breaking news
Telangana
-
‘గ్యారంటీ’ల బండ!
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ఖజానాకు ‘గ్యారంటీ’ల గండం పట్టుకుంది. ప్రభుత్వరంగ సంస్థలు చేస్తున్న అప్పులకు రాష్ట్ర ప్రభుత్వం ఎడాపెడా గ్యారంటీలు ఇవ్వటంతో పరిస్థితి విషమించింది. అధికారిక అప్పులకు తోడు లెక్కల్లోకి రాని ఈ ‘గ్యారంటీ’ అప్పులు కొండలా పేరుకుపోయాయి. గ్యారంటీ అప్పుల్లో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉందని పీఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ సంస్థ తాజా నివేదికలో ప్రకటించింది. ఇది చాలా ప్రమాదకరమైన ఆర్థిక నిర్వహణ అని హెచ్చరించింది. గ్యారంటీ అప్పులు జీఎస్డీపీలో ఏకంగా 15.1 శాతానికి చేరాయని వెల్లడించింది. నిధులన్నీ సంక్షేమం, సబ్సిడీలకే పోతున్నాయని.. భవిష్యత్తుకు కీలకమైన విద్య, వైద్య రంగాలను గాలికి వదిలేశారని తూర్పారబట్టింది. బడ్జెట్ అంచనాలు ఏకంగా 21 శాతం గల్లంతవుతుండటం ఆర్థిక క్రమశిక్షణా రాహిత్యానికి అద్దం పడుతోందని నివేదిక పేర్కొంది. అప్పుల ఊబిలోకి రాష్ట్రం.. ‘స్టేట్ ఆఫ్ ఫైనాన్సెస్’నివేదిక తెలంగాణ రాష్ట్ర ఖజానా డొల్లతనాన్ని బయటపెట్టింది. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతోందని హెచ్చరించింది. ప్రభుత్వ రంగ సంస్థల కోసం ఇచ్చిన గ్యారెంటీలు జీఎస్డీపీలో 15.1 శాతానికి చేరగా, ఇందులో సింహభాగం (37%) నీటిపారుదల రంగానికే ఉండటం గమనార్హం. దేశంలో మరే రాష్ట్రం ఇంతటి భారీ గ్యారెంటీలను ఇవ్వలేదని నివేదిక పేర్కొంది. ఈ గ్యారెంటీలకు తోడు, 2025 మార్చి నాటికి అధికారిక అప్పులు సైతం జీఎస్డీపీలో 26 శాతానికి చేరాయి. ఇది ఎఫ్ఆర్బీఎం కమిటీ నిర్దేశించిన 20% పరిమితి కంటే చాలా ఎక్కువ. రాష్ట్రం బడ్జెట్ వెలుపల చేసే అప్పులు కూడా కొనసాగుతున్నాయి. 2024–25లో ఇవి రూ.2,697 కోట్లుగా ఉన్నాయి. కాగితాలపై కోటలు.. వాస్తవాలకు బీటలు పీఆర్ఎస్ నివేదిక ప్రకారం రాష్ట్ర బడ్జెట్ అంచనాలకు, వాస్తవ రాబడులకు ఏమాత్రం పొంతన కుదరడం లేదు. 2015–23 మధ్య కాలంలో బడ్జెట్లో వేసిన అంచనాలకు, వాస్తవంగా వచ్చిన ఆదాయానికి మధ్య ఏకంగా 21% వ్యత్యాసం (లోటు) కనిపించింది. దేశంలో అత్యంత దారుణమైన పనితీరులో ఇది ఒకటి అని నివేదిక పేర్కొంది. కాగితాలపై కోటలు కట్టడం, తీరా ఆదాయం రాకపోవడంతో.. చివరకు అభివృద్ధి పనులకు భారీగా కోత పెట్టాల్సి వస్తోంది. ఇదే కాలంలో రాష్ట్రం తన మూలధన వ్యయంలో 12% కోత విధించింది. రాష్ట్రం సొంత ఆదాయాన్ని సమకూర్చుకోవడంలో బలంగా ఉంది. మొత్తం ఆదాయంలో 77% సొంత వనరుల (63% సొంత పన్నులు, 14% పన్నేతర ఆదాయం) నుంచే వస్తోంది. జీఎస్డీపీలో సొంత పన్నుల వాటా 8.1%గా ఉంది. ఆదాయం ఇలా బలంగా ఉన్నప్పటికీ, బడ్జెట్ ప్రణాళిక మాత్రం దారుణంగా విఫలమవుతోంది. విద్య, వైద్యానికి మంగళం: రాష్ట్ర ఖజానాలో సంక్షేమం, సబ్సిడీలకు పెద్ద పీట వేస్తున్న క్రమంలో కీలకమైన మౌలిక రంగాలకు తీరని అన్యాయం జరుగుతున్నట్లు నివేదిక తెలిపింది. రెవెన్యూ ఆదాయంలో 14% సబ్సిడీలకే పోతోంది. ఇందులో సింహభాగం 76% కరెంట్ సబ్సిడీలకే వెళ్తుండటం గమనార్హం. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ సంక్షేమానికి బడ్జెట్లో 12.4% వాటా ఇచ్చి దేశంలో రెండో స్థానంలో నిలిచారు. కానీ, భవిష్యత్ తరాలను నిర్మించే కీలక రంగాలను పూర్తిగా గాలికి వదిలేశారు. ప్రజారోగ్యంపై తెలంగాణ తన బడ్జెట్లో 4.8% మాత్రమే ఖర్చు చేస్తోంది. ఇది దేశంలోనే అత్యల్పం. విద్యారంగానికి చేసిన కేటాయింపులు 9.0% మాత్రమే. ఇది కూడా దేశంలోనే అత్యంత తక్కువ కావడం గమనార్హం. మౌలిక వసతులైన రోడ్లు, వంతెనల కోసం ఖర్చు చేస్తున్నది 1.9% మాత్రమే. సొంత ఆదాయం బలంగా ఉన్నా ఆ డబ్బంతా సబ్సిడీలకే పోతుండటం, మరోవైపు గ్యారెంటీల పేరుతో అప్పుల ఊబిలో కూరుకుపోవడం రాష్ట్రాన్ని ప్రమాదపు అంచున నిలబెట్టిందని నివేదిక హెచ్చరించింది. కీలకమైన విద్య, వైద్యం కుంటుపడటంతో రాబోయే తరాలపై తీవ్ర ప్రభావం చూపడం ఖాయమని నివేదిక పేర్కొంది. -
రండి.. పెట్టుబడులు పెట్టండి
సాక్షి, హైదరాబాద్: జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారులను ఆకర్శించేందుకు ప్రజాపాలన–ప్రజావిజయోత్సవాల పేరిట రాష్ట్ర ప్రభుత్వం ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్–2025’నిర్వహించనుంది. వచ్చే నెల 8,9 తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీలోని మీర్ఖాన్పేటలో ఈ సదస్సు నిర్వహించేందుకు ఏర్పాట్ల కోసం స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేశ్‌రంజన్ అధ్యక్షతన ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి అధికారం చేపట్టి రెండేళ్లు పూర్తవడంతోపాటు డిసెంబర్ 9న సోనియాగాంధీ పుట్టిన రోజు కావడంతో ఈ సదస్సును ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ విజన్ రైజింగ్–2047 డాక్యుమెంట్‌ను విడుదల చేస్తారు. ఫ్యూచర్ సిటీ సమగ్ర మాస్టర్ ప్లాన్‌ను అదే రోజు విడుదల చేయాలని నిర్ణయించారు. దీంతోపాటు కొత్త ఇండస్ట్రీ, మైనింగ్, ఎడ్యుకేషన్ పాలసీలను విడుదల చేస్తారు. ఏడుగురితో ప్రత్యేక కమిటీ టీజీ ఎస్పీడీసీఎల్, జలమండలి, హెచ్ఎండీఏ, ఐటీ, ట్రాన్స్‌కో, హౌసింగ్, ట్రాన్స్పోర్ట్ వంటి పలు ప్రభుత్వ విభాగాల సమన్వయానికి జయేశ్‌రంజన్ అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో స్పెషల్ చీఫ్ సెక్రటరీలు వికాస్‌రాజ్, సంజయ్‌కుమార్, ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్‌కుమార్ సుల్తాని యా, టీజీ ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషరఫ్ అలీ ఫారూఖీ, టీజీఐఐసీ ఎండీ శశాంక, ఎంఆర్డీసీఎల్ ఎండీ ఈవీ నర్సింహారెడ్డిలు సభ్యులుగా ఉన్నారు. ఫార్చ్యూన్–500 కంపెనీలకు ఆహ్వానం గ్లోబల్ సమ్మిట్‌కు ఫార్చ్యూన్–500 కంపెనీలకు ఆహ్వానించాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. భారత్ ఫ్యూచర్ సిటీ, మూసీ పునరుజ్జీవం, రీజినల్ రింగ్‌రోడ్ వంటి కీలక ప్రాజెక్టుల అభివృద్ధి ఎలా ఉంటుందో వివరించనున్నారు. రెండు రోజుల సదస్సులో ఫ్యూచర్ సిటీలో పలు ప్రభుత్వ విభాగాలకు భూములను కేటాయించనున్నారు. స్పెషల్ చీఫ్ సెక్రటరీ సంజయ్‌కుమార్, ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఇలంబర్తి, టీజీఐఐసీ ఎండీ, ఫ్యూచర్ సిటీ కమిషనర్ శశాంక ఆధ్వర్యంలో ఎంఓయూ, అనౌన్స్మెంట్ కమిటీని ఏర్పాటు చేశారు. ప్రతినిధుల భద్రత ఏర్పాట్ల కోసం అదనపు డీజీ డీఎస్ చౌహాన్, ఐజీ ఎం.రమేశ్, రాచకొండ కమిషనర్ సు«దీర్బాబులతో సెక్యూరిటీ అండ్ ప్రోటోకాల్ కమిటీని ఏర్పాటు చేశారు. -
వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా హైదరాబాదీ
సాక్షి, హైదరాబాద్: అమెరికా రాజకీయాల్లో మన హైదరాబాదీ మెరిశారు. వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా న్యూ మలక్పేటవాసి గజాలా హష్మీ గెలుపొంది చరిత్ర స్పష్టించారు. తొలిసారి ముస్లిం మహిళ అమెరికాలో రాజ్యాంగ పదవిలోకి రావడం ద్వారా సరికొత్త రికార్డు నమోదు చేశారు. వర్జీనియా సెనేట్‌లో పనిచేసిన తొలి ముస్లిం, తొలి దక్షిణాసియా అమెరిక¯న్గా ఆమె ఇప్పటికీ కీర్తి సాధించారు. గజాలా విజయం ఆమె కుటుంబ సభ్యులను ఆనందంలో ముంచెత్తింది. చిన్నప్పటి నుంచే చురుగ్గా ఉండే గజాలా.. సామాజిక రంగంలోనూ పేరొందారని ఆమె సోదరి డాక్టర్ రసియా హష్మీ ‘సాక్షి’కి చెప్పారు. తమ కుటుంబ ప్రతిష్టతోపాటు హైదరాబాద్ విశిష్టతను కూడా తన సోదరి నిలబెట్టారని ఆమె హర్షం వ్యక్తం చేశారు. ఐదేళ్ల క్రితం హైదరాబాద్‌లో పర్యటించారని, చారిత్రక ప్రదేశాలను సందర్శించారని గుర్తు చేసుకున్నారు. హైదరాబాద్‌తో అనుబంధం ఇలా... జియా హష్మీ–తన్వీర్ హష్మీ దంపతులకు గజాలా జూలై 5, 1964లో జని్మంచారు. తన బాల్యాన్ని మలక్‌పేటలోని అమ్మమ్మ ఇంట్లో గడిపారు. నాలుగేళ్ల వయసులో తన తల్లి, సోదరుడితో కలిసి అమెరికాలోని జార్జియాకు వలస వెళ్లారు. ఆమె తండ్రి అంతర్జాతీయ వ్యవహారాల్లో పీహెచ్డీ పూర్తి చేసి, ఓ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేశారు. గజాలా జార్జియా సదరన్ విశ్వవిద్యాలయం నుంచి బీఏ ఆనర్స్ పూర్తి చేసి, అట్లాంటాలోని ఎమరీ విశ్వవిద్యాలయం నుంచి సాహిత్యంలో పీహెచ్డీ పట్టా పొందారు. గజాలా వివాహం హైదరాబాద్‌కు చెందిన అమెరికాలోనే నివసించే అజహర్ రఫీక్‌తో జరిగింది. వీరికి ఇద్దరు అమ్మాయిలు. అజహర్ ప్రస్తుతం నాసాలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. 1991లో రిచ్మండ్ ప్రాంతానికి వెళ్లారు.రేనాల్డ్స్ కమ్యూనిటీ కళాశాలలో 30 ఏళ్ల పాటు ప్రొఫెసర్‌గా పనిచేసి.. వేలాది మంది విద్యార్థులకు గజాలా మార్గదర్శకత్వం వహించారు. విద్యారంగంలో చేసిన సేవలు ఆమె రాజకీయ ప్రవేశానికి పటిష్టమైన పునాదిగా నిలిచాయి. ప్రొఫెసర్‌గా సుదీర్ఘ అనుభవం తర్వాత.. గజాలా 2019లో తొలిసారిగా అమెరికా ఎన్నికల్లో గెలుపొందారు. గజాలాకు సీఎం అభినందనలు వర్జీనియా రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన డెమోక్రటిక్ పార్టీ నేత గజాలా హష్మీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. హైదరాబాద్‌లో జని్మంచిన గజాలా ఆ తర్వాత కాలంలో అమెరికాలో స్థిరపడి ఈ ఘనత సాధించారని కొనియాడారు. -
పగబట్టిన పాము!
గొల్లపల్లి: జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలోని బొంకూర్ గ్రామానికి చెందిన శ్రీకాంత్ అనే వ్యక్తి కొన్నిరోజులుగా పాముకాటుకు గురవుతున్నాడు. పాము పగబట్టి కాటేస్తోందా..లేక ప్రమాదవశాత్తు పాముకాటుకు గురవుతున్నాడా..అన్నది ప్రశ్నార్థకంగా మారింది. బాధితుడి కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన శ్రీకాంత్ ప్రైవేటు కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. దసరా నవరాత్రుల ఉత్సవాలకు ముందు ఉదయం 11 గంటల సమయంలో ఓ పాము పడగను తొక్కడంతో దాని కాటు నుంచి తృటిలో తప్పించుకున్నాడు. తర్వాత నాలుగైదు రోజులకు రాత్రి 11 గంటలకు బాత్రూంకు వెళ్తున్న సమయంలో పాము కాటువేసింది. వెంటనే తన సోదరులకు ఫోన్ చేసి చెప్పడంతో ఆస్పత్రికి తరలించారు. ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న అతడిని మరో ఐదు రోజులకు మధ్యాహ్నం మరోసారి పాముకాటు వేసింది. మళ్లీ వెంటనే తేరుకుని ఆస్పత్రికి వెళ్లి ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. బుధవారం, శనివారం, ఆదివారం రోజుల్లోనే శ్రీకాంత్ పాముకాటుకు గురవుతున్నాడు. ఇలా 33 రోజుల్లోనే ఏడుసార్లు పాముకాటుకు గురై చికిత్స పొందుతూ ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. వినడానికి వింతగా అనిపించినా ఆయనను వదలకుండా పాము వెంటాడుతూ కాటేస్తుండటం సంచలనంగా మారింది. ఏదైనా సర్పదోషం ఉందేమోనని స్థానికులు చర్చించుకుంటున్నారు. బుధ, శని, ఆదివారం వచ్చిందంటే చాలు తనకేదో కీడు జరుగుతుందనే ఉద్దేశంతో ఫోన్లను ఎప్పుడూ అంటిపెట్టుకుంటున్నాడు. పాముకాటు వైద్యం కోసం అయ్యే ఖర్చులు భరించలేక బాధితుడు ఇబ్బంది పడుతుండటంతో ఆయన పరిస్థితి చూసి ఆస్పత్రి సిబ్బంది కూడా దయతో వైద్యం అందిస్తున్నారు. అయితే శ్రీకాంత్‌ను లక్ష్యంగా చేసుకుని పాము ఎందుకు కాటు వేస్తుందో తెలియక కుటుంబ సభ్యులు తలలు పట్టుకుంటున్నారు. -
చెరువు మధ్యలో పట్టా ఇస్తారా?
పర్యావరణ హననానికి ఎలాంటి విపత్తులు కారణం కాదు. మనిషే బాధ్యుడు. సర్కార్ భూములే కాదు.. చెరువులనూ వదలడం లేదు. వాస్తవ స్థితిని పరిశీలించకుండా రెవెన్యూ అధికారులు వారికి పట్టాలు జారీ చేస్తున్నారు. కోర్టుల ఆదేశాలన్నా లెక్కలేదు. ఎఫ్టీఎల్ భూములకూ పట్టాలిచ్చేస్తున్నారు. ఇటు కోర్టుల్లో అందుకు విరుద్ధంగా కౌంటర్లు వేస్తున్నారు. అధికారులది ద్వంద్వ నీతి. చెరువుల నడిమధ్య భూమికి పట్టాలు జారీ చేస్తున్నారంటే ఎంత నిర్లక్ష్యంగా విధులు నిర్వర్తిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. 37 ఎకరాల చెరువు భూమిలో ఓ మాజీ ఎమ్మెల్యేకు 27 ఎకరాలకు పట్టా జారీ చేశారు. పాస్ పుస్తకాలతో సహా అతను పిటిషన్ వేశారు. అధికారుల తీరు క్షంతవ్యం కాదు అంటూ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది.సాక్షి, హైదరాబాద్: రెవెన్యూ, నీటి పారుదల అధికారుల తీరు పై హైకోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. వాస్తవ స్థితిని పరిశీలించకుండా ఇష్టమొచ్చినట్టు పట్టాలు జారీ చేస్తున్నా రని ఆగ్ర హం వ్యక్తం చేసింది. ఆ ఆధారాలతో వారంతా న్యాయస్థానా ల్లో పిటిషన్లు వేస్తున్నారని వ్యాఖ్యానించింది. రెవెన్యూ శాఖను రద్దు చేస్తే గానీ ఈ దేశం బాగుపడదని ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండ లం అడవిమల్లెల సర్వే నంబర్ 11, 12, 13, 29, 30, 31లోని తమ పట్టా భూమిని మిషన్ కాకతీయ పథకంలో చేర్చడాన్ని సవాల్ చేస్తూ వ్యవసాయదారుడు బోనం సంజీవరెడ్డి సహా మరో ఏడుగురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ అనిల్‌కుమార్ జూకంటి ధర్మా సనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయ వాది వాదనలు వినిపిస్తూ.. పట్టా భూమిని చెరువుగా పేర్కొంటూ మిషన్ కాకతీయలో చేర్చడంలో కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్, నీటిపారుదల శాఖ సూపరింటెండెంట్ తీరు సరికాదన్నారు. కనీసం పిటిషనర్ల భూమిని సేకరించలేదని వారికి నోటీసులైనా జారీ చేయలేదన్నారు. అధికారుల నిర్ణయం ఏకపక్షం, రాజ్యాంగ, సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని వాదించారు. పిటిషనర్ల పట్టా భూముల్లో జోక్యం చేసుకోకుండా అధికారులు ఆదేశాలు జారీ చేయాలని కోరారు. కలెక్టర్ రాకుంటే చర్యలు తప్పవు కొత్త ప్రాజెక్టు కట్టేప్పుడు మాత్రమే భూ సేకరణ చేస్తామని ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. ఎఫ్టీఎల్ పరిధిలో పట్టా భూములున్నా పరిహారం ఇచ్చే అవకాశం లేదన్నారు. న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ.. చెరువు నీటి నిల్వ సామర్థ్యం పెంచితే వారి భూములు మునిగిపోతాయి కదా అని అడిగారు. ప్రైవేట్ భూమిపై అధికారులు ఎలా నిర్ణయం తీసుకుంటారని ప్రశ్నించారు. ఏదైనా నీటిమట్టం పెంపుపై నిర్ణయం తీసుకునే అధికారం అధికారులకు ఉందని ఏజీపీ బదులిచ్చారు. పూర్తి వివరాలు సమర్పించేందుకు సమయం కావాలని ఏజీపీ కోరారు. ఈ సందర్భంగా రెవెన్యూ, నీటిపారుదల అధికారులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘ఓ చెరువులో 27 ఎకరాలు పట్టా భూమి అని ఓ మాజీ ఎమ్మెల్యే ఈ కోర్టుకు వచ్చారు. చెరువు మొత్తం ఏరియా 37 ఎకరాలు. 37 ఎకరాల్లో 27 ఎకరాలకు ఎలా పట్టా ఇచ్చారో అధికారులకే తెలియాలి. అధికారుల తప్పిదానికి ప్రతి ఒక్కరూ మూల్యం చెల్లించాలని మరవొద్దు. ఎఫ్టీఎల్ భూములనీ అధికారులంటారు.. పట్టా భూములని ప్రైవేట్ వ్యక్తులంటారు. ఖమ్మం కేసులో 29 సర్వే నంబర్ భూమి స్వభావ పట్టా.. భూమి వివరణ మెట్ట అని అధికారులే పేర్కొన్నారు. కానీ, 29 సర్వే నంబర్ పూర్తిగా చెరువు మధ్యలో ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా చెరువులకు ఎఫ్టీఎల్ నిర్ధారించని కారణంగానే ఇలాంటి పిటిషన్లన్నీ వస్తున్నాయి. రెవెన్యూశాఖను తొలగిస్తే తప్ప ఈ దేశం బాగుపడదు’అని మండిపడ్డారు. ఖమ్మం జిల్లా కలెక్టర్‌ను కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ.. తదుపరి విచారణ వారం రోజులకు వాయిదా వేశారు. కౌంటర్ దాఖలు చేయని పక్షంలో ఈ కోర్టు తీసుకునే చర్యలకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. -
వికాసమా..? విధ్యంసమా?
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గడపగడపకూ వెళ్లి ప్రజలకు వాస్తవాలు వివరిస్తూ కాంగ్రెస్ చేతిలో మరోమారు మోసపోవద్దని చెప్తున్నాం.ఈ ఎన్నికలు బీఆర్ఎస్ పదేళ్ల అభివృద్ధి.. రెండేళ్ల కాంగ్రెస్ అరాచకానికి నడుమ పోటీ అని చెప్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ గణాంకాలను ప్రజల ముందు పెడుతున్నాం. ప్రజల మద్దతు కూడగట్టి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడంతో పాటు మిగిలిన మూడేళ్లు ప్రజల కోసం పనిచేసేలా ఒత్తిడి తెస్తాం.సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు డబ్బులు లేవంటూనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీలో కాంగ్రెస్ నేత రాహుల్‌గాందీకి రూ.వేలకోట్ల ముడుపులు ముట్టజెపుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు విమర్శించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్‌లో జరిగిన అభివృద్ధికి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో రెండుసార్లు, 2023 శాసనసభ ఎన్నికల్లో నగరంలో బీఆర్ఎస్ గెలుపే నిదర్శనమని పేర్కొన్నారు. తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ జాయింట్ వెంచర్ సర్కారు నడుస్తోందని ఆరోపించారు. హైదరాబాద్ అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు.. సాక్షి: సీఎం రేవంత్, బీజేపీ నడుమ బంధం అంటూ మీరు ఏ ఆధారాలతో విమర్శలు చేస్తున్నారు? కేటీఆర్: రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ జాయింట్ వెంచర్ సర్కారు నడుస్తోంది. ఓ వైపు సంక్షేమ పథకాలకు డబ్బులు లేవంటూనే ఢిల్లీలో రాహుల్‌గాందీకి రేవంత్ రూ.వేల కోట్ల ముడుపులు ఇస్తున్నారు. అందుకు బీజేపీ కూడా సహకరిస్తోంది. అందుకే బీజేపీ ఎంపీ సీఎం రమేశ్‌కు తెలంగాణలో రూ.1,300 కోట్ల కాంట్రాక్టు దక్కింది. హర్యానా, మహారాష్ట్ర, బిహార్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు తెలంగాణ నుంచి రేవంత్ నిధులు పంపుతుంటే బీజేపీ ఎందుకు వదిలేస్తోంది? రేవంత్ తన రాజకీయ ఎదుగుదల కోసం ఏ పార్టీని అయినా వాడుకుంటారు. ఏబీవీపీ నుంచి మొదలై బీఆర్ఎస్, టీడీపీ, కాంగ్రెస్ మీదుగా సాగుతున్న ఆయన ప్రయాణం వచ్చే రెండేళ్లలో తిరిగి బీజేపీకి చేరుకుంటుంది. రేవంత్ వైఖరితో రాహుల్ గాంధీ అసంతృప్తితో ఉన్నారు కాబట్టే అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదు. బీజేపీ ఎంపీలతో కలిసి రేవంత్ అర్ధరాత్రి అమిత్ షాను కలుస్తున్నారు. విధిలేని పరిస్థితుల్లో రేవంత్‌ను రాహుల్ భరిస్తున్నారు. సాక్షి: పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్‌లో కనీసం చెత్త కుప్పలు కూడా తీయలేదన్న సీఎం రేవంత్ విమర్శలపై మీ స్పందనేంటి? కేటీఆర్: హైదరాబాద్ నగరానికి మేము ఏం చేయకపోతే రెండుసార్లు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు మాకు ఎందుకు జై కొడుతారు? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటమి ఖాయం కావడంతో కాంగ్రెస్‌కు వణుకు పుడుతోంది. సీఎం రేవంత్ అసహనంతో మాట్లాడుతున్నారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని సొంత గడువు పెట్టుకున్న కాంగ్రెస్.. ఏడు వందల రోజులు కావస్తున్నా ఒక్కటీ నెరవేర్చలేదు. కాంగ్రెస్‌కు మరోమారు ఓటేస్తే రాష్ట్రాన్ని అడుగు పట్టించడం ఖాయం. నేను మంత్రిగా పదేళ్లలో హైదరాబాద్ అభివృద్ధికి ఏం చేశానో బహిరంగ చర్చకు సిద్ధం. రేవంత్ జూబ్లీహిల్స్ ప్యాలెస్‌లో అయినా చర్చకు సిద్ధమే. దమ్ముంటే సీఎం చర్చకు రావాలి. పేమెంట్ కోటా సీఎం రేవంత్ తనకు తాను ఎక్కువగా ఊహించుకుని మమ్మల్ని దూషిస్తే ధీటుగా సమాధానం చెప్తాం. సాక్షి: ఫార్ములా ఈ రేసు, కాళేశ్వరం అంశంలో బీఆర్ఎస్, బీజేపీ నడుమ బంధాన్ని సీఎం రేవంత్ లేవనెత్తడంపై ఏమంటారు? కేటీఆర్: ఫార్ములా ఈ రేసు కేసులో నన్ను విచారించేందుకు ప్రభుత్వం గతంలోనే గవర్నర్ అనుమతి తీసుకుంది. ఆ తర్వాతే నా మీద కేసు నమోదు చేశారు. ఈ విషయంలో నన్ను అరెస్టు చేసేందుకు మరోమారు గవర్నర్ అనుమతి అవసరం లేదు. మగాడివైతే ‘ఫార్ములా ఈ’కేసులో నాపై చార్జిïÙటు వేయించు (సీఎంను ఉద్దేశించి). నాతోపాటు సీఎం రేవంత్‌పైనా ఏసీబీ కేసులు ఉన్నాయి. ఈ విషయంలో నేను లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధంగా ఉన్నా. సీఎం తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలి. పీసీ ఘోష్ కమిషన్ ‘కాళేశ్వరం ప్రాజెక్టు’పై విచారణ పేరిట కొండను తవ్వి ఎలుకను పట్టింది. బీజేపీకి సీబీఐ జేబు సంస్థ అని రాహుల్‌గాంధీ విమర్శిస్తూ ఉంటారు. కానీ రేవంత్ మాత్రం అదే సీబీఐకి కాళేశ్వరం విచారణను అప్పగిస్తారు. రాష్ట్రంలో సీఐడీ, ఏసీబీ వంటి దర్యాప్తు సంస్థలు లేవా? సీబీఐ కేసు పెట్టి ఏం పీకుతాడు. మేము తప్పు చేయలేదు. ఎవరికీ భయపడం. సాక్షి: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను బీఆర్ఎస్ పార్టీ ఎలా భావిస్తోంది? కేటీఆర్: ఉప ఎన్నికలను తెలంగాణ ఉద్యమంలో సాధనంగా వాడుకుని రాజకీయ పార్టీల డొల్లతనాన్ని బయట పెట్టడంతో పాటు రాజకీయ అనివార్యత సృష్టించి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో వచ్చిన ఈ ఉప ఎన్నికలో రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై తీర్పు ఇచ్చే అవకాశం ప్రజలకు వచ్చింది. నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల తరఫున నాలుగు లక్షల మంది జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓటర్లు గొంతు వినిపించేందుకు అరుదైన సందర్భం ఇది. బీఆర్ఎస్ పదేళ్ల అభివృద్ధి, సంక్షేమానికి.. కాంగ్రెస్ రెండేళ్ల అరాచక, సంక్షోభ, విధ్వంసకర పాలనకు నడుమ పోటీ ఈ ఉప ఎన్నిక. ఈ ఎన్నిక రాష్ట్ర ప్రజల మనోభావాలకు ప్రతీకగా నిలుస్తుంది. సాక్షి: ఉప ఎన్నిక ప్రచారంలో హైడ్రా కూల్చివేతలనే ఎందుకు ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు? కేటీఆర్: ఉత్తరప్రదేశ్‌లో బుల్డోజర్ రాజ్యం అంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ విమర్శిస్తారు. కానీ ఇక్కడ హైడ్రా పేరిట పేదల ఇళ్లను రేవంత్ సర్కారు కూల్చివేయటం ఆయనకు కనిపించడం లేదు. సీఎం సోదరుడితో పాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, వివేక్ తదితరుల భవనాలు చెరువుల్లో ఉన్నా హైడ్రా ఎందుకు ముట్టుకోవడం లేదు? మూసీకి అడ్డుగా భారీ బహుళ అంతస్తుల భవనాలు కడుతున్నా హైడ్రాకు కనిపించడం లేదా? ఇళ్లు కూల్చుతూ, మా పార్టీ తరఫున పనిచేస్తున్న చిన్నా చితక వ్యాపారుల దుకాణాలను తొలగిస్తూ దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. దమ్ముంటే రెండేళ్లలో చేసిన అభివృద్ధి ఏమిటో ప్రజలకు వివరించాలి. సాక్షి: అజహరుద్దీన్‌కు మంత్రి పదవి ఇవ్వడం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ప్రభావం చూపుతుందా? కేటీఆర్: బీఆర్ఎస్ హయాంలో మైనారిటీ వర్గానికి చెందిన మంత్రికి రెవెన్యూ, హోమ్ వంటి కీలక శాఖలు ఇచ్చాం. అజహరుద్దీన్‌కు ఇచ్చేందుకు మైనారిటీ సంక్షేమం తప్ప వేరే శాఖలు లేవా? అజహరుద్దీన్‌కు మంత్రి పదవి ఇచ్చి జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ దింపుడు కల్లం ఆశతో ఉంది. కాంగ్రెస్ లేకపోతే ముస్లింలు, బీజేపీ లేకపోతే హిందువులు ఉండరనుకోవటం ఆ పారీ్టల భావదారిద్య్రం. రేవంత్ మూలంగా రాష్ట్రంలో కాంగ్రెస్ మరో 15 ఏళ్లపాటు తిరిగి లేచే పరిస్థితి ఉండదు. బీజేపీకి ఎంఐఎం పార్టీ బీటీమ్ అని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ విమర్శిస్తున్నా ఆ పార్టీ ఎందుకో స్పదించడం లేదు. సాక్షి: రౌడీ షీటర్‌ను కాంగ్రెస్ అభ్యరి్థగా పెట్టారని మీ పార్టీ అధినేత కేసీఆర్ వ్యాఖ్యానించినట్టు వచ్చిన వార్తలపై ఏమంటారు? కేటీఆర్: కాంగ్రెస్ అభ్యర్థి గురించి మాట్లాడాల్సిన అవసరం కేసీఆర్‌కు లేదు. కానీ రాష్ట్రంలో సీఎం సర్కారు నడుపుతున్నారో.. రౌడీ దర్భారు నడుపుతున్నారో అర్ధం కావడం లేదు. ఫీజు రీయింబర్స్‌మెంటు బకాయిలు అడిగిన ప్రైవేటు విద్యా సంస్థలను విజిలెన్స్ దాడుల పేరిట భయపెడుతున్నారు. ఏరియర్స్ అడిగిన ఉద్యోగులపై ఏసీబీ దాడులు, రిటైర్డు ఉద్యోగులపై కేసులు పెడుతున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ప్రచారం చేస్తున్న మా నాయకుల మీద దాడులు చేస్తూ సీఎం రేవంత్ నీచ రాజకీయం చేస్తున్నారు. సాక్షి: మీ సోదరి కవితతో విభేదాలు, మీ అధినేత కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి రాకపోవడాన్ని కాంగ్రెస్, బీజేపీ ప్రశ్నిస్తున్నాయి కదా? కేటీఆర్: కేసీఆర్ తమను ఫుట్‌బాల్ ఆడుకుంటారని బీజేపీ, కాంగ్రెస్‌లకు భయం. ఆ రెండు పారీ్టలకు అభివృద్ధి, సంక్షేమం గురించి తెలంగాణలో ఏం చెప్పాలో తెలియడం లేదు. జూబ్లీహిల్స్‌లో బీజేపీకి డిపాజిట్ కూడా దక్కదు. దీంతో కేసీఆర్, బీఆర్ఎస్ లక్ష్యంగా అనేక విమర్శలు చేస్తున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విషయంలో పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని పిలిచి ప్రచారానికి సంబంధించి దిశా నిర్దేశం చేస్తూ మమ్మల్ని నడిపిస్తున్నారు. కవిత విషయంలో పార్టీ నిర్ణయం తీసుకున్న తర్వాత ఇక ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదని అనుకుంటున్నా. సాక్షి: జూబ్లీహిల్స్‌లో మీ ప్రచార తీరుతెన్నులు ఎలా ఉన్నాయి? కేటీఆర్: గడపగడపకూ వెళ్లి ప్రజలకు వాస్తవాలు వివరిస్తూ కాంగ్రెస్ చేతిలో మరోమారు మోసపోవద్దని చెప్తున్నాం. ఈ ఎన్నికలు బీఆర్ఎస్ పదేళ్ల అభివృద్ధి.. రెండేళ్ల కాంగ్రెస్ అరాచకానికి నడుమ పోటీ అని చెప్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ గణాంకాలను ప్రజల ముందు పెడుతున్నాం. ప్రజల మద్దతు కూడగట్టి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడంతో పాటు మిగిలిన మూడేళ్లు ప్రజల కోసం పనిచేసేలా ఒత్తిడి తెస్తాం. సాక్షి: జూబ్లీహిల్స్ ప్రచారానికి కేసీఆర్ వస్తారా? కేటీఆర్: మా అధినేత ఉప ఎన్నిక ప్రచారానికి వస్తారా లేదా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. కథానాయకుడు క్లైమాక్స్‌లోనే వస్తాడు. -
సవాల్ చేయటం.. పారిపోవటమే కేటీఆర్ పని
సాక్షి, హైదరాబాద్: అభివృద్ధిపై చర్చకు సవాల్ విసరటం.. ఆ తర్వాత పారిపోవటం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు అలవాటేనని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం బీజేపీ పాలిత రాష్ట్రాలపై ప్రేమ చూపిస్తూ.. ఇతర పార్టీల పాలిత రాష్ట్రాలపై వివక్ష చూపిస్తోందని ఆరోపించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం రాత్రి హైదరాబాద్‌లోని షేక్‌పేట, యూసుఫ్‌గూడలో రోడ్‌షో నిర్వహించి కార్నర్ మీటింగ్‌లలో సీఎం ప్రసంగించారు. ‘చర్చలకు సవాల్ విసరడం.. పారిపోవడం కేటీఆర్‌కు అలవాటే. గతంలో గంజాయి, డ్రగ్స్ టెస్టులంటే అమర వీరుల స్థూపం వద్ద నేను ఆరు గంటలు వేచి చూశాను. ఆయన రాలేదు. ఆసెంబ్లీలో చర్చిద్దామంటే తండ్రి కొడుకులు పారిపోయారు. మొన్నటికి మొన్న కంటోన్మెంట్లో శ్రీ గణేష్ ను ఎమ్మెల్యేగా గెలిపించినందుకు నేను రూ.4 వేల కోట్లతో అభివృద్ధి చేశాననని చెబితే.. అభివృద్ధి ఎక్కడ జరిగిందో చెప్పు రాజీనామా చేస్తానని కేటీఆర్ సవాల్ విసిరారు. శ్రీ గణేష్ రూ.5 వేల కోట్ల అభివృద్ధి పనులకు సంబంధించిన జీవోలు చూపిస్తే.. రాజీనామా చేయకుండా పారిపోయిన కేటీఆర్, మళ్లీ చర్చలకు సవాల్ విసురుతున్నారు’అని ఎద్దేవా చేశారు. తెలంగాణపై కేంద్రం వివక్ష బీజేపీ పాలిత గుజరాత్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ తదితర రాష్ట్రాలో అభివృద్ధికి సహకరిస్తున్న కేంద్రం.. కాంగ్రెస్ పాలిత తెలంగాణకు అన్యాయం చేస్తోందని సీఎం విమర్శించారు. గుజరాత్లో సబర్మతి రివర్‌ఫ్రంట్, యూపీలో గంగానదీ రివర్‌ఫ్రంట్, ఢిల్లీలో యుమునా రిఫర్‌ఫ్రంట్ కట్టుకోవచ్చు కానీ, హైదరాబాద్‌లో మూసీ రివర్‌ఫ్రంట్ ఎందుకు కట్టుకోకూడదు అని ప్రశ్నించారు. సికింద్రాబాద్‌లో కిషన్‌రెడ్డిని గెలిపించి కేంద్ర మంత్రిని చేస్తే హైదరాబాద్‌లో మెట్రో రైలు విస్తరణ, గోదావరి జలాలు, మూసీ అభివృద్ధి, ట్రిఫుల్ ఆర్ రేడియల్ రోడ్లకు నిధులు రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ‘కాళేశ్వరం కేసులో కేసీఆర్‌పై సీబీఐ కేసులు ఎందుకు పెట్టడం లేదని ప్రశి్నస్తే.. నాతో చర్చిస్తాననని కిషన్‌రెడ్డి అంటున్నారు. నాతో చర్చలేంటి? ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్‌షాతో చర్చించి కేసీఆర్, కేటీఆర్‌లను జైలుకు పంపేందుకు ఎందుకు అనుమతి ఇవ్వడం లేదో కోట్లాడాలి’అని సూచించారు. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను 30 వేల మెజార్టీతో గెలిపిస్తామని, కిషన్‌రెడ్డికి దమ్ముంటే డిపాజిట్ తెచ్చుకోవాలని సవాల్ విసిరారు. బీఆర్ఎస్ పేరుతో బీజేపీ ఓట్లు అడుగుతోందని ఆరోపించారు. ప్రధాని నరేంద్రమోదీ, మాజీ సీఎం కేసీఆర్ ఒక్కటేనని విమర్శించారు. కాంగ్రెస్ అంటేనే ముస్లిం.. ముస్లిం అంటే కాంగ్రెస్ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. కొడంగల్‌లో తాను మూడు సార్లు గెలవడానికి మైనార్టీల సహకారం ఎంతో ఉందని తెలిపారు. అజహరుద్దీన్‌కు మంత్రి పదవి ఇస్తే కిషన్‌రెడ్డికి సమస్య ఏంటని ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్, మంత్రులు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, అజహరుద్దీన్, కొండా సురేఖ, ఎంపీ అనిల్ కుమార్‌యాదవ్, మజ్లిస్ ఎమ్మెల్యే కౌసర్‌మొయినుద్దీన్, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ అంటేనే కరెంట్
పరిగి: గత పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు చేసి, రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను నాశనం చేసిందని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క మండిపడ్డారు. వికారాబాద్ జిల్లా పరిగి పట్టణ కేంద్రంలోని నజీరాబాద్‌తండాలో బుధవారం ఆయన 220 కేవీ సబ్‌స్టేషన్‌ను ప్రారంభించి, 400 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్, 33 కేవీ సబ్స్టేషన్లకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వంలో రూ.1లక్ష కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రాష్ట్ర ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేకుండాపోయిందన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి దేశంలోనే మొట్టమొదటిగా రైతులకు ఉచిత విద్యుత్‌ను సరఫరా చేశారని గుర్తుచేశారు. కాంగ్రెస్ అంటేనే కరెంట్ అని పేర్కొన్నారు. రాష్ట్రంలో 53 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నామన్నారు. ఉచిత విద్యుత్ కోసం ఇప్పటి వరకు రూ.2,830 కోట్లు ఆ శాఖకు కేటాయించామని వెల్లడించారు. దళితులకు 3 ఎకరాల భూమి, ఇంటికో ఉద్యోగం, బంగారు తెలంగాణ అంటూ మభ్య పెట్టిన బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రానికి చేసిందేమీ లేదన్నారు. కేసీఆర్ పాలనలో ఒక్కరికి కూడా ఇల్లు రాలేదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసిందని చెప్పారు. తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టే విధంగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి చీఫ్‌విప్ పట్నం మహేందర్‌రెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షుడు లాల్‌కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
పాత రికార్డులను తోడేసిన వరద
సాక్షి, హైదరాబాద్: పరీవాహక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురవడంతో కృష్ణా, గోదావరి బేసిన్ల పరిధిలో రాష్ట్రంలో ఉన్న జలాశయాలకు ఈ ఏడాది రికార్డు స్థాయిలో వరద ప్రవాహం వచ్చింది. కృష్ణా పరీవాహక పరిధిలోని శ్రీశైలం, పులిచింతల జలాశయాలతోపాటు గోదావరి పరీవాహక పరిధిలోని సింగూరు, ఎల్లంపల్లి ప్రాజెక్టుల చరిత్రలోనే అత్యధిక వరద ఈ ఏడాదే వచ్చింది. నాగార్జునసాగర్, నిజాంసాగర్, మిడ్‌మానేరు, లోయర్ మానేరు, కడెం వంటి ఇతర ప్రాజెక్టులకు సైతం రికార్డు స్థాయి వరదలొచ్చాయి. సాగునీటి రంగ పరిభాషలో జూన్ 1 నుంచి వచ్చే ఏడాది మే 31 మధ్య కాలాన్ని నీటి సంవత్సరంగా పరిగణిస్తారు. 2015–16లో కృష్ణా, గోదావరి పరీవాహకంలోని జలాశయాలకు చరిత్రలోనే అత్యల్ప వరదలు రాగా, సరిగ్గా దశాబ్దం తర్వాత ఈ ఏడాది రికార్డు స్థాయిలో వరదలు రావడం గమనార్హం. శ్రీశైలం జలాశయానికి 2,278.47 టీఎంసీలు ప్రస్తుత నీటి సంవత్సరం (2024–25)లో ఇప్పటి వర కు శ్రీశైలం జలాశయానికి 2,278.47 టీఎంసీల భారీ వరద వచ్చింది. ఈ ప్రాజెక్టుకు అత్యధికంగా 1994– 95లో 2,039.23 టీఎంసీల వరద ప్రవాహం రాగా, ఆ తర్వాత 2022–23లో దానికంటే స్వల్ప అత్యధికతో 2,039.87 టీఎంసీల ప్రవాహం వచ్చింది. శ్రీశై లం జలాశయం నిర్మాణం 1960లో ప్రారంభించగా 1980 జూలై 26న నిర్మాణం పూర్తయ్యింది. 1984–85 నుంచి జలాశయంలో పూర్తిస్థాయి నిల్వలను కొనసాగిస్తున్నట్టు గణాంకాలు పేర్కొంటున్నాయి. సాగర్‌కూ నాలుగో అత్యధిక వరద ప్రస్తుత నీటి సంవత్సరంలో ఇప్పటివరకు సాగర్‌కు 1,766.24 టీఎంసీల వరద వచ్చింది. సాగర్ చరిత్రలోనే ఇది నాలుగో అత్యధిక వరద. 1955లో ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభమై 1967లో పూర్తయిన సాగర్‌కు 1975–76లో అత్యధికంగా 2,639.9 టీఎంసీల వరద వచ్చింది. ఆ తర్వాతి కాలంలో కృష్ణానదిపై ఎగువన ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల, శ్రీశైలం వంటి ప్రాజెక్టుల నిర్మాణం జరిగింది. దీంతో సాగర్‌కు వరద ప్రవాహం గణనీయంగా తగ్గిపోయింది. 1978–79లో 1,966.75 టీఎంసీలు, 1994–95లో 1,885.64 టీఎంసీల అత్యధిక వరదలు వచ్చాయి. శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం తర్వాత గడిచిన 40 ఏళ్లలో సాగర్‌కు అత్యధిక వరద ఈ ఏడాదే వచ్చింది. పులిచింతల జలాశయానికి... సాగర్ దిగువన ఉన్న పులిచింతల జలాశయ చరిత్రలో అత్యధిక వరద ఈ ఏడాదే వచ్చింది. ఈ ఏడాది 1,477.1 టీఎంసీల వరద రాగా, అంతకు ముందు 2022–23లో అత్యధికంగా 1,285.86 టీఎంసీల వరద వచ్చింది. » ఈ ఏడాది కృష్ణానదికి నిరంతరంగా భారీ వరదలు కొనసాగడంతో ప్రకాశం బరాజ్ నుంచి రికార్డు స్థాయిలో 1,628 టీఎంసీల కృష్ణా జలాలను సముద్రంలో విడుదల చేశారు. 1990–91 తర్వాత ప్రకాశం బరాజ్ నుంచి సముద్రంలోకి విడుదల చేసిన అత్యధిక వరద ఇదే కావడం గమనార్హం. ఇంతకు ముందు 2022–23లో అత్యధికంగా 1,331. 55 టీఎంసీలను సముద్రంలోకి వదిలారు. గోదావరిలోనూ .... గోదావరి పరీవాహకంలోని సింగూరు జలాశయానికి 1998–99లో అత్యధికంగా 176.56 టీఎంసీల వరద ప్రవాహం రాగా, ఈ ఏడాది చరిత్రలోనే అత్యధికంగా 230.49 టీఎంసీల వరద వచ్చింది. » నిజాంసాగర్ ప్రాజెక్టుకు 1983–84లో అత్యధికంగా 328.93 టీఎంసీల వరద వచ్చింది. ఈ ఏడాది నిజాంసాగర్‌కు 306.83 టీఎంసీల రెండో అత్యధిక వరద వచ్చింది. » శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు అత్యధికంగా 1983–84లో 1,168.57 టీఎంసీల వరద రాగా, 1988–89లో 928.18 టీఎంసీల రెండో అత్యధిక వరద వచ్చింది. ఈ ఏడాది జలాశయానికి 927.40 టీఎంసీల మూడో అత్యధిక వరద రావడం గమనార్హం. » శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు చరిత్రలోనే అత్యధికంగా 1,444.22 టీఎంసీల వరద ఈ ఏడాదే వచ్చింది. 2022–2023లో జలాశయానికి అత్యధికంగా 1,235.76 టీఎంసీల వరద రాగా, 2021–22లో 1077.23 టీఎంసీల ప్రవాహం వచ్చింది. 2015–16లో పూర్తయిన ఈ ప్రాజెక్టు చరిత్రలో ఏడాదికి 1,000 టీఎంసీలకు పైగా వరద మూడు పర్యాయాలు మాత్రమే వచ్చింది. » ధవళేశ్వరం బరాజ్ నుంచి ఈ ఏడాది 4,428 టీఎంసీల గోదావరి జలాలను సముద్రంలోకి వదిలారు. -
బాలసదనంలో లైంగిక వేధింపులపై ఎన్హెచ్ఆర్సీ ఆరా..!
సాక్షి, హైదరాబాద్: సైదాబాద్ బాలసదనంలోని పిల్లలపై లైంగిక దాడుల ఘటన వెలుగు చూసిన నేపథ్యంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) ప్రత్యేక విచారణ ముమ్మరం చేసింది. బాలసదనంలో ఘటనను స్వయంగా పరిశీలించి విచారించేందుకు ఎన్హెచ్ఆర్సీ అధికారుల బృందం రంగంలోకి దిగింది. మూడు రోజులుగా విచారణ ప్రక్రియను కొనసాగిస్తోంది. అక్టోబర్ మొదటి వారంలో పదేళ్ల బాలుడు తీవ్ర అస్వస్థతకు గురి కాగా... చికిత్స నిమిత్తం బాలుడి తల్లి ఆస్పత్రికి తీసుకెళ్లడంతో లైంగిక దాడి ఘటన వెలుగు చూసింది. ఈ ఘటనను సుమోటోగా స్వీకరించిన జాతీయ మానవ హక్కుల కమిషన్ విచారణకు ఆదేశించింది. ఇందులో భాగంగా దర్యాప్తు బృందం డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఇసామ్ సింగ్, మరో అధికారి అవినాష్ కుమార్ సైదాబాద్ బాలసదనానికి చేరుకున్నారు. మూడు రోజులుగా అక్కడే బస చేసిన అధికారులు వివిధ కోణాల్లో విచారణ చేపడుతున్నారు. బాలసదనంలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బందిని వేరువేరుగా విచారించిన దర్యాప్తు అధికారులు... బుధవారం బాలసదనంలోని పిల్లలతో వేరువేరుగా ముచ్చటించారు. ఇంకా చాలా మంది పిల్లలపైనా ఈ తరహా దాడులు జరిగినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. దీంతో ఎన్హెచ్ఆర్సీ దర్యాప్తు అధికారులు బాలురిని వేరువేరుగా విచారణ జరిపారు. బాధిత పిల్లలను సైతం దర్యాప్తు అధికారులు ప్రత్యేకంగా కలిసి విచారించినట్లు తెలిసింది. మూడు రోజులపాటు విచారణ జరిపిన అధికారులు గురువారం ఢిల్లీకి వెళ్లిన తర్వాత విచారణ నివేదికను ఎన్హెచ్ఆర్సీకి అందించనున్నట్లు సమాచారం. కంటితుడుపు చర్యలతో సరి... బాలసదనంలోని పిల్లలపై లైంగిక దాడులు వెలుగుచూసిన వెంటనే రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కంటితుడుపు చర్యలతో సరిపెట్టింది. సైదాబాద్‌లో ఉన్న రెండు చిల్డ్రన్ హోంలతో పాటు స్పెషల్ హోంకు సంబంధించి పూర్తి స్థాయిలో పరిశీలించి నివేదిక సమరి్పంచాలని జువెనైల్ వెల్ఫేర్ శాఖ అధికారిని రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆదేశించారు. దాదాపు నెలరోజులు కావస్తున్నా ఈ విచారణ ప్రక్రియ ముందుకు సాగకపోవడం గమనార్హం. -
చిన్న, స్థానిక కాంట్రాక్టర్లకు 25 శాతం రిజర్వేషన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 1,023 గురుకుల, సంక్షేమ హాస్టళ్లు, పాఠశాలల్లో విద్యార్థులకు అందించే ఆహార, ఇతర సరుకుల టెండర్ల ప్రక్రియలో చిన్న, స్థానిక కాంట్రాక్టర్లకు 25 శాతం రిజర్వేషన్ వర్తింపజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. సరుకుల సేకరణలో సమానత్వం, పారదర్శకత, నిష్పాక్షికత పాటించాలని స్పష్టం చేసింది. బిడ్డర్లను లాటరీ ద్వారా ఎంపిక చేసే విధానాన్ని నిలిపివేయాలని తేల్చిచెప్పింది. జూలై 8న ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ 17 సబబే అయినా.. కొన్ని మార్పులు అవసరమని అభిప్రాయపడింది. గిరిజన సహకార సంఘాలు, మహిళా సమాఖ్యలకు టెండర్ల ప్రక్రియకు ముందే రిజర్వేషన్లు కల్పించాలని చెప్పింది. జిల్లాల వారీగా విద్యార్థులకు అందించే సరుకులు, ఆహార పదార్థాల ఏకరీతి సేకరణ వ్యవస్థ కిందకు తీసుకొస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీఓ 17ను సవాల్ చేస్తూ తెలంగాణ గురుకుల కాంట్రాక్టర్ల అసోసియేషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై జస్టిస్ నగేశ్ భీమపాక విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. దశాబ్దాలుగా సరుకులు పంపిణీ చేస్తున్న చిన్న, మధ్యతరహా కాంట్రాక్టర్లను తప్పించి.. ఆర్థికంగా ఉన్న వారికి కట్టబెట్టేందుకు ఈ జీఓ తీసుకొచ్చారన్నారు. జీఓ జారీలో ఎలాంటి దురుద్దేశం లేదని, టెండర్లలో అందరూ పాల్గొనవచ్చని ప్రభుత్వ తరఫు న్యాయవాది చెప్పారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. ప్రభుత్వ నిర్ణయాన్ని సమరి్థస్తూనే కొన్ని.. పలు మార్గదర్శకాలు జారీ చేశారు. ఏళ్ల తరబడి సరుకులు పంపిణీ చేస్తున్న చిన్న కాంట్రాక్టర్ల జీవనోపాధిని దెబ్బతీయవద్దన్నారు. హైకోర్టు జారీ చేసిన మార్గదర్శకాల్లో ముఖ్యమైనవి » గిరిజన సహకార సంస్థ (జీసీసీ), మండల, జిల్లా మహిళా సమాఖ్యలకు ఏదైనా రిజర్వేషన్ లేదా ఇతర ప్రాధాన్యతను టెండర్ నోటిఫికేషన్లోనే స్పష్టంగా పేర్కొనాలి. రిజర్వేషన్ శాతం, అది వర్తించే సరఫరా ప్రాంతాలను ముందుగానే ప్రకటించాలి. » రూ. కోటి కంటే తక్కువ విలువైన కాంట్రాక్టుల విషయంలో ఈఎండీ అంచనా విలువలో 2 శాతానికి మించకూడదు. వార్షిక టర్నోవర్ కాంట్రాక్టు విలువను మించకూడదు. » ప్రతి టెండర్ నోటిఫికేషన్లో పని మొత్తం అంచ నా విలువ, సరఫరా చేయాల్సిన వస్తువులు, వా టి పరిమాణాలు, సుమారు యూనిట్ రేట్లు స్పష్టంగా పేర్కొనాలి. » ఏదైనా బిడ్‌ను అంగీకరించడానికి లేదా తిరస్కరించడానికి కారణాలను రాతపూర్వకంగా నమో దు చేయాలి. సంబంధిత సంక్షేమ శాఖల అధికారిక వెబ్సైట్ల ద్వారా బహిరంగంగా ఈ కార ణాలను అందుబాటులో ఉంచాలి. æ సాంకేతికంగా అర్హత కలిగిన బిడ్డర్లలో లాటరీ తీసి పనిని కేటాయించే విధానాన్ని వెంటనే నిలిపివేయాలి. » మండల లేదా గురుకుల స్థాయిలో అనుభవమున్న చిన్న, స్థానిక కాంట్రాక్టర్లకు 25 శాతానికి తక్కువ కాకుండా రిజర్వేషన్ ఇవ్వాలి. » టెండర్ నోటీసుల ప్రచురణ, సవరణలు, ఫలితాలు, టెండర్ ప్రక్రియల ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారానికి కేంద్రీకృత ఆన్లైన్ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి. » ఈ తీర్పు అందిన తేదీ నుంచి 2 వారాల్లో పైన పేర్కొన్న మార్గదర్శకాలతో నోటిఫికేషన్ ఇవ్వాలి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని సంక్షేమ శాఖలు, వాటి అధీన సంస్థలకు ఒకేలా వర్తింపజేయాలి. -
చర్లపల్లి జైలులో జవాన్‌పై ఐఎస్ఐ ఖైదీ దాడి?
సాక్షి, హైదరాబాద్: చర్లపల్లి కేంద్ర కారాగారంలో విధి నిర్వహణలో ఉన్న ఓ జవాన్‌పై పాక్ ప్రేరేపిత ఐఎస్ఐ ఖైదీ దాడికి పాల్పడిన ఉదంతమిది. ఈ సంఘటన బుధవారం సాయంత్రం ఐదు గంటలకు చోటుచేసుకుంది అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం చర్లపల్లిలో విధులు నిర్వహిస్తున్న రాజేష్ అనే జవాన్ చేతిలో లాఠీ పట్టుకుని రౌండ్స్‌లో ఉన్నారు. జైలులోని యూనిట్ ఆసుపత్రి వద్ద ఆయన తనిఖీల్లో ఉండగా, అప్పడే చికిత్స కోసం మాజ్ అనే ఖైదీ చికిత్స కోసం వచ్చాడు.ఆసుపత్రిలో మహిళా డాక్టర్‌తో తనను నిమ్స్ కానీ, ఉస్మానియా ఆసుపత్రి కానీ రిఫర్ చేయాలంటూ డిమాండ్ చేశాడు. చిన్న ఆరోగ్య సమస్యేనని.. అవసరమైతే రేపు మరోసారి పరీక్షించి రిఫర్ చేస్తామని డాక్టర్ చెప్పారు. దాంతో శివాలెత్తిపోయిన మాజ్.. ఆసుపత్రి నుంచి బయటకు వచ్చి తిట్లు పురాణం ప్రారంభించారు. అదే సమయంలో రౌండ్స్‌లో ఉన్న రాజేష్‌ను తీవ్రంగా దూషించారు. అంతటితో ఆగకుండా రాజేష్ చేతులోని లాఠీని లాక్కుని ఆయనపై దాడి చేశారు.తోటి సిబ్బంది ఇతర ఖైదీలు వెంటనే స్పందించి మాజ్‌ను నిలువరించారు. అక్కడే విధుల్లో ఉన్న ఓ డిప్యూటీ జైలర్.. మరో జవాన్ ఆ ఖైదీపై ఎదురుదాడి చేసి రాజేష్‌ను కాపాడారు. ఐఎస్ఐ సంబంధింత కేసులో మాజ్ చర్లపల్లి జైలుకి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై చర్లపల్లి ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ శివకుమార్‌గౌడ్ వివరణ తీసుకునేందుకు ‘సాక్షి’ యత్నించగా ఆయన ఫోన్లో స్పందించలేదు. ఈ ఘటనపై మరిని వివరాలు తెలియాల్సి ఉంది. -
‘కారు గుర్తుకు ఓటేస్తే కమలం గుర్తుకు వేసినట్టే’
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్ని కేసీఆర్ బీజేపీకి తాకట్టుపెట్టారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. ‘బీఆర్ఎస్ ఆత్మహత్య చేసుకుని బీజేపీకి అవయవదానం చేసింది. ప్రధాని మోదీకి ఇస్తున్న కేసీఆర్ ప్రమాదకరం. కారు గుర్తుకు ఓటేస్తే కమలం గుర్తుకు వేసినట్టే.కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగించి మూడు నెలలైంది.ఈ-కార్ రేసు కేసులో కేటీఆర్ ప్రాసిక్యూషన్‌కు గవర్నర్ ఇప్పటివరకు అనుమతి ఇవ్వలేదు. సోనియా,రాహుల్‌ను ఈడీ విచారించింది. కేసీఆర్,కేటీఆర్,హరీష్‌ను ఎందుకు పిలవలేదు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనమయ్యే పరిస్థితి ఉంది’అని పునరుద్ఘాటించారు. -
కేసీఆర్ పదేళ్ల పాలనపై చర్చకు సిద్ధమా?: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ అభివృద్ధిపై తనతో చర్చకు రావాలంటూ సీఎం రేవంత్‌రెడ్డికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. అసెంబ్లీ, సచివాలయం, గాంధీ భవన్ ఎక్కడైనా సరే.. రేవంత్‌తో చర్చకు రెడీ అన్నారు. ‘‘సీఎం రేవంత్ రెడ్డి నిరాశ, నిస్పృహతో ఉన్నారు. జూబ్లీహిల్స్ బైపోల్స్‌లో కాంగ్రెస్ ఓటమి ఖాయమని రేవంత్‌కు అర్థమైంది. అందుకే నాపై రేవంత్ వ్యక్తిగత దూషణకు దిగాడు’’ అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు.‘‘ఓటమి తప్పదని భావించి.. రేవంత్ మాట్లాడుతున్నారు. ఆయన కంటే గట్టిగా మాట్లాడగలను. రేవంత్‌కు సమాధానం చెప్పే సత్తా ఉంది. కానీ కేసీఆర్ సూచనతోనే రేవంత్‌పై వ్యక్తిగత దూషణకు దిగటం లేదు. బీఆర్ఎస్ హయాంలో చేసిన పనులను ప్రజలకు చెప్పమని కేసీఆర్ నాకు చెప్పారు. నన్ను వ్యక్తిగతంగా తిట్టిగా.. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి రేవంత్‌ను గౌరవిస్తున్నా.. హైదరాబాద్, జూబ్లీహిల్స్ అభివృద్ధిపై రేవంత్ తో చర్చకు రెడీ. హోంశాఖను చూస్తున్న రేవంత్‌రెడ్డి హయాంలో శాంతి భద్రతలు క్షీణించాయి. హైదరాబాద్‌లో గన్, డ్రగ్ కల్చర్ పెరిగింది...కాంగ్రెస్ హయాంలో హైదరాబాద్.. చెత్త సిటీ, క్రైం సిటీగా మారింది.అండర్ పాస్‌లు, ప్లైఓవర్లు కేసీఆర్ హాయాంలోనే నిర్మించాం. కాంగ్రెస్ వచ్చాక ఎన్ని ఫ్లైఓవర్లు కట్టారో చెప్పాలి. పదేళ్లల్లో వంద లింకు రోడ్లు నిర్మించాం. కాంగ్రెస్ వచ్చాక ఒక గుంత కూడా పూడ్చలేదు. సీఎం అంటే కటింగ్ మాస్టర్ మాదిరి రేవంత్ వ్యవహరిస్తున్నారు. సిటీలో మళ్లీ మంచి నీటి కష్టాలు తెచ్చింది కాంగ్రెస్ సర్కార్. చెత్త సమస్య పరిష్కారానికి స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమానికి మేము శ్రీకారం చుట్టాం. మెట్రో నిర్మించిన ఎల్అండ్టీని రేవంత్‌రెడ్డి.. బెదిరించి పంపించారు’’ అని కేటీఆర్ ఆరోపించారు. -
హైదరాబాద్: జగద్గిరిగుట్టలో నడిరోడ్డుపై దారుణం
సాక్షి, హైదరాబాద్: జగద్గిరిగుట్టలో నడిరోడ్డుపై కత్తిపోట్లు కలకలం సృష్టించాయి. జగద్గిరిగుట్ట బస్టాండ్‌లో యువకుడు రోషన్‌పై ఓ వ్యక్తి హత్యాయత్నం చేశాడు. కత్తితో యువకుడిపై రౌడీషీటర్ బాల్ రెడ్డి, మరో దుండగుడు కత్తితో దాడి చేశారు. ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో హత్య యత్నానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.తీవ్ర గాయాలపాలైన యువకుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమం ఉందని వైద్యులు తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
మంత్రి పదవి కోరుకున్నా.. కానీ
సాక్షి, హైదరాబాద్: తాను మంత్రి పదవి ఆశించిన మాట వాస్తమేనని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి (P Sudarshan Reddy) అన్నారు. కొన్ని సమీకరణాల వల్ల తనకు మంత్రి పదవి రాలేదని చెప్పారు. సెక్రటేరియట్లో బుధవారం ఉదయం ప్రభుత్వ సలహాదారుగా ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహించడానికి ప్రయత్నం చేస్తానని చెప్పారు. ప్రభుత్వ సలహాదారు బాధ్యతలు అప్పగించినందుకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఏఐసీసీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.''గ్రామాల్లో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తాం. తెలంగాణ ఏర్పాటు జరిగిన తర్వాత అభివృద్ధి జరగలేదు. గత ప్రభుత్వ హయాంలో పనికిరాని పథకాల వల్ల తెలంగాణ (Telangana) ప్రజలపై భారాన్ని మోపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రేషన్ కార్డులు, సన్నబియ్యం అందిస్తున్నాం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నాం. ఇప్పటి వరకు 7వేల కోట్లు ఖర్చు చేశాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో అందరికి తెలుసు.. ఉన్న పథకాలను ఇంప్లిమెంట్ చేసేందుకు ప్రణాళికలు వేస్తామ''ని సుదర్శన్ రెడ్డి అన్నారు.అంతకుముందు తన కార్యాలయంలో కుటుంబ సభ్యులతో సుదర్శన్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, (Tummala Nageswara Rao) పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు అభినందనలు తెలియజేశారు. కాగా, మంత్రి వర్గంలో చోటు ఆశించి భంగపడ్డ సుదర్శన్‌రెడ్డితో పాటు కె. ప్రేంసాగర్‌రావులకు కేబినెట్ హోదాతో ప్రభుత్వం సరిపెట్టింది. ప్రభుత్వ పథకాల అమలు బాధ్యత అప్పగిస్తూ.. సుదర్శన్‌రెడ్డిని సలహాదారుగా నియమించింది. పౌరసరఫరాల సంస్థ చైర్మన్ పదవిని ప్రేంసాగర్‌రావుకు కట్టబెట్టింది. మరోవైపు కొత్తగా మంత్రి వర్గంలో చోటు దక్కించుకున్న అజహరుద్దీన్‌కు మైనారిటీల సంక్షేమం, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ శాఖలను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. చదవండి: కేటీఆర్ అరెస్ట్‌కు అనుమతి ఇవ్వాలి.. సీఎం రేవంత్ -
చెట్లు తప్పు చేయవు..చెట్లను బతికిస్తున్నాడు
‘చెట్టే కదా అని నరికివేయకండి. దానికి ప్రాణం ఉంది. శక్తి ఉంది. పదిమందికి మేలు చేసే గుణం ఉంది అని గ్రహించండి’ అంటున్న సత్తెయ్య కుప్పకూలిన చెట్లు తిరిగి లేచేలా, పచ్చదనంతో నవ్వేలా చేస్తున్నాడు. ట్రీ ట్రాన్స్‌లొకేషన్ విధానం ద్వారా చనిపోయిన చెట్లకుప్రాణం పోస్తున్నాడు...అది అందరి బాధ్యతమొక్కలు నాటడం, చెట్లను కాపాడుకోవడం అనేది ఏ ఒక్కరి బాధ్యతో కాదు. అది అందరి బాధ్యత. ‘నేను ఒక్కరిని తలచుకుంటే ఏం అవుతుంది!’ అని ఎవరికి వారు నిరాశపడడం కంటే ‘నాకు తోచింది నేను చేస్తాను’ అని ఎవరికి వారు అనుకుంటే సమాజానికి, పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుంది. ట్రీ ట్రాన్స్‌లొకేషన్‌కు సంబంధించిన అవగాహన పర్యావరణ ప్రేమికులకే కాదు సామాన్య ప్రజలకు కూడా ఉండాలి. – సుంకిసాల సత్తయ్య తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా ఇటిక్యాల గ్రామానికి చెందిన సుంకిసాల సత్తయ్య పెద్ద చదువులు చదువుకోలేదు. ఇంటర్మీడియెట్ వరకు బైపీసీ చదువుకున్న సత్తయ్యకు చెట్లు, జీవవైవిధ్యం. పర్యావరణ విషయాలపై ఆసక్తి ఎక్కువ. ‘చెట్లు కూడా మనలాంటి జీవులే’ అంటాడు.బతుకుదెరువు కోసం దుబాయ్ వెళుతూ వెళుతూ... ‘ఇప్పటిలాగే మీరు ఎప్పుడూ పచ్చగా వర్థిల్లాలి’ అని మనుషులకు చెప్పినట్లే చెట్లకు కూడా చెప్పి వెళ్లిపోయాడు. దుబాయ్‌కి వెళ్లి తిరిగి వచ్చిన సత్తయ్య తనకు ఇష్టమైన ఎన్నో చెట్లు నరికివేసి ఉండటాన్ని చూసి తల్లడిల్లిపోయాడు. నరికిన చెట్లను ఎలాగైనా బతికించాలని పట్టుదలగా ముందుకు కదిలాడు. సత్తయ్య బాధపడుతున్న తీరు, పట్టుదల కొద్దిమందికి ఆశ్చర్యంగా అనిపించింది.‘చెట్లను కొట్టేయడం మామూలే కదా, ఎందుకు ఇంతలా బాధపడుతున్నావు?’ అని అడిగారు.‘చెట్టు మనిషి కాదు కదా!’ అని కూడా అన్నారు. అప్పుడు సత్తెయ్య ఇలా అన్నాడు... ‘తెలిసో తెలియకో మనిషి తప్పుచేస్తాడేమోగానీ చెట్టు ఎప్పుడూ తప్పు చేయదు. పదిమందికి ఉపకారమే చేస్తుంది. అలాంటి చెట్లను నరికితే బాధ కలగదా!’చెట్టును బతికించడానికి చేయూత ఇవ్వండి...‘అయ్యా ఇదీ పరిస్థితి. చెట్లను బతికించే పనిలో మీ చేయి కూడా ఉండాలి’ అని ఎంతోమంది రైతులు, దాతలను అడిగాడు. అలా వారి సహకారంతో ఎకరం భూమిలో ట్రీ ట్రాన్స్‌లొకేషన్ చేపట్టి సుమారు 40 మహావృక్షాలకు ప్రాణంపోశాడు. ఇది తెలంగాణలోనే మొట్టమొదటి ట్రాన్స్‌లొకేషన్. గ్రామంలోని వాగు పక్కన ఎకరం భూమిలో గత ఏడాది ఆగస్టులో చెట్లకు ప్రాణం పోసే కార్యక్రమం ప్రారంభం అయింది. సుమారు 30 చెట్లను బతికించారు. ట్రాన్స్‌లొకేషన్ చేసిన ఎకరం భూమిలో తనకు సహకరించిన చెన్నమనేని హిమవంతరావు, కాటిపల్లి నారాయణరెడ్డి, సుంకిసాల సత్తయ్య, కొక్కు శేఖర్, కొమ్ముల రాధ, సింగని వీరేందర్ పేర్లను ఆయా చెట్ల బోర్డులపై రాయించాడు.ప్రతి పండుగ... మొక్కలు నాటే పండుగ‘ఇక నా బాధ్యత పూర్తయింది’ అనుకోలేదు సత్తెయ్య. ‘మొక్కలు నాటాలి. నాటించాలి’ అని ప్రతిజ్ఞ తీసుకున్నాడు. గ్రామంలో ప్రతి ఒక్కరితో మొక్కలు నాటించాలనే లక్ష్యంతో ఎనిమిది వేల మొక్కల వరకు నాటించాడు. గ్రామంలో ఏ పండగ వచ్చినా మొక్కలు నాటేలా కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టాడు.– నాగమల్ల శ్రీకర్, సాక్షి, రాయికల్, జగిత్యాల జిల్లా -
మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం!
హైదరాబాద్: మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని మౌలాలిలో దారుణం చోటు చేసుకుంది. కుషాయిగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎదుట సింగిరెడ్డి మీన్ రెడ్డి (32)అనేవ్యక్తి డ్రంక్ అండ్ డ్రైవ్ లో పోలీసులు వ్యవహరించిన తీరుపై మనస్తాపంతో ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.ఈ ఘటన బుధవారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో చోటు చేసుకున్నట్లు సమాచారం. మీన్ రెడ్డి దమ్మాయిగూడా నివాసిగా పోలీసులు గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. సింగిరెడ్డి మీన్ రెడ్డి డ్రంక్ అండ్ డ్రైవ్ లో మద్యం తాగిన రీడింగ్ 120 వచ్చిందని కుషాయిగూడ ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు.ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
బీదర్‌లో ఘోర ప్రమాదం.. తెలంగాణవాసులు మృతి
బెంగళూరు: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. వ్యాను, కారు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు తెలంగాణ వాసులు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలైనట్టు తెలుస్తోంది.వివరాల ప్రకారం.. కర్ణాటకలోని బీదర్‌లో బుధవారం ఉదయం డీటీడీసీ కొరియర్ వ్యాను, కారు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడటంతో వారికి ఆసుపత్రికి తరలించారు. మృతులు నారాయణఖేడ్ మండలం జగన్నాథ్‌పూర్ గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. వీరంతా గణగాపూర్ దత్తాత్రేయ ఆలయానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగినట్టు సమాచారం. -
కలలో కూడా ఊహించలేదు: బస్సు కండక్టర్ రాధ
చేవెళ్ల: ‘ఇలాంటి ప్రమాదం జరుగుతుందని కలలో కూడా ఊహించలేదు. కళ్ల ముందే టిప్పర్ మృత్యువులా దూసుకొచ్చింది. బస్సుపైకి వస్తున్న లారీని చూసి డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. అయినా లారీ ఒక్కసారిగా బస్సుపైకి వచ్చింది. ఈ కుదుపునకు నేను కూర్చున్న సీటు ముందు ఉన్న రాడ్‌కు తల బలంగా ఢీకొట్టింది. కంకరలో నా కాళ్లు మునిగిపోయాయి. అప్పటికే బస్సులో క్షేమంగా బయట పడినవారు, వెనుక బస్సుల్లో వచ్చిన పోలీస్ కానిస్టేబుళ్లు నన్ను బయటకు లాగారు. 18 కుట్లు పడ్డాయి. నిన్ననే చిన్న సర్జరీ చేశారు. 24 గంటలు అబ్జర్వేషన్లో ఉండాలని వైద్యులు చెప్పారు. ప్రతిరోజూ ఉదయం 4:40 గంటలకు బయలుదేరుతాం. ఆ రోజు 4:50కి స్టార్ట్ అయ్యాం ’ బస్సు కండక్టర్ రాధ చెప్పారు. -
నేను కూలి చేసి నా సెల్లిని సదివిస్తా..
వికారాబాద్/తాండూరుటౌన్: ‘అమ్మకు జెరం వచ్చిందిని.. మా అమ్మమ్మ ఇంటికి పోయివారం ఆయే. నిన్న రాత్రి అమ్మను దవఖానాకు సూపిస్కొస్త అని మా నాయిన గూడపోయిండు.. ఆల్లిద్ద రూ పొద్దుగూకినంక ఒస్తరనుకుంటే పొద్దుగాళ్ల పదిగంట్లకే మీ అమ్మనాయిన చచ్చిపోయిండ్రని ఫోనొచ్చింది’అంటూ తల్లిదండ్రులను కోల్పోయిన ఇద్దరు బాలికలు విలపించటం కన్నీరు పెట్టించింది. వికారాబాద్ జిల్లా హాజీపూర్‌కి చెందిన దంపతులు లక్ష్మి–బందెప్ప బస్సు ప్రమాదంలో మృతిచెందిన విషయం తెలిసిందే. ఉండటానికి చిన్న ఇల్లు తప్ప ఏ ఆస్తిపాస్తులు లేని ఈ దంపతులు మృతితో వారి ఇద్దరు కూతుళ్లు శిరీష, భవానీ అనాథలయ్యారు. వారిని ‘సాక్షి’ పరామర్శించగా తల్లడిల్లిపోయారు. ‘మాయమ్మ, మా నాయిన సచ్చిపోయిండ్రని సుట్టాలందరు ఒచ్చిండ్రు.. రేపెల్లుండి ఎవరిండ్లకు ఆల్లు పోతరు.. ఇంక నేను మా సెల్లె ఇంట్ల ఉండాలె. మాకింక దిక్కెవరు. మాయమ్మతోని కలిసి నేనుగూడ కూలికి పోతుంటి. వారం పదిదినాలసంది పానం బాగలేకపోతె మా అమ్మమ్మ ఇంటికి తోలిచ్చినం. దవాఖానాకు పోయి పానం బాగా చేపిచ్చుకొని ఒస్తమని పోయిండ్రు.. ఇప్పుడు మా నాయిన లేడు. మాయమ్మలేదు. ఎంత కష్టమైనా సరే నేను కూలికి పోయి మా సెల్లిని మంచిగ సదివిపిస్త. మా అమ్మమ్మను తోలుకొచ్చుకోని నా జతకు పండుకోబెట్టుకుంటా..’ అంటూ శిరీష చెప్పుకొచ్చింది. -
Chevella Bus Incident: ప్రాణం పోవడం ఖాయమనుకున్నా
చేవెళ్ల: మీర్జాగూడ వద్ద జరిగిన ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన వారిలో ప్రస్తుతం 13 మంది చేవెళ్లలోని పట్నం మహేందర్‌రెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాద ఘటనపై వారిని కదిలించగా ఉబికివచ్చే కన్నీళ్లతో తమ అనుభవాలను పంచుకున్నారు. మృత్యువు అంచులవరకు వెళ్లి వచి్చనట్లుగా ఉందని, షాక్ నుంచి తేరుకోవడానికి సమయం పట్టిందని పేర్కొన్నారు. నిమ్స్‌లో చికిత్స పొందుతున్న జయసుధ లక్డీకాపూల్/ధారూరు: ‘బస్సులో కంకరలో కూరుకుపోయి ప్రాణాలపై ఆశ వదులుకున్నా.. సీటు దొరక్కపోవడంతో కండక్టర్‌తో మాట్లాతుండగా టిప్పర్ ఢీకొట్టింది.. క్షణాల్లో అంతా జరిగిపోయింది. నా ప్రాణం పోవడం ఖాయమనుకున్నా. బస్సు మొత్తం కంకరతో నిండిపోయింది. చేతుల వరకు కూరుకుపోయా, కాపాడాలని మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయింది. చివరకు ఒకరి వద్ద ఫోన్ అడుక్కొని తమ్ముడికి కాల్ చేశా. గంటలోపు తమ్ముడు, భర్త వచ్చారు. అప్పటి వరకు అలాగే ఉన్నా. నా ఎడమ కాలుపై ఇద్దరు పడ్డారు. కుడి కాలు బస్సు సీటులో ఇరుక్కుపోయి విరిగిపోయింది. నా కాలుపై పడిన ఇద్దరు ఎప్పుడో చనిపోయారు. భర్త, తమ్ముడు రాగానే చేతులతో కంకర తీయడం మొదలుపెట్టారు. వాళ్ల చేతులు రక్తమయంగా మారాయి. చివరకు బయటపడ్డా’అని ధారూరు మండలం కేరెళ్లికి చెందిన జయసుధ తెలిపారు. చేవెళ్లలోని గురుకుల పాఠశాలలో పార్ట్‌టైమ్ టీచర్‌గా పనిచేస్తూ రోజూ గ్రామం నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. మీర్జాగూడ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో గాయపడింది. ఎడమ కాలు పక్క ఎముకలు విరిగ్గా, కుడి కాలుకు కూడా గాయాలయ్యాయి. జయసుధ కాలుకు శస్త్ర చికిత్స చేశారు. ప్రస్తుతం ఆమె నిమ్స్ చికిత్స పొందుతున్నారు. తలచుకుంటేనే భయంగా ఉంది బస్సు తాండూరులోనే నిండిపోయింది. ధారూరు, వికారాబాద్ వచ్చేసరికి సీట్లు లేక చాలామంది నిల్చున్నారు. ప్రమాదంలో నడుం వరకు కంకరలో కూరుకుపోయాను. నా కాలుకు రేకు దిగింది. రెండు ఫీట్లు ముందుండి ఉంటే ప్రాణాలు పోయేవి. బతికిపోయాను అనుకున్నా. తలచుకుంటేనే భయంగా ఉంది. – బస్వరాజ్, కోకట్ ప్రాణాలు పోతాయనుకున్నా.. నగరంలో స్వీపర్‌గా పనిచేస్తాను. ధారూరు నుంచి రోజూ తాండూరు నుంచి వచ్చే మొదటి బస్సుకే వెళ్తుంటాను. సోమవారం కూడా ఎప్పటిలాగే బస్సు ఎక్కగా సీట్లు లేకపోవడంతో డ్రైవర్ పక్కనే ఉన్న బ్యానెట్‌పై కూర్చున్నా. మీర్జాగూడ గేట్ రాగానే మలుపులో ఎదురుగా వేగంగా వస్తున్న టిప్పర్‌ను చూసి లారీ వస్తుంది తమ్మి అని డ్రైవర్‌కు చెప్పా. డ్రైవర్ బస్సును పక్కకు మలిపేలోపు టిప్పర్ ఢీకొట్టింది. కంకరలో మొత్తం మునిగిపోయా. నా చేయి మాత్రమే పైకి ఉండిపోయింది. తోటి ప్రయాణికులు నా చేయి పట్టుకొని బయటకు తీశారు. ప్రాణాలు గాలిలో కలిసిపోతాయనుకున్నా. తీవ్ర గాయాలతో బతికిబయటపడ్డా. – నాగమణి, ధారూరు రైలు మిస్సు కావడంతో.. హైదరాబాద్‌లో సేల్స్‌మెన్‌గా పనిచేస్తున్నాను. వీక్లీ ఆఫ్ కావడంతో ఇంటికి వచ్చాను. ఎప్పుడు వచి్చనా రైలుకు వెళ్తాను. సోమవారం ఉదయం 4.30కు రైలు మిస్ కావడంతో 4.40 గంటలకు తాండూరు నుంచి వెళ్లే మొదటి బస్సు ఎక్కాను. బస్సు డ్రైవర్ కంట్రోల్ చేశాడు. కానీ టిప్పర్ డ్రైవర్ వచ్చి ఢీకొట్టాడు. నిలబడి ఉన్న నేను కంకరలో ఇరుక్కుపోయాను. నా ముందు ఒకతని ప్రాణాలు పోయాయి. జేసీబీ వచ్చే వరకు బయటకు రాలేకపోయా. ఇలా ఆస్పత్రి పాలవుతాననుకోలేదు. – బి.శ్రీనివాస్, తాండూరు కంకరలో కూరుకుపోయా.. మన్నెగూడ నుంచి చేవెళ్లలో ఆస్పత్రికి చూపించుకునేందుకని బస్సు ఎక్కాను. బస్సు నిండిపోవడంతో నిలబడి ఉన్నా. కంకరలో సగం వరకు కూరుకుపోయా. డోర్‌కు దగ్గరలో ఉండడంతో స్థానికులు రెండు చేతులు పట్టి బయటకు లాగారు. లేదంటే ప్రాణాలు పోయేవి. రోడ్డు బాగాలేకే ఈ ప్రమాదం జరిగింది. అసలే అనారోగ్యంతో ఉన్నాను. ఈ ప్రమాదంతో మరింతగా బాధపడుతున్నాను. – అనసూయ, బోంగుపల్లి ఏం జరిగిందో అర్థం కాలేదు వికారాబాద్‌లో ఉంటూ హైదరాబాద్‌లో డ్రైవర్‌గా పనిస్తున్నాను. వారానికి ఒకరోజు ఇంటికి వచ్చి వెళ్తాను. ఆదివారం వచ్చి సోమవారం హైదరాబాద్‌కు వెళ్తున్నాను. బస్సులో ఉన్న నాకు ఏం జరిగిందో అర్థం కాలేదు. ఒక్కసారిగా పెద్ద శబ్దం వచి్చంది. తరువాత చూస్తే అంతా దుమ్ము, కంకర. అందులో పడిన వారి అరుపులు వినిపించాయి. నాకు ముక్కుకు, తలకు కంకర తగిలి గాయలయ్యాయి. – ఆర్.అఖిల్, పూడూరు -
జోరు.. టాప్ గేరు!
సాక్షి,హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తేదీ సమీపిస్తుండటంతో ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారంలో గేరు మార్చాయి. వీధులన్నీ రాజకీయ నాయకులు, పార్టీ కార్యకర్తలతో హోరెత్తుతున్నాయి. ఈ ఉప ఎన్నికను మూడు ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దీంతో ఎలాగైనా ఈ సీటు దక్కించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. స్థానిక సమస్యలే ఎజెండాగా ప్రచారం చేస్తున్నాయి. బీజేపీ నుంచి తెలుగు రాష్ట్రాలతో పాటు, జాతీయ స్థాయి నాయకులు, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రులు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వీధివీధిలో పాదయాత్రలు నిర్వహిస్తూ, ఇంటింటికి తిరిగి ఓటర్లను కలుస్తున్నారు. తమ అభ్యర్థకే ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్నర్ మీటింగ్‌లతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తుండగా, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ ఛైర్మన్లు తదితరులు సైతం ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్నారు. బీఆర్ఎస్ సిట్టింగ్ సీటును దక్కించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పదునైన విమర్శనా్రస్తాలతో ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. మాస్ క్యాంపెయిన్‌పై దృష్టి.. ఉప ఎన్నికలో కాంగ్రెస్, బీఆర్ఎస్ల ప్రచార శైలికి భిన్నంగా బీజేపీ ముందుకెళుతోంది. ప్రత్యర్థి పార్టీలు కార్నర్ మీటింగ్, రోడ్ షో అంటూ పెద్దఎత్తున జన సమీకరణ చేస్తుండగా, బీజేపీ నేరుగా కాలనీల్లో ఓటర్ల ఇంటికి పాదయాత్రగా వెళుతోంది. బీజేపీ 50 మంది స్టార్ క్యాంపెయినర్లతో జాబితా విడుదల చేసింది. కార్పెట్ బాంబింగ్ అంటూ కొత్త తరహా ప్రచారానికి తెరతీసింది. కాంగ్రెస్, బీఆర్ఎస్లు మాత్రం జన సమీకరణకు మొగ్గుచూపుతున్నాయి. కార్నర్ మీటింగ్‌లు, ఇంటింటి ప్రచారంతో నాయకులు బస్తీల్లో కలియదిరుగుతున్నారు. పేరుకు పెద్దదే అయినా.. పేరుకు జూబ్లీహిల్స్ నియోజకవర్గం అయినా ఆ రాజసం ఆ ప్రాంతంలో కనిపించదు. బస్తీల్లో గుంతలుగా మారిన అంతర్గత రహదారులు, పొంగుతున్న మురుగు నీటి పారుదల వ్యవస్థ, వెలగని విద్యుత్తు లైట్లు, పార్కులు, ఫుట్ పాత్ల ఆక్రమణలపై విమర్శణా్రస్తాలు సంధిస్తున్నాయి. ఈ పాపం మీదంటే మీదంటూ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నేతలు ఒకరినొకరు నిందిస్తుండగా, ఈ దుస్థితికి ఆ రెండు పార్టీలే కారణమంటూ బీజేపీ వాదిస్తోంది. ఈసారి అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తామంటోంది. ఆ ముగ్గురే కీలకం.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మూడు ప్రధాన పార్టీల నుంచి ముగ్గురు నేతలు కీలకంగా వ్యవహరిస్తున్నారు. బీజేపీ నుంచి కిషన్ రెడ్డి, కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్లో కేటీఆర్ ప్రచార బాధ్యతలను తీసుకున్నారు. ఇతర నేతలంతా కాలనీల్లో పర్యటిస్తున్నారు. ఎన్నికల వ్యూహాలు, జన సమీకరణ, ఎక్కడ మీటింగ్ ఏర్పాటు చేయాలి, ఎవరెవరిని గెస్ట్లుగా పిలవాలి తదితర అంశాలన్నీ ఆయా నేతలు చూస్తున్నారు. పార్టీ అభ్యరి్థని విజయ తీరాలకు చేర్చే బాధ్యతలను తమ భుజాలపై వేసుకున్నారు. -
ఆస్తి కోసం భర్తను కిడ్నాప్ చేయించిన మొదటి భార్య.!
అంబర్‌పేట: అంబర్‌పేట పరిధిలోని డీడీ కాలనీలో గత నెల 29న జరిగిన కిడ్నాప్ కేసును పోలీసుల ఛేదించారు. బాధితుడి మొదటి భార్యే కిడ్నాప్‌నకు సూత్రధారి అని తేల్చారు. ఈమేరకు మంగళవారం ఈస్ట్‌జోన్ డీసీపీ బాలస్వామి, అడిషనల్ డీసీపీ నర్సయ్య, ఏసీపీ హరిష్కుమార్లు మీడియాకు వివరాలు వెల్లడించారు. డీడీ కాలనీలో నివాసం ఉండే మంత్రి శ్యామ్‌ను అక్టోబరు 29న కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. దీనిపై శ్యామ్ రెండో భార్య ఫాతిమా పోలీసులకు ఫిర్యాదు చేసింది. కిడ్నాప్ వ్యవహారం ఇలా... శ్యామ్‌కు అమెరికాలో మాధవీలత అనే యువతితో వివాహం, అక్కడే విడాకులు జరిగాయి. వీరి మధ్య ఆస్తి తగాదాలు ఉన్నాయి. ఇద్దరు నగరానికి విచ్చేసి విడివిడిగా ఉంటున్నారు. శ్యామ్ అలీగా పేరు మార్చుకుని ఫాతమా అనే మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు. కాగా ఇటీవల శ్యామ్ బంజారాహిల్స్‌లో తనకు వారసత్వంగా వచి్చన ఆస్తిని సుమారు రూ.20 కోట్లకు విక్రయించాడు. అందులో తనకు వాటా కావాలని మాధవీలత భావించి కిడ్నాప్‌నకు ప్రణాళిక వేసింది. ఈ మేరకు తనకు పరిచయం ఉన్న పటేల్‌నగర్‌కు చెందిన దుర్గావినయ్ను సంప్రదించింది. దుర్గా వినయ్ రామ్‌నగర్‌లో నివసించే స్నేహితుడు కట్టా దుర్గాప్రసాద్ అలియాస్ సాయి సాయంతో కిడ్నాప్‌కు పథకం రచించారు. ఈమేరకు మొదట కూకట్‌పల్లికి చెందిన ప్రీతి, మలక్‌పేటకు చెందిన సరితలను బాధితుడు శ్యామ్ నివసిస్తున్న అపార్ట్మెంట్లోని ఎదురు ఫ్లాట్‌లో అద్దెకు దించి అతని కదలికలపై నిఘా ఏర్పాటు చేశారు. అనంతరం ఈ నెల 29న కిడ్నాప్ చేయాలని నిర్ణయించుకున్నారు. విద్యానగర్‌కు చెందిన కాటమోని పురుషోత్తం, పురానాఫూల్కు చెందిన సందోలు నరే కుమార్, ఆగాపురాకు చెందిన పవన్‌కుమార్, మంగళ్‌హాట్‌కు చెందిన నారాయణ రిషికేష్, పటేల్‌నగర్‌కు చెందిన పిల్లి వినయ్‌లతో కలిసి శ్యామ్‌ను కిడ్నాప్ చేశారు. పోలీసులకు తెలిసిందని... శ్యామ్ కిడ్నాప్‌పై పోలీసులకు ఫిర్యాదు అందిందని తెలిసి నిందితులు మొదట కిడ్నాప్‌నకు వినియోగించిన కారును చర్లపల్లిలో వదిలి వేరే వాహనంలో వెళ్లారు. అనంతరం మొదక్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో తిరిగారు. రూ.30 లక్షలు డిమాండ్ చేయడంతో శ్యామ్ అతని స్నేహితుడు రఘునాథ్‌రెడ్డికి ఫోన్ చేసి డబ్బులు అడగడంతో పాటు కిడ్నాప్ అయినట్లు సమచారం ఇచ్చారు. అప్పటికే పోలీసులు ముమ్మరంగా గాలిస్తుడడంతో కిడ్నాపర్లు విజయవాడకు వెళ్లారు. ఈ విషయాన్ని ఎలా ముగించాలని కిడ్నాపర్లు మాధవీలతను సంప్రదించగా ఆమె సరిగ్గా స్పందించలేదు. దీంతో బాధితుడు తానే డబ్బులు ఇస్తానని కిడ్నాపర్లను నమ్మించి బంజారాహిల్స్‌లోని ఓ బ్యాంకుకు తీసుకువెళ్లాడు. అక్కడ శ్యామ్ కిడ్నాపర్ల నుంచి తప్పించుకుని పోలీసుల చెంతకు చేరి జరిగింది వివరించాడు. దీంతో కిడ్నాపర్లను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వారి వద్ద నుంచి మూడు కార్లు, రెండు ద్విచక్రవాహనాలు, 8 సెల్ఫోన్లను స్వా«దీనం చేసుకున్నారు. -
హుస్సేన్‌సాగర్‌లో దూకి రెండేళ్ల కుమార్తెతో తల్లి ఆత్మహత్య
హైదరాబాద్: కుటుంబ కలహాలతో రెండున్నరేళ్ల కుమార్తెతో కలిసి ఓ తల్లి హుస్సేన్ సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన లేక్‌పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం పాతబస్తీకి చెందిన పృథ్వీ, కార్తీక అగర్వాల్ దంపతులు. పృథ్వీ వ్యాపారి కాగా..కార్తీక అగర్వాల్ చార్టెడ్ అకౌంటెంట్. వీరికి రెండున్నర సంవత్సరాల కుమార్తె బియారా ఉంది. ఏడాది క్రితం భార్యాభర్తల మధ్య కుటుంబ కలహాలు రావడంతో కార్తీక బహుదూర్పురాలోని పుట్టింట్లో ఉంటుంది. ఈ నెల 2వ తేదీన ఉదయం కార్తీక ఎవరికీ చెప్పకుండా తన కుమార్తెతో కలిసి ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయింది. దీనిపై కుటుంబ సభ్యులు బహుదూర్‌పురా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా సోమవారం సాయంత్రం హుస్సేన్‌సాగర్‌లో ఓ మహిళ మృతదేహం తేలడంతో పోలీసులు వెలికితీసి గుర్తు తెలియని మృతదేహంగా కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో విచారణ జరిపి అది కార్తీక అగర్వాల్ మృతదేహంగా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కార్తీక అగర్వాల్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులు గుర్తించి ఆమెతో పాటు రెండున్నరేళ్ల కుమార్తె కూడా ఉందని తెలిపారు. దీంతో పోలీసులు మరోమారు మంగళవారం హుస్సేన్ సాగర్‌లో గాలించగా చిన్నారి మృతదేహం కూడా సాగర్ జలాల్లో కనిపించింది. కేసును బహుదూర్‌పూరా పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేస్తామని లేక్‌పోలీసులు తెలిపారు. కాగా మృతదేహాలను చూసి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. -
Jubilee Hills Bypoll: ముందే ఓటేసిన 97 మంది
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓటింగ్ ఈ నెల 11వ తేదీన జరగనుండగా 97 మంది ఓటర్లు ముందస్తుగానే మంగళవారం తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 85 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు, దివ్యాంగులకు ఇంటి వద్దే ఓటు వేసే సౌకర్యాన్ని కేంద్ర ఎన్నికల సంఘం కల్పించింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా హోం ఓటింగ్‌కు 103 మంది దరఖాస్తు చేసుకోగా, ఈ నెల 4, 6వ తేదీల్లో రెండు విడతలుగా హోం ఓటింగ్ జరిపేందుకు అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. మంగళవారం భారీ పోలీసు బందోబస్తు మధ్య 97 మంది ఓటర్లు ఇంటి వద్దనే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉదయం 7 గంటలకే హోం ఓటింగ్ జరిపే నివాసాల వద్ద పోలింగ్ బూత్ ఎలా ఉండాలో అలాంటి సౌకర్యాలన్నీ కల్పించారు. స్థానిక పోలీసులు బందోబస్తు ఏర్పాటుచేశారు. ఇంటి వద్ద సాయుధ బలగాలను మోహరించారు. నియోజకవర్గ ఎన్నికల అధికారి రజనీకాంత్‌రెడ్డితో పాటు ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులు పర్యవేక్షించారు. మిగతా వారు ఈ నెల 6వ తేదీన హోం ఓటింగ్‌లో పాల్గొననున్నారు. అందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా ఒకే రోజు 97 మంది హోం ఓటింగ్‌లో పాల్గొనడం ఇదే మొదటిసారి. ఇద్దరు ఓటర్ల మృతి.. హోం ఓటింగ్‌లో పాల్గొనేందుకు నియోజకవర్గంలో దరఖాస్తు చేసుకున్న 80 సంవత్సరాల పైబడిన సీనియర్ సిటిజన్స్‌లో ఇద్దరు ఓటింగ్‌కు ముందే మృతి చెందారు. మంగళవారం ఎన్నికల అధికారులు, సిబ్బంది దరఖాస్తు చేసుకున్న వారి ఇళ్లకు వెళ్లగా మూడు రోజుల క్రితం ఒకరు, వారం రోజుల క్రితం మరొకరు మృతి చెందినట్లు వారి కుటుంబ సభ్యులు వెల్లడించారు. హోం ఓటింగ్‌కు దరఖాస్తు చేసుకున్న తర్వాత ఓటింగ్‌లో పాల్గొనకుండానే వీరు మృతి చెందడం పట్ల అధికారులు కూడా కొంత ఆవేదనకు గురయ్యారు. -
ర్యాట్.. ఏపీకే..టేకోవర్!
సాక్షి, హైదరాబాద్: ‘నా ఫోన్ హ్యాక్ అయింది... వాట్సాప్‌ను ఎవరో టేకోవర్ చేశారు... ఫేస్బుక్ క్లోన్ అయింది. నా పేరు, ఫొటోలతో మెసేజ్‌లు పంపి కొందరు కేటుగాళ్లు డబ్బు అడుగుతున్నారు. దయచేసి ఇలాంటి సందేశాలను చూసి ఎవరూ మోసపోవద్దు’అంటూ ఇటీవల కాలంలో ఎంతో మంది సైబర్ క్రైం బాధితులు తమ బంధువులు, స్నేహితులు, సన్నిహితులను కోరుతున్నారు. కొందరి కేసుల్లో కథ ఇక్కడితో ఆగిపోతే మరికొందరు బాధితులు మాత్రం తమ బ్యాంకు ఖాతాలు ఖాళీ కావడంతో ఆర్థికంగా నష్టపోతున్నారు. ఈ తరహా సైబర్ నేరాలు పెరగడానికి సైబర్ హ్యాకర్లు పంపే రిమోట్ యాక్సెస్ ట్రోజన్ (ర్యాట్), ఆండ్రాయిడ్ ప్యాకేజ్ కిట్ (ఏపీకే) ఫైల్స్‌తోపాటు వాట్సాప్ టేకోవర్లే కారణమని సైబర్ క్రైం నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ నేరాల బారినపడకుండా ఉండాలంటే స్మార్ట్ఫోన్ల వినియోగదారులకు పలు జాగ్రత్తలు సూచిస్తున్నారు. యాడ్స్ మాటున ర్యాట్... ఇంటర్నెట్, సోషల్ మీడియాల్లో అనేక యాప్స్‌కు సంబంధించి కనిపించే యాడ్స్‌ను చాలా మంది నెటిజన్లు అవసరం లేకపోయినా స్మార్ట్ఫోన్లలో డౌన్లోడ్ చేసుకుంటున్నారు. దీంతో సైబర్ నేరస్తులు ఈ తరహా యాడ్స్ మాటున పంపుతున్న ఆయుధమే ‘ర్యాట్’. యాప్స్, వీడియోలు, అప్డేట్స్ పేరుతో పంపే లింకుల మాటున ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను పొందుపరుస్తారు. ఎవరైనా ఆ లింక్‌ను క్లిక్ చేస్తే ఆ సాఫ్ట్వేర్ వారి ఫోన్లో డౌన్లోడ్ అయిపోతుంది. ఫలితంగా వినియోగదారుడికి తెలియకుండా, ప్రమేయం లేకుండానే సైబర్ క్రిమినల్ పంపే ట్రోజన్ కూడా అదే మొబైల్ ఫోన్లోకి దిగుమతి అయిపోతుంది. అలా జరిగిన మరుక్షణం నుంచే సైబర్ నేరస్తుల అ«దీనంలోకి వెళ్లిపోతుంది. దీంతో చేతిలో సెల్‌ఫోన్ లేకపోయినా దాన్ని రిమోట్ యాక్సెస్ చేస్తూ కేటుగాళ్లు వారికి అవసరమైన విధంగా వాడగలుగుతున్నారు. అందుకే ఈ వైరస్‌ను రిమోట్ యాక్సెస్ ట్రోజన్ (రాట్) అంటారు. ఓటీపీలను సంగ్రహించడానికీ సైబర్ నేరగాళ్లు ర్యాట్ ఫైల్స్ వాడుతున్నారు. ‘డాట్’పేరుతో స్పాట్... ఇటీవల కాలంలో సైబర్ నేరగాళ్లు తమ పంథా పూర్తిగా మార్చేశారు. డార్క్ వెబ్ నుంచి సేకరించిన ఫోన్ నంబర్ల ఆధారంగా బాధితులను ఎంచుకుంటున్నారు. వారికి ఫోన్లు చేసి క్రెడిట్ కార్డుల ఆఫర్ల పేరిట వలపన్ని ఆసక్తి చూపిన వ్యక్తుల నుంచి చిరునామాలు సేకరిస్తున్నారు. ఈ కార్డుల జారీ కోసం సిమ్ వెరిఫికేషన్ తప్పనిసరి అయినందున టెలికం శాఖ యాప్ లింకును పంపుతున్నామని చెబుతున్నారు. ఇది నిజమేనని నమ్మే బాధితులు వాటిని క్లిక్ చేయగానే రిమోట్ యాక్సెస్ యాప్‌లు సైబర్ క్రిమినల్స్ ఫోన్లలో ఇన్‌స్టల్ అయిపోతున్నాయి. దీంతో బాధితుల బ్యాంకు ఖాతాలకు సంబంధించిన ఇంటర్నెట్ బ్యాంకింగ్ వివరాలు, ఓటీపీలు వారికి వెళ్లడం మొదలవుతోంది. దీంతో నేరగాళ్లు బ్యాంకు ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. ఏపీకే ఫైల్స్తోనూ ఎటాక్స్... ప్రభుత్వ పథకాలు, బ్యాంకు సేవలు, పెట్టుబడుల అవకాశాలు, పెండింగ్ చలాన్లు, రుణాలు, ఆధార్ అప్డేట్ల పేరుతో ఆండ్రాయిడ్ ప్యాకేజ్ కిట్స్ (ఏపీకే) ఫైల్స్ పంపి సైబర్ నేరగాళ్లు బాధితుల బ్యాంకు ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. వాట్సాప్ సహా వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు, నకిలీ వెబ్సైట్ల ఆధారంగా లింకుల రూపంలో సైబర్ నేరగాళ్లు ఈ ఏపీకే ఫైల్స్ పంపుతున్నారు. వాటిని క్లిక్ చేసి ఇన్స్టాల్ చేస్తే ఫోన్లు వారి అ«దీనంలోకి వెళ్లిపోతున్నాయి. ఈ రకంగానూ నేరగాళ్లు వినియోగదారుల బ్యాంకు ఖాతాల లాగిన్లు, ఓటీపీలు, వ్యక్తిగత సమాచారం సహా సున్నిత వివరాలు పొందుతున్నారు. సైబర్ నిపుణులు సూచిస్తున్న జాగ్రత్తలివీ... – అపరిచిత నంబర్ల నుంచి వచ్చే లింక్‌లు క్లిక్ చేయొద్దు. – ఎవరికీ ఓటీపీలు, యాక్టివేషన్ కోడ్లు చెప్పొద్దు. – ప్లే స్టోర్, యాపిల్ స్టోర్ మినహా లింక్‌ల ద్వారా వచ్చే యాప్స్‌ను డౌన్లోడ్ చేయకూడదు. – వాట్సాప్ టోకేవర్ బారినపడకుండా ఉండాలంటే వాట్సాప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి అకౌంట్ ఆప్షన్‌ను ఎంపిక చేసుకొని అందులో టూ–స్టెప్ వెరిఫికేషన్‌ను యాక్టివేట్ చేసుకోవాలి. తద్వారా ఆ నంబర్‌తో కూడిన వాట్సాప్‌ను మరోసారి, మరో ఫోన్లో యాక్టివేట్ చేయాలంటే ఓటీపీతోపాటు యాక్టివేషన్ కోడ్ కూడా అవసరం అవుతుంది. – కొందరు కేటుగాళ్లు మాల్వేర్ను ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్లు రూపంలో పంపిస్తుంటారు. అందువల్ల వాట్సాప్ సెట్టింగ్స్‌లో డౌన్లోడ్ ఆప్షన్‌ను ‘నన్’అని యాక్టివేట్ చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆటో డౌన్లోడ్ ఎంచుకోవద్దు. ఆటో డౌన్లోడ్ ఆప్షన్ ఉంటే వినియోగదారుల ప్రమేయం లేకుండానే ఆ వైరస్ ఫోన్లో ఇన్స్టాల్ అయిపోయే అవకాశం ఉంటుంది. – సైబర్ దాడికి గురైతే వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930కు ఫోన్ చేసి లేదా www.cybercrime.gov.in పోర్టల్‌లోకి లాగిన్ అయి ఫిర్యాదు చేయాలి. ఈ విషయంలో ఎంత ఆలస్యమైతే రికవరీలు అంత తక్కువగా ఉంటాయన్నది మర్చిపోవద్దు. లింక్ క్లిక్ చేస్తే.. ఫోన్ బ్లాక్.. ఖాతా ఖాళీ సికింద్రాబాద్‌కు చెందిన ఓ యువకుడిని (36) డీటీడీసీ కొరియర్ పేరుతో లింక్ పంపి అతని ఖాతా నుంచి రూ. 2.47 లక్షలు కాజేసిన ఉదంతం మంగళవారం వెలుగులోకి వచ్చింది. ఆర్టీఏ కార్యాలయం నుంచి వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్సీ) కోసం వేచి చూస్తున్న యువకుడికి అదే సమయంలో డీటీడీసీ కొరియర్ పేరుతో ఓ మెసేజ్ వచ్చింది. పార్సిల్‌ను డెలివరీ చేయడానికి రెండోసారి చేసిన ప్రయత్నం సైతం విఫలమైందనేది దాని సారాంశం. పూర్తి వివరాల కోసం లింక్ క్లిక్ చేయాలంటూ సైబర్ నేరగాళ్లు వల విసిరారు. ఇది నిజమేనని నమ్మిన బాధితుడు ఆ లింక్ క్లిక్ చేయగానే ఆయన ఫోన్ స్తంభించిపోయింది. కాసేపటికే అతని బ్యాంకు ఖాతా నుంచి రూ. 2.47 లక్షలు మాయమయ్యాయి. -
ఒప్పుకోవడమా? ఒత్తిడి పెంచడమా?
సాక్షి, హైదరాబాద్: ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలను దారికి తేవాలని ప్రభుత్వం భావిస్తుండగా, ఎలాగైనా బకాయిలు రాబట్టుకోవాలనే యోచనలో ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం కూడా ప్రైవేట్ కాలేజీలన్నీ మూతపడ్డాయి. కాలేజీల వద్ద సిబ్బంది ఆందోళనలు కొనసాగాయి. జేఎన్టీయూహెచ్ పరిధిలో జరుగుతున్న ఫార్మసీ మొదటి సంవత్సరం పరీక్షలను ప్రైవేట్ కాలేజీలు నిర్వహించలేదు. ప్రైవేట్ కాలేజీల యాజమాన్య సంఘం (ఫతి) పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తోంది. మరోవైపు ప్రభుత్వం నిఘా వర్గాల ద్వారా సమాచారం తెప్పించుకుంటోంది. ఇంకో వైపు పరిస్థితిపై అధికార యంత్రాంగం చర్చోపచర్చలు చేస్తోంది. ఉప ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఫతి నేతలకు ఫోన్లు వెళ్లాయి. ‘ముందు కాలేజీలు తెరవండి..సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకుందాం’అనే సందేశాలు ఫతి నేతలకు వచ్చాయి. దీపావళిలోగా ఇస్తామన్న రూ.900 కోట్లు ఇవ్వాలని, మిగిలిన బకాయిలు ఎప్పుడిస్తారో జీఓ ద్వారా తెలియజేయాలన్నది యాజమాన్యాల డిమాండ్. ఉన్నతాధికారుల మంతనాలు సీఎస్ రామకృష్ణారావు, విద్యాశాఖ ఉన్నతాధికారులు యోగితారాణా, దేవసేన, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి జూమ్ మీటింగ్ నిర్వహించారు. బంద్‌లో ఏఏ కాలేజీలు పాల్గొన్నాయో ఆరా తీశారు. ఫతిలో కీలకంగా వ్యవహరిస్తున్న నేతల వివరాలు సేకరించారు. అంతకు ముందు ఫతికి చెందిన ఇద్దరు నేతలతో డిప్యూటీ సీఎం ఫోన్ ద్వారా రహస్య మంతనాలు జరిపినట్టు తెలిసింది. బంద్‌కు దూరంగా ఉండే కాలేజీల పట్ల భవిష్యత్‌లో సానుకూలంగా ఉంటామనే సంకేతాలు పంపినట్టు తెలిసింది. ఈ విషయం తెలియగానే ఫతి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఇదిలా ఉంటే..అధికారులు క్షేత్రస్థాయిలో కాలేజీల వ్యవహారాలపై దృష్టి పెట్టారు. ఏ కాలేజీలో ఎలాంటి అవకతవకలున్నాయనే నివేదిక రూపొందించాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించినట్టు తెలిసింది. ముదురుతున్న ఆందోళన ఈ నెల 8వ తేదీన దాదాపు 30 వేల మంది కాలేజీల సిబ్బందితో, 11వ తేదీన లక్షకుపైగా విద్యార్థులతో సభ నిర్వహిస్తామని ఫతి ప్రకటించింది. ఈ రెండు కార్యక్రమాలు హైదరాబాద్‌లో జరుగుతాయని వెల్లడించింది. ఈ నేపథ్యంలో పరిస్థితి హింసాత్మకంగా మారే అవకాశం లేకపోలేదని నిఘా వర్గాలు అంటున్నాయి. ఫతిలో కొంతమంది ప్రభుత్వ అనుకూల ధోరణి ఉన్నా, ఎక్కువ మంది వ్యతిరేక ధోరణితో ఉన్నారు. వీరికి కొన్ని రాజకీయ పార్టీల మద్దతు ఉందనేది నిఘా వర్గాల సమాచారం. దీంతో భారీ సంఖ్యలో సిబ్బంది, విద్యార్థులను రాజధానికి తరలిస్తే అవాంఛనీయ ఘటనలు జరగొచ్చని, ఇది ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీస్తుందని పోలీసు వర్గాలు అంటున్నాయి. ప్రదర్శనలకు అనుమతి నిరాకరించినా, ఆందోళన మరోరూపం దాల్చే వీలుందనే అనుమానం పోలీసు వర్గాల నుంచి వస్తోంది. దీన్ని వాయిదా వేయించేందుకు ప్రభుత్వం సర్వశక్తులూ ఒడ్డుతోంది. ఫతి మాత్రం తమ సత్తా చూపించుకోవడానికి ఇది వేదికగా భావిస్తోంది. రీ ఎంబర్స్‌మెంట్‌పై కమిటీ ఫీజు రీయింబర్స్మెంట్ హేతుబద్ధీకరణ, ఉన్నతవిద్య బలోపేతానికి ప్రభుత్వం కమిటీ వేసింది. గత నెల 28వ తేదీనే ఇందుకు సంబంధించిన జీఓ వచ్చినా, మంగళవారం దీన్ని హడావిడిగా వెలుగులోకి తెచ్చింది. సంక్షేమశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చైర్మన్‌గా ఉండే ఈ కమిటీలో ఆర్థిక, విద్య, ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీ శాఖల కార్యదర్శులతోపాటు, ఉన్నత విద్యా మండలి చైర్మన్, ఎస్సీ డెవలప్మెంట్ విభాగం కమిషనర్, ప్రొఫెసర్ కంచె ఐలయ్య, ప్రొఫెసర్ కోదండరాంను సభ్యులుగా చేర్చారు. ఫతి నుంచి ఎన్.రమేశ్‌బాబు, కేఎస్.రవికుమార్, డాక్టర్ కే.రామదాస్‌కు సభ్యులుగా చోటు కల్పించారు. ట్రస్ట్ బ్యాంకు ద్వారా ఫీజు రీయింబర్స్మెంట్ నిర్వహణ, హేతుబద్ధీకరణ, ఫీజు రీయింబర్స్మెంట్ విధానం, ఉన్నతవిద్యలో నాణ్యత పెంపుపై ఈ కమిటీ చర్చించి మూడు నెలల్లో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని సూచించింది. -
రహదారులు.. రక్తపుటేరులు
సాక్షి, హైదరాబాద్: జాతీయ రహదారులు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా నిర్మితమైన విశాలమైన రోడ్లు ఉన్న చోట అతివేగం.. హైవేలలో ఇరుకైన ప్రాంతాలు.. ప్రమాదకరమైన మలుపులు.. డ్రైవర్ల నిర్లక్ష్యం..ఇతరత్రా కారణాలు వెరసి ప్రమాదం జరిగితే పెద్ద సంఖ్యలో ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. ఇటీవల రహదారులపై జరుగుతున్న ప్రమాదాలను పరిశీలిస్తే ఇదే విషయం స్పష్టమవుతోంది.రాష్ట్ర పరిధిలోని జాతీయ, రాష్ట్ర రహదారుల్లో కొన్నిసార్లు నెత్తురు పారుతోంది. తాజాగా హైదరాబాద్– బీజాపూర్ జాతీయ రహదారిపై మీర్జాగూడలో సోమవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 19 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం..అతడి ప్రాణాలతోపాటు మరో 18 మందిని ప్రాణాలు తీసింది. ఇదే తరహాలో రాష్ట్రంలోని జాతీయ, రాష్ట్ర రహదారుల్లోనూ ప్రమాదాలు పెరిగాయి. జనవరి నుంచి సెప్టెంబర్ వరకు..ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ వరకు తొమ్మిది నెలల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జాతీయ, రాష్ట్ర రహదారుల్లో 7,333 రోడ్డు ప్రమాదాలు జరగగా, 2,702 మంది ప్రాణాలు కోల్పోయారు. 8,118 మంది క్షతగాత్రులయ్యారు. రాష్టవ్యాప్తంగా 6,417 కిలోమీటర్ల పొడవున జాతీయ, రాష్ట్ర రహదారులు ఉన్నాయి. అయితే ప్రతీ కిలోమీటర్‌కు సగటున ఒక్కో రోడ్డు ప్రమాదం జరుగుతున్నట్టు రాష్ట్ర పోలీస్ శాఖలోని రోడ్డు భద్రతా విభాగ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. జాతీయ రహదారులపై ఇరుకైన మలుపులు, ధ్వంసమైన రోడ్లు ఇలా ప్రమాదాలకు అనేక అంశాలు కారణమవుతున్నాయి.వీటికి తోడు డ్రైవర్ల నిర్లక్ష్యం ఎదుటి వారికి యమపాశమవుతోంది. జాతీయ రహదారులపై వెళ్లే భారీ వాహనాల డ్రైవర్లు సైతం కనీస రోడ్డు భద్రత నియమాలు పాటించని పరిస్థితులు ఉంటున్నాయి. హైవేలపై ఓవర్ స్పీడ్, సెల్‌ఫోన్ డ్రైవింగ్, డ్రంకన్ డ్రైవ్, సిగ్నల్ జంపింగ్‌తోపాటు కొన్నిచోట్ల సైన్‌బోర్డులు, స్టాపేజ్ సిగ్నళ్లు, సైడ్ రెయిలింగ్స్ సరిగ్గా లేకపోవడమూ ప్రమాదాలకు కారణంగా రోడ్డు భద్రత నిపుణులు పేర్కొంటున్నారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ప్రత్యేక చర్యలురాష్ట్రంలో ఏటా వివిధ సంఘటనల్లో హత్యలకు గురయ్యేవారి సంఖ్య కన్నా పదిరెట్లు ఎక్కువగా రోడ్డు ప్రమాదాల్లో మరణించే వారి సంఖ్య ఉంటోంది. శాంతిభద్రతల పరిరక్షణతోపాటు రోడ్డు ప్రమాదాల నియంత్రణ అత్యంత ప్రాధాన్యమైన అంశం. ఏదో ఒక వాహన డ్రైవర్ చేసే తప్పుకు ఎంతోమంది అమాయకుల జీవితాలు బలవుతున్నాయి. అందుకే రోడ్డు ప్రమాదాల నియంత్రణను అత్యంత ప్రాధాన్యత అంశంగా పోలీస్‌శాఖ భావిస్తోంది. ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన కలి్పంచేందుకు ‘అరైవ్..అలైవ్’పేరిట రాష్ట్ర వ్యాప్త ప్రచార కార్యక్రమం వచ్చే డిసెంబర్ నెలలో 15 రోజులపాటు నిర్వహించనున్నాం. – సాక్షి’తో డీజీపీ శివధర్‌రెడ్డి -
కోలుకుంటున్న క్షతగాత్రులు
సాక్షి, రంగారెడ్డి జిల్లా/ చేవెళ్ల/మొయినాబాద్: మీర్జాగూడ వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు కోలుకుంటున్నారు. స్వల్ప గాయాలతో వికారాబాద్, చేవెళ్ల ఆస్పత్రుల్లో చేరిన 27 మందిలో ఇప్పటికే ఆరుగురు డిశ్చార్జ్ కాగా, మంగళవారం మరో ఐదుగురు ఇళ్లకు వెళ్లిపోయారు. ప్రస్తు తం ఉస్మానియా ఆస్పత్రిలో ఆరుగురు, పీఎంఆర్‌లో 12 మంది, వికారాబాద్‌లో ఒకరు, నిమ్స్‌లో ఇద్దరు, మెడ్లైఫ్లో ఒకరు చికిత్స పొందుతున్నారు. స్వల్ప గాయాలతో చేవెళ్ల పీఎంఆర్ ఆస్పత్రిలో చేరిన ఎండీ యోనస్, జె.జగదీశ్‌తోపాటు వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో చేరిన బి.ప్రవీణ, సయ్యద్ తహ్రా, సయ్యద్ ఖాతిజలు కోలుకోవడంతో ఆస్పత్రి నుంచి ఇంటికి పంపారు.మెరుగైన వైద్యం కోసం ఉస్మానియాకు.. తలకు తీవ్ర గాయాలైన సయ్యద్ అస్మాను మెరుగైన చికిత్స కోసం ఉస్మానియాకు తరలించారు. షేక్ తస్లీమా, సయ్యద్ అబ్దుల్లా, సయ్యద్ ఖాజావలి, సయ్యద్ షఫీలను కూడా ఉస్మానియాకు పంపారు. ప్రస్తుతం వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో మోహిని స్వప్న మాత్రమే చికిత్స పొందుతోంది. పీఎంఆర్ ఆస్పత్రిలో 12 మందికి చికిత్స అందిస్తున్నారు. సుజాత, నందినికి నిమ్స్‌లో చికిత్స చేశారు. టిప్పర్ యజమాని లక్ష్మణ్‌నాయక్ బండ్లగూడ జాగీర్‌లోని మెడ్‌లైఫ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. శకలాలే ఆనవాళ్లు.. ఘోర ప్రమాదంతో భీతావహంగా మారిన మీర్జాగూడ మంగళవారం నిశ్శబ్దంగా కనిపించింది. కంకర లోడుతో వచ్చిన టిప్పర్ ఆర్టీసీ బస్సును ఢీకొట్టడంతో 19 మంది మరణించగా, 27 మంది గాయపడిన విషయం తెలిసిందే. సోమ వారం శవాల దిబ్బలు, క్షతగాత్రుల ఆర్తనాదాలు, బంధువుల రోదనలతో కంపించిన ఈ ప్రాంతం సాధారణంగా మారిపోయింది. ఆ మార్గంలో వెళ్లేవాళ్లు ప్రమాద స్థలాన్ని ఆసక్తిగా, ఒకింత భయంగా పరిశీలిస్తూ ఘటనపై చర్చించుకున్నారు. రోడ్డు పక్కన కంకర దిబ్బలు, వాహనాల శకలాలు ప్రమాదానికి ఆనవాళ్లుగా మిగిలాయి. టిప్పర్, బస్సును చేవెళ్ల పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నిద్ర వస్తుంటే మధ్యలో చాయ్ తాగాం ఏడాది క్రితమే టిప్పర్ కొనుగోలు చేశాను. అప్పటికే నాతో కలిసి పనిచేసిన మహారాష్ట్రకు చెందిన ఆకాశ్కాంబ్లేను డ్రైవర్‌గా నియమించుకున్నా. ఆదివారం రాత్రి లక్డారం సమీపంలోని క్వారీలో కంకర లోడ్ చేయించాం. సోమవారం తెల్లవారుజాము వరకు నేనే టిప్పర్ నడిపాను. రాత్రంతా డ్రైవింగ్ చేయడం వల్ల నిద్ర వస్తుంటే మధ్యలో ఓ హోటల్ వద్ద ఆపి ఇద్దరం చాయ్ తాగాం. అప్పటి వరకు నా చేతిలో ఉన్న స్టీరింగ్‌ను ఆకాశ్ కాంబ్లే తీసుకున్నాడు. గమ్యస్థానానికి మరికొద్ది నిమిషాల్లో చేరుకుంటామనగా ఈ దుర్ఘటన జరిగింది. ఆ సమయంలో ఏం జరిగిందో నాకు అర్థం కాలేదు. టిప్పర్‌లోనే స్పృహ తప్పిపోయాను. పోలీసులు నన్ను బయటికి తీసి వికారాబాద్ ఆస్పత్రికి తరలించారు. నేను కానీ, ఆకాశ్ కాంబ్లే కానీ మద్యం సేవించలేదు. – లక్ష్మణ్ నాయక్, టిప్పర్ యజమానిప్రాణం పోవడం ఖాయమనుకున్నా నిమ్స్‌లో చికిత్స పొందుతున్న జయసుధ లక్డీకాపూల్/ధారూరు: ‘బస్సులో కంకరలో కూరుకుపోయి ప్రాణాలపై ఆశ వదులుకున్నా.. సీటు దొరక్కపోవడంతో కండక్టర్‌తో మాట్లాతుండగా టిప్పర్ ఢీకొట్టింది.. క్షణాల్లో అంతా జరిగిపోయింది. నా ప్రాణం పోవడం ఖాయమనుకున్నా. బస్సు మొత్తం కంకరతో నిండిపోయింది. చేతుల వరకు కూరుకుపోయా, కాపాడాలని మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయింది. చివరకు ఒకరి వద్ద ఫోన్ అడుక్కొని తమ్ముడికి కాల్ చేశా. గంటలోపు తమ్ముడు, భర్త వచ్చారు. అప్పటి వరకు అలాగే ఉన్నా. నా ఎడమ కాలుపై ఇద్దరు పడ్డారు. కుడి కాలు బస్సు సీటులో ఇరుక్కుపోయి విరిగిపోయింది.నా కాలుపై పడిన ఇద్దరు ఎప్పుడో చనిపోయారు. భర్త, తమ్ముడు రాగానే చేతులతో కంకర తీయడం మొదలుపెట్టారు. వాళ్ల చేతులు రక్తమయంగా మారాయి. చివరకు బయటపడ్డా’అని ధారూరు మండలం కేరెళ్లికి చెందిన జయసుధ తెలిపారు. చేవెళ్లలోని గురుకుల పాఠశాలలో పార్ట్‌టైమ్ టీచర్‌గా పనిచేస్తూ రోజూ గ్రామం నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. మీర్జాగూడ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో గాయపడింది. ఎడమ కాలు పక్క ఎముకలు విరిగ్గా, కుడి కాలుకు కూడా గాయాలయ్యాయి. జయసుధ కాలుకు శస్త్ర చికిత్స చేశారు. ప్రస్తుతం ఆమె నిమ్స్ చికిత్స పొందుతున్నారు. -
Chevella tragedy: తడి ఆరని కళ్లు
పెద్దమ్మ కొడుకు పెళ్లికి వస్తే ముగ్గురికి చీరలు కట్టి వాళ్లమ్మ మురిసిపోయింది. ముద్దుగా తయారైండ్రు.. ఎవరి దిష్టి తగిలిందో నా బిడ్డలకు.. మమ్ములను దిక్కులేనోళ్లను చేసి వెళ్లిపోయిండ్రు. రెండు నెలల్ల ఇద్దరం జాబ్ చేస్తం.. వచ్చి నిన్ను అమ్మను హైదరాబాద్ తీస్కపోతాం నాయినా అంటూ చెప్పి బస్సెక్కిండ్రు. ఇట్ల నన్ను పూర్తిగా ఇడిసిబెట్టి పోతరనుకోలేదు.. – ఎల్లయ్యగౌడ్ వికారాబాద్: ‘అయ్యో పాపం ఎల్లయ్యా.. నీకు నలుగురూ బిడ్డలేనా అని చాలామంది మాట్లాడినా ఎన్నడూ బాధ కాలేదు. నా నలుగురు కూతుళ్లు ‘నిన్ను నలుగురిలో దర్జాగా నిలబెడతాం... నిన్ను గెలిపిస్తాం నాయనా’ అని నాకు కొండంత ధైర్యం చెప్పేవారు. ఒక బిడ్డకు పెళ్లి చేసి, అత్తగారింటికి పంపి నెలకూడా కాకుండానే మిగతా ముగ్గురు బిడ్డలను దేవుడు తీస్కపోయిండు’ అంటూ అంబిక–ఎల్లయ్యగౌడ్ దంపతులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. చెట్టంత బిడ్డలను పోగొట్టుకున్న వీరి బాధ వర్ణనాతీతం.సోమవారం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల (Chevella) మండలం మీర్జాగూడ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో వికారాబాద్ జిల్లా యాలాల మండల పరిధిలోని పెర్కంపల్లికి చెందిన తనూష, సాయిప్రియ, నందిని మృతి చెందిన విషయం తెలిసిందే. మంగళవారం ‘సాక్షి’ఎల్లయ్యగౌడ్ను కలిసి పరామర్శించే ప్రయత్నం చేయగా, కూతుళ్ల గురించి విలపిస్తూ చెప్పిన జ్ఞాపకాలు ఆయన మాటల్లోనే... ‘సదువులో ఎప్పుడూ ముందుండేవారు. వారు బాగా సదివి నాకు ఫీజులు తగ్గించేవారు.. అందరూ రెకమండేషన్లు అంటూ నాయకుల చుట్టూ తిరిగి ఫీజులు తగ్గించుకుంటే, నా బిడ్డలు బాగా సదివి క్లాస్ ఫస్ట్ వచ్చేవారు.. మా నాయన డ్రైవింగ్ చేస్తాడు.. మేము బాగా సదువుతున్నాంగా.. ఫీజు తగ్గించండని సార్లను అడిగి తక్కువ చేయించేవారు. ఇంటర్ సదివేటప్పుడే యోగా నేర్చుకొని, అంతా యోగా టీచర్లు అయ్యారు.. వాళ్లే వేరే వాళ్లకు నేర్పించెటోళ్లు. కూతుళ్లను సదివించటానికే ఊర్లోనుంచి తాండూరు టౌన్‌కు వచ్చేశా. ఇప్పుడు వాళ్లే లేకపోతే నాకు దిక్కెవరు. జిల్లేడు చెట్టుకు పెళ్లి చేస్తా అనుకోలేదు బిడ్డా..నా బిడ్డలు బాగా సదివి నన్ను నలుగుట్లో గొప్పగా నిలబెడతమన్నారు. కానీ ఇట్ల మమ్ములనే ఒంటరోళ్లను చేసి పోతారనుకోలేదు. బాగా సదివించి కొలువులు చేస్తుంటే.. శాతనైనంతలో గొప్పగా పెళ్లిళ్లు చేసి అత్తగారింటికి సాగనంపుతాననుకున్నా. కానీ ఇట్ల జిల్లెడు చెట్టుకు పెళ్లిళ్లు చేసి ముగ్గురిని ఒకేసారి పాడెగట్టి సాగనంపుతానను కోలేదు. మొన్న పెద్దమ్మ కొడుకు పెళ్లికి వస్తే ముగ్గురికి చీరలు కట్టి వాళ్లమ్మ మురిసిపోయింది. ముద్దుగా తయారైండ్రు.. ఎవరి దిష్టి తగిలిందో నా బిడ్డలకు ..మమ్ములను దిక్కులేనోళ్లను చేసి వెళ్లిపోయిండ్రు.పదోతరగతి, ఇంటర్లో ఒచ్చిన మార్కులు చూసి.. సదువులో నా బిడ్డెల ఉశారు సూసి కోఠి ఉమెన్స్ కాలేజీలో మేడం ఫ్రీ సీటు ఇచ్చింది. నేను మంచి అంగి తొడుక్కోకపోయినా నా చిన్నబిడ్డ ఒప్పుకునేది కాదు.. మంచి అంగి తొడిగి తలదువ్వి నొసటికి బొట్టుపెట్టి భుజంపై తట్టేది. చెప్పులు పాతగ అయితే వాళ్లకు ఇచ్చిన ఖర్చుల్లోకి మిగలవట్టి కొత్త చెప్పులు తెచ్చెటోళ్లు.. డ్రైవింగ్ చేయడానికి పోతే చాయ్ బిస్కెట్ కూడా తాగెటోన్ని కాదు.పది రూపాయలు ఉంటే నా బిడ్డలకు పెన్ను కొనివ్వచ్చు. 20 రూపాయలు ఉంటే నోటు బుక్కు వస్తదికదా అనుకునే వాన్ని. వాళ్లు హైదరాబాద్‌లో ఉన్నా, కూడా రోజు మూడుసార్లు ఫోన్ చేసేవారు..తిన్నావా? టీ.తాగినవా నాయిన ఇంటికి పోయినవా.. తొందరగా ఇంటికిపో అంటూ గుర్తు చేస్తుండ్రి.. రెండు నెలల్ల ఇద్దరం జాబ్ చేస్తం.. వచ్చి నిన్ను అమ్మను హైదరాబాద్ (Hyderabad) తీస్కపోతాం నాయినా అంటూ చెప్పి బస్సెక్కిండ్రు. ఇట్ల నన్ను పూర్తిగా ఇడిసిబెట్టి పోతరనుకోలేదు.. ముగ్గురు బిడ్డలు ఎప్పు డూ ఒకేసారి బస్సుల పోలేదు. సాయిప్రియ రైల్లో పోతే ఇద్దరు బిడ్డలు బస్సుల పోతుండ్రి.. ఇప్పుడే ఇట్ల ముగ్గురు ఒకే బస్సుల పోయిండ్రు.. తిరిగి రాలేదు. నా ధైర్యం మొ త్తం వాల్లే.. ఇప్పుడు వాళ్లే లేకపోతే ఎట్లుండాల్నో ఏమి అర్థం అయితలేదు’అంటూ ఎల్లయ్యగౌడ్ కన్నీరు మున్నీరయ్యాడు. -
పులుల్ని లెక్కిద్దాం రండి!
