానికి పది వేల మొక్కల చొప్పున 8టన్నులకు పైగా దిగుబడి వచ్చింది. అయితే, జీవన ఎరువులతో పాటు వర్మీ కంపోస్టు లేదా జీవామృతం లేదా లిగ్నైట్ కలిపి వాడినప్పుడు.. కోళ్ల ఎరువుతో పాటు జీవన ఎరువులు వాడినప్పటికన్నా తక్కువ దిగుబడి రావటం విశేషం.రెడ్ క్యాబేజీ ఎకరానికి 9 టన్నులుపూర్తిగా సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లో పాలీహౌస్లో ఎత్తు మడులపై రెడ్ క్యాబేజీ పంటను వివిధ రకాల, వివిధ మోతాదుల్లో సేంద్రియ ఎరువులను వినియోగిస్తూ 6 రకాల కాంబినేషన్లతో ప్రయోగాత్మక సాగు చేశారు. పాలీహౌస్లో హెక్టారుకు 25 టన్నుల పశువుల ఎరువు మాత్రమే వాడితే హెక్టారుకు 5 టన్నుల రెడ్ క్యాబేజీ దిగుబడి వచ్చింది. అయితే, హెక్టారుకు 25 టన్నుల పశువుల ఎరువుతో పాటు మరో 4 రకాల సేంద్రియ ఎరువులు వాడితే హెక్టారుకు అత్యధికంగా 9 టన్నులకుపైగా సేంద్రియ రెడ్ క్యాబేజీల దిగుబడి వచ్చింది. హెక్టారుకు 5 టన్నుల పశువుల ఎరువు, వర్మీకంపోస్టు 2 టన్నులు, వేపపిండి 1 టన్ను, లిగ్నైట్ 2 టన్నులు, ద్రవరూప జీవన ఎరువులు 2 లీటర్లు వాడారు. ఒక్కో రెడ్ క్యాబేజీ బరువు 962 గ్రాములు తూగింది. ఎకరానికి పది వేల మొక్కల చొప్పున 9 టన్నులకు పైగా దిగుబడి రావటం విశేషం. అయితే, పశువుల ఎరువు అసలు వాడకుండా.. హెక్టారుకు వర్మీకంపోస్టు 2 టన్నులు, వేపపిండి 1 టన్ను, లిగ్నైట్ 2 టన్నులు, ద్రవరూప జీవన ఎరువులు 2 లీటర్లు వాడినప్పుడు ఒక్కో రెడ్ క్యాబేజీ బరువు 935 గ్రాములకు మాత్రమే పెరిగింది.సమతుల్య పోషణే కీలకంసేంద్రియ సాగులో పంటలకు అవసరమైన అన్ని పోషకాలనూ సమతుల్యంగా తగు పాళ్లలో అందించగలిగినప్పుడే రసాయన సేద్యంతో సమానంగా దిగుబడులు సాధించటం సాధ్యమవుతుందని మల్లారెడ్డి యూనివర్సిటీలో తాజా పరిశోధనలు తేల్చాయి. పాలీహౌస్ ప్రయోగాత్మక సాగులో ఎకరానికి 8 టన్నుల కాలీఫ్లవర్, 9 టన్నుల రెడ్ క్యాబేజీ దిగుబడులు మాకు సంతృప్తి కలిగించాయి. అన్ని యూనివర్సిటీలూ ఈ దిశగా పరిశోధనలు చేస్తే రైతులకు మంచి ఆదాయంతో పాటు వినియోగదారులకు ఆరోగ్యదాయకమైన ఆహారం లభిస్తుంది. – ఎం.ఎస్. సుబ్రహ్మణ్యం రాజు (76598 55588), సేంద్రియ/ప్రకృతి వ్యవసాయ నిపుణులుసేంద్రియ పరిశోధనలు కొనసాగిస్తాంపూర్తిగా సేంద్రియ కూరగాయల సాగులో మూడేళ్ల పరిశోధనా ప్రాజెక్టు తొలి ఏడాది ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయి. మరో రెండు సంవత్సరాలు ఈ ప్రయోగాలు కొనసాగిస్తాం. సేంద్రియ ఎరువుల యాజమాన్యం, దిగుబడుల స్థిరీకరణ చేసి పూర్తి ఫలితాలు ఆ తర్వాత ప్రకటిస్తాం. – డాక్టర్ ఎ. రాజారెడ్డి, డీన్, స్కూల్ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్, మల్లారెడ్డి యూనివర్సిటీనిర్వహణ: పంతంగి రాంబాబు -
మిద్దెతోటల్లో కోకో పీట్తో ఇన్ని ఉపయోగాలా..?!
మిద్దెతోటలు లేదా టెర్రస్ గార్డెన్లు లేదా పెరటి తోటల్లో కోకో పీట్ (కొబ్బరి పొట్టు) వాడకం మొక్కల ఎదుగుదలకు ఎంతో మేలు చేస్తుంది. ఇది కొబ్బరి పీచు నుంచి తయారయ్యే ఒక సేంద్రియ పదార్థం. దీని ఉపయోగాలు ఎన్నో ఉన్నాయి:1 కోకో పీట్ తన బరువు కంటే 8–10 రెట్లు ఎక్కువ నీటిని పీల్చుకొని నిల్వ ఉంచుకోగలదు. దీనివల్ల మొక్కల వేర్లకు ఎక్కువ సేపు తేమ అందుతుంది, వేసవిలో కూడా మొక్కలు త్వరగా ఎండిపోవు.2 మట్టి కంటే కోకో పీట్ చాలా తక్కువ బరువు ఉంటుంది, కాబట్టి మేడపై కుండీల వల్ల భారం పడకుండా ఉంటుంది.3 దీని నిర్మాణం గుల్లగా ఉండటం వల్ల వేర్లకు గాలి బాగా అందుతుంది. ఇది మొక్క వేర్లు బలంగా, ఆరోగ్యంగా పెరగడానికి సహాయపడుతుంది.4 విత్తనాలతో మొక్కలు పెంచటానికి ఇది ఒక అద్భుతమైన మాధ్యమం. ఇందులో విత్తనాలు చాలా వేగంగా మొలకెత్తుతాయి.5 ఎర్రమట్టి లేదా ఇతర రకాల మట్టితో కలిపి వాడినప్పుడు, ఇది నేల బిగుసుకుపోకుండా చూస్తుంది.6 ఇది కొబ్బరి వ్యర్థాల నుండి తయారవుతుంది కాబట్టి పూర్తిగా సహజమైనది, పర్యావరణానికి ఎటువంటి హాని చేయదు.7 కూరగాయల మొక్కల వేర్లు త్వరగా విస్తరించడానికి కోకో పీట్ మట్టిని గుల్లగా ఉంచుతుంది. 30% కోకో పీట్ + 40% ఎర్రమట్టి + 30% వర్మీ కంపోస్ట్ లేదా పశువుల ఎరువు కలుపుకోవాలి. టమాటా, పచ్చిమిర్చి, బెండ వంటి కూరగాయలు మొక్కలకు ఈ మిశ్రమం ద్వారా పోషకాలు, తేమ సమపాళ్లలో అందుతాయి.8 పూలు బాగా పూయాలంటే నేలలో గాలి ప్రసరణ (ఎయిరేషన్) ఉండాలి. 40% కోకో పీట్ + 20% ఇసుక + 40% వర్మీ కంపోస్ట్ కలిపి మట్టి మిశ్రమం తయారు చేసుకోవాలి. మందార, గులాబీ, చామంతి వంటి మొక్కల కుండీల్లో నీరు నిల్వ ఉండకుండా, అదనపు నీరు సులభంగా బయటకు పోయేలా కోకో పీట్ సహాయపడుతుంది.9 నిమ్మ, జామ, దానిమ్మ లాంటి పండ్ల మొక్కలు ఎక్కువ కాలం కుండీల్లోనే ఉండాలి కాబట్టి మట్టి గట్టిపడకుండా ఉండటం ముఖ్యం. 25% కోకో పీట్ + 50% ఎర్రమట్టి + 25% కంపోస్ట్, కొద్దిగా వేప పిండి కలిపి మట్టి మిశ్రమం తయారు చేసుకోవాలి. ఇది మొక్క వేర్లు బలంగా నాటుకోవడానికి, ఎక్కువ పండ్లు కాయడానికి అవసరమైన పోషకాలను నెమ్మదిగా విడుదల చేస్తుంది.10 మార్కెట్లో దొరికే కోకో పీట్ బ్లాక్స్‌ను ఉపయోగించే ముందు.. నీటిలో నానబెట్టి, అది మెత్తగా అయ్యాక అందులోని లవణాలను పోగొట్టడానికి 2–3 సార్లు నీటితో కడిగి, తర్వాత వాడాలి.11 కోకో పీట్ మట్టిని గుల్లగా ఉంచుతుంది కాబట్టి, అదనపు నీరు కుండీ అడుగున ఉన్న రంధ్రాల ద్వారా సులభంగా బయటకు పోతుంది.12 కుండీలలో మట్టి కొన్ని రోజుల తర్వాత రాయిలా గట్టిగా మారుతుంది. కోకో పీట్ కలిపితే మట్టి ఎప్పుడూ మెత్తగానే ఉంటుంది, దీనివల్ల వేర్లకు ఆక్సిజన్ బాగా అందుతుంది.13 కోకో పీట్లో సొంతంగా పోషకాలు ఉండవు. అది కేవలం ఒక మాధ్యమం మాత్రమే. కాబట్టి, తప్పనిసరిగా వర్మీ కంపోస్ట్ లేదా ఏదైనా సేంద్రియ ఎరువు కలిపితేనే మొక్కకు బలం అందుతుంది.14 మిద్దె తోటలో కుండీల్లో వాడటం కోసం మట్టి మిశ్రమాన్ని తయారు చేసేటప్పుడు వరి పొట్టు, కోకో పీట్ రెండూ ఉపయోగకరమైనవే.15 వరి పొట్టు మట్టిలో గాలి ప్రసరణను మెరుగుపరచడానికి, నీరు త్వరగా బయటకు వెళ్లడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇది మట్టిని గుల్లగా ఉంచుతుంది, తద్వారా వేర్లకు గాలి అందుతుంది. అదనపు నీరు నిలవకుండా బయటకుపోతుంది.16 వరి పొట్టులో సిలికా అధికంగా ఉంటుంది, ఇది మొక్కల కణజాలాన్ని దృఢపరిచి తెగుళ్లు, వ్యాధులను తట్టుకునే శక్తిని ఇస్తుంది.17 వరి పొట్టు కోకో పీట్ కంటే నెమ్మదిగా కుళ్ళిపోతుంది, కాబట్టి కుండీలో మట్టి ఎక్కువ కాలం గట్టిపడకుండా ఉంటుంది. ఇది సాధారణంగా కోకో పీట్ కంటే చౌకగా లభిస్తుంది. – కొల్లి కృష్ణ కుమారి, మిద్దె తోటల సాగుదారు, గుంటూరుమొబైల్: 9490602366నిర్వహణ: పంతంగి రాంబాబుసాక్షి సాగుబడిడెస్క్ చదవండి: అపురూపమైన అడవి మామిడి పండ్ల జాతులు -
అపురూపమైన అడవి మామిడి
వాడుక భాషలో అడవి మామిడి పండును తెలుగులో కొండ మామిడి, టౌర మామిడి, ఆద్వము అని కూడా పిలుస్తారు. అస్సామీలో ఆమ్రత అని, ఇంగ్లీష్‌లో ఇండియన్ హాగ్ ప్లం, వైల్డ్ మ్యాంగో అని, ఒరియాలో అంబడు, అంబ అని, కన్నడలో కడంబట్టే, అంబట్టేమర, పూండి, డి. గుడ్ల మాటే, ఆమెటి, గాయగిడ, గొడడకాయ, మరాహున్నె, కొడలిమావు అని, గుజరాతిలో అంబాడ అని, తమిళంలో అంబాళం, కింకం, పలుచకయి అని, బెంగాలీలో ఆమ్ర, ఆమడ, అంబడ అని, మరాఠీలో అమడ, అంబడ అని, మలయాళంలో అంపఝం అని, హిందీలో అంబారి, అమర, అంబర అని, సంస్కృతంలో ఆమ్రత, ఆమ్రతక, మెతుల అని పిలుస్తారు.పూత కాలం ఫిబ్రవరి – మార్చి. పండ్ల కాలం: జూన్–జులై.అడవి మామిడి చెట్టు మాను గట్టిగా ఉండి, బెరడుపై బూడిద పూసినట్లు ఉంటుంది. మానుకు దెబ్బ తగిలినప్పుడు జిగురు వస్తుంది. ఈ చెట్టు కూడా ఔషధగుణాలు కలిగి ఉంటుంది. ఈ చెట్లకు పూత ఫిబ్రవరి–మార్చి నెలల్లో వస్తుంది. కాలం అనుకూలిస్తే జనవరిలో కూడా పూత మొదలవుతుంది. పండ్లు మాత్రం జూన్–జులై మాసాలలో వస్తాయి. కానీ, ఈ ప్రక్రియ ప్రాంతాలను బట్టి పూత–కాతలో మార్పులు ఉండవచ్చు.ఉనికికొండ మామిడి ఎక్కువగా కొండల్లో కోనల్లో ఉంటుంది. సముద్ర మట్టానికి దాదాపు 1200 మీటర్ల (3,900 అడుగులు) ఎత్తు వరకు గల ప్రాంతాల్లో కనిపిస్తుంది. ఈ చెట్లు ఉష్ణమండల ప్రాంతాల్లో పెరుగుతుంది. ఇది సతత హరితం. కానీ కొన్ని సందర్భాల్లో ఆకులు రాల్చుతుంది. వీటి జీనస్‌లో 17 జాతులు ఉన్నాయి.అడవి మామిడి స్వస్థలంభారత్, శ్రీలంక, ఆగ్నేయాసియా, మయన్మార్, నేపాల్ దేశాలు. ఇండియాలో ఎక్కువగా ఉన్న ప్రాంతాలు: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఒరిస్సా, కేరళ, వెస్ట్ బెంగాల్, అండమాన్, నికోబార్ దీవులు. అస్సాం, హిమాలయ దిగువ శ్రేణులు మొదలగు ప్రాంతాల్లో కూడా పెరుగుతాయి. ఈ చెట్లు దాదాపు 25 మీటర్ల ఎత్తువరకు పెరుగగలవు. అలాగే అన్ని ప్రాంతాలలో వీటి పండ్ల వినియోగం ఉన్నది. వీటిపైన పరిశోధనలు ఉన్నప్పటికీ, రైతుల చెంతకు చేరిన దాఖలాలు చాలా తక్కువే. వీటిపైన నిరంతర పరిశోధన జరగవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ చెట్లు నల్లమల అడవుల్లో వంకల వెంబడి, సెలయేర్ల వెంబడి అధికంగా ఉన్నాయి.ఉపయోగాలెన్నో...అడవి మామిడి చెట్టు ఎన్నో ఉపయోగాలతో కూడుకున్నది. కలప నిర్మాణ రంగంలో తాత్కాలిక పనులకు ఎంతగానో ఉపయోగపడుతాయి (సెంట్రింగ్ చెక్క, నగిషీలు చేయటానికి, బొమ్మల తయారీ మొదలైనవి)ఇది ప్లైఉడ్ తయారీలో ముఖ్యమైన వస్తువు. అగ్గిపెట్టెలు, పుల్లల తయారీకి వాడుతారు. క్రేట్స్, బాక్స్‌ల తయారీలో ఉపయోగిస్తారు.ఆకులను మేకలు, పశువులు తింటాయి.కొమ్మలు వంట చెరకుగా ఉపయోగపడతాయి.పండ్లను పిల్లలు ఇష్టంగా తింటారు. పులుపు–తీపి కలబోసినట్లు ఉంటాయి.వీటి కాయలను ఊరగాయ పచ్చడి పెట్టడానికి ఉపయోగిస్తారు. అట్లే పండ్ల నుండి జామ్ కూడా తయారు చేస్తారు.కాయలను చెక్కు తీసి ఒరుగు చేసుకోవచ్చు. ఆ ఒరుగును పప్పు, ఇతర కూరల్లో వేసుకుంటే పులుపుతో కూడిన రుచి వస్తుంది.గిరిజనులు అడవి మామిడి ఒరుగు చేసుకుంటారు. వీటిని వానాకాలం, చలికాలాల్లో పప్పుకూరలు, ఇతర కాయకూరలలో వాడుతారు.వీటి లేత ఆకులు, పూత, పండ్లు, వేర్లు, బెరుడును గిరిజనులు నాటు వైద్యంలో వాడుతారు. అట్లే ఆయుర్వేదంలో కూడా వినియోగిస్తున్నారు.వీటి పండ్లు, వేర్లు ఎక్కువ దప్పికను నివారించడానికి వాడతారు. వీటి బెరుడు విరేచనాలను అరికట్టడానికి ఉపయోగిస్తారు. బహిష్టు క్రమబద్ధం చేయటానికి వేర్లను ఉపయోగిస్తారు. వేర్లను రుబ్బగా వచ్చిన గుజ్జును నీళ్ళల్లో కలుపుకొని తాగితే మధుమేహ సమస్య అదుపు అవుతుంది.అడవిమామిడి ఉపయోగాలు అనేకం ఉన్నాయి. క్యాన్సర్ కారకాలను, మైక్రోబియల్ చర్యలను అదుపు చేయగల శక్తి ఈ పండ్లకు ఉంది. పండ్ల గుజ్జు కీళ్లనొప్పిని తగ్గిస్తుంది.పోషక విలువలు (100 గ్రా. అడవి మామిడి పండ్ల గుజ్జులో)పోషకాలు విలువప్రోటీన్లు 0.7%కొవ్వు 3.0%పీచు పదార్థం 1.0%పిండి పదార్ధాలు 4.5%ఖనిజాలు 0.5%కాల్షియం 36.0 మి.గ్రా.భాస్వరం 11.02 మి.గ్రా.ఇనుము 3.9 2 మి.గ్రా.థయామిన్ 0.02 మి.గ్రా.రిబోఫ్లేవిన్ 0.02 మి.గ్రా.నికోటిన్ ఆసిడ్ 0.3 మి.గ్రా.విటమిన్ సి 21.0 మి.గ్రా.విటమిన్ ఎ 450 మైక్రో గ్రాములు–––––––––––––––––––––––––––––––––––( ౌuటఛ్ఛి: ఈౖఐ:10.130.40/్ఖ్క ఖ.0975–8232.5(4).1138–45)అడవి మామిడిపై పరిశోధనలు ఎంతైనా అవసరం. వీటి ఉనికిని, సాంద్రతను పెంచగలిగితే వాతావరణానికి ఎంతో మేలు జరుగుతుంది. అడవి మామిడి సతత హరితం, కాబట్టి ఆకులు రాల్చే చెట్ల కన్నా అధికంగా ఆక్సిజన్ విడుదల చేస్తుంది. అపురూపమైన అడవి పండ జాతులుమన దేశంలోని అడవుల్లో వందల కొలదీ మనుషులు తినదగిన, పోషకాలతో కూడిన అనేక జాతులు పండ్ల చెట్లు, మొక్కలు ఉన్నాయి. వీటిలో అతి ముఖ్యమైన కొన్ని పండ్ల జాతులను ఎంచుకొని పరిశోధనలను ముమ్మరం చెయ్య గలిగితే ఆ పండ్ల చెట్లను కూడా భవిష్యత్తులో రైతుల తోటల్లోకి, పెరటి తోటల్లోకి ఈ అరుదైన అడవి పండ్ల జాతులను ప్రవేశపెట్టవచ్చు అంటున్నారు భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలికి అనుబంధంగా రాజేంద్రనగర్‌లో ఉన్న భారతీయ నూనె గింజల పరిశోధనా సంస్థలో ప్రధాన శాస్త్రవేత్తగా కొన్నేళ్ల క్రితం ఉద్యోగ విరమణ చేసిన డాక్టర్ మొరుపోజు పద్మయ్య అంటున్నారు. ఆయన తన బాల్యంలో అడవుల్లో తిరుగుతూ రుచి చూసిన 65 రకాల అడవి పండ్ల జాతులపై లోతైన పరిశోధన చేసి, ‘ఆదరణ కరవైన అడవి పండ్లు– పోషక, ఔషధ నిధులు’ పేరుతో చక్కటి పుస్తకాన్ని వెలువరించారు. ఈ అపురూపమైన అడవి పండ్ల జాతులను పరిరక్షించుకోవటంతో పాటు ఈ మొక్కలను రైతులకు అందుబాటులోకి తేవటం ద్వారా ప్రజల ఆహారంలో పౌష్టికాహార స్థాయిని, వైవిధ్యాన్ని పెంపొందించవచ్చని, పర్యావరణంలోనూ జీవవైవిధ్యాన్ని పెంపొందించవచ్చని డాక్టర్ పద్మయ్య అంటున్నారు. ‘సాగుబడి ప్లస్’ పేజీలో ప్రతి శుక్రవారం ఒక్కో అడవి పండ్ల జాతి గురించి ఆయన అందిస్తున్న సమగ్ర సమాచారాన్ని ధారావాహికగా ప్రచురించడానికి సమ్మతించినందుకు డా. పద్మయ్యకు ధన్యవాదాలు. ఈ సమాచారం పాఠకులకు ఎంతో ఉపకరిస్తుందని ఆశిస్తున్నాం.– డాక్టర్ మొరుపోజు పద్మయ్య, విశ్రాంత ప్రధాన శాస్త్రవేత్త, ఐసీఏఆర్ – ఐఐఓఆర్, రాజేంద్రనగర్, హైదరాబాద్.మొబైల్: 94407 08924 – ఎడిటర్, సాక్షి (చదవండి: పాలలో ఆ నేల రుచి ఉంటుంది!) -
కరువు కాలపు పంట బ్రహ్మజెముడు
ముళ్ళు లేని బ్రహ్మజెముడు (స్పైన్‌లెస్ కాక్టస్) కరువుప్రాంతాల్లో రైతులకు చక్కని పశుగ్రాసం సహా 5 రకాలుగా ఉపయోగపడే ఒక చక్కని పంట. వాతావరణ మార్పులను తట్టుకోగల పంట. తక్కువ నీటితో పెరుగుతుంది. సారహీనమైన నేలల్లో కూడా (చౌడు భూముల్లో తప్ప) పెరుగుతుంది. ఇప్పటికే ఉన్న తోటల్లో మధ్యలో వరుసలుగా దీన్ని పెంచవచ్చు. ఇది చిన్న రైతులను ఆదుకునే పంట. కరువు పీడిత రైతులకు బహుళ ఆదాయ మార్గాలను సృష్టిస్తుంది. సుస్థిర జీవనోపాధిని కల్పిస్తుంది.హెక్టారుకు 80 నుంచి 100 టన్నులుముళ్ళు లేని బ్రహ్మజెముడు ఒక్కసారి నాటితే 25 సంవత్సరాలకు పైగా ఫలసాయాన్నిచ్చే దీర్ఘకాలిక పంట. చిన్న పండ్లతో సహా ఈ చెట్టులోని ప్రతి భాగం విలువైన పశువుల మేతగా ఉపయోగపడుతుంది. తక్కువ ఖర్చుతో సమకూరే పచ్చిమేతను అందిస్తుంది. సంవత్సరానికి హెక్టారుకు 80 నుంచి 100 టన్నుల వరకు బ్రహ్మజెముడు ఆకుల దిగుబడి వస్తుంది. కరువు సమయంలో నమ్మకంగా, తక్కువ ఖర్చుతో కూడిన పశుగ్రాసాన్ని అందిస్తుంది. తద్వారా పశుగ్రాస ఖర్చులను తగ్గిస్తుంది. దీని ఆకులను అంగుళం ముక్కలుగా కోసి పశువులకు మేపాలి. పాలిచ్చే పశువులకు రోజుకు 10–15 కిలోలు (రోజువారీ పచ్చిమేతలో 25% వరకు) మేపవచ్చని కర్నాల్‌లోని ఎన్డీఆర్ఐ నిపుణులు చెబుతున్నారు. ఇతర పశువులకు రోజుకు 8–12 కిలోల వరకు, ఆర్నెల్లు పైబడిన దూడలకు 2–4 కిలోలు మేతగా ఇవ్వొచ్చు. క్రమంగా అలవాటు చెయ్యాలి.బయోగ్యాస్ తయారీకి ఉపయోగంముళ్ళు లేని బ్రహ్మజెముడు బయోగ్యాస్ తయారీకి అద్భుతంగా ఉపయోగపడుతుంది. దీని ఆకులకు 60–65% మీథేన్‌ను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. బయోగ్యాస్ తయారీ తర్వాత వెలువడే స్లర్రీ విలువైన సేంద్రియ ఎరువుగా ఉపయోగపడుతుంది. 3 కిలోల బ్రహ్మజెముడు ఆకులతో 3.38 చదరపు అడుగుల విస్తీర్ణం గల బయో–లెదర్ షీట్‌ను తయారు చేయొచ్చు. దీనితో రెండు జతల బూట్లు లేదా మూడు చిన్న బ్యాగులు తయారు చేయవచ్చు. దీని పండ్లు పోషక విలువలతో కూడి ఉంటాయి. దీని ఆకులను కూరగానూ వండుకొని తినొచ్చు.ఎవరిని సంప్రదించాలి?ముళ్లులేని బ్రహ్మజెముడు పంట సాగును వ్యాప్తిలోకి తేవాలంటే రైతులకు దీని గురించి తెలియజె΄్పాలి. నాటుకునే బ్రహ్మజెముడు ఆకులను అందించాలి. మార్కెట్‌ను అనుసంధానం అవసరం. పరిశోధనా సంస్థలు, ప్రభుత్వ శాఖలు, ప్రైవేట్ సంస్థలు కలసి పనిచేస్తే ఈ కరువు కాలపు పంటను వేగంగా రైతులకు అందించవచ్చు.ఉత్తరప్రదేశ్‌లోని భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్) అనుబంధ సంస్థ ఇండియన్ గ్రాస్‌ల్యాండ్ అండ్ ఫాడర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ దీనిపై విస్తృతంగా పరిశోధనలు చేసింది. అదనపు సమాచారం కోసం డా. శివ్ కుమార్ అగర్వాల్‌ను సంప్రదించవచ్చు. sk.agrawal@cgiar.org -
వేడి ఒత్తిడి నివారణ ఎలా?
పాడి ఆవులు, గేదెల పెంపకంలో వేడి ఒత్తిడి ఒక కీలకమైన సమస్య. ఇది పాల దిగుబడిపై, పునరుత్పత్తిపై, మొత్తం పశువుల శ్రేయస్సుపై గణనీయ ప్రభావం చూపుతుంది. పశువులు తమ శరీరంలోని అధిక వేడిని బయటకు పంపటానికి ఇబ్బంది పడినప్పుడు ఒత్తిడికి గురవుతాయి. ఆవులు, గేదెలు 5 నుంచి 25 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రత ఉంటే సౌకర్యంగా ఉంటాయి. ఆపైన పెరిగే వేడితో పాటు గాలిలో అధిక తేమ శాతం కూడా వేడి ఒత్తిడిని కలిగిస్తుంది. ఫలితంగా మేత తీసుకోవటం తగ్గుతుంది. పాల ఉత్పత్తి పడిపోతుంది. ఆవులు, గేదెలలో వేడి ఒత్తిడిని తగ్గించడానికి పోషకాహార నిర్వహణ, నివాస మార్పులు, మెరుగైన నిర్వహణ పద్ధతులతో కూడిన బహుముఖ విధానం పాటించటం అవసరమని అక్షయకల్ప ఆర్గానిక్కు చెందిన పశువైద్య నిపుణులు డాక్టర్ తేజేశ్వర రెడ్డి (63669 59100) అంటున్నారు.వేడిమి ఒత్తిడి అంటే ఏమిటి?పశువులు శరీరంలోని వేడిని బయటకు సమర్థవంతంగా వదలలేనప్పుడు శరీరంలో వేడి భారం పెరిగి ఒత్తిడి ఏర్పడుతుంది. ఎక్కువ పాలు ఇచ్చే ఆవులు/గేదెలపై వేడి ఒత్తిడి ప్రభావం ఎక్కువగా ఉంటుంది.వేడిమి ఒత్తిడితో పశువులకు నష్టాలు:→ మేత తీసుకోవటం 10–20% తగ్గుతుంది. → ఆ మేరకు పశువుల ఒంట్లో శక్తి తగ్గుతుంది.→ పాల ఉత్పత్తి తగ్గుతుంది.→ దూడల్లో పెరుగుదల మందగిస్తుంది.→ చూడి కట్టే అవకాశాలు తగ్గుతాయి. → రోగ నిరోధక శక్తి తగ్గుతుంది.→ అబార్షన్లు, వడదెబ్బ, మరణం సంభవించవచ్చు.వేడిమి భారం సూత్రంశరీరంలో పుట్టిన వేడి + వాతావరణం నుంచి గ్రహించిన వేడి – శరీరం నుంచి బయటికి వదిలే వేడి = మొత్తం వేడి భారం→ వాతావరణ మార్పు, తీవ్రమైన వేడి పశువుల ఆరోగ్య రక్షణకు కీలకమైన సవాళ్లుగా మారాయి.→ ఇతర పశువుల కన్నా అధిక పాల దిగుబడినిచ్చే పాడి పశువులు ఎక్కువగా వేడి ఒత్తిడికి గురవుతాయి.→ శరీర అంతర్గత ఉష్ణోగ్రత పెరుగుతుంది.→ ఆవుల కన్నా గేదెలు వేడి ఒత్తిడికి ఎక్కువగా గురవుతాయి. ఎందుకంటే గేదెలకు వేడిని శరీరం నుంచి బయటకు వదిలేందుకు స్వేద గ్రంధులు తక్కువగా ఉంటాయి. వాటి నలుపు శరీర రంగు ఎక్కువ వేడిని గ్రహిస్తుంది.మేత నిర్వహణ:→ ఉదయం/ రాత్రి చల్లటి సమయాల్లో మాత్రమే మేత వెయ్యండి. → అధిక పీచు పదార్థాలు (ఎండు గడ్డి) మేపటం తగ్గించాలి. → పచ్చిమేత/ సైలేజ్ ఇవ్వాలి. → ఎలక్ట్రోలైట్లు, విటమిన్ సి, ఇ, సెలీనియం.. ఇవ్వాలి.→ ప్రొ బయోటిక్స్– ఎంజైమ్‌లు ఇవ్వాలి.చల్లపూటే పనులు→ పశువులపై ఒత్తిడిని తగ్గించడానికి పాలు పితకటం, మేత పెట్టటం, వాటిని పట్టుకొని కడగటం వంటి పనులను పగటి పూట చల్లగా ఉండే సమయాల్లోనే చేయండి.→ మధ్యాహ్నం ఎండు మేత ఇవ్వకూడదు.పర్యవేక్షణ:→ అధికంగా ఆయాస పడుతున్నాయా? శ్వాస రేటు పెరిగిందా? మేత తినటం తగ్గిందా? వంటి వేడి ఒత్తిడి సంకేతాల కోసం పశువుల శరీర పరిస్థితిని, ప్రవర్తనను క్రమం తప్పకుండా గమనిస్తూ ఉండండి.అత్యవసర ప్రణాళికలు:→ అతి తీవ్రమైన వేడి పరిస్థితుల్లో ఇబ్బంది వస్తే ఏం చెయ్యాలో అత్యవసర ప్రణాళికలను రూపొందించుకోండి.→ పశువులను త్వరగా చల్లబరిచే మార్గాలు ఆలోచించిపెట్టుకోండి. → అత్యవసరమైన వైద్య సహాయం అందించండిగాలి ప్రసరణ – శీతలీకరణ→ పశువుల షెడ్డులో నిలువు ఫ్యాన్లు అమర్చాలి ∙మిస్టర్లు/ స్ప్రింక్లర్లు వినియోగించాలి.→ పశువుల శాల లేదా షెడ్లోకి గాలి బాగా వచ్చి ΄ోయేలా చూసుకోండి. → పశువుల శరీరంపై నేరుగా నీటిని చల్లండి. → తడిపిన గోనె సంచులను పశువుల శరీరంపై కప్పండి. → షెడ్లో ఎక్కువ పశువులను ఉంచకుండా రద్దీగా లేకుండా చూసుకోండి. ఎందుకంటే ఇది వాటి శరీరంలో వేడి ఉత్పత్తి తగ్గటానికి, గాలి ప్రసరణ పెరగటానికి దోహదపడుతుంది.షెడ్డు నిర్వహణ→ పశువులకు షెడ్‌కు పక్కనే అదనంగా చెట్ల నీడ ఉండేలా చూడాలి లేదా షేడ్ నెట్‌ను కట్టి నీడ ఏర్పాటు చెయ్యటం ద్వారా వేడిమి ఒత్తిడిని తగ్గించవచ్చు. → షెడ్ పైకప్పుపై తెల్లని పెయింట్ వేస్తే వేడి తక్కువగా ఉంటుంది. → షెడ్ ఎత్తు 12–14 అడుగులు; ΄÷డవు 8–10 అడుగులు ఉంటే గాలి ΄ారాడుతూ వేడి తీవ్రత తగ్గుతుంది. నీటి నిర్వహణ→ శుభ్రమైన నీటిని పశువులకు ఇవ్వాలి. రోజంతా నిరంతరాయంగా అందించాలి.→ వేడి వాతావరణంలో ఆవులు/ గేదెలు ఆయాసం, చెమట ద్వారా శరీర ఉష్ణోగ్రతను నియంత్రించుకోవటానికి ఎక్కువ నీరు తాగుతాయి. → 24 గంటలూ చల్లని నీరు ఇవ్వాలి. నీటి ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉండాలి. → వేసవిలో నీటి తొట్టెల సంఖ్య పెంచాలి. → గేదెలు నీటిలో మునగటానికి ఇష్టపడతాయి.→ అందుకోసం వాలో ట్యాంకులు ఏర్పాటు చెయ్యాలి. నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
పాలలో ఆ నేల రుచి ఉంటుంది!
పచ్చిక బయళ్లు పరిరక్షించబడే చోట అత్యంత ఆరోగ్యదాయకమైన పాల ఉత్పత్తులను సమాజానికి అందించవచ్చని అంటున్నారు జార్జియా దేశానికి చెందిన మహిళా రైతు నీనా. ఊరికి దగ్గర్లో ఉండే పచ్చిక బయళ్లను పరిరక్షించుకుంటూ ఉండబట్టే తమ జీవనం ఒదిదొడుకుల్లేకుండా సజావుగా సాగుతోందని ఆమె అంటున్నారు. ఒకప్పుడు పచ్చిక బయళ్లలోకి వెళ్లటం, పాడి పరిశ్రమ పనులు చేపట్టటం మహిళలకు సంబంధం లేని విషయంగా ఉండేదట. అయితే, పట్నం నుంచి స్వగ్రామానికి తిరిగొచ్చిన ఆమె పట్టుదలతో కొద్ది సంవత్సరాలుగా ‘పచ్చిక బయళ్ల ఆధారిత డెయిరీ రైతు’గా నిలదొక్కుకున్నారు. తనలాంటి చిన్న మహిళా పాడి రైతుల నుంచి పాలు కొనటం ద్వారా వారికి స్థిరంగా సొంత ఆదాయం వచ్చేలా చేస్తున్నారామె. అంతేకాదు, మరుగునపడిన ‘డో’ అనే ఒక పాతకాలపు ప్రత్యేక జార్జియన్ పాల ఉత్పత్తిని తిరిగి అందుబాటులోకి తేవటం నీనా చేసిన మరో మంచి పని!జార్జియా దేశంలోని కాస్పి సామూహిక పచ్చిక బయళ్లలో మహిళా రైతు నీనో నుగ్జరాష్విలి కృషి ప్రత్యేకమైనది. ఆమె భర్త తమ పాడి పశువులను మేత కోసం తోలుకు΄ోతుండగా, ఆమె తమ పశువుల పాలను అనేక రకాల సురక్షితమైన, అధిక–నాణ్యత గల పాల ఉత్పత్తులుగా మార్చే పనిలో నిమగ్నమవుతుంటుంది. ఆమె స్వయంగా పశువులను మేపడం అరుదుగా చేస్తుంటుంది. అందుబాటులో ఉన్న ఆ పచ్చిక బయళ్లే వారి జీవనాధారంగా నిలిచాయి. ‘సహజమైన పచ్చిక బయళ్లలో దొరికే మేతే మాకు సర్వస్వం. తక్కువ ఖర్చుతో పాలను ఉత్పత్తి చెయ్యటానికి పచ్చిక బయళ్లు మాకు ఆధారం. ఈ సహజమైన పచ్చిక వల్ల పాలకు పూర్తిగా భిన్నమైన నాణ్యత వస్తుంది. దొడ్డిలో పశువులను కట్టేసి మేపే పద్ధతిలో పెరిగే పశువుల పాల రుచి, విశాలమైన పచ్చిక బయళ్లలో తిరుగాడుతూ పెరిగే పశువుల పాల రుచికి, నాణ్యతకు సాటి రాదు..’ అంటారు నీనో. ‘ఒకప్పుడు మహిళలు పచ్చిక బయళ్లకు వెళ్లలేరని లేదా పశువులను మేపలేరని నమ్మేవారు, కానీ ఈ రోజుల్లో మహిళలు అవన్నీ చేస్తున్నారు..’ అని చీజ్ తయారీ పనులు చేస్తూనే ఆమె చెప్పారు.చాలా సంవత్సరాల క్రితం నీనో తన గ్రామాన్ని విడిచిపెట్టి జార్జియాలోని పర్వత ప్రాంతమైన త్సాల్కా మునిసిపాలిటీకి వెళ్లి.. స్థానికుల దగ్గర జున్ను తయారీ కళను నేర్చుకుంది. జార్జియన్ సుల్గుని, ఇమెరులి, ఇతర సాధారణ రకాల జున్నులను తయారుచేసే రహస్యాలను నేర్చుకుంది.ఆమె కుటుంబం ఆరు సంవత్సరాల క్రితం తన గ్రామానికి తిరిగి వచ్చి రెండు ఆవులను పెంచుకుంటూ పాలు అమ్మకుండా, ఆ పాలతోజున్ను, వెన్న, ‘డో’ అనే ఒక అరుదైన పురాతన (పాలను పులియబెట్టి తయారు చేస్తారు) పాల ఉత్పత్తిని తయారు చేయటం ప్రారంభించింది. ప్రస్తుతం ‘డో’ జార్జియాలో దాదాపుగా కనుమరుగైపోయింది. ‘డో’కి ఘాటైన రుచి, గొప్ప చరిత్ర ఉన్నాయని ఆమె వివరిస్తుంది. అది మా మార్కెట్లో కనిపించటమే లేదు. నేను దాన్ని నెమ్మదిగా మార్కెట్లోకి తిరిగి తీసుకురావాలనుకున్నాను అన్నారామె. ‘డో’ తయారీకి ఎక్కువ శ్రమపడాలి. సరైన యంత్ర పరికరాలు సమకూర్చుకోలేకుండా ఆర్థికంగా నిలదొక్కుకోవడం కష్టం. ‘డో’ను పునరుద్ధరించడానికి ఆమె చేస్తున్న ప్రయత్నాల గురించి వార్త వ్యాపించడంతో, మార్కెట్ స్పందించింది. దాదాపుగా మర్చిపోయిన ఈ ఉత్పత్తికి చప్పున అధిక డిమాండ్ ఏర్పడింది. అయితే, పాలను ‘డో’గా ఉత్పత్తి చేయడానికి, ప్రాసెస్ చేయడానికి అవసరమైన పరికరాలు నీనో వద్ద ఇంకా లేవు. ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార–వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏఓ) ఆర్థిక తోడ్పాటుతో ఆమె పాశ్చరైజర్ తదితర యంత్ర పరికరాలను సమకూర్చుకోగలిగింది. అంతేకాకుండా, శిక్షణ కూడా పొందింది.నీనో సమాజంలో, గ్రామీణ మనుగడకు సామూహిక పశువుల మేత భూములు అత్యవసరం. అయితే, భూమి లభ్యతపై ఆందోళన పెరుగుతోంది. కేవలం రెండు లేదా మూడు ఆవులు ఉన్న కుటుంబాలు దాదాపు పూర్తిగా బహిరంగ పచ్చిక బయళ్లపైనే ఆధారపడి ఉన్నాయి. కొన్ని ప్రాంతాలలో, భూముల అమ్మకాలు, భూమి క్షీణత, పచ్చిక బయళ్లలోకి ప్రవేశించే అవకాశాల్లేక΄ోవటం కారణంగా అనేక గ్రామాలు ఇబ్బంది పడుతున్నాయి. కొన్ని ్ర΄ాంతాలలో పచ్చిక బయళ్లు ఇప్పటికే పూర్తిగా కనుమరుగయ్యాయి. కొంతమంది రైతులు తమ పశువులను అమ్ముకోవలసి వచ్చింది.పచ్చిక బయళ్ళు కేవలం పాల ఉత్పత్తికి తోడ్పడే వ్యవస్థలు మాత్రమే కాదు. అంతకంటే ఎంతో ఎక్కువ. జీవవైవిధ్యాన్ని, సాంస్కృతిక సంప్రదాయాలను, ఆహార వారసత్వాన్ని పచ్చిక బయళ్లు నిలబెడతాయి. ‘సహజంగా పెరిగిన గడ్డిని ఆరుబయట తిరుగుతూ పశువులు మేయడం వల్ల వచ్చే పాలలో ఆ నేల రుచి ఉంటుంది. అది మనల్ని మన పర్యావరణానికి, మన చరిత్రకు అనుసంధానిస్తుంది..’ అని ఆమె అన్నారు. ఎఫ్ఏఓ శిక్షణా తరగతుల్లో చేరిన కొద్దికాలానికే, నీనో మ్యాచింగ్ గ్రాంట్‌ను కూడా ΄పొందింది. దీనితో ఆమె పాశ్చరైజర్, మిల్క్ కూలర్, మిల్క్ ఎనలైజర్ వంటి ఆధునిక పరికరాలను కొని ఉపయోగించగలుగుతోంది. ఆమె వంటి 11 వేల మంది జార్జియా మహిళా రైతులకు ఈ ఏడాది మ్యాచింగ్ గ్రాంట్, శిక్షణను ఇచ్చింది. ఈ సంవత్సరం వారిదే!2026ని ఐక్యరాజ్యసమితిలోని ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏవో) నీనా వంటి పచ్చిక బయళ్లపై ఆధారపడి పశువులను పెంచుకొని జీవనోపాధి పొందే రైతులపై దృష్టిని కేంద్రీకరించేందుకు ‘అంతర్జాతీయ పచ్చిక బయళ్ళు– పశుపోషకుల సంవత్సరం’గా, ‘అంతర్జాతీయ మహిళా రైతు సంవత్సరం’గా కూడా జరుపుతోంది. పశుపోషకులు, మత్స్యకారుల నుండి ప్రాసెసర్లు, వ్యాపారులు, గ్రామీణ పారిశ్రామికవేత్తల వరకు ఉన్న మహిళా రైతుల కృషికి జేజేలు పలకటమంటే.. ఆరుగాలం కష్టించి చాకిరీ చేస్తూ సమాజానికి తిండిపెట్టే రైతమ్మలకు జేజేలు పలకటమే.భూమిలో సగం పచ్చిక బయళ్లే!భూమిపై సగం భూభాగంలో విస్తరించి ఉన్న పచ్చిక బయళ్ళు కోట్లాది మంది పశు΄ోషకులు, పశువుల పెంపకందారుల జీవనోపాధికి ఆధారంగా నిలిచాయి. వారు తమ సంచారశీలత, సాంప్రదాయ జ్ఞానం, జీవవైవిధ్యం, సహజ వనరులను పరిరక్షించే సుస్థిర పద్ధతుల ద్వారా పచ్చిక బయళ్లను పశువులు మేపుకోవటానికి ఉపయోగించుకుంటూనే సంరక్షిస్తున్నారు. చాలా మంది మహిళా రైతులకు పశుపోషణ అనేది వారి సంస్కృతి, జీవనోపాధి, సామాజిక భద్రతకు అతి ముఖ్యమైన పనిగా ఉంది. (చదవండి: Savidya: ఉచిత డిజిటల్ సహకార కోర్సులు) -
ఉచిత డిజిటల్ సహకార కోర్సులు
సహకార రంగానికి సంబంధించి 160కి పైగా ఆన్లైన్ డిజిటల్ కోర్సులను తెలుగు సహా 8 భాషల్లో ఉచితంగా కేంద్ర సహకార శాఖ ఆఫర్ చేస్తోంది. రైతులు, ఎగుమతిదారులు, విద్యార్థులకు ఉపయోగపడేలా కృత్రిమ మేధ తోడ్పాటుతో ఈ కోర్సులను రూపొందించారు. ఇందుకోసం ప్రత్యేకంగా ‘సవిద్య.సీఓఓపి’ పేరిట ఒక వెబ్సైట్ అందుబాటులోకి వచ్చింది.‘సవిద్య’ అంటే ‘సహకార విద్యాలయం’. (Sahakar Vidyalaya) ఇది దేశంలోనే మొట్టమొదటి డిజిటల్ సహకార విద్యా వేదిక. రైతులు, విద్యార్థులు, ఎగుమతిదారుల్లో సహకార విజ్ఞానాన్ని పెంపొందించటానికి ఉద్దేశించిన వేదిక ఇది. సహకార మంత్రిత్వ శాఖ ‘సహకార్ సే సమృద్ధి’ (సహకారం ద్వారా శ్రేయస్సు) చొరవలో భాగంగా ప్రారంభించిన ఈ వేదిక సహకార రంగంలో నిపుణుల నేతృత్వంలో ఉచిత శిక్షణను అందిస్తుంది. వ్యవసాయ పద్ధతులు, ఎగుమతి వ్యూహాలు వంటి ముఖ్యమైన అంశాలను కవర్ చేసే 160కి పైగా ఉచిత వీడియో కోర్సులు. తెలుగు సహా 8 భారతీయ భాషల్లో గ్రామీణులకు కూడా అందుబాటులో ఉండేలా ఈ కోర్సులను రూపొందించారు. కృత్రిమ మేధ ఆధారిత ఫీచర్లను ఉపయోగించి కంటెంట్‌ను వ్యక్తిగతీకరిస్తుంది. లక్షలాది వినియోగదారులకు మరింత సమర్థవంతంగా జ్ఞానాన్ని అందించేందుకు ఏఐ వాడినట్లు కేంద్ర సహకార శాఖ తెలిపింది.వినియోగదారులు తమ మొబైల్ పరికరాల ద్వారా ఎప్పుడైనా, ఎక్కడైనా ఈ వీడియో కోర్సులు చదువుకోవడానికి వీలుంది. రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులను నేర్చుకోవడానికి, పంట దిగుబడిని మెరుగుపరచుకోవడానికి ఇందులో కోర్సులు ఉన్నాయి. విద్యార్థులు సహకార రంగంలో వృత్తి, పరిశోధన అవకాశాలను అన్వేషించడానికి ఉపయోగపడే కోర్సులు ఉన్నాయి. అంతేకాదు, ఎగుమతిదారులు ప్రపంచ మార్కెట్ అవసరాలు, అంతర్జాతీయ వాణిజ్యంపై అవగాహన పొందడానికి అవసరమైన కోర్సులను సైతం ఇందులో పొందుపరచటం విశేషం.నేషనల్ కో–ఆపరేటివ్ ఎక్స్‌పోర్ట్స్ లిమిటెడ్ (ఎన్సీఈఎల్), క్రిబ్కో వంటి సహకార సంస్థలు ఉమ్మడి కృషితో సహకార విద్యా ప్లాట్‌ఫారమ్ ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా దాదాపు 17,000 సహకార సంఘాలను 2 కోట్ల మందికి పైగా రైతులకు అనుసంధానం చేయటమే దీని లక్ష్యం. మీరు savidya.coopలో నేరుగా కోర్సులను ఎంపిక చేసుకొని, సులువుగా, ఉచితంగా నేర్చుకోవడం ప్రారంభించవచ్చు. -
సూక్ష్మంలో మోక్షం..నానో ఎరువులు!
పశ్చిమాసియా యుద్ధం ఇచ్చిన షాక్‌తో దేశంలో రసాయనిక ఎరువులకు తీవ్ర కొరత వచ్చి పడింది. యూరియా, డీఏపీ, ఫాస్ఫరస్ వంటి ఎరువులకు గత 60 ఏళ్లుగా మన రైతులు అలవాటైపోయారు. ప్రస్తుత సంక్షోభ కాలంలో ఈ అలవాటు మార్చుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. రసాయనిక ఎరువులకు బదులుగా సులువుగా వాడదగిన ఎరువులేవైనా ఉన్నాయా? అంటే.. తప్పకుండా ఉన్నాయి. అవే ‘నానో ఎరువుల’ని ‘ఇఫ్కో’ ఘంటాపథంగా చెబుతున్నది. నానో ఎరువులపై రైతులు ఇప్పటికీ, ఎప్పటికీ, పూర్తిగా ఆధారపడొచ్చని ‘ఇఫ్కో’ ఘంటాపథంగా చెబుతోంది. నానో ఎరువులను వాడుతున్న రైతుల అనుభవాలు కూడా ప్రోత్సాహకరంగానే ఉన్నాయంటున్నారు. సబ్సిడీ లేని సహకార ఎరువులు కావటంతో ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తోంది. ‘తక్షణ ఎరువుల కొరతను అధిగమించేందుకు నానో ఎరువులే ఉత్తమ మార్గం. దీర్ఘకాలంలో ప్రకృతి/సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లోకి మారి పోవటమే ఉత్తమం..’ అని నిపుణులు నొక్కి చెబుతున్నారు. ఇంతకీ నానో ఎరువులంటే ఏమిటి? ఏయే పంటలు/తోటలకు ఎలా వాడాలి? రైతుల అనుభవాలేమిటి? పరిశీలిద్దాం.మన దేశంలో రైతులు ఏర్పాటు చేసుకున్న సహకార దిగ్గజ సంస్థల్లో ఒకటి ‘ఇఫ్కో’ (ఇండియన్ ఫార్మర్స్ ఫర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్. ఇఫ్కో దేశీయంగా తయారు చేస్తున్న నానో యూరియా, నానో డీఏపీ తదితర నానో ద్రవ రూప ఎరువులు ప్రపంచంలోనే అరుదైనవి. వీటిని గత ఐదేళ్లుగా ఇఫ్కో రైతులకు విక్రయిస్తోంది. సాంప్రదాయక గుళికల యూరియా, డీఏపీకి బదులుగా.. ద్రవరూపంలో ఉండే నానో యూరియా, నానో డీఏపీ, నానో పొటాష్ ఎరువులు వాడినప్పుడు ఎటువంటి దిగుబడి నష్టం లేదని, అధిక దిగుబడులే వస్తున్నాయని ఇఫ్కో క్షేత్రప్రయోగాల ద్వారా నిరూపించింది. రైతులు కూడా సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. నానో ఎరువులు వల్ల దిగుబడి తగ్గుతుందన్న దిగుల్లేదు, ఖర్చు తక్కువ, నానో ఎరువులు దొరకవన్న భయం లేదు. నేల, నీరు, గాలి కాలుష్యం కూడా ఉండదని ఇఫ్కో చెబుతోంది. అర లీటరు సీసా ఒక బస్తాకు సమానం500 మి.లీ. నానో ద్రవ యూరియా సీసా ఒక బస్తా సాంప్రదాయ గుళికల యూరియాతో సమానం. ఎరువుల ఉత్పత్తిలో వాడే సహజ వాయువు విదేశీ దిగుమతులు తగ్గినా, నానో ఎరువుల రూపంలో రైతులకు అవసరమైన ఎరువులను సరఫరా చేసే సామర్థ్యం ఉందని ఇఫ్కో స్పష్టం చేసింది. నానో ఎరువుల గురించి రైతులకు నచ్చజెప్పే లక్ష్యంతో 19 రాష్ట్రాల్లో ఇఫ్కో తాజాగా భారీ ప్రచారోద్యమం చేపట్టింది. నానో ఎరువుల ప్రత్యేకతేంటి?గుళికల ఎరువులు: చిన్న గుళికల రూపంలో ఉండే యూరియా, డీఏపీ, పొటాష్ వంటి సాధారణ రసాయనిక ఎరువులను విదేశాల నుంచి దిగుమతి చేసుకునే సహజ వాయువుతో తయారు చేస్తారు. వీటిని భూమిలో వేస్తే, వేసిన ఒకటి, రెండు రోజుల్లోనే ఆకులు ముదురు ఆకుపచ్చగా మారతాయి. కానీ, ఎక్కువగా పెరిగి పంట పడిపోతుంది. ఎక్కువగా చీడపీడలు ఆశిస్తాయి. 30–40% పోషకాలను మాత్రమే మొక్కలు వాడుకోగలుగుతాయి. నానో ఎరువులు: నానో యూరియా ప్లస్, నానో డీఏపీ, నానో పొటాష్ తదితర నానో ఎరువులు ద్రవ రూపంలో ఉంటాయి. ఇఫ్కో దేశీయ పరిజ్ఞానంతో తయారు చేస్తోంది. తక్కువ ఖర్చు. విరివిగా దొరుకుతాయి. వీటిలో పోషకాల కణం చాలా చిన్నగా 20–50 నానో మీటర్ల సైజులో ఉంటాయి. నీటిలో కలిపి పంటలపై పిచికారీ చేస్తారు. ఆకులు ఈ పోషకాలను 80–90% మేరకు త్వరగా ఉపయోగించుకోగలుగుతాయి. మామూలు స్ప్రేయర్లు, డ్రోన్లతో చల్లితే పంటలు వెంటనే ముదురు ఆకుపచ్చ రంగులోకి మారవు. కానీ, బలంగా పెరుగుతాయి. రొట్ట ఎక్కువగా పెరగదు. గాలులకు పడిపోదు. తాలు ఉండదు. దిగుబడి పెరుగుతుంది. చీడపీడల సమస్య తగ్గుతుంది. శాస్త్రవేత్తల ఆమోదం ప్రపంచ ప్రమాణాల ప్రకారం సురక్షితమైనవిగా గుర్తింపు పొందిన నానో ఎరువులు ఇతర జీవరాశికి సురక్షితమైనవి. కేంద్ర ప్రభుత్వ బయోటెక్నాలజీ విభాగం (డీబీటీ), నానో అగ్రి ఇన్పుట్ ప్రొడక్ట్స్–2020 మార్గదర్శకాలకు అనుగుణంగా తయారుచేసినవని ఇఫ్కో తెలిపింది. నానో ఎరువుల సామర్థ్యంపై శాస్త్రీయ ధ్రువీకరణ కోసం వ్యవసాయ పరిశోధనా సంస్థల్లో నిర్వహించిన పరీక్షలు విజయవంతమయ్యాయని ఇఫ్కో అధికారులు ‘సాక్షి సాగుబడి’కి తెలిపారు. హైదరాబాద్‌లోని కేంద్రీయ మెట్ట పంటల పరిశోధనా సంస్థ (ఐసీఏఆర్–క్రీడ) వంటి అగ్రగామి వ్యవసాయ పరిశోధనా సంస్థల్లో విస్తృతమైన క్షేత్ర పరీక్షలు నిర్వహించినట్లు తెలిపింది. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ అనుబంధ వ్యవసాయ కళాశాలల్లో జరుగుతున్న క్షేత్ర ప్రయోగాల్లో అత్యంత సంతృప్తికరంగా ఫలితాలు వస్తున్నాయని ఇఫ్కో అధికారులు ప్రకటించారు. ప్రభుత్వభాగస్వామ్యం, జిల్లా కలెక్టర్లు, వ్యవసాయ శాఖ, శాస్త్రవేత్తలు, తెలంగాణ వ్యవసాయ యూనివర్సిటీ, ఐసీఏఆర్ పరిశో ధన సంస్థలు నానో ఎరువులపై విస్తృత ప్రచారంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇది నానో సాంకేతికతపై రైతుల్లో విశ్వాసాన్ని పెంచిందని చెబుతున్నారు. విస్తృతంగా ప్రదర్శనా క్షేత్రాలునానో ఎరువులపై రైతుల సందేహాలను నివృత్తి చేయటానికి, పంట దిగుబడిపై నానో ఎరువుల సానుకూల ప్రభావాన్ని కళ్ళారా చూపించడానికి ఇఫ్కో విస్తృతంగా ప్రదర్శనా క్షేత్రాలను నిర్వహిస్తూ రైతులకు అవగాహన కల్పిస్తోంది. నానో ఎరువుల వ్యాప్తికి ఈ క్షేత్రాలు బలమైన పునాది వేశాయి. గ్రామీణ యువతకు, మహిళలకు డ్రోన్లను అందించి, ఎకరానికి రూ. 300 ఖర్చుతో డ్రోన్లతో నానో ఎరువుల పిచికారీ జరుగుతోంది. పిచికారీ సమయం, శ్రమ తగ్గటంతో ఈ సాంకేతికతను రైతులు వేగంగా స్వీకరిస్తున్నారని ఇఫ్కో చెబుతోంది. నానో ఎరువుల వాడకం వేగంగా పెరుగుతోందిసంప్రదాయ యూరియాకు ప్రత్యామ్నాయంగా ఇఫ్కో ప్రవేశపెట్టిన నానో యూరియా, నానో డీఏపీ ఎరువుల వాడకం వేగంగా పెరుగుతోంది. రైతులు అనూహ్య వేగంతో అందిపుచ్చుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 2025–26లో వానాకాలం, యాసంగి కలిపి 10.46 లక్షల సీసాల నానో ఎరువులను రైతులు వాడటమే ఇందుకు నిదర్శనం. విత్తనం వేసే ముందు లేదా మొక్కలు నాటే దశలో సంప్రదాయ గుళికల యూరియా, డీఏపీలను వాడుకోవాలి. పంట మొక్కలకు ఆకులు పెరిగినాక రెండో విడత, మూడో విడత వేసే గుళికల ఎరువులకు బదులుగా నానో యూరియా, నానో డీఏపీలను నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. గుళికల రూపంలో ఉండే సంప్రదాయ యూరియా, డీఏపీ, పొటాష్ వంటి రసాయనిక ఎరువుల మోతాదును 25 నుంచి 50% వరకు తగ్గించి, పంట కొన్ని రోజులు ఎదిగిన తర్వాత నానో యూరియా, నానో డీఏపీ వంటి ద్రవ రూప ఎరువులను రెండు సార్లు పిచికారీ చేస్తున్న చాలా మంది రైతులు ఖర్చు తగ్గించుకుంటూ మంచి దిగుబడులు సాధిస్తున్నారు. అయితే, సంప్రదాయ గుళికల యూరియా, డీఏపీ ఎరువులను పూర్తిగా మానేసి.. కేవలం నానో ఎరువులు, జీవన ఎరువులు, సముద్రపు నాచు ద్రావణాలను కలిపి వాడి పంటలు పండిస్తూ మంచి దిగుబడులు పొందుతున్న రైతులు కూడా కొందరు ఉన్నారు. నానో ఎరువులు వాడితే ఎకరాకు సుమారు రూ. 2 వేల వరకు ఖర్చు తగ్గుతుందని, 8% వరకు దిగుబడి పెరుగుతుందని మా క్షేత్ర ప్రయోగాల్లో తేలింది. – ఎం.ఆర్. కృపాశంకర్, ఇఫ్కో, తెలంగాణ స్టేట్ మార్కెటింగ్ మేనేజర్ఊళ్లో నాదే అత్యధిక దిగుబడి!వరి పంటకు అడుగున కొద్దిగా డీఏపీ మాత్రమే వాడాను. మిగతా పోషకాలకు బస్తాలు వేయకుండా.. నానో యూరియా, నానో డీఏపీ, సాగరిక కలిపి డ్రోన్ ద్వారా పిచికారీ చేయించాను. మా చుట్టుపక్కల పొలాలన్నింటిలో ఎండాకు తెగులు వచ్చినా, నా పొలానికి అస్సలు రాలేదు. పంట బలంగా నిలబడింది, గింజ కూడా బరువుగా, నాణ్యంగా ఉంది. ఈ కొత్త నానో ఎరువులతో ఎకరానికి 33 క్వింటాళ్లు వరి ధాన్యం దిగుబడి వచ్చింది. మా ఊళ్లో నాదే అత్యధిక దిగుబడి!.– ఎం. కృష్ణార్జున రావు (90320 37954), మల్లుపల్లి, ఖమ్మం జిల్లాపత్తి దిగుబడి పెరిగింది!నేను పంటలతో పాటు పశువులను పెంచుకుంటూ సమగ్ర వ్యవసాయం చేస్తున్నా. పత్తి సాగులో ఖర్చులు తగ్గించుకోవాలని నానో ఎరువులు వాడటం మొదలుపెట్టా. సాధారణ ఎరువులు సగం తగ్గించి, వాటి బదులు నానో యూరియా, నానో డీఏపీ పిచికారీ చేశా. ఆశ్చర్యం ఏంటంటే, ఎరువుల ఖర్చు తగ్గి, దిగుబడి పెరిగింది! పక్క పొలంలో ఎకరానికి పత్తి 8.5 క్వింటాళ్లు వస్తే, నా పొలంలో 10 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. నానో ఎరువులతో రైతుకు లాభమే.– మల్లారావు (99597 13273), రవిపహాడ్, సూర్యాపేట జిల్లాపూర్తిగా నానో ఎరువులే వాడుతున్నా..గత మూడేళ్లుగా నేను ఒక్క బస్తా గుళికల యూరియా, డీఏపీ కూడా వాడలేదు. పూర్తిగా నానో ఎరువులపైనే ఆధారపడుతున్నా. నానో డీఏపీతో విత్తనశుద్ధి చేస్తా, ఆ తర్వాత మూడు సార్లు నానో యూరియా పిచికారీ చేస్తా. దీనికి అదనంగా జీవ ఎరువులను కూడా వాడుతున్నా. ఈ విధానంతో పత్తి, వరి, మొక్కజొన్నలో నాణ్యమైన దిగుబడి సాధిస్తున్నా. నా పొలంలో వచ్చిన ఫలితాలు చూసి, మా ఊరి రైతులు చాలా మంది నానో ఎరువులు వాడటం మొదలుపెట్టారు.– బోయపాటి నరసింహారావు (88970 07608), అనంతారం, వరంగల్ జిల్లానానో ఎరువులతో కొత్త మార్పు సోయా, పత్తి పంటల్లో రెండు సంవత్సరాలుగా నానో ఎరువులు వాడుతున్నా. ముందు బస్తాల ఎరువులు ఎక్కువ వేస్తేనే పంట బాగుంటుందని అనుకునేవాళ్లం. కానీ నానో ఎరువులు వేసాక మొక్కలు ఇంకా ఆరోగ్యంగా, సమానంగా పెరుగుతున్నాయి. పత్తిలో కాయ పరిమాణం పెరగడం, సోయాలో పూత సమానంగా వస్తోంది. స్ప్రే చేసిన తర్వాత మొక్కల పెరుగుదల బాగుంది. పెట్టుబడి తగ్గినా పంట నాణ్యత మాత్రం బాగుంది. నానో ఎరువులతో కొత్త మార్పు వచ్చింది.– ఉగ్గె రాము (90005 91246), చందా(టీ), ఆదిలాబాద్ రూరల్ మండలం, ఆదిలాబాద్ జిల్లా -
అధిక వేడితో పెనుముప్పు
తీవ్రమైన వేడి ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయం, అనుబంధ రంగాలను ప్రమాదం అంచుకు నెడుతోంది. ప్రధాన వ్యవసాయ ప్రాంతాల్లో వడగాలులు తీవ్రతరం అవుతుండటంతో పంటలు, పశుసంపదపై ఒత్తిడి పెరుగుతోంది. యావత్ సమాజం ఉద్గారాలను తగ్గించుకునేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటే తప్ప ఆహార, వ్యవసాయ వ్యవస్థలకు, 120 కోట్లకు పైగా ప్రజల జీవనోపాధులు, ఆహార భద్రత పెను ముప్పును ఎదుర్కోక తప్పదని ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏఓ), ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఓ) హెచ్చరించాయి. ధరిత్రీ దినోత్సవం సందర్భంగా బుధవారం ఐక్యరాజ్యసమితి సంస్థలు ఉమ్మడి నివేదికను విడుదల చేశాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, తరచుగా సంభవిస్తున్న వడగాలులు ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయం, అనుబంధ రంగాల్లో ఆహారోత్పత్తిని దెబ్బతింటున్నది. తీవ్రమైన వేడి కారణంగా ఇప్పటికే పనులు చేసుకోలేని పరిస్థితులు పెరుగుతున్నాయని, ప్రతి సంవత్సరం 50 వేల కోట్ల పని గంటలు కోల్పోతున్నామని, ఉష్ణోగ్రతలు పెరిగేకొద్దీ ఈ ప్రభావాలు మరింత తీవ్రతరం కానున్నాయని ఈ నివేదిక హెచ్చరించింది.పశువులు, పంటలకు కష్టంవ్యవసాయ పద్ధతులన్నింటిలోనూ అధిక వేడి ప్రభావాలు ఇప్పటికే స్పష్టంగా కనిపిస్తున్నాయి. 30 డిగ్రీల సెల్సియస్ కంటే ఉష్ణోగ్రత పెరిగినప్పటి నుంచే మొక్కజొన్న, సోయా వంటి అనేక ప్రధాన పంటలదిగుబడులు తగ్గడం మొదలవుతోంది. దీనివల్ల పంట మొక్కలు బలహీనపడి, ఉత్పాదకత తగ్గుతోంది. ఉష్ణోగ్రత 25 డిగ్రీలు దాటినప్పటి నుంచే పశువులు, ముఖ్యంగా పందులు, కోళ్లు ఒత్తిడికి గురవుతుంటాయి. వేడిని తట్టుకోలేనందున వాటి పెరుగుదల తగ్గిపోతుంది. పాల దిగుబడి తగ్గుతుంది. తీవ్రమైన సందర్భాల్లో అవయవ వైఫల్యం కూడా సంభవిస్తుందని నివేదిక హెచ్చరించింది. సముద్రాలలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ఆక్సిజన్ స్థాయిలను తగ్గిస్తున్నాయి. దీనివల్ల సముద్ర జలాల్లోని చేపలు ఒత్తిడికి గురవుతున్నాయి. తీవ్రమైన వేడి కిరణజన్య సంయోగక్రియకు అంతరాయం కలిగించి, కార్చిచ్చుల ప్రమాదాన్ని పెంచుతుండటంతో అడవులు కూడా ప్రభావితమవుతున్నాయి. తీవ్రమైన వేడి నేరుగా నష్టపరచటమే కాకుండా ఇతర పర్యావరణ సమస్యలను సైతం ప్రేరేపిస్తుంది. కరువులను ప్రేరేపించగలదు, నీటి కొరతను మరింత తీవ్రతరం చేయగలదు, కార్చిచ్చు ప్రమాదాలను పెంచగలదు. అంతేకాదు, తెగుళ్లు, వ్యాధుల వ్యాప్తిని వేగవంతం చేయగలదు. ఇలాంటివన్నీ కలిసి మొత్తం పర్యావరణ వ్యవస్థలపై పెను ప్రభావం చూపే స్థితికి చేర్చుతాయని నివేదిక తెలిపింది.పనులు చెయ్యలేని రోజులు..తీవ్రమైన వేడి ఒత్తిడి ప్రభావాలు ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే తీవ్రంగా ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. పంటలు, పశువులకే కాదు మనుషులకు కూడా నష్టం అంతే తీవ్రంగా ఉంది. దక్షిణాసియా, సహారా ఉప–ఆఫ్రికా, లాటిన్ అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో ఆరుబయట పనులు చేయడానికి వీలుకాని రోజుల సంఖ్య సంవత్సరానికి 250కి పెరగొవచ్చు. ఇది లక్షలాది మంది వ్యవసాయ కార్మికుల జీవనోపాధిని ప్రమాదంలో పడేసి, ఆహార ఉత్పత్తిని దెబ్బతీస్తుందని నివేదిక హెచ్చరించింది.ఉదాహరణకు, 2025లో కిర్గిజ్‌స్థాన్‌లో సంభవించిన వడగాడ్పుల కాలంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే సుమారు 10 డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగాయి. ఇది ధాన్యం దిగుబడుల్లో 25 శాతం తగ్గుదలకు కారణమవ్వటానికే కాకుండా, ఎడారి మిడతల దండును ప్రేరేపించి, నీటిపారుదల సామర్థ్యాన్ని కూడా తగ్గించింది.ఇతర ప్రాంతాలలో, 2023 మరియు 2024లో బ్రెజిల్లో దీర్ఘకాలం పాటు కొనసాగిన వేడి మరియు కరువు పరిస్థితులు సోయాబీన్ దిగుబడులను 20 శాతం వరకు తగ్గించాయి , అదే సమయంలో 2021లో ఉత్తర అమెరికా అంతటా సంభవించిన తీవ్రమైన వడగాలులు పండ్ల పంటలలో గణనీయమైన నష్టాలకు మరియు అటవీ అగ్నిప్రమాదాలలో తీవ్రమైన పెరుగుదలకు దారితీశాయి.తక్షణ చర్యలు తీసుకోవాలిఅధిక వేడిని తట్టుకునే పంట రకాలను తయారు చేసుకోవటం, నాట్లు వేసే సమయాలను వేడికి అనుగుణంగా సర్దుబాటు చేయటం, వ్యవసాయ పద్ధతులను మెరుగుపరచడం వంటి తక్షణ చర్యలతో నష్టనివారణకు గల అవకాశాలను అందిపుచ్చుకోవాలని పాలకులకు పిలుపునిచ్చింది. పెరుగుతున్న వాతావరణ ప్రమాదాలను ఎదుర్కోవడంలో రైతులకు సహాయపడటానికి ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, బీమా, సామాజిక భద్రత వంటి ఆర్థిక సహాయ పథకాలను అందుబాటులోకి తేవటం కూడా చాలా కీలకం. చదవండి: 'అరటిపండు'ని ప్రపంచ ఫలం అంటారు ఎందుకో తెలుసా..!వ్యవసాయ భవిష్యత్తును పరిరక్షించడానికి, ప్రపంచ ఆహార భద్రత పరిరక్షణకు, వాతావరణ మార్పును తట్టుకునే శక్తిని పంటలకు పెంపొందించాలి. కర్బన ఉద్గారాలను భవిష్యత్తులో భారీగా తగ్గించుకోవటం కూడా అవసరమని ΄పాలకులకు ఎఫ్ఏఓ, ఐడబ్ల్యూఓ పిలుపునిచ్చాయి.బలహీనతలు తీవ్రతరంవ్యవసాయం, అనుబంధ రంగాలు, ఆహార పంపిణీ వ్యవస్థల్లో పని పరిస్థితులను తీవ్రమైన వేడిమి అతలాకుతలం చేస్తోంది. వ్యవసాయ, ఆహార పంపిణీ వ్యవస్థల్లో ఇప్పటికే ఉన్న బలహీనతలను మరింత తీవ్రతరం చేసే ఒక ‘సంక్లిష్ట ప్రమాద కారకం’గా అధిక వేడి పనిచేస్తోందని ΄ాలకులు గుర్తించాలి.– సెలెస్ట్ సౌలో, డైరెక్టర్ జనరల్, ప్రపంచ వాతావరణ సంస్థ ఆహార భద్రతపై ఒత్తిడితీవ్రమైన వేడి పంటలు, పశుసంపద, మత్స్య సంపద, అడవులపై, అలాగే వాటిపై ఆధారపడి జీవిస్తున్న రైతులు, కార్మికుల జీవనోపాధిని దెబ్బతీస్తోంది. ఆహార భద్రతపై ఒత్తిడిని పెంచుతోంది. – క్యు డోంగ్యు, డైరెక్టర్ జనరల్, ఐక్యరాజ్యసమితి ఆహార–వ్యవసాయ సంస్థ నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడిడెస్క్ -
జంతువుల నుంచి మనుషులకు ఏటా 5 కొత్త వ్యాధులు..!
సృష్టిలో ప్రతి జీవరాశి తన మనుగడను కొనసాగించడానికి శక్తి అత్యవసరం. ఈ శక్తి ప్రధానంగా ఆహారం ద్వారానే లభిస్తుంది. ముఖ్యంగా మానవాళికి అవసరమైన పోషకాలు పంటలు, పశుసంపద ద్వారా లభించే ఆహార పదార్థాలపై ఆధారపడి ఉంటాయి. పశువైద్యులు కేవలం జంతువులకు చికిత్స చేసే వైద్యులు మాత్రమే కాదు. ఆహార భద్రతకు రక్షకులు కూడా. ఆరోగ్యదాయక పశుపోషణ ద్వారా ప్రజారోగ్యాన్ని, పర్యావరణ సమతుల్యతను కాపాడుతున్నారు. ‘పశు వైద్యులు– ఆహార ఆరోగ్య సంరక్షకులు’ అనే థీమ్‌తో ఈ సంవత్సరం ప్రపంచ పశు వైద్య దినోత్సవాన్ని జరుపుకోవటం అత్యంత సముచితం.పశు సంపద ఆర్థిక, సామాజిక అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తుంది. పెరుగుతున్న జనాభా, మారుతున్న జీవనశైలి, పెరుగుతున్న పోషక అవసరాల నేపథ్యంలో పశు వైద్య రంగం ప్రాముఖ్యత మరింత పెరుగుతోంది. మన పూర్వీకులు పశువులను, ప్రకృతిని సమానంగా గౌరవించి, పర్యావరణహితమైన విధానాలతో వ్యవసాయం, జీవన విధానాన్ని అభివృద్ధి చేశారు. ఈ సమతుల్య జీవన విధానాన్ని మళ్లీ ఆచరిస్తే, భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన, సుస్థిరమైన జీవితం అందించవచ్చు.ఆరోగ్యంపై సమగ్ర దృక్పథంపశువైద్యం కేవలం జంతువుల వైద్యంతో పరిమితం కాకుండా.. మనుషుల ఆరోగ్యం, పశువుల ఆరోగ్యం, పర్యావరణ ఆరోగ్యం వేర్వేరు కాదు అంతా ఒక్కటే (వన్ హెల్త్) అనే సమగ్ర విధానాన్ని అనుసరిస్తుంది. ఈ మూడూ పరస్పరం అనుసంధానమైనవి. పశువైద్యులు పశువుల ఆరోగ్యాన్ని మాత్రమే కాపాడటమే కాకుండా పరోక్షంగా ప్రజారోగ్యాన్ని పరిరక్షిస్తున్నారు. ముఖ్యంగా ఆహారంగా ఉపయోగించే పశువులకు చికిత్స ఇచ్చేటప్పుడు మందుల అవశేషాలు పాలు, మాంసం, గుడ్లు వంటి ఆహార పదార్థాలలో ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవడం అత్యంత కీలకం.సంక్రమిత వ్యాధుల నియంత్రణపశువుల నుండి మనుషులకు, అలాగే మనుషుల నుండి పశువులకు సంక్రమించే వ్యాధులను జూనోటిక్ వ్యాధులు అంటారు. ఉదాహరణకు: రేబీస్, బ్రూసెల్లోసిస్, టీవీ వంటివి. ప్రస్తుతం గుర్తించిన సంక్రమిత వ్యాధులలో సుమారు 60% జంతువుల ద్వారా వ్యాపిస్తున్నాయి. ప్రతి సంవత్సరం కనీసం 5 కొత్త వ్యాధులు జంతువుల నుండి మనుషులకు వస్తున్నాయని అంచనా. అరణ్య ప్రాంతాలలో మానవ జోక్యం పెరగటం ఈ వ్యాధుల వ్యాప్తికి ముఖ్య కారణం. ఈ నేపథ్యంలో పశువైద్యులు ఆధునిక సాంకేతిక పద్ధతులతో వ్యాధులను ముందుగానే గుర్తించి నియంత్రించడంలో కీలకపాత్ర పోషిస్తున్నారు.యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ (ఏఎంఆర్) ప్రపంచ ఆరోగ్యానికి అత్యంత పెద్ద సవాళ్లలో ఒకటి. అనవసరంగా, అధికంగా యాంటీ బయోటిక్స్ వాడటం వల్ల మందుల ప్రభావం తగ్గుతుంది. ఆహారంలో అవశేషాలు చేరి ప్రజారోగ్యానికి హాని కలుగుతుంది. ఈ సమస్యను నివారించడానికి పశువైద్యులు బాధ్యతాయుతమైన ఔషధ వినియోగాన్ని ప్రోత్సహించాలి. పశుసంపద సుస్థిర ఆహార భద్రతలో కీలకపాత్ర పోషిస్తోంది. ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏవో) అంచనాలప్రకారం, ప్రపంచానికి అవసరమైన ప్రోటీన్‌లో సుమారు 30–40% జంతువుల నుంచి లభిస్తుంది. అయితే, ప్రతి సంవత్సరం సుమారు 20% ఆహారం పశువ్యాధుల వల్ల కోల్పోతున్నాం. పశువుల విసర్జితాల పునర్వినియోగం ద్వారా సేంద్రియ వ్యవసాయం, గోఆధారిత వ్యవసాయం వర్థిల్లుతుంది. తద్వారా పర్యావరణం, పశువులు, మనుషుల మధ్య సమన్వయంతో ఆహార గొలుసును కాపాడుకోవచ్చు.14.5% వరకు పశువుల ఉద్గారాలుప్రస్తుతం పశువైద్య రంగం ఎదుర్కొంటున్న ప్రధాన సవాలు వాతావరణ మార్పు. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 14.5% హరిత గృహ ఉద్గార వాయువులు పశుసంపద నుంచి వెలువడుతున్నాయని అంచనా. దీర్ఘకాలిక సగటు ప్రపంచ ఉష్ణోగ్రత 1 డిగ్రీల సెల్షియస్ పెరిగితే 10–15% వరకు పశువుల పెరుగుదల, వ్యవసాయోత్పత్తి తగ్గుతుంది. అయితే, పశుసంపద మనకు ముఖ్యమైన ప్రోటీన్ వనరుగా కూడా ఉంది. ఈ పరిస్థితుల్లో పశువైద్యులు మీథేన్ ఉద్గారాలను తగ్గించే పద్ధతులు, సుస్థిర పశుసంవర్ధన విధానాలు, కార్బన్ క్రెడిట్ అవకాశాలపై దృష్టి సారిస్తున్నారు. రైతులకు అదనపు ఆదాయం కల్పించే విధంగా కార్బన్ మార్కెట్లో భాగస్వామ్యం కల్పించడం కూడా ఒక ముఖ్య లక్ష్యం.మీథేన్ ఉద్గారాలుప్రపంచంలో అత్యధిక పశుసంపద కలిగిన దేశం మనదే. ఎఫ్ఏఓ, ఐసీఏఆర్ అంచనాల ప్రకారం భారతదేశంలో మొత్తం హరిత గృహ వాయువు ఉద్గారాల్లో సుమారు 14–16% వ్యవసాయం నుంచి వెలువడుతుంటే, అందులో పశుసంపద ఉద్గారాల వాటా 55–60%. పాల ఉత్పత్తిలో దేశంలోనే ముఖ్య రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి. ఏపీలో వ్యవసాయ ఉద్గారాల్లో పశుసంపద వాటా 30–35%గా ఉంది. ముఖ్యంగా డెయిరీ రంగంలో గేదెల ద్వారా ఎక్కువ మీథేన్ వెలువడుతోందని అంచనా. నెమరు వేసేటప్పుడు జీర్ణప్రక్రియ వల్ల వెలువడే మీథేన్ పశు ఉద్గారాల్లో 85%ను ఆక్రమిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో వెలువడే వ్యవసాయ ఉద్గారాలలో పశుసంపద ఉద్గారాల వాటా 25–30%. తెలంగాణలో గొర్రెలు, మేకల సంఖ్య అధికంగా ఉండటం వల్ల ఉద్గారాల తీరు భిన్నంగాఉంటుంది. తెలంగాణ ఎస్‌ఏపీసీసీ చెబుతున్న దాని ప్రకారం మీథేన్ ఉద్గారాలు పశువుల నుండే ఎక్కువ వెలువడుతున్నాయి.ముఖ్యమైన విశేషాలుప్రపంచంలోని అన్ని దేశాల కంటే మన దేశంలో పశుసంపద ఎక్కువ. కానీ తక్కువ. కానీ, ముఖ్యంగా ఒక్కో పశువు తలసరి ఉత్పాదకత తక్కువ. ప్రపంచంలోని గేదెల సంఖ్యలో 50% మన దేశంలోనే ఉంది. ఈ కారణంగా మొత్తం ఉద్గారాలు ఎక్కువగా కనిపిస్తాయి. కానీ పాలు, మాంసం, గుడ్ల ఉత్పత్తి క్రమంలో వెలువడే ఉద్గారాలను తగ్గించే అవకాశం ఉంది. పశువైద్యులు కేవలం జంతువుల వైద్యులు మాత్రమే కాదు. ఆహార భద్రతకు రక్షకులు కూడా. ఆరోగ్యదాయక పశుపోషణ ద్వారా ప్రజారోగ్యాన్ని కాపాడుతున్నారు. పర్యావరణ సమతుల్యతకు మార్గదర్శకులుగా నిలుస్తున్నారు. వన్ హెల్త్ దృక్పథంతో పశువైద్యులు సమగ్ర సుస్థిర అభివృద్ధికి మార్గం సుగమం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘పశు వైద్యులు– ఆహార, ఆరోగ్య సంరక్షకులు’ అనటంలో ఎంతమాత్రమూ అతిశయోక్తి లేదు. – డా. మల్లంపల్లి సాయిబుచ్చారావు (99122 92229), అసిస్టెంట్ డైరెక్టర్(ఏహెచ్), ఏరియా వెటర్నరీ ఆసుపత్రి, జీలుగుమిల్లి, ఏలూరు జిల్లా. saii@doctor.com(చదవండి: World Banana Day: 'అరటిపండు'ని ప్రపంచ ఫలం అంటారు ఎందుకో తెలుసా..!) -
వృథా కానీ ఎకానమీగా వెదురు.. సాగు ఒక్కటే చాలదు!
వెదురు వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. ఔషధ గుణాల దగ్గరి నుంచి సౌందర్య సాధనాల తయారీలోనూ దీని వినియోగిం పెరిగింది. దీంతో భారత్ సహా చాలా దేశాలు సాగును పెద్దఎత్తున ప్రోత్సహిస్తున్నాయి. అయితే పంటకు ప్రాముఖ్యత ఇచ్చినంత మాత్రన సరిపోదంటున్నారు శాస్త్రవేత్తలు. వెదురు విప్లవం సాగుకే పరిమితం కాకూడదని, దాన్నో ఎకానమీగా మారాలంటే రీసెర్చ్ అవసరమని అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ (నీతిఆయోగ్)–ICAR–నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సీఈవో డాక్టర్ ఆదర్శ గౌడ. మరి అదెలాగో ఆయన మాటల్లోనే సవివరంగా తెలుసుకుందాం..వెదురు ఇండస్ట్రీని తీసుకురావాలంటే.. కేవలం భావోద్వేగ ప్రచారాలు, హ్యాష్ ట్యాగులు కాదని.. రీసెర్చులు జరిగితేనే ఆ పరిశ్రమలు నిలబడతాయని చెబుతున్నారు ఆదర్శ గౌడ. ఆ అవసరం ఎందుకో ఆయన వివరించారు. ఐరన్ వెదురు (Guadua) షూట్స్‌లోని చేదు రుచి కారణమైన బయో–యాక్టివ్ ఫ్లేవనోయిడ్లు, ఫెనాలిక్ కంపౌండ్లు, ప్రాసెసింగ్ చేయకపోతే హానికరమైన సైనోజెనిక్ గ్లైకోసైడ్లను సూచిస్తుందని చెబుతున్నారాయన. ఈ చేదులో ఆంటీ–డయాబెటిక్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలపై ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు సాగుతున్నాయని.. రక్తంలో చక్కెర నియంత్రణకు తోడ్పడే ఫంక్షనల్ ఫుడ్‌గా నిలిచే అవకాశాలు ఉన్నప్పటికీ, శాస్త్రీయ ధృవీకరణ, సేఫ్ ప్రాసెసింగ్ కీలకమని ఆయన హెచ్చరించారు.అలాగే ఐరన్ వెదురులో తక్కువ సిలికా కంటెంట్ ఉండటంతో ఎకో–టూరిజం పార్కులు, వినోద అరణ్యాలు వంటి పర్యావరణ హితమైనవి తీసుకురావొచ్చని అన్నారు. దీంతోపాటు వెదురు ఫైబర్‌తో తయారయ్యే ఎండీఎఫ్ బోర్డులు రైలు మార్గాల సౌండ్ బ్యారియర్లు, భవనాల ఇన్సులేషన్, అకౌస్టిక్ ప్యానెల్స్ వంటి రంగాల్లో భారీ మార్కెట్‌ను ఆకర్షించే సామర్థ్యం ఉందన్నారు. అలాగే వెదురు ఆకులు, కొమ్మలతో తయారయ్యే బయోడిగ్రేడబుల్ ఎగ్ ట్రేస్, ప్లేట్లు, ప్యాకేజింగ్ పల్ప్ ప్లాస్టిక్‌కి అడ్డుకట్ట వెయ్యొచ్చు. పైగా అగ్రికల్చరల్ వ్యర్థాన్ని ఆదాయంగా మార్చే గొనంన అవకాశం కూడా అని అన్నారు. ఆఖరికి వెదురు ఆకులు, కొమ్మలతో తయారయ్యే బయోడిగ్రేడబుల్ ఎగ్ ట్రేస్, ప్లేట్లు, ప్యాకేజింగ్ పల్ప్ ప్లాస్టిక్‌కి అడ్డకట్ట వెయ్యొచ్చుని చెప్పారు. అలాగే వెదురు షూట్స్(తినదగిని వెదురు లేత రెమ్మలు) స్నాక్స్‌గా, ఫ్లవర్, ఫెర్మెంటెడ్ ఫుడ్స్, అలాగే టెక్స్టైల్ ఫైబర్లు, పశువుల మేత, మెడికల్ ఎక్స్ట్రాక్టుల వరకు దీన్ని విస్తరించవచ్చని చెబుతున్నారు. ఇవన్నీ జరగాలంటే రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ సెంటర్ వల్లే సాధ్యమని, ఇది కేవలం ల్యాబ్ కాదని పరిశ్రమకు బ్రెయిన్ లాంటిదని చెబుతున్నారు. ఈ సెంటర్ ద్వారా ఉపయోగాలేంటంటే..ఎలాంటి చోట వెదురు పెంచాలో రైతులకు చెప్పడంఎలాంటి వెదురు మొక్కలను పెంచాలో రైతులకు సూచనలు ఇవ్వడం..ఏ పొడక్ట్లకు మార్కెట్ సుస్థిరమో ఇన్వెస్టర్లకు క్లారిటీ ఏ రంగాల్లో సబ్సిడీలు, ప్రోత్సాహకాలు ఇవ్వాలో ప్రభుత్వానికి గైడ్స్టాండర్డ్స్, క్వాలిటీ కంట్రోల్, పేటెంటబుల్ ఇన్నొవేషన్లు సిస్టమాటిక్‌గా బయటకు రావడంఅంతేగాదు ఈ ఆర్ అండ్ డీ సెంటర్ వల్ల నేరుగా ఇంజినీర్లు, టెక్నీషియన్లు, ప్రోడక్ట్ డెవలపర్లు, డేటా అనలిస్టులకు ఉద్యోగాలు వస్తాయని, పక్కనే రైతులు, ఇండస్ట్రీ వర్కర్లు, లాజిస్టిక్స్, మార్కెటింగ్, ఎక్స్పోర్ట్ రంగాల్లో కూడా కొత్త ఉపాధి అవకాశాలు తెరుచుకుంటాయని తెలిపారు. ఇది “లైవ్లీహుడ్ ప్రాజెక్ట్” స్థాయిలో ఉండే వెదురు సాగును, నిజమైన ఆర్థిక రంగంగా మారుస్తుందని డా. గౌడ అభిప్రాయపడ్డారు. అందువల్ల వీటిని సాగు ఒక్కటే భవిష్యత్తు కాదని, మరింత లోతుగా అధ్యయనం చేయడం దాని వాల్యూ తెలుసుకోవడం అత్యంత ముఖ్యమని నొక్కి చెప్పారు. అందువల్ల ఫిలిప్పీన్స్ వంటి దేశాల్లో వెదురు విప్లవం మొదలైంది. గ్రామీణ సమాజాన్ని పేదరికం నుంచి బయటపడేసే హీరోగా, భూమిని రక్షించే మొక్కగా, అలాగే నిర్మాణ రంగానికి ఆయువు పట్టుగా కీర్తిస్తున్నారు. అలాంటి వెదురు కలప పరిశ్రమ వాస్తవికతలోకి రావాలంటే పరిశోధనల్లో పెట్టుబడులు పెడితేనే సాధ్యమని లేదంటే ప్రచారంగానే మిగిలిపోతుందని హెచ్చరించారాయన.(చదవండి: ముంచుకొస్తున్న వ్యవసాయ, ఆహార విపత్తు! ఎఫ్ఏఓ ఆందోళన) -
ముంచుకొస్తున్న వ్యవసాయ, ఆహార విపత్తు!
అత్యవసర వ్యవసాయ ఉత్పాదకాలైన ఎరువుల ఉత్పత్తి కోసం సహజ వాయువును తీసుకువెళ్లే ఓడలను హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణించటాన్ని వెంటనే పునఃప్రారంభించకపోతే ప్రపంచ ఆహార ధరలు ఈ ఏడాది చివర్లో విపరీతంగా పెరిగే ముప్పు పొంచి ఉందని ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏఓ) తీవ్రస్వరంతో హెచ్చరిస్తోంది. హార్ముజ్ జలసంధిలో రవాణాకు దీర్ఘకాలిక అంతరాయాలు కోవిడ్–19 అనంతర కాలాన్ని గుర్తుచేసే విధంగా ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను, సరఫరా గొలుసులో ఆటంకాలను ప్రేరేపించగలవని ఎఫ్ఏఓ హెచ్చరించింది.పంటల క్యాలెండర్ల ప్రకారం ఎరువులు, ఇంధన ఉత్పాదకాలు సకాలంలో అందకపోవటం, అధిక ధరల కారణంగా పేద దేశాలు అత్యధిక ప్రమాదంలోకి కూరుకుపోతున్నాయని ఎఫ్ఏఓ ముఖ్య ఆర్థికవేత్త మాక్సిమో టొరెరో ఆందోళన వ్యక్తం చేశారు. ఎఫ్ఏఓ ఆర్థిక విభాగం డైరెక్టర్ డేవిడ్ లాబోర్డ్తో కలిసి ఇటీవల ఒక పాడ్‌కాస్ట్‌లో ఆయన మాట్లాడారు. ముడి చమురు, నత్రజని ఎరువుల తయారీకి ఉపయోగించే సహజ వాయువు, ఇంకా ఇతర ఎరువులు రవాణా కావడం లేదు. ఫాస్ఫేట్ ఎరువుల తయారీకి ఉపయోగించే సల్ఫర్ రవాణా కూడా స్తంభించిందని ఆయన అన్నారు. నౌకలు కదలకపోతే, ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ–ఆహార వ్యవస్థకు, ఆర్థిక వృద్ధికి, ఇంకా అనేక రంగాల రోజువారీ కార్యకలాపాలకు అవసరమైన కీలక వనరులపై గణనీయమైన ప్రభావం పడుతుందని టొరెరో హెచ్చరించారు. రాబోయే రోజుల్లో నౌకలు కదలడం ప్రారంభిస్తాయని ఆశిస్తున్నానన్నారు. ‘సమయం గడిచిపోతోంది..’ ‘సమయం గడిచిపోతోంద’ని ఎఫ్ఏఓ ప్రధాన ఆర్థికవేత్త టొరెరో అన్నారు. వ్యవసాయ–ఆహార వ్యవస్థకు సంబంధించిన ప్రతిదీ పంటల క్యాలెండర్‌తో ముడిపడి ఉందని వివరించారు. మనం పంటల క్యాలెండర్‌ను పాటించకపోతే, విత్తనాలు/ నాట్లు వేసే సమయంలో రైతుల దగ్గర పెట్టుబడులు లేక΄ోతే తక్కువ పెట్టుబడులతో వ్యవసాయం చేయవలసి వస్తుంది. అందువల్ల రానున్న ఒకటి, రెండు పంటకాలాల్లో దిగుబడులు తగ్గి΄ోవచ్చు. అలాగే ఆహారం, నిత్యావసరాల ధరలు పెరిగిపోవచ్చు. ప్రస్తుతం మనం ఈ అత్యవసర పరిస్థితిలో ఉన్నాం. దీనివల్ల వడ్డీ రేట్లు పెరుగుతాయని, అది ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుందన్నారు. కోవిడ్–19 నుండి కోలుకున్న తర్వాత అనుసరించిన విధానాల మాదిరిగానే, అన్ని దేశాలు ధరలను తగ్గించే విధానాలను అమలు చేయాల్సి ఉంటుంది. అందువల్ల, ఈ నౌకలు ఇప్పుడు కదలడం ప్రారంభించడం చాలా ముఖ్యం అని టొరెరో నొక్కి చెప్పారు.ఆహార పంటల సాగు తగ్గొచ్చుధరల సూచి ఏప్రిల్‌లో పెరుగుతోందని, మేలో అది మరింత తీవ్రమవుతుందని టొరెరో పేర్కొన్నారు. ఎరువుల లభ్యతకు అనుగుణంగా పంటల ఎంపికలను మార్చుకోవాలా వద్దా? పెరిగిన చమురు ధరలతో ప్రయోజనం పొందడానికి జీవ ఇంధనాల ఉత్పత్తికి అనువైన పంటల సాగుకు ఎక్కువ భూమిని, వనరులను కేటాయించటంపై రైతులు నిర్ణయాలు తీసుకుంటారు. దీని వల్ల ప్రపంచ ఆహార సరఫరా తగ్గిపోతుంది. అందుకే కాల్పుల విరమణ కొనసాగడం, జలసంధిలోని నౌకలు కదలటం అత్యవసరమని అన్నారు. ముఖ్యంగా ఇంధనం, ఎరువులపై ఎగుమతి ఆంక్షలను నివారించాలని ఎఫ్ఏఓ అన్ని దేశాలను కోరింది.మాక్సిమో టొరెరో ఎఫ్ఏఓ ముఖ్య ఆర్థికవేత్త -
'అరటిపండు'ని ప్రపంచ ఫలం అంటారు ఎందుకో తెలుసా..!
ప్రపంచవ్యాప్తంగా సామాన్యులకు కూడా అత్యంత అందుబాటులో ఉండే పండు అరటి పండు. అంతర్జాతీయ వాణిజ్యంలో అత్యధికంగా ఎగుమతయ్యే పండు అరటి పండు. ప్రపంచవ్యాప్తంగా 40 కోట్ల మందికి అరటి పంట జీవనాధారంగా నిలిచింది. దీన్ని సాగు చేసి విక్రయించి ఆదాయాన్ని పొందుతున్న రైతులు కొందరైతే... అరటి ఉత్పత్తులనే దైనందిన ప్రధాన ఆహారంగా తీసుకుంటూ ఆధారపడుతున్న వారు మరికొందరు. ప్రపంచ అరటిపండు దినోత్సవం ప్రతి ఏప్రిల్ నెల మూడో బుధవారం జరుపుకుంటున్నారు.ప్రపంచంలో అత్యధికంగా ప్రజలు తింటున్న, ఎగుమతి చేస్తున్న పండ్లలో అరటి ఒకటి. పండుగా తినటమే ఎక్కువ. పచ్చి కాయను కూరగా వండి లేదా కాల్చి లేదా పిండి చేసి నిల్వచేసుకొని దైనందిన ఆహారంగా తినే దేశాలూ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న పరిమాణ పరంగా మొదటి పది ప్రధాన పంటల్లో అరటి ఒకటిగా నిలుస్తుంది. ప్రపంచ అరటి పరిశ్రమ విలువ సంవత్సరానికి సుమారు 2,500 కోట్ల డాలర్లు. ఆహార భద్రత, పౌష్టికత, గ్రామీణాభివృద్ధిలో అరటి పండ్లు కీలక పాత్ర పోషిస్తాయి.150కి పైగా దేశాలలో అరటిని పండిస్తారు. ముఖ్యంగా తక్కువ ఆదాయం గల, ఆహార కొరత ఉన్న దేశాల్లో రోజువారీ ముఖ్యమైన ఆహారంగా అరటిని ఉపయోగిస్తున్నారు. అంతేకాకుండా, లక్షలాది మంది చిన్న రైతులకు వాణిజ్య పంటగా కీలకమైన ఆదాయ వనరుగా కూడా ఉంది. మొత్తంగా, ప్రపంచవ్యాప్తంగా అరటి ఆర్థిక వ్యవస్థ సుమారు 40 కోట్ల మంది ప్రజల జీవనోపాధికి దోహదం చేస్తోందని అంచనా. అరటి తోటల్లో లక్షలాది మంది కార్మికులకు ప్రత్యక్ష ఉపాధి దొరుకుతోంది. ప్యాకింగ్, రవాణా, మార్కెటింగ్‌లో పరోక్ష ఉద్యోగాలు పొందే వారు చాలా మంది ఉన్నారు. ఉత్పత్తి చేసే దేశాల్లోనే కాకుండా అరటి ఆధారిత పరిశ్రమ ముడిసరుకుల తయారీ నుండి అంతర్జాతీయ రవాణా, ఓడరేవు సేవలు, టోకు మార్కెట్లు, చిల్లర మార్కెట్ల వరకు ప్రపంచ అరటి విలువ గొలుసు అంతటా ఎంతో మందికి అరటి ఉపాధిని కల్పిస్తోంది.ప్రపంచ అరటి పండ్ల ఉత్పత్తి గత కొన్ని దశాబ్దాల్లో గణనీయంగా పెరిగింది. 2023 నాటికి ఇది 13.93 కోట్ల టన్నులకు చేరుకుంది. భారతదేశం, చైనా, ఇండోనేషియా, నైజీరియా, ఈక్వెడార్ అగ్రగామి అరటి ఉత్పత్తిదారులుగా ఉన్నాయి. అధిక శాతం అరటిపండ్లు స్థానికంగా వినియోగించబడుతుంటాయి. సుమారు 15 శాతం అంతర్జాతీయ వాణిజ్యంలోకి ప్రవేశిస్తున్నాయి. 2024 నాటికి ప్రపంచ ఎగుమతులు 19.7 మిలియన్ టన్నులకు చేరుకున్నాయి. ప్రపంచ నికర అరటిపండ్ల ఎగుమతులలో దాదాపు 80 శాతం వాటాతో ఈక్వెడార్, ఫిలిప్పిన్స్, కోస్టారికా, గ్వాటెమాల, కొలంబియా అగ్రగామి ఎగుమతి దేశాలుగా ఉన్నాయి. యూరోపియన్ యూనియన్, అమెరికా, చైనా, రష్యా, జపాన్ అతిపెద్ద దిగుమతి మార్కెట్లుగా కొనసాగుతున్నాయి.అరటి సాగులో భారత్ వాటా29% ప్రపంచ అరటి ఉత్పత్తిలో 25–29% వాటాతో భారత్ అగ్రస్థానంలో ఉంది. తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్రప్రదేశ్‌లలో అరటి తోటల సాగు విస్తారంగా ఉంది. భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి 1993లో తమిళనాడులోని తిరుచిరాపల్లిలో జాతీయ అరటి పరిశోధనా కేంద్రాన్ని నెలకొల్పింది. ఈదురుగాలులకు అరటి తోటలు కూలిపోవటం రైతులకు అపారమైన నష్టాన్ని కలిగిస్తోంది. ఈ సమస్యను అధిగమించటానికి జీ9 మాదిరిగా అధిక దిగుబడినిచ్చే పాటి అరటి రకాన్ని ఈ కేంద్రం ఇటీవలే రూపొందించటం విశేషం.వెయ్యికి పైగా అరటి రకాలుప్రపంచవ్యాప్తంగా వెయ్యికి పైగా అరటి రకాలు ఉన్నాయని అంచనా. అయితే, ప్రపంచ ఎగుమతులలో ప్రధానంగా ‘కావెండిష్’ అరటి పండు రకానిదే ఆధిపత్యం. మన దేశంలో వాణిజ్యపరంగా ఉత్పత్తి చేస్తూ విరివిగా విక్రయిస్తున్న గ్రాండె నైన్ (జీ9) రకం దీనికి సంబంధించినదే. 20వ శతాబ్దం మధ్యకాలం వరకు, ప్రధాన ఎగుమతి రకం గ్రోస్ మిషెల్. రుచికి మరియు రవాణాలో తట్టుకునే సామర్థ్యానికి ప్రసిద్ధి చెందింది. అయితే, ఫ్యూసేరియం విల్ట్ రేస్ 1 అనే మట్టి ద్వారా వ్యాపించే శిలీంధ్రపు తెగులు మహమ్మారిగా మారి లాటిన్ అమెరికా అంతటా గ్రోస్ మిషెల్ తోటలను నాశనం చేసింది. దీంతో ఆ తెగులును తట్టుకోగల కావెండిష్ రకాల వైపు మళ్లవలసి వచ్చింది.కావెండిష్ అరటిపండ్లు సాగులోకి వచ్చిన కొద్ది కాలంలోనే అంతర్జాతీయ వాణిజ్యంలో ప్రాధాన్యత గల ఎంపికగా మారాయి. అధిక దిగుబడి, ఏకరీతి రూపం, ఎక్కువ కాలం నిల్వ ఉండే గుణం, సుదూర ప్రాంతాలకు రవాణాలో తట్టుకునే శక్తి, స్పష్టమైన పక్వ లక్షణాలే ఇందుకు కారణాలు. నేడు ప్రపంచ అరటి ఎగుమతులలో 90 శాతం, ప్రపంచ ఉత్పత్తిలో దాదాపు సగం వాటా కావెండిష్ అరటి పండ్లదే. అయినప్పటికీ, కావెండిష్ రకంతోపాటు, ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అరటిపండ్లు సాగులో ఉన్నాయి. ఇవి స్థానిక ఆహారపు అలవాట్లు, మార్కెట్లు, సంస్కృతులలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి. వీటిలో వంటకు ఉపయోగించే రకాలు (ప్లాంటైన్లు, ఇతర పిండి పదార్థాలు అధికంగా ఉండే అరటిపండ్లు), పండించి తినే అనేక ఇతర రకాల అరటి రకాలు ఉన్నాయి. వీటిలో ప్రతి ఒక్కటీ ప్రత్యేకమైన వ్యవసాయ లక్షణాలు, పోషక ప్రయోజనాలు, గుణాలను కలిగి ఉండి జీవవైవిధ్యానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. కొత్త రకాల అభివృద్ధిఅరటిపండ్లు ఆగ్నేయాసియాలో ఉద్భవించాయి. అడవి అరటిపండ్ల సహజ సంకరీకరణ వలన ఆ ప్రాంతంలో, పసిఫిక్‌లో వాటిని తొలుత సాగు చెయ్యటం ప్రారంభమైంది. అన్ని అరటిపండ్లు ముసేసి కుటుంబంలోని మూసా ప్రజాతికి చెందినవి, ఇందులో ఎన్సెటే, ముసెల్లా ప్రజాతులు కూడా ఉన్నాయి. కాలక్రమేణా కొత్త రకాల అభివృద్ధి జరిగింది. తోటల సాగు, పోషకాల అవసరాలు, పంటకోత అనంతర సవాళ్లను పరిష్కరించడానికి మెరుగైన రకాలను అభివృద్ధి చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం విస్తృత శ్రేణిలో ప్రజనన (బ్రీడింగ్) ప్రయత్నాలు జరుగుతున్నాయి. అరటి, ప్లాంటైన్ ప్రజనన కార్యక్రమాల ముఖ్య ఉద్దేశాలలో ఫ్యూసేరియం విల్ట్ ట్రాపికల్ రేస్ 4 (టిఆర్4), బ్లాక్ సిగాటోకా (మైకోస్ఫెరెల్లా ఫిజియెన్సిస్), ఎల్లో సిగాటోకా (సూడోసెర్కోస్పోరా ముసే), బనానా బంచీ టాప్ వైరస్ (బీబీటీవీ) వంటి ప్రధాన వ్యాధులను తట్టుకునే రకాలను అభివృద్ధి చేస్తున్నారు.అరటి ప్రజనన కార్యక్రమాలు కరువు, లవణీయత, తీవ్ర ఉష్ణోగ్రతలు వంటి ఒత్తిళ్లను తట్టుకునే రకాలను అభివృద్ధి చేయడం ద్వారా మెరుగైన, నాణ్యమైన రకాలను ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు రూపొందిస్తున్నాయి. తద్వారా మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో స్థిరమైన దిగుబడిని పొందటం సాధ్యపడుతుంది. పండ్ల నిల్వ కాలాన్ని పొడిగించడం, ఎంజైమాటిక్ బ్రౌనింగ్‌ను తగ్గించడం, పండ్ల దృఢత్వాన్ని, నిర్వహణ నష్టాన్ని తట్టుకునే శక్తిని పెంచడం ద్వారా కోత అనంతర సమస్యలను తగ్గించటంపై కూడా దృష్టి సారిస్తున్నారు. అదే సమయంలో, విటమిన్ ఎ, ఇనుము, జింక్‌తో బయోఫోర్టిఫికేషన్ ద్వారాపోషకాలను పెంచుతున్నారు. అలాగే అరటిపండ్లు, కూర అరటి రకాల నాణ్యతను మెరుగుపరచడానికి పిండిపదార్థం, చక్కెర కూర్పును సరిచేయడంపై కూడా ఈ ప్రజనన కార్యక్రమాలు దృష్టి సారిస్తున్నాయి. అదే సమయంలో, మారుతున్న మార్కెట్, వినియోగదారుల డిమాండ్లను తీర్చడానికి మెరుగైన రుచి, ఆకృతి, ప్రాసెసింగ్ అనుకూల లక్షణాలతో కూడిన రకాలను అభివృద్ధి చేయడం కూడా జరుగుతోంది.ఒకే రకం సాగుతో ముప్పుఆర్థిక అనిశ్చితి, వాతావరణ మార్పులు అరటి పంటపై కూడా తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. జీవనోపాధి కోసం, ఆహార భద్రత కోసం లక్షలాది మంది ఆధారపడే అరటి పంట ఉత్పత్తి అనేక సమస్యలను ఎదుర్కొంటున్నది. ఒకే రకంపై ఎక్కువగా ఆధారపడటం, అరటిలో అంతర పంటలు వెయ్యకుండా ఏక పంట సాగుపై ఆధారపడటం వల్ల అరటి తోటల సాగు పర్యావరణ పరంగా, చీడపీడల పరంగా ఒత్తిళ్లకు గురవుతోంది. అదేవిధంగా మార్కెట్లో ఎదురయ్యే ఒడిదుడుకులు అరటి రంగాన్ని ప్రమాదంలోకి నెడుతున్నాయి. కావెండిష్ అంటే జీ9 రకం ఒక్కదాన్నే సాగు చెయ్యటం మానుకోవాలని ప్రపంచ అరటి ఫోరమ్ ప్రచారం చేస్తోంది. ‘అరటి రకాల్లో ఇప్పటికీ విస్తృతంగా సాగు చెయ్యని అపారమైన వ్యవసాయ వైవిధ్యం ఉంది. ఆ వైవిధ్యపూరిత రకాలను వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చెయ్యాలి. స్థానిక మార్కెట్లలో అత్యంత ప్రజాదరణ పొంది, సాగు జరిగే ప్రాంతాల్లోని సాంస్కృతిక వారసత్వంలో భాగమైనవైనప్పటికీ, అంతర్జాతీయ వాణిజ్య అవసరాలకు మనం ఇచ్చిన ప్రాధాన్యం రీత్యా మరుగునపడ్డాయి. ఈ అరటి రకాలను తిరిగి సాగులోకి తేవాలి. ఉదాహరణకు.. మైసూరు అరటి రకం. ఈ సంప్రదాయ రకాలు అరటి తోటల్లో వ్యవసాయ జీవవైవిధ్యాన్ని పెంపొందిస్తాయి. చీడపీడలను, కరువు వంటి ప్రకృతి వైపరీత్యాలను తట్టుకోవటంలో అరటి రంగం సామర్థ్యాన్ని పెంచడానికి, కొత్త మార్కెట్ అవకాశాలను తెరవడానికి ఈ స్థానిక రకాలు అవకాశాలు కల్పిస్తున్నాయి. ఈ విషయాలను ప్రచారంలోకి తేవాల’ని ప్రపంచ అరటి ఫోరమ్ ప్రపంచ దేశాలకు సూచిస్తోంది. అరటి సాగులో సవాళ్లుఅంతర్జాతీయంగా అరటి పంట బాగోగులు, తీరుతెన్నులను పరిశీలిస్తూ ప్రపంచ దేశాలకు తగిన సూచనలు ఇచ్చే సంస్థ ప్రపంచ అరటి ఫోరమ్. ఐక్యరాజ్యసమితికి అనుబంధంగా ఉండే ఆహార–వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏఓ) ఏర్పాటు చేసిన ఈ ఫోరం ఏమంటోందంటే? ‘ప్రపంచంలో అత్యధికంగా ఎగుమతి అయ్యే తాజా పండ్లు అరటి పండ్లే. సంవత్సరానికి దాదాపు వెయ్యి కోట్ల డాలర్లు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని వేలాది గ్రామీణ కుటుంబాలకు అరటి పండ్లు ఒక ముఖ్యమైన ఆదాయ వనరు. అయితే, అరటి సాగులో వ్యవసాయ రసాయనాలపై అధికంగా ఆధారపడటం, రైతుల చేతికందే ఆదాయం బాగా తగ్గటంతోపాటు గణనీయమైన పర్యావరణ, సామాజిక సవాళ్లు తలెత్తాయి. సంబంధిత వర్గాలన్నీ చురుకుగా సహకరించుకుంటేనే వీటిని సమర్థవంతంగా పరిష్కరించగలం’.– నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ (చదవండి: రైతమ్మల గెలుపుకి.. సాంకేతిక సామాజిక స్ట్రాటజీ..) -
జీవ వనరుల కేంద్రాల స్థాపనపై శిక్షణ
రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించటానికి.. తెగుళ్ల నియంత్రణ, నేల/మొక్కల ఆరోగ్య నిర్వహణ కోసం రసాయనేతర వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించటానికి హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని జాతీయ మొక్కల ఆరోగ్య యాజమాన్య సంస్థ (ఎన్ఐపీహెచ్ఎం) వివిధ తక్కువ ఖర్చుతో కూడిన సాంకేతికతలు, ఉత్పాదకాలను అభివృద్ధి చేసింది. కేంద్ర వ్యవసాయ శాఖకు అనుబంధంగా ఈ సంస్థ ఏర్పాటైంది. దేశంలో సేంద్రియ / ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించటంలో భాగంగా రైతులకు నాణ్యమైన జీవన ఎరువులు, ద్రావణాలు, కషాయాలు వంటి జీవ ఉత్పాదకాలను అందించే జీవ వనరుల కేంద్రాల (బీఆర్సీల) స్థాపనపై సంపూర్ణ అవగాహన కలిగించటానికి ఎన్ఐపీహెచ్ఎం ఈ నెల 21 నుంచి 23 వరకు మూడు రోజుల రెసిడెన్షియల్ శిక్షణ ఇవ్వనుంది. తక్కువ ఖర్చుతో కూడిన జీవ ఉత్పాదకాలు, వాటి ఉత్పత్తి సాంకేతికతల గురించి అవగాహన కలిగిస్తారు. ప్రగతిశీల రైతులు, ఎఫ్పీఓలు / స్వయం సహాయక బృందాలు/ కృషి సఖిలు, విస్తరణ అధికారులు, సేంద్రియ/ ప్రకృతి వ్యవసాయం చేస్తున్న గ్రామీణ యువ పారిశ్రామికవేత్తలు ఈ శిక్షణ పొందడానికి అర్హులు. ఫీజు, భోజన, వసతి సదుపాయాల వివరాల కోసం ఎన్ఐపీహెచ్ఎం వెబ్సైట్ చూడొచ్చు లేదా ఈమెయిల్ ద్వారా సంప్రదించవచ్చు: dirphmniphm-ap@nic.in - damodar.kammari@gov.in -
‘నూకలు’ చెల్లిన కలుపు!
