breaking news
Guntur
-
నాడు అరచేతిలో వైకుంఠం.. నేడు మోసం
తాడేపల్లి: అధికారంలోకి వచ్చిన దాదాపు ఏడాదిన్నర తర్వాత ఉద్యోగులకు కేవలం ఒకే ఒక్క డీఏ ప్రకటించి, ఆర్భాటంగా ప్రచారం చేసుకోవడం ఒక్క చంద్రబాబుకే చెల్లిందని మాజీ మంత్రులు కాకాణి గోవర్థన్‌రెడ్డి, మేరుగ నాగార్జున మండిపడ్డారు. ఎన్నికలకు ముందు ఉద్యోగులకు ఇచ్చిన హామీలు ఏమిటి.. ఇప్పుడు మీరు చేస్తున్నదేమిటని నిలదీశారు. తీపి తీపి మాటలతో అరచేతిలో నాడు వైకుంఠం చూపి, తీరా ఇప్పుడు వారిని మోసం చేయడం దుర్మార్గం అని ధ్వజమెత్తారు. ఇందుకేనా మీరు అధికారంలోకి వచ్చిందని నిలదీశారు.ఉద్యోగులను నిలువునా ముంచారన్నారు. కేబినెట్ సమావేశాల్లో మీ శ్రద్ధ అంతా భూ పందేరం మీద తప్ప, ప్రజల మీద, ఉద్యోగస్తుల మీద ఇసుమంత కూడా లేదన్నారు. ‘అప్పుడైనా, ఇప్పుడైనా, ఎప్పుడైనా ప్రజల మీద, ఉద్యోగుల మీద మీకున్నది కపట ప్రేమే. వారిని నమ్మించి వెన్నుపోటు పొడవటం, మీకు అలవాటే. ఉద్యోగులకు మీరిచ్చిన హామీలు ఏమిటో ఒక్కసారి మీ మేనిఫెస్టో చూడండి. అందులో ఒక్కటైనా నెరవేర్చారా? అధికారంలోకి వచి్చన వెంటనే ఐఆర్ అన్నారు. మరి ఇచ్చారా? మెరుగైన పీఆర్సీ అంటూ ఊదరగొట్టారు. మరి ఆ సంగతి ఏమైంది? మేము నియమించిన పీఆర్సీ చైర్మన్‌ను వెళ్లగొట్టారు. ఆ తర్వాత కొత్తగా ఎవ్వరినీ నియమించ లేదు.సీపీఎస్, జీపీఎస్ రెండింటినీ సమీక్షించి ఆమోదయోగ్యమైన పరిష్కారం అంటూ ఎన్నికల ముందు కబుర్లు చెప్పారు. కానీ, వాటిపై ఒక్కసారి కూడా సమీక్షించలేదు. బకాయిలు, పెండింగ్ డీఏలు, జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ, మెడికల్ రీయింబర్స్మెంట్ మాటెత్తడం లేదు. మొత్తంగా రూ.31 వేల కోట్లు బకాయి పడ్డారు. ఇప్పుడు ప్రకటించిన డీఏను గత ఏడాది జవనరి 1 నుంచి ఇవ్వాలి. మరి ఆ బకాయిల చెల్లింపుపై మీ నోటి నుంచి ఏ మాటా రాలేదు. ఇది మరో మోసం. వలంటీర్ల జీతాలు రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతామని హామీ ఇచ్చి, ఏకంగా వారి పొట్టకొట్టి రోడ్డు మీద పడేశారు. ఆరీ్టసీలో పని చేస్తున్న దాదాపు 52 వేల మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా రెగ్యులరైజ్ చేయడాన్ని తప్పన్నట్లు మాట్లాడటం దారుణం’ అని మండిపడుతూ శనివారం వారు ఓ ప్రకటన విడుదల చేశారు. -
కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా ఉంది: వైఎస్సార్సీపీ
తాడేపల్లి : కూటమి ప్రభుత్వం 16 నెలలు తర్వాత ఉద్యోగులతో హడావుడిగా చర్చలు జరిపి ఒకే ఒక్క డీఏ మాత్రమే ప్రకటించడంపై వైఎస్సార్సీపీ మండిపడింది. ఇది కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా ఉందంటూ విమర్శించింది. ఈరోజు( శనివారం, అక్టోబర్ 18వతేదీ) పెన్షనర్ల సంఘ నాయకులతో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్, ముఖ్యమంత్రి సమావేశాలు జరిపి ఒక్క విడత డి ఏ మాత్రమే అనౌన్స్ చేయడం విడ్డూరంగా ఉందని వైఎస్సార్సీపీ ఎంప్లాయిస్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖరరెడ్డి ధ్వజమెత్తారు. ముఖ్యంగా మధ్యంతర భృతిని ఇవ్వకపోవడం, 4 విడతలు డిఏ పెండింగ్ ఉంటే ఒకటి విడత మాత్రమే మంజూరు చేయడం, ఉద్యోగులకు ఇవ్వవలసిన బకాయిలు మాట ఎత్తక పోవడాన్ని ఉద్యోగవర్గం జీర్ణించుకోలేక పోతోంది దీపావళి పండుగకు ఇవి తప్పక ఇస్తారని ఎదురు చూశారు కానీ కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు మరియు పెన్షనర్స్ కి దీపావళి కానుక ఒక్క డీ ఏతో తుష్ మనిపించారు’ అని విమర్శించారు.కాగా, ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు మళ్లీ మొండిచేయి చూపెట్టారు. ఉద్యోగులకు ఐఆర్‌పై ఎటువంటి ప్రకటన చేయని చంద్రబాబు.. పీఆర్సీపైనా కూడా నోరు మెదపలేదు. వీటిని పక్కన పెట్టిన చంద్రబాబు.. కేవలం సింగిల్ డీఏతో సరిపెట్టేశారు. నాలుగు డీఏల్లో ఒక డీఏను మాత్రమే ప్రకటించారు. ఇక, ఐఆర్, పీఆర్సీపై ప్రకటన వస్తుందని ఉద్యోగులుకు కేవలం ఒక డీఏనే ప్రకటించడంతో మరోసారి చంద్రబాబు చిత్తశుద్ధి బయటపడింది. చంద్రబాబు ప్రకటనతో ఉద్యోగుల్లో తీవ్ర నిరాశ వ్యక్తమవుతోంది. గత రెండు రోజులుగా ఉద్యోగ సంఘాలతో చర్చల పేరుతో మంత్రులు హైడ్రామా నడిపినప్పటికీ, చివరికి ఒక డీఏనే ప్రకటించారు చంద్రబాబు. మరొకవైపు పెండింగ్ బకాయిల అంశానికి సంబందించి కూడా ఉద్యోగులకు నిరాశే ఎదురైంది. -
ఐవీఆర్ఎస్ కాల్స్‌తో వైఎస్సార్సీపీపై విష ప్రచారం: టీజేఆర్
సాక్షి, తాడేపల్లి: ప్రభుత్వ పెద్దల ప్రోత్సహాంతో నకిలీ మద్యం దందాలో టీడీపీ నేతలు అడ్డంగా దొరికిపోవడంతో, ప్రజల దృష్టిని మళ్ళించేందుకు ఐవీఆర్ఎస్ కాల్స్‌తో వైఎస్సార్సీపీపై తప్పుడు ప్రచారానికి చంద్రబాబు తెగబడ్డారని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్ బాబు మండిపడ్డారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. వివేకా హత్యతో లింక్ చేస్తూ, నకిలీ మద్యం దందాపై ప్రజలకు ఐవీఆర్ఎస్ కాల్స్ చేయిస్తున్న చంద్రబాబుకు నిజంగా దీనిపై వాస్తవాలు వెల్లడి కావాలంటే సీబీఐ విచారణ కోరడానికి ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. ఈ దందాలో కిలారు రాజేష్, నారా లోకేష్‌ల దోపడీ వ్యవహారం బయటపడుతుందని చంద్రబాబు కంగారు పడుతున్నారని ధ్వజమెత్తారు. ఇంకా ఆయనేమన్నారంటే..చంద్రబాబు నేతృత్వం లోని ప్రభుత్వం నకిలీ మద్యం రాకెట్‌ను ప్రోత్సహిస్తూ మద్యం దుకాణాలు, బార్లు, బెల్ట్‌షాప్‌ల ద్వారా పెద్ద ఎత్తున అమ్ముతోంది. ఈ విషయం కాస్తా బయటపడిపోవడం, ఈ నకిలీ మద్యం దందా వెనుక ఉన్న టీడీపీ నేతల పేర్లు వెలుగులోకి రావడంతో ప్రజలు తెలుగుదేశం పార్టీని అసహ్యించుకుంటున్నారు. దీని నుంచి బయటపడటానికి సీఎం చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్‌ను తెరమీదికి తీసుకువచ్చి, వైఎస్సార్సీపీకి ఆ బురద అందించేందుకు సిద్ధమయ్యాడు.అందులో భాగంగానే నిందితుడు జనార్థన్‌తో మాజీ మంత్రి జోగి రమేష్‌పై తప్పుడు ఆరోపణలు చేయించాడు. ఈ విషయాలను ప్రజలు నమ్మడం లేదని తెలిసి, పదేపదే ఈ నిందను వైఎస్సార్సీపీపై మోపుతూ పెద్ద ఎత్తన ప్రచారం చేయించేందుకు తెగబడ్డాడు. దీనిలో భాగంగా ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ప్రజలకు ఫోన్లు చేయించి, ముందుగా రికార్డు చేసిన మెసేజ్‌ను వారి మెదళ్ళలో జొప్పించేందుకు దిగజారుడు రాజకీయం చేస్తున్నాడు.ఫేక్ న్యూస్‌ను ప్రచారం చేయడంలో చంద్రబాబు దిట్టగత ఎన్నికలకు ముందు కూడా ఇలాగే ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా 'మీ భూమిని వైయస్ జగన్ లాగేసుకుంటున్నారు, మీ భూములకు రక్షణ లేదంటూ' ఒక ఫేక్ న్యూస్‌ను విస్తృతంగా ప్రచారం చేసి లభ్దిపొందారు. తిరిగి ఇప్పుడు టీడీపీ కార్యాలయం నుంచి ప్రజలకు మళ్ళీ అటువంటి ఐవీఆర్ఎస్ కాల్స్ చేయిస్తున్నాడు. నకిలీ మద్యం దందాలో కీలక నిందితుడు జనార్థన్‌రావు వాయిస్‌తో ఉన్న ఐవీఆర్ఎస్ కాల్స్‌లో జోగి రమేష్‌పై చేసిన ఆరోపణలను వినిపిస్తూ, నకిలీ మద్యం అంతా కూడా వైయస్ఆర్సీపీ వారే చేశారనే ఫేక్ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. (టీడీపీ నేతలు చేయిస్తున్న ఐవీఆర్ఎస్ కాల్స్ ఆడియోను ప్రదర్శించారు) తెలుగుదేశంకు ఈ నకిలీ మద్యం దందాతో సంబంధం లేకపోతే ఎందుకు పనిగట్టుకుని పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు చేసి ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా జనార్థన్ వాయిస్‌తో జోగి రమేష్ పేరు చెప్పిస్తున్నారో ప్రజలు అర్థం చేసుకోవాలి.నాణ్యమైన లిక్కర్ అంటూ నకిలీ లిక్కర్ ఇస్తున్నాడుప్రజాస్వామ్యంలో ఇటువంటి నికృష్టపు రాజకీయాలు ఒక్క చంద్రబాబు తప్ప మరెవ్వరూ చేయలేదు. చంద్రబాబు పేరు చెబితే నేడు ప్రజలకు నకిలీ మద్యం దందానే గుర్తుకు వస్తోంది. మందుబాబులకు నాణ్యమైన మద్యంను ఇస్తానంటూ ఎన్నికలకు ముందు హామీలు గుప్పించాడు. ప్రబుత్వ ఆధీనంలోని మద్యంను ప్రైవేటువారి చేతికి ఇస్తే ఇలాంటి దారుణాలే జరుగుతాయని అందరికీ తెలుసు. గత తెలుగుదేశం ప్రభుత్వంలోనూ నకిలీ మద్యం తాగి అనేక మంది చనిపోయారు. నేడు అధికారంలోకి రాగానే చంద్రబాబు తన నకిలీ మద్యం దందాను ప్రారంభించాడు. నాణ్యమైన మద్యం, తక్కువ రేటుకు ఇస్తానంటూ హామీలు ఇస్తే మద్యం తాగే అలవాటు ఉన్న వారు చంద్రబాబు మాటలపై ఎంతో ఆశలు పెంచుకున్నారు.కానీ నేడు నాణ్యమైన మద్యం సంగతి పక్కకుపెట్టి, నకిలీ మద్యం తయారీని కుటీర పరిశ్రమ స్థాయికి తీసుకువచ్చాడు. ఈ విషయం ప్రజల ముందు బయటపడిపోవడంతో, దాని నుంచి బయట పడేందుకు తన హయాంలోనే జరిగిన వివేకా హత్యకేసు, సీబీఐ విచారణలో ఉన్న ఆ కేసుపైన కూడా తప్పుడు వక్రీకరణలు చేస్తూ ఐవీఆర్ఎస్ కాల్స్ చేయిస్తున్నాడు. ఇటువంటి ఐవీఆర్ఎస్ కాల్స్ చేసే బదులు నకిలీ మద్యం దందాపై సీబీఐ విచారణ జరిపించాలని చంద్రబాబు కోరాలని డిమాండ్ చేస్తున్నాం. చంద్రబాబు తన చిత్తశుద్దిని నిరూపించుకోవాలి. వివేకా హత్యకేసు ఇప్పటికే సీబీఐ పరిధిలో ఉంది. నకిలీ మద్యంను, వివేకా హత్య కేసును ఎలా ముడిపెడతారు? ప్రజలను పక్కదోవ పట్టించేందుకే ఇటువంటి దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారు. నకిలీ మద్యం ఏ షాప్‌ల్లో ఉందో ప్రజలను ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా అడగాలి. చంద్రబాబు నకిలీ మద్యం తాగి చనిపోయిన ప్రతి ప్రాణం ఉసురు ఆయనకు తగిలితీరుతుంది.చంద్రబాబూ.. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండిఐవీఆర్ఎస్ కాల్స్‌లో తప్పుడు ప్రచారాలు మాని… మీకు ధైర్యం, నిజాయితీ ఉంటే మేం అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి. నారా లోకేష్‌తో అయినా చెప్పించండి. నకిలీ లిక్కర్ ఫ్యాక్టరీలు బయటపడ్డ తర్వాత మీరెన్ని షాపుల్లో తనిఖీలు చేశారు? ఎన్ని నకిలీ లిక్కర్ బాటిళ్లు పట్టుకున్నారు? ఏయే షాపుల్లో గుర్తించారు? నకిలీ లిక్కర్ ఫ్యాక్టరీల నుంచి సరఫరా చైన్ ఏంటి? ఎవరెవరు వాటిని కొన్నారు? ఏయే లిక్కర్ షాపులు అమ్మాయి? ఎక్కడెక్కడ బెల్టుషాపులకు సప్లై అయ్యాయి? ఇది బయటకు రావడం లేదంటే.. ఇదంతా మీరు నడిపించిన మాఫియా కదా? అద్దేపల్లి జనార్దన్‌ను మీరు రప్పించారా? తనే వచ్చాడా? తాను వస్తున్నట్టుగా మీకు తెలిస్తే.. ముంబై వెళ్లి ఎందుకు అరెస్టు చేయలేదు? అంతకుముందు రెడ్‌కార్నర్ నోటీసు ఎందుకు జారీచేయలేదు? పరస్పర సహకార ఒప్పందం వెనుక మతలబు ఏమిటో చెప్పాలి.అద్దేపల్లి జనార్థన్ ఫోన్ ఎక్కడ ఉంది?అద్దేపల్లి జనార్దన్ తన ఫోను ముంబైలో పోయిందని చెప్పారు. ఆ ఫోన్లో జోగిరమేష్‌తో చాట్ చేసినట్టుగా మరోవైపు లీక్ చేయించారు. పోయిన ఫోన్ నుంచి చాటింగ్ స్క్రీన్ షాట్ ఎలా బయటకు తీశారు? ఇదెలా సాధ్యమైంది? జనార్దన్‌ను ఎయిర్‌పోర్టులోనే అరెస్టు చేశారు. జనార్దన్ లాయర్ల సమక్షంలో అదుపులోకి తీసుకున్నారు. మరి మీ కస్డడీలో ఉన్నప్పుడు జనార్దన్ ఎలా వీడియో తీసుకున్నాడు? ఆ వీడియోను ఎలా బయటకు పంపగలిగాడు? అదీ అతనికి ఫోన్లేకుండా? ఈ మాయా మర్మం ఏంటి మహానుభావా? నకిలీ మద్యం కేసులో తంబళ్లపల్లె నుంచి పోటీచేసిన మీ పార్టీ నాయకుడు జయచందరారెడ్డి తనకు లిక్కర్ వ్యాపారాలు ఉన్నాయని, ఆఫ్రికాలో ఉన్నాయని నేరుగా అఫిడవిట్లో పెట్టారు.మీకు ఇవన్నీ తెలిసే గత ఎన్నికల్లో టిక్కెట్టు ఇచ్చిన మాట వాస్తవం కాదా? దీనికోసం సీనియర్, మాజీ ఎమ్మెల్యే అయిన శంకర్‌యాదవ్‌ను నట్టేటా ముంచిన మాట వాస్తవం కాదా? ఈ టిక్కెట్లు ఇవ్వడానికి నడిచిన క్యాష్… సూట్‌కేస్… రాజేష్.. లోకేష్.. వ్యవహారం మీద మీకు విచారణ చేసే దమ్ము ఉందా? నకిలీ లిక్కర్ ఫ్యాక్టరీ అక్టోబరు 3న బయటపడితే ఇవ్వాళ్టికి 16 రోజులు అయ్యింది. ఇప్పటికీ జయంద్రారెడ్డికి రెడ్ కార్నర్ నోటీసు ఇవ్వలేదు. రెడ్‌కార్నర్ నోటీసు జారీచేయలేదు. పాస్ పోర్టు రద్దు చేయాలంటూ మీ జేబులో సిట్ దరఖాస్తు కూడా చేయలేదు. కారణం ఏంటో…? స్తుతి మెత్తని, సానుకూలత పద్ధతులు ఎందుకు? మీకు మీకు ఉన్న ఒప్పందాలు ఏంటి?కిలారు రాజేష్, లోకేష్‌ల గుట్టు బయటపడుతుందని భయంజయచంద్రారెడ్డి బావమరిది గిరిధర్‌రెడ్డి, పీఏ రాజేష్లనుకూడా ఎందుకు పట్టుకోలేకపోయారు? నన్ను ఇబ్బందిపెడితే కిలారు రాజేష్, లోకేష్‌ల గట్టువిప్పుతానని జయంద్రారెడ్డి మీకు గట్టి హెచ్చరిక పంపినట్టుగా తెలుస్తోంది. ఈ స్టోరీపై కాస్త స్పందిస్తారా? కనీసం లోకేష్ అయినా మాట్లాడతాడా? మీ నకిలీ మద్యం అమ్మకానికి అడ్డురాకుండా మీరు అద్భుతమంటూ ప్రచారం చేసిన రూ.99ల లిక్కర్ సప్లైని తగ్గించేశారు. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అద్భుతమైన ఈ రూ.99ల సరుకు ఎంత అమ్మారు? నెలల వారీగా… వివరాలు బయటపెట్టగలరా? మీరు డాష్‌బోర్డు సీఎం కదా? కనీసం ఆ ముఖేష్‌కుమార్ మీనా కైనా చెప్పండి. పాపం మిమ్మల్ని కవర్ చేయలేక, ఆయన్ని ఆయన కాపాడుకోలేక తెగ ఇబ్బందిపడుతున్నాడు. దీంతో పాటు గతంలో ఉన్న బ్రాండ్లు, వాటి రేట్లు, ఇప్పుడున్న బ్రాండ్లు వాటి రేట్లు, మీరు కొత్త పాలసీ తెచ్చిన తర్వాత నెలవారీగా వాటి విక్రయాలు, అలాగే ఆయా డిస్టలరీలకు ఇచ్చిన ఆర్డులు, వాటి నుంచి సప్లై, చెల్లించిన మొత్తాలు.. ఇవి బయటపెడితే బాగుంటుంది. మీరు బయటపెట్టకపోయినా ఎలాగూ.. మేం వచ్చాక బయటపెడతాం. అందులో సందేహం లేదు. చంద్రబాబూ.. రూల్ ప్రకారం బార్లకు సెపరేట్‌గా, లిక్కర్ షాపులకు సెపరేట్‌గా మందును సప్లై చేయాలి. కాని, బార్లు ఏవీకూడా ఆర్డర్లు పెట్టుండా… నేరుగా లిక్కర్ షాపుల నుంచి తెచ్చి అమ్మేస్తున్నారు. ఇందులో ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర, కిలారు రాజేష్‌కి, తద్వారా లోకేష్‌కి వాటాలు అందుతున్న విషయం వాస్తవం కాదా? -
ఆగి ఉన్న లారీని ఢీకొన్న ఆటో
మాచర్ల రూరల్: ఆగి ఉన్న లారీని ఆటో ఢీకొన్న ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న హస్తకళల డిజైనర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మాచర్ల మండలం తాళ్లపల్లి కుడి కాలువ సమీపంలోని మాచర్ల–సాగర్ ప్రధాన రహదారిపై శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కొత్తూరులోని హస్తకళల వారికి శిక్షణ ఇచ్చేందుకు వచ్చిన ట్రైనర్లు ఎస్.సుగుణరాజు, ఫిలిప్, వంగడ రమేష్ కొత్తూరు నుంచి పోచం నర్సింహారావు అనే వృద్ధుడు ఆటోలో మాచర్ల బయలుదేరారు. ఏడో మైలులోని గిరిజన ఆశ్రమ పాఠశాల వార్డన్ నాగ మల్లీశ్వరి, మరో వ్యక్తి కూడా ఆటో ఎక్కారు. తాళ్లపల్లి సమీపంలోకి రాగానే రోడ్డుపై నిలిచి ఉన్న లారీని ఆటో ఢీకొట్టింది. ఆటోలో ప్రయాణిస్తున్న హస్తకళల ట్రైనర్ ఎస్.సుగుణరాజు (35) అక్కడికక్కడే మృతి చెందాడు. వార్డెన్ నాగ మల్లీశ్వరికి, ట్రైనర్ ఫిలిప్‌కు తీవ్ర గాయాలుకాగా వంగడ రమేష్‌కు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు సుగుణరాజుకు వివాహం కాలేదు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు విజయపురిసౌత్ ఎస్ఐ అశోక్ తెలిపారు. నరసరావుపేటరూరల్: విద్యార్థులు సృజనాత్మకతను పెంపొందించుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి ఎల్.చంద్రకళ తెలిపారు. జిల్లా స్థాయి సైన్స్ సెమినార్ పోటీలు శంకరభారతీపురం జెడ్పీ హైస్కూల్లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పోటీలను జిల్లా విద్యాశాఖ అధికారి ప్రారంభించారు. కాకాని జెడ్పీ హైస్కూల్‌కు చెందిన వక్కలగడ్డ కాత్యాయనీ ప్రథమ స్థానం, నరసరావుపేట మున్సిపల్ హైస్కూల్‌కు చెందిన కోడిరెక్క ఇమ్మానియేల్‌కు ద్వితీయ స్థానం లభించింది. ఈ రెండు నమూనాలను శనివారం విజయవాడలో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికచేశారు. రాష్ట్ర స్థాయి సైన్స్ సెమినార్లో జిల్లా విద్యార్థులు మెరుగైన ప్రదర్శన ఇవ్వాలని డీఈవో తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఈవో ఎస్కె సుభాని, సత్తెనపల్లి డీఈవో ఏసుబాబు, జిల్లా సెన్స్ అధికారి ఎస్.రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
ఏసీఏ అపెక్స్ కమిటీ సభ్యుడిగా ఆస్కార్ వినోద్
గుంటూరు వెస్ట్ (క్రీడలు): ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అపెక్స్ కమిటీ సభ్యునిగా గుంటూరుకు చెందిన మాజీ రంజీ ఆటగాడు డి.ఆస్కార్ వినోద్ కుమార్ (ప్లేయర్స్ రిప్రజెంటేషన్) ఎంపికయ్యారని గుంటూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ త్రీమెన్ కమిటీ సభ్యులు యు.మహతీశంకర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇండియన్ క్రికెట్ అసోసియేషన్ నిర్వహించిన ఎన్నికల్లో వినోద్‌తోపాటు బీసీసీఐ నిర్వహించిన ఎన్నికల్లో ఏసీఏ అపెక్స్ కమిటీ సభ్యునిగా మాజీ రంజీ క్రికెటర్ చాముండేశ్వరీనాఽథ్ ఎన్నికయ్యారన్నారు. లెఫ్ట్ హ్యాండరైన వినోద్ కుమార్ గుంటూరులోనే తన క్రికెట్ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1989–96 మధ్య ఆంధ్ర జట్టు తరఫున 21 రంజీ మ్యాచ్‌లతోపాటు పలు టోర్నమెంట్లలో ప్రతిభ చూపారు. ఈ సందర్భంగా మహతీశంకర్, వి.అర్జున్, బి.సుధాకర్‌లు అభినందనలు తెలిపారు. -
వైఎస్సార్సీపీలో చేరిక
టీడీపీ నాయకురాలి కుటుంబ సభ్యులుమంగళగిరి టౌన్: మంత్రి లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని టీడీపీ శ్రేణులు షాక్‌కు గురయ్యాయి. టీటీడీ బోర్డు మెంబర్ తమ్మిశెట్టి జానకీదేవి కుటుంబంలోని కొందరు వైఎస్సార్సీపీలో చేరడమే దీనికి కారణం. తొలుత పాత మంగళగిరి సీతారామ కోవెల సెంటర్ నుంచి ఆత్మకూరు నియోజకవర్గ కార్యాలయం వరకు సుమారు వందమందికిపైగా యువతతో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మంగళగిరి వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు ఆకురాతి రాజేష్ ఆధ్వర్యంలో శుక్రవారం జానకీదేవి తోటికోడలు అయిన తమ్మిశెట్టి అనూరాధతోపాటు జితేంద్ర, గౌతమి, బిట్ర శ్వేతలు వైఎస్సార్సీపీలో చేరారు. పార్టీలోకి వారిని సాదరంగా ఆహ్వానించిన ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డిలు పార్టీ కండువాలు కప్పి, అభినందించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ... ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం విస్మరించడంతో పోరాటం చేస్తున్న వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై నమ్మకంతో పార్టీలో చేరినట్లు పేర్కొన్నారు. పార్టీపై, అధినాయకుడిపై నమ్మకం ఉంచి పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి సముచిత స్థానం ఉంటుందని మురుగుడు, డీవీఆర్లు సూచించారు. జానకీదేవి ప్రస్తుతం టీటీడీ బోర్డు మెంబరుగా ఉన్నారు. మొదటి నుంచి బీజేపీ నేపథ్యం ఉన్న ఆమె 2004లో మంగళగిరి అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరి మళ్లీ పోటీ చేసినా ఓడిపోయారు. 2024 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు. -
కబడ్డీ టోర్నీలో క్రీడాకారిణుల ప్రతిభ
గుంటూరు రూరల్: నగర శివారు లాంలోని చలపతి ఫార్మసీ కళాశాలలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహిళల కబడ్డీ టోర్నమెంట్ రెండో రోజు శుక్రవారం పోటీలు ఉత్సాహంగా కొనసాగాయి. వివిధ కళాశాలల జట్లు ప్రతిభ చాటాయి. నరసరావుపేట కృష్ణవేణి డిగ్రీ కళాశాల, తెనాలి జె.ఎం.జె. డిగ్రీ కళాశాల, గుంటూరు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఫిజికల్ ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ అండ్ సైన్‌న్స్ విభాగం, గుంటూరు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలు వరుసగా తొలి నాలుగు స్థానాలు సాధించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ డాక్టర్ నాదెండ్ల రామారావు తెలిపారు. అనంతరం బహుమతి ప్రదాన కార్యక్రమంలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం యోగా కోఆర్డినేటర్ డాక్టర్ డి. సూర్యనారాయణ పాల్గొన్నారు. కళాశాల ప్రిన్సిపాల్, చలపతి విద్యాసంస్థల చైర్మన్ వైవీ ఆంజనేయులు తదితరులు విజేతలను అభినందించారు. -
ఉచిత వైద్యం అందకుండా కూటమి కుట్ర
చేబ్రోలు: పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసి, ప్రజలకు ఉచిత వైద్యం అందకుండా చేయాలనే కుట్రతో ప్రభుత్వ మెడికల్ కళాశాలలను కూటమి ప్రభుత్వం ప్రైవేటుకు అప్పగిస్తోందని, దీనిని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని వైఎస్సార్ సీపీ పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ అన్నారు. మెడికల్ కళాశాలలను ప్రైవేటుకు అప్పగించటాన్ని వ్యతిరేకిస్తూ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు చేపట్టిన కోటి సంతకాల ప్రజా ఉద్యమంలో భాగంగా శుక్రవారం సంతకాలు సేకరించారు. చేబ్రోలు మండలం సుద్దపల్లిలో పొలంలో పనిచేస్తున్న మహిళా రైతు కూలీలకు మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై అవగాహన కల్పించారు. రచ్చబండ సమావేశంలో అంబటి మురళీకృష్ణ మాట్లాడుతూ మాజీ సీఎం వైఎస్ జగన్ పేద విద్యార్థులకు వైద్య విద్య అందించటంతో పాటు బడుగులకు ఉచిత వైద్యం అందించేలా ప్రభుత్వ మెడికల్ కళాశాలలను నిర్మిస్తే.. కూటమి ప్రభుత్వం ప్రైవేటుకు అప్పగిస్తోందన్నారు. వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు ఆళ్ల శ్రీరామిరెడ్డి, పార్టీ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు బి.భాస్కరరెడ్డి, అక్కిరెడ్డి, శంకరరావు, చందు సాంబశివరావు, పోతురాజు, గోపి, మమత, దాసరి దానమ్మ, చిరంజీవి, జానీ, వేణు, బాల చంద్రయ్య, అశోక్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ సుద్దపల్లిలో కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమం -
28న ధర్నాను జయప్రదం చేయండి
మంగళగిరి టౌన్: చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 28వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఏడీ కార్యాలయాల వద్ద జరిగే ధర్నాను జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లలమర్రి బాలకృష్ణ శుక్రవారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. చేనేత కార్మికులకు 200 యూనిట్ల ఉచిత కరెంటు అమలు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పి నేటికీ అమలు చేయడంలో విఫలమయ్యారని అన్నారు. సహకార సంఘాలకు రావాల్సిన బకాయిలు రూ.203 కోట్లను ప్రభుత్వం విడుదల చేయకపోవడం వలన ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. చేనేత రక్షణకు 11 రకాల రిజర్వేషన్లు అమలు జరపాలని కోరారు. చేనేతపై జీఎస్టీ పూర్తిగా రద్దు చేయాలన్నారు. చేనేత కార్మికులకు, సహకార సంఘాల్లో లేనివారికి ఇవ్వాల్సిన ట్రిప్ట్ ఫండ్ రూ.27 కోట్లను కూడా విడుదల చేయాలని ప్రకటనలో పేర్కొన్నారు. గుంటూరు వెస్ట్ (క్రీడలు): సౌత్ జోన్ షూటింగ్ చాంపియన్‌షిప్ పోటీల్లో ద ఇండియన్ అకాడమీ ఆఫ్ షూటింగ్ స్పోర్ట్స్ షూటర్లు 20 మంది రైఫిల్, పిస్టల్ విభాగాలలో ప్రతిభ కనబరిచారని అకాడమీ చీఫ్ కోచ్ నాగిశెట్టి సుబ్రహ్మణ్యేశ్వర రావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. డిసెంబర్ 11వ తేదీ నుంచి జరిగే జాతీయ పోటీలకు ఎంపిక అయ్యారన్నారు. రైఫిల్ విభాగంలో వట్టిమల్లీ షణ్ముఖ రుష్యేంద్ర, శ్రీరంగ సాయి చరణ్, పారా ఆశ్రిత్ చౌదరి, వజ్జు దారియా, ఎం. కార్తికేయన్, దాసరి సౌమ్యశ్రీ, చిన్ను తేజస్, కాగిత విద్యావల్లి, కాగిత కుసుమవల్లి, కె.ఎస్.ఎస్ చక్రవర్తి, మట్లి యోక్షిత్ రెడ్డి, షేక్ హబీబా సుహానా, అన్నా బత్తిని రోహిత్ ఎంపికయ్యారని తెలిపారు. పిస్టల్ విభాగంలో కొసన పూర్ణిమ, సోడిశెట్టి ధరణీనాథ్, రాజ రాజేశ్వరి, ఒంటెద్దు నాగ లోహిత్ రెడ్డి, గ్రీష్మ సందేశి, అభిలాష్ చంద్ర, రిషిక్ బాబులు అర్హత సాధించారన్నారు. వీరిని రాప్ సెక్రెటరీ డి. రాజ్ కుమార్ తదితరులు అభినందించారన్నారు. నరసరావుపేట: వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పల్నాడు జిల్లాకు చెందిన పలువురు నాయకులను వివిధ హోదాల్లో నియమిస్తూ కేంద్ర పార్టీ కార్యాలయం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆర్గనైజేషనల్ సెక్రటరీలుగా నరసరావుపేటకు చెందిన గెల్లి బ్రహ్మారెడ్డి, యన్నం రాధాకృష్ణారెడ్డి, గురజాలకు చెందిన కలకంధ అంధ్రయ్యను యాక్టివిటీ సెక్రటరీగా నియమితులయ్యారు. నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ అధ్యక్షులుగా కండ్రకుంట మరియమ్మను నియమించారు. కూటమి ప్రభుత్వ వైఖరిపై జెడ్పీటీసీ సభ్యుడు ఓబుల్‌రెడ్డి ఆగ్రహం గుంటూరు ఎడ్యుకేషన్: జెడ్పీటీసీ సభ్యురాలు తన మండలంలో విచ్చలవిడిగా కొనసాగుతున్న బెల్టుషాపులను అరికట్టాలని స్థానిక ఎమ్మెల్యే అయిన విద్యాశాఖ మంత్రి లోకేష్‌కు లేఖ రాయడం నేరమా అని రొంపిచర్ల వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీ సభ్యుడు పిల్లి ఓబుల్‌రెడ్డి ప్రశ్నించారు. దుగ్గిరాల వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీ సభ్యురాలు మేకతోటి అరుణ భర్తను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడంపై నిరసన వ్యక్తం చేసిన పిల్లి ఓబుల్‌రెడ్డి... ఈ ఘటనను వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీ సభ్యులందరూ ముక్త కంఠంతో ఖండిస్తున్నట్లు శుక్రవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు. సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్న కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా బెల్టుషాపులకు, నకిలీ మద్యానికి తావు లేకుండా పాలన సాగిందని పేర్కొన్నారు. అరెస్టు విషయంలో న్యాయం జరిగే వరకు బాధితులకు తాము అందరం అండగా ఉంటామని ఆయన తెలిపారు. -
ఎరువుల విక్రయాలు నిలుపుదల
నగరంపాలెం: గుంటూరు పట్నంబజార్‌లోని బయో స్టిమ్యులేట్ ఎరువుల తయారీ షాపులు, ఇతర దుకాణాల్లో శుక్రవారం జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు ఆరు బృందాలుగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఏడు టోకు వర్తకుల దుకాణాల్లో రూ.1.01 కోట్ల విలువైన ఎరువుల విక్రయాలు నిలుపుదల చేశారు. మరో పదమూడు రీటైల్ వర్తకుల దుకాణాల్లో రూ.26.10 లక్షల విలువైన బయో స్టిమ్యులేట్ అమ్మకాలు, పార్శిల్ సర్వీసెస్‌లో రూ.5.15 లక్షల విలువైన సరుకుకు సంబంధించి పత్రాలు చూపకపోవడంతో వాటి విక్రయాలు నిలుపుదల చేశారు. తనిఖీల్లో సహాయ వ్యవసాయ సంచాలకులు ఎన్.మోహన్‌రావు (గుంటూరు), టి.శ్రీనివాసరావు (మంగళగిరి), వి.కోటేశ్వరి (పొన్నూరు), ఆర్.విజయబాబు (తెనాలి), సీహెచ్ తిరుమలదేవి (పీటీఎల్), ఐ.సునీత (బీసీఎల్) పాల్గొన్నారు. అనుమతుల్లేకుండా ఎరువులు విక్రయిస్తే ఉపేక్షించేది లేదని, చట్టపరమైన చర్యలు చేపడతామని జిల్లా వ్యవసాయ అధికారి అయితా నాగేశ్వరరావు తెలిపారు. -
వసతిగృహాల ముఖచిత్రం మారాలి
గుంటూరు వెస్ట్: పేద కుటుంబాలకు చెందిన పిల్లలు ఉండే ప్రభుత్వ భవనాల్లో నడుస్తున్న సంక్షేమ వసతి గృహాల ముఖ చిత్రాలు మారాలని జిల్లా కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియా అన్నారు. ఇంజినీరింగ్, సంక్షేమ శాఖల అధికారులతో శుక్రవారం స్థానిక కలెక్టరేట్లోని వీడియో సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడుతూ.. వసతి గృహాల భవనాలు ఆహ్లాదకరంగా మారాలని సూచించారు. ప్రభుత్వ భవనాల్లో ఉన్న 20 సాంఘిక సంక్షేమ, 8 బీసీ సంక్షేమ, 3 గిరిజన సంక్షేమ వసతి గృహాలు సహా అంగన్వాడీ కేంద్రాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. పరిశుభ్రమైన పరిసరాలు, రక్షిత తాగునీరు అందించాలన్నారు. రహదారుల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని, నాణ్యతలో రాజీ పడరాదని స్పష్టం చేశారు. తాగునీటి పథకాలకు నిధులు ప్రజా ఆరోగ్య శాఖ పర్యవేక్షక ఇంజినీర్ డి.శ్రీనివాసులు మాట్లాడుతూ అమృత్ కింద ఏడు ప్రాజెక్ట్‌లకు రూ.331 కోట్లు మంజూరు అయ్యాయన్నారు. తక్కెళ్ళపాడు నుంచి బుడంపాడు వరకు పైపులైన్లు వేసి ఏటుకూరు గ్రామం వద్ద ఐదు లే అవుట్లకు నీరు ఇచ్చేందుకు పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు. గోరంట్ల వద్ద రిజర్వాయర్ పూర్తి చేయడం ద్వారా చుట్టు పక్కల గ్రామాలకు కూడా నీరు అందించే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. కార్యక్రమంలో హౌసింగ్ పి.డి. ప్రసాద్, ఆర్ అండ్ బీ ఎస్ఈ శ్రీనివాసమూర్తి, నగర పాలక సంస్థ పర్యవేక్షక ఇంజినీర్ సుందరరామి రెడ్డి, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి యు. చెన్నయ్య, మహిళ, శిశు సంక్షేమ శాఖ అధికారి ప్రసూన పాల్గొన్నారు. ఆహార సరఫరా సవ్యంగా సాగాలి పాఠశాలలు, వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాలకు సక్రమంగా ఆహారం పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ అన్నారు. పీఎం పోషణ్ – డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం కార్యక్రమంపై జిల్లా సమన్వయ కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆహార నాణ్యతలో లోపాలు ఉండరాదని చెప్పారు. నిర్లక్ష్యం వహించే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. డీఈవో రేణుక మాట్లాడుతూ జిల్లాలో ఈ పథకం కింద నెలకు రూ.3.32 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో జడ్పీ సీఈఓ వి.జ్యోతి బసు, ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ పి ప్రసూన, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె విజయలక్ష్మి, డీఆర్డీఏ పి.డి. టి.విజయ లక్ష్మి, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి యు.చెన్నయ్య, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ కె.తులసి, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి మయూరి, జిల్లా ఇంటర్మీడియట్ విద్య శాఖ అధికారి జె.పద్మ, ప్రాంతీయ పర్యవేక్షక అధికారి జి.సునీత తదితరులు పాల్గొన్నారు. రక్తహీనతను రూపుమాపేలా చర్యలు జిల్లాలో రక్తహీనతతో బాధపడుతున్న చిన్నారులు, గర్భిణులు, బాలింతల ఆరోగ్యంపై అధికారులు దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ అన్నారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా సమన్వయ కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ రక్త హీనతను రూపుమాపాలని పేర్కొన్నారు. బాల్య వివాహాలు అరికట్టాల్సిన అవసరం ఉందని తెలిపారు. విద్యా సంస్థలలో బాలికలకు అవగాహన కల్పించాలని సూచించారు. అదనపు పోలీసు సూపరింటెండెంట్ రమణ మూర్తి, జడ్పీ సీఈఓ వి. జ్యోతి బసు, డీపీఓ బి.వి.నాగ సాయి కుమార్, దివ్యాంగుల శాఖ సహాయ సంచాలకులు డి.దుర్గాబాయి, డీఈవో రేణుక, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియా -
ఏ వార్త రాసినా తప్పే అనేలా కూటమి సర్కారు తీరు
వైఎస్సార్సీపీ లీగల్ సెల్ కార్యదర్శి పొలూరి వెంకటరెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశంలో మీడియా నాలుగో స్తంభం అని పేర్కొన్నారు. వార్తలు రాసేందుకు సోర్సు ఎలా వచ్చిందని పత్రికలను అడగడం స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వం కూడా చేయలేదని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రత్యేకంగా ‘సాక్షి’ని లక్ష్యంగా చేసుకుందని అన్నారు. ఏ వార్త రాసినా తప్పే అన్నట్టుగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డి హైదరాబాద్‌లో ఉంటే ఇంటికి వెళ్లి కుట్రపూరితంగా నోటీసులు జారీ చేశారని ధ్వజమెత్తారు. ఆయన్ను మానసికంగా వేధించాలనే కుట్రకు తెరలేపారని అన్నారు. ఏపీ అంతటా సాక్షి మీడియాపై, కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న వారిపై కూడా ఇలాంటి దాడులు చేస్తున్నారని ఆరోపించారు. రానున్న రోజుల్లో ప్రజా సంఘాలు ఈ విషయంలో పాత్రికేయులకు మద్దతుగా ఉంటాయని ప్రకటించారు. -
విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల సమస్యలను పరిష్కరించాలి
లక్ష్మీపురం: విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు, జేఎల్ఎం గ్రేడ్ –2ల సమస్యలను పరిష్కరించాలని ఏపీ విద్యుత్ స్ట్రగుల్ కమిటీ జిల్లా చైర్మన్ దాసరి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. గుంటూరు పొన్నూరు రోడ్డులోని విద్యుత్ భవన్ కార్యాలయం ఎదుట శుక్రవారం కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. వి. రాంప్రభాకర్, జి. నాగరాజులు నేతృత్వం వహించారు. దాసరి వెంకటేశ్వరరావు, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బి.లక్ష్మణరావు, జిల్లా నాయకులు సుబ్బారెడ్డిలు మాట్లాడుతూ... సమస్యలు పరిష్కారం అయ్యేవరకు పోరాటాలు కొనసాగించాలని పిలుపునిచ్చారు. మెడికల్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ రాష్ట్ర నాయకులు అబ్దుల్ సలీం, ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.ఎ.చిష్టీ, 104 ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు జి.సురేష్ కుమార్, ప్రధాన కార్యదర్శి శ్రీహర్ష, విద్యుత్ సీఐటీయూ నాయకులు పవన్, రాంబాబు, శివనాగేశ్వరరావు, సురేష్, నాగరాజు, సలీంబాషా, వర్మ, వంశీ, బి. రవికుమార్, వీరారెడ్డి, లెనిన్ బాబు, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
ఏపీ ఎన్జీవో అసోసియేషన్ అమరావతి అధ్యక్షుడిగా బెజ్జం అశోక్
తాడికొండ: ఏపీ ఎన్జీవో అసోసియేషన్ అమరావతి యూనిట్ అధ్యక్షుడిగా బెజ్జం అశోక్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంఘం నాయకులు ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం తాడికొండ రూరల్ హెల్త్ సెంటర్లో తాడికొండ, తుళ్లూరు, మేడికొండూరు, ఫిరంగిపురం మండలాలకు కలిపి యూనిట్ ఎన్నిక ప్రక్రియ నిర్వహించారు. ఎన్నికల అధికారిగా బి.కృష్ణ కిషోర్, సహాయ ఎన్నికల అధికారిగా కె. శేషగిరి రాజు వ్యవహరించారు. 16 మందితో కూడిన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికై ంది. ఎన్నికల పరిశీలకుడిగా కె. విజయ్ బాబు వ్యవహరించారు. అమరావతి యూనిట్ అధ్యక్షుడిగా బెజ్జం అశోక్ కుమార్, సహ అధ్యక్షుడిగా కె. రవిబాబు, ఉపాధ్యక్షులుగా షేక్ సుభాని, ఎ. లలిత కుమారి, ఇ. చంద్రబాబు, పి. మల్లికార్జున రావు, మహిళా ఉపాధ్యక్షులుగా సీహెచ్ శారదాదేవి, కార్యదర్శిగా షేక్ అబ్దుల్ కరీం, కార్యనిర్వాహక కార్యదర్శిగా డాక్టర్ డి.శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శులుగా వి. రామాంజనేయులు, డి.అరుణకుమార్, బి.రాంబాబు, పి.అంకమ్మరావు, మహిళా సంయుక్త కార్యదర్శిగా ఎం.నాగమణి, కోశాధికారిగా ఎ.పూర్ణయ్య, జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా ఎన్. ఏసునాథరావులు ఎన్నికయ్యారు. వీరు మూడేళ్లు పదవిలో కొనసాగుతారని ఎన్నికల అధికారి ప్రకటించారు. అభినందన సభకు ముఖ్య అతిథులుగా ఏపీఎన్జీజీవో ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షుడు ఘంటసాల శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి శ్యాంసుందర్ శ్రీనివాస్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు షేక్ నాగూర్ షరీఫ్ హాజరయ్యారు. సభ్యులను పూలమాలలతో సత్కరించి అభినందించారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు డి.డి. నాయక్, ఎస్.వెంకటరెడ్డి సత్తెనపల్లి యూనిట్ అధ్యక్షుడు మణిరావు, అమరావతి యూనిట్ మాజీ అధ్యక్షుడు రావు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
హత్య కేసులో నిందితుడి అరెస్ట్
తెనాలి రూరల్: తెనాలిలో పట్టపగలు నడిరోడ్డుపై ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటనలో నిందితుడిని పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. స్థానిక త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో డీఎస్పీ బి.జనార్దనరావు కేసు వివరాలను వెల్లడించారు. ఆయన చెప్పిన వివరాల మేరకు... బాపట్ల జిల్లా అమృతలూరు మండలం కోరుతాడిపర్రు గ్రామానికి చెందిన జూటూరి తిరుపతిరావు(60) ఈ నెల 14న పట్టణంలో హత్యకు గురైన సంగతి తెలిసిందే. తిరుపతిరావు గ్రామంలోని రామాలయం పాలకవర్గంలో కీలకంగా ఉన్నాడు. ఆలయ చెరువుల వేలం పాటల నిర్వహణ బాధ్యత చూసేవాడు. 15 రోజుల క్రితం జ్వరం రావడంతో తిరుపతిరావు తన భార్యతో కలసి తెనాలిలో నివాసం ఉంటున్న కుమార్తె గండికోట దుర్గ ఇంటికి వచ్చాడు. ఈ నెల 14న టిఫిన్ కోసం బైక్‌పై ఇంటి నుంచి బయటకు వచ్చాడు. సమీపంలో టిఫిన్ సెంటర్ వద్ద బైక్‌పై కూర్చున్నాడు. అదే సమయంలో కోరుతాడిపర్రు గ్రామానికి చెందిన గండికోట వెంకటసుబ్బారావు వచ్చి కొబ్బరి బొండాల కత్తితో విచక్షణరహితంగా దాడి చేసి పారిపోయాడు. తిరుపతిరావుతో నిందితుడికి కొంతకాలంగా విభేదాలున్నాయి. నిందితుడి వ్యక్తిగత విషయాలలోనూ తిరుపతిరావు జోక్యం చేసుకున్న కారణంగా కక్ష పెంచుకొని ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఆలయ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించడం, గతంలో తన తండ్రి మృతికి కూడా తిరుపతిరావు కారణమయ్యాడని భావించి రెక్కీ నిర్వహించి మరీ హత్యకు పాల్పడ్డాడు. నిందితుడిపై పట్టణ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో గతంలో మూడు కేసులు, అమృతలూరు పోలీస్‌స్టేషన్‌లో రెండు కేసులు నమోదైనట్లు వెల్లడించారు. తిరుపతిరావు భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కంచర్లపాలెం రోడ్డులో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కోర్టుకు హాజరు పరుస్తున్నట్లు డీఎస్పీ చెప్పారు. సమావేశంలో సీఐ ఎస్. సాంబశివరావు, త్రీ టౌన్ ఎస్ఐ కరిముల్లా, రూరల్ ఎస్ఐ కె. ఆనంద్, సిబ్బంది ఉన్నారు. ఆధిపత్య పోరు, పాత కక్షలే కారణమని డీఎస్పీ వెల్లడి -
విలువలతో కూడిన నాయకత్వం అవసరం
చేబ్రోలు: విద్య కేవలం జ్ఞాన సంపాదనకే కాకుండా విలువలతో కూడిన నాయకత్వం పెంచుకోవడానికి కూడా ముఖ్యమని ఐసీఎస్ఎస్ఆర్–ఎస్ఆర్సీ హానరరీ డైరెక్టర్ ప్రొఫెసర్ బి.సుధాకర్ రెడ్డి అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీలో ‘‘కల్టివేటింగ్ ఎథికల్ బిజినెస్ లీడర్స్’’పై రెండు రోజుల జాతీయ సదస్సు శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. ప్రొఫెసర్ బి.సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ... నేటి యువత వ్యాపార రంగంలోకి అడుగుపెడుతున్నప్పుడు సామాజిక బాధ్యతతో కూడిన నైతిక విలువలే మార్గదర్శకాలు కావాలని సూచించారు. ఉస్మానియా వర్సిటీ మాజీ డీన్ ప్రొఫెసర్ ఎ. సూర్యనారాయణ మాట్లాడుతూ ఆధునిక సంస్థల్లో ఎదురయ్యే నైతిక సమస్యలను ఆచరణాత్మక కోణంలో విశ్లేషించారు. పుదుచ్చేరి యూనివర్సిటీ మేనేజ్మెంట్ స్కూల్‌కు చెందిన ప్రొఫెసర్ యార్లగడ్డ శ్రీనివాసులు ఐఐటీ హైదరాబాద్ మేనేజ్మెంట్ విభాగాధిపతి డాక్టర్ ఎం.పి.గణేష్‌లు కూడా ప్రసంగించారు. వంద మందికిపైగా ప్రతినిధులు తమ పరిశోధన పత్రాలను సమర్పించారు. వైస్ చాన్సలర్ పి.నాగభూషణ్, రిజిస్ట్రార్ పీఎంవీ రావు, డీన్లు తదితరులు పాల్గొన్నారు. -
మెలోడియోసిస్ రోగికి విజయవంతంగా చికిత్స
గుంటూరు మెడికల్: జిల్లా వ్యాప్తంగా సుమారు నాలుగు నెలలకుపైగా అందరిని ఆందోళనకు గురిచేస్తున్న మెలోడియోసిస్ వ్యాధి బాధితునికి గుంటూరు జీజీహెచ్ వైద్యులు రెండు నెలలపాటు వైద్యసేవలు అందించి ప్రాణాలు కాపాడారు. శుక్రవారం గుంటూరు జీజీహెచ్‌లో విలేకరుల సమావేశంలో సూపరింటెండెంట్ డాక్టర్ యశస్వి రమణ మీడియాకు ఈ వివరాలు వెల్లడించారు. గుంటూరు రూరల్ మండలం తురకపాలేనికి చెందిన పి.ఎలీషా (42) ఆగస్టు 21న అడ్మిట్ అయ్యారన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నామని తెలిపారు. మెలోడియోసిస్ ఉందని నిర్ధారించామని, రెండు నెలలపాటు వైద్యం అందించి వ్యాధి నుంచి విముక్తుడిని చేశామన్నారు. జనరల్ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ పి.ఉషారాణి మాట్లాడుతూ ఈ విషయంలో ఆర్థోపెడిక్ విభాగాధిపతి డాక్టర్ అనిల్ కుమార్ బృందం, జనరల్ సర్జరీ విభాగం సహకారం అందించారని పేర్కొన్నారు. ప్రొఫెసర్ డాక్టర్ సి.వాసవి, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జి.ప్రభాకర్, పీజీ వైద్యులు డాక్టర్ కే ఆశాజ్యోతి, డాక్టర్ వి.స్వర్ణ సేవలు అందించినట్లు చెప్పారు. -
లక్ష్మీనాయుడు దారుణ హత్య కేసును నీరుగార్చే కుట్ర!