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత పులుల లెక్కింపు–2026 కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆసక్తిగల వలంటీర్ల నుంచి రాష్ట్ర అటవీశాఖ దరఖాస్తులు కోరుతోంది. దరఖాస్తుల నమోదును మంగళవారం నుంచి ప్రారంభించారు. ఈ కార్యక్రమం ఈనెల 22 వరకు కొనసాగనుంది. వచ్చే ఏడాది జనవరి 17–23 తేదీల మధ్య రాష్ట్రవ్యాప్తంగా 3 వేలకు పైగా అటవీ బీట్లలో దీనిని చేపట్టేందుకు.. ఈ రంగంలో కృషి చేస్తున్న స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, జంతు ప్రేమికులు, సామాన్యులకు వలంటీర్లుగా అవకాశం కల్పించనున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద వన్యప్రాణి మానిటరింగ్ ప్రోగ్రామ్‌గా పేరుగాంచిన ఈ లెక్కింపును (అఖిల భారత పులుల లెక్కింపు) డెహ్రాడూన్ వైల్డ్‌లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, నేషనల్ టైగర్ కన్సర్వేషన్ అథారిటీ (ఎన్టీసీఏ) సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకునే వారు https://tinyurl. com/ aite2026tg లో సైనప్ చేయడంతోపాటు ఏవైనా ప్రశ్నలుంటే 18004255364 నంబర్‌కు, వాట్సాప్‌లో 9803338666 లేదా ఈ–మెయిల్ aite2026tg@gmail.com ద్వారా సంప్రదించవచ్చునని పీసీసీఎఫ్ (వైల్డ్‌లైఫ్) ఏలూసింగ్ మేరు ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణలో సుమారు 26వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం గల 3వేలకు పైగా బీట్ల నుంచి సమాచారం సేకరించనున్నట్టు తెలిపారు. పులుల లెక్కింపు ఇలా.. ప్రతి వలంటీర్ అటవీ సిబ్బందితో కలిసి 7 రోజులపాటు అడవిలో నడుస్తారు. రోజుకు 10–15 కిలోమీటర్ల దూరం నడుస్తూ అడవుల్లో పులుల జాడలు, అడుగుల ముద్రలు, మల చిహా్నలు, నివాస నాణ్యత వంటి వివరాలను సేకరిస్తారు.వలంటీర్ల అర్హతలు వయసు: 18–60 ఏళ్లు శారీరక సామర్థ్యం: రోజుకు 10–12 కిలోమీటర్ల వరకు అడవుల్లో నడిచే సామర్థ్యం అనుకూలత: తక్కువ సౌకర్యాలతో దూరప్రాంత క్యాంపుల్లో ఉండగల సామర్థ్యం ఇది పూర్తిగా స్వచ్ఛంద కార్యక్రమం. ఎలాంటి పారితోషికం ఇవ్వరు. వసతి, ఫీల్డ్ రవాణా సదుపాయం అటవీ శాఖ కల్పిస్తుంది. -
ఇవి హైదరాబాద్ రక్షణకు సంబంధించిన ఎన్నికలు
వెంగళరావునగర్ : త్వరలో జరగనున్న ఉపఎన్నిక జూబ్లీహిల్స్‌కు మాత్రమే కాకుండా హైదరాబాద్ రక్షణకు సంబంధించిన ఎన్నికలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం రాత్రి వెంగళరావునగర్ డివిజన్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన రోడ్‌షోలలో కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. ఆయా ప్రాంతాల్లో ఓపెన్‌టాప్ జీపుపై పర్యటిస్తూ పలు ప్రాంతాల్లో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. పదేళ్ల వరకు బీఆర్ఎస్ అధికారంలో ఉండగా, మజ్లిస్ పార్టీ మద్దతు పలికిందని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అదే దారిలో నడుస్తుందని చెప్పారు. ఇక్కడ ఎవరికి మంత్రి పదవి ఇవ్వాలన్నా, టికెట్ ఇవ్వాలన్నా దారుసలాంలో నిర్ణయం అవుతుందని, ఈ పరిస్థితి మన హైదరాబాద్‌కు, తెలంగాణకు అవసరమా ఆలోచించండన్నారు. నాడు ఇందిరాగాంధీ తెలంగాణ ఉద్యమాన్ని అణచివేసిందని తెలిపారు. సలావుద్దీన్ ఒవైసీ ఉన్న నాటి నుంచి ఇక్కడ మజ్లిస్ పార్టీ పెత్తనం చేసిందన్నారు. ఒకనాడు పాతబస్తీలో హిందువుల బస్తీలు కోకొల్లలుగా ఉండేవని, అయితే మజ్లిస్ పార్టీ వారిని బెదిరించి, దాడులు చేసి, మత కల్లోలాలు చేసి అక్కడ నుంచి పంపించి వేసిందని విమర్శించారు. ఖాళీ చేయని బస్తీల్లో దాడులు చేసి 300 మందిని హత్య చేసిన ఘనత మజ్లిస్ పార్టీకే ఉందన్నారు. అలాంటి మజ్లిస్ పార్టీకి మద్దతు పలకడానికి బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు నేడు పోటీ పడుతున్నాయని చెప్పారు. కేటీఆర్, రేవంత్‌లు మజ్లిస్ పార్టీ ఒకే కుటుంబానికి చెందిన పార్టీలని, వాటికి బుద్ధి చెప్పాలన్నారు. 2014లో మజ్లిస్ పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థికి నేడు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచి్చందని, ఈ చేతి గుర్తు వెనుక పతంగి గుర్తు ఉందని పేర్కొన్నారు. ఇక్కడ అభ్యర్థులు లేకపోవడంతో మజ్లిస్ పార్టీ వ్యక్తిని తీసుకొచ్చి కాంగ్రెస్ తరఫున నిలబెట్టిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం బంజారాహిల్స్‌లో పెద్దమ్మ గుడిని ధ్వంసం చేసిందని, మోహిదీపట్నం, ఎర్రగడ్డ ప్రాంతాల్లో ఒక వర్గం కోసం ఖబరస్తాన్కు స్థలాలు కేటాయించిందని, ఇది కేవలం మసీదు రాజకీయాల కోసమేనన్నారు. ఇది గూండాల పార్టీ, రౌడీల పార్టీ అని, ఇది ముస్లింలకు అండగా ఉండదని, గొడవలు మాత్రమే రేపుతుందని చెప్పారు. నిన్నటి వరకు బీఆర్ఎస్ను భుజాన వేసుకున్న మజ్లిస్ పార్టీకి ఇప్పుడు రేవంత్ ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడని ప్రశ్నించారు. ఈ రెండు పార్టీలు చీకటి ఒప్పందాన్ని చేసుకున్నాయని, అందుకే ఇక్కడ హిందువులంతా ఐక్యతగా ఉండాలని కోరారు. హైదరాబాద్‌లో, రాష్ట్రంలో మార్పు రావాలంటే ఈ రెండు పార్టీలకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ అంతుచూస్తామని, భూస్థాపితం చేస్తామని హెచ్చరించారు. జూబ్లీహిల్స్ అభివృద్ధి చెందాలంటే ప్రజలతో ఎల్లప్పుడూ ఉండే బీజేపీ అభ్యర్థి దీపక్‌రెడ్డిని గెలిపించాలని, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలను బొంద పెట్టాలన్నారు. ఈ రోడ్‌షోలో నిజామాబాద్ ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్తా, మాజీ ఎమ్మెల్యే లక్ష్మయ్య, బీజేపీ అభ్యర్థి లంకెల దీపక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పత్తి కొను‘గోలగోల’
సాక్షి, హైదరాబాద్: సీసీఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండి యా) రకరకాల నిబంధనల నేపథ్యంలో రాష్ట్రంలో పత్తి కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి. జిన్నింగ్ మిల్లులను నోటిఫై చేసి గత నెల 21 నుంచే కొనుగోళ్లు ప్రారంభిస్తున్న ట్టు సీసీఐ ప్రకటించినా, ఇప్పటి వరకు కేవలం 10,434 మెట్రిక్ టన్నుల పత్తిని మాత్రమే సేకరించింది. ఈ సీజన్లో రాష్ట్రంలో సుమారు 46 లక్షల ఎకరాల్లో సుమారు 25 లక్షల మంది రైతులు పత్తి సాగు చేయగా, 29 లక్షల మెట్రిక్ టన్ను ల పత్తి ఉత్పత్తి అవుతుందని మార్కెటింగ్ శాఖ అంచనా వేసింది. సీసీఐ తీసుకొచ్చిన కపాస్ కిసాన్ యాప్‌లో ఇప్పటి వరకు 22,587 మంది రైతులు స్లాట్ బుక్ చేసుకున్నారు. తెరుచుకున్న జిన్నింగ్ మిల్లులు 172 మాత్రమే 320 జిన్నింగ్ మిల్లులను రాష్ట్ర ప్రభుత్వం పత్తి కొనుగోళ్లకు నోటిఫై చేసింది. అయితే జిన్నింగ్ మిల్లుల సామర్థ్యం, పత్తి నుంచి దూదిని, గింజలను వేరు చేసి ఇచ్చినందుకు సీసీఐ చెల్లించే మొత్తాన్ని పరిగణనలోకి తీసుకొని మిల్లులను ఎల్–1, ఎల్–2 తరహాలో ఎల్–12 వరకు విభజించారు. ఇందులో ఎల్–1 కేటగిరీలో గుర్తించిన మిల్లుల్లో తొలుత పత్తి సేకరించిన తర్వాతే ఎల్–2, ఆ తర్వాత ఎల్–3 మిల్లులకు పత్తిని పంపించేలా సీసీఐ నిబంధనలు విధించింది. ముడి పత్తిని మిల్లుకు తీసుకొచ్చిన తర్వాత జిన్నింగ్ చేసి బేల్స్గా, విత్తనాలుగా వేరు చేస్తారు. ఒక బేల్ పత్తి (దూది) కోసం సుమారు 485 కిలోల పత్తికాయలను జిన్నింగ్ చేయాల్సి ఉంటుంది. 485 కిలోల పత్తికాయలను జిన్నింగ్ చేసినందుకు మిల్లులకు సీసీఐ రూ.1,440 చెల్లిస్తుంది. కాగా ప్రస్తుతం 172 మిల్లులు మాత్రమే తెరుచుకోగా, కేవలం ఎల్–1 కింద 117 మిల్లుల్లో మాత్రమే కొనుగోళ్లు సాగే పరిస్థితి ఏర్పడింది. రైతులు గతంలో తమకు దగ్గరలో ఉన్న జిన్నింగ్ మిల్లుకు వెళ్లి పత్తిని విక్రయించుకునే పరిస్థితి ఉండగా, ఈసారి ఆ పరిస్థితి లేదు. కపాస్ కిసాన్ యాప్‌లో సీసీఐ ఆయా జిల్లాల్లోని ఎల్–1 కేటగిరీలో ఉన్న మిల్లుల జాబితాను మాత్రమే పొందుపరచడంతో రైతులు దూరమైనా, అక్కడికే పత్తిని తరలించాల్సి వస్తోంది. ఒకటి, రెండు ఎకరాల చిన్న చిన్న కమతాలు ఉండే రైతులు రవాణా ఖర్చులు భరించి దూరానికి వెళ్లి పత్తి విక్రయించడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆంక్షలపై మిల్లర్ల అల్టిమేటం కపాస్ కిసాన్ యాప్‌లో రైతుల రిజి్రస్టేషన్ తప్పనిసరి చేసిన సీసీఐ... 8 నుంచి 12 శాతం లోపు తేమ ఉంటేనే పత్తికి మద్దతు ధర రూ. 8,110 ఇచ్చేలా నిబంధనలు విధించింది. ఒక రైతు ఎకరాకు 7 క్వింటాళ్ల పత్తిని మాత్రమే మద్దతు ధరకు అమ్మేలా నిబంధనలు మార్చారు. ఎల్–1, ఎల్–2 ఇలా మిల్లులకు పత్తి పంపేలా నిబంధనలు మార్చడాన్ని మిల్లర్లు ఒప్పుకోవడం లేదు. ఈ పరిస్థితుల్లో నిబంధనలను సడలించి, మొత్తం మిల్లుల్లో పత్తి జిన్నింగ్ అయ్యేలా చర్యలు తీసుకోకపోతే ఈనెల 6వ తేదీ నుంచి పత్తి సేకరణ నిలిపివేస్తామని జిన్నింగ్ మిల్లర్ల సంఘం అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి అల్టిమేటం ఇచ్చారు. -
టీవీ5 మూర్తిపై కేసు
సాక్షి, హైదరాబాద్: శ్రేయా బ్రాడ్‌కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (టీవీ–5) సీఈవో డీహెచ్వీఎస్ఎస్ఎన్ మూర్తి తన ఫోన్‌ను ట్యాపింగ్ చేస్తూ రూ. 10 కోట్లు డిమాండ్ చేస్తున్నారని వర్దమాన సినీనటుడు కాకాని ధర్మ సత్యసాయి శ్రీనివాస మహేశ్ తీవ్ర ఆరోపణలు చేశారు. లేకపోతే ప్రైవేటు వీడియోలు బయటపెడతానని వేధింపులకు గురిచేస్తున్నారని.. ఈ అంశంపై సిట్ ఏర్పాటు చేసి విచారణ చేపట్టేలా పోలీసులను ఆదేశించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్... పిటిషనర్ తగిన సాక్ష్యాధారాలు సమర్పిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. హైకోర్టు ఆదేశాలతో మహేశ్ ఫిర్యాదును, ఆయన సమరి్పంచిన సాక్ష్యాధారాలను పరిశీలించిన పోలీసులు.. మూర్తితోపాటు మహేశ్ భార్య గౌతమిపై బీఎన్ఎస్లోని సెక్షన్ 308 (3), ఐటీ యాక్ట్‌లోని సెక్షన్ 72 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎఫ్ఐఆర్లోని వివరాల ప్రకారం..: మహేశ్ ఫోన్‌ను మూర్తి చట్టవిరుద్ధంగా ట్యాప్ చేస్తున్నారు. ఆయన ప్రైవేట్ సంభాషణల్ని సైతం రికార్డు చేసి టీవీ5లో ప్రసారం చేస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 25న చిరుమామిళ్ల గౌతమి, మూర్తి కలిసి మహేశ్, ఆయన తండ్రికి మధ్య జరిగిన ఫోన్ సంభాషణను రికార్డు చేసి టీవీ5 చానల్లో ప్రసారం చేశారు. ఈ చట్టవిరుద్ధ ప్రసారం ద్వారా మహేశ్ వ్యక్తిగత గోప్యతను దెబ్బతీశారు. ఆయనతోపాటు ఆయన కుటుంబాన్నీ అవమానించడంతోపాటు మానసిక వేదనకు గురి చేసి ప్రతిష్టకు భంగం కలిగేలా వ్యవహరించారు. ఆ తర్వాత కూడా మూర్తి మహేశ్‌కు సంబంధించిన ప్రైవేట్ వీడియోలను స్పై కెమెరాలతో రికార్డు చేశారు. వాటిని అడ్డం పెట్టుకుని గౌతమి, మూర్తి రూ. 10 కోట్లు ఇవ్వాలని లేదా మహేశ్ వ్యాపార సంస్థ గిస్మత్ అరబిక్ మండిలో యాజమాన్య హక్కులను ఇవ్వాలని డిమాండ్ చేశారు. డబ్బు చెల్లించకపోతే ఫోన్ రికార్డింగ్‌లు, ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పెడతానని, టీవీ5లో ప్రసారం చేస్తామని మహేశ్‌ను బెదిరించారు. -
ఆల్మట్టి, బనకచర్లపై సుప్రీంకు..
సాక్షి, హైదరాబాద్: పోలవరం–బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుతోపాటు ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంపునకు పొరుగు రాష్ట్రాలు చేస్తున్న ప్రయత్నాలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో కేసులు వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తమ అభ్యంతరాలను పట్టించుకోకుండా ఏపీ ప్రభుత్వం పోలవరం–బనకచర్ల ప్రాజెక్టు డీపీఆర్ తయారీకి టెండర్లు ఆహ్వానించడాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభు త్వం ఇప్పటికే కేంద్ర జలశక్తి శాఖతోపాటు కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేసింది. కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) మార్గదర్శకాల ప్రకారం ప్రాజెక్టు డీపీఆర్ తయారీతోపాటు అవసరమైన పరిశోధనలు, కేంద్ర అనుమతులకు సహకారం కోరుతూ ఏపీ జలవనరుల శాఖ గత నెల 7న టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. పోలవరం నుంచి బనకచర్లకు 200 టీఎంసీల గోదావరి జలాలను తరలించే ప్రాజెక్టుకు అనుమతి కోసం సీడబ్ల్యూసీకి గత మే 22న పీఎఫ్ఆర్ (ప్రీ ఫీజబులిటీ రిపోర్టు)ను ఏపీ సమర్పించింది. దీనిపై సీడబ్ల్యూసీ అభిప్రాయాలను కోరింది. తెలంగాణ సహా బేసిన్ పరిధిలోని ఇతర రాష్ట్రాలు, గోదావరి, కృష్ణా బోర్డు, పోలవరం ప్రాజెక్టు అథా రిటీ (పీపీఏ)తోపాటు సీడబ్ల్యూసీ ఈ ప్రతిపాదనలపై తీవ్ర అభ్యంతరం తెలిపాయి. ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతి కోసం దరఖాస్తు చేయడానికి నిర్వహించాల్సిన పర్యావరణ ప్రభావ మదింపు (ఈఐఏ)కు నియమ, నిబంధనలు (టీవోఆర్) జారీ చేయాలని ఏపీ చేసుకున్న దరఖాస్తును కేంద్ర అటవీ, పర్యావరణ శాఖలోని నిపుణుల మదింపు కమిటీ (ఈఏసీ) జూన్ 30న తోసిపుచ్చింది. గోదావరిలో వరద జలాల లభ్యత.. అంతర్రాష్ట్ర అనుమతి తీసుకున్నాకే టీవోఆర్ కోసం దరఖాస్తు చేసు కోవాలని స్పష్టం చేసింది. అయినా ప్రాజెక్టు డీపీఆర్ రూపకల్పన విషయంలో ఏపీ ముందుకు వెళ్లడం.. ఆ రాష్ట్రాన్ని అడ్డుకోవడానికి కేంద్రం చర్యలు తీసుకోకపోవడంతో సుప్రీంకోర్టుకెక్కాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆల్మట్టిపై కర్ణాటక ఎత్తులు ఆల్మట్టి డ్యామ్‌లో 524.256 మీటర్ల ఎత్తులో నీటిని నిల్వ చేసేలా పనులను 2002 నాటికే కర్ణాటక సర్కార్ పూర్తి చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో 2002–03 నుంచి 519.06 మీటర్ల ఎత్తులో 129.72 టీఎంసీల మేరకే నీటిని నిల్వ చేస్తోంది. డ్యామ్ ఎత్తు పెంపు పనులు పూర్తి చేశామని.. నీటి కేటాయింపులు చేయకపోతే ఆ పనులకు చేసిన వ్యయం వృథా అవుతుందని బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ ఎదుట కర్ణాటక సర్కార్ వాదించింది. నిధులు వృథా అవుతాయన్న వాదనతో ఏకీభవించిన ట్రిబ్యునల్.. అప్పర్ కృష్ణా ప్రాజెక్టుకు బచావత్ ట్రిబ్యునల్ 75 శాతం లభ్యతగా కేటాయించిన 173 టీఎంసీల జోలికి వెళ్లకుండా 65 శాతం లభ్యత ఆధారంగా అదనంగా 130 టీఎంసీలను కేటాయించింది. ఈ క్రమంలో ఆల్మట్టి డ్యామ్ లో 524.256 మీటర్ల ఎత్తులో నీటిని నిల్వ చేసుకోవడానికి అనుమతిస్తూ 2013 నవంబర్ 29న కేంద్రానికి తుది నివేదిక ఇచ్చింది.ట్రిబ్యునల్ తుది నివేదికను సవాల్ చేస్తూ ఉమ్మడి ఏపీ, మహారాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ వేయగా దాని అమలును నిలుపుదల చేయాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రస్తుతం ఆ ఎస్ఎల్పీలపై సుప్రీంకోర్టు విచారణ చేస్తుండటంతో ట్రిబ్యునల్ తుది నివేదికను అమలు చేస్తూ కేంద్రం గెజిట్ నోటి ఫికేషన్ జారీ చేయలేదు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ సైతం ఈ కేసులో ప్రతివాదిగా చేరింది. మరోవైపు డ్యామ్‌లో 524.256 మీటర్ల ఎత్తు వరకు నీళ్లు నిల్వ చేస్తే ముంపునకు గురయ్యే 20 గ్రామాలు, బాగల్‌కోట మున్సిపాలిటీలో 11 వార్డుల ప్రజలకు పునరావాసంతోపాటు 75,663 ఎకరాల సేకరణకు రూ. 70 వేల కోట్లను మంజూరు చేస్తూ కర్ణాటక కేబినెట్ సెపె్టంబర్ 17న గ్రీన్‌సిగ్నల్ ఇచి్చంది. ఈ కేసు పరిష్కారం కాకముందే కర్ణాటక ఆల్మట్టి ఎత్తు పెంపునకు ముందుకు వెళ్తుండటాన్ని సవాల్ చేస్తూ సుప్రీంలో మరో ఇంటర్లోక్యూటరీ అప్లికేషన్ (ఐఏ) వేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. -
హైదరాబాద్‌లో జర్మన్ కంపెనీ జీసీసీ
సాక్షి, హైదరాబాద్: జర్మనీకి చెందిన దిగ్గజ ఆర్థిక సేవల సంస్థ డోయిచ బోర్స (Deutsche Borse)) తమ విస్తరణలో భాగంగా హైదరాబాద్‌లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (జీసీసీ)ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. తద్వారా వచ్చే రెండేళ్లలో ఐటీ రంగంలో వెయ్యి మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపింది. భాగ్యనగరంలో జీసీసీని ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో జర్మన్ కాన్సుల్ జనరల్ (చెన్నై) మైఖేల్ హాస్పర్ సారథ్యంలో డోయిచ బోర్స ప్రతినిధి బృందం మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో ఆయన నివాసంలో సమావేశమైంది. జీసీసీ ఏర్పాటుకు హైదరాబాద్‌ను ఎంపిక చేసుకున్నందుకు సీఎం ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. హైదరాబాద్‌లో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని.. తమ ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తుందని హామీ ఇచ్చారు. హైదరాబాద్‌ను ఆవిష్కరణల కేంద్రంగా తయారు చేసేందుకు సహకరించాలని కోరారు. తెలంగాణ విద్యార్థులు జర్మన్ భాష నేర్చుకొనేందుకు వీలుగా హైదరాబాద్‌లో శిక్షకులను నియమించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. పెట్టుబడుల విషయంలో జర్మనీ భాగస్వామ్యాన్ని తెలంగాణ కోరుకుంటున్నట్లు చెప్పారు. ఐటీ, ఫార్మా, ఆటోమొబైల్ రంగాల్లో జర్మన్ కంపెనీల పెట్టుబడులను సీఎం ఆహ్వానించారు. టామ్‌కామ్ (తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్) ద్వారా వృత్తివిద్య, నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇచ్చేందుకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అమిత దేశాయ్, డోయిచ బోర్స సీఐవో క్రిస్టోఫ్ బోమ్, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్‌రెడ్డి, విష్ణువర్దన్‌రెడ్డి పాల్గొన్నారు.సీఎంను కలిసిన అమెజాన్ వెబ్ సర్వీసెస్ బృందంసీఎం రేవంత్‌రెడ్డితో అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్) ప్రతినిధి బృందం మంగళవారం మర్యాదపూర్వకంగా సమావేశమైంది. రాష్ట్రంలో తమ డేటా సెంటర్ ప్రాజెక్టులు, వాటి విస్తరణ కోసం చేపట్టనున్న చర్యలను వివరించింది. పెట్టుబడులతో వస్తే అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని సీఎం అమెజాన్ బృందానికి హామీ ఇచ్చారు. సమావేశంలో ఏడబ్ల్యూఎస్ డేటా సెంటర్ గ్లోబల్ హెడ్ కెర్రీ పర్సన్, ఇన్ఫ్రా పబ్లిక్ పాలసీ డైరెక్టర్ విక్రమ్ శ్రీధరన్, అనురాగ్ కిల్నానీ తదితరులు పాల్గొన్నారు. -
ఇది సర్కారా? రౌడీ దర్బారా..? : కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: పేదరికం కారణంగా ఏ విద్యార్థి కూడా విద్యకు దూరం కాకూడదనే మహోన్నత లక్ష్యంతో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తుంగలో తొక్కారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారకరామారావు విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పేద విద్యార్థుల కోసం ప్రవేశపెట్టిన పథకాన్ని ఉద్దేశపూర్వకంగా నిలిపివేసి లక్షలాది విద్యార్థులకు ఉన్నత విద్య పొందే హక్కు దూరం చేస్తున్నారని మండిపడ్డారు. విద్యార్థుల భవిష్యత్ అంధకారం చేసేందుకు కాంగ్రెస్ కుట్ర పన్నిందని ఆరోపించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం రాత్రి పార్టీ అభ్యర్థి మాగంటి సునీతకు మద్దతుగా సోమాజిగూడలో భారీ రోడ్‌షోలో పాల్గొన్న ఆయన ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. సీఎం రేవంత్‌రెడ్డి రూ.10 వేల కోట్ల ఫీజు బకాయిలు కట్టకుండా విజిలెన్స్ దాడులతో కాలేజీలను బెదిరిస్తుండటంతో విద్యార్థుల భవిష్యత్‌కు భరోసా లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఉద్యోగులకు డీఏ, పీఆర్సీలు లేవు. రిటైరైనవారు, ఉద్యోగులు, విద్యార్థులను బెదిరించి ఏం సాధిస్తావు రేవంత్‌రెడ్డీ? తల్లిదండ్రులను పట్టించుకోని ఉద్యోగుల జీతాల్లోంచి పది శాతం కటింగ్ అన్నారు కదా! పెన్షనర్లు నీ తల్లిదండ్రుల్లాంటి వారేకదా.. నీ జీతంలోంచి కోత పెట్టాలా? ఇంతమందిని వేధించి ఏం సాధిస్తావు? మీరు నడుపుతున్నది సర్కారా లేక రౌడీ దర్బారా?’అని దుయ్యబట్డారు. మీరే న్యాయమూర్తులు ‘జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఆషామాషీ ఎన్నిక కాదు. పదేళ్ల బీఆర్ఎస్ అభివృద్ధికి, రెండేళ్ల కాంగ్రెస్ అరాచకానికి మధ్య జరుగుతున్న పోటీ. ఇది బీఆర్ఎస్ వికాసానికి, కాంగ్రెస్ విధ్వంసానికి, సంక్షేమానికి– సంక్షోభానికి మధ్య జరుగుతున్న పోటీ. ఎవరి పాలన బాగుంటే వారికి ఓటెయ్యండి. 4 కోట్ల మంది 4 లక్షల ఓటర్ల వైపు చూస్తున్నారు. ఈ ఎన్నికల్లో సరైన వారినే గెలిపించండి. మీరే న్యాయనిర్ణేతలు. కేసీఆర్ అధికారంలోకి వచ్చినప్పుడున్న జనరేటర్లు, ఇన్వర్టర్లు, నీటికోసం ధర్నాల వంటి సమస్యల్ని ఒక్కటొక్కటిగా పరిష్కరించాం. అందరినీ అమ్మలా అక్కున చేర్చుకునే హైదరాబాద్‌లో కార్మీకులకు పని కల్పించాం. పదిలక్షలకు పెరిగిన ఐటీ ఉద్యోగులతోపాటే రియల్ ఎస్టేట్, వివిధ వ్యాపారాలు పెరిగాయి. శాంతి భద్రతల సమస్యల్లేకుండా నగరాన్ని కంటికి రెప్పలా కాపాడిన ఘనత కేసీఆర్‌ది. మడిలో ఉండే రైతును, బడిలో ఉండే టీచర్‌ను, గుడిలో ఉండే పూజారిని, చర్చిలో ఉండే పాస్టర్‌ను, మసీదులో ఉండే ఇమాంను ఇలా.. సబ్బండ వర్గాలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసగించింది. కేసీఆర్, కేటీఆర్‌ల రెండు ఉద్యోగాలు ఊడగొడితే రెండు లక్షల ఉద్యోగాలిస్తామని ఎన్నికలకు ముందు రాహుల్‌గాంధీ ఇచ్చిన హామీ నెరవేర్చనందున ఇప్పుడు నిరుద్యోగులు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు’అని కేటీఆర్ తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు 420 హామీలిచ్చిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్కటీ అమలు చేయకుండా అన్నివర్గాలను మోసం చేసిందని ఆరోపించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత ఉచిత నీటి పథకం కూడా ఎత్తివేసి వేలకువేల బిల్లులు ఇస్తుందని అన్నారు. హైడ్రా పేదలపైనే ప్రతాపం చూపుతుందని.. మంత్రులు, పెద్దల జోలికి పోదని ఆరోపించారు. జూబ్లీహిల్స్ ఓటర్లు ఇచ్చే తీర్పుతో కాంగ్రెస్ మైండ్ బ్లాంక్ కావాలని తెలిపారు. -
కేటీఆర్ అరెస్ట్‌కు అనుమతివ్వాలి..: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: బీజేపీ, బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందం లేకపోతే ఈ నెల 11వ తేదీలోగా కాళేశ్వరం ప్రాజెక్టు కేసులో సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, ఫార్ములా–ఈ రేస్ కేసులో కేటీఆర్‌ను అరెస్ట్ చేసేందుకు గవర్నర్‌తో అనుమతి ఇప్పించాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సవాల్ విసిరారు. లోపాయికారీ ఒప్పందం కారణంగానే కాళేశ్వరం, ఫార్ములా ఈ రేస్ కేసుల్లో కేసీఆర్, కేటీఆర్‌లను బీజేపీ కాపాడుతోందని ఆరోపించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు మద్దతుగా మంగళవారం రాత్రి హైదరాబాద్‌లోని షేక్‌పేట, రహమత్‌నగర్‌లలో రేవంత్‌రెడ్డి రోడ్‌షో నిర్వహించి కార్నర్ మీటింగుల్లో ప్రసంగించారు. ‘రాబోయే రోజుల్లో బీజేపీలో బీఆర్ఎస్ విలీనమవుతుంది. ఇది నేను అంటున్న మాట కాదు. వాళ్ల ఆడబిడ్డ చెబుతున్న మాటే. ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటించినప్పుడల్లా కాళేశ్వరం కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంగా మారిందని, కేసును సీబీఐకి అప్పగిస్తే 48 గంటల్లో తండ్రీ కొడుకులను జైలుకు పంపిస్తామని పదేపదే చెప్పారు. తీరా కాళేశ్వరంపై దర్యాప్తు చేయాలని కేసును మేము సీబీఐకి అప్పగిస్తే.. మూడు నెలలైనా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్‌ను అరెస్ట్ చేసేందుకు గవర్నర్ అనుమతి కోరితే రెండు నెలలైనా స్పందన లేదు. బీఆర్ఎస్, బీజేపీది ఫెవికాల్ బంధమని దీనితోనే తేలిపోతుంది’అని ఆరోపించారు. కారుగుర్తుకు ఓటేస్తే కమలంగా మారుతుంది బీఆర్ఎస్కు ఓటు వేస్తే ఆ తర్వాత కమలం గుర్తుగా రూపాంతరం చేందుతుందని, కారు ఢిల్లీకి చేరగానే కమలంగా మారుపోతుందని సీఎం రేవంత్ అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ రెండు ఒక్కటేనని ఆరోపించారు. కేంద్రంలో మోదీ ప్రతి నిర్ణయానికి కేసీఆర్ వత్తాసు పలికి మద్దతు ఇచ్చారని తెలిపారు. ‘కారు స్టీరింగ్ మోదీ చేతిలో ఉంది. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో సైతం బీజేపీకి బీఆర్ఎస్ సహకరించింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్కు బీజేపీ పరోక్షంగా మద్దతు ఇస్తోంది. ఇక్కడ బీజేపీకి డిపాజిట్ దక్కదు. బీఆర్ఎస్ నేతలు సెంటిమెంట్ పేరుతో ఓట్లు దండుకోవాలని చూస్తున్నారు. 2007లో పీజేఆర్ ఆకస్మిక మరణం తర్వాత వచ్చిన ఉప ఎన్నికల్లో ఆయన కుటుంబంపై కేసీఆర్ అభ్యరి్థని నిలబెట్టి మంచి సంప్రదాయాన్ని తుంగలో తొక్కారు. పీజేఆర్ సతీమణి కలిసేందుకు వెళితే మూడు గంటలు బయట నిలబెట్టిన దుర్మార్గుడు కేసీఆర్. ఆనాడు ఒక నీతి, ఇప్పుడు ఒక నీతినా? ఆనాడు పీజేఆర్ కుటుంబాన్ని రోడ్డుపై నిలబెట్టినందు రహమత్‌నగర్ చౌరస్తాలో ముక్కు నేలకు రాసి కేటీఆర్ క్షమాపణ చెప్పాలి’అని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. మహిళా సెంటిమెంట్ మాట్లాడటమా? బీఆర్ఎస్కు మహిళా సెంటిమెంట్ గురించి మాట్లాడే హక్కు లేదని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ‘సొంత చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని ఇంటినుంచి బయటకు పంపిన దుర్మార్గుడు కేటీఆర్. ఆయన మాగంటి సునీతమ్మను ఆదుకుంటాడంటే నమ్మేది ఎలా? ఇలాంటి వాడు ఎవరింట్లోనైనా ఉంటే అక్కాచెల్లెళ్లు వాతలు పెడుతారు. ఆర్టీసీలో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తే బీఆర్ఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తోంది. బీఆర్ఎస్ను ఎందుకు గెలిపించాలో సమాధానం చెప్పాలి. రేషన్ కార్డులు, సన్న బియ్యం, ఉచిత బస్సు రద్దు చేయడానికా? ఉప ఎన్నిక తరువాత జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పేదలకు 4 వేల ఇళ్లు ఇప్పించే బాధ్యత నాది’అని సీఎం హామీ ఇచ్చారు. సభల్లో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్‌గౌడ్, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, అజహరుద్దీన్, డీసీసీ అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
‘కేసీఆర్, హరీష్‌ను ఎప్పుడు అరెస్టు చేస్తారో చెప్పాలి?’
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంశానికి సంబంధించి కేసీఆర్, హరీష్‌రావులను ఎప్పుడు అరెస్టు చేస్తారో చెప్పాలని తెలంగాణ బీజేపీ నేతల్ని టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేశారు. నవంబర్ 11లోపు కేసీఆర్, హరీష్‌లను అరెస్ట్‌చేయాలని డిమాండ్ చేశారు.తాము ఈ కేసును సీబీఐకి అప్పగించి మూడు నెలలు అవుతుందని, ఇప్పటివరకూ ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదన్నారు. బీజేపీతో బీఆర్ఎస్ చీకటి ఒప్పందంలో భాగంగానే ఇది జరుగుతుందని సీఎం రేవంత్ ఆరోపించారు. ఈ-రేస్ కేసులో కేటీఆర్‌ను అరెస్ట్ చేసేందుకు గవర్నర్ అనుమతి ఇవ్వలేదన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశారు.మరొకవైపు బీజేపీ జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కిషన్ెడ్డి మాట్లాడుతూ.. ఎంఐఎం, బీఆర్ఎస్, కాంగ్రెస్‌లది చీకటి ఒప్పందమని విమర్శించారు.మరొకవైపు కాంగ్రెస్ సర్కార్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ఇచ్చిన హామీలను గాలికొదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.. హైడ్రా పేరుతో ఇళ్లు కూలగొడుతుందని ధ్వజమెత్తారు.వృద్ధుడిని రైల్వే ట్రాక్‌పై తోసేసిన యువకులు -
టీవీ5 మూర్తి, గౌతమి చౌదరికి షాక్!