వరి పొలాల్లో కలుపు నివారణకు రైతులు రసాయనిక గడ్డి మందులు / కలుపు మందులు పిచికారీ చెయ్యటం రివాజు. అయితే, ప్రస్తుత రబీ పంట కాలంలో తెలుగు రాష్ట్రాల్లో నీరు నిల్వగట్టే పద్ధతిలో వరి సాగు చేసే కొందరు వరి రైతులు ఒక సరికొత్త ప్రయోగం చేసి కలుపుపై నూటికి నూరు శాతం సక్సెస్ అయ్యారు. కలుపు మందులకు బదులుగా వరి బియ్యం నూకలను నాట్లు వేసిన పొలంలో చల్లి కలుపు మొలవకుండా అడ్డుకున్నారు. ఎకరానికి రూ. 5 వేలకు పైగా రైతులకు ఖర్చు తగ్గటంతో పాటు పర్యావరణానికి మేలు జరిగింది. ప్రముఖ రైతు శాస్త్రవేత్త పద్మశ్రీ పురస్కార గ్రహీత చింతల వెంకటరెడ్డి (సీవీఆర్) చెప్పిన ఈ చిట్కా సూపర్ హిట్ అయ్యింది. వరి నాటిన మొదటి 3 రోజుల్లో ఒకసారి, 25వ రోజు మరోసారి ఎకరానికి 100 కిలోల చొప్పున వరి బియ్యం నూక (రెండుసార్లు కలిపి ఎకరానికి 200 కిలోలు) చల్లాలని ఆయన సూచించారు. ఈ ఆవిష్కరణపై జనవరి 6న ‘సాక్షి సాగుబడి’లో కథనం ప్రచురించిన విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో సేంద్రియ/ ప్రకృతి వ్యవసాయ దారులతో పాటు రసాయనిక ఎరువులు వాడే రైతులు, సమస్యాత్మక చౌడు భూముల్లో వరి పండించే రైతులు కూడా సత్ఫలితాలు పొందుతుండటం విశేషం. వరి నూకలు లేకపోతే ధాన్యాన్ని మరపట్టించి పొట్టుతో సహా పొలంలో చల్లినా కలుపు సమస్య తీరిందని రైతులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో దీనిపై అధ్యయనం చెయ్యాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నూకలు కలుపును ఎలా నియంత్రిస్తాయంటే?నూకలు చల్లితే కలుపు నియంత్రణ జరగటానికి వెనుక శాస్త్రీయత ఏమిటి అని ప్రశ్నించినప్పుడు తన పేరు వెల్లడించటానికి అంగీకరించని ఒక సీనియర్ శాస్త్రవేత్త ఇలా వ్యాఖ్యానించారు: ‘నూకలను వరి పొలాల్లో చల్లితే కలుపు నివారణకు సహాయపడుతుంది. ఒక రకమైన ఆచ్ఛాదన పొర (మల్చింగ్ లేయర్) ఏర్పడుతుంది. ఈ పొర సూర్యరశ్మిని అడ్డుకుంటుంది. కలుపు మొక్కల పెరుగుదలను అణచివేస్తుంది. కలుపు విత్తనాలు మొలకెత్తలేవు. పొలంలో నిల్వగట్టిన నీటి ఆవిరి నష్టం, నేల కోత తగ్గుతుంది. నేల ఆరోగ్యం మెరుగవుతుంది. పంట పెరుగుదలకు తోడ్పడుతుంది. అయితే, వరి పొలాల్లో నూకలు చల్లితే ఏమవుతుందనే అంశంపై శాస్త్రీయంగా పటిష్టమైన అధ్యయనాలు ఇప్పటి వరకు జరగలేదు. వరి పొట్టు బయోచార్ను పొలంలో చల్లినా కూడా ఈ ఫలితాలు వస్తాయి. ఈ విషయం పరిశోధనల్లో ఇప్పటికే నిర్ధారణైంది.’యూరియాతో నూకలు చల్లితే మోకాళ్ల ఎత్తు తుంగ పోయింది!రెండు పొలాల్లో మొత్తం 10.5 ఎకరాల్లో వరి సాగు చేస్తున్నా. ఎకరానికి 1 బస్తా డీఏపీ, మూడు సార్లు కలిపి 2.5 బస్తాల యూరియా, అర బస్తా పొటాష్ వాడుతుంటాను. ఈ రబీ సీజన్లో 4.5 ఎకరాల పొలంలో డ్రమ్‌సీడర్‌తో ‘ఆర్ఎన్ఆర్31479’ వరి విత్తనాలు వేశాను. తుంగ మోకాళ్ల ఎత్తు పెరిగింది. వరి మొక్కలు దానికి సగం ఎత్తులోనే ఉన్నాయి. పంట పోయినట్లే నని దున్నేద్దాం అనుకున్నా. ఆ దశలో చింతల వెంకటరెడ్డి గారు నూకల గురించి చెప్పింది విని 4.5 ఎకరాల్లో 170 కిలోల సన్న (చీరు) నూకలను 3 కట్టల యూరియాలో కలిపి చల్లా. వారం రోజుల తర్వాత నుంచి తుంగ వాడిపోవటం మొదలైంది. కొన్నాళ్లలో తుంగ పూర్తిగా నేలవాలింది. వరి మొక్కలు మాత్రం ఏపుగా పెరిగాయి. కోతల నాటికి తుంగ ఆనవాళ్లు కూడా లేకుండా పోయింది. పోయిందనుకున్న పొలంలో ఎకరానికి 35 బస్తాలు పండింది. అందరితో పాటు నేనూ ఆశ్చర్యపోయాను. మరో 6 ఎకరాల్లో ‘కేఎన్ఎం 12368’ వరి నాట్లు వేశాను. తుంగ, ఇతర కలుపు లేకపోయినా రెండో దఫా వేసే 3 కట్టల యూరియాతో పాటు 150 కిలోల నూకలు కలిపి చల్లాను. పంట బాగా పెరిగి కోతకు వచ్చింది. ఎకరానికి 45 బస్తాల వరకు దిగుబడి వస్తుంది. చివరి విడత యూరియా, పొటాష్ వెయ్యాల్సిన అవసరం రాలేదు. నూకల వల్ల పురుగుమందులు, ఫంగిసైడ్స్ చల్లాల్సిన అవసరం రాలేదు. పురుగుమందుల ఖర్చే ఎకరానికి రూ. 5 వేలు మిగిలాయి. క్వింటా నూకలకు రూ.1,800 వరకు ఖర్చవుతున్నది. అయినా, వీటిని చల్లటం వల్ల తుంగ వంటి మొండి కలుపు కూడా పోవటం ఒక్కటే కాదు ఇతర ఉపయోగాలు కూడా ఉన్నాయని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. – వల్లభనేని వెంకట్రావు (81793 84318), లింగగిరి, హుజూర్నగర్ మం., సూర్యాపేట జిల్లాచౌడు సమస్య తగ్గింది.. కలుపు మొలవ లేదు..మాది 2 ఎకరాల చౌడు పొలం. సేంద్రియ వ్యవసాయం చేస్తున్నాను. చింతల వెంకటరెడ్డి గారు చెప్పినట్లు కలుపు నివారణకు నూకలు చల్లితే మంచి ఫలితాలు వచ్చాయి. 1.25 ఎకరాల వరి పొలంలో రెండు దఫాలుగా ఎకరానికి 100 కిలోల చొప్పున నూకలు చల్లాను. తుంగ, గరిక తదితర కలుపు మొలవలేదు. అంతేకాదు, చౌడు వల్ల ప్రతి ఏటా మొక్కలు చాలా చనిపోయేవి. కానీ, నూకలు వేశాక మొక్కలన్నీ బతికాయి. 30 బస్తాల ధాన్యం దిగుబడి వచ్చింది. మరో, 75 సెంట్ల వరి పొలంలో నూకలు ఒక్కసారే వేశాను. రెండోసారి వెయ్యలేదు. మొక్కలు 20% పోయాయి. ఇంకా పంట కొయ్య లేదు. నూకలు చల్లిన తర్వాత కొన్ని రోజులకు మురుగు వాసన వస్తుంది. అయితే, కలుపు పెరగదు. కలుపు మందులు కొట్టినా కలుపు అంతో ఇంతో వస్తూనే ఉంటుంది. నూకలు కలుపు రాకుండా చెయ్యటంతో పాటు చౌడు సమస్యలను కూడా తగ్గించాయి. –చిన్నపరెడ్డి నరసింహారెడ్డి (94406 86885), తిమ్మంపేట, జఫర్‌గఢ్ మం., జనగామ జిల్లాశాస్త్రీయ పరిశోధన చెయ్యాలిఇవన్నీ కూడా మన సంప్రదాయ వైద్యంలో చెప్పే విషయాల వంటివి. ఏదైనా ఫలితాలనిస్తే దాన్ని మనము ఆలోచించాలి, అయితే, కొందరు రైతులు బాగుంది అంటున్నారు కాబట్టి, ఇంకా విస్తృత స్థాయిలో పరీక్షించాలి. క్రమబద్ధ శాస్త్రీయ పరిశోధన చేయకుండా దీన్ని మనం సిఫార్సు చేయటం సాధ్యం కాదు. – డాక్టర్ చెన్నబోయిన దామోదర రాజు, అధిపతి–ప్రధాన శాస్త్రవేత్త, వరి పరిశోధనా సంస్థ, ప్రొ. జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం.ఎకరానికి 50 కిలోలు చల్లిన పొలాల్లోనూ కలుపు రాలేదువరి పొలాల్లో నూకలు చల్లితే కలుపు సమస్య తీరిపోవటం ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమని ఈ రబీ పంట కాలంలో తొలిసారి నా అనుభవంలో రుజువైంది. 1.25 ఎకరం పడావు భూమిని సిద్ధం చేసి నాట్లు వేశాం. ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటిస్తున్నాం. నాట్లేసిన రెండో రోజు, 25వ రోజు వంద కిలోల చొప్పున వరి బియ్యం నూకలు చల్లాం. మా పొలంలో కలుపు అసలు రాలేదు. పంట ఎర్రబడకుండా ఆకుపచ్చగా, ఆరోగ్యంగా ఉంది. త్వరలో కోతకు రానుంది. చదవండి: కలుపు మొక్కల 'ఉపయోగాలు' మీకు తెలుసా?పొలాన్ని వీడియోతీసి యూట్యూబ్‌లో పోస్ట్ చేస్తే, అనుసరించిన 60–70 మంది రైతులు ఫోన్ చేసి తమ అనుభవాలు చెప్పారు. ఎకరానికి 50 కిలోల నూకలు వేసిన పొలాల్లో కూడా కలుపు నివారణ జరిగింది. నాట్లేసిన తర్వాత 10–26 రోజులకు నూకలు చల్లిన పొలాల్లోనూ కొత్తగా కలుపు పుట్టలేదు. మా తమ్ముడు పొలంలో కనీసం రెండుసార్లు కలుపు తీయిస్తాడు. నాట్లేసిన 20 రోజులకు ఒకసారి కలుపు తీసినాక ఒకే ఒక్కసారి ఎకరానికి వంద కిలోలు నూకలు చల్లినా కలుపు మళ్లీ రాలేదు. చౌడు భూముల్లో ఆర్గానిక్ వరి సాగు చేసే పొలాల్లో నూకలు చల్లినా కలుపు రాలేదు. మొక్కలు చనిపోవటం, ఎరుపు రంగుకు మారటం కూడా జరగలేదని రైతులు చెబితే ఆశ్చర్యం కలిగింది. కలుపు మందులు కేన్సర్ కారకాలని చెబుతున్న నేపథ్యంలో నూకలతో కలుపు నివారణ ఆవిష్కరణను సీవీఆర్ అందించటం సంతోషదాయకం. – పడాల గౌతమ్ (98497 12341), ఎస్టేట్ మేనేజర్, రిషి వ్యాలీ స్కూల్, మదనపల్లి నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి, సాగుబడి డెస్క్ -
విజేతలు రైతమ్మలు..
మహిళా రైతులకు వాతావరణ మార్పులను తట్టుకునే సామర్థ్యాన్ని సమర్థవంతంగా, సుస్థిరంగా పెంపొందించే పద్ధతులపై అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ (ఐఆర్ఆర్ఐ) పరిశోధకుల బృందం అధ్యయనం నిర్వహించింది. ఫ్రాంటియర్స్ ఇన్ సస్టైనబుల్ ఫుడ్ సిస్టమ్స్ పత్రికలో ఇటీవల ప్రచురించిన ఈ అధ్యయనం ప్రకారం, మన మహిళా రైతులు నిజమైన వాతావరణ మార్పులను తట్టుకునే శక్తియుక్తులను పెంపొందించుకోవాలంటే వారికి ఏవో కొన్ని సాంకేతికతలను ఉన్నత స్థాయి నుంచి అందించటం ఒక్కటే సరిపోదు. వారికి సాంకేతిక, సామాజిక, సంస్థాగత మద్దతును వ్యూహాత్మకంగా సమన్వయం చేసి అందించాల్సిన అవసరం ఉందని ఈ అధ్యయనంలో తేలింది. భారత దేశవ్యాప్తంగా నాలుగు రాష్ట్రాల్లో విభిన్న కేస్ స్టడీలను ఐఆర్ఆర్ఐ విశ్లేషించి ఈ విషయాన్ని నిర్థారించింది. ఆ వివరాలు చూద్దాం...వాతావరణ సంక్షోభం దక్షిణాసియా దేశాల్లో వ్యవసాయం చేసే కోట్లాది మంది మహిళలను కూడా ప్రభావితం చేస్తోంది. వ్యవసాయ రంగంలో అహరహం శ్రమించటంలో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ, మహిళా రైతులు అడుగడుగునా ‘లింగ–వివక్ష’ను ఎదుర్కొంటున్నారు. వారు అధిగమించాల్సిన సామాజిక అడ్డంకులను పరిగణనలోకి తీసుకోకుండా, వారికి కొత్త సాంకేతికతతో కూడిన పనిముట్లను అందించటం వల్ల ప్రయోజనం ఉండటం లేదని అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ (ఐఆర్ఆర్ఐ) పరిశోధకుల బృందం నిర్వహించిన అధ్యయనం వెల్లడించింది. ఫ్రాంటియర్స్ ఇన్ సస్టయినబుల్ ఫుడ్ సిస్టమ్స్ పత్రికలో ఇటీవల ప్రచురించిన కొత్త అధ్యయనం ప్రకారం.. వాతావరణ మార్పులను తట్టుకునేందుకు నిజంగా ఉపయోగపడే సామర్థ్యాలను మనం పెంపొందించుకోవాలంటే, విడివిడి సాంకేతికతలను అందించడం ఆపి, అనేక ఆవిష్కరణలను కలిపి గంపగుత్తగా అందించడం ప్రారంభించాలి. ఎక్కడో ఉండే నిపుణులు తమకు తోచినట్లు సిద్ధం చేసిన సాంకేతికతను రైతుకు బదిలీ చేసే సాంప్రదాయ అధికార కేంద్రీకృత వ్యవసాయ విస్తరణ నమూనా మహిళా రైతుల విషయంలో విఫలమవుతోందని ఈ పరిశోధన తేల్చింది. దానికి బదులుగా, సామాజిక పరిస్థితులు, అవసరాల ఆధారిత సాంకేతిక విధానాన్ని అమలు చెయ్యాలని సూచించింది. అంటే, విత్తనం లేదా ట్రాక్టర్ కేవలం మహిళా రైతులకు, పురుష రైతులకు ఒకేలా ఉపయోగపడే ఒక తటస్థ సాంకేతికత కాదని గుర్తించడం.. సామాజిక సంబంధాలు, సాంస్కృతిక నియమాలు, ఆ సమాజంలోని సంస్థాగత అధికార స్థితిగతులపై దాని విజయం ఆధారపడి ఉంటుందని గుర్తించటం అవసరమని అధ్యయనం పేర్కొంది. ఈ భావనను నిరూపించడానికి అధ్యయనంలో భాగంగా ఐఆర్ఆర్ఐ పరిశోధకులు భారతదేశవ్యాప్తంగా నాలుగు విభిన్న కేస్ స్టడీలను విశ్లేషించారు. సాంకేతిక, సామాజిక, సంస్థాగత మద్దతును వ్యూహాత్మకంగా సమన్వయం చేయడం ద్వారా మహిళా రైతులు వాతావరణ మార్పులను తట్టుకునే సామర్థ్యం వైపు సమర్థవంతంగా, సుస్థిరంగా ఎలా మారగలరో ఈ అధ్యయనం వెల్లడించింది. విజ్ఞాన శాస్త్రం, భూ హక్కులపై అవగాహనతో చౌడుపై పోరాటంగుజరాత్లోని భావనగర్ ఉప్పునీటి చిత్తడి నేలల్లో పర్యావరణ ఒత్తిళ్లు, సామాజిక అసమానతలు విడదీయరానివని ఉత్థాన్ అనే సంస్థ (ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ స్టడీస్ ట్రస్ట్ నిర్వహించిన ఒక అధ్యయనం ద్వారా) గుర్తించింది. ఈ ప్రాంతంలోని మహిళలు నేల లవణీయతతోను, చట్టపరమైన భూమి హక్కుల లేమితో కూడా పోరాడుతున్నారు. భూమి హక్కులు లేకపోవడంతో వారు ప్రభుత్వ రుణాలను లేదా దీర్ఘకాలిక వ్యవసాయ వనరులను సులభంగా పొందలేకపోతున్నారు. ఉత్థాన్ రూపొందించిన నూతన ఆవిష్కరణల ప్యాకేజీ ప్రత్యేకమైనది. ఇది నేల పరీక్ష, సేంద్రియ ఎరువులు వంటి సుస్థిర వ్యవసాయ పద్ధతులను, సామాజిక–చట్టపరమైన సాధికారతతో జత చేసింది. బ్లాక్–స్థాయి రెవెన్యూ కార్యాలయాల్లో పనులు చక్కబెట్టేందుకు తోడ్పడే ‘కృషి సఖు’లు (మహిళా సామాజిక రిసోర్స్ పర్సన్లు), పారాలీగల్ కార్యకర్తలకు శిక్షణ ఇచ్చారు. పారాలీగల్ కార్యకర్తలు భూమి రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన చిక్కుముడులను అధిగమించడంలో మహిళా రైతులకు సహాయపడ్డారు. కృషి సఖులు ప్రామాణిక పంటల సాగు పద్ధతులన్నిటినీ బోధించారు. ఈ విధానం ఒక ‘సోదరభావాన్ని‘ సృష్టించింది. దీనిలో మహిళలు తమ తోటివారి నుంచి నేర్చుకున్నారు. ఇది వారి ఆత్మవిశ్వాసాన్ని మాత్రమే కాదు, వారిపై వారి భర్తలకున్న విశ్వసనీయతను గణనీయంగా పెంచింది.ఆవాల కోసం అనుభవజ్ఞానాన్ని, మార్కెట్లను నిర్మించటంఉత్తర ప్రదేశ్‌లోని ఉత్తర మైదాన ప్రాంతాల్లో గ్రామీణ్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా (జీఎఫ్ఐ) నీటి ఒత్తిడిని తట్టుకునే, పోషకాలు అధికంగా కలిగి ఉండే ‘పూసా మస్టర్డ్ 30’ అనే బయోఫోర్టిఫైడ్ ఆవాలు రకాన్ని ప్రవేశపెట్టింది. అయితే, ఒక మహిళ తన పంటను సరసమైన ధరకు అమ్ముకోవడానికి మార్గం లేనప్పుడు, కేవలం మెరుగైన విత్తనాన్ని అందించడం నిరుపయోగమని పరిశోధకులు పేర్కొన్నారు. జీఎఫ్ఐ ఈ లోపాన్ని అధిగమించే ప్రయత్నం చేసింది. ఈ విత్తనాలతో పాటు ఇతర ఆవిష్కరణల ప్యాకేజీని కలిపి అందించటంపై దృష్టి సారించింది. వారు రైతు ఉత్పత్తిదారుల సంఘాలు (ఎఫ్పీఓలు), స్వయం సహాయక బృందాల(ఎస్‌హెచ్‌జీల) ద్వారా మార్కెట్ అనుసంధానాలతోపాటు సాంకేతిక శిక్షణ ఇప్పించారు. బనారస్ హిందూ విశ్వవిద్యాలయానికి అవగాహన పర్యటనలను నిర్వహించడం ద్వారా, వారు శాస్త్రీయ నైపుణ్యాన్ని రైతులు అందరికీ అందుబాటులోకి తెచ్చారు. తద్వారా మహిళా రైతులు నిపుణులతో నేరుగా సంభాషించడానికి వీలు కలిగింది. ఈ మార్కెట్ అనుసంధానాలను కొనసాగించడంలో సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ.. ఎఫ్పీఓలు, ఎస్‌హెచ్‌జీల ద్వారా ఏర్పడిన సామూహిక భాగస్వామ్యం మహిళా రైతులకు బలాన్నిచ్చింది. మహిళలు తమ ఇళ్లలో, సమాజాలలో తమ అభిప్రాయాలను మరింత స్పష్టంగా వ్యక్తపరచడానికి ఈ సాధికారత సహాయపడింది.ముందడుగు ఎలా?మహిళా రైతుల సాధికారత కృషిలో సజావుగా ముందుకు సాగాలంటే మనం తప్పక చేయవలసినవి ఇవేనని ఐఆర్ఆర్ఐ పరిశోధకులు నొక్కి చెబుతున్నారు: ఎంత సమయం?: అమల్లోకి తెచ్చే సేంద్రియ వ్యవసాయం వంటి నూతన వ్యవసాయ సాంకేతికతలు ఒక మహిళా రైతు వెచ్చించే సమయాన్ని, శ్రమను ఎలా ప్రభావితం చేస్తాయో క్రమపద్ధతిలో అంచనా వేయాలి. అందరికీ భాగస్వామ్యం: ఇంటి బాధ్యతలను పునఃపంపిణీ చేయడానికి పురుషులను భాగస్వాములను చేసే లింగ పరివర్తన విధానాలను అవలంబించాలి. వ్యవస్థకు మద్దతు: భూమి హక్కులు, మార్కెట్ అందుబాటు, స్వయం సహాయక బృందాలు వంటి సామూహిక వేదికలలో సాంకేతికత వేరూనుకునేలా చెయ్యాలి. సాంకేతిక, సంస్థాగత అంశాలతో సామాజిక అంశాలను అనుసంధానించడం ద్వారా, తదుపరి తరం వాతావరణ అనుకూల వ్యవసాయానికి సంబంధించిన ఆధునిక సాధనాలు కేవలం ఒక షెడ్డుకే పరిమితం కాకుండా, ప్రపంచ ఆహార భద్రతకు వెన్నెముక అయిన మహిళలకు వాస్తవంగా సాధికారత కల్పించేలా నిర్థారణగా చెయ్యొచ్చు. పరిశోధకులు చెప్పినట్లుగా, ‘వ్యవస్థాగత ఏర్పాట్లు (సంస్థలు, పంపిణీ యంత్రాంగాలు, ప్రోత్సాహకాలు), సామాజిక సంబంధాలు (నియమాలు, గుర్తింపులు, శ్రమ పంపిణీ, సామాజిక అభ్యసనం) ఏకకాలంలో రూపాంతరం చెందినప్పుడు మాత్రమే సుస్థిరమైన ఆవిష్కరణ ఆవిర్భవిస్తుంది’. తోటివారి నుంచి నేర్చుకోవటం ఐఆర్ఆర్ఐ పరిశోధకులు నిర్వహించిన ఈ అధ్యయనంలో వెల్లడైన అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే, తోటి వారి నుంచి నేర్చుకోవడం ఎంత ప్రభావవంతంగా ఉందో తేలింది. అన్ని సందర్భాల్లోనూ, తమలాంటి వారు విజయం సాధించడాన్ని చూసినప్పుడు రైతులు ఆ కొత్త సాంకేతికతలను స్వీకరించడానికి ఎక్కువ మొగ్గు చూపారు. గుజరాత్లో తమ భార్యలైన మహిళా రైతులు అమలు చేసిన ప్రత్యేక సాగు పద్ధతుల వల్ల కలిగిన స్పష్టమైన ఫలితాలను కళ్లారా చూసిన పురుషులు, తొలుత సందేహాలు లేవనెత్తినా, చివరికి వారికి మద్దతుగా నిలిచారు. ఒకప్పుడు తాను పాల్గొనే సమావేశాలను పట్టించుకోని తన భర్త, చివరికి ఆమెతో ‘ఇంటి పనుల గురించి చింతించకు.. నీ సమావేశంపై దృష్టి పెట్టు’ అని చెప్పినట్లు ఒక మహిళా రైతు సంబరంగా గుర్తుచేసుకుంది. నమ్మకాన్ని పెంపొందించటం, సామూహిక కార్యాచరణ, నాయకత్వ శిక్షణ వంటి సామాజిక మద్దతు వల్లనే ఈ సాంకేతికతలు వేళ్లూనుకోవడానికి దోహదపడింది. భవిష్యత్తు వైపు చూస్తూ...వాతావరణ మార్పులను దీటుగా తట్టుకొని నిలిచే ‘క్లైమేట్ స్మార్ట్’ వ్యవసాయం నిజంగా ‘స్మార్ట్’గా ఉండాలంటే, దానిని స్థానిక సమాజంతో కలిసి ఏమేమి చెయ్యాల్లో ప్రణాళికను రూపొందించాల్సి ఉంటుందని ఈ అధ్యయనం నిర్ధారించింది. దీనికి కేవలం సాంకేతికతను బదిలీ చేసి చేతులు దులుపుకోవటం నుండి, మహిళల అనుభవాలను పరిగణనలోకి తీసుకునే సహాయక వ్యవస్థలను జోడించడం వైపు మార్పు రావటం అవసరం.విభిన్న పంటల సాగు నిర్ణయాలుమహారాష్ట్రలోని ధరాశివ్ కరువు ప్రాంతంలో స్వయం శిక్షణ ప్రయోగ (ఎస్ఎస్పీ) స్వచ్ఛంద సంస్థ మహిళల నేతృత్వంలో వాతావరణ మార్పులను ఎదుర్కొని నిలిచే వ్యవసాయ నమూనా పద్ధతులను అమలు చేయించింది. ఈ ప్రాజెక్ట్ విప్లవాత్మకమైనది. ఎందుకంటే ఇది అధిక పెట్టుబడి అవసరమయ్యే వాణిజ్య పంటల నుంచి రైతుల దృష్టిని ఉద్దేశపూర్వకంగా మళ్లించింది. తక్కువ నీటి వినియోగానికి సంబంధించి స్థానికంగా అమల్లో ఉన్న పద్ధతులను ఉపయోగించి చిరుధాన్యాలు, కూరగాయల వంటి వైవిధ్యభరితమైన ఆహార పంటల వైపు మళ్లించింది. మహిళా రైతులకు రైతుగా ఉండాల్సిన మౌలిక గుర్తింపు సమస్యను పరిష్కరించేందుకు ఈ సంస్థ కృషి చేసింది. మహిళలను వ్యవసాయ నిర్ణయాలు తీసుకునే ప్రాథమిక నిర్ణయాధికారులుగా, ఆవిష్కర్తలుగా నిలబెట్టింది. కేవలం కూలీలుగా మిగిలిపోయిన వారిని వ్యవసాయంలో తమకు నచ్చిన నిర్ణయాలు తీసుకునే మహిళా రైతు నాయకులుగా మారడానికి సహాయపడింది. నాయకత్వ శిక్షణ ఇచ్చారు. సూక్ష్మ పెట్టుబడుల కోసం కమ్యూనిటీ రిసైలియన్స్ ఫండ్ ఏర్పాటు జరిగాయి. రైతులు –స్థానిక ప్రభుత్వ అధికారుల మధ్య సమాచార మార్పిడిని సులభతరం చేసేందుకు మహిళా కృషి సంవాద్ సహాయకుల(కేఎస్‌ఎస్‌ల)ను నియమించారు. ఫలితాలు స్పష్టంగా కనిపించాయి. మహిళలు ఆహార పంటల ఉత్పాదకతలో 10–15% పెరుగుదల సాధించారు. దీనితో పాటు మహిళా రైతు కుటుంబాల నెలవారీ పొదుపు బాగా పెరిగింది. ఇది ఇంట్లో వారి మధ్య సంబంధాలను మార్చివేసింది. పురుషులు తమ భార్యలను తమతో పాటు సమాన భాగస్వాములుగా గుర్తించటం ప్రారంభించారు.సమ్మిళిత శిక్షణా విధానంపశ్చిమ బెంగాల్‌లోని తూర్పు గంగా మైదాన ప్రాంతంలో పనిచేసే సత్మిలే సతీష్ క్లబ్ ఓ పాతాగర్ (ఎస్ఎస్సీఓపీ) స్వచ్ఛంద సంస్థ ప్రకృతికి అనుగుణమైన వ్యవసాయం అమలులో ఎదురవుతున్న సాంకేతిక అడ్డంకులపై దృష్టి సారించింది. సుస్థిర వ్యవసాయం, వాతావరణ మార్పులను తట్టుకునే వ్యవసాయ వ్యవస్థ సాంద్రతీకరణ (ఎస్ఆర్ఎఫ్ఎస్ఐ) ప్రాజెక్ట్‌ను చేపట్టింది. దుక్కి చెయ్యకుండా వ్యవసాయం చెయ్యటం, యంత్రంతో వరి నాట్లు, బహుళ పంటల విత్తనాలను విత్తే పరికరాలను వాడటం వంటి అత్యాధునిక సాంకేతిక పరిష్కారాలను ప్రవేశపెట్టింది. ఈ ప్రాజెక్ట్ ప్రారంభంలో మహిళా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై తక్కువ దృష్టి పెట్టినప్పటికీ, దీనిలోని ఆడా మగా తేగా లేకుండా రైతులందరికీ శిక్షణ ఇచ్చే సమ్మిళిత శిక్షణా విధానం ఉపయోగపడింది. సాధారణంగా పురుషుల ఆధిపత్యం ఉండే భారీ యంత్రాలు వంటి రంగాలలోకి మహిళా రైతులు ప్రవేశించడానికి వీలు కల్పించింది. రైతులు తాము కొనుగోలు చేయలేని ఖరీదైన పరికరాలను అద్దెకు తీసుకునేందుకు వీలు కల్పించే కస్టమ్–హైరింగ్ కేంద్రాల వ్యాపార కార్యకలాపాలపై, ఎరువులను సమర్థవంతంగా వాడటం, నీటిపారుదలలో మెళకువలపై శిక్షణ ఇచ్చారు. పురుషులు ఎక్కువగా దృష్టి సారించే ఇటువంటి సాంకేతికతలలో మహిళలకు శిక్షణ ఇచ్చినప్పుడు, వారు సమాజంలో ఆదర్శప్రాయులుగా గుర్తింపు పొందారు. ఈ మహిళల్లో 80% కంటే ఎక్కువ మంది ఏయే రకాల పంటలు సాగు చెయ్యాలనే నిర్ణయాలలో తమ ప్రభావం ఎక్కువగా ఉందని చెప్పారు.ఏవో కొన్ని సాంకేతికతలను పై నుంచి అందించటం ఒక్కటే సరిపోదువారితో కలిసి పనిచేస్తూ వారికి అవసరమైన నైపుణ్యాలను అందించాలిసాంకేతిక, సామాజిక, సంస్థాగత మద్దతును సమన్వయంతో అందిస్తే అద్భుత ఫలితాలు వస్తాయి∙4 రాష్ట్రాల్లో అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ (ఐఆర్ఆర్ఐ) జరిపిన అధ్యయనంలో వెల్లడిపొంచి ఉన్న ప్రమాదాలుమహిళా రైతుల సాధికారతలో ఈ విజయాలు సాధించినప్పటికీ, రకరకాల వ్యవసాయ సాంకేతికతలతో కూడిన ప్యాకేజీలను అమలు చేసిన విధానంలో ఐఆర్ఆర్ఐ పరిశోధకులు అనేక లోపాలను గుర్తించారు. ఈ ప్యాకేజీల ఏర్పాటు ఉద్దేశపూర్వకంగా కాకుండా తాత్కాలికంగా జరిగింది. సంస్థలు మొదట సాంకేతికతపై దృష్టి సారించాయి. అక్కడి రైతుల్లో సామాజిక మద్దతు పొందటాన్ని రెండో ప్రాధాన్యత గల ఆలోచనగా పరిగణించాయి. చదవండి: జీవన ఎరువులతో సేద్యానికి జీవంవేతనం లేని సంరక్షణ పనుల భారం ఒక ప్రధాన ఆందోళన. మహిళా సాధికారత లక్ష్యంగా చేపట్టిన 60 శాతం ప్రాజెక్టుల వల్ల మహిళా రైతులకు కొత్త బాధ్యతలను జోడించడం ద్వారా వాస్తవానికి వారి పని–జీవిత సమతుల్యతను మరింత దిగజార్చాయని ఈ అధ్యయనంలో తేలింది. ఉదాహరణకు.. గుజరాత్లో కనిపించే సేంద్రియ వ్యవసాయం వాతావరణానికి అనుకూలమైనదే అయినప్పటికీ, జీవన ఎరువులు, వర్మీకంపోస్ట్ తయారీకి అధిక శ్రమ అవసరం. అప్పటికే ఇంటి పనులు, పిల్లల సంరక్షణ చూసుకుంటున్న మహిళలపై ఈ ఎరువుల తయారీ పనులు మరింత భారాన్ని మోపుతుంది. అంతేకాకుండా, అంతర్లీనంగా ఉన్న పురుషాధికార నిర్మాణాలను పరిష్కరించకుండా, మహిళా రైతులకు పనులు పెంచే ఉపరితల ప్రయత్నాల వల్ల వారిని మరింత కృంగదీయటానికి దారితీసే ప్రమాదాన్ని ఈ అధ్యయనం ఎత్తి చూపింది. అనేక సందర్భాల్లో (ఎస్ఎస్పీ మినహా) పురుషులతో సంప్రదింపులు కొరవడ్డాయి. భర్తలు, కమ్యూనిటీ నాయకులు ఈ సంభాషణలో పాలుపంచుకోకపోతే, మహిళలు ఇంటా బయటా వారి వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి రావచ్చు లేదా ఇంటి పనులు చేసుకుంటూ ఇంట్లోనే ఉండిపోవడం వల్ల శిక్షణలో పాల్గొనలేకపోవచ్చు.– పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ -
జీవన ఎరువులతో సేద్యానికి జీవం
పశ్చిమాసియా దేశాల్లో యుద్ధం కారణంగా రసాయనిక ఎరువుల లభ్యత బాగా తగ్గిపోతుండటంతో పాటు.. వాతావరణ మార్పుతో పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో రైతులు సాగు పద్ధతుల్లో తగిన మార్పులు చేసుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది. బత్తాయి సాగులో ద్రవ రూప జీవన ఎరువుల వాడకం ద్వారా రసాయనిక ఎరువుల వాడకాన్ని 60%, రసాయనిక పురుగుమందుల వాడకాన్ని 50% వరకు తగ్గించుకుంటూనే దిగుబడిని, ఆదాయాన్ని పెంచుకోవటం సాధ్యమేనని ఓ రైతు అనుభవపూర్వకంగా చెబుతున్నారు..బత్తాయి అంటేనే నల్లగొండ జిల్లా గుర్తుకు వస్తుంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మూడు లక్షల ఎకరాల్లో ఉండే బత్తాయి తోటలు ప్రస్తుతం అనేక సమస్యలతో 40 వేల ఎకరాలకు తగ్గిపోయింది. దశాబ్దాలుగా రసాయనిక ఎరువుల వాడకం వల్ల నేలలో పెరిగిన క్షార గుణం వల్ల, సూక్ష్మజీవరాశి నశించటం వల్ల భూసారం దెబ్బతిని దిగుబడులూ తగ్గిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో రసాయనిక ఎరువులు తగ్గించి, జీవన ఎరువులను ఉపయోగిస్తూ బత్తాయి పంటకు జీవం తెచ్చిన రైతు కట్టెబోయిన శ్రీనివాస్ తోటి రైతులకు మార్గదర్శకంగా నిలిచారు. ఏళ్ల తరబడి వ్యవసాయంలో అతిగా రసాయనిక ఎరువులు వాడకం వల్ల నేలలో సేంద్రియ కర్బనం తగ్గి, దిగుబడులు తగ్గిపోయిన పరిస్ధితుల్లో కొందరు రైతులు సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లుతున్నారు. ఈ కోవలోని రైతే గుర్రంపోడు మండలం బ్రాహ్మణగూడెం బత్తాయి రైతు శ్రీనివాస్. గత 30 ఏళ్లుగా బత్తాయి సాగు చేస్తున్న శ్రీనివాస్ సాగులో కష్టనష్టాలను ఎదుర్కొన్నారు. నేలలో సూక్ష్మజీవరాశి నశించటం వల్ల సమస్యలు ఎదురయ్యాయి. నాణ్యమైన దిగుబడులు లేక లాభాలు తగ్గిపోవటంతో శాస్త్రవేత్తల సూచనల మేరకు గత మూడేళ్లుగా జీవన ఎరువులను వాడుతూ నాణ్యమైన దిగుబడులు సాధిస్తున్నారు. రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి జీవన ఎరువులు వాడటం ప్రారంభించారు. నేల సారాన్ని పెంపొందించి పంటలకు పోషకాలందించే జీవన ఎరువులను బత్తాయి తోటకు ఉపయోగించి మంచి ఫలితాలు సాధిస్తున్నారు. ద్రవ రూప జీవన ఎరువులు..రైతు కట్టెబోయిన శ్రీనివాస్ జీవన ఎరువులైన ట్రై కోడర్మా, బవేరియా, మైకోరైజా, సూడోమోనాస్, వామ్, వేస్ట్ డీ కంపోజర్, పీఎస్బీ, కేఎస్బీ, ఎన్పీకే బ్యాక్టీరియా, జింక్ సాల్యుబుల్ బాక్టీరియా, సీవీడ్ బ్యాక్టీరియా లాంటి సుమారు 40 రకాల ద్రవ రూప జీవన ఎరువుల కల్చర్‌ను పరిశోధనా కేంద్రాల నుంచి తెచ్చుకొని తన తోటలోనే వాటిని అభివృద్ధి చేసి, దశల వారీగా, అవసరాన్ని బట్టి వాడుతున్నారు. ఒక్కో జీవన ఎరువును ఒక్కో డ్రమ్ములో వేసి, తగినంత నీరు, బెల్లం కలిపి, రోజూ కలియ తిప్పుతూ, వాటిలో సూక్ష్మజీవులు అభివృద్ధి చెందే వరకు నాలుగైదు రోజులు అలాగే ఉంచి, డ్రిప్, జెట్ల ద్వారా నేరుగా బత్తాయి చెట్లకు అందిస్తున్నారు.మంచి నాణ్యత.. మంచి ధర.. ప్రస్తుతం మార్కెట్లో బత్తాయికి తోటల దగ్గర టన్నుకు రూ. 15 వేల నుంచి 20 వేల లోపు పలుకుతోంది. జీవన ఎరువులతో నాణ్యంగా పండించటంతో సైజు, నిగారింపు, నిల్వ సామర్థ్యం పెరిగాయి. దీంతో శ్రీనివాస్ తోటలో బత్తాయిలకు టన్నుకు రూ. 26–27 వేల ధర పలికింది. సాధారణంగా బత్తాయిలో గరిష్ట దిగుబడులు ఎకరాకు పది టన్నులు. అయితే, సరాసరిన ఐదారు టన్నులకు మించి రావటం లేదు. శ్రీనివాస్ ఎనిమిదిన్నర ఎకరాల (6–10 ఏళ్ల తోట)లో ప్రస్తుత ముందు కత్తెర కోతలో 104 టన్నుల దిగుబడి వచ్చింది. వచ్చే జూన్–జూలై సీజన్లో మరో 60–70 టన్నుల దిగుబడి వస్తుందని శ్రీనివాస్ ఆశిస్తున్నారు. గత మూడేళ్లుగా జీవన ఎరువులతో అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్న ఈ తోటను తెలంగాణ ఉద్యానవన శాఖ కమీషనర్ షేక్ యాస్మిన్ భాషా, ఇతర అధికారులు, శాస్త్రవేత్తలు సందర్శించి రైతును అభినందించటం విశేషం.రసాయనిక ఎరువులతో పాటు పురుగుమందుల అవసరమూ తగ్గిందిగత మూడేళ్లుగా ద్రవ రూప జీవన ఎరువులను వాడుతూ మంచి ఫలితాలు పొందుతున్నాను. రసాయనిక ఎరువులు 60% తగ్గించాను. పురుగుమందుల అవసరం కూడా 40–50% మేరకు తగ్గింది. రసాయనిక వ్యవసాయంలో సాగు వ్యయం ఎకరానికి రూ. 80 వేల నుంచి లక్ష వరకు అవుతుంది. నాకు పశువుల ఎరువు, ద్రవరూప జీవన ఎరువులతో కలిపి రూ. 50–60 వేలు మాత్రమే అయ్యింది. బత్తాయి అనే కాదు ఏ పంటలకైనా జీవన ఎరువులు పనిచేస్తాయి. మీరూ వాడండని ఇతర రైతులకూ చెబుతున్నా. గత ఏడాది వరకూ పెద్దగా స్పందన లేదు. ఈ ఏడాది దిగుబడులు, కమిషనర్ సందర్శించటం చూసి కొందరు రైతులు ఆసక్తి చూపుతున్నారు.– కట్టెబోయిన శ్రీనివాస్ (98484 53525), బత్తాయి రైతు, బ్రాహ్మణగూడెం, గుర్రంపోడు మం., నల్లగొండ జిల్లా– చింతరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, సాక్షి, గుర్రంపోడు, నల్లగొండ జిల్లా -
ప్రకృతి వ్యవసాయంపై నీతి ఆయోగ్ కరదీపిక
ప్రకృతి వ్యవసాయాన్ని దేశవ్యాప్తంగా విస్తృతంగా వ్యాప్తిలోకి తేవాలన్న లక్ష్యంతో సమగ్రమైన ట్రైనింగ్ మాన్యువజీల్ను కేంద్ర ప్రభుత్వ సంస్థ నీతి ఆయోగ్ ఇటీవలే వెలువరించింది. ‘రైతులకు సాధికారత కల్పించటం: ప్రకృతి వ్యవసాయ శిక్షణా కిట్ – ఉత్తమ పద్ధతుల మార్గదర్శిని’ పేరుతో రూపొందించారు. ప్రకృతి సేద్య మూల సూత్రాలతో పాటు.. ముఖ్యమైన 22 రకాల పంటల సాగులో క్షేత్రస్థాయిలో ఆచరించదగిన ప్రామాణిక ప్రకృతి సేద్య పద్ధతులను పొందుపరిచారు. నీతి ఆయోగ్ వ్యవసాయం–సాంకేతిక విజ్ఞాన విభాగం ప్రోగ్రామ్ డైరెక్టర్ డాక్టర్ నీలం పటేల్, కన్సల్టెంట్ పరెమల్ బనఫర్ ఆధ్వర్యంలో నిపుణుల బృందం దీన్ని రూపొందించింది.రైతులు, విస్తరణ సిబ్బంది, విధాన నిర్ణేతలకు సుస్థిర వ్యవసాయ విస్తరణ దిశా నిర్దేశం చేయటానికి ఈ శిక్షణా మాన్యువల్, ఉత్తమ ప్రకృతి సేద్య పద్ధతులకు అక్షర రూపం ఇచ్చినట్లు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బెరీ పేర్కొన్నారు. డాక్టర్ నీలం పటేల్ ఇలా అన్నారు: ‘దేశవ్యాప్తంగా రైతులు అనుసరిస్తున్న ప్రకృతి సేద్య పద్ధతులు, ఆవిష్కరణలు, సంప్రదాయ విజ్ఞానంతో పాటు వివిధ రాష్ట్ర ప్రభుత్వాల ప్రకృతి సేద్య అనుభవాల ఆధారంగా ఈ శిక్షణా మాన్యువల్‌ను రూపొందించాం. దేశంలో సుస్థిర వ్యవసాయాన్ని విస్తరింపజేయటంలో ఇదొక కీలక ముందడుగు’. ప్రకృతి వ్యవసాయ వారసత్వాన్ని సుసంపన్నం చేసిన సుభాష్ పాలేకర్ (మహారాష్ట్ర), ఎల్. నారాయణరెడ్డి (కర్ణాటక), శ్రీపాద దబోల్కర్, జి. నమ్మాళ్వార్ (తమిళనాడు), దీపక్ సచ్దే (మధ్యప్రదేశ్), భాస్కర్ సావే (గుజరాత్)ల సేవలను ఇందులో ప్రస్తుతించారు. దేశవ్యాప్తంగా ప్రకృతి సేద్య పథకాలు అమలవుతున్నాయని, 9.4 లక్షల హెక్టార్లలో సుమారు 10 లక్షల మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారని ఇందులో పేర్కొన్నారు. అధిక దిగుబడి.. అధిక నికరాదాయం!వరిని వరుసగా 4 ఏళ్లు ప్రకృతి వ్యవసాయం (ప్ర.వ్య.)లో పండిస్తే 2023 ఖరీఫ్‌లో ఎకరానికి 33.75 క్వింటాళ్ల ధాన్యం దిగుబడి వచ్చింది. రసాయన వ్యవసాయం (ర.వ్య.)లో 31.5 క్వింటాళ్లు వచ్చింది. ఈ రెండు ధాన్యాలను క్వింటా రూ.2,040కే విక్రయించారు. ప్ర.వ్య.లో నికరాదాయం రూ.48 వేలు రాగా, రూపాయి ఖర్చుకు 2.3 రూపాయల ఆదాయం వచ్చింది. ర.వ్య.లో నికరాదాయం రూ.35,140 రాగా, రూపాయి ఖర్చుకు 1.2 రూపాయలు మాత్రమే ఆదాయం వచ్చింది. → ప్రధాన పంటలన్నింటిలో సాగు ఖర్చును కనీసం 5–10% తగ్గిస్తుంది. మరికొన్ని పంటల్లో, కొన్ని రాష్ట్రాల్లో 20–55% వరకు తగ్గింది. ∙ప్రకృతి వ్యవసాయం రైతులు, వినియోగదారుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. → నేలల్లో సేంద్రియ కర్బనం 1947లో 2.5% ఉండేది. ఇప్పటికి 0.4%కి తగ్గింది. ప్రకృతి వ్యవసాయం దీన్ని 45% వరకు పెంచుతుంది. ∙నీరు, విద్యుత్‌లో 50–60% ఆదా అవుతుంది. ∙కర్బన ఉద్గారాలను 55–85% తగ్గిస్తుంది. ∙పశువులను ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పెంచటం రైతులకు లాభదాయకంగా ఉంటుంది.→ పంటల వైవిధ్యం, అంతరపంటలు, బహుళ అంచెల పంటలతో వ్యవసాయా దాయ భద్రత, పోషకాహార భద్రత పెరుగు తాయి. రసాయనిక సేద్యం ఏకపంట సాగుతో పోలిస్తే 20–40% అధిక నికర ఆదాయం వస్తుంది. జీవామృతం.. 48 గంటలు పులిస్తే చాలు!జీవామృతం కోసం పేడ, మూత్రం, పప్పుల పిండి, బెల్లం, మట్టిని డ్రమ్ము నీటిలో కలిపిన తర్వాత 2–3 రోజులు పులియబెట్టి పంటలకు వాడుకోడానికి సిద్ధమైనట్లే. కలిపిన 48 గంటల్లో బ్యాక్టీరియా పూర్తిస్థాయిలో వృద్ధి చెందుతుంది. సిద్ధమైన జీవామృతాన్ని వేసవిలో 7 రోజుల వరకు, శీతాకాలంలో 8–10 రోజుల్లో వాడుకోవచ్చని నీతి ఆయోగ్ ప్రకృతి వ్యవసాయ శిక్షణ మాన్యువల్ చెబుతోంది.ప్రకృతి సేద్యానికి మార్గదర్శకంరసాయనిక వ్యవసాయానికి ఒక సుస్థిరమైన ప్రత్యామ్నాయం ప్రకృతి వ్యవసాయం. ఇటు సంప్రదాయ విజ్ఞానాన్ని అటు ఆధునిక పర్యావరణ విజ్ఞానాన్ని ఇముడ్చుకొని ప్రకృతి వ్యవసాయ పద్ధతులు రూపొందాయి. ప్రస్తుతం ఆధునిక వ్యవసాయంలో ఎదురవుతున్న సవాళ్లకు ప్రకృతి వ్యవసాయ పద్ధతులు దీటైన సమాధానాలు ఇవ్వగలవు. తక్కువ వనరులతో, తక్కువ ఖర్చుతోనే వ్యవసాయానికి సుస్థిరత చేకూర్చటం సాధ్యమని ఈ పద్ధతులు చాటి చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా రైతులకు, విస్తరణ సిబ్బందికి ప్రకృతి సేద్య పద్ధతులపై శిక్షణ ఇవ్వటానికి ఈ మాన్యువల్ మార్గదర్శకంగా నిలుస్తుంది. – ప్రొఫెసర్ రమేశ్ చంద్, వ్యవసాయ ఆర్థికవేత్త, నీతి ఆయోగ్ సీనియర్ సభ్యులు -
సమగ్ర కలుపు నిర్వహణ పద్ధతులు
కలుపు.. అంటే రైతులు ఆ పొలంలో ఆ పంట సాగు కాలంలో అవాంఛితంగా పెరుగుతున్న రకరకాల మొక్కలను కలుపు మొక్కలు అని పిలుస్తున్నాం. వేల సంవత్సరాల సుసంపన్న సంప్రదాయ వ్యవసాయ విజ్ఞానం కలిగిన భారతీయ రైతాంగానికి ఒక్క గ్రాము కలుపు మందును వాడకుండా వ్యవసాయం చేసే వారసత్వం ఉంది. అయినా, ఆధునిక వ్యవసాయ పోకడల నేపథ్యంలో కలుపు మొక్కలను నియంత్రించే మందుల వినియోగం పెరిగిపోయింది. రసాయనిక లేదా పారిశ్రామిక వ్యవసాయం ఊపందుకున్నాక.. ఏదో ఒకటే పంటను పొలమంతా వేసి పండించే ఏక పంటల (మోనోకల్చర్) సాగు విస్తృతం అయిన తర్వాత.. గడ్డి లేదా కలుపు నిర్మూలన మందుల వాడకం పెరిగింది. అప్పటికి ఇది రైతుకు సులువైన పరిష్కారంగా, ఖర్చు తక్కువతో పూర్తయ్యే పనిగా తోచినప్పటికీ.. గడ్డి మందులకు అనేక రకాలుగా దుష్పరిణామాలు ఉంటాయని ప్రపంచ దేశాల అనుభవాలు చెబుతున్నాయి. మట్టిలో సూక్ష్మజీవరాశి నశించి వ్యవసాయం సమస్యల్లో పడుతుంది. గాలి, నీరు కలుషితమవుతుంది. మనుషుల ఆరోగ్యం దెబ్బతింటుంది. పారాక్వాట్, గ్లైఫొసేట్ వంటి కలుపు మందుల వాడకంతో రైతులు, రైతు కూలీలు, వినియోగదార్లలో కేన్సర్లు, ప్రాణాంతక జబ్బులు ప్రబలుతున్నాయని చెప్పటానికి ప్రపంచ దేశాల్లో ఆధారాలకు కొదువ లేదు. కాబట్టి, రసాయనాలు చల్లకుండా కలుపు నిర్వహణపై భారతీయ వ్యవసాయ వారసత్వాన్ని పునరుజ్జీవింపజేయడం అవసరమని కొందరు నిపుణులు చెబుతున్నారు. దేశంలో ప్రకృతి, సేంద్రియ వ్యవసాయ విస్తరణకు గతంలో కన్నా ఎక్కువగా కృషి జరుగుతున్న ప్రస్తుత నేపథ్యంలో ఇది ఒక అనివార్యం. కలుపు మందుల నిరోధకత, కలుపు మందులతో వ్యవసాయ – పర్యావరణ ప్రభావాలు, కలుపు మొక్కలపై ప్రాకృతిక దృక్పథం, సమగ్ర కలుపు నిర్వహణ పద్ధతులు ఏమిటో చర్చించటమే ఈ కథనం లక్ష్యం. కలుపు మొక్కల ‘ఉపయోగాలు’ మీకు తెలుసా! రైతులు సాగుచేసే పంటలతో సూర్యరశ్మి, తేమ, పోషకాల కోసం కలుపు మొక్కలు పోటీ పడుతుంటాయి. తద్వారా పంట దిగుబడిని, నాణ్యతను ప్రభావితం చేస్తాయి. పంటకు తెగుళ్ళు, ఇతర చీడపీడలను కలిగిస్తాయని కూడా భావిస్తారు. కలుపు మొక్కలు మామూలు పంటలకన్నా చాలా ఎక్కువ మొత్తంలో విత్తనాలను ఉత్పత్తి చేస్తాయి, చాలా వేగంగా పెరుగుతాయి. కొన్ని గడ్డి మొక్కలు రకాలు మొలకెత్తిన ఒక నెల కంటే తక్కువ సమయంలోనే విత్తనాల ఉత్పత్తిలో చివరి దశకు చేరుకోగలవు. ఇంకా కొన్ని కలుపు మొక్కలు అల్లెలోపతి (రసాయనాలను ఉత్పత్తి చేసే లక్షణం) ప్రభావాలను కూడా సృష్టిస్తాయి. తద్వారా ఆర్థికంగా రైతుకు ముఖ్యమైన పంటల పెరుగుదలకు సవాళ్లు విసురుతాయి. అవి మనం తీసుకునే నియంత్రణ చర్యల కంటే ఒక అడుగు ముందే ఉంటాయి!మనకు అవసరమైన పంట మొక్కల కన్నా వేగంగా పెరిగే ఈ కలుపు మొక్కలు వాటిని నియంత్రించటానికి మనం చేసే ప్రయత్నాలన్నింటినీ తప్పించుకుంటాయి. అన్నిటికంటే నష్టం కలిగించే వార్షిక కలుపు మొక్కలు బతికేది స్వల్పకాలమే కావచ్చు, కానీ వాటి విత్తనాలు మార్గం దీర్ఘ కాలం బతికి వుండి చాన్నాళ్ల తర్వాత కూడా మొలకెత్తుతాయి. అందువల్ల కలుపును పూర్తిగా నిర్మూలించడం దాదాపు అసాధ్యం అవుతోంది. ఒక సంవత్సరం విత్తనంతో ఏడు సంవత్సరాల పాటు కలుపు మొక్కలు మొలుస్తూనే ఉంటాయట. స్థానిక వాతావరణంలో పుట్టి పెరిగే కలుపు మొక్కలు కొన్నయితే, విదేశాల నుంచి వచ్చి చేరి స్థానిక మొక్కలకు చోటివ్వకుండా విపరీతంగా పెరిగిపోయే పార్థీనియం/ వయ్యారిభామ వంటి ప్రమాదకరమైన కలుపు మొక్కలు కొన్ని.కలుపు మొక్కల వల్ల పర్యావరణానికి మేలు కలుగుతుంది. మట్టి పైపొరలో క్షీణించిన ఖనిజాలను భూగర్భం నుంచి పైపొర మట్టిలోకి తీసుకువచ్చి, పంట మొక్కలకు అందుబాటులో ఉంచుతాయి. కలుపు మొక్కలు గట్టి మట్టిపెడ్డలను విచ్ఛిన్నం చేసి నేలను గుల్లచేస్తాయి. తరువాత వేసే పంటల వేర్లు లోతుగా వెళ్లడానికి మార్గం సుగమం చేసాయి. సూక్ష్మజీవులకు మంచి వాతావరణాన్ని అందించడానికి అవి నేలను వదులుగా, పొరలుగా చేస్తాయి. తద్వారా నేలను సుసంపన్నం చేస్తాయి. నేల స్థితిగతులు ఎలా ఉన్నాయో, మట్టిలో పోషక లోపాలు ఏమిటో సూచిస్తాయి.భూమి లోతుల్లోకి వేర్లను చొప్పించే కలుపు మొక్కలు పోషకాలను తీసుకుంటూ.. పైపైన వేర్లతో ఉండే ఇతర జాతుల మొక్కలు కరువు బారిన పడకుండా తట్టుకునేలా దోహదం చేస్తాయి.సాగు చేసే పంటల వేర్లకు అందుబాటులో లేని పోషకాలను అందుకోవటానికి ‘సహచర పంటలు’గా కలుపు మొక్కలు సహాయపడతాయి.కలుపు మొక్కలు మట్టి పైపొరను కప్పి ఉంచటం ద్వారా ఆ మట్టి నుంచి ఖనిజాలు, పోషకాలు కొట్టుకుపోకుంగా నిల్వ చేస్తాయి, అందుబాటులో ఉంచుతాయి.కలుపు మొక్కల వల్ల పర్యావరణానికి మేలు కలుగుతుంది. మట్టి పైపొరలో క్షీణించిన ఖనిజాలను భూగర్భం నుంచి పైపొర మట్టిలోకి తీసుకువచ్చి, పంట మొక్కలకు అందుబాటులో ఉంచుతాయి.కలుపు మొక్కలు గట్టి మట్టిపెడ్డలను విచ్ఛిన్నం చేసి నేలను గుల్లచేస్తాయి. తరువాత వేసే పంటల వేర్లు లోతుగా వెళ్లడానికి మార్గం సుగమం చేసాయి. సూక్ష్మజీవులకు మంచి వాతావరణాన్ని అందించడానికి అవి నేలను వదులుగా, పొరలుగా చేస్తాయి. తద్వారా నేలను సుసంపన్నం చేస్తాయి.నేల స్థితిగతులు ఎలా ఉన్నాయో, మట్టిలో పోషక లోపాలు ఏమిటో సూచిస్తాయి.భూమి లోతుల్లోకి వేర్లను చొప్పించే కలుపు మొక్కలు పోషకాలను తీసుకుంటూ.. పైపైన వేర్లతో ఉండే ఇతర జాతుల మొక్కలు కరువు బారిన పడకుండా తట్టుకునేలా దోహదం చేస్తాయి. సాగు చేసే పంటల వేర్లకు అందుబాటులో లేని పోషకాలను అందుకోవటానికి ‘సహచర పంటలు’గా కలుపు మొక్కలు సహాయపడతాయి. కలుపు మొక్కలు మట్టి పైపొరను కప్పి ఉంచటం ద్వారా ఆ మట్టి నుంచి ఖనిజాలు, పోషకాలు కొట్టుకుపోకుంగా నిల్వ చేస్తాయి, అందుబాటులో ఉంచుతాయి.నేలను కప్పి ఉంచుతూ సూర్యకాంతి నుంచి రక్షిస్తాయి. ప్రవహించే వాన నీరు, గాలుల వల్ల నేల కోతకు గురికాకుండా కలుపు మొక్కలు కాపాడతాయి. అనేక ప్రయోజనకరమైన కీటకాలు, మాంసాహారులు, పరాన్నజీవులు, పరాగ సంపర్కాని ఉపయోగపడే జీవులకు కలుపు మొక్కలు ఆహారాన్ని, ఆశ్రయాన్ని కల్పిస్తాయి.చాలా జంతువులకు, మానవులకు ఆహారంగా, ఔషధాలుగా ఉపయోగపడతాయి. వాటి ఔషధ విలువలు తెలియక మనం అవి కలుపు మొక్కలనుకొని నిర్మూలిస్తుంటాం.చాలా రకాల కలుపు మొక్కలు నిజానికి పుష్కలంగా పోషక విలువలను కలిగి వుంటాయి. సాగు చెయ్యని ఆకుకూరలుగా, మందు మొక్కలుగా వ్యవసాయ కుటుంబాలకు గొప్పగా దోహదపడతాయి. అలాగే కరువు సమయాల్లో ఆహారాన్ని కూడా అందిస్తాయి. వీటిలో చాలా వాటిని కొందరు గ్రామీణులు సేకరించి మార్కెట్లలో కూడా అమ్ముతారు.కేరళలోని వాయనాడ్ జిల్లాలో ‘థనల్’ సంస్థ నిర్వహించిన ఒక అధ్యయనంలో, 83 రకాల ఆకుకూరలను (సాధారణంగా కలుపు మొక్కలుగా వర్గీకరించబడినవి) ఆ ప్రాంత ప్రజలు ఆహారంగా వినియోగిస్తున్నట్లు కనుగొన్నారు. వాటిలో 20 రకాలు వరి పొలాల్లో లభించాయి.ప్రకృతిలో అన్నీ మొక్కలే.. ‘కలుపు’ మొక్కల్లేవు! ప్రకృతి దృష్టికోణంలో ‘కలుపు మొక్కలు’ అనేవి ఉండవు. కలుపు అనేది మానవుల భావన. ఎందుకంటే మనం ఒక పంటను ΄పొలంలో పెంచుకుంటూ ఉంటే మనం కోరకుండా వాటంతట అవే పెరిగే మొక్కలను మనం ‘కలుపు మొక్కలు అని పిలుస్తున్నాం. అయితే, మనం కలుపు అనుకునే మొక్కలు ఒక ప్రత్యేక వాతావరణంలో, ప్రత్యేకమైన మట్టిలో కొన్ని కలుపు మొక్కలు పెరగడానికి ప్రకృతి సంబంధమైన కారణాలు అనేకం ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. వాటికి ప్రకృతిపరంగా ముఖ్యమైన పాత్రలు, విధులు ఉంటాయి. కలుపు మొక్కలు ప్రకృతిపరంగా బాగా అనుకూలతను కలిగి ఉంటాయి. మనం విత్తనాలు/మొక్కలు నాటి సాగు చేసే పంటలు జీవించడం కష్టతరమైన పరిస్థితుల్లో కూడా ఆ పొలంలోనే అనేక కలుపు మొక్కలు పెరగడానికి ఇదే కారణం. కొన్ని పరిస్థితులలో పంట మొక్కల కంటే కలుపు మొక్కలు మరింత దృఢంగా ఉంటాయి. కలుపు మొక్కలు సూక్ష్మమైన శక్తులు. అవి ప్రకృతి సమతుల్యతకు సహాయపడతాయి.అందుకనే, ‘నేలపై నియంత్రణ సాధించడంలో కలుపు మొక్కలు మానవ వైఫల్యాన్ని సూచిస్తాయి. ప్రజలు తప్పులు చేసిన చోట అవి సమృద్ధిగా పెరుగుతాయి. అవి మన తప్పులను, ప్రకృతి చేపట్టిన దిద్దుబాట్లను సూచిస్తాయి’ అంటారు అమెరికాకు చెందిన ప్రసిద్ధ బయోడైనమిక్ శాస్త్రవేత్త డా. ఎహ్రెఫ్రై డ్ ఫైఫర్.ఉదాహరణకు.. సియామ్ కలుపు మొక్క లేదా ఫ్లాస్ ఫ్లవర్ (క్రోమోలీనా ఒడోరాటా) అనేది ఒక భయంకరమైన కలుపు మొక్క. ఇది అడవులను అక్రమిస్తూ అక్కడ అనాదిగా సహజంగా పెరిగే మొక్కలు, చెట్ల జాతుల జీవవైవిధ్యాన్ని తగ్గించడానికి కారణమవుతుంది. అయితే, ఇది చెట్లు లేని వాలు ప్రాంతాల్లో పెరిగి, నేలను త్వరగా ఆక్రమించుకుంటుంది, ఇతర మొక్కలు పెరగడానికి అనుమతించదు. చాలా సందర్భాలలో, ఇది నేలను పట్టి ఉంచి, నేల కోతను నిరోధించే ఏకైక మొక్క. త్వరగా కుళ్ళిపోయే దాని ఆకులు తూర్పు భారతదేశంలో ఝుమ్ వ్యవసాయ పద్ధతిలో పండించే వివిధ రకాల పంటలకు మంచి ఎరువుగా ఉయోగపడుతుంటాయి. కొన్ని రకాల పోషకాలు లోపించిన నేలల్లో కొన్ని రకాల ప్రత్యేక కలుపు మొక్కలు పెరుగుతాయట. రైతులు సాగుచేసే పంటలతో సూర్యరశ్మి, తేమ, పోషకాల కోసం కలుపు మొక్కలు పోటీ పడుతుంటాయి. తద్వారా పంట దిగుబడిని, నాణ్యతను ప్రభావితం చేస్తాయి. పంటకు తెగుళ్ళు, ఇతర చీడపీడలను కలిగిస్తాయని కూడా భావిస్తారు. కలుపు మొక్కలు మామూలు పంటలకన్నా చాలా ఎక్కువ మొత్తంలో విత్తనాలను ఉత్పత్తి చేస్తాయి, చాలా వేగంగా పెరుగుతాయి. కొన్ని గడ్డి మొక్కలు రకాలు మొలకెత్తిన ఒక నెల కంటే తక్కువ సమయంలోనే విత్తనాల ఉత్పత్తిలో చివరి దశకు చేరుకోగలవు. ఇంకా కొన్ని కలుపు మొక్కలు అల్లెలోపతి (రసాయనాలను ఉత్పత్తి చేసే లక్షణం) ప్రభావాలను కూడా సృష్టిస్తాయి. తద్వారా ఆర్థికంగా రైతుకు ముఖ్యమైన పంటల పెరుగుదలకు సవాళ్లు విసురుతాయి. అవి మనం తీసుకునే నియంత్రణ చర్యల కంటే ఒక అడుగు ముందే ఉంటాయి! మనకు అవసరమైన పంట మొక్కల కన్నా వేగంగా పెరిగే ఈ కలుపు మొక్కలు వాటిని నియంత్రించటానికి మనం చేసే ప్రయత్నాలన్నింటినీ తప్పించుకుంటాయి. అన్నిటికంటే నష్టం కలిగించే వార్షిక కలుపు మొక్కలు బతికేది స్వల్పకాలమే కావచ్చు, కానీ వాటి విత్తనాలు మార్గం దీర్ఘ కాలం బతికి వుండి చాన్నాళ్ల తర్వాత కూడా మొలకెత్తుతాయి. అందువల్ల కలుపును పూర్తిగా నిర్మూలించడం దాదాపు అసాధ్యం అవుతోంది. ఒక సంవత్సరం విత్తనంతో ఏడు సంవత్సరాల పాటు కలుపు మొక్కలు మొలుస్తూనే ఉంటాయట. స్థానిక వాతావరణంలో పుట్టి పెరిగే కలుపు మొక్కలు కొన్నయితే, విదేశాల నుంచి వచ్చి చేరి స్థానిక మొక్కలకు చోటివ్వకుండా విపరీతంగా పెరిగిపోయే పార్థీనియం/ వయ్యారిభామ వంటి ప్రమాదకరమైన కలుపు మొక్కలు కొన్ని.కలుపు మందులకు నిరోధకతకలుపు మందుల మార్కెట్ మన దేశంలో 2025లో 393 మిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకుంది. 2030 నాటికి 608 మిలియన్ డాలర్లకు పెరుగుతుందని అంచనా. పెరుగుతున్న కలుపు కూలీల ఖర్చు తగ్గించుకోవటానికి రైతులు కలుపు మందులు చల్లుతున్నారు. అయితే, కలుపు కూలీల ఖర్చే కాదు మొత్తంగా సాగు ఖర్చులు పెరుగుతున్నాయి. రైతు అధికంగా ఖర్చు పెట్టిన తర్వాత గిట్టుబాటు ధర లభించనప్పుడు కూలీల ఖర్చు భరించటం వారికి సమస్యగా మారుతోంది. కలుపు మందుల మార్కెట్లో సింహభాగం గ్లైఫోసేట్, 2,4–డి ఆక్రమిస్తున్నాయి. గ్లైఫోసేట్ ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడైన వ్యవసాయ రసాయనం. 2024లో రైతులకు వచ్చిన ఆదాయంలో నేల కోసం పెట్టిన ఖర్చు వాటా 46.5%కు పెరిగిందని అంచనా. కలుపు మందును తట్టుకునే నిషిద్ధ బీటీ పత్తితో సహా వాణిజ్య పంటల విస్తరణ ఏటా 9.31% పెరుగుతున్నట్లు చెబుతున్నారు.కలుపు మందులు కొట్టినా కలుపు చనిపోకుండా నిరోధకత పెంచుకోవటం ప్రపంచవ్యాప్తంగా సమస్యగా మారింది. దీర్ఘకాలికంగా బీటీ పంటలను సాగుచేస్తున్న దేశాల స్థాయిలో మన దేశంలో ఇంకా నిరోధకత లేదు. అయినప్పటికీ, కలుపు మందును తట్టుకునే నిషిద్ధ పత్తి సాగు వ్యాప్తితో పెరుగుతున్న కలుపు మందుల వాడకం ఆందోళన కలిగిస్తున్నది. వరి పొలాల్లో కూలీలతో కలుపు తీసే పద్ధతిలో కూడా కలుపు మొక్కలు రంగు మార్చుకొని తప్పించుకుంటున్నాయి.మన దేశంలో కలుపు మందులకు నిరోధక శక్తిని పెంచుకున్న కలుపు మొక్కల సంఖ్య పెరుగుతున్నది. తట్టుకునే శక్తిని పెంచుకున్న కలుపు మొక్కలను లక్ష్యంగా చేసుకునే కొత్త కలుపు మందుల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. మొండి కలుపుపై చల్లటానికి అనేక కొత్త మందులు అభివృద్ధి చెందే క్రమంలో ఉన్నాయి. గ్లైఫోసేట్ కలుపు మందుకు 50కి పైగా కలుపు జాతులు ఇప్పుడు నిరోధకతను ప్రదర్శిస్తున్నాయి. పాత కలుపు మందులు పనిచేయకపోతే మరింత విషపూరిత కలుపు మందులను రైతులు వాడాల్సిన పరిస్థితి వస్తోంది. ఇది పొలంపై, పంటపై రసాయనాల భారాన్ని తీవ్రతరం చేస్తోంది. ఈ పొలాల్లో నుంచి నీరు పొంగి పొర్లిన సందర్భంలో నాచుకు, ఉభయచరాలకు ఈ రసాయనాలు హాని చేస్తాయి.ప్రాక్వాట్ అనే కలుపు మందు మట్టికి గట్టిగా అంటుకుంటుంది. అది పై పొరలలో ఉండి ఉత్పాదకతకు కీలకమైన నత్రజనిని స్థిరీకరించే మంచి బ్యాక్టీరియాకు హాని కలిగిస్తుంది. తక్కువ సాంద్రతలలో కూడా ఈ మందు జలచరాలు, తేనెటీగలు, ప్రయోజనకరమైన కీటకాలకు అత్యంత విషపూరితమైనది. 30 కంటే ఎక్కువ కలుపు జాతులు ఇప్పుడు దానికి నిరోధకతను సంతరించుకున్నాయి. అంటే, ఈ మందు కొట్టినా ఈ కలుపు మొక్కలు మళ్ళీ పెరుగుతున్నాయి. ఎక్కువసార్లు పిచికారీ చేయటం వల్ల కలుపు మొక్కల రకాలు తట్టుకొని దీర్ఘకాలం బతికే జాతులుగా మారుతున్నాయి. ప్రాక్వాట్ నేల ఆరోగ్యాన్ని, వాన పాముల సంఖ్యను భారీగా తగ్గిస్తుంది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం తాజాగా నిషేధం విధించటం హర్షదాయకం. అదే విధంగా, 2,4 డిని 80 సంవత్సరాలకు పైగా ఉపయోగించిన తర్వాత 40 కంటే ఎక్కువ కలుపు జాతులు దానికి నిరోధకతను పెంచుకున్నాయి. పర్యావరణ హితమైన ప్రత్యామ్నాయాలురసాయనిక కలుపు మందులకు అనేక పర్యావరణ హితమైన సమర్థ ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. కొందరు రైతులు కలసి సహకార యాజమాన్యంలో యంత్రాలతో కలుపుతీసే పద్ధతులతో పాటు సేంద్రియ/ప్రకృతి సేద్య మిశ్రమ పంటల సాగు పద్ధతులను అనుసరించవచ్చు. కలుపు మొక్కలు పెరగనీయకుండా అంతరాయం కలిగించే అంతర పంటలు, పంటల మార్పిడి, నేలను కప్పి వుంచే పంటలు సాగు చెయ్యటం, పంట వెయ్యటానికి ముందు పొలానికి నీటి తడి పెట్టి కలుపు మొలిచిన తర్వాత దుక్కి చేసి ఆ తర్వాత పంట వేసుకోవటం ద్వారా కలుపు సమస్యను అధిగమించటం వంటి అనేక పద్ధతులు కలుపు మందులకు ప్రత్యామ్నాయంగా నిలుస్తున్నాయి. ఈ పద్ధతులు కలుపు మొక్కలను అణచివేయటం, నేల ఆరోగ్యాన్ని పెంపొందించటంతో పాటు విలువైన పర్యావరణ సేవలను అందిస్తాయని గుర్తించడం అవసరం.ఎద్దులతో గుంటకలు తోలి కలుపు నివారించే సాధనాలను ఉపయోగించే సాంప్రదాయ పద్ధతులు, కోనో–వీడర్లు, రోటరీ వీడర్లు, సైకిల్ వీడర్లు వంటి ఆధునిక ఆవిష్కరణలతో కలిపి సమర్థవంతమైన కలుపు తొలగింపు మార్గాలను అనుసరించవచ్చు. దానితో పాటు ఈ పనుల ద్వారా మట్టి లోపలికి గాలిని ప్రసరింపజేయటం, తెగుళ్లు కలిగించే పురుగుల జీవిత చక్రాలకు అంతరాయం కలిగించటం, కలుపు మొక్కలను పచ్చి రొట్ట ఎరువుగా తయారుచేసి నేలలో కలపటం ఈ పద్ధతుల్లో సాధ్యపడుతుంది. తద్వారా రసాయన ఉత్పాదకాలపై ఆధారపడకుండా బహుళ వ్యవసాయ ప్రయోజనాలను ఈ పద్ధతులు సాధిస్తాయి.అంతేకాదు, ఈ విధానాలు రైతు స్వయం ప్రతిపత్తిని బలోపేతం చేస్తాయి. గ్రామీణ ఉపాధి అవకాశాలను సృష్టిస్తాయి. తరతరాల పర్యావరణ జ్ఞానాన్ని కాపాడతాయి. నేల సారానికి నష్టం చేయకపోగా పెంపొందిస్తాయి. విషం లేని ఆహారాన్ని ఉత్పత్తి చేస్తాయి.రసాయనాలు లేకుండా కలుపు మొక్కలను నియంత్రించటం అనేది సాంకేతికమైన విషయమా లేదా రాజకీయ, ఆర్థిక విషయమా అనేది ప్రాథమిక ప్రశ్న. వ్యవసాయదారులు, వ్యవసాయ కార్మికులు పర్యావరణ మార్పును తట్టుకునే స్థితిని కల్పించటానికి ఉపయోగపడే వ్యవసాయ పర్యావరణ శాస్త్రం అభివృద్ధిపై భారతదేశం పెట్టుబడి పెడుతుందా లేదా రసాయనాల వాడకాన్ని పెం΄÷ందించే పద్ధతులను ప్రోత్సహిస్తుందా అన్నది కాలం తేల్చాల్సిన విషయం.హెక్టారులో 40 కోట్ల పార్థీనియం విత్తనాలు!ఒక పార్థీనియం మొక్క 15 వేల నుంచి 20 వేల విత్తనాలను ఉత్పత్తి చేయగలదు. ఇది పొలంలోనే లేదా నేలలోనే ఒక భారీ, నిరంతర విత్తన బ్యాంకు ఏర్పడటానికి దారి తీస్తుంది. హెక్టారు భూమిలో విత్తనాల దశ వరకు పార్థీనియం మొక్కలను పెరగనిస్తే ఆ పొలంలో 40 కోట్ల విత్తనాలు తయారు చేసినట్లే. అవి మైళ్ళ దూరం ప్రయాణించి, అనేక దశాబ్దాల పాటు జీవిస్తాయి. అవి మానవులను, జంతువులను అంటుకొని ప్రయాణిస్తాయి. మరికొన్ని మన పొలాల్లో వాలే పక్షుల ద్వారా ఇతర ప్రాంతాలకు వ్యాప్తి చెందుతాయి.చాలా ఏళ్లపాటు బతికే కలుపు మొక్కలు విత్తనాల ద్వారా కాకుండా వేర్ల ద్వారా, ఊడల్లాంటి (రన్నర్లు లేదా స్టోలన్) తీగల ద్వారా వ్యాప్తిచెందుతాయి. తెల్ల క్లోవర్ కలుపు మొక్క 50 మీటర్ల పొడవున తీగను పాకించగలదు. వేరు దుంపల ద్వారా కొన్ని కలుపు మొక్కలు నిరంతరం విస్తరిస్తూ ఉంటాయి. హార్స్‌టెయిల్ వేరు దుంపలు 5 మీటర్ల లోతులో 100 మీటర్ల దూరం వరకు చొచ్చుకెళ్లి మొక్కల్ని మొలిపించగలదు. నేలపై ఒక చోట కలుపు మందుతోనో, చేతితోనే తీసేసి నిర్మూలించినా నేలలో దుంప నుంచి మళ్లీ పెరుగుతూనే ఉంటుందన్న మాట. చాలా కలుపు మొక్కలు లోతైన వేర్లను కలిగి ఉంటాయి. ఇవి కొమ్మలు, రెమ్మలను తొలగించినప్పుడు కూడా పునరుత్పత్తి చేయగలవు. ఆక్సాలిస్ జాతి దుంప రకం కలుపు మొక్క ఒక సీజన్లో 6900 మొక్కలుగా పెరుగుతుంది. నేలకు కరుచుకొని, పొట్టిగా, పాకుతూ పెరుగుతుండటం వలన యంత్రాలతో వీటిని తొలగించినప్పటికీ తప్పించుకుని బతుకుతాయి. -
ఐసీఏఆర్-ఐఏఆర్ఐ డైరెక్టర్‌కి ఎం.ఎస్. స్వామినాథన్ పురస్కారం
ఐసీఏఆర్–భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ (ICAR–IARI) డైరెక్టర్ వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి.హెచ్. శ్రీనివాసరావును ప్రతిష్టాత్మక 'ప్రొఫెసర్ ఎం.ఎస్. స్వామినాథన్' జాతీయ అవార్డు (2024–25)కు ఎంపిక చేసినట్లు రిటైర్డ్ ఐసీఏఆర్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (RICAREA) ప్రకటించింది. భారత ఆహార భద్రత కోసం విశేష కృషి చేసిన శాస్త్రవేత్తలకు గుర్తింపుగా నుజివీడు సీడ్స్ లిమిటెడ్ (NSL) సహకారంతో 2004-05లో ఈ అవార్డును నెలకొల్పారు. డా. ఎం.ఎస్. స్వామినాథన్ జన్మ శతాబ్ది సంవత్సరంలో ఈ అవార్డును ప్రకటించడం విశేషం.వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన ఎనిమిది మంది ప్రముఖ శాస్త్రవేత్తలు ఇప్పటివరకు ఈ గౌరవాన్ని పొందారు. ఆ జాబితాలో ఇప్పుడు డా. శ్రీనివాసరావు చేరారు. గతంలో ఈ అవార్డు పొందిన వారిలో డా. గెండా లాల్ జైన్ (పౌల్ట్రీ), డా. ఎస్. నాగరాజన్ (ప్లాంట్ పాథాలజీ), డా. వి. ప్రవీణ్ రావు (మైక్రో ఇరిగేషన్), డా. పి.వి. సత్యనారాయణ (వరి వంగడాలు) వంటి ప్రముఖులు ఉన్నారు.మాజీ ఐసీఏఆర్ డైరెక్టర్ జనరల్ డా. త్రిలోచన్ మోహపాత్ర అధ్యక్షతన ఏర్పాటైన నిపుణుల కమిటీ అత్యంత పారదర్శకంగా ఈ ఎంపికను చేపట్టింది. ఈ కమిటీలో వరల్డ్ ఫుడ్ ప్రైజ్ గ్రహీత డా. విజయ్ గుప్తా, డా. బాల రవి, ఎం.ఎస్. స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ ఛైర్పర్సన్ డా. సౌమ్య స్వామినాథన్ సభ్యులుగా వ్యవహరించారు.విశిష్ట సేవలు..వాతావరణ మార్పులను తట్టుకునే వ్యవసాయ పద్ధతులు, సహజ వనరుల యాజమాన్యంలో డా. రావు చేసిన పరిశోధనలు అమోఘం.పర్యావరణ ప్రభావం: 40 లక్షల హెక్టార్లలో వనరుల పరిరక్షణ సాంకేతికతను అమలు చేయడం ద్వారా ఏటా రూ. 380 కోట్ల డీజిల్ ఖర్చును ఆదా చేయడంలో కీలక పాత్ర పోషించారు.వాతావరణ అనుకూలత: 637 జిల్లాలకు వ్యవసాయ ఆకస్మిక ప్రణాళికలు, 151 వాతావరణ తట్టుకునే గ్రామాలను రూపొందించారు.విద్యా రంగం: ఇప్పటివరకు 363 పరిశోధనా పత్రాలను, 57 పుస్తకాలను ప్రచురించారు.అవార్డు ప్రధానోత్సవం:బంగారు పతకం, ప్రశంసా పత్రం రూ. 2,00,000 నగదుతో కూడిన ఈ పురస్కారాన్ని ఏప్రిల్ 18న అందజేయనున్నారు.(చదవండి: సాహసం శ్వాసగా సాగిపో బామ్మ..!) -
రైతులకు అండగా ‘టాప్కో’
చిన్న, సన్నకారు రైతులను కూడగట్టి పంచాయతీ స్థాయిలో వారికి అవసరమైన అన్ని రకాల సేవలు అందించటంలో తిరునెల్లి అగ్రి ప్రొడ్యూసర్ కంపెనీ (టాప్కో) ఆదర్శప్రాయమైన కృషి చేస్తోంది. కేరళలోని వాయనాడ్ జిల్లా తిరునెల్లి పంచాయతీలో 9 ఏళ్ల క్రితం 51 మంది రైతుల భాగస్వామ్యంతో ప్రారంభమైన ఈ రైతు ఉత్పత్తిదారుల కంపెనీ ప్రకృతి వ్యవసాయ శిక్షణ, దేశీ వరి వంగడాల పరిరక్షణ, రైతులు పండించిన ప్రతి గింజనూ సమంజసమైన ధరకు కొనుగోలు చెయ్యటం కీలకపాత్ర పోషిస్తోంది. దేశీ వరి, కూరగాయ విత్తనాలను సుమారు 5 వేల మంది రైతులకు అందిస్తోంది. కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ తోడ్పాటుతో ప్రతి మంగళవారం గ్రామస్థాయిలో వాతావరణ సంబంధమైన సూచనలు, సలహాలను అందించటం విశేషం.గ్రామ స్థాయిలో వాతావరణ సూచనలు: వరి, కాఫీ, మిరియాలు, దుంప పంటలు, కూరగాయలు.. ఈ ఐదు రకాల పంటలకు సంబంధించి పంచాయతీలోని 8 కొండ ప్రాంత గ్రామాల్లో ప్రతి 5 కిలోమీటర్లను ఒక యూనిట్‌గా తీసుకొని వాతావరణ సూచనలు ఇందిస్తోంది. భారత వాతావరణ శాఖ జిల్లా స్థాయి వాతావరణ సూచనలతో సరిపెట్టుకుంటూ ఉన్నందున తాము గ్రామ స్థాయి సూచనలు అందించటం రైతులకు ఉపయుక్తంగా ఉంటున్నదని టాప్కో సీఈవో, సేంద్రియ రైతు రమేశ్ కృష్ణన్ చెప్పారు. మైసూరులో ఇటీవల జరిగిన ఆషా కిసాన్ స్వరాజ్ సమ్మేళనంలో ఆయన ‘సాక్షి సాగుబడి’తో ముచ్చటించారు. అనూహ్యంగా మారుతున్న వాతావరణ పరిస్థితులపై పంచాయతీ స్థాయిలో పరిశోధనలు చెయ్యటం, గమనించిన మార్పులను, వాటిని తట్టుకునేందుకు రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఎప్పటికప్పుడు రైతులకు తెలియజెయ్యటం ద్వారా టాప్కో సత్ఫలితాలు సాధిస్తోంది. తిరునెల్లి పంచాయతీ కూడా ఏమీ వెనుకబడి లేదు. ఈ ఏడాది నుంచి ప్రతి వార్డులో ఉష్ణోగ్రత, గాలిలో తేమ, వర్షం తదితర వాతావరణ సమాచారాన్ని హ్యూమెస్ ట్రస్టు తోడ్పాటుతో ప్రతి రోజూ ఉదయం 8 గంటలకు పంచాయతీ ప్రజలకు అందిస్తోందన్నారు. ఉత్పత్తి వ్యయాన్ని బట్టి ధర: తమ సంస్థ సభ్యులైన రైతులు ఏమేమి పంటలు, ఎంత విస్తీర్ణంలో పండించాలన్నది ప్రతి ఏటా ఖరీఫ్‌కు ముందు క్రాప్ కేలండర్‌ను రూపొందించుకుంటున్నామని రమేశ్ కృష్ణన్ వివరించారు. ముఖ్యంగా అంతరించిపోతున్న సంప్రదాయ వరి వంగడాలను గుర్తించి, మార్కెట్ అవసరాల మేరకు సాగు చేయిస్తున్నామన్నారు. పూర్వం నుంచి వరి సాగు చేస్తున్న భూములను ఇతర అవసరాలకు మళ్లించకుండా రైతులకు నచ్చజెప్పటంతో పాటు సేంద్రియ సేద్యానికి, మార్కెటింగ్ సదుపాయం ద్వారా మంచి ఆదాయం రైతులకు అందించటానికి కృషి చేస్తున్నామన్నారు. ఏ రకం దేశీ వరి దాన్యం సగటున ఎకరానికి ధిగుబడి ఎంతో ఆ ఉత్పత్తి వ్యయాన్ని బట్టి సీజన్‌కు ముందుగానే రైతు నుంచి కొనుగోలు చేసే ధరను టాప్కో నిర్ణయించటం మరో విశిష్టత. ఎక్కువ దిగుబడి వచ్చే వంగడం ధాన్యం ధర తక్కువగా ఉంటుంది. తక్కువ దిగుబడి వచ్చే రకం ధర ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు.. ఎకరానికి 2 టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే రెడ్ రైస్ ధాన్యానికి కిలో రూ. 34, తక్కువ దిగుబడినిచ్చే రకానికి రూ.130 చెల్లిస్తున్నారు.వయనాడ్ తొండి, పాల్ తొండి, చెంతడి, వలై చెన్నెల్లు, నవార, గంధకశాల, జీరకశల, ముల్లంకైమ తదితర రకాల దేశీ వరి రకాల బియ్యం, పిండి, రవ్వ, అటుకులను టాప్కో ప్రత్యేక దుకాణంలో విక్రయిస్తున్నారు. స్థానిక వాతావరణానికి పూర్వకాలం నుంచి అనువుగా ఉండే పాత పంటలను పరిరక్షించుకోవటం, రసాయనాలు వాడకుండా ఆరోగ్యదాయక మైన ఆహారాన్ని ప్రజలకు అందించటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని, ఈ పనులను రైతులకు గిట్టుబాటయ్యేలా చెయ్యటంలో తమ ఎఫ్పీసీ విజయం సాధిస్తోందని రమేశ్ కృష్ణన్ సంతోషంగా చెప్పారు. -
సక్సెస్ బాటలో సహజ ఆర్గానిక్స్
దేశంలో సేంద్రియ వ్యవసాయానికి పెరుగుతున్న ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకొని తీసుకోవాల్సిన నియంత్రణ చర్యలపై అధ్యయనం చెయ్యటానికి కేంద్ర ప్రభుత్వం డాక్టర్ కున్వర్జి భాయ్ జాధవ్ అధ్యక్షతన తొలి ఆర్గానిక్ ఫార్మింగ్ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. దీని నివేదిక ఆధారంగానే ‘నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఆర్గానిక్ ప్రొడక్షన్’ (ఎన్పీఓపీ) పేరిట తొలి ఆర్గానిక్ సర్టిఫికేషన్ వ్యవస్థ 2000 మార్చిలో అమల్లోకి వచ్చింది. సేంద్రియ వ్యవసాయం, సర్టిఫికేషన్ వ్యవహారాలను సమన్వయపరచడానికి ‘నేషనల్ సెంటర్ ఫర్ ఆర్గానిక్ ఫార్మింగ్ (ఎన్‌సీఓఎఫ్)’ 2004లో ప్రారంభమైంది. తదనంతరం ఈ సంస్థ పేరులో ‘నేచురల్’ అనే పదాన్ని చేర్చటం ద్వారా ప్రకృతి వ్యవసాయాన్ని కూడా కేంద్ర వ్యవసాయ శాఖ దీని పరిధిలోకి తెచ్చింది. అదే ఏడాది తొలి సేంద్రియ వ్యవసాయ విధానాన్ని 2004 మార్చి 24న అమల్లోకి తెచ్చిన ఘనత కర్ణాటక రాష్ట్రానికి దక్కింది. ఈ నేపథ్యంలో రూపుదిద్దుకున్న బెంగళూరుకు చెందిన సహజ ఆర్గానిక్స్ ఎఫ్‌పీఓ ప్రజల ఆదరణ పొందుతోంది.130 ఉత్పత్తులు... రూ.28 కోట్ల టర్నోవర్కర్ణాటకలో ఏర్పాటైన తొలి రైతు ఉత్పత్తిదారుల కంపెనీ ‘సహజ సమృద్ధ ఆర్గానిక్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్’. 16 ఏళ్ల క్రితం కంపెనీ చట్టం ప్రకారం బెంగళూరులో రిజిస్టరైన ఈ ఎఫ్‌పీఓ తన వాటాదారులైన 1,024 మంది సేంద్రియ రైతులకు అధిక నికరాదాయాన్ని అందిస్తోంది. దానితో పాటు, 15 రాష్ట్రాల్లోని సేంద్రియ రిటైల్ విక్రయదారులకు, వినియోగదారులకు నమ్మకమైన రసాయన అవశేషాల్లేని ఆహారోత్పత్తులను ‘సహజ ఆర్గానిక్స్’ బ్రాండ్‌తో చేరవేస్తోంది. 130 పచారీ సామాన్లతో పాటు వంద రకాలకు పైగా కూరగాయలు, పండ్లను టోకుగా, రిటైల్‌గా విక్రయిస్తూ గత ఏడాది రూ.28 కోట్ల వార్షిక టర్నోవర్ సాధించింది. ప్రతిష్టాత్మక జైవిక్ ఇండియా ఫస్ట్ ప్రైజ్ సహా అనేక జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు గెల్చుకుంది. అన్నిటికీ మించి, 2018 జూన్ 24న ‘మన్ కీ బాత్’లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు పొందటం విశేషం.రైతుకు 15–20% అదనపు ధరసహజ ఆర్గానిక్స్ తన వాటాదారులైన రైతుల నుంచి, దేశవ్యాప్తంగా 25కు పైగా సేంద్రియ రైతు బృందాల నుంచి∙ఈ ఎఫ్‌పీఓ దేశీ వరి బియ్యం, పప్పులు, నూనె గింజలు, పండ్లు, బెల్లం, తేనె తదితరాలను సేకరిస్తుంది. బెంగళూరు పరిసరాల్లోని 5 గ్రామాల్లో సేంద్రియ రైతుల నుంచి కూరగాయలు, పండ్లను సేకరిస్తుంది. రైతులకు, ప్రాసెసింగ్ యూనిట్, మిల్లులకు ఎన్పీఓపీ ఆర్గానిక్ సర్టిఫికేషన్‌తో పాటు ఐఎంఓ ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ తప్పనిసరి చేశారు. రైతులకు మార్కెట్ ధరపై 15–20% అదనపు ధర చెల్లిస్తున్నట్లు సహజ ఆర్గానిక్స్ ప్రతినిధి ప్రసాద్ బెంగళూరులోని ప్రాసెసింగ్ యూనిట్‌ను సందర్శించిన ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు. ప్రతి పంటకు బేస్ ధర ఉంటుంది. బహిరంగ మార్కెట్లో అంతకన్నా ధర పతనమైనా ఎఫ్‌పీఓ ఆ ధర చెల్లిస్తుందన్న మాట. ఉదా.. టొమాటో బేస్ ధర కిలోకు రూ. 10–12. ఎఫ్‌పీఓ ఖరారు చేసిన ముందస్తు ప్రణాళిక ప్రకారం.. రైతులు మిశ్రమ సేంద్రియ పంటలను నిర్దేశిత విస్తీర్ణంలో సాగు చేస్తారు. అవసరానికి మించి పండితే సాధారణ ధరలకే స్థానిక మార్కెట్లలో విక్రయిస్తారు. రైతులకు వారానికోసారి పైకం చెల్లిస్తున్నారు. ఎఫ్‌పీఓకి వచ్చిన లాభాల్లో నుంచి ఏడాదికి ఓసారి బోనస్ (విత్‌హెల్డ్ ప్రైస్) చెల్లిస్తున్నారు.అంతర్జాతీయ ప్రమాణాల వల్లనే ప్రజల ఆదరణఆరోగ్యకరమైన సేంద్రియ ఆహారోత్పత్తి ద్వారా వినియోగదారులకు, రైతులకు, మట్టికి, పర్యావరణానికి మేలు జరుగుతోంది. దీని ప్రాధాన్యం పెరుగుతోంది. ప్రజలు మున్ముందు ఇంకా ఎక్కువగా గుర్తిస్తారు. బెంగళూరు, చెన్నై, కేరళ తదితర ప్రాంతాల్లో మా ఉత్పత్తులు ఎక్కువగా అమ్ముడుపోతున్నాయి. మా వద్ద ఆర్గానిక్ ఉత్పత్తులను టోకుగా కొనుగోలు చేసి, ఎక్కడైనా రిటైల్‌గా విక్రయించుకునే వారి కోసం వైట్ ప్యాకింగ్‌తో లేదా వారి బ్రాండ్ కవర్‌తో ప్యాక్ చేసి ఇస్తున్నాం. నాణ్యత, విశ్వసనీయత, ట్రేసబిలిటీలకు సంబంధించి అంతర్జాతీయ ప్రమాణాలను పాటిస్తున్నాం. మా సేంద్రియ ఉత్పత్తులకు గత 16 ఏళ్లుగా ప్రజాదరణ పెరుగుతోంది.– బి. సోమేశ్, సీఈవో, ఎండీ, సహజ సమృద్ధ ఆర్గానిక్ ప్రొడ్యూసర్ కంపెనీ, సిద్ధనపాల్య, బెంగళూరు somesh@sahajaorganics.com -
ఆధునిక వ్యవసాయానికి ఆయువుపట్టు!
మానవాళి ప్రపంచవ్యాప్తంగా కనీసం పది వేల ఏళ్ల నుంచి వ్యవసాయం ద్వారా ఆహారాన్ని సమకూర్చుకుంటున్నది. వందేళ్ల క్రితం నుంచి రసాయనిక ఎరువుల వాడకం ప్రారంభమై, క్రమంగా ప్రపంచవ్యాప్తమైంది. అయితే, ఈ ఎరువుల ఉత్పత్తి అన్ని ఖండాల్లో, అన్ని దేశాల్లో అవసరాలకు తగినంత జరగటం లేదు. అందువల్ల ఎరువుల వాణిజ్యం కీలకంగా మారింది. ఆధునిక వ్యవసాయానికి రసాయనిక ఎరువు మూలస్తంభం. ప్రపంచ మానవాళికి ఆహారం అందించడానికి ఈ ఎరువులు అత్యవసరం. ప్రపంచ జనాభాలో దాదాపు సగం మంది (సుమారు 350–400 కోట్ల మంది) హేబర్–బోష్ ప్రక్రియ ద్వారా సహజ వాయువు నుంచి ఉత్పత్తి చేసే నత్రజని ఎరువులపై ఆధారపడుతున్నారని ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార–వ్యవసాయ సంస్థను ఉటంకిస్తూ ఇంటర్నేషనల్ ఫర్టిలైజర్ అసోసియేషన్(ఐఎఫ్ఏ) చెబుతోంది.ఈ ఎరువులను సమకూర్చటంలో అంతర్జాతీయ వాణిజ్యం పాత్ర కీలకంగా ఉంది. ఎరువుల సరఫరాకు అంతరాయం కలిగినప్పుడు, దాని పర్యవసానాలు నేరుగా రైతుల పొలాలపై, అంతిమంగా ప్రపంచ ఆహార లభ్యతపై ప్రభావం చూపుతాయి. రసాయనిక ఎరువుల వ్యాపారం వల్ల వ్యవసాయం, ఆహార వ్యవస్థలు ప్రభావితమయ్యే తీరు ప్రపంచవ్యాప్తంగా ఆయా ప్రాంతాలను బట్టి గణనీయంగా మారుతుంది. దేశీయ సహజ వాయువు నిల్వలు లేదా ఎరువుల ఉత్పత్తికి సంబంధించిన మౌలిక సదుపాయాల కొరత వంటి అనేక అంశాలపై ఇది ఆధారపడి ఉంటుంది. ఏయే దేశాల్లో ఎంత?భారతదేశంలో 37.9 కోట్ల మంది ప్రజలకు అవసరమయ్యే ఆహారోత్పత్తికి దిగుమతి చేసుకున్న నత్రజని తదితర రసాయనిక ఎరువులు లేదా దిగుమతి చేసుకున్న గ్యాస్ నుంచి తయారైన ఎరువులను వాడుతున్నారని ఒక అంచనా. బ్రెజిల్లో వీరి సంఖ్య 18.5 కోట్ల మంది ఇలాగే ఆధారపడి ఉన్నారు. చైనా ప్రధాన ఎరువుల ఉత్పత్తిదారు అయినప్పటికీ, ఇది దిగుమతి చేసుకున్న సహజ వాయువు నుండి ఉత్పత్తి చేసిన ఎరువులను ఉపయోగించి 15.1 కోట్ల మందికి ఆహారం అందిస్తున్నట్లు సమాచారం.ప్రపంచ ఎరువుల వాణిజ్యంలో మధ్యప్రాచ్యం కీలక పాత్ర పోషిస్తుంది. 2024లో ఇరాన్, ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ, బహ్రెయిన్ కలిసి ప్రపంచ అమ్మోనియా వాణిజ్యంలో 23%, ప్రపంచ యూరియా వాణిజ్యంలో 34%, ప్రపంచ అమ్మోనియేటెడ్ ఫాస్ఫేట్ వాణిజ్యంలో 18% వాటాను కలిగి ఉన్నాయి. ప్రధాన ఎరువుల ఎగుమతిలో మధ్యప్రాచ్య దేశాలు దాదాపు 30% సరఫరా చేశాయి.దిగుమతులు కీలకంఅయితే, ప్రపంచ దేశాలు తమ దేశాల్లో సొంత వనరులతో తయారు చేసుకునే రసాయనిక ఎరువులు సగం మేరకు ఉంటాయి. మిగతా సగం(52%) ఎరువుల కోసం విదేశాలపైనే దేశాలు ఆధారపడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 180 కోట్ల మంది విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఎరువులతో లేదా దిగుమతి చేసుకునే సహజ వాయువుతో దేశీయంగా తయారు చేసుకునే ఎరువులతో పండించిన పంటల ఆహారంపై ఆధారపడుతున్నారు. ప్రపంచ జనాభాలో వీరు సుమారు 23% మేరకు ఉంటారని అంచనా.దిగుమతి చేసుకున్న నత్రజని తదితర రసాయనిక ఎరువులతో పండించిన ఆహారంపై సుమారు 107 కోట్ల నుండి 120 కోట్ల మంది ప్రజలు ఆధారపడి ఉన్నారు. ప్రాథమిక ముడిపదార్థంగా దిగుమతి చేసుకున్న సహజ వాయువును ఉపయోగించి దేశీయంగా ఉత్పత్తి చేసే ఎరువుల ద్వారా అదనంగా 71 కోట్ల మంది ప్రజలకు ఆహారం అందుతోందని అంచనా.ఎన్పీకే ఎరువుల వినియోగ నిష్పత్తి ఎంత?మన దేశంలో రసాయనిక (నత్రజని, ఫాస్ఫరస్, పొటాషియం– ఎన్పీకే) ఎరువుల వినియోగ నిష్పత్తి అన్ని రాష్ట్రాల్లోనూ ఒకేలా లేదు. కేంద్ర ప్రభుత్వం ఈ నెల 24న పార్లమెంటులో ప్రకటించిన గణాంకాల ప్రకారం రాష్ట్రాల్లో ఎన్పీకే ఎరువుల వినియోగ నిష్పత్తి ఎలా ఉందో చూద్దాం. రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి అనుప్రియ ఎస్. పటేల్ రాజ్యసభలో ఎరువుల సమతుల్య వినియోగం, సుస్థిర వ్యవసాయ పద్ధతుల ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు.భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్) ప్రకారం.. పంట రకం, నేల ఆరోగ్యం, వ్యవసాయ–వాతావరణ పరిస్థితులను బట్టి పోషకాల అవసరాలు దేశంలో వివిధ ప్రాంతాల్లో విస్తృతంగా మారుతూ ఉంటాయి. కాబట్టి, దేశవ్యాప్తంగా వర్తించే ఒకే ఒక్క ‘ఆదర్శవంతమైన’ ఎన్పీకే ఎరువుల వినియోగ నిష్పత్తిని నిర్దేశించలేమని మంత్రి పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా విస్తృతమైన క్షేత్ర ప్రయోగాలు, సమన్వయ పరిశోధనలను నిర్వహించి రసాయన, సేంద్రియ వనరులను రెండింటినీ కలిపి, వివిధ పంటలకు ఎరువుల మోతాదులను ఐసీఏఆర్ నిర్థారించింది. ఎన్పీకే ఎరువులను 4:2:1 నిష్పత్తిలో వాడమని సూచించింది. అయితే, దేశవ్యాప్తంగా యూరియా ఎక్కువగా వాడుతున్నారు. నేల ఆరోగ్యాన్ని, ఎరువుల వినియోగ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి ఈ ఎరువులను సమతుల్యంగా వాడటం అవసరం.నేల పరీక్ష ఆధారిత సమతుల్య, సమీకృత పోషక నిర్వహణ చేపట్టాలని ఐసీఏఆర్ చెబుతోంది. సేంద్రియ ఎరువులు, జీవన ఎరువులు, పచ్చిరొట్ట పంటలు, పంట అవశేషాల పునర్వినియోగం వంటి సేంద్రియ వనరులతో రసాయనిక ఎరువులను కలిపి ఉపయోగించాలని సిఫారసు చేస్తోంది. సరైన పరిమాణం, సరైన సమయం, సరైన పద్ధతి, సరైన రకం ఎరువులను వివేకవంతంగా ఉపయోగించటం, రసాయనిక ఎరువుల అధిక వినియోగాన్ని తగ్గించాలని సూచిస్తోంది. ఈ అంశాలపై రైతులకు అవగాహన కల్పించడానికి కృషి చేస్తున్నామని మంత్రి వివరించారు.హోర్ముజ్ జలసంధి కీలకంనత్రజని ఎరువు అయిన యూరియా.. అంతర్జాతీయంగా అత్యంత విస్తృతంగా అమ్మకాలు కొనుగోళ్లు జరిగేది ఈ ఎరువుకు సంబంధించే. మధ్యప్రాచ్యంలో ఇటీవలి సంఘర్షణలు హోర్ముజ్ జలసంధిలో రాకపోకలకు అంతరాయం కలగటంతో ముఖ్యంగా నత్రజని ఎరువుల క్రయవిక్రయాలు ప్రభావితమయ్యాయి.2024లో, హోర్ముజ్ జలసంధి ద్వారా దాదాపు 18.5 మిలియన్ టన్నుల యూరియా ఎగుమతి జరిగింది. ఈ మార్గంలో రవాణాకు ఏవైనా దీర్ఘకాలిక అంతరాయాలు ఏర్పడితే, దాని ప్రభావం ప్రపంచ ఎరువుల మార్కెట్లపై చప్పున కనిపిస్తుంది.నత్రజని ఎరువులను అమ్మోనియా నుంచి ఉత్పత్తి చేస్తారు. ఇది హైడ్రోజన్ ఫీడ్‌స్టాక్‌గా, ఇంధన వనరుగా సహజ వాయువుపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. అందువల్ల, ఇంధన ధరల్లోని అస్థిరత ఎరువుల ఉత్పత్తి ఖర్చులను నేరుగా ప్రభావితం చేస్తుంది.ఫాస్ఫేట్ సరఫరా గొలుసులు కూడా ఈ హోర్ముజ్ జలసంధితో ముడిపడి ఉన్నాయి. అమ్మోనియేటెడ్ ఫాస్ఫేట్ల ప్రపంచ వాణిజ్యంలో దాదాపు 18% హోర్ముజ్ ద్వారా జరుగుతుంది. అదే సమయంలో ప్రపంచ సల్ఫర్ వాణిజ్యంలో దాదాపు సగం ఇదే మార్గం గుండా వెళుతుంది. ఫాస్ఫేట్ ఎరువుల ఉత్పత్తిలో సల్ఫర్ ఒక కీలకమైన ముడి పదార్థం. అంటే, సరఫరాలో అంతరాయాలు ఫాస్ఫేట్ ఎరువుల విలువ గొలుసును ప్రభావితం చేయగలవు.ఇంధనం, ఎరువుల వాణిజ్య మార్గాలకు అంతరాయాలు కొనసాగితే, దిగుమతి చేసుకున్న ఎరువులపై ఆధారపడిన దేశాలలో దీని ప్రభావం అత్యంత తీవ్రంగా ఉంటుంది. సహారా ఉప–్ర ప్రాంత ఆఫ్రికా, దక్షిణాసియాలోని కొన్ని ప్రాంతాలలో ఉన్న చిన్న రైతులు ముఖ్యంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతారు. ఎందుకంటే ఎరువుల లభ్యత, అందుబాటు ధరలు పంట దిగుబడులను, ఆహార ఉత్పత్తిని నేరుగా ప్రభావితం చేస్తాయి.చదవండి: సేంద్రియ ఆహార మార్కెట్లకు చోటివ్వండిఈ కారణాల వల్ల, ఎరువుల సరఫరా గొలుసులను సజావుగా కొనసాగించేలా చర్యలు తీసుకోవటం అత్యవసరం. ఎరువులు సకాలంలో అందితేనే రైతులు పంట దిగుబడులు పొందగలుగుతారు. ప్రపంచ ఆహార భద్రతకు, స్థిరత్వానికి తద్వారా భరోసా ఉంటుంది. భౌగోళిక–రాజకీయ సంక్షోభాలను తట్టుకునే శక్తి చేకూరుతుంది.తీవ్రమైన అనిశ్చితి నెలకొన్న ఈ సమయంలో, విధాన రూపకర్తలు ఎరువులను ప్రపంచ ఆహార వ్యవస్థలలో ఒక వ్యూహాత్మక భాగంగా గుర్తించి, కీలకమైన వ్యవసాయ సరఫరా గొలుసులు సజావుగా పనిచేసేలా కృషి చెయ్యటం చాలా ముఖ్యం. ఎరువులు ప్రధాన సముద్ర మార్గాల ద్వారా నమ్మకంగా రవాణా అయ్యేలా చూడటం, రైతులకు తోడ్పడటానికి, ప్రపంచవ్యాప్తంగా ఆహార భద్రతను కాపాడటానికి అత్యవసరం.– నిర్వహణ: పంతంగి రాంబాబుసాక్షి సాగుబడి డెస్క్ -
‘ఎండోసల్ఫాన్’పై విజయం ఒక మలుపు
ఉషా సూలపాణి (63).. తిరువనంతపురం కేంద్రంగా పనిచేస్తున్న సేంద్రియ వ్యవసాయోద్యమ ప్రచారకర్త. దేశీ వరి వంగడాల వైవిధ్యం, పురాతన ఆహార సంస్కృతుల పరిరక్షణ, పునరుద్ధరణ లక్ష్యంతో ఆమె ‘సేవ్ అవర్ రైస్ క్యాంపెయిన్’ను రెండు దశాబ్దాలకు పైగా ముందుండి నడిపిస్తున్నారు. వాతావరణ మార్పులను దీటుగా తట్టుకునే వ్యవసాయ పద్ధతులు, సేంద్రియ వ్యవసాయంలో శక్తి వినియోగ సామర్థ్యంపై ప్రస్తుతం పని చేస్తున్నారు. ఆమె థనాల్ ట్రస్టు వ్యవస్థాపకురాలు. థనాల్ సేంద్రియ ఉత్పత్తిదారుల కంపెనీ డైరెక్టర్‌గా కూడా పనిచేస్తున్నారు. ఎమ్మెస్సీ హార్టీకల్చర్ చదివి 1986లో వ్యవసాయ శాఖ అధికారిగా ఉద్యోగంలో చేరారు. నాలుగేళ్ల తర్వాత ఉద్యోగాన్ని వదిలి సేంద్రియ వ్యవసాయ ఉద్యమ ప్రచార కార్యకర్తగా జీవితాన్ని ప్రారంభించారు. ఎండోసల్ఫాన్ వంటి రసాయనిక పురుగుమందులకు వ్యతిరేకంగా ఉద్యమించి విజయం సాధించటం తన జీవితంలో గొప్ప మలుపు వంటిదని ఆమె అంటారు. ఇటీవల మైసూరులో కిసాన్ స్వరాజ్ సమ్మేళనంలో అతిథిగా పాల్గొన్న ఆమెతో ‘సాక్షి సాగుబడి’ ఇంటర్వ్యూ ముఖ్యాంశాలు..→ వ్యవసాయాధికారి ఉద్యోగాన్ని వదిలి సేంద్రియ వ్యవసాయం, పర్యావరణ ఉద్యమంలోకి మీరు ప్రవేశించారు. ఈ 35 ఏళ్లలో మీ జీవన అనుభవాలను వివరిస్తారా?భోపాల్ గ్యాస్‌లీక్ ఉదంతం, సైలెంట్ స్ప్రింగ్ (రాచెల్ కార్సెన్ రచన) పుస్తకం ప్రేరణతో వ్యవసాయ అధికారి ఉద్యోగానికి స్వస్తి చెప్పి పర్యావరణ ఉద్యమంలోకి వచ్చాను. ఎటుచూసినా పచ్చని చెట్లు, నీటితో ఆవరించి ఉండే కేరళ దశాబ్దాల నిర్లక్ష్యం కారణంగా పర్యావరణ వినాశనం జరుగుతోంది. సమాజం నానాటికీ ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నప్పటికీ పర్యావరణ సంక్షోభంలోకి కూరుకుపోతోంది. అందుకే, పర్యావరణాన్ని, స్థానిక పాత పంటలను, పురాతన వ్యవసాయ సంస్కృతిని పరిరక్షించుకోవాలనే చైతన్యాన్ని ప్రజల్లో రగిలించే ఆశయంతో పనిచేస్తున్నాం. 1986లో థనల్ ట్రస్టును ఏర్పాటుచేశాం. ఎన్నో అంశాలపై ప్రచారోద్యమా లను విజయవంతంగా నిర్వహించగలిగాం. ఈ ఉద్వేగభరిత ప్రయాణంలో మాతో చాలా మంది జత కలిశారు. → సేంద్రియ ఆహార మార్కెట్ల అభివృద్ధిలో మీ అనుభవాలు చెప్పండి.. 2002లో తిరువనంతపురం జిల్లాలో రెండు పంచాయితీల్లో పనిచేయటం ప్రారంభించాం. మహిళా స్వయం సహాయక బృందాలను ఏర్పాటు చెయ్యటం, సేంద్రియ సేద్యం, ఇంటి పంటల సాగుపై శిక్షణ ఇవ్వటంతో కొబ్బరి, కూరగాయలు, అరటి పండ్లు.. వంటి సేంద్రియ సాగు పెరిగింది. అయితే, ఎవరికి అమ్మాలి? ఎక్కడ అమ్మాలి? అనే సవాళ్లు వచ్చాయి. అప్పుడు సేంద్రియ రైతుల మార్కెట్లను తిరువనంతపురంలో ఏర్పాటు చేయించాం. రైతుల భాగస్వామ్యంతో 2009లో థనాల్ ఆర్గానిక్ బజార్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీని ఏర్పాటు చేశాం. నెలకోసారి సేంద్రియ సంతతో మార్కెట్‌ను ప్రారంభించాం. ప్రజాదరణతో రెండేళ్లలోనే వారాంతపు మార్కెట్లు నిర్వహించాల్సి వచ్చింది. 2011 నాటికి అనుదిన సేంద్రియ మార్కెట్ నిర్వహణ ప్రారంభమైంది. → ‘సేవ్ అవర్ రైస్ క్యాంపెయిన్’ ఎప్పుడు మొదలైంది..?మన పురాతన ఆహార, వ్యవసాయ సుసంపన్న సంస్కృతిలో భాగమైన దేశీ వరి వంగడాలు కనుమరుగైపోతున్న స్థితిలో 2004లో ‘సేవ్ అవర్ రైస్ క్యాంపెయిన్’ ప్రారంభించాం. అది ఐరాస అంతర్జాతీయ రెండవ వరి సంవత్సరం. కొచ్చిన్‌లో జాతీయ స్థాయి సమావేశం పెట్టాం. పది రాష్ట్రాల నుంచి చాలా మంది వచ్చి పాల్గొనటంతో కొత్త ఉత్సాహంతో ముందుకెళ్లాం. దేశీ వరి రకాలను సేకరించి, పండించటమే కాదు నుంచి మార్కెటింగ్ వరకు వాల్యూ చెయిన్ నిర్మించాం. వినియోగదారుల్లో అవగాహన పెంచటం కోసం ప్రత్యేక కృషి చేశాం. సీడ్ ఫెస్టివల్స్, ఫుడ్ ఫెస్టివల్స్ ఇందుకు బాగా ఉపయోగపడ్డాయి. → ఇప్పటికి ఎన్ని రకాలను పరిరక్షించారు?ఈ 22 ఏళ్లలో 1,400 రకాల దేశీ వరి రకాలను పరిరక్షించి రైతులు, విత్తనోత్పత్తి సంఘాల ద్వారా సాగులోకి తెచ్చాం. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దేశీ రకాలను ప్రాధాన్యాన్ని గుర్తించాయి. రైతు ఉత్పత్తిదారుల సంఘాలు దేశీ రకాలను ప్రత్యేకంగా ఆర్గానిక్‌గా సాగు చేస్తున్నాయి. దేశీ రకాలను 95% సేంద్రియంగానే సాగు చేస్తున్నారు. అనేక యూనివర్సిటీలు కూడా దేశీ రకాలపై ఆసక్తి చూపుతున్నాయి. ఈ ఉత్పత్తులకు ఎగుమతి అవకాశాలు కూడా వచ్చాయి.→ ఏయే రాష్ట్రాల్లో ఆదరణ బాగుంది?కేరళ, కర్ణాటక, తమిళనాడు, పశ్చిమబెంగాల్, ఒడిషా, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో వరి తదితర దేశీ విత్తనాలకు ఎక్కువ ఆదరణ ఉంది. పశ్చిమబెంగాల్లో దేశీ వరి ఆధారిత సమీకృత వ్యవసాయ పద్ధతి అమల్లోకి వచ్చింది. వరి, కూరగాయలు, చేపలు, కోళ్లతో కూడి ఉంటుందీ పద్ధతి. → అంతర్జాతీయ మహిళా రైతు సంవత్సరం 2026 కదా..అవును. వ్యవసాయం అంటేనే మహిళ కేంద్రంగా జరిగే పని. విత్తనం దగ్గరి నుంచి నూర్పిడి వరకు వ్యవసాయ పనుల్లో 70% మహిళల శ్రమ చాలా కీలకంగా ఉంది. మహిళా రైతుల హక్కుల అమలును ప్రోత్సహించడానికి అంతర్జాతీయ మహిళా రైతు దినోత్సవం ఉపయోగపడుతుంది. → రైతులు వాతావరణ మార్పుల్ని తట్టుకోవాలంటే..?ప్రతికూల వాతావరణ పరిస్థితుల్ని, చీడపీడల్ని తట్టుకోవాలంటే పర్యావరణ హితమైన పద్ధతుల్లో బహుళ పంటలను సాగు చెయ్యాలని మా అనుభవాలు చెబుతున్నాయి. సేంద్రియ/ప్రకృతి వ్యవసాయంలో పంటలు పండించే రైతులు నేరుగా వినియోగదారులకు అమ్ముకునే విధంగా మార్కెట్ సదుపాయాల కల్పనపై ప్రభుతం దృష్టి పెట్టాలి. కానీ, ప్రభుత్వ శాఖలు దేనికదే అన్నట్లు ఒంటెద్దు పోకడలా పనిచేస్తున్నాయి. అన్నీ కలిసి పనిచేస్తేనే రైతులకు ప్రయోజనం కలుగుతుంది. సేంద్రియ/ప్రకృతి సేద్య నమూనాలను క్షేత్రస్థాయిలో ఏర్పాటు చేస్తే ఎక్కువ మంది రైతులు ఈ పద్ధతిలోకి మారటానికి అవకాశం ఉంటుంది. సౌరశక్తిని వాడుకోవాలి. తద్వారా రసాయనిక వ్యవసాయ హరితగృహ వాయువులను 30% తగ్గించుకోవచ్చు. → వ్యవసాయం వైపు యువతను ఆకర్షించటం ఎలా?ఇటీవల కాలంలో సేంద్రియ/ప్రకృతి సేద్యం వైపు యువతీ యువకులు బాగానే ఆకర్షితులవుతున్నారు. మహిళలు కూడా సేద్యంలోకే కాదు మార్కెటింగ్ నైపుణ్యాలతో అగ్రిప్రెన్యూర్స్గానూ రాణిస్తున్నారు. కిసాన్ స్వరాజ్ సమ్మేళనంలోనూ కొందరు పాల్గొన్నారు.ఎండోసల్ఫాన్ నిషేధానికి దారితీసిన ఉద్యమం గురించి చెప్పండి..1997–98 నుంచి రసాయనిక పురుగుమందులకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమాలు నిర్వహించటం ప్రారంభించాం. ఎండోసల్ఫాన్ పురుగుమందును హెలికాప్టర్లతో జీడి తోటపై పిచికారీ చేయటం వల్ల ఆ ప్రాంత ప్రజల ఆరోగ్యం నాశనమైంది. అప్పట్లో గణాంకాలు పెద్దగా అందుబాటులో లేవు. వైద్యులు, హెల్త్ వర్కర్స్ తదితరులు కలసి రావటంతో క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి గణాంకాలు తయారు చేసి వెలుగులోకి తెచ్చాం. మీడియా తోడ్పాటుతో చైతన్యం తేగలిగాం. ఎన్నో అవాంతరాలు ఎదురైనా ఎట్టకేలకు ఎండోసల్ఫాన్‌ను నిషేధించటం మా ఉద్యమానికి గొప్ప మలుపుతిప్పింది. ఎంతో ఉత్సాహాన్నిచ్చింది. ఈ విజయం తర్వాతే సేంద్రియ వ్యవసాయంపై మరింత లోతుగా దృష్టి కేంద్రీకరించాం. -
సాధికారత @ బీబీజాన్!
బీబీజాన్ హలేమణి (40).. విశేష కృషితో లోకాన్ని తన వైపు తిప్పుకున్న ఓ సాధారణ మహిళా రైతు, స్వయం సహాయక సంఘం సారథి. కర్ణాటకలోని ధార్వాడ్ జిల్లా కుందగొడ తాలూకాలో హుబ్లి నుంచి దాదాపు 30 కి.మీ. దూరంలో ఉన్న ఒక గ్రామం ‘తీర్థ’ ఆమె స్వస్థలం. అంతా వర్షాధార వ్యవసాయమే. ఆమె కుటుంబం 3 ఎకరాల సొంత భూమి 7 ఎకరాలను కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తోంది. రాజనీతి శాస్త్రంలో బీఏ చదివిన బీబీజాన్ భర్త మౌల వ్యాపారి. ఇద్దరు పిల్లలు. కొడుకు బీఎల్, కూతురు బీఎస్సీ నర్సింగ్ చదువుతున్నారు. చదువు, సామాజిక దృష్టి కలిగినప్పటికీ.. ఇంటి పనులతో పాటు కుటుంబ వ్యవసాయ పనులు చేస్తూ ఒకానొక కుగ్రామంలో కాలం వెళ్లదీస్తున్న ఆమె జీవితం ఏడేళ్ల క్రితం గొప్ప మలుపు తీసుకుంది. యూఎన్డీపీ ఈక్వేటర్ అవార్డు2019లో 15 మంది మహిళల భాగస్వామ్యంతో బీబీజాన్ సార«థ్యంలో ఏర్పాటైన ‘బీబీ ఫాతిమా స్వయం సహాయక సంఘ’మే అందుకు కారణం. ఆరేడేళ్లు గడిచే సరికి వారంతా సాధికారతను సాధించుకున్నారు. తమ ఊరితో పాటు 30 ఊళ్లలో వ్యవసాయాన్ని నిలబెట్టే దిశగా మరల్చేందుకు ఈ సంఘమే దోహదపడింది. అందుకే గత ఏడాది ప్రసిద్ధ ‘యూఎన్డీపీ ఈక్వేటర్ ఇనీషియేటివ్ అవార్డు’ను ఈ సంఘం గెల్చుకుంది. పంటల జీవవైవిధ్యానికి, సుస్థిర వ్యవసాయ పద్ధతులను వ్యాప్తిలోకి తెచ్చే పది సంస్థలకు ఏటాఈ పురస్కారం ఇస్తుంటారు. దీనితో పాటు రూ.9 లక్షల నగదు బహుమతిని ప్రదానం చేస్తారు. అంతరించిపోతున్న చిరుధాన్యాలతో కూడిన మిశ్రమ సాగు పద్ధతిని ఈ సంఘం వ్యాప్తిలోకి తేవటానికి కీలక సాధనంగా ఉపయోగపడింది. చిరుధాన్యాలతో పాటు పప్పుధాన్యాలు, నూనెగింజలు, కూరగాయలను మిశ్రమ సాగు ద్వారానే ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ రైతులు నిలదొక్కుకోగలరని తెలియజెప్పి, రైతులు సుమారు 2 వేల హెక్టార్లలో అనుసరించేలా చెయ్యటంలో బీబీజాన్ నేతృత్వంలోని మహిళా సంఘం అపూర్వ విజయం సాధించింది. ఇందులో 25% రైతులు ప్రకృతి, సేంద్రియ పద్ధతుల్లోకి మారారని చెబుతూ.. రైతులతో సాగు పద్ధతిని మార్పించటం అంత సులభం కాదని బీబీజాన్ ‘సాక్షి సాగుబడి’తో అన్నారు. సహజ సమృద్ధ స్వచ్చంద సంస్థ మార్గదర్శనంలో భారతీయ చిరుధాన్యాల పరిశోధనా సంస్థ (ఐఐఎంఆర్) తదితర సంస్థల తోడ్పాటు తీసుకుంది. మిల్లెట్ ప్రాసెసింగ్ యంత్రం, సౌర విద్యుత్తు సదుపాయం వంటి మౌలిక సదుపాయాలు కల్పించుకుంటూ ఈ సంఘం ఆదర్శవంతంగా ఆర్థికాభివృద్ధి సాధిస్తోంది. బీబీ ఫాతిమా ఎస్‌హెచ్‌జి ఇతర సంఘాలతో కలసి ఏర్పాటు చేసుకున్న దేవధాన్య ఎఫ్పీసీ ఈ సంవత్సరం రూ. 1.5 కోట్ల వ్యాపారం చేసింది. 350 రకాలతో దేశీ విత్తన నిధి సొంత, దేశీ విత్తనాలు కాపాడుకోవటానికి ఈ సంఘం విత్తన నిధిని ఏర్పాటు చేసింది. విత్తనం రైతులు కొనే పనిలేదు. పది కిలోల విత్తనాలు తీసుకుంటే పంట పండించి 20 కిలోలు తిరిగి ఇవ్వాలి. అంతే. ఈ సామాజిక విత్తన బ్యాంకులో ఇప్పుడు 350 దేశీ రకాల విత్తనాలున్నాయి. 74 రకాల రాగులు, 10 రకాల కొర్రలు, 25 రకాల సామలు, 25 రకాల పప్పుధాన్యాలు, 80 కూరగాయల విత్తనాలు ఈ విత్తన బ్యాంకులో రైతులు అందుబాటులో ఉన్నాయి. ఎంపిక చేసిన 30 మంది రైతులతో దేశీ విత్తన ఉత్పత్తి చేయిస్తున్నారు. పంట దిగుబడులను దేవధాన్య ఎఫ్‌పీవో, సహజ ఆర్గానిక్స్ ఎఫ్‌పీవోల ద్వారా విక్రయిస్తున్నారు. సీడ్, మిల్లెట్ ఫెస్టివల్స్ నిర్వహిస్తూ రైతులే నేరుగా వినియోగదారులకు సేంద్రియ ఆహారాన్ని అమ్మే వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటుండటం విశేషం.25% మంది చిరుధాన్యాలు తింటున్నారుమా ప్రాంతంలో రైతులు 2 వేల హెక్టార్లలో చిరుధాన్యాల మిశ్రమ సాగు చేస్తున్నారు. సుమారు 15 గ్రామాల రైతులు తమ ధాన్యాలను మా ప్రాసెసింగ్ యూనిట్లో ప్రాసెసింగ్ చేయించుకుంటున్నారు. మా యంత్రంలో 10 కిలోల చిరుధాన్యాలను కూడా మరపట్టించి బియ్యం తయారు చేసుకోవచ్చు. 2024లో దాదాపు 50 మెట్రిక్ టన్నుల మిల్లెట్లు ప్రాసెస్ చేశాం. మా సంఘం ఏర్పాటైనప్పుడు మా గ్రామంలో ఎవరూ చిరుధాన్యాలు తినేవారు కాదు. కానీ ఇప్పుడు కనీసం 25% మంది ప్రతిరోజూ చిరుధాన్యాల బియ్యంతో వండిన అన్నం తింటున్నారు. యూఎన్డీపీ ఈక్వేటర్ ఇనీషియేటివ్ అవార్డు మా బాధ్యతను మరింత పెంచింది. ఈ పురస్కారం మాకు మాత్రమే చెందినది కాదు. దేశంలో మహిళా రైతులందరికీ దీన్ని అంకితం చేస్తున్నాం. – బీబీజాన్, బీబీ ఫాతిమా స్వయం సహాయక సంఘం, కర్ణాటక, యూఎన్డీపీ ఈక్వేటర్ ఇనీషియేటివ్ అవార్డు గ్రహీత. -
మహిళల నీటి కష్టాలు మూడురెట్లు!
ప్రపంచంలో మన దేశానికి ఉన్నది 4% మంచినీరు మాత్రమే. కానీ, ప్రపంచ జనాభాలో 18% మన దేశంలోనే నివశిస్తున్నారు. నీటి కొరత ఇప్పటికే మనకు పెనుసవాలుగా మారింది. ముఖ్యంగా వేసవిలో నీటి చుక్క కోసం అల్లాడే పరిస్థితి చాలా ప్రాంతాల్లో ఉంది. ప్రపంచవ్యాప్తంగా మహిళలు, బాలికలు ప్రతిరోజూ నీటి సేకరణకు 25 కోట్ల గంటలు వెచ్చిస్తున్నారు. ఇది పురుషులు, బాలురు వెచ్చిస్తున్న దాని కంటే 3 రెట్లు ఎక్కువ. నీటి గణాంకాల గురించి సాధారణంగా క్యూబిక్ మీటర్లలో చెబుతూ ఉంటాం. కానీ ఈ ప్రతి సంఖ్య వెనుక ఒక మానవ ముఖం ఉంది. ఆ ముఖం, చాలా సార్లు, మహిళదే! ఇది కల్పన కాదు. ఐక్యరాజ్యసమితి, ప్రపంచ ఆరోగ్య సంస్థ, యునెస్కో, యూఎన్ ఉమెన్, భారత జలశక్తి మంత్రిత్వ శాఖ గణాంకాల సహితంగా నమోదు చేసిన వాస్తవం ఇదే. నీటి భద్రతే లింగ సమానత్వానికి భూమిక.ఐక్యరాజ్యసమితి ప్రతి ఏటా మార్చి 22న ‘ప్రపంచ నీటి దినోత్సవం’ నిర్వహిస్తూ మనలో నీటి చైతన్యాన్ని పెంపొందించే ప్రయత్నం చేస్తోంది. ఈ ఏడాది ఇతివృత్తం: ‘ప్రజలందరికీ నీరు: స్త్రీ పురుషులకు సమాన హక్కులు– సమాన అవకాశాలు’. నీటి దినోత్సవ ప్రచార నినాదం: ‘నీరు ప్రవహించే చోట, లింగ సమానత్వం వికసిస్తుంది’! అది సాగు నీరైనా, తాగు నీరైనా సరే.. నీటికి సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకునే సందర్భంలో అయినా మహిళల అభిప్రాయాలకు, ఆకాంక్షలకు సముచితమైన చోటివ్వటం ద్వారా సమానత్వాన్ని వికసింపజేయాలని ఐరాస పిలుపునిస్తోంది! ఇది మనందరం ఆలకించాల్సిన మానవీయమైన పిలుపు!!వ్యవసాయానికి అవసరమైన శ్రమను, గృహ, ఉత్పాదక అవసరాలకు నీటిని అందించడంలో మహిళలే ప్రధాన పాత్ర పోషిస్తున్నప్పటికీ.. అధికారిక నీటి నిర్వహణ, నిర్ణయాలు తీసుకునే ప్రక్రియల నుంచి వారిని క్రమపద్ధతిలో మినహాయిస్తున్నారు. వ్యవసాయ పనులను 37%–42% వరకు మహిళలే చేస్తున్నారు. ఒక పంట కాలంలో సగటున 3,300 గంటలు పనిచేస్తారు. పురుషుల 1,860 గంటలు మాత్రమే. కలుపు తీయటం, మొక్కలు నాటటం, నీరు పెట్టటం వంటి చేతులతో చేసే పనులు, ఎక్కువ నీరు అవసరమయ్యే పనులతో ΄ాటు, పశువులకు నీరు పెట్టటం వంటి పశు΄ోషణ పనుల్లో ఎక్కువ భాగాన్ని చక్కబెట్టే బాధ్యతలను మహిళలు నెరవేర్చుతున్నారు. క్షేత్ర స్థాయిలో వీరే ‘వాస్తవ‘ నీటి నిర్వాహకులు అయినప్పటికీ, వారి ΄ాత్రను తక్కువగా చూస్తున్నారు. టైమ్ పావర్టీభూగర్భ జలమట్టాలు తగ్గి΄ోతున్నందున, మహిళలు నీటిని తెచ్చుకోవడానికి మరింత దూరం ప్రయాణించవలసి వస్తుంది. మన దేశంలో మహిళలు కొన్నిసార్లు దీనికోసం రోజూ నాలుగు గంటల వరకు సమయం వెచ్చిస్తున్నారు. బుందేల్‌ఖండ్, విదర్భ, రాయలసీమ వంటి కరువు పీడిత ప్రాంతాల్లో వేసవికాలంలో 15–20 లీటర్ల బిందెలను నెత్తిన పెట్టుకని రోజుకు 5–20 కిలోమీటర్ల దూరం నడచి మరీ కుటుంబాలకు మహిళలు, బాలికలు నీటిని సమకూర్చుతున్నారు. ఒక అంచనా ప్రకారం.. గ్రామీణ భారతీయ మహిళ నీటి సేకరణ కోసం 210 గంటల (27 పూర్తి పనిదినాలకు సరిపడా) సమయాన్ని ప్రతి ఏటా కేటాయిస్తోంది. ఇంటì దగ్గరకే కుళాయి వస్తే ఈ సమయం అంతా మహిళలకు ఆదా అవుతుంది. ఈ శ్రమకు విలువ కడితే దేశం యావత్తూ ఒక రోజు ఆర్జించే ఆదాయానికి సమానం. ఈ పనుల వల్ల మహిళలు, బాలికలకు తీరిక దొరక్క (టైమ్ పావర్టీ) చదువు లేదా మరింత లాభదాయకమైన వ్యవసాయ కార్యకలాపాల్లో పాల్గొనలేకపోతున్నారు. కేవలం 5% మంది మహిళలకు మాత్రమే కిసాన్ క్రెడిట్ కార్డులు ఉన్నాయి. సోలార్ పంపులు వంటి వాతావరణ మార్పుల్ని తట్టుకునే టెక్నాలజీలు అందుబాటులో లేవు. అందు వల్ల, మహిళా రైతులు ఎక్కువగా కరువు బాధితులుగా మారుతున్నారు. వాతావరణ మార్పులను తట్టుకోగల సేంద్రియ వ్యవసాయ నమూనాలకు మహిళా రైతులు పెద్దపీట వేస్తున్నారు. చిరుధాన్యాలను పండించటం, ఆహారంలో భాగం చేసుకోవటంలోనూ మహిళా రైతులు నిర్ణయాత్మక పాత్ర పోషిస్తున్నారు. ఇవన్నీ ఆహార భద్రతను పెంచుతాయని, నీటి వినియోగాన్ని తగ్గిస్తాయని అనేక సంస్థల అనుభవాలు నిరూపించాయి.పురుషులతో పోలిస్తే మహిళలు వాతావరణ మార్పుల పట్ల ఎక్కువ సున్నితంగా ఉంటారని చటర్జీ (2021) అధ్యయనంలో వెల్లడైంది. నీటి లభ్యత, వ్యవసాయ ఉత్పాదకత, పశువుల సమస్యలు వంటి వివిధ రంగాలలో పురుషుల కంటే మహిళలే వాతావరణ మార్పుల ప్రభావాన్ని ఎక్కువగా గమనిస్తారని కూడా అధ్యయనాలు ఎత్తి చూపుతున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం, దేశం మొత్తం వ్యవసాయ ఉత్పత్తిలో 55%–65% వాటా మహిళా రైతులదే. పురుష రైతులు వ్యవసాయ రంగాన్ని విడిచిపెట్టి, వ్యవసాయేతర రంగాలలో కూలీలుగా మారుతున్న ప్రస్తుత ధోరణిని బట్టి చూస్తే, భారతదేశంలో మహిళా రైతుల సంఖ్య పెరుగుతోంది.లింగ సమానత్వానికి అడ్డంకులుమన దేశంలో నీటి హక్కులు సాధారణంగా భూ యాజమాన్యంతో ముడిపడి ఉంటాయి. సాగులో ఉన్న భూముల్లో కేవలం 13.5% మాత్రమే మహిళల ఆధీనంలో ఉన్నాయి. అధికారిక నీటి వినియోగదారుల సంఘాలు, సాగునీటి హక్కుల విషయంలో నిర్ణయాలు తీసుకోవటంలో మహిళల పాత్ర అంతంత మాత్రంగా మిగిలిపోయింది.సమావేశాలకు హాజరు కావడానికి భర్త అనుమతి అవసరం కావడం, వ్యక్తిగతంగా ఆత్మవిశ్వాసం లేకపోవడం, ‘నీటిపారుదల పురుషుల పని’ అనే భావన వంటివి నీటి నిర్వహణలో లింగ సమానత్వానికి అడ్డంకులుగా నిలుస్తున్నాయి. 2012లో ప్రభుత్వం ప్రకటించిన జాతీయ జల విధానం మహిళల అవసరాలను ప్రస్తావించింది. అయినప్పటికీ, జల పరిపాలనలో పురుషులతో సమానంగా మహిళలకు నిజంగా అవకాశాలు కల్పించడానికి ఇందులో నిర్దిష్ట మార్గదర్శకాలు లేవని విమర్శకులు వాదిస్తున్నారు. మహిళల మహా శ్రమప్రతి రోజూ 20 కోట్ల మంది భారతీయులు నడిచి వెళ్లి దూరం నుంచి నీటిని తెచ్చుకుంటారు. వీరిలో అత్యధికులు మహిళలు, బాలికలు (భారత ప్రభుత్వ జలశక్తి మంత్రిత్వ శాఖ). భారతదేశ జనాభాలో దాదాపు సగం మంది, అంటే 60 కోట్ల మంది, తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కొంటున్నారు (నీతి ఆయోగ్ సీడబ్ల్యూఎంఐ 2018). ప్రభుత్వం అమలు చేస్తున్న జల్ జీవన్ మిషన్ ఫలితంగా ప్రతిరోజూ మహిళలు నీటిని తెచ్చేందుకు ఖర్చు చేసే 5.5 కోట్ల గంటల సమయం ఆదా అవుతోంది (జల్ శక్తి మంత్రిత్వ శాఖ, 2023).ప్రపంచవ్యాప్తంగా మహిళలు, బాలికలు ప్రతిరోజూ నీటి సేకరణకు 25 కోట్ల గంటలు వెచ్చిస్తున్నారు. ఇది పురుషులు, బాలుర కంటే 3 రెట్లు ఎక్కువ (యూఎన్ ఉమెన్, 2024).ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లకు పైగా మహిళలు, అంటే మొత్తం మహిళల్లో 27 శాతానికి పైగా, సురక్షిత తాగునీటి సేవలను పొందలేకపోతున్నారు (యూఎన్ ఉమెన్/యూఎన్డిఈఎస్ఏ, 2023).సురక్షితమైన తాగునీరు అందక భారతదేశంలో ప్రతి సంవత్సరం 2 లక్షల మంది మరణిస్తున్నారు (నీతి ఆయోగ్ సీడబ్ల్యూఎంఐ).మన దేశంలోని నదులు, రిజర్వాయర్లు, చెరువుల్లోని నీటిలో 70 శాతం కలుషితమైంది. జల నాణ్యత సూచికలో 122 దేశాల్లోకెల్లా భారతదేశం 120వ స్థానంలో, చివరి నుంచి మూడో స్థానంలో, ఉంది (నీతి ఆయోగ్ / ప్రపంచ బ్యాంకు). ప్రపంచవ్యాప్తంగా 14% దేశాల్లో నీటికి సంబంధించి నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలో పురుషులతో సమానంగా మహిళలు పాల్గొనడానికి ఇప్పటికీ ఎలాంటి యంత్రాంగాలు లేవు (యూఎఈ ఈపీ–డీహెచ్ఐ, జీడబ్ల్యూపీ, యూఎన్ ఉమెన్, 2025).నీటిపారుదల సామర్థ్యంవ్యవసాయరంగంలో నీటిపారుదల సామర్థ్యం ప్రపంచ సగటు 50–60%. మన దేశ వ్యవసాయ నీటిపారుదల సామర్థ్యం కేవలం 38% మాత్రమేనని నీతి ఆయోగ్ స్పష్టం చేసింది. పంటలకు నీటి వినియోగ సామర్థ్యాన్ని 60%కి పెంచితే, ఏటా 200 బిలియన్ క్యూబిక్ మీటర్ల (బీసీఎం) పైగా నీరు అందుబాటులోకి వస్తుంది. ఇది గృహ, పారిశ్రామిక అవసరాల కొరత మొత్తాన్ని తీర్చడానికి సరి΄ోతుందని నీతి ఆయోగ్ అంచనా.సమానమైన దిగుబడి కోసం అమెరికా, చైనా లేదా ఇజ్రాయెల్‌లోని రైతులతో ΄ోలిస్తే భారతీయ రైతులు (ఒక్కో పంట యూనిట్‌కు) 3–5 రెట్లు ఎక్కువ నీటిని ఉపయోగిస్తున్నారు. ఇది రైతుల వైఫల్యం కాదు. ఇది విధానపరమైన మౌలిక సదుపాయాల వైఫల్యమని నీతి ఆయోగ్ / ఎఫ్ఏఓ తేటతెల్లం చేశాయి.ప్రపంచంలోనే అత్యధికంగా భూగర్భ జలాలను తోడే దేశం భారతదేశం. ఏటా 239–241 బిలియన్ క్యూబిక్ మీటర్ల నీటిని తోడేస్తున్నాం. ఇది ప్రపంచవ్యాప్తంగా తోడుతున్న నీటిలో నాలుగో వంతు కంటే ఎక్కువ. 1,592 బిలియన్ క్యూబిక్ మీటర్ల నీటిని అధికంగా వినియోగిస్తున్నామని అంచనా.భారతదేశంలోని నదులు, చెరువులు, రిజర్వాయర్లు, కాలువల్లోని 70% నీరు కలుషితమయ్యాయి. జల నాణ్యత సూచికలో 122 దేశాలలో భారతదేశం 120వ స్థానంలో ఉంది. మనం కేవలం నీటిని కోల్పోవడమే కాదు, మిగిలి ఉన్న నీటిని కూడా విషపూరితం చేస్తున్నామని నీతి ఆయోగ్/ప్రపంచ బ్యాంకు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. మహిళలకే గ్రామస్థాయి జల నాయకత్వం నీటి సేకరణకు అనుదినం మహిళలు, బాలికలు వెచ్చించే సమయం నుంచి ఆదా చేసే ప్రతి గంట సమయమూ.. మహిళాభివృద్ధిలో, విద్యలో, వాణిజ్యంలో, సమాజ పరివర్తనలో పెట్టుబడిగా పెట్టడానికి అదనంగా దొరికిన సమయమే. నీటి భద్రత, లింగ సమానత్వం అనేవి వేర్వేరు అంశాలు కావు. నీటి భద్రతతోనే లింగ సమానత్వం సాధ్యం. ఒకే సంక్షోభం, ఒకే అవకాశం. జల్ జీవన్ మిషన్ సహా ప్రభుత్వ నీటి పథకాలన్నిటికి సంబంధించి గ్రామ స్థాయిలో మహిళలను ప్రాథమిక జల పరిపాలన నాయకులు’గా అధికారికంగా గుర్తించాలి. నీటిని పరిపాలన బాధ్యతలు మహిళలకిస్తే సమాజాలు అభివృద్ధి చెందుతాయని గణాంకాలు స్పష్టంగా చెబుతున్నాయి. 5, 6 సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు, విక్సిత్ భారత్ లక్ష్యం కూడా తద్వారా నెరవేరుతాయి. – మర్ది కరుణాకర్ రెడ్డి, ఇగ్నైటింగ్ మైండ్స్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు, జల సంరక్షణ ప్రచార కార్యకర్త– నిర్వహణ: పంతంగి రాంబాబుసాక్షి సాగుబడి డెస్క్ (చదవండి: మహిళా రైతులకు మద్దతిస్తే..!) -
కాఫీకి ఒక రోజు..!
కాఫీ అంటే ఉదయించే ఉత్సాహం. సరికొత్త రోజుకు కాఫీ సేవనంతో ఉత్సాహంగా స్వాగతం చెప్పటం తప్పనిసరైన ఇష్టమని గాఢంగా భావించే కాఫీ ప్రేమికులు ప్రపంచవ్యాప్తంగా కోకొల్లలు. ఒక మహత్తరమైన ఆహార సాంస్కృతిక వారసత్వానికి కాఫీ ఒక ప్రతీక. అటువంటి కాఫీకి ఇప్పటి వరకు ఒక ప్రత్యేక రోజంటూ లేదు. ఇప్పుడా కొరత తీరింది. అక్టోబర్ 1వ తేదీన ఇక ఏటా అంతర్జాతీయ కాఫీ డే (International Coffee Day) జరుపుకోవచ్చు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ఈ నెల 10వ తేదీన ఈ మేరకు తీర్మానించింది. తన సువాసనలతో ఉత్తేజపరిచే కాఫీకి జేజేలు చెప్పని వారు ఈ విశాల భూతలమ్మీద ఎవరుంటారు? కమ్మటి కాఫీని సిప్ చేస్తూ మైమరచే వినియోగదారులతో పాటు కాఫీ గింజలను ఆరుగాలం కష్టించి పండించే రైతుల వరకూ కాఫీ దినోత్సవ ప్రకటన ఒక ఉత్తేజకరమైన వార్తే కదూ! ఆహార భద్రతకు దోహదపడే కాఫీ పంట సామాజిక–ఆర్థిక ప్రాముఖ్యత గురించి అవగాహన పెంపొందించడానికి కాఫీకి ఒక రోజును కేటాయిస్తున్న ఐక్యరాజ్యసమితి తీర్మానం పేర్కొంది. ఈ సందర్భంగా కాఫీ కబుర్లు మీ కోసం!కాఫీకి ఉన్న సాంస్కృతిక, సామాజిక, చారిత్రక ప్రాముఖ్యతను ఐక్యరాజ్య సమితి గుర్తించింది. ఇదొక ముఖ్యమైన వ్యవసాయక ఉత్పత్తి మాత్రమే కాదు, కోట్లాది మంది వ్యవసాయ సమూహాలకు జీవనోపాధి కూడా. సామాజిక ఆతిథ్యం, సాంస్కృతిక వ్యక్తీకరణ, రోజువారీ సంప్రదాయానికి చిహ్నంగా కూడా కాఫీ మారింది అని ఐరాస తీర్మానం పేర్కొంది. ఆకలికి వ్యతిరేకంగా పోరాటం, తీవ్ర పేదరికాన్ని తగ్గించడం, మహిళల సాధికారత, మంచి పనిని ఆర్థికాభివృద్ధిని ప్రోత్సహించడం వంటి అనేక సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు కాఫీ సాగు, ప్రాసెసింగ్ దోహదపడుతున్నాయని ఐరాస పేర్కొంది.2.5 కోట్ల రైతుల పంట ప్రపంచంలో అత్యంత విస్తృతంగా సేవించే పానీయాలలో కాఫీ ఒకటి. గత దశాబ్దంలో ప్రపంచ తలసరి వినియోగం సంవత్సరానికి 1.2 శాతం పెరుగుతోంది. ఈ రంగం సుమారు 2.5 కోట్ల రైతుల జీవనోపాధికి తోడ్పడుతోంది. తోటల సాగు నుంచి ప్రాసెసింగ్, వినియోగం వరకు విస్తరించిన విలువ గొలుసు అంతటా ఎందరికో ఉపాధి అవకాశాలను కాఫీ కల్పిస్తోంది. మొత్తం మీద, ప్రపంచ కాఫీ పరిశ్రమ వార్షిక ఆదాయం 20,000 కోట్ల డాలర్లు.3,400 కోట్ల డాలర్ల వాణిజ్యంప్రపంచంలోనే అత్యధికంగా క్రయవిక్రయాలు జరిగే వస్తువులలో కాఫీ ఒకటిగా ఉంది. 2024లో ప్రపంచ కాఫీ ఉత్పత్తి 1.1 కోట్ల టన్నులను అధిగమించింది. అంతర్జాతీయంగా సుమారు 80 లక్షల టన్నుల కాఫీ గింజల వర్తకం జరుగుతోంది. 2024లో ప్రపంచ కాఫీ ఉత్పత్తి విలువ దాదాపు 2,500 కోట్ల డాలర్లని అంచనా, అయితే, కాఫీ గింజల ప్రపంచ వాణిజ్యం సుమారు 3,400 కోట్ల డాలర్లకు చేరుకుంది.పుట్టిల్లు ఇథియోపియాఅనేక తక్కువ ఆదాయ దేశాలు విదేశీ మారకద్రవ్యం ఆర్జనకు కాఫీ ఎగుమతులు కీలకంగా మారాయి. కాఫీ పుట్టిల్లు ఇథియోపియా. 2024లో ఇథియోపియా మొత్తం వస్తువుల ఎగుమతుల్లో కాఫీ వాటా 27.9 శాతం. ఉగాండాలో 20.1 శాతం, బురుండిలో 19.5 శాతం. ఇథియోపియా, ఉగాండా రెండింటిలోనూ, కాఫీ ఎగుమతి ఆదాయాలు ఆహార దిగుమతి బిల్లులను మించిపోయాయి. 2024లో బ్రెజిల్, వియత్నాం ప్రముఖ కాఫీ ఎగుమతిదారులుగా ఉన్నాయి. యూరోపియన్ యూనియన్, అమెరికా అతిపెద్ద దిగుమతిదారులుగా ఉన్నాయి.కాఫీ రైతులు ఎదుర్కొంటున్న వాతావరణ సంక్షోభాన్ని పరిష్కరించడంలో ఆహార – వ్యవసాయ సంస్థ ఫార్మర్ ఫీల్డ్ స్కూల్స్ కార్యక్రమం ముఖ్యపాత్ర పోషిస్తోంది. ఫీల్డ్ స్కూల్స్ ద్వారా తూర్పు ఆఫ్రికాలో, క్యూబాలో సహకార కాఫీ సాగు నమూనాలను ఎఫ్ఏవో బలోపేతం చేసింది. ప్రపంచ కాఫీ మార్కెట్‌కు అవసరమైన బలమైన ట్రేసబిలిటీ వ్యవస్థలను అభివృద్ధి చేయడానికి రైతులు, ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తోంది. ఏడో స్థానంలో భారత్కాఫీ సాగులో ప్రపంచంలో ఏడో స్థానంలో, ఎగుమతిలో ఐదో స్థానంలో భారత్ ఉంది. కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ తదితర దక్షిణాది రాష్ట్రాల్లోనే 90% కాఫీ గింజలు పండుతాయి. ముఖ్యంగా తూర్పు, పశ్చిమ కనుమల్లోని కొండ్రప్రాంతాల్లో కాఫీ సాగు విస్తరించింది. అరకు కాఫీ ఘుమఘుమలకు ప్రపంచ ప్రఖ్యాతి ఉంది. కాఫీ రకాల్లో అరబిక 30%, రోబస్ట 70% మన దేశంలో సాగవుతున్నాయి. 17వ శతాబ్దంలో బాబా బుడాన్ ఎమెన్ నుంచి ఏడంటే ఏడు కాఫీ గింజల్ని మన దేశానికి రహస్యంగా తీసుకొచ్చారు. బ్రిటీష్ పాలనలో 19వ శతాబ్దం మధ్య నుంచి వాణిజ్యపరంగా కాఫీ పంట సాగు మన దేశంలో డచ్ వారి చొరవతో ప్రారంభమైంది. మన దేశంలో ఉత్పత్తయ్యే కాఫీ గింజల్లో 70% ఇటలీ, రష్యా, జర్మనీ కొనుగోలు చేస్తున్నాయి. 6 లక్షల కుటుంబాలు ఆధారపడి ఉన్న కాఫీ పరిశ్రమ కార్యకలాపాలను కాఫీ బోర్డు పర్యవేక్షిస్తోంది.చదవండి: మహిళా రైతులకు మద్దతిస్తే..!కాఫీ అనేది ఒక పానీయం కంటే ఎక్కువ. ఇది ప్రపంచవ్యాప్త వాణిజ్య వస్తువు. గింజల నుండి కాఫీ సేవనం వరకు – కోట్లాది వ్యవసాయ కుటుంబాల జీవనోపాధిని నిలబెడుతోంది. గ్రామీణులను ప్రపంచ మార్కెట్లతో అనుసంధానం చేస్తోంది. కాఫీ రంగానికి గల విలువను గుర్తించటం, దాని సామాజిక–ఆర్థిక ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచుతుంది. పేదరిక నిర్మూలనకు దాని సహకారాన్ని బలోపేతం చేస్తుంది. కాఫీ దినోత్సవాన్ని, దాని విలువలను సంబరంగా జరుపుకోటానికి ఎదురుచూస్తున్నాం.– క్యూ.యూ. డోంగ్యు, డైరెక్టర్ జనరల్, ఐరాస ఆహార–వ్యవసాయ సంస్థ, రోమ్.నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ -
మహిళా రైతులకు మద్దతిస్తే..!
ఒక మహిళా రైతు సాధికారితను పెంపొందిస్తే (అంటే, మద్దతు ఇస్తే లేదా బలోపేతం చేస్తే).. ఏమవుతుంది? ఆ కుటుంబం, సమాజం బాగుపడుతుంది. ఇందుకోసమే 2026 అంతర్జాతీయ మహిళా రైతు దినోత్సవం జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార–వ్యవసాయ సంస్థ (యూఎన్–ఎఫ్ఏఓ) మహిళా రైతుల సాధికారితపై నాలుగు మాటల్లో ఏమంటోందో చూద్దాం..మీకు తెలుసా? దాదాపు ప్రతి గ్రామీణ మహిళ ఒక కార్మికురాలే, తిని కూర్చునే వారెవరూ లేరు! ఐక్యరాజ్యసమితి నివేదికల ప్రకారం, 2021లో ప్రపంచ వ్యవసాయ రంగం, ఆహార శుద్ధి, పంపిణీ రంగాల్లో పనిచేస్తున్న వారిలో మహిళలు 41% ఉన్నారు. అయినప్పటికీ గ్రామీణ మహిళలు అసమానతలను ఎదుర్కొంటున్నారు. వారి ఉపాధికి గ్యారంటీ లేదు. ప్రమాదకరమైన పరిస్థితుల్లో పనిచేస్తున్నారు. హక్కులను పరిమితంగా మాత్రమే పొందగలుగుతున్నారు.ఆదాయం వచ్చే పొలం పనుల కన్నా ‘వేతనం లేని కుటుంబ సంరక్షణ పనుల’కు మహిళా రైతులు ఎక్కువ సమయాన్ని కేటాయించాల్సి వస్తోంది. ఇది లేబర్ మార్కెట్లో వారి విలువను తగ్గిస్తోంది. ఆర్థిక సాధికారత తగ్గిపోతోంది. ఈ పరిస్థితులు మహిళా రైతులకు అంత శ్రేయస్కరంగానూ లేదు. ప్రపంచవ్యాప్తంగా, మహిళలు, బాలికలు చేసే కుటుంబ సంరక్షణ పనులకు విలువ కడితే ఎంతవుతుందో తెలుసా? ఏడాదికి ఏకంగా రూ.9,95,264 కోట్లు అవుతుంది!మహిళా రైతులు సాధారణంగా పురుషుల కంటే చిన్న కమతాల్లోనే పంటలు పండిస్తున్నారు. పురుషులతో సమానమైన విస్తీర్ణం గల పొలాల్లో పంటలు పండిస్తున్న చోట్ల కూడా.. మహిళా రైతులకు వనరుల లభ్యత, వ్యవసాయ శిక్షణ, సలహాల అందుబాటు అరకొరగా అందుతుండటంతో ఉత్పాదకతలో వెనుకబడుతున్నారు. వీరి ΄పొలాల్లో పంటల దిగుబడి 24% తక్కువగానే వస్తోందని బెంగళూరుకు చెందిన ‘ఫౌండేషన్ ఫర్ అగ్రేరియన్ స్టడీస్’ చెబుతోంది.ఆహార అభద్రత పురుషుల్లో కంటే మహిళల్లోనే ఎక్కువ. ప్రపంచం లో ఏ ప్రాంతంలో చూసినా పరిస్థితి ఇలాగే ఉంది. ఉపాధి, విద్య, ఆదాయంలో లింగపరమైన వివక్షలను తొలగించటం ద్వారా ఈ అంతరం 52% పోతుందని నిపుణులు చెబుతున్నారు.మన దేశంలో మహిళా రైతుల పరిస్థితేమిటి?ఫౌండేషన్ ఫర్ అగ్రేరియన్ స్టడీస్ సర్వేల (2017–18) ప్రకారం, వ్యవసాయ సీజన్లో 92% గ్రామీణ మహిళలు ఆదాయం వచ్చే వ్యవసాయ పనులు చేస్తున్నారు. పనులు అంతగా ఉండని సీజన్ లో కూడా 64% మంది ఏదో ఒక పని చేస్తున్నారు. ఏడాది పొడవునా గ్రామీణ మహిళలు చాలా మంది పనిలో నిమగ్నం అవుతున్నారని ఈ గణాంకాలు చెబుతున్నాయి.పాడి పనుల్లో నిమగ్నమయ్యే వారిలో దాదాపు 70% మంది మహిళలే. అయినప్పటికీ ఈ రంగం యొక్క అసంఘటిత స్వభావం కారణంగా వారి పనిని చాలా సార్లు చిన్న చూపు చూస్తున్నారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రకారం, 2022–23లో, ఉపాధి హామీ పనులు చేసే శ్రామికుల్లో 57.43% మంది మహిళలు ఉన్నారు.సాధికార మహిళా రైతులువారి కుటుంబాలు, సమాజాల శ్రేయస్సుకు దోహదపడుతుంది. ఆహార కొరత తగ్గుతుంది.అనేక రకాల ఆహారం, పౌష్టికాహారం మరింత మెరుగ్గా అందుతుంది. రైతు కుటుంబాల ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక వ్యవస్థలు బలోపేతం అవుతాయి.రకరకాల ఒడొదుడుకులను తట్టుకునే శక్తి కుటుంబాలకు పెరుగుతుంది. (చదవండి: సేంద్రియ ఆహార మార్కెట్లకు చోటివ్వండి!) -
సేంద్రియ ఆహార మార్కెట్లకు చోటివ్వండి!
కురుగంటి కవిత... మన దేశంలో రైతుల హక్కులు, సుస్థిర వ్యవసాయ జీవనోపాధుల పరిరక్షణ కోసం పోరాడుతున్న ఓ ప్రముఖ సామాజిక ఉద్యమకారిణి. దేశవ్యాప్తంగా సేంద్రియ/ప్రకృతి వ్యవసాయదారులు, రైతు శాస్త్రవేత్తలు, దేశీ విత్తన పరిరక్షకులు, స్వతంత్ర శాస్త్రవేత్తలు, పౌర సంస్థలు, వ్యక్తులతో కూడిన ఒక విస్తృతమైన నెట్వర్క్ ‘అలియన్స్ ఫర్ సస్టెయినబుల్ అండ్ హోలిస్టిక్ అగ్రికల్చర్ (ఆషా)’. దీనికి కవిత జాతీయ కన్వీనర్‌గా సేవలందిస్తున్నారు. ఆషా–కిసాన్ స్వరాజ్, జాతీయ మహిళా రైతుల హక్కుల సంఘం (మకాం), ప్రకృతి వ్యవసాయంపై జాతీయ మిషన్ (ఎన్సీఎన్ఎఫ్), కోలిషన్ ఫర్ ఎ జీఎం–ఫ్రీ ఇండియా వంటి అనేక జాతీయ వేదికల్లో ఆమె దశాబ్దాలుగా కీలకపాత్ర పోషిస్తున్నారు. రైతాంగ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. స్వావలంబనే శ్వాసగా కదిలే సేంద్రియ, ప్రకృతి వ్యవసాయదారులకు, రైతు శాస్త్రవేత్తలకు, రైతుల హక్కుల కోసం కృషి చేసే స్వచ్ఛంద కార్యకర్తలు, సంస్థలకు బలమైన సమష్టి గొంతుకగా ఆషా–కిసాన్ స్వరాజ్ నెట్వర్క్ నిలుస్తోంది. సేంద్రియ/ప్రకృతి వ్యవసాయదారులు తమ ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు అమ్మితేనే వారికి సముచిత ఆదాయం వస్తుంది. సేంద్రియ మార్కెట్ల నిర్వహణకు కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీల్లో రైతులకు కాస్త చోటివ్వమని నగర/పట్టణవాసులకు ఆమె పిలుపు ఇచ్చారు. ఆరో కిసాన్ స్వరాజ్ సమ్మేళనాన్ని (kisan swaraj sammelan 2026) ఇటీవల మైసూరులో ఘనంగా నిర్వహించిన కవిత కురుగంటితో ‘సాక్షి సాగుబడి’ ముఖాముఖిలో కొన్ని ముఖ్యాంశాలు.‘ఆషా’ ఎప్పుడు, ఎలా పుట్టింది? కురుగంటి కవిత (kavitha kuruganti): 15 ఏళ్ల క్రితం ‘ఆషా’ కిసాన్ స్వరాజ్ సంస్థ పుట్టింది. బీటీ వంగ ప్రతిఘటన ఉద్యమకాలంలో ‘కోలియేషన్ ఫర్ ఎ జీఎం–ఫ్రీ ఇండియా’ను మేమంతా 2004లో సేవాగ్రామ్‌లోని గాంధీ ఆశ్రమంలో కూర్చొని ఏర్పాటు చేసుకున్నాం. బీటీ పత్తి మన దేశంలోకి వచ్చి అప్పటికి రెండేళ్లు గడిచాయి. బీటి పత్తి (BT Cotton) వల్ల ఆచరణలో ఎదురవుతున్న సమస్యలు ఆధారసహితంగా తెలిసివస్తున్న రోజులవి. కార్పొరేట్ కంపెనీల నియంత్రణ నుంచి బయటకు రావటం కోసం, స్వావలంబన సేద్యం కోసం రైతులు అనుసరించవలసిన పద్ధతులు, విష ముక్త, రుణ ముక్త, ఆత్మహత్య ముక్త జీవనోపాధుల వ్యవస్థ సాధించాలన్నది మా లక్ష్యం. అప్పుడు మేం అనుకున్నదేమిటంటే.. రైతు తన పొలంలో నడుము వంచి పనిచేసుకుంటున్నప్పుడు ఏదైనా ఎద్దు చేనులోకి చొరబడితే చేతిలో పని ఆపేసి ముందు ఆ ఎద్దును బయటకు తరమాలి కదా. అలాగే మిగతా పనులన్నీ పక్కనపెట్టి జన్యుమార్పిడి పంటలను పారదోలాలని అనుకున్నాం. ఆ విధంగా దేశంలో ఒక ఉద్యమం నిర్మించటానికి ఆరేళ్లు విపరీతంగా కష్టపడ్డాం.కేంద్ర పర్యావరణ మంత్రి జయరామ్ రమేశ్ 2009 డిసెంబర్ నుంచి జీఎం వంగపై ప్రజాభిప్రాయ సేకరణ మొదలు పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వాల చేత నో అనిపించటం కోసం, సైంటిస్టులను, డాక్టర్లను ఈ ఉద్యమంలోకి తేవటం కోసం దేశమంతా తిరుగుతూ, చర్చలు పెడుతూ.. రాత్రి, పగలు అవిశ్రాంతంగా పని చేశాం. 2010 ఫిబ్రవరి 9న బీటీ వంగపై నిరవధిక మారటోరియం ప్రకటించారు. అదే మా తొలి విజయం. అదే సంవత్సరం మార్చిలో నాగపూర్‌లో మేం మళ్లీ కలిసి కార్యాచరణ నిర్ణయించుకున్నాం. ముఖ్యంగా పత్తి రైతుల ఆత్మహత్యలు జరుగుతున్న ప్రాంతాల్లో ‘కిసాన్ స్వరాజ్ యాత్ర’ చేపట్టాం. 71 రోజులు 220 మందిమి 20 వేల కిలోమీటర్లు 20 రాష్ట్రాల్లో బస్సు యాత్ర చేసి రాజ్‌ఘాట్‌లో ముగించి, సోనియా గాంధీకి మా డిమాండ్ల పత్రాన్ని ఇచ్చాం.మేము బయలుదేరిందేమో ఆత్మహత్య దారితీయని సేంద్రియ/ప్రకృతి వ్యవసాయ పద్ధతుల వ్యాప్తి కోసమని. అయితే, దేశవ్యాప్తంగా రైతులు ఇతర సమస్యలను మా దృష్టికి తెచ్చారు. ఆర్గానిక్ సేద్యం (Organic Farming) కన్నా ముందు గిట్టుబాటు ధర, భూసేకరణ, వ్యవసాయంపై పారిశ్రామిక కాలుష్యం ముప్పు వంటి సమస్యలను పరిష్కరించాలని గ్రామీణ, ఆదివాసీ ప్రాంతాల్లో రైతులు కోరారు. సిటీల్లో ప్రజలు తమకు రసాయన అవశేషాల్లేని ఆహారం కావాలని అడిగారు. ముంబైలో మహేశ్ భట్ వంటి బాలీవుడ్ పెద్దలూ మాకు స్వాగతం పలికారు. ఈ యాత్ర నుంచే ‘ఆషా–కిసాన్ స్వరాజ్’ పుట్టింది. ‘కిసాన్ స్వరాజ్ నీతి’ పేరుతో మార్గదర్శకాలను నిర్దేశించుకొని, వాటి సాధన కోసం పని చేస్తున్నాం.మీరు సాధించిందేమిటి?కవిత: దేశంలో వ్యవసాయం మీద ఇష్టం ఉన్నవాళ్లకి మనం ముందుకెళ్లాల్సిన దారి ఏమిటో దిశా నిర్దేశం చెయ్యటంలో ఆషా–కిసాన్ స్వరాజ్ విజయం సాధించింది. గందరగోళాన్ని పారదోలింది. బీటీ వంగ పంట రాకుండా ఆపింది. రసాయనిక వ్యవసాయంతో ఎదురవుతున్న రకరకాల సంక్షోభాలు, జన్యుమార్పిడి పంటలతో (genetically modified crops) సమస్యలు వంటి వాటిపై వాస్తవ గణాంకాల ఆధారిత నివేదికలను రూపొందించటం, సంబంధిత సమగ్ర జ్ఞానాన్ని అందుబాటులోకి తేవటంలో మేం సఫలమయ్యాం. ఉదాహరణకు.. రైస్ ఫోర్టిఫికేషన్. అధ్యయన నివేదికలు రూపొందించాం. ఇది ప్రజారోగ్యానికి హానికరం కాబట్టి వద్దు అని చెప్పాం. ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం వేశాం. 23 ఏళ్లుగా మరో జన్యుమార్పిడి పంటను వాణిజ్యపరంగా బయటకు రాకుండా ఆపగలిగాం. అంతేకాదు, ముఖ్యంగా ఏ రాష్ట్రంలోనూ క్షేత్ర ప్రయోగాలు జరపకుండా కూడా ఆయా ప్రభుత్వాలను విజయవంతంగా ఒప్పించగలిగాం.ప్రజల నుంచి మీరేమి ఆశిస్తున్నారు?కవిత: ఆరోగ్యదాయకమైన ఆహారం గురించి అందరూ చైతన్యం పెంచుకోవాలి. మీ కోసం, మీ పిల్లల ఆరోగ్యం కోసం మీరు ఈ పని చెయ్యగలిగితే.. అనేక విధాలుగా మేలు కలుగుతుంది. మీ ఆరోగ్యం బాగవుతుంది. వ్యవసాయంపై కార్పొరేట్ కంపెనీల నియంత్రణ కొంత తగ్గుతుంది. ఎక్కువ మంది రైతులు స్వావలంబనతో కూడిన వ్యవసాయం వైపు మొగ్గుచూపుతారు. నగరాలు, పట్టణాల్లో ప్రజలను నేను కోరుతున్న మరో విషయమేమిటంటే.. సేంద్రియ/ ప్రకృతి రైతులు తమ ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు అమ్ముకోవటానికి చోటివ్వండి. మీ ఇళ్లు/ గేటెడ్ కమ్యూనిటీలు/ కాలనీల్లో తరచూ సేంద్రియ సంతల నిర్వహణకు చోటు కల్పించండి. తద్వారా మధ్యవర్తుల బెడద తీరి, రైతుల ఆదాయం పెరుగుతుంది. అర్హులైన రైతులను గుర్తించి, సమన్వయపరచడానికి స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులకు కొదువ లేదు. చెన్నై, మాండ్యలలో రైతులే నిర్వహించుకునే సేంద్రియ మార్కెట్లే ఇందుకు నిదర్శనాలు.ఏమిటా ‘కిసాన్ స్వరాజ్ నీతి’ సూత్రాలు?కవిత: డా. జయతీఘోష్, డా. డి. నరసింహారెడ్డి వంటి చాలా మంది మేధావులతో లోతుగా చర్చించి 4 మార్గదర్శకాలను నిర్దేశించుకున్నాం. 1. కనీస మద్దతు ధర కావాలని రైతులు అడుగుతుంటారు. అయితే, అది దొరికినా ఆదాయ భద్రత దొరక్కపోవచ్చు. అందుకే రైతులకు ఆదాయ భద్రత కల్పించాలి. 2. ప్రభుత్వం వ్యవసాయ విధాన నిర్ణయం ఏది చేసినా అది పర్యావరణ సుస్థిరతకు లోబడి ఉండేలా చూడాలి. 3. భూమి, విత్తనం, నీరు వంటి వ్యవసాయ వనరులపై హక్కు రైతు సముదాయం చేతుల్లోనే ఉండాలి. 4. వినియోగదారులందరికీ వైవిధ్యభరితమైన, భద్రమైన, పుష్కలంగా, పోషక సంపన్నమైన ఆహారాన్ని అందించాలి. మా లక్ష్యం కేవలం సుస్థిర వ్యవసాయం కాదు. ఇవన్నీ కలిసి ఉండే హోలిస్టిక్ అగ్రికల్చర్. ఈ మార్గదర్శకాలే మమ్మల్ని నడిపిస్తున్నాయి. మహిళా రైతులు, కౌలు రైతులు, ఆదివాసీ రైతుల హక్కులపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నాం.‘ఆషా’ నిర్మాణం ఎలా ఉంది?కవిత: మాది సభ్యత్వం, ఎన్నికల ఆధారంగా పనిచేసే సంస్థ కాదు. దేశవ్యాప్తంగా భావసారూప్యత ఉన్న సంస్థలు, వ్యక్తుల్ని కలుపుకొని వెళ్లే ఒక వేదిక మాత్రమే. ఆషా స్వచ్ఛంద సంస్థ కాదు. మాకు బ్యాంకు ఎకౌంట్ లేదు, ఆఫీసు, సిబ్బంది లేరు. ఇళ్ల నుంచే మేం పనిచేస్తున్నాం. మా సొంత డబ్బునే ఖర్చు పెట్టుకొని పనిచేస్తున్నాం. వేరే యూనియన్ల మాదిరిగా ఇది వద్దు, అది వద్దు అనే వైఖరికి పరిమితం కాకుండా.. సమస్యలకు నిర్మాణాత్మక పరిష్కారాలను చూపే సంఘర్ష్, నిర్మాణ్లతో కూడిన వేదికగా ‘ఆషా’ను తీర్చిదిద్దాం. మాలో చాలా మందిమి ధర్నాల్లో పాల్గొంటాం, ప్రభుత్వ సలహా బృందాల్లోనూ సభ్యులుగా ఉంటాం. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చెయ్యటానికని కేంద్ర ప్రభుత్వం నియమించిన అశోక్ దల్వాయి వర్కింగ్ కమిటీలో నేను, కిరణ్ సభ్యులుగా ఉండి, మూడు సంపుటాలలో మా సూచనలిచ్చాం. అదే సమయంలో కిసాన్ ముక్తి యాత్ర వంటి ఆందోళనలు నిర్వహించాం.చదవండి: ఆహార వృథాను అరికట్టే ‘అర్క ట్రైసైకిల్’తెలుగు బిడ్డ!కురుగంటి కవిత తెలుగింటి బిడ్డే! ఆమె తల్లిదండ్రులు గంగాభవాని (తూ.గో. జిల్లా పలివెల), రమేశ్ (గుంటూరు). హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎమ్మే చదివిన తర్వాత జహీరాబాద్ వద్ద పస్తాపూర్‌లోని డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ(డీడీఎస్)లో దళిత మహిళా రైతుల అభ్యున్నతి కోసం ఐదేళ్లపాటు పనిచేశారు. తదనంతరం బెంగళూరులో (ఈ మధ్యనే మైసూరుకు మారారు) స్థిరనివాసం ఉంటూ జాతీయ రైతాంగ ఉద్యమం నిర్మాణానికి కృషి చేస్తున్నారు. జాతీయ స్థాయిలో 400కుపైగా సంస్థలు, వ్యక్తులతో కూడిన ‘అలియన్స్ ఫర్ సస్టెయినబుల్ అండ్ హోలిస్టిక్ అగ్రికల్చర్ (ఆషా) ఉద్యమాన్ని గత 15 ఏళ్లుగా ముందుండి నడిపిస్తున్నారు. ప్రభుత్వ విధానాల్లో గుణాత్మక మార్పు కోసం జరిగే పోరాటాల్లో ఆమె కీలక పాత్ర నిర్వహిస్తున్నారు.ఇంటర్వ్యూ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి -
అత్యంత విషపూరితమైన గడ్డిమందు పారాక్వాట్..!
అత్యంత విషపూరితమైన (హై అక్యూట్ టాక్సిసిటీ) గడ్డి/కలుపు మందు పారాక్వాట్‌ను నిషేధించాలన్న డిమాండ్ ఊపందుకుంది. దీన్ని 9 పంటల్లో గడ్డి/కలుపు నివారణకు వినియోగించడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే, 25 పంటల్లో దీన్ని తెలిసో తెలియకో వాడుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ మందును చల్లేటప్పుడు జాగ్రత్తలు తగిన రీతిలో తీసుకోకపోవటం వల్ల రైతులు, రైతుకూలీలు ఆ విషప్రభావానికి తీవ్రఅస్వస్థతకు గురై చనిపోతున్నారు. ఈ ప్రమాదకరమైన రసాయనం గాలి ద్వారా పీల్చినా, క్షణికావేశంలో తాగినా, దీన్ని చల్లిన నేలపై నడిచేటప్పుడు ముల్లు గుచ్చుకున్నా శరీరం విషపూరితమవుతుంది. ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, గుండె దెబ్బతింటాయి. దీని ప్రభావాన్ని అడ్డుకోవటానికి ఇప్పటి వరకు విరుగుడు చికిత్స అందుబాటులో లేదు. ఈ కారణంగా పారాక్వాట్‌ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే నిషేధించాలన్న డిమాండ్ నానాటికీ బలపడుతోంది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్, డాక్టర్స్ ఎగెనెస్ట్ పారాక్వాట్ పాయిజన్ సంస్థలు సంయుక్తంగా హైదరాబాద్‌లో నిర్వహించిన రౌండ్‌టేబుల్‌లో పలువురు పాల్గొని నిషేధం కోసం పోరాడతామన్నారు. ఇప్పటికే ఒడిషా, కేరళ రాష్ట్రాల్లో నిషేధించారు. తెలుగు రాష్ట్రాల్లోనూ నిషేధించాల్సిన అవసరం ఉంది. పెస్టిసైడ్ యాక్షన్ నెట్వర్క్ ఇండియా కొన్ని సంవత్సరాల క్రితమే రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించి నిషేధించాలని కోరింది. ఈ నేపథ్యంలో అసలు పారాక్వాట్ కలుపు/గడ్డి మందు పూర్వాపరాలేమిటో తరచి చూద్దాం...పారాక్వాట్ డైక్లోరైడ్.. నాన్–సెలెక్టివ్ కాంటాక్ట్ హెర్బిసైడ్. అంటే.. ఏదో ఒక రకం కలుపు మొక్కనో లేదా ఏవో కొన్ని రకాల కలుపు మొక్కల్నో నిర్మూలించడానికి ఉద్దేశించింది కాదు. ఇది తాకిన అన్ని ఆకుపచ్చ మొక్కల కణజాలాలను చంపుతుంది లేదా దెబ్బతీస్తుంది. వేగంగా పనిచేసే రసాయనం. ఇలాంటి కలుపు మందులు పారిశ్రామిక ప్రాంతాల్లో, రోడ్ల పక్కన చెట్లు, గడ్డిని నియంత్రచడానికి.. తేయాకు, పత్తి, బంగాళాదుంపలు తదితర పంటల్లో కలుపు మొక్కలను తొలగించడానికి పయోగిస్తారు.ఇటువంటి గడ్డి మందులు మొక్కల కణ త్వచాలను నాశనం చేయడం ద్వారా, కిరణజన్య సంయోగక్రియకు అంతరాయం కలిగించడం ద్వారా ఆ మొక్కలు ఎండిపోయేలా చేస్తాయి. దీనివల్ల గంటల్లోనే మొక్కల భాగాలు వేగంగా, స్పష్టంగా ఎండిపోతాయి, వాడిపోతాయి. పారాక్వాట్‌ను గడ్డి, పెద్ద ఆకులతో కూడిన కలుపు మొక్కలను వేగంగా నాశనం చేయడానికి విస్తృతంగా ఉపయోగిస్తారు.1964 నుంచి వాణిజ్యపరంగా ఉత్పత్తిపారాక్వాట్ డైక్లోరైడ్ గడ్డి మందుకు 140 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉంది. ప్రపంచంలో అత్యంత విసృతంగా ఉపయోగంలో ఉన్న, వివాదాస్పదమైన కలుపు మందులలో ఒకటి. 19వ శతాబ్దం చివరలో మొదటిసారిగా సంశ్లేషణ చేయబడినప్పటికీ, కలుపును చంపే దీని సామర్థ్యాన్ని 20వ శతాబ్దం మధ్యలో మాత్రమే గుర్తించారు. ఆస్ట్రియన్ రసాయన శాస్త్రవేత్తలు హ్యూగో వీడెల్, ఎం. రస్సోలు 1882లో మొదట అయోడైడ్ ఉప్పుగా సంశ్లేషణ చేశారు. 1955లో ఇంగ్లాండ్‌లోని ఇంపీరియల్ కెమికల్ ఇండస్ట్రీస్ (ఐఇఐ) శాస్త్రవేత్తలు వ్యవసాయ రసాయనంగా దాని సామర్థ్యాన్ని గుర్తించారు. 1962 నుంచి వాణిజ్య పరంగా ఉత్పత్తి చెయ్యటం ్ర΄ారంభమైంది. 1964 మొదట అమెరికాలో పురుగుమందుగా ఉపయోగించడానికి నమోదైంది. 1970 దశకం చివరలో మెక్సికన్ గంజాయి పొలాలపై పారాక్వాట్‌ను అమెరికా స్ప్రే చేయించింది. 1985లోజూన్లో వెండింగ్ మెషిన్ ద్వారా విక్రయించిన పానీయాలలో ఈ రసాయనం కలవటం ఫలితంగా కనీసం 10 మంది మరణించారు. 2007లో నిషేధించిన ఈయూఅమెరికా 1978లో పారాక్వాట్‌ను అధిక విషపూరిత స్వభావం కారణంగా గుర్తించి, పరిమితంగా వాడే పురుగుమందుగా వర్గీకరించింది. 1980–90 దశకాల్లో అనేక దేశాలు దీన్ని నియంత్రించటం ప్రారంభించాయి. పారాక్వాట్ వల్ల ప్రజారోగ్యానికి తీరని హాని జరుగుతోందని స్వీడన్, తదితర ఐరోపా దేశాలు పట్టుబట్టటంతో 2007లో యూరోపియన్ యూనియన్ నిషేధించింది. ప్రస్తుతం చైనా (దేశీయ వినియోగం మాత్రమే), బ్రెజిల్, థాయిలాండ్‌తో సహా 70కి పైగా దేశాల్లో పారాక్వాట్ గడ్డి మందు వాడకాన్ని నిషేధించాయి లేదా దశలవారీగా వాడకాన్ని నిలిపివెయ్యటానికి నిర్ణయాలు తీసుకున్నాయి. అయినప్పటికీ అమెరికాతో పాటు భారత్ సహా అనేక అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇప్పటికీ విస్తృతంగా ఉపయోగిస్తూనే ఉన్నారు.అమెరికాలో త్వరలో ఉత్పత్తి నిలిపివేతపారాక్వాట్ గడ్డి మందు ప్రభావానికి గురైన వారికి పార్కిన్సన్స్ వ్యాధి వస్తోందని నమ్ముతున్నారు. దీని తయారీదారులపై ప్రస్తుతం అమెరికాలో వేలాది వ్యాజ్యాలు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జూన్ నాటికి పారాక్వాట్ గడ్డి మందు తయారీని నిలిపివేస్తానని సింజెంట బహుళ జాతి కంపెనీ ప్రకటించినట్లు ద గార్డియన్‌లో తాజాగా కథనం ప్రచురితమైంది. ఈ నిర్ణయం ప్రజారోగ్యంలో ఒక మైలురాయి వంటిదని ఫ్లోరిడా యూనివర్సిటీలోని ఫిక్సెల్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ మైఖేల్ ఓకున్ వ్యాఖ్యానించారు. యూరప్ దేశాలు సహా అనేక దేశాలు నిషేధించినప్పటికీ అమెరికాలో సోయాబీన్స్, పత్తి, మొక్కజొన్న, ద్రాక్ష, పిస్తా, వేరుశనగ వంటి ఎన్నో పంటల్లో ఇప్పటికీ దీన్ని వాడుతూనే ఉన్నారు.భారత్‌లో పరిస్థితులుభారతదేశంలో పారాక్వాట్ డైక్లోరైడ్ వాడకాన్ని నిషేధించాలన్న డిమాండ్ ప్రబలంగా ఉంది. దీన్ని ఉపయోగించడానికి జాతీయ స్థాయిలో అనుమతి ఉంది. అయినప్పటికీ.. దీని అత్యధిక విషపూరిత స్వభావం, దీన్ని తాగటం ద్వారా ఆత్మహత్య చేసుకునే వారి సంఖ్య పెరుగుతుండటంతో ఒడిషా, కేరళ వంటి రాష్ట్రాలు నిషేధించాయి. ఒడిశా రాష్ట్రంలో ΄ారాక్వాట్ అమ్మకం, పంపిణీ, వాడకంపై నిషేధం కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం 2023 చివరిలో నిషేధించింది. ప్రతి ఆరు నెలలకోసారి నిషేధాన్ని పొడిగిస్తోంది. కేరళ గతంలో నిషేధాన్ని అమలు చేసింది. కానీ, పురుగుమందుల తయారీదారులు చట్టబద్ధంగా సవాలు చేసిన తర్వాత 2022లో దాన్ని రద్దు చేసింది.ఈ నేపధ్యంలో తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. పారాక్వాట్ విష ప్రభావంతో వందలాది మంది మరణిస్తున్నందున దీన్ని నిషేధించాలని పిటిషనర్లు కోరుతున్నారు. కలుపు మందుపై మీ వైఖరేమిటో వివరించమని హైకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది.9 పంటలకే అనుమతిపారాక్వాట్ కలుపు మందును టీ, కాఫీ, పత్తితో సహా తొమ్మిది నిర్దిష్ట పంటలపై మాత్రమే ఉపయోగించడానికి కేంద్ర క్రిమిసంహారకాల బోర్డు రిజిస్ట్రేషన్ కమిటీ అనుమతించింది. అయితే, దేశంలో 25 రకాల పంటలపై ఉపయోగించబడుతున్లట్లు పెస్టిసైడ్ యాక్షన్ నెట్వర్క్ ఇండియా సర్వే నివేదికలు సూచిస్తున్నాయి. ఇలా వాడటం భారతీయ క్రిమిసంహారకాల చట్టాన్ని ఉల్లంఘించటమే. భారత దేశంలో 1,500 కంటే ఎక్కువ తయారీ యూనిట్లు పారాక్వాట్‌ను ఉత్పత్తి చేయడానికి లైసెన్స్ పొందగా, వీటిలో 35 ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయి. ప్రభుత్వం నియమించిన అనుపమ్ వర్మ కమిటీ 2015లో పారాక్వాట్‌ను సమీక్షించి, ‘కఠినమైన పరిమితులు’, మెరుగైన ప్యాకేజింగ్ పద్ధతులు పాటిస్తూ వినియోగాన్ని కొనసాగించడానికి అనుమతించింది. అయితే ఈ చర్యలు సమర్థంగా అమలు కావటం లేదని నిపుణులు వాదిస్తున్నారు.సైనైడ్ కన్నా ప్రమాదకరంవైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు పారాక్వాట్‌ను ‘సైనైడ్ కంటే ప్రమాదకరమైనది‘ అని అభివర్ణిస్తున్నారు. ఎందుకంటే దీనికి విరుగుడు లేదు. అందువల్ల పొలాల్లో దీన్ని పిచికారీ చేసే క్రమంలో దాని విషప్రభావానికి గురైన వారు లేదా దీన్ని క్షణికావేశంలో తీసుకున్న వారికి చికిత్స చేసి రక్షించటం కష్టసాధ్యమైంది. దీంతో మరణాలు రేటు పెరుగుతోంది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వంటి వైద్య సంఘాలు దీన్ని వెంటనే పూర్తిగా నిషేధించాలని డిమాండ్ చేస్తున్నాయి.దేశవ్యాప్తంగా నిషేధించాలిపారాక్వాట్ వంటి అత్యంత విషతుల్యమైన వ్యవసాయ రసాయనాల వాడాకాన్ని వదిలించుకోవడానికి, వాటి వల్ల కలిగే హానిని నిలువరించటానికి పనిచేస్తున్నాం. క్లోర్‌పైరిఫోస్, ఫి్ర΄ోనిల్ పురుగుమందులు, అలాగే అట్రాజిన్, పారాక్వాట్ డైక్లోరైడ్ కలుపు మందులపై అధ్యయనం చేశాం. పారాక్వాట్‌ను 9 పంటల్లో వాడటానికి ప్రభుత్వ అనుమతి ఉంటే 25 పంటల్లో వాడుతున్నట్లు మా అధ్యయనంలో తేలింది. దీన్ని వాడే క్రమంలో చాలా మంది దీని విషప్రభావానికి గురై ప్రాణాలు కోల్పోతున్నారు. దీన్ని క్షణికావేశంలో తాగి ఆత్మహత్యల పాలవుతున్న రైతులు, రైతు కూలీల సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంది. ప్రాథమికంగా ప్రాణాలను చంపడానికి రూపొందించబడిన పురుగుమందుల దీర్ఘకాలిక పరిణామాలను రైతులు, వినియోగదారులు అర్థం చేసుకోవాలి. పురుగుమందుల హానికరమైన ప్రభావాలపై శాస్త్రవేత్తలు మరింత పరిశోధన చేయాలి. విధాన నిర్ణేతలు కూడా తమ అవగాహనను పెంచుకోవాలి. రైతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇచ్చి ఈ విష రసాయనాలను నియంత్రించడంపై దృష్టి పెట్టాలి. వాతావరణ మార్పుకు ప్రధాన కారకాల్లో విధ్వంసక పురుగుమందులు కూడా ఉన్నాయి. అత్యంత విషతుల్యమైన పారాక్వాట్ గడ్డి మందును దేశవ్యాప్తంగా నిషేధించాలి. – డాక్టర్ దొంతి నరసింహారెడ్డి, విధాన నిపుణుడు, పెస్టిసైడ్ యాక్షన్ నెట్వర్క్ ఇండియా స్టీరింగ్ కమిటీ సభ్యుడు -
ఆహార వృథాను అరికట్టే ‘అర్క ట్రైసైకిల్’
ఎండలు ఏటేటా అంతకంతకూ మండిపోతున్నాయి. రైతులు ఆరుగాలం కష్టపడి పండించే ఆకుకూరలు, కూరగాయలు, పండ్లను తోపుడు బండ్ల ద్వారా వినియోగదారుల ఇళ్ల దగ్గరకు తెచ్చి చిరు వ్యాపారులు (కొందరు సేంద్రియ / ప్రకృతి వ్యవసాయదారులు కూడా) అమ్ముతూ ఉంటారు. అయితే, ఇలా పండిన పంట తినేవారి ఇంటికి చేర్చే లోగా రోజువారీగా 10–15% వరకు ఎండకు వడపడి, రంగు మారి, దుమ్మూ ధూళి పడి పాడైపోయి వృథా అవుతున్నాయని అంచనా. ఈ వృథాను అరికట్టగలిగితే విలువైన ఆహారం వృథా కాకుండా ఉంటుంది. రిటైల్ విక్రయదారుల ఆదాయమూ పెరుగుతుంది. సాధారణ తోపుడు బండ్ల వల్ల జరిగే ఈ నష్టాన్ని అరికట్టడానికి బెంగళూరులోని భారతీయ ఉద్యాన పంటల పరిశోధనా సంస్థ (ఐఐహెచ్ఆర్) సౌర విద్యుత్తుతో నడిచే ట్రైసైకిల్‌ను రూపొందించింది. దీనికి ‘అర్క ట్రైసైకిల్’ అని పేరు పెట్టారు (కర్ణాటకలో ‘అర్కావతి’ నది ఒడ్డున ఐఐహెచ్ఆర్ ఉంది. అందుకే ఈ సంస్థలో రూపొందే కొత్త వంగడాలు, ఇతర ఉత్పత్తులకు కూడా ముందు అర్క అని పెడుతూ ఉంటారు. అర్క అని ఏ వంగడం, ఉత్పత్తి పేరులో ఉంటే అది బెంగళూరు ఐఐహెచ్ఆర్ అభివృద్ధి చేసిందని తెలుసుకోవచ్చు). అందంగా, సౌకర్యవంతంగా ఐఐహెచ్ఆర్ శాస్త్రవేత్తలు తయారు చేసిన ఈ ట్రైసైకిల్.. సౌర విద్యుత్తుతో నడుస్తుంది. ఇందులో ఉంచే కూరగాయలు, పండ్లు తదితర ఉత్పత్తులు పాడైపోకుండా ఉష్ణోగ్రత, తేమలను ‘ఎవాపరేటివ్ కూలింగ్’ పద్ధతిలో నియంత్రించవచ్చు. కూరగాయల బరువుతో కూడిన తోపుడు బండిని నెట్టుకుంటూ వెళ్లే చాకిరీని అర్క ట్రైసైకిల్ చాలా వరకు తగ్గిస్తుంది. సాధారణ తోపుడు బండితో తిరిగే ప్రాంతాల కన్నా ట్రైసైకిల్ ద్వారా ఎక్కువ ప్రాంతాల్లో వేగంగా తిరుగుతూ.. తక్కువ కాలంలోనే ఎక్కువ ఉత్పత్తులను అమ్ముకోవచ్చు. సౌర విద్యుత్తు ద్వారా చల్లగాలి ప్రసరించే ఏర్పాటు ఉండటం వల్ల అర్క ట్రైసైకిల్ ద్వారా తీసుకెళ్లే కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పుట్టగొడుగులను కోత తర్వాత 36–48 గంటల పాటు తాజాగా ఉంచుకుంటూ అమ్ముకోవడానికి వీలవుతుంది. తక్కువ కష్టంతో తక్కువ కాలంలోనే ఎక్కువ ప్రాంతాల్లో ట్రైసైకిల్ తిరుగుతుంది. కూరగాయలు, పండ్లు, ఆకుకూరల నాణ్యత, నిల్వ సామర్థ్యం కూడా బాగా పెరుగుతుంది. ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి సేంద్రియ/ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పండించిన వ్యవసాయోత్పత్తులను నాణ్యంగా, తాజాగా వినియోగదారుల ఇళ్లకు తీసుకెళ్లి ఇవ్వటం అర్క ట్రైసైకిల్ వల్ల సాధ్యమవుతుందని దీన్ని రూపొందించిన ఐఐహెచ్ఆర్ ప్రధాన శాస్త్రవేత్త డా. జి. సెంథిల్ కుమార్ ‘సాక్షి’తో చెప్పారు. అర్క ట్రైసైకిల్ ప్రత్యేకతలుభారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసిఏఆర్) కు అనుబంధ సంస్థ అయిన బెంగళూరులోని భారతీయ ఉద్యాన పంటల పరిశోధనా సంస్థ (ఐఐహెచ్ఆర్) రూపకల్పన చేసినది. దీని పైనే సౌర ఫలకాలు ఉంటాయి. ఎండలో తిరిగేటప్పుడే బ్యాటరీ చార్జ్ అవుతూ ఉంటుంది. ఆ శక్తితోనే ట్రైసైకిల్ నడుస్తుంది. దీన్ని నడిపే వ్యక్తి సైకిల్ తొక్కనవసరం లేదు. నెట్టుకుంటూ వెళ్లాల్సిన అవసరం లేదు. ఆ కష్టం తప్పుతుంది. బ్యాటరీ ఫూర్తిగా చార్జి అయితే 50 కిలోమీటర్ల దూరం నిరాటంకంగా ప్రయాణిస్తుంది.ఇందులో 20 ప్లాస్టిక్ క్రేట్స్‌ను పెట్టుకునే ఏర్పాటు ఉంది. ఒక్కో క్రేట్లో 10 కిలోల సరుకును పెట్టవచ్చు. 200 కిలోల ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, పుట్టగొడుగులను తీసుకెళ్లవచ్చు.సౌరవిద్యుత్తుతో ఎవాపరేటివ్ కూలింగ్ సిస్టం ద్వారా గాలిని చల్లబరిచి ఈ ట్రైసైకిల్లోని పచ్చి సరుకు పాడవకుండా ఉండేందుకు సరిపోయే చల్లదనాన్ని ఇచ్చే వ్యవస్థ ఉంది. రాత్రి పూట అమ్మకాలు చేయడానికి వీలుగా ఎల్ఇడి బల్బులు ఉన్నాయి. డిజిటల్ కాటా ఉంది. ప్రజలకు వినిపించేలా ఉత్పత్తుల వివరాలు పెద్దగా వినపడేలా చెప్పడానికి సోలార్ విద్యుత్‌తో నడిచే మైక్ ఉంటుంది. మబ్బులున్నప్పుడు దీన్ని విద్యుత్‌తో చార్జ్ చేసుకోవచ్చు.వినియోగదారుల భద్రత కోసం ఆటోమేటిక్‌గా శానిటైజర్ పరికరం ఉంది. తోపుడు బండ్ల వ్యాపరులకు కూరగాయలు, పండ్ల వృథాను తగ్గించుకొని అధిక ఆదాయం పొందేందుకు ట్రైసైకిల్ ఉపయోగపడుతుంది. తమ ఇళ్ల దగ్గరకే వచ్చి పరిశుభ్రంగా, తాజాగా ఉండే కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు, పుట్టగొడుగులు అమ్ముతున్నందున అర్క ట్రైసైకిల్ పట్ల వినియోగదారులు ఆకర్షితులవుతారు. అర్క ట్రైసైకిల్ ధర రూ. లక్షన్నర. తోపుడు బండిపై అమ్మితే వృథా అయ్యే కూరగాయలు, ఆకుకూరలు, పండ్లను ట్రైసైకిల్ ద్వారా నిక్షేపంగా అమ్ముకోవచ్చు కాబట్టి రెండేళ్లలో దీని ఖర్చును తిరిగి రాబట్టుకోవచ్చు. నిర్వహణ పతంగి రాంబాబుసాక్షి, సాగుబడి డెస్క్(చదవండి: జస్ట్ మూడు నెలల్లో 14 కిలోలు బరువు తగ్గాలంటే..!) -
మహిళా రైతులకు సౌరశక్తి..!
వ్యవసాయంలో గుదిబండగా మారిన పాత పద్ధతులను వదిలించుకొని, ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉండే చిన్న సన్నకారు రైతులు, ముందడుగు వెయ్యటం అంత తేలిక కాదు. కానీ, ఒక ఉత్తరప్రదేశ్ గ్రామానికి చెందిన మహిళా రైతులు సాగు నీరు తోడటానికి డీజిల్ ఇంజన్లకు బదులుగా సమష్ఠిగా సోలార్ పంపు వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. అభివృద్ధి దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు. అధికాదాయం వచ్చే పంటలపై దృష్టి సారించటంతోపాటు నీటిపారుదల ఖర్చును సగానికి తగ్గించుకుంటున్నారు.డీజిల్ ఇంజన్లతో పంటలకు నీరు పెట్టటం రైతులకు చాలా ఖరీదైన, నిర్వహణ కష్టతరమైన, కాలుష్యకారకమైన పని. ఇది గుర్తించిన ఉత్తరప్రదేశ్ మహిళా రైతులు నీటిపారుదల కోసం డీజిల్ ఇంజన్లకు స్వస్తి చెప్పి సౌరశక్తితో నడిచే పంపు హౌస్‌ను ఏర్పాటు చేసుకున్నారు. పనిలో పనిగా అధిక విలువ కలిగిన పంటలను పండిస్తూ అధికాదాయం ΄పొందుతున్నారు. పనిలో పనిగా నీటిపారుదల ఖర్చును సగానికి సగం తగ్గించుకున్నారు.ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్ జిల్లాలోని రాంవాపూర్ గ్రామంలో మహిళా రైతుల బృందం ఎండను ఉపయోగించుకొని సాగు నీటి సమస్యకు పర్యావరణహితమైన మార్గం కనుగొంది. ఉమ్మడి సౌరశక్తి నీటి΄ారుదల వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. ఈ సోలార్ పంపు ప్రయోజనాలు చాలా ఉన్నాయి. సాగు నీటిపారుదల ఖర్చు తగ్గటం, వ్యవసాయంలో సౌలభ్యం పెరగటం, వాయు కాలుష్యాన్ని తగ్గించటం వంటి ప్రయోజనాలు సాధించారు. సౌర విద్యుత్‌తో నడిచే నీటి పంపు వ్యవస్థను ఈ మహిళా రైతుల బృందం కోసం 2023 డిసెంబర్లో ఇండస్లాండ్ బ్యాంక్ మద్దతుతో ఆగా ఖాన్ ఫౌండేషన్ ద్వారా ఫ్లాగ్షిప్ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ్ర΄ోగ్రామ్ కింద ఏర్పాటు చేశారు. మహిళా రైతులు ‘గంగా సించాయ్ వికాస్ సమితి’ బ్యానర్ కింద దీన్ని నిర్వహిస్తున్నారు. సౌర నీటిపారుదల వ్యవస్థ 20.6 ఎకరాల విస్తీర్ణంలో పంటలకు నిరంతరాయంగా సాగు నీటిని అందిస్తోంది. దీని వల్ల 19 చిన్నకారు రైతుల కుటుంబాలు ప్రయోజనం పొందుతున్నాయి. వారు ఇప్పుడు సాంప్రదాయ మొక్కజొన్న, గోధుమ పంటలతోపాటు పుదీనా, కాకర, అరటి, ముల్లంగి, బెండ వంటి అధిక విలువ కలిగిన కూరగాయ పంటలు పండించగలుగుతున్నారు.ఈ ప్రాజెక్ట్ నీటిపారుదల ఖర్చులను 50 శాతానికి పైగా తగ్గించింది. సాగు నీటి మీటర్ ఏర్పాటైంది. ప్రతి రైతు తమ పొలానికి ఎంత నీరు వాడుతున్నదీ ఇది నమోదు చేస్తుంది. ఒక యూనిట్ లేదా 1,000 లీటర్ల నీటిని రూ. 2 ఖర్చుతో అందిస్తారు. అక్కడి స్థానిక పరిస్థితుల్లో ఒక ఎకరానికి 2,50,000–3,00,000 లీటర్ల నీరు అవసరం. దీని మొత్తం ఖర్చు రూ. 500–600 అవుతుంది. ‘గతంలో, డీజిల్‌తో నడిచే పంపులు నడపడానికి రూ. 1,000–1,250 వరకు ఖర్చయ్యేద’ని ఒక మహిళా రైతు దేవి (60) అన్నారు సంతోషంగా. ఆమె కుటుంబం జీవనో΄ాధి కోసం పూర్తిగా వ్యవసాయంపై ఆధారపడింది.గంగా సించాయ్ వికాస్ సమితి కమిటీ అధ్యక్షురాలుగా ప్రేమ్‌నందిని దేవి (45) వ్యవహరిస్తున్నారు. సోలార్ పంపు ఆపరేటర్ గదిలో నిలబడి ఆమె ఇలా వివరించారు: ‘మా బృందంలో ఇద్దరు మహిళలు నీటి వినియోగ ఛార్జీలను సేకరించి బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. ఈ నిధులను సోలార్ పంపుసెట్ నిర్వహణ, ఈ వ్యవస్థ ఏర్పాటు చేసిన భూమి అద్దె, అలాగే పంప్ ఆపరేటర్ జీతం కోసం మేం ఉపయోగిస్తాం’. ఈ సోలార్ పంపు నిర్వహణ ఖర్చుల కోసం మహిళా రైతులు ఎవరి సహాయమూ అడగటం లేదు. ఈ ప్రాజెక్ట్ పనితీరుకు సంబంధించిన సమస్యలను చర్చించడానికి కమిటీ క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహిస్తుంది. వ్యవసాయ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి మార్గాలు, పంట దిగుబడి, నష్టాలు, యూనిట్ నిర్వహణ ఖర్చు అవసరాల గురించి వారు చర్చిస్తారు. కుటుంబాల సంక్షేమం, విద్య, జీవనోపాధి సమస్యలపై కూడా మాట్లాడుకొని ఉమ్మడిగా నిర్ణయాలు తీసుకుంటారు. వారి కుటుంబాల్లోని పురుషులు ఈ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవట్లేదు. గేటు బయట నిలబడి చూస్తారంతే. అయితే, ఈ మార్పు అంత సులభం కాదు. సాంప్రదాయ డీజిల్‌తో నడిచే పంపు సెట్లను తొలగించడంలో మహిళలే కీలకపాత్ర వహించారు. డీజిల్ పంపులతో నీరు తోడటానికి కుటుంబంలో కనీసం ఒకరు లేదా ఇద్దరు మగ వాళ్లు పనిచేయటం అవసరం. ఇంజిన్‌ను క్రాంక్ చేయడంతోపాటు డీజిల్‌ను సేకరించడం కూడా పురుషుల బాధ్యత. సాంప్రదాయ పంపు సెట్ల నిర్వహణ ఖర్చులూ ఎక్కువే. 20 ఎకరాలకు నీరు తోడితే దాదాపు 1,372 కిలోల వరకు కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలు విడుదలవుతాయి. రాంవాపూర్లో ఇప్పుడు మూలనపడి ఉన్న ఆయిల్ ఇంజన్లను చూస్తే.. ఒకప్పుడు ఆ గ్రామంలో స్వాతంత్య్రం లేక నిద్రాణంగా మిగిలిన మహిళలు గుర్తుకొస్తారు. ఇప్పుడు వారే క్రియాశీలంగా ఉన్నారు. సౌర నీటిపారుదల పథకం విషయంలో తమ కుటుంబ సభ్యుల నుంచి మొదట్లో వ్యతిరేకత వచ్చిందని, ఇది అయ్యేపనేనా అనే సందేహాలను ఎదుర్కొన్నామని కమిటీ సభ్యులు అంటున్నారు. కొంతమంది పురుషులు ఇది ఎక్కువ కాలం నిలవదని నమ్మారు. మరికొందరు మహిళలతో సమావేశాలు నిర్వహించడంపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ‘ఈ ప్రయత్నం విజయవంతమైన తర్వాత, ప్రతి ఒక్కరూ ఇది తాము ఊహించినదేన’ని అంటున్నారని రైతు దేవి (65) అన్నారు. ‘ఇప్పుడు మా వ్యవసాయానికి డీజిలే కాదు, పురుషుల సహాయమూ అవసరం లేదు’ అన్నారామె.గంగా సించాయ్ సౌర నీటిపారుదల ప్రాజెక్ట్ సభ్యులైన మహిళా రైతులకు మిగులు ఆదాయం రావటంతో వేరే పనుల్లో పెట్టుబడి పెడుతున్నారు. కుష్మా దేవి (54) సోలార్ పంపు నీటితోనే తన సొంత నర్సరీని ప్రారంభించింది. టమోటా, మిరప, పొట్ల, దోస మొదలైన మొక్కల నారును కొబ్బరిపొట్టులో పెంచుతున్నారు. ఒక్కో మొక్క రూ. 5–10కి ఇతర రైతులకు విక్రయిస్తున్నారు. ‘ఏదీ అసాధ్యం కాద’ని ప్రేమ్‌నందిని దేవి అనే మరో రైతు అన్నారు. ‘మా సమష్టి యాజమాన్యంలో నడిచే సోలార్ నీటి పంపే దీన్ని నిరూపించింది. ‘కమిటీలోని ప్రతి ఒక్క మహిళా రైతు ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. సమావేశాల్లో మాట్లాడే ఉత్సాహం ఒకప్పుడు ఉండేది కాదు. ఇప్పుడు మాట్లాడేటప్పుడు తమ భర్త పేర్లను సైతం స్వేచ్ఛగా ప్రస్తావించటం వరకు ఎదిగారు. గంగా సించాయ్ వికాస్ సమితి మహిళలు భవిష్యత్ తరాలకు ఒక ఉదాహరణగా నిలుస్తున్నారు. తమ కుటుంబాల సంక్షేమం తాము ఆధారపడిన సహజ వనరుల రక్షణతో ముడిపడి ఉందని వారు గట్టిగా నమ్ముతున్నారు. ఇదే కదూ.. నిజమైన అర్ధంలో సాధికారత అంటే?– నిర్వహణ: పంతంగి రాంబాబుసాక్షి సాగుబడి డెస్క్ (చదవండి: వర్జిన్ కోకోనట్‌తో వండర్స్..!) -
వర్జిన్ కోకోనట్‌తో వండర్స్..!
సాధారణ కొబ్బరి తోటను ఒక అద్భుతమైన ‘సూపర్ ఫుడ్’ ఉత్పత్తి కేంద్రంగా, వ్యవసాయ పర్యాటక స్థలంగా మార్చవచ్చా? నిస్సందేహంగా అంటున్నాడు గోవాకు చెందిన యువ రైతు పారిశ్రామికవేత్త రోహన్. తన తండ్రి నాటిన తోట అది. కొబ్బరి కాయలను మాత్రమే అమ్మేవారు. కరోనా తర్వాత ఈ ఫామ్‌పై దృష్టి సారించిన రోహన్ ఈ తోట రూపు రేఖలు మార్చేశారు. ఐదేళ్లలో తన కలను సాకారం చేసుకున్నారు. కొబ్బరి కాయలు, బోండాలు అమ్మే చోట.. కొబ్బరి పాల నుంచి ప్రత్యేక పద్ధతిలో ‘వర్జిన్ కోకోనట్ ఆయిల్’ను ఉత్పత్తి చేసి విక్రయిస్తున్నారు. చెట్టుకు కాసే కాయ నుంచి వర్జిన్ కొబ్బరి నూనె తయారీ వరకు చేసే పనులను స్వయంగా చూడాలనుకునే వారికి ఫామ్ విజిట్‌కు ఆహ్వానిస్తున్నారు. పనిలో పనిగా సంప్రదాయ గోవా గ్రామీణ వంటకాలను రుచిచూపిస్తున్నారు. ఇటు వ్యవసాయ పర్యాటకం, అటు ఆరోగ్యదాయకమైన నూనె ఉత్పత్తితో మంచి ఆదాయం గడిస్తున్న రోహన్ యువ కొబ్బరి ‘రైతు పారిశ్రామిక వేత్త’గా ఆదర్శప్రాయుడయ్యారు. కొబ్బరైనా మరొకటైనా కేవలం పండించి ముడిసరుకుగా అమ్మజూపితే రైతుకు దక్కేది మార్కెట్ ధరలో కొంచమే. రూపం మార్చి, కొంచెం వ్యాపార దృష్టిని కలిపి అమ్మటం నేర్చుకుంటేనే రైతుకు ఆర్థిక భద్రత, సుస్థిరత చేకూరుతుంది. రైతులు ఆర్ధికంగా నిలబెట్టే మెలకువలు బోధించే నిపుణులు చెబుతుండే ఈ సూత్రాన్ని తు.చ. తప్పకుండా పాటించారు రోహన్. మైక్రోబయాలజిస్ట్‌గా శిక్షణ పొందిన రోహన్ ఎంబీఏ పూర్తిచేసి 2021 వరకు బెంగళూరులో వివిధ సంస్థల్లో దశాబ్దానికి పైగా పనిచేశాడు. కరోనా తర్వాత కుటుంబానికి చెందిన సంప్రదాయ కొబ్బరి తోటపై పూర్తిస్థాయిలో దృష్టి సారించి గుణాత్మకమైన మార్పు సాధించారు. ఉత్తర గోవాలోని ముల్గావ్ అనే గ్రామంలోని ఒక చిన్న కొబ్బరి తోట వారిది. ఆరోగ్య స్పృహతో కూడిన వర్జిన్ కొబ్బరి నూనె బ్రాండ్‌ను నిర్మించాడు. శాస్త్రీయ పద్ధతుల్లో ప్రాసెస్ చేసి వర్జిన్ కొబ్బరి నూనెను ఉత్పత్తి చేస్తున్నారు. స్థానికులకు జీవనోపాధిని కల్పిస్తున్నారు. సాధారణ కొబ్బరి కాయలను ఉత్పత్తి చెయ్యటానికి బదులు సమాజానికి ఔషధగుణాలు కలిగి ఉండే వర్జిన కొబ్బరి నూనెను గౌరవప్రదంగా ఎలా ఉత్పత్తి చేసి లాభదాయకంగా ఎలా అమ్మొచ్చో తెలియజెబుతున్నారు. ‘నిదానంగా తయారు చేసిన నిజమైన ఆహారం’ గురించి తెలుసుకోవాలనుకునే వారికి చక్కటి వ్యవసాయాధారిత పరిశ్రమను కళ్ల ముందుంచుతున్నారు. నూనె ఉత్పత్తికి ఆరు గంటలు.. ఆ తోటలో రోహన్ తండ్రి చాన్నాళ్ల క్రితం నాటిన దాదాపు 200 ఎత్తుగా ఎదిగిన కొబ్బరి చెట్లు ఉన్నాయి. 150కి పైగా లేత మొక్కలున్నాయి. సాధారణ కొబ్బరి నూనె తలకు రాసుకునే నూనెగా, కొన్ని సార్లు వంట నూనెగా ఉపయోగించడానికి మించి ప్రజలకు మేలైన ఆరోగ్యాన్నందించే సూపర్‌ఫుడ్‌గా అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉందని అతను నమ్మాడు. కొబ్బరి పాలతో తయారు చేసే వర్జిన్ కొబ్బరి నూనె రూపంలోకి మార్చటానికి రోహన్ వ్యక్తిగత శ్రద్ధతో కృషి చేశారు. పచ్చి కొబ్బరి నుంచి పాలు తీసిన తర్వాత, ఆ పాల నుంచి ట్రేడ్‌మార్క్ చేసిన ‘హాట్ ఎక్స్ట్రాక్షన్ యాంటీఆక్సిడెంట్ లాడెన్’ పద్ధతిలో పోషకాలు పోకుండా నెమ్మదిగా నూనెను వెలికి తీస్తారు. ఈ ప్రక్రియకు 6 గంటల సమయం పడుతుంది. ఫలితంగా నూనె సహజంగా యాంటీఆక్సిడెంట్లు, లారిక్ ఆమ్లంతో సమృద్ధిగా ఉంటుంది. తల్లి పాలలో ఉండే ముఖ్యమైన కొవ్వు ఆమ్లం, దాని యాంటీమైక్రోబియల్ లక్షణాలకు ప్రసిద్ధి చెందింది.మోస్తరు వేడితో నష్టం లేదు‘ఈ ప్రక్రియలో మోస్తరు వేడిని ఉపయోగించటం వల్ల నష్టమేమీ లేదు. విపరీతమైన వేడిని వాడితే నష్టం. స్వచ్ఛతను, విశిష్టతను కాపాడుతూ సూపర్ ఫుడ్‌ని ఉత్పత్తి చేస్తున్నాం’ అని రోహన్ వివరించాడు. ఈ తోటలో దేన్నీ వృథాగా పారెయ్యటం లేదు. కొబ్బరి పొట్టును చెట్ల కింద ఆచ్ఛాదనగా వేస్తున్నారు. ఈ పంట వ్యర్థం తిరిగి మట్టిలోకి చేరుతోంది. కొబ్బరి పెంకులను యాక్టివేటెడ్ కార్బన్‌గా మార్చి తిరిగి వినియోగిస్తున్నారు. నూనె ఉత్పత్తి ప్రక్రియలో వెలువడే పిప్పితో వర్మీకం΄ోస్టు తయారు చేస్తున్నారు. కొబ్బరిలోని ప్రతి భాగం పర్యావరణ వ్యవస్థలో పాత్ర పోషించేలా చూసుకోవడమే లక్ష్యమని రోహన్ చెప్పారు.రోజూ ఒక చెంచా.. ‘వర్జిన్ కొబ్బరి నూనె పొట్ట ఆరోగ్యం, జీవక్రియ, కొలెస్ట్రాల్ నిర్వహణకు తోడ్పడుతుంది. దానిలోని యాంటీఆక్సిడెంట్లు, ప్రయోజనకరమైన మీడియం–చైన్ ఫ్యాటీ యాసిడ్ అయిన లారిక్ యాసిడ్ ఇందుకు ప్రధాన కారణం. అందుకే ప్రతి రోజూ ఒక చెంచా వర్జిన్ కొబ్బరి నూనెను తీసుకుంటే ఆరోగ్యం..’ అంటారు రోహన్. ‘నేను వర్జిన్ కొబ్బరి నూనె తీసే పని చేస్తాను. కొబ్బరి కాయల నుంచి కొబ్బరి తీసి ముక్కలు చేసి రుబ్బుతాం. అందులో నుంచి తర్వాత ΄ాలు తీస్తాం. ఇది దాదాపు ఆరు గంటల పాటు నెమ్మదిగా జరిగే ప్రక్రియ’ అని ఒక కార్మికుడు చె΄్పారు.వ్యవసాయ పర్యాటకంవిలువలకు నిలబడుతూ శ్రద్ధగా ఆరోగ్యదాయకమైన, ΄ోషకవంతమైన వ్యవసాయోత్పత్తులను ఉత్పత్తి చేసే వ్యవసాయ క్షేత్రం పర్యాటక కేంద్రంగా కూడా పేరుగాంచుతుందనటానికి రోహన్ క్షేత్రమే ఉదాహరణ. ఆసక్తి గల వారు బుక్ చేసుకొని 2.5 గంటల వ్యవసాయ ఆధారిత అనుభవాలను చవిచూస్తున్నారు. అతిథులు కొబ్బరి తోటల గుండా నడుస్తూ విషయాలు తెలుసుకుంటారు. చెట్టు నుంచి కాయలు కోయటం దగ్గరి నుంచి నూనె తయారీ వరకు జరిగే పనులన్నిటినీ చూస్తారు. స్థానిక పదార్థాలను ఉపయోగించి గ్రామీణ మహిళలు వండిన సాంప్రదాయ గోవా భోజనంతో ఈ అనుభవం ముగుస్తుంది.‘ఇది ఎక్కువ మందిని ఆకర్షించే పర్యాటకం కాదు. జీరో వేస్ట్ క్షేత్ర నిర్వహణ, ఆరోగ్యదాయకమైన ఆహారంపై సంభాషించడానికి మేం ఒక బ్యాచ్‌లో కొద్ది మందికి మాత్రమే ఆతిథ్యం ఇస్తామ’ని రోహన్ స్పష్టం చేశారు. త్వరలో కొబ్బరితో చిరుతిండ్లను ఉత్పత్తి చెయ్యనున్నామన్నారు. టోక్యోకి చెందిన అంతర్జాతీయ పర్యాటక సంస్థ స్కాల్ ఇంటర్నేషనల్ నుంచి గుర్తింపు దక్కటం ఆనందదాయకమని ఆయన సంబరపడుతున్నారు. -
పత్తి యంత్రం రెడీ
పత్తి తీయటంలో వ్యయప్రయాసలతో సతమతమవుతున్న రైతుల కష్టాలు గట్టెక్కే రోజులు వచ్చాయి. భోపాల్‌లోని సెంట్రల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ (ఐసీఏఆర్ – సీఐఏఈ) శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన పత్తి తీసే యంత్రాన్ని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఇటీవల రైతులకు అంకితం చేశారు. భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్) సమాచారం ప్రకారం.. ప్రీ–క్లీనింగ్ సిస్టమ్‌తో కూడిన ఈ యంత్రాన్ని ట్రాక్టర్‌కు అమర్చి ఉపయోగించాలి. విత్తన పత్తిలో చెత్త 15% కంటే తక్కువగా ఉంటుంది. ఖరీదు రూ. 15 లక్షలు. దీంతో కిలో పత్తి తీత ఖర్చు రూ. 5కు తగ్గుతుంది. గంటకు 0.23 హెక్టారులో పత్తి తీసే సామర్థ్యం దీనికుంది. ఇప్పటి పద్ధతితో పోల్చితే 90% సమయం, 65% ఖర్చు ఆదా అవుతుంది. మంత్రి ‘ఎక్స్’లో ఇలా ట్వీట్ చేశారు.. ‘ఇప్పటివరకు చేతి వేళ్లతో పత్తిని తీస్తున్నారు. అందుకు చాలా సమయంతో పాటు అధిక శ్రమతో కూడిన పని. దాంతో రైతులకు ఖర్చు కూడా గణనీయంగా పెరిగింది. చాలా కాలంగా, రైతులు పత్తి తీసే ప్రక్రియను సులభతరం చేసే యంత్రం కావాలని అడుగుతున్నారు. నేడు వారి కోరిక నెరవేరింది. ఈ యంత్రం త్వరలో రైతులకు అందుబాటులోకి వస్తుంది. ఈ యంత్రంతో పత్తి తీసే పనిని నేను వ్యక్తిగతంగా పరిశీలించాను. సమయంతోపాటు ఖర్చులనూ తగ్గించడానికి, పత్తి సాగును మరింత లాభదాయకంగా మార్చడానికి ఇది సహాయపడుతుంది. అదే సమయంలో, చీడపీడలను తట్టుకుంటూ అధిక దిగుబడినివ్వగల కొత్త పత్తి రకాలను అభివృద్ధి చేస్తున్నాం..’ అని మంత్రి పేర్కొన్నారు. 2 వరుసల్లో వత్తుగా విత్తిన పత్తి మొక్కల (హెచ్‌డీపీఎస్) నుంచి సీజన్లో ఒకేసారి పత్తి తియ్యటానికి వీలుగా ఈ యంత్రాన్ని రూపొందించారు. -
పోషక లోపాలు తీర్చే చొప్ప!
దేశంలో పశువుల పోషకాహార లోటును పరిష్కరించడానికి పశుగ్రాస పంటల బయోఫోర్టిఫికేషన్ ఒక సమర్థవంతమైన, సుస్థిరమైన పరిష్కారం. పంటలు పెరిగే దశలోనే వాటిలో అవసరమైన పోషకాల (జింక్, ఇనుము, రాగి వంటి సూక్ష్మపోషకాల) పరిమాణాన్ని, వాటి జీవ లభ్యతను సస్యవిజ్ఞాన పద్ధతుల్లో పెంపొందించడాన్నే బయోఫోర్టిఫికేషన్ అంటారు. బయోఫోర్టిఫికేషన్ మూడు విధాలు: 1. నేల ద్వారా ఎరువుల వినియోగం.. పొలం మట్టిలో లోపించిన పోషకాలను లేదా సూక్ష్మపోషకాలను నీటిలో కలిపి నేలకు అందిస్తారు. 2. పంటలపై పిచికారీ చేయడం.. ఎరువులను ద్రవరూపంలో నేరుగా మొక్కల ఆకులపై పిచికారీ చేస్తారు. దీని వల్ల మొక్కలు పోషకాలను వేగంగా గ్రహిస్తాయి. 3. సూక్ష్మజీవుల ప్రయోగం.. నేలలో ప్రయోజనకరమైన సూక్ష్మజీవులను మట్టిలో కలుపుతారు. తద్వారా మొక్కలు నేల నుంచి పోషకాలను తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది.నత్రజని ప్రాముఖ్యతపంట అభివృద్ధికి, పశుగ్రాస ఉత్పత్తికి నత్రజని చాలా కీలకమైన పోషకం. ఇది ప్రొటీన్లు, అమైనో ఆమ్లాలు, పత్రహరితం, ఇతర ముఖ్యమైన అణువుల నిర్మాణానికి అవసరం. నత్రజని ఎరువులు మేత నాణ్యతను, ముఖ్యంగా పొడి పదార్థం, ముడి మాంసకృత్తుల సాంద్రతను పెంచుతాయి.పరిశోధనా ఫలితాల ప్రకారం, హెక్టారుకు 25 టన్నుల పశువుల ఎరువు వాడినప్పుడు, మొక్కజొన్న గ్రాసంలో జింక్ (15.3%), రాగి (7.5%), మాంగనీస్ (28.4%), ఇనుము (15.6%) వంటి సూక్ష్మపోషకాల స్థాయిలు పెరిగాయి. నత్రజని (120 కిలోలు/హెక్టారు)ని పశువుల ఎరువుతో కలిపి వాడటం వల్ల పశుగ్రాసంలో ముడి ప్రొటీన్లు 36.56% వరకు పెరిగినట్లు పరిశోధనా ఫలితాలు వెల్లడిస్తున్నాయి.గొర్రెల్లో జింక్ లోపం పోయిందిమొక్కజొన్న, అలసంద వంటి పశుగ్రాస పంటల పెరుగుదలకు, అధిక దిగుబడికి జింక్ చాలా ముఖ్యం. పశుగ్రాసంలో జింక్ లోపం ఉంటే పశువుల ఎదుగుదల తగ్గటం, పునరుత్పత్తి సమస్యలు, ఎముకలు, చర్మ కణజాలం దెబ్బతినటం జరుగుతాయి. 2020లో డా. గిరిధర్ బృందం బెంగళూరులో (ఐసీఏఆర్–ఎన్ఐఎన్íపీ) ఒక అధ్యయనం చేసింది. జింక్ ఎరువులను నేలలో వేసి పండించిన జొన్న చొప్పను జింక్ లోపం ఉన్న గొర్రెలకు 120 రోజులపాటు ప్రయోగాత్మకంగా తినిపించారు. హెక్టారుకు 25 కిలోల జింక్ సల్ఫేట్ వేస్తే జొన్న చొప్ప దిగుబడి హెక్టారుకు 4.2 టన్నులు పెరిగింది. చొప్పలో జింక్ పరిమాణం 14.4 పీపీఎం మేర వృద్ధి చెందింది. బయోఫోర్టిఫైడ్ చొప్ప తిన్న గొర్రెల్లో జింక్ స్థాయి పెరగటంతో పాటు.. రక్తంలోని జింక్ పరిమాణం పెరిగింది. వ్యాధి నిరోధక శక్తి పెరిగింది.రాగితో పెరిగిన దిగుబడి పరిశోధనల ప్రకారం, ఓట్స్ పశుగ్రాస పంటకు నేల ద్వారా హెక్టారుకు 6 కిలోల రాగి అందించడం వల్ల దాని జీవలభ్యత పెరిగి దిగుబడి మెరుగుపడింది. అలాగే, విత్తిన 60–90 రోజుల్లో ఆకులపై 0.2% రాగిని పిచికారీ చేయటం వల్ల రాగి గ్రహణ శక్తి, దిగుబడి, ప్రొటీన్స్ గణనీయంగా పెరిగాయి. డా. సి.హెచ్. రామకృష్ణ బృందం హైదరాబాద్‌లో చేసిన పరిశోధన ఫలితాల ప్రకారం.. నేలకు హెక్టారుకు 25 కిలోల చొప్పున జింక్ సల్ఫేట్‌ను సిఫారసు చేసిన ఎరువులతోపాటు దుక్కిలో వేస్తే.. పచ్చిమేతలో అత్యధిక జింక్ సాంద్రత (41.4 పీపీఎం) నమోదైంది. అలాగే, విత్తిన 15, 30, 45, 60 రోజుల తర్వాత 1% అన్నభేదిని ఆకులపై పిచికారీ చేస్తే అత్యధిక ఇనుము సాంద్రత (155.3 పీపీఎం) నమోదైంది. అంతేకాకుండా, ఈ పద్ధతులు సైలేజ్ (పాతరగడ్డి)లోని పోషక విలువలను కూడా మెరుగుపరిచాయి. అందువల్ల, ఇటువంటి బయోఫోర్టిఫైడ్ పశుగ్రాసం లేదా సైలేజ్‌ను ఎక్కువ కాలం మేతగా ఇవ్వడం వల్ల గొర్రెలలో శరీర బరువు, సగటు రోజువారీ పెరుగుదల, రక్తంలోని ఖనిజాల స్థాయిలను మెరుగుపరచవచ్చని నిరూపితమైంది. ఈ విధానం వల్ల నేల సారం పెరిగి పశుగ్రాస దిగుబడి పెరగడమే కాకుండా, ఇటు పశువుల్లో అటు మనుషుల్లోనూ ఉన్న ఖనిజ లవణాల లోపాలను సరిదిద్దవచ్చని ఈ అధ్యయనం వెల్లడించింది.జీవన ఎరువుల ప్రాముఖ్యతరసాయన ఎరువులు మితిమీరి వాడకం వల్ల భూమి నిస్సారమవడమే కాకుండా, పశుగ్రాసంలో పోషకాల సమతుల్యత దెబ్బతినే అవకాశం ఉంది. ఈ సవాలును ఎదుర్కోవడంలో మొక్కల పెరుగుదల ప్రోత్సహించే అజోటోబాక్టర్, అజోస్పిరిలియం వంటి జాతుల జీవన ఎరువులు కీలకపాత్ర పోషిస్తాయి. జీవసంబంధమైన నత్రజని స్థిరీకరణ, ఫాస్ఫేట్ కరిగింపు, ఫైటో హార్మోన్ల ఉత్పత్తి వంటి చర్యల ద్వారా పోషకాల లభ్యతను పెంచుతాయి. ఇవి జీవసంబంధంగా నత్రజనిని స్థిరీకరించడం ద్వారా పంటల నాణ్యతను, దిగుబడిని మెరుగుపరుస్తాయి. ఈ సుస్థిర పద్ధతులను అవలంబించడం వల్ల నేల సారాన్ని కాపాడుకుంటూనే పశుపోషణను లాభసాటిగా మార్చుకోవచ్చు.గణనీయమైన మార్పు.. సుస్థిర వ్యవసాయ పద్ధతులతో కూడిన బయోఫోర్టిఫికేషన్ వ్యూహాల అమలు ద్వారా దేశ పశుపోషణ రంగంతోపాటు, ఆర్థికాభివృద్ధిలో గణనీయమైన మార్పు తీసుకురావచ్చు. అయితే, పశుగ్రాస పంటల బయోఫోర్టిఫికేషన్ ద్వారా మేత పోషక విలువను పెంచే పద్ధతి అమలుకు అనేక అడ్డంకులు ఎదురవుతున్నాయి. నేలలోని పోషక అసమతుల్యతలు, ఉదాహరణకు అధిక ఫాస్ఫరస్ స్థా్థయిలు జింక్ శోషణను నిరోధించడం వంటివి మొక్కల పోషక గ్రహణ శక్తిని దెబ్బతీస్తున్నాయి. వేడిగాలులు, కరువులు, వర్షపాతంలో ఒడిదుడుకులు వంటి తీవ్రమైన వాతావరణ పరిస్థితులు పంట పెరుగుదలను, పోషకాల గ్రహణను నిరోధిస్తాయి. ఆర్థిక, సామాజిక అంశాలు కూడా ఈ ప్రక్రియను ప్రభావితం చేస్తున్నాయి. సూక్ష్మపోషక ఎరువులు, అధునాతన సాంకేతికతలతో కూడిన ఖర్చులు ఎక్కువగా ఉండటం వల్ల చిన్న రైతులు ఇటువంటి నూతన వ్యవసాయ పద్ధతులను అనుసరించలేక పోతున్నారు. పశుగ్రాస పంటల బయోఫోర్టిఫికేషన్ పద్ధతులపై మరింత పరిశోధన జరగాలి. ఖర్చు–ప్రభావంపై దీర్ఘకాలిక అధ్యయనాలు అవసరం. – డా. సి.హెచ్. రామకృష్ణ, అసోసియేట్ ప్రొఫెసర్ (అగ్రానమీ), పి.వి. నరసింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం, హైదరాబాద్ (9491562536) -
నమో డ్రోన్ దీదీ స్కీమ్ గురించి తెలుసా?
