అవినీతి జలగలు! | - | Sakshi
Sakshi News home page

అవినీతి జలగలు!

Feb 12 2026 7:26 AM | Updated on Feb 12 2026 7:26 AM

అవినీ

అవినీతి జలగలు!

● పలమనేరు: ఇక్కడ రైటర్లదే హవా. అన్‌ రిజిస్ట్రార్‌ డ్యాకుమెంట్‌కు సైతం రూ.వేలు గుంజుతున్నారు. ఇక రిజిస్ట్రేషన్‌కు అయితే చెప్పాల్సిన పనిలేదు. స్టాంప్‌పేపర్స్‌ పై విచ్చలవిడిగా దోచుకుంటున్నారు. ● చిత్తూరు: చిత్తూరులో రైటర్లదే హవా. అడిగినంత తీసి ఇస్తున్న రైటర్లుకు క్షణాల్లో పనిచేస్తున్నారు. ఇక వివాహ రిజిస్ట్రేషన్స్‌, ఈసీ, స్టాంప్‌ పేపర్స్‌, మార్కెట్‌ విలువ పత్రాల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ● నగరి: చిన్నచిన్న సవరణలను సాకుగా చూపుతూ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను ఆలస్యం చేస్తున్నారు. అడిగినంత ఇస్తే సరైన పత్రాలు లేకపోయినా క్షణాల్లో పని జరిగిపోతోంది. ● పుంగనూరు: స్టాంప్‌ పేపర్స్‌ అధిక రేట్లకు కార్యాలయంలోనే విక్రయిస్తున్నారు. దీని పై ప్రశ్నిస్తే స్టాక్‌ లేదంటూ స్టాంప్‌ వెండర్స్‌కు అమ్ముకొని వారి వద్ద వాటా తీసుకుంటున్నారు. ● కార్వేటినగరం: పత్రాలు తక్కువగా జరిగే పల్లె ప్రాంతాలు కావడంతో అధిక మొత్తంలో దోచుకుంటున్నారు. స్టాంప్‌ పేపర్స్‌ ఽచెప్పిందే రేటుగా మారింది.

రైటర్లతో దందా చేయిస్తున్న అధికారులు చూసీచూడనట్టు వదిలేస్తున్న ఉన్నతాధికారులు ఆపసోపాలు పడుతున్న క్రయ, విక్రయదారులు

సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో..

చిత్తూరు అర్బన్‌ సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయం

చిత్తూరులో సాధారణ కూలీగా పనిచేసిన వ్యక్తి రైటర్‌గా అవతారమెత్తి రూ.2 కోట్లతో ఇల్లు కట్టాడు. కొందరు రైటర్లు వేలకు వేలు సంపాదిస్తున్నారు.

నిన్న కుప్పం సబ్‌రిజి స్ట్రార్‌ కార్యాలయంలో సీనియర్‌ సహాయకులు సీట్‌లో ఏకంగా ప్రైవేటు వ్యక్తి అయిన డ్యాకుమెంట్‌ రైటర్‌ దర్జాగా రిజిస్రేష్టన్‌ ప్రక్రియ నిర్వహించడం వెలుగులోకి వచ్చింది.

మొన్న తిరుపతిలో సస్పెండ్‌ అయిన రేణిగుంట సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయ అటెండర్‌ తిరుమలేష్‌ ఆస్తుల వివరాల పై ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. దాదాపు రూ.50 కోట్ల ఆస్తులు కూడబెట్టినట్టు గుర్తించారు.

జిల్లాలోని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో అవినీతి అనకొండలు తిష్టవేశాయి. చిన్న పనికి కూడా వేలల్లో గుంజేస్తున్నాయి. నిబంధనల ప్రకారం వెళితే క్రయవిక్రయదారులకు చుక్కలు చూపిస్తాయి. సవాలక్ష కొర్రీలు పెట్టి ముప్పుతిప్పలు పెడుతుంటాయి. అదే రైటర్లు, వెండర్ల సాయంతో వెళితే క్షణాల్లో పనిచేసి పెట్టేస్తాయి. అదీ వారు అడినంత ఇచ్చుకుంటే సరి.. లేకుంటే కార్యాలయం చుట్టూ ప్రదక్షిణ చేయించడం అలవాటు చేసుకున్నాయి. ఇక్కడి కింది స్థాయి సిబ్బంది కూడా కోట్లకు పగడలెత్తడం చూస్తే అవినీతి ఏ స్థాయిలో రాజ్యమేలుతోందో ఇట్టే అర్థమవుతుంది.. సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో అవినీతి దందాపై ‘సాక్షి’ స్పెషల్‌ ఫోకస్‌..

చిత్తూరు కార్పొరేషన్‌: జిల్లాలో చిత్తూరులో 2, బంగారుపాళ్యం, పలమనేరు, పుంగనూరు, కుప్పం, కార్వేటినగరం, నగరిలో మొత్తం 8 సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలున్నాయి. రోజూ 200 నుంచి 300 రిజిస్ట్రేషన్లు జరుగుతుంటాయి. మొత్తంగా రూ.50 లక్షలకు పైగా ఆ శాఖకు ఆదాయం వస్తోంది. సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో నేరుగా వెళ్లి కనీసం ఒక ఈసీ కూడా తీసుకొళ్లేము. దానికి సవాలక్ష కొర్రీలు చెప్పి రోజులు తరబడి తిప్పించడం రివాజుగా మారుతోంది. అదే రైటర్‌కు అదనంగా రూ.300 ఇస్తే నిమిషాల్లో ఈసీ తీసి చేతిలో పెడతారు.

బేజారు

రిజిస్ట్రేషన్స్‌శాఖ అంటేనే ఉద్యోగులకు రోజూ పండుగ వచ్చినట్టే. ఉదయాన్నే ఖాళీ జేబుతో విధులకు వచ్చి సాయంత్రం ఇంటికి రూ.వేలు తీసుకుపోవడం వారి జీవితంలో భాగంగా మారింది. పైసా సంపాదనతో ప్లాట్స్‌, కార్లు, బంగారు కోనుగోలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మాదేమీ లేదంటూనే రైటర్లను అడ్డంగా పెట్టుకొని అధికారులు విచ్చలవిడిగా సంపాదిస్తున్నారు. జిల్లాలో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేస్తే గానీ దారికి రాని పరిస్థితి ఏర్పడింది.

జిల్లాలో ఇదీ పరిస్థితి

కుప్పంలోని సబ్‌రిజిస్ట్రేషన్‌ కార్యాలయం

పలమనేరులో

చేయి తడపందే పనికాదు

అవినీతి జలగలు! 1
1/3

అవినీతి జలగలు!

అవినీతి జలగలు! 2
2/3

అవినీతి జలగలు!

అవినీతి జలగలు! 3
3/3

అవినీతి జలగలు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement