breaking news
Chittoor
-
ఏడీ సరెండర్‌పై దివ్యాంగుల హర్షం
చిత్తూరు కలెక్టరేట్ : దివ్యాంగుల సంక్షేమ నిధులను పక్కదోవ పట్టించిన విభిన్న ప్రతిభావంతుల శాఖ ఏడీ వినోద్ కుమార్‌ను కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ ప్రభుత్వానికి సరెండర్ చేసిన విషయం తెలిసిందే. దీంతో దివ్యాంగుల రాష్ట్ర జేఏసీ అధ్యక్షుడు కొణతల చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి మురళి, జేఏసీ సభ్యులు గురువారం కలెక్టరేట్లోని ఏడీ కార్యాలయం వద్ద సంబరాలు చేసుకున్నారు. వినూత్న నిరసన, శుద్ధి కార్యక్రమాన్ని చేపట్టారు. కొంతకాలంగా కార్యాలయంలో నెలకొన్న అవినీతి మరకలు, గ్రహణం తొలగిపోవాలని కోరుతూ ప్రాంగణంలో పసుపు నీళ్లు చల్లి, పుణ్యాహ వచనం చేశారు. అనంతరం దివ్యాంగులతో కలసి కార్యాలయంలోకి ప్రవేశించారు. లోకాయుక్తకు ఫిర్యాదు జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు కొణతల చంద్రశేఖర్ విలేకరులతో మాట్లాడారు. జిల్లాలోని దివ్యాంగులకు అందాల్సిన సుమారు రూ.కోటి వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులను ఏడీ వినోద్ కుమార్ తన సొంత ఖాతాలకు మళ్లించి అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. దీనిపై తాము పలుమార్లు కలెక్టరేట్ వద్ద నిరసనలు తెలిపినట్లు చెప్పారు. కలెక్టర్ స్పందించి సమగ్ర విచారణ జరిపించారని తెలిపారు. అవినీతి నిజమని తేలడంతో ఏడీ వినోద్‌ను మాతృశాఖకు సరెండర్ చేశారని తెలిపారు. ఏడీని సరెండర్‌తో సరిపెట్టకుండా, ఆయన దోచుకున్న నిధులను తిరిగి సేకరించి జిల్లాలోని దివ్యాంగులకు అందజేసేలా త్వరలోనే లోకాయుక్తకు ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు. ఇన్చార్జి జిల్లా విభిన్న ప్రతిభావంతుల శాఖ ఏడీ గా ఫారెస్ట్ సెటిల్మెంట్ అధికారి పుల్లారెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగులు లీలావతి, సుమతి, చెంచులక్ష్మి, గోపి, సతీష్, చిట్టిబాబు, గజేంద్ర, పురుషోత్తం, మధు, శ్రీనివాసులు, ఈశ్వర్ పాల్గొన్నారు. -
మూషికుడిపై గణపతి విహారం
కాణిపాకం: కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా మూడో రోజైన గురువారం రాత్రి సిద్ధి, బుద్ధి సమేత వరసిద్ధి వినాయకస్వామి తన వాహనమైన మూషికంపై విహరిస్తూ దర్శనమిచ్చారు. స్వామివారి దివ్య మంగళ రూపాన్ని తిలకించి భక్తులు మైమరిచిపోయారు. ఉదయం ఆలయంలోని మూలవిరాట్‌కు అర్చకులు శాస్త్రోక్తంగా పండ్ల రసాలు, సుగంధ ద్రవ్యాలతో తిరుమంజనం నిర్వహించారు. అనంతరం స్వామివారికి విశేష ధూపదీప నైవేద్యాలు సమర్పించి భక్తులకు దర్శనం కల్పించారు. రాత్రి స్వామివారిని పరిమళ భరిత వివిధ రకాల పుష్పమాలికలతో విశేషంగా అలంకరించారు. వేద మంత్రోచ్ఛరణలు, మంగళ వాయిద్యాలు, భజన బృందాల కోలాటాలు, నృత్య ప్రదర్శనల నడుమ స్వామివారు మూషిక వాహనంపై కొలువుదీరి విహరించారు. విఘ్నాలు తొలగించి, తమ కుటుంబాలను చల్లగా కాపాడాలని భక్తులు కర్పూర హారతులు పట్టి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ మూషిక వాహన సేవకు కాణిపాకం, తిరువణంపల్లె, అగరంపల్లె, పట్నం, వడ్రాంపల్లె, కొత్తపల్లె, చినకాంపల్లె గ్రామాల విశ్వకర్మ వంశస్తులు ఉభయదారులుగా వ్యవహరించారు. -
ఏనుగు దాడిలో పంట నష్టం
రామకుప్పం(కుప్పం) : రామకుప్పం మండ లం పరిధిలోని ననియాల తాండా, ఆరిమానుపెంట, పెద్దూ రు అటవీ సరిహద్దులోని పంట పొలాలపై బుధవారం రాత్రి ఒంటరి ఏనుగు దాడి చేసింది. తమిళనాడు నుంచి వచ్చిన ఒంటరి ఏనుగు వారం రోజులుగా పొలాల్లో తిరుగుతూ పంటలను ధ్వంసం చేస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏనుగు బారి నుంచి పంటలను కాపాడాలని, దెబ్బతిన్న పంటలకు పరిహారం ఇవ్వాలని కోరుతున్నారు. ఇద్దరికి తీవ్ర గాయాలు పుత్తూరు: స్థానిక బైపాస్ రోడ్డులో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. పుత్తూరు మున్సిపాలిటీలోని 2వ వార్డు కేఎం అగ్రహారం గ్రామానికి చెందిన రంజిత్(23), రోహిత్(22) బైక్‌లో పుత్తూరుకు వస్తుండగా తిరుపతి నుంచి నగరి వైపు వెళ్తున్న వ్యాన్ ఢీకొంది. దీంతో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. బైక్ నుజ్జునుజ్జు అయింది. యువకులను స్థానికులు 108లో తిరుపతి రుయాకు తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. యువతి అదృశ్యం పుత్తూరు: పట్టణంలోని ఎన్జీవో కాలనీకి చెందిన ఏళ్ల యువతి (19) గురువారం కళాశాలకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె స్థానిక ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ తొలి ఏడాది చదువుతోంది. నెల రోజుల క్రితం ఒక కుటుంబం పెళ్లి చూపులకు పుత్తూరుకు వచ్చి వెళ్లింది. సదరు అబ్బాయే తమ అమ్మాయిని తీసుకెళ్లి ఉండవచ్చునని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
శ్రీవారి దర్శనానికి 4 గంటలు
తిరుమల: తిరుమలలో గురువారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 4 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. బుధవారం అర్ధరాత్రి వరకు 71,196 మంది స్వామిని దర్శించుకున్నారు. 22,581 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.2.246 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 4 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకుంటున్నారు. -
వరసిద్ధి సన్నిధికి డిజిటల్ పోటు?
కాణిపాకం: యూపీఐ చెల్లింపులపై విధించే ఎండీఆర్ చార్జీలు కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంపై కూడా ఉండనుందనే వార్తలు వినిపిస్తున్నా యి. కేంద్ర ఆర్థిక శాఖ చెప్పినట్లు ఆ అదనపు ఛార్జీ దేవస్థానం పడుతుందా లేక భక్తుల పైనా అనే అంశంపై స్పష్టత రావడం లేదు. రూ.వెయ్యికి మించిన గదుల అద్దె వంటి వాటికి భక్తులు ఇప్పటికే 5 శాతం జీఎస్టీ చెల్లిస్తున్నారు. జీఎస్టీలో మినహాయింపు లేదు కాబ ట్టి యూపీఐ చెల్లింపులపై కూడా ఆలయం ఎండీఆర్ చెల్లించాల్సి ఉంటుందనే వివరాలు తెలుస్తున్నాయి. ప్రస్తుతం స్వామివారి వ్రతాలు, ప్రత్యేక పూజల టిక్కె ట్లు, ప్రసాదం, వసతి గదుల రిజర్వేషన్ నుంచి దర్శనం వరకూ ఆన్లైన్లోనే చెల్లింపులు జరుగుతున్నాయి. సాధారణ రోజుల్లో రూ.10 లక్షల వరకూ ఉంటే, సంకటహర చతుర్ది, ఆదివారాలు, పర్వదినాల్లో రూ.12 లక్షల వరకూ ఉంటున్నాయి. ప్రతి నెలా రూ.2 కోట్ల వరకు ఆన్లైన్ పేమెంట్లు జరుగుతున్నాయి. వీటిపై ఎండీఆర్ వడ్డన -
బాలుడి వైద్యానికి ఎంపీ మిథున్‌రెడ్డి భరోసా
వెదురుకుప్పం: అనారోగ్యంతో బాధపడుతూ వేలూరు సీఎంసీలో చికిత్స పొందుతున్న బాలుడికి రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి చేయూత ఇచ్చారు. పీఎంఎన్ఆర్ఎఫ్ కింద రూ.3 లక్షలు మంజూరు చేయించారు. వెదురుకుప్పం మండలం తంగేళిమిట్టకు చెందిన గిరిబాబు కుమారుడు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. వివిధ ఆస్పత్రుల్లో చికిత్స చేయించినా ఫలితం లేదు. ప్రస్తుతం వేలూరు సీఎంసీలో చికిత్స పొందుతున్నాడు. బాలుడి వైద్యం కోసం తల్లిదండ్రులు ఇప్పటికే రూ.లక్షలు ఖర్చు చేశారు. ఆర్థిక స్థోమత లేని కారణంగా ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ విషయాన్ని స్థానిక నాయకులు కొండారెడ్డి, రామయ్య వైఎస్సార్సీపీ గంగాధరనెల్లూరు నియోజకవర్గ సమన్వయకర్త కే.కృపాలక్ష్మి దృష్టికి తీసుకెళ్లారు. ఆమె బాలుడిని ఆదుకోవాలని రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిని కోరారు. స్పందించిన ఎంపీ మిథున్‌రెడ్డి పీఎంఎన్ఆర్ఎఫ్ కింద రూ.3 లక్షలు మంజూరు చేయించారు. తక్షణమే మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గురువారం సాయంత్రం పుత్తూరులోని క్యాంపు కార్యాలయంలో పీఎంఎన్ఆర్ఎఫ్ మంజూరుకు సంబంధించిన ప్రొసీడింగ్ కాపీని బాలుడి తల్లిదండ్రులకు అందజేశారు. మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, సమన్వయకర్త కృపాలక్ష్మి మాట్లాడుతూ వైఎస్సార్సీపీ అధికారంలో లేకున్నా బాలుడి కుటుంబ ఆర్థిక పరిస్థితిని వివరించిన వెంటనే ప్రధానమంత్రి జాతీయ రిలీఫ్ పండ్ కింద రూ.3 లక్షలు మంజూరు చేయించడం అబినందనీయమన్నారు. కష్ట కాలంలో బాలుడి కుటుంబానికి ఆర్థికంగా భరోసా కల్పించడం కొండంత ధైర్యాన్నిచ్చినట్టేనన్నారు. నిధులు మంజూరు చేయించడంతో స్థానిక నాయకులు హర్షం వ్యక్తం చేశారు. -
సమస్యలకు సత్వర పరిష్కారం
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని ఎస్సీ, ఎస్టీల సమస్యలకు సత్వరం పరిష్కారం చూపాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ, ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు హెచ్చరించారు. కలెక్టరేట్లో గురువారం జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ (డీవీఎంసీ) సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ జిల్లాలో ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి తక్షణమే పరిష్కరించాలన్నారు. బాధితులను ఆఫీసుల చుట్టూ తిప్పించు కోవడం, చులకనగా, దురుసుగా మాట్లాడ టం వంటి ఘటనలు చోటుచేసుకుంటే సహించేది లేదన్నారు. ఎస్ఆర్.పురం మండలంలో అర్హులైన ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు ఇంటి పట్టాలు మంజూ రు చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించా రు. ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో శ్మశాన వాటికలు, రహదా రి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. వెట్టిచాకిరీ బాధితులకు 7 రోజుల్లో పరిహారం జిల్లాలోని బంగారుపాళ్యం ప్రాంతానికి చెందిన 74 మంది వెట్టిచాకిరీ (బాండెడ్ లేబర్) బాధితులకు మరో 7 రోజుల్లోపు పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆర్డీవోను ఆదేశించారు. గుడిపాల మండలం 189 కొత్తపల్లిలో ఎస్సీ కాలనీ శ్మశాన భూమిని పరిశీలించి, 5 రోజుల్లో స్థలాన్ని కేటాయించాలని ఆర్డీవోకు సూచించారు. జిల్లాలో ఇప్పటి వరకు అట్రాసిటీ బాధితులైన 154 మంది ఎస్సీ, ఎస్టీ వ్యక్తులకు రూ.1.16 కోట్ల పరిహారాన్ని పంపిణీ చేసినట్లు వెల్లడించారు. ప్రధాని ఆవాస్ యోజన పథకంలో అర్హులైన ఎస్సీ, ఎస్టీలకు గృహాలు, స్థలాలు మంజూరు చేయాలని హౌసింగ్, రెవెన్యూ శాఖల అధికారులను ఆదేశించారు. 30 శాతం తగ్గిన నేరాల నమోదు ఎస్పీ తుషార్ డూడి మాట్లాడుతూ గతంతో పోలిస్తే జిల్లాలో ఎస్సీ, ఎస్టీలపై నేరాల నమోదు దాదాపు 30 శాతం తగ్గిందని తెలిపారు. అట్రాసిటీ, పరస్పర దాడు లు, దూషణల కేసుల్లో స్వతంత్ర సాక్షులు, శాసీ్త్రయ ఆధారాల లోపంతో కోర్టుల్లో నేరం నిరూపించడం క్లిష్టంగా మారుతోందన్నారు. తీవ్రమైన నేరాల్లో ఎఫ్ఐఆర్ నమోదు నుంచి ఛార్జ్‌షీట్ దాఖలు వరకు పక్కా ఆధారాలతో బాధితులకు న్యాయం జరిగేలా చేస్తున్నట్టు పేర్కొన్నారు. సమావేశంలో డీఆర్వో మోహన్‌కుమార్, డీఎఫ్‌వో సుబ్బరాజు, ఎస్సీ వెల్ఫేర్ డీడీ రబ్బానిబాషా, డీవీఎంసీ సభ్యులు మునీంద్రనాయక్, వరలక్ష్మమ్మ, రవి, రాజ్‌కుమార్, శంకర్, మునస్వామి, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ఏడుకొండలవాడే కాపాడాడు!
తిరుమల శ్రీవారిని దర్శించుకుని సంతోషంగా ఇంటికి బయలుదేరిన ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది. పలమనేరు సమీపంలోని మొగిలి ఘాట్‌లో ఆగి ఉన్న లారీని వెనుక నుంచి బొలేరో కారు ఢీకొంది. దీంతో అక్కడికక్కడే ఒకరు, పలమనేరు ఆస్పత్రిలో మరొకరు మృతిచెందారు. అదే కారులోని తల్లి, బిడ్డ ప్రాణాలతో బయటపట్టారు. తమను ఏడు కొండల వాడే కాపాడాడని వారు తెలిపారు. పలమనేరు: తమిళనాడు రాష్ట్రం క్రిష్ణగిరి జిల్లా వేపనపల్లికి చెందిన పాండియన్(64), కుమారుడు ఉమాపతిరాజా(33), అతని భార్య నిత్య(26), కుమార్తె పోమిత(3), గణపతి(44), అతని భార్య కాంచన(38) బుధవారం కారులో తిరుమల వెళ్లారు. గురువారం ఉదయం స్వామిని దర్శించుకుని తిరిగి స్వగ్రామానికి బయలుదేరారు. పాండ్యన్ వాహనాన్ని నడుపుతున్నారు. పలమనేరు సమీపంలోని మొగిలిఘాట్‌లో వెళుతున్న సమయంలో రెండు రోజులుగా నిద్రలేని పాండ్యన్ నిద్రలోకి జారుకున్నాడు. ఈ క్రమంలో ఎదురుగా ఉన్న లారీని కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో కాంచన అక్కడికక్కడే మృతిచెందింది. ఉమాపతిరాజు(33) తీవ్రంగా గాయపడి పలమనేరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. కుడివైపున్నవారు సురక్షితం కారులో కుడివైపు ఉన్న డ్రైవర్ పాండ్యన్, అతని వెనుక సీట్లో ఉన్న గణపతి, నిత్య, ఈమె కుమార్తె పోమిత గాయాల బారిన పడి ప్రాణాలతో బయటపడ్డారు. ఎడమవైపున ఉన్న కాంచన, ఉమాపతిరాజు మృతిచెందారు. ప్రమాదానికి కారణం నిద్రమత్తే.. ఇటీవల సంభవిస్తున్న రోడ్డు ప్రమాదాల్లో సెల్ఫ్ డ్రైవర్లే ఎక్కువగా కారణమవుతున్నారు. వీరు డ్రైవర్లను పెట్టుకోకుండా సొంతంగా డ్రైవ్ చేస్తూ ఇలాంటి ఘటనలకు కారణమవుతున్నారని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలోనూ కుటుంబ సభ్యులతో కలిసి దైవ దర్శనం చేసుకుని విశ్రాంతి లేకుండా తిరుగు ప్రయాణం చేయడంతో నిద్ర మత్తులోకి జారుకుని ఆగి ఉన్న లారీని ఢీకొట్టినట్టు లారీ డ్రైవర్ పేర్కొంటున్నారు. రోడ్డు ప్రమాదంలో సురక్షితంగా బయటపడిన తలి, బిడ్డ -
బడి ఎన్నికలకు వేళాయె!
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, మౌలిక వసతులు, ప్రభుత్వ పథకాల అమలు, విద్యార్థుల సంక్షేమం, విద్యాప్రమాణాల మెరుగుదలలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలు కీలకం. దీంతో ఈ కమిటీల్లో స్థానం కోసం ఆశావహులైన తల్లిదండ్రులు సైతం నేతలను ఆశ్రయిస్తున్నారు. నాయకులు సైతం తమకు అనుకూలమైన వ్యక్తులు పదవుల్లో ఉండేలా ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు ఇప్పటికే నాయకుల చుట్టూ తిరుగుతుండగా, మరికొందరు తల్లిదండ్రులను కూడగట్టే పనిలో నిమగ్నమయ్యారు. ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు డీఈవో లక్ష్మీనారాయణ, సమగ్రశిక్ష శాఖ ఏపీసీ వెంకటరమణ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఉన్నతాధికారులు జారీచేసిన ఉత్తర్వుల మేరకు ఎన్నికల కసరత్తు చేస్తున్నారు. ఎన్నికల ప్రక్రియ ఇలా జిల్లాలోని 2047 ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో ఈ నెల 18న ఓటర్ల జాబితాను ప్రదర్శిస్తారు. అభ్యంతరాలు, మార్పులు, చేర్పుల పరిశీలన అనంతరం 25న తుది ఓటర్ల జాబితాను ఖరారు చేస్తారు. ఈ నెల 29వ తేదీన అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో ఎన్నికలు నిర్వహిస్తారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 1702, ప్రాథమికోన్నత పాఠశాలలు 40, ఉన్నత పాఠశాలలు 305 ఉన్నాయి. వీటిలో 1,10,672 మంది విద్యార్థులు ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి వరకు విద్యనభ్యసిస్తున్నారు. ఈ విద్యార్థుల తల్లిదండ్రులు తమ ఓటు హక్కును ఎన్నికల్లో వినియోగించుకోనున్నారు. ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. 12 నుంచి 25 మందితో కమిటీ విద్యార్థుల సంఖ్యను బట్టి ఒక్కో పాఠశాలలో 12 నుంచి 25 మంది సభ్యులతో యాజమాన్య కమిటీ ఏర్పడుతుంది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, నిబంధనల ప్రకారం ఇతర సభ్యులు ఇందులో ఉంటారు. నూతన కమిటీ పదవీకాలం రెండేళ్లు ఉంటుంది. పాఠశాలల అభివృద్ధి, విద్యార్థుల సంక్షేమంలో కమిటీలు బాధ్యత వహించాల్సి ఉంటుంది. 2024 ఆగస్టు 8న పాఠశాల యాజమాన్య కమిటీల ఎన్నికలు నిర్వహించారు. రెండేళ్ల పదవీకాలం ఈ నెల 8వ తేదీతో ముగిసింది. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు జరుగుతుండటంతో బడి కమిటీల ఎన్నికలకు రాజకీయ ప్రాధాన్యం పెరిగింది. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే పల్లెల్లో రాజకీయ వేడి మొదలైంది. పాఠశాల యాజమాన్య కమిటీల ఎన్నికలు ఈ నెల 29వ తేదీన జరగనుండటంతో నేతలు, ఆశావహులు పావులు కదుపుతున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులే కీలక ఓటర్లు కావడంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న పాఠశాలల వారిగా వారి వివరాలను ఆరా తీస్తూ మద్ధతు కూడుగట్టుకునే ప్రయత్నాలు మొదలయ్యాయి. గ్రామాల్లో తమ పట్టును కొనసాగించేందుకు కమిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను దక్కించుకోవడంపై రాజకీయ వర్గాలు ప్రత్యేక దృష్టి సారించాయి. జిల్లా సమాచారం జిల్లాలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 1,702 ప్రాథమికోన్నత పాఠశాలలు 40 ఉన్నత పాఠశాలలు 305 ప్రాథమిక పాఠశాల విద్యార్థులు 48,231 ప్రాథమికోన్నత విద్యార్థులు 2,458 ఉన్నత పాఠశాలల విద్యార్థులు 59,983 మొత్తం విద్యార్థులు 1,10,672 పల్లెల్లో వేడెక్కనున్న రాజకీయం 25న తుది జాబితా విడుదల -
సింహ వాహనంపై యోగనరసింహుడి రూపంలో మలయప్ప
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. మూడో రోజు గురువారం రాత్రి మలయప్ప స్వామివారు ముత్యపు పందిరి వాహనంపై శ్రీమన్నారాయణుడి అలంకరణలో తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. ఉదయం సింహ వాహనాన్ని అధిష్టించి యోగనరసింహుడి రూపంలో కనువిందు చేశారు. వాహన సేవల ముందు కళాబృందాల ప్రదర్శన ఆకట్టుకుంది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి శ్రీవారికి అత్యంత ప్రీతిపాత్రమైన గరుడ వాహనాన్ని అధిరోహించి మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించనున్నారు. – తిరుమల నిధి విలంబన! ఆదర్శప్రాయుడు జగనన్న -
30న జిల్లా స్థాయి యువజనోత్సవాలు
చిత్తూరు కలెక్టరేట్ : ఏపీ యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 30వ తేదీన విజ యం ఇంజినీరింగ్ కళాశాలలో జిల్లా స్థాయి యువజనోత్సవాలు నిర్వహించనున్నట్టు జిల్లా యువజన శాఖ అధికారిని సంకీర్తన చావన్ తెలిపారు. ఆమె గురువారం విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో 15 నుంచి 29 ఏళ్లలోపున్న యువతీ యువకుల్లో ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు జానపద నృత్యాలు, జానపద గేయాలు, నుక్కడ్ నాటక్, చిత్రలేఖనం, కవితా రచన పోటీలు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి ఉన్న వారు ఈ నెల 29వ తేదీలోపు పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. వివరాలకు 9440573537 నంబర్లో సంప్రదించాలని కోరారు. సేవా సంకల్ప అభియాన్ ప్రారంభం చిత్తూరు రూరల్ (కాణిపాకం): రోగులకు మెరుగైన వైద్య సేవలే ధ్యేయంగా గురువారం నుంచి వచ్చే అక్టోబర్ 17 వరకు జిల్లా వ్యాప్తంగా సేవా సంకల్ప అభియాన్ ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు డీసీహెచ్ఎస్ పద్మాంజలిదేవి, సూపరింటెండెంట్ ఉషశ్రీ తెలిపారు. పేషెంట్ కేర్ వీక్ ముగింపు సందర్భంగా గురువారం చిత్తూరు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ శిబిరాల్లో బీపీ, షుగర్, గైనకాలజీ, కంటి పరీక్షలు చేసి మందులు అందజేస్తామని తెలిపారు. వరసిద్ధుడికి కనకదుర్గమ్మ పట్టువస్త్రాలు కాణిపాకం: శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం తరఫున గురువారం స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు. విజయవాడ ఈవో శీనా నాయక్, చైర్మన్ రాధాకృష్ణ పట్టువస్త్రాలు అందజేయగా, కాణిపాకం ఈవో పెంచల కిషోర్, చైర్మన్ మణి నాయుడు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశా రు. అనంతరం వారికి తీర్థప్రసాదాలు, చిత్రపటం అందజేశారు. 22 మంది గిరిజనులకు పట్టాల పంపిణీ చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని అర్హులైన గిరిజనులు 22 మందికి అటవీ హక్కుల పట్టాలను కలెక్టర్ సుమిత్‌కుమార్ గాంధీ, ఎంపీ దగ్గుమళ్ల ప్రసాద్‌రావు పంపిణీ చేశారు. కలెక్టరేట్లో గురువారం జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అటవీ హక్కుల చట్టం (ఆర్వోఎఫ్ఆర్) కింద జిల్లాలోని గంగవరం మండలానికి చెందిన 18 మంది, తవణంపల్లి మండలానికి చెందిన నలుగురు గిరిజనులకు 31.07 ఎకరాలకు సంబంధించి పట్టాలు, పట్టదారు పాసు పుస్తకాలు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా అటవీశాఖ అధికారి సుబ్బరాజు, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి శివప్రసాద్, గిరిజనులు పాల్గొన్నారు. కొత్త పింఛన్లకు 40,020 దరఖాస్తులు చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో కొత్త పింఛన్లకు దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. పొడిగించిన గడువు శుక్రవారంతో గడువు ముగియనుంది. డీఆర్డీఏ పీడీ శ్రీదేవి మాట్లాడుతూ జిల్లాలో ఈ నెల 7 నుంచి గురువారం సాయంత్రం వరకు మొత్తం 40,020 దరఖాస్తులు అందినట్టు పేర్కొన్నారు. ఇందులో వృద్ధులు 21,304 మంది, వితంతువులు 8,156 మంది, దివ్యాంగులు 6,673 మంది, చేనేత కార్మికులు 116 మంది, మత్స్యకారులు 64 మంది, ఒంటరి మహిళలు 250 మంది, ట్రాన్స్‌జెండర్స్ 11 మంది, చర్మకారులు 372 మంది, డప్పు కళాకారులు 2,970 మంది, కల్లుగీత కార్మికులు 104 మంది దరఖాస్తులు చేసుకున్నారని తెలిపారు. సచివాలయాల సిబ్బంది ఆధ్వర్యంలో క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 1,608 మంది దరఖాస్తులను అర్హులుగా గుర్తించగా, 197 దరఖాస్తులను తిరస్కరించారు. వచ్చి న దరఖాస్తులన్నింటినీ నిబంధనల ప్రకారం క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి ఈ నెల 21వ తేదీలోగా సంబంధిత ఎంపీడీవోల లాగిన్‌కు పంపించేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఎంపీడీవోలు వాటిని పరిశీలించి ఆమోదించిన అనంతరం ఈ నెల 24వ తేదీ నాటికి నేరుగా సెర్ప్ సీఈఓకు సమర్పించేలా డీఆర్డీఏ అధికారులు కసరత్తు నిర్వహిస్తున్నారు. -
ప్రాసెసింగ్ యూనిట్ కార్యకలాపాల నిలిపివేత
నగరి: మండలంలోని వీకేఆర్ పురం గ్రామంలోని పాల ఫ్యాక్టరీని గురువారం అధికారులు తనిఖీ చేశారు. కార్యకలాపాలను నిలిపివేశారు. ఈ ఫ్యాక్టరీ నుంచి వస్తున్న గాలిని పీల్చ డం వల్ల ముక్కులో మంట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉంటోందని గ్రామస్తులు గతంలో నిరసన తెలిపారు. ఈ క్రమంలో అధికారులు స్పందించారు. ఆర్డీవో అనుపమ, తహసీల్దార్ రవికుమార్, ఎంపీడీవో వాణి గురువారం కష్వి మిల్క్ ప్రాడెక్ట్స్ డెయిరీ యూనిట్‌ను తనిఖీ చేశారు. తనిఖీలో భాగంగా యూనిట్‌లోని కార్యకలాపాలను పరిశీలించారు. అధికారుల నుంచి అనుమతులు పొందకుండానే చిల్లింగ్ యూనిట్‌ను ప్రాసెసింగ్ యూనిట్‌గా మార్చినట్లు గుర్తించారు. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు చిల్లింగ్, ప్రాసెసింగ్ యూనిట్ కార్యకలాపాలను నిలిపివేయాల ని ఆదేశాలు జారీచేశారు. ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్డీవో స్పష్టం చేశారు. అమలులో ఉన్న చట్టాలు, నిబంధనల ప్రకారం సంబంధిత వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. కంపెనీ కార్యకలాపాలను నిలిపివేయాలంటూ గురువారం ఎంపీడీవో వాణి సంబందిత పాల ఫ్యాక్టరీ యాజమాన్యానికి నోటీసులు అందజేశారు. చిత్తూరులో వీధి కుక్కల వీరంగం చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరు నగరం సంతపేట 45వ వార్డులో వీధి కుక్కలు విజృంభించాయి. గురువారం ఒక్కసారిగా ఆరుగురిపై దాడిచేసి తీవ్రంగా గాయపరిచాయి. దీంతో ఆ ప్రాంత ప్రజలు భయంతో వణికిపోతున్నారు. స్థానికంగా ఉన్న ఓ కుటుంబం తమ ఇంటి ప్రాంగణాన్ని ఏకంగా డంపింగ్ యార్డుగా మార్చేయడంతో అక్కడికి భారీగా వీధి కుక్కలు చేరి తిష్ట వేశాయని అధికారులు చెబుతున్నారు. చెత్త దుర్వాసనకు తోడు కుక్కల సంచారం ఎక్కువై ఎప్పుడు ఎవరిపై దాడి చేస్తాయో తెలియక ప్రజలు భయాందోళన చెందుతున్నారని స్థానికులతో పాటు అధికారులు వెల్లడించారు. పేరుకుపోయిన చెత్త కుప్పల్లోకి కుక్కలు దూరిపోవడంతో అధికారులు ఒక్క కుక్కను మాత్రమే పట్టుకున్నారు. ఘనంగా ఆయుష్య హోమాలు, కోటి దీపోత్సవం నారాయణవనం : స్థానిక సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాల ఆవరణలో తొమ్మిది రోజుల పాటు తలపెట్టిన నవాహ్నిక హోమ కార్యక్రమంలో భాగంగా గురువారం హోమాలు, ధార్మికోపన్యాసం, సాయంత్రం దీపోత్సవం, వేణుగోపాలస్వామి ఊరేగింపు తదితర కార్యక్రమాలు నిర్వహించారు. చైర్మన్ అశోకరాజు ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్రమోదీ పేరున ఉదయం ఆయుష్య హోమం, మృత్యుంజయ హోమం లక్ష తులసి అర్చనలను నిర్వహించారు. సాయంత్రం ప్రవచనకర్త కుప్పా విశ్వనాథ శా స్త్రిచే ‘ధర్మము – పునరవలోకనం‘ ప్రవసచనం కొనసాగింది. సాయంత్రం హోమ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ హాజరై శ్రీకృష్ణ వేణుగోపాలస్వామి విగ్రహాన్ని ఆవిష్కరించి, గోపూజ నిర్వహించారు. దీపో త్సవం అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి (వేణుగోపాల అలంకారంలో) పల్లకీ ఉత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా మాధవ్, అశోకరాజు మాట్లాడుతూ 25 ఏళ్ల సూదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా, ప్రధాన మంత్రిగా పనిచేస్తున్న నరేంద్రమోదీ నాయకత్వంలో భారతదేశం విశ్వగురు స్థానానికి చేరుకుంటుందన్నారు. ఆధ్యాత్మిక వేడుకల్లో కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు, భక్తులు పాల్గొని స్వామి వారి దివ్యాశీస్సులు అందుకున్నారు. -
తిరుమల ఆలయం ముందు మహిళ రీల్స్
సాక్షి, తిరుమల: తిరుమలలో మరోసారి రీల్స్ వ్యవహారం కలకలం రేపింది. తిరుమల ఆలయం ముందు దర్శిణి ఫ్యాషన్స్‌కు చెందిన మహిళ రీల్స్ చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కళాకారులకు మేకప్ చేసేందుకు వచ్చిన దర్శిణి ఫ్యాషన్స్ మహిళ.. ప్రమోషన్ కోసం ఆలయం ముందు రీల్స్ చేసింది. కళాకారులతో దర్శిణి ఫ్యాషన్స్‌పై ఆ మహిళ మాట్లాడించింది. తిరుమలలో రీల్స్, వాణిజ్య ప్రమోషన్స్ నిషేధించిన సంగతి తెలిసిందే.మాడవీధుల్లో రీల్స్ చేస్తున్నా భద్రతా సిబ్బంది పట్టించుకోవడం లేదు. తిరుమల పవిత్రతకు భంగం కలిగేలా రీల్స్‌పై విమర్శలు వస్తున్నాయి. రేణిగుంటకు చెందిన దర్శిణి ఫ్యాషన్స్‌గా గుర్తించారు. ఆలయం ముందు వాణిజ్య ప్రచారం చేయడంపై భక్తుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. నిబంధనలు ఉన్నా తిరుమలలో రీల్స్‌కు అడ్డుకట్ట ఎక్కడ? అంటూ భక్తులు ప్రశ్నిస్తున్నారు.కాగా, గత నెలలో కూడా శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చిన ఓ జంట దేవుడి పేరుతో రీల్స్ చేశారు. సర్వదర్శనం క్యూలైన్ పాటు రాంబగీచా ప్రాంతంలోనూ చేసిన రీల్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. తిరుమలలో తరచూ ఇలాంటి రీల్స్ వెలుగులోకి వస్తుండడంపై చర్చ జరుగుతోంది. ఇదీ చదవండి: AP: ఆ జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక -
ఏపీ: గణేష్ నిమజ్జన ఊరేగింపులో విషాదం.. ఇద్దరు మృతి
సాక్షి, చిత్తూరు: చిత్తూరు జిల్లాలో గణేష్ నిమజ్జన ఊరేగింపులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గణేషుడి విగ్రహాన్ని నిమజ్జనానికి తీసుకెళ్తున్న భక్తులపైకి ఐషర్ వ్యాన్ దూసుకెళ్లడంతో ఇద్దరు భక్తులు మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండగా.. ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషాద ఘటన వి.కోట మండలం నాయకనేరి టోల్ ప్లాజా వద్ద జరిగింది.వివరాల మేరకు.. గందోడిపాల్య గ్రామానికి చెందిన భక్తులు గణేష్ విగ్రహాన్ని గురువాయం ఉదయం నిమజ్జనానికి తీసుకెళ్తున్నారు. ఇదే సమయంలో చిత్తూరు నుంచి హాసన్ వైపు వెళ్తున్న ఐషర్ వాహనం అదుపుతప్పి నిమజ్జన ఊరేగింపుపైకి దూసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన మరో ఆరుగురిని చికిత్స కోసం కుప్పం పీఎస్ ఆస్పత్రికి తరలించారు.ఇక, ఈ ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఇదీ చదవండి: ఏపీలో ప్రైవేటుకు పవర్! -
ఏడాదిగా నో స్టాంపు డ్యూటీ!
చిత్తూరు కార్పొరేషన్: ఆస్తుల క్రయ విక్రయాల సమయంలో వినియోగదారులు రిజిస్ట్రేషన్ల శాఖకు స్టాంప్ డ్యూటీ కింద 6.5 శాతం చెల్లించాల్సి ఉంది. ఇందులో 5 శాతం ప్రభుత్వానికి పోగా, మిగిలిన 1.5 శాతం స్థానిక సంస్థలకు జమ చేయాల్సి ఉంది. ఏడాదిగా నిధులు జమ చేయకపోవడంతో స్థానిక సంస్థల్లో తీవ్ర ఆర్థిక సంక్షోభం ఏర్పడింది. జెడ్పీకి అద్దెలు, స్టాంప్ డ్యూటీ, మైన్స్ తదితరాల నుంచి ప్రతి ఏటా కొంత ఆదాయం సమకూర్చాలి. ఆ మొత్తంతో జిల్లాలో తాగునీరు, రోడ్లు, డ్రైనేజీలు తదితర అభివృద్ధి పనులకు ఖర్చు చేస్తారు. దీనికి తోడు వచ్చే ఆదాయంలో 15 శాతం ఎస్సీలకు, 6 శాతం ఎస్టీలకు, 15 శాతం శిశు సంక్షేమ శాఖకు నిధులు వెచ్చిస్తారు. నిధులు రాకపోవడంతో జిల్లాలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టలేని పరిస్థితి నెలకొంది. ఎస్సీ, ఎస్టీ, సీ్త్ర శిశు సంక్షేమశాఖలకు ఇవ్వాల్సిన బడ్జెట్లోనూ కోత పడుతోంది. వీటి నుంచే ఆదాయం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసే తలసరి ఆదాయం రూ.4 ప్రకారం కింద 2020–2026(ఆరేళ్లలో) వరకు జెడ్పీకి రూ.7.39 కోట్లు వచ్చాయి. శాండ్ సీనరేజ్ ఫీజు కింద 2020–26 వరకు రూ.27.75 కోట్లు వసూలైంది. ఇతర ఆదాయాల ద్వారా రూ.62.45 లక్షలు మాత్రమే ఆదాయం వస్తోంది. ఈ రకమైన పద్దుల నుంచి వచ్చే ఆదాయంతోనే ఉమ్మడి జిల్లాలోని అన్ని గ్రామాల్లో పలు రకాల అభివృద్ది పనులు చేపట్టాల్సి ఉంది. నిలిచిపోయిన స్టాంప్ డ్యూటీ స్థానిక సంస్థల్లో సింహభాగం వైఎస్సార్సీపీ చెందిన ప్రజాప్రతినిధులు ఉన్న కారణంగానే స్టాంప్ డ్యూటీపై రాష్ట్ర ప్రభుత్వం దెబ్బకొట్టిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆయా స్థానిక సంస్థలకు సంబంధిత రిజిస్ట్రేషన్ శాఖ ప్రతి ఆర్థిక సంవత్సరంలో స్టాంప్ డ్యూటీ విడుదల చేయాల్సి ఉంది. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి స్థానిక సంస్థలకు స్టాంప్ డ్యూటీ విడుదల చేయవద్దని మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో జెడ్పీ పాలకవర్గం స్టాంప్ డ్యూటీపై ప్రత్యేక దృష్టి సారించడంతో రూ.5.29 కోట్లు వచ్చాయి. 2025–26 ఆర్థిక సంవత్సరం నుంచి ఒక రూపాయి కూడా రాలేదు. 2020–21 రూ.3,14,02,324 2021–22 రూ.9,95,52,209 2022–23 రూ.7,87,45,759 2023–24 రూ.4,30,82,293 2024–25 రూ.5,29,33,404 స్థానిక సంస్థలకు ప్రధాన ఆదాయ వనరు స్టాంప్ డ్యూటీ. దీనితోనే అభివృద్ధి పనులు చేస్తుంటారు. రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల్లో వైఎస్సార్ సీపీ పాలక వర్గాలు ఉన్నాయి. దీంతో కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఏడాదిగా స్టాంప్ డ్యూటీని జమ చేయడం లేదు. జిల్లా పరిషత్ స్టాంప్ డ్యూటీ నిధులను విడుదల చేయవద్దని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మౌఖిక ఆదేశాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఆదాయం లేకపోవడంతో చిన్నచిన్న పనులు కూడా చేయలేకపోతున్నట్టు పాలకవర్గాల ప్రతినిధులు వాపోతున్నారు. -
అక్రమాల ‘వినోదం’
జిల్లా విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖలో చోటుచేసుకున్న భారీ నిధుల అక్రమాల వ్యవహారంలో ఎట్టకేలకు కీలక పరిణామం చోటుచేసుకుంది. తీవ్రస్థాయి అవినీతి, ప్రభుత్వ నిధుల మళ్లింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏడీ వినోద్ కుమార్‌ను కలెక్టర్ సుమిత్ కుమార్ ప్రభుత్వానికి సరెండర్ చేశారు. రూ.కోటి వరకు ప్రజాధనాన్ని పక్కదారి పట్టించిన అధికారిపై చర్యలు తీసుకోవాలని జూన్ నెల నుంచి సాగిస్తున్న పోరాటానికి ఫలితం దక్కిందని దివ్యాంగ సంఘాల నేతలు హర్షం వ్యక్తంచేస్తున్నారు. చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోనే వివిధ కేడర్లలో 30 ఏళ్లుగా పనిచేస్తూ వ్యవస్థలను మేనేజ్ చేస్తూ వచ్చిన వినోద్ కుమార్ ఏడీగా ఉద్యోగోన్నతి పొందిన 9 నెలల్లోనే భారీగా నిధుల మళ్లింపునకు పాల్పడ్డారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై ఏపీ దివ్యాంగ సంఘాల ఐక్యకార్యాచరణ సమితి నేతలు చంద్రశేఖర్, మురళి ఈ ఏడాది జూన్ నుంచి పలుమార్లు ఆందోళనలు చేపట్టారు. కలెక్టరేట్ వద్ద ధర్నాలు నిర్వహించడంతో పాటు, పీజీఆర్ఎస్లో కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీకి ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. విచారణతో తేలిన అక్రమాలు ఈ వ్యవహారంపై కలెక్టర్ సమగ్ర విచారణకు ఆదేశించారు. మొదట డిప్యూటీ కలెక్టర్ సురేష్‌ను విచారణాధికారిగా నియమించగా, ఆయన ట్రైనింగ్ నిమిత్తం అమరావతికి వెళ్లడంతో విచారణ బాధ్యతలను జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్‌కు అప్పగించారు. విచారణలో పలు అవకతకవలు వెలుగులోకి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం అమలు చేసే నషాముక్త్ భారత్ అవగాహన కార్యక్రమాలు నిర్వహించకుండానే రూ.8.94 లక్షలను వేరే ఫొటోలను మార్ఫింగ్ చేసి బిల్లులు పొందడం, వయోవృద్ధుల చట్టాలపై ప్రచారానికి కేటాయించిన రూ.16 లక్షలు, అలాగే వివిధ వసతి గృహాల నిర్వహణ నిధులను తన బినామీలు, కుటుంబ సభ్యుల ఖాతాలకు మళ్లించడం, వాహనాన్ని వాడకుండా, చివరికి మెడికల్ లీవ్‌లో ఉన్న సమయంలోనూ నెలకు రూ.35 వేల చొప్పున అక్రమంగా వాహన బాడుగ బిల్లులు పొందినట్లు తేలినట్లు తెలిసింది. త్వరలో శాఖాపరమైన చర్యలు జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ సమర్పించిన సమగ్ర విచారణ నివేదిక ఆధారంగా ఏడీ వినోద్ కుమార్‌ను సరెండర్ చేస్తూ కలెక్టర్ నిర్ణయం తీసుకున్నారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించి, దివ్యాంగుల సంక్షేమ నిధులను పక్కదారి పట్టించిన సదరు అధికారిపై క్రిమినల్, శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని దివ్యాంగ సంఘాల నేతలు కోరుతున్నారు. -
సీఎం పర్యటన ప్రదేశాల పరిశీలన
కుప్పం: ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 22, 23 తేదీల్లో కుప్పంలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో ఆయా ప్రదేశాలను బుధవారం జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ పరిశీలించారు. కొత్తపేటలో ఆర్డీవో, డీఎస్పీ కార్యాలయాలకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రదేశాలను ఆయన పరిశీలించి సిబ్బందికి సూచనలు ఇచ్చారు. సీఎం సభా వేదిక, రాజీవ్ కాలనీ సర్కిల్ వద్ద రైతు బజార్ ఏర్పాటు స్థలాన్ని పరిశీలించారు. భద్రతపై పోలీసులకు సూచనలు చేశారు. అంతేకాకుండా ప్రభుత్వ శాఖ అధికారులు వారి పరిధిలోని బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి సీఎం పర్యటనను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో కుప్పం ఏఎస్పీ హేమంత్ బోడ్డు, సీఎం వ్యక్తిగత కార్యదర్శి శ్రీకాంత్, ఆర్డీవో మహమ్మద్ హుసేన్ తదితరులు పాల్గొన్నారు. -
స్వర్ణ నెమలిపై గణనాథుడు
కాణిపాకం: కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయకస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆలయ ప్రాంగణం వినాయక నామస్మరణలతో మారుమోగుతోంది. బుధవారం సిద్ధి, బుద్ధి సమేత వరసిద్ధి వినాయకస్వామి స్వర్ణ నెమలి వాహ నంపై కొలువుదీరి భక్తులకు దర్శనమిచ్చారు. ఉద యం స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. విశేష అలంకరణలు చేసి భక్తులకు దర్శనం కల్పించారు. ఆ తర్వాత ఉభయదారులు ప్రత్యేకంగా క్షీరాభిషేకం, గంధాభిషేకం, నారికేళం అభిషేకాలు చేయించారు. రాత్రి అలంకార మండపంలో సిద్ధి, బుద్ధి సమేత స్వామి వారి ఉత్సవమూర్తులను సర్వాంగసుందరంగా అలంకరించారు. తదుపరి బంగారు మయూర వాహనంపై కొలువుదీర్చి కోలాటాల నడుమ కనుల పండువగా ఊరేగించారు. భక్తజనం అడుగడుగునా కర్పూర హారతులు పట్టి నీరాజనాలు అర్పించారు. -
ఎర్రమట్టి తవ్వకాలపై గ్రామస్తుల నిరసన
●పాలసముద్రం : మండలంలోని తొట్టికండ్రిగ పంచాయతీ రాజుఇండ్లు సమీపంలో ఉన్న గుట్టలోని ఎర్రమట్టి తవ్వకాలు చేపట్టరాదని గ్రామస్తులు డిమాండ్ చేశారు. వారు బుధవారం గుట్ట వద్దకు వేస్తున్న రోడ్డు పనులను అడ్డుకుని నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ గుట్టలో గతంలో చెట్లు పెట్టి బిందెలతో నీరు పోసి సంరక్షించామని తెలిపారు. ప్రస్తుతం అధికార పార్టీ నాయకులు ఎర్రమట్టి కోసం అనుమతులు తెచ్చుకున్నామని చెబుతూ మామిడి చెట్లను తొలగించి రోడ్డు వేయడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. గుట్టలో మట్టిన తవ్వి తమిళనాడుకి తరలిస్తున్నారని, దీనిపై ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. తమ గ్రామానికి చెందిన కొందరు పశువులు, మేకలు, గొర్రెలను గుట్టలోకి మేత కోసం తీసుకెళుతున్నారని, గుట్టను తవ్వేస్తే వాటికి మేత ఎక్కడి నుంచి వస్తుందని పేర్కొన్నారు. ఇప్పటికై నా జిల్లా అధికారులు స్పందించి ఎర్రమట్టి తవ్వకాలపై చర్యలు తీసుకోవాలని కోరారు. గతంలో గుట్టలో మొక్కలు నాటాం మా గ్రామం సమీపంలో ఉన్న గుట్టలో గతంలో వివిధ మొక్కలు నాటి బిందెలతో నీరు పోసి పెద్ద చేసుకున్నాం. ఇప్పడు ఎర్రమట్టి తవ్వుకోవడానికి అనుమతి తీసుకున్నామని చెప్పి చెట్లను జేసీబీతో తొలగించి రోడ్డు వేస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం. దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలి. – పి.వెంగమరాజు, రాజు ఇండ్లు అధికారులు స్పందించాలి మా గ్రామ సమీపంలో పచ్చ పచ్చని చెట్లతో కూడిన గుట్టను ఎర్రమట్టి పేరుతో నాశనం చేసున్నారు. మూగజీవాలకు మేత లేకుండా చేస్తున్నారు. అధికారులు స్పందించి మా గ్రామానికి సమీపంలో ఉన్న గుట్టులో ఎర్రమట్టి గ్రావెల్ తవ్వకాలు చేపట్టకుండా చర్యలు తీసుకోవాలి. – కే ధనంజయరాజు, రాజు ఇండ్లు అనుమతిని రద్దు చేయాలి గుట్టలో ఎర్రమట్టి తవ్వకాలు ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలి. ఎన్నడూ లేని విధంగా ఎర్రమట్టిని తవ్వి తమిళనాడుకు తరలిస్తున్నారు. ఇక్కడ జరుగుతున్న పనులకు తవ్వుకుంటే అధికారులు అడ్డు చెబుతున్నారు. తమిళనాడుకు తరలించడానికి అనుమతి ఎలా ఇచ్చారో అర్థం కావడం లేదు. – జగనాథరాజు, రాజు ఇండ్లు -
బ్రహ్మాండోత్సవం
ప్రభుత్వ బడుల్లో స్టెమ్ ల్యాబ్‌లు విద్యార్థుల్లో సాంకేతిక ఆలోచనలను పెంపొందించేందుకు పాఠశాలల్లో స్టెమ్ ల్యాబ్‌లు ఏర్పాటుచేస్తున్నారు.తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఉభయ దేవేరుల సమేతంగా శ్రీమలయప్ప స్వామి విశేష వాహనాల్లో కొలువుదీరి భక్తులను అనుగ్రహిస్తున్నారు. బుధవారం ఉదయం చిన్నశేష వాహనంపై ఊరేగుతూ అశేష జనులను కటాక్షించారు. రాత్రి వీణాపాణి అలంకారంలో హంస వాహనంపై విహరించారు. భువి వైకుంఠంలో ఏడుకొండలస్వామి దివ్యతేజోవిరాజిత మూర్తిని వీక్షించి భక్తకోటి పులకించింది. తిరుమాడ వీధుల్లో దేదీప్యంగా ప్రకాశిస్తున్న తిరుమలేశుని దర్శించి పరవశించింది. ఎన్ని జన్మల ఫలమో కదా.. అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుని సేవించు భాగ్యము దక్కిందంటూ మురిసిపోయింది. – తిరుమల అక్రమాల ‘వినోదం’ జిల్లా విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఏడీ అవినీతి ఎట్టకేలకు బయట పడింది. ఆయనపై వేటు వేశారు. గురువారం శ్రీ 17 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026 -
ప్రభుత్వ బడుల్లో స్టెమ్ ల్యాబ్‌లు
చిత్తూరు కలెక్టరేట్ : ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో విజ్ఞాన, సాంకేతిక ఆలోచనలను పెంపొందించేందుకు వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. యూత్ ఫర్ సేవా ఎన్జీవో జిల్లా కో ఆర్డినేటర్ హరీష్ ఆధ్వర్యంలో జిల్లాలోని ఐరాల మండలం కాణిపాకం, ఎం.పైపల్లి, గంగాధరనెల్లూరు మండలం తూగుండ్రం జెడ్పీ హైస్కూళ్లను పైలెట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేశారు. వీటిలో ప్రత్యేకంగా స్టెమ్ ల్యాబ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథ్స్)లను ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం రూ.13 లక్షలు కేటాయించారు. ఈ మేరకు డీఈవో లక్ష్మీనారాయణ చర్యలు తీసుకుంటున్నారు. ఆధునిక సాంకేతికత, సమగ్ర పర్యవేక్షణ ల్యాబ్‌లలో సైన్స్, ఇంజినీరింగ్ ప్రయోగాలపై విద్యార్థులకు ప్రత్యక్ష అనుభూతిని కల్పించేలా అధునాతన టెక్నాలజీ సహాయంతో బోధన చేస్తారు. విద్యార్థుల ప్రతిభను అంచనా వేసేందుకు ఆన్లైన్ పరీక్షలు నిర్వహిస్తారు. అలాగే ల్యాబ్ కార్యకలాపాలు, ఆన్లైన్ పరీక్షల నిర్వహణను ట్రాక్ చేసేందుకు ప్రత్యేక వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెస్తున్నారు. దీనిద్వారా విద్యార్థుల ప్రతిభ, ల్యాబ్ వినియోగంపై నెలానెలా పురోగతి నివేదికలను పర్యవేక్షిస్తారు. ఈ ల్యాబ్‌లను సమర్థవంతంగా నిర్వహించేందుకు వీలుగా సంబంధిత ఉపాధ్యాయులకు ప్రత్యేక అధికారుల ఆధ్వర్యంలో శిక్షణా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రముఖ కార్పొరేట్ కంపెనీల సామాజిక బాధ్యత నిధులు రూ.10 లక్షలతో జిల్లా కేంద్రంలోని సైన్స్ సెంటర్ అభివృద్ధి చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. -
ఘనంగా నిమజ్జనోత్సవం
చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరు నగరంలో గణేష్ నిమజ్జనోత్సవ వేడుకలు బుధవారం అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. నగరంలోని వివిధ మండపాల నుంచి స్వామివారి విగ్రహాలను శోభాయాత్రగా తరలించారు. ఊరేగింపులో యువత, భక్తులు డప్పు వాయిద్యాల దరువులకు నృత్యాలు చేశారు. రంగుల కేరింతలు, బాణసంచా పేలుళ్లు, కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనల మధ్య శోభాయాత్ర కోలాహలంగా సాగింది. ఊరేగింపు అనంతరం విగ్రహాలను కట్టమంచి చెరువు వద్దకు తరలించారు. భక్తులు భక్తిశ్రద్ధలతో వినాయకుడికి చివరి పూజలు చేసి జలధివాసం గావించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. క్రేన్ సాయంతో వినాయకుడిని నిమజ్జనం చేస్తున్న భక్తులు -
యథేచ్ఛగా చెరువు కబ్జా
గుడిపాల: కొంతమంది ప్రకృతి సంపదను కొల్లగొడుతున్నారు. ఈ విషయం తెలిసినా అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తుండడం విమర్శలకు తావిస్తోంది. మండలంలోని వసంతాపురం పంచాయతీ పశుమంద రెవిన్యూలోని సర్వే నంబర్ 40/1లో 24.03 ఎకరాల్లో కొత్తచెరువు ఉంది. అలాగే సర్వే నంబర్లు 42/3, 38లో 1.82 ఎకరాల కాలువ పోరంబోకు ఉంది. ఈ చెరువుకు సంబంధించి అటవీప్రాంతం నుంచి వంకల ద్వారా చెరువులోకి నీరు వచ్చేది. వంకల పక్కన గ్రానైట్ క్వారీలు ఉండడంతో గ్రానైట్‌కు సంబంధించిన వ్యర్థాలను వంకల్లో వేసి పూడ్చివేశారు. చెరువుకు సంబంధించిన భూమిని కూడా గ్రానైట్ వ్యర్థాలు వేశారు. కొంతమంది చెరువు భూమిని దున్నుకుని పంటలు సాగు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కొత్తచెరువులో ఉన్న 24 ఎకరాల భూమిలో ఐదు ఎకరాల భూమి వరకు కబ్జా అయ్యింది. మిగిలిన భూమిని కుడా కబ్జా చేసేందుకు కొంతమంది పన్నాగం పన్నుతున్నారు. ఈ చెరువుకు రావాల్సిన వంకలన్నీ పూడిపోవడంతో వర్షాలు అధికంగా వస్తే వ్యవసాయ పొలాలవైపు నీరు పోవాల్సి ఉందన్నారు. రెవెన్యూ అధికారులు కబ్జాలకు గురైన భూమిని సర్వే చేయించడంతో పాటు పూడ్చివేసిన వంకలను సర్వేచేసి న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు. -
నేడు డీవీఎంసీ సమావేశం
చిత్తూరు కలెక్టరేట్ : ప్రస్తుత ఏడాదిలో 1, 3 త్రైమాసికాలకు సంబంధించి జిల్లా విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ (డీవీఎంసీ) సమీక్ష గురువారం నిర్వహించనున్నట్లు ఎస్సీ వెల్ఫేర్ డీడీ రబ్బానీ బాషా తెలిపారు. ఆయ బుధవారం విలేకరులతో మాట్లాడుతూ గురువారం 10.30 గంటలకు కలెక్టరేట్లో సమీక్ష ఉంటుందన్నా రు. జిల్లాలో ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చ ట్టం అమలు, నమోదైన కేసులు, బాధి తులకు అందించిన పరిహారం, వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష ఉంటుందని పేర్కొన్నారు. ఈ సమావేశానికి సంబంధిత శాఖల అధికారులు తమ పరిధిలోని కేసుల పురోగతి, చేపట్టిన చర్యల నివేదికలు, సమగ్రమైన డేటాతో హాజరుకావాలని వెల్లడించారు. అభ్యంతరాల పరిశీలన చిత్తూరు కార్పొరేషన్: జెడ్పీ ఎన్నికలకు సంబంధించి ప్రచురించిన ముసాయిదా ఓటర్ల ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలపై పలు అభ్యంతరాలు వచ్చాయి. వీటిపై అధికారులు బుధవారం ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రజలు, రాజకీయ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఐదేళ్ల క్రితం 2,912 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా, ప్రస్తుతం 144 కేంద్రాలను అదనంగా ప్రతిపాదించారు. దీంతో 3,056 చేరాయి. అదనపు కేంద్రాల ఏర్పాటుపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పెద్ద ఎత్తున అభ్యంతరాలు తెలిపినట్లు తెలుస్తోంది. కూటమి, వైఎస్సార్ సీపీ, బీజేపీ, వామపక్ష పార్టీలతో పాటు పలువురు పలు సమస్యలు తెలిపారు. వాటినిఽ అధికారులు నమోదు చేసుకుని క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. తదుపరి నివేదికను జెడ్పీ సీఈవోకు పంపించనున్నారు. చివరిగా కలెక్టర్ ఆమోదం పొందాక ఈ నెల 19న తుది జాబితాను ప్రకటించనున్నట్లు జెడ్పీ సీఈఓ రవికుమార్‌నాయుడు వివరించారు. స్తంభించిన ఈ–వాహన్ చిత్తూరు రూరల్ (కాణిపాకం): వాహనాల కొనుగోలు, విక్రయాలు చేసే వారిపై కేంద్ర రవాణా శాఖ నిర్లక్ష్యం తీవ్ర ప్రభావం చూపుతోంది. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ ఈ–వాహన్ ఇంటర్నెట్ పోర్టల్‌లో వాహన యజమాని పేరు మార్పిడి సేవలు ఒక్కసారిగా స్తంభించిపోయాయి. కేంద్ర స్థాయిలో పోర్టల్ సాఫ్ట్వేర్ మార్పులు, నవీకరణ పనులు చేపడుతున్నామంటూ గత నాలుగైదు రోజులుగా ఈ సేవలను రవాణా శాఖ నిలిపివేసింది. ఫలితంగా జిల్లా రవాణా అధికారి కార్యాలయంతో పాటు జిల్లా పరిధిలోని రవాణా శాఖ కార్యాలయాలకు వచ్చే వాహనదారులు, కొనుగోలుదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో రోజుకు సగటున పదుల సంఖ్యలో యజమాని పేరు మార్పిడి దరఖాస్తులు వస్తున్నాయి. ఇంటర్నెట్ పోర్టల్ పనిచేయకపోవడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. ఎల్ఎల్ఆర్, డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ రెన్యువల్ వంటి ఇతర సర్వీసులు యధావిధిగా కొనసాగుతున్నాయి. కీలకమైన యజమాని పేరు మార్పిడి దరఖాస్తులు మాత్రం ముందుకుసాగడం లేదు. సాఫ్ట్వేర్ మార్పులు త్వరలోనే పూర్తవుతాయని, అనంతరం ఈ సేవలు పునరుద్ధరణకు నోచుకుంటాయని జిల్లా రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు. ఏడీగా పుల్లారెడ్డి చిత్తూరు కలెక్టరేట్: జిల్లా విభిన్న ప్రతిభవంతులశాఖ ఇన్చార్జి ఏడీగా పుల్లారెడ్డిని నియమించారు. ఈ మేరకు కలెక్టర్ సుమిత్‌కుమార్‌గాంధీ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆ శాఖ ఏడీగా పనిచేస్తున్న వినోద్‌ను ప్రభుత్వానికి సరెండర్ చేశారు. కలెక్టరేట్లో ఫారెస్టు సెటిల్మెంట్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న పుల్లారెడ్డికి విభిన్న ప్రతిభవంతులశాఖ ఇన్చార్జి ఏడీగా అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. శ్రీవారి దర్శనానికి 4 గంటలు తిరుమల: తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 8 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. మంగళవారం అర్ధరాత్రి వరకు 61,361 మంది స్వామివారిని దర్శించుకోగా 18,722 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.70 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 4 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలైన్లో వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. కేటాయించిన సమయాన్ని కంటే ముందు వెళ్లిన భక్తులను క్యూలో అనుమతించరని స్పష్టం చేసింది. -
ప్రతి గ్రామంలోనూ వైద్యశిబిరాలు
చిత్తూరు రూరల్ (కాణిపాకం): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని జిల్లాలోని ప్రతి గ్రామంలోనూ ప్రత్యేక వైద్య శిబిరాలు, ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి నాగ శశిభూషణ్ రెడ్డి ఆదేశించారు. ఆయన బుధవారం తన కార్యాలయంలో సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమం అమలుపై జిల్లా వైద్యాధికారులు, సూపర్వైజర్లు, సిబ్బందితో సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ గురువారం నుంచి అక్టోబర్ 17 వరకు ఈ కార్యక్రమాలు కొనసాగుతాయని తెలిపారు. మాతా–శిశు సంరక్షణ, రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం, బీపీ–షుగర్ వంటి అసంక్రమిత వ్యాధులు, కంటి, చెవి పరీక్షలు, రక్తదాన శిబిరాలను క్షేత్రస్థాయిలో అందుబాటులోకి తేవాలని స్పష్టం చేశారు. -
ఆటో బోల్తాపడి వ్యక్తికి గాయాలు
వి.కోట: మండలంలోని తోటకనుమ–వి.కోట రోడ్డులోని మోర్నపల్లి గ్రామం వద్ద బుధవారం ఆటో బోల్తా పడడంతో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. తోటకనుమ గ్రామానికి చెందిన వరదప్ప కుమారుడు రాజశేఖర్ ఆటోలో వి.కోటకు బయ లుదేరాడు. మోర్నపల్లి వద్ద ఆటో బోల్తా పడింది. రాజశేఖర్ తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని స్థానికులు వి.కోట సీహెచ్‌సీకి తరలించి చికిత్స అందించారు. వరకట్నం వేధింపులపై కేసు నమోదు పుత్తూరు: మహిళ ఫిర్యాదు మేరకు అదనపు కట్నం కోసం వేధిస్తున్న భర్తతో పాటు అత్తింటి వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పుత్తూరు మండలం నేసనూరుకు చెందిన వి.మునిలక్ష్మి(30)కి చైన్నె రాజకీలపాక్కానికి చెందిన ఎం.మణికంఠశివ అలియాస్ వరుణ్శివతో 2018లో వివాహమైంది. ఆ సమయంలో 20 సవర్ల బంగారు నగలు, రూ.10 లక్షల నగదు ఇచ్చారు. వివాహం తర్వాత ఆస్ట్రేలియాలో కాపురం పెట్టిన మణికంఠశివ అదనపు కట్నం కింద రూ.20 లక్షలు తీసుకురావాలని వేధించేవాడు. ఇతనికి అతని బంధువులైన శేఖర్, జానకి, విజయలక్ష్మీ, గోపి మద్దతు తెలిపారు. ఈ మేరకు మునిలక్ష్మీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
భజే హం.. గణేశం
శాస్త్రోక్తంగా ధ్వజారోహణం బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం ఉదయం ధ్వజారోహణ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. మంగళ వాయిద్యాలు, వేదమంత్రోచ్ఛారణల నడుమ ధ్వజస్తంభానికి సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. మూషిక చిత్రపటాన్ని ధ్వజస్తంభంపైకి ఎగురవేశారు. ముక్కోటి దేవతలను ఉత్సవాలకు ఆహ్వానించారు. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి స్వామివారు హంసవాహనంపై విహరిస్తూ భక్తులకు అభయమిచ్చారు. కాణిపాకం : కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో చవితి పర్వదిన వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. అలాగే మంగళవారం వార్షిక బ్రహ్మోత్సవాలను కనులపండువగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణాన్ని విద్యుద్దీపాలు, పుష్పాలంకరణలతో అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. పర్వదినం రోజున శాస్త్రోక్తంగా మూలవిరాట్‌కు పంచామృతాభిషేకం జరిపించారు. దివ్యాభరణాలతో స్వామివారిని అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మూలవర్లకు ప్రత్యేక అభిషేకాలు, అంతరాలయ దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేశారు., ఉదయం నుంచి రాత్రి వరకు నిరంతరాయంగా సర్వదర్శన సేవలు అందించారు. అలాగే క్యూలో వేచి ఉన్న భక్తులకు ఆలయ అధికారులు తాగునీరు, ఉచిత ప్రసాదాలు పంపిణీ చేశారు. వందలాది మంది భక్తులు స్వామివారికి పుష్పకావళ్లను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. తొలి రోజు రాత్రి ఉత్సవమూర్తి మూషిక వాహనంపై పురవీధుల్లో విహరించారు. పట్టువస్త్రాల సమర్పణ వార్షిక బ్రహ్మోత్సవాలు, వినాయక చవితిని పురస్కరించుకుని దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రభుత్వం తరఫున స్వామివారికి సంప్రదాయబద్ధంగా పట్టువస్త్రాలను సమర్పించారు. కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ తుషార్‌డూడి, ఎమ్మెల్యేలు మురళీమోహన్, గురజాల జగన్మోహన్, ఆలయ ఈఓవో పెంచల కిషోర్, చైర్మన్ మణినాయుడు పాల్గొన్నారు.. అనంతరం ప్రత్యేకంగా చేపట్టిన గణపతి వ్రతానికి మంత్రి హాజరయ్యారు. స్వర్ణ రథోత్సవ సేవ ప్రారంభం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో భక్తుల కోసం నూతనంగా స్వర్ణ రథోత్సవ ఆర్జిత సేవను ప్రవేశపెట్టినట్లు ఈఓ పెంచల కిషోర్ తెలిపారు. ప్రతి సంకటహర గణపతి వ్రతం రోజున ఈ సేవ అందుబాటులో ఉంటుందన్నారు. రూ.5వేల టికెట్‌పై గరిష్టంగా ఐదుగురు భక్తులను అనుమతిస్తామని వెల్లడించారు. పూజా సామగ్రిని ఆలయమే సమకూరుస్తుందని, భక్తులకు సిల్క్ శాలువా, జాకెట్ పీస్, రెండు అభిషేకం లడ్డూలు, రెండు వడలను ప్రసాదంగా అందిస్తామని వివరించారు. ఆన్లైన్ ద్వారా భక్తులు స్వర్ణ రథోత్సవం టికెట్లు పొందవచ్చని తెలిపారు. ఊరేగుతున్న స్వామివారు మూషిక వాహనంపై వినాయకుడు స్వయంభు.. నీ సన్నిధే మాకు పెన్నిధి. సకల దేవతాగణాలు పూజనీయమైన సుమ పాద పద్మాలే మాకు శరణ్యం. మూషిక వాహనంపై కొలువుదీరిన నీ దివ్య చరణాలే సర్వజగద్రక్ష.. అంటూ అశేష భక్త జనులు స్మరించుకున్నారు. వినాయక చవితిని పురస్కరించుకుని సోమవారం కాణిపాకం క్షేత్రానికి భారీగా తరలివచ్చారు. శోభాయమానంగా వెలుగొందుతున్న పార్వతీతనయుడిని దర్శించుకుని పులకించారు. మంగళవారం వైభవంగా ప్రారంభమైన వరసిద్ధుని బ్రహ్మోత్సవంలో గణనాథుని సేవించుకుని పరవశించారు. ఆలయాల అభివృద్ధే ధ్యేయం రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని 6,254 ఆలయాల్లో ధూప దీప నైవేద్య పథకం కింద ఏటా రూ.75 కోట్లు వెచ్చిస్తున్నామని చెప్పారు.సీజీఎఫ్ ద్వారా 767 ఆలయాల పునర్నిర్మాణానికి రూ.908.32 కోట్ల నిధులు మంజూరు చేశామన్నారు. రూ.750 కోట్లతో 5వేల భజన మందిరాల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటికే 1,788 మందిరాలకు నిధులు విడుదల చేశామని వివరించారు. 111 ఆలయాల్లో ఏటా రూ.3 కోట్ల మందికి అన్నదానం చేస్తున్నామని తెలిపారు. పాలనా సౌలభ్యం కోసం 996 ఆలయాలకు ట్రస్ట్ బోర్డుల నియామకం పూర్తి చేశామని వివరించారు. -
దేశాభివృద్ధిలో ఇంజినీర్లు కీలకం
చిత్తూరు కార్పొరేషన్ : దేశాభివృద్ధిలో ఇంజినీర్ల పాత్ర కీలకమని కలెక్టర్ సుమిత్‌కుమార్ తెలిపారు. మంగళవారం జిల్లా ఆర్కిటెక్ట్ అండ్ సివిల్ ఇంజినీ ర్స్ అసోసియేషన్ వారు చిత్తూరు ఆర్అండ్బీ అతి థిగృహంలో ఇంజనీర్స్ డే నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్‌తోపాటు కలెక్టర్ పాల్గొన్నారు. ముందుగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహనికి నివాళులర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఇంజినీరింగ్ రంగానికి మార్గదర్శకుడైన మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలను స్మరించుకోవడం స్ఫూర్తిదాయకమన్నారు. వివిధ విభాగాలకు చెందిన ఇంజినీర్లు, ఆర్కిటెక్ట్‌లు దేశ ని ర్మాణంలో తమ వంతు పాత్ర పోషిస్తున్నారని వెల్లడించారు. గతంలో నిర్మించిన అనేక ఆనకట్టలు, రహదారులు, నీటిపారుదల వ్యవస్థలు, పట్టణ ప్రణాళికలు నేటికి చెక్కుచెదరకుండా ఉన్నాయని వివరించారు. కాలానుగుణంగా మారుతున్న సాంకేతికతను అందిపుచ్చుకుని ఇంజినీర్లు కొత్త ఆవిష్కరణలు, నాణ్యమైన నిర్మాణాలకు కృషి చేయాలని సూచించారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో చుడా చైర్మన్ హేమలత, ఆర్అండ్బీ ఎస్ఈ సురేష్, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఎస్ఈ కార్యాలయంలో.. ట్రాన్స్‌కో ఎస్ఈ కార్యాలయంలో మోక్షగుండ విశ్వేశ్వరయ్య చిత్రపటానికి ఎస్ఈ అమర్‌బాబు నివాళులర్పించారు. కార్యక్రమంలో పీఓ రెడ్డప్ప, ఏఈ జ్యోతి పాల్గొన్నారు. -
బ్రహ్మోత్సవ తేజం.. విశేష విహారం
పెద్దశేష వాహనంపై విహరిస్తున్న శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామివారుకలియుగ వైకుంఠనాథుడి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. సోమవారం అంకురార్పణతో ఉత్సవాలకు నాంది పలకగా.. మంగళవారం మీన లగ్నంలో నిర్వహించిన ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు లాంఛనంగా ఆరంభమయ్యాయి. గరుడ పతాకాన్ని బంగారు ధ్వజస్తంభంపై ఎగురవేసి ముక్కోటి దేవతలకు ఉత్సవాలకు ఆహ్వానం పలికారు. రాత్రి పెద్ద శేష వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామివారు తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను కనువిందు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీవారికి ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించి, స్వామివారిని దర్శించుకున్నారు. పెద్ద శేష వాహనంపై అభయముద్ర బ్రహ్మోత్సవాలలో తొలి రోజు మంగళవారం రాత్రి శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారు ఏడు తలల పెద్ద శేష వాహనంపై తిరుమాడ వీధుల్లో విహరించారు. ఆదిశేషుడు తన పడగ నీడలో స్వామివారిని సేవిస్తూ దాస్యభక్తికి ప్రతీకగా నిలుస్తాడు. -
తూకమేస్తున్నారు!
సాక్షి ప్రతినిధి, తిరుపతి: పేదలకు పంపిణీ చేసే బియ్యం మధ్యలోనే సగం మాయం అవుతోంది. స్టాక్ పాయింట్ల నుంచి రేషన్ డీలర్‌కు చేరవేసే మసయంలో భారీ తేడాలు వస్తున్నాయి. ప్రతి నెలా వచ్చే ఈ తేడాల కారణంగా అనేక మంది డీలర్లు తీవ్రంగా నష్టపోతున్నారు. మధ్యలో ఉన్న వారు మాత్రం బియ్యాన్ని నొక్కేసి బ్లాక్ మార్కెట్లకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారని డీలర్లు ఆరోపిస్తున్నారు. తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో మండల స్థాయి రేషన్ స్టాక్ పాయింట్లు అవకతవకలకు అడ్డాలుగా మారాయి. గోదాముల నుంచి వచ్చే బియ్యాన్ని కాటా వేయకుండానే నేరుగా ఎఫ్పీ (రేషన్) షాపులకు తరలిస్తూ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. తూకం లేదు .. కొలత లేదు స్టేజ్–1 గోదాముల నుంచి ఎంఎల్ఎస్ పాయింట్లకు వచ్చే బియ్యం లోడులను నిబంధనల ప్రకారం కాటా వేసి గోదాముల్లో దించాల్సి ఉంది. అయితే అవేవీ పట్టించుకోకుండా అసలు తూకమే వేయకుండా అన్న్లోడ్ చేస్తున్నారు. అక్కడితో ఆగకుండా స్టేజ్–1 లారీల నుంచి నేరుగా ఎఫ్పీ షాపులకు వెళ్లే లారీల్లోకి బస్తాలను మార్చేసి పంపించేస్తున్నారు. ఈ దందా వల్ల ప్ర తి బస్తాకు 2 నుంచి 3 కిలోల వరకు బియ్యం తక్కువ వస్తోందని డీలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలపైనే తరుగు భారం! ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి తక్కువ తూకంతో బియ్యం వస్తుండడంతో ఎఫ్పీ షాపు డీలర్లు తీవ్ర నష్టాన్ని చవిచూస్తున్నారు. చివరకు డీలర్లు కూడా కార్డుదారులకు ఇచ్చే కోటాలో కోతలు విధించాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. అంతిమంగా ఈ తూకాల తరుగు భారం మొత్తం పేద ప్రజల మీదే పడుతోంది. కార్డుదారులకు పూర్తి కోటా అందకపోవడంతో రేషన్ దుకాణాల వద్ద నిత్యం వాగ్వాదాలు చోటుచేసుకుంటున్నాయి. రేషన్ షాపులకు బియ్యం సరఫరాలో తేడాలు మామూళ్లు ఎవరిస్తారంటూ దబాయింపు ఈ తూకాల లోపాలపై రేషన్ డీలర్లు ఎంఎల్ఎస్ పాయింట్ ఇన్‌చార్జ్‌లను నిలదీస్తే.. వారు ‘మా పైవాళ్లకు నెల నెలా మామూళ్లు ఎవరు ఇవ్వాలి?.. మా జేబులో నుంచి ఇవ్వాలా?’ అంటూ డీలర్లపై కేకలు వేస్తున్నట్లు తెలిసింది. పై వాళ్లకు మామూళ్లు కావాలంటే.. బస్తాల్లో రెండు, మూడు కిలోలు తీసేస్తేనే కాదా? ఇవ్వగలం. కాబట్టి మేము ఇలాగే ఇస్తాం, మీ ఇష్టం వచ్చిన చోట చెప్పుకోండి’ అంటూ దబాయిస్తున్నట్లు డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు జిల్లా ఉన్నతాధికారుల అండదండలతోనే తూకాల్లో భారీ మోసం జరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. తక్షణమే ఉన్నతాధికారులు, విజిలెన్స్ విభాగం స్పందించి ఎంఎల్ఎస్ పాయింట్లలో వేబ్రిడ్జి తూకం వేయాలని, అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు, డీలర్లు డిమాండ్ చేస్తున్నారు. -
పురపోరుకు అడుగులు!
మరో వారంలో ఓటర్ల జాబితా సాక్షి, చిత్తూరు : మున్సిపల్ ఎన్నికల నిర్వహణ దిశగా రాష్ట్ర ఎన్నికల సంఘం అడుగులు వేస్తోంది. అందులో భాగంగా ఈనెల 22వ తేదీన జిల్లాలోని నగరపాలక సంస్థతోపాటు రెండు మున్సిపాలిటీల్లో వార్డుల వారీ గా ఓటర్ల జాబితా ప్రచురించాలని మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. చైర్మన్, మేయ ర్ స్థానాల ఖరారు చేసి.. ఎన్నికల షెడ్యుల్ విడుదల చేయడమే మిగిలింది. వార్డుల వారీగా వివరాలు జిల్లాలో చిత్తూరు కార్పొరేషన్‌తో పాటు పలమనేరు, నగరి, కుప్పం మునిసిపాలిటీలు ఉన్నాయి. కుప్పం పాలకవర్గానికి నవంబరు వరకు గడువు ఉంది. మిగిలిన చోట్ల పాలకవర్గాల పదవీకాలం పూర్తవడంతో ప్రస్తుతం ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది. మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా వార్డుల పునర్విభజన ప్రక్రియకు న్యాయపరమైన చిక్కులు వీడడంతో అధికారులు రెండు రోజుల క్రితం కొత్త వార్డుల సరిహద్దులు నిర్ణయిస్తూ వివరాలను గెజిట్ రూపంలో విడుదల చేశారు. దీంతో చిత్తూరు కార్పొరేషన్‌లోని 50 డివిజన్లు 60గా మారాయి. నగరిలోని 29 వార్డులను 40గా, పలమనేరులో ఉన్న 26 వార్డులను 36గా పెంచుతూ అధికారులు గెజిట్ విడుదల చేశారు. కానీ, కుప్పంలోని 25 వార్డులను 32 స్థానాలకు పెంచినప్పటికీ తొలి షెడ్యుల్‌లో ఇక్కడ ఓటర్ల జాబితా ప్రచురణ ఉండదు. రెండో దశలో ఇక్కడ ఎన్నికలు నిర్వహించే అవకాశముంది. ఇక మిగిలింది రిజర్వేషన్లే వార్డుల పునర్వభజన పూర్తవడం, వార్డుల వారీగా ఓటర్ల జాబితా ప్రచురణ పూర్తయితే మరో షెడ్యుల్ విడుదలవుతుంది. ప్రచురించిన ఓటర్ల జాబితాలో మళ్లీ ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్లను గుర్తించడానికి మున్సిపల్ అధికారులు ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరించనున్నారు. అనంతరం వార్డులను ఏయే సామాజిక వర్గాలకు కేటాయించాలనే నిబంధన ప్రకారం కలెక్టర్ రిజర్వేషన్లు ప్రకటిస్తారు. తుదిగా మేయర్, చైర్మన్ స్థానాల రిజర్వేషన్లపై ప్రభుత్వం ప్రకటన జారీ చేయడం, తర్వాత ఎన్నికల షెడ్యుల్ విడుదల చేస్తారు. అభ్యర్థుల కోసం వేట చైర్మన్, మేయర్ స్థానాల రిజర్వేషన్ ప్రకటన వెలువడకముందే జిల్లాలో అభ్యర్థుల కోసం పార్టీల వేట మొదలైంది. తొలిగా ఓపెన్ కేటగిరీ వస్తే ఎవరిని బరిలోకి దించాలనే విషయంపై కసరత్తు ప్రారంభమైంది. రిజర్వేషన్ కేటగిరీలో అభ్యర్థుల ఎంపిక నిమిత్తం ఆర్థిక బలవంతుల కోసం టీడీపీ జల్లెడ పడుతోంది. చిత్తూరులో మేయర్ స్థానం ఆశిస్తునన వారు ఇప్పటికే ఫ్లెక్సీలు వేసుకుంటున్నారు. మేయ ర్ కుర్చీ కోసం రూ.20 కోట్లు సైతం ఖర్చు చేయడానికి సిద్ధమనే సంకేతాలు పంపిస్తున్నారు. కానీ, ప్రజాక్షేత్రంలో ఉన్న వ్యతిరేకత, క్షేత్రస్థాయిలో ప్రతిపక్షానికి ఉన్న ప్రజాబలాన్ని అంచనా వేయలేకపోతున్నారు. వార్డుల పునర్విభజన పూర్తవడంతో తాజాగా ఓటర్ల జాబితా ప్రచురణకు రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. ఈనెల 22వ తేదీ చిత్తూరు కార్పొరేషన్‌తో పాటు పలమనేరు, నగరి, మున్సిపాలిటీల్లోని 136 వార్డుల్లో ఓటర్ల జాబితా ప్రచురించనున్నారు. రాజకీయ పార్టీలు, ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించి, వార్డుల వారీగా పురుష, మహిళా ఓటర్ల తుది జాబితాను ప్రదర్శించనున్నారు. తర్వాత వార్డుల వారీగా పోలింగ్ కేంద్రాల జాబితా, ఒక్కో వార్డులోని ఓటర్లను పోలింగ్ కేంద్రాల వారీగా సర్దుబాటు చేయడం వంటి ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. -
భార్యను కడతేర్చిన భర్తకు జీవిత ఖైదు
మదనపల్లె టౌన్ : కట్టుకున్న భార్యను కొడవలితో దారుణంగా నరికి హత్య చేసిన భర్తకు జీవిత ఖైదు పడింది. చిత్తూరులోని ఆరవ అదనపు జిల్లా కోర్టు మహిళలపై నేరాల ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి టి.హరిత మంగళవారం ఈ సంచలన తీర్పు వెలువరించారు. పోలీసుల కథనం మేరకు.. అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని చిలకవారిపల్లెకు చెందిన పడపట్ల రఘు (60) తన భార్య పడపట్ల లక్ష్మీదేవమ్మను 2023 ఆగస్టు 31న పట్టపగలు నడిరోడ్డుపై కొడవలితో దారుణంగా నరికి హత్య చేశాడు. మదనపల్లె రెండో పట్టణ పరిధిలోని బాపూజీ పార్కు సమీపంలో ఈ సంచలన హత్య అందరూ చూస్తుండగానే జరిగింది. ఈ ఘటన అప్పట్లో తీవ్ర కలకలం కూడా రేపింది. ఈ ఘటనపై అప్పటి రెండో పట్టణ ఎస్ఐ జి.హేమాద్రి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు సేకరించిన సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయస్థానం.. రఘు హత్యకు పాల్పడినట్లు నిర్ధారించింది. హత్య నేరానికి జీవితకాల కఠిన కారాగార శిక్షతోపాటు రూ.500 జరిమానా విధించింది. జరిమానా చెల్లించకపోతే మరో రెండు వారాల సాధారణ కారాగార శిక్ష అనుభవించాలని ఆదేశించింది. ఈ కేసులో పక్కా ఆధారాలు సేకరించి నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన మదనపల్లె డీఎస్పీ బుచ్చిరాజు, రెండో పట్టణ సీఐ ఎస్.మహమ్మద్ రఫీ, ఎస్ఐ నాగేశ్వరరావు, ప్రభుత్వ న్యాయవాది ఎం.బాలాజీ, న్యాయస్థాన పోలీసు సిబ్బంది ఎ.మునిరాజు, టి. వెంకటరమణలను జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి అభినందించారు. -
గుడిసె దగ్ధం
శ్రీరంగరాజపురం : మండలంలోని తుంగమిట్ట గ్రామంలో సోమ వారం సాయంత్రం జి.ఆర్ముగం అనే వ్యక్తి పూరిల్లు దగ్ధమైంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌కారణంగా ప్రమాదం సంభవించిందని బాధితుడు తెలిపాడు. పిల్లల సర్టిఫికెట్లు రూ.2లక్షల నగదు, 90 పీవీసీ పైపులు, ఇంటి పట్టా, దుస్తులు, నిత్యావసర సరుకులు కాలిబూడిదైనట్లు వెల్లడించాడు. ప్రభు త్వం ఆదుకోవాలని కోరాడు. బొలేరో బోల్తా : ముగ్గురికి గాయాలు కుప్పంరూరల్ : బొలేరో వాహనం బోల్తాపడి ముగ్గురు గాయపడిన ఘటన కుప్పం మండలం, మల్లమ్మ చెరువు వద్ద సోమవారం జరిగింది. వివరాలు.. బేటరాయస్వామి కొండ వైపు నుంచి కుప్పం దిశగా వస్తున్న బొలేరో వాహనం అదుపు తప్పడంలో ప్రమాదం జరిగింది. దీంతో ముగ్గురు యువకులు గాయపడ్డారు. క్షతగాత్రుల్లో రాహుల్ అనే యువకుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు కుప్పంరూరల్ : కుప్పం పట్టణం సమీపంలోని వాణిమహల్ వద్ద సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు గాయపడ్డారు. మార్కెట్ యార్డు వైపు నుంచి వస్తున్న ద్విచక్ర వాహనాన్ని కుప్పం వైపు నుంచి వెళుతున్న కారు ఢీ కొంది. క్షతగాత్రులను ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. క్షతగాత్రుల వివరాలు తెలియరాలేదు. బాల్ బ్యాడ్మింటన్‌లో జిల్లా జట్టు విజేత నగరి : ఉమ్మడి ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో ఈ నెల 11, 12, 13 తేదీల్లో నిర్వహించిన అంతర్ జిల్లాల సబ్ జూనియర్ బాల్ బ్యాడ్మింటన్ పోటీల్లో చిత్తూ రు జిల్లా జట్టు అద్భుత ప్రతిభ కనబరిచి ప్రథమ బహుమతిని సాధించింది. ఈ పోటీల్లో జిల్లా జట్టు తరఫున పాల్గొన్న నగరికి చెందిన దువ్వూరు లక్ష్మీనరసింహారెడ్డి అత్యుత్తమ ప్రతిభ కనబరచి రాష్ట్ర బెస్ట్ ప్లేయర్ అవార్డు దక్కించుకున్నాడు. రాష్ట్ర స్థాయి ఎంపిక కమిటీ జాతీయ సబ్ జూనియర్ బాల్ బ్యాడ్మింటన్న్ జట్టుకు లక్ష్మీనరసింహారెడ్డిని ఎంపిక చేసింది. దీనిపై క్రీడాభిమానులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే రాష్ట్ర స్థాయి సబ్‌జూనియర్స్ పోటీల్లో 3వ సారి జిల్లా జట్టు విజయం సాధించి హ్యాట్రిక్ విజయం నమోదు చేసుకుంది. -
హక్కు.. సన్నాయి నొక్కు!
పేదల ఆశలపై నీళ్లు చిత్తూరు కలెక్టరేట్ : చంద్రబాబు సర్కారు ఫ్రీ హోల్డ్ భూముల విషయంలో చేస్తున్న కుట్రలు వివాదాలకు దారితీస్తున్నాయి. దశాబ్దాల తరబడి భూము లను నమ్ముకున్న పేద రైతులకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం లబ్ధి చేకూరిస్తే, కూటమి సర్కారు ఆ లబ్ధిని లాగేసుకుంటోంది. రైతులకు గతంలో అందించిన ఫ్రీ హోల్డ్ (పూర్తి యాజమాన్య) హక్కులను ప్రస్తుత సర్కారు కుట్రపూరితంగా లాక్కోవడంపై గ్రామీణ ప్రాంతాల్లో నిరసన వ్యక్తమవుతోంది. రీ వెరిఫికేషన్, సమీక్షల పేరుతో లక్షలాది ఎకరాలను తిరిగి 22 ఏ నిషేదిత భూముల జాబితాలోకి నెట్టివేయడంపై రైతాంగం మండిపడుతోంది. కుప్పంలో సైతం.. సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో సైతం ప్రభుత్వం పక్షపాత వైఖరికి పాల్పడి దగా చేస్తోందని రైతులు విమర్శిస్తున్నారు. కుప్పం, వి.కోట మండలాల్లో ఉద్దేశపూర్వకంగాానే భూ హక్కులపై కోత విధిస్తున్నారని ఆరోపిస్తున్నారు. కుప్పం మండలంలో సుమారు 8,674 ఎకరాలను గత వైఎస్సార్సీపీ సర్కారు ఫ్రీ హోల్డ్‌గా ప్రకటిస్తే, అందులో ఏకంగా 8,400 ఎకరాల భూ హక్కులను రద్దు చేసి 22 ఏలో పెట్టేందుకు కుట్రలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వి.కోట మండలంలో 12,226 ఎకరాల డీకేటీ భూములను గతంలో ఫ్రీహోల్డ్ గా ప్రకటిస్తే, ప్రస్తుతం ఏకంగా 9,243 ఎకరాలను చంద్రబాబు సర్కారు రద్దు చేస్తోంది. ఆందోళనలో రైతులు రీ వెరిఫికేషన్ అనేది కేవలం ఒక నాటకమని, వైఎస్సార్సీపీ సర్కారు పేదలకు చేసిన మంచిని చెరిపేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుట్రలకు తెరలేపిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లా సమాచారం ఫ్రీ హోల్డ్ చేసిన మొత్తం భూములు 1.59 లక్షల ఎకరాలు ప్రభుత్వం అక్రమంగా కోత పెట్టినవి 1.05 లక్షల ఎకరాలు ప్రస్తుతం హక్కు కల్పిస్తున్నవి 53,917 ఎకరాలు నష్టపోతున్న రైతులు 30,150 మందిఫ్రీ హోల్డ్ భూముల విషయంలో పారదర్శకత పాటిస్తాం. చిన్న, సన్నకారు రైతులకు హక్కులు కల్పించేందుకు కృషి చేస్తాం. రీ వెరిఫికేషన్ చేయించి అర్హులందరికీ న్యాయం చేస్తాం.. అంటూ చంద్రబాబు ప్రభుత్వం సన్నాయి నొక్కులు నొక్కింది. వాస్తవంలోకి వచ్చేసరికి నిజమైన రైతుల భూములను 22 ఏ కింద నిషేధ జాబితాలోకి చేర్చేసింది. తమ్ముళ్లకు చెందిన సాగులేని భూములకు మాత్రం యథేచ్ఛగా సర్వ హక్కులు కట్టబెడుతోంది. గత వైఎస్సార్సీపీ సర్కారులో నిష్పక్షపాతంగా తయారు చేసిన జాబితాలను బుట్టదాఖలు చేసి.. టీడీపీ నేతలకే పెద్దపీట వేస్తుండడం చర్చనీయాంశంగా మారింది. గత వైఎస్సార్సీపీ సర్కారు అసైన్డ్ భూములకు సంబంధించి 20 ఏళ్ల పాటు అనుభవంలో ఉన్న పేద రైతులకు యాజమాన్య హక్కులు కల్పిస్తూ ఫ్రీ హోల్డ్ విధానం తెచ్చింది. దీంతో రైతుల తమ భూములను అమ్ముకునేందుకు, బ్యాంకు రుణాలు పొందేందుకు, పిల్లల చదువులు, పెళ్లిళ్లకు వినియోగించుకునేందుకు మార్గం సుగమమైంది. కానీ, చంద్రబాబు ప్రభుత్వం రాగానే రీ వెరిఫికేషన్ పేరుతో ఈ ప్రక్రియను నిలిపివేసింది. వైఎస్సార్సీపీ పాలనలో జిల్లా వ్యాప్తంగా 1.59 లక్షల ఎకరాల భూములకు ఫ్రీ హోల్డ్ కల్పించారు. ప్రస్తుతం కూటమి సర్కారు రీ వెరిఫికేషన్ పేరుతో 1.05 లక్షల ఎకరాలకు తగ్గిస్తున్నారు. ప్రస్తుతం 53,917 ఎకరాలకు మాత్రం ఫ్రీహోల్డ్ హక్కులు కల్పించేందుకు చర్యలు చేపడుతున్నారు. ఈ ప్రక్రియలో విచిత్రమేమిటంటే...సాధారణ, పేద రైతుల భూములను రిజిస్ట్రేషన్లు కాకుండా 22 ఏలో పెడుతూ, పచ్చ నేతలకు మాత్రం సైలెంట్ గా ఫ్రీ హోల్డ్ జాబితాలో పెట్టి రిజిస్ట్రేషన్లు చేయించేలా కుట్ర చేస్తున్నారు. పక్షపాతంతో రెవెన్యూ రికార్డుల్లో యథేచ్చగా మార్పులు, చేర్పులు చేస్తూ నిజమైన లబ్ధిదారుల పొట్ట కొడుతున్నారు. -
వినాయకుడి ఊరేగింపులో విషాదం
– తండ్రి కళ్ల ముందే చిన్నారి మృతి నగరి : వినాయక చవితి వేడుకల్లో ఆనందంగా సాగాల్సిన ఊరేగింపు ఒక కుటుంబంలో తీరని విషాదాన్ని మిగిల్చింది. వినాయక ప్రతిమను ట్రాక్టర్లో ఊరేగిస్తుండగా జరిగిన ప్రమాదంలో 11 ఏళ్ల చిన్నారి మృతి చెందింది. ఈ విషాద ఘటన నగరి మండలం దామరపాకం గ్రామంలో సోమవారం అర్ధరాత్రి జరిగింది. దామరపాకం గ్రామానికి చెందిన జి. శంకర్ కుమార్తె ప్రసన్నశ్రీ (11) స్థానిక పాఠశాలలో ఐదో తరగతి చదువుతోంది. వినాయక చవితి సందర్భంగా సోమవారం రాత్రి గ్రామంలో వినాయక విగ్రహాన్ని ట్రాక్టర్‌పై ఊరేగిస్తున్నారు. ఈ సమయంలో తండ్రి చిన్నారిని ట్రాక్టర్లో జనరేటర్ పక్కన కూర్చో బెట్టాడు. రాత్రి సుమారు 11.30 గంటల సమయంలో జనరేటర్ ఫ్యాన్‌న్‌కు చిన్నారి తల వెంట్రుకలు చుట్టుకోవడంతో తీవ్రంగా గాయపడింది. తిరుపతి రుయాకు తరలిస్తుండగా మార్గం మధ్యలో మరణించింది. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు విషాదంలో మునిగిపోయారు. -
తమిళనాడు వాసి మృతి
కుప్పంరూరల్ : కుప్పంలోని పెద్ద గంగమ్మ ఆలయ ఆవరణలో తమిళనాడుకు చెందిన సోమసుందరం అనే వృద్ధుడు మంగళవారం ఉదయం మృతి చెందాడు. తమిళనాడు నుంచి వచ్చిన సోమ సుందరం పగటి పూట పట్టణంలో భిక్షాటన చేసు కుని రాత్రివేళ పెద్ద గంగమ్మ ఆలయ ఆవరణ లో నిద్రించేవాడు. కాగా సోమవారం రాత్రి పడుకున్న వృద్ధుడు నిద్రలోనే మరణించినట్లు స్థానికులు తెలిపారు. అయితే సోమసుందరం తన కుటుంబీకుల ఫోన్ నంబర్లు, చిరునామా ఓ పేపర్‌పై రాసుకుని ఉన్నాడు. దీంతో వృద్ధుడు మృది చెందిన వార్తను ఆయన కుటుంబీకులకు పోలీసులు తెలియజేశారు. బాణసంచా పేలి ఐదుగురికి గాయాలు బంగారుపాళెం: మండలంలోని కూర్మాయిపల్లె పంచాయతీ రోళ్లవారిపల్లెలో గణపతి విగ్రహ నిమజ్జనంలో సోమవారం సాయంత్రం అపశృతి జరిగింది. బాణసంచా పేలుడు కారణంగా ఐదురుగు గాయపడ్డారు. సీఐ శ్రీనివాసులు కథనం మేరకు.. వినాయ క చవితిని పురష్కరించుకుని సోమవారం ఉదయం రోళ్లవారిపల్లెవాసులు గణపతి ప్రతిమకు విశేష పూజలు నిర్వహించారు. సాయంత్రం నిమజ్జన ఊరేగింపు నిమిత్తం బాణసంచా తెప్పించారు. అందులో కొంత ఓ ఇంటి ఆవరణలో ఉంచారు. ఊరేగింపు మొదలైన తర్వాత బాణసంచా పేలుస్తుండగా రవ్వలు ఎగసి ఇంటి ఆవరణలో పెట్టిన టపాకాయలపై పడ్డాయి. దీంతో భారీ పేలుడు సంభవించింది. అక్కడే ఉన్న జగదీశ్వర్‌రెడ్డి, సుగుణ్ సింధుప్రసాద్, జయచంద్రారెడ్డి, కిషోర్‌రెడ్డి గాయపడ్డారు. స్థానికులు వెంటనే వారిని ప్రభుత్వాస్పత్రిఇక తరలించారు. జగదీశ్వర్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. వ్యక్తిపై కత్తితో దాడి కుప్పంరూరల్: పురపాలక పరిధిలోని అనిమిగానిపల్లెలో వెంకటేష్ అనే వ్యక్తిపై గుర్తుతెలియని దుండగుడు కత్తితో దాడి చేసిన ఘటన మంగళవారం జరిగింది. గ్రామానికి చెందిన వెంకటేష్ ఉదయం 6 గంటల సమయంలో బహిర్భూమికి సమీపంలోని పొలాల వద్దకు వెళ్లాడు. అక్కడ గుర్తు తెలియని వ్యక్తి రాయితో దాడి చేసి కత్తితో పొడిచాడు. వెంకటేష్ కేకలు వేయడంతో దుండగుడు పారిపోయాడు. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం వెంకటేష్ ను పీఈఎస్ మెడికల్ కళాశాలకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పాత కక్షలతో వెంకటేష్‌పై దాడి జరిగి ఉంటుందని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విద్యుదాఘాతంతో యువతి మృతి పూతలపట్టు(యాదమరి): మండలంలోని వసంతాపురం దళితవాడలో మంగళవారం విద్యుదాఘాతంతో ఓ యువతి మృతి చెందింది. వివరాలు.. గ్రామానికి చెందిన రవిశంకర్ కుమార్తె సబిత (23) ముత్తిరేవుల సమీపంలోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో పనిచేస్తోంది. మంగళవారం ఉదయం నీటి కోసం మోటారు వేసే క్రమంలో కరెంట్ షాక్‌కు గురై అక్కడిక్కడే కుప్పకూలిపోయింది. కుటుంబసభ్యులు వెంటనే పి.కొత్తకోట సీహెచ్‌సీకి తరలించగా, అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సీఐ తిమ్మయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గుంతలో కర్ణాటక యువకుడు గల్లంతు శాంతిపురం : మండలంలోని 64 పెద్దూరు పంచాయతీ కారిముట్ల గ్రామం వద్ద రాతి క్వారీ గుంతలో కర్ణాటకకు చెందిన యువకుడు గల్లంతయ్యాడు. వివరాలు.. కె గొల్లపల్లెకు చెందిన మనోహర్‌కు కర్ణాటకలోని కేజీఎఫ్‌లో ఓ హోటల్లో పనిచేస్తున్న తుముకూరుకు ముబారక్(24) తో స్నేహం ఉంది. సోమవారంహోటల్కు సెలవు రావడంతో మిత్రుడి ఆహ్వానం మేరకు ముబారక్ వచ్చాడు. ఉక్కపోతగా ఉండడంతో సాయంత్రం మరో ఇద్దరితో కలిసి మొత్తం నలుగురు కారిముట్ల వద్ద ఉన్న క్వారీ గుంతలో ఈత కొట్టేందుకు వెళ్లారు. ఇంతలో ముబారక్ నీట మునిగిపోయా డు. మిగిలిన ముగ్గురు ఎంత గాలించినా ప్రయోజనం లేకపోయింది. విషయం తెలుసుకున్న రాళ్లబూదుగూరు పోలీసులు మంగళవారం ఉదయం నుంచి గాలింపు చర్యలు మొదలు పెట్టినా మృతదేహం లభించలేదు. అగ్నిమాపక సిబ్బందితో గాలింపు చర్యలను కొనసాగిస్తున్నారు. -
టెలిగ్రామ్ ఛానెల్ ఖరీదు రూ.6 కోట్లా.. తిరుపతి యువకుడికి జాక్‌పాట్
సాక్షి,తిరుపతి : సోషల్ మీడియా టెలిగ్రామ్ ఛానెల్ అమ్మి రూ.6 కోట్లు సంపాదించాడు తిరుపతి యువకుడు.కానీ సీన్ కట్ చేస్తే.. అదే డబ్బు కోసం స్నేహితులే కిడ్నాప్ ప్లాన్ చేశారు.అసలు ఏం జరిగిందంటే?క్రికెట్ ప్రిడిక్షన్ టెలిగ్రామ్ ఛానెల్‌ను కోట్లకు విక్రయించి భారీగా డబ్బు సంపాదించిన యువకుడిని, అదే డబ్బుపై కన్నేసిన స్నేహితులే అపహరించిన సంచలన ఘటన తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది.పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. చంద్రగిరి మండలం నాగపట్నం గ్రామానికి చెందిన సుమంత్ అనే యువకుడు ‘నాని క్రికెట్ ప్రిడిక్షన్’ పేరుతో ఒక టెలిగ్రామ్ ఛానెల్‌ను నిర్వహిస్తున్నాడు. కాగా, ఈ ఛానెల్‌ను నార్త్ ఇండియాకు చెందిన ఒక వ్యక్తికి సుమంత్ ఏకంగా రూ.6 కోట్లకు విక్రయించాడు. ఈ భారీ మొత్తానికి సంబంధించిన డబ్బు సుమంత్ వద్ద ఉండటంతో, అతని స్నేహితులే ఆ కోట్ల రూపాయలపై కన్నేశారు.ఈ నేపథ్యంలోనే సుమంత్‌ను అతని స్నేహితులు కిడ్నాప్ చేశారు. అయితే కిడ్నాపర్ల చెర నుంచి ఒక స్నేహితురాలి సహాయంతో సుమంత్ అప్రమత్తమై ప్రాణాలతో బయటపడ్డాడు. వెంటనే తేరుకున్న బాధితుడు ఆగస్టు 28న తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. బాధితుని ఫిర్యాదు మేరకు తిరుపతి రూరల్ పోలీసులు వెంటనే స్పందించి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఇప్పటికే ముగ్గురు నిందితులను అరెస్ట్ చేయగా, పోలీసు కస్టడీలో వారు విస్తుపోయే నిజాలు వెల్లడించారు.నిందితులు ఇచ్చిన సమాచారంతో తాటితోపు వద్ద ఉన్న చందు ఇంట్లో దాచిపెట్టిన రూ. కోటి 10 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తాజాగా ఈ కేసులో దర్యాప్తును మరింత వేగవంతం చేసిన పోలీసులు.. మోహన్, బాలాజీ అనే మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఈ కిడ్నాప్ ఉదంతంలో ప్రధాన సూత్రధారులుగా ఉన్న యశ్వంత్, మనోజ్, గౌతంలు పరారీలో ఉండగా, వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. -
జేసీబీ, ట్రాక్టర్ సీజ్
పలమనేరు: పట్టణ సమీపంలోని కౌండిన్య నది లో ఏటిగడ్డ ఎల్లమ్మ ఆలయం వద్ద అక్రమంగా ఇసుకను తోడుతున్న జేసీబీ, ట్రాక్టర్‌ను ఆదివారం పలమనేరు పోలీసులు సీజ్ చేశారు. జీడిమాకులపల్లికి చెందిన ఇద్దరు ఇసుకాసురులపై కేసు నమోదు చేశారు. ఇక్కడి కౌండిన్య నదిలో కొందరు యథేచ్ఛగా ఇసుకను జేసీబీలతో తవ్వి తరలిస్తున్న విషయం తెలిసిందే. దీనిపై నదికి ఆనుకుని ఉన్న రైతులు పలుమార్లు అధికారులకు తెలిపినా స్పందన లేకుండా పోయింది. ఇలా ఉండగా కొందరు ఆదివారం నేరుగా పోలీసులను తీసుకెళ్లి వారి కళ్లముందే ఇసుకాసరులను పట్టించినట్టు తెలిసింది. జేసీబీ, ట్రాక్టర్ మంజునాథ్, సురేంద్రకు చెందినవిగా తెలిసింది. పోలీసులు వారిపై కేసు నమోదు చేశారా లేదా వాహనాల డ్రైవర్లపై కేసులు పెట్టారా అనే విషయం తెలియరాలేదు. -
పూల ధరలకు రెక్కలు
కుప్పం రూరల్ : కుప్పం మార్కెట్లో పూల ధరలకు రెక్కలు వచ్చాయి. గత వారం రోజులుగా సరాసరిన రూ.500 పలికిన కనకాంబరం పూలు ఆదివారం కిలో రూ.600 నుంచి రూ.900 పలికాయి. మిగిలిన పూల ధరలు వందల్లో పెరిగింది. దిగుబడి తగ్గడం, వినాయక చవితి పండుగ కావడంతో పూల ధరలు పెరిగినట్టు వ్యాపారులు తెలిపారు. ఒకప్పుడు కుప్పం నుంచి దేశ విదేశాలకు పూలు ఎగుమతి అయ్యేవి. నేడు కుప్పం నుంచి బెంగళూరు, చైన్నె, ముంబయి, విజయవాడ, నెల్లూరు, గుంటూరు వంటి ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. ఎల్‌నినో ప్రభావంతో కుప్పం ప్రాంతంలో 20 శాతం బోర్లు ఎండిపోయాయి. ఉన్న బావుల వద్ద కొంత మంది రైతులు తక్కువ విస్తీర్ణంలో పూల తోటలు సాగు చేస్తున్నారు. దీంతో దిగుబడి కూడా అంతంత మాత్రంగానే వస్తోంది. కుప్పం పూల మార్కెట్లో ఆదివారం కిలో పూల ధరలు ఇలా ఉన్నాయి. కనకాంబరం కిలో రూ.600 – 900, మల్లెలు కిలో రూ.1000, కాగడాలు రూ.500, జాజిమల్లె రూ.900, నేల సంపంగి రూ.350, సెంటుజాజులు రూ.900, గన్నేరు రూ.260, చామంతి రూ.250, గులాబి రూ.250, బంతి రూ.50 పలుకుతున్నాయి. పూలను కొనేందుకు ఆదివారం మార్కెట్లో జనం ఎగబడడం కనిపించింది. ఉద యం నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మార్కె ట్ సాగడం గమనార్హం. -
పట్టాలు ఇచ్చారు.. ఇప్పుడు ఖాళీ చేయమంటున్నారు
పెనుమూరు(కార్వేటినగరం): వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో 2022లో పట్టాలు ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇంటి నిర్మాణాలను ఆపి ఖాళీ చేయమంటున్నారు. ఇదెక్కడి న్యాయం అని పెనుమూరు మండలం కేసీపల్లి పంచాయతీ కంబాల చేను గ్రామస్తులు వాపోతున్నారు. కంబాల చేను గ్రామానికి చెందిన 13 మంది పేదలకు గత ప్రభుత్వం ఇళ్ల పట్టాలు మంజూరు చేసింది. 9 మంది ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. ఆర్థికంగా వెనుకడి ఉండడంతో కొందరు వివిధ దశల్లో నిర్మాణాలను ఆపేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ నాయకులు రెవెన్యూ అధికారులతో కలిసి ఇళ్లు మంజూరు చేసిన సర్వే నంబర్ మారిందని, అందులో ఇళ్ల నిర్మాణం చేయకూడదని ఆంక్షలు విధించారు. బాధితులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. బెదిరింపులకు గురిచేస్తున్న వారికి లాయర్ ద్వారా నోటీసులు పంపించారు. ఇవేవీ పట్టించుకోకుండా కూటమి నాయకుల అండతో రెవెన్యూ అధికారులు ఆదివారం పునాదులను జేసీబీతో తొలగించారు. తాము వైఎస్సార్సీపీ సానుభూతిపరులుగా ఉండడమే మేము చేసిన పాపమా అంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా అధికారులు స్పందించి తమకు 2022లో మంజూరు చేసి పట్టాలను పరిశీలించి ఇళ్ల నిర్మాణాలు చేసుకోవడానికి అనుమతులు ఇవ్వాలని కోరుతున్నారు. ప్రభుత్వాలు మారినంత మాత్రాన భూమికి ఉన్న సర్వే నంబర్లు కూడా మారుతాయా అని ప్రశ్నిస్తున్నారు. పునాదులను జేసీబీతో తొలగిస్తున్న కూటమి నాయకులు గత ప్రభుత్వం మంజూరు చేసిన పట్టాలను చూపిస్తున్న లబ్ధిదారులు -
ప్రతిభకు ఆసరా ఎన్ఎంఎంఎస్
చిత్తూరు కలెక్టరేట్ : డ్రాపౌట్స్ సంఖ్యను తగ్గించడం, ఉన్నత విద్యను అభ్యసించేలా అల్పాదాయ కుటుంబాల్లోని పిల్లలను ప్రోత్సహించడం, ఆర్థిక కారణాలతో చదువు ఆగిపోకుండా చూడాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ (ఎన్ఎంఎంఎస్)ను అమలు చేస్తోంది. జిల్లాలోని కొన్ని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు ఎన్ఎంఎంఎస్ పరీక్షకు విద్యార్థులను ప్రత్యేకంగా సిద్ధం చేస్తున్నారు. జాతీయ స్థాయి ప్రతిభా పోటీల్లో సత్తా చాటితే నాలుగేళ్లపాటు స్కాలర్షిప్ అందుతుంది. ప్రస్తుత విద్యాసంవత్సరంలో ప్రభుత్వ, జెడ్పీ, మున్సిపల్, నగరపాలక, ఎయిడెడ్, మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు. 7వ తరగతిలో ఓసీలు 55 శాతం, ఎస్సీ, ఎస్టీలు 50 శాతం మార్కులు సాధించి ఉండాలి. ఎన్ఎంఎంఎస్కు ఎంపికై న విద్యార్థులకు 9 నుంచి 12వ తరగతి వరకు ప్రతి ఏటా రూ.12 వేల చొప్పున మొత్తం రూ.48 వేలు వారి బ్యాంకు ఖాతాల్లో డీబీటీ ద్వారా జమచేస్తారు. తెలుగు, ఉర్ధూ, హిందీ, ఇంగ్లీష్ మీడియంలలో పరీక్ష రాయవచ్చు. రెవెన్యూ డివిజన్, జిల్లా కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తారు. మెంటల్ ఎబిలిటీ 90, స్టాటిస్టిక్ ఆప్టిట్యూట్ 90 మార్కులకు ఉంటుంది. ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించేందుకు అక్టోబర్ 12 చివరి తేదీ. పరీక్ష రుసుం చెల్లించేందుకు అక్టోబర్ 13 వరకు గడువు ఉంది. పరీక్ష నవంబర్ 15వ తేదీన నిర్వహిస్తారు. అర్హులైన విద్యార్థులు www. bre.ap.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని డీఈవో లక్ష్మినారాయణ సూచించారు. -
రేపు డయల్ యువర్ ఎస్ఈ
చిత్తూరు కార్పొరేషన్: విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం మంగళవారం డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ట్రాన్స్‌కో ఎస్ఈ అమర్‌బాబు తెలిపారు. వినాయకచవితి రోజున ప్రభుత్వ సెలవు దినం కావడంతో సోమవారం నిర్వహించాల్సిన కార్యక్రమాన్ని మరుసటి రోజుకు మార్పు చేశారన్నారు. వినియోగదారులు మంగళవారం ఉద యం 8.30 నుంచి 9.30 గంటల మధ్య 7993147979 నంబర్‌కు కాల్చేసి సమస్యలు తెలియజేయాలని సూచించారు. కాణిపాకం బ్రహ్మోత్సవాలకు ఐదు టన్నుల కూరగాయలు పలమనేరు: కాణిపాకంలో జరిగే బ్రహ్మోత్సవాలకు పలమనేరుకు చెందిన మోహన్‌రెడ్డి ఐదు టన్నుల కూరగాయలను వితరణ చేశారు. వాటిని ఆదివారం ప్రత్యేక వాహనంలో పంపించారు. 21 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలకు ప్రతి మూడు రోజులకు ఓ లోడు కూరగాయలను దాతల ద్వారా పంపనున్నట్టు శ్రీవారి భక్తులు రవీంద్రారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో కిశోర్స్వామితోపాటు పలువురు పాల్గొన్నారు. నేడు వినాయకుడికి పట్టువస్త్రాల సమర్పణ కాణిపాకం: స్వయంభు వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో 2026 వార్షిక బ్రహ్మోత్సవాలు సోమవారం నుంచి అక్టోబర్ 4వ తేదీ వరకు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం స్వామివారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి స్వామివారికి పట్టువస్త్రాలు అందజేస్తారని ఈవో పెంచల కిషోర్ ఒక ప్రకటనలో తెలిపారు. బయటపడిన హనుమ రాతి ప్రతిమ శాంతిపురం: మండలంలోని సొన్నేగానిపల్లి పంచాయతీ కూతేగౌనిపల్లిలో హనుమంతుడి రాతి విగ్రహం ఆదివారం బయటపడింది. గ్రామానికి చెందిన ఆనందగౌడుకు చెందిన ఆవు దూడ కాళ్లతో నేలపై గోకడంతో నల్లటి రాయి కొంత బయట పడింది. దీన్ని గమనించి మరి కొంత తవ్వడంతో ఆంజనేయస్వామి రాతి విగ్రహం బయటపడిందని గ్రామస్తులు చెప్పారు. విగ్రహానికి పూజలు చేశారు. వినాయక చవితి వేళ అన్ని గ్రామాలకు ప్రతిమల రూపంలో వినాయకుడు వస్తే తమ గ్రామానికి గణనాథుడితో పాటు హనుమంతుడు కూడా వచ్చాడని ఆనందం వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న తహసీల్దార్ ప్రకాష్ బాబు, ఎస్ఐ నరేష్ గ్రామానికి వెళ్లి స్వాధీనం చేసుకుని తీసుకెళ్లారు. దాన్ని పరిశీలించి ఏకాలం నాటిదో తెలియజేస్తామన్నారు. -
బ్రహ్మాండం!
బ్రహ్మోత్సవం.. ప్రత్యేక పూజలు, వాహన సేవలు కాణిపాకం: కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయకస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల శోభ మొదలైంది. సోమవారం చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రారంభమయ్యే ఉత్సవాలు అక్టోబర్ 4వ తేదీ వరకు ఘనంగా నిర్వహించనున్నారు. అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆలయంతోపాటు పరిసరాలను శోభాయమా నంగా తీర్చిదిద్దారు. దేశ విదేశాల నుంచి నుంచి తరలివచ్చే లక్షలాది మంది భక్తులకు స్వామి వారి దర్శనంలో ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి నిత్యం శాస్త్రోక్తంగా విశేష అభిషేక పూజలు, అర్చనలు చేస్తారు. ఉదయం, సాయంత్రం వేళల్లో విఘ్నేశ్వరుడు వివిధ వాహనాలపై కాణిపాక వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు. ఆలయ ఈవో పెంచల కిషోర్ పర్యవేక్షణలో అధికారులు భక్తుల రద్దీకి అనుగుణంగా ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శనాల క్యూలైన్ల పొడవును పెంచడంతో పాటు అదనపు షెడ్లను ఏర్పాటు చేశారు. దర్శనం అనంతరం భక్తులు ప్రసాదాల కోసం ఇబ్బంది పడకుండా ప్రసాద విక్రయ కేంద్రాల వద్ద కూడా క్యూలైన్లను ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. రథంతో పాటు వివిధ సేవలకు వినియోగించే వాహనాలకు రంగులు వేసి కొత్త కళను తీసుకువచ్చారు. చిత్తూరు, తిరుపతి మార్గాల నుంచి వచ్చే ప్రధాన రహదారుల్లో భక్తులకు స్వాగతం పలుకుతూ భారీ డిజిటల్ కటౌట్లు, తోరణాలు అమర్చారు. ఆలయ ప్రాంగణమంతా రంగురంగుల విద్యుత్ దీపాలంకరణలతో దేదీప్యమానంగా వెలిగిపోతోంది. మూషిక, అన్వేటి, సుపథ మండపాలతో పాటు నవగ్రహ, అభయాంజనేయస్వామి ఆలయాల వద్ద విద్యుత్ కటౌట్లు ఏర్పాటు చేశారు. ముఖద్వారం నుంచి ధ్వజస్తంభం, అంతరాలయం వరకు వివిధ రకాల దేశీయ, విదేశీ పూలతో అలంకరించారు. హోమాలు, జపాలు, యజ్ఞ పూజల కోసం ప్రత్యేకంగా యజ్ఞశాలను సిద్ధం చేశారు. మూడు చోట్ల పార్కింగ్ స్థలం భక్తుల వాహనాల రద్దీని నివారించేందుకు ముందుగానే పార్కింగ్ స్థలాలను సిద్ధం చేశారు. గణేష్ సేవాసదన్ భవనం పక్కన ఉన్న ఖాళీ స్థలంలో బస్సులు, భారీ వాహనాల పార్కింగ్‌కు కేటాయించగా, కాణిపాకం బస్టాండును ఆను కుని ఉన్న ప్రాంగణంలో కార్లు, ఆటోలు నిలి పేలా చర్యలు చేపట్టారు. అలాగే ఈవో నివాస భవనం వెనుక భాగంలో ద్విచక్ర వాహనాలు, ఇతర వాహనాల పార్కింగ్‌కు ఏర్పాట్లు చేశారు.పూలతో అలంకరణలు చేస్తున్న సిబ్బందివిద్యుత్ దీపాల వెలుగులో కాణిపాకం ఆలయం -
ఉత్కంఠభరితంగా క్రికెట్ మ్యాచ్
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో డీఈఓ ఆఫీస్ క్రికెట్ టీమ్, చిత్తూరు ఫిజికల్ ఎడ్యుకేషన్ జట్ల మధ్య శనివారం నిర్వహించిన క్రికెట్ మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగింది. ఈ మ్యాచ్‌లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీమ్ ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఘన విజయం సాధించింది. మ్యాచ్ ప్రారంభానికి ముందు జరిగిన టాస్‌లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీమ్ నెగ్గి మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన డీఈఓ ఆఫీస్ టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో పీఈడీ టీమ్ ముందు 175 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. బరిలోకి దిగిన ఫిజికల్ ఎడ్యుకేషన్ టీమ్ ఓపెనర్లు దేవేంద్ర (పీడీ), మోహన్ (పీడీ) ఆరంభం నుంచే ప్రత్యర్థిబౌలర్లపై విరుచుకుపడ్డారు. బౌండరీల వర్షం కురిపిస్తూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. కేవలం 9.5 ఓవర్లలోనే వికెట్ ఏమీ నష్టపోకుండా 175 పరుగుల టార్గెట్‌ను ఛేదించి, తమ టీమ్‌ను విజేతగా నిలిపారు. మెరుపు ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ను తక్కువ ఓవర్లలోనే ముగించిన ఓపెనర్లు దేవేంద్ర, మోహన్‌లను పలువురు పీఈడీలు, విద్యాశాఖ అధికారులు అభినందించారు. ఈ మ్యాచ్‌లో డీఈఓ కార్యాలయం నుంచి తులసి, ప్రసాద్, ఎంఈఓ పాండ్యన్, పీడీ సిరాజ్, పీఈటీ శరత్, పాల్గొన్నారు. వరసిద్ధునికి రూ.2.50 లక్షల విరాళం కాణిపాకం : కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారికి శనివారం రూ.2.5లక్షల విరాళం అందింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్నోకు చెందిన దాత దిలీప్ కుమార్ సింగ్ తమ కుటుంబసభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకుని విరాళం సమర్పించారు. ఏఈఓ రవీంద్రబాబు, ప్రోటోకాల్ ఏఈఓ ధనపాల్, టెంపుల్ ఇన్స్పెక్టర్ బాలాజీ నాయుడుపాల్గొన్నారు. అగ్నిమాపక శాఖ డీజీ పూజలు కాణిపాకం: శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ని అగ్నిమాపక శాఖ డీజీ వెంకటరమణ కు టుంబ సమేతంగా దర్శించుకున్నారు. శనివా రం ఆలయానికి విచ్చేసిన ఆయనకు అధికారు లు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. 12,496 కేసుల పరిష్కారం చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లాలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో 12,496 కేసులు పరిష్కరించినట్లు ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణసారిక తెలిపారు. కోర్టు వారీగా వాల్మీకిపురంలో 53 కేసులు, తంబళ్లపల్లె 71, శ్రీకాళహస్తి 1,106, సత్యవేడు 1,278, తిరుపతిలో 3,420, పుత్తూరు 903, పుంగనూరు 357, పీలేరు 1220, చిత్తూరులో 1,417, పలమనేరు 508, పాకాల 505, నగరి 191, మదనపల్లె 979, కుప్పంలో 488 కేసులు పరిష్కారమయ్యాయని వివరించారు. క్యాంపస్ డ్రైవ్‌లో ‘శ్రీరామ’ విద్యార్థుల ప్రతిభ తిరుపతి సిటీ : కరకంబాడి రోడ్డులోని శ్రీరామ ఇంజినీరింగ్ కళాశాలలో శనివారం యత్వా ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహించిన క్యాంపస్ డ్రైవ్‌లో పలువురు విద్యార్థులు ఉన్నత స్థాయి ఉద్యోగాలకు ఎంపికయ్యారు. కళాశాల చైర్మన్ మన్నెం రామిరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు సాంకేతిక విద్యతో పాటు నైపుణ్యాభివృద్ధి, కమ్యూనికేషన్ స్కిల్స్ ప్లేస్ మెంట్ శిక్షణ అందిస్తున్నామని తెలిపారు. సెక్రటరీ మన్నెం రామసుబ్బారెడ్డి, డైరెక్టర్ మన్నెం అరవిందుకుమార్ రెడ్డి, ప్రిన్సిపల్ జయచంద్ర, వైస్ ప్రిన్సిపల్ వాసు, ప్లేస్మెంట్ ఆఫీసర్ విష్ణువర్ధన్‌రెడ్డి, ఎండీ రవిమారుతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బాబు వెంటే కరువు
పూతలపట్టు(యాదమరి): ఎన్నికల సమయంలో బాబు వస్తే జాబ్ గ్యారెంటీ అన్నారని..తీరా చూస్తే బాబు వెంటే కరువు వస్తుందనే విషయం ప్రజలకు బాగా అర్థమయ్యిందని వైఎస్సార్సీపీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి స్పష్టం చేశారు. చంద్రబాబు అధికారంలో ఉన్నంత కాలం రాష్ట్రానికి కరువు తప్పదని, ఆయన పాలనకు ప్రకృతి సైతం నిరసన తెలుపుతోందని వెల్లడించారు. శనివారం పూతలపట్టులోని జగదీశ్వర్‌రెడ్డి కల్యాణమండపంలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే డా.సునీల్‌కుమార్ ఆధ్వర్యంలో నేతలు, కార్యకర్తలకు గుర్తింఫు కార్డుల పంపిణీ చేశారు. భూమన మాట్లాడుతూ అలవి కాని హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఒక్కటి కూడా నెరవేర్చలేదని ఆరోపించారు. పచ్చ మీడియాను పోషించుకోవడం తప్ప.. బాబు పాలనలో ఒక్క సామాన్యుడికై నా మేలు జరిగిందా అని నిలదీశారు. ఇటీవల కాణిపాకం దేవాలయానికి సంబంధించిన పలు టెండర్లలో భారీ కుంభకోణం జరిగిందని, దానికి స్థానిక ఎమ్మెల్యేనే కారకుడని పచ్చ పత్రికల్లోనే వార్తలు రావడం సిగ్గు చేటన్నారు. ఒక్క పూతలపట్టులోనే కాదు రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలోనూ కూటమి ఎమ్మెల్యేలు బందిపోటుల్లా దోచుకుంటున్నారని ఆరోపించారు. పార్టీ కోసం అహర్నిశలు శ్రమించే కార్యకర్తల సంక్షేమం కోసమే వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ గుర్తింపు కార్డులు అందిస్తున్నారని తెలిపారు. ఈ కార్డు మన జేబులో ఉంటే జగనన్నే మనకు తోడుగా ఉన్నట్లు అని కేడర్‌కు భరోసా ఇచ్చారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో అధికార పార్టీ అరాచకాలకి దీటుగా నిలబడి పోటీ చేసి గెలవాలని, మనందరికి జగనన్న అండగా ఉన్నాడని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. విబేధాలను పక్కనపెట్టి.. మాజీ ఎమ్మెల్యే సునీల్ మాట్లాడుతూ గత ఎన్నికల్లో మన పార్టీకి 43శాతం ఓట్లు వచ్చాయని, మనలో ఉన్న విభేదాలను పక్కన పెట్టి త్వరలో జరగబోయే స్థానిక ఎన్నికల్లో పూతలపట్టులోని అన్ని స్థానాలు కై వసం చేసుకుని జగనన్నకు బహుమతిగా అందిద్దామని చెప్పారు. కూటమి నేతలు పెట్టే అక్రమ కేసులకు భయపడాల్సిన అవసరం లేదని, క్షే క్షేత్రస్థాయిలో ప్రజల పక్షాన నిలబడదామని కోరారు. అనంతరం భూమన చేతుల మీదుగా నాయకులు, కార్యకర్తలకు వైఎస్సార్సీపీ గుర్తింపు కార్డులు అందజేశారు. అనంతరం ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువత అధ్యక్షుడు నవీన్‌రెడ్డిని మాజీ ఎమ్మెల్యే సునీల్, మండల కన్వీనర్ సుధాకర్‌రెడ్డితో కలసి పి.కొత్తకోటలోని ఆయన నివాసంలో పరామర్శించారు. రాష్ట్ర మేధావుల ఐక్య వేదిక కార్యదర్శి జగదీశ్వర్‌రెడ్డి, జెడ్పీ వైస్ చైర్మన్ బి.ధనుంజయరెడ్డి, పాల ఏకరి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కుమార్‌రాజా, మాజీ ఎమ్మెల్యే లలితకుమారి, ఐదు మండలాల కన్వీనర్లు సుధాకర్‌రెడ్డి, బుజ్జిరెడ్డి, హరిరెడ్డి, రామచంద్రారెడ్డి, రైతు విభాగం అధికార ప్రతినిధి ప్రవీణ్‌రెడ్డి, జిల్లా పంచాయతీరాజ్ అధ్యక్షుడు కె.మనోహర్, లీగల్‌సెల్ అధ్యక్షుడు సుగుణాకర్‌రెడ్డి, వైస్ ఎంపీపీలు శిరీష్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్ది, సురేష్‌రెడ్డి, సోషల్‌మీడియా సంయుక్త కార్యదర్శి కిషోర్‌రెడ్డి, నేతలు మనోహర్‌రెడ్డి, ఖాదర్‌వలీ, మాశిలామణి, బాబురెడ్డి, వెంకటరమణరెడ్డి, అమర్నా థ్, రషీద్, గౌస్‌భాష, రాజేంద్రరెడ్ది, మల్లికార్జునశెట్టి, ఎమ్మెస్ మణి, పవన్‌కుమార్, జ్యోతి, కబీర్ బాషా, కరుణాకర్‌గౌడ్, పండు మందడి, పరంధామగౌడ్, భాస్కర్, తేజారెడ్డి, హరీష్ పాల్గొన్నారు. -
అనంతలోకాలకే..!
ఆదమరిస్తే.. అతివేగం.. నిద్రమత్తే కారణమా..? బెంగళూరు ఎక్స్‌ప్రెస్ హైవేలో వాహనాల రద్దీ పలమనేరు : చైన్నె– బెంగళూరు హైవేపై గత కొన్నేళ్లుగా పలమనేరు ప్రాంతంలో మొగిలి ఘాట్, పలమనేరు బైపాస్, గండ్రాజుపల్లి తదితర ప్రాంతాల్లో తరచూ మేజర్ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. గత ఐదేళ్లలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో దాదాపు 30 మంది దాకా మృతి చెందగా వందమంది దాకా గాయపడ్డారు. ఈ నేపధ్యంలోనే ఈ ప్రాంతంలో మూడు నెలల క్రితం ఎన్‌హెచ్–7 చైన్నె– బెంగళూరు ఎక్స్‌ప్రెస్ హైవే కింద హొసకోట్ నుంచి బైరెడ్డిపల్లె వరకు దాదాపు 78 కిలోమీటర్ల మేర కొత్తరహదారి మొదలైంది. ఇందులో ఇప్పటికే వాహనాల రాకపోకలు ప్రారంభమయ్యాయి. ఈ రోడ్డుతో ప్రమాదాలు తగ్గుముఖం పడతాయని అందరూ భావించారు. కానీ కొత్త ఎక్స్‌ప్రెస్ హైవేలోనూ ప్రమాదాలు సంభవించడం జనంలో ఆందోళన పెంచుతోంది. ఎంత కట్టుదిట్టంగా ఉన్నప్పటికీ.. ఎక్స్‌ప్రెస్ హైవేలోకి పశువులు, కుక్కలు తదితరాలు రాకుండా రహదారికి ఇరువైపులా ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. ఎగ్జిస్ట్ పాయింట్లలో తప్పా ఎక్కడా రహదారిలోకి ప్రవేశించేందుకు వీలుకాదు. దీంతోపాటు ఈ మార్గంలో బైక్‌లు, ఆటోలు, ట్రాక్టర్లకు అనుమతుల్లేవు. ఫలితంగా వాహనాలు గంటకు వంద నుంచి 150 కి.మీ వేగంతో నడుస్తున్నాయి. ఇన్ని సురక్షిత చర్యలున్నా ఈ మూడు నెలల్లో ఈ హైవేపై మేజర్ ప్రమాదాలు సంభవించాయి. వి.కోటకు 27 .మీ దూరంలోని దొడ్డకారి గ్రామంలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు స్పాట్లోనే మృతి చెందారు. మొత్తం మీద ఇప్పటిదాకా నాలుగు ప్రమాదాల్లో 8మంది మృత్యువాత పడ్డారు. విశాలమైన రహదారులు సైతం ప్రాణాల మీదకు తెస్తున్నాయి. ఎక్స్‌ప్రెస్ హైవేలు కూడా ప్రమాదాలకు నిలయంగా మారుతున్నాయి. ఆధునిక వాహనాల్లో మితిమీరిన వేగంతో డ్రైవింగ్ చేస్తుండడంతో తరచూ యాక్సిడెంట్లు సంభవిస్తున్నాయి. అందులో భాగంగానే చైన్నె– బెంగళూరు ఎక్స్‌ప్రెస్ హైవే మీద మృత్యుఘంటికలు మోగుతున్నాయి. హాయిగా రాకపోకలు సాగించవచ్చనుకుంటే.. వాహనదారుల నిర్లక్ష్య వైఖరి కారణంగా ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. -
మద్యం దుకాణాల లైసెన్సుల రెన్యూవల్‌కు నోటిఫికేషన్
● జిల్లాలో 113 వైన్‌షాపులకు గడువు ఏడాది పొడిగింపు ● రూ.23 లక్షలు.. రూ.27.20 లక్షల ఫీజు ● 21తేదీ లోపు రెన్యూవల్ చేసుకోకుంటేనే దరఖాస్తులు ● టెండర్లు.. లక్కీడిప్ లేకుండానే లైసెన్సులు ప్రజా సంక్షేమం పట్టదు కానీ, తమ్ముళ్ల జేబు నింపడంలో మాత్రం చంద్రబాబు ప్రభుత్వానికి పెద్ద మనసు వచ్చేస్తుంది. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా లిక్కర్ మాఫియా పచ్చమూక కనుసన్నల్లోనే సాగుతోంది. మళ్లీ టెండర్లు పిలవడం ఎందుకని భావించిన సర్కారు మళ్లీ తమ నేతలకే కిక్కు ఇచ్చేందుకు కార్యాచరణ అమలు చేసింది. అందులో భాగంగా మద్యం దుకాణాల లైసెన్సులను మరో ఏడాది పొడిగిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. దరఖాస్తులతో పని లేకుండా.. లక్కీడిప్‌కు అవకాశమివ్వకుండా రెన్యూవల్ పేరుతో దోపిడీకి దారులు తెరిచేసింది. సాక్షి, చిత్తూరు: అంతా అనుకున్నట్టే అయ్యింది. దర ఖాస్తు చేయకుండా, లక్కీడిప్ వేయకుండా.. మద్యం లైసెన్సులను ఉన్నవాళ్లకే రెన్యూవల్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో 113 మద్యం దుకాణాల లైసెన్సులను ఏడాది పొడిగిస్తూ జిల్లా ఆబ్కారీ మద్య నియంత్రణ శాఖ అధికారులు శనివారం నోటి ఫికేషన్ విడుదల చేశారు. ఇక ఒకటో తేదీ నుంచి అందినకాడికి అమ్ముకోవడం, దాచుకోవడమే తరువాయి. నోటిఫికేషన్ విడుదల ఎకై ్సజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ టి.విజయశేఖర్, జిల్లా ప్రొహిబిషన్ అధికారి బి.శ్రీనివాస్, ఏఈఎస్ బి.సుందర రామయ్య కలిసి మద్యం దుకాణాల రెన్యూవల్ నోటిఫికేషన్‌ను శనివారం చిత్తూరులోని అర్బన్ ఎకై ్సజ్ పోలీస్ స్టేషన్లో విడుదల చేశారు. డీసీ మాట్లాడుతూ జిల్లాలోని 113 మద్యం దుకాణాల లైసెన్సులను అక్టోబర్ 1వ తేదీ నుంచి వచ్చే ఏడాది సెప్టెంబరు 30వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం 50వేల లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో లైసెన్సు రెన్యూవల్ రుసుమును రూ.23 లక్షలు, కల్లుగీత కార్మికుల సామాజిక వర్గాలకు రూ.11.50 లక్షలు, పర్మిట్ గదులకు రూ.5 లక్షల ఫీజు ఉంటుందన్నారు. 50 వేల కంటే ఎక్కువ జనాభా ప్రాంతాల్లో జనరల్ కేటగిరీలో రూ.27.20 లక్షలు, పర్మిట్ గదుల ఫీజు రూ.7.50 లక్షలు, కల్లుగీత లైసెన్సుల్లో రూ.13.60 లక్షలు చెల్లించాలని స్పష్టం చేశారు. ప్రతి దుకాణ నిర్వాహకుడు ఈనెల 21వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు ఆన్లైన్లో లైసెన్సు రెన్యూవల్ చేసుకోవాలని, ఎవరైనా చేసుకోని పక్షంలో ఆ దుకాణాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తామన్నారు., రూ.3 లక్షల నాన్ రీఫండబుల్ ఫీజు చెల్లిస్తే, లక్కీడిప్ నిర్వహించి షాపులు కేటాయిస్తామని వివరించారు. విమర్శలను వస్తున్నా.. జిల్లాలో 2024 అక్టోబర్‌లో నిర్వహించిన మద్యం దు కాణాల లైసెన్సుల ప్రక్రియలో నాన్ రీఫండబుల్ దర ఖాస్తు రుసుము కింద మాత్రమే ప్రభుత్వానికి రూ.45 కోట్లకు పైగా ఆదాయం లభించింది. ఇక నెలకు మ ద్యం విక్రయాల దాదాపు రూ.70 కోట్లు, లైసెన్సు ఫీజుల ద్వారా దాదాపు రూ.133 కోట్లు ఆదాయం వచ్చింది. పర్మిట్ గదుల పేరిట రూ.3 కోట్లు అదనపు ఆదాయం. కానీ, ఇప్పుడు మాత్రం దరఖాస్తులే చేసుకోకుండా, లక్కీడిప్ వేయకుండా ఏకపక్షంగా దుకాణాలను పాత లైసెన్సులున్న వారికే కట్టబెట్టడానికి నిర్ణ యం తీసేసుకున్నారు. జిల్లాలో 90 శాతం దుకాణాల న్నీ టీడీపీ నేతల చేతుల్లోనే ఉన్నాయన్నది జగమెరిగిన సత్యం. సొంత పార్టీ నేతలకు ఉపాధి కల్పించేందుకే ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోవడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నా, పట్టించుకునే పరిస్థితుల్లో లేదు. -
రాజీ మార్గమే ఉత్తమం
చిత్తూరు రూరల్ (కాణిపాకం): కోర్టుల చుట్టూ తిరిగే పనిలేకుండా న్యాయపరమైన సమస్యలను త్వరితగతి న పరిష్కరించుకోవడానికి జాతీయ లోక్ అదాలత్‌లో రాజీ మార్గమే ఉత్తమమని జిల్లా ప్రధాన న్యాయమూ ర్తి అరుణ సారిక తెలిపారు. శనివారం చిత్తూరు నగరంలోని జిల్లా కోర్టు ప్రాంగణంలో సుప్రీంకోర్టు, న్యాయ సేవా సంస్థల పర్యవేక్షణలో చేపట్టిన లోక్ అదాలత్‌ను ఆమె ప్రారంభించారు. మొదటి అదనపు సివిల్ జడ్జి శ్రీనివాసరావు బెంచ్‌లో మోటార్ వాహన ప్రమాద పరిహార కేసులను విచారించి రాజీ కుదిర్చారు. అనంతరం బాధితులకు ఆర్థిక భరోసా పత్రాలను జిల్లా జడ్జి అందజేశారు. లోక్ అదాలత్‌లో ఇచ్చే తీర్పులే తుది నిర్ణయాలని, వీటిపై అప్పీల్ ఉండదని, కక్షిదారులకు సమయం, ధనం ఆదా అవుతాయని జడ్జి వెల్లడించా రు. డీఎల్ఎస్ఏ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఎంఎస్ భారతి మాట్లాడుతూ లోక్ అదాలత్ కోసం జిల్లా వ్యాప్తంగా 28,890 కేసులను గుర్తించి నోటీసులు ఇచ్చామన్నారు. విచారణ కోసం జిల్లా కోర్టులో 4, ఇతర మండలాల్లో కలిపి మొత్తం 30 బెంచ్‌లను ఏర్పాటు చేసినట్లు వివరించారు. కేసుల పరిష్కారంలో చిత్తూరు జిల్లాను రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలపాలని కోరారు. -
రాజ్ కాలువ ఆక్రమణ
కుప్పం: ఇటీవల కుప్పం పట్టణ పరిసరాల్లో పరిశ్రమల ఏర్పాటు పనులు జోరందుకున్నాయి. దీనికితోడు గ్రామాలకు చెందిన వారు పిల్లల చదువులు, చిన్నచిన్న పనుల కోసం కుప్పంలో స్థిర నివాసం ఏర్పాటుచేసుకుంటున్నారు. దీంతో భూములు, స్థలాలకు డిమాండ్ పెరిగింది. దీన్ని ఆసరాగా తీసుకున్న కొందరు అధికార పార్టీ నేతలు కుప్పం పట్టణ సమీపంలోని సామగుట్టపల్లి వద్ద వ్యవసాయ భూముల్లో లేఅవుట్లు వేశారు. ఆ భూముల చుట్టూ ఉన్న ప్రభుత్వ భూములు, పంట కాలువలను సైతం ఆక్రమించుకుని చదును చేసి ప్లాట్లుగా మార్చేశారు. చెరలో రాజ్ కాలువ చిన్న శెట్టిపల్లి వద్ద ఉన్న పటాలమ్మ చెరువు నుంచి బైరుగానిపల్లి చెరువు వరకు 20 అడుగుల వెడల్పుతో ఉన్న రాజ్ కాలువను ఆక్రమించుకునేశారు. నామ మాత్రంగా 20 అడుగుల కాలువలను మూ డు అడుగులకు కుదించి రివ్విట్మెంట్ కట్టారు. సుమారు 3 కిలో మీటర్ల దూరం 20 అడుగుల వెడల్పుతో విస్తరించి ఉన్న కాలువ పూర్తిగా అక్రమణకు గురింది. అంతేకాకుండా కుప్పం ముఖద్వారం ఆర్చి వద్ద ఉన్న పెద్ద వారాది పక్కన చిన్న వారాదిని కూల్చివేశారు. ఆ స్థలం చదును చేసి ప్లాట్లుగా మార్చేసి దర్జాగా రియల్ వ్యాపారం చేస్తున్నారు. ఈ 20 అడుగుల రాజ్ కాలువ గురించి పట్టించుకునే నాథుడు లేడని స్థానికులు అంటున్నారు. శూలల గుడి స్థలానికి రక్షణ కరువు పలమనేరు–కుప్పం జాతీయ రహదారి పక్కనే పురాతన శూలాల గుడి ఉంది. ఈ ఆలయానికి 0.23 సెంట్లు భూమి ఉంది. రియల్ ఎస్టేట్ వ్యాపారుల కన్ను ఈ స్థలంపై పడిందని స్థానికులు అంటున్నారు. ఇప్పటికే కొంత స్థలం కబ్జాకు గురైందని, మిగిలిన స్థలాన్ని సర్వే చేసి ఫెన్సింగ్ వేయాలని వారు అధికారులను కోరుతున్నారు. అధికార పార్టీ నేతలు అధికారం అండతో రెచ్చిపోతున్నారు. జోరుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. ఏళ్లనాటి రాజ కాలువలు, దేవాలయ భూములు, ప్రభుత్వం నిర్మించిన కల్వర్టులను ఆక్రమించుకుంటున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే బెదిరింపులకు దిగుతున్నారు. 20 అడుగుల వెడల్పుతో సుమారు 3 కిలోమీటర్లు విస్తరించి ఉన్న రాజ కాలువను ఆక్రమించి ఆనవాళ్లు లేకుండా చేశారు. కాలువను పూడ్చేసి ప్లాట్లుగా మార్చేశారు. వీటిని కోనుగోలు చేస్తే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని స్థానికులు అంటున్నారు. కనుమరుగైన రెండు కల్వర్టులు రోడ్డు పక్కన శూలాల గుడి పక్కన ఉన్న వ్యవసాయ భూమిలో వర్షపు నీరు ప్రవాహించడానికి గతంలో ఇరిగేషన్ శాఖ రెండు కల్వర్టులు నిర్మించింది. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ వ్యాపారుల దెబ్బకు రెండు కల్వర్టులు కనుమరుగయ్యాయి. వీటిని పడగొట్టి చదను చేసి లే అవుట్లో కలిపేసుకున్నారు. -
చెరుకు.. ఉరుకు!
ఒకప్పుడు పచ్చని తోటలు.. చక్కెర మిల్లుల సైరన్లతో కళకళలాడిన జిల్లాలో మళ్లీ చెరుకు సాగు పెరిగే అవకాశం కనిపిస్తోంది. దశాబ్ద కాలంగా నష్టాల సుడిగుండంలో చిక్కుకుని ఫ్యాక్టరీలు మూతపడిన దశ నుంచి కోలుకునే పరిస్థితి దర్శనమిస్తోంది. పెరిగిన చక్కెర ధర రైతాంగంలో కొత్త ఆశలన రేకెత్తిస్తోంది. ఒకప్పుడు 30 వేల హెక్టార్లలో విస్తరించిన సాగు.. నేడు 6 వేల హెక్టార్లకు పడిపోయినా.. మళ్లీ పుంజుకుంటుందని అధికార యంత్రాంగం సైతం వెల్లడిస్తోంది. చిత్తూరు రూరల్ (కాణిపాకం) : ఉమ్మడి చిత్తూరు జిల్లా బెల్లం ఉత్పత్తికి, చెరుకు సాగుకు రాష్ట్రంలోనే చిరునామాగా ఉండేది. జిల్లా వ్యాప్తంగా 6 చక్కెర కర్మాగారాలు నిరంతరం నడుస్తూ వేలాది మంది రైతు కుటుంబాలు, కార్మికులకు ఉపాధినిచ్చాయి. అయితే, 2014 తర్వాత పరిస్థితులు తలకిందులయ్యాయి. ఉత్తరాది రాష్ట్రాలలో చక్కెర ఉత్పత్తి విపరీతంగా పెరగడంతో దేశీయ మార్కెట్లో నిల్వలు పెరిగిపోయాయి. దీని ప్రభావంతో చక్కెర ధరలు ఘోరంగా పడిపోయి, దక్షిణ భారత మిల్లులు తీవ్రమైన నష్టాల్లో కూరుకుపోయా యి. రైతులకు చెల్లింపులు భారమై జిల్లాలోని మిల్లులు ఒకటొకటిగా మూతపడ్డాయి. ఓ వైపు పంట పెట్టుబడి పెరగడం, మరోవైపు కోత, రవాణా ఖర్చులు టన్నుకు ఏకంగా రూ.1,000 నుంచి రూ. 1,400 వరకు ఎగబాకాయి. స్థాని కంగా కూలీలు దొరక్కపోవడంతో ఒడిశా వంటి పక్క రాష్ట్రాల కార్మికులపై ఆధారపడాల్సిన దుస్థితి ఏర్పడింది. పర్యవసానంగా 30వేల హెక్టార్లుగా ఉన్న సాగు విస్తీర్ణం ప్రస్తుతం కేవలం 6వేల హెక్టార్లకు పడిపోయింది. ప్రస్తు తం ఎస్ఆర్పురం మండలం నెలవాయిలో మాత్రమే ఓ ఫ్యాక్టరీ నడుస్తోంది. తియ్యని ఆశలు గడిచిన రెండు నెలల వ్యవధిలోనే బహిరంగ మార్కెట్లో కిలో చక్కెర ధర రూ.40 నుంచి ఏకంగా రూ.60 వరకు పెరగడం రైతుల్లో తియ్యని ఆశలను చిగురింపజేసింది. ఈ పరిణామంతో చక్కెర కర్మాగారాల యాజమాన్యా లు మళ్లీ లాభాల బాట పట్టాయి. ఇన్నేళ్లుగా నష్టాలను ఓర్చి పంటను కాపాడుకున్న తమకు ఈ పెరిగిన ధరల ప్రయోజనాన్ని అందించాలని రైతాంగం డిమాండ్ చేస్తోంది. రాబోయే సీజన్న్కు కేంద్ర ప్రభుత్వం 9.50శాతం రికవరీ ప్రాతిపదికన టన్ను చెరుకుకు రూ.3,383 ఎఫ్ఆర్పీ ప్రకటించగా, ప్రస్తుతం ఓ మిల్లు యాజమాన్యం టన్నుకు రూ. 3,500 ఇస్తోంది. అయితే పెరిగిన సాగు వ్యయానికి, ప్రస్తుత మార్కెట్ ధరలకు అనుగుణంగా టన్నుకు రూ. 5వేల మద్దతు ధర చెల్లించాలని రైతులు కోరుతున్నారు. అంతేకాకుండా మిల్లు యాజమాన్యాల నుంచి కోత పర్మిట్లు రావడంతో జాప్యం జరుగుతుండటంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. దీంతో చాలామంది పంటను ఇతర జిల్లాల మిల్లులకు తరలించడమో, లేదా నాటు బెల్లం తయారీకి మళ్లించడమో చేస్తున్నారు. ఎల్‌నినో ఎఫెక్ట్ ఒకవైపు చక్కెర ధరల రూపంలో ఆశలు కనిపిస్తున్నా, మరోవైపు ఎల్‌నినో ప్రభావంతో కరువు కమ్ముకోవడం రైతులకు గుబులును మిగులుస్తోంది. ఏ పంట వేయాలన్నా ఆచి తూచి అడుగులు వేయాల్సిన పరిస్థితుల్లో, వర్షాధారిత సాగుపై ఆధారపడకుండా బోరు బావుల కింద రైతులు మాత్రం చెరుకు వైపే మొగ్గు చూపుతున్నారు. వర్షాభావం వల్ల ఇతర పంటలు దెబ్బతిన్నా, చెరుకు గడ్డి జాతి పంట కావడంతో నీటి ఎద్దడిని కొంతకాలం తట్టుకుని నిలబడే సామర్థ్యం ఉండడమే ఇందుకు కారణం. బిందు సేద్యం ద్వారా తక్కువ నీటితోనే బోరు బావుల కింద సమర్థవంతంగా సాగు చేయవచ్చని రైతులు భావిస్తున్నారు. భూమిలో తేమ ఆవిరి కాకుండా చెరుకు చెత్తను కప్పడం, కరువును తట్టుకునే వంగడాలను ఎంపిక చేసుకోవడం లాంటి జాగ్రత్తలతో రైతన్నలు అడుగులు ముందుకు వేస్తున్నారు. -
ఉరి వేసుకుని యువకుడి ఆత్మహత్య
నగరి : ఉపాధి కోసం పొరుగు రాష్ట్రం నుంచి నగరికి వచ్చిన ఒక యువకుడు కొన్ని రోజులకే తను వు చాలించడం విషాదాన్ని నింపింది. నగరి పట్టణంలోని ఓం శక్తి గుడి సమీపంలో శనివారం ఈ ఘటన జరిగింది. తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరి జిల్లా అందేరిపట్టికి చెందిన ఎం.ప్రశాంత్ (31) కొంతకాలంగా స్వీట్ మాస్టర్‌గా పనిచేస్తూ జీవ నం సాగిస్తున్నాడు. తిరుత్తణి తాలూకా కనకమ్మసత్రంలోని ఓ బేకరీలో సుమారు నాలుగేళ్లు పనిచేశాడు. అనంతరం శ్రీకాళహస్తిలోని మరో బేకరీలో పనిచేసి, ఈ నెల 4వ తేదీ నుంచి నగరి ఓంశక్తి ఆలయం సమీపంలోని బేకరీలో స్వీట్ మాస్టర్‌గా విధుల్లో చేరాడు. టిఫిన్ చేసి వస్తానని వెళ్లి.. శనివారం ఉదయం దుకాణానికి వచ్చిన ప్రశాంత్.. సుమారు 10 గంటల సమయంలో టిఫిన్ చేసి వస్తానని షాపు యజమాని సుందరేశన్‌కు చెప్పి అక్కడి నుంచి వెళ్లాడు. ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో మధ్యాహ్నం ప్రశాంత్ అద్దెకు ఉంటున్న గదికి సుందరేశన్ వెళ్లి చూడగా తలుపులు, కిటికీలు లోపలి నుంచి గడియపెట్టి ఉన్నాయి. దీంతో ఇంటి యజమానులతో కలిసి కిటికీలోంచి పరిశీలించగా.. వంటగదిలో ప్రశాంత్ ఉరికి వేలాడుతూ కనిపించాడు. విషయం తెలుసుకున్న నగరి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లారు. ప్రశాంత్ అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. అనంతరం మృతుడి తల్లి గోవిందమ్మకు సమాచారం అందించారు.మృతదేహాన్ని ప్రైవేట్ అంబులెన్‌న్స్‌లో నగరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రశాంత్ ఆత్మహత్యకు పాల్పడేందుకు కారణాలు ఇంకా తెలియరాలేదు. ఘటనపై నగరి పోలీసులు విచారణ చేపట్టారు. కాగా, వివాహమైన రెండు నెలలకే భార్య నుంచి విడిపోవడంతో ప్రశాంత్ ఒంటరిగానే ఉంటున్నాడు. -
కణ్ణన్ పాఠశాల ఆధునికీకరణకు చర్యలు
చిత్తూరు కలెక్టరేట్ : వందేళ్ల చరిత్ర కలిగిన బీఎస్.కణ్ణన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాల ఆధునికీకరణకు చర్యలు చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ తెలిపారు. పాఠశాల వార్షికోత్సవాన్ని శనివారం పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో పాఠశాల ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ సుబ్రమణ్యం చెట్టియార్ తన కుమారుడి జ్ఞాపకార్థం విలువైన స్థలాన్ని పాఠశాలకు అందించారని కొనియాడారు. ఇక్కడ చదివిన ఎంతో మంది విద్యార్థులు దేశ విదేశాల్లో స్థిరపడటం గర్వకారణమన్నారు. స్వర్గీయ కేశవరెడ్డి ఫౌండేషన్ పేరిట రూ.3.50 లక్షల వ్యయంతో పాఠశాల ప్రాంగణంలో ప్రార్థన షెల్టర్ నిర్మించిన పూర్వ విద్యార్థి, ఫౌండేషన్ చైర్మన్ శ్రీధర్ రెడ్డిని సత్కరించారు. చుడా చైర్పర్సన్ కఠారి హేమలత మాట్లాడుతూ విద్యార్థులు విద్యా వైజ్ఞానిక రంగాల్లో రాణించాలన్నారు. పాఠశాల పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు పూల సుబ్రమణ్యం 31 మంది విద్యార్థులకు కణ్ణన్ పేరుతో టీషర్టులను అందజేశారు. పాఠశాల హెచ్ఎం కోమల, కళాశాల ప్రిన్సిపల్ మాలతి, పూర్వ విద్యార్థుల సంఘం నేతలు నరసింహులునాయుడు, కృష్ణమూర్తి, లోకనాథం, మునిరత్నం, మురళి, కుమారస్వామి పాల్గొన్నారు. -
రాజ్ కాలువ ఆక్రమణ
కుప్పం సమీపంలోని చిన్నశెట్టిపల్లె వద్ద పటాలమ్మ చెరువు నుంచి వెళ్లే రాజ్ కాలువను కొందరు కబ్జా చేశారు.ఉమ్మడి సర్వీసు రూల్స్ తప్పనిసరి చిత్తూరు కలెక్టరేట్ : ఉపాధ్యాయ ఉద్యోగోన్నతులకు అడ్డంకిగా మారిన ఉమ్మడి సర్వీసు రూల్స్‌ను తప్పనిసరిగా ప్రభుత్వం అమలు చేయాలని యూటీఎఫ్ నేతలు డిమాండ్ చేశారు. శనివారం చిత్తూరులోని యూటీఎఫ్ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు రెడ్డెప్ప నాయుడు అధ్యక్షతన కార్యవర్గ సమావేశం నిర్వహించారు. యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి జీవీ రమణ మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు నెట్వర్క్ ఆసుపత్రుల్లో హెల్త్ కార్డ్స్ తో ఎలాంటి వ్యయం లేకుండా సమగ్రంగా నగదు రహిత వైద్య చికిత్సలు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రెడ్డెప్ప నాయుడు,మణిగండన్ మాట్లాడుతూ గత జనవరిలో మంజూరు చేసిన డీఏ బకాయిల్లో ఇంకా జమకాని నిధులను తక్షణమే విడుదల చేయాలని కోరారు. సాంకేతిక కారణాలతో రీసబ్మిషన్ కాకుండా రిజెక్ట్ అయిన బిల్లులను తిరిగి ఆన్లైన్లో సబ్మిట్ చేసేందుకు వెసులుబాటు కల్పించాలని సూచించారు. ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులకు స్పెషల్ టెట్ లో ప్రత్యేక రాయితీ కల్పించేందుకు ఎన్సీటీఈతో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు జరపాలని కోరారు. నేతలు రెహనా బేగం, ఏకాంబరం, ఈశ్వర మహేంద్ర, సురేష్, పార్థసారథి,శ్రీనివాసులు, బాబు,వంశీకృష్ణ పాల్గొన్నారు. వరసిద్ధుని సేవలో కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి కాణిపాకం: కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక స్వామివారిని కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సీతారాం శ్రీవాత్సవ శనివారం కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆలయం వద్ద ఆయనకు అధికారులు ఘనంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం స్వామివారి మూలవిరాట్టును దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన న్యాయమూర్తి కుటుంబ సభ్యులకు ఆల య సూపరింటెండెంట్ కోదండపాణి స్వామి వారి శేషవస్త్రాలు, తీర్థప్రసాదాలను అందజేశారు.టెంపుల్ ఇన్స్పెక్టర్ బాలాజీ నాయుడు పాల్గొన్నారు. -
అసత్య ప్రచారంపై ఆగ్రహం
నగరి: దేశమ్మ ఆలయంలో విధులు నిర్వరిస్తూ అమ్మవారి సేవ చేసుకోకుండా రాజకీయనాయకుడిలా వ్యవహరిస్తూ మాజీ మంత్రి ఆర్కే రోజా ప్రతిష్టకు భంగం కలిగించేలా సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టిన ఆలయ టికెట్ క్లర్క్ మోహనకృష్ణపై చర్యలు చేపట్టాలని వైఎస్సార్సీపీ నేతలు కోరారు. శనివారం ఈ మేరకు ఆలయ ఈఓ మునికృష్ణమూర్తికి ఫిర్యాదు చేశారు. గ్రామస్తుల ఆహ్వా నం మేరకు విజయపురం మండలంలో ఒక కార్యక్రమానికి హాజరైన మాజీ మంత్రి రోజా అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత సాయంత్రం జరిగిన ఒక ఘటనను ముడిపెడుతూ సోషల్ మీడియా గ్రూపుల్లో ఆమె ఫొటోను ఉపయోగించి మోహన కృష్ణ తప్పుడు ప్రచారం చేశాడన్నారు. దేశమ్మ దేవాలయం నేడు అపురూపంగా నిర్మించబడి అభివృద్ధి పథంలో ఉందంటే అది మాజీ మంత్రి ఆర్కే రోజా కృషి అని ప్రతి ఒక్కరికీ తెలుసని వెల్లడించారు. ఆమైపెనే ఆలయ సిబ్బంది ఇలాంటి పోస్టింగ్‌లు పెట్టడాన్ని దేవత కూడా క్షమించదని స్పష్టం చేశారు. పోస్టింగ్‌లకు సంబంధించి పోలీసులకు కూడా ఫిర్యాదు అందించామని తెలిపారు. టికెట్ క్లర్క్‌గా విధులు నిర్వహిస్తున్న మోహన కృష్ణపై గతంలో ఆలయ నిధులు, అమ్మవారి ఆభరణాలు, నగదు లావాదేవీలు, చందాలు, విరాళాలకు సంబంధించిన వ్యవహారాలపై శాఖాపరమైన ఆరోపణలు ఉన్నాయన్నారు. 2021 జనవరి 22, 2021 మే 25 తేదీల్లో జారీ అయిన మెమోలో ఈ అంశాలు ఉన్నాయని వివరించారు.. సస్పెన్షన్‌లో ఉన్న మోహనకృష్ణకు ఆలయ పెత్తనం, అజమాయిషీ ఎందుకిచ్చారని ప్రశ్నించారు. గ్రామస్తు లు, భక్తులు, దాతలు ఆలయానికి అందించిన చందాలు, విరాళాల్లో కొంత మొత్తం ఆలయ ఖాతాలో జమ కాలేదనే ఆరోపణల కూడా తమ దృష్టికి వచ్చిందని అలాగే విధులకు కూడా అతను సక్రమంగా హాజరుకావడం లేదని ఇష్టానుసారం వస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆలయ పవిత్రత, భక్తు ల నమ్మకాన్ని కాపాడేందుకు అధికారులు తక్షణ మే సమగ్ర, నిష్పక్షపాత విచారణ చేపట్టాలన్నారు. అలా గే విచారణ పూర్తయ్యే వరకు మోహనకృష్ణను విధుల నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు దేవదాయశాఖ డిప్యూటీ కమిషనర్‌కు కూడా వినతిపత్రం సమర్పించామన్నారు. దీనిపై ఈఓ మాట్లాడుతూ మోహనకృష్ణ మళ్లీ విధుల్లోకి వచ్చినా ఆలయంలో ఆర్ధిక పరమైన పనులు అప్పగించడం లేదన్నారు. ఆరోపణలు వస్తున్న నేపధ్యంలో విచారణ చేపట్టి అతనిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు రమేష్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు మునివేలు, మాజీ కౌన్సిలర్లు మురుగా, యాకో బు, భూపాలన్, వెంకటేష్, నియోజకవర్గ యువత అధ్యక్షుడు యువరాజ్, నేతలు శశికుమార్, కృష్ణ మూర్తి, కేఆర్ సలీం, కన్నాయిరం, ఆనంద్‌కుమార్, మేషాక్, వినోద్ తదితరులు పాల్గొన్నారు. -
వందశాతం అప్డేట్లు తప్పనిసరి
గంగవరం : ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రతగా ఉంచడమే కాకుండా ఆరోగ్య కార్యక్రమాలు, ఆన్లైన్ అప్డేట్లను వంద శాతం నిర్వహించాలని డీఎంహెచ్ఓ నాగశశిభూషణ్‌రెడ్డి ఆదేశించారు. శుక్రవారం గంగవరం మండలంలోని పత్తికొండ పీహెచ్‌సీని ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ముందుగా పీహెచ్సీ రికార్డులు పరిశీలించి సేవల నాణ్యత, మందుల గది, ల్యాబ్ గదిని తనిఖీ చేశారు. అనంతరం వైద్యాధికారి, ఆరోగ్య సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఆస్పత్రికి సంబంధించిన అన్ని రికార్డులు, మాతా శిశు సంరక్షణ సేవలను ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉంచుకోవాలని ఆదేశించారు. అలాగే సంజీవని కార్యక్రమం, హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ తదితర ఆరోగ్య కార్యక్రమాల పురోగతి నిరంతరం పర్యవేక్షించి సంబంధిత వివరాలను ఆన్లైన్లో వందశాతం అప్లోడ్ చేయాలని సూచించారు. ప్రజలకు అందుతున్న వైద్య సేవల్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా వైద్యాధికారులు, సిబ్బంది సమన్వయంతో పని చేయాలన్నారు. ఆరోగ్య కార్యక్రమాల అమలును నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. వైద్యాధికారి మల్లికార్జున్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. -
అప్పుడే అభివృద్ధి
గత వైఎస్సార్సీపీ పాలనలో రూ.2.50 కోట్లతో మండలంలో అభివృద్ధి పనులు చేశాం. తడుకుపేట–మునీశ్వరస్వామి ఆలయం వరకు రూ. 40 లక్షలతో రోడ్డు వేశాం. అలాగే ముదిపల్లె– నామా తీర్థం వరకు రూ.48.50 లక్షలతో రహదారి నిర్మించాం. వీటితో పాటు జగనన్న కాలనీలో రూ.7.50 లక్షలతో పైప్‌లైన్ ఏర్పాటు చేశాం. కానీ, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తడుకుపేట బజారువీధిలో రూ.10 లక్షలతో కాలువ నిర్మాణం, అలాగే మధురికొండ ఎిస్టీ కాలనీలో రూ.10 లక్షలతో రోడ్డు పనులు పెండింగ్‌లో పెట్టారు. గుండ్రాజుకుప్పం దళితవాడలో రూ.3.50 లక్షలతో పైప్‌లైన్ పనులు, మరో రూ.3.50 లక్షలతో అసంపూర్తిగా అంగన్వాడీ భవన నిర్మాణ పనులు పెండింగ్‌లో ఉంది. – గాంధీ, జెడ్పీటీసీ సభ్యుడు, నగరి -
హామీ ఉంటేనే..
ఆగి ఉన్న లారీని ఢీకొన్న మరో లారీ కుప్పం– పలమనేరు జాతీయ రహదారిపై చెల్దిగానిపల్లె వద్ద ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొంది. ట్విస్ట్ తెలియక.. శనివారం శ్రీ 12 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026సాక్షి, చిత్తూరు : త్వరలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం చెబుతుండడంతో చిత్తూరులో టీడీపీ నేతలు ఇల్లు చక్కదిద్దుకునే పనిలో పడ్డారు. రూ.కోట్లు విలువ చేసే అభివద్ధి పనులను పంచేసుకున్నారు. ఇక పర్సంటీజీల రూపంలో కమిషన్లు సమర్పించుకునేందుకు సన్నద్ధమవుతున్నారు. కార్పొరేషన్ కార్యాలయం వేదికగా నిర్వహించిన ఆన్లైన్ టెండర్లు ఇందుకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ‘సింగిల్’ ఎజెండా.. 130కి పైగా పనులను టెండర్లు పిలిస్తే 80కి పైగా పనులకు కేవలం ఒకే ఒక్క దరఖాస్తు దాఖలు కావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇదే సమయంలో ఎవరెవరికి ఏయే పనులు ఇచ్చారనే స్పష్టత కూడా వచ్చేసింది. కొంగారెడ్డిపల్లెలో రూ.23 లక్షలు విలువ చేసే రోడ్డు పనులు, రూ.10.15 లక్షల కాలువ పనులు, పెనుమూరు క్రాస్ సమీపంలో రూ.13 లక్షల రోడ్డు పనులు తక్కువ కోట్ చేసిన వాళ్లకు కాదని, ఎక్కువ మొత్తం కోట్ చేసిన వాళ్లకు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలున్నాయి. సాధ్యమేనా..? మునిసిపల్ ఎన్నికల వేళ పదుల సంఖ్యలో అభివద్ధి పనులు కొందరు కాంట్రాక్టర్ వద్దే ఉండిపోవడంతో.. పనులు వేగంగా జరగకపోవడం, త్వరగా పూర్తి చేయాలనే ఆత్రంలో నాణ్యత లోపించే అవకాశాలున్నాయి. మరి ఈ సమస్యను అధిగమించడానికి అధికారులు, నేతలు ఏం చేస్తారో చూడాలి. ఏది ఏమైనా టెండర్లలో పాల్గొనే అవకాశం కొందరికే ఇవ్వడం., పాలనలో పారదర్శకత దాచడమే అవుతుందని పలువురు కాంట్రాక్టర్లు విమర్శిస్తున్నారు. టెండర్14 నుంచి వరసిద్ధుని బ్రహ్మోత్సవాలు కాణిపాకం: కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలను ఈ నెల 14 నుంచి అక్టోబర్ 4 వరకు వైభవంగా నిర్వహించనున్నారు. తొలిరోజు ధ్వజారోహణం, గ్రామోత్సవంతో పాటు పుష్పకావళ్లు సమర్పించనున్నారు. ఉత్సవాల్లో భాగంగా స్వామివారు నిత్యం ఉదయం, రాత్రి సమయాల్లో వివిధ వాహనాలపై విహరిస్తూ భక్తులకు దర్శనమివ్వనున్నారు. ప్రధాన సేవలలో ఈనెల 15న హంస వాహనం, 16న బంగారు నెమలి వాహనం, 17న మూషిక వాహనం, 18న బంగారు చిన్న, పెద్ద శేషవాహనం, 19న చిలుక, వృషభ వాహనం, 20న గజవాహనం సేవలు విశేషంగా జరిపించనున్నారు. 21న స్వామివారి రథోత్సవం, 22న తిరు కల్యాణ మహోత్సవంతో పాటు అశ్వ వాహన సేవ చేపట్టనున్నారు. ఈనెల 23న ధ్వజావరోహణంతో ప్రధాన క్రతువులు పూర్తవుతాయి. అనంతరం ఈనెల 24 నుంచి అక్టోబర్ 4 వరకు ప్రత్యేక ఉత్సవాలు నిర్వహించనున్నారు. వీటిలో ఈనెల 24న అధికార నంది, 25న రావణబ్రహ్మ, 26న విమానోత్సవం, 27 సూర్యప్రభ, 28న చంద్రప్రభ, 29న యాళివాహనం, 30న కల్పవృక్ష, అక్టోబర్ 1వ తేదీన పూలంగి సేవ, ప్రాకారోత్సవం, 2న కామధేను వాహన సేవలతో పాటు అక్టోబర్ 3న పుష్ప పల్లకి సేవ, 4న వైభవంగా నిర్వహించనున్న తెప్పోత్సవంతో బ్రహ్మోత్సవా లు పరిపూర్ణం కానున్నాయి. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఈనెల 14 నుంచి అక్టోబర్ 4 వరకు ఆలయంలో ఆర్జిత అభిషేకాలు, ప్రమాణాలు రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. ఉత్సవాల చివరి రోజు రాత్రి 10 గంటలకు 21 కేజీల బరువైన స్వామివారి మహాలడ్డూను బహిరంగ వేలం వేయనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలుగు తమ్ముళ్లు కాంట్రాక్టులను సొంతం చేసుకోవడంలో నిమగ్నమయ్యారు. గంపగుత్తగా రూ.కోట్ల పనులను పలహారంగా పంచేసుకున్నారు. నగరపాలక సంస్థ కార్యాలయమే అడ్డాగా అక్రమాలకు తెరతీసేశారు. నిబంధనలకు విరుద్ధంగా టెండర్ల ప్రక్రియను తమ కనుసన్నల్లోనే నడిపించేశారు. నీకింత.. నాకింత అనుకుంటూ పంపకాలు పూర్తి చేసేసుకున్నారు. ఇక కమీషన్లు సమర్పించి కాసులు పోగేసుకోవడమే తరువాయి అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఆన్లైన్ టెండర్ అంటే దేశంలో ఎక్కడి నుంచైనా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే సదరు టీడీపీ నేత హామీ లభించని కొందరు కాంట్రాక్టర్లు ఈ టెండర్లలో పాల్గొన్నారు. ప్రభు త్వం నిర్ణయించిన ధర కంటే తక్కువ మొత్తం కోట్ చేశారు. వాస్తవానికి టెండర్ వీరికే దక్కాలి. కానీ చిత్తూరు కార్పొరేషన్లో పెట్టిన ట్విస్ట్ తెలియ కుండా టెండర్లు వేసిన కాంట్రాక్టర్ల దరఖాస్తులను అధికారులు తెరవకుండా వదిలేశారు. దరఖాస్తు వేయడానికి చివరి తేదీ పూర్తవడం, ఈనెల 3,7,8,9 తేదీల్లో ఆన్లైన్ టెండర్లు ఓపెన్ చేశారు. నేత హామీ దక్కని కాంట్రాక్టర్ల దరఖాస్తులను పక్కన పెట్టేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయిన వాళ్లకు ఆన్లైన్.. కానివాళ్లకు ఆఫ్‌లైన్ జిల్లా మినరల్ ఫండ్స్ (డీఎంఎఫ్), కార్పొరేషన్ సాధారణ పద్దులు (జనరల్ ఫండ్స్) నుంచి చిత్తూరు కార్పొరేషన్ పరిధిలో సీసీ రోడ్లు, కాలువలు, పైపులైన్లు, వీధి దీపాలు, ఇతర అభివద్ధి పనులు చేపట్టడానికి అధికారులు ఆగస్ట్‌లో ఆన్లైన్ టెండర్లు పిలిచారు. డీఎంఎఫ్‌లో రూ.15 కోట్లు విలువ చేసే 111 పనులు ఉన్నాయి. జనరల్ ఫండ్స్ నుంచి సుమారు రూ.అర కోటి విలువ చేసే 30కు పైగా పనులు చూపెట్టారు. అర్హత ఉన్న ఎవరైనా సరే ఆన్లైన్లో టెండర్లు దాఖలుచేసి, ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే తక్కువ కోట్ చేసి.. పనులను దక్కించుకోవచ్చు. 130కి పైగా ఉన్న పనులకు ఎవరెవరు టెండర్లు వేయాలి..? ఎవరు వేయకూడదు..? అని టీడీపీ నేతలే నిర్ణయించేశారు. ఓ నాయకుడి హామీ లభించిన వాళ్లు మాత్రమే టెండర్లు వేసేలా నిబంధన పెట్టుకున్నారు. -
ఆశా వర్కర్ల ఆందోళన
ప్రధాన డిమాండ్లు ఇవీ.. చిత్తూరు రూరల్ (కాణిపాకం): ప్రజల ప్రాథమిక ఆరోగ్య పరిరక్షణలో కీలక భూమిక పోషిస్తున్న ఆశావర్కర్లు మనోవేదనకు గురవుతున్నారు. ఒకవైపు వరస సర్వేల భారంతో నలిగిపోతుంటే, మరోవైపు సాంకేతిక సమస్యల పేరిట ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనలతో నానా అవస్థలు ఎదుర్కొంటున్నారు. జిల్లాలో మొత్తం 1,349 మంది ఆశవర్కర్లు పనిచేస్తుండగా, ప్రస్తుతం వీరు ఏకంగా 12 రకాల సేవలు అందిస్తున్నారు. ఇది చాలదన్నట్లు, నిబంధనల ప్రకారం ఏఎన్ఎంలు చేయాల్సిన సర్వేలను కూ డా పూర్తిగా ఆశావర్కర్లపైనే నెట్టేస్తుండడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. ఓటీపీల గోల శుక్రవారం నుంచి జిల్లాలో ప్రారంభమైన లెప్రసీ (కుష్టు వ్యాధి) సర్వే ఈ వివాదానికి కారణంగా మా రింది. 15 రోజుల వ్యవధిలో బాధితుల శరీరంపై మచ్చలను గుర్తించి, వారి వివరాలను కేటాయించిన యాప్‌లో అప్లోడ్ చేయాల్సి ఉంది. అయితే ఈసారి లెప్రసీ సర్వేను అభా యాప్‌కు అనుసంధానం చేయ డంతో ప్రతీ వ్యక్తి సమాచారం నమోదవ్వాలంటే వారి మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీ నమోదు చేయడం తప్పనిసరి చేశారు. క్షేత్రస్థాయికి వెళుతున్న ఆశావర్క ర్లను చూసి ప్రజలు ప్రతీ సర్వే కు ఓటీపీలు ఎందుకు అంటూ నిలదీస్తున్నారు. రోజుకో సర్వే పేరిట ఓటీపీ లు అడగడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, వివరాలు చెప్పేది లేదంటూ తిరస్కరిస్తున్నారు. జనం నుంచి వస్తున్న వ్యతిరేకతతో ఆశా వర్కర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏఎన్ఎంల గైర్హాజరు నిబంధనల ప్రకారం ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు కలిసి సంయుక్తంగా ఈ సర్వే చేపట్టాల్సి ఉంది. అయితే క్షేత్రస్థాయిలో ఏఎన్ఎంలు ఎక్కడా రావడం లేదని ఆశా కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. సర్వేల బాధ్యతనంతా తమపైనే వదిలేసి అధికారులు, ఏఎన్‌న్‌ఎంలు పక్కకు తప్పుకుంటున్నారని మండిపడుతున్నారు. ఈ క్రమంలో శుక్రవారం చిత్తూరు నగరంలోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం ఎదుట ఆశా వర్కర్ల యూనియన్ ఆధ్వర్యంలో భారీ ధర్నా చేపట్టారు. అధికారుల వాదన అయితే దీనిపై అధికారులు మరోలా స్పందిస్తున్నారు. ఓటీపీ లింక్ పెడితేనే ఆశా వర్కర్లు నేరుగా ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజల ఆరోగ్య పరిస్థితిని ప్రత్యక్షంగా గమనిస్తారని, లేకపోతే కొందరు ఇంటి వద్దనే కూర్చుని నకిలీ వివరాలతో సర్వే ముగిస్తున్నారని వెల్లడిస్తున్నారు. కానీ, గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో నెట్వర్క్ వైఫల్యాలు, ఓటీపీలు ఆలస్యంగా రావడం లేదా అసలు రాకపోవడం వల్ల అమూల్యమైన సమయం వృథా అవుతోందని సిబ్బంది వాపోతున్నారు. పని పాటా లేదంటున్నారు మమ్మల్ని చూసి జనం పని పాటా లేదంటున్నారు. ఏంది ఎప్పుడు చూసినా బ్యాగు ఒకటి తగిలించుకుని వచ్చేస్తున్నారని ఆడిపోసుకుంటున్నారు. ఓటీపీ అడిగితే ముఖం మీదనే తిరస్కరిస్తున్నారు. ఇలాగైతే ఎలా సర్వేలను పూర్తి చేస్తాం. ఏఎన్‌న్‌ఎంలు రాకపోయినా మేము సర్వే చేస్తాం. ఓటీపీలు లేకుండా చూడాలని అడుగుతున్నాం. – ఉమాదేవి, ఆశా వర్కర్ ఓటీపీ వద్దు ఇప్పటికే సర్వేలతో ఇబ్బంది పడుతున్నాం. ఇంకా ఏఎన్‌న్‌ఎం పను లు, వారి సర్వేలను కూ డా మమ్మల్ని చేయమంటున్నారు. ఇలాగైతే కష్టమండీ.. మా దగ్గర వెట్టిచాకిరీ చేయిస్తున్నారు. తాజాగా చేసిన సర్వేలన్నీ కూడా ఓటీపీలతో జరిగాయి. శుక్రవారం ఇచ్చిన లెప్రసీ సర్వేను కూడా ఓటీపీలతో చేయమంటున్నారు. ఇలాగైతే కష్టం. వెంటనే ఈ ఓటీపీ విధానం తొలగించాలి. లేకుంటే జనాలతో మేము మాట పడాల్సి వస్తోంది. – పద్మ,ఆశా వర్కర్ యూనియన్ నేత -
ముగిసిన చెకుముకి సంబరాలు
చిత్తూరు కలెక్టరేట్ : జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో చిత్తూరు, గుడిపాల మండలాల స్థాయి ‘చెకుముకి సైన్స్ సంబరాలు’ గురువారం తపోవనం ఉన్నత పాఠశాలలో విజయవంతంగా ముగిశాయి. ఈ పోటీల్లో రెండు మండలాల నుంచి 46 బృందాలుగా మొత్తం 138 మంది విద్యార్థులు పాల్గొని తమ వైజ్ఞానిక ప్రతిభను చాటుకున్నారు. 27న జిల్లా స్థాయి పోటీలు ఈ సందర్భంగా జనవిజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు హెచ్.అరుణ శివప్రసాద్ మాట్లాడుతూ పాఠశాల స్థాయిలో 20 వేలకు పైగా విద్యార్థులు పాల్గొనగా, గురువారం 28 మండలాల్లో మండల స్థాయి పోటీలు పూర్తి చేశామన్నారు. విజేతలకు ఈ నెల 27న చిత్తూరులోని విజయం ఇంజినీరింగ్ కళాశాలలో జిల్లా స్థాయి సంబరాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. నగర శాఖ అధ్యక్షుడు సుధాకర్ మాట్లాడుతూ విద్యార్థుల్లో ఆలోచనా శక్తిని రేకెత్తించే వినూత్న ప్రశ్నపత్రాలే చెకుముకి ప్రత్యేకతని తెలిపారు.ఆంధ్ర విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యులు దండాల రాధాకృష్ణ సరస్వతి దంపతులు రూ.10 వేల విలువైన మెమెంటోలను, విశ్రాంత ఉపాధ్యాయులు డాక్టర్ త్యాగరాజు నాయుడు రూ.10 వేల విలువ చేసే బహుమతులను విజేతలకు అందించారు. కార్యక్రమంలో జేవీవీ జిల్లా ఉపాధ్యక్షులు జయంతి, గౌరవ అధ్యక్షుడు మునిరత్నం, లయన్స్ క్లబ్ జోనల్ చైర్మన్ శ్రీధర్ రెడ్డి, తపోవనం హెచ్ఎమ్ కుప్పస్వామి పిళ్లై, సభ్యులు అమరనాథ్ రెడ్డి, రాజశేఖర్, రమేష్, పుష్ప తదితరులు పాల్గొన్నారు. మండలాల వారీగా విజేతలు చిత్తూరు అర్బన్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల విభాగంలో ఏపీఆర్ఎస్ మైనారిటీ పాఠశాల ప్రథమ, జెడ్పీ హైస్కూల్ దొడ్డిపల్లె ద్వితీయ స్థానాల్లో నిలిచాయి. ప్రైవేట్ విభాగంలో బృందావన్ ఇంగ్లిష్ మీడియం ప్రథమ, క్యాంఫర్డ్ నార్త్ పాఠశాల ద్వితీయ బహుమతులు సాధించాయి. చిత్తూరు రూరల్ మండలం పరిధిలోని ప్రభుత్వ విభాగంలో బీఎన్ఆర్ పేట జెడ్పీ హైస్కూల్ ప్రథమ, తుమ్మింద జెడ్పీ హైస్కూల్ ద్వితీయ బహుమతి గెలుపొందగా, ప్రైవేటు విభాగంలో రెయిన్బో సీబీఎస్ఈ పాఠశాల ప్రథమ, రెయిన్బో ఇంగ్లిష్ మీడియం ద్వితీయ స్థానాలు కై వసం చేసుకున్నాయి. గుడిపాల మండలంలోని జెడ్పీ హైస్కూల్ నరహరిపేట నుంచి వచ్చిన రెండు జట్లు ప్రథమ, ద్వితీయ బహుమతులు సాధించి ప్రతిభను చాటాయి. -
జగనన్న ఆశీస్సులతో జిల్లాకు సేవ
– జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు చిత్తూరు కార్పొరేషన్: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశీస్సులతో జిల్లాకు సేవ చేసే మహద్భాగ్యం దక్కిందని జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు తెలిపారు. జెడ్పీ పాలకవర్గం పదవీ కాలం ఈనెల 24వ తేదీతో ముగియనున్న నేపథ్యంలో శుక్రవారం జిల్లాపరిషత్ సమావేశ మందిరంలో జెడ్పీటీసీ సభ్యులకు వీడ్కోలు సభ నిర్వహించారు. వారిని సన్మానించి, జ్ఞాపికలను అందజేశారు. జెడ్పీ చైర్మన్ మాట్లాడుతూ తన తండ్రి గోవిందప్ప 5 సార్లు సర్పంచ్‌గా ఎన్నికయ్యారన్నారు. రాజకీయ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన నన్ను వి.కోట మండలవాసులు జెడ్పీటీసీ సభ్యుడిగా ఎన్నుకున్నారని వెల్లడించారు. అయితే జెడ్పీ చైర్మన్‌గా మాజీ సీఎం జగనన్న, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అవకాశం కల్పించారని వివరించారు. పాలన కాలంలో టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మాజీ మంత్రి రోజా, ఉమ్మడి జిల్లా మాజీ ఎమ్మెల్యేల సహకారం మరువలేనిదన్నారు. జెడ్పీ పరిధిలో ఉద్యోగుల బదిలీలు, పను లు, కారుణ్య నియమాకాలను పారదర్శకంగా చేపట్టామని తెలిపారు. పదవిని అలంకారంగా కాకుండా బాధ్యతగా భావించడం తృప్తినిచ్చిందన్నారు. ఆరోపణలకు తావులేకుండా ఐదేళ్లపాటు విధులు నిర్వర్తించామని వెల్లడించారు. రూ.వందల కోట్ల తో సీసీరోడ్లు, పలు భవనాల నిర్మాణం, పైప్‌లైన్స్ ఏర్పాటు, ఆలయాల ఆధునికీకరణ చేపట్టామని వివరించారు. అందుకే జాతీయ స్థాయిలో రెండు అవార్డులు వచ్చాయని చెప్పారు. ఈ సందర్భగా పాలకవర్గంతో తమ అనుబంధాన్ని జెడ్పీ సీఈఓ రవికుమార్‌నాయుడు, డిప్యూటీ సీఈఓ వెంకటనారాయణలు గుర్తు చేసుకున్నారు. చివరిగా జెడ్పీ పరిఽధిలో జరిగిన పలు అభివృద్ది కార్యక్రమాలకు సంబంధించి శిలఫలకాన్ని ఆవిష్కరించారు. సీ్త్రశిశు సంక్షేమ కమిటీ ఛైర్మన్ భారతి పాల్గొన్నారు. -
క్షణ క్షణం.. చిరుత భయం
చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరు నగర పరిసర ప్రాంతాలను చిరుత పులి భయం వెంటాడుతోంది. చెన్నమ్మగుడిపల్లె, ఎగువమాసాపల్లె, దిగువమాసాపల్లె ప్రాంతాల్లో మూడు రోజులుగా చిరుత సంచరిస్తోందన్న వార్త స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. క్షేత్రస్థాయి పరిశీలనలో భాగంగా అటవీశాఖ అధికారులు డ్రోన్ కెమెరాల ద్వారా పరిశీలించగా చిరుత సంచరిస్తున్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. దీంతో పొలాల్లోకి వెళ్లేందుకు రైతులు భయపడుతున్నారు. మరోవైపు చెన్నమ్మగుడిపల్లె ప్రాథమిక పాఠశాల వద్ద చిరుత కదలికలను గుర్తించారు. దీంతో విద్యార్థులను బడి దూరంగా గుడి వద్ద పాఠాలు బోధిస్తున్నారు. వ్యక్తి మృతదేహం గుర్తింపు వడమాలపేట (పుత్తూరు): వడమాలపేట మండలం పూడి రైల్వే స్టేషన్ సమీపంలోని పొలంలో శుక్రవారం ఓ వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి జేబులోని ఆధారాల మేర కు కార్వేటినగరం మండలం పద్మసరస్సుకు చెందిన గురవ య్య మందడిగా గుర్తించినట్లు ఎస్ఐ హరీష్ తెలి పారు. నాలుగు రోజుల క్రితం పూడిలో జరిగిన ఓ కార్యక్రమానికి గురవయ్య వచ్చినట్లు తెలిపారు. మృతుడి ఒంటిపై ఎలాంటి గాయాలు లేవన్నా రు. నాలుగు రోజుల క్రితం మృతి చెందడంతో దుర్వాసన రావడం వల్లే గ్రామస్తులు సైతం గుర్తించి సమాచారం అందించినట్లు వెల్లడించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించినట్లు ఎస్ఐ తెలిపారు. ఇద్దరు హెచ్ఎంలకు నోటీసులు చిత్తూరు కలెక్టరేట్ : విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన ఇద్దరు ప్రధానోపాధ్యాయులకు నో టీసులు జారీ చేసినట్లు డీఈఓ లక్ష్మీనారాయణ తెలిపారు. శుక్రవారం ఆయన విలేకర్ల తో మా ట్లాడారు. నగరి మండలం ఏకాంబరకుప్పం జెడ్పీ ఉన్నత పాఠశాల హెచ్ఎం నమశ్శివాయ, పలమనేరు మండలం ప్రభుత్వ ఉన్నత పాఠ శాల హెచ్ఎం షంషీర్‌కు నోటీసు లు ఇచ్చినట్లు వెల్లడించారు. ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేయకుండా అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆగి ఉన్న లారీని ఢీకొన్న మరో లారీ రామకుప్పం(శాంతిపురం) : కుప్పం– పలమనేరు జాతీయ రహదారిపై చెల్దిగానిపల్లె వద్ద శుక్రవారం ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో తమిళనాడుకు చెందిన లారీ డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. వివరాలు.. శుక్రవారం భారీ వినాయక విగ్రహం తరలింపుతో చెల్దిగానిపల్లె వద్ద విద్యుత్ లైన్లు తెగిపోయాయి. రెస్కో సిబ్బంది మరమ్మతు పనులు చేస్తుండటంతో వి.కోట వైపు నుంచి వచ్చిన రెండు లారీలు ఒకదాని వెనుక ఒకటి రోడ్డుపై ఆగాయి. ఈ క్రమంలో ముందు లారీని వెనుక నుంచి మరో లారీ ఢీకొంది. దీంతో క్యాబిన్ లారీ డ్రైవర్ రాజేంద్రన్(37) ఇరుక్కుపోయాడు. రెండు కాళ్లు తీవ్రంగా గాయపడడంతో పోలీసులు అతి కష్టం మీద వెలికి తీశారు. క్షతగాత్రుడిని 108 వాహనంలో కుప్పంలోని ఆస్పత్రికి తరలించారు. జిల్లాలో పలువురికి పార్టీ పదవులు సాక్షి,చిత్తూరు: వైఎస్సార్సీపీ జిల్లా నేతలను పలు కీలక పదవుల్లో నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు నియామకాలు చేపట్టినట్లు తెలిపింది. ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ విభాగం జిల్లా అధ్యక్షుడిగా టి.గోవిందన్ (చిత్తూరు), జిల్లా వి ద్యార్థి విభాగం కార్యదర్శిగా బి.సోమరాజు (పలమనేరు), జిల్లా ఎస్సీ విభాగం ప్రధాన కార్యదర్శిగా ఎం.లక్ష్మీనారాయణ (పలమనేరు), జిల్లా యువ త విభాగం కార్యదర్శిగా ఎస్.శరత్(చిత్తూరు), పుత్తూరు రూరల్ మండల పార్టీ అధ్యక్షుడిగా భాస్కర్ యాదవ్ (నగరి) నియమితులయ్యారు. -
ముసాయిదా ఓటరు జాబితా ప్రచురణ
చిత్తూరు కార్పొరేషన్: ఉమ్మడి జిల్లా పరిధిలోని ఎంపీడీఓ కార్యాలయాలు, జెడ్పీ కార్యాలయంలో ఎంపీటీసీ స్థానాల వారీగా ముసాయిదా ఓటర్ల జాబితాను శుక్రవారం ప్రచురించినట్లు సీఈఓ రవికుమార్‌నాయుడు తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ జాబితాలో ఎంపీటీసీ స్థానాల వారీగా ఓటర్ల వివరాలను సరి చూసుకోవాలన్నారు. సంబంధిత కార్యాలయాల్లో ఓటర్లు తమ పేరు, వివరాలు, ఫొటో తదితర అంశాలను పరిశీలించుకోవాలని సూచించారు. స్వీయ ధ్రువీకరణతో చర్మకారులకు పింఛన్లు చిత్తూరు కలెక్టరేట్ : డప్పు కళాకారులు, చర్మకారులు స్వీయ ధ్రువీకరణతో పింఛన్లకు దర ఖాస్తు చేసుకోవచ్చని రాష్ట్ర సామాజిక బోర్డు చైర్మన్ బాలకోటమ్మ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని అర్హులు గ్రామ, వార్డు సచివాలయాల్లో పింఛన్లకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ అసిస్టెంట్లు, పట్టణాల్లో వార్డు డేటా ప్రాసెసింగ్ కార్యదర్శులు పూర్తి వివరాలను ఆన్‌న్‌లైన్ చేస్తారన్నారు. అనంతరం సంక్షేమ సహాయకులు, సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టి అర్హత గల అప్లికేషన్లను ఎంపీడీఓ, మున్సిపల్ కమిషనర్లకు పంపుతారని వెల్లడించారు. -
నిలిపివేశారు
గత వైఎస్సార్సీపీ పాలనలో రూ.కోట్ల పనులు చేశాం. రెండున్నరేళ్లుగా చిన్నచిన్న పనులు చేయించుకోవడానికి అల్లాడుతున్నాం. అన్ని పనులను నిలిపివేశారు. టి.సదుంలో రూ.13 కోట్లతో 13 కిలోమీటర్లు రెండువైపులా రోడ్డు విస్తరణ పనులు గతంలో చేశాం. రాయనిపల్లె వద్ద రూ.8 కోట్లతో బ్రిడ్జి పూర్తి చేశాం. వీటితో పాటు సీసీ రోడ్డు, కాలువలు నిర్మించాం. కందుకూరు–చెల్లూరు రూ.15 కోట్లతో 15 కిలోమీటర్ల రోడ్డు పనులకు టెండర్ పూర్తి అయినప్పటికీ పెండింగ్‌లో పెట్టేశారు. కాలువలు, పలు అభివృద్ది పనులు చేయాల్సి ఉంది. – శివన్న, జెడ్పీటీసీ సభ్యుడు, తంబలపల్లె -
మరోసారి తప్పు జరగదు
పుత్తూరు: ఖోఖో ఆడడానికి వెళ్లిన విద్యార్థులు గ్రౌండ్‌లోని రాళ్ల ను ఏరివేయాల్సి వచ్చింది. ఇలాంటి తప్పు మరోసారి జరగకుండా చూస్తామని నారాయణ స్కూల్ ప్రిన్సిపల్ ఉషా రాణి పుత్తూరు విద్యాశాఖాధికారికి లిఖిత పూర్వకంగా లేఖ రాసి ఇచ్చారు. శుక్రవారం సాక్షి దినపత్రికలో నారా యణ ఏమిటయ్యా ఇది? అంటూ విద్యార్థుల చేత మట్టి పనులు చేయించడంపై కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన ఎంఈఓలు తిరుమలరాజు, బాలసుబ్రమణ్యం వెంటనే నారాయణ పాఠశాలకు వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. ప్లేగ్రౌండ్ బాగు చేసే పని మీది కాదని, అలాంటి పనులు చేయకూడదని అవగాహన కల్పించారు. అనంతరం ఆటస్థలం పరిశీలించారు. పాఠశాల నిర్వాహకులను వివరణ కోరారు. మరోసారి ఇలాంటి పొరబాటు జరగదని ప్రిన్సిపల్ లెటర్ రాసి ఇచ్చారు. చెరువులో నీటి చౌర్యం పలమనేరు : అసలే కరువు కారణంగా వర్షాలు కురవక చెరువుల్లోని నీటిని వృథా చేయకుండా చూసుకోవాల్సిందిపోయి చెరువుకే మోటార్ పెట్టి లాగేస్తున్న ఘటన మండలంలోని నక్కపల్లెలో శుక్రవారం వెలుగుచూసింది. గ్రామ సమీపంలోని చెరువులో నీరు పుష్కలంగా ఉంది. ఈ నీటిని రైతులు పొదుపుగా పంటలకు వాడుకుంటున్నారు. కానీ, చెరువు పక్కనే భూమి కలిగిన నాగరాజు అనే వ్యక్తి తాను టీడీపీ నేతనంటూ పెత్తనం చెలాయిస్తున్నాడు. ఏకంగా చెరువునీటిని మోటార్ ద్వారా లాగేస్తున్నాడని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీ అధికారులు, వీఆర్ఓ ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడంలేదని మాజీ సర్పంచ్ విశ్వనాథ రెడ్డి తెలిపారు. -
పింఛన్ సమస్య పరిష్కారం
చిత్తూరు కలెక్టరేట్ : కొత్త పింఛన్ల నమోదులో అర్హులైన దివ్యాంగులు ఎదుర్కుంటున్న సమస్యలపై సాక్షి దినపత్రికలో ఈ నెల 11వ తేదీన నిబంధనల సంకెళ్లు శీర్షికతో కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి జిల్లా యంత్రాంగం స్పందించింది. నూతన పింఛన్ల నమోదులో క్షేత్రస్థాయిలో అర్హులైన దివ్యాంగులు ఎదుర్కొంటున్న సాంకేతిక అడ్డంకులు, అధికారుల నిర్లక్ష్యంపై సాక్షి సమగ్ర కథనాన్ని ప్రచురించిన విషయం విదితమే. ముఖ్యంగా ఆధార్ కార్డు, సదరం సర్టిఫికెట్‌లోని పేర్లలో స్వల్ప వ్యత్యాసాలు (పొంతన లేకపోవడం) ఉన్నాయనే సాకుతో అధికారులు దరఖాస్తులను స్వీకరించకుండా తిరస్కరిస్తున్నారని బాధితుల ఆవేదనను సాక్షి వెలుగులోకి తెచ్చింది. చొరవ చూపిన అధికారులు ఈ కథనం ప్రచురితం కావడంతో స్పందించిన సంబంధిత శాఖ అధికారులు యాదమరి మండలానికి చెందిన దివ్యాంగులు మధుబాబు, సురేఖల దరఖాస్తు సమస్యను వెంటనే పరిష్కరించారు. వారి నుంచి వివరాలను సేకరించి, సాంకేతిక లోపాలను సరిదిద్ది దరఖాస్తులను విజయవంతంగా ఆన్‌న్‌లైనన్‌లో నమోదు చేయించారు. రోజుల తరబడి సచివాలయాల చుట్టూ తిరిగినా తీరని తమ సమస్య సాక్షి కథనంతో వెంటనే పరిష్కారం కావడంపై దివ్యాంగులు హర్షం వ్యక్తం చేశారు. -
పసికందుకు పక్కాగా చికిత్స
చిత్తూరు రూరల్ (కాణిపాకం) : అప్పుడే పుట్టిన పసికందును కటిక నేలపై వదిలేసిన అమానుష ఘటన చిత్తూరు నగరంలో చర్చనీయాంశమైంది. జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలోని ప్రసూతి విభాగం వెనుక భాగంలో బుధవారం ఉదయం ఓ నవజాత మగ శిశువును గుర్తుతెలియని వ్యక్తులు వదిలి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఆ చిన్నారిని ఎస్ఏఐసీయూ వార్డుకు తరలించి, వైద్యుల పర్యవేక్షణలో అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ఆ బిడ్డను మాకిచ్చేయండి ప్లీజ్... పసిబిడ్డను చూసి ఆస్పత్రిలోని మహిళా సిబ్బంది మనసు చలించిపోయింది. ఆ బిడ్డను మాకిచ్చేయండి, మేము ప్రాణం కంటే ఎక్కువగా పెంచుకుంటాం అంటూ చాలా మంది అధికారులను వేడుకుంటున్నారు. అయితే చిన్నారి రక్షణ, చట్టబద్ధమైన దత్తత నిబంధనల దృష్ట్యా ఎవరికీ నేరుగా ఇచ్చేందుకు వీలులేదని, బిడ్డ కోలుకున్నాక చట్టప్రకారం శిశువిహార్‌కు అప్పగిస్తామని ఆస్పత్రి వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. వదిలేసింది ఎవరు? కన్నబిడ్డను అలా వదిలేసి వెళ్లిన నిర్దయులు ఎవరనే కోణంలో పోలీసులు రంగంలోకి దిగారు. ఆస్పత్రి పరిసరాల్లోని సీసీటీవీ పుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. బుధవారం ఉదయం సరిగ్గా 6.10 గంటల ప్రాంతంలో ఓ వృద్ధుడు ప్రసూతి విభాగం వెనుక గేటు గుండా లోపలికి వచ్చినట్లు పోలీసులు గుర్తించారని తెలిసింది. చేతిలోని బ్యాగులో బిడ్డను తీసుకొచ్చి, ఎవరూ చూడని సమయం చూసి అక్కడ పెట్టేసి జారుకున్నట్లు దృశ్యాల ద్వారా అనుమానిస్తున్నట్లు సమాచారం. ఆ వృద్ధుడు గేటు వద్దకు ఎలా వచ్చాడు? అక్కడ నుంచి ఏ వాహనంలో పరారయ్యాడు? ఆటోలో వచ్చాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఎస్పీ సీరియస్ బిడ్డను వదిలి వెళ్లిన విషయం తెలుసుకున్న ఎస్పీ అత్యంత తీవ్రంగా ఈ కేసును పరిగణించారు. కానీ, ఈ ఘటనపై ఎలాంటి అధికారిక ఫిర్యాదు... కేసు నమోదు కాకపోవడంతో అమ్మను కనిపెట్టడంలో కొందరు పట్టించుకోలేదనే విమర్శలు వచ్చాయి. -
మరోసారి తప్పు జరగదు
పుత్తూరులోని నారాయణ స్కూల్లో విద్యార్థులతో మైదానం శుభ్రం చేయించడంపై ప్రిన్సిపల్ వివరణ ఇచ్చారు.కలెక్టర్‌కు సీఎం అభినందన చిత్తూరు కలెక్టరేట్ : ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విద్య అమలుకు కలెక్టర్ వినూత్నంగా ప్రవేశపెట్టిన ఓసాట్ ప్రాజెక్ట్‌ను సీఎం చంద్ర బాబు అభినందించారు. శుక్రవారం విజయవాడ లో నిర్వహించిన కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ సుమిత్‌కుమార్ గాంధీపై ప్రశంసలు కురిపించారు. రూ.2 కోట్ల స్వచ్ఛంద సంస్థల నిధు లతో జిల్లాలోని 22 పాఠశాలల్లో పైలెట్ ప్రాజెక్ట్ గా ల్యాప్‌టాప్‌లు, ఐఎఫ్ ప్యానెళ్లు, మైక్రోసాఫ్ట్ ఓపెన్ ఏఐ ట్యాబ్‌లతో బోధన అందిస్తున్నారు. గత 14 నెలల్లో 6,828 మంది విద్యార్థుల అభ్యాసన ప్రమాణాల్లో గణనీయమైన పురోగ తి కనిపించిందని సీఎంకు కలెక్టర్ వివరించా రు. చిత్తూరు మోడల్‌ను సమగ్రంగా అధ్యయ నం చేసి, పాఠశాల విద్యలో ఏఐ బోధనను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని అధికారులను సీఎం ఆదేశించారని కలెక్టర్ వివరించారు. -
ఆగిన ఆశలు .. అసంపూర్తి నిర్మాణాలు
పునాదులు, మెండి గోడలకే పరిమితమైన కాలనీ అధ్వానంగా దాసేగానూరు వద్ద జగనన్న కాలనీ నిరుపేదల సొంతింటి కల అసంపూర్తిగా మిగిలిపోయింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మంజూరు చేసిన కాలనీలను చంద్రబాబు సర్కారు నిర్వీర్యం చేసేస్తోంది. కనీస వసతులు సైతం కల్పించకుండా కావాలని కాలయాపన చేస్తోంది. సకాలంలో బిల్లులు చెల్లించకుండా నిర్మాణ పనులను నిలిపివేసుకునే దుస్థితిని తీసుకువస్తోంది. కనికరించాలని లబ్ధిదారులు నేతలు, అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేసినా స్పందించకుండా పేద బతుకులను ఇబ్బందిపెడుతోంది. కుప్పం : కుప్పం నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం 102 కాలనీల నిర్మాణం చేపట్టింది. వీటిలో 15 వేల పైచిలుకు ఇళ్లు మంజూరు చేసింది. అనంతరం మారిన రాజకీయాల పరిమాణాల దృష్ట్యా జగనన్న కాలనీలకు చంద్ర గ్రహణం పట్టింది. రెండేళ్లుగా కాలనీలోని గృహాలకు సకాలంలో బిల్లు రాకపోవడంతో నిర్మాణ పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయి. దీంతో కాలనీల్లో ఎటు చూసినా పునాదులు, మొండి గోడలే కనిపిస్తున్నాయి. అధికారులు, పాలకుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో లబ్ధిదారులు ఏం చేయాలో దిక్కతోక మిన్నకుండి పోయారు. ఒక్క ఇల్లు మంజూరు కాలేదు రెండేళ్ల కూటమిపాలనలో సీఎం చంద్రబాబు ప్రాతి నిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో ఒక్క ఇల్లు మంజూరు కాలేదు. కేవలం పురపాలక పరిధిలో అర్బన్ ఏరియా కింద కుప్పం పట్టణానికి కొన్ని గృహాలు మంజూరు చేశారు. నియోజకవర్గంలోని నాలు గు మండలాల్లో గ్రామీణ ప్రాంతాలకు ఇప్పటి వరకు ఒక్క ఇల్లు మంజూరు చేయకపోవడం గమనార్హం. పిచ్చిమొక్కలతో నిండిన కాలనీ రహదారి దుస్థితిఅర్ధాంతరంగా ఆగిన కాలనీలను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో అధ్వానంగా మారిపోయాయి. వర్షాలకు రోడ్డు , వీధులు కోతకు గురై నడవలేని పరిస్థితి ఏర్పడింది. కాలనీ గృహాలు పిచ్చిమొక్కలతో నిండిపోయాయి. కుప్పం మండలం దాసేగానూరు పంచాయతీ వగరప్ప కోటాలు వద్ద 120 ఇళ్లతో కాలనీ నిర్మాణం చేపట్టారు. ప్రస్తుతం ఈ కాలనీ అధ్వానంగా మారింది. పునాదులు, మెండి గోడలకే పరిమితమైయింది. చిట్టడవిని తలపిస్తోంది. -
‘కరువు’ ప్రకటన అవసరం
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో కరువు మండలాలను వెంటనే ప్రకటించి ఆదుకోవాలని ఆల్ ఇండియా కిసాన్ సభ జిల్లా అధ్యక్షుడు మునిరత్నం, నాయకుడు శివారెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం ఈ మేరకు చిత్తూరు ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ కరువు పరిస్థితులపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలన్నారు. ఎండిన పంటలతో నష్టపోయిన రైతులను, ఉపాధి కోల్పోయిన వ్యవసాయ కార్మికులను ఆదుకోవాలని కోరారు. వర్షాభావంతో పంటలు ఎండిపోయి రైతులు తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయారన్నారు. కరువు ప్రభావిత మండలాలను వెంటనే గుర్తించి అధికారికంగా ప్రకటించాలని స్పష్టం చేశారు. కేంద్రం నుంచి ప్రత్యేక కరువు ప్యాకేజీని తెప్పించాలన్నారు. సాధారణ పంటలకు ఎకరాకు రూ.10వేలు ఇన్పుట్ సబ్సిడీ, వాణిజ్య, ఉద్యాన పంటలకు ఎకరాకు రూ.25వేలను నష్టపరిహారం అందించాలని కోరారు. నిజమైన కౌలు రైతులను గుర్తించి ఇన్‌న్‌పుట్ సబ్సిడీ, పంట నష్టపరిహారం, రుణమాఫీ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. పంటలను కాపాడుకునేందుకు నీటి రవాణా ఖర్చులను ప్రభుత్వమే భరించాలన్నారు. వలసల నివారణకు ఉపాధి పనులు గ్రామీణ ప్రాంతాల నుంచి వలసలను నివారించేందుకు ఉపాధి హామీ పనులను భారీగా చేపట్టాలన్నారు. రోజువారీ కూలీని రూ.700కి పెంచాలని కోరారు. కరువు ప్రభావిత రైతులు, వ్యవసాయ కూలీలు, చేతివృత్తిదారులకు నెలకు రూ.10 వేల కరువు భృతి అందించాలని డిమాండ్ చేశారు. పశువులకు ఉచితంగా గ్రాసం, తాగునీటి సదుపాయం కల్పించాలన్నారు. బాధిత కుటుంబాల విద్యార్థుల ఫీజులను పూర్తిగా మాఫీ చేసి ప్రత్యేక ఆర్థిక సాయం అందించాలని కోరారు. ఉపాధి కల్పనకు గ్రామీణ ప్రాంతాల్లో ఫుడ్ ప్రాసెసింగ్, చిన్నతరహా పరిశ్రమలు నెలకొల్పాలని స్పష్టం చేశారు. అనంతరం ఆర్డీఓ శ్రీనివాసులుకు వినతిపత్రం అందజేశారు. రైతు సంఘం నేతలు నాగరాజన్, గోపీనాథ్, దాసరి చంద్ర, మణి, రమాదేవి, విజయ్ గౌరీ, బాలాజీ రావు, రఘు, జమీలాబీ పాల్గొన్నారు. -
ఏమీ చేయడం లేదు
గత వైఎస్సార్సీపీ పాలనలో గుడిపల్లెలోని చీకటిపల్లెలో రూ.20 లక్షలతో సీసీ రోడ్డు నిర్మించాం. అలాగే రూ.15 లక్షలతో కాలువ నిర్మించాం. మల్లప్పకొండ రిటర్నింగ్ వాల్‌కు రూ.30 లక్షలు, మండల కాంప్లెక్స్ కాంపౌండ్ వాల్‌కు రూ.12 లక్షలు ఖర్చు చేశాం. కనుమనపల్లెలో రూ.10 లక్షలతో సీసీ రోడ్డు వేశాం. ఇక కనుమనపల్లెలో రూ.10 లక్షలతో సీసీ రోడ్డు, వెంకటాపురంలో రూ.5 లక్షలతో సీసీ రోడ్డు, వెంకటాపురంలో రూ.2.25 కోట్లతో తారురోడ్డు, రూ.కోటితో కల్వర్టు పనులను చంద్రబాబు ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టింది. – కృష్ణమూర్తి, జెడ్పీటీసీ సభ్యుడు, గుడుపల్లె -
డబ్బులు అడిగారనడం అవాస్తవం
సాక్షి టాస్క్‌ఫోర్స్ : జీడీ నెల్లూరు మండలంలో పరిశ్రమల స్థాపన కోసం భూ సేకరణ చేస్తున్నది నిజమేనని తహసీల్దార్ సీకే శ్రీనివాసులు తెలిపారు. రైతులకు ప్రభు త్వం ఇస్తున్న పరిహారం మొత్తంలో వాటాలు ఇవ్వాలని అడిగారనడం అవాస్తవని పేర్కొన్నారు. సాక్షి దినపత్రికలో గురువారం ఎకరాకు రూ.రెండు ఇవ్వాల్సిందే అన్న శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనిపై తహసీల్దార్ సీకే శ్రీనివాసులు స్పందించారు. జాయింట్ కలెక్టర్ రైతులతో పలుమార్లు సమావేశాలు నిర్వహించి ఎకరాకు రూ.17 లక్షల పరిహారం ఇవ్వాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు. రెవెన్యూ అధికారులు రైతుల నుంచి డబ్బులు డిమాండ్ చేయడం పూర్తిగా అవాస్తవమని తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. లాడ్జీల్లో పోలీసుల తనిఖీ చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరు నగరంలోని లాడ్జీల్లో అక్రమ కార్యకలాపాలను అరికట్టేందుకు పోలీసులు గురువారం తనిఖీలు చేపట్టారు. వన్ టౌన్ ఎస్ఐ నాగప్ప నాయక్ తన సిబ్బందితో కలిసి పలు లాడ్జీలను క్షుణ్ణంగా పరిశీలించారు. అతిథుల రిజిస్టర్లు, ఐడీ కార్డులు, సీసీటీవీ కెమెరాల పనితీరును తనిఖీ చేశారు. లాడ్జీల్లో మత్తు పదార్థాల విని యోగం, జూదం వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు తావిస్తే యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. డీలర్ వద్ద కందిపప్పు నిల్వలు యాదమరి: మండలంలోని కీనాటంపల్లి రేషన్ దుకాణంలో అక్రమాల గుట్టు రట్టయ్యింది. ఫుడ్ కమిషన్ సభ్యుడు గురువారం రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యుడు కృష్ణ కిరణ్ మండలంలో జరిపిన ఆకస్మిక తనిఖీల్లో రేషన్ డీలర్ బండారం బయటపడింది. కూటమి ప్రభుత్వం కందిపప్పు సరఫరా చేయకపోయినా రేషన్ షాపులో కాలం చెల్లిన, పురుగులు పట్టిన 60 కేజీల కందిపప్పు నిల్వలను గుర్తించి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీనిపై డీలర్‌ను ప్రశ్నించగా అది గతంలో వచ్చిన స్టాక్ అని, అప్పటికే పురుగులు పట్టి ఉండడంతో వెనక్కి తీసుకెళ్లాలని అధికారులకు చెప్పానని తెలిపారు. ఇన్ని నెలలుగా షాపులోనే ఎందుకు ఉంచారని నిలదీయడంతో పొంతన లేని సమాధానాలు చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన డీలర్‌తో పాటు, క్షేత్రస్థాయిలో పర్యవేక్షించని డీటీకి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. అంతకుముందు ఆయన మండలంలోని పలు అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేశారు. రికార్డులు సక్రమంగా లేకపోవడంతో ఐసీడీఎస్ సూపర్వైజర్పై మండిపడ్డారు. చిన్నపిల్లలకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనాన్ని, పౌష్టికాహారాన్ని అందించాలని ఆదేశించారు. -
కని విసిరేస్తున్నారు..!
చిత్తూరు రూరల్ (కాణిపాకం): అభం శుభం ఎరుగని పసిపాపలు అనాథలుగా మారుతున్నారు. నవమాసాలు మోసి జన్మనిచ్చిన కన్నతల్లులే పేగుబంధాన్ని తెంచుకుంటున్నారు. లోకాన్ని చూడకముందే నవజాత శిశువులను చెట్ల పొదల్లో, ముళ్ల కంచెల్లో, రోడ్ల పక్కన వదిలేసి వెళ్తున్నారు. కొంతమంది ఆస్పత్రులు, ఆలయాల వద్ద నిర్దయతో వదిలిపెడుతున్నారు. చివరికి ఆ పసికందులు శిశువిహార్ వంటి సంరక్షణ కేంద్రాల ఆలనాపాలనాలో పెరుగుతున్నారు. పెరిగిపోతున్న దారుణాలు.. కారణాలివే పసికందులను ఇలా వదిలేయడానికి అనేక సామాజిక కారణాలు కనిపిస్తున్నాయి. చాలామంది తీవ్ర ఆర్థిక ఇబ్బందులు తాళలేక కన్నబిడ్డలను వద్దనుకుంటున్నారు. మరికొందరు సంతానం లేని వారికి ఇచ్చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇవే కాకుండా ఇటీవల కాలంలో టీనేజీ వయస్సులో ప్రేమ వ్యవహారాలు, పెళ్లి కాకుండానే గర్భవతులు కావడం, లివింగ్ టుగెదర్ సంస్కృతి ఎక్కువకావడం వల్ల పుడుతున్న బిడ్డలను అనాథలుగా వదిలేస్తున్నారని నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల లెక్కల ప్రకారం జాతీయ ఆరోగ్య మిషన్ 2026–27 ఆశయాలకు అనుగుణంగా చిత్తూరు జిల్లా వ్యాప్తంగా మాతృ, శిశు సంక్షేమానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. పీహెచ్‌సీలు, సీహెచ్‌సీల ద్వారా గర్భిణుల నమోదు, సురక్షిత ప్రసవాలు, టీనేజ్ గర్భాల గుర్తింపు ప్రక్రియపై వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. తాజా నివేదికల ప్రకారం జిల్లా వ్యాప్తంగా వివిధ ఆరోగ్య కేంద్రాల్లో ఇప్పటి వరకు 15,945 మంది గర్భిణులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. 12,279 మంది వైద్యాధికారుల పర్యవేక్షణలో సురక్షిత ప్రసవాలు చేసుకున్నారు. అత్యధికంగా ఓగు పీహెచ్సీలో 729 మంది గర్భిణులు నమోదు కాగా, 661 ప్రసవాలు, తుంబకుప్పం పరిధిలో 571 మంది నమోదు కాగా 504 ప్రసవాలు విజయవంతంగా జరిగాయి. ఇదిలా ఉండగా, జిల్లా వ్యాప్తంగా 10,528 మంది గర్భిణులను పరిశీలించగా, అందులో 1,125 టీనేజ్ గర్భాలు కావడం గమనార్హం. ముఖ్యంగా శాంతిపురం మండలం రాళ్లబూదుగూరు పీహెచ్సీ పరిధిలో అత్యధికంగా 37, బుగ్గ ఆగ్రహారంలో 36, జీడీ నెల్లూరులో 35, బైరెడ్డిపల్లెలో 34 చొప్పున టీనేజ్ గర్భాలను అధికారులు గుర్తించారు. వదిలేయొద్దు.. ఊయలలో వేయండి కన్న బిడ్డలను పోషించలేక వద్దనుకునే తల్లిదండ్రుల కో సం జిల్లా మహి ళా శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. పసికందుల ను చెత్తకుప్ప లు, ముళ్లపొదల్లో పడేసి ప్రాణాలు తీయకుండా ఉండేందుకు చిత్తూరు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో ఊయలను అందుబాటులో ఉంచింది. బిడ్డలను ఆ ఊయలలో వేస్తే ప్రభుత్వం వారి బాధ్యతను స్వీకరిస్తుందని అధికారులు తెలిపారు. ఎక్కడైనా అనధికారికంగా బిడ్డలను వదిలేసినట్లు గుర్తిస్తే వెంటనే 1098, 181, 112 నంబర్లకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. పేగు బంధం కరిగిపోయింది. తొమ్మిది నెలలు మోసిన అమ్మతనానికి కనికరం లేకుండా పోయింది. లోకంలోకి అడుగు పెట్టిన కొన్ని గంటలు కూడా కాకముందే, ఏడుపు కూడా ఆగక ముందే చెత్తకుప్పలు, ముళ్లపొదలు, ఆస్పత్రి ఆవరణలు వారి నివాసాలుగా మారుతున్నాయి. అభం శుభం తెలియని ఆ లేత ప్రాణాలు చేసిన పాపమేమిటో ఎవరికీ తెలియదు. పేదరికమో.. సమాజానికి భయపడో.. లేక లింగ వివక్షో.. కారణమేదైనా పసిగుడ్డును నడి రోడ్డుపై వదిలేస్తున్న కర్కశత్వం మానవత్వానికి మాయని మచ్చగా మారుతోంది. అమ్మ ఒడిలో వెచ్చగా సేదతీరాల్సిన ఆ చిట్టి ప్రాణాలు చీకట్లో దిక్కుతోచక చేస్తున్న ఆక్రందనలు రాతి హృదయాలను సైతం కలచివేస్తున్నాయి. పాపం పసి పాపలు చిత్తూరు ఆస్పత్రిలో వరుస ఘటనలు మూడేళ్ల క్రితం ఒక తల్లి ఆడబిడ్డ పుట్టిందనే నెపంతో చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రి అత్యవసర విభాగం బాత్రూంలో వదిలివెళ్లగా, ఆస్పత్రి సిబ్బంది నెల రోజుల పాటు మెరుగైన చికిత్స అందించి కాపాడారు. తాజాగా బుధవారం చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలోని ప్రసూతి విభాగం వెనుక ఒక మగబిడ్డను వదిలివెళ్లారు. గమనించిన సిబ్బంది వెంటనే అధికారులకు సమాచారం అందించడంతో ఆ బిడ్డను ఎస్ఎన్సీయూ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. బిడ్డను వదిలివెళ్లిన కఠినాత్ముల కోసం పోలీసులు విచారణను వేగవంతం చేశారు. -
నయనానందం నేత్రగణిత అవధానం
చిత్తూరు కలెక్టరేట్ : స్థానిక బీఎస్.కన్నన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో గురువారం బీఎస్ కణ్ణన్ 99వ జయంతిని పురస్కరించుకుని పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన నేత్రగణిత అవధానం విశేషంగా ఆకట్టుకుంది. చిత్తూరు రూరల్ మండలం తుమ్మిందపాళ్యం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు చాముండి, జ్ఞానప్రియ, శర్వాన్ తమ ప్రజ్ఞాపాఠవాలతో అందరినీ అబ్బురపరిచారు. ప్రేక్షకులు కాగితంపై రాసి ఇచ్చిన గణిత సమస్యలు, గణాలు, వర్గాలు, ఘన మూలాలు, వర్గమూలాలు, వింత చదరాలు, ఆంగ్ల పదాలు, ఆంగ్ల వ్యాక్యాలను దత్తాంశంగా స్వీకరించారు. విద్యార్థిని జ్ఞానప్రియ తన కనుబొమ్మల కదలికల రూపంలో సంకేతాలు ఇవ్వగా, దాని ఆధారంగా శర్వాన్, చాముండి ఆయా ప్రశ్నలకు సరైన సమాధానాలను చదివి విని పించి నేత్రావధానంలో తమ ప్రావీణ్యాన్ని చాటుకున్నారు. రెండు విశిష్ట కళల సమాహారం ఈ కార్యక్రమానికి మెంటార్, సంధానకర్తగా వ్యవహరించిన గణిత ఉపాధ్యాయుడు అరుణ శివప్రసాద్ మాట్లాడుతూ సాధారణంగా నేత్రావధానం, గణితావధానం వేర్వేరుగా ఉంటాయని తెలిపారు. రెండింటినీ మేళవించి నేత్రగణిత అవధానంగా ప్రదర్శించడం తమ విద్యార్థుల ప్రత్యేకత అని పేర్కొన్నారు. కన్నన్ పాఠశాల హెచ్ఎం కోమల మాట్లాడుతూ గణితం అనేది లెక్కలు మాత్రమే కాదని, అదొక మానసిక వ్యాయామమని కొనియాడారు. కార్యక్రమంలో పాల్గొన్న పలువురు ప్రముఖులు మాట్లాడుతూ ఇటువంటి వినూత్న ప్రదర్శనను తాము మొదటిసారి చూస్తున్నామని, విద్యార్థుల అసాధారణ ప్రతిభను, అరుణ శివప్రసాద్ కృషిని అభినందించారు. ఈ కార్యక్రమంలో సైన్స్ సెంటర్ కోఆర్డినేటర్ జయంతి, పూర్వ విద్యార్థుల సంఘం ప్రధాన కార్యదర్శి మునిరత్నం, సభ్యులు మురళి, నరసింహులు నాయుడు, రవికుమార్, కుమారస్వామి, లయన్స్ క్లబ్ గోల్డ్ జోనల్ చైర్మన్ ఎం.వి. శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
గూండా రాజ్యం
కుప్పంలో ‘పచ్చ’ గూండాలదే రాజ్యం చిత్తూరు జెడ్పీ చైర్మన్‌పై దాడి చేసే క్రమంలో ధ్వంసమైన కారు ఎమ్మెల్సీ భరత్‌పై దాడిచేసిన తర్వాత రోడ్డుపైనే కేకలు వేస్తున్న కుప్పంలోని టీడీపీ గూండాలు సాక్షి, చిత్తూరు: 27 నెలల కూటమి పాలనలో కుప్పం నియోజకవర్గంలో ప్రతిపక్ష నేతలే లక్ష్యంగా 27 కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వం ఇచ్చిన హామీలను సోషల్ మీడియాలో ప్రశ్నించిన పూడి శ్రీహరితోపాటు కొత్తపల్లెకు చెందిన ఈశ్వర్, అతని కుటుంబ సభ్యులు ఆరుగురిపై రెండుసార్లు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. అసలైన కారణం మాత్రం 2024 ఎన్నికల్లో వైఎస్సార్ సీపీకి సానుభూతిపరులుగా వ్యవహరించడమే. 2023లో అప్పటి రెస్కో చైర్మన్ సెంథిల్ కుమార్ మాజీ సీఎం చంద్రబాబుపై అనుచితంగా మాట్లాడారంటూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కేసు పెట్టారు. ఆపై ఆయన్ను అరెస్టు చేసి 15 రోజులు జైల్లో ఉంచారు. పచ్చ మూకల గూండాయిజానికి భయపడి బెయిల్‌పై వచ్చిన సెంథిల్‌కుమార్ గత 27 నెలలుగా ఊరు వదిలి, అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. 2024లో వైఎస్సార్ సీపీ తరఫున ప్రచారం చేసినందుకు గాను కుప్పం మండలం మల్లానూరుకు చెందిన పార్టీ కార్యకర్తలు మురుగేష్, అతని కుమారుడు శీనుపై ట్రాక్టర్ చోరీ చేశారంటూ తప్పుడు కేసు పెట్టారు. ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వ రీచ్ నుంచి ఇసుక తెచ్చుకున్న పాపానికి శాంతిపురం మండలం నాయనపల్లెకు చెందిన కృష్ణమూర్తిపై ఇసుకను కర్ణాటకకు స్మగ్లింగ్ చేస్తున్నాడంటూ కేసు పెట్టారు. ఇక సూపర్ సిక్స్ హామీలు అమలు చేయలేదని ప్రశ్నించినందుకు శాంతిపురం మండలం కొలమడుగు పంచాయతీ రామాపురానికి చెందిన వైఎస్సార్ సీపీ సానుభూతిపరులైన ఇద్దరు మహిళలపై అక్రమ కేసు పెట్టారు. మీడియాపై కేసుల కత్తి గత ఏడాది కుప్పంలో ఓ వ్యక్తి చనిపోతే అంత్యక్రియలు నిర్వహించడానికి కొందరు దారి ఇవ్వలేదు. స్థానిక డీఎస్పీ కల్పించుకుని దారి కల్పించి, అంత్యక్రియలు పూర్తి చేయించారు. ఇదే విషయం సాక్షి దినపత్రికలో ప్రచురితమైంది. సీఎం ఇలాఖాలోని పరిస్థితులు చూపించినందుకు సాక్షి రూరల్ రిపోర్టర్‌పై కేసు పెట్టారు. ఊర్లో చవితి జాతర నిర్వహణ గురించి మాట్లాడుతున్న సమయంలో తమపై దాడికి ప్రయత్నించారని కుప్పం సాక్షి రిపోర్టర్‌పై కేసు నమోదు చేశారు. దగా డీఎస్సీలో తప్పుడు సర్టిఫికెట్లతో ఉద్యోగం పొందిన వ్యక్తి వివరాలు సేకరించడానికి వెళ్లిన సాక్షి టీవీ రిపోర్టర్, కెమెరామెన్‌ను కులం పేరిట దూషించిన నకిలీ ఉపాధ్యాయుడిని వదిలేసి సాక్షి టీవీ ప్రతినిధులపై క్రిమినల్ కేసు పెట్టారు. వైఎస్సార్సీపీ నేతలపై ఎదురు కేసు తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్ సీపీ కార్యకర్తల రక్తం కళ్ల చూడడానికి టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. దానికి కూడా తమ కార్యకర్తలు సిద్ధపడి, రక్తాభిషేకం చేయడానికై నా ముందుండాలని మాట్లాడినందుకు శాసన మండలి సభ్యు డు భరత్‌పై కేసు పెట్టారు. ఇదే భరత్‌ను చంపడానికి టీడీపీ మూకలు మారణాయుధాలతో ఇంటిపైకి వెళి తే మాత్రం కేసు లేదు. ఇక చిత్తూరు జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు ఓ సమావేశానికి హాజరై వస్తుండగా ఆయ న్ను చంపడానికి టీడీపీ మూకలు దాడులు చేశాయి. వాళ్ల నుంచి తప్పించుకుని ప్రాణాలను అర చేతిలో పెట్టుకుని చిత్తూరుకు వచ్చి ఏఎస్పీకి ఫిర్యాదు చేశారు. వెనువెంటనే కుప్పం టీడీపీ నాయకులు శాంతిపురం పోలీస్ స్టేషన్‌కి వెళ్లి జెడ్పీ శ్రీనివాసులు తమపై కారు ఎక్కించి చంపేందుకు ప్రయత్నించినట్టు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారించమని ఎస్పీ పోలీసులను ఆదేశించారు. కుప్పంలో వైఎస్సార్ సీపీ నేతలపై నమోదైన ప్రతి ఒక్క కేసులోనూ ఫిర్యాదుదారులు టీడీపీ కార్యకర్తలు, నేతలే. ఫిర్యాదులపై కనీస విచారణ చేయని పోలీసుశాఖ, పచ్చ మూకలు చేసిన చట్టాన్ని అమలుచేస్తూ బాబు పాలనకు సెల్యూట్ కొడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
ఫిట్నెస్ పేరిట దోపిడీ!
కాణిపాకం/బంగారుపాళ్యం: వాహనాల ఫిట్నెస్ ప్రక్రియలో పారదర్శకత పెంచాలని, మానవ ప్రమేయం తగ్గించి వేగవంతమైన సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఆటోమేటిక్ ఫిట్నెస్ సెంటర్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. బంగారుపాళ్యంలో ఉన్న ఏటీఎఫ్ కేంద్రం అక్రమ సంపాదనకు, దళారుల దాహానికి నిలువెత్తు నిదర్శనంగా మారింది. చిత్తూరు రవాణా శాఖ కార్యాలయం వద్ద ఏళ్ల తరబడి పాతుకుపోయిన ఏజెంట్లే ఇప్పుడు ఇక్కడికి తమ డేరా మార్చారు. ఇక్కడి సిబ్బందితో చేతులు కలిపి బహిరంగంగా దందా చేస్తున్నారు. గ్రీన్‌సిగ్నల్ వస్తేనే ఫైలు ముందుకు ఏజెంట్లను ఆశ్రయించకుండా నేరుగా అధికారిక పద్ధతిలో ఫిట్నెస్ సర్టిఫికెట్ పొందుదామని వచ్చే వాహనదారులకు అక్కడ చుక్కలు కనిపిస్తున్నాయి. అక్రమ దందాకు తలొగ్గని వారిని టార్గెట్ చేస్తూ చిన్న చిన్న సాంకేతిక సాకులు చూపి దరఖాస్తులను తిరస్కరించడం ఇక్కడ నిత్యకృత్యమైందని పలువురు వాహనదారులు వాపోతున్నారు. కొన్ని సందర్భాల్లో యజమానులను వారాల తరబడి తిప్పుకుంటూ నరకం చూపిస్తున్నారని ఆగ్రహానికి గురవుతున్నారు. ఏజెంట్ల వద్ద కొలతలు పూర్తయి, వారి ముద్ర లేదా ముందస్తు సంతకం ఉన్న ఫైళ్లు మాత్రం క్షణాల్లో ఆమోదం పొందుతున్నాయని ఆరోపిస్తున్నారు. ఆటోమేటిక్ ఫిట్నెస్ సెంటర్ ప్రైవేట్ భాగస్వామ్యంతో నడుస్తుండడంతో మాకు ఈ కేంద్రాలపై నేరుగా తనిఖీలు చేసే లేదా చర్యలు తీసుకునే నిబంధనలు లేవనేది ఆ శాఖ అధికారుల వాదన. ఇప్పటికై నా బంగారుపాళ్యం కేంద్రం వద్ద జరుగుతున్న దోపిడీపై రవాణా శాఖ ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్ తక్షణమే దృష్టి సారించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే కొందరు అధికారులు ఆ సెంటర్‌పై వచ్చిన ఫిర్యాదులపై విచారణ చేపడుతున్నట్లు తెలిసింది. రోజుకు 2,000 పైగా వాహనాలు.. అడ్డగోలు వసూళ్లు ఇక్కడికి ప్రతిరోజూ జిల్లా నలుమూలల నుంచి సుమారు 2 వేలకు పైగా వాహనాలు ఫిట్నెస్ పరీక్షల కోసం వస్తుంటాయి. ఈ రద్దీని ఏజెంట్లు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. వాహనా న్ని బట్టి రేటు ఫిక్స్ చేశారు. ఆటోలు, చిన్న రవాణా వాహనాల నుంచి రూ.2 వేలు, హెవీ వాహనాలకు రూ.30 వేల వరకు డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. పైసలు పూజిస్తే తప్ప సర్టిఫికెట్ మంజూరు కావడం లేదని యజమానులు లబోదిబోమంటున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. -
నిబంధనల సంకెళ్లు!