పట్నంబజారు/నెహ్రూనగర్(గుంటూరు): దసరా పండుగ నాడు... నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం దారకానిపాడులో జరిగిన కాపు యువకుడు తిరుమలశెట్టి లక్ష్మీనాయుడు దారుణ హత్య కేసును నీరుగార్చేందుకు టీడీపీ పెద్దలు కుట్ర చేస్తున్నారని మృతుడి కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఈ కేసును టీడీపీ నేతల ఒత్తిడితో పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని వాపోతున్నారు. హత్య కేసు నమోదు చేసిన పోలీసులు... ప్రధాన నిందితుడు, టీడీపీ కార్యకర్త అయిన కాకర్ల హరిచంద్రప్రసాద్, అతడి తండ్రిని అరెస్టు చేశారని, కేసుకు సంబంధించిన వాస్తవాలను ఇప్పటికీ బయటపెట్టలేదని అంటున్నారు. మీడియాకు వివరాలు ఏమీ లేకుండా, నిందితులను అరెస్టు చేసినట్లు చిన్న ప్రెస్ నోట్ రిలీజ్ చేసి చేతులు దులుపుకొన్న సంగతిని గుర్తు చేస్తున్నారు. లక్ష్మీనాయుడిని ఢీకొట్టిన కారులో హరిచంద్రప్రసాద్ నాయనమ్మ కాకర్ల నారాయణమ్మ, అతడి భార్య కూడా ఉన్నారని, వీరిద్దరూ అతడిని ప్రోత్సహించినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. లక్ష్మీనాయుడు చనిపోయినట్లు నిర్ధారించుకున్న తరువాత వారు వెళ్లిపోయారని, వారిని ఇప్పటి వరకు పోలీసులు అరెస్టు చూపించలేదని వాపోతున్నారు. హరిచంద్రప్రసాద్‌కు పూర్తి సహకారం అందించిన పలువురు యువకుల పైనా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు లేకపోవడాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇదంతా టీడీపీ నాయకుల ఒత్తిళ్ల కారణంగానే జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేసును నీరుగార్చేందుకు తెరవెనుక పెద్దఎత్తున పన్నాగం పన్నుతున్నారని అంటున్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం...దారకానిపాడుకు చెందిన లక్ష్మీనాయుడు (25)ను టీడీపీ కార్యకర్త కాకర్ల హరిచంద్రప్రసాద్ ఈ నెల 2న కారుతో ఢీకొట్టి దారుణంగా హత్య చేశాడు. లక్ష్మీనాయుడు తన ట్రాక్టర్‌ను హరిచంద్రప్రసాద్‌కు అమ్మగా అతడు రూ.2 లక్షల దాకా ఇవ్వాల్సి ఉంది. ఆ డబ్బు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాడు. లక్ష్మీనాయుడు గట్టిగా నిలదీయడంతో అతడి భార్య సుజాత గురించి అసభ్యంగా మాట్లాడాడు. ఓ సందర్భంలో లక్ష్మీనాయుడు తన భార్య సుజాత ఫోన్ నుంచి హరికి కాల్ చేశాడు. నంబరు సేవ్ చేసుకున్న హరి... సుజాత ఫోన్‌కు మేసేజ్‌లు పెడుతూ అసభ్యంగా ప్రవర్తించసాగాడు. సుజాత విసిగిపోయి భర్తకు చెప్పింది. లక్ష్మీనాయుడు తమ్ముడు పవన్ నాయుడు, బాబాయ్ కుమారుడు భార్గవ్ నాయుడుతో కలిసి హరిచంద్రప్రసాద్ ఇంటికి వెళ్లి అతను చేస్తున్నది తప్పని హెచ్చరించారు. ‘‘నేను ఇలాగే చేస్తా. చేతనైంది చేసుకోండి’’ అంటూ హరిచంద్రప్రసాద్ దుర్భాషలాడాడు. మరోవైపు లక్ష్మీనాయుడు కుటుంబం కలగజేసుకుని అప్పు చెల్లించాలని అడగడంతో వేరేవాళ్ల వద్ద ఉన్న ట్రక్కును ష్యూరిటీగా ఉంచాడు. కానీ, తన ట్రాక్టర్ లాక్కున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసి ఇబ్బందిపెట్టాడు. ఒకటికి రెండుసార్లు గొడవలు కావడం, లక్ష్మీనాయుడు సోదరులతో వచ్చి నిలదీయడంతో పరువు పోయిందని హరి వారిపై కసి పెంచుకున్నాడు. దసరా పండుగ నాడు బైక్‌పై వెళ్తున్న లక్ష్మీనాయుడు, పవన్, భార్గవ్‌ను కారుతో ఢీకొట్టాడు. కారు దిగి రాడ్డుతో కొట్టాడు. కారులోని మహిళలు సైతం చచ్చేదాకా తొక్కించు అంటూ అతనిని రెచ్చగొట్టారు. ఈ ఘటనలో లక్ష్మీనారాయణ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. తీవ్ర గాయాలైన భార్గవ్‌నాయుడు, పవన్ గుంటూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా, తాము ఆరాధ్య దైవంగా భావించే వంగవీటి రంగాను సైతం హరి దుర్భాషలాడాడని, ఆయన ఫొటో పెట్టుకోవటం పాపామా అని లక్ష్మీనాయుడు కుటుంబం వాపోయింది.గుడ్లూరు ఘటనలో సమగ్ర దర్యాప్తు: ఎస్పీనెల్లూరు (క్రైమ్): శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం రాళ్లపాడు శివారులో ఈ నెల 2న జరిగిన లక్ష్మీనారాయణ హత్య కేసులో సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ అజిత వేజెండ్ల తెలిపారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ కేసులో నిందితులు హరిచంద్రప్రసాద్, మాధవరావును అరెస్ట్ చేశామని, వారు రిమాండ్‌లో ఉన్నారని చెప్పారు. నిందితుల ఆస్తుల జాబితాను కోర్టుకు సమర్పించినట్లు తెలిపారు. దర్యాప్తు సరిగా జరగడం లేదనేది అసత్య ప్రచారంగా పేర్కొన్నారు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే వ్యక్తులు, సోషల్ మీడియా ఖాతాలపై చర్యలు తప్పవని హెచ్చరించారు. కాపు వర్గ నాయకుల్లో తీవ్ర ఆగ్రహంటీడీపీ కార్యకర్త హరిచందప్రసాద్ చేతిలో హత్యకు గురైన లక్ష్మీనాయుడు కాపు యువకుడు కావడంతో ఆ సామాజిక వర్గం నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర కాపు జేఏసీ నాయకులు దారకానిపాడులో లక్ష్మీనాయుడు భార్య సుజాత, కుటుంబ సభ్యులను పరామర్శించారు. నిందితులను తప్పించే ప్రయత్నం చేయడం, నియోజకవర్గ ప్రజాప్రతినిధి... లక్ష్మీనాయుడు కుటుంబాన్ని కనీసం పరామర్శించకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులు తన సామాజికవర్గానికి చెందిన వారు కావడంతో కాపాడుకునేందుకు తెరవెనుక ప్రయత్నాలు చేశారనే విమర్శలు చేశారు. కాగా, తీవ్ర విమర్శలు రావడంతో స్థానిక ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు శుక్రవారం హడావుడిగా దారకానిపాడు వెళ్లారు. పరామర్శ పేరుతో హడావుడి చేశారు. పేదలమైన మాపై ఇంత కక్షా?మాది రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం. పిల్లలు చిన్న చిన్న వ్యాపారాలతో జీవనం సాగిస్తున్నారు. చేతికి అందివచి్చనవారు ఆసుపత్రుల పాలయ్యారు. వారి వైద్యానికి కనీసం డబ్బు పుట్టని పరిస్థితి. హరిచంద్రప్రసాద్ కారుతో గుద్దడంతో మా అన్న కుమారుడు లక్ష్మీనాయుడు చనిపోయాడు. పవన్‌కు నడుము విరిగి మంచానికి పరిమితమయ్యాడు. – తిరుమలశెట్టి వేణు, రమాదేవి (భార్గవ్‌నాయుడు తల్లిదండ్రులు)నా కూతురిని చంపుతానని బెదిరించాడుహరిచంద్రప్రసాద్ నన్ను లైంగికంగా వేధించాడు. లొంగకపోతే నన్నయినా, నా భర్తను అయినా చంపుతా అంటూ బెదిరించేవాడు. ఓసారి నా కూతురిని పైకి ఎత్తి చంపుతానంటూ భయపెట్టాడు. నా భర్తను దారుణంగా చంపేశాడు. ఈ ఊరికే చెందిన బెజవాడ అవినాష్, అల్లం విజయకుమార్, కామినేని శ్రీనివాసులు (పొందూరు శ్రీను) నా భర్త లక్ష్మీనాయుడు హత్యకు సహకరించారు. వారిని పోలీసులు వదిలేశారు. – లక్ష్మీనాయుడు భార్య సుజాత -
‘లోకేశ్‌ని ఎదిరించినందుకు హత్య కేసులో ఇరికించారు’
తాడేపల్లి: వైఎస్సార్సీపీలో యాక్టివ్‌గా ఉంటూ, పార్టీ నిర్వహిస్తున్న నకిలీ లిక్కర్ వ్యతిరేక ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తుంటే తట్టుకోలేక వైఎస్సార్సీపీ దుగ్గిరాల జెడ్పీటీసీ మేకతోటి అరుణ భర్త దాసరి వీరయ్యపై పోలీసులు అక్రమంగా హత్య కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మలసాని మనోహర్‌రెడ్డి ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గతంలో జరిగిన ఒక హత్య కేసుతో సంబంధం లేకపోయినా కూడా దాసరి వీరయ్యను ఆ కేసులో నిందితుడిగా చేర్చారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ కుటుంబాలతో వీరయ్యకు ఏమాత్రం సంబంధం లేకపోయినా తప్పుడు వాంగ్మూలం తీసుకుని దొంగ సాక్ష్యాలతో ఒక కట్టు కథ అల్లారని చెప్పారు. మంత్రి నారా లోకేష్ ప్రాతినిథ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో వ్యతిరేక గళం వినిపించకూడదన్న నియంత ఆలోచనలతో ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని మనోహర్‌రెడ్డి చెప్పారు. నకిలీ మద్యం తయారీకి వ్యతిరేకంగా గళమెత్తినందుకు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు, ఆయన భార్యతోపాటు మరో 13 మంది వైయస్సార్సీపీ నాయకులపై హత్యాయత్నం కేసు నమోదు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఇదే నకిలీ మద్యం గురించి వార్తలు రాసినందుకు సాక్షిమీడియాపై 17 అక్రమ కేసులు నమోదు చేశారని, ములకలచెరువు నకిలీ మద్యం తయారీ రాకెట్ గుట్టు ఎలా తెలిసిందో సోర్స్ చెప్పాలని వేధించడం రాజ్యాంగం ఇచ్చిన మీడియా స్వేచ్చను కాలరాయడమేనని స్పష్టం చేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే ...కుట్రపూరితంగా దాసరి వీరయ్యపై కేసు బనాయించారుచట్టాన్ని, శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీస్ యంత్రాంగం కూటమి నాయకుల ప్రయోజనాలు కాపాడటమే లక్ష్యంగా పనిచేస్తోంది. కూటమి నాయకుల అడుగులకు మడుగులొత్తుతూ పోలీసులు రోజురోజుకీ దిగజారి వ్యవహరిస్తున్నారు. ఇటీవల బాపట్ల జిల్లా అమల్తూరు మండలం యడవూరు గ్రామానికి చెందిన నాగ గణేశ్, కొలకలూరు గ్రామానికి చెందిన కీర్తి వీరాంజనాదేవి అనే యువతి వారి కుటుంబసభ్యులకు ఇష్టం లేకపోయినా కోటిలింగాల గుడిలో ప్రేమ వివాహం చేసుకున్నారు. అనంతరం నల్లపాడు పోలీస్‌స్టేషన్‌కి వెళ్లి పోలీసుల రక్షణ కోరారు. ఇరువురు తల్లిదండ్రులను పోలీసులు పిలిపించగా అమ్మాయి తల్లిదండ్రులు నచ్చలేదని వెళ్లిపోయారు. దీంతో నవ దంపతులు కొత్త కాపురం పెట్టుకుని జీవిస్తుండగా, ఇటీవల కీర్తి వీరాంజనాదేవి అన్న కాపు కాసి ఆమె భర్త నాగ గణేశ్‌ను మరికొందరితో కలిసి తండ్రి ముందరే నరికి చంపేశాడు. దీనిపై ప్రత్యక్ష సాక్షి, మృతుడు నాగ గణేశ్ తండ్రి స్టేట్మెంట్ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు అంతటితో ఆగకుండా ఈ కేసుకి ఏమాత్రం సంబంధం లేని వైఎస్సార్సీపీ నాయకుడు, దుగ్గిరాల జెడ్పీటీసీ మేకతోటి అరుణ భర్త అయిన దాసరి వీరయ్యని నిందితుడిగా చేర్చారు. మంగళగిరి నియోజకవర్గంలో మంత్రి లోకేశ్‌ని ఎదిరించి నిలబడిన కారణంగా ఆయనపై పోలీసులు ఈ విధంగా అక్రమ కేసు బనాయించారు. ఎవరో ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా మొన్న అర్థరాత్రి అరెస్ట్ చేసి నిన్న రాత్రి కోర్టులో హాజరు పరిచారు. ఈ వాంగ్మూలం కాపీలో పేర్లు, చిరునామా దగ్గర నుంచి చంపిన ఘటన వరకు వారే ప్రశ్నలు వేసినట్టు, వారే సమాధానాలు రాసుకున్నారు. నాగ గణేశ్‌ని చంపడం వెనుక మాస్టర్ మైండ్ దాసరి వీరయ్య అన్నట్టుగా ఆయన అండదండలతోనే హత్య చేసినట్టుగా ఒక కథనం అల్లారు. దాన్ని ధ్రువీకరిస్తూ ఇద్దరు మధ్య వ్యక్తులతో సాక్షి సంతకాలు చేయించుకున్నారు. మధ్యవర్తుల సమక్షంలో సంతకం చేయడానికి దాసరి వీరయ్య సంతకం చేయడానికి నిరాకరించినట్టు మళ్లీ మధ్యవర్తులతో సంతకాలు చేయించుకున్నారు. చేయని నేరాన్ని అంగీకరించాలంటూ దాసరి వీరయ్యను పోలీసులు ఒత్తిడి చేస్తున్నారు. తనపై అన్యాయంగా అక్రమ కేసు బనాయించి వేధిస్తున్నారని, ఎలాంటి సంబంధం లేకపోయినా 302 కేసులో ఇరికించారని దాసరి వీరయ్య స్వయంగా మెజిస్ట్రేట్‌కి వివరించారు. ప్రేమ పెళ్లి వ్యవహారంలో జరిగిన పరువు హత్య ఘటనలో ఆ ఊరితో సంబంధమే లేని దాసరి వీరయ్యను పోలీసులు అక్రమంగా ఇరికించారు. ప్రమోషన్ల ఆశ చూపించి కొంతమంది పోలీసులను రాజకీయ ప్రతీకార దాడులకు కూటమి నాయకులు వాడుకుంటున్నారు.ధర్నా చేసినందుకు 13 మందిపై హత్యాయత్నం కేసునకిలీ మద్యం వ్యవహారంలో రాష్ట్రవ్యాప్తంగా వైయస్సార్సీపీ పిలుపునివ్వడంతో పలాస నియోజకవర్గంలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు నేతృత్వంలో పార్టీ నాయకులు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో కొంచెం పెనుగులాట జరిగింది. కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరగ్గా మహిళా కానిస్టేబుల్ ఫిర్యాదుతో ఒకరిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి జైలుకు పంపించారు. నిరసనలో పాల్గొన్నందుకు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు, ఆయన భార్యతోపాటు మరో 13 మందిపై పోలీసులను చంపడానికి ప్రయత్నం చేశారంటూ 307 కింద అక్రమంగా హత్యాయత్నం కేసు పెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు నిత్యకృత్యమైపోయాయి. ఎక్కడ చూసినా అక్రమ కేసులే. విచారణ పేరుతో పదే పదే పిలిపించడం వంద ప్రశ్నలు రాసుకొచ్చి వాటికి సమాధానాలు చెప్పాలని వేధించడం పోలీసులు అలవాటుగా మార్చుకున్నారు. నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సాక్షి మీడియాపై 17 అక్రమ కేసులునకిలీ లిక్కర్ గుట్టురట్టు చేయడమే నేరమన్నట్టు సాక్షి మీడియాపై కూటమి ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తోంది. విచారణ పేరుతో సాక్షి ఎడిటర్‌ను పిలిపించి గంటలకొద్దీ కూర్చోబెట్టి ఇబ్బంది పెడుతున్నారు. నకిలీ లిక్కర్ దందా వెలికితీసిన వ్వవహారంలో వార్తలు రాయడినికి దొరికిన సోర్స్ వివరాలు చెప్పాలని వేధిస్తున్నారు. సోర్స్ చెప్పే అవసరం లేని పత్రికా స్వేచ్ఛ ఉందని తెలిసీ, ఇది రాజ్యాంగం ప్రసాదించిన హక్కు అని తెలిసీ పోలీసులు సాక్షి కార్యాలయాన్ని చుట్టుముట్టి వార్త ఎవరు రాశారు? ఎవరు ఎడిట్ చేశారు? వార్తకు సోర్స్ ఏంటి చెప్పాలంటూ వంద ప్రశ్నలు రాసుకొచ్చారు. వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయనే భయంతో సాక్షి ప్రసారాలు రాకుండా కేబుల్ ఆపరేటర్లను బెదిరిస్తున్నారు. ఏకంగా సాక్షిపై 17 కేసులు నమోదు చేశారు. సూపర్ సిక్స్ హామీల అమలుపై ప్రజల దృష్టి మరల్చేందుకు ప్రశ్నించే గొంతులను నొక్కేస్తున్నారు. కక్షపూరిత రాజకీయాలతో రాష్ట్రంలో శ్మశాన వాతావరణం సృష్టిస్తున్నారు. సోషల్ మీడియా యాక్టివిస్టులు, జర్నలిస్టులు, వైఎస్సార్సీపీ నాయకుల మీద హత్యాయత్నం, హత్య కేసులు బనాయిస్తున్నారు. కోర్టు పదే పదే మొట్టికాయలేస్తున్నా లెక్కచేయకుండా కూటమి నాయకులకు ఊడిగం చేస్తున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్న ఇలాంటి పోలీసులంతా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మూల్యం చెల్లించుకుంటారు. వారిని న్యాయస్థానాల్లో దోషులుగా నిలబెట్టడం ఖాయం. చట్టవ్యతిరేక కార్యకలాపాలు చేసే వారికి ఖచ్చితంగా బుద్ధి చెబుతాం’ అని హెచ్చరించారు,ఇదీ చదవండి: లేఖ రాశానని.. నా భర్తను అరెస్ట్ చేశారు: మేకతోటి అరుణ -
దివ్యాంగులపై మానవత్వం లేదా బాబూ?: సజ్జల
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అధ్యక్షతన పార్టీ దివ్యాంగుల విభాగం రాష్ట్ర కమిటీ, అన్ని జిల్లాల అధ్యక్షుల ఆత్మీయ సమావేశం జరిగింది. పార్టీ ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి, మాజీ మంత్రి మేరుగ నాగార్జున, దివ్యాంగుల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పులిపాటి దుర్గారెడ్డి, దివ్యాంగుల విభాగం నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి.. ఆయన ఏమన్నారంటే..దివ్యాంగులకు సంబంధించిన ప్రతి సమస్యపై వైఎస్ జగన్ క్షుణ్ణంగా తెలుసుకుంటూనే ఉన్నారు. వైఎస్ జగన్ హయాంలో నిస్సహాయులుగా ఉన్న వర్గాలకు, దివ్యాంగులకు సమాన హక్కులు కల్పించడం, అంతిమంగా దివ్యాంగులకు ఎలా లబ్ధిచేయాలని తపించారు. సాంకేతిక కారణాలతో దివ్యాంగులను ఇబ్బంది పెట్టకుండా, నిబంధనలు సరళీకృతం చేయాలని, అవసరమైన సవరణలు చేశారు. క్యాలెండర్ పెట్టుకుని జగనన్న పాలనలో ఏ నెలలో ఏం వస్తుందని సంక్షేమ లబ్ధిదారులకు హక్కుగా లభించేలా చేశారు...పాలన అంటే ఒక సార్ధకత దానిని నాడు వైఎస్సార్.. ఆ తర్వాత వైఎస్ జగన్ హయాంలో చూశారు. అసమానతలు తొలగించి రాజ్యాంగ స్పూర్తిని అమలు చేసింది వైఎస్ జగన్ పాలనలోనే. మానవత్వంతో పాలన సాగించడం అనేది చూశాం. వైఎస్సార్సీపీ అనేది ప్రజల్లో నుంచి వచ్చిన పార్టీ కాబట్టి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకెళుతుంది. వైఎస్ జగన్ పాలనకు పూర్తి వ్యతిరేకంగా చంద్రబాబు పాలన సాగుతుంది. ఏ రకంగా వడపోసి సంక్షేమ పథకాల లబ్ధిదారులను తగ్గించాలనేది చంద్రబాబు లక్ష్యం. చంద్రబాబు సంక్షేమం అంతా తన కోసం, అయిన వారికే తప్ప నిజమైన లబ్ధిదారులకు కాదు. ఎల్లో మీడియా, ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు చంద్రబాబు చేతిలో ఉన్నాయి.ఊత కర్రల సాయంతో కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు. దివ్యాంగుల విషయంలో చంద్రబాబు రాక్షసంగా వ్యవహరిస్తున్నారు. దివ్యాంగులకు ఇచ్చే పింఛన్లలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. సామాజిక భద్రత అనేది లేకపోతే పేద వర్గాలు ఏమవ్వాలి. దివ్యాంగులకు పింఛన్లు అవసరమా అనే చర్చ లేవనెత్తారు చంద్రబాబు. దానికి ఎల్లో మీడియా బాకా ఊదుతోంది. రీవెరిఫికేషన్ పేరుతో దివ్యాంగులను వేధిస్తున్నారు. వికలాంగుల విషయంలో జగన్ ఏనాడు పార్టీలు చూడలేదు. వారికి ఎలా చేయూత ఇవ్వాలి, వారు ఆత్మగౌరవంతో ఎలా బతకాలి అని ఆలోచించారు. వైఎస్ జగన్ పాలన ఈ ఐదేళ్ళు కొనసాగి ఉంటే ఒక కొత్త జనరేషన్ తయారయ్యేది. ఒక మంచి వ్యవస్థలను జగన్ రూపొందిస్తే.. చంద్రబాబు దానిని కుప్పకూల్చారు.వైఎస్ జగన్ పాలనలో నాడు-నేడు పేరుతో స్కూల్స్ అభివృద్ధి జరిగితే ఇప్పుడు ఏం జరుగుతుంది. కురుపాం, తురకపాలెం ఘటనలే ఇందుకు నిదర్శనం. ఇది క్రిమినల్ నెగ్లిజెన్స్ కాదా.? ప్రభుత్వం దృష్టికి ఇవి రాలేదా..? ఇవి వైఫల్యాలు కావా..? పాలన అనేది ఒక యజ్ఞంలా వైఎస్ జగన్ భావించారు. వైఎస్ జగన్ సంక్షేమ పథకాల డెలివరీ పెడితే చంద్రబాబు లిక్కర్ షాప్‌లు, బెల్ట్ షాపులు పెట్టి లిక్కర్ డెలివరీ చేస్తున్నారు. పోలీస్ వ్యవస్థను కూడా రెడ్ బుక్ పేరుతో నాశనం చేశారు. మళ్ళీ అధికారం రాదని తెలిసి చంద్రబాబు ఆయన కుమారుడు బరితెగించి వ్యవహరిస్తున్నారు. వైఎస్సార్సీపీ ఒక బలీయమైన శక్తిగా రూపొందింది. అందుకు ఉదాహరణే జగన్ పర్యటనలకు వస్తున్న లక్షలాది మంది జనమే. కోటి సంతకాల సేకరణలో మీ విభాగం కూడా సమన్వయంతో పనిచేయాలి. మీ పరిధిలో ఉన్నంత మేరకు వైఎస్సార్సీపీ బలోపేతానికి కృషిచేయండి.కూటమి సర్కార్ దివ్యాంగులను మోసగించింది: మేరుగ నాగార్జునదేశ చరిత్ర లోనే దివ్యాంగులకు భరోసా, ఆత్మస్ధైర్యం కల్పించింది జగనన్న పాలనలోనే. ఏపీలో కూటమి ప్రభుత్వం దివ్వాంగులను మోసగించింది. వెరిఫికేషన్ పేరుతో దివ్యాంగులను ఆసుపత్రుల చుట్టు, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిప్పుతున్నారు. పెన్షన్ల రీవెరిఫికేషన్ పేరుతో వారికి నరకయాతన చూపుతున్నారు. చంద్రబాబు ఇదేనా మానవత్వం. చంద్రబాబు దివ్యాంగుల పట్ల నువ్వు చేస్తున్నది మోసం, దగా కాదా అని ప్రశ్నిస్తున్నాం.దివ్యాంగులకు ఇచ్చిన హామీ ఏంటి, ఇప్పుడు చేస్తున్నదేంటి?: పులిపాటి దుర్గారెడ్డిచంద్రబాబు దివ్యాంగులను నిలువునా మోసం చేశారు. దివ్యాంగుల పెన్షన్లలో కోతలు, ఆంక్షలతో వేధిస్తున్నారు. చంద్రబాబు ఎన్నికల ముందు నువ్వు దివ్యాంగులకు ఇచ్చిన హామీ ఏంటి, ఇప్పుడు చేస్తున్నదేంటి. లక్షల మంది దివ్యాంగలకు నోటీసులు ఇచ్చి మా దివ్యాంగులను దొంగలుగా చిత్రీకరిస్తున్నావు. మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీశావ్. జగన్ హయాంలో తలెత్తుకు తిరిగిన మేమంతా ఇప్పుడు ఆత్మాభిమానం దెబ్బతిని బతుకీడుస్తున్నాం. అనేకమంది బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇంత దుర్మార్గంగా వ్యవహరించడం మీకు సమంజసమా అని నిలదీస్తున్నాం. -
లేఖ రాశానని.. నా భర్తను అరెస్ట్ చేశారు: మేకతోటి అరుణ
సాక్షి, తాడేపల్లి: మంగళగిరి నియోజకవర్గంలో బెల్ట్‌షాప్‌లపై మంత్రి నారా లోకేష్‌ను ప్రశ్నిస్తూ ఒక జెడ్పీటీసీగా లేఖ రాయడాన్ని జీర్ణించుకోలేక తన భర్త వీరయ్యపై పోలీసులను ప్రయోగించి తప్పుడు కేసులో అర్ధరాత్రి దౌర్జన్యంగా లాక్కెళ్ళారని దుగ్గిరాల జెడ్పీటీసీ మేకతోటి అరుణ మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళగిరి వైఎస్సార్సీపీ ఇంచార్జి దొంతిరెడ్డి వేమారెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడుతూ.. దళితులమైన తమపై మంత్రి నారా లోకేష్ కక్షపూరితంగానే అక్రమ కేసులు బనాయించి, తన నియోజకవర్గంలో ప్రశ్నించే గొంతు ఉండకూడదనే నిరంకుశత్వంతో వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.వైఎస్ జగన్ నాయకత్వంలో ప్రజల పక్షాన నిలబడతామని, నారా లోకేష్ ఎన్ని అక్రమ కేసులు పెట్టించినా భయపడేదే లేదని మేకతోటి అరుణ స్పష్టం చేశారు. తాను చేస్తున్న తప్పులకు నారా లోకేష్ భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఇంకా ఆమె ఏమన్నారంటే.. ఈనెల పదో తేదీన దుగ్గిరాల మండల సర్వసభ్య సమావేశంలో బెల్ట్‌షాప్‌లపై బాధ్యత కలిగిన ఒక జెడ్పీటీసీ సభ్యురాలుగా అధికారులను ప్రశ్నించాను. మా మండలంలో ప్రతి వీధిలోనూ బెల్ట్‌షాప్‌లను ఏర్పాటు చేసి, మద్యాన్ని విచ్చలవిడిగా నడిపిస్తున్నారు. దీనిపై ఎక్కడికి వెళ్ళినా మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తూ, ప్రభుత్వం దృష్టికి ఈ సమస్యను తీసుకురావాలని కోరుతున్నారు. ఇదే అంశాన్ని సర్వసభ్య సమావేశంలో నేను ప్రస్తావించాను.ఈ సమావేశానికి మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే, మంత్రి నారా లోకేష్ హాజరు కాలేదు. అందువల్ల ఈ అంశాన్ని ఆయన దృష్టికి తీసుకువెడుతూ లేఖ రాశాను. (ఈ సందర్బంగా ఆ లేఖ ప్రతిని వీడియాకు ప్రదర్శించారు) ఈ లేఖను ఎండీఓకు అందచేయడం ద్వారా దానిని మంత్రివర్యులకు పంపాలని కోరాను. మండలంలో కూల్ డ్రింక్ షాప్‌లు, కంటైనర్లలో బెల్ట్‌షాప్ లను నిర్వహిస్తూ, ప్రజలకు మద్యాన్ని విచ్చలవిడిగా విక్రయిస్తూ, వారిని ఆరోగ్యపరంగా, ఆర్థికంగా దెబ్బతీస్తున్నారని ఫోటోలతో సహా ఆ లేఖకు జత చేసి ఎండీఓకు అందచేశాను.ఆ రోజు నేను మండల ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశంలో ఏం మాట్లాడానో దానికి సంబంధించిన వీడియోను కూడా ఈ సందర్బంగా ప్రదర్శిస్తున్నాను. (ఎంపీపీ సర్వసభ్య సమావేశంలో మాట్లాడిన వీడియోను ప్రదర్శించారు). ఈ సమావేశంలో కేవలం మద్యం, బెల్ట్‌షాప్‌ల గురించి, అధిక ధరలకు జరుగుతున్న మద్యం విక్రయాలు, ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి మాత్రమే మాట్లాడానే తప్ప ఎవరినీ విమర్శించలేదు. అయినా కూడా దీనిని తట్టుకోలేని స్థితిలో మంత్రి నారా లోకేష్ ఉన్నారు. ప్రభుత్వంలో కీలక స్థానంలో ఉన్న మంత్రి నారా లోకేష్ నియోజకవర్గంలోనే ఈ పరిస్థితి ఉంది. దీనిని బయటపెట్టినందుకు నా భర్త దాసరి వీరయ్యను ఎక్కడో జరిగిన హత్యకేసులో నిందితుడిగా కేసులు బనాయించి, అర్థరాత్రి దౌర్జన్యంగా అదుపులోకి తీసుకున్నారు.నారా లోకేష్ అక్రమాలను ప్రజలు గమనిస్తున్నారుకూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాష్ట్రంలో దళితులపై తప్పుడు కేసులు, అరాచకాలు, దాష్టీకాలు పెరిగిపోయాయి. ఈ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే గత ఏడాది జూన్ 4న తుమ్మపూడిలో జరిగిన హత్యకేసులో కూడా నా భర్త వీరయ్యను ఇరికించారు. మంత్రి నారా లోకేష్ కావాలనే మాపైన కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. ఎక్కడ ఏం జరిగినా దానికి నా భర్తనే లక్ష్యంగా చేసుకుని తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారు. మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో ఐజీ నా భర్తపై అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారు. నారా లోకేష్ దళితులమైన మాపైన ఎన్ని కేసులు పెట్టినా, వేధించినా భయపడేదే లేదు.వైఎస్ జగన్ నాయకత్వంలో ప్రజల పక్షాన గళం విప్పకుండా మమ్మల్ని అడ్డుకోలేరు. గత ప్రభుత్వంలో అవినీతి కేసులో చంద్రబాబును అరెస్ట్ చేస్తే, అది అక్రమ కేసు అంటూ ఇదే నారా లోకేష్ మాట్లాడారు. ఇప్పుడు మీరు చేస్తున్నది ఏమిటీ? వైఎస్సార్సీపీలో ఉన్న దళిత నాయకులపై అక్రమ కేసులు పెట్టి వేధించడం లేదా? కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారు. సరైన సమయంలో బుద్ది చెబుతారని అరుణ స్పష్టం చేశారు.వీరయ్య పట్ల దౌర్జన్యంగా వ్యవహరించిన పోలీసులు: దొంతిరెడ్డి వేమారెడ్డివీరయ్యను కుటుంబసభ్యులను భయబ్రాంతులకు గురి చేసి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రజాస్వామ్యంలో ఉన్నామా? పోలీస్ రాజ్యంలో జీవిస్తున్నామా? అనే సందేహం కలుగుతోంది. తప్పుడ చేస్తే చట్టప్రకారం అరెస్ట్ చేయవచ్చు. కానీ పోలీసులు వ్యవహరించిన తీరు చూస్తుంటే, వైఎస్సార్సీపీలో ఆయన నాయకుడిగా కొనసాగుతున్నందున కక్షసాధింపుతో కావాలనే ఒక భయోత్పాతాన్ని సృష్టించేలా ఆయనను అరెస్ట్ చేశారు.అర్ధరాత్రి తన కుటుంబంతో నిద్రిస్తున్న సమయంలో, ఆయనను పెద్ద సంఖ్యలో వచ్చిన పోలీసులు హంగామాతో బలవంతంగా ఈడ్చుకుంటూ తమతో తీసుకువెళ్ళిన ఘటన అభ్యంతరకరం. ఆయన సంతానంలో దివ్యాంగురాలైన కుమార్తె కూడా ఉంది. జరుగుతున్న ఈ తతంగంతో ఆమె భీతావాహం అయ్యింది. ఈ రాష్ట్రంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఉందా? లోకేష్ రాసుకున్న రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు అవుతోందా? అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ, వైయస్ఆర్సీపీ నేతలను భయపెట్టాలనుకోవడం వారి అవివేకమని వేమారెడ్డి హెచ్చరించారు. -
చంద్రబాబుకు పేర్ని నాని సవాల్..
సాక్షి, తాడేపల్లి: నకిలీ మద్యం కేసులో జనం నవ్వుతారనే సిగ్గు ప్రభుత్వానికి, ఎల్లో మీడియాకు లేదంటూ ఎద్దేవా చేశారు మాజీ మంత్రి పేర్ని నాని. ప్రభుత్వ పెద్దల ఒత్తిడితోనే పోలీసులు జనార్థన్‌తో వీడియో చేయించారని ఆరోపించారు. ఇదే సమయంలో చంద్రబాబుకు సవాల్ విసిరారు. బార్లలో జరుగుతున్న అవినీతిని బయట పెట్టే దమ్ముందా? అని ప్రశ్నించారు. బార్లలో విక్రయించే మద్యం ఎక్కడిదో లెక్క తేల్చేందుకు ఎల్లో మీడియా సైతం సిద్దమా అని సవాల్ చేశారు. ఇక, బార్లలో నెలకు రూ.5 కోట్లు భారీ అవినీతి జరుగుతోందని సంచలన ఆరోపణలు చేశారు. మాజీ మంత్రి పేర్ని నాని తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ..‘కూటమి నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నకిలీ మద్యాన్ని కవర్ చేయడం తెలియక ఎల్లో మీడియా చచ్చిపోతుంది. ఈనాడులో నకిలీ మద్యం మీద వార్తలే లేవు!. నకిలీ మద్యంపై ఆంధ్రజ్యోతి వార్తలు జుగుప్సాకరంగా ఉన్నాయి. జనం నవ్వుతారనే సిగ్గు ప్రభుత్వానికి, ఎల్లో మీడియాకు లేదు. జనార్థన్, సురేంద్ర నాయుడు, జయచంద్రారెడ్డికి రెడ్ కార్నర్ నోటీసు ఇవ్వలేదు. నకలీ మద్యం కేసులో ఏ1 జనార్థన్ పెళ్లికి వచ్చినట్టు గన్నవరంలో దిగాడు. జనార్థన్‌తో కూటమి ప్రభుత్వ పెద్దలు మ్యాచ్ ఫిక్సింగ్ డ్రామాలాడారు. ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో పోలీసులు జనార్థన్‌తో వీడియో చేయించారు.అన్ని వైన్ షాపులకు పర్మిట్ రూమ్‌లు.. కూటమి ప్రభుత్వం వచ్చాక క్యూఆర్ కోడ్ ఎందుకు రద్దు చేశారు. నకిలీ మద్యాన్ని విచ్చలవిడిగా అమ్ముకోవడానికే క్యూఆర్ కోడ్ ఎత్తేశారు. మళ్లీ ఏడాదిన్నర తర్వాత క్యూఆర్ కోడ్ ఎందుకు తెచ్చారు?. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందానా.. క్యూఆర్ కోడ్ రాగం ఎత్తుకున్నారు. నకిలీ మద్యం వ్యవహారం చేయిదాటి పోతుందనే క్యూ ఆర్ కోడ్ తెచ్చారు. క్యూ ఆర్ కోడ్‌పై కూటమి నేతలు డ్రామాలు మానుకోవాలి. రాష్ట్రంలో పర్మిట్ రూమ్లేని షాపులు ఉన్నాయా?. పట్టణాల్లో పర్మిట్ రూమ్‌కు రూ.7.5లక్షలు, గ్రామాల్లో 5 లక్షల చొప్పున వసూలు చేస్తున్నారు. అన్ని వైన్ షాపులకు పర్మిట్ రూమ్‌లు పెట్టారు. ఏపీలో 3736 మద్యం దుకాణాలు ఉంటే 3736 పర్మిట్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. నకిలీ మద్యంతో ప్రజల ఆరోగ్యంతో కూటమి ప్రభుత్వం ఆటలాడుతోంది. రాష్ట్రంలో లక్షా 50వేలకు పైగా బెల్టు షాపులు ఉన్నాయి. బెల్టు షాపులు ఏర్పాటు చేసింది నకిలీ మద్యం విచ్చలవిడిగా అమ్ముకోవడానికే కదా.నగదుకే మందు ఎందుకు?..రూ.99 మందును రెండు నెలలకే అటక ఎందుకెక్కించారు?. రూ.99కే మందు దొరికితే నకిలీ మద్యం అమ్ముకోవడం కుదరదు కాబట్టే ఆపేశారు. కూటమి ప్రభుత్వంలో పది శాతం కూడా డిజిటల్ పేమెంట్స్ లేవు. వైన్ షాపుల్లో 25 శాతం డిజిటల్ పేమెంట్స్ అంటే చంద్రబాబు ఎలా నమ్ముతున్నారు?. నగదుకే మందు ఎందుకు అమ్ముతున్నారో ప్రజలకు తెలియదా?. జనార్థన్ ఫ్యాక్టరీలో మందు నకిలీయే కానీ.. ప్రమాదం కాదట!. నకిలీ మద్యం అయినా తాగేయమని అధికారులు, ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు’ అంటూ మండిపడ్డారు. చంద్రబాబుకు సవాల్చంద్రబాబు.. బార్లలో జరుగుతున్న అవినీతిని బయట పెట్టే దమ్ముందా?. నెలకు రూ.5 కోట్లు దండుకుని బార్లలో పెద్ద ఎత్తున స్కాం చేస్తున్నారు. ప్రభుత్వ డిపోల నుండి కాకుండా బయటి నుండి పెద్ద ఎత్తున సరుకు తెచ్చి విక్రయిస్తున్నారు. ఆ మద్యం విక్రయాల కోసం నెలకు రూ.5 కోట్లు లంచాల కింద వసూలు చేస్తున్నారు. ఆ డబ్బంతా ఎవరి జేబుల్లోకి వెళ్తోంది?. చంద్రబాబుకు దమ్ముంటే బార్లలో తనిఖీలు చేసేందుకు రాగలరా?. బార్లలో విక్రయించే మద్యం ఎక్కడిదో లెక్క తేల్చేందుకు ఎల్లోమీడియా, రాజకీయ పార్టీల సమక్షంలో మేము సిద్దం. మా హయాంలో ఊగిపోయిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎక్కడ దాక్కున్నారు?. నకిలీ మద్యంపై ఎందుకు మాట్లాడటం లేదు?. మద్యం సీసాల మీద క్యూఆర్ కోడ్ పెట్టామని ప్రెస్ మీట్ పెట్టేంత ఖాళీగా చంద్రబాబు ఉన్నారు. రోజుకు రూ.3 లక్షల బిజినెస్ చేయకపోతే బార్లకు నష్టం వస్తుంది. విజయవాడ, తిరుపతి, కర్నూలు, గుంటూరు లాంటి నగరాల్లో నెలకి రూ.80 లక్షల సరుకు ప్రభుత్వం దగ్గర కొనాలి. ఈ మేరకు ఆ షాపులు కొనుగోలు చేస్తున్నాయా?. ప్రభుత్వానికి చాలెంజ్ చేస్తున్నా.. ఆ వివరాలు బయట పెట్టగలరా?.కరకట్టకే డబ్బంతా..డబ్బంతా కరకట్ట బంగ్లాలోకి వెళ్తోందా? విమానాల్లో హైదరాబాద్ వెళ్తుందో చెప్పాలి. నకిలీ మద్యం తాగినా జనం చనిపోరని ఎల్లోమీడియా రాసింది. అంటే నకిలీ మద్యం తాగొచ్చని ప్రభుత్వమే స్టాంప్ వేసినట్టు కాదా?. ఇంతకంటే దుర్మార్గం ఇంకొకటి ఉంటుందా?. రేపోమాపో జయచంద్రారెడ్డిపై సస్పెన్షన్ ఎత్తేస్తారు. జనార్థన్కి బెయిల్ ఇప్పించి బయటకు తెస్తారు. నకిలీ మద్యం తయారు చేసిన జయచంద్రారెడ్డి, జనార్ధన్, సురేంద్ర నాయుడు ఫోన్లను అధికారులు ఎందుకు సీజ్ చేయలేదు?. ఏ సంబంధం లేని జోగి రమేష్ ఫోన్లను ఎందుకు సీజ్ చేశారు?. అన్ని వర్గాల ప్రజలను పథకాల పేరుతో చంద్రబాబు నిలువునా మోసం చేశారు. పిఠాపురం వర్మ నుండి తాగుబోతుల వరకు ఇలా అందరినీ మోసం చేశారు. మద్యం షాపుల ఓనర్లను కూడా చంద్రబాబు మోసం చేశారు. ఈ విషయం వచ్చే సెప్టెంబరు నాటికి తెలుస్తుంది. -
సాక్షిపై బాబు సర్కార్ కుట్రలు.. తెలుగు రాష్ట్రాల్లో జర్నలిస్టుల నిరసనలు
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: నకిలీ మద్యంపై వార్తలు ప్రచురించిన సాక్షి మీడియాపై కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్రలను నిరసిస్తూ తెలుగు రాష్ట్రాల్లో జర్నలిస్టులు ఆందోళన చేపట్టారు. ఏపీ ప్రభుత్వ అరాచకపాలన, దమనకాండపై నిరసన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టులు ఆందోళన నిర్వహించారు. సాక్షిపై పెట్టిన తప్పుడు కేసులు ఎత్తేయాలంటూ డిమాండ్ చేశారు. భావప్రకటనా స్వేచ్ఛకు చంద్రబాబు ప్రభుత్వం తూట్లు పొడుస్తోందంటూ జర్నలిస్ట్ సంఘాల నాయకులు మండిపడ్డారు.నకిలీ మద్యం పై వార్తలు రాస్తే కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కేసులు పెట్టడం ప్రజాస్వామ్యానికి తూట్లు పొడవడమే. భవిష్యత్తులో వార్తలు రాయాలంటేనే జర్నలిస్టులు భయపడే పరిస్థితి నెలకొంది. వార్తలు రాస్తే కేసులు పెట్టడం చాలా దారుణం. అన్ని వార్తా సంస్థలను ఒకేలా చూడాలి. నకిలీ మద్యం తాగితే మనుషులు చనిపోరా?. నకిలీ మద్యంపై వార్తలు రాస్తే రిపోర్టర్లు, ఎడిటర్లను కేసులతో వేధిస్తున్నారు. నకిలీ మద్యాన్ని కుటీర పరిశ్రమగా మార్చారని రాయడం తప్పా?. నకిలీ మద్యం తప్పని రాయడం కూడా మీకు తప్పేనా?. నకిలీ మద్యం మంచిదే అని ప్రభుత్వం చెబుతోందా?. ఇప్పటికైనా ప్రభుత్వం సాక్షిపై కక్ష సాధింపు మానుకోవాలి. జర్నలిస్టులు, మీడియా సంస్థలను ప్రభుత్వం ఇబ్బంది పెట్టడం మానుకోవాలి. లేని పక్షంలో జర్నలిస్ట్ సంఘాలన్నీ ఏకమై పోరాడతాయి’’ అంటూ జర్నలిస్ట్ సంఘాలు హెచ్చరించాయి.వైఎస్సార్ జిల్లా: సాక్షి జర్నలిస్టులపై ప్రభుత్వ వేధింపులకు నిరసనగా ఏపీయూడబ్ల్యూజే, వైఎస్సార్సీపీ అధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సాక్షి ఎడిటర్ ధనుంజయ రెడ్డి, నెల్లూరు బ్యూరో మస్తాన్ రెడ్డిలపై అక్రమ కేసులు బనాయించడంపై నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కక్షసాధింపునకు దిగుతుందన్న జర్నలిస్టు నాయకులు.. వార్తలు రాస్తే ఖండించడానికి అనేక మార్గాలున్నా ఇళ్లు, ఆఫీసుల్లో సోదాలు చేయడం కక్షసాధింపు చర్యలేనన్నారు. మీడియా, సోషల్ మీడియా విషయంలో పోలీసులు, ప్రభుత్వం ఇష్టారీతిన వ్యవహరిస్తోందని వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జర్నలిస్టులు వినతిపత్రం అందించారు. అనంతపురం జిల్లా: సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డి, ఇతర జర్నలిస్టులపై బనాయించిన అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ అనంతపురం జిల్లాలో జర్నలిస్టు సంఘాలు నిరసన తెలిపాయి. నగరంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట చంద్రబాబు సర్కార్‌కు వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ సంఘాలు మద్దతు తెలిపాయి. కల్తీ మద్యం కథనాలు జీర్ణించుకోలేక అక్రమ కేసులు బనాయించడం తగదని.. సీఎం చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే కల్తీ మద్యం అరికట్టాలని వారు డిమాండ్ చేశారు.కర్నూలు జిల్లా: కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టు సంఘాలు ఆందోళన నిర్వహించాయి. సాక్షి మీడియాపై కూటమి ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులను నిరసిస్తూ జర్నలిస్టు సంఘాలు నిరసనలు చేపట్టాయి. సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డిపై అక్రమ కేసులు ఎత్తివేయాలని జర్నలిస్టు నేతలు డిమాండ్ చేశారు.కాకినాడ జిల్లా: సాక్షి మీడియాపై పోలీసుల వేధింపులను నిరసిస్తూ కలెక్టరేట్ వద్ద జర్నలిస్టుల ఆందోళన చేపట్టారు. పత్రిక స్వేచ్చ ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించాలని డిమాండ్ చేశారు. పోలీసులు నమోదు చేసిన కేసులను భేషరతుగా ఉపసంహరించాలని అధికారులకు వినతి పత్రం అందజేశారు.జనగామ: సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనుంజయ రెడ్డిపై ఏపీ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టడాన్ని నిరసిస్తూ జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ బస్టాండ్ వద్ద అంబేద్కర్ విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి జర్నలిస్టులు, ప్రజా సంఘాలు నిరసన తెలిపాయి. జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.సూర్యాపేట జిల్లా: సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డిపై జరిగిన దమనకాండను నిరసిస్తూ హుజుర్నగర్ ఆర్డీవో కార్యాలయం ముందు జర్నలిస్టుల ఆందోళన చేపట్టారు. జర్నలిస్టులపై దాడులను అరికట్టాలని డిమాండ్ చేస్తూ ఆర్డీవో శ్రీనివాసులుకు వినతి పత్రం అందజేశారు.నిజామాబాద్ జిల్లా: నిజామాబాద్ జిల్లా ధర్నా చౌక్‌లో సాక్షి మీడియాపై ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపుతో వ్యవహరిస్తోందని జర్నలిస్టులు సంఘాలు నిరసన చేపట్టారు. సాక్షి మీడియాపై పెట్టిన తప్పుడు కేసులను వెంటనే ఎత్తేయాలని వారు డిమాండ్ చేశారు. జర్నలిస్టులు, మీడియా సంస్థలను ఇబ్బంది పెట్టే విధానాన్ని కొనసాగిస్తే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో మీడియా స్వేచ్ఛను కాపాడాలని, జర్నలిస్టుల గళాన్ని అణచే చర్యలను తక్షణం ఆపాలని సంఘాలు డిమాండ్ చేశాయి.పెద్దపల్లి జిల్లా: పెద్దపల్లిలో ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు ఆందోళన నిర్వహించారు. సాక్షి పత్రికపై ఏపీ ప్రభుత్వ కుట్రపూరిత చర్యలకు నిరసనగా జర్నలిస్టుల నిరసన చేపట్టారు. అమరుల స్తూపం నుండి బస్టాండ్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. రాజీవ్ రహదారిపై ధర్నా చేశారు. పత్రిక స్వేచ్ఛను హరించడాన్ని జర్నలిస్టు, వామపక్ష నాయకులు ఖండించారుమహబూబాబాద్ జిల్లా: నకిలీ మద్యం పై వరుస కథనాలు ప్రచురించిన సాక్షిపై కూటమి ప్రభుత్వం, పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ జర్నలిస్టులు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు రాజకీయ పార్టీల నేతలు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించి నిరసన చేపట్టారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలతో పట్టణ ప్రాంతాన్ని హోరెత్తించారు. ఈ సందర్బంగా పలువురు నేతలు మాట్లాడుతూ.. గత నాలుగు రోజుల్లో సాక్షి ఎడిటర్ ధనుంజయ రెడ్డికి ఏపీ పోలీసులు నోటీసులు ఇవ్వడం, బెదిరింపులకు పాల్పడడం దుర్మార్గం అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి సాక్షిపై అక్రమ కేసులతో దాడి చేయడం హేయమైన చర్య అంటూ దుయ్యబట్టారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం కళ్లు తెరిచి సాక్షి దినపత్రికపై అక్రమ కేసులు ఎత్తివేయాలని లేనిపక్షంలో ఆందోళనలు తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు. -
చారాణా కోడికి బారాణా మసాలా