గత రెండు దశాబ్దాల్లో డ్రోన్ సాంకేతికత ప్రపంచవ్యాప్తంగా ఒక శక్తిమంతమైన సాధనంగా ఎదిగింది. మన దేశం కూడా ఈ సాంకేతికతను సమర్థవంతంగా వినియోగిస్తోంది. వ్యవసాయం, పాలన, అభివృద్ధి రంగాల్లో డ్రోన్ల వినియోగాన్ని వేగంగా విస్తరిస్తోంది. తొలుత ప్రయోగాత్మకంగా డ్రోన్ల వాడకం చిన్నగా ప్రారంభమైనా ఇప్పుడు ప్రభుత్వ సేవలు, మౌలిక సదుపాయాల నిర్వహణ, వ్యవసాయం, జాతీయ భద్రత వంటి రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చే స్థాయికి చేరుకుంది. నమో డ్రోన్ దీదీ కార్యక్రమం కింద 1,094 డ్రోన్లను మహిళా స్వయం సహాయక సంఘాలకు అందించారు. ఇది వ్యవసాయ ఉత్పాదకతను, జీవనోపాధిని మెరుగుపరుస్తోంది. న్యూఢిల్లీలో ఏఐ సమ్మిట్ జరుగుతున్న సందర్భంగా డ్రోన్ల హవాపై ఫోకస్...మన దేశంలో ప్రస్తుతం ఆధునిక వ్యవసాయంతో పాటు భూమి, ఆస్తి సర్వేలు, మౌలిక సదుపాయాల తనిఖీ, విపత్తు నిర్వహణ, రైల్వే, హైవేల పర్యవేక్షణ వంటి పనుల కోసం డ్రోన్లను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. డ్రోన్ల తయారీదారులు, సాఫ్ట్వేర్ డెవలపర్లు, శిక్షణ సంస్థలు, అంకుర సంస్థలు, పరిశోధన సంస్థలు, ధ్రువీకృత పైలట్ల కృషితో డ్రోన్ల వినియోగం ప్రభుత్వ నిబంధనలకు లోబడి నానాటికీ విస్తరిస్తోంది.కేంద్ర ప్రభుత్వ తాజా గణాంకాల ప్రకారం.. ఫిబ్రవరి 2026 నాటికి దేశంలో 38,500కు పైగా నమోదిత డ్రోన్లు(యూఐఎన్) వాడుకలో ఉన్నాయి. 39,890 డీజీసీఏ–ధ్రువీకృత పైలట్లు సేవలందిస్తున్నారు. 244 శిక్షణా సంస్థలు డ్రోన్ సంబంధిత నైపుణ్యాలను అందిస్తున్నాయి. స్వమిత్వ పథకం కింద డ్రోన్లను ఉపయోగించి 3.28 లక్షల గ్రామాలను సర్వే చేశారు. 31 రాష్ట్రాల్లోని 1.82 లక్షల గ్రామాలకు సంబంధించి 2.76 కోట్ల ఆస్తి కార్డులను రూపొందించారు.సరళీకృత విధాన నిర్ణయాలు డ్రోన్ వ్యవస్థ విస్తరణకు దోహదపడుతున్నాయి. ప్రభుత్వం తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాల వల్ల ఈ రంగం ఇంతగా అభివృద్ధి చెందింది. సరళీకృతమైన డ్రోన్ నియమాలు, ‘డిజిటల్ స్కై’ సింగిల్ విండో ప్లాట్‌ఫారమ్, తయారీదారులకు ఇచ్చే ప్రోత్సాహకాలు, లక్షిత నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, డ్రోన్ వినియోగాన్ని సామాన్యులకు కూడా అందుబాటులోకి తీసుకువచ్చాయి. ప్రభుత్వ పథకాల్లో డ్రోన్లను చేర్చడం వల్ల పనులు మరింత వేగంగా, పారదర్శకగా జరుగుతున్నాయి.నమో డ్రోన్ దీదీ సేవలునవంబర్ 2023లో ప్రారంభించిన ‘నమో డ్రోన్ దీదీ’ కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం. ఆధునిక వ్యవసాయ పద్ధతులకు మద్దతుగా మహిళా స్వయం సహాయక సంఘాలకు(ఎస్‌హెచ్‌జీ) డ్రోన్లను అందించడం ఈ పథకం లక్ష్యం. వ్యవసాయ సామర్థ్యాన్ని మెరుగుపరచడం, పంట ఉత్పాదకతను పెంచడం, పెట్టుబడి ఖర్చులను తగ్గించడం, మహిళలకు స్థిరమైన జీవనోపాధి అవకాశాలను కల్పించడం దీని ప్రధాన ఉద్దేశ్యాలు.డ్రోన్ దీదీ పథకం ప్రారంభమైనప్పటి నుంచి ప్రముఖ ఎరువుల కంపెనీల ద్వారా మహిళా స్వయం సహాయక సంఘాలకు 1,094 డ్రోన్లు పంపిణీ అయ్యాయని గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో నమో డ్రోన్ దీదీ పథకం కింద అందించినవి 500కు పైగా డ్రోన్లు ఉన్నాయి.నమో డ్రోన్ దీదీ పథకం (Namo Drone Didi Scheme) శ్రమతో కూడిన పాత పిచికారీ పద్ధతులకు స్వస్తి చెప్పి.. కచ్చితమైన ఫలితాలు సాధించే కృషి దిశగా వ్యవసాయంలో గణనీయమైన మార్పునకు శ్రీకారం చుట్టింది.ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్‌కు చెందిన ఒక డ్రోన్ దీదీ మాట్లాడుతూ డ్రోన్ శిక్షణ తనను శక్తివంతం చేసిందన్నారు. స్వయం సహాయక సంఘం తరఫున నానో ఎరువులు, పురుగు మందుల పిచికారీ సేవలను అందిస్తూ ఆదాయం పొందుతున్నానని వివరించారు.డ్రోన్ల నిబంధనలు మీకు తెలుసా?దేశంలో డ్రోన్ల వినియోగం వేగవంతంగా విస్తరిస్తోంది. డ్రోన్ల తయారీ, వినియోగాన్ని వేగవంతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం సమగ్ర విధానపరమైన, ఆర్థిక చట్రాన్ని ఏర్పాటు చేసింది. ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి, నిబంధనల అమలును సులభతరం చేయడానికి, స్వదేశీ డ్రోన్ల ఉత్పత్తిని బలోపేతం చేయడానికి చర్యలు తీసుకుంది.డ్రోన్ రూల్స్ 2021ను 2022, 2023లలో సవరించారు. ఈ సవరణలు మన దేశ డ్రోన్ వ్యవస్థను సరళీకరించాయి.నియంత్రణ విధానాలు సులభతరమయ్యాయి. ఫారమ్‌ల సంఖ్యను 25 నుంచి 5కి తగ్గించారు. అనుమతుల అవసరాలను 72 నుంచి కేవలం 4కు తగ్గించారు.ఫీజుల హేతుబద్ధీకరణ జరిగింది. డ్రోన్ పరిమాణంతో సంబంధం లేకుండా ఫీజుల నిర్ణయం జరిగింది.పౌర డ్రోన్ కార్యకలాపాల్లో 500 కేజీల బరువు వరకు ఉన్న డ్రోన్ల వాడకానికి అనుమతి లభించటంతో వాణిజ్య, పారిశ్రామిక అవసరాల కోసం వినియోగం పెరిగింది. గగనతలంలో దాదాపు 90%ను గ్రీన్ జోన్‌గా ప్రకటించారు. 400 అడుగుల ఎత్తు వరకు డ్రోన్లను ప్రభుత్వం అనుమతిస్తున్నది.‘సాంప్రదాయ పైలట్ లైసెన్స్‌కు బదులుగా డీజీసీఏ జారీ చేసే ‘రిమోట్ పైలట్ సర్టిఫికేట్’ను ప్రవేశపెట్టారు.పాస్‌పోర్ట్ అవసరం లేదు. ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా ఐడీ, అడ్రస్ ప్రూఫ్ ఉంటే డ్రోన్లను నడపడానికి సరిపోతుంది.మొత్తంగా ఈ సంస్కరణలు డ్రోన్ రంగంలోకి ప్రవేశించాలనుకునే వారికి గల అడ్డంకులను గణనీయంగా తగ్గించాయి. డ్రోన్ సేవల అందుబాటును గ్రామాల్లో పెంచడానికి దోహదపడుతున్నాయని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.డ్రోన్లు, డ్రోన్ విడిభాగాల దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహించటానికి పీఎల్ఐ పథకానికి కేంద్రం రూ.120 కోట్లు కేటాయించింది. అంకుర సంస్థలు, ఎంఎస్ఎంఈలు తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవడానికి, దేశీయ డ్రోన్ తయారీ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఈ పథకం వీలు కల్పిస్తోంది.సెప్టెంబర్ 2025లో డ్రోన్లపై జీఎస్టీని ఏకరీతిగా 5 శాతానికి తగ్గించారు. అంతకుముందు 18%, 28% పన్ను రేట్లు ఉండేవి.డ్రోన్ రిజిస్ట్రేషన్, రిమోట్ పైలట్ సర్టిఫికేషన్, టైప్ సర్టిఫికేషన్, ఆర్టీపీఓ అధికారాల వంటి నియంత్రణ సేవలు డిజిటల్ స్కై ప్లాట్‌ఫారమ్ నుంచి ఈజీసీఏకి మార్చారు. విమాన ప్రణాళిక, ఎయిర్‌స్పేస్ మ్యాప్ వంటి కార్యాచరణ సేవలు డిజిటల్ స్కై ప్లాట్‌ఫారమ్‌తో అనుసంధానితమై కొనసాగుతున్నాయి.చదవండి: సేంద్రియ ఆహారంతో ఆరోగ్యానికి మేలేనా?మన దేశంలో డ్రోన్ వ్యవస్థ పైలట్ ప్రాజెక్టుల స్థాయి నుంచి ఆవిష్కరణ–ఆధారిత ప్రధాన స్రవంతి రంగంగా ఎదిగింది. మహిళా సాధికారత, గ్రామీణ సదుపాయాలు, దేశీయ తయారీకి మద్దతు ఇచ్చే కార్యక్రమాలతో ప్రభుత్వం సాంకేతిక ఆవిష్కరణలను, విస్తృత డ్రోన్ల వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది. డ్రోన్లు ఇప్పుడు వ్యవసాయం, భూమి, ఆస్తి సర్వేలు, మౌలిక సదుపాయాల పర్యవేక్షణ, విపత్తు అంచనా, పౌర సేవల పంపిణీ వంటి కీలక రంగాలలో భాగమయ్యాయి. పంట నష్టాల సేకరణ సులువుదేశంలో అనేక రంగాల్లో డ్రోన్లు వివిధ రంగాలలో సామాజిక–ఆర్థిక అభివృద్ధి ఫలితాలను అందిస్తున్నాయి. వ్యవసాయంలో వీటి వినియోగం మహిళా రైతులకు సాధికారత కల్పించడమే కాకుండా పంట నష్టాల అంచనా పనులను మెరుగుపరిచింది. మౌలిక సదుపాయాలు, పట్టణ ప్రణాళికలో ఇవి చురుకైన పర్యవేక్షణ, మెరుగైన వనరుల నిర్వహణకు వీలు కల్పించాయి. భూ వివాదాల పరిష్కారానికి డ్రోన్లుసర్వే ఆఫ్ విలేజెస్ అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రువైజ్డ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియాస్(స్వమిత్వ) పథకంలో డ్రోన్ సాంకేతికత ప్రధాన భూమిక పోషిస్తోంది. ఈ పథకాన్ని ఏప్రిల్ 2020లో ప్రారంభించారు. దీన్ని పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ, రాష్ట్ర ప్రభుత్వాలు, సర్వే ఆఫ్ ఇండియా సంయుక్తంగా అమలు చేస్తున్నాయి. భూ వివాదాలను పరిష్కరించడానికి, బ్యాంకు రుణాలు పొందడాన్ని సులభతరం చేయడానికి గ్రామీణ ప్రాంతాల్లో డ్రోన్ ఆధారిత మ్యాపింగ్ చేపట్టారు.డిసెంబర్ 2025 నాటికి 3.28 లక్షల గ్రామాల్లో డ్రోన్ సర్వే పూర్తయింది. 31 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 1.82 లక్షల గ్రామాలకు సంబంధించి 2.76 కోట్ల ఆస్తి కార్డులు సిద్ధమయ్యాయి.నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్ హెచ్ఏఐ) అన్ని హైవే ప్రాజెక్టుల కోసం ప్రతి నెలా డ్రోన్–వీడియో రికార్డింగ్‌లను తప్పనిసరి చేసింది.విపత్తు నిర్వహణ, అత్యవసర సేవలకు కూడా డ్రోన్లను విస్తృతంగా వినియోగిస్తున్నారు. రైల్వే ట్రాక్‌లు, వంతెనలు, ఇతర మౌలిక సదుపాయాల పర్యవేక్షణ, నిర్వహణ కోసం రైల్వే మంత్రిత్వ శాఖ యూఏవీలు/డ్రోన్లను ఉపయోగిస్తోంది. అదేవిధంగా, దేశ రక్షణలో డ్రోన్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. – నిర్వహణ: పంతంగి రాంబాబుసాక్షి సాగుబడి డెస్క్ -
కేరళ విద్యార్థుల ఘనత...మొక్కల కోసం యాప్
మీ స్కూల్ గ్రౌండ్లో ముక్కులున్నాయా? వాటి పేర్లేంటి? ఇంకా అక్కడ ఎలాంటి మొక్కలుంటే బాగుంటుంది? అక్కడ ఏయే మొక్కల ద్వారా ఏయే ప్రయోజనాలున్నాయి? వాటిని రక్షించుకోవడం ఎలా? ఇలాంటివి తెలుసుకునేందుకు కేరళలోని కార్యవట్టం ప్రభుత్వ కళాశాల బీఎస్సీ భౌగోళిక శాస్త్ర విద్యార్థుల బృందం ఓ వెబ్ అప్లికేషన్‌ను తయారు చేసింది. ఇది విద్యార్థులకు ఎంతో అనుకూలమైనది. సెకండరీ పాఠశాల విద్యార్థులు తమ పాఠశాల క్యాంపస్‌లలో మొక్కల వైవిధ్యాన్ని మ్యాప్ చేసేందుకు ఈ యాప్ వీలు కల్పిస్తుంది. యాండ్రాయిడ్ ఫోన్ లేదా వెబ్ బ్రౌజర్ ఉంటే చాలు ఈ అప్లికేషన్ పనిచేస్తుంది. దీనికి ఇన్స్టాలేషన్ కూడా అవసరం లేదు. ఇదీ చదవండి: డ్యాన్సర్ నోట్లో బలవంతంగా నాణేలు : పరిస్థితి విషమంఈ యాప్ అందరూ వాడొచ్చు. సాధారణ ఫీల్డ్ సర్వేలను నిర్వహించడానికి ప్రాథమిక కార్టోగ్రాఫిక్ అంశాలతో జీవవైవిధ్య మ్యాప్‌లను తక్షణమే రూపొందించడానికి ఈ యాప్ పనికొస్తుందని దీన్ని తయారు చేసిన విద్యార్థులు అంటున్నారు. భౌగోళిక శాస్త్ర విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రతీప్ కుమార్ మార్గదర్శకత్వంలో ఈ ప్రాజెక్ట్ రూపొందించారు. తరగతి గదుల్లో డిజిటల్ బోధనను ప్రోత్సహించే కేరళ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అండ్ టెక్నాలజీ ఫర్ ఎడ్యుకేషన్ (ఓఐఖీఉ) లక్ష్యాలకు అనుగుణంగా ఈ యాప్ తయారు చేశారు. టెక్నాలజీపై కనీస అవగాహన ఉన్న పాఠశాల విద్యార్థులంతా దీన్ని సులభంగా ఉపయోగించవచ్చు.పాఠశాల విద్యార్థులలో డిజిటల్ విద్య, పర్యావరణ అభ్యాసం, జియోస్పేషియల్ నైపుణ్య అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడానికి ఇది ఉపయోగ పడుతుంది. ఇలాంటి యాప్స్ తయారీపై విద్యార్థులు దృష్టి పెట్టాలి.ఇదీ చదవండి: టొమాటో..టొమాటో నీది ఏ దేశం? మీకు తెలుసా? -
సాంప్రదాయ విత్తనాలను కాపాడుకోవాలి
సాక్షి, కడ్తాల్: అంతరించి పోతున్న దేశీయ, సాంప్రదాయ విత్తనాలను కాపాడుకుంటూ, వాటి నిర్వహణను కంపెనీలు, కార్పొరేట్ల గుప్పిట్ల నుంచి రైతు అజమాయిషీలోకి తీసుకు రావాలని తెలంగాణ రాష్ట్ర రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి పిలుపు నిచ్చారు. తద్వారా పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అది రైతు హక్కు అని తెలిపారు. ఈరోజు బహుళ జాతి కంపెనీలు హైబ్రిడ్ విత్తన వ్యాపారంతో రాష్ట్ర ప్రభుత్వాలను శాసిస్తున్నాయి అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సాంప్రదాయ విత్తనాలతోనే వాటికి చెక్ పెట్టాలని పిలుపునిచ్చారు.శుక్రవారం రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం అన్మాసుపల్లి లోని ఎర్త్ సెంటర్ లో సెంటర్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్(సీజీఆర్), భారత్ బీజ్ స్వరాజ్ మంచ్ మూడు రోజుల పాటు నిర్వహిస్తోన్న తెలంగాణ ద్వితీయ వార్షిక విత్తన పండుగకు ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా కోదండ రెడ్డి మాట్లాడుతూ... బహుళ జాతి కంపెనీలు దేశంలో వేల కోట్ల రూపాయలు సంపాదిస్తూ కూడా ఐటీ, మార్కెట్ ఫీజు మినహాయింపు పొందుతున్నాయన్నారు. ప్రభుత్వం నిషేధించిన విత్తనాలను కూడా అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నాయని విమర్శించారు. కలుపు మందులు చాలా విష పూరితమని, అయినా ఎరువుల దుకాణాలలో దొరకడం శోచనీయం అన్నారు.మనకు వనరులు, అవకాశం ఉన్నప్పటికీ సాంప్రదాయ విత్తనాలను పండించడం లేదని, ఇప్పటికయినా మేల్కొనకపోతే ఒకవంక వాతావరణ మార్పుల దుష్ప్రభావం, మరో వంక బహుళ జాతి కంపెనీల చేతిలో ఇబ్బందుల పాలవుతామని కోదండరెడ్డి హెచ్చరించారు. సాంప్రదాయ విత్తనాల వినియోగానికి, రైతుల హక్కులు కాపాడడానికి కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. వ్యవసాయ రంగానికి ప్రభుత్వం అన్ని రకాల సహకారం అందిస్తుందన్నారు కోదండ రెడ్డి. అనంతరం విత్తన స్టాళ్లను ఆయన ప్రారంభించి, సందర్శించారు. ఈ కార్యక్రమంలో సీజీఆర్ ప్రెసిడెంట్ లీలా లక్ష్మారెడ్డి ప్రసంగిస్తూ.. ఆహారం లోనే ఆరోగ్యం ఉందని, దురదృష్టవశాత్తు ఆ ఆహారం కల్తీ అయ్యిందన్నారు. రాబోయే తరాల కోసం సాంప్రదాయ విత్తనాలను రక్షిద్దామని పిలుపు నిచ్చారు.సీజీఆర్ వైస్ ప్రెసిడెంట్, ఆర్టీఐ మాజీ కమిషనర్ దిలీప్ రెడ్డి మాట్లాడుతూ... మానవ సమాజానికి రైతు చేస్తున్న సేవలో విత్తన పండుగ కూడా ఒకటని అన్నారు. గత ఏడాది CGR నిర్వహించిన విత్తన పండుగలో 50 స్టాళ్లు ఏర్పాటు చేయగా, ఈసారి 75 స్టాళ్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.ఆహార వ్యవస్థలో తీవ్ర మైన మార్పులు వచ్చి ప్రపంచ వ్యాప్తంగా జన్యు సంపద ప్రమాదంలో పడిందని, వాటిని కాపాడటమే విత్తన పండుగ ప్రధాన ఉద్దేశ మని పర్యావరణ వేత్త, కార్యక్రమ కన్వీనర్ దొంతి నర్సింహారెడ్డి తెలిపారు.రైతు కమిషన్ సభ్యుడు గోపాల్ రెడ్డి మాట్లాడుతూ... కల్తీ మందులు, విత్తనాలతో పక్షి జాతులు అంతరించి పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రముఖ పర్యావరణ వేత్త ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ... సమస్య చాలా తీవ్రంగా ఉందని, జీవ వైవిధ్యం నశించి పోతుందన్నారు. కార్పొరేట్ కంపెనీలకు ప్రభుత్వాలు తలవంచుతున్నాయని విమర్శించారు.‘నాబార్ఢ్’ చీఫ్ జనరల్ మేనేజర్ ఉదయ భాస్కర్ మాట్లాడుతూ... రాష్ట్రం లోని 13 జిల్లాలలోని 180 స్కూళ్ళలో ట్రెడిషనల్ గార్డెన్స్ ఏర్పాటు చేసి విద్యార్ధులకు సాంప్రదాయ వ్యవసాయంపై అవగాహన కల్పిస్తున్న సీజీఆర్ కార్యక్రమం ‘వైఇఎల్పీ’కి నాబార్డు మద్దతిస్తున్నట్టు చెప్పారు. సాంప్రదాయ విత్తనాల వాడకం కోసం సీజీఆర్ చేస్తున్న కృషిని కొనియాడారు. CGR కు తమ సహకారం ఉంటుందన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ గంగుల ప్రతాప్ రెడ్డి, భారత్ బీజ్ స్వరాజ్ మంచ్ కన్వీనర్ జాకోబ్, జిల్లా అటవీ శాఖాధికారి రోహిత్ తదితరులు పాల్గొని ప్రసంగించారు.చదవండి: సేంద్రియ ఆహారంతో ఆరోగ్యానికి మేలేనా? -
సేంద్రియ ఆహారంతో ఆరోగ్యానికి మేలేనా?
ప్రపంచవ్యాప్తంగా వంద దేశాల్లో విస్తరించిన సేంద్రియ వ్యవసాయ సంస్థలతో కూడిన నెట్వర్క్ ఐఫోమ్– ఆర్గానిక్స్ ఇంటర్నేషనల్. జర్మనీలోని బాన్ కేంద్రంగా 1972 నుంచి పనిచేస్తోంది. 700 పైచిలుకు అనుబంధ సంస్థలకు సేంద్రియ సంబంధిత అంశాలపై చోదక శక్తిగా ఉంది. సేంద్రియ వ్యవసాయం, మార్కెటింగ్ తదితర అంశాలపై ఆర్గానిక్స్ ఇంటర్నేషనల్ నిపుణులు ఏమంటున్నారంటే..?సేంద్రియ వ్యవసాయం ప్రయోజనాలేంటి? నేల సారాన్ని పెంపొందించడం, పరిశుభ్రమైన నీటిని అందుబాటులోకి తేవటం, జీవవైవిధ్యం కోసం పెట్టుబడి పెట్టడం, మట్టిలో సేంద్రియ పదార్థాన్ని స్థిరీకరించడం ద్వారా వాతావరణ మార్పును తగ్గించడం. నెదర్లాండ్స్‌లో డెలాయిట్ నిర్వహించిన ఇటీవలి అధ్యయనం ప్రకారం.. రైతులందరినీ 100% సేంద్రియ సాగుకు మళ్లిస్తే పన్ను చెల్లింపుదారులు సంవత్సరానికి 1000 కోట్ల యూరోలు ఆదా చేయవచ్చని లెక్కగట్టింది. మరొక అధ్యయనం ప్రకారం.. వ్యవసాయాన్ని సేంద్రియం వైపు మళ్లిస్తే సరఫరా గొలుసులను ప్రమాదం నుంచి రక్షించవచ్చు. ఆహార భద్రతకు దోహదపడుతుంది.సేంద్రియం ప్రపంచాన్ని పోషించలేదనే విషయం నిజమేనా?రసాయనిక వ్యవసాయంలో ఉత్పాదకత స్తబ్దుగా ఉండటంతో పాటు చాలా సవాళ్లు ఉన్నాయి. పంటల మార్పిడి పాటిస్తూ సేంద్రియ సాగు చేస్తే సాధారణ సాగుకు దీటుగా దిగుబడి వస్తుందని కెన్యాలోని చుకా, కందరాలలో జరిగిన దీర్ఘకాలిక అధ్యయనాలు నిరూపించాయి. బొలీవియాలోని అగ్రోఫారెస్ట్రీ కోకో పొలాల్లోనూ ఇది రుజువైంది.సేంద్రియ ఆహారం పర్యావరణానికి మేలేనా?సేంద్రియ సాగు (Organic Farming) పద్ధతుల వల్ల కలిగే పర్యావరణ ప్రయోజనాలు శాస్త్రీయ గణాంకాల ద్వారా ధృవీకరించబడ్డాయి. మల్చింగ్ వంటి సేంద్రియ పద్ధతులు భూమిని క్షీణింపజేయకుండా కాపాడుతాయి. మంచి దిగుబడిని ఇస్తాయని తేలింది. ఇంధన వినియోగం తగ్గి, నేల సారం పెరిగి పర్యావరణంపై సానుకూల ప్రభావం ఉంటుందని గణాంకాలు నిర్థారిస్తున్నాయి.సేంద్రియ ఆహారం ఖరీదైనది. అందుబాటులో లేదన్నది నిజమేనా?అమెరికా వాసుల (జనవరి 2025) అభిప్రాయం ప్రకారం సేంద్రియ ఉత్పత్తులు సాధారణ ఉత్పత్తుల కంటే సగటున 52% ఖరీదైనవి. ఒక ప్రాంతంలో రైతులందరినీ స్థానిక పంటలను, సీజన్‌కు అనువైన పంటలను సేంద్రియంగా పండించటాన్ని ప్రోత్సహిస్తే ప్రజలకు సేంద్రియ ఆహారం అందుబాటులోకి వస్తుంది. సరసమైన ధరకే అందించవచ్చు. స్థానికంగా పండించిన పంటలను స్థానికంగానే ప్రాసెసింగ్ చేసి అమ్మితే.. గ్రామీణ మార్కెట్లలో సేంద్రియ ఆహారం మరింత అందుబాటులోకి వస్తుంది. ఈ దిశగా ప్రయత్నం జరగాలి. సేంద్రీయ ఉత్పత్తుల ప్రభావం ఆరోగ్యంపై ఎలా ఉంటుంది? ఆరోగ్యంపై సానుకూల ప్రభావం ఉంటుందనటానికి బలమైన ఆధారాలున్నాయి. సేంద్రియ ఆహార ఆరోగ్య ప్రయోజనాలను వినియోగదారులు, శాస్త్రవేత్తలు ఇద్దరూ గుర్తించారు. యూరోపియన్ ఫుడ్ సేఫ్టీ ఏజెన్సీ అధ్యయనం ప్రకారం.. సాధారణ ఆపిల్ పండ్ల కంటే సేంద్రియ ఆపిల్లు 19% అదనంగా ఆరోగ్యకరమైనవని తేలింది. నేషనల్ పెస్టిసైడ్ అబ్జర్వర్ సమాచారం ప్రకారం సేంద్రియ ఆహారానికి మారటం వల్ల మూత్రంలో గడ్డి మందు గ్లైఫొసేట్ అవశేషాలు గణనీయంగా తగ్గుతాయి.చదవండి: ఈ మొక్కే ఒక ఎరువుల ఫ్యాక్టరీ! -
పశువైద్యంలో యాంటీబయాటిక్స్‌కు ప్రత్యామ్నాయం
పశువ్యాధుల చికిత్సలో యాంటీబయాటిక్స్ వాడకాన్ని 90% వరకు తగ్గించే సాంప్రదాయ మూలికా చికిత్స పద్ధతులను అభివృద్ధి చేసిన తమిళనాడు వెటర్నరీ యూనివర్సిటీ మాజీ డీన్ డా. ఎన్. పుణ్యమూర్తి పద్మశ్రీ పురస్కారానికి ఎంపికయ్యారు. సంప్రదాయ విజ్ఞానంతో కూడిన ఎత్నో–వెటర్నరీ మెడిసిన్ (ఈవీఎం)లకు శాస్త్రీయ ప్రామాణికతను నిరూపించటంలో, రైతుల చెంతకు చేర్చటంలో డా. పుణ్యమూర్తి విశేష కృషి చేశారు. యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ (ఏఎంఆర్) మహమ్మారికి అసలైన పరిష్కారం ఈవీఎం చికిత్సలేనని డా. పుణ్యమూర్తి తెలిపారు. యాంటీబయాటిక్స్ అవసరం లేకుండానే పొదుగువాపు, గాలికుంటు వ్యాధి వంటి తీవ్ర జబ్బులను ఈవీఎం చికిత్సలతో సమర్థవంతంగా అరికట్టవచ్చని శాస్త్రీయ పరీక్షలతో పాటు రైతుల అనుభవంలోనూ రుజువైందన్నారు. తమిళనాడు తంజావూరు సమీపంలోని వల్లం గ్రామంలో రైతు కుటుంబంలో పుట్టిన ఆయన పశువైద్యంలో డాక్టరేట్ చేసి, తమిళనాడు వెటర్నరీ యూనివర్సిటీ డీన్‌గా పనిచేసిన ఆయన 2001లో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. ఆ తర్వాత కూడా బెంగళూరులోని టీడీయూ హెల్త్‌సైన్సెస్ అండ్ టెక్నాలజీతో కలిసి పరిశోధనలు కొనసాగించారు. యాంటీబయాటిక్స్ తదితర రసాయన ఔషధాలపై ఆధారపడకుండా తమ ఇంట్లోని దినుసులతోనే పశువ్యాధులకు రైతులే స్వయంగా చికిత్స చేసుకోవటానికి వీలుగా ఉండటం ఈవీఎంల ప్రత్యేకత. సిద్ధ వైద్య సూత్రాల ఆధారంగా సుమారు 50కి పైగా పశు వ్యాధులకు ఈవీఎం పద్ధతులను ఆయన రూపొందించారు. వీటి పనితీరును నిర్ధారించుకున్న జాతీయ పాడి పరిశ్రమాభివృద్ధి బోర్డు (ఎన్డీడీబీ) దేశవ్యాప్తంగా పశుపోషకులకు కొన్ని సంవత్సరాల క్రితం నుంచే సిఫారసు చేస్తూ సత్ఫలితాలను నమోదు చేసింది. సంబంధిత చికిత్సల వీడియోలను తెలుగు సహా అన్ని ప్రాంతీయ భాషల్లో ఎన్డీడీబీ యూట్యూబ్ చానల్లో అందుబాటులో ఉన్నాయి.స్వచ్ఛమైన పాలు, గుడ్లు, పేడ, మూత్రం ఉత్పత్తే లక్ష్యం: డా. పుణ్యమూర్తి ‘మన దేశంలో సేంద్రియ, ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో స్వచ్ఛమైన పాలు, గుడ్లు, శుద్ధమైన పేడ, మూత్రం ఉత్పత్తికి ఈవీఎం చికిత్సల వ్యాప్తి ద్వారా కృషి చెయ్యటమే’ తన లక్ష్యమని డా. పుణ్యమూర్తి ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు. పశువులు, కోళ్లకు వ్యాధులు రాకుండా చూడటం కోసం ప్రివెంటివ్ హెల్త్‌కేర్‌పై ప్రస్తుతం తాను పరిశోధనలు చేస్తున్నానని తెలిపారు. యాంటీబయాటిక్ రహిత, రసాయన రహిత పశుపోషణ దిశగా తాను చేస్తున్న కృషికి పద్మశ్రీ పురస్కారం మరింత దోహదపడుతుందని ఆశిస్తున్నానన్నారు.‘మన దేశంలో సేంద్రియ, ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో స్వచ్ఛమైన పాలు, గుడ్లు, శుద్ధమైన పేడ, మూత్రం ఉత్పత్తికి ఈవీఎం చికిత్సల వ్యాప్తి ద్వారా కృషి చెయ్యటమే’ తన లక్ష్యమని డా. పుణ్యమూర్తి ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు. పశువులు, కోళ్లకు వ్యాధులు రాకుండా చూడటం కోసం ప్రివెంటివ్ హెల్త్‌కేర్‌పై ప్రస్తుతం తాను పరిశోధనలు చేస్తున్నానని తెలిపారు. యాంటీబయాటిక్ రహిత, రసాయన రహిత పశుపోషణ దిశగా తాను చేస్తున్న కృషికి పద్మశ్రీ పురస్కారం మరింత దోహదపడుతుందని ఆశిస్తున్నానన్నారు. -
విరిసిన సేద్య పద్మాలు!
వ్యవసాయం, పశుపోషణ, సహకార రంగాల్లో విశేష కృషి చేసిన 9 మందికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల పద్మశ్రీ పురస్కారాలను ప్రకటించింది. వీరిలో ఐదుగురు శాస్త్రవేత్తలు, ముగ్గురు రైతు శాస్త్రవేత్తలు, ఒకరు ప్రముఖ సహకార వేత్త. భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ (ఐఏఆర్ఐ, పూసా) మాజీ సంచాలకులు డా. అశోక్ కుమార్ సింగ్ (బాస్మతి వరి రకాల అభివృద్ధి), జాతీయ జీవవైవిధ్య ప్రాధికార సంస్థ, మొక్కల రకాలు రైతుల హక్కుల ప్రాధికార సంస్థల మాజీ చైర్మన్ డా. పి.ఎల్. గౌతమ్ (జీవవైవిధ్య పరిరక్షణ చట్టం, రైతుల విత్తన హక్కుల రక్షణ చట్టం రూపశిల్పి), తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయ మాజీ వైస్ చాన్స్‌లర్ డా. కె.రామస్వామి (క్లైమేట్ ఒత్తిళ్లను తట్టుకునే వ్యవసాయ పద్ధతులపై పరిశోధన), రాజేంద్ర ప్రసాద్ సెంట్రల్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ మాజీ వైస్ చాన్స్‌లర్ డా. జి.ఎల్. త్రివేది (ఈశాన్య రాష్ట్రాల్లో వ్యవసాయాభివృద్ధి), తమిళనాడు వెటర్నరీ యూనివర్సిటీ మాజీ డీన్ డా. ఎన్. పుణ్యమూర్తి (ఎత్నో–వెటర్నరీ మెడిసిన్) పద్మశ్రీకి ఎంపికయ్యారు. వీరితో పాటు రైతు శాస్త్రవేత్తలు దివంగత రఘుపత్ సింగ్ (ఉత్తరప్రదేశ్), జోగేష్ డ్యూరి (అస్సాం), శ్రీరంగ్ దేవబా లాడ్ (మహారాష్ట్ర), దివంగత సహకార వేత్త మామిడి రామారెడ్డి (తెలంగాణ) పద్మశ్రీ 2026 పురస్కారాలకు ఎంపికయ్యారు.మాక్స్ చట్టం రూపశిల్పి రామారెడ్డితెలంగాణ రాష్ట్రంలో పాడి పరిశ్రమలో సహకార సంఘాల పాత్రను బలోపేతం చేసేందుకు 50 ఏళ్లపాటు పాటుపడిన దార్శనిక సహకార నేత మామిడి రామారెడ్డి(83)కి మరణానంతరం కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రదానం చేయనుంది. అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించిన ఆయన స్వగ్రామం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ సర్పంచ్‌గా, రాజేంద్రనగర్ సమితి అధ్యక్షుడిగా పనిచేశారు. సహకార సమాఖ్య, కోఆపరేటివ్ డెవలప్మెంట్ ఫౌండేషన్ల ద్వారా సహకార వ్యవస్థ పటిష్టతకు రాజకీయాలకు అతీతంగా, స్వతంత్ర సహకార వేత్తగా నిబద్ధతతో సేవలందించారు. మల్టీపర్పస్ కోఆపరేటివ్ సొసైటీ (ఎంపీసీఎస్)లను ఏర్పాటు చేశారు. పీఏసీఎస్‌లలో ప్రభుత్వ ప్రత్యక్ష జోక్యాన్ని నిరోధించేందుకు జాతీయ స్థాయిలో ఉద్యమించి, చట్ట సవరణ సాధించారు. 1995లో మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ(మాక్స్) చట్టం రూపకల్పనలో రామారెడ్డి కీలకపాత్ర పోషించారని 5 దశాబ్దాలుగా రామారెడ్డితో కలసి నడుస్తున్న సహకార ధర్మపీఠం వ్యవస్థాపక ధర్మకర్త సంభారపు భూమయ్య ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు. సహకార రంగంలో పద్మశ్రీ పురస్కారాన్ని గెల్చుకున్న తొలి నేత రామారెడ్డి కావటం సంతోషదాయకమన్నారు. ముఖ్యంగా మహిళల నేతృత్వంలోని సహకార సంస్థలను, స్వయం సహాయక బృందాలను ఇతోధికంగా ప్రోత్సహించారు. వరంగల్, కరీంనగర్ ప్రాంత మహిళా సహకార డెయిరీ ఏర్పాటులో చోదక శక్తిగా నిలిచారని ఆయన తెలిపారు. దూరదృష్టి గల నేత: ఎన్డీడీబీసహకార సంస్థలను బలోపేతం చేయడానికి తన జీవితాన్ని అంకితం చేసిన దూరదృష్టి గల నాయకుడు మామిడి రామారెడ్డి పద్మశ్రీ పురస్కారానికి ఎంపిక కావటం హర్షణీయమని జాతీయ పాడి పరిశ్రమ అభివృద్ధి బోర్డు (ఎన్డీడీబీ) పేర్కొంది. సహవికాస – సహకార అభివృద్ధి ఫౌండేషన్ ద్వారా మహిళా సాధికారతపై బలమైన దృష్టితో తెలంగాణ అంతటా గ్రామీణ జీవనోపాధి అవకాశాలను కల్పించారు. సహకార చట్టాలను రూపొందించడంలో, జాతీయ స్థాయి విధాన సంస్కరణల్లో కీలక పాత్ర పోషించారు. వేలాది మంది సభ్యుల యాజమాన్యంలోని స్వావలంబనతో కూడిన సహకార సంస్థలను ఆయన వారసత్వం విశ్వాసం, గౌరవం, స్థిరమైన గ్రామీణాభివృద్ధి దిశగా ముందుకు తీసుకువెళుతుందని ఎన్డీడీబీ ఆకాంక్షించింది.శ్రీరంగ్ దేవబా లాడ్ (మహారాష్ట్ర)వ్యవసాయ ఆవిష్కరణలతో ప్రసిద్ధి చెందిన రైతు శాస్త్రవేత్త శ్రీరంగ్ దేవబా లాడ్ (మహారాష్ట్ర). పత్తి ఉత్పత్తిని పెంచే ‘దాదా లాడ్ పద్ధతి’ని ఆయన అభివృద్ధి చేసినందుకు పద్మశ్రీ అందుకోనున్నారు. అధిక సాంద్రతలో పత్తి విత్తటం, మొక్కను 3 దశల్లో కొమ్మలు, పిలకలను కత్తిరించటం ద్వారా దిగుబడిని పెంచటం దాదా లాడ్ టెక్నిక్ ప్రత్యేకత. పత్తి పంట కాలాన్ని కుదించటం ద్వారా గులాబీ పురుగు బెడద నష్టాన్ని నివారించటం మరో ప్రయోజనం. నాగపూర్‌లోని కేంద్రీయ పత్తి పరిశోధనా సంస్థ (సీఐసీఆర్) లాడ్ టెక్నిక్‌లో ప్రయోజకత్వాన్ని గుర్తించి, అధికారికంగా రైతులకు సిఫారసు చేయటం విశేషం. వర్షాధార, నీటిపారుదల సాగు పద్ధతుల్లోనూ సీఐసీఆర్ విస్తృత స్థాయిలో క్షేత్ర ప్రయోగాలు జరిపింది. ఈ టెక్నిక్ ద్వారా సగటున 48 నుంచి 76% వరకు పత్తి దిగుబడి పెరిగినట్లు రుజువైందని సీఐసీఆర్ ప్రకటించింది.రఘుపత్ సింగ్ (ఉత్తరప్రదేశ్)మొరాదాబాద్ జిల్లాలోని బిలారి ప్రాంతానికి చెందిన అభ్యుదయ రైతు రఘుపత్ సింగ్‌కు మరణానంతరం పద్మశ్రీ అవార్డు ప్రదానం చేయనున్నారు. 55 పైగా అంతరించిపోతున్న కూరగాయల వంగడాలను సంరక్షించి రైతులకు తిరిగి పరిచయం చేశారు. దాదాపు 100 కొత్త రకాలను అభివృద్ధి చేశారు.జోగేష్ డ్యూరి (అస్సాం)ముగా పట్టు పరిరక్షణలో కీలక పాత్ర పోషించిన జోగేష్ డ్యూరి పద్మశ్రీని అందుకోనున్నారు. ఆయన కృషి వేలాది గ్రామీణ కుటుంబాల ఆదాయాన్ని పెంచింది. ముగా పట్టుకు ప్రపంచ గుర్తింపు తెచ్చిపెట్టింది. -
పాడి రైతుకు క్లైమేట్ పోటు!
పాల ఉత్పత్తిలో, వినియోగంలో ప్రపంచంలోకెల్లా మన దేశమే ఫస్ట్. 30 కోట్లకు పైగా ఆవులు, గేదెలను పెంచుతున్న 8 కోట్లకు పైగా రైతులకు పశుపోషణే ముఖ్య జీవనోపాధి. జాతీయ స్థూల దేశీయోత్పత్తికి పాలు దాదాపు 5 శాతం దోహదం చేస్తున్నాయి. 2003–2019 మధ్య దేశ పాల ఉత్పత్తి 86 మిలియన్ టన్నుల నుంచి 188 మిలియన్ టన్నులకు (దాదాపు 2.2 రెట్లు) పెరిగింది. పశువుల సంఖ్య పెరిగింది 11 శాతం మాత్రమే. తలసరి పాల లభ్యత 471 గ్రాములు. సగటున తలసరి పోషకాహార అవసరం 300 గ్రాముల కంటే ఇది చాలా ఎక్కువ. అయితే, ఈ మొత్తం గణాంకాలు గొప్పగా ఉన్నప్పటికీ పాడి/పశుపోషణ రంగంలో కష్టాలు, సమస్యలు, సవాళ్లు ఎన్నో ఉన్నాయి. పెరుగుతున్న భూతాపం పశువులపై ప్రతికూల ప్రభావాలకు దారితీస్తోంది. ఇటువంటి ఎన్నో ముఖ్య విషయాలపై గణాంకాలను ఒక తాజా అధ్యయనం మొట్టమొదటి సారి వెలుగులోకి తెచ్చింది. ‘కౌన్సెల్ ఆన్ ఎనర్జీ, ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్ (సీఈఈడబ్ల్యూ) అనే స్వతంత్ర పరిశోధనా సంస్థ ఈ అధ్యయనం చేసింది. దేశంలోని 91% ఆవులు, గేదెల పెంపకం జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ సహా 15 రాష్ట్రాల్లో 7,350 మంది రైతులను అడిగిన వివరాలను విశ్లేషించి అధ్యయన నివేదికను సీఈఈడబ్ల్యూ వెలువరించింది. మన దేశంలో పశుపోషకుల స్థితిగతులపై జరిగిన తొలి విస్తృత స్థాయి అధ్యయనం ఇదే కావటం విశేషం.పాడి రైతుల్లో 80% వీరే పాడి రైతుల్లో 80% 1–2 ఆవులనో గేదెలనో పెంచుకునే చిన్న, సన్నకారు రైతులే. దక్షిణాదిలో సంకరజాతి ఆవులు, ఉత్తరాదిలో గేదెలపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. పంజాబ్, హరియాణాలోని అధికంగా పాలిచ్చే గేదెలు, ఆవులను అధిక సంఖ్యలో పెంచే సాంద్ర పెంపకం పద్ధతి (ఇంటెన్సివ్ సిస్టమ్) అమల్లో ఉంది. మహారాష్ట్రలో పాలతో పాటు పశువులను వ్యవసాయంలో, రవాణా కోసం వాడుకునే పరిస్థితులున్నాయి. తూర్పు రాష్ట్రాల్లో పశువుల యాజమాన్యాన్ని సామాజిక–సాంస్కృతిక అంశాలు బలంగా ప్రభావితం చేస్తున్నాయి. అధ్యయనం చేసిన 15 రాష్ట్రాల్లోని 9 రాష్ట్రాల్లో సగం కంటే తక్కువ మంది పశుపోషకులు తాము పాల అమ్మకం ఆదాయంపై ఆధారపడి ఉన్నామన్నారు. దేశవ్యాప్తంగా పశువుల పెంపకందారుల్లో దాదాపు 38 శాతం (సుమారు 3 కోట్లు) రైతు కుటుంబాలకు పశువుల పెంపకానికి పాల అమ్మకమే ప్రేరణ కాదు. వీరి ఇళ్లలో చాలా వరకు సాధారణంగా 1–2 దేశీయ జాతుల ఆవులు ఉంటాయి. ఇంట్లో వారి అవసరాల కోసం పోషకాలతో కూడిన పాల కోసం, ప్రకృతి/సేంద్రియ వ్యవసాయానికి పేడ, మూత్రం కోసం, వ్యవసాయ పనుల్లో ఎద్దుల కోసం వీరు పశువులు పెంచుకుంటున్నారు. ముఖ్యంగా సమీకృత వ్యవసాయంలో దేశీయ పశువుల పాత్ర ఈ రాష్ట్రాల్లో ఎక్కువగా కనిపించింది. మహారాష్ట్ర, కర్ణాటకలలో పాడి పరిశ్రమ విస్తరించి ఉన్నప్పటికీ, ఈ రాష్ట్రాల్లో 30 శాతం కంటే ఎక్కువ మంది పశుపెంపకందారులు పాలకు ప్రాధాన్యం ఇవ్వటం లేదని అధ్యయనం తెలిపింది. 1–2 దేశీయ పశువులను పెంచే రైతుల్లో ఈ ధోరణులు సర్వసాధారణం. హిమాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, అస్సాంలలో, 15 శాతం కంటే ఎక్కువ మంది రైతులు సామాజిక–సాంస్కృతిక లేదా మతపరమైన అంశాల ప్రేరణతో పశువులను పెంచుతున్నట్లు చె΄్పారు.42%లో బలమైన ఆసక్తిదేశవ్యాప్తంగా దాదాపు 42 శాతం మంది పశు పెంపకందారులు మరిన్ని ఆవులు/ గేదెలను కొని పెంచాలన్న ఆకాంక్షతో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇది 46%. అంతేకాకుండా, తమ కుటుంబంలోని భవిష్యత్ తరాలకు పశువుల పెంపకంపై ఆసక్తి ఉందని దేశంలో 39 శాతం రైతులు చెబితే, ఆసక్తి ఉండే అవకాశం ఉందని మరో 35 శాతం చె΄్పారు. కేవలం 9 శాతం మంది మాత్రమే తమ వారసులకు పశువుల పెంపకంపై ఆసక్తి చూపబోరన్నారు. అయితే, ఆంధ్రప్రదేశ్‌లో వారసుల్లో 30%కు మాత్రమే ఆసక్తి ఉంటుందన్నారు. 45% మంది తెలియదన్నారు.వేడి ఒత్తిడి ఇక్కట్లు ఉష్ణోగ్రతలు గత మూడేళ్లుగా అతిగా పెరుగుతున్నాయి. వాతావరణ ఒత్తిళ్లు పశువులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని పశువుల పెంపకందారులు వాపోతున్నారు. రాబోయే 5 దశాబ్దాలలో వాతావరణ ఒత్తిడి గోవుల ఉత్పాదకతను దాదాపు 25 శాతం తగ్గిస్తుందని అంచనా. ఇప్పటికే, 54 శాతం గేదెల పెంపకందారులు, 50 శాతం సంకరజాతి ఆవుల పెంపకందారులు, 41 శాతం దేశీ ఆవుల పెంపకందారులు తమ పశువులకు వాతావరణ సంబంధిత ఇబ్బందులు పెరిగాయని చె΄్పారు. 33 శాతం రైతులు తమ పశువులు ఎక్కువగా జబ్బుపడుతున్నాయని, చనిపోతున్నాయని చె΄్పారు. అలాగే 20 శాతం రైతులు ఎండ దెబ్బకు పశువులు నిస్సత్తువగా ఉంటున్నాయన్నారు. గేదెలు, సంకరజాతి ఆవులపై వాతావరణ మార్పు ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు రైతులు గుర్తించారు. స్వదేశీ జాతి ఆవులు వాతావరణంలో హెచ్చుతగ్గుల్ని మెరుగ్గా తట్టుకోగలుగుతున్నాయని రైతులు తెలిపారు. వాణిజ్యస్థాయిలో పాడి పరిశ్రమను విస్తరింపజేయదలచిన రైతులు గేదెలు, సంకరజాతి ఆవుల వైపే దృష్టి సారిస్తున్నారు. తద్వారా వాతావరణ మార్పుల సెగ పాడి రైతులకు మున్ముందు పెరుగుతుందని చెప్పుకోవచ్చు.ప్రభుత్వం కదలాలివాతావరణ మార్పుల్ని తట్టుకొనే మెళకువలపై రైతుల్లో చైతన్యం కలిగించేందుకు ప్రభుత్వం కృషి చెయ్యాలని సీఈఈడబ్ల్యూ అధ్యయన నివేదికలో సూచించింది. గేదెలు వేడి ఒత్తిడిని తట్టుకోలేవు కాబట్టి రైతులు తగిన యాజమాన్య పద్ధతులు పాటించాలి. ఆయా రాష్ట్రాల్లో పరిస్థితులకు అనుగుణంగా వేడి ఒత్తిడిని తట్టుకునే దేశీ బ్రీడ్స్‌ను ప్రోత్సహించాలి. సంకరజాతి ఆవులు, గేదెల పెంపకం చేపట్టే రైతులకు షేడ్‌నెట్స్, నీటి స్ప్రింక్లర్లు వంటి ప్రత్యేకమైన శీతల సదుపాయాలు కల్పించాలి. పశుబీమా ప్రీమియం తగ్గించాలి. బీమా ప్రక్రియను సులభతరం చెయ్యాలి. క్లెయిమ్‌లను సత్వరం పరిష్కరించాలి. తద్వారా వాతావరణ మార్పులను తట్టుకునేలా పాడి రైతులకు రక్షణ కల్పించాలి. పాడి పరిశ్రమకు సవాళ్లెన్నో..దాణా, పశుగ్రాసాలను సరసమైన ధరకు పొందటమే పశు పెంపకందారులకు అతిపెద్ద సవాలు. దేశంలోని నలుగురిలో దాదాపు ముగ్గురు పశువుల పెంపకందారులు మేత, పశుగ్రాసానికి సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటున్నట్లు చె΄్పారు. పచ్చి, ఎండు గడ్డి ఆ ప్రాంతంలో అవసరానికి మించి ఉన్నప్పటికీ అందుబాటు ధరలో దొరక్కపోవటం పాడి రైతులకు ఆందోళన కలిగిస్తోంది. పచ్చిక బయళ్ల విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోవటం చాలా రాష్ట్రాల్లో రైతులకు సమస్యగా మారింది. ఈ కొరత తీర్చే సైలేజ్ గడ్డి గురించి 80% మందికి తెలియదు. 25% మంది రైతులు అరకొర పశువైద్య సేవలు, అధిక చికిత్స ఖర్చులతో సతమతమవుతున్నారు. సగం మంది రైతులు తమ పశువులకు కృత్రిమ గర్భధారణ చేయిస్తున్నారు. ఆడ దూడలనే పుట్టించే సాంకేతికత గురించి 25% మందికి మాత్రమే తెలుసు.తెలంగాణ రెండో దేశీ విత్తన పండుగరంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం అన్మాస్పల్లిలోని ఎర్త్ సెంటర్లో ఫిబ్రవరి 6,7,8 తేదీల్లో తెలంగాణ రెండో దేశీ విత్తన పండుగ జరగనుంది. వాతావరణ మార్పుల నేపథ్యంలో భవిష్యత్ వ్యవసాయాన్ని నిలబెట్టుకోవటానికి దేశీ వంగడాల పరిరక్షణ అత్యంత ముఖ్యమన్న నినాదంతో కౌన్సెల్ ఫర్ గ్రీన్ రెవెల్యూషన్, భారత్ బీజ్ స్వరాజ్ మంచ్ సంయుక్తంగా ఈ విత్తన పండుగను నిర్వహిస్తున్నాయి. దేశవ్యాప్తంగా దేశీ విత్తన పరిరక్షకులు, రైతులు, విద్యార్థులు పాల్గొంటారు. మూడు రోజులూ రైతులు, శాస్త్రవేత్తలు, విత్తన పరిరక్షకులతో ప్రత్యేక చర్చాగోష్టులు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. ఇతర వివరాలకు.. 96769 57000. -
ప్రపంచంలోనే తొలి త్రీవే హైబ్రీడ్ సజ్జ
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి/సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో ఉన్న అం ర్జాతీయ పరిశోధన సంస్థ ఇక్రిసాట్ ప్రపంచం కోనే మొట్టమొదటి త్రీవే హైబ్రీడ్ సజ్జ రకం. రాచీ 273ని అభివృద్ధి చేసింది. ఈ చిరు కాన్యం కరువు పీడిత ప్రాంతాల్లో 400 ఏ.మీ.ల లోటు వర్షపాతాన్ని సైతం తట్టుకుని అధిక దిగుబడి ఇస్తుంది. అత్యంత కరువు పరిస్థి టలుండే ఉష్ణ మండలాల్లో పంటలు సాగు చేసే తులకు ఇలాంటి హైబ్రీడ్ రకం ఎంతో ప్రయో నకరంగా ఉంటుందని ఇక్రిసాట్ మంగళ కారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపిం ). ఐసీఏఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రిక రల్ రీసెర్చ్). ఆర్ఎఏఆర్ ఐ (రాజస్థాన్ వ్యవసాయ పరిశోధన సంస్థ)ల సహకారంతో ఈ సజ్జ విత్తనాలను అభివృద్ధి చేసినట్లు తెలిపారు. సాధారణంగా ద్విముఖ సంకర జాతితో రూపొందే సజ్జల కంటే భిన్నంగా, త్రిముఖ జాతి లక్షణాలను కలబోసిన సంకర జాతి కావ డం దీని ప్రత్యేకత. అధిక దిగుబడి, ఎండ సహనశక్తి, మంచి మేత నాణ్యత వంటి లక్ష ణాలు ఒకేసారి లభిస్తాయని శాస్త్రవేత్తలు తెలిపారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఇటీవల విడుదల చేసినట్లు ప్రక టించిన వాటిల్లో ఆరోచీ 273 ఒకటి. రాజ స్థాన్, గుజరాత్, హరియాణా రాష్ట్రాల్లోని అత్యంత లోటు వర్షపాతాలు ఉండే 30 ప్రదే శాల్లో 3 సంవత్సరాలుగా ఈ రకాన్ని పరీక్షలు చేసింది. ఇది హెక్టారుకు 2,230 కిలోల దిగు బడిని ఇచ్చినట్లు తెలిపింది. ప్రాంతీయ రకాల కంటే సుమారు 13 నుంచి 27% అధిక దిగుబడి ఇచ్చినట్లు గుర్తించింది. డౌనీ బూజు, బ్లాస్ట్, స్మట్ వంటి కీలక వ్యాధి నిరోధకత కూడా ఈ రకం అందిపుచ్చుకున్నట్లు తెలిపింది. పశు గ్రాసం కొరతకు కూడా ఈ రకం పరిష్కారం చూపుతుందని భావిస్తున్నారు. ఆసియా, ఆఫ్రి కాల్లోని కరువు పీడిత ప్రాంతాలకు చిరుధా న్యాలు ప్రధాన జీవనాధారం. ముఖ్యంగా సజ్జలు అధిక ఉష్ణోగ్రతలను, తక్కువ నీటి లభ్య తను తట్టుకోగల సామర్ధ్యానికి ప్రసిద్ధి చెం దాయని ఐక్రిశాట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ హిమాన్షు పాఠక్ పేర్కొన్నారు. ప్రపంచంలోనే తొలి త్రీ వే సజ్జ రకం ఇక్రిసాట్ పరిశోధనల్లో మరో మెలురాయిగా నిలుస్తుందని అన్నారు. -
ఈ మొక్కే ఒక ఎరువుల ఫ్యాక్టరీ!
రైతును ఎటువంటి ఎరువూ అడగకపోగా.. తనే పోషకాల పంట పండించి ఇచ్చే అత్యంత అరుదైన, ఎన్నో సుగుణాలున్న అద్భుతమైన మొక్క ‘కాంఫ్రే’. బోరేజ్ కుటుంబం. సింఫిటమ్ జాతి. యూరప్, ఆసియాలకు చెందినది. ఆ ప్రాంతం అంతటా 40 జాతులు నమోదయ్యాయి. ఇంగ్లండ్‌లో దీనిపై ఇద్దరు వ్యక్తులు విస్తృతంగా పరిశోధనలు చేశారు.రెండు అడవి కాంఫ్రే జాతుల సంకరంతో ‘రష్యన్ కాంఫ్రే’ (సింఫిటమ్ అప్లాండికమ్) హైబ్రిడ్‡జాతి రూపొందింది. ఈ మొక్కల విశిష్ట ప్రయోజనాలను తొలుత గుర్తించిన వ్యక్తి హెన్రీ డబుల్డే (1810–1902). అతను ఈ మొక్కను ఆహారం, పశువులు, కోళ్ల మేత పంటగా విస్తృతంగా ప్రచారం చేశారు. ఆయన తర్వాత లారెన్స్ డి హిల్స్ (1911–1991) ఆ కృషిని కొనసాగించారు. 1950వ దశకంలో ఇంగ్లండ్‌లోని బోకింగ్ అనే గ్రామంలో కాంఫ్రే పరిశోధన కేంద్రంలో 21 రకాల కాంఫ్రే జాతులపై హిల్స్ ప్రయోగాలు చేశారు. పోషకాలు అధికంగా ఉండే మేలైన రకాన్ని గుర్తించి ’బోకింగ్ 14 కాంఫ్రే’ అని పేరు పెట్టారు. ఎన్పీకే ఎరువులతో కూడిన ఆకులుచిన్న దుంప తెచ్చి ఒక్కసారి నాటితే చాలు.. కనీసం పదేళ్లు వేగవంతంగా పెరుగుతూ ముఖ్యమైన పోషకాలతో కూడిన ఆకులను ‘కాంఫ్రే’ మొక్క నిరంతరాయంగా ఉత్పత్తి చేస్తూనే ఉంటుంది. కాంఫ్రే ఆకుల్లో నత్రజని, ఫాస్ఫరస్, ఫాస్ఫేట్ (ఎన్పీకే ఎరువులు) పుష్కలంగా ఉండటం విశేషం. ఈ మొక్క పెద్ద మొత్తంలో ఆకులను ఉత్పత్తి చేస్తుంది. 20–25 రోజులకోసారి పోషకాలతో నిండిన ఆకులు కోతకు వస్తూనే ఉంటాయి. కోసిన ప్రతిసారీ మొక్క మళ్లీ వేగంగా పెరుగుతుంది. అందుకే దీన్ని ‘డైనమిక్ న్యూట్రియంట్ ఎక్యుములేటర్’ అని పిలుస్తారు. మల్చింగ్ పచ్చిరొట్ట ఉత్పత్తికి ఇది అద్భుతమైన వనరు.ఇదీ చదవండి: మంచులో రీల్స్..క్షణం ఆలస్యమై ఉంటే.. వైరల్ వీడియో16–18 సార్లు ఆకుల కోతమొక్కలకు ఎంత బాగా నీరు పోసి పోషిస్తారు అనే దానిపై ఆధారపడి సంవత్సరానికి 16 నుంచి 18 సార్లు కత్తిరించవచ్చని కాంఫ్రే మొక్కల పెంపకంలో అనేక దశాబ్దాల అనుభవం గల ప్రముఖ పర్మాకల్చరిస్టులు కొప్పుల నరసన్న, పద్మ ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు. తోటల్లో ప్రతి పండ్ల చెట్టు పక్కన ఈ మొక్క నాటితే చాలన్నారు. కాంఫ్రే వేర్లను కొన్ని అడుగుల లోతు వరకు చొప్పిస్తుంది. రెండు మీటర్ల లోతు వరకు దీని వేర్లు వెళ్తాయట. ఇతర మొక్కలకు అందనంత లోతు నుంచి పోషకాలు కాంఫ్రే ఆకుల ద్వారా నేలపైకి వస్తాయి. ఈ ఆకులను మల్చింగ్గా వేయటం లేదా కంపోస్టుగా మార్చి పంటలకు వేయటం ద్వారా ఆ పోషకాలు ఇతర పంటలకు అందించవచ్చు. కాంఫ్రే ఆకులను పొడి చేసి కూరగాయ మొక్కలు, పండ్ల చెట్లకు వేయొచ్చు. పచ్చి ఆకులను నేరుగా ఆచ్ఛాదనగా వేసుకోవచ్చు లేదా కాంఫ్రే ఆకులను తరిగి నీటిలో అనేక వారాల పాటు ఊడబెట్టి ద్రావణాన్ని తయారు చేసి వాడుకోవచ్చు.ఎండ, నీడ, నీరు ఉండాలిఏ రకమైన నేలల్లో అయినా కాంఫ్రే పెరుగుతుంది. అయితే, తేమ ఆరిపోకుండా ఉండే సారవంతమైన నేలలకు అనువైనది. పీహెచ్ 6.5–8.5 మధ్య ఉండాలి. 6–7 మధ్య పీహెచ్ ఉన్న నేలల్లో ఇది బాగా పెరుగుతుందని చెబుతున్నారు. మన ఉష్ణమండలంలో ఇది పెరగాలంటే పాక్షికంగా చెట్టు నీడ అవసరం. కొంతసేపు ఎండ కూడా అవసరమే. అదేమాదిరిగా నీటి తేమ నిరంతరం ఉండేలా చూసుకోవాలి అని నరసన్న, పద్మ తెలిపారు. కూరగాయ తోటలు, పండ్ల తోటలు, కలప తోటల్లో సాళ్ల మధ్య కాంఫ్రేని నాటుకోవచ్చు. నీటి ఎద్దడిని తట్టుకునే కాంఫ్రే వంగడాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. వాటిని గుర్తించి మన దేశంలోకి దిగుమతి చేసి, రైతులకు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవటం ఉపయోగకరం.పశుగ్రాసంగానూ పనికొస్తుంది కాంఫ్రే ఆకులను పశుగ్రాసంగా సుదీర్ఘ కాలంగా ఉపయోగిస్తున్నారు. లారెన్స్ డి హిల్స్ ఈ అంశంపై పుస్తకాలు రాశారు. తాజా ఆకులను పందులు, గొర్రెలు, కోళ్లు ఇష్టంగా తింటాయి. కానీ పశువులు, కుందేళ్ళు, గుర్రాలు వాడిపోయిన ఆకులను మాత్రమే తింటాయని హిల్స్ పేర్కొన్నారు. ఈ మొక్కకు గంట ఆకారంలో పువ్వులు పూస్తాయి. అనేక జాతుల తేనెటీగలు, కందిరీగలు, సాలె పురుగులు ఇతర మిత్ర పురుగులకు ఈ మొక్కలు ఆవాసం కల్పిస్తాయి. బూజు తెగులును నివారించడానికి కాంఫ్రే ఆకుల ద్రావణాన్ని ఉపయోగించవచ్చని పరిశోధన సూచిస్తుంది. ఇంగ్లండ్‌లో ఒక పర్మాకల్చరిస్టు అంచనా ప్రకారం.. అక్కడి వాతావరణంలో మొక్కకు 5.5 కిలోల బరువైన ఆకులను ఒక ఏడాదిలో కోసుకోవచ్చు. 10 మీటర్ల పొడవు 4 అడుగుల వెడల్పు గల ఎత్తు మడిలో అడుగు– అడుగున్నర దూరంలో 52 మొక్కలు వేస్తే ఏడాదిలో 286 కిలోల ఆకు వస్తుంది. ఈ ఆకు ద్వారా పొటాషియం 2.08 కిలోలు, నత్రజని 104 కిలోలు సమకూరుతుందని అంచనా. వాతావరణాన్ని బట్టి, నేల సారాన్ని బట్టి ఇది మారుతుంది. విరిగిన ఎముకలను కట్టుకునేలా చేసే ఔషధ గుణాలు కాంఫ్రే ఆకుల్లో ఉన్నాయి. ఈ ఆకులను మనుషులు కూడా గతంలో తినేవారు. నొప్పులు తగ్గుతాయని కషాయం తాగేవారు. అయితే, లివర్‌పై దుష్ప్రభావం ఉంటుందని 20 ఏళ్ల క్రితం పరిశోధనల్లో తేలింది.ఇదీ చదవండి: తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం : ఆ కాఫ్ సిరప్ బ్యాన్అత్యంత అరుదైన మొక్క కాంఫ్రేకాంఫ్రే అరుదైన అద్భుత మొక్క. భూసారం పెంపొందించటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. కోళ్లు ఈ ఆకులను ఇష్టంగా తింటాయి. విరిగిన ఎముకలను కట్టించటానికి కూడా ఇది ఉపయోగమే. చలి దేశాల నుంచి తీసుకొచ్చి 1987 నుంచి కాంఫ్రే మొక్కలను గత ఏడాది వరకు పెంచాం. ఆదిలాబాద్ దగ్గర మా పొలంలో ఒక ఎకరంలో పూర్తిగా కాంఫ్రే ఉండేది. మన వాతావరణానికి ఈ మొక్క అలవాటు పడింది. చాలామంది రైతులకు ఇచ్చాం. చాలామంది రైతులకు ఇచ్చాం. అయితే, మేం వేరే పనిలో ఉండి ఒక సంవత్సరం అంతగా శ్రద్ధ పెట్టలేదు. మొక్కలన్నీ చనిపోయాయి. కాంఫ్రే మొక్కల ఆకులు నేలపై మల్చింగ్ చేసేవాళ్లం. ఆకులతో ద్రావణం తయారు చేసి కూరగాయలు, పండ్ల చెట్ల పోషణ కోసం వాడేవాళ్లం. కంపోస్టులో వాడేవాళ్లం. 6–7 అంగుళాల ఎత్తు పెరుగుతుంది. ఏడాదికి 16–18 సార్లు ఆకులను కత్తిరించి వాడుకోవచ్చు. అల్లం మాదిరిగా దీనికి పాక్షికంగా ఎండ, నీడ కావాలి. నీరు రోజూ ఇవ్వాలి. పావెకరంలో 500 మొక్కలు పెట్టొచ్చు. పండ్ల చెట్లకు పక్కనే పెరుగుతూ పోషకాలు అందించే నర్స్ ప్లాంట్‌గా కాంఫ్రే పనికొస్తుంది. ఆకు గరుకుగా నూగుతో కూడి ఉండటం వల్ల అతి త్వరగా 3 రోజుల్లోనే కుళ్లి మట్టిలో కలిసిపోతుంది. మనుషులకే కాదు పశువులకూ బోన్‌సెట్టర్‌గా ఉపయోగపడుతుంది. వ్యవసాయా నికి, పశుపోషణకు ఎన్నో విధాలుగా ఉపయోగపడే ఈ మొక్కలను ప్రభుత్వం ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ వంటి దేశాల నుంచి తెప్పించాలి. మన వాతావరణానికి సరిపడే కాంఫ్రే జాతులను దిగుమతి చేసుకొని రైతులకు అందించాలి. మన దేశంలో కూడా ఇటువంటి లక్షణాలున్న మొక్కలు ఉండే ఉంటాయి. మన శాస్త్రవేత్తలు పరిశోధించాలి. చేపలు ఇవ్వటం కన్నా చేపలు పట్టటం నేర్పితే ఎక్కువ మేలు జరుగుతుందన్నది నానుడి. అదే విధంగా రసాయనిక ఎరువులను రైతులకు ఇవ్వటానికి బదులు ‘ఎరువుల ఫ్యాక్టరీ’ వంటి అద్భుత మొక్కలను రైతులకు ఇస్తే ఎంతో మేలు జరుగుతుందంటున్నారు నిపుణులు. ఆ విదేశీ మొక్క పేరే ‘కాంఫ్రే’! చిన్న దుంప తెచ్చి ఒక్కసారి నాటితే చాలు.. కనీసం పదేళ్లు వేగవంతంగా పెరుగుతూ ఎన్పీకే ఎరువులతో కూడిన ఆకులను ‘కాంఫ్రే’ మొక్క నిరంతరాయంగా ఉత్పత్తి చేస్తూనే ఉంటుంది. ఆకులు 20–25 రోజులకోసారి కోతకు వస్తూనే ఉంటాయి. అందుకే దీన్ని ‘డైనమిక్ న్యూట్రియంట్ ఎక్యుములేటర్’ అంటారు పంటలు, పండ్ల తోటల్లో గడ్డి పెరగకుండా పోషకాలను పండించే కవర్ క్రాప్‌గా పెంచుకోవచ్చు. ఆకులు కోసి ఆచ్ఛాదనగా వెయ్యొచ్చు. ఆకులను ఊరబెట్టి ద్రావణాన్ని గ్రోత్ ప్రమోటర్‌గా వాడొచ్చుపశువులకు, కోళ్లకు, పందులకు పోషకవంతమైన మేతగానూ కాంఫ్రే ఆకులు ఉపయోగపడతాయి జహీరాబాద్‌కు చెందిన పర్మాకల్చరిస్టులు నర్సన్న, పద్మకు ‘కాంఫ్రే’ సాగులో అనుభవం ఉంది కాంఫ్రే మొక్కల నుంచి ఏడాదికి 16–18 సార్లు ఆకులు కోసుకోవచ్చన్నారు ప్రభుత్వం రసాయనిక ఎరువులకు బదులు అద్భుతమైన ఈ మొక్కను ఇంగ్లండ్/ ఆస్ట్రేలియా నుంచి తెప్పించి ఇస్తే మేలని సూచిస్తున్నారు– కొప్పుల నరసన్న, పద్మ, సహ వ్యవస్థాపకులు, అరణ్య శాశ్వత వ్యవసాయ సంస్థ, జహీరాబాద్ మొబైల్: 94408 26722 -
Sagubadi: హోమియోతో చీడపీడలకు చెక్!
వరి, మిరప వంటి పంటలతో పాటు మామిడి తదితర పండ్ల తోటల్లోనూ పురుగులు, తెగుళ్ల యాజమాన్యానికి హోమియో మందులు అత్యంత ప్రభావశీలంగా పనిచేస్తున్నాయని ఈ రంగంలో పదిహేనేళ్లుగా విశేష కృషి చేస్తున్న ప్రముఖ రైతు శాస్త్రవేత్త, అమేయ కృషి వికాస కేంద్రం వ్యవస్థాపకులు జిట్టా బాల్‌రెడ్డి ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు. తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా రామకృష్ణాపురంలోని తన పరిశోధనా క్షేత్రంలో అగ్రి హోమియోపతిపై బాల్‌రెడ్డి పరిశోధనలు కొనసాగిస్తున్నారు. తొలుత తన క్షేత్రంలో వాడి, మంచి ఫలితాలు కనిపించిన తర్వాత ఆయన ఈ మందులను రైతులకు సూచిస్తున్నారు. ఈ విషయాలను ఎప్పటికప్పుడు రైతులకు తెలియజెప్పే లక్ష్యంతో ‘అమేయ కృషి వికాస కేంద్రం’ పేరిట యూట్యూబ్ చానల్ ద్వారా వీడియోలను కూడా ఆయన రైతులకు అందుబాటులోకి తెస్తున్నారు. హోమియో మందులతో వ్యవసాయంపై ఆయన ‘సాక్షి సాగుబడి’తో చెప్పిన వివరాలు ఆయన మాటల్లోనే..మిరపలో చీడపీడలకు హోమియో మందులునల్లపేను (వెస్ట్రన్ బ్లాక్ త్రిప్స్)– ఆర్నేరియా డయాడెమా 30; రింగ్ స్పాట్ వైరస్ (బొబ్బర) – నెట్రమ్ సాలిసికమ్ 30, సాలిసిక్ ఆసిడ్ 30; ఎల్లో మొజాయిక్ వైరస్– జింజింబర్ 30, వాలెరినా 30; బూడిద తెగులు, కొమ్మెండు తెగులు– కూప్రమ్ మెటాలికమ్ 30; వేరుకుళ్లు, కాయకుళ్లు, కాండంకుళ్లు– బావిస్టా 30; తెల్లదోమ, పచ్చదోమ– కోక్సినెల్లా 30, సోరినమ్ 30; తుప్పు తెగులు, కాయ మచ్చ– బెల్లడోనా 30, కాల్కేరియాకార్బ్ 30; మెగ్నీషియం లోపం– మ్యాగ్ఫాస్ 30; జింక్ లోప నివారణ– జింకమ్మేట్ 30; బోరాన్ లోప నివారణ– బోరాన్ 30; లద్దె పురుగు– నక్స్‌వామికా 30, అజారిక్టా ఇండికా 30; తెల్ల లద్దె పురుగు, జపానీస్ బీటిల్– తూజా 30; పూత రాలటం– బావిస్టా 30; పూతరాలటం, వాతావరణ మార్పు– పెర్రంమేట్ 30; ఎదుగుదల లోపం, గిడసబారటం– కార్బోవెజ్ 30; దెబ్బతిన్న పంట కోలుకోవడానికి– బయోవేరా డిప్యూజా 30; పూత రాలకుండా– సికిల్ కార్ 30; పూత రావడానికి– అస్పగరిస్ 30 మందులను పిచికారీ చేసుకోవాలి.మామిడిమామిడి పూత రావటానికి – కాలి నైట్రికం 30, పల్సటిల్ల 30; పిందె రాలిపోకుండా – బావిస్టా 30; పచ్చదోమ/తెల్లదోమ నివారణకు – కోక్సినెల్లా 30, సోరినం 30 లేదా కోక్సినెల్లా 30, సల్ఫర్ 30 లేదా సోరినం 30, సల్ఫర్ 30; కాయ పెరుగుదలకు, తీపికి – ఆక్సాలిక్ ఆసిడ్ 30; సూటి మోల్డ్– సోరినం 30; బ్యాక్టీరియా మంగు– నాట్రం సాలిసికం 30, సాలిసిక్ ఆసిడ్ 30; పిందె దశలో త్రిప్స్, మైట్స్ నియంత్రణకు– తూజ 30; కాయకు కవరు కట్టే ముందు– సల్ఫర్ 30, సోరినం 30 వేర్వేరుగా పిచికారీ చేయాలి.కొబ్బరి కొబ్బరిలో కాపు తెప్పించటానికి, కాయ రాలకుండా నిలబెట్టుకోవటానికి రెండు కొత్త హోమియో మందులను తయారు చేసుకొని వాడాం. పూతలో 3 వంతుల కాపును నిలబెట్టుకున్నాం. కొబ్బరి చెట్లకు రెండు రకాల మందులు వాడుకోవాలి. గెలలు రావటానికి ఒకటి, కాయలు రాలకుండా కాపాడుకోవటానికి మరొకటి వేర్వేరుగా వాడుకోవాలి. 30 లీటర్ల నీటిలో 30 ఎం.ఎల్. మందు కలిపి వాడాలి. గడ్డపారతో చెట్టు చుట్టూ 4,5 నేలలో బొరియలు చేసి, వాటిలో పోయాలి. పది రోజులకోసారి వరుసగా 3 నెలలు వాడితే మంచి ఫలితం వస్తుంది. 6 నెలల తర్వాత మళ్లీ ఇవ్వొచ్చు. ఈ రెండు మందులు బయట దొరకవు. వీటితోపాటు 15 రోజులకోసారి పేడ ద్రావణం కూడా పోస్తున్నాం. తెల్లదోమ నివారణకు కోక్సినెల్లా 30, రెండు రోజులకు సల్ఫర్ 30, వారంలోగా సెమ్సిఫోగా 30, సల్ఫర్ 30 పిచికారీ చేసుకోవాలి.నత్తల నివారణకు..అధిక వర్షాల నేపథ్యంలో వరి, అనేక కూరగాయలు, బొప్పాయి తదితర పండ్ల తోటలకు కూడా ఆఫ్రికా నత్త బెడద ఏర్పడింది. నత్తల నివారణకు 20 లీటర్ల నీటిలో 2.5 ఎం.ఎల్. హెలిక్స్ టోస్టా 30 మందును కలిపి పిచికారీ చెయ్యాలి. ఒక స్ప్రే సరిపోతుంది. మరీ అవసరమైతే 10 రోజుల తర్వాత మరోసారి పిచికారీ చేస్తే చాలు.వరి20 లీటర్ల నీటిలో 2.5 ఎం.ఎల్. శైలీషియా 30 మందును కలిపి వరి విత్తన శుద్ధి చేసుకొని ఆరబెట్టిన తర్వాత మైకోరైజా పట్టించి మండె కట్టి నారు పోసుకోవాలి. ఇనుప ధాతువు లోప నివారణకు– ఫెర్రంమెట్ 30; నారు ఎర్రబారినప్పుడు– కార్బొవెజ్ 30; నాటేసిన మొక్క నిలదొక్కుకోవటానికి కాలెండుల్లా 30; వేరుకుళ్లుకు– బావిస్ట 30; మొగి పురుగు, తెల్లకంకి నివారణకు– నాటేసిన 20 రోజులకు ఒకసారి, చిరుపొట్ట దశలో మరోసారి తూజ 30; పాముపొడ, పచ్చ పురుగు– నక్స్ వామిక 30; దోమపోటు– కోక్సినెల్ల 30 ( మరీ అవసరమైతే సింసిఫ్యూగ 30, సోరినమ్ 30 వేర్వేరుగా వాడాలి); పోషకాల లోపనివారణ– పేడ ద్రావణం, డీఏపీకి బదులు– అమ్మోనియా ఫాస్ 30, యూరియాకు బదులు– యూరియా పోరిక 30; పొటాష్కోసం– కాలిమూర్ 30; జింక్ లోప నివారణకు– జింకం మేట్ 30; స్మట్ – తూజా 30, అగ్గితెగులు–బెల్లడోనా 30, కాల్కేరియా కార్బ్ 30 పిచికారీ చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి.పంటలకు హోమియో మందులను 30కన్నా తక్కువ పొటెన్సీలోనే వాడాలిద్రవ రూప హోమియో మందులు ప్రత్యేక హోమియో దుకాణాలలో లభిస్తాయి. ఒకే హోమియో మందు అనేక పొటెన్సీలలో అందుబాటులో ఉంటుంది. పంటలకు సూచించిన హోమియో మందులను 6 లేదా 12 లేదా 30 పొటెన్సీ కలిగినవి మాత్రమే వాడుకోవాలి. 6 లేదా 12 పొటెన్సీలు అందుబాటులో లేనప్పుడు 30 పొటెన్సీ హోమియో మందులు వాడుకోవటం ఉత్తమం. అంతకన్నా ఎక్కువ పొటెన్సీ గల మందులు వాడకూడదు. అవసరం కూడా లేదు. హోమియో మందులు ఏ రెంటినీ కలిపి చల్లకూడదు. దేనికి దానికే వాడుకోవాలి. మోతాదు కూడా 20 లీటర్ల ట్యాంకుకు 2.5 ఎం.ఎల్. మాత్రమే వాడాలి. అంతకు మించి వాడితే దుష్ఫలితాలు వస్తాయి. హోమియో మందుల వల్ల సాధారణంగా ఎటువంటి దుష్ఫలితాలు రావటం ఉండదు. ఇతర వివరాలకు నా యూట్యూబ్ చానల్ అఝ్ఛy్చ జుటజీటజిజీ Vజీజ్చుట్చ జ్ఛుnఛీట్చఝ లో వీడియోలు చూడవచ్చు. పంటలకు హోమియో మందులను కొత్తగా వాడే రైతులు ముందు ఒక ఎకరంలో వాడి చూసుకొని ముందుకు వెళ్లాలని సూచన. 20 లీటర్ల ట్యాంకుకు 2.5 ఎం.ఎల్. మందు చాలుద్రవ రూపంలో ఉండే హోమియో మందులు పంటలపై పిచికారీ చేసుకునేందుకు ప్రత్యేక పద్ధతిని పాటించటం అవసరం. ఒక లీటరు మంచినీటి సీసా తీసుకొని శుభ్రంగా కడిగి, సగానికి నీరు పోయాలి. ఎంపిక చేసుకున్న మందు 2,5 ఎంఎల్‌ను కొలిచి ఆ సీసాలోని నీటిలో కలిపి గట్టిగా మూత బిగించాలి. ఆ తర్వాత సీసాను కిందికి పైకి లెక్కపెట్టి మరీ 50 సార్లు గిలక్కొట్టినట్టు ఉపాలి. ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని 20 లీటర్ల థైవాన్ స్పేయర్ ట్యాంక్‌లో పోసుకొని, నీటిని నింపి పిచికారీ చేయాలి. పురుగు ఉధృతి ఎంత ఎక్కువగా ఉన్నా ట్యాంకుకు 2.5 ఎం.ఎల్. కంటే ఎక్కువ మందు వాడవద్దు. అలా చేస్తే మందు పనిచేయదు. స్ప్రేయర్‌ను పూర్తిగా శుభ్రం చేసిన తర్వాత హోమియో మందుల పిచికారీకి వాడితేనే ఫలితాలు వస్తాయి. వేడి నీటితో కడిగి పైపులు శుభ్రం చేయాలి. వేడి నీటితో శుభ్రం చేసి నీడలో పంపును, స్పేయర్‌ను, బాటిళ్లను ఎప్పటికప్పుడు జాగ్రత్తగా పెట్టుకున్నప్పుడే ఈ మందులు పనిచేస్తాయి. వీలుంటే హోమియో మందును పిచికారీ చేయడానికి ప్రత్యేకంగా ఒక స్ప్రేయర్‌ను వాడుకుంటే మంచిది. సూచించిన మందులను ఒక్కసారి (సింగిల్ డోస్) పిచికారీ చేస్తే చాలు సమస్య పరిష్కారం అవుతుంది. మరీ అవసరమైతే రెండోసారి చాలు. – జిట్టా బాల్‌రెడ్డి, ప్రముఖ రైతు శాస్త్రవేత్త, అమేయ కృషి వికాస కేంద్రం, రామకృష్ణాపురం, యాదాద్రి భువనగిరి జిల్లా -
ప్రకృతి సేద్యం పొలాల్లోంచి వర్సిటీల్లోకి!
ప్రకృతి వ్యవసాయ పద్ధతులను ప్రయోగశీలురైన రైతు శాస్త్రవేత్తలు చాలాకాలంగా ఆచరిస్తూ వస్తున్నారు. సత్ఫలితాలు సాధిస్తున్న ప్రకృతి వ్యవసాయదారుల అనుభవాలను చూసి తోటి రైతులు నేర్చుకుంటూ వచ్చారు. మొదట్లో సంశయించిన ప్రభుత్వమే తదనంతరం ప్రకృతి వ్యవసాయం బహుముఖ ప్రయోజకత్వాన్ని గుర్తించి కొన్నేళ్లుగా ప్రోత్సహిస్తోంది. నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ (ఎన్ఎంఎన్ఎఫ్) కూడా అమల్లోకి వచ్చింది. ఇప్పుడు నియత వ్యవసాయ విద్యలోకి ప్రకృతి వ్యవసాయం చేరింది. దేశంలో 4 యూనివర్సిటీల్లో మాత్రమే ఇప్పుడు ఈ కోర్సులు ఉన్నాయి. మరికొన్ని యూనివర్సిటీల్లో ప్రకృతి వ్యవసాయం ఎలెక్టివ్ సబ్జెక్ట్‌గా ఉంది. ఈ నేపథ్యంలో ప్రకృతి వ్యవసాయంలో బీఎస్సీ, ఎమ్మెస్సీ, పరిశోధన కోర్సులను విధిగా ప్రారంభించాలని సూచిస్తూ భారతీయ వ్యవసా య పరిశోధనా మండలి (ఐసీఏఆర్) డైరెక్టర్ జన రల్ ఎం.ఎల్. జాట్ రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వ హ యాంలో నడుస్తున్న, డీమ్డ్ వ్యవసాయ విశ్వవిద్యా లయాలన్నిటికీ ఇటీవల లేఖ రాశారు. ‘సుస్థిర వ్యవసాయం, రైతుల సంక్షేమం సాధించే క్రమంలో ప్రకృతి వ్యవసాయం జాతీయ ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఆరో డీన్ల కమిటీ సిఫారసులు, జాతీయ విద్యా విధానం 2020 మార్గదర్శకాల ప్రకారం బీఎస్సీ ప్రకృతి సేద్యం కోర్సు పాఠ్యప్రణాళి కను రూపొందించి, ఆమోదించి, అన్ని యూనివర్సిటీలకూ పంపాం. ఇప్పటి కే కొన్ని యూనివర్సిటీలు కోర్సులు ప్రారంభించా యి. మిగతా యూనివర్సిటీలు కూడా వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభిస్తాయని ఆశిస్తు న్నాను’ అని డా. జాట్ పేర్కొన్నారు. రసాయనిక అవశేషాల్లేని ఆహారోత్పత్తులకు ఆదరణ పెరుగుతోంది. విపత్తులను తట్టుకునే వ్యవసాయ పద్ధతులకు, భూమి ఆరోగ్యం పునరు ద్ధరణకు, తక్కువ ఉద్గారాలను వెలువరించే వ్యవ సాయ పద్ధతులకు ఆదరణ పెరుగుతున్నందున ఉన్నత వ్యవసాయ విద్యలో ప్రకృతి సేద్య సంబంధమైన కోర్సుల ప్రాధా న్యం ఏర్పడిందని ఆయన వివరించారు. ప్రకృతి వ్యవసాయ సాంకేతి కతలో నిష్ణాతులైన నవతరం శాస్త్ర వేత్తలు, విస్తరణ సిబ్బంది, ఎంటర్ ప్రెన్యూర్లను తయారు చేసే బృహత్ కార్యంలో విశ్వవిద్యాలయాలన్నీ కీలక పాత్ర పోషిస్తాయని విశ్వసిస్తున్నానని డా. జాట్ పేర్కొ న్నారు. ఈ విషయంలో ఐసీఏఆర్ అన్నివిధాలా సహకారం అందిస్తుందన్నారు. లాభదాయకతే గీటురాయి చెయ్యాలిప్రకృతి వ్యవసాయంలో ఉన్నత విద్యాకోర్సులు ప్రారంభించమని ఐసీఏఆర్ వ్యవసాయ విశ్వవిద్యాలయాలను కోరటం సంతోషదాయకమని ప్రముఖ వ్యవసాయ నిపుణులు డాక్టర్ దేవేంద్ర శర్మ హర్షం వ్యక్తం చేశారు. అయితే, అగ్రికల్చర్ బీఎస్సీ కోర్సు ఆఖరి సంవత్సరం కరిక్యులంలో భాగంగా విద్యార్థులు చేపట్టే ఫీల్డ్ వర్క్‌ను కేవలం లాంఛనప్రాయంగా మిగల్చ కూడదు. ఫీల్డ్ వర్క్‌లో భాగంగా స్వయంగా ప్రకృతి వ్యవసాయం ఆచరించి, అందులో లాభదాయకతను నిరూపించుకున్న విద్యార్థులకు మాత్రమే డిగ్రీని ప్రదానం చెయ్యటం ప్రయోజనకరంగా ఉంటుందని ఆయన సూచించారు. -
ఐదడుగుల అరటి!
తుపాను గాలులకు అరటి చెట్లు విరిగి పడిపోవటం అనేది రైతును ఆర్థికంగా తీవ్రంగా నష్టపరిచే పరిస్థితి. ఈ నష్టాల నుంచి రైతులను ఆదుకునేందుకు ఉపయోగపడే పొట్టి రకం అరటి ‘కావేరి వామన్’ అందుబాటులోకి వచ్చింది. ముంబైలోని భాభా అణు పరిశోధనా కేంద్రం (బార్క్), తిరుచ్చిలోని జాతీయ అరటి పరిశోధనా సంస్థ (ఐసీఏఆర్ – ఎస్ఆర్సీబీ) సంయుక్తంగా ఈ సరికొత్త అరటి రకాన్ని రూపొందించాయి. విస్తారంగా సాగులో ఉన్న గ్రాండ్ నైన్ (జీ9) అరటి చెట్టు ఎత్తు 6–8 అడుగులు. దీని పంట కాలం 11–12 నెలలు. అయితే, గాలులకు ఇది ఒరిగిపోతుంది లేదా విరిగిపోతుంది. ఎత్తుగా పెరుగుతుంది కాబట్టి దీనికి ఊత కర్రలను సైతం రైతులు అమర్చుకోవాల్సి ఉంటుంది. అయితే, జీ9 అరటితోనే ఉత్పరివర్తన వికిరణ పద్ధతిలో పొట్టి అరటి ‘కావేరి వామన్’ రకాన్ని రూపొందించటం విశేషం. ఈ చెట్టు ఎత్తు 4.9 అడుగుల నుంచి 5.25 అడుగులు (150 నుంచి 160 సెం.మీ.. (59–63 అంగుళాల) పెరుగుతుంది. గెల స్థూపాకారంలో ఉంటుంది. మధ్యస్థ ఎత్తు ఉండే గెలలో 8–10 పండ్ల హస్తాలు ఉంటాయి. గెల బరువు 18 నుంచి 25 కిలోల వరకు ఉంటుంది. రైతులు పొలాల్లో అధిక సాంద్రత పద్ధతిలో వాణిజ్య స్థాయిలో సాగు చెయ్యటానికే కాకుండా.. ఇంటిపంటలకు, టెర్రస్ గార్డెనింగ్ చేసే వారికి కూడా సౌలభ్యకరంగా ఉంటుంది.రైతుల జీవనోపాధిని మెరుగుపరచడానికి, దేశ ఆహార/ పౌష్టికాహార భద్రతకు దోహదపడేందుకు ట్రోంబే బనానా మ్యూటెంట్–9 (టీబీఎం–9) పొట్టి అరటి రకాన్ని అభివృద్ధి చేశామని బార్క్ తెలిపింది. టీబీఎం–9నే ఇటీవల భారత ప్రభుత్వం ’కావేరి వామన్’ పేరుతో నోటిఫై చేసింది. కావేరి వామన్ దేశంలోని మొట్టమొదటి మ్యూటెంట్ అరటి రకం మాత్రమే కాదు, బార్క్ అభివృద్ధి చేసి విడుదల చేసిన మొదటి పండ్ల జాతి కూడా కావటం విశేషం. కావేరి వామన్తో బార్క్ విడుదల చేసిన మెరుగైన పంట రకాల సంఖ్య 72కు చేరుకుంది.అయోనైజింగ్ రేడియేషన్ ద్వారా దేశంలో ఉద్యాన పంటల అభివృద్ధిలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చే కృషిలో కావేరి వామన్ విడుదల ఒక ప్రధాన అడుగు అని అణుశక్తి విభాగం కార్యదర్శి, అణుశక్తి కమిషన్ చైర్మన్ డాక్టర్ అజిత్ కుమార్ మొహంతి ప్రశంసించారు.బార్క్ డైరెక్టర్ వివేక్ భాసిన్ మాట్లాడుతూ, స్థిరమైన వ్యవసాయానికి కీలకమైన కొత్త పంట రకాలను అభివృద్ధి చేయడంలో గామా కిరణాల ప్రేరేపిత మ్యూటాజెనిసిస్ కీలక పాత్రను పోషించిందన్నారు. గ్రాండ్ నైన్ అరటిని పండించే రైతులకు కావేరి వామన్ విడుదల ఒక వరం వంటిదన్నారు. బార్క్ రూపొందించిన ఈ కొత్త రకంపై తమిళనాడులోని తిరుచిరాపల్లిలోని నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ బనానా అనేక సంవత్సరాల పాటు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించింది. కఠినమైన క్షేత్రస్థాయి పరీక్షల తర్వాత మాతృరకం అయిన జీ9 రకం కంటే కావేరి వామన్ అనేక మేలైన ఫలితాలనిచ్చిందని శాస్త్రవేత్తలు తెలిపారు. పొడవుగా పెరిగే జీ9 రకం అరటి మొక్కలతో గాలుల తీవ్రత ఉండే ప్రాంతాల్లో రైతులు పెద్ద నష్టాలపాలవుతున్నారు. ఒరిగిపోకుండా, విరిగిపోకుండా చెట్లను కాపాడుకోవటానికి వెదురు లేదా సర్వి బాదులను ఆసరాగా పెడుతూ ఉంటారు. ఇది చాలా ఖర్చుతో కూడిన పని. గాలులకు తట్టుకొని నిలబడే శక్తిగల కావేరి వామన్ కొత్త రకం పొట్టి వంగడంతో ఈ సమస్య తీరిపోతుంది. కావేరి వామన్ చెట్ల గెలలు ఒకటిన్నర నెలల ముందే కోతకు వస్తాయి. దీని అరటి పండు గ్రాండ్ నైన్ రకం అరటి పండ్ల మాదిరిగానే రుచిగా, నాణ్యంగా ఉంటాయి. -
CO2 పెరిగితే.. పోషకాలు తగ్గిపోతాయ్!
గాలిలో అంతకంతకూ పెరుగుతున్న కార్బన్ డయాక్సైడ్ (సీఓ2)కు.. మన ఆహారంలో పోషకాలకు ప్రత్యక్ష సంబంధం ఉందని మీకు తెలుసా? భూతాపం పెరుగుతున్న కొద్దీ మనం రోజూ తినే వరి బియ్యంలో, గోధుమల్లో, ఇంకా చెప్పాలంటే.. జొన్నల్లో కూడా పిండి పదార్థాల శాతం పెరిగిపోతోంది. ప్రొటీన్లు, సూక్ష్మపోషకాల శాతం ఆ మేరకు తగ్గిపోతోంది. అంతేకాదు, విషతుల్యమైన సీసం వంటి భార లోహాలు ప్రమాదకర స్థాయిలో ఆహార గింజల్లోకి చేరిపోతున్నాయి. టూకీగా చెప్పుకోవాలంటే.. భూతాపం పెరుగుతున్నకొద్దీ మన దైనందిన ఆహారంలో పోషకాల సమతుల్యత అస్తవ్యస్తమవుతోందని తాజా అధ్యయనం చెబుతోంది. – సాక్షి, సాగుబడిగాలిలో నానాటికీ పెరుగుతున్న కార్బన్ డయాక్సైడ్ స్థాయులు వాతావరణ మార్పులకు కారణమవుతాయని అందరికీ తెలుసు. కానీ ఇటీవల వెలువడిన ఒక కొత్త అధ్యయనం.. అధిక సీఓ2 వల్ల ఇప్పుడు ఆహార పంటల పోషకవిలువలు స్థిరంగా క్షీణిస్తున్నాయని తేల్చింది. మనం తినే ఆహారంలో పిండి పదార్థాలు పెరిగిపోయి, ప్రొటీన్లు, సూక్ష్మ పోషకాలు తగ్గిపోతే.. అధిక బరువు, పౌష్టికాహార లోపం వంటి సమస్యలు ఏకకాలంలో మరింత పెరుగుతాయి. ఆ మూడింటిలో..నెదర్లాండ్స్‌లోని లీడెన్ యూనివర్సిటీ నిపుణుల పరిశోధన వివరాలు ‘గ్లోబల్ ఛేంజ్ బయాలజీ’ జర్న ల్లో ప్రచురితమయ్యాయి. పెరుగుతున్న సీఓ2 ప్రభావం వల్ల పంటల్లో పోషకాలు తగ్గిపోయి, మనం తినే ప్రతి ముద్దలోనూ కేలరీలు గతం కన్నా ఎక్కువగా ఉంటాయని ఈ అధ్యయనం వెల్లడించింది. వరి, గోధుమ, జొన్న వంటి ప్రధాన ఆహార ధాన్యాల్లో పిండి పదార్థాలు పెరుగుతుండగా, ప్రొటీన్ తగ్గిపోతోందన్నారు. ఐరన్, జింక్, మెగ్నీషి యం, కాల్షియం వంటి అతిముఖ్యమైన సూక్ష్మపోషకాలు కూడా తగ్గిపోతున్నాయి. పప్పుధాన్యాల్లో జింక్ 38% తగ్గినట్లు గుర్తించారు.కిం కర్తవ్యం?!భారతీయులు ఆహారంలో కార్బోహైడ్రేట్ల (పిండి పదార్థాల)ను మితిమీరి తీసుకోవటం, ప్రొటీన్లను అవసరం కన్నా తక్కువగా తీసుకోవటం వల్ల ఊబకాయం, షుగర్ వంటి జీవనశైలి వ్యాధుల బెడద ఏటేటా పెరుగుతోందని అధ్యయనాలు హెచ్చరిస్తున్న విషయం మనకు తెలిసిందే. రోజువారీ మొత్తం ఆహారంలో 45%కి మించి పిండి పదార్థాలు తీసుకోవద్దని, 15%పైగా ప్రొటీన్లు తీసుకోవాలని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) సూచిస్తోంది. అయితే, ప్రజలు 62% మేరకు పిండి పదార్థాలు అధికంగా తింటున్నారని, 11.5% మేరకు ప్రొటీన్లు అవసరం కన్నా తక్కువగా తింటున్నారని ఇటీవలి సర్వేల్లో తేలింది. ప్రపంచ దేశాలన్నీ సీఓ2 స్థాయులు తగ్గించడంపై తక్షణమే దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని ఈ అధ్యయనం స్పష్టం చేస్తోంది.ఎందుకిలా?గాలిలో ఒకప్పుడు 350 పీపీఎం స్థాయిలో ఉండే సీఓ2 ప్రస్తుతం 426 పీపీఎంకు పెరిగింది. గాలిలో సీఓ2 లభ్యత పెరుగుతున్నకొద్దీ మొక్కలు దాన్ని ఎక్కువగా తీసుకుంటూ షుగర్‌ను, పిండిపదార్థాలను ఎక్కువగా ఉత్పత్తి చేసుకుంటున్నాయి. తత్ఫలితంగా మట్టి నుంచి వేర్ల ద్వారా ఇతర పోషకాలను తీసుకునే సామర్థ్యం తగ్గిపోతోంది. వరి, గోధుమ, జొన్నల్లో ఇలా జరుగుతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. పిండి పదార్థాలు పెరగటం, ప్రొటీన్లు, సూక్ష్మపోషకాలు తగ్గటం అనేది మనం తినే గింజలు, పూలు, కాయలు, ఆకులు, దుంపలన్నిటిలోనూ ఒకేలా ఉన్నట్లు వారు తెలిపారు.భార లోహాల ముప్పు అధిక సీఓ2 ప్రభావంతో ధాన్యాల్లో క్రోమియం, నికెల్, సీసం వంటి విషతుల్యమైన భార లోహాలు ఎక్కువగా పోగుపడుతున్నాయని పరిశోధకులు తేల్చారు. ఇవి అతి స్వల్ప మోతాదుల్లో ఉన్నప్పటికీ మెదడు, గుండె, నాడీ మండలాలకు హాని చేస్తాయి. సీఓ2 స్థాయి పెరగటంతో గోధుమలో సీసం 170% పెరిగింది. -
Sagubadi: రైతమ్మల శ్రమకు జేజేలు!
వ్యవసాయం, ఆహారోత్పత్తుల తయారీ, పంపిణీ రంగాల్లో మహిళలు అత్యంత కీలకపాత్ర పోషిస్తున్నారు. మహిళా శ్రమ తోడు లేకుండా వ్యవసాయం ఒక్క పూట కూడా ముందుకు సాగదు. ఆమె బహుపాత్రాభినయం చెయ్యకపోతే కుటుంబమూ వర్ధిల్లదు. పొలాల్లో వ్యవసాయ పనులు, ఇంటి దగ్గర పశుపోషణతో పాటు అదనంగా వంట పనులు, ఇంటి పనులు, పెద్దల సంరక్షణ పనులను భుజాన వేసుకొని మోస్తున్న మహిళా రైతులు కొవ్వొత్తుల్లా కరుగుతూ సమాజ అభ్యున్నతికి దోహదపడుతున్నారు. మహిళా రైతులు ప్రత్యక్షంగా, పరోక్షంగా లింగపరమైన ప్రతిబంధకాలను, వివక్షలను, అసౌకర్యాలను ఎదుర్కొంటున్నారు. ఈ లింగ అంతరాలను గుర్తించి, పరిష్కరిస్తే ఆర్థికాభివృద్ధి పరుగులు పెడుతుంది. ఆహార అభ్రదత గణనీయంగా తగ్గుతుందని అధ్యయన నివేదికలు చెబుతున్నాయి. ఈ కొత్త సంవత్సరంలో ఆ దిశగా మీ ఆలోచనలు, ఆచరణకు పదును పెట్టండి అని ఐక్యరాజ్యసమితి ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది. 2026ను అంతర్జాతీయ మహిళా రైతు సంవత్సరం (ఐవైడబ్ల్యూఎఫ్ 2026)గా ప్రకటించింది. ఆహార భద్రతను అందించటంలో మహిళలు – రైతుగా, రైతు కూలీగా, ఆహార పరిశ్రమదారుగా, ఉద్యోగిగా, అమ్మగా, కుటుంబ సభ్యుల సంరక్షకురాలిగా– బహుముఖ సేవలందిస్తున్నారు. ప్రపంచ వ్యవసాయ శ్రామిక శక్తిలో మహిళలకు గణనీయమైన భాగస్వామ్యం ఉంది. వ్యవసాయ, ఆహార విలువ గొలుసులో వీరి పాత్ర అత్యంత కీలకం. వ్యవసాయంలో, వ్యవసాయానుబంధ రంగాల్లో ఆహారోత్పత్తి, ప్రాసెసింగ్ పనుల నుంచి పంపిణీ, వాణిజ్య కార్యకలాపాల వరకు వ్యవసాయ, ఆహార విలువ గొలుసు పరిధిలోకి వస్తాయి. ఇంటి ఆహార భద్రత, పోషకాహారం సమకూర్చటంలోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు. 2021లో వ్యవసాయ ఆహార రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా శ్రమిస్తున్న వారిలో 41% మహిళలైనప్పటికీ, మహిళల శ్రమ విలువను తక్కువగా చూస్తున్నారు. నడుములు పడిపోయే శ్రమతో కూడుకున్న పనులు చేయిస్తారు. కానీ, తక్కువ జీతం. భూమి, ఆర్థిక, సాంకేతికత, విద్య, విస్తరణ సేవలు తదితర అన్ని స్థాయిల్లో నిర్ణయాలు తీసుకునే విషయంలో వ్యవస్థాగత అడ్డంకులను మహిళా రైతులు ఎదుర్కొంటున్నారు. మహిళా రైతుల జీవన వాస్తవాలను వెలుగులోకి తీసుకురావటానికి, లింగ సమానత్వాన్ని పెంపొందించడానికి, మహిళలను శక్తివంతం చేయడానికి.. తద్వారా వ్యవసాయాన్ని ఆహారోత్పత్తి రంగాలను మరింతగా ఒడిదుడుకుల్ని తట్టుకునేలా పటిష్టంగా నిర్మించడానికి అనుగుణంగా విధాన సంస్కరణలు, పెట్టుబడులను ప్రోత్సహించాలని ఐక్యరాజ్యసమితి లక్ష్యంగా పెట్టుకుంది. ఎఫ్‌ఏఓతో పాటు ఐరాస అనుబంధ సంస్థలైన ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చరల్ డెవలప్మెంట్ (ఐఎఫ్ఏడీ), వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ (డబ్లు్యఎఫ్పీ)లు వచ్చే ఏడాదంతా మహిళా రైతులను బలోపేతం చేసే కార్యకలాపాలను సమన్వయం చేస్తాయి. ‘మహిళా రైతు’లంటే ఎవరు?వ్యవసాయ, ఆహార రంగాల్లో విభిన్న పాత్రల్లో పనిచేస్తున్న మహిళలందరూ మహిళా రైతులే. చిన్న/పెద్ద సొంత భూముల్లో పంటలు సాగు చేసే మహిళలు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులు, చేపలు/రొయ్యల రైతులు, మత్స్యకారులు, చేపల కార్మికులు, తేనెటీగల పెంపకందారులు, పశువులు/కోళ్ల పెంపకందారులు, ప్రాసెసర్లు, వ్యాపారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, గ్రామీణ వ్యవస్థాపకులు, సాంప్రదాయ విజ్ఞానవంతులు.. అధికారిక లేదా అనధికారిక పనిలో నిమగ్నమయ్యే మహిళలు.. భూమి యాజమాన్య హక్కులు ఉన్నా లేకున్నా సరే.. వీరంతా మహిళా రైతులే. వీరిలో యువతులు, వృద్ధులు, పేద, ఆదివాసీ మహిళలు, వైకల్యాలున్న మహిళలు, శరణార్థులు, వలస వచ్చి వ్యవసాయ, ఆహార శుద్ధి పనులతో పొట్టపోసుకుంటున్న మహిళలు కూడా ఈ కోవలోని వారే. వ్యవసాయ, ఆహార రంగాల్లో మహిళల స్థితిగతులు, లింగ అసమానతల స్థాయి, పర్యావరణ విపత్తుల నేపథ్యంలో మహిళలు ఎదుర్కొంటున్న అసమానతల వల్ల కలుగుతున్న ప్రమాదాలను ఎఫ్ఏఓ నివేదికలు నొక్కి చెబుతున్నాయి. మీకు తెలుసా?→ ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయం, వ్యవసాయానుబంధ రంగాలు, ఆహార పరిశ్రమల్లో 2021లో పనిచేసే కార్మికుల్లో మహిళలు 41% ఉన్నారు. అయినప్పటికీ గ్రామీణ మహిళలు అసమానతను ఎదుర్కొంటున్నారు. → మగ రైతులతో పోల్చితే చాలా మంది మహిళా రైతులు చిన్న కమతాల్లోనే సేద్యం చేస్తున్నారు. → వ్యవసాయం, అనుబంధ రంగాలు, ఆహార పరిశ్రమల్లో పనిచేసే మహిళల సంపాదన పురుషుల కన్నా 22% తక్కువ. → మహిళా రైతులపై పొలం పనులతో పాటు ఇంటి సంరక్షణ పని భారం అధికంగా ఉంటుంది. ఇంటి పనులకు ప్రత్యేక ఆదాయం ఉండదు. అసలు ఆ శ్రమ విలువ లెక్కలోకి రాదు. పని చేసినా ఆర్థిక సాధికారత రాదు. వారి శారీరక, మానసిక శ్రేయస్సును ఈ వేతనం లేని పని భారం దెబ్బతీస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా మహిళలు, బాలికలు తమ కుటుంబ సభ్యుల కోసం చేసే వేతనం లేని సంరక్షణ పని విలువ ఏటా కనీసం 10.8 లక్షల కోట్ల డాలర్లని ఎఫ్ఏఓ లెక్కగట్టింది.→ ప్రణాళికాబద్ధమైన పథకాల ద్వారా గ్రామీణ మహిళలను సాధికారపరిస్తే 5.8 కోట్ల మంది ఆదాయం పెరుగుతుంది. 23.5 కోట్ల మందికి ఒడిదుడుకుల్ని తట్టుకునే శక్తి పెరుగుతుంది. అయినప్పటికీ ఈ దిశగా కృషి జరగటం లేదు. → తీవ్రమైన వేడి, కరువుల నేపథ్యంలో పురుషుల కంటే మహిళలపై ఎక్కువ పని భారం పడుతుంది. → లింగపరమైన అంతరాలను రూపుమాపితే ప్రపంచ స్థూల దేశీయోత్పత్తి ఏటా లక్ష కోట్ల డాలర్ల మేరకు పెరుగుతుంది. 4.5 కోట్ల మంది ఎదుర్కొంటున్న ఆహార అభద్రతను తగ్గించవచ్చు. → ఆహార అభద్రత బాధితుల్లో మహిళల సంఖ్యే ఎక్కువ. ఉపాధి, విద్యావకాశాలు, ఆదాయంలో లింగపరమైన అంతరం తగ్గించగలిగితే మహిళల్లో ఆహార అభద్రతను 52% తొలగించవచ్చని ఎఫ్ఏఓ నివేదిక తెలిపింది. → మహిళలకు భూమి హక్కులు కల్పిస్తే వ్యవసాయ, ఆహార వ్యవస్థలు, గ్రామీణాభివృద్ధికి.. మొత్తంగా సమాజాభివృద్ధికి సహాయపడుతుంది. భూమి యాజమాన్య హక్కు విషయాల్లో లింగ వివక్ష రాజ్యం ఏలుతోంది. సాగు భూమిపై మహిళలకు మరింతగా హక్కులు కల్పిస్తే వారి సాధికారత, పెట్టుబడి సామర్థ్యం, స్థిరత్వం, సమస్యలను ఎదుర్కొనే శక్తి పెరుగుతుంది. భూమి హక్కున్న మహిళా రైతుకు సేవల లభ్యత మెరుగవుతుంది. లింగ ఆధారిత హింస తగ్గుతుందని ఎఫ్ఏఓ సూచిస్తోంది. గడ్డిభూముల సంవత్సరం కూడా ! 2026ను మహిళా రైతుల సంవత్సరంతో పాటు గడ్డి భూములు, సంచార పశుకాపరుల సంవత్సరంగానూ ఉమ్మడిగా జరుపుకోవాలని ఐక్యరాజ్యసమితి పిలుపునిచ్చింది. గడ్డి భూములు, సవన్నాలు, పొదలతో నిండిన బంజర్లు, ఎడారులు, చిత్తడి భూములు, కొండలు గుట్టలున్న ప్రాంతాల విస్తీర్ణం భూతలమ్మీద సగానికి సగం ఉంటుంది. ఈ ప్రాంతాలను పర్యావరణ హితమైన రీతిలో నిర్వహించటం జీవవైవిధ్యం, పచ్చదనం పరిరక్షణకు, కర్బన నిల్వలు, నీటి చక్రం నిర్వహణకు అవసరం. గొర్రెలు, మేకలు, ఆవులు, గేదెలు వంటి సుమారు 100 కోట్ల పశువులను బంజరు భూములు, పచ్చికబయళ్లలో మేపుకుంటూ ఎంతో మంది సంచార పశుకాపరులు తరతరాలుగా జీవనం సాగిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా భూముల్లో దాగి ఉన్న కర్బన నిల్వల్లో 30% ఈ భూముల్లోనే ఉంది. భూతాపం పెరగటం వల్ల ఈ భూముల్లోని సగం కర్బనం వాతావరణంలో కలిసినట్లు అంచనాలు ఉన్నాయి. ఫలితంగా ఈ భూములపై ఆధారపడి ఉన్న ప్రజల జీవనోపాధులు ప్రమాదంలో పడుతున్నాయి. గడ్డి భూములు, చిత్తడి నేలల పరిరక్షణకు పాలకులు శ్రద్ధతీసుకొని పెట్టుబడులు పెట్టాలని ఎఫ్ఏఓ పిలుపునిచ్చింది. ఈ భూములను పరిరక్షించటం ద్వారా పంట పొలాలకూ మేలు జరుగుతుంది. -
హైడ్రోపోనిక్స్ ద్రావణాల్లో పీహెచ్ 5 ఉంటే సేఫ్!
హైడ్రోపోనిక్ ఆహారోత్పత్తి కేంద్రాల్లో మోనోసైటోజీన్స్ బ్యాక్టీరియా వల్ల లిస్టెరియోసిస్ అనే వ్యాధి సోకుతున్నట్లు అమెరికాలో గుర్తించారు. ఏటా 1,600 కేసులు నమోదవుతున్నాయి. 260 మంది చనిపోతున్నారు కూడా. గర్భిణీ స్త్రీలు, వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వ్యక్తులు అత్యధికంగా దీని బారినపడుతున్నారు. అందువల్ల ఎల్. మోనోసైటోజీన్స్ ఆహార భద్రతకు, ప్రజారోగ్యానికి ముప్పుగా మారింది.సాధారణ వ్యవసాయంలో మట్టి ద్వారా వ్యాపించే తెగుళ్లు హైడ్రోపోనిక్ పద్ధతిలో సాగయ్యే పంటలకు సోకవు. అయితే, మట్టికి బదులు వాడే సబ్స్ట్రేట్లు, విత్తనాలు, నీరు, పోషక ద్రావణాల్లో ఎల్. మోనోసైటోజీన్స్ వంటి క్రిములు పెరుగుతాయి. అమెరికాలోని లూసియానా స్టేట్ యూనివర్సిటీ(ఎస్ఎస్యూ) ఎస్ఎస్యూ స్కూల్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ ఫుడ్ సైన్సెస్ ప్రొఫెసర్, ఫుడ్ ఇన్నోవేషన్ ఇన్స్టిట్యూట్ తాత్కాలిక సంచాలకులు డాక్టర్ అచ్యుత్ అధికారి నేతృత్వంలోని పరిశోధకుల బృందం పరిశోధనలు చేసింది. టమాటా, లెట్యూస్, స్ట్రాబెర్రీ పంటలను పెంచే పోషక ద్రావణాలలో ఎల్. మోనోసైటోజీన్ క్రిములు పెరుగుదల తీరుపై డాక్టర్ అచ్యుత్ బృందం చేసిన తాజా అధ్యయనంలో తేలిందేమంటే.. పోషక ద్రావణం ఉదజని సూచిక (పీహెచ్)లో మార్పులు ఈ క్రిముల పెరుగుదలకు, తగ్గుదలకు దోహదం చేస్తున్నాయి. పీహెచ్ 5 గల డిస్టిల్డ్ వాటర్‌లో ఎల్. మోనోసైటోజీన్ క్రిములు 72 గంటల్లో నశించాయి. లైట్యూస్, స్ట్రాబెర్రీ పంటకు వాడే ద్రావణాలలో పీహెచ్ 6 ఉన్న దశలో ఈ క్రిములు బాగా పెరిగాయి. అయితే, టమాటా పోషక ద్రావణం అన్ని పీహెచ్ స్థాయిల్లో ఎల్. మోనోసైటోజీన్ క్రిముల పెరుగుదల పరిమితంగా ఉంది. ఈ క్రిములను చంపటానికి రసాయనిక క్రిమిసంహారకాలను వాడితే, మేలు చేసే సూక్ష్మజీవులు కూడా చనిపోతాయి. కాబట్టి రసాయన రహిత పద్ధతిపై పరిశోధకులు దృష్టి సారించారు. యూవీ–సీ కాంతి ఎల్. మోనోసైటోజీన్ క్రిములను గణనీయంగా తగ్గించినట్లు వెల్లడైంది. హైడ్రోపోనిక్ సాగు నానాటికీ విస్తరిస్తున్న నేపథ్యంలో డా. అచ్యుత్ పరిశోధనలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. -
అడవి జంతువులతో పంట నష్టానికి బీమా రక్షణ!
పంటలకు అడవి జంతువుల వల్ల, వరి పంటకు నీటి ముంపు వల్ల కలిగే పంట నష్టాల నుంచి రైతులకు ఉపశమనం కలిగించడానికి 2026 ఖరీఫ్ నుంచి బీమా సదుపాయం కల్పించాలని కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కోతులు, అడవి పందులు, ఏనుగులు, దుప్పులు, కృష్ణజింకల వంటి అడవి జంతువుల వల్ల కూరగాయలు, పండ్లు, వరి, పత్తి వంటి పంటలకు కూడా చాలా ప్రాంతాల్లో తీరని నష్టం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే, వీటి ప్రభావంపై రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఎటువంటి అధికారిక శాస్త్రీయ సర్వేలు ఇప్పటివరకు జరగకపోవటం వల్ల ఆధారపడదగిన గణాంకాలేవీ అందుబాటులో లేవు.ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై) పథకం కింద ఈ బీమా సదుపాయం అందుబాటులోకి రానుంది. కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ సవరించిన నియమ నిబంధనల ప్రకారం అడవి జంతువుల దాడి కారణంగా పంట నష్టపోయే రైతులను ఆదుకునేందుకు వచ్చే ఖరీఫ్ నుంచి బీమా పరిహారం చెల్లిస్తారు. అడవి జంతువుల దాడిని ‘స్థానిక ప్రమాదం’గా గుర్తించి పీఎంఎఫ్‌బీవై కింద ఐదో యాడ్–ఆన్ కవర్‌గా చేర్చుతారు. రాష్ట్ర ప్రభుత్వాలు పంట నష్టానికి కారణమవుతున్న అడవి జంతువుల జాబితాను ప్రకటిస్తాయి. గతంలో జరిగిన పంట నష్టాల గణాంకాల ఆధారంగా ఈ బీమా వర్తించే జిల్లాలు లేదా బీమా యూనిట్లను గుర్తిస్తాయి. జియోట్యాగ్ చేసిన ఛాయాచిత్రాలను పంట బీమా యాప్‌లోకి 72 గంటల్లోపు నష్టాలను రెతులు అప్లోడ్ చేయడం ద్వారా నివేదించాల్సి ఉంటుంది. అటవీ జంతువుల వల్ల రైతులకు పంట నష్టం జరుగుతోందని, దీనికి పరిష్కారం వెతకాలని అనేక రాష్ట్రాల నుంచి వచ్చిన దీర్ఘకాలిక అభ్యర్థనల మేరకు కేంద్రం ఈ నిర్ణయాలు తీసుకుంది. ఆకస్మికంగా స్థానికంగా జరిగే తీవ్రమైన పంట నష్టం నుంచి రైతులకు రక్షణ కల్పించటమే ప్రభుత్వ లక్ష్యం. దేశవ్యాప్తంగా అమలు చేయడానికి శాస్త్రీయ, పారదర్శక, కార్యాచరణపరంగా సాధ్యమయ్యే విధివిధానాలు సిద్ధమయ్యాయి. వీటిని 2026 ఖరీఫ్ పంట కాలం నుంచి అమల్లోకి వస్తాయి. దేశవ్యాప్త దీర్ఘకాలిక సమస్యమన దేశం అంతటా రైతులు ఏనుగులు, అడవి పందులు, నీల్గాయ్, జింకలు, కోతులు వంటి వన్యప్రాణుల దాడుల కారణంగా చాలా సంవత్సరాలుగా పంట నష్టాలను ఎదుర్కొంటున్నారు. అడవులు, వన్యప్రాణులు సంచరించే ప్రాంతాలు, కొండల సమీపంలో ఉన్న ప్రాంతాల్లో ఈ సమస్య సర్వసాధారణం. ఇప్పటివరకు, ఇటువంటి నష్టాలు పంట బీమా పరిధిలోకి రాకపోవడంతో రైతులు పరిహారం పొందలేకపోయారు. అదేవిధంగా, వరద పీడిత, తీరప్రాంత రాష్ట్రాల్లోని వరి రైతులు భారీ వర్షాలు, వరదల వల్ల పదేపదే నష్టపోతున్నారు. మునిగిపోయిన పంటలను అంచనా వేయడంలో ఇబ్బంది కారణంగా 2018లో వరి ముంపునకు బీమా సదుపాయం తొలగించారు. అయితే, ప్రతి ఏటా వరదలకు గురయ్యే జిల్లాల్లోని రైతులకు బీమా రక్షణ అందకుండా పోయింది.ఈ సవాళ్లను పరిగణనలోకి తీసుకొని కేంద్రం ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సిఫార్సుల మేరకు బీమా సదుపాయం కల్పించాలని కేంద్ర వ్యవసాయం–రైతు సంక్షేమ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తాజాగా నిర్ణయించారు. ఈ ముఖ్యమైన నిర్ణయంతో స్థానికంగా పంట నష్టం వాటిల్లిన రైతులు ఇప్పుడు పీఎంఎఫ్‌బీవై కింద సాంకేతికత ఆధారిత క్లెయిమ్ ద్వారా సకాలంలో పరిహారం పొందబోతున్నారు.మానవ–వన్యప్రాణుల సంఘర్షణ ఎక్కువగా ఉన్న ఒడిశా, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఉత్తరాఖండ్, అస్సాం, మేఘాలయ, మణిపూర్, మిజోరాం, త్రిపుర, సిక్కిం, హిమాచల్‌ప్రదేశ్‌తో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలలోని రైతులకు బీమా సదుపాయం గణనీయంగా ప్రయోజనం చేకూరుస్తుందని భావిస్తున్నారు. ముంపు నుంచి వరి పంటకు స్థానిక విపత్తుగా బీమా రక్షణను తిరిగి ప్రవేశపెట్టడం వల్ల తరచూ వరదల పాలయ్యే తీరప్రాంత, తదితర రాష్ట్రాలలోని రైతులకు ప్రయోజనం చేకూరుతుంది. మన దేశ పంటల బీమా వ్యవస్థను ఈ కొత్త సవరణలు మరింత బలోపేతం చేస్తాయి.రెండు రాష్ట్రాల్లో శాస్త్రీయ సర్వే చెయ్యాలివిశ్రాంత శాస్త్రవేత్త డాక్టర్ వైద్యుల వాసుదేవరావు సూచన పంటలకు అడవి జంతువుల వల్ల బీమా సదుపాయాన్ని సరిగ్గా అమలు చెయ్యాలన్నా గణాంకాలు అవసరం. ఏయే జంతువుల వల్ల ఎంత మేరకు నష్టం జరుగుతోందో రాష్ట్ర ప్రభుత్వాలు ముందు తెలుసుకోవాలి. శాస్త్రీయ పద్ధతుల్లో సమగ్ర సర్వే ద్వారా గణాంకాలు సేకరించిన తర్వాత స్వల్పకాలిక, దీర్ఘకాలిక చర్యలు చేపట్టాలని విశ్రాంత శాస్త్రవేత్త డాక్టర్ వైద్యుల వాసుదేవరావు సూచిస్తున్నారు. ప్రొ.జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అఖిల భారత సకశేరుక చీడల యాజమాన్య విభాగం అధిపతిగా, ప్రధాన శాస్త్రవేత్తగా దీర్ఘకాలం పరిశోధనలు చేసి ఉద్యోగ విరమణ చేశారు. ‘సాక్షి సాగుబడి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ముఖ్యాంశాలు: వచ్చే ఖరీఫ్ నుంచి బీమా సదుపాయం కల్పించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది కదా. రైతులకు ఉపశమనం కలుగుతుందంటారా? కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు బీమాను అమలు చేస్తే రైతులకు ప్రయోజనం కలుగుతుంది. అయితే, ఇది ఒక్క రోజులో పరిష్కారం అయ్యే సమస్య కాదు. జటిలమైనది. ఏమి చెయ్యాలన్నా ముందు అధికారికంగా గణాంకాలు సేకరించాలి. పైపై అంచనాల ఆధారంగా కాకుండా ఉన్నత స్థాయి నిపుణుల కమిటీ ఆధ్వర్యంలో శాస్త్రీయ సర్వే ఆధారంగా స్వల్పకాలిక, దీర్ఘకాలిక చర్యలు చేపట్టాలి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దిశగా చర్యలు తీసుకోవాలి. ఈ కమిటీలో ఎవరెవరు ఉండాలి?వ్యవసాయ, ఉద్యాన, పశు విశ్వవిద్యాలయాల నిపుణులతో పాటు వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్థక శాఖ అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసి ప్రామాణిక పద్ధతుల్లో సర్వే జరపాలి. ఏయే అడవి జంతువుల వల్ల ఏయే పంటలకు ఏయే దశల్లో ఎంత మేరకు పంట నష్టం జరుగుతున్నది? అనే గణాంకాలను ప్రాజెక్ట్ మోడ్‌లో పక్కాగా సేకరించాలి. ఏయే ప్రాంతాల్లో సమస్య ఏ(ఎక్కువ, మధ్యస్థం, తక్కువ) స్థాయిలో ఉందో గుర్తించాలి. తదనుగుణంగా స్వల్పకాలిక, దీర్ఘకాలిక చర్యలు తీసుకోవాలి.తెలుగు రాష్ట్రాల్లో అడవి జంతువుల వల్ల పంటలకు నష్టం ఎంత మేరకు జరుగుతోందని మీరనుకుంటున్నారు?ఆంధ్రప్రదేశ్‌లో చాలా ప్రాంతాలతో పాటు తెలంగాణలో 90% పంట పొలాలకు కోతుల సమస్య ఉంది. కోతులను వన్యప్రాణుల జాబితా నుంచి తొలగించారు. కాబట్టి, వీటికి కుటుంబ నియంత్రణ చేయించవచ్చు. కోతులన్నిటినీ పట్టుకొని ఆపరేషన్ చెయ్యలేం కాబట్టి, ఆహారంలో మందు కలిపి పెట్టి మేటింగ్ కంట్రోల్ చెయ్యాలి. 50% పొలాలకు అడవి పందుల సమస్య ఉంటుంది. వీటితో పాటు గద్వాల్, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, నాగర్‌కర్నూలు జిల్లాల్లో కృష్ణజింకల సమస్య ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో కోతులు, అడవి పందులు, కృష్ణజింకలు, దుప్పులతో పాటు చిత్తూరు జిల్లాలో అదనంగా ఏనుగుల సమస్య కూడా ఉంది. పంటలకే కాదు, గ్రామాలు, పట్టణాల్లో ప్రజలకు కూడా కోతుల సమస్య ఉంది. ఒక పార్టీ ఎన్నికల వాగ్దానం చెయ్యాల్సి వచ్చిందంటే ఈ సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది. శాస్త్రీయ సర్వే ఎంత త్వరగా, సమగ్రంగా చేస్తే.. సమస్య పరిష్కారం దిశగా అంత వేగంగా అడుగులు పడతాయి. ఏ రాష్ట్రంలో అయినా ఇలాంటి సర్వే జరిగిందా?హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం సమగ్ర సర్వే చేసింది. కోతులకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసి వాటి సంఖ్యను తగ్గించగలిగారు. అడవి జంతువుల నుంచి పంటలను కాపాడుకోవటంలో సాంకేతిక సాధనాలు ఎంతవరకు ఉపయోగకరం?ఎన్ని సాంకేతిక ఉపకరణాలను రూపొందించినా కొంత మేరకు ప్రభావం చూపుతాయి. కానీ, పూర్తిగా సమస్యను పరిష్కరించలేవు. -
అడవే సేద్యానికి ఆధారం
అడవుల నరికివేతతో ఏటా 28 వేల మరణాలు : స్థానికంగా అడవులు నీడ, బాష్పీభవన ప్రేరణ ద్వారా చల్లని సూక్ష్మ వాతావరణాన్ని సృష్టిస్తాయి. ఉష్ణ ఒత్తిడిని తగ్గిస్తాయని నివేదిక వివరించింది. అదే సమయంలో అటవులను నిర్మూలిస్తే ఆ కారణంగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఇది వ్యవసాయం పైన మాత్రమే కాకుండా మానవ ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా, 2001–2020 మధ్య, ఉష్ణమండలంలో అడవుల నరికివేత వల్ల ఏటా సుమారు 28,000 అదనపు ఉష్ణ సంబంధిత మరణాలకు దారితీసిందని ఎఫ్ఏవో అంచనా. అటవీ విస్తీర్ణం తగ్గితే పర్యావరణ సమస్యలు రావటంతో ΄ాటు ప్రజారోగ్యానికి ముప్పు ఎలా వస్తోందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అడవులు, చెట్లు వ్యవసాయానికి ముఖ్యమైన అనేక ప్రయోజనాలు చేకూరుస్తున్నాయి. పరాగ సంపర్కం, తెగుళ్ల జీవ నియంత్రణ, పోషక చక్రం పరిరక్షణ, రక్షక కవచం, వాతావరణ నియంత్రణ వంటి ప్రయోజనాలు చేకూరతాయి. ఇవి పంట దిగుబడిని పెంచుతాయి. పర్యావరణ వ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడుతాయని ఎఫ్ఏవో పేర్కొంది. అందువల్ల అడవులు, చెట్లను వ్యవసాయ పొలాలతో ఆశ్రయ కేంద్రాలు, నదీ తీర బఫర్ జోన్లు, అటవీ ప్రాంతాలుగా అనుసంధానించి అభివృద్ధి చేసే విధానాలనుపాలకులు రూపొందించటం చాలా ముఖ్యం. ఈ వ్యూహాలు వ్యవసాయంలో కృత్రిమ ఎరువులు తదితర ఉత్పాదకాల వినియోగంపై ఆధారపడటాన్ని తగ్గిస్తాయి. పంట పొలాలకు ప్రతికూల వాతావరణ పరిస్థితులను దీటుగా తట్టుకునే శక్తినిస్తాయి. వైవిధ్యమైన, పోషక–సాంద్రత కలిగిన ఆహార పదార్థాల ఉత్పత్తికి దోహదం చేస్తాయని నివేదిక పేర్కొంది.‘అడవి–వ్యవసాయం మధ్య పోటీ లేద’ని ఆహార వ్యవసాయ సంస్థ (యూఎన్–ఎఫ్ఏవో) తెలిపింది. బ్రెజిల్లో ఇటీవల ముగిసిన వాతావరణ మార్పుపై అంతర్జాతీయ శిఖరాగ్ర వార్షిక సమావేశం (కాప్ 30) సందర్భంగా ఒక కీలకమైన నివేదికను ఎఫ్ఏవో వెలువరించింది. ‘అడవులు, చెట్లు వ్యవసాయం కోసం వాతావరణ, పర్యావరణ సేవల ప్రయోజనాలు 2025’ పేరిట ఈ నివేదికను ఎఫ్ఏవో విడుదల చేసింది. చెట్లు, అడవుల వల్ల వ్యవసాయానికి ఒనగూరే ప్రయోజనాలను లెక్కగట్టే పద్ధతులను ఈ నివేదిక వెల్లడించింది. ఆహార భద్రత అడవులపై ఆధారపడి ఉంటుంది. వ్యవసాయ పొలాల్లో ఉత్పాదకతను పెంచడానికి అడవుల పరిరక్షణ, పునరుద్ధరణ కీలకమైన చర్యలుగా ఉపయోగపడతాయని నివేదిక వెల్లడించింది. ప్రపంచ అడవులు భూగోళంపైన వ్యవసాయ–ఆహార పంపిణీ వ్యవస్థలను బలోపేతం చేసే ముఖ్యమైన సేవలను అందిస్తాయి. అయితే, ఈ సేవల విలువను చాలా సార్లు తక్కువగా అంచనా వేస్తుండటం విచారకరం. అందుకే ఈ రెండు రంగాలను సమన్వయంతో అభివృద్ధి చేసేలా తగిన విధానాలు రూపొందించాలి, పెట్టుబడులను ప్రోత్సహించాలని నివేదిక పిలుపునిచ్చింది. వ్యవసాయ విస్తరణ కోసం భూమి అవసరమైనప్పుడల్లా అడవులు, చెట్లు వ్యవసాయంతో పోటీ ఏర్పడుతుంది. కానీ, అడవులను సంరక్షించడం, పునరుద్ధరించడం వాస్తవానికి వ్యవసాయ ఉత్పాదకతను పెంపొందించటానికి దోహదం చేసే చాలా ముఖ్యమైన పని’ అని ఎఫ్ఏవో ఫారెస్ట్రీ డైరెక్టర్ డా. జిమిన్ వు అన్నారు.అడవులు, చెట్ల వల్లే 50% వర్షపాతం ఎఫ్ఏవో, స్టాక్‌హోమ్ ఎన్విరాన్మెంట్ ఇన్స్టిట్యూట్, కన్జర్వేషన్ ఇంటర్నేషనల్, ది నేచర్ కన్జర్వెన్సీ సంయుక్తంగా ప్రచురించిన నివేదిక ఇది. అడవుల నరికివేత వల్ల వాతావరణంపై, వ్యవసాయంపై తక్షణం పడే ప్రభావాలను, కొలవగల ప్రభావాలను ఈ నివేదిక నొక్కి చెబుతుంది. అడవులను పరిరక్షిస్తే కలిగే ప్రయోజనాలు.. పర్యావరణ వ్యవస్థలు ఉష్ణోగ్రతలను తగ్గించడంతోపాటు వర్షపాతాన్ని నిలబెట్టుకుంటాయి. నీటి చక్రాన్ని నియంత్రిస్తాయి. పంట ఉత్పాదకతపై నేరుగా ప్రభావం చూపుతాయి. స్థానిక వాతావరణ పరిస్థితులను స్థిరీకరిస్తాయి. గ్రామీణ ప్రజల ఆరోగ్యం, భద్రత, జీవనోపాధిని మెరుగుపరుస్తాయి.155 దేశాల్లోని వ్యవసాయ భూములు ఇతర దేశాల్లోని అడవులు అందించే పర్యావరణ సేవలపై ఆధారపడి వార్షిక వర్షపాతంలో 40% పొందుతున్నాయి. ఇది ముఖ్యంగా ఆఫ్రికాకు వర్తిస్తుంది. ఒక సర్వే ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 50 శాతం వర్ష΄ాతం అడవులు, చెట్లు వాతావరణంలోకి వదిలే నీటి తేమ ద్వారా లభిస్తుంది. కాంగో వర్షారణ్యం దాని తేమలో 40 శాతానికి పైగా స్థానికంగా రీసైకిల్ చేస్తుంది. ఆఫ్రికాలో మారుమూల వ్యవసాయ ప్రాంతాలకు కూడా 10 శాతానికి పైగా వర్షపాతాన్ని అందిస్తుందని ఈ నివేదిక వెల్లడించింది. సగం అడవులను పునరుద్ధరిస్తే 1 డిగ్రీ వేడి తగ్గుతుందిప్రపంచంలో కోల్పోయిన ఉష్ణమండల అడవుల్లో సగాన్ని పునరుద్ధరిస్తే నేలపై ఉష్ణోగ్రతలు 1 డిగ్రీల సెల్సియస్ మేరకు తగ్గుతాయి. వ్యవసాయం, నీటి భద్రత సాధన కోసం అడవులు చెట్ల నీటి చక్రాల పునరుద్ధరణకు, వాతావరణ నియంత్రణ విధులను పునరుద్ధరణకు ఇది సహాయపడుతుంది. అయితే, ఈ లక్ష్యాల సాధన కోసం అడవుల పునరుద్ధరణకు దృఢచిత్తంతో చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆర్థిక ్ర΄ోత్సాహకాలు ఇవ్వాల్సిన అవసరం ఉంటుందని నివేదిక వివరించింది. ఆహార భద్రత, ప్రజారోగ్యం, వాతావరణ ప్రతికూలతలను తట్టుకోవటం కోసం సుస్థిరమైన అటవీ నిర్వహణ బాధ్యతను బహుళ రంగాలకు ప్రయోజనం చేకూర్చే వ్యూహంగా గుర్తించాలని ఎఫ్ఏవో నివేదిక పేర్కొంది.రైతులు, స్థానిక ఆదివాసీ సమాజాలను భాగస్వాముల్ని చెయ్యాలి. అటవీ పునరుజ్జీవన, పరిరక్షణ పథకాల రూపుకల్పనలో, పర్యవేక్షణ కార్యకలాపాలను మెరుగుపరచడంలో వారిని పాల్గొనేలా చేయడం ద్వారా వారికి సాధికారత కల్పించాలి. అటవీ సంరక్షణ, పునరుద్ధరణ, సుస్థిరమైన పద్ధతుల్లో అడవిని ఉపయోగించుకోవటంపై పెట్టే పెట్టుబడులన్నీ వాతావరణాన్ని తట్టుకునే వ్యవసాయం కోసం, గ్రామీణ జీవనోపాధులు పెంపొందించటం కోసం, ప్రపంచ ఆహార భద్రత, నీటి భద్రత కల్పించటం కోసం పెట్టే మంచి పెట్టుబడులేనని అర్థం చేసుకోవాలి. అడవిని వ్యవసాయంతో సమన్వయీకరించి ్ర΄ోత్సహించడం ద్వారా ప్రజలు మరింత ఉత్పాదక, సుస్థిరమైన, సమానతతో కూడిన భవిష్యత్తు కోసం పని చేయటం సాధ్యపడుతుందని నివేదిక చివరలో ఎఫ్ఏవో స్పష్టం చేసింది.అడవి... వ్యవసాయానికి శత్రువని సాధారణంగా చాలా మంది అనుకుంటూ ఉంటారు. అయితే, అది నిజం కాదు. నిజానికి అడవుల వల్ల వ్యవసాయానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. అడవి, చెట్లు అందించే పర్యావరణ సేవలు వ్యవసాయాన్ని ప్రతికూల వాతావరణ పరిస్థితులకు ఎదురొడ్డి నిలబడే శక్తిస్తాయి. వర్షపాతం తగినంత పొందటానికి అడవులు అత్యవసరం. పంట భూముల్లో భూసారాన్ని పెంచుకునేందుకు అడవులు దోహదపడతాయి. ముఖ్యంగా ఉష్ణమండల ప్రాంతాల్లో ఉండే అడవులు ఆ అడవులున్న దేశాలకే కాదు వందలాది ఇతర దేశాలకు కూడా పర్యావరణ సేవలు అందిస్తున్నాయని గుర్తించండి. అడవి ఏ దేశ భూభాగంలో ఉన్నప్పటికీ అంతర్జాతీయ సంపదేనని గమనంలో పెట్టుకోండి. ఈ వ్యవసాయ ప్రాణాధార అడవుల్లో నరికివేసిన విస్తీర్ణంలో సగానికి సగంలోనైనా తిరిగి చెట్లను పెంచితే ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయానికి భూతాపోన్నతిని తట్టుకొని నిలబడే వనరులను సమకూర్చుతుందని పాలకులు గుర్తెరగాలి.అందుకు అనుగుణంగా విధానాలను రూపొందించి అమల్లోకి తేవాలి. స్థానిక ప్రజలను, రైతులను ఈ అడవుల పునరుజ్జీవన కార్యక్రమాల్లో భాగస్వాముల్ని చేస్తే లక్ష్యం సాధించటం సులభమవుతుంది. అడవిని రక్షించుకుంటే వ్యవసాయం చల్లగా పది కాలాలు బతుకుతుందని ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ (యూఎన్–ఎఫ్ఏవో) ఇటీవల వెలువరించిన ఓ కీలక నివేదికలో ప్రపంచ దేశాలకు దిశానిర్దేశం చేసింది. ఉష్ణమండదేశాల్లో అడవి ఏ దేశంలో ఉన్నప్పటికీ విదేశాల్లో సేద్యానికి మేలు ‘‘155 దేశాల్లోని వ్యవసాయ భూముల్లో కురిసే వార్షిక వర్షపాతంలో 40% ఇతర దేశాల్లోని అడవులందించే పర్యావరణ సేవలే ఆధారం’’‘‘వ్యవసాయ విస్తరణ కోసం భూమి అవసరమైనప్పుడల్లా అడవులు, చెట్లు వ్యవసాయంతో ΄ోటీ ఏర్పడుతుంది. కానీ, అడవులను సంరక్షించడం, పునరుద్ధరించడం వాస్తవానికి వ్యవసాయ ఉత్పాదకతను పెం΄÷ందించటానికి దోహదం చేసే చాలా ముఖ్యమైన పని!’’– డా. జిమిన్ వు, ఫారెస్ట్రీ డైరెక్టర్, యూఎన్–ఎఫ్ఏవో – నిర్వహణ: పంతంగి రాంబాబు సాక్షి సాగుబడి డెస్క్ -
అత్యవసర పట్టుబడి వైఫల్యం కాదు
రొయ్యల సాగు సున్నితమైనది. నీటి నాణ్యతలో మార్పులు, వ్యాధులు, వాతావరణ మార్పులు వంటి అంశాలకు చాలా త్వరగా మార్పు కనిపిస్తుంది. ఎంత మంచిగా నిర్వహణ చేసినా, కొన్ని సందర్భాల్లో సాగును కొనసాగించడం ప్రమాదకరంగా మారుతుంది. అలాంటి పరిస్థితుల్లో రైతులు అత్యవసర పట్టుబడి చేస్తారు. అంటే నిర్ణయించిన తుది తేదీకి ముందే పట్టుబడి జరుపుతారు. ఇలా చేయడం ద్వారా జీవించి ఉన్న మిగిలిన రొయ్యలను కాపాడవచ్చు. ఆర్థిక నష్టాలను తగ్గించవచ్చు. రోగాలు ఇతర చెరువులకు వ్యాపించకుండా ఆపవచ్చు. డిస్ట్రెస్ హార్వెస్ట్ అనేది వైఫల్యం కాదు. భారీ నష్టాలను తప్పించుకునే ఒక తెలివైన నిర్ణయం. అత్యవసర పట్టుబడి అంటే?రొయ్యల చెరువులో పరిస్థితులు హానికరంగా మారినప్పుడు, ముందుగానే రొయ్యలను పట్టుబడి చేసుకోవడం. ఇది సాధారణంగా ప్రమాద నిర్వహణ కోసం తీసుకునే నిర్ణయం. పరిస్థితి ప్రమాదకరంగా ఉన్నప్పుడు వెంటనే అత్యవసర పట్టుబడి చెయ్యటం సాగును కొనసాగించడం కన్నా మంచి పని.అత్యవసర పట్టుబడి ఎప్పుడు చెయ్యాలి?1. వ్యాధులు సోకినప్పుడు లేదా అనుమానం ఉన్నప్పుడు...రొయ్యల చెరువుల్లో వ్యాధులు చాలా వేగంగా వ్యాపిస్తాయి. రైతులు ఈ లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే అప్రమత్తంగా ఉండాలి:∙ఫీడ్ తీసుకోవడం ఆకస్మికంగా తగ్గటం∙బలహీనంగా కనిపించడం లేదా ఉపరితలంపై ఈదటం∙ఎర్రగా కనిపించటం, గుల్ల వదులుగా ఉండడం ∙అకస్మాత్తుగా మరణాలు∙డబ్ల్యూఎస్‌ఎస్‌వీ, ఈహెచ్‌పీ, ఐఎంఎన్వీ, ఐహెచ్హెచ్ఎన్వీ వంటి వ్యాధులు కొన్ని గంటల్లోనే/ రోజుల్లోనే చెరువును పూర్తిగా నాశనం చేయగలవు. త్వరగా హార్వెస్ట్ చేయటం పెద్ద నష్టాన్ని నివారిస్తుంది.2. నీటి నాణ్యత తీవ్రంగా క్షీణించినప్పుడు...కొన్నిసార్లు నీటి నాణ్యత చాలా వేగంగా పడిపోతుంది. దాన్ని సరిచేయడానికి సమయం సరిపోదు.సాధారణ కారణాలు... ∙మబ్బు వాతావరణం లేదా మరణాలు ∙అధిక అమోనియా లేదా నైట్రైట్ అలాగే ప్లాంక్టాన్ నీరు రంగు మారటం ∙భారీ వర్షాల వల్ల సెలినిటీ లేదా పి.హెచ్. ఒక్కసారిగా పడిపోవటంఇవి అదుపులోకి రాకపోతే అత్యవసర పట్టుబడి ఉత్తమం. 3. చెరువు అడుగు పాడై విషతుల్యం కావటం...రొయ్యలు చెరువు అడుగులోనే ఎక్కువ కాలం ఉంటాయి. అడుగు భాగం చెడితే అవి త్వరగా ప్రభావిత మవుతాయి.జాగ్రత్త సంకేతాలు... కుళ్ళిన గుడ్డు వాసన ∙రొయ్యలు అంచులకు లేదా ఎయిరేటర్ల దగ్గరకు చేరటం అధిక బురద లేదా నల్లటి నేల ∙పేగు ఖాళీగా ఉండటం, బలహీనంగా కనిపించటం ఇవి వ్యాధులకు ముందు వచ్చే సూచనలు4. తీవ్రమైన వాతావరణం / ప్రకృతి వైపరీత్యాలుతుఫాన్లు, భారీవర్షాలు, వరదలు వంటి సందర్భాల్లో చెరువు రక్షణకు ప్రమాదం ఉంటుంది. చెరువు గట్లు తెగి΄ోవటం లేదా నీరు నిండి΄ోవడం లాంటి పరిస్థితుల్లో ముందుగానే హార్వెస్ట్ చేయటం సురక్షితం. 5. ఆర్థిక / మార్కెట్ కారణాలుచాలాసార్లు మార్కెట్ పరిస్థితుల వల్ల కూడా ముందుగానే హార్వెస్ట్ చేస్తారు.ఉదాహరణకు:రొయ్యల ధరలు ఒక్కసారిగా పడిపోవటం, ప్రాసెసర్లు కొనుగోలు తగ్గించటంఫీడ్, విద్యుత్ ఖర్చులుపెరగటంప్రస్తుత సైజుకు మంచి మార్కెట్ ధర లభించడం..అత్యవసర పట్టుబడిలో రకాలు:1. పాక్షిక పట్టుబడిస్టాక్లో కొంత భాగమే ఒత్తిడిలో ఉన్నప్పుడు లేదా చెరువులో బయోమాస్ అధికంగా ఉన్నప్పుడు పాక్షిక పట్టుబడి చేస్తారు. సాధారణంగా కొంత నీరు వదిలి లాగుడు వలలు, చేతి వలలతో పట్టుబడి చేస్తారు. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది. మిగిలిన రొయ్యలు పెరుగటానికి అవకాశం ఉంటుంది.2. పూర్తి పట్టుబడి ఈ క్రింది సందర్భాల్లో పూర్తిగా పట్టుబడి చేస్తారువ్యాధులు వేగంగా వ్యాపిస్తున్నప్పుడు, మరణాలు పెరిగినప్పుడు నీటి నాణ్యత పూర్తిగా క్షీణించినప్పుడు తీవ్రమైన వాతావరణ హెచ్చరికలున్నప్పుడుఈ సందర్భంలో చెరువును పూర్తిగా వదిలి, రొయ్యలను వెంటనే పట్టుబడి చేయాలి.అత్యవసర పట్టుబడి చేసే విధానం:మొదటగా చెరువు పరిస్థితి త్వరగా అంచనా వేయాలి. రొయ్యల సైజు, సర్వైవల్, మేత తీసుకోవటం, సమస్యకు కారణం వంటి అంశాలు చూడాలి. దీనిపై ఆధారపడి పాక్షిక లేదా పూర్తి పట్టుబడి చేపట్టాలి.నిర్ణయం తీసుకున్న వెంటనే ఏర్పాట్లు మొదలు పెట్టాలి. కొనుగోలుదారులకు సమాచారం ఇవ్వాలి. ఫీడ్ ఇవ్వటం తగ్గించాలి ఎయిరేషన్ పెంచాలి. పని వారు, వలలు, ఐస్, వాహనం వంటివి సిద్ధం చేయాలి.పట్టుబడి సమయంలో రొయ్యలను జాగ్రత్తగా హ్యాండిల్ చెయ్యాలి. పాక్షిక పట్టుబడి కోసం లాగుడు వలలు, చేతి వలలు అనువైనవి. పూర్తి హార్వెస్ట్ కోసం నీటిని నెమ్మదిగా వదలాలి/దింపాలి. రొయ్యలను వెంటనే ఐస్‌లో ఉంచాలి. ∙రొయ్యలను శుభ్రపరిచి, గ్రేడింగ్ చేసి, చల్లని పరిస్థితుల్లో కొనుగోలుదారునికి పంపాలి.అత్యవసర పట్టుబడి తర్వాత చెరువు నిర్వహణఅత్యవసర పట్టుబడి తర్వాత చెరువులో చని΄ోయిన రొయ్యలు ఉంటే వాటిని సరిగ్గా ఏరి దూరంగా పాతి పెట్టాలి. కాలువలు లేదా వాగుల్లో వేస్తే వ్యాధులు వ్యాపిస్తాయి. ∙చెరువును పూర్తిగా శుభ్రపరచి డిస్ఇన్ఫెక్ట్ చెయ్యాలి. అడుగున పేరుకు΄ోయిన సేంద్రియ వ్యర్థాలను తొలగించాలి. అవసరమైనంత క్లోరిన్ లేదా సున్నం వేయాలి. చెరువు అడుగు పూర్తిగా ఆరాలి. అదనపు బురదను తొలగించాలి. ఇన్లెట్, అవుట్లెట్ ప్రాంతాలను కూడా శుభ్రం చేయాలి. ∙తదుపరి సాగు ప్రారంభించే ముందు ప్రధాన కారణాన్ని గుర్తించాలి. సీడ్ నాణ్యత, నీటిపరీక్షలు, ఎయిరేషన్, బయోసెక్యూరిటీ, ఫీడింగ్ తదితర విషయాల్లో లోపాలున్నాయా అని పరిశీలించాలి.ఇదీ చదవండి: స్మృతి మంధాన పెళ్లి వాయిదా : మరో వార్త వైరల్ఒక ముఖ్యమైన రక్షణ చర్య సరైన సమయంలో తీసుకున్న నిర్ణయం పెద్ద నష్టాలను నివారించగలదు. వ్యాధులు ప్రబలకుండా ఆపగలదు. రైతును ఆర్థికంగా రక్షించగలదు. అవసరమైనప్పుడు అత్యవసర పట్టుబడి చెయ్యాల్సిన పరిస్థితిని వైఫల్యంగా కాకుండా, తెలివైన, సమయోచిత నిర్ణయంగా చూడాలి. మంచి బయోసెక్యూరిటీ, నీటినాణ్యతపై నిత్యపర్యవేక్షణ, సమర్థవంతమైన చెరువు నిర్వహణ తద్వారా డిస్ట్రెస్ హార్వెస్ట్ అవసరాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. కీలకమైన నిరోధక చర్యలుఅత్యవసర పట్టుబడి అవసరం రాకుండా ఉండాలంటే...ఎస్పీఎఫ్/ వ్యాధి రహిత సీడ్ ఉపయోగించాలిబలమైన బయోసెక్యూరిటీ పాటించాలిఓవర్ స్టాకింగ్, ఓవర్ ఫీడింగ్ చేయకూడదుచెరువు అడుగును శుభ్రంగా ఉంచాలిప్రోబయోటిక్స్ వాడాలి – అత్యవసర ఎయిరేటర్లు సిద్ధంగా ఉంచాలిరోజూ చెరువు రికార్డులు రాయాలినీటకరిగిన ఆక్సిజన్, అమోనియా, నైట్రైట్, పీహెచ్, అల్కలినిటీ రెగ్యులర్‌గా చెక్ చెయ్యాలి – డా. పి. రామ్మోహన్రావు (9885144557)మత్స్యశాఖ ఉప సంచాలకులు (విశ్రాంత), కాకినాడ నిర్వహణ : పంతంగి రాంబాబు సాగుబడి డెస్క్ -
సుసంపన్న సహకారా వారసత్వ సంపద..!
వారసత్వ సంపద అపురూపమైనది. విలువను గుర్తెరిగి పరిరక్షించుకోదగినది. కొత్త తరానికి ఆ స్ఫూర్తిని అందించదగినది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నెన్నో పురాతన నాగరికతలకు ప్రతిరూపాలుగా వారసత్వ కట్టడాలు, స్థలాలు ఎన్నో ఉన్నాయి. వీటిని వరల్డ్ కల్చరల్ హెరిటేజ్ సైట్స్‌గా గుర్తించి పరిరక్షించటం ఆధునికుల బాధ్యత. సాంస్కృతిక, ఆథ్యాత్మిక, చారిత్రక, వ్యవసాయక హెరిటేజ్ సైట్స్ గురించి మాత్రమే ఇప్పటికి తెలుసు. ఇప్పుడు తాజాగా ఈ జాబితాలో సహకార సంస్థలు కూడా చేరాయి. ఇది అంతర్జాతీయ సహకార సంవత్సరం. ఈ సందర్భంగా సుప్రసిద్ధ సహకార సాంస్కృతిక వారసత్వ సంస్థలను గుర్తించే బృహత్ కృషికి అంతర్జాతీయ సహకార కూటమి (ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ అలియన్స్– ఐసీఏ) శ్రీకారం చుట్టింది. 25 దేశాలకు చెందిన అంతర్జాతీయంగా పేరొందిన 31 పురాతన సహకార సంస్థలకు ‘కోఆపరేటివ్ కల్చరల్ హెరిటేజ్ సైట్స్’గా తొలివిడతలో విశిష్ట గుర్తింపు లభించింది. ప్రత్యేక వెబ్సైట్లో ఈ సైట్స్ విశిష్టతలను తాజాగా అందుబాటులోకి తెచ్చారు. సహకార సాంస్కృతిక వారసత్వంలో భారత్‌కు విశేష భాగస్వామ్యం ఉంది. ‘కోఆపరేటివ్ కల్చరల్ హెరిటేజ్ సైట్స్’గా గుర్తింపు పొందిన సంస్థల్లో గుజరాత్ కేంద్రంగా విస్తరించిన పాడి రైతుల సహకార మకుటం ‘అమూల్’తోపాటు కేరళకు చెందిన ‘ఉరులుంగల్ వర్క్‌ర్స్ సొసైటీ’ చోటు దక్కించుకున్నాయి. అసలు సహకార ఉద్యమం అంటే ఏమిటి? ఈ ఉద్యమ చరిత్ర ఏమిటి? సుసంపన్న వారసత్వం ఏమిటి?... వివరంగా తెలుసుకుందాం!దిగ్గజ సహకార సంస్థలకు ‘సహకార సాంస్కృతిక వారసత్వ’ సంస్థలుగా గుర్తించటంతో పాటు వీటన్నిటినీ ఆన్లైన్లో ఒక్కచోట చూపించే ప్రపంచ పటం ఇప్పటి వరకు లేదు. ఈ కొరత తీర్చుతూ ఈ నెల 12న అంతర్జాతీయ సహకార కూటమి (ఐసీఏ) అధికారికంగా ప్రకటన చేసింది. సహకార సాంస్కృతిక వారసత్వ వేదికను, సహకారం తరతరాలుగా సంస్కృతి, విద్య, జీవనోపాధిని ఎలా రూపొందించిందో వివరించే స్థలాల మొట్ట మొదటి ప్రపంచ పటాన్ని ప్రారంభించింది. బ్రెసిలియాలోని బ్రెజిల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఒక వేడుకలో ఈ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. సహకార ఉద్యమ సజీవ సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడటం, దాని ప్రాముఖ్యతను ఎత్తిచూపటానికి ఈ ఆవిష్కరణ ఒక చారిత్రాత్మక అడుగుగా నిలిచిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా 25 దేశాల నుంచి 31 సహకార సాంస్కృతిక వారసత్వ ప్రదేశాలను మొట్టమొదట ఈ పటంలో ఐసీఏ చోటు కల్పించింది. ఆధునిక సహకారానికి జన్మస్థలం రోచ్డేల్ (యునైటెడ్ కింగ్డం) మొదలుకొని.. నోవా పెట్రోపోలిస్ (బ్రెజిల్) లోని మాన్యుమెంటో ఆవో కోఆపరేటివ్ నుంచి అముల్ డెయిరీ కోఆపరేటివ్ – వర్గీస్ కురియన్ మ్యూజియం (భారతదేశం), ఉరులుంగల్ వర్కర్స్ కోఆపరేటివ్ (భారతదేశం), ఫెడరేషన్ ఆఫ్ సదరన్ కోఆపరేటివ్స్ (అమెరికా), మోషి కో–ఆపరేటివ్ యూనివర్సిటీ (టాంజానియా) నుంచి అంతర్జాతీయ కార్మిక సంస్థ కోఆపరేటివ్, సోషల్ అండ్ సాలిడారిటీ ఎకానమీ యూనిట్ (స్విట్జర్లాండ్) వరకు ఇందులో ఉన్నాయి. ఐసీఏ గ్లోబల్ ఆఫీస్ సహకారంతో ఆర్గనైజేషన్ ఆఫ్ బ్రెజిలియన్ కోఆపరేటివ్స్ (ఓసీబీ), భారత్‌కు చెందిన నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్సీడీసీ) ఈ మ్యాప్‌ను రూపొందించాయి.‘ఈ వారసత్వ స్థలాలు సహకారం, సంఘీభావాన్ని బోధించే సజీవ తరగతి గదులు. సహకారం సుసంపన్న చరిత్ర అని, న్యాయమైన సమాజాలను నిర్మిస్తున్న సాంస్కృతిక శక్తి అని ఇవి నిరూపిస్తున్నాయి’ అని ఆర్గనైజేషన్ ఆఫ్ బ్రెజిలియన్ కోఆపరేటివ్స్ (ఓసీబీ) అధ్యక్షుడు మార్సియో లోప్స్ డి ఫ్రీటాస్ అన్నారు. ‘ఈ గ్లోబల్ ప్లాట్‌ఫామ్, వెబ్‌సైట్‌ను అభివృద్ధి చేయడంలో ఎన్సీడీసీ సాంకేతిక పరమైన భాగస్వామి కావటం సంతోషకరం. సహకారానికి సంబంధించిన కాలాతీత వారసత్వాన్ని ప్రపంచ ప్రజలు చూడటం కోసం నమోదు చేయటానికి ఈ కృషి దోహదపడింది’ అని ఎన్సీడీసీ మేనేజింగ్ డైరెక్టర్ పంకజ్ బన్సాల్ (ఐఏఎస్) అన్నారు. ప్రపంచవ్యాప్తంగా మొదట విడతలో 31 ప్రసిద్ధ సంస్థలను సహకార సాంస్కృతిక వారసత్వ సంస్థలుగా ఈ పటంలో చేర్చారు. ఇకముందు కూడా ఈ ప్రక్రియ కొనసాగుతుంది. పంచవ్యాప్తంగా సహకార సంస్థలు, సమాఖ్యలు, సంఘాలు తమకు తెలిసిన సహకార వారసత్వ హోదా ఇవ్వదగిన సైట్లు, సంస్థలు, జీవన సంప్రదాయాలను ప్రతిపాదించవచ్చు. సహకార సాంస్కృతిక వారసత్వ ప్రదేశాల గుర్తింపుపై కొత్త మార్గదర్శకాలలో నిర్వచించిన స్పష్టమైన అంతర్జాతీయ ప్రమాణాల ద్వారా ఈ ప్రక్రియ జరుగుతుంది. ఐసీఏలో సభ్యులైన సహకార సంస్థలు, వ్యక్తులు ఈ పటంలో చేర్పింపునకు ఈ కింది వెబ్సైట్ ద్వారా నామినేట్ చెయ్యవచ్చు. www.culturalheritage.coop/ nominationsఐసీఏ రెక్టర్ జనరల్ జెరోయిన్ డగ్లస్ అధ్యక్షతన గల వర్కింగ్ గ్రూప్ నిర్ణయం తీసుకొని, అర్హతగల సంస్థలకు హెరిటేజ్ గుర్తింపునిచ్చి ఈ పటంలో పొందుపరుస్తారు. ఈ బృందంలో మొరాకో, జర్మనీ, నైజీరియా, భారతదేశం, జపాన్, యూకే, బ్రెజిల్, అమెరికాలకు చెందిన సీనియర్ సహకారవేత్తలు ఉన్నారు. ఇప్పటి వరకు మనం మాట్లాడుకుంటున్నది కంటికి కనిపించే సుప్రసిద్ధ సహకార సంస్థలకు సంబంధించిన ప్రపంచ సహకార సాంస్కృతిక వారసత్వ పటం గురించి. దీన్ని ‘గోచర సహకార వారసత్వ జాబితా’ అనొచ్చు. వచ్చే ఏడాదిలో ‘అవ్యక్త సహకార వారసత్వ జాబితా’ను కూడా ఐసీఏ ప్రకటించనుంది. సహకార సంస్కృతిని ప్రతిబింబించే మౌఖిక సంప్రదాయాలు, అభ్యాసాలు, ఆచారాలకు ఇందులో చోటుకల్పిస్తారు. సహకార ఉద్యమం అంటే..? ఉమ్మడి యాజమాన్యంలో, ప్రజాస్వామ్యబద్ధంగా నియంత్రించబడే సంస్థ ద్వారా తమ సాధారణ ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక అవసరాలను తీర్చుకోవడానికి స్వచ్ఛందంగా ఐక్యమయ్యే వ్యక్తులతో కూడిన స్వయంప్రతిపత్తి గల సంఘం. స్వయం సహాయం, పరస్పర సహాయం సూత్రాలపై సభ్యుల అవసరాలు తీర్చటం కోసం పనిచేసే ప్రపంచ వ్యాప్తంగా విస్తరించి ఉన్న ఆర్థిక, సామాజిక ఉద్యమం. బాహ్య వాటాదారులకు లాభాలను పెంచడం కంటే సభ్యులకు సేవ చేసే లక్ష్యంతోనే ఏర్పాటైనవి సహకార సంఘాలు.అంతర్జాతీయంగా విస్తరించిన సహకార ఉద్యమానికి చోదక శక్తి అంతర్జాతీయ సహకార కూటమి (ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ అలియన్స్– ఐసీఏ). ఇది 130 ఏళ్లుగా పనిచేస్తోంది. ప్రతి కథా ఒక స్వరంతో ప్రారంభమవుతుంది. వ్యక్తులు బృందంగా ఏర్పడి కలలను పండించుకున్నప్పుడు.. కోఆపరేటివ్ ఉద్యమంలో ఈ స్వరం ప్రతిధ్వనిస్తుంది. ఇది సమాజాలను మర్చేస్తుంది. తరతరాల పాటు ఆ మార్పు కొనసాగుతూ ఉంటుంది. కోఆపరేటివ్ కల్చరల్ హెరిటేజ్ ఒక ప్రపంచ ఉద్యమం. సహకారం నుంచి పుట్టిన కథల్లో, సంప్రదాయాల్లో, కల్పనల్లోని ఈ సహకార ఉద్యమ స్వరాలన్నిటినీ ఈ ఉద్యమం భద్రంగా కాపాడుతూ ఉంటుంది అని ఐసీఏ తెలిపింది. అమూల్: శ్వేత విప్లవ స్ఫూర్తి‘ఆనంద్ మిల్క్ యునైటెడ్ లిమిటెడ్ (అమూల్)’ పాల ఉత్పత్తుల దిగ్గజ సహకార సంఘం, ఆనంద్ మ్యూజియం భారతీయ చిన్న, సన్నకారు పాడి రైతుల శ్వేత విప్లవ స్ఫూర్తికి సంబంధించిన అవిచ్ఛిన్న సహకార సంస్కృతి వారసత్వ స్ఫూర్తికి నిదర్శనాలుగా నిలుస్తాయి. 1946లో త్రిభువన్దాస్ పటేల్, తర్వాత డాక్టర్ వర్గీస్ కురియన్ చూపిన బాటలో అమూల్ దిగ్గజ సంస్థగా అవతరించింది. ఇవ్వాళ 78 ప్రాసెసింగ్ ప్లాంట్లలో రోజుకు 28 కోట్ల లీటర్ల పాలను శుద్ధి చేసి ఉత్పత్తులను తయారు చేస్తారు. గుజరాత్‌లోని 37 లక్షల పాడి రైతుల శ్రమ అమూల్ గుండెచప్పుడై వెల్లివిరుస్తోంది. ఆనంద్ నగరంలోని అమూల్ మ్యూజియం భవనం భారతదేశంలోని అత్యంత అసాధారణ సహకార విజయ గాథలలో ఒకదాన్ని చెప్పే భవనం ఉంది. అమూల్ మ్యూజియం కేవలం ప్రదర్శనల గ్యాలరీ కాదు, ఇది ఒక దేశాన్ని మార్చిన సహకార ఆదర్శాలకు సజీవ నివాళి. ఇక్కడ భారతదేశ స్వాతంత్య్ర పోరాటం, క్షీర విప్లవం పెనవేసుకున్న కథనాలు వినిపిస్తాయి. స్వావలంబన కల సహకార ఉద్యమంలో ఎలా శాశ్వత రూపాన్ని ΄పొందిందో అముల్ మ్యూజియం చూపిస్తుంది. నవంబర్ 26న కురియన్ పుట్టిన రోజును భారతదేశం జాతీయ పాల దినంగా జరుపుకుంటుంది. ఉరలుంగల్: శ్రామిక సహకార స్ఫూర్తిఉరలుంగల్ లేబర్ కాంట్రాక్ట్ కో–ఆపరేటివ్ సొసైటీ (యూఎల్సీసీఎస్).. సాధారణ కార్మికులు తమ ఉపాధి కోసం, పని భద్రత కోసం నిర్మించుకున్న అద్భుత సహకార సౌధం. కేరళ తీర్రప్రాంత పట్టణం వడకరలో ఉరలుంగల్ ప్రధాన కార్యాలయం ఉంది. శ్రామికుల చెమట చుక్కలతో ఇటుక ఇటుక పేర్చి ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఆశాసౌధం ఇది. ఆసియాలోని అత్యంత గొప్ప సహకార సంస్థలలో ఒకది. 1925లో కొద్ది మంది దార్శనిక కార్మికుల సమూహం స్థాపించారు. సంపద లేదా ప్రత్యేక హక్కు నుంచి పుట్టలేదు. అవసరం, ఐక్యత, ధైర్యం నుంచి పుట్టింది. న్యాయమైన వేతనాలు, గౌరవానికి నోచుకోని 14 మంది ఉరలుంగల్ గ్రామ కార్మికులు న్యాయం కోసం వేచి ఉండటానికి బదులుగా, దాన్ని తామే నిర్మించుకోవాలని నిర్ణయించుకొని సహకార సంఘం ఏర్పాటు చేసుకున్నారు. సామాజిక సమానత్వం, సహకార చర్యను సమర్థించిన స్థానిక తత్వవేత్త వాగ్భటానంద సంస్కరణవాద ఆదర్శాలే వారికి మార్గనిర్దేశం చేశాయి. ‘గౌరవంగా పని చేయండి, సమిష్టిగా పంచుకోండి, సమాజానికి సేవ చేయండి’ ఇదీ వారి నినాదం. రోడ్లు, వంతెనలు, విద్యాసంస్థలు, ఆసుపత్రులు నిర్మించే ప్రజా మౌలిక సదుపాయాల నిర్మాణ సంస్థగా ఈ సొసైటీ ఎదిగింది. సేంద్రియ వ్యవసాయం, కళలు, సాఫ్ట్వేర్, డిజిటల్ రంగాల్లోకి కూడా ప్రవేశించటం విశేషం. ప్రజలు నిజాయితీ, క్రమశిక్షణ, ఒకరిపై ఒకరు విశ్వాసంతో కలిసి పనిచేసినప్పుడు, వారు సృష్టించగల సంపదకు పరిమితి లేదని ప్రపంచానికి గుర్తు చేస్తూనే ఉంటుంది ఉరులుంగల్.ఇవి కేవలం సంస్థలు మాత్రమే కాదు!సహకార సంస్థలు కేవలం సంస్థలు మాత్రమే కాదు. అవి సంస్కృతి, చరిత్ర, గుర్తింపును కలిగి ఉంటాయి. ఈ సహకార సాంస్కృతిక వారసత్వ ప్రదేశాల ప్రపంచ పటాన్ని ఆవిష్కరించటం ద్వారా సహకారాన్ని యావత్ మానవాళి భాగస్వామ్య వారసత్వ విజయంగా జరుపుకుంటున్నాం. సంఘీభావం, స్వయం సహాయం ద్వారా ప్రజలను, సమాజాలను అనుసంధానిస్తాం.– ఏరియల్ గ్వార్కో, అధ్యక్షుడు, అంతర్జాతీయ సహకార కూటమి(ఐసీఏ)పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ (చదవండి: కొత్తిమీర పంటతో జస్ట్ 30 రోజుల్లోనే రూ.లక్ష లాభం!.. శెభాష్) -
కొత్తిమీరతో జస్ట్ 30 రోజుల్లోనే రూ. లక్ష లాభం!.. శెభాష్
పంట పెట్టుబడి..తక్కువ అధిక అధాయం వస్తే ఏ రైతు అయినా సంతోషంతో ఎగిరిగంతేస్తాడు. అది కూడా సాదాసీదా చిన్న పంటగా వేసిందే ఊహించని రేంజ్లో లాభం వస్తే ఆ సంతోషానికి అవధులు ఉండవు కదా..!. అలాంటి ఆనందంతోనే తడిసిముద్దవుతోంది ఈ యువ రైతు శివానీ పవార్. మరి ఆమె ఈ సక్సెస్ ఎలా అందుకుందంటే..మధ్యప్రదేశ్‌కి చెందిన యువ రైతు శివానీ తాను ఎలా చిన్న పంటతో తక్కువ టైంలో అధిక లాభం ఆర్జించిందో ఇన్స్టాగ్రామ్ వీడియోలో షేర్ చేసుకుంది. అది నెటిజన్ల దృష్టిని అమితంగా ఆకర్షించడమే గాక ఈవిషయం నెట్టింట వైరల్‌గా మారింది. తాను ఒక చిన్న కొత్తిమీర కట్టతో జస్ట్ 30 రోజుల్లోనే రూ. లక్ష రూపాయాలు లాభం అందుకున్నానని వీడియోలో పేర్కొంది. తన ఖర్చులు, పెట్టుబడి అన్నింటిని తీసేస్తే..9 టు 5 జాబ్ చేసే వారికంటే మెరుగైనా ఆదాయాన్ని ఆర్జించానని అంటోంది. తన చిన్న పొలంలో కొత్తిమీర పంట వేశానని, అది 30 రోజుల్లోనే కోతకు వచ్చిందని వివరించింది. ఆ తర్వాత అమ్మకాలు రూ. 1.25 లక్షలకు చేరాయని పేర్కొంది. తనకు ఈ పంటకు, విత్తనాలు, ఎరువు, కూలీ, నీటి పారుదల..ఇలా అన్నింటికి కలిపి మొత్తం రూ. 16,000లే ఖర్చు అయ్యాయని చెప్పుకొచ్చింది. రోజువారి వంటలో ఉపయోగించే కొత్తిమీరకు తక్కువ పెట్టుబడి అవుతుందని, అయితే స్వల్పకాలంలోనే అధిక టర్నోవర్‌ని ఇచ్చే పంట అని వెల్లడించింది. శీతాకాలంలో ఈ ఆకుకూరకు అధిక డిమాండ్ ఉంటుందని..అదే తాను క్యాష్ చేసకున్నట్లు పేర్కొంది. కొత్తిమీర సాగు..నేల వాతావరణాన్ని బట్టి కొత్తిమీర సాధారణంగా 30 నుంచి 40 రోజుల్లో ఎకరానికి ఐదు నుంచి పది టన్నుల దిగుబడి వస్తుందట. ఇలాంటి పంటలు వేయాలనుకునే రైతులు ప్రధానంగా గుర్తించుకోవాల్సింది ఏంటంటే..నీటి పారుదల, సరైన విత్తనాలు, పంటను సరిగా నిర్వహించడం తదితరాల పట్ల కేర్‌గా ఉండాలని అంటోంది శివాని. తక్కువకాలంలో లాభం అందించే ఈ చక్ర వ్యవసాయం ప్రస్తుతం ట్రెండ్‌గా మారింది. చాలామంది యువ రైతులు ఈ చక్ర వ్యవసాయం ట్రెండ్‌నే అనుసరిస్తున్నారు. అలాంటి చక్ర వ్యవసాయం పంటలు ఏంటంటే..పచ్చి ఉల్లిపాయలు, పాలకూర, మెంతులు, త్వరితగతిన ఆదాయం ఇచ్చే పంటలట. ప్రస్తుతం ఈ చక్ర వ్యవసాయం అనేక రాష్ట్రాల్లో విస్తరిస్తోంది కూడా. View this post on Instagram A post shared by Shivani Pawar | Farmer🌱 (@thefarmergirl.cv) (చదవండి: ఒక చిత్రమే..రెండుగా రూపాంతరం..! ఈ టాలెంట్‌కి మాటల్లేవ్ అంతే..) -
కన్హా శాంతి వనంలో మహా కిసాన్ మేళా
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా నందిగామ సమీపంలోని ప్రసిద్ధ హార్ట్ఫుల్నెస్ సెంటర్ కన్హా శాంతి వనంలో డిసెంబర్ 3–4 తేదీల్లో మహా కిసాన్ మేళా జరగనుంది. సుస్థిర వ్యవసాయాభివృద్ధి కోసం కృషి చేసే లాభాపేక్ష లేని శాస్త్రీయ సంస్థ ఆసియన్ పీజీపీఆర్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ మహా కిసాన్ మేళా జరుగుతోంది. దేశంలో ఎప్పుడూ లేని రీతిలో అత్యంత ఆధ్యాత్మిక కేంద్రంలో జరుగుతున్న ఈ మహోత్సవంలో వేలాది మంది రైతు ప్రతినిధులు పాల్గొంటారని ఆసియన్ పీజీíపీఆర్ఆర్ సొసైటీ (ఇండియా చాప్టర్) అధ్యక్షులు డా. శామారావ్ తెలిపారు. ఇక్రిశాట్ ఆవరణలో గత నెలలో నిర్వహించాలని తొలుత తలపెట్టినప్పటికీ భారీ వర్షాల కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. ముందస్తు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారే ఈ కిసాన్ మేళాలో ప్రతినిధులుగా పాల్గొనేందుకు అర్హులు. ఈ నెల 20 వరకు మాత్రమే రిజిస్ట్రేషన్ (ఫీజు: రూ. వంద) సదుపాయం అందుబాటులో ఉంటుంది. ఇదీ చదవండి: అరగంటలో రూ. 10 లక్షలు : సేల్స్‌మేన్‌కు దిమ్మ తిరిగిందిడా. నితేష్ – 98440 94168డా. శామారావ్ జహగీర్దార్ 97406 41068.రిజిస్ట్రేషన్, వసతి రిజర్వేషన్ నమోదు లింక్: https://eventform.in/view/apgpr -
‘నానో’ మ్యాజిక్ తక్కువ ఎరువు ఎక్కువ దిగుబడి!
పంట మొక్కల మొదళ్ల దగ్గర వేసే సాధారణ రసాయనిక ఎరువుల్లో 30 శాతమే పంటలకు ఉపయోగపడుతుంటే, 70% ఎరువులు నేల పాలవుతున్నాయి. రైతుల డబ్బు వృథా కావటంతో పాటు ఇవి నేలను, నీటిని, గాలిని కలుషితం చేస్తున్నాయి. అయితే, దీన్ని సమూలంగా మార్చేసే అవకాశం ఉందని తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. నేలపై వేసే యూరియా వంటి ఎన్పీకే (రసాయనిక) ఎరువులనే అతి సూక్ష్మ కణాల ఎన్పీకే పొడిగా మార్చి, నేలపై వెయ్యకుండా, నీటిలో కలిపి పిచికారీ చేస్తే.. ప్రామాణిక మోతాదులో కేవలం 20–30% నానో ఎరువులతోనే అధిక దిగుబడులు సాధించవచ్చు. 80–70% ఎరువులను నికరంగా ఆదాయ చెయ్యవచ్చు. ఎరువుల ఖర్చును తగ్గించుకోవటంతో పాటు పనిలో పనిగా పర్యావరణ కాలుష్యాన్ని, నేల ఆరోగ్యాన్ని, భూతాపాన్ని కూడా తగ్గించుకోవచ్చు. అయితే, అతి సూక్ష్మ రసాయనిక ఎరువులతో దీర్ఘకాలంలో దుష్ఫలితాలేమీ లేవని నిర్ధారించే పరీక్షలు ఇంకా చెయ్యాల్సి ఉంది. ఆ తర్వాతే ఈ టెక్నాలజీ రైతులకు అందుబాటులోకి వస్తుందని ఈ పరిశోధనలో కీలకపాత్ర పోషిస్తున్న ప్రొ. శ్రీకాంత్ ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు.‘నానో ఫెర్టిలైజర్ లేదా అతి సూక్ష్మ రసాయనిక ఎరువులు’ అనగానే సీసాల్లో నింపి అమ్ముతున్న నానో ద్రవ రూప ఎరువులు చప్పున గుర్తొస్తాయి. అయితే, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది వాటి గురించి కాదు. మామూలుగా మన రైతులు గుప్పిళ్లతో పొలాల్లో వెదజల్లే తెల్లని యూరియా, ఫాస్పరస్, డీఏపీ వంటి గుళికల రసాయనిక ఎరువుల గురించే. గుళికల రూపంలో ఉండే వీటిని అతి సూక్ష్మ కణాల పొడిగా మార్చితే అవి ‘నానో ఎరువులు’ అవుతాయి. ఈ పొడిని నీటితో కలిపి పంటలపై పిచికారీ చేస్తే.. వ్యవసాయ శాస్త్రవేత్తలు పంటలకు సిఫారసు చేసే రసాయనిక ఎరువుల మోతాదులో 20–30% అతిసూక్ష్మ ఎరువులతోనే సాధారణం కన్నా అధిక దిగుబడి సాధించవచ్చని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిశోధకులు రుజువు చేశారు. ఎన్పీకే స్థూల ఎరువులతో పాటు ఐరన్, జింక్ తదితర సూక్ష్మపోషక ఘనరూప ఎరువులను సైతం పొడిగా మార్చి, నీటిలో కలిపి పంటలపై పిచికారీ చేసి సత్ఫలితాలు సాధించవచ్చు అంటున్నారు. స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్సెస్ అండ్ టెక్నాలజీకి చెందిన ప్రొఫెసర్ వీవీఎస్ఎస్ శ్రీకాంత్ తదితర పరిశోధకుల బృందం నానో–ఎరువుల రూపకల్పన, తయారీపై పనిచేసింది. మొక్కల ఎదుగుదల తీరుపై ప్లాంట్ సైన్సెస్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ పొదిలె అప్పారావు బృందం అధ్యయనం చేసింది. అతి సూక్ష్మ ఎరువుల ప్రయోజనాలు 3:∙ఎరువుల మోతాదులో 20–30% చాలు∙80–70% తగ్గనున్న ఎరువుల ఖర్చు ∙నేల, నీరు, గాలి కాలుష్యానికి చెక్!రోజ్మేరీపై నెలకోసారి పిచికారీరోజ్మేరీ (రోస్మరినస్ అఫిసినాలిస్) ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా వాడుకలో ఉన్న విలువైన సుగంధ నూనె పంట. రోజ్మేరీ నూనెను ఆహారం, సౌందర్య సాధనాలు, ఔషధ పరిశ్రమల్లో విస్తృతంగా ఉపయోగిస్తారు. అయితే, సాధారణంగా అధికంగా రసాయనిక ఎరువుల వాడకంతో అధిక ఖర్చుతో పాటు పర్యావరణానికి హాని కలుగుతోంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిశోధకులు ప్రత్యేక డిజైన్‌తో రూపొందించిన యంత్రంలో సాధారణ ఎన్పీకే ఎరువులను వేసి, నానో ఎరువుల పొడిగా మార్చారు. ఎన్పీకే ఎరువులతో పాటు ఇనుము, జింక్, మాంగనీస్, రాగి సహా కీలకమైన సూక్ష్మ పోషకాలను కూడా అతి సూక్ష్మ పొడిగా మార్చి వాడారు. గ్రీన్హౌస్లో కుండీల్లో పెరిగే రోజ్మేరీ మొక్కలపై 3 నెలల పంట కాలంలో నెలకోసారి పిచికారీ చేశారు. సాధారణ ఎరువుల గుళికలను నేలపై వేసినప్పటితో పోల్చితే, పిచికారీ చేసిన నానో పొడిలోని పోషకాలను మొక్కలు ఆకుల ద్వారా చాలా మెరుగ్గా ఉపయోగించుకున్నట్లు గుర్తించారు. రోజ్మేరీ పంట సాగులో సాధారణంగా హెక్టారుకు ఏడాదిలో 100–300 కిలోల ఎన్పీకే ఎరువులు వాడతారు. అయితే, రోజ్మేరీ మొక్కలకు ప్రామాణిక ఎరువుల మోతాదులో 20–30% పరిమాణంలోనే నానో ఎరువుల పొడిని వాడారు. అయినా మొక్కలు, వేర్ల పెరుగుదల మెరుగ్గా ఉంది. అతి సూక్ష్మ రూపంలోని రసాయనిక ఎరువుల కణాలను ఆకులు సులువుగా గ్రహించటం వల్ల సమర్థవంతంగా పోషక శోషణ జరిగింది. జీవక్రియ మెరుగ్గా జరిగింది. ఫలితంగా అధిక నూనె దిగుబడి వచ్చింది. నూనె నాణ్యత, సుగంధ స్థాయి అధికంగా వచ్చింది. ఈ పరిశోధన ఫలితాలు ‘ఇండస్ట్రియల్ క్రాప్స్–ప్రొడక్ట్స్’ శాస్త్రీయ జర్నల్‌లో ఇటీవల ప్రచురితమయ్యాయి. ఈ విధానాన్ని మార్కెట్లో అధిక విలువ కలిగిన అనేక ఔషధ, సుగంధ పంటలకు కూడా అన్వయించవచ్చని పరిశోధకులు విశ్వసిస్తున్నారు. మీటరులో 100 కోట్ల వంతు!సాధారణంగా రైతులు వాడే డీఏపీ, ఎన్పీకే వంటి రసాయనిక ఎరువుల గుళికలు మైక్రోమీటర్ల (మీటరులో పది లక్షల వంతు) సైజులో ఉంటాయి. ఇఫ్కో నుంచి సా«దారణ 19:19:19 ఎన్పీకే, మైక్రో–న్యూట్రియంట్ మిక్స్ (ఉత్కర్ష్ కాంబి–2)లను కొనుగోలు చేశారు. వీటిని హై–ఎనర్జీ షేకర్ మిల్లులో వేసి నానో ఎరువుల పొడిని తయారు చేశారు. నానో ఎరువుల కణాలు మీటరులో 100 కోట్ల వంతు సైజులో అతి సూక్ష్మంగా ఉంటాయి. నానో ఎరువుల బయో ఎవైలబిలిటీ (జీవ లభ్యత) ఎక్కువ. నీటిలో కలిపి పంటలపై పిచికారీ చేసినప్పుడు పత్ర రంధ్రాల ద్వారా ఈ పోషకాలు నేరుగా మొక్క సులువుగా, సమర్థవంతంగా తీసుకోగలుగుతుంది. నేలలో వేసిన సాధారణ ఎరువుల్లో పోషకాలను వేర్ల ద్వారా గ్రహించగలిగే దానికన్నా, పిచికారీ చేసిన నానో ఎరువుల పోషకాలను చాలా సులువుగా, మెరుగ్గా పంట మొక్కలు తీసుకోగలుగుతాయి. వ్యవసాయ, ఉద్యాన శాస్త్రవేత్తలు సిఫారసు చేసే మోతాదులో 20 నుంచి 30% అతి సూక్ష్మ ఎరువులతోనే అధిక దిగుబడి తీయటం సాధ్యమవుతుందని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిశోధకులు పేర్కొన్నారు. దీర్ఘకాలిక ప్రభావాలపై పరీక్షలు చెయ్యాల్సి ఉందివ్యవసాయ శాస్త్రవేత్తలు సూచించే ప్రామాణిక రసాయనిక ఎరువుల పరిమాణంలో 20–30% నానో ఎరువులు æ వాడితే అధిక దిగుబడులు సాధించవచ్చు. అతి సూక్ష్మ కణాలతో కూడి ఉన్నందున నానో ఎరువులు తక్కువ మోతాదుతోనే అధిక ఫలితాన్ని ఇస్తాయి. నేల, నీటి వ్యవస్థలపై ఒత్తిడిని తగ్గిస్తాయి. సాధారణ రసాయనిక ఎరువులను ఉపయోగించి నానో ఎరువులను తయారు చేశాం. మా యూనివర్సిటీ ప్రయోగశాలలో నియంత్రిత వాతావరణంలో కుండీల్లో రోజ్మేరీ మొక్కలపై ప్రయోగాత్మకంగా నానో ఎరువులు వాడాం. దాంతో పాటు రోజ్మేరీ నూనె దిగబడితో పాటు నాణ్యత కూడా పెరిగింది. అయితే, రైతులకు ఈ సాంకేతికత అందించడానికి ముందు మరికొన్ని పరీక్షలు చెయ్యాల్సి ఉంది. నానో ఎరువుల వల్ల దీర్ఘకాలిక పర్యావరణ, ఆరోగ్య ప్రభావాలు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవడానికి అంతర్జాతీయ మార్గదర్శకాలు, కేంద్ర ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం కఠినమైన పరీక్షలు ఇంకా చెయ్యాల్సి ఉంది. నానోటెక్నాలజీ అనూహ్యంగా ఎటు వంటి హానీ చెయ్యదని, వ్యవసాయానికి నిజంగా ప్రయోజనం చేకూరుస్తుందని ఆధార సహితంగా నిర్ధారించుకోవటానికి ఈ పరీక్షలు ముఖ్యం. ఆ తదనంతరం నానో ఎరువుల సాంకేతికతను రైతుల వద్దకు తీసుకువెళ్తాం. – ప్రొఫెసర్ వీవీఎస్ఎస్ శ్రీకాంత్, స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ,యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ – పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి -
సాయిల్ హెల్త్‌కు ఓ చట్టం..!
మట్టి అతి వేగంగా అంతరిస్తోంది. మట్టిని బతికించండి.. అని ‘ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (ఐయూసీఎన్)’ అబుదాబిలో జరిగిన ద్వైవార్షిక అంతర్జాతీయ మహాసభ ఇటీవల పిలుపునిచ్చింది. అంతర్జాతీయంగా ఐక్యరాజ్యసమితి సభ్య దేశాలన్నీ కట్టుబడి అమలు చేసేలా ‘సాయిల్ సెక్యూరిటీ లా’ చెయ్యాల్సిన అవసరం ఉందని ఐయూసీఎన్ మహాసభ తీర్మానం చేసింది. ‘మిషన్ 007 – సాయిల్ సెక్యూరిటీ లా’ పేరిట చరిత్రలో మొట్టమొదటి సారి ఈ తీర్మానం ఆమోదం పొందింది. నేల ఆరోగ్యమే మన ఆరోగ్యం, ఆహార భద్రతలకు మూలాధారం. భూగోళంపై జీవం మనుగడకు ముఖ్యమైన 8 అంశాల్లో మట్టి ఆరోగ్యం కూడా ఉంది. సాగు భూములు / నేలలు ప్రపంచవ్యాప్తంగా అతి వేగంగా క్షీణతకు గురవుతున్నాయి. 2050 నాటికి 1.6 కోట్ల చదరపు కిలోమీటర్ల నేల నిస్సారమవుతుందని, ఏటా 87,800 కోట్ల డాలర్ల మేరకు ఆర్థిక నష్టం చేకూరుతుందని ఐరాసకు చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏఓ) తాజాగా అంచనా వేసింది. ఈ అత్యవసర పరిస్థితిని ప్రతిఫలించేలా ఐయూసీఎన్ తీర్మానం చేసింది. అన్నీ సజావుగా జరిగితే త్వరలోనే చట్టబద్ధమైన ఒడంబడిక రూపుదిద్దుకునే క్రమంలో ఇది కీలక ముందడుగు. మరికొన్ని దశలు దాటి చట్టం జరిగితే, మరింత ఫోకస్‌తో సాగు భూముల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వాలు నడుము బిగించేందుకు దోహదం చేస్తుంది.మట్టిని బతికించుకోవటానికి అంతర్జాతీయ సమాజం ఒక అడుగు ముందుకు వేసింది. ఇది కేవలం ప్రారంభం మాత్రమే, అయినా సందేశం స్పష్టంగా ఉంది. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (ఐయూసీఎన్) ఐక్యరాజ్య సమితికి అనుబంధ సంస్థ. భూగోళంపై పర్యావరణం, జీవజాతుల పరిరక్షణ స్థితిగతులపై ఐయూసీఎన్ దృష్టిని కేంద్రీకరిస్తుంది. ప్రతి రెండేళ్లకోసారి వరల్డ్ కన్జర్వేషన్ కాంగ్రెస్‌ను నిర్వహిస్తూ జాతీయ, రాష్ట్రీయ ప్రభుత్వాలకు సూచనలు అందిస్తుంటుంది. గత నెలలో అబుదాబిలో జరిగిన ఐయూసీఎన్ వరల్డ్ కన్జర్వేషన్ కాంగ్రెస్‌లో ‘మోషన్ 007: సాయిల్ సెక్యూరిటీ లా’పై అధికారిక తీర్మానాన్ని సభ్యులు ఆమోదించారు. నేలల భద్రతకు అవసరమైన తక్షణ కార్యాచరణ ప్రణాళికకు చట్టపరమైన గుర్తింపును అందించడమే ఈ తీర్మానం లక్ష్యం. నేలల భద్రతపై ప్రపంచవ్యాప్తంగా అనుసరించదగిన చట్టాన్ని రూపొందించడానికి భావనలను, విధివిధానాలను అభివృద్ధి చేయాలని ఈ మహాసభ పిలుపునిచ్చింది. నేల భద్రతపై అంతర్జాతీయ చట్ట ప్రకారం సభ్యు దేశాలన్నీ విధిగా కట్టుబడి ఉండేలా లేదా అనుసరించమని సూచించేలా సాయిల్ సెక్యూరిటీ చట్టం చేసే విషయాన్ని ఆలోచించమని వరల్డ్ కమిషన్ ఆన్ ఎన్విరాన్ మెంటల్ లాకు ఐసీయూన్ ‘మోషన్ 007’ తీర్మానం ద్వారా విజ్ఞప్తి చేసింది.90 దేశాల్లో నేలల పరిరక్షణకు చుక్కానిప్రకృతిలో జీవవైవిధ్యాన్ని పరిరక్షించేందుకు మార్గనిర్దేశనం చేసే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్సర్వేషన్ ఆఫ్ నేచర్ (ఐయూసీఎన్) కృషితో ప్రపంచంలోనే మొట్టమొదటగా నేలల పరిరక్షణకు అంతర్జాతీయ చట్టబద్ధ వ్యవస్థను ఏర్పాటు చెయ్యడానికి తొలి అడుగుపడింది. ‘మోషన్ 007– సాయిల్ సెక్యూరిటీ లా’ తీర్మానం ఈ దిశగా అత్యంత కీలకమైన, శుభప్రదమైన చర్య. ఇది 90 దేశాల్లో, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న, అల్పాదాయ దేశాల్లో, సాగు భూముల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక పథకాల ప్రారంభానికి దోహదం చేసే జాతీయ చట్టాల రూపుకల్పనకు భూమిక కానుంది. ప్రకృతి, సేంద్రియ పద్ధతుల ప్రోత్సాహానికి, ప్రభుత్వాల జవాబుదారీతనానికి ఇది దన్నుగా నిలుస్తుంది. అబుదబిలో గత నెలలో జరిగిన ఐయూసిఎన్ ద్వైవార్షిక మహాసభలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి తెరవెనుక జరిగిన కృషిలో భారతీయ స్వచ్ఛంద సంస్థ సేవ్ సాయిల్ (ఈషా అవుట్‌రీచ్), ఆస్ట్రేలియా సంస్థ ఆరోరా, అమెరికాకు చెందిన పేస్ యూనివర్సిటీలోని గ్లోబల్ సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంటల్ లీగల్ స్టడీస్ కీలకపాత్ర పోషించాయి. సేవ్ సాయిల్ చీఫ్ సైంటిస్ట్, టెక్నికల్ ఆఫీసర్ ప్రవీణ శ్రీధర్ హర్షం వ్యక్తం చేస్తూ.. ‘ఆహారం, నీరు, జీవవైవిధ్యం, క్లైమెట్ రిసైలియన్స్లకు నేల ఆరోగ్యమే పునాది అని ఒక అంతర్జాతీయ పరిరక్షణ సంస్థ మొట్టమొదటిగా మోహన్ 007 తీర్మానం ద్వారా గుర్తించటం హర్షదాయకం. ఇది నేలమ్మకు దక్కిన గౌరవం. ఈ విజయం వెనుక ప్రపంచవ్యాప్తంగా ఎందరెందరో చెమటోడ్చి సుదీర్ఘకాలంగా చేస్తున్న కృషి దాగి ఉంది..’ అని వ్యాఖ్యానించారు. తీర్మానం నేపథ్యంలో ఐయూసీఎన్ ఒక వర్కింగ్ గ్రూప్‌ను ఏర్పాటు చేయనుంది. నేలల పరిరక్షణకు కుదరబోయే అంతర్జాతీయ ఒడంబడిక లేదా ఏర్పాటు కాబోయే ప్రపంచ చట్టబద్ధ సంస్థకు సంబంధించిన భావనలను, విధివిధానాలను ఈ వర్కింగ్ గ్రూప్ రూపొంస్తుంది.8 అస్తిత్వ సమస్యల్లో ఇదొకటి..భూగోళంపై పర్యావరణ సమతుల్యత కొనసాగింపునకు కీలకమైన విధులను నిర్వచిస్తూ, అవసరమైన పర్యావరణ సేవలను, జీవభౌతిక సేవలను అందించడంతోపాటు.. భూమిపై జీవులను ముప్పుల నుంచి రక్షించటానికి మానవాళి నేలలను బాధ్యతాయుతమైన రీతిలో సంరక్షించుకోవటం అవసరమని ఐసీయూఎన్ మహాసభ పిలుపునిచ్చింది. విధానాల రూపుకల్పన, కార్యాచరణ ప్రణాళికల్లో నేలల భద్రత అంశాన్ని ప్రాధాన్యంతో అంతర్భాగం చేయడానికి అంతర్జాతీయ ఒడంబడికను రూపొందించే దిశగా ముందడుగు పడింది. భూగోళంపై మానవ మనుగడ ప్రమాదంలో ఉంది. భూగోళం ఎదుర్కొంటున్న 8 అస్తిత్వ సమస్యలలో నేలల క్షీణత సమస్య కూడా ఒకటని ఐయూసీఎన్ మహాసభ నొక్కి చెప్పింది. వాతావరణ మార్పు, ఆహారం, నీటి కొరత, జీవవైవిధ్య పరిరక్షణ, విద్యుత్తు సుస్థిరత, పర్యావరణ నిర్వహణ, మానవ శ్రేయస్సు తోపాటు నేల ఎనిమిదో అస్తిత్వ సమస్యగా పేర్కొంది. చర్చలతో కాలక్షేపం ఇంకెన్నాళ్లు?వాతావరణం, జీవవైవిధ్యం, నీరు, ఎడారీకరణపై ఇప్పటికే ఉన్న అంతర్జాతీయ ఒడంబడికలు లేదా చట్టబద్ధంగా కట్టుబడి ఉండే ఒప్పందాలు అంతర్జాతీయ మహాసభల్లో ఐక్యరాజ్యసమితి సభ్యదేశాలు ఏకాభిప్రాయానికి రావటానికి సాధారణంగా చాలా సంవత్సరాలు పడుతుంది. ఇంకా చెప్పాలంటే, ఈ సంక్లిష్టమైన చర్చల ప్రక్రియ ఒక కొలిక్కి రావటానికి దశాబ్దాల కాలం పడుతుంటుంది. ఈ అనుభవం దృష్ట్యా.. నేలల క్షీతను ఆపేందుకు అంతర్జాతీయ ఒడంబడక లేదా చట్టపరమైన సంస్థ సృష్టిపై చర్చల ప్రక్రియను వేగవంతం చేయడమే ఐయూసీఎన్ లక్ష్యంగా పెట్టుకుంది. నేలలకు భద్రత కల్పించే బాధ్యతను ప్రత్యేక ఒడంబడికగా కాకుండా ఇప్పటికే అమల్లో ఉన్న వాతావరణ మార్పు, జీవవైవిధ్యం లేదా ఎడారీకరణపై ఒడంబడికలలో దేనికైనా అనుబంధంగా మార్చితే చర్చలతో కాలం వెల్లబుచ్చకుండా వెంటనే పని ప్రారంభం కావటానికి ఉపయోగపడుతుందని చాలామంది నిపుణులు సూచిస్తున్నారు. అయితే, నేలల భద్రతపై ఇప్పుడు ఐయూసీఎన్ ద్వైవార్షిక మహాసభలో ఆమోదం మోషన్ 007 అధికారిక తీర్మానం చెయ్యటం కూడా అంత చిన్న విషయమేమీ కాదు. ఇది నిస్సందేహంగా ఒక ముఖ్యమైన మైలురాయి. మృత్తికా శాస్త్రవేత్త డా. క్వెంటిన్ స్టైక్ అభివర్ణించినట్లుగా ‘ఇది మానవత్వం చేపట్టగల ఒక శక్తివంతమైన ఐక్యతా చర్య‘గా గుర్తించటం అవసరమని డౌన్టుఎర్త్కు చెందిన ప్రసిద్ధ పర్యావరణ పాత్రికేయుడు రిచర్డ్ మహాపాత్ర చక్కగా వ్యాఖ్యానించారు.వార్షిక నష్టం 87,800 కోట్ల డాలర్లునేలలకు జరుగుతున్న నష్టాన్ని నిలువరించడానికి దేశాలు తక్షణ ఉపశమన చర్యలు తీసుకోకపోతే 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా 1.6 కోట్ల చదరపు కిలోమీటర్ల భూమి జీవాన్ని కోల్పోయి సాగుయోగ్యం కాకుండా పోతుందని ఎడారీకరణపై పోరుకు సంబంధించిన అంతర్జాతీయ ఒడంబడిక హెచ్చరిస్తోంది. దీని ఆర్థిక నష్టం అపారమైనది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు వార్షికంగా 87,800 కోట్ల డాలర్ల నష్టం. నేలల వినియోగానికి సంబంధించి పర్యావరణపరమైన పరిమితులను ఇప్పటికే దాటేశాం. నేలల క్షీణత ఎంత ఎక్కువైందంటే.. అది భూగ్రహానికి ఉండే మానవాళిని నిలబెట్టే సామర్థ్యాన్ని దెబ్బతీయడం ప్రారంభించిందని ఐయూసీఎన్ మహాసభ పేర్కొంది. అడవులు, నీరు, వాతావరణ పరిరక్షణ వంటి అంశాలపై ఐయూసీఎన్ మహాసభలు గతంలో చర్చింది అంతర్జాతీయ ఒడంబడికలను కుదిర్చింది. కానీ నేలల పరిరక్షణపై గతంలో ఎప్పుడూ ఇలాంటి శ్రద్ధ చూపలేదు.జీవితానికి పునాది‘నేల.. జీవితానికి నిశ్శబ్ద పునాది. ఆహార ఉత్పత్తికి కీలకం. నీటిని నియంత్రిస్తుంది. కార్బన్‌ను నిల్వ చేస్తుంది. జీవవైవిధ్యాన్ని నిలబెట్టుకుంటుంది. అయినప్పటికీ ప్రకృతిలో దీనికి రక్షణ తక్కువగా ఉంద’ని ఆస్ట్రేలియాకు చెందిన అరౌరా అనే సంస్థకు చెందిన డా. జూలియో పచాన్ మాల్డోనాడో చె΄్పారు. నేలల పరిరక్షణను ప్రపంచ ధాన్యతగా మార్చడానికి ఈ సంస్థ ప్రచారోద్యమం నిర్వహిస్తుంటుంది. ‘ప్రతి భూసంబంధమైన ప్రతి పర్యావరణ వ్యవస్థకు నేల పునాది. నేలలు సురక్షితంగా లేకపోతే.. ఆహారం లేదు, నీటి భద్రత లేదు, భవిష్యత్తు లేదు’ అని సిడ్నీ(ఆస్ట్రేలియా) విశ్వవిద్యాలయంలోని నేల శాస్త్రవేత్త డా. జూలియా ఫీత్ అంటున్నారు. నేల సంక్షోభాన్ని పరిష్కరించకుండా మనం వాతావరణం లేదా జీవవైవిధ్య సంక్షోభాలను పరిష్కరించలేం అని ఆమె స్పష్టం చేశారు. ఐక్యరాజ్య సమితి నిర్దేశిత 17 సుస్థిర అభివృద్ధి లక్ష్యాలలో కనీసం 12 లక్ష్యాలు నెరవేరడానికి నేల ఆరోగ్యం కూడా అవసరం. ఈ లక్ష్యాలను 2030 నాటికి సాధించాలి. ముఖ్యంగా, ఆకలిని నిర్మూలించడం అనే లక్ష్య సాధనకు నేల ఆరోగ్యం కీలకం. పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ (చదవండి: 4 వేల లీటర్ల పాల దిగుబడినిచ్చే ఆవుల గురించి తెలుసా?) -
4 వేల లీటర్ల పాల దిగుబడినిచ్చే ఆవుల గురించి తెలుసా?
హోల్స్టీన్ ఫ్రైసియన్, సాహివాల్ జాతుల కలయికతో రూపొందిన సంకరజాతి కొత్త ఆవుల జాతి ‘ఫ్రైస్వాల్’ (Frieswal). ఇప్పటికి ఉన్న గోజాతులన్నిటికన్నా అత్యధికంగా ఒక ఈత కాలంలో 4 వేల కిలోల పాల దిగుబడినివ్వటం దీని ప్రత్యేకత. భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి(ఐసీఏఆర్)కు అనుబంధంగా మీరట్‌లోని కేంద్రీయ పశు పరిశోధనా సంస్థ (సీఐఆర్సీ) మిలటరీ ఫామ్స్ సర్వీస్ సంయుక్తంగా ఈ కొత్త పాడి పశుజాతిని రూపొందించాయి. ఇందులో హెచ్.ఎఫ్. గుణాలు 62.5%, సాహివాల్ గుణాలు 37.5% ఉంటాయి. అధిక పాల దిగుబడినిచ్చే హెచ్.ఎఫ్. గుణాలతో పాటు దేశంలోని వివిధ వ్యవసాయ వాతావరణ పరిస్థితులకు తట్టుకొని మంచి ఫలితాలను ఇవ్వగలిగిన దేశీ గోజాతి సాహివాల్ లక్షణాలను ఫ్రైస్వాల్ పుణికిపుచ్చుకుంది. ఈనిన తర్వాత 300 రోజుల్లో 4% కొవ్వు కలిగిన 4 వేల లీటర్ల పాల దిగుబడిని ఫ్రైస్వాల్ ఆవు ఇస్తుందని ఐసీఏఆర్ ప్రకటించింది. పాల ఉత్పత్తిని గణనీయంగా పెంచే లక్ష్యంతో ఫ్రైస్వాల్ జాతి అభివృద్ధి కోసం దేశవ్యాప్తంగా 42 మిలటరీ ఫామ్స్‌లో పరిశోధనలు జరిగాయి. సైనికులకు మేలైన పాలను అందించేందుకు దేశవ్యాప్తంగా ఏర్పాటైన మిలటరీ డెయిరీ ఫామ్స్ సరికొత్త సంకరజాతి గోజాతుల అభివృద్ధిలో కీలకపాత్ర పోషించాయి. కొత్త పశు జాతిని అభివృద్ధి చెయ్యటం కోసం శాస్త్రవేత్తలు సుమారు 4 దశాబ్దాల పాటు శ్రమించారు. 1984 సెప్టెంబర్ 4న ప్రారంభమైన ఫ్రైస్వాల్ పరిశోధనలు కొద్ది నెలల క్రితమే పూర్తయ్యాయి. ఈ పరిశోధన ప్రాజెక్టు కోసం రూ. 800 కోట్లు ఖర్చయ్యాయి. ఈ బ్రీడ్ ఆవులు తెలుగు రాష్ట్రాలకు కొత్త కాదు. చాలా సంవత్సరాల నుంచి ‘హెచ్ఎఫ్ సాహివాల్’ అనే పేరుతో ఈ ఆవులు రైతులకు అందుబాటులో వున్నాయి. అయితే ఈ బ్రీడ్‌కు కొత్తగా ‘ప్రైస్వాల్’ అని పేరును ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.ఇదీ చదవండి: పొట్టి ఆవులు గట్టి మేలు!20 ఏళ్ల స్టార్డం వదిలేసి, 1200 కోట్ల వ్యాపార సామ్రాజ్యం -
పొట్టి ఆవులు గట్టి మేలు!
మన వ్యవసాయంలో కీలకమైనది పశువుల పెంపకం. అనాది కాలం నుంచి సామాజిక–ఆర్థిక చట్రంలో ఇది అంతర్భాగం. దేశీ ఆవుల్లో విశిష్టమైనవి పొట్టి ఆవులు. వేచూర్, కాసరగోడ్ డ్వార్ఫ్, పుంగనూర్, నదిపతి, మల్నాడ్ గిడ్డ వంటి మినియేచర్ ఆవులకు తక్కువ మేతే సరిపోతుంది. పోషకాలతో పాటు ఔషధ విలువలు కలిగిన పాలను ఇస్తాయి. ప్రతికూల వాతావరణాల్లో చక్కటి ఫలితాలనిచ్చే సామర్థ్యం వీటి సొంతం. సంకరజాతులు, విదేశీ గోజాతులతో పోల్చినప్పుడు పొట్టి ఆవుల పాలకు మెరుగైన జీర్ణశక్తి, వ్యాధి నిరోధకత ఉన్నాయని చెబుతారు. ఈ సుగుణాల కారణంగా నగర పరిసర ప్రాంతాల్లోని చిన్న, సన్నకారు పాడి రైతులకు ఇవి ఎంతో అనువైనవి. స్థానికులకు ఆహార భద్రత, ఉపాధి, ఆదాయాన్నిచ్చే భారతీయ పొట్టి గోజాతులపై లోతైన పరిశీలన..ప్రపంచంలోనే అత్యధిక పాల ఉత్పత్తిదారైన మన దేశంలో ఏటా 23 కోట్ల టన్నులకు పైగా పాలు ఉత్పత్తి అవుతున్నాయి. అయితే, మన దేశంలో పాడి పరిశ్రమ అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. దాణా ధర పెరుగుదల.. పశుగ్రాసం కొరత.. పాడి పశువుల ఆరోగ్యం, సంతానోత్పత్తి, ఉత్పాదకతలపై వాతావరణ మార్పుల ప్రతికూల ప్రభావం.. పెద్ద విస్తీర్ణంలో భూమి అవసరం కావటం.. ప్రత్యేక సుగుణాలున్న పాల ఉత్పత్తులపై వినియోగదారుల ఆసక్తి పెరుగుతుండటం.. ఈ సవాళ్లలో ముఖ్యమైనవి. సంకరజాతి, విదేశీ జాతుల ఆవులు అధిక దిగుబడినిచ్చేవి అయినప్పటికీ, చిన్న రైతులు వాటిని అరకొర వనరులతో పెంచేటప్పుడు ఎక్కువగా వేడి ఒత్తిడికి, రుగ్మతలకు గురవుతుంటాయి. అయితే, దేశీ పొట్టి ఆవుల పెంపకంతో ఈ సవాళ్లన్నిటినీ చిన్న రైతులు అధిగమించవచ్చని నిపుణులు చెబుతున్నారు. సేంద్రియ వ్యవసాయ పద్ధతులకు అనుగుణమైన ఆరోగ్యకరమైన, స్థానిక దేశీ పాడి ఉత్పత్తులను ఇష్టపడే రైతులు, వినియోగదారులకు దేశీ పొట్టి ఆవులు ఆకర్షణీయంగా నిలుస్తున్నాయి. చిన్న డెయిరీ రైతులకు పొట్టి దేశీ ఆవుల పెంపకం అనేక విధాలుగా ఉపయోగకరమని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. చదవండి: 20 ఏళ్ల స్టార్డం వదిలేసి, 1200 కోట్ల వ్యాపార సామ్రాజ్యంపుంగనూరు: పొట్టి గో జాతుల్లో ప్రత్యేకమైనది పుంగనూరు. ఈ ఆవుల ఎత్తు 70–90 సెంటీమీటర్లు. ఇవి ఆంధ్రప్రదేశ్‌లోని కరువు పీడిత చిత్తూరు జిల్లాకు బాగా అనుకూలంగా ఉంటాయి. పాలలో అసాధారణంగా అధిక కొవ్వు (8%) ఉంటుంది. రోజుకు 3–5 లీటర్ల దిగుబడినిస్తాయి. మెరుగైన నాణ్యతతో కూడిన నెయ్యి, కోవా తయారీకి ఈ పాలు ఉపయోగిస్తాయని జాతీయ పశు వనరుల బోర్డు తెలిపింది. అంతరించే ముప్పును ఎదుర్కొంటున్న ఈ జాతి ఆవులు చాలా తక్కువ సంఖ్యలోనే ఉన్నాయి. అయితే, పరిరక్షణకు కృషి జరుగుతోంది. నదిపతి నానో : ఆంధ్రప్రదేశ్ గోశాలల్లో కనిపించే నదిపతి నానో ఆవు ఎత్తు 60సెం.మీ.లోపే! రోజుకు అర లీ. నుంచి ఒకలీటరు పాల దిగుబడి. కొవ్వు 4–5%. ప్రొటీన్ ఎక్కువ. దేశీ పొట్టి ఆవులతో ఉపయోగాలేంటి?→ భారతీయ దేశీ ఆవుల పాలలో ఏ2 బీ కెసీన్ ఉంటుంది. అందువల్ల, పాలు మెరుగ్గా జీర్ణం కావాలని, కడుపులో అసౌకర్యం ఉండదని ఆశించే వినియోగదారులకు ఈ పాలు నచ్చుతాయి. ఈ గుణం మార్కెటింగ్‌లో ఉపయోగకరం. → ఫ్రీరాడికల్స్‌ను నిర్మూలించే గుణం హోల్స్టీన్–ఫ్రీసియన్ సంకరజాతి ఆవు పాలలో కన్నా వేచూర్, కాసర్గోడ్ డ్వార్ఫ్ వంటి పొట్టి ఆవు పాలలో ఎక్కువని పరిశోధనల్లో తేలింది. బయోయాక్టివ్ పెపై్టడ్లు, యాంటీఆక్సిడెంట్ విటమిన్లు ఎక్కువగా ఉండటమే అందుకు కారణం. ఔషధ గుణాలున్న పాల ఉత్పత్తులను కోరుకునే మార్కెట్లలో విక్రయానికి ఈ గుణం ఉపయోగకరం. → వెచూర్, కాసర్గోడ్ డ్వార్ఫ్ ఆవుల పాలల్లో ఈ–కోలి, సాల్మొనెల్లా వంటి క్రిములను అరికట్టే గుణాలు ఉన్నట్లు పరిశోధనల్లో వెల్లడైంది. పెరుగు ఉత్పత్తికి, ప్రోబయోటిక్ రిచ్ దేశీ పాల ఉత్పత్తుల తయారీకి ఈ గుణం ఉపయోగపడుతుంది. → పొట్టి ఆవుల బరువు తక్కువ కావటం వల్ల అధిక ఉష్ణోగ్రతను మెరుగ్గా తట్టుకోగలుగుతున్నాయి. → తక్కువ నాణ్యమైన గడ్డిని తిని మెరుగ్గా జీర్ణం చేసుకోగల శక్తి కాసర్గోడ్ పొట్టి ఆవులకు ఉందని పరిశోధనల్లో తేలింది. కరువు పీడిత పేద రైతులు కూడా దేశీ ఆవులను పెంచుకోగలగటానికి ఇదే కారణం. → సంకరజాతి ఆవులతో పోల్చినప్పుడు దేశీ ఆవులు చిన్న రైతులకు అనువైనవి. తక్కువ మేత అవసరం, ఎక్కువ రోగనిరోధకశక్తి, తక్కువ వైద్య ఖర్చుల వల్ల అధిక లాభం వస్తుంది. → ఏ2 నెయ్యి, ప్రొబయోటిక్ యోగర్ట్, సంప్రదాయ మిఠాయిలు వంటి ఔషధ గుణాలున్న సాంప్రదాయ ఆహారోత్పత్తులకు నగర ప్రాంతాల్లో గిరాకీ ఎక్కువగా ఉందని ఎఫ్ఎస్ఎస్ఏఐ అధ్యయనంలో తేలింది. అత్యధికంగా 8% కొవ్వు గల పుంగనూరు ఆవు పాలు, యాంటీఆక్సిడెంట్లుండే వెచూర్, కాసర్గోడ్ డ్వార్ఫ్ గోజాతుల పాలకు వాణిజ్యపరమైన విలువ ఉంది. → వాతావరణంలో వేడి, మేత కొరత వంటి ప్రధాన సమస్యలను అధిగమించడానికి దోహదపడే గొప్ప సంపదగా దేశీ పొట్టి గోజాతులు. పర్యావరణ అనుకూల / సేంద్రియ పాడి పరిశ్రమ అభివృద్ధికి ఈ గోజాతులు ఉపకరిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అయితే, ఈ దిశగా ప్రభుత్వం వాల్యూచెయిన్ పైలట్ ప్రాజెక్టుల ద్వారా అధ్యయనాలు చేపట్టాల్సి ఉంది. → అయితే, పరిశోధనలు మరింత లోతుగా జరగాల్సి ఉంది. దేశీ గోజాతులు, పొట్టి ఆవులు వివిధ రకాల మేపులతో సాధించే పాల దిగుబడిపై విస్తృత అధ్యయనాలు జరగాలని నిపుణులు సూచిస్తున్నారు.ఎవరేమి చెయ్యాలి?→ చిన్న రైతులు తమకున్న పరిమిత భూకమతాలు, పరిమిత వనరుల దృష్ట్యా దేశీ పొట్టి ఆవులను పెంచుకోవటం మేలు. ఇవి తక్కువ పాలు ఇచ్చినప్పటికీ అధిక ఆదాయాన్ని ఇవ్వగలుగుతాయని గుర్తించాలి. → సహకార సంఘాలు వారసత్వ సంపదైన దేశీ పొట్టి ఆవుల పాలు, నెయ్యిని గ్రామాల్లో సేకరించి, బ్రాండింగ్ వ్యూహాలతో విక్రయాలు పెంచాలి. → పాలకులు దేశీ పొట్టి గోజాతుల జన్యు అభివృద్ధికి, మార్కెటింగ్ సదుపాయాల అభివృద్ధికి నిధులు కేటాయించాలి. జాతుల పరిరక్షణకు, లాభదాయకతకు దోహదమవుతుంది. → పరిశోధకులు ప్రతి దేశీ పొట్టి గోజాతులకు సంబంధించి ప్రత్యేక ప్రయోజనాలతో కూడిన ఆహారోత్పత్తుల అభివృద్ధి, వాటి ద్వారా చేకూరే ఆరోగ్య ప్రయోజనాలపై పరిశోధనలు చెయ్యాలి. → ఈ చర్యల ద్వారా దేశీ పొట్టి గోజాతుల పరిరక్షణతో పాటు పర్యావరణహితమైన, ఆరోగ్యదాయకమైన రీతిలో పాడి పరిశ్రమకు సరికొత్త భాష్యం చెప్పినట్లు అవుతుంది. ఆదాయం,ఆరోగ్యంతోపాటు భారతీయ సంప్రదాయ పశు సంపదకు ఇది గౌరవాన్ని కూడా పెంచుతుందని కేరళ వెటర్నరీ యానిమల్ సైన్సెస్ యూనివర్సిటీ పరిశోధకురాలు దీప్తి అంటున్నారు.కాసరగోడ్ డ్వార్ఫ్: ఇది 96–107 సెం.మీ. ఎత్తుండే కేరళ గోజాతి. కోస్తా వాతావరణానికి అనువైనది. అణకువగా ఉంటుంది. పాల దిగుబడి రోజుకు 1.2–1.5 లీటర్లు. ప్రొటీన్ 3.8%. కొవ్వు 4–4.5%. వేచూర్ పాలలో కన్నా ఈ పాలలో ఎక్కువ యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయని నిరూపితమైంది.వేచూర్: కేరళ దేశీ పశుజాతుల సుసంపన్న వారసత్వానికి వేచూర్ నిదర్శనం. ప్రపంచంలోనే అతి చిన్న పశు జాతుల్లో ఒకటిగా (87–90 సెం.మీ. ఎత్తు) ఐరాసకు చెందిన ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏఓ) గుర్తించింది. వేచూర్ జాతి పొట్టి ఆవులకు అధిక వేడిని తట్టుకునే శక్తి ఉంది. పాల దిగుబడి రోజుకు 2–3 లీటర్లు. పాలలో 4.5–5.5% కొవ్వుతో పాటు ఘనపదార్థాలు ఎక్కువ. నెయ్యి, ప్రోబయోటిక్ పెరుగు, సాంప్రదాయ మిఠాయిలు వంటి ప్రీమియం ఉత్పత్తుల తయారీకి ఈ పాలు అనువైనవి. ఈ–కోలి, సాల్మొనెల్లా వంటి క్రిములను నియంత్రించే యాంటీ బాక్టీరియల్ శక్తి కూడా ఈ పాలలో ఉందని నిరూపితమైంది.మల్నాడ్ గిడ్డ: కర్ణాటకకు చెందిన మల్నాడ్ గిడ్డ ఆవు 90 సెం.మీ. ఎత్తుంటుంది. కొండ కోనల్లో తిరిగి రకరకాల గడ్డి మేయటం దీనికి ఇష్టం. ఫ్రీ రేంజ్ ఆవు పాలలో ఒమెగా 3 కొవ్వు ఆమ్లాలు, బయోయాక్టివ్ మెటబొలైట్లు ఎక్కువ. పరాన్నజీవులు, గాలి కుంటు వ్యాధికి నిరోధకత కలిగి ఉంటుంది. (4 వేల లీటర్ల పాల దిగుబడినిచ్చే ఆవుల గురించి తెలుసా?) -
దిగుబడుల్లో అంతరాలెందుకు
వరి, గోధుమ, మొక్కజొన్న, పప్పుధాన్యాలు, నూనెగింజలు, కూరగాయలు, పండ్లు తదితర పంటల దిగుబడి, ఉత్పత్తి వ్యయంలో ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల మధ్య ఎన్నో వ్యత్యాసాలు ఉన్నాయి. 1960 నుంచి 2023 మధ్యకాలంలో సాగు భూముల విస్తీర్ణం, భూసారం తగ్గిపోవటం, ఎరువుల వాడకం, పంట దిగుబడుల్లో వివిధ దేశాల మధ్య ఎన్నెన్నో వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. అందుకు గల కారణాలేమిటి? వ్యవసాయం, ఆహార భద్రతల విషయంలో భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? అధిక జనాభా భారంతో ఉండే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వ్యవసాయంలో ఇప్పటికీ దిగుబడులు పెంచుకోవటానికి గల అవకాశాలు, మార్గాలేమిటి? ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్.ఏ.ఓ.) తాజాగా ప్రకటించిన గణాంకాలతో ప్రత్యేక కథనం. 12,000 సంవత్సరాల క్రితం వ్యవసాయం ప్రారంభమైంది. అప్పటి నుండి నాగరికతలను నిలబెట్టడంలో భూమి కీలక పాత్ర పోషించింది. ప్రస్తుతం, ప్రపంచ ఆహార సరఫరాలో 95 శాతానికి పైగా భూమి ఆధారంగా జరిగే వ్యవసాయం ద్వారానే వస్తోంది. 2022లో వ్యవసాయ రంగం ప్రపంచవ్యాప్తంగా 89.2 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తోంది (మొత్తం ఉపాధిలో 26.2 శాతం). ΄÷లాల బయట ఆహార రవాణా, నిల్వ, పంపిణీ (ఆహార వ్యవస్థల)కి సంబంధించిన పనులు, ఉద్యోగాలలో ప్రపంచ శ్రామిక శక్తిలో అదనంగా 13 శాతం మంది నిమగ్నమై ఉన్నారు. చిన్న, సన్నకారు రైతులే అత్యధిక సంఖ్యలో ఉన్నారు. భూమి విస్తీర్ణం, పశువుల సంఖ్య, ఆదాయాల పంపిణీని బట్టి చిన్న, సన్నకారు రైతులను గుర్తించే ప్రమాణాలు దేశాన్ని బట్టి మారుతుంటాయి. ఒక దేశంలో 2 హెక్టార్ల భూమి ఉన్న రైతులు చిన్న, సన్నకారు రైతులైతే.. మరొక దేశంలో 50 హెక్టార్లున్న వారు చిన్న రైతులు. ఒక దేశంలో వార్షికాదాయం 1,500 డాలర్ల ఆదాయం ఉండే వారు చిన్న, సన్నకారు రైతులైతే.. మరొక దేశంలో 2,50,000 డాలర్లు వార్షిక ఆదాయం వున్న వారు కావచ్చు.2 శాతం తగ్గిన వ్యవసాయ భూమిఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్.ఏ.ఓ.) ఇటీవలే ప్రకటించిన 2023 నాటి గణాంకాల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా మొత్తం భూభాగంలో వ్యవసాయ భూమి (అంటే.. స్వల్పకాలిక పంటలు పండించే వ్యవసాయ యోగ్యమైన భూమి, శాశ్వత / దీర్ఘకాలిక తోటలు సాగు చేసే భూమి కలిపి) విస్తీర్ణం 12 శాతం మాత్రమే. శాశ్వత పచ్చిక భూములు, పచ్చిక బయళ్ళు మొత్తం భూమిలో నాలుగింట ఒక వంతు ఆక్రమించగా, అడవులు మూడింట ఒక వంతు ఆక్రమించాయి. 2001 – 2023 మధ్య, ప్రపంచ వ్యవసాయ భూమి విస్తీర్ణం నికరంగా 7.5 కోట్ల హెక్టార్ల (2 శాతం) తగ్గింది.1961 – 2020 మధ్య ప్రపంచ వ్యవసాయ భూమిలో కేవలం 8 శాతం విస్తరణతో వ్యవసాయ ఉత్పత్తిలో నాలుగు రెట్ల పెరిగింది. పంటల ఉత్పాదకతలో గణనీయమైన మెరుగుదలను ఇది సూచిస్తోంది. దాంతో ప్రపంచవ్యాప్తంగా ఆహార లభ్యతకు ఢోకా లేదు. నేడు కొరత సమస్య కాదు. ఆహారాన్ని పొందగలిగే స్థోమత లేకపోటం, అశాంతి, యుద్ధాలతో ఆహార పంపిణీ సమస్యలు ఎదురవుతున్నాయి. వ్యవసాయ ఉత్పాదకత పెరుగుదలలో చారిత్రకంగా నమోదైన పురోగతితో ఆహార భద్రత, పేదరికం తగ్గింపు, ఆర్థిక అభివృద్ధికి ప్రాథమికంగా కనిపించింది. అయినప్పటికీ కొన్ని ్ర΄ాంతాల్లో స్థానిక పరిస్థితులు గణనీయంగా భిన్నంగా మారుతూ ఉంటాయి.తీవ్రంగా పెరిగిన ఉత్పాదకాల వాడకం ఒకే రకం పంట దిగుబడుల విషయంలో వివిధ దేశాల్లో చాలా ఎక్కువ స్థాయిలో తారతమ్యాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. వ్యవసాయంలో ఉత్పాదకత ధోరణులను విశ్లేషించేటప్పుడు నికర వ్యవసాయ ్ర΄ాంతం, దిగుబడులను పరిగణనలోకి తీసుకుంటారు. కానీ అధిక దిగుబడులు ఉత్పాదకాల వాడకం తీరుపై ఆధారపడి ఉంటాయి. స్థానిక వ్యవసాయ వాతావరణ పరిస్థితులు, విత్తనం, ఎరువులు, పురుగుమందులు, నీటి΄ారుదల సదు΄ాయాలు వంటి జీవభౌతిక ఉత్పాదకాలతోపాటు శ్రమ, పెట్టుబడులను బట్టి పంటల ఉత్పాదకతను, ఉత్పాదక సామర్థ్యాన్ని నిర్ణయిస్తాయి. వ్యవసాయంలో భూమి పాత్రను అర్థం చేసుకోవడానికి వీటన్నిటినీ అర్థం చేసుకోవటం అవసరం. ఉత్పాదకాల వినియోగించే తీవ్రత స్థాయి, సాంకేతిక ఆవిష్కరణలు, మెరుగైన నిర్వహణను బట్టి దిగుబడుల్లో తారతమ్యాలు వస్తాయి. అందువల్ల, ఎరువులు, యంత్రాలు లేదా మానవ శ్రమ మరింత ఎక్కువ స్థాయిలో వెచ్చించటం వల్లనే దిగుబడి పెరుగుదల నమోదైందని గుర్తించాల్సి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఆహారోత్పత్తి వృద్ధిలో సాగు భూమి విస్తీర్ణం పెరుగుదల చాలా తక్కువ పాత్ర పోషించిందని, అయితే, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పంట భూముల విస్తరణే ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉందని ఎఫ్ఎఓ చెబుతోంది.దిగుబడుల్లో అంతరాలుదిగుబడి పెరుగుదలలో విజయం సాధించినప్పటికీ.. సాధిస్తున్న దిగుబడిలో దేశాల మధ్య అంతరాలు కొనసాగుతున్నాయి. దిగుబడి అంతరం అంటే? ఒక నిర్దిష్ట వాతావరణంలో ఒక పంటకు గరిష్టంగా సాధించగల దిగుబడికి, అక్కడి రైతులు ప్రస్తుతం సాధిస్తున్న వాస్తవ దిగుబడికి మధ్య వ్యత్యాసాన్నే దిగుబడి అంతరం అంటారు. దిగుబడి పెరుగుదలలో గతంలో విజయాలు సాధించినప్పటికీ, అనేక దేశాలు, అనేక పంటలలో గణనీయమైన దిగుబడి అంతరాలు ఉన్నాయి.ఉత్పాదకతలో ఆస్ట్రేలియా రారాజుఉదాహరణకు.. వరిలో (హెక్టారుకు టన్నుల్లో) 2023లో ఆస్ట్రేలియా 9.52 టన్నుల దిగుబడి సాధిస్తే, భారత్ 4.32, అమెరికా 8.57, చైనా 7.14, బ్రెజిల్ 6.94 టన్నుల దిగుబడి సాధించింది. ఈ అంతరాలు గత 63 ఏళ్లుగా కొనసాగుతూనే ఉన్నాయి. 1961లో వరి దిగుబడిలో అత్యధికంగా ఆస్ట్రేలియా 5.9 టన్నులతో నంబర్ వన్‌గా నిలిచింది. 9.52 టన్నులతో ఇప్పటికీ ఆ స్థానాన్ని నిలబెట్టుకుంటోంది. భారత్ 1.54 టన్నుల నుంచి 4.32 టన్నులకు పెంచుకోగలిగింది. చైనా వరి దిగుబడులు మన కన్నా ఎక్కువ శాతం పెరిగాయి. 1961లో 2.04 టన్నులున్న చైనా వరి ధాన్యం దిగుబడి 2023 నాటికి 7.14 టన్నులకు పెరిగింది. అమెరికా 3.82 టన్నుల నుంచి 8.57 టన్నులకు పెంచుకోగలిగింది. వ్యవసాయ భూమి సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో సమర్థవంతంగా ఉపయోగించుకోవటంలో కొన్ని దేశాలు వెనుకబడటం కూడా ఈ స్థాయిలో దిగుబడి అంతరాలు ఏర్పడటానికి కారణమని ఎఫ్.ఏ.ఓ. చెబుతోంది. ముఖ్యంగా, ఈ అంతరాలకు జీవ భౌతిక కారణాలు మాత్రమే కాకుండా సామాజిక, ఆర్థిక, సంస్థాగత పరిమితులు కూడా కారణమవుతున్నాయి. పెరిగిన ఎరువుల ధరలు, గిట్టుబాటుకాని పంటల ధరలు, రుణం లేదా బీమా సదు΄ాయాలు అంతగా అందకపోవటం, కౌలుదారుల్లో అభద్రత.. వేర్వేరు దేశాల్లో దిగుబడుల అంతరాలు కారణమవుతున్నాయని ఎఫ్.ఏ.ఓ. తెలిపింది.భూసార క్షీణతతో 170 కోట్ల మందికి ముప్పుమనుషుల పనుల కారణంగా భూసారం నష్టపోతోంది. ఈ కారణంగా పంట దిగుబడులు తగ్గుతున్నాయి. సుమారు 170 కోట్ల మంది నివసిస్తున్న భారత్ తదితర ఆసియా, ఆఫ్రికా దేశాల్లో ఈ ముప్పు ఏర్పడిందని ఎఫ్.ఎ.ఓ. నివేదిక వెల్లడించింది. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న అధిక జనాభా గల దేశాలకు ఈ ముప్పు ఉంది. ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ వ్యవస్థ ఆరోగ్యానికి, వ్యవసాయ ఉత్పాదకతకు ఈ నిశ్శబ్ద సంక్షోభం గొడ్డలి పెట్టుగా మారిందని ఎఫ్.ఏ.ఓ. హెచ్చరిస్తోంది.ధాన్యపు పంటలు: ప్రపంచ దేశాల్లో 1961–2023 మధ్యకాలంలో గోధుమ, వరి, మొక్కజొన్న, చిరుధాన్యాలు తదితర ధాన్యపు పంటలకు సంబంధించి హెక్టారుకు పెరిగిన ఉత్పాదకత వివరాలు టన్నుల్లో. భారత్: 0.95(1961)–3.63(2023). ఆస్ట్రేలియా:1.08–3.23, చైనా:1.19–6.42. బ్రెజిల్: 1.35–5.34. అమెరికా: 2.52–8.33.వరి: ప్రపంచ దేశాల్లో 1961–2023 మధ్యకాలంలో వరి పంటకు సంబంధించి హెక్టారుకు పెరిగిన ఉత్పాదకత వివరాలు టన్నుల్లో. భారత్: 1.54(1961)–4.32(2023). ఆస్ట్రేలియా:5.9–9.52, చైనా:2.04–7.14. బ్రెజిల్: 1.7–6.94. అమెరికా: 3.82–8.57. ఈల్డ్ గ్యాప్ ఒక దేశంలో ఒక పంటకు గరిష్టంగా ఎంత దిగుబడి సాధించే అవకాశం ఉంది? రైతులు ప్రస్తుతం ఎంత తీస్తున్నారు? ఈ రెండిటి మధ్య వ్యత్యాసాన్నే దిగుబడి అంతరం(ఈల్డ్ గ్యాప్) అంటారు. హెక్టారులో వరి దిగుబడిని భారత్ 0.4, చైనా 0.61, రష్యా 3.61, అల్జీరియా 7.57 టన్నుల వరకు పెంచుకునే అవకాశం ఉంది. అమెరికా, బ్రెజిల్, ఆస్ట్రేలియా ఇప్పటికే పూర్తిస్థాయి ఉత్పాదకత సాధించాయి. అందుకే ఈ దేశాల ఈల్డ్ గ్యాప్ సున్నాగా ఉంది. 2023లో పత్తి దిగుబడి (హెక్టారుకు టన్నుల్లో).. భారత్: 1.27, ప్రపంచం:2.3, చైనా:6.64, మెక్సికో:4.52,బ్రెజిల్:4.39, ఆస్ట్రేలియా:3.79, పెరు:2.86, అమెరికా:2.84.2023లో మొక్కజొన్న దిగుబడి (హెక్టారుకు టన్నుల్లో).. భారత్: 3.54, ప్రపంచం:5.96, అమెరికా:11.25, ఇండోనేషియా:8.07, ఈజిప్టు:7.51, రష్యా:6.92, చైనా:6.53.2023లో పప్పుధాన్యాల దిగుబడి (హెక్టారుకు టన్నుల్లో).. భారత్: 0.74, ప్రపంచం:0.98, ఈజిప్టు:4.24, ఆస్ట్రేలియా:2.07, అమెరికా:1.97, రష్యా:1.95, చైనా:1.86. 2023లో కూరగాయల దిగుబడి (హెక్టారుకు టన్నుల్లో)..భారత్: 15.81, ప్రపంచం:20.07, అమెరికా:36.64, ఇరాన్:29.59, రష్యా:29.36, జపాన్:27.6, చైనా:26.14, బ్రెజిల్:25.79.2023లో పండ్ల దిగుబడి (హెక్టారుకు టన్నుల్లో)..భారత్:15.11, ఇండోనేషియా:27.06, దక్షిణాఫ్రికా:24.55, ఈజిప్టు: 20.94, అమెరికా:20.91, కజకిస్తాన్:19.54, బ్రెజిల్: 18.39.2023లో వరి దిగుబడి (హెక్టారుకు టన్నుల్లో).. భారత్: 4.32, ఆస్ట్రేలియా: 9.52, ఈజిప్టు: 8.72, అమెరికా: 8.57, పెరు:8.07, చైనా: 7.14, బ్రెజిల్: 6.94. 2023లో గోధుమ దిగుబడి (హెక్టారుకు టన్నుల్లో)..భారత్: 3.52, ఈజిప్టు: 7.19, మెక్సికో: 6.2, చైనా: 5.78, జపాన్: 4.72. – నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ -
కండరాలకూ జ్ఞాపకాలు!
తెలివితేటలు, జ్ఞాపకశక్తి వంటి మాటలు వినగానే.. అవి మన మెదడు సొత్తే అనుకుంటాం. కానీ, మన శరీరం అంతటా అల్లుకొని ఉండే కండరాలకు కూడా సొంత తెలివితేటలు, జ్ఞాపకాలు ఉంటా యట. ఇది ఆశ్చర్యంగా అనిపించవచ్చు గానీ, వాస్తవం. అంతెందుకు..? వ్యాయామం చేస్తే కండరాలు బలంగా పెరుగుతాయని మనకు తెలుసు. అయితే, మానేసిన కొన్నాళ్లకు ఆ విషయాన్ని మనం మర్చిపోవచ్చు. కానీ, కండరాలు మాత్రం మర్చిపోవట. మళ్లీ కొన్నేళ్ల తర్వాత తిరిగి మొదలు పెట్టినా, మన కండరాలు గతంలో కన్నా చప్పున స్పందిస్తాయని అధ్యయనాల్లో తేలింది. – సాక్షి, సాగుబడికండరాలకూ సొంత తెలివితేటలతో కూడిన జ్ఞాపకాలుంటాయట. మీరు కండరాలను ఎంతగా ఉపయోగిస్తే, అవి మీ శరీరానికి అంత ఎక్కువ శాశ్వత ప్రయోజనకరమైన వనరుగా మారుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. సైకిల్ తొక్కేట ప్పుడు శరీరంలో కండరాలు కలిసికట్టుగా సమన్వయంతో కదలటం నేర్చుకుంటాయి. ఆ చలనశీలతను చిరకాలం పాటు గుర్తుపెట్టుకుంటాయి. జ్ఞాపకాలతో మరింత వేగంగా!కండరాల ఎపిజెనెటిక్ జ్ఞాపకశక్తిపై షార్పుల్స్ విశేష పరిశోధనలు చేశారు. ప్రవర్తన, పరిస్థితుల ప్రభావం వల్ల జన్యు వ్యక్తీకరణలో వచ్చే మార్పులను ఎపిజెనెటిక్ మార్పులు అంటారు. అంటే, జన్యువులు మారవు, కానీ అవి పనిచేసే విధానం మారుతుంది. వ్యాయామంతో కలిగే జన్యు వ్యక్తీకరణ మార్పులకు సంబంధించిన జ్ఞాపకాలను కండరాలు చిరకాలం గుర్తుంచుకుంటాయని షార్పుల్స్ పరిశోధనలు రుజువు చేశాయి. కొన్ని నెలలు లేదా ఏళ్ల విరామం తర్వాత మళ్లీ వ్యాయామం ప్రారంభించినప్పుడు పాత జ్ఞాపకాల ఆధారంగా మొదట్లో కన్నా వేగంగా కండరాలు బలం పుంజుకుంటాయని ఆయన కనుగొన్నారు. చప్పున గుర్తుతెచ్చుకుంటాయిమన కండరాల్లోని కణాలు.. శరీర కదలికలను, వ్యాయామాన్ని కలకాలం గుర్తుపెట్టుకోగలవు. అవసరమైనప్పుడు వాటిని మళ్లీ చప్పున గుర్తుతెచ్చుకోవటమే కాకుండా మొదట్లో కన్నా చప్పున స్పందించగలవని ఇటీవల వైద్య పరిశోధనల్లో వెల్లడైంది. ‘మానవ శరీరంలో అవయవాల చుట్టూ ఉండే కండరాల్లోని కణాలు విలక్షణమైనవి. అవి పొడవుగా, పల్చగా, పోగుల మాదిరిగా ఉంటాయి. నిద్రాణంగా ఉండే ఈ మూల కణాలు శరీర కదలికలు/వ్యాయామం వల్ల వత్తిడి కలిగినప్పుడు లేదా గాయం తగిలినప్పుడు చైతన్యవంతమై కండర వృద్ధికి దోహదపడతాయి. చాలా ఏళ్ల తర్వాత మనం మళ్లీ వ్యాయామం చేసినా గతంలో కన్నా చప్పున స్పందిస్తాయని మా పరిశోధనల్లో తేలింది’ అంటారు కండర శాస్త్రవేత్త డా. ఆడమ్ షార్పుల్స్. ఆయన ఓస్లోలోని నార్వేజియన్ స్కూల్ ఆఫ్ స్పోర్ట్ సైన్సెస్‌లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ప్రతికూల జ్ఞాపకాలు!కండర కణాలు అన్ని వేళలా ‘సానుకూల జ్ఞాపకాల’తోనే స్పందించాలనేం లేదు. ఒక్కోసారి ‘ప్రతికూల జ్ఞాపకాల’తోనూ ప్రతిస్పందించవచ్చు. ప్రతికూలతకు వ్యాధి కూడా కారణం కావచ్చు. ఉదాహరణకు.. పదేళ్ల క్రితం రొమ్ము కేన్సర్‌కు చికిత్స పొందిన మహిళల్లో కండరాలు ‘ప్రతికూల జ్ఞాపకాల’ వల్ల వారి వయసుకు మించి పట్టు సడలి, క్షీణించటాన్ని షార్పుల్స్ గుర్తించారు. వారితో ఏరోబిక్ ఎక్సర్సైజులు చేయించినప్పుడు కండరాలు వయసుకు తగిన రీతిలో పున రుజ్జీవనం పొంది పటుత్వం పెంచుకోగలిగాయి. ప్రతికూల జ్ఞాపకాలపై సానుకూల జ్ఞాపకాలు పైచేయి సాధించటం వల్లనే ఇది సాధ్యమైందని ఆయన అంటారు. -
మారుతున్న వాతావరణం, చిన్నరైతుకు పెద్ద కష్టం!
చిన్న కమతాల రైతులు... ప్రపంచ వ్యవసాయ రంగంలో అతి కీలకపాత్ర నిర్వహిస్తున్నారు. చిన్న, సన్నకారు రైతులు ప్రపంచవ్యాప్తంగా సగంపైగా ఆహారాన్ని ఉత్పత్తి చేస్తున్నారు. చిన్న, సన్నకారు రైతులు వనరుల కొరత, అధిక ఖర్చులు, దగ్గర్లో సరైన మార్కెట్ సదుపాయాల్లేకపోవటంతో పాటు అనూహ్య ప్రతికూల వాతావరణం వంటి ముఖ్యమైన సవాళ్లను ఎదుర్కొంటున్నారు. చిన్న తరహా కుటుంబ రైతులకు రక్షణ కల్పించాలంటే... మొదట వాతావరణ మార్పు ప్రభావాలకు తట్టుకునేలా సాగు పద్ధతిని మార్చుకునేలా వారికి సహాయం చెయ్యటం అతి ముఖ్యమైన విషయం. వాతావరణ మార్పు ప్రభావాలకు తట్టుకునేలా వీరికి సాయం చెయ్యాలంటే ఎంత డబ్బు (దీన్నే ‘వాతావరణ ఆర్థిక సహాయం’ అంటారు) అవసరం అవుతుంది? అనేది ఆసక్తికరమైన చర్చ. ఇప్పుడు ఇదంతా ఎందుకు చర్చకొస్తోందంటే.. ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో 30వ సర్వసభ్య వాతావరణ శిఖరాగ్రసభ (కాప్ 30) వచ్చే నెలలో బ్రెజిల్లో జరగనుంది. కాప్ 30 ఎజెండాలో చిన్న కమతాల రైతులకు ‘వాతావరణ ఆర్థిక సహాయం’ ఒక కీలకాంశంగా ఉంది. అయితే, చిన్న రైతులను వాతావరణ విపత్తుల నుంచి కాపాడుకోవటానికి కేటాయింపులను పెంచటంతో పాటు ప్రత్యేకంగా ‘రైతు నిధి’ని ఏర్పాటుతో న్యాయం చెయ్యాలని ఎఫ్ఎఫ్సీఏ పిలుపునిస్తోంది .చిన్న విస్తీర్ణంలో భూమిని సాగు చేసుకునే రైతు కుటుంబాలు ప్రపంచ ఆహార వ్యవస్థకు చాలా ముఖ్యమైనవి. ప్రధానంగా కుటుంబ శ్రమపై ఆధారపడే ఈ కుటుంబాలు వ్యవసాయం కొనసాగిస్తున్నాయి. ఆఫ్రికా, లాటిన్ అమెరికా, ఆసియా, పసిఫిక్లలో 9.5 కోట్ల మంది చిన్న, సన్నకారు రైతులు ఉన్నారు. ఈ చిన్న కమతాలే 250 కోట్ల మందికి జీవనాధారంగా నిలుస్తున్నాయి. ప్రపంచంలో ఉత్పత్తయ్యే ఆహారంలో సగానికి సగం వీరే చెమటోడ్చి పండిస్తున్నారు. అయినప్పటికీ పేదరికం, పరిమిత మార్కెట్ సదుపాయాలు, వాతావరణ మార్పుల దుష్ప్రభావాలు వంటి తీవ్రమైన సమస్యలను చిన్న కమతాల సేద్యం ఎదుర్కొంటున్నదని క్లైమేట్ ఫోకస్ ఫర్ ది ఫ్యామిలీ ఫార్మర్స్ ఫర్ క్లైమేట్ యాక్షన్ (ఎఫ్ఎఫ్సీఏ) తాజా అధ్యయన నివేదిక తేల్చి చెప్పింది. చిన్న రైతులకు అవసరమైన దానిలో 1% కూడా వాతావరణ సహాయం అందటం లేదని, కేవలం 0.36% మాత్రమే అందుతోందని స్పష్టం చేసిందీ నివేదిక. ప్రభుత్వాలు ప్రజలకు, భూగోళానికి హానికరమైన రీతిలో అందిస్తున్న వ్యవసాయ సబ్సిడీల తీరును మార్చి ఉపయోగించుకోటం, అంతర్జాతీయ ఆర్థిక సంస్థలను సంస్కరించటం, అవసరమైన నిధులను సమీకరించడానికి న్యాయమైన పన్నులపై దృష్టి పెట్టటం ద్వారా చిన్న సన్నకారు రైతులకు వాతావరణ మార్పుల నుంచి రక్షణ కల్పించవచ్చని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది.హెక్టారుకో కాఫీ ఖర్చు!ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులకు అనుగుణంగా చిన్న తరహా రైతులకు సహాయం చేయడానికి ఏటా 44,300 కోట్ల డాలర్లు అవసరమని ఫ్యామిలీ ఫార్మర్స్ ఫర్ క్లైమేట్ యాక్షన్ తాజా నివేదిక వెల్లడించింది. వాతావరణ మార్పులకు తట్టుకునేందుకు చిన్న రైతులకు సహాయం చేయటానికి అయ్యే ఖర్చు తలకుమించిన భారమేమీ కాదని తేల్చింది. ప్రభుత్వాలు ప్రతి సంవత్సరం ప్రజలకు, గ్రహానికి హాని కలిగించే వ్యవసాయ సబ్సిడీల కోసం ఖర్చు చేసే 47,000 కోట్ల డాలర్ల కంటే తక్కువేనని బ్రెజిల్లో అంతర్జాతీయ వాతావరణ శిఖరాగ్ర సదస్సు కాప్ 30కి ముందు విడుదల చేసిన ఈ విశ్లేషణ నివేదిక వివరించింది. ప్రపంచ ఆహార భద్రత, పర్యావరణ సుస్థిరత సాధన కృషిలో వారి పాత్రను నొక్కి చెబుతూ, ఈ రైతులకు మద్దతు ఇవ్వడానికి నిధులను దారి మళ్లించాలని ΄ాలకులను నివేదిక కోరుతోంది. ప్రపంచంలోని ఆహారంలో సగం ఉత్పత్తి చేస్తున్నప్పటికీ, 250 కోట్ల మంది జీవనోపాధికి తోడ్పడుతున్నప్పటికీ, తీవ్రతరం అవుతున్న కరువులు, వరదలు, తుఫానులకు తట్టుకునేలా చిన్న రైతులకు అవసరమైన వాతావరణ ఆర్థిక సహాయంలో 0.36 శాతం మాత్రమే లభిస్తున్న విషయాన్ని పాలకులు గుర్తెరగాలని నివేదిక ఎత్తిచూపింది.వాతావరణ మార్పులను ఎదుర్కొనేలా చిన్న రైతులను సంసిద్ధం చెయ్యటానికి, కాలుష్యాన్ని తగ్గించేలా వ్యవసాయ పద్ధతులను మార్చుకోవటానికి, డిజిటల్ వాతావరణ సేవలను మెరుగుపరచడానికి సముచిత రీతిన ప్రత్యేక ఆర్థిక సాహాయం చెయ్యాల్సిన అవసరం ఉంది. 10 హెక్టార్ల కంటే తక్కువ విస్తీర్ణంలో సాగు చేసే చిన్న రైతులకు హెక్టారుకు సగటున ఏడాదికి 953 డాలర్లు అవసరం అవుతుంది. అంటే.. రోజుకు 2.19 డాలర్లు. ఇది జర్మనీలో ప్రజలు ఒక కప్పు కాఫీ తాగటానికి వెచ్చించే ఖర్చుతో సమానమని నివేదిక స్పష్టం చేసింది. చిత్తశుద్ధి ఉంటే చిన్న రైతులను ఆదుకోవటం ఎంత సులభమో ఈ నివేదికను బట్టి అర్థమవుతుంది.ఆహార భద్రత కోసం పెట్టుబడిక్లైమేట్ ఫోకస్ ఫర్ ది ఫ్యామిలీ ఫార్మర్స్ ఫర్ క్లైమేట్ యాక్షన్ (ఎఫ్ఎఫ్సీఏ) నివేదికలో పలువురి అభిప్రాయాలకు చోటు కల్పించారు. ‘ఇది దాతృత్వం కాదు. ఇది ప్రపంచ ఆహార భద్రత కోసం పెట్టే పెట్టుబడి’ అని 2.5 కోట్ల చిన్న రైతులకు ప్రాతినిధ్యం వహిస్తున్న తూర్పు ఆఫ్రికా రైతుల సమాఖ్య అధ్యక్షురాలు ఎలిజబెత్ న్సిమదాల అన్నారు. ‘చిన్న రైతులు ప్రపంచంలోని సగం ఆహారాన్ని ఉత్పత్తి చేస్తారు. ప్రపంచ ఆహార సరఫరా గొలుసులకు వీళ్లే కేంద్రంగా ఉన్నారు. వారిని నిలబెట్టేలా పెట్టుబడి పెట్టడం అందరికీ ప్రయోజనం చేకూరుస్తుంది’ అన్నారామె.కొత్త ప్రపంచ వాతావరణ ఫైనాన్స్ రోడ్‌మ్యాప్‌పై వచ్చే నెలలో బ్రెజిల్లో జరిగే కాప్ 30లో చర్చించాలనే చర్చ ముగింపు దశకు చేరుకున్న దశలో ఈ నివేదిక వెలువడింది. అయితే, అంతర్జాతీయంగా వాతావరణ మార్పుల్ని ఎదుర్కొనేందుకు విడువలవుతున్న నిధుల్లో చిన్న రైతులకు ఎంత అందుతున్నదీ ఎవరూ లెక్కలు తీయట్లేదు. ఈ నేపథ్యంలో కాప్ 30లో కూడా చిన్న రైతుల ప్రయోజనాలను మళ్లీ పక్కన పెట్టబడతారని కొందరు ఆందోళన చెందుతున్నారు.ఆదాయంలో 40% వెచ్చిస్తున్న రైతులు2021లో అంతర్జాతీయ సమాజం ఇచ్చిన వాతావరణ ఆర్థిక సహాయంలో కేవలం 159 కోట్ల డాలర్లు మాత్రమే ప్రపంచవ్యాప్తంగా చిన్న రైతులు, గ్రామీణ సంఘాలకు చేరాయని ఎఫ్ఎఫ్సీఏ వెల్లడించింది. రైతులు వాతావరణ మార్పులను తట్టుకోవటానికి మెరుగైన నీటి΄ారుదల, నేల సంరక్షణ, పంటల వైవిద్యీకరణ వంటి అనుకూల చర్యల కోసం సమిష్టిగా తమ సొంత ఆదాయంలో నుంచి 36,800 కోట్ల డాలర్లను ఖర్చు చేశారు. ఈ మొత్తం వారి వార్షిక ఆదాయంలో 40 శాతం వరకు ఉంటుందని నివేదిక పేర్కొంది. ‘చిన్న రైతులపై పెట్టుబడి పెట్టడం ఆర్థిక అవసరం మాత్రమే కాదు, పర్యావరణ అత్యవసరం’ అని దక్షిణ బ్రెజిల్‌కు చెందిన ఇంటర్–కాంటినెంటల్ నెట్వర్క్ ఆఫ్ ఆర్గానిక్ ఫార్మర్ ఆర్గనైజేషన్స్ ప్రతినిధి థేల్స్ మెండోన్సా అన్నారు. ‘ప్రకృతి వ్యవసాయ పద్ధతులను ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ పనికి మద్దతు ఇవ్వటం ద్వారా కరువును అధిగమించి సమృద్ధి సాధించవచ్చు’ అన్నారు. హానికరమైన వ్యవసాయ సబ్సిడీలను దిశ మార్చి ఉపయోగించాలలని, అంతర్జాతీయ ఆర్థిక సంస్థలను సంస్కరించాలని, అవసరమైన నిధులను సమీకరించడానికి న్యాయమైన పన్నులు విధించాలని నివేదిక ప్రభుత్వాలను కోరింది. చిన్న రైతులకు అందించే 44,300 కోట్ల డాలర్ల వార్షిక పెట్టుబడి అభివృద్ధి చెందుతున్న దేశాలు రుణ చెల్లింపుల కోసం ఏటా ఖర్చు చేసే దానిలో మూడింట ఒక వంతు కంటే తక్కువే. 25 అతిపెద్ద ఆహార సంస్థల వార్షిక ఆదాయంలో 25%కు సమానం అని నివేదిక వివరించింది.3.8 లక్షల కోట్ల డాలర్ల నష్టంవాతావరణ విపత్తుల వల్ల వ్యవసాయ రంగానికి సంవత్సరానికి 12,300 కోట్ల డాలర్ల నష్టం జరుగుతోంది. గత 30 సంవత్సరాలుగా 3.8 లక్షల కోట్ల డాలర్ల మేరకు పంటలకు, పశువులకు నష్టం జరిగిందని నివేదిక అంచనా వేసింది. చిన్న రైతులకు తోడ్పడేలా పెట్టుబడి పెట్టడం వల్ల వరి, గోధుమ, కోకో, కాఫీ వంటి కీలక వస్తువుల సరఫరా గొలుసులను భద్రపరచడంతో పాటు వాతావరణ విపత్తుల్లో వ్యవసాయ నష్టాలను తగ్గించడంలో సహాయపడుతుంది.రైతుల కోసం ప్రత్యేక నిధిదీర్ఘకాలిక గ్రాంట్లు, సులభ రుణాలను నేరుగా రైతు ఉత్పత్తిదారుల సంస్థలు, సహకార సంస్థలకు అందించడానికి రైతు సంస్థల నేతృత్వంలోని రైతు సాధికారత నిధిని ఏర్పాటు చెయ్యాలని ఎఫ్ఎఫ్సీఏ నివేదిక పిలుపునిచ్చింది. ‘వాతావరణ సంబంధ వత్తిళ్లు ఎదుర్కొంటూ నష్ట΄ోతున్న చిన్న సన్నకారు రైతులకు సులభంగా రుణాలను అందించేందుకు ప్రభుత్వాలు నిబంధనలను సులభతరం చేయాలని ఆసియా రైతు సంఘం సెక్రటరీ జనరల్ ఎస్తేర్ పెనునియా కోరుతున్నారు. రైతుల నేతృత్వంలోనే ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తే గొప్ప ప్రభావం ఉంటుందన్నారు. దక్షిణాసియా, ఆగ్నేయాసియా, లాటిన్ అమెరికా, సబ్–సహారా ఆఫ్రికా బ్యాంకుల్లో 16 శాతం మాత్రమే చిన్న రైతులకు రుణాలు ఇస్తున్నాయని నివేదిక పేర్కొంది. బ్రెజిల్ అధ్యక్షతన నవంబర్ 10న ప్రారంభమయ్యే కాప్ 30 ఎజెండాలో ప్రకృతికి అనుకూల వ్యవసాయ పద్ధతులను, చిన్న సన్నకారు రైతులకు మద్దతు ఇచ్చే అంశాలకు ప్రాధాన్యత ఉండటం శుభసూచకం. ‘ఆకలిని ఎదుర్కోవడానికి, పర్యావరణ వ్యవస్థలను పునరుద్ధరించ డానికి, మన ఆహార భవిష్యత్తును భద్రపరచడానికి చిన్న సన్నకారు రైతులకు మద్దతు ఇవ్వడం అతి ముఖ్యం’ అని న్సిమదాల అన్నారు. వాతావరణ మార్పుల నుంచి చిన్న కమతాల సేద్యాన్ని ఇప్పుడు రక్షించుకోక΄ోతే భవిష్యత్తులో అందుకు చెల్లించే మూల్యం చాలా ఎక్కువగా ఉంటుంది.చిన్న రైతులు ఎవరు? చిన్న రైతులు ఎవరనే ప్రశ్నకు అన్ని దేశాలకూ వర్తించే నిర్దిష్ట నిర్వచనం అంటూ లేదు. అది దేశాన్ని బట్టి మారుతూ ఉంటుంది. సాధారణంగా 1 నుంచి 10 హెక్టార్ల (హెక్టారుకు దాదాపు 2.5 ఎకరాలు) భూమిలో పంటలు పండించే రైతులను / రైతు కుటుంబాలను స్మాల్ హోల్డర్ ఫార్మర్స్ అని అంతర్జాతీయంగా వ్యవహరిస్తుంటారు. అయితే, ఎక్కువ దేశాల ప్రభుత్వాలు 2 హెక్టార్ల కంటే తక్కువ భూమిని కలిగిన రైతులను చిన్న రైతులుగా గుర్తిస్తున్నాయి. మన దేశంలో చిన్న, సన్నకారు రైతులంటే 2 హెక్టార్ల లోపు భూమి కలిగి ఉన్నవారు. దేశ వ్యవసాయ ఆధారిత జనాభాలో 85% కంటే ఎక్కువ మంది వీరే. కానీ, సగం కంటే తక్కువ భూమి మాత్రమే వీరికి ఉంది.వాతావరణ ఆర్థిక సహాయం హెక్టారుకు రూ. 84 వేలు కావాలి! ఫ్యామిలీ ఫార్మర్స్ ఫర్ క్లైమేట్ యాక్షన్ (ఎఫ్ఎఫ్సీఏ) అనే అంతర్జాతీయ సంస్థ తాజాగా జరిపిన ఒక విశ్లేషణ ప్రకారం.. వాతావరణ విపత్తుల నుంచి చిన్న, సన్నకారు రైతులను కాపాడుకోవటానికి సంవత్సరానికి 44,300 కోట్ల డాలర్ల ‘వాతావరణ ఆర్థిక సహాయం’ అవసరం ఉంది. ప్రజలకు, భూగోళానికి హానికరమైన వ్యవసాయ సబ్సిడీలపై అంతర్జాతీయంగా ఖర్చు చేస్తున్న 47,000 కోట్ల డాలర్ల కంటే ఇది తక్కువేనని కూడా ఈ నివేదిక లెక్క తేల్చింది. సింపుల్‌గా చెప్పాలంటే.. 1 హెక్టార్ పొలానికి ఏటా సగటున 953 డాలర్ల (రూ. 84 వేల) పెట్టుబడి అవసరం అవుతుంది. అంతర్జాతీయ సమాజం నుంచి ఇప్పుడు కూడా కొద్ది మొత్తంలో కొన్ని దేశాల్లో రైతులకు సహాయం అందుతోంది. అయితే, చిన్న రైతులకు అవసరమైన దానిలో 1% కూడా అందటం లేదు. ఇంకా చె΄్పాలంటే.. కేవలం 0.36% మాత్రమే! చిన్న రైతులను వాతావరణ విపత్తుల నుంచి కాపాడుకోవటానికి ‘రైతు నిధి’ ఏర్పాటు చెయ్యటం ద్వారా న్యాయం చెయ్యాలని ఫ్యామిలీ ఫార్మర్స్ ఫర్ క్లైమేట్ యాక్షన్ (ఎఫ్ఎఫ్సీఏ) పిలుపునిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా చిన్న రైతులకు అవసరమైన నిధులు1. ఉత్తర ఆఫ్రికా: ఆహారోత్పత్తిని వాతావరణ విపత్తుల నుంచి రక్షించడానికి సంవత్సరానికి 889 కోట్ల డాలర్లు అవసరం. ఉదాహరణకు.. 2022–23 కరువు కారణంగా ట్యునీషియాలో ఆహారధాన్యాల ఉత్పత్తిలో 70% తగ్గింది.2. తూర్పు ఆఫ్రికా: వ్యవసాయ రంగం సుస్థిరతకు సంవత్సరానికి 3,460 కోట్ల డాలర్లు అవసరం. 75% కంటే ఎక్కువ మంది ప్రజలకు వ్యవసాయరంగమే ఉపాధికల్పిస్తుంది.3. మధ్య ఆఫ్రికా: వాతావరణ విపత్తుల్ని తట్టుకోవటానికి వ్యవసాయానికి సంవత్సరానికి 292 కోట్ల డాలర్లు అవసరం. కాంగో నదీ పరివాహక ప్రాంతంలోని ప్రపంచంలో రెండో అతిపెద్ద ఉష్ణమండల వర్షారణ్యాన్ని పునరుద్ధరించడానికి, రక్షించడానికి ఈ నిధులు అవసరం.4. దక్షిణ ఆఫ్రికా:కటిక కరువు వల్ల పంట ఎండిపోకుండా కాపాడటానికి సంవత్సరానికి 1,320 కోట్ల డాలర్లు అవసరం. కరువు వల్ల 2023–24లో 2.1 కోట్ల మంది పిల్లలు పోషకాహార లోపంతో అల్లాడారు.5. పశ్చిమ ఆఫ్రికా: 20 లక్షల కోకో రైతుల జీవనోపాధిని కాపాడటానికి సంవత్సరానికి 1,111 కోట్ల డాలర్లు అవసరం. అంతేకాదు, యూరప్‌లోని 5,000 కోట్ల డాలర్ల చాక్లెట్ పరిశ్రమ భవిష్యత్తును కా΄ాడటానికి కూడా ఈ నిధులు సహాయపడతాయి.6. మధ్య అమెరికా – మెక్సికో: ప్రపంచంలోనే అత్యంత వాతావరణ విపత్తులకు గురయ్యే ప్రాంతాల్లో కూడా ‘డ్రై కారిడార్’ ఒకటి. అక్కడి కోటికి పైగా ప్రజల జీవనోపాధిని కాపాడుతూ, ఆహార కొరత రాకుండా కాపాడటానికి సంవత్సరానికి 1,209 కోట్ల డాలర్లు అవసరమవుతాయి.7. దక్షిణ అమెరికా: సంవత్సరానికి 1,295 కోట్ల డాలర్ల వ్యవసాయ ఎగుమతులను (కొలంబియా 320 కోట్ల డాలర్ల కాఫీ పంట సహా) కాపాడడంలో సహాయపడతాయి.8. ఆగ్నేయాసియా: 69 కోట్ల మంది ప్రజలు చిన్న, సన్నకారు రైతులు పండించే ఆహారోత్పత్తులపై 90% మేరకు ఆధారపడుతున్నారు. వీరికి ఆహార కొరత రాకుండా చూడటానికి సంవత్సరానికి18,918 కోట్ల డాలర్లు అవసరం.9. పసిఫిక్: చిన్న, సన్నకారు రైతుల వ్యవసాయాన్ని రక్షించడానికి సంవత్సరానికి 8 కోట్ల డాలర్లు అవసరం. ఈ ప్రాంత స్థూల జాతీయోత్పత్తిలో వ్యవసాయానికి 17.7% వాటా ఉంది. – నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ -
విపత్తుల్ని తట్టుకునే వినూత్న ఉపాయాలు!
అధిక వేడి, అధిక చలి, నీటి ముంపు వంటి విపత్కర వాతావరణ పరిస్థితులు చుట్టుముట్టినప్పుడు పంటలు, తోటలు తట్టుకోలేకపోవటం ఆధునిక కాలపు వ్యవసాయ, ఉద్యాన తోటల సాగుకు పెద్ద సవాలుగా నిలిచింది. గడ్డు కాలాన్ని తట్టుకొని నిలబడటమే కాకుండా, మంచి దిగుబడినిచ్చేందుకు తోడ్పడే 2 అద్భుత సాంకేతికతలను శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయ నిపుణులు డాక్టర్ జడల శంకరస్వామి ఆవిష్కరించారు. అమెరికాలో మొక్కజొన్న సాగులో వీటితో సత్ఫలితాలు సాధించారని, మన దేశంలో తానే మొదటిగా గత మూడేళ్లుగా పరిశోధనలు చేస్తున్నానని ఆయన ‘సాక్షి సాగుబడి’కి వెల్లడించారు. వాతావరణ మార్పులు మనం, మన పంటలు ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు. ఉద్యాన పంటల సాగులో వాతావరణం కీలకపాత్ర పోషిస్తుంది. వాతావరణ మార్పుల వల్ల ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయి. ఫలితంగా వర్షపాతంలో/ ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులు, విపరీతమైన వేడి గాలులు, పెరుగుతున్న నీటి అవసరాలు సవాళ్లు విసురుతున్నాయి. అధిక వర్షాలు, వరద ముంపు సందర్భాల్లో ఉద్యాన తోటలు, సీజనల్ పంటలకు అధిక నష్టం కలిగి, ఉత్పాదక శక్తి తగ్గిపోతోంది. ఈ నేపథ్యంలో వాతావరణ విపత్తుల నుంచి పంటలు, తోటలను రక్షించుకోవటానికి ఉపయోగపడే రెండు చక్కని సాంకేతికతలను వనపర్తి జిల్లా మోజర్లలోని శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన యూనివర్సిటీ కళాశాలకు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.జడల శంకరస్వామి ఆవిష్కరించారు. ప్రయోజనకరమైన పరిశోధనలు చేస్తున్న ఆయన ఆవిష్కరించిన మొదటి సాంకేతికత: ‘మల్టీవాల్ కార్బన్ నానో ట్యూబ్ పౌడర్’(నానో బొగ్గుపొడి), రెండోది: ‘హైడ్రోజన్ రిచ్ వాటర్ (హైడ్రో నీరు)’. నానో బొగ్గు పొడి, హైడ్రో నీటిని పిచికారీ చేసి పండ్ల తోటలు, కూరగాయ తోటలతోపాటు పత్తి, మిరప, వరి వంటి సీజనల్ పంటలను కాపాడుకోవచ్చని డా. శంకరస్వామి వెల్లడించారు. వీటిని వేర్వేరుగా పిచికారీ చేయటం ద్వారా పంటలు, తోటలను పర్యావరణ ఒత్తిళ్ల నుంచి సమర్థవంతంగా రక్షించుకోవచ్చని రుజువైందని డా. శంకరస్వామి తెలిపారు. పంట, పండ్ల వ్యర్థాలతో నానో బొగ్గు పొడి తయారీ ఇలా..నానో బొగ్గు పొడి పైకి సాధారణ బొగ్గు పొడిలాగే కనిపిస్తుంది. కానీ, అతిసూక్ష్మ కర్బన గొట్టాలతో కూడిన బొగ్గు పొడి ఇది. పంటల వ్యర్థాలను ఒక ప్రత్యేక యంత్రంలో వేసి ఆక్సిజన్ లేని వాతావరణంలో 600 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలో మండించి దీన్ని తయారు చేస్తారు. రైతుల పొలాల్లో, పట్టణాలు, నగరాల్లో వృథాగా పారేసే పంట, పండ్ల వ్యర్థాలతో నానో బొగ్గు పొడిని తయారు చేసుకోవచ్చు. ఎండిన దానిమ్మ, నారింజ, పుచ్చ, సీతాఫలం, పనస, సొర, గుమ్మడి తదితర పండ్ల తొక్కలు.. మామిడి టెంకలు, చింతగింజలు, పత్తి చెట్ల ప్రధాన కాండాలు (వేర్లతో సహా), అరటి బోదలు, కొబ్బరి బొండాల డొప్పలు, కొబ్బరి చిప్పలతో దీన్ని తయారు చేసుకోవచ్చు. ఒక కిలో చెత్తను యంత్రంలో వేస్తే పావు కిలో బొగ్గు పొడి తయారవుతుంది. ఇది మార్కెట్లో అందుబాటులో ఉన్నా, ఖరీదెక్కువ. కిలో ధర రూ. 10 వేలు. గ్రాము ధర రూ. వంద వరకు ఉంటుంది. అయితే, దీని తయారీ యంత్రం ధర కనీసం రూ. 7.5 లక్షలు ఉంటుంది. రైతు ఉత్పత్తిదారుల సంస్థలు, సహకార సంఘాలు దీన్ని తయారు చేసి రైతులకు అందించవచ్చని డా. శంకరస్వామి సూచిస్తున్నారు. పత్ర రంధ్రాల్లోంచి చొచ్చుకెళ్తుంది!నానో బొగ్గు పొడి పైకి సాధారణ బొగ్గు పొడి మాదిరిగానే కనపడుతుంది. అయితే, నీటిలో కలిపి పంటలు, తోటలపై పిచికారీ చేస్తే బాగా పనిచేస్తుంది. ఆకుల్లోని సూక్ష్మ రంధ్రాల ద్వారా చొచ్చుకెళ్లి వాతావరణ ఒత్తిళ్లను తట్టుకునే శక్తినిస్తుంది. విత్తనాలు త్వరగా మొలకెత్తేలా చేస్తుంది. తోటలు/పంటల పెరుగుదలను వేగవంతం చేస్తుంది. నీరు, ముఖ్యమైన పోషకాలను సమర్ధవంతంగా గ్రహించటంలో తోడ్పడుతుంది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో పంటలు దెబ్బతినకుండా కాపాడుతుంది. హైడ్రో నీరు తయారీ ఇలా..పంటలు, తోటలకు ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకునే శక్తినివ్వటంలో హైడ్రోజన్ కలిపిన నీరు (హైడ్రోజన్ రిచ్ వాటర్) ఉపయోగపడుతుంది. సాధారణ నీటిలో హైడ్రోజన్ వాయువును అదనంగా కలిపితే హైడ్రో నీరు తయారవుతుంది. సాధారణ నీటిలో హెచ్2ఓ అణువులు మాత్రమే ఉంటాయి. కానీ ఈ నీటిలో స్వేచ్ఛగా తిరిగే ‘కరిగిన హైడ్రోజన్ అణువులు’ అదనంగా ఉంటాయి. హైడ్రోజన్ వాయువును ఎలక్ట్రోలసిస్ పరికరం సహాయంతో హైడ్రో నీటిని తయారు చేసుకోవచ్చు. ఈ నీటి సాంద్రతను పార్ట్స్ పర్ బిలియన్ (పీపీబీ) యూనిట్లలో కొలుస్తారు. 1000 పీపీబీ సాంద్రత గల హైడ్రో నీటిని పిచికారీ చేస్తే వాతావరణ ప్రతికూలతలను తట్టుకునే శక్తి వస్తుందని డా. శంకరస్వామి పరిశోధనల్లో తేలింది. రోజుకు వేల లీటర్ల హైడ్రో నీటిని ఉత్పత్తి చేసే వాటర్ ఎలక్ట్రోలైజర్ మిషన్ ధర రూ. 10 లక్షల వరకు ఉంటుంది లేదా మిక్సీ మాదిరిగా ఉండే చిన్న మిషన్ ధర రూ. 2 వేలు ఉంటుంది. దేన్నయినా వాడొచ్చు. సాధారణ నీటితో నింపిన 2 లీ. గాజు సీసాను ఈ మిషన్‌పై తల్లకిందులుగా పెడితే, 15 నిమిషాల్లో 1000 పీపీబీ హైడ్రో నీరు సిద్ధమవుతుంది. ఈ నీటిని (సాధారణ నీళ్లలో కలపకూడదు) నేరుగా పంటలు, తోటలపై పిచికారీ చెయ్యాలి. జీవ ఉత్ప్రేరకం హైడ్రో నీరు పిచికారీ వల్ల మొక్కలు/చెట్లలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పెరుగుతాయి. అధిక వేడి, చలి, నీటి ముంపు వంటి ఒత్తిళ్లకు గురైనప్పుడు ఏర్పడే ‘రియాక్టివ్ ఆక్సిజన్ స్పీసీస్’ పంటలను బలహీనపరుస్తాయి. వీటిని తటస్థీకరించటంలో హైడ్రోజన్ ఒక సెలెక్టివ్ యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేసి, మొక్కల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. హైడ్రో నీరు జీవ ఉత్ప్రేరకం (బయో స్టిమ్యులెంట్) గా పనిచేస్తుంది. జిబ్బరిల్లిక్ యాసిడ్ వంటి హర్మోన్లను పెంపొందిస్తుంది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో చెట్లు, మొక్కలు చనిపోకుండా కాపాడుతుంది. కిరణజన్య సంయోగ క్రియను మెరుగుపరిచి, జీవక్రియ, శక్తి జీవక్రియ (ఏటీపీ)ల ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది. పూలు, పండ్లు, కూరగాయలు కోసిన తర్వాత త్వరగా పాడవకుండా నిల్వ సామర్ధ్యాన్ని పెంచుతుంది. అధిక ఉష్ణోగ్రతను, అతి చలిని తట్టుకోవటంతో పాటు వ్యాధి నిరోధకతను పెంపొందించేందుకు కూడా హైడ్రో నీరు ఉపయోగ పడుతుందని డా. శంకరస్వామి చెబుతున్నారు. పిచికారీతో 15 రోజులు రక్షణవేసవి వడగాడ్పులు, అధిక ఎండ, అతి చలి వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో.. అధిక వర్షం కారణంగా ఉరకెత్తకుండా పత్తి, మిర్చి, టమాటా వంటి కూరగాయ పంటలు, పండ్ల తోటలను రక్షించుకోవడానికి నానో బొగ్గు పొడి, హైడ్రో నీటిని వేర్వేరుగా పిచికారీ చేసి కాపాడుకోవచ్చని డా. శంకరస్వామి చెప్పారు. పిచికారీ చేస్తే 15 రోజుల పాటు రక్షణ ఉంటుందన్నారు. అవసరమనుకుంటే మళ్లీ పిచికారీ చేసుకోవాలన్నారు. ఈ రెండింటిని కలిపి చల్లకూడదు. వేర్వేరుగా చల్లాలి. ఇదొకరోజు, అదొకరోజు సాయంత్రం వేళల్లోనే చల్లాలి. లీటరు నీటికి 7 గ్రాముల బొగ్గు పొడి లీటరు నీటికి 7 గ్రాముల నానో బొగ్గు పొడిని కలిపి సాయంత్రపు వేళలో పిచికారీ చెయ్యాలి. ఆ తెల్లారి సాయంత్రం 1000 పీపీబీ సాంద్రత గల హైడ్రో నీటిని పంటలు/చెట్ల ఆకులన్నీ పూర్తిగా తడిచేలా పిచికారీ చెయ్యాలి. సాధారణ నీటిలో కలపకుండా పంటలు, తోటలపై నేరుగా పిచికారీ చెయ్యాలి. అవసరమైతే 15 రోజుల తర్వాత మళ్లీ చల్లాలి. ముదురు పండ్ల తోటల్లో చెట్టుకు 10 లీటర్ల మోతాదులో ఈ రెండింటిని వేర్వేరుగా, 24 గంటల వ్యవధిలో, పిచికారీ చెయ్యాలి. ఎకరం వరికి 4 కిలోల నానో బొగ్గు పొడినీరు నిల్వగట్టిన వరి పొలాల్లో, పిచికారీ కాకుండా చేలోని నీటిలో, ఎకరానికి 4 కిలోల చొప్పున నానో బొగ్గు పొడిని నేరుగా కలపాలి. వరి మొక్కల కాండాలు, వేరు వ్యవస్థలకు ఆక్సిజన్ పుష్కలంగా అందుతుంది. 24 గంటల పాటు ఉపశమనం కలుగుతుంది. ఆ తర్వాత అవసరాన్ని బట్టి మళ్లీ నానో బొగ్గు పొడిని వరి పొలం నీటిలో చల్లాలి. వరి పొలంలో హైడ్రోజన్ రిచ్ నీరు చల్లనవసరం లేదు. నానో బొగ్గు పొడి, హైడ్రో నీరు తయారీపై శిక్షణ ఇస్తాంవాతావరణ మార్పులు తెచ్చే విపత్కర పరిస్థితులను తట్టుకొని నిలబడే విధంగా పంటలు, తోటల సామర్థ్యాన్ని పెంపొందించటానికి నానో బొగ్గు పొడి, హైడ్రో నీరు ఉపయోగపడతాయి. మూడేళ్లుగా నేను ఈ పరిశోధనలు చేస్తూ సత్ఫలితాలు సాధించాను. మన దేశంలో మొట్టమొదట ఉద్యాన కాలేజీలోనే వీటిపై పరిశోధనలు చేపట్టాం. తమిళనాడు కోస్తా ప్రాంతంలో మాత్రమే పండే మధురై మల్లి పంటను వనపర్తి జిల్లా్లలో పండించడానికి నానో బొగ్గు పొడి, హైడ్రో నీరు చాలా బాగా ఉపయోగపడ్డాయి. నీటిని నిల్వగట్టి సాగు చేసే వరి పొలాల దగ్గరి నుంచి.. కూరగాయలు, పండ్ల తోటలు, పత్తి, మిర్చి వంటి అన్ని రకాల ఆరుతడి పంటల వరకూ గడ్డుకాలాల్లో కాపాడుకోవటానికి ఇవి నిస్సందేహంగా ఉపయోగపడతాయి. నానో బొగ్గు పొడిని, హైడ్రో నీటిని రైతులు మార్కెట్లో కొనాల్సిన అవసరం లేదు. యంత్రాలను సమకూర్చుకొని ఎఫ్పీఓలు, సొసైటీలు, రైతు సంఘాలు, మహిళా స్వయం సహాయక బృందాలు వీటిని తయారు చేసి రైతులకు అందించవచ్చు. వీటి తయారీ, వాడే పద్ధతులపై మోజర్ల ఉద్యాన కాలేజీలో 3 రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నాం. – డా. జడల శంకరస్వామి, అసిస్టెంట్ ప్రొఫెసర్, శ్రీకొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన కళాశాల, మోజర్ల, వనపర్తి జిల్లా(సాయంత్రం 6–7 గంటల మధ్య రైతులు డా. శంకరస్వామికి 97010 64439 నంబరుకు ఫోన్ చేసి తమ సందేహాలు తీర్చుకోవచ్చు) – పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి -
పల్లీ..
సాక్షి, సాగుబడి: ఆహార పదార్థాలన్నీ అందరికీ సరిపడాలన్న నియమం ఏమీ లేదు. అలర్జీకి కారణమయ్యే అవకాశం ఉన్న వేరుశనగల్లాంటి ఆహార పదార్థాలను పసిపిల్లలకు ఎంత వయసులో అలవాటు చెయ్యటం ప్రారంభించాలి? ఈ ప్రశ్నకు సమాధానం దేశాన్ని బట్టి మారిపోతుందంటున్నారు వైద్య నిపుణులు. విదేశాల్లోని పిల్లలతో పోలి్చతే మన పిల్లలకు ఇమ్యునిటీ ఎక్కువేనని, వారికి వచి్చన అలర్జీలన్నీ మనకు రావాలనేమీ లేదని నిపుణులు చెబుతున్నారు. అమెరికాలో 3.3 కోట్ల మందికి ఆహార సంబంధమైన అలర్జీలున్నాయని అంచనా.అక్కడి పిల్లలకు వేరుశనగలు (పల్లీలు), గుడ్లు, సోయాచిక్కుళ్లు తింటే అలర్జీ వస్తాయనే అభిప్రాయం ఉండేది. అందుకే మూడేళ్లు నిండే వరకు పిల్లలకు పల్లీలు పెట్టొద్దని అమెరికా ప్రభుత్వం గతంలో అనేక దశాబ్దాల పాటు అక్కడి తల్లిదండ్రులు, వైద్యులకు చెప్పింది. అయితే, ఆ తర్వాత కాలంలో జరిగిన వైద్య పరిశోధనల ఫలితాలను బట్టి 4–6 నెలల వయసులోనే శిశువులకు వేరుశనగలు తినిపించటం మొదలు పెట్టాలని సూచించింది. దీని వల్ల అలర్జీ బెడద చాలా వరకు తగ్గిందని తాజా అధ్యయనం చెబుతోంది. మన పరిస్థితి ఏమిటి? మన దేశంలో 6 నెలలు నిండిన పసి పిల్లలకు ధాన్యాలు, పప్పులు, నూనెగింజలు, గుడ్లు, పాల ఉత్పత్తులు, కూరగాయలు, పండ్లు కొద్ది మోతాదులో తినిపించవచ్చని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్)కు చెందిన జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) ఆహార మార్గదర్శకాల్లో సూచించింది. లండన్ అధ్యయనంతో మార్పు 2015లో లండన్‌లోని కింగ్స్ కాలేజీకి చెందిన డాక్టర్ జిడియోన్ లాక్ జరిపిన లెర్నింగ్ ఎర్లీ అబౌట్ పీనట్ ఎలర్జీ (ఎల్ఈఏపీ) అధ్యయనం వేరుశనగల అలర్జీపై అమెరికాకున్న పూర్వపు అవగాహనను పూర్తిగా మార్చేసింది. పుట్టిన కొద్ది నెలలకే శిశువులకు వేరుశనగలను తినిపించటం అలవాటు చేస్తే మున్ముందు జీవితంలో ఫుడ్ అలర్జీల ముప్పు 80% వరకు తగ్గిపోయిందని ఈ అధ్యయనం తేలి్చంది. ఈ పిల్లలు కౌమార దశ వరకూ 70% మందికి ఫుడ్ అలర్జీల బెడద లేదని కూడా తేలింది. ఈ అధ్యయనంలో వెల్లడైన ఫలితాల ఆధారంగా 2015లో అమెరికాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అలర్జీ అండ్ ఇన్ఫెక్షస్ డిసీజెస్ సరికొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. 4–6 నెలల మధ్య వయసులో శిశువులకు వేరుశనగ గింజలను తినిపించటం అలవాటు చెయ్యవచ్చని స్పష్టం చేసింది. నాలుగు నెలల నుంచే పెట్టొచ్చు.. గత దశాబ్ద కాలంగా 4–6 నెలల శిశువులకు వేరుశనగలు అలవాటు చెయ్యటం వల్ల మంచి ఫలితాలే వస్తున్నాయని తాజా అధ్యయనం తేలి్చంది. ఫిలడెల్ఫియా పిల్లల ఆస్పత్రిలో అలర్జీ నిపుణుడు, పరిశోధకుడు డాక్టర్ డేవిడ్ హిల్ ఆధ్వర్యంలో జరిగిన అధ్యయన వివరాలు ఇటీవల మెడికల్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. 2015లో సవరించిన మార్గదర్శకాల వల్ల సుమారు 60 వేల మంది పిల్లలు వేరుశనగల అలర్జీ నుంచి తప్పించుకున్నారని వెల్లడైంది. ఇది చాలా గొప్ప సంగతి కదూ అన్నారు డా. డేవిడ్ హిల్. డజన్ల కొద్దీ పిల్లల వైద్యుల వద్ద నుంచి 2015కు ముందు, ఆ తర్వాత పిల్లలకు అందించిన అలర్జీ చికిత్సల వివరాలను సేకరించి ఆయన విశ్లేíÙంచారు. మూడేళ్ల లోపు పిల్లల్లో వేరుశనగల అలర్జీ కేసులు 2015 తర్వాత 27%, 2017 తర్వాత 40% తగ్గిపోయాయని నిర్ధారించారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అలర్జీ అండ్ ఇన్ఫెక్షస్ డిసీజెస్ 2021లో మార్గదర్శకాలను మరోసారి సవరించి ఎటువంటి ముందస్తు పరీక్షలు చెయ్యకుండానే 4 నుంచి 6 నెలల శిశువులకు వేరుశనగ గింజలు, గుడ్లు, సోయాచిక్కుళ్లు వంటి అలర్జీ వచ్చే అవకాశం ఉన్న ఆహారాలను అలవాటు చెయ్యమని సూచించింది. అయితే, ఏడు నెలలకన్నా ముందు శిశువులకు వేరుశనగలు తినిపిస్తున్న తల్లిదండ్రులు ఇప్పటికీ కేవలం 17% మాత్రమేనని ఒక సర్వే చెబుతోంది.వేరుశనగతో అలర్జీ ఎందుకొస్తుంది?వేరుశనగ గింజల్లోని ప్రొటీన్లు హాని చేస్తాయేమోనని పిల్లల శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ తప్పుగా అర్ధంచేసుకొని రక్షణాత్మకంగా ప్రత్యేక రసాయనాలను విడుదల చేయటం ద్వారా ఈ గింజలు తినగానే అలర్జీ రియాక్షన్ వస్తోందని పరిశోధకులు గుర్తించారు. శరీరంపై దద్దుర్లు రావటం, శ్వాసకోశ సంబంధమైన ఇబ్బందులు రావచ్చు. కొన్ని సందర్భాల్లో ఈ ఫుడ్ అలర్జీ అతి తీవ్ర రూపం దాల్చి ప్రాణాంతకంగానూ పరిణమించవచ్చు. మన పిల్లల్లో ఇమ్యునిటీ ఎక్కువ వాతావరణం, జీవనశైలిలో అమెరికాకు మనకు వ్యత్యాసం ఉంది. వారితో పోలి్చతే మన పిల్లలకు రోగనిరోధక శక్తి ఎక్కువ. కాబట్టి వారికి వచ్చే కొన్ని అలర్జీలు మన పిల్లలకు అంతగా రావు. శిశువుకు 6 నెలల వరకు విధిగా తల్లిపాలు ఇవ్వాలని, ఆరు నెలల తర్వాతే ధాన్యాలు, పప్పులు వంటి ఆహార పదార్థాలను మెత్తగా వండి కొద్దికొద్దిగా తినిపించటం ప్రారంభించాలని జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) సూచిస్తోంది. సాధారణంగా మన దగ్గర మరీ చిన్న పిల్లలకు వేరుశనగలు పెట్టరు. బిడ్డకు సంవత్సరం నిండే వరకు తల్లి పాలు ఇవ్వటం కొనసాగిస్తూనే అనుబంధ ఆహారం అలవాటు చెయ్యటం మంచిది. పసిపిల్లలకు జలుబుల్లాంటివి వచి్చనా యాంటీబయాటిక్స్ వాడకుండా ఉంటే వాటికవే తగ్గుతాయి. ఇమ్యునిటీ కూడా పెరుగుతుంది. – డాక్టర్ వి.ఆర్. లోహిత్ కుమార్, గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, అపోలో స్పెక్ట్రా హాస్పిటల్, అమీర్‌పేట. -
ఒత్తిడిలో చిత్తవుతున్న అడవి : మనిషికో అర హెక్టారు అడవి!
అడవుల నరికివేత తగ్గుతోంది. గత దశాబ్దంలో ప్రపంచంలోని అన్నిప్రాంతాల్లో అడవుల నరికివేత నెమ్మదించింది. అయినప్పటికీ అడవులు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా గత ఐదేళ్లలో అడవుల పరిస్తితిపై ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార–వ్యవసాయ సంస్థ(ఎఫ్ఏఓ) మంగళవారం విడుదల చేసిన ‘గ్లోబల్ ఫారెస్ట్ రిసోర్సెస్ అసెస్మెంట్ 2025’ (జీఎఫ్ఆర్ఏ 2025) తాజా నివేదికలో అనేక అంశాలను ఎత్తిచూపింది. 236 దేశాలు, ప్రాంతాల అటవీ సంబంధ వివరణాత్మక విశ్లేషణలను ఈ నివేదిక అందిస్తోంది. దీని ఆధారంగానే ప్రపంచ దేశాల అటవీ సంరక్షణ కార్యక్రమాల సమీక్ష, ప్రణాళిక, అమలు ఆధారపడి ఉంటుంది. ప్రతి ఐదు సంవత్సరాలకోసారి విడుదలయ్యే ఈ నివేదిక 2025 ఎడిషన్‌ను ఇండోనేషియాలోని బాలిలో జరిగిన గ్లోబల్ ఫారెస్ట్ అబ్జర్వేషన్స్ ఇనిషియేటివ్ ప్లీనరీ సందర్భంగా విడుదలైంది. ఈ నివేదికలో మరెన్నో ఆసక్తికరమైన అంశాలున్నాయి.. అడవులు భూమిపై మనుషులు సహా సకల జీవ జాతుల మనుగడ సజావుగా సాగటానికి దోహద పడతాయి. ఆహార భద్రత, స్థానికుల జీవనోపాధి, పునరుత్పాదక జీవ పదార్థాలు, శక్తి సరఫరాకు అడవులు కీలకమైనవి. ప్రపంచంలోని జీవవైవిధ్యంలో ఎక్కువ భాగానికి అడవులు ఆవాసాలుగా ఉన్నాయి. ప్రపంచ కర్బన చక్రాలు, జలసంబంధ చక్రాలను నియంత్రించడంలో సహాయపడతాయి. కరువు, ఎడారీకరణ, నేల కోత, కొండచరియలు విరిగిపడటం, వరదల ముప్పులను తగ్గించడంలో అడవులపాత్ర కీలకం. అందుకనే, ఐక్యరాజ్యసమితిలోని ఆహార వ్యవసాయ సంస్థ అడవుల ఆరోగ్య స్థితిగతులపై నిరంతరం అధ్యయనం చేస్తుంటుంది. తాజా గణాంకాల ప్రకారం అడవులు 414 కోట్ల హెక్టార్లలో విస్తరించి ఉన్నాయి. ఇది భూగ్రహంపైన గల భూభాగంలో మూడింట ఒక వంతు. అడవులు అంతరించి΄ోయే వేగం తగ్గుముఖం పట్టిందని జీఎఫ్ఆర్ఏ 2025 నివేదిక చెబుతోంది. అంతేకాదు, ప్రపంచ అడవులకు సంబంధించి మరికొన్ని సానుకూల వార్తలను సైతం ఈ నివేదిక వెలుగులోకి తెచ్చింది. అడవులలో సగానికి పైగా దీర్ఘకాలిక నిర్వహణ ప్రణాళికల పరిధిలో సంరక్షించబడుతున్నాయి. ఐడో వంతు అడవులు చట్టబద్ధంగా ప్రభుత్వాలు ప్రకటించిన రక్షిత ప్రాంతాల్లో క్షేమంగా ఉన్నాయి. అయితే, ప్రపంచవ్యాప్తంగా అటవీ పర్యావరణ వ్యవస్థలు సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ప్రస్తుతం సంవత్సరానికి 1.09 కోట్ల హెక్టార్ల అడవుల నరికివేత ఎక్కువగానే కొనసాగుతోందని ఉందని నివేదిక పేర్కొంది.236 దేశాలు,ప్రాంతాల్లో విస్తరించి ఉన్న అడవుల వివరాలను ‘గ్లోబల్ ఫారెస్ట్ రిసోర్సెస్ అసెస్మెంట్ 2025’(జీఎఫ్ఆర్ఏ 2025) విశ్లేషిస్తుంది. 197 దేశాలు,ప్రాంతాలకు చెందిన ప్రభుత్వాలు నియమించిన అధికార∙జాతీయ కరస్పాండెంట్లు గణాంకాలు అందించారు. ప్రపంచవ్యాప్తంగా 700 పైచిలుకు నిపుణులు ఈ నివేదిక తయారీలో పాల్గొన్నారు.సమగ్ర నివేదిక : ఎఫ్ఆర్ఏ 2025కి ముందుమాట రాస్తూ ఎఫ్ఏఓ డైరెక్టర్ జనరల్ డాక్టర్ డోంగ్యు ఇలా అన్నారు: ‘అటవీ వనరుల అంచనా నివేదికలు అటవీ వనరులు, వాటి పరిస్థితి, నిర్వహణ, ఉపయోగాలకు సంబంధించి అత్యంత సమగ్రమైన, పారదర్శకమైన ప్రపంచ మూల్యాంకనాలు. సుస్థిర అటవీ నిర్వహణలోని అన్ని నేపథ్య అంశాలను విశదీకరిస్తాయి. ఇవి ఉత్పత్తి చేసే డేటా బహుళ ప్రయోజనాలకు ఉపయోగపడుతుంది. అడవుల స్థితిని, వాటిలో వస్తున్న మార్పులను అంతర్జాతీయ సమాజానికి తెలియజేయటం, అడవులకు సంబంధించిన నిర్ణయాలు, విధానాలు, పెట్టుబడులకు మద్దతు ఇవ్వటంతో పాటు అవి అందించే పర్యావరణ సేవలను మనకు గుర్తు చేయడానికి ఈ నివేదికలు ఉపయోగపడతాయి’ అన్నారు. మనిషికో అర హెక్టారు అడవి! అటవీ విస్తీర్ణం: అడవులు 414 కోట్ల హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్నాయి. ప్రపంచ భూభాగంలో ఇవి 32 శాతానికి విస్తరించాయి. భూతలంపై ఉన్న ప్రతి ఒక్కొక్కరికి 0.5 హెక్టార్ల (123.6 సెంట్ల) మేరకు అడవులు ఉన్నాయి. ప్రపంచంలోని దాదాపు సగం అడవులు ఉష్ణమండలంలోనే ఉన్నాయి.నికర నష్టం తగ్గుతోంది: అడవి ప్రతి ఏటా తగ్గిపోతోంది. నికర నష్టం 1990లలో ఏటా 1 కోటి 7 లక్షల హెక్టార్ల మేరకు తగ్గుతుండేది. 2015–2025లో మధ్యకాలంలో ఇది 41 లక్షల హెక్టార్లకు తగ్గింది.అడవుల నరికివేత: 1990–2000 దశకంలో 1.76 కోట్ల హెక్టార్ల మేరకు సం‘‘రానికి అడవులను నరికివేస్తుండే వాళ్లం. 2015–2025 దశకంలో సంవత్సరానికి 1.09 కోట్ల హెక్టార్లకు మందగించింది. అటవీ విస్తరణ రేటు కూడా తగ్గుముఖం పట్టింది. 2000–2015 మధ్యలో ఏటా 98.8 లక్షల హెక్టార్ల నుంచి 2015–2025లో 67.8 లక్షల హెక్టారు తగ్గింది.సహజంగా పునరుత్పత్తి చెందుతున్న అడవులు: సహజంగా పునరుత్పత్తి చెందుతున్న అడవుల విస్తీర్ణం మొత్తం అటవీ ప్రాంతంలో 92 శాతం (383 కోట్ల హెక్టార్లు). 1990–2025 మధ్య అవి 32.4 కోట్ల హెక్టార్లు తగ్గినప్పటికీ, నికర నష్టం రేటు గణనీయంగా తగ్గింది. ఆఫ్రికా, దక్షిణ అమెరికాలో అత్యంత ముఖ్యమైన తగ్గుదల (గత దశాబ్దంలో) జరిగింది. అయితే, సహజంగా పునరుత్పత్తి అయ్యే అడవుల పెరుగుదల అత్యధికంగా యూరప్‌లో జరుగుతోంది.పురాతన అడవులు: పురాతన కాలం నుంచి మనుషుల వల్ల నాశనం కాకుండా కొనసాగుతున్న అడవులను ప్రాథమిక అడవులు అంటారు. ఇవి కనీసం 118 కోట్ల హెక్టార్లలో ఉన్నాయి. అటవీ ప్రాంతంలో మూడింట ఒక వంతు వరకు ఉంటాయి. అయితే, ఈ విస్తీర్ణం తగ్గి΄ోతున్నది. కానీ, 2000 దశకం ప్రారంభంతో పోలిస్తే ఈ రేటు ఇప్పుడు సగానికి తగ్గింది.నాటిన అడవులు: మనుషులు నాటిన చెట్లతో కూడిన అడవులు మొత్తం అటవీ ్ర΄ాంతంలో దాదాపు 8 శాతం. అంచనా ప్రకారం.. 31.2 కోట్ల హెక్టార్లలో ఇవి ఉన్నాయి. 1990 నుంచి అన్ని ప్రాంతాల్లోనూ వాటి విస్తీర్ణం పెరిగింది. కానీ ఇటీవలి దశాబ్దంలో ప్రపంచవ్యాప్తంగా పెరుగుదల నెమ్మదించింది.జీవపదార్థం, కర్బనం: ప్రపంచ వ్యాప్తంగా అడవుల్లో పచ్చదనం 63,000 కోట్ల క్యూబిక్ మీటర్లు ఉందని అంచనా. అడవుల్లో కర్బన నిల్వలు 714 గిగా టన్నులకు పెరిగాయి.రక్షిత ప్రాంతాలు: చట్టబద్ధంగా ప్రభుత్వాలు ప్రకటించిన రక్షిత ప్రాంతాల్లో దాదాపు 20 శాతం అడవులు (81.3 కోట్ల హెక్టార్లు) విస్తరించి ఉన్నాయి. 1990 తర్వాత ఈ విస్తీర్ణం 25.1 కోట్ల హెక్టార్ల మేర పెరిగింది.నిర్వహణ ప్రణాళికలు: ప్రపంచవ్యాప్తంగా సగానికి పైగా అడవులు (213 కోట్ల హెక్టార్లు లేదా మొత్తం విస్తీర్ణంలో 55 శాతం) నిర్వహణ ప్రణాళికల కింద ఉన్నాయి. 1990 తర్వాత 36.5 కోట్ల హెక్టార్ల మేరకు ఈ విస్తీర్ణం పెరిగింది. కార్చిచ్చులు: అగ్నిప్రమాదాలు ఏటా సగటున 26.1 కోట్ల హెక్టార్ల భూమిని కాల్చేస్తున్నాయి. కార్చిచ్చులకు దగ్ధమవుతున్న విస్తీర్ణంలో దాదాపు సగం అడవులు. 2020లో కీటకాలు, వ్యాధులు, ప్రతికూల వాతావరణం 4.1 కోట్ల హెక్టార్ల అడవులను దెబ్బతీశాయి.యాజమాన్యం: ప్రపంచంలోని డెబ్బై ఒక్క శాతం అడవులు ప్రభుత్వ యాజమాన్యంలో ఉన్నాయి. 24 శాతం ప్రైవేట్ యాజమాన్యంలో ఉన్నాయి. మిగిలినవి ఇతరుల యాజమాన్యంలో ఉన్నాయి లేదా ఎవరి యాజమాన్యంలో ఉన్నాయో సమాచారం లేదు. నిర్వహణ లక్ష్యాలు దాదాపు 120 కోట్ల హెక్టార్ల (29 శాతం) అడవులను ప్రధానంగా అటవీ ఉత్పత్తుల కోసం నిర్వహిస్తున్నారు. 61.6 కోట్ల హెక్టార్ల అడవులను బహుళ ఉపయోగాల కోసం నిర్వహిస్తున్నారు. 48.2 కోట్ల హెక్టార్ల అడవులను జీవవైవిధ్య పరిరక్షణ కోసం, 38.6 కోట్ల హెక్టార్లను నేల, నీటి రక్షణ కోసం, 22.1 కోట్ల హెక్టార్లను సామాజిక సేవల కోసం నిర్వహిస్తున్నారు. రణ సేవలను మనకు గుర్తు చేయడానికి ఈ నివేదికలు ఉపయోగపడతాయి’ అన్నారు.తగ్గిన అటవీ నష్టం : 35 సంవత్సరాల కాలంలో మూడు బ్లాక్‌ల(1990–2000, 2000–2015 మరియు 2015–2025)లో అటవీ ప్రాంత పోకడలను విశ్లేషించారు. కెనడా, చైనా, రష్యన్ ఫెడరేషన్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో అటవీ విస్తీర్ణం భారీగా పెరిగింది. ఈ కారణంగా 1990–2000 మధ్య ప్రపంచవ్యాప్తంగా అటవీ నష్టం (అంతరిస్తున్న అడవుల విస్తీర్ణం) సంవత్సరానికి 1.07 కోట్ల హెక్టార్ల నుంచి 2000–2015లో సంవత్సరానికి 36.8 లక్షల హెక్టార్లకు తగ్గింది. అటవీకరణ, సహజ అటవీ విస్తరణ (అటవీ లాభం రేటు) తగ్గటం కారణంగా 2015–2025 కాలంలో నికర అటవీ నష్టం వార్షిక రేటు 4.12 మిలియన్ హెక్టార్లకు పెరిగింది. ఉదాహరణకు, చైనాలో, 2000–2015 మధ్యలో సంవత్సరానికి 22.2 లక్షల హెక్టార్లుగా ఉన్న నికర అటవీ లాభం 2015–2025లో సంవత్సరానికి 16.9 లక్షల హెక్టార్లకు తగ్గింది. కెనడాలో 2000–2015లో సంవత్సరానికి 5.13 లక్షల హెక్టార్లుగా ఉన్న నికర అటవీ లాభం 2015–2025లో సంవత్సరానికి 82,500 హెక్టార్లకు తగ్గింది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో, 2000–2015లో సంవత్సరానికి 4.37 లక్షల హెక్టార్ల నికర అటవీ లాభం ఇటీవలి దశాబ్దంలో సంవత్సరానికి 1.2 లక్షల హెక్టార్ల నికర అటవీ నష్టంగా మారింది. 5 దేశాల్లోనే 54% అడవి : ప్రపంచంలోని అటవీ ప్రాంతం సగానికి పైగా (54 శాతం) కేవలం ఐదు దేశాలలో (రష్యన్ ఫెడరేషన్, బ్రెజిల్, కెనడా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, చైనా) విస్తరించింది. ప్రపంచంలో అత్యధిక అటవీప్రాంతం ఉన్న పది దేశాలు మొత్తం అటవీ విస్తీర్ణంలో మూడింట రెండు వంతులు (66 శాతం) ఆక్రమించాయి. ఏడు దేశాలు, ప్రాంతాలు (ఫాక్లాండ్ దీవులు (మాల్వినాస్), 8 జిబ్రాల్టర్, హోలీ సీ, మొనాకో, నౌరు, స్వాల్బార్డ్, జాన్ మాయెన్ దీవులు, టోకెలావ్) అస్సలు అడవులే లేవు. మరో 49 దేశాలు,ప్రాంతాల్లో మొత్తం భూభాగంలో 10 శాతం కంటే తక్కువగానే అడవుల వాటా ఉంది.అటవీ భూమిలో హెక్టారుకు 79.6 టన్నుల సేంద్రియ కర్బనం! : అడవులు వాతావరణంలోని కర్బనాన్ని గ్రహించటం ద్వారా పర్యావరణ సమతుల్యతకు దోహదం చేస్తాయి. ‘గ్లోబల్ ఫారెస్ట్ రిసోర్సెస్ అసెస్మెంట్ 2025’(జీఎఫ్ఆర్ఏ 2025)లో 215 దేశాల అటవీ ప్రాంతాల నుంచి సేకరించిన ఫారెస్ట్ కార్బన్ స్టాక్ సమాచారాన్ని పొందుపరిచారు. అటవీ నేలలోని సేంద్రియ కర్బనం లెక్క వెయ్యటానికి సగటున నేల లోతు 41 సెం.మీ. మట్టిని పరిగణనలోకి తీసుకున్నారు. ఆసియా, ఓషియానియాలో 30 సెం.మీ., యూరప్‌లో 32 సెం.మీ, దక్షిణ అమెరికాలో 34 సెం.మీ, ఆఫ్రికాలో 41 సెం.మీ, ఉత్తర–మధ్య అమెరికాలో 70 సెం.మీ. లోతు మట్టిని విశ్లేషించారు. అడవిలో మట్టిలో, చెట్ల కాండంలో, ఆకుల్లో, వేర్లలో కర్బనం ఉంటుంది. 2025లో మొత్తం అటవీ కర్బన నిల్వలు 714 గిగా టన్నులుగా అంచనా వేశారు. అంటే.. హెక్టారు అడవిలో 172 టన్నుల కర్బనం ఉంది. మట్టిలో సేంద్రియ కార్బన్ 329 గిగా టన్నులు (మొత్తంలో 46 శాతం) లేదా హెక్టారుకు 79.6 టన్నులు. భూమి పైన చెట్లలో 247 గిగా టన్నులు (35 శాతం) లేదా హెక్టారుకు 59.7 టన్నులు. భూగర్భంలో వేర్లు తదితరాలలోని కర్బనం 65.9 గిగా టన్నులు (9 శాతం) లేదా హెక్టారుకు 15.9 టన్నులు. నేలపైన రాని ఆకులు అలముల్లో 41.1 గిగా టన్నులు (6 శాతం) లేదా హెక్టారుకు 9.93 టన్నులు. ఎండిన కట్టెల్లో కర్బనం 30.3 గిగా టన్నులు (4 శాతం) లేదా హెక్టారుకు 7.32 టన్నులు. యూరప్ (ప్రపంచ మొత్తంలో 24 శాతం), ఉత్తర, మధ్య అమెరికా (22 శాతం), దక్షిణ అమెరికా (20 శాతం)లలో అధిక మోతాదులో కర్బన నిల్వలున్న అటవీప్రాంతాలున్నాయి. పశ్చిమ, మధ్య ఆఫ్రికాలో ఒక యూనిట్ ప్రాంతానికి కర్బన నిల్వలు అత్యధికంగా హెక్టారుకు 260 టన్నులు ఉన్నాయి. ఉత్తర అమెరికాలో హెక్టారుకు దాదాపు 200 టన్నుల కర్బన నిల్వలు ఉన్నాయి. అటవీ విస్తీర్ణం యూరప్‌లోనే ఎక్కువ! 2025లో ప్రపంచ అటవీప్రాంతం 414 కోట్ల హెక్టార్లలో విస్తరించి ఉందని అంచనా. ఇది మొత్తం భూభాగంలో 32 శాతం. ఈ ప్రాంతం తలసరి 0.50 హెక్టార్ల అడవికి సమానం. అయితే, అడవులు ప్రపంచవ్యాప్తంగా భౌగోళికంగా సమానంగా వ్యాపించి లేవు. నలభై ఐదు శాతం అడవులు ఉష్ణమండల ప్రాంతాల్లో ఉన్నాయి. బోరియల్ (28 శాతం), సమశీతోష్ణ (17 శాతం), ఉప ఉష్ణమండల (11 శాతం)ప్రాంతాల్లో ఉన్నాయి. ప్రపంచంలోని అటవీ ప్రాంతం యూరప్‌లో 25 శాతం, దక్షిణ అమెరికాలో 20 శాతం, ఉత్తర, మధ్య అమెరికాలో 19 శాతం, ఆఫ్రికాలో 16 శాతం, ఆసియాలో 15 శాతం, ఓషియానియాలో 4 శాతం విస్తరించి ఉన్నాయి. – నిర్వహణ: పంతంగి రాంబాబు సాక్షి సాగుబడి డెస్క్ -
ఊపిరి ఉగ్గబట్టి 20 మీటర్లు.. 2 నిమిషాలు... సీఫుడ్ హీరోలు జుజు మహిళలు
శ్వాస పరికరాలు లేకుండా సాగర గర్భంలోకి డైవ్ చేస్తూ షెల్ ఫిష్, సీవీడ్స్ వంటి సముద్ర ఆహారాన్ని సేకరించి కుటుంబాలను పోషించుకునే మహిళా రైతుల తెగువ ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయంలో చెమటను చిందించే రైతమ్మలందరికీ స్ఫూర్తినిస్తుంది. దక్షిణ కొరియాలోని జెజు ద్వీపానికి చెందిన హెన్యో అనే మహిళా డైవర్లను ‘సీ ఉమన్’ అంటారు. వెయ్యేళ్ల నాటి వారసత్వ సంస్కృతి, డైవింగ్ నైపుణ్యం, సుస్థిరతలకు ప్రసిద్ధి చెందిన ఒక ప్రత్యేకమైన పాక్షిక మాతృస్వామిక సంప్రదాయం వారిది. ఇప్పటికీ 103 గ్రామాలకు చెందిన మహిళలు ఈ విధంగా ఎటువంటి యంత్రాల సహాయం లేకుండా సముద్ర గర్భంలోకి దూసుకెళ్తూ ఆహార సేకరణ చేస్తున్నారు. ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏఓ) ‘ఫుడ్ హీరోలు’గా కీర్తిస్తోంది. అంతేకాదు, అత్యంత అరుదైన ప్రపంచ వ్యవసాయ వారసత్వ సంపదగా కూడా హెన్యో సామ్రాజ్యాన్ని ఎఫ్ఏవో, యునెస్కో విశిష్ట గుర్తింపునిచ్చాయి. జెజు ద్వీపంలో పుట్టిన ఈ తరం యువతులు సైతం ఈ సంప్రదాయ వారసత్వ వ్యవసాయాన్ని కొనసాగిస్తూ ఆధునిక సాగర కన్యలుగా జీవనం సాగిస్తుండటం విశేషం. స్వేచ్ఛా డైవింగ్ ద్వారా వారు ‘సముద్ర పొలాలను’ పండిస్తున్న అరుదైన మహిళా ఫుడ్ హీరోలపై అక్టోబర్ 16న అంతర్జాతీయ ఆహార దినోత్సవం (World Food Day )సందర్భంగా ప్రత్యేక కథనం...‘సముద్రం నా రెండో తల్లి’!ర్యుజిన్ కో తన తల్లి లేదా అమ్మమ్మ అడుగుజాడల్లో నడవాలని ఎప్పుడూ అనుకోలేదు. జెజు ద్వీపం తూర్పు తీరంలో డైవ్ చేయడానికి తన తల్లి లేదా అమ్మమ్మ ఇంటి నుంచి పొద్దున్నే బయలుదేరి వెళ్లే సంగతి ఆమెకు బాల్యంలోనే తెలుసు. సీజన్ సరిగ్గా ఉన్నప్పుడు, వారు తమ కుటుంబాలను పోషించుకోవడానికి సముద్రపు అర్చిలు, అబలోన్, సముద్రపు నాచును సముద్రం లోపలి జలాలను గాలించి సేకరించేవారు. ర్యుజిన్ తన తరంలోని చాలా మంది అమ్మాయిల్లాగే కష్టపడి చదువుకుని నగరపు జీవితాన్ని గడపాలని కలలు కంది. అథ్లెటిక్స్‌లో డిగ్రీ పొందినతర్వాత ఆమె నగరానికి వెళ్లిపోయింది. కానీ, అక్కడి జీవితంలో నిలవలేకపోయింది. ఎదురైన నిరాశ, ఆవహించిన నిస్సత్తువ ఆమెను తిరిగి ఇంటి బాట పట్టించాయి. ఇల్లు ఆమెను సముద్రం వైపు నడిపించింది. ఆ విధంగా యువ ర్యుజిన్ తన తల్లి, అమ్మమ్మలాగే ఆమె ‘సముద్ర మహిళ’ కావాలని నిర్ణయించుకుంది.ప్రకృతి చిత్రమైనది. ఒక వనరు లేకపోతే మరో వనరును చూపిస్తుంది మనుషులు బతకడానికి! రిపబ్లిక్ ఆఫ్ కొరియాలోని జెజు ద్వీపం ఇందుకు ఒక ఉదాహరణ. ఒక అసాధారణ, విలక్షణ ‘సముద్ర వ్యవసాయ’ వారసత్వానికి కేంద్ర బిందువైంది. జెజు ద్వీపంలో ఎక్కువ భూమి నిస్సారవంతమైనది కావటంతో వ్యవసాయానికి అంతగా పనికొచ్చే స్థితిలో లేదు. ఈ భౌగోళిక బలహీనత కారణం వల్ల జెజు ప్రజలు సాంప్రదాయకంగా వరికి బదులుగా తమ మెట్ట పొలాల్లో బాగా పెరిగే చిరుధాన్యాలు, బార్లీ వంటి ధాన్యపు పంటలను పండించేవారు. ఎందుకంటే ఈ పంటలు తక్కువ వనరులతోనే ఎక్కువ మందికి ఆహార భద్రతనిచ్చే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఆ కారణంగా అక్కడి మహిళా రైతులు సముద్రంపై ఆధారపడి తమ కుటుంబాలకు ఆహారాన్ని సమకూర్చుకోవటంపై దృష్టి సారించారు. సముద్రం అడుగున ఉండే జీవులు, ఆకులు అలములను వెదికి తెచ్చుకోవటమే వారు వృత్తిగా పెట్టుకున్నారు. సుమారు వెయ్యి ఏళ్ల క్రితం నుంచి జుజు ద్వీపంలోని మహిళలు సముద్రపు నీటి లోతుల్లోకి దూకి తినదగిన ఆహారాన్ని సేకరించటం ప్రారంభించారు. ఆ క్రమంలో వారు అసాధారణమైన డైవింగ్ నైపుణ్యాలను తరతరాలుగా సంతరించుకున్నారు. ఎటువంటి శ్వాస పరికరాలు పెట్టుకోకుండా సాగర గర్భంలోకి డైవ్ చేస్తూ అట్టడుగున ఉండే షెల్ ఫిష్, సీవీడ్స్ వంటి సముద్ర ఆహారాన్ని సేకరించి కుటుంబాలను పోషించుకుంటున్నారు. జెజు హెన్యో ఫిషింగ్ ప్రాక్టీస్ అనేది ప్రధానంగా మహిళలు నిర్వహించే సాంప్రదాయ జీవనాధార ఫిషింగ్ వ్యవస్థ. హెన్యో అంటే కొరియన్ భాషలో ‘సముద్ర మహిళ’ అని అర్థం. జెజు హెన్యోలు సాధారణ పద్ధతుల్లో చేపలు పట్టరు. అలాగని మట్టిలో పంటలు పండించరు. ఈ రెండిటికి మధ్యలో పర్యావరణ హితమైన సముద్రాహార సేకరణ ద్వారా తమ సమాజానికి ఆహార, జీవనోపాధి భద్రతను సాధించగలిగారు. ఈ మహిళా డైవర్లు సగం వ్యవసాయం – సగం మత్స్యకార జీవనశైలితో కూడిన జీవనోపాధి పనిలో నిమగ్నమవుతున్నారు. వట్టిపోతున్న సముద్రంకనుమరుగవుతున్న వాణిజ్య అవకాశాలతో పాటు సముద్రం నుంచి జుజు మహిళా డైవర్లు పొందే ప్రతిఫలం కూడా తగ్గుతోంది. వాతావరణ మార్పుల కారణంగా జెజు సముద్ర జలాలు వేడెక్కుతున్నాయి. ఫలితంగా, ఈ ప్రాంత సముద్ర జలాల్లోకి చొచ్చుకొస్తున్న ఉపఉష్ణమండల చేపలు స్థానిక జాతులను మింగేస్తున్నాయి. అముర్ స్టార్ ఫిష్, బ్లూ–రింగ్డ్ ఆక్టోపస్ వంటి మాంసాహార జాతులు ఈ జలాలను దురాక్రమణ చేస్తున్నాయి. సముద్ర మహిళలు ఇప్పుడు అలల కింద కొత్త సవాళ్లను ఎదుర్కొంటున్నారు.ర్యుజిన్ సముద్రంలోకి దిగిన ప్రారంభ సంవత్సరాల్లో సమృద్ధిగా చేపలు పట్టుకోగలిగేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారి΄ోయింది. ఒకప్పుడు దొరికిన దానిలో ΄ావు వంతు కంటే తక్కువ మత్స్య సంపదే ఇప్పుడు దొరుకుతోంది. ‘నా నైపుణ్యాలు మెరుగుపడినప్పటికీ, సముద్రం నుంచి తక్కువగానే పట్టుకోగలుగుతున్నాను. మూడు సంవత్సరాల క్రితం నేను ఏటా 30 బస్తాల అగర్ సీవీడ్‌ను సేకరించి ఎండబెట్టగలిగాను. ఈ సంవత్సరం కేవలం ఏడు బస్తాలతో సరిపెట్టుకోవాల్సి వస్తోంది..’ అన్నారు ర్యుజిన్. ర్యుజిన్, ఆమెతో పాటు ఉండే మహిళా డైవర్లు మత్స్య సంపద అంతరించి΄ోకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నారు. స్వీయ–నియంత్రణ ΄ాటిస్తూ సముద్ర పర్యావరణ వ్యవస్థను సంరక్షించే చర్యలు చేపడుతున్నారు. హానికరమైన మత్స్య జాతుల నుంచి ఒబుంజాక్ (ఒక రకమైన అబలోన్) వంటి స్థానిక జాతులను కాపాడుతున్నారు. మహిళా డైవర్లు తాము ఆహారం కోసం వేటాడే వారిలా మాత్రమే కాకుండా సముద్ర జీవుల సంరక్షకులుగా తమను తాము భావిస్తారు. స్థానిక సముద్ర జలాలను దురాక్రమణ చేసే స్టార్ ఫిష్‌లను స్థానిక ప్రభుత్వ మద్దతుతో చంపే పని కూడా చేస్తున్నారు.కొత్త యుగంసవాళ్లు ఎదురవుతున్నప్పటికీ జెజు హెన్యో సంస్కృతిపై ప్రజలకు ఆసక్తి పెరుగుతోంది. 2016లో యునెస్కో జెజు హెన్యో సంస్కృతిని యావత్ మానవాళి అవ్యక్త సాంస్కృతిక వారసత్వ సంపదగా గుర్తించింది. ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏఓ) జెజు హెన్యో మత్స్యకార వ్యవస్థను ‘ప్రపంచవ్యాప్తంగా అతిముఖ్యమైన వ్యవసాయ వారసత్వ వ్యవస్థ’గా 2023లో ప్రకటించింది. సముద్ర జీవవైవిధ్యం, హానికరం కాని రీతిలో వేట పద్ధతులు అనుసరించటం, అసాధారణమైన సామాజిక నీతి సంరక్షకులుగా హెన్యో మహిళా డైవర్లకు గల ప్రాముఖ్యతను ఎఫ్ఏఓ గుర్తించి ప్రోత్సహిస్తోంది. జెజు ప్రత్యేక స్వయం పాలిత రాష్ట్రంలో ఏర్పాటైన హెన్యో సాంస్కృతిక వారసత్వ విభాగం డైరెక్టర్ క్యుంగ్–హో కో మాట్లాడుతూ ఈ గుర్తింపు ప్రాముఖ్యతను ఇలా వివరించారు.. ‘ఇది జెజు హెన్యో వ్యవస్థను ఉన్నతీకరిస్తుంది. ఈ విలువైన వారసత్వాన్ని భవిష్యత్ తరాలకు అందించడానికి సహాయపడుతుంది. స్థానిక సమాజం అభివృద్ధికి దోహదపడుతుంద’ని ఆయన అన్నారు. ‘కఠినమైన పని పరిస్థితులు, పర్యావరణ మార్పులు, తగ్గుతున్న సముద్ర వనరులు, వృద్ధాప్యం, కొత్తగా ఈ పనిలోకి వచ్చే వారి సంఖ్య తక్కువగా ఉండటం వంటి సవాళ్లు ఉన్నప్పటికీ, తమ జీవనోపాధిని కొనసాగించే మహిళల బలమైన ఆకాంక్షను ఎఫ్ఏవో గుర్తింపు బలోపేతం చేస్తోంది’ అన్నారాయన. హెన్యో జీవన విధానాన్ని కాపాడుకోవడానికి జెజు ప్రభుత్వం కృషి చేస్తోంది. సముద్ర మహిళల సంక్షేమం కోసం, వారి ఆదాయాన్ని పెంపొందించడానికి, వారి పని వాతావరణాన్ని మెరుగుపరచటం ద్వారా హెన్యో సంస్కృతిని సంరక్షించడానికి ఈ సంవత్సరం 2 కోట్ల అమెరికన్ డాలర్ల మేరకు ప్రభుత్వం పెట్టుబడి పెట్టిందని డైరెక్టర్ క్యుంగ్–హో కో వివరించారు. డైవింగ్ సంబంధిత గాయాలకు వైద్య ఖర్చులను ప్రభుత్వం భరిస్తోంది. అరవై, డెబ్బయి ఏళ్లు దాటిన హెన్యోలకు ఆర్థిక భత్యాలు ఇస్తున్నారు. 75 ఏళ్లు పైబడిన వారికి పదవీ విరమణ ప్రయోజనాలను అందిస్తున్నారు. హెన్యో పండుగలు, ఆచారాల ప్రోత్సహించటం, కొత్త తరం మహిళలకు హెన్యో నైపుణ్యాలపై శిక్షణ ఇవ్వడానికి పాఠశాలలను కూడా నిర్మించటం విశేషం.ఉద్యోగం కంటే ఎక్కువ..ఒక జీవన వారసత్వం! వేగవంతమైన ప్రపంచంలో జెజులోని హెన్యో సమాజం పర్యావరణ స్పృహతో కొనసాగుతోంది. ప్రకృతిని మనుషులు ఉపయోగించుకునే క్రమంలో పర్యావరణ పరిమితులను గౌరవిస్తుంది. పరస్పరం ఆధారపడటాన్ని విలువైనదిగా భావించే జీవన విధానాన్ని కొత్త తరాలకు చాటిచెప్పే ఉదాహరణగా నిలుస్తుంది. ‘ప్రజలు ఈ పనిని ‘3డి ఉద్యోగం’ అని పిలుస్తారు. మూడు డీలు అంటే.. డర్టీ, డేంజర్, డిమాండింగ్తో కూడిన పని అని చెబుతుంటారు. కానీ నా మటుకు నాకు, ఇది అత్యున్నతమైన సంతృప్తినిచ్చే పని అనిపిస్తుంటుంది’ అన్నారు 42 ఏళ్ల ర్యుజిన్. ‘నేను నీటి అడుగున ఉన్నప్పుడు, నేను జీవించడం గురించి మాత్రమే ఆలోచిస్తాను. అంతకుమించి అతిగా ఆలోచించడం మానేశాను’ అంటారు ర్యుజిన్. ‘సముద్రం నా రెండో తల్లి. నేను సముద్రపు తల్లి ఒడిలో ఈదులాడుతూ చాలా స్వస్థత పొందాను. ఈ తల్లి నాకు చాలా ఇచ్చింది..’ అంటారామె ఉద్వేగంగా! ‘నాకు నలుగురు పిల్లలు. ప్రతి ఉదయమూ జీవన పోరాటమే. కానీ సముద్రం వైపు వెళుతున్నప్పుడు మాత్రం నాకు ఉత్సాహంగా ఉంటుంది. ఈ రోజు సముద్రం నాకు ఏమి ఇస్తుందో అన్న ఉత్సుకత కలుగుతుంది. స్వస్థత చేకూర్చే నిరంతర ప్రవాహంలా జీవితం గడచిపోతోంది’ అన్నారామె. ‘జెజులో మహిళలది ఎల్లప్పుడూ కీలక పాత్రే. నాకు, హెన్యో అంటే మహిళలు, మహిళలు అంటే హెæన్యో. ఇది గొప్ప గర్వకారణం...’ అన్నారు.కనుమరుగవుతున్న వారసత్వంహెన్యో వ్యవసాయ వారసత్వ సంప్రదాయానికి వెయ్యి సంవత్సరాలకు పైగా చరిత్ర ఉంది. క్రీస్తు శకం 1,105వ సంవత్సరం నుంచి ఈ వ్యాపారాన్ని ప్రస్తావించిన రికార్డులున్నాయి. జెజు మహిళలు ఎల్లప్పుడూ ఆ ద్వీపం జీవితానికి వెన్నెముకగా ఉన్నారు. మత్స్యకారులుగా, రైతులుగా, తల్లులుగా, ఎక్కువగా వీళ్లదే ఇళ్లలో ముఖ్యమైన సంపాదనగా ఉంటుంది.1970లలో 14,000 మంది హెన్యోలు ఉన్నారు. కానీ, 1980 తర్వాత కాలంలో చాలా మంది మహిళలు ఈ పనిని విడిచిపెట్టి పర్యాటక, టాన్జేరిన్ పరిశ్రమల్లో ఉద్యోగాల కోసం వెళ్లారు. ప్రస్తుతం 2,700 హెన్యోలు ఉన్నారు. అయితే, వారిలో చాలా మంది డెబ్బై, ఎనభై– ఏళ్ల వయస్కులే! 42 సంవత్సరాల వయస్కురాలైన ర్యుజిన్ సముద్రంలోకి వెళ్లే అతి పిన్న వయస్కుల్లో ఒకరు. ర్యుజిన్ గ్రామంలో 83 మంది చురుకైన హెన్యోలు ఉన్నారు. ఈ సంవత్సరం పది మంది పదవీ విరమణ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు. ర్యుజిన్ తరంలో డైవర్లు పని నేర్చుకున్న వారి సంఖ్య చాలా తక్కువ. ‘భవిష్యత్తులో నేను ఒంటరిగా డైవింగ్ చేయవలసి వస్తుందేమోనని ఆందోళన చెందుతున్నాను. అందుకే నేర్చుకోవాలనుకునే వారెవరినైనా స్వాగతిస్తున్నాను. నాకు తెలిసిన ప్రతి నైపుణ్యాన్నీ వారికి నేర్పుతాను’ అని ర్యుజిన్ చెప్పారు. 20 మీటర్లు.. 2 నిమిషాలు...స్వేచ్ఛా డైవింగ్ చేసే జెజు మత్స్యకార మహిళలు తమ శ్వాసను ఉగ్గబట్టుకునే సామర్థ్యం, సముద్ర జలాల్లోకి దూసుకెళ్లే నైపుణ్యం, సముద్రపు నీటి అడుగున ఏయే తావుల్లో తమకు అవసరమైన ఆహారం ఎక్కడెక్కడ ఉంటుందో గ్రహించే సంప్రదాయ విజ్ఞానం, జ్ఞాపక శక్తిని మాత్రమే ఆయుధాలుగా ఉపయోగించి సముద్రపు లోతుల్లోకి సాహసంతో దూకేస్తారు. ఆక్సిజన్ ట్యాంకులు లేకుండా వారు డైవ్ చేయగలరు. ఒకటి–రెండు నిమిషాలు తమ శ్వాసను స్తంభింపజేసుకోగలరు. ఆ కొద్ది సమయంలోనే ఐదు నుండి 20 మీటర్ల లోతుకు డైవ్ చేయగలరు. రోజుకు ఏడు గంటల పాటు సముద్రంలో గడపటం వారికి వెన్నతో పెట్టిన విద్య. ప్రతి అక్టోబర్ 16 నాడు ప్రపంచ ఆహార దినోత్సవం జరుపుకుంటూ ప్రపంచవ్యాప్తంగా ర్యుజిన్ వంటి ‘ఫుడ్ హీరో’ల గురించి గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం. ఇటువంటి సంప్రదాయ విజ్ఞానంతో కూడిన గొప్ప జీవన నైపుణ్య సాంప్రదాయ వారసత్వాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరాన్ని ఈ తరం గుర్తించేలా చెయ్యటం మన కర్తవ్యం.– నిర్వహణ: పంతంగి రాంబాబు సాక్షి సాగుబడి డెస్క్ -
పగ బట్టిన పండు ఈగ!
పండు ఈగ (ఫ్రూట్ ఫ్లై) అనేక పండ్లు, కూరగాయ తోటలకు పెను నష్టాన్ని కలిగిస్తూ రైతులను అల్లాడిస్తోంది. కొద్ది సంవత్సరాల క్రితం మామిడికే పరిమితమై ఉండే పండు ఈగ ఇప్పుడు అనేక పంటలకు విస్తరించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పండు ఈగ ముప్పు ఏటేటా పెరుగుతోంది. దాదాపు 20కి పైగా పండ్లు, కూరగాయ తోటలకు పండు ఈగ ఆశిస్తూ రైతులకు పెను నష్టం కలిగిస్తోంది. మామిడిలో 30% నుంచి 70% దిగుబడి నష్టం జరుగుతోంది. జామ, బొప్పాయి, సపోటా, రేగు వంటి పంటల్లో 20% నుంచి 50% దిగుబడి నష్టాలకు కారణమవుతున్న పండు ఈగపై కేంద్ర వ్యవసాయ శాఖ అనుబంధ సంస్థ ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్’ (ఎన్ఐపీహెచ్ఎం) శాస్త్రవేత్తలు డాక్టర్ మరియదాస్, డాక్టర్ పైలా జ్యోతి, డాక్టర్ ఆలిస్ ఆర్పీ సుజీత సూచనలతో ప్రత్యేక కథనం. పండు ఈగ సోకకుండా జీవనియంత్రణ పద్ధతులను అనుసరించటమే మేలని వారు రైతులకు సూచిస్తున్నారు.పండ్ల ఈగలు (ప్రధానంగా బాక్ట్రోసెరా జాతులు బి. డోర్సాలిస్, బి. జోనాటా, బి. కుకుర్బిటే వంటివి) ఎన్నో రకాల పండ్లు, కూరగాయలను ఆశించి నాశనం చేసే పురుగులు. అందుకే వీటిని ‘పాలీఫాగస్ పెస్ట్స్’ అంటారు. ఒకప్పుడు కొన్ని పండ్లు, కూరగాయ రకాలకు నష్టం చేకూర్చేవి. క్రమంగా అనేక ఇతర పంటలకు కూడా వ్యాపించి నష్టం చేస్తున్నాయి. అకాల వర్షాలు, అస్థిర వాతావరణ పరిస్థితులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ఉద్యాన తోటల్లో పండు ఈగల త్వరితగతిన వ్యాప్తికి దోహదం చేస్తున్నాయి. దీనివల్ల గత సీజన్లో కూడా మామిడి కాయలకు తీవ్ర నష్టం కలిగింది. పండు ఈగ వల్ల మామిడి ఎగుమతులు కూడా తగ్గిపోతాయి. అనేక ఇతర పంటలను కూడా పండు ఈగ చుట్టుముడుతోంది.పండు ఈగ నియంత్రణకు మేలైన యాజమాన్య పద్ధతులు→ తోటలో చెట్ల నుంచి రాలిపోయిన లేదా పండు ఈగ సోకిన పండ్లను సేకరించి మట్టిలో రెండు అడుగుల (60 సెం.మీ.ల) లోతు గుంత తీసి పాతిపెట్టాలి. → పండ్ల చెట్ల కొమ్మలను తగుమాత్రంగా కత్తిరించి, కత్తిరింపులను తో టలో నుంచి తొలగిస్తే పండు ఈగలు పెరగకుండా చూసుకోవచ్చు. → పండిన పండ్లను పండినట్లు ఎప్పటికప్పుడు వెంటనే కోయండి. పండిన పండ్లను చెట్లపై వదిలివేయవద్దు.→ జొన్న, ఆముదం, తులసి, కర్రపెండలం వంటి పురుగులను ఆకర్షించే జాతుల మొక్కలను తోటల గట్లు/ సరిహద్దుల్లో పెంచటం ద్వారా ప్రధాన పంటను పండు ఈగల నుంచి రక్షించుకోవచ్చు. → మగ ఈగలను ఆకర్షించటం కోసం సామూహిక ఉచ్చులు ఏర్పాటు చేయటం ద్వారా పండు ఈగ సంతతిని నియంత్రించి తోటలను కాపాడుకోవచ్చు. పండ్ల తోటల్లో మిథైల్ యూజినాల్ ఉచ్చులు పెట్టాలి. తీగజాతి కూరగాయ పంటల్లో క్యూ–లూర్ ఉచ్చులను ఉపయోగించాలి. ఎకరానికి 6–10 ఉచ్చులు పెట్టాలి. ఒకసారి పెడితే చాల్లే అనుకోకండి. ప్రతి 30–40 రోజులకు ఒకసారి ఎరలను మార్చుతూ ఉండాలి. తక్కువ ఖర్చుతో కూడిన ‘ఫ్రూట్ ఫ్లై బాటిల్ ట్రాప్ టెక్నాలజీ’ని ఎన్ఐపీ హెచ్ఎం వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. దాన్ని ఉపయోగించుకోవచ్చు. → అధిక విలువైన పండ్లను పండు ఈగ నుంచి కాపాడుకోవటం కోసం పండ్లకు రక్షక సంచులు తొడగాలి. పండ్లకు కాగితం లేదా ప్లాస్టిక్ సంచులు తొడగండి. ఇది పండుపై ఈగ గుడ్లు పెట్టకుండా అడ్డుకుంటుంది. పురుగుమందుల అవశేషాలను తగ్గిస్తుంది. ఎగుమతి నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా పండ్లు ఉండేలా చేస్తుంది. శ్రమతో కూడుకున్న పని అయినప్పటికీ చిన్న తోటలన్నిటిలో, దేశీయ /ఎగుమతి మార్కెట్ల కోసం ఉద్దేశించిన తోటల్లో చెట్లపై కాయలకు సంచి చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. → తోటలో చెట్లు / మొక్కల కింద ఉన్న మట్టిని కుళ్లగించి, ఆ మట్టిలో ఉండే పండు ఈగ ప్యూపాలను చంపడానికి క్లోర్‌పైరిఫోస్ 20% ద్రావణాన్ని లీటరు నీటికి 2.5 ఎం.ఎల్. చొప్పున కలిపి చల్లండి. → బ్యూవేరియా బాసియానా, మెటారైజియం అనిసోప్లియా వంటి ఎంటోమో పాథోజెనిక్ శిలీంధ్రాలను ఆకులపై పిచికారీ చేయండి. → మగ, ఆడ కీటకాలను చంపడానికి ఎర స్ప్రేలను పిచికారీ చేయవచ్చు. ఏదైనా ఒక పురుగుమందును (మలాథియాన్ 50% ద్రావణం లీటరు నీటికి 2 ఎం.ఎల్./∙లేదా డెల్టామెథ్రిన్ 2.8% ద్రావణం లీటరు నీటికి 2 ఎం.ఎల్. చొప్పున) ప్రోటీన్ హైడ్రోలైజేట్ లేదా మొలాసిస్ లేదా బెల్లంలకు లీటరు నీటికి 10 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేయండి. పండు ఈగలు ఎక్కువగా ఉన్నప్పుడల్లా 2 వారాల వ్యవధిలో పిచికారీ చేయండి.ఈ తోటలకు ముప్పుపండ్ల జాతులు: మామిడి, జామ, సీతాఫలం, రేగు, బొప్పాయి, సపోటా, అరటి, దానిమ్మ, బత్తాయి, పుచ్చతో పాటు కివి వంటి అన్యదేశ పండ్లను కూడా పండు ఈగలు ఆశిస్తున్నాయి. కూరగాయలు, దోసకాయలు: టమాటా, వివిధ రకాల తీగ జాతి కూరగాయ పంటలకు పండు ఈగ సమస్యగా మారింది. బీర, సొర, కాకర, నేతి బీర, పొట్ల, గుమ్మడి, దొండ, దోస, కీర దోస తదితర ఉద్యాన పంటలకు పండు ఈగ ముప్పు పెరుగుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. బాక్ట్రోసెరా జాతి పండ్ల ఈగలు విజృంభిస్తున్నాయి. వందలాది పంటలను ఆశిస్తున్నాయి. అకాల వర్షాలు, తేమతో పాటు వెచ్చని రాత్రులతో మారుతున్న వాతావరణం చీడపీడలు వేగంగా విస్తరించటానికి సహాయపడుతున్నది. ఇది తెలంగాణ, ఆంధ్రలో ఇటీవలి మామిడి నష్టాలకు ప్రధాన కారణం బాక్ట్రోసెరా జాతి పండ్ల ఈగలే. పక్వానికి వచ్చిన కాయల కోత ఆలస్యమై పండ్లు చెట్లపై ఎక్కువ కాలం ఉన్నప్పుడు పండు ఈగలు వాటిని ఆశించి, ఆ పండ్ల లోపలికి గుడ్లు చొప్పించడానికి ఎక్కువ అవకాశం దొరుకుతున్నది. (పాపాయితోనే మాస్టర్స్..కానీ గ్రాడ్యుయేషన్ ఈవెంట్‌కి డబ్బుల్లేక అలా చేశా!)నష్టాలు.. ఎగుమతి చిక్కులుచెట్లకు వేలాడుతున్న పండ్ల తొక్కకు ఆడ పండు ఈగలు బెజ్జం చేసి, వాటి లోపల గుడ్లు పెడతాయి. గుడ్ల నుంచి తయారయ్యే పురుగులు ఆ పండు లోపలే ఉండి గుజ్జు ను తింటూ ఉంటాయి. దీనివల్ల పండు పైకి చూపులకు అంతా బాగానే కనిపిస్తున్నా లోపల్లోపల కుళ్ళి మెత్తబ డుతుంది. అకాలంగా పండ్లు రాలిపోతుంటాయి. ఇది పంట కోత తర్వాత కాలంలో అధిక నష్టాలకు దారితీస్తుంది. పండు ఈగలు ఎక్కువగా ఆశిస్తే పంట దిగుబడితో పాటు మార్కెట్లో ధరలు, ఎగుమతులు కూడా తగ్గిపోతాయి. పండు ఈగల దాడిని సరిగ్గా నియంత్రించకపోతే పండ్లు, కూరగాయల దిగుబడి గణనీయంగా తగ్గిపోయి, రైతులకు భారీ స్థాయిలో ఆర్థిక నష్టాలు సంభవిస్తాయి. మామిడిలో 30% నుంచి 70% వరకు పంట నష్టం జరుగుతుంది. జామ, బొప్పాయి, సపోటా, రేగు తదితర పంటల్లో సీజన్‌ను, పండు ఈగల తీవ్రతను బట్టి 20% నుంచి 50% వరకు పంట నష్టం జరుగుతుంది. (Diwali 2025 : ఈ ఏడాది అద్భుతం విశిష్టత ఏంటి? శుభ ముహూర్తం!)పండు ఈగలు పెద్ద సంఖ్యలో ఆశిస్తే విదేశాలకు ఎగుమతైన పండ్లు అక్కడికి వెళ్లిన తర్వాత తిరస్కరణకు గురయ్యే రిస్క్ పెరుగుతుంది. ఎగుమతికి సిద్ధం చేసే ప్రక్రియలో ఖర్చులు కూడా పెరుగుతాయి. కొన్ని సందర్భాల్లో సరుకు ఎగుమతి ఆర్డర్ల రద్దుకు సైతం దారితీస్తుంది. ఇది భారతీయ ఉత్పత్తులకు విదేశీ మార్కెట్లలో వాణిజ్య భాగస్వామ్యాన్ని తగ్గిస్తుంది. ఈ పరిస్థితిని నివారించడానికి పండ్లు ఈగలతో ప్రభావితమైన పండ్లను ఎగుమతి కాకుండా చూడాలి. అందుకు అనుగుణంగా కఠినమైన ఫైటో శానిటరీ శుద్ధి ప్రక్రియలు చేపట్టటం అవసరం. వేడి నీటి చికిత్స, వేడి ఆవిరి చికిత్స, చల్ల నీటి చికిత్స, వికిరణ చికిత్స, రసాయన ద్రావణాల్లో పండ్లను ముంచటంతో పాటు ఎగుమతి ప్రమాణాలకు అనుగుణంగా పండు ఈగ రహిత ధ్రువీకరణను ప్రవేశపెట్టటం వంటి పటిష్ట చర్యలు తీసుకుంటే పండు ఈగ వల్ల ఎగుమతులు దెబ్బతినకుండా చూసుకోవచ్చు. -
చిట్టిచేప.. చీరమీను... ఒక్కసారి తిన్నారంటే!
చీరమీను..అరుదైన ఒక రకం చిట్టిచేప. గోదావరి నది బంగాళాఖాతంలో కలిసే ప్రాంతాల్లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని యానం ప్రాంతంలో దొరికే ఒక ప్రత్యేకమైన, అత్యంత విలువైన చేప. ఈ చిన్న చేప చక్కని రుచి, పోషకాలతో కూడినది. సీజన్లో దొరుకుతుంది. ప్రత్యేక వేట పద్ధతులకు ప్రసిద్ధి చెందింది. చీరమీను స్థానికులకు మాత్రమే కాక, సీ ఫుడ్ ప్రియులకు కూడా ప్రత్యేక ఆకర్షణగా మారింది.స్థానిక పేర్లు: చీరమీను, సీరమీను. శాస్త్రీయ నామం: auridatumbil, Sauridatumbil, Sauridagracilis, Sauridatumbil ambo scamis. Synodontidae. దీన్ని కొందరు Awaousfluviatilisఅని కూడా సూచిస్తారు. చీరతో పట్టే చేపచీరమీను ప్రధానంగా గోదావరి నది – సముద్రం కలిసే బురద నీటిలో దొరుకుతుంది. ఈ ్ర΄ాంతంలో ఆక్సిజన్ సమృద్ధిగా ఉండటం వల్ల ఈ చేపలు గుడ్లు పెడతాయి. వర్షాకాలం సీజన్లో తూర్పు గాలులు వీస్తే, ఈ చేపలు నది ఒడ్డుకు చేరతాయి. వాటి రాకను పక్షులు గమనించి వాటిని తినడానికి నీటిపై ఎగురుతాయి. పక్షుల హడావుడి చూసి మత్స్యకారులు ‘చీరమీను వస్తోంది’ అని గుర్తిస్తారు. చీరమీను వేట ఒక సాంప్రదాయ ప్రక్రియ. మత్స్యకారులు చీరలకు ఒకవైపున షీట్లు కుట్టి వాటిని నీటిలో అమరిస్తారు. చేపలు వాటిలో చిక్కుకుంటాయి. చిన్న వలలు ఉపయోగించకుండా ఈ చేపలను చీరలతోనే సురక్షితంగా పట్టుకుంటారు. చీరలను ఉపయోగించి పడవలో వెళ్లి పట్టుకుంటారు కాబట్టి ‘చీరమీను’ అని పేరుపెట్టారు. ఈ చేప 1.7 సెంటీమీటర్లు వరకు పెరుగుతుంది. చీరమీను సాధారణంగా ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో లభిస్తుంది. వర్షాకాలంలో ఎక్కువగా దొరుకుతుంది. దీపాళి, నాగుల చవితి వంటి పండుగల సమయానికి చీరమీను మార్కెట్లలో అత్యధిక డిమాండ్‌లో ఉంటుంది. ఈ సీజన్లోనే స్థానికులు, ఆహార ప్రేమికులు దీన్ని ఆస్వాదిస్తారు. మాంసకృత్తులు, కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్, నియాసిన్, సెలీనియం, ఒమెగా 3 కొవ్వు ఆమ్లాలు చీరమీను చేపల్లో పుష్కలంగా ఉంటాయి.ఇదీ చదవండి: కిలో రూ. 1,500!చీరమీను అరుదుగా దొరుకుతుంది. వేట శ్రమతో కూడినది. కాబట్టి, మార్కెట్లో అధిక ధర పలుకుతుంది. దీన్ని గ్లాసు, తవ్వ, సేరు, కుంచం, బిందె, బకెట్లలో కొలిచి విక్రయిస్తారు. ఒక గ్లాసు చీరమీను చేపల ధర సుమారు రూ. 50–100. ఒక కుండి లేదా పెద్ద పాత్ర చేపల ధర రూ.10,000 వరకు ఉంది. కిలో ధర: రూ.500 – 1,500 (డిమాండ్‌ను బట్టి) పలుకుతుంది. ఇందువల్ల ఇది ఒక విలాసవంతమైన వంటకంగా మారింది. చీరమీను మాత్రమే కాక, దీని పిల్లలు కూడా ఫ్రాన్స్ వంటి అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి అవుతాయి. ఇదీ చదవండి: నో అన్న గూగుల్లోనే కీలక పదవి.. ఎవరీ రాగిణీ?మసాలా దట్టించి వండిన చీరమీను చక్కటి రుచి ఉంటుంది. కొంతమంది చీరమీను మినప్పిండి, చింత చిగురు, మామిడి కాయ, గోంగూర వంటి ఇతర పదార్థాలతో కలిపి వంటలు తయారు చేస్తారు. స్థానికులు పండుగల సమయంలో బంధు మిత్రులకు దీన్ని బహుమతిగా ఇచ్చి ఆనందిస్తారు. గోదావరి మడ అడవుల ప్రాంతంలో అధికంగా వేటాడటం, కాలుష్యం, వాతావరణ మార్పుల వల్ల చీరమీను మనుగడ ప్రమాదంలో పడింది. కాలుష్య నియంత్రణ, మత్స్యసంఘాల అవగాహన ద్వారా సురక్షిత వేట పద్ధతులను పాటిస్తే చేపల జాతిని పరిరక్షించుకోవచ్చు. తద్వారా జీవవైవిధ్యాన్ని, గోదావరి ప్రాంతపు సాంస్కృతిక, ఆర్థిక వారసత్వాన్ని నిలుపు కోవచ్చు. భవిష్యత్ తరాలకు దీన్ని రుచి చూపవచ్చు. చీరమీను కేవలం ఒక చేప మాత్రమే కాదు. ఇది ఆంధ్రప్రదేశ్‌లో సాంప్రదాయం, జీవనోపాధి, వంటకాల సంపద పర్యావరణ సూచికగా ప్రసిద్ధి చెందింది. ప్రతి వర్షాకాలం సీజన్లో గోదావరి ప్రాంతానికి వచ్చే పర్యాటకులు దీని రుచిని ఆస్వాదించడానికి ఇష్టపడతారు. -పొన్నపల్లి రామమోహన్ రావు (9885144557), డిప్యూటీ డైరక్టర్ ఆఫ్ ఫిషరీస్ (రిటైర్డ్), కాకినాడ -
Sagubadi: రైతు విత్తన హక్కులకు తూట్లు!
విత్తనం.. ప్రకృతి మనుగడకు, ఆహార భద్రతకు, వ్యవసాయానికి, రైతుల సంప్రదాయ పారంపర్య హక్కులకు విత్తనం మూలాధారం. ప్రపంచవ్యాప్తంగా ఇన్ని దేశాల్లో ఎన్నోన్నో ప్రత్యేక విత్తనాలు, విలక్షణ వంగడాలు ఉన్నాయి. సార్వభౌమత్వం గల ఒక దేశంలో అనాదిగా ఉన్న విత్తనాలు, మొక్కలు, వంగడాలు, వాటి జన్యువనరులు ఆ దేశం సొత్తు. ఇంకా చెప్పాలంటే గత పదివేల సంవత్సరాల నుంచి వీటిని నిరంతరాయంగా సాగు చేస్తూ, తమవైన పద్ధతుల్లో పరిరక్షించుకుంటూ, తమ పొలాల్లో వాడుకోవటంతోపాటు, తమ దేశవాసులతో పంచుకుంటూ జీవనయానం కొనసాగిస్తున్న వ్యవసాయ సమాజాల లేదా రైతుల అపురూపమైన వారసత్వ సొత్తు విత్తనం! ఒక దేశం వ్యవసాయక వారసత్వ సంపదైన విత్తనాన్ని లేదా జన్యు వనరులను ఇతర దేశాలకు ఇచ్చి పుచ్చుకోవటానికి ఎటువంటి నియమ నిబంధనలుపాటించాలో నిర్దేశించేందుకు ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏఓ) అంతర్జాతీయ ఒడంబడికను కుదిర్చింది.దాని పేరే యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ ట్రీటీ ఆన్ ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్ ఫర్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ (ఐటీపీజీఆర్ఎఫ్ఏ). దీన్ని అంతర్జాతీయ విత్తన ఒడంబడిక లేదా మొక్కల ఒడంబడిక (సీడ్ ట్రీటీ లేదా ప్లాంట్ ట్రీటీ) అని కూడా పిలుస్తారు. 154 దేశాలు దీనిపై సంతకాలు చేశాయి. ఇది 2004లో అమల్లోకి వచ్చింది. ఇది సభ్యదేశాలన్నీ విధిగాపాటించి తీరవలసిన ఒడంబడిక (లీగల్లీ బైండింగ్ ట్రీటీ) కావటంతో దీని ప్రభావం వారసత్వ మేధో హక్కులపై గణనీయంగా ఉంటుంది. 64 రకాల విత్తనాలు/ మొక్కలు/ వంగడాలు దీని పరిధిలోకి వస్తాయి.ఈ పంటలకు సంబంధించిన 70 లక్షలకు పైగా విత్తనాల నమూనాలు అంతర్జాతీయ స్థాయి విత్తన నిధుల్లో అందుబాటులోకి వచ్చాయి. వీటిని ఉపయోగించుకొని సరికొత్త వంగడాల తయారీపై 28,000కు పైగా విత్తన సంస్థలు పరిశోధనలు చేస్తున్నాయి. ఇతర దేశపు విత్తనాలను పరిశోధనలకు వాడుకుంటే ఆ దేశానికి కంపెనీ కొంత మొత్తాన్ని చెల్లించాలన్నది ఒక నియమం. అయితే, 20 ఏళ్ల తర్వాత ఈ ఒడంబడికకు సవరణలు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ సవరణలు రైతుల హక్కులకు భంగం కలిగిస్తూ కంపెనీలకు లాభం చేకూర్చేలా ఉన్నాయని విమర్శలు రావటంతో వివాదం రాజుకుంది. ఆ విషయాలను కొంచెం వివరంగా తెలుసుకుందాం...అంతర్జాతీయ విత్తన ఒడంబడిక (ఐటీపీజీఆర్ఎఫ్ఏ)కు సవరణ ప్రయత్నాల నేపథ్యంలో ఇటీవల వివాదం నెలకొంది. ప్రధానంగా అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య విత్తన జన్యు వనరుల పంపిణీకి సంబంధించిన మేధో సంపత్తి హక్కులు, ప్రయోజన భాగస్వామ్యం (బెనిఫిట్ షేరింగ్), సింపుల్‌గా చెప్పాలంటే రాయల్టీ, చెల్లింపు విషయంలో కొనసాగుతున్న అసమానతల కారణంగా వివాదం నెలకొంది. ఈ వ్యవస్థ చిన్న తరహా రైతులు, జీవవైవిధ్యం అధికంగా ఉన్న భారత్ తదితర దేశాల ప్రయోజనాల కంటే బహుళజాతి విత్తన సంస్థలకు ఎక్కువ అనుకూలంగా ఉందని.. అంతేకాకుండా ప్రతిపాదిత సవరణలు ఈ సమస్యలను మరింతగా పెంచుతాయని విమర్శకులు వాదిస్తున్నారు.నవంబర్‌లో లిమాలో కీలక సమావేశంనవంబర్ 24 నుంచి 29 వరకు పెరూలోని లిమాలో జరగనున్న విత్తన ఒడంబడిక 11వపాలకమండలి సమావేశంలో సవరణలపై చర్చ జరగనుంది. వర్కింగ్ గ్రూప్ తయారుచేసిన చర్యల ముసాయిదాప్యాకేజీపై చర్చిస్తారు.వివాదానికి దారితీసిన కీలక అంశాలు: 1. ప్రపంచంలోని పంటల జీవవైవిధ్యం (అంటే.. వైవిధ్యమైన వంగడాలు, పంటల జాతుల సంఖ్య) ఎక్కువ భాగం అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే కేంద్రీకృతమై ఉంది. ఈ దేశాలు తమ జన్యు పదార్థాన్ని అభివృద్ధి చెందిన దేశాలకు అనాదిగా అందిస్తున్నాయి. అయితే, అందుకు తగిన స్థాయిలో ఆర్థిక ప్రయోజనాలు తిరిగి పొందలేక΄ోతున్నాయి. 2. జన్యు వనరుల వాణిజ్యీకరణతో కలిగే ప్రయోజనాలను బెనిఫిట్–షేరింగ్ ఫండ్ ద్వారా సేకరించి విత్తన హక్కులున్న దేశాలకు పునఃపంపిణీ చేయడానికి బహుళ పక్ష వ్యవస్థ (ఎంఎల్ఎస్) ను ఏర్పాటు చేశారు. అయితే, ఈ వ్యవస్థ చాలా తక్కువ డబ్బును మాత్రమే రాబట్టగలుగుతోంది. ప్రయోజనాలు తరచుగా ద్రవ్యేతరమైనవి లేదా కేవలం ప్రతీకాత్మకమైనవిగా అరకొరగా మాత్రమేనని విమర్శకులు వాదిస్తున్నారు.3. విత్తన ఒడంబడిక ఎజెండాలోనే తేడా ఉందన్న అభిప్రాయం ఉంది. రైతులు, స్వదేశీ వ్యవసాయ సమాజాల హక్కుల పరిరక్షణపై కంటే.. తమ వాణిజ్య ప్రయోజనాలకు ్రపాధాన్యత ఇచ్చే కార్పొరేట్ సంస్థలకే విత్తన ఒడంబడిక ఉపయోగపడుతోందని చాలామంది భావిస్తున్నారు.ప్రపంచ రైతుల కూటమి హెచ్చరికఐక్యరాజ్యసమితి విత్తన ఒప్పందంలో ప్రతిపాదించిన సంస్కరణలు రైతుల హక్కులకు భంగం కలిగించే విధంగా ఉన్నాయని రైతు సంఘాలు, పౌర సమాజ సంస్థలతో కూడిన ‘ప్రపంచ రైతుల కూటమి’ హెచ్చరిస్తోంది. ప్రతిపాదనలు రైతుల డిమాండ్లను పక్కన పెట్టి విత్తన కంపెనీలకు బహుళ పక్ష వ్యవస్థను మరింత ఆకర్షణీయంగా మార్చడంపై దృష్టి పెడుతున్నాయని కూటమి ఆరోపిస్తోంది. రైతుల హక్కులను దెబ్బతీసే విత్తన ఒప్పంద సంస్కరణలను ప్రపంచ రైతు కూటమి వ్యతిరేకిస్తోంది. బహుళ పక్ష వ్యవస్థ పరిధిలోకి ప్రస్తుతం ఉన్న 64 పంటలతోపాటు ఇతర మొక్కల జన్యు వనరులను చేర్చాలన్న ప్రతిపాదన ఉంది.ఇది జాతీయ విత్తన హక్కుల దోపిడీకి దారితీస్తుందని కూటమి ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మార్పులు రైతుల హక్కులను, విత్తనాలపై ఆయా దేశాల సార్వభౌమత్వాన్ని దెబ్బతీస్తాయని హెచ్చరించింది. ఒప్పందం పరిధిని విస్తరించే లక్ష్యంతో ఉన్న సంస్కరణలు బహుళజాతి విత్తన సంస్థలకు అనుకూలంగా కనిపిస్తున్నాయి. ఇవి తగిన రక్షణలు లేకుండా సాంప్రదాయ విత్తన రకాలను దోపిడీ చేయడానికి వీలు కల్పిస్తాయని కూటమి తెలిపింది.మన దేశంలోని రైతు సంఘాల జాతీయ కూటమి అయిన భారత్ బీజ్ స్వరాజ్ మంచ్, ప్రపంచవ్యాప్తంగా 280 కంటే ఎక్కువ సంస్థలు, 100 మంది వ్యక్తులతో కలిసి ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ డైరెక్టర్ జనరల్ క్యూ డోంగ్యు, విత్తన ఒడంబడిక కార్యదర్శి కెంట్ న్నాడోజీకి గత నెల 12న లేఖ రాశారు. చర్చల దశలో ఉన్న ప్రస్తుత చర్యల ముసాయిదాప్యాకేజీ రైతుల హక్కులను, విత్తనాలపై జాతీయ సార్వభౌమత్వానికి గొడ్డలిపెట్టు వంటిదని, అదే సమయంలో ఒప్పంద వ్యవస్థను బహుళజాతి విత్తన సంస్థలకు మరింత ఆకర్షణీయంగా మారుస్తుందని ఆ లేఖ హెచ్చరించింది.కొత్త ప్రతిపాదనలు ప్రపంచ కార్పొరేషన్లు తగిన రక్షణ చర్యలు లేకుండా భారతదేశ సాంప్రదాయ విత్తనాలను, వాటి జన్యు డేటాను దొరకబుచ్చుకోవటానికి వీలు కల్పించవచ్చని రైతులు ఆందోళనలు వ్యక్తం చేయడం ఇదే మొదటిసారి కాదు. గత మే 21న ఈ సంస్కరణల ప్రమాదాలను పౌర సమాజం ఎత్తి చూపింది. జూలై 7న రైతు సంఘాలు, దేశీ విత్తన సంరక్షకులు, పర్యావరణ న్యాయవాదులు ఉమ్మడి లేఖలో ఇదే హెచ్చరిక చేశారు. జూలై 10న శాస్త్రవేత్తల బృందం కేంద్ర వ్యవసాయ మంత్రికి లేఖ రాసింది. ఒప్పందం భారతదేశ విత్తన సార్వభౌమత్వానికి గండి కొట్టేలా ఉందని హెచ్చరించింది.ఈ విజ్ఞప్తిపై ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా, యూరప్, ఓషియానియా నుంచి రైతు సంఘాలు, పౌర సమాజ సంస్థలు సంతకం చేశాయి. సంతకాలలో ఆఫ్రికన్ సెంటర్ ఫర్ బయోడైవర్సిటీ (దక్షిణాఫ్రికా), అసోసియాసియన్ నేషనల్ డి ్రపొడక్టోర్స్ ఎకోలోజికోస్ డెల్ పెరూ (పెరూ), అన్నదాన సాయిల్ – సీడ్ సేవర్స్ నెట్వర్క్ (ఇండియా), థర్డ్ వరల్డ్ నెట్వర్క్ (మలేషియా) వంటి ప్రసిద్ధ సమూహాలు సంతకాలు చేశాయి.రైతులకు దక్కని ప్రయోజనాలుబహుపాక్షిక వ్యవస్థలోపారదర్శకత లేక΄ోవడంపై వారు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా 28,000 కంటే ఎక్కువ కార్పొరేట్ విత్తన సంస్థలు ఈ ఒప్పందం ప్రకారం 70 లక్షలకు పైగా విత్తన నమూనాలను ఉపయోగించుకున్నాయి. విత్తన కంపెనీలు ఈ వనరులతో అభివృద్ధి చేసిన కొత్త విత్తన రకాలపై మేధో సంపత్తి హక్కులను పొందాయి. అయితే, ఆ వనరులను అందించిన దేశాలకు లేదా రైతులకు ఎటువంటి ప్రయోజనాలు తిరిగి అందలేదని లేఖ ఎత్తి చూపింది. రక్షణ చర్యలు లేకుండా బహుపాక్షిక వ్యవస్థను విస్తరిస్తున్నారని కూడా వారు విమర్శించారు. ప్రస్తుత 64 పంటలకు తోడు మిగతా అన్ని మొక్కల జన్యు వనరులను చేర్చడానికి ఈ వ్యవస్థను విస్తరించాలన్నది ప్రతిపాదన. ఇప్పటికే ఉన్న ప్రయోజన భాగస్వామ్య విధానాలు బలహీనంగా ఉన్నందున ఈ ప్రతిపాదన మరింత దోపిడీకి ఆస్కారం కలిగిస్తుందని అంటున్నారు.రైతుల హక్కులకు రక్షణేదీ?రైతుల హక్కులను గుర్తించాలని లేఖ పిలుపునిచ్చింది. విత్తనాలను పండించిన పంట నుంచి తీసి దాచుకోవటం, ఉపయోగించడం, ఇతరులకు ఇచ్చి పుచ్చుకుంటూ మార్పిడి చేయడం, విక్రయించడం వంటి రైతుల హక్కులను రక్షించడంలో నవంబర్‌లో జరిగే సమావేశానికి ముందు విడుదలైన ముసాయిదా విఫలమైందని ఎఫ్ఏవో డైరెక్టర్ జనరల్‌కు రాసిన లేఖపై సంతకాలు చేసినవారు ఆరోపించారు. బయోపైరసీ లేదా సాంప్రదాయ విత్తన రకాల పేటెంట్ మోసాలను అరికట్టే రక్షణలు ఇందులో లేవు. తమ విత్తనాలను స్వాధీనం చేసుకుని కార్పొరేట్ నియంత్రిత వంగడాలుగా మార్చే కంపెనీలు, వాటిని తిరిగి తమకే విక్రయిస్తారని రైతులు భయపడుతున్నారు.ఎక్కువపారదర్శకత, జవాబుదారీతనం కావాలని రైతు సంఘాలు అడుగుతున్నాయి. అంతర్జాతీయ విత్తన ఒడంబడిక ఎవరు ఏ విత్తనాలను తీసుకుంటున్నారు? వాటిని ఎలా ఉపయోగిస్తున్నారు? అనే విషయాలను గుట్టుగా ఉంచకుండా, బహిరంగంగా వెల్లడించాలని కూడా డిమాండ్ చేస్తున్నాయి. విత్తన ఒడంబడికలో సంస్కరణలు చేసే ముందు ప్రపంచవ్యాప్తంగా రైతులతో సంప్రదింపులు జరపాలని పిలుపునిచ్చాయి.జాతీయ సార్వభౌమత్వాన్ని లేదా కంపెనీలు కొత్త వంగడాల తయారీ ద్వారా పొందే ప్రయోజనాలలో అందుకు ఉపయోగపడినపాత విత్తనాల జన్యువనరులపై హక్కుదారులైన రైతులకు సముచిత భాగం పంచే వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ఒక కొత్త ప్రక్రియను ప్రారంభించాలని రైతు సంఘాలు ప్రతిపాదించాయి. రైతుల జన్యు హక్కులకు బలమైన రక్షణలు కల్పించాలని, డిజిటల్ బయోపైరసీని నిరోధించడానికి చర్యలు తీసుకోవాలని కూడా వారు కోరుతున్నారు. – నిర్వహణ: పంతంగి రాంబాబు సాక్షి సాగుబడి డెస్క్ -
యువతకు ఆచరణాత్మక వ్యవసాయ శిక్షణ
సమీకృత ప్రకృతి వ్యవసాయాన్ని పూర్తి స్థాయి వృత్తిగా చేపట్టాలని భావించే యువతకు సరైన సమాచారంతో పాటు కొద్ది నెలల పాటు ఆచరణాత్మక శిక్షణ కూడా అవసరం. అటువంటి యువతకు ఆచరణాత్మక ప్రకృతి వ్యవసాయ జ్ఞానం అందించడానికి తెలంగాణలో రెండు సంస్థలు ఈ నెలలోనే ప్రత్యేక శిక్షణా శిబిరాలను ప్రారంభించనున్నాయి.సేంద్రియ పశుపోషణ, సమీకృత సేంద్రియ వ్యవసాయంలో 15 ఏళ్ల అనుభవం గల అక్షయకల్ప సంస్థ 3 నెలల ఉచిత ఫెలోషిప్ కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభించనుంది. యువకులను రైతు పారిశ్రామికవేత్తలుగా లేదా రైతు విస్తరణ నిపుణులుగా తీర్చిదిద్దటమే లక్ష్యంగా 19–27 ఏళ్ల మధ్య వయస్కులకు రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం ఈదులపల్లిలోని అక్షయకల్ప రీజనరేటివ్ వ్యవసాయ పరిశోధన–అభివృద్ధి కేంద్రంలో 3 నెలల రెసిడెన్షియల్ శిక్షణ ఇస్తారు. భోజన వసతులతో పాటు స్టైపెండ్ కూడా ఇస్తారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో 2,300 మంది ప్రకృతి/సేంద్రియ రైతులకు శిక్షణ ఇచ్చి, నెలకు రూ. 1.2 లక్షలకు పైగా సంపాదించేలా ప్రాక్టికల్‌గా మార్గదర్శనం చేశామని అక్షయకల్ప ప్రతినిధి డాక్టర్ తేజేశ్వర్ రెడ్డి తెలిపారు. 30 మందితో త్వరలో ఒక బ్యాచ్‌ను ప్రారంభించనున్నామన్నారు. ఇతర వివరాలకు.. 89043 96761, 91132 03476.చౌహన్ క్యు సేద్యంపై 12 నెలల శిక్షణదక్షిణ కొరియాకు చెందిన డా. చౌహన్ క్యు ప్రకృతి వ్యవసాయ పద్ధతిపై న్యూ లైఫ్ ఫౌండేషన్(హైదరాబాద్) 12 నెలల పాటు యువతకు ఉచిత ఆచరణాత్మక శిక్షణ ఇవ్వనుంది. శాశ్వత ఎత్తుమడులపై ఉద్యాన పంటలను సాగు చేస్తూ అత్యంత తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించటం ఎలాగో నేర్పిస్తామని ఫౌండేషన్ వ్యవస్థాపకుడు శివ సిందే తెలిపారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ సమీపంలోని క్షేత్రంలో ఉచిత భోజన వసతులతో 12 నెలల పాటు శిక్షణ ఇస్తామని, పూర్తి చేసిన వారికి ధ్రువపత్రం ఇస్తామని అన్నారు. వ్యవసాయ డిప్లొమా విద్యార్థులకు స్టైపెండ్ ఇస్తామన్నారు.కనీస చదువు: 10 తరగతి. కనీస వయసు: 18 ఏళ్లు. ఇతర వివరాలకు.. 98660 73174. -
ఆఫ్రికా నత్తల నియంత్రణ అంత సులువు కాదు!
ప్రకృతిలో పుట్టిన ప్రాంతం దాటి ఇతర ప్రాంతాలకు చేరినప్పుడు తామర తంపరగా పెరుగుతూ జీవవైవిధ్యానికి ముప్పుగా పరిణమించే జాతులను ఇన్వాసివ్ స్పెసీస్ (దురాక్రమణ జాతులు) అంటారు. మొక్కలు, జీవులు ఈ జాబితాలో ఉంటాయి. స్వతహాగా పుట్టి పెరిగే వాతావరణ పరిస్థితుల్లో అవి సమస్యగా ఉండవు. అక్కడి నుంచి ఏదో ఒక విధంగా వేరే వాతావరణ పరిస్థితులున్న దేశాల్లోకి ప్రవేశించినప్పుడు అవి తమ సంతతిని తామర తంపరగా పెంపొందించుకుంటూ సమస్యాత్మకంగా మారతాయి. స్థానికంగా పంటలను ఆరగించేస్తూ.. రైతులను తీవ్ర ఇక్కట్ల పాలు చేస్తుంటాయి. సర్కారు తుమ్మ, వయ్యారిభామ అలాంటివే. ఈ జాబితాలో తాజాగా చేరింది ‘జెయింట్ ఆఫ్రికన్ నత్త’. ఉత్తరాంధ్ర, కోస్తా ఆంధ్ర జిల్లాలతో పాటు తెలంగాణ రాష్ట్రంలోనూ కొన్ని చోట్ల కూరగాయలు, పండ్ల తోటల్లో కుప్పలు తెప్పలుగా ఆఫ్రికా నత్తలు తమ సంతతిని వృద్ధి చేసుకుంటూ పంటలను విధ్వంసకరంగా తినేస్తున్నాయి. దీంతో రైతులు తీవ్ర నష్టాల పాలవుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని కేంద్ర వ్యవసాయ శాఖకు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్ (ఎన్ఐపీహెచ్ఎం) శాస్త్రవేత్తలు డాక్టర్ పి.శక్తివేల్, డాక్టర్ ఎ. మరియదాస్, డాక్టర్ సి. ఆలిస్ ఆర్ పి సుజీత ఆఫ్రికా నత్తల బెడద నుంచి పంటలను, తోటలను కాపాడుకునే పద్ధతులను సూచిస్తున్నారు. ‘సాక్షి సాగుబడి’ కోసం వారు అందించిన వివరాలతో ప్రత్యేక కథనం.మన దేశంలో దాదాపు 1,500 రకాల నత్తలున్నాయి. వాటిలో తొమ్మిది జాతుల నత్తలు పూలు, కూరగాయలు, పండ్ల తోటలకు హాని కలిగిస్తున్నాయి. హెలిక్స్ అనే సాధారణ నత్త హిమాచల్‌ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, బిహార్, మహారాష్ట్ర, ఒడిశా వంటి రాష్ట్రాల్లో కనిపిస్తుంటుంది. అచటినా ఫులికా అనే జెయింట్ ఆఫ్రికన్ నత్త కూడా ఇప్పుడు తోడైంది. ఇది ఇప్పటికే మన దేశంలోని అనేక రాష్ట్రాలకు వ్యాపించింది. ఒడిశా, పశ్చిమ బెంగాల్, అస్సాం, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతాలతో పాటు తెలంగాణలోనూ కొన్ని చోట్ల పండ్ల తోటలు, కూరగాయ తోటల్లో తామర తంపరగా విస్తరిస్తూ పెద్ద సమస్యగా మారింది. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (ఐయూసీఎన్) దీన్ని ‘అత్యంత దురాక్రమణ గుణం కలిగిన వంద జాతు’ల్లో ఒకటిగా గుర్తించింది. నత్తల సమగ్ర నిర్వహణ మార్గాలివి:→ తోటను శుభ్రంగా ఉంచండి. కలుపు మొక్కలను తొలగించండి. నత్తలు లోపలికి రాకుండా తోట చుట్టూ మొక్కల్లేకుండా ఖాళీగా ఉంచండి. → తోటలు/పొలాల్లోకి నత్తలు రాకుండా ఉండాలంటే చుట్టూతా ఉప్పు, సున్నపు పొడి లేదా కాపర్ సల్ఫేట్ చల్లితే చాలు. ఈ పదార్థాలను దాటి నత్తలు వెళ్లలేవు. → ఉప్పు నత్తలను నిర్జలీకరణం చేసి, చంపుతుంది. కాపర్ సల్ఫేట్ విషపూరితమైన రసాయనం కాబట్టి అవరోధంగా పనిచేస్తుంది. వీటిని చల్లిన ప్రాంతాల్లో నత్తల సంఖ్య వేగంగా తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. నత్తలు తోటల్లోకి ప్రవేశించకుండా లేదా మొక్కల కాండాలపైకి పాకకుండా నిరోధించడానికి నమ్మదగిన పద్ధతి ఇది. → ప్లాస్టిక్ పాత్రలో కొద్దిగా బీరు, వైన్ లేదా ఈస్ట్‌లను పోసి.. ఆ పాత్ర అంచు నేలతో సమానంగా ఉండేలా, పాతిపెట్టాలి. నత్తలు పాక్కుంటూ వచ్చి అందులో పడతాయి. అప్పుడు ఉప్పు వేస్తే, చనిపోతాయి. → నత్తలను ఆకర్షించడానికి కుండలు, బాక్సులు లేదా తడి సంచుల కింద నత్తలు లోపలికి వెళ్లే అంత ఖాళీ ఉండేలా రాళ్లు అమర్చి, వాటి లోపల క్యాబేజీ ఆకులు లేదా బొప్పాయి కాండాలను ఎరగా పెట్టి, రాత్రంతా అలా ఉంచాలి. ఉదయానికి నత్తలు వాటి కింద చేరతాయి. వాటిపై ఉప్పు చల్లితే చనిపోతాయి. లేదా వాటిని నలిపివేసి చంపండి. → పండ్ల చెట్లు, కూరగాయ మొక్కల కాండాలకు ఎగబాకకుండా ఉండాలంటే.. వాటి చుట్టూ ఒక వలయంలో కొద్దిగా సూపర్ ఫాస్ఫేట్ ఎరువును చల్లండి. → నత్తలు మొక్కలు, చెట్ల పైకి ఎక్కకుండా ఆపటానికి చెట్ల కాండాలకు సన్నని రాగి లేదా జింక్ రేకు (సుమారు 0.8 మిమీ మందం) చుట్టండి. → నత్తలున్న తోటల్లో 3 శాతం కాపర్ సల్ఫేట్ ద్రావణం (అంటే.. 400 లీటర్ల నీటిలో 12 కిలోల కాపర్ సల్ఫేట్ కలిపి హెక్టారుకు) పిచికారీ చేయండి. → కంచెలు/ప్రహరీలు, నత్తలు గుడ్లు పెట్టిన ప్రాంతాల్లో ఒక లీటరు నీటిలో కాపర్ సల్ఫేట్ (60 గ్రా.), పొగాకు(25 గ్రా.) రసం కలిపి పిచికారీ చేయడం ద్వారా కూడా నత్తల ముప్పును నియంత్రించవచ్చు. → పొగాకు మిశ్రమాన్ని తయారు చేసే పద్ధతి: 50 గ్రాముల పొగాకును 1.5 లీటర్ల నీటిలో వేసి మరిగించండి. ద్రావణం 1 లీటరుకు తగ్గే వరకు మరిగించండి. అందులో, 1 లీటరు నీటిలో 60 గ్రాముల కాపర్ సల్ఫేట్ కలిపిన ద్రావణాన్ని కలపండి. ఆ ద్రావణాన్ని నత్తలున్న చోట పిచికారీ చేయండి. → ప్రభుత్వం ప్రచారోద్యమం చేపట్టి సమగ్ర చర్యల ద్వారా నత్తల సమస్యను నియంత్రించవచ్చు. మొక్కలు/చెట్లపై ఉండే నత్తలను ప్రజల సహకారంతో చేతులతో తీసివేయించటం, బాతులతో నత్తలను తినిపించటం వంటి పటిష్టమైన చర్యలు తీసుకుంటే ఆఫ్రికా నత్తల సంతతి వ్యాప్తిని నియంత్రించడానికి అవకాశం ఉంది.నత్తలన్నీ గుడ్లు పెడతాయి!జెయింట్ ఆఫ్రికన్ జాతికి చెందిన నత్తలన్నిటిలో మగ, ఆడ జననాంగాలుంటాయి. కాబట్టి ఆడ, మగ కూడా గుడ్లు పెడతాయి. సాధారణంగా శరద్ రుతువు, శీతాకాలంలో వాతావరణం తేమగా ఉన్నప్పుడు జతకూడి తడి నేలలో గుండ్రని తెల్ల గుడ్లు పెడతాయి. తడి వాతావరణంలో గుడ్లు రెండు నుంచి నాలుగు వారాల్లో పిల్లలు పుడతాయి. పిల్ల నత్తలు ఒక సంవత్సరం తర్వాత గుడ్లు పెట్టటం ప్రారంభిస్తాయి. నత్త మూడు నుంచి ఐదేళ్లు జీవిస్తుంది. జెయింట్ ఆఫ్రికన్ నత్త సంవత్సరానికి ఒకసారి 50–200 గుడ్లు పెడుతుంది. దాని జీవితకాలంలో వెయ్యి వరకు గుడ్లు పెడుతుంది.నత్తల ద్రావణంతో పంటలకు మేలు!నత్తలు పంటలకు నష్టదాయకంగా పరిణమిస్తున్న నేపథ్యంలో ఈ నత్తలతో పంటల పెరుగుదలను వేగవంతం చేసే ద్రావణం(గ్రోత్ పమోటర్) తయారు చేసుకొని పంటలపై పిచికారీ చేయటం ద్వారా రైతులు ప్రయోజనం పొందవచ్చని కాకినాడ జిల్లా ప్రకృతి వ్యవసాయ శాఖ ప్రాజెక్ట్ మేనేజర్ తాతారావు ‘సాక్షి సాగుబడి’కి తెలిపారు. నత్తల ద్రావణం తయారు చేసే పద్ధతి: అవసరం ఉన్నన్ని నత్తలను ఒక డ్రమ్ములో వేసుకొని, అవి మునిగిన తర్వాత 2 అంగుళాల పై వరకు నిమ్మరసం పొయ్యాలి. 15 రోజులు ఊరబెట్టాలి. అప్పటికి నత్తలు కోడిగుడ్ల మాదిరిగానే పూర్తిగా ద్రావణంలో కరిగిపోతాయి. వడగట్టిన ద్రావణానికి సమాన తూకంలో బెల్లం కలిని 7 రోజులు వూరబెట్టండి. నత్తల ద్రావణం అర లీటరును 100 లీటర్ల నీటిలో కలిపి ఒక ఎకరంలో ఏ పంటల కైనా పిచికారీ చెయ్యొచ్చు. నత్తల సమస్య తీరిపోతుంది. పంట బలంగా పెరిగి రైతుకు డబ్బులు వస్తాయని ఆయన సూచించారు. -
మిరాకిల్ మునగ: కరువును తట్టుకుంటుంది..లాభాల సిరి!
కరువు వంటి ప్రతికూల వాతావరణాన్ని తట్టుకోవటానికి మునగ సాగు దోహద పడుతుంది. మెట్ట ప్రాంతాల్లో పండించుకోవచ్చు. మునగ కాయలతో పాటు ఆకుల పొడి, గింజల ద్వారా అదనపు ఆదాయం సమకూర్చుకోవచ్చు. గొప్ప రోగ నిరోధక, ఔషధ లక్షణాల కారణంగా మునగ ఉత్పత్తులకు ఔషధ పరిశ్రమలో అధిక డిమాండ్ ఉంది. మునగ ఆకును పొడి రూపంలో లేదా గుళికలు లేదా మాత్రలుగా విక్రయిస్తారు. దీని గింజల నుండి తీసిన నూనెలను ఆహార పదార్థాలు, సౌందర్య సాధనాల తయారీకి, వివిధ యంత్ర నూనెల తయారీకి ఉపయోగిస్తారు. 3 సంవత్సరాలలోపు ఆయిల్΄ామ్ తోటల్లో అంతర పంటగా కూడా మునగను సాగు చేసుకోవచ్చు. తిరుపతి జిల్లాలోని రాస్ కృషి విజ్ఞాన కేంద్రం అధిపతి, సీనియర్ శాస్త్రవేత్త డా. ఎస్. శ్రీనివాసులు మునగ సాగుపై అందించిన వివరాలు...మునగ (మోరింగ ఒలిఫెరా-Moringa oleifera) కరువును తట్టుకునే చెట్టు. మునగ కాయలు, ఆకులు, పువ్వులకు అధిక పోషక విలువలకు నిలయం . మునగ ఆకులు, గింజలు లేదా పండ్లు, పువ్వులు, వేర్లలో విటమిన్లు ఎ, సి, కాల్షియంతో పాటు మానవ ఆరోగ్యానికి ముఖ్యమైన అన్ని ఇతర ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. మునగ ఆకుల్లో నారింజలో లభించే విటమిన్ సి కంటే 7 రెట్లు ఎక్కువ,పాలలో లభించే కాల్షియం కంటే 4 రెట్లు, అరటి పండ్లలో లభించే ΄÷టాషియం కంటే 3 రెట్లుపాలలో లభించే ప్రోటీన్ కంటే 2 రెట్లు ఎక్కువ. నీరు నిలవని నేలలు అనుకూలం మునగ వేడి, ఉష్ణ మండల, సమశీతోష్ణ మండల ్ర΄ాంతాల్లో బాగా పెరుగుతుంది. 25–30 డిగ్రీల ఉష్ణోగ్రత మునగ పూత రావడానికి అనుకూలం. వేడి, ΄÷డి వాతావరణం దీనికి బాగా సరి΄ోతుంది. ఈ పంట వివిధ రకాల నేలలకు అనుగుణంగా ఉంటుంది. కానీ 6.5–8.0 పీహెచ్ కలిగిన, బాగా ఇసుక గల ఒండ్రు నేలల్లో మంచి పంటనిస్తుంది. నీరు నిలవని తేలికపాటి ఇసుక లేదా లోతైన ఒండ్రు నేలలు అనుకూలం. నీరు బాగా ఇంకే నేలలు అనుకూలం. నేలను చాలాసార్లు బాగా దున్నాలి. వార్షిక రకాలకు 45“45“45 సెం.మీ. కొలతలు గల గుంతలు తవ్వాలి. ప్రతి గుంతకు 10 కిలోల కంపోస్ట్ లేదా పశువుల ఎరువు వేసి, నాటడానికి ముందు పై మట్టితో కలిపి నింపుకోవాలి. హెక్టారు భూమికి దాదాపు 1200–1500 మొక్కలను పెంచవచ్చు. వర్షాకాలంలో మొక్కలు నాటాలి. విత్తడానికి ఇది సరైన సమయం.మన దేశంలో అనేక మునగ రకాలు ఉన్నాయి. చాలా రకాలు కాయల ఉత్పత్తికి అనుకూలంగా ఉంటాయి, కొన్ని కొన్ని మాత్రమే మంచి ఆకు ఉత్పత్తిని ఇస్తాయి. అధిక దిగుబడినిచ్చే వార్షిక రకాలు వాణిజ్య సాగు ఎంపిక అనుకూలం. మునగ మొక్కలను విత్తనాలు లేదా కాండపు కత్తిరింపుల ద్వారా ప్రవర్ధనం చేయవచ్చు. ఏక వార్షిక రకాలను విత్తన ప్రవర్ధనం చేయటం వలన బలమైన వేర్ల వ్యవస్థ అభివృద్ధి చెంది, మొక్కలు కరువును బాగా తట్టుకుంటాయి. అధిక దిగుబడినిచ్చే రకాలను ఎంపిక చేసుకోవాలి. నాణ్యమైన విత్తనం కోసం విశ్వసనీయ నర్సరీలను (లేదా) వ్యవసాయ పరిశోధనా కేంద్రాలను సంప్రదించాలి. రాస్ – కేవీకే 2013–14 నుంచి అరెకరంలో అధిక సాంద్రత పద్ధతిలో సాగు చేస్తున్న మునగ తోటలో విత్తనోత్పత్తి చేస్తోంది. రైతులకు మునగ విత్తనాలు, నారును అందిస్తోంది.రకాన్ని బట్టి నాటే దూరంజూలై–అక్టోబర్ మధ్య నాటవచ్చు. పూత సమయంలో వర్షాలు లేకుండా విత్తే సమయం నిర్ణయించుకోవాలి. హెక్టారుకు సుమారు 500–625 గ్రా. విత్తనాలు అవసరం. విత్తనాలను 2.5–3 సెం.మీ. లోతులో విత్తవచ్చు. మొక్కలు బాగా నిలదొక్కుకోవడం కోసం, నాటడానికి ముందు 35–40 రోజులు పాలీబ్యాగ్లలో 70–90 సెం.మీ. ఎత్తుకు పెంచి తర్వాత ప్రధాన పొలంలో నాటుకోవాలి. సాగుదారులు ఎకరానికి 1000–1250 విత్తనాలను ఒక గుంతలో 2 విత్తనాల చొప్పున ఉపయోగించవచ్చు. రకం, సాగు పద్ధతిని బట్టి నాటే దూరం మారుతూ ఉంటుంది. ఏక వార్షిక రకాల మొక్కలను 2.5“2.5 మీ. దూరంలో నాటవచ్చు. పి.కె.ఎం–1 వంటి రకం 1.5“1.0 మీ. దూరంతో అధిక సాంద్రత పద్ధతిలో నాటవచ్చు. బహువార్షిక రకాల మొక్కలను 6“6 మీటర్ల దూరంలో నాటుకోవాలి.రెండు నెలలు విధిగా నీరుముఖ్యంగా పొడి పరిస్థితులలో మొదటి రెండు నెలలు క్రమం తప్పకుండా నీరు పెట్టాలి. మునగ చెట్లు కరువును తట్టుకుంటాయి, కానీ, పొడి కాలంలో ప్రతి 10–15 రోజులకు నీరు పెట్టడం వల్ల ప్రయోజనం ఉంటుంది. బిందు సేద్యం దిగుబడిని గణనీయంగా పెంచుతుంది. పూత రాలిపోకుండా ఉండాలంటే ఫిబ్రవరి–మార్చి నెలల్లో నీటిని తగ్గించాలి. కానీ, నీటి ఎద్దడిని నివారించడానికి తగినంత తేమను వుండేలా చూడాలి.ఇదీ చదవండి: Black Thrips నల్ల తామర డిజిటల్ అరెస్ట్!కొమ్మ చివర్లను తుంచాలిమునగ మొక్కలు 75 సెం.మీ. ఎత్తు ఉన్నప్పుడు పెరుగుతున్న చివర్లను తుంచి వేయాలి. తద్వారా పక్క కొమ్మలు పెరుగుతాయి. ఆ పక్క కొమ్మలు 40–60 సెం.మీ పొడవుకు చేరుకున్నప్పుడు, వాటి పైభాగాన్ని తుంచి వేయాలి. ఇలా చేయడం వల్ల మొక్కలు ఎక్కువ కొమ్మలతో గుబురుగా పెరుగుతాయి. ఎక్కువ కాయలతో దిగుబడి పెరుగుతుంది. బహువార్షిక రకాల్లో ప్రతి పంట తర్వాత కొమ్మలను కత్తిరించడం వలన కొత్త కొమ్మలు వచ్చి దిగుబడి పెరుగుతుంది. ఏక వార్షిక రకాల మొదటి పంట తర్వాత, కొత్త పంటను ప్రోత్సహించడానికి చెట్లను నేల నుండి ఒక మీటరు వరకు కత్తిరించాలి. ముఖ్యంగా మొక్కలు పెరిగే ్ర΄ారంభ దశల్లో క్రమం తప్పకుండా కలుపు తీయటం చాలా అవసరం. మొక్కలు పూర్తి స్థాయిలో పెరిగి దిగుబడినిచ్చే వరకు, తక్కువ కాలవ్యవధి గల కూరగాయలతో అంతర పంటలు వేయడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ పద్ధతి కలుపు మొక్కల నియంత్రణలో కూడా సహాయపడుతుంది. (మిల్లెట్స్ స్నాక్స్ ..మఖానా.. మజాకా!)సస్యరక్షణ కాయ తొలిచే పురుగు లేత కాయలపై గుడ్లు పెట్టి కుళ్ళిపోయేలా చేస్తుంది. కాయలను తొలచి లోపలి గుజ్జును తినేస్తుంది. గొంగళి పురుగుల వల్ల పూత, మొగ్గలు ముందుగానే రాలిపోతాయి. సోకిన మొగ్గలను సేకరించి నాశనం చేయాలి. గొంగళి పురుగు లార్వా ఆకులను గుంపుగా తిని ఆకులు రాల్చుతాయి. బెరడు తొలచే పురుగు కాండం బెరడును తొలచి మొక్కను బలహీనపరుస్తుంది. ఆకు తినే పురుగు లార్వా మొక్కల ఆకులను తిని వాటి పెరుగుదలకు హాని కలిగిస్తుంది. తామర పురుగుల వల్ల కాయల మీద మచ్చలు ఏర్పడి నాణ్యత తగ్గుతుంది. వేరు, కాండం కుళ్లు వర్షాకాలంలో మురుగు నీరు ΄ోయే సౌకర్యం లేని నేలలో ఎక్కువగా ఆశిస్తుంది. వీటి నిర్వహణకు శాస్త్రవేత్తల సూచనల ప్రకారం పురుగుమందులను వాడాలి. రకం, నిర్వహణను బట్టి దిగుబడి సాధారణంగా మొక్కలు నాటిన 6–8 నెలల్లో మొదటి పంటను పొందవచ్చు. మొక్కలకు బదులు నేరుగా విత్తనాలు వేసుకుంటే తొలి పంటకు ఒక సంవత్సరం పడుతుంది. సంవత్సరానికి రెండుసార్లు రెండు పంటలు (జూలై–సెప్టెంబర్) మరియు (మార్చి–ఏప్రిల్) వస్తాయి ప్రారంభంలో మొదటి రెండు సంవత్సరాలలో, మొక్కలు 250–300 కాయలను దిగుబడినివ్వ గలవు. తర్వాత సంవత్సరాలలో 500 వరకు పెరుగుతుంది. సంవత్సరానికి హెక్టారుకు 31 టన్నుల కాయలను ఉత్పత్తి చేయవచ్చు. అనేక హైబ్రిడ్ జాతులు సంవత్సరానికి ఒక మొక్కకు 800–1000 కాయల దిగుబడిని అందించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. రకం, నిర్వహణ ఆధారంగా దిగుబడి గణనీయంగా మారుతుంది. వార్షిక రకాలు హెక్టారుకు 50–55 టన్నులను ఉత్పత్తి చేయగలవు. – డా. ఎస్. శ్రీనివాసులు (79810 70420),సీనియర్ సైంటిస్ట్–హెడ్, రాస్ కృషి విజ్ఞాన కేంద్రంతిరుపతి. rasskvk@gmail.comనిర్వహణ: పంతంగి రాంబాబుసాక్షి సాగుబడి డెస్క్ -
నల్ల తామర డిజిటల్ అరెస్ట్!
మిరప పంటకు నల్ల తామర పురుగుల బెడద చాలా ఎక్కువ. మిరపతోపాటు, పత్తి, మిర్చి, కంది,మినుములు, మామిడి, పుచ్చకాయ, తదితర పంటలను దెబ్బతీస్తుంది. అతి చిన్నగా ఉండే నల్ల తామర రైతులను విపరీతంగా నష్టాల ఇవీ డిజిటల్ సాధనాలు పాలు చేస్తోంది. అయితే,ఆధునిక డిజిటల్ ఉపకరణాల సహాయంతో రైతులకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ మిరప పంటను ఆశించే తామర పురుగును జీవన పురుగు మందులతో కట్టడి చేసే పద్ధతులపై యూనివర్సిటీలు, స్వచ్ఛంద సంస్థల నిపుణులు ప్రచారోద్యమం చేపట్టారు. విశేషం ఏమిటంటే... డిజిటల్ సమాచారం అంతా తెలుగులోనే అందించటం. సుస్థిర వ్యవసాయ కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డా. జి. చంద్రశేఖర్ అందించిన సమగ్ర సమాచారం ఇక్కడ పొందుపరుస్తున్నాం...మరప ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొదటి స్థానంలో.. తెలంగాణ, మధ్యప్రదేశ్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. గుంటూరు మిర్చి యార్డ్ ఆసియాలోనే అతిపెద్ద మిర్చి మార్కెట్. ఇది దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో మిర్చి ధరలను ప్రభావితం చేస్తుంది. 2021లో ఆంధ్రప్రదేశ్‌లో మిరప పంటను తీవ్రంగా నష్టపరిచే కొత్త నల్ల తామర (బ్లాక్ త్రిప్స్-Black Thrips) జాతి పురుగులు వెలుగులోకి వచ్చాయి. దీని శాస్త్రీయనామం ‘త్రిప్స్ పార్విస్పినస్. దీన్ని సాధారణంగా ‘చిల్లీ బ్లాక్ త్రిప్స్’ అని పిలుస్తారు. అతి తక్కువ సంవత్సరాల్లోనే దక్షిణ భారతదేశంలోని ఇతర రాష్ట్రాలకు ఇది విస్తరించింది. ఆగ్నేయాసియా నుంచి ఉద్భవించిన చీల్చి రసం పీల్చే పురుగు ఇది. 2015 నాటికి అనేక రాష్ట్రాలకు పాకింది. ఈ పురుగులు కణజాలాలను తినే ముందు లేత ఆకులు, పువ్వులను చీల్చివేస్తాయి. ముఖ్యంగా పువ్వు చీలికలు, పండ్ల నిర్మాణాన్ని దెబ్బతీస్తాయి. విషయానికి వస్తే, ఇది పాలిఫాగస్ పురుగు. అంటే, ఇది వివిధ రకాల వృక్ష జాతులను ఆహారంగా తీసుకోగలదు. మిరపతో పాటు, పత్తి, మిర్చి, కంది, మినుములు, మామిడి, పుచ్చకాయ, తదితర పంటలను దెబ్బతీస్తుంది.పంట నష్టం 85 నుంచి 100 వరకు!2022లో ఆరు దక్షిణాది రాష్ట్రాల్లో మిరప పంటను గణనీయంగా దెబ్బతీసింది. తీవ్రంగా ప్రభావితమైన ్ర΄ాంతాల్లో అంచనా నష్టాలు 85 నుండి 100% వరకు ఉన్నాయి. ఊహించని విధంగా నష్టాన్ని కలిగిస్తున్న కారణంగా రైతులు తమ పంటలను రక్షించుకోవడానికి రసాయన పురుగుమందులను ప్రయోగించడం తప్ప వేరే మార్గం లేకుండా పోయింది. ఇది ఖర్చుతో కూడుకున్నదే కాకుండా, తదనంతరం నిరుపయోగంగా మారింది. అదనంగా, నల్లతామర ఆశించిన మిరప కాయలకు మార్కెట్లో తక్కువ ధరలు రావటంతో చాలా మంది రైతులు నష్టాల పాలవుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని అంతర్జాతీయంగా ప్రసిద్ధి గాంచిన సెంటర్ ఫర్ అగ్రికల్చర్ అండ్ బయోసైన్సెస్ ఇంటర్నేషనల్ (సీఏబీఐ) అనే సంస్థ హైదరాబాద్‌లోని సుస్థిర వ్యవసాయ కేంద్రంతో కలిసి తెలంగాణలో మిరపని ఆశించే నల్ల తామర పురుగులపై సీఏబీఐ డిజిటల్ టూల్స్ ఉపయోగించడం ద్వారా మిరపలో నల్ల తామర పురుగును నివారించడానికి ఒక ప్రచారోద్యమం మొదలు పెట్టింది. జయశంకర్ భూమిరప పంటకు నల్ల తామర పురుగుల బెడదచాలా ఎక్కువ. మిరపతోపాటు, పత్తి, మిర్చి, కంది,మినుములు, మామిడి, పుచ్చకాయ, తదితర పంటలను దెబ్బతీస్తుంది. అతి చిన్నగా ఉండే నల్ల తామర రైతులను విపరీతంగా నష్టాల ఇవీ డిజిటల్ సాధనాలు పాలు చేస్తోంది. అయితే,ఆధునిక డిజిటల్ ఉపకరణాల సహాయంతో రైతులకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ మిరప పంటను ఆశించే తామర పురుగును జీవన పురుగు మందులతో కట్టడి చేసే పద్ధతులపై యూనివర్సిటీలు, స్వచ్ఛంద సంస్థల నిపుణులు ప్రచారోద్యమం చేపట్టారు. విశేషం ఏమిటంటే... డిజిటల్ సమాచారం అంతా తెలుగులోనే అందించటం. సుస్థిర వ్యవసాయ కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డా. జి. చంద్రశేఖర్ అందించిన సమగ్ర సమాచారం ఇక్కడ పొందుపరుస్తున్నాం...లపల్లి, జోగుళాంబ గద్వాల్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో మిరప పండించే కొన్ని గ్రామాలను ఎంపిక చేసుకొని వేలాది మంది రైతులకు సేవలందించే లక్ష్యంతో ఈ ఖరీఫ్ కాలంలో ప్రచారోద్యమం జరుగుతోంది. దీనిలో భాగంగా జులై 9న హైదరాబాద్ హబ్సిగుడాలో మిరప పంట పండిస్తున్న రైతులు, శాస్త్రవేత్తలు, రైతు ఉత్పత్తి దారుల సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, స్పైసెస్ బోర్డు ప్రతినిధి, అపెడా ప్రతినిధి, నాబార్డ్ ప్రతినిధి, శ్రీకొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వ విద్యాలయం ప్రతినిధి, యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్– రాయచూరు ప్రతినిధి, డి డి ఎస్ కృషి విజ్ఞాన కేంద్రం– జహీరాబాద్ ప్రతినిధి, బయో పెస్టిసైడ్స్ తాయారీదారులు, ్ర΄÷ఫెసర్ జయశంకర్ తెలంగాణా విశ్వవిద్యాలయ బయో కంట్రోల్ యూనిట్ ప్రతినిధి, సీఏబీఐ ప్రతినిధులతో వర్క్‌షాప్ జరిగింది. గత సంవత్సరం రాయచూరులోని యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ శాస్త్రవేత్తలు గత సంవత్సరం మిరపలో నల్లతామరపై తాము నిర్వహించిన ప్రచారోద్యమంతో రైతులకు కలిగిన ప్రయోజనాలను వివరించారు. ఉద్యానవనశాఖ నిర్దేశకులు బాబు మాట్లాడుతూ నల్లతామరను నివారించే మార్గాలు వివరించారు. ఈ క్యాంపెయిన్‌కు ఉద్యాన శాఖ సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు.ప్రచారోద్యమం ఈ క్యాంపెయిన్ ద్వారా 1000 ఎకరాలలో మిర్చి పండించే 2000 మంది రైతులు ఈ పద్ధతులకు సలహాలు అందిస్తున్నారు. రైతుల ప్రదర్శన క్షేత్రాలను చూసే మిగతా రైతులు కూడా ఈ పద్ధతులు ΄ాటించే అవకాశం ఉంటుంది. అలాగే ΄ోస్టర్స్, మీడియా ద్వారా ఎక్కువ మందికి ఈ క్యాంపెయిన్ ద్వారా చైతన్యం కలిగిస్తున్నారు. చదవండి: సెంటర్‌స్టోన్ డైమండ్‌రింగ్, లగ్జరీ గౌనులో ఇషా అంబానీ : ధర ఎంతో తెలుసా?పంటలకు మేలు చేసేవి కూడా..!తామర పురుగులు (త్రిప్స్) రెక్కలు కలిగిన చిన్న కీటకాలు. తామర పురుగులలో అనేక జాతులు ఉన్నాయి. నల్ల తామర పురుగులు ఉల్లి, టమోటో, స్ట్రాబెర్రీ, ద్రాక్ష సహా వివిధ పంటలకు గణనీయమైన నష్టాన్ని కలిగిస్తాయి. మరికొన్ని త్రిప్స్ జాతులు ఇతర పురుగులను తినటం ద్వారా వ్యవసాయానికి ప్రయోజనం చేకూరుస్తాయి కూడా! తామర పురుగులు మొక్కల బయటి పొరను చీల్చుకుని అందులోని పదార్థాలను తినడం ద్వారా మొక్కలను దెబ్బతీస్తాయి. త్రిప్స్ జాతులు చూడటానికి భిన్నంగా ఉంటాయి. జాతిని బట్టి, జీవిత దశను బట్టి ఇవి వివిధ రంగుల్లో లభిస్తాయి. పిల్ల పురుగు(లార్వా)లు సాధారణంగా పారదర్శకంగా, పెద్దవాటి కంటే చిన్నవిగా ఉంటాయి. చాలావరకు పెద్ద తామర పురుగులు పొడవాటి, సన్నని రెక్కలతో, అంచులలో చిన్న వెంట్రుకలను కలిగి ఉంటాయి. గుడ్లు సాధారణంగా పొడుగ్గా ఉంటాయి. మూత్రపిండాల ఆకారంలో కనిపిస్తాయి. ఉష్ణమండలంలో నివసించే త్రిప్ జాతులు సాధారణంగా సమశీతోష్ణ వాతావరణంలో కంటే పెద్దవిగా పెరుగుతాయి. జాతిని, వాతావరణ అనుకూలతను బట్టి తామర పురుగులు వేగంగా సంతానోత్పత్తి చెయ్యగలవు. సంవత్సరానికి ఎనిమిది తరాల వరకు వీటి సంతతి పెరుగుతుంది. ఆడ త్రిప్స్ అతిథేయ (హోస్ట్) మొక్కల ఆకులపై గుడ్లు పెడతాయి. లార్వా పొదిగిన తర్వాత ఆహారం తీసుకోవడం ప్రారంభిస్తుంది. లార్వా పెద్దది పురుగు కావడానికి నాలుగు దశల్లో పురోగమిస్తుంది. వెచ్చని వాతావరణంలో యుక్త వయస్సు వరకు పురోగతి వేగంగా ఉంటుంది. శీతాకాలంలో వీటి సంఖ్య సాధారణంగా తగ్గుతుంది. మొక్కల లోపల ద్రవాలను పీల్చుకోడానికి లోపలికి చొచ్చుకుపోతాయి. పండ్లు, ఆకులు, రెమ్మలను ఆశిస్తాయి. త్రిప్స్ పెద్ద మొత్తంలో పంటని ఆశించినప్పుడు, పంట పెరుగుదల, దిగుబడి తగ్గి΄ోతుంది. ఇవి చాలా పెద్ద చెట్ల జాతులపై కూడా దాడి చేయగలవు. ఐతే సాధారణంగా పండ్లు, కూరగాయల చెట్లు వీటి తాకిడికి తట్టుకోలేవు. పెద్ద చెట్లు కొంత వరకు తట్టుకుంటాయి. తామరపురుగులు వేరుశనగలో మొవ్వు కుళ్ళు (బడ్ నెక్రోసిస్), టొమాటో–స్పాటెడ్ విల్ట్ కలిగించే వైరస్‌లను వ్యాపింపజేస్తాయి.ఇదీ చదవండి: పారిస్ ఫ్యాషన్ వీక్ : ఐశ్వర్యా డాజ్లింగ్ లుక్ వెనుకున్న సీక్రెట్ ఇదే!నల్లతామర యాజమాన్య పద్ధతులు:తామర పురుగులు నేలపై పడ్డ వ్యర్ధపదార్ధాల్లో జీవిస్తూ పంటలను ఆశిస్తుంటాయి. కాబట్టి పంట వ్యర్ధాలను ఎప్పటికప్పుడు తీసేయడం మంచిది. సూర్యకాంతి పరావర్తనం చెందే మల్చింగ్ షీట్లను బెడ్స్ మీద వాడటం ఉపయోగకరం.నీలం రంగు జిగురు అట్టలను ఏకరానికి 20 వరకు ఏర్పాటు చేసుకోవాలి. ఇవి పురుగులతో నిండగానే ఎప్పటికప్పుడు మార్చుకోవాలి. సహజ శత్రువులైన అల్లిక రెక్కల పురుగు(లేస్ వింగ్ బగ్స్)లు, అతిచిన్న పైరేట్ బగ్స్, పరాన్న భుక్కు నల్లులు (ప్రిడేటరీ మైట్స్)ను రక్షించుకోవడం అవసరం.వేప నూనె 3% తామర పురుగులకు వికర్షణను కలిగిస్తుంది. పునరుత్పత్తి చక్రాలకు అంతరాయం కలిగిస్తుంది. బ్యువేరియా బ్యాసియానా, మెటార్హిజియం అనిసోప్లియె అనే శిలీంద్రాలు తామరపురుగులకు రోగాన్ని కలుగజేయటం ద్వారా పంటలను రక్షిస్తాయి. ఇవి బజారులో దొరుకుతున్నాయి.మొబైలు ఫోన్ ద్వారా సమాచారంఈ డిజిటల్ యుగంలో అనేక సంస్థలు డిజిటల్ సలహాలను, సమాచారాన్ని రైతులకు చేరవేస్తున్నాయి. వీటివల్ల రైతులకు సరైన సలహాలు సరైన సమయంలో మొబైల్ ఫోన్ ద్వారా అందుబాటులో ఉండటం వల్ల తన దైనందిన కార్యక్రమాలకు అంతరాయం లేకుండా రైతు సమాచారాన్ని పొందుతున్నారు. ఇటువంటి డిజిటల్ సాధనాల్లో అంతర్జాతీయంగా ప్రసిద్ధి గాంచిన సెంటర్ ఫర్ అగ్రికల్చర్ అండ్ బయోసైన్సెస్ ఇంటర్నేషనల్ (సీఏబీఐ) అందుబాటులోకి తెచ్చిన డిజిటల్ సాధనాలు 27 దేశాలలో సేవలు అందిస్తున్నాయి. సీఏబీఐ అంతర్జాతీయ లాభాపేక్ష లేని, వంద సంవత్సరాలకు పైగా చీడపీడల యాజమాన్యంలో అనుభవమున్న సంస్థ. ఈ డిజిటల్ సాధనాలు మనదేశంలో కూడా అందుబాటులో ఉన్నాయి. ఇది హైదరాబాద్ లో గల సుస్థిర వ్యవసాయ కేంద్రంతోపాటు అనేక వ్యవసాయ విశ్వ విద్యాలయాలు, స్వచ్ఛంద సంస్థలు, కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా ఈ జ్ఞానాన్ని రైతులకు అందిస్తున్నారు. ఈ డిజిటల్ సాధనాలను రైతులు ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. విజ్ఞాన పరంగా పరీక్షించి, నిరూపించబడిన, బజారులో లభ్యమౌతున్న ఉత్పత్తుల వివరాలు లభ్యమౌతాయి. ఇతర వివరాలకు... www.cabi.org ఇవీ డిజిటల్ సాధనాలుసీఏబీఐ వివిధ భాగస్వాములతో కలిసి పెస్ట్ మేనేజ్మెంట్ డెసిషన్ గైడ్ (పీఎండీజీ) అభివృద్ధి చేసింది, ఇది త్రిప్స్ పార్విస్పినస్ను గుర్తించడం, సురక్షితమైన యాజమాన్యంపై సలహాలను అందిస్తుంది. దేశంలో వాణిజ్యపరంగా అందుబాటులో ఉన్న అనేక బయోపెస్టిసైడ్స్‌ను సూచిస్తున్నారు. పీఎండీజీ ఇప్పుడు తెలుగు, కన్నడ, తమిళం భాషలలో రైతులకు, విస్తరణ కార్యకర్తలకు అందుబాటులో ఉన్నాయి. విస్తరణ అధికారులు, విద్యార్ధులు, శిక్షకులు, రైతులు, పరిశోధకులు ఈ కింది సీఏబీఐ డిజిటల్ సాధనాలను ఉపయోగించి డిజిటల్ సలహాలు తెలుసుకుంటున్నారు. వీటిని సమర్థవంతంగా, ఉపయోగించడం ద్వారా నల్ల తామర పురుగును అరికట్టే మార్గాలపై సమాచారాన్ని ఎవరైనా పొందదవచ్చు.బయో ప్రొటెక్షన్ పోర్టల్...: తెగులును నిర్వహించడానికి స్థానికంగా లభించే బయోపెస్టిసైడ్స్ గురించి సమాచారం కోసం ఇక్కడ స్కాన్ చేయండి.క్రాప్ స్ప్రేయర్ యాప్...: స్ప్రేయర్ పరిమాణాన్ని బట్టి పురుగు మందు/ బయోపెస్టిసైడ్ మోతాదు ఎంత వాడాలి అన్నది తెలుసుకోవడం కోసం ఇక్కడ స్కాన్ చేయండి .ఫ్యాక్ట్‌షీట్ యాప్/నాలెడ్జ్ బ్యాంక్... సమర్థవంతంగా చీడపీడల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై పూర్తి సమాచారాన్ని ఇక్కడ స్కాన్ చేసి డౌన్లోడ్ చేసుకోవటం ద్వారా తెలుగు తదితర భాషల్లోనూ ΄ పొందవచ్చు. నిర్వహణ: పంతంగి రాంబాబు సాక్షి సాగుబడి డెస్క్ -
రొయ్యలకు దేశంలోనే డిమాండ్ పెంచాలి!
ఆక్వాకల్చర్ ప్రపంచంలో రాణించిన అరుదైన భారతీయ శాస్త్రవేత్త డాక్టర్ విజయ్ గుప్తా. 86 ఏళ్ల క్రితం బాపట్ల జిల్లాలో పుట్టారు. ఆక్వా కల్చర్ నిపుణుడిగా లావోస్ నుంచి బంగ్లాదేశ్ వరకు 22 ఆసియా, ఆఫ్రికా దేశాల్లో విశేష సేవలందించారు. సామాన్య ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పు తెచ్చారు. నిస్వార్థ సేవలకు గుర్తింపుగా అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘ప్రపంచ ఆహార పురస్కారం’ (2005), నోబెల్‌తో సరితూగే ‘సన్హాక్ శాంతి పురస్కారం ’(2015) అందుకున్నారు.పదవీ విరమణ అనంతరం హైదరాబాద్‌లో నివసిస్తున్న డా. విజయ్ గుప్తాను ‘సాక్షి సాగుబడి’ పలుకరించింది. ట్రంప్ సుంకాల నేపథ్యంలో అమెరికాయేతర మార్కెట్లను వెతకటంతో పాటు.. దేశీయ మార్కెట్లలో మౌలిక సదుపాయాలు కల్పించి చేపలు, రొయ్యలకు డిమాండ్ పెంచుకోవటానికి పుష్కలంగా ఉన్న అవకాశాలను ఉపయోగించుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యాంశాలు..86 ఏళ్ల వయసులో 66లా ఉన్నారు.. మీ ఆరోగ్య రహస్యం ఏమిటి?డా. విజయ్ గుప్తా: ఏమీ లేదు. కష్టపడి పనిచెయ్యటమే. పనితో వయసును జోడించి చూడకూడదండి.. మీరు చెయ్యగలిగినంత కాలం పని చేస్తూనే ఉండాలి. జీవితంలో మీరు ఏమి చెయ్యదలచుకున్నారో ఆ పనిలో సంతృప్తి కోసం పాటుపడాలి. చాలా మంది ధనంలోనే సంతృప్తిని వెదుక్కుంటూ ఉంటారు. కానీ, అది వాస్తవం కాదు. ధనార్జన ఇచ్చే సంతృప్తి పరిమితమైనది. మీరు ఎవరికైనా సహాయంతో అభివృద్ధి చెందిన వాళ్లు చూపే ఆదరణతో లభించే ఆత్మసంతృప్తి అనంతమైనది.2015లో దక్షిణ కొరియా ప్రభుత్వం సన్హాక్ శాంతి బహుమతి నాకు ఇచ్చింది.దానికి ముందు నేను గతంలో పనిచేసిన దేశాల్లో ప్రజల స్పందనను తెలుసుకునేందుకు నాతో పాటు పాత్రికేయులను పర్యటనకు పంపింది. బంగ్లాదేశ్‌లో ఆరేళ్లు పనిచేసిన నేను పదిహేనేళ్ల తర్వాత మళ్లీ అక్కడి గ్రామాల్లోకి వెళ్తే.. మహిళా రైతులు నన్ను గుర్తిపట్టి చాలా సంబరపడ్డారు. మీరు నేర్పిన ఆక్వా సాగు వల్ల మా పూరి గుడిసెలు ఇప్పుడు పక్కా భవనాలయ్యాయని చూపించి కృతజ్ఞతలు తెలిపారు. ఆ క్షణాల్లో వారి మొహాల్లో నవ్వును చూసినప్పుడు నాకు ఎంతో ఆత్మసంతృప్తి కలిగింది. అది ఏ బహుమతులతోనూ దొరకదు..!బంగ్లాదేశ్ ఆక్వా రైతు మిమ్మల్ని అంతగా గుర్తుపెట్టుకోవటానికి కారణం ఏమిటి?అక్కడ ఆరేళ్లు పనిచేశా. బంగ్లాదేశ్ అంతా లోతట్టు ప్రాంతం. స్థానికంగా ప్రజలు గుంతలు తవ్విన మట్టిని ఎత్తుగా పోసి, వాటిపైన గుడిసెలు వేసుకొని జీవిస్తుంటారు. ఆ గుంతల్లో గుర్రపుడెక్క, దోమలు పెరిగి సమస్యగా ఉండేది. తినటానికి జనానికి తిండి లేదు. అటువంటి స్థితిలో ఆ చిన్న గుంతల్లోనే పెంచుకొని తినే చిన్న సైజు చేపల సాగు సాంకేతికతలను అభివృద్ధి చేశాం. స్థానిక స్వచ్ఛంద సంస్థల ద్వారా రైతుల బృందాలను కూడగట్టాం. ఉమ్మడి బాధ్యతతో కూడిన బృంద రుణాలు ఇప్పించాం. తద్వారా పేద రైతులను అధిక వడ్డీల విషచక్రం నుంచి, ఆహార అభద్రత నుంచి బయటపడేశాం. యూఎన్ఎయిడ్ చరిత్రలోనే బెస్ట్ ప్రాజెక్ట్‌గా మాకు గుర్తింపు రావటం ఓ మధుర స్మృతి. ప్రభుత్వం అందుకు ఏం చెయ్యొచ్చు..?ఒక్క రొయ్యలకే కాదు, చేపలకు కూడా మన నగరాలు, పట్టణాల్లో అపారమైన మార్కెటింగ్ అవకాశాలున్నాయి. ప్రొటీన్ ఆహారానికి డిమాండ్ ఉన్నా చేపలు, రొయ్యలను చాలా మంది తినకపోవటానికి కారణం.. వాటిని విక్రయించే పద్ధతులు సరిగ్గా లేకపోవటమే. జూబ్లీహిల్స్‌లో ఇప్పటికీ చేపలను రోడ్డుపక్కన పెట్టి అపరిశుభ్ర పరిస్థితుల్లో అమ్ముతున్నారు. అసలు మెరుగైన మార్కెటింగ్ కల్పించాలన్న చైతన్యం లేదు. నగరాలు, పట్టణాల్లో ఆధునిక వసతులతో ప్రత్యేక దుకాణాలు తెరవాలి. విలువ జోడించి మార్కెటింగ్ గొలుసును నిర్మిస్తే.. చేపలు, రొయ్యలను ప్రజలు బాగా తింటారు. సబ్సిడీలివ్వటం కాదు, మౌలిక సదుపాయాలు కల్పించాలి. పోషకాల పరంగా అడ్వాంటేజ్ ఉందా?పోర్క్, బీఫ్, పౌల్ట్రీతో పోల్చితే చేపలు, రొయ్యల్లో పోషకాలు చాలా ఎక్కువ. కంపేరిటివ్ స్టడీస్ కూడా వచ్చాయి. పర్యావరణ పరంగా చూసినా ఆక్వా ఉత్పత్తులే మెరుగైనవి. ఒకటిన్నర కేజీల మేత వేస్తే కిలో చేపల్ని పెంచే సాంకేతికత అందుబాటులో ఉంది. ఇతర జంతువులకు 12 కిలోల మేత పెడితే గాని ఒక కిలో ఉత్పత్తి రాదు. పశువుల పెంపకం కోసం విస్తారంగా గడ్డి భూములు కావాలి. చేపలు, రొయ్యలు నీటిలో పెరుగుతాయే కానీ అవి నీరు తాగవు. మార్కెటింగ్, కోల్డ్ చెయిన్ సదుపాయాల కొరత, ఆరోగ్య ప్రయోజనాలపై ప్రచార లోపమే సమస్య. యూరోపియన్ యూనియన్ కఠిన నియమాలను అధిగమించేదెలా?ట్రేసబిలిటీ వంటి సదుపాయాలు అన్ని దేశాల్లోనూ అందుబాటులో ఉన్నాయి. అందువల్ల కెమికల్ రెసిడ్యూ లేని విధంగా సస్టయినబుల్ ఫిష్ ప్రొడక్షన్ పద్ధతులను ఆక్వా రైతులకు, పరిశ్రమదారులకు ప్రభుత్వం నేర్పించాలి. తెలిసో తెలియకో మందులు వాడుతున్న మన చిన్న, సన్నకారు రైతులకు లోతైన అవగాహన కల్పించాలి. టెక్నాలజీ ఇవ్వాలి. ఇలా చేస్తే అధిక ధర వచ్చే విదేశీ మార్కెట్లు ఉన్నాయి. ఆఫ్రికాలో ఇలా చేశారు. మన ప్రభుత్వాలు కూడా చెయ్యాలి. అమెరికాయేతర దేశాలతో కూడా ట్రేడ్ అగ్రిమెంట్లకు ప్రయత్నం చెయ్యాలి. ప్రపంచ ఆహార భద్రత భవిష్యత్తు ఎలా ఉంటుంది?రాబోయే 20–30 సంవత్సరాల్లో జంతువులను మాంసం కోసం పెంచటం చాలా ఇబ్బందుల్లో చిక్కుకుంటుంది. జనాభాతో పాటు వారి కొనుగోలు శక్తి పెరుగుతోంది. ఇది ఆసియా దేశాల్లో ఆక్వా అభివృద్ధికి చాలా మంచి అవకాశం. జలవనరులు ఎక్కువగా ఉన్న మన దేశానికి ఇది గొప్ప అవకాశం. అయితే, మన ఆక్వా రంగం ఉత్పాదకతను పెంచుకోవాలి. మన ఉత్పాదకత ఎందువల్ల తక్కువ?ఉప్పునీటి, మంచినీటి చేపలు, రొయ్యల సాగు రంగంలో మనకున్న వనరుల్లో 30–40% మాత్రమే ఇప్పటికి వాడుకుంటున్నాం. ఇంకా పెంచుకోవటానికి చాలా అవకాశం ఉంది. ఉత్పాదకత పెరగాలంటే దేశీయంగా వినియోగం పెరగాలి. మార్కెటింగ్ మౌలిక సదుపాయాలు పెంపొందిస్తే డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ డ్రైవెన్ ఎకానమీగా గుర్తించి ప్రభుత్వాలు ఆక్వా రంగంపై దృష్టి కేంద్రీకరిస్తే రైతులు అందుకుంటారు. – ఇంటర్వ్యూ: పంతంగి రాంబాబు ఫొటో: ఎస్.ఎస్. ఠాకూర్ఆక్వా ఉత్పత్తుల మార్కెటింగ్ పెరిగే అవకాశాలు ఎంత మేరకు ఉన్నాయి?కోళ్ల పరిశ్రమతో సరిపోల్చి చూడండి.. 15–20 ఏళ్ల క్రితం కోడి మాంసం తినాలంటే కోడిని కొనుక్కొచ్చి ఇంటి దగ్గర కోసుకునే వాళ్లు. ఇప్పుడు ఎక్కడ చూసినా కోళ్లను కోసి మాంసం అమ్మే దుకాణాలొచ్చేశాయి. కాబట్టే వినియోగదారులు కోడి మాంసాన్ని ఇంత ఉత్సాహంగా వాడుతున్నారు. చేపలు, రొయ్యల అమ్మకానికి, పౌల్ట్రీ మాదిరిగా, మార్కెటింగ్ సదుపాయాలు, విలువ జోడింపు మౌలిక సదుపాయాలను పెద్ద ఎత్తున కల్పించాలి. మార్కెట్ సృష్టిస్తే చేపలు, రొయ్యల ఉత్పత్తిని ఇంకా పెంచుకోవటానికి రైతులు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. చేపలు, రొయ్యల పౌష్టికాహార విలువలు, ఆరోగ్య ప్రయోజనాలపై విస్తృతంగా ప్రచార మాధ్యమాల్లో ఎగ్ క్యాంపెయిన్ మాదిరిగా ప్రచారోద్యమం చేపట్టాలి.దేశీయంగా రొయ్యలు ఎక్కువగా తినకపోవటానికి కారణం?ప్రపంచవ్యాప్తంగా ఆక్వా ఉత్పత్తులను ఏడాదికి తలసరి వినియోగం 22 కిలోలు. బంగ్లాదేశ్‌లో 30–40 కిలోల వరకు ఉంటుంది. మన దేశంలో 6 కిలోలంటారు. కచ్చితమైన గణాంకాలు లేవు. మనవాళ్లు రొయ్యలు ఎక్కువగా తినకపోవటానికి ధర ఎక్కువ కావటం ఒకటి. మరొక అపోహ ఏమిటంటే.. రొయ్యలు తింటే కొలెస్ట్రాల్ ఉంటుందని. అది అపోహే. చేపలతో కూడా ప్రాబ్లమ్ ఏమీ లేదు. నీట్‌గా ఉండే కోయిస్క్లను ఏర్పాటు చేస్తే వినియోగం పెంచవచ్చు. ప్రభుత్వం నగదు ఇన్సెంటివ్‌లు ఇవ్వటం కాదు. కోల్డ్‌చెయిన్, మౌలిక సదుపాయాలు కల్పించాలి. -
ఐసీయూలో భూమి!
భూమికి బాగా సుస్తీ చేసింది. అవనికి ఆధారంగా నిలుస్తున్న 9 పర్యావరణ వ్యవస్థల్లో ఏడింటి ఆరోగ్యం క్షీణించింది. శాస్త్రవేత్తల పరిభాషలో వీటిని ‘ప్లానెటరీ బౌండరీస్’ అంటారు. తాజాగా.. భూగ్రహంపై 70% భూభాగాన్ని ఆక్రమించటమే కాకుండా జీవావరణాన్ని కంటికి రెప్పలా కాపాడే సముద్రం కూడా అనారోగ్యం పాలైంది. సముద్ర జలాల ఆమ్లీకరణ హద్దుమీరి ప్రమాద ఘంటికలు మోగించటం ఇదే మొదటిసారి! అయినప్పటికీ, ఇంకా ఆశ మిగిలి ఉందని, ఇప్పటికైనా మానవాళి మేలుకోవాలని ‘ప్లానెటరీ హెల్త్ చెక్ 2025’ తాజా నివేదిక హెచ్చరిస్తోంది. – సాక్షి, సాగుబడిభూమి ఒక రోగి అయితే, అది ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో పడి ఉండేదని పోట్స్‌డ్యామ్ ఇన్ స్టిట్యూట్ ఫర్ క్లైమేట్ ఇంపాక్ట్ రీసెర్చ్ (పీఐకే) వెలువరించిన ‘ప్లానెట్ హెల్త్ చెక్ 2025’ నివేదిక చెబుతోంది. జర్మనీ కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ.. భూ ఆరోగ్య స్థితిగతులపై అధ్యయనంలో చురుగ్గా పనిచేస్తోంది. పరిశోధకులు గుర్తించిన తొమ్మిది పర్యావరణ సరిహద్దుల్లో మూడు ప్రమాదకర హద్దును దాటాయని 2009లో తొలుత గుర్తించారు. వీటి సంఖ్య 2023 నాటికి ఆరుకు, ప్రస్తుతం 9కి పెరిగింది. శాస్త్రవేత్తలు భూమి ఆరోగ్యాన్ని.. దాని ఉత్పాదకత, మానవులు వాడుకున్న తర్వాత మిగిలిన శక్తి అనే 2 సూచికలను ఉపయోగించి కొలుస్తారు.1 వాతావరణ మార్పువాతావరణంలో కార్బన్డయాక్సైడ్ (సీఓ2) 350 పీపీఎం (పార్ట్స్ పర్ మిలియన్) స్థాయిలో ఉంటే మంచిది. కానీ ఇది 423కి పెరిగింది. 450కి చేరితే మరింత ప్రమాదకరం. ఈ కారణంగానే ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరిగి, విపత్తులు తీవ్రమవుతున్నాయి.2 జీవావరణ సమగ్రతలో మార్పుమనం చేసే పనులు జీవావరణ సమగ్రతపై ఒత్తిడి పెంచుతున్నాయి. ప్రకృతిలో ఉన్న శక్తిలో 10 శాతాన్ని మనుషులు వాడుకుంటే ప్రకృతి తిరిగి దాన్ని పూడ్చుకొని తెప్పరిల్లుతుంది. కానీ, మనం 30% వాడేసుకుంటున్నాం. వ్యవసాయం, పశువుల పెంపకం, నగరీకరణ, పరిశ్రమల కోసం భూమి సహజ స్థితిని విపరీతంగా మార్చటం వల్ల.. జీవవైవిధ్యం ప్రమాదకర స్థాయిలో అంతరిస్తోంది.3 భూ వ్యవస్థ మార్పుఅడవులు భూగోళంపై వాతావరణాన్ని స్థిరంగా ఉంచటంలో కీలకపాత్ర పోషిస్తాయి. అసాధారణంగా అడవులు నరికివేసి భూమిని చిన్నాభిన్నం చేస్తున్నాం. వ్యవసాయం, నగరీకరణ, పశుపోషణ కోసం తీవ్రస్థాయిలో భూ వినియోగ సహజ స్థితిని మార్చటం సమస్యగా మారింది. 2000–2018 మధ్యలో 90% అడవుల నరికివేత వ్యవసాయం (52%), పశుపోషణ (38%) కోసమే జరిగింది. ప్రపంచ భూభాగంలో అడవులు 75% ఉంటే మేలు. అయితే, ఇప్పుడు 59 శాతానికి తగ్గిపోయాయి. 4 మంచినీటి మార్పుపరిమితి దాటిని మంచి నీటి వినియోగం జల చక్రాన్ని దెబ్బతీస్తోంది. నదుల్లో పారే నీటిని 12.9% వాడుకుంటే పర్వాలేదు. కానీ, ఇప్పుడు 22.6% వాడుతున్నాం. భూగర్భ జలాలను 12.4% వాడుకుంటే పర్వాలేదు.మనం 22% వినియోగిస్తున్నాం.5 జీవ భౌతిక రసాయన మార్పులురసాయనిక ఎరువులను పంటలు ఉపయోగించుకునేది తక్కువ.. నీటిని, భూమిని కలుషితం చేసేదే ఎక్కువ. ఇవి చివరికి సముద్ర జలాల్లోకీ చేరి పర్యావరణ వ్యవస్థలను కూడా అస్తవ్యస్తం చేస్తున్నాయి. భాస్వరం ఎరువులను ప్రపంచవ్యాప్తంగా ఏడాదికి 62 లక్షల టన్నులు వాడితే పర్వాలేదు. కానీ, 11 కోట్ల టన్నులు వాడుతున్నాం. నత్రజని ఎరువును ఏటా 6.2 కోట్ల టన్నులు వాడితే పర్వాలేదు. కానీ, 8.2 కోట్ల టన్నులు వాడుతున్నాం. ఇతర ఆరు రకాల సరిహద్దులను కూడా ఈ ఎరువులు ప్రభావితం చేస్తున్నాయి. 6 సముద్రాల ఆమ్లీకరణవాతావరణంలోకి విడుదలయ్యే కార్బన్‌డయాక్సైడ్‌లో చాలా వరకు సముద్రాలే పీల్చుకుంటాయి. దీనివల్ల సముద్ర జలాల్లో ఆమ్లగుణం పెరిగిపోతుంది. ఇది ఒక స్థాయికి మించితే సముద్ర జీవ వ్యవస్థలకు ప్రమాదం. ఫలితంగా సీఓ2ను పీల్చుకునే శక్తి సముద్రాలకు తగ్గిపోతుంది. దీంతో భూగోళం మరింత వేడెక్కుతుంది. 7 వాయు కాలుష్యంగత కొన్ని దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు చర్యలు తీసుకోవటం వల్ల ఈ కాలుష్యం తగ్గుముఖం పట్టింది. 9 సరిహద్దుల్లో సురక్షిత స్థాయిలో ఉన్న రెండింటిలో ఇదొకటి.8 ఓజోన్ పొరసౌర వ్యవస్థ నుంచి అతినీలలోహిత కిరణాలను భూమిపైకి రాకుండా వడకట్టేది ఆకాశంలోని ఓజోన్ పొర. గతంలో ఇది క్షీణించడంతో ప్రపంచ దేశాలు చర్యలు తీసుకున్నాయి. దీంతో ఓజోన్ పొర మందం ఇటీవల పెరుగుతోంది. తొమ్మిదింటిలో సురక్షిత స్థాయిలో ఉన్న రెండోది ఇదే.9 నావల్ ఎంటిటీస్మనుషులు తయారుచేసిన రసాయనాలు, ప్లాస్టిక్లు.. వీటి కిందికి వస్తాయి. సూక్ష్మ ప్లాస్టిక్ పదార్థాలు సముద్ర జంతువుల్లోకి, మన దేహాల్లోకి చేరి చేటు చేస్తున్నాయి. అయితే, వీటి ముప్పు ఎంత అనేది అంచనా వేయాల్సి ఉంది. -
ఒక్కటే పంట..ఐదు ఆదాయాల పెట్టు!
చాలా రకాల పంటలు రైతుకు ఒకే ఆదాయాన్ని ఇస్తుంటాయి. కానీ, 5 రకాలుగా ఆదాయాన్నిచ్చే పంట ఒకటుంది. మరో విశేషం ఏమిటంటే...దీన్ని సాగు చెయ్యటానికి సారం కోల్పోయిన, కరువు ప్రాంతాల్లో బంజరైనా భేషుగ్గా పనికొస్తుంది. ఆ పంట పేరు ముళ్లు లేని బ్రహ్మజెముడు (స్పైన్‌లెస్ కాక్టస్). క్షీణించిన భూమిలో ‘5 ఎఫ్ మోడల్’ పంటగా కాక్టస్‌ను పండించడం అంటే.. ఎడారీకరణను సమర్థవంతంగా ఎదుర్కొంటూనే రైతు కుటుంబాలకు స్థిరమైన జీవనోపాధిని సృష్టించటం. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో నిస్సారమైన కరువు ప్రాంత భూముల్లో దీన్ని సాగు చేస్తున్నారు. ఇంతకీ ‘5ఎఫ్ మోడల్’ పంట అంటే ఏమిటి?.. చదవండి...ముళ్లులేని బ్రహ్మజెముడు ఒకటే పంట.. 5 ప్రయోజనాలు చేకూర్చుతోంది. రైతులకు బహుళ ఉత్పాదనలు, బహుళ ఆదాయ మార్గాలను అందిస్తున్నది. ఆ ఐదు ‘ఎఫ్‘లు ఏవంటే.. ఫుడ్, ఫాడర్, ఫ్యూయల్, ఫర్టిలైజర్, ఫ్యాషన్! ఈ ఐదు ఆంగ్ల పదాలు ఎఫ్‌తో ప్రారంభం అవుతాయి కాబట్టి ‘5ఎఫ్ మోడల్ పంట’ అని దీనికి పేరొచ్చింది. ఆహారం, పశుల మేత, ఇంధనం, ఎరువులు, ఫ్యాషన్ రంగాల్లో ముళ్లులేని బ్రహ్మజెముడు పంట ఉపయోగపడుతోంది. ఆ విధంగా కరువును ΄పారదోలుతోంది!1. ఆహారం: దీని పండ్లను కాక్టస్ పియర్ (ఓపుంటియా ఫికస్–ఇండికా) అంటారు. ఈ పండ్లు తియ్యగా, జ్యూసీగా ఉంటాయి. తాజాగా తినవచ్చు లేదా జామ్‌లు, జ్యూస్‌లు, సిరప్‌లుగా ్ర΄ాసెస్ చేయవచ్చు. ముళ్లులేని బ్రహ్మజెముడు మొక్కల ఆకులను ముక్కలుగా కత్తిరించి కూర వండుకొని తీసుకుంటారు.2. పశువుల మేత: ముళ్లులేని బ్రహ్మజెముడు మొక్కల ఆకులను క్యాక్టస్ ప్యాడ్లు లేదా క్లాడోడ్లు అంటారు. ఇవి పశువులకు పచ్చి మేతగా ఉపయోగపడతాయి. నమ్మకమైన, తక్కువ ఖర్చుతో సమకూర్చుకోగల పచ్చి మేత. ముఖ్యంగా ఇతర రకాల మేతకు కొరత ఉన్న కరువు పీడిత ప్రాంతాల్లో ఇవి పశువులకు ప్రాణం నిలిపేందుకు ఉపయోగపడుతున్నాయి. ఇందులో నీరు అధికపాళ్లలో ఉంటుంది.3. ఇంధనం: ముళ్లులేని బ్రహ్మజెముడు ఆకులను (కాక్టస్ బయోమాస్‌ను) బయోగ్యాస్ ఉత్పత్తికి మూల వనరు (ఫీడ్ స్టాక్)గా ఉపయోగిస్తున్నారు. 10% ఆవు పేడతో 90% కాక్టస్ బయోమాస్‌ను ఉపయోగించడం వల్ల 65% వరకు మీథేన్ కంటెంట్‌తో బయోగ్యాస్‌ను ఉత్పత్తి చేయవచ్చని ఒక పైలట్ అధ్యయనం నిరూపించింది. ఈ గ్యాస్‌తో వంటకు, ఇతర ఉపయోగాలకు స్వచ్ఛమైన శక్తి వనరుగా పనికొస్తుంది.4. ఎరువులు: బయోగ్యాస్ ఉత్పత్తి తర్వాత మిగిలిపోయే పోషకాలతో కూడిన స్లర్రీని సేంద్రియ ఎరువుగా ఉపయోగించి నేలను సారవంతం చేసుకోవచ్చు. పంట ఉత్పాదకతను మెరుగుపరుచుకోవచ్చు. ఇది ఖరీదైన రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గిస్తుంది. పొలంలో పండే మొక్కల ఆకులతోనే ఎరువుగా వాడటం ద్వారా వృత్తాకార ఆర్థిక వ్యవస్థను సృష్టించుకోవచ్చు.5. ఫ్యాషన్: బూట్లు, బ్యాగులు, ఇతర ఉపకరణాల కోసం బయో–లెదర్ (మొక్కలకు సంబంధించిన తోలు) ఉత్పత్తి చేయడానికి ముళ్లులేని బ్రహ్మజెముడు ఆకులను ఉపయోగించవచ్చని మన దేశంలోని భూ వనరుల శాఖ, ఇతర పరిశోధకులు నిరూపించారు. 3 కిలోల దీని ఆకుల ద్వారా 3 చదరపు అడుగుల కంటే ఎక్కువ బయో–లెదర్‌ను ఉత్పత్తి చేయగలదని ఒక పైలట్ అధ్యయనంలో తేలింది.ఎడారిగా మారిపోతున్న ప్రదేశాలు, కరువు పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్న ప్రాంతాల్లో భూములు నిస్సారమైపోయి ఉంటాయి. అయితే, అటువంటి కఠిన పరిస్థితుల్లో మనుగడ సాగించగలిగే జాతుల పంటలను గుర్తించి, పరిశోధనలు చేయటం.. ఆయా పంటలను సాగు చేయించటంలో తోడ్పాటునందించటం ముఖ్యమైన అభివృద్ధి కార్యక్రమం. ఇటువంటి పని చేస్తున్న ఒకానొక అంతర్జాతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ ఐసీఏఆర్డీఏ. ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్ ద డ్రై ఏరియాస్. దీని ప్రధాన కార్యాలయం లెబనాన్‌లో ఏభయ్యేళ్లుగా పనిచేస్తోంది. దక్షిణాసియా, చైనాలకు కలిపి ప్రాంతీయ కార్యాలయాన్ని 2008లో న్యూఢిల్లీలో నెలకొల్పారు. ఐసీఏఆర్డీఏ మన దేశంలోకి 67 రకాల ముళ్లులేని బ్రహ్మజెముడు రకాలను ప్రవేశపెట్టి, భారతీయ సంస్థల సహకారంతో పరిశోధనలకు మార్గదర్శకత్వం వహించింది. ఆ కృషి ఫలితంగానే దేశంలో రైతులకు ఇప్పుడు తమ జీవనోపాధిని పెంచుకునే, కరువును ఎదుర్కొనే ఆశాజనకమైన ముళ్లులేని బ్రహ్మజెముడు అనే కొత్త పంట అందుబాటులోకి వచ్చింది. ఐసీఏఆర్డీఏ ఇండియా ఆధ్వర్యంలో మధ్యప్రదేశ్‌లోని అమ్లహలో ఫుడ్ లెగ్యూమ్ రీసెర్చ్ ప్లాట్ఫామ్లో డాక్టర్ నేహా తివారీ పరిశోధకురాలిగా పనిచేస్తున్నారు. మన దేశంలో ఎడారీకరణను, కరువును ఎదుర్కొంటున్న ప్రాంతాల అభ్యున్నతికి ‘కాక్టి రాణి’గా ప్రసిద్ధి చెందిన ముళ్లులేని బ్రహ్మజెముడు ఎంత అవసరమో ఆమె ఒక ఇంటర్వ్యూలో చర్చించారు. ముఖ్యాంశాలు..ముళ్లులేని బ్రహ్మజెముడు పంటను సాగు చేయటానికి తగిన వ్యవసాయ పరిస్థితులు ఏమిటి?ముళ్లులేని బ్రహ్మజెముడు పంట తక్కువ తేమతో కూడిన వేడి వాతావరణంలో పెరుగుతుంది. ఇసుక నేలలు, కంకర నేలలకు ఇది అనువైనది. ముళ్లులేని బ్రహ్మజెముడు నిస్సారమైన నేలల్లో స్థిరంగా పెరిగే పంట అయినప్పటికీ, ముఖ్యంగా దాని పెరుగుదల దశలో, దానికీ కొంత తేమ అవసరం. ముళ్లులేని బ్రహ్మజెముడు బాగా పెరగాలన్నా, పండ్ల కాపు రావాలన్నా ప్రతిరోజూ కనీసం ఆరు గంటల ప్రత్యక్ష సూర్యకాంతి అవసరం. ఈ మొక్క ఉదజని సూచిక కొద్దిగా ఆమ్ల లేదా తటస్థంగా ఉన్న నేలలను ఇష్టపడుతుంది. సాధారణంగా 6.0 నుండి 7.5 వరకు పీహెచ్ ఉండాలి. మొక్కల మధ్య దూరం ఎక్కువగా ఉండాలి. మన దేశంలోని మెట్ట ప్రాంతాలలో కఠినమైన వ్యవసాయ–వాతావరణ పరిస్థితులు ముళ్లులేని బ్రహ్మజెముడుకు అద్భుతమైన అనుకూలంగా ఉంటాయి. ఇతర పంటలేవీ పండించలేని ప్రదేశాలలో ఇది పెరుగుతుంది. వాస్తవానికి, ఐసీఏఆర్డీఏ భారతదేశంలో అరవై ఏడు కాక్టస్ రకాలను ప్రవేశపెట్టింది. ఈ రకాలను పెంచే మదర్ నర్సరీలు అమలహాలోని ఐసీఏఆర్, ఐసీఏఆర్డీఏ సంస్థల్లో ఏర్పాటయ్యాయి. ముళ్లులేని బ్రహ్మజెముడు పంట సాగును ప్రోత్సహించడానికి డిసెంబర్ 2023లో ఐసీఏఆర్డీఏ భారత ప్రభుత్వం ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి.దేశంలో ముళ్లులేని బ్రహ్మజెముడు మార్కెటింగ్ వ్యవస్థ అభివృద్ధి చెందిందా?చిన్న రైతులు స్థానికంగా ముళ్లులేని బ్రహ్మజెముడు పండ్ల కోసం, పశుగ్రాసం కోసం పండిస్తున్నారు. ఇతర దేశాలతో పోలిస్తే ఇక్కడ కొంచెం తక్కువే. మార్కెటింగ్ ప్రయత్నాలను మెరుగుపరచడానికి ఐసీఏఆర్డీఏ కేంద్ర భూ వనరుల శాఖతో కలిసి పనిచేస్తున్నది. ఆహారంగా, ఇంధనంగా, పశుగ్రాసంగా, ఎరువుగా, కార్బన్ క్రెడిట్స్, ఫ్యాషన్ రంగాల్లో రైతులకు ఆకర్షణీయమైన ప్రయోజనాలను చేకూర్చేందుకు ప్రయత్నిస్తున్నాం. ఉదాహరణకు.. ముళ్లులేని బ్రహ్మజెముడు ఆకులతో 61% మీథేన్‌తో కూడిన బయోగ్యాస్‌ను ఉత్పత్తి చేశాం. అలాగే చౌకగా, సమృద్ధిగా లభించే బయోఫెర్టిలైజర్‌ను ఉత్పత్తి చేసే సాంకేతికతలను అభివృద్ధి చేశాం. అదనంగా, ప్రైవేట్ రంగం భాగస్వామ్యంతో బయో–లెదర్‌ను రూపొందించే కార్యక్రమాన్ని ప్రారంభించాం. కేరళలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటర్ డిసిప్లినరీ సైన్స్ అండ్ టెక్నాలజీలో జరిగిన ప్రాథమిక పరీక్షలు ఆశాజనకమైన ఫలితాలిచ్చాయి. 3 కిలోల ముళ్లులేని బ్రహ్మజెముడు ఆకులతో 3.38 చదరపు అడుగుల బయో లెదర్‌ను ఉత్పత్తి చేశాం. ఇది 2 జతల చెప్పులు, 3 చిన్న బ్యాగులు లేదా 2 జతల బూట్లను తయారు చేయడానికి సరి΄ోతుంది. బయోలెదర్ ఉత్పత్తులను మరింత అభివృద్ధి చేయడానికి అనేక జాతుల ముళ్లులేని బ్రహ్మజెముడు రకాలపై పరిశోధనలు కొనసాగుతున్నాయి. బయో లెదర్ రైతులకు కొత్త మార్కెట్ అవకాశాలను కల్పిస్తుంది. అదే సమయంలో, రైతులకు ప్రయోజనం చేకూరుస్తూనే ప్రైవేట్ రంగాన్ని శక్తివంతం చేయడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటున్నది. బ్రహ్మజెముడు ఉత్పత్తుల ఉత్పత్తి, ప్రాసెసింగ్, మార్కెటింగ్‌ను పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ముళ్లు లేని బ్రహ్మజెముడు పంట నిరూపిత సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకొని దేశంలో ఈ పంట సాగు, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీని పెంపొందించడానికి ఐసీఏఆర్డీఏ ప్రభుత్వ సంస్థలకు సహకరిస్తున్నది. ముఖ్యంగా ఎడారీకరణ ముప్పును ఎదుర్కొంటున్న ప్రాంతాలు, కరువు ప్రాంతాల్లో ఆహార భద్రత, జీవనోపాధులను పెంపొందించేందుకు కృషి చేస్తున్నాం.ఒక రైతు ముళ్లులేని బ్రహ్మజెముడు పంటను ఎలా పండించవచ్చు?ముళ్లు లేని బ్రహ్మజెముడు సాగులో గమనించాల్సిన అనేక అంశాలు ఉన్నాయి. నీరు నిలవని నేలలు, తగినంత సూర్యకాంతి ఉన్న ప్రదేశాల్లో పెంచాలి. దీనికి కూడా ఎండా కాలంలో నీరందించాలి. జంతువుల నుంచి రక్షణకు కంచెను ఏర్పాటు చేసుకోవాలి. దున్నిన తర్వాత నాటుకోవాలి. వాన నీరు బయటకు వెళ్లిపోవటానికి ఏర్పాట్లు చేసుకోకపోతే వేరుకుళ్లు సమస్య వస్తుంది. ముళ్లు లేని బ్రహ్మజెముడు ఆకులనే నాటుకోవాలి. వీటిని ఐసీఏఆర్డీఏ, ఇండియన్ గ్రాస్‌ల్యాండ్ అండ్ ఫాడర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, సెంట్రల్ అరిడ్ జోన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, భారతీయ ఆగ్రో ఇండస్ట్రీస్ ఫౌండేషన్ వంటి ప్రసిద్ధ నర్సరీల నుంచి ఆరోగ్యకరమైన, ముదురు ముళ్లు లేని బ్రహ్మజెముడు ఆకులను తెచ్చుకొని రైతులు నాటుకోవాలి.వరుసలలో తగినంత దూరంలో నాటుకోవాలి. ముళ్లు లేని బ్రహ్మజెముడు రకాన్ని, దాని పెరుగుదల అలవాటును బట్టి ఎంత దూరం పెట్టాలన్నది ఆధారపడి ఉంటుంది. ఈ ఆకులను తెచ్చిన 10 నుండి 15 రోజులు వాడబెట్టిన తర్వాత నాటుకోవాలి. వరుసల మధ్య 2 మీటరు, మొక్కల మధ్య 1 మీటరు దూరంలో నాటాలి. ఆకు 1/3 వంతు నేలలోకి ఉండేలా నాటాలి. వ్యాధి నివారణ కోసం కార్బెండజిమ్ (2 గ్రాములు/లీటరు) ద్రావణంలో ముంచి నాటుకోవాలి. నాటిన తర్వాత మొదటి 10 రోజులు నీరు పెట్టవద్దు. తరువాత 15 రోజుల వ్యవధిలో మొక్కకు 1–2 లీటర్ల నీరు ఇవ్వండి. అది వేరుపోసుకొని మొలకెత్తిన తర్వాత అంత తరచుగా నీరు పెట్టనవసరం లేదు. నేల పరీక్ష నిర్వహించి తగినంత ఎరువు వేయాలి. నాటేటప్పుడు మొక్కకు బాగా కుళ్ళిన పశువుల ఎరువు 2 కిలోలు వెయ్యండి. పండ్లు, ఆకులు కోసిన ప్రతి సారీ ఎరువులు వేయాలి. పిండినల్లి, శిలీంధ్ర తెగుళ్లు, ఇతర పురుగుల నుంచి రక్షణకు చర్యలు తీసుకోవాలి. ఒక సంవత్సరం తర్వాత, అడుగున రెండు ఆకులు వదిలి, పైన పూర్తిగా ఎదిగిన ఆకులను కోసి ఉపయోగించుకోవాలి. మొదటి సంవత్సరంలో మొక్కకు 8–10 కిలోల ఆకుల దిగుబడి వస్తుంది. మేకలు, గొర్రెలు, పశువులు, గేదెలకు మేతగా వీటిని వేసుకోవచ్చు. ఇతర పచ్చి మేతకు 25% ప్రత్యామ్నాయంగా ఉపయోగించండి. వసంతకాలం చివరిలో లేదా వేసవి ప్రారంభంలో ముళ్లులేని బ్రహ్మజెముడు పండ్లు కోతకు వస్తాయి.ముళ్లులేని బ్రహ్మజెముడు పంట నాటే ఆకులను ఎలా సేకరించుకోవాలి?ఐసీఏఆర్డీఏ, ఐజీఎఫ్ఆర్ఐ, సీఏజడ్‌ఆర్‌ఐ, సెంట్రల్ ఇన్సి్టట్యూట్ ఫర్ ఆరిడ్ హార్టికల్చర్, బీఏఐఎఫ్ వంటి పరిశోధనా సంస్థల్లో ముళ్లులేని బ్రహ్మజెముడు నర్సరీలు ఉన్నాయి. వారి నుంచి విత్తన ఆకులను తీసుకొని నాటుకోవచ్చు. ఇప్పటికే ఈ పంట సాగు చేస్తున్న రైతుల పొలాల నుంచి ఆరోగ్యకరమైన ఆకులు లేదా కాండం ముక్కలను తెచ్చి నాటుకోవచ్చు. ముళ్లులేని బ్రహ్మజెముడు మొక్క 3–4 సంవత్సరాలలో పూర్తి పరిపక్వతకు చేరుకుంటుంది. కొందరు గ్రీనహౌస్లో కూడా పెంచుతున్నారు. చదరపు మీటరుకు రూ. 500 నుండి 600 వరకు ఆదాయాన్ని పొందవచ్చని అంచనా. రూపాయి ఖర్చుకు 3 రూపాయల ఆదాయాన్ని పొందవచ్చని పరిశోధనలు చెబుతున్నాయి. ఇతర వివరాలకు.. www.icarda.orgదీన్ని సాగు చేస్తే భూమికి మేలు... నిస్సారమైన ఇసుక దువ్వలాగా మారిపోయిన భూమికి జవ జీవాలను అందించి పునరుద్ధరించడానికి అనేక విధాలుగా బ్రహ్మజెముడు పెంపకం అనువైనదని నిపుణులు చెబుతున్నారు:కరువు నిరోధకత... వాతావరణం నుంచి నీటిని పీల్చుకొని తనలో నిల్వ చేసుకోవటం బ్రహ్మజెముడు మొక్క లక్షణం. అందువల్లే ఇది కరువును గట్టిగానే తట్టుకోగలుగుతుంది. ఈ మొక్క జీవించడానికి, ఎక్కువ ఆకులను ఉత్పత్తి చేయడానికి చాలా తక్కువ నీరు సరిపోతుంది.నేలకు మేలు... బ్రహ్మజెముడును పెంచడం వల్ల మట్టి వానకు, గాలికి కొట్టుకుపోకుండా ఆపటం ద్వారా నేల సారాన్ని పునరుద్ధరించవచ్చు. ఈ మొక్కలు మట్టికి సేంద్రియ పదార్థాన్ని అందిస్తాయి.కర్బన స్థిరీకరణ... బ్రహ్మజెముడు మొక్క కర్బనాన్ని వాతావరణం నుంచి సంగ్రహించి తన ఆకులు, కాండంతో పాటు నేలలో నిల్వ చేయడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి ఈ కర్బన స్థిరీకరణ ప్రక్రియ సహాయపడుతుంది.అధిక దిగుబడి సామర్థ్యం... కఠినమైన వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ ముళ్లు లేని బ్రహ్మజెముడు చక్కగా పెరుగుతుంది. సంవత్సరానికి హెక్టారులో 80–100 టన్నుల బరువైన ముళ్లులేని బ్రహ్మజెముడు ఆకులను పండించవచ్చు.అమలుకు అవకాశాలు... ఈ 5 రకాల ప్రయోజనాలను పొందే ముళ్లులేని బ్రహ్మజెముడు పంట నమూనాను స్వీకరించడానికి ప్రభుత్వ సంస్థలు, పరిశోధనా సంస్థలు, ప్రైవేటు సంస్థలు, వ్యక్తుల సహకారం అవసరం. ముళ్లులేని బ్రహ్మజెముడు నాణ్యమైన ఆకులు నాటుకుంటే చాలు. అవి వేరుపోసుకొని ఎత్తయిన మొక్కగా ఎదుగుతాయి. కరువు ప్రాంతాల్లో జీవనోపాధులను మెరుగుపరిచేందుకు రైతులకు నాణ్యమైన ఆకులను అందించటం, సాంకేతిక మార్గదర్శకత్వం అందించడం ముఖ్యమైన విషయం. మార్కెట్ లింకేజీలను ఏర్పాటు చేయడం, ఈ ఆకులను 5 రకాలుగా ఉపయోగించేందుకు వీలుగా ప్రాసెస్ చేయడానికి మౌలిక సదుపాయాలను నిర్మించడం అవసరం.ఈ 5 రకాల ప్రయోజనాలనిచ్చే పంట నమూనాను సమర్థవంతంగా అమలు చేయడానికి ప్రజల్లో అవగాహన పెంచడం, సామర్థ్యాన్ని పెంపొందించడంపై దృష్టి సారించాలి. ఈ పంట నమూనా ముఖ్యంగా కరువు, ఎడారి తాలకు బాగా సరిపోతుంది. భారతదేశం, పాకిస్తాన్, ఇథియోపియా, మొరాకోతో సహా ఎడారీకరణను ఎదుర్కొంటున్న అనేక దేశాల్లో దీనిపై పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ పంట సాగు చేస్తున్నారు. బహుళ ఆదాయ మార్గాలను అందించడం, పనిలో పనిగా భూమిని తిరిగి సారవంతం చేయటం ద్వారా 5 రకాలుగా ప్రయోజనకరమైన బ్రహ్మజెముడు పంట నమూనా బడుగు రైతుల ఆదాయాన్ని పెంచుతుంది. మెరుగైన ఆహార భద్రతనిస్తుంది. అదే సమయంలో పర్యావరణాన్ని మెరుగుపరిచేందుకు ఒక మార్గాన్ని అందిస్తుంది. –పంతంగి రాంబా, బుసాక్షి సాగుబడి డెస్క్ (చదవండి: Sagubadi: మునగ మేలు!) -
Sagubadi: మునగ మేలు!