జీవచ్చవాల్లా బతుకులీడుస్తున్న నిస్సహాయులకు భరోసా ఇవ్వాల్సిన ప్రభుత్వ పింఛను కఠిన నిబంధనల ఉచ్చులో చిక్కుకుపోయింది. కొత్త పింఛన్ల మంజూరు కోసం ఎదురుచూస్తున్న దివ్యాంగులకు సంక్షేమ ఫలాలు దక్కకపోగా, నిబంధనల పేరుతో అధికారులు పెడుతున్న కొర్రీలు వారి ఆశలను నిలువునా తుంచేస్తున్నాయి. సదరం సర్టిఫికెట్ల పునఃపరిశీలన, అర్హత శాతం పెంపు, సాంకేతిక సమస్యల నెపంతో కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఫలితం దక్కడం లేదు. ఆసరాగా నిలవాల్సిన చేతులే అడ్డంకులు సృష్టిస్తుండడంతో కనీస జీవనాధారం కోసం నిస్సహాయులు కన్నీటి పర్యంతమవున్నారు. పాలకుల నిర్లక్ష్యం, అధికారుల ఉదాసీనత వారి జీవితాల్లో చీకట్లు నింపుతున్నాయి. కొత్త పింఛన్ల నమోదులో దివ్యాంగులు ఎదుర్కొంటున్న అవస్థలపై సాక్షి కథనం. చిత్తూరు కలెక్టరేట్ : శారీరక వైకల్యంతో బాధపడుతూ, పనులు చేయలేక ప్రభుత్వం ఇచ్చే ఆసరా కోసం ఎదురుచూస్తున్న దివ్యాంగులకు నూతన పింఛన్ దరఖాస్తు ప్రక్రియ శాపంలా మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొత్తగా పింఛన్ల నమోదుకు శ్రీకారం చుట్టినప్పటికీ, క్షేత్రస్థాయిలో విధిస్తున్న నిబంధనలు, సాంకేతిక సాకులు దివ్యాంగులను తీవ్ర వేదనకు గురిచేస్తున్నాయి. అందజేస్తున్న డాక్యుమెంట్లు సరిపోలడంలేదంటూ అధికారులు దరఖాస్తులను తిరస్కరిస్తున్నారు. దీంతో జిల్లాలో వేలాది మంది దివ్యాంగుల ఆశలు అడియాసలవుతున్నాయి. దివ్యాంగులు క్షేత్రస్థాయిలో ఎదుర్కొంటున్న సమస్యలను వికలాంగుల ఐక్య కార్యాచరణ రాష్ట్ర అధ్యక్షుడు కొణతం చంద్రశేఖర్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అడుగడుగునా నిబంధనలు కూటమి ప్రభుత్వం పింఛన్ లబ్ధిదారుల సంఖ్యను పెంచకుండా, దరఖాస్తు దశలోనే అడ్డుకట్ట వేసేందుకే కఠిన నిబంధనలు తీసుకొచ్చిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సదరం క్యాంపుల్లో తీవ్ర శ్రమకోర్చి తీసుకున్న వైకల్య ధ్రువీకరణ పత్రాలు ఉన్నప్పటికీ, పోర్టల్‌లో డేటా మ్యాచ్ కావడం లేదంటూ తిరస్కరించడంపై దివ్యాంగులు మండిపడుతున్నారు. దరఖాస్తుల తిరస్కరణతో తీవ్ర నిరాశా నిస్పృహలకు లోనవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా వేలాది మందికి తిప్పలు జిల్లాలోని కుప్పం, పలమనేరు, జీడీనెల్లూరు, పూతలపట్టు, నగరి, చిత్తూరు నియోజకవర్గాల్లో వేలాది మంది దివ్యాంగులు కొత్త పింఛన్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు అల్లాడిపోతున్నారు. సచివాలయ సిబ్బంది, ఆర్ఐలు, తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరిగినా సరైన సమాధానం చెప్పేవారు కరువయ్యారు. శారీరక వైకల్యంతో పాటు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న తమను ఇబ్బంది పెట్ట డం సబబు కాదని ఆవేదన చెందుతున్నారు. ప్రభు త్వం స్పందించి నిబంధనలను సడలించి, వైకల్యం కలిగిన ప్రతి ఒక్కరికీ సులభతరంగా పింఛన్ మంజూరు చేయాలని జిల్లాలోని దివ్యాంగ సంఘాలు ప్రతినిధులు, బాధితులు డిమాండ్ చేస్తున్నారు. జిల్లా సమాచారం దివ్యాంగుల పింఛనుపై కూటమి దెబ్బ! మొత్తం పల్లెలు 5,228 రెవెన్యూ గ్రామాలు 822 పంచాయతీలు 697 కార్పొరేషన్, మున్సిపాలిటీలు 05 మొత్తం జనాభా 18.73 లక్షలు ప్రస్తుతం అందుతున్న దివ్యాంగ పింఛన్లు 34,796 కొత్తగా అర్హత ఉన్న దివ్యాంగులు 5,145 -
స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యం కావాలి
కార్వేటినగరం : స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి పిలుపునిచ్చారు. ఆయన గురువారం మాజీ ఉప ముఖ్యమంత్రి కళత్తూరు నారాయణస్వామి, జీడీనెల్లూరు నియోజకవర్గ సమన్వయకర్త కృపాలక్ష్మి, నియోజకవర్గం పరిశీలకులు వల్లివేడు పృథ్వీరెడ్డితో కలిసి పుత్తూరు వైఎస్సార్ సీపీ కార్యాలయంలో నాయకులకు గుర్తింపు కార్డులు అందజేశారు. ఆయన మాట్లాడుతూ అధికార గర్వంతో రాష్ట్రంలో అక్రమాలు, అరాచకాలకు పాల్పడుతున్న కూటమి ప్రభుత్వంపై కలిసికట్టుగా పోరాటం చేసి జీడీనెల్లూరు నియోజకవర్గంలో ప్రతి గ్రామ పంచాయతీ కార్యాలయాలపై వైఎస్సార్ సీపీ పార్టీ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. కరువుకు మానస పుత్రుడు చంద్రబాబు అని, కరువు, చంద్రబాబు కవల పిల్లలని ఎద్దేవా చేశారు. 1993 నుంచి 2004 వరకు ఉమ్మడి రాష్ట్రాల్లో 1400 మండలాలు ఉండగా అందులో 1200 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించిన వ్యక్తి చంద్రబాబు అని, అలాగే చిత్తూరు–తిరుపతి ఉమ్మ డి జిల్లాలో 67 మండలాలు ఉండగా బాబు అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ కరువు మండలాలుగా ప్రకటించాడని గుర్తు చేశారు. 2014లోనూ వర్షాలు లేక భూగర్భ జలాలు ఇంకి పోయాయని పేర్కొన్నారు. ఇప్పుడు కూడా చంద్రబాబు ప్రభావంతోనే వర్షాలు కురవడం లేదన్నారు. 120 ఏళ్ల క్రితం డొక్కల కరువు (గంజికరువు) వచ్చిందని, ఇప్పుడు మళ్లీ డొక్కల కరువు వచ్చిందని తెలిపారు. మూడేళ్లపాటు రాష్ట్రం కరువుతో అల్లాడక తప్పదన్నారు. వాతావరణ శాఖ అధికారులు చంద్రబాబు పాలన వల్ల వర్షాలు రావు చెప్పకుండా ఎల్‌నినో ప్రభావం అంటూ ప్రజలను నమ్మిస్తున్నారని ఆరోపించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి, వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో సమృద్ధిగా వర్షాలు కురిశాయని గుర్తు చేశారు. గుర్తింపు కార్డులు పొందిన ప్రతి ఒక్కరూ జగనన్న పాలన కోసం ఒక సైనికుడిలా పోరాటం చేసి వైఎస్సార్ సీపీ అభ్యర్థులను గెలిపించుకోవాలని సూచించారు. అభ్యర్థుల ఎంపికలో ఆ పంచాయతీ వారే కీలకం స్థానిక ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికల్లో ఆయా పంచాయతీ నాయకులే కీలకమని, ఒక పంచాయతీలో మరో పంచాయతీ నాయకులు జోక్యం చేసుకోకూడదని భూమన కరుణాకరరెడ్డి తెలిపారు. ప్రతి కార్యకర్త ఈ ఎన్నికల్లో ఒక సైనికుడిలా పని చేసి ఆ పంచాయతీ కార్యాలయంపై వైఎస్సార్సీపీ జెండా ఎగరవేయడానికి సిద్దం ఉండాలన్నారు. ఆ పంచాయతీ నాయకులు, కార్యకర్తల నిర్ణయమే పార్టీ అధిష్టానం నిర్ణయమని తెలిపారు. పోటీ చేసే అభ్యర్థికి ప్రతి ఒక్కరూ సహకరించాలని పేర్కొన్నారు. సర్పంచుల విజయంతోనే అసెంబ్లీ అభ్యర్థుల విజయాలు స్థానిక ఎన్నికల్లో పోటే చేసే వైఎస్సార్ సీపీ అభ్యర్థుల విజయాలే రానున్న ఎమ్మెల్యే అభ్యర్థుల విజయాలని జీడీనెల్లూరు నియోజకవర్గం సమన్వయకర్త కృపాలక్ష్మి అన్నా రు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అక్రమాలు, అరాచకాలను గ్రామస్థాయిలో ఎండగట్టి మన అభ్యర్థుల విజయానికి కృషి చేయాలన్నారు. ఓటర్లకు వెన్నుదన్నుగా నిలవాలి రాష్ట్రంలోనే వైఎస్సార్ సీపీకి బలమైన నియోజకవర్గం జీడీనెల్లూరు అని, ప్రతి పంచాయతీలోను మన అభ్యర్థి గెలవాలని జీడీనెల్లూరు నియోజకవర్గం పరిశీలకులు వల్లివేడు ఫృథ్వీరెడ్డి పిలుపునిచ్చారు. పార్టీ అండగా ఉంటుందని నాయకులకు భరోసానిచ్చారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు గురవారెడ్డి, మండల కన్వీనర్లు శేఖర్‌రాజు, వెంకటరెడ్డి, మణి, విజయకుమార్‌రెడ్డి, జెడ్పీటీసీ అన్బలగన్, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి చందురాజు, ద్రాక్షాయణి, మాజీ మండల కన్వీనర్ ధనంజయవర్మ, వైస్ ఎంపీపీ కార్తీక్‌రెడ్డి, సింగిల్ విండో మాజీ అధ్యక్షుడు లోకనాథరెడ్డి, ధనశేఖర్‌యాదవ్, మునికృష్ణ, నందగోపాల్, కోలార్ ప్రకాష్, రామయ్య, శివాజీ, సురేంద్రరెడ్డి, వెంకటేష్‌రెడ్డి, కిషోర్‌రెడ్డి, కుప్పయ్య, జనార్ధన్, శ్యామ్, మదివాణన్, రమాదేవి, దూది మోహన్, లోకేష్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, కృష్ణారెడ్డి పాల్గొన్నారు. -
హోరెత్తిన రెడ్ రన్ 5ఓ మారథాన్
చిత్తూరు రూరల్ (కాణిపాకం): ఎయిడ్స్ రహిత సమాజమే లక్ష్యంగా యువతలో అవగాహన కల్పించేందుకు గురువారం చిత్తూరులో నిర్వహించిన 5ఓ రెడ్ రన్ మారథాన్‌కు విశేష స్పందన లభించింది. హెచ్ఐవీపై అవగాహన పెంచుదాం.. వివక్షను తరిమికొడదాం అనే నినాదంతో యువతీ యువకులు ఉత్సాహంగా పరుగులు తీస్తూ ప్రజల్లోకి బలమైన సందేశాన్ని తీసుకెళ్లారు. ఈ కార్యక్రమానికి చుడా చైర్పర్సన్ కటారి హేమలత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి నాగ శశిభూషణ్ రెడ్డి, జి.వెంకటప్రసాద్, అనీల్ కుమార్, మెడికల్ ఆఫీసర్ ఫయాజ్, దిశా సిబ్బంది, ప్రతినిధులు, ఉపాధ్యాయులు, పెద్ద సంఖ్యలో యువత పాల్గొన్నారు. ఈ పోటీల్లో పురుషుల విభాగంలో భరణి ప్రథమ స్థానంలో నిలిచి రూ.10 వేల బహుమతి గెలుచుకోగా, కిషోర్, మురుగేష్ ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచి రూ.7 వేలు, రూ.3 వేలు అందుకున్నారు. అలాగే పృథ్వి నాలుగో స్థానం సాధించి రూ.1,500 అందుకున్నారు. మహిళల విభాగంలో యువశ్రీ ప్రథమ స్థానాన్ని కై వసం చేసుకుని రూ.10 వేలు గెలుచుకోగా, ద్వితీయ, తృతీయ స్థానాల్లో గుణశ్రీ, ఎ.అనుష్క నిలిచి వరుసగా రూ.7 వేలు, రూ.3 వేలు అందుకున్నారు. నాలుగో స్థానంలో సుశీల నిలిచి రూ.1,500 పొందారు. 3, 4 స్థానాల్లో నిలిచిన అభ్యర్థుల బహుమతుల నిమిత్తం కటారి హేమలత తన వంతుగా రూ.7,000, జిల్లా క్షయ నివారణ అధికారి జి.వెంకట ప్రసాద్ వ్యక్తిగతంగా రూ.2,000 ఆర్థిక సహాయం అందించారు. -
కంట్రోల్ రూమ్ పరిశీలన
చిత్తూరు కార్పొరేషన్ : స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా జెడ్పీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన కంట్రోల్ రూమ్‌ను గురువారం సీఈఓ రవికుమార్‌నాయుడు పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఆయన మాట్లాడుతూ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, ఓటర్ల జాబితా పరిశీలన ప్రక్రియను ఎలాంటి లోపాలు లేకుండా నిర్వహించాలని సూచించారు. మండలాల వారిగా ఎంపీటీసీ, జెడ్పీటీసీల ఓటర్ల జాబితాను సిద్ధంగా ఉంచుకోవాలని పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాల ఎంపిక, ఓటర్ల సంఖ్య, ముసాయిదా జాబితా ప్రచురణ, తుది జాబితా విడుదల తదితర అంశాల గురించి చర్చించారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో సగటున 1000 మంది ఓటర్లు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. 1050 మంది ఓటర్లు ఉన్న కేంద్రాలకు మినహాయింపు ఉన్నప్పటికీ 1200 మందికి పైగా ఓటర్లు ఉంటే తప్పనిసరిగా కేంద్రాన్ని విభజించాలని తెలిపారు. పోలింగ్ కేంద్రాలు ప్రజలు అందుబాటులో ఉండే ప్రాంతాలను ఎంచుకోవాలన్నారు. ఆస్పత్రుల్లో కేంద్రాలను ఏర్పాటు చేయరాదని తెలిపారు. ఈ నెల 14వ తేదీలోపు పోలింగ్ కేంద్రాలపై నివేదికను పూర్తి చేసి, తదుపరి ఓటర్ల జాబితాను ప్రచురించే చర్యలు తీసుకోవాలని తెలిపారు. శుక్రవారం అన్ని ఎంపీడీవో కార్యాలయాల్లో ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురించాలన్నారు. ఓటర్ల సందేహాలను నివృత్తి చేయడానికి ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రత్యేకంగా సిబ్బంది పెట్టాలన్నారు. -
సచివాలయాల చుట్టూ తిరుగుతున్నా..
గత ప్రభుత్వ హయాంలో ఇంటి వద్దకే వచ్చి సదరం సర్టిఫికెట్లు సహా దరఖాస్తులను నేరుగా నమోదు చేసుకునే వెసులుబాటు ఉండేది. ప్రస్తుత కూటమి పాలనలో దరఖాస్తు చేసుకోవడమే ఒక ప్రహసనంగా మారింది. మంచానికే పరిమితమైన, సరిగ్గా నడవలేని దివ్యాంగులు సైతం ప్రతిరోజూ గ్రామ, వార్డు సచివాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సి వస్తోంది. వచ్చిన ప్రతిసారీ సదరం సర్టిఫికెట్ వ్యాలిడిటీ లేదని, ఆధార్ లింక్ కాలేదని, ఆదాయ పరిమితి దాటిందని, కుటుంబ వివరాల్లో తేడాలున్నాయని రకరకాల సాకులు చెబుతూ సిబ్బంది పింఛన్ దరఖాస్తులను తిరస్కరిస్తున్నారు. -
మధ్యాహ్నం భోజనం ఇంత అధ్వానమా?
పలమనేరు: ‘మధ్యాహ్నం భోజనాన్ని మరీ ఇంత అధ్వానంగా తయారు చేస్తారా? కుళ్లిన కోడిగుడ్లు పిల్లలకు ఎలా పెడుతున్నారు?’ అని జిల్లా విద్యాశాఖాధికారి(డీఈవో), మండల విద్యాశాఖాధికారులు(ఎంఈవోల)పై ఫుడ్ కమిషన్ సభ్యుడు జక్కంపూడి కృష్ణకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా పలమనేరులోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలను గురువారం ఆయన తనిఖీ చేశారు. మధ్యాహ్నం భోజనంలోని వెజిటబుల్ రైస్‌ని రుచి చూసి.. అసంతృప్తి వక్త్తం చేశారు. భోజనం గురించి విద్యార్థులను ఆరా తీశారు. తమకు కుళ్లిన కోడిగుడ్లను పెడుతున్నారని.. వంటలు రుచిగా లేవంటూ విద్యార్థులు వాపోయారు. తాగేందుకు కూడా మంచి నీళ్లు లేవని.. ట్యాంకులో ఉన్న పాచిపట్టిన నీటిలో పురుగులున్నాయని.. వాటినే తాగుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఆయన నీళ్ల ట్యాంకును పరిశీలించి.. ప్రధానోపాధ్యాయుడు షంషీర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలు తినకుండా పడేసిన భోజనాన్ని డీఈవో లక్ష్మీనారాయణ, ఎంఈవోలు లీలాకుమారి, సుజాతకు చూపించి.. వారిని నిలదీశారు. రిజిస్టర్ ప్రకారం స్టోర్ రూమ్‌లో 2,795 గుడ్లు తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. అలాగే పాడైన గుడ్లు ఉండడాన్ని గుర్తించిన ఆయన.. కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరతామని చెప్పారు. ఇంత నిర్లక్ష్యంగా మధ్యాహ్నం భోజనం వండుతున్న నిర్వాహకులను తొలగించాలని డీఈవోను ఆదేశించారు. -
చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం
సాక్షి,చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. గుడిపాల మండలం మందికృష్ణాపురంలో విషాదం చోటు చేసుకుంది నిర్మాణంలో ఉన్న చర్చి కూలి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని స్థానికులు, అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని వైఎస్సార్సీపీ చిత్తూరు నియోజకవర్గం ఇంఛార్జి విజయానంద రెడ్డి పరిశీలించారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలను ఆయన పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. -
ప్రీమియంతో రూ.కోట్లు
రూ.99 మద్యం బాటిళ్లను పూర్తిగా పక్కన పెట్టేసిన సర్కారు పేదల కష్టార్జితాన్ని దోచేయడానికి ప్రీమియం బ్రాండ్లను అలవాటు చేసింది. రూ.99 తరువాత దుకాణాల్లో రూ.వంద పైన పెరిగే రూ.200, రూ.210, రూ.240, రూ.260, రూ.300 ఎమ్మార్పీ ఉన్న మీడియం, ప్రీమియం బ్రాండ్లను ఉంచింది. దీంతో మద్యం ప్రియులు తప్పనిసరిగా వాటినే కొనుగోలు చేయాల్సిన పరిస్థితిని కల్పించింది. గత నెల జిల్లాలో 25,671 బాక్సుల రూ.99 మద్యాన్ని మాత్రమే 113 దుకాణాలకు సరఫరా చేసింది. వాస్తవానికి జిల్లాలో ఒక్క రోజు డిమాండే 20 వేల బాక్సుల రూ.99 మద్యం అవసరం ఉంది. -
కారు డ్రైవర్‌కు జైలు, జరిమానా
చిత్తూరు రూరల్ (కాణిపాకం): ఓ వ్యక్తి మృతికి కారణమైన రోడ్డు ప్రమాదం కేసులో కారు డ్రైవర్‌కు ఏడాది జైలు, రూ.13 వేలు జరిమానా విధిస్తూ చిత్తూరులోని మూడవ అదనపు జిల్లా న్యాయస్థానం బుధవారం తీర్పునిచ్చింది. వివరాలు.. చిత్తూరులోని చైన్నె–బెంగళూరు జాతీయ రహదారిపై ఓ ఆటో ప్రయాణికులతో వెళ్తుండగా ఎదురుగా మితిమీరిన వేగంతో వచ్చిన కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న రఘు అనే వ్యక్తి మృతి చెందాడు. పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. ఈ సంఘటన 2023 నవంబర్ 3న చోటుచేసుకుంది. కారు నడుపుతున్న బెంగళూరువాసి సుబ్రహ్మణ్యం రావుపై అప్పట్లో ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేశారు. నేరం రుజువు కావడంతో జడ్జి పైవిధంగా తీర్పునిచ్చారు. -
ఎమ్మెల్సీ భరత్‌పై కేసు
కుప్పం: చిత్తూరు ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ కుప్పం నియోజకవర్గ సమన్వయకర్త భరత్‌పై కుప్పం పోలీస్ స్టేషన్లో బుధవారం కేసు నమోదు చేశారు. కుప్పంలోని ఎమ్మెల్సీ క్యాంపు కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమావేశంలో ఎమ్మెల్సీ భరత్ ప్రసంగంలో అభ్యంతకరమైనా వాఖ్యలు, కుప్పం ప్రజలను భయపెట్టే విధంగా ఉన్నాయని టీడీపీ పట్టణ అధ్యక్షుడు తంబిగానిపల్లి వెంకటేష్ ఫిర్యాదు మేరకు కుప్పం పోలీసులు కేసు నమోదు చేశారు. బీఎన్ఎస్ చట్టం ప్రకారం 192,353(1)(బి), 351(2) సెక్షన్ల కింద ఆయనపై కుప్పం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. జాతీయ పోషణ మాసోత్సవాలు ప్రారంభం చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో బుధవారం నుంచి అక్టోబర్ 8 వరకు జాతీయ పోషణ మాసోత్సవాలు నిర్వహిస్తున్నట్టు జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ తెలిపారు. ఆయన పోస్టర్ ఆవిష్కరించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో తల్లి, శిశు సంరక్షణ, చిన్నారుల ఎదుగుదల, పోషకాహార లోపం నివారణపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమాల సమర్థవంతమైన నిర్వహణకు ఈ నెల 10వ తేదీన వివిధ శాఖల అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఇన్చార్జి ఐసీడీఎస్ పీడీ శ్యామసుగుణ, జిల్లా మిషన్ కోఆర్డినేటర్ నిర్మల, పోషణ్ అభియాన్ సిబ్బంది పాల్గొన్నారు. లారీ ఢీకొని వ్యక్తి మృతి శాంతిపురం: కుప్పం–పలమనేరు జాతీయ రహదారిలో నాయనపల్లి వద్ద బుధవారం బైకును లారీ ఢీకొనడంతో వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల కథనం మేరకు.. మఠం పంచాయతీలోని కేపి మిట్ట గ్రామానికి చెందిన రహమాన్(35) బుధవారం సాయంత్రం రాజుపేట రోడ్డు నుంచి బైక్‌లో స్వగ్రామానికి బయలుదేరాడు. మార్గమధ్యంలో నాయనపల్లి వద్ద కుప్పం వైపు నుంచి వచ్చిన లారీ బైక్‌ను ఢీకొంది. తీవ్రంగా గాయపడిన రహమాన్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న రాళ్లబూదుగూరు పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి ప్రమాదానికి కారణమైన లారీని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. గుర్తుతెలియని వ్యక్తి మృతి చిత్తూరు కార్పొరేషన్: గుడిపాల మండలం బొమ్మసముద్రం రైల్వేస్టేషన్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి రైలులో ప్రయాణిస్తూ ప్రమాదవశాత్తు జారిపడి మంగళవారం మృతిచెందాడు. రైల్వే ఎస్ఐ నరసింహులు బుధవారం విలేకరులతో మాట్లాడుతూ గుర్తుతెలియని వ్యక్తి రైలులో ప్రయాణిస్తూ కాలు జారి దూరంగా పడి మరణించాడన్నారు. ఈ విషయాన్ని ఎవరూ గుర్తించలేదని పేర్కొన్నారు. తదుపరి దుర్గంధం వస్తుండడంతో గ్యాంగ్‌మెన్ ద్వారా సమాచారం తెలిసిందన్నారు. ఈ మేరకు సీఐ యత్రీంద సమక్షంలో క్లూస్ టీమ్‌తో కలిసి సంఘటన స్థలం వద్దకు వెళ్లి పరిశీలించామన్నారు. ప్రమాదవశాత్తు జారిపడి మరణించినట్లు నిర్ధారణకు వచ్చామన్నారు. మృతుడు బూడిద రంగు నెక్ టీషర్ట్, నలుపు రంగు ప్యాంట్ ధరించి ఉన్నాడని పేర్కొన్నారు. వివరాలు తెలిసిన వారు 9247575619 నంబరులో సంప్రదించాలన్నారు. లారీని ఢీకొన్న బస్సు – తప్పిన ప్రమాదం వడమాలపేట (పుత్తూరు): వడమాలపేట రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద బుధవారం ఆర్టీసీ బస్సు, సిమెంట్ మిక్సర్ లారీ ఢీకొన్నాయి. తిరుపతి నుంచి వడమాలపేటకు వస్తున్న లారీని పుత్తూరు నుంచి తిరుపతికి వెళ్తున్న బస్సు ఢీకొంది. లారీ డ్రైవర్ అప్రమత్తంగా లారీని మరోవైపునకు తిప్పడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ అమెండోరాయ్, బస్సులో ప్రయాణిస్తున్న వారిలో ఒకరైన మహేష్ అనే వ్యక్తికి మాత్రం గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం తిరుపతి రుయాకు తరలించారు. ఎస్ఐ హరీష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
స్థానికంలో పోటీకి సిద్ధం
నగరి/చిత్తూరు కార్పొరేషన్/పలమనేరు : స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేయడానికి వైఎస్సార్ సీపీ సిద్ధంగా ఉందని ఆ పార్టీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి తెలిపారు. నగరి, చిత్తూరు, పలమనేరులోని పార్టీ కార్యాలయాల్లో బుధవారం పార్టీ నమన్వయకర్తలు ఆర్కే రోజా, విజయానందరెడ్డి, వెంకటేగౌడ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తల సమావేశమయ్యారు. పార్టీ అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డి సంతకంతో కూడిన గుర్తింపు కార్డులు అందజేశారు. ఆయన మాట్లాడుతూ నాయకుల మధ్య ఉన్న మనస్పర్థలను పక్కన పెట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపుకోసం కృషి చేయాలన్నారు. అరాచకాలు సృష్టించి ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని బాబు కుట్రలు పన్నుతున్నారని, వాటిని ధీటుగా ఎదుక్కోవాలని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో గెలిచి వైఎస్సార్ సీపీ జెండాను వాడవాడలా ఎగురవేయాలన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ నాయకులు బయటకు రావడానికి మూడేళ్లు పట్టిందన్నారు. అదే తమ పార్టీ మూడు రోజుల్లో బయటికి వచ్చి ప్రజల తరఫున పోరాటాలు చేస్తోందని గుర్తు చేశారు. వైఎస్సార్ సీపీ గుర్తింపు కార్డు జేబులో ఉంటే జగనన్న గుండెల్లో ఉన్నట్టేనని తెలిపారు. ఆ కార్డు ప్రతి సభ్యునికీ ఒక శ్వాస, నమ్మకం, విశ్వాసం, ధైర్యంలా, పోరాట స్ఫూర్తినిచ్చే క జ్వాలలాగా ఉంటుందని తెలిపారు. కేవలం కార్డు కాదని ప్రత్యర్థుల నీచ ధోరణికి వ్యతిరేకంగా ఇచ్చిన ఆయుధమన్నారు. జగనన్న బాటలో నడవాలి చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి మాట్లాడుతూ జగనన్న, కరుణాకరన్న సూచించినట్లు నాయకులు నడుచుకోవాలన్నారు. ఎన్నికల్లో గెలుపే ప్రధాన అజెండాగా భావించి పార్టీ క్యాడర్ మొత్తం శక్తివంచన లేకుండా పనిచేయాలన్నారు. నగరిలో జరిగిన కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర పరిశీలకులు రాహుల్రాజారెడ్డి, నగరి, పుత్తూరు మున్సిపల్ మాజీ చైర్మన్లు నీలమేఘం, హరి, మాజీ వైస్ చైర్మన్లు జయప్రకాష్, వెంకటరత్నం, పుత్తూరు మండల ఎంపీపీ మునివేలు, నగరి, పుత్తూరు మున్సిపల్ పార్టీ అధ్యక్షులు రమేష్‌రెడ్డి, ఏకాంబరం, రాష్ట్రకమిటీ నాయకులు కాయం గాంధీ, రవీంద్ర, గుణశేఖర్, శేఖర్‌రాజు, శ్యామ్‌లాల్, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. అలాగే చిత్తూరులో కార్యక్రమంలో చిత్తూరు నియోజకవర్గ పరిశీలకులు రెడ్డెప్ప, నాయకులు జ్ఞానజగదీష్, రాహుల్‌రెడ్డి, విజయసింహారెడ్డి, కెపి శ్రీధర్, ప్రకాష్, జయపాల్, హరిణిరెడ్డి, త్యాగ, అమర్నాథరెడ్డి, రజనీకాంత్, ప్రసాద్ రెడ్డి, అప్పొజీ, రమణ, చక్రి మురళీ, భాగ్యలక్ష్మి, ఆను, మధురెడ్డి, మధుసూదన్, టిమ్ము, నారాయణ, మనోజ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పలమనేరులో జరిగిన కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, రాష్ట్ర, జిల్లా కార్యదర్శులు, నియోజకవర్గ పరిశీలకులు వెంకటరెడ్డి యాదవ్, మండల కన్వీనర్లు, ప్రజాప్రతినిధులు, మాజీ సర్పంచులు, పార్టీ అనుభంద విభాగాలు, నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు జెడ్పీ చైర్మన్‌పై దాడి అమానుషం జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులుపై శాంతిపురంలో టీడీపీ మూకలు దాడికి యత్నించడం అమానుషమని భూమన కరుణాకరరెడ్డి ధ్వజమెత్తారు. దాడి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో కారులో వెళుతుండగా టీడీపీ కార్యకర్తను కిడ్నాప్ చేశారని ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో రాయడం సిగ్గుచేటన్నారు. ఆ రెండు పత్రికలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాయని దుయ్యబట్టారు. ఎంపీటీసీ వెంకటరమణారెడ్డిపై దాడి చేసి కారు అద్దాలు పగులగొడితే టీడీపీ నాయకులను కిడ్నాప్ చేశారని జెడ్పీ చైర్మన్‌పై కేసు పెట్టడం పాశవికమన్నారు. కుప్పంలో ఎమ్మెల్సీ భరత్ మాట్లాడింది రక్తం చిందించైనా ఎన్నికల్లో గెలుద్దామని చెప్పారని, దాన్ని టీడీపీవారి రక్తం చిందిస్తామని పచ్చపత్రికలు రాయడం పద్ధతికాదన్నారు. జరిగిన తప్పుపై టీడీపీ క్షమాపణ చెప్పాల్సిందిపోయి వైఎస్సార్ సీపీ నేతలపై కేసులు పెట్టడం చాలా దారుణమన్నారు. యుద్ధానికి ముందు బలి ఇచ్చిన చందాన మేం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలను ఇలాగే భయపెట్టి చేస్తామని ట్రయల్ చూపినట్టుగా కుప్పం సంఘటన కనిపిస్తోందన్నారు. హింస మీదైతే అహింస తమదని, దాడులు మీవైతే వాటిని ఎదుర్కోవడం తమదని తెలిపారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని కూటమి ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందన్నారు. మోసం తెలియని వ్యక్తి రోజమ్మ మోసం తెలియని, ప్రజలకు మేలు చేయాలన్న తపన ఉన్న వ్యక్తి రోజా అని భూమన కరుణాకరరెడ్డి తెలిపారు. రోజమ్మకు ఎంత బలాన్ని కూరుస్తున్నారో స్థానిక సంస్థల ఎన్నికలు చెబుతాయన్నారు. అందరూ సైనికుల్లా పనిచేసి పార్టీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు.ఏం చేశారని జనం కూటమికి ఓట్లేస్తారు కూటమి పార్టీ నేతలు రెండున్నరేళ్లలో ఏం చేశారని ప్రజలు వారికి స్థానిక ఎన్నికల్లో ఓట్లేస్తారని మాజీ మంత్రి ఆర్కేరోజా అన్నారు. చంద్రబాబు ఎప్పుడొచ్చినా మోసమే చేస్తారు. ఆయన జీవితంలో మారరన్న విషయం ప్రజలకు బోధపడిందన్నారు. లోకల్ బాడీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు జనం సిద్దంగా ఉన్నారని, అందుకే కూటమి నేతలు వైఎస్సార్ సీపీ నేతలను బెదిరించి, కేసులు పెట్టి లొంగదీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. -
చేపల వలలో చిక్కుకుని వ్యక్తి మృతి
గంగవరం: కుంటలో చేపలు పట్టేందుకు వెళ్లిన వ్యక్తి వలకు చిక్కుకుని మృతి చెందిన ఘటన మండలంలో బుధవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. మండలంలోని కొత్తపల్లి పంచాయతీ పాత కీలపట్లకు చెందిన సురేష్ బాబు(47) కూలి పనులు చేసుకుని జీవిస్తున్నాడు. గ్రామానికి ఆనుకుని ఉన్న కేతనకుంటలో చేపలు పట్టేందుకు వల తీసుకుని వెళ్లాడు. కుంటలో వలకు చిక్కుకుని ప్రమాదవశాత్తు నీట మునిగిపోయాడు. ఆ వ్యక్తి ఎంత సేపటికీ తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు కుంట వద్దకు వెళ్లి పరిశీలించగా మృతి చెందినట్లు గుర్తించారు. మృతదేహాన్ని కుంట నుంచి వెలికితీసి గ్రామానికి తరలించారు. ఈ ఘటనపై పోలీస్ స్టేషన్లో ఎలాంటి ఫిర్యాదు అందలేదు. -
జిల్లాలో కనిపించని రూ.99 మద్యం బాటిళ్లు
● వాటి స్థానంలో రూ.140, రూ.200 బ్రాండ్ల మద్యం ● మాట తప్పిన సర్కారు.. మద్యం ప్రియులపై భారం ● చాపకింద నీరులా కర్ణాటక మద్యం.. ఊర్లలో ‘నాటు’ సూపర్ సిక్స్ పథకాలంటూ ఊదరగొట్టిన కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలనూ మోసం చేసింది. పథకాలను తూతూమంత్రంగా అమలుచేసి చేతులు దులుపుకుంది. అలాగే మద్యం ప్రియులకు ఇచ్చిన హామీలను సైతం తుంగలో తొక్కేసింది. తాము అధికారంలోకి వస్తే రూ.99కే మద్యం బాటిళ్లను అందుబాటులో ఉంచి, కావాల్సినంత మద్యం ఇస్తామని చెప్పిన సర్కారు తొమ్మిది నెలలుగా దీన్ని పక్కన పెట్టేసింది. ప్రీమియం బ్రాండ్లను తీసుకువచ్చి మద్యం ప్రియులకు బలవంతంగా అంటగడుతోంది. తద్వారా రూ.కోట్లు వసూలు చేస్తూ ఖజనాను నింపుకుంటోంది. సాక్షి, చిత్తూరు: గత ప్రభుత్వం తీసుకువచ్చిన మద్యం పాలసీని కాదని కూటమి ప్రభుత్వం ప్రైవేట్ మద్యం పాలసీని తీసుకువచ్చింది. ప్రభుత్వ మద్యం దుకాణాలను ఎత్తేసి, వాటి స్థానంలో పచ్చ తమ్ముళ్లకు ఉపాధి కల్పిస్తూ ప్రైవేటు మద్యం దుకాణాలను ఏర్పాటుచేసింది. రెండేళ్ల కాలపరిమితితో లైసెన్సులు జారీ చేసింది. ఇక మాట ఇచ్చామని చెబుతూ మధ్య తరగతి మద్యం ప్రియులకు రూ.99లకే మద్యం బాటిల్ అందుబాటులోకి తెచ్చింది. ఈ మద్యాన్ని తెచ్చిన పది రోజుల్లోనే నిబంధనలు వర్తిస్తాయంటూ 20 శాతం స్టాకు మాత్రమే దుకాణాల్లో ఉంచింది. తొమ్మిది నెలలుగా 20 శాతం కాస్త, 5 శాతానికి పడిపోయింది. రూ.99 మద్యం కోసం దుకాణాలకు వెళ్లే మద్యం ప్రియులకు లభించకుండా చేసేశారు. పేరుకు మాత్రం దుకాణాల్లో స్టాకు చూపించడం, రెండు బాక్సుల అమ్మకాలు పూర్తయ్యాక నో స్టాకు బోర్డు పెట్టడం పరిపాటిగా మారిపోయింది. యథేచ్ఛగా కర్ణాటక మద్యం విక్రయాలు మద్యం దుకాణాల్లో రూ.99 మద్యం కనుమరుగు కావడాన్ని కొందరు ఆసరాగా తీసుకున్నారు. నాటు సారా, కర్ణాటక మద్యం విక్రయాలను ప్రారంభించారు. జిల్లాలో ఎక్కడ చూసినా కర్ణాటక మద్యం ఏరులై ప్రవహిస్తోంది. అదేవిధంగా రూ.99 మద్యానికి ప్రత్యామ్నాయంగా రూ.20 పలికే నాటుసారా తయారీ ఊపందుకుంది. గుడిపాల, పాలసముద్రం, రొంపిచెర్ల, పులిచెర్ల, గంగాధరనెల్లూరు, పలమనేరు, కుప్పం, బిఎన్ఆర్.పేట ప్రాంతాల్లో నాటుసారా తయారీ మళ్లీ పుంజుకుంది. ఇక చిత్తూరు జిల్లా కర్ణాటక, తమిళనాడుకు సరిహద్దు కావడంతో పలమనేరు, కుప్పం ప్రాంతాలకు కర్ణాటక మద్యం భారీగా దిగుమతి అవుతోంది. కర్ణాటకలో రూ.73లకే టెట్రా ప్యాకెట్ల మద్యం అక్కడి దుకాణాల్లో అందుబాటు ఉండడంతో, దాన్ని భారీ మొత్తంలో జిల్లాకు తీసుకొస్తున్నారు. ఇక్కడ కర్ణాటక మద్యాన్ని రూ.వందకు విక్రయిస్తూ, అందులో కూడా తమ్ముళ్లే ఉపాధి పొందుతున్నారు. పేదల కష్టార్జితాన్ని కొల్లగొట్టేందుకు ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం రూ.99 మద్యం సరఫరాను ఆపేసి, దాని స్థానంలో నాటుసారా, కర్ణాటక మద్యానికి గేట్లు ఎత్తేసి.. అధికార పార్టీ కార్యకర్తలకు ఉపాధి కల్పిస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీన్ని నిలువరించడంలో ఎకై ్సజ్ శాఖ ఎప్పుడో చేతులు ఎత్తేసింది. -
నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనాల సీజ్
తిరుపతి మంగళం : తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనాలను సీజ్ చేస్తామని జిల్లా రవాణాశాఖాధికారి కొర్రపాటి మురళీమోహన్ హెచ్చరించారు. ఆయన బుధవారం రవాణా, పోలీస్ శాఖల అధికారులతో తిరుమల ఘాట్ రోడ్డులో తనిఖీలు చేశారు. ఆయన మాట్లాడుతూ శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వేలాది మంది భక్తులు తిరుమలకు వస్తారని తెలిపారు. వారిని సురక్షితంగా గమ్యాలకు చేర్చే బాధ్యత ట్యాక్సీ వాహనదారులపై ఉందన్నారు. ఘాట్‌రోడ్డులో వెళ్లే వాహనాలు సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం, సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం, సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం వంటివి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే వాహనాలను తిరుమలకు వెళ్లకుండా నిషేధిస్తామని హెచ్చరించారు. ఎంవీఐ, వెంకటరమణ నాయక్, ఎ ఎంవీఐ ప్రసాద్ వర్మ, ట్రాఫిక్ ఎస్ఐ , పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
ఉపాధిలో మామిడి కుంభకోణం?
యాదమరి: కొందరు అక్రమార్కులు ఉపాధి కూలీల పొట్టగొడుతున్నారు. ఉపాధి హామీ కింద మంజూరైన మామిడి చెట్ల నిధులను పక్కదారి పట్టించారు. నిరుపేద అర్హులైన రైతులకు దక్కాల్సిన సొమ్మును క్షేత్రస్థాయి సిబ్బంది, అధికారులు తమకు కావాల్సిన బినామీల వారి ఖాతాల్లోకి మళ్లించి కుంభకోణానికి పాల్పడారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దాదాపు రూ.ఐదు లక్షల నుంచి రూ.ఏడు లక్షల వరకు స్వాహా చేసినట్టు బాధిత రైతులు చెబుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో పేద రైతులకు మేలు చేసేందుకు ఈ పథకం కింద మామిడి మొక్కలు నాటుకునే అవకాశం కల్పించారు. సిబ్బంది అవినీతి వల్ల అసలైన లబ్ధిదారులకు అన్యాయం జరుగుతోంది. అడిగితే త్వరలో వస్తుంది అంటూ బుకాయింపు పంట సాగు చేసుకున్న రైతుల నుంచి ఆధార్, బ్యాంకు ఖాతాల పత్రాలను సేకరించిన సిబ్బంది కొందరు అధికారులతో కుమ్మకై ్క నిధుల బదిలీలో అక్రమాలకు పాల్పడినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. తమకు రావలసిన నగదు గురించి రైతులు నిలదీస్తే ‘ఇంకా డబ్బులు పడలేదు.. త్వరలోనే వస్తాయి అంటూ ఉపాధి హామీ సిబ్బంది పచ్చి అబద్దాలతో కాలయాపన చేస్తూ వచ్చారు. తీరా అనుమానం వచ్చి ఆన్లైన్లో చెక్ చేసుకోగా తమ డబ్బులు వేరే వారి అకౌంట్లలోకి బదిలీ అయినట్లు తేలడంతో షాక్‌కు గురయ్యారు. ఈ విషయంపై మండలంలోని సంబందిత అధికారులను ప్రశ్నించగా పొంతన లేని సమాధానం రావడంతో బాధితులు కలెక్టరేట్లో నిర్వహించే పీజీఆర్ఎస్ను ఆశ్రయించారు. కొన్ని వారాలుగా ఈ వ్యవహారంపై కలెక్టర్‌కు ఫిర్యాదులు అందుతుండడంతో ఉన్నతాధికారులు సీరియస్ అయినట్టు తెలుస్తోంది. దీంతో ఇరకాటంలో పడిన సదరు ఉపాధి సిబ్బంది గుట్టుచప్పుడు కాకుండా బాధిత రైతులకు సొంతంగా డబ్బులు సర్దుబాటు చేస్తూ సెటిల్మెంట్లకు దిగుతున్నారని ఈ వారం డబ్బులు తీసుకున్న ఓ బాధితుడు చెప్పాడు. మండలంలో అసలు లబ్ధిదారుల ఖాతాల్లోకి వెళ్లాల్సిన నిధులు ఇతరుల ఖాతాల్లోకి ఎలా మళ్లించారు? దీని వెనుక ఉన్న పెద్ద తలకాయలు ఎవరు? ఇప్పటి వరకు ఎంతమంది రైతుల పొట్టగొట్టారు? అనే వాటిపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరపాలని, అవినీతి సిబ్బందిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. -
అయ్యో పాపం!
చిత్తూరు రూరల్ (కాణిపాకం): ఆ తల్లికి ఎంత కష్టం వచ్చిందో.. తాను ఎంత దయనీయ స్థితిలో ఉందో తెలియదు. మనసును రాయి చేసుకుంది. కన్నీటిని గుండెల్లోనే దిగమింగుకుంది. నవమాసాలు మోసి కన్న మగబిడ్డను వద్దనుకుంది. చిత్తూరు నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో వదిలేసి వెళ్లిపోయింది. బుధవారం వేకువజామున ఆసుపత్రిలోని ప్రసూతి విభాగం వెనుక భాగంలో రోదిస్తున్న మగబిడ్డను స్థానిక సిబ్బంది గుర్తించారు. వెంటనే ఆసుపత్రి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. వైద్యులు తక్షణమే ఆ బిడ్డను స్వాధీనం చేసుకుని, అత్యవసర చికిత్స నిమిత్తం ఎస్ఎన్సీయూ విభాగంలో చేర్చారు. బిడ్డ ఆరోగ్యం ప్రస్తుతం క్షేమంగానే ఉందని, బరువు కాస్త తక్కువగా ఉండడంతో ప్రత్యేక వైద్య పర్యవేక్షణలో ఉంచామని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఉషశ్రీ తెలిపారు. ఆసుపత్రి అధికారుల సమాచారం మేరకు ఆ పసికందును సురక్షితంగా శిశువిహార్‌కు అప్పగించారు. బిడ్డను బయటి నుంచి తెచ్చి వదిలిపెట్టినట్లు తెలుస్తోందని, ఆస్పత్రిలో ఉన్నవాళ్లు ఈ పనిచేయలేదని ఆస్పత్రి అధికారులు వెల్లడిస్తున్నారు. పోలీసుల విచారణ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి విచారణ వేగవంతం చేశారు. ఆ పసికందును వదిలివెళ్లిన తల్లి ఎవరు? ఏ సమయంలో ఆసుపత్రిలోకి వచ్చి వెళ్లారనే అంశాలపై ఆసుపత్రి ప్రాంగణంలోని సీసీ పుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కుటుంబ సమస్యల వల్ల మనస్తాపానికి గురై ఈ నిర్ణయం తీసుకున్నారా? లేక పిల్లలపై విరక్తితో వదిలేసి వెళ్లారా? అసలు మగ్గ బిడ్డను వదిలి వెళాల్సిన అవసరం ఏమొచ్చింది అన్న కోణాల్లో పోలీసులు విచారిస్తున్నారు. ఆ బిడ్డను వదిలిపెట్టిందా.. ఆ ఇద్దరేనా..? చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరు నగరంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో నవజాత శిశువును వదిలి వెళ్లిన ఘటనలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మంగళవారం రాత్రి ఆసుపత్రి ఆవరణలో ఉన్న వన్‌స్టాప్ సెంటర్ వద్ద అనుమానాస్పదంగా సంచరించిన ఆ యువతీయువకులే ఈ పని చేసి ఉంటారనే అనుమానాలు మరింత బలపడుతున్నాయి. బిడ్డను వేరే ఎక్కడో కాకుండా సరిగ్గా వన్‌స్టాప్ సెంటర్‌కు అత్యంత సమీపంలోనే వదిలి వెళ్లడం అనుమానాలకు బలాన్ని చేకూరుస్తోంది. ఆ రాత్రి అక్కడే సంచరించిన ఆ ఇద్దరూ ముందుగా ప్లాన్ చేసుకునే పసికందును అక్కడ వదిలేసి వెళ్లిపోయి ఉంటారని వన్‌స్టాప్ సిబ్బంది భావిస్తున్నారు. ఘటనపై టూ టౌన్ పోలీసులు దర్యాప్తును తీవ్రతరం చేశారు. ఆస్పత్రిలోని సీసీటీవీ దృశ్యాలను విశ్లేషిస్తూ, ఆ రాత్రి సంచరించిన ఆ జంట ఎవరనేది గుర్తించేందుకు గాలిస్తున్నారు. -
ప్రిన్సిపాల్‌కు భయపడి.. చీటీల రూపంలో ఫిర్యాదు
ప్రిన్సిపాల్ దబాయింపులకు భయపడిన హాస్టల్ విద్యార్థులు తమ బాధలను చీటీల రూపంలో ఫుడ్ కమిషన్ సభ్యునికి అందజేశారు. తమకు కడుపునిండా భోజనం పెట్టడం లేదని వాపోయారు. అన్నం, చిక్కీలలో పురుగులు వస్తున్నాయని, రెండు చికెన్ ముక్కలే వేస్తున్నారని తెలిపారు. దీనిపై సిబ్బందిని నిలదీస్తే పెట్టింది తినండి అంటూ కసురుకుంటున్నారని, ఈ విషయంపై ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేస్తే మండిపడుతున్నారని పేర్కొన్నారు. వంట గదిని పరిశీలించిన కమిషన్ సభ్యుడు అక్కడ నాణ్యత లేని సరుకులను గుర్తించారు. మిరియాలలో బొప్పాయి గింజలు, రవ్వలో పురుగులు, నాణ్యత లేని కూరగాయలు ఉండటంతో విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న సరఫరాదారునిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అంతకముందు ఆయన పలు అంగన్వాడీలు, రేషన్ షాపులును తనిఖీ చేసి, రికార్డులను పరిశీలించారు. అంగన్వాడీలలో రికార్డులు సక్రమంగా లేకపోవడంతో సీడీపీఓ, సూపర్వైజర్పై అసహనం వ్యక్తం చేశారు. అనంతరం పి.కొత్తకోట జెడ్పీ ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. విద్యార్థులతో ముచ్చటించి వారితో కలిసి భోజనం చేశారు. స్టాక్ రికార్డులను తనిఖీ చేయగా దాదాపు 580 కోడిగుడ్లు వ్యత్యాసం ఉన్నట్లు తేలింది. గుడ్లను స్వాహా చేసిన వ్యవహారంపై హెచ్ఎం, రికార్డు అసిస్టెంట్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని పక్కనే ఉన్న ఎంఈఓను ఆదేశించారు. -
పకడ్బందీగా బ్రహ్మోత్సవాలు
వ్యక్తి ఆత్మహత్మ భార్య, పిల్లల మృతితో మనోవేదన చెందిన వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన పుత్తూరు మండలంలో జరిగింది. కాణిపాకం: కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకుడి వార్షిక బ్రహ్మోత్సవాలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్‌గాంధీ అధికారులను ఆదేశించారు. ఆయన బుధవారం కాణిపాకం దేవస్థానంలో ఎమ్మెల్యే మురళీమోహన్, ఎస్పీ తుషార్ డూడితో కలిసి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ 21 రోజులు జరిగే ఉత్సవాల్లో సామాన్య భక్తులకే మొదటి ప్రాధాన్యత ఇస్తూ, దర్శన నిరీక్షణ సమయాన్ని తగ్గించాలన్నారు. ఎమ్మెల్యే మురళీమోహన్ మాట్లాడుతూ భక్తుల భద్రత కోసం 210 సీసీ కెమెరాలతో కమాండ్ కంట్రోల్ రూమ్ నిఘా, 3 అంబులెన్స్‌లు, ఫైర్ సేఫ్టీ వాహనాలు అందుబాటులో ఉంచుతున్నామని తెలిపారు. తాగునీరు, పారిశుద్ధ్య లోపాలు లేకుండా చూసుకోవాలని, ప్రతి రాత్రి 11.30 గంటలకు జిల్లా కేంద్రానికి ప్రత్యేక బస్సుతో పాటు గ్రామాల నుంచి 50 మంది భక్తులను తక్కువ ఛార్జీతో ఆర్టీసీ ప్రత్యేక బస్సు సదుపాయం కల్పిస్తున్నట్లు చెప్పారు. వినాయక చవితి రోజున ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పిస్తామన్నారు. ఆలయ పరిసరాల్లో 24 గంటలు పోలీసు బందోబస్తు ఉంటుందని ఎస్పీ తుషార్ డూడి తెలిపారు. -
నవోదయలో 9,11 తరగతుల్లో అడ్మిషన్లు
చిత్తూరు కలెక్టరేట్ : అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గం వలసపల్లి నవోదయ పాఠశాలలో 9, 11 తరగతుల్లో అడ్మిషన్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ తెలిపారు. నవోదయ పాఠశాల ప్రిన్సిపాల్ గీత బుధవారం కలెక్టర్‌ను కలిసి అడ్మిషన్ల ప్రక్రియపై చర్చించారు. కలెక్టర్ మాట్లాడుతూ అడ్మిషన్ల ప్రక్రియకు ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 10న పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు. అర్హత, ఆసక్తి ఉన్న వారు ఈ నెల 30వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. 2026–27 విద్యాసంవత్సరంలో ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 8, 10 తరగతులు చదువుతున్న విద్యార్థులు అర్హులని చెప్పారు. ఆరోగ్య కార్యక్రమాలను వంద శాతం పూర్తి చేయాలి చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లాలో అమలవుతున్న జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను 100 శాతం లక్ష్యంతో పూర్తి చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి నాగ శశిభూషణ్ రెడ్డి ఆదేశించారు. ఆయన బుధవారం చిత్తూరు నగరంలోని తన కార్యాలయంలో వైద్యాధికారులు, సూపర్వైజర్లతో సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ 11 నుంచి 24 వరకు లెప్రసీ ఎల్సీడీసీ ద్వారా కుష్టువ్యాధి గ్రస్తులను గుర్తించాలని సూచించారు. కేసీడీ, అభా, సంజీవిని, ఆర్బీఎస్కే సర్వేల్లో పురోగతి పెంచి, ఈ వారంలోగా 80 శాతం లక్ష్యాన్ని సాధించాలన్నారు. పీహెచ్సీ గ్రేడింగ్, ప్రజల్లో సానుకూల అభిప్రాయం పెరిగేలా నాణ్యమైన వైద్య సేవలు అందించాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న వీహెచ్సీ నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని, సిబ్బంది ఈఎస్ఆర్ అప్డేషన్ను ఈ నెలలోనే ముగించాలని ఆదేశించారు. గురువారం మెసానికల్ గ్రౌండ్లో నిర్వహించే ెఎయిడ్స్ అవగాహన మారథాన్‌లో 17–20 ఏళ్ల యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా చూడాలని సూచించారు. ప్రథమ బహుమతి రూ.10 వేలు, ద్వితీయ బహుమతి రూ.7 వేలు ఇస్తామన్నారు. సమావేశంలో అదనపు డీఎంహెచ్ఓ వెంకట ప్రసాద్, డీపీఎంఓ డాక్టర్ ప్రవీణ పాల్గొన్నారు. కంట్రోల్ రూమ్ ఏర్పాటు చిత్తూరు కార్పొరేషన్: స్థానిక సంస్థల ఎన్నికలకు జెడ్పీ యంత్రాంగం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా జెడ్పీ కార్యాలయంలో ఎన్నికల కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. పాత ఏఓ కార్యాలయాన్ని వీటి కోసం వినియోగిస్తున్నారు. వీటిని పర్యవేక్షించడానికి ఏఓ, సీనియర్, జూనియర్ సహాయకులు, టైపిస్టు, అటెండర్లకు డ్యూటీలు కేటాయించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించిన ఎన్నికల ప్రక్రియను ఇక్కడి నుంచి పర్యవేక్షించనున్నారు. జెడ్పీ పరిధిలోని చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాలకు సంబంధించిన ఎన్నికల సమాచారాన్ని అధికారులు ఇక్కడ నుంచి పర్యవేక్షించనున్నారు. ఈ నెల 24వ తేదీతో జెడ్పీ పాలకవర్గం పదవీ కాలం ముగియనుంది. 25 నుంచి తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో కొత్త జెడ్పీలు ఏర్పాటు కానున్నాయి. రాష్ట్ర స్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు జిల్లా జట్ల ఎంపిక చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా కేంద్రంలోని పీవీకేఎన్ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించిన జిల్లా స్థాయి సాఫ్ట్‌బాల్ సబ్ జూనియర్, జూనియర్ జట్ల ఎంపిక పోటీలు బుధవారం ముగిశాయి. ఈ పోటీలకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 250 మంది క్రీడాకారులు హాజరైనట్లు ఏపీ సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ వైస్ చైర్మన్ షణ్ముగం తెలిపారు. ఎంపికై న సబ్ జూనియర్ జట్లు ఈ నెల 12 నుంచి 14 వరకు బొబ్బిలి (విజయనగరం)లో, జూనియర్ జట్లు అక్టోబర్ 12 నుంచి 14 వరకు పుల్లంపేట (కడప)లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటాయని జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్, కార్యదర్శి మల్లేశ్వరి వెల్లడించారు. క్రీడాకారులు పట్టుదలతో ఆడి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు. -
వ్యక్తి ఆత్మహత్మ
పుత్తూరు: భార్య, పిల్లలు మృతి చెందడంతో మనోవేదనకు గురైన పుత్తూరు మండలం పైడిపల్లికి చెందిన శివశంకర్ తడుకు ఆర్ఎస్ వద్ద గల ఫారెస్ట్ చెక్‌పోస్టు సమీపంలోని మామిడి తోటలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సీఐ నెట్టి కంఠయ్య తెలిపారు. ఆయన బుధవారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. పుత్తూరు మండలం నేసనూరు గ్రామానికి చెందిన పద్మజ(27), పైడిపల్లికి చెందిన శివశంకర్‌ను ప్రేమించి ఎనిమిదేళ్ల క్రితం పెళ్లి చేసుకుంది. పుత్తూరు కృష్ణానగర్‌లో కాపురం ఉండేవారు. వారికి పిల్లలు తేజశ్రీ(7), లాస్య(4) ఉన్నారు. శివశంకర్ ఉద్యోగం చేయకుండా, అప్పులు చేస్తూ జులాయిగా తిరిగేవాడు. ఇంటికి వచ్చి భార్యను వేధించేవాడు. మరోపక్క అప్పుల వారి వేధింపులు ఎక్కువయ్యాయి. దీంతో పద్మజ గత ఫిబ్రవరి 7వ తేదీన ఇంట్లో ఇద్దరు పిల్లలకు ఉరివేసి తానూ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. శివశంకర్ వేధింపులతోనే భార్య, పిల్లలు మృతి చెందారని అతనిపైనా, అతని తల్లిపైనా ఈ ఏడాది ఫిబ్రవరి 7వ తేదీన కేసు నమోదు అయ్యింది. ఈ కేసులో రిమాండ్‌లో ఉన్న తల్లీకొడుకులు బెయిల్‌పై బయటకు వచ్చారు. ఈ నేపథ్యంలో శివశంకర్ బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అంతకుముందు అతను బంధువులకు ఫోన్ చేశాడు. ‘‘నా భార్య, పిల్లలు చనిపోయారు. వారు లేక నేను జీవించలేను. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నాను’’ అని తెలిపాడు. తాను చనిపోతున్నట్లు తెలిపే వాయిస్ రికార్డును సైతం బంధువులకు పంపించాడు. భార్య, పిల్లలు లేకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురైన శివశంకర్ ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పుత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అకౌంట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్‌కు నూతన కార్యవర్గం
తిరుపతి రూరల్ః ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ గణాంక అధికారుల సంఘం (అకౌంట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్) ఏపీఎస్పీడీసీఎల్ యూనిట్‌కు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ మేరకు సంఘం ప్రధాన కార్యదర్శి ఎన్.నరేంద్ర నాయుడు బుధవారం ప్రకటన విడుదల చేశారు. అసోసియేషన్ అధ్యక్షుడిగా టీ. రవికుమార్, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఎం. శివకుమార్, కోశాధికారిగా ఎం.ఎన్.పి. శైలజ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా జె. సుభాష్ చంద్రబోస్, ఎస్.సిన్హా, సంయుక్త కార్యదర్శులుగా సీహెచ్ అనిల్‌కుమార్, కేవీ సుబ్బారావు, సంస్థాగత కార్యదర్శులుగా వై.ఆర్. రవికుమార్‌రెడ్డి, ఆర్.పాపయ్య, మహిళా ప్రతినిధిగా ఎస్. ప్రశాంతి ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా టీ.వెంకట సుబ్బయ్య, సి.శ్రీనివాసులు, జె.రామకృష్ణ, ఎస్.వెంకటేశ్వర్లు, ఎన్.అశోక్ వర్ధన్ గుప్తా ఎన్నికయ్యారు. ఏపీఎస్పీడీసీఎల్ చీఫ్ జనరల్ మేనేజర్లు ఎం.మురళీకుమార్, ఎం.శ్రీకాంత్ సమక్షంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.మధుసూదన్, సంయుక్త కార్యదర్శి పి.బాలాజీ ఆధ్వర్యంలో నూతన కార్యవర్గం ఎన్నికలు నిర్వహించారు. చివరగా నూతన కార్యవర్గం సీఎండీ శివశంకర్‌ను మర్యాదపూర్వకంగా కలిసింది. -
రాష్ట్ర స్థాయి యోగాసన పోటీలకు ఎంపిక
చిట్వేలి: స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు మంగళవారం మదనపల్లిలో జరిగిన జిల్లా స్థాయి యోగాసన పోటీల్లో పాల్గొని విశేష ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై నట్లు ఫిజికల్ డైరెక్టర్ రమాదేవి తెలిపారు. పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న సింధు, దిలీప్, సమద్, ఏడో తరగతి విద్యార్థులు లక్ష్మీనారాయణ, లాస్యకుమార్, శివనందు, ఎనిమిదో తరగతి చదువుతున్న హర్షవర్దన్, తొమ్మిదో తరగతి చదువుతున్న తనూజ, గ్రీస్మిత సాయి యోగాసన జిల్లా స్థాయి పోటీల్లో ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించినట్టు వెల్లడించారు. యోగాసన స్టేట్ మీట్‌కు ఎంపికై న విద్యార్థినీ విద్యార్థులను ఇన్చార్జ్ హెడ్మాస్టర్ సోఫియా అభినందించారు. బంగారు ఆభరణాల అప్పగింత తిరుపతి అన్నమయ్యసర్కిల్: తిరుమలకు వెళ్తున్న తమిళనాడుకు చెందిన భక్తుడు పి.కార్తికేయన్సోమవారం సాయంత్రం 5 గంటల సమయంలో చెక్‌పాయింట్ వద్ద తన బ్యాగును పొరపాటున మరిచిపోయి వెళ్లారు. వెంటనే సిబ్బంది బ్యాగును గుర్తించి, అందులో లభించిన వివరాల ఆధారంగా భక్తుడిని సంప్రదించి అలిపిరి చెక్‌పాయింట్ వద్దకు రావాలని సమాచారం అందించారు. ఆ మేరకు చేరుకున్న భక్తుడు బ్యాగులోని వస్తువులను గుర్తించి ధృవీకరించిన అనంతరం బ్యాగును సురక్షితంగా ఆయనకు అప్పగించారు. బ్యాగులో రూ.10,900 నగదుతో పాటు రెండు గాజులు, ఒక బంగారు గొలుసు, రెండు బంగారు ఉంగరాలు ఉన్నాయి. వీటి విలువ సుమారు రూ.5 లక్షలు ఉంటుందని టీటీడీ సెక్టార్–5 ఏవీఎస్వో రమేష్ తెలిపారు. విజిలెన్స్ అధికారులు, సిబ్బంది చూపిన అప్రమత్తత, నిజాయితీతో విలువైన వస్తువులను తిరిగి అప్పగించడంతో భక్తుడు కృతజ్ఞతలు తెలిపారు. -
వస్త్ర నాణ్యత అవసరం
ఏపీకి ప్రత్యేక స్థానం నగరి : దేశంలో అత్యధిక ఉపాధి కల్పిస్తున్న రంగాల్లో చేనేత, పవర్‌లూమ్స్ రంగం ఒకటని, ఈ రంగం ద్వారా 4.5 కోట్ల మందికి పైగా ప్రత్యక్ష ఉపాధి పొందుతున్నారని కేంద్ర టెక్స్టైల్ కమిషనర్ వృందా మనోహర్ దేశాయ్ తెలిపారు. మంగళవారం నగరి పట్టణంలోని పవర్లూమ్ యూనిట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం ఏకాంబరకుప్పం రైల్వే స్టేషన్న్ సమీపంలోని ఎస్ఎంటీ పొన్నుస్వామి శంకరమ్మాళ్ కల్యాణ మండపంలో నిర్వహించిన టెక్స్టైల్ స్టాటిస్టికల్ రిటర్న్స్ సిస్టమ్ (టీఆర్ఎస్ఆర్ ) పోర్టల్ వర్క్‌షాప్‌లో పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ వస్త్ర నాణ్యత అవసరమని, దీని పై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ వస్త్రాల ఎగుమతులు రూ.3.25 లక్షల కోట్లకు చేరుకున్నాయని, ఇది ఇప్పటివరకు నమోదైన అత్యధికమని తెలిపా రు. ప్రపంచంలోని 100కు పైగా దేశాలకు భారత వస్త్ర ఉత్పత్తుల ఎగుమతులు జరుగుతున్నాయని, 2030 నాటికి 100 బిలియన్ అమెరికనన్ డాలర్ల విలువైన వస్త్ర ఎగుమతులను సాధించడమే లక్ష్యమన్నారు. 93 శాతం మహిళలే సమర్థ్ పథకం కింద ఆంధ్రప్రదేశ్‌లో 14,942 మంది అభ్యర్థులకు శిక్షణ అందించగా, వారిలో 12,157 మందికి ఉపాధి లభించిందన్నారు. ఉపాధి పొందిన వారిలో 93 శాతం మంది మహిళలు ఉండటం విశేషమని చెప్పారు. ఏటీయూఎఫ్ఎస్ పథకం కింద రాష్ట్రంలోని వస్త్ర పరిశ్రమ యూనిట్లకు రూ.20.69 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. ప్రస్తుత పత్తి సీజన్లో కాటన్‌న్ కార్పొరేషన్‌న్ ఆఫ్ ఇండియా 30 కొనుగోలు కేంద్రాల ద్వారా రూ.1,557 కోట్ల విలువైన పత్తిని కొనుగోలు చేసిందని వివరించారు. సద్వినియోగం చేసుకోవాలి నగరిలోని పవర్లూమ్ యూనిట్లు నవీనీకరణ చెందడం లేదని రాష్ట్ర టెక్స్టైల్ కమిషనర్ రేఖారాణి తెలిపారు. అందుకే నగరి నేత నాణ్యత కూడా మెరుగుపడడం లేదన్నారు. చుడీదార్లకు వారు ఇచ్చే కొలతలు కూడా సరిలేవని చెప్పారు. నగరిలోని పవర్లూమ్ సర్వీస్ సెంటర్‌ను ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ అండ్ అపారెల్ డెవలప్మెంట్ సెంటర్‌గా ఆధునికీకరించామని, ఈ శిక్షణ కేంద్రాన్ని కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రీజినల్ ఆఫీస్ అసిస్టెంట్ డైరెక్టర్, ఆఫీస్ ఇన్చార్జి సుధారాణి, డైరెక్టర్ రవికుమార్, అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి, జాయింట్ డైరెక్టర్ రాజారావు, ఆర్డీఓ అనుపమ పాల్గొన్నారు. వస్త్రాలను పరిశీలిస్తున్న అధికారులు సమావేశంలో మాట్లాడుతున్న కేంద్ర టెక్స్టైల్ కమిషనర్ టీఎస్ఆర్ఎస్ నమోదు తప్పనిసరి వస్త్ర పరిశ్రమకు సంబంధించిన ఉత్పత్తి, పత్తి రాక, వినియోగం, వాణిజ్యం, నిల్వలు తదితర అంశాలపై కచ్చితమైన గణాంకాలు ప్రభుత్వ విధానాల రూపకల్పనకు ఎంతో కీలకమని వృందా మనోహర్ దేశాయ్ తెలిపారు. టీఎస్ఆర్ఎస్ పోర్టల్‌లో ఒకసారి మాత్రమే నమోదు చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ఈ పోర్టల్‌ను సౌతిండియాలో నగరి నుంచి ప్రారంభిస్తున్నామన్నారు. ఈ పోర్టలో యూనిట్ పేరు, ఫోన్ నంబర్, ఈ–మెయిల్, పానన్ నంబర్, అవసరమైన పత్రాలను సమర్పించిన అనంతరం ప్రతి యూనిట్‌కు శాశ్వత టీయూఐడీ నంబర్ కేటాయిస్తారని, కేంద్ర టెక్స్టైల్ మంత్రిత్వ శాఖకు సంబంధించిన పథకాల ప్రయోజనాలు పొందేందుకు ఈ నంబర్ తప్పనిసరని స్పష్టం చేశారు. వస్త్ర రంగంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక స్థానం ఉందని వృందా మనోహర్ దేశాయ్ తెలిపారు. రాష్ట్రంలో సుమారు 5.54 లక్షల హెక్టార్లలో పత్తి సాగు జరుగుతోందని, దాదాపు 16 లక్షల బేళ్ల పత్తి ఉత్పత్తి అవుతోందన్నారు. రాష్ట్రంలో 238 జిన్నింగ్, ప్రెస్సింగ్ యూనిట్లు, 104 స్పిన్నింగ్ మిల్లులు, 25.3 లక్షల స్పిండిల్స్ ఉన్నాయని వివరించారు. దేశంలోనే ముడి పట్టు ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ రెండో అతిపెద్ద రాష్ట్రంగా ఉందన్నారు. చిత్తూరు జిల్లాలోని నగరి ప్రాంతంలో సుమారు 3,438 యూనిట్లు, 13వేల పవర్‌లూమ్‌లు పనిచేస్తున్నాయని వెల్లడించారు. వీటికి 34 సైజింగ్ యూనిట్లు, 50 డైయింగ్ యూనిట్లు సహకరిస్తున్నాయన్నారు. అయితే పవర్లూమ్ యంత్రాలు గానీ, డైయింగ్ యూనిట్లు గానీ అప్డేట్ కాలేదని చెప్పారు. అత్యాధునిక పవర్‌లూమ్‌లు ఈ ప్రాంతంలో లేవన్నారు. పాత పద్దతులే పాటించడంతో విద్యుత్. నీరు ఆదా కాదని, నాణ్యతలో కూడా తేడా ఉంటుందని తెలిపారు. నగరిలోని ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ అండ్ అపారెల్ డెవలప్మెంట్ సెంటర్ (టీఎస్ఆర్ఎస్) పవర్లూమ్, వస్త్ర రంగ కార్మికులకు అందుబాటులో ఉందన్నారు. ఉత్పత్తి కేంద్రాల్లో ఎదురయ్యే సాంకేతిక సమస్యల పరిష్కారం, రుణ సదుపాయాలపై మార్గదర్శకత్వం, కార్మికులకు శిక్షణతో పాటు అత్యాధునిక యంత్రాలు, భవిష్యత్ మార్కెట్ డిమాండ్, ఫ్యాషనన్్ ట్రెండ్స్‌పై సమాచారం అందిస్తుందని వివరించారు. పవర్‌టెక్స్ ఇండియా పథకం కింద రాష్ట్రంలోని 1,861 మంది చేనేత కార్మికులకు యూనిట్ల ఆధునికీకరణకు సహాయం అందించామని, ప్రధానమంత్రి క్రెడిట్ పథకం కింద మరో 40 మంది చేనేత కార్మికులకు ఆర్థిక సహాయం అందించామని వెల్లడించారు. -
ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్యచౌదరి, ఆలయ అర్చకులు, అధికారులు, సిబ్బంది ఆలయ శుద్ధి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదనపు ఈవో మీడియాతో మాట్లాడుతూ సెప్టెంబర్ 15 నుంచి 23వ తేదీ వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగనున్నాయని, ఇందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ పూర్తి చేసినట్లు తెలిపారు. బ్రహ్మోత్సవాలు, ఉగాది, ఆణివార ఆస్థానం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఆలయంలోని ఆనందనిలయం మొదలుకొని బంగారువాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప దేవాలయాలు, ప్రసాదాల పోటు, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పుతోపాటు పూజాసామగ్రిని శుద్ధి చేసినట్టు తెలిపా రు. కాగా, ఆలయంలో ఉదయం 6 నుంచి 10 గంటల వరకు శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహించారు. ఆ సమయంలో స్వామివారి మూలవిరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పి వేశారు. శుద్ధి పూర్తయిన తర్వాత నామకోపు, చూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్యం కార్యక్రమాలను నిర్వహించారు. ఆ తరువాత భక్తులను దర్శనానికి అనుమతించారు. పలువురు బోర్డు సభ్యులు, సీవీఎస్వో మురళీకృష్ణ, డిప్యూటీ ఈవో భాస్కర్ పాల్గొన్నారు. -
అభివృద్ధి పథంలో గ్రంథాలయాలు
తిరుపతి సిటీ: గ్రంథాలయాలు అప్పటికీ, ఇప్పటికీ ఎంతో అభివృద్ధి చెందాయని ఎస్వీ వీసీ టాటా నర్సింగరావు పిలుపునిచ్చారు. ఎస్వీయూలో బ్రిడ్జింగ్ ది డిజిటల్ డివైడ్ టెక్నాలజీ అప్లికేషన్ ఇన్ పబ్లిక్ అండ్ అకడమిక్ లైబ్రరీస్ అనే అంశంపై జరుగతున్న జాతీయ సదస్సు రెండో రోజు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ గ్రంథాలయాలు గతానికి ఇప్పటికీ డిజిటల్, సాంకేతిక పరంగా ఎంతో అభివృద్ధి చెందాయన్నారు. ఢిల్లీ విశ్వవిద్యాలయ గ్రంథాలయ శాస్త్ర ఆచార్యులు ఆర్కె భట్ మాట్లాడుతూ పౌర గ్రంథాలయ యాక్ట్‌లు చాలా ఉన్నాయని, అయితే అవి సమర్థవంతంగా పనిచేయడంలేదని చెప్పారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గురవారెడ్డి ప్రసంగిస్తూ ప్రతి గ్రామంలో పౌర గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసి, ప్రజలలో చదివే అలవాటును పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ మధుసూదన్, సెమినార్ డైరెక్టర్ ఆచార్య శ్రీనివాస రాఘవన్, సెమినార్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆచార్య కే.సురేంద్రబాబు, గ్రంథాలయ శాస్త్ర శాఖాధిపతి ప్రశాంతికుమారి, దేశంలో పలు ప్రాంతాల నుంచి విచ్చేసి గ్రంథాలయాధికారులు, మేథావులు తదితరులు పాల్గొన్నారు. -
తల్లి కళ్లు.. కొడుకు జీవితానికి వెలుగు
పెద్దపంజాణి : తల్లిని కోల్పోయిన బాధ ఒక వైపు.. ఆమె కళ్లే తన జీవి తానికి వెలుగవుతాయనే ఆశ మరో వైపు.. క్షణాల్లో జరిగిన ప్రమాదంతో కుటుంబంలో విషాదం అలుముకుంది. అయితే చూపులేని ఆ ఇంటి పెద్దకొడుకు జీవితంలో వెలు గు నింపాలనే ఆలోచనతో తల్లి కళ్లను దానం చేయాలని కుటుంబం నిర్ణయించింది. ఒక ప్రమా దం తల్లి ప్రాణాలు తీసుకెళ్లింది. కానీ, కుటుంబం తీసుకున్న నిర్ణయం మాత్రం ఆమెను మరొకరి జీవితంలో వెలుగుగా నిలబెడుతోంది. విషాదంగా మారిన ప్రయాణం మండలంలోని నాగిరెడ్డిపల్లి పంచాయతీ చల్లావారిపల్లెకు చెందిన రాజమ్మ(55) తన చిన్న కుమారుడు గోపితో కలసి సొంత పనుల నిమి త్తం మంగళవారం ఉదయం సచివాలయానికి బైక్‌పై బయలు దేరింది. పనులు ముగించుకున్న అనంతరం ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు. మార్గం మధ్యలో ఆమె ధరించిన చీర బైక్ ఫోర్క్‌లో చిక్కుకుంది. దీంతో ఒక్కసారిగా బైక్ అదుపు తప్పి కింద పడడంతో రాజమ్మ తలకు తీవ్రమైన గాయ మైంది. వెంటనే స్థానికుల సహాయంతో చికిత్స కోసం పలమనేరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సూచనల మేరకు చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ రాజమ్మ మృతి చెందింది. చూడలేని పెద్ద కుమారుడు రామకృష్ణ రాజమ్మకు ఇద్దరు కుమారులు.పెద్దకుమారుడు రామకృష్ణకు కంటి చూపులేదు. చిన్న నాటి నుంచి తమకు అండగా నిలిచిన తల్లి ఇకలేదనే విషయం ఆకుటుంబాన్ని తీవ్రంగా కలచివేసింది. ముఖ్యంగా పెద్దకుమారుడి పరిస్థితి అందరినీ మరింత బాధకు గురిచేసింది. ఈ విషాదం నుంచి తేరుకోక ముందే కుటుంబసభ్యులు రాజమ్మ కళ్లను రామకృష్ణకు అందించాలని నిర్ణయించారు. ఈ మేరకు వైద్యులను సంప్రదించి, శస్త్ర చికిత్సకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. -
విద్యుత్ స్తంభానికి ఢీకొని వ్యక్తి మృతి
గంగాధరనెల్లూరు: మండలంలోని తూగుండ్రం పంచాయతీ బాలయ్య కొత్తూరు వద్ద బైక్ అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. వివరాలు.. పాలసముద్రం మండలం రంగాపురం గ్రామానికి చెందిన గుణశేఖర్ మంగళవారం ద్విచక్రవాహనంపై వెళుతుండగా ప్రమాదం జరిగింది. తీవ్రంగా గాయపడిన గుణశేఖర్ గంటకు పైగా రక్తస్రావంతో ప్రమాద స్థలంలోనే పడి ఉన్నా డు. స్థానికులు వెంటనే 108 వాహనానికి సమా చారం అందించినప్పటికీ, సమయానికి రాలేదు. ఆర్తనాదా లు చేస్తున్న క్షతగాత్రుడిని స్థానికులే ఓ ప్రైవేట్ వాహనంలో చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మరణించాడు. సకాలంలో 108 వచ్చి ఉంటే ప్రాణాలు కాపాడి ఉండవచ్చని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశా రు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. శ్రీవారి దర్శనానికి 24 గంటలు తిరుమల: తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్ శిలాతోరణం వద్దకు చేరుకుంది. సోమవారం అర్ధరాత్రి వరకు 69,440 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 36,255 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.75 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 24 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టంచేసింది. నేడు టీటీడీ బోర్డు సమావేశం తిరుమల: టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం బుధవారం తిరుమలలో జరగనుంది. ఈ ఏడాది అధిక మాసం కారణంగా శ్రీవారికి రెండు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్న నేపథ్యంలో.. భారీగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చేపట్టాల్సిన ఏర్పాట్లపై మండలి ప్రధానంగా చర్చించనుంది. సుమారు 50 అజెండా అంశాలు సమావేశంలో చర్చకు రానున్నాయి. లడ్డూ పోటులో అధనపు సిబ్బందిని నియమించే అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే డొనేషన్ పాలసీలో స్వల్ప మార్పులు చేసి.. నామినీని మార్చుకునే అవకాశం కల్పించే అంశంపై విధివిధానాలను పరిశీలించనున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు కాంట్రాక్ట్ కార్మికులకు టైమ్ స్కేల్ వర్తింపజేసే అంశంపైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. భక్తులకు కల్పిస్తున్న ప్రమాద బీమా మొత్తాన్ని పెంచే అంశంపైనా మండలి చర్చించనుంది. రోడ్డు ప్రమాదంలో ఐఐటీ విద్యార్థికి తీవ్ర గాయాలు నాయుడుపేటటౌన్: రోడ్డు ప్రమాదంలో ఐఐటీ విద్యార్థి తీవ్రంగా గాయపడిన సంఘటన మంగళవారం మండలంలోని అయ్య ప్పరెడ్డిపాళెం క్రాస్ రోడ్డు చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు.. బుచ్చిరెడ్డిపాళెంకు చెందిన పవన్‌కుమార్ చైన్నెలో ఐఐటీ చదువుతున్నాడు. మంగళవారం చైన్నె నుంచి తన బైక్‌పై స్వగ్రామానికి వస్తుండగా మార్గమఽధ్యంలో అయ్యప్పరెడ్డిపాళెం గ్రామ జాతీయ రహదారి కూడలి వద్ద ఓ యాచకుడు అడ్డు రావడంతో బైక్ అతనిని ఢీకొంది. ఈ ప్రమాదంలో పవన్ కుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. అలాగే యాచకుడు చెంచయ్యకూ గాయాలయ్యాయి. ఇద్దరినీ 108 అంబులెన్సులో స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం పవన్‌ను నెల్లూరు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రతిపక్షం గొంతు నొక్కేందుకే దాడులు
తిరుపతి మంగళం : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతిపక్షం గొంతునొక్కేందుకు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై టీడీపీ గూండాలు దాడులకు తెగబడుతున్నారని చిత్తూరు, తిరుపతి జిల్లాల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రామకుప్పం మండలం, పెద్దూరు ఎంపీటీసీ వెంకటరమణారెడ్డిపై టీడీపీ గూండాలు దాడి చేసి కారు అద్దాలు పగులగొట్టి విధ్వంసం సృష్టించడాన్ని ఆయన ఖండించారు. తిరుపతి పద్మావతిపురంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీల ప్రకారం ప్రజలకు సంక్షేమ పథకాలను అందించడంలో, రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయడంలో చంద్రబాబు శ్రద్ద చూపడం లేదన్నారు. ఎంతసేపు వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్.జగన్మోహన్రెడ్డిని దూషించడం, పార్టీ శ్రేణులపై దాడులకు తెగబడడం, అక్రమ కేసులు బనాయించి జైళ్లకు పంపడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంలో టీడీపీ గూండాలు రెచ్చిపోతున్నారని, కుప్పంలో వైఎస్సార్సీపీ సమన్వయకర్త, ఎమ్మెల్సీ భరత్, జిల్లా పరిషత్ చైర్మన్లు నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారని తెలిపారు. ఆ సమావేశానికి వెళ్లి వస్తున్న తమ పార్టీ ఎంపీటీసీ వెంకటరమణారెడ్డిపై దాడికి పాల్పడ్డారని తెలిపారు. కుప్పంలోనే టీడీపీ గూండాలు చేస్తున్న అరాచకాలు, దాడులను అదుపుచేయాల్సిన చంద్రబాబు చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. కూటమి బెదిరింపులు, దాడులు, అక్రమ కేసులకు వైఎస్సార్సీపీలో భయపడేవాళ్లెవ్వరూ లేరని హెచ్చరించారు. మీరు ఎన్ని దాడులు చేసినా ప్రజావ్యతిరేక విధానాలపై వైఎస్సార్సీపీ ప్రజల పక్షాన నిలబడి ఉద్యమ పోరాటాలు చేస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. కుప్పంలో రెచ్చిపోతున్న టీడీపీ గూండాలు -
బాధ్యతాయుతంగా విధులు
11 నుంచి లెప్రసీ సర్వే జిల్లాలో కుష్టు వ్యాధి నిర్మూలనకు ఈ నెల 11 నుంచి 24 వరకు లెప్రసీ కేస్ డిటెక్షన్ క్యాంపెయిన్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి స్పర్శ లేని మచ్చలు ఉన్న వారిని గుర్తించి ఉచిత వైద్యం అందేలా చూడాలన్నారు. పాఠశాల ల్లో విద్యార్థులకు లెప్రసీ వ్యాధిపై అవగాహన కల్పించాలని సూచించారు. డీఎంహెచ్ఓ నాగ శశిభూషణ్‌రెడ్డి మాట్లాడుతూ కుష్టు వ్యాధి శాపం కాదని, సరైన చికిత్సతో నయం చేయవచ్చని తెలిపారు. చిత్తూరు కలెక్టరేట్ : స్థానిక సంస్థల ఎన్నికల విధులను నిక్కచ్చిగా, బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో పలు శాఖల అధికారులతో ఎన్నికల ముందస్తు ఏర్పాట్లపై సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలను జిల్లాలో ప్రశాంతంగా, పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఈ క్రమంలోనే ఓటర్ల జాబితా ప్రక్రియ దాదాపు 99.9 శాతం పూర్తయిందని చెప్పారు. కౌంటింగ్ ప్రక్రియ రాత్రి వరకు కొనసాగే అవకాశమున్న కేంద్రాలను ముందుగానే గుర్తించాలన్నారు. నిరంతర విద్యుత్ సరఫరా, ప్రత్యామ్నాయ పవర్ బ్యాకప్ సిద్ధం చేయాలని సూచించారు. ఆన్లైన్ నామినేషన్ల కోసం హైస్పీడ్ ఇంటర్నెట్, కంప్యూటర్లు, అవసరమైన చోట మొబైల్ హాట్స్పాట్లు సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. నామినేషన్లు, పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియలపై అధికారులు, సిబ్బందికి మాస్టర్ ట్రైనర్లతో సమగ్ర శిక్షణ ఇప్పిస్తామని తెలిపారు. ప్రత్యేక భద్రతా ప్రణాళిక ఎస్పీ తుషార్ డూడీ మాట్లాడుతూ నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, పోలింగ్, కౌంటింగ్ ఇలా ప్రతి దశకూ ప్రత్యేక భద్రతా ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించినా, ఎవరి ప్రభావానికై నా లోనైనా సహించేది లేదని హెచ్చరించారు. డీఆర్ఓ మోహన్ కుమార్ మాట్లాడుతూ తహసీల్దార్లు, ఎంపీడీఓలు ఇప్పటి నుంచే క్షేత్రస్థాయి ఏర్పాట్లలో నిమగ్నం కావాలన్నారు. ఎన్నికల సంఘం జారీ చేసే తాజా మార్గదర్శకాల ను అధ్యయనం చేయాలని సూచించారు. పంచా యతీ ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ల ముద్రణ, గోప్యత, భద్రత విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఆర్డీఓ శ్రీనివాసులు, జెడ్పీ సీఈఓ రవికుమార్‌నాయుడు, డీపీఓ పాల్గొన్నారు. పర్యాటకాభివృద్ధికి మాస్టర్ ప్లాన్ జిల్లాలో పర్యాటక రంగం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్‌గాంధీ వెల్లడించారు. మంగళవారం కలెక్టరేట్లో పర్యాటక, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో వరుస సమావేశాలు నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ పర్యాటక రంగంలో ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. అర్ధగిరి, పులిగుండు ఆలయాల వద్ద డీడీసీ నిధులతో మౌలిక వసతులు కల్పించాలన్నారు. గంగినేని, భూమిరెడ్డిపల్లి, బుడితిరెడ్డిపల్లి చెరువుల్లో బోటింగ్ సౌకర్యాలు పునరుద్ధరించాలని సూచించారు. డీఆర్‌ఓతోపాటు పర్యాటక 11 నుంచి లెప్రసీ సర్వే జిల్లాలో కుష్టు వ్యాధి నిర్మూలనకు ఈ నెల 11 నుంచి 24 వరకు లెప్రసీ కేస్ డిటెక్షన్ క్యాంపెయిన్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి స్పర్శ లేని మచ్చలు ఉన్న వారిని గుర్తించి ఉచిత వైద్యం అందేలా చూడాలన్నారు. పాఠశాలల్లో విద్యార్థులకు లెప్రసీ వ్యాధిపై అవగాహన కల్పించాలని సూచించారు. డీఎంహెచ్ఓ నాగ శశిభూషణ్‌రెడ్డి మాట్లాడుతూ కుష్టు వ్యాధి శాపం కాదని, సరైన చికిత్సతో నయం చేయవచ్చని తెలిపారు. అధికారి నరేంద్ర కుమార్ పాల్గొన్నారు. హాజరైన అధికారులు మాట్లాడుతున్న కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ తుషార్‌డూడీ -
స్థానికం.. అప్రమత్తం
కుప్పం : స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, పార్టీ కుప్పం నియోజకవర్గ సమన్వయకర్త, ఎమ్మెల్సీ భరత్ స్పష్టం చేశారు. మంగళవారం ఈ మేరకు ఎమ్మెల్సీ క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్సీపీ నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. ముందుగా జెడ్పీ చైర్మన్ మాట్లాడుతూ టీడీపీ నేతలకు దమ్ముంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించాలని కోరారు. వైఎస్సార్సీపీ నిజాయితీగా ఎన్నికలకు వస్తుంటే టీడీపీ నేతలు భయపడుతున్నారన్నారు. ఇచ్చిన హామీలను సక్రమంగా నెరవేర్చి ఉంటే చంద్రబాబుకు ఇప్పుడు భయపడాల్సిన అవసరం ఉండేది కాదని వెల్లడించారు. నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి, తదితర పథకాలను అమలు చేయలేదని విమర్శించారు. కుప్పం నియోజకవర్గంలో ఇసుక, మైనింగ్, మట్టి అక్రమ వ్యాపారం జోరుగా సాగిస్తున్నారని ఆరోపించారు. భయపడే ప్రసక్తే లేదు స్థానిక సంస్థల ఎన్నికల్లో భయపడే ప్రసక్తే లేదని, అన్ని వార్డులు, పంచాయతీల్లో అభ్యర్థులను నిలబెట్టి గెలిపించుకుంటామని ఎమ్మెల్సీ భరత్ స్పష్టం చేశారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పం వస్తారని సోషల్ మీడియాలో పోస్టు పెట్టినందుకే టీడీపీ నేతలు ఉలిక్కిపడుతున్నారన్నారు. పెద్దిరెడ్డి అంటే అంత భయమెందుకని ప్రశ్నించారు. టీడీపీ నేతల అరాచకాలను దీటుగా ఎదుర్కొంటామని, ప్రజాస్వామ్యబద్ధంగా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ కుప్పం నియోజకవర్గ పరిశీలకుడు మొగసాల కృష్ణమూర్తి మాట్లాడుతూ పెద్దిరెడ్డిని అడ్డుకునే శక్తి టీడీపీకి లేదని స్పష్టం చేశారు. కుప్పం నియోజకవర్గంలోని అన్ని స్థానాల్లో వైఎస్సార్సీపీ పోటీ చేస్తుందని తెలిపారు. -
అనుచిత ప్రచారంపై ఆగ్రహం
విజయపురం (నగరి) : మాజీ మంత్రి ఆర్కే రోజాపై అనుచిత ప్రచారం చేసిన టీడీపీ సోషల్‌మీడియాపై వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ కక్షతో ప్రజల మధ్య అపోహలు, విద్వేషాలు రెచ్చగొట్టేలా తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంగళవారం ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశార. సోమవారం విజయపురం మండలం కోసలనగరంలో పోతురాజు కొలుపు మహోత్సవం నిర్వహించారు. గ్రామస్తుల ఆహ్వానం మేరకు మాజీ ఆర్కేరోజా హాజరై స్వామివారిని దర్శించుకుని వెళ్లిపోయారు. అయితే అదే రోజు సాయంత్రం ఆలయం వద్ద అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనకు సంబంధించిన వాస్తవాలు అధికారుల దర్యాప్తులో తేల్చాల్సి ఉంది. అయితే కొందరు రాజకీయ దురుద్దేశంతో ప్రమాదాన్ని మాజీ మంత్రి పర్యటనకు ముడిపెడుతూ సోషల్ మీడియాలో ప్రచారం చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నగరి మండలం అడవికొత్తూరుకు చెందిన మోహన్‌న్ కృష్ణ, ఐటీడీపీ సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేసినట్లు తమకు సమాచారం అందిందని వైఎస్సార్సీపీ నేతలు ఫిర్యాదులో పేర్కొన్నారు. దేవుని ఆలయంలో జరిగిన ప్రమాదాన్ని కూడా రాజకీయాలకు వాడుకోవడం దారుణమని వైఎస్సార్సీపీ నేతలు మండిపడ్డారు. మహిళా నాయకురాలిని అవమానించేలా వ్యక్తిగత దూషణలకు దిగడం సరికాదని స్పష్టం చేశారు. ఉత్సవాలకు మాజీ మంత్రి మాత్రమే రావడం, ఎమ్మెల్యే రాకపోవడంతో టీడీపీకి ప్రజల్లో ఎక్కడ చెడ్డపేరు వస్తుందో అని వారే అగ్రిప్రమాదాన్ని సృష్టించి ఉంటారనే అనుమానముందని వెల్లడించారు. అడ్డుకట్ట వేయాలి ప్రజలను తప్పుదోవ పట్టించే ఇలాంటి దుష్ప్రచారాలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరముందని, లేకుంటే భవిష్యత్తులో మరింత రెచ్చిపోయే ప్రమాదముందని వైఎస్సార్సీపీ నేతలు తెలిపారు. అసత్యాలతో కూడిన పోస్టర్‌ను ఎవరు రూపొందించారు? ఎవరి సూచనలతో తయారైంది? ఏయే సోషల్ మీడియా ఖాతాలు, వాట్సాప్ గ్రూపుల్లో ప్రచారం చేశారు? దీని వెనుక మరెవరైనా ఉన్నారా? అనే అంశాలపై సాంకేతికంగా దర్యాప్తు చేయాలన్నారు. పోస్టర్ తయారీ, ప్రచారానికి సంబంధించిన డిజిటల్ ఆధారాలను సేకరించి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో కోసలనగరం ఆలయంలో జరిగిన అగ్ని ప్రమాదానికి అసలు కారణాలను సంబంధిత అధికారులు పూర్తిస్థాయిలో విచారించి వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు శివరాజు, జిల్లా నేతలు గుణశేఖర్ రెడ్డి, శేఖర్‌రాజు, నారపరాజు, నేతలు చెంచురాజు, సతీష్, హరి పాల్గొన్నారు. -
పవర్ ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటుకు ఆదేశం
చిత్తూరు కార్పొరేషన్: జిల్లాలోని నగరి, బలిజకండ్రిగ, కుప్పంలో 6 పవర్ ట్రాన్స్‌ఫార్మర్లును ఏర్పాటు చేయాలని ట్రాన్స్‌కో ఎస్ఈ అమర్‌బాబు ఆదేశించారు. మంగళవారం ఎస్ఈ కార్యాలయంలో ఎంఆర్టీ విభాగం అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎండల తీవ్రత నేపథ్యంలో విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు లేకుండా ముందుస్తు చర్యలు తీసుకోవాలన్నారు. అందులో భాగంగా ఎస్‌పీఎంలలో ట్రాన్స్ఫార్మర్లను నిల్వ ఉంచుకోవాలని సూ చించారు. నిబంధనల ప్రకారం రెండు రోజు ల్లో పాడైన ట్రాన్స్ఫార్మర్లకు మరమ్మతు చేయాలన్నారు. ఉష్ణోగ్రతలు పెరగడంతో విద్యుత్ వాడకం పెరిగిందని చెప్పారు. అనంతరం చిత్తూరులోని ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతు కేంద్రాన్ని పరిశీలించారు. ఓఆర్‌ఎం పనితీరు ను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఈఈ బాబు, డీఈలు, ఏఈలు పాల్గొన్నారు. రిజిస్ట్రేషన్ ఆదాయం రూ.19.13 కోట్లు చిత్తూరు కార్పొరేషన్: జిల్లావ్యాప్తంగా ఆగస్టు నెలకు సంబంధించి రిజిస్ట్రేషన్ల ద్వారాఆదా యం లక్ష్యం రూ.20.02 కోట్లకు గాను రూ.19.13 కోట్లు వచ్చినట్లు జిల్లా రిజిస్ట్రార్ రమణమూర్తి తెలిపారు. మంగళవారం జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో ఆయన వివరాలను మీడియాకు వెల్లడించారు. మేలో రూ.20.02 కోట్లు లక్ష్యం కాగా, రూ.13.33 కోట్లు, జూన్‌లో రూ.17.74 కోట్లు లక్ష్యం కాగా, రూ.17.97 కోట్లు, జూలైలో రూ.20.07 కోట్లకుగాను రూ.17.58 కోట్ల ఆదా యం వచ్చినట్లు వివరించారు. వంద శాతం ఉత్తీర్ణతకు ప్రణాళిక నగరి : విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా ప్రణాళిక రూపొందించాలని డీఈఓ కె.లక్ష్మీనారాయణ ఆదేశించారు. మంగళవారం నగరి మండలంలోని పాఠశాలలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జెడ్పీ బాలిక ఉన్నత పాఠశాలలో ఆయన మాట్లాడుతూ విద్యార్థినులకు ఇంగ్లిష్, సోషియల్ కీ వర్డ్స్‌పై అవగాహన కల్పించాలని సూచించారు. ఏకాంబరకుప్పం జెడ్పీ హైస్కూ ల్లో హిందీ టీచర్ గైర్హాజరుపై మండిపడ్డారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పెంపొందించేలా ఉపాధ్యాయులు పాఠ్యాంశాలను బోధించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎంఈఓ శ్రీదేవి, ఎంఈఓ–2 నమశ్శివాయ పాల్గొన్నారు. -
డీఎస్సీ అక్రమాలపై వరుస కథనాలు.. సాక్షి ప్రతినిధులపై అక్రమ కేసులు
సాక్షి,చిత్తూరు: కుప్పంలో డీఎస్సీ అక్రమాలపై వార్తలు ప్రసారం చేస్తున్న సాక్షి టీవీ ప్రతినిధులు కూటమి ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు దిగింది. క్షేత్రస్థాయిలో వార్తలు సేకరిస్తున్న సాక్షి టీవీ కుప్పం రిపోర్టర్ గణేష్, కెమెరామెన్ శ్రీకాంత్‌లపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.డీఎస్సీ అక్రమాల కథనాలపై దృష్టి మళ్లించేందుకు, విధుల్లో ఉన్న జర్నలిస్టులపై ఓ ఉపాధ్యాయుడితో తప్పుడు ఫిర్యాదు చేయించారు. జర్నలిస్ట్ తమపై దాడి చేశారని, కాలర్ పట్టుకుని బెదిరించారంటూ తప్పుడు ఆరోపణలతో ఈ కేసు బనాయించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను, అక్రమాలను వెలికితీస్తున్న జర్నలిస్టులపై ఇలాంటి అక్రమ కేసులు బనాయించడం ద్వారా భావప్రకటన స్వేచ్ఛను, పత్రికా స్వాతంత్ర్యాన్ని కాలరాస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.ఈ క్రమంలో సాక్షి టీవీ సిబ్బందిపై బనాయించిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని కోరుతూ చిత్తూరు ప్రెస్ క్లబ్ సభ్యులు, పలువురు మీడియా ప్రతినిధులు చిత్తూరు జిల్లా ఎస్పీని కలిసి వినతిపత్రం అందజేశారు. జర్నలిస్టులపై అక్రమ కేసుల నమోదును ఆపాలని, లేనిపక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. -
నాసిరకంగా పనులు
చిరుతల సంచారంపై కలకలం చిత్తూరు మండలంలో చిరుతల సంచారం కలకలం రేపుతోంది. దీనిపై అటవీశాఖ ప్రత్యేక దృష్టి సారించింది.శ్రీవారి దర్శనానికి 18 గంటలు తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. టోకెన్ లేని భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు 18 గంటలు పడుతోంది.ప్రస్తుతం టీడీపీ నేత చేస్తున్న పనులు ఇవీ.. మంగళవారం శ్రీ 8 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026జెడ్పీ పాత సమావేశ మందిరంలో పెచ్చూలూడిన గోడ అడగకాండ్ర!అవినీతిని మా రాజ్యం.. పనులన్నీ మాకే.. నిధులన్నీ మాకే భోజ్యం.. ఏం చేసినా మా పేరు మీదే చేయాలి.. మమ్మల్ని ప్రశ్నిస్తే సహించం.. అడ్డుకోవాలని యత్నిస్తే అంతుచూస్తాం.. అంటూ ఓ టీడీపీ నేత ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాడు. మొత్తం జిల్లా పరిషత్ కార్యాలయాన్నే తన కబంధ హస్తాల్లో ఇరికించుకుని చక్రం తిప్పుతున్నాడు. అధికారులను భయపెట్టి మరీ రూ.కోట్ల పనులను కై వసం చేసుకుంటున్నాడు. అధిక సంఖ్యలో టెండర్ ప్రక్రియ లేకుండానే నామినేషన్ విధానంలో చేజిక్కించుకుంటున్నాడు. నాసిరకంగా నిర్మాణాలు పూర్తి చేసి సొమ్ము వెనకేసుకుంటున్నాడు. ఇతర కాంట్రాక్టర్లు పోటీ పడితే బెదిరింపులకు తెగబడుతున్నాడు. వర్క్ కావాలంటే కమీషన్ చెల్లించాల్సిందే అంటూ హుకుం జారీ చేస్తున్నాడు. అక్రమార్జనలో ప్రజాప్రతినిధులకు సైతం వాటాలు పంచుతూ జెడ్పీని శాసిస్తున్నాడు. టీడీపీ నేత గుప్పిట్లో జిల్లా పరిషత్ సాక్షి టాస్క్‌ఫోర్స్ : జిల్లా పరిషత్ కార్యాలయంలో కాంట్రాక్టర్ ముసుగులోని ఓ టీడీపీ నేత హల్చల్ చేస్తున్నాడు. నిబంధనలు, చట్టాలను తుంగలో తొక్కి తన మాటను చెల్లుబాటు చేసుకుంటున్నాడు. సహకరించని అధికారులను బెదిరించి మరీ దారికి తెచ్చుకుంటున్నాడు. జిల్లావ్యాప్తంగా సుమారు రూ.15 కోట్లకు పైగా విలువైన దాదాపు 150 పనులను తన ఖాతాలో వేసుకున్నాడు. జెడ్పీ సాధారణ నిధులతో పాటు 15వ ఆర్థిక సంఘం నిధులను టార్గెట్ చేస్తున్నాడు. ఈ అవినీతి దందాలో తెరవెనుక పలువురు ప్రజాప్రతినిధులు సైతం ఉన్నట్లు తెలుస్తోంది. సాధారణంగా రూ.5లక్షలలోపు పనులను నామినేషన్ పద్ధతిలో కేటాయించే వెసులుబాటును ఆసరాగా చేసుకుని, రూ.20 లక్షల పనులను సైతం నాలుగు ముక్కలుగా విభజించి అక్రమంగా దోచేసుకుంటున్నాడు. టెండర్లు పిలిచినా వేరే కాంట్రాక్టర్ పోటీకి రాకుండా భయపెడుతున్నాడు. తాను వద్దనుకునే పనులను ఇతర కాంట్రాక్టర్లకు కమీషన్‌కు అమ్ముకుంటున్నాడనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆ నలుగురి సహకారం మొత్తం దందాకు జెడ్పీలోని ఇద్దరు అధికారులు, యూనియన్ పేరు చెప్పుకుని తిరిగే ఇద్దరు ఉద్యోగులు సహకారం అందిస్తున్నట్లు పలువురు సిబ్బంది బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. వీరిని వెంటబెట్టుకుని సదరు టీడీపీ నేత మొత్తం యంత్రాంగాన్నే శాసిస్తున్నట్లు తెలుస్తోంది. ఎవరైన పనులకు పోటీగా టెండర్ వేయడానికి వస్తే వారితో మధ్యస్తం చేయడమే వీరు పనిగా పెట్టుకున్నారు. జెడ్పీ సమీపంలోని ఓ మద్యం దుకాణంలో లాబీయింగ్‌లు చేస్తుంటారని తోటి ఉద్యోగులు వెల్లడిస్తున్నారు. అనధికార బాస్‌గా వ్యవహరించే టీడీపీ నేతతో కలిసి పలు పనులను భాగ్యస్వామంగా చేస్తున్నట్లు సమాచారం. పచ్చనేత చెప్పిందే వేదవాక్కుగా వ్యవహరిస్తుంటారని తెలిసింది. ఇతర కాంట్రాక్టర్లకు పనులు ఇవ్వద్దు, వారి బిల్లులను లేట్ చేయి అంటే సరే అని తలలు ఊపడం వీరికి అలవాటు. చివరకు క్వాలిటీ కంట్రోల్ అధికారులకు సైతం ఖరీదైన బహుమతులు ఇచ్చి, తాను చేసిన నాసిరకం పనులను బయటపెట్టకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం. దీనిపై టీడీపీకి చెందిన ఇతర నేతలు సైతం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కష్టపడి పనిచేసిన కార్యకర్తలను పక్కనపెట్టి ఓకే నాయకుడికి అన్ని పనులు కట్టపెట్టడం ఏంటని ఆవేదన చెందుతున్నారు. ఇలాంటి వారి కారణంగా పార్టీకి నష్టం కలుగుతుందని విమర్శిస్తున్నారు. అయితే బడా నేతలకు కమీషన్లు ఇవ్వడంతోనే సదరు నేత హవా నడుస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు. జాగ్రత్త పడతాం సాధారణంగా ఒకరికే పనులన్నీ ఇవ్వం. జెడ్పీ పరిధిలో ఒకరికే ఎక్కువ పనులు ఇచ్చినట్లు మా దృష్టికి రాలేదు. మరోసారి ఇలా జరగకుండా జాగ్రత్త పడతాం. ఈ మేరకు పంచాయతీరాజ్ అధికారులకు సైతం ఆదేశాలు జారీ చేశాం. సదరు కాంట్రాక్టర్‌కు ఉద్యోగుల సహకరిస్తున్న అంశంపై దృష్టి పెడతాం. వాస్తవమైతే తగిన చర్యలు తీసుకుంటాం. – రవికుమార్‌నాయుడు, జెడ్పీ సీఈఓ అక్రమ కేసులు అన్యాయం -
నాడు ఒరవడి.. నేడు వెనుకబడి
చిత్తూరు కలెక్టరేట్ : గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో విద్యాశాఖ అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ చూపించారు. నాణ్యమైన విద్య పేద విద్యార్థులకు అందాలనే సంకల్పంతో ఇంగ్లిష్ మీడియం, బైజూస్ కంటెంట్, 3వ తరగతి నుంచే టోఫెల్ శిక్షణ, ఉచితంగా ట్యాబ్‌ల పంపిణీ, స్మార్ట్ టీవీలు వంటి సంచలనాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. కార్పొరేట్ పాఠశాలలను తలదన్నేలా ప్రభుత్వ బడులను అద్బుతంగా తీర్చిదిద్దారు. ఒకప్పుడు పాడుబడిన ప్రభుత్వ బడుల భవనాలు, కనీస సౌకర్యాలు లేని పరిస్థితుల నుంచి రన్నింగ్ వాటర్ తో మరుగుదొడ్లు, తాగునీటి వ్యవస్థ, విద్యుద్దీకరణ, ఫ్యాన్లు, గ్రీన్న్ చాక్‌బోర్డులు, సుందరమైన పెయింటింగ్స్, ఇంగ్లష్ ల్యాబ్స్, బెంచీలతో డిజిటల్ నిలయాలుగా ఆవిర్భవించాయి. దీంతో జిల్లాలోని ప్రభుత్వ బడుల్లో అడ్మిషన్ల సంఖ్య రికార్డు స్థాయి పెరిగింది. అక్షరాస్యత శాతంలో గణనీయంగా వృద్ధి నమోదైంది. సర్కారు అలసత్వం చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యాశాఖ మంత్రి లోకేష్ అనాలోచిత నిర్ణయాలతో సర్కారు బడుల పరిస్థితి దిగజారుతోంది. ఉత్తీర్ణత శాతం దారుణంగా పడిపోతోంది. ఏటా డ్రాపౌట్ల సంఖ్యల గణనీయంగా పెరిగిపోతోంది. పిల్లలు బడికి వచేందుకు పెద్దగా ఆసక్తి చూపని దుస్థితి దాపురించింది. సాంకేతిక అంశాలను ఉపాధ్యాయులకు అంటగట్టడంతో బోధన అరకొరగా మారింది. టీచర్లు తరగతి గదుల కంటే బయటే ఎక్కువ తిరగాల్సి వస్తోంది. దీంతో విద్యార్థుల అభ్యసన సామర్థ్యం పడిపోతోంది. దీంతో చదువుపై పిల్లలకు ఆసక్తి సన్నగిల్లుతోంది. ఈ క్రమంలో జిల్లా అక్షరాస్యత శాతంపై సైతం ప్రభావం పడుతోంది. అక్షరాస్యత అనేది కేవలం అక్షరాలు దిద్దడం మాత్రమే కాదు.. సమాజ వికాసానికి, భావితరాల భవిష్యత్‌కు వేసే బలమైన పునాది. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 8వ తేదీన అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం విద్యా ప్రాధాన్యతను చాటి చెబుతుంది. గత వైఎస్సార్సీపీ హయాంలో విద్యారంగం దినదినాభివృద్ధి చెందింది. విప్లవాత్మకమైన మార్పులతో దేశానిక ఆదర్శంగా నిలిచింది. ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వంలో విద్యావ్యవస్థ వెనుకంజ వేస్తోంది. అనాలోచిత నిర్ణయాలు.. అలసత్వంతో ప్రధానంగా సర్కారు బడుల పరిస్థితి రోజురోజుకూ తీసికట్టుగా మారింది. ప్రభుత్వ పాఠశాలలే కీలకం అక్షరాస్యత శాతం పెంపొందించడంతో ప్రభుత్వ పాఠశాల పాత్ర కీలకం. నిరుపేదలే ఎక్కువగా చదువుకు దూరంగా ఉంటారు. వారు తమ పిల్లలను బడికి పంపించేందుకు పెద్దగా ఇష్టపడరు. కూలి పనులు చేసుకుంటే కుటుంబానికి ఆధారంగా ఉంటారని భావిస్తుంటారు. అలాంటి పేదలను విద్యాఒడిలోకి తీసుకురావాలంటే సర్కారు బడులు బలోపేతం కావాలి. ఆ దిశగా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కృషి చేశారు. అయితే చంద్రబాబు పాలనలో కార్పొరేట్లకే కొమ్ముకాస్తున్నారు. పేద బిడ్డల చదువుపై నిర్లక్ష్యం చూపుతున్నారు. ఇది ఏమాత్రం మంచి కాదు. – మనోజ్‌రెడ్డి, వైఎస్సార్సీపీ చిత్తూరు నియోజకవర్గ యువత అధ్యక్షుడు పేదలపై విద్యాభారం జిల్లాలో అక్షరాస్యత కేవలం 70.38 శాతానికే పరిమితం కావడం, అందులోనూ మహిళల అక్ష రాస్యత 60.90 శాతమే ఉండడం ఆలోచించాల్సిన విషయం. ము ఖ్యంగా కుప్పం నియోజకవరగం గుడుపల్లె మండలంలో అక్షరాస్యత 60 శాతానికి పడిపోయింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పేదల విద్యకు ప్రాధాన్యమివ్వడంతో సర్కా రు బడులు కళకళలాడాయి. ఇప్పుడు కార్పొరేట్లకు వంత పాడుతుండడంతో నిరుపేదలపై విద్యాభారం పడుతోంది. దీంతో చాలామంది చదువుకు దూరమవుతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం మేలుకోవాలి. దేశ భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని సర్కారు బడులను బలోపేతం చేయాలి. – సద్దాం, జిల్లా స్టూడెంట్స్ అసోషియేషన్ జేఏసీ చైర్మన్ -
నేడు ‘కరెంటోళ్ల జనబాట’
చిత్తూరు కార్పొరేషన్ : జిల్లాలోని 40 సెక్షన్ల పరిధిలో మంగళవారం కరెంటోళ్ల జనబాట కార్యక్రమం చేపట్టనున్నట్లు ట్రాన్స్‌కో ఎస్ఈ అమ ర్‌బాబు తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో అధికారులు, సిబ్బంది పర్యటించి సమస్యలను నమోదు చేసుకుంటారని, వాటిని దశల వారీగా పరిష్కరిస్తామని వివరించారు. కుప్పం ఏఎస్పీగా హేమంత్‌రెడ్డి కుప్పం : కుప్పం పోలీస్ డివిజన్‌కు అడిషనల్ ఎస్పీ ని నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. పోలవరం జిల్లా చింతూరు ఏఎస్పీ హేమంత్ రెడ్డిని కుప్పానికి బదిలీ చేస్తున్నట్లు పేర్కొంది. కుప్పం డీఎస్పీ పార్థ సారథిని డీఐజీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. అలాగే కుప్పం అర్బన్ సీఐ సయ్యద్ హాషంను చిత్తూరు వన్‌టౌన్‌కు బదలీ చేశారు. 11న ముసాయిదా ఓటర్ల జాబితా చిత్తూరు కార్పొరేషన్: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సిద్ధం కావాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్‌చంద్ర పునేఠా ఆదేశించారు. ఈ మేరకు జిల్లాల వారీగా ఓటర్ల ముసాయిదా జాబితాను సిద్ధం చేయాలని సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన తుది జాబితా ఓటర్ల వివరాలను ఎంపీటీసీ , జెడ్పీటీసీల సెగ్మెంట్ల వారీగా విభజించాలని సూచించారు. ఈ మేరకు ఈనెల 11న ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీటీసీ ఓటర్లు, జెడ్పీ కార్యాలయంలో జెడ్పీటీసీ ఓటర్ల వివరాలను ప్రచురించనున్నారు. బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం చిత్తూరు కలెక్టరేట్ : కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీని ఆహ్వానించారు. సోమవారం ఈ మేరకు ఆలయ కమిటీ సభ్యు లు, ఈఓ పెంచలకిషోర్ ఆహ్వానపత్రిక అందజేశారు. ఈఓ మాట్లాడుతూ ఈ నెల 14వ నుంచి అక్టోబర్ 4వ తేదీ వరకు అత్యంత వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌కు వేద పండితులు ఆశీర్వచనం ఇచ్చారు. స్వామివారి తీర్థప్రసాదాలు, చిత్రపటం బహూకరించారు. ఆలయ కమిటీ చైర్మన్ సురేంద్రబాబు తది తరులు పాల్గొన్నారు. ఎయిడ్స్‌పై అవగాహన మారథాన్ చిత్తూరు రూరల్ (కాణిపాకం): ఎయిడ్స్‌పై యువతలో అవగాహన పెంపొందించేందుకు ఈ నెల 10వ తేదీన చిత్తూరులో ప్రత్యేక అవగాహన మారథాన్ నిర్వహించనున్నట్లు జిల్లా లెప్రసీ, ఎయిడ్స్ మరియు టీబీ అధికారి వెంకట ప్రసాద్ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ 17 ఏళ్ల నుంచి 25 ఏళ్ల యువతీ యువకులు మారథాన్‌లో పాల్గొనవచ్చన్నారు. ఈ మారథాన్ ఉదయం 7.30 గంటలకు మెసానికల్ గ్రౌండ్ నుంచి ప్రారంభమై పీవీకేఎన్ కళాశాల మీదుగా తిరిగి మెసానికల్ గ్రౌండ్‌కు చేరుకుంటుందని వెల్లడించారు. ప్రతిభ కనబరచిన యువతీయువకులకు వేర్వేరుగా రూ.10వేల ప్రథమ బహుమతి, రూ.7వేల ద్వితీయ బహుమతి అందించనున్నట్లు వివరించారు. ఆసక్తి గల వారు ఆరోజు ఉదయం 5.30 నుంచి 7.00 గంటలలోపు గ్రౌండ్ వద్దకు చేరుకోవాలని కోరారు. సత్వర న్యాయమే లక్ష్యం చిత్తూరు రూరల్ (కాణిపాకం ): ప్రజలకు సత్వర న్యాయం అందించడమే లక్ష్యంగా పనిచేయాలని ఎస్పీ తుషార్ డూడీ ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఎస్పీతోపాటు నాన్ కేడర్ ఎస్పీ రాజశేఖర్‌రాజు, ఏఎస్పీ ఎస్.షాను, చిత్తూరు ఎస్డీపీఓ వెంకటనారాయణ అర్జీలు స్వీరించారు. ఎస్పీ మాట్లాడుతూ వినతులను సమగ్రంగా విచారించి నిర్దేశిత గడువులోపు పరిష్కరించాలని స్పష్టం చేశారు. అధికారులు అలసత్వం ప్రదర్శించకుండా నిబద్ధతతో పనిచేసి బాధితులకు అండగా నిలవాలని కోరారు. కార్యక్రమంలో బాధితుల నుంచి మొత్తం 45 ఫిర్యాదు లు అందినట్లు అధికారులు వెల్లడించారు. -
గృహోపకరణాలు దగ్ధం
కుప్పంరూరల్ : మండలంలో ని నడుమూరులో ఆదివారం రాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా నారాయణ అనే వ్యక్తి ఇంట్లో మంటలు చెలరేగాయి. బాధితులు నిద్ర లేచి చూసే సరికే గృహోపకరణాలు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మంటలు వ్యాప్తి చెందకుండా అదుపు చేశారు. ప్రభుత్వం చేయూతనందించాలని బాధితుడు కోరాడు. ప్రాణం తీసిన చేపల వేట గంగాధరనెల్లూరు : మండలంలోని గొల్లపల్లె చెరువులో చేపల వేట ఓ వ్యక్తి ప్రాణం తీసింది. వివరాలు.. ఈడిగపల్లెకు చెందిన ఎస్.గోపాలయ్య, సమీప గ్రామానికి చెందిన జగన్నాథంతో కలసి గొల్లపల్లె చెరువులో చేపల వేటకు వెళ్లాడు. అయితే చెరువులో సుమారు 10 అడుగుల లోతు వరకు నీరు ఉండడంతో వల వేసేందుకు జగన్నాథం యత్నిస్తూ బురదలో చిక్కుకున్నాడు. గోపాలయ్య వెంటనే గ్రామస్తులకు విషయం తెలియజేశాడు. అందరూ హుటాహుటిన చెరువు వద్దకు చేరుకునే సరికి జగన్నాథం మృత్యువాత పడ్డాడు. గజ ఈతగాళ్ల సాయంతో మృతదేహాన్ని వెలికి తీశారు. -
బస్సులు ఆపడం లేదని ఆవేదన
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల పాఠశాలలు, కళాశాలల సమయాలు, తిరిగి ఇళ్లకు వెళ్లే సమయాల్లో ఆర్టీసీ బస్సులు ఆపడం లేదని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు దుర్గాప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఈ మేరకు కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీకి వినతిపత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ పూతలపట్టు మండలం తిరుపతి రోడ్డులోని వేము ఇంజినీరింగ్ కాలేజీ వద్ద ఉదయం, సాయంత్రం వేళల్లో ఆర్టీసీ బస్సులు నిలపడం లేదన్నారు. దీంతో విద్యార్థులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. కాలేజీ యాజమాన్యం, ఆర్టీసీ అధికారులు పట్టించుకోకపోవడంతో దిక్కుతోచక కొట్టుమిట్టాడుతున్నారని వివరించారు. ఐరాల మండలంలో స్కూల్ వదిలే సమయానికి నడపాల్సిన ఆర్టీసీ బస్సును రాత్రి 6 గంటల తర్వాత నడుపుతున్నారన్నారు. దీంతో విద్యార్థులు 4 కిలోమీటర్లు కాలినడకన వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే జీడీ నెల్లూరు మండలం వేల్కూరు నుంచి యలమరాజపురానికి వెళ్లే దారిలోని బట్టు కండ్రిగ వద్ద సాయంత్రం 5.30 నుంచి 7 గంటల మధ్య విద్యార్థినులు, మహిళలపై ఈవ్‌టీజింగ్ పెరుగుతోందని, ఆకతాయిలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఎస్ఎఫ్ఐ కార్యదర్శి మసూద్, మాజీ జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు పాల్గొన్నారు. -
క్రీడల్లో సత్తా చాటిన చిత్తూరు ఖాకీలు
చిత్తూరు రూరల్ (కాణిపాకం): రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జరిగిన 1వ ఏపీ స్టేట్ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్–2026 పోటీల్లో చిత్తూరు జిల్లా పోలీసులు అద్భుత ప్రతిభ కనబరిచారు. అనంతపురం రేంజ్ తరఫున బరిలోకి దిగిన జిల్లా పోలీస్ సిబ్బంది మొత్తం 30 పతకాలను (11 స్వర్ణ, 6 రజత, 13 కాంస్య) సాధించి సత్తా చాటారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన 17 మంది క్రీడాకారులు సోమవారం సాయుధ దళం కార్యాలయంలో ఎస్పీ తుషార్ డూడీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా క్రీడాకారులను ఎస్పీ ఘనంగా సత్కరించారు. విధుల ఒత్తిడిని అధిగమించడానికి క్రీడలు ఎంతో దోహదపడతాయని తెలిపారు. దారి దోపిడీ కేసులో నిందితుల అరెస్ట్ బైరెడ్డిపల్లె : పలమనేరు–కుప్పం జాతీయ రహదారిలోని దేవదొడ్డి సమీపంలో ఆగస్ట్ 28వ తేదీన దారి దోపిడీకి పాల్పడిన కేసులో నిందితులను అరెస్ట్ చేసినట్లు సీఐ పరుశురాముడు తెలిపారు. సోమవారం బైరెడ్డిపల్లె పోలీస్‌స్టేషన్‌లో ఆయన మాట్లాడారు. పలమనేరు మైక్రోఫైనాన్స్‌కు చెందిన వ్యక్తులు ద్విచక్రవాహనంపై వెళుతుండగా తమిళనాడులోని కృష్ణగిరి ప్రాంతానికి చెందిన వెంకటేష్, నాగేంద్ర, మురుగేష్ కత్తులతో బెదిరించి రూ.40వేలు దోచుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. సీసీ కెమెరా ఫుటేజీలు, ఫోన్ నంబర్ల ఆధారంగా నిందితులను గుర్తించి వెంకటేష్, నాగేంద్రను అరెస్ట్ చేసినట్లు సీఐ తెలిపారు. మురుగేష్ పరారీలో ఉన్నాడని, గాలిస్తున్నా మని వెల్లడించారు. ఎస్ఐ చందనప్రియ పాల్గొన్నారు. డిగ్రీ అడ్మిషన్లకు శ్రీకారం తిరుపతి సిటీ: జిల్లాలోని ప్రభుత్వ, టీటీడీ, ప్రైవేటు విద్యా సంస్థలల్లో డిగ్రీ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్లు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఓఏఎమ్‌డీసీ వెబ్సైట్లో యూజీ కోర్సులలో ప్రవేశాల కోసం రిజిస్ట్రేషన్ చేసుకు న్న విద్యార్థులకు సోమవారం తొలి విడత ప్రవేశాల మెరిట్ లిస్ట్ విడుదల చేశారు. ఇందులో భాగంగా 2026–27 విద్య సంవత్సరానికి సంబంధించి టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో తొలి అడ్మిషన్‌గా విద్యార్థి బి రామశేష సాయి శివారెడ్డికి బీఎస్సీ హానర్స్ జు వాలజీ మొదటి సంవత్సరంలో ప్రవేశం పొందారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కిషన్, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ వై.మల్లికార్జున, అధికారులు విద్యార్థికి ప్రవేశపత్రాన్ని అందజేశారు. ఫైర్ ఫైటింగ్‌పై అవగాహన తిరుమల: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని భక్తుల భద్రత, అత్యవసర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు తిరుమలలో ఫైర్ ఫైటింగ్, బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సోమవారం ఆస్థాన మండపంలో తిరుమల డీఎస్పీ విజయశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పోలీసు, టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ, ఫైర్ సర్వీసెస్, హెల్త్ డిపార్ట్మెంట్ సిబ్బంది పాల్గొన్నారు. అగ్ని ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అగ్నిమాపక పరికరాల వినియోగంపై ఫైర్ సిబ్బందికి అవగాహన కల్పించారు. -
సులభతరంగా అనుమతులు
చిత్తూరు కలెక్టరేట్ : వినాయక చవితి ఉత్సవ ఏర్పాట్లకు సింగిల్ విండో విధానంలో ఆన్లైన్ ద్వారా సులభతరంగా అనుమతులు మంజూరు చేస్తున్నట్లు ఆర్డీఓ శ్రీనివాసులు తెలిపారు. సోమవా రం ఈ మేరకు చిత్తూరు డివిజన్ పరిధిలోని వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు, పలు శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆర్డీఓ మాట్లాడుతూ చిత్తూరు డివిజన్ పరిధిలో వినాయక చవితి ఉత్సవాలు, విగ్రహాల నిమజ్జన కార్యక్రమాలను ప్రశాంత వాతావరణంలో చేపట్టాలన్నారు. అవసరమైన అన్ని ఏర్పాట్లను శాఖల సమన్వయంతో పకడ్బందీగా పూర్తి చేయాలని సూచించారు. నిర్వాహకులు అనుమతుల కోసం ఆన్లైన్ దరఖాస్తులు ఈ నెల 13వ తేదీ లోపు సమర్పించాలన్నారు. విగ్రహాల నిమజ్జన ప్రక్రియను ఈ నెల 24 లోపు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. మండపాల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసే క్రమంలో ప్రధా న రహదారులను పూర్తిగా మూసివేయకూడదని స్పష్టం చేశారు. ద్విచక్ర వాహనదారులు, అత్యవసర వాహనాలకు రాకపోకలకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. నిమజ్జన ప్రాంతాల్లో అత్యవసర వైద్య సేవలు అందుబాటులో ఉంచాలని సూచించారు. డీఎస్పీ వెంకట నారాయణ మాట్లాడుతూ ఉత్సవాల్లో డీజేలు, అధిక శబ్దం చేసే సౌండ్ సిస్టమ్‌లకు అనుమతి లేదని చెప్పారు. మహిళలు, పిల్లలు ఎక్కువగా వచ్చే అవకాశమున్నందున మండపాల వద్ద కమిటీ సభ్యులే బాధ్యతగా వలంటీర్లను నియమించుకోవాలని సూచించారు. వర్షాభావం, నీటి ఎద్దడి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని భారీ విగ్రహాల జోలికి వెళ్లకుండా పర్యావరణహిత మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్టించి పూజించాలని మున్సిపల్ కమిషనర్ నరసింహ ప్రసాద్ ఉత్సవ నిర్వాహకులకు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో వినాయక ఉత్సవ కమిటీ కన్వీనర్ అట్లూరి శ్రీనివాసులు పాల్గొన్నారు. -
అర్జీదారుల అసంతృప్తి
కలెక్టర్‌కు సమస్యలు విన్నవించుకుంటున్న అర్జీదారులు నిరసన తెలుపుతున్న పిల్లగుండ్లపల్లె వాసులుచిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని క్షేత్రస్థాయి అధికారుల తీరుపై ప్రజలు తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మండల, గ్రామ స్థాయిల్లో అధికారుల చుట్టూ ఏళ్ల తరబడి తిరిగినా సమస్యలు తీరకపోవడంతో బాధితులు చివరి ఆశగా కలెక్టరేట్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)కు తరలివస్తున్నారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్లో కలెక్టర్ సుమిత్ కుమా ర్ గాంధీ అర్జీలను స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన అర్జీదారులు కలెక్టర్ ఎదుట తమ సమస్యలను విన్నవించుకున్నారు. అధికారుల నిర్లక్ష్యం, స్థానిక నాయకుల వేధింపులు, ఆక్రమణలతో తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను కలెక్టర్‌కు విన్నవించుకున్నారు. ఆక్రమణపై నిరసన ఎస్.ఆర్.పురం మండలం, పిల్లిగుండ్లపల్లెకు చెందిన పేద ప్రజలు కలెక్టరేట్లో నిరసన చేపట్టారు. వారు మాట్లాడుతూ కటికపల్లె పంచాయతీలోని 33 మంది పేద, వెనుకబడిన తరగతుల కుటుంబాలకు ప్రభుత్వం కేటాయించిన ఇంటి స్థలాలను కొంతమంది రాజకీయ నాయకులు ఆక్రమించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ స్థలంలో పంటలు సాగు చేస్తున్నారని చెప్పారు. పేదల స్థలాలను ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. స్పందించిన కలెక్టర్, రెవెన్యూ అధికారులను క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లి ఆక్రమణలను తొలగించి నిబంధనల మేరకు బాధితులకు న్యాయం చేయా లని ఆదేశించారు. -
ఎలక్ట్రిక్ బస్సులతో ఆర్టీసీకి ప్రమాదం
చిత్తూరు రూరల్ (కాణిపాకం) : ఎలక్ట్రికల్ బస్సుల నిర్వహణతో ఆర్టీసీ ఉనికికి, ఉద్యోగుల భవిష్యత్తుకు ప్రమాదమని నేషనల్ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీవీ రమణారెడ్డి స్పష్టం చేశారు. సోమవారం చిత్తూరులోని రెవెన్యూ భవనంలో సంఘం జిల్లా అధ్యక్షుడు వి.మోహన్ ఆధ్వర్యంలో జిల్లా విస్తృత స్థాయి సర్వసభ్య సమావేశం నిర్వహించారు. రమణారెడ్డి మాట్లాడుతూ ఎలక్ట్రిక్ బస్సుల రాకతో రాష్ట్రంలో ఇప్పటికే ఆరు డిపోలు మూతపడ్డాయని, మరో కొన్ని డిపోలు కూడా మూతబడే పరిస్థితి కనిపిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎలక్ట్రికల్ బస్సుల నెపంతో ఆర్టీసీ ఉద్యోగులే లేకుండా చేసే ప్రయత్నాలు సాగుతున్నాయని ఆరోపించారు. చిత్తూరు– 1, చిత్తూరు–2 డిపోలతో పాటు తిరుపతిలోని మంగళం డిపోను యథావిధిగా కొనసాగించాలని, ఆయా డిపోల ఉద్యోగులను తిరిగి అక్కడికే తీసుకొచ్చేలా యూనియన్ తరఫున పోరాడుతున్నామని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఎలక్ట్రిక్ బస్సులు వచ్చినా ఆర్టీసీ ఉద్యోగులకే శిక్షణ ఇచ్చి పనిచేయించేలా చర్యలు తీసుకోవాలని ఎండీకి విన్నవించినట్లు వివరించారు. సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శ్రీకర్‌రెడ్డి, కడప జోనల్ అధ్యక్షుడు వినోద్‌బాబు, జోనల్ సంయుక్త కార్యదర్శి బాషా, జోనల్ ఆర్గనైజేషన్ కార్యదర్శి మురుగన్, చిత్తూరు జిల్లా చైర్మన్ రాజారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ గణేష్, వైస్ ప్రెసిడెంట్ సంపూర్ణ, జిల్లా కార్యదర్శి ఆరణి ఉపేంద్ర, సంయుక్త కార్యదర్శి రవీంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు. -
● ముగిసిన లోకల్ సీజన్ ● మార్కెట్‌కు సరుకు తగ్గుముఖం
నిలకడగా టమాటా ధరలు! పలమనేరు : పలమనేరు టమాటా మార్కెట్లో 14 కిలోల బాక్సు ధర రూ.300గా ఉంది. గత పది రోజులుగా ఇదే ధర పలుకుతోంది. స్థానికంగా టమాటా సీజన్ ముగియడంతో ధరలు ఆ మాత్రమైనా ఉన్నాయనే మాట రైతుల్లో వినిపిస్తోంది. సాధారణంగా ఈ ప్రాంతంలో మార్చి నుంచి సెప్టెంబరు వరకు సీజన్ నడుస్తుంది. ఇప్పటికే ఇక్కడి తోటలు ఒడిగిపోయాయి. ఉన్న తోటలు ఈనెలాఖరు కల్లా పూర్తవుతాయి. ఫలితంగా స్థానిక మార్కెట్‌కు రోజుకి 4 నుంచి 5 లారీల సరుకు మాత్రమే వస్తోంది. సీజన్లో అయితే రోజుకు 30 లారీల దాకా టమాటాలు వచ్చేవి. ఏదేమైనా లోకల్‌గా సరుకు ఎక్కువగా ఉన్నప్పుడు ధరల్లేక సీజన్ ముగుస్తున్న సమయంలో కాస్త ధరలు పెరిగినా ప్రయోజనం లేదని రైతులు చెబుతున్నారు. ఎల్‌నిలో ప్రభావంతో వాతావరణంలో మార్పులు ఏర్పడి స్థానికంగా ఎండలు దంచుతున్నాయి. ఇక తమిళనాడులో అయితే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైమాటే. దీంతో తమిళనాడులో టమాటాకు డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా తమిళనాడు నుంచి వ్యాపారులు ఇక్కడి మార్కెట్లకు వస్తున్నారు. మొత్తం మీద సీజన్లో రైతులతో కళకళలాడిన మార్కెట్ సీజన్ ముగుస్తుండడంతో పలుచగా కనిపిస్తోంది. -
సోలార్ పనులు వేగవంతం చేయండి
తిరుపతి రూరల్: ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో ఎస్సీ, ఎస్టీ విద్యుత్ వినియోగదారుల గృహాలపై రూఫ్ టాప్ సోలార్ ఏర్పాటు పనులను వేగవంతం చేయాలని సీఎండీ శివశంకర్ లోతేటి ఆదేశించారు. ఏపీఎస్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయం నుంచి సంస్థ అధికారులతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సిబ్బందితో సమావేశమయ్యారు. ఆయన మాట్లాడు తూ సంస్థ పరిధిలో ఇప్పటివరకు 1.31 లక్షల ఎస్సీ, ఎస్టీ విద్యుత్ వినియోగదారుల గృహాలపై రూఫ్ టాప్ సోలార్ వ్యవస్థలను ఏర్పాటు చేశామని, వాటిలో 1.01 లక్షల సర్వీసులను గ్రిడ్‌కు అనుసంధానం చేసినట్టు వెల్లడించారు. క్షేత్ర స్థాయిలో అధికారులు, సిబ్బందితో పాటు సంబంధిత ఏజెన్సీల సమన్వయంతో సోలార్ ఏర్పాటు పనులను మరింత వేగవంతం చేయాలని సంస్థ అధికారులు, సిబ్బంది, కాంట్రాక్టర్లను ఆదేశించారు. వేగంగా వ్యవసాయ విద్యుత్ సర్వీసుల మంజూరు సంస్థ పరిధిలోని 9 జిల్లాల్లో రైతులకు సకాలంలో వ్యవసాయ విద్యుత్ సర్వీసులను మంజూరు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సంస్థ అధికారులు, సిబ్బందిని సీఎండీ ఆదేశించారు. సంస్థ డైరెక్టర్లు పి. అయూబ్‌ఖాన్, కే.గురవయ్య, చీఫ్ జనరల్ మేనేజర్లు జే.రమణాదేవి, ఎన్.శోభా వాలెంటీనా, ఎం.మురళికుమార్, సీహెచ్ రామచంద్రరావు, కే.సంపత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. పీఎం–కుసుమ్ పనులు వేగవంతం కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పీఎం–కుసుమ్ పథకంలో భాగంగా ఫీడర్ లెవెల్ సోలరైజేషన్ పనులను వేగవంతం చేయాలని సీఎండీ సూచించారు. ఈ పనులను సకాలంలో పూర్తి చేయడం ద్వారా రైతులకు పగటిపూట నాణ్యమైన 9 గంటల విద్యుత్తును సరఫరా చేసేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. -
పట్టాల కోసం ప్రదక్షిణలు
గుడిపాల మండలం, ఏ.ఎల్.పురం గ్రామానికి చెందిన యానాది కులానికి చెందిన మణికంఠ తనకు ఎలాంటి సొంత భూములు లేవని కలెక్టర్‌కు విన్నవించారు. గ్రామ లెక్కల రికార్డుల ప్రకారం సర్వే నెంబర్లు 447–1, 447–2లోని భూమిని పరిశీలించి తనకు పట్టా మంజూరు చేయాలని కోరారు. ఇందుకోసం మండల అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేసినా ప్రయోజనం లేకుండాపోయిందని ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కలెక్టర్ సుమిత్ కుమార్ వెంటనే రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి నిబంధనల ప్రకారం సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. -
చిరుతల సంచారంపై కలకలం
చిత్తూరు కార్పొరేషన్ : నగరంలోని చెన్నమ్మగుడిపల్లె వద్ద చిరుతపులి సంచారంపై అటవీశాఖ సిబ్బందికి సమాచారం అందింది. గత మూడు రోజులుగా ఇటువైపుగా చిరుత సంచరిస్తోందని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మూడు రోజుల క్రితం కుక్కని చంపిందని వెల్లడిస్తున్నారు. . క్షేత్రస్థాయిలో పర్యటించిన ఎఫ్ఆర్ఓ థామస్ అనుమానిత ప్రాంతాల్లో ట్రాక్ కెమెరాలు ఏర్పాటు చేశారు. అలాగే డ్రోన్ కెమెరా ద్వారా పరిసర ప్రాంతాలను పరిశీలించారు. గ్రామీణులు ఒంటరిగా సంచరించరాదని, రాత్రివేళ బయటకు రావద్దని సూచించారు. చిరుత పాదముద్రలను సేకరించి పరిశీలనకు పంపారు. ఎగువమాసాపల్లెలో.. చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరు మండలంలోని ఎగువమాసాపల్లెలో రెండు చిరుతలు సోమ వారం రాత్రి ప్రజలను హడలెత్తించాయి. చెన్నమ్మగుడిపల్లె వద్ద ఉదయం దర్శనమిచ్చిన చిరుతలు..రాత్రికి ఎగువమాసాపల్లెలో హల్చల్ చేశాయి. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి రోడ్డుపై వెళుతుండగా చిరుతలు ప్రత్యక్షం కావడంతో భయపడి పరుగులు పెట్టాడు. వెంటనే పోలీసులు, అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాడు. -
ఎస్సీ విద్యార్థులకు ఆర్థిక భరోసా
చిత్తూరు కలెక్టరేట్ : పేద ఎస్సీ విద్యార్థుల ఉన్నత విద్యకు కేంద్ర ప్రభుత్వం టాప్ క్లాస్ స్కాలర్షిప్ పథకం అమలుచేస్తోంది. దీనికింద 2026–27 విద్యాసంవత్సరానికి దేశవ్యాప్తంగా 2,000 మంది విద్యార్థులకు ఆర్థిక భరోసా కల్పించనుంది. ఇందులో ఎంపికయ్యే విద్యార్థులకు ల్యాప్‌టాప్, స్టేషనరీ, విద్యా సంబంధిత ఖర్చులకు మొదటి సంవత్సరంలో రూ.86 వేలు, ఆ తర్వాత ప్రతి ఏటా రూ.41 వేలు చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తుంది. ప్రైవేట్ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులకు ట్యూష న్ ఫీజుతో పాటు ఇతర ఖర్చులను సైతం మంజూరుచేస్తుంది. అర్హతలు, నిబంధనలు దరఖాస్తు విధానం, గడువు మెరిట్ ఆధారంగా విద్యార్థుల ఎంపిక ప్రక్రియ ఉంటుంది. అర్హత ఉన్న విద్యార్థులు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్‌లో దరఖాస్తులు చేసుకోవాలి. అక్టో బర్ 31వ తేదీ వరకు గడువు ఉంది. వైఎస్సార్సీపీ విస్తృత స్థాయి సమావేశంలో పెద్దిరెడ్డి, భూమన, ప్రజాప్రతినిధులు నియోజకవర్గాల సమన్వయకర్తలుగుర్తింపు కార్డుల పంపిణీ పార్టీ తిరుపతి, చిత్తూరు జిల్లాల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న అన్ని నియోజక వర్గాల సమన్వయకర్తలకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి చేతులమీదుగా గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. త్వరలో అన్ని నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహించి నేతలందరికీ గుర్తింపు కార్డులు అందించనున్నట్లు భూమన వెల్లడించారు. జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, తిరుపతి మాజీ మేయర్ డాక్టర్ శిరీష, మాజీ ఎమ్మెల్యే లలిత థామస్ పాల్గొన్నారు. -
కూటమిపై సమరానికి వైఎస్సార్సీపీ సమాయత్తం
● ఏకగ్రీవాలకు అవకాశం ఇవ్వొద్దు ● గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుదాం ● విస్తృత స్థాయి సమావేశంలో పెద్దిరెడ్డి ● 18న అరణియార్ సందర్శనకు భూమన పిలుపు ‘‘అలవి కాని హామీలు గుప్పించి చంద్రబాబు అధికారం చేపట్టారు. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు దాటినా ఒక్కటీ సక్రమంగా అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారు. అవినీతికి పెద్దపీట వేసి స్కామ్‌లకు తెరతీశారు. ఈ క్రమంలో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. వైఎస్సార్సీపీ శ్రేణులు సమాయత్తం కావాలి. ఏకగ్రీవాలకు అవకాశం ఇవ్వకుండా పోరాట పటిమను ప్రదర్శించాలి. పార్టీ గెలుపే లక్ష్యంగా అడుగులు వేయాలి. ఇందుకోసం బలమైన అభ్యర్థులను బరిలో దించాలి. చంద్రబాబు అక్రమాలను క్షేత్రస్థాయిలో ఎండగట్టాలి. సర్కారు కుట్రలను దీటుగా ఎదుర్కోవాలి. అధినేత ఆదేశాల మేరకు వైఎస్సార్సీపీ జెండాను ఎగురవేసేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలి’’ అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన కరుణాకరరెడ్డి పిలుపునిచ్చారు. తిరుపతిలో ఆదివారం నిర్వహించిన విస్తృతస్థాయి సమావేశంలో నియోజకవర్గాల సమన్వయకర్తలు, ప్రజాప్రతినిధులు, నేతలకు దిశానిర్దేశం చేశారు. తిరుపతి రూరల్ : స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా వైఎస్సార్సీపీ సమరశంఖం పూరించింది. ఎన్నికల సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో పార్టీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, ముఖ్య నేతలతో రీజనల్ కో–ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డి, తిరుపతి, చిత్తూరు జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. స్థానిక ఎన్నికల్లో కూటమిని ఢీకొట్టేందుకు గ్రామస్థాయి నుంచి పార్టీ యంత్రాంగాన్ని సన్నద్ధం చేయాలని స్పష్టం చేశారు. మాజీ మంత్రి ఆర్కే రోజా మాట్లాడుతూ జగనన్న చేసిన పనులను సైతం తన ఖాతా వేసుకుని క్రెడిట్ చోరీ చేసేందుకు చంద్రబాబు తెగబడుతున్నారని ఆరోపించారు. ఈ విషయాలను ప్రజల్లో తీసుకెళ్లి స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి ప్రధాన అస్త్రంగా మార్చాలని కోరారు. చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకుడు చవ్వా రాజశేఖర్ మాట్లాడుతూ సమన్వయకర్తలు విస్తృతంగా పర్యటించి నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకోవాలని సూచించారు. పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయాలని, పోరాటాల పార్టీగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. తిరుపతి పార్లమెంటు పరిశీలకుడు వజ్ర భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ ఎస్ఐఆర్ ప్రక్రియలో పార్టీ నేతలు చూపించిన చొరవను స్థానిక ఎన్నికల్లో కూడా చూపించాలన్నారు. అత్యధిక స్థానాలను కై వసం చేసుకుని జగనన్నకు కానుకగా అందించాలని సూచించారు. వెన్నుపోటు బాబు నైజం వెన్నుపోటు అనేది చంద్రబాబు సహజ నైజమని మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి తెలిపారు. లోకేష్ నుంచి ముఖ్యమంత్రి పీఠం కాపాడుకునేందుకు డీఎస్సీ అక్రమాలకు లీక్ చేసింది చంద్రబాబే అని ఆరోపించారు. తన సీటును రక్షించుకునేందుకు చంద్రబాబు ఎవరినైనా తొక్కేసేందుకు వెనుకాడరని విమర్శించారు. ఇప్పుడు డీఎస్సీ బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తుంటే లోకేష్ అవినీతి బాగోతం బయటపడుతోందని స్పష్టం చేశారు. బాబు పాలనలోనే కరువు చంద్రబాబు ప్రభుత్వం వస్తే రాష్ట్రంలో కరువు వస్తుందని, ఈ కరువు తీరాలంటే బాబు ప్రభుత్వం పోవా లని మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి తెలిపారు. పల్లెల్లో తాగునీటికి ఇబ్బందులు వస్తున్నాయని, జలాశయాలన్నీ ఎండిపోతున్నాయని, భూ గర్భ జ లాలు అడుగంటి పోయాయని వివరించారు. అందుకే వైఎస్.జగన్మోహన్రెడ్డి పాలన కోసం ప్రజలు ఎదు రుచూస్తున్నారని తెలిపారు. నాయకులు, కార్యకర్తలు ప్రజలకు అండగా నిలబడి జగనన్న ఆశయ సాధన కోసం స్థానిక ఎన్నికల్లో శక్తి వంచన లేకుండా పోరాడా లని కోరారు. ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం మాట్లాడుతూ కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు అన్ని చోట్లా స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ జెండాను ఎగురవేస్తామన్నారు. ఎమ్మెల్సీ భరత్ మాట్లాడుతూ కుప్పంలో పోలీసులు రౌడీల్లా వ్యవహరిస్తున్నారని, అయినా సరే స్థానిక ఎన్నికల్లో ఏకగ్రీవానికి అవకాశం లేకుండా చూస్తానని స్పష్టం చేశారు. మాజీ ఎమ్మెల్యే లు వెంకటేగౌడ, డాక్టర్ సునీల్ మాట్లాడుతూ ఏకగ్రీవాలకు తావు లేకుండా అన్ని చోట్లా పోటీ పెట్టి విజయం దిశగా నడిపిస్తామన్నారు. మాజీ ఎంపీ రెడ్డెప్ప మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా గడిపారని, చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. తిరుపతి, చంద్రగిరి, జీడీనెల్లూరు, సత్యవేడు నియోజకవర్గాల సమన్వయకర్తలు భూమన అభినయ్‌రెడ్డి, చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి, కృపాలక్ష్మి, నూకతోటి రాజేష్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలకు పోటీ చేసేందుకు నేతలు పోటీలు పడుతున్నారన్నారు. ప్రతి పంచాయతీలో బలమైన అభ్యర్థులను నిలబెట్టి గెలిపిస్తామని స్పష్టం చేశారు. సీమకు తీరని అన్యాయం ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ రాయలసీమ నుంచి కీలక సంస్థలు ఇతర ప్రాంతాలకు తరలిపోతున్నాయని ఆరోపించారు. నేషనల్ ఫోరెన్సిక్ యూనివర్సిటీతో పాటు 16 మేజర్ ఇన్స్టిట్యూట్లు వెళ్లిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులను నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. కేంద్రం నుంచి వచ్చే నిధులను పక్కదారి పట్టిస్తూ పేదల ఆర్థికాభివృద్ధిని ప్రశ్నార్థకంగా మార్చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు పాలనలో అన్ని వర్గాల ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని, జగనన్న రాకకోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారన్నారు. ఈవీఎంలను అడ్డుపెట్టుకుని స్థానిక ఎన్నికల్లో మరోసారి కుట్రలకు తెగబడితే కలసికట్టుగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. -
గ్రీష్మం..
పెరిగిన విద్యుత్ వాడకం గత 40 రోజులుగా జిల్లాలో ఉష్ణోగ్రతల్లో చోటు చేసుకున్న విపరీతమైన మార్పులు ప్రజల జీవన విధానంలో స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో ఎప్పుడూ ఆగస్టు–సెప్టెంబరు నెలల్లో రాత్రి వేళల్లో పెద్దగా ఏసీలు వాడే పరిస్థితిలేదు. కానీ తాజాగా ఏసీలు ఉన్న ప్రతి ఇంట్లోనూ రాత్రింబవళ్లు తప్పకుండా వాడాల్సి వస్తోంది. ఈ వేసవి సమయంలో మే నెలలో జిల్లాలో అత్యధికంగా 331.18 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను వినియోగించగా ఆగస్టు నెలలో ఏకంగా 410 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను వినియోగించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. విద్యుత్ అధికారులు సైతం ఈ గణాంకాలను చూసి షాక్‌కు గురవుతున్నారు. జిల్లాలో ప్రస్తుతం గ్రీష్మ రుతువు నడుస్తోందన్నట్టు ఉంది వాతావరణం. వర్షాకాలం ముదిరి వానలు దంచి కొట్టాల్సిన ఆగస్టులోనూ ఎండలు అగ్నిగుండంలా మాడుస్తున్నాయి. ఉదయం 8 గంటలకే సూర్యుడు భగభగమంటున్నాడు. మే–జూన్‌లో వచ్చే రోహిణి కార్తెలో రోళ్లు పగిలిపోతాయని పెద్దలు చెబుతుంటారు. కానీ ఇప్పుడున్న ఎండలకు పుర్రెలే పలిగిపోతాయేమో అనేంతగా భయం వేస్తోంది. మృగశిరలో చిరు జల్లులు కురవాలని, శ్రావణం తరువాత విస్తారంగా వర్షాలు పడతాయని రుతువుల గురించి మనం పాఠ్యాంశాల్లో చదుకున్నాం. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఓటీటీల్లో వచ్చే వెబ్–సిరీస్ సీజన్–2ను తలపించేలా ఉంది జిల్లాలో సూర్యుడి ప్రతాపం. సీజన్–2.ఓ!చిత్తూరు: చిత్తూరు నగరం నుంచి కుప్పం వరకు గత నెల రోజులుగా ఉష్ణోగ్రతల్లో విపరీతమైన మార్పులు కనిపిస్తున్నాయి. ఉదయం 7 గంటల నుంచే చిత్తూరు లాంటి ప్రదేశాల్లో సూర్యుడి ఎండ ధాటిని ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. సూర్య నమస్కారాలు చేసే సమయంలోనూ భానుడిని తలెత్తి చూసే పరిస్థితి కనిపించడంలేదు. ఇక ఉద యం 11 నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు ఎండ ఎక్కువగా కాస్తోంది. వేడి గాలులు, ఉక్కపోతలతో ప్రజలు అల్లాడుతున్నారు. చిత్తూరు జిల్లాలో పలమనేరు దాటుకున్న తరువాత కుప్పం వరకు ఉష్ణోగ్రతలు సాధారణంకంటే తక్కువగా నమోదవుతూ ఉంటా యి. గత 40 రోజులుగా ఈ ప్రాంతాల్లో కూడా ఎండ తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. చిత్తూరుతో పోలిస్తే మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవడం తప్ప.. వేడిమిలో ఎలాంటి మార్పు కనిపించడంలేదు. ఎక్కడా కూడా పగటి ఉష్ణోగ్రతలు 36 డిగ్రీలకు తగ్గడంలేదు. చిత్తూరులో గత రెండు రోజుల్లో ఏకంగా 38, 39 డిగ్రీల ఉష్ణోగత్ర నమోదుకావడం వేసవి రికార్డులను బద్దలు కొడుతోంది. వెలవెలబోతున్న నిత్యం రద్దీగా ఉండే కాణిపాకం–తిరుపతి బైపాస్ రోడ్డు ఎండల తీవ్రతకు నిర్మానుష్యంగా మారిన చిత్తూరులోని గాంధీ రోడ్డు జిల్లాలో బెంబేలెత్తిస్తున్న ఎండలు జిల్లాలో గత వారం నమోదైన ఉష్ణోగ్రతలు డిగ్రీల్లో 1వ తేదీ 2వ తేదీ 3వ తేదీ 4వ తేదీ 5వ తేదీ 6వ తేదీ 37 39 36 36.5 38 39.5 -
యాదవుల ఐక్యతకు కంకణబద్దులు కావాలి
చిత్తూరు రూరల్ (కాణిపాకం): యాదవుల సామాజిక, ఆర్థిక, రాజకీయ అభివృద్ధి కోసం గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు సంఘాన్ని మరింత బలోపేతం చేయడానికి కంకణబద్దులు కావాలని అఖిల భారత యాదవ మహాసంఘం నాయకులు పిలుపునిచ్చారు. చిత్తూరు నగరంలోని ఓ భవనంలో ఆదివారం జిల్లా అఖిల భారత యాదవ మహా సంఘం జిల్లా కార్యవర్గ సమావేశాన్ని జిల్లా అధ్యక్షుడు నవీన్ యాదవ్ అధ్యక్షతన నిర్వహించారు. జాతీయ అధ్యక్షుడు బుసగాని లక్ష్మయ్య యాదవ్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గంగాదేవి గంగయ్య యాదవ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరువాటి వెంకట మునియాదవ్, ఉపాధ్యక్షుడు ఓబులరెడ్డి యాదవ్, రాష్ట్ర అధికార ప్రతినిధి ఆవుల గోపియాదవ్, రాయలసీమ జోన్ మహిళా అధ్యక్షురాలు గాయత్రి యాదవ్, ప్రచార కార్యదర్శి చాట మునిరాజా యాదవ్, తిరుపతి టౌన్ అధ్యక్షుడు గాలం వెంకటేష్ యాదవ్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కాణిపాకం బ్రహ్మోత్సవాల్లో ఉభయం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో యాదవులకు ఒకరోజు ఉభయం కేటాయించాలని తీర్మానించారు. చిత్తూరు గోపాలపురంలోని చిత్తూరు యాదవ కల్చరల్ అండ్ వెల్ఫేర్ ట్రస్ట్‌లో అఖిల భారత యాదవ మహా సంఘం జిల్లా సభ్యులకు భాగస్వామ్యం కల్పించాలని కోరారు. అలాగే 12 వేల చదరపు అడుగుల స్థలంలో యాదవ భవన్, కల్యాణ మండపాన్ని నిర్మించాలని నిర్ణయించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీల నుంచి యాదవులు అధిక సంఖ్యలో సీట్లు సాధించేలా కృషి చేయాలని పేర్కొన్నారు. పోటీ చేసే యాదవ అభ్యర్థుల గెలుపునకు మహాసంఘం పూర్తి సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు. జిల్లాలో యాదవులపై దాడులు జరిగితే బాధితులకు సంఘం అండగా నిలిచి పోరాడుతుందని వెల్లడించారు. అలాగే బీసీల భద్రత కోసం ప్రభుత్వం తక్షణమే ప్రత్యేక రక్షణ చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. సమావేశంలో జిల్లా గౌరవాధ్యక్షుడు కోదండ యాదవ్, ఉపాధ్యక్షులు ఎం.కోదండ యాదవ్, జనార్దన్ యాదవ్, వాసు యాదవ్, లక్ష్మీపతి యాదవ్, ప్రధాన కార్యదర్శి కుమార్ యాదవ్, మహిళా విభాగం అధ్యక్షురాలు రాణి యాదవ్, ప్రధాన కార్యదర్శి ప్రతిభ యాదవ్, ఉపాధ్యక్షురాలు కుమారి యాదవ్, పలు మండలాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు. -
బ్రహ్మోత్సవ ఏర్పాట్లు శరవేగం
కాణిపాకం: శ్రీ స్వయంభు వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానంలో 2026 వార్షిక బ్రహ్మోత్సవాలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆలయ అధికారుల ఆధ్వర్యంలో ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఆలయ ప్రాంగణంలో విద్యుద్దీపాల అలంకరణలు, రంగుల అలంకరణ తదితర పనులను అధికారులు ముమ్మరం చేశారు. స్వామివారి ఉత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సర్వాంగ సుందరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయంలోకి వర్షపు నీరు నాగలాపురం: నాగలాపురంలో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. శ్రీ వేదనారాయణ స్వామి ఆలయంలోకి నీరు చేరింది. ఆలయ ప్రాంగణంలో మోకాళ్ల లోతు వరకు వర్షపు నీరు రావడంతో భక్తులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఆలయం నుంచి వర్షపు నీరు సక్రమంగా బయటకు వెళ్లేలా డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని భక్తులు కోరుతున్నారు. రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి నాగలాపురం : మండలంలోని సుబ్బానాయుడు కండ్రిగ వద్ద ఆదివారం చైన్నె హైవేపై జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందారు., మరొకరు గాయపడ్డారు. వివరాలు.. నాగలాపురం తూర్పు దళితవాడకు చెందిన సత్యరాజ్ (36) ద్విచక్రవాహనంలో ఊత్తుకోటైకి బయలుదేరాడు. తమిళనాడులోని తండల గ్రామానికి చెందిన ప్రభాకర్ నందనం వస్తుండగా రెండు వాహనాలు ఎదురెదురుగా డీకొన్నాయి. క్షతగాత్రులను 108లో నాగలాపురం ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలిస్తుండగా మార్గం మధ్యలో సత్యరాజ్ మరణించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సునీల్ తెలిపారు. దళారుల గుప్పిట్లో ధాన్యం తిరుపతి అర్బన్ : ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం అమ్ముకోలేక రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. దళారుల గుప్పిట్లో చిక్కుకుని అవస్థలు ఎదుర్కొంటున్నారు. వ్యాపారులు సిండికేట్‌గా మారి దళారులతో కుమ్మకై ్క అన్నదాతలను నిలువునా దోచుకుంటున్నారు. గత రబీ సీజన్లో 1.40 లక్షల హెక్టార్లలో వరి పంటను సాగుచేశారు. ఈ ఖరీఫ్‌లో 1.10 లక్షల హెక్టార్లలో వరి పంట సాగైంది. ఈ ఏడాదిలో రెండు సీజన్లకు సంబందించి 2.50 లక్షల హెక్టార్లలో వరి పంట సాగు చేశారు. ఇందులో 20 శాతం వరకు ధాన్యాన్ని సుమారు 30 ఏళ్లుగా శ్రీకాళహస్తిలోని ఏపీ సీడ్స్ కొనుగోలు చేసేది. ఏడాది క్రితం నుంచి ఏపీ సీడ్స్ నష్టాల పేరుతో ధాన్యం కొనుగోళ్లు నిలిపివేసింది. విత్తనాలు మాత్రమే పంపిణీ చేస్తామని స్పష్టం చేసింది. ఇదే వ్యాపారులు, దళారులకు వరంగా మారింది. తాము చెప్పిందే రేటు అన్నట్లు రైతులను దగా చేస్తున్నారు. తక్కువ ధరకు ధాన్యం కొల్లగొడుతున్నారు. వ్యాపారులు చెప్పిందే వేదం వ్యాపారులు గతంలో బస్తా ధాన్యం (75 కేజీలు) కొనుగోలు చేసిన 24 గంటల నుంచి 72 గంటల్లోనే రైతుకు నగదును ఇచ్చేవారు. ప్రస్తుతం బస్తా ధాన్యం 80 కేజీల లెక్కన తీసుకుంటున్నారు. దీంతో రైతులు బస్తాపై 5 కేజీలు నష్టపోతున్నారు. దీనిపై ప్రశ్నిస్తే ధాన్యం నెమ్ముగా ఉందని, దాంతోనే 5 కేజీలు అదనంగా వేసుకుంటున్నామంటూ తెగేసి చెబుతున్నారు. కాదంటే తమ ధాన్యం కొనుగోలు చేసేవారు లేకపోవడంతో రైతులు చేసే దిలేక విక్రయిస్తున్నారు. మరోవైపు ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత నగదు ఇవ్వడానికి రెండు వారాలు సమయం పడుతుందని దళారులు ముందే చెప్పేస్తున్నారు. తీరా నగదు ఇచ్చే సరికి నాలుగు వారాల సమయం పడుతోంది. దీంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. -
● జిల్లాలో ఒకరికే రాష్ట్ర స్థాయి అవార్డు ● సీఎం నుంచి అవార్డు అందుకున్న మల్లేపు రుక్మిణి
చెరువులకు సెలవుల గండం కార్వేటినగరం: కొంతమంది అక్రమార్కులు ప్రభుత్వ సెలవు రోజులు వస్తే చాలు చెరువులు, వాగులు, వంకలు, గుట్టలను చెరబడుతున్నారు. జేసీబీలతో యథేచ్ఛగా తవ్వకాలు చేపట్టి మట్టిని ట్రాక్టర్లలో తరలిస్తున్నారు. గత వారం సిద్దేశ్వర గుట్టను గుండు కొట్టారు. ఈ వారం ఎస్టీకాలనీ సమీపంలో ఉన్న పద్మసరస్సు చెరువును చెరబట్టారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా జేసీబీలతో తవ్వకాలు చేపడుతున్నారు. అధికారులు మామూళ్లు తీసుకుని చూసీచూడనట్టు వ్యవహరిస్తుండడం వల్లే జేసీబీ యజమానులు మట్టి తవ్వకాలు చేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. లేకుంటే వారికి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందని చెబుతున్నారు. ఇప్పటికై నా జిల్లా అధికారులు స్పందించి అక్రమ మట్టి తవ్వకాలపై ప్రత్యేక దృష్టిసారించాలని కోరుతున్నారు. అక్రమ తవ్వకాలను ఆపకుంటే తామే రంగంలోకి దిగాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అభినందనీయం చిత్తూరు కలెక్టరేట్ : బోధనలో చూపిన ప్రతిభ, క్రమశిక్షణ, విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ, బోధనారంగంలో అందించిన విశేష సేవలకు గాను సావిత్రమ్మ మహిళా ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకురాలు మల్లేపు రుక్మిణికి రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు లభించింది. ఈ నెల 5న ఆమె విజయవాడలో సీఎం చంద్రబాబునాయుడు, విద్యాశాఖ మంత్రి లోకేష్ చేతుల మీదుగా అవార్డు స్వీకరించారు. ఆమెను ఆదివారం కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు అభినందించారు. జిల్లా వ్యాప్తంగా పలువురు అధ్యాపకులు రాష్ట్ర స్థాయి అవార్డుకు దరఖాస్తు చేసుకోగా రుక్మిణికి మాత్రమే అవార్డు దక్కింది. ఆమె ఇప్పటి వరకు జాతీయ స్థాయిలో 8 ప్రధాన సదస్సులు నిర్వహించారు. 2 పుస్తకాలను రాశారు. 6 గ్రంథాలకు సంపాదకురాలిగా వ్యవహరించారు. వివిధ అంతర్జాతీయ, జాతీయ జర్నల్స్‌లో 75కి పైగా పరిశోధనా వ్యాసాలను ప్రచురించారు. రూ.23,18,700 అంచనా వ్యయంతో మైనర్ రీసెర్చ్ ప్రాజెక్ట్‌ను విజయవంతంగా పూర్తి చేసి విద్యా, పరిశోధనా రంగంలో ప్రత్యేకతను చాటుకున్నారు. -
జెడ్పీ కార్యాలయాల గుర్తింపు
చిత్తూరు కార్పొరేషన్: ఈ నెల 24వ తేదీతో ఉమ్మడి చిత్తూరు జెడ్పీ పాలకవర్గం గడువు ముగియనుంది. కొత్త పాలక వర్గాలను ఎన్నుకోకపోతే కేంద్ర ఆర్థిక సంఘం నిధులు రావు. తద్వారా పల్లెల్లో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోతాయి. ఈ క్రమంలో ప్రభుత్వం విధిలేక స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సెప్టెంబర్ 25 నుంచి జెడ్పీ పాలన కొత్త జిల్లాల నందు ప్రారంభించాలని ఉత్తర్వులు జారీ చేసింది. అందులో భాగంగా చిత్తూరు కేంద్రంగా సాగుతున్న ఉమ్మడి జిల్లా జెడ్పీ పాలన ఇక మారనుంది. మరో 17 రోజుల్లో తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లోని కొత్త జెడ్పీ కార్యాలయాల నుంచి పాలన ప్రారంభించనున్నారు. అందుకుగాను తిరుపతిలో చంద్రగిరి ఎంపీడీఓ కార్యాలయం, మదనపల్లెలో జెడ్పీ బంగ్లాలో కార్యాలయాలను ఏర్పాటు చేయనున్నారు. కొత్తగా తిరుపతి, అన్నమయ్య జిల్లాలకు సీఈఓలు, డిప్యూటీ సీఈఓలను నియమించనున్నారు. రిజర్వేషన్‌పై ఉత్కంఠ జెడ్పీల విభజన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం చూస్తోంది. అందులో భాగంగా జిల్లాల వారిగా జెడ్పీటీసీ, చైర్మన్ల పరంగా రిజర్వేషన్ చేపట్టడానికి చర్యలు తీసుకుంటున్నారు. దీంతో అన్ని వర్గాల్లోనూ ఉత్కంఠ నెలకొంది. గతంలో చిత్తూరు జిల్లా బీసీకి రిజర్వు అయిన విషయం తెలిసిందే. ఉమ్మడి జిల్లాలో 65 జెడ్పీటీసీలు, 877 ఎంపీటీసీలు ఉన్నారు. ఆ లెక్కన తీసుకుంటే చిత్తూరు జిల్లాకు 27 జెడ్పీటీసీలు, తిరుపతి జిల్లాకు 19, అన్నమయ్య జిల్లాకు 19 మంది జెడ్పీటీసీలు వస్తారు. చిత్తూరు జిల్లాలో ఎంపీటీసీల సంఖ్య 370, తిరుపతి జిల్లాలో 253, అన్నమయ్య జిల్లాలో 254 మంది వస్తారు. కొత్త జెడ్పీల ప్రతిపాదికన చిత్తూరు జిల్లాలో 27 జెడ్పీటీసీలు, తిరుపతి జిల్లాలో 35 జెడ్పీటీసీలు, అన్నమయ్య జిల్లాలో 25 జెడ్పీటీసీలు వస్తారు. ఉద్యోగుల పంపకం జెడ్పీ పరిధిలో వివిధ కేటగిరీల కింద మొత్తం 650 మంది ఉద్యోగులు ఉన్నారు. వారిలో ఎంపీడీఓలు, డిప్యూటీ ఎంపీడీఓలు 130 మంది, ఏఓలు 79 మంది, ఎస్ఏలు 135 మంది, జేఏలు, టైపిస్టులు 350 మంది, రికార్డు అసిస్టెంట్లు, అటెండర్లు, వాచ్మెన్లు, డ్రైవర్లు 275 మంది ఉన్నారు. వారిలో సీనియారిటీ జాబితాను సిద్ధం చేసి సీనియర్లను పాత జిల్లాలో ఉంచి జూనియర్లను కొత్త జిల్లాలకు నిష్పత్తి ప్రకారం పంపనున్నారు. 109 ఏళ్ల భవనం చిత్తూరులోని జెడ్పీ కార్యాలయాన్ని 1917 జనవరి 18న అప్పటి ఐపీఎస్ అధికారి బ్రెయిడ్ఉడ్ ప్రారంభించారు. 109 సంవత్సరాలుగా ఉన్న ఈ భవనం ఇప్పటికీ చెక్కుచెదరకుండా చరిత్రకు ఆనవాళ్లుగా నిలుస్తోంది. అప్పటి కాలం ఇంజినీర్లు, పనివిధానానికి ప్రతీకగా కనిపిస్తోంది. ఇప్పటి మరమ్మతులు చేస్తున్నా పెద్ద స్థాయిలో ఏమీ చేయలేదు. అప్పటి కాలం తలుపులు, కిటీకీలు మార్చకుండా వాడుతున్నారు. మదనపల్లెలోని బంగ్లాలో ఏర్పాటు కానున్న అన్నమయ్య జిల్లా జెడ్పీ చంద్రగిరి ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు కానున్న తిరుపతి జెడ్పీ కార్యాలయం 1962 నుంచి మనుగడలో 1959లో అమలులోకి వచ్చిన ఆంధ్రప్రదేశ్ పంచాయతీ సమితి, జిల్లా ప్రజా పరిషత్ చట్టం ప్రకారం చిత్తూరు జిల్లా ప్రజా పరిషత్ ఏర్పడింది. అంతకుముందు బ్రిటీష్ కాలంలో ఏర్పాటు చేసిన జిల్లా బోర్డు వ్యవస్థలో 1921 – 59 వరకు పలువురు ప్రముఖులు అధ్యక్షులుగా కొనసాగారు. జెడ్పీల పాలకవర్గం ఎన్నికయ్యాక 1962లో అద్దూరి బలరామరెడ్డి మొదటి చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. గత 64 సంవత్సరాల్లో 31 మంది చైర్మన్లుగా వ్యవహరించారు. అందులో 12 మంది స్పెషల్ ఆఫీసర్లుగా కలెక్టర్లు, జేసీలు పాలన కొనసాగించారు. వరుసగా చూస్తే రెడ్డివారి నాదమునిరెడ్డి, నాగిరెడ్డి, రామలింగారెడ్డి, విశ్వనాథరెడ్డి, రామస్వామి, కుతూహలమ్మ, రామకృష్ణారెడ్డి, రాజశేఖర్, రామేగౌడు, శ్రీనాథరెడ్డి, శ్రీనివాస్, సిద్దరామరెడ్డి, గోవిందస్వామి, రెడ్డెమ్మ, సుబ్రమణ్యంరెడ్డి, కుమార్‌రాజా, గీర్వాణి పనిచేశారు. ఉమ్మడి చివరి జెడ్పీ చైర్మన్‌గా గోవిందప్ప శ్రీనివాసులు పనిచేస్తున్నారు. అలాగే ప్రత్యేకాధికారులుగా కలెక్టర్లు రాజాజీ, రామకృష్ణయ్య, సంపత్, సుబ్బారావు, జనార్దన్‌నాయుడు, ఆనంద్, వెంకటేశ్వర్లు, సాల్మన్ఆరోగ్యరాజ్, రాంగోపాల్, నారాయణభరత్‌గుప్తా, మార్కండేయులు, హరినారాయణన్ బాధ్యతలు నిర్వహించారు. ఇప్పటి వరకు 65 మంది జెడ్పీటీసీ సభ్యులు ప్రాతి నిధ్యం వహిస్తుండగా, కొత్త జిల్లాల ప్రాతిపదికన తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో ఆయా జిల్లాల పరిధిలోని పరిస్థితుల ఆధారంగా కొత్తగా జెడ్పీటీసీలను, చైర్మన్, వైస్ చైర్మన్లను ఎన్నుకుంటారు. అధికారులు ఎన్నికలకు సిద్ధమవుతూ ముందస్తు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. -
వసతులు కనుమరుగు
చిత్తూరు రూరల్ (కాణిపాకం ): పెట్రోల్ బంకుల్లో వినియోగదారులకు వసతులు కనుమరగయ్యాయి. లీటరు ఇంధనానికి రూ.వందలు గుంజుతున్న నిర్వా హకులు కనీస వసతులు కల్పించడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 146 పెట్రో ల్ బంకులు ఉండగా, వీటిలో అత్యధిక శాతంలో కనీస సౌకర్యాలు కల్పించలేదని పౌర సరఫరాలు, లీగల్ మెట్రాలజీ అధికారుల తనిఖీల్లో తేలింది. జిల్లాలోని జాతీయ రహదారులు సహా అంతర్రాష్ట్ర సరిహద్దు మార్గాల్లో రోజూ వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రయాణికుల రద్దీని ఆసరాగా చేసుకుని ఇంధన విక్రయాల ద్వారా కాసుల పంట పండించుకుంటున్న యంత్రాంగాలు అత్యవసర వసతులకు బొందపెట్టాయి. జిల్లాలోని మెజారిటీ పెట్రోల్ బంకుల్లో మరుగు దొడ్ల నిర్వహణ కనిపించడం లేదు. ప్రయాణికులు అడిగితే తాళం చెవులు ఇవ్వకపోవడం లేదా లోపల శుభ్రత లేక దుర్వాసన వెదజల్లుతుండటంతో మహిళలు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బోర్డులకే పరిమితమైన ఫ్రీ ఎయిర్ పలు బంకుల్లో ఉచిత గాలి సౌకర్యం పేరుకే తప్ప అమలులో లేదు. మెజారిటీ బంకుల్లో ఎయిర్ పంప్ పనిచేయడం లేదు అనే బోర్డులు వేలాడదీయడం లేదా ఆపరేటర్లను అందుబాటులో ఉంచకపోవడం పరిపాటిగా మారింది. తాగునీటి సౌకర్యం నిల్ మండుతున్న ఎండలు, ప్రయాణ అలసట నుంచి ఉప శమనం పొందేలా బంకుల్లో తాగునీటి సదుపాయం కల్పించాల్సి ఉన్నా శుద్ధి చేసిన నీరు అటుంచి కనీసం మూతలున్న డ్రమ్ములు కూడా ఏర్పాటు చేయడం లేదు. కాగితాలకే పరిమితమైన భద్రత ప్రమాదాలు సంభవిస్తే ఆర్పేందుకు ఉంచాల్సిన ఫైర్ ఎక్స్టింగిషర్లు కాగితాలకే పరిమితమయ్యాయి. కాలం చెల్లిన సిలిండర్లు, ఖాళీ ఇసుక బకెట్లతో కాలం వెళ్లదీస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 146 పెట్రోల్ బంకుల్లో నిబంధనలు పాటించడం లేదని అధికారుల తనిఖీల్లో తేలినా చర్యలు తీసుకోవడంలో ఉదాసీనత కనిపిస్తోంది. తక్షణమే అధికారులు స్పందించి బంకుల్లో కనీస సదుపాయాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో భారీ జరిమానా విధించడంతో పాటు అవసరమైతే లైసెన్సులు రద్దు చేయాలని జిల్లా ప్రజలు, వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు. -
హామీలు ఘనం.. అమలు శూన్యం
చిత్తూరు కలెక్టరేట్ : ఎన్నికల్లో ఉద్యోగ, ఉపాధ్యా య, పెన్షనర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా సీఎం చంద్రబాబు తూతూమంత్రంగా చర్చలు జరపడం దారుణమని వెఎస్సార్ సీపీ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాదిరెడ్డి విజయసింహారెడ్డి విమర్శించారు. ఆయ న ఆదివారం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలోని లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగుల దీర్ఘకాలిక న్యాయమైన డిమాండ్లపై ఈ నెల 5న సీఎం చంద్రబాబు ఉద్యోగ సంఘాలతో నిర్వహించిన చర్చలకు ఫలితం లేదన్నారు. ఏ ఒక్క సమస్యకు అర్థవంతమైన ముగింపు ఇవ్వకపోవ డం దారుణమన్నారు. సంఘాల నాయకులు లాలూచీ పడి ఉద్యోగ వర్గాల ప్రయోజనాలను ఫణంగా పెట్టారని ఆరోపించారు. ప్రస్తావనకు రాని కీలక సమస్యలు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం పీఆర్సీ నియమించడానికి ముఖ్యమంత్రి అంగీకరించారని నాయకులు చెబుతున్నారని, అది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందన్న దానిపై స్పష్టత లేదని విజయసింహారెడ్డి తెలిపారు. నూతన పీఆర్సీ ఆలస్యమయ్యే క్రమంలో ఉద్యోగులకు తక్షణం ఐఆర్ ఇచ్చే అంశాన్ని ప్రస్తావించకపోవడం గమనార్హమన్నారు. సీపీఎస్ ఉద్యోగుల భవిష్యత్తుపై ఎలాంటి చర్చ జరగకపోవడంపై ఆ ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో, నిరాశ చెందుతున్నారని పేర్కొన్నారు. 2 డీఏలకే సంబరాలా? రాష్ట్రంలో ఉద్యోగులకు 5 డీఏలు పెండింగ్‌లో ఉండగా ప్రభుత్వం 2 డీఏలు ఇస్తామని చెబితే ఉద్యోగ సంఘాల నాయకులు హర్షాతిరేకాలు వ్యక్తం చేయ డం వెనుక అంతర్యమేమిటో అర్థం కావడం లేదని విజయసింహారెడ్డి తెలిపారు. ఉద్యోగుల హక్కుల కోసం శల్య సారథ్యం వహిస్తూ, తమ స్వార్థం కో సం ఉద్యోగుల ప్రయోజనాలను బలిపెడుతున్న నా యకుల అసలు రంగును ప్రతి ఒక్కరూ గ్రహించాల ని తెలిపారు. ఇకనైనా ప్రభుత్వం, ఉద్యోగ సంఘాల నాయకులు కళ్లు తెరిచి దీర్ఘకాలిక డిమాండ్లపై నిర్దిష్టమైన కాలపరిమితితో కూడిన స్పష్టమైన నిర్ణ యాలు ప్రకటించేలా చొరవ చూపాలని కోరారు. -
నేడు ఓటర్ల తుది జాబితా
చిత్తూరు కార్పొరేషన్: పంచాయతీ ఎన్నికల నిర్వహించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన గ్రామసభలు ఆదివారం ముగిశాయి. జిల్లాలోని 27 మండలాలు 622 పంచాయతీల్లో 10,26,821 మంది ఓటర్లు ఉండగా అందులో 7,52,331 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఉన్నట్లు ముసాయిదా జాబితాలో ప్రకటించారు. వాటిని పంచాయతీల వారీగా ప్రభుత్వ కార్యాలయాల వద్ద ప్రదర్శించారు. అభ్యంతరాలు స్వీకరించారు. గత 5 రోజులుగా పల్లెల్లో గ్రామసభలు నిర్వహించి ఓటర్ల జాబితాపై విచారణ చేశారు. ఇందులో ఆమోదం పొందినవి తుది జాబితాగా సిద్ధం కానున్నాయి. వాటిని సోమవారం కలెక్టర్ సుమిత్‌కుమార్‌కు అందజేయనున్నారు. ఆయన ఆమోదం తెలిపితే అదే రోజు ప్రకటించనున్నట్లు డీపీఓ సుధాకర్‌రావు తెలిపారు. శ్రీవారి దర్శనానికి 24 గంటలు తిరుమల: తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్ తిరుమలలోని బాట గంగమ్మ ఆలయం వద్దకు చేరింది. శనివారం అర్ధరాత్రి వరకు 84,176 మంది స్వామిని దర్శించుకున్నారు. 36,673 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.74 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని వారికి 24 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లున్న వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకుంటున్నారు. -
సాహిత్యంతోనే సమాజ చైతన్యం
పలమనేరు: సాహిత్యంతోనే సమాజ చైతన్యం సాధ్యమని, అలాగే సాహిత్యం సమాజానికి విలువైన కానుకలా ఉండాలని తిరుపతి వేద విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్యరాణి సదాశివ మూర్తి తెలిపారు. పలమనేరు పట్టణంలోని కళామందిరంలో ఆదివారం జొన్నవిత్తుల సాహిత్య స్పూర్తి పురస్కారాలు ప్రదానం చేశారు. ఇందులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రామక్రిష్ణ శర్మ రచించిన శబరి శ్రీరాముడు గ్రంథాన్ని ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ ఈ గ్రంథంలో భారతీయ తాత్విక చింతనలోని ఔన్నత్యం కనిపిస్తోందన్నారు. జొన్నవిత్తుల రామక్రిష్ణశర్మ సాహిత్యం భవిష్యత్తు తరాలకు విలువైన కానుకని కొనియాడారు. అనంతరం రామకృష్ణమ్మ, లక్ష్మీ సరసమ్మల జ్ఞాపకార్థం ఈ పురస్కారాన్ని యువ కవి పరిమి పరామనాథ్కు అందజేశారు. యువ రచయిత రాసిన హృదయావి గ్రంథ పరిచయాన్ని ఆముదాల మురళి చేపట్టారు. కార్యక్రమంలో ప్రముఖ రచయితలు కే రాజ్యలక్ష్మి, కట్టమంచి బాలకృష్ణారెడ్డి, పలమనేరు బాలాజీ, దేవేంద్రాచారి. రజిని, మిఠాయు యుగంధర్, కు మారస్వామి రెడ్డి, సిద్ధార్థ తదితరులు పాల్గొన్నారు. -
గెలుపే లక్ష్యంగా కృషి
బైరెడ్డిపల్లె : స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కృషి చేయాలని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం బైరెడ్డిపల్లెలో వైఎస్సార్సీపీ నేతలతో సమావేశం నిర్వహించారు. ఎంపీ మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి చిత్తశుద్ధితో పనిచేయాలని కోరారు. ఒక్క స్థానం కూడా ఏకగ్రీవం కాకుండా అన్నిచోట్లా అభ్యర్థులను పోటీపెట్టాలని స్పష్టం చేశారు. ఎవరై అధైర్య పడాల్సిన అవసరం లేదని, తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఎంపీపీ మొగసాల రెడ్డెప్ప, జెడ్పీటీసీ సభ్యుడు ఆర్.కేశవులు, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి బైరెడ్డిపల్లె కృష్ణమూర్తి పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో రైతు మృతి
బంగారుపాళెం: మండలంలోని గుండ్లకట్టమంచి వద్ద శనివారం గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ రైతు మృతి చెందాడు. గుండ్లకట్టమంచి దళితవాడకు చెందిన రైతు వెంకటేష్ (59) పొలం నుంచి ఇంటికి వెళుతుండగా ప్రమా దం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బంగారుపాళెం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యువకుడి ఆత్మహత్య పలమనేరు: పట్టణ సమీపంలోని ఓ చెట్టుకు అయ్యప్ప(28) అనే యువకుడు శనివారం ఉరేసుకున్నాడు. అనారోగ్య సమస్యల కారణంగానే ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలిసింది. దీనిపై పోలీసులకు ఎలాంటి సమాచారం లేదని సీఐ మోహన్‌రెడ్డి తెలిపారు. -
ట్రాన్స్‌కో ఉద్యోగుల సంఘ కార్యవర్గం ఏకగ్రీవం
చిత్తూరు కార్పొరేషన్: ట్రాన్స్‌కో విద్యుత్ ఉద్యోగుల సంఘం ఉమ్మడి జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈమేరకు తిరుపతిలో జరిగిన సర్వసభ్య సమావేశంలో జిల్లా కొత్త కార్యవర్గ వివరాలను ఎన్నికల అధికారి వాసుదేవరెడ్డి ప్రకటించారు.జిల్లా అధ్యక్షుడిగా మధుబాబు, జిల్లా కార్యదర్శిగా చంద్రమౌళి, జిల్లా కార్యనిర్వహక కార్యదర్శిగా వాసుదేవనాయుడు, జిల్లా కోశాధికారిగా గజేంద్ర, జిల్లా ఉపాధ్యక్షుడిగా మహేంద్రా రెడ్డి, సుధాకర్ నాయుడు, హిమవంత్ కుమార్, ఈసీ మెంబర్లుగా గోపి, కోటేశ్వరరెడ్డి, రఘు, హేమాద్రిరెడ్డి, హరిబాబులను ఎన్నుకున్నారు. ఉద్యో గుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని వారు వివరించారు. ఇసుక డంప్‌పై పోలీసుల దాడి – ఒక జేసీబీ, టిప్పర్ స్వాధీనం చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరు మండలంలో సాగుతున్న అక్రమ ఇసుక దందాకు తా లూకా పోలీసులు గండికొట్టా రు. తుమ్మింద సమీపంలోని అడవిచేను ప్రాంతంలో నిల్వ చేసిన ఇసుక డంప్‌పై ఎస్ఐ అశోక్‌కుమార్ తమ బృందంతో దాడి చేశారు. బీఎన్ఆర్ పేట నుంచి ఇసుక ను తీసుకొచ్చి అడవిచేను ప్రాంతంలో రహస్యంగా డంప్ చేసేవారు. అక్కడి నుంచి తమిళనాడులోని పరదరామి మీదుగా రాత్రి వేళల్లో టిప్పర్లలో సరిహద్దు దాటించేవారు. అధికారుల కన్నుగప్పేందుకు టిప్పర్‌లో ఇసుక నింపిన తర్వాత దానిపై నల్లదుమ్ము పోసి, దొడ్డిదారిన సరిహద్దులకు తరలించి విక్రయించేవారు. ఒక్కో టిప్పర్ ఇసుకను ఏకంగా రూ.1.30 లక్షలకు పైగా అమ్ముకుంటూ సొమ్ము చేసుకునేవారు. గత రెండేళ్లుగా ఈ ప్రాంతంలో నిరాటంకంగా సాగుతున్న ఈ దందాపై ఎస్ఐ అశోక్‌కుమార్ ప్రత్యేక నిఘా పెట్టా రు. శుక్రవారం రాత్రి తన సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించి అక్రమ రవాణాను అడ్డుకున్నారు. ఘటనా స్థలంలోని ఒక జేసీబీ, టిప్పర్‌ను స్వాధీనం చేసుకుని తాలూకా పోలీస్ స్టేషన్‌న్‌కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు. రైతుపై ఇసుకాసురుల దాడి పలమనేరు : పలమనేరు ప్రాంతంలోని కౌండిన్య నదిలో ఇస్టానుసారంగా ఇసుకాసురులు ఇసుకను తోడేస్తున్నా అధికారులు అసలు పట్టించుకోవడం లేదు. పత్రికల్లో ఇసుక అక్రమాలపై పలు కథనాలు వెలువడినా ఎవరూ స్పందించని పరిస్థితి. పట్టణ సమీపంలోని మారేడుపల్లి వద్ద ఏటికి ఆనుకుని ఉన్న సామారాజుపల్లి సుబ్రమణ్యం అనే రైతు పొలం ఉంది. నదిలో ఇసుకను తరలించడంతో తన బోరులో నీరు తగ్గాయని భావించిన రైతు అక్కడ ఇసుకను తోడుతున్న అక్రమార్కులను వేడుకున్నాడు. కానీ, వారు కనుకరించలేదు. దీంతో కడుపు మండిన ఆ రైతు వెంటనే వీఆర్వోకు కాల్చేసి చెప్పాడు. ఆయన సైతం వారు అధికారపార్టీ వారు కావడంతో తానేమీ చేయలేనని చెప్పాడు. దీంతో ఆ రైతు అదే మండలంలోని ఏడూరు గ్రామానికి చెందిన బాబు ద్వారా కలెక్టర్ నంబరు సంపాదించి శనివారం సాయంత్రం ఫోన్ చేశాడు. తన పొలం వద్ద కౌండిన్య నదిలో సాగుతున్న ఇసుక అక్రమ రవాణాను వివరించాడు. దీనిపై స్పందించిన కలెక్టర్ చర్యలు తీసుకోవాలని తహసీల్దార్‌ను ఆదేశించారు. రెవెన్యూ అధికారులు అక్కడికి చేరుకుని నదిలోని ఇసుక ట్రాక్టర్లను సీజ్ చేసి తీసుకెళ్లారు. టీడీపీ నేతలకు లొంగిన అధికారులు కలెక్టర్‌కు ఫలానా సుబ్రమణ్యం ఫిర్యాదు చేశాడని చెప్పేశారు. దీంతో ఫిర్యాదు చేసిన రైతుపై ఇసుకాసురులు దాడికి పాల్పడ్డారు. బాధితుడు మళ్లీ కలెక్టర్‌కు ఫోన్ చేసి తనపై జరిగిన దాడిని వివరించాడు. అధికారులే ఇలా ఇసుకాసురులకు వంతపాడుతుంటే అక్రమాలను అరికట్టినట్టేన అనే మాట జనం నోట వినిపిస్తోంది. -
గాలి పీల్చలేమని ఆందోళన
నగరి : మిల్క్ప్రొడెక్ట్లు తయారుచేసే పాల ఫ్యాక్టరీ నుంచి వెలువడుతున్న వాయువులతో ఇబ్బందిపడుతున్నామని వీకేఆర్‌పురం గ్రామస్తులు శనివారం కంపెనీ ఎదుట ఆందోళనకు దిగారు. ఫ్యాక్టరీ నుంచి వస్తున్న గాలిని పీల్చితే ముక్కులో మంటగా ఉంటోందని, శ్వాస తీసుకోలేకపోతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఊపిరి అందక వృద్ధులు సొమ్మసిల్లి పడిపోతున్నారని ఆరోపించారు. ఫ్యాక్టరీలోకి పాల ట్యాంకర్లు, ఇతర వాహనాలు వెళ్లకుండా దారిని జేసీబీతో తవ్వేశారు. దీంతో ఫ్యాక్టరీలోకి వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ట్యాంకర్లు రోడ్డుపైనే ఆగిపోయాయి. ఫ్యాక్టరీ నుంచి వెలువడుతున్న వాయువులపై గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేశారు. ముఖ్యంగా అమోనియం నైట్రేట్ వంటి హానికర వాయువులు వెలువడుతున్నాయేమోనని ఆందోళనగా ఉందన్నారు. సంబంధిత అధికారులు స్పందించి వాయు కాలుష్యంపై పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. మరోవైపు పాల ఫ్యాక్టరీ యాజమాన్యం ఈ ఆరోపణలను ఖండించింది. ఎనిమిది నెలలుగా ఫ్యాక్టరీని నిర్వహిస్తున్నామని, ఇంతకాలం ఎలాంటి సమస్య లేవని తెలిపింది. అయితే ఒక నివాస ప్రాంతానికి ఇబ్బంది కలుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఈ మేరకు చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసింది. ఈ వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఫ్యాక్టరీ యాజమాన్యం, కూలీలు, గ్రామస్తులు పరస్పరం వాగ్వాదానికి దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలకు నచ్చజెప్పారు. -
చిత్తూరు దేశంలో సంకుల సమరం !
సాక్షి టాస్క్‌ఫోర్స్: చిత్తూరులోని అధికార పార్టీ నేతల్లో ప్రస్తుతం సంకుల సమరం రాజుకుంది. మునిసిపల్ ఎన్నికలపై జరుగుతున్న ప్రచారమే దీనికి ప్రధాన కారణం. చిత్తూరు మేయర్ పీఠం తమకే.. కాదు తమ సామాజిక వర్గానికే.. అంటూ మూడు ప్రధాన సామాజిక వర్గాల మధ్య చిచ్చు అంటుకుంది. దీనికితోడు ఓ స్థాయిలో ఉన్న ప్రజాప్రతినిధులు కుర్చీ మీదే అని ఒకరికి.. మీకే అంటూ మరొకరికి హామీలు ఇచ్చేస్తుండడం ఆ పార్టీ నేతలకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. స్పష్టత ఏదీ..? మునిసిపల్ ఎన్నికల నిర్వహణపై ఇదిగో.. అదిగో, ఇప్పుడే.. అంటూ హడావుడి చేస్తున్న ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయమంటూ ఏమీ చెప్పడంలేదు. వార్డుల పునర్విభజనపై హైకోర్టులో ఉన్న కేసులు కొట్టేసినా, ఎస్ఐఆర్ (ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ), వార్డుల వారీగా బీసీ ఓటర్ల వివరాలు, ఎస్ఐఆర్లో చిత్తూరు కార్పొరేషన్ నుంచే దాదాపు 20 వేలకు పైగా ఓట్లు తొలగించడంపై ఇప్పటికే హైకోర్టులో వైఎస్సార్సీపీ దాఖలు చేసిన పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో మునిసిపల్ ఎన్నికలపై ప్రభుత్వానికి ఎలాంటి స్పష్టత లేకనే.. ఆర్భాటం చేస్తోంది. మాకంటే మాకే..! ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వానికి స్పష్టత లేకపోవడం ఓవైపైతే.. చిత్తూరు మేయర్ కుర్చీపై ఇప్పటికే అధికార పార్టీ నేతల్లో అసంతృప్తులు మొదలయ్యాయి. చిత్తూరులో ఉన్న మూడు ప్రధాన సామాజిక వర్గాలు మేయర్ కుర్చీపై ఆశలు పెట్టుకున్నాయి. ఇటీవల మంత్రి రాంప్రసాద్‌రెడ్డి చిత్తూరులో పర్యటించి, ఇద్దరు నేతల ఇళ్లకు వెళ్లారు. మాజీ ఎమ్మెల్యే సీకే బాబు ఇంటికి, కాజూరు బాలాజీ ఇళ్లకు ఒకేరోజు వెళ్లారు. ఇది ఇద్దరికీ మేయర్ కుర్చీపై హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఫలితంగా తమ నాయకుడికే మేయర్ కుర్చీ అంటూ ఇరువైపులా ఉన్న కార్యకర్తలు దీమాగా ఉన్నారు. తాజాగా నాయుడు బిల్డింగ్స్‌లోని ఓ టీడీపీ నేత ఇంట్లో చిత్తూరుకు చెందిన ఓ ప్రజాప్రతినిధి, మరో నాయకుడు, మేయర్ కుర్చీ ఆశిస్తున్న అధికారపార్టీ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి భేటీ అయినట్లు సమాచారం. మేయర్ మీకే ఇప్పిస్తామని చెప్పడంతో ఆ పలుకు వినడానికే బాగుందని పొంగిపోయిన ఓ సామాజికవర్గ నేత, తన భార్యను పోటీలో పెట్టడానికి నిర్ణయానికి సైతం వచ్చేశారు. ఇలా చిత్తూరులో మూడు సామాజిక వర్గాలు మేయర్ కుర్చీపై ఊహల్లో విహరిస్తున్నా., ఎవరికి సీటు దక్కుతుందోనని అభద్రతాభావంలో కొట్టుమిట్టాడుతున్నారు. సీకే నివాసంలో విందులో పాల్గొన్న మంత్రి రాంప్రసాద్‌రెడ్డి తన ఇంటికి వచ్చిన మంత్రికి పుష్పగుచ్చం ఇస్తున్న కాజూరు బాలాజీ వీళ్లు గుర్తులేరా ? మేయర్ స్థానం ఎవరికి రిజర్వు కానుందనే కనీస ఆలోచనలు కూడా లేకుండా పచ్చ నేతలు ఊహల్లో తేలుతుండడం, అదే పార్టీలోని ఇతర సామాజికవర్గా లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. చిత్తూరు నగరంలో వన్నెకుల క్షత్రియ ఓట్లు వేలల్లో ఉన్నాయని, ఇక్కడ గెలుపును ఖరారుచేసేది తమ సామాజికవర్గమనే విష యం గుర్తుపెట్టుకోవాలని సూచిస్తున్నారు. మేయర్ పోటీకి తామేమీ తక్కువ కాదని చెబుతున్నారు. ఇదే సమయంలో కుర్చీ ఎస్సీ సామాజిక వర్గానికి రిజర్వ యితే తాము ఎవరినీ రంగంలోకి దింపాలనే విషయా న్ని కూడా ఆలోచించలేదు. మొత్తంగా మునిపోల్స్ ప్రచారం చిత్తూరులోని తమ్ముళ్ల మధ్య తేనె తుట్టెను కదిపి, సంకుల సమరానికి ఆజ్యం పోసినట్లయ్యింది. -
పాఠశాలలో చెట్లు నరికివేత
– రాత్రికి రాత్రే తరలించేసిన కూటమి నాయకులు గుడిపాల: బొమ్మసముద్రం దళితవాడలో ఉన్న టేకు చెట్లును గురువారం అర్ధరాత్రి నరికివేసి శుక్రవారం తెల్లవారే సరికి తరలించేశారు. బొమ్మసముద్రం దళితవాడలో తమిళ పాఠశాల ఉంది. ఈ పాఠశాల విద్యార్థులు లేక సుమారు పది సంవత్సరాల క్రితం మూతపడింది. పాఠశాల ఆవరణలో ఉన్న టేకు చెట్లను ఎవరి అనుమతీ లేకుండా కూటమి నాయకులు నరికి అమ్మేశారు. దీనిపై అధికారులు మౌనం వహిస్తున్నారు. దీంతో చెట్లు నరికిన సమయంలో దళితవాడకు వెళ్తున్న పైపులైన్ కూడా విరిగిపోవడంతో తాగునీటి సమస్య కూడా తలెత్తింది. అధికారులు స్పందించి చెట్లు నరికివేసిన వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
తమ్ముళ్ల కమీషన్ల గోల!
పూతలపట్టు నియోజకవర్గానికి ఏమైంది? అక్కడ అభివృద్ధి మాట దేవుడెరుగు.. అధికార పార్టీ నేతల అక్రమార్జన దాహానికి నియోజకవర్గం బలైపోతోంది. ఒకవైపు ఇసుక, మట్టి మాఫియాతో ప్రకృతి వనరులను దోచేస్తుండగా, మరోవైపు కమీషన్ల పేరిట కాంట్రాక్టర్లను పిప్పి చేస్తున్నారు. చిన్నపాటి సివిల్ పని నుంచి కోట్లాది రూపాయల ప్రభుత్వ టెండర్ల వరకు ఏది పడినా చాలు.. ఓ ముఖ్య ప్రజాప్రతినిధితో పాటు బలం ఉన్న ‘పచ్చ’ నేతలు కాకులు వాలినట్లు వాలిపోతున్నారు. సొంత పార్టీ నేతలు చేసిన పనులైనా సరే.. పర్సంటేజీలు ముట్టజెప్పాల్సిందేనని హుకుం జారీచేస్తున్నారు. సాక్షి టాస్క్‌ఫోర్స్: ప్రసిద్ధి చెందిన కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయ పరిధిలో తెలుగు తమ్ముళ్ల ఆగడాలు పరాకాష్టకు చేరాయి. చివరికి ఆలయ చెప్పుల కౌంటర్ కాంట్రాక్ట్ టెండర్ మొదలుకొని, నిత్యం జరిగే అభివృద్ధి పనుల్లోనూ పర్సంటేజీలు డిమాండ్ చేస్తున్నారు. రాబోయే వార్షిక బ్రహ్మోత్సవాల నిర్వహణ పనులకు సంబంధించి అప్పుడే కొన్ని ప్రైవేటు ఏజెన్సీలతో, కొందరు నేతలు లోపాయికారి ఒప్పందాలు కుదుర్చుకున్నారనే తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తమకు నజరానాలు ఇవ్వని వారిని భయభ్రాంతులకు గురిచేయడం, పనులను అడ్డగించడం నిత్యకృత్యమైంది. గత రెండు రోజులుగా కాణిపాకం చుట్టూ జరుగుతున్న వరుస పరిణామాలే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఇంతా జరుగుతున్న పాలకమండలి పక్షం ఎందుకు మౌనం పాటిస్తోందో..దేవుడి ఎరుక. పిండుకోవడమే! రూ.లక్షలు కేటాయించే పెద్ద పెద్ద ప్రభుత్వ భవనాలు, రోడ్ల నిర్మాణాల టెండర్లు రాగానే ఎవరికి వారు సరిహద్దులు గీసుకుని దండుకునేందుకు కాపు కాస్తున్నారు. బెదిరింపులు తాళలేక కాంట్రాక్టర్లు 5 శాతం నుంచి 10 శాతం వరకు కమీష న్లు ఇచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఇక్కడ విచిత్రమేమిటంటే.. ఓ ప్రజా ప్రతినిధికి ఒక రేటు, జిల్లా స్థాయి నేతలకు మరో రేటు, మండల, స్థానిక తెలుగు తమ్ముళ్లకు వేరొక రేటు చొప్పున ముట్టజెప్పాల్సి వస్తోందని సొంత పార్టీ నేతలే బహిరంగంగా భగ్గుమంటున్నారు. స్వామివారి నిధి ఆ ప్రజాప్రతినిధికి ప్రసాదం? మరోవైపు, ప్రభుత్వ అధికారులు సైతం నిబంధనలను గాలికి వదిలేసి సదరు ప్రజాప్రతినిధి చెప్పిన మాటకే కట్టుబడి టెండర్లను ‘వన్‌సైడ్’గా చేస్తున్నారు. ఆలయానికి ఆదాయం చేకూరేలా పారదర్శకంగా వ్యవహరించాల్సింది పోయి, స్వామివారి నిధినే సదరు ప్రజాప్రతినిధికి నైవేద్యంగా పెడుతున్నారని కూటమిలోని ప్రాథమిక నేతలే తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా కూటమిలోని ఓ జిల్లా ప్రధాన కార్యదర్శి కాంట్రాక్టర్‌కు నేరుగా ఫోన్‌చేసి 5 శాతం కమీషన్ ఇవ్వాల్సిందేనని, లేకపోతే పని వదులుకోవాలని బెదిరించిన ఫోన్ కాల్ రికార్డింగ్ బయటపడడంతో పూతలపట్టులో సాగుతున్న పర్సంటేజీల బాగో తం ఏ స్థాయిలో ఉందో స్పష్టమైంది. అధికారుల ఆట కట్టించేందుకు కోర్టుకే ప్రజాప్రతినిధి ఒత్తిళ్లకు తలొగ్గి అక్రమాలకు సహకరిస్తు న్న అధికారుల తీరుపై బాధితులు ఆగ్రహంతో ఉన్నా రు. ఈ దోపిడీకి, బెదిరింపుల దందాకు అడ్డుకట్ట వేయాలంటే అధికారులతో సహా సంబంధిత ప్రజాప్రతినిధిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించడమే ఏకై క మార్గమని పలువురు బాధితులు, స్థానిక నాయకులు నిశ్చయించుకున్నారు. కోర్టు మెట్లు ఎక్కితే తప్ప ఈ మాఫియా ఆట లు ఆగవని వారు సొంత నేతలే భావిస్తున్నారు. -
పాఠశాలలో చెట్లు నరికివేత
గుడిపాల మండలం బొమ్మసముద్రంలో ఓ పాఠశాలలో ఉన్న టేకు చెట్లను రాత్రికి రాత్రే నరికి కలప తరలించేశారు.రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలు బ్రహ్మోత్సవాలకు పటిష్ట భద్రత తిరుమల బ్రహ్మోత్సవాల నేపధ్యంలో జిల్లా ఎస్పీ టీటీడీ అధికారులతో కలసి భద్రతా ఏర్పాట్లు పరిశీలించారు.తెలుగు భాషా వికాసానికి మేడసాని సేవలు మాతృభాషపై మక్కువతో విద్యార్థులకు తెలుగు భావాల పరిమళాలు పంచుతున్నారు పూతలపట్టు మండలం ఎం.బండపల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తెలుగు ఉపాఽ ధ్యాయుడు మేడసాని హేమ శేఖర్. ఆయన గత ఆరేళ్లుగా ప్రతి ఏటా పదో తరగతి పరీక్షల్లో తెలుగులో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు రూ.1,016 నగదు ప్రోత్సాహకాన్ని సొంత నిధులతో అందజేస్తున్నారు. భాషా వికాసానికి పాఠశాల స్థాయిలో పోటీలు నిర్వహిస్తూ విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీస్తున్నారు. విద్యాసేవలో బోధనామూర్తి శాంతిపురం మండలం తుమ్మిసి ఏపీ మోడల్ స్కూల్ పీజీటీ అధ్యాపకుడు సుబ్బరాయుడు. మూడు దశాబ్దాలుగా విద్యా రంగంలో నిరంతర సేవలు అందిస్తున్నారు. ఉన్నత విద్యలో ఎంతో అనుభవం ఉన్నప్పటికీ పునాది స్థాయిలోనే విద్యార్థులను సరిగ్గా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఏపీ మోడల్ స్కూల్లో పీజీటీ లెక్చరర్‌గా విధుల్లో చేరారు. కేవలం పాఠ్యాంశాల బోధనకే పరిమితం కాకుండా విద్యార్థుల్లో నైతిక విలువలు, రాజ్యాంగ స్పృహ, పౌర బాధ్యతలను పెంపొందించడంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. సొంత నిధులతో అభివృద్ధి పనులు నిరంతరం విద్యాసేవకే తమ జీవి తాన్ని అంకితం చేసే గురువులు సమాజానికి మార్గదర్శకులు. అటువంటి అరుదైన, ఆదర్శవంతమైన విద్యాసేవకు ప్రత్యక్ష నిదర్శనం గంగవరం మండలం గండ్రాజుపల్లి జెడ్పీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయు డు నాగరాజ. ఈయన గత 25 సంవత్సరాలుగా విద్యాశాఖ లో అంకితభావంతో ఎటువంటి ఫిర్యాదులు లేకుండా సేవలందిస్తున్నారు. పాఠశాల మౌలిక వసతుల కల్పనకు తన సొంత నిధులు రూ.1 లక్ష వెచ్చించారు. దాతల సహకారంతో రూ.2 లక్షలతో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. మేడసాని హేమశేఖర్హెచ్ఎం నాగరాజ సుబ్బరాయుడు -
కారు ఢీకొని వృద్ధుడి మృతి
బంగారుపాళెం: మండలంలోని కాటప్పగారిపల్లె సమీపంలో చైన్నె–బెంగళూరు జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధుడు మృతి చెందాడు. కాటప్పగారిపల్లెకు చెందిన సుబ్రమణ్యం(66) రోడ్డు దాటుతుండగా కంచి నుంచి బెంగళూరు పోతున్న కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సుబ్రమణ్యంను చికిత్స నిమిత్తం బంగారుపాళెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కారు ఢీకొని సైక్లిస్టు మృతి గంగాధర నెల్లూరు: సైకిల్‌పై చిత్తూరుకు వెళుతున్న ఓ వ్యక్తి కారు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన శుక్రవారం గంగాధర నెల్లూరు మండలంలో చోటుచేసుకుంది. గంగాధర నెల్లూరు మండల కేంద్రంలోని దళితవాడుకు చెందిన బాబు (55) అలియాస్ ఆంటోనీ సైకిల్‌పై చిత్తూరుకు వెళుతుండగా, ఎల్లమ్మరాజు పల్లి సమీపంలో చిత్తూరు వైపు నుంచి జీడి నెల్లూరు వైపు వస్తున్న ఓ కారు ఢీకొంది. సైకిల్లో ప్రయాణిస్తున్న బాబు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కారును పోలీస్ స్టేషన్‌కు తరలించి, కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. సబ్‌స్టేషన్ ిషిఫ్ట్ ఆపరేటర్‌పై దాడి వడమాలపేట (పుత్తూరు): వడమాలపేట మండలం పూడి విద్యుత్ సబ్ స్టేషన్లో షిఫ్ట్ ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తున్న త్యాగరాజు(35)పై గురువారం రాత్రి గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు దాడి చేశారు. త్యాగరాజు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. రాత్రి 9 గంటల సమయంలో సబ్ స్టేషన్ వద్ద ఇద్దరు వ్యక్తులు వచ్చి మద్యం సేవిస్తుండగా ఇక్కడ అలాంటి పనులు చేయకూడదని, వెళ్లిపోవాలని త్యాగరాజు చెప్పాడు. అక్కడి నుంచి వెళ్లిన వారు కొంత సేపటికి తిరిగి వచ్చి గదిలో ఉన్న త్యాగరాజుపై కత్తితో దాడిచేసి పరారయ్యారు. ఈక్రమంలో త్యాగరాజు చెవి, తలపై కత్తిపోట్లు పడ్డాయి. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. బ్రహ్మోత్సవాలకు పటిష్ట భద్రత తిరుమల : శ్రీవారి సాలకట్ల, నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల భద్రత, రద్దీ నియంత్రణ, ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు తెలిపారు. శుక్రవారం టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగం చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ (సీవీఎస్ఓ) మురళీకృష్ణతో కలిసి తిరుమలలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. రింగ్ రోడ్డు, ప్రధాన ట్రాఫిక్ జంక్షన్లు, భక్తుల రాకపోకల మార్గాలను పరిశీలించి అధికారులతో సమీక్షించారు. బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులకు ఇబ్బందులు లేకుండా క్రౌడ్ మేనేజ్మెంట్, ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఎస్పీ తెలిపారు.తిరుమలలో పార్కింగ్ సామర్థ్యం పరిమితంగా ఉందని, సుమారు 2,500–3,000 వాహనాలకు మాత్రమే స్థలం ఉంటుందని చెప్పారు. తిరుపతిలో గుర్తించిన ప్రాంతాల్లో ప్రైవేట్, ఎల్లో బోర్డు వాహనాలను నిలిపేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అక్కడి నుంచి ఆర్టీసీ బస్సుల్లో తిరుమలకు చేరుకునేలా ప్రణాళిక రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. గరుడసేవకు ప్రత్యేక ఆంక్షలు గరుడసేవ సందర్భంగా ద్విచక్ర, ప్రైవేట్ వాహ నాల రాకపోకలపై పరిమితులు విధించే ప్రాంతాలు, సమయాలను త్వరలో వెల్లడిస్తామని ఎస్పీ తెలిపారు. భక్తులు పోలీసు, టీటీడీ సూచన లు పాటించి సహకరించాలని కోరారు. -
రేపు తిరుపతిలో వైఎస్సార్సీపీ ముఖ్య సమావేశం
కాణిపాకం: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై వైఎస్సార్సీపీ చిత్తూ రు, తిరుపతి జిల్లాల నేతల ముఖ్య సమావేశం ఆదివారం తిరుపతిలో జరగనుంది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌న్‌రెడ్డి ఆదేశాల మేరకు తిరుపతి ఏఐఆర్ బైపాస్ రోడ్డులోని పీఎల్ఆర్ కన్వెన్షన్ హాల్లో ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. రీజినల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకర రెడ్డి హాజరయ్యే ఈ సమావేశానికి నియోజకవర్గ సమన్వయకర్తలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్, మేయర్, రాష్ట్ర, జిల్లా కమిటీల ప్రజాప్రతినిధులు, నాయకులు తప్పనిసరిగా హాజరుకావాలని పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలియజేసింది. నేడు జిల్లా స్థాయి గురుపూజోత్సవం చిత్తూరు కలెక్టరేట్ : డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ఈనెల 5 వ తేదీ జిల్లా స్థాయి గురు పూజోత్సవం నిర్వహించనున్నట్లు డీఈవో లక్ష్మీనారాయణ తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాస్థాయి గురుపూజోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించేలా పకడ్బందీ ఏర్పాట్లు చేశామన్నారు. జిల్లా కేంద్రంలోని జెడ్పీ సమావేశ మందిరంలో శనివారం ఉదయం 10 గంటలకు కార్యక్రమం ప్రారంభం అవుతుందన్నారు. జిల్లాలో విద్యారంగంలో విశేష సేవలు అందించిన ఉత్తమ ఉపాధ్యాయులు 72 మందిని సత్కరించి అవార్డులు అందజేస్తామని డీఈవో వెల్లడించారు. 10, 11 తేదీల్లో కలెక్టర్ల కాన్ఫరెన్స్ చిత్తూరు కలెక్టరేట్ : అభివృద్ధి, పలు కార్యక్రమాల సమీక్షకు ఈ నెల 10, 11 తేదీల్లో విజయవాడలో కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టరేట్‌కు ఉత్తర్వులు అందాయి. సీఎం అధ్యక్షతన నిర్వహించే ఈ కాన్ఫరెన్స్‌కు జిల్లాలోని పలు కార్యక్రమాల పురోగతి, పలు సమస్యల నివేదికలను సిద్ధం చేసే పనిలో కలెక్టరేట్ అధికారులు నిమగ్నమయ్యారు. కాణిపాకంలో భక్తుల కిటకిట కాణిపాకం: స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయం శుక్రవారం కృష్ణాష్టమి సెలవుదినం కావడంతో భక్తులతో కిక్కిరిసిపోయింది. స్వామివారి దర్శనం కోసం వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా తరలిరావడంతో క్యూలైన్లు, దర్శన ప్రాంగణాలు పూర్తిగా నిండిపోయాయి. భక్తులకు ఇబ్బంది కలగకుండా ఆలయ అధికారులు తాగునీరు, పాలు పంపిణీ చేస్తూ ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. చీకట్లో గుడిపాల గుడిపాల: గుడిపాల మండల కేంద్రంలోని చైన్నె–బెంగుళూరు జాతీయ రహదారిపై వీధి దీపాల నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైంది. వీధి దీపాలు వెలగకపోవడంతో ప్రయాణికులు చీకట్లోనే మగ్గుతున్నారు. గుడిపాల మండల కేంద్రంలో ఒక కిలోమీటరు మేర జాతీయ రహదారిపై రోడ్డు పక్కన సోలార్ లైట్లు ఏర్పాటు చేశారు. గత వారం రోజులుగా ఈ లైట్లు వెలగకపోవడంతో గుడిపాల మండల కేంద్రం అంధకారంలో ఉంది. అధికారులు స్పందించి వెంటనే లైటు వెలిగేలా చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు. -
గగనతలంలో.. విజయోత్సాహం
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శుక్రవారం వేకువజామున 2.55 గంటలకు ప్రయోగించిన జీఎస్ఎల్వీ ఎప్17/ఈఓఎస్–05 ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించారు. రాకెట్‌లోని మూడు దశలు అద్భుతంగా పనిచేశాయి. ముందుగా ఊహించిన దానికంటే ఉపగ్రహాన్ని కక్ష్య దూరం మరింతగా పెరిగింది. భూమికి దగ్గరగా అంటె పెరిజీ 170 కి.మీ అనుకున్నారు. ఇది 171 కి.మీకు పెరిగింది. అదే విధంగా 28,934 కి.మీ అపోజిని ముందుగా నిర్దేశించుకున్నారు. ఈ దూరం సుమారు 31 వేల కిలోమీటర్లుకు పెంచి మరీ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. బెంగళూరులోని మాస్టర్ కంట్రోల్ సెంటర్ శాస్త్రవేత్తలు పెరిజీ 171 కిలోమీటర్లు దూరాన్ని అధికంగా, 31 వేల కిలోమీటర్లు అపోజిని కొద్ది కొద్దిగా పెంచుకుంటూ మరో నాలుగైదు విడుతలుగా భూమికి 36 వేల కిలోమీటర్లు ఎత్తులోని భూస్థిర కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు. అయితే భూస్థిక కక్ష్యలో నుంచి పని చేయబోయే మొట్టమొదటి ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ఇదే కావడం విశేషం. 51.70 మీటర్లు పొడవున్న జీఎస్ఎల్వీ ఎప్17 రాకెట్ 420.5 టన్నుల బరువుతో నిప్పులు చిమ్ముతూ నింగివైపు దూసుకెళ్లింది. మొదటిదశ : నాలుగు స్ట్రాపాన్ బూస్టర్లులో 160 టన్నుల ద్రవ ఇంధనం, కోర్ అలోన్ దశలో 139 ఘన ఇంధనంతో మొదటి దశను ఘన, ద్రవ ఇంధనాలను మిళితం చేసి 151.9 సెకెండ్లలో మొదటి దశను విజయవంతంగా పూర్తిచేశారు. రాకెట్ శిఖరభాగంలోని ఉపగ్రహానికి అమర్చిన హీట్‌షీల్డ్స్ 234.3 సెకెండ్లకు మొదటి దశ రెండోదశ ప్రయాణం మధ్యలోనే విడిపోయాయి. రెండోదశ: 40 టన్నుల ద్రవ ఇంధనం సాయంతో రెండోదశను 295.5 సెకెండ్లకు పూర్తి చేశారు. మూడోదశ:– క్రయోజనిక్ దశలో 15 టన్నుల క్రయోజనిక్ ఇంధనం సాయంతో 1106.60 సెకెండ్లకు కటాఫ్ చేశారు. ఆతరువాత ఈ దశలోనే 1,117 కిలోలు బరువు కలిగిన ఈఓఎస్–05 ఉపగ్రహాన్ని 1115.60 సెకెండ్లకు (19 నిమిషాలకు) భూమికి దగ్గరగా అంటే పెరిజీ 171 కిలోమీటర్లు, భూమికి దూరంగా అంటే అపోజి 31,934 కిలోమీటర్లు ఎత్తులోని దీర్ఘ వృత్తాకార కక్ష్యలో జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టారు. -
డీఎస్సీ నియామకాలపై సీబీఐ విచారణ చేయాలి
శ్రీరంగరాజపురం : ఇటీవల కూటమి ప్రభుత్వం చేపట్టిన డీఎస్సీ నియామకాల్లో సీబీఐ దర్యాప్తు చేయాలని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి డిమాండ్ చేశారు. మండలంలోని పిళ్లారికుప్పంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుత మంత్రి నారా లోకేష్ యువగళంలో పాల్గొన్న వారికి అడ్డదారిలో ప్రభుత్వ ఉద్యోగులుగా ఇచ్చారని ఆరోపించారు. కర్నూలు జిల్లా డీఎస్సీలో అక్రమాలు జరిగాయన్నారు. టెట్ పాస్ కాని ప్రభాకర్‌కు ఉపాధ్యాయ ఉద్యోగం ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. స్పోర్ట్స్ కోటాలో ఐదుగురు ఒక్క వల్లూరు పాఠశాలలోనే రిక్రూట్ అయ్యారని చెప్పారు. ఆ ఐదుగురిని డీఈవో ఆఫీసుకు పిలిచి ఉద్యోగం ఇచ్చారని అన్నారు. ఒక్క కర్నూలు జిల్లాలోనే 24 మందికి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం ఇచ్చారనీ, ఈ విధంగా రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సీపార్సు చేసిన వారికి ఎలాంటి అర్హత లేకపోయినా ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇవ్వడం దేశ చరిత్రలో ఎన్నడూ జరగలేదని ఆరోపించారు. తల్లిదండ్రులు తర్వాత స్థానం ఉపాధ్యాయులు ఇస్తారని, అలాంటి పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిని పప్పులూ, బెల్లం పంచినట్టు ఇవ్వడం దారుణం అని అన్నారు. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు పొందిన వారి రికార్డులను సీబీఐ ద్వారా పరిశీలించాలన్నారు. జగనన్న ప్రభుత్వంలో నియమించిన ప్రభుత్వ ఉద్యోగాలపైన, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీ నియమాకాల్లో జరిగిన అవినీతిపైనా సీబీఐ విచారణకు సిద్ధమా అని సవాల్ విసిరారు. టెట్ అర్హత సాధిస్తేనే ఉపాధ్యాయ వృత్తికి అర్హులని సుప్రీంకోర్టు తెలిపిందని అన్నారు. కానీ కూటమి ప్రభుత్వంలో టెట్ అర్హత లేని వారికి కూడా ఉపాధ్యాయ ఉద్యోగం ఇవ్వడం దేశ చరిత్రలో ఇదే మొదటిసారి అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు మోసపూరిత హామీలు ఇచ్చి వారి సహకారంతో అధికారంలోకి వచ్చాక వారిని మోసం చేయడం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు వెన్నతో పెట్టిన విద్య అని అన్నారు. ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా వాటిని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలను, ప్రభుత్వ ఉద్యోగులను మోసం చేసిన కూటమి పార్టీలకు రాజకీయ సమాధి చేయాలని అన్నారు. -
రోడ్డు ప్రమాదంలో తమిళనాడు వాసి మృతి
రామకుప్పం(శాంతిపురం): కర్ణాటకలోని జేకే పురం నుంచి రామకుప్పం వెళ్లే మార్గంలోని రాజుపేట సమీపంలో జరిగిన ద్విచక్రవాహన ప్రమాదంలో తమిళనాడు చెందిన వ్యక్తి మృతి చెందాడు. రామకుప్పం పోలీసుల కథనం మేరకు వివరాలు. తిరుపత్తూరు జిల్లాలోని దిగువ వానియంబాడికి చెందిన పార్థిబన్(27) గురువారం బైక్‌పై కర్ణాటకలోని కోటి లింగాలు ఆలయానికి వెళ్లాడు. రాత్రి తిరుగు ప్రయాణంలో ప్రమాదవశాత్తు రాజుపేట సమీపంలో హంద్రీ–నీవా కాలువలో బైకుతో సహా పడిపోయాడు. ప్రమాదం జరిగిన విషయాన్ని గమనించిన వాహనదారులు రామకుప్పం పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్ఐ మారెప్ప ఆధ్వర్యంలో పోలీసుల బృందం హుటాహుటిన సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించే సరికి తలకు తీవ్ర గాయాలైన వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు. తన జేబులోని వివరాలు, ఫోను ద్వారా మృతుడి కుటుంబ సభ్యులతో మాట్లాడి పార్థిబన్‌ను గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసిన ఎస్ఐ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కుప్పం ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. శవ పరీక్షల అనంతరం శుక్రవారం మృతదేహాన్ని అతని బంధువులకు అప్పగించారు. కాలువపై ఉన్న వంతెన వద్ద మలుపులో సరైన సూచిక బోర్డులు లేకపోవడం, కాలువ పక్కన కొంతవరకు సైడ్ వాల్ నిర్మించకపోవడంతో తరచూ ఇక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు చెప్పారు. -
తండ్రిని గొంతుకోసి చంపిన తనయుడి అరెస్టు
పెనుమూరు (కార్వేటినగరం): చెడు వ్యసనాలను వదిలెయ్యమన్నందుకు తండ్రిని కిరాతకంగా గోంతుకోసి హతమార్చిన తనయుడిని శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. చిత్తూరు రూరల్ ఈస్టు సీఐ రామచంద్ర కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పెనుమూరు మండలం మాణిక్యరాయినిపల్లి గ్రా మానికి చెందిన చెంగారెడ్డి, జ్యోతి దంపతుల పెద్దకుమారుడు జోకేష్‌రెడ్డి (బాలాజీ)కి తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలం అనుప్పలి గ్రామానికి చెందిన చూడామణితో 13 సంవత్సరాల క్రితం వివాహమైయింది. తొమ్మిదేళ్ల క్రితం బాలాజీ తల్లిదండ్రులతో గొడవపెట్టుకుని పెనుమూరులోని లక్ష్మీనగర్ కాలనీలో వేరు కాపురం పెట్టాడు. చిన్నకుమారుడు హేమచంద్ర కూడా పెళ్లి చేసుకుని వేరుగా జీవిస్తున్నాడు. చెంగారెడ్డి, ఆయన భార్య జ్యోతి స్వగ్రామంలో ఉంటున్నారు. పెద్ద కుమారుడు బాలాజీ చెడు వ్యసనాలకు బానిసై అప్పులు చేసి జులాయిగా తిరుగుతూ ప్రతి నిత్యం భార్యపై గొడవపడతూ ఉండేవాడు. ఈ క్రమంలో ఈనెల 2వ తేదీ రాత్రి బాలాజీ భార్య చూడామణి మామ చెంగారెడ్డికి ఫోన్‌చేసి తన భర్త వేధింపులను వివరించారు. దీంతో తండ్రి పెనుమూరుకు వస్తే ఎప్పటిలాగే భార్యముందు అవమానిస్తాడని భావించిన నిందితుడు జోకేష్‌రెడ్డి(బాలాజీ) స్వగ్రామానికి వెళ్లి తన వెంట తెచ్చిన కోడి కత్తితో తన తల్లి కళ్లముందే ముందే తండ్రిని గొంతుకోసి హతమార్చాడు. పరా రీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు పెనుమూ రు ఎస్ఐ శ్రీకాంత్, ఎన్ఆర్ పేట ఎస్ఐ మణికంఠేశ్వరరెడ్డి, చిత్తూరు తాలుక ఎస్ఐ అశోక్‌కుమార్, సిబ్బందితో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు గురువారం సాయంత్రం పెనుమూరు మండలం, పాకాల రోడ్డు సమీపంలో నిందితుడు జోకేష్‌రెడ్డి (బాలాజీ) ఉన్నట్లు అందిన సమాచారం మేరకు అరెస్టు చేశారు. శుక్రవారం అతన్ని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ వెల్లడించారు. నిందితుడ్ని అరెస్టు చేయడానికి కృషి చేసిన సిబ్బందిని జిల్లా ఎస్పీ తుషార్ డూడి అభినందించారని తెలిపారు. -
రాష్ట్ర స్థాయి పోలీస్ స్పోర్ట్స్ మీట్లో చిత్తూరు విజృంభణ
చిత్తూరు రూరల్ (కాణిపాకం): గుంటూరులో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోలీస్ స్పోట్స్ అండ్ గేమ్స్ మీట్–2026లో చిత్తూరు జిల్లా పోలీస్ సిబ్బంది అద్భుత ప్రదర్శనతో మెరిశారు. వివిధ క్రీడా పోటీల్లో తమ మార్కు చూపిస్తూ ఏకంగా 9 స్వర్ణాలు, 6 రజతాలు, 2 కాంస్యాలతో మొత్తం 17 పతకాలను సొంతం చేసుకుని జిల్లాకు గర్వకారణంగా నిలిచారు. పోటీల్లో ప్రతిభ చాటిన వారిలో బి.సుధాకర్ రెజ్లింగ్‌లో స్వర్ణ పతకం గెలుచుకోగా, కె.ధనలక్ష్మి షాట్‌పుట్, జావాలిన్ త్రోలో 2 బంగారు పతకాలు, బాక్సింగ్‌లో రజత పతకం సాధించారు. ఎం.లావణ్య వెయిట్ లిఫ్టింగ్ (45 కేజీలు), పవర్ వెయిట్ లిఫ్టింగ్ (83 కేజీలు) విభాగాల్లో 2 బంగారు పతకాలు, 4400 రిలేలో రజతం, 200 మీటర్ల పరుగు పందెంలో కాంస్య పతకం కై వసం చేసుకున్నారు. అలాగే బాక్సింగ్‌లో షేక్ ఫైరోజ్, బాడీ బిల్డింగ్‌లో బి.ప్రవీణ్ స్వర్ణ పతకాలు సాధించారు. కార్వేటినగరం ఎస్ఐ డి.తేజస్విని రెజ్లింగ్, బ్యాడ్మింటన్ డబుల్స్ విభాగాల్లో 2 రజత పతకాలు పొందగా, యు.అరుణ వెయిట్ లిఫ్టింగ్ (67 కేజీలు), పవర్ వెయిట్ లిఫ్టింగ్ (84 కేజీలు) విభాగాల్లో 2 రజతాలు సాధించారు. బాడీ బిల్డింగ్‌లో ఆర్ఐ ఎం.చంద్రశేఖర్ కాంస్య పతకం దక్కించుకున్నారు. రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చాటి జిల్లా పేరు ప్రఖ్యాతులను నిలబెట్టిన పోలీస్ క్రీడాకారులను జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు, తోటి అధికారులు ఘనంగా అభినందించారు. -
అసలు హంతకుడు అతనే !
పలమనేరు: పట్టణంలోని శివాలయం వీధిలో శ్రీకాంత్ మెడికల్స్ వద్ద నిద్రిస్తున్న గుర్తు తెలియని బిక్షాటణ చేసే 55 ఏళ్ళ మహిళలను హత్య చేసిన సతీష్‌కుమార్ (28) అనే నిందితుడిని పలమనేరు పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. ఈ వివరాలను పట్టణ సీఐ మోహన్‌రెడ్డి మీడియాకు వివరి స్తూ.. పలమనేరు పాతపేట అంబేద్కర్‌నగర్‌కు చెందిన మార్కొండ కుమారుడు సతీష్‌కుమార్ మొబైల్లో ఫ్రీఫైర్ గేమ్‌ను ఆడుతూ, వింతపోకడతో ప్రవర్తించేవాడు. ఎప్పుడూ తన వెంట కత్తి పెట్టుకుని తిరగ డం ఇతని అలవాటు. ఈ నేపథ్యంలో 00 వ తేదీన ఆన్లైన్ గేమ్‌లు ఆడొద్దంటూ కుమారుడిని తండ్రి మందలించాడు. దీంతో తండ్రిపై ఆగ్రహించిన సతీష్‌కుమార్ ఇంటి నుంచి వెళ్ళి పద్మశ్రీ థియోటర్ పక్కనున్న అమృతవైన్స్లో పూటు గా మద్యం సేవించి ఇంటికెళ్లి, దుస్తులు మార్చుకుని బయలుదేరాడు. టీకే వీధిలో వస్తుండగా ప్రకాష్ అనే తెలిసిన వ్యక్తి ఇంత రాత్రిలో ఎక్కడికెళుతున్నావని ప్రశ్నిస్తే, కత్తిచూపి బెదించాడు. అనంతరం శివాల యం వీధిలో వెళుతూ అక్కడ నిద్రిస్తున్న బిక్షా టన చేసే మహిళ కాలు తొక్కాడు. ఆమె దొంగదొంగా అంటూ కేకలు పెట్టింది. దీంతో ఆగ్రహించిన సతీష్‌కుమార్ తన వద్దనున్న కత్తితో ఆమెను పొడి చి పారిపోయాడు. ఆమె చికిత్సపొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. అర్థరాత్రిలో జరిగిన ఈ ఘట నపై పోలీసులు హత్యానంతరం సీసీ పుటేజీల్లో ఓ వ్యక్తి పరుగెడుతుండటాన్ని గుర్తించి మానసిక రోగి ఖాజాను నేరస్తుడిగా భావించి అతని ఫోటోలను సైతం సామాజిక మాధ్యమాల ద్వారా విడుదల చేశా రు. అసలైన నిందితుడు మాత్రం హత్యానంతరం పలమనేరు నుంచి చిత్తూరుకు పారిపోయి, రైల్వే పోలీసుల కంటపడి, పోలీసులకు చిక్కాడు. నిందితుడు హత్యకు ఉపయోగించిన కత్తిని సీజ్ చేసి, స్థానిక కోర్టులో హాజరుపరచగా.. న్యాయమూర్తి ఆదేశాలతో ఇతడిని రిమాండ్‌కు తరళించారు. అనుమా నంతో అదుపులోకి తీసుకున్న ఖాజాను పోలీసులు విడిచిపెట్టారు. ఈ కేసును త్వరగా పరిష్కరించిన సిఐ మోహన్‌రెడ్డి, ఎస్ఐలను డీఎస్పీ డేగల ప్రభాకర్ అభినందించారు. -
జీడీ నెల్లూరు జనసేన ఇంచార్జ్‌పై కలెక్టర్‌కు ఫిర్యాదు
జీడీ నెల్లూరు(చిత్తూరు జిల్లా): జీడీ నెల్లూరు జనసేన ఇన్చార్జ్ యుగంధరప్పై కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు సొంత పార్టీ నేతలు. అక్రమాలకు పాల్పడుతూ స్థానికుల నుంచి నగదు వసూళ్లు చేస్తున్నాడనే ఆరోపణల నేపథ్యంలో యుగంధర్‌పై జనసేన నేతలు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. పీఎమ్ఈజీపీ స్కీమ్ కింద సబ్సిడీ రుణాలు ఇప్పిస్తానని యుగంధర్ వసూళ్లకు పాల్పడుతున్నట్లు సొంత పార్టీకి చెందిన నేతలు ఆరోపిస్తున్నారు. రూ. 10 లక్షల సబ్సిడి రుణాలు ఇప్పిస్తానని యుగంధర్ డబ్బులు వసూళ్లు చేసినట్లు ఫిర్యాదు చేశారు. పార్టీ సభ్యత్వం ఉన్న ఒక్కొక్కరి నుంచి రూ. 2,100 చొప్పున వసూలు చేశాడని, పార్టీ సభ్యత్వం లేని వారి నుంచి రూ. 20 వేల వరకూ తీసుకున్నట్లు జనసేన నేతల ఆరోపిస్తున్నారు. రాష్ట్ర మాల కార్పొరేషన్ డైరెక్టర్‌గా ఉన్న యుగంధర్.. సబ్సీడీ దందా పేరుతో వసూళ్లకు పాల్పడుతున్నట్లు జనసేన మండల నేతలే కలెక్టరేట్లో ఫిర్యాదు చేశారు. యుగంధర్‌పై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు. రాజకీయ పెద్దలతో పరిచయాలు, ఫోటోలు చూసి నమ్మించినట్లు ఫిర్యాదు దారుల ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి ఆరు మండలాల్లో వందలాది మంది బాధితులున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఫిర్యాదుపై విచారణ జరిపి కేసు నమోదు చేయాలని ఎస్పీకి జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. -
ఎల్‌నినో పంజా!
ఎల్‌నినో పంజా విసిరింది. వాతావరణ పరిస్థితులపై తీవ్రమైన ప్రభావం చూపుతోంది. ప్రధానంగా వర్షపాతం ఒక్కసారిగా పడిపోయింది. చుక్కనీటికి కటకటలాడాల్సిన దుస్థితి దాపురించింది. ఈ క్రమంలోనే జిల్లాలోని రిజర్వాయర్లతో నీటి మట్టం తగ్గిపోయింది. చెరువుల్లో సైతం నీరు అడుగంటింది. వ్యవసాయానికి ఇబ్బందికర పరిస్థితి తలెత్తింది. పంటలు ఎండుముఖం పట్టాయి. దాహార్తిని తీర్చుకునేందుకు ఇక్కట్లు మొదలవుతున్నాయి. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో అధికారులు వైఫల్యం చెందడంతో ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.రిజర్వాయర్ నీటి ప్రస్తుత పేరు సామర్థ్యం నిల్వ టీఎంసీల్లో టీఎంసీల్లో అరణియార్ 1,853 0.632 స్వర్ణముఖి బ్యారేజ్ 0.035 0.000 కల్యాణీ డ్యామ్ 0.910 0.257 కండలేరు 68.030 19.350 కాళంగి 0.240 0.001 కృష్ణాపురం 0.200 0.004 కై లాసగిరి 0.020 0.017 మల్లిమడుగు 0.181 0.006 ఎన్టీఆర్ జలాశయం 0.110 0.036 సోమశిల 78.000 18.699సాక్షి ప్రతినిధి, తిరుపతి : చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఎల్‌నినో ప్రభావం తీవ్ర రూపం దాల్చింది. తాగు, సాగు నీటి కష్టాలు ప్రారంభమయ్యాయి. పలుచోట్ల పంటలకు సాగు నీరు లేక మాడిపోతున్నాయి. మరో వైపు తాగునీటికి తిప్పలు తప్పడం లేదు. జిల్లాలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా ఇటు అన్నదాతలు.. అటు జనం ఇబ్బందులు ఎదుర్కొనక తప్పేట్టు లేదు. వర్షాలు కురవకపోవడంతో రెండు జిల్లాల్లో సాధారణ సాగు శాతం భారీగా పడిపోయింది. భూగర్భ జలాలు భారీగా పడిపోయాయి. రిజర్వాయర్లు, చెరువులు నీరు లేక వెలవెలబోతున్నాయి. ఫలితంగా సాగవుతున్న పంటలు సైతం నీరు లేక ఎండిపోతున్నాయి. మామిడి, కొబ్బరి చెట్లు ఎండిపోతుండడం తీవ్రమైన వర్షాభావ పరిస్థితులకు నిదర్శనం. పంటలు ఎండిపోతున్నా అధికార యంత్రాంగం పట్టించుకున్న దాఖలాలు కనిపించకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రబీ ఆశలపై నీళ్లు వర్షాభావ పరిస్థితుల కారణంగా రైతులు ఖరీఫ్ సీజన్లో ఆశించిన స్థాయిలో పంటలు సాగు చేయలేకపోయారు. రబీకైనా వరుణుడు కరుణిస్తాడేమోనని ఆశగా ఎదురుచూశారు. సెప్టెంబర్ ప్రారంభమైనా వర్షాలు లేవు. ఆగస్టులో అక్కడక్కడ చిన్నపాటి చినుకులు మాత్రమే పడ్డాయి. ఈ పరిస్థితుల్లో రబీ సాగుపై అన్నదాతలు ఆశలు వదులుకున్నారు. తాగునీటికి తప్పని తిప్పలు ఎల్‌నినో ప్రభావంతో తాగునీటికి తిప్పలు తప్పడం లేదు. ముఖ్యంగా తిరుపతి నగరంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. నగరవాసుల దాహార్తిని తీర్చే కై లాసగిరి, కల్యాణి డ్యామ్‌లో నీటి నిల్వలు భారీగా పడిపోయాయి. భూగర్భ జలాలు అడుగంటడంతో ఉన్న బోర్ల నుంచి నీరు రావడం లేదు. ఫలితంగా నగరవాసులు ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలు చేసుకుంటున్నారు. ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉన్నప్పటికీ అధికార యంత్రాంగం ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించకపోవటంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.తిరుపతి, చిత్తూరు జిల్లాలోని రిజర్వాయర్ల సమాచారం