ఆంధ్రప్రదేశ్‌కు చంద్రబాబు నాయుడికి మించిన బ్రాండే లేదంటారు ఆయన కుమారుడు, టీడీపీ నేతలు. బాగానే ఉంది కానీ.. ఈ బ్రాండ్ విలువ కాస్తా ఆంధ్రప్రదేశ్ ప్రజలను మరింత పేదలను చేస్తేనే వస్తుంది తంటా. విశాఖపట్నంలో గూగుల్ ఏర్పాటు చేస్తున్న గూగుల్ డేటా సెంటర్ వివరాలు తెలిస్తే ఎవరైనా ఇదే మాట అంటారు. కేవలం రెండు వందల మందికి ఉద్యోగాలిచ్చే ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఎకాఎకిన రూ.22 వేల కోట్ల రాయితీలు కల్పిస్తోంది మరి. చారాణా కోడికి బారా అణా మసాలా అన్నమాట!ఇంతటి భారీ రాయితీల వల్ల ఆయా రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి చితికిపోతుందని కర్ణాటక ఐటీ శాఖ మంత్రి ప్రియాంక ఖర్గే ఇప్పటికే విస్పష్టంగా చెప్పేశారు కూడా. కానీ యథావిధిగా ఏపీ మంత్రివర్యులు లోకేశ్ ఆ మాటలను ఖండించేశారు. కడుపుమంట అన్నట్టుగానూ మాట్లాడారు. ఇలా కాకుండా భారీ రాయితీలతో ఆర్థిక నష్టం ఉండదన్న విషయాన్ని వివరించి ఉంటే బాగుండేదేమో. ఐటీ ఉద్యోగాల కోసం రాష్ట్ర యువత బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి నగరాలకు భారీ ఎత్తున వెళుతున్న నేపథ్యంలో ఆచితూచి మాట్లాడటం మంచిదన్నది పలువురి అభిప్రాయం.గూగుల్ డేటా సెంటర్ విషయానికి వస్తే.. కొన్ని రోజుల క్రితం ఎల్లో మీడియా దీనిపై పతాక శీర్షికల్లో కథనాలు ప్రచురించింది. రైడెన్ ఇన్ఫోటెక్ రూ.87 వేల కోట్ల పెట్టుబడులతో విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటుకు ప్రతిపాదించిందని, దీంతో రాష్ట్ర సాఫ్ట్వేర్ రంగం గతి మారిపోతుందన్నది దీని సారాంశం. దీంతోపాటే మరుసటి రోజు ఈనాడులో ఇంకో కథనం కూడా ప్రచురితమైంది. డేటా సెంటర్ ఏర్పాటకు గాన ప్రభుత్వం ఇస్తున్న రాయితీల మొత్తం రూ.22 వేల కోట్లు అని! కేబినెట్ ఆమోదం రోజున వెల్లడైన వివరాల ప్రకారం ఈ ప్రాజెక్టుతో వచ్చే ఉద్యోగాల సంఖ్య 200 మాత్రమే.పెట్టుబడి మొత్తం ఒక్కో కోటికి ఒక ఉద్యోగాన్ని ఇవ్వవచ్చునన్నది సాధారణ అంచనా. ఈ లెక్కన డేటా సెంటర్‌తో 87 వేల ఉద్యోగాల సృష్టి జరగాలి. పరోక్షంగా ఉపాధి పొందేవారు దీనికి అదనం. కానీ ఇవేవీ జరుగుతున్నట్లు లేదు. అటు సీఎం చంద్రబాబు, ఇటు రైడెన్ సంస్థ ప్రతినిధులు కానీ ఉద్యోగాల సంఖ్య విషయంలో పెదవి విప్పలేదు. ప్రభుత్వ జీవోలోనూ స్పష్టత లేదు. ఈ విషయాన్ని కవర్ చేసుకునేందుకా అన్నట్టు ఎల్లోమీడియా తరువాతి రోజుల్లో ఈ ప్రాజెక్టు ద్వారా రెండు లక్షల మంది వరకూ ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు వస్తాయని కాకిలెక్కలు కొన్ని ప్రచురించింది. కాకపోతే ప్రపంచవ్యాప్తంగా గూగుల్ ఉద్యోగుల సంఖ్య 1.87 లక్షలైతే.. కొత్తగా ఏర్పాటయ్యే ఒక డేటా సెంటర్లోనే అంతమొత్తంలో ఉద్యోగాలు ఎలా వస్తాయన్నది ప్రశ్న!ఎల్లో మీడియా బొంకులు అక్కడితో ఆగాయా? ఊహూ లేదు. డేటా సెంటర్ పెట్టుబడులన్నీ గూగుల్ పెడుతున్నట్టుగా రాశారు. వాస్తవానికి గూగుల్ అనుబంధం సంస్థ రైడెన్, అదానీ గ్రూపులు కలిసి ఈ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. ఎయిర్టెల్ కూడా భాగస్వామి అని తెలుస్తోంది. అయితే జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా అదానీ ఏర్పాటు చేయతలపెట్టిన డేటా సెంటర్ కోసం 150 ఎకరాల భూమి కేటాయించారు. సీఎంగా ఆయన శంకుస్థాపన కూడా చేశారు.డేటా సెంటర్‌తోపాటు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సెంటర్ కూడా ఏర్పాటు చేయాలని, 25 వేల ఉద్యోగాలు కల్పించాలన్న షరతులతో అదానీకి స్థలం కేటాయించడం గమనార్హం. ఈ ఏర్పాట్లు కొనసాగుతున్న సమయంలోనే అదాని కంపెనీకి రైడెన్, ఎయిర్‌టెల్‌లు తోడయ్యాయి. నెదర్లాండ్స్, డెన్మార్క్, ఐర్లాండ్ వంటి దేశాలు డేటా సెంటర్ ఏర్పాటు ప్రతిపాదనను తిరస్కరించిన తరువాతే రైడెన్ అదానీ కంపెనీతో జత కట్టడం గమనార్హం. ఈ డేటా సెంటర్లకు కావాల్సిన భారీ విద్యుత్తు, నీటి అవసరాలను తీర్చలేకపోవడం, డేటా సెంటర్లతో వచ్చే కాలుష్య సమస్యపై ప్రజలు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఆ దేశాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి.ఎక్కడైనా పరిశ్రమ వస్తే ఆ ప్రాంత ప్రజలకు ఉపయోగం ఉండాలి. ప్రభుత్వానికి ఆదాయం సమకూరాలి. కాని చంద్రబాబు ఇచ్చిన రాయితీలను పరిగణనలోకి తీసుకుంటే మరో పది నుంచి ఇరవై ఏళ్ల వరకు ప్రభుత్వానికి అదనపు ఖర్చే మినహా పైసా ఆదాయం ఉండదని స్పష్టమవుతోంది. లక్షల కోట్ల టర్నోవర్, వేల కోట్ల పెట్టుబడులు పెట్టగలిగిన స్థోమత ఉన్న కంపెనీలకు మళ్లీ అంతే స్థాయిలో రాయితీలు ఇవ్వాల్సిన అవసరముందా? అన్నది ప్రశ్న. అసలు రూ.87 వేల కోట్ల పెట్టుబడి పెట్టగలిగే సామర్ధ్యం ఉన్న కంపెనీ ఇన్ని రాయితీలు ఎలా కోరుతోందో అర్థం కాదు. తాము పెట్టదలచిన మొత్తంలో 25 శాతం ముందుగానే గిట్టుబాటు చేసుకుంటున్నారన్న భావన రాదా? కంపెనీలను ఆకర్శించేందుకు ప్రోత్సాహకాలు ఇవ్వడంలో తప్పులేదు కానీ.. ఒకపక్క వైద్య కళాశాలల నిర్మాణానికి డబ్బుల్లేవని చెబుతున్న ప్రభుత్వం ఆరోగ్యశ్రీ బకాయిలకూ నిధుల్లేవంటున్న ప్రభుత్వం ఇలా కంపెనీలకు వేల వేల కోట్ల రాయితీలు ఇవ్వడం ఎంత వరకూ సమంజసం? కొన్ని కంపెనీలకు భారీ రాయితీలు.. ఇంకొన్నింటికి కారుచౌకగా భూములు ఇస్తున్న చంద్రబాబు ప్రభుత్వం... భారతీ సిమెంట్స్ మైనింగ్ లీజులను కక్షపూరితంగా రద్దు చేసే ప్రయత్నం చేస్తూండటం విమర్శలకు గురవుతోంది. అడక్కపోయినా టీసీఎస్ కంపెనీకి ఎకరాకు రూపాయి చొప్పున 22 ఎకరాల భూమి కేటాయించింది. కాగ్నిజెంట్, ఉర్సా కంపెనీలకూ ఇదే లెక్కన భూమి ఇస్తున్నామని అంటున్నారు.తాజాగా రైడెన్ కంపెనీకి 25 శాతం రాయితీతో 480 ఎకరాలు ఇస్తారట. స్టాంపు డ్యూటి, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పూర్తిగా మినహాయిస్తారు. కంపెనీ వారు ప్లాంట్, మెషినరీ కొనుగోలు ఖర్చులో పది శాతం రాయితీ అంటే రూ.2129 కోట్లు ప్రభుత్వం భరిస్తుందట. డేటా సెంటర్ నిర్మాణానికి చెల్లించే జీఎస్టీ మొత్తం కంపెనీకి తిరిగి చెల్లిస్తారు.దీని విలువ రూ.2245 కోట్లు. లీజులపై చెల్లించే జీఎస్టీ పదేళ్లపాటు చెల్లించే మరో రూ.1745 కోట్లు కూడా ప్రభుత్వం తిరిగి చెల్లించనుంది. ఏపీ ప్రజలపై కొన్నివేల కోట్ల రూపాయల అదనపు ఛార్జీల భారం మోపిన చంద్రబాబు ప్రభుత్వం రైడెన్ కంపెనీకి మాత్రం యూనిట్‌కు రూపాయి రాయితీ ఇస్తోంఇ. తద్వారా కంపెనీకి పదేళ్లలో కలిగే లాభం రూ.4800 కోట్లు! సుంకాల్లో మినహాయింపులు మరో రూ.1200 కోట్లు. పంపిణీ ఛార్జీలు, క్రాస్ సబ్సిడీ ఛార్జీలు కలిపి మరో రూ.8500 కోట్లు ఉంటాయని లెక్క గడుతున్నారు.ఈ అంశాలపై ఎవరైనా సందేహాలు వ్యక్తం చేశారనుకోండి.. ఈనాడు వంటి సంస్థలు ఠకీమని అదంతా విష ప్రచారమన్న పాట అందుకుంటున్నాయి. విశాఖను కార్యనిర్వాహక రాజధాని అని గతంలో జగన్ అన్నప్పుడు ఇదే ఎల్లోమీడియా విశాఖకు వ్యతిరేకంగా బోలెడు కథనాలు వండి వార్చాయి. సముద్రం మట్టం పెరుగుతోందని, విశాఖకు ఏదో అవుతుందంటూ, ప్రజలను భయపెట్టేశారు. రిషి కొండపై నాలుగు ఆధునిక భవనాలు గత ప్రభుత్వం నిర్మిస్తే, పర్యావరణం నాశనం అయిపోయిందని, కొండకు గుండు కొట్టారంటూ తప్పుడు వార్తలు రాశారు. విష ప్రచారం అంటే అది! రిషికొండ భవనాలతోపాటు మరో తొమ్మిది ఎకరాల భూమిని ఇప్పుడు ప్రైవేటు వారికి ఇస్తుంటే మాత్రం వీరికి నోరు పెగలడం లేదు.డేటా సెంటర్ వల్ల ఉష్ణాగ్రత పెరుగుతుందని ఒప్పుకుంటూనే అది పెద్ద ఇబ్బంది కాదని సమర్థించుకున్నారు. ఇలా ఉంది వారి జర్నలిజం . మరో వైపు చక్కగా నడుస్తూ స్థానికులకు ఉపాధి కల్పిస్తున్న భారతి సిమెంట్, ఏసీసీ, రామకో సిమెంట్ కంపెనీలకు గతంలో ప్రభుత్వం ఇచ్చిన సున్నపురాయి లీజులను రద్దు చేస్తారట. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబానికి సంబంధం ఉన్న భారతి సిమెంట్ కంపెనీకి నష్టం చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ ప్రతిపాదన చేస్తోందన్నది వాస్తవం. ఇది కదా నడుస్తున్న పరిశ్రమలకు తరిమివేసే ప్రయత్నం అంటే అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.గూగుల్ డేటా సెంటర్ ఏపీ ప్రజలకు, ముఖ్యంగా విశాఖ ప్రాంతానికి ప్రయోజనం కలిగేలా ఏర్పాటైతే స్వాగతించాల్సిందే. కాకపోతే దాని వల్ల వచ్చే సమస్యలను అధ్యయనం చేయడం అవసరం.అప్పులపై ఆధారపడి ప్రభుత్వాన్ని నడుపుతున్న ఏపీలో అతి తక్కువ సంఖ్యలో ఉద్యోగాలు కల్పించే సంస్థకు 22 వేల కోట్ల రాయితీలు ఇవ్వడంలోని హేతుబద్దతపై ప్రభుత్వం వివరణ ఇవ్వకపోతే ప్రజలలో అనుమానాలు బలపడతాయని గమనించాలి.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
బాజీ బాబాకే టోకరా
గుంటూరు● ప్రణాళిక, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సేకరణ ● ఐదు పంటల్లో 140 ప్రయోగాలు సూపర్ జీఎస్టీపై 19 వరకు ఎగ్జిబిషన్ కమ్ సేల్ లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్) : సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్ గుంటూరు జిల్లా ఉత్సవ్‌ను కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియా, డెప్యూటీ మేయర్ షేక్ సజీలతో కలిసి గురువారం ప్రారంభించారు. ఈ నెల 19వ తేదీ వరకు ఉత్సవ్ జరుగుతుందని ఆమె తెలిపారు. అనంతరం మాట్లాడుతూ ధరలు తగ్గలేదని ఫిర్యాదులు రాకూడదని వ్యాపారులకు సూచించారు. ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. నగర పాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు మాట్లాడుతూ జీఎస్టీ 2.0పై ప్రజలు పూర్తిస్థాయిలో అవగాహన పొందాలని, తద్వారా ప్రశ్నించే అవకాశం ఉంటుందని తెలిపారు.జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ మాట్లాడుతూ జీఎస్టీలో వచ్చిన పొదుపును గృహ అవసరాలకు ఖర్చు చేయాలని సూచించారు. జీఎస్టీ జాయింట్ కమిషనర్ బి. గీతా మాధురి మాట్లాడుతూ ప్రతి వస్తువుపై జీఎస్టీ ధరల తగ్గుదలను ప్రతి ఒక్కరూ గమనించాలని తెలిపారు. ఏసీ కళాశాల ఆవరణలో ఏర్పాట్లు జీఎస్టీ 2.0పై వినియోగదారులకు పూర్తి అవగాహన కల్పించేందుకు ఏసీ కళాశాల ఆడిటోరియం హాలులో ఉత్సవ్‌ను ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా లోగో కూడా తయారు చేయించారు. ప్రతి రోజూ రాత్రి 9 గంటల వరకు ఎగ్జిబిషన్లో అమ్మకాలు జరుగుతాయి. పచ్చళ్లు, పొడులు, గృహోపకరణాలు, క్రీడా పరికరాలు, జిమ్, ఫిట్నెస్, సోలార్, బుక్స్ స్టేషనరీ, వ్యవసాయ పరికరాలు, పురుగు మందులు, అన్ని రకాల ఎలక్ట్రానిక్స్ వస్తువులు, వాహనాలు, ట్రాక్టర్లతో 70 స్టాల్స్ ఏర్పాటు చేశారు. రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలి జిల్లాలో వ్యవసాయ, ఉద్యాన, పాడి పరిశ్రమ రంగాల్లో పెట్టుబడి వ్యయం తగ్గించి దిగుబడులు ద్వారా అధిక ఆదాయం సాధించేందుకు అవలంబించాల్సిన పద్ధతులపై రైతులకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా తెలిపారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో గురువారం సాయంత్రం ఆమె పలు శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో వ్యవసాయ, ఉద్యాన పంటల సాగు వివరాలు, దిగుబడి, సాగు ప్రోత్సాహానికి ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, రాయితీల వివరాలు, పంటల వారీగా సాగు పెట్టుబడి, దిగుబడి వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆమె వివరించారు. పెదకాకాని: బాజీ బాబా దర్గాలో కూటమి నాయకుల దందాలు, ఆక్రమణలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. వక్ఫ్‌బోర్డు అధికారులతో కుమ్మకై ్క బాబా వారికి భక్తులు సమర్పించిన కానుకలు పెద్ద మొత్తంలో కాజేస్తున్నారు. వక్ఫ్ బోర్డు మేనేజ్మెంట్లో కొనసాగుతున్న హజరత్ సయ్యద్ బాజీ షహీద్ అవులియా దర్గాకు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో పేరు ఉంది. భక్తులు వచ్చి ప్రార్థనలను చేసుకోవడం, మొక్కులు చెల్లించుకోవడం దశాబ్దాలుగా ఇక్కడ జరుగుతోంది. పలువురు భక్తులు బాబావారిపై ఉన్న భక్తితో శక్తికొలది దర్గా అభివృద్ధికి కానుకలు నగదు రూపంలో చెల్లిస్తుంటారు. మరి కొందరు దర్గాకు వచ్చే భక్తుల సౌకర్యార్థం షెడ్లు నిర్మించారు. గతంలో దర్గాకు వచ్చిన భక్తులు మొక్కులు చెల్లించుకోవడంలో భాగంగా వంట అక్కడే చేసుకునేవారు. వర్షా కాలం భోజనం తినే సమయానికి వాన వచ్చి అనేక ఇబ్బందులు పడిన సందర్భాలు కొల్లలు. దీంతో దాతలు దర్గాలో మొక్కులు చెల్లించుకునే వారి సౌకర్యార్థం షెడ్డును నిర్మించారు. దీన్ని కూటమి నాయకులు ఆక్రమించుకుని అందులో టెంట్‌హౌస్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. బాబాపై ఉన్న భక్తితో షెడ్డు నిర్మించానని, అందులో టెంటు సామాను ఖాళీ చేయించి భక్తులకు ఉపయోగపడేలా చూడాలని దాత కోరినప్పటికీ వక్ఫ్‌బోర్డు అధికారులు పట్టించుకోవడం లేదు. భక్తులు దర్గాకు వస్తూ టెంటు, సామాన్లు తెచ్చుకున్నా అడ్డుకుంటున్నారు. తమ దగ్గరే తీసుకోవాలంటూ హుకుం జారీ చేస్తున్నారు. యడ్లపాడు: సంక్రాంతి పర్వదినం నాడు జిల్లాలోని పర్యాటక కేంద్రాలైన కోటప్పకొండ, కొండవీడు ప్రాంతాల్లో టూరిజం శాఖ ఆధ్వర్యంలో ఫెస్టివల్ నిర్వహించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ కృతికా శుక్లా చెప్పారు. ఇప్పటికే అటవీశాఖ, టూరిజం శాఖల అధికారులు దీనిపై రూపకల్పన చేశారన్నారు. కొండవీడుకోటను కలెక్టర్ కృతికా శుక్లా పలుశాఖల జిల్లా స్థాయి అధికారులతో కలసి గురువారం సందర్శించారు. కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత జిల్లా పరిధిలోని అన్ని పర్యాటక కేంద్రాలను క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. తొలుత ఘాట్ రోడ్డు ప్రారంభంలోని చెక్‌పోస్టు వద్దకు రాగానే కలెక్టర్‌కు డీఎఫ్‌వో జి కృష్ణప్రియ స్వాగతం పలికారు. రిజర్వ్ ఫారెస్టు భూముల వివరాలను కలెక్టర్‌కు వివరించారు. మొదలైన పంట కోత ప్రయోగాలు I పెదకాకాని బాజీ బాబా దర్గాలో దోపిడీల పర్వం యథేచ్ఛగా కూటమి నాయకుల దందా అధికారులతో కుమ్మక్కు కానుకల లెక్కింపులో చేతివాటం అక్రమాలను అరికట్టాలని ముస్లిం హక్కుల పోరాట సమితి డిమాండ్ వక్ఫ్ బోర్డు అధికారులు, ప్రజా ప్రతినిధులు వెంటనే స్పందించి అక్రమాలను అరికట్టాలి. టెంట్ హౌస్‌ను వెంటనే తొలగించాలి. హుండీల కానుకలు లెక్కింపులో సమయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. వారికి అనుకూలమైన ఫోటోగ్రాఫర్‌ను పెట్టుకుని కూటమి నాయకులు, వక్ఫ్‌బోర్డు అధికారులు కుమ్మకై ్క బాబా వారికి భక్తులు సమర్పించిన కానుకలు పెద్ద మొత్తంలో కాజేస్తున్నారు. – షేక్ ఖాజావలి, ముస్లిం హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు విజయపురిసౌత్: నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద నీరు తగ్గడంతో గురువారం క్రస్ట్ గేట్లు మూసివేశారు. ప్రస్తుతం నీటిమట్టం 589.30 అడుగులు. అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 53,355 క్యూసెక్కులు వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు నుంచి దిగువకు 53,355 క్యూసెక్కులు వదులుతున్నారు. దర్గాలో మూడు నెలలకు ఒకసారి హుండీలు తెరచి కానుకలు లెక్కింపు చేస్తూ ఉంటారు. ఈ సమయంలో చిల్లర నాణేలు సుమారు రూ. 2 లక్షల వరకూ వస్తుంటాయి. స్థానిక కూటమి నాయకుడి ఒత్తిడితో లెక్కించకుండానే రూ. 30 వేల నుంచి రూ. 40 వేలు తీసుకుని అతనికి అప్పగిస్తున్నారు. హుండీల్లోని కానుకలు లెక్కింపు సమయంలో కూడా కూటమి వారికి అనుకూలమైన ఫోటో వీడియోగ్రాఫర్‌ను ఏర్పాటు చేసుకుని హుండీల్లోని నగదు కాజేస్తున్నారని భక్తుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వక్ఫ్‌బోర్డు అధికారులు, స్థానిక ఈఓ, కూటమి నాయకులు కుమ్మకై ్క ఫోటోలకు, వీడియోకు దొరక్కుండా నగదు కాజేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. వక్ఫ్ బోర్డులో పనిచేస్తున్న కొందరు అవినీతి అధికారులు కూడా అక్రమాలను ప్రోత్సహిస్తున్నారు. ఇప్పటికై నా ప్రజాప్రతినిధులు, వక్ఫ్‌బోర్డు అధికారులు, చైర్మన్ స్పందించి అక్రమాలను అరికట్టాలని భక్తులు, పెదకాకాన్ని ప్రజలు కోరుతున్నారు. పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా -
హత్య కేసులో నిందితుల అరెస్టు
పట్నంబజారు (గుంటూరు ఈస్ట్) : పరువు హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. పాత గుంటూరు పోలీసు స్టేషన్లో ఈస్ట్ సబ్ డివిజన్ డీఎస్పీ షేక్ అబ్దుల్ అజీజ్, ఎస్హెచ్ఓ కె.వెంకట ప్రసాద్, ఎస్ఐ ఎన్.సి.ప్రసాద్‌లు గురువారం వివరాలను వెల్లడించారు. పొన్నూరు రోడ్డులో ఈనెల 7న కుర్రా నాగ గణేష్ (25)ను హత్య చేశారు. బుడంపాడులో నివాసం ఉండే నాగ గణేష్ కొలకలూరు గ్రామానికి చెందిన కీర్తి వీరాంజనేయదేవిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వివాహం ఇష్టం లేని ఆమె సోదరుడు కీర్తి దుర్గారావు ఈనెల 7న స్నేహితులతో కలిసి నాగ గణేష్‌ను హత్య చేశాడు. ఈ క్రమంలో మృతుడు తండ్రి శివాంజనేయులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు అనంతరం తెనాలి కొలకలూరు గ్రామానికి చెందిన షేక్ నూర్‌బాషా అలియాస్ జలాలి, బత్తిన లోకేష్, నందివెలుగు గ్రామానికి చెందిన తుమ్మల శివయ్య, జంపని వంశీ, గుంటూరు రూరల్ మండలం నివాసగొర్లవారిపాలేనికి చెందిన శాఖమూరి గోపీకృష్ణ, కీర్తిపాములు, కుంచనపల్లికి చెందిన దాసరి వీరయ్య అలియాస్ చుక్కపల్లి వీరయ్యను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. పోలీసులను ఆశ్రయించిన హతుడు సెప్టెంబరు 25న వివాహం జరిగిన తరువాత వీరాంజనేయదేవి కుటుంబ సభ్యుల నుంచి ప్రాణ హాని ఉందని కుర్రా నాగ గణేష్ ఆమెతో కలిసి నల్లపాడు పోలీసులను ఆశ్రయించాడు. అప్పటికే పలుమార్లు గణేష్‌ను చంపుతామంటూ ప్రధాన నిందితుడు దుర్గారావు బెదిరింపులకు పాల్పడిన పరిస్థితులున్నాయి. నాగ గణేష్, స్నేహితుడు సంగుల కరుణతో కలిసి ఈనెల 7న ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయానికి వచ్చి తిరిగి వెళుతున్నాడు. ఈ క్రమంలో పొన్నూరు రోడ్డులోని ఎం. కన్వెన్షన్ పంక్షన్ హాలు సమీపంలో దుర్గారావు ఇద్దరు వ్యక్తులతో వచ్చి మృతుడిని విచక్షణారహితంగా పొడిచి అక్కడి నుంచి పరారయ్యాడు. పక్కనే ఉన్న స్నేహితుడు గణేష్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లే సరికి అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈనెల 15న రాత్రి తొమ్మిది గంటల సమయంలో గుంటూరు రూరల్ మండలం అడవితక్కెళ్లపాడు పంచాయతీ గొర్లవారిపాలెం వెళ్లే రోడ్డులో నిందితులు ఉన్నట్లు పక్కా సమాచారం అందుకున్న పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. ఇదే కేసులో ఏ–8గా పేర్కొన్న దాసరి వీరయ్య హత్యకు కుట్ర చేసి ప్రొత్సహించిన నేపథ్యంలో అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. నిందితుల నుంచి హత్యకు వినియోగించిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. దాసరి వీరయ్యకు రిమాండ్ గుంటూరు లీగల్: హత్య కేసులో దాసరి వీరయ్య అలియాస్ చుక్కపల్లి వీరయ్యను రిమాండ్‌కు పంపుతూ ఆరవ అదనపు జూనియర్ సివిల్ కోర్టు జడ్జి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. బుడంపాడు గ్రామానికి చెందిన కుర్రా నాగ గణేష్ హత్య కేసులో వీరయ్య ప్రమేయం ఉందంటూ నేరారోపణ ఉన్న క్రమంలో 8వ ముద్దాయిగా గుర్తిస్తూ పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో కోర్టులో వాద ప్రతివాదనల అనంతరం వీరయ్యకు 14 రోజుల వరకు రిమాండ్ విధించారు. ఆయన్ను పోలీసులు జిల్లా జైలుకు తరలించారు. -
వ్యవసాయశాఖ కమిషనర్‌కు అభినందనలు
కొరిటెపాడు(గుంటూరు): వ్యవసాయ శాఖ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ మనజీర్ జిలానీ సమూన్‌ను గుంటూరు చుట్టుగుంటలోని కార్యాలయంలో ఏపీ ఫర్టిలైజర్స్, ఫెస్టిసైడ్స్ అండ్ సీడ్ డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు వజ్రాల వెంకట నాగిరెడ్డి, అసోసియేషన్ నాయకులు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం, మెమెంటో అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నాగిరెడ్డి.. ప్రస్తుత పరిస్థితుల్లో డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యలు, ఎరువుల లభ్యత గురించి కమిషనర్‌కు వివరించారు. రబీ సీజన్లో రైతులకు ఇబ్బంది లేకుండా ముందస్తుగా ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచినట్లు కమిషనర్ జిలానీ సమూన్ తెలిపారు. డీలర్ల సమస్యల్ని పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర కోశాధికారి కె.విజయకుమార్, ఉపాధ్యక్షులు చక్కా రవికుమార్, భీమవరపు శ్రీనివాసరెడ్డి, కార్యవర్గ సభ్యులు ఆర్.చలపతిరావు, సంజీవరెడ్డి పాల్గొన్నారు. -
శునకాల దాడిలో 15 గొర్రెలు మృతి
బల్లికురవ: మండంలోని కొప్పరపాడులో కుక్కల దాడిలో 15 గొర్రెలు మృతి చెందాయి. బుధవారం అర్ధరాత్రి గ్రామంలోని బీసీ కాలనీలోని షేక్ వలి గొర్రెల దొడ్డిలోకి ప్రవేశించిన శునకాలు వాటిపై దాడి చేసి చంపేశాయి. సుమారు వంద గొర్రెలను మేపుతూ వలి జీవనాన్ని వెళ్లదీస్తున్నాడు. కుక్కల దాడితో 15 చనిపోగా, గాయపడిన వాటిని స్థానిక పశు వైద్యశాలకు తీసుకెళ్లి వైద్యం చేయిస్తున్నారు. కుక్కకాటుకు గురవడంతో బతకడం కష్టమేనని వివరించారు. ప్రభుత్వం ఆదుకోవడంతోపాటు గ్రామంలో కుక్కలకు అడ్డుకట్ట వేయాలన్నారు. స్థానిక వైఎస్సార్ సీపీ నాయకులు బుర్రి ఆదినారాయణ, మూడావత్ దానానాయక్లు చనిపోయిన గొర్రెలను పరిశీలించారు. కుక్కలు ఏడాదిగా పలువుర్ని కరిచాయని ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదన్నారు. తాను రూ.2 లక్షల వరకు నష్టపోయానని వలి తెలిపారు. -
డిసెంబర్ 12 నుంచి క్రెడాయ్ ప్రాపర్టీ షో
నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్): క్రెడాయ్ గుంటూరు చాప్టర్ 8వ ప్రాపర్టీ షో బ్రోచర్ ఆవిష్కరణ గురువారం ఇన్నర్ రింగ్ రోడ్డులోని ఓ కన్వెన్షన్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రెరా చైర్మన్ ఆరే శివారెడ్డి, ఏపీ రెరా మెంబర్ దామచర్ల శ్రీనివాసరావు, ది గుంటూరు కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ బోనబోయిన శ్రీనివాసరావు, క్రెడాయ్ ఏపీ మాజీ చైర్మన్ ఆళ్ల శివారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా శివారెడ్డి మాట్లాడుతూ క్రెడాయ్ గుంటూరు చాప్టర్ వినియోగదారులకు నాణ్యమైన, నమ్మకమైన సేవలు అందించడం అభినందనీయమని తెలిపారు. సామాన్య, మధ్యతరగతి కుటుంబాలు సొంతింటి కలను నెరవేర్చుకోవడానికి ప్రాపర్టీ షోను డిసెంబర్ 12, 13, 14వ తేదీల్లో గుంటూరులో నిర్వహించనున్నట్లు వెల్లడించారు.ఇందులో నాణ్యమైన అపార్ట్మెంట్లు, స్థలాల వివరాలతో పాటు బిల్డింగ్ కన్స్ట్రక్షన్కు సంబంధించిన స్టాల్స్ ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో క్రెడాయ్ ఆంధ్రప్రదేశ్ జాయింట్ సెక్రటరీ, ప్రాపర్టీ షో కన్వీనర్ టి.వినోద్‌రెడ్డి, గుంటూరు చాప్టర్ చైర్మన్ ఆరుమళ్ల సతీష్‌రెడ్డి, ప్రెసిడెంట్ మామిడి రాము, సెక్రటరీ మెట్టు సాంబశివారెడ్డి, ట్రెజరర్ ఏ.వి. నాగార్జునరెడ్డి పాల్గొన్నారు. -
జిల్లా స్థాయి పోటీలకు గురుకుల విద్యార్థులు
వేటపాలెం: స్థానిక మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాల విద్యార్థులు జిల్లా స్థాయి ఆటల పోటీలకు ఎంపికైనట్లు హెచ్ఎ ఎం.నహిద గురువారం తెలిపారు. ఇంకొల్లు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల్లో నిర్వహించిన డివిజన్ స్థాయి ఆటల పోటీల్లో తమ విద్యార్థులు ప్రతిభ చాటారన్నారు. అండర్– 17 విభాగంలో 100 మీటర్లు, 400 మీటర్లు పరుగు పందెంలో కాటం రాజు, 200 మీటర్లలో కిశోర్, కబడ్డీలో కాటంరాజు, చెస్‌లో గోపీకృష్ణ, వాలీబాల్‌లో కిశోర్, 3 కి.మీ., 5 కి.మీ. పరుగు పందెంలో గహత్, శ్రీను ప్రతిభ చాటారన్నారు. అండర్ –14 విభాగంలో 200 మీటర్లు, 400 మీటర్లు, వాలీబాల్‌లో వినయ్‌కుమార్, 400 మీటర్లలో సతీష్‌కుమార్, చెస్‌లో దేవరాజు, ఖోఖోలో చందు ప్రతిభ చూపారని పేర్కొన్నారు. జిల్లా స్థాయి పోటీలకు అర్హత సాధించినట్లు తెలిపారు. విద్యార్థులను పీఈటీ కె. మమత, ఉపాధ్యాయులు అభినందించారు. -
మత్స్యకారులకు నిత్యావసర సరుకులు పంపిణీ
చొరవ చూపించిన మంత్రి నారా లోకేష్ తాడేపల్లి రూరల్: కృష్ణా నదిలో వరదల కారణంగా వల విసరక మత్స్యకారులకు భుక్తి కరువైంది. దయనీయంగా జీవిస్తున్నారని సాక్షిలో అక్టోబర్ 1వ తేదీన కథనం వెలువడింది. దీనికి స్పందించిన మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే, ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ ఆర్థిక సాయంతో గురువారం మత్స్యకారులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తాడేపల్లి పట్టణ టీడీపీ అధ్యక్షుడు వల్లభనేని వెంకటరావు మాట్లాడుతూ గత మూడు నెలల నుంచి గంగ పుత్రులు వేట లేక ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. మంత్రి లోకేష్ సహాయంతో 300 మందికి రెండు వేల రూపాయల చొప్పున నిత్యావసర వస్తువులను అందజేశామని చెప్పారు. కార్యక్రమంలో మత్స్యకార సంఘ నాయకులు, టీడీపీ నేతలు పాల్గొన్నారు. -
ఉచిత వైద్య శిబిరానికి స్పందన
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో గురువారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. సంఘ కార్యాలయంలో డీఆర్వో ఎన్.ఎస్.ఖాజావలి శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం ఆరోగ్య పరీక్షలు చేయించుకొన్నారు. సంఘం చేసే సేవా కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలు నిర్వహించాలని, దానికి సహకారం అందిస్తానని తెలిపారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు సీహెచ్.వెంకటేశ్వర్లు, కార్యదర్శి కె.లూర్థురెడ్డి, ట్రెజరర్ పి. నాగరాజు, రాష్ట్ర కార్యదర్శి సంపత్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షుడు ఎ. సుబ్బారావు, ఎం.ఎస్.నాగేంద్రం, కె.మురళి, సంయుక్త కార్యదర్శులు ఐ. సాయిబాబు, పెద మస్తాన్‌తో పాటు కార్యవర్గ సభ్యులు, సభ్యులు పాల్గొన్నారు. డాక్టర్ రామలింగారెడ్డి కంటి హాస్పిటల్, కాస్వి డెంటల్ క్లినిక్ వైద్యులు పరీక్షలు చేసి సభ్యులకు పలు ఆరోగ్య సూచనలు చేశారు. సందేహాలను నివృత్తి చేశారు. -
షార్ట్ హ్యాండ్ పరీక్షల షెడ్యూల్ విడుదల
గుంటూరు ఎడ్యుకేషన్: రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ ఆధ్వర్యంలో వచ్చే ఏడాది జనవరి 4న షార్ట్ హ్యాండ్, జనవరి 25,26వ తేదీల్లో టైప్ రైటింగ్ పరీక్షలు నిర్వహించేందుకు షెడ్యూల్ విడుదలైనట్లు ఆల్ ప్రిన్సిపాల్స్ టెక్నికల్ కంప్యూటర్ ఇనిస్టిట్యూట్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు టీవీఎస్ ప్రకాష్‌బాబు గురువారం తెలిపారు. ఆయా పరీక్షలకు హాజరుకాబోయే అభ్యర్థులు సమీపంలోని టైప్ ఇనిస్టిట్యూట్స్‌లో సంప్రదించాలని ఆయన సూచించారు. గంజాయి స్వాధీనం పెదకాకాని: నగర శివారులోని బసవతారక రామనగర్ సమీపంలో ఇద్దరు గంజాయి తాగుతుండగా టాస్క్‌పోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 250 గ్రాములు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను ఎర్ల వెంకటచిన్న, గుంజి మోహన్‌లుగా గుర్తించారు. ప్రాథమిక విచారణలో వారికి విక్రమ్ అనే వ్యక్తి సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గురువారం సీఐ టి.పి. నారాయణస్వామి తెలిపారు. రైలులో 4.4 కిలోలు.. తెనాలి రూరల్: రైలులో తరలిస్తున్న గంజాయిని తెనాలి జీఆర్పీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. టాటా నగర్ నుంచి ఎర్నాకులం వెళ్లే రైలులో గంజాయి తరలిస్తున్నారన్న సమాచారంతో జీఆర్పీ ఎస్ఐ జి. వెంకటాద్రిబాబు, సిబ్బంది అప్రమత్తమయ్యారు. రైలు గురువారం తెనాలి చేరుకోగానే బోగీల్లో తనిఖీలు చేపట్టారు. ఎస్–3 బోగీలోని ఓ బ్యాగులో 4.4 కిలోల గంజాయిని గుర్తించి సీజ్ చేశారు. వెంటనే తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణకు సమాచారమందించి, ఆయన సమక్షంలో సీజ్ చేశారు. గంజాయి తరలిస్తున్న వ్యక్తి పరారయ్యాడని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. 19న ‘మట్టి రంగు’ పుస్తకావిష్కరణ బాపట్ల: ప్రముఖ కవయిత్రి చిల్లర భవానీదేవి రచించిన ‘మట్టి రంగు’ కవితా సంపుటి ఆవిష్కరణ ఈ నెల 19వ తేదీ సాయంత్రం 6 గంటలకు స్థానిక హోటల్ గౌతం వేదిక హాలులో జరగనుంది. ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం ఆధ్వర్యంలో కార్యక్రమం ఉంటుందని బాపట్ల జిల్లా రచయితల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు తిమ్మన శ్యామ్ సుందర్ తెలిపారు. రచయిత పాపినేని శివశంకర్ ముఖ్యఅతిథిగా పాల్గొంటారని పేర్కొన్నారు. రచయిత్రి వెలువోలు నాగరాజ్యలక్ష్మి సభాధ్యక్షత , సాహితీ విమర్శకులు బీరం సుందరరావు పుస్తక పరిచయాన్ని చేస్తారని తెలిపారు. ఆత్మీయ అతిథిగా ఫోరం ఫర్ బెటర్ కార్యదర్శి డా. పి.సి. సాయిబాబు పాల్గొననున్నట్లు ఆయన వివరించారు. ఈ సందర్భంగా కోటంరాజు సత్యనారాయణ శర్మ దంపతుల స్మారక సాహితీ పురస్కారాన్ని డా. అప్పాజోస్యుల సత్యనారాయణకు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. -
రైలు ఎక్కితే రక్షణ కరువు
దాచేపల్లి : రైలు ప్రయాణికులకు భద్రత కరువైంది. ఇటీవల జరిగిన వరుస ఘటనలతో గుండెళ్లో రైళ్లు పరుగెత్తుతున్నాయి. ఇటీవల ప్రయాణికుల నుంచి దుండగులు బంగారం, నగదు దోచుకున్న ఘటనలు భారీగా జరిగాయి. తాజాగా సంత్రగాచి స్పెషల్ రైలులో ప్రయాణిస్తున్న మహిళపై గుర్తు తెలియని వ్యక్తి అత్యాచారానికి పాల్పడటం తీవ్ర సంచలనంగా మారింది. రైలు ప్రయాణికుల్ని కలవరపాటుకు గురి చేసింది. ఏపీకి చెందిన ఓ మహిళా ప్రయాణికురాలు(35) సోమవారం రాజమహేంద్రవరం స్టేషన్లో చర్లపల్లి వెళ్లేందుకు సంత్రగాచి ప్రత్యేక రైలు ఎక్కింది. ఆమె అక్కడ ఇళ్లల్లో పని చేసుకుని జీవించేందుకు వెళుతోంది. రైలు గుంటూరు స్టేషన్‌కి చేరుకున్న తరువాత మహిళా బోగీలో ఉన్న ప్రయాణికులంతా దిగి పోయారు. ఆమె ఒక్కతే మిగిలింది. బోగీలోని 40 ఏళ్ల వయస్సున్న గుర్తు తెలియని వ్యక్తి ఎక్కేందుకు ప్రయత్నించగా ఆమె ఒప్పుకోలేదు. బలవంతంగా ఎక్కాడు. గుంటూరు రైల్వేస్టేషన్ నుంచి బయలుదేరిన 20 నిమిషాల తరువాత బోగీ తలుపులు మూసివేశారు. ఒంటరిగా ఉన్న మహిళ ప్రయాణికురాలిని కత్తితో బెదిరించి, బలవంతంగా ఆత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె వద్ద ఉన్న రూ. 5,600తో పాటు సెల్‌ఫోన్, హ్యాండ్‌బ్యాగ్ లాక్కొని దాడి చేసి, పెదకూరపాడు చేరుతుండగా కిందకు దిగి పారిపోయాడు. రైలు మంగళవారం చర్లపల్లి స్టేషన్‌కు చేరుకున్న తరువాత బాధితురాలు సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. తర్వాత నడికుడి జీఆర్పీ పోలీసులకు బదిలీ చేశారు. ఇటీవల నడికుడి, తుమ్మలచెరువు, పిడుగురాళ్ల, బెల్లంకొండ స్టేషన్ల పరిధిలో రైళ్లల్లో ప్రయాణికులను బెదిరించి బంగారం, నగదును దుండగులు దోచుకున్నారు. ఆగంతకులు రైళ్లను ఆపి పారిపోవడం ఆ శాఖకు సవాల్‌గా మారింది. ప్రయాణికుల గుండెల్లో రైళ్లు పెరుగుతున్న దోపిడీలు, దొంగతనాలు తాజాగా ప్రయాణికురాలిపై అత్యాచారం సికింద్రాబాద్‌లో కేసు నమోదు చేసి నడికుడికి బదిలీ జీఆర్పీ, ఆర్పీఎఫ్ల్లో సిబ్బంది కొరత రైల్వే ఆస్తులు, ప్రయాణికుల భద్రత కోసం ఏర్పాటైన జీఆర్పీ, ఆర్పీఎఫ్ల్లో సిబ్బంది కొరతతో ప్రయాణికులకు సరియైన భద్రత కల్పించటం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. గుంటూరు రైల్వే డివిజన్లో రెండో అతి పెద్ద స్టేషన్ అయిన నడికుడి రైల్వే జంక్షన్లో ఉన్న ఆర్పీఎఫ్ కార్యాలయాన్ని పిడుగురాళ్లకు తరలించారు. నడికుడి స్టేషన్‌లోని జీఆర్పీ కార్యాలయంలో ఎస్ఐగా నరసరావుపేట స్టేషన్లో పని చేస్తున్న అధికారి ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. స్టేషన్లలో, రైళ్లలో సరిపడా సిబ్బంది లేకపోవడం వల్ల దుండగులు యథేచ్ఛగా దోపిడీలకు పాల్పడుతున్నారు. -
కోనేరులోకి దూకి మహిళ ఆత్మహత్య
మంగళగిరి టౌన్: స్థానిక శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి చెందిన పెద కోనేరులోకి దూకి ఓ మహిళ ఆత్మహత్యచేసుకున్న ఘటన మంగళగిరి నగరంలో గురువారం చోటుచేసుకుంది. సేకరించిన వివరాల మేరకు... మంగళగిరి నగర పరిధిలోని గండాలయ్యపేటకు చెందిన చలంచలం కామాక్షి (29) తల్లి ధనలక్ష్మితో కలసి జీవిస్తోంది. కొన్నేళ్ల కిందట అనారోగ్యంతో భర్తతో పాటు పిల్లలు కూడా చనిపోయారు. పలు ఆలయాల వద్ద భిక్షాటన చేసుకుంటూ తల్లీకూతుళ్లు జీవనం సాగిస్తున్నారు. కామాక్షి కొంతకాలంగా విపరీతమైన కడుపు నొప్పితో బాధపడుతోందని, మానసిక ఆరోగ్య పరిస్థితి కూడా సరిగా లేదని తల్లి ధనలక్ష్మి పేర్కొంది. గురువారం మధ్యాహ్నం కోనేరు వద్దకు వెళ్లి ప్రహరీ ఎక్కి కోనేటిలోకి దూకేసింది. సమీపంలో కొందరు చూసి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న మంగళగిరి పట్టణ పోలీసులు సమీపంలోని సీసీ కెమెరా పుటేజ్‌ను పరిశీలించారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో వారు వచ్చి కామాక్షి మృతదేహాన్ని వెలికి తీశారు. సంఘటనపై పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మంగళగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉండగా కోనేరు చుట్టూ ఫెన్సింగ్ ఉంటే ఇలాంటి ఘటనలు జరగకుండా ఉంటాయని స్థానికులు తెలిపారు. కోనేరుకు మూడు పక్కలా ఫెన్సింగ్ ఉందని, దక్షిణం వైపు మాత్రం లేకపోవడం వల్లే ఈ ఘటనకు కారణమని వ్యాఖ్యానిస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా దక్షిణం వైపు కూడా ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు. -
పత్తిలో పూత రాలడాన్ని నివారించాలి
కేంద్రీయ సస్య రక్షణ కేంద్రం ప్లాంట్ ప్రొటెక్షన్ అధికారి కె. వీరయ్య చౌదరి ప్రత్తిపాడు: పత్తిలో పూత రాలడాన్ని నివారించే దిశగా రైతులు చర్యలు తీసుకోవాలని కేంద్రీయ సస్య రక్షణ కేంద్రం ప్లాంట్ ప్రొటెక్షన్ అధికారి కె. వీరయ్య చౌదరి సూచించారు. మండల పరిధిలోని పెదగొట్టిపాడులో గురువారం ఓ పత్తి పొలంలో పొలంబడి నిర్వహించారు. స్థానిక మండల వ్యవసాయాధికారి షేక్ సుగుణా బేగంతో కలిసి వీరయ్య చౌదరి పత్తి పంటను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన అధిక తేమ కారణంగా పత్తిలో పూత రాలడంతో పాటు పలు తెగుళ్లు, పురుగులను గమనించారు. నివారణకు తీసుకోవలసిన చర్యలను రైతులకు వివరించారు. పూత రాలడాన్ని నివారించేందుకు ఎకరానికి కేజీ 19–19–19 లేదా 13–0–45 పిచికారీ చేయాలని సూచించారు. పంటలో అక్కడక్కడా పచ్చ దోమ కూడా ఉందని, నివారణకు ఫిప్రోనిల్ 2 ఎం.ఎల్. లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.4 ఎం.ఎల్. లేదా ఎసిటామిప్రిడ్ 0.2 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలని తెలిపారు. అల్లిక రెక్కల పురుగు వంటి మిత్ర పురుగులను కూడా అధికంగా గమనించామని, ప్రస్తుత పరిస్థితుల్లో పురుగు మందులను ఎక్కువగా వాడనవసరం లేదని సూచించారు. అధిక వర్షాలకు సోకుతున్న ఆకుమచ్చ తెగులు నివారణకు ఒక గ్రాము స్టెప్టోసైక్లిన్, కాపర్ ఆక్సి క్లోరైడ్ 30 గ్రాములు పది లీటర్ల నీటికి కలిపి రెండు లేదా మూడుసార్లు పిచికారీ చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో వీహెచ్ఏ షణ్ముఖ్, రైతులు పాల్గొన్నారు. -
30 మంది పోలీసులు ఇంట్లోంచి లాక్కెళ్లారు
పట్నంబజారు (గుంటూరు ఈస్ట్): బెల్టుషాపుల గురించి ప్రశ్నించటమే నేరంగా భావించిన కూటమి ప్రభుత్వం వైఎస్సార్సీపీ నేతను అక్రమంగా అరెస్టు చేసింది. గుంటూరు జిల్లా దుగ్గిరాల జెడ్పీటీసీ సభ్యురాలు మేకతోటి అరుణ భర్త, వైఎస్సార్సీపీ నాయకుడు దాసరి వీరయ్యను 30 మంది పోలీసులు కుంచనపల్లిలోని వారి ఇంట్లోకి బుధవారం అర్ధరాత్రి అక్రమంగా చొరబడి అరెస్టు చేశారు. గుంటూరులోని పాతగుంటూరు పోలీసు స్టేషన్‌కు తీసుకొచ్చిన వీరయ్యను పోలీసులు గురువారం కోర్టులో హాజరుపరిచారు.న్యాయాధికారి 14 రోజుల రిమాండ్ విధించడంతో వీరయ్యను రేపల్లె జైలుకు తరలించారు. పోలీస్ స్టేషన్లో వీరయ్యను ఎవరితోను మాట్లాడనీయలేదని, కుటుంబసభ్యులను కూడా కలవనీయలేదని తెలిసింది. తాను బెల్టుషాపులు, నియోజకవర్గంలో ఉన్న సమస్యలపై స్థానిక ఎమ్మెల్యే కాబట్టి లోకేశ్‌కు లేఖరాశానని, దీంతో ఆయన కక్షపూరితంగా వ్యవహరించి తన భర్తను హత్యకేసులో ఇరికించి అరెస్టు చేయించారని అరుణ ఆరోపించారు. పాతగుంటూరు పోలీస్ స్టేషన్ వద్ద గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు.ఇటీవల గుంటూరు నగరంలోని పొన్నూరు రోడ్డులో జరిగిన కుర్రా నాగగణేష్ హత్యకేసులో తన భర్త వీరయ్య ప్రమేయం ఉందంటూ బుధవారం అర్ధరాత్రి 12 సమయంలో సుమారు 30 మంది పోలీసులు కుంచనపల్లిలోని వారి ఇంట్లోకి వచ్చి సోదా చేశారని తెలిపారు. వచ్చినవారు తాడేపల్లి పోలీసులమని చెప్పారని, తన భర్తను దుస్తులు కూడా వేసుకోనీయకుండా హడావుడిగా తీసుకెళ్లారని చెప్పారు. తన భర్తకు షుగర్ ఉందని, కనీసం బిళ్లలు ఇస్తున్నా కూడా ఆయన్ని తీసుకోనీయలేదని తెలిపారు.ఏ కేసులో తీసుకెళుతున్నారని ప్రశ్నించినా సమాధానం చెప్పకుండా స్టేషన్‌కు రావాలంటూ బలవంతంగా లాక్కెళ్లారన్నారు. తన భర్త ఫోన్‌తోపాటు తన ఫోన్‌ను కూడా దౌర్జన్యంగా తీసుకెళ్లారని చెప్పారు. హత్యకేసులో తన భర్త ప్రమేయం ఉంటే ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే తన భర్తను అన్యాయంగా హత్యకేసులో నిందితుడిగా చేర్చిందని ఆరోపించారు. తన భర్తను తీసుకెళ్లిన తరువాత అర్ధరాత్రి పూట ఒంటరిగా తాడేపల్లి పోలీసు స్టేషన్‌కు వెళ్లానన్నారు. తాము తీసుకురాలేదని చెప్పిన పోలీసులు ఉదయాన్నే రమ్మంటూ ఇష్టానుసారం మాట్లాడారని ఆరోపించారు. లోకేశ్‌కు లేఖ రాసినందుకే.. మంగళగిరి నియోజకవర్గంలో మద్యం బెల్ట్‌షాపులు నడుస్తున్నాయని ఈ నెల 10వ తేదీన మంత్రి లోకేశ్‌కు లేఖ రాసినట్లు అరుణ చెప్పారు. ఎక్కడెక్కడ బెల్ట్‌షాపులు ఉన్నాయో వివరిస్తూ వీటిపై చర్యలు తీసుకోవాలని కోరానన్నారు. ఈ క్రమంలో జరిగిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో బెల్ట్‌షాపుల అంశాన్ని ప్రస్తావించి ఏం చేస్తున్నారంటూ అధికారుల్ని ప్రశ్నించినట్లు తెలిపారు.ఆ తరువాత ఐదురోజుల్లోనే తన భర్త వీరయ్యను హత్యకేసులో నిందితుడిగా పేర్కొంటూ అరెస్ట్ చేశారని చెప్పారు. బెల్టుషాపులు, నియోజకవర్గంలో ఉన్న సమస్యలపై స్థానిక ఎమ్మెల్యే కాబట్టి లోకేశ్‌కు లేఖరాశానని, దీంతో ఆయన కక్షపూరితంగా వ్యవహరించి తన భర్తను హత్యకేసులో నిందితుడిగా పెట్టించారని ఆరోపించారు. గుంటూరులో జరిగిన హత్యకు తన భర్తకు సంబంధం ఏమిటని ప్రశ్నించారు. తన భర్తకు ఏం జరిగినా కూటమి ప్రభుత్వం, మంత్రి లోకేశ్ బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆమె హెచ్చరించారు. -
అందుకే పవన్ కల్యాణ్ నోరు మెదపడం లేదు: పోతిన మహేష్
సాక్షి, తాడేపల్లి: నకిలీ మద్యం వెనుక ప్రభుత్వ పెద్దల కుట్ర ఉందని.. వారి కనుసన్నల్లోనే పెద్ద ఎత్తున వ్యాపారం జరుగుతోందని వైఎస్సార్సీపీ నేత పోతిన మహేష్ అన్నారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఈ నకిలీ మద్యంలో పవన్ కళ్యాణ్‌కీ భాగస్వామ్యం ఉందని.. అందుకే ఆయన దీనిపై నోరు మెదపటం లేదన్నారు. ప్రజల ప్రాణాలు పోతున్నా పవన్‌కు కనపడటం లేదా? అంటూ పోతిన మహేష్ నిలదీశారు.‘‘కొత్తగా తెచ్చిన క్యూ ఆర్ కోడ్ కంటితుడుపు చర్య మాత్రమే. రాష్ట్రంలో వైన్ షాపులన్నీ టీడీపీ నేతలవే. వారందరికీ నకిలీ మద్యంలో ప్రమేయం ఉంది. అలాంటప్పుడు క్యూ ఆర్ కోడ్ వలన ఏం ప్రయోజనం ఉంటుంది?. అసలు క్యూ ఆర్ కోడ్ పెట్టటం అంటే రాష్ట్రంలో నకిలీ మద్యం విక్రయిస్తున్నట్టు చంద్రబాబు అంగీకరించినట్టే.. అందుకే ఇప్పుడు వైన్ షాపుల్లో క్యూ ఆర్ కోడ్ అమలు చేస్తున్నారు. నకిలీ మద్యంతో చంద్రబాబు ప్రభుత్వం ప్రజల ప్రాణాలను తీస్తోంది, వేల కోట్ల రూపాయలు దోపిడీకి టీడీపీ పెద్దలు ప్లాన్ చేశారు. నకిలీ మద్యాన్ని నియంత్రిస్తామని ప్రభుత్వ పెద్దలు ఎందుకు చెప్పటం లేదు?’’ అంటూ పోతిన మహేష్ ప్రశ్నించారు.‘‘ప్రజలను మభ్య పెట్టటానికే క్యూ ఆర్ కోడ్ ప్రకటన చేశారు. స్మార్ట్ ఫోన్లు పేద ప్రజలందరి దగ్గర ఎలా ఉంటాయి?. వారు నకిలీ మద్యాన్ని ఎలా గుర్తిస్తారు?. బెల్టు షాపులు, పర్మిట్ రూములు పెట్టి గత 16 నెలలుగా దోపిడీ చేశారు. ఈ పర్మిట్ రూములలో పెగ్గుతో పాటు, ఫుడ్, బెడ్‌కి కూడా అవకాశం కల్పించారు. నకిలీ మద్యాన్ని ప్రోత్సాహించటానికే పర్మిట్ రూములకు అవకాశం ఇచ్చారా?. లూజుగా మద్యం విక్రయిస్తే అది నకిలీదో మంచిదే ఎలా తెలుస్తుంది?. వైఎస్సార్సీపీ హయాంలో మద్యం షాపులన్నీ ప్రభుత్వ ఆదీనంలో నడిచాయి. ప్రతి బాటిల్ మీద క్యూఆర్ కోడ్ ఉంది. డిస్టలరీస్ నుండి షాపుల వరకు అన్ని పాయింట్లలోనూ చెకింగ్ జరిగేది. అందువలన ఎక్కడా నకిలీ మద్యానికి ఆస్కారం లేదు..ఇప్పుడు టీడీపీ పెద్దల ఆధ్వర్యంలో నకిలీ మద్యం ఏరులై పారుతోంది. ములకలచెరువు, అనకాపల్లి, ఏలూరులో భారీగా నకిలీ డంపులు బయట పడ్డాయి. ఇంత జరిగినా వైన్ షాపులలో ఎందుకు తనిఖీలు చేయట్లేదు?. రాష్ట్ర ప్రజలందరికీ ఏపీలో నకిలీ మద్యం విక్రయిస్తున్నారని అర్థం అయింది. పవన్ కళ్యాణ్ ఈ నకిలీ మద్యంపై ఎందుకు మాట్లాడటం లేదు?. అనేక మంది చనిపోతున్నా ఎందుకు పట్టించుకోవటం లేదు?. పవన్‌కు కూడా నకిలీ మద్యంలో భాగస్వామ్యం ఉంది. అందుకే ఆయన మాట్లాడటం లేదు’’ అంటూ పోతిన మహేష్ దుయ్యబట్టారు. -
ఆర్మీ మేజర్‌కు ఘన నివాళి
లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్): డాక్టర్ స్వామినాథన్ సిఫారసుల ప్రకారం క్వింటా పత్తికి రూ.10,073 ధర నిర్ణయించి కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య, గుంటూరు జిల్లా కౌలు రైతుల సంఘం ప్రధాన కార్యదర్శి పి.వి. జగనాదం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గుంటూరు కొత్తపేటలోని సీపీఐ జిల్లా కార్యాలయంలోని మల్లయ్య లింగంభవన్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ పత్తి కొనుగోలులో వ్యాపారస్తులు సిండికేట్‌గా మారి కేంద్రం ప్రకటించిన మద్దతు ధర కూడా దక్కనివ్వడం లేదన్నారు. క్వింటా పత్తిని రూ.5 వేలలోపునకు కొనుగోలు చేసి రైతుల శ్రమను దోచుకుంటున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని కనీస మద్దతు ధర రూ.7,710 ప్రకారమైనా కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. తండ్రి మందలించాడని.. ఇంటి నుంచి వెళ్లిపోయిన కొడుకు కారంచేడు: తండ్రి మందలించినందుకు కొడుకు అలిగి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. బంధువులు, స్నేహితుల వద్ద విచారించినా కనపడకపోవడంతో పోలీసులకు బుధవారం తండ్రి ఫిర్యాదు చేశాడు. కారంచేడు ఎస్ఐ షేక్ ఖాదర్‌బాషా తెలిపిన వివరాలు.. మండలంలోని తిమిడెదపాడు గ్రామానికి చెందిన తమ్మల ప్రసాద్‌కు ముగ్గురు సంతానం కాగా ఇద్దరికి వివాహాలు చేశాడు. మూడో కుమారుడైన జయప్రకాశ్ ఈనెల 14వ తేదీ ఉదయం 10 గంటల నుంచి కనిపించకుండా పోయాడు. ఐటీఐ పూర్తి చేసిన జయప్రకాశ్ కొన్ని రోజులు హైదరాబాద్‌లో ఉండి ఉద్యోగం చేశాడు. తనకు బెంగగా ఉందని ఇంటికి రమ్మని తండ్రి కోరడంతో తిరిగి ఇంటికి వచ్చాడు. అయితే వచ్చిన దగ్గర నుంచి ఏ పనికీ వెళ్లకుండా ఇంటి వద్దనే ఉండటంతో తండ్రి మందలించి పనులు చేసుకోవాలని సూచించాడు. దీంతో అతను అలిగి పారిపోయాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రైవేటు ఆసుపత్రి ఖర్చులు భరించలేం
నా భార్యకు నెల రోజుల కిందట శరీరంపై గడ్డ వచ్చింది. ప్రభుత్వాసుపత్రికి వెళితే పట్టించుకోవడం లేదని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లా. ఆపరేషన్ చేసి గడ్డను తొలగించారు. ప్రస్తుతం పరిశీలనలో ఉన్నాం. వేలకు వేలు ఖర్చవుతున్నాయి. జ్వరం రెండు రోజలు తగ్గుతుంది.. మరలా వస్తోంది. డాక్టర్లే ఇది అప్పుడే తగ్గదు టైం పడుతుంది అంటున్నారు. ప్రైవేటు ఆసుపత్రి ఖర్చులు భరించలేక పోతున్నారు. ప్రభుత్వం పట్టించుకోక పోడంతో మా గ్రామస్తులు చనిపోయారు. – నక్కా నాగేశ్వరరావు గ్రామస్తుడు -
ముమ్మాటికీ కూటమి హత్యలే !