సాంప్రదాయ పంటలు పండించే చాలా మంది రైతుల నికరాదాయం ఎకరానికి రూ.20 వేలకు మించటం లేదు. పత్తి, మొక్కజొన్నకు బదులుగా మునగ సాగు చేస్తే సన్న, చిన్నకారు రైతుల నికరాదాయం పెరుగుతుంది. 3 సంవత్సరాలలోపు ఆయిల్‌పామ్ తోటల్లో అంతర పంటగా కూడా మునగను సాగు చేసుకోవచ్చు. వాతావరణ ఒడిదుడుగులను తట్టుకోవటానికి మునగ దోహద పడుతుంది. నాటిన 7–8 నెలల్లో తొలి పంట కోతకు వస్తుంది. మూడేళ్లలో వరుసగా కనీసం 5 కార్శి పంటలు తీసుకోవచ్చు. మునగ ఆకుల పొడి, గింజల ద్వారా అదనపు ఆదాయం సమకూర్చుకోవచ్చు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డా. టి. భరత్, ఉద్యాన శాస్త్రవేత్త బి. శివ, విస్తరణ శాస్త్రవేత్త డా. ఎన్. హేమ శరత్ చంద్ర మునగ సాగుపై అందించిన పూర్తి వివరాలు.పోషకాల గనిగా పేరు తెచ్చుకున్న మునగ రైతుల పాలిట కల్పవృక్షంగా విరాజిల్లుతున్నది. తినే వారికి ఆరోగ్యం, పండించే వారికి లాభాలు అందిస్తోంది. తక్కువ పెట్టుబడితోనే అధిక దిగుబడులందిస్తూ.. అన్నదాతల ఇంట సిరులు కురిపిస్తున్నది. మునగ చెట్టులో ప్రతీ భాగం ఉపయోగకరమైనదే. ఆకులు, కాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటి విత్తనాలను ఔషధ పరిశ్రమలలో వాడతారు. అందుకే, వీటికి మార్కెట్లో భారీ డిమాండ్ ఉంటుంది. ఆరోగ్యపరంగానే కాకుండా, వ్యాపారపరంగానూ మునగను సాగు చేసేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఏ నేలలైనా ఓకేఅన్ని రకాల నేలల్లో మునగను సాగు చేసుకోవచ్చు. ఉదజని సూచిక 6.5–8 శాతం ఉండే ఇసుక రేగడి నేలలు ఎక్కువ అనుకూలంగా ఉంటాయి. నీరు నిలవని ఎర్ర, ఇసుక, ఒండ్రు నేలలు అనుకూలమైనవి. నీటి వసతి గల సారవంతమైన భూముల్లో అధిక దిగుబడి సాధించవచ్చు. ఆరు నెలల్లోనే కాతకు వచ్చే ఏకవార్షిక రకాలు అందుబాటులోకి వచ్చాయి. చదవండి: ఏడేళ్ల బాలుడికి రెండు నెలలుగా ఆగని వాంతులు..కట్ చేస్తే.!అక్టోబర్ వరకు విత్తుకోవచ్చుమునగ విత్తనంతో మొక్కలు పెంచి, నాటుకోవాలి. జూలై నుంచి అక్టోబర్ వరకు విత్తుకోవచ్చు. ఏ సమయంలో విత్తినా వేసవిలోనే (జనవరి–ఏప్రిల్ మధ్యలో) పూతకు వస్తుంది. ఫిబ్రవరిలో ఎక్కువ పూత, కాత ఉంటుంది. ఒక ఎకరానికి వెయ్యి మొక్కలు నాటాలి. మొక్కలను ముందుగా నర్సరీల్లో పెంచాలి. పీకేఎం–1 మునగ రకం విత్తుకోవటం మేలు. పాలిథిన్ సంచుల్లో విత్తిన 15 రోజుల్లో మొలక వస్తుంది. మొక్కల మధ్య 1 మీ., వరుసల మధ్య 1.5 మీ. దూరంలో గుంతలు తీసుకోవాలి. అర ట్రక్కు పశువుల ఎరువుకు రెండు బస్తాల వేపపిండి, 10 కేజీల ట్రైకోడెర్మా కలపాలి. దీన్ని ప్రతి గుంతకు రెండు దోసెళ్ళు (ఒక కిలో), గుప్పెడు సూపర్ ఫాస్ఫేట్ వేయాలి. ప్రతి మొక్కకూ డ్రిప్ ద్వారా 135: 23: 45 గ్రాముల చొప్పున నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువులను అందిస్తే దిగుబడులు పెరుగుతాయి. నత్రజని, పొటాష్ ఎరువులను యూరియా, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో డ్రిప్ ద్వారా అందించాలి. డ్రిప్ ద్వారా 10–15 లీ. నీరివ్వాలి. నాటిన తర్వాత 3, 6 నెలలకు నత్రజని ఎరువు వేయాలి. వాస్తవానికి మునగ మొక్కలకు ఎక్కువ ఎరువులు అవసరం ఉండదు. జీవన ఎరువులు కూడా వాడితే నేల సారం, నేల ఆరోగ్యం పెరిగి తెగుళ్ళు రాకుండా ఉంటాయి. బొంత పురుగులతో జాగ్రత్తమునగ కాండంపై బొంత పురుగులు గుంపులుగా చేరి, బెరడును తొలిచి తింటాయి. ఆకులను తొలిచేస్తాయి. దీంతో ఆకు విపరీతంగా రాలిపోతుంది. ఈ సమయంలో పురుగు గుడ్లను, లార్వాలను ఏరివేయాలి. వర్షాల తర్వాత పెద్ద పురుగులను నివారించడానికి హెక్టారుకు ఒక దీపపు ఎరను ఉంచాలి. వేపనూనె మందు ద్రావణం పిచికారీ చేస్తే మొక్కలపై పురుగులకు వికర్షకాలుగా పనిచేస్తాయి. ఈ పంటలతో మునగను కలపొద్దుఆయిల్ పామ్, పత్తి, కూరగాయ పంటల్లో అంతర పంటగా వేస్తే మునగ మొక్కలు ఎరువులు, నీరు ఎక్కువగా అంది చాలా ఏపుగా పెరుగుతాయి. కానీ, పూలు, కాయలు ఆలస్యంగా రావడం స్పష్టంగా గుర్తించాం. కాబట్టి, అంతర పంటగా వేసినప్పుడు మునగ మొక్కలకు ఎక్కువ నీరు, ఎరువులు అందకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువ చీడపీడలు ఆశించే టమాటా, వంగ, మిర్చి పంటలను మునగలో అంతర పంటలుగా వేసుకోకూడదు. ఎరువులు, సస్యరక్షణ చర్యలు తక్కువ అవసరమయ్యే కూరగాయ పంటలను మాత్రమే వేసుకోవాలి. లేకపోతే మునగ దిగుబడి తగ్గిపోతుంది. పొలంలో మురుగు నీరు చేరకుండా చూసుకోవాలి.ఇదీ చదవండి: కొత్తకోడలిపై అమానుషం, గదిలో బంధించి పామునువదిలారుకత్తిరించిన 4–5 నెలల్లో మళ్లీ కాపుమునగ నాటిన మొదట్లో ప్రతి 2 నెలలకోసారి (6 నెలల్లో 3 సార్లు) విధిగా కొమ్మలు కత్తిరిస్తే.. కొమ్మలు గుబురుగా వచ్చి పూత, కాయల దిగుబడి ఎక్కువగా వస్తుంది. పక్క కొమ్మలు రాకుండా ఏపుగా బాగా ఎత్తు పెరిగితే పూత సరిగ్గా రాదు. భారీ వర్షాలు, ఈదురు గాలులకు మొక్కలు పక్కకు పడిపోయి విరిగిపోతాయి. మొదటి కాయ కోత తర్వాత భూమట్టం నుంచి 90 సెం.మీ. ఎత్తులో మొక్క కాండం, కొమ్మలను కత్తిరించాలి. దీంతో 4–5 నెలల్లో చెట్టు మళ్లీ కాపుకొస్తుంది. మూడు సంవత్సరాల వరకు ఇలా 4–5 నెలల కొకసారి కార్సి పంటలను తీసుకోవచ్చు. కత్తిరించిన వెంటనే మొక్కకు 45, 15,30గ్రాముల చొప్పున నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువులు వేయాలి. 30 గ్రాముల చొప్పున నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువులు వేయాలి. ఏటా 25 కిలోల చొప్పున బాగా చివికిన పశువుల ఎరువు వేయాలి. మొక్కకు 150 కాయలుఒక ఎకరానికి 1,000 మొక్కలు నాటితే ప్రతి మొక్కకు కనీసం 150 కాయల చొప్పున 1,50,000 కాయలు కాస్తాయి. రూపాయికి 2 కాయల చొప్పున (ఒక కేజీకి రూ.5) స్థానికంగా అమ్మితే.. ఎకరానికి ఏడాదికి రూ.75,000 ఆదాయం వస్తుంది. మునగ ఆకులను కోసి ఎండ బెట్టి పొడి చేసి అమ్మొచ్చు. మునగ గింజలు/నూనె ద్వారా అదనపు ఆదాయం వస్తుంది.మునగ ప్రకృతి సేద్యం ఇలా..మునగ పంటను ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేస్తే ఖర్చులు తగ్గి, నేల ఆరోగ్యం మెరుగుపడి, మంచి దిగుబడులు వస్తాయి. ప్రకృతి వ్యవసాయ పద్ధతి మునగ సాగుకు బాగా అనుకూలం. భూమిని లోతుగా దున్ని సూర్య కాంతికి ఎండబెట్టాలి. గోతులు తవ్వి, ఎండిన ఆకుల చెత్త, పశువుల ఎరువు, ఘనజీవామృతం లేదా వర్మీ కంపోస్ట్ కలిపి గోతులను నింపాలి. సేంద్రియంగా సాగు చేసిన విత్తనాలను మాత్రమే వాడాలి. విత్తనాలను బీజామృతంలో శుద్ధి చేసిన 24 గంటల తర్వాత విత్తాలి. మొక్కలకు జీవామృతం లేదా గోమూత్ర ద్రావణం వాడాలి. ద్రవ జీవామృతాన్ని 15 రోజులకు ఒకసారి ఇస్తూ ఉండాలి. డ్రిప్ ద్వారా నీరివ్వాలి. వర్షాకాలంలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. వేపనూనె, అగ్ని అస్త్రం, బ్రహ్మాస్త్రం వంటి కషాయాలను తయారు చేసి పిచికారీ చేయాలి. పచ్చి రొట్ట పంటలను పెంచి, కత్తిరించి, మొక్కల మొదళ్ల చుట్టూ మల్చింగ్గా వెయ్యాలి. కలుపు సమస్య తగ్గుతుంది. ఉత్పత్తి ఖర్చు 30–40% తగ్గుతుంది. ప్రకృతి వ్యవసాయంలో పండించిన మునగ కాయలు రుచిగా, పోషకాలు అధికంగా ఉండి, ఎగుమతులకు అనుకూలంగా ఉంటాయి.ఇతర వివరాలకు.. డా. టి. భరత్ – 97005 49754 -
గతి తప్పిన జలచక్రం!
ప్రపంచ జలచక్రం గతి తప్పింది. 2024లో ఇది మరింత అస్తవ్యస్తమైంది. గత 175 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు 1.55 డిగ్రీల సెల్సియస్ మేరకు పెరగటంతో వాతావరణంలో అసమతుల్యత పెరిగిపోయింది. ఇటు కుంభవృష్టి, అటు కరువులు విరుచుకుపడటంతో మూడింట రెండొంతుల నదులు చుక్క నీరు లేకుండా ఎండిపోయాయి లేదా విపరీతమైన వరదలతో సతమతమయ్యాయి. అతివృష్టి, అనావృష్టి వల్ల వల్ల ప్రజలు గతంలో ఎన్నడూ లేని విధంగా 2024లో తీవ్రస్థాయిలో కష్టాలపాలయ్యారని ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఓ) తాజా నివేదికలో వెల్లడించింది. – సాక్షి, సాగుబడిఅసాధారణ నీటి కష్టాల వల్ల.. ఆహార కొరత, ధరల పెరుగుదల, సంఘర్షణలు, వలసలు పెరిగాయని 41 దేశాల సమాచారాన్ని క్రోడీకరించిన ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఓ) తాజా నివేదిక వివరించింది. ఐక్యరాజ్యసమితికి అనుబంధ సంస్థ అయిన డబ్ల్యూఎంఓ ఏటా ప్రపంచ జల వనరులపై నివేదికను వెలువరిస్తుంటుంది. నీటి వనరులపై ప్రజలు, పాలకులు, శాస్త్రవేత్తలకు దిశానిర్దేశం చేస్తుంది.కరువు కరాళ నృత్యంఅతి తీవ్రమైన నీటి సమస్యలతో ప్రపంచ జల చక్రం పూర్తిగా గతి తప్పింది. నదులు, రిజర్వాయర్లు, సరస్సులు, భూగర్భ జలాలు, హిమానీ నదాలన్నిటిలోనూ ఈ అసాధారణ స్థితిగతులు కనిపించాయి. ఆఫ్రికా, యూరప్, ఆసియా దేశాల్లో వరదలు పొటెత్తగా.. దక్షిణ అమెరికా, ఆఫ్రికా దక్షిణ ప్రాంతంలో తీవ్ర కరువు కరాళ నృత్యం చేసింది. హిమానీ నదాల్లో మంచు నిల్వలు 450 గిగా టన్నుల (ఒక గిగా టన్ను అంటే లక్ష కోట్ల కిలోలు) మేరకు అత్యధికంగా కరగటం వరుసగా ఇది మూడో సంవత్సరం. ఆకస్మిక వరదలతో పాటు దీర్ఘకాలిక నీటి అభద్రతకు ఇది దారితీస్తుంది. ఈ నీటితో 1.2 మిల్లీమీటర్ల మేరకు సముద్రాల నీటి మట్టాలు పెరిగాయి. వరుసగా ఆరో ఏడాదినీటి చక్రం అస్తవ్యస్తం కావటం ఇదే మొదటిసారి కాదు. ఇలా జరగడం వరుసగా ఆరో ఏడాది. ప్రకృతి వైపరీత్యాల ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు, ప్రభుత్వాలకు వేల కోట్ల డాలర్ల మేరకు నష్టం జరిగింది. పంట దిగుబడులు నష్టపోయారు. ధరలు పెరిగిపోయాయి. ఆహార కొరత పెరిగింది. ఉద్రిక్తతలు పెరిగాయి. పొట్ట కూటికోసం వలస పోవాల్సిన దుస్థితి మరింతగా పెరిగింది. గత ఏడాది 40 శాతం నదుల్లో మాత్రమే.. నీటి లభ్యత ఉండాల్సినంత సాధారణంగా ఉంది. మిగతా 60 శాతం నదుల్లో అతి కరువు లేదా అతి వరద పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఈ రెండు తీవ్ర పరిస్థితులు నెలకొన్న విచిత్ర స్థితి ఏర్పడింది. మనదేశంలోనూ..ఉత్తర భారతంలో అతివృష్టి కారణంగా భూగర్భ జలాల్లో 2023తో పోల్చితే వృద్ధి కనిపించింది. అయితే, వాయవ్య ప్రాంతాల్లో కొన్ని చోట్ల మాత్రం కరువు నెలకొంది. భారత్, ఆగ్నేయాసియా ప్రాంతాల్లో రిజర్వాయర్లలోకి చాలా ఎక్కువ నీరు చేరింది. గంగ, గోదావరి, కృష్ణా తదితర నదులు సాధారణం కన్నా ఎక్కువగా ఉప్పొంగాయి. జూలై 30న కేరళలో ఆకస్మిక వరదలు విరుచుకుపడ్డాయి. ఇందులో 385 మంది భారతీయులు చనిపోయారు. 40 లక్షల మంది నిరాశ్రయులుఅమెజాన్ నదీ పరివాహక ప్రాంతంలో తీవ్ర కరువు వచ్చింది. దక్షిణ అమెరికాలో, ముఖ్యంగా అమెజాన్ బేసిన్లలో మట్టిలో తేమ బాగా తగ్గింది. సెంట్రల్ యూరప్‌లో అందుకు భిన్నంగా నేలలు అతి తేమగా మారాయి.» సెంట్రల్ యూరప్, రష్యా, పాకిస్తాన్లలో పెను వరదలు ముంచెత్తాయి. » ఆఫ్రికా ట్రాపికల్ జోన్లో వరదలకు 2,500 మంది చనిపోగా, 40 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. » దుబాయ్‌లో 75 ఏళ్లలో ఎన్నడూ ఎరుగనంత వర్షపాతం నమోదైంది. అస్తవ్యస్తం జలచక్రం నీరే జీవకోటికి ప్రాణాధారం. ఆర్థిక వ్యవస్థలకు నీరే ఇంధనం. పర్యావరణానికీ నీరే ప్రాణం. అయితే, అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఈ జలచక్రం అస్తవ్యస్తమైంది. జలవనరులు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఒత్తిడికి గురై విపత్తులకు కారణమవుతున్నాయి. ప్రాణాధారమైన ఆ నీరే ఉపద్రవాలకు కారణమై ప్రజల ప్రాణాలను, ఆస్తులను, జీవనోపాధులను కబళిస్తోంది. ఇది మౌలిక సదుపాయాలు, వ్యవసాయం, ఇంధనం, ఆరోగ్యం, ఆర్థిక రంగాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపింది. జలచక్రం ఎంత అస్తవ్యస్తంగా మారిపోయిందో 2024 నివేదిక మనకు తెలియజñ ప్తోంది. దీనిపై మరింత శ్రద్ధగా గణాంకాలు సేకరించాలి. జరుగుతున్నదేమిటో సరిగ్గా అంచనా వెయ్యలేకపోతే దాన్ని మార్చలేం కదా! – సెలెస్టె సాలో, ప్రధాన కార్యదర్శి, ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఓ) -
సౌర విద్యుత్‌తో నడిచే రైస్ మిల్లు..!
వరి, చిరుధాన్యాలు పండించే రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాలను అయినకాడికి అమ్మేసుకుంటే మిగిలేది అరకొర లాభాలు లేదా నికర నష్టాలే! అవే ధాన్యాలను కొని, మరపట్టించి అమ్ముకునే వ్యాపారులు బాగుపడతారు. రైతే ఈ పని కూడా చేసుకుంటే నికరంగా లాభాలు పొందడానికి అవకాశం ఉందని రుజువు చేసే విజయగాథలు ఎక్కడ వెతికినా కనిపిస్తాయి. అయితే, మన దేశంలో వ్యవసాయం చేసే వారిలో 80–90 శాతం మంది చిన్న, సన్నకారు రైతులు లేదా కౌలు రైతులే. ధాన్యాలను పండించి అలాగే అమ్మేసుకోవటం వల్ల రావాల్సినంత ఆదాయం రావటం లేదు. ఇటువంటి రైతుల నికరాదాయం పెరగాలంటే ధాన్యాన్ని బియ్యంగా మార్చి అమ్మాలి. పెద్ద రైస్ మిల్లులు చాలా దూరంలో ఉంటాయి. రవాణా ఖర్చు ఎక్కువ అవుతుంది. కాబట్టి అంత లాభదాయకం కాదు. వారికి కావాల్సింది చిన్న రైస్ మిల్లు. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే చిన్న మిల్లులు కావాలి. విద్యుత్తు కట్ ఎక్కువగా ఉంటుంది ఆ ప్రాంతాల్లో. అందుకే వారికి కావాల్సింది సౌర విద్యుత్తుతో నడిచే చిన్న/మధ్య తరహా రైస్ మిల్లు!చిన్న, సన్నకారు రైతుల ఆదాయం పెంచడానికి ఇదొక్కటే మార్గమని సరిగ్గా గుర్తించిన బెంగళూరుకు చెందిన ‘సెమా ఆల్టో’ అనే వ్యాపార సంస్థ సౌర విద్యుత్తుతో నడిచే చిన్న రైస్ మిల్లును, ఇతర అనుబంధ యంత్రాలను రూపొందించింది. సెల్కో ఫౌండేషన్ సహకారంతో రైతులకు అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే 150 సౌర విద్యుత్తుతో నడిచే చిన్న రైస్ మిల్లులను దక్షిణాది రాష్ట్రాల్లో నెలకొల్పి సత్ఫలితాలు సాధిస్తోంది. సౌరశక్తితో పనిచేసే ఆవిష్కరణలతో వ్యవసాయోత్పత్తుల వ్యాపార చిత్రంలో గుణాత్మక మార్పునకు దోహదం చేస్తోందీ సంస్థ. సోలార్ మినీ రైస్ మిల్లుల ద్వారా రైతులకు (ధాన్యం: బియ్యం నిష్పత్తి) నికర బియ్యం దిగుబడి 30 శాతం పెరిగింది. ఆదాయం రెట్టింపైందని సెమ ఆల్టో చెబుతోంది. ప్రకృతిని కలుషితం చేయని సౌర విద్యుత్తు ద్వారా ఈ సంస్థ గ్రామీణ జీవనోపాధిని విజయవంతంగా పునర్నిర్మిస్తోంది.2017లో ప్రారంభం‘సెమ(ఎస్ఈఎంఏ)’ అంటే ‘సోలార్ పవర్డ్ ఎఫిషియంట్ మెషినరీ ఫర్ అగ్రికల్చర్’. వరి ధాన్యం, చిరుధాన్యాలను మరపట్టటం, బియ్యాన్ని మార్కెట్‌కు అందించడానికి అవసరమైన అనేక పనులు చెయ్యటం ఒక్క యంత్రంతో అవ్వదు. ధాన్యాలను శుభ్రపరచటం, మర పట్టటం, పాలిష్ చెయ్యటం, గ్రేడింగ్ వరకు మొత్తం 4 వేర్వేరు యంత్రాలు అందుకు కావాలి. వీటన్నిటినీ సెమ ఆల్టో సంస్థ రూపొందించింది. సౌరశక్తితో పనిచేసే మల్టీ–స్టేజ్ మినీ మిల్లు ఎండ్–టు–ఎండ్ బియ్యం ప్రాసెసింగ్‌ను నిర్వహిస్తోంది. 3.7–5 కిలోవాట్ల విద్యుత్తుతో ఇది నడుస్తుంది. 2017లో బెంగళూరులో అసద్ జాఫర్ ఈ కంపెనీని ప్రారంభించారు. తక్కువ ఖర్చుతో గ్రామీణులు తమ వ్యవసాయోత్పత్తులను రూపం మార్చి అధిక ధరకు విక్రయించుకునే మార్గాన్ని సుగమం చెయ్యటమే ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో ఇప్పటికే సెమ రైస్ మిల్లులు 150 యూనిట్ల వరకు ఏర్పాటయ్యాయి.65% రికవరీ రేటుపాతకాలపు డీజిల్‌తో నడిచే పెద్ద రైస్ మిల్లుల్లో 500 కిలోల ధాన్యాన్ని మరపట్టిస్తే 275–300 కిలోల బియ్యం వస్తే, ఇప్పుడు అది 320–350 కిలోలకు పెరిగింది. ఈ సోలార్ మినీ రైస్ మిల్లు ఏర్పాటు చేసుకోవటం ద్వారా నికర బియ్యం దిగుబడి 30% పెరిగింది. రవాణా ఖర్చులు తగ్గాయి. ఆదాయం రెట్టింపైంది. పదెకరాల్లో వరి పండించినా అప్పట్లో నా కుటుంబాన్ని పోషించుకోవటానికి కూడా ఆదాయం సరి΄ోయేది కాదు. ఇప్పుడు ఈ మిల్లుతో బియ్యం నాణ్యత, రికవరీ రేటు, ఆదాయం పెరిగింది..’ అని తమిళనాడుకు చెందిన సేంద్రియ వరి రైతు గోపి చెబుతున్నారు. సోలార్ మినీ రైస్ మిల్లులో 100 కిలోల ధాన్యాన్ని మరపట్టిస్తే 65 కిలోల బియ్యం రైతుల చేతికి వస్తున్నాయి. మిల్లు సామర్థ్యం మెరుగ్గా ఉండటం వల్ల రైతులకు ఎక్కువ బియ్యం వస్తున్నాయి, వృథా తగ్గింది. ధాన్యాన్ని కిలో రూ. 45–50కి అమ్మే రైతు గోపి ఇప్పుడు సోలార్ రైస్ మిల్లులో మరపట్టి బియ్యాన్ని రూ. 80–100లకు కిలో అమ్ముతున్నారు. తద్వారా ఆదాయం రెట్టింపైందని గోపి తెలిపారు. వరి ధాన్యంతోపాటు చిరుధాన్యాలు, మొక్కజొన్నలు, గోధుమలను కూడా సౌర రైస్ మిల్లుల్లో మరపట్టే అవకాశం ఉండటం విశేషం.సోలార్ రైస్ మిల్లులను రైతుల దగ్గరకు తీసుకెళ్లే కృషిలో సీఈఈడబ్లు్య, విల్‌గ్రో సంస్థలతో కలసి సెమ ఆల్టో పనిచేస్తోంది. ఆస్తిపాస్తులు లేని పేద రైతులకు రుణ సదుపాయం కల్పించడం ద్వారా అందుబాటు బడ్జెట్లో ఈ మిల్లులను అందిస్తున్నారు. ప్రధాన మంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ స్కీమ్ వంటి ప్రభుత్వ పథకాలతో ఇటువంటి యంత్రాలను అనుసంధానం చేయగలిగితే రుణ సంబంధిత సబ్సిడీలను గ్రామీణ చిరువ్యాపారులకు అందించటం సాధ్యమవుతుందని ఆశిస్తున్నారు.(చదవండి: పొలం పంటల కన్నా ఇంటి పంటలతో ప్రయోజనాలున్నాయా?) -
sagubadi: గడ్డి సాగుతోనే అధికాదాయం!
రైతు కుటుంబాలకు పంటలపై వచ్చే ఆదాయంతో పోల్చితే, పశుపోషణ ద్వారా సమకూరే నిరంతర ఆదాయం చాలా ఎక్కువ. చిన్న, సన్నకారు రైతులు తమ పశువులకు గడ్డిని, దాణాను సరిపడా అందించలేకపోతు న్నారు. అందువల్లే మన దేశంలో పశువుల ఉత్పాదకత బాగా తక్కువగా ఉంది. పశువుల్ని పెంచే ప్రతి రైతూ కొన్ని సెంట్లు/ కొన్ని కుంటల్లో అయినా గడ్డిని కూడా పెంచుకోవాలి. సైలేజి గడ్డి, దాణాలను తానే తయారు చేసుకొని పశువులను మేపుకుంటే పశుపోషకులకు అధికాదాయంతో పాటు, ప్రతిరోజూ ఆదాయం వస్తుందని గుర్తించాలని సూచిస్తున్నారు పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ (పీవీఎన్ఆర్టీవీయూ) వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ మంథా జ్ఞాన ప్రకాశ్. వాతావరణ మార్పుల నుంచి జన్యుపరమైన అభివృద్ధి వరకు అనేక కీలకాంశాలపై ఆయన ఇటీవల ‘సాక్షి సాగుబడి’తో ముచ్చటించారు. ఇంటర్వ్యూలో ముఖ్యాంశాలు..క్లైమేట్ ఛేంజ్ ప్రతికూల పరిస్థితులు పశుపోషణపై ఎటువంటి ప్రభావం చూపుతున్నాయి? ప్రొ. జ్ఞాన ప్రకాశ్: క్లైమేట్ ఛేంజ్ సెగ ఇప్పుడు మనకు విపరీతంగా అనుభవంలోకి వస్తోంది. సాధారణ ప్రజలకు కూడా ఈ సమస్య ఇప్పుడు అర్థమవుతోంది. ఇక్కడ కుండపోత వర్షాలు, టెక్సాస్‌లో కరువు, మరోచోట అధిక ఉష్ణంతో మంచు కరిగిపోవటం ఇవన్నీ క్లైమేట్ ఛేంజ్ వల్ల జరుగుతున్నవే. పశువుకు గానీ.. మనిషికి గానీ.. ప్రతి ప్రాణికీ అనువైన ఉష్ణోగ్రత రేంజ్ ఒకటి ఉంటుంది. ఆ కంఫర్ట్ జోన్లోనే అది సరిగ్గా పనిచేయగలదు. పాలు, మాంసం వంట ఉత్పత్తుల్ని సరిగ్గా ఇవ్వగలదు. కానీ, ఉష్ణోగ్రత అంతకన్నా పెరిగినప్పుడు దాని జీవక్రియలన్నీ ఇబ్బంది పడతాయి. రావలసినటు వంటి ఉత్పత్తి రాదు. ఇంకొకటేమిటంటే.. పశుగ్రాసం కూడా పొలాల్లో సరిగ్గా పెరగదు. రోగకారక క్రిముల తీవ్రత పెరుగుతుంది. ఎప్పుడో పోయిన క్రిములు కూడా మళ్లీ సమస్య అయ్యే అవకాశం ఉంటుంది. క్లైమేట్ ఛేంజ్ నుంచి మన జీవరాశిని, గడ్డి జాతులను పరిరక్షించుకోవాల్సి ఉంటుంది. భూతాపోన్నతి ప్రతికూలతల నుంచి పశు సంపదను ఎలా రక్షించుకోగలం?ప్రొ. జ్ఞాన ప్రకాశ్: అధిక ఉష్ణోగ్రతను తట్టుకోవటానికి ఉపయోగపడే కొన్ని రకాల జన్యువులు ప్రతి ప్రాణిలో ఉంటాయి. ఆ జన్యువులపై పరిశోధనలు చేసి గుర్తించి, జన్యుపరంగా అభివృద్ధి చేయటం ద్వారా పెరిగిన ఉష్ణోగ్రతల్లోనూ అవి మంచి ఉత్పాదకతను ఇచ్చేలా మార్చుకోవచ్చు. 37 డిగ్రీల సెల్సియస్ దగ్గర కంఫర్టబుల్‌గా ఉండే జంతువును 39 డిగ్రీల దగ్గర కూడా కంఫర్టబుల్‌గా ఉండేలా జన్యుపరంగా అభివృద్ధితో చేసుకోవచ్చు. అసాధారణ ఉష్ణోగ్రతలతో ఏయే పశుజాతులకు ఎక్కువ ఇబ్బంది?ప్రొ. జ్ఞాన ప్రకాశ్: వాతావరణంలో ఉష్ణోగ్రతలు పెరగ్గానే ముందు గేదెలకు ఎక్కువ ప్రాబ్లం వస్తుంది. పునరుత్పత్తి సమస్యలు పెరుగుతాయి. దేశవాళీ ఆవుల కన్నా చల్లటి విదేశాల నుంచి తెచ్చిన జాతుల ఆవులకు పెరిగిన ఉష్ణోగ్రతల్లో మరీ ఇబ్బంది అవుతుంది. కాబట్టి, పెరుగుతున్న ఉష్ణోగ్రత ల్లోనూ సజావుగా బతకగలిగేలా మన గేదెలు, ఆవులు, మేకలు, గొర్రెల్లో జన్యుపరమైన సామర్థ్యం పెంపొందించుకోవాలి. భూతాపోన్నతికి పశువులు కూడా కారణం అవుతున్నాయా?ప్రొ. జ్ఞాన ప్రకాశ్: క్లైమేట్ ఛేంజ్ పెరగడానికి చాలా కారణాలు ఉన్నాయి. అందుకు పశువులు కూడా కారణం అవుతున్నాయి. ఆవులు, గేదెలు, గొర్రెలు.. వీటి కడుపులో సూక్ష్మజీవుల ద్వారా జరిగే జీర్ణప్రక్రియ (మైక్రోబియల్ ఫర్మంటేషన్) వల్ల మీథేన్ వాయువు వెలువడుతుంది. ఇది వాతావర ణాన్ని అధికంగా వేడెక్కించే వాయువు. ఈ సమస్య ను తగ్గించాలంటే.. పశువులకు పెట్టే దాణాను, గడ్డిని తక్కువ మీథేన్‌కు కారణమయ్యేలా మార్చాలి. దాణాలో, పశువు కడుపులోని సూక్ష్మ జీవరాశిని కూడా తక్కువ మీథేన్ ఉత్పత్తి చేసేలా మార్పు చేసుకోవాలి. తద్వారా భూతాపం పెరుగుదలను కొంత మేరకు తగ్గించుకోవచ్చు. పేడ నుంచి కూడా ఉద్గారాలు..?ప్రొ. జ్ఞాన ప్రకాశ్: పశువుల పేడ వల్ల కూడా వాతావరణంలో మీథేన్ పెరుగుతోంది. దీన్ని కూడా అరికట్టాలి. 2–3 పశువులను పెంచుకునే చిన్న, సన్నకారు రైతులు కూడా మీథేన్‌ను తమ స్థాయిలో నియంత్రించగల పద్ధతులు ఉన్నాయి. పచ్చి పేడను ఆరుబయట వదిలేస్తేనే సమస్య. ఒక చిన్న గుంత తవ్వి అందులో రోజూ వేసి, గుంత నిండిన తర్వాత పైన కొన్ని ఎండు ఆకులు వేసి కప్పిపెట్టాలి. 60 రోజుల్లో మంచి కంపోస్టు ఎరువు తయారవుతుంది. వర్మీకంపోస్టు కూడా తయారు చేసుకోవచ్చు. ఇలా చేస్తే మీథేన్ చాలా వరకు తగ్గుతుంది. ఈ దిశగా పరిశోధనలు జరుగుతున్నాయా..?ప్రొ. జ్ఞాన ప్రకాశ్: వాతావరణ మార్పులకు అనుకూలంగా వ్యవసాయం చేయడానికి సంబంధించి ‘నిక్ర’ పేరుతో ఐసీఏఆర్ పరిశోధనా ప్రాజెక్టుల్ని చేపట్టింది. వ్యవసాయం, అనుబంధ రంగాలన్నిటికి సంబంధించి దేశవ్యాప్తంగా అనేక సంస్థల్లో చేపట్టిన పరిశోధన ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి. మన పశువుల ఉత్పాదకత తక్కువ ఎందుకని?ప్రొ. జ్ఞాన ప్రకాశ్: మన దేశంలో పాడి పశువు సగటు పాల దిగుబడి ఒక ఈతలో 1,500–1,700 లీటర్లయితే, ప్రపంచ సగటు 2,700 లీటర్లు. నెదర్లాండ్స్, యూకే, యూఎస్‌లలో ఇంకా చాలా ఎక్కువ. ముఖ్యంగా మన దగ్గర రైతులు చాలా మంది చిన్న, సన్నకారు రైతులు. వీళ్లు తెలిసీ తెలియక, పశువులను సరిగ్గా మేపలేకపోతున్నారు. వాటికి పోషణ సరిగ్గా అందటం లేదు. ఆ దేశాల్లో తక్కువ ఉష్ణోగ్రతలే కారణమా?ప్రొ. జ్ఞాన ప్రకాశ్: ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండటం ఒక్కటే కారణం కాదు. అంతకన్నా ముఖ్యమైనది జెనెటిక్ ఇంప్రూవ్మెంట్. అక్కడి పశువులను వాళ్లు జన్యుపరంగా బాగా అభివృద్ధి చేసుకోగలిగారు. మనం చేసుకోలేకపోయాం. జన్యుమార్పిడి(జీఎం) కూడా అవసరమా?ప్రొ. జ్ఞాన ప్రకాశ్: జెనెటిక్ ఇంప్రూవ్మెంట్ చాలు. మామూలుగా మన పశువుల్లో ఉన్న మంచి గుణాలున్న జన్యువులనే పెంపొందిస్తాం ఆ జీవిలో. జెనెటిక్ మాడిఫికేషన్ అంటే జంతువుల్లోని జన్యువు లను మార్చేస్తారు. ఒక జన్యువును తీయటం, వేరే దాన్ని పెట్టడం అనేది జెనెటిక్ మాడిఫికేషన్ అంటారు. అది రిస్క్‌తో కూడిన పని. అవసరం లేదు. జీన్ ఎడిటింగ్‌ను ఇప్పుడిప్పుడే వాడుతు న్నారు. ఇవి చాలా వివాదాస్పద అంశాలు.ప్రత్యేక బ్రీడ్ల అభివృద్ధికి కృషి జరుగుతోందా?ప్రొ. జ్ఞాన ప్రకాశ్: అధిక ఉష్ణోగ్రతలను తట్టుకోవటంలో దేశీ పశువులు మెరుగ్గా ఉంటాయి. అధిక ఉత్పాదకత కోసం సంకరజాతి పశువులను రూపొందించుకున్నాం. హీట్ టాలరెంట్ జన్యువు లను ఇప్పటికే శాస్త్రవేత్తలు గుర్తించారు. జెనెటిక్ ఇంప్రూవ్‌మెంట్‌పై పరిశోధనలు కొనసాగుతు న్నాయి. పంటల్లో కొత్త వంగడాలు తయారు చేసినంత సులభంగా పశువుల్లో జన్యు అభివృద్ధి జరగదు. పంట కాలం ఆర్నెల్లయితే పశువు ఒక తరం 7–8 ఏళ్లు పడుతుంది. సేంద్రియ పశుపోషణకు ప్రత్యేక బ్రీడ్స్ అవసరమా?ప్రొ. జ్ఞాన ప్రకాశ్: పశువుల్లో ఆర్గానిక్ బ్రీడ్స్ అంటూ ఏమీ ఉండవు. కొత్త బ్రీడ్ సహజంగా ఎవాల్వ్ కావటానికి కనీసం వందేళ్లు (10–12 తరాలు) పడుతుంది. ఒంగోలు తదితర పశుజాతులన్నీ అనాదిగా ఆర్గానిక్‌గా ఎవాల్వ్ అయినవే. అయితే, పశువుల పెంపకమే ఈ కాలంలో సూక్ష్మ కుటుంబాలకు భారంగా మారింది. గ్రామాల్లో సేంద్రియ ఎరువుల లభ్యత కూడా అంత తేలిక కాదు. ప్రత్యేకంగా గడ్డి పెంపక క్షేత్రాలు నెలకొల్పినప్పుడే గడ్డి కొరత తీరి, పశుపోషణ సజావుగా కొనసాగుతుంది. అప్పుడే పెరిగే జనాభా అవసరాలకు తగిన పాలు, మాంసం లభిస్తాయి. ఆర్గానిక్ పశు ఉత్పత్తులకు విదేశాల్లో గిరాకీ ఉంటుందా?ప్రొ. జ్ఞాన ప్రకాశ్: అభివృద్ధి చెందిన దేశాల్లో నిబంధనలు కఠినంగా ఉంటాయి. యాంటీబయాటిక్ రెసిడ్యూస్, థెరప్యూటిక్ రెసిడ్యూస్ లేని ఆర్గానిక్ ఉత్పత్తుల ఎగుమతికి కొన్ని పద్ధతులున్నాయి. కొన్ని యాంటీబయాటిక్స్‌ను 2 నెలల ముందే ఆపెయ్యాలి. కొన్నిటిని ఒక రోజు ముందు వరకు ఇవ్వవచ్చు. ఒక్కో మందుకు ఒక్కొక్క టైమ్ ఉంటుంది. పశువులు పెంచే రైతులకున్న ముఖ్యమైన సమస్య ఏమిటి? ప్రొ. జ్ఞాన ప్రకాశ్: గడ్డి భూములు, అడవులు తగ్గిపోవటమే పెద్ద సమస్య. అందువల్ల పశువులను రోజంతా కట్టేసి పెంచాల్సి వస్తోంది. అందువల్ల దాణా, పచ్చి మేత మన పశువులకు సరిపోను అందటం లేదు. పశువుకు ఇచ్చే ఆహారంలో మూడింట రెండొంతులు పచ్చి గడ్డి, ఒక వంతు దాణా కలిపి ఇస్తే ఆరోగ్యం. అయితే, చిన్న, సన్నకారు రైతులు, భూమి లేని రైతులు దాణా, పచ్చిమేత చాలినంత పెట్టలేకపోతున్నారు. పశువుల ఉత్పాదకత తగ్గిపోతోంది. పరిష్కారం ఏమిటి?ప్రొ. జ్ఞాన ప్రకాశ్: రైతులు కొన్ని సెంట్లు/గుంటల్లో అయినా గడ్డి పెంచుకోవాలి. పాడిపై రైతులకు ఏడాది పొడవునా ఆదాయం వస్తుంది. ఉన్న కొద్దిపాటి పొలంలో ఈ పశువుల కోసం పచ్చి మేతను పండించుకుంటే వచ్చే ఆదాయం కన్నా.. ఆ పొలంలో ఇతర పంటలు వేస్తే వచ్చే ఆదాయం చాలా తక్కువని అధ్యయనాల్లో తేలింది. సైలేజీ గడ్డి, పంట వ్యర్థాలతో దాణాలను సొంతంగా తయారు చేసుకొని వాడుకోవాలి.ఇంటర్వ్యూ: పంతంగి రాంబాబుఫొటో: ఎస్.ఎస్. ఠాకూర్ -
పొలం పంటల కన్నా.. ఇంటి పంటలే బెటరా?
పంటలు అనగానే మనకు ఆరుబయట పొలంలో పండించే పంటలే (అవుట్డోర్ ఫార్మింగ్) గుర్తుకొస్తాయి. కానీ, ఆధునిక కాలంలో ఇండోర్ పంటలా (ఇంటి పంటలా), అవుట్డోర్ పంటలా అని వివరణ అడగాల్సిన పరిస్థితి. మేడపైన ఇంటి పంటలు, పెరటి తోటలు, వర్టికల్ గార్డెన్స్, పాలీహౌస్ పంటలు.. ఇలా అనేక రకాలుగా ఇవ్వాళ పంటలు పండించుకుంటున్నాం. వాతావరణ పరిస్థితులు ఆరుబయట అనుకూలంగా లేనప్పుడు పాలీహౌస్‌లు, భవంతుల్లో ప్రత్యేక వాతావరణ పరిస్థితులు కల్పించి మరీ సాగు చేస్తున్నాం. రూరల్ అగ్రికల్చర్, అర్బన్ అగ్రికల్చర్‌గా కూడా విడమర్చి మాట్లాడుకుంటున్నాం. అయితే, ఇండోర్ ఫార్మింగ్‌లో (Indoor Farming) చాలా విషయాలను మనం నియంత్రించగలం కాబట్టి ఆరుబయట సాగుతో పోల్చితే అన్నీ మెరుగ్గానే ఉంటాయన్న గ్యారంటీ ఏమీలేదు. అక్కడ ఉండే ఇబ్బందులు అక్కడా ఉంటాయి. అయితే, ఇండోర్ ఫార్మింగ్ పద్ధతుల్లో ఏయే ఆహార భద్రతా చిక్కులొస్తాయి? సాధారణ వ్యవసాయానికి దీనికీ ఏమి తేడాలుంటాయి? అనే అంశంపై చర్చ చాలాకాలంగానే ఉన్నప్పటికీ అధ్యయనాల, ప్రమాణాల లోపం వెంటాడుతూ ఉంది. ఈ కొరత తీర్చడానికి ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ (యూఎన్ ఎఫ్ఏవో) ఇటీవల ఒక నివేదికను వెలువరించింది. ఆరుబయట పంటలు పండించటంతో పోల్చితే ఇంట్లో పండించే పంటలతో ప్రయోజనాలేమి ఉన్నాయి? ఏమి జాగ్రత్తలు తీసుకోవాలి?.. ఇటువంటి ఆసక్తికరమైన వివరాలను ఆ నివేదికలో చర్చించారు. వాటిని రేఖామాత్రంగా పరిశీలిద్దాం..ఆధునిక ఇండోర్ వ్యవసాయంతో ముడిపడి ఉన్న ఆహార భద్రత (Food Security) ప్రమాదాలు, నియంత్రణలపై మొట్టమొదటి సమగ్ర సమీక్షా నివేదికను ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏవో) నివేదికలో సాకల్యంగా చర్చించింది. ఇండోర్ వ్యవసాయం లేదా నియంత్రిత పర్యావరణ వ్యవసాయం (కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్ అగ్రికల్చర్ – సీఈఏ) వల్ల ఒనగూడే ప్రయోజనాలు అనేకం. స్థిరత్వంతో కూడిన ఉత్పత్తి, ఉత్పాదకత, వాతావరణ మార్పులకు అనుకూలత, ఆహార భద్రతను మెరుగుపరచడం వంటివాటిని ఎఫ్ఏవో ఈ జాబితాలో చేర్చింది.ప్రస్తుత రోజుల్లో, సాంప్రదాయకంగా ఆరుబయట పండించే ఆకుకూరలతో పాటు మైక్రోగ్రీన్, బేబీ లీఫ్ వంటి స్వల్పకాలిక పంటల ఇండోర్ వ్యవసాయమే వాణిజ్యపరంగా లాభదాయకంగా మారిందని నివేదిక చెబుతోంది. ప్రపంచవ్యాప్త పరిస్థితులు ముఖ్యంగా సంపన్న చలి ప్రాంత పాశ్చాత్య, ఐరోపా దేశాలను దృష్టిలో పెట్టుకొని చెప్పిన మాటగా దీన్ని మనం పరిగణించాలి. ఎందుకంటే.. మన దేశంలో ఇండోర్ వ్యవసాయం ఇంకా శైశవ దశలోనే ఉంది. ఈ పరిమితిలోనే ఈ నివేదికలోని అంశాలను పరిశీలిద్దాం.ఏ వ్యవసాయమైనా ఆరోగ్యదాయకమైన, రోగకారకం కాని భద్రమైన ఆహారోత్పత్తే లక్ష్యంగా సాగుతుంది. అయితే, సాంప్రదాయ వ్యవసాయం కంటే ఇండోర్ వ్యవసాయమే సులభంగా నిర్వహించదగిన ఆహార భద్రత ప్రమాదాలతో కూడి ఉంటుందని తరచుగా భావిస్తుంటారు. అయితే, ఇండోర్ పంటలకు సంబంధించిన ఆహార భద్రత సమస్యలు సాధారణంగా సాంప్రదాయ బహిరంగ వ్యవసాయంలో కనిపించే సమస్యల అంతటి తీవ్రంగానే ఉంటాయని ఎఫ్ఏవో నివేదిక (FAO Report) నొక్కి చెబుతోంది. విత్తనాలు, మట్టికి బదులుగా వాడే పదార్థాలు, నీటికి సంబంధించి సూక్ష్మక్రిములతో కూడిన కాలుష్య ప్రమాదాలు పొంచి ఉంటాయి. అలాగే మొలకల ఉత్పత్తిలోనూ సమస్య రావచ్చు.బహిరంగ వ్యవసాయంతో పోల్చినప్పుడు ఇండోర్ వ్యవసాయంలో అంతర్లీనంగా ఉన్న కొన్ని అనియంత్రిత కాలుష్య సమస్యలు ఉండవు. బహిరంగ వాతావరణంలో సూక్ష్మక్రిముల పోటీ, ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులు, ఎండ సోకటం వల్ల కొన్ని సహజ వ్యాధికారకాలు నశిస్తాయి. ఇండోర్ వ్యవసాయంలో వ్యాధికారకాలు ఎక్కువ కాలం సమస్యను సృష్టించే వీలుంటుంది. ఇందులో విత్తనాలు, నీరు, మట్టికి బదులుగా వాడే పదార్థాలు, ఎరువులు వంటి ఉత్పాదకాల జీవ భద్రతపై నియంత్రణకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి.ఇండోర్ వ్యవసాయంలో అధిక తేమ, నీటి ఆధారిత వ్యవస్థలు వాడతాం కాబట్టి సూక్ష్మక్రిములతో ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఇండోర్ వ్యవసాయంలో సూక్ష్మక్రిముల వల్ల వచ్చే ప్రమాదాలు రసాయనాలతో వచ్చే ప్రమాదాల కంటే చాలా విస్తృతంగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. అయినప్పటికీ, పర్యావరణ కాలుష్యం, పొలాస్టిక్ పరికరాల సంబంధిత పదార్థాల నుంచి వెలువడే కాలుష్యం వంటి రసాయన సమస్యలను కూడా నివేదిక పేర్కొంది.ఆర్థిక పోటీకి నిలబడితేనే భవిష్యత్తు‘ఇండోర్ వ్యవసాయం వాతావరణ మార్పుల్ని తట్టుకొని స్థిరమైన దిగుబడినిచ్చే విషయంలో గణనీయమైన సామర్థ్యాన్ని కలిగి ఉంది. కానీ ఈ సామర్థ్యాన్ని ఆచరణలో నిజం చేయడానికి బలమైన ఆహార భద్రతా పద్ధతులు, పర్యవేక్షణ చాలా అవసరం’ అని ఎఫ్ఏవో నివేదిక రూపుకల్పనలో కీలకంగా వ్యవహరించిన ఆహార భద్రతా అధికారి మసామి టకేచి అన్నారు.‘సాంప్రదాయ పంటల సాగుతో తక్కువ ఖర్చుతో ఉత్పత్తిని వెలువరించగలిగే విషయంలో ఆర్థికంగా పోటీకి నిలవగలగడమే ఇండోర్ వ్యవసాయం విజయానికి కీలకం’ అని డాక్టర్ కీత్ వారినర్ అన్నారు. ఈ నివేదికను రూపొందించిన బృందంలోని గ్వెల్ఫ్ విశ్వవిద్యాలయ నిపుణుల్లో కీత్ ఒకరు. ‘అదే సమయంలో, ఇండోర్ పొలాల లోపల నియంత్రిత వాతావరణ పరిస్థితులు వ్యాధికారక సూక్ష్మజీవుల మనుగడకు అనుకూలంగా ఉంటాయి. కాబట్టి అవి లోపలికి ప్రవేశించకుండా నిరోధించడమే తొలి ప్రాధాన్యతగా ఉండాలి. అప్రమత్తతకు నవీన ఆవిష్కరణలు తోడైతే ఇండోర్ వ్యవసాయం సురక్షితంగా, స్థిరంగా పెరుగుతుంది. భవిష్యత్తు బాగుంటుంది..’ అని డా. కీత్ వివరించారు.‘ఇండోర్ ఫార్మింగ్’కు పేర్లెన్నో!?ఇండోర్ వ్యవసాయాన్ని వివిధ రకాలుగా వ్యవహరిస్తున్నారు. ‘రక్షిత వ్యవసాయం‘ అనే పదంతో ‘ఇండోర్ ఫార్మింగ్’ను 13వ శతాబ్దంలో మొదటి సారి వాడారు. బయటి వాతావరణానికి దూరంగా ఉంచే సౌకర్యాల మధ్య పెరిగే మొక్కలనే అర్థంలో వాడారు. ఆ తర్వాత కాలంలో ‘ఇండోర్ వ్యవసాయం‘ అనే పదానికి ‘పట్టణ వ్యవసాయం‘, ‘మొక్కల కర్మాగారం‘, ‘గ్రీన్హౌస్‘, ‘హాట్‌హౌస్‘, ‘గ్లాస్‌హౌస్‘ వంటి అదనపు పదాలు తోడయ్యాయి. ఇవన్నీ పర్యాయపదాలుగా ఉపయోగించబడుతున్నాయి. ఇందులోని వివిధ పద్ధతులను, వాటి భాగాలను వివరించడానికి ఉపయోగించే పదాలను నిర్వచించాల్సిన అవసరం ఏర్పడింది.పట్టణ వ్యవసాయం: నగరాలు, పట్టణ ప్రాంతాలు, వాటి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆహారాన్ని పండించడం, ప్రాసెస్ చేయడం, పంపిణీ చేయడం.ఇండోర్ వ్యవసాయం: ఆరుబయట కాకుండా మూసివున్న వాతావరణంలో పంటలను పెంచే ఏవైనా పద్ధతులు. ఒక గదిలో మొక్కలను పెంచే వ్యవసాయ వ్యవస్థను వివరించేందుకు వాడే పదం.గ్రీన్హౌస్: గ్రీన్హౌస్ అనేది నియంత్రిత పర్యావరణ నిర్మాణం. ఇది ఉష్ణోగ్రత, సూర్యకాంతి వంటి పరిస్థితులను మారుస్తుంది. మొక్కల పెరుగుదలను సులభతరం చేస్తుంది, ముఖ్యంగా సహజ వాతావరణ పరిస్థితులు తక్కువ అనుకూలంగా ఉన్న వాతావరణాలలో దీన్ని వాడతారు. గ్లాస్‌హౌస్, పాలీ వినైల్ క్లోరైడ్ గ్రీన్హౌస్, పాలిథిలిన్ గ్రీన్హౌస్ ఇవన్నీ దీనికి పర్యాయపదాలే.చదవండి: ఒక్కసారి నాటు.. ఆరు సార్లు కోతలునియంత్రిత పర్యావరణ వ్యవసాయం: పట్టణ, పట్ణణాల చుట్టూ గలప్రాంతాల్లో ఆరుబయట, మట్టిలో గాని, మట్టిలేకుండా గాని చేసే వ్యవసాయం.మొక్కల కర్మాగారం: కృత్రిమ/సహజ/సౌర కాంతిని ఉపయోగించి అధిక నాణ్యత గల పంటలను నిరంతరం ఉత్పత్తి చేసే భవనం.– పంతంగి రాంబాబు సాక్షి సాగుబడి డెస్క్ -
sagubadi: గడ్డికి నిప్పు పెడితే ఏమవుతుందో తెలుసా?
పంట కోసిన తర్వాత గడ్డి లేదా కట్టెకు అక్కడే నిప్పు పెట్టేస్తుంటాం కదా.. పొగ వల్ల పర్యావరణ కాలుష్యం పెరుగుతుందని మనకు తెలుసు. అయితే, అంతకుమించి ఏమి నష్టం జరుగుతుందో మనకు తెలియదు. ‘సైన్స్ ఆఫ్ టోటల్ ఎన్విరాన్మెంట్’ జర్నల్‌లో ఇటీవల అచ్చయిన ఒక అధ్యయన పత్రం ఈ విషయాలను లోతుగా చర్చించింది. గడ్డిని కాల్చేస్తే ఆ భూమిలోని సూక్ష్మజీవరాశి జీవవైవిధ్యం నశించి, పొలం పర్యావరణ వ్యవస్థల సహజ క్రియలకు విఘాతం కలుగుతుందని ఈ అధ్యయనం వివరించింది. భారత్ సహా అనేక దేశాల్లోని పొలాల్లో గడ్డిని కాల్చటం వల్ల భూమికి, రైతుకు ఎలా నష్టం జరుగుతున్నదో తెలుసుకోవటానికి 250 అధ్యయన ఫలితాలను క్రోడీకరించి విశ్లేషించటం విశేషం.గడ్డిని తగులబెట్టినప్పుడు 33.8–42.2 డిగ్రీల సెల్సియస్ వరకు మట్టి ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఆ వేడికి మట్టిలోని నత్రజని నశిస్తుంది. సేంద్రియ పదార్థం తగ్గిపోతుంది. అంగుళం లోతు వరకూ ఉండే మట్టిలోని అపారమైన సూక్ష్మజీవులు చనిపోతాయి. అంతేకాదు, చీడపీడల బెడద పెరుగుతుంది. ఎరువు మరింత ఎక్కువ వేయాల్సి వస్తుంది. పొలంలో కనిపించే పురుగులను ఏరుకు తినేసే సాలీళ్లు, ఆరుద్ర పురుగులు, కప్పల సంఖ్య గడ్డీ గాదాన్ని తగులబెట్టిన పొలాల్లో పెద్దగా కనిపించవు. మంటపెట్టినప్పుడు వెలువడే అధిక ఉష్ణోగ్రత మట్టి ఆరోగ్యం బాగా దెబ్బతింటుంది. మట్టిలో ఉండే పోషకాలను మొక్కల వేర్లు తీసుకోగలిగే రూపంలోకి మార్చి అందించే అద్భుతమైన సహజ పోషణ వ్యవస్థ దెబ్బతింటుంది. గడ్డీగాదాన్ని కాలబెట్టకుండా నేలపై కప్పి ఆచ్ఛాదన చేయటం ఎన్ని విధాలా మేలో ఈ అధ్యయనం తేటతెల్లం చేసింది. -
Sagubadi: ఒక్కసారి నాట్లు...ఆరుసార్లు కోతలు!
ఒక్కసారి నాట్లేసి మూడేళ్లలో వరుసగా ఆరు సార్లు పంట కోసుకునే రోజులు రానున్నాయి. ఇలాంటి వరిని ‘పెరెన్నియల్ రైస్’(పీఆర్) అంటున్నారు. ఈ విలక్షణ వరి వంగడాలను రూపొందించుకున్న చైనా ఏడేళ్లుగా సాగు చేస్తోంది. ఉత్పత్తి ఖర్చులు 40% మేరకు తగ్గుతాయి. నికరలాభం పెరుగుతుంది. పనిలో పనిగా భూసారం, జీవవైవిధ్యం కూడా పెరుగుతుంది. చైనా తదితర దేశాల్లో ఏటేటా పీఆర్ వరి సాగు విస్తరిస్తోంది. భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్) కూడా దీనిపై తాజాగా దృష్టి సారించింది. ‘ఫార్మింగ్ సిస్టం’ జర్నల్ తాజా సంచికలో భారతీయ వరి పరిశోధనా సంస్థ (ఐఐఆర్ఆర్) శాస్త్రవేత్త డాక్టర్ విజయకుమార్ షణ్ముగం రాసిన అధ్యయన పత్రం ఆధారంగా ‘సాక్షి సాగుబడి’ ప్రత్యేక కథనంఖర్చులు పెరిగిపోవటం, ఆదాయం తగ్గిపోవటం, నీటి అవసరాలు పెరగటం, భూసారం క్షీణించటం, హరితగృహ వాయువులతో పర్యావరణానికి తీరని హాని జరగటం.. ఇవీ ప్రస్తుతం మన దేశంలో వరి వ్యవసాయాన్ని వేధిస్తున్న సవాళ్లు. దాదాపు ఈ సమస్యలన్నిటికీ ఏకకాలంలో చెక్ పెట్టే అద్భుతమైన ‘పెరెన్నియల్ రైస్’ వంగడాలను చైనా శాస్త్రవేత్తలు రూపొందించారు. ఈ వరి వంగడాలను చైనాలో రైతులు ఏడేళ్లుగా సాగు చేస్తున్నారు. సాధారణంగా వరి పంటను ఒక్కసారి నాటితే ఒక్కసారే పంట చేతికి వస్తుంది. తర్వాత సీజన్లో మళ్లీ దున్ని, దమ్ము చేసి, నాట్లు వేసుకుంటున్నాం. ఈ వంగడం ఒక్కసారి నాటితే చాలు. మొత్తంగా చూస్తే పీఆర్ వరుసగా 6 సీజన్లలో తిరిగి పెరిగే వరి పంటను కోసుకోవచ్చు. పటిష్టంగా ఉండే కుదుళ్లు పంట కోసిన తర్వాత మళ్లీ చిగురించి, పిలకలన్నీ మొదటి పంటలాగే ఏపుగా పెరగటం పీఆర్23 వంగడం ప్రత్యేకత. ఒక్కసారి నాట్లు వేస్తే చాలు.. ఇక తర్వాత ప్రతి పంట కాలంలోనూ మళ్లీ మళ్లీ పొలాన్ని దున్ని, నాట్లు వేయాల్సిన అవసరం ఉండదు. ఈ వరి మొక్కల వేర్లు సాధారణ రకాల (అడుగు) మొక్కల వేర్ల కన్నా బలంగా ఉండి రెట్టింపు (2 అడుగుల) లోతుకు చొచ్చుకెళ్తాయి. యున్నన్ యూనివర్సిటీ ఆవిష్కరణచైనాలోని యున్నన్ రాష్ట్రంలోని ‘యున్నన్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ (వైఏఏఎస్)’ పెరెన్నియల్ రైస్ వంగడాలను రూపొందించింది. ఒరిజా సటివ అనే సాధారణ వరి రకాన్ని ఒరిజా సాంగిస్తామినట అనే ఆఫ్రికా అటవీ జాతి వరి మొక్కతో ఎంబ్రయో రెస్క్యూ టెక్నిక్‌ను ఉపయోగించి సంకరం చేసి ‘పెరెన్నియల్ రైస్– పీఆర్23’ వంగడాన్ని రూపొదించింది. అధిక దిగుబడి, గింజ నాణ్యత గల పీఆర్24, పీఆర్25, పీఆర్101, పీఆర్107 వంగడాలను 2020లో విడుదల చేసింది.17 దేశాల్లో ప్రయోగాత్మక సాగు 2018 నుంచి దక్షిణ చైనాలో 44,752 మంది చిన్న రైతులు 15,333 హెక్టార్లలో పీఆర్ వంగడాలను నీటిపారుదల సదుపాయంతో సాగు చేస్తున్నారు. వీరంతా ఆర్థికంగా, పర్యావరణ పరంగా ప్రయోజనాలు పొందుతున్నారని యున్నన్ యూనివర్సిటీ ప్రకటించింది. ఇంటర్నేషనల్ పెరెన్నియల్ రైస్ కొలాబరేషన్ తోడ్పాటుతో యున్నన్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఆసియా, ఆఫ్రికా ఖండాల్లోని 17 దేశాల్లో విభిన్న పర్యావరణ పరిస్థితుల్లో సాగవుతున్న పీఆర్ వంగడాలు స్థిరంగా మెరుగైన దిగుబడిని ఇస్తు న్నట్లు యున్నన్ యూనివర్సిటీ తెలిపింది. వరి గడ్డితో ఆచ్ఛాదనకోతల తర్వాత గడ్డిని సాళ్ల మధ్య ఆచ్ఛాదనగా వేస్తున్నారు. దీంతో పోషకాలు పునర్వినియోగమవుతూ భూసారం మెరుగవుతోంది. నేలలో సూక్ష్మజీవరాశి జీవవైవిధ్యం పెరుగుతోంది. కలుపు సమస్య తగ్గుతోంది. రసా యనిక పురుగుమందులు, కలుపుమందుల అవ సరం తగ్గుతున్నది. అవసరం మేరకు ఏడాదంతా కొద్ది కొద్దిగా నీరు ఇచ్చినప్పటికీ, మొత్తంగా సాగు నీటి వాడకం తగ్గుతోందని శాస్త్రవేత్తలు గుర్తించారు. 29% తగ్గిన ఉత్పత్తి వ్యయంప్రతి ఏటా నాట్లు వేసే పద్ధతిలో కన్నా ఒక్కసారి నాట్లు వేసి మూడేళ్లలో మొత్తం ఆరు పంటలు కోసుకునే ఈ పద్ధతిలో అన్ని ఖర్చులూ కలిపి ఉత్పత్తి వ్యయం 29% తగ్గిందని నాలుగేళ్ల అధ్యయనంలో తేలింది. మొదటి సీజన్లో అన్ని ఖర్చులూ మామూలే. రెండో సీజన్ నుంచి 54% వరకు కూలి ఖర్చులు ఆదా అవుతాయి. మొత్తం మూడేళ్లలో ఆరు పంట సీజన్లకు గాను.. 5 పంట సీజన్లలో సీజన్‌కు 68–77 పనిదినాల అవసరం తగ్గుతుంది. వాతావరణాన్ని కలుషితం చేసే యంత్రాల వాడకమూ తగ్గుతుంది. పీఆర్23 ధాన్యం మిల్లింగ్ సామర్థ్యం 73% నమోదైంది. ప్రతి ఏటా నాట్లు వేసే పద్ధతి కన్నా పీఆర్ పద్ధతిలో దిగుబడి 8.8% తక్కువైనప్పటికీ, రైతుకు నికరాదాయం 235% పెరిగిందని అధ్యయన పత్రం తెలిపింది. మన సగటు దిగుబడి కన్నా ఎక్కువేఒకసారి పంట కోసిన తర్వాత తిరిగి పెరగటంలో పీఆర్23 వంగడం పనితీరు మెరుగ్గా ఉందని గుర్తించారు. దీని పిలకలు 90–98% తిరిగి పెరిగాయి. అందువల్ల వాణిజ్యపరమైన సాగుకు ఈ వంగడాన్ని ఉపయోగిస్తున్నారు. 119 రోజుల్లో పీఆర్23 పంట కోతకు వస్తోంది. తొలి కోతలో హెక్టారుకు 6.8–7.5 టన్నుల ధాన్యం దిగుబడిని ఇస్తుండగా, తర్వాత కోతల్లో 5.4–6.3 టన్నుల వరకు దిగుబడి వస్తోందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. భారత్‌లో సగటు వరి ధాన్యం దిగుబడి హెక్టారుకు 4.2 టన్నులు మాత్రమే. కాబట్టి మన రైతులకు ఇది ఉపయోగకరమేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ముందున్న సవాళ్లుపీఆర్ వరి సాగులో ప్రయోజనాలతో పాటు సవాళ్లు కూడా ఉన్నాయి. మన దేశపు వాతావరణ పరిస్థితులకు అనుగుణమైన పీఆర్ వరి వంగడాలను రూపొందించుకోవాలి. పంట కోసిన తర్వాత తిరిగి పంట చిగురించటం కోసం నీరు పెడతాం. మొలకలు రాకముందే మోళ్లు కుళ్లిపోయే అవకాశం ఉంది. మొలకల కన్నా కలుపు వేగంగా పెరిగే అవకాశం ఉంది. గడ్డిని ఆ పొలంలోనే ఆచ్ఛాదనగా వేయటం వల్ల కలుపు కొంత అదుపులో ఉన్నప్పటికీ, కలుపు మందులు వాడక తప్పదు. మోళ్లలో మిగిలిన రోగకారకాలు చీడపీడల బెడదను పెంచవచ్చు. వేసవి అత్యధికంగా నమోదవుతున్న ఉష్ణోగ్రతల్లో పంటను రక్షించుకోవటం అంత తేలిక కాదు. సవాళ్లను అధిగమించడానికి ప్రభుత్వం నిధులను విరివిగా వెచ్చించి పరిశోధనలను వేగంగా కొనసాగించాలి. అన్నీ సజావుగా జరిగితే కొద్ది సంవత్సరాల్లో భారతీయ పెరెన్నియల్ రైస్ వంగడాలు మన రైతులకు అందుబాటులోకి రావచ్చు. -
ఆగ్రోఫారెస్ట్రీ మేడ్ ఈజీ..!
అడవి, పొలం వేర్వేరు...అడవిలో విత్తిన పంటలు ఉండవు.. పొలంలో చెట్లు ఉండవు.. అయితే, ‘ఆగ్రోఫారెస్ట్రీ’లో రెండూ కలగలిసి ఉంటాయి. దీన్ని ‘అటవీ వ్యవసాయం’ అనొచ్చు. పొలాల మధ్యలోనే కాదు గట్ల మీద కూడా మచ్చుకు ఒక చెట్టు కూడా లేని వ్యవసాయ భూములు మన గ్రామాల్లో విస్తారంగా కనిపిస్తాయి. చెట్టు నీడ పడిన చోట పంట మొక్కలు సరిగ్గా పెరగవని ఉన్న చెట్లు కొట్టెయ్యటం మనకు తెలిసిందే. విస్తారమైన పొలాల మధ్య ఒక్క చెట్టూ లేని ప్రాంతాలు కూడా కనిపిస్తున్నాయి. 3–6 నెలల్లో పూర్తయ్యే పంటలను ఎప్పటికప్పుడు విత్తుకొని, పంటయ్యాక శుభ్రం చేసి దున్ని పెట్టుకునే అలవాటు వల్ల వ్యవసాయ భూములు నిస్సారంగా మారిపోతున్నాయి. ఈ దుస్థితి మారాలి.అంటే, పంట భూముల్లోకి తిరిగి చెట్లను ప్రవేశపెట్టాలి. అందుకని, ‘ఆగ్రోఫారెస్ట్రీ’ని ప్రోత్సహించాలని కేంద్ర ప్రభుత్వం చొరవ చూపుతోంది. స్వల్పకాలిక పంటలు సాగు చేసే పొలాల్లోనూ ఆదాయాన్నిచ్చే రకరకాల చెట్లు, పశువులను కలిపి పెంచటాన్ని.. ఆగ్రోఫారెస్ట్రీని.. ప్రోత్సహించాలని కేంద్ర ప్రభుత్వం తలపెట్టింది. రైతుల ఆర్థిక ప్రయోజనం కోసం, పనిలో పనిగా పర్యావరణ సేవల కోసం ఈ అటవీ వ్యవసాయాన్ని పెంపొందించాలన్నది లక్ష్యం. విలువైన కలప చెట్లను పెంచుతున్న రైతులు ఆ చెట్లు ఎదిగిన తర్వాత నరికి అమ్ముకోవటానికి సవాలక్ష ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ బాధల నుంచి రైతులను ఒడ్డునపడెయ్యటం ద్వారా చెట్ల పెంపకాన్ని పంట పొలాల్లోనూ ప్రోత్సహించాలని కేంద్ర ప్రభుత్వం తలపెట్టింది. వాస్తవానికి, రైతులు తమ పొలాల్లో పెంచే (ముఖ్యంగా విలువైన కలప జాతి) చెట్ల నరికివేత సమయంలో పొందాల్సిన అనుమతుల ప్రక్రియ ఇప్పుడు చాలా సంక్లిష్టంగా ఉంది. దీన్ని సులభతరం చేస్తూ ఇటీవలే నమూనా నియమాలను విడుదల చేసింది కేంద్రం. ఈ రైతుల కోసం ఒక ప్రత్యేక పోర్టల్‌ను ఏర్పాటు చేస్తోంది. ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకొన్న రైతులు ఆన్లైన్లోనే అనుమతులు తీసుకునే ఏర్పాటు చేస్తోంది. అయితే, ఆగ్రోఫారెస్ట్రీపై సరికొత్త నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదించి, అమలు చేయాల్సి ఉంది! ఆ నియమాలేమిటో చూద్దాం...ఆగ్రోఫారెస్ట్రీ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలనే లక్ష్యంతో భారత పర్యావరణ, అటవీ, క్లైమెట్ ఛేంజ్ మంత్రిత్వ శాఖ వ్యవసాయ భూమిలో పెంచిన చెట్లను నరకటం, రవాణా చేయటానికి సంబంధించిన నియమ నిబంధనలను సులభతరం చేసే నమూనా నియమ నిబంధనలను ఇటీవల ప్రకటించింది. ప్రైవేట్ భూమిలో చెట్ల పెంపకాన్ని సులభతరం చేయడం, రైతుల ఆదాయాన్ని పెంచడం, నేలను పునరుద్ధరించడం, డిజిటల్ ట్రేసబిలిటీ ద్వారా అధికారిక అనుమతుల తిప్పలు తగ్గించడం.. తద్వారా విదేశీ కలప దిగుమతులను తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకుంది. వ్యవసాయ భూమిలో పెరిగిన చెట్లను నరికివేతకు స్పష్టమైన నియమాలు ఇప్పటి వరకు లేకపోవటంతో నమూనా నియమనిబంధనలను కేంద్రం రూపొందించింది. అయితే, సాధారణ పంట పొలాలను అటవీ వ్యవసాయ క్షేత్రాలుగా మార్చేందుకు దోహదపడే ఈ ‘నమూనా నియమాల’ ప్రయోజనాలు ఎంత వరకు రైతులకు అందుతాయనేది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాల అంగీకారం, అమలు తీరుపై ఆధారపడి ఉంటుంది. కేంద్రం చెప్పినంత మాత్రాన రాష్ట్రాలు వాటిని విధిగా అనుసరించాల్సిన బాధ్యత లేదు. రూ. లక్ష కోట్ల కలప దిగుమతి మన దేశం ప్రతి సంవత్సరం దాదాపు రూ. లక్ష కోట్ల విలువైన కలపను దిగుమతి చేసుకుంటున్నది. చెక్క ఫర్నీచర్, తలుపులు, కిటికీలు చాలా వరకు మలేషియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికా లేదా ఇండోనేషియా నుండి దిగుమతి చేసుకున్న కలపతో తయారవుతున్నాయి. అదే సమయంలో, మన దేశంలో, అటవీ వ్యవసాయం చేయడానికి అనువైన కోట్ల హెక్టార్ల వ్యవసాయ యోగ్యమైన భూమి ఉంది. కానీ, కారణం ఏదైతేనేమి, మన దేశంలోని రైతులు ఈ భారీ మార్కెట్‌ను ఉపయోగించుకోలేక΄ోయారు. భారతీయ రైతులు ఇంత ఆశాజనకమైన అవకాశాన్ని ఎందుకు ఉపయోగించుకోకూడదు? అని ప్రశ్నించుకునే సందర్భం వచ్చింది. కోట్లాది మంది రైతులు ప్రతిరోజూ తమ ΄÷లాలను జాగ్రత్తగా చూసుకుంటుంటారు. ఆ సాగు భూమిని ‘చెట్లతో కూడిన వ్యవసాయం’ కోసం ఉపయోగించడం ద్వారా కలప దిగుమతికి స్వస్తి చెప్పవచ్చు. అటవీ వ్యవసాయం కేవలం కలప గురించి మాత్రమే కాదు. ఇది నేల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, పంట దిగుబడిని పెంచడానికి, ఆహార భద్రతను పరిపూర్ణం చేయటంలో, వాతావరణ మార్పులను ఎదుర్కోవడంలో సహాయపడుతుంది. నదులను పునరుద్ధరించడంలో చెట్ల ఆధారిత వ్యవసాయం ఎలా సహాయపడుతుందో చూపే ఉద్యమ ఉదాహరణలు ఉన్నాయి. అయినా, ఇన్నాళ్లూ అటవీ వ్యవసాయం విస్తరించక΄ోవటానికి కారణాలు ఉన్నాయి.చట్టపరమైన చిక్కుఒక మారుమూల గ్రామంలో మీరు ఒక రైతు అని ఊహించుకోండి. కలపకు పెరుగుతున్న డిమాండ్ చూసి, మీ భూమిలో అధిక విలువైన కలప చెట్లను నాటారు. మొక్కలు కొని, గుంతలు తవ్వి నాటారు. నీటి΄ారుదల ఏర్పాటు చేశారు. చెట్లను ఏళ్ల తరబడి జాగ్రత్తగా చూసుకున్నారు. దీర్ఘకాలిక పెట్టుబడిగాను, ఒక రకమైన బీమాగా కూడా భావించి ఆశలు పెంచుకున్నారు. కానీ చివరకు చెట్లు నరికే సమయం వచ్చినప్పుడు, సమస్య వచ్చిపడుతుంది. మీ సొంత వ్యవసాయ భూమిలో చెట్లు పెరిగినప్పటికీ, వాటిని మీ వ్యవసాయ ఉత్పత్తులుగా చట్టం పరిగణించదు! చట్టబద్ధంగా, అవి ‘అటవీ ఉత్పత్తుల’ కిందకు వస్తాయి. పెరిగిన చెట్లను నరకాలంటే సంక్లిష్టమైన అనుమతులు అవసరం అవుతాయి. అటవీ, రెవెన్యూ, వ్యవసాయ శాఖల నుంచి ఆమోదాలు తీసుకోవాలి. అనుమతుల కోసం తరచుగా కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఇప్పటికే రోజువారీ బాధ్యతలతో తీరిక లేకుండా ఉండే రైతులకు ఈ పనులు సులభం కాదు.2014 తర్వాత ఆశాజనకమైన కదలిక ఈ పరస్థితుల్లో మార్పు తేవటానికి ఆశాజనకమైన విధాన మార్పులు జరుగుతున్నాయి. రైతులు చెట్లను వ్యవసాయ పంటలతో అనుసంధానించడాన్ని ప్రోత్సహించడానికి జాతీయ అటవీ వ్యవసాయ విధానాన్ని 2014లో అమల్లోకి తెచ్చారు. 2018లో ఒక నిపుణుల కమిటీ చెట్ల ఆధారిత వ్యవసాయ క్షేత్రాలను ప్రధాన స్రవంతి వ్యవసాయంలోకి తీసుకురావడం ద్వారా ‘అడవుల వెలుపల చెట్టు’న్న ప్రాంతాన్ని విస్తరించాలని సిఫారసు చేసింది. ఈ విధానాలు మంచి ఉద్దేశ్యంతో కూడినవే అయినప్పటికీ, అవి నిజంగా కీలక సమస్యను పరిష్కరించలేదు. అదేమిటంటే.. ప్రైవేట్ వ్యవసాయ భూముల్లో పెంచే చెట్లకు సంబంధించిన చట్టపరమైన స్థితి మారలేదు.ఈ సమస్య 1927 నాటి ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ నాటిది. ఇది వలసరాజ్యాల కాలం నాటి చట్టం. ప్రైవేట్ భూమిలో పండించిన కలపతో సహా అన్ని రకాల కలపలను ‘అటవీ ఉత్పత్తులు’గానే నిర్వచించింది. దీని అర్థం రైతులు తాము పెంచిన చెట్లను నరకడానికి లేదా రవాణా చేయడానికి అటవీ శాఖ అనుమతులు తీసుకోవటం అవసరం. ఈ పాత నిబంధన దాదాపు ఒక శతాబ్దం పాటు 2023 వరకు అమలులో ఉంది. అటవీ సంరక్షణ చట్టానికి 2023లో ఒక మైలురాయి వంటి సవరణ జరిగింది. అధికారికంగా అడవిగా నోటిఫై అయిన భూమికి లేదా 1980 అక్టోబర్ 25 నాటికి ప్రభుత్వ రికార్డులలో అడవిగా నమోదైన భూమికి మాత్రమే వర్తిస్తుందని, రైతుల పొలాలకు వర్తించదని ఈ సవరణ స్పష్టం చేసింది. సరళంగా చెప్పాలంటే, రైతులు ఇప్పుడు తమ వ్యవసాయ భూమిలో చెట్లను పెంచుకోవచ్చు. వాటిని నరికితే జరిమానా పడుతుందనే ఆందోళన లేకుండా ఆగ్రోఫారెస్ట్రీ సాగు చేసుకోవచ్చు.సొంత భూమిలో పెంచిన చెట్లను నరకడానికి, రవాణా చేయటానికి మాత్రం అనుమతులు తప్పనిసరి అనే మరో ప్రధాన అడ్డంకి మిగిలే ఉంది. ప్రతి రాష్ట్రం కొన్ని జాతుల చెట్ల జాబితాను రూపొందించింది. వీటిని నరకాలన్నా లేదా కలప రవాణా చేయాలన్నా ప్రత్యేక అనుమతి అవసరం. తరచూ మారే ఈ నియమనిబంధనలు రైతులను గందరగోళపరుస్తూ ఉంటాయి.ఎన్టిపిఎస్కు స్పందన కరవురైతులకు ఈ అనుమతులు ఇవ్వటం కోసమని 2020లో ‘నేషనల్ ట్రాన్సిట్పాస్ సిస్టమ్’(ఎన్‌టిపిఎస్) కేంద్రం ఆన్లైన్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. కానీ ఇప్పటివరకు, ఇది పెద్దగా ఆదరణ పొందలేదు. దాదాపు 950 మంది రైతులు మాత్రమే ఈ ప్లాట్ఫామ్లో నమోదు చేసుకున్నారు. కాబట్టి, ఆగ్రోఫారెస్ట్రీ నిబంధనలను మరింత సరళీకరించాల్సిన అవసరాన్ని గుర్తించిన కేంద్ర పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ 2025 జూన్‌లో ‘వ్యవసాయ భూమిపై చెట్ల నరికివేతకు నమూనా నియమాల’ను ప్రకటించింది. అన్ని రాష్ట్రాలను దృష్టిలో పెట్టుకొని ఏకీకృత, రైతు స్నేహ పూర్వక వ్యవస్థ ఏర్పాటుకు ఇవి వీలు కల్పిస్తున్నాయి.కొత్త నియమాలు చెబుతున్నదేమిటి?నేషనల్ టింబర్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఎన్‌టీఎంఎస్) రైతులు తమ పొలాల్లో పెంచుతున్న చెట్లను నమోదు చేసుకోవడానికి, పర్మిట్లను ట్రాక్ చేయడానికి సహాయపడుతుంది. ఇది జాప్యాన్ని తగ్గిస్తుంది. రైతులు తమ తోటల భూములను ఎన్‌టీఎంఎస్ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి. భూమి యాజమాన్యం, ఊరు, నాటిన జాతులు, నాటిన తేదీలు వంటి వివరాలను అందించాలి. చెట్లను జియోట్యాగ్ చేసిన ఫోటోలను కూడా అప్లోడ్ చేయాలి. కాలానుగుణంగా కొత్త సమాచారాన్ని జోడించాలి.9 చెట్లకు ఆటోమేటిక్ అనుమతిపది చెట్ల కంటే తక్కువ పెంచుతున్న రైతులు చెట్ల ఫోటోలను అప్లోడ్ చేసిన తర్వాత ఈ పోర్టల్ ద్వారా ‘నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్ఓసీ)ను, చెట్లు నరకడానికి, రవాణా చేయటానికి ఆటోమేటిక్‌గా అనుమతులు పొందవచ్చు. 10 కంటే ఎక్కువ చెట్లు ఉన్న రైతులు ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. గుర్తింపు పొందిన ఏజెన్సీ క్షేత్రస్థాయిలో పరిశీలించి ధ్రువీకరించిన తర్వాత అనుమతి మంజూరవుతుంది.2016 నాటి కలప ఆధారిత పరిశ్రమల (స్థాపన – నియంత్రణ) మార్గదర్శకాల ప్రకారం ఏర్పడిన రాష్ట్ర స్థాయి కమిటీలు ఈ నియమాలను అమలు చేస్తాయి. విధానాల సరళీకరణపై రాష్ట్ర ప్రభుత్వాలకు సలహా ఇస్తాయి. చెట్ల నరికివేత కోసం దరఖాస్తులను ధ్రువీకరించడానికి అటవీ నిర్వహణ లేదా వ్యవసాయ అటవీశాస్త్రంలో నైపుణ్యం కలిగిన ఏజెన్సీలను కూడా ఈ కమిటీలు ఎంప్యానెల్ చేస్తాయి. డివిజనల్ ఫారెస్ట్ అధికారులు కాలానుగుణంగా ధ్రువీకరణ సంస్థల పనితీరును పర్యవేక్షిస్తారు. ఈ నియమాలు రైతులు అధికారిక చిక్కుల్లో చిక్కుకోకుండా కలప చెట్లను పెంచడం, నరకడం, విక్రయించే ప్రక్రియను సులభతరం చేయడానికి దోహదపడతాయి. అదే సమయంలో ప్రతి రాష్ట్రం స్థానిక అవసరాలకు అనుగుణంగా మార్చుకోవడానికి వీలు ఉండటం విశేషం. రాష్ట్రాలు వీటిని ఆమోదిస్తేనే ఆగ్రోఫారెస్ట్రీ రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది.ఆకు విలువ రూ.5!చెట్టు అందించే పర్యావరణ సేవలు అన్నీ ఇన్నీ కాదు. తనపైన పడిన వర్షాన్ని వేర్ల ద్వారా భూమిలోకి ఇంకింపజేస్తుంది. ఏడాది పొడవునా పచ్చగా ఉంటుంది. పక్షులకు ఆవాసాన్ని కల్పిస్తుంది. పక్షులు పంటలపై పురుగుల్ని ఏరుకొని తిని రైతుకు మేలు చేస్తాయి. పక్షుల విసర్జితాలు పంట భూమిలో సూక్ష్మజీవరాశిని పెంచి సారవంతం చేస్తాయి. చెట్టు ఆకులు రాల్చుతుంటుంది. ఆ ఆకులు భూమిలో కలిసి భూసారం పెరుగుతుంది. భూమి లోపలి పొరల్లో నుంచి చెట్టు గ్రహించిన పోషకాలను ఆ ఆకుల ద్వారా నేలను సారవంతం చెయ్యటానికి చెట్టు ఆకులు రాల్చుతూ ఉంటుంది. అందుకే, ‘రాలే ప్రతి ఆకూ రూ.5తో సమానం’ అని ప్రసిద్ధ సేంద్రియ వ్యవసాయ రైతు శాస్త్రవేత్త దివంగత డాక్టర్ ఎల్. నారాయణరెడ్డి అన్నారు. అటవీ వ్యవసాయంలో అనేక రకాలు...సాధారణ ఆగ్రోఫారెస్ట్రీచెట్ల మధ్య పంటల సాగు. పండ్ల చెట్లు లేదా కలప చెట్లు లేదా పశువుల మేతకు పనికొచ్చే ఆకులనందించే జాతుల చెట్ల వరుసల మధ్య సీజనల్ పంటలు పండిస్తారు.సిల్వోపాస్టర్చెట్ల మధ్య పచ్చిక బయళ్ళుంటాయి. అందులో పశువులు మేస్తూ పెరుగుతాయి. జంతువులకు చెట్లు నీడనిస్తాయి. కలుపు నియంత్రించడంలో జంతువులు సహాయపడతాయి.ఆగ్రోసిల్వో పాస్టోరల్చెట్లు, పంటలు, జంతువులు కలిసి పెరిగే క్షేత్రం. ఒక చక్కని ఉదాహరణ: ఇంటి తోట. ఇక్కడ వివిధ రకాల కూరగాయ మొక్కలు, పండ్ల చెట్లు, జంతువులు.. అన్నీ కలిసి పెరిగే వ్యవస్థ. అటవీ వ్యవసాయం మనకు కొత్తది కాదు, పురాతనమైనదే.కానీ, ఆధునిక అటవీ వ్యవసాయ పద్ధతులు సమకాలీన వ్యవసాయ, పర్యావరణ సవాళ్లకు ప్రకృతి ఆధారిత పరిష్కారంగా సరికొత్త ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి.విండ్బ్రేక్లుతీవ్ర గాలి, ధూళి నుంచి పంటలు, పశువులు, భవనాలను రక్షించడానికి చెట్లు, పొదలను వరుసలుగా నాటుతారు. పతంగి రాంబాబుసాక్షి, సాగుబడి డెస్క్(చదవండి: ఐదు దొంతర్ల సాగులో శిక్షణ : ఏటా రూ.3 లక్షల నికరాదాయం) -
ఐదు దొంతర్ల సాగులో శిక్షణ : ఏటా రూ.3 లక్షల నికరాదాయం
సుభాష్ పాలేకర్ కృషి (ఎస్పీకే) పద్ధతిలో అద్భుతమైన ఆవిష్కరణ ఐదు దొంతర్ల ఉద్యాన పంటల సాగు చేపడితే వరి సాగులో రైతులు పొందే ఆదాయంతో పోల్చితే పది రెట్లు అధికాదాయం పొందవచ్చని సేవ్ స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్, ఎస్పీకే తెలుగు రాష్ట్రాల సమన్వయకర్త విజయ్‌రామ్ తెలిపారు. భూతాపం పెరిగిపోతున్న దశలో వ్యవసాయదారులు ఎదుర్కొంటున్న అనేక సవాళ్లను అధిగమించేందుకు ఎస్పీకే సేద్యం దోహద పడుతుందన్నారు. నిమగ్నమై పనిచేసే రైతులు ఐదు అంచెల ఉద్యాన పంటల సాగు ద్వారా ఎకరానికి ఏడాదికి రూ. 3 లక్షల వరకు నికరాదాయం పొందే విధంగా కొత్తగా వ్యవసాయం చేపట్టాలనుకునే వారికి శిక్షణ ఇస్తామని ఆయన వివరించారు. సెప్టెంబర్ 2న పాలేకర్ ప్రసంగంహైదరాబాద్ దోమల్‌గూడ శ్రీరామచంద్ర మిషన్‌లో సెప్టెంబర్ 2 (మంగళవారం)న ఉదయం 9 గంటలకు జరిగే తెలుగు రాష్ట్రాల ఎస్పీకే ముఖ్యుల సమావేశంలో పద్మశ్రీ పురస్కార గ్రహీత, ఎస్పీకే రూపశిల్పి డా. సుభాష్ పాలేకర్ ప్రసంగిస్తారని విజయ్‌రామ్ తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లోని పూర్వ జిల్లాల ప్రకారం ఎస్పీకే వ్యవసాయ పద్ధతిని ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో అంకితభావంతో పనిచేసే వారిని జిల్లా సమన్వయకర్తలుగా నియమించనున్నట్లు తెలిపారు. ఆసక్తిగల రైతులు, యువ రైతులు, విశ్రాంత ఉద్యోగులు అందరికీ ఆహ్వానం పలుకు తున్నారు. జిల్లాకు కనీసం నలుగురు ప్రతినిధులు సెప్టెంబర్ 2 సమావేశంలో పాల్గొనాలని ఆయన కోరారు.డిసెంబర్లో క్షేత్ర సందర్శనకృష్ణా జిల్లా గూడూరు మండలం తరకటూరు గ్రామంలో తాను పెంచిన ఐదు దొంతర్ల నమూనా క్షేత్రాన్ని ఈ ఏడాది డిసెంబర్ 25 నుంచి వచ్చే ఏడాది జనవరి 15 మధ్య కాలంలో నిర్దేశిత తేదీల్లో సందర్శించవచ్చని విజయ్‌రామ్ తెలిపారు. తెలుగు రాష్రా్టల్లోని పాత జిల్లాలకు చెందిన వారికి ఒక్కో రోజు ఒక్కో జిల్లాకు చెందిన వంద మంది రైతులు సందర్శించవచ్చన్నారు. ఇతర వివరాలకు: ఫోన్: 6309111427 -
పొలాల్లో ప్లాస్టిక్ భూతం! బయోపాస్టిక్‌లూ విషపూరితమే!
వ్యవసాయంలో ప్లాస్టిక్ వస్తువుల వాడకం విపరీతంగా పెరుగుతోంది. మల్చింగ్ షీట్లు, మొలక ట్రేలు, డ్రిప్ లైన్లు, చెరువు లైనర్ షీట్లు, పాలీహౌస్‌ల నిర్మాణంతో పాటు ఆహార పదార్థాల నిల్వ, ప్యాకేజింగ్, రవాణా క్రమంలోనూ విరివిగా ప్లాస్టిక్ వాడుతున్నారు. పంట భూముల్లో మిగిలిపోయే పాలిథిన్ అవశేషాలు ఇప్పుడు హెక్టారుకు 300 కిలోలకన్నా ఎక్కువట. ప్లాస్టిక్ వస్తువుల్లో 16 వేల రకాల రసాయనాలు ఉంటాయి. వీటిలో 4,200 రసాయనాలు అత్యంత విషపూరితమైనవి. ప్రజారోగ్యానికి, పర్యావరణానికి ఇవి తీవ్ర హాని చేస్తున్నాయని ప్లాస్ట్కెమ్ ప్రాజెక్టు శాస్త్రవేత్తల బృందం గతేడాది గుర్తించింది. కాబట్టి, ప్లాస్టిక్ వాడకంలోను, వాడిన వాటిని పారేయటంలోనూ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్లాస్టిక్ వస్తువులు మానవ సమాజానికి తిరుగులేని ప్రయోజనాలను అందిస్తున్నాయి. కానీ ఇప్పుడు ప్లాస్టిక్ ‘అరికట్టలేని సంక్షోభం’గా మారిపోయింది. కృత్రిమ రసాయనాలతో సింథటిక్ ప్లాస్టిక్ వస్తువులను 1907లో మొట్టమొదట తయారు చేశారు. 1950 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఏటా 2 కోట్ల టన్నుల ప్లాస్టిక్ వస్తువులు ఉత్పత్తి అయ్యేవి. ఇప్పుడు ఏటా 45 కోట్ల మెట్రిక్ టన్నులకు మించిపోయింది. ఇందులో, వాడేసిన ప్లాస్టిక్ వస్తువుల్లో కేవలం 9 శాతాన్ని మాత్రమే సేకరించి, తిరిగిఉపయోగించుకుంటున్నాం.91% శాతం ప్లాస్టిక్ వస్తువులు మట్టిలోనో, నీటిలో కలిసిపోతున్నాయి. ప్రతి సంవత్సరం 1.9 కోట్ల నుంచి 2.3 కోట్ల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు నీటి ద్వారా సరస్సులు, నదులు, సముద్రాలను కలుషితం చేస్తున్నాయి. 1.3 కోట్ల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు మట్టిలో పేరుకుపోతున్నాయి. ప్లాస్టిక్ వ్యర్థాలు కనపడని చోటేదీ ఇప్పుడు మిగల్లేదు. మన అడవులు, నేల, నీరు, గాలిని కూడా ప్లాస్టిక్ వ్యర్థాలు కలుషితం చేస్తున్నాయి. కంటికి కనిపించనంత చిన్న ప్లాస్టిక్ ముక్కలు (మైక్రోప్లాస్టిక్‌లు) జంతువులు, మొక్కలు, పండ్లు, మానవ శరీరాల్లోకి కూడా ప్రవేశించాయి. ఒక లీటరు మంచినీటి సీసాలో దాదాపు 2,40,000 చిన్న ప్లాస్టిక్ ముక్కలు ఉన్నాయని ఇటీవలి అధ్యయనంలో తేలింది.చదవండి: Vitamin D deficiency ఎన్నో ఆరోగ్య సమస్యలుప్లాస్టిక్ పదార్థాలు ప్రపంచంలోని ప్రతి మూలలోకి చొరబడ్డాయి. మనం తాగే నీరు, తినే ఆహారం, పీల్చే గాలిని కూడా కలుషితం చేశాయి. వీటిని బాధ్యతతో వాడుకోవటం, వాడిన ప్లాస్టిక్‌ను ఎక్కడ పడితే అక్కడ పారేయకుండా పద్ధతి ప్రకారం సేకరించి తిరిగి ప్లాస్టిక్ ఉత్పత్తుల తయారీలో వాడుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మనలో ప్రతి ఒక్కరూ సమష్టిగా చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. వ్యవసాయంలో ప్లాస్టిక్‌తో ముప్పువ్యవసాయంలో ప్లాస్టిక్ వస్తువుల వాడకం గత కొన్ని దశాబ్దాలుగా అలవాటైంది. ఆధునిక కాలంలో వాణిజ్య పద్ధతుల్లో వ్యవసాయం తీవ్రతరం కావటంతో దీని వాడకం మరింత పెరుగుతోంది. నేల ఉష్ణోగ్రతను విజయవంతంగా నియంత్రించడం, కలుపు పెరుగుదలను చాలా వరకు అరికట్టడం, నేలలో తేమ నష్టాన్ని నిరోధించడం కోసం వ్యవసాయ భూముల్లో మల్చింగ్ షీట్(పాలిథిన్ ఫిల్మ్)ను విస్తృతంగా వాడటం మన దేశంలో మొదలుపెట్టింది కొద్ది సంవత్సరాల క్రితమే. అయితే, అభివృద్ధి చెందిన దేశాల్లో 1950లలోనే ప్రారంభమైంది. ఈ పద్ధతి పత్తి, మొక్కజొన్న తదితర పంటల సాగు ఖర్చును తగ్గించటంతో పాటు దిగుబడిని సగటున 30 శాతం పెంచుతోంది. ప్లాస్టిక్‌ను ఇప్పుడు మల్చింగ్ షీట్, మొలక ట్రేలు, డ్రిప్ లైన్లు, చెరువు లైనర్ షీట్లు, పాలీహౌస్‌లు, ఆహార నిల్వ, ప్యాకేజింగ్, రవాణాలో విరివిగా ఉపయోగిస్తున్నారు. పంట భూముల్లో మిగిలిపోయే పాలిథిన్ అవశేషాలు ఇప్పుడు హెక్టారుకు 300 కిలోలకన్నా ఎక్కువగానే ఉన్నాయని ఒక అధ్యయనం చెబుతోంది.ఇదీ చదవండి: నటి పరిణీతి ప్రెగ్నెన్సీ.. నో కోల్డ్‌వార్..పెద్దమ్మ ఫుల్ హ్యాపీఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏవో) వ్యవసాయంలో ప్లాస్టిక్‌ల వినియోగాన్ని అంచనా వేసే ఒక కీలక నివేదికను విడుదల చేసింది. 2019లో ప్రపంచవ్యాప్తంగా పంటలు, పశువుల ఆహారోత్పత్తుల సాగు నుంచి విక్రయం వలకు వివిధ దశల్లోని విలువ గొలుసులో 1.2 కోట్ల టన్నుల ప్లాస్టిక్ ఉత్పత్తులు వాడారు. ఆహార ప్యాకేజింగ్‌లో 3.73 కోట్ల టన్నుల ప్లాస్టిక్ ఉత్పత్తులను ఉపయోగించారని ఎఫ్ఏవో లెక్క తేల్చింది. ప్లాస్టిక్ వాడకంపై నియంత్రణ అవసరమనే విషయమై 3 దశాబ్దాలుగా చర్చలు జరుగుతున్నాయి. పది రోజుల శిఖరాగ్రసభ జెనీవాలో ఈ నెల 15న ముగిసింది. భారత్ సహా 184 దేశాలకు చెందిన 3,700 మంది ప్రతినిధులు ఏకాభిప్రాయానికి రాలేక ఎటువంటి ఒడంబడికా చేసుకోలేదు. ముప్పయ్యేళ్లుగా ఇదే తంతు. మన దేశంలో పరిస్థితేంటి?వ్యవసాయంలోప్రపంచవ్యాప్తంగా వాడుతున్న ప్లాస్టిక్ ఉత్పత్తుల్లో సగం ఆసియా దేశాల్లోనే వినియోగిస్తు న్నారు. వాడేసిన ప్లాస్టిక్‌ను తగులబెట్టడం, పూడ్చిపెట్టటం లేదా చెత్తకుప్పల్లో పోయటం మనకు తెలిసిందే. అయితే, దీనికి సంబంధించిన ఏ లెక్కలూ దొరకవు. ఎందుకంటే, వ్యవసాయ ప్లాస్టిక్ కాలుష్యం గురించి ఆలోచించేవారే కరువు. మన దేశంలో 90 శాతం గ్రామాల్లో చెత్త యాజమాన్య వ్యవస్థలే లేవు. ఎవరికిష్టం వచ్చినట్లు వాళ్లు ఎక్కడపడితే అక్కడ పారెయ్యటమే. 67 శాతం మంది మామూలు చెత్తతో పాటు ప్లాస్టిక్ చెత్తను కూడా కాల్చేస్తున్నారని ఒక అధ్యయనం చెబుతోంది. దేశంలోని 6.65 లక్షల గ్రామాలు, 2.68 లక్షల పంచాయతీల్లో ప్రతి ఏటా అభివృద్ధి ప్రణాళికలు రూపొందిస్తుంటాయి. వీటిలో క్లైమేట్ ఛేంజ్ యాక్షన్ ప్లాన్‌ను చేర్చాలి. అందులో వ్యవసాయ, వ్యవసాయేతర ప్లాస్టిక్ నిర్వహణను కూడా జోడించాలి. ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో ప్లాస్టిక్‌కు బదులు పంట వ్యర్థాలతో, వత్తుగా పంటలతోనే సజీవ ఆచ్ఛాదన చేస్తూ ఉంటారు. ఆ పద్ధతులపై అవగాహన కలిగించి, ప్రోత్సహించే పథకాలను తీసుకురావాలని నిపుణులు సూచిస్తున్నారు. పాలిథిన్ మల్చింగ్ షీట్లతో ఇదీ ముప్పు వ్యవసాయ భూముల్లో వేసిన ప్లాస్టిక్ మల్చింగ్ షీట్ వ్యర్థాలు మిగిలిపోతాయి. వేసిన నెలల్లోనే చిరిగి పోతుంది. కాబట్టి దాని ముక్కలన్నిటినీ మట్టిలో నుంచి ఏరెయ్యటం సాధ్యపడదు.నేల ఆరోగ్యాన్ని, పర్యావరణ వ్యవస్థలను దెబ్బతీస్తుంది. వ్యవసాయ భూముల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు నేల సారాన్ని తగ్గిస్తుంది. పంట భూమి లోపలికి గాలి ప్రసరించటం కూడా అవసరం. ప్లాస్టిక్ షీట్ కింద మట్టిలో గాలి ప్రసరణకు ఆటంకం కలిగిస్తుంది. నేల ఆరోగ్యంగా ఉండాలంటే అందులో సూక్ష్మజీవులు ఆరోగ్యంగా ఉండాలి. మల్చింగ్ షీట్ వీటికి ప్రతికూలంగా పనిచేస్తుంది. వేర్లు, మొత్తంగా మొక్కల పెరుగుదలపై ప్లాస్టిక్ ప్రతికూలంగా పని చేస్తుంది. మట్టిలోని వానపాములు వంటి మేలు చేసే జీవరాశికి హాని కలుగుతుంది. వాటి పోషణ దెబ్బతింటుంది.వానపాములు బొరియలు చేసుకుంటూ మట్టిపైకి వచ్చి వదిలే విసర్జితాలే నేలను సారవంతం చేస్తాయి. ఆ ప్రక్రియ ప్లాస్టిక్ మల్చింగ్ వల్ల దెబ్బతింటుంది. ప్లాస్టిక్ సూక్ష్మ ముక్కల (మైక్రోప్లాస్టిక్‌ల)ను మొక్కలు వేర్ల ద్వారా గ్రహించి, ఆకుల్లో, పువ్వుల్లో, కాయల్లో, గింజల్లోకి చేర్చుతాయి. ఆ భూమిలో పండే ఆహారోత్పత్తుల ద్వారా మైక్రోప్లాస్టిక్స్ ఆహారంలోకి, మానవ శరీరాల్లోకి ప్రవేశించే అవకాశం ఉంది. వ్యవసాయంలో ప్లాస్టిక్ కాలుష్యంపై పాలకులు పట్టించుకోవటం లేదు. అధ్యయనాలూ జరగక పోవటం దురదృష్టకరం. ఈ నిర్లక్ష్యం వ్యవసాయాన్ని, యావత్ పర్యావరణ వ్యవస్థల ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తోంది.పంట పొలాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలను జాగ్రత్తగా సేకరించి, రీసైకిల్ చేసే వారికి పంపటం ద్వారా ఈ ముప్పును కొంత తగ్గించవచ్చు. అయితే, దీని గురించి రైతులకు చైతన్యం కలిగించే వారు కరువయ్యారు. అర్బన్ ప్రాంతాల్లోని ఇళ్లలో ప్రజలు వాడిన ప్లాస్టిక్ సేకరణ, రీసైక్లింగ్‌పై కార్యాచరణ ప్రణాళికల్లోనూ వ్యవసాయ ప్లాస్టిక్ వ్యర్థాల ఊసే లేదు. అగ్రి ప్లాస్టిక్ సమస్యపై అవగాహన ఇటీవలే ముందుకు వస్తుండటం దీనికి కారణం. ఈ నేపథ్యంలో వ్యవసాయ ప్లాస్టిక్ వస్తువుల సుస్థిర వినియోగం, నిర్వహణపై ఎఫ్ఏవో గత అక్టోబర్‌లో వాలంటరీ గైడ్‌లైన్స్‌ను ప్రకటించింది. మల్చింగ్ షీట్లతో ముప్పేమిటో తెలుసా?ఆధునిక పంట పొలాల్లో ప్లాస్టిక్ షీట్లు విస్తారంగా కనిపిస్తుంటాయి. ఇవి చాలా పల్చటి ప్లాస్టిక్‌తో తయారు చేసినవి. పొలంలో పరచిన ఒక సంవత్సరంలో చిరిగిపోతాయి. అవి ఎంత పలచనంటే.. ఒక కిలో మల్చింగ్ షీట్ కట్టను 700 చదరపు అడుగుల వ్యవసాయ భూమిపై పరచడానికి సరిపోతుంది. దాని వల్ల ఉపయోగాలున్నాయి. అయితే, అంత భూమిని అనేక విధాలుగా నాశనం చేస్తోందన్నది కూడా వాస్తవం.బయోపాస్టిక్‌లూ విషపూరితమే! పెట్రోలియం ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా మొక్కల ఆధారంగా బయోప్లాస్టిక్ వస్తువులు తయారు చేస్తున్నారు. మొక్కజొన్న, బంగాళదుంపలు, చెరకు, సుగర్బీట్ అనే దుంపల ద్వారా బయోప్లాస్టిక్‌లను తయారు చేస్తారు. అయితే, ఇవి కూడా పూర్తిగా మేలైనవనుకోవటానికి లేదు. బయోప్లాస్టిక్ వస్తువుల తయారీలో వాడే ముడి పదార్థాలను ఈ మొక్కలనుంచి తీసుకుంటు న్నప్పటికీ.. బయోప్లాస్టిక్‌ను తయారు చేసే క్రమంలో గట్టితనం, రంగు తదితర గుణాల కోసం రసాయనిక ప్రక్రియల్లో వాడే వేలకొద్దీ సింథటిక్ రసాయనాలు చాలా విషపూరితమైనవని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. స్వీడన్‌లోని గోథెన్బర్గ్ విశ్వవిద్యాలయంలో ఎకోటాక్సికాలజీ–పర్యావరణ శాస్త్ర ప్రొఫెసర్ బెథానీ అల్మ్రోత్ ఇలా స్పందించారు: ‘చాలా మందికి ప్లాస్టిక్‌లోని విషతుల్య పదార్థాల గురించి తెలియదు. ప్లాస్టిక్‌లతో పనిచేసే వ్యక్తులకు కూడా బయోప్లాస్టిక్లలోని టాక్సిన్స్ గురించి సరైన సమాచారం లేదు. అందుకని, ప్లాస్టిక్లు పర్యావరణానికి, ప్రజారోగ్యానికి ముప్పుగా మారకుండా ఉండాలంటే, మొదట వాటి వాడకం తగ్గించాలి. వాడేసిన ప్లాస్టిక్ వస్తువుల్ని పారేసే అలవాట్లను మనందరం పనిగట్టుకొని మార్చుకోవాలి’ అంటున్నారామె. కాబట్టి, ప్రజల్లో ప్లాస్టిక్ చైతన్యం పెరగాలి. బయోప్లాస్టిక్ తయారీని పాతికేళ్ల క్రితమే కనుగొన్నప్పటికీ ప్రస్తుతం వీటి ఉత్పత్తి మొత్తం ప్లాస్టిక్ వాడకంలో ఒక్క శాతానికే పరిమితమైంది.4,200 ప్లాస్టిక్ రసాయనాల్లో విషం! మనం దైనందిన జీవితంలో వాడే ప్లాస్టిక్ వస్తువులు పెట్రోకెమికల్స్తోనే తయారవుతున్నాయి. ఈ ప్లాస్టిక్ వస్తువుల్లో 16 వేల రకాల రసాయనాలు ఉంటాయి. ఇవన్నీ హాని చేసేవి కాదు. వీటిలో 4,200 రసాయనాలు మాత్రం అత్యంత విషపూరితమైనవి. ప్రజారోగ్యానికి, పర్యావరణానికి ఇవి తీవ్ర హాని చేస్తున్నాయని ప్లాస్ట్కెమ్ ప్రాజెక్టు శాస్త్రవేత్తల బృందం గతేడాది గుర్తించింది. మరో 10 వేల ప్లాస్టిక్ రసాయనాల విషతుల్యత ఎంత అనేదానిపై ఇప్పటికీ తగినంత సమాచారం లేదని బృందం తెలిపింది. ప్లాస్టిక్ వస్తువుల్లోని రసాయనాలు 70 శాతం అసాంక్రమిక వ్యాధుల(ఎన్సీడీలు) వ్యాప్తికి ఒకానొక ముఖ్యకారణమని అంచనా. -
ఆదివారం వరకు రైతులకు వాతావరణ ఆధారిత వ్యవసాయ సలహాలు
ఈ నెల 20 నుంచి 24 తేదీల మధ్యకాలంలో తెలంగాణలోని రెండు జిల్లాల్లో అతిభారీ వర్షాలు, ఆరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాజేంద్రనగర్‌లోని పీజేటీఏయూ ప్రధాన శాస్త్రవేత్త, వ్యవసాయ వాతావరణ పరిశోధన విభాగం అధిపతి డాక్టర్ పి.లీలా రాణి తెలిపారు. బుధవారం నుంచి వచ్చే ఆదివారం వరకు ఉపయోగపడే వాతావరణ ఆధారిత వ్యవసాయ సలహాలను రైతాంగానికి ఆమె సూచిస్తున్నారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్ష సూచనలున్నందున రైతులు విద్యుత్ స్తంభాలు, విద్యుత్ తీగలు, చెరువులు, నీటికుంటలకు దూరంగా ఉండాలి. అధేవిధంగా రైతులు చెట్ల కింద నిలబడ కూడదు. పశువులు, గొర్రెలు, మేకలను చెట్ల కింద ఉంచరాదని ఆమె సూచిస్తున్నారు. గత మూడు రోజుల వాతావరణం:గడిచిన మూడు రోజుల్లో రాష్ట్రంలో కొన్ని చోట్ల భారీ, అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు, అనేక చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. పగటి ఉష్ణోగ్రతలు 25 నుంచి 31 డిగ్రీల సెల్సియస్, రాత్రి ఉష్ణోగ్రతలు 19 నుంచి 25 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యాయి. వచ్చే ఐదు రోజుల వాతావరణ విశ్లేషణ:హైదరాబాద్ వాతావరణ కేంద్రం అందించిన సమాచారం ప్రకారం. 20, 21 తేదీల్లో రాష్ట్రంలో చాలా చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయి. 21 నుంచి 24వ తేదీ ఉదయం వరకు కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురసే సూచనలున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 24 నుంచి 34 డిగ్రీల సెల్సియస్ మధ్య, రాత్రి ఉష్ణోగ్రతలు 20 నుంచి 26 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదుకావచ్చు.అత్యంత భారీ వర్షాల హెచ్చరిక:20వ తేదీ: కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో అక్కడక్కడా అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాల్లో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూ΄ాలపల్లి, ములుగు, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు (గంటకు 30–40 కి.మీ.)తో కూడిన వర్షాలు తెలంగాణ అన్ని జిల్లాల్లో కురిసే అవకాశం ఉంది.21వ తేదీ: జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు మరియు ఈదురు గాలులు (గంటకు 30–40 కి.మీ.)తో కూడిన వర్షాలు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కురిసే అవకాశం ఉంది.22వ తేదీ: ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు (గంటకు 30–40 కి.మీ.)తో కూడిన వర్షాలు ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలలో అక్కడక్కడా కురిసే అవకాశం ఉంది.23వ తేదీ: ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు (గంటకు 30–40 కి.మీ.)తో కూడిన వర్షాలు ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో కురిసే అవకాశం ఉంది.24వ తేదీ: ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు (గంటకు 30–40 కి.మీ.)తో కూడిన వర్షాలు ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో అక్కడక్కడా కురిసే అవకాశం ఉంది.పొలాల్లో మురుగు కాలువలు ముఖ్యంభారీవర్షాలు కురిసిన ప్రాంతాల్లో పొంలం నుండి మురుగునీటిని వీలైనంత వరకు త్వరగా పొలం నుండి తీసివేయాలి.వచ్చే ఐదు రోజుల్లో అక్కడక్కడ భారీ వర్షాలు, అనేక చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున పంట పొలాల్లో మురుగు కాలువలు ఏర్పాటు చేసుకోవాలి.ఆరుతడి పంటల్లో ఆఖరి అంతర కృషి తరువాత ప్రతీ 2 మీటర్లకు ఒక గొడ్డు చాలు వేసుకోవాలి.నీటి ముంపునకు గురైన వర్షాధార పంటల్లో వర్షాలు ఆగిన తరువాత వీలైనంత త్వరగా అంతర కృషి చేసుకోవాలి. ఇదీ చదవండి: ఇండియన్ వయాగ్రా రైస్ తెలుసా? దేశీ వరి ఔషధ గుణాలుపశువులు జాగ్రత్తప్రస్తుత వాతావరణ పరిస్థితులు కోళ్ళలో కొక్కెర తెగులు సోకటానికి అనుకూలం. వీటి నివారణకు, టీకాలు వేయించాలి. గొర్రెల్లో చిటుకు, పీపీఆర్ సోకే వీలుంది ఆవులు, గేదేల్లో గొంతువాపు వ్యాధి సోకడానికి అనుకూలం. టీకాలు వేయించాలి ∙గొర్రెల్లో నట్టల నివారణకు డీవార్మింగ్ చెయ్యాలి. – నిర్వహణ: పంతంగి రాంబాబు సాక్షి సాగుబడి డెస్క్ ఇదీ చదవండి: కేవలం రూ.3.5 లక్షలతో ఫ్యాషన్ బ్రాండ్..రూ. 500 కోట్ల దిశగా