సాక్షి,హైదరాబాద్: టీవీ5 మూర్తిపై కేసు నమోదైంది. వ్యక్తిగత గోప్యత, ప్రైవసీ భంగం కలిగించారనే అభియోగాలపై కూకట్పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్లో ఏ1 గౌతమి చౌదరి,ఏ2 టీవీ5 మూర్తి పేర్లను చేర్చారు. టీవీ5 మూర్తి,గౌతమి చౌదరిపై చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని సింధూరం, డ్రింకర్ సాయి సినిమాల్లో హీరోగా నటించిన ధర్మ మహేష్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. టీవీ5 మూర్తి రూ.10 కోట్లు డిమాండ్ చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి TV5 మూర్తి , గౌతమీ చౌదరిలపై చట్ట పరమయిన చర్యలు తీసుకోవాల్సిందిగా తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.తెలంగాణ హైకోర్టు ఆదేశాలతో Tv5 మూర్తి పై, గౌతమి చౌదరిపై పోలీసులు 308 (3) BNS 72 IT Act ప్రకారం కేసునమోదు చేసి విచారణ చేపట్టారు . -
వృద్దుడిని రైల్వే ట్రాక్‌పై తోసేసిన యువకులు
సాక్షి,హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైలులో దారుణం జరిగింది. సీనియర్ సిటిజన్లకు కేటాయించిన సీటు తనకు ఇవ్వాలంటూ కోరిన ఓ వృద్ధుడిపై ముగ్గురు యువకులు దారుణానికి ఒడిగట్టారు. రైల్వే ట్రాక్‌పైకి నెట్టి దాడి చేశారు. పోలీసుల వివరాల మేరకు.. అమీర్‌పేట్ నుండి మెట్రోలో ప్రయాణిస్తున్న 62 ఏళ్ల వృద్ధుడితో ముగ్గురు యువకులు దురుసు ప్రవర్తించారు. సీనియర్ సిటిజన్లకు కేటాయించిన సీటును ఇవ్వమని కోరగా యువకులు దుర్భాషలాడి అవమానించారు. లక్డికాపూల్ మెట్రో స్టేషన్ వద్ద ముగ్గురు యువకులు వృద్ధుడిని రైల్వే ట్రాక్‌పైకి నెట్టి గాయపరిచారు.బాధితుడు వెంటనే ఘటనను సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు.బాధితుడి ఫిర్యాదు మేరకు సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి వేగంగా దర్యాప్తు చేపట్టారు. నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు. వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. న్యాయస్థానం ఎదుట హాజరుపరిచారు. విచారణ చేపట్టిన కోర్టు నిందితులకు రిమాండ్ విధించింది. నిందితులు సివ్వల సునీల్ కుమార్ (32),సివ్వల రాజేష్ (34),కాలిశెట్టి అశోక్ (34) అని తెలుస్తోంది. -
తుపాకీతో బెదిరిపులు.. కేఈ ప్రభాకర్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్
సాక్షి,హైదరాబాద్: ఏపీ టీడీపీ నేత కేఈ ప్రభాకర్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ కుటుంబం మధ్య తుపాకీ కలకలం రేగింది. ప్రభాకర్ అల్లుడు, నందీశ్వర్ గౌడ్ కుమారుడు అభిషేక్ గౌడ్‌కు ఓ ఇంటి అగ్రిమెంట్ విషయంలో విభేదాలు వచ్చాయి. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వారం క్రితం వివాదం రేగింది. దీంతో ఓ వర్గం తుపాకీతో బెదిరించిందంటూ.. రెండో వర్గం తాజాగా రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.దీనిపై రాయదుర్గం ఎస్హెచ్ఓ సీహెచ్ వెంకన్న మాట్లాడుతూ.. ఏపీకి చెందిన ఒక రాజకీయ నేత కూతురు, తెలంగాణకు చెందిన ఒక రాజకీయ నేత కుమారుడు విషయంలో వివాదం చోటు చేసుకున్నట్లు తెలిపారు. వీరిద్దరూ భార్యభర్తలని, వీరికి 14 ఏళ్ల క్రితం పెళ్లయిందని, వ్యక్తిగత సమస్యల కారణంగా ఈ జంట ఒక సంవత్సరం నుండి విడివిడిగా నివసిస్తున్నారన్నారు.గత నెల 25న, మణికొండలోని పంచవటి కాలనీలో ఉన్న ఒక ఆస్తి విషయంలో రెండు కుటుంబాల మధ్య వివాదం తలెత్తిందని,. దీనికి సంబంధించి, రెండు వర్గాలు రాయదుర్గం పోలీసులను సంప్రదించి, ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటూ ఫిర్యాదులు సమర్పించారన్నారు. వీరి ఫిర్యాదులు స్వీకరించి విచారణ జరుపుతున్నట్లు పేర్కొన్నారు. ఇక కాల్పుల నివేదిక సంబంధించి అటువంటిది ఏదీ తమ దృష్టికి రాలేదన్నారు. కాల్పులకు సంబంధించి ఏదైనా ఆధారాలు కనిపిస్తే, తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. -
మరో రోడ్డు ప్రమాదం.. నుజ్జునుజ్జయిన కారు
నాగర్‌కర్నూల్: వరుస ప్రమాదాలతో రోడ్లు రక్తమోడుతున్నాయి. తాజాగా శ్రీశైలం రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అచ్చంపేట మండలం హాజీపూర్ సమీపంలో ఓ కారును లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరి తీవ్ర గాయాలవ్వగా, కారు నుజ్జునుజ్జు అయ్యింది. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంచితే, నిన్న(సోమవారం, నవంబర్ 3వ తేదీ) రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాద చోటుచేసుకుంది. తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 19 మంది మృతిచెందారు. మరోకవైపు ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెలు మృతి చెందడంతో తీవ్ర విషాదం నెలకొంది. తాండూరుకు చెందిన ఎల్లయ్య గౌడ్ ముగ్గురు కూతుళ్లు నందిని (డిగ్రీ ఫస్టియర్), సాయిప్రియ (డిగ్రీ థర్డ్ ఇయర్), తనూష (ఎంబీఏ) హైదరాబాద్‌లో చదువుకుంటున్నారు. ఇటీవల బంధువుల పెళ్లి ఉండటంతో ముగ్గురు సొంతూరుకు వచ్చారు. తిరిగి వెళ్తుండగా ప్రమాదానికి గురై మృత్యువాత పడ్డారు.ఇదీ చదవండి:రోజుకు 15 మందిని చంపేస్తున్న అతివేగం -
మంత్రి అజారుద్దీన్‌కు కేటాయించిన శాఖలు ఇవే
సాక్షి, హైదరాబాద్: మహ్మద్ అజారుద్దీన్‌కు తెలంగాణ ప్రభుత్వం శాఖలను కేటాయించింది. మైనార్టీ వెల్ఫేర్‌తో పాటు పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ శాఖలను కేటాయించింది. గత నెల అక్టోబర్ 31న అజారుద్దీన్ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అజారుద్దీన్‌కు ఏ శాఖ ఇస్తారన్నది రాజకీయవర్గాల్లో చర్చ జరిగింది.బీఆర్ఎస్ హయాంలో మైనారిటీలకు ఉప ముఖ్యమంత్రి హోదాలో హోం మంత్రిత్వ శాఖను కేటాయించిన నేపథ్యంలో అజారుద్దీన్‌కు కూడా మంచి అవకాశం లభిస్తుందనే చర్చ జరిగింది. హోంశాఖ కేటాయిస్తారని ఊహాగానాలు వినిపించాయి. అయితే, మైనార్టీ వెల్ఫేర్ సంక్షేమం, పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ శాఖలను ప్రభుత్వం ఆయనకు కేటాయించింది. -
కృష్ణా.. ఓ మినీ ఇండియా
అనగనగా ఓ రైల్వేస్టేషన్.. ఆ స్టేషన్ సమీపంలో రైల్వే ఉద్యోగుల కోసం బ్రిటీషర్లు కొన్ని నిర్మాణాలు చేపట్టారు. గుజరాత్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, పంజాబ్.. ఇలా ఎన్నో రాష్ట్రాల నుంచి వచ్చిన రైల్వే ఉద్యోగులు ఇక్కడే నివాసం ఉండేవారు. ఆ ప్రాంతం నచ్చడంతో కాలక్రమేణా అక్కడే స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నారు. క్రమంగా జనం పెరగడంతో వ్యాపారాలు చేసేందుకు వర్తకులు వచ్చారు. వీధులు వెలిసి.. అక్కడ ఓ ఊరే ఏర్పడింది. భిన్న మతాలు.. విభిన్న సంస్కృతులు.. కులాలు.. జాతులు.. ప్రాంతాల వారితో ఏర్పడిన ఆ గ్రామమే కృష్ణా. కృష్ణానది ఒడ్డున ఉండడంతో ఆ పేరే గ్రామం పేరుగా వాడుకలోకి వచ్చింది. ఎన్నో రాష్ట్రాల ప్రజలంతా ఒకేచోట ఉండడంతో కృష్ణా మండల కేంద్రాన్ని ఓ మినీ ఇండియాగా అభివరి్ణస్తుంటారు. అయితే.. బ్రిటిషర్ల కాలంలో కేవలం రైల్వేస్టేషన్ మాత్రమే ఉండగా.. అనంతరం దానిని అనుసరించి ఓ ఊరే ఏర్పడడం గమనార్హం. కృష్ణా గ్రామంలో నివసించే ప్రజలంతా ఇక్కడికి వలస వచ్చిన వారే కావడం విశేషం. మరాఠ కాలనీ, ధర్మశాల ఇలా విభిన్న పేర్లతో కూడిన కాలనీలు ఇక్కడ కనిపిస్తాయి.కృష్ణా: రాష్ట్ర సరిహద్దులోని కృష్ణా మండల కేంద్రాన్ని ఓ మినీ ఇండియాగా అభివర్ణిస్తుంటారు. దేశంలోని వివిధ రాష్ట్రాల వారు ఇక్కడ కలిసి ఉండడమే ఇందుకు కారణం. 1907 సంవత్సరంలో బ్రిటీష్ ప్రభుత్వం తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించేందుకు కృష్ణానదిపై వంతెన నిర్మించి.. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు మొదట రైలు మార్గాలను ఏర్పాటు చేసింది. ఆ సమయంలో నది పక్కన ఒక స్టేషన్ ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ రైల్వేస్టేషన్ ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతంలో అప్పట్లో ఊరేలేదు. కేవలం రైల్వే ఉద్యోగులే ఉండేవారు. ఎన్నో రాష్ట్రాల వారు ఇక్కడే స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకొన్నారు. ఉద్యోగ విరమణ తర్వాత కూడా ఇక్కడే ఉండిపోవడంతో కాలక్రమేణా గ్రామంగా ఏర్పడింది. కృష్ణానది ఒడ్డున ఉండడంతో కృష్ణా గ్రామంగా పేరు వాడుకలోకి వచ్చింది. ఇదిలా ఉండగా.. 1911లో నిజాం కాలం నాటి హైదరాబాద్ ఫస్ట్ తాలుక్దార్గా (కలెక్టర్) ఉన్న గోవింద్‌నాయక్ తన భార్య రంగుబాయి జ్ఞాపకార్థం కృష్ణానది ఒడ్డున తిరుపతిలోని శ్రీవేంకటేశ్వరస్వామి మూలవిరాట్‌ను పోలిన మరో విగ్రహాన్ని ప్రతిష్టించాడు. అప్పట్లో ఈ ఆలయంలో పూజలు చేసేందుకు బ్రాహ్మణులు మహదేవ్ దీక్షిత్, నారాయణభట్, రాఘవేంద్రచారి, గణపతిభట్, భీమాచారిని నియమించి.. వారి భృతికి కొంత భూమిని కొనిచ్చారు. ఈ ఐదు కుటుంబాలకు చెందిన వారసులే ఇప్పుడు వందల సంఖ్యలో ఇక్కడ నివసిస్తూ కర్మకాండలు, తద్దినం, నిత్యకర్మ, సావత్రిక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. కర్మకాండలకు దేశంలో మొదటిది కాశీ అయితే.. రెండోది కృష్ణా కావడం మరో విశేషం. మాజీ ప్రధాని ఇందిరాగాం«దీ, రాజీవ్‌గాంధీ, ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి ఎనీ్టఆర్ అస్తికలను ఇక్కడున్న కృష్ణా, భీమానదుల సంఘమ క్షేత్రంలోనే నిమజ్జనం చేసినట్లు పురోహితులు తెలిపారు.రాజ్‌పుత్‌లు: మహారాష్ట్ర నుంచి ఇక్కడికి రైల్వే ఉద్యోగులుగా 75 ఏళ్ల క్రితం వలస వచ్చారు. ఒక్క కుటుంబం నుంచి దాదాపు 10 కుటుంబాలు అయ్యాయి. తాతల కాలం నుంచి రైల్వే ఉద్యోగులుగా కొనసాగుతున్నారు. ఒకరి నుంచి ఒకరికి ఉద్యోగాలు వచ్చాయని, మరికొందరు చిన్నపాటి వ్యాపారాలు, ప్రైవేటు ఉద్యోగాలు చేస్తూ ఇక్కడే స్థిరపడ్డారు. వీరి వాడుక భాష హిందీ. కట్టుబొట్టు వేరుగా ఉంటాయి. ఉగాది, దీపావళి, దసరా ముఖ్య పండుగలు. గోదుమ పిండితో చేసిన చపాతి, పూరీలు ఎక్కువగా తింటారు.మరాఠీలు : మహారాష్ట్ర నుంచి ఇక్కడికి రైల్వే ఉద్యోగాలపైన 60 ఏళ్ల క్రితం వచ్చారు. ప్రస్తుతం ఆ కుటుంబాల్లో కొందరు మాత్రమే ఉద్యోగాల్లో ఉండడంతో మిగతా వారు ఖాళీగా ఉండకుండా.. గ్రామంలో కిళ్లీ కొట్లు, సప్లయింగ్ తదితర వ్యాపారాలు చేస్తున్నారు.అగర్వాల్‌లు : ఉత్తరప్రదేశ్, ఢిల్లీ నుంచి 80 ఏళ్ల క్రితం వ్యాపార నిమిత్తం ఇక్కడికి వచ్చారు. హోటళ్లు, స్వీట్స్ దుకాణం, ధాన్యం కొనుగోలు తదితర రంగాల్లో వ్యాపారం చేసేవారు. అప్పట్లో మక్తల్ మార్కెట్ కంటే ఇక్కడే ఎక్కువగా ధాన్యం కొనుగోళ్లు జరిగేవి. 40 ఏళ్లుగా ఇక్కడ వ్యాపారం పడిపోవడంతో ఇక్కడున్న వ్యాపారులు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు.ముస్లింలు :రజాకార్ల పరిపాలనలో వ్యాపారం నిమిత్తం ఇక్కడికి వచ్చారు. అప్పట్లో వీరు దాదాపు 800 మంది ఉండగా.. ప్రస్తుతం 400 మంది మాత్రమే ఉన్నారు. ఇక్కడ వ్యాపారం పడిపోవడంతో కర్ణాటక, మహారాష్ట్రకు వలస వెళ్లారని సమాచారం.బ్రాహ్మణులు : కర్ణాటక నుంచి ఇక్కడికి మొట్టమొదట వచ్చింది వీరే. పూజలు నిర్వహించేందుకు వచ్చి స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకోవడంతో ఇక్కడ గ్రామం అవతరించింది. వీళ్లు కర్ణాటకలోని శృంగేరి మఠంకు చెందినవారు. అప్పట్లో సాధువులు నది ఉన్నందున ఎక్కువగా వచ్చేవారు. అలా వచ్చిన క్షీరలింగేశ్వరుడు ఆయన మంత్రశక్తితో ఇక్కడి ప్రజల బాధలు, రోగాలను నయం చేసేవారు. ఆయన మరణంతో ఆయనను పూడ్చిన స్థానంలోనే సమాధి కట్టి, విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఏటా జనవరి 14న బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు.జైనులు: 70 ఏళ్ల కిందట రాజస్తాన్ నుంచి వ్యాపార నిమిత్తం కృష్ణాకు వలస వచ్చారు. రైళ్లలో సరుకులు, వస్తువులను తీసుకొచ్చి ఇక్కడ వ్యాపారం చేసేవారు. 35 ఏళ్ల కిందట 100 మంది ఉంటే ఈ రోజు రెండు కుటుంబాలు మాత్రమే మిగిలాయి. వ్యాపారం పడిపోవడం, ఇతర రంగాలవైపు వెళ్లడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. మరాఠ, ధర్మశాల కాలనీలు.. నది ఒడ్డున నివసిస్తున్న బ్రాహ్మణుల కాలనీ ధర్మశాలగా, రైల్వేస్టేషన్‌కు సమీపంలో ఉన్న కాలనీని మరాఠకాలనీ అని పిలుస్తారు. ఇక్కడ మహారాష్ట్రకు చెందినవారు ఎక్కువగా ఉండడంతో ఆ గల్లీని మరాఠ కాలనీగా పిలుస్తున్నట్లు తెలిపారు. అలాగే, జైనులు, రాజ్‌పుత్‌లు, వాల్మీకి (బోయ), ముదిరాజ్, చాకలి, కుర్వ, హరిజన్, ముస్లిం, వైశ్య తదితర కులాలకు చెందినవారు నివసిస్తున్నారు.సంప్రదాయాలు కొనసాగిస్తున్నాం ఇక్కడి ఆచారాలు, అలవాట్లు, భాష, ప్రాంతం వేరైనప్పటికీ మా సంప్రదాయాలు, అలవాట్లు, ఆచారాలు కొనసాగిస్తున్నాం. కొన్ని విషయాల్లో అంటే ఇక్కడున్న కట్టు, బొట్టు, తిండి విషయాల్లో మా వాటిని వదులుకొని ఇక్కడున్న విధంగా నడుచుకుంటున్నాం. మా ప్రాంతాలకు వెళ్తే మా అలవాట్ల ప్రకారమే ఉంటాం. – లక్ష్మీరాజ్పుత్, కృష్ణా గ్రామంవ్యాపారం చేస్తూ.. ఉపాధి మాది రాజస్తాన్. మా వంశస్తులు వ్యాపారం నిమిత్తం కృష్ణాకు వచ్చారు. వ్యాపారం చేస్తూ మరికొందరికీ ఉపాధి కల్పించారు. అలాగే మావారు ఆస్తులు సంపాదించారు. కాలక్రమేణా వ్యాపారం పడిపోయింది. ఈ గ్రామంలోని ఎంతోమంది పేదలకు భూములు ఇచ్చాం. మా తాతలు ఇచ్చిన ఆస్తులతో ఇప్పటికీ కొందరు జీవనం సాగిస్తున్నారు. – కపిల్సేట్, మార్వాడి, కృష్ణా వ్యాపారం కోసం.. మా వంశస్తులు 50 మందికి పైగా ఇక్కడకు రజాకార్ల పరిపాలనలో వ్యాపార నిమిత్తం వచ్చారు. వారి సంతానమే ఈ రోజు గ్రామంలో దాదాపు 400 మందికి పైగా ఉన్నాం. ప్రస్తుతం వివిధ వ్యాపారాలు, ప్రైవేటు, ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ జీవనం గడుపుతున్నాం. – మహ్మద్ రియాజ్, కృష్ణా -
ఎవరిదీ పాపం ఎందుకీ శాపం!
రోడ్డుపై నెత్తురు చుక్కగా మొదలై.. ధారలై.. ప్రవాహమై పండంటి జీవితాలను నాశనం చేస్తుంది... పచ్చటి బతుకులను బలి తీసుకుంటుంది. ఎవరిదీ పాపం..! అచేతనంగా ఉన్న ఆ రోడ్డుదా!! మనిషి చేతిలోని మర యంత్రానిదా!! అవసరం అనివార్యమై బతుకుపోరు చేస్తున్న మనుషులదా!! ఎవరేస్తారు అడ్డుకట్ట..? ఎక్కడుంది ఆనకట్ట..?అయ్యా.. ప్రజాప్రతినిధులు.. నాయకులు.. అధికారులారా కనిపించడం లేదా శవాలగుట్టలు.. వినిపించడంలేదా ఆర్తనాదాలు.. అడుగడుగునా మోడువారిన బతుకులు. పారాణి ఆరకముందే నేలరాలిన సాభాగ్యాన్ని..లోకాన్ని చూడకముందే చీకట్లు కమ్మిన బాల్యాన్ని.. బతుకుపోరులో రహదారిపై నడుము ఇరిగిన యువతరాన్ని.. ఆసరా కోల్పోయిన వృద్ధులను చూడండి. విజ్ఞులని పట్టంగట్టాం.. మా జీవిత గమనాన్ని మీ చేతుల్లో పెట్టాం.. తక్షణ కార్యాచరణ లేకపోతే మీరు వల్లించే అభివృద్ధి మాటలకు సూచికగా మిగిలేది మరుభూమే..!సాక్షిప్రతినిధి,కరీంనగర్: ఉమ్మడి జిల్లాలో రహదారులు మృత్యుకుహరాలుగా మారాయి. తరచూ ప్రమాదాలు జరిగి ఎందరో మృత్యువాత పడుతున్నారు. ప్రమాదం అంటే రెండు వాహనాలు ఢీకొట్టుకోవడం కాదు.. కుటుంబాన్ని పోషించే పెద్ద దిక్కును కోల్పోయిన కుటుంబాలు రోడ్డున పడటం. తాజాగా చేవెళ్లలో టిప్పర్ లారీ బస్సు ఢీకొన్న దుర్ఘటనలో పదుల సంఖ్యలో కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయి. మితివీురిన వేగంతోపాటు నిర్లక్ష్యపు డ్రైవింగ్‌తో అమాయకులు అసువులుబాసారు. మరోవైపు ఇసుక, గ్రానైట్ లోడ్లతో తిరిగే వాహనాలతో మనకూ ముప్పు పొంచి ఉంది. నిత్యం రోడ్డు ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్లను గుర్తించినప్పటికీ.. సరైన ప్రమాద హెచ్చరిక బోర్డులు, వాటి నివారణకు సరైన చర్యలు తీసుకోకపోవడం వల్ల మనకూ అదేస్థాయిలో ముప్పు పొంచి ఉంది. కరీంనగరే టాప్..ఉమ్మడి జిల్లాలో నమోదైన రోడ్డు ప్రమాదాల్లోకరీంనగర్ జిల్లా టాప్‌లో ఉంది. ఇక్కడ మొత్తంగా 624 ప్రమాదాలు జరగగా 164 మంది మరణించారు. 576 మంది క్షతగాత్రులయ్యారు. తరువాతి స్థానంలో జగిత్యాల ఉంది. ఇక్కడ 402 రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. 150 మంది అసువులు బాసారు. 413 మంది గాయపడ్డారు. పెద్దపల్లిలో 245 రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. 75 మంది మరణించారు. 204 మంది గాయాలతో బయటపడ్డారు. సిరిసిల్ల రోడ్డు ప్రమాదాల్లో మూడోస్థానంలో నిలిచినా.. 67 మరణాలు, 257 క్షతగాత్రులతో నాలుగోస్థానంలో నిలిచింది. కరీంనగర్ జిల్లాలో హైదరాబాద్–కరీంనగర్, వరంగల్, జగిత్యాల రహదారుల్లో ఇప్పటి వరకు గుర్తించిన పలు బ్లాక్ స్పాట్లను నిరోధించడంలో పోలీసులు, ఆర్అండ్బీ అధికారులు పూర్తిస్థాయిలో సఫలీకృతం కాలేకపోయారు. ఫలితంగా ఇంకా రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అతివేగం, డ్రంకెన్‌డ్రైవ్ కూడా కొన్నిసార్లు కారణాలు అవుతున్నాయని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. ముఖ్యంగా కరీంనగర్ నగరంలోని అనేక జంక్షన్ల నిర్మాణంలో లోపాల కారణంగా నేటికీ అమాయకుల ప్రాణాలు తీసూ్తనే ఉన్నాయి. రక్షణ చర్యలేవి?ఉమ్మడి జిల్లాలో పారిశ్రామిక ప్రాంతాలైన పెద్దపల్లి, కరీంనగర్లో అత్యధికంగా గూడ్స్ వాహనాలు తిరుగుతుంటాయి. ముఖ్యంగా పెద్దపల్లిలో బొగ్గులోడులతోపాటు, గోదావరి, మానేరుల నుంచి నడిచే ఇసుక లారీలు, కుందనపల్లి నుంచి నడుస్తున్న బూడిద లారీల్లో కొన్ని ఓవర్ లోడ్‌తో వెళ్తున్నాయి. ఇవన్నీ భారీ వాహనాలే. నిత్యం వందలాది వాహనాలు మంథని, కరీంనగర్, హైదరాబాద్, మంచిర్యాల రోడ్లపై పరుగులు తీస్తున్నాయి. ఈ క్రమంలో పలు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. కరీంనగర్లో గ్రానైట్ పరిశ్రమ అతిపెద్దది. ఇక్కడ కరీంనగర్, ఉప్పల్, జమ్మికుంట, జగిత్యాల తదితర రైల్వేస్టేషన్లకు తరలించే భారీ గ్రానైట్ రాళ్లకు ఎలాంటి రక్షణ చర్యలూ తీసుకోవడం లేదు. వీటి ఓవర్‌లోడ్ కారణంగా రోడ్లు ధ్వంసమవుతున్నాయి. తరచూ ప్రమాదాలతో ప్రజల ప్రాణాలు బలిగొంటున్నాయి. -
అద్దె బస్సే కొంప ముంచిందా?
తాండూరు/తాండూరు టౌన్: ఆర్టీసీ అద్దెకు తీసుకున్న ప్రైవేటు బస్సులతో తరచూ ప్రమాదాలు చోటు చేసుకొంటున్నాయి. తాండూరు డిపోలో మొత్తం 90 బస్సులు ఉండగా అందులో 57 సంస్థకు చెందినవి కాగా, 33 ప్రైవేటు వ్యక్తుల నుంచి అద్దెకు తీసుకున్నవి. డిపోలో మొత్తం 132 మంది డ్రైవర్లు, 165 మంది కండక్టర్లు విధులు నిర్వర్తిస్తున్నారు. అద్దె బస్సులను ప్రైవేటు డ్రైవర్లే నడిపిస్తున్నారు. ఐదేళ్లుగా తాండూరు డిపోకు చెందిన బస్సులు పెద్ద ఎత్తున ప్రమాదాలకు గురయ్యాయి. తాండూరు– భద్రాచలం వైపు వెళ్లే బస్సు ప్రమాదానికి గురికావడం అప్పట్లో సంచలనంగా మారింది. తర్వాత వరుసగా అనంతగిరి గుట్టలో బస్సు బొల్తాపడింది.చేవెళ్లలోని ఆలూరు వద్ద ఓ బస్సు ప్రమాదానికి గురైంది. తాజాగా మీర్జాగూడ వద్ద (34టీఏ6354) ఇదే డిపో బస్సు ప్రమాదానికి గురైంది. దీంతో తాండూరు డిపో నిర్వహణ తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడి డిపోలో సుమారు 30 వరకు ప్రైవేటు వ్యక్తులకు చెందిన బస్సులు అద్దెకు తిప్పుతున్నారు. ప్రైవేటు బస్సులు నడిపించే డ్రైవర్ల పని తీరును డిపో అధికారులు పరిశీలించాల్సి ఉంది. అయితే సోమవారం తెల్లవారు జామున 4.40 గంటలకు తాండూరు ప్రాంతానికి చెందిన ప్రైవేట్ డ్రైవర్ దస్తగిరి బాబా హైదరాబాద్‌కు బయలు దేరేందుకు బస్సు ఎక్కాడు. అతడికి ఆరోగ్య పరీక్షలు చేయకుండానే బస్సును డిపో నుంచి పంపించారు. సదరు డ్రైవర్ గతంలో అనంతగిరి గుట్టపై బస్సును బోల్తా కొట్టించాడు. అదే డ్రైవర్‌కు తిరిగి బస్సు నడిపించేందుకు అవకాశం ఎలా ఇచ్చారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. డిపోకు చెందిన బస్సును, సంస్థ సిబ్బందిని ఫస్ట్ ట్రిప్‌లో పంపించకపోవడం డిపో అధికారుల నిర్లక్ష్యమేనని విమర్శిస్తున్నారు. శాణమ్మ పేరిట రిజిస్ట్రేషన్అద్దెకు తీసుకున్న ప్రైవేటు బస్సు శాణమ్మ పేరిట రిజిస్ట్రేషన్ అయి ఉంది. 2026 సెప్టెంబర్ వరకు అగ్రిమెంట్ ఉంది. ఆరేళ్లుగా బస్సు డిపోలో నడుస్తోంది. ప్రైవేటు బస్సు కావడంతో డిపోలోకి వెళ్లవు. బయటి నుంచి మాత్రమే వెళ్తాయి. -
ట్రాఫిక్ కానిస్టేబుల్‌పై వరకట్న వేధింపుల కేసు
హైదరాబాద్: చేవెళ్ల పోలీస్‌స్టేషన్‌లో ట్రాఫిక్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న పాసుల నర్సింహులుతో పాటు ఆయన కుటుంబసభ్యులపై సనత్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో అదనపు కట్నం వేధింపుల (డీపీ యాక్ట్) కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన మేరకు.. ఫతేనగర్ ప్రభాకర్‌రెడ్డి నగర్లో నివాసం ఉండే సౌమ్యకు పరిగి మండలం చిగురుపల్లె గ్రామానికి చెందిన ట్రాఫిక్ కానిస్టేబుల్ నర్సింహులు (35)తో గత ఏడాది వివాహం జరిగింది. వివాహ సమయంలో సౌమ్య తల్లిదండ్రులు రూ.25 లక్షల నగదు, 500 గ్రాముల బంగారం, సంగారెడ్డి జిల్లా మనూరు గ్రామంలో 242 చదరపు గజాల స్థలం, గృహోపకరణాలను కట్నంగా ఇచ్చారు. వివాహానంతరం దంపతులు చందానగర్‌లో నివాసం ఉండేవారు. కొంతకాలం తర్వాత భర్త నర్సింహులు, అతని కుటుంబ సభ్యులు అదనపు కట్నంగా మరో రూ.10 లక్షల నగదు, హైదరాబాద్‌లో ఒక డబుల్ బెడ్రూమ్ ప్లాట్ ఇవ్వాలని సౌమ్యను డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా తెలియజేయగా తాము ఇవ్వలేమని చెప్పారు. దీంతో అప్పటి నుంచి నర్సింహులుతో పాటు అతని కుటుంబ సభ్యులు ఆమెను మానసికంగా, శారీరికంగా వేధించడం మొదలుపెట్టారు. పరిగి మండలం చిగురుపల్లె గ్రామంలోని తన అత్తింటికి వెళ్లిన ప్రతిసారీ అత్త పద్మమ్మ, మరిది, మరిది భార్య, భర్త నర్సింహులు కలిసి అదనపు కట్నం కోసం ఒత్తిడి చేస్తున్నారు. వేధింపులు తట్టుకోలేక సౌమ్య సనత్‌నగర్ పోలీసులను ఆశ్రయించగా నర్సింహులుతో పాటు కుటుంబసభ్యులు పద్మమ్మ, బండయ్య, ఆంజనేయులు, బోయినిస్వరూప, బోయిని శైలులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
Jubilee hills bypoll: నువ్వా.. నేనా!
సాక్షి, హైదరబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్దీ రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. సర్వేల పేరిట మౌత్ టాక్ ఓటర్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ప్రధాన పక్షాలు ప్రత్యర్థుల బలహీనతలను ప్రచారాస్త్రాలుగా చేసుకొని ఓటర్ల ఆలోచన విధానంలో మార్పు తేచ్చేందుకు పాట్లు పడుతున్నాయి. వ్యూహాలు, ప్రతివ్యూహాలతో బలమైన సామాజిక వర్గాలను అనుకూలంగా తమకు మల్చుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. ఆయా పక్షాల అగ్రనేతలు ప్రచార రంగంలోకి దిగడంతో మాటలు తూటాలు పేలుతున్నాయి. రోడ్ షోలు, కార్నర్ సభలకు పోటాపోటీగా జనసమీకరణలతో ప్రచార పర్వం ఊపందుకుంది. మరోవైపు క్షేత్ర స్థాయిలో ఓటర్లను గాలం వేసే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ప్రధాన పక్షాల బూత్‌ల వారీగా బాధ్యులు ఓటరు స్లిప్‌లు పంపిణీ చేస్తుండగా, మరో పక్షం మాత్రం దూకుడు పెంచి స్లిప్‌తో పాటు కొంత నగదు అడ్వాన్స్‌గా అందిస్తునట్లు ప్రచారం సాగుతోంది. కాంగ్రెస్‌కు ప్రతిష్టాత్మకం.. అధికార కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ఇజ్జత్‌గా సవాల్ తీసుకొని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నా.. మారుతున్న ప్రజానాడిని సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రత్యర్థుల మౌత్ టాక్ ప్రభావం ఓటర్లపై పడకుండా ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి ఉప ఎన్నికను ఆషామాïÙగా తీసుకోవద్దని పార్టీ భవిష్యత్ దృష్ట్యా బూత్ స్థాయి మేనేజ్మెంట్ పకడ్బందీగా జరిగేలా చర్యలు చేపట్టాలని మంత్రులకు దిశానిర్దేశం చేశారు. అధికారంలో వచ్చిన తర్వాత రెండో ఉప ఎన్నిక కావడంతో కంటోన్మెంట్ మాదిరిగా జూబ్లీహిల్స్‌లో గెలుపు బావుటా ఎగురవేసి పరువు దక్కించుకునేందుకు ముమ్మరం ప్రయత్నాలు చేస్తోంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జూబ్లీహిల్స్ ఫలితాన్ని రెండేళ్ల పాలనపై ప్రజా తీర్పుగా చూపించే వ్యూహంతో అడుగులు వేస్తోంది. ఏ చిన్న అవకాశాన్ని కూడా వదలకుండా పావులు కదుపుతోంది. నియోజక వర్గంలో గత పదేళ్ల వైఫల్యాలను ఎత్తిచూపుతూ అభివృద్ధి సెంటిమెంట్‌ను ప్రజల్లోకి చొప్పించే ప్రయత్నం చేస్తోంది.వ్యూహాత్మకంగా బీఆర్ఎస్.. బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను పార్టీ భవిష్యత్తుతో ముడిపెట్టి చావోరేవోగా పరిగణిస్తోంది. ప్రత్యర్థుల మౌత్ టాక్‌కు అడ్డకట్ట వేసి ఎదురుదాడితో ఓటర్లను ఆకర్షించే విధంగా ప్రయత్నాలు చేస్తోంది. ప్రధానంగా రెండేళ్లలో ఆరు గ్యారంటీల బాకీ కార్డు ప్రయోగిస్తోంది. అధికారం కోల్పోయిన తర్వాత రెండో ఉప ఎన్నిక కావడంతో కంటోన్మెంట్ మాదిరిగా కాకుండా సిట్టింగ్ స్థానం పదిలం చేసుకొని పార్టీ బంగారు భవిష్యత్‌కు సంకేతం ఇవ్వాలని భావిస్తోంది. మూడు పర్యాయాలు ప్రాతినిధ్యం వహించిన సిట్టింగ్ స్థానం కావడంతో సానుభూతితో గట్టి ఓటు బ్యాంక్ పదిలపర్చుకునేందుకు వ్యూహాత్మకంగా పావులుకదుపుతోంది. పార్టీ యంత్రాంగాన్ని మొత్తం రంగంలో దింపి రెండేళ్ల కాంగ్రెస్ వైఫల్యాలను ప్రధాన ప్రచారా్రస్తాలుగా సంధిస్తోంది. పట్టు కోసం కమలదళం జూబ్లీహిల్స్‌లో పాగా వేసేందుకు బీజేపీ సర్వశక్తులూ ఒడ్డుతోంది. ప్రధాని మోదీ చరిష్మా, హిందూత్వ ఎజెండా ప్రయోగిస్తూ ఓటర్లను ఆకర్షించే పనిలో పడింది. రాష్ట్రంలో టార్గెట్– 2028గా పావులు కదుపుతున్నా... పత్యర్థులకు దీటుగా ప్రచారంలో మాత్రం వెనుకబడినట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని అసెంబ్లీ సెగ్మెంట్ కావడంతో ఎన్నికల ప్రచారాన్ని తన భుజస్కంధాలపై వేసుకున్నారు. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, మజ్లిస్‌తో కాంగ్రెస్ మిలాఖత్‌పై ప్రచారంతో ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డారు. -
కలల తీరం చేరకుండానే కడతేరిపోయారు
హైదరాబాద్: కోఠిలోని చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఈ యూనివర్సిటీకి చెందిన ముగ్గురు విద్యారి్థనులు చేవెళ్ల బస్సు ప్రమాద ఘటనలో మృత్యువాత పడటంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా తాండూరుకు చెందిన ఎల్లయ్య గౌడ్ కుమార్తెలు సాయి ప్రియ మహిళా యూనివర్సిటీలో ఎంఎస్డీఎస్, నందిని ఎంపీసీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. తమ బంధువుల పెళ్లి ఉండడంతో తాండూరు వచ్చి అనంతరం కళాశాలకు తిరిగి వెళ్తున్న క్రమంలో బస్సు చేవెళ్లలో బస్సు ప్రమాదంలో బలయ్యారు. ఈ ప్రమాదంలో వీరితో పాటు ఇదే యూనివర్సిటీలో బీకాం హానర్స్ ఫైనల్ ఇయర్ చదువుతున్న తాండూరుకు చెందిన ముస్కాన్ అనే విద్యార్థిని సైతం మృత్యువాత పడింది. మహిళా విశ్వవిద్యాలయానికి చెందిన ముగ్గురు విద్యారి్థనులు బస్సు ప్రమాదంలో మృతి చెందడంతో తోటి విద్యారి్థనులు కన్నీటి పర్యంతమయ్యారు. విశ్వవిద్యాలయం వైస్‌చాన్సలర్ ప్రొఫెసర్ సూర్య ధనుంజయ్, ప్రిన్సిపల్ లోక పావని, అధ్యాపకులు సంతాపం వెలిబుచ్చారు. -
ఐఫోన్ కోసం వచ్చి.. అనంత లోకాలకు
భార్యను ఆస్పత్రికి తీసుకెళ్తున్న భర్త.. పిల్లల వైద్యం కోసం తండ్రి.. అక్షర యాత్రకు బయలుదేరిన ఓ చదువుల తల్లి.. జీవనపోరాటంలో ఆకలి తీర్చుకునేందుకు శ్రమను వెతుక్కుంటూ ప్రయాణిస్తున్న మరెన్నో జీవితాలు.. క్షణ కాలంలో విధి ఆడిన వింత నాటకంలో సజీవ సమాధి అయ్యాయి. మీర్జాగూడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వారిలో ఒక్కొక్కరిదీ ఓ కన్నీటి గాథ. కన్నవారిని దూరం చేసుకున్న కుటుంబాలు శోక సంద్రంలో మునిగాయి. ఐఫోన్ కోసం వచ్చి .. అనంత లోకాలకు యాలాలకు చెందిన అలివేలుకు ఓ కొడుకు, కూతురు సంతానం. ఆమె కూతురు అఖిల (22) మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో బీఎస్సీ పూర్తి చేసింది. నాలుగు నెలల క్రితం నగరంలోని నానక్‌రాంగూడలో ఉన్న ఓ ప్రైవేటు కళాశాలలో పీజీడీఎం కోర్సులో చేరింది. ఆమె చదువు కోసం తల్లి ఇటీవలే రూ.12లక్షలు ఫీజు చెల్లించింది. రెండు రోజుల క్రితం కూతురుకు ఐఫోన్ ఇప్పిస్తానని చెప్పడంతో అఖిల స్వగ్రామానికి వచ్చింది. కొత్త ఫోన్ తీసుకుని బస్సు ఎక్కిన ఆ యువతి అంతలోనే అనంత లోకాలకు వెళ్లింది. తల్లి రోదనలకు అంతులేకుండా పోయింది. కళ్లెదుటే తండ్రి సజీవ సమాధి దౌల్తాబాద్ మండలం ఈటూరుకు చెందిన హన్మంతు (35) కుమారుడు హర్షవర్ధన్ కొంత కాలంగా చెవి సమస్యతో బాధపడుతున్నాడు. ఈ కారణంగా పాఠశాలలో ఎన్సీసీ విభాగంలోకి తీసుకోవడంలేదని నగరంలోని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు బస్సు ఎక్కాడు. మార్గ మధ్యలో టిప్పర్ ఢీకొట్టడంతో కొడుకు పక్కనే కూర్చున్న హన్మంతు ఒక్కసారిగా పక్కకు పడిపోయాడు. ఆయనపై మరో ముగ్గురు ప్రయాణికులు పడ్డారు. వారు తేరుకునేలోగా టిప్పర్‌లో ఉన్న కంకర వారిపై పడటంతో హర్షవర్ధన్ కళ్లెదుటే తండ్రి సజీవ సమాధి అయ్యాడు. తల్లి మృతి.. తండ్రి ఐసీయూలోలాలించిన తల్లి తనువు చాలించింది.. నాన్న ఐసీయూలో చేరాడు.. ఏం చేయాలో తోచక చిన్నారులు రోదిస్తున్న తీరు అందరి హృదయాలను కలిచి వేసింది. తాండూరుకు చెందిన అబ్దుల్ మాజీద్ భార్య తబస్సుమ్ కొంత కాలంగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతోంది. దీంతో అబ్దుల్ మాజీద్ భార్య, పిల్లలు మతీన్, ముకురం, మైవిష్తో కలిసి హైదరాబాద్‌లోని ఆస్పత్రికి బయలుదేరారు. ఈ ప్రమాదంలో తబస్సుమ్పై కంకర పడి కన్నుమూయగా.. మాజీద్ తీవ్రగాయాలతో చేవెళ్ల పట్నం మహేందర్‌రెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.వికారాబాద్ ఆస్పత్రిలో చికిత్స అనంతగిరి: బస్సు ప్రమాదంలో గాయపడిన పలువురిని వికారాబాద్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 10మందిని తరలించగా వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌కు రెఫర్ చేశారు. పట్టణంలోని ఈషా ఆస్పత్రిలో ఇద్దరు చికిత్స పొందారు. టిప్పర్ ఓనర్ లక్ష్మణ్ తలకు తీవ్ర గాయాలు కాగా నగరానికి రెఫర్ చేశారు. ప్రమాదంలో అబ్దుల్లా చేయి, సుమయకు కాలు విరిగింది. సయ్యద్ అస్మాకు తలకు, సఫీ, సయ్యద్ అస్మా, తౌసురా, సోమయ్య, సప్న, ప్రవీణ గాయపడ్డారు. 8 మంది ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈషా ఆస్పత్రిలో పవన్, వాహీద్ చికిత్స పొందుతున్నారు. శోకసంద్రంలో పేర్కంపల్లి యాలాల: ప్రమాదంలో ముగ్గురు అక్కాచెల్లెళ్లు తనూష, సాయిప్రియ, నందిని మృతి చెందడంతో వారి స్వగ్రామం పేర్కంపల్లి శోక సంద్రంలో మునిగిపోయింది. పేర్కంపల్లికి చెందిన ఎల్లయ్యగౌడ్ కుటుంబం కొన్నేళ్ల క్రితం తాండూరుకు వెళ్లి íస్థిరపడింది. వారికి గ్రామంలో మూడెకరాల భూమి ఉంది. గ్రామానికి తరచూ వచ్చి వెళ్తుంటారు. కూతుళ్లను ఉన్నత చదువులు చదివించేందుకు ఊరు విడిచి మృతదేహాలతో గ్రామానికి వచ్చావా అంటూ ఎల్లయ్యగౌడ్ను చూసిన మహిళలు కన్నీటి పర్యంతమయ్యారు. ముగ్గురి అంత్యక్రియలు సాయంత్రం నిర్వహించారు. -
తెలుగు రాష్ట్రాల్లో ఒకే రోజు మూడు ప్రమాదాలు
సాక్షి, శ్రీసత్యసాయి జిల్లా: తెలుగు రాష్ట్రాల్లో వరుస బస్సు ప్రమాదాలు హడలెత్తిస్తున్నాయి. ఒకే రోజు మూడు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఏపీలోని సత్యసాయి జిల్లాలో ఐచర్ వాహనాన్ని ట్రావెల్స్ బస్సు ఢీకొంది. హైదరాబాద్ - బెంగళూరు జాతీయ రహదారిపై జరిగిన ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, 8 మంది గాయపడ్డారు. వారిని ఆసుపత్రి కి తరలించారు. రాప్తాడు నియోజకవర్గం చెన్నేకొత్తపల్లి మండలం దామాజిపల్లి వద్ద ఘటన జరిగింది.నల్లగొండ జిల్లా: వేములపల్లి మండలం బుగ్గుబావిగూడెం వద్ద ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కావలి నుంచి హైదరాబాద్ వెళ్తున్నచెర్రీ ట్రావెల్స్ బస్సు నార్కెట్ పల్లి -అద్దంకి హైవే పై ట్రాక్టర్ ను డికొట్టింది. బస్సు వెనుక నుంచి ఢీకొట్టడంతో రోడ్డుపై ట్రాక్టర్ పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఐదు మందికి గాయాలయ్యాయి. ప్రమాదంలో గాయపడిన వారిని మిర్యాలగూడ ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 45 A మంది ప్రయాణికులు ఉన్నారు.కరీంనగర్ జిల్లా: తిమ్మాపూర్ మండలం రేణికుంట బ్రిడ్జి రాజీవ్ రహదారిపై వడ్ల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్‌ను ఆర్టీసీ బస్సు వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సులో ఉన్న 15 మంది గాయపడ్డారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్ఐ క్షతగాత్రులను అంబులెన్స్‌లో కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. మెట్పల్లి డిపోకి చెందిన బస్సు.. హైదరాబాద్‌నుంచి మెట్టుపల్లికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. -
ఘోర ప్రమాదం..ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన కంకర టిప్పర్ 19 మంది మృతి.
-
వంకర.. టింకర.. కంకర..
సాక్షి, హైదరాబాద్: పాము మెలికల్లా వంకర తిరిగిన ఇరుకు రహదారి.. అత్యంత ప్రమాదకరంగా దూసుకుపోయే వాహనాలు.. పరిమితికి మించి 50 నుంచి 80 టన్నుల లోడుతో లారీల రాకపోకలు. అడుగడుగునా గుంతలు.. ఇదీ హైదరాబాద్ తాండూరు రహదారి పరిస్థితి. సోమవారం ఉదయం చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద ఘోర ప్రమాదం జరిగి 19 మంది ప్రయాణికుల ప్రాణాలు పోవటానికి ఈ రహదారి దుస్థితే కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ రహదారిపై తాండూరు, వికారాబాద్ ప్రాంతాల ప్రజలు నిత్యం హైదరాబాద్‌కు రాకపోకలు సాగిస్తుండటంతో రద్దీ భారీగా పెరిగింది. రద్దీకి తగినట్టుగా రహదారి విస్తరణకు నోచుకోకపోవటంతో ఈ రహదారిపై ప్రయాణించాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పోవాల్సి వస్తోందని అక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 110 కిలోమీటర్లు.. లక్షల్లో గుంతలు హైదరాబాద్ బీజాపూర్ జాతీయ రహదారిలో పోలీస్ అకాడమీ (అప్పా) జంక్షన్ నుంచి వికారాబాద్ జిల్లా మన్నెగూడ వరకు, మన్నెగూడ నుంచి వికారాబాద్ మీదుగా తాండూరు వరకు సుమారు 110 కిలోమీటర్ల వరకు దూరం ఉంటుంది. ఈ దారిలో మొయినాబాద్ వరకు డివైడర్‌తో నాలుగు వరుసలుగా రహదారి ఇప్పటికే విస్తరించి ఉంది. మొయినాబాద్ నుంచి చేవెళ్ల, మన్నెగూడ వరకు పాము వంకలు తిరిగినట్లు ఉంటుంది. కొన్ని దశాబ్దాల క్రితం అప్పటి అవసరాల మేరకు ఈ రహదారిని నిర్మించారు.ప్రస్తుతం వాహనాల సంఖ్య గణనీయంగా పెరిగినా విస్తరణకు నోచుకోలేదు. తాండూరు నుంచి సిమెంట్ ట్యాంకర్లు, బండలు, పెద్దేముల్ నుంచి సుద్ద, వికారాబాద్, మర్పల్లి, మోమిన్‌పేట్, నవాబ్‌పేట్ ప్రాంతాల నుంచి ఎర్రమట్టి లారీలు రోజుకు సుమారు 1,500 వరకు ఈ రోడ్డుపై ప్రయాణిస్తాయి. ఈ వాహనాల్లో పరిమితికి మించి ఓవర్‌లోడ్ సర్వసాధారణం. సుమారు 50 నుంచి 80 టన్నుల లోడుతో వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. రవాణా శాఖ అధికారులకు ఈ విషయం తెలిసినా చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.ఓవర్‌లోడ్ వాహనాల కారణంగా రహదారిపై లక్షల సంఖ్యలో గుంతలు ఏర్పడ్డాయి. కొన్నిచోట్ల అడుగు నుంచి రెండు అడుగుల లోతు గుంతలు ఏర్పడ్డాయి. రాత్రి సమయంలో వాహనం దగ్గరకు వచ్చేవరకు ఈ గుంతలు కనిపించవు. దీంతో ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయి. వాహనాలు వెళ్లలేని పరిస్థితి ఉండటంతో కొన్నిసార్లు లారీల సిబ్బందే తాండూరు బండల వ్యర్థాలు, సిమెంటు ట్యాంకర్లలో మిగులును పోసి పూడ్చుతున్నారు. చాలాచోట్ల రోడ్డు కంకర తేలి కనిపిస్తోంది. పెరిగిన వ్యక్తిగత వాహనాలు వికారాబాద్ జిల్లా నుంచి నిత్యం హైదరాబాద్‌కు విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, ఇతర అవసరాలకు వేలాది మంది ప్రయాణాలు సాగిస్తున్నారు. వీరి అవసరాలకు సరిపడా ఆర్టీసీ బస్సులను నడపటంలేదని ఆ ప్రాంత ప్రజలు అంటున్నారు. ఎప్పుడో ఒకసారి వచ్చే బస్సులోనే పరిమితికి మించి 60 నుంచి 90 మంది వరకు ఎక్కి ప్రయాణిస్తున్నారు. ఈ కష్టాలు పడలేనివారు వ్యక్తిగత వాహనాలపై ప్రయాణిస్తున్నారు. దీంతో ఈ రహదారిపై వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది. నిధులున్నా నీరసమే.. తాండూరు నుంచి వికారాబాద్ వరకు 40 కిలోమీటర్ల దహదారి విస్తరణకు 2018 ఎన్నికల కంటే ముందే నిధులు మంజూరయ్యాయి. కానీ, నేటికీ పనులు అసంపూర్తిగానే ఉన్నాయి. వర్షాకాలంలో ఈ రహదారిపై ప్రయాణించటం నరకమేనని ఆ ప్రాంత ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వికారాబాద్ నుంచి మన్నెగూడ వరకు పది కిలోమీటర్లు రోడ్డు వేసినా పనుల్లో నాణ్యతా లోపాలు వెక్కిరిస్తున్నాయి. మన్నెగూడ నుంచి అప్పా వరకు 55 కిలోమీటర్లు జాతీయ రహదారుల పరిధిలో ఉంది. దీన్ని 4 వరుసల రహదారిగా అభివృద్థి చేయడానికి ఐదేళ్ల క్రితం రూ.925 కోట్లు మంజూరైనా పనులు మాత్రం పూర్తికాలేదు. వికారాబాద్ జిల్లా నుంచి ఔటర్ రింగ్ రోడ్డుకు నిత్యం వేల సంఖ్యలో సరుకు రవాణా వాహనాలు వస్తున్నాయి. అయితే, అవి నిబంధనల మేరకే ఉన్నాయా? లేవా? అనే తనిఖీలు ఎక్కడా కనిపించడంలేదు. -
తెలంగాణ ఆర్టీసీ చరిత్రలో రెండో అతిపెద్ద దుర్ఘటన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ చరిత్రలో భారీ ప్రాణ నష్టం సంభవించిన రెండో అతిపెద్ద ప్రమాదం ఇది. చేవెళ్ల సమీపంలో ఆర్టీసీ అద్దె బస్సును టిప్పర్ ఢీకొన్న ప్రమాదంలో 19 మంది చనిపోయిన విషయం తెలిసిందే. 2018 సెప్టెంబరు 11న కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయం నుంచి ఘాట్ రోడ్డు మీదుగా వస్తున్న ఆర్టీసీ బస్సు అదుపు తప్పి దిగువకు దొర్లిపోవటంతో ఏకంగా 64 మంది చనిపోయారు. ఇదే ఆర్టీసీ చరిత్రలో అతిపెద్ద దుర్ఘటన. ఆ తర్వాత అంతమంది చనిపోయింది మాత్రం సోమవారం నాటి ప్రమాదంలోనే. ⇒ 2013 అక్టోబరు 30న మహబూబ్‌నగర్ జిల్లా పాలెం సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు బెంగళూరు నుంచి వస్తూ డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల కల్వర్టు గోడను ఢీకొని అగ్నికి ఆహుతైన దుర్ఘటనలో 45 మంది చనిపోయారు. తెలంగాణ ఆవిర్భావానికి కొన్ని నెలల ముందు జరిగిన ఈ ఘటనలో ప్రమాదానికి గురైంది ప్రైవేటు బస్సు. అది దేశ చరిత్రలోనే భారీ ప్రమాదాల్లో ఒకటికొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయం నుంచి జగిత్యాల వైపు వెళ్తున్న ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు లోయలోకి పడిపోయిన దుర్ఘటన దేశ చరిత్రలోనే అతిపెద్ద ప్రమాదాల్లో ఒకటిగా నిలిచింది. దాదాపు 12 లక్షల కిలోమీటర్లు తిరిగిన పాత డొక్కు బస్సును నడపటం పెను ప్రమాదానికి కారణమైంది. దేవాలయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో, ఈ బస్సులో 104 మంది ఎక్కారు. నిరోధించాల్సిన డ్రైవర్, కండక్టర్లు అధిక టికెట్ ఆదాయం ఆశతో నియంత్రించలేదు.రెగ్యులర్‌గా దిగాల్సిన మార్గంలో కాకుండా తక్కువ దూరం ఉండే మరో నిషేధిత మార్గంలో డ్రైవర్ నడిపారు. ఓవర్ లోడ్, పాత డొక్కు బస్సు, ప్రమాదకర మార్గం... అన్ని లోపాలు వెరసి బస్సు అదుపు తప్పి లోయలోకి జారిపోయింది. ఆ తర్వాత ఎక్కువ ప్రాణనష్టం జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదం సోమవారం చేవెళ్ల సమీపంలో చోటు చేసుకున్నదే. ⇒ 2016లో ఖమ్మం జిల్లా నాయకునిగూడెం వద్ద కెనాల్లోకి ఓ ప్రైవేటు బస్సు దూసుకెళ్లిన దుర్ఘటనలో 10 మంది ప్రయాణికులు మృతి చెందారు. -
బీజేపీనే కింగ్: కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ కింగ్ మేకర్‌గా మిగలబోదని, కింగ్ గానే విజయం సాధిస్తుందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గత లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరి కాకుండా ఈ ఉప ఎన్నికలో త్రిముఖ పోటీ జరగనున్నందున, బీజేపీ అభ్యర్థి దీపక్‌రెడ్డి గెలుస్తారనే నమ్మకం తమకుందన్నారు. సికింద్రాబాద్ ఎంపీగా జూబ్లీ హిల్స్‌లో పార్టీ విజయానికి తనదే బాధ్యత అని, తెలంగాణలో రాజకీయాలకు బీజేపీ కేంద్ర బిందువుగా మారబోతోందని అన్నారు. ఎన్డీఏ భాగస్వామ్యపక్షాలైన టీడీపీ, జనసేన కార్యకర్తలు, సానుభూతిపరులు ఈ నియోజకవర్గంలో బీజేపీకి మద్దతు తెలిపారని చెప్పారు. సోమవారం కిషన్‌రెడ్డి బీజేపీ కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి ఈ ఉప ఎన్నికకు పాకిస్తాన్‌కు ముడిపెట్టడం ఏమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్ సర్కార్ ఫ్రీ బస్సు తప్ప ఇంకే హామీ అమలు చేయలేదని, అలాంటిది కాంగ్రెస్‌ను గెలిపించకపోతే సంక్షేమ పథకాలు ఆపేస్తామని సీఎం బెదిరించడం ఏమిటని నిలదీశారు. ఆరు గ్యారంటీలు, 421 హామీలను అమలు చేయని రేవంత్‌ను ప్రజలెందుకు నమ్మాలని ప్రశ్నించారు. మరో 500 రోజుల్లో కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారని కేటీఆర్ పగటి కలలు కంటున్నారన్నారు. తెలంగాణలో ఇక బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయినట్టేనని వ్యాఖ్యానించారు. మహిళలు రోజూ పొద్దున్నే పనులు పూర్తి చేసుకుని ‘విండో షాపింగ్’(ఏమీ కొనకుండానే) చేసి తిరిగి వచ్చేందుకు ఉచిత బస్సు సదుపాయం ఉపయోగపడుతోందన్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందన్నారు. ఏప్రిల్ 1 నుంచి జనగణన షురూ.. వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా జనగణన మొదలై 2027 ఫిబ్రవరి 28న ముగుస్తుందని సెన్సెస్ కమిషనర్ ప్రకటించారని కిషన్‌రెడ్డి తెలిపారు. తొలిదశలో ఇళ్ల వారీగా జనాభా లెక్కలు, కులాల వారీగా సమాచారం సేకరిస్తారని, వ్యక్తిగత సమాచారాన్ని డిజిటల్‌గా పంపించే వీలు కూడా కల్పిస్తున్నారని చెప్పారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ టికెట్‌పై గెలిచిన వారికి మంత్రి పదవి ఇచ్చిన పార్టీ నేత కేటీఆర్.. ఫిరాయింపులపై కొత్త భాష్యం చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. కాగా, ఖైరతాబాద్ స్థానంలోనూ ఉప ఎన్నిక రావాలని కోరుకుంటున్నామన్నారు. రాష్ట్రంలో ఫోన్‌ట్యాపింగ్ వ్యవహారంపై హైకోర్టులో తమ పార్టీపరంగా కేసు దాఖలు చేశామని తెలిపారు. ప్రైవేట్ కాలేజీలకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల్లో మొదటి విడత ఇస్తామన్న రూ.600 కోట్లు వెంటనే ఇవ్వాలని కిషన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
అప్పుడే ‘డిజైన్’ మార్చి ఉంటే..
నవంబర్ 3: బీజాపూర్ జాతీయ రహదారిపై అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు 46 కి.మీ. నిడివి మేర రోడ్డును నాలుగు వరుసలుగా విస్తరించుకునేందుకు జాతీయ హరిత ట్రిబ్యునల్ పచ్చజెండా ఊపిన రోజు. విస్తరణకు అడ్డుగా ఉన్న మర్రి వృక్షాలను కాపాడాలంటూ వృక్ష ప్రేమికులు వేసిన కేసు ఆధారంగా ఇచ్చిన స్టేను తొలగించేందుకు సమ్మతించిన రోజు. ఇక రోడ్డు విస్తరణతో ఆ రోడ్డుపై జరుగుతున్న భారీ ప్రాణ నష్టాన్ని భారీగా తగ్గించే వీలుంటుందని సంబరం వ్యక్తమైన రోజు.. కానీ, సరిగ్గా అదేరోజు అదే రోడ్డుపై ఏకంగా 19 మందిని ఘోర ప్రమాదం పొట్టనపెట్టుకున్న రోజు.సాక్షి, హైదరాబాద్: ఎన్హెచ్ఐఏ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రోడ్డు విస్తరణకు చొరవ చూపని కారణంగా, నిర్లక్ష్యంగా కాలయాపన చేసిన ఫలితంగా గత ఆరేళ్లలో 273 నిండుప్రాణాలను ఆ రోడ్డు బలితీసుకుంది. 2014 నుంచి పరిశీలిస్తే మరో 90 మంది చనిపోయినట్టు పేర్కొంటున్నారు. అది పేరుకే జాతీయ రహదారి.. కానీ, ఎక్కడా దానికి ఆ లక్షణం మాత్రం కనిపించదు. రోజురోజుకూ ట్రాఫిక్ పెరుగుతున్నా ఇప్పటికీ అది సెంట్రల్ మీడియన్ లేని సాధారణ డబుల్ రోడ్డు మాత్రమే. చేవెళ్ల జాతీయ రహదారిని నాలుగు వరుసలకు విస్తరించాలనే ప్రయత్నం దశాబ్దకాలంగా ‘సా..గు’తూనే ఉంది. అదేదో ముందే చేసి ఉంటే.. విస్తరణలో కొట్టేయకుండా ఆ రోడ్డుపై ఉన్న 915 మర్రి వృక్షాలను కాపాడేందుకు స్పష్టమైన హామీ ఇవ్వాలంటూ పర్యావరణ ప్రేమికులు ఎన్జీటీని ఆశ్రయించి ఆరేళ్లయినా సమస్యకు పరిష్కారం చూపకుండా ఎన్హెచ్ఏఐ నిర్లక్ష్యంగా వ్యవహరించింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ద్వారా ఎన్హెచ్ఏఐ అధికారులపై ఒత్తిడి చేయించటంతో సమస్య పరిష్కారానికి వీలుగా ప్రత్యామ్నాయ విస్తరణ డిజైన్‌ను రూపొందించారు. కేసు దాఖలు చేసిన పర్యావరణ ప్రేమికులు కూడా ఆ డిజైన్‌కు మద్దతు తెలపటంతో ఎన్జీటీలో కేసు సులభంగా తేలిపోయింది. ఈ చొరవను ముందే తీసుకుని ఉంటే, ఇన్నేళ్లలో జరిగిన ప్రాణనష్టం భారీగా తగ్గిఉండేది. సోమవారం నాటి ఘోర ప్రమాదం కూడా తప్పి ఉండేదేమో. ప్రణాళిక లేని ఎన్హెచ్ఏఐ మర్రి వృక్షాలను ట్రాన్స్‌లొకేట్ చేస్తామన్న గాలి మాటలు తప్ప, పక్కా ప్రణాళికను ఎన్హెచ్ఏఐ ఎన్జీటీకి అందించలేకపోయింది. ఇలాంటి విస్తరణ సమయాల్లో పర్యావరణంపై ఉండే ప్రభావం అంచనాకు అధ్యయనం కూడా నిర్వహించాలి. దాన్ని కూడా చేపట్టకపోవటంతో ఎన్జీటీ మొట్టికాయలు వేయాల్సి వచ్చింది. ఆ తర్వాత ఓ స్టడీ నిర్వహించినా, అది ప్రభావవంతంగా లేనందున మళ్లీ నిర్వహించాలని ఎన్జీటీ ఆదేశించాల్సి వచ్చిందంటే ఎన్హెచ్ఏఐ నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో ఊహించొచ్చు. ఇటీవల రాష్ట్రప్రభుత్వం ఒత్తిడి తెచ్చే వరకు ఆ నిర్లక్ష్యం కొనసాగింది.ఏడాదిన్నరలో పూర్తి చేసేలా చర్యలు ఎన్జీటీలో కేసు కొలిక్కి వచ్చినందున వెంటనే రోడ్డు నిర్మాణాన్ని ప్రారంభించేలా ఎన్హెచ్ఏఐపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తెస్తోంది. ప్రతి 10 కి.మీ.కు ఓ బృందాన్ని ఏర్పాటుచేసి ఒకే సమయంలో అన్ని ప్రాంతాల్లో నిర్మాణ పనులు కొనసాగేలా చూడాలని నిర్మాణ సంస్థకు ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఫలితంగా... రెండేళ్లలో పూర్తి కావాల్సిన రోడ్డు విస్తరణను ఏడాదిన్నరలో పూర్తిచేసేలా చూస్తాం. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్మాణ సంస్థ ప్రతినిధులతో మాట్లాడారు. ఇక రోడ్డు విస్తరణలో జాప్యం ఉండదు. - రామ్మోహన్‌రెడ్డి, పరిగి ఎమ్మెల్యే -
లంచమిస్తే ఓవర్లోడ్కూ రైట్‌రైట్!
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలోని మీర్జాగూడ వద్ద సోమవారం ఆర్టీసీ బస్సును టిప్పర్ ఢీకొట్టిన ఘోర దుర్ఘటన రాష్ట్రంలో ఓవర్‌లోడ్‌తో భారీ వాహనాలు యథేచ్ఛగా తిరుగుతున్న ఉదంతాన్ని కళ్లకు కట్టింది. తెలంగాణవ్యాప్తంగా భారీ సరుకు రవాణా వాహన యజమానుల కాసుల కక్కుర్తి, రవాణా అధికారుల మామూళ్ల మత్తు ఏ స్థాయిలో ఉంటోందో చెప్పకనే చెప్పింది. యమదూతల్లా టిప్పర్లు.. హైదరాబాద్‌లో నిర్మాణ రంగం శరవేగంగా విస్తరిస్తుండటంతో ఇసుక, కంకర, ఇటుకలు, నిర్మాణ వ్యర్థాలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఈ అవసరాన్ని సొమ్ము చేసుకొనేందుకు ట్రాన్స్పోర్ట్ మాఫియా.. కొందరు రాజకీయ నేతల అండదండలతో నిబంధనలను తుంగలో తొక్కుతోంది. ప్రధానంగా హైదరాబాద్ శివారు జిల్లాలైన రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, మహబూబ్‌నగర్, నల్లగొండ నుంచి నిర్మాణ సామగ్రితో టిప్పర్లు, లారీలు ఓవర్‌లోడ్, ఓవర్ స్పీడ్‌తో యమదూతల్లా ప్రయాణిస్తూ తరచూ ప్రమాదాలకు కారణమవుతున్నాయి. నిబంధనలు గాలికి.. రాష్ట్రంలో ఏ రకం ట్రక్కు లేదా లారీ ఎంత బరువు మోసుకెళ్లాలో నిబంధనల్లో పొందుపరిచారు. ట్రక్కు తయారీ కంపెనీలు ఆయా ట్రక్కుల బరువు మోసే సామర్థ్యాన్ని విడుదల చేస్తున్న నేపథ్యంలో ఆ వివరాలను లెక్కలోకి తీసుకొని ట్రక్కుల సామర్థ్య పరిమితులను ఖరారు చేశారు. ఆ మేరకు సింగిల్ యాక్సల్ (ఒక టైరు) 3 టన్నులు, సింగిల్ యాక్సల్ (2 టైర్లు) 6 టన్నులు, సింగిల్ యాక్సల్ (4 టైర్లు) 10.2 టన్నులు.రెండు యాక్సల్ (8 టైర్లు) 19 టన్నులు, మూడు యాక్సల్ (12 టైర్లు) 24 టన్నుల బరువును మోసుకెళ్లవచ్చు. కానీ రాష్ట్రంలో పరిమితికి మించి రెండు రెట్ల బరువును మోసుకెళ్తూ ట్రక్కులు భయానక వాతావరణం సృష్టిస్తున్నాయి. ట్రక్కుల వేగం, అవి మోసుకెళ్లే బరువుపై నియంత్రణ కొరవడడం రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణమవుతున్నాయి. దీనికితోడు రోడ్ల నిర్మాణంలో లోపాలు ఈ నిబంధనల ఉల్లంఘనకు తోడవడంతో తరచూ భారీ ప్రమాదాలు జరిగి ప్రాణనష్టం సంభవిస్తోంది. కాసుల వేటలో అధికారులు.. ట్రక్కులు, లారీల యజమానులు నిబంధనల ఉల్లంఘనకు పాల్పడుతున్నా చాలా మంది రవాణా శాఖ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడంలేదు. పైపెచ్చు ట్రక్కుల యజమానుల నుంచి వసూళ్లకు తెగబడుతూ వాటిని యథేచ్ఛగా వదిలేస్తున్నారు. సోమవారం ప్రమాదానికి కారణమైన ట్రక్కులో 50 టన్నులకుపైగా బరువుగల కంకర ఉన్నట్లు తెలిసింది. వాస్తవానికి నిబంధనలు ఉల్లంఘించే ట్రక్కుల యజమానులపై భారీ పెనాల్టీలు, వరుస ఉల్లంఘనలకు పాల్పడితే వారి పర్మిట్లు రద్దు చేసే అధికారం రవాణా అధికారులకు ఉంది.అలాగే ఓవర్‌లోడ్ వాహనాలు నడిపే డ్రైవర్ల లైసెన్సులను కూడా రద్దు చేసే అవకాశం ఉంది. కానీ రాష్ట్రంలో అలాంటి పరిస్థితులు నామమాత్రంగానే కనిపిస్తున్నాయి. కొన్ని మినహా దాదాపు అన్ని ట్రక్కులు నిబంధనలను ఉల్లంఘిస్తున్నా కేసులు మాత్రం అక్కడక్కడా నమోదవుతుండటం చూస్తే రవాణాశాఖ అధికారుల కాసుల కక్కుర్తి ఏ స్థాయిలో ఉందో తెలుస్తుంది. కేవలం ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే రవాణా అధికారులు తూతూమంత్రంగా తనిఖీలు చేసి ఆ తర్వాత చేతులు దులుపుకుంటున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ కారణాలతోనే.. ఒకే ట్రిప్పులో ఎక్కువ లోడ్ తరలించడం ద్వారా డీజిల్ ఖర్చును తగ్గించుకోవాలన్నది ట్రక్కు యజమానుల ఆలోచన. అలాగే ఏకకాలంలో ఎక్కువ లోడ్ తరలిస్తే తక్కువ సమయంలో భారీ మొత్తం సంపాదించే వీలుంటుంది. డ్రైవర్‌కు చెల్లించే మొత్తం కూడా తగ్గుతుంది. లారీల నిర్వహణ వ్యయం కూడా తక్కువగా ఉంటుంది. ఈ నాలుగు కారణాలతో ట్రక్కులు, లారీల యజమానులు నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు.శిక్షణ లేకుండానే స్టీరింగ్... భారీ ట్రక్కుల డ్రైవింగ్ లైసెన్సు పొందేందుకు తగిన శిక్షణ అవసరమన్నది రవాణా శాఖ నిబంధన. కానీ శిక్షణ లేకున్నా డబ్బు దండుకొని అధికారులు లైసెన్సులు జారీ చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్లకు శిక్షణ ఇచ్చే కేంద్రాలు ఉన్నప్పటికీ ట్రక్కు డ్రైవర్లకు శిక్షణ ఇచ్చే కేంద్రాలు మాత్రం లేవు. దీంతో బస్సు డ్రైవర్లకు శిక్షణ ఇచ్చే కేంద్రాల్లోనే ట్రక్కు డ్రైవర్లకు కూడా శిక్షణ ఇవ్వాలన్న ప్రతిపాదన తెరపైకి వచ్చింది. కానీ అది కార్యరూపం దాల్చాలంటే ఆ కేంద్రాల్లో సిబ్బంది సంఖ్యను పెంచాలి. అయితే జీతాల భారం భరించే స్థితిలో ఆర్టీసీ లేనందున ఆ భారం తిరిగి తమపైనే పడుతుందన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఆ ప్రతిపాదనకు ఆమోదం తెలపడంలేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.క్వారీల్లోనే కంట్రోల్ చేయాలి మైనింగ్ క్వారీల్లోనే ఓవర్ లోడ్‌ను నియంత్రిస్తే చాలా వరకు ప్రమాదాలు తగ్గుతాయి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. మేం మొదటి నుంచీ ఓవర్ లోడ్‌ను వ్యతిరేకిస్తున్నాం. కంకర, డస్ట్, ఇసుక, గృహ నిర్మాణ వ్యర్థాలను తరలించేటప్పుడు పైన టార్పాలిన్‌తో కప్పాలి. రవాణా అధికారులకు ఈ ఉల్లంఘనలు కనిపించకపోవడం శోచనీయం. - మంచిరెడ్డి రాజేందర్‌రెడ్డి, తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు -
మీర్జాగూడ రోడ్డు ప్రమాదంపై ప్రముఖుల సంతాపం
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద సోమవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 19 మంది మరణించటంపై రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని సహా పలువురు ప్రముఖలు తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి.. బస్సు ప్రమాదంలో అనేకమంది ప్రాణాలు కోల్పోవడం చాలా దురదృష్టకరం. మృతుల కుటుంబాలకు నా సానుభూతిని తెలుపుతున్నా. గాయపడిన ప్రయాణికులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా. – ద్రౌపదీ ముర్ము, రాష్ట్రపతి క్షతగాత్రులు కోలుకోవాలి.. మృతుల కుటుంబాలకు సంతాపం తెలుపుతున్నా. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుతున్నా. ఇంతమంది ప్రాణనష్టం బాధాకరంగా ఉంది. – సీపీ రాధాకృష్ణన్, ఉప రాష్ట్రపతి చాలా బాధాకరం.. ఈ క్లిష్ట సమయంలో మృతిచెందిన వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నా. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలి. మరణించిన వారి ప్రతి కుటుంబానికి పీఎంఆర్ఎఫ్ ద్వారా రూ.2లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.50వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందిస్తాం. – నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి ప్రమాదం దిగ్భ్రాంతికరం.. మీర్జాగూడ వద్ద జరిగిన ఘోర ప్రమాదంలో భారీగా ప్రాణనష్టం జరగటం దిగ్భ్రాంతి కలిగించింది. మృతుల కుటుంబాలను ఆదుకోవడంతో పాటు క్షతగాత్రులకు మెరుగైన వైద్య సదుపాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా. – కే.చంద్రశేఖర్‌రావు, బీఆర్ఎస్ అధినేత ఘటన కలచివేసింది..తెలంగాణలోని చేవెళ్ల వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం దిగ్భ్రాంతి కలిగించింది. ఈ ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరం.. ఈ ఘటన తీవ్రంగా కలచివేసింది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలి. ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలి. – వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు బాధిత కుటుంబాలకు సానుభూతి.. ఈ ప్రమాదం తీవ్రంగా కలిచివేసింది. మృతుల కుటుంబాలకు సానుభూతి. రోడ్డు భద్రతా ప్రమాణాలను కట్టుదిట్టం చేయాలి. ఇటువంటి దుర్ఘటనలు మళ్లీ జరగకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి. – జి.కిషన్‌రెడ్డి, కేంద్రమంత్రి అండగా ఉంటాం.. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే సీఎం రేవంత్‌రెడ్డితోపాటు మంత్రివర్గ సహచరులు వెంటనే స్పందించి ఇచి్చన ఆదేశాలతో యంత్రాంగం ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టింది. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది. – మల్లు భట్టి విక్రమార్క, డిప్యూటీ సీఎం బాధితులను ఆదుకోవాలి చేవెళ్ల వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం అత్యంత బాధాకరం. మృతుల కుటుంబాలను, గాయపడిన వారిని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను. – కే.తారకరామారావు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్మంత్రులు, ప్రముఖుల సంతాపం సాక్షి, హైదరాబాద్: ఈ ఘటన దురదృష్టకరమని, సన్నిహితులను కోల్పోయిన వారి కుటుంబాల కోసం దేవుని ప్రార్థిస్తున్నామని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్ ఓ ప్రకటనలో తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్యతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నానని, ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులు బాధితులకు అండగా ఉండాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ తెలిపారు. రంగారెడ్డి జిల్లా ఇన్చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డితో కూడా మాట్లాడి బాధితులకు అవసరమైన సాయం చేయాలని సూచించినట్టు ఆయన తెలిపారు.కాగా, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, వాకిటి శ్రీహరి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బాధితులకు అన్ని విధాలా అండగా ఉంటామని వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. ఇలాంటి దుర్ఘటనల కట్టడికి ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు కోరారు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందించేందుకు చేవెళ్లలోని పీఎంఆర్ జనరల్ ఆస్పత్రికి తరలించినట్టు శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి తెలిపారు.మీర్జాగూడ రోడ్డు ప్రమాదం తెలుసుకుని తీవ్ర ది్రగ్బాంతికి గురైనట్టు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో తెలిపారు. టిప్పర్లపై కవర్ కప్పేలా చర్యలు తీసుకోవాలని, అదే జరిగి ఉంటే చేవెళ్ల వద్ద ఇంతటి దుర్ఘటన జరిగి ఉండేది కాదని బీజేపీ ఎమ్మెల్సీ, తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సి.అంజిరెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
ఎస్ఎల్బీసీని పూర్తి చేస్తాం: సీఎం రేవంత్
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్/సాక్షి, నాగర్‌కర్నూల్: శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ) ప్రాజెక్టును ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఎట్టిపరిస్థితుల్లోనూ పూర్తిచేసి తీరుతామని.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. ఈ ప్రాజెక్టు కోసం ప్రపంచ స్థాయి అధునాతన సాంకేతిక పరిజ్ఙానాన్ని వినియోగిస్తామన్నారు. ఈ ప్రాజెక్టు కోసం అమ్రాబాద్ టైగర్ రిజర్వ్, కృష్ణా నది పక్క నుంచి సొరంగం తవ్వకం అత్యంత సవాల్‌తో కూడుకున్నదని.. ఇలాంటి ప్రాజెక్టు మరెక్కడా లేదన్నారు. మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలతో కలసి సోమవారం నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం మన్నెవారిపల్లి వద్ద ఎస్ఎల్బీసీ అవుట్లెట్ టన్నెల్ నుంచి హెలిబోర్న్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ సర్వేను సీఎం రేవంత్ ప్రారంభించారు. జాతీయ భూ¿ౌతిక పరిశోధనా సంస్థ (ఎన్జీఆర్ఐ) నిపుణుల ఆధ్వర్యంలో హెలికాప్టర్ ద్వారా చేపట్టిన సర్వేను పర్యవేక్షించిన అనంతరం సీఎం మీడియా సమావేశంలో మాట్లాడారు. రూ. 4,600 కోట్ల అంచనా వ్యయంలోనే సర్వే పనులతోపాటు ప్రాజెక్టును పూర్తి చేస్తామని తెలిపారు. కాంగ్రెస్‌కు పేరొస్తదనే ఎస్ఎల్బీసీ మూలకు.. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి 20 ఏళ్లయినా ఇప్పటివరకు పూర్తి కాలేదని సీఎం రేవంత్ చెప్పారు. 2004లో వై.ఎస్. రాజశేఖరరెడ్డి హయాంలో జలయజ్ఞం పేరిట ప్రాజెక్టు పురోగతిలోకి వచ్చినా ఆయన మరణం తర్వాత పనులు ఆగిపోయాయన్నారు. 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం 30 కి.మీ. మేర సొరంగ నిర్మాణం పూర్తి చేస్తే బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో 10 కి.మీ. కూడా పూర్తి చేయలేదని రేవంత్ విమర్శించారు. ఏడాదికో కి.మీ. చొప్పున పూర్తిచేసినా ఇప్పటికే ప్రాజెక్టు పూర్తయ్యేదన్నారు. కాంగ్రెస్‌కు పేరొస్తదని.. కమీషన్లు రావనే దురుద్దేశంతోనే కేసీఆర్ ఈ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేశారని రేవంత్ ఆరోపించారు. రాష్ట్రంలో ప్రాజెక్టుల పేరుతో కేసీఆర్ పాలనలో రూ. 1.80 లక్షల కోట్లు ఖర్చు చేశారని, అందులో రూ.1.03 లక్షల కోట్లను కాంట్రాక్టర్ల టెండర్లకే వెచ్చించారన్నారు. అయినా ఏ ఒక్క ప్రాజెక్టునూ పూర్తిచేయలేదని మండిపడ్డారు. కృష్ణాలో రాష్ట్రానికి 299 టీఎంసీలే చాలని కేసీఆర్, హరీశ్‌రావు సంతకాలు చేశారని సీఎం రేవంత్ ఆరోపించారు. దీంతో తెలంగాణకు నీటి వాటాపై అడిగేందుకు అవకాశం లేదని ఏపీ వాదిస్తే తాము సుప్రీంకోర్టు, ట్రిబ్యునళ్లలో వాదనలు వినిపిస్తున్నామని చెప్పారు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పటికీ పూర్తవదు.. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని సీఎం రేవంత్ అన్నారు. ముఖ్యమంత్రిగా తాను ఉమ్మడి పాలమూరు జిల్లాకు, మంత్రి ఉత్తమ్ నల్లగొండ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తుండటం వల్ల ఈ ప్రాజెక్టు పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని చెప్పారు. ఇప్పుడు కాకపోతే భవిష్యత్తులో ఇంకెప్పుడూ ఈ ప్రాజెక్టు పూర్తికాదన్నారు. తక్కువ ఖర్చుతోనే రోజుకు 3 టీఎంసీల నీటిని తరలించే ప్రాజెక్టు మరెక్కడా లేదన్నారు. ఈ ప్రాజెక్టుతో నల్లగొండ జిల్లాలోని 30 లక్షల మంది ప్రజలకు శాశ్వత పరిష్కారంతో 3 లక్షల ఎకరాలకు 3 టీఎంసీల నీరు అందుతుందన్నారు. తక్కువ ఖర్చుతో గొప్ప ప్రాజెక్టు: మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు అతితక్కువ ఖర్చుతో చేపట్టిన గొప్ప ప్రాజెక్టు అని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. సొరంగ తవ్వకం పూర్తికి సైన్యం, జాతీయ సంస్థల సేవలనూ వినియోగించుకుంటున్నట్లు చెప్పారు. ఇందుకోసం సైన్యానికి చెందిన సొరంగ నిపుణులు కల్నల్ పరీక్షిత్ మెహ్రా, హర్పాల్సింగ్లను రాష్ట్ర ప్రభుత్వ సలహదారులుగా డెప్యుటేషన్‌లో కేటాయించామన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం చొరవ తీసుకుని ఈ ప్రాజెక్టును పర్యవేక్షిస్తుండటం తమ అదృష్టమన్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ నిర్మాణం కోసం టీబీఎం పరికరాలు, బేరింగ్ తెప్పించేందుకు తాను అమెరికా వెళ్లానని చెప్పారు. కార్యక్రమంలో ఎన్జీఆర్ఐ డైరెక్టర్ ప్రకాశ్‌కుమార్, చీఫ్ సైంటిస్ట్ సత్యనారాయణ, ఎమ్మెల్యేలు చిక్కుడు వంశీకృష్ణ, బాలునాయక్, సీఈలు విజయ్‌భాస్కర్‌రెడ్డి, అనిల్‌కుమార్, తదితరులు హాజరయ్యారు. -
ఒక్క చాన్సిస్తేనే రాష్ట్రం భ్రష్టుపట్టింది.. మరో చాన్స్ కావాలా?: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: కారు–బుల్డోజర్కు మధ్య జరుగుతున్న పోటీలో పేదలపైకి బుల్డోజర్ రాకుండా ఉండాలంటే, హైడ్రా అనే రాక్షసి మాయం కావాలంటే జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కారు గుర్తునే గెలిపించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు పిలుపునిచ్చారు. పార్టీ అభ్యర్థి మాగంటి సునీతకు మద్దతుగా సోమవారం రాత్రి బోరబండలో ఆయన రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తన సీఎం కుర్చీ కాపాడుకునేందుకు మాత్రం రాహుల్‌గాందీకి, ఢిల్లీకి వందలు, వేల కోట్లు పంపే రేవంత్‌రెడ్డికి పేదల కోసం సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు మాత్రం పైసలుండవని దుయ్యబట్టారు. ఒక్క ఛాన్స్ అని మాట్లాడుతున్న రేవంత్‌రెడ్డికి రెండేళ్ల కింద ఒక్క ఛాన్సిచ్చినందుకే కదా ఏ ఒక్క పథకమూ అమలు కాకుండాపోయిందని ఎద్దేవా చేశారు. ఒక్క ఛాన్సిచ్చినందుకే రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారర్నారు. మళ్లీ ఏ ముఖం పెట్టుకొని ఒక్క ఛాన్స్ అడుగుతున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేయకుండా ఏ ఒక్కరినీ వదిలిపెట్టలేదని ధ్వజమెత్తారు. ఏ ఒక్క మాటా నిలబెట్టుకోలేదని, నంబర్‌వన్‌గా ఉన్న తెలంగాణ రాష్ట్రానికి అట్టర్‌ఫ్లాప్ అనే పేరొచ్చిందని మండిపడ్డారు. 700 మంది రైతులు చనిపోయే దుస్థితి ఏర్పడిందని, కౌలురైతులు, రైతు కూలీలను కూడా మోసగించారన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్‌కు, రేవంత్‌రెడ్డికి మరో ఛాన్సివ్వొద్దని పిలుపునిచ్చారు. హింస, అరాచకత్వంతో రెచ్చిపోతున్న కాంగ్రెస్ రౌడీయిజానికి జూబ్లీహిల్స్ నుంచే చరమగీతం పాడాలన్నారు. గల్లాపట్టి అమలు చేయిస్తాం బీఆర్ఎస్ను గెలిపిస్తే కాంగ్రెస్ గల్లా పట్టి సంక్షేమ పథకాలు అమలు చేయిస్తామని కేటీఆర్ హామీనిచ్చారు. తమను మోసగించినందుకు నిరుద్యోగులు పోటీచేస్తే వారిపై దాడులు చేస్తున్నారన్నారు. రాష్ట్రాన్ని లూటిఫికేషన్ చేయడం తప్ప నిరుద్యోగులకు నోటిఫికేషన్లు రాలేదన్నారు. మీఠా మాటలు చెప్పిన రాహుల్‌గాంధీ పత్తాలేడని విమర్శించారు. ‘ప్రజలు తలచుకుంటే హిట్లర్ వంటి వాళ్లేపోయారు. నువ్వెంత’అని సీఎంను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అభివృద్ధి పనులకు ప్రభుత్వం పైసలివ్వడం లేదని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే చెప్పారన్నారు. అందుకే ఎల్లారెడ్డి ఎమ్మెల్యే వంద కోట్లు కావాలని ప్రపంచబ్యాంకుకు దరఖాస్తు చేసుకున్నారన్నారు. కేసీఆర్ నాయకత్వాన్ని కోరుతున్నారు కులాలు, మతాలకతీతంగా అందరూ కేసీఆర్ నాయకత్వాన్ని కోరుతున్నారని కేటీఆర్ అన్నారు. కేసీఆర్, రేవంత్ పాలనను పోలుస్తూ కొన్ని ఉర్దూ కవితలతో ప్రజల్లో ఉత్సాహం రేకెత్తించారు. పథకాలు అమలు చేయని తీరు, హైడ్రా బాధితుల కడగండ్లు టీవీల ద్వారా ప్రదర్శించి చూపారు. ‘రేపు మీ బోరబండకి బుల్డోజర్ రాకుండా ఉండాలంటే కారునే గెలిపించాలి. మీకు అండగా బుల్డోజర్లకు అడ్డంగా పడుకుంటామ’ని అన్నారు. పార్టీ మారలేదని టార్చర్ చేసి తమ ఇల్లు కూల్చారని ఆత్మహత్య చేసుకున్న బీఆర్ఎస్ నాయకుడు సర్దార్ భార్య యాస్మిన్ కేటీఆర్ దృష్టికి తెచ్చారు. -
సంగారెడ్డి జిల్లాలో తుపాకీతో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య
సంగారెడ్డి జిల్లాలో కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకు,న్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. జిల్లాలోని మహబూబ్ సాగర్ చెరువు వద్ద ఏఆర్ కానిస్టేబుల్ సందీప్ బలవన్మరణానికి పాల్పడ్డారు. తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఏడాది కాలంగా సంగారెడ్డి టౌన్ పీఎస్‌లో సందీప్ విధులు నిర్వర్తిస్తున్నాడు.వ్యక్తిగత కారణాల వల్లే సందీప్ ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ చేపట్టారు. అయితే సందీప్ మృతిపై పలు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఆన్లైన్ గేమింగ్‌కు బానిసైన క్రమంలోనే ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
‘ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎస్ఎల్బీసీ పూర్తి చేసి తీరుతాం’
నాగర్ కర్నూల్: రెండు దశాబ్దాలుగా నిలిచిపోయిన శ్రీశైలం ఎడమగట్టు కాలువ (SLBC) ప్రాజెక్టును తమ ప్రభుత్వం కచ్చితంగా పూర్తి చేసి తీరుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆ ప్రాజెక్టును పూర్తి చేసి తీరుతామన్నారు ఈరోజు(సోమవారం, నవంబర్ 3వ తేదీ) అచ్చంపేట మండలం మన్నెవారిపల్లి వద్ద ఎస్ఎల్బీసీ టన్నెల్-1 ప్రాంతంలో హెలిబోర్న్ ఏరియల్ ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ సర్వేలో సీఎం రేవంత్, రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి,,ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘ రెండు దశాబ్దాలుగా నిలిచిపోయిన శ్రీశైలం ఎడమగట్టు కాలువ (SLBC) ప్రాజెక్టును మా ప్రభుత్వం తిరిగి చేపట్టి, సాంకేతిక సవాళ్లను అధిగమిస్తూ ముందుకు వెళ్తోంది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు నేను అమెరికాకు వెళ్లి టన్నెల్ బోరింగ్ యంత్రాన్ని తెప్పించాను. గత ప్రభుత్వాలు ఈ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేయకపోతే ఇదే పనులు చాలా కాలం క్రితం పూర్తయ్యేవి.SLBC పూర్తయితే 30 లక్షల మందికి తాగునీరు, 3 లక్షల ఎకరాలకు గ్రావిటీ ద్వారా సాగునీరు అందే అవకాశం ఉంది. దీనివల్ల విద్యుత్ ఖర్చులు గణనీయంగా తగ్గి ప్రభుత్వానికి భారీ ఆదా లభిస్తుంది. మూసి నది శుద్ధీకరణతో నల్లగొండకు శాశ్వత నీటి సమస్యకు పరిష్కారం లభిస్తుంది.ఈ ప్రాజెక్టు ప్రపంచంలోనే అతిపెద్ద టన్నెల్ ప్రాజెక్టులలో ఒకటి. ఎన్ని అడ్డంకులొచ్చినా తొలగించుకుంటూ దీనిని పూర్తి చేయాలన్నది ప్రభుత్వ దృఢ సంకల్పం. నిధుల విషయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా గ్రీన్ చానెల్ ద్వారా అందుబాటులోకి తెస్తాం.పునరావాస ప్యాకేజీలను డిసెంబర్ 31 నాటికి పూర్తిచేస్తాం. భూములు కోల్పోయిన వారికి నష్టం జరగకుండా పూర్తి సహాయం అందిస్తాం’అని మంత్రి స్పష్టం చేశారు. -
కేవలం రూ.500కే 66 గజాల ప్లాట్!