గుంటూరు రూరల్: తురకపాలెంలో మరణాలన్నీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే జరిగాయని వైఎస్సార్ సీపీ నేతలు ఆరోపించారు. ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలేనని ధ్వజమెత్తారు. రూరల్ మండలంలోని తురకపాలెం గ్రామాన్ని బుధవారం వైఎస్సార్ సీపీ నేతలు సందర్శించారు. అంతుచిక్కని వ్యాధితో అకాల మరణాలకు గురైన బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఇంకా జ్వరం, శరీరంపై గడ్డలతో బాధపడుతున్న బాధితుల ఇళ్లకు వెళ్లి మనోధైర్యాన్ని కల్పించారు. వైఎస్సార్ సీపీ నేతలతో పాటు వైద్యుల బృందం బాధితుల రిపోర్టులు పరిశీలించి వైద్య సలహాలను అందించింది. గ్రామస్తులను పలకరించి వారి సమస్యలు, సంఘటనలు జరిగిన తీరును నాయకులు తెలుసుకున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంపై ఆగ్రహం కూటమి ప్రభుత్వం వెంటనే మృతుల కుటుంబాలకు కోటి రూపాయల ఆర్థిక సాయం అందించాలని, నిర్లక్ష్యాన్ని విడనాడాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ సీపీ నేతలు నినాదాలు చేశారు. గ్రామస్తులను సామాజిక బహిష్కరణ చేయడం సబబుకాదని నినాదాలు చేశారు. -
లలిత సంగీత సరస్వతి
తెనాలి: బాలసరస్వతి స్వస్థలం ఉమ్మడి తెనాలి డివిజనులోని బాపట్ల. 1928 ఆగస్టు 28న జన్మించారు. తల్లిదండ్రులు విశాలాక్షి, పార్థసారథిరావు. లలిత కళలపై అభిమానం కలిగిన తండ్రి సితార, వీణ వాయించేవారు. గుంటూరులో రత్నా థియేటర్ పేరుతో సినిమాహాలు నిర్మించారు. థియేటరులో ప్రదర్శించే ఏదైనా సినిమాలో సంగీతానికి తగినంత ప్రాధాన్యం లేదని అనిపిస్తే, వెంటనే ఆ సినిమా ప్రదర్శన నిలిపివేసి, అందుబాటులో ఉన్న నాటక సమాజాన్ని పిలిపించి, పద్యనాటకం వేయించారు. అంతటి సంగీతాభిమాని ఆయన. కాలక్రమంలో వ్యాపారం దెబ్బతిని, థియేటర్ మూతపడింది. తండ్రి వారసత్వం అన్నట్టుగా బాలసరస్వతికి సంగీతంపై ఆసక్తి ఏర్పడింది. అక్క, అన్నయ్య చక్కగా చదువుకుంటున్నా తండ్రితోపాటు నాటకాలు చూడటం, వాటిలోని పాటలు గానం చేయటం అలవాటైంది. అప్పట్లో గుంటూరులో హెచ్ఎంవీ (హిజ్ మాస్టర్స్ వాయిస్) గ్రామఫోను కంపెనీ ఆఫీసుండేది. పార్థసారిథిరావుకు పరిచయస్తులు. ఓసారి బాలసరస్వతిని పిలిపించి, ట్రైనింగ్‌లా పాడమన్నారు. బాగుండటంతో బెంగళూరులో రికార్డు చేశారు. ఆ విధంగా 1934లో ఆరేళ్ల వయసులో సోలో రికార్డు పాడిన ఘనతను బాలసరస్వతి దక్కించుకున్నారు. మైకు అందేంత ఎత్తు లేకపోవటతో సినీనటుడు సత్యం సోదరుడు కామేశ్వరరావు ఎత్తుకోగా, ఆమె ఆ పాట పాడారు. శ్రోతలను ఆకట్టుకునేలా.. అంతకుముందు 1941లో రేణుకావారి ‘భాగ్యలక్ష్మి’ సినిమాలో బీఎన్ఆర్ సంగీత దర్శకత్వంలో పాడిన ‘తిన్నెమీద చిన్నోడా’ పాట బాలసరస్వతి తొలి ప్లేబాక్ పాట. సుతిమెత్తగా, చక్కని భావప్రకటనతో, ప్రత్యేకమైన పాడే విధానంతో శ్రోతలను ఆకట్టుకుని మనసు లోతుల్లోకి ప్రవహించే అమృతధారగా పాటను మార్చుకున్న ప్రతిభాశాలి బాలసరస్వతి. ‘స్వప్నసుందరి’లో కథానాయిక కోసం పాడినా, ‘దేవదాసు’లో ద్వితీయ నాయికకు గానం చేసినా ఆమె తనకు తానే సాటిగా నిలిచారు. సినిమాలకు పాడుతూనే ఎస్.రాజేశ్వరరావు, బాలసరస్వతి కలిసి‘ లలిత సంగీతం’ పేరిట, తెలుగు సంగీత ప్రపంచంలో కొత్త విభాగాన్ని ఆవిష్కరించారు. ఆకాశవాణిలో వీరిద్దరూ పాడే లలిత గీతాలు లక్షల సంఖ్యలో అభిమానులను సంపాదించారు. 1946లో సింహళ చిత్రం ‘లైలా మజ్నూ’కు సంగీతం సమకూర్చారు. తాను సోలోగా పాడిన ప్రైవేటు గీతాలకు స్వయంగా సంగీతబద్దం చేసుకుంటూ వచ్చారు. 1974లో భర్త మరణం, దివాణాలు, వైభవాలు అంతరించటంతో చైన్నె, తర్వాత మైసూరు, బెంగళూరులో ఉంటూ 1995లో హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. భూములు పోయినా నష్టపరిహారం అందలేదు. మైసూరు నుంచి హైదరాబాద్ వస్తే సాంస్కృతిక శాఖలో ఉద్యోగం ఇస్తామన్న ఎన్టీ రామారావు ఆహ్వానంపై ఇక్కడికి వచ్చేసరికి రాకీయాలు మారిపోయాయి. 2015లో గుంటూరులో బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి ఫౌండేషన్ బాలసరస్వతిని విశిష్ట సేవా పురస్కారంతో సత్కరించి రూ.లక్ష నగదు, రజత జ్ఞాపికను బహూకరించారు. ఈ సందర్భంగా ‘నిండుపున్నమి పండువెన్నెల’ పేరుతో అభినందన సంచికను విడుదల చేశారు. తొలి అడుగులు గుంటూరులోనే.. బాలగాయనిగా ఇక్కడి నుంచే సినీప్రస్థానం గతంలో విశిష్ట సేవా పురస్కారంతో సత్కారం ఆ సమయంలో అక్కడే ఉన్న సుప్రసిద్ధ దర్శకుడు సి.పుల్లయ్య, తన ‘సతీఅనసూయ–భక్త ధృవ’ సినిమాలో బాలనటిగా తీసుకున్నారు. అందులో గంగ పాత్రలో నటిస్తూ బాలసరస్వతి పాడిన పాట ‘ఏదీ దారి నాకిచట’ ఆ రోజుల్లో పెద్ద హిట్. కోల్‌కతాలో ఈ షూటింగ్ జరుగుతుండగా, అక్కడే చిత్రీకరిస్తున్న తమిళ చిత్రం ‘భక్తకుచేల’లో రెండు పాత్రలు ఇచ్చారు. మొదటి భాగంలో చిన్న కృష్ణుడు, రెండో భాగంలో కుచేలుని కూతురు పాత్రలో పోషించారు. అందులో పాటలు కూడా తానే పాడారు. తర్వాత ‘బాలయోగిని’ తమిళ సినిమాలో టైటిల్ రోల్ తనదే. అప్పటివరకు సరస్వతిగా ఉన్న ఆమె పేరుకు ముందు ‘బాల’ అని అప్పుడే కలిపారు. తన సినిమాల్లోని పాటలు, బయట కచేరీల్లో పాడుతూ బహుమతులను అందుకుంటూ వచ్చారు. బాలయోగిని సినిమా తర్వాత చైన్నెలో సెటిలయ్యారు. బాలనటిగా ‘తుకారం’ (1937), ‘మహానంద’, ‘తిరునీలంకర్’ (1939) సినిమాల్లో నటించాక, 1940లో ఇందిరా వారి ‘ఇల్లాలు’ సినిమాలో సంగీత దర్శకుడు ఎస్.రాజేశ్వరరావుతో కలిసి నటించారు. వరుసగా సినిమాల్లో నటిస్తుండగానే 1944లో తూర్పుగోదావరి జిల్లా కోలంక జమీందారు రావు ప్రద్యుమ్న కృష్ణ మహీపతి సూర్యారావుతో వివాహమైంది. దీనితో నటనకు స్వస్తిపలికి, పాటలకే పరిమితమయ్యారు. -
రాష్ట్రపతి పదవికి వన్నె తెచ్చిన కలాం
కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియాలక్ష్మీపురం (గుంటూరు వెస్ట్): దేశంలో అత్యున్నతమైన రాష్ట్రపతి పదవికి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వన్నె తెచ్చారని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా కొనియాడారు. కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో బుధవారం కలాం జయంతిని ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా, డీఆర్వో ఎన్ఎస్కే ఖాజావలి, సిబ్బంది ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ‘మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా’గా కీర్తి గడించిన మహనీయులు ఏపీజే అబ్దుల్ కలాం అన్నారు. సామాన్య కుటుంబం నుంచి దేశం గర్వించదగిన శాస్త్రవేత్తగా ఎదిగిన అబ్దుల్ కలాం తన ప్రసంగాలతో యువతలో స్ఫూర్తి నింపారని పేర్కొన్నారు. ఆయన జయంతిని ప్రపంచ విద్యార్థుల దినోత్సవంగా జరుపుకోవడం మనందరికీ గర్వకారణమని తెలిపారు. ఎందరికో ఆదర్శంగా నిలిచిన అబ్దుల్ కలాం సేవలను, ఆశయాలను స్మరించుకుంటూ ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో పూర్ణచంద్రరావు,సెక్షన్ సూపరింటెండెంట్లు మల్లేశ్వరి, కల్యాణి , కలెక్టరేట్ బ్బంది పాల్గొన్నారు. బాపట్ల: రైతు బజార్లో రైతులు పంటలు విక్రయించుకునే విధంగా చర్యలు తీసుకోవాలని మార్కెటింగ్‌శాఖ ఏడీ కారుమూరి రమేష్‌బాబు ఆదేశించారు. స్థానిక రైతు బజార్ని బుధవారం తనిఖీ చేశారు. మౌలిక వసతులను పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. ఆయన వెంట రైతు బజార్ ఎస్టేట్ అధికారి ఘట్రాజు ఫణీంద్ర ఉన్నారు. -
ప్రతిభ పురస్కారాలకు దరఖాస్తులు ఆహ్వానం
బాపట్ల: కాపు సేవా సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులకు అందించనున్న ప్రతిభ పురస్కారాలకు దరఖాస్తు చేసుకోవాలని సంఘం జిల్లా అధ్యక్షులు ఇక్కుర్తి శ్రీనివాసరావు తెలిపారు. స్థానిక అన్నం సతీష్‌ప్రభాకర్ కాపు కళ్యాణ మండపంలో కరపత్రాలను బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఏడాది నిర్వహించే కార్తిక వన సమారాధన సమయంలో అందజేస్తున్న విధంగా నే నవంబరు 16వ తేదీన పురస్కారాలు అందజేయనున్నట్లు చెప్పారు. బాపట్ల నియోజకవర్గానికి సంబంధించిన విద్యార్థులు, ఇంటర్ మొదటి సంవత్సరం నుంచి పై చదువులు చదువుతున్న 60 శాతం మార్కులు మించిన వారు ఈనెల 25వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తుతో పాటు సంబంధిత సర్టిఫికెట్స్, జత చేసి అన్నం సతీష్ ప్రభాకర్ కాపు కళ్యాణ మండపంలో అందజేయాలని సూచించారు. వివరాలకు కె.శ్రీనివాసరావు 9346569982ను సంప్రదించాలని కోరారు. -
అధికారులు స్పందించ లేదు
రెండు నెలల కిందట నాకు జ్వరం వచ్చింది. రెండు రోజులకు తగ్గింది. తరువాత శరీరంపై గడ్డ వచ్చింది. వెంటనే గుంటూరులో ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లా. ఆపరేషన్ చేసి గడ్డను తొలగించారు. ప్రతి రెండు రోజులకు ఒకసారి డ్రస్సింగ్, ఆరు నెలల పాటు పరిశీలనలో ఉండాలని చెప్పారు. గతంలో మా గ్రామానికి బోరు పని చేయకపోవడంతో క్వారీ గుంత నుంచి అందించారు. అప్పటి నుంచి గ్రామంలో ప్రతి రెండు రోజలకు ఒక సంఘటన జరుగుతూనే ఉంది. నాకు చికిత్సలకే రూ. 5 లక్షలు ఖర్చయింది. – మెట్టు నాగిరెడ్డి, గ్రామస్తుడు -
తురకపాలెంలో ‘మరణాలు’ ప్రభుత్వ ‘హత్యలే..’
గుంటూరు రూరల్: తురకపాలెంలో జరిగినవి ప్రభుత్వ హత్యలేనని ఆ గ్రామంలో పర్యటించిన వైఎస్సార్సీపీ నాయకులు విమర్శించారు. అరుదైన వ్యాధితో దాదాపు 46 మంది ప్రాణాలు కోల్పోయిన గుంటూరు రూరల్ మండలం తురకపాలెంలో బుధవారం వైఎస్సార్సీపీ నాయకులు పర్యటించారు. మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు గ్రామంలో పర్యటించిన నాయకులు ఇంటింటికీ వెళ్లి బాధితులను పరామర్శించారు. వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ‘‘అరుదైన మెలియాయిడోసిస్ వ్యాధి కారణంగా గ్రామస్తులు మృతి చెందారని చెబుతున్నప్పటికీ మరణాలకు అసలు కారణాన్ని నేటికి గుర్తించలేకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం. 46 మంది మృతి చెందితే కేవలం 28 మందికే నామమాత్రంగా రూ. 5 లక్షలు పరిహారం ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకోవటం దారుణం. కుటుంబానికి రూ.కోటి ఆర్థిక సహాయం అందించాలి. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ప్రభుత్వమే ఉచిత వైద్యం అందించాలి. గ్రామంలో 24 గంటలు కార్పొరేట్ వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలి. కేవలం క్వారీ నీటిని తాగడం వల్లే ఇంతటి దారుణ పరిస్థితి సంభవించింది. ఏడాదిగా తాగునీరు మురికిగా వస్తోందని చెప్పినా ఎవరూ పట్టించుకోలేదు. ఈ పరిస్థితుల్లో గ్రామాన్ని, గ్రామ ప్రజలను సాంఘిక బహిష్కరణ చేస్తున్నారు. ఇంత జరిగినా ఈ ఆరోగ్య సంక్షోభానికి ప్రభుత్వం పరిష్కారమే చూపడం లేదు. మాజీ ఎంపీ వైఎస్సార్సీపీ కృష్ణా గుంటూరు జిల్లాల పరిశీలకుడు మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, నియోజకవర్గం ఇంచార్జ్ బలసాని కిరణ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్‌రావు, అన్నాబత్తుని శివకుమార్, సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి, గుంటూరు పార్లమెంట్ పరిశీలకులు పోతిన మహేష్, తూర్పు నియోజకవర్గం ఇన్చార్జ్, నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా, మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, డాక్టర్స్ విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ శివభరత్‌రెడ్డి తదితరులు గ్రామంలో పర్యటించిన పార్టీ ప్రతినిధి బృందంలో ఉన్నారు.నెలరోజుల్లో మంచినీటి ప్లాంట్తురకపాలెం దళితవాడలో సురక్షిత మంచినీటి వ్యవస్థ అవసరమని, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి ఫౌండేషన్ నుంచి ఆర్వో ప్లాంట్‌ను నిర్మించి గ్రామానికి నెల రోజుల్లో ప్లాంట్ ఏర్పాటు చేసి మంచినీరు అందిస్తుందని పార్టీ నాయకులు పేర్కొన్నారు. గ్రామంలో తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారం కోసం గుంటూరు నగరం నుంచి పైపులైన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. -
ఏపీలో వైన్స్, బార్లలో క్యూఆర్ కోడ్ విధానం తెస్తూ జీవో జారీ
సాక్షి, విజయవాడ: ఏపీలో మద్యం షాపులు, బార్లలో క్యూఆర్ కోడ్ విధానం తెస్తూ చంద్రబాబు సర్కార్ జీవో జారీ చేసింది. గత వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేసిన విధానం పునరుద్ధరిస్తూ.. ఎక్సైజ్ శాఖ జీవో 376 జారీ చేసింది. ప్రతి మద్యం షాపు, బార్లో క్యూ ఆర్ కోడ్ విధానాన్ని గత ప్రభుత్వం అమలు చేసింది. నకిలీ మద్యానికి వైఎస్ జగన్ ప్రభుత్వం చెక్ పెట్టింది. ఏడాది కిందట క్యూ ఆర్ కోడ్ విధానాన్ని చంద్రబాబు ప్రభుత్వం ఎత్తేసింది. టీడీపీ నేతల చేతుల్లోకి మద్యం షాపులు వెళ్లగానే క్యూ ఆర్ కోడ్ విధానం ఎత్తివేసింది.ఏడాదిగా మద్యం, బార్ షాపుల్లో నకిలీ మద్యానికి ఎక్సైజ్ శాఖ ఆస్కారం కల్పించింది. టీడీపీ నేతల నకిలీ మద్యం దందా బయటపడటంతో తాజాగా జీవో జారీ చేస్తూ.. గత ప్రభుత్వం అమలు చేసిన విధానాన్ని చంద్రబాబు ప్రభుత్వం మళ్లీ తెచ్చింది. మద్యం షాపు, బార్లలో ప్రతి బాటిల్‌ను క్యూ ఆర్ కోడ్ ద్వారా స్కాన్ చేయాలని ఆదేశాల జారీ చేసింది. -
గాయని బాల సరస్వతీ దేవి మృతి పట్ల వైఎస్ జగన్ సంతాపం
సాక్షి, తాడేపల్లి: సినీ నేపథ్య గాయని బాల సరస్వతీ దేవి మృతిపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ‘‘తెలుగు సంగీత ప్రపంచంలో బాల సరస్వతీ దేవి తన అద్భుత గాత్రంతో ప్రత్యేక ముద్ర వేశారు. తొలి సినీ నేపథ్య గాయని రావు బాల సరస్వతీ దేవిగారి మృతి పట్ల సంతాపాన్ని తెలియజేస్తున్నా.. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నా’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.తెలుగులో తొలి మహిళా సింగర్ రావు బాలసరస్వతి దేవి (97) ఇవాళ ఉదయం (అక్టోబర్ 15) హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు. బాలసరస్వతి.. స్వాతంత్ర్యం రాకముందు జన్మించారు. 1928లో పుట్టిన ఆమె ఆరేళ్ల వయసు నుంచే పాటలు పాడటం మొదలుపెట్టారు. మొదటగా రేడియోలో ఆకాశవాణి కార్యక్రమంతో తెలుగువారికి పరిచయమయ్యారు. సతీ అనసూయ (1936) సినిమాలో తొలిసారి పాట పాడారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ భాషల్లోనూ అనేక పాటలు ఆలపించారు. దాదాపు రెండువేలకి పైగా సాంగ్స్ పాడారు. తెలుగు సంగీత ప్రపంచంలో తన అద్భుత గాత్రంతో ప్రత్యేక ముద్ర వేసిన తొలి సినీ నేపథ్య గాయని రావు బాల సరస్వతీ దేవిగారి మృతి పట్ల సంతాపాన్ని తెలియజేస్తున్నా. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నా. pic.twitter.com/2y2lneAY7O— YS Jagan Mohan Reddy (@ysjagan) October 15, 2025 -
వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా అబ్దుల్ కలాం జయంతి
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సెంట్రల్ పార్టీ ఆఫీస్ ఇన్చార్జ్, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి ఆధ్వర్యంలో భారతరత్న ఏపీజే అబ్దుల్ కలాం జయంతిని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ ఆయన దేశానికి చేసిన సేవలను శ్లాఘించారు.విద్య, శాస్త్రసాంకేతిక రంగాల్లో ఆయన చూపించిన బాటలోనే గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అనేక సంస్కరణలను ఆ రంగాల్లో తీసుకువచ్చిందని గుర్తు చేశారు. కడు పేదరికంలో జన్మించి, పట్టుదలతో తాను కోరుకున్న జీవితాన్ని సాధించి, ఈ దేశాన్ని విజ్ఞానపరంగా అత్యున్నత స్థానంలో నిలబెట్టిన అబ్దుల్ కలాం జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయం కావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా ఎవరెవరు ఏం మాట్లాడారంటే..అబ్దుల్ కలాం ఆశయాలను ఆచరణలో చూపిన నేత వైఎస్ జగన్: ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిఒక సామాన్య కుటుంబంలో జన్మించి, పేదరికంను తన పట్టుదల, దీక్షతో జయించిన మహనీయుడు ఏపీజే అబ్దుల్ కలాం. వీధి దీపాల కింద చదువుకుంటూ, తాను చిన్నతనంలో కన్న కలలను సాకారం చేసుకోవడానికి అహర్నిశలు కష్టపడి తన భవిష్యత్తును అందరికీ ఆదర్శప్రాయంగా మార్చి చూపించిన గొప్ప దార్శినికుడు. ఉన్నత చదువులతో ఇంజనీర్‌గా, శాస్త్రవేత్తగా, భారతదేశం గర్వించే గొప్ప కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. దేశ రక్షణ వ్యవస్థకు ఆధునిక శాస్త్ర సాంకేతికతను ఊతంగా అందించి, మిస్సైల్ మ్యాన్‌గా కీర్తిని అందుకున్న గొప్ప వ్యక్తి.ప్రపంచ దేశాల సరసన అణ్వస్త్రదేశంగా భారత్‌ను నిలబెట్టి, ఎటువంటి అంతర్జాతీయ శక్తుల ఒత్తిళ్లకు తలొగ్గం అని చాటిచెప్పడంలో అబ్దుల్ కలాం కృషి మరువలేనిది. ఆయన దేశానికి అందించిన సేవలకు రాష్ట్రపతి వంటి అత్యున్నత పదవి ఆయనను అలంకరించింది. రాష్ట్రపతిగా ఆయన దేశంలో అనేక మార్పులకు శ్రీకారం చుట్టారు. రాష్ట్రపతిగా పదవీకాలం పూర్తి అయిన తరువాత ఒక గురువుగా విద్యార్థులకు జ్ఞానాన్ని అందించాలనే సంకల్పంతో పనిచేశారు.క్రమశిక్షణ, దేశభక్తి, విజయాన్ని సాధించాలనే సంకల్పాన్ని యువతలో పెంపొందించేందుకు ఆయన చేసిన రచనలు కూడా స్పూర్తిదాయకం. అటువంటి మహనీయుల మార్గదర్శకంలో వైయస్ఆర్సీపీ ముందుకు సాగుతూ, సమాజంలో మార్పుకు, అభివృద్దికి పాటుపడుతోంది. అబ్ధుల్ కలాం అందించిన స్పూర్తికి అనుగుణంగానే గత అయిదేళ్ళ పాలనలో ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ విద్య, సాంకేతికరంగాల్లో అనేక సంస్కరణలను తీసుకువచ్చారు. విద్యతోన పేదరికాన్ని నిర్మూలించాలనే ఆశయంలో ఆయన పనిచేశారు.దేశానికి అరుదైన సేవలందించిన మహనీయుడు: ఎమ్మెల్సీ వరుదు కళ్యాణితమిళనాడులోని రామేశ్వరం సమీపంలోని ఒక కుగ్రామంలో 1931లో జన్మించి, ఈ దేశం గర్వంచే భారతరత్న వంటి అత్యున్నత పురస్కారాలను ఏపీజే అబ్దుల్ కలాం అందుకున్నారు. దేశానికి రాష్ట్రపతి వంటి ఉన్నతస్థాయి పదవిని అలంకరించి, ఆ పదవికే వన్నె తెచ్చారు. తన పదవీకాలం పూర్తయిన తరువాత కూడా విద్యార్థులకు స్పూర్తిదాయకంగా నిలవాలని తపించారు. చివరికి ఆయన విద్యార్థులకు బోధనలు చేస్తూనే మరణించారంటే, ఆయన జీవితం ఎంత ఉన్నతమైనదో అర్థం చేసుకోవచ్చు.అటువంటి గొప్ప వ్యక్తి ఈ దేశానికి చేసిన సేవలు మరువలేనివి. అబ్ధుల్ కలాం వంటి మహనీయులు ఇచ్చిన స్పూర్తిని అందుకున్న వైఎస్సార్సీపీ ప్రభుత్వం కూడా సమాజంలో విద్యతోనే మంచి మార్పును సాధించాలనే లక్ష్యంతో పనిచేసింది. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ తన పాలనలో విద్యకు ఉన్న గొప్పతనాన్ని, అబ్దుల్ కలాం వంటి మహనీయులు సమాజానికి చేసిన మార్గదర్శకాలను అనుసరిస్తూ పాలన సాగించాలని తపించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు రమేష్ యాదవ్, పార్టీ ప్రధాన కార్యదర్శులు ఆలూరు సాంబశివరారెడ్డి, షేక్ ఆసీఫ్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్ బాబు, లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్‌రెడ్డి, గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు అంకంరెడ్డి నారాయణ మూర్తి, పబ్లిసిటీ సెల్ అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్, పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి, పార్టీ నాయకులు నారమల్లి పద్మజ, కాకాణి పూజిత, బత్తుల రామారావు, దుర్గారెడ్డి, పానుగంటి చైతన్య, ఎ.రవిచంద్ర, దొడ్డ అంజిరెడ్డి, పుణ్యశీల తదితరులు పాల్గొన్నారు. -
ఫేక్ గాళ్ల కుట్రలు.. లై డిటెక్టర్ టెస్టుకి రెడీ: జోగి రమేష్
సాక్షి, తాడేపల్లి: నకిలీ మద్యం కేసు ప్రధాన నిందితుడు జనార్దన్‌రావుతో తనకు సంబంధాలు ఉన్నట్లు నిరూపిస్తే ఎలాంటి శిక్షకైనా సిద్ధమని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత జోగి రమేష్ సీఎం చంద్రబాబు నాయుడికి సవాల్ విసిరారు. ఈ విషయంలో చిత్తశుద్ధి నిరూపించుకోవాల్సిన విషయం తనకు లేదని.. అయితే తీవ్ర ఆరోపణల నేపథ్యంలో లై డిటెక్టర్ పరీక్షలకు కూడా తాను సిద్ధమని అన్నారాయన. బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. నారావారి సారాను చంద్రబాబు ఏరులై పారిస్తున్నారు. టీడీపీ నేతలు నకిలీ మద్యాన్ని కుటీర పరిశ్రమల్లా నడిపిస్తున్నారు. టీడీపీ నేత జనార్దన్‌రావుతో నేను ఎలాంటి చాటింగ్ చేయలేదు. అది నిరూపిస్తే ఎలాంటి శిక్షకైనా తాను సిద్ధమని జోగి రమేష్ అన్నారు. తిరుమల వెంకన్న, బెజవాడ దుర్గమ్మ మీద కూడా ప్రమాణం చేస్తా. చంద్రబాబు ఇంట్లో కూడా ప్రమాణానికి నేను సిద్ధం. చంద్రబాబు ఆయన కుటుంబ సభ్యులతో ప్రమాణం చేయడానికి వస్తారా?. అవసరమైతే సత్య శోధన పరీక్ష(లై డిటెక్టర్)కు నేను సిద్ధం. నా సవాల్‌ను చంద్రబాబు స్వీకరిస్తారా? అని జోగి రమేష్ నిలదీశారు.నా ఫోన్ ఇస్తా చంద్రబాబు, లోకేష్ చెక్ చేస్కోండి. ఓ గౌడ కులస్థుడి మీద దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు. నీది ఓ బతుకేనా చంద్రబాబు?నా పేరు రిమాండ్ రిపోర్టులో ఉందా?.. ఫేక్ గాళ్లు కుట్రలు చేస్తున్నారు అంటూ మండిపడ్డారాయన.ఇదీ చదవండి: బాబు డైరెక్షన్.. జనార్దన్ యాక్షన్! -
నేడు అబ్దుల్ కలామ్ జయంతి.. వైఎస్ జగన్ నివాళి
సాక్షి, తాడేపల్లి: నేడు దివంగత మాజీ రాష్ట్రపతి, మిస్సైల్ మ్యాన్ అబ్దుల్ కలామ్(Abdul Kalam) జయంతి. ఈ సందర్భంగా అబ్ధుల్ కలామ్‌కు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) నివాళులు అర్పించారు. విజ్ఞానం, వినయంతో దేశానికి సేవ చేసిన మూర్తీభవించిన వ్యక్తి అబ్దుల్ కలామ్ అని కొనియాడారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా.. విజ్ఞానం, వినయంతో దేశానికి సేవ చేసిన మూర్తీభవించిన వ్యక్తి అబ్దుల్ కలామ్. విద్యాశక్తిని నమ్మి, కలలు కనాలి.. వాటిని సాకారం చేసుకోవాలంటూ కొన్ని తరాలకు స్ఫూర్తిని నింపిన వ్యక్తి అబ్దుల్ కలాం. మెరుగైన దేశాన్ని నిర్మించటానికి కృషి చేసిన మిస్సైల్ మ్యాన్‌కు నమస్కారిస్తున్నా అంటూ పోస్టు చేశారు. Remembering Dr. A.P.J. Abdul Kalam , who embodied leadership through knowledge, humility, and service. On his jayanti, I salute the Missile Man who believed in the power of education and inspired a generation to dream and build a better India.#APJAbdulKalam pic.twitter.com/Y8D4253RJi— YS Jagan Mohan Reddy (@ysjagan) October 15, 2025 -
ఎయిడ్స్ నియంత్రణ లక్ష్యాలు సకాలంలో చేరాలి
నరసరావుపేట: జిల్లాలో ఎయిడ్స్ నియంత్రణ కోసం నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో పూర్తిచేయాలని జిల్లా లెప్రసీ, ఎయిడ్స్, టీబీ అధికారి డాక్టర్ యు.మాధవీలత పేర్కొన్నారు. మంగళవారం కార్యాలయం నుంచి ఎయిడ్స్ నియంత్రణ చర్యలపై జిల్లాలోని ఐసీటీసీ, పీపీటీసీటి, ఏఆర్టీ, డీఎస్ఆర్సీ, లింక్ ఏఆర్టీ, టీఐ, ఎన్జీఓఎస్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. డాక్టర్ మాధవీలత మాట్లాడుతూ జిల్లాలో హెచ్ఐవీ, ఎయిడ్స్ నియంత్రణ కోసం పరీక్షలు పెంచాలని, ఏపీ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ జిల్లాకు నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలని అన్నారు. హెచ్ఐవీ నిర్ధారణ జరిగిన ప్రతి ఒక్కరిని ఏఆర్టీకి లింక్ చేయాలని, ఆయా కేంద్రాల ద్వారా హెచ్ఐవీ ఉన్న వారికి మందులు పంపిణీ చేయాలని ఆదేశించారు. అర్హత ఉన్న ప్రతి పేషెంట్‌కు ఏఆర్టీ కేంద్రాల ద్వారా పెన్షన్‌కు దరఖాస్తు చేయాలని, ఆయా కేంద్రాలలో ఎల్ఆఫ్యూ కేసులను కూడా తగ్గించాలని పేర్కొన్నారు. జిల్లాలోని గ్రామాలు, పట్టణాలు, స్కూళ్లు, కళాశాలల్లో విద్యార్థిని, విద్యార్థులకు హెచ్ఐవీ, ఎయిడ్స్, సుఖ వ్యాధులపై విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. క్లస్టర్ ప్రోగ్రామ్ మేనేజర్ జానీబాషా, క్లినికల్ సర్వీస్ ఆఫీసర్ చైతన్య, క్లస్టర్ ప్రివెన్షన్ ఆఫీసర్ కిరణ్, టెక్నికల్ ఎక్స్‌ఫర్ట్ శశిధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జిల్లా లెప్రసీ, ఎయిడ్స్, టీబీ అధికారి డాక్టర్ యు.మాధవీలత -
వైద్యారోగ్యశాఖ పూర్తిగా విఫలం
గుంటూరు మెడికల్: కూటమి అధికారంలోకి వచ్చి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులు రోగాల బారిన పడుతున్నారని మాజీ మంత్రి విడదల రజిని ఆరోపించారు. వైద్యారోగ్య శాఖ పూర్తిగా విఫలమైందని విమర్శించారు. గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న అనపర్రు బీసీ హాస్టల్ విద్యార్థులను మంగళవారం ఆమె పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కురపం హాస్టల్లో ఇద్దరు చనిపోయారని గుర్తుచేశారు. , తాజాగా అనపర్రు హాస్టల్లో 31 మంది అస్వస్థతకు గురై గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారని చెప్పారు. అనపర్రు బీసీ హాస్టల్ వార్డెన్ వేధింపులను తట్టుకోలేక విద్యార్థులు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినా ఎమ్మెల్యే పట్టించుకోకపోవడం దారుణమన్నారు. అలాగే, తురకపాలెంలో పదుల సంఖ్యలో చనిపోయినా ఇప్పటి వరకు కారణాలు నిగ్గుతేల్చలేకపోవడం ప్రభుత్వ వైఫల్యమేనన్నారు. గుంటూరు నగరంలో 200 మందికిపైగా డయేరియాతో జీజీహెచ్‌లో చికిత్స పొందినా పట్టించుకోలేదన్నారు. రాష్ట్రంలో వైద్యారోగ్య శాఖ పనిచేయడం లేదని, అది పూర్తిగా ఫెయిల్ అయిందని అన్నారు. వారం రోజుల్లో హాస్టళ్లకు... సంక్షేమ హాస్టళ్లు నేడు సంక్షోభంలో ఉన్నాయని వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య అన్నారు. జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా హాస్టళ్లలో తాము తనిఖీలు చేశామన్నారు. వారం రోజుల్లో వాటిని పరిష్కరించని పక్షంలో విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో హాస్టల్స్ బాట పడతామని స్పష్టం చేశారు. పరామర్శించిన వారిలో వైఎస్సార్సీపీ నగర అధ్యక్షురాలు షేక్ నూరిఫాతిమా, తాడికొండ నియోజకవర్గ ఇన్చార్జి వనమా బాలవజ్రబాబు, నాయకులు, తదితరులు ఉన్నారు. -
మొబైల్ఫోన్లు బాధితులకు అప్పగింత
నగరంపాలెం: మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న వారికి ఫోన్లను తిరిగి అప్పగించారు. సుమారు రూ.50 లక్షల విలువైన 250 ఫోన్లను మంగళవారం నగరంపాలెంలోని జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో బాధితులకు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అందించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ... ఫోన్లను పొగోట్టుకున్న వెంటనే ఫిర్యాదు చేస్తే సమాచారం దుర్వినియోగం కాదని అన్నారు. ఇప్పటివరకు సుమారు రూ.6.82 కోట్ల విలువైన 3,414 ఫోన్లను బాధితులకు అప్పగించామని చెప్పారు. హెల్ప్ నంబర్ 86888 31574 లేదా సీఈఐఆర్ వెబ్సైట్లో ఫిర్యాదు చేయాలని తెలిపారు. ఐటీ కోర్ సీఐ నిషార్ బాషా, హెచ్‌సీ కిషోర్, కానిస్టేబుళ్లు శ్రీధర్, ఇమామ్‌సాహెబ్, యాసిన్, అరుణ, మానస, సీసీఏస్ హెచ్‌సీ రమేష్, కానిస్టేబుల్ కరీముల్లాలను జిల్లా ఎస్పీ అభినందించారు. -
ఘనంగా ఏపీ ఎస్పీఎఫ్ స్పోర్ట్స్ మీట్ ప్రారంభం
ఏఎన్‌యూ (పెదకాకాని): క్రీడల ద్వారా దేహదారుఢ్యం, ఐకమత్యం పెంపొందుతాయని ఏపీ ఎస్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సీఎం త్రివిక్రమ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రత్యేక రక్షణ దళం (ఏపీ ఎస్పీఎఫ్) రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు మంగళవారం ఏఎన్‌యూలో ఘనంగా ప్రారంభం అయ్యాయి. త్రివిక్రమ్ ఈ పోటీలను ఇన్స్పెక్టర్ జనరల్ బీవీ రామిరెడ్డితో కలసి ప్రారంభించారు. 34వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని పోటీలను నిర్వహిస్తున్నారు. డాక్టర్ త్రివిక్రమ్ మాట్లాడుతూ క్రీడల్లో గెలుపోటముల తేడా లేదని, క్రీడా స్ఫూర్తి గొప్పదన్నారు. ఇన్స్పెక్టర్ జనరల్ బీవీ రామిరెడ్డి మాట్లాడుతూ డైరెక్టర్ జనరల్‌గా త్రివిక్రమ్ బాధ్యతలు స్వీకరించిన తరువాత ఏపీ ఎస్పీఎఫ్లో మార్పులు శరవేగంతో జరుగుతున్నాయన్నారు. రాష్ట్రంలో పలు చోట్ల మినీ శిక్షణ కేంద్రాలు ఏర్పాటుకు ప్రభుత్వం స్థలాలు కేటాయించిందన్నారు. సిబ్బంది సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. ఉద్యోగుల పదోన్నతులు, నూతన నియామకాలపై దృష్టి పెట్టారని చెప్పారు. ఈ క్రీడా పోటీలలో వాలీబాల్, బాడ్మింటన్, 100 మీటర్లు, 400 మీటర్లు, 5 కిలో మీటర్ల పరుగు పందేలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని వివిధ యూనిట్ల నుంచి దాదాపు రెండు వందల మంది అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. విజయవాడ జోన్ కమాండెంట్ ముద్దాడ శంకర్రావు, కమాండెంట్ డీఎన్ఏ బాషా, అసిస్టెంట్ కమాండెంట్లు, ఇన్స్పెక్టర్లు ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
నేడు విద్యుత్ లోక్ అదాలత్
తాడికొండ: విజయవాడకు చెందిన కన్సూమర్ గ్రీవెన్సెస్ రీడ్రెస్సల్ ఫోరం (సీజీఆర్ఎఫ్) ఆధ్వర్యంలో బుధవారం రాయపూడిలోని విద్యుత్ భవన్లో అదాలత్, అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు అమరావతి క్యాపిటల్ ఈఈ సీహెచ్ వెంకటేశ్వరరావు తెలిపారు. విద్యుత్ భవన్‌లోని కాన్ఫరెన్స్ హాల్లో ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కార్యక్రమం జరగనుంది. సీఆర్డీఏ సర్కిల్, అమరావతి క్యాపిటల్ డివిజన్ పరిధిలోని విద్యుత్ వినియోగదారులు తమ సమస్యలను పరిష్కరించుకోవాలని తెలిపారు. విజయవాడ సీజీఆర్ఎఫ్ చైర్మన్, రిటైర్డ్ జడ్జి ఎన్ విక్టర్ ఇమ్మాన్యుయేల్, సాంకేతిక సభ్యుడు డి. కృపానాయక్, ఆర్థిక సభ్యుడు ఆర్సీహెచ్ శ్రీనివాసరావు, స్వతంత్య్ర సభ్యులు సునీత, ఎస్ఈ ఎం. శ్రీనివాసరావు పాల్గొంటారని పేర్కొన్నారు. నెహ్రూనగర్: స్వయం ఉపాధి పథకాలపై ఎస్సీ యువతకు బుధవారం ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో (జిల్లా పరిషత్ కార్యాలయం రోడ్) అవగహన సదస్సు నిర్వహించనున్నట్లు ఆ శాఖ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె.శ్రీనివాస్ మంగళవారం ఓ ప్రకటనలో తెలియజేశారు. ప్రభుత్వం ద్వారా అందించే స్వయం ఉపాధి పథకాలపై జిల్లాస్థాయిలో అధికారులు, వివిధ బ్యాంకుల అధికారులు పాల్గొని అవగాహన కల్పిస్తారని చెప్పారు. జిల్లాలోని నిరుద్యోగ ఎస్సీ యువత ఈ అవగాహన సదస్సుకు హాజరై ఉపాధి అవకాశాలను పెంపొందించుకోవాలని సూచించారు. నరసరావుపేట రూరల్: అధిక ధరకు మొక్క జొన్న విత్తనాలు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయ అధికారి ఎం.జగ్గారావు హెచ్చరించారు. జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయంలో మంగళవారం విత్తన డీలర్లతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రతి 15 రోజులకు విత్తన స్టాక్ రిపోర్ట్‌ను అందజేయాలని తెలిపారు. రైతుకు ఇచ్చే బిల్లు మీద తప్పనిసరిగా లాట్ నెంబర్ వేయాలన్నారు. నాణ్యమైన విత్తనాలను రైతులకు అందజేయాలని, విత్తన చట్టానికి లోబడి ప్రతి డీలరు వ్యాపారం చేయాలని స్పష్టంచేశారు. సమావేశంలో వ్యవసాయ సంచాలకులు వి.హనుమంతరావు, నరసరావుపేట సహాయ వ్యవసాయ సంచాలకులు కేవీ శ్రీనివాసరావు, ఏఓ శాంతి, డీలర్లు పాల్గొన్నారు. -
జాతీయ అథ్లెటిక్స్ పోటీల్లో రజత పతకం
గుంటూరు వెస్ట్ (క్రీడలు): ఒడిశాలో ఈ నెల 10 నుంచి 14 వ తేదీ వరకు జరిగిన 40వ జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో గుంటూరుకు చెందిన ఎస్కే రోషన్ రజత పతకం సాధించాడు. అండర్ 20 యూత్ విభాగంలో 110 మీటర్ల హర్డల్స్‌లో ఈ పతకాన్ని సాధించాడని అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆఫ్ గుంటూరు జిల్లా కార్యదర్శి జి.వి.ఎస్. ప్రసాద్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా రోషన్‌ను ఏపీ రెరా సభ్యుడు దామచర్ల శ్రీనివాసరావు స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో అభినందించారన్నారు. స్టేడియంలో అథ్లెటిక్స్ ట్రాక్ కూడా బాగు చేయాలని కోరారు. సదుపాయాలు కల్పిస్తే మరింత మంది రాణిస్తారని ఆకాంక్షించారు. రోషన్‌ను కోచ్ రామకృష్ణ, కె.రవి, కె.అరుణ్ కుమార్, పి.ఆనంద్ కుమార్, ఎస్కే మన్సూర్ వలి తదితరులు అభినందించారు. -
తిన్నారా.. తినలేక పడేశారా..?
ప్రత్తిపాడు: ప్రత్తిపాడు బీసీ బాలుర వసతి గృహంలో పరిశుభ్రత మచ్చుకై నా కానరావడం లేదు. డస్ట్‌బిన్‌లో అన్నం పడేశారు. అసలు ఆహారం తిన్నారా? తినలేక పడేశారా..? ప్రభుత్వం ఇచ్చే బియ్యమే కదా అని అధికంగా వండి వ్యర్థాల డబ్బాలో పారవేశారా..? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సోమవారం ఉదయం బీసీ కళాశాల బాలుర వసతిగృహంలో కనిపించిన ఈ దృశ్యాలు హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యానికి, ఉన్నతాధికారుల ఉదాసీనతకు ప్రత్యక్ష సాక్ష్యాలుగా నిలిచాయి. పక్కనే కూతవేటు దూరంలో ఉన్న పెదనందిపాడు మండలం అన్నపర్రు బాలుర హాస్టల్లో ఐదు రోజుల కిందట విద్యార్థులు అస్వస్థతకు గురైనప్పటికీ ప్రత్తిపాడు హాస్టల్ సిబ్బందికి కనువిప్పు కలిగినట్లుగా లేదు. హాస్టల్ ఆరంభంలోనే అపరిశుభ్ర వాతావరణం కనిపిస్తోంది. మిగిలిన వ్యర్థాలు డబ్బాలో పడేసి, మూత కూడా పెట్టలేదు. దోమలు, ఈగలు వాలి అధ్వానంగా దర్శనమిస్తున్నాయి. అదేవిధంగా మరుగుదొడ్ల నుంచి వచ్చే మురుగు సైతం ఆవరణలోనే నిలిచి ఉంది. నీటి కొళాయిలు ఉన్న ప్రదేశం అంతా పాచి పట్టి అపరిశుభ్రంగా మారింది. అయినా హాస్టల్ వార్డెన్‌కు కనీసం చీమ కుట్టినట్లయినా లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆహార పదార్థాల వ్యర్థాలు విచ్చలవిడిగా పడేయడంతో విద్యార్థుల ఆరోగ్యానికి ప్రమాదకరంగా మారే అవకాశాలు లేకపోలేదు. ఇకనైనా జిల్లా బీసీ సంక్షేమశాఖ అధికారులు స్పందించి హాస్టళ్లలో పరిశుభ్ర వాతావరణం ఉండేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు. ప్రత్తిపాడు బీసీ హాస్టల్లో మారని పారిశుద్ధ్య నిర్వహణ తీరు -
రైళ్లలో చోరీలకు పాల్పడిన వ్యక్తి అరెస్టు
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): రైళ్లలో వరుస చోరీలకు పాల్పడుతున్న పాత నేరస్తుడిని ప్రభుత్వ రైల్వే పోలీసులు (జీఆర్పీ) అరెస్టు చేశారు. అతని వద్ద 64 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. జీఆర్పీ ఇన్స్పెక్టర్ జె.వి.రమణ కథనం మేరకు.. సెప్టెంబర్ నెలలో రైళ్లలో బంగారు ఆభరణాలు కలిగిన లగేజీ బ్యాగుల చోరీలపై నమోదైన రెండు కేసులకు సంబంధించి జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు చేపట్టారు. ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ ఫతే అలీబేగ్, జీఆర్పీ ఇన్స్పెక్టర్ జె.వి.రమణలు తమ సిబ్బందితో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వేజెండ్ల గ్రామానికి చెందిన మూల్పూరి ఫణేంద్ర కుమార్‌ను నిందితుడిగా గుర్తించారు. గతంలో రైళ్లు, స్టేషన్లలో ఇతడు నేరాలు చేసి జైలుకు కూడా వెళ్లొచ్చాడు. నిందితుడు మంగళవారం విజయవాడ కాళేశ్వరరావు మార్కెట్, శివాలయం వీధిలో ఉన్నట్లు సమాచారం అందటంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి రూ.3.68 లక్షల విలువైన నగలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. -
ఈత పోటీలలో రైల్వే ఉద్యోగి ప్రతిభ
లక్ష్మీపురం: దక్షిణ మధ్య రైల్వేలోని గుంటూరు డివిజనులో లోకో పైలట్ (గూడ్స్) గంపల సాంబశివరావు ఈత పోటీలలో ప్రతిభ చాటారు. జాతీయ, రాష్ట్ర స్థాయి ఈత పోటీలలో అత్యుత్తమ ప్రదర్శన ద్వారా సంస్థకు కీర్తి తెచ్చిపెట్టారని గుంటూరు డీఆర్ఎం సుథేష్ఠసేన్ అన్నారు. పట్టాభిపురంలోని డీఆర్ఎం కార్యాలయంలో మంగళవారం సాంబశివరావును ఘనంగా సత్కరించారు. డీఆర్ఎం మాట్లాడుతూ ఈ నెల 11, 12వ తేదీల్లో మంగళగిరిలో ఎస్.మహబూబ్ షంషేర్ ఖాన్ జాతీయ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్ పోటీలలో సాంబశివరావు 2 బంగారు, వెండి, కాంస్య పతకాలను కై వసం చేసుకోవడం అభినందనీయం అన్నారు. ఈ నెల 8వ తేదీన గుంటూరు ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన 8వ అంతర్ జిల్లాల మాస్టర్ స్విమ్మింగ్ పోటీలలో సైతం 4 బంగారు పతకాలను కై వసం చేసుకున్నారని తెలిపారు. ఏడీఆర్ఎం ఎం.రమేష్‌కుమార్, అధికారులు అభినందించారు. -
25న తెనాలిలో ఆంధ్రప్రదేశ్ పాడి రైతుల సభ
తెనాలి: పాడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల తరహాలో లీటరుకు రూ.8–10 ప్రోత్సాహకధర ఇవ్వాలని కోరుతూ ఈ నెల 25వ తేదీన తెనాలిలో సభ నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్ పాడి రైతుల జిల్లా ప్రథమ మహాసభను జయప్రదం చేయాలని సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ములకా శివసాంబిరెడ్డి కోరారు. తెనాలిలో మంగళవారం పాడిరైతులతో కలసి మహాసభ ఆహ్వానపత్రికను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ తెనాలి అయితానగర్‌లోని నన్నపనేని సీతారామయ్య సరస్వతమ్మ కల్యాణమండపంలో 25న ఉదయం 10 గంటలకు మహాసభ జరుగుతుందని తెలిపారు. గేదెపాలు లీటరుకు రూ.40, ఆవు పాలు రూ.20కు మించి డెయిరీల్లో ధర రావటం లేదన్నారు. పాడి పశువులకు బీమా మార్కెట్ ధర ప్రకారం నిర్ణయించాలని తెలిపారు. ప్రభుత్వమే ప్రీమియం చెల్లించాలని సంఘం జిల్లా నాయకురాలు వేజెండ్ల తబిత కోరారు. తెనాలి శాంతకుమారి, మాన్యం పద్మ, ఎల్లమాటి మేరమ్మ, కె.శకుంతల ఎ.సరోజిని, టి.నిర్మల, సంతోషం, సుశీల తదితరులు పాల్గొన్నారు. -
నేటి నుంచి కాంట్రాక్టు విద్యుత్ ఉద్యోగుల సమ్మె
లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్): విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు, జేఎల్ఎం గ్రేడ్ –2ల సమస్యల పరిష్కారం కోసం గురువారం నుంచి తలపెట్టిన నిరవధిక సమ్మెను జయప్రదం చేయాలని ఏపీ విద్యుత్ ట్రేడ్ యూనియన్ పోరాట కమిటీ జిల్లా చైర్మన్ దాసరి వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. పాత గుంటూరులోని సీఐటీయూ జిల్లా కార్యాలయంలో మంగళవారం కమిటీ జనరల్ బాడీ సమావేశం రామ్ప్రభాకర్, జి.నాగరాజుల అధ్యక్షతన జరిగింది. చైర్మన్ దాసరి వెంకటేశ్వరరావు, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి దండా లక్ష్మీనారాయణ, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సీహెచ్ నాగ బ్రహ్మచారి, జిల్లా గౌరవాధ్యక్షుడు బి.లక్ష్మణరావు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి వై.నేతాజీ, జిల్లా నాయకులు సుబ్బారెడ్డి మాట్లాడారు. సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె బాట పడతామని, దీనికి పూర్తిగా యాజమాన్యం బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. సమావేశంలో నాయకులు జానీ, పవన్, రాంబాబు, వంశీ, అందే రాజేష్, కొండా, చంద్రశేఖర్ ఆచారి తదితరులు పాల్గొన్నారు. -
గుంటూరు
బుధవారం శ్రీ 15 శ్రీ అక్టోబర్ శ్రీ 2025పులిచింతల సమాచారం అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 74,600 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా, దిగువకు 81,966 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 42.1600 టీఎంసీలు. టీటీడీకి రూ.10 లక్షలు విరాళం గుంటూరుమెడికల్: తిరుమల తిరుపతి దేవస్థానం నిత్యాన్నదానం ట్రస్టుకు రూ.10 లక్షల విరాళాన్ని సుష్మగౌడ్ ఫౌండేషన్ అధ్యక్షులు జల్లెడ శ్రీనివాస్ గౌడ్,ఎస్ఎన్వీఎస్ ప్రసాద్‌గౌడ్‌లు అందజేశారు.315 రోజులుగా దీక్షలు తాడేపల్లిరూరల్: బ్రహ్మానందపురంలో ఏసీసీ కార్మికులు చేపట్టిన దీక్షలు మంగళవారం నాటికి 315వ రోజుకు చేరుకున్నాయి. శిబిరాన్ని కేసీ వర్క్స్ యూనియన్ నాయకులు సందర్శించారు.I -
పరిశ్రమలపై ‘చిన్న’చూపు
తాడేపల్లి రూరల్: నూతన రాజధాని అమరావతిలో ఉన్న చిన్న పరిశ్రమలను తరలించేందుకు ఆయా శాఖల అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. దానిలో భాగంగా తాడేపల్లిలో ఉన్న ఐఓసీ స్మాల్ క్యాన్ ఫిల్లింగ్ ప్లాంట్‌ను తరలించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఐఓసీ స్మాల్ క్యాన్ ఫిల్లింగ్ ప్లాంట్ రాష్ట్రం నుంచి తరలిపోతుంటే ఏమాత్రం ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. ఫిల్లింగ్ ప్లాంట్ పరిశ్రమను నమ్ముకుని అందులో పర్మినెంట్ ఉద్యోగులు కాకుండా 80 మంది కాంట్రాక్ట్ పద్ధతిపై విధులు నిర్వర్తిస్తున్నారు. ట్రాన్స్పోర్ట్ ద్వారా మరో 120 మంది కుటుంబాలను పోషించుకుంటున్నారు. ట్రాన్స్‌పోర్ట్‌లో డ్రైవర్లు కాకుండా వాహన యజమానుల కుటుంబాలు ఈ కంపెనీపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నాయి. చిన్న పరిశ్రమలను ప్రభుత్వం కాపాడాలని కార్మిక సంఘం నాయకులు కోరుతున్నారు. కంపెనీ మూసివేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించలేదు. కానీ అధికారులే స్వయంగా వేరే ఉద్యోగాలు చూసుకోండంటూ కార్మికులకు చెబుతున్నారు. దీంతో కార్మికుల కుటుంబాల్లో ఆందోళన పెరిగింది. 5 నెలల క్రితం వరకు ఇక్కడ ఉన్న ఆయిల్ కంపెనీలో 2500 కేఎల్ ఇంజిన్ ఆయిల్ ఉత్పత్తి చేయగా, దానిని క్రమక్రమంగా వెయ్యి కేఎల్‌కు తీసుకొచ్చారు. త్వరలోనే కంపెనీ మూసివేస్తారని కార్మికులు ఆందోళన చెందుతున్నారు. -
నీటి సరఫరాలో నిర్లక్ష్యం వహిస్తే క్రిమినల్ చర్యలే
గుంటూరు వెస్ట్: మంచినీటి సరఫరాలో అలసత్వం వహించే సిబ్బందిపై క్రిమినల్ చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియా హెచ్చరించారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని వీడియో సమావేశ మందిరంలో నిర్వహించిన అధికారుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఉద్యోగులు సామాజిక బాధ్యతగా విధులు నిర్వహించాలన్నారు. సమావేశంలో అనధికార బాణసంచా నిల్వలు, విక్రయాలు చేయొద్దని తెలిపారు. ఈ నెల 20వ తేదీన దీపావళి సందర్భంగా తాత్కాలిక షాపులు పెట్టుకోవడానికి అనువైన ఖాళీ ప్రదేశాలను గుర్తించాలని అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. దుకాణాల ఏర్పాటుకు 17వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పించాలన్నారు. అలాగే రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సీసీఐ) ద్వారా పత్తి కొనుగోళ్లకు ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. వట్టిచెరుకూరు మండలం కూర్నూతలలో సీసీఐ పత్తి కొనుగోళ్లుకు నోటిఫై చేసిన గాయత్రి కాటన్ ప్రెస్సింగ్ మిల్లులో సన్నద్ధత ఏర్పాట్లను మంగళవారం ఆమె పరిశీలించారు. అమరేశ్వరుని హుండీ ఆదాయం అమరావతి:అమరావతిలోని శ్రీ బాల చాముండికా సమేత శ్రీ అమరేశ్వర స్వామి దేవస్థానంలో మంగళవారం హుండీలలోని కానుకలను లెక్కించారు. కోటప్పకొండ త్రికోటేశ్వరస్వా మి దేవస్థానం కార్యనిర్వహణాధికారి దాసరి చంద్రశేఖరరావు సమక్షంలో 12 హుండీలను తెరచి లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. మూడు నెలల 7 రోజుల కాలానికి దేవాలయంలో ఉన్న హుండీల ఆదాయం మొత్తం రూ. 20,07,999. అన్నదాన మండపంలోని హూండీ ద్వారా రూ.48, 809 ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి రేఖ తెలిపారు. అచ్చంపేట జెడ్పీ హైస్కూల్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అచ్చంపేట: స్థానిక జిల్లా పరిషత్ హైస్కూల్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్టు స్కూల్ ఎడ్యుకేషన్ రీజినల్ జాయింట్ డైరెక్టర్ బి.లింగేశ్వరరెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటుకు కావలసిన వసతులు, తరగతి గదులను పరిశీలించారు. ఇక్కడ 1950లో స్థలదాత తుమ్మేపల్లి శ్రీరాములు నిర్మించిన పురాతన భవనం శిథిలం కాగా, ఇటీవల పూర్వవిద్యార్థులు సుమారు రూ.20లక్షల వ్యయంతో ఆధునీకరించారు. అందులో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటుకు అనుకూలమని ఆర్జేడీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే ఈ గదులను ఇంకా ఆధునీకరించవలసి ఉందన్నారు. త్వరలోనే పనులను ప్రారంభించనున్నట్లు చెప్పారు. 19న త్రిపురనేని రామస్వామి చౌదరి పురస్కార ప్రదానోత్సవం గుంటూరు ఎడ్యుకేషన్ : తెలుగు సమాజంలోని గొప్ప సామాజిక విప్లవకారుడు కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమాన్ని ఈనెల 19న సాయంత్రం 5 గంటలకు బ్రాడీపేటలోని యూటీఎఫ్ హాలులో నిర్వహిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు తెలిపారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వాన పత్రికలను మంగళవారం ఆవిష్కరించారు. 2025వ సంవత్సరానికి రామస్వామి చౌదరి పురస్కారాలను సుప్రసిద్ధ కవి, సాహితీ విమర్శకులు డాక్టర్ కోయి కోటేశ్వరరావు, రాజకీయ, సామాజిక ఉద్యమకారుడు డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లుకు ఇస్తున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో డాక్టర్ మూకిరి సుధ, వీసీకే పార్టీ మహిళా విభాగ రాష్ట్ర అధ్యక్షురాలు కై లా జయసుధ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ – జాషువా – పూలే – పెరియార్ లిటరేచర్ ఫౌండేషన్ అధ్యక్షుడు బి.విల్సన్ పాల్గొన్నారు. -
సైబర్ కేటుగాడు అరెస్టు
నగరంపాలెం/గుంటూరువెస్ట్: కాల్ బాయ్ వ్యాపారం ముసుగులో సైబర్ నేరాలకు పాల్పడే ఓ పాత నేరస్థుడిని పట్టాభిపురం పోలీసులు అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. అతని నుంచి మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. గుంటూరు నగరంపాలెంలోని జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలోని హాల్లో మంగళవారం మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ... ఆరు నెలల క్రితం ఎస్వీఎన్ కాలనీలో ఓ వృద్ధుడికి(68) ఫేస్బుక్ మెసేంజర్‌లో శైలజ మార్ని పేరుతో హాయ్ అని మెసేజ్ వచ్చిందన్నారు. వృద్ధుడు కూడా హాయ్ పంపించాడని చెప్పారు. కాల్ బాయ్‌గా చేస్తే నగదు చెల్లిస్తామని పేర్కొనడంతో వృద్ధుడు వద్దని చెప్పాడన్నారు. తర్వాత పది రోజులపాటు అవతలి వ్యక్తి వాయిస్ కాల్స్ చేసినట్లు పేర్కొన్నారు. వేరే నంబర్లతోనూ కాల్ చేసి పోలీసులమని, మహిళలతో అసభ్యకరంగా చాట్ చేస్తున్నావని వృద్ధుడికి బెదిరింపులు వచ్చాయన్నారు. కేసు నమోదైందని, మాఫీకి నగదు ఇవ్వాలని బెదిరించారని చెప్పారు. ఆదాయపు పన్ను శాఖ అధికారులమని, రైస్ మిల్లులో అక్రమ లావాదేవీలు జరిగాయని, తనిఖీలకు వస్తున్నామని హెచ్చరించారు. వృద్ధుడు భయపడి పలు ఖాతాలకు సుమారు రూ.కోటి జమ చేశారని తెలిపారు. తర్వాత మోసపోయినట్లు తెలిసి పట్టాభిపురం పీఎస్‌లో ఫిర్యాదు చేశాడన్నారు. సీఐ వెంకటేశ్వర్లు కేసు దర్యాప్తు చేపట్టారని పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో బాపట్ల జిల్లా ఇంకొల్లు మండలం సాయిబాబా గుడి బజారుకు చెందిన చోడ చైతన్యకృష్ణ పవన్ (27)ను నిందితుడిగా తేల్చారని పేర్కొన్నారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారించామని, నేరం రుజువు కావడంతో అరెస్ట్ చేశామని వివరించారు. విచారణలో విస్తుపోయే విషయాలు... ఇంటర్ వరకు చదివిన చైతన్యకృష్ణ పవన్ బెంగళూరు కేంద్రంగా కాల్‌బాయ్ పేరుతో మోసగిస్తున్నాడు. నాలుగేళ్లపాటు సికింద్రాబాద్, హైదరాబాద్, నిజామాబాద్ ప్రాంతాల వారిని మోసగించాడు. మహిళల పేర్లతో ఫేస్బుక్లో ఖాతాలు తెరిచి మెసేజ్ చేస్తూ పరిచయం చేసుకునేవాడు. కాల్‌బాయ్ కథ అల్లేవాడు. గొంతులు మార్చి కాల్ చేసేవాడు. వసూళ్లే వసూళ్లు ఒప్పుకొంటే ఏవేవో ఫీజుల కింద రూ.20 వేలు, రూ.30 వేలు తీసుకునేవాడు. తర్వాత బాధితులకు వేరే ఫోను నంబర్లతో కాల్ చేసి పోలీస్ అని బెదిరించేవాడు. ఆడవాళ్లతో అసభ్యంగా చాటింగ్, ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ కేసు నమోదైందని బెదరగొట్టేవాడు. మళ్లీ వేరే నంబర్లతో ఫోన్ చేసి హైకోర్టు న్యాయవాది, సీఐ, ఎస్ఐ, కానిస్టేబుల్ ఇలా పలు విధాలుగా చెప్పేవాడు. కేసు లేకుండా చూసేందుకని 2022లో హైదరాబాద్‌లో ఓ వ్యక్తిని సుమారు రూ.1.70 లక్షలకు మోసగించాడు. సైబరాబాద్ క్రైం పీఎస్‌లో కేసు నమోదైంది. 2024 సైబరాబాద్‌కు చెందిన వ్యక్తి నుంచి రూ.20 లక్షలు కాజేశాడు. ఈ ఏడాది జనవరిలో హైదరాబాద్ వాసి నుంచి రూ.2 లక్షలు, నిజామాబాద్‌కు చెందిన వ్యక్తి నుంచి రూ.37 వేలు జమ చేయించుకున్నాడు. కేసును ఛేదించిన పట్టాభిపురం పీఎస్ సీఐ జి.వెంకటేశ్వర్లు, ఎస్ఐ రాజ్‌కుమార్, పీఎస్ఐ ప్రదీప్, హెచ్‌సీ ప్రసాదరావు, ఐటీ కోర్ సీఐ నిస్సార్ బాషా, హెచ్‌సీ రాజాకిషోర్లను జిల్లా ఎస్పీ అభినందించి, ప్రశంసాపత్రాలు అందించారు. -
ఏకంగా బస్ షెల్టరుకే ఎసరు
బస్ షెల్టర్‌ను దుకాణాలుగా మార్చిన దృశ్యం మంగళగిరి టౌన్: మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని నిడమర్రులో ఓ ప్రభుత్వ స్థలంలో బంధువుల జ్ఞాపకార్థం వారి కుటుంబసభ్యులు బస్ షెల్టర్ ఏర్పాటు చేశారు. 1978లో పాములపాటి రంగారెడ్డి, వెంకటరత్నం దంపతుల జ్ఞాపకార్థం వారి కుమారుడైన శివారెడ్డి దీన్ని నిర్మింపజేశారు. 2024 జూన్ 5వ తేదీన కూటమి ప్రభుత్వం వచ్చాక బస్ షెల్టర్ ఏర్పాటు చేసిన వారి సంబంధికులు దానిని టీడీపీ కార్యాలయంగా మార్చారు. ప్రస్తుతం ఆ కార్యాలయాన్ని తొలగించి, మరికొంత స్థలాన్ని కూడా ఆక్రమించి దుకాణాలు నిర్మించారు. అద్దెకు ఇచ్చేందుకు సన్నాహాలు జరుగుతుండడంతో స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు. అధికారులు కూడా పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి లోకేష్ దృష్టికి తీసుకువెళ్లి బస్ షెల్టర్ ఏర్పాటు చేయిస్తామని కొంతమంది టీడీపీ నాయకులు చెబుతున్నారు. -
ఏఎన్‌యూలో ప్రపంచ హస్తకళల దినోత్సవం
పెదకాకాని: సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడటంలో హస్తకళలు కీలకపాత్ర పోషిస్తాయని ఫైన్ ఆర్ట్స్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ కోఆర్డినేటర్ పులిచెర్ల దేవకాంత్ అన్నారు. ప్రపంచ హస్తకళల దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ప్రదర్శన ఏర్పాటు చేశారు. దేవకాంత్ మాట్లాడుతూ హస్తకళలు ఆర్థిక వ్యవస్థకు తోడ్పడటంలో, సృజనాత్మకతను ప్రోత్సహిస్తాయన్నారు. అనంతరం కొండపల్లి, ఏటికొప్పాక, చెన్నపట్నం బొమ్మలు, మంగళగిరి, ధర్మవరం, కలంకారి, చేనేత వస్త్రాలను విద్యార్థులు ప్రదర్శించారు. అధ్యాపకులు బి.శేఖర్‌బాబు, జాన్రత్నబాబు, వి.వీరయ్య, విద్యార్థులు సీహెచ్ హెలీనా, చక్రిత విద్య, రేణుక, బాంధవి, గణేష్ తదితరులు పాల్గొన్నారు. -
పట్టపగలే వ్యక్తి దారుణ హత్య
తెనాలి రూరల్: గుంటూరు జిల్లా తెనాలిలో పట్టపగలు ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మృతుని కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు... బాపట్ల జిల్లా అమృతలూరు మండలం కోరుతాడిపర్రు గ్రామానికి చెందిన జూటూరి తిరుపతిరావు అలియాస్ బుజ్జి (60) గ్రామంలోని తమ సామాజిక వర్గంలో పెద్దగా ఉన్నాడు. ఆయనకు ఐదుగురు కుమార్తెలు. పెద్ద కుమార్తె గండికోట దుర్గ తెనాలి చెంచుపేటలోని ఎమ్మెల్యే బజారులో ఉంటోంది. బుజ్జి పది రోజుల క్రితం కుమార్తె వద్దకు వచ్చాడు. బైక్‌పై టిఫిన్ బండి వద్దకు మంగళవారం ఉదయం వెళ్లాడు దోశలు ఆర్డరిచ్చి వేరే వ్యక్తితో మాట్లాడుతున్నాడు. అంతలోనే ద్విచక్ర వాహనంపై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి కొబ్బరి బొండాలు నరికే కత్తితో తిరుపతిరావును హత్య చేశాడు. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. గుంటూరు నుంచి వచ్చిన డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం ఆధారాలు సేకరించింది. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కారణమేంటి? పాత కక్షలు, ఆధిపత్య పోరు కారణంగానే ఈ హత్య జరిగినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. కోరుతాడిపర్రులో ఆలయానికి సంబంధించిన నగదు పాట నిర్వహించడం, ఆలయ వ్యవహారాల పర్యవేక్షణ వంటివి బుజ్జి చూస్తుంటాడు. అమృతలూరు సొసైటీ సభ్యుడిగా కూడా ఉన్నాడు. ఆలయ వ్యవహారం ఏళ్లుగా ఒక్కరే చూడాలా అంటూ గ్రామానికే చెందిన అల్లుడు వరుస అయ్యే వ్యక్తి ఇటీవల బుజ్జితో వాగ్వాదానికి దిగాడని, అలాగే తన తండ్రి మృతికి తిరుపతిరావు కారణమంటూ గతంలో ఘర్షణ పడ్డాడని తెలుస్తోంది. అతనే ఈ హత్య చేసి ఉంటాడని అటు గ్రామస్తులు కూడా భావిస్తున్నారు. మరో వైపు తిరుపతిరావు మనవరాలికి ఆమె భర్తకు మధ్య కలహాలు ఉన్నాయి. మూడు రోజులుగా చెంచుపేటలో పంచాయితీ నడుస్తోంది. కుటుంబ కలహాలకు తిరుపతిరావే కారణమని, అతడిని హతమారిస్తే కలహాలు ఉండవంటూ మనవరాలి భర్త సోమవారం రాత్రి హెచ్చరించాడని చెబుతున్నారు. గ్రామంలో ఆధిపత్య పోరులో అల్లుడి వరుస అయ్యే వ్యక్తి లేదా మనవరాలి భర్త ఈ హత్యకు పాల్పడి ఉండొచ్చని భావిస్తున్నారు. వారిద్దరూ ఒక్కటై పథకం వేసి హత్య చేసి ఉంటారనే కోణంలోనూ పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. -
‘ఆ భయంతోనే చంద్రబాబు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు’
తాడేపల్లి : నకిలీ మద్యంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడ్డగోలుగా బరితెగించి వ్యవహరిస్తున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబు తప్పులు మీద తప్పులు చేస్తూ కూడా అడ్డగోలుగా బుకాయిస్తున్నారని విమర్శించారు. ఈరోజు(మంగళవారం, అక్టోబర్ 14వ తేదీ) పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర కార్యదర్శులతో సజ్జల సమావేశమయ్యారు. ‘భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి మద్యం అసలుదా.. నకిలీదా అని తెలుసుకునేలా యాప్ పెట్టలేదు. చంద్రబాబు యాప్ పెట్టారంటే నకిలీ మద్యం ఉన్నట్లే కదా..?, చంద్రబాబు తప్పుల మీద తప్పులు చేస్తూ కూడా అడ్డంగా బుకాయిస్తున్నారు. సడెన్‌గా ఒకడు ఆఫ్రికానుంచి వస్తాడు, అతనికి రెడ్ కార్పెట్ స్వాగతం పలుకుతారు. అతని వీడియో బయటికి వస్తుంది, జోగి రమేష్ పేరు చెబుతాడు.. అతను చెప్పినందుకే చేశానంటాడు, నకిలీ మద్యం కేసులో చంద్రబాబు అడ్డం దొరికారు. ఆ భయంతో అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. బెల్ట్ షాప్‌లు ఉన్నాయని చంద్రబాబే ఒప్పుకున్నారు.. కల్తీ మద్యాన్ని అసలు మద్యంలా చూపించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ మద్యం దుకాణాలు పెట్టాం.. ఆ దుకాణాలకు వచ్చిన మద్యం ఏ డిస్టిలరీ నుంచి వచ్చిందో తెలుసేలా చేశాం. దాని అమ్మకం జరిగితేనే డిస్టిలరీకి డబ్బులు వెళ్ళే విధంగా క్యూఆర్ కోడ్ పెట్టాం. పక్కాగా పకడ్భందీగా లిక్కర్ సేల్స్ జరిగాయి. టీడీపీ ప్రభుత్వం కల్తీ మద్యాన్ని డోర్ డెలివరీ చేస్తున్నారు. 24 గంటలు బెల్ట్ షాపులు, పర్మిట్ రూమ్‌లు పెట్టి నకిలీ మద్యం ఏరులై పారిస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ధీటుగా ఎదుర్కోవాలి. 175 నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలి. ఎన్ని కష్టాలు ఎదురైనా ఉవ్వెత్తున ఎగిసి పడి మనం పోరాటాలు చేస్తున్నాం. చంద్రబాబు గ్యాంగ్ బరితెగించి అడ్డగోలుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియాను విస్తృతంగా వినియోగించుకోవాలి. పార్టీ కేంద్ర కార్యాలయంతో అనుసంధానం అయ్యేలా యాప్‌ను కూడా సిద్దం చేశాం.. డేటా ప్రొఫైలింగ్ జరుగుతుంది. స్ధానిక ఎన్నికలు ఎప్పుడు జరిగినా పూర్తిస్ధాయిలో సిద్దంగా ఉండాలి. పార్టీ కమిటీలు, సంస్ధాగత నిర్మాణం విషయంలో పుంగనూరు, మడకశిర నియోజకవర్గాలను మోడల్ గా తీసుకుని ముందుకెళ్ళాలి. మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే నిర్వహిస్తే నష్టమని చంద్రబాబు అంటున్నారు పీపీపీలో మెడికల్ కాలేజీలు మంచిదని చెబుతున్నాడు.. ఇంతకంటే దారుణం ఇంకేమైనా ఉంటుందా?’ అని సజ్జల ప్రశ్నించారు.ఇదీ చదవండి:‘వైద్య రంగంలో జగన్ సేవలను శత్రువులైనా అంగీకరించాల్సిందే’ -
అడ్డగోలు వసూళ్ల రెవెన్యూ!
నెహ్రూనగర్: ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఇప్పటి వరకు వివిధ కారణాలతో రెవెన్యూ అధికారులు రిజెక్ట్ చేసిన ఫైళ్లు ఏకంగా 5,075 కావడం గమనార్హం. గుంటూరు నగరపాలక సంస్థకు ఆస్తి పన్ను పేరు మార్పు, కొత్త ఇంటి పన్ను, వీఎల్టీ, ఇతర పనుల నిమిత్తం మొత్తం వచ్చిన దరఖాస్తులు 14,936. ఏ దరఖాస్తు అయినా 15 రోజుల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. కానీ, గడువు పూర్తయిన తరువాత దరఖాస్తులు (బీయాండ్ ఎస్ఎల్ఏ) ఆమోదించినవి 1,600 ఉన్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఏదైనా సర్వీస్ రిక్వెస్ట్ రిజెక్ట్ కొట్టగానే సదరు దరఖాస్తుదారుడు రెవెన్యూ సిబ్బందిని కలిసి ప్రసన్నం చేసుకుంటే పనులు పూర్తి అవుతున్నట్లు పరిస్థితి నెలకొంది. ఇవిగో నిదర్శనాలు... ●పొన్నూరు రోడ్డులోని ఓ ఖాళీ స్థలంలో ఇల్లు నిర్మాణం చేపట్టారు. సదరు స్థలానికి వీఎల్టీ (ఖాళీ స్థల పన్ను) ఉంది. ఇంటి నిర్మాణం పూర్తయిన తరువాత దానిని రెసిడెన్షియల్‌లోకి మార్చాలంటే ఖర్చు అవుతుందని రెవెన్యూ సిబ్బంది డబ్బులు డిమాండ్ చేశారు. ప్రస్తుతం పన్ను నుంచి రెండున్నర సంవత్సరాలపాటు వెనక్కి వేసే వెసులుబాటు ఉంటుంది. వారు అడిగింది ఇవ్వకపోయే సరికి పన్ను ఉన్నదానికన్నా అదనంగా పెంచడంతోపాటు సంవత్సరం వెనక్కి వేశారు. ●అరండల్‌పేటలో ఓ ఇంటికి టైటిట్ ట్రాన్స్ఫర్ (టీటీపీ) చేయడానికి రూ.లక్ష డిమాండ్ చేశారు. విషయం చివరికి కార్పొరేషన్ కార్యాలయంలో తెలియడంతో కొంచెం వెనక్కి తగ్గారు. ●సంజీవయ్యనగర్‌లో ఓ వ్యాపార సంస్థకు కమర్షియల్ ట్యాక్స్ వేయాల్సి ఉండగా.. సదరు వ్యాపారస్తుల నుంచి మామూళ్లు తీసుకుని రెసిడెన్షియల్ ట్యాక్స్ వేసేందుకు దరఖాస్తు అప్పీలు చేశారు. దీనిని గమనించిన ఆర్వో సదరు దరఖాస్తును రిజెక్ట్ చేశారు. ●బృందావన్ గార్డెన్స్‌లో ఇంటి పన్ను పేరు మార్పు కోసం దరఖాస్తు వచ్చింది. కార్పొరేషన్ కార్యాలయ సిబ్బంది ఆ ఫైల్ తమ వారిదేనని, కొంచెం చేసి పెట్టాలని కోరినప్పటికీ డబ్బులు ఇవ్వాల్సిందేనని చెప్పారు. ఆ పని కోసం వారు కూడా డబ్బులు సమర్పించుకున్న పరిస్థితి. ●కొత్తపేటలో కూడా టైటిల్ ట్రాన్స్ఫర్ కోసం దరఖాస్తు వస్తే దానిని సకాలంలో పూర్తి చేయలేదు. సదరు దరఖాస్తుదారుడు బాధ్యులైన రెవెన్యూ సిబ్బందిపై ఫిర్యాదు చేశారు. కనీసం రూ.10 వేలు ఇవ్వాల్సిందే.. కొత్త ఇంటి పన్ను సదరు స్థల విస్తీర్ణం బట్టి రూ.10 వేల నుంచి రూ. 50 వేలకుపైగా వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. టైటిల్ ట్రాన్స్‌ఫర్‌కు సదరు భవనం స్థితిని బట్టి రూ.50 వేలకుపైగా వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. నేరుగా ఫిర్యాదు చేయండి రెవెన్యూ సెక్షన్లో సర్వీస్ రిక్వెస్ట్ కోసం సిబ్బంది ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే నేరుగా ఫిర్యాదు చేయండి. సంబంధిత సిబ్బందిపై వెంటనే శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. – చల్లా ఓబులేసు, అదనపు కమిషనర్ -
బీసీ హాస్టళ్లలో వసతులు మెరుగుపరచాలి
గుంటూరు మెడికల్: అనపర్రు బీసీ హాస్టల్ విద్యార్థులు అస్వస్థతకు కారణమైన వార్డెన్‌పై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని, బీసీ వసతి గృహాలలో వసతులు మెరుగు పరచాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేశారు. గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న విద్యార్థులను సోమవారం మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల రెడ్డి, గుంటూరు పార్లమెంట్ పరిశీలకుడు పోతిన మహేష్, ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్చార్జి బలసాని కిరణ్‌కుమార్, గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్చార్జి షేక్ నూరి ఫాతిమా, రాష్ట్ర కార్యదర్శి గులాం రసూల్‌లు పరామర్శించారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. అనంతరం పోతిన మహేష్ మీడియాతో మాట్లాడుతూ వార్డెన్ నిర్లక్ష్యం కనిపిస్తోందన్నారు. ఆహారం విషపూరితంగా మారిందని, విద్యార్థులు తెల్లవార్లు వాంతులు, విరోచనాలు, కడుపు నొప్పితో బాధపడినా సకాలంలో స్పందించలేదని వెల్లడించారు. వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హాస్టళ్లలో భోజనం బాగుందని, మెను బాగా పెట్టేవారని విద్యార్థులు తమతో చెప్పారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక భోజనం బాగుండటం లేదని వెల్లడించారన్నారు. అందుకే విద్యార్థులు నీరసించి పోయారన్నారు. ఎవరైనా సమస్యల గురించి తమ తల్లిదండ్రులకు చెప్పినట్లు తెలిస్తే చాలు ఆ విద్యార్థులను వార్డెన్ చితకబాదుతున్నట్లు ఆరోపించారు. ఇలాంటి వారిపై అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. భయపడుతున్న తల్లిదండ్రులు విద్యార్థులను హాస్టల్లో ఉంచేందుకు తల్లిదండ్రులు భయపడుతున్నారని, ఇళ్లకు తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారని, ఇది ప్రభుత్వం వైఫల్యం కాదా అని ప్రశ్నించారు. జిల్లాలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు లోకేష్, నాదెండ్ల మనోహర్, కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్‌లు ఉన్నప్పటికీ ఫలితం లేకుండా పోయిందన్నారు. హాస్టల్‌నే సరైన దిశగా నడిపించలేని వీరు రాష్ట్రాన్ని పరిపాలించగలరా అని ప్రశ్నించారు. జిల్లాలో నెలరోజులుగా పలు పెద్ద సంఘటనలు జరుగుతున్నా కూటమి ప్రభుత్వం చోద్యం చూస్తోందన్నారు. తురకపాలెంలో పెద్ద ఎత్తున మరణాలు సంభవించాయని, అయినప్పటికీ నేటి వరకు కారణాలు ప్రభుత్వం తెలుసుకోలేకపోయిందన్నారు. గుంటూరు నగరంలో గతనెలలో డయేరియాతో 200 మందికిపైగా చికిత్స పొందారని, తాజాగా బీసీ హాస్టల్ విద్యార్థులు అస్వస్థతతో చికిత్స పొందుతున్నారన్నారు. రాష్ట్రంలో అనేక చోట్ల విద్యార్థులు అస్వస్థతకు గురై అవస్థలు పడుతున్నారని, హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలన్నారు. తక్షణమే హాస్టల్‌ను సందర్శించి వసతులు మెరుగు పరచాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలన్నారు. మూడు రోజుల్లో వసతులు మెరుగు పడకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. బలసాని కిరణ్‌కుమార్ మాట్లాడుతూ హాస్టల్లో విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం విద్యార్థుల తల్లిదండ్రులకు వార్డెన్ ఫోన్ చేసి చెప్పలేదన్నారు. వార్డెన్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తురకపాలెంలో అనుకూలంగా ఉన్న కొంత మందికి రూ. 5 లక్షలు ఇచ్చి కంటి తుడుపు చర్యలు చేపట్టారని పేర్కొన్నారు. ఇక్కడ మరణాలకు కారణాలు తెలుసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. నూరిఫాతిమా మాట్లాడుతూ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్య, వైద్య రంగాలకు పెద్దపీట వేశారని చెప్పారు. నేడు రాష్ట్రంలో ఆ రంగాలు వెంటిలేటర్‌పై ఉన్నాయన్నారు. వరుసగా పలు సంఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందని ఆరోపించారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారని, ప్రజలు చచ్చిపోతున్నా పట్టించుకునే పరిస్థితుల్లో లేరన్నారు. కూటమి ప్రభుత్వంలో సీఎం దగ్గర నుంచి కింది స్థాయి అధికారుల వరకు నిర్లక్ష్యంగా ఉన్నారని, అందరూ అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. వారి నిర్లక్ష్యం వల్లే ఎంతో మంది ప్రాణాలు పోతున్నాయని, ప్రజలు బుద్ధి చెప్పే సమయం తొందరల్లోనే ఉందన్నారు. పాలించే అర్హత మంత్రులకు లేదని, తక్షణమే రాజీనామా చేయాలన్నారు. ప్రాణం విలువ రూ. 5 లక్షలా అంటూ ప్రశ్నించారు. పరిపాలన తెలియని వారు ఉన్నారని ఆరోపించారు. -
అవకాశం లేకనే ఆ బిర్యానీ తిన్నాం..
ప్రత్తిపాడు: పెదనందిపాడు మండలం అన్నపర్రు గ్రామంలోని బీసీ బాలుర హాస్టల్లో 54 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం బీసీ సంక్షేమశాఖ స్టేట్ అడిషనల్ డైరెక్టర్ డి.చంద్రశేఖర్‌రాజు, వైద్య ఆరోగ్యశాఖ అడిషనల్ డైరెక్టర్ బి.సుబ్రమణ్యేశ్వరిలు హాస్టల్లో విచారణ నిర్వహించారు. అధికారులు విద్యార్థులను ప్రశ్నించగా అవకాశం లేకనే బిర్యానీ తిన్నామని చెప్పారు. తాజాగా ఉందా, వాసన వస్తుందా అని అడుగగా తాజాగా లేదని తెలిపారు. హాస్టల్లోని వంటగది, విద్యార్థులు ఉండే రూమ్‌లు, బెడ్లు, వంట పాత్రలు, తాగు నీరు, తదితరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. హాస్టల్ వాతావరణం అపరిశుభ్రంగా, గదుల్లో బూజుపట్టి ఉండటంతో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇదేమని సిబ్బందిని ప్రశ్నించారు. ఇంత ఘటన జరిగిన తరువాత కూడా హాస్టల్ ఇలా ఉంటే ఎలాగని ఆగ్రహించారు. బయట నుంచి ఫుడ్ తెచ్చి ఎలా పెడతారు? సస్పెన్షన్‌కు గురైన హాస్టల్ వార్డెన్ మార్కండేయులును పిలిపించి ఘటనకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అసలు బయట నుంచి ఫుడ్‌ను లోపలకు ఎందుకు అనుమతిస్తున్నారని ప్రశ్నించారు. బయట ఫుడ్ అనుమతించకూడదు కదా అని మండిపడ్డారు. విధుల్లో నిర్లక్ష్యంగా ఉండటం వలనే ఘటన చోటుచేసుకుందన్నారు. అందువలనే ఫుడ్ పాయిజన్ అయ్యేది.. వంట మనిషి కల్పనతోనూ మాట్లాడారు. భోజనం వంట గది అపరిశుభ్రంగా ఉంటే చూసుకోవాలి కదా అని మండిపడ్డారు. పరిశుభ్రతకు సంబంధించి పలు సూచనలు అందించారు. వంట పాత్రలు శుభ్రంగా లేకున్నా కూడా ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశాలు ఉంటాయని సుబ్రమణ్యేశ్వరి స్పష్టం చేశారు. అనంతరం బీసీ సంక్షేమశాఖ స్టేట్ అడిషనల్ డైరెక్టర్ డి.చంద్రశేఖర్ రాజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు వెళ్లి అక్కడ విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం పరిశీలించారు. తదనంతరం విద్యార్థులతో మాట్లాడారు. ఆరోగ్యం ఎలా ఉంది, ఘటన ఎలా జరిగింది, సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వెంట జిల్లా బీసీ సంక్షేమశాఖ అధికారి మయూరి తదితరులున్నారు. -
మహిళ అవయవాల దానం
తాడేపల్లి రూరల్: మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని మణిపాల్ ఆసుపత్రిలో సోమవారం అవయవాల దానం జరిగింది. ఈ సందర్భంగా హాస్పిటల్ డైరెక్టర్ రామాంజనేయరెడ్డి, ఆంధ్రప్రదేశ్ జీవన్‌దాన్ చైర్మన్ డాక్టర్ కె. రాంబాబులు మాట్లాడుతూ.. తాడేపల్లి పట్టణ పరిధిలోని నులకపేటకు చెందిన రాజులపాటి పాప (64) ప్రమాదానికి గురి అయిందన్నారు. ఆమె బంధువులు ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించారని తెలిపారు. వైద్య పరీక్షల అనంతరం శస్త్రచికిత్స నిర్వహించారని పేర్కొన్నారు. అయినా ఆమె ఆరోగ్య పరిస్థితిలో మార్పు కనిపించలేదని చెప్పారు. అనంతరం బ్రెయిన్ డెడ్‌గా వైద్యులు ప్రకటించారని తెలిపారు. కుటుంబ సభ్యుల ఆమోదంతో ఆమె అవయవాలను సేకరించి కాలేయాన్ని మణిపాల్‌లో ఒక రోగికి ట్రాన్స్‌ప్లాంటేషన్ చేశారన్నారు. కార్నియాను ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రికి తరలించామని వివరించారు. మంచి కార్యానికి ముందుకు వచ్చిన దాత కుటుంబసభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. తురకపాలెంలో ఎన్సీడీసీ బృందం గుంటూరు రూరల్: మండలంలోని తురకపాలెం గ్రామంలో నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్సీడీసీ) బృందం ప్రతినిధులు సోమవారం పర్యటించారు. గ్రామంలో పలు ప్రాంతాలను పరిశీలించి ఎస్సీ కాలనీలో ఒక ప్రాంతంలో , విలేజ్ క్లినిక్ ప్రాంతంలో మట్టిని సేకరించారు. బెంగళూరుకు చెందిన బృందంతోపాటు గుంటూరు జిల్లాలోని ఎన్సీడీసీకి చెందిన 40 మందికిపైగా పాల్గొన్నారు. అదేవిధంగా నీటి నమూనాలను కూడా సేకరించారు. మట్టి, నీటిని పరీక్షల నిమిత్తం తీసుకెళుతున్నట్లు బృందం సభ్యులు తెలిపారు. న్యాయవాద కోర్సుల పరీక్షలు ప్రారంభం పెదకాకాని: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పీజీ పరీక్షల విభాగం ఆధ్వర్యంలో సోమవారం మాస్టర్ ఆఫ్ లా (ఎల్ఎల్ఎం) ద్వితీయ సెమిస్టర్, ఐదు సంవత్సరాల ఆనర్స్ బీబీఏఎల్‌ఎల్‌బీ, బీఏఎల్ఎల్బీ నాలుగో సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం అయ్యాయి. ఈ మేరకు పీజీ పరీక్షల కో ఆర్డినేటర్ ఆచార్య ఎం.సుబ్బారావు తెలిపారు. ఎల్ఎల్ఎం పరీక్షలు ఏఎన్‌యూతోపాటు గుంటూరులోని జేసీ కాలేజ్ ఆఫ్ లా, ఏసీ కాలేజీ పరీక్ష కేంద్రాలలో కొనసాగుతున్నాయన్నారు. ఐదు సంవత్సరాల ఆనర్స్ పరీక్షలు విశ్వవిద్యాలయంలోని టీటీఎం విభాగంలో ప్రారంభం అయ్యాయన్నారు. పరీక్షలను సమర్థంగా నిర్వహించేందుకు ప్రత్యేక తనిఖీల బృందాలను నియమించినట్లు వివరించారు. వర్సిటీలో జరుగుతున్న పరీక్ష కేంద్రాలను సందర్శించారు. ఎంఎస్సీ కెమిస్ట్రీ ఫలితాలు విడుదల ఏఎన్‌యూ (పెదకాకాని): ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ వరిధిలో ఎమ్మెస్సీ కెమిస్ట్రీ కోర్సు రెండో సెమిస్టర్ ఫలితాలను సీఈ ఆలపాటి శివప్రసాదరావు సోమవారం విడుదల చేశారు. 507 మందికిగాను 357 మంది ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు. అలాగే వర్సిటీ అందిస్తున్న డిప్లమో ఇన్ ఫొటోగ్రఫీ కోర్సు రెండవ సెమిస్టర్ పరీక్షల ఫలితాలను కూడా విడుదల చేశారు. 15 మందికి అందరూ ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు. రీవాల్యూయేషన్ కోసం ఈ నెల 23వ తేదీలోగా పేపరుకు రూ.1860 చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. టెయిల్‌పాండ్ నుంచి నీరు రెంటచింతల: మండలంలోని సత్రశాల వద్ద నున్న నాగార్జునసాగర్ టెయిల్‌పాండ్ విద్యుత్ ప్రాజెక్టు రిజర్వాయర్ 5 క్రస్ట్‌గేట్లు, రెండు యూనిట్లు ద్వారా విద్యుత్ ఉత్పాదన అనంతరం మొత్తం 58,122 క్యూసెక్కులను పులిచింతలకు విడుదల చేసినట్లు ప్రాజెక్టు ఎస్ఈ వెంకటరమణ, ఈఈ సుబ్రమణ్యం తెలిపారు. -
వర్షానికి పోలీస్ గ్రీవెన్స్ రద్దు
నగరంపాలెం: గుంటూరు నగరంపాలెంలోని జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో సోమవారం జరగాల్సిన ప్రజా ఫిర్యాదుల పరిష్కారాల వ్యవస్థ (పీజీఆర్ఎస్)ను తాత్కాలికంగా రద్దు చేశారు. ఈ మేరకు డీపీఓ వర్గాలు తెలిపాయి. సుదూర ప్రాంతాల నుంచి ఫిర్యాదులు చేసేందుకు వచ్చిన వారు ఇబ్బందులకు గురయ్యారు. ప్రధాన ద్వారం వద్ద పహారా నిర్వహించే పోలీస్ సిబ్బంది వారికి విషయం తెలిపారు. పక్కనే ఉన్న జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో పీజీఆర్ఎస్ కొనసాగడంతో బాధితులు ఒకింత అసహనం వ్యక్తం చేశారు. దీంతో షామియానాలు, కుర్చీలు ఖాళీగా దర్శనమిచ్చాయి. బాధితులు డీపీఓ ఎదుట మీడియాతో మాట్లాడారు. రూ.1.5 కోట్ల వరకు టోకరా.. ఏటీ అగ్రహారం 13వ వీధిలో ఉంటున్న ఓ మహిళ, ఆమె కుటుంబ సభ్యులు గత 25 ఏళ్లుగా చిట్టీ పాటలు నిర్వహిస్తున్నారు. రోజూవారీ పనులకు వెళ్తూ చిట్టీలు చెల్లించాం. అడిగితే మాపై దాడికి సిద్ధమవుతున్నారు. అరవై మందికిపైగా బాధితులు ఉన్నారు. సుమారు రూ.1.5 కోట్లు వరకు చెల్లించాలి. – బాధితులు, ఏటీ అగ్రహారం ప్రజా సమస్యల పరిష్కారమే ముఖ్యం గుంటూరు వెస్ట్: ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసమే అర్జీలు పెట్టుకుంటారని, దీనిని గుర్తించి అధికారులు పనిచేయాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎస్కే ఖాజావలి తెలిపారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో డీఆర్వో మాట్లాడుతూ జిల్లాలో అర్జీలను పూర్తిగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వమే వైద్య కళాశాలలు నిర్వహించాలని దళిత బహుజన ప్రజా సంఘాలు, పార్టీల ఐక్యవేదిక నేతలు కోరారు. 228 అర్జీలను డీఆర్వో, డిప్యూటీ కలెక్టర్ గంగరాజు, జిల్లా పరిషత్ సీఈవో వి.జ్యోతి బసు, డ్వామా పి.డి. శంకర్ పరిశీలించారు. -
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయిపై దాడి అనాగరిక చర్య
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ గుంటూరు వెస్ట్: సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బి.ఆర్ గవాయిపై సాక్షాత్తూ దేశ అత్యున్నత న్యాయస్థానంలో న్యాయవాది చేసిన దాడి సభ్యసమాజానికి సిగ్గుచేటని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు. సోమవారం స్థానిక డాక్టర్ బాబూ జగ్జీవన్‌రామ్ విగ్రహం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియాకు వినతిపత్రం అందజేశారు. కృష్ణమాదిగ విలేకరులతో మాట్లాడుతూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయి దళితుడు కావడం వల్లే ఈ దాడి జరిగిందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో అనేక అభిప్రాయాలుంటాయన్నారు. దానికి ఇలా దాడులు చేయడం అత్యంత హేయమన్నారు. దళితులు దేశంలో ఎన్నో వివక్షలకు గురౌతూ ఎదుగుతుంటే కొంత మంది ఓర్వలేక అక్కసుతోనే ఇటువంటి సంఘటనలకు పాల్పడుతున్నారన్నారు. దళితులు మరింత పట్టుదలతో ఉన్నత స్థానాలను పొందాలని కోరారు. గుంటూరు వెస్ట్: కేంద్ర ప్రభుత్వం తగ్గించిన జీఎస్టీ ఫలాలు అన్ని వర్గాల ప్రజలకు అందేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి షేఖ్ ఖాజావలి తెలిపారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద కార్మిక శాఖ ఆధ్వర్యంలో సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్‌లో భాగంగా నిర్వహించిన బైక్ ర్యాలీని డీఆర్వో జెండా ఊపి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ... తగ్గిన పన్నుల శాతంపై ప్రజలకు అవగాహన కల్పించడానికి గత నెల 22 నుంచి ఈ నెల 19వ తేదీ వరకు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని తెలిపారు. కార్మిక శాఖ బైక్ ర్యాలీ ద్వారా అవగాహన కల్పిస్తున్నందుకు అభినందనలు తెలిపారు. కార్మిక శాఖ సంయుక్త కమిషనర్ ఆశారాణి తదితరులు ప్రసంగించారు. బైక్ ర్యాలీ కలెక్టరేట్ నుంచి హిందూ కళాశాల సెంటర్, జిన్నా టవర్, బస్టాండ్, మంగళగిరి రోడ్డు మీదుగా ఆటోనగర్ వరకు కొనసాగింది. -
రాజస్తాన్‌లో రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఆర్మీ మేజర్ కన్నుమూత
జైసల్మీర్: రాజస్తాన్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్మీకి చెందిన ఒక అధికారి చనిపోగా మరో నలుగురు గాయపడ్డారు. ప్రాణాలు కోల్పోయిన మేజర్ టీసీ భరద్వాజ్(33) స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు అని అధికారులు తెలిపారు. ఈ ఘటన జైసల్మీర్ జిల్లాలోని గమ్నే వాలా గ్రామ సమీపంలో ఆదివారం సాయంత్రం 5 గంటల సమయంలో చోటుచేసుకుంది. రామ్‌గఢ్ వైపు నుంచి లొంగెవాలా వైపు వెళ్తున్న ఆర్మీ జిప్సీ వాహనం మూలమలుపులో అదుపు తప్పి బోల్తా పడింది. ఘటనలో లెఫ్టినెంట్ కల్నల్, ముగ్గురు మేజర్ స్థాయి అధికారులు, డ్రైవర్‌కు గాయాలయ్యాయి. వెంటనే వీరిని రామ్‌గఢ్ ఆస్పత్రికి తరలించారు. భరద్వాజ్ అప్పటికే కన్నుమూసినట్లు వైద్యులు ధ్రువీకరించారు. క్షతగాత్రులైన లెఫ్టినెంట్ కల్నల్ ప్రశాంత్ రాయ్(33), మేజర్ అమిత్, మేజర్ ప్రాచీ శుక్లా, డ్రైవర్ జవాన్ నసీరుద్దీన్‌లను ప్రాథమిక చికిత్స అనంతరం జైసల్మీర్, జోధ్‌పూర్‌లలోని ఆర్మీ ఆస్పత్రికి తరలించారు. మేజర్ ప్రాచీ శుక్లా తలకు, మేజర్ అమిత్ కుడి కన్ను వద్ద తీవ్ర గాయాలైనట్లు తనొత్ పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు. మేజర్ భరద్వాజ్ మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం ఆర్మీకి అప్పగించారు. -
ఎన్ఓసీ క్లియరెన్స్ కాలపరిమితి తగ్గింపునకు ప్రతిపాదనలు
గుంటూరు రూరల్: ఒక ప్రాంతంలో కొత్త వ్యాపారాన్ని స్థాపించేందుకు అనుకూల వాతావరణం కల్పించేందుకు పలు చర్యలు తీసుకుంటున్నామని, వాటిలో ఫైర్ ఎన్వోసీ క్లియరెన్్స్ కాలపరిమితిని తగ్గించడానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ పి.వి.రమణ చెప్పారు. నగర శివారులోని గోరంట్ల గ్రామంలోగల నెక్ట్స్ జెన్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఆదివారం జోన్–3 జిల్లాల ఫైర్ డిపార్ట్మెంట్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో ముఖ్య అతిథిగా డీజీ రమణ, సౌత్ జోన్ అడిషనల్ డైరెక్టర్ ఆర్. జ్ఞానసుందరం, రీజనల్ ఫైర్ ఆఫీసర్ జిలానీ పాల్గొన్నారు. రీజనల్ ఫైర్ ఆఫీసర్, గుంటూరు, డీడీఆర్ఎఫ్వోలు సమస్యలపై ప్రెజెంటేషన్ ఇచ్చారు. అన్ని కార్యకలాపాలను వివరంగా చర్చించారు. నేషనల్ బిల్డింగ్ కోడ్ ఆఫ్ ఇండియా (ఎన్బీసీ) ప్రకారం ఫైర్ సేఫ్టీ నామ్స్ సరిదిద్దడానికి అన్ని రకాల నోటీసులు జారీ చేయబడ్డాయని తెలిపారు. మేనేజ్మెంట్స్, ఫారమ్స్, స్కూల్స్, కళాశాలలకు నోటీసులు పంపామని, దశల వారీగా తీసుకోవాల్సిన మార్గదర్శకాలు జారీ చేసినట్లు డీజీ తెలిపారు. ప్రొవిజనల్ ఎన్వోసీ మూడు రోజుల్లోను, ఆక్యుపెన్సీ ఎన్వోసీ 21 రోజులలో జారీ చేయాలని, రెన్యువల్ ఎన్వోసీ 21 రోజులలో జారీ చేయాలని చెప్పారు. 15వ ఫైనాన్స్ కమిషన్ వర్క్స్, ఫండ్స్ కేటాయింపుపై చర్చించారు. సమావేశంలో ఆయా జిల్లాల ఫైర్ సర్వీసెస్ అధికారులు పాల్గొన్నారు. -
తురకపాలెంలో బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం
గుంటూరు రూరల్: రూరల్ మండలంలోని తురకపాలెంలో ఆకస్మిక మరణాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్పందిస్తూ మరణించిన ఒక్కో వ్యక్తి కుటుంబానికి రూ. 5 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించినట్లు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఆదివారం గ్రామంలో ఏర్పాటు చేసిన చెక్కుల పంపిణీలో ఆయన స్థానిక ఎమ్మెల్యే బి. రామాంజనేయులు, కలెక్టర్ తమీమ్ అన్సారియాతో కలిసి పాల్గొన్నారు. ఎమ్మెల్యే రామాంజనేయులు మాట్లాడుతూ తురకపాలెం తరహాలో అనారోగ్యాలు ప్రబలినప్పుడు కంటికి రెప్పలా ప్రజలను కాపాడుకోవాల్సిన అవసరం అందరి పైనా ఉందని తెలిపారు. -
ఫార్మసీ ప్రవేశాలకు కొత్త షెడ్యూల్
గుంటూరు ఎడ్యుకేషన్: ఏపీ ఈఏపీసెట్–2025లో అర్హత సాధించి, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థుల కోసం రాష్ట్ర ఉన్నత విద్యామండలి, సాంకేతిక విద్యాశాఖ సంయుక్తంగా సవరించిన షెడ్యూల్ విడుదల చేశాయి. ఉమ్మడి గుంటూరుజిల్లాలో 43 ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశాల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులు ఈనెల 14 వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంది. రిజిస్ట్రేషన్ పూర్తయిన విద్యార్థులు కళాశాలలను ఎంపిక చేసుకునేందుకు ఈనెల 14 నుంచి 17వ తేదీ వరకు ఆన్లైన్లో ఆప్షన్లు నమోదు చేసుకోవాల్సి ఉంది. దరఖాస్తు సమయంలోనే పూర్తయిన సర్టిఫికెట్ల పరిశీలన.. ఏపీ ఈఏపీ సెట్లో ర్యాంకులు సాధించిన విద్యార్థులు హెల్ప్‌లైన్ కేంద్రాలకు విధిగా వెళ్లాల్సిన అవసరం లేదు. దరఖాస్తు సమయంలోనే విద్యార్థులు సమర్పించిన టెన్త్, ఇంటర్ మార్కుల జాబితాలు, సామాజికవర్గ, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాల పరిశీలన ఆన్లైన్లో పూర్తి చేశారు. ధ్రువపత్రాల పరిశీలన అసంపూర్తిగా ఉన్న విద్యార్థులు వాటిని కంప్యూటర్ స్క్రీన్‌పై కనిపించే సూచనల ఆధారంగా తిరిగి, ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అనంతరం విద్యార్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. గుంటూరు శివారు నల్లపాడులోని ఎంబీటీఎస్ ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో హెల్ప్‌లైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 25 నుంచి తుది విడత కౌన్సెలింగ్ బైపీసీ స్ట్రీమ్ మొదటి విడత ప్రవేశాల ప్రక్రియ ముగిసిన వెంటనే కళాశాలల్లో మిగులు సీట్ల భర్తీ కోసం ఈనెల 25 నుంచి తుది విడత ప్రవేశాల ప్రక్రియ చేపట్టనున్నారు. ఏపీ ఈఏపీసెట్ బైపీసీ స్ట్రీమ్ నోటిఫికేషన్లోనే రెండు విడతలకు సంబంధించిన షెడ్యూల్ వివరాలను పొందుపర్చారు. -
జాతీయ రహదారిపై ప్రమాదం
గుర్తు తెలియని బస్సు ఢీకొని ఇద్దరు నేపాల్ యువకులు మృతి మంగళగిరి టౌన్: మంగళగిరిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నేపాల్ దేశానికి చెందిన ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. సేకరించిన వివరాల మేరకు గుంటూరు జిల్లా పెదకాకాని సమీపంలో వున్న ఓ బార్లో సుమారు సంవత్సరం నుంచి నేపాల్‌కు చెందిన మనోజ్ బిస్తా (26), రాకేష్ (34)లు పనిచేస్తున్నారు. భ్రమరాంబపురం కాలనీలో ఓ రూమ్ అద్దెకు తీసుకుని ఇద్దరూ ఉంటూ ప్రతిరోజూ విధులకు వెళ్లివస్తుంటారు. ఈ క్రమంలో శనివారం అర్ధరాత్రి 12 గంటలకు విధులను ముగించుకుని యజమాని దగ్గర నుంచి స్కూటీ తీసుకుని వెళ్లారు. తిరిగి వెళ్లే క్రమంలో ఆదివారం తెల్లవారుజామున 4:30 సమయంలో జాతీయ రహదారిపై విజయవాడ వైపు వెళుతుండగా మంగళగిరి వద్ద వెనుక నుంచి ఓ వాహనం ఢీకొట్టింది. దీంతో ఇద్దరు యువకులు రోడ్డుమధ్యలో పడిపోయారు. అదేసమయంలో వెనుక నుంచి ఓ గుర్తుతెలియని బస్సు వారిపై నుంచి వెళ్లడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. సమీపంలో వున్న ఓ వ్యక్తి చూసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఘటనా స్థలానికి చేరుకున్న మంగళగిరి పట్టణ ఎస్ఐ రవీంద్రనాయక్ మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం మంగళగిరి ఎయిమ్స్‌కు తరలించి మృతుల వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుల్లో మనోజ్ బిస్తా (26) యువకుడికి తల్లిదండ్రులు లేరని, 10 సంవత్సరాల నుంచి గుంటూరు నగరంలో వివిధ బార్లలో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడని ప్రాథమిక విచారణలో తేలినట్లు పోలీసులు తెలిపారు. నేపాల్‌లోని సౌరన ప్రస్తకీర్ ప్రాంతానికి చెందిన ఇద్దరు యువకుల్లో రాకేష్ (34)కు తండ్రి లేడని, అమ్మ, చెల్లి మాత్రమే ఉన్నారని, ఇతను గత సంవత్సర కాలం నుంచి బార్లో పనిచేస్తున్నాడని ఇద్దరూ రూమ్‌లో అద్దెకు ఉంటూ పెదకాకాని గోల్డెన్ బార్లో పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రాకేష్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించామని పేర్కొన్నారు. గుంటూరు ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాలనలో పారద ర్శకత, జవాబుదారీతనం కోసం సమాచార హక్కు చట్టం ఒక ఆయుధం వంటిదని రాష్ట్ర సమాచార కమిషనర్ పి.శామ్యూల్ జోనాథాన్ పేర్కొన్నారు. ఆదివారం బ్రాడీపేటలోని యూటీఎఫ్ హాలులో ఫోరమ్ ఫర్ ఆర్టీఐ ఆధ్వర్యంలో సమాచార హక్కుచట్టం అమల్లోకి వచ్చి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా చైతన్య సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న శామ్యూల్ జోనాథాన్ మాట్లాడుతూ సమాచారం పొందడం ప్రజల ప్రాథమిక హక్కు అని, ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని పొందవచ్చునని తెలిపారు. అవగాహన సంస్థ కార్యదర్శి కొండా శివరామిరెడ్డి మాట్లాడుతూ సమాచారహక్కు చట్టం సక్రమంగా అమలు కావడం లేదన్నారు. చట్టాన్ని ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందన్నారు. సదస్సులో దళిత బహుజన ఫ్రంట్ జాతీయ అధ్యక్షుడు కొరివి వినయ్‌కుమార్, ఫోరం ఫర్ ఆర్టీఐ అధ్యక్షుడు ఈమని హనుమంతరావు, కార్యదర్శి మద్దెల విజయకుమార్, డాక్టర్ ఎం.సుధ, కె.జయసుధ, విల్సన్ పాల్గొన్నారు. లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): విద్యుత్ కార్మిక వర్గ శ్రేయస్సు కోసం, సంస్థ పరిరక్షణకై కాంట్రాక్ట్ కార్మికులు, ఉద్యోగుల సమస్యలు పరిష్కారం అయ్యేవరకు పోరాటం కొనసాగిస్తామని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు, స్ట్రగుల్ కమిటీ డిస్కం నాయకులు డి.వెంకటేశ్వరరావు, ఎల్.రాజులు ఆదివారం తెలిపారు. విద్యుత్ కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ కార్మికుల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలన్నారు. దీనిలో భాగంగా ఈనెల 15న విద్యుత్ కాంట్రాక్ట్, జేఎల్ఎం, గ్రేడ్ 2 ఉద్యోగులు నిరవధిక సమ్మె చేయనున్నారని, జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం మహారాష్ట్రలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్న కార్మికులకు సంఘీభావం తెలిపారు. -
బ్రాహ్మణ వివాహ సమాచార కేంద్రం సేవలు శ్లాఘనీయం
తెనాలి: ఆంధ్రాప్యారిస్ తెనాలిలో నిర్వహిస్తున్న బ్రాహ్మణ ఉచిత వివాహ సమాచార కేంద్రం సేవలు శ్లాఘనీయమని రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య అధ్యక్షుడు కామేశ్వర ప్రసాద్ అన్నారు. స్థానిక నూకల రామకోటేశ్వరరావు కళ్యాణ కళాసదనంలో ఆదివారం 15వ రాష్ట్రస్థాయి బ్రాహ్మణ వధూవరుల పరిచయవేదిక జరిగింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన సమావేశానికి సంఘ అధ్యక్షుడు దక్షిణామూర్తి అధ్యక్షత వహించారు. ఐదు రాష్ట్రాల్నుంచి 750 కుటుంబాలవారు పాల్గొన్నారు. ముఖ్యఅతిథి కామేశ్వరప్రసాద్ వివాహవేదిక సమాచార పుస్తకాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు. శాఖ భేదాన్ని చూడకుండా వివాహాలు జరుపుకోవాలని హితవు పలికారు. రాష్ట్రస్థాయిలో 15 పర్యాయాలు పరిచయ వేదికను తెనాలిలో నిర్వహించటం గొప్పగా ఉందన్నారు. సంఘ అధ్యక్షుడు దక్షిణామూర్తి మాట్లాడుతూ వైష్ణవి కేటరర్స్ హైదరాబాద్, బ్రాహ్మణ పరిషత్, వివిధ బ్రాహ్మణ సంఘాలు, అర్చక సంఘాల సహకారంతో నిర్వహించినట్టు తెలిపారు. తెనాలిలో ప్రతి ఆదివారం ఉచిత సమాచార సేవలను అందిస్తున్నట్టు గౌరవ అధ్యక్షుడు ప్రకాష్‌రావు చెప్పారు. సమాచార వేదికను ఏర్పాటుచేసిన సూర్యప్రకాశరావు, సుబ్బారావు సత్యబాబు, రామ్మోహనరావు ఆశయానికి అనుగుణంగా సేవలు అందిస్తున్నట్టు కోశాధికారి రాజేంద్రప్రసాద్ చెప్పారు. వివిధ విభాగాల ద్వారా బ్రాహ్మణులకు, బ్రాహ్మణ సంఘాలకు సేవలు అందిస్తున్న ప్రముఖులను సత్కరించారు. ఏపీపీఎస్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వేదం హరిప్రసాద్, నెల్లూరు హైదరాబాదు ప్రాంతాల ప్రతినిధులు ఉమాదేవి, జయలక్ష్మి, విశ్వనాథం, మనవ రాము, కందాల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి సత్యకుమార్, ఉపాధ్యక్షుడు ఆమంచి రాంబాబు, సంయుక్త కార్యదర్శి వేణుధర్, బీఎల్ సత్యనారాయణమూర్తి, పూర్ణ భాస్కర్, శ్రీనివాస్, కోదండ రామమూర్తి, వివిధ బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు సాయి, శ్రీనివాసమూర్తి, వేణుగోపాల్ పాల్గొన్నారు. ఐదు రాష్టాల్నుంచి 750 కుటుంబాలు హాజరుకావటం విశేషం! 15వ రాష్ట్రస్థాయి బ్రాహ్మణ వధూవరుల పరిచయ వేదికలో రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య అధ్యక్షుడు కామేశ్వర ప్రసాద్ -
నకిలీ మద్యం కుంభకోణం.. ఏపీ రాష్ట్రవ్యాప్త నిరసనలకు వైఎస్సార్సీపీ పిలుపు
తాడేపల్లి : నకిలీ మద్యం కుంభకోణంతో కూటమి ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న క్రమంలో రేపు(సోమవారం, అక్టోబర్ 13వ తేదీ) రాష్ట్ర వ్యాప్త నిరసనలకు వైఎస్సార్సీపీ పిలుపునిచ్చింది. నకిలీ మద్యం తయారీని చంద్రబాబు సర్కార్ కుటీర పరిశ్రమలా మార్చిన నేపథ్యంలో వైఎస్సార్సీపీ నిరసనలకు పిలుపునిచ్చింది. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లోని ఎక్సైజ్ కార్యాలయాల ఎదుట నిరసనలు చేపట్టనుంది. నకిలీ మద్యం రాకెట్లో ఉన్న వారందర్నీ అరెస్ట్ చేయాలనే డిమాండ్‌తో ఆందోళనలకు పిలుపునిచ్చింది వైఎస్సార్సీపీ. నకిలీ మద్యంతో ప్రజల ప్రాణాలను బలపీఠంపై పెట్టడంపై నెట్టింట ఆగ్రహం వ్యక్తమవుతుంది. ఇదీ చదవండి: నకిలీ మద్యంలో ఈ ప్రశ్నలకు బదులేది..? -
పెద్దాసుపత్రికి సుస్తీ
గుంటూరు మెడికల్: ఉమ్మడి ఏపీలో పేదల పెద్దాసుపత్రిగా పేరు గడించిన గుంటూరు జీజీహెచ్‌లో సమస్యలు ఏకరవు పెడుతున్నాయి. ఇటీవల డయేరియా బాధితుల వార్డులో వసతులు లేక రోగులు నరకయాతన పడ్డారు. నేడు పెద్దాసుపత్రికి చికిత్స కోసం వచ్చిన బీసీ హాస్టల్ విద్యార్థులు కూడా అవస్థలు పడుతున్నారు. పిల్లల వార్డులో పలు సమస్యలు తిష్ట వేశాయి. ఇటీవల గుంటూరు నగరంలో డయేరియాతో సుమారు 200 మంది వరకు గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందారు. బాధితుల కోసం ఆస్పత్రి అధికారులు ఏర్పాటు చేసిన ప్రత్యేక వార్డులో వసతులు కరువయ్యాయి. సైలెన్ స్టాండ్స్ సరిపడా లేక కిటికీలకు వేలాడదీశారు. పడకలపై బెడ్ షీట్స్ లేవు. మరుగుదొడ్లలో నీటి సమస్య నెలకొంది. పారిశుద్ధ్య నిర్వహణ సరిగా లేదు. సమస్యల మధ్యే రోగులు చికిత్స పొందారు. సమస్యలు స్వాగతం నేడు వాంతులు, విరేచనాలతో అనపర్రు బీసీ హాస్టల్ విద్యార్థులు పిల్లల వైద్య విభాగానికి వచ్చారు. ఒక పక్క అనారోగ్యంతో బాధపడుతూ, మరో పక్క వార్డులో వసతుల లేమి, సమస్యల మధ్యే చికిత్స పొందుతున్నారు. వార్డు వ్యాధి బాధితులతో కిక్కిరిసి పోయింది. ఏసీలు పనిచేయక చిన్నారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. పడకలపై కనీసం బెడ్షీట్లు కూడా లేవు. మంచాలు సైతం తుప్పు పట్టిపోయాయి. రోగి పడుకుని చికిత్స పొందాలంటేనే భయపడే విధంగా ఉన్నాయి. వార్డుల్లో వైద్య సిబ్బందికి సైతం వసతులు లేక ఇక్కట్లు తప్పడం లేదు. పిల్లల వార్డులోని బాత్రూమ్కు కనీసం డోర్ కూడా లేకపోవడం దారుణం. తనిఖీలకే అధికారులు పరిమితం ఆస్పత్రి అధికారులు ప్రతిరోజూ తనిఖీల పేరుతో పలు వార్డుల్లో తిరుగుతున్నా ప్రయోజనం లేదు. వార్డుల్లో సమస్యలు అధికారులు కనిపించటం లేదా? అని బాధితులు ప్రశ్నిస్తున్నారు. సమస్యలను ఉన్నతాధికారులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినా పరిష్కారం లభించటం లేదనే ఆరోపణలు సిబ్బంది నుంచి వినిపిస్తున్నాయి. ప్రతి శుక్రవారం ప్రత్యేకంగా ‘మీ కోసం మేము’ అనే కార్యక్రమాన్ని ఆస్పత్రి అధికారులు నిర్వహిస్తున్నారు. రోగులను ఒకచోట సమావేశపరిచి సమస్యలు ఉంటే చెప్పాలని, తక్షణమే పరిష్కరిస్తామని భరోసా మాటలు చెబుతున్నారు. అయితే, అవి కార్యరూపం దాల్చడం లేదు. అధికారుల తూతూమంత్రంగా తనిఖీలు చేసి సమస్యలు పట్టించుకోవటం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఆస్పత్రి అధికారులు ఇకనైనా స్పందించి, ప్రశాంతమైన వాతావరణంలో వైద్యసేవలు అందించేలా చూడాలని పలువురు రోగులు కోరుతున్నారు. -
