ఇంట్లోనే గర్భాశయ కేన్సర్ స్క్రీనింగ్ టెస్ట్..! సురక్షితమేనా..? | Health: What Is An At-Home Cervical Cancer Screening Test | Sakshi
Sakshi News home page

ఇంట్లోనే గర్భాశయ కేన్సర్ స్క్రీనింగ్ టెస్ట్..! సురక్షితమేనా..?

Feb 12 2026 12:40 PM | Updated on Feb 12 2026 12:47 PM

Health: What Is An At-Home Cervical Cancer Screening Test

కొన్నికేన్సర్‌లు.. సులభంగా టెస్ట్‌లు చేయించుకోలేం. అలాంటి వాటిల్లో ఒకటి ఈ గర్భాశయ కేన్సర్‌. ఇది కాస్త గోపత్యకు సంబంధించినవి కావడంతో మహిళలు క్లినిక్‌లను సందర్శించడంలో జాప్యం చేస్తున్నారు. ఆ నేపథ్యంలో వైద్యశాస్త్రం సాంకేతిక సాయంతో మరింత పురోగతిని అందించేలా మహిళలే స్వీయంగా చేసుకునే వెసులబాటు అందించింది. అంటే ఇంట్లోనే సులభంగా గర్భాశయ కేన్సర్‌ స్క్రీనింగ్‌ టెస్ట్‌(HPV స్వీయ-నమూనా అని కూడా పిలుస్తారు) చేసుకోవచ్చు అన్నమాట. 

ఇది భవిష్యత్తు కాలంలో మంచి గేమ్‌ ఛేంజర్‌గా ఉద్భవించనుంది. అచ్చం ప్రెగ్నెన్సీ టెస్ట్‌ కిట్‌ మాదిరిగానే ఇంట్లోనే గర్భాశయం ఆరోగ్యం కోసం మనమే స్వయంగా చేసుకోవచ్చని చెబుతున్నారు వైద్య నిపుణులు. అసలేంటి టెస్ట్‌? ఎలా చేయాలి?, సురక్షితమేనా? తదితరాల గురించి సవివరంగా తెలుసుకుందామా..!.

ఇంట్లోనే గర్భాశయ కేన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ అంటే..
గర్భాశయం నుంచి కణాలను సేకరించడానికి వైద్యుడు స్పెక్యులమ్‌ను ఉపయోగించే సాంప్రదాయ పాప్ స్మియర్ మాదిరిగా కాకుండా, ఇంట్లోనే నిర్వహించే స్వీయ-నమూనా కిట్‌ ఇది. ఇందులో 95% కచ్చితత్వం ఉంటుందని చెబుతున్నారు నిపుణులు

ఎలా చేయాలంటే..

కిట్:  స్టెరైల్ స్వాబ్ (పొడవైన Q-టిప్ లాగా) లేదా ప్రత్యేకమైన బ్రష్‌ను కలిగి ఉన్న చిన్న ప్యాకేజీని అందుకుంటారు.

బాత్రూమ్ లేదా గదిలో ఆ స్వాబ్‌ను యోనిలోకి చొప్పించి కొన్ని సెకన్ల పాటు తిప్పాలి. అది గర్భాశయాన్ని చేరుకోవాల్సిన అవసరం లేదు. అప్పుడు ఆ స్వాబ్ HPV DNA కలిగి ఉన్న యోని గోడల నుంచి కణాలు, ద్రవాలను తీసుకుంటుంది. 

ఆ స్వాబ్‌ను ప్రిజర్వేటివ్ ట్యూబ్‌లో ఉంచి, దానిని సమీపంలోని ల్యాబ్‌కు పంపించాలి. 

ఫలితం: పరీక్షలో నెగిటివ్‌ వస్తే..గర్భాశయ కేన్సర్‌వచ్చే ప్రమాదం చాలా తక్కువని, ఒకవేళ పాజిటివ్‌ అయితే ..ప్రమాదకర హెచ్‌పీవి శరీరంలో ఉందని అర్థం. అలాంటప్పుడు తదుపరి పాప్ స్మియర్ లేదా కోల్‌పోస్కోపీ కోసం గైనకాలజిస్ట్‌ను సందర్శించాలి.

ఇక్కడ మహిళలకు ఓ వైద్యుడి మాదిరిగా చేసుకోగలమా అనే సందేహం రావడం సహజం. అయితే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR), జేసీఓ గ్లోబల్ ఆంకాలజీ ఈ స్వీయ నమునా చాలా ప్రభావవంతంగా ఉంటుందని పేర్కొంది. ముందుగా ఈ గర్భాశయ కేన్సర్‌ని గుర్తించడంలో సాంప్రదాయ పాప్‌ స్మియర్‌ల కంటే HPV DNA పరీక్షలు చాలా సులభంగా, ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్వహించగలిగేవని పేర్కొంది. 

ఈ హెచ్‌పీవీ కిట్‌ల సాయంతో మహిళలు స్వయంగా సేకరించిన నమునాలు, వైద్యులు సేకరించిన వాటివలే ఉంటాయని హామి ఇచ్చింది కూడా. ఇది ప్రారంభ స్కీనింగ్‌ వైద్య పరీక్షగా ఉపయోగపడుతుంది. అయితే ఇది కేన్సర్‌ని మందస్తు దశలోనే గుర్తించడానికి హెల్ప​్‌ అయ్యే సాధనమే తప్ప కేన్సర్‌ని నిర్థారించేది మాత్రం కాదు.

ఎందుకు అత్యంత ముఖ్యమైనదంటే..
భారతదేశంలో, గర్భాశయ కేన్సర్ మహిళల్లో రెండవ అత్యంత సాధారణ కేన్సర్‌గా మారింది. ప్రతి ఏడాది దాదాపు 75 వేల నుంచి 80 వేల మంది దాక మహిళలు ఈ వ్యాధి కారణాంగా ప్రాణాలు కోల్పోతున్నారు. వాటిని నివారించేందుకు ఇంట్లేనే నిర్వహించుకునే ఈ సులభమైన స్క్రీనింగ్‌ పరీక్ష అత్యంత ప్రధానమైనదిగా మారింది.

ఏవిధంగా అంటే..?

  • ఈ టెస్ట్‌ నిమిత్తం చాలామంది మహిళలు అసౌకర్యంగా ఫీలవుతారు.  ఆ అసౌకర్యాన్ని ఈ పరీక్ష తొలగిస్తుంది. 

  • అదీగాక గ్రామీణ మహిళలకు, అత్యంత బిజీగా ఉండే పట్టణ మహిళలకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. పైగా వైద్య ఖర్చులను తగ్గిస్తుంది. 

  • పైగా ఈ పరీక్షలో ఎలాంటి నొప్పి ఉండదు, ఐదు నిమిషాల కంటే తక్కువ సమయమే పడుతుంది.

  • నిజానికి ఈ కిట్‌లు ఆరోగ్యకరమైన భవిష్యత్తుగా వారధిగా పనిచేస్తాయి. పైగా 25 నుంచి 65 ఏళ్ల మధ్య వయసు వాళ్లు కనీసం మూడేళ్ల కొకసారైనా ఈ పరీక్షను చేసుకోవడం మంచిదని చెబుతున్నారు నిపుణులు.

గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. 

(చదవండి: వారసత్వ వేడుక..'జుట్టు విప్పే ఆచారం'!: సోనమ్‌ కపూర్‌)

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement