ప్రజలను మోసం చేసే బడ్జెట్‌ | - | Sakshi
Sakshi News home page

ప్రజలను మోసం చేసే బడ్జెట్‌

Feb 16 2026 7:13 AM | Updated on Feb 16 2026 7:13 AM

ప్రజల

ప్రజలను మోసం చేసే బడ్జెట్‌

చంద్రబాబు ప్రభుత్వం బడ్జెట్‌ కేటాయింపుల్లో వరుసగా మూడోసారి అన్నివర్గాలను మోసం చేసింది. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో అమలు చేసిన బడ్జెట్‌కు, చంద్రబాబు బడ్జెట్‌కు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. సూపర్‌సిక్స్‌ పథకాలు అమ లు చేసేందుకు అవసరమైన కేటాయింపులు బడ్జెట్‌లో లేవు. అధికారంలోకి వచ్చి రెండేళ్ల కావస్తున్నా నిరుద్యోగ భృతి ఆడబిడ్డ నిధి, నూతన పింఛన్ల మంజూరు, సున్నా వడ్డీ పథకాలు ఇప్పటిదాకా అమలుకు నోచుకోలేదు. బడ్జెట్‌తో మరోసారి మోసం చేశారే తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదు. అలాగే అన్నదాత సుఖీభవ తల్లికి వందనం వంటి పథకాలపై బడ్జెట్‌లో కోతలు విధించి సామాన్యుల ఆశ లపై నీళ్లు చల్లారు. ప్రభుత్వ ఉద్యోగులకు బడ్జెట్‌లో మొండిచేయి చూపారు. పీఆర్‌సీ, ఐఆర్‌ ఊసే లేదన్నారు. సీపీఎస్‌ రద్దుపైన బడ్జెట్‌లో ప్రస్తావన లేదు. – నూకతోటి రాజేష్‌, వైఎస్‌ఆర్‌ సీపీ సత్యవేడు సమన్వయకర్త

నిరుద్యోగులను నట్టేట ముంచారు

చంద్రబాబు సర్కారు ఎన్నికల హామీలలో ప్రధానంగా యువతను ఆకట్టుకునేందుకు కుటుంబంలోని నిరుద్యోగులందరికీ ఒక్కక్కొరికి నెలకు రూ.3 వేలు అందిస్తామన్నారు. అధికారం చేపట్టి రెండేళ్లు పూర్తి కావస్తోంది. ఇప్పటి వరకు ఆ ఊసే ఎత్తలేదు. యువగళం పాదయాత్రలోనూ నారా లోకేష్‌ యువత ఓట్ల కోసం ప్రగల్భాలు పలికారు. కనీసం ఈ బడ్జెట్‌లోనైనా నిరుద్యోగ భృతిపై ప్రకటన చేస్తారని విశ్వసించాం. కానీ నిరుద్యోగులకు నిరాశే మిగిలింది. జిల్లాలోని సుమారు ఏడు లక్షల మంది నిరుద్యోగులను నట్టేట ముంచేశారు.

– శివశంకర్‌ నాయక్‌, జీఎన్‌ఎస్‌ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు, తిరుపతి

ప్రజలను మోసం చేసే బడ్జెట్‌ 1
1/1

ప్రజలను మోసం చేసే బడ్జెట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement