మెగా ఫ్యామిలీకే తొలి శుభలేఖ.. చిరంజీవికి ఏమైంది? | Allu Sirish gives Invitation Card to Chiranjeevi, Surekha | Sakshi
Sakshi News home page

Allu Sirish: చిరంజీవి మామయ్యకే తొలి పెళ్లి పత్రిక.. ఫోటో షేర్‌ చేసిన శిరీష్‌

Feb 15 2026 5:23 PM | Updated on Feb 15 2026 5:54 PM

Allu Sirish gives Invitation Card to Chiranjeevi, Surekha

అల్లు ఫ్యామిలీ ఇంట పెళ్లి సందడి మొదలైంది. అల్లు అరవింద్‌ చిన్న కుమారుడు శిరీష్‌.. నయనిక మెడలో మూడు ముళ్లు వేయనున్నాడు. మార్చి 6న ఈ వివాహ కార్యక్రమం జరగనుంది. శిరీష్‌ అన్నవదినలైన అల్లు అర్జున్‌- స్నేహల పెళ్లిరోజు కూడా ఇదే కావడం విశేషం!

పత్రికల పంపిణీ
ఇప్పటికే దుబాయ్‌లో ప్రీవెడ్డింగ్‌ సెలబ్రేషన్స్‌ కూడా జరిగాయి. రెండు రోజుల క్రితం పసుపు దంచే కార్యక్రమం జరిగింది. తాజాగా పెళ్లిపత్రికల పంపిణీని మొదలుపెట్టారు. మొదటి పత్రికను చిరంజీవి- సురేఖ దంపతులకు ఇచ్చారు. ఆ ఫోటోను శిరీష్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. 

మెగాస్టార్‌కు గాయం?
మన తెలుగు సాంప్రదాయం ప్రకారం మొదటి పెళ్లి పత్రికను మా మామయ్య చిరంజీవి, అత్తయ్య సురేఖలకు అందించాం అంటూ ఫోటో షేర్‌ చేశాడు. అందులో చిరంజీవి దంపతులతో పాటు అల్లు అరవింద్‌- నిర్మల, శిరీష్‌ ఉన్నారు. అయితే ఫోటోలో మెగాస్టార్‌ షోల్డర్‌ బ్యాగ్‌ వేసుకుని కనిపించాడు. దీంతో ఆయనకు ఏమైంది? సర్జరీ జరిగిందా? అని అభిమానులు ఆరా తీస్తున్నారు.

చదవండి: తిట్ల దండకం ఆపలేదు.. లాగిపెట్టి కొట్టా: బాలీవుడ్‌ హీరో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement