breaking news
Tirupati
-
తిరుమల ప్రసాదంలో జంతువుల కొవ్వు కలవలేదు: ఈడీ
తిరుమల తిరుమల లడ్డూ ప్రసాదం అంశానికి సంబంధించి జంతువుల కొవ్వు కలిసిందని పదే పదే ఆరోపణలు చేస్తున్న కూటమి సర్కారుకు షాక్ తగిలింది. తిరుపతి దేవస్థానం శ్రీవారి లడ్డూ ప్రసాదంలో ఎటువంటి జంతువుల కొవ్వు కలవలేదని ఈడీ నిర్దారించింది. శ్రీవారి ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందంటూ కూటమి ప్రభుత్వంలోని పెద్దలు, ముఖ్యమంత్రి చంద్రబాబు పదే పదే ఆరోపణలు చేస్తూ వచ్చారు. అయితే తిరుమల ప్రసాదంలో ఎటువంటి జంతువుల కొవ్వు కలవలేదని ఈడీ సైతం నిర్దారించిన నేపథ్యంలో కూటమి సర్కార్ కుట్ర పూరిత రాజకీయం మరోసారి నిరూపితమైంది. అంతకుముందు సీబీఐ నేతృత్వంలోని సిట్ కూడా తిరుమల ప్రసాదంలో ఎటువంటి జంతువుల కొవ్వు కలవలేదని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్బంలో భక్తులకు నిజంగా బాధ కలిగించిన వారు ఎట్టకేలకు క్షమాపణ చెబుతారా?, మీడియా సంస్థలు, రాజకీయ నాయకులు, వారి మద్దతుదారులు అందరూ క్షమాపణ చెబుతారా? అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. గత రెండేళ్లుగా ఇదే విషయాన్ని చెబుతూ వస్తున్నా తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రజల్ని, భక్తుల్ని పక్కదోవ పట్టించిన వారు క్షమాపణలు చెప్పాల్సిందేననే డిమాండ్ చేస్తున్నారు.After CBI-led SIT, even ED investigation confirms that "animal fat", as claimed by Andhra Pradesh CM @ncbn in 2024, was not used to adulterate ghee used in Tirumala Tirupati Devasthanam's Srivari prasadam. ED's probe also points to chemical & plant based adulterants. For 2… https://t.co/Gm4INAzthq pic.twitter.com/lgk1Hprd8l— Anusha Ravi Sood (@anusharavi10) September 18, 2026 -
రేణిగుంట స్టేషన్లో కలకలం.. హైటెన్షన్ వైర్ పట్టుకున్న వ్యక్తి!
సాక్షి, తిరుపతి: జిల్లాలోని రేణిగుంట రైల్వే స్టేషన్లో కలకలం రేగింది. మతిస్థిమితం లేని ఓ వ్యక్తి రైల్వే స్టేషన్ పరిసరాల్లోని హైటెన్షన్ విద్యుత్ లైన్ పట్టుకుని ఆత్మహత్యకు యత్నించాడు. ఇది గమనించిన రైల్వే అధికారులు వెంటనే అప్రమత్తమై విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.అయితే, ఈ ఘటనతో రేణిగుంట స్టేషన్లో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అలాగే, విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో పలు రైళ్ల రాకపోకలకు కొద్దిసేపు అంతరాయం ఏర్పడింది. ఆ వ్యక్తి అసోం రాష్ట్రానికి చెందినవాడిగా రైల్వే పోలీసులు గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని ఘటనకు గల కారణాలపై విచారిస్తున్నారు.ఇదీ చదవండి: నీకు నా మీద లవ్ తగ్గిపోయింది కదా... -
శ్రీసిటీ సందర్శన
శ్రీసిటీ (వరదయ్యపాళెం): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర అమెరికా పెట్టుబడుల ప్రధాన అనుసంధానకర్త సతీష్ మండువ గురువారం శ్రీసిటీని సందర్శించారు. రాష్ట్రానికి ఉత్తర అమెరికా పెట్టుబడులను ఆకర్షించేందుకు నియమితులైన ఆయన యూఎస్–ఇండియా చాంబర్ ఆఫ్ కామర్స్ ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యుడిగా, ఇంటెలిసాఫ్ట్ టెక్నాలజీస్ సీఈఓగా కొనసాగుతున్నారు. ఆయనకు ఆంధ్రప్రదేశ్‌తో అనుబంధంతో పాటు ఉత్తర అమెరికా వ్యాపార వర్గాల్లో విస్తృత పరిచయాలు, అనుభవం ఉన్నాయి. శ్రీ సిటీకి చేరుకున్న సతీష్ మండువకు శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి స్వాగతం పలికారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అవకాశాలను ఉత్తర అమెరికా పెట్టుబడిదారులకు పరిచయం చేయడంలో ఆయన చేస్తున్న కృషి అభినందించారు. మోడల్ ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ టౌన్‌షిప్‌గా శ్రీసిటీని అభివృద్ధి చేయడంలో డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి దూరదృష్టి, పట్టుదలను అభినందించారు. పర్యటనలో భాగంగా స్థానిక డైకిన్ పరిశ్రమను సందర్శించి, అక్కడ సంస్థ ప్రతినిధులతో చర్చించారు. -
రాష్ట్ర గవర్నర్‌కు సాదర స్వాగతం
రేణిగుంట: తిరుపతి జిల్లాలో రెండు రోజుల పర్యటనలో భాగంగా గురువారం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు విమానాశ్రయంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్, ఎస్పీ ఎల్.సుబ్బారాయుడు, తదితరులు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్ రోడ్డు మార్గాన తిరుపతికి బయల్దేరి వెళ్లారు. రేణిగుంట డీఎస్పీ శ్రీనివాసరావు, సెట్విన్ సీఈఓ యస్వంత్, విమానాశ్రయ అధికారులు, తహసీల్దార్ శ్రావణ్‌కుమార్ పాల్గొన్నారు. ఓపెన్ వర్సిటీ స్టడీసెంటర్ కో–ర్డినేటర్గా కిరణ్‌కుమార్ తిరుపతి సిటీ: ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ అధ్యయన కేంద్రం కో–ఆర్డినేటర్‌గా డాక్టర్ ఎం.కిరణ్‌కుమార్‌రాజు నియమితులయ్యారు. గతంలో ఉన్న డాక్టర్ జీ. కిషన్ ఎస్వీ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్‌గా నియామకం కావడంతో ఆయన స్థానంలో డాక్టర్ కిరణ్‌కుమార్ రాజు గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ అధ్యయన కేంద్రాన్ని అందరి సహకారాలతో మరింత అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తానని తెలిపారు. అనంతరం ఎస్వీ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కిషన్, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ వై మల్లికార్జునరావు, డాక్టర్ ఎం.ప్రసాద్‌రావు, అధ్యాపకులు, సిబ్బంది ఆయనను ఘనంగా సత్కిరంచారు. పోక్సో కేసులో నిందితుడి అరెస్ట్ నాయుడుపేట టౌన్ : పోక్సో కేసులో నిందితుడుగా ఉన్న మండల పరిధిలోని మేనకూరు గ్రామానికి చెందిన కందాటి నజీర్‌ను అరెస్టు చేసి గురువారం కోర్టులో హాజరు పరిచినట్టు నాయుడుపేట అర్బన్ సీఐ వెంకటేశ్వరరావు తెలిపారు. పోక్సో కేసు దర్యాప్తు చేస్తున్న నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు సారథ్యంలో నజీర్‌ను పట్టణ పరిధిలోని శివాలయం సమీపంలో అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ఏడేళ్ల చిన్నారులపై లైంగిక దాడి జరిపిన ఘటనపై నజీర్పై పోక్సో కేసు నమోదు చేసిన విషయం తెలిసిందె. గురువారం కోర్టులో హాజరుపరచగా జడ్జి రిమాండ్ విధించినట్టు సీఐ పేర్కొన్నారు. బీవీపాళెంలో పర్యటన తడ: మండలంలోని బీవీపాళెం, సూళ్లూరుపేట మండలం అటకానితిప్ప, దొరవారిసత్రం మండలం నేలపట్టు గ్రామాల్లోని టూరిజం కేంద్రాలను రాష్ట్ర టూరిజం శాఖ కార్యదర్శి, ఐఏఎస్ అధికారి ఎస్ఎస్ రావత్ గురువారం పర్యటించారు. ఈ ప్రాంతాల్లో నెలకొల్పిన టూరిజం రిసార్టులు, టూరిస్టుల కోసం ఏర్పాటు చేసిన వసతులు కొనసాగుతున్న తీరును ఆయన పరిశీలించారు. ఆయన వెంట టూరిజం శాఖ ఎండీ తదితరులు ఉన్నారు. పిచ్చి కుక్క బీభత్సం – 13 మందిని కరిచిన శునకం నాగలాపురం: నాగలాపురం పట్టణంలోని ఈస్ట్ దళితవాడలో గురువారం ఉదయం ఓ పిచ్చి కుక్క బీభత్సం సృష్టంచింది. వీధుల్లో తిరుగుతూ ఏకంగా 13 మందిని కరిచింది. కుక్క కాటుకు గురైన బాధితులు నాగలాపురం ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి చికిత్స పొందారు. ఒకే ప్రాంతంలో వరుసగా పలువురిని కుక్క కరవడంతో స్థానికులు ఆందోళనలో పడ్డారు. అప్పు ఇవ్వలేదని..! – వివాహిత ఆత్మహత్యాయత్నం వరదయ్యపాలెం: ఇచ్చిన అప్పు వసూలు కాక మనస్తాపానికి గురైన ఓ వివాహిత పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన వరదయ్యపాలెం మండలంలో గురువారం వెలుగు చూసింది. మండలంలోని సీఎల్ఎన్పల్లెకు చెందిన మౌనిక, ప్రవీణ్ దంపతులు ప్రస్తుతం వరదయ్యపాళెం ప్రకాశం వీధిలో నివాసం ఉంటున్నారు. కొంతకాలం క్రితం పట్టణంలోని బీసీ కాలనీ, బలిజపాలెం విద్యుత్ సబ్ స్టేషన్ సమీపంలోని రియల్ ఎస్టేట్ భూమి వ్యవహారంలో స్థానిక రియల్ ఎస్టేట్ వ్యాపారి, రాజకీయ నాయకుడికి రూ.40 లక్షలు అప్పుగా ఇచ్చినట్లు బాధితురాలు తెలిపింది. అయితే ఆ భూమి వివాదంలో చిక్కుకోవడంతో అప్పు తిరిగి చెల్లించడం లేదని ఆరోపిస్తున్నారు. పలుమార్లు ఇంటి చుట్టూ తిరిగినా రాజకీయ, అధికార బలంతో బెదిరిస్తున్నారని బాధితురాలు వాపోయింది. గతంలో పోలీస్ స్టేషన్లో పంచాయితీ జరిగి గడువు ఇచ్చినా అమలు కాలేదని పేర్కొంది. దీంతో మనస్తాపానికి గురై గురువారం ఇంట్లోనే పురుగుమందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. -
గరుడ సేవకు పటిష్ట భద్రత
తిరుపతి అర్బన్: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడ వాహన సేవ (ఈనెల 19వ తేది శనివారం) సందర్భంగా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టనున్నట్టు ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ జిల్లా అధికార యంత్రాంగంతోపాటు ప్రధానంగా టీటీడీ, విజిలెన్స్ విభాగాలతో సమన్వయం చేసుకుంటూ భద్రతా చర్యలు తీసుకుంటామని వివరించారు. ప్రైవేటు వాహనాల పైన ఆంక్షలు విధిస్తున్నామని, భక్తులకు ఇబ్బంది లేకుండా ఆర్టీసీ బస్సులు, టీటీడీ వాహనాల ద్వారా తిరుమలకు చేరుకోవాలని సూచించారు. ద్విచక్ర వాహనాలకు అనుమతి లేదు ఈనెల 18వ తేదీ రాత్రి 9 నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు తిరుమల–తిరుపతి ఘాట్ రోడ్డులో ద్విచక్ర వాహనాలకు అనుమతి లేదని ఎస్పీ స్పష్టం చేశారు. ద్విచక్ర వాహనాలకు బాలాజీ లింక్ బస్తాండ్, నెహ్రూ మున్సిపల్ గ్రౌండ్, ఎస్వీ మెడికల్ కాలేజీ గ్రౌండ్, ఇస్కాన్ గ్రౌండ్, వద్ద పార్కింగ్‌కు ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఆర్టీసీ బస్సుల మళ్లింపు -
ముత్యపు పందిరిలో మురిపాల రేడు
సింహ వాహనంపై యోగనరసింహుని అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్న కల్యాణ వేంకటేశ్వరుడు తుమ్మలగుంటలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజు మంగళవారం రాత్రి దేవేరులతో కలిసి శ్రీ కల్యాణ వేంకటేశ్వరుడు ముత్యపు పందిరి వాహనంపై బాలకృష్ణుడి అవతారంలో భక్తులకు అభయమిచ్చారు. ఉదయం స్వామివారు యోగ నరసింహుని అవతారంలో సింహ వాహనంపై కొలువుదీరి భక్తులను కటాక్షించారు. తుడా మాజీ చైర్మన్ చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి, చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి సైతం యువకులతో కలిసి వాహనాన్ని మోశారు. సింహ వాహన సేవకు తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు, ముండ్లపూడి, బ్రాహ్మణపట్టు, పాడిపే ట ప్రాంతాల నుంచి భక్తులు సారెను తీసుకొచ్చి స్వామి వారికి సమర్పించారు. రాత్రి ముత్యపు పందిరి వాహన సేవకు ఎర్రావారిపాళెం మండలంలోని ఎర్రావారిపాళెం, చెరుకువారిపల్లి, యల్లమంద, ఉదయమాణిక్యం, ఉస్తికాయలపెంట, కోటకాడపల్లి, యల్లమంద, బోడేవాండ్లపల్లి, వీఆర్ అగ్రహారం, నెరబైలు, చింతగుంట, కూరపర్తివారిపల్లి, చెరకువారిపల్లికి చెందిన భక్తులు వస్త్రాలు తీసుకువచ్చి సమర్పించారు. వాహనసేవల్లో ఆలయ వ్యవస్థాపక అధ్యక్షుడు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, చెవిరెడ్డి లక్ష్మి దంపతులు, ఈవో సుబ్రమణ్యంరెడ్డి పాల్గొన్నారు. – తిరుపతి రూరల్ -
ఇదేంది డ్రైవరన్నో?
నాగలాపురం: డ్యూటీలో ఉన్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ తన వ్యక్తిగత సమస్యపై పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు ఏకంగా ప్రయాణికులను స్టేషన్ వద్దకు తీసుకొచ్చిన ఘటన నాగలాపురంలో చోటు చేసుకుంది. పిచ్చాటూరు మండలం, రామగిరి గ్రామానికి చెందిన వికేష్నాయుడు తిరుమల డిపోకు చెందిన చైన్నె–తిరుమల ఎక్స్‌ప్రెస్ డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. గురువారం డ్యూటీలో ఉన్న సమయంలో తన వ్యక్తిగత సమస్యకు సంబంధించి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు బస్సులో ప్రయాణికులని తిరుమల నుంచి ఎక్కించుకొని నాగలాపురం పోలీసు స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు ఇచ్చి వెళ్లాడు. బస్సులో ఉన్న ప్రయాణికులు కొంతసేపు పోలీసు స్టేషన్ వద్ద వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. డ్యూటీ సమయంలో వ్యక్తిగత సమస్య పరిష్కారం కోసం పోలీసు స్టేషన్‌కు రావడం వల్ల కొందరు ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు. -
కొత్త ఉద్యోగాలు
‘శ్రీవారి దగ్గర సేవ చేయాలి.. ఉద్యోగం కాదు. కొత్తగా ఉద్యోగాలిస్తే.. వచ్చే ఆదాయం వారి జీతాలకే వెళ్తుంది. ఇప్పటికే 50 శాతం వరకు ఉద్యోగుల జీతాలకు ఖర్చు చేస్తున్నాం.’ అంటూ సీఎం చంద్రబాబు చేసిన వాఖ్యలపై నిరుద్యోగులు రగిలిపోతున్నారు. ఎన్నికల ముందు సవాలక్ష హామీలిచ్చి.. నిరుద్యోగ భృతి అంటూ మభ్యపెట్టి ఓట్లు దండుకుని అధికార పీఠం ఎక్కాక శాశ్వత ఉద్యోగులు వద్దన్న రీతిలో వ్యాఖ్యలు చేయడం సరికాదని మండిపడుతున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు ఉద్యోగులు, కార్మికులు, శ్రీవారి సేవకుల మధ్య విబేధాలు సృష్టించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే ఆ మాటలను వెనక్కి తీసుకోవాలని హితవు పలుకుతున్నారు. శాశ్వత ఉద్యోగాలకు చెక్ కొద్దిపాటి ఉద్యోగులను భర్తీ చేసి.. శ్రీవారి సేవకుల సేవల్ని ఉచితంగా వినియోగించుకునే విధానం అమలు చేయాలని సీఎం చెప్పడం అందరినీ ఆశ్చర్యంలో పడేసింది. ఇప్పటికే టీటీడీలో శ్రీవారి సేవకులతో అన్నదానం, క్యూలైన్ మేనేజ్మెంట్ వినియోగిస్తున్నారు. అన్నదానంలో కూరగాయలు తరగడం నుంచి, వడ్డించే వరకు శ్రీవారి సేవకులే విధులు నిర్వహిస్తున్నారు. మరో వైపు శ్రీవారి భక్తులకు గుండుకొట్టే కళ్యాణ కట్ట క్షురకుల్లో కూడా కేవలం పీస్ రేట్ కింద శ్రీవారి సేవకుల్ని వినియోగించుకుంటుఊ.. శాశ్వత ఉద్యోగాల భర్తీకి చెక్ పెట్టారు. రానున్న రోజుల్లో ఇదే విధానం అన్ని విభాగాల్లో అమలు చేసే దిశగా అడుగులు వేస్తే తమ పరిస్థితి ఏంటని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. సాక్షి, టాస్క్‌ఫోర్స్: టీటీడీలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీపై సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. టీటీడీలో ఇకపై శాశ్వత ఉద్యోగాలు భర్తీ లేకుండా శ్రీవారి సేవకులతో భర్తీ చేసే విధానం అమలు చేస్తామని సీఎం వ్యాఖ్యానించడంపై ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. ఆ వ్యాఖ్యలు ఉద్యోగులు, కార్మికులు, శ్రీవారి సేవకుల మధ్య భేదాభిప్రాయాలు సృష్టించే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నాయి. బాబొస్తే జాబు పోయినట్టేనా? బాబొస్తే జాబు వస్తుంది అంటూ 2014–19 ఎన్నికల్లో ఊదరగోట్టారు. బాబు వచ్చారు.. నిరుద్యోగ యువతకు జాబు రాలేదు. అలాగే 2024 ఎన్నికల్లో సంపద సృష్ట్టిస్తా, ఏడాదికి 5 లక్షల ఉద్యోగాలు, ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తా.. అంటూ జబ్బలు చరిచారు. అంతవరకు నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తానంటూ కాకమ్మ కబుర్లు చెప్పారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత సంపద సృష్టించడం పక్కనబెట్టి, దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా అప్పుల ఆంధ్రప్రదేశ్‌గా మార్చేశారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వస్తాయా..? అంటే అదీ లేదు. తాజాగా టీటీడీలో శాశ్వత ఉద్యోగాలు భర్తీ చేయకపోవడంతో ప్రస్తుతం ఉన్న ఉద్యోగులపై భారం పడుతోంది. దుమారం రేపిన సీఎం వ్యాఖ్యలు ‘తిరుమల శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించడానికి వచ్చిన సీఎం చంద్రబాబునాయుడు బుధవారం టీటీడీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘శ్రీవారి దగ్గర సేవ చేయాలి. ఉద్యోగం కాదు. శ్రీవారి సేవకోసం వైద్య, విద్య సేవకులు ముందుకొస్తున్నారు. సత్యసాయి ట్రస్ట్‌లో భక్తులకు ఎలాగైతే సేవ చేస్తున్నారో అదేవిధానం తిరుమలలో మరింత పెంచేలా శ్రీవారి సేవకులకు శిక్షణ ఇచ్చి వారిని వినియోగించుకోవాలని. టీటీడీలో ఇప్పటికే దాదాపు 12 లక్షల మంది శ్రీవారి సేవకులుగా నమోదు చేసుకున్నారు. వీరిని ఆలయ సేవా కార్యక్రమాలకు అనుసంధానం చేస్తాం. వైద్యులను కూ డా శ్రీవారి సేవకులుగా అనుసంధానం చేసి టీటీడీ ఆస్పత్రుల్లో సేవలందించేలా చర్యలు చేపడుతాం’. అంటూ సీఎం స్థాయి వ్యక్తి వ్యాఖ్యలు చేయడం నిరుద్యోగులను తీవ్ర నిరాశలో పడేసింది.టీటీడీలో కొత్త ఉద్యోగాలకు గండి ఆ వ్యాఖ్యలు ఉప సంహరించుకోవాలి టీటీడీ ఉద్యోగులపై సీఎం చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి. శ్రీవారి సేవకుల పేరుతో శాశ్వత ఉద్యోగాలను తగ్గించే ఆలోచన సరికాదు. తిరుమలలో శాశ్వత ఉద్యోగుల సంఖ్యను పరిమితం చేసి, పనులను శ్రీవారి సేవకులతో చేయించుకోవాలనే విధంగా సీఎం చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరం. భక్తులకు నిరంతరం సేవలందించే టీటీడీ ఉద్యోగులను తక్కువ చేసి మాట్లాడడం వారి మనోభావాలను గాయపరుస్తోంది. శ్రీవారి సేవకులు స్వచ్ఛందంగా అందిస్తున్న సేవలను గౌరవిస్తాం. అయితే, వారి సేవను శాశ్వత ఉద్యోగులకు ప్రత్యామ్నాయంగా చూపడం సరికాదు. పారిశుద్ధ్యం సహా తిరుమలలో రోజూ నిర్వహించాల్సిన పనులకు తగిన సంఖ్యలో ఉద్యోగులు, కార్మికులు అవసరం. ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులు, శ్రీవారి సేవకుల మధ్య పోటీ పెట్టే విధానాన్ని ప్రభుత్వం విడనాడాలి. 2025–26 బడ్జెట్లో జీతాలు, ఇతర సిబ్బంది చెల్లింపులకు కేటాయించిన మొత్తం సుమారు 34 శాతం. ఈ కేటాయింపులో జీతాలతో పాటు ఇతర సిబ్బంది చెల్లింపులూ ఉన్నాయి. దాన్నంతటినీ సాధారణ ఉద్యోగుల జీతంగా చూపడం సరైంది కాదు. వెంటనే ఆ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి. – కందారపు మురళి, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు, తిరుపతి -
సింహ వాహనంపై యోగనరసింహుడి రూపంలో మలయప్ప
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. మూడో రోజు గురువారం రాత్రి మలయప్ప స్వామివారు ముత్యపు పందిరి వాహనంపై శ్రీమన్నారాయణుడి అలంకరణలో తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. ఉదయం సింహ వాహనాన్ని అధిష్టించి యోగనరసింహుడి రూపంలో కనువిందు చేశారు. వాహన సేవల ముందు కళాబృందాల ప్రదర్శన ఆకట్టుకుంది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి శ్రీవారికి అత్యంత ప్రీతిపాత్రమైన గరుడ వాహనాన్ని అధిరోహించి మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించనున్నారు. – తిరుమల -
నిమజ్జనం వేళ కత్తితో దాడి
– యువకుడికి గాయాలు సైదాపురం : గణేష్ నిమజ్జనం వేళ ఇద్దరి మధ్య వివాదం జరగడంతో ఓ యువకుడు మరో యువకుడిని కత్తితో దాడి చేసి గాయపరిచిన ఘటన మండల కేంద్రమైన సైదాపురంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానిక ఎస్ఐ దుర్గాప్రసాద్ కథనం.. మండల కేంద్రమైన సైదాపురం బస్టాండు సమీపంలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద బుధవారం రాత్రి గణేష్ విగ్రహంతో ఊరేగింపుగా నిమజ్జనానికి బయలు దేరారు. ఆ సమయంలో యువకులు డ్యాన్స్‌లు వేస్తుండగా పలవారి వెంకి కాలును డేగా మహేష్ తొక్కాడు. దీంతో ఇద్దరి మధ్య వివాదం చోటు చేసుకుంది. వెంకీ ఆగ్రహానికి గురై మహేష్‌పై కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన మహేష్ ప్రస్తుతం నెల్లూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష అమీర్‌పేట (హైదరాబాద్): చేపల వ్యాపారి హత్య కేసులో నింధితుడికి కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష, జరిమానా విధించింది. ఎస్ఆర్నగర్ ఇన్‌స్పెపెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఏజీ కాలనీ సమీపంలోని వికాస్పురి కాలనీకి చెందిన చేపల వ్యాపారి పాంపరి రమేష్ (50) 2020 యూసుఫ్‌గూడ జవహర్‌నగర్‌లో హత్యకు గురయ్యాడు. ఫిబ్రవరి 1వ తేదీ సాయంత్రం బోరబండ వెళ్తున్నానని రమేష్ ఇంట్లో చెప్పి వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. అదే రోజు రాత్రి 8.30 గంటల సమయంలో ఆయన స్నేహితుడైన సాయి ఫోన్ చేయగా, తాను స్నేహితుడి ఇంట్లోనే ఉన్నానని రమేష్ తెలిపాడు. ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉండడంతో అనుమానం వచ్చిన కుమారుడు పాంపరి ప్రదీప్ 2వ తేదీన ఎస్ఆర్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు 4వ తేదీన జవహర్‌నగర్‌లోని ఓ ఇంట్లో రమేష్ మృతదేహన్ని గుర్తించారు. కాళ్లను తాళ్లతో కట్టి, రెండు చేతులను నరికిన స్థితిలో మృతదేహం లభించింది. డబ్బుల కోసం హత్య తిరుపతి ఎస్.వి.నగర్‌కు చెందిన నిందితుడైన మూడే రాజునాయక్‌కు రమేష్‌తో గతంలో పరిచయం ఉంది. డబ్బుల కోసం రమేష్‌ను కిడ్నాప్ చేసి డిమాండ్ చేయాలని పథకం వేశాడు. ఇందులో భాగంగా యూసుఫ్‌గూడలో ఇంటిని అద్దెకు తీసుకుని, రమేష్‌ను మద్యం తాగేందుకు అక్కడికి పిలిచాడు. మద్యంలో నిద్రమాత్రలు కలపడంతో రమేష్ స్పృహ కోల్పోయాడు. అనంతరం సుత్తితో తలపై కొట్టి హత్య చేశాడు. రమేష్ వద్ద ఉన్న బంగారు గొలుసు, ఉంగరం, ఏటీఎం కార్డు, సెల్ఫోన్లు తీసుకున్నాడు. మృతదేహాన్ని గదిలో ఉంచి తాళం వేసి వెళ్లిపోయాడు. రమేష్ కోడలి సెల్‌కు వాట్సాప్ సందేశాలు పంపి, కిడ్నాప్ చేశానని, విడిచిపెట్టాలంటే రూ.90 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు విచారణలో తేలింది. శాసీ్త్రయ ఆధారాలతో నిందితుడిని అరెస్టు చేసి న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. నాంపల్లి నాలుగో అదనపు సెషన్స్ కోర్టులో నింధితుడిపై చార్జిషీట్ దాఖలు చేయగా జీవిత ఖైదుతో పాటు రూ.16 వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి జె.విక్రమ్ తీర్పు వెలువరించారు. -
సైన్స్ సెమినార్లో విద్యార్థుల ప్రతిభ
కేవీబీపురం: జాతీయ సైన్స్ సెమినార్–2026లో కేవీబీపురం మండల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్, తిరుపతి జిల్లా విద్యాశాఖాధికారి కేవీఎన్ కుమార్ ఆదేశాల మేరకు కేవీబీపురం మండల విద్యాశాఖ అధికారి రవికుమార్ ఆధ్వర్యంలో కేవీబీపురం ఉన్నత పాఠశాల వేదికగా గురువారం మండల స్థాయి సైన్స్ సెమినార్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో కేవీబీపురం ఉన్నత పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థి ప్రజ్వల్రాజు ప్రథమ బహుమతి సాధించగా, అదే పాఠశాలకు చెందిన విద్యార్థిని ఎన్.యాన్సీమేరీ ద్వితీయ బహుమతి సాధించింది. ఇద్దరు విద్యార్థులు తమ ప్రసంగాలతో ఆకట్టుకున్నారు. హెచ్ఎం కూనాటి సురేష్, సైన్స్ ఉపాధ్యాయులు సత్య, సుబ్రహ్మణ్యం, ప్రకాష్, విజయ, విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన విద్యార్థులు జిల్లా స్థాయి జాతీయ సైన్‌న్స్ సెమినార్–2026లో పోటీల్లో పాల్గొననున్నట్టు ఎంఈఓ తెలిపారు. -
బిల్ కలెక్టర్లకు బిగ్ రిలీఫ్
● తొలగింపులు ఉండవు.. అందరినీ కొనసాగిస్తాం తిరుపతి రూరల్: ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో పనిచేస్తున్న 134 మంది బిల్ కలెక్టర్లకు భారీ ఊరట లభించింది. ఉద్యోగం నుంచి ఎవ్వరినీ తొలగించబోమని, అందరినీ కొనసాగిస్తామని ఆ సంస్థ సీఎండీ శివశంకర్ హామీ ఇచ్చారు. బిల్ కలెక్టర్లను కొనసాగించడంతో పాటు ప్రత్యామ్నాయ విధులపై నవంబర్1వ తేదీన జరిగే చర్చలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. గతంలో జారీ చేసిన తొలగింపు ఉత్తర్వులను ఉపసంహరించుకుంటామని స్పష్టం చేశారు. దీంతో తిరుపతిలోని ఎస్పీడీసీఎల్ కార్యాలయం ఎదుట 31 రోజులుగా కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలను బిల్ కలెక్టర్లు విరమించారు. చర్చల అనంతరం సంస్థ డైరెక్టర్ గురవయ్య, సీజీఎంలు మురళి, రామచంద్రయ్య, ప్రసాద్ తదితర అధికారులు దీక్షా శిబిరానికి చేరుకుని యాజమాన్యం నిర్ణయాన్ని వివరించారు. అనంతరం డైరెక్టర్ గురవయ్య నిమ్మరసం ఇచ్చి బిల్ కలెక్టర్ల దీక్షలను విరమింపజేశారు. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కందారపు మురళి, ఏపీ బిల్ కలెక్టర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకటరమణతోపాటు తొమ్మిది జిల్లాలకు చెందిన బిల్ కలెక్టర్లు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. -
ఘనంగా ఆయుష్య హోమాలు, కోటి దీపోత్సవం
నారాయణవనం : స్థానిక సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాల ఆవరణలో తొమ్మిది రోజుల పాటు తలపెట్టిన నవాహ్నిక హోమ కార్యక్రమంలో భాగంగా గురువారం హోమాలు, ధార్మికోపన్యాసం, సాయంత్రం దీపోత్సవం, వేణుగోపాలస్వామి ఊరేగింపు తదితర కార్యక్రమాలు నిర్వహించారు. చైర్మన్ అశోకరాజు ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్రమోదీ పేరున ఉదయం ఆయుష్య హోమం, మృత్యుంజయ హోమం లక్ష తులసి అర్చనలను నిర్వహించారు. సాయంత్రం ప్రవచనకర్త కుప్పా విశ్వనాథ శాస్త్రిచే ‘ధర్మము – పునరవలోకనం‘ ప్రవసచనం కొనసాగింది. సాయంత్రం హోమ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ హాజరై శ్రీకృష్ణ వేణుగోపాలస్వామి విగ్రహాన్ని ఆవిష్కరించి, గోపూజ నిర్వహించారు. దీపో త్సవం అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి (వేణుగోపాల అలంకారంలో) పల్లకీ ఉత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా మాధవ్, అశోకరాజు మాట్లాడుతూ 25 ఏళ్ల సూదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా, ప్రధాన మంత్రిగా పనిచేస్తున్న నరేంద్రమోదీ నాయకత్వంలో భారతదేశం విశ్వగురు స్థానానికి చేరుకుంటుందన్నారు. ఆధ్యాత్మిక వేడుకల్లో కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు, భక్తులు పాల్గొని స్వామివారి దివ్యాశీస్సులు అందుకున్నారు. -
డయల్ యువర్ సీఎండీకి 2,249 ఫిర్యాదులు
తిరుపతి రూరల్: ‘డయల్ యువర్ ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ’ కార్యక్రమానికి వివేష స్పందన లభిస్తోందని ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ లోతేటి తెలిపారు. 9 జిల్లాల పరిధిలో ఇప్పటివరకు 2,249 ఫిర్యాదులు అందగా, 1,898 సమస్యలు పరిష్కరించినట్లు వెల్లడించారు. గురువారం ఏపీఎస్పీడీసీఎల్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎండీ.. ‘డయల్ యువర్ సీఎండీ’ కార్యక్రమంలో నమోదైన ఫిర్యాదులు, పరిష్కార స్థితి, పెండింగ్ అంశాలపై సమీక్షించారు. 2025 నవంబర్ 3 నుంచి 2026 సెప్టెంబర్ 14 వరకు 2,249 ఫిర్యాదులు నమోదైనట్లు తెలిపారు. 9 జిల్లాల్లో ‘డయల్ యువర్ సీఎండీ’, ‘డయల్ యువర్ ఎస్ఈ’ కార్యక్రమాల ద్వారా నమోదవుతున్న ఫిర్యాదులపై నోడల్ అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని సీఎండీ ఆదేశించారు. సంస్థ డైరెక్టర్ కె.గురవయ్య, చీఫ్ జనరల్ మేనేజర్లు, జనరల్ మేనేజర్లు, 9 జిల్లాల సూపరింటెండింగ్ ఇంజినీర్లు పాల్గొన్నారు. -
ఎస్వీయూలో జాబ్‌మేళా రేపు
తిరుపతి సిటీ: ఎస్వీయూ ఎంప్లాయ్మెంట్ కార్యాలయంలో శనివారం జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు కార్యాలయ అధికారి టీ.శ్రీనివాసులు ఒక ప్రకటనలో తెలిపారు. పేరొందిన ఎమ్ఎన్సీ కంపెనీ ప్రతినిధులు జాబ్‌మేళాలో పాల్గొని సుమారు 500 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించనట్లు తెలిపాశారు. ఎస్ఎస్స్సీ, ఇంటర్, ఐటీఐ, డిప్లొమో, ఏదేని డిగ్రీ, డీ, బీ, ఎమ్ ఫార్మసీ, బీటెక్, ఎంబీఏ ఉత్తీర్ణులైన యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. శ్రీవారి దర్శనానికి 4 గంటలు తిరుమల: తిరుమలలో గురువారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 4 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. బుధవారం అర్ధరాత్రి వరకు 71,196 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 22,581 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.2.246 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 04 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. బాధ్యతల స్వీకరణ తిరుపతి అన్నమయ్యసర్కిల్: తిరుపతి రైల్వేస్టేషన్ నూతన డైరెక్టర్‌గా రంజిత్‌కుమార్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇదివరకు ఇక్కడ పనిచేసిన కుప్పాల సత్యనారాయణ ఉద్యోగోన్నతిపై గుంతకల్ రైల్వే డివిజన్ సీనియర్ డీసీఎంగా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో విజయవాడ రైల్వేలో అసిస్టెంట్ ఆపరేషన్ మేనేజర్‌గా పనిచేస్తున్న రంజిత్‌కుమార్‌ను ఆ శాఖ ఉన్నతాధికారులు నియమించారు. ఆ మేరకు ఆయన బాధ్యతలు చేపట్టారు. కాణిపాక వినాయకునికి ముక్కంటి సారె శ్రీకాళహస్తి: వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకుని కాణిపాక వరసిద్ధి వినాయకస్వామివారికి ముక్కంటి ఆలయ సారెను గురువారం పాలక మండలి చైర్మన్ కొట్టే సాయిప్రసాద్, ఈవో బీకే.వెంకటేశులు అందజేశారు. వారికి ఆలయం వద్ద ఈవో, అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. వేదమంత్రో చ్ఛారణల నడుమ వారు ఆలయానికి పట్టు వస్త్రాలను అందజేశారు. వేదపండితులు వారిని ఆశీర్వదించి స్వామివారి జ్ఞాపిక, తీర్థ ప్రసాదాలు అందజేశారు. పాలకమండలి సభ్యులు గుర్రప్పశెట్టి, విజయమ్మ, హైమావతి, పగడాల మురళి, అధికారులు శ్రీనివాసరాజు, మోహన్ పాల్గొన్నారు. జనవరి 22 నుంచి జేఈఈ మెయిన్స్ తిరుపతి సిటీ: ఐఐటీ, ఎన్ఐటీ సంస్థల్లో ఇంజినీరింగ్ విద్యనభ్యసించాలనే కలను విద్యార్థులు నెరవేర్చుకునేందుకు సమయం ఆసన్నమైంది. ఈ మేరకు జేఈఈ మెయిన్స్–2027 పరీక్షల తేదీలను ఎన్టీఏ గురువారం విడుదల చేసింది. వచ్చే ఏడాది జనవరి, ఏప్రిల్ మాసాలలో రెండు సెషన్స్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు. తొలి సెషన్ పరీక్షలు జనవరి 22 నుంచి 30వ తేదీ వరకు నిర్వహించనన్నట్లు ప్రకటించారు. అలాగే రెండవ సెషన్ పరీక్షలను ఏప్రిల్ మొదటి వారంలో నిర్వహించేందుకు సిద్ధమవతున్నట్లు వెల్లడించారు. తొలి సెషన్ పరీక్షల కోసం అక్టోబర్ మొదటి వారంలో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. పింఛన్ల దరఖాస్తుకు నేటితో ఆఖరు తిరుపతి అర్బన్: కొత్త పింఛన్ల దరఖాస్తుకు శుక్రవారంతో గడువు పూర్తికానుంది. ఇప్పటివరకు 49,205 మంది దరఖాస్తు చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. జిల్లాలో సుమారు 60 వేల మంది వరకు కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన ఇంకా 11 వేల మందికి పైగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. -
స్విమ్స్‌లో అరుదైన శస్త్ర చికిత్స
తిరుపతి తుడా: స్విమ్స్‌లో టీటీడీ ప్రాణదాన పథకం కింద పేద రోగికి ఉచితంగా లక్షల విలువ చేసే అరుదైన శస్త్ర చికిత్సను వైద్యులు విజయవంతంగా పూర్తిచేశారు. ప్రకాశం జిల్లా, కోమరోలు మండలం, మాధవపల్లి చెందిన రోగి ఎం.తిరుమలేశ్వర్‌రెడ్డి (25) గతనెలలో స్విమ్స్‌లో న్యూరో సర్జరీ విభాగంలో అడ్మిషన్ పొందారు. వైద్యులు పరీక్షలు నిర్వహించి, సర్జరీ అవసరమని నిర్ణయించి ప్రాణదాన పథకం కింద విజయవంతంగా శస్త్ర చికిత్స నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ డాక్టర్ జగదీష్ మాట్లాడుతూ స్విమ్స్‌లో వైద్యసేవ అంటే కేవలం వ్యాధికి చికిత్స చేయడం మాత్రమే కాదని, ఆపదలో ఉన్న రోగికి, అతని కుటుంబానికి భరోసాగా నిలవడం కూడా తమ బాధ్యతన్నారు. -
దరఖాస్తుల ఆహ్వానం
తిరుపతి ఎడ్యుకేషన్ : నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ (ఎన్ఎంఎంఎస్) పరీక్షకు ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ కేవీఎన్.కుమార్ తెలిపారు. నవంబర్ 15న నిర్వహించే ఈ పరీక్షకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో 8వ తరగతి చదువుతూ వార్షిక కుటుంబ ఆదాయం రూ.3.5 లక్షల లోపున్న విద్యార్థులు అర్హులని తెలిపారు. ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.బీఎస్ఈ.ఏపీ.జీఓవీ.ఇన్’ వెబ్సైట్ ద్వారా అక్టోబర్ 12వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని, అలాగే దరఖాస్తు రుసుమును ఓసీ, బీసీ విద్యార్థులు రూ.100, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.50 అక్టోబర్ 13వ తేదీలోపు ఎస్బీఐ కలెక్ట్ లింకు ద్వారా చెల్లించాలని పేర్కొన్నారు. నామినల్ రోల్‌ను సంబంధిత ప్రధానోపాధ్యాయులు ధృవీకరించి, ఆ ధృవపత్రాలను డీఈఓ కార్యాలయంలో అక్టోబర్ 14వ తేదీలోపు అందజేయాలని ఆయన సూచించారు. రెండు బస్సులు ఢీ – తప్పిన పెను ప్రమాదం తడ: జాతీయ రహదారిపై రెండు బస్సులు ఢీకొన్న ఘటన మండలంలోని కొండూరు గ్రామం వద్ద గురువారం చోటు చేసుకుంది. వివరాలు.. టైర్ పంక్చర్ కావడంతో పరిశ్రమలకు కార్మికులను తరలించే బస్సు ఓ లారీ పక్కన రోడ్డుపై నిలిచిపోయింది. అదే సమయంలో తమిళనాడుకు ప్రయాణికులతో వెళుతున్న ట్రావెల్స్ బస్సు దాన్ని అంచనా వేయలేక కార్మికుల బస్సును ఢీకొట్టింది. ట్రావెల్స్ బస్సులోని ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. -
తిరుమల ఆలయం ముందు మహిళ రీల్స్
సాక్షి, తిరుమల: తిరుమలలో మరోసారి రీల్స్ వ్యవహారం కలకలం రేపింది. తిరుమల ఆలయం ముందు దర్శిణి ఫ్యాషన్స్‌కు చెందిన మహిళ రీల్స్ చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కళాకారులకు మేకప్ చేసేందుకు వచ్చిన దర్శిణి ఫ్యాషన్స్ మహిళ.. ప్రమోషన్ కోసం ఆలయం ముందు రీల్స్ చేసింది. కళాకారులతో దర్శిణి ఫ్యాషన్స్‌పై ఆ మహిళ మాట్లాడించింది. తిరుమలలో రీల్స్, వాణిజ్య ప్రమోషన్స్ నిషేధించిన సంగతి తెలిసిందే.మాడవీధుల్లో రీల్స్ చేస్తున్నా భద్రతా సిబ్బంది పట్టించుకోవడం లేదు. తిరుమల పవిత్రతకు భంగం కలిగేలా రీల్స్‌పై విమర్శలు వస్తున్నాయి. రేణిగుంటకు చెందిన దర్శిణి ఫ్యాషన్స్‌గా గుర్తించారు. ఆలయం ముందు వాణిజ్య ప్రచారం చేయడంపై భక్తుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. నిబంధనలు ఉన్నా తిరుమలలో రీల్స్‌కు అడ్డుకట్ట ఎక్కడ? అంటూ భక్తులు ప్రశ్నిస్తున్నారు.కాగా, గత నెలలో కూడా శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చిన ఓ జంట దేవుడి పేరుతో రీల్స్ చేశారు. సర్వదర్శనం క్యూలైన్ పాటు రాంబగీచా ప్రాంతంలోనూ చేసిన రీల్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. తిరుమలలో తరచూ ఇలాంటి రీల్స్ వెలుగులోకి వస్తుండడంపై చర్చ జరుగుతోంది. ఇదీ చదవండి: AP: ఆ జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక -
కొండపైనా క్రెడిట్ కొట్టేశారు!
తిరుమల: తిరుమలలో అభివృద్ధి కార్యక్రమాల్లోనూ చంద్రబాబు ప్రభుత్వం క్రెడిట్ చోరీ చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. గత ప్రభుత్వం చేపట్టి, అధిక భాగం పూర్తి చేసిన శ్రీ వేంకటేశ్వర మ్యూజియం ఆధునీకరణ, టీటీడీ ఉద్యోగుల ఇళ్ల స్థలాల వ్యవహారం మొత్తం చంద్రబాబు ప్రభుత్వంలో కొత్తగా చేసినట్లుగా బిల్డప్ ఇవ్వడంపట్ల భక్తులు, ఉద్యోగవర్గాల నుంచి విమర్శలు వస్తున్నాయి. మ్యూజియం పనులకు అప్పుడే శ్రీకారం శ్రీవారి ఆలయ చరిత్ర, కళా సంపదను భక్తులకు పరిచయం చేసేలా ఎస్వీ మ్యూజియాన్ని ఆధునిక సాంకేతికతతో అభివృద్ధి చేసే ప్రాజెక్టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలోనే ప్రారంభమైంది. 2023లోనే టీటీడీ అధికారికంగా విడుదల చేసిన వివరాల ప్రకారం.. మ్యూజియం ఆధునీకరణకు టీసీఎస్ రూ.125 కోట్లు, బెంగళూరుకు చెందిన మ్యాప్ సిస్టమ్స్ రూ.20 కోట్లు విరాళంగా అందించేందుకు ముందుకొచ్చాయి. మొత్తం రూ.145 కోట్ల ప్రాజెక్టులో 19 గ్యాలరీలను అభివృద్ధి చేయనున్నట్లు అప్పట్లోనే టీటీడీ వెల్లడించింది. అన్నమయ్య రాగి రేకులు, శిల్పాలు, నాణేలు, ఆయుధాలు, సంగీత వాయిద్యాలు, పూజా సామగ్రి తదితర చారిత్రక వస్తువులను ప్రదర్శించేలా గ్యాలరీలను రూపొందించే పనులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలోనే ప్రారంభమై, 85 శాతం పనులు కూడా పూర్తయ్యాయి. మిగిలిన 15 శాతం పనులకు ప్రభుత్వం మారిన తర్వాత రెండేళ్ల సమయం పట్టింది. దీనిని విస్మరించి, మ్యూజియం అభివృద్ధి మొత్తం బాబు ప్రభుత్వంలోనే జరిగినట్లుగా చెప్పుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఉద్యోగుల ఇళ్ల స్థలాలపైనా అదే చర్చ టీటీడీ ఉద్యోగుల ఇళ్ల స్థలాల విషయంలోనూ చంద్రబాబు సర్కారు క్రెడిట్ కొట్టేసే ప్రయత్నం చేసింది. టీటీడీ అధికారిక రికార్డుల ప్రకారం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో 2022లోనే వడమాలపేట మండలంలోని పాదిరేడు అరణ్యం వద్ద సుమారు 300.22 ఎకరాల భూమిని ఉద్యోగుల ఇళ్ల స్థలాల కోసం సేకరించారు. ఇందుకోసం రూ.61.63 కోట్ల చెక్కును జిల్లా కలెక్టర్‌కు అందించినట్లు టీటీడీ అప్పట్లోనే వెల్లడించింది. 2023 ఆగస్టులో అప్పటి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి భూమిని కూడా పరిశీలించారు. సుమారు 7 వేల మంది ఉద్యోగులకు 35/55 అడుగుల చొప్పున స్థలాలు కేటాయించే ప్రణాళికను అప్పట్లోనే ప్రకటించారు. లేఅవుట్, కచ్చా రోడ్లు, టౌన్ ప్లానింగ్ అనుమతుల కోసం కూడా చర్యలు చేపట్టినట్లు టీటీడీ తెలిపింది. ఇప్పుడేదో కొత్తగా చేస్తున్నట్లుగా ఉద్యోగుల ఇళ్ల స్థలాల అభివృద్ధికి రూ.230 కోట్లతో మౌలిక వసతులు కలి్పస్తామని చంద్రబాబు ప్రకటించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
శ్రీవారి వద్ద సేవే చేయాలి.. ఉద్యోగం కాదు
తిరుమల : శ్రీవారి వద్ద సేవ చేయాలే తప్ప ఉద్యోగాలు కల్పించే సంస్థగా తిరుమల తిరుపతి దేవస్థానాలు (టీటీడీ) మారకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. తిరుమల పద్మావతి అతిథి గృహంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. టీటీడీలో ఎంతమంది ఉద్యోగులు అవసరమో అంతవరకే ఇస్తామని స్పష్టంచేశారు. కొత్తగా ఉద్యోగాలు కల్పిస్తే టీటీడీ ఆదాయంలో 100 శాతం జీతాలకే వెళ్లిపోతుందన్నారు. ఇప్పటికే 12 లక్షల మంది శ్రీవారి సేవకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని.. వారి సేవలను సమర్థంగా వినియోగించుకునే వ్యవస్థను బలోపేతం చేయాలన్నారు. వైద్య, విద్యారంగాల్లో పనిచేసే వారిని కూడా సేవకులుగా మార్చి సేవలు అందించేలా చర్యలు చేపట్టాలని చెప్పారు. తిరుపతికి స్కైవాక్.. 50 ఎకరాల్లో పార్కింగ్.. తిరుపతి రైల్వేస్టేషన్ నుంచి బస్టాండ్ వరకు ఆ ప్రాంతాన్ని అనుసంధానించేలా స్కైవాక్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉందని చంద్రబాబు తెలిపారు. ఇటీవల తిరుపతిలో సేకరించిన 50 ఎకరాల్లో బహుళ అంతస్తుల పార్కింగ్ ఏర్పాటుచేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. తిరుపతిని వెడ్డింగ్ డెస్టినేషన్‌గా మార్చాలన్నది తమ ఆలోచన అని ∙తెలిపారు.రూ.3,165 కోట్ల అన్నదానం కార్పస్ ఫండ్.. టీటీడీలోని ఎస్వీ అన్నదానం ట్రస్ట్‌కు దాదాపు రూ.3,165 కోట్ల కార్పస్ ఫండ్ ఉందని సీఎం వెల్లడించారు. ప్రాణదానం ట్రస్ట్ ద్వారా రోగులకు మరింత నాణ్యమైన వైద్యసేవలు అందించాలని చెప్పారు. 65 ఆలయాలకు ఏ, బీ, సీ కేటగిరీలు.. టీటీడీ ఆధ్వర్యంలోని 65 ఆలయాలను ఏ, బీ, సీ కేటగిరీలుగా విభజించి అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలని సీఎం సూచించారు. శ్రీవారి ఆస్తులు, ఆభరణాలు, బంగారం, నిధులు, భూములు తదితర వివరాలను ఆన్లైన్లో ఉంచేలా చర్యలు చేపట్టాలని కూడా ఆదేశించినట్లు తెలిపారు. తిరుమలకు నీటి భద్రత కల్పించేందుకు చర్యలు చేపడుతున్నట్లు సీఎం తెలిపారు. మీడియా సమావేశంలో మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, అనగాని సత్యప్రసాద్, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈఓ ముద్దాడ రవిచంద్ర, జిల్లా కలెక్టర్ డాక్టర్ వేంకటేశ్వర్, అదనపు ఈఓ సీహెచ్ వెంకయ్య చౌదరి, బోర్డు సభ్యులు పాల్గొన్నారు. తిరుమలలో పలు ప్రారంభోత్సవాలు.. ఇదిలా ఉంటే.. తిరుమలలో భక్తుల సౌకర్యార్థం టీటీడీ చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ముఖ్యమంత్రి బుధవారం ప్రారంభించారు. ఇందులో తిరుమల హీలింగ్ అండ్ డివోషన్ ఎక్స్పీరియన్స్ సెంటర్, దుర్లభ దర్శన్ వీఆర్ అనుభవం, ఎలక్ట్రిక్ బస్సులు, శ్రీ వేంకటేశ్వర మ్యూజియం, నందకం యాప్, భక్తులకు గ్రూప్ ఇన్సూరెన్స్ పథకం ఉన్నాయి.సీఎం వ్యాఖ్యలపై టీటీడీ సిబ్బంది ఫైర్!సాక్షి టాస్‌్కఫోర్స్: తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగాల నియామకాలపై సీఎం చంద్రబాబు బుధవారం చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. తిరుమలలో ఇకపై శాశ్వత ఉద్యోగాలు ఉండవు.. అవసరం మేరకే ఉంటాయి.. శ్రీవారి దగ్గర సేవ చేయాలి.. ఉద్యోగం కాదు. కొత్తగా ఉద్యోగాలు ఇస్తే వచ్చే ఆదాయం వంద శాతం ఉద్యోగుల జీతాలకే వెళ్తుంది’ అని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించడంపై టీటీడీ ఉద్యోగులు మండిపడుతున్నారు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి.. ఉద్యోగాల విషయంలో ఇలా మాట్లాడటాన్ని టీటీడీ ఉద్యోగ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తున్నాయి. ఉద్యోగానికి బదులు ‘సేవ’?.. రాష్ట్రంలో ప్రభుత్వంతో సమాంతరంగా తిరుమల తిరుపతి దేవస్థానం నడుస్తుంది. టీటీడీలో శాశ్వత, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ కింద సుమారు 15 వేల నుంచి 16 వేల మంది పనిచేస్తున్నట్లు సమాచారం. టీటీడీలో పనిచేసే ఉద్యోగుల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మందికి వివిధ రూపాల్లో జీవనోపాధి లభిస్తుంది. అటువంటి ధార్మిక సంస్థలో ఉద్యోగావకాశాలకు గండికొట్టేలా సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించడంపై ఇటు టీటీడీలోనూ.. అటు జనంలోనూ ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. వైద్యం, విద్య తదితర రంగాల్లో కొత్తగా ఉద్యోగాలను భర్తీచేయడం కంటే ఇప్పటికే ఉన్న శ్రీవారి సేవకులకు శిక్షణ ఇచ్చి సేవా కార్యక్రమాల్లో వినియోగించుకోవాలన్న దిశగా సీఎం వ్యాఖ్యలు ఉండడంపై టీటీడీ ఉద్యోగుల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. -
శ్రీవారి దర్శనానికి 4 గంటలు
తిరుమల: తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 8 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. మంగళవారం అర్ధరాత్రి వరకు 61,361 మంది స్వామివారిని దర్శించుకోగా 18,722 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.70 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 04 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలైన్లో వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. కేటాయించిన సమయాన్ని కంటే ముందు వెళ్లిన భక్తులను క్యూలో అనుమతించరని స్పష్టం చేసింది. ముక్కంటి సేవలో ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీకాళహస్తి : జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరస్వామివారిని బుధవారం దేవదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కన్నబాబు సేవించుకున్నారు. దక్షిణ గోపురం వద్ద ఆయనకు ఆలయ పాలకమండలి చైర్మన్ కొట్టే సాయిప్రసాద్, ఈఓ బీకే వెంకటేశులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. మృత్యుంజయస్వామి సన్నిధిలో వేదపండితులు ఆశీర్వదించి స్వామి అమ్మవార్ల జ్ఞాపిక, తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ పరిపాలన భవనంలో చైర్మన్, ఈఓతో కలిసి అధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఆలయ నిర్వహణ, భక్తులకు అందుతున్న సౌకర్యాలు, అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించారు. భక్తులకు మెరుగైన వసతుల కల్పనే లక్ష్యంగా పనిచేయాలని ఆదేశించారు. జాతర నిర్వహణకు అనుమతి వెంకటగిరి(సైదాపురం) : గ్రామశక్తి పోలేరమ్మతల్లి జాతరను వైభవంగా నిర్వహించాలని వెంకటగిరి రాజా కుటుంబీకులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వీబీ సాయికృష్ణ యాచేంద్ర సూచించారు. బుధవారం ఈ మేరకు వెంకటగిరి రాజా ప్యాలెస్‌లోని మండపంలో వెంకటగిరి గ్రూప్ దేవస్థానం ఈఓ శ్రీనివాసులరెడ్డి, సీఐ రోశయ్యకు సాయికృష్ణయా చేంద్ర తాంబులం అందించి జాతర నిర్వహణ కు అనుమతి ఇచ్చారు. సాయికృష్ణ యాచేంద్ర మాట్లాడుతూ సాంప్రదాయలను గౌరవిస్తూ ప్రజా ప్రతినిధుల సమక్షంలో దేవదాయ, పోలీ సు, ఇతర శాఖల అధికారులు సమన్వయం చేసు కుని జాతరను విజయవంతం చేయాలని కోరా రు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు. -
రూ.కోట్ల కాలువ కబ్జా!
రేణిగుంట : తిరుపతి– కరకంబాడి రహదారిలోని రేణిగుంట మండలం వెంకటాపురం చెరువు కలుజు నుంచి నీరు వెళ్లే కాలువను ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాల యాజమాన్యం కబ్జా చేసేస్తోంది. 227 సర్వే నంబర్లోని 74 సెంట్లను టీడీపీ స్థానిక నేతల అండతో ఆక్రమించుకుని ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టింది. కబ్జాకు సహకరిస్తున్నందుకు సదరు పచ్చనేతలు భారీగా ముడుపులు తీసుకున్నట్లు తెలుస్తోంది. సుమారు రూ.3కోట్ల విలువైన భూమి కబ్జాకు గురైనప్పటికీ ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడంపై స్థానిక రైతులు మండిపడుతున్నారు. పేదలు రెండు సెంట్ల పోరంబోకు భూమిలో ఇల్లు కట్టుకుంటేనే కూల్చి వేసే అధికారులు ఇప్పుడు రూ.కోట్ల స్థలం చెరబడుతున్నప్పటికీ ఎందుకు చర్యలు చేపట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీటికి దారేది..? వెంకటాపురం చెరువు నుంచి ఈ కాలువ ద్వారా మరో రెండు చెరువులకు నీరు వెళుతుంది, ఇప్పుడు కాలువను కబళించేసి ప్రహరీ గోడ నిర్మిస్తే నీరు దిగువకు ఎలా వెళుతుందని రైతులు ప్రశ్నిస్తున్నారు. కింది చెరువుల ఆయకట్టు రైతులు పరిస్థితి ఏంటని నిలదీస్తున్నారు. ఆక్రమణ విషయంపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. ఉన్నతాధికారులైనా స్పందించాలని కోరుతున్నారు. గతంలో సైతం ఆక్రమణ సదరు ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాల యాజమాన్యం గతంలో సైతం వెంకటాపురం చెరువుకు సంబంధించి సర్వే నంబర్ 225/1లో ఒక ఎకరా ఆక్రమించుకొని ప్రహరీ గోడ నిర్మించుకున్నారని స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు. అదే విధంగా మళ్లీ కబ్జాకు తెగబడుతున్నారని ఆరోపిస్తున్నారు. అధికారలు వెంటనే పూర్తిస్థాయిలో సర్వే చేయించి చెరువు భూమిని కాపాడాలని కోరుతున్నారు. ఈ క్రమంలోనే దీనిపై తహసీల్దార్ శ్రావణ్‌కుమార్ వివరణ తీసుకునేందుకు యత్నించగా, ఆయన స్పందించలేదు. వెంకటాపురం చెరువు కలుజు -
సంప్రదాయబద్ధంగా వెంకటగిరి జాతర చాటింపు
వెంకటగిరిరూరల్ : వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మతల్లి జాతర మొదటి చాటింపు బుధవారం అర్ధరాత్రి సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ముందుగా కాపాళెంలోని గాలిగంపుల పోలేరమ్మ, కామాక్షమ్మ ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిపించారు. అనంతరం జాతరకు చాటింపు వేశారు. కాంపాళెంలోని ప్రధాన మార్గం మీదుగా వరదరాజస్వామి ఆలయం, బజారువీధి మీదుగా పోలేరమ్మతల్లి ఆలయం, ఆర్చి, కాశీపేట కూడలి మీదుగా చాటింపును కొనసాగించారు. శ్రీనివాసులరెడ్డి, సీఐ రోశయ్య పర్యవేక్షించారు. 19న ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు తిరుపతి అర్బన్: ఇంటర్ 2025–26లో 75శాతం మార్కులతో ఉత్తీర్ణులైన నాన్ మ్యాథ్స్ గ్రూప్ విద్యార్థులకు హెస్‌సీఎల్ కంపెనీ అసోసియేట్ పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ఆర్ఈఓ గోపాల్‌రెడ్డి, డీఎస్డీఓ లోకనాథం తెలిపారు. బుధవారం వారు మాట్లాడుతూ ఈ నెల 19వ తేదీ ఉదయం 10 గంటలకు తిరుపతిలోని కరకంబాడి మార్గంలో ఉన్న శ్రీరామ ఇంజినీరింగ్ కళాశాలలో ఇంటర్వ్యూలు ఉంటాయని వెల్లడించారు. ఆసక్తిగల విద్యార్థులు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. వివరాలకు 8019913422 నంబర్లో సంప్రదించాలని కోరారు. -
బ్రహ్మాండోత్సవం
రూ.కోట్ల కాలువ కబ్జా! తిరుపతి– కరకంబాడి మార్గంలోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాల యాజమాన్యం యథేచ్ఛగా కబ్జాకు పాల్పడుతోంది.తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఉభయ దేవేరీ సమేతంగా శ్రీమలయప్పస్వామివారు విశేష వాహనాల్లో కొలువుదీరి భక్తులను అనుగ్రహిస్తున్నారు. బుధవారం ఉదయం చిన్నశేష వాహనంపై ఊరేగుతూ అశేష జనులను కటాక్షించారు. రాత్రి వీణాపాణి అలంకారంలో హంస వాహనంపై విహరించారు. భువి వైకుంఠంలో ఏడుకొండలస్వామి దివ్యతేజోవిరాజిత మూర్తిని వీక్షించి భక్తకోటి పులకించింది. మహిమాన్విత మాడవీధుల్లో దేదీప్యంగా ప్రకాశిస్తున్న తిరుమలేశుని దర్శించి పరవశించింది. ఎన్ని జన్మల ఫలమో కదా.. అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుని సేవించు భాగ్యము దక్కిందంటూ మురిసిపోయింది. – తిరుమల భక్తుల సౌకర్యాలకే ప్రాధాన్యం తిరుమలలో భక్తుల సౌకర్యాలకే ప్రాధాన్యమివ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. గురువారం శ్రీ 17 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026 -
వైభవోత్సవం
తుమ్మలగుంట శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. రెండో రోజు బుధవారం ఉదయం చిన్నశేష వాహనంపై వెంకన్న విహరించారు. రాత్రి హంస వాహనంపై సరస్వతీ స్వరూపంగా దర్శనమిచ్చారు. ఈ క్రమంలోనే ఉదయం 11 గంటలకు దేవదేవేరులనను కల్యాణ మండపానికి వేంచేపు చేశారు. వేడుకగా స్నపన తిరుమంజనం జరిపించారు. సాయంత్రం కనులపండువగా ఊంజల్ సేవ నిర్వహించారు. ఈ క్రమంలోనే చిన్నశేష వాహన సేవకు తిరుపతి రూరల్ మండలానికి చెందిన భక్తులు సారె తీసుకువచ్చారు. హంస వాహన సేవకు పాకాల మండలానికి చెందిన వారు సారె సమర్పించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఆలయ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, కుటుంబీకులు పర్యవేక్షించారు. – తిరుపతి రూరల్ లారీని ఢీకొన్న తమిళనాడు ఆర్టీసీ బస్సుఆదేశాల అమలు తప్పనిసరి నాయుడుపేట టౌన్ : ఎన్నికల కమిషన్ ఆదేశాలను మున్సిపల్‌శాఖ అధికారులు తప్పనిసరిగా అమలు చేయాలని మున్సిపల్ అడ్మినిస్టేషన్ కమిషనర్ సంపత్‌కుమార్ స్పష్టం చేశారు. బుధవారం నాయుడుపేట మున్సిపల్ కార్యాలయంలో నాయుడుపేట, సూళ్లూరుపేట, వెంకటగిరి కమిషనర్లు షేక్ ఫజులుల్లా, చిన్నయ్య, కిరణ్‌తో కలిసి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఎస్ఐఆర్ ప్రక్రియను పకడ్బందిగా నిర్వహించాలని సూచించారు. పురపాలక సంఘాల్లో తాగునీటి సరఫరాతో పాటు పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ద వహించాలని కోరారు. అనంతరం పట్టణంలోని పాతబస్టాండ్ వద్ద అన్నా క్యాంటీన్‌కు మధ్యాహ్న భోజనం పంపిణీని పరిశీలించారు. మున్సిపల్ మేనేజర్ ఊరుకుందమ్మ పాల్గొన్నారు. పాఠశాల ఆవరణలోకి పాముపుల్లంపేట :ప్రభుత్వ పాఠశాల ఆవరణలోకి పాము రావడంతో విద్యార్ధులు భయాందోళనకు గురయ్యారు. బుధవారం ఉదయం సాతువారిపల్లె ప్రాథమిక పాఠశాల గేటు తీయగానే రక్తపింజరి పాము కనిపించడంతో విద్యార్ధులు కేకలు వేస్తూ పరుగులు తీశారు. గ్రామస్తులు వెంటనే అక్కడకు చేరుకుని పాముని కొట్టి చంపేశారు. పాఠశాల సమీపంలో ముళ్లపొదలు అధికంగా ఉండడం, పరిసర ప్రాంతాలు అపరిశుభ్రంగా ఉండడంతో విషజీవుల సంచారం అధికమైందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాల ప్రాంగణంలోనే అంగన్వాడీ కేంద్రం కూడా ఉండడంతో చిన్నారుల భద్రతపై దృష్టి సారించాలని కోరుతున్నారు. శిథిలావస్థలోని పాఠశాల భవనానికి మరమ్మతులు చేయించడంతోపాటు పరిసరాలను పరిశుభ్రంగా మార్చేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. నాయుడుపేట టౌన్ : మండలంలోని నరసారెడ్డి కండ్రిగ వద్ద జాతీయ రహదారి పక్కన ఆగి ఉన్న లారీని కంటైనర్ లారీని తమిళనాడు ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు.. తమిళనాడుకు చెందిన 103 బస్సు నెల్లూరు నుంచి 50 మంది ప్రయాణికులతో చైన్నెకు బయలుదేరింది. మార్గం మధ్యలో ప్రమాదం జరిగింది. బస్సు డ్రైవర్ సెల్‌ఫోన్ చూస్తూ అజాగ్రత్తగా నడపడం వల్లే యాక్సిడెంట్ జరిగిందని ప్రయాణికులు వెల్లడించారు. బస్సు వేగంగా వెళుతున్న సమయంలో కాల్ రావడంతో డ్రైవర్ ఫోన్ చూస్తూ రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వెనుకనుంచి ఢీకొట్టాడని చెప్పుకొచ్చారు. ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగంలో కూర్చుని ఉన్న కండక్టర్ షణ్ముగంతోపాటు ఇందుకూరు పేటకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు తిరుమలశెట్టి మల్లికార్జున, పొదలకూరు ప్రాంతానికి చెందిన శ్రీనివాసులు, సూళ్లూరుపేటకు చెందిన ఎస్కే షేక్ సద్దార్, తడ మండలం చెరివి గ్రామానికి చెందిన శ్రీరాఘవేంద్ర, నాయుడుపేటకు చెందిన ఎన్.నరేంద్రకుమార్‌లు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక మహాలక్ష్మీనగర్ కాలనీకి చెందిన యువత, హైవే మొబైల్, 108 అంబులెన్స్ సిబ్బంది హుటాహుటిన ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.తీవ్రంగా గాయపడిన కండక్టర్ షణ్ముగాన్ని మెరుగైన చికిత్స నిమిత్తం చైన్నెకు తీసుకెళ్లార. ప్రయాణికులు మరో బస్సులో చైన్నెకు తరలివెళ్లారు. సీఐ వెంకటేశ్వరరావు, ఏఎస్ఐ రామ్మూర్తి, పోలీస్ సిబ్బంది ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కండక్టర్ వద్ద ఉన్న రూ.15వేల నగదు 108 ఈఎంటీ బల్లి కిరణ్‌కుమార్, పైలెట్ సుబ్బారావుకు దొరికింది. వారు ఆ నగదును ప్రభుత్వ వైద్యశాలలో బస్ డ్రైవర్ జ్ఞానప్రకాష్కు అందజేశారు. రోడ్డు ప్రమాదంలో ఎస్బీఐ మేనేజర్ దుర్మరణం వెంకటగిరి రూరల్:వెంకటగిరి– తిరుపతి జాతీయ రహదారిపై బుధవారం శ్రీకాళహస్తి మండలం జగ్గరాజుపల్లె వద్ద గుర్తుతెలియని వాహ నం ఢీకొని ఎస్బీఐ వెంకటగిరి శాఖ మేనేజర్ మృతి చెందారు. వివరాలు.. వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన దీపక్ (35) వెంకటగిరి స్టేట్ బ్యాంకులో మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. దీపక్ వాకింగ్ వెళ్లిన సమయంలో ప్రమాదం జరిగింది. స్ధానికులు 108లో వైద్యశాలకు తరలించగా దీపక్ అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. లారీ ఢీకొని అర్చకుడి మృతి శ్రీకాళహస్తి: ఏర్పేడు నుంచి వెంకటగిరికి వెళ్లే ప్రధాన రహదారిలో మంగళవారం అర్ధరాత్రి లారీ ఢీకొనడంతో ద్విచక్ర వాహనంలో వస్తున్న అర్చకుడు కళ్యాణ్ కుమార్ శర్మ (29) అక్కడకక్కడే మృతి చెందాడు. వివరాలు.. పల్లం గ్రామానికి చెందిన పులివెందుల కళ్యాణ్ కుమార్ శర్మ వెంకటగిరి వెళ్లి తిరిగి వస్తుండగా పల్లంపేట పెట్రోల్ బంకు వద్ద ప్రమాదం జరిగింది. ఏర్పేడు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఉపాధి అవకాశాల విధ్వంసం
తిరుపతి అన్నమయ్యసర్కిల్: కేంద్రంలోని మోడీ పాలనలో ఉపాధి అవకాశాలు విధ్వంసమయ్యాయని ప్రగతిశీ ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్‌యూ) రాష్ట్ర అధ్యక్షుడు భాస్కర్, ప్రధాన కార్యదర్శి వినోద్‌కుమార్ తెలిపారు. బుధవారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో వారు మాట్లాడారు. రాష్ట్రంలో 2 లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉంటే, కూటమి ప్రభుత్వం అరకొరగా భర్తీ చేస్తోందని విమర్శించారు. అందుకే శాశ్వతమైన, గౌరవప్రదమైన ఉపాధి ప్రతి విద్యార్థి హక్కు నినాదంతో డిసెంబర్ 11 నుంచి 13వ తేదీ వరకు తిరుపతిలో 24వ రాష్ట్ర మహాసభలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. దేశవ్యాప్తంగా మేధావులు, పీడీఎస్‌యూ ప్రతినిధులు మహాసభలకు హాజరు కానున్నట్లు చెప్పారు. మంత్రి నారా లోకేష్ జీవో నంబర్ 77ను రద్దు చేస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నెరవేర్చలేదన్నారు. అలాగే పెండింగ్‌లోని రూ.64 వేల కోట్ల ఫీజు రియింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఒక్కొక్క యూనివర్సిటీకి రూ. 200 కోట్లు నిధులు కేటాయించాలని కోరారు. -
జిల్లా హౌసింగ్ హెడ్ పోస్టుతో ఆటలు
● 6 నెలలకు ఒకసారి మారుతున్న అధికారులు ● ముందుకు సాగని గృహ నిర్మాణాలు నిరుపేదల సొంతింటి కలలను చంద్రబాబు ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. ఇప్పటికే గత వైఎస్సార్సీపీ హయాంలో మంజూరైన ఇళ్ల నిర్మాణంపై శీతకన్ను వేసింది. ఈ క్రమంలోనే హౌసింగ్‌శాఖ జిల్లా హెడ్ పోస్టును సైతం ఇష్టారాజ్యం చేసేస్తోంది. పక్కా గృహాల పురోగతిని పర్యవేక్షించాల్సిన కీలక అధికారిని సక్రమంగా పనిచేయకుండా మోకాలడ్డుతోంది. ప్రతి ఆరు నెలలకు ఒకసారి కొత్త వారిని నియమిస్తూ ఆటలాడుకుంటోంది. టీడీపీ నేతల సిఫార్సు ఉంటే చాలు ఎవరికై నా సదరు పోస్టును కట్టబెట్టేస్తోంది. సామర్థ్యం.. పనితీరుతో సంబంధం లేకుండా రికమండేషన్లకు ప్రాధాన్యమిస్తోంది. చివరకు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారైనా సరే పలుకుబడి ఉంటే చాలు వెంటనే జిల్లా అధికారి స్థానంలో కూర్చోబెట్టేస్తోంది.హౌసింగ్ జిల్లా సమాచారం గత వైఎస్సార్సీపీ హయాంలో మంజూరు చేసిన ఇళ్లు 69,215 పూర్తి చేసినవి 25,450 ప్రస్తుత ప్రభుత్వం పూర్తి చేసినవి 10,132 భూమి పూజ చేసినవి 4,385 పునాదుల్లోనే ఉన్నవి 3,500 బేసిమెంట్ దశలోవి 13,313 గోడల దశలోని ఇళ్లు 7,902 శ్లాబ్ దశలో ఉన్నవి 4,533తిరుపతి అర్బన్:చంద్రబాబు ప్రభుత్వంలో జిల్లా స్థాయి అధికారి పోస్టును.. కాస్త సిఫార్సు ఉంటే చాలు సులభంగా తెచ్చుకోవచ్చునంటూ హౌసింగ్ డిపార్ట్ మెంట్లో జోరుగా చర్చసాగుతోంది. అందుకు జిల్లా హౌసింగ్ హెడ్ (డీహెచ్‌హెచ్) పోస్టును ఉదాహరణ గా చూపుతున్నారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన హౌ సింగ్ కార్యాలయంలోని ఉద్యోగులు పదే పదే డీహెచ్‌హెచ్ పోస్టును మార్పు చేయడంపై మండిపడుతున్నారు. అవినీతి అరోపణలతో సంబంధం లేదు.. ఆప్షన్–3 ఇంటి నిర్మాణాల్లో దోపిడీకి పాల్పడినా ఏ మా త్రం పట్టించుకోకుండా రికమండేషన్‌తో సులవుగా జిల్లా అధికారి పోస్టును సంపాదించుకుంటున్నారు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే.. జిల్లా హౌసింగ్ హెడ్‌ను తరచూ మారుస్తుండడంతో పక్కా గృహాల నిర్మాణాలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు తయారయ్యాయని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డీహెచ్హెచ్కు సైతం తమ పోస్టును కాపాడుకునేందుకే సమయం గడచిపోతోందని ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారి పర్యవేక్షణ లేకపోవడంతో పలువురు ఉద్యోగులు సైతం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. డీహెచ్‌హెచ్ మహా ఉంటే మూడు నెలలు ఉంటారు.. ఆయనను పట్టించుకునేది ఏముంటదిలే అని తూతూమంత్రంగా విధులు నిర్వర్తిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి పూర్తి బాధ్యతలతో కీలకమైన హౌసింగ్ జిల్లా అధికారి పోస్టును భర్తీ చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే పేదల ఇళ్ల అసంపూర్తిగానే మిగిలిపోయే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. బేసిమెంట్ దశలో ఆగిన ఇంటి నిర్మాణాలు తాజాగా శ్రీనివాసరావు నియామకం డీహెచ్‌హెచ్‌గా ఏ.శ్రీనివాసరావును బుధవారం నియమించారు. ఆయన ఏడాది క్రితం ఉద్యోగ విమరణ పొందారు. అయితే మూడు నెలల క్రితం హౌసింగ్ కార్పొరేషన్ ఉద్యోగుల విరమణ వయసును 62 ఏళ్లకు పెంచారు. దీంతో పదలు సంఖ్యలో ఉద్యోగులు తిరిగి విధుల్లో చేరారు. ఈ క్రమంలో శ్రీనివాసరావు సైతం తిరుపతి ఈఈగా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం తిరుపతి ఈఈతోపాటు జిల్లా హౌసింగ్ హెడ్‌గా ఇన్చార్జి బాద్యతలు అప్పగించారు. అయితే మూడు నెలల నుంచి ఇప్పటి వరకు ఇన్చార్జి డీహెచ్‌హెచ్‌గా విధులు నిర్వర్తించిన గోపాల్‌నాయక్‌ను తిరిగి గూడూరు ఈఈగా పంపించారు. గోపాల్‌నాయక్‌కు ముందు రైల్వేకోడూరు హౌసింగ్ ఈఈ శ్రీరాములురెడ్డి డీహెచ్‌హెచ్‌గా పనిచేశారు. -
నిమజ్జనోత్సాహం
తిరుపతి నగరంలో వినాయక నిమజ్జనోత్సవం వైభవంగా సాగుతోంది. బుధవారం ఈ మేరకు గణపతి విగ్రహాలను ఊరేగింపుగా తరలించారు. బాణసంచా పేలుస్తూ.. డప్పు వాయిద్యాల నడుమ నృత్యాలు చేస్తూ.. రంగులు చల్లుకుంటూ యువత ఉత్సాహంగా గణేశుని నిమజ్జనానికి బయలుదేరింది. ఈ క్రమంలోనే గణేశుని ప్రతిమలను గంగమ్మ ఒడికి చేర్చేందుకు నగరపాలక సంస్థ అధికారులు వినాయకసాగర్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వినాయక నిమజ్జన కమిటీ ఆధ్వర్యంలో మంగళం రోడ్డు వద్ద ఓ వేదిక ఏర్పాటు చేసి విశేష విగ్రహాలకు మంగళ హారతి సమర్పించి వీడ్కోలు పలికారు. చవితి వేడుకుల సందర్భంగా తిరుపతిలో సుమారు 2,500 విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఇందులో దాదాపు 80శాతం వరకు ప్రతిమలను నిమజ్జనం చేశారు. భారీ క్రేన్ల సాయంతో సురక్షితంగా ప్రక్రియను పూర్తి చేశారు. – తిరుపతి మంగళం/ తిరుపతి తుడా -
ఐక్య పోరాటంతోనే వివక్ష అంతం
తిరుపతి సిటీ : ఐక్య పోరాటంతోనే కుల వివక్ష అంతమవుతుందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు తెలిపారు. బొజ్జాతారకం పదో వర్ధతిని పురస్కరించుకుని బుధవారం ఎస్వీయూ సెనెట్ హాల్లో దళిత సాహిత్యం, ప్రజా ఉద్యమాలు అనే అంశంపై జాతీయ సదస్సు నిర్వహించారు. ముందుగా బొజ్జాతారకం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రాఘవులు మాట్లాడుతూ బొజ్జా తారకంతో కలిసి ఉద్యమాలు చేసిన సందర్భాలను గుర్తు చేశారు. దళితుల కోసం ఆయన సృష్టించిన సాహిత్యాన్ని మేళవించి ముందుకెళ్లితేనే దళితుల సమస్యను అరికట్టవచ్చని తెలిపారు. దళిత అభ్యుదయ సాహిత్య రచనలను వినూత్నంగా తీసుకురావల్సిన అవసరం ఎంతైనా ఉందని సూచించారు. ప్రస్తుతం దళిత సంఘాల్లో విభజన ద్వారా రాజకీయ స్వార్థం పెచ్చు మీరుతోందని, దళితులందరూ ఐకమత్యంగా ప్రజా ఉద్యమాలను సాగించాలని పిలుపునిచ్చారు. సదస్సులో దక్షిణ భారత రిపబ్లికన్ పార్టీ అధ్యక్షుడు అంజయ్య, ఉమ్మడి చిత్తూరు జిల్లా జెడ్పీ మాజీ సీఈఓ వెంకట నారాయణ, ఆర్పీఐ రాష్ట్ర అధ్యక్షుడు పిట్టా వరప్రసాద్, రచయిత గోవిందయ్య పాల్గొన్నారు. పింఛన్ల దరఖాస్తుకు గడువు పెంపు – 18 వరకు అవకాశం తిరుపతి అర్బన్:కొత్త పింఛన్ల కోసం దరఖాస్తులు చేసుకునేందుకు మరో రెండు రోజులు అవకాశం కల్పించినట్లు అధికారులు వెల్లడించారు. బుధవారం వారు మాట్లాడుతూ ఈ నెల 18వ తేదీలోపు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. -
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
రాపూరు : పట్టణంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. వివరాలు.. స్థానిక పడమటి అగర్తకట్టకు చెందిన భూపతి శ్రీదేవి (53) ఇంటి నుంచి బజారుకు వెళ్లేందుకు రోడ్డు దాటుతుండగా మోటార్ సైకిల్ ఢీకొంది. దీంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రమాదానికి కారణమైన వ్యక్తిని ఆదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తిరుమలరావు తెలిపారు. ఫాస్ట్‌ఫుడ్ తయారీపై ఉచిత శిక్షణ చంద్రగిరి : యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ చంద్రగిరిలో ఈనెల 21వ తేదీ నుంచి 12 రోజుల పాటు పురుషులు, మహిళలకు ఫాస్ట్ ఫుడ్ తయారీపై ఉచితంగా శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు సంస్థ డైరెక్టర్ పి. సురేష్ బాబు బుధవారం తెలిపారు. తెల్ల రేషన్ కార్డు గల గ్రామీణ ప్రాంతానికి చెందిన 19 నుంచి 50 ఏళ్ల మధ్య వయసు కలిగిన నిరుద్యోగ పురుషులు, మహిళలు అర్హులన్నారు. కనీసం 8వ తరగతి చదువుకుని ఉండాలని చెప్పారు. ట్రైనీస్‌కి ఉచిత భోజనం, శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్లు అందించనున్నట్లు తెలిపారు. ఆసక్తిగలవా రు ఆధార్ కార్డు, రేషన్ కార్డు జెరాక్స్ కాపీలు, 4 పాసుపోర్టు సైజు ఫొటోలతో సంస్థకి వచ్చి పేరు నమోదు చేయించుకోవాలని కోరారు. ముందుగా పేరు నమోదు చేసుకున్న ప్రాధాన్యతనిస్తామన్నారు. ఇతర వివరాలకు యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ, 11–48 ద్వారకానగర్ (రాయల్ విక్టరీ స్కూల్ దగ్గర) కొత్తపేట, చంద్రగిరి. 79896 80587, 91775 43543, 63017 17672 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. భక్తుడికి నగల బ్యాగు అప్పగింత తిరుపతి అన్నమయ్యసర్కిల్ : అలిపిరి చెక్ పాయింట్ వద్ద బంగారు నగలు, నగదుతో కూడిన బ్యాగును మరచివెళ్లన భక్తుడికి తిరిగి బ్యాగును అప్పగించారు. తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా పీర్లగూడానికి చెందిన జనార్ధన్‌రెడ్డి కుటుంబ సభ్యులతో కలసి బుధవారం ఉదయం అలిపిరి చెక్‌పాయింట్ వద్ద తమ బ్యాగును మరిచి తిరుమలకు చేరుకున్నారు.భద్రతా సిబ్బంది సదరు బ్యాగును సెక్టార్ కార్యాలయానికి చేర్చారు. అందులో నగదు రూ. 32 వేలు, సుమారు 30 గ్రాముల బంగారు ఆభరణాలు ఉన్నట్లు గుర్తించారు. బ్యాగును మరిచిపోయిన వారు తిరిగి అలిపిరి చెక్‌పాయింట్ వద్దకు చేరుకున్నారు. వారి వివరాలను నిర్ధారించుకుని ఏవీఎస్ఓ రమేష్‌కుమార్ ఆ బ్యాగ్‌ను తిరిగి అప్పగించారు. రైల్వేట్రాక్‌పై గుర్తుతెలియని మృతదేహం తిరుపతి అర్బన్ : తిరుపతి– తిరుచానూరు రైల్వే స్టేషన్ మధ్య చింతల చేను వద్ద గుర్తుతెలియని వ్యక్తి (సుమారు 35 ఏళ్లు) మృతదేహం ఉందని రైల్వే ఇన్స్పెక్టర్ వరప్రసాద్ బుధవారం తెలిపారు. రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని వెల్లడించారు. మృతుడి వివరాలు తెలియలేదని, ఈ మేరకు కేసు నమోదు చేసి ఎస్వీ మెడికల్ కళాశాల మార్చురీకి మృతదేహం తరలించినట్లు వివరించారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 9247575618 నంబర్‌కు సమాచారం అందించాలని సూచించారు. విద్యుదాఘాతానికి యువకుడి బలి సైదాపురం : మండలంలోని తురిమెర్లలో మంగళవారం అర్ధరాత్రి విద్యుదాఘాతానికి ఓ యువకుడు మృతి చెందాడు. వివరాలు.. సైదాపురానికి చెందిన కాకాణి నాగరాజు, ప్రమీల దంపతులకు ముగ్గురు కుమార్తెలు. నాగరాజు కొంతకాలంగా తురిమెర్లలోని అత్తగారింట్లోనే కాపురం ఉంటున్నాడు. కూలి పనులకు వెళ్లి జీవనం సాగించేవాడు. మంగళవారం రాత్రి ఆరు బయట ఫ్యాన్ పెట్టుకుని కుటుంబ సమేతంగా పడుకున్నాడు. అర్ధరాత్రి దాహం వేసి నీరు తాగేందుకు ఇంట్లోకి వెళ్లి వస్తుండగా తలుపులు తగిలి ప్లగ్‌బాక్స్ వైర్ తెగిపోయింది. దానికి మరమ్మతు చేస్తుండగా కరెంట్ షాక్‌కు గురయ్యాడు. కుటుంబీకులు వెంటనే ఆస్పత్రికి తరలించేందుక యత్నించగా అప్పటికే మరణించాడు. సమాచారం అందుకునన స్టేషన్ ఇన్చార్జి శ్రీనివాసులు ఘటనా స్థలానికి చేరుకుని నాగరాజు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కుటుంబ పెద్ద మృత్యువాత పడడంతో భార్యాబిడ్డలు కన్నీరుమున్నీరవుతున్నారు. -
వైభవంగా కల్యాణ వెంకన్న బ్రహ్మోత్సవాలు
ధ్వజారోహణంతో ముక్కోటి దేవతలకు ఆహ్వానం తిరుపతి రూరల్: తుమ్మలగుంట శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. మంగళవారం సాయంత్రం ఆగమోక్తంగా ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలు, భక్తుల గోవింద నామస్మరణ మధ్య ధ్వజపటాన్ని ధ్వజస్తంభంపై ప్రతిష్టించారు. అంతకుముందు భేరిపూజ, భేరితాడనం, ధ్వజపటం, నవసంధి, మాడవీధి ఉత్సవం, ఆస్థానం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. పెద్ద శేషునిపై పరమాత్ముడు బ్రహ్మోత్సవాల్లో తొలిరోజు రాత్రి పెద్ద శేష వాహన సేవ కన్నులపండువగా జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి వారు ఏడుతలల పెద్దశేష వాహనంపై పరమపదనాథుడి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి 7.30 నుంచి 9.30 గంటల వరకు జరిగిన వాహన సేవకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి, చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి పాల్గొన్నారు. కంకణ ధారణ శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలనే సంకల్పంతో ఆలయ వ్యవస్థాపకులు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, చెవిరెడ్డి లక్ష్మి దంపతులు కంకణధారణ చేసుకున్నారు. ధ్వజారోహణం సందర్భంగా కంకణం కట్టుకుని దీక్ష చేపట్టారు. స్వామి వారి బ్రహ్మోత్సవాలకు సోమవారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. అనంతరం విశ్వక్సేనులవారు తుమ్మలగుంట గ్రామంలో విహరిస్తూ బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించారు. పట్టువస్త్రాలు సమర్పణ తుమ్మలగుంట శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వారి పెద్ద శేష వాహన సేవకు పాకాల మండలం దామలచెరువు, ఉప్పరపల్లి, పెద్ద రామాపురం, కొత్త వడ్డేపల్లి, మొగరాల, రమణయ్యగారిపల్లి, గానుగపెంట, ఇ.పాలగుట్టపల్లి, వల్లివేడు, పేరసానిపల్లి, మద్దినాయునిపల్లి, పదిపుట్లబైలు గ్రామాలకు చెందిన భక్తులు పట్టువస్త్రాలు తీసుకువచ్చి సమర్పించారు. సారె తెచ్చిన భక్తులకు చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి, చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి ఎదురేగి స్వాగతం పలికారు. -
పింఛన్ల దరఖాస్తుకు నేటితో ఆఖరు
తిరుపతి అర్బన్: ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఏడాదికి రెండు సార్లు ( 6 నెలలకు ఒకసారి) కొత్త పింఛన్లు మంజూరు చేస్తూ వచ్చారు. పింఛన్ల జారీకి సంబందించి దశాబద్దాలుగా ఇదే తంతు కొనసాగుతుంది. అయితే చంద్రబాబు సర్కార్ 2024 జూలై 12న కొలువుదీరిన నాటి నుంచి ఇప్పటి వరకు కొత్త పింఛన్లకు చాన్స్ ఇవ్వలేదు. 27 నెలలు తర్వాత తాజాగా ఈనెల 7 నుంచి 16వ తేది వరకు కొత్త పింఛన్ల దరఖాస్తులు కూటమి ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. అయితే 12,13,14 తేదీల్లో సెలువులు రావడంతో కేవలం 7 రోజులు మాత్రమే గ్రామ, వార్డు సచివాల యాల్లో దరఖాస్తులు చేసుకునే అవకాశం కల్పించారు. అయితే తక్కువ సమయం ఇచ్చారంటూ పలువురు గగ్గొలు పెడుతున్నారు. జిల్లాలో సుమారుగా 60 వేల మంది వరకు కొత్త పింఛన్లకు దరఖాస్తులు చేసుకోవడానికి సిద్దంగా ఉన్నారు. అయితే ఇప్పటి( మంగళవారం) వరకు 41,260 మంది మాత్రమే దరఖాస్తులు చేసుకున్నారు. బుధవారంతో దరఖాస్తుకు గడువు ముగుస్తోంది. దాదాపుగా ఇంకా 19 వేల మందికి పైగా దరఖాస్తులు చేసుకోవాల్సి ఉందని తెలుస్తుంది. ఒక్క రోజులో వీరందరు దరఖాస్తులు చేసుకోవడం సాధ్యంకాదని పలువురు ఆందోళన చెందుతున్నారు. కొత్త పింఛన్లకు దరఖాస్తులు ఇలా... వృద్ధాప్య పింఛన్‌కు 22,411 మంది వితంతువులుు 10,482 వికలాంగులు 4,369 డప్పు కళాకారులు 1881 నేత కార్మికులు 657 చర్మకారులు 533 కల్లుగీత కార్మికుల 374 ఫిషర్స్ మెన్స్ 308 ఒంటరి మహిళలు 221 ట్రాన్స్‌జెండర్స్ 24 మంది మొత్తం 41,260 మంది దరఖాస్తులు చేసుకున్నారు -
నేడు వెంకటగిరి పోలేరమ్మ జాతర చాటింపు
సైదాపురం/వెంకటగిరి రూరల్: వెంకటగిరి శక్తిస్వరూపిణి శ్రీ పోలేరమ్మ తల్లి జాతరకు ఏట్లు పూర్తయ్యాయి. నేడు జాతర చాటింపుతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. వివిధ దేశాలు, రాష్ట్రాల నుంచి భక్తులు తండోపతండాలుగా తరలిరానున్నారు. బుధవారం వెంకటగిరి రాజాల నుంచి తాంబులాలు పుచ్చుకొని రాజర నిర్వహణకు అనుమతి తీసుకొని జాతరకు సంబంఽధించి తొలి చాటింపు వేయనున్నారు. 23 రెండో చాటింపు, 27 ఘటోత్సవం, 30 అమ్మవారి నిలుపు, అక్టోబర్ 1న అమ్మవారి సాగనంపు జరగనుంది. ఈ మేరకు సంబంధిత శాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. తాంబూలం స్వీకరణ నేడు ప్రతి ఏటా వెంకటగిరిలో జరగనున్న పోలేరమ్మతల్లి జాతరకు సంబంఽధించి వెంకటగిరి రాజా కుటుంబీకుల వద్ద నుంచి అమ్మవారి సేవకులు, రెడ్డి పెత్తందారలకు రాజా ప్యాలెస్‌లోని బొడ్డిచావిడి వద్ద దేవదాయశాఖ అధికారుల సమక్షంలో జాతర నిర్వహణకు తాంబూలం స్వీకరించనున్నారు. అనంతరం జాతరకు సంబంధించి మొదటి చాటింపు అదేరోజు అర్ధరాత్రి వేస్తారు. దీంతో వెంకటగిరిలో అమ్మవారి జాతర ప్రారంభమవుతుంది. -
మెడి‘కల’ నెరవేరె
మాట్లాడుతున్న ప్రిన్సిపల్ డాక్టర్ రవిప్రభు తిరుపతి తుడా: ఎస్వీ వైద్య కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి నీట్ కౌన్సెలింగ్ ద్వారా ప్రవేశాలు పొందిన విద్యార్థులకు తరగతులు మంగళవారం నుంచి ప్రారంభమయ్యాని ప్రిన్సిపల్ డాక్టర్ రవిప్రభు తెలిపారు. ఈ మేరకు కళాశాలలో ఏర్పాటు చేసిన ఓరియంటేషన్ కార్యక్రమానికి ఆయన హాజరై విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. నీట్ ఆదేశాల మేరకు నూతన ఎంబీబీఎస్ వైద్య విద్యార్థులకు అవగాహన, ఓరింటేషన్ తరగతులు 15 రోజులు పాటు నిర్వహించనున్నట్టు తెలిపారు. కళాశాలలో ఎంబీబీఎస్ వైద్య విద్యతో పాటు, పరిశోధనలకు పెద్దపీట వేస్తామన్నారు. ఎస్వీ వైద్య కళాశాల ఆల్ ఇండియా ర్యాంకింగ్‌లో 69వ స్థానం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5వ స్థానం ఎస్వీ వైద్య కళాశాలకు ఇవ్వడం గర్వకారణమన్నారు. -
బ్రహ్మోత్సవ తేజం..
అంగరంగ వైభవంగా ధ్వజారోహణం స్వర్ణకాంతుల్లో శ్రీవారి ఆలయం బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. మహద్వారం నుంచి ఆలయ ప్రాకారాల వరకు పుష్పాలు, విద్యుత్ దీపాలంకరణలతో అలంకరించారు. హథీరాంజీ మఠం, ఆస్థాన మండపం తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన విద్యుత్ అలంకరణలు భక్తులను ఆకట్టుకున్నాయి. పుష్ప ప్రదర్శనశాలలో దేశీయ పుష్పాలతోపాటు వివిధ రకాల విదేశీ పుష్పాలతో ప్రత్యేక ప్రదర్శనకు ఏర్పాట్లు చేశారు. ఫొటో ఎగ్జిబిషన్‌న్, కళా ప్రదర్శనలకు కూడా సన్నాహాలు పూర్తయ్యాయి. తిరుమల:తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా శ్రీకారం చుట్టారు. మంగళవారం సాయంత్రం ధ్వజారోహణ ఘట్టాన్ని పూర్తిచేశారు. మీన లగ్నంలో పవిత్ర గరుడ పతాకాన్ని బంగారు ధ్వజస్తంభ శిఖరాగ్రాన అర్చకులు ఆవిష్కరించారు. వేద మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల నడుమ గరుడ పతాకం ఎగరడంతో బ్రహ్మోత్సవాలకు లాంఛనంగా శ్రీకారం చుట్టారు. ధ్వజస్తంభంపై ఎగిరే గరుడ పతాకమే ముక్కోటి దేవతలకు బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రంగా భావిస్తారు. గరుడుడి ఆహ్వానాన్ని అందుకుని దేవతలు, అష్టధిక్పాలకులు, దేవగణాలు తొమ్మిది రోజులపాటు తిరుమలలో జరిగే శ్రీవారి ఉత్సవాలను తిలకిస్తారని పురాణాలు పేర్కొంటున్నాయి. ధ్వజారోహణానికి ముందు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారు పరివార దేవతలతో కలిసి తిరుచ్చి వాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగారు. భక్తుల వీక్షణ.. విష్వక్సేనుడి పర్యవేక్షణ సోమవారం సాయంత్రం శ్రీవారి బ్రహ్మోత్సవాల అంకురార్పణ కార్యక్రమాన్ని వైఖానస ఆగమశాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామివారి సర్వసేనాధిపతి విష్వక్సేనుడు బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించే కార్యక్రమానికి అంకురార్పణతో శ్రీకారం చుట్టారు. ముందుగా విష్వక్సేనుడు ఛత్రచామరాలు, మేళతాళాల నడుమ ఆలయ పురవీధుల్లో ఊరేగారు. అనంతరం యాగశాలకు చేరుకుని భూమిపూజ నిర్వహించారు. నిర్ణీత పాళికల్లో శాలి, వ్రీహి, యవ, ముద్గ, మాష, ప్రియంగు తదితర నవధాన్యాలతో బీజావాపం చేశారు. పాళికల్లో వేసిన విత్తనాలు శుక్లపక్ష చంద్రునిలా దినదినాభివృద్ధి చెందాలని, బ్రహ్మోత్సవాలు విజయవంతం కావాలని అర్చకులు ప్రార్థించారు. అనంతరం రంగనాయక మండపంలో ఆస్థానం నిర్వహించారు. శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణ బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుమలకు విచ్చేసి శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు ముఖ్యమంత్రికి తీర్థ ప్రసాదాలు, ఆశీర్వచనం అందజేశారు. శ్రీవారి దర్శనానంతరం ఆలయం వెలుపల జరిగిన పెద్ద శేష వాహన సేవను సీఎం వీక్షించి తరించారు. పెద్ద శేష వాహనంపై అభయముద్ర బ్రహ్మోత్సవాలలో తొలి రోజు మంగళవారం రాత్రి శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారు ఏడు తలల పెద్ద శేష వాహనంపై తిరుమాడ వీధుల్లో విహరించారు. ఆదిశేషుడు తన పడగ నీడలో స్వామివారిని సేవిస్తూ దాస్యభక్తికి ప్రతీకగా నిలుస్తాడు. పటిష్ట బందోబస్తు బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. పోలీసు, టీటీడీ విజిలె న్స్, ఎస్పీఎఫ్, ట్రాఫిక్, అగ్నిమాపక, వైద్య తదితర విభాగాల సిబ్బంది విధుల్లో నిమగ్నమయ్యారు. -
శ్రీవారి దర్శనానికి 4 గంటలు
తిరుమల: తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని కంపార్ట్మెంట్లు అన్నీ ఖాళీగా ఉన్నాయి. సోమ వారం అర్ధరాత్రి వరకు 88,210 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 30,192 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.23 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తు లకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడాని కి 4 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవే శ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 1 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టంచేసింది. నేటి నుంచి వీఆర్ఏల సహాయ నిరాకరణ రామచంద్రాపురం: నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్ఏలు సహాయ నిరాకరణ చేపట్టనున్నట్టు వీఆర్ఏల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేష్ తెలిపారు. ఈ మేరకు న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని, తెలంగాణ తరహాలో పే స్కేల్ అమలు చేయాలని కోరుతూ మంగళవారం స్థానిక తహసీల్దార్ మధుసూదన్‌రావుకు వినతి పత్రం అందజేశారు. వీఆర్ఏల అధ్యక్షుడు మాట్లాడుతూ ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న వీఆర్ఏల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. ప్రభుత్వం తమ డిమాండ్లను సానుకూలంగా పరిష్కరించే వరకు రాష్ట్ర వ్యాప్తంగా సహాయ నిరాకరణ ఉద్యమాన్ని చేపడుతామని ఆయన స్పష్టం చేశారు. తుది విడతపైనే ఆశలు – నేడు చివరి విడత ఇంజినీరింగ్ ప్రవేశాల మెరిట్ లిస్ట్ విడుదల తిరుపతి సిటీ: జిల్లాలోని ప్రభుత్వ, డీమ్డ్, ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాల్లో పలు బీటెక్ కోర్సుల్లో మిగిలి ఉన్న సీట్ల భర్తీకి సాంకేతిక విద్యాశాఖ మూడవ, తుది విడత కౌన్సెలింగ్ ప్రక్రియకు సంబంధించి మెరిట్ లిస్ట్‌ను బుధవారం విడుదల చేయనుంది. చివరి విడతలో కన్వీనర్ కోటా సీట్లు పొందిన విద్యార్థులు ఆయా కళాశాలల్లో ఈనెల 19వ తేదీలోపు రిపోర్టు చేయాల్సి ఉంటుంది. కాగా ఇప్పటికే రెండు విడతల కౌన్సెలింగ్ ప్రక్రియ ముగిసినా చెప్పుకోదగ్గ స్థాయిలో ప్రవేశాలు లేకపోవడంతో మూడో విడత కౌన్సెలింగ్ ప్రక్రియను చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రయివేటు కళాశాలల పరిస్థితి దారుణం జిల్లాలోని ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల్లో మాత్రం ప్రవేశాలు 85 శాతం పైగా సీట్లు భర్తీ కాగా మిగిలిన ప్రైవేటు కళాశాల పరిస్థితి దారుణంగా ఉంది. జిల్లాలో రెండు విడతల్లో కన్వీనర్ కోటా కింద రెండు డీమ్డ్ వర్సిటీలలో 80 శాతం సీట్లు, ఐదు అటానమస్ కళాశాలల్లో 75 శాతం ప్రవేశాలు జరిగినట్లు సమాచారం. కాగా జిల్లాలోని 11 ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలల్లో ఇప్పటి వరకు పలు బీటెక్ కోర్సుల్లో 60 శాతం సీట్లు కూడా భర్తీ కాలేదని యాజమాన్యాలు వాపోతున్నాయి. కన్వీనర్ కోటా మూడో విడతపైనే ఆశలన్నీ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. తుదివిడత అనంతరం జరిగే స్పాట్ అడ్మిషన్లకు సైతం ఈ ఏడాది అంతగా స్పందన ఉండకపోవచ్చని అధ్యాపకులు అంచనా వేస్తున్నారు. భక్తుల సురక్షిత ప్రయాణమే లక్ష్యం తిరుపతి మంగళం : భక్తుల సురక్షిత ప్రయాణమే లక్ష్యంగా డ్రైవర్లు వాహనాలు నడపాలని జిల్లా రవాణాశాఖాధికారి కొర్రపాటి మురళీమోహన్ ఆదేశించారు. మంగళవారం తిరుపతి జిల్లా రవాణా, పోలీస్ శాఖలు సమన్వయంతో ప్రత్యేక రహదారి భద్రతా చర్యలు చేపట్టారు. గత పది రోజులుగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తిరుపతికి వస్తున్న 61 కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సులను మోటార్ వెహికల్ ఇన్‌న్‌స్పెక్టర్లు తనిఖీలు నిర్వహించారు. పర్మిట్ లేకుండా ఉన్న మూడు వాహనాలు, వాణిజ్యపరమైన సరుకు తీసుకెళ్తున్న 18 వాహనాలు, అధిక చార్జీలు వసూలు చేస్తున్న 4 వాహనాలు, అలాగే మోటార్ వాహన నిబంధనలను ఉల్లంఘించిన మరో 36 వాహనాలపై కేసులు నమోదు చేసి మొత్తం రూ.6 లక్షల అపరాధ రుసుము వసూలు చేసినట్లు జిల్లా రవాణాశాఖాధికారి తెలిపారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తిరుపతి జిల్లా పరిధిలోని అన్ని చోట్ల మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు విస్తృత తనిఖీలు చేపడుతున్నట్టు ఆయన పేర్కొన్నారు. -
తిరుపతి @ 66 డివిజన్లు
తిరుపతి తుడా: తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ 66 డివిజన్లకు ఆమోదం తెలుపుతూ ప్రభుత్వం రాజముద్ర వేసింది. కార్పొరేషన్ 50 డివిజన్ల నుంచి 66కు పెంచుతూ ఫైనల్ నోటిఫికేషన్‌తో కూడిన గెజిట్‌ను మంగళవారం విడుదల చేసింది. ఇటీవల అభ్యంతరా లు, సూచనలు ఉంటే చేయాలని ఏడు రోజుల పాటు ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో మొత్తం 33 ఫిర్యాదులు, అభ్యంతరాలు కార్పొరేషన్‌కు అందాయి. వాటిని పరిశీలించిన మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చిన్న మార్పులు, చేర్పులు చేసి ప్రభుత్వానికి నివేదించారు. ఈ క్రమంలో ప్రభుత్వం 66 డివిజన్లకు ఆమోదం తెలిపింది. -
బైక్‌ను ఢీకొన్న కారు
– వృద్ధుడి మృతి నాయుడుపేటటౌన్: మండల పరిధిలోని మేనకూరు సెజ్ వద్ద లాయల్ పరిశ్రమ సమీపంలో రహదారిపై సోమవారం సాయంత్రం బైక్‌ను కారు వేగంగా వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో ఓజిలి మండలం, మానవాలి గ్రామానికి చెందిన ముసులూరు గోపాలయ్య(65) మృతిచెందాడు. పోలీసుల కథనం.. మానవాలి గ్రామానికి చెందిన గోపాలయ్య బైక్‌పై మేనకూరు గ్రామానికి వస్తున్నారు. మార్గమధ్యంలో రాయల్ టైక్స్టైెల్స్ పరిశ్రమ సమీపంలో రహదారి వద్దకు వచ్చే సరికి వెనుక నుంచి వస్తున్న కారు వేగంగా వచ్చి బైక్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో గోపాలయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. ప్రమాదానికి కారణమైన కారును పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ శివశంకర్ తెలిపారు. పోక్సో కేసుపై విచారణ నాయుడుపేట టౌన్: పోక్సో కేసుపై నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు విచారణ చేపట్టారు. మండల పరిధిలోని మేనకూరు గ్రామానికి చెందిన కందాటి రజనీపై ఇటీవల పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. ఘటన జరిగిన ప్రదేశం, తదితర ప్రదేశాలను డీఎస్పీ ప్రత్యక్షంగా వెళ్లి పరిశీలించారు. డీఎస్పీతో పాటు సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ శివశంకర్ ఉన్నారు. -
సిద్ధార్థలో భారత విశ్వగురు సంకల్ప సిద్ధి మహాయాగం
నారాయణవనం: మండలంలోని సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాలలో నవాహ్నిక భారత విశ్వగురు సంకల్ప సిద్ధి మహాయాగం మంగళవారం ప్రారంభమైంది. కళాశాల చైర్మన్ అశోకరాజు దంపతుల ఆధ్వర్యంలో 225 మంది వేద పండితుల సమక్షంలో యాగానికి అంకురార్పణ చేపట్టారు. యాగశాలలో శ్రీదేవీ, భూదేవి సమేత వెంకటేశ్వరస్వామికి తిరుమంజం నిర్వహించి, ఆకల్పాంత హోమం, పంచగవ్య ప్రాశన, వాస్తు హోమం, దీక్షా ధారణ, కంకణ ధారణ పూర్తిచేశారు. సాయంత్రం అంబటిపూడి రాధాకృష్ణేశ్వర్ ‘భారత విశ్వ గురుత్వము, సనాతన ధర్మం‘ పై ప్రవచనం అనంతరం వివిధ రకాల పూజలు చేశారు. అశోకరాజు మాట్లాడుతూ మంగళవారం నుంచి 23వ తేదీ వరకు హోమాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. లోక కళ్యాణానికి, భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షల మేరకు భారత్ ‘విశ్వగురు’గా నిలవాలనే సంకల్పంతో ఈ యాగాన్ని తలపెట్టినట్లు తెలిపారు. ఆధ్యాత్మిక క్రతువులో అందరూ పాల్గొని దైవానుగ్రహం పొందాలని ఆయన కోరారు. -
తూకమేస్తున్నారు!
సాక్షి ప్రతినిధి, తిరుపతి: పేదలకు పంపిణీ చేసే బియ్యం మధ్యలోనే సగం మాయం అవుతోంది. స్టాక్ పాయింట్ల నుంచి రేషన్ డీలర్‌కు చేరవేసే మసయంలో భారీ తేడాలు వస్తున్నాయి. ప్రతి నెలా వచ్చే ఈ తేడాల కారణంగా అనేక మంది డీలర్లు తీవ్రంగా నష్టపోతున్నారు. మధ్యలో ఉన్న వారు మాత్రం బియ్యాన్ని నొక్కేసి బ్లాక్ మార్కెట్లకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారని డీలర్లు ఆరోపిస్తున్నారు. తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో మండల స్థాయి రేషన్ స్టాక్ పాయింట్లు అవకతవకలకు అడ్డాలుగా మారాయి. గోదాముల నుంచి వచ్చే బియ్యాన్ని కాటా వేయకుండానే నేరుగా ఎఫ్పీ (రేషన్) షాపులకు తరలిస్తూ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. తూకం లేదు .. కొలత లేదు స్టేజ్–1 గోదాముల నుంచి ఎంఎల్ఎస్ పాయింట్లకు వచ్చే బియ్యం లోడులను నిబంధనల ప్రకారం కాటా వేసి గోదాముల్లో దించాల్సి ఉంది. అయితే అవేవీ పట్టించుకోకుండా అసలు తూకమే వేయకుండా అన్న్లోడ్ చేస్తున్నారు. అక్కడితో ఆగకుండా స్టేజ్–1 లారీల నుంచి నేరుగా ఎఫ్పీ షాపులకు వెళ్లే లారీల్లోకి బస్తాల ను మార్చేసి పంపించేస్తున్నారు. ఈ దందా వల్ల ప్రతి బస్తాకు 2 నుంచి 3 కిలోల వరకు బియ్యం తక్కువ వస్తోందని డీలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలపైనే తరుగు భారం! ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి తక్కువ తూకంతో బియ్యం వస్తుండడంతో ఎఫ్పీ షాపు డీలర్లు తీవ్ర నష్టాన్ని చవిచూస్తున్నారు. చివరకు డీలర్లు కూడా కార్డుదారులకు ఇచ్చే కోటాలో కోతలు విధించాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. అంతిమంగా ఈ తూకాల తరుగు భారం మొత్తం పేద ప్రజల మీదే పడుతోంది. కార్డుదారులకు పూర్తి కోటా అందకపోవడంతో రేషన్ దుకాణాల వద్ద నిత్యం వాగ్వాదాలు చోటుచేసుకుంటున్నాయి. రేషన్ షాపులకు బియ్యం సరఫరాలో తేడాలు ఇలా చేయకపోతే మామూళ్లు ఎవరిస్తారు?ఈ తూకాల లోపాలపై రేషన్ డీలర్లు ఎంఎల్ఎస్ పాయింట్ ఇన్‌చార్జ్‌లను నిలదీస్తే.. వారు ‘మా పైవాళ్లకు నెల నెలా మామూళ్లు ఎవరు ఇవ్వాలి?.. మా జేబులో నుంచి ఇవ్వాలా?’ అంటూ డీలర్లపై కేకలు వేస్తున్నట్లు తెలిసింది. పై వాళ్లకు మామూళ్లు కావాలంటే.. బస్తాల్లో రెండు, మూడు కిలోలు తీసేస్తేనే కాదా? ఇవ్వగలం. కాబట్టి మేము ఇలాగే ఇస్తాం, మీ ఇష్టం వచ్చిన చోట చెప్పుకోండి’ అంటూ దబాయిస్తున్నట్లు డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు జిల్లా ఉన్నతాధికారుల అండదండలతోనే తూకాల్లో భారీ మోసం జరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. తక్షణమే ఉన్నతాధికారులు, విజిలెన్స్ విభాగం స్పందించి ఎంఎల్ఎస్ పాయింట్లలో వేబ్రిడ్జి తూకం వేయాలని, అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు, డీలర్లు డిమాండ్ చేస్తున్నారు. -
ఆరోగ్యశ్రీ నిధులు గోల్మాల్
సాక్షి, టాస్క్‌ఫోర్స్: శ్రీకాళహస్తి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో భారీ అవినీతి కుంభకోణం బయటపడింది. ఆరోగ్యశ్రీ, ఏపీవీపీ నిధులను ఇద్దరు ఉద్యోగులు స్వాహా చేసినట్టు తేలింది. ప్రాథమిక విచారణలో స్వాహా సొమ్ము రూ.25 లక్షలుగా తేలిందని, మరింత లోతుగా విచారణ చేస్తే రూ.కోటి వరకు అవినీతి బయటపడవచ్చని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఆ మేరకు అవినీతికి పాల్పడ్డ ఇద్దరు ఉద్యోగులపై మంగళవారం టూ టౌన్ పోలీసులకు ఆస్పత్రి సూపరింటెండెంట్ మురళి ఫిర్యాదు చేశారు. వివరాలు.. ఆస్పత్రి పరిపాలనా సౌలభ్యంలో భాగంగా ఆర్థిక లావాదేవీల పనులను ఎల్డీసీగా ఉన్న లక్ష్మీప్రసన్న, పోస్టుమార్టం అసిస్టెంట్‌గా ఉన్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగి చందుకు యాజమాన్యం అప్పగించింది. ఈ క్రమంలో లక్ష్మీప్రసన్న ప్రస్తుతం మెటర్నిటీ సెలవులో ఉండగా చెక్కుల డ్రా చేసే పనిని చందూకు అప్పగించారు. ఈ క్రమంలో ఆరోగ్యశ్రీ నిధుల్లో గోల్మాల్ జరిగినట్టు బయటకు పొక్కడంతో సంబంధిత అధికారులకు అనుమానం వచ్చి విచారణ చేపట్టారు. ఇందులో ప్రాథమికంగా రూ.25 లక్షలు స్వాహా చేసినట్టు తేలింది. ఉన్నతాధికారుల ప్రమేయం లేకుండా ఆ స్థాయిలో నిధులు స్వాహా చేసి ఉంటారా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి చైర్మన్‌గా, ఆయన కుటుంబ సభ్యుల్లో ఒకరు నిత్యం పర్యవేక్షిస్తున్నట్లు తెలిసింది. కూటమి నేతలు సభ్యులుగా ఉన్న ప్రభుత్వాస్పత్రిలో ఇంత పెద్ద మొత్తంలో నిధులు గోల్మాల్ కావడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
డయల్ యువర్ సీఎండీకి 75 వినతులు
తిరుపతి రూరల్: డయల్ యువర్ ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ కార్యక్రమానికి 75 వినతులు వచ్చినట్టు సీఎండీ శివశంకర్ లోతేటి తెలిపారు. ప్రతి సోమవారం ఏపీఎస్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయం, సర్కిల్ కార్యాలయాల్లో నిర్వహించే డయల్ యువర్ సీఎండీ, డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమాన్ని వినాయక చవితి సందర్భంగా సోమవారం సెలవుదినం కావడంతో మంగళవారం నిర్వహించారు. సంస్థ పరిధిలోని 9 జిల్లాల నుంచి 75 మంది వినియోగదారులు తమ విద్యుత్ సమస్యలను సీఎండీకి విన్నవించారు. కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు పి.అయూబ్‌ఖాన్, కె.గురవయ్య, చీఫ్ జనరల్ మేనేజర్లు జె.రమణాదేవి, ఎన్.శోభా వాలెంటీనా, ఆర్.పద్మ, ఎం.మురళీకుమార్, సిహెచ్ రామచంద్రరావు, కే.సంపత్ కుమార్, ఎస్.రమణ, ఎం.శ్రీకాంత్, ఏ.శ్రీనివాసబాబు, జనరల్ మేనేజర్లు జగదీష్, భాస్కర్‌రెడ్డి, హేమలత, సురేష్ తదితరులు పాల్గొన్నారు. బీజీపీ నేత బైక్ దగ్ధం చంద్రగిరి: మండల బీజేపీ నేత ద్విచక్ర వాహనానికి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పటించిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాలు.. చంద్రగిరి శ్రీనివాసశెట్టి సందు వీధికి చెందిన కాకిమాను మునిరాజ బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. సోమవారం తెల్లవారుజామున తన ఇంటి సమీపంలో ఉంచిన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్‌పై పెట్రోల్ పోసి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పంటించారు. ఈ ఘటనలో బైక్ పూర్తిగా కాలిపోయింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, వివరాలు సేకరించారు. వినాయక చవితి పండుగకు శుభాకాంక్షలు తెలియజేస్తూ బ్యానర్లు పెట్టామనే కక్షతో తన బైక్‌కే నిప్పటించారని బాధితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు దర్యాప్తులో ఉంది. బైక్‌ను ఢీకొన్న శ్రీసిటీ బస్సు – వ్యక్తికి తీవ్ర గాయాలు చిట్టమూరు: నాయుడుపేట–మల్లాం రహదారిలో చిట్టమూరు మండలం, బయ్యవారికండ్రిగ గ్రామం వద్ద సోమవారం శ్రీసిటీకి వెళ్తున్న బస్సు మోటార్ బైక్‌ను ఢీకొంది. ఈ ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. పెళ్లకూరు మండలం, చెంబేడుకు చెందిన రామచంద్రయ్య మోటార్ బైక్‌పై నాయుడుపేట నుంచి మల్లాం వైపు వస్తుండగా, తడ మండలం నుంచి శ్రీసిటీలోని ఓ కంపెనీకి ఉద్యోగులను తీసుకెళ్తున్న బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో మోటార్ బైక్‌పై వెళ్తున్న రామచంద్రయ్యకు గాయాలు కావడంతో వైద్యశాలకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి, బస్సును పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తిరుపతిలో ట్రెకింగ్–ఐ తిరుపతి సిటీ: తిరుపతి ఎన్సీసీ నగర్లో ఆల్ ఇండియా ఎన్సీసీ ఏపీ ట్రెక్–ఐ పేరుతో ఇండియన్ సీనియర్, జూనియర్ డివిజన్ ఎన్సీసీ క్యాడెట్లకు ట్రెకింగ్ యాత్ర చేపట్టారు. ఈనెల 12 ప్రారంభమైన యాత్ర ఈనెల 19 వరకు జరగనుంది. తిరుపతి ఎన్సీసీ గ్రూప్ హెడ్‌క్వార్టర్స్ 5వ ఆంధ్ర గర్ల్స్ బెటాలియన్ నిర్వహిస్తున్న ట్రెకింగ్ యాత్రలో ఏపీ, తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్, కేరళ, లక్ష్యదీప్, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర డైరెక్టరేట్లకు చెందిన 510 మంది ఎన్సీసీ క్యాడెట్లు, 15 మంది ఎన్సీసీ అధికారులు పాల్గొంటున్నారు. ట్రెకింగ్ షెడ్యూల్లో భాగంగా క్యాడెట్లు తిరుమల, జూపార్క్, సైన్స్ సెంటర్ వంటి కేంద్రాల్లో శిక్షణ, సాహస కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఎన్సీసీ గ్రూప్ హెడ్ క్వార్టర్స్ గ్రూప్ కమాండర్, ట్రెక్ మేనేజర్ కల్నల్ ఎకే.శర్మ పాల్గొన్నారు. -
అవినీతి తప్ప అభివృద్ధి ఎక్కడ?
సూళ్లూరుపేట: రెండున్నరేళ్లు కూటమి ప్రభుత్వ హయాంలో అవినీతి తప్ప అభివృద్ధి కనిపించడం లేదని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నియోజకవర్గ కో–ఆర్డినేటర్ కిలివేటి సంజీవయ్య ధ్వజమెత్తారు. మంగళవారం ఆయన స్థానిక నాయకులతో కలిసి శిథిలావస్థకు చేరుకున్న కాళంగి వంతెనను పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ కుటుంబ సభ్యులు నియోజకవర్గాన్ని అవినీతి పథంలో నడిపిస్తున్నారని విమర్శించారు. సూళ్లూరుపేట పట్టణంలోని శ్రీచెంగాళమ్మ పరమేశ్వరి ఆలయ సమీపంలో కాళంగి నదిపై నిర్మించిన వంతెన శిథిలావస్థకు చేరుకున్నా ఎందుకు పట్టించుకోవడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ వంతెన గురించి నాటి ముఖ్యమంత్రి మా జగనన్నకు చెప్పి 2023 నవంబర్ 6 జీఓ ఆర్టీ నం.325 ద్వారా రూ.35 కోట్లు మంజూరు చేస్తే.. దానికి టెక్నికల్ మంజూరు చేయించుకునే లోపు ఎన్నికల కోడ్ రావడం, ఎన్నికల్లో ఓడిపోవడంతో మేము పనులు చేయలేకపోయామన్నారు. మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయకుండా సీఎంతో మాట్లాడాను అని చెప్పడం ప్రజలను మోసం చేయడమేనన్నారు. ఎంతసేపు ఎమ్మెల్యే కుటుంబం ప్రకృతి వనరుల్ని పర్సెంటేజీలకు అమ్మేయడమే పనిగా పెట్టుకుందని ధ్వజమెత్తారు. రెండున్నరేళ్ల పాలనలో ఏం చేశారో చెప్పండి? అవినీతిని ప్రశ్నిస్తే కేసులు పెడతామని బెదిరింపులా? ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు చేస్తున్న అవినీతి, అక్రమాలను ప్రశ్నిస్తే కేసులు పెట్టి జైలుకు పంపిస్తామని బెదిరించడం ఏమిటని కిలివేటి అన్నారు. మా నాయకుడు సత్యనారాయణరెడ్డిపై తప్పుడు కేసులు నమోదు చేసి రెండోసారి జైలుకు పంపడం వెనుక కుట్రకోణం దాగి ఉందన్నారు. కేసులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. సమావేశంలో మండల పార్టీ అధ్యక్షుడు అల్లూరు అనిల్‌కుమార్‌రెడ్డి, పట్టణ పార్టీ అధ్యక్షుడు వేళ్లపాళెం కృపాకర్‌రెడ్డి, నాయకులు స్వామిరెడ్డి, జెట్టి వేణుయాదవ్, మీజూరు రామకృష్ణారెడ్డి, అలవల సురేష్, వాకాటి బాబురెడ్డి, బద్దెపూడి మోహన్‌రెడ్డి, మల్లిరెడ్డి, చిలకా యుగంధర్, అయితా శ్రీధర్, కాకి శ్రీరామ్మూర్తి, మాదరపాక సురేష్ పాల్గొన్నారు. -
కన్నీరే మిగిలిందిక నేస్తం!
కలిసిరాని నిమ్మ సైదాపురం: ఎల్‌నినో ప్రభావం నిమ్మ రైతులను తీవ్ర నష్టాల్లో ముంచేసింది. వర్షాభావ పరిస్థితుల కారణంగా సైదాపురం మండలంలో నిమ్మచెట్లు నిలువునా ఎండిపోతున్నాయి. నిమ్మ రైతులు భగీరథయత్నాలు చేసినా ప్రయోజనం లేదు. చినకు కోసం పరితపించినా చివరకు కన్నీరే మిగులుతోంది. పసిబిడ్డలా పెంచిన చెట్లు తమకళ్లెదుటే నిలు వునా వాడిపోతుండడంతో కన్నీళ్లు పెట్టుకోవాల్సి వస్తోంది. కండలేరు జలాయశం కూడా అడుగంటడంతో చెరువులు సైతం ఎండిపోతున్నాయి. ధరలు బాగు.. వర్షాలు జాగు సైదాపురం, డక్కిలి, బాలాయపల్లి, రాపూరు, వెంకటగిరి, కలువాయి మండలాల్లో సుమారు 25వేల హెక్టార్లులో నిమ్మ తోటలు సాగు చేస్తున్నారు. గడిచిన మూడేళ్లుగా అతివృష్టి, అనావృష్టి కారణంగా నిమ్మతోటల రైతులకు కష్టాలే మిగులుతున్నాయి. ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా చెట్లు నిలువునా ఎండిపోతున్నాయి. వేలకు వేలు ఖర్చుపెట్టి బోర్లు వేసినా ప్రయోజనం లేకుండా పోతోంది. బస్తా రూ.25 వేల వరకు పలికినా ఫలితం లేదు. కాలం కలిసిరాక.. చెట్లకు కాయల్లేక దిగాలు చెందాల్సి వస్తోంది. ఈ ఫొటోలో ఉన్న రైతు పేరు ఆవుల జయరామయ్య. ఊరు సైదాపురం. ఆయన గత 15 ఏళ్లుగా నిమ్మతోటలపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ప్రస్తుతం నిమ్మ ఽకాయల ధరలు ఆకాశాన్ని అంటగా.. చెట్లకు కాయలు లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాభావం కారణంగా తమ కళ్లెదుటే చెట్లకు సాగు నీరందక ఎండిపోవడంతో కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు. మూడు బోర్లు వేసినా చుక్క నీరు రాక అప్పుల్లో కూరుకుపోయాడు. గత కొద్ది రోజుల నుంచి కాస్తున్న ఎండలకు చెట్ల ఆకులు సైతం ఎండిపోయి రాలిపోవడంతో చూస్తూ కుమిలిపోతున్నాడు. -
నైలెట్పై సందిగ్ధం
●తిరుపతి సిటీ: తిరుపతి నుంచి నైలెట్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ శాశ్వత క్యాంపస్‌ను అమరావతికి తరలిస్తున్నారంటూ వైఎస్సార్సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్‌రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం ఎస్వీయూ వద్ద జెన్‌జెడ్ భారీ ర్యాలీ నిర్వహించారు. పార్టీలకతీతంగా యువత, స్థానికులు, విద్యార్థి, యుజవన సంఘాల నేతలు పెద్ద సంఖ్యలో హాజరై ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. దీంతో ప్రభుత్వం తర్జన భర్జనలో పడింది. ఆగమేఘాల మీద నైలెట్ తాత్కాలిక క్యాంపస్ డైరెక్టర్‌తో ప్రెస్‌మీట్ పెట్టించి వివరణ ఇచ్చుకునే పరిస్థితి ఏర్పడింది. అబ్బే...అదేం లేదు! తిరుపతి నైలిట్ కేంద్రం తరలింపు అపోహ మాత్రమేనని.. విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎస్వీయూలోని నైలెట్ కార్యాలయ డైరెక్టర్ శశికుమార్ తెలిపారు. శనివారం ఆయన ఎస్వీయూలోని నైలెట్ క్యాంపస్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. నైలెట్ శాశ్వత క్యాంపస్ కోసం స్థలం కేటాయించాలని విన్నవించామని, కుర్రకాలువ వద్ద ఉన్న స్థలం చూపించారని తెలిపారు. ఆ స్థలం పరిశీలించామని తిరుపతికి రిమోట్ ఏరియాలో ఉందని నైలెట్‌కు అంత అనువుగా లేదని తెలిపారు. ఎస్వీయూ పరిసరాలలో 5 ఎకరాలు స్థలం కేటాయించాలని విన్నవించామని, ప్రస్తుతం ఆ దిశగా అధికారులు పరిశీలిస్తున్నారని చెప్పారు. నైలిట్కు కేంద్రం 2024 జనవరి 4న ఆమోదం లభించిందని, నిర్వహణ బాధ్యతలను నైలిట్ చైన్నె విభాగానికి అప్పగించారన్నారు. తాత్కాలికంగా 8 వేల చ.అ.వి పదేళ్ల అగ్రిమెంట్‌తో కేంద్రం కార్యకలాపాలు ప్రారంభించిందని, మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.850.09 లక్షలు కాగా, ఇందులో మైటీ వాటా రూ.693.25 లక్షలని తెలిపారు. ఇప్పటివరకు విద్యార్థులు, నిరుద్యోగులు, అధ్యాపకులతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులకు, పోలీసులు అధికారులకు సుమారు 4,300 మందికి పైగా వివిధ సాంకేతిక శిక్షణ కార్యక్రమాలు అందించారన్నారు. త్వరలో ఇండియా ఏఐ ల్యాబ్‌ను సైతం నైలెట్‌లో ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. స్పష్టత ఏదీ? తిరుపతి ప్రజలను, రాయలసీమ యువతను మభ్యపెట్టే ప్రయత్నాలు ప్రభుత్వం చేస్తోంది. నైలెట్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ తిరుపతిలోనే ఏర్పాటు చేస్తున్నట్లు గతంలో కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆ దిశగా తిరుపతిలో నైలెట్ ఏర్పాటుకు స్థలం కేటాయించకుండా బుకాయింపు మాటలు చెప్పడం దారుణం. అమరావతిలో క్వాంటమ్ టెక్నాలజీ అంటూ నైలెట్ డీమ్డ్ వర్సిటీకి సీఆర్డీఏ నుంచి 8 ఎకరాలు స్థలం కేటాయించినట్లు మంత్రి స్పష్టం చేయడం వెనుక ఆంతర్యమేమిటి. తిరుపతిలో నైలెట్ డీమ్డ్ యూనివర్సిటీ ఏర్పాటుపై స్పష్టత ఇవ్వకుండా దాటవేత ధోరణిని ప్రదర్శించడంతోనే ప్రభుత్వ వైఖరి స్పష్టమవుతోంది. – ఎం.గురుమూర్తి, ఎంపీ, తిరుపతి -
పరిహారం ఆరగించి.. కబ్జాకు తెరలేపి!
రామచంద్రాపురం: కోట్లాది రూపాయల ప్రభుత్వ ధనాన్ని పరిహారంగా తీసుకుని మళ్లీ ఆ భూమి తనదేనంటూ ఓ వ్యక్తి ఆక్రమణకు తెరలేపిన ఘటన మండలంలో కలకలం రేపింది. కూటమి నేతల అండదండలతో సదరు రైతు కబ్జాకు పాల్పడడం విమర్శలకు తావిస్తోంది. వివరాలు.. మండలంలోని పీవీపురం పంచాయతీ, బలిజపల్లి గ్రామ పరిధిలోని సర్వే నం.210, 211, 212లో ఎనిమిది ఎకరాల భూమిని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పేదలందరికీ ఇళ్ల స్థలాలు అందించే లక్ష్యంతో ‘జగనన్న కాలనీ‘ కోసం సేకరించారు. సదరు భూమికి సంబంధించి యజమాని లోకనాథ్‌రెడ్డికి అప్పటి మార్కెట్ విలువ ప్రకారం కోటి రూపాయలకు పైగా చెల్లించారు. అయితే ఇప్పుడు అధికార పార్టీ అండదండలతో సదరు వ్యక్తి ఆ భూమి తనదేనంటూ శనివారం కబ్జాకు యత్నించాడు. తాను ప్రభుత్వానికి ఇచ్చినదే గాక అధనంగా మరో నాలుగు ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించుకునేందుకు యత్నిస్తున్నట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు. అనుమతులు లేకుండానే విద్యుత్ లైన్ ఏర్పాటు ఎలాంటి అనుమతులు లేకుండానే కబ్జాదారుడు విద్యుత్ లైన్‌ను లాగేశాడు. అంతేకాకుండా, హడావుడిగా బోర్ మోటార్ బిగించి, జేసీబీల సాయంతో భూమిని చదును చేసేందుకు భారీ ప్లాన్ వేశాడు. తహసీల్దార్ వార్నింగ్ ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తే చర్యలు తప్పవని తహసీల్దార్ మధుసూదన్‌రావు హెచ్చరించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ, జగనన్న కాలనీ కోసం కేటాయించిన భూమి జోలికి వస్తే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. నేరుగా జైలుకే వెళ్తావంటూ గట్టిగా హెచ్చరించడంతో కబ్జాదారుడు వెనక్కితగ్గాడు. గతంలో జగనన్న కాలనీకి ఎనిమిది ఎకరాల సేకణ -
శ్రీవారి దర్శనానికి 18 గంటలు
తిరుమల: తిరుమలలో శనివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. శుక్రవారం అర్ధరాత్రి వరకు 72,408 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 28,691 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.39 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 18 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. 21 నుంచి వస్త్రాల ఈ–వేలం తిరుపతి అన్నమయ్యసర్కిల్: తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు ఇతర అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించిన వస్త్రాలను ఈ నెల 21 నుంచి 23వ తేదీ వరకు ఈ – వేలం వేయనున్నారు. కొత్తవి ఆర్ట్ సిల్క్ శారీస్ 132 లాట్లు ఉన్నాయి. ఇతర వివరాలకు తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్ కార్యాలయం (వేలములు) 0877–2264429 నంబరులో గానీ, టీటీడీ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని టీటీడీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఆదాయ పన్ను చెల్లించండి తిరుపతి అర్బన్: ముందస్తు ఆదాయ పన్ను చెల్లించడం ద్వారా పలు ప్రయోజనాలు ఉన్నాయని ఐఆర్ఎస్ అసిస్టెంట్ కమిషనర్ లోకేష్, తిరుపతి ఆదాయపు పన్ను అధికారి వసంతలక్ష్మి తెలిపా రు. శనివారం తిరుపతిలో చాంబర్ ఆప్ కామర్స్ ఆధ్వర్యంలో నగరంలోని వ్యాపారులకు ఆదాయ పన్ను చెల్లింపుపై అవగాహన కల్పించారు. ఈ నెల 15న రెండవ కంతు కట్టుకునే అవకాశం ఉందని వివరించారు. వ్యాపారులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 14న పీజీఆర్ఎస్ రద్దు తిరుపతి అర్బన్: జిల్లా కలెక్టరేట్‌తోపాటు మండల, డివిజన్ కేంద్రాల్లో ఈనెల 14 సోమవారం నిర్వహించాల్సిన పీజీఆర్ఎస్ను వినాయకచవితి పండుగ నేపథ్యంలో రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా ప్రజలు ఈ అంశాన్ని గుర్తించాలని సూచించారు. నీళ్ల సీసాలపై ఆరోగ్యశాఖ కొరడా తిరుమల : తిరుమలలో తాగునీటి గ్లాస్ వాటర్ బాటిళ్లను సరఫరా చేసే కంపెనీలపై ఆరోగ్యశాఖ కొరడా ఝుళిపించింది. తిరుమలకు వాటర్ బాటిళ్లు సరఫరా చేస్తున్న నాలుగు కంపెనీలకు సంబంధించిన వాటర్ బాటిళ్లను ఆరోగ్యశాఖ అధికారులు ఎఫ్ఎస్ఎస్ఏఐ ల్యాబ్‌లో తనిఖీలు చేపట్టారు. సదరు వాటర్ బాటిళ్లలోని నీటిలో ఎఫ్ఎస్ఎస్సీఐ ప్రమాణాలకు తగిన విధంగా మినరల్స్ అందుబాటులో లేవని తేలింది. అదేవిధంగా సరైన నాణ్యత లేకపోవడంతో వాటిని తిరుమలకు నిషేధిస్తూ ఉత్తర్వులు జారీచేసినట్లు టీటీడీ ఆరోగ్యశాఖ డిప్యూటీవో సోమన్నారాయణ తెలిపారు. తిరిగి తగిన ప్రమాణాలను ల్యాబ్ నివేదికలో నిరూపించుకున్న కంపెనీలకు అనుమతిస్తామని తెలిపారు. -
బస్సు ఇంజిన్‌లో చెలరేగిన మంటలు
నాయుడుపేట టౌన్: మండల పరిధిలోని పుదూరు గ్రామ సమీపంలో గోశాల వద్ద ఆర్టీసీ బస్సు ఇంజిన్‌లో నుంచి చిన్నపాటిగా పొగలు చెలరేగాయి. దీంతో బస్సు డ్రైవర్ పి.మురుగన్ చాకచక్యంగా బస్సును నిలిపివేసి ప్రయాణికులను కిందికి దించివేసి అప్రమత్తం చేశారు. వివరాలు.. వాకాడు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు శనివారం సాయంత్రం నాయుడుపేట నుంచి ప్రయాణికులను తీసుకుని మల్లాంకు బయలుదేరింది. ఈ బస్సులో 73 మంది వరకు ప్రయాణికులు ఉన్నారు. బస్సు పుదూరు గ్రామం దాటిన తర్వాత ఇంజిన్‌లో నుంచి చిన్నపాటి పొగ, మంటలు రావడంతో డైవర్ అప్రమత్తమయ్యారు. బస్సు ఇంజిన్ వద్ద వైర్ల రాపిడి వల్ల మంటలు చెలరేగి ఉండవచ్చని డ్రైవర్ తెలిపారు. ఈ విషయమై డ్రైవర్‌తో పాటు కండెక్టర్ కె.కోటయ్య వాకాడు డిపో మేనేజర్‌కు సమాచారం అందించడంతో ఆయన వెంటనే స్పందించి మెకానిక్‌ను పంపించారు. అయితే అరగంట తర్వాత బస్సును స్టార్ట్ చేయడంతో స్టార్ అయ్యిందని, మంటలు రాలేదని కండెక్టర్ వెల్లడించారు. -
కిక్కు.. తమ్ముళ్లకే లక్కు!
తిరుపతి అర్బన్: మళ్లీ మద్యం దుకాణాలను తమ్ముళ్లకే కట్టబెట్టేశారు. టెండర్లు పిలవకుండా, లక్కీ డిప్‌నకు ఛాన్స్ లేకుండా, ఽలైసెన్స్ ధరలు పెంచకుండా తమ్ముళ్లకే అప్పగించేశారు. ఈ మేరకు ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. మద్యం దుకాణాల లైసెన్స్‌ను ఈ నెల 12 నుంచి 21వ తేదీ సాయంత్రం 5గంటల్లోపు పునరుద్ధరణ చేసుకోవాలని తిరుపతి, చిత్తూరు జిల్లాల ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ విజయశేఖర్ వెల్లడించారు. శనివారం ఆయన కలెక్టరేట్లోని ఎకై ్సజ్ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలో 233 మద్యం దుకాణాలు ఓపెన్ కేటగిరిలోను, 22 దుకాణాలు గీత కులాల వారి పరిధిలో నడుస్తున్నాయని చెప్పారు. ఈ నెల 30వ తేదీకి లైసెన్స్ గడువు పూర్తవుతున్న నేపథ్యంలో ఈ నెల 12 నుంచి 21వ తేదీ వరకు ఆప్లైన్ లేదా ఆన్లైన్ ద్వారా తమ లైసెన్స్‌ను 2026–27కి సంబంధించి రెన్యూవల్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. రెన్యూవల్ చేసుకోకుంటే వాటిని ఖాళీలుగా చూపించి కొత్తగా టెండర్లు ఆహ్వానించడం జరుగుతుందని స్పష్టం చేశారు. లైసెన్స్ మొత్తాన్ని నాలుగు దశల్లో చెల్లించే సౌకర్యం కల్పించామని వెల్లడించారు. 2026–27కు సంబంధించి వార్షిక రిటైల్స్ ఎకై ్సజ్ పన్నులో ఎలాంటి మార్పులు చేయకుండా గతంలో ఉన్న ధరలే నిర్ణయించినట్లు చెప్పారు. -
ప్రభుత్వ లాగిన్‌తో ‘పచ్చ’ రాజకీయం!
తిరుపతి రూరల్: తిరుపతి రూరల్ మండలం, మల్లంగుంట గ్రామ సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్‌కు సంబంధించిన ప్రభుత్వ లాగిన్న్ను టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న ఓ వ్యక్తి వినియోగించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. రెండో శనివారం సెలవు రోజున సచివాలయంలో ఉద్యోగులు లేకపోయినా.. ఓ వ్యక్తి డిజిటల్ అసిస్టెంట్ సీటులో కూర్చొని పింఛన్లకు సంబంధించిన వివరాలను ప్రభుత్వ లాగిన్న్లో నమోదు చేస్తుండడాన్ని గ్రామస్తులు గుర్తించి నిలదీశారు. లాగిన్ ఉద్యోగిది.. పెత్తనం పార్టీదా? మల్లంగుంట సచివాలయంలో పనిచేస్తున్న డిజిటల్ అసిస్టెంట్ పదోన్నతితో బదిలీ కాగా ఆమె స్థానంలో మహిళా పోలీసుకు అదనపు బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. ఆమె కూడా ప్రస్తుతం మెటర్నిటీ సెలవులో ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగికి చెందిన లాగినన్ ఓ టీడీపీ కార్యకర్త చేతిలోకి ఎలా వెళ్లిందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆ లాగిన్‌తో ఎవరెవరి పింఛన్ల వివరాలు నమోదు చేశారు? ఎంత మంది దరఖాస్తులు స్వీకరించారు? వైఎస్ఆర్సీపీ సానుభూతిపరుల పింఛన్లు తొలగించారా..? అనే అంశాలపై జిల్లా అధికారులు సమగ్రంగా పరిశీలించాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
తుమ్మలగుంటలో.. విభూది వినాయకుడు
తిరుపతి రూరల్: విభూది పరిమళం.. మంచు కొండల నడుమ గణనాథుడి దివ్యరూపం.. భక్తులను విశేషంగా ఆకట్టుకునేలా తుమ్మలగుంటలో ఈ ఏడాది విభూది వినాయకుడు కొలువు దీరనున్నాడు. ప్రముఖ శైవక్షేత్రాల నుంచి సేకరించిన పవిత్ర విభూదిని వినాయకుని ప్రతిమ తయారీకి వినియోగిస్తున్నారు. అత్యద్భుతంగా రూపుదిద్దుకునే విభూది వినాయకున్ని చూసేందుకు భక్తులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గత 15 ఏళ్లుగా రాష్ట్ర ప్రభుత్వ మాజీ విప్ చెవిరెడ్డి కుటుంబీకుల సహకారంతో బాల వినాయక కమిటీ సభ్యులు విభిన్న ఆకృతులతో గణపతి ప్రతిమలను తయారు చేయించి భక్తులకు కనువిందు కలిగించడం ఆనవాయితీగా వస్తోంది. వినాయక చవితి నుంచి 9 రోజుల పాటు ప్రత్యేకంగా పూజలు చేస్తూ గణేశుని దర్శనభాగ్యం కలిగిస్తున్నారు. అంతేగాక ఆ వినాయకుని ప్రతిమ తయారీలో ఎలాంటి రసాయనాలకు తావులేకుండా మట్టి, గడ్డి, చెక్కను మాత్రమే వినియోగిస్తున్నారు. తుమ్మలగుంటలో వరుసగా ఐదేళ్లు పాటు ఏర్పాటు చేసిన వినాయకుని ప్రతిమల జాబితాను పరిశీలిస్తే పైనాపిల్ వినాయకుడు, నారికేళ వినాయకుడు, తమలపాకు వినాయకుడు, నెమలి పింఛ వినాయకుడు, తుంబుర వినాయకుని ప్రతిమలను భక్తులు దర్శించారు. అదే సమయంలో ఈ ఏడాది విభూది వినాయకుని ప్రతిమను తయారు చేయించి చవితి రోజున భక్తులకు దర్శనభాగ్యం కలిగించనున్నారు. కల్యాణ మండపంలో కొలువు ఈ ఏడాది వినాయక చవితి పర్వదినం రోజునే తుమ్మలగుంట శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు కూడా ప్రారంభం కానున్నాయి. దీంతో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విభూది వినాయకుడిని ఆలయంలోని కల్యాణ మండపంలో ఏర్పాటు చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్నారు. 7 టన్నుల విభూదితో.. ప్రముఖ శైవక్షేత్రాల నుంచి సేకరించిన సుమారు 7 టన్నుల విభూదిని ఉపయోగించి 11 అడుగుల ఎత్తు, 7 అడుగుల వెడల్పుతో విభూది వినాయకుడి ప్రతిమను రూపొందిస్తున్నారు. హైదరాబాద్ నుంచి వచ్చిన 16 మంది కళాకారులు వారం రోజులుగా విగ్రహ తయారీలో నిమగ్నమయ్యారు. మంచుకొండల మధ్య విభూది వినాయకుడు కొలువుదీరినట్టుగా ప్రతిమను తీర్చిదిద్దుతున్నారు. విగ్రహం తయారీ పనులను బాల వినాయక కమిటీ సభ్యులు దగ్గరుండి పర్యవేక్షిస్తుండగా చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి, చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు. -
లోక్ అదాలత్‌లో 3,442 కేసుల పరిష్కారం
తిరుపతి లీగల్: తిరుపతి కోర్టు ఆవరణలో శనివారం జరిగిన జాతీయ లోక్‌అదాలత్‌లో 3,442 కేసులు పరిష్కారమైనట్టు తిరుపతి మూడవ అదనపు జిల్లా జడ్జి, మండల న్యాయ సేవ అధికార సంస్థ చైర్మన్ ఎం.గురునాథ్ మీడియాకు తెలిపారు. పరిష్కారమైన కేసుల్లో కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న 249 కేసులు, వ్యాజ్యం వేయని బ్యాంకు, బీఎస్ఎన్ఎల్కు సంబంధించిన 22 కేసులు, మొదటి ప్రత్యేక మెజిస్ట్రేట్ కోర్టుకు సంబంధించి జరిమానా చెల్లించే 1,395 కేసులు, రెండవ ప్రత్యేక మెజిస్ట్రేట్ కోర్టుకు సంబంధించిన జరిమానా చెల్లించే 1,776 కేసులు ఉన్నట్టు న్యాయమూర్తి పేర్కొన్నారు. కేసుల పరిష్కారం కోసం ఐదు బెంచులను ఏర్పాటు చేసినట్టు న్యాయమూర్తి తెలిపారు. తనతోపాటు ఆ బెంచ్‌లకు అధ్యక్షులుగా తిరుపతి నాల్గవ అదనపు జిల్లా జడ్జి అర్చన, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి వెన్నెల, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ లెనిన్ బాబు, మొదటి జూనియర్ సివిల్ జడ్జి రమాదేవి వ్యవహరించారన్నారు. ‘ఆర్ఐఎంసీ’కి 30 వరకే గడువు తిరుపతి అర్బన్: రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్ (ఆర్ఐఎంసీ) 2027 విద్యా సంవత్సరంలో 8వ తరగతి ప్రవేశానికి జాతీయ స్థాయిలో నిర్వహించే పరీక్ష దరఖాస్తుకు ఈ నెల 30వ తేదీ వరకు గడువు ఉందని కోచింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ఉపాధ్యాక్షులు, విశ్వం విద్యాసంస్థల అధినేత విశ్వనాథ్‌రెడ్డి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది డిసెంబర్ 6న పరీక్ష ఉంటుందని చెప్పారు. ఈ పరీక్షకు 2013 జూలై 2 నుంచి 2015 జనవరి 1 మధ్య జన్మించిన వారు మాత్రమే అర్హులని పేర్కొన్నారు. పరీక్షకు మ్యాథమెటిక్స్, ఇంగ్లిష్, జనరల్ నాలెడ్జ్ ప్రధాన అంశాలుగా ఉంటాయని వివరించారు. అదనపు సమాచారం కోసం 8688888802, 9399976999 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. -
4.6 కిలోల గంజాయితో మహిళ అరెస్ట్
– గతంలోనూ దొంగతనాలు, గంజాయి కేసుల్లో నిందితురాలు తిరుపతి: గంజాయిని తరలిస్తున్న ఓ మహిళను ఎస్వీ యూనివర్సిటీ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. ఆమె వద్ద నుంచి 4.6 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఎస్వీ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోని సీకాం కళాశాల సమీపంలో గంజాయి తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు అక్కడ నిఘా పెట్టి గంజాయితో పట్టుబడిన మహిళను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. చిత్తూరు జిల్లా, మంగసముద్రానికి చెందిన లక్ష్మీదేవి గంజాయి తరలిస్తూ పట్టుబడింది. ఆమైపె గతంలోనూ పలు దొంగతనాలు, గంజాయి కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. ఆయా కేసుల్లో అరైస్టె జైలు జీవితం గడిపినట్లు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, నిందితురాలిని రిమాండ్‌కు తరలించినట్లు ఎస్వీ యూనివర్సిటీ సీఐ నరేష్ తెలిపారు. లారీ అదుపు తప్పి వ్యక్తి మృతి ఓబులవారిపల్లె : చిన్నఓరంపాడు–ముక్కావారిపల్లి జాతీయ రహదారిపై శనివారం లారీ అదుపుతప్పి బోల్తాపడిన ఘటనలో డ్రైవర్ బీ.మురళి (50) అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్ఐ సుజున్కుమార్ కథనం మేరకు.. తాడిపత్రికి చెందిన లారీ డ్రైవర్ మురళి లోడ్డుతో చైన్నెకి బయల్దేరాడు. మార్గమధ్యంలోని చిన్న ఓరంపాడు వద్ద రోడ్డు మరమ్మతుల కారణంగా లారీ కల్వర్టు వద్ద అదుపుతప్పి బోల్తాపడింది. విషయాన్ని గమనించిన డ్రైవర్ మురళి కుడివైపునకు దూకగా లారీ అతనిపైకే వెళ్లి పడింది. దీంతో మురళి అక్కడికక్కడే మృతిచెందాడు. కేసు దర్యాప్తులో ఉంది. వృద్ధురాలిపై దాడి చేసి.. బంగారు నగలు అపహరించి.. నాగలాపురం: పట్టపగలే గుర్తుతెలియని మహిళ ఓ వృద్ధురాలి ఇంట్లోకి చొరబడి దాడి చేసి, బంగారు ఆభరణాలు అపహరించుకెళ్లిన ఘటన శనివారం మధ్యాహ్నం నాగలాపురం బజారు వీధిలో చోటుచేసుకుంది. బాధితురాలు ఉష (72) తెలపిన వివరాల ప్రకారం.. ఓ గుర్తుతెలియని మహిళ శనివారం ఉదయం నుంచి ఇంటికి ఎదురుగా ఉన్న కాయగూరల దుకాణం వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తూ కనిపించింది. మధ్యాహ్నం సుమారు 2.30 గంటల సమయంలో ఉష ఇంట్లోకి వెళ్లిన వెంటనే ఆ మహిళ చొరబడి ఆమైపె దాడి చేసి మెడలో ఉన్న మూడు సవరల బంగారు చైను, చెవి కమ్మలు అపహరించుకొని పరారైంది. ఉష ఇంటి నుంచి బయటకు వచ్చి గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆమెను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సునీల్ తెలిపారు. ఫ్రీ మెడికల్ చెకప్ పేరుతో చంపేశారు! – ప్రెస్‌క్లబ్‌లో కుటుంబ సభ్యుల ఆరోపణ తిరుపతి అన్నమయ్యసర్కిల్: ఫ్రి మెడికల్ చెకప్ పేరుతో రేణిగుంట బాలాజీ మెడికల్ కాలేజీ హాస్పిటల్ అండ్ రీసెర్స్ ఇన్స్టిట్యూట్ వారు తీసుకెళ్లి తమ తండ్రి ఆర్.గోవిందస్వామి (72)ని చంపేశారని కేవీబీపురం మండలం, రాజులకండ్రిగ గ్రామానికి చెందిన కుమారుడు గిరి, కుటుంబ సభ్యులు ఆరోపించారు. శనివారం సాయంత్రం వారు తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడారు. గత నెల ఆగస్టు 10వ తేదీన రాజులకండ్రిగకు వచ్చిన హాస్పిటల్ సిబ్బంది ఉచిత వైద్య పరీక్షల పేరుతో ఆరోగ్యంగా ఉన్న తమ తండ్రిని ఆస్పత్రికి తీసుకెళ్లారని చెప్పారు. ఆపై 13వ తేదీన మీ తండ్రి చనిపోయాడని కబురు వచ్చినట్టు పేర్కొన్నారు. మరణ ధ్రువీకరణ పత్రంలోనూ వేర్వేరు సమయాలు ఉండడం అనుమానాలకు తావిస్తోందన్నారు. తమ తండ్రి మృతిపై సమగ్ర విచారణ చేపట్టి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. -
క్యాంపస్ డ్రైవ్‌లో ‘శ్రీరామ’ విద్యార్థుల ప్రతిభ
తిరుపతి సిటీ: కరకంబాడి రోడ్డులోని శ్రీరామ ఇంజినీరింగ్ కళాశాలలో శనివారం యత్వా ఎనర్జీ సొల్యూ షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహించిన క్యాంపస్ డ్రైవ్‌లో పలువురు విద్యార్థులు ఉన్నత స్థాయి ఉద్యోగాలకు ఎంపికయ్యారు. కళాశాల చైర్మన్ మన్నెం రామిరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు సాంకేతిక విద్యతో పాటు నైపుణ్యాభివృద్ధి, ప్లేస్మెంట్ శిక్షణ అందిస్తున్నామని తెలిపారు. సక్రటరీ మన్నెం రామసుబ్బారెడ్డి, డైరెక్టర్ మన్నెం అరవిందుకుమార్ రెడ్డి, ప్రిన్సిపల్ జయచంద్ర, వైస్ ప్రిన్సిపల్ వాసు, ప్లేస్మెంట్ ఆఫీసర్ విష్ణువర్ధన్‌రెడ్డి, ఎండీ రవిమారుతి రెడ్డి పాల్గొన్నారు. -
పారామెడికల్ విద్యార్థులపై ఖా‘కీచకం’
సాక్షి టాస్క్ ఫోర్స్: తిరుపతి రుయా ఆస్పత్రి వద్ద స్టైపెండ్ కోసం నిరసన తెలుపుతున్న పారా మెడికల్ విద్యార్థులపై పోలీసులు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. శనివారం ఉదయం నిరసనలో భాగంగా పారామెడికల్ విద్యార్థులు తిరుపతి రుయా ఆసుపత్రి ధర్నా శిబిరం నుంచి అలిపిరి వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. వీరికి మద్దతుగా తిరుపతి జిల్లా ఎస్ఎఫ్ఐ కమిటీ ర్యాలీలో పాల్గొంది. అలిపిరి సర్కిల్ వద్ద అప్పటికే పెద్ద సంఖ్యలో మోహరించి ఉన్న పోలీసులు విద్యార్థుల ర్యాలీని అడ్డుకునే ప్రయత్నం చేశారు. శాంతియుతంగా న్యాయమైన డిమాండ్లపై ధర్నా చేస్తున్న తమను అడ్డుకోవడం ఏమిటని విద్యార్థులు పోలీసులను నిలదీశారు. దీంతో అలిపిరి వద్ద ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విచక్షణ కోల్పోయిన పోలీసులు నిరసన తెలుపుతున్న విద్యార్థులను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారు. ఏం తప్పు చేశాం.. ఎందుకు అరెస్ట్ చేస్తారని విద్యార్థులు పెద్ద సంఖ్యలో అడ్డుపడటంతో ఆగ్రహించిన పోలీసులు పశువులను ఈడ్చినట్లు విద్యార్థులను ఈడ్చుకెళ్లారు. జుట్టుపట్టి ఈడ్చుకుంటూ.... పారామెడికల్ విద్యార్థుల సమస్యలపై నిరసన తెలుపుతున్న తమపై పోలీసులు దారుణంగా ప్రవర్తించారని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పవిత్ర, అక్బర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రుయా ఆసుపత్రి సర్కిల్ నుంచి అలిపిరి వరకు ర్యాలీ చేస్తుండగా, పోలీసులు అడ్డుకుని ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకురాలు సునీతను జుట్టుపట్టి ఈడ్చుకెళ్లి అరెస్ట్ చేశారని ఆరోపించారు. ఇంత దారుణంగా విద్యార్థులపైన, విద్యార్థి నాయకులపైనా పోలీసులు ప్రవర్తించడం గతంలో ఎన్నడూ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జరిగిన ఘటనకు సంబం«ధించి వీడియోలు బయటకు వెళితే కేసులు పెడతామంటూ బెదిరింపులకు దిగుతున్నారని వాపోయారు. భయభ్రాంతులతో పరుగులు పెట్టిన విద్యార్థినులు అలిపిరి వద్ద జరిగిన సంఘటనతో స్థానిక ప్రజలు, ఆ ప్రాంతంలో ఉన్న భక్తులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు వ్యవహరించిన తీరును వారు ప్రత్యక్షంగా చూసి ఆందోళన చెందారు. విద్యార్థులు వదలండి అంటూ కేకలు పెడుతున్నా వినకుండా అత్యంత క్రూరంగా లాగడంతో నిరసన తెలుపుతున్న విద్యార్థినులలో కొందరు భయభ్రాంతులకు లోనై రుయా ఆసుపత్రి వైపు పరుగులు పెట్టారు. విద్యార్థులపై దౌర్జన్యం దారుణం శాంతియుతంగా ప్రదర్శన నిర్వహించి తిరిగి వస్తున్న విద్యార్థినులపై పోలీసులు విరుచుకుపడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు సీపీఎం రాష్ట్ర కమిటీ పేర్కొంది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు శనివారం ఒక ప్రకటన విడుదలచేశారు. ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకురాలు సునీతను జుట్టుపట్టుకుని ఈడ్చుకెళ్లడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, విద్యార్థి నాయకులు, విద్యార్థులపై పెట్టిన అక్రమ కేసులను తక్షనం ఎత్తివేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు డిమాండ్ చేశారు. సమస్యలపై గళమెత్తిన విద్యార్థులపై తిరుపతి పోలీసులు వ్యవహరించిన తీరు అమానుషమని ఐద్వా తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి సాయిలక్ష్మి పేర్కొన్నారు. కాగా తిరుపతి గరుడ సర్కిల్ వద్ద జరిగిన ఘటన అనుకోకుండా జరిగిందని, విద్యార్థిని చేయి పట్టుకుని లాగే క్రమంలో అనుకోకుండా జుట్టు కూడా చేతికి చిక్కినట్లు ఫొటోలో కనిపిస్తోందని ఏఎస్పీ రవిమనోహరా చారి అన్నారు. అయినప్పటికీ ఏఎస్సై లక్ష్మీకుమారిని వీఆర్‌కు పంపించినట్లు ఆయన తెలిపారు. హక్కుగా రావాల్సిన స్టైపెండ్ అడిగితే అమానుషంగా దాడిచేస్తారా హక్కుగా రావాల్సిన స్టైపెండ్ చెల్లించాలని, తమ చదువులు సజావుగా కొనసాగేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ తిరుపతిలోని అలిపిరి వద్ద నిరసన చేపట్టిన పారామెడికల్ విద్యార్థులపై పోలీసులు చేసిన దాడి అమానుషం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. విద్యార్థినులను జుట్టు పట్టుకుని నడిరోడ్డుపై ఈడ్చుకెళ్లడం దారుణం. ప్రభుత్వం వెంటనే స్పందించి వారి సమస్యలను పరిష్కరించాలి. – డాక్టర్ మద్దిల గురుమూర్తి, తిరుపతి ఎంపీ -
నకిలీ జూడో సర్టిఫికెట్లతో టీచర్ ఉద్యోగాలు!
తిరుపతి ఎడ్యుకేషన్: మెగా డీఎస్సీ 2025లో నకిలీ సర్టిఫికెట్ల స్కామ్ గురించి ఏడాది క్రితమే రాష్ట్ర ప్రభుత్వానికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసి హెచ్చరించినట్లు రాష్ట్ర జూడో సంఘం మాజీ జాయింట్ సెక్రటరీ చీనేపల్లి కిరణ్ ‘సాక్షి’కి వెల్లడించారు. అనుమానాస్పదంగా ఉండటంతో పలువురు అభ్యర్థుల పత్రాలను పరిశీలించగా నిర్ఘాంతపోయే వాస్తవాలు గుర్తించామన్నారు. జూడోతోపాటు ఇతర క్రీడలకు సంబంధించి పలువురు మెగా డీఎస్సీ అభ్యర్థులు నకిలీ సర్టిఫికెట్లను సమర్పించారని గుర్తించడంతో గత ఏడాది సెప్టెంబరు 16న ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామన్నారు. నకిలీ సర్టిఫికెట్ల బాగోతంపై జూడో సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఆనం రామకిషోర్‌రెడ్డి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. జూడో సర్టిఫికెట్లు ఎవరిచ్చారు? ఎవరికి ఇచ్చారు? మెరిట్ జాబితా ఇవ్వాలంటూ సమాచార హక్కు చట్టం కింద కోరినప్పటికి వెల్లడించేందుకు ‘శాప్’ నిరాకరించిందని, పైగా మెరిట్ జాబితాను వెబ్సైట్ నుంచి తొలగించిందని పేర్కొన్నారు. నకిలీ సర్టిఫికెట్లు గుర్తించామని శాప్ చైర్మనే చెప్పారుమెగా డీఎస్సీలో స్పోర్ట్స్ కోటా కింద దరఖాస్తు చేసుకున్న వారిలో 880 మంది నకిలీ సర్టిఫికెట్లను గుర్తించామని శాప్ చైర్మన్ రవినాయుడు గతంలో మీడియాకు చెప్పారని కిరణ్ గుర్తు చేశారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ సమాచార హక్కు చట్టం ద్వారా ఆ నకిలీ సర్టిఫికెట్ల వివరాలను తాము కోరామన్నారు. శాప్ అధికారులు కేవలం 32 మాత్రమే నకిలీ సర్టిఫికెట్లు ఉన్నట్లు గుర్తించామని చెప్పారన్నారు. అభ్యర్థులు కరిష్మ, షేక్ ఇమామ్ హుస్సేన్, సూర్యానాయక్, శ్వేతారాణి జూడో నకిలీ సర్టిఫికెట్లను అప్లోడ్ చేయగా మరో 28 మంది వివిధ క్రీడలకు సంబంధించి నకిలీ సర్టిఫికెట్లను అప్లోడ్ చేశారన్నారు. నకిలీ సర్టిఫికెట్లతో టీచర్లుగా ఉద్యోగాలు చేస్తున్నారని, క్షేత్రస్థాయిలో విచారిస్తే పూర్తి స్థాయిలో వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు.2014లో తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ జూడో అసోసియేషన్ నిర్వహించిన రాష్ట్ర స్థాయి సీనియర్ మెన్ అండ్ ఉమెన్ చాంపియన్‌షిప్‌లో విజేతలకు అందజేసిన ఒరిజినల్ పార్టిసిపేట్ అండ్ మెరిట్ సర్టిఫికెట్లు శాప్ ఎండీ అవాస్తవాలు చెప్పారు..శాప్ ఎండీ భరణి ఇటీవల ప్రెస్‌మీట్ పెట్టి జూడోకు సంబంధించి ఫేక్ సర్టిఫికెట్ల అంశంపై తమకు ఎటువంటి ఫిర్యాదులు అందలేదని చెప్పడం పూర్తిగా అవాస్తవమన్నారు. జూడో నకిలీ సర్టిఫికెట్లతో పలువురు ఉద్యోగాలు పొందారని గత ఏడాది సెప్టెంబరు 16న లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు శాప్ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదని చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఫేక్ సర్టిఫికెట్ల రాకెట్‌ను ఛేదించి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. తేదీలు మార్చి ఫేక్ సర్టిఫికెట్లు..!రాష్ట్రం విడిపోయాక తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ జూడో అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి సీనియర్ మెన్ అండ్ ఉమెన్ చాంపియన్‌షిప్ పోటీలను 2014 నవంబరు 28, 29వ తేదీల్లో విజయవాడలో నిర్వహించారు. దీనికి సంబంధించి ఇచ్చిన సర్టిఫికెట్లు ఒరిజినల్ అని తెలిపారు. అయితే అదే వేదికపై 2014 నవంబరు 11 నుంచి 13వతేదీ వరకు రాష్ట్రస్థాయి సీనియర్ మెన్ అండ్ ఉమెన్ చాంపియన్‌షిప్ పోటీలను నిర్వహించినట్లు నకిలీ సర్టిఫికెట్లను ప్రింట్ చేసి అప్పటి జూడో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ నామిశెట్టి అమ్ముకున్నారని, ఇవే సర్టిఫికెట్లతో డీఎస్సీలో 28 మంది ఉద్యోగాలు సాధించారని ఆయన చెప్పారు. -
వినాయక మండపాలకు ఉచిత విద్యుత్
తిరుపతి రూరల్: వినాయక మండపాలకు ఉచిత విద్యుత్ అందించనున్నట్టు ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ లోతేటి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసే మండపాల్లో విద్యుత్ ప్రమాదాలకు తావులేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వినాయక మండపాలకు గ్రామీణ ప్రాంతాల్లో 3 కిలోవాట్లు, పట్టణ ప్రాంతాల్లో 5 కిలోవాట్ల వరకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేయనున్నట్లు తెలిపారు. అత్యవసర సమాచారం కోసం 1912 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేయాలన్నారు. 14న స్విమ్స్ ఓపీ, ఓటీలకు సెలవు తిరుపతి తుడా: వినాయక చవితి పర్వదినం సందర్భంగా స్విమ్స్ ఓపీ, ఓటీ విభాగాలకు సెలవు ప్రకటించినట్టు డైరెక్టర్ డాక్టర్ జగదీష్ ఒక ప్రకటనలో తెలిపారు. అత్యవసర సేవలు యథాతథంగా కొనసాగుతాయన్నారు. -
గర్జించిన.. జెన్‌జెడ్
జిల్లా కేంద్రం తిరుపతిలో విద్యార్థిలోకం భగ్గుమంది. రాయలసీమ యువతకు ఉపాధి అవకాశాల కోసం శిక్షణనిచ్చే నైలెట్ శాశ్వత క్యాంపస్ తరలింపుపై గర్జించింది. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కుట్రలపై గళమెత్తింది. సీఎం సొంత జిల్లాకు ద్రోహం చేస్తారా..? అంటూ మండింది. న్యూఢిల్లీలో ఇటీవల జరిగిన కాక్రొచ్ జెన్‌జెడ్ పోరును తలపించేలా కాక్రొచ్ ప్లకార్డులు చేతబూని ప్రభుత్వ వైఖరి ఖండించింది. నైలెట్ జోలికొస్తే ఖబడ్దార్ అంటూ హెచ్చరికలు జారీ చేసింది. తిరుపతి సిటీ: నైలెట్ శాశ్వత క్యాంపస్‌ను తిరుపతి నుంచి అమరావతికి తరలింపునకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీల కతీతంగా జరిగిన జెన్‌జెడ్ ర్యాలీకి విశేష స్పందన లభించింది. శుక్రవారం ఎస్వీయూ రెండవ గేటు నుంచి వర్సిటీ ప్రధాన ద్వారం వరకు జరిగిన భారీ ర్యాలీకి తిరుపతి స్థానికులతో పాటు విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, ప్రజాప్రతినిధులు స్వచ్ఛందం తరలివచ్చి మద్దత్తు పలికారు. సుమారు మూడు వేల మందికి పైగా హాజరయ్యారు. ఈ ర్యాలీకి తిరుపతి ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం, మాజీ ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులు, మాజీ మేయర్ డాక్టర్ శిరీష, సుమారు 16 విద్యార్థి సంఘాల నేతలు, నిరుద్యోగ యువకులు పాల్గొన్నారు. జన్మనిచ్చిన జిల్లాకే ద్రోహం చేస్తారా? సీఎం చంద్రబాబుకు జన్మనిచ్చిన సొంత జిల్లా తిరుపతికి ద్రోహం చేయడంపై విద్యార్థులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హాయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో ఎంపీ గురుమూర్తి పోరాటంతో కేంద్రమంత్రులను ఒప్పించి తిరుపతికి ప్రతిష్టాత్మక నైలెట్‌ను తీసుకొస్తే సహించని కూటమి సర్కార్ పగపట్టి తరలించుకుపోవడం దారుణమని మండిపడ్డారు. జిల్లాలో ఏర్పేడు వద్ద రూ.100 కోట్లతో స్థాపించిన స్కిల్ డెవలెప్మెంట్ యూనివర్సిటీని సైతం అమరావతి తరలించారని మండిపడ్డారు. అలాగే నేషనల్ ఫోరెన్సిక్ యూనివర్సిటీని సైతం తీసుకెళ్లారని ఆరోపించారు. ప్రస్తుతం వర్సిటీలో ఏర్పాటు చేసిన నైలెట్ సంస్థపై కన్నుపడిందని, దానిని సైతం అమరావతికి తరలించేస్తున్నారని మండిపడ్డారు. ప్రత్యేక ఆకర్షణగా కాక్రొచ్ ప్లకార్డులు జెన్‌జెడ్ ర్యాలీలో కాక్రొచ్ ప్లకార్డులు హల్చల్ చేశాయి. పార్టీలకతీతంగా పాల్గొన్న యువత, విద్యార్థులు, స్థానిక ప్రజలు ర్యాలీలో బాబు సర్కార్‌ను విమర్శిస్తూ కాక్రొచ్ చిత్రపటాలతో హెచ్చరించారు. తిరుపతి ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా కూటమి సర్కార్ వ్యవహరిస్తే కాక్రొచ్లు పుట్టుకొచ్చి నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తుందంటూ హెచ్చరించారు. -
చంద్రగిరి నుంచే టీడీపీ పతనం
చంద్రగిరి: చంద్రబాబు సొంత నియోజకవర్గం చంద్రగిరి నుంచే టీడీపీ పతనం ఆరంభం కావాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి, చంద్రగిరి నియోజకవర్గ ఇన్చార్జి చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి పిలుపునిచ్చారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఒక్క ఎన్నిక కూడా ఏకగ్రీవం కాకుండా ప్రతి పంచాయతీలో వైఎస్సార్సీపీ అభ్యర్థులను బరిలోకి దించి గెలిపించాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. చంద్రగిరిలో అత్యధిక స్థానాలను కై వసం చేసుకుని ఆ విజయాన్ని వైఎస్ జగన్మోహన్రెడ్డికి కానుకగా ఇవ్వాలని పిలుపునిచ్చారు. చంద్రగిరిలో శుక్రవారం జరిగిన వైఎస్సార్సీపీ విస్తృత స్థాయి సమావేశంలో భూమన కరుణాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు, కరువు కవల పిల్లలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు పుట్టిన నారావారిపల్లిలోనే రైతులకు నీటి కష్టాలు తప్పడం లేదన్నారు. కల్యాణీ రిజర్వాయర్‌లో నీరు లేక ఎండిపోతోందని తెలిపారు. చంద్రబాబు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా కరువు విలయతాండవం చేస్తుందని విమర్శించారు. ఒక్కటి కూడా ఏకగ్రీవం కాకూడదు స్థానిక ఎన్నికల్లో ఎక్కడా ఏకగ్రీవం కాకూడదన్న లక్ష్యంతో ప్రతి పంచాయతీలో అభ్యర్థులను బరిలోకి దించాలని చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి స్పష్టం చేశారు. చంద్రబాబు సొంత నియోజకవర్గమైన చంద్రగిరి నుంచే టీడీపీ పతనం ప్రారంభమవుతుందనే విషయాన్ని ఈ ఎన్నికల ద్వారానే ప్రభుత్వానికి తెలియజేయాలన్నారు. అభ్యర్థులను గెలిపించే వరకు వెన్నంటే ఉంటానని ఆయన హామీ ఇచ్చారు. సమన్వయ కమిటీలతో సమీక్షలు ప్రతి పంచాయతీలో ఎన్నికలు ముగిసే వరకు తరచూ సమీక్షలు నిర్వహించాలని చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో తుడా ద్వారా చంద్రగిరి నియోజకవర్గంలో రూ.వెయ్యి కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనుల వివరాలను ప్రతి గడపకూ చేర్చాలన్నారు. మాజీ ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ చంద్రగిరి నియోజకవర్గంలో చెవిరెడ్డి కుటుంబం చేసిన మంచి దేశంలో ఏ నియోజకవర్గంలో జరగలేదన్నారు. రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డితో పాటు ఆరు మండలాల పార్టీ అధ్యక్షులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మహిళలు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. -
నువ్వా.. నేనా?
సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో అతిముఖ్యమైన తిరుపతి నగరపాలక సంస్థ ఎన్నికల వేడి రాజుకుంది. గత పాలక వర్గం చేసిన గ్రేటర్ తిరుపతి తీర్మానంపై టీడీపీ, జనసేన నేతలు పథకం ప్రకారం నీళ్లు చల్లి మహానగరం విస్తరణకు మోకాలొడ్డారు, గ్రేటర్ చేసే ప్రక్రియలో భాగంగా చంద్రగిరి, తిరుపతి రూరల్, రామచంద్రాపురం, రేణిగుంట మండలాల్లోని 160కి పైగా పంచాయతీలను తిరుపతి కార్పొషన్‌లో విలేనం చేసే ప్రక్రియ జరిగింది. అయితే అధికార పార్టీకి చెందిన నాయకులు అభ్యంతరాలు తెలిపారు. ఈ ప్రక్రియ కొనసాగుతుండగానే ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమైంది. దీంతో గ్రేటర్ ప్రతిపాదనకు బ్రేక్ పడింది. 50 డివిజన్ల నుంచి 66 డివిజన్లతో కార్పొరేషన్ ఎన్నికలకు సమాయత్తమవుతున్నారు. అందుకు సంబంధించి ఓటర్ల విభజన జరిగిపోయింది. అయితే డివిజన్ల పునర్విభజన సరిగా జరగలేదని కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. న్యాయస్థానం ఆ పిటిషన్లను కొట్టివేయడంతో కార్పొరేషన్ ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఆశావహులు అధికం తిరుపతి మేయర్ కుర్చీ కోసం కూటమిలోని మూడు పార్టీల నేతలు కుస్తీపడుతున్నారు. రిజర్వేషన్ల విషయం కొలిక్కిరాకముందే నువ్వా.. నేనా అంటూ ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. గ్రేటర్ తిరుపతి విషయాన్ని పక్కనబెట్టి మేయర్ కుర్చీ కోసం పాకులాడుతున్నారు. స్థానికంగా జనసేన ఎమ్మెల్యే ఉండడంతో మేయర్ పీఠం కూడా జనసేనకే కేటాయించాలని పట్టుబడుతుండగా.. ఎమ్మెల్యే జనసేనకు కేటాయించారు కాబట్టి ఈ సారి మేయర్ పీఠం తమకే ఇవ్వాలని టీడీపీ నేతలు పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. బీజేసీ నేతలు కూడా తమ పలుకుబడిని ఉపయోగించి మేయర్ పీఠాన్ని అధిరోహించేందుకు గట్టిగానే కృషి చేస్తున్నట్టు సమాచారం. మూడు పార్టీల నుంచి పోటీ కార్పొరేషన్ ఎన్నికల్లో అధికారాలన్నీ ఉపయోగించి మేయర్ పీఠం దక్కించుకోవాలని కూటమిలోని మూడు పార్టీలు ఎత్తుకు పై ఎత్తులు వేసుకుంటున్నాయి. మేయర్ పీఠం తమకే కావాలని జనసేన నేతలు అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఎమ్మెల్యేగా జనసేన అభ్యర్థి ఉన్న సమయంలో మేయర్ కూడా అదే పార్టీకి చెందిన వారు ఉంటే బాగుంటుందని, అభివృద్ధి విషయంలో కూడా చేదోడు వాదోడుగా ఉంటామని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. జనసేనకు ఎమ్మెల్యే ఇచ్చామని, మేయర్ టీడీపీకి ఇవ్వాలంటే కుదరదని పట్టుబడుతున్నారు. ఇదిలా ఉంటే మరో వైపు బీజేపీ కూడా మేయర్ పీఠాని ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మేయర్ పీఠం కోసం కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు ఎవరికి వారు ఆశలు పెట్టుకున్నారు. అందు కోసం రిజర్వేషన్ల ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు. రిజర్వేషన్లు పక్కన పెడితే.. ప్రస్తుత పరిస్థితుల్లో మహిళలకు రిజర్వు (జనరల్) అయితే.. మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ మనుమరాలు కీర్తి ముందు వరుసలో ఉన్నారు. జనసేన వైపు నుంచి అన్నా అనిత మేయర్ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. ఇంకా టీడీపీ మహిళా జిల్లా మాజీ అధ్యక్షురాలు పుష్పావతి పేర్ల ప్రచారంలో ఉంది. లేదా జనరల్‌కు కేటాయిస్తే.. మబ్బు దేవనారాయణరెడ్డి కుటుంబం నుంచి, జేబీ శ్రీనివాసులు, కోడూరు బాలసుబ్రమణ్యం, నరసింహయాదవ్ కుటుంబం నుంచి ఒకరు పోటీలో ఉండే అవకాశం ఉంది. ఇంకా దంపూరి భాస్కర్ యాదవ్, కృష్ణయాదవ్, ఆర్సీ మునికృష్ణ తదితరులు మేయర్ పీఠాన్ని ఆశిస్తున్నారు. అనూహ్యంగా ఈ సారి బీజేపీ నుంచి కూడా మేయర్ పీఠాన్ని ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్‌రెడ్డి పదవీ కాలం ముగియనుండడంతో ఈ సారి మేయర్ పీఠంపై కూర్చోవాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అదేవిధంగా సామంచి శ్రీనివాసులు కూడా మేయర్ పీఠాన్ని ఆశిస్తున్నట్లు తెలిసింది. భాను మాత్రం.. తన పలుకుబడిని ఉపయోగించి.. కేంద్రం నుంచి చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌పై ఒత్తిడి తెచ్చేందుకు పావులు కదుపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇదిలా ఉంటే.. డివిజన్ల కేటాయింపులోనూ మూడు పార్టీల దారులు ఒక్కో రకంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. టీడీపీ అడిగేవే జనసేన కూడా అడుతున్నట్లు తెలుస్తోంది. మరో వైపు బీజేపీ కూడా కార్పొరేషన్ ఎన్నికల్లో కొన్ని డివిజన్లు అడుగుతున్నట్లు ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నారు. మొత్తానికి తిరుపతి కార్పొరేషన్ ఎన్నికలు.. కూటమికి చిక్కులు తప్పేలా లేవని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. -
శ్రీవారి దర్శనానికి 20 గంటలు
● రికార్డు స్థాయిలో శ్రీవారి హుండీ ఆదాయం 6.94 తిరుమల: తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 29 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. గురువారం అర్ధరాత్రి వరకు 69,771 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 25,888 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో రికార్టు స్థాయిలో హుండీలో రూ.6.94 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 20 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారికి 3 గంటల సమయం పడుతోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. -
వైరాలజీ ప్రయోగశాలకు ఐఎస్ఓ గుర్తింపు
తిరుపతి సిటీ: ఎస్వీయూ వైరాలజీ విభాగం ప్రయోగశాలలకు ఐఎస్ఓ గుర్తింపు లభించింది. ఈ సందర్భంగా అక్రిడిటేషన్‌తో పాటు, విద్యాసేవలు, శక్తి నిర్వహణ, పర్యావరణ నిర్వహణ, లింగ సున్నితత్వానికి సంబంధించిన మూడు ధ్రువీకరణ పత్రాలను ప్రయోగశాలకు అందజేశారు. ఐఎస్ఓ గుర్తింపు రావడం పట్ల వీసీ టాటా నర్సింగరావు, రిజిస్ట్రార్ భూపతి నాయుడు, అధికారులు హర్షం వ్యక్తం చేశారు. పరిశోధన అవకాశాలపై వర్క్‌షాపు తిరుపతి సిటీ: ఎస్వీయూ వైరాలజీ విభాగం విద్యార్థులు, పరిశోధకులలో అంతర్జాతీయ పరిశోధనా అవకాశాల గురించి అవగాహన కల్పించడం, సమర్థవంతమైన ప్రాజెక్ట్ ప్రతిపాదనలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో జర్మనీలో పరిశోధనా అవకాశాలు, ప్రాజెక్ట్ ప్రతిపాదన రచన అనే అంశంపై వర్సిటీలో వర్క్‌షాపు నిర్వహించారు. శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమానికి సైన్స్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ ఆచార్య ఓవీఎస్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పరిశోధనా నైపుణ్యాలను బలోపేతం చేసుకోవాలని సూచించారు. చైన్నెకి చెందిన డీఏఏడీ సమాచార కేంద్రం ప్రాంతీయ అధికారిణి ఆచార్య ఆంటోనెట్ స్టీఫెన్ జర్మనీలో ఉన్నత విద్య, పరిశోధన అవకాశాలు, విద్యార్థులు, పరిశోధకులకు అందుబాటులో ఉన్న వివిధ మార్గాలు, విద్యా, పరిశోధనా సహకారాలకు మద్దతు ఇవ్వడంలో డీఏఏడీ పాత్ర గురించి విలువైన సమాచారాన్ని అందించారు. ప్రొఫెసర్ వసుధారాణి దేవనాథన్, ప్రొఫెసర్ రజని, అధ్యాపకులు, పరిశోధకులు పాల్గొన్నారు. -
అక్రమ కేసులతో భయపెట ్టలేరు
నాయుడుపేట టౌన్: అక్రమ కేసులతో వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నేతలను భయపెట్టలేరని తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి, సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యలు తేల్చిచెప్పారు. శుక్రవారం నాయుడుపేట పట్టణంలోని ఆర్అండ్బీ అతిథిగృహం వద్ద ఎంపీ, మాజీ ఎమ్మెల్యేలు, నాయకులతో కలిసి విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. వారు మాట్లాడుతూ పెళ్లకూరు మండల పరిధిలోని చిల్లకూరులో జరిగిన చిన్నపాటి ఘటనను పెద్దదిగా చూపించి, ఒత్తిడితో మృతి చెందిన విషయాన్ని హత్యాయాత్నంగా చిత్రీకరించి తీవ్రమైన సెక్షన్లను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై నమోదు చేయడం దారుణమన్నారు. ఈ ఘటనతో సంబంధం లేని వ్యక్తులను సైతం కేసుల్లో ఇరికిస్తున్నారని తీవ్ర స్థాయిలో విమర్శించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యనారాయణరెడ్డిపై అక్రమ కేసు నమోదు చేయడాన్ని ఖండించారు. పోలీసులు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదన్నారు. ఇక్కడి పోలీసుల తీరుపై గవర్నర్‌తో పాటు డీజీపీ, ఎస్పీలకు ఫిర్యాదు చేస్తామన్నారు. అవసరమైతే ప్రైవేట్ కేసులు సైతం దాఖలు చేసి న్యాయపోరాటానికి సన్నద్ధమవుతామని వారు స్పష్టం చేశారు. యథేచ్ఛగా ఇసుక, మట్టి దందా నియోజకవర్గంలో ఇసుక, మట్టి, గ్రావెల్ అక్రమ దందాతో సాగుతోందని మాజీ ఎమ్మెల్యే సంజీవయ్య ఆరోపించారు. అక్రమాలను ప్రశ్నించే వారిపై కేసులు నమోదు చేసి భయపెట్టాలని చూడడం అవివేకమన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్యనారాయణరెడ్డి మండలంలో ఉంటే టీడీపీ, కూటమి నాయకుల నాటకాలు సాగవనే దుర్బుద్ధితో టీడీపీ నేతలు ఆయనపై అక్రమ కేసులు బనాయించి రిమాండ్‌కు పంపారని తెలిపారు. ఘనంగా ఎంపీ మిథున్‌రెడ్డి జన్మదిన వేడుకలు నాయుడుపేట ఆర్అండ్బీ అథితిగృహం వద్ద రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి జన్మదిన వేడుకలను తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి, మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య సారథ్యంలో నాయకులు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్‌చేసి మిథున్‌రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు కలిక మాధవరెడ్డి, జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి కామిరెడ్డి రాజారెడ్డి, మద్దాల సోమశేఖర్‌రెడ్డి, ఓజిలి మండల పార్టీ అధ్యక్షుడు పాదర్తి హరినాథ్‌రెడ్డి, పెళ్లకూరు ఎంపీపీ శేఖర్‌రెడ్డి, పెళ్లకూరు పార్టీ అధ్యక్షుడు ఒబ్బు వెంకటరత్నం, ఈదా రత్నశ్రీ, చదలవాడ కుమార్, పట్టాభిరెడ్డి పాల్గొన్నారు. -
చోరీ సొత్తు స్వాధీనం
తిరుపతి క్రైం : సీసీ కెమెరాలు, జీపీఎస్, ఇతర సాంకేతిక ఆధారాలను ఉపయోగించి తిరుపతి ఈస్ట్ పోలీసులు పలు దొంగతనం కేసులను ఛేదించారు. ఐదు కేసుల్లో నలుగురు నిందితులను అరెస్టు చేసి.. ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాలు, బంగారు గొలుసు తదితరాలు కలిపి సుమారు రూ.13.8 లక్షల విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు ఆదేశాల మేరకు ఈస్ట్ పోలీస్ స్టేషన్న్ అధికారులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి కేసుల దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక ఆధారాలతో పాటు స్థానికంగా సేకరించిన సమాచారాన్ని విశ్లేషించి నిందితులను గుర్తించారు. కేసుల వివరాలను తిరుపతి జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో అడిషనల్ ఎస్పీ (అడ్మినిస్ట్రేషన్న్) ఆర్ల శ్రీనివాసులు, అడిషనల్ ఎస్పీ (లా అండ్ ఆర్డర్) కె.రవిమనోహరాచారి వెల్లడించారు. ట్రాక్టర్ చోరీ కేసులో.. జమ్మలమడుగుకు చెందిన గొంగాటి మల్లికార్జున్న్రెడ్డి (38)ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి సుమారు రూ.9 లక్షల విలువైన ట్రాక్టర్, ట్రాలీని స్వాధీనం చేసుకున్నారు. విచారణలో అలిపిరి పోలీస్ స్టేషన్న్ పరిధిలో జరిగిన మరో ట్రాక్టర్ చోరీ కేసులో ఇంజిన్‌ను కూడా దొంగిలించినట్లు వెల్లడైంది. దీంతో ఆ కేసుకు సంబంధించిన సుమారు రూ.1.5 లక్షల విలువైన ఇంజిన్, ట్రాలీని రికవరీ చేశారు. మూడు బైక్‌లు స్వాధీనం రోడ్డుపై తాళాలు వేసి నిలిపిన ద్విచక్ర వాహనాలను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న దాయనబోయిన రవి (55)ని పోలీసులు పట్టుకున్నారు. అతని వద్ద నుంచి సుమారు రూ.50 వేల విలువైన హీరో ప్లెజర్, మరో రూ.50 వేల విలువైన హీరో స్ల్పెండర్ వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా పిడుగురాళ్లకు చెందిన శివరాత్రి చందు (23) దొంగిలించిన రాయల్ ఎన్న్ఫీల్డ్ బైక్‌ను స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి సుమారు రూ.90 వేల విలువైన బైక్‌లను రికవరీ చేశారు. చైన్‌స్నాచింగ్ కేసు ఛేదన వృద్ధురాలి మెడలోని 35 గ్రాముల బంగారు గొలుసును అపహరించిన కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. తిరుపతి డీఎస్పీ పర్యవేక్షణలో ఈస్ట్ సీఐ, ఎస్ఐలు, ఐడీ పార్టీ సిబ్బందితో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సాంకేతిక ఆధారాలను విశ్లేషించి గిద్దలూరుకు చెందిన కొప్పాలి గీత (25)ను గుర్తించి అరెస్టు చేశారు. ఆమె వద్ద నుంచి సుమారు రూ.1.4 లక్షల విలువైన 35 గ్రాముల బంగారు గొలుసును స్వాధీనం చేసుకున్నారు. -
20 మంది రైతులపై అక్రమ కేసులు
రామచంద్రాపురం: రామచంద్రాపురం మండలం, అనుపల్లి రెవెన్యూ పరిధి, ఉప్పులవంక గ్రామంలో ఇటీవల జరిగిన భూ వివాదంలో ఏకంగా 20 మంది రైతులపై అక్రమ కేసులు బనాయించడం విస్మయానికి గురిచేస్తోంది. బాధితుల కథనం.. ఉప్పులవంక గ్రామంలోని సర్వే నం.318కి సంబంధించి నెలకొన్న వివాదంపై రైతులు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ఓ వినతిపత్రం సమర్పించారు. ఈ ఫిర్యాదు మేరకు తహసీల్దార్ మధుసూదనరావు ఈనెల 1న గ్రామ సర్వేయర్‌తో కలిసి క్షేత్ర స్థాయి విచారణకు వెళ్లారు. ఆపై అధికార పార్టీ నాయకుల ఒత్తిడికి తలొగ్గి సమస్యను పరిష్కరించకుండానే అక్కడి నుంచి జారుకునే ప్రయత్నం చేశారు. దీంతో బాధిత రైతులు తహసీల్దార్ కారు ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తహసీల్దార్ విధులకు ఆటంకం కలిగించారనే నెపంతో పోలీసులు ఏకంగా 20 మందిపై కేసులు నమోదు చేశారు. ఇందులో నలుగురు మహిళలు, ఓ చంటిబిడ్డ తల్లి ఉన్నారు. ఓ ప్రజాప్రతినిధి భార్య ఒత్తిడితోనే కేసులు నమోదు చేసినట్టు తెలిసింది. ఓ పత్రిక విలేకరి (సాక్షి కాదు)పై కూడా కేసు నమోదు చేశారు. -
బాబు పాలనలో కరువు విలయతాండవం
తిరుపతి మంగళం : చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా రాష్ట్రంలో కరువు విలయతాండవం చేస్తుందని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకరరెడ్డి ఆరోపించారు. తిరుపతి పద్మావతిపురంలోని తన నివాసంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో ఎప్పుడైనా రాష్ట్రంలో సకాలంలో వర్షాలు కురిసిన దాఖలాలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాడంటే ఇక పంటల పరిస్థితి ఏమిటి దేవుడా అంటూ రైతుల గుండెల్లో దడ పుడుతుందన్నారు. చంద్రబాబు పాలనలో అతివృష్టి, అనావృష్టే తప్ప సమృద్ధిగా వర్షాలు కురిసే పరిస్థితి ఉండదన్నారు. ఎకనామిక్స్ టైమ్స్ పత్రిక వారు చంద్రబాబుకు వాటర్‌మెన్ బిరుదును ఎగతాళితో ఇచ్చినట్లుగా అనిపిస్తోందన్నారు. సకాలంలో వర్షాలు లేక కరువు విలయతాండవం చేస్తోందన్నారు. డ్యామ్‌లు, చెరువులు ఎండిపోయి సాగు, తాగునీరు లేక అటు రైతులు, ఇటు ప్రజలు అల్లాడుతున్నారని వాపోయారు. 1995– 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబు ఉన్నపుడు 1,400 మండలాలకు గాను 1200 మండలాలు కరువు మండలాలుగా ప్రకటించారని గుర్తుచేశారు. 2014–19వరకు కరువు, అతివృష్టి వచ్చిందన్నారు. చంద్రబాబు, కరువు ఒకే కడుపున పుట్టిన కవల పిల్లలు అని ఎద్దేవా చేశారు. స్వామి భక్తి కన్నా చంద్రబాబు భక్తే ఎక్కువా? తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ డిప్యూటీ ఈవోగా కొత్తగా బాధ్యతలు స్వీకరించిన భాస్కర్‌కు స్వామి భక్తి కన్నా చంద్రబాబు భక్తే ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోందని భూమన కరుణాకరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుపైన ఎంత అపారమైన భక్తి ఉన్నా దానిని మనసులో దాచుకోవాలే తప్ప మీ ఫోన్ వాట్సాప్ డీపీలో చంద్రబాబుతో కలిసి ఉన్న ఫొటోను పెట్టుకోవడం స్వామి సేవకుడిగా, టీటీడీ ఉద్యోగిగా సరికాదన్నారు. ఇప్పటికే పూర్వ డిప్యూటీవో లోకనాథన్యాదవ్ మీద దాడి చేయడం వెనుక చాలా పేర్లు బయటికి వస్తున్నాయని, వీళ్లందరూ ఆ ఉద్యోగం కావాలనుకున్నవారేనన్నారు. -
బాధ్యతల స్వీకరణ
తిరుపతి అర్బన్: తిరుపతి సెట్విన్ సీఈవోగా పనిచేస్తున్న యశ్వంత్‌కు జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారిగా బాధ్యతలు అప్పగించారు. ఆ మేరకు ఆయన కలెక్టరేట్లోని సోషల్ వెల్పేర్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. జిల్లా సాంఘిక సంక్షేమశాఖ అధికారి హరీష్ శిక్షణ నిమిత్తం దీర్ఘకాలిక సెలవులో వెళ్లడంతో ఆ బాధ్యతలను సెట్విన్ సీఈవోకు అదనంగా అప్పగించారు. రైలు కిందపడి గుర్తుతెలియని మహిళ మృతి సూళ్లూరుపేట: పట్టణం పరిధిలోని ఇసుకమిట్ట సమీపంలో దిగువ రైల్వేలైన్, గూడూరు–చైన్నె మార్గంలో సుమారు 50 నుంచి 55 సంవత్సరాల వయస్సు కలిగిన గుర్తుతెలియని మహిళ శుక్రవారం రైలు కిందపడి మృతి చెందింది. రైల్వే పోలీసుల కథనం.. గుర్తు తెలియని మహిళ తెలుపు రంగుపై బ్లూ కలర్ , ఫింక్ కలర్ పూల డిజైన్ కలిగిన చీర, తెలుపు రంగు జాకెట్, పసుపు రంగు లంగా ధరించి ఉంది. కుడి ఛాతీపై ఒక నల్లని పుట్టుమచ్చ, ఎడమ మో చేయి పైన పుట్టు మచ్చలు ఉన్నాయి. మృతురాలిని గుర్తించేందుకు ఎటువంటి ఆధారాలు దొరక్కపోవడంతో మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాస్పత్రిలోని మార్చురీకి తరలించారు. మృతురాలి ఆచూకీ తెలిసిన వారు రైల్వే పోలీస్ హెడ్‌కానిస్టేబుల్ కే శ్రీనివాసరావునను సంప్రదించాలని, లేదంటే 70360 43535, 95732 45266 నంబర్లలో సంప్రదించవచ్చని సూచించారు. నేడు జాతీయ లోక్‌అదాలత్ తిరుపతి లీగల్ : తిరుపతి కోర్టు ఆవరణలో శనివారం ఉదయం 10.30 నుంచి జాతీయ లోక్‌అదాలత్‌ను నిర్వహించనున్నట్టు తిరుపతి మూడవ అదనపు జిల్లా జడ్జి, మండల న్యాయ సేవ అధికార సంస్థ చైర్మన్ ఎం.గురునాథ్ శుక్రవారం తెలిపారు. రాష్ట్ర న్యాయ సేవ సంస్థ ఆదేశాల మేరకు ఈ జాతీయ లోక్‌అదాలత్‌ను నిర్వహించనున్నట్టు న్యాయమూర్తి పేర్కొన్నారు. కేసుల పరిష్కారం కోసం ఈ లోక్‌అదాలత్‌లో ఐదు బెంచులను ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఆ బెంచులకు అధ్యక్షులుగా తనతో పాటు తిరుపతి నాల్గవ అదనపు జిల్లా జడ్జి అర్చన, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి ఎస్పిడి.వెన్నెల, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి లెనిన్‌బాబు, మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి రమాదేవి వ్యవహరిస్తారన్నారు. కోర్టులలో పెండింగ్‌లో ఉన్న సివిల్ కేసులు, రాజీ కాదగిన క్రిమినల్ కేసులు, వివాహ సంబంధ కేసులు, మోటార్ వాహన ప్రమాద కేసులు, వ్యాజ్యం వేయని కేసులు తదితర కేసులను ఈ లోక్ అదాలత్ లో పరిష్కరిస్తామన్నారు గంజాయి కేసులో మహిళకు రిమాండ్ తిరుపతి లీగల్ : ఎస్వీ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో నాలుగు కిలోలకు పైగా గంజాయిని తరలిస్తున్న కేసులో చిత్తూరు, మంగసముద్రం, లెనిన్ నగర్‌కు చెందిన బి.లక్ష్మీదేవికి 14 రోజులపాటు రిమాండ్ విధిస్తూ తిరుపతి మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి రమాదేవి శుక్రవారం ఆదేశాలు జారీచేశారు. -
ఆటోను ఢీకొట్టిన పాల లారీ
నాయుడుపేట టౌన్: మండల పరిధిలోని పండ్లూరు గ్రామ సమీపంలో జాతీయ రహదారి పక్కనే నిలబెట్టి ఉన్న ఆటోను వెనుక నుంచి వస్తున్న పాల లారీ వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న ఓజిలి మండలం, ఆచర్ల పార్లపల్లి గ్రామానికి చెందిన రమేష్(32) తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే మృతిచెందాడు. మరో కార్మికుడు సుబ్బయ్య పరిస్థితి విషమంగా ఉంది. ఆటోలో ఉన్న మరో ఐదుగురు కార్మికులకు గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసుల కథనం.. ఆచర్లపార్లపల్లి గ్రామం వద్ద నుంచి మండల పరిధిలోని అయ్యప్పరెడ్డిపాళెం గ్రామ సమీపంలో ఎంపీ షుగర్ పరిశ్రమ వద్ద చెట్లను నరికేందుకు కూలీలను తీసుకుని ఆటో బయలుదేరింది. పండ్లూరు గ్రామ సమీపంలోని జాతీయ రహదారి పక్కన నిలబెట్టుకుని కార్మికులకు టిఫిన్స్లు కట్టించుకునేందుకు ఇద్దరు కిందకు దిగారు. ఈ క్రమంలో గూడూరు వైపు నుంచి వేగంగా వస్తున్న పాల లారీ రోడ్డు పక్కన నిలబెట్టిన ఆటోను వెనుక నుంచి వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ క్రమంలో ఆటో పక్కన నిలబడి ఉన్న రమేష్ తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. సుబ్బయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. ఆటోలో ఉన్న మరో ఐదుగురు కూలీలకు రక్తగాయాలయ్యాయి. వీరిని 108 అంబులెన్స్‌తో పాటు హైవే అంబులెన్స్‌లలో నాయుడుపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి కారణమైన పాల లారీని అదుపులోకి తీసుకున్నారు. సుబ్బయ్యను మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. -
40 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
తొట్టంబేడు (శ్రీకాళహస్తి రూరల్): శ్రీకాళహస్తి ఫారెస్ట్ రేంజ్ పరిధిలో అటవీశాఖ అధికారులు ముందస్తు సమాచారం మేరకు శుక్రవారం దాడులు నిర్వహించి 40 ఎరచ్రందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. అటవీశాఖ అధికారి లోకేష్ మాట్లాడుతూ.. అక్రమంగా తరలించేందుకు సిద్ధంచేసిన 40 దుంగలు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. వాటి బరువు 350 నుంచి 400 కిలోలు, వాటి విలువ రూ.1.5 లక్షలు ఉంటుందన్నారు. నిందితులను గుర్తించి పట్టుకునేందుకు దర్యాప్తు కొనసాగుతోందన్నారు. ఎస్వీయూ వీసీకి అరుదైన గౌరవం తిరుపతి సిటీ: ప్రముఖ అంతర్జాతీయ సైంటిస్ట్, ఎస్వీయూ వీసీ టాటా నరసింగరావుకు అరుదైన గౌరవ లభించింది. భారత జాతీయ సైన్స్ అకాడమీ ఆఫ్ సైన్స్ సంస్థ ఫెలో ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్ హోదాకు ఎంపికచేశారు. భారతదేశంలో ప్రసిద్ధి చెంది, 1930లో స్థాపించబడిన నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో 2026, డిసెంబర్ 3 నుంచి 5వ తేదీ వరకు నిర్వహించనున్న 96వ సంవత్సరిక సదస్సులో దీనిని అందజేయనున్నట్లు అకాడమీ ప్రకటించింది. దేశంలో ఇలాంటి ఫెలోషిప్ హోదా పొందిన కొద్ది మంది సైంటిస్టుల జాబితాలో వర్సిటీ ఉపకులపతి ఆచార్య టాటా నరసింగరావు చేరడం పట్ల పలువురు వర్సిటీ అధికారులు, అధ్యాపకులు హర్షం వ్యక్తంచేశారు. -
సెల్‌ఫోన్ కోసం బావిలోకి దిగి ఇద్దరి మృతి
తిరుపతి క్రైం : సెల్‌ఫోన్ కోసం బావిలోకి దిగిన ఇద్దరు వలస కూలీలు విషవాయువులు పీల్చి మృతి చెందిన ఘటన తిరుపతిలో శుక్రవారం చోటుచేసుకుంది. అలిపిరి పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఎస్బీఐ ట్రైనింగ్ సెంటర్ వెనుక ఉన్న బావిలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో స్థానికంగా విషాదం అలముకుంది. మృతులను ఒడిశా రాష్ట్రానికి చెందిన వలస కూలీలు భీమ్రాజ్ (36), నరేష్ (21)గా గుర్తించారు. బావిలో సెల్‌ఫోన్ పడిపోవడంతో దానిని తీసేందుకు భీమ్రాజ్ దుప్పట్లను తాడులా కట్టి బావిలోకి దిగాడు. అయితే ఎంతసేపటికీ అతడు బయటకు రాకపోవడంతో నరేష్ కూడా అతడిని కాపాడేందుకు బావిలోకి దిగాడు. ఈ క్రమంలో విషవాయువులు పీల్చడంతో ఇద్దరూ బావిలోనే మృతి చెందినట్లు సమాచారం. అలిపిరి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. బావిలో విషవాయువులు ఉన్నట్లు గుర్తించడంతో ఫైర్ సిబ్బంది లోపలికి దిగేందుకు సాహసించ లేదు. అనంతరం పాతాళభేరి సహాయంతో మృతదేహాలను బావిలో నుంచి వెలికితీశారు. మృతి చెందిన యువకులు -
నిందితులకు ఐదేళ్ల జైలు
తిరుపతి లీగల్ : ఎరచ్రందనం దుంగల అక్రమ రవాణా కేసులో తమిళనాడు, తిరువణ్ణామలై జిల్లా, పోలూరు తాలూకా, కోయిలాంబూర్కు చెందిన ముత్తుస్వామినాథన్కు ఐదేళ్ల జైలు శిక్ష, ఆరు లక్షల రూపాయల జరిమానా విధిస్తూ తిరుపతి నాల్గవ అదనపు జిల్లా జడ్జి, రాష్ట్ర ఎరచ్రందనం కేసుల విచారణ సెషనన్ జడ్జి కోర్టు ఇన్చార్జ్ జడ్జి అర్చన శుక్రవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం.. ఎరచ్రందనం అక్రమ నిరోధక దళం 2018లో శేషాచలం, టీఎన్ పాలెం సెక్షన్, మేకలబండ అటవీ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించింది. ఆ సమయంలో స్వామినాథన్ ఎరచ్రందనం దుంగలు తరలిస్తూ సిబ్బందికి పట్టుబడ్డాడు. ఫారెస్ట్ సిబ్బంది అతన్ని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. నేరం అతనిపై రుజువు కావడంతో న్యాయమూర్తి అతనికి శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. అలాగే మరో కేసులో వైఎస్సార్ కడప జిల్లా, సానిపయ్య రేంజ్, పింఛ సెక్షన్, దిన్నెలబీట్, ఏడు ఆవుల ధర్తీ అటవీ ప్రాంతంలోకి అక్రమంగా ప్రవేశించి ఏడు ఎరచ్రందనం దుంగలను తరలిస్తున్న కేసులో తమిళనాడు, విల్లుపురం జిల్లా, చిన్న సేలం తాలూకా, ఇన్నాడు గ్రామానికి చెందిన కె.రాజీవ్‌గాంధీకి ఐదేళ్ల జైలు శిక్ష, ఆరు లక్షల రూపాయల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. -
తిరుపతిలో విషాదం.. సెల్ ఫోన్ కోసం బావిలోకి దిగి..
సాక్షి, తిరుపతి: తిరుపతిలో విషాదం చోటు చేసుకుంది. సెల్ ఫోన్ కోసం బావిలోకి దిగి ఇద్దరు యువకులు మృతి చెందారు. అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్బీఐ ట్రైనింగ్ సెంటర్ వెనుక ఉన్న బావిలో ఘటన జరిగింది. మృతులు ఒరిస్సా రాష్ట్రానికి చెందిన వలస కూలీలు భీమ్ రాజ్ (36), నరేష్(21)గా గుర్తించారు.సెల్ ఫోన్ పడిపోయిందని దుప్పట్లు కట్టుకొని బావిలోకి దిగిన భీమ్ రాజ్, అతడు రాకపోయేసరికి కాపాడే ప్రయత్నంలో నరేష్ బావిలోకి దిగి మృతి చెందారు. విష వాయువులు పీల్చడంతో అక్కడికక్కడే మృతి చెందారు. అగ్నిమాపక సిబ్బంది బావిలో నుంచి మృతదేహాలను వెలికితీశారు. మృతదేహాలను రుయా మార్చురీకి తరలించారు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. -
సన్నగా దండుకో
తిరుమలలో మాక్ డ్రిల్ తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో భక్తుల భద్రతను మరింత కట్టుదిట్టం చేసేందుకు మాక్ డ్రిల్ నిర్వహించారు. సన్న బియ్యం పంపిణీ గాలికి! సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుపతి జిల్లాలో పౌరసరఫరాల శాఖ తీరు అధ్వాన్నంగా మారింది. పేద ప్రజల ఆకలి తీర్చేందుకు సన్న రకం బియ్యం అందజేస్తామంటూ ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు ప్రచారానికే పరిమితమైంది. ఒక ప్రజాప్రతినిధి, జిల్లా ఉన్నతాధికారులు మామూళ్ల మత్తులో జోగుతూ పేదల ప్రయోజనాలను గాలికి వదిలేశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మిల్లర్లతో కుమ్మకై ్క నాసిరకం బియ్యాన్ని ప్రజలకు అంటగడుతూ కోట్లాది రూపాయల దందా నడిపిస్తున్నారని లబ్ధిదారులు, ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి. దందా షురూ గతంలో కాకినాడలో పనిచేసిన సమయంలో తీవ్ర అక్రమాలకు పాల్పడిన ఒక వివాదాస్పద అధికారిని ఏరికోరి ముఖ్యమంత్రి సొంత జిల్లా అయిన తిరుపతికి బదిలీ చేయడం వెనుక ఉన్న మర్మమేమిటని అధికార వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇప్పుడు ఇక్కడ కూడా మిల్లర్లతో చేతులు కలిపి వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. మరోవైపు నాణ్యతా ప్రమాణాలను పరిశీలించాల్సిన మరొక అధికారి గతంలో నెల్లూరులో అడ్డగోలు వ్యవహారాలు నడిపి, ఇప్పుడు తిరుపతిలో నాణ్యత లేని బియ్యానికి మంచి మార్కులు ఇస్తూ మిల్లర్ల నుంచి భారీగా ముడుపులు దండుకుంటున్నారని లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాసిరకం బియ్యం రైస్ మిల్లుల వద్ద ప్రత్యేక కౌంటర్లు తెరిచి సన్న బియ్యం పంపిణీ చేయాలన్న కూటమి ప్రభుత్వ ప్రకటనలు కేవలం ప్రచారానికే పరిమితమయ్యాయి. కౌంటర్లు తెరిచామని కాగితాల్లో లెక్కలు చూపుతున్న అధికారులు, వాస్తవానికి నాణ్యమైన బియ్యం అందకుండా గండికొడుతున్నారు. ప్రస్తుతం పంపిణీ చేస్తున్న బియ్యం తినడానికి పనికిరావడం లేదని, వండినా ఉడకక దుర్వాసన వస్తుండడంతో పశువుల దాణాకు తప్ప మనుషులకు ఉపయోగపడడం లేదని కార్డుదారులు వాపోతున్నారు. మంత్రి అండదండలతో అవినీతి అధికారుల లాలూచీ వల్ల పేదల కడుపు కొడుతున్నారని ప్రజలు ధ్వజమెత్తుతున్నారు. సీఎం సొంత జిల్లాలోనే ఇలాంటి అక్రమాలు జరగడం సిగ్గుచేటని, తక్షణమే విచారణ జరిపి బాధ్యులైన అధికారులను సస్పెండ్ చేసి, నాణ్యమైన సన్న బియ్యాన్ని పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. -
అంతా ఉత్తిదే
● టీడీఆర్ బాండ్లలో అవకతవకలు మా దృష్టికి రాలేదు సాక్షి టాస్క్‌ఫోర్స్: తిరుపతి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో గత ప్రభుత్వ హయాంలో మాస్టర్ ప్లాన్ రోడ్ల కోసం జారీచేసిన ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ (టీడీఆర్) బాండ్లలో అవకతవకలు జరిగాయని, ఇందులో ప్రజాప్రతినిధులు, అధికారుల ప్రమేయం ఉందంటూ వచ్చిన ఆరోపణలు అసెంబ్లీ సాక్షిగా అసత్యాలని తేలిపోయాయి. ఈ విషయంపై తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు సంబంధిత మంత్రిత్వ శాఖకు లిఖిత పూర్వక జవాబు కోసం నోటీసు అందించంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ అధికారులు ఎమ్మెల్యే నోటీసుకు జవాబు ఇస్తూ తమకు విజిలెన్స్ శాఖ నుంచి టీడీఆర్ బాండ్ల కుంభకోణానికి సంబంధించి ప్రజాప్రతినిధులు, అధికారులపైన ఎటువంటి రిపోర్టులు అందలేదని సమాధానం ఇచ్చారు. దీంతో టీడీఆర్ బాండ్ల కుంభకోణం అంటూ అసత్య ప్రచారం ఉత్తదే అని తేలిపోయింది. కొనసాగుతున్న బిల్ కలెక్టర్ల దీక్ష తిరుపతి రూరల్: డిజిటలైజేషన్ పేరుతో ఏపీఎస్పీడీసీఎల్ అధికారులు బిల్ కలెక్టర్లను ఉద్యోగం నుంచి తొలగించడంతో వారి కుటుంబాల్లో చీకట్లు అలుముకున్నాయి. ఉద్యోగం తిరిగి ఇవ్వాలని, లేదంటే ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తూ గత 25 రోజులుగా కుటుంబాలతో కలిసి దీక్ష కొనసాగిస్తున్నారు. గురువారం పుత్తూరు, నాగలాపురం, పిచ్చాట్టూరు ప్రాంతాలకు చెందిన బిల్కలెక్టర్లు, వారి కుటుంబీకులు పాల్గొన్నారు. -
క్లస్టర్ టీచర్ల పరిస్థితి అయోమయం
● ఒక్కోరోజు ఒక్కో పాఠశాలలో విధులు ● ఎవరైనా సెలవు పెడితే ఆ పాఠశాలలో విధి నిర్వహణ ● స్కూల్ అసిస్టెంట్ అయ్యుండి.. 1, 2 తరగతులకు బోధన తిరుపతి ఎడ్యుకేషన్ : ప్రభుత్వ పాఠశాలల్లో మిగులుగా ఉన్న క్లస్టర్ టీచర్ల పరిస్థితి అయోమయంగా మారింది. విద్యార్థులు, ఉపాధ్యాయ నిష్పత్తి ప్రకారం జిల్లా వ్యాప్తంగా 117 మందికిపైగా టీచర్లు మిగులుగా ఉన్నారు. వీరందరినీ క్లస్టర్ పాఠశాలలకు అనుసంధానించారు. క్లస్టర్ ప్రధానోపాధ్యాయుల పరిధిలో ఉంటూ పని చేయాలని నిబంధన పెట్టి మొబైల్ టీచర్ విధానంలా క్లస్టర్ టీచర్ విధానాన్ని తీసుకొచ్చారు. కష్టాలు ఎన్నో క్లస్టర్ టీచర్ విధానంతో క్షేత్ర స్థాయిలో క్లస్టర్ టీచర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారి క్లస్టర్ పరిధిలోని ఏదేని పాఠశాలలో టీచర్ సెలవు పెడితే ఆ పాఠశాలకు వెళ్లి విధులు నిర్వహించాలి. విద్యార్థుల సంఖ్య పెరిగితే ఆ పాఠశాలకు వెళ్లి బోధించాలి. విధులు లేకుంటే క్లస్టర్ పాఠశాలలోనే ఉండాల్సి వస్తోంది. కొన్నిమార్లు స్కూల్ అసిస్టెంట్లు అయ్యుండి 1, 2 తరగతులకు బోధించాల్సి రావడం బాధాకరమంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్లస్టర్ టీచర్ల విషయంలో ఏ క్లస్టర్ పాఠశాల నిర్ధిష్ట ప్రణాళిక పాటించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సర్దుబాటు చేయాలి ఆదర్శ ప్రాథమిక పాఠశాలల్లో 60 మందికిపైగా విద్యార్థులుంటే తరగతికి ఒక టీచర్‌ను కేటాయిస్తున్నారు. ఇదే విధానాన్ని బేసిక్ ప్రాథమిక పాఠశాలల కు వర్తింపజేసి, అవసరమైనచోట క్లస్టర్ టీచర్లను సర్దు బాటు చేయాలని పలువురు టీచర్లు సూచిస్తున్నారు.జిల్లా సమాచారం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 1,993 ప్రాథమికోన్నత పాఠశాలలు 12 ఉన్నత పాఠశాలలు 304 హైస్కూల్ ప్లస్‌లు 54 మొత్తం పాఠశాలల సంఖ్య 2,363 విద్యార్థుల సంఖ్య 1,47,050 క్లస్టర్ పాఠశాలల సంఖ్య 130 క్లస్టర్ టీచర్ల సంఖ్య 117అప్పటికప్పుడు పాఠశాలకు పయనం ఏ పాఠశాలకు వెళ్లాలన్న సమాచారం లేకపోవడంతో క్లస్టర్ టీచర్లకు ఇబ్బందులు తప్పడం లేదు. డెప్యుటేషన్ వేసినట్లుగా క్లస్టర్ పాఠశాలకు వెళ్లినప్పుడు పలాన పాఠశాలకు వెళ్లాలని చెబుతారని, అప్పటికప్పుడు హుటాహుటిన ఆ పాఠశాలకు వెళ్లాల్సి వస్తోందని పలువురు పేర్కొంటున్నారు. ఆ పాఠశాల వాతావరణం, విద్యార్థులతో మమేకమయ్యేందుకు క్లస్టర్ టీచర్లకు వీల్లేకుండా పోతోంది. దీంతో నాణ్యమైన బోధన ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నిస్తున్నారు. -
బాబు, కరువు కవలలు!
తిరుపతి మంగళం : రాష్ట్రంలో చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కరువు పలకరిస్తుందని, దాంతో రాష్ట్ర ప్రజలంతా అల్లాడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని చిత్తూరు, తిరుపతి జిల్లాల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి విమర్శించారు. తిరుపతి పద్మావతిపురంలోని పార్టీ జిల్లా కార్యాయం వద్ద గురువారం వైఎస్సార్సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్‌రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం, మాజీ మేయర్ శిరీష, పార్టీ నగర అధ్యక్షుడు మల్లం రవిచంద్రారెడ్డి, పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు నీలం బాలాజీతో పాటు పార్టీ శ్రేణులు అధిక సంఽఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూమన మాట్లాడుతూ అధికార దాహంతో ప్రజలకు చంద్రబాబు చేస్తున్న ద్రోహం, వంచనపై భగవంతునికి, ప్రకృతికి సైతం కోపం వచ్చిందని, దాంతో సకాలంలో వర్షాలు కురవక ప్రజలు తాగునీరు కూడా లేక అల్లాడిపోతున్నారన్నారు. చంద్రబాబు ఎప్పుడూ అధికార కోసం తప్ప ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచించరన్నారు. అందుకే రాష్ట్రంలో 120 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా కరువుతో, ఏడాది పొడువునా ఉక్కపోతతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 1,400 మండలాల్లో 1,250 మండలాలను కరువు మండలాలుగా, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో 67 మండలాలు ఉంటే 66 మండలాలను కరువు మండలాలుగా ప్రకటిస్తున్నారంటే చంద్రబాబుపై ప్రకృతి కూడా ఏ విధంగా ఆగ్రహం వ్యక్తం చేస్తోందో అర్థమవుతోందన్నారు. 14 ఏళ్ల చంద్రబాబు పాలనలో రాష్ట్రమంతా కరువే అపరభగీరథుడు వైఎస్సార్ రాష్ట్రంలో ప్రజలకు తాగునీరు, సాగునీరు అందించడానికి అనేక ప్రాజెక్టులు తీసుకొచ్చిన భగీరథుడు వైఎస్.రాజశేఖరరెడ్డి అని భూమన గుర్తుచేశారు. అప్పట్లో కండలేరు రిజర్వాయర్ దగ్గర పైప్ లైన్ ద్వారా నీరు తరలించాలని పోరాటం చేశామని, గాలేరు– నగరి కోసం 600 కి.మీ పాదయాత్ర చేశామని గుర్తుచేశారు. 2వ పైప్‌లైన్ ద్వారా తెలుగు గంగ నీటిని తిరుపతి ప్రజలకు అందించడానికి టీటీడీ ద్వారా రూ.50 కోట్లు తాము తీసుకొస్తే వాటిని రాజకీయ కక్షతో ఆపేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. ఇప్పటికే తిరుమలలో ఉన్న రెండు డ్యామ్‌లు మూడు నెలలకే సరిపోతాయని అధికారులు ప్రకటించిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. 25 ఏళ్ల క్రితం తిరుమలకు తాగునీటి సమస్య రావడంతో ట్యాంకర్లతో నీటిని తరలించిన పరిస్థితి చంద్రబాబు పాలనలోనే అన్న విషయాన్ని గుర్తుచేశారు. తాగునీటి సమస్యపై ప్రజల పక్షాన వైఎస్సార్సీపీ పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతుందని హెచ్చరించారు. తిరుపతిలో ఆందోళనలు చేపడుతున్నామన్న కక్షతో తమ కుటుంబ ఆస్తులపై దౌర్జన్యం చేస్తూ, తమ పార్టీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తూ జైళ్లకు పంపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొని వైఎస్సార్సీపీ విజయకేతనం ఎగురవేద్దామని పిలుపునిచ్చారు. అనంతరం పార్టీ కార్యకర్తలకు ఐడీ కార్డులు పంపిణీ చేశారు. -
నైలెట్ తరలింపుపై నేడు జెన్‌జెడ్ ర్యాలీ
తిరుపతి సిటీ: ‘‘ఇది రాజకీయ కార్యక్రమం కాదు.. పార్టీల జెండాలు అసలే ఉండవు.. యువత భవిష్యత్తుకు భరోసానిచ్చే నైలెట్ శాశ్వత క్యాంపస్‌ను కుట్రతో తిరుపతి నుంచి తరలించే ప్రయత్నాన్ని అడ్డుకుందాం.. తిరుపతి ఆత్మ గౌరవాన్ని నిలబెడదాం.. ఎస్వీయూకు తలమానికంగా నిలిచిన కేంద్ర ప్రభుత్వ సంస్థను తిరుపతి నుంచి తరలించవద్దని ప్రభుత్వాన్ని నిలదీయడం.. తరలింపు కుట్రను అడ్డుకోవడం.. ఇదే జన్‌జెడ్ భారీ ర్యాలీ ప్రధాన ఉద్దేశం’’ అని విద్యార్థి, యుజవన సంఘాల నేతలు పిలుపునిచ్చారు. శుక్రవారం ఉదయం 10గంటలకు ఎస్వీయూ రెండో గేటు నుంచి వర్సిటీ ప్రధాన ద్వారం వద్ద వరకు భారీ ఎత్తున విద్యార్థులు, నిరుద్యోగ యువతతో జెన్‌జెడ్ ర్యాలీ నిర్వహించనున్నారు. అనంతరం ఎస్వీయూ ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టనున్నారు. ఈ ర్యాలీలో పార్టీల కతీతంగా యువత, విద్యార్థులు, పలు పార్టీలకు చెందిన నేతలు, మేధావులు, స్థానికులు హాజరై ప్రభుత్వ కుట్రపై గళమెత్తనున్నారు. -
అడ్మిషన్లు అంతంతమాత్రమే
తిరుపతి సిటీ: జిల్లాలో ప్రభుత్వ, టీటీడీ, ప్రైవేటు కళాశాలల్లో డిగ్రీ ప్రవేశాల కోసం ఓఏఎమ్‌డీసీ విడుదల చేసిన తొలి విడిత మెరిట్ లిస్ట్ ప్రవేశాలు గురువారం ముగిశాయి. ప్రభుత్వ కళాశాలల్లో తొలి విడత ప్రవేశాలలో కనీసం 40 శాతం సీట్లు భర్తీ కాకపోవడం గమనార్హం. అలాగే టీటీడీ ఆధ్వర్యంలో నడస్తున్న ఎస్పీడబ్ల్యూ, ఎస్వీ ఆర్ట్స్, ఎస్జీఎస్ కళాశాల్లో మాత్రమే చెప్పుకోదగ్గ స్థాయిలో ప్రవేశాలు జరిగినట్లు తెలుస్తోంది. అలాగే జిల్లాలోని ప్రైవేటు డిగ్రీ కళాశాల సైతం తొలి విడతలో అంతంతమాత్రంగానే ప్రవేశాలు జరిగాయని గత ఏడాది కంటే పరిస్థితి దారుణంగా ఉందని యాజమాన్యాలు వాపోతున్నాయి. రెండవ విడత ప్రవేశాల ప్రక్రియ వచ్చేవారం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.టీటీడీ విద్యాసంస్థల్లో తొలి విడతలో జరిగిన ప్రవేశాల వివరాలు డిగ్రీ కళాశాల మొత్తం సీట్లు తొలివిడతలో కేటాయించినవి భర్తీ అయిన సీట్లు మిగిలినవి ఎస్జీఎస్ 1068 703 444 624 ఎస్వీ ఆర్ట్స్ 1417 1206 848 569 ఎస్పీడబ్ల్యూ 1550 1354 1115 435 -
పింఛన్.. కష్టాలు పెంచెన్
తిరుపతి అర్బన్: చంద్రబాబు ప్రభుత్వం అధికారం చేపట్టిన 27 నెలలు తర్వాత కొత్త పింఛన్ల దరఖాస్తుకు అవకాశం కల్పించింది. అయితే అర్హుత ఉన్న పింఛన్‌దారులు దరఖాస్తు చేసుకోవడానికి నానా తిప్పులు పడుతున్నారు. ఈనెల 16వ తేదీ వరకు మాత్రమే దరఖాస్తుకు గడువు ఉండడం.. మధ్యలో శని, ఆది, సోమవారాలు సెలవు రోజులు కావడంతో అర్హులైన వారు ఆందోళనలో మునిగిపోయారు. ఇబ్బందులెన్నో? ఒక్కో సచివాలయంలో పింఛన్ల దరఖాస్తు వ్యవహారాలను చూడడానికి ఒక్కో డిజిటల్ అసిస్టెంట్ (డీఏ)ను మాత్రమే అందుబాటులో ఉంచారు. పలు సచివాలయాల్లో డీఏలకు చెందిన కంప్యూటర్లు పనిచేయడంలేదు. దీంతో వారు మరొకరి కంప్యూటర్ను వినియోగించాల్సి వస్తోంది. అంతేకాకుండా పలు కంప్యూటర్లకు ఇచ్చిన నెట్ కనెక్షన్లు సక్రమంగా పనిచేయడం లేదు. దీంతో డీఏ తమ మొబైల్ ద్వారా నెట్‌కు కనెక్షన్ ఇచ్చుకోవాల్సి వస్తోంది. ఈ క్రమంలో సర్వర్ సమస్యలు తలెత్తున్నాయి. ఒక్కో దరఖాస్తుకు సాధారణంగా 15 నిమిషాల సమయం పడుతుంది. అయితే నెట్, సర్వర్ ఇబ్బందులతో 20 నిమిషాల వరకు తీసుకుంటోంది. గంటకు నాలుగు దరఖాస్తులు చేసినా ఆరు గంటలకు 24 లేదా 25 దరఖాస్తులు మాత్రమే చేయడానికి వీలుగా ఉంటుంది. ఒక్కో గ్రామ, వార్డు సచివాలయ పరిధిలో 200 నుంచి 240 మందికిపైగా అర్హులు ఉన్నారు. డప్పు కళాకారుల దరఖాస్తుల నిరాకరణ ప్రతి గ్రామ, వార్డు పరిధిలో డప్పు కళాకారులు ఉన్నారు. సచివాలయంలో వారి దరఖాస్తులను స్వీకరించడం లేదు. సచివాలయ ఉద్యోగులను వారు గట్టిగా ప్రశ్నిస్తే కలెక్టరేట్‌కు వెళ్లి ఐడీ కార్డులతోపాటు ఆర్డర్ కాపీలు తీసుకురావాలని సూచిస్తున్నారు. దీంతో గురువారం పలువురు డప్పు కళాకారులు కలెక్టరేట్‌కు వచ్చి తమ అర్జీలను ఇవ్వాల్సి వచ్చింది. కొత్త పింఛన్ల దరఖాస్తులకు సవాలక్ష సమస్యలు న్యాయం చేయండి పింఛన్ దరఖాస్తు కోసం సచివాలయానికి వెళ్లాం. అయితే వారు సోషల్వెల్ఫేర్ అధికారి నుంచి అనుమతి తీసుకురావాలని సూచిస్తున్నారు. లేదంటే కలెక్టరేట్‌కు వెళ్లి ఆర్డర్ తీసుకురావాలని ఆదేశిస్తున్నారు. విధిలేని పరిస్థితుల్లో కలెక్టరేట్‌కు వచ్చి అర్జీ ఇచ్చాం. వీళ్లు ఆర్డర్ ఎప్పుడు ఇస్తారా తెలియడం లేదు. టెన్షన్‌గా ఉంది. – మస్తానయ్య, శ్రీకాళహస్తి మండలం దరఖాస్తు తీసుకోవడం లేదు ఒంటరి మహిళకు 40 ఏళ్ల వయస్సు ఉంటే పింఛన్ కోసం దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉంది. అయితే సచివాలయ ఉద్యోగులు 50 ఏళ్లు ఉంటేనే ఒంటరి మహిళ పింఛన్‌కు దరఖాస్తు చేసుకోవాలంటూ నిబంధన పెట్టారు. సచివాలయ ఉద్యోగులు దరఖాస్తును స్వీకరించ లేదు. దీంతో కలెక్టరేట్‌కు వచ్చాం. –వాణి, ఒంటరి మహిళ, శ్రీకాళహస్తి మండలం -
సూపర్వైజర్ ఆత్మహత్య
నాయుడుపేట టౌన్: మేనకూరు సెజ్ పరిధిలోని ఓ ప్రైవేట్ పరిశ్రమలో సూపర్వైజర్గా పనిచేస్తున్న లోకేశ్వరన్బాబు(35) ఇంట్లో ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసుల కథనం.. తమిళనాడు రాష్త్రం, రాణిపేట జిల్లా, తెరుంబలిపాకం గ్రామానికి చెందిన లోకేశ్వరన్ మేనకూరు సెజ్ పరిధిలోని ఓ ప్రైవేట్ పరిశ్రమలో సూపర్వైజర్గా పనిచేస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. నాయుడుపేట పట్టణంలోని రాజగోపాలపురం 4వ వీధిలోని ఓ ఇంట్లో అద్దెకుంటున్నారు. రెండు రోజుల నుంచి లోకేశ్వరన్ బాబు ఫోన్ తీయక పోవడంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి గురువారం నాయుడుపేటకు వచ్చి ఇంటికి వెళ్లి పరిశీలించారు. ఇంట్లో నైలాన్ తాడుతో ఆత్మహత్య చేసుకుని ఉండడాన్ని గుర్తించారు. ఆత్మహత్యకు సంబంధించి కారణాలు తెలియరాలేదు. కేసు దర్యాప్తులో ఉంది. -
పుష్ప ప్రదర్శన ఏర్పాట్లు ముమ్మరం
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని తిరుమలలోని పురోహిత సంఘం వద్ద ప్రత్యేక పుష్ప ప్రదర్శనకు ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. వివిధ రకాల పుష్పాలతో ప్రత్యేక ఆకృతులను తీర్చిదిద్దేందుకు సన్నాహాలు చేస్తున్నారు. భక్తులకు ఆహ్లాదకరమైన అనుభూతిని కలిగించేలా పుష్ప ప్రదర్శనను అందంగా ముస్తాబు చేస్తున్నారు. ఇప్పటికే ప్రదర్శన ఏర్పాట్లకు సంబంధించిన పనులు ప్రారంభం కాగా, సిబ్బంది వాటిని వేగవంతం చేశారు. పుష్పాల ఎంపిక, అలంకరణ, వివిధ ఆకృతుల రూపకల్పన పనులు కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యే నాటికి పుష్ప ప్రదర్శనను పూర్తి స్థాయిలో సిద్ధం చేసేందుకు నిర్వాహకులు చర్యలు చేపడుతున్నారు. – తిరుమల -
వేడి సాంబార్ పడి ఒకరికి గాయాలు
తిరుమల: వైకుంఠం క్యూ కాంప్లెక్స్–2లో ప్రమాదవశాత్తు వేడి సాంబార్ ఒలికిపడి పడింది. అక్కడ విధులు నిర్వహిస్తున్న ఎన్.హరీశ్‌కుమార్ గాయపడ్డారు. అన్నప్రసాదం పంపిణీ సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. వెంటనే స్పందించిన టీటీడీ సిబ్బంది, భక్తులు హరీశ్‌కుమార్‌ను చికిత్స నిమిత్తం తిరుమల అశ్విని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో ఆయనకు స్వల్ప గాయాలైనట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ‘రెవెన్యూ’కు సంజాయిషీ నోటీసులు సైదాపురం: మండలంలో రీసర్వే నత్తనడకన సాగుతుండడంతో సంబధిత రెవెన్యూ అధికారులకు నెల్లూరు ఆర్డీఓ అనూష గురువారం సంజాయిషీ నోటీసులను జారీచేశారు. రీ సర్వే ప్రక్రియలో 10(1) నోటీసులో ఉన్న వివరాలనే డీఎల్ఆర్ ఎంట్రీలకు కాపీ చేస్తున్నారని, క్షేత్ర స్థాయిలో సర్వే నిర్వహించకుండానే కార్యాలయంలోనే నిర్వహిస్తున్నారంటూ పలువురు ఫిర్యాదు చేయడంతో ఈ నోటీసులు జారీ చేశారు. సైదాపురం తహసీల్దార్ కార్యాలయ అధికారులకు నోటీసులు అందాయి. క్షేత్ర స్థాయిలో అధికారులు రీసర్వే పనుల్లో తీవ్ర జాప్యం చేయడంతో నాలుగో విడత రీసర్వే గ్రామాలైన పాతాళపల్లి, మిట్టపల్లి, నల్లబొట్లపల్లి, ఓరుపల్లి, కేజీఆర్పాళెం డీఎల్ఆర్లోనే ఉండిపోయాయి. అలాగే మొలకలపూడి, పొక్కందల, ఈదలకండ్రిగ, తోచాం, కృష్ణారెడ్డిపల్లి గ్రామాల్లో జరిగిన సర్వే వీఆర్వో, వీఎస్ లాగిన్‌లోనే ఉండడంతో ఈ నోటీసులను జారీ చేసినట్టు తెలిసింది. జాతీయ స్థాయి కరాటే పోటీల్లో బంగారు పతకం తిరుపతి సిటీ: హైదరాబాద్ వేదికగా ఈనెల 5వ తేదీ నుంచి రెండు రోజుల పాటు జరిగిన ఆల్ ఇండియా కరాటే చాంపియన్‌షిప్‌లో తిరుపతి విశ్వసాయి జూనియర్ కళాశాల విద్యార్థి టీ.జశ్వంత్‌రెడ్డి గోల్డ్‌మెడల్ సాధించారు. ఈ సందర్భంగా విశ్వసాయి విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ ఎన్.సత్యనారాయణ, వైస్ చైర్మన్ కృష్ణమోహన్, డైరెక్టర్ శివసంకేత్ మాట్లాడుతూ తిరుపతి బ్రాంచ్‌కు చెందిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఎంపీసీ విద్యార్థి జశ్వంత్‌రెడ్డి జాతీయ స్థాయి కరాటే పోటీలలో రెండు ఈవెంట్లలోనూ గోల్డ్‌మెడల్స్ సాధించండం కళాశాలకు గర్వకారణమన్నారు. తమ కళాశాలలో అకడమిక్ విద్యతో పాటు క్రీడల్లోనూ విద్యార్థులను ప్రొత్సహిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా గోల్డ్‌మెడల్ సాధించిన విద్యార్థిని ప్రిన్సిపల్, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది ఘనంగా సత్కరించి అభినందించారు. ముక్కంటి సేవలో శ్రియా చరణ్ శ్రీకాళహస్తి రూరల్: జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరస్వామిని గురువారం ప్రముఖ సినీనటి శ్రియా చరణ్ దర్శించుకున్నారు. దక్షిణగోపురం వద్ద ఆలయ అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం మృత్యుంజయ స్వామి సన్నిధి వద్ద వేదపండితులు ఆమెను ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాలక మండలి సభ్యురాలు కోలా వైశాలి, ఆలయ అధికారులు పాల్గొన్నారు. -
కామిరెడ్డి సత్యనారాయణరెడ్డిపై మరో అక్రమ కేసు, అరెస్టు
పెళ్లకూరు: టీడీపీ నాయకులు చేసిన రౌడీయిజానికి వత్తాసు పలికిన పోలీసులు పెళ్లకూరు మండలంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణరెడ్డిపై మరోమారు నాన్‌బెయిల్ కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఆయనను కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి రిమాండ్ విధించడంతో గురువారం నెల్లూరు సబ్ జైలుకు తరలించారు. గ్రామంలోని సర్వే నంబరు 17లో ఉన్న సత్యనారాయణరెడ్డి భూములకు సంబంధించిన పంటకాలువ వద్ద బుధవారం సిమెంట్ పైపులు ఏర్పాటు చేసుకొని రోడ్డు నిర్మాణ పనులు చేయించుకుంటున్నారు. అదే సమయంలో గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు రాకేష్‌రెడ్డి, కృష్ణారెడ్డి, చైతన్యకృష్ణారెడ్డి తమ అనుచరులతో కలిసి సంబంధిత భూముల వద్దకు చేరుకుని అనవసర రాద్ధాంతం చేస్తూ రౌడీయిజానికి దిగారు. దాడులకు తెగబడ్డారు. అదే సమయంలో వడ్డిపాళెం గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త వలిపి బాలయ్య(55).. కామిరెడ్డి సత్యనారాయణరెడ్డిని దుర్భాషలాడుతూ సంఘటనా స్థలానికి వెళుతూ సుమారు 50 మీటర్లు దూరంలో ఒక్కసారిగా స్పృహతప్పి కుప్పకూలిపడిపోయాడు. పోలీసులు, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో పాటు ఘటనా స్థలంలోని వారంతా చూస్తుండగా కిందపడిపోయిన బాలయ్యను చికిత్సల నిమిత్తం వైద్యశాలకు తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు అక్కడి వైద్యులు నిర్ధారించారు. మరోమారు అక్రమ కేసులు ఈ నేపథ్యంలో టీడీపీ కార్యకర్త బాలయ్య మృతికి వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలకు ఎలాంటి సంబంధం లేకపోయినా పోలీసులు మాత్రం 103(1), ఆర్/డబ్ల్యూ 3(5) సెక్షన్ల కింద కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి, మద్దూరు భాస్కర్, మద్దూరు చందు, మద్దూరు శ్రీనివాసులు, మల్లి ధయాకర్, బండి శివకుమార్, బెల్లంకొండ రవిపై అక్రమ కేసులు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. సత్యనారాయణ రెడ్డిని 14రోజులు రిమాండ్ విధించి నెల్లూరు సబ్ జైలుకు తరలించారు. మిగిలిన వారిని పోలీసు కస్టడీలో ఉంచారు. అనారోగ్య సమస్యతో బాలయ్య మరణిస్తే ఈ నెపాన్ని టీడీపీ నేతల ప్రోద్బలంతో పోలీసులు వైఎస్సార్సీపీ నేతలపై నెడుతూ అక్రమ కేసులు నమోదు చేయడం దారుణమని వైఎస్సార్సీపీ శ్రేణులు మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే మార్చి 14న కలవకూరు గ్రామం వద్ద స్వర్ణముఖినదిలో కూటమి నాయకులు చేస్తున్న ఇసుక దోపిడిపై ప్రశ్నించినందుకు సత్యనారాయణరెడ్డితో పాటు రైతులతో కలిపి మొత్తం 26మందిపై అక్రమ కేసులు పెట్టి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. ఆటోలో జైలుకు వెళ్లేందుకు కామిరెడ్డి నిరాకరణ వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణరెడ్డిని రిమాండ్ నిమిత్తం నెల్లూరు సబ్ జైలుకు ఆటోలో తీసుకెళ్లేందుకు పోలీసులు సిద్ధపడడంతో సత్యనారాయణరెడ్డి అభ్యంతరం చెప్పారు. నాయుడుపేట నుంచి నెల్లూరుకు ఆటో ప్రయాణం ప్రమాదకరమని, ఆర్టీసీ బస్సులో అయినా తీసుకెళ్లాలని స్థానిక ఎస్ఐ ఆదిలక్ష్మిని కోరారు. దీంతో ఏసీ వాహనాలు, లగ్జరీ వాహనాల్లో తీసుకెళ్లలేమని ఎస్ఐ ఆదిలక్ష్మి రుసరుసలాడారు. కవరేజ్ చేస్తున్న మీడియా ప్రతినిధులపైనా ఫొటోలు ఎందుకు తీస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు పోలీసు జీపులో సత్యనారాయణరెడ్డిని నెల్లూరు సబ్ జైలుకు తరలించారు. -
గొల్లపల్లి సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజీలో క్యాంపస్ ఇంటర్వ్యూలు
తిరుపతి రూరల్: తిరుపతి రూరల్ మండలం సి.గొల్లపల్లిలోని సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజీలో గురువారం క్యాంపస్ ఇంటర్వూలు నిర్వహించారు. బెంగళూరుకు చెందిన ప్రముఖ ‘గ్లోబల్ క్వస్ట్ టెక్నాలజీస్’ సంస్థ వారు ఇంజినీరింగ్ నాలుగవ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ ఇంటర్వ్యూలు నిర్వహించారు. అన్ని రౌండ్లలో విశేష ప్రతిభ కనబరచిన 25 మంది విద్యార్థులు ఉద్యోగ అర్హత సాధించగా వారందరికీ నియామక పత్రాలను అందించారు. కళాశాలలో జరిగిన అభినందన సభలో ఉద్యోగ అర్హత సాధించిన విద్యార్థులను కళాశాల సెక్రటరీ వై.ఆనందరెడ్డి, ప్రిన్సిపల్ ప్రొఫెసర్ రాజశేఖర్, ప్లేస్‌మెంట్స్ డైరెక్టర్ స్వామినాథ్, టీపీఓ భాస్కర్ తదితరులు అభినందించారు. -
ఎస్వీ మ్యూజియం పరిశీలన
తిరుమల: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతుల మీదుగా తిరుమలలోని ఎస్వీ మ్యూజియం ప్రారంభోత్సవం జరగనున్న నేపథ్యంలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి, ఎస్పీ సుబ్బరాయుడు, సీవీఎస్వో మురళీకృష్ణతో కలిసి గురువారం ఉదయం మ్యూజియంలోని ఏర్పాట్లను పరిశీలించారు. మ్యూజియంలో ఏర్పాటు చేసిన గ్యాలరీలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో టీటీడీ ఇన్చార్జ్ సీఈ మనోహరం, డిప్యూటీ ఈవో సోమన్నారాయణ, వీజీఓ సురేంద్ర పాల్గొన్నారు. నూతన విమాన సర్వీస్ ప్రారంభం రేణిగుంట: హైదరాబాద్ నుంచి విజయవాడను కలుపుతూ తిరుపతి విమానాశ్రయం నుంచి గురువారం నూతన విమాన సర్వీసును ప్రారంభించారు. ఫ్లై–91 తొలి విమాన సర్వీసును తిరుపతి విమానాశ్రయంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు వర్చువల్‌గా ప్రారంభించారు. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వారి అగ్నిమాపక విభాగం సంప్రదాయబద్ధంగా వాటర్ కెనాన్ సెల్యూట్‌తో తొలి విమానానికి స్వాగతం పలికారు. విమానాశ్రయ డైరెక్టర్ భూమినాథన్, ఇతర ప్రముఖులు ప్రయాణికులకు మొదటి బోర్డింగ్ పాస్‌ను అందజేశారు. అనంతరం కేక్ కట్ చేసి కొత్త సర్వీసును ప్రారంభించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ ఫ్లై–91 ద్వారా విజయవాడ, రాజమండ్రి, హైదరాబాద్‌కు ఈ అదనపు ప్రత్యక్ష కనెక్టివిటీ భక్తులకు వేగవంతమైన, మరింత సౌకర్యవంతమైన ప్రయాణ మార్గాలను అందిస్తుందని తెలిపారు. -
గురుకులంలో గురువుపై దాడికి యత్నం
రేణిగుంట: గిరిజన గురుకుల ఉపాధ్యాయుడిపై అధికార పార్టీకి చెందిన ఎస్సీ సంఘం నాయకుడు దాడికి యత్నించడం రేణిగుంట మండలంలో చర్చనీయాంశమైంది. విశ్వసనీయ సమాచారం మేరకు.. రేణిగుంట విమానాశ్రయం సమీపంలోని ఏపీ గిరిజన గురుకుల రెసిడెన్షియల్ పాఠశాలలోని ఉపాధ్యాయులకు నాలుగు నెలలకు ముందు క్వార్టర్స్‌ను కేటాయించారు. ఆ తర్వాత ఇక్కడ తాత్కాలికంగా ఇద్దరు టీచర్లను నియమించారు. వారికి క్వార్టర్స్‌ను ఇవ్వకుండా నిరాకరించారు. అందులో ఒక టీచర్ భర్త తిరుపతిలోని అధికార పార్టీ నాయకుడికి అనుచరుడుగా ఉన్నారు. దీంతో అతను సీనియర్ ఉపాధ్యాయులను క్వార్టర్స్ ఖాళీ చేయాలని బెదిరింపులకు దిగాడు. ఈనెల ఆరో తేదీన సదరు నాయకుడు పాఠశాలకు చేరుకుని ప్రిన్సిపల్ ముందే ఒక ఉపాధ్యాయుడిపై దాడికి యత్నించాడు. ‘నువ్వు ఇక్కడ ఎలా ఉద్యోగం చేస్తావో నేను చూస్తా’ అంటూ బెదిరింపులకు దిగాడు. విషయాన్ని బాధిత ఉపాధ్యాయులు జిల్లా అధికారులకు నివేదించినట్లు తెలిసింది. ఈ విషయం బయటికి రావడంతో జిల్లా అధికారులు తొక్కిపెట్టారు. సదరు అధికార పార్టీ నాయకుడిని కాపాడే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇదంతా ప్రిన్సిపల్ గదిలో ఉన్న సీసీ కెమెరాల్లో నమోదైన ఫుటేజ్‌ని పరిశీలిస్తే అసలు విషయం తెలుస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంపై ప్రిన్సిపల్ రవికాంత్‌ను వివరణ కోరగా బదులు ఇవ్వకుండా మాట మార్చి జారుకున్నారు. -
గల్లా రామచంద్ర నాయుడుకు నాయుడమ్మ స్మారక పురస్కారం
రేణిగుంట : అమర రాజా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వ్యవస్థాపక చైర్మన్ డా.గల్లా రామచంద్ర నాయుడుకు ప్రతిష్టాత్మక పద్మశ్రీ డా. యలవర్తి నాయుడమ్మ స్మారక పురస్కారం–2026 మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా అందుకున్నట్లు కంపెనీ నిర్వాహకులు తెలిపారు. తెనాలిలోని రామకృష్ణ కవి కళాక్షేత్రంలో డా.యలవర్తి నాయుడమ్మ సైనన్స్ అండ్ టెక్నాలజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫౌండేషన్ చైర్మన్ యడ్లపాటి రఘునాథ బాబు అధ్యక్షత గురువారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ప్రఖ్యాత శాస్త్రవేత్త, పద్మశ్రీ డా.యలవర్తి నాయుడమ్మ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం వివిధ రంగాల్లో విశేష సేవలందించిన ప్రముఖ వ్యక్తికి ఈ స్మారక పురస్కారాన్ని ప్రదానం చేస్తున్నారు. అందులో భాగంగా వివిధ సేవారంగాల్లో రాణిస్తున్న డా.గల్లా రామచంద్రనాయుడును ఈ పురస్కారానికి ఎంపిక చేశారు. -
క్రయోజనిక్ ఇంజిన్ ఫ్లైట్ ‘హాట్ టెస్ట్’ విజయవంతం
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) బాహుబలి రాకెట్‌గా పేరు ప్రఖ్యాతులు పొందిన ఎల్వీఎం3 ఏడవ కార్యాచరణ మిషన్ కోసం క్రయోజనిక్ ఇంజిన్ ఫ్లైట్ హాట్ టెస్ట్‌ను గురువారం విజయవంతంగా నిర్వహించింది. ఈ ప్రయోగాత్మక పరీక్షను మహేంద్రగిరిలోని ఇస్రో ప్రపొల్షన్ కాంప్లెక్స్ (ఐపీఆర్సీ)లోని మెయిన్ ఇంజిన్ అండ్ స్టేజ్ టెస్ట్ ఫెసిలిటీ (ఎంఈటీ)లో నిర్వహించారు. ప్రయోగించబోయే ప్రతి ఎల్వీఎం3 రాకెట్‌కు సంబం«ధించి క్రయోజనిక్ ఇంజిన్లు ఆమోదం పొందడంలో భాగంగా హాట్టెస్ట్ ప్రక్రియను చేయడం పరిపాటి. అధిక ఎత్తులో పనిచేయడానికి రూపొందించిన నాజిల్‌తో ఈ అప్పర్ స్టేజ్ ఇంజిన్ హాట్ టెస్ట్‌ను నిర్వహించేందుకు ఒక నాజిల్ ప్రొటెక్షన్ సిస్టంను అభివృద్ధి చేసి పలు క్వాలిఫికేషన్ల ద్వారా ధ్రువీకరించుకుంటారు. హై ఆల్టిట్యూడ్ టెస్ట్ ఫెసిలిటిలో ప్రయోగానికి సమానమైన వాక్యూమ్ పరిస్థితులను అనుకరించడం ద్వారా క్రయోజనిక్ ఇంజిన్ల పరీక్షకు పట్టే సమయాన్ని, శ్రమను తగ్గిస్తుంది. ఎల్వీఎం3 రాకెట్ ద్వారా పేలోడ్స్ సామర్థ్యాన్ని పెంచడానికి భవిష్యత్తులో ప్రయోగించబోయే ఎల్వీఎం3 రాకెట్లలో క్రయోజనిక్–20 (సీఈ–20) క్రయోజనిక్–32 (సీఈ–32) దశలను 22 టన్నుల థ్రస్ట్ స్థాయిలో పనిచేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. సీఈ–20 ఇంజిన్ పనితీరు పరీక్షలోని అన్ని లక్ష్యాలను చేరుకుందని, ఇంజిన్ వ్యవస్థ పనితీరు సంతృప్తికరంగా ఉందని ఇస్రో శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఈ పరీక్షలో గగన్‌యాన్ కోసం సీఈ–32 దశలకు ఉద్దేశించిన ఎల్‌ఓఎక్స్ ట్యాంక్ ప్రెషరైజేషన్ మాడ్యూల్ కూడా విజయవంతంగా ప్రదర్శించినట్లు తెలిపారు. ఆదోని పరిసర ప్రాంతాల్లో భూప్రకంపనలు ఆదోని: కర్నూలు జిల్లా ఆదోనితో పాటు చుట్టుపక్క ప్రాంతాల్లో గురువారం రాత్రి భూమి కంపించడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. రాత్రి 7.45 గంటల కొన్ని సెకన్ల పాటు భూమి అదురుతున్నట్లు అనిపించడంతో ఇళ్లలో ఉన్నవారు బయటకు పరుగులుదీశారు. అలాగే, ఆలూరు మండలంలోని గ్రామాల్లోనూ భూమి కంపించినట్టు స్థానికులు చెప్పారు. తహసీల్దార్ వేణుగోపాల్, డీఎస్పీ వెంకటరమణ తదితరులు కూడా భూమి కంపించినట్టు ధ్రువీకరించారు. -
టీటీడీ భూమిలో చెల్లెలికి చంద్రబాబు కానుక
తిరుపతి మంగళం: టీటీడీకి సంబంధించిన విలువైన స్థలానికి ముఖ్యమంత్రి సమీప బంధువు(చెల్లెలి) పేరుతో నివేశన పట్టా మంజూరు చేశారనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. సుమారు రూ.60 లక్షల విలువైన రెండున్నర సెంట్ల స్థలానికి పట్టా మంజూరు చేయడంపై స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. చంద్రగిరి మండలం అనంతగురప్పగారిపల్లికి చెందిన ఎం.చెంచయ్యనాయుడు భార్య ఎం.బేబీ పేరుతో తిరుమలనగర్ పంచాయతీ పద్మావతి నగర్‌లోని సర్వే నంబర్ 1/1లో రెండున్నర సెంట్ల స్థలానికి ఈ నెల 9న నివేశన పట్టా మంజూరు కావడం వివాదానికి దారితీసింది. ప్రస్తుతం ఆ స్థలం విలువ సుమారు రూ.60 లక్షలు ఉంటుందని స్థానికులు పేర్కొంటున్నారు. సీఎం కార్యాలయం ఆదేశాలతోనే.. పట్టా మంజూరు విషయంలో సీఎం కార్యాలయం నుంచి ఆదేశాలు రావడంతోనే తిరుపతి అర్బన్ తహసీల్దారు పట్టా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని అర్బన్ తహసీల్దార్ కూడా స్పష్టంచేస్తున్నారు. సీఎం పేషీ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు కలెక్టర్ ఉత్తర్వులతో పట్టాలిచ్చామని చెబుతున్నారు. దీంతో ఈ వ్యవహారంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టీటీడీకి సంబంధించిన భూమిలో వ్యక్తిగతంగా నివేశన పట్టా ఎలా మంజూరు చేశారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. టీటీడీ స్థలంలో పట్టా ఇచ్చే అధికారం రెవెన్యూ అధికారులకు ఉందా? అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఒక వేళ ఇచ్చినా టీటీడీ తీర్మానం ఇచ్చినట్లు ఏమైనా పత్రాలు ఉన్నాయా? అంటూ అక్కడికి వచ్చిన రెవెన్యూ అధికారులను, టీడీపీ నాయకులనూ ప్రశ్నించారు. ఎం.బేబీ పేరిట తిరుపతి అర్బన్ తహసీల్దార్ మంజూరు చేసిన పట్టా పట్టా ఇచ్చిన స్థలంలోకి వెళ్లిన బేబీ పట్టా మంజూరైన స్థలంలో ప్లాటు శుభ్రం చేసేందుకు చంద్రబాబు సోదరి బేబీ వెళ్లగా స్థానికులు అడ్డుకున్నారు. సర్వే నంబర్ 1/1లోని స్థలం టీటీడీకి చెందినదని, అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టేందుకు అనుమతించబోమని స్థానికులు స్పష్టం చేశారు. ఆ స్థలం కమ్యూనిటీ భవనం, పిల్లల ఆట స్థలంగా ఉపయోగించుకోవడానికి టీటీడీకి విన్నవించుకున్నామని స్థానికులు వివరించారు. బేబీకి మద్దతుగా కొందరు టీడీపీ నేతలు అక్కడికి వచ్చినప్పటికీ స్థానికులు వెనక్కి తగ్గలేదు.సామాన్యులకే నిబంధనలా.. సీఎం బంధువులకు లేదా.. ? నిరుపేదలు ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తు చేసుకుంటే నిషేధిత జాబితా, నిబంధనలు, రికార్డుల పేరుతో పట్టాలు మంజూరు చేయడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి టీటీడీకి సంబంధించిన స్థలానికి సీఎం బంధువు పేరుతో పట్టా ఎలా మంజూరైందని ప్రశ్నిస్తున్నారు.‘సామాన్యులకు ఒక న్యాయం.. సీఎం బంధువులకు మరో న్యాయమా?’ అంటూ నిలదీస్తున్నారు. పట్టా మంజూరుకు ఏ నిబంధన వర్తించిందో ప్రభుత్వం, రెవెన్యూ అధికారులు స్పష్టం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సర్వే నంబర్ 1/1లోని భూమి వాస్తవ యాజమాన్యం, రెవెన్యూ రికార్డులు, టీటీడీ రికార్డులను పరిశీలించాలని స్థానికులు కోరుతున్నారు. బేబీ పేరుతో పట్టా మంజూరుకు ఎవరు సిఫార్సు చేశారు? ఏ నిబంధనల ప్రకారం పట్టా ఇచ్చారు? సీఎం కార్యాలయం నుంచి ఆదేశాలు వస్తే ఇచ్చేస్తారా ? ఈ పట్టా చెల్లుబాటవుతుందా? అంటూ ప్రశ్నిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చిన ఆ పట్టాను రద్దు చేసి భూమిని టీటీడీ ఆ«దీనంలోనే కొనసాగించాలని స్థానికులు కోరుతున్నారు. -
తిరుపతి జిల్లాలో ట్రావెల్స్ బస్సు దగ్ధం
ఓజిలి: తిరుపతి జిల్లాలో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి 19 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడారు. బుధవారం అర్ధరాత్రి దాటిన అనంతరం ఓజిలి వద్ద జాతీయ రహదారిపై ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గుంటూరుకు చెందిన కామాక్షి ట్రావెల్స్ బస్సు బుధవారం సాయంత్రం ఆరు గంటలకు రేపల్లె నుంచి బెంగళూరుకు ఇద్దరు డ్రైవర్లు, ఒక క్లీనర్, 19 మంది ప్రయాణికులతో బయలుదేరింది. మొదటి డ్రైవర్ జేడీ ప్రేమ్ రాత్రి 10 గంటలకు ఒంగోలు వద్దకు వచ్చేసరికి బస్సును రెండవ డ్రైవర్ తిరుపతయ్యకు అప్పగించారు. అర్ధరాత్రి 1:45 గంటల సమయంలో ఓజిలి పెద్దచెరువు సమీపంలోకి రాగానే బస్సు ఇంజిన్ నుంచి కాలిన వాసన, పొగ రావడాన్ని డ్రైవర్ తిరుపతయ్య గుర్తించారు. వెంటనే అప్రమత్తమై బస్సుకు ఉన్న అన్ని తలుపులు తెరిచి ప్రయాణికులను దించి దూరంగా పంపివేశారు. కొద్దిసేపటికి బస్సు డీజిల్ ట్యాంక్ ఒక్కసారిగా పేలిపోయింది. ఈ సమయంలో బస్సు రేకు ఒకటి ఎగిరి రోడ్డు డివైడర్‌పై ఉన్న చెట్లపై పడింది. డివైడర్‌పై ఉన్న చెట్లకు మంటలు వ్యాపించాయి. కేవలం 15 నిమిషాల్లోనే బస్సు పూర్తిగా కాలిపోయింది. అనంతరం వేరే బస్సుల ద్వారా ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు పంపారు. ఎస్ఐ శ్రీకాంత్ సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చర్యలు తీసుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. డ్రైవర్ తిరుపతయ్య అప్రమత్తం కావడంతోనే 19మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడగలిగారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
15 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు
తిరుమల: తిరుమలలో ఈ నెల 15 నుంచి 23వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబర్ 12 నుంచి 20 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు టీటీడీ చైర్మన్ బి.ఆర్.నాయుడు చెప్పారు. ఈ నెల 14న రాత్రి 7 గంటలకు అంకురార్పణ జరుగుతుందని, 15న సాయంత్రం 5.30 నుంచి రాత్రి 7 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణ నిర్వహిస్తామని తెలిపారు. తిరుమలలో బుధవారం ఆయన అధ్యక్షతన టీటీడీ పాలకమండలి సమావేశం జరిగింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 15న రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వామికి పట్టువ్రస్తాలు సమర్పించి, పెద్ద శేషవాహనసేవలో పాల్గొంటారని చెప్పారు. రిలయన్స్ సంస్థ టీటీడీకి విరాళంగా ఇచ్చిన 25 ఎలక్ట్రిక్ బస్సులను ఈ నెల 16న సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారని, 2027కు సంబంధించిన టీటీడీ క్యాలెండర్లు, డైరీలను ఆవిష్కరిస్తారని తెలిపారు. వైభవంగా నిర్వహించనున్న ఈ బ్రహ్మోత్సవాల్లో భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. భక్తులకు లైఫ్ ఇన్సూరెన్స్ తిరుమలలో ప్రమాదవశాత్తు మరణించే ఉద్యోగుల కుటుంబాలకు అందించే బీమాను రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచనున్నట్లు చెప్పారు. తిరుమలలో సహజ మరణం సంభవించే భక్తులకు కూడా లైఫ్ ఇన్సూరెన్స్ పథకం అమలు చేస్తామన్నారు. మరణించిన భక్తుడి కుటుంబానికి ఈ పథకం కింద రూ.2 లక్షలు చెల్లించనున్నట్లు తెలిపారు. నారాయణవనంలోని పద్మావతి సమేత శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో అమ్మవారి పద్మపీఠానికి, చెన్నైలోని శ్రీపద్మావతి అమ్మవారి ఆలయ ధ్వజస్తంభం, బలిపీఠానికి బంగారు తాపడం చేయనున్నట్లు ఆయన చెప్పారు. ఈ సమావేశంలో ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్యచౌదరి, జేఈవోలు డాక్టర్ ఎ.శరత్, ప్రభల గోపీనాథ్, సీవీఎస్వో మురళీకృష్ణ, బోర్డు సభ్యులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
టీడీపీ గుండాయిజం
పెళ్లకూరు: మండలంలోని చిల్లాకూరు గ్రామంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి బుధవారం తన వ్యవసాయ భూములకు చెందిన పంట కాలువ పనులు చేస్తుండగా స్థానిక టీడీపీ నాయకులు రాకేష్‌రెడ్డి, చైత్యకృష్ణారెడ్డి తదితరులతో కలిసి పనులను అడ్డుకుని రౌడీయిజం చేశారు. గ్రామంలో ఉన్న సత్యనారాయణరెడ్డి కుమార్తెకు చెందిన వ్యవసాయ భూములకు సాగు నీరు అందించే పంట కాలువ పనులను కూలీలతో చేయించుకుంటున్నారు. దాంతో స్థానిక టీడీపీ నాయకులు అల్లరిమూకలతో కలిసి పనులను అడ్డుకున్నారు. సత్యనారాయణరెడ్డి అనుచరులపై దాడికి దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివాదాన్ని సర్దుబాటు చేశారు. టీడీపీ దుష్ప్రచారం చిల్లకూరు వడ్డిపాళెం గ్రామానికి చెందిన వలిపి బాలయ్య(55) మృతిపై గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు చేస్తున్న దుష్ప్రచారం మంచిది కాదని స్థానికులు అంటున్నారు. బుధవారం వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి పంట కాలువ పనులను చేయించుకుంటుండగా గ్రామానికి చెందిన అధికార పార్టీ నాయకులు రాకేష్‌రెడ్డి, చైత్యకృష్ణారెడ్డి, కృష్ణారెడ్డి, లోకేష్‌నాయుడు పలువురు ఆ పార్టీ అల్లరిమూకలతో కలిసి అక్కడికి చేరుకుని రౌడీయిజం చేశారు. ఈక్రమంలో చిల్లకూరు వడ్డిపాళెం గ్రామానికి చెందిన బాలయ్య ఘర్షణ సమయంలో దూరంగా నిలబడి చూస్తుండగా అనారోగ్య సమస్యలతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీన్ని గుర్తించిన స్థానికులు, పోలీసులు అపస్మారక స్థితిలో ఉన్న బాలయ్యను హుటాహుటిన పెళ్లకూరు పీహెచ్‌సీకి చికిత్స నిమిత్తం తరలించారు. పరిశీలించిన వైద్యులు అతను మృతి చెందినట్లు నిర్ధారించారు. కాని టీడీపీ శ్రేణులు మాత్రం శవ రాజకీయాలు చేస్తూ ఆపార్టీకి చెందిన సోషల్ మీడియా గ్రూపుల్లో బాలయ్య మృతి పట్ల తీవ్ర దుష్ప్రచారం చేస్తున్నారు. వాస్తవం ఏమిటో పోలీసులకు, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు పూర్తిగా తెలిసినప్పటికీ లేనిపోని ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసమని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. -
తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం
– బ్రేక్ ఫెయిల్ కావడంతో డివైడర్‌పైకి ఎక్కిన కారు తిరుమల: తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో బుధవా రం ప్రమాదం చోటుచేసుకుంది. చైన్నెకి చెందిన ఓ కుటుంబం శ్రీవారి దర్శనం అనంతరం తిరుగు ప్రయా ణంలో వారు వస్తున్న కారుకు మొదటి మలుపు వద్ద బ్రేక్ ఫెయిల్ అయ్యింది. దీంతో కారు అదుపు తప్పి డివైడర్ పైకి ఎక్కింది. కారులో దంపతులతో పాటు వారి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ప్రమాద ఘటనతో ఘాట్ రోడ్డులో కొద్దిసేపు ఆందోళన నెలకొంది. అకౌంట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్‌కు నూతన కార్యవర్గం తిరుపతి రూరల్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ గణాంక అధికారుల సంఘం ఏపీఎస్పీడీసీఎల్ యూనిట్‌కు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ మేరకు సంఘం ప్రధాన కార్యదర్శి ఎన్.నరేంద్ర నాయుడు బుధవారం ప్రకటన విడుదల చేశారు. అసోసియేషన్ అధ్యక్షుడిగా టీ. రవికుమార్, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఎం. శివకుమార్, కోశాధికారిగా ఎం.ఎన్.పి. శైలజ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా జె. సుభాష్ చంద్రబోస్, ఎస్.సిన్హా, సంయుక్త కార్యదర్శులుగా సీహెచ్ అనిల్‌కుమార్, కేవీ సుబ్బారావు, సంస్థాగత కార్యదర్శులుగా వై.ఆర్. రవికుమార్‌రెడ్డి, ఆర్.పాపయ్య, మహిళా ప్రతినిధిగా ఎస్. ప్రశాంతి ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా టీ.వెంకట సుబ్బయ్య, సి.శ్రీనివాసులు, జె.రామకృష్ణ, ఎస్.వెంకటేశ్వర్లు, ఎన్.అశోక్ వర్ధన్ గుప్తా ఎన్నికయ్యారు. ఏపీఎస్పీడీసీఎల్ చీఫ్ జనరల్ మేనేజర్లు ఎం.మురళీకుమార్, ఎం.శ్రీకాంత్ సమక్షంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.మధుసూదన్, సంయుక్త కార్యదర్శి పి.బాలాజీ ఆధ్వర్యంలో నూతన కార్యవర్గం ఎన్నికలు నిర్వహించారు. -
చనిపోయిన వారి జాబితాతో మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తారా?
చేనేత కార్మికుల కడుపు కొడుతున్న కూటమి ప్రభుత్వం వెంకటగిరి(సైదాపురం): స్థానిక సంస్థ ఎన్నికల్లో పారదర్శకంగా నిర్వహించాలని పదే పదే వైఎస్సార్సీపీ కోరుతున్నా.. మృతి చెందినవారితోపాటు వలస వెళ్లిన ఓటర్ల జాబితాతో స్థానిక ఎన్నికల నిర్వహణ ఎలా చేస్తారంటూ వైఎస్సార్సీపీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పట్టణంలోని ఎన్‌జేఆర్ భవనంలో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ సర్ పక్రియలో భాగంగా ఓటర్ల జాబితా సవరణలు పూర్తవుతున్నాయని ఈ మేరకు కొత్త ఓటర్ల జాబితా వచ్చిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని వైఏస్సార్సీపీ కోరుతున్నట్లు తెలిపారు. ఇందుకు భిన్నంగా ప్రస్తుత ముఖ్యమంత్రి ఉన్నపళంగా ఎన్నికలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆరోపించారు. ఇప్పటికే వెంకటగిరి నియోజకవర్గంలో 36వేల ఓట్లు అనర్హుల ఓట్లను అధికారులు గుర్తించారన్నారు. అదేవిధంగా మున్సిపాల్టీలో 8వేల ఓట్లు అనర్హత ఓట్లుగా గుర్తించి నివేదికలను అందజేయడం జరిగిందన్నారు. గతంలో 44 వేల ఓటర్లు ఉన్న మున్సిపాలిటీలో అధికారుల గణాంకాల లెక్కల ప్రకారం ప్రస్తుతం 36వేల ఓటర్లు అధికారంగా ఉన్నట్లు నిగ్గు తేల్చారన్నారు. ఈ ఓటర్ల ఆధారంగా ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా తాము సంపూర్ణ మద్దతు ఇవ్వనున్నట్లు తెలిపారు. 25 వార్డులుగా ఉన్న వెంకటగిరి మున్సిపాలిటీ గెజిట్ ప్రకారం 36 వార్డులుగా విభజించేందుకు మే నెలలో అధికారులు అధికారిక ప్రకటన విడుదల చేశారన్నారు. ఈ సమయంలో వార్డుల విభజన పారదర్శకంగా నిర్వహించాలని వినతిపత్రం ద్వారా మున్సిపల్ అధికారులకు నివేదికలను సమర్పించామని అయినప్పటి తన నివేదికలను పక్కన పెట్టి వార్డుల విభజనలో ఇష్టారాజ్యాంగా వ్యవహరించారని ఆరోపించారు. ఒక వార్డుల్లో 1400 ఓట్లు, మరో వార్డులో 750 ఓట్ల జనాభాతో, వార్డులోని సంబంధంలేని వ్యక్తులకు కూడా వేరే వార్డుల్లో ఓటు హక్కు కల్పిచడం వంటి అవకతవకలకు పాల్పడడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇదంతా స్థానిక ప్రజా ప్రతినిధికి తెలియకుండా జరుగుతుందా అని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకు వెళ్లనున్నట్లు తెలియజేశారు. అధికార పార్టీ నేతల అండదండలతో ప్రజలకు న్యాయం చేయకుండా ప్రశ్నించినా ప్రజలపై తప్పుడు కేసులు బనాయిస్తున్న అధికారులు మూల్యం చెల్లించక తప్పదని నేదురుమల్లి హెచ్చరించారు. నేతన్న సేవలో నిధులను కూటమి నేతల కనుసన్నల్లో మృతి చెందిన వారికి సైతం నిధులు జమ చేశారని ఆరోపించారు. దీంతో కడుపుమంటతో రోడ్డెక్కిన చేనేత కార్మికులపై పోలీసులు కేసు నమోదు చేయడం సరికాదన్నారు. ప్రజలకు వైఎస్సార్సీపీ అండగా ఉండి పోరాటాలు సైతం కొనసాగిస్తామన్నారు. అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయించి అర్హులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలియజేశారు. నియోజకవర్గంలో ఇసుక అక్రమ రవాణా, బఫర్ జోన్లలో సైతం అక్రమ నిర్మాణాలు, భూకబ్జాలు వంటివి మితిమీరిపోతున్నాయని వాటిని నివారించాల్సిన సంబంధిత శాఖ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్నారు. ఏపీ డీఎస్సీ స్కామ్‌లో సంచలన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయన్నారు. స్పోర్ట్స్ కోటాలో క్రీడలు ఆడని వారు, ఉపాధ్యాయులుగా అర్హతే లేని వారిని ఉపాధ్యాయులుగా ఏంపిక చేశారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు పులి ప్రసాద్‌రెడ్డి, బాలాయపల్లి, డక్కిలి మండలాల అధ్యక్షులు వెందోటి కార్తీక్‌రెడ్డి, చింతల శ్రీనివాసులరెడ్డి, వైఎస్సార్సీపీ నేతలు చిట్టేటి హరికృష్ణ, సేతరాసి బాలయ్య, సదానందరెడ్డి, కందాటి రాజారెడ్డి, ఆటంబాకం శ్రీనివాసులు రెడ్డి, రొంటాల చిన్నా, గోపాల్ యాదవ్, ములవాయిల వెంకటేశ్వర్లు, సతీష్, రౌవరత్ కుమార్, కాసారం నీలకంఠం, వెందోటి బాబు, పూజారి లక్ష్మి, కాటూరు రామతులసి, సుకన్య, కందాటి కళ్యాణి, రమణమ్మ తదితరులు పాల్గొన్నారు. తప్పుచేసిన అధికారులు మూల్యం చెల్లించక తప్పదు -
ముక్కంటి హుండీ ఆదాయం రూ.1.51కోట్లు
శ్రీకాళహస్తి రూరల్: శ్రీకాళహస్తీశ్వరాలయ హుండీ ఆదాయం రూ.1,51,82,310 వచ్చినట్లు ఈవో బీకే వెంకటేశులు తెలిపారు. బుధవారం ఆలయ ఆవరణంలోని కొట్టు మండపంలో హుండీ కానుకలను లెక్కించారు. ప్రధాన హుండీలతో పాటు పరివార దేవతల వద్ద ఉన్న హుండీల ద్వారా బంగారం 22 గ్రాములు, వెండి 360 కేజీలు, విదేశీ కరెన్సీ నోట్టు 103 వచ్చాయి. ఈ కార్యక్రమంలో పాలకమండలి చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. ముగిసిన గ్రంథాలయ జాతీయ సదస్సు తిరుపతి సిటీ: ఎస్వీయూలో మూడు రోజుల పాటు నిర్వహించిన గ్రంథాలయ జాతీయ సదస్సు బుధవారం ముగిసింది. ఈ కార్యక్రమానికి ఎస్వీయూ రిజిస్ట్రార్ భూపతినాయుడు, శ్యాప్ చైర్మన్ రవినాయుడు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో పలు విశ్వవిద్యాలయాల నుంచి గ్రంథాలయ మేధావులు ఇచ్చిన అతిథి ఉపన్యాసాలు ఎంతో ఉపయోగకరంగా, ఆధునికంగా ఉన్నాయని అలాగే వివిధ గ్రంథాలయాధికారులు, పరిశోధనా విద్యార్థులు సమర్పించిన పరిశోధనా పత్రాలు ఎంతో గుణాత్మకంగా ఉన్నాయని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని గ్రంథాలయాలను ఆధునీకరించవలసిన అవసరం ఏంతైనా ఉందని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పౌర గ్రంథాలయాల అభ్యున్నతి కోసం ఎంతగానో పాటుపడుతుందని తెలియజేశారు. అమరావతిలో దేశంలోనే అతి పెద్ద గ్రంథాలయాన్ని నిర్మించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కంకణం కట్టుకుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సెమినార్ డైరెక్టర్ డాక్టర్ కె. నాగేశ్వరరావు, ద్రవిడ విశ్వవిద్యాలయ మాజీ ఉపకులపతి ఆచార్య ఎం.దొరస్వామి, సెమినార్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ ఆచార్య కొంగర సురేంద్రబాబు, గ్రంథాలయశాస్త్ర శాఖాధిపతి డాక్టర్ ప్రశాంత కుమారి, అధ్యాపకులు, పరిశోధకులు పాల్గొన్నారు. తహసీల్దార్‌కు తృటిలో తప్పిన ప్రమాదం సూళ్లూరుపేట: సూళ్లూరుపేట పట్టణంలోని శ్రీచెంగాళమ్మ పరమేశ్వరి ఆలయం దక్షిణం వైపు ఆర్చి వద్ద జాతీయ రహదారిపై బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో తహసీల్దార్ గోపాలకృష్ణకు తృటిలో ప్రమాదం తప్పింది. సూళ్లూరుపేట నుంచి చైన్నె వెళ్లేందుకు ఆర్చి వద్ద మలుపు తిరుగుతున్న సమయంలో నెల్లూరునుంచి చైన్నె వైపు వెళ్లే మినీ లారీ కారును ఢీకొట్టడంతో ప్రమాదం సంభవించింది. మినీ లారీ డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. కారు ముందుభాగం నుజ్జు నుజ్జు అయింది. ప్రమాదం జరిగిన సమయంలో గోపాలకృష్ణ ఒక్కరు కారులో ఉండడంతో అదృష్టవశాత్తూ ఆయనకు ఎలాంటి గాయాలు లేకుండా ప్రమాదం నుంచి బయటపడ్డారు. -
40 ఏళ్లల్లో ఎన్నడూ లేనంత అభివృద్ధి
● రేణిగుంటలో టౌన్ బ్యాంక్ బ్రాంచ్ ప్రారంభించడం అభినందనీయం ● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి రేణిగుంట: తిరుపతి కో–ఆపరేటివ్ బ్యాంక్ రేణిగుంటలో ఏర్పాటు చేసిన నూతన బ్రాంచ్‌ను బుధవారం వైఎస్సార్సీపీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షులు భూమన కరుణాకరరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత 40 ఏళ్లల్లో ఎన్నడూ లేనంతగా ప్రస్తుత పాలకవర్గం చేస్తున్న అభివృద్ధి అభినందనీయమన్నారు. తిరుపతి కో–ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ కేతం జయచంద్రారెడ్డి ఆధ్వర్యంలో రేణిగుంటలో నూతన బ్రాంచ్‌ను ఏర్పాటు చేయడం ఓ మైలురాయి అన్నారు. ఈ పాలకవర్గం బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రాజకీయాలకు అతీతంగా బ్యాంక్ అభివృద్ధే లక్ష్యంగా, ఖాతాదారులకు విశేష సేవలందించడమే పరమావధిగా పనిచేస్తున్నారన్నారు. 40ఏళ్ల తర్వాత బ్యాంక్ చైర్మన్ కేతం జయచంద్రారెడ్డి కృషితో నూతన బ్రాంచ్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. దాంతోపాటు రూ.47కోట్ల బకాయిల్లో రూ.43 కోట్లు వసూలు చేయడంలోనూ, ఖాతాదారులకు డివిడెంట్లు ఇప్పించడంలోనూ పాలకవర్గం, అధికారులు ఎంతో కృషి చేస్తున్నారన్నారు. బ్యాంక్ అభివృద్ధికి కృషి చేస్తున్న అధికారులు, పాలకవర్గం, సిబ్బందిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. శ్రీవారి దర్శనానికి 24 గంటలు తిరుమల: తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 29 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. మంగళవారం అర్ధరాత్రి వరకు 71,297 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 32,783 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.5.59 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 24 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. -
బ్రహ్మోత్సవాల్లో నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనాలు సీజ్
పైసలిస్తేనే ఫైళ్లు కదిలేది! సూళ్లూరుపేట రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో ఏదైనా ఫైలు కదలాలంటే సిబ్బందికి ముడుపులు చెల్లించాల్సిందే.పుస్తకాలతో స్నేహం చేయించాలి విద్యార్థులను మొబైల్‌కు దూరంచేసి పుస్తకాల తో స్నేహం చేసేలా మార్చాలని డీఈవో ఉపాధ్యాయులకు సూచించారు.సర్టిఫికెట్లలో కూలాలు మారిపోతున్నాయి ఉద్యోగులు చేసిన తప్పులకు ప్రజలకు అవస్థలు ●గురువారం శ్రీ 10 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026పుట్టింది ఓ కులం.. ధ్రువీకరణపత్రంలో మరోకులం. పింఛన్‌కు అర్జీ ఇవ్వాలంటే కుదరదు. సంక్షేమ పథకంలో లబ్ధిపొందాలంచే వీలుకాదు.. చివరికి తానను తానే అని నిరూపించుకోవాలన్నా.. సాధ్యంకావడం లేదు. ఇందంతా ఏ ఒక్కరి సమస్యో కాదు.. అధికారులు తప్పుల తడకగా కుల ధ్రువీకరణ పత్రాలివ్వడం వల్ల జిల్లా వ్యాప్తంగా వందలాది మంది పడుతున్న నరకయాతన. ఇక కులధ్రువీకరణం పత్రం సవరణ కోసం.. వారు పెద్ద యుద్ధమే చేయాల్సి వస్తోంది. ఈ క్రమంలో వీఆర్ఓ, తహసీల్దార్, ఆర్డీఓ సహా చివరికి జాయింట్ కలెక్టర్ కార్యాలయం వరకూ సగటున రెండు నెలలకు పైగా కాళ్లరిగేలా తిరుగుతున్నా.. ప్రయోజనం కనిపించడం లేదు. ఇలాంటి తరుణంలో పేరెన్నికగన్న కపట కూటమి ప్రభుత్వం ఈనెల 16 వరకే అర్జీలు స్వీకరిస్తామని హుకుం జారీ చేయడంతో.. అర్హులంతా.. హలో లక్షణా.. హథవిథీ అంటూ సకాలంలో దరఖాస్తులందజేయలేక.. అల్లాడిపోతున్నారు. వీరి పట్టించుకునే నాథుడుకానీ.. సమస్యను పరిష్కరించే నాయకుడు గానీ ప్రభుత్వంలో కనిపించడం లేదంటే అతిశయోక్తికాదు. ఇంకా ఎంత కాలం తిరగాలో? మా కులం ఈడిగ (బీసీ–బీ). అయితే రెండు నెలల క్రితం మా పిల్లలు మా పాఠశాలలో చేర్పించడానికి కులధృవీకరణ పత్రం కోసం సచివాలయంలో దరఖాస్తు చేసుకున్నాం. అయితే వారు మా కులం ఈడిగ కాకుండా ఆన్లైన్లో జంగమ (బీసీ–బీ) అని ఉందని అలా ఇస్తామని లేదంటే జాయింట్ కలెక్టర్ లాగిన్‌లో మార్పు చేయించుకోవాలని చెప్పారు. దీంతో రెండు నెలలుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నాం. నా తోపాటు మా భర్త, మా ఇద్దరు పిల్లల కులం కూడా జంగమ గా మారిపోయింది. ఇప్పటికే రెండు నెలలు నుంచి తిరుగుతున్నాం. ఇంకా ఎంతకాలం పడుతుందో తెలియడం లేదు. – భువనేశ్వరి, పాండూరు గ్రామం, వరదయ్యపాళెం మండలం ఇంతమంది వద్దకు తిరగాలా? మా కమ్యూనిటీ రెడ్డి (ఓసీ), అయితే కమ్మ (ఓసీ)గా మారిపోయింది. ఆ తర్వాత వీఆర్వో నుంచి తహసీల్దార్, ఆర్డీవో, కలెక్టరేట్ సీ సెక్షన్, డీఆర్వో, జాయింట్ కలెక్టర్ ఇంతమంది అధికారుల పర్యవేక్షణ అనంతరం ఎట్టకేలకు కమ్యూనిటీని మార్పు చేయించుకున్నాం. క్షేత్రస్థాయి నుంచి జాయింట్ కలెక్టర్ వరకు ఆరుగురు అధికారుల వద్దకు వెళ్లి తప్పుగా పడిన కమ్యూనిటీని మార్పు చేసుకోవడానికి నానా తంటాలు పడ్డాం. ఎక్కడ పొరపాటు జరిగిందే గానీ తహసీల్దార్ పరిధిలోనే తప్పును సవరిస్తే కాస్తా ఇబ్బందులు తప్పుతాయని అంతా భావిస్తున్నాం. – రత్నం, శ్రీకాళహస్తి మండలం బీసీ(ఏ) అయితే బీసీ(డీ)గా మార్చేశారు మా కమ్యూనిటీ బీసీ(ఏ) అయితే బీసీ(డీగా మా కుమార్తె సర్టిఫికేట్లో మా ర్పుచేశారు. బీసీ ఏ అయితే ఇంజినీరింగ్‌లో మంచి కాలే జ్లో సీటు వస్తుంది. అయి తే బీసీ డీ అయితే సీటు రాదు. దాంతో కమ్యూనిటీ సర్టిఫికెట్‌ను మార్పు చేసుకోవడానికి అధికారుల చుట్టు తిరుగుతున్నాను. ఇలా ఎందుకు జరిగిందో తెలియం లేదు. చాలామంది తమ పిల్లల సర్టి ఫికెట్స్ కోసం సచివాలయంకు వెళితే కమ్యూనిటీ మారిపోయినట్లు చెబుతున్నారు. – జయరాం, ఏర్పేడు మండలం తిరుపతి అర్బన్: పిల్లల చదువుల కోసం, ఉద్యోగాల కోసం, పింఛన్లకు దరఖాస్తులు చేసుకోవడానికి పలువురు తమ కుల ధ్రువీకరణ పత్రాన్ని పొందడానికి సచివాలయాలకు వెళుతున్నారు. అయితే ఆన్లైన్లో వారి కులం మారిపోయి ఉండడంతో లబోదిబోమంటూ వాపోతున్నారు. సచివాలయ ఉద్యోగులు మాత్రం జేసీ లాగిన్‌లో మార్పు చేసుకోండి అంటూ సలహాలు ఇచ్చేస్తున్నారు. మార్పు చేయడానికి వీఆర్వో వద్ద నుంచి మొదలుపెట్టి తహసీల్దార్, తర్వాత ఆర్డీవో, అక్కడి నుంచి కలెక్టరేట్ సీ–సెక్షన్‌కు ఆ తర్వాత డీఆర్వో నుంచి జాయింట్ కలెక్టర్ లాగిన్‌కు ఫైల్ వెళ్లాల్సి ఉంది. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి పేదలకు నెల నుంచి రెండు నెలల సమయం పడుతోంది. దీంతో పేద, సామాన్య, మధ్య తరగతికి చెందిన వారు అల్లాడిపోతున్నారు. తప్పులను తహసీల్దార్ పరిధిలో సవరిస్తే అందరికి అనుకూలంగా ఉండేదని ఆవేదన చెందుతున్నారు. ఎన్నో అవస్థలు కొందరు ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వారికి ఎస్సీలుగా మారిపోవడంతో వారు పింఛను దరఖాస్తులు చేసుకోలేకవాపోతున్నారు. ఎస్టీలకు 50ఏళ్లకు పింఛనుకు దరఖాస్తు చేసుకునే సౌకర్యం ఉంది. ఎస్సీలు అయితే 60ఏళ్లకు పింఛన్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. ఎస్టీలకు ఆన్లైన్లో ఎస్సీలుగా కమ్యూనిటీ మారిపోయి ఉండడంతో దరఖాస్తు చేసుకోలేకపోతున్నారు. జిల్లా ఉన్నతాధికారులు ఈ అంశాన్ని గుర్తించి తహసీల్దార్ పరిధిలోనే కులధ్రువీకరణలో చోటుచేసుకున్న పొరబాట్లుకు పరిష్కారం చూపాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. 30 నుంచి 40 రోజులు సర్టిఫికెట్లలో సవరణలకు ఆరుగురు అధికారులు.. పర్యవేక్షణ చేసి అప్రూవల్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత మళ్లీ వారంతా తప్పులతో ఉన్న పాత సర్టిఫికెట్‌ను రిజెక్ట్ కొట్టాల్సి ఉంది. అనంతరం కొత్తగా తప్పులు లేకుండా సచివాలయంలో సర్టిఫికెట్లకు దర ఖాస్తు చేసుకోవాల్సి ఉంది. ప్రతిరోజూ అధికారుల చుట్టూ తిరిగినా కనీసం.. సర్టిఫికెట్‌ను సవరించుకోవడానికి 30 నుంచి 40 రోజుల సమయం పడుతోంది. ఈ ప్రభుత్వంలో తహసీల్దార్‌కు, ఆర్డీవోకు పూర్తి అధికారాలు ఇచ్చేశామంటూ ఏడాదిగా ఊదరగొట్టిన సంగతి తెలిసిందే. చిన్నపాటి సర్టిఫికెట్లో పొరబాటు ను సవరించడానికి తహసీల్దార్‌కు, ఆర్డీవోకు పవర్ లేదు.. జాయింట్ కలెక్టర్ వద్దకు వెళ్లి రావాల్సి ఉంది. దీంతో పలువురు మండిపడుతున్నారు. – జిల్లా రవాణాశాఖాధికారి కొర్రపాటి మురళీమోహన్ తిరుపతి మంగళం:తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవా ల్లో నిబంధనలు ఉల్లంఘించి ఎవరైనా వాహనాలు నడిపితే అలాంటి వాహనాలను సీజ్ చేస్తామని జిల్లా రవాణాశాఖాధికారి కొర్రపాటి మురళీమోహన్ హెచ్చరించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో బుధవారం తిరుమల ఘాట్ రోడ్డులో రవాణా, పోలీస్ శాఖల అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ప్రపంచ నలుమూలల నుంచి వేలాది మంది భక్తు లు తిరుమలకు విచ్చేస్తుంటారని, వారిని సురక్షితంగా వారి గమ్యాలకు చేర్చే బాధ్యత ట్యాక్సీ వాహనదారులపై ఉందన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే అలాంటి వాహనాలను సీజ్‌చేసి జరిమానా విధించి, ఆ వాహనాలను తిరుమలకు వెళ్లకుండా నిషేధిస్తామని హెచ్చరించారు. వాహనదారులు చేసే చిన్నపాటి నిర్లక్ష్యం కారణంగా ప్రయాణికుల ప్రాణాలు గాలిలో కలిసిపోతాయని ప్రతి వాహనదారుడు గుర్తు పెట్టుకోవాలని సూచించారు. ఈ ప్రత్యేక తనిఖీలలో ఎంవీఐ, వెంకటరమణ నాయక్, ఎ ఎంవీఐ ప్రసాద్ వర్మ, ట్రాఫిక్ ఎస్ఐ , పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. కులం మార్పు చేశారు.. పింఛన్ కోల్పోతున్నా ఎస్టీలకు 50 ఏళ్లు నిండితే వృద్ధాప్య పింఛనుకు వర్తిస్తుంది. నాకు 51 ఏళ్లు. పింఛన్‌కు దరఖాస్తు చేసుకోవడానికి సచివాలయానికి వెళ్లాను. సచివాలయ ఉద్యోగులు ఆన్లైన్లో నా కులం ఎస్సీగా ఉందని చెప్పారు. ఎస్సీలకు 60ఏళ్లు నిండి ఉంటేనే పింఛన్ వస్తుందని చెబుతున్నారు. నేను ఎస్సీ కాదు ఎస్టీ అంటూ మొత్తుకున్నాను. వారు జాయింట్ కలెక్టర్ లాగిన్‌కి వెళ్లి కమ్యూనిటీని మార్పు చేసుకుని వస్తే.. దరఖాస్తు చేస్తామని చెబుతున్నారు. మార్పు చేసుకోవాలంటే రెండు నెలలు సమయం పడుతుందని అంతా చెబుతున్నారు. అయితే ఈ నెల 16 వరకు మాత్రమే పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి సమయం ఇచ్చారు. నాకు న్యాయం చేయండి స్వామీ. – గంగయ్య, వెన్నలకంటి రాఘవయ్య ఎస్టీకాలనీ -
కొత్తమార్గాలకు లైన్ క్లియర్!
రాజంపేట: దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే రైల్వే మార్గాల్లో ఒకటైన రేణిగుంట–గుంతకల్లు సెక్షన్‌కు ఎట్టకేలకు మోక్షం లభించింది. బంగాళాఖాతం – అరేబియా మహాసముద్రాలను అనుసంధానించే అత్యంత కీలకమైన ముంబయి–చైన్నె రైల్వే కారిడార్‌లో కొత్తగా మూడు, నాలుగు లైన్ల నిర్మాణానికి కేంద్ర క్యాబినెట్ బుధవారం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దాదాపు రూ.4,500 కోట్ల భారీ అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు ద్వారా ఈ ప్రాంత ప్రజల 20 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. ప్రతి 7.5 నిమిషాలకో రైలు 310 కిలోమీటర్ల పొడవు కలిగిన రేణిగుంట–గుంతకల్ సెక్షన్ మధ్య ప్రస్తుతం రెండు లైన్లు మాత్రమే ఉన్నాయి. ఈ మార్గంలో ప్రతిరోజూ దాదాపు 190 రైళ్లు నడుస్తున్నాయి. అంటే సగటున ప్రతి 7.5 నిమిషాలకు ఒక రైలు ఈ ట్రాక్‌పై ప్రయాణిస్తోంది. రైల్వే భద్రతా ప్రమాణాల ప్రకారం ఒక రైలుకు, మరో రైలుకు మధ్య కనీసం 15 నిమిషాల వ్యవధి ఉండాలి. కానీ, ప్రస్తుత రద్దీ వల్ల ప్రమాదకర పరిస్థితులు నెలకొనడమే కాకుండా, రైళ్లను చిన్న చిన్న స్టేషన్లలో లేదా ఔటర్లలో గంటల తరబడి నిలిపివేయాల్సి వస్తోంది. కొత్తగా 3, 4 లైన్లు అందుబాటులోకి వస్తే ఈ సమస్యలన్నింటికీ శాశ్వత పరిష్కారం లభించనుంది. కృష్ణపట్నం పోర్టుకు మహర్దశ ఈ లైన్ల నిర్మాణం పూర్తయితే కృష్ణపట్నం ఓడ రేవుకు గూడ్స్ రైళ్ల ద్వారా సరుకులను అత్యంత వేగంగా చేరవేసే వెసులుబాటు కలుగుతుంది. ఈ కొత్త లైన్లలో రైళ్లు గంటకు 150 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా అధునాతన సాంకేతికతతో నిర్మించనున్నారు. ఈ మార్గంలో సున్నపు రాయి, సిమెంట్, ఇనుప ఖనిజం, ఉక్కు, పెట్రోలియం ఉత్పత్తులు, ఎరువుల రవాణా వేగవంతం కావడం వల్ల రైల్వే శాఖకు ఆదాయం భారీగా పెరుగుతుంది. రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను సకాలంలో నగరాలకు చేర్చవచ్చు. ఈ కారిడార్ వెంబడి ఉన్న పలు గ్రామాలు పారిశ్రామికంగా వేగంగా అభివృద్ధి చెందనున్నాయి. రంగంలోకి యంత్రాంగం ఈ మెగా ప్రాజెక్టు కోసం ఆరు నెలల కిందటే రైల్వే అధికారులు క్షేత్రస్థాయి సర్వే పూర్తి చేశారు. తాజాగా కేంద్ర అనుమతులు రావడంతో, రైల్వే చట్టం 1989 సెక్షన్ 2(37ఎ) కింద దీనిని ఒక ప్రత్యేక ప్రాజెక్టుగా ప్రకటిస్తూ భూసేకరణకు అధికారులు ముందడుగు వేశారు. ఈ మేరకు వైఎస్సార్ కడప, తిరుపతి, అనంతపురం జిల్లాల పరిధిలో అవసరమైన భూమిని సేకరించేందుకు రైల్వే యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. రేణిగుంట–గుంతకల్లు మధ్య 3, 4 లైన్ల మార్గం నేతల హర్షం ముంబయి–చైన్నె రైల్వే కారిడార్‌లో అత్యంత కీలకమైన రేణిగుంట–గుంతకల్లు మధ్య 3, 4 లైన్ల నిర్మాణానికి కేంద్రం అనుమతించడంపై రాజంపేట ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే ఈ 310 కిలోమీటర్ల మార్గంలో నిత్యం ప్రయాణికులు, సరకు రవాణా రైళ్ల ఒత్తిడి ఎక్కువగా ఉందని వారు పేర్కొన్నారు. ఈ ఫోర్‌లైన్ నిర్మాణం పూర్తయితే రైళ్లు గంటల తరబడి ఔటర్లలో వేచి ఉండే ఇబ్బందులు తొలగిపోతాయని, ప్యాసింజర్, గూడ్స్ రైళ్ల రాకపోకలు ఎలాంటి అంతరాయం లేకుండా సాఫీగా సాగుతాయని నేతలు స్పష్టం చేశారు. రైలుమార్గం కి.మీ గుంతకల్–రేణిగుంట 298 సెష్టన్లు 36 రైళ్ల వేగం 150 ప్రధాన రైల్వే కేంద్రాలు కడప, నందలూరు, రేణిగుంట, గుత్తి, గుంతకల్లు, ఎర్రగుంట్ల మార్గంలో –150 ప్యాసింజర్‌రైళ్లు..40 ఎక్స్‌ప్రెస్ రైళ్లు –డైలీ 40 గూడ్స్ రైళ్లకు 1.20లక్షల టన్నుల రవాణా రవాణా బాక్స్ ఎన్లోడ్స్, బీసీ ఎన్లోడ్స్ ఆయిల్ ట్యాంక్ లోడ్స్, కంటైయినర్ లోడ్స్ -
పేషెంట్ మానిటరింగ్ సిస్టమ్ విత్ ఆటోమేటిక్ ఎస్ఎంఎస్ అలెర్ట్
పేషెంట్ మానిటరింగ్ సిస్టమ్ విత్ ఆటోమేటిక్ ఎస్ఎంఎస్ అలెర్ట్ వర్కింగ్ మోడల్‌ను వడమాలపేట మండలనం, ఎస్వీ పురం జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థిని ఎన్.మేఘన గైడ్ టీచర్ ఎం.నరసింహారెడ్డి పర్యవేక్షణలో రూపొందించింది. 2023–2024 విద్యాసంవత్సరానికి సంబంధించిన ఈ ప్రాజెక్టు జాతీయ స్థాయి ప్రదర్శనకు ఎంపికయ్యింది. ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం రోగి శరీర ఉష్ణోగ్రత, హృదయ స్పందన రేటును నిరంతరం పర్యవేక్షిస్తుంది. వివిధ సెన్సార్ల ద్వారా సేకరించిన సమాచారాన్ని మైక్రో కంట్రోలర్ ద్వారా ప్రాసెస్ చేస్తుంది. ఏదేని అత్యవసర పరిస్థితి ఎదురైనప్పుడు వెంటనే ఈ పరికరం స్పందించి సంబంధిత డాక్టర్‌ను ఎస్ఎంఎస్ రూపంలో అలెర్ట్ చేస్తుంది. తద్వారా ఆ రోగిని ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడేందుకు దోహదపడుతుంది. పంట పొలాల్లో పనిచేసే రైతులు, ముఖ్యంగా రాత్రి వేళల్లో పాము కాటు నుంచి తప్పించుకోవడానికి రూపొందించిందే ఈ రక్షణ బూటు. ఈ వర్కింగ్ మోడల్‌ను తడ మండలం, వటంబేడు జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థి ఎన్.ధనుష్ గైడ్ టీచర్ వై.వెంకటరమణయ్య పర్యవేక్షణలో తయారుచేశాడు. 2024–25కు సంబంధించి జాతీయ స్థాయికి ఈ ప్రాజెక్టు ఎంపికయ్యింది. గట్టి లెదర్‌తో ఈ షూను రూపొందించాడు. షూ ముందువైపు ఆన్/ఆఫ్ చేసుకునేలా చిన్న లైటు, చిన్న బర్జర్‌ను అమర్చాడు. రాత్రి వేళల్లో రైతులు పొలాలకు వెళ్లినప్పుడు గట్టుపై ఉన్న పాములు ఈ షూ నుంచి వచ్చే కాంతి, అలాగే బర్జర్ సౌండ్‌తో దూరంగా వెళతాయి. తద్వారా పాము కాటు బారిన పడరు. ఈ షూ గట్టి లెదర్‌తో చేయడంతో దీర్ఘకాలిక మన్నిక ఉంటుంది. చేతిలో టార్చ్‌లైట్, గట్టిగా శబ్ధం చేయాల్సిన పని నుంచి రైతుకు ఉపశమనం లభిస్తుంది. స్మార్ట్ అలారం ఫర్ ది క్రేజీ చెఫ్ వంట చేసేటప్పుడు ఆహారం వృథా కాకుండా చేయడమే ‘‘స్మార్ట్ అలారం ఫర్ ది క్రేజీ చెఫ్’’ లక్ష్యం. తిరుపతి భారతీయ విద్యాభవన్ విద్యార్థిని సీహెచ్‌కే శ్రీహిత గైడ్ టీచర్ విజయలక్ష్మి పర్యవేక్షణలో ఈ ప్రాజెక్టును రూపొందించింది. 2023–2024కు సంబంధించి ఈ ప్రాజెక్టు జాతీయ స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్‌కు ఎంపికయ్యింది. ఆహారం వృథా కాకుండా, మాడిపోకుండా ఉండేందుకు వంట చేసే వ్యక్తికి ఆ వంటకం ఉష్ణోగ్రత స్థితిని తెలియజేసేదే ఈ పరికరం ఉద్ధేశం. ఈ పరికరం వంట చేసే వ్యక్తి నమోదు చేసిన ఉష్ణోగ్రత ఆదేశాల మేరకు పనిచేస్తుంది. గ్యాస్ స్టవ్‌పై వంటకం ఉంచి అవసరమైన ఉష్ణోగ్రతను ఈ పరికరంలో నమోదు చేయాలి. స్టవ్‌ను ఆఫ్ చేయడం మరిచిపోతే వెంటనే ఈ పరికరం నుంచి అలారం వస్తుంది. తద్వారా స్టవ్‌ను ఆఫ్ చేయవచ్చు. ఈ పరికరం వంట చేస్తున్న విషయాన్ని విషయాన్ని మరిచిపోయే స్వల్పకాలిక జ్ఞాపకశక్తి సమస్య ఉన్న వారికి ఈ పరికరం ఎంతో ఉపయోగకరం. పాము కాటు నుంచి రైతుకు రక్షణ బూటు -
అభివృద్ధి పేరుతో ప్రజాధనం స్వాహా
నాయుడుపేట టౌన్: చంద్రబాబు ప్రభుత్వం రెండున్నరేళ్ల పాలనలో సూళ్లూరుపేట నియోజకవర్గంలో అభివృద్ధి పనుల పేరుతో కోట్లాది రూపాయల నిధులు ప్రజాధనం స్వాహా చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ సమన్వయకర్త కిలివేటి సంజీవయ్య తీవ్రస్థాయిలో విమర్శించారు. బుధవారం పట్టణంలోని ఆర్అండ్బీ అతిథి గృహంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సూళ్లూరుపేట, ఓజిలితో పాటు పలు మండలాల్లో చేపడుతున్న ఎఫ్డీఆర్ పనుల్లో సుమారు రూ.20 కోట్లకు పైగా అవకతవకలు జరుగుతున్నాయన్నారు. ఆర్ఆర్ పనులకు కేటాయించిన రూ.10 కోట్ల నిధుల వ్యయంలోనూ అక్రమాలు జరుగుతున్నాయని సంజీవయ్య విరుచుకు పడ్డారు. ఎమ్మెల్యే అనుచరులకు బినామీ పేర్లతో స్థలాలు కేటాయించి ప్రజా ఆస్తులను సైతం దోచుకుంటున్నారని విమర్శించారు. ఓజిలి మండలంలోని కుందాం, మాచవరం తదితర గ్రామాల్లోని సెజ్ భూముల్లో ప్రభుత్వ అసైన్మెంట్ భూములను ప్రభుత్వ బినామీ పేర్లతో మార్చి కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనం లూటీ చేసేందుకు చర్యలు చేపడుతున్నారని ధ్వజమెత్తారు. నియోజకవర్గంలో ఇసుక, మట్టి, గ్రావెల్ పేరుతో ప్రభుత్వానికి ఎటువంటి పన్ను చెల్లించకుండానే కోట్ల రూపాయలు దోచుకుంటున్నారన్నారు. ఉచిత ఇసుక పథకం మాటున అక్రమ వసూళ్లు, దోపిడీ జరుగుతోందని పత్రికల్లో ప్రముఖంగా ప్రచురిస్తున్నా అధికారులు స్పందించడం లేదని సంజీవయ్య ఆరోపించారు. ఒక్క ఓజిలి మండలంలోనే సగుటూరు చెరువులో ఎఫ్డీఆర్ నిధులు రూ.10కోట్లు కేటాయించినా అందులోను ఎమ్మెల్యే అనుచరులు దిగమింగుతున్నారని రుజువులతో సహా సంజీవయ్య విలేకరులకు చూపించారు. ఒక్క సగుటూరు చెరువు కట్టపై ఉన్న విలువైన నల్లకర్ర తుమ్మ తదితర చెట్లను పంచాయతీ అనుమతులు లేకుండానే నరికివేసి సుమా రు రూ.50 లక్షలకు పైగా స్వాహా చేశారని ఆరోపించారు. ఇందకు సంబంధించిన సాక్ష్యాలు సైతం ఉన్నాయని సంజీవయ్య చూపించా రు. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు సంబంధించి బినా మీ కాంట్రాక్టర్ల ఒత్తిళ్లతో అధికారులు సైతం భయపడుతున్నారన్నారు. నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలు వెలుగులోకి వస్తున్నప్పటికీ జిల్లా కలెక్టర్‌తో పాటు ఆర్డీవో, తదితర శాఖల అధికారులు సైతం స్పందించక పోవడం బాధకరమన్నారు. విచారణ జరిపించండి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు, బినామీలు చేస్తున్న అవినీతిపై ఎమ్మెల్యేకి ఎలాంటి ప్రమేయం లేకపోతే వారం రోజుల్లోగా జరుగుతున్న అవినీతి, అక్రమాలపై సమగ్రంగా విచారణ జరిపించి ప్రజలకు పత్రికా ముఖంగా వెల్లడించాలని సంజీవయ్య డిమాండ్ చేశారు. డీఎస్సీ నియామకాల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డితో పాటు పార్టీ అధినాయకులు రుజువులు సైతం చూపిస్తున్న విషయం తెలిసిందేనని సంజీవయ్య వెల్లడించారు. దీనిపై నిరాహార దీక్షలు, ర్యాలీలు నిర్వహిస్తూ సీబీఐతో విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు. తప్పుచేయని వారు సీబీఐ విచారణకు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. అవినీతి అక్రమాలకు అడ్డాగా సూళ్లూరుపేట కార్యకర్తల జోలికొస్తే ఉపేక్షించం స్వర్ణముఖి నదిని ధ్వంసం చేస్తున్న టీడీపీ నేతలను పట్టించుకోని సంబంధిత శాఖల అధికారులు వైఎస్సార్సీపీకి చెందిన రైతులు, నాయకులపై అక్రమంగా బైయిండోవర్ కేసులు నమోదు చేయడం తగదన్నారు. తమ పార్టీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తే ఉపేక్షించమన్నారు. ఈ విషయమై డీఎస్పీతో పాటు ఆర్డీవోలను కలిసి అక్రమ కేసులపై ఫిర్యాదు చేయడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ పట్టణ, మండల అధ్యక్షులు కలికి మాధవరెడ్డి, ఒట్టూరు కిషోర్‌యాదవ్, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ కామిరెడ్డి రాజారెడ్డి, నాయకులు మద్దాల సోమశేఖర్‌రెడ్డి, ఓజిలి, దొరవారిసత్రం మండల పార్టీ అధ్యక్షులు పాదర్తి హరినాథరెడ్డి, అల్లూరు రాహుల్‌రెడ్డి, బైనా మల్లికార్జునరెడ్డి, కటకం జయరామయ్య, పేట చంద్రారెడ్డి, వేణుంబాక మునస్వామి నాయుడు, ఎంపీపీలు కురుగొండ ధనలక్ష్మి, గడ్డం అరుణారెడ్డి, లీగల్ సెల్ కన్వీనర్ చదలవాడ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఎంపీ పేరు లేకుండానే ఆహ్వానపత్రికలు
చిట్టమూరు: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో దేవదాయ శాఖ అధికారులు ప్రొటోకాల్ పాటించడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల గూడూరు, చిల్లకూరు మండలాల్లోని పలు ఆలయాల్లో నిర్వహించిన కుంభాభిషేక వేడుకలకు సంబంధించిన ఆహ్వాన పత్రికలు, వాల్‌పోస్టర్లలో తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి పేరును ప్రస్తావించకపోవడం చర్చనీయాంశంగా మారింది. తాజాగా చిట్టమూరు మండలం మల్లాంలోని ప్రసిద్ధ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహించనున్న బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికలు, వాల్పోస్టర్లలోనూ ఎంపీ పేరును ప్రస్తావించలేదు. ఆలయంలో బుధవారం వాటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎంపీ పేరు ఎందుకు ముద్రించలేదని ఈఓ కుడారి పెంచల వరప్రసాద్‌ను ప్రశ్నించగా.. తనకు తెలియకుండానే ఆహ్వాన పత్రికలు ముద్రించారని సమాధానం ఇచ్చారు. -
సృజనశీలురు.. బాల మేధావులు
గ్రీన్హౌస్ పర్యావరణాన్ని నియంత్రించేరోబోట్ మానవ రహిత టాయ్‌లెట్ క్లీనింగ్జిల్లాకు చెందిన చిన్నారులు తమ మేధస్సుకు పదును పెట్టి రూపొందించిన నమూనాలు జాతీయ స్థాయికి ఎంపికయ్యాయి. ఉపాధ్యాయుల మార్గదర్శకత్వంలో లభించిన కఠిన శిక్షణ, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో తాము ఏకాగ్రతతో నమూనాలు రూపొందించడం వల్లే విజయం సాధ్యమైందని చిన్నారులు చెబుతున్నారు. భవిష్యత్తులో మంచి శాస్త్రవేత్తలుగా ఎదిగి దేశానికి సేవ చేస్తామని సగర్వంగా చెబుతున్నారు. తిరుపతి ఎడ్యుకేషన్ : ఓ చిన్ని ఐడియా జీవితాన్నే మార్చివేస్తుందన్నట్టు విద్యార్థుల్లో మొలకెత్తే ఆలోచనలకు పదును పెట్టిస్తే అద్భుతాలు సృష్టించవచ్చు. ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం విద్యార్థులతో అడుగులు వేయిస్తోంది. ప్రతి ఏటా ఇన్స్పైర్ పేరుతో విద్యార్థులతో ప్రాజెక్టులు తయారుచేయిస్తోంది. వీటిలోని ఉత్తమ ప్రాజెక్టులను ఎంపిక చేసి వారిని ఆర్థికంగా, విద్యాపరంగా ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా 2023–2024 విద్యా సంవత్సరం, 2024–2025 విద్యా సంవత్సరానికి సంబంధించి రాష్ట్రస్థాయి ప్రదర్శనను ఆన్లైన్ ప్రాతిపదికన నిర్వహించారు. ఇందులో 2023–24కు సంబంధించి 3 ప్రాజెక్టులు, 2024–25కు సంబంధించి 2 ప్రాజెక్టులు, మొత్తం 5 ప్రాజెక్టులు జాతీయ స్థాయికి ఎంపికై నట్లు ఇటీవలే ప్రకటించారు. వ్యక్తిగత, పబ్లిక్ టాయ్లెట్లను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచడం, దుర్వాసనను నివారించడం, టాయ్లెట్ల నుంచి వ్యాపించే వ్యాధులను నివారించడమే ఆటోమేటిక్ టాయ్‌లెట్ ఫ్లషింగ్ సిస్టం ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. ఈ ప్రాజెక్టును వరదయ్యపాళెం జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థిని ఎం.గౌతమి గైడ్ టీచర్ ఎం.సుబ్బరామయ్య మార్గనిర్దేశంతో రూపొందించింది. 2024–25విద్యా సంవత్సరానికి సంబంధించి జాతీయ స్థాయి ప్రదర్శనకు ఎంపికయ్యింది. మానవ రహిత టాయ్‌లెట్ క్లీనింగ్ ద్వారా టాయ్‌లెట్‌కు వెళ్లిన ప్రతిమారు చేతితో ఫ్లష్‌ను నొక్కాల్సిన అవసరం ఉండదు. ఈ సిస్టంను వ్యక్తిగత, పబ్లిక్ టాయ్లెట్స్తోపాటు పాఠశాలలు, రైళ్లు, బస్టాండ్లలో ఉపయోగించడం ద్వారా టాయ్లెట్లు ఎప్పుడూ శుభ్రంగా ఉంటూ దుర్వాసన రాకుండా ఉండడంతో పాటు వ్యాధులు వ్యాప్తి చెందకుండా ఉంటుంది. ఈ సిస్టం తక్కువ నీటిని వినియోగించుకోవడంతో నీటిని ఆదా చేసుకోవచ్చు. గ్రీన్హౌస్ వాతావరణ నియంత్రణ రోబోట్ వర్కింగ్ మోడల్‌ను తిరుపతిలోని సెవెన్ హిల్స్ హైస్కూల్ విద్యార్థిని ఎస్.విజయసాయి గైడ్ టీచర్ డి.భువనేశ్వరి పర్యవేక్షణలో రూపొందించింది. 2023–2024 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఈ ప్రాజెక్టు జాతీయ స్థాయి ప్రదర్శనకు ఎంపికయ్యింది. ఈ పరికరంలో ఏర్పాటుచేసిన వివిధ సెన్సార్లు వాతావరణంలోని ఉష్ణోగ్రత, తేమ, కాంతి తీవ్రత, నేలలోని తేమ వంటి కీలకమైన వాతావరణ, నేల పారా మీటర్లను పర్యవేక్షిస్తుంది. అలాగే వాతావరణ మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తూ నమోదు చేస్తుంది. ఈ పరికరం గ్రీన్హౌస్ వాతావరణాన్ని నియంత్రించేందుకు అనువుగా రూపొందించారు. తద్వారా వాతావరణంలో జరిగే మార్పులను ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తూ అందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుని వాతావరణ సమతుల్యత చేపట్టవచ్చు. -
వ్యవసాయ మోటార్ల చోరీ
తొట్టంబేడు (శ్రీకాళహస్తి రూరల్): తొట్టంబేడు మండలంలోని విరూపాక్షాపురంలో సోమవారం రాత్రి ఒకేసారి 8 మంది రైతులకు చెందిన విద్యుత్ మోటార్లను దొంగలు ఎత్తుకెళ్లారు. బాధిత రైతులు వెంకటేష్, రమణయ్య, కాటయ్య, మనోహర్, పరమేష్ రెడ్డి, బత్తయ్య, సుబ్రహ్మణ్యం, రమేష్ మంగళవారం ఉదయం పొలాలకు వెళ్లి చూడగా స్టార్టర్ బాక్సులు పగలగొట్టి వైర్లు కత్తిరించి మోటార్లు చోరీ చేసినట్లు గుర్తించారు. ఇటీవలే చిట్టత్తూరులో నలుగురు రైతుల మోటా ర్లు చోరీ కాగా ఇప్పుడు విరూపాక్షీపురంలో ఏకంగా 8 మోటార్లు మాయం కావడంతో రైతులు భ యాందోళనకు గురవుతున్నారు. పక్కా ప్రణాళిక తో ఒకే ముఠా ఈ చోరీలకు పాల్పడుతోందని అ నుమానిస్తున్నారు. వర్షాలు లేక అప్పులతో ఇబ్బంది పడుతున్న తరుణంలో లక్షల విలువైన మోటా ర్లు దొంగలించడంతో తీవ్రంగా నష్టపోయామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
సీనియర్స్ బేస్ బాల్ జిల్లా జట్ల ఎంపిక
తిరుపతి ఎడ్యుకేషన్ : తిరుపతి మంగళం ట్రెండ్స్ పాఠశాల ఆవరణలో మంగళవారం సీనియర్స్ బేస్ బాల్ తిరుపతి జిల్లా జట్లు ఎంపిక ప్రక్రియను నిర్వహించారు. ఈ ఎంపిక పోటీలకు జిల్లా నలుమూలల నుంచి బాలబాలికలు 150 మందికిపైగా హాజరైనట్లు తిరుపతి జిల్లా బేస్ బాల్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు సోము రవికుమార్, సాంబశివరావు తెలిపారు. బాలబాలికలకు విడివిడిగా ఎంపిక ప్రక్రియను నిర్వహించినట్లు తెలిపారు. వీరిలో ప్రతిభ కనబరచిన బాలురు 18 మంది, బాలికలు 18 మందితో జిల్లా జట్లను ఎంపిక చేసినట్లు తెలిపారు. ఎంపికై న జట్లు ఈ నెల 12 నుంచి 14వ తేదీ వరకు సత్యసాయి జిల్లా, పుట్టపర్తిలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి బేస్ బాల్ పోటీల్లో జిల్లా తరఫున పాల్గొననున్నట్లు పేర్కొన్నారు. జట్టు ఎంపిక కమిటీ సభ్యులుగా రామకృష్ణ, సత్య, లోకనాథం, దశరథ, అమ్ములు, విద్యాలత, ప్రమీల, ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులుగా పీడీలు సురేష్, రూపలత వ్యవహరించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం మురళి, ఇన్చార్జ్ హెచ్ఎం సుభాష్చంద్రదాస్, సీనియర్ క్రీడాకారులు డేవిడ్, హేంబాబులు పాల్గొన్నట్లు పేర్కొన్నారు. ఇంటి పట్టాల పంపిణీ తిరుపతి అర్బన్: విధి నిర్వహణలో వీరమరణం పొందిన అటవీశాఖ అధికారుల కుటుంబాలకు 13 ఏళ్ల తర్వాత కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్ వారికి అండగా నిలిశారు. మంగళవారం కలెక్టరేట్లో వారికి ఇంటి పట్టాలను అందించారు. వివరాల్లోకి వెళితే.. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకునే క్రమంలో విధి నిర్వహణలో ఉన్న ఇద్దరు అధికారులు ప్రాణాలు కోల్పోయారు. 2013లో శేషాచలం కొండల్లో జరిగిన ఈ ఘటనలో డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ ఎన్ఆర్.శ్రీధర్, అలాగే అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఎన్.డేవిడ్ కరుణాకరన్ ప్రాణాలు కోల్పోయారు. ఆ రెండు కుటుంబాలకు ప్రభుత్వం ఇచ్చిన ఇంటిపట్టా భూమి న్యాయపరమైన వివాదాల్లో చిక్కుకోవడంతో ఆ కేటాయింపులు అలానే నిలిచిపోయాయి. ఇటీవల కాలంలో డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ ఎన్ఆర్.శ్రీధర్ సతీమణి ఇందిర, అలాగే అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఎన్.డేవిడ్ కరుణాకరన్ సతీమణి ఎన్.హెలెన్ మేరీ తమ సమస్యను కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో కలెక్టరేట్ ప్రత్యేక శ్రద్ధతో ఆ సమస్యకు పరిష్కారం చూపించింది. వారి ఇంటి స్థలానికి సంబంధించిన ఇంటి పట్టాను మంగళవారం కలెక్టరేట్లో వారికి అందించారు. -
పెన్షన్.. టెన్షన్
కొత్త పింఛన్ల దరఖాస్తుకు 16 వరకే గడువు తిరుపతి అర్బన్: కొత్త పింఛన్ దరఖాస్తుల గడువు సమీపిస్తుండడంతో అర్హులైన వారిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన రెండున్నరేళ్ల తర్వాత కొత్త పింఛన్ల దరఖాస్తుకు అవకాశం కల్పించింది. సచివాలయాల్లో ఈ నెల 7 నుంచి 16వ తేదీ వరకు మాత్రమే గడువు విదించింది. కేవలం పది రోజులు సమయం ఉండడం.. అందులో మూడు రోజులు సెలవులు మినహాయిస్తే ఏడు రోజులు మాత్రమే ఉంది. ఇప్పటికే రెండు రోజులు గడిచిపోయింది. ఇక ఐదు రోజులు మాత్రమే అవకాశం ఉంది. జిల్లాలో 30 వేల నుంచి 35 వేల మంది దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. మరో వైపు దరఖాస్తు సమయంలో ఆధార్–మొబైల్‌కు అనుసంధానం చేసి ఉండాలి.. లేదంటే ఓటీపీ చెప్పకపోవడంతో పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి ముందస్తుగా జాగ్రత్తులు తీసుకోవాల్సి ఉంది. తొలి రోజు నుంచే సర్వర్ సమస్యలు కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి తొలి రోజు నుంచే సర్వర్ మొరాయించడంతో దరఖాస్తుదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సోమవారం జిల్లా వ్యాప్తంగా సర్వర్ సమస్యలు చోటుచేసుకోవడంతో 2,669 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. రెండో రోజు వివిధ సమస్యల కారణంగా 735 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. సెలవు రోజులు మినహాయిస్తే మిగిలిన రోజుల్లో సర్వర్ సమస్యలు లేకుండా చూడాలని పలువురు కోరుతున్నారు. సచివాలయ సిబ్బంది అందుబాటులో ఉండేనా? పలువురు సచివాలయ ఉద్యోగులు బీఎల్వోలుగా పనిచేస్తున్న క్రమంలో వారు ఇంటింటా సర్వే, పోలింగ్ బూత్‌ల పరిశీలన, ఇతర సర్వేల పేరుతో సచివాలయంలో అందుబాటులో ఉండడం లేదు. ఈ క్రమంలో సచివాలయ ఉద్యోగులను ఈ నెల 16వ తేదీ వరకు సచివాలయంలో అందుబాటులో ఉంచాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. -
ఇంటి పట్టాల పంపిణీ
విధి నిర్వహణలో వీరమరణం పొందిన అటవీశాఖ అధికారుల కుటుంబాలకు కలెక్టర్ ఇంటి పట్టాలు పంపిణీ చేశారు. బుధవారం శ్రీ 9 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026శెట్టిపల్లి భూ సమస్యకు చంద్ర గ్రహణం పట్టుకుంది. గత ప్రభుత్వ క్రెడిట్‌ని చోరీ చేసేందుకు బాబు సర్కార్ ఇటీవల శెట్టిపల్లి భూ బాధితులకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేసి చేతులు దులుపుకుంది. అయితే లబ్ధిదారుల ప్లాటు ఎక్కడన్నది కనుగొనే పరిస్థితి ఇప్పట్లో కనిపించేలా లేదు. వెంచర్లను అభివృద్ధి చేయాలంటే తుడా కనీసం రూ.100 కోట్లు ఖర్చు పెట్టాలి. ప్రస్తుతం అంత డబ్బు ఖర్చు పెట్టే పరిస్థితి తుడాకు లేకపోవడంతో శెట్టిపల్లి భూ సమస్య ఎక్కడ వేసినగొంగళి అక్కడే అన్న చందంగా మారింది. ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని వచ్చే సార్వత్రిక ఎన్నికల వరకు సాగదీసేందుకు యత్నిస్తోందని లబ్ధిదారులు వాపోతున్నారు. లబ్ధిదారులకు కేటాయించే శెట్టిపల్లి భూమి చెప్పింది ఎక్కువవెంచర్ల అభివృద్ధి లెనట్టే శెట్టిపల్లి లబ్ధిదారులకు కేటాయించిన ఫ్లాట్స్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను మాత్రమే చేసిన కూటమి ప్రభుత్వం వెంచర్లను అభివృద్ధి చేసి ప్లాట్లను చూపించే ప్రక్రియ ఇప్పట్లో పూర్తిచేసేలా కనిపించడం లేదు. స్థలాలు రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్లాట్లను యజమానులు ఇది నాది అని చూసుకునే ఆశ ఇప్పట్లో తీరేలా లేదు. ముళ్లపదల్లోనే ప్లాట్లు ఉండడంతో భూ సమస్య ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉంది. వెంటనే ప్లాట్లను అభివృద్ధి చేసి తమకు అప్పగించాలని లబ్ధిదారులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఇలానే నిర్లక్ష్యం చేస్తే సహించబోమని హెచ్చరిస్తున్నారు. తిరుపతి తుడా : శెట్టిపల్లి భూ సమస్య ఏడు దశాబ్దాల నాటిది. 636 ఎకరాల భూమి వివిధ కారణాలతో అన్ సెటిల్మెంట్గానే మిగిలిపోయింది. స్థానిక రైతులు, ప్రైవేట్ వ్యక్తుల ద్వారా కొనుగోలు చేసిన ప్లాట్లు అలాగే ఉండిపోయాయి. ఇలా నాటి నుంచి ఆ భూములపై రైతులకు ఎలాంటి హక్కులు కల్పించకుండా అన్ సెటిల్మెంట్ గానే ప్రభుత్వాలు పరిగణిస్తూ వచ్చాయి. 2019లో వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడంతో స్థానిక భూ బాధితులు నాటి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్ భూమన అభినయరెడ్డిని కలిసి సమస్యను వివరించారు. నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో చర్చలు జరిపి, లబ్ధిదారులను ఒప్పించి, లీగల్ సమస్యలను అధిగమించేందుకు దాదాపు రెండేళ్లు పట్టింది. ఈ క్రమంలో 2023 డిసెంబర్ 15న రాష్ట్ర క్యాబినెట్ శెట్టిపల్లె భూసమస్యకు పరిష్కారం చూపుతూ ఉత్తర్వులు జారీచేసింది. ఉన్న భూముల్లో వ్యవసాయ రైతులకు 30 శాతం (ప్రభుత్వానికి మిగిలేది 70 శాతం), లే అవుట్ల ద్వారా ఇళ్ల స్థలాలు కొనుగోలు చేసిన వారికి 50 శాతం (ప్రభుత్వానికి మిగిలేది 50 శాతం) గా నిర్ణయించింది. రికార్డులను పరిశీలించి అంతే వేగంగా 2024 ఫిబ్రవరిలో లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన భూ హక్కులను కల్పిస్తూ ప్రొసీడింగ్స్‌ను అందజేశారు. ఇంతలో ఎన్నికల కోడ్ రావడంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆగింది. మిగిలిన ప్రక్రియలన్నీ పూర్తిగా గత ప్రభుత్వ హయాంలోనే పరిష్కరిం చేశారు. క్రెడిట్ చోరీకి యత్నం గత ప్రభుత్వ హాయంలో శెట్టిపల్లె భూ సమస్యకు దాదాపు పరిష్కారం చూపేశారు. అప్పటికే 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు శెట్టిపల్లె భూ సమస్యను పరిష్కరించేందుకు ఏనాడూ ముందుకు రాలేదు. ప్రతి ఎన్నికల ముందు హడావిడిగా ప్రకటనలు చేయడం ఆపై వాటిని విస్మరించడం బాబు ప్రభుత్వానికి పరిపాటిగా మారింది. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వనప్పటికే దాదాపు పూర్తయిన ఈ సమస్యను తానే పరిష్కరిస్తున్నట్లు మరో క్యాబినెట్ తీర్మానం చేయించారు. గత ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం, ప్రొసీడింగ్స్ ఆధారంగా ప్లాట్స్ కొనుగోలు చేసిన యజమానులకు రిజిస్ట్రేషన్ లను చేపట్టింది. ఇక ఈ సమస్యను అక్కడితో వదిలేసి చేతులు దులుపుకుంది. రైతులకు సంబంధించిన మరో 22 ఎకరాల భూ సమస్యను పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. శెట్టిపల్లికి చంద్ర గ్రహణం రూ.100 కోట్లు అవసరం శెట్టిపల్లి లబ్ధిదారులకు దాదాపు 60 ఎకరాల్లో నాలుగు వెంచర్లను వేశారు. ఈ వెంచర్లు కాగితాలకే పరిమితమయ్యాయి. ఈ వెంచర్లలో ఫ్లాట్లు విభజన రోడ్లు, యూడీఎస్, కాలువలు అభివృద్ధి చేయాలంటే తుడా కనీసం రూ.100 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది. ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితిలో తుడా లేకపోవడంతో ఇప్పట్లో వెంచర్లు అభివృద్ధి చేసే అవకాశం ఎక్కడా కనిపించడం లేదు. టౌన్షిప్ నిర్మాణం కోసం తుడాకు కేటాయించిన దాదాపు 90 ఎకరాలను అభివృద్ధి చేసి, వాటిని విక్రయించాలంటే కనీసం ఏడాదన్నర పడుతుంది. అలా విక్రయాల ద్వారా వచ్చిన డబ్బుతోనే వెంచర్లను అభివృద్ధి చేసి ఫ్లాట్లు చూపించే అవకాశం ఉంటుంది. అంతకుమించి తుడాకు అభివృద్ధి చేసేందుకు ఏ అవకాశం లేదు. దీంతో ప్లాట్లు చూసే అవకాశం లబ్ధిదారులకు ఇప్పట్లో లేనట్టే. వచ్చే సార్వత్రిక ఎన్నికల ముందు శెట్టిపల్లి ఫ్లాట్లను అభివృద్ధి చేసేందుకు హడావిడి చేసి లబ్ధి పొందాలని కూటమి ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది -
ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్యచౌదరి, ఆలయ అర్చకులు, అధికారులు, సిబ్బంది ఆలయ శుద్ధి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదనపు ఈవో మీడియాతో మాట్లాడుతూ సెప్టెంబర్ 15 నుంచి 23వ తేదీ వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగనున్నాయని, ఇందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ పూర్తి చేసినట్లు తెలిపారు. బ్రహ్మోత్సవాలు, ఉగాది, ఆణివార ఆస్థానం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఆలయంలోని ఆనందనిలయం మొదలుకొని బంగారువాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప దేవాలయాలు, ప్రసాదాల పోటు, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పుతోపాటు పూజాసామగ్రిని శుద్ధి చేసినట్టు తెలిపా రు. కాగా, ఆలయంలో ఉదయం 6 నుంచి 10 గంటల వరకు శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహించారు. ఆ సమయంలో స్వామివారి మూలవిరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పి వేశారు. శుద్ధి పూర్తయిన తర్వాత నామకోపు, చూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్యం కార్యక్రమాలను నిర్వహించారు. ఆ తరువాత భక్తులను దర్శనానికి అనుమతించారు. పలువురు బోర్డు సభ్యులు, సీవీఎస్వో మురళీకృష్ణ, డిప్యూటీ ఈవో భాస్కర్ పాల్గొన్నారు. -
పది విద్యార్థులపై ప్రత్యేక దృష్టి
శ్రీకాళహస్తి రూరల్ : పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ప్రతి పాఠశాలలో వందశాతం ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా ఉపాధ్యాయులు పనిచేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి కె.వి.ఎన్. కుమార్ అన్నారు. ప్రతి ఉపాధ్యాయుడు విద్యార్థులకు తగిన అవగాహన కల్పిస్తూ, ఆయా సబ్జెక్టుల్లో మెరుగైన మార్కులు సాధించేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. మంగళవారం శ్రీకాళహస్తి పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాలలో సబ్జెక్టుల వారీగా శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. వరదయ్యపాలెం, బీఎన్‌కండ్రిగ, శ్రీకాళహస్తి, తొట్టంబేడు, కె.వి.బి.పురం మండలాలకు చెందిన ఉపాధ్యాయులకు పదవ తరగతి విద్యార్థులు మెరుగైన మార్కులు సాధించేందుకు అనుసరించాల్సిన మెలకువలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా బ్లూప్రింట్, మిషన్ మార్చి–2027 తదితర అంశాలపై సబ్జెక్టు నిపుణులు ఉపాధ్యాయులకు వివరణాత్మకంగా శిక్షణ ఇచ్చారు. విద్యార్థుల సామర్థ్యాలను గుర్తించి, వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి, ప్రతి విద్యార్థి ఉత్తీర్ణత సాధించేలా కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఎంఈవో బాలయ్య, పాఠశాల ప్రధానోపాధ్యాయులు తీగల వెంకటయ్య, విషయం నిపుణులు యువశ్రీ మురళి, మూర్తి, మునీశ్వరరెడ్డి, రవి, రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ప్రతిపక్షం గొంతు నొక్కేందుకే దాడులు
తిరుపతి మంగళం : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతిపక్షం గొంతునొక్కేందుకు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై టీడీపీ గూండాలు దాడులకు తెగబడుతున్నారని చిత్తూరు, తిరుపతి జిల్లాల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రామకుప్పం మండలం, పెద్దూరు ఎంపీటీసీ వెంకటరమణారెడ్డిపై టీడీపీ గూండాలు దాడి చేసి కారు అద్దాలు పగులగొట్టి విధ్వంసం సృష్టించడాన్ని ఆయన ఖండించారు. తిరుపతి పద్మావతిపురంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీల ప్రకారం ప్రజలకు సంక్షేమ పథకాలను అందించడంలో, రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయడంలో చంద్రబాబు శ్రద్ద చూపడం లేదన్నారు. ఎంతసేపు వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్.జగన్మోహన్రెడ్డిని దూషించడం, పార్టీ శ్రేణులపై దాడులకు తెగబడడం, అక్రమ కేసులు బనాయించి జైళ్లకు పంపడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంలో టీడీపీ గూండాలు రెచ్చిపోతున్నారని, కుప్పంలో వైఎస్సార్సీపీ సమన్వయకర్త, ఎమ్మెల్సీ భరత్, జిల్లా పరిషత్ చైర్మన్లు నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారని తెలిపారు. ఆ సమావేశానికి వెళ్లి వస్తున్న తమ పార్టీ ఎంపీటీసీ వెంకటరమణారెడ్డిపై దాడికి పాల్పడ్డారని తెలిపారు. కుప్పంలోనే టీడీపీ గూండాలు చేస్తున్న అరాచకాలు, దాడులను అదుపుచేయాల్సిన చంద్రబాబు చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. కూటమి బెదిరింపులు, దాడులు, అక్రమ కేసులకు వైఎస్సార్సీపీలో భయపడేవాళ్లెవ్వరూ లేరని హెచ్చరించారు. మీరు ఎన్ని దాడులు చేసినా ప్రజావ్యతిరేక విధానాలపై వైఎస్సార్సీపీ ప్రజల పక్షాన నిలబడి ఉద్యమ పోరాటాలు చేస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. కుప్పంలో రెచ్చిపోతున్న టీడీపీ గూండాలు -
ప్రజలంటే వెటకారం!
సొంతూరిపై మమకారం.. తిరుపతి అర్బన్: సీఎం చంద్రబాబునాయుడు సొంత మండలమైన చంద్రగిరికి జెడ్పీ కార్యాలయాన్ని కేటాయించారు. సాధారణంగా ఏ జిల్లాలో అయినా జిల్లా కేంద్రంలోనే జెడ్పీ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తుంటారు. జిల్లా కేంద్రం తిరుపతిలో అన్ని కార్యాలయాలు ఉంటున్న తరుణంలో జెడ్పీ కార్యాలయాన్ని కూడా తిరుపతిలో ఏర్పాటు చేస్తారని అంతా భావించారు. కానీ అందుకు భిన్నంగా సీఎం చంద్రబాబునాయుడు తమ సొంత మండలం చంద్రగిరిలో జెడ్పీ కార్యాలయం ఏర్పాటు చేయడంపై పలు విమర్శలు ఎక్కుపెడుతున్నారు. అందరికీ సౌకర్యవంతంగా ఉండేందుకు జిల్లా కేంద్రమైన తిరుపతిలో లేదా జిల్లాకు మధ్య భాగంగా ఉన్న ఏర్పేడు, రేణిగుంట, శ్రీకాళహస్తి ప్రాంతాల్లో జెడ్పీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి ఉంటే బాగుండేదని చెబుతున్నారు. సీఎం చంద్రబాబునాయుడు జిల్లా ప్రజల సౌకర్యాన్ని పట్టించుకోకుండా తన సొంత మండలంలో జెడ్పీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడంపై జిల్లా వాసులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చంద్రగిరి నుంచే పాలన జిల్లా ప్రజాపరిషత్ కార్యాలయాన్ని చంద్రగిరి ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు పనులు చకచకా సాగుతున్నాయి. ఈ నెల 24తో ఉమ్మడి చిత్తూరు జిల్లా జెడ్పీ పాలకవర్గం గడువు ముగియనుంది. దీంతో చిత్తూరు జిల్లా పరిషత్‌ను మూడు విభాగాలుగా విభజించారు. ఇందులో చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లా(మదనపల్లిలో)గా విభజించి జెడ్పీ సీఈవోలు, డిప్యూటీ సీఈవోలు, ఇతర ఉద్యోగుల విభజన ప్రక్రియ చేపట్టారు. ఈ నెల 25 నుంచి చంద్రగిరి నుంచే జెడ్పీ పాలన సాగించడానికి అధికారులు నిర్ణయించారు. ఇది తగునా బాబూ? 24 లక్షల జనాభా కలిగిన తిరుపతి జిల్లా ఎంతో విశాలంగా ఉంది. మూడు రెవెన్యూ డివిజన్లు, 36 మండలాలు, తిరుపతి, శ్రీకాళహస్తి, చంద్రగిరి, రైల్వేకోడూరు, సత్యవేడు, సూళ్లూరుపేట నియోజకవర్గాలు పూర్తిగా.. వెంకటగిరి, నగరి, గూడూరు నియోజకవర్గాలు పాక్షికంగా తిరుపతి జిల్లాలో ఉన్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకుని జెడ్పీ కార్యాలయాన్ని కేటాయించే బాగుండేదనే వాదన బలంగా వినిపిస్తోంది. వీటినేటినీ పట్టించుకోకుండా సీఎం చంద్రబాబు తన స్వార్థ రాజకీయాల కోసం జెడ్పీ కార్యాలాయన్ని తన సొంత మండలానికి కేటాయించారని జిల్లా ప్రజలు విమర్శిస్తున్నారు.జెడ్పీ విభజన తర్వాత స్థానిక ఎన్నికలు జెడ్పీ విభజన తర్వాత స్థానిక సంస్థ ఎన్నికల్లోకి వెళ్లడానికి సర్కార్ రంగం సిద్ధం చేస్తోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 65 జెడ్పీటీసీలు ఉండేవి. అయితే జిల్లా పునర్విభజన నేపథ్యంలో తిరుపతి జిల్లాలో 36 మండలాలు ఉన్నప్పటికీ తిరుపతి కార్పొరేషన్‌ను మినాహాయిస్తే మిగిలిన 35 మండలాల్లో జెడ్పీటీసీ ఎన్నికలు చేపట్టనున్నారు. అలాగే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 877 ఎంపీటీసీలు ఉండేవి. తిరుపతి జిల్లాను పరిశీలిస్తే 253 ఎంపీటీసీలకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తంగా స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని హడావుడిగా జెడ్పీల విభజన జరిగినట్లు చర్చసాగుతుంది. తిరుపతి జెడ్పీ చైర్మన్.. రిజర్వేషన్ ఎవరికో? జెడ్పీ విభజన ప్రక్రియ తుది దశకు చేరుకున్న నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా జెడ్పీ చైర్మన్ బీసీ సామాజిక వర్గానికి కేటాయించారు. ఈ సారి ఎవరికి కేటాయిస్తారనే చర్చ జిల్లాలో జోరుగా సాగుతోంది. ఎవరికి వారు తమ కమ్యూనిటీకే జెడ్పీ చైర్మన్ గిరి దక్కుతుందని ఆయా వర్గాలకు చెందిన వారు చర్చించుకంఉటున్నారు. -
రాష్ట్ర స్థాయి యోగాసన పోటీలకు ఎంపిక
చిట్వేలి: స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు మంగళవారం మదనపల్లిలో జరిగిన జిల్లా స్థాయి యోగాసన పోటీల్లో పాల్గొని విశేష ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై నట్లు ఫిజికల్ డైరెక్టర్ రమాదేవి తెలిపారు. పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న సింధు, దిలీప్, సమద్, ఏడో తరగతి విద్యార్థులు లక్ష్మీనారాయణ, లాస్యకుమార్, శివనందు, ఎనిమిదో తరగతి చదువుతున్న హర్షవర్దన్, తొమ్మిదో తరగతి చదువుతున్న తనూజ, గ్రీస్మిత సాయి యోగాసన జిల్లా స్థాయి పోటీల్లో ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించినట్టు వెల్లడించారు. యోగాసన స్టేట్ మీట్‌కు ఎంపికై న విద్యార్థినీ విద్యార్థులను ఇన్చార్జ్ హెడ్మాస్టర్ సోఫియా అభినందించారు. -
టీటీడీకి రూ.10 లక్షల విరాళం
తిరుమల: టీటీడీ శ్రీవేంకటేశ్వర గో సంరక్షణ ట్రస్టుకు మంగళవారం టీటీడీ బోర్డు సభ్యులు దర్శన్ సతీమణి యశోద దర్శన్ రూ.10 లక్షలు విరాళంగా అందించారు. ఈ మేరకు దాతలు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్యచౌదరికి విరాళం డీడీని అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈవో డాక్టర్ శరత్ పాల్గొన్నారు. బంగారు ఆభరణాల అప్పగింత తిరుపతి అన్నమయ్యసర్కిల్: తిరుమలకు వెళ్తున్న తమిళనాడుకు చెందిన భక్తుడు పి.కార్తికేయన్సోమవారం సాయంత్రం 5 గంటల సమయంలో చెక్‌పాయింట్ వద్ద తన బ్యాగును పొరపాటున మరిచిపోయి వెళ్లారు. వెంటనే సిబ్బంది బ్యాగును గుర్తించి, అందులో లభించిన వివరాల ఆధారంగా భక్తుడిని సంప్రదించి అలిపిరి చెక్‌పాయింట్ వద్దకు రావాలని సమాచారం అందించారు. ఆ మేరకు చేరుకున్న భక్తుడు బ్యాగులోని వస్తువులను గుర్తించి ధృవీకరించిన అనంతరం బ్యాగును సురక్షితంగా ఆయనకు అప్పగించారు. బ్యాగులో రూ.10,900 నగదుతో పాటు రెండు గాజులు, ఒక బంగారు గొలుసు, రెండు బంగారు ఉంగరాలు ఉన్నాయి. వీటి విలువ సుమారు రూ.5 లక్షలు ఉంటుందని టీటీడీ సెక్టార్–5 ఏవీఎస్వో రమేష్ తెలిపారు. విజిలెన్స్ అధికారులు, సిబ్బంది చూపిన అప్రమత్తత, నిజాయితీతో విలువైన వస్తువులను తిరిగి అప్పగించడంతో భక్తుడు కృతజ్ఞతలు తెలిపారు. వృద్ధురాలి హత్య – ప్రత్యేక బృందాలతో దర్యాప్తు ముమ్మరం రైల్వేకోడూరు: రైల్వేకోడూరు పట్టణంలోని వినాయక నగర్లో రాజుపాళెం మంగమ్మ (70) అనే వృద్ధురాలు హత్యకు గురైన ఘటనపై మంగళవారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతురాలు ఒంటరిగా నివసిస్తున్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. మృతురాలి వద్ద ఉండాల్సిన సుమారు నాలుగు తులాల బంగారు ఆభరణాలు, చెవి దిద్దులు, ఉంగరం, చంద్రముఖి మోడల్ గొలుసు కనిపించకపోవడంతో బంగారు ఆభరణాల కోసం హత్య జరిగి ఉండవచ్చనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిందితులను త్వరితగతిన గుర్తించి అరెస్టు చేయడంతోపాటు చోరీకి గురైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకునేందుకు రెండు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్టు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. వ్యభిచార గృహంపై దాడి తిరుపతి క్రైం: నగరంలోని ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు వచ్చిన సమాచారంతో పోలీసులు మంగళవారం ఓ లాడ్జీపై దాడి చేసి కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల మేరకు.. శ్రీసాయి లక్ష్మి లాడ్జీలో వ్యభిచార కార్యకలాపాలు జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం అందడంతో బుధవారం మధ్యాహ్నం 12.15 నుంచి 1.45 గంటల మధ్య ఈస్ట్ ఇన్‌న్‌స్పెక్టర్, ఈస్ట్ డబ్ల్యూఎస్ఐ సుమతి, సిబ్బంది కలిసి దాడి చేశారు. ఈ సందర్భంగా లాడ్జీలోని రూమ్ నం.201లో ఓ మహిళ, వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో శ్రీనివాసులు, అతని భార్య సుకన్య వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు, లాడ్జీ మేనేజర్ కూడా ఇందులో పాత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పట్టుబడిన వారిని పోలీస్ స్టేషన్‌న్‌కు తరలించి సంబంధిత చట్ట నిబంధనల ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, శ్రీనివాసులుపై గతంలోనూ వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో కేసులు నమోదైనట్లు విచారణలో తేలింది. 2016లో ధర్మస్థల పోలీస్ స్టేషన్లో నమోదైన ఓ కేసులో కోర్టుకు హాజరుకాకపోవడంతో 2026 జూన్ 30న కర్ణాటక పోలీసులు అతడిని అరెస్ట్ చేసి తీసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం బెయిల్‌పై విడుదలైన తర్వాత కూడా నేర కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు సమాచారం ఉందన్నారు. అతడిపై చిత్తూరు తాలూకా పోలీస్ స్టేషనన్లోనూ కేసు నమోదైనట్లు పేర్కొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఐఐటీ విద్యార్థికి తీవ్ర గాయాలు
నాయుడుపేటటౌన్: రోడ్డు ప్రమాదంలో ఐఐటీ విద్యార్థి తీవ్రంగా గాయపడిన సంఘటన మంగళవారం మండలంలోని అయ్యప్పరెడ్డిపాళెం క్రాస్ రోడ్డు చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు.. బుచ్చిరెడ్డిపాళెంకు చెందిన పవన్‌కుమార్ చైన్నెలో ఐఐటీ చదువుతున్నాడు. మంగళవారం చైన్నె నుంచి తన బైక్‌పై స్వగ్రామానికి వస్తుండగా మార్గమఽధ్యంలో అయ్యప్పరెడ్డిపాళెం గ్రామ జాతీయ రహదారి కూడలి వద్ద ఓ యాచకుడు అడ్డు రావడంతో బైక్ అతనిని ఢీకొంది. ఈ ప్రమాదంలో పవన్ కుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. అలాగే యాచకుడు చెంచయ్యకూ గాయాలయ్యాయి. ఇద్దరినీ 108 అంబులెన్సులో స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం పవన్‌ను నెల్లూరు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆక్రమించినోడిదే భూమి!
వరదయ్యపాళెం: మండలంలోని చిన్న పాండూరు పంచాయతీ వీకేఆర్‌వై కాలనీ భూ ఆక్రమణలకు అడ్డాగా మారింది. ఈ పరిసర ప్రాంతాల్లో విరివిగా పరిశ్రమలు రావడంతో అక్కడ పొలానికి ఎక్కడలేని గిరాకీ ఏర్పడింది. ప్రభుత్వ డీకేటీ భూమి ఎకరం కోట్లకు పడగలెత్తింది. ఊహించని విధంగా ఈ ప్రాంతంలో భూమి ధరలకు ఒక్కసారిగా రెక్కలు రావడంతో అక్రమార్కుల కళ్లు ఆ భూములపై పడ్డాయి. ఇన్నాళ్లు వీకేఆర్‌వై కాలనీలో గిరిజనులకు కేటాయించిన ఇంటి స్థలాలను దర్జాగా కొనుగోళ్ల పేరుతో ఆక్రమించుకున్నారు. తాజాగా సమీపంలోని పాదిరికుప్పం రెవెన్యూలో గల 1,056 ఎకరాల శోత్రియం భూములపై అక్రమార్కులు పాగా వేస్తున్నారు. ఆ దిశగా గత నాలుగు రోజులుగా పట్టపగలే శోత్రియ భూముల్లో ఓ వైపు పొలం దన్నకాలు చేపట్టి ఆక్రమణ దిశగా పావులు కదుపుతున్నారు. దున్నిన పొలం సత్యవేడు–చిన్న పాండూరు ప్రధాన రోడ్డు మార్గానికి ఆనుకుని ఉండడంతో ఆ భూములను కబ్జా చేసేందుకు తెరవెనుక కొందరు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఇప్పటికే కొంతమేరకు షికారీలు ఆక్రమించుకుని, ఆ భూమి తమ పూర్వీకులకు చెందినదిగా బుకాయిస్తూ గుడిసెలు ఏర్పాటు చేసుకున్నారు. ఇలాగే కొనసాగితే శోత్రియ భూములు పూర్తిగా అక్రమార్కుల పాలయ్యే ప్రమాదం ఉందని స్థానికులు చర్చించుకుంటున్నారు. కనిపించలేదా? శోత్రియ భూములు ఆక్రమణకు గురవుతున్నా తమకేమీపట్టనట్లు రెవెన్యూ యంత్రాంగం వ్యవహరిస్తోంది. పరిశ్రమల ఏర్పాటుకు ఎంతో అనువైన ప్రాంతంగా ఉన్న శోత్రియ భూములు విచ్చలవిడిగా ఆక్రమణలకు గురవుతున్నాయి. ఓ వైపు దుక్కి దున్నకాలు, మరో వైపు షికారీల గుడిసెలు.. ఇలా ఆక్రమించినోడిదే భూమి అన్న చందాన అక్రమార్కులు చెలరేగిపోతుఆన్నరు. ఎంతో విలువైన భూములు అన్యాక్రాంతమవుతుంటే నియంత్రించాల్సిన రెవెన్యూశాఖ చోద్యం చూడడం విమర్శలకు తావిస్తోంది. ప్రధాన రోడ్డుకు రెండు వైపులా ఆక్రమణలు చిన్న పాండూరు–సత్యవేడు ప్రధాన రోడ్డు మార్గంలోని వీకేఆర్‌వై కాలనీ సమీపంలో రోడ్డుకు తూర్పు, పడమర రెండు వైపుల సుమారు 100 ఎకరాలకు పైగా గత కొద్ది రోజులుగా దుక్కి దున్నకాలు చేపడుతూ ఆక్రమణలకు సిద్ధం చేసుకుంటున్నారు. అంతేగాక దుక్కి దున్నకాలు చేపట్టిన ఆక్రమిత భూమిలో పంటల సాగుకు సమాయత్తమవుతున్నారు. ఎకరా రూ.10కోట్లకు పైగా విలువ కలిగిన ఈ ప్రాంతంలో ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములు ఆక్రమణ జరుగుతున్నా కట్టడి చేయాల్సిన రెవెన్యూ యంత్రాంగం మిన్నకుండిపోవడం గమనార్హం. శోత్రియం భూముల్లో దొంగలు పడ్డారు -
భక్తులకు సజావుగా దర్శన భాగ్యం
తిరుపతి అన్నమయ్యసర్కిల్: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈ నెల 15 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో భక్తలకు సజావుగా దర్శన భాగ్యం కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు కలెక్టర్ వెంకటేశ్వర్, అదనపు ఈవో వెంకయ్యచౌదరి వెల్లడించారు. మంగళవారం సాయంత్రం అలిపిరి సమీపంలోని భూదేవి కాంప్లెక్స్‌లో శ్రీవారి సాలకట్ల, నవరాత్రి బ్రహ్మోత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై ఎస్పీ సుబ్బారాయుడు, టీటీడీ అదనపు ఈవో, సీవీఎస్వో మురళీకృష్ణ, మున్సిపల్ కమిషనర్ జయకృష్ణతో కలసి నిర్వహించిన మీడియా సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ఈ ఏడాది తిరుమల శ్రీవారి సాలకట్ల, నవరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై టీటీడీ ఈవో ఆధ్వర్యంలో సన్నాహక సమావేశాలు నిర్వహించడంతో పాటు క్షేత్ర స్థాయి పరిశీలనలు పూర్తి చేసినట్లు తెలిపారు. బ్రహ్మోత్సవాల తొలి రోజు ముఖ్యమంత్రి తిరుమలలో శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారన్నారు. వాహన రద్దీ నియంత్రణకు తిరుపతి అలిపిరి చెక్‌పాయింట్, జూ పార్క్ సమీపంలోని టీటీడీ స్థలాలు, నెహ్రూ మున్సిపల్ హైస్కూల్ తదితర ప్రాంతాల్లో పార్కింగ్, హోల్డింగ్ పాయింట్లను ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు. గరుడ సేవకు తిరుమల, తిరుపతిలో తగిన పార్కింగ్ ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. ఎస్పీ మాట్లాడుతూ రాబోయే వినాయక చవితి ఉత్సవాలు, శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ నెల 19న నిర్వహించనున్న గరుడ సేవ నేపథ్యంలో పోలీస్, రెవెన్యూ శాఖల అధికారులతో సమన్వయంగా ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. సమావేశంలో టీటీడీ జేఈవో డాక్టర్ శరత్, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
విద్యుత్ స్తంభానికి ఢీకొని వ్యక్తి మృతి
గంగాధరనెల్లూరు:మండలంలోని తూగుండ్రం పంచాయతీ బాల య్య కొత్తూరు వద్ద బైక్ అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. వివరాలు.. పాలసముద్రం మండలం రంగాపురం గ్రామానికి చెందిన గుణశేఖర్ మంగళవారం ద్విచక్రవాహనంపై వెళుతుండగా ప్రమాదం జరిగింది. తీవ్రంగా గాయపడిన గుణశేఖర్ గంటకు పైగా రక్తస్రావంతో ప్రమాద స్థలంలోనే పడి ఉన్నాడు. స్థానికులు వెంటనే 108 వాహనానికి సమాచారం అందించినప్పటికీ, సమయానికి రాలేదు. ఆర్తనాదాలు చేస్తున్న క్షతగాత్రుడిని స్థానికులే ఓ ప్రైవేట్ వాహనంలో చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మరణించాడు. సకాలంలో 108 వచ్చి ఉంటే ప్రాణాలు కాపాడి ఉండవచ్చని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. -
అభివృద్ధి పథంలో గ్రంథాలయాలు
తిరుపతి సిటీ: గ్రంథాలయాలు అప్పటికీ, ఇప్పటికీ ఎంతో అభివృద్ధి చెందాయని ఎస్వీ వీసీ టాటా నర్సింగరావు పిలుపునిచ్చారు. ఎస్వీయూలో బ్రిడ్జింగ్ ది డిజిటల్ డివైడ్ టెక్నాలజీ అప్లికేషన్ ఇన్ పబ్లిక్ అండ్ అకడమిక్ లైబ్రరీస్ అనే అంశంపై జరుగతున్న జాతీయ సదస్సు రెండో రోజు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ గ్రంథాలయాలు గతానికి ఇప్పటికీ డిజిటల్, సాంకేతిక పరంగా ఎంతో అభివృద్ధి చెందాయన్నారు. ఢిల్లీ విశ్వవిద్యాలయ గ్రంథాలయ శాస్త్ర ఆచార్యులు ఆర్కె భట్ మాట్లాడుతూ పౌర గ్రంథాలయ యాక్ట్‌లు చాలా ఉన్నాయని, అయితే అవి సమర్థవంతంగా పనిచేయడంలేదని చెప్పారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గురవారెడ్డి ప్రసంగిస్తూ ప్రతి గ్రామంలో పౌర గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసి, ప్రజలలో చదివే అలవాటును పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ మధుసూదన్, సెమినార్ డైరెక్టర్ ఆచార్య శ్రీనివాస రాఘవన్, సెమినార్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆచార్య కే.సురేంద్రబాబు, గ్రంథాలయ శాస్త్ర శాఖాధిపతి ప్రశాంతికుమారి, దేశంలో పలు ప్రాంతాల నుంచి విచ్చేసి గ్రంథాలయాధికారులు, మేథావులు పాల్గొన్నారు. శ్రీవారి దర్శనానికి 24 గంటలు తిరుమల: తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్ శిలాతోరణం వద్దకు చేరుకుంది. సోమవారం అర్ధరాత్రి వరకు 69,440 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 36,255 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.75 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 24 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టంచేసింది. జాప్యం చేయొద్దు తిరుపతి అర్బన్: జాతీయ రహదారికి సంబంధించి భూసేకరణతోపాటు రైతులకు ఇవ్వాల్సిన పరిహారం పంపిణీలో జాప్యం చేయొద్దని కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ సిబ్బందిని ఆదేశించారు. సోమవారం ఆయన కలెక్టరేట్లో జేసీ గోవిందరావుతో కలసి ఆర్డీవోలు, తహసీల్దార్లతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూసేకరణలో సమస్యలు ఉన్నా.. అలాగే పరిహారం విషయంలో ఇబ్బందులు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ప్రధానంగా పుల్లంపేట, ఓబులవారిపల్లి, కోడూరు ప్రాంతాల్లో భూసేకరణ పనుల్లో పెద్ద ఎత్తున జాప్యం జరుగుతోందని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇచ్చిన గడువులోపు భూసేకరణ ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పారు. వేడుకగా గంధోత్సవం తిరుపతి కల్చరల్: కులమతాలకు అతీతంగా ముస్లింలు గురువుల పట్ల అత్యంత భక్తితో గంధోత్సవం నిర్వహించడం ఆనవాయితీ అని, సేవ జీవిత సార్థకతకు మార్గదర్శకమని ఖాదరీ పీఠాధిపతి, ప్రభుత్వ ఖాజీ సయ్యద్‌షఫీ అహ్మద్ఖాదిరి తెలిపారు. ఎస్వీ ఆర్ట్స్ కళాశాల ఎదురుగానున్న దర్గాలో హజ్రత్ ఫీర్ సయ్యద్ అమానుల్లాషా ఖాదరి 80వ గంధోత్సవాన్ని మంగళవారం రాత్రి అత్యంత వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా దర్గాలో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు చేపట్టారు. ఉర్దూ గాయకుల బృందం ఆలపించిన పాటలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో డాక్టర్ నజీర్‌ఖాన్, డాక్టర్ మొహద్దీన్బాషా, డాక్టర్ అమీనుల్లా, ముస్తఫా, కలాం, నవీన్, చాంద్‌బాషా, ఖాదర్‌బాషా, హిమబిందు, దినేష్ సింగ్, నవీన్ సింగ్, ముస్లింలు పాల్గొన్నారు. -
పింఛన్ కోసం పాట్లు
తిరుపతి అర్బన్: చంద్రబాబు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కొత్త పింఛన్ల కోసం వేలాది మంది సచివాలయంతోపాటు మండల, డివిజన్ కార్యాలయాల్లోనే కాకుండా ఏకంగా కలెక్టరేట్లో పీజీఆర్ఎస్కు విచ్చేసి అర్జీలు సమర్పిస్తున్నారు. అందులో ఓ కుటుంబానికి చెందిన భార్యాభర్తలు సోమవారం కలెక్టరేట్లో అధికారులను కలిసి తమ బాధలు ఏకరువు పెట్టారు. మాకు న్యాయం చేయండి అంటూ రెండు చేతులు జోడించి అధికారులను వేడుకున్నారు. ప్రతి గ్రీవెన్స్‌లో అర్జీలు సత్యవేడు మండలం, ఆరంబాకానికి చెందిన రాజాకు రెండు కాళ్లులేవు. దివ్యాంగుడైన అతను రెండేళ్లుగా తన భార్య పుష్పతో కలసి కలెక్టరేట్లో ప్రతి సోమవారం జరిగే గ్రీవెన్స్‌కు విచ్చేస్తున్నారు. సత్యవేడు నుంచి తిరుపతి రావడానికి 80 కి.మీ ప్రయాణించి అర్జీలు సమర్పిస్తున్నారు. వారు సోమవారం కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకుని సంతోషం వ్యక్తం చేశారు. ఆపై కలెక్టరేట్లో అధికారులను కలిసి తమకు న్యాయం చేయాలని ప్రాధేయపడ్డారు. తిరుపతిలో రేషన్ రచ్చ తిరుపతి అర్బన్: ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతి నగరంలో రేషన్ బియ్యం రచ్చ రెండేళ్లుగా కొనసాగుతూనే ఉంది. స్థానికేతరులు డీలర్ల వద్దకెళ్లడం.. వారు ఇవ్వకపోవడం షరామామూలుగా సాగుతోంది. వివరాల్లోకి వెళితే.. బతుకుదెరువు కోసం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు రెండు వేల కుటుంబాలు తిరుపతిలో నివాసముంటున్నాయి. వారిలో చాలా మంది వైట్ రేషన్ కార్డు కలిగిన వారే ఉన్నారు. వీరందరికీ రేషన్ బియ్యం ఇవ్వాల్సిన డీలర్లు సివిల్ సప్లయ్ అధికారులు ఇవ్వలేదంటూ చేతులెత్తేస్తున్నారు. అధికారులనడిగితే డీలర్లు ఎవ్వరూ తమను అడగలేదని అంటున్నారు. ఇటు డీలర్లు, అటు అధికారుల మధ్య కార్డుదారులు బలైపోతున్నారు. ఈ సమస్యకు పరిష్కారం ఎప్పుడు దొరుకుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. -
‘టీటీడీ ఆస్తులను ల్యాండ్‌బ్యాంక్‌గా చూస్తే ఊరుకోం’
తిరుపతి: టీటీడీ ఆస్తులను ల్యాండ్‌బ్యాంక్‌గా చూస్తే ఊరుకునే ప్రసక్తే లేదని మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి హెచ్చరించారు. స్వామివారి ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టవద్దని భూమన స్పష్టం చేశారు. అలాగే గోమాంసానికి అనుమతి ఉన్న ఓ హెటల్‌కు తిరుమలలో పర్మిషన్ ఇవ్వడంపై కూడా భూమన నిలదీశారు. ఇది భక్తుల మనోభావాలను దెబ్బతీయడమేని ఆయన విమర్శించారు. దీనిపై హిందూ సంఘాలంతా కలిసి పోరాడాలని భూమన విజ్ఞప్తి చేశారు. ‘తిరుపతి రూరల్ మండలం లో వందల ఎకరాలు స్థలం ఉంది. అత్యంత విలువైన టిటిడి ఇనామ్ భూమి ఇచ్చింది. 746 జీవో ప్రకారం ఏడు కొండలు టీటీడీ చెందినవి అని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఇచ్చారు. వెలకట్ట లేని 604 సర్వే 1953 వరకు రిజర్వ్ ఫారెస్ట్ లో ఉంది. ఎస్వీ అగ్రికల్చర్ 1999 లో 50 ఎకరాలు స్థలం ఏపీ టూరిజంకు అప్పగించారు. సర్వే..588 ఇనామ్ వాణిజ్య అవసరాలకు లావాదేవీలకు రూ. 3వేల కోట్లు విలువైన స్థలం ఇవ్వడం పై టీటీడీ సమాధానం లేదు. దీనికి రూ. 58 కోట్లు పన్నులు మినహాయింపులు ఇచ్చారు, భక్తులు విశ్వాసానికి, నమ్మకానికి మోసం చేశారుటౌన్ షిప్ కావాలని కోరారో.. అదే స్థలం ముంతాజ్ హోటల్‌కు అప్పగించాలనే కుట్రలో టీటీడీ అధికారులు భాగస్వామ్యం అయ్యారు. టీటీడీ స్థలం వాణిజ్య అవసరాలు అప్పగించే కుట్ర, మూడు దశల్లో చేశారు’ అని పేర్కొన్నారు.‘టెట్ లేకుండా ఉద్యోగాలు ఎలా ఇస్తారు?’ -
కడుపులో బిడ్డ.. చేతిలో మరో పసిబిడ్డతో పోరాటం
తిరుపతి రూరల్: కడుపులో ఏడు నెలల బిడ్డ.. చేతిలో ఒకటిన్నరేళ్ల పసిబిడ్డ.. అయినా భర్త ఉద్యోగం కోసం ఆమె వెనక్కి తగ్గలేదు. కింద కూర్చునే పరిస్థితి లేకపోయినా.. రోజంతా నిల్చునే నిరసన వ్యక్తం చేస్తూ పోరాటం సాగిస్తున్నారు. ఏపీఎస్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయం ఎదుట సోమవారం కనిపించిన ఈ çహృదయవిదారక దృశ్యం చూపరులను కలచివేసింది.ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో విద్యుత్ బిల్ కలెక్టర్ల ఉద్యోగులను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రిలే, నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. భర్త ఉద్యోగం పోయిందని.. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పరిధిలోని బిల్ కలెక్టర్లు, వారి కుటుంబ సభ్యులు 22వ రోజు దీక్షా శిబిరానికి చేరుకుని నిరసన తెలిపారు. ఈ క్రమంలో బిల్ కలెక్టర్ శివన్న భార్య కళావతి ఏడు నెలల గర్భంతో తన ఒకటిన్నరేళ్ల బిడ్డను తీసుకుని దీక్షా శిబిరానికి చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. తన చిన్నారిని ఊయలలో పడుకోబెట్టి ఊపుతూ నినాదాలు మిన్నంటించారు. చదవండి: అక్కా.. నన్ను చంపేస్తారు..! -
ఆప్సీ చైర్మన్‌గా విజయభాస్కర్‌రావు
తిరుపతి సిటీ: రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఇన్చార్జి చైర్మన్‌గా ప్రొఫెసర్ విజయ భాస్కర్ రావు బాధ్యతలు చేపట్టారు. గతంలో రాష్ట్ర ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్‌గా సేవలందిస్తున్న ఆయనను ఆప్సీ చైర్మన్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉన్నత విద్య, పరిశోధన, వాతావరణ శాస్త్రం, రేడియో కమ్యూనికేషన్, అంతరిక్ష సాంకేతిక రంగాల్లో ఆయనకు సుదీర్ఘ అనుభవం ఉంది. ఎస్వీయూ ఫిజిక్స్ విభాగం ప్రొఫెసర్‌గా సుదీర్ఘకాలం పనిచేసిన ఆయన ఉన్నత విద్యారంగంలో పలు ఉన్నత హోదాలలో సేవలందించారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ స్థాయికి చేరుకోవడంపై ఫిజిక్స్ విభాగాధిపతి ప్రొఫెసర్ బీ దేవప్రసాద్‌రాజు హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ఆయన ఆధ్వర్యంలో 150 కి పైగా పరిశోధనా పత్రాలను, 35 మంది పీహెచ్డీ, ఆరుగురు ఎంఫిల్ విద్యార్థులకు పరిశోధనా మార్గదర్శకత్వం అందించారని, 2012, 201లో నిర్వహించిన 104వ ఇండియన్ సైన్‌న్స్ కాంగ్రెస్‌కు ఆర్గనైజింగ్ సెక్రటరీగా వ్యవహరించి తన నిర్వహణ సామర్థ్యాన్ని చాటుకున్నారని కొనియాడారు. -
పుస్తకావిష్కరణ
తిరుపతి కల్చరల్:జ్ఞాన ముక్తి సాధనంగా అన్నమయ్య కు పదార్చన పుస్తకాన్ని వెంకటపతి స్వామి రచించార ని ఎస్వీ వేదిక్ యూనివర్సిటీ వీసీ ఆచార్య రాణి సదాశిమూర్తి తెలిపారు. విశ్వామిత్ర సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో వేంకటపతి స్వామి రచించిన ‘అన్నమయ్యకు పదార్చన’ పుస్తకావిష్కరణ ఆదివారం శ్రీప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయ ఆవరణలో నిర్వహించారు. కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి అన్నమయ్యకు పదార్చన పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఆలిండియా రేడియో మాజీ డైరెక్టర్ మల్లేశ్వరరావు సమన్వ య కర్తగా వ్యవహరించగా ఆచార్య గార్లపాటి దామోదర నాయుడు, రిటైర్డ్ ప్రిన్సిపల్ గాలి గుణశేఖర్, సూ ర్యచంద్ర ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ఏనుగు అంకమ నాయుడు, సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి డాక్టర్ కే.సుబ్రమణ్యం, పరిహార సేవ ఫౌండేషన్ అధ్యక్షుడు డాక్టర్ బి.చక్రపాణి పాల్గొన్నారు. ప్రముఖ గాయకులు మధు సూదన్, ప్రియాంక, డాక్టర్ ఆశాదీపిక, కుమారి రిషిత ఆలపించిన సంకీర్తనలు శ్రోతులను అలరించాయి. -
పులికాట్ సరిహద్దులు తేల్చండి
పులికాట్ సరస్సులో చేపల వివాదానికి సంబంధించి తమిళనాడు–ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మత్స్యకారుల మధ్య తరచూ జరుగుతున్న వివాదాల నేపథ్యంలో సరిహద్దులు తేల్చాలని మత్స్యకారులు పట్టుబట్టారు. ఆరు నెలలుగా క్రమంతప్పకుండా కలెక్టరేట్ గ్రీవెన్స్‌కు వస్తున్నా ఫలితం లేదని వాపోయారు. పులికాట్ సరస్సు ఆధారంగా 17 గ్రామాలకు చెందిన వేలాది మంది మత్స్యకారులు చేపల వేట ఆధారంగా జీవనం సాగిస్తున్నట్లు పేర్కొన్నారు. తమిళనాడు మత్స్యకారులు తమపై దాడులు చేయడంతోపాటు కేసులు పెడుతున్నారని వాపోయారు. ప్రధానంగా మంగోడు, చిన్న మంగోడు, కీర పుదుకుప్పం ప్రాంతాల్లో సరిహద్దు వివాదాలు అధికంగా ఉన్నట్లు వివరించారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. మత్స్యకారుల సంఘం నేతలు ఏే.వాసు, మూర్తి, కే.వాసు, శివలింగం, రాజేంద్రన్, సంజయ్, వినోద్, ఆర్ముగం స్పష్టం చేశారు. -
ధాన్యం నగదు ఇప్పించండి
పీజీఆర్ఎస్కు క్యూ కట్టిన అర్జీదారులు తిరుపతి అర్బన్: గత ఏడాది జూలై, ఆగస్ట్ నెలల్లో 40 మందికి పైగా రైతులు పండించిన వరిధాన్యాన్ని తొట్టంబేడు మండలంలోని పెద్దకన్నలి గ్రామానికి చెందిన ఓ వ్యాపారికి విక్రయించామని, వారం రోజుల్లో ధాన్యం డబ్బులు ఇస్తామని చెప్పిన ఆ వ్యాపారి ఆ తర్వాత వాయిదాలు వేస్తూ వచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి వ్యాపారి సమాధానం చెప్పకపోవడంతో సోమవారం కలెక్టరేట్లో గ్రీవెన్స్‌లో జేసీకి న్యా యం చేయాలని వినతిపత్రాన్ని ఇచ్చామని రైతులు వివరించారు. సుమారుగా రూ.2.2 కోట్లు రైతులకు వ్యాపారి ఇవ్వాల్సి ఉందని వాపోయారు. న్యాయం చేయాలని అధికారులను వేడుకున్నారు. ప్రధానంగా పూడి, యార్లపూడి, సుబ్బానాయుడుకండ్రిగ, వెంకటాపురం, చిట్టత్తూరు, అంజిమేడు, పుల్లూరు తదితర గ్రామాలకు చెందిన రైతులు కన్నీరుపెట్టుకున్నారు. పీజీఆర్ఎస్కు 275 అర్జీలు కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్కు జిల్లా వ్యాప్తంగా మొత్తం 275 అర్జీలు రాగా.. అందులో రెవెన్యూ సమస్యలపైనే 152 అర్జీలు వచ్చినట్టు కలెక్టరేట్ అధికారులు తెలిపారు. ప్రతి అర్జీకి న్యాయం చేయాలని కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ సిబ్బందిని ఆదేశించారు. ఈ మేరకు కలెక్టర్‌తోపాటు జాయింట్ కలెక్టర్ గోవిందరావు, డీఆర్వో నరసింహులు, పలువురు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు అర్జీలు స్వీకరించారు. పనిభారం తగ్గించండి పనిభారం తగ్గించాలంటూ ఆశావర్కర్లు కలెక్టరేట్లో అధికారులకు మొరపెట్టుకున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. తమ విధులకు సంబంధం లేని పనులు అప్పగించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రాత్రి సమయంలో డ్యూటీలను వేయరాదన్నారు. అనంతరం డీఆర్వో నరసింహులకు వినతిపత్రాన్ని అందించారు. ఆశా వర్కర్ల యూనియన్ నేతలు హైమావతి, చాముండేశ్వరి, ధనలక్ష్మి, మారెమ్మ పాల్గొన్నారు. ఇంటిపట్టాలకు భద్రత కల్పించాలంటూ ధర్నా చేస్తున్న గ్రామీణ వాసులు రక్షణ కల్పించండి దశాబద్దాల క్రితం ప్రభుత్వం ఇచ్చిన ఇంటిపట్టాలకు సరైన రికార్డులు లేకపోవడంతో నానా ఇబ్బందులు పడుతున్నామని, వాటికి రక్షణ కల్పించాలని వడమాలపేట మండలంలోని ఎస్బీఆర్పురం, అంబేద్కర్‌కాలనీ, చెంచులక్ష్మి కాలనీకి చెందిన వారు ఆవేదన చెందారు. ఆ మేరకు తమకు న్యాయం చేయాలంటూ కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. 180 మందికి ఇంటి పట్టాలు ఇచ్చినప్పటికీ రికార్డులో నమోదు చేయలేదని వాపోయారు. జరిమానాలు సరికాదు పదేపదే వాహనాల తనిఖీలు చేపట్టడం, చిన్న పొరబాట్లకు భారీ మొత్తంలో జరిమానాలు విధించడం సరికాదని ఆటో అండ్ మోటార్ ట్రాన్స్‌పోర్టు వర్కర్స్ యూనియన్ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఏఐటీయూసీ అధ్యక్ష, కార్యదర్శులు చంద్రశేఖర్‌రెడ్డి, రాధాకృష్ణ మాట్లాడుతూ ఆటోలు, క్యాబ్‌లు, లారీలు, మినీ వ్యాన్లు, అంబులెన్సులకు భారీ ఈ–చలానాలు, తనిఖీల పేరుతో వేధింపులకు గురిచేస్తున్నారని ఆవేదన చెందారు. ఆ మేరకు డీఆర్వోకు వినతిపత్రాన్ని అందించారు. -
బీటెక్ విద్యార్థులకు ఓరియంటేషన్ ప్రోగ్రాం
తిరుపతి రూరల్:శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాల యం ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ పాఠశాలలో 2026 –30 బ్యాచ్ బీటెక్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు సోమవారం ఓరియంటేషన్ ప్రోగ్రాం నిర్వహించారు. బేసిక్ సైన్సెస్ అండ్ హ్యూమానిటీస్ విభాగం ఆధ్వర్యంలో జరిగిన ఈకార్యక్రమంలో విద్యార్థులకు విద్య, కెరీర్, వసతి, పరీక్షలు, ప్లేస్మెంట్లు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. వర్సిటీ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ వి.ఉమా మాట్లాడుతూ విద్యార్థుల వ్యక్తిత్వ వికాసంలో నిర్ణయ సామర్థ్యం, సమస్య పరిష్కార నైపుణ్యాలు కీలకమన్నారు. రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఆర్.ఉషా మాట్లాడుతూ విజయవంతమైన కెరీర్‌కు క్రమశిక్షణ ఎంతో ముఖ్యమని సూచించారు. ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ పాఠశాల డైరెక్టర్ ప్రొఫెసర్ పి.మల్లికార్జున బీటెక్ కోర్సుల పాఠ్య ప్రణాళిక, విద్యార్థుల బాధ్యతలను వివరించారు. ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 7 వరకు నిర్వహించిన మూడు వారాల ఇండక్షన్ ప్రోగ్రామ్ నివేదికను డాక్టర్ ఎన్.రామజ్యోతి సమర్పించారు. ఇంజినీరింగ్ కాలేజీ డైరెక్టర్ ప్రొఫెసర్ పి.మల్లికార్జున, బీఎస్అండ్హెచ్ కో–ఆర్డినేటర్ డాక్టర్ జి.సుప్రియ, డాక్టర్ ఎన్.రామజ్యోతి పాల్గొన్నారు. -
ఉత్తర ప్రదేశ్ సీఎంకు సాదర స్వాగతం, వీడ్కోలు
రేణిగుంట: తిరుపతి, నెల్లూరు జిల్లాల ఒక్కరోజు పర్యటన నిమిత్తం సోమవారం ఉదయం తిరుపతి విమానాశ్రయానికి చేరుకున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు విమానాశ్రయంలో జిల్లా అధికారులు, బీజేపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం హెలికాఫ్టర్‌లో నెల్లూరు జిల్లా వెళ్లి, మళ్లీ సాయంత్రం విమానాశ్రయానికి చేరుకున్నారు. అనంతరం రోడ్డు మార్గాన తిరుమలకు వెళ్లి శ్రీవారి దర్శనానంతరం రాత్రి విమానాశ్రయం నుంచి తిరుగు ప్రయాణం అయ్యారు. స్వాగతం పలికిన వారిలో రాష్ట్ర మంత్రులు సత్యకుమార్‌యాదవ్, నారాయణ, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్, ఎస్పీ ఎల్.సుబ్బారాయుడు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోలా ఆనంద్ ఉన్నారు. జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక శ్రీకాళహస్తి రూరల్: నెల్లూరు జిల్లా, అలూరులోని రామకృష్ణ కళాశాల మైదానంలో జరిగిన ఏపీ 12వ సీనియర్ పురుషుల అంతర్ జిల్లాల బాల్‌బ్యాడ్మింటన్ చాపింయన్ షిప్లో శ్రీకాళహస్తికి చెందిన క్రాంతికుమార్ ప్రతిభ చూపి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ పోటీలు ఈ నెల 4 నుంచి 6వ తేదీ వరకు జరిగాయి. ఈ సందర్భంగా సోమవారం శ్రీకాళహస్తి 1వ పట్టణ సీఐ వెంకటేష్, రూరల్ సీఐ ఇబ్రహీం క్రాంతికుమార్‌ను సత్కరించి అభినందించారు. ఐదు ఇసుక ట్రాక్టర్లు సీజ్ శ్రీకాళహస్తి రూరల్: శ్రీకాళహస్తి రెండో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదు ఇసుక ట్రాక్టర్లను సీజ్ చేసినట్లు సీఐ నాగరాజు తెలిపారు. ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు డీఎస్పీ నరసింహమూర్తి ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి పరిధిలో పోలీసులు సోమవారం ఇసుక, మట్టి అక్రమ రవాణాపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. అందులో భాగంగా సరైన రికార్డులు, డ్రైవింగ్ లైసెన్సు, ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక, వ ట్టి తరలిస్తున్న ఐదు ఇసుక ట్రాక్టర్లను సీజ్ చేసినట్టు సీఐ తెలిపారు. -
కేసుల పరిష్కారానికి సహకరించండి
తిరుపతి లీగల్ : తిరుపతి కోర్టు ఆవరణలో ఈనెల 12వ తేదీన జరగనున్న జాతీయ లోక్ అదాలత్‌లో ఎక్కువ సంఖ్యలో క్రిమినల్ కేసులు పరిష్కారమయ్యేందుకు పోలీసు అధికారులు సహకరించాలని తిరుపతి మూడవ అదనపు జిల్లా జడ్జి, మండల న్యాయ సేవ అధికార సంస్థ చైర్మన్ ఎం.గురునాథ్ సూచించారు. సోమవారం సాయంత్రం తిరుపతి మూడో అదనపు జిల్లా జడ్జి కోర్టు హాల్లో వివిధ పోలీస్ స్టేషన్ల అధికారులతో న్యాయమూర్తి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జడ్జి గురునాథ్ మాట్లాడుతూ రాజీ కాదగిన కేసులను ముందుగా గుర్తించాలన్నారు. కార్యక్రమంలో తిరుపతి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి లెనిన్ బాబు, మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి రమాదేవి, తిరుపతి ఏఎస్పీ శ్రీలత, వివిధ స్టేషన్ల సీఐలు, కోర్టు కానిస్టేబుళ్లు, లైజనింగ్ అధికారులు పాల్గొన్నారు. రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి మృతి రేణిగుంట: మామండూరు–రేణిగుంట రైల్వే స్టేషన్ల మధ్య కరకంబాడి సమీపంలో సోమవారం రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. రైల్వే పోలీసుల సమాచారం మేరకు.. రైల్వే పోలీసులకు ఉదయం 10 గంటలకు సమాచారం అందడంతో ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. రైలు పట్టాల పక్కన సుమారు 25 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించారు. ఎగువ మార్గంలో వెళ్తున్న గుర్తు తెలియని రైలు ఢీకొనడంతో తీవ్ర గాయాలై మృతి చెందినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లేవు. తెలుపు రంగు ఫుల్ హ్యాండ్ షర్ట్, నల్లటి లైన్లు, నల్లటి షర్ట్, లైట్ బ్రౌన్న్ రంగు లోదుస్తులు ధరించి ఉన్నాడు. కుడివైపు వీపు పైభాగంలో నల్లటి పుట్టుమచ్చ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. -
శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
తిరుమల: తిరుమల శ్రీవారిని సోమవారం మాజీ మంత్రి ఆర్కే రోజా దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. శ్రీవారి దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనాలు అందించగా.. టీటీడీ అధికారులు ఘనంగా లడ్డూ ప్రసాదాలతో సత్కరించారు. తిరుమల స్థానికుల సమస్యల పరిష్కారానికి కృషి తిరుపతి అన్నమయ్య సర్కిల్: తిరుమల వాసులకు అండగా ఉంటానని శ్రీ వెంకటేశ్వర భక్తి చానల్ (ఎస్వీబీసీ) చైర్మన్ శ్రీధర్‌వర్మ తెలిపారు. పార్టీలకు అతీతంగా స్ధానిక ఓ ప్రైవేటు కల్యాణ మండపంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. తిరుమల స్థానికుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తామన్నారు. తన తండ్రి ఆశయ సాధన కోసం పనిచేస్తామని తిరుమల స్థానికులకు తెలిపారు. 82 బస్తాల రేషన్ బియ్యం స్వాధీనం పెళ్లకూరు: మండలంలోని పునబాక గ్రామంలో సోమవారం జిల్లా విజిలెన్స్ అధికారులు 82 బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. గ్రామానికి చెందిన రేషన్ బియ్యం వ్యాపారి సాయి అక్రమంగా నిల్వ చేసినట్లు సమాచారం అందడంతో అధికారులు దాడులు చేశారు. ఈ దాడుల్లో సుమారు రూ.3 లక్షల విలువ చేసే 82 బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని గోదాముకు తరలించారు. ఈ మేరకు కేసు కేసు దర్యాప్తులో ఉంది. డీటీ యువరాజ్, వీఆర్వో సుధాకర్ పాల్గొన్నారు. ప్రైవేట్ బస్సు డ్రైవర్‌కు జైలు తొట్టంబేడు (శ్రీకాళహస్తి రూరల్): మద్యం తాగి బస్సు నడిపిన డ్రైవర్‌కు ఐదు రోజులు జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పినట్టు పట్టణంలోని 2 టౌన్ సీఐ నాగరాజు తెలిపారు. తొట్టంబేడు మండలం, మామిడిగుంట గ్రామానికి చెందిన ధనశేఖర్ ఇటీవల మద్యం సేవించి ప్రయివేటు బస్సు నడపగా... డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడినట్టు తెలిపారు. ఫైర్ ఫైటింగ్‌పై అవగాహన తిరుమల: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని భక్తుల భద్రత, అత్యవసర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు తిరుమలలో ఫైర్ ఫైటింగ్, బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు, సీవీఎస్వో మురళీకృష్ణ ఆదేశాల మేరకు సోమవారం ఆస్థాన మండపంలో తిరుమల డీఎస్పీ విజయశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పోలీసు, టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ, ఫైర్ సర్వీసెస్, హెల్త్ డిపార్ట్మెంట్ సిబ్బంది పాల్గొన్నారు. అగ్ని ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అగ్నిమాపక పరికరాల వినియోగంపై ఫైర్ సిబ్బందికి అవగాహన కల్పించారు. -
రౌడీ షీటర్‌కు రిమాండ్
రేణిగుంట: బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించిన రౌడీషీటర్‌కు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ మండల మేజిస్ట్రేట్ శ్రావణ్‌కుమార్ ఆదేశాలు జారీచేశారు. పోలీసుల కథనం.. కడప జిల్లా, సెట్టిగుంట మండలానికి చెందిన బండి జయచంద్ర (26) ప్రస్తుతం రేణిగుంట మండలంలోని చెంగారెడ్డిపల్లి పీఎన్ఆర్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. ఇతడి పై రేణిగుంట పోలీస్ స్టేషన్లో 3, గాజుల మండ్యంలో 1, రైల్వేకోడూరులో 1, ఎస్వీ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో 1 మొత్తం ఆరు కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ క్రమంలో అర్బన్ పోలీస్ స్టేషన్లో జయచంద్ర పై గతంలో రౌడీషీటర్ ఓపెన్ చేశారు. 02–05–2026 తేదీన అర్బన్ సీఐ జయచంద్ర రేణిగుంట మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఎదుట జయచంద్రను బైండోవర్ చేయించారు. బైండోవర్‌లో ఉన్నప్పటికీ 17–08–2026 రాత్రి చెంగారెడ్డిపల్లి గ్రామంలో మద్యం సేవించి గొడవకు పాల్పడి, కొందరిపై దాడి చేసినట్లు విచారణలో నిర్ధారణ అయ్యింది. దీంతో అతనిపై కేసు నమోదు చేశారు. బైండోవర్ నిబంధనలను ఉల్లంఘించినందుకు సోమవారం జయచంద్రను మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా, విచారణ అనంతరం 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. -
హత్య కేసులో ముగ్గురికి జీవిత ఖైదు
నాయుడుపేట టౌన్ : మండల పరిధిలోని విన్నమాల గ్రామంలో 2021లో హత్య కేసుకు సంబంధించి ముగ్గురు నిందితులకు జీవిత ఖైదుతో పాటు ఒక్కొక్కరికీ రూ.25 వేలు జరిమానా విధిస్తూ న్యాయ స్థానం తీర్పు చెప్పినట్లు నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు తెలిపారు. నాయుడుపేట పోలీస్ డివిజన్ కార్యాలయంలో సోమవారం సాయంత్రం ఆయన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. 2021 నవంబర్ 17వ తేదీ విన్నమాల గ్రామానికి చెందిన అరవ శ్రీనివాసులును అదే గ్రామానికి చెందిన పేర్నాటి సాగర్, పేర్నాటి బెన్హర్, పేర్నాటి అనీల్ అనే అన్నదమ్ములు దాడిచేయడంతో అప్పట్లో ఎస్ఐగా ఉన్న చింతం కృష్ణరెడ్డి కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. బాధితుడు చికిత్సలు పొందుతూ మృతి చెందడంతో హత్య కేసుగా నమోదు చేసి అప్పటి సీఐగా పనిచేసిన వైవీ సోమయ్య దర్యాప్తు చేపట్టినట్టు వెల్లడించారు. ఈ క్రమంలో గూడూరు 7వ అదనపు జిల్లా న్యాయస్థానంలో సోమవారం హత్య కేసుపై విచారణ జరిపి నేరం రుజువు కావడంతో ముగ్గురు నిందితులకు న్యాయాధికారి జీవిత ఖైదుతో పాటు ఒక్కొక్కరికీ రూ.25 వేలు జరిమానా విధిస్తూ తీర్పు చెప్పినట్లుగా డీఎస్పీ వివరించారు. -
శాశ్వత వాహన తనిఖీ కేంద్రం ప్రారంభం
తిరుపతి అన్నమయ్యసర్కిల్: తిరుమల వెళ్లే ఏపీఎస్ ఆర్టీసీ వాహనాల మరమ్మతుల నిర్వహణలో భాగంగా సోమవారం అలిపిరి బాలాజీ బస్టాండ్‌లో శాశ్వత వాహన తనిఖీ కేంద్రాన్ని జిల్లా ప్రజా రవాణాధికారి (డీపీటీవో) కె.శ్రీనివాసరావు ప్రారంభించారు. నిర్దేశిత డిపోల బస్సుల తనిఖీ నిర్వహణను ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. ఆయన మాట్లాడుతూ ఈ తనిఖీల్లో బస్సులోని కీలకమైన భాగాల్లోని బ్రేకింగ్, స్టీరింగ్, సస్పెన్సన్, ఎలక్ట్రిక్ లైటింగ్. ఇంజిన్ కూలింగ్, టైర్లు వంటి వాటిలో చిన్నపాటి లోపాన్ని సైతం గుర్తించి వాటిని మరమ్మతులు చేయించిన తరువాతనే తిరుమల ఘాట్‌లో ప్రయాణానికి అనుమతిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎంఈ బాలాజీ, సూళ్లూరుపేట డీఎం కళ, వివిధ డిపోల నుంచి విచ్చేసిన మెకానిక్ సిబ్బందితో పాటు వెంకటగిరి, అలిపిరి, చిత్తూరు డిపోల అసిస్టెంట్ ఇంజినీర్లు ప్రభాకర్, ఆనంద్, జగదీష్ పాల్గొన్నారు. -
పదిలో వంద శాతం ఉత్తీర్ణతే లక్ష్యం
తిరుపతి ఎడ్యుకేషన్ : పదో తరగతి పబ్లిక్ పరీక్షా ఫలితాల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించడమే తమ లక్ష్యమని డీఈఓ కేవీఎన్.కుమార్ తెలిపారు. తిరుపతిలోని డీఈఓ కార్యాలయంలో సోమవారం ఆయన మాట్లాడుతూ పబ్లిక్ పరీక్షా ఫలితాల్లో అత్యుత్తమ ఉత్తీర్ణత శాతం సాధించడంతో పాటు ప్రతి విద్యార్థి ఉత్తీర్ణతయ్యేలా కార్యాచరణకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ఇందులో భాగంగానే పదో తరగతి బోధించే సబ్జెక్టు ఉపాధ్యాయులకు ఒక్కరోజు ప్రత్యేక శిక్షణ తరగతులను ఆయా సబ్జెక్టు నిపుణులతో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ నెల 8న తెలుగు, గణితం, 9న హిందీ, బయాలజికల్ సైన్స్, 10న ఇంగ్లిష్, ఫిజికల్ సైన్స్, 11న సోషియల్ సబ్జెక్టుల్లో తరగతులు ఉంటాయన్నారు. 2026–27విద్యా సంవత్సరంలో పదో తరగతి సిలబస్, పరీక్షా విధానం, ఎస్ఎస్సీ మార్చి, 2007 బ్లూప్రింట్, మోడల్ పేపర్లను సమగ్రంగా అధ్యయనం చేసి, వాటి ఆధారంగా విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చేసేందుకే ఈ శిక్షణ తరగతులను ఉపాధ్యాయులకు అందిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థుల సామర్థ్యాలను గుర్తించి వారి స్థాయికి అనుగుణంగా బోధించడం, వెనుకబడ్డ విద్యార్థులను గుర్తించి ఉపాధ్యాయుల ద్వారా దత్తత తీసుకుని ప్రత్యేక శ్రద్ధ చూపించడం ఈ శిక్షణలో ప్రధానాంశాలుగా ఉంటాయన్నారు. జిల్లా కామన్ ఎగ్జామినేషన్ బోర్డు (డీసీఈబీ) ద్వారా ఈ శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ యాజమాన్య హైస్కూళ్లల్లో పదో తరగతి బోధిస్తున్న సబ్జెక్టు ఉపాధ్యాయులు, రిసోర్స్ పర్సన్లు తప్పనిసరిగా ఈ శిక్షణా తరగతులకు హాజరయ్యేలా ప్రధానోపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని డీఈఓ కోరారు. -
తిరుపతి రోడ్లు, ఫుట్ పాత్‌లు భారీగా ఆక్రమణ దుకాణాలు పెట్టుకున్నందుకు ప్రతిఫలంగా కప్పం కట్టాల్సిందే
● పోటీపడి అమ్మేస్తున్న టీటీడీ, జనసేన నేతలు ● రోజుకు ఒక షాపునకు రూ.200 నుంచి రూ.2వేల వరకు వసూళ్లు ● చోద్యం చూస్తున్న కార్పొరేషన్ అధికారులు తిరుపతి తుడా: ఆధ్యాత్మిక నగరమైన తిరుపతికి నిత్యం వేల సంఖ్యలో భక్తులు, వ్యాపారులు, ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. వీరిలో ఎక్కువ శాతం మంది పేదలే ఉండడంతో రోడ్ల పక్కన టిఫిన్లు, కూల్ డ్రింక్‌లు, టీలు తాగుతుంటారు. వీరి అవసరాలను ఆసరాగా చేసుకుని అనేక దుకాణాలు రోడ్లపక్కన నెలకొల్పుతున్నారు. ఇలా ఏర్పాటు చేసుకునేందుకు జనసేన, టీడీపీలోని కొందరు నేతలకు కప్పం చెల్లించాల్సి వస్తోంది. ఇలా ఒక్కో షాపునకు రోజుకు రూ.200 నుంచి రూ.2 వేల వరకు చెల్లించాల్సిందే. కప్పం ఇవ్వని వారి షాపులు మరునాడే కూటమి నేతలు తొలగించేస్తున్నారు. ఇరు పార్టీల వారికి ఇదే ప్రధాన ఆదాయ వనరు కావడంతో పోటీలు పడి పర్మిషన్లు ఇస్తున్నారు. ఎక్కడ బడితే అక్కడ షాపులు ఏర్పాటు చేయిస్తున్నారు. నగరంలో ఫుట్‌పాత్‌లు, రోడ్లు ఆక్రమించేస్తున్నారు. పాదచారులు, వాహన చోదకులకు చుక్కలు చూపిస్తున్నారు. వీటిని అరికట్టాల్సిన కార్పొరేషన్ అధికారులు మిన్నకుండిపోవడం విమర్శలకు తావిస్తోంది. కప్పం కడతావా.. దాడి చేయమంటావా? నగరంలోని కొన్ని ప్రాంతాల్లో దశాబ్దానికి పైగా చిరు వ్యాపారాలు సాగిస్తూ కొందరు పొట్టపోసుకుంటున్నారు. ఇదే అదునుగా పేదల ముసుగులో కూటమి నేతలు అక్రమ దుకాణాలకు తెరలేపారు. రెండేళ్లలో నగరంలో దాదాపు 500 పైగా ఆక్రమిత ప్రాంతంలో వివిధ దుకాణాలు వెలిశాయి. నిజమైన పేదలు ఎవరైనా దుకాణం పెట్టుకుంటే వారిని కార్పొరేషన్ అధికారులు కాకుండా కూటమినేతలే అడ్డుకుంటారు. కప్పం కట్టందే ఎవరైనా దుకాణం పెడితే రౌడీ మూకలు గద్దల్లా వాలిపోతున్నారు. వారిపై దండయాత్ర చేసి రోజుకు తమకు ఇంత కడితేనే పెట్టాలంటూ హుకుం జారీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ, జనసేన నేతల్లో కొంతమంది పోటీపడి అక్రమాలను పెంచి పోషిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇలా నెలకు ఒక్కో నేత రూ.లక్షల్లో సంపాదిస్తున్నారు. మరికొందరి వద్ద ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా.. ఫుట్‌పాత్‌లు పాదాచారుల కోసమే ఉపయోగించాలని ఇటీవల సుప్రీంకోర్టు మార్గదర్చకాలను విడుదల చేసింది. బెంగళూరులో ఫుట్‌పాత్ ఆక్రమణకు గురవ్వడంతో రోడ్డుపై వెళ్తున్న ఓ వ్యక్తి ప్రమాదంలో మృతి చెందాడు. కుటుంబ సభ్యులు కోర్టు మెట్లు ఎక్కారు. ఫుట్‌పాత్ పై నడిచేందుకు వీలు లేకపోవడంతోనే రోడ్డుపై నడిచి వెళ్లాడని, దీంతోనే ప్రమాదం జరిగిందని, వ్యక్తి మృతికి సంబంధిత నగరపాలక సంస్థ నిర్లక్ష్యమేనని వాదించారు. ఇందుకు సుప్రీం సైతం ఏకీభవించింది. ఫుట్‌పాత్‌లు నడకదారికి మాత్రమే ఉపయోగించాలని హెచ్చరికలు జారీచేసింది. కానీ ఈ నిబంధనలను పట్టించుకోని తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అక్రమాలను పెంచి పోషిస్తున్నారు. అక్కడ తొలగించారు.. ఇక్కడ పోషిస్తున్నారు అలిపిరి నుంచి జూపార్క్ వెళ్లే మార్గంలో సుమారు 30 పేద కుటుంబాలు ఆక్రమణకు తావులేకుండా, ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా, యాత్రికులకు ఎలాంటి ఇబ్బందీ కలిగించకుండా దుకాణాలను గత పదేళ్లుగా నడిపేవారు. కొందరి స్వార్థంతో ఈ దుకాణాలను తొలగించేశారు. అదే ప్రాంతంలో రుయా నుంచి అలిపిరికి వెళ్లే మార్గం ఫుట్‌పాత్‌తోపాటు రోడ్డును పూర్తిగా ఆక్రమించేశారు. డబుల్ రోడ్డు కాస్త సింగిల్ రోడ్డుగా మారిపోయింది. అలాగే రైల్వేస్టేషన్ ముందు శ్రీనివాసానికి దక్షిణం వైపు, ఆర్టీసీ బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో రోడ్లు కుంచించుకుపోయాయి. ఇక్కడ అక్రమాలకు కూటమే నేతలు అండగా ఉండడంతో అధికారులు సైతం అటువైపు కన్నెత్తి చూడడం లేదనే విమర్శలు ఉన్నాయి. -
సోలార్ పనులు వేగవంతం చేయండి
తిరుపతి రూరల్: ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో ఎస్సీ, ఎస్టీ విద్యుత్ వినియోగదారుల గృహాలపై రూఫ్ టాప్ సోలార్ ఏర్పాటు పనులను వేగవంతం చేయాలని సీఎండీ శివశంకర్ లోతేటి ఆదేశించారు. ఏపీఎస్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయం నుంచి సంస్థ అధికారులతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సిబ్బందితో సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ సంస్థ పరిధిలో ఇప్పటివరకు 1.31 లక్షల ఎస్సీ, ఎస్టీ విద్యుత్ వినియోగదారుల గృహాలపై రూఫ్ టాప్ సోలార్ వ్యవస్థలను ఏర్పాటు చేశామని, వాటిలో 1.01 లక్షల సర్వీసులను గ్రిడ్‌కు అనుసంధానం చేసినట్టు వెల్లడించారు. క్షేత్ర స్థాయిలో అధికారులు, సిబ్బందితో పాటు సంబంధిత ఏజెన్సీల సమన్వయంతో సోలార్ ఏర్పాటు పనులను మరింత వేగవంతం చేయాలని సంస్థ అధికారులు, సిబ్బంది, కాంట్రాక్టర్లను ఆదేశించారు. వేగంగా వ్యవసాయ విద్యుత్ సర్వీసుల మంజూరు రైతులకు సకాలంలో వ్యవసాయ విద్యుత్ సర్వీసులను మంజూరు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సంస్థ సిబ్బందిని సీఎండీ ఆదేశించారు. సంస్థ డైరెక్టర్లు పి. అయూబ్‌ఖాన్, కే.గురవయ్య, చీఫ్ జనరల్ మేనేజర్లు జే.రమణాదేవి, ఎన్.శోభా వాలెంటీనా, ఎం.మురళికుమార్, సీహెచ్ రామచంద్రరావు, కే.సంపత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. పీఎం–కుసుమ్ పనులు వేగవంతం కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పీఎం–కుసుమ్ పథకంలో భాగంగా ఫీడర్ లెవెల్ సోలరైజేషన్ పనులను వేగవంతం చేయాలని సీఎండీ సూచించారు. ఈ పనులను సకాలంలో పూర్తి చేయడం ద్వారా రైతులకు పగటిపూట నాణ్యమైన 9 గంటల విద్యుత్తును సరఫరా చేసేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. -
హత్య కేసులో ముగ్గురికి జీవిత ఖైదు
హత్య కేసులో ముగ్గురికి జీవిత ఖైదు పడిన ఘటన నాయుడుపేట మండల పరిధిలో చోటు చేసుకుంది. రుయా కూడలి వద్ద ఫుట్‌పాత్ ఆక్రమణతో రోగుల అవస్థలు రద్దీ ప్రాంతాలే టార్గెట్ నడవడానికి వీలు లేకుండా, వాహనాలతో నిత్యం రద్దీగా, ట్రాఫిక్ చక్ర బంధాన్ని తలపించే ప్రాంతాల్లో ఎప్పుడూ లేనివిధంగా నగరంలో అక్రమ దుకాణాలు పుట్టుకొచ్చాయి. రైల్వేస్టేషన్ ముందు ఇసుకేస్తే రాలనంత జనాలు ఉంటారు. మోడ్రన్‌గా అభివృద్ధి చేసిన రైల్వే స్టేషన్‌కు ఎదురుగా చిల్లర కొట్లు, తోపుడు బండ్లు ఏర్పాటు చేసుకున్నారు. వీటివల్ల యాత్రికులకు తీవ్ర అసౌకర్యం కాగా వాహనదారులకు ఇబ్బందికరంగా మారింది. అలానే రైల్వే స్టేషన్ ముందు విష్ణునివాసం ఫుట్‌పాత్ పూర్తిగా ఆక్రమణకు గురైంది. బస్టాండు, విష్ణు నివాసం పరిసర ప్రాంతాలు పూర్తిగా అక్రమ దుకాణాలకు కేరాఫ్‌గా నిలిచాయి. కపిల తీర్థం ఏరియా, అలిపిరి, రుయా పరిసర ప్రాంతాలు, ఎస్వీ యూనివర్సిటీ, మహిళా యూనివర్సిటీ, ఏఐఆర్ బైపాస్ రోడ్డు, రేణిగుంట రోడ్డు, లక్ష్మీపురం కూడలి రోడ్ల ఫుట్ పాత్‌లు పూర్తిగా అక్రమణకు గురయ్యాయి. రోడ్ల అక్రమణతో యాత్రికులు నడక యాతన అనుభవిస్తున్నారు. రుయా కూడలి నుంచి అలిపిరి మార్గం పూర్తిగా కబ్జా కోరుల చేతుల్లోకి వెళ్లిపోయింది. -
ఇంటర్ అడ్మిషన్ల గడువు పొడిగింపు
తిరుపతి సిటీ: జిల్లాలోని ప్రభుత్వ ఆధ్వర్యంలో నడస్తున్న అన్ని జూనియర్ కళాశాలల్లో, ప్రైవేటు, ఎయిడెడ్ కళాశాలలో ఇంటర్మీడియెట్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ల గడువును బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియెట్ మరో మారు పొడిగించింది. ఈ నెల 15వ తేదీలోపు అడ్మిషన్లకు అవకాశమిస్తూ అన్ని కళాశాలల యాజమాన్యాలకు సమాచారం అందించింది. దీంతో ఇప్పటి వరకు అడ్మిషన్లు పొందని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆర్ఐఓ గోపాల్‌రెడ్డి సూచించారు. డయల్ యువర్ సీఎండీకి 71 వినతులు తిరుపతి రూరల్: విద్యుత్ వినియోగదారుల సమస్యలను సత్వరం పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ లోతేటి తెలిపారు. ఏపీఎస్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో సోమవారం ‘డయల్ యువర్ ఏపీఎస్పీడీసీఎల్ సిఎండి’ కార్యక్రమాన్ని నిర్వహించారు. సంస్థ పరిధిలోని 9 జిల్లాల నుంచి 71 మంది వినియోగదారులు తమ విద్యుత్ సమస్యలను సీఎండీకి విన్నవించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలు, ఓల్టేజ్‌లో హెచ్చుతగ్గులు, గృహాలపై నుంచి వెళ్లే విద్యుత్తు లైన్ల మార్పు తదితర సమస్యలను వినియోగదారులు సీఎండీ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ విద్యుత్ వినియోగదారుల నుంచి ఫిర్యాదులు అందిన వెంటనే వాటిని పరిష్కరించేందుకు అధికారులు, సిబ్బంది ప్రాధాన్యతనివ్వాలని సూచించారు. భానుడి భగభగలు తిరుపతి తుడా: భానుడి భగభగలకు జనం ఉక్కిరిబిక్కిరవుతున్నాడు. సెప్టెంబర్‌లోనూ ఊహించని ఎండలు జనానికి షాక్ ఇస్తున్నాయి. సోమవారం జిల్లా వ్యాప్తంగా 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం ఎనిమి ది గంటల నుంచే భగభగమంటూ నిప్పులు కక్కుతున్నాడు. అదే స్థాయిలో ఉక్కపోత సైతం ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. సాయంత్రం 6 గంటల వరకు ఎండ ప్రభావం కనిపించింది. శ్రీవారి దర్శనానికి 18 గంటలు తిరుమల: తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్ కృష్ణతేజ అతిథి గృహం వద్దకు చేరుకుంది. ఆదివారం అర్ధరాత్రి వరకు 87,115 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 35,053 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.22 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 18 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ప్రతి రోగి దైవంతో సమానం తిరుపతి తుడా: స్విమ్స్ ఆస్పత్రికి వచ్చే ప్రతి రోగి దైవంతో సమానంగా భావించి, వారికి మెరుగైన సేవలందించాలని స్విమ్స్ సంచాలకులు, ఉపకులపతి డాక్టర్ గుడారు జగదీష్ సూచించారు. స్విమ్స్‌లో విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో ఆయన దిశానిర్దేశం చేశారు. ఆస్పత్రికి వచ్చే రోగులు, వారి సహాయకులు వివిధ ప్రాంతాల నుంచి, వివిధ సమస్యలతో వస్తుంటారని, అలాంటి సమయంలో సెక్యూరిటీ సిబ్బంది సహనంతో, మర్యాదగా, మానవతా దృక్పథంతో వ్యవహరించాలని ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో రోగులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, ఇతర సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని సూచించారు. డిగ్రీ అడ్మిషన్లకు శ్రీకారం తిరుపతి సిటీ: జిల్లాలోని ప్రభుత్వ, టీటీడీ, ప్రైవేటు విద్యా సంస్థలల్లో డిగ్రీ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్లు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఓఏఎమ్‌డీసీ వెబ్సైట్లో యూజీ కోర్సులలో ప్రవేశాల కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థులకు సోమవారం తొలి విడత ప్రవేశాల మెరిట్ లిస్ట్ విడుదల చేశారు. ఇందులో భాగంగా 2026–27 విద్య సంవత్సరానికి సంబంధించి టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో తొలి అడ్మిషన్‌గా విద్యార్థి బి రామశేష సాయి శివారెడ్డికి బీఎస్సీ హానర్స్ జువాలజీ మొదటి సంవత్సరంలో ప్రవేశం పొందారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కిషన్, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ వై.మల్లికార్జున, అధికారులు విద్యార్థికి ప్రవేశపత్రాన్ని అందజేశారు. -
వేధింపులకు భయపడం
తిరుపతి లీగల్: వైఎస్సార్సీపీ నాయకులపై అక్రమ కేసులు బనాయించి వేధింపులకు గురి చేసిన మాత్రాన భయపడే ప్రసక్తే ఉండదని తిరుపతి చిత్తూరు జిల్లాల అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి తెలిపారు. తిరుపతి టీడీపీ ఇన్చార్జ్ జేబీ శ్రీనివాస్ ఇంటి వద్ద దాడికి పాల్పడ్డారంటూ అభియోగాలపై వైఎస్సార్సీపీ నాయకులు పసుపులేటి సురేష్ వాసు యాదవ్‌తో పాటు మరో నలుగురు మీడియా ప్రతినిధులపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఆ కేసులో పోలీసులు వారిని రిమాండ్‌లో భాగంగా తిరుపతి సబ్ జైలుకు తరలించారు. తిరుపతి సబ్ జైల్లో ఉన్న వైఎస్సార్సీపీ నాయకులను భూమన కరుణాకరరెడ్డి సోమవారం కలిశారు. ఆయనతోపాటు తిరుపతి జిల్లా వైఎస్సార్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు ఐ. చంద్రశేఖర్‌రెడ్డి, కొత్తపల్లి విజయ్‌కుమార్, రవీంద్రనాథ్ రెడ్డి, కోటేశ్వర్ రెడ్డి, రాజశేఖర్, శ్రీనివాసరెడ్డి, వైఎస్సార్సీపీ తిరుపతి అధ్యక్షుడు మల్లం రవిచంద్రరెడ్డి ఇతర వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు. -
మైనింగ్ మాఫియా ట్రక్కు టమారం
సాక్షి టాస్క్‌ఫోర్స్: మైనింగ్ ట్రాక్టర్లు సామాన్యుల పాలిట మృత్యు శకటాలుగా మారుతున్నాయి. ఇసుక, మట్టి, గ్రావెల్ రవాణా చేస్తున్న ట్రాక్టర్ల అతి వేగానికి వాహనదారులు బెంబేలెత్తుతున్నారు. సామాన్యులు ప్రాణాలు అరచేత పెట్టుకుని ప్రయాణాలు సాగిస్తున్నారు. గడిచిన రెండేళ్ల కాలంలోనే మైనింగ్ ట్రాక్టర్లు ఢీకొని ఆరుగురు మృతి చెందారంటే మాఫియా ఏ స్థాయిలో అధికారులను మేనేజ్ చేస్తుందో అర్థమవుతోంది. టీడీపీ ప్రభుత్వం అధికారం చేపట్టాక శ్రీకాళహస్తి నియోజకవర్గంలో మైనింగ్ మాఫియా వేళ్లూనుకుంది. పచ్చనేతల ధనదాహం ముందు సామాన్యుల ప్రాణాలకు విలువ లేకుండా పోయింది. శ్రీకాళహస్తి పట్టణ సమీపంలోని ఏఎం పుత్తూరు వద్ద ఆదివారం మట్టి ట్రాక్టర్ ఢీకొట్టి తొట్టెంబేడు మండలం గుండేలుగుంటకు చెందిన చంద్రశేఖర్ అనే యువకుడు దుర్మరణం చెందాడు. చంద్రశేఖర్ శ్రీకాళహస్తి ఆలయంలో స్వచ్ఛంద సేవకుడిగా ఎలక్ట్రికల్ పనులు చేస్తున్నాడు. అంతకు ముందు శ్రీ కాళహస్తి మండలం నారాయణపురానికి చెందిన ఉపాధ్యాయుడు కావలి మురళి జూలై 1వ తేదీన విధులు ముగించుకుని ఇంటికి బైక్‌పై వస్తుండగా, బైపాస్‌రోడ్డులోని అండర్ పాస్ వంతెన వద్ద మట్టిలోడుతో వెళుతున్న ఇదే ట్రాక్టర్ ట్రక్కు ఢీకొని దుర్మరణం పాలయ్యాడు. ఈ సంఘటనాస్థలికి కొద్దిదూరంలోనే అతి వేగంగా వస్తున్న మట్టి ట్రాక్టర్ చంద్రశేఖర్‌ను ఢీకొట్టింది. ఈ రెండు ప్రమాదాలలో ట్రాక్టర్ ఇంజన్లు వేరైనా ట్రక్కు మాత్రం ఒక్కటేనని తేలింది. ట్రక్కులకు నంబరు ప్లేట్లు కూడా ఉండవు. తొలి ఘటనలో ట్రాక్టర్ యజమానిపై పోలీసులు చర్యలు తీసుకున్నారా, తీసుకుని ఉంటే మళ్లీ అదే ట్రక్కును వేరే ట్రాక్టర్‌కు అమర్చి మట్టి తోలడానికి ఎలా అనుమతి ఇచ్చారనేది ప్రశ్న..ఈ ఉదంతాన్ని ఆసాంతం పరిశీలిస్తే అక్రమ మైనింగ్ మాఫియా అరాచకం ఇట్టే అర్థమవుతోంది. రెండు నెలల్లో మట్టి ట్రాక్టర్లు ఢీకొని ఇద్దరు మృతి డ్రైవర్ ఎక్కడ? యువకుడు చంద్రశేఖర్‌ను ఢీకొట్టి ట్రాక్టర్‌ను అక్కడే వదిలి పరారైన డ్రైవర్‌ను శ్రీకాళహస్తి టూటౌన్ పోలీసులు ఇప్పటి వరకు పట్టుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. అధికార ఒత్తిళ్లతోనే కేసును నీరుగార్చే ప్రయత్నాలు చేస్త్న్నుట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు శ్రీకాళహస్తి టూటౌన్ సీఐ నాగరాజు ఇసుక, మట్టి స్థావరాలపై నిఘా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే ఎలాంటి అనుమతులు లేకుండా, రికార్డులు సక్రమంగా లేని ఐదు ఇసుక, మట్టి ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. -
కూటమిపై సమరానికి వైఎస్సార్సీపీ సమాయత్తం
● ఏకగ్రీవాలకు అవకాశం ఇవ్వొద్దని ఆదేశం ● గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుదాం ● విస్తృత స్థాయి సమావేశంలో పెద్దిరెడ్డి ● 18న అరణియార్ సందర్శనకు భూమన పిలుపు ‘‘అలవి కాని హామీలు గుప్పించి చంద్రబాబు అధికారం చేపట్టారు. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు దాటినా ఒక్కటీ సక్రమంగా అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారు. అవినీతికి పెద్దపీట వేసి స్కామ్‌లకు తెరతీశారు. ఈ క్రమంలో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. వైఎస్సార్సీపీ శ్రేణులు సమాయత్తం కావాలి. ఏకగ్రీవాలకు అవకాశం ఇవ్వకుండా పోరాట పటిమను ప్రదర్శించాలి. పార్టీ గెలుపే లక్ష్యంగా అడుగులు వేయాలి. ఇందుకోసం బలమైన అభ్యర్థులను బరిలో దించాలి. చంద్రబాబు అక్రమాలను క్షేత్రస్థాయిలో ఎండగట్టాలి. సర్కారు కుట్రలను దీటుగా ఎదుర్కోవాలి. అధినేత ఆదేశాల మేరకు వైఎస్సార్సీపీ జెండాను ఎగురవేసేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలి’’ అంటూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన కరుణాకరరెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం ఈ మేరకు తిరుపతిలో నిర్వహించిన విస్తృతస్థాయి సమావేశంలో నియోజకవర్గాల సమన్వయకర్తలు, ప్రజాప్రతినిధులు, నేతలకు దిశానిర్దేశం చేశారు. వైఎస్సార్సీపీ విస్తృత స్థాయి సమావేశంలో పెద్దిరెడ్డి, భూమన, ప్రజాప్రతినిధులు నియోజకవర్గాల సమన్వయకర్తలుతిరుపతి రూరల్ : స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా వైఎస్సార్సీపీ సమరశంఖం పూరించింది. ఎన్నికల సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో పార్టీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, ముఖ్య నేతలతో రీజనల్ కో–ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డి, తిరుపతి, చిత్తూరు జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. స్థానిక ఎన్నికల్లో కూటమిని ఢీకొట్టేందుకు గ్రామస్థాయి నుంచి పార్టీ యంత్రాంగాన్ని సన్నద్ధం చేయాలని స్పష్టం చేశారు. మాజీ మంత్రి ఆర్కే రోజా మాట్లాడుతూ జగనన్న చేసిన పనులను సైతం తన ఖాతా వేసుకుని క్రెడిట్ చోరీ చేసేందుకు చంద్రబాబు తెగబడుతున్నారని ఆరోపించారు. ఈ విషయాలను ప్రజల్లో తీసుకెళ్లి స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి ప్రధాన అస్త్రంగా మార్చాలని కోరారు. చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకుడు చవ్వా రాజశేఖర్ మాట్లాడుతూ సమన్వయకర్తలు విస్తృతంగా పర్యటించి నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకోవాలని సూచించారు. తిరుపతి పార్లమెంటు పరిశీలకుడు వజ్ర భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ ఎస్ఐఆర్ ప్రక్రియలో పార్టీ నేతలు చూపించిన చొరవను స్థానిక ఎన్నికల్లో కూడా చూపించాలన్నారు. అత్యధిక స్థానాలను కై వసం చేసుకుని జగనన్నకు కానుకగా అందించాలని సూచించారు. వెన్నుపోటు బాబు నైజం వెన్నుపోటు అనేది చంద్రబాబు సహజ నైజమని మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి తెలిపారు. లోకేష్ నుంచి ముఖ్యమంత్రి పీఠం కాపాడుకునేందుకు డీఎస్సీ అక్రమాలకు లీక్ చేసింది చంద్రబాబే అని ఆరోపించారు. బాబు పాలనలోనే కరువు చంద్రబాబు ప్రభుత్వం వస్తే రాష్ట్రంలో కరువు వస్తుందని, ఈ కరువు తీరాలంటే బాబు ప్రభుత్వం పోవా లని మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి తెలిపారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం మాట్లాడుతూ కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు అన్ని చోట్లా స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ జెండాను ఎగురవేస్తామన్నారు. స్థానిక ఎన్నికల్లో ఎక్కడా ఏకగ్రీవానికి అవకాశం లేకుండా చూస్తానని ఎమ్మెల్సీ భరత్ స్పష్టం చేశారు. అలాగే మాజీ ఎమ్మెల్యేలు వెంకటేగౌడ, డాక్టర్ సునీల్ మాట్లాడుతూ పార్టీని విజయం దిశగా నడిపిస్తామన్నారు. మాజీ ఎంపీ రెడ్డెప్ప, తిరుపతి, చంద్రగిరి, జీడీనెల్లూరు, సత్యవేడు నియోజకవర్గాల సమన్వయకర్తలు భూమన అభినయ్‌రెడ్డి, చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి, కృపాలక్ష్మి, నూకతోటి రాజేష్ మాట్లాడారు.గుర్తింపు కార్డుల పంపిణీ పార్టీ తిరుపతి, చిత్తూరు జిల్లాల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న అన్ని నియోజక వర్గాల సమన్వయకర్తలకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి చేతులమీదుగా గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. త్వరలో అన్ని నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహించి నేతలందరికీ గుర్తింపు కార్డులు అందించనున్నట్లు భూమన వెల్లడించారు. జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, తిరుపతి మాజీ మేయర్ డాక్టర్ శిరీష, మాజీ ఎమ్మెల్యే లలిత థామస్ పాల్గొన్నారు. విజయకేతనం ఎగురవేద్దాం తిరుపతి మంగళం : స్థానిక సంస్థల ఎన్నికలకు వైఎస్సార్సీపీ సమన్వయకర్తలంతా సిద్దం కావాలని పార్టీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం తిరుపతి ఎయిర్‌బైపాస్‌రోడ్డులోని పీఎల్ఆర్ కన్వెన్షన్ హాల్లో ఎంపీ, ఎమ్మెల్సీ, సమన్వయకర్తలతో సమావేశం నిర్వహించారు. భూమన మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో చంద్రబాబు ఈవీఎంల ట్యాంపరింగ్‌తో అధికారంలోకి వచ్చారనే విషయం ప్రపంచమంతా తెలుసునన్నారు. నోటికి వచ్చినట్లుగా చంద్రబాబు, పవన్‌కల్యాణ్, లోకేష్ 114 అబద్ధపు హామీలు గుప్పించి ప్రజలను వంచించారని విమర్శించారు. అందుకే స్థానిక ఎన్నికల్లో చంద్రబాబు ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పేందుకు సిద్దంగా ఉన్నారన్నారు. సమన్వయకర్తలు తమ నియోజకవర్గంలోని ప్రతి ఇంటికీ వెళ్లి కూటమి అరాచకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఇచ్చిన హామీల కంటే ఎక్కువ సంక్షేమ పథకాలు అందించిన వైఎస్. జగన్మోహన్రెడ్డి, వైఎస్సార్సీపీపై ప్రజల్లో సానుకూలత ఉందన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చిన వైఎస్సార్సీపీకి ఓట్లు వేసేందకు ప్రజలు ఎదురుచూస్తున్నారని తెలిపారు. కూటమి దౌర్జన్యాలకు ఎదురొడ్డే అభ్యర్థులను బరిలోకి దింపాలని కోరారు. సీమకు తీరని అన్యాయం ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ రాయలసీమ నుంచి కీలక సంస్థలు ఇతర ప్రాంతాలకు తరలిపోతున్నాయని ఆరోపించారు. నేషనల్ ఫోరెన్సిక్ యూనివర్సిటీతో పాటు 16 మేజర్ ఇన్స్టిట్యూట్లు వెళ్లిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులను నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. కేంద్రం నుంచి వచ్చే నిధులను పక్కదారి పట్టిస్తూ పేదల ఆర్థికాభివృద్ధిని ప్రశ్నార్థకంగా మార్చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు పాలనలో అన్ని వర్గాల ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని, జగనన్న రాకకోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారన్నారు. ఈవీఎంలను అడ్డుపెట్టుకుని స్థానిక ఎన్నికల్లో మరోసారి కుట్రలకు తెగబడితే కలసికట్టుగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. -
సెల్ రేగిన చోరులు!