ఆరోగ్యం కుదుటపడ్డాకే విద్యార్థుల డిశ్చార్జి
టెలీ కాన్ఫరెన్స్‌లో మంత్రి సవిత స్పష్టం గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న అన్నపర్రు బీసీ హాస్టల్ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, వారి ఆరోగ్యం పూర్తిగా మెరుగయ్యాకే డిశ్చార్జి చేయాలని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత ఆదేశించారు. హాస్టల్ విద్యార్థుల ఆరోగ్య స్థితిగతులపై బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఎస్.సత్యనారాయణ, డైరెక్టర్ మల్లికార్జున, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ యశశ్వి రమణతో మంత్రి సవిత శనివారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి గురించి జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ యశశ్వి రమణను అడిగి తెలుసుకున్నారు. 60 మంది విద్యార్థులు వాంతులు, విరేచనాలతో ఆసుపత్రిలో చేరగా, ప్రస్తుతం 24 మంది మాత్రమే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, ఒక విద్యార్థి ఐసీయూలో చికిత్స అందజేస్తున్నామని జీజీహెచ్ సూపరింటెండెంట్ వివరించారు. ఆ విద్యార్థి ఇంతకుముందు నుంచే కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతుండడంతో ఐసీయూలో వైద్యమందిస్తున్నామని తెలిపారు. మరో ఇద్దరు విద్యార్థులు పెదనందిపాడు కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక వైద్య శిబిరంలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. మిగిలిన విద్యార్థులను ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేశామన్నారు. మంత్రి సవిత స్పందిస్తూ, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ఆరోగ్యం పూర్తిగా కుదుటపడిన తరవాతే ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేయాలని ఆదేశించారు. విద్యార్థుల ఆరోగ్యంపై గంటకు గంటకూ అప్ డేట్ ఇవ్వాలని స్పష్టం చేశారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న విద్యార్థిని తక్షణమే ఎయిమ్స్‌కు తరలించాలని మంత్రి సవిత ఆదేశించారు. వైద్యుల పర్యవేక్షణ తప్పనిసరి డిశ్చార్జి అయిన వారితో పాటు హాస్టల్లో మిగిలిన విద్యార్థులను వైద్యుల పర్యవేక్షణలో ఉంచాలని బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి సత్యనారాయణను, డైరెక్టర్ మల్లికార్జునను మంత్రి సవిత ఆదేశించారు. హాస్టల్లో పరిశుభ్రతతపై తీసుకున్న చర్యల గురించి డీబీసీడబ్ల్యూవో మయూరిని అడిగి తెలుసుకున్నారు. కాచి చల్లార్చిన నీటితోపాటు తాజా ఆహారమే వారికి అందివ్వాలన్నారు. హాస్టల్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, దోమలు వృద్ధి చెందకుండా బ్లీచింగ్ చల్లాలని స్పష్టం చేశారు. హాస్టల్ పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇళ్లకు వెళ్లదలుచుకున్న విద్యార్థులను వారి తల్లిదండ్రులను పిలిచి వారితో పంపించాలని సూచించారు. ఘటనలు పునరావృతం కానివ్వొద్దు అన్నపర్రు బీసీ హాస్టల్ లాంటి ఘటన రాష్ట్రంలో పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి సవిత ఆదేశించారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల నేపథ్యంలో నిరంతరం అప్రమత్తంగా ఉండేలా వార్డెన్లను ఆదేశించాలన్నారు. డీబీసీడబ్ల్యూవోలు తమ పరిధిలో హాస్టళ్లను నిరంతం పర్యవేక్షించాలని తెలిపారు. హాస్టళ్లలో వార్డెన్లు ఉండేలా చూడాలని, బయట ఆహారం లోపలకు రాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యార్థులను సొంత బిడ్డల్లా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని టెలీ కాన్ఫరెనన్స్‌లో మంత్రి సవిత స్పష్టం చేశారు. -
జీజీహెచ్‌ను సందర్శించిన కలెక్టర్
గుంటూరు మెడికల్: ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్)ని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా శనివారం సందర్శించారు. వివిధ వార్డుల్లో చికిత్స పొందుతున్న వారిని పరిశీలించారు. బీసీ వసతి గృహం విద్యార్థులను, వారి తల్లిదండ్రులను సందర్శించారు. విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ యశశ్వి రమణ తెలియజేశారు. విద్యార్థులకు, అత్యవసర చికిత్సల కోసం వచ్చే ప్రజలకు తక్షణ వైద్య సేవలు అందించడానికి వైద్యులు సిద్ధంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. అన్ని రకాల మందులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. వివిధ విభాగాల్లో మరమ్మతులకు గురైన పరికరాలను ఉపయోగంలోకి తీసుకుని రావాలని చెప్పారు. విద్యార్థులంతా సేఫ్ అన్నపర్రు వసతి గృహంలో విద్యార్థులంతా ఆరోగ్యంగానే ఉన్నారని జిల్లా సాంఘిక, బీసీ సంక్షేమ అధికారి చెన్నయ్య తెలిపారు. జిల్లాలో ఉన్న 33 వసతి గృహాలకు గాను, 24 చోట్ల ఇప్పటికే నీటి నమూనా పరీక్షలు నిర్వహించామని చెప్పారు. మిగిలిన చోట్ల త్వరలో పూర్తి చేస్తామని చెప్పారు. అన్ని వసతి గృహాల్లో విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని, తాగునీటి ట్యాంకులను శుభ్రం చేసినట్లు తెలిపారు. జిల్లా పంచాయతీ అధికారి బి.వి. నాగసాయికుమార్, ఇతర అధికారులు అన్నపర్రులో పర్యటించారు. పారిశుద్ధ్య పనులు, తాగునీటి పరిస్థితులు పరిశీలించారు. -
నగరపాలక సంస్థ అప్కాస్ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం
నెహ్రూనగర్: గుంటూరు నగరపాలక సంస్థ అప్కాస్ ఉద్యోగి ఉదయ్‌చంద్ర శనివారం ఆత్మహత్యాయత్నం చేశాడు. ‘‘ఎలక్ట్రికల్ ఏఈ మధు నన్ను విధుల్లో ఇబ్బందులకు గురి చేయడంతో పాటు దుర్భాషలాడాడని.. నా చావుకు మధునే కారణం’’ అని సెల్ఫీ వీడియో తీసుకుని పోస్ట్ చేయడంతో సోషల్ మీడియాలో కలకలం రేపింది. స్నేహితులు అడ్డుకోవడంతో ఆత్మహత్యాయత్నాన్ని ఆపేసినట్లు ఉదయ్‌చంద్ర తెలిపాడు. దీనిపై ఏఈ మధుసూదన్‌రావును వివరణ కోరగా గతంలో జరిగిన కౌన్సిల్ సమావేశంలో ఉదయ్చంద్రపై పశ్చిమ ఎమ్మెల్యే పలు ఆరోపణలు చేశారన్నారు. విధులు సక్రమంగా నిర్వహించడం లేదని, లైట్లు ఆన్/ఆఫ్ సక్రమంగా చేయడం లేదని, ఫోన్లు లిఫ్ట్ చేయడం లేదని సభ దృష్టికి తెచ్చారన్నారు. కార్పొరేటర్ల ఫోన్లకు స్పందించడం లేదని, ఉదయ్చంద్రను విధుల నుంచి తీసివేయాలని సూచించడంతో కొన్ని రోజులు ఆపామని ఏఈ వివరించారు. భవిష్యత్తులో ఇలాంటి పొరపాటు మళ్లీ చేయనని చెప్పడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు 29, 30వ డివిజన్లలో పనిచేస్తున్న ఉదయ్చంద్రను బుడంపాడు లైట్లు ఆన్/ఆఫ్‌కు మార్చినట్లు తెలిపారు. ఆ విధులకు కూడా హాజరు కాకపోవడంతో అతన్ని ప్రశ్నించడంతో ఆత్మహత్యాయత్నం చేస్తున్నట్లు బెదిరింపులకు దిగాడని మధు వివరించారు. -
సచివాలయ ఉద్యోగుల పోరుబాట
తెనాలి అర్బన్: కూటమి ప్రభుత్వం జాబ్ చార్టుకు వ్యతిరేకంగా సచివాలయ ఉద్యోగులకు అన్ని రకాల విధులను అప్పగించటం వల్ల వారి ఆత్మగౌరవం దెబ్బతింటోందని డెమోక్రటిక్ ఏపీసీఎస్డబ్ల్యూఎస్ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కోఆర్డినేటర్ బండికల్ల సతీష్ ఆవేదన వ్యక్తం చేశారు. జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో తెనాలిలోని సామ్రాట్ హోటల్లో శనివారం అత్మగౌరవ సభను నిర్వహించారు. సమావేశానికి జేఎసీ రాష్ట్ర చైర్మన్ జి. జోసఫ్ కిశోర్ అధ్యక్షత వహించారు. సతీష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వలంటీర్ల వ్యవస్థను రద్దు చేసి వారి విధులను కూడా సచివాలయంలోని ఉద్యోగులకు అప్పగించడం వల్ల సతమతమవుతున్నారని తెలిపారు. వలంటీర్ల కోసం ఏర్పాటు చేసిన క్లస్టర్లను ఉద్యోగులకు బదలాయించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. న్యాయమైన కోర్కెలను పరిష్కరించాలని కోరుతున్నా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదని విమర్శించారు. ఉద్యోగులపై పని భారం పెంచటం వల్ల మానసిక ఒత్తిడికి గురై కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు జేఎసీలుగా చలామణి అవుతూ తప్పుడు నిర్ణయాలు తీసుకుని ఉద్యోగులకు నష్టం కలిగిస్తున్నారని ఆరోపించారు. దీనివల్ల రెండు వేల మందిపై క్రమశిక్షణ చర్యలకు ప్రభుత్వం దిగిందని, వెంటనే దాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల మనోభావాలకు అనుగుణంగా ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తున్నామని చెప్పారు. జేఏసీ రాష్ట్ర వర్కింగ్ సెక్రటరీ అప్పికట్ల కిశోర్ మాట్లాడుతూ మహిళా ఉద్యోగులపై కొందరు అనుచితంగా ప్రవర్తిస్తున్నారని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్పష్టమైన జాబ్ చార్టును ప్రభుత్వం ప్రకటించాలని కోరారు. జేఎసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. కిరణ్ కుమార్ మాట్లాడుతూ నోషనల్ ఇంక్రిమెంట్ ప్రకటించటంతో పాటు హేతుబద్ధంగా పదోన్నతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. అంతర్ జిల్లాల బదిలీలకు అనుమతి ఇవ్వాలని కోరారు. సమావేశంలో ట్రెజరర్ దుర్గాప్రసాద్, కన్వీనర్లు జీవన్ సాగర్, మదన్ మోహన్, శంకరరావు, శామ్యూల్, డైమండ్ బాబు, కీర్తి సాగర్ పాల్గొన్నారు. తెనాలిలో కార్యాచరణ ప్రకటించిన రాష్ట్ర జేఎసీ నాయకులు -
విజ్ఞాన్ యూనివర్సిటీలో 5జీ ల్యాబ్ ప్రారంభం
చేబ్రోలు: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీలో భారత ప్రభుత్వ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డీవోటీ) ఆర్థిక సహకారంతో ఏర్పాటు చేసిన 5జీ ల్యాబ్ – గ్లోబల్ డిజిటల్ ఇన్నోవేషన్ సెంటర్‌ను బీఎస్ఎన్ఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఏ.రాబర్ట్ జే రవి వర్చువల్‌గా శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 5జీ ల్యాబ్ ద్వారా విద్యార్థులు, పరిశోధకులు, స్టార్టప్‌లు నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడమే కాకుండా, విద్య, వైద్యం, వ్యవసాయం, విద్యుత్, స్మార్ట్ సిటీస్, లాజిస్టిక్స్, ఈ–గవర్నెన్స్ వంటి కీలక రంగాలలో నవీన ఆవిష్కరణలు, అనువర్తనాలను అభివృద్ధి చేసే దిశగా ప్రోత్సహించడమే లక్ష్యమన్నారు. ల్యాబ్‌లో పూర్తిస్థాయి 5జీ స్టాండలోన్ సెటప్ ఏర్పాటు చేయబడిందని, ఇందులో సిమ్‌లు, డాంగిల్స్, ఐవోటీ గేట్వేలు, రౌటర్లు, అప్లికేషన్ సర్వర్లు మొదలైన పరికరాలు ఉంటాయన్నారు. బీఎస్ఎన్ఎల్ ఏపీ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ ఎం.శేషాచలం మాట్లాడుతూ 5జీ ల్యాబ్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశోధకులు, విద్యార్థులు రియల్‌టైమ్‌లో కలిసి పనిచేసే అవకాశం లభిస్తుందని అన్నారు. ప్రాజెక్ట్ ఆధారిత లెర్నింగ్, లైవ్ డేటా అనలిటిక్స్ ద్వారా పరిశోధన మరింత బలోపేతం అవుతుందని వివరించారు. విజ్ఞాన్ విద్యాసంస్థల చైర్మన్ లావు రత్తయ్య మాట్లాడుతూ విద్యార్థులు నూతన సాంకేతికతలలో ముందంజలో ఉండేందుకు 5జీ ల్యాబ్ ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుందని తెలిపారు. కార్యక్రమంలో విజ్ఞాన్ విద్యాసంస్థల వైస్ చైర్మన్ లావు శ్రీకృష్ణదేవరాయలు, వైస్ చాన్స్‌లర్ పి.నాగభూషణ్, రిజిస్ట్రార్ పీఎంవీ రావు, డీన్లు పాల్గొన్నారు. -
వ్యర్థాలతో వ్యాప్తి చెందుతున్న క్యాన్సర్
తెనాలి: ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలు పంట పొలాలు, నీటిలో కలుస్తుండటంతో క్యాన్సర్ వ్యాప్తి చెందుతోందని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. ఈ పరిస్థితి దీర్ఘకాలం ఉండరాదనే తెనాలికి రూ.30 కోట్ల వ్యయంతో 10 ఎంఎల్డీ లీటర్ల మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని తీసుకొచ్చినట్టు చెప్పారు. పట్టణ పూలే కాలనీలో నిర్మించిన మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని శనివారం రాష్ట్ర ఆహార, పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. ముఖ్య అతిథి పెమ్మసాని మాట్లాడుతూ తెనాలి రైల్వేస్టేషను అభివృద్ధి చెందుతోందని తెలిపారు. తెనాలి–మంగళగిరి రోడ్డు, నారాకోడూరు–తెనాలి రోడ్డును అద్దంలాగ తీర్చిదిద్దినట్టు చెప్పారు. డాక్టర్ ప్రతాప్ కోటి రూపాయల వితరణతో జిల్లా ఆసుపత్రిని అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. వీటిన్నిటి నిర్వహణను ఎక్కడికక్కడ స్థానికులతో ఏర్పాటైన కమిటీలు పర్యవేక్షించాలని సూచించారు. ప్రజలంతా నగదు స్థానంలో డిజిటల్ చెల్లింపులు చేస్తే అమరావతి అమెరికాలా అవుతుందని సూచించారు. జీఎస్టీ తగ్గింపు పాటించని వ్యాపారులను ప్రశ్నించాలని కోరారు. సభకు అధ్యక్షత వహించిన మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ మురుగునీటి సమస్య పరిష్కారానికి ప్రస్తుతం ప్రారంభించిన ప్లాంటుతో పాటు పట్టణానికి రెండో వైపున మరో 10 ఎంఎల్డీ లీటర్ల మురుగునీటి శుద్ధి ప్లాంట్ నిర్మాణానికి కృషి చేస్తామని చెప్పారు. ప్రజారోగ్యశాఖ, మున్సిపాలిటీలు ఒక నోడల్ అధికారితో ప్లాంట్ నిర్వహణను సమీక్షిస్తుండాలని సూచించారు. స్వచ్ఛత కోసం ప్రభుత్వం చేస్తున్న కృషికి ప్రజల సహకారం ఉండాలని కోరారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ అమృత పథకం కింద నిర్మించిన చాలా ప్లాంట్లలో నిర్వహణ సరిగా లేదని తెలిపారు. తెనాలి ప్లాంటును సక్రమంగా నిర్వహించాలని సూచించారు. వార్డు కౌన్సిలర్ కఠారి రత్నకుమారి పలు ప్రధాన సమస్యలను సభ దృష్టికి తీసుకొచ్చారు. జిల్లా సహకార మార్కెటింగ్ చైర్మన్ హరిబాబు, మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక, కమిషనర్ రామ అప్పలనాయుడు, ప్రజారోగ్యశాఖ, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. -
109 మంది వీవీఐబీయూ విద్యార్థులకు ఉద్యోగాలు
పెదకాకాని: వాసిరెడ్డి వెంకటాద్రి ఇంటర్నేషనల్ టెక్నలాజికల్ యూనివర్సిటీ (వీవీఐబీయూ)కి చెందిన 109 మంది విద్యార్థులు కాగ్నిజెంట్ (డిజిటల్ నర్పూర్) డెల్టా ఎక్స్, ప్లిస్ట్ ల్యాబ్స్, జెన్ట్రీ ట్యాబ్స్, టెక్ అవుట్ సొల్యూషన్స్, ఈఫిల్ టెక్ సొల్యూషన్స్, పాలెక్, సెర్పాడ్ వంటి బహుళ జాతీయ సంస్థల్లో ఉద్యోగాలు పొందారని వైస్ చైర్మన్ వాసిరెడ్డి మహదేవ్ తెలిపారు. మండలంలోని నంబూరు వీవీఐటీ యూనివర్సిటీలో ఆగస్టు, సెప్టెంబర్లలో నిర్వహించిన ప్రాంగణ ఎంపికల్లో 2022–2026 బ్యాచ్ విద్యార్థులు రూ.3 లక్షల నుంచి రూ. 8 లక్షల వార్షిక వేతనంతో నియామకాలు పొందారని తెలిపారు. -
కల్తీ మద్యం తయారీదారుల వెనుక చంద్రబాబు, లోకేష్
సాక్షి,తాడేపల్లి: తాడేపల్లి: రాష్ట్రంలో కల్తీ మద్యం తాగిన ఘటనలో పలువురు మరణించారు. అందుకే ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి డిమాండ్ చేశారు. తాడేపల్లిలో వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయంలో ఆమె శనివారం(అక్టోబర్11)న మీడియాతో మాట్లాడారు.‘కల్తీ మద్యం కేసును సీబీఐకి ఇవ్వాలి. కల్తీ మద్యం తయారీ దారుల వెనుక చంద్రబాబు, లోకేష్ ఉన్నారు. అందుకే కేసును నీరు గార్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ ఎందుకు బయటకు రావటం లేదు?.నకిలీ మద్యం గురించి చంద్రబాబు మాట్లాడాలి.జయచంద్రారెడ్డి టీడీపీ పెద్దలకు కోట్ల రూపాయలు ఇచ్చి టికెట్ తీసుకున్నారు. అలాంటి వ్యక్తిని వైఎస్సార్సీపీ కోవర్టు అని ముద్ర వేస్తున్నారు. మరి జయచంద్రారెడ్డి వైఎస్సార్సీపీ కోవర్టులయితే టికెట్ ఎందుకు ఇచ్చారు?. లావు శ్రీకృష్ణదేవరాయలు సహా ఇప్పుడు ఉన్న కొందరు మంత్రులు కూడా మా కోవర్టులే.మరి వాళ్లపై చర్యలు తీసుకునే ధైర్యం ఉందా?.ఏపీలో కల్తీ మద్యం ఫ్యాక్టరీలను ఏర్పాటు చేశారు. రేపల్లె, ఏలూరు సహా అనేక చోట్ల టీడీపీ నేతలు నకిలీ మద్యం కింగ్ పిన్‌లా మారారు. మా ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాలు అత్యంత పారదర్శకంగా జరిగాయి.ఎక్కడా నకిలీ, కల్తీకి ఆస్కారం లేకుండా చేశారు.కానీ టీడీపీ నేతలు తమ జేబులు నింపు కోవటానికి నకిలీ మద్యం తయారు చేస్తున్నారు.ఈ మద్యంతో రాష్ట్రంలో మహిళల తాళి బొట్టు తెంచుతున్నారు. చంద్రబాబు హయాంలో నకిలీ లిక్కర్ ఫ్యాక్టరీలు పెరిగి పోయాయి. ప్రతి నాలుగు సీసాల్లో ఒకటి నకిలీ మద్యమే. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం తనిఖీలు చేయటం లేదు. ప్రభుత్వ పెద్దల కుట్ర దీని వెనుక ఉంది. అయినప్పటికీ ఎల్లో మీడియాలో వార్తలు రావటం లేదు. నకిలీ మద్యం కావడం వల్లే తెలంగాణ వెళ్లి కొనుగోలు చేస్తున్నారు’అని అన్నారు. -
పసివాళ్లంటే ఎంత అలుసో..!
చంద్రబాబు సర్కారు నిర్లక్ష్యంతో ఆసుపత్రి పాలైన హాస్టల్ విద్యార్థులు ప్రత్తిపాడు: పెదనందిపాడు మండలం అన్నపర్రులోని బీసీ హాస్టల్లో నాలుగు నుంచి పది తరగతుల వరకు మొత్తం 107 మంది విద్యార్థులున్నారు. వీరికి గురువారం రాత్రి బెండకాయ వేపుడు, రసం, మజ్జిగతో భోజనం పెట్టారు. శుక్రవారం తెల్లవారుజాము నుంచి ఒకరి తరువాత ఒకరు వాంతులు, విరేచనాలు, కడుపునొప్పితో బాధపడుతున్నారు. గమనించిన నైట్ వాచ్‌మన్ విషయాన్ని ఉదయం విధులకు వచ్చిన కుక్ కల్పనకు చెప్పారు. అప్పటికే 17 మంది అస్వస్థతకు గురై బాధపడుతుండటంతో కల్పన వారిని ఆటోలో పెదనందిపాడు పీహెచ్‌సీకి తరలించారు. ఉదయం కిచిడీ, టమాట చట్నీతో టిఫిన్ చేసిన తరువాత అదేవిధంగా బాధపడుతున్న మరో 37 మంది విద్యార్థులను కూడా ఆస్పత్రికి తరలించారు. వారిలో 16 మందిని మెరుగైన చికిత్స నిమిత్తం గుంటూరు జీజీహెచ్‌కు 108 వాహనాల్లో పంపించారు. సాయంత్రానికి 21 మందిని డిశ్చార్జ్ చేసి హాస్టల్‌కు తరలించగా, 17 మంది శిబిరంలో చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న కలెక్టర్ తమీమ్ అన్సారియా పెదనందిపాడు పీహెచ్‌సీకి చేరుకుని బాధిత విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులుతో కలిసి హాస్టల్‌ను పరిశీలించారు. సిబ్బందితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఆస్పత్రిలో సరిపోని బెడ్లు ఒక్కసారే సుమారు యాభై మంది విద్యార్థులు అస్వస్థతకు గురై ఆస్పత్రికి రావడంతో ఆస్పత్రిలో ఉన్న బెడ్లు సరిపోలేదు. దీంతో ఒక్కో మంచంపై ఇద్దరు, ముగ్గురు, నలుగురిని కూడా పడుకోబెట్టి చికిత్స అందించారు. మంచం చుట్టూ సైలెను స్టాండ్లు పెట్టడంతో చేతులు అటూ ఇటూ కదపలేక, కడుపునొప్పి తాళలేక విద్యార్థులు నరరకయాతన అనుభవించారు. అనంతరం వారి ఇబ్బందులను గమనించిన కలెక్టర్.. కల్యాణమండపంలో స్పెషల్ క్యాంప్ ఏర్పాటు చేయించారు. సైలెన్ స్టాండ్లు కూడా సరిపడినన్ని లేకపోవడంతో విద్యార్థులే ఒక చేతితో సైలెన్ బాటిల్ పట్టుకుని కనిపించగా, మరికొందరికి ఆశా కార్యకర్తలు బాటిళ్లు పట్టుకోవాల్సి వచ్చింది. తీవ్ర జ్వరంతో బాధపడుతూ.. అస్వస్థతకు గురైన విద్యార్థుల్లో పదహారు మందిని మెరుగైన చికిత్స నిమిత్తం గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. జ్వరం కూడా ఉన్నట్లు వైద్యులు గమనించారు. విద్యార్థులు ఇంత పెద్ద సంఖ్యలో అస్వస్థతకు గురవ్వడానికి స్పష్టమైన కారణాలు తెలియడం లేదు. దీంతో ఆయా శాఖల అధికారులు ఆహార పదార్థాల, తాగునీటి నమూనాలను సేకరించారు. ఇదిలా ఉంటే బుధవారం రాత్రి కూడా బయటి నుంచి బిర్యానీ, కలియా, పెరుగు చట్నీలు వచ్చాయి. వాటిని విద్యార్థులకు అందించారు. మరుసటి రోజు నుంచి కడుపునొప్పితో బాధపడినట్లు కొందరు విద్యార్థులు చెప్పారు. మంత్రి దుర్గేష్ ఆరా గుంటూరు మెడికల్: హాస్టల్లో విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై జిల్లా ఇన్చార్జి మంత్రి కందుల దుర్గేష్ ఆరా తీశారు. వారు అస్వస్థతకు గురవ్వడం బాధాకరమని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వ అలసత్వం... బీసీ సంక్షేమ శాఖ అధికారుల నిర్లక్ష్యం.. ఉన్నతాధికారుల ఉదాసీనత వెరసి వసతి గృహ విద్యార్థులు ఆస్పత్రిపాలయ్యేలా చేసింది. 54 మంది అస్వస్థతకు గురవడంతో కలకలం రేగింది. ఘటనకు కారణం కలుషిత ఆహారమేనని అధికారులు భావిస్త్తున్నారు. పేద పిల్లల ప్రాణాలంటే కూటమి సర్కారుకు ఎంత అలుసో చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం. గురువారం రాత్రి విద్యార్థులు భోజనం చేసే సమయంలోగానీ, ఉదయం విద్యార్థులు అస్వస్థతకు గురైనప్పుడుగానీ, వారిని ఆస్పత్రికి తరలించే సమయంలోగానీ వార్డెన్ అందుబాటులో లేకపోవడం ఆయన విధుల పట్ల వహిస్తున్న నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. కుక్కు సమీప బంధువు అయిన అశోక్ గత కొద్ది నెలలుగా హాస్టల్లో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇతనికి జీతం కూడా వార్డెన్ తన జేబు నుంచే చెల్లిస్తున్నట్లు చెబుతున్నారు. అశోక్ గురువారం రాత్రి వాంతులు, విరేచనాలతో బాధపడుతూ ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. నీరు మాత్రమే తాగాడని సిబ్బంది చెబుతున్నారు. -
ఎన్టీఆర్ వైద్యసేవ బంద్
గుంటూరు మెడికల్: జిల్లా వ్యాప్తంగా పేదలకు ఉచిత వైద్య సేవలు నిలిచిపోయాయి. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా వైద్య సేవలు అందించిన నెట్వర్క్ ఆసుపత్రులకు కూటమి ప్రభుత్వం బకాయిలు చెల్లించలేదు. దీంతో ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శుక్రవారం జిల్లా వ్యాప్తంగా నెట్వర్క్ ఆసుపత్రుల్లో వైద్య సేవలను నిలిపివేశారు. బంద్ పాటించారు. జిల్లా వ్యాప్తంగా 154 నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఈ ఉచిత వైద్య సేవలు అందిస్తున్నారు. వీటిల్లో 33 ప్రభుత్వ, 121 ప్రైవేటు ఆసుపత్రులు ఉన్నాయి. అసోసియేషన్ పిలుపు మేరకు గుంటూరు కొత్తపేట ఓల్డ్‌క్లబ్ రోడ్డులోని పలు ఆసుపత్రులు బంద్ పాటిస్తున్నట్లు ఫ్లెక్సీలు ప్రదర్శించాయి. రోగులు, అంబులెన్సులతో నిత్యం కిటకిటలాడే ఈ రోడ్డు శుక్రవారం మామాలు రద్దీతో కనిపించింది. రోజూ పథకం ద్వారా చికిత్స అందించేందుకు నెట్వర్క్ ఆసుపత్రులు అనుమతి కోసం ట్రస్టు కార్యాలయానికి నివేదికలు పంపిస్తుంటాయి. బంద్ ప్రభావంతో శుక్రవారం ఈ అనుమతులు చాలా తక్కువ సంఖ్యలో కోరినట్లు సమాచారం. కీలక డిమాండ్లు తీరిస్తేనే... నెట్వర్క్ ఆసుపత్రులకు రూ. 2,700 కోట్ల బకాయిలు ఉన్నట్లు సంఘం నేతలు వెల్లడించారు. పథకం ప్రారంభమైనప్పటి నుంచి హెల్త్ ప్యాకేజీల్లో పెరుగుదల నామమాత్రంగా ఉందని పేర్కొన్నారు. 2010 నాటి పరిస్థితితో పోలిస్తే నెట్వర్క్ ఆసుపత్రులపై భారం పడుతున్నట్లు వాపోయారు. ఆసుపత్రుల ఖర్చులు పెరిగిపోయినా ప్రభుత్వం బకాయిలు చెల్లించకుండా ఏళ్ల తరబడి పెండింగ్‌లో పెట్టడం వల్ల సమ్మెకు పిలుపునిచ్చినట్లు నేతలు వెల్లడించారు. డిమాండ్లను పరిష్కరించే వరకు సేవలు నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేశారు. పేదల ప్రాణాలకు భరోసా కరువు కూటమి ప్రభుత్వం తీసుకున్న కఠినాత్మక నిర్ణయం వల్ల పథకం ద్వారా లభించే ఉచిత వైద్య సేవలు పేదలకు శుక్రవారం నుంచి నిలిచిపోయాయి. తద్వారా వివిధ రోగాలకు చికిత్స చేయించుకునే వారు డబ్బులు పెట్టాల్సి వచ్చింది. కొంతమంది స్థోమత లేక అల్లాడిపోతున్నారు. పేదోళ్ల ప్రాణాలు గాలిలో దీపాలుగా మారాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరిపడా మందులు ఉండటం లేదు. సరిగ్గా వైద్య సేవలు అందించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో నెట్వర్క్ ఆసుపత్రుల వైద్య సేవల నిలిపివేత ప్రభావం పేదలపై ఎక్కువగా కనిపిస్తోంది. ప్రభుత్వం ఇకనైనా పట్టువీడాలని రోగులు కోరుతున్నారు. -
చల్ మోహన రంగా...
తెనాలి: పట్టణంలో శుక్రవారం రహదారిపై దౌడు తీస్తూ వస్తున్న గుర్రాన్నీ, బుర్రమీసాలు, తలపాగాతో దానిపై స్వారీ చేస్తున్న వ్యక్తిని చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు. ఆ వ్యక్తి పేరు ఉయ్యూరు లక్ష్మారెడ్డి. చుండూరు మండల గ్రామం కార్మూరివారిపాలెం వాసి. ప్రఖ్యాత కవి సరస్వతీ సమ్మాన్ అవార్డు గ్రహీత డాక్టర్ కె.శివారెడ్డి స్వగ్రామం కూడా ఇదే. వేమూరు నియోజకవర్గంలోని ఆ గ్రామం ప్రస్తుతం బాపట్ల జిల్లా పరిధిలో ఉంది. 61 ఏళ్ల లక్ష్మారెడ్డికి వ్యవసాయమే జీవనాధారం. 61 సెంట్ల పొలం ఉంది. అబ్బాయి, అమ్మాయి. కానీ బాధ్యతల బరువు లేదు. సంసార సాగరాన్ని అవలీలగా ఈదేసిన వ్యక్తికి, గుర్రం స్వారీ ఓ లెక్కా అన్నట్టుంది ఆయన తీరు. కళ్లెం లాగుతూ రెండో చేతితో చెర్నాకోలను పట్టుకుని ఒక లయ అతడి స్వారీలో కనిపించింది.15 ఏళ్లప్పుడు గుర్రం కొనాలని అనుకున్నా.. 30 ఏళ్లు వచ్చాక కొన్నారు. గుర్రాలు మారినా తన స్వారీ మాత్రం ఆగలేదు. అవసరమైతే మహారాష్ట్ర వెళ్లి గుర్రం తెస్తుంటానని చెప్పారు. రోజూ గుర్రానికి ఉలవలు, పచ్చిగడ్డి ఆహారంగా ఇస్తుంటారు. ఎక్కడికై నా ఇలానే వెళుతుంటానని చెప్పారు. -
కేఎల్‌యూలో ‘సమ్యక్ 2025’
తాడేపల్లి రూరల్ : తాడేపల్లి రూరల్ పరిధిలోని వడ్డేశ్వరం కేఎల్ యూనివర్సిటీలో శుక్రవారం జాతీయస్థాయి టెక్నో మేనేజ్మెంట్ ఫెస్ట్ ‘సమ్యక్ 2025’ ప్రారంభమైంది. ఈ ఉత్సవానికి రాష్ట్ర క్రీడల అథారిటీ చైర్మన్ అనిమి రవినాయుడు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాస్తవ ప్రపంచ సవాళ్లను ఎదుర్కొనే జాతీయ స్థాయి వేదికను సృష్టించినందుకు కేఎల్యూను ప్రశంసించారు. అనంతరం ఆయన్ను వర్సిటీ వీసీ, ప్రో వీసీలు తదితరులు ఘనంగా సత్కరించారు. వీసీ డాక్టర్ పార్ధసారథి వర్మ మాట్లాడుతూ మొదటి రోజు కార్యక్రమంలో 23 రాష్ట్రాల నుంచి సుమారు 25 వేలం మంది విద్యార్థులు పాల్గొన్నారని చెప్పారు. ప్రాజెక్ట్ ఎక్స్పో, ఏఐ, ఎంఎల్, మొబిలిటీ, హెల్త్ టెక్, ఎంబెడెడ్ సిస్టమ్‌లలో 450కుపైగా ఆవిష్కరణలు ప్రదర్శించారని తెలిపారు. కార్యక్రమంలో ప్రో వీసీలు డాక్టర్ ఏవీఎస్ ప్రసాద్, సమ్యక్ చైర్మన్ డాక్టర్ కె.రాజశేఖరరావు, డాక్టర్ ఎ.శ్రీనాథ్, డాక్టర్ మాధవ్, కన్వీనర్లు డాక్టర్ వి.రాజేష్, డాక్టర్ కృష్ణారెడ్డి, డాక్టర్ ఎం.కిషోర్‌బాబు, సీనియర్ నిర్వాహకులు, పరిశ్రమ నిపుణులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
సంపూర్ణ ఆరోగ్యానికి ఈత దోహదం
జస్టిస్ ఎన్. హరినాథ్ గుంటూరు వెస్ట్ (క్రీడలు): ఈతతో మెరుగైన శారీరక ఆరోగ్యంతోపాటు మానసిక ఉల్లాసం కలుగుతాయని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్. హరినాథ్ పేర్కొన్నారు. శుక్రవారం శ్యామలానగర్‌లోని ఈత కొలనులో కానాల అంజనీ శ్రీకాంత్ రెడ్డి స్మారక 8వ మాస్టర్స్ అంతర్ జిల్లాల పోటీలు జరిగాయి. బహుమతి ప్రదానోత్సవానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. అనంతరం మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ నిత్యం ఏదో ఒక క్రీడలో సాధన చేయాలన్నారు. యోగా కూడా ఎంతో మేలు చేస్తుందని వెల్లడించారు. జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు పెద్ది రమణ రావు మాట్లాడుతూ 20–90 ఏళ్ల వరకు వయస్సున్న వారికి ఈ పోటీలను ఏటా మాదిరిగానే నిర్వహించామన్నారు. 180 పాల్గొన్నారన్నారు. పోటీలను ఉదయం ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే గళ్లా మాధవి, రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావులు ప్రారంభించారు. కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా కార్యదర్శి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
జాతీయ పికిల్ బాల్ పోటీలకు క్రీడాకారుల ఎంపిక
గుంటూరు వెస్ట్ (క్రీడలు): బెంగళూరులో శనివారం నుంచి జరగనున్న జాతీయ ఓపెన్ పికిల్ బాల్ టోర్నమెంట్‌కు జిల్లాకు చెందిన కె.అరుణ్ కుమార్, పి.ఆనంద్ కుమార్, విన్సెంట్ ఎంపికయ్యారని జిల్లా సంఘం చైర్మన్ టి.అరుణ్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వీవీవీ హెల్త్ హబ్‌లో వారు శిక్షణ పొందుతున్నారని తెలిపారు. క్రీడాకారులను తనతోపాటు జిల్లా సంఘం అధ్యక్షుడు టి.హరికిషన్, వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎం.శివకుమార్, హ్యాట్రిక్ స్పోర్ట్స్ అధినేత శ్రీకాంత్, అథ్లెటిక్ అసోసియేషన్ ఆఫ్ గుంటూరు జిల్లా కార్యదర్శి జీవీఎస్ ప్రసాద్‌లు అభినందించినట్లు పేర్కొన్నారు. -
విద్యార్థులు వ్యవస్థాపకులుగా ఎదగాలి
పెదకాకాని: విద్యార్థులు వ్యవస్థాపకులుగా ఎదిగి పరిశ్రమలను స్థాపించాలని, వినూత్న ఆలోచనలతో నూతన ఆవిష్కరణలు చేపట్టి విజయవంతం కావాలని పల్నాడు జిల్లా పరిశ్రమల అధికారి ఎం.నవీన్ కుమార్ అన్నారు. వాసిరెడ్డి వెంకటాద్రి ఇంటర్నేషనల్ టెక్నలాజికల్ యూనివర్సిటీలోని మెకానికల్ ఇంజినీరింగ్, ఐఈఐ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో రెండురోజుల జాతీయ స్థాయి సాంకేతిక సదస్సు ‘ఆమేయా –2కే25’ ముగింపు వేడుకలకు శుక్రవారం ముఖ్యఅతిథిగా పల్నాడు జిల్లా పరిశ్రమల అధికారి ఎం.నవీన్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాస్తవ ప్రపంచ నైపుణ్యాలను నేర్చుకోవడానికి, పరిశ్రమలకు తగ్గట్టు సన్నద్ధం అవటానికి విద్యార్థి దశ కీలకమన్నారు. మొబైల్ యాప్‌లను వినియోగించడమే కాకుండా సమాజానికి ఉపయోగపడేలా వాటి తయారీపై దృష్టిసారించాలని సూచించారు. సదస్సులో జిగ్ టెక్, పేపర్ అండ్ పోస్టర్ ప్రజెంటేషన్, ఆర్సీ కార్నేజ్, పిక్టో, క్రిక్ క్విజ్ వంటి సాంకేతిక పోటీలలో విజేతలకు ఆయన బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ డాక్టర్ వై. మల్లికార్జునరెడ్డి, డైరెక్టర్ డాక్టర్ రావెల నవీన్, మెకానికల్ విభాగాధిపతి డాక్టర్ టి.శ్రీనివాసరావు, సంధానకర్త వి.కిరణ్ కుమార్, ఐఈఎం విద్యార్థి విభాగ సభ్యులు ఎస్.పవన్ సాయి, సీహెచ్ విష్ణు, విద్యార్థులు పాల్గొన్నారు. -
కంపోస్ట్ యార్డుతో కష్టాలు
తెనాలి కంపోస్ట్ యార్డు వ్యర్థాల గుట్టలతో నిండిపోతోంది. రోజూ తెనాలిలో ఉత్పత్తి అయిన వ్యర్థాలను జిందాల్ సంస్థకు తరలించాలని ఆదేశాలున్నా అమలు కావడం లేదు. భూగర్భ జలాలు కలుషితమై పంట పొలాలు దెబ్బతింటున్నాయి. దుర్వాసనతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మొత్తం 1.07 లక్షల టన్నుల వ్యర్థాలుతెనాలి అర్బన్: కంపోస్ట్ యార్డులోని వ్యర్థాల గుట్టల కారణంగా సమీపంలోని పంట పొలాలకు సమస్యలు తలెత్తుతున్నాయి. యార్డు ప్రహరీలు పడిపోతున్నాయి. చెత్త నుంచి మిథైల్ గ్యాస్ విడుదలవుతూ దానికదే తగులబడుతోంది. వ్యర్థాల దగ్ధంతో రోజుల తరబడి హానికరమైన పొగ చుట్టుపక్కల అర కిలోమీటరు వరకూ వ్యాపిస్తోంది. దీంతో ప్రజలకు కళ్లు మండుతున్నాయి. ఊపిరి పీల్చుకోవటానికి కూడా వారు ఇబ్బంది పడాల్సి వస్తోంది. యార్డు దారిలోనే పలు విద్యాసంస్థలు, పప్పు మిల్లులు ఉన్నాయి. అతిదగ్గర్లోనే అపార్టుమెంట్లు, బీసీ కాలనీ ప్రజలు ఉంటున్నారు. యార్డు కారణంగా స్థానిక ప్రజలు, రైతులు, విద్యార్థులు అష్టకష్టాలు పడుతున్నారు. యార్డును తరలించాలని కోరుతున్నారు. మూలకు చేరిన కాంపాక్టర్లు తెనాలి పట్టణంలో చెత్త సేకరణ కోసం ఏడు కాంపాక్టర్లు వినియోగిస్తున్నారు. తెనాలిలో రోజూ ఉత్పత్తి అయ్యే 90 టన్నుల చెత్తలో 80 టన్నులను కాంపాక్టర్లలో గుంటూరు సమీపంలోని జిందాల్ సంస్థకు కొద్దినెలలుగా నిత్యం తరలిస్తున్నారు. మిగిలిన 10 టన్నులను ఇక్కడే యార్డులో పడేస్తున్నారు. నెల క్రితం ఒకటి పెద్దది, రెండు చిన్న కాంపాక్టర్లు మరమ్మతులకు గురయ్యాయి. యార్డుకు వెళ్లే దారి కూడా వ్యర్థాలతో నిండి దుర్వాసన వస్తోంది. వాహనాలు పాడవడం వలన పట్టణంలో పూర్తి స్థాయిలో చెత్త సేకరణ జరగటం లేదని సమాచారం. యార్డులోని వ్యర్థాల పరిమాణం 1.07 లక్షల టన్నులు ఉండవచ్చని అధికారుల అంచనా. మున్సిపల్ అధికారులు 63,550 టన్నుల చెత్త తరలింపు కోసం టెండర్లు పిలిచారు. హైదరాబాద్‌కు చెందిన సుధాకర ఇన్ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్ సంసస్థీ టెండర్లు దక్కించుకుని ఫ్రిబవరిలో పని ప్రారంభించింది. మే నెలలో టెండర్లు రివైజ్ చేసి, 72 వేల టన్నుల చెత్తను తరలించినట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు. జూన్‌లో మరోసారి మిగిలిన 35 వేల టన్నుల చెత్త తరలింపునకు టెండర్లు పిలిచారు. అదే సంస్థ టెండర్లు దక్కించుకుని, గత నెల చివరిలో పనులు ప్రారంభించింది. -
వైఎస్సార్సీపీకి చెందిన వారమనే నీరివ్వడం లేదు!
