రాజుపాలెం: పల్నాడు జిల్లా దేవరంపాడు కొండపై స్వయంభూగా మత్య్సరూపంలో వెలసిన నేతి వెంకన్నస్వామిని వైఎస్సార్ సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు, సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్‌భార్గవ్‌రెడ్డిలు సోమవారం కొండకు విచ్చేసి దర్శించుకుని, మొక్కులు తీర్చుకున్నారు. తొలుత మాజీ మంత్రి అంబటి రాంబాబును, సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్‌భార్గవ్‌రెడ్డిలను నాయకులు, కార్యకర్తలు దుశ్శాలువాలు కప్పి పూలమాలలతో సత్కరించారు. అనంతరం మత్య్సరూపంలో ఉన్న నేతి వెంకన్నస్వామి వద్ద పూజారులు మంత్రోచ్ఛారణ నడుమ పూజలు చేసి తీర్ధప్రసాదాలు అందించారు. వారి వెంకట పార్టీ మండల కన్వీనర్ వేపూరి శ్రీనివాసరావు, జెడ్పీటీసీ దొంతిరెడ్డి సునీత శ్రీనివాసరెడ్డి, ఎంపీపీ తేలుకుట్ల రాజేశ్వరి చంద్రమౌళి తదితరులు ఉన్నారు.