పరిశ్రమలలో పనిచేసే కార్మికులతో కళకళలాడే కాలనీ ఇప్పుడు దొంగల స్థావరంగా మారింది. వరదయ్యపాళెం మండలం చిన్నపాండూరు పంచాయతీ పరిధిలోని వీకేఆర్‌వై కాలనీలో సెల్ ఫోన్ చోరుల ముఠా హల్ చల్ చేస్తోంది. పగలు, రాత్రి అనే తేడా లేకుండా రెచ్చిపోతోంది.నెలకు సగటున 200కి పైగా ఫోన్లు అపహరణకు గురవుతున్నట్లు తెలుస్తోంది. వరదయ్యపాళెం : ఏపీఐఐసీ పరిధిలో అపోలో టైర్లు, హీరో మోటార్స్‌తో పాటు పలు పరిశ్రమలు ఉండటంతో వందలాది మంది కార్మికులు వీకేఆర్‌వై కాలనీలో నివాసం ఉంటున్నారు. వీరిలో అత్యధికులు ఉత్తర భారత రాష్ట్రాలకు చెందిన వారే. ఇదే అదునుగా చేసుకున్న దొంగల ముఠా.. తలుపు గడియ పెట్టకపోతే చాలు, ఇంట్లోకి దూరి చార్జింగ్‌లో ఉన్న ఫోన్లను, టేబుల్‌పై ఉన్న ఫోన్లను క్షణాల్లో మాయం చేస్తోంది. భాష రాదు.. ఎవరికి చెప్పుకోవాలో తెలియదు బాధితుల్లో ఎక్కువ మంది హిందీ మాట్లాడే వారు కావడం, ప్రాంతం కొత్త కావడంతో ఫిర్యాదు ఎవరికి చేయాలో తెలియక అయోమయంలో పడుతున్నారు. కొందరు భయంతో ఫిర్యాదు కూడా చేయడం లేదు. దీంతో దొంగల ఆగడాలు రోజురోజుకూ శృతి మించుతున్నాయి. చిన్నపాండూరు పంచాయతీలో దొంగల బెడద నిఘా వ్యవస్థ విఫలం ఈ ప్రాంతం మొత్తం శ్రీసిటీ హైటెక్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది. ఇద్దరు ఎస్ఐలు, ఒక సీఐ, డీఎస్పీ స్థాయి అధికారులు, సిబ్బంది ఉన్నా దొంగలను పట్టుకోలేకపోవడంపై స్థానికంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిఘా వ్యవస్థ విఫలమైందని ఆరోపిస్తున్నారు. రాత్రి వేళల్లో గస్తీ పెంచాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కాలనీ వాసులు కోరుతున్నారు. ఇప్పటికై నా పోలీస్ ఉన్నతాధికారులు స్పందించి, ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి దొంగల ముఠాను పట్టుకోకపోతే కార్మికుల్లో భయాందోళనలు మరింత పెరిగే ప్రమాదం ఉందని స్థానికులు హెచ్చరిస్తున్నారు. -
దళారీల గుప్పిట్లో ధాన్యం
తిరుపతి అర్బన్ : ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం అమ్ముకోలేక రైతులు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు. దళారీల గుప్పిట్లో చిక్కుకుని అవస్థలు ఎదుర్కొంటున్నారు. వ్యాపారులు సిండికేట్‌గా మారి దళారీలతో కుమ్మకై ్క అన్నదాతలను నిలువునా దోచుకుంటున్నారు. గత రబీ సీజన్లో 1.40 లక్షల హెక్టార్లలో వరి పంటను సాగుచేశారు. ఈ ఖరీఫ్‌లో 1.10 లక్షల హెక్టార్లలో వరి పంట సాగైంది. ఈ ఏడాదిలో రెండు సీజన్లకు సంబందించి 2.50లక్షల హెక్టార్లలో వరి పంట సాగు చేశారు. ఇందులో 20శాతం వరకు ధాన్యాన్ని సుమారు 30 ఏళ్లుగా శ్రీకాళహస్తిలోని ఏపీ సీడ్స్ కొనుగోలు చేసేది. అయితే ఏడాది క్రితం నుంచి ఏపీ సీడ్స్ నష్టాల పేరుతో ధాన్యం కొనుగోళ్లు నిలిపివేసింది. కేవలం విత్తనాలు మాత్రమే పంపిణి చేస్తామని స్పష్టం చేసింది. ఇదే వ్యాపారులు, దళారీలకు వరంగా మారింది. తాము చెప్పిందే రేటు అన్నట్లు రైతులను దగా చేసేస్తున్నారు. తక్కువ ధరకు ధాన్యం కొల్లగొడుతున్నారు. వ్యాపారులు చెప్పిందే వేదం వ్యాపారులు గతంలో బస్తా ధాన్యం( 75 కేజీలు) కొనుగోలు చేసిన 24 గంటల నుంచి 72 గంటల్లోనే రైతుకు నగదును ఇచ్చేవారు. అయితే ప్రస్తుతం బస్తా ధాన్యం 80 కేజీల లెక్కన మాత్రమే తీసుకుంటున్నారు. దీంతో రైతులు బస్తాపై 5 కేజీలు నష్టపోతున్నారు. దీనిపై ప్రశ్నిస్తే ధాన్యం నెమ్ముగా ఉందని, దాంతోనే 5 కేజీలు అదనంగా వేసుకుంటున్నామంటూ తెగేసి చెబుతున్నారు. కాదంటే తమ ధాన్యం కొనుగోలు చేసేవారు లేకపోవడంతో రైతులు చేసేదిలేక విక్రయిస్తున్నారు. మరోవైపు ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత నగదు ఇవ్వడానికి రెండు వారాలు సమయం పడుతుందని దళారీలు ముందే చెప్పేస్తున్నారు. తీరా నగదు ఇచ్చే సరికి నాలుగు వారాలు సమయం పడుతోంది. దీంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. -
ట్రావెల్స్ మేనేజర్‌పై రౌడీషీటర్ దాడి
తిరుపతి రూరల్: శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు చూసుకుని తిరిగి వస్తున్న ట్రావెల్స్ మేనేజర్‌పై ముగ్గురు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన చెర్లోపల్లి అయాన్ డిజిటల్ ఎగ్జామినేషన్ సెంటర్ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. బాధితుడి ఫోన్‌ను నేలకేసి పగులగొట్టడంతోపాటు మెడలోని 9 గ్రాముల బంగారు చైన్‌ను లాక్కుని, చంపేస్తానంటూ బెదిరించినట్లు పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశాడు. పోలీసుల సమాచారం మేరకు... అన్నమయ్య జిల్లా, సుండుపల్లి మండలం, మంచిరెడ్డిపల్లికి చెందిన పి.చంద్రమోహన్ తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పుదిపట్ల కృష్ణ ట్రావెల్స్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ఈ నెల 4న ఇస్కాన్ ఆలయం వద్ద శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు చూసుకుని ఆదివారం తెల్లవారు జామున తిరిగి వస్తుండగా చెర్లోపల్లి సమీపంలో ముగ్గురు వ్యక్తులు ద్విచక్ర వాహనాలను ర్యాష్‌గా నడుపుతూ వెళ్తున్నారు. చంద్రమోహన్ హారన్ కొట్టగా వారు వాహనాలను అడ్డంగా పెట్టి అతడిపై మూకుమ్మడిగా దాడికి దిగారు. అనంతరం బాధితుడి మెడలోని బంగారం చైన్ లాక్కుని వెళ్లారు. తనపై దాడి చేసిన వారిలో ఒకరు తన పేరు అజయ్ అని, తాను రౌడీషీటర్నని, చంపేస్తానంటూ బెదిరించి దాడి చేసినట్లు బాధితుడు పోలీసులకు తెలిపాడు. తన ఫోన్‌ను నేలకేసి పగులగొట్టి వెళ్లారన్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దాడి జరిగిన సమీపంలోని ఓ దుకాణం వద్ద సీసీ కెమెరాలో ఆ దృశ్యాలు రికార్డు కావడంతో దాని ఆధారంగా కొర్లగుంట కొత్తపల్లికి చెందిన రౌడీషీటర్ సయ్యద్ అజీమ్, తిరుపతి రూరల్ అవిలాలకు చెందిన గోశాల రుద్రను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. మరో నిందితుడు వినయ్ అలియాస్ బబ్లూ కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
మాస్టర్ ప్లాన్ పేరుతో కూల్చివేతలు
చంద్రగిరి: మాస్టర్ ప్లాన్ పేరుతో చేస్తున్న అరాచకంతో పేద ప్రజలకు నీడలేకుండా పోయింది. తిరుచానూరులో మాస్టర్ ప్లాన్ అమలులో భాగంగా, అభివృద్ధి పేరిట రోడ్డు వెడల్పునకు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో సర్వే నంబరు 457, 458లో ఏళ్ల తరబడి నివాసాలు ఏర్పాటు చేసుకున్న పేదలపై జులుం ప్రదర్శించారు. స్వర్ణముఖినది పరివాహక ప్రాంతంలోని కాలువ పోరంబోకు అంటూ కూల్చేందుకు సన్నద్ధమయ్యారు. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు. ఏళ్ల క్రితం కూడబెట్టిన డబ్బుతో చేసి కొనుగోలు చేసిన స్థలంలో అప్పు చేసి ఇళ్లను నిర్మించుకుంటే ఇప్పుడు మాస్టర్ ప్లాన్ పేరుతో ధ్వంసం చేయడమేంటని ఆవేదన చెందుతున్నారు. తమకు కొనుగోలు చేసే సమయంలో ఈ ప్రాంతం నదీ పరివాహక ప్రాంతమని తెలియదని, ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తూ, విద్యుత్ బిల్లులు కట్టుకుండా ఇక్కడే జీవనం సాగిస్తున్నామని వాపోతున్నారు. అయితే ఇప్పుడు అభివృద్ధి పేరుతో మా ఇళ్లను ధ్వంసం చేస్తే ఎలా బతకాలంటూ మండిపడుతున్నారు. అభివృద్ధి పేరుతో అధికారులు చేస్తున్న అరాచకాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరిహారం ఇవ్వకుండానే..! తరాల నుంచి వస్తున్న వ్యవసాయ పొలాలపై ఆధారపడి జీవనం సాగిస్తున్న రైతులను సైతం ప్రభుత్వం నిలువునా ముంచేస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డీకేటీ భూములను సాకుగా చూపి బాధితులకు ఎలాంటి పరిహారం చెల్లించకుండానే లాక్కొనేందుకు యత్నిస్తుండడంపై రైతులు మండిపడుతున్నారు. ఇప్పటికే పలువురు రైతులకు చెందిన ప్రహరీగోడలను సైతం ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా కూల్చివేయడంపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేదల ఇళ్లను పడగొట్టిన అధికారులు ముందస్తు సమాచారం లేకుండానే.. ఇళ్లు, ప్రహరీగోడలను కూల్చేస్తూ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించడంపై ప్రజలు మండిపడుతున్నారు. చట్టప్రకారం ఏదైనా ఆస్తులు ధ్వంసం చేయాలంటే ముందస్తుగా నోటీసులు జారీ చేయాలని, ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఎలా కూలుస్తారని ప్రశ్నిస్తున్నారు. రాజకీయ నాయకులు మెప్పుకోసం పేదల జీవితాలను రోడ్డున పడేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నోటీసులు ఇవ్వకుండా కూల్చడంపై వామపక్షాలు, మానవహక్కుల సంఘాలు సైతం పోరాటాలకు సిద్ధమవుతున్నాయి. -
విద్యారంగం అభివృద్ధికి ఉద్యమం
తిరుపతి సిటీ: చంద్రబాబు ప్రభుత్వంలో విద్యారంగం అభివృద్ధికి ఉద్యమం తప్పదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ఏపీ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య స్పష్టం చేశారు. ఆదివారం ఎస్వీయూ ఆర్ట్స్ బ్లాక్ ఆడిటోరియంలో ది పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అఖిల భారత విద్యార్థి సమాఖ్య సంయుక్తంగా రాయలసీమ ప్రాంత విద్యార్థులు, తల్లిదండ్రులు అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ 20 ఏళ్ల క్రితం రాయలసీమ ప్రాంతం ఎలా ఉందో ఇప్పుడూ అలాగే ఉందన్నారు. రాష్ట్రంలో విద్యారంగ, నిరుద్యోగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఉచిత విద్య, నిరుద్యోగ భృతి, ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు ఇస్తామని గద్దెక్కిన చంద్రబాబు అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినా ఒక్కటి కూడా అమలుచేయలేదని విమర్శించారు. రాయలసీమ ప్రాంత అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తానని చెప్పి మొండిచేయి చూపారని మండిపడ్డారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లలో కనీస వసతులు లేక పిల్లలు ఇబ్బంది పడుతున్నా పట్టించుకునే నాథుడు లేడన్నారు. యూనివర్సిటీల్లో అధ్యాపక, ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేయకపోవడంతో విద్యార్థుల సంఖ్య పడిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మూసివేసిన 4,500 పాఠశాలలను తిరిగి ప్రారంభించి విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీనియర్ సైంటిస్ట్ బి.డాక్టర్ రూపేష్ కుమార్ రెడ్డి, జియోగ్రఫీ సబ్జెక్ట్ నిపుణుడు కొరప్రాటి జనార్ధన, దివ్యాంగ సేవ కేంద్రం వ్యవస్థాపకులు నెల్లూరు మునిలక్ష్మి, ది పేరెంట్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు నరహరి శిఖరం, సీపీఐ జిల్లా కార్యదర్శి మురళి, ఏటీసీ జిల్లా కార్యదర్శి రాధాకృష్ణ, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఉదయ్, ప్రవీణ్, మహిళా సంఘం జిల్లా కార్యదర్శి నదియా, నేతలు గ్రేస్, వివేక్, వెంకీ, తారక్, అశోక్ పాల్గొన్నారు. -
ఆటోను ఢీకొన్న బొలేరో
– ముగ్గురికి గాయాలు పుల్లంపేట : మండలంలోని అనంతంపల్లె వద్ద ఆదివారం తిరుపతి–కడప ప్రధానరహదారిపై ఆటోను బొలేరో వాహనం ఢీకొంది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం రాజంపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసుల ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య చంద్రగిరి : మండలంలోని రామిరెడ్డిపల్లె సమీపంలో ఆదివారం సాయంత్రం రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి (సుమారు 50) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలు.. చంద్రగిరి–కొటాల మార్గంలోని రైల్వే ట్రాక్ వద్దకు ఓ వ్యక్తి ద్విచక్ర వాహనంపై వచ్చాడు. వాహనం పక్కన పెట్టి ఒక్కసారిగా రైలు కింద తలపెట్టాడు. అయితే మృతి చెందిన వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది. స్థానికులు ఈ మేరకు రైల్వే అధికారులకు సమాచారం అందించారు. చెట్టును ఢీకొన్న కారు – ముగ్గురికి గాయాలు చంద్రగిరి : శ్రీవారి మెట్టు మార్గంలో ఆదివారం ఓ కారు చెట్టును ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు.. తిరుమల శ్రీవారి దర్శనార్థం హైదరాబాదుకు చెందిన యాదగిరి కుటుంబ సభ్యులతో కలసి శ్రీవారిమెట్టు కాలినడకన వెళ్లేందుకు కారులో వచ్చారు. శ్రీనివావాస మంగాపురం నుంచి శ్రీవారి మెట్టుకు వెళుతుండగా కారు అదుపు తప్పడంతో ప్రమాదం జరిగింది. కారు డ్రైవరు ప్రేమ్ కుమార్ క్షేమంగా బయటపడగా, యాదగిరితో పాటు రమాదేవి, పద్మ గాయాలపాలయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను 108 వాహనంలో తిరుపతి రుయాకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మద్యం మత్తులో బస్సు అద్దాలు ధ్వంసం నాగలాపురం: స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఆదివారం సాయంత్రం ఓ వ్యక్తి మద్యం మత్తులో పల్లెవెలుగు బస్సు అద్దాలను ధ్వంసం చేశాడు. బస్సు కండక్టర్ దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి నాగలాపురం : మండలంలోని సుబ్బానాయుడు కండ్రిగ వద్ద ఆదివాంర చైన్నె హైవేపై జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందారు., మరొకరు గాయపడ్డారు. వివరాలు.. నాగలాపురం తూర్పు దళితవాడకు చెందిన సత్యరాజ్ (36) ద్విచక్రవాహనంలో ఊత్తుకోటైకి బయలుదేరాడు. తమిళనాడులోని తండల గ్రామానికి ప్రభాకర్ నందనం వస్తుండగా రెండు వాహనాలు ఎదురెదురుగా డీకొన్నాయి. క్షతగాత్రులను 108లో నాగలాపురం ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలిస్తుండగా మార్గం మధ్యలో సత్యరాజ్ మరణించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సునీల్ తెలిపారు. -
దళారీల గుప్పిట్లో ధాన్యం
రైతులకు గిట్టుబటు ధర దక్కడం లేదు. దీంతో దళారులు, వ్యాపారులు కుమ్మక్కై నిలువునా దోచుకుంటున్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో యథేచ్ఛగా వనరుల దోపిడీ ●సోమవారం శ్రీ 7 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026విలపిస్తున్న చంద్రశేఖర్ కుటుంబ సభ్యులు చియ్యవరం మృతుల ఘటనలో రోదిస్తున్న కుటుంబీకులు (ఫైల్)శ్రీకాళహస్తి నియోజకవర్గంలో అక్రమార్జనే లక్ష్యంగా మైనింగ్ మాఫియా రెచ్చిపోతోంది. ప్రకృతి వనరులను ఇష్టారాజ్యంగా దోచుకుంటోంది. అందులో భాగంగా స్వర్ణముఖి నదిలో ఇసుకను ఊడ్చేసింది. చెరువుల్లోని మట్టిని యథేచ్ఛగా తవ్వేసి అమ్మేస్తోంది. అక్రమ రవాణాకు వినియోగించే టిప్పర్లు.. ట్రాక్టర్లతో రహదారులను ఛిద్రం చేసేసింది. ఈ క్రమంలోనే ప్రజల ప్రాణాలను గాలిలో దీపంగా మార్చేసింది. అధికంగా ట్రిప్పులు వేయించి త్వరితగతిన సొమ్ములు మూటగట్టుకోవాలనే దురాశతో జనాల ఉసురు తీసేస్తోంది. ఆదివారం ఈ మేరకే ఓ యువకుడి నిండు బతుకును మట్టితో కప్పెట్టేసింది. రూ.కోట్లు కూడబెట్టుకునే పనిలో సామాన్యుల జీవితాలను చీకటిమయంగా మార్చేస్తోంది. అయినప్పటికీ అధికార యంత్రాంగం చూసీచూడనట్లు వ్యవహరిస్తోంది. అక్రమార్కులను అడ్డుకోలేక తూతూమంత్రంగా చర్యలు చేపట్టి చేతులుదులిపేసుకుంటోంది. సాక్షి, టాస్క్‌ఫోర్స్:జిల్లాలో ఎక్కడా లేనివిధంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో పుష్కలంగా సహజ వనరులు ఉన్నాయి. ప్రకృతి సంపద ను కొల్లగొట్టి రూ.కోట్లు పోగేసుకునేందుకు అక్రమా ర్కులు మాఫియా మారి రెచ్చిపోతున్నారు. నియోజకవర్గ ముఖ్యనేత కనుసన్నల్లో దందా సాగి స్తూ వాటాలు పంచుకుంటున్నారు. తమ అక్రమార్జనకు ప్రజను బలి చేస్తున్నారు. ఇసుక, మట్టి మాఫియాను అడ్డుకోవాల్సిన అధికారులు రాజకీయ ఒత్తిడికి తలొగ్గి ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. ముఖ్యనేత అండదండలతోనే.. నియోజకవర్గంలో అన్ని మండలాల మీదుగా స్వర్ణముఖి నది ప్రవహిస్తోంది. ఈ ప్రాంతాల్లో ఇసుక పుష్కలంగా లభిస్తోంది. దీంతో రాత్రింబవళ్లు జేసీబీలు, ట్రాక్టర్లు, టిప్పర్లతో ఇసుకను రాష్ట్ర సరిహద్దులు దాటిస్తూ రూ.కోట్లు వెనకేసుకుంటున్నారు. తొట్టంబేడు మండలంలోని పూడి, పెన్నలపాడు, పెద్దకనపర్తి, గద్దగుంట, శ్రీకాళహస్తి మండలంలోని వేడాం, రామాపురం, ఏర్పేడు మండలంలోని కొత్తవీరాపురం, ముసలిపేడు, పాపానాయుడుపేట, పెనుమల్లం, పెన్నగడ్డం ప్రాంతాల నుంచి భారీగా ఇసుక రవాణా సాగుతోంది. శ్రీకాళహస్తి మండలంలోని కమ్మకొత్తూరు, వాంపల్లి, బీవీపురం, తొట్టంబేడు మండలంలోని కళ్లిపూడి, తాటిపర్తి, తొట్టంబేడు, శివనాథపాళెం, ఏర్పేడు మండలం చిందేపల్లి, నచ్చనేరి, అంజిమేడు ప్రాంతాల్లో మట్టి, గ్రావెల్ తవ్వకాలు అధికంగా జరుగుతున్నాయి. ఇక్కడ నుంచి ట్రాక్టర్లు అధిక లోడ్డుతో మితిమీరిన వేగంతో వెళుతుంటాయి. దీంతో తరచూ దారిన వెళ్లే అమాయకుల ప్రాణాలు తీసేస్తున్నాయి. మొత్తం దందాను నియోజకవర్గ ముఖ్యనేత కనుసన్నల్లోనే జరుగుతున్నట్లు సమాచారం. అక్రమార్కులపై అధికారులు ఎవరూ చర్యలు తీసుకోకుండా సదరు ముఖ్యనేత అండదండలందిస్తున్నట్లు తెలుస్తోంది. రియల్ వెంచర్లకు తరలిస్తూ.. నియోజకవర్గంలో ఎక్కడ రియల్ వెంచర్ వెలిసినా, అవసరమైన మట్టిని అధికారపార్టీకి చెందిన ఓ కీలక నాయకుడు సరఫరా చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. జేసీబీలు, హిటాచీల సాయంతో చెరువులు, అటవీ శివారు భూములు, బీడు భూములలో మట్టి, గ్రావెల్‌ను అక్రమంగా తవ్వి తరలిస్తున్నారు. గ్రామాల్లోని చెరువుల కట్టలను తెగ్గొట్టి 30అడుగుల లోతు వరకు తవ్వి మట్టిని తరలిస్తున్నా కనీసం ఇరిగేషన్ అధికారుల జాడే కనిపించడం లేదు. అధికారులకు రాజకీయ ఒత్తిడి ఉండడంతో అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. దీనికితోడు ఎవరైనా సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేస్తే, చర్యలు తీసుకోవటం మానేసి, ఫిర్యాదు చేసిన వారి వివరాలను మాఫియా పెద్దలకు చేరవేయడంతో వారు భౌతికదాడులకు పాల్పడుతున్నారు. పైగా ఫిర్యాదు చేసిన వారిపైనే అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. ఆలయంలోకి వర్షపు నీరు నాగలాపురం: నాగలాపురంలో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. శ్రీ వేదనారాయణ స్వామి ఆలయంలోకి నీరు చేరింది. ఆలయ ప్రాంగణలో మోకాళ్ల లోతు వరకు వర్షపు నీరు రావడంతో భక్తులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఆలయం నుంచి వర్షపు నీరు సక్రమంగా బయటకు వెళ్లేలా డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని భక్తులు కోరుతున్నారు. శ్రీవారి దర్శనానికి 24 గంటలు తిరుమల: తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్ తిరుమలలోని బాట గంగమ్మ ఆలయం వద్దకు చేరింది. శనివారం అర్ధరాత్రి వరకు 84,176 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 36,673 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.74 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 24 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. అక్రమ మైనింగ్‌ను అరికట్టాలి శ్రీకాళహస్తి నియోజకవర్గంలో రాష్ట్రంలో ఎక్కడా లేనంతగా అక్రమ మైనింగ్ జరుగుతోంది. ఇసుక, మట్టి తరలింపుల్లో నంబర్ ప్లేట్లు లేని ట్రాక్టర్లు నడుపుతూ అమాయకుల ప్రాణాలను తీస్తున్నారు. నంబర్ ప్లేట్లు లేని ట్రాక్టర్లు మట్టి తోలుతుంటే ఆర్టీఏ అధికారులు ఏం చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే ఎందుకు నోరు మెదపడం లేదు. కలెక్టర్, ఎస్పీ అక్రమ మైనింగ్‌ను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలి. – గురుమూర్తి, ఎంపీ, తిరుపతిదుర్మార్గాలకు రోజులు దగ్గర పడ్డాయి రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా శ్రీకాళహస్తిలో ఇసుక, మట్టి మాఫియా రాజ్యమేలుతోంది. సామాన్యులను మట్టి, ఇసుక ట్రాక్టర్లతో గుద్ది చంపేస్తున్నారు. ప్రజల ప్రాణాలంటే ఎమ్మెల్యేకు లెక్కలేదా? అక్రమ మైనింగ్‌పై కలెక్టర్ వెంటనే దర్యాప్తు చేయించాలి. చంద్రబాబుకు ఇక్కడి ఇసుక, మట్టి మాఫియా ఆగడాలు కనబడడంలేదా..? మీ దుర్మార్గాలకు రోజులు దగ్గరపడ్డాయి. – బియ్యపు మధుసూదన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, శ్రీకాళహస్తి -
ఖాకీ వర్గాల్లో... లుకవుట్ కలకలం!
రాజంపేట: ఉమ్మడి కడప జిల్లాకు చెందిన అమెరికాలో ఉంటున్న పెనగలపాటి అభిషేక్ నాయుడు అనే విద్యార్థికి ఏపీ పోలీసులు ఇచ్చిన లుకవుట్ నోటీసు కలకలం రేపుతోంది. ఇదే అంశంపై తనకు పోలీసులు చేసిన అన్యాయాలు రాష్ట్రపతిభవన్‌ను తాకాయి. కేంద్రహోంశాఖకు ఈ ఫిర్యాదును బదిలీ చేసింది. ఇప్పుడు పోలీసువర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.ఈ వ్యవహారం జరిగేటప్పటికి అన్నమయ్య జిల్లాలో పుల్లంపేట మండలం ఉంది. ఇప్పుడు తిరుపతి జిల్లాలోకి మారింది. ఖాకీపై స్వారీ చేస్తున్న ఆయనెవరు.. ఎన్ఆర్ఐ విద్యార్ధికి పోలీసు వేధింపుల వెనుక ఖాకీల స్వారీ చేస్తున్న నాయకుడు పుల్లంపేటలో కమ్మ సామాజికవర్గాని చెందిన ఓ వ్యక్తి. ఇతను తన స్నేహితుడు ఓ పోలీసు ఉన్నతాధికారి పవర్‌ను తనకు అనుకూలంగా ఉపయోగించుకోని పోలీసులను తన చెప్పు చేతుల్లో ఉంచుకొని కబ్జాలు..అక్రమకేసులుపెట్టడంతోపాటు అన్నింటిని కానిం చేస్తున్నారన్న ఆరోపణలు బహిరంగగానే వినిపిస్తున్నాయి ఖాకీపై స్వారీ చేస్తున్న వ్యక్తి వల్ల రాజంపేట (కడపజిల్లా), పుల్లంపేట (తిరుపతి జిల్లా)లో కూడా పోలీసులపై పెత్తనం సాగిస్తున్నారనే విమర్శలున్నాయి. ఇతని చేతిలో టీటీడీ అధికారంలోకి వచ్చిన అనేక మంది డీఎస్పీ, సీఐలు, ఎస్ఐ బదిలీలకు కారకుడయ్యారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈయన పోలీసులతో దందా నిర్వహిస్తున్నారని ఆరోపణలు పోలీసువర్గాల్లో వినిపిస్తున్నాయి. స్వస్థలం రాలేక.. తిరుపతిజిల్లా పుల్లంపేట మండలానికి చెందిన అభిషేక్ అమెరికాలో మాస్టర్స్ డిగ్రీ చదవి, స్వదేశానికి తిరిగిరావాలనుకున్నా ఇప్పుడు సొంత జిల్లాలో అడుగుపెట్టేందకు హక్కులేకుండా పోయింది. ఇందుకు కారణం ప్రధానంగా భారత్ వదలిన తర్వాత నమోదైన ఒక తప్పుడు ఎఫ్ఐఆర్, ఆ తర్వాత అతని పాస్‌పోర్టు వివరాలు అతనికి తెలియకుండానే సేకరించి జారీచేసిన లుక్అవుట్ సర్కులర్ (ఎల్వోసీ). మే 24న వేసవిసెలవులకు ఇండియాకు వచ్చి న పెనగలపాటి అభిషేక్(పుల్లంపేట మండల పీవీజీ పల్లె) ఆ సమయంలోనే గ్రామకంఠం భూమిపై వివాదం రాజుకుంది. ఆగస్టు 8న బెంగళూరు విమానాశ్రయం నుంచి అమెరికాకు తిరిగి వెళ్లారు. అదేరోజు 9 గంటలకు అభిషేక్ దేశం విడిచి కేవలం గంటల్లోనే , పోలూరు కృష్ణమూర్తి అనే వ్యక్తి పుల్లంపేట పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. గ్రామకంఠం, అంటే ప్రభుత్వభూమి తన సొంత భూమిగా చూపించారు. పోలీసులు ఆ ఫిర్యాదును 133/ 2024గా నమోదుచేశారు. ఏ2గా చేర్చారు. అభిషేక్ కు టుంబీకులు, అతని కుటుంబం కానీ పాస్‌పోర్టు వివరాల ను పోలీసులకు ఎప్పుడూ ఇవ్వలేదు. ఎల్ఓసీలో తన పాస్‌పోర్టు నంబరుకు ఎలా వచ్చిందన్న అనుమానాలు లేవనెత్తారు. ఎఫ్ఐఆర్ నమోదు కావడానికి ముందే, బహిరంగంగా, చెల్లుబాటు అయ్యే వీసాపై, ఏ నోటీసు అందలేదు, ఏ సమన్లూ జారీ కాలేదు. కోర్టు ప్రకటన కూ డాలేదు. అయితే పోలీసుశాఖలో పరారీలో ఉన్న నిందితునిగా అభివర్ణించి, ఆ ఆధారంగా ఎల్వోసీతెప్పించారు. కారకులెవరు... అమెరికాలో ఉంటున్న అభిషేక్‌కు జారీ చేసిన అక్రమ లుక్అవుట్ అని ఆరోపిస్తున్న నేపథ్యంలో పోలీసు అధికారులు ఇరుక్కుపోయే అవకాశాలు ఉన్నాయని పోలీ సువర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. బాధితుని ఫిర్యాదు మేరకు కేంద్రహోంశాఖ విచారణకు ఆదేశిస్తే, తప్పుడు లేఖలు రాయడం, పాస్‌పోర్టు వివరాలు అనధికారికంగా సేకరించడం, నిష్పక్షపాతంగా వ్యవహారించడం వంటి ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది. రాష్ట్రపతికి ఫిర్యాదు.. ఆగస్టు 14..2026న పోలీసులు బాధితుడు స్వయంగా భారతరాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర హోంశాఖ, ఏపీముఖ్యమంత్రి, డీజీపీతో పాటు సహా పలువురికి ఫిర్యాదు చేశాడు. సెప్టెంబర్ 3న రాష్ట్రపతి భ వన్ నుంచి ఫిర్యాదు కేంద్రహోంశాఖకు బదిలీ అయింది. పీజీఆర్ఎస్లో ఇలా.. తిరుపతి పీజీఆర్ఎస్కు సంబంధించిన అధికారి ఇచ్చిన నివేదిక (209/206)–22.07.2026న ప్రకారం వివాదస్పద భూమి సర్వే నంబర్ 885లోని గ్రామకంఠం అంటే ప్రభుత్వభూమి, ఫిర్యాదుదారుకు దానికిపై చట్టబద్ధమైన స్వాధీనం లేదని, పట్టా కూడా లేదని ఆ నివేదిక స్పష్టం చేస్తోంది.ప్రభుత్వభూమిపై ప్రైవేట్ వ్యక్తి పేరిటట్రస్పాస్ కేసు నమోదు అనుమానానికి దారితీస్తోంది. విచారణ కొనసాగుతుండగానే వివాదస్ప భూమి అంశంలో గోడ నిర్మాణానికి పోలీసులే వెన్నుదన్నుగా నిలిచారని ఆరోపణలు వెలువడ్డాయి. -
మట్టి మాఫియాకు యువకుడు బలి
ఏర్పేడు: తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి సమీపంలోని ఏఎం పుత్తూరు వద్ద బైక్‌పై వెళుతున్న ఓ యువకుడిని మట్టి లోడుతో వెళుతున్న ట్రాక్టర్ వేగంగా ఢీకొట్టడంతో అక్కడికక్కడే మరణించాడు. శ్రీకాళహస్తి టూటౌన్ సీఐ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. తొట్టంబేడు మండలం గుండేలుగుంటకు చెందిన వెంకటసుబ్బారెడ్డి, సుబ్బరత్నమ్మ కుమారుడు చంద్రశేఖర్ (25) ఆదివారం బైక్‌పై శ్రీకాళహస్తికి వెళ్లి ఇంటికి తిరిగి వస్తున్నాడు. పట్టణ సమీపంలోని ఏఎం పుత్తూరు వద్ద ఎదురుగా మట్టి లోడుతో అతివేగంగా వస్తున్న ట్రాక్టర్ బలంగా ఢీకొట్టింది. అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు చంద్రశేఖర్ శ్రీకాళహస్తి ఆలయంలో స్వచ్ఛంద సేవకుడిగా చిన్నపాటి ఎలక్ట్రికల్ పనులు చేస్తున్నాడు. ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్ డ్రైవర్ పరారీలో ఉండగా, ట్రాక్టర్‌కు కనీసం నంబరు ప్లేట్ కూడా లేకపోవడం విశేషం. ప్రమాద విషయం తెలుసుకున్న తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి, శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి చేరుకుని మృతుని కుటుంబీకులతో మాట్లాడారు. ప్రమాదం జరిగిన తీరు గురించి అక్కడున్న వారిని ఆరా తీశారు. మృతుని తల్లిదండ్రులను ఓదార్చారు. ఎంపీ మద్దిల గురుమూర్తి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని తీరుతో శ్రీకాళహస్తిలోని ప్రతి గ్రామంలోనూ మట్టి, ఇసుక, గ్రావెల్ అక్రమ తరలింపు యథేచ్ఛగా జరుగుతోందన్నారు. నంబరు ప్లేట్లు లేకుండా ట్రాక్టర్లు నడుపుతుంటే ఆర్టీఏ అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సు«దీర్‌రెడ్డి మైనింగ్ మాఫియాకు అడ్డుకట్ట వేయాల్సిందిపోయి, నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం అనుమానాలకు తావిస్తోందన్నారు. కాగా.. శ్రీకాళహస్తి మండలం నారాయణపురానికి చెందిన ఉపాధ్యాయుడు కావలి మురళి జూలై 1వ తేదీన విధులు ముగించుకుని ఇంటికి బైక్‌పై వస్తుండగా బైపాస్‌రోడ్డులోని అండర్‌పాస్ వంతెన వద్ద మట్టి లోడుతో వెళుతున్న ఇదే ట్రాక్టర్ ట్రక్ ఢీకొట్టి అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. -
‘స్థానిక ఎన్నికలు.. కూటమి మోసాలు ప్రజలకు తెలియాలి’
సాక్షి, తిరుపతి: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా మరింత బలోపేతం చేయాలని తిరుపతి, చిత్తూరు జిల్లాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి పిలుపునిచ్చారు. ప్రతి నియోజకవర్గం సమన్వయకర్త ఆయా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటన చేయాలన్నారు. స్థానిక సంస్థలు ఎన్నికలపై ఉమ్మడి చిత్తూరు జిల్లా నియోజకవర్గం ఇంచార్జ్‌లు, ముఖ్య నాయకులతో రీజినల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తిరుపతి, చిత్తూరు జిల్లాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి, ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీలు సిపాయి సుబ్రమణ్యం, భరత్, మాజీ డిప్యూటి సీఎం నారాయణ స్వామి, మాజీ మంత్రి ఆర్కే రోజా, మాజీ ఎమ్మెల్యేలు వెంకటేగౌడ, బియ్యపు మధు సూధన్ రెడ్డి, డాక్టర్ సునీల్, మాజీ ఎంపీ రెడ్డప్ప, భూమన అభినయ్ రెడ్డి, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, కృపాలక్ష్మి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత వజ్ర భాస్కర్ రెడ్డి, చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గం పరిశీలకులు రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ..‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక బ్రాండ్, ప్రతి ఒక్కరికీ గుర్తింపు కార్డులు కూడా మీకు అందుతాయి. ఓట్లు వేసిన ప్రజలను చంద్రబాబు వెన్నుపోట్లతో పొడుస్తూనే ఉన్నాడు. నమ్మకం ద్రోహం చేస్తూ, అనుకూల మధ్యమాల ద్వారా ప్రచారం చేసుకుంటున్నాడు. పచ్చ మీడియా, కూటమి మోసాలను ప్రజల ముందుకు తీసుకెళ్లాలి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కార్యకర్తలందరూ క్రియాశీల కార్యకర్తలుగా పనిచేయాలి. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ పాదయాత్ర కూడా మొదలు అవుతుంది. ఆలోపే మనమంతా సమిష్టిగా పనిచేద్దాం. పరస్పర చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకుందాం’ అని చెప్పుకొచ్చారు.మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి మాట్లాడుతూ..‘స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయనే సంకేతాలు వస్తున్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లా సర్‌లో మొదటి స్థానంలో ఉంది. ఈ ఎన్నికలలో అందరం సమిష్టిగా పనిచేసి, పార్టీని గెలిపించుకుందాం’ అని అన్నారు.మాజీ మంత్రి రోజా మాట్లాడుతూ..‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు స్థానిక సంస్థలు ఎన్నికల్లో ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి. ఎన్నికల ముందు హామీలు వర్షం కురిపించారు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క పథకం అమలు చేయలేదు. రాష్ట్రంలో అభివృద్ధి శూన్యం, 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటుపరం చేశారు. రాష్ట్రంలో ఫేక్ సర్టిఫికెట్స్‌తో ఉద్యోగాలు ఇచ్చారు. అనర్హులకు డీఎస్సీలో ఉద్యోగాలు ఇచ్చారు. దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలో రైతులు పరిస్థితి దయనీయంగా ఉంది. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ పాలనలో కరువు వచ్చింది. ఈవీఎంలు మేనేజ్ చేసుకుని ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది’ అని వ్యాఖ్యానించారు. -
ధరా ఘాతం..
నిత్యావసరాల ధరల నియంత్రణలో కూటమి విఫలం సామాన్యుడి నడ్డి విరిచేలా ఆకాశాన్నంటుతున్న ధరలు నిత్యావసర ధరల పెంపుపై ప్లకార్డు చేతబట్టుకుని నిరసన వ్యక్తం చేస్తున్న భూమన అభినయ్‌రెడ్డి తిరుపతి మంగళం : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సామాన్యుడిపై బాదుడే బాదుడు అన్న విధంగా నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటేలా పెంచుతున్నారని వైఎస్సార్సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిత్యావసర ధరల పెంపునకు నిరసనగా భూమన అభినయ్‌రెడ్డి ఆధ్వర్యంలో శనివారం తిరుపతి నగరంలోని కృష్ణాపురం ఠాణా వద్ద నుంచి గాంధీరోడ్డు మీదగా నాలుగుకాళ్ల మండపం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. మాజీ మేయర్ డాక్టర్ శిరీష, పార్టీ నగర అధ్యక్షుడు మల్లం రవిచంద్రారెడ్డి, టౌన్‌బ్యాంక్ చైర్మన్ కేతం జయచంద్రారెడ్డి, పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు నీలం బాలాజీతో పాటు వేలాది మంది పార్టీ శ్రేణులు, సామాన్య ప్రజలు ర్యాలీలో పాల్గొన్నారు. నిత్యావసరాలను బండిపై పెట్టుకుని బతుకు బండి భారం అంటూ తాళ్లతో లాగుతూ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. పప్పులు, నూనెలు, చక్కెర, గ్యాస్ వంటి నిత్యావసరాల ధరల పెంపుపై ప్లకార్డులను చేతబట్టుకుని ‘ధరల పెంపుకు హద్దేలేదు .. పెంచే వారికి బుద్ధే లేదు ’ అంటూ నినదించారు. బాబు వస్తే కరువే బాబు వస్తే కరువు వస్తుందనడం ఎంత నిజమో, ధరలు ఆకాశాన్నంటుతాయనడం కూడా అంతే నిజమని భూమన అభినయ్ తెలిపారు. ప్రధానంగా దేశంలో విత్తనాల సమస్య తార స్థాయికి చేరిందన్నారు. నకిలీ విత్తనాలతో పంటలు సరిగా పండక, వేసిన పంటలకు సకాలంలో వర్షాలు లేక రైతులు అల్లాడిపోతున్నారన్నారు. ఎల్‌నినో ప్రభావం వల్ల పంటలు పండడంలేదంటూ చంద్రబాబు కొత్త నినాదాన్ని అందుకున్నారని గుర్తుచేశారు. ఎల్‌నినో ప్రభావం ఉంటే వచ్చే ఏడాది సమస్య వస్తుందే తప్ప ఈ ఏడాది కాదని స్పష్టం చేశారు. చంద్రబాబు చేతగాని తనం వల్లే రాష్ట్రంలో నిత్యావసరాల సంక్షోభం ఏర్పడిందన్నారు. కూటమి ప్రభుత్వం ధరల నియంత్రణపై మేలుకోకపోతే వైఎస్సార్సీపీ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టక తప్పదని ఆయన హెచ్చరించారు.ప్రభుత్వానికి నియంత్రణ లేదు భూమన అభినయ్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని వ్యవస్థలపై ప్రభుత్వానికి నియంత్రణ లేకపోవడం వల్లే నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయన్నారు. ఎన్నికల్లో ఓట్లు దండుకోవడం కోసం తాము అధికారంలోకి వస్తే నిత్యావసర ధరల రెక్కలు విరిచేస్తానంటూ చంద్రబాబు మాయమాటలు చెప్పి వంచించారని మండిపడ్డారు. రాష్ట్రంలో ముందుగా సివిల్ సప్లైశాఖ మంత్రికి నిత్యావసర ధరల నియంత్రణపై పూర్తి అవగాహన లేదన్నారు. రెవెన్యూ, సివిల్ సప్లై, జీఎస్టీ విభాగం, చాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్లతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ధరల నియంత్రించాలన్న ఆలోచనే లేకపోవడం విడ్డూరంగా ఉందన్నారు.అభినయ్‌రెడ్డి, అనుచరులపై కేసు తిరుపతి క్రైం : ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా నిరసన కార్యక్రమం నిర్వహించారనే ఆరోపణలపై భూమన అభినయ్‌రెడ్డి, ఆయన అనుచరులపై తిరుపతి వెస్ట్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల మేరకు.. శనివారం ఉదయం 10 గంటల సమయంలో తిరుపతి నగరంలోని కృష్ణాపురం ఠాణా వద్ద భూమన అభినయ్‌రెడ్డి, ఆయన అనుచరులు ముందస్తు అనుమతి లేకుండా నిరసన కార్యక్రమం నిర్వహించారు. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలంటూ నినాదాలు చేశారు. ఈ క్రమం కారణంగా ప్రజల సాధారణ రాకపోకలకు ఆటంకం కలిగింది. భక్తులకు అసౌకర్యం ఏర్పడిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. తిరుపతి సబ్ డివిజన్ పరిధిలో 30 పోలీస్ యాక్ట్–1861 అమల్లో ఉన్నప్పటికీ సంబంధిత అధికారుల నుంచి ముందస్తు అనుమతి తీసుకోలేదని పోలీసులు తెలిపారు. ఈ మేరకు భూమన అభినయ్‌రెడ్డి, ఆయన అనుచరులపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.