వడ్డమాను(తాడికొండ): వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఉంటామనే నెపంతో గత 10 రోజులుగా తమ బజారుకు నీరు ఇవ్వకుండా అధికారులు స్థానిక నాయకులతో కుమ్మకై ్క వేధిస్తున్నారని తుళ్ళూరు మండలం వడ్డమాను గ్రామ ఎస్సీ కాలనీ వాసులు ఆరోపించారు. గ్రామంలో మొత్తం 7 మోటార్లు ఉన్నాయి. వాటిలో తమ బజారుకు వచ్చే మోటారు మాత్రమే మరమ్మతులకు గురైందనే నెపంతో నీరివ్వడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. గోడు చెప్పుకుందామని కార్యదర్శితోపాటు ఎవరిని ఆశ్రయించినా సమస్య పరిష్కారం కావడం లేదన్నారు. పైగా హేళనగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవేళ నిజంగా సమస్యే ఉంటే మరమ్మతులకు 10 రోజులు ఎందుకు పడుతుందని ప్రశ్నించారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అయినా చేసి కనీసం ట్యాంకర్ల ద్వారా రెండు రోజులకు ఒకసారి సరఫరా చేయాలని కోరారు. దీనిపై కార్యదర్శి శ్రీనివాసరావును వివరణ కోరగా మోటారు మరమ్మతులకు గురైన మాట వాస్తవమేనని చెప్పారు. గత 4 రోజులుగా తనకు ఇతర పనులు ఉండటం వలన సమయం కుదరలేదని తెలిపారు. పార్టీ, కుల వివక్ష వంటివి తాను చూపించలేదన్నారు. త్వరలో మోటారుకు మరమ్మతులు చేయించి నీటిని అందించేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు. -
సామాన్యుడి ధైర్యం.. సమాచార హక్కు చట్టం
మంగళగిరి టౌన్: సమాచార హక్కు చట్టం సామాన్యుడికి కొండంత ధైర్యమని.. దీనిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర హైకోర్టు విశ్రాంతన్యాయమూర్తి జస్టిస్ తేలప్రోలు రజని అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని రాష్ట్ర సమాచార కమిషనర్ కార్యాలయంలో శుక్రవారం 20వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆమెతోపాటు మాజీ సమాచార కమిషనర్ కాకర్ల చెన్నారెడ్డి, సమాచార కమిషనర్లు శామ్యూల్, డాక్టర్ చావలి సునీల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సమాచార హక్కు చట్టం వల్ల దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో పారదర్శకత, బాధ్యత పెరిగిందన్నారు. ప్రజలకు ప్రభుత్వం జవాబుదారీతనంగా ఉండేలా చూడడంతోపాటు.. ప్రజాస్వామ్యాన్ని మరింత బలపరుస్తోందని పేర్కొన్నారు. కాగా, కమిషన్ సజావుగా పనిచేయడానికి వీలుగా కార్యదర్శి, సహాయ కార్యదర్శి, న్యాయ కార్యదర్శి, అకౌంట్ ఆఫీసర్ వంటి పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని సమాచార కమిషనర్లు కోరారు. రాష్ట్రవ్యాప్తంగా 900 అవగాహన కార్యక్రమాలు నిర్వహించి.. ప్రజలకు సమాచార హక్కు చట్టం గురించి వివరించామని తెలిపారు. అనంతరం ‘ఆర్టీఐ లిట్రసీ క్యాంప్స్ పుస్తకాన్ని’ జస్టిస్ రజని ఆవిష్కరించారు. -
బీసీ హాస్టల్ విద్యార్థులకు అస్వస్థత
ప్రత్తిపాడు: కూటమి ప్రభుత్వం వసతి గృహ విద్యార్థులకు శాపంలా మారింది. రాష్ట్రంలో నిత్యం ఏదో ఒక వసతిగృహంలో విద్యార్థులు అస్వస్థతకు గురవుతూనే ఉన్నారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని చంద్రబాబు సర్కారు గాలికొదిలేయడంతో సరైన వసతులు, నాణ్యమైన ఆహారం లేక బాలబాలికలు తరచూ అనారోగ్యానికి గురవుతున్నారు. రాష్ట్రంలో ఎన్ని ఘటనలు చోటుచేసుకుంటున్నా కూటమి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. తాజాగా, ఫుడ్ పాయిజన్ కారణంగా బీసీ బాలుర వసతి గృహం విద్యార్థులు వాంతులు, విరేచనాల బారిన పడి ఆస్పత్రి పాలైన ఘటన పెదనందిపాడు మండలంలో చోటుచేసుకుంది. గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం అన్నపర్రులోని బీసీ బాలుర వసతి గృహంలో మొత్తం 107 మంది విద్యార్థులు ఉన్నారు. గురువారం రాత్రి భోజనం తిన్న తర్వాత 54 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం తెల్లవారుజాము నుంచి ఒక్కొక్కరికి వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి. ఆ సంఖ్య క్రమేపీ పెరుగుతూ వచ్చింది. ఆ సమయంలో హాస్టల్లో వార్డెన్ లేకపోవడంతో, అందుబాటులో ఉన్న కుక్ సీహెచ్ కల్పన తొలుత 17 మంది విద్యార్థులను పెదనందిపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువచ్చారు. మిగిలిన విద్యార్థులు కూడా ఒకరి తరువాత ఒకరు అస్వస్థతకు గురి కావడంతో స్థానిక హైసూ్కల్ ఉపాధ్యాయులు ఆటోల్లో విద్యార్థులను పెదనందిపాడు పీహెచ్‌సీకి తరలించారు. సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా చికిత్స పొందుతున్న బాధిత విద్యార్థులను పరామర్శించారు. అనంతరం ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులుతో కలిసి బీసీ హాస్టల్‌ను సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. కలెక్టర్ ఆదేశాలతో స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి, బాధిత విద్యార్థులందరికీ చికిత్స అందించారు. అస్వస్థతకు గురైన వారిలో 16 మందిని మెరుగైన చికిత్స నిమిత్తం గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. 21 మందిని డిశ్చార్జి చేయగా, 17 మంది విద్యార్థులు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. విద్యార్థులు అస్వస్థతకు గురవ్వడానికి ఆహారం కలుషితం కావడమేనని ప్రాథమికంగా అధికారులు నిర్ధారించారు.‘ఏకలవ్య’కూ సోకిన పచ్చ కామెర్లు» పాఠశాలలో 380 మంది విద్యార్థులు.. వారిలో 30 మంది పచ్చ కామెర్లు »పలు ఆస్పత్రుల్లో వీరికి వైద్యం »ఇప్పటికే కురుపాం బాలికల గురుకుల పాఠశాల విద్యార్థినులకు పచ్చ కామెర్లు »రెండు పాఠశాలలూ పక్క పక్కనే.. ఒకే తాగు నీటి బోరు » ఆ బోరు పక్కనే మురుగు కురుపాం: పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం ఏకలవ్య పాఠశాలలో 30 మంది విద్యార్థులకు పచ్చకామెర్లు (హెపటైటిస్–ఏ) సోకినట్లు సమాచారం. 380 మంది విద్యార్థులు చదువుతుండగా.. వీరిలో 30 మంది విద్యార్థులు పచ్చకామెర్లు, వైరల్ జ్వరాలతో బాధపడుతున్నారు. పార్వతీపురం జిల్లా ఆస్పత్రిలో 17 మంది, కేజీహెచ్‌లో ఇద్దరు, కురుపాం సామాజిక ఆరోగ్య కేంద్రంలో నలుగురు విద్యార్థులు ప్రస్తుతం చికిత్స పొందుతుండగా.. ఏడుగురు విద్యార్థులు డిశ్చార్జ్ అయినట్లు ఏకలవ్య సిబ్బంది చెబుతున్నారు. పాఠశాల సిబ్బందికి కూడా ఒకరికి పచ్చకామెర్లు సోకినట్టు తెలిసింది. ఆ బోరు నీరే కారణమా..కురుపాం బాలికల గురుకుల పాఠశాల విద్యార్థినులు ఇప్పటికే పచ్చ కామెర్లతో బాధపడుతూ వివిధ ఆస్పత్రుల్లో చేరారు. పాఠశాలకు చెందిన ఇద్దరు బాలికలు మృతిచెందారు. గురుకుల పాఠశాలకు పక్కనే ఏకలవ్య పాఠశాల ఉంది. రెండు పాఠశాలల విద్యార్థులు ఒకే బోరు నీటిని తాగుతుండడం, అదే బోరు సమీపంలో మురుగు నీరు ఉండటంతోనే విద్యార్థులు కామెర్ల బారిన పడినట్టు ప్రాథమికంగా వైద్యులు నిర్ధారించినట్టు సమాచారం. -
గుంటూరు: బాలుర హాస్టల్లో ఫుడ్ పాయిజన్.. విద్యార్థులకు అస్వస్థత
సాక్షి, గుంటూరు: గుంటూరు జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. పెదనందిపాడు మండలం అన్నపర్రు బీసీ సంక్షేమ బాలుర హాస్టల్లో 16 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో, వెంటనే వారిని పెదనందిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, విద్యార్థులకు వాంతులు, విరేచనాలు అవుతున్నట్టు తెలిసింది. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
మనోవ్యాధులకూ మంచి ఔషధాలు
గుంటూరు మెడికల్: జిల్లాలో 25 మంది మానసిక వ్యాధి వైద్య నిపుణులు ఉన్నారు. ఒక్కో వైద్యుడి వద్దకు రోజూ 30 నుంచి 50 మంది వివిధ రకాల సమస్యలతో చికిత్స కోసం వస్తున్నారు. గుంటూరు జీజీహెచ్‌లో రోజూ 160 మంది చికిత్స పొందుతున్నారు. ప్రతి ఏడాది మానసిక రోగుల సంఖ్య పెరిగిపోవటంపై వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పిల్లల్లో సైతం మానసిక సమస్యలు రావటంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని వెల్లడిస్తున్నారు. వ్యాధి లక్షణాలు ఇవీ.. చిరాకు, కోపం, విసుగు తదితర లక్షణాలు వారానికి పైబడి ఉంటే మానసిక వ్యాధితో బాధపడుతున్నట్లు గుర్తించాలి. తనలో తాను మాట్లాడుకోవటం, ఒంటరిగా నవ్వుకోవటం, వ్యక్తిగత శ్రద్ధ తీసుకోకపోవటం, చేసిన పనిని పదేపదే చేయాలనుకోవటం, అనవసరమైన ఆలోచల్ని ఆపుకోలేకపోవటం, నిద్రలేమి, బరువు పెరగటం, నిర్ణయాలు తీసుకోవటంలో తీవ్ర జాప్యం చేసి తనమీద ఆధారపడే వారందరినీ ఇబ్బందికి గురి చేయడం, తాను కూడా ఇబ్బందులకు గురవ్వటం, ఎక్కువ సమయం పనిమీద ఏకాగ్రత లేకుండా కాలక్షేపం చేసే ధోరణిలో ఉండటం, తనకు హాని చేస్తున్నట్లు ఊహించుకుని తగాదాలు వరకు వెళ్లటం, తిరగబడి దాడి చేయటం, వ్యక్తిలో ఉన్న అనుమానాలు ఎన్ని రూపాల్లో నివృత్తి చేసే ప్రయత్నం చేసినా ఒప్పుకోకపోవటం తదితర లక్షణాలు మానసిక వ్యాధి సోకిన వారిలో కనిపిస్తాయి. రోటీన్ లైఫ్‌కు భిన్నంగా ఉండే ప్రవర్తన కనిపిస్తే వారిలో మానసిక సమస్య ఉన్నట్లు గుర్తించాలి. చదువుకునేందుకు ఆసక్తి చూపించకపోవటం, ఎక్కువ సమయం సెల్ఫోన్లకే పరిమితమవ్వటం, ఉద్యోగం, ఇతర పనులు చేయకుండా ఉండిపోవటం లక్షణాలు వ్యాధి బాధితుల్లో ఉంటాయి. గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందిన వారి వివరాలు.. ఏడాది రోగుల సంఖ్య 2023 22,189 2024 30,553 కరోనా వల్ల పెరిగిన మానసిక సమస్యల బాధితులను దృష్టిలో పెట్టుకుని మానసిక ఆరోగ్యానికి, వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. మానసిక సమస్యలపై అవగాహన కల్పించి ప్రజలు ఇబ్బంది పడకుండా చేసేందుకు ప్రతి ఏడాది అక్టోబర్ 10న ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇది. -
నేటి నుంచి ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్
గుంటూరు మెడికల్: జిల్లాలో శుక్రవారం నుంచి ఉచిత వైద్యసేవలు నిలిచిపోనున్నాయి. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా చికిత్స చేసిన ఆస్పత్రులకు కూటమి ప్రభుత్వం బకాయిలు చెల్లించకుండా మిన్నకుండి పోయింది. దీంతో ఆరోగ్యశ్రీలో వైద్యసేవలు అందించిన ఆస్పత్రులు తమకు బకాయిలు చెల్లించే వరకు వైద్యసేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. కూటమి పాలనలో పేదల ఆరోగ్యం గాలిలో దీపంలా మారింది. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేదలకు కార్పొరేట్ వైద్యసేవలు ఉచితంగా అందించే ఏపీ స్పెషాలిటి హాస్పటల్ అసోసియేషన్( ఆషా)కు కోట్లాది రూపాయలు ప్రభుత్వం చెల్లించకుండా నిలుపుదల చేసింది. మహానేత ప్రవేశపెట్టిన పథకం పేదలకు ఉచితంగా కార్పొరేట్ వైద్యసేవలు అందించేందుకు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారు. దేశ వ్యాప్తంగా ఆయన పెట్టిన ఆరోగ్యశ్రీ పథకాన్ని ఇతర రాష్ట్రాల వారు సైతం అమలు చేసేలా గొప్ప పథకంగా డాక్టర్ రాజశేఖరరెడ్డి దానిని తీర్చిదిద్దారు. నేడు ఆరోగ్యశ్రీ పథకం పేరును కూటమి ప్రభుత్వం డాక్టర్ ఎన్టీఆర్ వైద్యసేవగా మార్పు చేసింది. పథకం ద్వారా వైద్యసేవలు అందిస్తున్న ఆస్పత్రులకు బిల్లులు చెల్లించకుండా దీర్ఘకాలంగా పెండింగ్ పెట్టడంతో ఆస్పత్రుల వారు శుక్రవారం నుంచి వైద్యసేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. అస్తవ్యస్తంగా పథకం డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కూటమి పాలన ప్రారంభమయ్యాక అస్తవ్యస్తంగా తయారయ్యింది. ఈ పథకంలో కార్పొరేట్ నెట్వర్క్ ఆస్పత్రుల్లో పేదలకు ఉచితంగా వైద్యసేవలు అందించమే ఈ పథకం ప్రధాన ఉద్దేశం. అయితే ప్రభుత్వం నెట్వర్క్ ఆస్పత్రులకు సకాలంలో బిల్లులు చెల్లించకపోవటంతో కోట్లలో బకాయిలు పేరుకుపోయాయి. పెండింగ్ బిల్లులు చెల్లిస్తే గాని తాము కోలుకోలేమని, పేదలకు ఉచిత వైద్యసేవలు అందించలేమని ఆషా సంఘం నేతలు తెగేసి చెప్పారు. నేటి నుంచి ఉచిత వైద్యం బంద్ ఏపీ స్పెషాలిటి హాస్పటల్ అసోసియేషన్(ఆషా) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లాలోని నెట్వర్క్ ఆస్పత్రుల్లో వైద్యసేవలు నిలిపివేస్తున్నట్లు ఆషా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ సుబ్బరాయుడు, డాక్టర్ శివశంకరయ్యలు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రూ.2,700 కోట్ల నెట్వర్క్ ఆస్పత్రులకు ప్రభుత్వం ఏడాదిగా బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. డాక్టర్ ఎన్టీఆర్ వైద్యసేవ సీఈఓ క్లెయిమ్ అప్రూవల్స్ సుమారు రూ.670 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ముందుగా రూ.670 కోట్లు విడుదల చేస్తేనే ఉచిత వైద్యసేవలు అందించేందుకు ముందుకొస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం పథకాన్ని ప్రైవేటు ఇన్స్యూరెన్స్ కంపెనీకి అప్పగించే ప్రయత్నంలో ఉన్న దృష్ట్యా పథకం గైడ్‌లైన్స్ ఏర్పాటులో ఆషా సభ్యులను తప్పనిసరిగా భాగస్వాముల్ని చేయాలని నేతలు డిమాండ్ చేస్తున్నారు. -
నకిలీ ధ్రువపత్రాలకు అడ్డాగా తెనాలి
తహసీల్దార్ సంతకాలు ఫోర్జరీ తెనాలి రూరల్: తెనాలి నకిలీ ధ్రువపత్రాలకు అడ్డాగా మారింది. కొందరు మీ సేవా కేంద్రాల నిర్వాహకులు, దళారుల అండతో యథేచ్చగా నకిలీ ధ్రువపత్రాల దందా కొనసాగుతోంది. ఈ పత్రాలతో ఆస్తులను అక్రమంగా రిజిస్టర్ చేయించుకోవడమే కాకుండా విక్రయాలు జరుపుతున్నారు. తెనాలి మండలం బుర్రిపాలెం గ్రామానికి చెందిన గాజుల బసవ పూర్ణకుమారికి చెందిన రెండెకరాల మాగాణి, 17 సెంట్ల ఇంటి స్థలాన్ని కాజేయడానికి సొంత మేనల్లుడు కోలపల్లి నరేష్, అతని తండ్రి సత్యనారాయణతో కలిసి పథకం పన్నాడు. 2020లో పూర్ణకుమారి మృతి చెందినట్లు, అంతకుముందే ఆమె భర్త సత్యనారాయణ కూడా మరణించినట్లు తప్పుడు మరణ ధ్రువపత్రాలు సృష్టించి నిందితుడు నరేష్ కుటుంబ సభ్యులను బురిడీ కొట్టించాడు. తెనాలి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదురుగా డాక్యుమెంట్ రైటరుగా పనిచేస్తున్న తిరుపతి మరియదాస్ అలియాస్ దాస్, తెనాలి మున్సిపల్ కాంప్లెక్స్‌లో మీ–సేవ కేంద్రం నిర్వహిస్తున్న దాసరి శివన్నారాయణతో కలసి దొంగపత్రాలు సృష్టించి, సదరు హక్కు విడుదల దస్తావేజులు ద్వారా రిజిస్ట్రేషన్ చేయించిన నరేష్ తన మేనత్త పూర్ణకుమారికి చెందిన యావదాస్తిని విక్రయించి రూ.55 లక్షలు సొమ్ము చేసుకున్నాడు. అంతే కాకుండా ఆమెకు చెందిన 17 సెంట్ల ఇంటి స్థలాన్ని మూడు భాగాలుగా చేసి హైదరాబాద్, దుగ్గిరాల, తెనాలి పట్టణ ప్రాంతాలకు చెందిన వ్యక్తులకు దొంగ రిజిస్ట్రేషన్ చేసి విక్రయించాడు. మేనల్లుడి నిర్వాకం గురించి తెలుసుకున్న బసవ పూర్ణకుమారి పోలీసులను ఆశ్రయించింది. దీంతో నరేష్, అతని తండ్రి సత్యనారాయణ, డాక్యుమెంట్ రైటర్ మరియదాస్, మీ–సేవ శివలను అరెస్ట్ చేశారు. మంగళగిరికి చెందిన విశ్రాంత బీఎస్ఎన్ఎల్ ఉద్యోగి 2019లో రిజిస్టర్డ్ వీలునామా చేయించి, 2020లో మృతి చెందారు. తన తదనంతరం ఆస్తి తన రెండో భార్య సంతానానికి చెందేలా వీలునామా రిజిస్టర్ చేయగా, మొదటి భార్య కుమారులు నకిలీ వీలునామా సృష్టించి ఆస్తిని తమ పేరిట రిజిస్టర్ చేసుకున్నారు. తాజాగా పట్టణ నందులపేటకు చెందిన ఓ వ్యక్తి 2017లో మృతి చెందాడు. ఇతని కుటుంబసభ్యుల ధ్రువపత్రాన్ని నకిలీది సృష్టించి ఆస్తిని వినుకొండకు చెందిన బ్యాంకు ఉద్యోగికి విక్రయించేందుకు సిద్ధపడ్డారు. కుటుంబసభ్యుల ధ్రువపత్రాన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సమర్పించగా తహసీల్దార్ పరిశీలనకు పంపారు. తన సంతకాన్ని ఫోర్టరీ చేసి నకిలీ ధ్రువపత్రం తయారు చేశారని గుర్తించిన తహసీల్దార్ గోపాలకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నకిలీ పత్రాలను తయారుచేసిన/తయారు చేయించిన వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు సమాచారం. ఆస్తులు రిజిస్ట్రేషన్లకు వెళ్లే వారు విక్రయదారులు ఇచ్చే పత్రాలను ఒటికి రెండుసార్లు పరిశీలించుకోవాలని, అవసరమైతే లీగల్ ఒపీనియన్ తీసుకోవాలని రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు చెబుతున్నారు. ఏదేమైనా నకిలీ ధ్రువపత్రాలను తయారుచేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
ఎంపీపీపై అవిశ్వాస తీర్మానానికి రంగం సిద్ధం
● పావులు కదుపుతున్న తమ్ముళ్లు ● ఇప్పటికే ఫోన్ ద్వారా సంప్రదింపులు ● పార్టీ మారేదిలేదని స్పష్టం చేసిన ఎంపీటీసీ సభ్యులు పెదకాకాని: ఎంపీపీపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే తెలుగు తమ్ముళ్లు ఆ దిశగా పావులు కదుపుతున్నారు. మండలంలోని పలువురు ఎంపీటీసీలకు ఫోన్లు చేసి నయానా, భయానా చర్చలు జరిపే పనిలో నిమగ్నమయ్యారు. అయితే పార్టీలు మారి పరువు పోగొట్టుకోవడానికి తాము సిద్ధంగా లేమని పలువురు ఎంపీటీసీ సభ్యులు స్పష్టంచేసినట్లు చెబుతున్నారు. పెదకాకాని మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడుగా అనుమర్లపూడి ఎంపీటీసీ సభ్యుడిని ఎన్నుకొని నాలుగేళ్లు పూర్తయ్యింది. నాలుగేళ్ల వరకూ ఎంపీపీ కుర్చీపై అవిశ్వాసం పెట్టడానికి అవకాశం లేదనే నిబంధనలు ఉన్నాయి. దీంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కాలం గడిచినప్పటికీ నాలుగేళ్లు పూర్తయ్యే వరకూ వేచి ఉన్నారు. గత నెల సెప్టెంబరుతో నాలుగేళ్లు పూర్తి కావడంతో ఎంపీపీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పెదకాకాని మండల పరిధిలో 12 గ్రామ పంచాయతీలు, ఒక హామ్లెట్ విలేజ్ ఉంది. ఆయా గ్రామాల్లో ఉన్న ఓటర్ల ఆధారంగా మండలంలో 21 మంది ఎంపీటీసీ సభ్యులు ఉన్నారు. వారిలో వైఎస్సార్ సీపీ చెందిన 15 మంది ఎంపీటీసీ సభ్యులు, ఆరుగురు టీడీపీ చెందిన ఎంపీటీసీలు గెలుపొందారు. మెజారిటీ ఎంపీటీసీ సభ్యులు ఉన్న వైఎస్సార్ సీపీ నుంచి అనుమర్లపూడి ఎంపీటీసీ సభ్యుడు తుల్లిమిల్లి శ్రీనివాసరావును ఎంపీపీగా ఎన్నుకున్నారు. తమ్ముళ్లు రాయబారాలు నడుపుతున్నప్పటికీ పార్టీ మారడానికి, ఎంపీపీకి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానంలో పాల్గొనడానికి పలువురు ఎంపీటీసీ సభ్యులు ససేమిరా అంటున్నారు. వైఎస్సార్ సీపీ నుంచి పోటీ చేసి వారి మద్దతుతో విజయం సాధించి పదవీకాలం పది నెలలు ముందు తాము పార్టీ మారడానికి, చేతులెత్తడానికి సిద్ధంగా లేమని చెబుతున్నారు. ఈ వ్యవహారం మండలంలో చర్చనీయాంశంగా మారింది. గత ఎన్నికల సమయంలో వైఎస్సార్ సీపీ నుంచి పార్టీ మారిన వారిని కేవలం ఓటు బ్యాంక్‌గా వాడుకుని ఎటువంటి ప్రాధాన్యం ఇవ్వడం లేదనే చర్చ కూడా సాగుతోంది. -
సహకారంలో జీతాల కుంభకోణం
సాక్షి ప్రతినిధి, గుంటూరు: కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గుంటూరు జిల్లా సహకార బ్యాంకులో పర్సన్ ఇన్చార్జులు కుంభకోణానికి తెరలేపారు. నష్టాలలో ఉన్న సొసైటీలలో కూడా జీతాలు పెంచేశారు. జీతాల అరియర్స్ కోసం లక్షకు రూ.30 వేలు వసూలు చేసినట్లు సమాచారం. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 167 సొసైటీలు ఉన్నాయి. అందులో 100 సొసైటీల వరకు నష్టాలలో నడుస్తున్నాయి. మిగిలిన 67 సొసైటీలు మాత్రమే లాభాలలో ఉన్నాయి. ప్రాథమిక సహకార సంఘాల ఉద్యోగుల జీతాలు పెంచడం కోసం రాష్ట్ర ప్రభుత్వం హెచ్ఆర్ పాలసీ కింద జీఓ జారీ చేసింది. దీనికి జిల్లాలో డీఎల్ఈసీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి చైర్మన్‌గా జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ చైర్మన్న్ వ్యవహరిస్తుండగా, డీసీసీబీ సీఈవో కన్వీనర్‌గా, జిల్లా సహకార అధికారులు కమిటీ సభ్యులుగా ఉన్నారు. ప్రస్తుతం ప్రాథమిక సహకార సంఘం కార్యదర్శిని బదిలీ చేయాలన్నా ఈ కమిటీలో చర్చించి చేయాలి. అలాగే సొసైటీ సిబ్బంది జీతాలు పెంచాలంటే ఈ కమిటీ ఆమోదం కావాలి. మూడేళ్లుగా అనేక జిల్లాల్లో సొసైటీ కమిటీతో ప్రపోజల్ పంపించమని అడిగి డివిజనల్ సహకార అధికారులు సొసైటీ సిబ్బంది జీతాలు పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చేశారు. ఇందులో నష్టాలలో ఉన్న సొసైటీల సిబ్బందికి కూడా జీతాలు పెంచేశారు. ఈ క్రమంలో జీతాల అరియర్స్ చెల్లించడం కోసం డిపార్టుమెంట్ వారు లక్షకు 30 శాతం మామూళ్లు తీసుకుని జీతాలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. సిబ్బంది సర్వీస్ రిజిస్టర్ ప్రకారం డిపార్ట్మెంట్, బ్యాంక్ అధికారులు సంయుక్తంగా పరిశీలన చేసి వారికి ఎన్ని ఇంక్రిమెంట్లు ఇవ్వాలి, అంత పే ఫిక్సేషన్ చేసి డీసీసీబీ ద్వారా అరియర్ జీతాలు పెంచాలి. ఇవి అంతా డీసీసీబీలో జిల్లా స్థాయి కమిటీ ఆమోదం పొందాలి. పర్సన్ ఇన్చార్జుల ఇష్టారాజ్యం అయితే కొందరు సహకార అధికారులు పర్సన్ ఇన్చార్జిగా పనిచేసిన కాలంలో ఒక్కో సొసైటీలో ఇష్టారాజ్యంగా ఎక్కువగా పెంచేశారు. కొన్ని సొసైటీలలో ఒక సంవత్సరానికి రెండు, మూడుసార్లు జీతాలు పెంచుతూ పాత బకాయిలు ఇవ్వాల్సిన వాటికంటే ఎక్కువ ఇచ్చేశారు. దీని కోసం డిపార్టుమెంట్ పర్సన్ ఇన్‌ఛార్జులు పాత బకాయిలను మామూళ్ల కింద తీసుకుని పెంచిన జీతం మాత్రం ఉద్యోగులకు ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా డిపార్ట్మెంట్ పర్సన్ ఇన్చార్జిలు గత ఏడాదిన్నర కాలంగా ఇటీవల కొత్త కమిటీలు వేసే వరకూ సొసైటీలలో అధిక మొత్తంలో కంటింజెంట్ ఖర్చులు, ధాన్యం సేకరణ ఖర్చులు రాసేసుకుని డబ్బులు డ్రా చేసుకున్నారు. ఇవన్నీ పరిశీలించాలంటే 2024 మార్చి 31 నుంచి ఈ ఏడాది మార్చి 31కి, ఆగస్టు 10 వరకూ అంటే కొత్త కమిటీలు బాధ్యతలు తీసుకునే వరకూ కంటింజెంట్ ఖర్చులు, ధాన్యం సేకరణ ఖర్చులు, సిబ్బంది జీతాలు ఎన్నిసార్లు పెంచారో, దానికి ఎంత చెల్లించారో పరిశీలిస్తే అన్ని వాస్తవాలు బయట పడతాయి. ఇటీవల నూతన కమిటీలు 10 రోజుల్లో బాధ్యతలు తీసుకుంటాయని తెలిసిన వెంటనే వారు సిబ్బందికి జీతాలు పెంచేసినట్లు సమాచారం. నిబంధనలు తుంగలో తొక్కి... నాబార్డు నిబంధనలు ప్రకారం వరుసగా మూడు సంవత్సరాలు నష్టాలు వస్తే జీతాలు పెంచడానికి వీలులేదు. సీఆర్ఎఆర్ 12 శాతం మించి వుండాలి, కానీ ఇవేమీ పట్టించుకోకుండా రాష్ట్ర వ్యాప్తంగా కాసులకు అలవాటు పడి డిపార్ట్మెంట్ సిబ్బంది జీతాలు పెంచేశారు. ఒక్కొక్క సొసైటీలో ఇవ్వవలసిన దాని కన్నా ఎక్కువ ఇచ్చేశారు. ఉదాహరణకు బాపట్ల జిల్లా నగరం మండలంలో నగరం పీఎసీఎస్ రూ. 12 కోట్లు నష్టాల్లో ఉండగా, అందులో ఐదుగురు ఉద్యోగులకు జీతాలు పెంచేశారు. నిజాంపట్నం బ్రాంచ్ పరిధిలో కూచిపూడి పీఎసీఎస్ రూ.4.50 కోట్లు నష్టం ఉండగా అందులో టైమ్బార్డ్ అప్పులు ఉన్నాయి. అందులో నలుగురు ఉద్యోగులు పర్మినెంట్ ఉండగా నలుగురు తాత్కాలిక సిబ్బంది ఉన్నారు. ఇక్కడ పర్మినెంట్ ఉద్యోగుల జీతాలు అడ్డదిడ్డంగా పెంచేశారు. ఈ ఆగస్టు నెలలో కొత్త పాలకవర్గం ఏర్పడగా ముగ్గురు తాత్కాలిక ఉద్యోగులను పాలకవర్గం అధ్యక్షులు నియమించుకున్నారు. పర్మినెంట్ ఉద్యోగుల జీతాలు పెంచాలంటే జిల్లా స్థాయి కమిటీలో పెంచాల్సి ఉండగా, మామూళ్లు తీసుకుని డివిజనల్ సహకార అధికారులు జీతాలు పెంచుతూ ఆదేశాలు ఇచ్చేశారు. ఇందులో కొన్నిచోట్ల డిపార్ట్మెంట్ పర్సన్ ఇన్చార్జులు ప్రతిపాదనలు పంపిస్తే డిప్యూటీ రిజిస్ట్రార్లు మామూళ్లు తీసుకుని జీతాలు పెంచుతూ అడ్డదిడ్డంగా అనుమతులు ఇచ్చేశారు. దీనిపై విచారణ జరిపితే కోట్ల రూపాయల కుంభకోణం బయటపడుతుంది. -
పగలు రెక్కీ.. రాత్రిళ్లు చోరీ
నగరంపాలెం: పగలు పల్సర్ బైక్‌పై తిరుగుతూ తాళాలు వేసి ఇళ్లను గుర్తించి, రాత్రిళ్లు చోరీలకు పాల్పడే భార్యాభర్తలను కొల్లిపర పోలీసులు అరెస్ట్ చేశారని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ చెప్పారు. దంపతుల నుంచి 173.19 గ్రాముల బంగారం, 226.36 గ్రాముల వెండి, రూ.2.15 లక్షలు, ఒక మోటారు సైకిల్, టీవీ, ఇనుపరాడ్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నగరంపాలెంలోని జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో గురువారం ఆయన మీడియాకు కేసు వివరాలు వెల్లడించారు. ఇటీవల కొల్లిపర మండల పరిధిలోని తాళాలు వేసి ఇళ్లల్లో వరుసగా చోరీలు జరిగాయి. తూములూరు గ్రామ వాసి మాటూరి మధుసూదనరావు గతనెల 28న ఊరెళ్లారు. ఈనెల 2న ఇంటికి రాగా, బీరువాలో దాచిన బంగారు సొత్తు చోరీ చేశారు. దీనిపై బాధితులు కొల్లిపర పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. తెనాలి సబ్ డివిజన్ డీఎస్పీ బి.జనార్ధనరావు, రూరల్ సీఐ ఆర్.ఉమేష్ నేతృత్వంలో కొల్లిపర పీఎస్ ఎస్ఐ పి.కోటేశ్వరరావు ప్రత్యేక దర్యాప్తు చేపట్టారు. ఈ మేరకు పరిసరాల్లోని సీసీ కెమెరాల పుటేజీలు పరిశీలించారు. సాంకేతిక ఆధారాలతో కొల్లిపర గ్రామ వాసి కటారి వెంకటేశ్వర్లుగా గుర్తించారు. అతన్ని అదుపులోకి తీసుకుని విచారించారు. నేరం రుజువైంది. గతంలోనూ మండల పరిధిలోని పలు గ్రామాల్లో 13 చోరీలకు పాల్పడినట్లు గుర్తించారు. ఈ చోరీల్లో కొంత వరకు భార్య తేజ నాగమణికి ఇచ్చి భద్రపరిచేవాడు. దీంతో భార్యాభర్తలను అరెస్ట్ చేసి, 173.19 గ్రాముల బంగారం, 226.36 గ్రాముల వెండి, రూ.2.15 లక్షలు, పల్సర్ బైక్, ఒక టీవీ, ఇనుపరాడ్ స్వాధీనం చేసుకున్నారు. ఇనుపరాడ్‌తో తాళాలు పగులకొట్టి.. గతంలో వెంకటేశ్వర్లు బేల్దారి పనులకు వెళ్లేవాడు. భార్యాభర్తలు కొద్దికాలంగా చోరీలకు శ్రీకారం చుట్టారు. భర్త ద్విచక్ర వాహనం (పల్సర్)పై వెళ్లి ఇళ్లకు తాళాలు వేసిన గృహాలను గుర్తించే వాడు. ఇరువురు కలసి చోరీకి వెళ్లేవారు. భర్త ఇనుపరాడ్డుతో తలుపులు పగలుకొట్టి, బంగారం, వెండి వస్తువులు, నగదుతో రెప్పపాటులో ఉడాయించేవారు. భార్య ఘటనా స్థలంలో ఉండి వచ్చే, పోయే వారి కదలికలను గుర్తించేది. చోరీలకు పాల్పడి వచ్చాక ఏమీ తెలియనట్టు అందరితో కలిసిపోయేవారు. దొంగలించిన సొమ్ముతో జల్సాలు చేయడం, వ్యక్తిగత అవసరాలకు ఉపయోగించుకునేవారు. నిందితుడైన వెంకటేశ్వర్లుకు పాత నేర చరిత్ర ఉందన్నారు. దాదాపు 13 కేసులు నమోదై ఉన్నాయి. త్వరితగతిన కేసు ఛేదించిన తెనాలి డీఎస్పీ బి.జనార్ధనరావు, తెనాలి రూరల్ పీఎస్ సీఐ ఆర్.ఉమేష్, కొల్లిపర పీఎస్ ఎస్ఐ పి.కోటేశ్వరరావు, హెచ్‌సీలు రామకోటేశ్వరరావు, మురళీకృష్ణ, పీసీలు కూర్మారావు, శివరామకృష్ణలను జిల్లా ఎస్పీ అభినందించి, ప్రశంసాపత్రాలు అందించారు. జిల్లా ఏఎస్పీ (పరిపాలన) రమణమూర్తి పాల్గొన్నారు. -
● బలం లేకున్నా టీడీపీ బరితెగింపు ● వైఎస్సార్సీపీ అభ్యర్థులపై వేధింపుల పర్వం ● అవిశ్వాసం అంటూ డ్రామా
ముప్పాళ్ల: ముప్పాళ్ల మండల పరిషత్ అధ్యక్ష పీఠంపై టీడీపీ నాయకులు గురి పెట్టారు. 2021లో జరిగిన ఎన్నికల్లో మొత్తం 12 ఎంపీటీసీ స్థానాలకు పదకొండు స్థానాల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులు గెలుపొందారు. జనసేన ఒక స్థానంలో గెలుపొందింది. టీడీపీ ఒక్కచోట కూడా గెలిచిన దాఖలాలు లేవు. మాదల ఎంపీటీసీ సభ్యుడు మృతి చెందగా ప్రస్తుతం ఆ స్థానం ఖాళీగా ఉంది. భయపెడుతూ, ప్రలోభాలకు గురిచేస్తూ, పదవి ఆశ చూపుతూ ఆరుగురు ఎంపీటీసీలను టీడీపీ వైపునకు లాక్కున్నారు. ఎంపీపీతో కలిపి నలుగురు ఎంపీటీసీలు వైఎస్సార్ సీపీని వీడేందుకు ఇష్ట పడకపోవటంతో వారిపైన, వారికి సంబంధించిన ఆర్థిక వ్యవహారాలను దెబ్బకొట్టేలా అధికార దర్పాన్ని ఉపయోగించుకుంటూ భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. కొత్తగా తెరపైకి అవిశ్వాసం డ్రామా కొత్తగా ఎంపీపీపై అవిశ్వాస డ్రామాను టీడీపీ నాయకులు తెర లేపారు. చాగంటివారిపాలెంకు చెందిన ఎంపీపీ మారూరి పద్మపై అవిశ్వాసం తీర్మానం పెట్టేందుకు సమావేశం నిర్వహించాలంటూ సత్తెనపల్లి ఆర్డీఓను మంగళవారం కలసి వినతిపత్రం అందించారు. అవిశ్వాస తీర్మానం ఇవ్వాలంటే కనీసం 8 మంది ఎంపీటీసీ సభ్యుల బలం ఉండాలి. ఎనిమిది మంది సభ్యులు ఆర్డీవో ఎదుట హాజరై అవిశ్వాస తీర్మానం కోరుతూ వినతిపత్రం అందించాల్సి ఉంటుంది. కేవలం ఐదుగురు సభ్యులతో సంతకాలు చేయించి అవిశ్వాస తీర్మానం అంటూ డ్రామా చేస్తున్నారు. ఈ విషయం పై వైఎస్సార్సీపీ సభ్యులు మాత్రం పార్టీ నిర్ణయానికే కట్టుబడి ఉంటామని ఖరాఖండిగా తేల్చి చెబుతున్నారు. పార్టీ నిర్ణయానికే కట్టుబడి ఉన్నాం. –మలిరెడ్డి అనూష, లంకెలకూరపాడు ఎంపీటీసీ సోషల్‌మీడియాలో టీడీపీ నాయకులు చేస్తున్న విష ప్రచారంలో వాస్తవం లేదు. అవిశ్వాస తీర్మానంపై ఆర్డీఓకు ఇచ్చిన పేపర్లలలో తన సంతకాన్ని ఫోర్జరీ చేశారు. వైఎస్సార్ సీపీ నిర్ణయానికే కట్టుబడి ఉంటాం. కేసులతో ఎన్ని ఇబ్బందులు పెట్టినా భయపడేది లేదు. -
జీజీహెచ్‌లో ఉచిత వైద్య సేవలు
మానసిక వ్యాధులకు జీజీహెచ్‌లో ఉచిత వైద్య సేవలను అందించటంతోపాటుగా మందులు కూడా ఉచితంగానే అందజేస్తున్నారు. అవుట్ పేషేంట్ విభాగంలోని 21వ నెంబర్ గదిలో వైద్య పరీక్షలు చేసి, అవసరం ఉన్న వారిని ఇన్‌పేషేంట్ విభాగంలో అడ్మిట్ చేసుకుంటారు. సోమవారం నుంచి శనివారం వరకు ఓపీలో వైద్య సేవలు లభిస్తాయి. మందులతోపాటుగా రోగులకు కౌన్సెలింగ్ కూడా చాలా ముఖ్యం. – డాక్టర్ నీలి ఉమాజ్యోతి, మానసిక వ్యాధుల వైద్య విభాగాధిపతి, గుంటూరు జీజీహెచ్. -
పశు సంతతిని పెంచుకోవాలి
ప్రత్తిపాడు: గ్రామాల్లో రోజురోజుకీ తగ్గిపోతున్న పశుసంతతిని పెంచుకునేందుకు ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలని గుంటూరు జిల్లా పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ కె.వి.వి. సత్యనారాయణ అన్నారు. ప్రత్తిపాడు మండలం నడింపాలెంలో గురువారం ఏపీ పశుగణాభివృద్ధి సంస్థ, పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో మేలుజాతి లేగ దూడల ప్రదర్శనను నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆయన ప్రత్తిపాడు ఏడీ సుగణ్యరావు, ఇతర అధికారులతో కలిసి రిబ్బన్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ పాడి రైతులు లేగ దూడలకు సరైన పోషకాహారం అందించాలన్నారు. యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా పశు సంతతిని జాగ్రత్తగా కాపాడుకోవచ్చన్నారు. లింగ నిర్ధారిత వీర్యం వలన బహుళ ప్రయోజనాలున్నాయని, రైతులు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో గుంటూరు డివిజన్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ టి. శంకరరావు, పశువైద్యులు డాక్టర్ వై. ఈశ్వరరెడ్డి, సీహెచ్. హరీష్ ఖన్నా, కె.వి.ఎస్. నందకిశోర్ తదితరులు పాల్గొన్నారు. -
ధాన్యం కొనుగోలులో అప్రమత్తంగా ఉండాలి
జాయింట్ కలెక్టర్ ఆశుతోష్ శ్రీవాస్తవ గుంటూరు వెస్ట్: ఖరీఫ్ సీజన్ 2025–26లో ధాన్యం సేకరణపై ఆయా శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండి రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ ఆశుతోష్ శ్రీవాస్తవ అన్నారు. గురువారం కలెక్టరేట్లోని ఎస్.ఆర్.శంకరన్ సమావేశ మందిరంలో ఏపీ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యాన ఖరీఫ్ సీజన్ 2025–26లో ధాన్యం సేకరణపై అవగాహన, శిక్షణ సదస్సు నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ జిల్లాలో ఖరీఫ్ సీజన్లో రైతు సేవ కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తామన్నారు. జిల్లాలో 50 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా నిర్దేశించినట్లు తెలిపారు. ధాన్యం కనీస మద్దతు ధర సాధారణ రకం (కామన్) క్వింటా (100 కిలోలు) రూ.2,369, ‘ఏ’ గ్రేడ్ రకం క్వింటా (100 కిలోలు) రూ.2,389లుగా నిర్ణయించినట్లు తెలిపారు. గత సంవత్సరం మద్దతు ధర కన్నా రూ.69 అధికంగా చెల్లించనున్నట్లు తెలిపారు. ధాన్యం విక్రయంలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా టోల్ ఫ్రీ నెంబర్ 1967కు ఉదయం ఎనిమిది నుంచి సాయంత్రం ఏడు గంటలలోపు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. గుంటూరు జిల్లా కంట్రోలు రూమ్ ఏర్పాటు చేసినట్లు(నెం.94913 92717) తెలిపారు. సమావేశంలో సివిల్ సప్లయీస్ డీఎం తులసి, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బండ్లమూడి వెంకయ్య చౌదరి, మిల్లర్లు, తదితరులు పాల్గొన్నారు. -
12న బ్రాహ్మణ వధూవరుల పరిచయ వేదిక
తెనాలి: స్థానిక ఆంధ్రాప్యారిస్ బ్రాహ్మణ ఉచిత వివాహ సమాచార కేంద్రం ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీన ‘రాష్ట్రస్థాయి బ్రాహ్మణ వధూవరుల పరిచయ వేదిక’ జరగనుంది. బోసురోడ్డులోని నూకల రామకోటేశ్వరరావు కల్యాణ మండపంలో కార్యక్రమం ఉంటుంది. స్థానిక రామలింగేశ్వరపేటలోని మూల్పూరు సుబ్రహ్మణ్య కల్యాణ మండపంలో గురువారం విలేకరుల సమావేశంలో కేంద్రం పాలకవర్గ అధ్యక్షుడు టి.దక్షిణామూర్తి సంబంధిత కరపత్రాన్ని ఆవిష్కరించారు. రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారికి ఉచిత భోజన సౌకర్యంతోపాటు సమాచార బుక్లెట్ ఇస్తామన్నారు. ప్రధాన కార్యదర్శి ఎన్వీ సత్య కుమార్, సంయుక్త కార్యదర్శి పింగళి వేణుధర్, గౌరవాధ్యక్షుడు పీఎల్జీఎస్ ప్రకాశరావు, కోశాధికారి ఆర్.రాజేంద్రప్రసాద్, గౌరవ సలహాదారు బీఎల్ సత్యనారాయణమూర్తి, సభ్యులు డీవీ సోమయ్య శాస్త్రి పాల్గొన్నారు. -
ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలి
నగరంపాలెం: జిల్లాలోని ప్రజలకు ఉత్తమమైన పోలీస్ సేవలు అందించాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. నగరంపాలెంలోని జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలోని హాల్లో గురువారం నేర సమీక్షా సమావేశం (సెప్టెంబర్ – 2025) నిర్వహించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి రోజు రెండుసార్లు రోల్కాల్తోపాటు, వారంలో ఒకసారి పోలీస్ సిబ్బందితో సమీక్షా సమావేశం చేపట్టాలని అన్నారు. శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజలకు సత్వర, నాణ్యమైన సేవలపై దృష్టి సారించాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజలకు పోలీసులు అందుబాటులో ఉండాలన్నారు. రాత్రుళ్లు గస్తీ నిర్వర్తించే సమయంలో లాఠీలు, టార్చ్లైట్లు, విజిల్స్ తీసుకెళ్లాలని, పోలీస్ సైరన్ వినియోగించాలని చెప్పారు. పోలీస్స్టేషన్ల పరిధిలో రాత్రి పదిన్నరలోపు దుకాణాలు మూసివేయించాలని, లేనిచో కఠిన చర్యలు చేపట్టాలన్నారు. రాత్రుళ్లు అనుమానాస్పదంగా సంచరించే వ్యక్తులను అదుపులోకి తీసుకుని, సాంకేతిక పరికరాలతో తనిఖీలు చేయాలని చెప్పారు. విద్యా, వ్యాపార సంస్థల వద్ద గస్తీ కొనసాగించాలని తెలిపారు. రహదారులపై అల్లర్లు సృష్టించే వారిపై చట్టం ప్రకారం చర్యలు ఉండాలన్నారు. రౌడీషీటర్ల కదలికలపై నిఘా ఉండాలని, తరచూ నేరాలకు పాల్పడే వారిపై రౌడీషీట్లు తెరవాలన్నారు. రానున్న దీపావళి దృష్ట్యా ప్రతి పోలీస్‌స్టేషన్ పరిధిలోని బాణసంచా విక్రయ దుకాణాలు, నిల్వలు, లైసెన్సులను పరిశీలించాలని సూచించారు. అనుమతుల్లేని వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని అన్నారు. సమావేశంలో జిల్లా ఏఎస్పీలు జీవీ.రమణమూర్తి (పరిపాలన), ఏటీవీ.రవికుమార్ (ఎల్/ఓ), ఎ.హనుమంతు (ఏఆర్), డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. -
13న పెన్షన్ అదాలత్
గుంటూరు ఎడ్యుకేషన్: కృష్ణనగర్‌లోని ఉద్యోగుల భవిష్యనిధి (ఈపీఎఫ్) ప్రాంతీయ కార్యాలయంలో ఈ నెల 13న ఉదయం 11 గంటలకు పెన్షన్ అదాలత్, ప్రయాస్ వెబినార్ నిర్వహించనున్నట్లు పీఎఫ్ కార్యాలయ వర్గాలు గురువారం ఓ ప్రకటనలో తెలిపాయి. వ్యక్తిగతంగా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావచ్చునని, ఆన్లైన్, ఈ–మెయిల్, వాట్సాప్‌ల్లోనూ పంపవచ్చని పేర్కొన్నాయి. మెయిల్‌తో పాటు వాట్సాప్ నంబరు: 94946 57469, 0863–2344106, 2232921 నంబర్లకు ఫోన్ ద్వారా తెలియజేయాలని అధికారులు కోరారు. వెబ్ ఎక్స్ ఐడీ 2640 680 9421, పాస్‌కోడ్: ఈపీఎఫ్‌వో ఎట్ దరేట్ 1234 ద్వారా జాయిన్ కావాలని సూచించారు. మరొకరికి తీవ్రగాయాలు మేడికొండూరు: మేడికొండూరు మండలం గుండ్లపాలెం బస్టాండ్ సమీపంలో బుధవారం అర్ధరాత్రి రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందారు. మృతుడిని పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం అనుపాలెం గ్రామానికి చెందిన టెంపో డ్రైవర్ ఆల వెంకటేశ్వర్లుగా గుర్తించారు. టెంపో, ఎదురుగా వచ్చిన లారీ అతి వేగంగా ఢీకొనడంతో టెంపో ధ్వంసమైంది. మృతదేహం చెట్లలో ఇరుక్కుపోవడంతో స్థానికులు తీవ్రంగా శ్రమించి బయటకు తీశారు. మేడికొండూరు పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని గుంటూరు ప్రభుత్వ మార్చురీకి తరలించారు. లారీ డ్రైవర్ సయ్యద్ బాబావలికి సొంతూరు మేడికొండూరు మండలం పేరిచర్ల గ్రామం అని గుర్తించారు. ఆయనకు తీవ్రగాయాలు కావడంతో చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి అతివేగమే కారణమై ఉండొచ్చని ప్రాథమికంగా పోలీసులు భావిస్తున్నారు. -
మెడి‘కిల్’ను ఉపసంహరించుకోవాలి
గుంటూరు ఎడ్యుకేషన్ : వైద్య కళాశాలలను పబ్లిక్, పైవేటు భాగస్వామ్యంతో (పీపీపీ) నిర్మించేందుకు కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రజల్లో పెద్దఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతున్న దృష్ట్యా ఉపసంహరించుకోవాలని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కేఎస్ లక్ష్మణరావు డిమాండ్ చేశారు. గుంటూరు బ్రాడీపేటలోని యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో బుధవారం జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ప్రభుత్వ రంగంలోనే వైద్య విద్య, ప్రజారోగ్య వ్యవస్థ కొనసాగాలని నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో విద్యార్థి, ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొని మాట్లాడారు.కేఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒకటి చొప్పున ప్రతిపాదించి, నిర్మాణాన్ని ప్రారంభించిన ప్రభుత్వ వైద్య కళాశాలలకు అనుబంధంగా ఏర్పాటు చేసే 300 పడకల ఆసుపత్రితో పేదలకు ఉచితంగా నాణ్యమైన వైద్య సేవలు అందుతాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం 60 శాతం నిధులు సమకూరుస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక భారం నెపంతో 10 వైద్య కళాశాలలను పీపీపీ విధానంలో ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడం సహేతుకం కాదని ఖండించారు.జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ముందుకెళ్తే ప్రభుత్వాలు మనుగడ సాధించలేవని తెలిపారు. వైద్యం ప్రభుత్వ రంగంలో ఉంటే పేద, మధ్యతరగతి ప్రజలకు జరిగే మేలు గురించి ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ప్రత్యక్ష సాక్ష్యమని పేర్కొన్నారు.ఏపీ మెడికోస్ పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వైద్యం కోసం ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తే కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయని తెలిపారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రభుత్వం చేస్తున్న ఖర్చు కంటే నాలుగు నుంచి ఐదు రెట్లు అదనంగా పేద ప్రజలు సేవలు పొందుతారని పేర్కొన్నారు. జీవో నంబర్ 107, 108లపై నాడు ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం పూర్తిగా విస్మరించడం తగదని హితవు పలికారు.సమావేశానికి అధ్యక్షత వహించిన డాక్టర్ ఏఎస్ ప్రసాద్ మాట్లాడుతూ గత 37 ఏళ్లుగా విద్య, వైద్య రంగాలపై జన విజ్ఞాన వేదిక కృషి చేస్తోందని తెలిపారు. ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ ఎండగడుతూ రాష్ట్రవ్యాప్తంగా ప్రజా చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. సమావేశంలో జన విజ్ఞాన వేదిక జిల్లా కోశాధికారి గోరంట్ల వెంకటరావు, అవగాహన కార్యదర్శి కొండా శివరామిరెడ్డి, నేస్తం సహ వ్యవస్థాపకులు టి. ధనుంజయరెడ్డి, ఆవాజ్ నేత చిస్టీ, కౌలు రైతుల సంఘం నాయకులు అజయ్ కుమార్, మెడికల్ రిప్రజెంటేటివ్ యూనియన్ నేతలు కుమార్, శ్రీనివాస్, సలీం పాల్గొన్నారు. -
విద్యార్థిని చితకబాదిన వైస్ ప్రిన్సిపాల్
చెరుకుపల్లి: బాపట్ల జిల్లా గుళ్లపల్లి ఎన్ఆర్ఐ కళాళాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సర విద్యార్థి పాల్ గాంధీని వైస్ ప్రిన్సిపాల్ విచక్షణ రహితంగా కొట్టగా ఆస్పత్రి పాలైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విద్యార్థి తల్లిదండ్రుల వివరాల మేరకు... గుళ్లపల్లి శివాలయం కాలనీకి చెందిన విద్యార్థి చల్లా పాల్ గాంధీకి, యశ్వంత్ అనే విద్యార్థితో ఈ నెల 7న క్లాస్రూమ్ బెంచ్‌పై కూర్చునే విషయంలో ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో వైస్ ప్రిన్సిపాల్ విజయ్ తరగతి గదికి వచ్చి విద్యార్థులను అడగ్గా పాల్గాంధీ యశ్వంత్‌ను కొట్టాడని చెప్పారు. దీంతో ఆగ్రహానికి గురైన వైస్ ప్రిన్సిపల్ పాల్గాంధీపై తన మోచేతితో వీపుమీద గుద్దుతుండగా దెబ్బలు తట్టుకోలేక చెయ్యి అడ్డం పెట్టాడు. చేతి వేళ్లు విరగడంతో తొలుత రేపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లారు. అక్కడ స్కానింగ్, ఎక్సరే తీయగా కుడి చేతి వేలి ఎముక విరిగినట్టు తల్లిదండ్రులు తెలిపారు. -
ముందస్తు పరీక్షలే బెస్ట్!
ఆధునిక జీవన శైలి వల్ల 50 ఏళ్లు దాటిన తరువాత వచ్చే రొమ్ము క్యాన్సర్లు నేడు 25 ఏళ్లకే కనిపించడం ఆందోళనకు దారి తీస్తోంది. విద్యావంతులు, చదువులేనివారు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ వ్యాధిపై అవగాహన లేకుండా నిర్లక్ష్యంగా ఉండటం వల్లే రొమ్ము క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఏడాది అక్టోబరు నెల రొమ్ము క్యాన్సర్ అవగాహన మాసంగా నిర్వహిస్తున్నారు.గుంటూరు మెడికల్: పేదల పెద్దాసుపత్రిగా పేరుగడించిన గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రిలో రొమ్ము క్యాన్సర్‌ను ప్రాథమిక దశలోనే గుర్తించే వైద్య పరికరం మెమోగ్రఫీ వైద్య పరికరం అందుబాటులో ఉంది. నాట్కో ట్రస్ట్ వారు రూ. కోటి విలువైన త్రీడీ డిజిటల్ మెమోగ్రఫీ వైద్య పరికరాన్ని నాట్కో క్యాన్సర్ సెంటర్లో అందుబాటులోకి తెచ్చారు. దీని ద్వారా రొమ్ము క్యాన్సర్‌ను ప్రాథమిక దశలోనే గుర్తించవచ్చు.మెమోగ్రామ్ పరీక్ష చేసినందుకు ప్రైవేటు ఆస్పత్రుల్లో సుమారు రూ. 2వేలు వరకు ఫీజు తీసుకుంటున్నారు. జీజీహెచ్‌లో వ్యాధి నిర్ధారణతోపాటు, రొమ్ము క్యాన్సర్ బాధితులకు అవసరమైన ఆపరేషన్లు ఉచితంగా చేస్తున్నారు. ఆపరేషన్ల అనంతరం అవసరమయ్యే రేడియేషన్ థెరఫీ, కిమోథెరఫీ వైద్య సేవలు సైతం జీజీహెచ్ నాట్కో క్యాన్సర్‌సెంటర్‌లో పూర్తి ఉచితంగా అందిస్తున్నారు.‘మెమోగ్రామ్’ పరీక్షలు చేయించుకున్నవారి వివరాలు..జీజీహెచ్‌లో రొమ్ము క్యాన్సర్ నిర్ధారణ పరీక్ష మెమోగ్రామ్ 2023లో 368 మంది, 2024లో 381మంది, 2025 సెప్టెంబరు వరకు 381 మంది పరీక్షలు చేయించుకున్నారు. రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతూ 2022లో 34 మంది, 2023లో 73 మంది, 2024లో 69 మంది, 2025 సెప్టెంబరు వరకు 55 మంది రొమ్ము క్యాన్సర్ ఆపరేషన్ చేయించుకున్నారు.స్క్రీనింగ్ పరీక్షలతో చెక్ మహిళలంతా మెమోగ్రామ్, బయాప్సీ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలి. క్యాన్సర్‌ను ప్రథమ దశలోనే గుర్తించి చికిత్స అందించడం ద్వారా పూర్తిగా నివారించవచ్చు. కుటుంబంలో ఎవరికై నా క్యాన్సర్ ఉంటే ఇతర కుటుంబ సభ్యు లకు వచ్చే అవకాశాలు ఉన్న దృష్ట్యా ముందస్తుగా జనటిక్ పరీక్ష చేయించాలి. సంతానం లేనివారికి, ఆలస్యంగా పిల్లలు పుట్టిన వారికి సైతం రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉన్న దృష్ట్యా ముందస్తుగా స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలి.–డాక్టర్ బైరపనేని స్రవంతి, క్యాన్సర్ వైద్య నిపుణులు, గుంటూరుఉచితంగా రొమ్ము క్యాన్సర్ ఆపరేషన్లు... నాట్కో క్యాన్సర్ సెంటర్లో కార్పొరేట్ ఆస్పత్రుల కంటే దీటుగా రొమ్ము క్యాన్సర్ బాధితులకు చికిత్స అందించేలా ఆపరేషన్ థియేటర్ ఏర్పాటు చేశాం. గత ఏడాది 69 మందికి, ఈఏడాది ఇప్పటివరకు 55 మందికి ఉచితంగా క్యాన్సర్ ఆపరేషన్లు చేశారు. నన్నపనేని లోకాధిత్యుడు, సీతారావమ్మ స్మారక నాట్కో సెంటర్లో 24 గంటలు కార్పోరేట్ ఆస్పత్రుల కంటే ధీటుగా ఉచితంగా క్యాన్సర్ వైద్యసేవలను అందిస్తున్నారు.– నన్నపనేని సదాశివరావు, నాట్కో ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్తొలిదశలోనే గుర్తించవచ్చుతొలి దశలోనే రొమ్ము క్యాన్సర్‌ను గుర్తించేందుకు మెమోగ్రామ్ పరీక్ష చేస్తారు. మెమోగ్రామ్తో రెండు మి.మీ కన్నా తక్కువ సైజులో రొమ్ములో గడ్డలు ఉన్నా గుర్తించి వెంటనే వైద్యం చేయవచ్చు తొలి దశలోనే వ్యాధిని గుర్తిస్తే వ్యాధి నుంచి త్వరితగతిన కోలుకోవటంతోపాటుగా మరణాన్ని తప్పించవచ్చు. మహిళలే స్వయంగా రొమ్ము పరీక్ష చేసుకుని రొమ్ములో ఏమైనా గడ్డలు ఉన్నట్లు అనిపిస్తే తక్షణమే వైద్యులను సంప్రదించాలి.– డాక్టర్ చక్కా సుజాత, సీనియర్ రేడియాలజిస్ట్, గుంటూరు -
తొలిదశలోనే గుర్తించవచ్చు
తొలి దశలోనే రొమ్ము క్యాన్సర్‌ను గుర్తించేందుకు మెమోగ్రామ్ పరీక్ష చేస్తారు. మెమోగ్రామ్తో రెండు మి.మీ కన్నా తక్కువ సైజులో రొమ్ములో గడ్డలు ఉన్నా గుర్తించి వెంటనే వైద్యం చేయవచ్చు తొలి దశలోనే వ్యాధిని గుర్తిస్తే వ్యాధి నుంచి త్వరితగతిన కోలుకోవటంతోపాటుగా మరణాన్ని తప్పించవచ్చు. మహిళలే స్వయంగా రొమ్ము పరీక్ష చేసుకుని రొమ్ములో ఏమైనా గడ్డలు ఉన్నట్లు అనిపిస్తే తక్షణమే వైద్యులను సంప్రదించాలి. – డాక్టర్ చక్కా సుజాత, సీనియర్ రేడియాలజిస్ట్, గుంటూరు -
స్క్రీనింగ్ పరీక్షలతో చెక్
మహిళలంతా మెమోగ్రామ్, బయాప్సీ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలి. క్యాన్సర్‌ను ప్రథమ దశలోనే గుర్తించి చికిత్స అందించడం ద్వారా పూర్తిగా నివారించవచ్చు. కుటుంబంలో ఎవరికై నా క్యాన్సర్ ఉంటే ఇతర కుటుంబ సభ్యు లకు వచ్చే అవకాశాలు ఉన్న దృష్ట్యా ముందస్తుగా జనటిక్ పరీక్ష చేయించాలి. సంతానం లేనివారికి, ఆలస్యంగా పిల్లలు పుట్టిన వారికి సైతం రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉన్న దృష్ట్యా ముందస్తుగా స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలి. –డాక్టర్ బైరపనేని స్రవంతి, క్యాన్సర్ వైద్య నిపుణులు, గుంటూరు -
ఉచితంగా రొమ్ము క్యాన్సర్ ఆపరేషన్లు...
నాట్కో క్యాన్సర్ సెంటర్లో కార్పొరేట్ ఆస్పత్రుల కంటే దీటుగా రొమ్ము క్యాన్సర్ బాధితులకు చికిత్స అందించేలా ఆపరేషన్ థియేటర్ ఏర్పాటు చేశాం. గత ఏడాది 69 మందికి, ఈఏడాది ఇప్పటివరకు 55 మందికి ఉచితంగా క్యాన్సర్ ఆపరేషన్లు చేశారు. నన్నపనేని లోకాధిత్యుడు, సీతారావమ్మ స్మారక నాట్కో సెంటర్లో 24 గంటలు కార్పోరేట్ ఆస్పత్రుల కంటే ధీటుగా ఉచితంగా క్యాన్సర్ వైద్యసేవలను అందిస్తున్నారు. – నన్నపనేని సదాశివరావు, నాట్కో ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ -
జీఎస్టీ నిబంధనల ప్రకారం ఔషధాల అమ్మకం
గుంటూరు మెడికల్: ఔషధ ఉత్పత్తులపై సవరించిన జీఎస్టీ నిబంధనల ప్రకారం విక్రయించేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఔషధ నియంత్రణ పరిపాలన శాఖ సహాయ సంచాకులు డి.లక్ష్మణ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏమాత్రం ‘తగ్గిందేలే’ శీర్షిక పేరుతో బుధవారం జిల్లా పత్రికలో ప్రచురితమైన కథనంపై లక్ష్మణ్ స్పందించారు. తమ రాష్ట్ర కార్యాలయ సూచనల ప్రకారం సెప్టెంబరు 20న జిల్లాలోని కెమిస్టులు, డ్రగ్గిస్టులతో జీఎస్టీపై అవగాహన కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. కొత్త జీఎస్టీ నియమాలు, బిల్లింగ్ విధానాలు, ఇన్వాయిస్లపై సవరించిన ఎమ్మార్పీ ధరల ప్రకారం రిటైల్, హోల్‌సేల్ మందుల డీలర్లకు అవగాహన కల్పించామని ఆయన వివరించారు. బిల్లింగ్ స్టాఫ్‌వేర్‌లో సవరించిన జీఎస్టీ ధరలను సరిగా చేర్చాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన డ్రగ్ ఇన్స్పెక్టర్లు 21 మెడికల్ షాపులు, హాస్పిటల్స్‌లోని మందుల షాపుల్లో తనిఖీలు నిర్వహించారని ఆయన వెల్లడించారు. సదరు తనిఖీల్లో కొత్త జీఎస్టీ నియమాలు పాటిస్తున్నట్లు డ్రగ్ ఇన్స్పెక్టర్లు గుర్తించారని పేర్కొన్నారు. సవరించిన ఎమ్మార్పీని ఫార్మసీలు తిరిగి లేబుల్ చేయడమనేది డ్రగ్, కాస్మోటిక్ చట్టం 1940 కింద రూపొందించిన నిబంధనలు తయారీ, కార్యకలాపాల కిందకు వస్తుందని వివరించారు. -
ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపర్చాలి
గుంటూరు ఎడ్యుకేషన్ : గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చేందుకు సంపూర్ణ పారిశుధ్యాన్ని సాధించాలని జిల్లా పంచాయతీ అధికారి బీవీఎం సాయికుమార్ పేర్కొన్నారు. జెడ్పీ సమావేశ మందిరంలో బుధవారం స్థానిక సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ‘ధీమ్–5 క్లీన్ అండ్ గ్రీన్ విలేజ్’పై రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలోని ఎంపీడీవోలు, డిప్యూటీ ఎంపీడీవోలకు ఒక్కరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీపీవో సాయికుమార్ మాట్లాడుతూ గ్రామాల్లో అపరిశుభ్ర పరిస్థితులు, అధ్వాన్న వాతావరణం కారణంగా ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని చెప్పారు. సంపూర్ణ పారిశుధ్యాన్ని సాధించడం ద్వారా ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచవచ్చునని తెలిపారు. జెడ్పీ సీఈవో వి.జ్యోతిబసు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతత ప్రజల్లో పూర్తిస్థాయిలో అవగాహన కల్పించడం ద్వారా సత్ఫలితాలను సాధించవచ్చునని అన్నారు. శిక్షణ కార్యక్రమంలో డీపీఆర్సీ రీసోర్స్ పర్సన్ రామకృష్ణ, ఎంపీడీవోలు, డిప్యూటీ ఎంపీడీవోలు పాల్గొన్నారు. -
ఆధునిక హంగులతో జిగేల్
తెనాలి: పట్టణంలోని కొత్తపేటలో గల పురాతన తహసీల్దార్ కార్యాలయం ఆధునిక హంగులతో జిగేల్ మంటోంది. అపరిశుభ్ర పరిసరాలు,వాహనాల పార్కింగ్తో చిందరవందరగా ఉండే కార్యాలయం నేడు కార్పొరేట్ తరహాలో సుందరీకరణకు నోచుకుంది. పనుల మీద వచ్చే ప్రజలకూ తగిన వసతులు కల్పించారు. పరిసరాలను ఆహ్లాదకరంగా తీర్చిదిద్దారు. అక్కడ అడుగుపెట్టినవారు ఇది ప్రభుత్వ కార్యాలయమేనా! అన్నంత అందంగా అధికారులు తీర్చిదిద్దారు.1887లో నిర్మాణంతెనాలి తహసీల్దార్ కార్యాలయం 1887లో బ్రిటిష్ పాలకుల హయాంలో 3.87 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటైంది. కాలక్రమంలో ఆ స్థలంలోనే కోర్టు, పోలీస్‌స్టేషన్, సబ్ ట్రెజరీ, సబ్ జైలు, ఎకై ్సజ్ స్టేషన్, ఫైర్‌స్టేషన్, ఎన్జీవో హోమ్, పెన్షనర్స్ అసోసియేషన్ కార్యాలయాలు వచ్చేశాయి. పరిసరాలు నిర్లక్ష్యానికి గురయ్యాయి. ఆవరణలోనే వాహనాల పార్కింగ్, పందుల సంచారం, ఏపుగా పెరిగిన చెట్ల పక్కన సందర్శకుల మూత్ర విసర్జన, కార్యాలయం వెనుక వైపు రాత్రిళ్లు మందుబాబులు తాగి పడేసిన బాటిళ్లతో దారుణంగా ఉండేది.తహసీల్దార్ చొరవతో ముందుకొచ్చిన దాతలుమండల తహసీల్దార్‌గా కేవీ గోపాలకృష్ణ బాధ్యతలు చేపట్టాక వీటిన్నిటినీ పరిశీలించారు. కార్యాలయ పరిసరాలతో పాటు భవనాన్ని కూడా సుందరీకరించాలని కంకణం కట్టుకున్నారు. మంచి పనికి మేమున్నామంటూ దాతలూ ముందుకొచ్చారు. ముందుగా పరిసరాలను శుభ్రం చేయించారు. ట్రాక్టరు లోడు ఖాళీ మద్యం సీసాలు తీయించారు. కార్యాలయానికి ఇరువైపులా ప్రహరీ వచ్చేసింది. ఆవరణలో శిథిలావస్థలో ఉన్న రెవెన్యూ ఉద్యోగుల పెంకుల భవనాన్ని ముందుగా ఆధునికీరించారు. సందర్శకుల కోసం మరో హాలును నిర్మించారు. అక్కడే విధులను నిర్వర్తిస్తూ భవనం సుందరీకరణకు పూనుకున్నారు. ఆవరణలో ఫ్లోరింగ్‌తో పాటు చక్కని పార్కును తీర్చిదిద్దారు. మధ్యలో నాలుగు సింహాల స్తూపంతో పాటు ఓ పక్కన వర్షపాతం నమోదు సూచికను ఏర్పాటుచేయించారు.కేరళ నుంచి పెంకులుప్రధాన భవనానికి అదే తరహా పెంకులను కేరళ నుంచి తెప్పించారు. అడుగు మందంలో ఫ్లోరింగ్ పెంచటంతో ముందు భాగంలో ఎత్తు తగ్గిన పైకప్పును జాకీలతో నాలుగు అంగుళాలు ఎత్తు పెంచారు. ఉద్యోగులకు ప్రత్యేకంగా క్యూబిక్ రూమ్స్, కంప్యూటర్ రూమ్, యాంటీ రూమ్, సందర్శకుల వెయిటింగ్ హాలు, ప్రత్యేకంగా టాయ్‌లెట్స్‌ను ఏర్పాటు చేయించారు. అటు ఉద్యోగులు, ఇటు పనుల నిమిత్తం వచ్చే ప్రజలకూ మంచి వాతావరణం కల్పించారు. వెనుకనున్న గ్రామ రెవెన్యూ ఉద్యోగుల సంఘ భవనాన్నీ కూడా సుందరీకరణ చేస్తున్నారు.చాలా సంతోషంగా ఉందినేను ఎక్కడ ఉద్యోగం చేసినా కార్యాలయం బాగుండేలా చూస్తా. తెనాలి వచ్చాక ఇక్కడ కార్యాలయం పరిస్థితి బాధేసింది. ఎలా బాగు చేయాలని ఆలోచిస్తూ ఉన్నా. ఈ సమయంలో నాకు ప్రధాన దాత సూర్యదేవర భువనకుమార్, మరికొందరు సహకరించారు. అనుకున్నట్టుగా సుందరీకరణ చేయగలిగాం. మరికొద్దిరోజుల్లో పూర్తిస్థాయిలో సిద్ధమవుతుంది. చాలా సంతోషంగా ఉంది.– కేవీ గోపాలకృష్ణ, తెనాలి తహసీల్దార్ -
ఏఎన్‌యూ వీసీగా సత్యనారాయణ రాజు
ఏఎన్‌యూ(పెదకాకాని): ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్‌గా ఆచార్య సామంతపూడి వెంకట సత్యనారాయణరాజు నియమితులయ్యారు. ఈ మేరకు గవర్నర్ నజీర్ అహ్మద్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆచార్య సత్యనారాయణరాజు ఇప్పటి వరకూ వారణాసిలోని బెనారస్ హిందూ యూనివర్సిటీలో ఎంటోమాలజీ ప్రొఫెసర్‌గా ఉన్నారు. ఏఎన్‌యూలో గత కొంతకాలంగా ఇన్చార్జి వీసీగా ఆచార్య కె. గంగాధరరావు విధులు నిర్వహిస్తున్నారు. సత్యనారాయణరాజు అగ్రికల్చర్ బీఎస్సీని మహారాష్ట్రలోని డాక్టర్ పుంజాబ్రావు క్రిషి విద్యాపీఠ్ నుంచి 1983లో ఉత్తీర్ణులయ్యారు. ఎంఎస్సీ అగ్రికల్చర్ కోర్సును హిమాచల్‌ప్రదేశ్‌లోని డాక్టర్ వైఎస్ పర్మార్ యూనివర్సిటీ ఆఫ్ ఆర్టికల్చర్ అండ్ పారెస్ట్రీ నుంచి 1986 లోనూ, అగ్రికల్చర్ ఎంటోమాలజీలో పీహెచ్‌డిని ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వారణాసి బెనారస్ హిందూ యూనివర్సిటీ నుంచి 1990లో పొందారు. బోధన రంగంలో 28, పరిశోధనా రంగంలో 32 సంవత్సరాల అనుభవం గడించారు. రైతులు అనుబంధ అంశాల్లో 28 సంవత్సరాలకు పైగా పాలు పంచుకున్నారు. పలు కమిటీల్లో సభ్యత్వం యునైటెడ్ కింగ్డమ్ దేశానికి చెందిన వరల్డ్ బీ ప్రాజెక్ట్ ఎడ్వజరీ బోర్డుకు, నాగాలాండ్ సెంట్రల్ యూనివర్సిటీ మేనేజ్మెంట్ కమిటీకి, బెనారస్ హిందూ యూనివర్సిటీలోని పలు కమిటీలు, పలు జాతీయ స్థాయి పరిశోధనా సంస్థల బోర్డుల్లోనూ సభ్యుడిగా సత్యనారాయణరాజు వ్యవహరించారు. 2017లో అలహాబాద్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ నుంచి ఎన్విరాల్మెంటల్ కాన్వర్జేషన్ అవార్డును, అదే ఏడాది వారణాసిలోని మహిమా రీచెర్చ్ ఫౌండేషన్ అండ్ సోషల్ వెల్ఫేర్ నుంచి లైఫ్‌టైమ్ ఎచ్చీవ్‌మెంట్ అవార్డును అందుకున్నారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఎన్సీసీ నుండి బెస్ట్ ఏఎన్‌ఓ అవార్డును అందుకున్నారు. 2018లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రో ఎన్విరాల్మెంట్ సొసైటీ నుంచి ఎమినెంట్ సైంటిస్ట్ అవార్డును, ఒరిస్సా రాష్ట్రంలోని అఫ్లైడ్ జువాలజిస్ట్ అండ్ రీసెర్చ్ సంస్థ నుండి డాక్టర్ ఆనంద్ ప్రకాష్ అవార్డును, 2019లో అలహాబాద్ యూనివర్సిటీ నుండి అగ్రికల్చరిక్ ఎచీవ్మెంట్ అవార్డును పొందారు. ప్రస్తుతం ఎంటోమాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా ఫెలోగా కొనసాగుతున్నారు. ఈయన పర్యవేక్షణలో ఇప్పటి వరకూ తొమ్మిది మందికి పీహెచ్‌డీలు, 34 మందికి పీజీ సంబంధిత డిగ్రీలు చేశారు. అమెరికా చైనాతో పాటు పలు దేశాలను సందర్శించి, పలు అంశాలపై పరిశోధనా పత్రాలు సమర్పించడంతో పాటు ప్రసంగాలు చేశారు. ఏఎన్‌యూలో ప్రస్తుతం ఏడాదిన్నరగా తాత్కాలిక వీసీగా విధులు నిర్వహిస్తున్న ఆచార్య కె. గంగాధరరావును తక్షణమే విధుల నుంచి రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రిజిస్ట్రార్ తగిన ఏర్పాట్లు చేయాలని జీవోలో పేర్కొన్నారు. నూతన వీసీగా ఆచార్య ఎస్ వెంకటసత్యనారాయణరాజు త్వరలో బాధ్యతలు చేపట్టనున్నారు. -
చంద్రవంక వరద ఉధృతి తగ్గుముఖం
మాచర్ల: చంద్రవంక వాగు వరద ఉధృతి తగ్గుముఖం పట్టింది. సోమవారం రాత్రి నుంచి మంగళవారం వరకు ఉధృతంగా ప్రవహించడంతో మాచర్ల నుంచి జమ్మలమడక, తుమృకోట గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా సంబంధిత అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. బుధవారం వరద తగ్గుముఖం పట్టడంతో రాకపోకలు కొనసాగాయి. నగరంపాలెం(గుంటూరు వెస్ట్) : స్థానిక నగరంపాలెం జిల్లా కోర్టు ఆవరణలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయి కల్యాణచక్రవర్తిని బుధవారం గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్‌జిందాల్ మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం పూల మొక్కను అందించారు. శాంతి భద్రతల పరిరక్షణ, చట్టవ్యతిరేక,అసాంఘిక కార్యకలాపాల నిర్మూలన కోసం న్యాయశాఖ, పోలీస్ శాఖ నిర్వహించాల్సిన పలు అంశాలపై చర్చించారు. జిల్లా న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం అందించడం, నేరస్తులకు త్వరితగతిన శిక్షలు పడేలా చర్యలు చేపట్టేందుకు అవసరమైన పరిపాలనా, చట్టపరమైన చర్యలపై చర్చించారు. జిల్లా ప్రజలకు సమర్థ, నిష్పాక్షిక సేవలు అందించాలని నిర్ణయించారు. మంగళగిరి టౌన్ : మంగళగిరి మండలం పెదవడ్లపూడిలోని యూపీ స్కూల్లో శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం ఆధ్వర్యంలో నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న 11వ ఉచిత మహిళా యోగా శిక్షణ శిబిరం బుధవారంతో ముగిసింది. ఈ యోగా ముగింపు మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యోగా సేవా కేంద్రం ఉప ప్రధాన యోగాచార్యులు శ్రీ యధాశక్తి యోగి గురూజీ హాజరయ్యారు. మహిళా యోగా సాధకులు పలు యోగాసనాలు ప్రదర్శించారు. పలువురు యోగా సాధకులు మాట్లాడుతూ యోగా సాధన వల్ల శారీరక ఆరోగ్యంతో పాటు, మానసిక రుగ్మతలు కూడా తొలగుతాయని అన్నారు. తల్లిదండ్రులు పిల్లలకు యోగా సాధనలో శిక్షణ ఇప్పించడానికి ఆసక్తి కనబర్చాలన్నారు. మహిళలు యోగా శిక్షణకు వెళితే కుటుంబమంతా ఆరోగ్యంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో యోగ సేవ కేంద్ర ప్రతినిధి కీర్తియోగి మాతాజీ, యోగా సాధకులు పద్మలత, సుజాత, పద్మ పాల్గొన్నారు. ఏఎన్యు(పెదకాకాని): ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలో బుధవారం నుంచి బి.ఫార్మసీ రెండవ సెమిస్టర్ (రెగ్యులర్), ప్రథమ సెమిస్టర్ (సప్లిమెంటరీ)పరీక్షలతో పాటు ఫార్మా.డి పరీక్షలు సజావుగా ప్రారంభమయ్యాయి. బి.ఫార్మసీ పరీక్షలు 18 కేంద్రాల్లోను, ఫార్మా.డి పరీక్షలు 10 కేంద్రాల్లో జరుగుతున్నాయి. వర్సిటీ పీజీ, వృత్తి విద్యా కోర్సుల పరీక్షల సమన్వయకర్త ఆచార్య ఎం.సుబ్బారావు నరసరావుపేటలోని ఇండో అమెరికన్ ఫార్మసీ కళాశాలలో పరీక్షలు జరుగుతున్న తీరును పరిశీలించారు. పొన్నూరు: దళిత, ఆదివాసీ హక్కుల సాధన కోసం కృషి చేసిన మహనీయుడు డాక్టర్ బాలగోపాల్ అని వక్తలు కొనియాడారు. పొన్నూరులోని మానవహక్కుల వేదిక కార్యాలయంలో బుధవారం బాల గోపాల్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు.ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో టి.రాజారావు, న్యాయవాదులు జి.ఎస్. రాయల్, తోడేటి శ్రీనివాస్, బలగని వెంకటేశ్వర్లు, షేక్ సుభాని, చుక్కా వెంకటేశ్వర్లు, గేరా మున్ని పాల్గొన్నారు. -
విద్యార్థిని చితకబాదిన వైస్ ప్రిన్సిపాల్
చెరుకుపల్లి: బాపట్ల జిల్లా గుళ్లపల్లి ఎన్ఆర్ఐ కళాళాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సర విద్యార్థి పాల్ గాంధీని వైస్ ప్రిన్సిపాల్ విచక్షణ రహితంగా కొట్టగా ఆస్పత్రి పాలైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విద్యార్థి తల్లిదండ్రుల వివరాల మేరకు... గుళ్లపల్లి శివాలయం కాలనీకి చెందిన విద్యార్థి చల్లా పాల్ గాంధీకి, యశ్వంత్ అనే విద్యార్థితో ఈ నెల 7న క్లాస్రూమ్ బెంచ్‌పై కూర్చునే విషయంలో ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో వైస్ ప్రిన్సిపాల్ విజయ్ తరగతి గదికి వచ్చి విద్యార్థులను అడగ్గా పాల్గాంధీ యశ్వంత్‌ను కొట్టాడని చెప్పారు. దీంతో ఆగ్రహానికి గురైన వైస్ ప్రిన్సిపల్ పాల్గాంధీపై తన మోచేతితో వీపుమీద గుద్దుతుండగా దెబ్బలు తట్టుకోలేక చెయ్యి అడ్డం పెట్టాడు. చేతి వేళ్లు విరగడంతో తొలుత రేపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లారు. అక్కడ స్కానింగ్, ఎక్సరే తీయగా కుడి చేతి వేలి ఎముక విరిగినట్టు తల్లిదండ్రులు తెలిపారు.వైస్ ప్రిన్సిపాల్ కొట్టడంతో వాచిన చేయి విద్యార్థి పాల్ గాంధీ (ఫైల్) -
సెలవులోకి వెళ్లిన లాం గ్రామ వీఆర్వో
తాడికొండ: కొండ భూమిని వదలని కూటమి నేతలు పేరిట సాక్షిలో బుధవారం ప్రచురితమైన కథనం కలకలం రేపింది. గ్రామానికి చెందిన ముస్లిం నాయకుడు చెరలో రెండెకరాల భూమి చేరడంపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అది ప్రభుత్వ కొండ పోరంబోకుగా రికార్డుల్లో నమోదై ఉన్న నేపథ్యంలో ఇక్కడ నిర్మాణాలు చేయకూడదని ఆదేశాలు జారీ చేశారు. అయితే, ఇంత పెద్ద మొత్తంలో ఆక్రమణ జరుగుతుంటే ఏం చేస్తున్నావంటూ సదరు వీఆర్వోపై రెవెన్యూ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.దీంతో ఆయన సెలవు మంజూరు చేయాలంటూ అధికారులకు లేఖను అందజేశారు. దీంతో అసలు ఏం జరుగుతుంది ? అనే దానిపై అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అధికార పార్టీ నాయకుడు కావడంతో భూ ఆక్రమణలకు సహకరిస్తారా ? లేక ప్రభుత్వ భూమిని కాపాడుతారా? అనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు. రాజధాని నేపథ్యంలో భూములకు రెక్కలొచ్చి ఇష్టారీతిగా జరుగుతున్న దందాలపై జిల్లా అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు కోరుతున్నారు. -
నకిలీ మద్యంపై మహిళల కన్నెర్ర
పట్నంబజారు(గుంటూరు ఈస్ట్): నారా వారి నకిలీ మద్యంపై మహిళా లోకం కన్నెర్రజేసింది..ఆడబిడ్డల పుస్తెలు తెంచుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. నకిలీ మద్యంలో చంద్రబాబు, లోకేష్ వాటాలు ఎంత ? పవన్ కల్యాణ్‌కు ప్యాకేజీ ఎంత ? అని మహిళలు నిలదీశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు నగర అధ్యక్షురాలు షేక్ నూరిఫాతిమా ఆధ్వర్యంలో అరండల్‌పేటలోని ఎక్సైజ్ కార్యాలయం వద్ద బుధవారం నకిలీ మద్యం, కూటమి కల్తీ విధానాలపై ఆందోళన చేపట్టారు. ముందుగా కల్తీ మద్యాన్ని నియంత్రించాలని డిమాండ్ చేస్తూ ప్రదర్శన చేపట్టారు. అనంతరం ఎక్సైజ్ కార్యాలయం ఎదుట శాంతియుతంగా నిరసన వ్యక్తం చేశారు. కల్తీ మద్యానికి కారుకులైన వారిపై కేసులు నమోదు చేయాలని ముక్తకంఠంతో నినదించారు. ఈ సందర్భంగా నూరిఫాతిమా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన నాటి నుంచి కల్తీ మద్యాన్ని ఏరులై పారిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇటీవల దొరుకుతున్న కల్తీ మద్యంలో అసలు నిందితులు ఎవరో ప్రజలకు తెలుసని స్పష్టం చేశారు. చంద్రబాబు, లోకేష్‌కు వాటాలు వెళ్తున్నాయని, పవన్ కల్యాణ్‌కు ప్యాకేజీ ఇస్తుండటంతో నోరు మెదపటం లేదని దుయ్యబట్టారు. కచ్చితంగా మహిళలు, రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని హెచ్చరించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నేతలు నందేటి రాజేష్, కార్పొరేటర్ ఫర్జానా, ఎం. ఉషారాణి, భాగ్యమ్మ, వరలక్ష్మి, తోటకూర స్వర్ణలత, షేక్ సలీం, షేక్ సుభాని, దోర్నాల శ్రీకాంత్‌రెడ్డి, పూనూరి నాగేశ్వరరావు, దూపాటి సాల్మన్, రాణా ప్రతాప్ పాల్గొన్నారు. -
వైఎస్ జగన్ అనకాపల్లి, విశాఖ జిల్లాల పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదే
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం అనకాపల్లి,విశాఖ జిల్లాలలో పర్యటించనున్నారు. ఈ మేరకు వైఎస్ జగన్ జగన్ పర్యటన వివరాలను వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం విడుదల చేసింది. ఆ పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి. వైఎస్ జగన్ రేపు (09.10.2025) ఉదయం 9.20 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 11 గంటలకు విశాఖపట్నం చేరుకుంటారు, అక్కడినుంచి అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలం భీమబోయినపాలెం (వయా-ఎన్ఏడీ జంక్షన్, వేపకుంట, పెందుర్తి, కొత్తూరు జంక్షన్, తాళ్ళపాలెం జంక్షన్) వెళ్ళి మధ్యలో నిర్మాణం నిలిపివేసిన ప్రభుత్వ వైద్య కళాశాలను సందర్శిస్తారు. అనంతరం మధ్యాహ్నం అక్కడినుంచి బయలుదేరి విశాఖపట్నం కేజీహెచ్ (వయా - తాళ్ళపాలెం జంక్షన్, కొత్తూరు జంక్షన్, పెందుర్తి, వేపకుంట, ఎన్ఏడీ జంక్షన్)కు చేరుకుంటారు. కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న గిరిజన విద్యార్ధులను పరామర్శిస్తారు. అనంతరం సాయంత్రం అక్కడి నుంచి తిరుగుపయనమవుతారు. -
వైఎస్ జగన్‌ను కలిసిన డీఎస్సీ అభ్యర్థులు
తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని డీఎస్సీ అభ్యర్థులు కలిశారు. డీఎస్సీ-2025 ను రద్దు చేసేలే ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. రీ నోటిఫికేషన్ ఇచ్చి ఒకే పేపర్‌తో పరీక్ష నిర్వహించాలని అభ్యర్థులు కోరారు. నచ్చినట్లుగా మార్కులు కలిపే నార్మలైజేషన్ విధానం మోసపూరితంగా ఉందని డీఎస్సీ అభ్యర్థులు అన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన జీవో 77 రద్దుచేసేలా ఒత్తిడి తేవాలని విజ్ఞప్తి చేశారు. డిఎస్సీ అభ్యర్థుల విజ్ఞప్తి పట్ల వైఎస్ జగన్ సానుకూలంగా స్పందించారు. -
ప్రధాని మోదీకి వైఎస్ జగన్ అభినందనలు
సాక్షి, గుంటూరు: బీజేపీ అగ్రనేత, దేశ ప్రధాని నరేంద్ర మోదీకి వైఎస్సార్సీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు(YS Jagan Congratulate PM Modi). పాతికేళ్ల పాలనా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నందుకు ఆయన్ని అభినందిస్తూ ఈ మేరకు ఎక్స్ ఖాతాలో ఓ సందేశం ఉంచారాయన. పాలనాధిపతిగా విశిష్ట సేవలందిస్తూ.. 25వ సంవత్సరంలోకి అడుగుపెట్టినందుకు నరేంద్ర మోదీకి అభినందనలు, దేశ సేవలో ఆయన అంకితభావం, పట్టుదల, నిబద్ధతను ప్రతిబింబించే గొప్ప మైలురాయి ఇది. ఈ సందర్భంగా.. ఆయనకు మరింత శక్తి కలగాలని, మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నా అంటూ వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓ సందేశం ఉంచారు.Congratulations to Shri @narendramodi ji on entering the 25th year of distinguished service in heading governance. A remarkable milestone reflecting dedication, perseverance, and commitment in service to the Nation. Wishing you continued strength and success.— YS Jagan Mohan Reddy (@ysjagan) October 8, 2025నరేంద్ర దామోదరదాస్ మోదీ.. 2001 అక్టోబరు 7న గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అలా.. 2014 మే 22 వరకు ఆ పదవిలో కొనసాగారు. అటుపై సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించగా.. మే 26వ తేదీన తొలిసారిగా భారతదేశ ప్రధానమంత్రిగా ప్రమాణం చేశారు. అలా.. 11 ఏళ్లకు పైబడి మూడు పర్యాయాలు వరుసగా ఆయన ఆ పదవిలో కొనసాగుతున్నారు. ఈ మైలురాయి సందర్భంగా.. భారత ప్రజలకు కృతజ్ఞుడిని అంటూ మంగళవారం మోదీ(Modi On 25 Years Governance) ఓ ప్రకటన విడుదల చేశారు.ఇదీ చదవండి: ఇందిరా గాంధీ రికార్డు బద్ధలు కొట్టిన ప్రధాని మోదీ -
రాష్ట్రంలో కులగణన చేపట్టాలి
లక్ష్మీపురం: తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలలో ఏ తరహాలో కులగణన చేశారో అదే తరహాలో ఆంధ్రప్రదేశ్‌లో కూడా చేసేందుకు చర్యలు చేపట్టాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గుంటూరు కొత్తపేటలోని జిల్లా సీపీఐ కార్యాయలంలోని మల్లయ్య లింగం భవన్లో మంగళవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. జనగణనలో కులగణన తక్షణమే చేపట్టాలని, బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాల జనాభా ప్రాతిపదికన స్థానిక సంస్థలలో సీట్లు కేటాయించాలని కోరుతూ సీపీఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశానికి సీపీఐ జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి అధ్యక్షత వహించారు. రామకృష్ణ మాట్లాడుతూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జనగణనలో కులగణన చేయడమే కాకుండా త్వరలో జరుగబోతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జనాభా ప్రాతిపదికన 42 శాతం సీట్లు బీసీలకు కేటాయించడం జరిగిందన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో కూడా కులగణన చేపట్టాలని, అనంతరం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం మాట్లాడుతూ కులగణన జరిగితే బీసీలు ఎవరి దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సిన అవసరం ఉండదని చెప్పారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకరరావు కులగణన కోసం క్షేత్రస్థాయి నుంచి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, బీసీ నాయకులు, ప్రముఖ వైద్యులు డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి, సీపీఐ నాయకులు జంగాల అజయ్‌కుమార్, ముస్లిం లీగ్ రాష్ట్ర అధ్యక్షుడు బషీర్ అహ్మద్, సీపీఎం జిల్లా నాయకులు పాశం రామారావు, ఓబీసీ రాష్ట్ర అధ్యక్షులు అంగిరేకుల పరప్రసాద్, ముస్లిం హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు ఖాజావలి ప్రసంగించారు. సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ -
ఏపీ పీజీసెట్ పీడబ్ల్యూడీ కేటగిరిలకు కౌన్సెలింగ్ రేపు
ఏఎన్‌యూ(పెదకాకాని): ఏపీ పీజీ సెట్ ప్రవేశాల్లో భాగంగా వర్సన్ విత్ డిజేబిలిటీస్ (పీడబ్ల్యూడి) కేటగిరిలో అడ్మిషన్లకు గురువారం కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు కౌన్సెలింగ్ కో ఆర్డినేటర్ ఆచార్య ఆర్‌వీఎస్‌ఎస్‌ఎన్ రవికుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని సూచించారు. ఉదయం 10 గంటలకు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ హెల్ప్ లైన్ సెంటర్లో జరిగే కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని కోరారు.ఆంధ్రాలో సినిమాలు తీయవద్దునిర్మాతలకు ‘మా– ఏపీ’ వ్యవస్థాపకుడు దిలీప్‌రాజా వినతితెనాలి: ఆంధ్రాలో సినిమాలు చిత్రీకరించవద్దని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్(మా–ఏపీ) వ్యవస్థాపకుడు, సినీ దర్శకుడు దిలీప్‌రాజా నిర్మాతలకు విజ్ఞప్తి చేశారు. గుంటూరు జిల్లా తెనాలిలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆంధ్రాలో తీసే సినిమాకు రూ.10 లక్షలు సబ్సిడీ చెల్లిస్తామని జీవో చేసినా ఒక్క సినిమాకు కూడా సబ్సిడీ ఇవ్వలేదని విమర్శించారు. అతితక్కువ నిర్మాణ వ్యయంతో రూపొందిస్తున్న ‘భోజ్ పురి’ సినిమాలకు సైతం సబ్సిడీ వెంటనే చెల్లిస్తున్నారని చెప్పారు. పదేళ్లుగా సినిమాలకు సబ్సిడీ చెల్లించని రాష్ట్రాలున్నాయా? అని ప్రశ్నించారు. ఆంధ్రాలో సినీపరిశ్రమ అభివృద్ధి గురించి ఒంటరిపోరాటం మినహా ఆశించిన స్పందన ప్రభుత్వం నుంచి రావటం లేదన్నారు. పరిశ్రమ గురించి పట్టించుకునే పరిస్థితిలో ప్రభుత్వం ఉంటే ఒక రూట్ మ్యాప్‌ను సిద్ధం చేసి విధివిధానాలను ప్రకటించేదని పేర్కొన్నారు.ఉమ్మడి జిల్లా బాస్కెట్‌బాల్ జట్ల ఎంపికచిలకలూరిపేట: చిలకలూరిపేట ఏఎంజీ పాఠశాల క్రీడా మైదానంలో మంగళవారం అండర్–19 బాలురు, బాలికల ఉమ్మడి గుంటూరు జిల్లా బాస్కెట్‌బాల్ జట్ల ఎంపిక పోటీలు విజయవంతంగా ముగిశాయి. ఈ పోటీల్లో పల్నాడు, గుంటూరు, బాపట్ల జిల్లాల నుంచి సుమారు 80 మంది క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పాఠశాల హెచ్ఎం కృపాదానం, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ వీరరాఘవయ్యలు ప్రారంభించిన ఈ క్రీడా పోటీలను ఉమ్మడి గుంటూరు జిల్లా ఎస్ఎఫ్ కార్యదర్శి నరసింహారావు, సహాయ కార్యదర్శి పద్మాకరరావు పర్యవేక్షించారు.ఎంపికై న బాలురు జట్టు: నాగశరత్, అస్రామ్, ఎండి అబ్దుల్ సమీర్, కె.జయరామ్, యశ్వంత్, యు హేమంత్‌రెడ్డి, జె అంకమ్మరావు, త్రినాథ్, ఎస్ వెంకటరాజేష్, ఎల్.లాకేష్, సీహెచ్ అక్ష, కె.వంశీకృష్ణ.బాలికల జట్టు: ఇ.ప్రశాంతి, శ్రీ చందన, జి.అనిత, జి.మనీష, నేత్ర, పి.పావని, పి.హారిక, బి.శ్రీవల్లి, బి.రష్మి, కె.శ్రావ్య, జి.గౌతమి, పి.జ్యోతి చంద్రిక, పి.అమృతవర్షిణి. ఎంపికై న క్రీడాకారులను ఎస్ఎఫ్ కార్యదర్శి నరసింహారావు, సహాయ కార్యదర్శి పద్మాకరరావులతో పాటు పీఈటీలు, ఇతర పెద్దలు అభినందించారు. -
నయా కవులు... ఫేక్ డాక్టరేట్లు
‘కవిగారూ...మీకు డాక్టరేట్ ఎవరిచ్చారు...? కొందరు కవులు/రచయితల వాట్సాప్ గ్రూపులో తెనాలికి చెందిన ఒకరు తన పేరుకు ముందు డాక్టర్‌ను చేర్చుకోవటంతో పీహెచ్డీ చేసి డాక్టరేట్ తీసుకున్న ఓ మహిళ వేసిన ప్రశ్న ఇది! ‘ఫలానా సంస్థ రూ.150 చెల్లిస్తే ఇచ్చింది...’ అంటూ సదరు కవిగారు సమాధానమిచ్చారు. ‘అలా ఎలా ఇస్తారు...ఏవిధంగా తీసుకుంటారు...నేను కేసు పెడతా’నంటూ ఆ మహిళ ఆగ్రహోదగ్రురాలైంది...ఇది జరిగి నాలుగురోజులైనా కాలేదు. -
మిర్చి సీజన్ నాటికి ఏర్పాట్లు పూర్తి చేయాలి
కొరిటెపాడు(గుంటూరు): రాబోయే మిర్చి సీజన్ నాటికి మిర్చి యార్డు లోపల, బయట రైతులు, వ్యాపారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని మార్కెటింగ్ శాఖ రీజినల్ జాయింట్ డైరెక్టర్ కాకుమాను శ్రీనివాసరావు కోరారు. మిర్చి సీజన్ ఏర్పాట్లపై మార్కెటింగ్ శాఖ అధికారులు, మిర్చి ఎగుమతి, దిగుమతి వ్యాపారులు, సూపర్ వైజర్లు, వేమెన్స్లతో మంగళవారం సన్నాహాక సమావేశం నిర్వహించారు. తొలుత పలువురు ఎగుమతిదారులు మాట్లాడుతూ మిర్చి సీజన్లో సుమారు లక్ష మంది, అన్ సీజన్లో 50 వేల మంది యార్డుపై ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు. సీజన్లో యార్డులోని అన్ని గేట్లు తెరిచేలా చూడాలన్నారు. కొనుగోలు చేసిన మిర్చిని తరలించేందుకు ట్రాన్స్‌పోర్టు సమస్య ఉందని, యార్డుకు ఇరువైపులా రోడ్లు విస్తరించాలని సూచించారు. లారీల యూనియన్ సమస్య అధికంగా ఉందని, కిరాయి ఎక్కువగా ఉందని, దానిని నియంత్రించేలా చర్యలు చేపట్టాలని విన్నవించారు. పరిశ్రమలకు ఇండస్ట్రీ డెవలప్మెంట్ కింద మాకు సబ్సిడీపై భూమి కేటాయిస్తే గోదాములు నిర్మించుకుంటామని సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. అంతేకాకుండా మిర్చిని ఆరబెట్టుకునేందుకు డ్రయర్లు ఏర్పాటు చేయాలని కోరారు. అనంతరం ఆర్జేడీ శ్రీనివాసరావు మాట్లాడుతూ సీజన్ ప్రారంభం నాటికి యార్డులో అన్ని మౌలిక వసతులు పూర్తి చేసేలా చర్యలు చేపడతామన్నారు. ఈ నెల 12వ తేదీ(సోమవారం)న తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం మార్కెట్ యార్డును సందర్శించేందుకు ఎగుమతి, దిగుమతి వ్యాపారులు, యార్డు అధికారులు వెళ్లనున్నట్లు తెలిపారు. సమావేశంలో మార్కెటింగ్ శాఖ డీడీ దివాకర్, ఏడీఎం సత్యనారాయణ చౌదరి, యార్డు కార్యదర్శి ఎ.చంద్రిక, యార్డు అధికారులు సుబ్రహ్మణ్యం, శ్రీకాంత్, ఎగుమతి వ్యాపారులు జుగిరాజ్ భండారీ, కొత్తూరి సుధాకర్, తోట రామకృష్ణ పాల్గొన్నారు. మార్కెటింగ్ శాఖ ఆర్జేడీ శ్రీనివాసరావు -
ఆసియా అభివృద్ధి బ్యాంకు బృందం పర్యటన
తాడికొండ: ఆసియా అభివృద్ధి బ్యాంకు(ఏడీబీ) బృందం రాజధాని అమరావతి పర్యటన వరసగా రెండో రోజు కొనసాగింది. విజయవాడలోని సీఆర్డీఏ కార్యాలయంలో కమిషనర్ కె.కన్నబాబు, అడిషనల్ కమిషనర్లు జి.సూర్యసాయి ప్రవీణ్ చంద్, అమిలినేని భార్గవ తేజ్‌లతో ఏడీబీ– వాటర్– అర్బన్ డెవలప్మెంట్ సెక్టార్ బృందంలోని సభ్యులైన నోరియా సైటో(సీనియర్ డైరెక్టర్), మనోజ్ శర్మ(డైరెక్టర్), సంజయ్ జోషి(ప్రిన్సిపాల్ అర్బన్ డెవలప్మెంట్ స్పెషలిస్ట్), అశ్విన్ హోసూర్ విశ్వనాథ్(సీనియర్ ప్రాజెక్టు ఆఫీసర్) సమావేశమయ్యారు. అనంతరం అమరావతి సచివాలయంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్, పురపాలక– పట్టణాభివృద్ధి శాఖ ప్రధాన కార్యదర్శి ఎస్.సురేశ్ కుమార్, పరిశ్రమలు– వాణిజ్య శాఖ కార్యదర్శి ఎన్.యువరాజ్, ఆర్థిక శాఖ కార్యదర్శి రొనాల్డ్ రాస్ ఐఏఎస్‌లను కలిశారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఐఏఎస్‌ను ఆయన చాంబర్లో ఏడీబీ బృందం కలిసినట్లు సీఆర్డీయే అధికారులు వెల్లడించారు. ఈ సందర్బంగా రాజధాని అమరావతి ప్రాజెక్టు పనులలో పురోగతి, ఏడీబీ అందజేస్తున్న ఆర్థిక సహకారం తదితర అంశాలను బృందంలోని సభ్యులు రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో చర్చించారు. -
జీవ ఉత్ప్రేరకాల తయారీపై అవగాహన
బ్రెజిల్ బృంద సభ్యులకు శిక్షణ కొల్లిపర: ప్రకృతి వ్యవసాయం విధానాలు, జీవ ఉత్ప్రేరకాల తయారీపై బ్రెజిల్ బృందం సభ్యులు మంగళవారం పరిశీలించారు. ప్రకృతి వ్యవసాయంపై అధ్యయనం కోసం 25 మంది బ్రెజిల్ ప్రతినిధుల బృందం రాష్ట్రంలో పర్యటిస్తోంది. రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో మండల పరిధిలోని అత్తోట, దావులూరిపాలెం గ్రామాల్లో పర్యటించారు. ఈసందర్భంగా రైతు సాధికార సంస్థ చీఫ్ టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్ ఆఫీసర్ లక్ష్మనాయక్, బృందం సభ్యులకు బయో ఇన్పుట్ల తయారీ, ఘన జీవామృతం తయారీ విధానంపై అవగాహన కల్పించారు. ఏడాదిపాటు పంటలతో భూమిని కప్పి ఉంచడంతో పాటు ఏ గ్రేడ్, ఏ ఫ్లస్ గ్రేడ్, ఏ ఫ్లస్ ప్లస్ గ్రేడ్, ఏటీఎం, పీఎండీఎస్ వంటి మోడల్స్ అనుసరించడం వలన కలిగే అనేక రకాల ప్రయోజనాలను బృంద సభ్యులకు అవగాహన కల్పించారు. దేశీ ఆవు, ప్రకృతి వ్యవసాయంలో కీలక పాత్ర పోషిస్తుందని ఆవు పేడ, మూత్రంలో అధికంగా లభించే సూక్ష్మ జీవులు, భూమి సారాన్ని పెంచి పంటల ఆరోగ్యాన్ని కాపాడతాయని చెప్పారు. బృందం సభ్యులను ఆవు దగ్గరికి తీసుకువెళ్లి ప్రత్యక్షంగా పేడ, మూత్రం సూక్ష్మజీవుల ప్రాధాన్యంపై వివరించారు. అనంతరం స్వయంగా బృందం సభ్యులు బీజామృతం, ద్రవ, జీవామృతం, విత్తన గుళికల తయారీపై తర్ఫీదు ఇచ్చారు. దావులూరిపాలెంలో న్యూట్రి గార్డెన్, ఫుడ్ బాస్కెట్, ఆరోగ్యం, పోషకాహార కార్యకలాపాల లబ్ధిదారులను కలసి నిర్వహణ, ఉపయోగాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయం జిల్లా ప్రాజెక్టు మేనేజర్ రాజకుమారి, రైతు సాధికార సంస్థ సీనియర్ అధికారులు జాకీర్ హుస్సేన్, కృష్ణారావు, వాణిశ్రీ పాల్గొన్నారు. -
అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి
యడ్లపాడు: అనుమానస్పదంగా ఓ యువకుడు ఆనవాళ్లు గుర్తుపట్టని విధంగా మృతి చెంది రోడ్డు పక్కన పడి ఉన్న ఘటన మండలంలో కలకలం రేగింది. మండలంలోని బోయపాలెం – సంగంగోపాలపురం గ్రామాల మధ్య మార్గంలో మంగళవారం ఈ దారుణ ఘటన వెలుగు చూసింది. పోలీసులు మొదట హత్యగా అనుమానించిన పోలీసులు ఘటనా స్థలి పరిశీలిన అనంతరం రోడ్డు ప్రమాదంగా ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని బోయపాలెం నుంచి చెంఘీజ్‌ఖాన్‌పేట వెళ్లే ఆర్అండ్బీ రోడ్డు పక్కన ఓ యువకుడు ముఖం ఛిద్రమై మృత్యువాత పడి ఉండటాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న యడ్లపాడు పోలీసులు అర్ధరాత్రి లేదా తెల్లవారుజామున గుర్తుతెలియని వాహనం దారుణంగా ఢీకొట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్నందునే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడని, తల పూర్తిగా నుజ్జునుజ్జుయి, ఆనవాళ్లను గుర్తించలేని పరిస్థితి ఏర్పడిందని భావిస్తున్నారు. మృతుడికి సుమారు 30 – 35 ఏళ్ల వయసు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. తెల్లని మేనిఛాయ కలిగి ఉన్నాడు. పసుపు రంగు టీషర్టు, నీలం రంగు షార్టు ధరించి ఉన్నాడు. ముఖ్యంగా, అతని ఎడమ కాలికి నల్లదారం కట్టి ఉండటాన్ని గుర్తించారు. బహుశా ఒడిశా రాష్ట్రానికి చెందిన వలస కూలీ అయి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఆనవాళ్ల ఆధారంగా పోలీసులు మండలం పరిధిలోని అన్నివలస కూలీలు పనిచేసే నూలుమిల్లు, క్వారీలు, కంపెనీల్లో గాలింపు చేపట్టారు. మృతదేహాన్ని చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి శవాగారంలో భద్రపరిచినట్లు ఎస్ఐ టి.శివరామకృష్ణ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. మృతుడి వివరాలు తెలిసినవారు యడ్లపాడు పోలీస్‌స్టేషన్‌న్‌లో సమాచారం అందించాలని ఎస్ఐ కోరారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది. -
గంజాయి కేసులో నిందితుడికి జైలు, జరిమానా
తెనాలిరూరల్: గంజాయి కేసులో నిందితుడికి జైలు శిక్ష జరిమానా విధిస్తూ ప్రిన్సిపల్ సివిల్ జడ్జి ఎ.పవన్‌కుమార్ తీర్పు నిచ్చారు. రూరల్ ఎస్ఐ ఆనంద్ అందించిన వివరాలు... పట్టణ ముత్తెంశెట్టిపాలేనికి చెందిన గంటినపల్లి పూర్ణచందు, సీబీఎన్ కాలనీకి చెందిన మొగిలి సాయి, గండికోట గోపి బైక్‌పై వస్తూ 2021 అక్టోబర్ 16న పోలీసులు వాహన తనిఖీ చేస్తుండగా పెదరావూరు జంక్షన్ వద్ద 500 గ్రాముల గంజాయితో పట్టుబడ్డారు. వీరిలో గోపి పరార్ కాగా, మిగిలిన ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. కొద్ది రోజులకు గోపిని అప్పటి సీఐ ఎం. సుబ్రహ్మణ్యం, ఎస్ఐ జి.ఏడుకొండలు అరెస్ట్ చేశారు. ఈ కేసు మంగళవారం విచారించిన ప్రిన్సిపల్ సివిల్ జడ్జి(జూనియర్ డివిజన్) ఎ.పవన్‌కుమార్, ముద్దాయిలు పూర్ణచందు, మొగిలి సాయిలకు మూడు నెలల జైలు శిక్ష, రూ.వెయ్యి చొప్పున జరిమానా విధించారు. మూడో నిందితుడు గోపిపై కేసు కొట్టివేశారు. ప్రసిక్యూషన్ తరఫున సీనియర్ ఏపీపీ పరిశపోగు సునీల్‌కుమార్ వాదించారు. జాతీయ అథ్లెట్ రష్మిశెట్టికి ఘన సన్మానం లక్ష్మీపురం: జాతీయ అథ్లెటిక్స్‌లో గుంటూరు రైల్వే డివిజన్‌కి చెందిన టీటీఐ(రైల్వే టికెట్ ఇన్స్పెక్టర్) రష్మిశెట్టి కాంస్య పతకం సాధించడం అభినందనీయమని గుంటూరు రైల్వే డీఆర్ఎం సుథేష్ఠ సేన్ అన్నారు. గుంటూరు పట్టాభిపురంలోని గుంటూరు రైల్వే డీఆర్ఎం కార్యాలయంలో మంగళవారం సన్మాన కార్యక్రమం నిర్వహించారు. రష్మిశెట్టి 64వ జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్ క్రీడా పోటీలలో జావెలిన్ త్రో విభాగంలో కాంస్య పతకం సాధించారు. డీఆర్ఎం మాట్లాడుతూ ప్రధానంగా జాతీయ క్రీడా పోటీలలో గుంటూరు రైల్వే డివిజన్ తరుఫున జావెలిన్ త్రోలో పాల్గొని సత్తా చాటిన రష్మి శెట్టిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. గుంటూరు రైల్వే డివిజన్ తరుపున క్రీడా, సాంస్కృతిక పోటీలలో ఆసక్తి కనబరిచిన వారికి ఎల్లప్పుడు తమ సహయా సహకారాలు ఉంటాయని స్పష్టం చేశారు. ముగిసిన రాష్ట్రస్థాయి ఎడ్లపోటీలు క్రోసూరు: మండలంలోని బయ్యవరం గ్రామంలో పోలేరమ్మతల్లి, లక్ష్మీతిరుపతమ్మతల్లి గోపయ్యస్వామి ఆశీస్సులతో గత ఐదు రోజులుగా జరుగుతున్న రాష్ట్రస్థాయి ఎడ్లపోటీలు సోమవారం రాత్రితో ముగిశాయి. విజేతల వివరాలు సీనియర్ విభాగంలో.. ప్రథమ బహుమతి హీరోహోండా డీలక్స్ బైక్‌ను ఏఎస్పీ సుంకి సురేంద్రరెడ్డి, సుంకి సాకేతరెడ్డి, సారికారెడ్డిల ఎడ్ల జత (హుజుర్నగర్, తెలంగాణ) గెలుచుకుంది. అదేవిధంగా ద్వితీయ బహుమతి రూ.60వేలు పావులూరి వీరస్వామి చౌదరి ఎడ్లజత (బాపట్ల జిల్లా, బల్లికురవ) గెలుచుకుంది. బాపట్ల జిల్లా, వేటపాలెం, అత్తోటశిరీషా చౌదరి, శివకృష్ణ చౌదరిల ఎడ్ల జత రూ.40 వేలు, కృష్ణా జిల్లా పెనమలూరుకు చెందిన గరికపాటి శ్రీధర్‌కు చెందిన ఎడ్లు రూ.30వేలు, ప్రకాశంజిల్లా బేస్తవారిపేట, జేసీ అగ్రహారం, లక్కు నాగశివశంకర్‌కు చెందిన ఎడ్ల జత రూ.20 వేలు, తెలంగాణ రాష్ట్రం, మఠం పల్లి, గాయం శృజన్రెడ్డి, శ్రీధర్‌రెడ్డిల ఎడ్ల జత రూ.15వేలు, గుంటూరు జిల్లా, కాకుమాను మండలం, కొండబాలవారిపాలెంకు చెందిన గూడవల్లి లక్ష్మీదీక్షితా చౌదరిల ఎడ్ల జత రూ.12వేలు, కృష్ణాజిల్లా, బాపులపాడు మండలం మల్లవల్లికి చెందిన అక్కినేని ముకుళ సత్యచౌదరి ఎడ్ల జత రూ.10 వేలు గెలుచుకున్నాయి. -
కొండ భూమిని వదలని కూటమి నేతలు
● రూ.20 కోట్ల విలువైన భూమి కబ్జా ● మసీదు స్థలంగా చూపించి బ్రిక్స్ ప్లాంటు ఏర్పాటుకు సన్నాహాలు ● గతంలో పేదల ఇళ్లు కూల్చి ఇప్పుడు దొడ్డిదారిలో కబ్జా ● అధికార పార్టీ పెద్దల ఆశీస్సులతోనే కబ్జాకు దారులు అంటున్న గ్రామస్తులు ● పట్టించుకోని ప్రభుత్వ యంత్రాంగం మసీదు స్థలంగా చూపి.. వీఆర్వో ఏమన్నారంటే... -
పరిశ్రమల మంజూరులో జాప్యం వద్దు
కలెక్టర్ తమీమ్ అన్సారియా గుంటూరు వెస్ట్: జిల్లాలో పరిశ్రమలకు అనుమతుల మంజూరులో జాప్యం లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లోని వీడియో సమావేశ మందిరంలో జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక మండలి(డి.ఐ.ఇ.పి.సి) సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సంబంధిత శాఖలు నిర్దేశిత సమయంలో మంజూరు అనుమతులు జారీ చేయాలని కోరారు. పీఎం విశ్వకర్మ పథకంపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన జీవీఏ లక్ష్యాలను సాధించేందుకు కృషి చేయాలని కోరారు. ‘ఒక కుటుంబం– ఒక పారిశ్రామికవేత్త‘ కార్యక్రమంలో భాగంగా ప్రతి కుటుంబంపై దృష్టి సారించాలని తద్వారా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను గుర్తించి వారికి సరైన ప్రోత్సాహం అందించాలని చెప్పారు. జిల్లాలో పరిశ్రమల స్థాపన పరంగా వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోవద్దని కలెక్టర్ సూచించారు. జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ జయలక్ష్మి మాట్లాడుతూ ప్రధానమంత్రి ఉపాధి కల్పనా కార్యక్రమం కింద 26 యూనిట్లను మంజూరు చేశామన్నారు. పీఎం విశ్వకర్మ పథకానికి 1,169 మంది అర్హత సాధించగా రూ.1.53 కోట్ల రుణాలు మంజూరు చేయడం జరిగిందని వివరించారు. 4 ఎంఎస్ఎంఈ యూనిట్లకు పెట్టుబడి రాయితీగా రూ.75.47 లక్షలు, 6 యూనిట్లకు వడ్డీ రాయితీగా రూ.7.33 లక్షలు ఉందని తెలియజేయగా కమిటీ ఆమోదం తెలిపింది. సమావేశంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా రెవెన్యూ అధికారి ఎన్.ఎస్.కె.ఖాజావలి, రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాసరావు, జిల్లా పంచాయతీ అధికారి బి.వి.నాగ సాయి కుమార్, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి చెన్నయ్య, డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ టి.విజయలక్ష్మి పాల్గొన్నారు. తురకపాలెంలో స్థానికుల సహకారం అవసరం గుంటూరు రూరల్: తురకపాలెంలో అనారోగ్య పరిస్థితులు నియంత్రణకు స్థానికులు భాగస్వామ్యం కావాలని కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా కోరారు. తురకపాలెంలో మంగళవారం పర్యటించారు. గ్రామస్తులతో రైతు సేవా కేంద్రంలో ఏర్పాటు చేసిన గ్రామ సభలో మాట్లాడుతూ గ్రామం ఆరోగ్య సంరక్షణకు నిలయం కావాలని ఆకాంక్షించారు. ప్రజలు తమ ఆరోగ్యస్థితి గతుల సమాచారం పక్కాగా అందించాలని సూచించారు. ప్రతి ఒక్కరిని కాపాడటమే ధ్యేయంగా ప్రభుత్వ యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తుందని హామీ ఇచ్చారు. -
నృసింహుని ఆదాయం రూ.48.45 లక్షలు
మంగళగిరిటౌన్: మంగళగిరిలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి హుండీ కానుకలను మంగళవారం దేవదాయ శాఖ అధికారుల పర్యవేక్షణలో సిబ్బంది లెక్కించారు. ఎగువ, దిగువ సన్నిధులు, ఘాట్‌రోడ్‌లోని పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయాలకు మొత్తం రూ.48,45,565 ఆదాయం వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. గతంలో కంటే రూ.2,94,429 అధికంగా వచ్చినట్లు వివరించారు. లెక్కింపు కార్యక్రమాన్ని గుంటూరు జిల్లా పొన్నూరు శ్రీ సహస్ర లింగేశ్వరస్వామి వారి దేవస్థాన కార్యనిర్వహణాధికారి జి.వి.అమర్నాఽథ్ పర్యవేక్షించారు. ఏఎన్‌యూ(పెదకాకాని):ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ కోర్సు రెండో సెమిస్టర్ పరీక్షల ఫలితాలను సీఈ ఆలపాటి శివప్రసాదరావు మంగళవారం విడుదల చేశారు. 13 మందికి 11 మంది ఉత్తీర్ణత సాధించారు. రీవాల్యూయేషన్‌కు దరఖాస్తు చేసుకునేవారు ఒక్కో పేపరుకు రూ.1,860 ఈనెల 17వ తేదీలోగా చెల్లించాలని సూచించారు. బీటెక్ సప్లిమెంటరీ ఫలితాలు.. వర్సిటీ పరిధిలో బీటెక్ 3/4 మొదటి సెమిస్టర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను సీఈ శివప్రసాదరావు విడుదల చేశారు. 132 మందికి 87 మంది ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు. రీవాల్యూయేషన్ కోసం ఒక పేపరుకు రూ.2070 ఈనెల 17వ తేదీలోగా చెల్లించాలని సూచించారు. సత్తెనపల్లి: పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం కంకణాలపల్లి శివారు ఎన్నాదేవి వద్ద ఉన్న 400 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను జిల్లా జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే మంగళవారం సందర్శించా రు. 400 కేవీ సబ్‌స్టేషన్ అలియనేషన్లో భాగంగా ట్రాన్స్‌కోకు కేటాయించేందుకు ప్రతిపాదించిన 14.92 ఎకరాల స్థలాన్ని ఆయన క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. ఆయనతోపాటు సత్తెనపల్లి ఆర్డీవో జీవీ రమణాకాంతరెడ్డి, తహసీల్దారు కేఎస్ చక్రవర్తి తదితరులు ఉన్నారు. గుంటూరురూరల్: గుంటూరు నగర శివారులోని లాంఫాం వ్యవసాయ పరిశోధన స్థానంలోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో మంగళవారం వాల్మీకి మహర్షి జయంతి నిర్వహించారు. ఈ సందర్బంగా విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ ఎంవీ రమణ వాల్మీకి చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో విశ్వవిద్యాలయం జాయింట్ రిజిస్ట్రార్ ఎం.శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఏఎన్‌యూ(పెదకాకాని): ఏఎన్‌యూలో కాంట్రాక్ట్ అధ్యాపకులకు నోటీసులు అందినట్లు విశ్వసనీయ సమాచారం. కాంట్రాక్ట్ అధ్యాపకులుగా పనిచేస్తున్న నలుగురు, దూరవిద్యలో పనిచేస్తున్న ఇద్దరు అకడమిక్ కౌన్సెలర్లకు సెప్టెంబరు 29న ఈ మెయిల్ ద్వారా వర్సిటీ అధికారులు సమాచారం అందించారు. కొద్ది నెలల క్రితం 60 ఏళ్లు పూర్తయిన వారిని తొలగిస్తూ వర్సిటీ ఆదేశాలు ఇచ్చింది. ఆ ఆదేశాలపై కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కోర్టు సూచనల మేరకు సెప్టెంబరు 30 వరకు విధుల్లో కొనసాగారు. తాజాగా సెప్టెంబరు 29న వర్సిటీ నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. ఇదే కేటగిరిలో సుమారు 11 మంది ఉండగా వారిలో ఆరుగురికి మాత్రమే నోటీసులు అందాయి. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
ఫిరంగిపురం: కారు, ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. మండలంలోని పొనుగుపాడుకు చెందిన రత్నసాగర్(33) భార్య, ఇద్దరు పిల్లలతో కలసి గుంటూరు వెళ్లారు. గుంటూరు– కర్నూలు రాష్ట్ర రహదారిలో ఇంటికి తిరిగివస్తుండగా వేములూరిపాడు వద్ద గుంటూరు వైపు వెళ్తున్న ఇన్నోవా వాహనం ఢీకొట్టింది. ఘటనలో ఇన్నోవా రోడ్డుకు మరోవైపు వెళ్లింది. రత్నసాగర్తో పాటు భార్య, పిల్లలు గాయపడ్డారు. వీరితో పాటు అటువైపు నుంచి వస్తున్న గుర్తుతెలియని వాహన చోదకుడు గాయపడ్డారు. 108 అందుబాటులో లేకపోవడంతో ఆటోల్లో తరలిస్తుండగా రత్నసాగర్, గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం కారణంగా నిలిచిన ట్రాఫిక్‌ను పోలీసులు క్రమబద్దీకరించారు. -
తగ్గిందేలే..
గుంటూరుబుధవారం శ్రీ 8 శ్రీ అక్టోబర్ శ్రీ 2025ఏ మాత్రం ● కేంద్రం ప్రభుత్వం ఔషధాలపై జీఎస్టీ తగ్గించినా.. ● ధరలు తగ్గించడం లేదని విమర్శలు ● పట్టించుకోని డ్రగ్ ఇన్స్పెక్టర్లు ● ప్రజల జేబులకు చిల్లు 7అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 75,430 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా దిగువకు 0,430 క్యూసెక్కులు వదులుతున్నారు. నరసరావుపేటటౌన్: ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రధాన న్యాయాధికారి సాయి కల్యాణ్ చక్రవర్తి ని పల్నాడు జిల్లా కలెక్టర్ కృత్తికా శుక్లా మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. -
ప్రమాదకరంగా బీబీసీ కెనాల్ డ్రాప్
● ఇప్పటి వరకు పది మంది ప్రాణాలు కోల్పోయారు ● డ్రాప్ వద్ద రక్షణ చర్యలు శూన్యం ● పట్టించుకోని కెనాల్స్ అధికారులు నకరికల్లు: బెల్లంకొండ బ్రాంచి కెనాల్‌పై త్రిపురాపురం వద్ద ఉన్న డ్రాప్ ప్రమాదకరంగా మారింది. డ్రాప్ వద్ద నీటి ఉధృతి అధికంగా ఉండడంతో ఈత కొట్టేందుకు, వాహనాలు శుభ్రం చేసుకునేందుకు వచ్చే వారు ప్రమాదం బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటి వరకు పది మంది ప్రాణాలు కోల్పోయారు. అయినా అధికారులు ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టడం లేదు. డ్రాప్‌కు ఇరువైపులా కట్ట బలహీనంగా ఉంది. యువకులు ఈత కొట్టేందుకు, ట్రాక్టర్లు, ఆటోలు శుభ్రం చేసుకునేందుకు వస్తుంటారు. అద్దంకి–నార్కట్‌పల్లి రాష్ట్ర రహదారి కావడంతో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే లారీ డ్రైవర్లు, క్లీనర్ స్నానాలు చేసేందుకు దిగుతుంటారు. డ్రాప్ సమీపంలో లోతు ఎక్కువగా ఉండడం, నీటి ప్రవాహం ఉధృతంగా ఉండడం, కట్ట మట్టి జారుతుండడంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ప్రదేశంలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం గాని కట్ట బలహీనంగా ఉన్నచోట జారకుండా చూడడం, ప్రమాదాలు సంభవిస్తున్న చోట ఎవరూ దిగకుండా చూడడం వంటి నివారణ చర్యలు చేపట్టకపోవడం శోచనీయం.