సాక్షి,హైదరాబాద్: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పురపాలిక పరిధిలోని గణేశ్‌నగర్‌లో ఓ చిన్నారి అదృష్టాన్ని తనవైపు తిప్పుకుంది.పది నెలల హన్సికకు రూ.16 లక్షల విలువైన 66 గజాల స్థలం,అందులో నిర్మించిన ఇల్లు కేవలం రూ.500కే లభించింది. ఆదివారం నిర్వహించిన లక్కీ డ్రాలో నిర్వాహకులు ఆమెను విజేతగా ప్రకటించారు. దీంతో ఆ ఇంట్లో ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లిలో హోటల్లో పనిచేస్తున్న శంకర్, తన భార్య ప్రశాంతి, కుమార్తెలు సాయి రిషిక, హన్సికల పేరుతో నాలుగు కూపన్లు కొనుగోలు చేశారు. అదృష్టం వెతుక్కుంటూ హన్సికను ఎంపిక చేసింది. లక్కీడ్రాలో హన్సిక ఎంపికైనట్లు నిర్వాహకులు తండ్రి శంకర్‌కు ఫోన్ ద్వారా సమాచారం అందించారు.రూ.500కే 66గజాల స్థలం దక్కడంతో ఎగిరి గంతేసినంత పనిచేశారు. ఇక 66 గజాల ఇంటి స్థలం అమ్మేందుకు దాని యజమాని కంచర్ల రామబ్రహ్మం లక్కీ డ్రా నిర్వహించారు. 66 సెంట్ల స్థలం, అందులో ఉన్న ఇంటి యజమాని కంచర్ల రామబ్రహ్మం. తనకు డబ్బు అవసరమై, సంప్రదాయ రీతిని పక్కనపెట్టి వినూత్నంగా ఆస్తిని విక్రయించేందుకు రూ.500కే లక్కీ డ్రా పద్ధతిని ఎంచుకున్నారు. నవంబర్ 2న లక్కీ డ్రా నిర్వహించి విజేతకు ఇల్లు, స్థలం రిజిస్ట్రేషన్ చేస్తానని ప్రకటించారు.ఈ ఆలోచన వినూత్నంగా ఉండటంతో 3,600 మంది తమ అదృష్టాన్ని పరీక్షించేందుకు కూపన్లు కొనుగోలు చేశారు. దీంతో రామబ్రహ్మంకు రూ.18 లక్షలు సమకూరాయి. విజేతగా హన్సిక నిలిచింది. త్వరలో యజమాని హన్సిక కుటుంబం పేరు మీద రిజిస్ట్రేషన్ చేయనున్నారు. -
చేవెళ్ల ప్రమాదంలో మృత్యువుకు బలయ్యాడు!
సాక్షి,రంగారెడ్డి: చేవెళ్లలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఆర్టీసీ బస్సు డ్రైవర్ దస్తగిరి బాబా కూడా ఉన్నారు. గతంలో తన చాకచక్యంతో అనేక ప్రాణాలను కాపాడిన ఆయన.. ఇప్పుడు రోడ్డు ప్రమాదంలో మరణించడం పట్ల తోటి ఆర్టీసీ ఉద్యోగులు,అధికారులు విచారం వ్యక్తం చేస్తున్నారు.ఈ సందర్భంగా ఆర్టీసీ అధికారులు గతంలో దస్తగిరి బాబా ప్రదర్శించిన అద్భుత ధైర్యాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఏడాదిన్నర క్రితం, వికారాబాద్‌లోని అనంతగిరి కొండపై బస్సు బ్రేకులు ఫెయిలయ్యాయి. ఆ సమయంలో దస్తగిరి చాకచక్యంగా వ్యవహరించి, బస్సులోని ప్రయాణికుల ప్రాణాలను కాపాడారు.అప్పట్లో తన ప్రాణాన్ని ఫణంగా పెట్టి ప్రయాణికులను రక్షించిన దస్తగిరి.. చేవెళ్ల ప్రమాదంలో మృతి చెందడంపై ఆర్టీసీ ఉద్యోగులు, అధికారులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.కాపాడండి’.. నడుములోతు కంకరలో ఇరుక్కుని టీచర్ ఆర్తనాదాలు ఒకే కుటుంబంలో ముగ్గురు అక్కాచెల్లెళ్ల మృతి -
హైదరాబాద్‌లో స్టీల్ స్ట్రక్చర్స్ యూనిట్
ప్రముఖ స్ట్రక్చరల్ స్టీల్ సంస్థ ఫాబెక్స్ స్టీల్ స్ట్రక్చర్స్ తమ రెండవ తయారీ యూనిట్‌ను తెలంగాణలో ప్రారంభించింది. హైదరాబాద్ సమీపంలోని చిట్యాల్ వద్ద రూ.120 కోట్ల పెట్టుబడితో 40 ఎకరాల్లో ఈ తయారీ కేంద్రం ఏర్పాటైంది.నూతన మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏటా 50 వేల మెట్రిక్ టన్నుల అదనపు ఉత్పత్తి సామర్థ్యాన్ని అందిస్తుంది. దీంతో కంపెనీ మొత్తం ఉత్పత్తి సామర్థ్యం రెండు యూనిట్లలో కలిపి లక్ష మెట్రిక్ టన్నులకు పెరగనుంది.ఈ ఫాబెక్స్ సంస్థ ప్రీ-ఇంజినీర్డ్ నిర్మాణాలు, ఉక్కు అమరికల రూపకల్పన, డిటైలింగ్, తయారీ, ఇన్స్టాలేషన్ వంటి విభాగాల్లో పనిచేస్తుంది. కంపెనీ ప్రస్తుతం విజయవాడలోని యూనిట్ ద్వారా దేశీయ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇక్కడి నుంచే ఉత్పత్తుల ఎగుమతులు సైతం చేస్తోంది.ప్రస్తుతం రూ.463 కోట్ల టర్నోవర్ కలిగిన ఫాబెక్స్, 400 మందికి ఉపాధి కల్పిస్తోంది. కార్యకలాపాల విస్తరణతో, ఈ సంఖ్యను 800 మందికి పెంచాలని యోచిస్తోంది. తయారీ సామర్థ్యాన్ని మరింత విస్తరించడానికి, ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి రాబోయే 2–3 ఏళ్లల్లో మరో రూ.100 కోట్ల పెట్టుబడి పెట్టాలని యోచిస్తున్నట్లు ఫాబెక్స్ స్టీల్ స్ట్రక్చర్స్ సహ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ వేణు చావా తెలిపారు. -
‘కాపాడండి’.. నడుములోతు కంకరలో ఇరుక్కుని టీచర్ ఆర్తనాదాలు
సాక్షి,రంగారెడ్డి: చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద సోమవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం రాష్ట్రాన్ని విషాదంలో ముంచింది. తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును ఓవర్‌లోడ్‌తో వెళ్తున్న కంకర లారీ ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 20 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా, మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.ప్రమాదానికి కారణంగా భావిస్తున్న టిప్పర్‌లో 30 టన్నులకు బదులుగా 50 టన్నుల కంకర లోడ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఢీకొట్టిన వెంటనే టిప్పర్లోని కంకర మొత్తం బస్సులోకి ప్రవేశించి, ప్రయాణికులపై పడటంతో ఊపిరాడక అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. కంకరలో ఇరుక్కుని బయటకు రాలేక ప్రయాణికులు చేసిన ఆర్తనాదాలు స్థానికులను కంటతడి పెట్టించాయి.ఈ ప్రమాదంలో తోల్కట్టలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో మ్యాథ్స్ కాంట్రాక్ట్ టీచర్‌గా పనిచేస్తున్న జయసుధ తీవ్రంగా గాయపడ్డారు. నడుములోతు కంకరలో ఇరుక్కుని ఆమె కాళ్లు వాచిపోవడంతో కుటుంబ సభ్యులు ఆమెను నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. కేరెల్లి గ్రామానికి చెందిన జయసుధ వికారాబాద్‌లో బస్సు ఎక్కగా, ఆమెతో పాటు రావాల్సిన మరో నలుగురు ఉపాధ్యాయులు ఆలస్యంగా రావడంతో వేరే బస్సులో ప్రయాణించి ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.ప్రమాదం తీవ్రతకు బస్సు డ్రైవర్ వైపు సీట్లలో ఉన్న ప్రయాణికులు అధికంగా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఘటనా స్థలంలో దృశ్యాలు హృదయవిదారకంగా ఉండగా, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. -
చేవెళ్ల దుర్ఘటన.. కారణాలు ఇవే!
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల బస్సు ప్రమాద దుర్ఘటనకు (Chevella Bus Accident) టిప్పర్ ఓవర్ లోడ్, ఓవర్ స్పీడ్ కారణమని ప్రాథమికంగా అధికారులు గుర్తించారు. పరిమితికి మించి కంకర నింపుకుని, మితిమీరిన వేగంతో వెళుతూ బస్సును టిప్పర్ ఢీకొట్టడంతో భారీ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు 19 మంది చనిపోగా, 32 మంది వరకు గాయపడినట్టు సమాచారం.మరోవైపు రోడ్డుపైన ఉన్న భారీ గుంత (గొయ్యి) కూడా ప్రమాదానికి కారణమని చెబుతున్నారు. గుంతను తప్పించబోయి టిప్పర్ డ్రైవర్ బస్సును ఢీకొట్టాడని అంటున్నారు. ఢీకొట్టిన వెంటనే టిప్పర్.. బస్సుపైకి ఒరిగిపోవడంతో ప్రాణనష్టం ఎక్కువగా జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. టిప్పర్లోని కంకర.. ఒక్కసారిగా బస్సులోని ప్రయాణికులపై పడడంతో వారిలో చాలా మంది ఊపిరి ఆడక ప్రాణాలు కోల్పోయారు. టిప్పర్‌లో 35 టన్నుల కంకర ఉండాల్సి ఉండగా 60 టన్నుల కంకర ఉన్నట్టు తెలుస్తోంది. బస్సు డ్రైవర్ వైపు సీట్లు అన్ని నుజ్జు నుజ్జు అయ్యాయి. దీంతో ఈ వరుసలోని వారందరూ దాదాపు ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారిలో ఇద్దరు డ్రైవర్లు సహా ఆరుగురు పురుషులు ఉన్నారు. చదవండి: అలా ప్రమాదం నుంచి బయటపడ్డానుప్రమాదానికి కారణాలు1. టిప్పర్ ఓవర్ లోడ్, ఓవర్ స్పీడ్2. రోడ్డుపైన భారీ గుంత3. టిప్పర్‌లో పరిమితికి మించిన కంకర4. గొయ్యి రావడంతో తప్పిన టిప్పర్ కంట్రోల్5. టిప్పర్లోని కంకరపై టార్పాలిన్ లేకపోవడం6. టిప్పర్లోన కంకర మొత్తం బస్సుపై పడడం7. బస్సులో సీట్లకు మించి ప్రయాణికులు -
'రెప్పపాటులో జరిగిపోయింది'
టిప్పర్ లారీ వేగంగా వచ్చి ఢీకొట్టడం వల్లే ప్రమాదం జరిగిందని చేవెళ్ల బస్సు ప్రమాద ఘటనలో ప్రాణాలతో బయటపడిన నర్సింహులు అనే ధూమ్ ధామ్ కళాకారుడు చెప్పాడు. రెప్ప పాటు సమయంలో ప్రమాదం చోటు చేసుకుందని మీడియాకు వెల్లడించాడు. తామంతా చూస్తుండగానే పలువురి ప్రాణాలు పోయాయని చెప్పాడు. ''నేను కండెక్టర్ పక్కన నిల్చున్న. దేవుడి దయతో బయటపడ్డాన''ని తెలిపాడు.ప్రాణాలతో బయటపడిన కండక్టర్బస్సు కండక్టర్ రాధ ప్రమాదం నుంచి గాయాలతో బయటపడింది. మహేందర్ రెడ్డి జనరల్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న ఆమెను మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు కాలే యాదయ్య, బి. మనోహర్ రెడ్డి తదితరులు పరామర్శించారు. ప్రమాదం ఎలా జరిగిందని అడిగి తెలుసుకున్నారు. స్థానికుల ఆందోళనబస్సు ప్రమాదం ఘటన స్థలానికి పెద్ద సంఖ్యలో చేరుకున్న స్థానికులు ఆందోళనకు దిగారు. సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీజాపూర్ హైవేను వెంటనే పూర్తి చేసి, తమ ప్రాణాలకు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. మరోవైపు చేవెళ్ల- వికారాబాద్ మార్గంలో ట్రాఫిక్ స్తంభించడంతో ఆలూరు నుంచి వాహనాలను పోలీసులు మళ్లిస్తున్నారు. ఆర్టీసీ ఉన్నతాధికారుల విచారణఆర్టీసీ ఉన్నత అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల రీజనల్ మేనేజర్లు, హైదరాబాద్ ఈడీ తదితరులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదానికి దారి తీసిన పరిస్థితుల గురించి ఆరా తీశారు. కేసు నమోదు, దర్యాప్తుబస్సు ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సైబరాబాద్ పోలీసు కమిషనర్ అవినాష్ మహంతి తెలిపారు. ప్రమాద ఘటనలో ఇప్పటివరకు 19 మంది చనిపోయారని చెప్పారు. గాయపడిన వారిని మహేందర్ రెడ్డి మెడికల్ హాస్పిటల్, చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్టు వెల్లడించారు. తాండూర్ నుంచి హైదరాబాద్‌కు బస్సులో 72 మంది ప్రయాణికులు బయలుదేరారని చెప్పారు. ప్రమాద ఘటనపై సమగ్ర విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. యమకింకర టిప్పర్ప్రమాదానికి కారణం అయిన టిప్పర్ నెంబర్ TG 06 T 3879గా అధికారులు గుర్తించారు. ఉదిత్య అనిత పేరుతో మహబూబ్‌నగర్ రిజిస్ట్రేషన్ అయినట్టు తెలుస్తోంది. పరిమితికి మించి కంకర నింపడంతో పాటు మితిమీరిన వేగం ఘోర ప్రమాదానికి కారణమైందని ప్రాథమిక సమాచారం.హృదయవిదారకం.. చేవెళ్ల బస్సు ప్రమాదం చిత్రాలు -
‘తప్పుడు గృహహింస కేసు నుంచి కాపాడండి’
హైదరాబాద్: భార్య మోపిన తప్పుడు గృహహింస కేసు కారణంగా ఇబ్బందుల్లో పడిన ఒక వ్యక్తి న్యాయం చేయాలంటూ సీఎంను వేడుకుంటున్నారు. హైదరాబాద్‌కు చెందిన పంకజ్‌తో పాటు అతని కుటుంబం తప్పుడు గృహ హింస, వరకట్న కేసులపై కొన్నేళ్లుగా న్యాయపోరాటం చేస్తోంది. ఈ కేసుల కారణంగా మానసిక వేదన అనుభవిస్తున్నట్లు పంకజ్ ఒక వీడియోలో తెలిపారు. Pankaj and his family from Hyderabad are fighting false domestic violence and dowry cases and have been facing extreme harassment for the past few years. In fact, Pankaj's wife walked out of the house taking their daughter along and is mentally torturing Pankaj. To seek help &… pic.twitter.com/1hI1Qktbgg— ForMenIndia (@ForMenIndia_) November 2, 2025ఆ వీడియోలో పంకజ్ తన భార్య.. తమ కుమార్తెను తీసుకొని ఇంటి నుండి బయటకు వెళ్లిపోయి, తనను మానసికంగా హింసిస్తోందని ఆరోపించారు. అయితే సహాయం కోసం అటు పోలీసులను, ఇటు వివిధ సంస్థలను, మంత్రులను వేడుకున్నా ప్రయోజనం లేకపోయిందని పంకజ్ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ వింగ్స్ మహిళా భద్రతా డీసీపీలు తాము అందించిన ఫిర్యాదు లేఖను స్వీకరించారని, అయితే ఇప్పటివరకూ ఎటువంటి స్పందన రాలేదన్నారు. అధికారులు తన సమస్యకు పరిష్కారం చూపాలని పంకజ్ ఆ వీడియోలో వేడుకుంటున్నారు. -
హృదయవిదారకంగా.. చేవెళ్ల ఘోర ప్రమాద చిత్రాలు
-
రోజుకు 15 మందిని చంపేస్తున్న అతివేగం
హైదరాబాద్: ఇటీవల బెంగళూరు హైవేపై జరిగిన కర్నూలు బస్సు విషాదం మరువకముందే, రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్లలో ఈరోజు (సోమవారం) మరో ఘటన చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సును కంకర లోడ్‌తో వెళ్తున్న టిప్పర్ లారీ ఢీ కొట్టి బోల్తా పడిపోయింది. ఈ ఘటనలో 19 మంది మృతి చెందారు. క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కేంద్ర ప్రభుత్వ తాజా నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలోని హైవేలపై ప్రతిరోజూ సగటున 15 మంది ‘అతివేగం’ కారణంగా మరణిస్తున్నారు. 2023లో రెండు రాష్ట్రాలలోని జాతీయ, రాష్ట్ర రహదారులపై 5,500 మంది అతివేగం సంబంధిత ప్రమాదాలలో ప్రాణాలు కోల్పోయారు. తెలుగు రాష్ట్రాల్లో చోటుచేసుకుంటున్న రోడ్డు ప్రమాద మరణాలలో 30 శాతం మరణాలు అతివేగం కారణంగానే జరుగుతున్నాయి.తెలంగాణలో 2020- 2023 మధ్య కాలంలో 25 వేల మందికి పైగా జనం అతివేగం కారణంగా సంభవించిన రోడ్డు ప్రమాదాల్లో కన్నుమూశారు. అతివేగం వల్ల సంభవించే మరణాల విషయానికి వస్తే, దేశంలోనే తెలంగాణ ఏడవ స్థానంలో ఉంది. గుజరాత్, ఉత్తరప్రదేశ్, బీహార్, ఒడిశా తదితర పెద్ద రాష్ట్రాల కంటే తెలంగాణ ముందు వరుసలో ఉంది. రోడ్డు ప్రమాదాలలో 80 శాతానికి మించిన ప్రమాదాలకు అతివేగమే ప్రధాన కారణమని రోడ్డు భద్రతా నిపుణులు చెబుతున్నారు.వాహనాలు నడిపే విషయంలో స్పష్టమైన వేగ పరిమితులను నిర్ణయించాలని, రోడ్లపై కనిపించే విధంగా సంకేతాలను ఏర్పాటు చేయాలని నిపుణులు కోరుతున్నారు. చాలా ప్రాంతాలలో, ముఖ్యంగా మలుపులు, జంక్షన్ల వద్ద సరైన సూచికలు లేవని వారు అంటున్నారు. స్పీడ్ లేజర్ గన్లు తాత్కాలిక నిరోధకం మాత్రమేనని, మెరుగైన రోడ్డు డిజైన్, సరైన గుర్తులు అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.ఇది కూడా చదవండి: చేవెళ్లలో ఘోర ప్రమాదం.. 19 మంది మృతి -
ఒకే కుటుంబంలో ముగ్గురు అక్కాచెల్లెళ్ల మృతి
సాక్షి, చేవెళ్ల: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 19 మంది మృతి చెందినట్టు మంత్రి పొన్న ప్రభాకర్ అధికారికంగా ప్రకటించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులకు ఆసుపత్రుల్లో చికిత్స జరుగుతోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. మరోవైపు.. ప్రమాదంలో మృతి చెందిన వారి వివరాలను అధికారులు, పోలీసులు గుర్తిస్తున్నారు. బస్సు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెలు మృతి చెందడంతో తీవ్ర విషాదం నెలకొంది. తాండూరుకు చెందిన ఎల్లయ్య గౌడ్ ముగ్గురు కూతుళ్లు నందిని (డిగ్రీ ఫస్టియర్), సాయిప్రియ (డిగ్రీ థర్డ్ ఇయర్), తనూష (ఎంబీఏ) హైదరాబాద్‌లో చదువుకుంటున్నారు. ఇటీవల బంధువుల పెళ్లి ఉండటంతో ముగ్గురు సొంతూరుకు వచ్చారు. ఈరోజు తెల్లవారుజామున తిరిగి హైదరాబాద్ వస్తుండగా ప్రమాదం కారణంగా మృతి చెందారు. దీంతో, వారి కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమవుతున్నారు. పోస్టుమార్టం అనంతరం తనూష, సాయి ప్రియా, నందిని మృతదేహాలు గ్రామానికి చేరుకున్నాయి,. ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు ఈ ప్రమాదంలో పది మంది మహిళలు, ఒక చిన్నారి, ఎనిమిది మంది పురుషులు ఉన్నట్టు తెలుస్తోంది. తాజాగా పలువురి మృతుల వివరాలను అధికారులు వెల్లడించారు. 1.దస్తగిరి బాబా, డ్రైవర్; 2.తారిబాయ్ (45), దన్నారమ్ తండా; 3.కల్పన(45), బోరబండ; 4.బచ్చన్ నాగమణి(55); భానూరు; 5.ఏమావత్ తాలీబామ్, ధన్నారం తాండ; 6.మల్లగండ్ల హనుమంతు, దౌల్తాబాద్ మండలం;7.గుర్రాల అభిత (21) యాలాల్; 8.గోగుల గుణమ్మ,బోరబండ;9.షేక్ ఖాలీద్ హుస్సేన్, తాండూరు;10.తబస్సుమ్ జహాన్, తాండూరు.11. తనూషా, సాయిప్రియ, నందిని(ఒకే కుటుంబానికి చెందిన అక్కాచెల్లెల్లు)12. అఖిల(తాండూరు).13. ఏనుగుల కల్పన14. నాగమణి, 15. జహంగీర్. క్షతగాత్రులు వీరే..వెంకటయ్యబుచ్చిబాబు-దన్నారమ్ తండాఅబ్దుల్ రజాక్-హైదరాబాద్వెన్నెలసుజాతఅశోక్రవిశ్రీను- తాండూరునందిని- తాండూరుబస్వరాజ్-కోకట్ (కర్ణాటక)ప్రేరణ- వికారాబాద్సాయిఅక్రమ్-తాండూరుఅస్లామ్-తాండూరు -
ఎమ్మెల్యేపై దాడికి యత్నం.. చేవెళ్ల ప్రమాదస్థలి వద్ద ఉద్రిక్తత
సాక్షి, రంగారెడ్డి: చేవెళ్ల మీర్జాగూడ బస్సు ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. సహాయక చర్యలు కొనసాగుతుండడంతో మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని అధికారులు అంటున్నారు. తాజాగా ఘటనాస్థలికి వెళ్లిన ఎమ్మెల్యే కాలె యాదయ్యకు నిరసన సెగ తలిగింది. రోడ్డు విస్తరణ ఎందుకు చేపట్టలేకపోయారు? అంటూ స్థానికులు ఆయన్ని నిలదీశారు. చేవెళ్ల ఘటనా స్థలంలో సోమవారం ఉదయం స్థానికులు ఆందోళన చేపట్టారు. జాతీయ రహదారిపై ఇప్పటిదాకా రోడ్డు విస్తరణ చేపట్టకపోవడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో అక్కడికి వచ్చిన ఎమ్మెల్యే కాలె యాదయ్యను నిలదీశారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ యాదయ్యపై దాడికి యత్నించబోయారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జోక్యం చేసుకుని శాంతింపజేశారు. దీంతో ఎమ్మెల్యే యాదయ్య వచ్చిన కారులో అలాగే వెళ్లిపోయారు.తాండూరుకు చెందిన ఆర్టీసీ బస్సు ఈ ఉదయం 4.45గం. బస్టాండ్ నుంచి హైదరాబాద్‌కు బయల్దేరింది. అయితే అక్కడ 30 మంది ఎక్కారు. ఫస్ట్ ట్రిప్ కావడం.. ఎక్స్‌ప్రెస్ బస్సే అయినప్పటికీ పల్లె వెలుగు పేరిట నడపం, ప్రతీ స్టాపులో ఆపుతూ రావడంతో విద్యార్థులు, ఉద్యోగులు అధిక సంఖ్యలో ఎక్కారు. కంకర లోడ్‌తో వెళ్తున్న టిప్పర్ మీర్జాగూడ టర్నింగ్ పాయింట్లో స్పీడ్‌ను కంట్రోల్ చేయలేకపోవడంతో అదుపుతప్పింది. బస్సును ఢీ కొట్టి ఆపై.. గుంత కారణంగా అదుపు తప్పి అలాగే బస్సు మీద ఒరిగిపోయింది. టిప్పర్ లారీ అతివేగం వల్లే ప్రమాదం జరిగిందని అధికారులు నిర్థారించగా.. బస్సు మీదకు ఒరిగిపోవడం, ఈ క్రమంలో కంకర మొత్తం బస్సులో పడిపోవడంతో ప్రమాద తీవ్రత పెరిగిందని చెబుతున్నారు. బస్సుకు కుడి వైపు కూర్చున్న 21 మంది స్పాట్లోనే మరణించినట్లు చెబుతున్నారు. ఘటనలో టిప్పర్ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. బస్సు డ్రైవర్ దస్తగిరి స్పాట్లోనే చనిపోగా.. కండక్టర్ రాధ ప్రాణాలతో బయటపడింది. మృతులంతా తాండూరు, చేవెళ్ల వాసులుగా తెలుస్తోంది. స్థానికులు, పోలీసులు కంకర నుంచి ప్రయాణికులను బయటకు తీసి రక్షించారు. ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.. యుద్ధప్రతిపాదికన సహాయక చర్యలు చేపట్టాలని సీఎస్, డీజీపీలను ఆదేశించారు. దీంతో మెరుగైన వైద్యం కోసం క్షతగాత్రులను హైదరాబాద్‌కు తరలించే యోచనలో అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. -
ఎన్‌హెచ్-163.. నెత్తుటి రహదారిపైనే ఘోర విషాదం
చేవెళ్ల మండలం మీర్జాగూడ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదంతో తెలుగు రాష్ట్రాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. ఘటనలో 17 మంది అక్కడికక్కడే మరణించగా.. పలువురి పరిస్థితి విషమంగా ఉంది. అయితే ప్రమాదానికి అపోజిట్ వెహికల్ అతివేగం కారణమని తెలుస్తున్నప్పటికీ.. స్థానికులు మాత్రం ‘అలసత్వం’ కూడా ఓ కారణమనే విమర్శలు గుప్పిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రధాన మార్గాల్లో హైదరాబాద్–బీజాపూర్ NH-163 రహదారి ఒకటి. వాణిజ్య, వ్యవసాయ, ప్రయాణ అవసరాలకు కీలకంగా ఉపయోగపడుతోంది. అయితే చాలా ఏళ్లుగా ప్రమాదాలకు కేంద్రబిందువుగా మారింది కూడా. తాజాగా వేగంగా దూసుకొచ్చిన కంకర టిప్పర్ బస్సును ఢీ కొట్టి బోల్తాపడి ప్రమాదం జరిగినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఇరుకు రోడ్డులో ఆ టిప్పర్ స్పీడ్ కంట్రోల్ కాకనే ఈ ఘోరం జరిగినట్లు స్పష్టమవుతోంది. దీంతో.. రహదారి విస్తరణ జరగకపోవడం వల్లే ఈ ఘోరం జరిగిందని స్థానికులు అంటున్నారు. నిరుడు.. ఇదే సమయంలో ఈ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. డిసెంబర్లో ఆలూరు వద్ద లారీ అదుపు తప్పి కూరగాయలు అమ్ముకునేవాళ్లపై దూసుకెళ్లడంతో ఆరుగురు మరణించారు. ఆ సమయంలో స్థానికులు రోడ్డుపై భైఠాయించి.. రహదారి విస్తరణను డిమాండ్ చేశారు. అంతకు ముందు.. సెప్టెంబర్‌లో ఒకే రోజు జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురు మరణించారు. ఈ ఏడాది జూన్‌లో కేజీఆర్ గార్డెన్ సమీపంలో ఓ భారీ గుంతలో వాహనం బోల్తా పడి ఇద్దరు మరణించారు.ప్రమాదాలకు కారణాలివే.. ఇరుకైన రహదారి: రెండు వైపులా వాణిజ్య కార్యకలాపాలు, కూరగాయల మార్కెట్లు ఉండటంతో వాహనాల రాకపోకలు కష్టతరంగా మారాయి.రోడ్డు విస్తరణ జాప్యం: NH-163గా గుర్తింపు వచ్చినప్పటికీ, 46 కిలోమీటర్ల విస్తరణ పనులు ఇంకా పూర్తికాలేదు.గుంతలు, మలుపులు: వర్షాకాలంలో నీరు నిలిచే గుంతలు, అజాగ్రత్త మలుపులు ప్రమాదాలకు దారితీస్తున్నాయి.సిగ్నలింగ్ లోపం: ట్రాఫిక్ నియంత్రణ, స్పీడ్ బ్రేకర్లు, జాగ్రత్త సూచనలు లేకపోవడం వల్ల ప్రమాదాలు పెరుగుతున్నాయి.మొదలైన రెండు రోజులకే.. ఎన్‌హెచ్-163 ఇరుకు రోడ్డు వల్ల మొయినాబాద్ నుంచి చేవెళ్ల వరకు నిత్యం ప్రమాదాలు జరుగుతూ, వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో.. పోలీస్ అకాడమీ నుంచి మన్నెగూడ వరకు సుమారు 46 కి.మీ మేర నాలుగు లేన్ల రోడ్డు విస్తరణ కోసం గత ప్రభుత్వ హయాంలో రూ. 920 కోట్లు మంజూరయ్యాయి. ఈలోపు రోడ్డు విస్తరణలో చెట్లకు నష్టం కలుగుతుందని పేర్కొంటూ పర్యావరణ ప్రేమికులు అడ్డుపడ్డారు. కొన్ని గ్రామాల పెద్దలతో కలిసి జాతీయ పర్యావరణ ట్రైబ్యునల్ (ఎన్జీటీ) ఆశ్రయించడంతో పనులు నిలిచిపోయాయి. అయితే.. ప్రజాప్రతినిధుల చొరవతో ఈ అంశంలో పురోగతి చోటు చేసుకుంది. ఈ రోడ్డు విస్తరణలో భాగంగా మొత్తం 950 చెట్లకు సంబంధించి అధికారులు ఒక ప్రత్యేక ప్రణాళికను రూపొందించారు. 150 చెట్లను రోడ్డు పక్కనే ఉన్న పొలాల్లో నాటించేందుకు అధికారులు హామీ ఇచ్చారు. మిగిలిన చెట్లను రోడ్డుకు మధ్యలో ఉంచడానికి వీలుగా డిజైన్ చేశారు. ఈ విజ్ఞప్తులతో పర్యావరణ ప్రేమికులు ఆ పిటిషన్లను ఉపసంహరించుకోగా.. మొన్న శుక్రవారమే(అక్టోబర్ 31) మొయినాబాద్-చేవెళ్ల రహదారి విస్తరణ పనులు ప్రారంభం అయ్యాయి. ఇంతలోనే ఈ ఘోరం చోటు చేసుకోవడం గమనార్హం. -
చేవెళ్ల దుర్ఘటన.. మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి
Chevella road accident Updates..చేవెళ్ల ఆర్టీసీ బస్సు ప్రమాదంపై తెలంగాణ ప్రభుత్వం విచారణకు ఆదేశంచేవెళ్ల బస్సు ప్రమాదంపై విచారణకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశంఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటనఘోర రోడ్డు ప్రమాదంపై సీఎం రేవంత్ తీవ్ర దిగ్భ్రాంతి మీర్జాగూడ ప్రమాదం కలచివేసింది.మృతుల కుటుంబాలను ఆదుకుంటాం ప్రభుత్వ పరిహారంతోపాటు సాయం అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటాం ఆర్టీసీ ఇన్సూరెన్సును కూడా అందిస్తాం బాధిత కుటుంబాలకు భరోసా ఇచ్చే చర్యలు చేపడతాం గ్రీన్ ట్రిబునల్లో ఉండటం వల్ల రోడ్డు విస్తరణ ఆలస్యంరంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి చేవెళ్లలో బస్సు ప్రమాదం జరిగిందిఈ ప్రమాదంలో మొత్తం 19మంది మంది మృతి చెందారుప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి,పీఎం హాస్పిటల్‌కు తరలించాంమృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయింది కుటుంబ సభ్యులకు మృతదేహాలను అప్పగించారు ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు గ్రీన్ ట్రిబునల్లో ఉండటం వల్ల రోడ్డు విస్తరణ ఆలస్యం అయ్యింది మూడు రోజుల క్రితం దాన్ని డిస్మిస్ చేయడం జరిగిందికొద్దిరోజుల్లో రోడ్డు పనులు ప్రారంభం కానున్నాయి కానీ అనుకోని విధంగా ఈ ప్రమాదం జరిగిందిచేవెళ్ల బస్సు ప్రమాదంతో భారీ ట్రాఫిక్ జామ్చేవెళ్ల బస్సు ప్రమాదంతో భారీ ట్రాఫిక్ జామ్ రోడ్డు ప్రమాదంతో హైదరాబాద్-బీజాపూర్ హైవేపై స్తంభించిన వాహనాలుచేవెళ్ల-వికారాబాద్ మార్గంలో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయిచేవెళ్ల ప్రమాదంపై రాష్ట్రపతి దిగ్భ్రాంతిచేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో అనేక మంది ప్రాణాలు కోల్పోవడం అత్యంత దురదృష్టకరమన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అలాగే బాధిత కుటుంబ సభ్యులకు దేవుడు ధైర్యం ఇవ్వాలని ఆమె ప్రార్థించారు. ఈ ఘటనలో గాయపడిన ప్రయాణికులు త్వరగా కోలుకోవాలని రాష్ట్రపతి ఆకాంక్షించారు.కేసు నమోదు..మీర్జాగూడ ప్రమాద ఘటనపై కేసు నమోదు..బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు.ప్రమాదానికి కారణమైన టిప్పర్ డ్రైవర్ గుర్తింపు.మహారాష్ట్రకు చెందిన ఆకాశ్ కాంబ్లేగా గుర్తించారు.ప్రమాదంలో బస్సు డ్రైవర్ దస్తగిరి(38) మృతి. ఆలూరు నుంచి వాహనాల మళ్లింపుమీర్జాగూడ దగ్గర బస్సు ప్రమాదంతో భారీగా ట్రాఫిక్ జామ్.చేవెళ్ల-వికారాబాద్ మార్గంలో స్తంభించిన ట్రాఫిక్.ఆలూరు నుంచి వాహనాల మళ్లింపు.ఆలూరు-చేవెళ్ల మీదుగా హైదరాబాద్‌కు మళ్లింపు. మంత్రి పొన్నం ఎక్స్‌గ్రేషియా ప్రకటన.. ఇప్పటి వరకు 19 మంది మృతి చెందారు.బస్సు ప్రమాదంపై విచారణకు ప్రభుత్వం ఆదేశిస్తుంది.గాయపడిన వారికి మెరుగైన వైద్య సాయం అందిస్తున్నాం.రోడ్డు విస్తరణను ఎవరు అడ్డుకుంటున్నారో అన్ని బయటకు వస్తాయి.ఘటనపై రాజకీయం చేసేందుకు ఇది సమయం కాదు.బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది. మృతుల కుటుంబాలకు ఐదు లక్షలు ఎక్స్గ్రేషియాక్షతగాత్రులకు రెండు లక్షల పరిహారం.కాసేపట్లో ఘటనా స్థలానికి సీఎం రేవంత్.. స్పాట్‌కు చేరుకున్న ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డిఘటనా స్థలికి చేరుకున్న ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి.కాసేపట్లో చేరుకోనున్న రవాణా మంత్రి పొన్నంతీవ్రంగా గాయపడిన వారిని హైదరాబాద్‌కు తరలిస్తున్న అధికారులు..కొనసాగుతున్న సహాయక చర్యలు.మృతుల సంఖ్య పెరిగే అవకాశం.తెలంగాణ కాంగ్రెస్ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ కామెంట్స్..రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం నన్ను తీవ్రంగా కలచివేసింది.ఈ ప్రమాదంలో మహిళలు, పిల్లలు సహా 20 మంది ప్రాణాలు కోల్పోయారు.నా ఆలోచనలు, ప్రార్థనలు తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలతో ఉన్నాయి.ఈ దుఃఖ సమయంలో వారికి ఓదార్పు లభిస్తుందని ఆశిస్తున్నాను.ప్రమాదంలో గాయపడిన వారికి నా సానుభూతిని అందిస్తున్నాను.వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.చేవెళ్ల ఘటనపై సెక్రటేరియట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటుప్రమాద వివరాలు - అధికారుల మధ్య సమన్వయం చేయనున్న కంట్రోల్ రూమ్.ప్రమాద సమాచారం కోసం AS: 9912919545SO: 9440854433 నంబర్లను సంప్రదించాలని కోరిన ప్రభుత్వంఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తీవ్ర దిగ్బ్రాంతి..ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడిన మంత్రిచేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్న మంత్రిఅవసరమైన వారందరినీ హైదరాబాద్‌కు తరలించి చికిత్స అందించాలని ఆదేశాలు. ఉన్నతాధికారులంతా తక్షణమే ఆసుపత్రికి వెళ్లాలని మంత్రి ఆదేశంమంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి తీవ్ర విచారంక్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నాం.ప్రమాదానికి గల కారణాలపై ఆరా, దిగ్భ్రాంతిసీఎం ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం సహాయక చర్యలు వేగం.బాధితులకు న్యాయం చేస్తాం.క్షతగాత్రులకు ప్రభుత్వం మెరుగైన వైద్య చికిత్స అందిస్తుంది.ఎంపీ డీకే అరుణ తీవ్ర దిగ్భ్రాంతి..ప్రమాదంలో 19 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం బాధాకరంఈ దుర్ఘటన వార్త తీవ్రంగా కలిచివేసిందిమృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాక్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్సలు అందించాలిఈ ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలిప్రాణాలు కోల్పోవడం తీవ్రంగా కలచివేసింది: కేంద్రమంత్రి కిషన్ రెడ్డిప్రమాద ఘటనపై స్పందించిన కిషన్ రెడ్డి.మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.ప్రమాదంలో గాయపడిన వారికి అవసరమైన వైద్య సహాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను.మంత్రి శ్రీధర్ బాబు దిగ్భ్రాంతి..బస్సు ప్రమాద దుర్ఘటనపై మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తీవ్ర దిగ్భ్రాంతి.జిల్లా కలెక్టర్, పోలీస్, ఇతర విభాగాల ఉన్నతాధికారులను అప్రమత్తం చేసిన మంత్రిప్రమాదం జరిగిన తీరును, క్షతగాత్రుల ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.వెంటనే ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించాలని ఉన్నతాధికారులను ఆదేశంక్షతగాత్రులకు చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రిలో మెరుగైన చికిత్స అందించాలని ఆదేశం.ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి శ్రీధర్ బాబుగాయపడిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం అండగా ఉంటుందన్న హామీ.క్షతగాత్రులకు సంబంధించిన పూర్తి సమాచారం కుటుంబ సభ్యులకు తెలియజేసే ఏర్పాట్లు చేయాలని ఆదేశంమృతుల కుటుంబాలను ఆదుకోవాలి: కేసీఆర్ప్రమాదంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబాలకు సంతాపాన్ని ప్రకటించారు. మరణించిన వారి కుటుంబాలను ఆర్ధికంగా ఆదుకోవడంతో పాటు గాయపడిన ప్రయాణికులకు మెరుగైన వైద్య సదుపాయం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. మృతుల కుటుంబాలకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.కేటీఆర్ సంతాపం..ప్రమాదంపై మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రయాణికులు మృతి చెందడంచ, పలువురు తీవ్రంగా గాయపడటం పట్ల ఆయన సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సాయం అందించాలని, మృతుల కుటుంబాలను, గాయపడిన వారిని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.రంగారెడ్డి జిల్లా, చేవెళ్ల మండలం, ఖానాపూర్ స్టేజి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 17 మందికి పైగా ప్రయాణికులు మృతి చెందడం అత్యంత బాధాకరం.మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. పలువురు తీవ్రంగా గాయపడటం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాను.ప్రభుత్వం తక్షణమే స్పందించి వెంటనే…— KTR (@KTRBRS) November 3, 2025టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ దిగ్భ్రాంతి..బస్సు ఘోర ప్రమాదంపై టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చేవెళ్ళేలో జరిగిన రోడ్డు ప్రమాదంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. గాయపడ్డవారికి తగిన వైద్య చికిత్సలు చేయాలని సూచించారు. అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మృతులను తన ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు.సీఎం రేవంత్ విచారం.. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా అధికారులు వెంటనే అక్కడికి చేరుకొని, అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఎప్పటికప్పుడు తెలియజేయాలని అధికారులకు సూచించారు. మంత్రులు ఘటనా స్థలానికి చేరుకోవాలని సూచించారు. 👉మరోవైపు... మీర్జాగూడలో ప్రమాదంపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన సంబంధించి వివరాలు, కారణాలపై ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డితో మాట్లాడారు. అలాగే, క్షతగాత్రులకు నాణ్యమైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు మంత్రి పొన్నం సూచించారు. ఆర్టీసీ అధికారులు ఘటన స్థలానికి వెళ్లాలని మంత్రి ఆదేశించారు.👉ఇదిలా ఉండగా.. మీర్జాగూడ వద్ద తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 19 మంది మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మూడు జేసీబీల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. కంకరలో కూరుకుపోయిన వారిని బయటకు తీస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.👉ఆర్టీసీ బస్సు తాండూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సులో సుమారు 70 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. వీరిలో ఎక్కువగా విద్యార్థులు, ఉద్యోగులు ఉన్నట్లు తెలుస్తోంది. విద్యార్థులు హైదరాబాద్‌లోని పలు కళాశాలల్లో చదువుతున్నట్లు సమాచారం. ఆదివారం సెలవు కావడంతో ఇళ్లకు వెళ్లి.. తిరిగి నగరానికి వస్తుండగా ఈ ఘటన జరిగింది. రోడ్డు ప్రమాదంతో హైదరాబాద్-బీజాపూర్ హైవేపై భారీగా ట్రాఫిక్‌జామ్ అయింది. చేవెళ్ల-వికారాబాద్ మార్గంలో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. -
విద్యాసంస్థలు బంద్.. సర్కార్ ప్లానేంటి?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో నేటి నుంచి ప్రైవేట్ ఉన్నత విద్యాసంస్థలు నిరవధిక బంద్‌ను పాటించనున్నాయి. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఇంజినీరింగ్, ఫార్మసీ, మేనేజ్మెంట్, బీఈడీ తదితర వృత్తి విద్యా కళాశాలలు, డిగ్రీ కళాశాలలు బంద్‌కు ప్రైవేట్ ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య పిలుపునిచ్చింది. దీంతో, కాలేజీలు మూతపడనున్నాయి.రాష్ట్రంలో పదివేల కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ప్రైవేట్ ఉన్నత విద్యా సంస్థలు బంద్‌కు పిలుపునిచ్చాయి. అయితే, దీపావళి నాటికి ప్రభుత్వం 600 కోట్లు ఇస్తామని భరోసా ఇచ్చినప్పటికీ ప్రభుత్వ హామీ నిలబెట్టుకోలేకపోవడంతో ప్రైవేట్ ఉన్నత విద్యా సంస్థలు ఆందోళన బాట పట్టాయి. కాలేజీలు నడపలేకపోతున్నామని ప్రైవేట్ ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య ఆవేదన వ్యక్తం చేసింది. కాగా, ప్రభుత్వం చర్చలకు పిలిస్తే వెళ్లడానికి సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించింది. ఇదే సమయంలో తక్షణమే బకాయిల్లో 50 శాతం చెల్లించాలని డిమాండ్ చేసింది. అయితే, బంద్ ప్రకటన నేపథ్యంలో ప్రభుత్వం 1200 కోట్లకు టోకెన్లు ఇచ్చి కేవలం 300 కోట్లు అందించినట్టు సమాచారం. -
చేవెళ్లలో ఘోర ప్రమాదం.. 20 మంది మృతి
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలో సోమవారం వేకువ జామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. చేవెళ్ల వద్ద ఆర్టీసీ బస్సును కంకర లోడ్‌తో వెళ్తున్న టిప్పర్ లారీ ఢీ కొట్టి బోల్తా పడిపోయింది. ఈ ఘటనలో 20 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. అయితే ప్రమాదంలో 19మంది మరణించారని రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. క్షతగాత్రులకు చికిత్స అందుతుండగా.. వాళ్లలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. చేవెళ్ల మండల పరిధిలో సోమవారం వేకువ ఝామున ఈ ఘోరం జరిగింది. తాండూరు డిపోకు చెందిన ఎక్స్‌ప్రెస్ బస్సు ఈ వేకువ జామున హైదరాబాద్‌కు బయల్దేరింది. తొలి ట్రిప్పు బస్సు కావడంతో అధిక సంఖ్యలో జనాలు ఎక్కారు. ఈలోపు.. బస్సు మీర్జాగూడ వద్దకు చేరుకోగానే కంకర లోడ్‌తో వెళ్తున్న టిప్పర్ వేగంగా దూసుకొచ్చి ఢీ కొట్టింది. ఆపై టిప్పర్ ఒరిగిపోవడంతో కంకర లోడ్ మొత్తం బస్సులోకి పడిపోయింది. తాండూరు బస్టాండ్ నుంచి బస్సు బయల్దేరిన దృశ్యంప్రమాదం ధాటికి బస్సు ముందు భాగం ధ్వంసం అయ్యింది. బస్సు, టిప్పర్ డ్రైవర్లు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటన గురించి సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. కంకరలో కూరుకుపోయిన వాళ్లను బయటకు తీసి ఆస్పత్రులకు తరలించారు. ఘటనా స్థలం వద్ద, బస్సుల్లో దృశ్యాలు హృదయవిదారకంగా ఉన్నాయి. తమను కాపాడాలంటూ కంకరలో కూరుకుపోయిన వాళ్లు వేడుకోవడం.. అచేతనంగా కొందరు పడి ఉండడం కలవరపాటుకు గురి చేస్తోంది. ఈ ప్రమాదంలో 20 మంది మరణించినట్లు అధికారులు ప్రకటించారు. మరో 32 మందికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. గాయపడినవాళ్లలో పలువురి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య పెరిగేలా కనిపిస్తోంది.బస్సులో కంకర మధ్య విగతజీవిగా యువతి.. ఆ వెనక సగం కూరుకుపోయి సాయం కోసం ఎదురు చూస్తున్న యువకుడుకంకర టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ఘోరం జరిగినట్లు తెలుస్తోంది. అతివేగం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. మితిమీరిన వేగంతో దూసుకొచ్చిన టిప్పర్.. అదుపు తప్పి బస్సుపై బోల్లా పడిందని పోలీసులు చెబుతున్నారు. కంకర మొత్తం బస్సులో పడిపోవడంతో ఈ తీవ్రత ఎక్కువైందని అంటున్నారు.ప్రమాద సమయంలో బస్సులో 72 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఆదివారం సెలవు కావడంతో సిటీ నుంచి వెళ్లినవాళ్లు తిరుగు పయనమైనట్లు స్పష్టమవుతోంది. అందులో విద్యార్థులు, ఉద్యోగులే ఎక్కువగా ఉన్నారు. మొత్తం 20 మంది మృతుల్లో 10 మంది మహిళలు, ఒక చిన్నారి, 8 మంది పురుషులు(ఇద్దరు డ్రైవర్లుసహా) ఉన్నారు. మృతుల్లో పది నెలల పసికందు, ఆమె తల్లి కూడా ఉండడం కలిచివేస్తోంది. కేబిన్లలో ఇరుక్కుపోయిన టిప్పర్ డ్రైవర్, బస్సు డ్రైవర్ మృతదేహాన్ని బయటకు తీశారు. మరో 15 మంది ప్రయాణికులను కాపాడగలిగారు. కంకరను పూర్తిగా తొలగించేందుకే జేసీబీ సహాయం తీసుకున్నారు.👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)ఇదిలా ఉంటే.. సహయ చర్యల్లో పాల్గొన్న సీఐ భూపాల్‌కు గాయాలయ్యాయి. జేసీబీ ఆయన కాలు మీదకు ఎక్కింది. దీంతో ఆయనకు చికిత్స అందించారు. ఇక ఈ ప్రమాదం వల్ల చేవెళ్ల-వికారాబాద్ బీజాపూర్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మూడు కిలోమీటర్ల వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దీంతో అధికారులు రంగంలోకి ట్రాఫిక్‌ను క్లియర్ చేసే పనిలో ఉన్నారు. -
పెళ్లికి ముందు భార్య వేరే వ్యక్తిని ప్రేమించిందని..
పటాన్చెరు టౌన్: పెళ్లికి ముందు భార్య వేరే వ్యక్తిని ప్రేమించిందని మనస్తాపానికి గురై ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నారాయణపేట జిల్లాకు చెందిన రాములు (23) అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని సుల్తాన్పూర్ లో ఉంటూ స్థానికంగా ప్రైవేట్ స్కూల్లో బస్ డ్రైవర్‌గా పని చేస్తున్నా డు. రాములుకు వికారాబాద్‌కు చెందిన ఓ యువతి (18)తో నెల కిందట వివాహం జరిగింది.ఈ క్రమంలో అతను గతనెల 28వ తేదీన భార్యతో తాను పెళ్లికి ముందు ఒక అమ్మాయిని ప్రేమించానని చెప్పి, నువ్వు ఎవ రినన్నా ప్రేమించావా? అని అడగడంతో అతని భార్య.. తాను కూడా ఒక వ్యక్తిని ప్రే మించానని చెప్పింది. దీంతో అప్పటి నుంచి ఆలోచిస్తూ.. మనస్తాపానికి గురైన రాములు శనివారం బయటకు వెళ్లొస్తానని చెప్పి తిరిగి ఇంటికి వెళ్లలేదు. దీంతో కుటుంబ సభ్యులు రాములు కోసం వెతుకుతుండగా సుల్తాన్పూర్ శివారులో చెట్టుకు ఉరి వేసుకొని కనిపించాడు. సమాచారం తెలుసుకున్న పోలీ సులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
వదిన, భార్య, బిడ్డను చంపి ఆపై ఆత్మహత్య
కుల్కచర్ల: కుటుంబ కలహాలు నలుగురి ప్రాణాలు బలితీసుకున్నాయి. ఈ ఘటన వికారాబాద్ జిల్లా కుల్క చర్ల మండల కేంద్రంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు, బాధిత కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన వేపూరి యాదయ్య (36)కు 15 ఏళ్ల క్రితం గండీడు మండలం పగిడ్యాలకు చెందిన సాయమ్మ, కృష్ణయ్య దంప తుల కుమార్తె అలి వేలుతో వివాహమైంది. వారికి అపర్ణ (13), శ్రావణి (10) కూతు ర్లు ఉన్నారు. అయితే దంప తులు నాలుగేళ్లుగా గొడవప డుతూ పెద్దల సూచనతో వైవాహిక బంధాన్ని కొనసా గిస్తున్నారు. శుక్రవారం మరో మారు గొడవపడ్డారు. ఈ క్రమంలో అలివేలు సోద రి వల్లభరావుపల్లికి చెందిన హన్మమ్మ శనివారం పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్ట గా వారు రాజీ కుదిర్చారు.నిద్రలో ఉండగా దాడి ఇంటికి వచ్చిన యాదయ్య ముందస్తు ప్రణాళిక ప్రకారం భార్య, వదిన, పిల్లలు నిద్రించిన తర్వాత మొదట హన్మమ్మపై కత్తితో దాడి చేశాడు. ఆ శబ్దానికి నిద్రలోంచి లేచిన భార్యపై.. తదనంతరం మేము లేకుంటే మిమ్ముల్మి ఎవరు సాకుతారంటూ పిల్లలపై దాడి చేశాడు. దీంతో శ్రావణి మృతిచెందగా మరో కుమార్తె అపర్ణ తీవ్రంగా గాయపడి అక్కడి నుంచి పరారైంది. అనంతరం యాదయ్య సైతం ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అపర్ణ స్థానికులకు విషయం చెప్పడంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. డీఎస్పీ శ్రీనివాస్, కుల్కచర్ల ఎస్ఐ రమేశ్ ఘటనాస్థలికి చేరుకొని వివరాలు సేకరించారు. అలివేలు కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
వేధింపుల ప్రిన్సిపాల్ మాకొద్దు
షాద్‌నగర్: ‘అడుగడుగునా వేధిస్తోంది.. లంచాలు అడుగుతోంది.. కులం పేరుతో దూషిస్తోంది.. మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది.. ఈ ప్రిన్సిపాల్ మా కొద్దు.. ఆమె నుంచి విముక్తి కల్పించండి’ అంటూ విద్యార్థినులు రోడ్డెక్కారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పరిధిలోని కమ్మదనం గ్రామ శివారులో నూర్ ఇంజనీరింగ్ కళాశాల భవనంలో నాగర్‌కర్నూల్ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల డిగ్రీ కళాశాల కొనసాగుతోంది. ఇక్కడ సుమారు 600 మంది విద్యార్థినులు విద్యాభ్యాసం సాగిస్తున్నారు. కళాశాల ప్రిన్సిపాల్ శైలజ తమను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపిస్తూ ఆదివారం విద్యార్థినులు ప్లకార్డులు పట్టుకొని పెద్దసంఖ్యలో హాస్టల్ నుంచి బయటికి వచ్చారు. సుమారు రెండున్నర కిలోమీటర్లకు పైగా ర్యాలీగా వెళ్లి షాద్‌నగర్ చౌరస్తాలో ధర్నా చేపట్టారు.వీరి ఆందోళనకు ఎస్ఎఫ్ఐ నాయకులు మద్దతు తెలిపారు. ఓ దశలో విద్యార్థినులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. కొందరు విద్యార్థినులు సొమ్మసిల్లి కింద పడిపోయారు. మఫ్టీలో ఉన్న ఓ మహిళా కానిస్టేబుల్ విద్యార్థినులను బలవంతంగా వాహనంలో ఎక్కించే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో ఓ విద్యార్థినిని చెంపపై కొట్టడంతో అంతా ఆగ్రహంతో ఆమెను జుట్టుపట్టి కొద్దిదూరం ఈడ్చుకెళ్లి చితకబాదారు.పట్టణ సీఐ విజయ్‌కుమార్ విద్యార్థినులకు నచ్చజెప్పి పోలీస్‌స్టేషన్ వద్దకు తీసుకెళ్లారు. త్వరలో కమిటీ వేసి సమస్యను పరిష్కరిస్తామని జోనల్ ఆఫీసర్ నిర్మల చెప్పినా వారు వినలేదు. ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేయాల్సిందేనని, అప్పటివరకు హాస్టల్‌కు వెళ్లబోమని భీష్మించుకుని ఠాణా ఎదుటే కాసేపు బైఠాయించారు. తిరిగి చౌరస్తా వద్దకు వచ్చి ధర్నా చేపట్టారు. పోలీసులు మరోసారి వారికి సర్దిచెప్పి బస్సుల్లో హాస్టల్‌కు పంపించారు. -
రాజ్యాంగ సవరణ చేయాల్సిందే
బంజారాహిల్స్: బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం ఈ నెల 20వ తేదీ నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల్లోనే రాజ్యాంగ సవరణ చేయాలని, లేదంటే గల్లీ నుంచి ఢిల్లీ వరకు బీసీలు ప్రత్యక్ష పోరాటానికి సిద్ధపడాలని అఖిలపక్ష పార్టీల నేతలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ నాయకులు పిలుపునిచ్చారు. బంజారాహిల్స్‌లోని కళింగ కల్చరల్ సెంటర్లో ‘బీసీ రిజర్వేషన్ల పెంపు.. భవిష్యత్ కార్యాచరణ’పై బీసీ జేఏసీ ఆదివారం రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి జేఏసీ వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్‌గౌడ్ అధ్యక్షత వహించగా, కో చైర్మన్ దాసు సురే‹Ù, కోఆర్డినేటర్ గుజ్జ కృష్ణ సమన్వయం చేశారు.సమావేశంలో పాల్గొన్న బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. దేశంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వచి్చన తర్వాత రిజర్వేషన్లు లేని వర్గం అంటూ ఏదీ లేదని తెలిపారు. రిజర్వేషన్లు అనుభవిస్తున్న సామాజిక వర్గాలలో బీసీలకే అన్యాయం జరుగుతోందని అన్నారు. దగా పడ్డ బీసీలు దండుకట్టే సమయం ఆసన్నమైందని తెలిపారు. జాజుల శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. గత నెల 18న నిర్వహించిన రాష్ట్ర బంద్ తర్వాత గల్లీ నుంచి ఢిల్లీ వరకు బీసీ రిజర్వేషన్ల సాధన కోసం తెలంగాణ ఉద్యమ తరహాలోనే పోరాడటానికి సమస్త శ్రేణులను, సామాజిక ఉద్యమ శక్తులను ఏకం చేస్తూ బీసీ జేఏసీని మరింత విస్తృతం చేస్తున్నామని తెలిపారు. బీసీ రిజర్వేషన్లపై వెనక్కి తగ్గేదే లేదు.. బీసీ రిజర్వేషన్ల పెంపు విషయంలో కాంగ్రెస్ పార్టీ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్ ఈరావత్ అనిల్ స్పష్టంచేశారు. అసెంబ్లీలో ఆమోదించిన బిల్లు ఆమోదం కోసం వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఇండియా కూటమి తరఫున ఒత్తిడి తెస్తామని తెలిపారు. అసెంబ్లీ మాజీ స్పీకర్ మధుసూదనాచారి, మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. దశాబ్దాలుగా బీసీలకు రాజకీయంగా అన్యాయం జరుగుతూనే ఉందని, పార్టీలను పక్కనపెట్టి మరో పోరాటాన్ని చేపట్టాలని పిలుపునిచ్చారు.మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ.. బీసీ ఉద్యమానికి ఎమ్మార్పీఎస్ వెన్నంటి ఉంటుందని, బయట నుండి మద్దతు ఇవ్వకుండా బీసీ ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మాట్లాడుతూ.. బీసీలు తెలంగాణలో ఒంటరి కాదని, వారికి సకల జనులు అండగా నిలబడతారన్న విషయం ఇటీవలి బంద్‌తో తేటతలమైందని పేర్కొన్నారు. సినీ నటుడు ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ.. తరతరాలుగా బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దడానికి అంబేడ్కర్, ఫూలే చూపించిన మార్గంలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు దండు కట్టాలని పిలుపునిచ్చారు. సమావేశంలో రిటైర్డ్ ఐఏఎస్ కొల్లేటి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. -
మజ్లిస్‌కు రేవంత్ జీహుజూర్
గోల్కొండ: రాష్ట్రంలో మజ్లిస్ పార్టీకి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గులామ్‌గా మారి జీహుజూర్ అంటున్నారని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం ఆయన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా షేక్‌పేటలో ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రసంగించారు. హైదరాబాద్‌లో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కసీటు కూడా గెలుచుకోలేకపోయిన కాంగ్రెస్ పార్టీ.. పరువు కాపాడుకునేందుకు జూబ్లీహిల్స్‌లో విజయం సాధించడానికి మజ్లిస్ పార్టీకి గులామ్‌గా మారిందని ఆరోపించారు.మజ్లిస్ పార్టీ అడిగినవాటినల్లా మంజూరు చేస్తూ మైనార్టీ ఓట్లను పొందడానికి సీఎం రేవంత్‌రెడ్డి ఎంతకైనా తెగిస్తున్నారని మండిపడ్డారు. మజ్లిస్ పార్టీ తరఫున గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యక్తిని అద్దెకు తెచ్చుకొని ఈసారి కాంగ్రెస్ అభ్యర్థిగా మార్చారని ఎద్దేవా చేశారు. మైనార్టీలను ప్రసన్నం చేసుకోవడానికి అన్ని హద్దులూ దాటి హడావుడిగా అజహరుద్దీన్‌కు మంత్రి పదవి కట్టబెట్టారని విమర్శించారు. ఇది ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించడమే అని ఆరోపించారు. మజ్లిస్ పార్టీ ఒత్తిళ్లకు లొంగి విలువైన ఆర్మీ స్థలాలను ముస్లిం స్మశానవాటికలకు కేటాయిస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ పథకాలకు నిధులు కేంద్రానివే.. రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నిటికి కేంద్ర ప్రభుత్వ నిధులే అందుతున్నాయని కిషన్‌రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రేషన్ బియ్యానికి సైతం కేంద్ర ప్రభుత్వ నిధులే ఆధారమని పేర్కొన్నారు. దేశంలో జరుగుతున్న అభివృద్ధి మొత్తం ప్రధాని నరేంద్రమోదీ కృషి వల్లేనని తెలిపారు. రాష్ట్రంలో రైతంగానికి అందుతున్న ఆర్థిక సహాయం కూడా కేంద్ర ప్రభుత్వానిదేనని ఆయన స్పష్టం చేశారు.గత రెండేళ్ల రేవంత్ పాలనను ప్రజలు అసహ్యించుకుంటున్నారని చెప్పారు. తనకు తాను సెక్యులర్ వాదిగా చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ.. ప్రజలను వర్గాలుగా విభజించి పాలిస్తోందని విమర్శించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్‌రెడ్డిని అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. -
పేదలకో న్యాయం.. పెద్దలకో న్యాయమా?: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘హైదరాబాద్‌లో హైడ్రా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకు ఎంతో మంది బాధితులుగా మారారు. ఈ రెండేళ్లలో రేవంత్‌రెడ్డి సర్కారు ఒక్క ఇటుక పెట్టలేదు.. ఒక్క కొత్త కట్టడం లేదు. రేవంత్‌రెడ్డి చేసింది ఏంటి అంటే.. కూలగొట్టడమే’అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. మరో 500 రోజుల్లో కేసీఆర్ ప్రభుత్వం తిరిగి రానుందని, అప్పుడు బాధితులందరికీ న్యాయం చేస్తామని తెలిపారు. తెలంగాణ భవన్లో ఆదివారం హైడ్రా బాధితులతో కలిసి నిర్వహించిన కార్యక్రమంలో ఆయన.. హైడ్రా కూల్చివేతలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ‘హైడ్రా అరాచకాలు: పెద్దలకు న్యాయం, పేదలకు అన్యాయం’పేరుతో ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్ పాలనలో పెద్దలకు ఒక న్యాయం, పేదలకు మరో న్యాయం లభిస్తోందని దుయ్యబట్టారు. చాంద్రాయణగుట్టలో స్కూళ్లు కూడా కూల్చివేసిన ప్రభుత్వం, గర్భిణులను పక్కకు తోసేసి, మూడేళ్ల చిన్నారులు భోజనం లేకుండా ఏడ్చేలా చేసిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘ఒక ఇంటì గృహప్రవేశం చేసి వారం రోజులు కాలేదు.. బుల్డోజర్ వచ్చి కూల్చేసింది. ఇది మానవత్వం లేని చర్య‘అని ఆవేదన వ్యక్తం చేశారు. హైడ్రా బాధితుల బాధ అందరికీ అర్థమవ్వాలని అన్నారు. గత రెండేళ్లలో రేవంత్ రెడ్డి చేసింది కేవలం కూల్చివేతలే‘అని విమర్శించారు.వాళ్ల దగ్గరకు హైడ్రా వెళ్లగలదా?ప్రభుత్వానికి అందరూ సమానమైతే అక్రమంగా ఇళ్లు నిర్మించుకొని ఉంటున్న పెద్దవాళ్ల జోలికి ఎందుకు వెళ్లటంలేదని కేటీఆర్ ప్రశ్నించారు. ‘పెద్దపెద్ద బిల్డర్ల జోలికి ఎందుకు వెళ్లలేదు? పేదలకు న్యాయం చేయాలనుకుంటే.. ఫైవ్ స్టార్ హోటళ్లలో సమావేశాలు ఎందుకు పెడుతున్నట్టు? పేదల ఇళ్లు కూలగొట్టలేదని హైడ్రా కమిషనర్ చెబుతున్నారు. పేపర్లు, కోర్టు తీర్పులు ఉన్నా కూడా.. ఆలస్యం చేస్తే కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుంటారని అంటున్నారు. ఇలా చేస్తే ఇక ప్రజాస్వామ్యం ఎందుకు? కోర్టులు ఎందుకు? ఎఫ్టీఎల్లో ఇళ్లు కడితే ఎవరినీ వదలం అని చెప్పి పెద్దలను వదిలేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెరువును పూడ్చి ఇల్లు కట్టారు. మరో మంత్రి వివేక్ కూడా హిమాయత్ సాగర్ చెరువు వద్ద ఇల్లు కట్టుకున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి అన్న తిరుపతిరెడ్డి దుర్గం చెరువు ఎఫ్టీఎల్లో ఇల్లు కట్టుకున్నారు. సున్నం చెరువులో ఇల్లు కట్టుకున్న పేదలది తప్పు.. దుర్గం చెరువులో కట్టిన తిరుపతిరెడ్డిది ఒప్పా? ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి చెరువు మధ్యలోనే ఇల్లు కట్టుకున్నారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చెరువులోనే ఇల్లు కట్టుకున్నారు. వాళ్ల దగ్గరకు వెళ్లి నోటీసులు ఇచ్చే దమ్ము హైడ్రా అధికారులకు ఉందా? శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ.. గాజులరామారంలో 11 ఎకరాల ఆక్రమణకు ప్రభుత్వమే అండగా ఉంది. పేదలను వెళ్లగొట్టి గాంధీకి మాత్రం అండగా నిలిచారు. మూసీ నదిలో అడ్డంగా కట్టిన బిల్డింగ్‌ను కూడా ఇప్పటివరకు ఆపలేదు. మంత్రులు, పెద్దపెద్ద నాయకులకు ప్రభుత్వం అండగా ఉంటుంది..పేదలపైకి బుల్డోజర్లు పంపుతుంది. అందుకే మేం హైడ్రాను వ్యతిరేకిస్తున్నాం’అని కేటీఆర్ స్పష్టంచేశారు. రాహూల్ మాటలేమయ్యాయి?‘బుల్డోజర్ నా శరీరంపై నుంచి వెళ్లాలని యూపీలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మాట్లాడారు. అదే బుల్డోజర్ తెలంగాణలో ఇళ్లను కూలగొడుతుంటే రాహుల్ గాంధీ ఏం చేస్తున్నారు? కొండాపూర్‌లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకున్న కొందరికి ప్లాట్లు ఇచ్చారు. వారిని కూడా హైడ్రా వెళ్లగొట్టింది. ఆర్మీ కుటుంబాన్ని కూడా ప్రభుత్వం ఇబ్బంది పెట్టింది. రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూలగొట్టడం తప్పు అని, తెలియక తప్పు జరిగితే సరిదిద్దాలని చెప్పారు. ఇప్పుడు ఎందుకు కూలగొడుతున్నారు?’అని కేటీఆర్ ప్రశ్నించారు. -
జూబ్లీహిల్స్ 'డూ ఆర్ డై'
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ఆషామాషీగా తీసుకోవద్దని మంత్రులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించారు. ఈ ఎన్నిక ఫలితంతో తనతోపాటు మంత్రులందరి భవిష్యత్తు ముడిపడి ఉందని వ్యాఖ్యానించినట్టు తెలిసింది. ఉప ఎన్నిక ఫలితం సానుకూలంగా వస్తుందనే ధీమాతో ఉండొద్దని, మంత్రులు ఈ ఎన్నికను చాలా సీరియస్‌గా తీసుకోవాలని ఆదేశించినట్టు సమాచారం. ఆదివారం మధ్యాహ్నం తన క్యాంపు కార్యాలయం సమీపంలో ఆయన కేబినెట్ సహచరులకు లంచ్ ఏర్పాటు చేశారు. అంతకుముందు దాదాపు గంటన్నరకు పైగా అక్కడే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచార సరళిని ఆయన సమీక్షించారు. ఈ సమీక్షలో సీఎం మాట్లాడుతూ.. ఉప ఎన్నికలో గెలవాల్సిన ఆవశ్యకతను మంత్రులకు వివరించారు. జూబ్లీహిల్స్ ఎన్నిక జరుగుతున్న తీరును అధిష్టానం కూలంకషంగా పరిశీలిస్తోందని, డివిజన్లవారీగా బాధ్యతలు తీసుకున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ల చైర్మన్ల పనితీరు గురించి ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటోందని చెప్పారు. డివిజన్లు, బస్తీలతో సహా బూత్ స్థాయిలో ప్రచార మేనేజ్మెంట్ పకడ్బందీగా జరగాలని, ఈ వారం రోజులపాటు ప్రతి మంత్రి ఉప ఎన్నికను సీరియస్‌గా తీసుకుని పనిచేయాలని సూచించారు. ‘ఈ ఎన్నికల్లో ఓడినా, గెలిచినా సీఎంగా నా ఒక్కడిపైనే ప్రభావం ఉండదు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వంపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రజల్లో ఓ ఇమేజ్ కల్పిస్తుంది. ఈ ఎన్నికలో సానుకూల ఫలితం రాకపోతే నాతోపాటు వ్యవస్థకు నష్టం చేస్తుంది. డూ ఆర్ డై తరహాలో ఈ ఎన్నికను తీసుకోవాలి. తూతూమంత్రపు వ్యవహారాలకు స్వస్తి చెప్పి మీ సొంత ఎన్నికలా తీసుకుని పనిచేయండి. మంచి మెజార్టీతో ఈ ఎన్నికలో గెలవాలి’అని దిశానిర్దేశం చేశారు. కౌంటర్లు ఇవ్వకపోతే ఎలా? ప్రతిపక్షాల ఆరోపణలను తిప్పికొట్టండంలో, సోషల్ మీడియా ప్రచారంలో ఆశించిన మేర మంత్రులు పనిచేయడం లేదని సీఎం రేవంత్‌రెడ్డి అసహనం వ్యక్తంచేసినట్టు తెలిసింది. బీఆర్ఎస్ పదేళ్లలో చేసిన విధ్వంసాన్ని అధిగమిస్తూ రాష్ట్ర ప్రజలకు అవసరమైన అన్ని కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నామని, హైదరాబాద్ నగరంలో గతంలో ఎన్నడూ లేని అభివృద్ధి ప్రణాళికలు రూపొందిస్తున్నామని, ఈ విషయాలను జూబ్లీహిల్స్ ఓటర్లకు వివరంగా చెప్పాలని మంత్రులకు సూచించారు. బీఆర్ఎస్, బీజేపీ విమర్శలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని ఆదేశించారు. సోషల్‌మీడియాలో బీఆర్ఎస్ చేస్తున్న దు్రష్పచారాన్ని తిప్పికొట్టేందుకు స్వయంగా మంత్రులే సోషల్ మీడియాను పర్యవేక్షించాలని, ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వారియర్లను అప్రమత్తం చేయాలని కోరారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేస్తున్న ఆరోపణలను వెంటనే తిప్పికొట్టేలా ప్రణాళిక రూపొందించుకోవాలని, సెంటిమెంట్‌ను ఉపయోగించుకోవాలని చూస్తున్న బీఆర్ఎస్ ప్రయత్నాన్ని తిప్పికొట్టాలని తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథం, పీసీసీ అధ్యక్షుడు బి.మహేశ్‌కుమార్‌గౌడ్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్, దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, వివేక్ వెంకటస్వామితోపాటు కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, అజారుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ వైద్య కళాశాలల్లో కొత్తగా 75 పీజీ సీట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో కొత్తగా 75 పీజీ సీట్లను కేటాయిస్తూ నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్ఎంసీ) నిర్ణయం తీసుకుంది. ఉస్మానియా వైద్య కళాశాలతోపాటు మరో ఆరు ప్రభుత్వ కళాశాలల్లో వివిధ కోర్సుల్లో కొత్త సీట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఉస్మానియా కాలేజీలో హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో 4 సీట్లు మంజూరు చేసిన ఎన్ఎంసీ.. నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో 8 సీట్లు, మహబూబ్‌నగర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో నాలుగు పీజీ సీట్లను మంజూరు చేసింది.కొత్తగా ఏర్పాటైన సిద్దిపేట, సూర్యాపేట, నల్లగొండ, రామగుండం వైద్య కళాశాలల్లో పెద్ద ఎత్తున పీజీ సీట్లు కేటాయించడం విశేషం. పెరిగిన సీట్లకు ఈ ఏడాది నుంచే అడ్మిషన్లు జరగనున్నాయి. 75 సీట్లు పెరగడంతో రాష్ట్రంలో స్పెషాలిటీ డాక్టర్ల సంఖ్య పెరిగి మరింత నాణ్యమైన వైద్య సేవలు అందనున్నాయని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం 2,983 పీజీ వైద్య సీట్లు అందుబాటులో ఉన్నాయి.అందులో ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 1,472 పీజీ సీట్లు ఉండగా వాటికి 75 సీట్లు అదనంగా కలవనున్నాయి. దీంతో ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో పీజీ సీట్ల సంఖ్య 1,547కు పెరగనుంది. వాటిలో 50 శాతం అఖిల భారత కోటా కింద పోగా మిగతా 50 శాతం అంటే 773 సీట్లు తెలంగాణ స్థానిక విద్యార్థులకే లభించనున్నాయి. -
ఇక రోడ్డు విశాలం.. ప్రయాణం పదిలం
సాక్షి, హైదరాబాద్: చేవెళ్ల రోడ్డు ఎట్టకేలకు లోపాలు సరిదిద్దుకొని విశాలంగా మారనుంది. గత పదకొండేళ్లలో రోడ్డు ప్రమాదాల రూపంలో 300 మంది మృతికి కారణమైన ఈ రోడ్డు మరో రెండేళ్లలో నాలుగు వరుసలుగా మారి ప్రయాణికులు పదిలంగా గమ్యం చేరేందుకు దోహదపడనుంది. ఈ విస్తరణ వల్ల 915 మర్రి చెట్లకు ముప్పు పొంచి ఉందంటూ వృక్ష ప్రేమికులు గతంలో వేసిన కేసు వల్ల జాతీయ హరిత ట్రిబ్యునల్‌లో కొనసాగుతున్న స్టేకు అడ్డంకులు తొలగనుండటమే అందుకు కారణం. రోడ్డు డిజైన్‌ను మార్చడం ద్వారా ఆ చెట్లను కాపాడనున్నట్లు ఎన్హెచ్ఏఐ చేసిన విన్నపానికి ట్రిబ్యునల్ సానుకూలంగా స్పందించిన నేపథ్యంలో సోమ, మంగళవారాల్లో స్టేను ఎత్తేసే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో రోడ్డు విస్తరణ పనులు మొదలు కానున్నాయి. గతంలోనే టెండర్ల ప్రక్రియను పూర్తి చేయడంతో ఇప్పుడు జాప్యం లేకుండా రోడ్డు పనుల్లో కదలిక రానుంది. 46.405 కి.మీ. నిడివిగల ఈ రోడ్డును 60 మీటర్లకు విస్తరించే పని రెండేళ్లలో పూర్తి చేస్తామని ఎన్హెచ్ఏఐ అధికారులు అంటున్నారు. తెలంగాణ వచ్చాక 300 మరణాలు... హైదరాబాద్ శివారులోని అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ కూడలి వరకు ఉన్న రోడ్డును 60 మీటర్ల మేర నాలుగు వరుసలుగా ఎన్హెచ్ఏఐ విస్తరించనుంది. ప్రస్తుతం రోడ్డు బాగా ఇరుకుగా ఉండటంతో తరచూ రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. 2014 నుంచి 2025 వరకు జరిగిన ప్రమాదాల్లో ఏకంగా 300 మంది మరణించారు. వాస్తవానికి ఈ రోడ్డును విస్తరించాలని పదేళ్ల క్రితమే నిర్ణయించినా పలు కారణాల వల్ల జాప్యం జరుగుతూ వచ్చింది. ప్రధానంగా ఈ మార్గంలో ఉన్న భారీ మర్రి చెట్లు రోడ్డు విస్తరణకు అడ్డంకిగా మారాయి. మిగతా రోడ్లను విస్తరించే సమయంలో భారీ మర్రి చెట్లను తొలగించడంతో ఈ రోడ్డుపై ఉన్న 915 మర్రి చెట్లను కాపాడాకే రోడ్డు విస్తరణ జరిగేలా చూడాలని వృక్ష ప్రేమికులు జాతీయ హరిత ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. అధికారుల వద్ద సరైన ప్రణాళిక లేకపోవడంతో రోడ్డు విస్తరణపై ట్రిబ్యునల్ స్టే విధించింది. ఇప్పుడు విస్తరణకు పక్కా ప్రణాళికను రూపొందించి తాజాగా ట్రిబ్యునల్‌కు సమర్పించారు. మార్పులతో ముందుకు.. రోడ్డు సెంట్రల్ మీడియన్‌కు ఉద్దేశించిన ఐదు మీటర్ల స్థలాన్ని ఒకటిన్నర మీటర్‌కు అధికారులు కుదించారు. ఫలితంగా మిగిలే మూడున్నర మీటర్ల స్థలాన్ని రోడ్డు విస్తరణకు జోడించారు. దీనివల్ల రోడ్డు పక్కనున్న చెట్లను తొలగించాల్సిన అవసరం ఉండదని ప్రణాళికలో పేర్కొన్నారు. చెట్లు తక్కువగా ఉన్న వైపు విస్తరణ స్థలాన్ని పెంచడం వల్ల చెట్లు పోకుండా కాపాడతామని తెలిపారు. కేవలం 136 వృక్షాలే ఈ డిజైన్‌కు సరిపోవట్లేదని.. వాటిని మాత్రం ఉన్న స్థలం నుంచి తొలగించి ట్రాన్స్‌లొకేట్ చేయడం ద్వారా రోడ్డు పక్కన తిరిగి నాటుతామని చెప్పారు. తద్వారా ఒక్క మర్రి చెట్టు కూడా పోకుండా కాపాడే అవకాశం ఉంటుందన్నారు. దీనికి ట్రిబ్యునల్ సానుకూలంగా ఉంది. కేసు దాఖలు చేసిన వృక్ష ప్రేమికులు ఈ ప్రణాళికను స్వాగతిస్తూనే దాని అమలు విషయంలో లిఖితపూర్వక హామీలు కోరుతున్నారు. వాటిని సోమవారం ట్రిబ్యునల్‌కు సమరి్పంచనున్నారు. ఆ హామీలపై ఎన్హెచ్ఏఐ లిఖితపూర్వక భరోసా ఇస్తే ట్రిబ్యునల్ స్టే ఎత్తేసే అవకాశం ఉంది. -
నేటి నుంచి ఎస్ఎల్బీసీ హెలికాప్టర్ సర్వే
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ) సొరంగం తవ్వకాల పనుల పునరుద్ధరణలో భాగంగా సోమవారం నుంచి హెలికాప్టర్ బోర్న్ వీటెమ్ ప్లస్ మాగ్నెటిక్ జియోఫిజికల్ సర్వేను ప్రారంభించనున్నారు. సర్వే నిర్వహణకు పౌర విమానయాన శాఖ డైరెక్టర్ జనరల్ (డీజీసీఏ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సోమవారం స్వయంగా నాగర్ కర్నూలు జిల్లా మన్నేవారిపల్లికి చేరుకుని సర్వేను పర్యవేక్షిస్తారు. సర్వే జరిపే హెలికాప్టర్‌కు సమాంతరంగా మరో హెలికాప్టర్లో సీఎం, మంత్రి ప్రయాణిస్తూ సర్వే ప్రక్రియను పరిశీలించనున్నారు. నేషనల్ జియో ఫిజికల్ ఇన్స్టిట్యూట్ (ఎన్జీఆర్ఐ) శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సర్వేలో భాగంగా దాదాపు 200 కి.మీ.ల విస్తీర్ణంలో సొరంగం తవ్వకాలు జరగాల్సిన ప్రాంతంలో భూగర్భంలో 800–1,000 మీటర్ల లోతు వరకు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనేది గుర్తిస్తారు. గత ఫిబ్రవరిలో సొరంగం కుప్పకూలిన ఘటనలో కార్మికులు మరణించటంతోపాటు టన్నెల్ బోరింగ్ మెషీన్ (టీబీఎం) ధ్వంసమైంది. దీంతో సురక్షిత పద్ధతిలో సొరంగం తవ్వకాలను పునరుద్ధరించడానికి నిపుణుల కమిటీ చేసిన సిఫారసుల మేరకు ఈ సర్వే నిర్వహిస్తున్నారు. ప్రాజెక్టులో భాగంగా రెండు వరుస సొరంగాలను నిర్మిస్తుండగా, రెండో సొరంగం తవ్వకాలు పూర్తి అయ్యాయి. ఒకటో సొరంగాన్ని మొత్తం 43.93 కి.మీ.లు తవ్వాల్సి ఉండగా, ఇన్లెట్ వైపు నుంచి 13.94 కి.మీ.లు, దేవరకొండ వద్ద ఉన్న అవుట్ లెట్ వైపు నుంచి 20.4 కి.మీ.లు తవ్వారు. మధ్యలో 9.8 కి.మీ. ల సొరంగాన్ని తవ్వాల్సి ఉంది. తవ్వకాలు పూర్తయితే ప్రపంచంలోనే అత్యంత పొడవైన మానవ నిర్మిత సొరంగంగా ఇది రికార్డు సృష్టించనుంది. సర్వే ఇలా చేస్తారు..24 మీటర్ల వ్యాసం కలిగిన ట్రాన్స్‌మీటర్ లూప్‌ను హెలికాప్టర్‌కు వేలాడదీసి సొరంగం తవ్వాల్సిన ప్రాంతంపై గాల్లో ఎగరడం ద్వారా ఈ సర్వే జరపనున్నారు. విద్యుత్ అయస్కాంత తరంగాలను ట్రాన్స్ మీటర్ భూమిలోకి పంపిస్తుంది. అవి భూగర్భంలోని పొరలకు తాకి పరావర్తనం చెందుతాయి. తిరిగివచ్చే తరంగాలను రిసీవర్ ద్వారా గ్రహించి భూగర్భంలో ఎలాంటి నిర్మాణం ఉందో అంచనా వేస్తారు. 800–1,000 మీటర్ల లోతులో ప్రమాదకర పరిస్థితులు (షీర్ జోన్) ఉన్నాయా? నీళ్లు ఉన్నాయా? అనే అంశాలను నిపుణులు అధ్యయనం చేసి సొరంగం తవ్వకాలకు ఎలాంటి టెక్నాలజీ వినియోగించాలనేది సూచించనున్నారు. -
ఎక్కడైనా ఓకే!
సాక్షి, హైదరాబాద్: బార్ అండ్ రెస్టారెంట్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో జీహెచ్ఎంసీ, శివారు మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో ఉన్న బార్లను ఎక్సైజ్ శాఖ ప్రతిపాదనల మేరకు తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ (టీసీయూఆర్) పరిధిలోకి తీసుకురానుంది. దీంతో బార్ అండ్ రెస్టారెంట్ల ప్రాంతీయ పరిధి పెరగనుంది. ఈ మేరకు సీఎం కార్యాలయం నుంచి కూడా గ్రీన్‌సిగ్నల్ వచ్చిందని.. త్వరలో జరిగే కేబినెట్ సమావేశంలో ఈ ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదం తెలపనుందని ఎక్సైజ్ వర్గాలంటున్నాయి. ప్రస్తుతం ఎక్కడివక్కడే...రాష్ట్రంలో దాదాపు 60 శాతం మద్యం విక్రయాలు జీహెచ్ఎంసీ, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల పరిధిలోనే జరుగుతున్నాయి. అయితే ఈ ప్రాంతాల్లోని వైన్‌షాపుల (ఏ4) ద్వారానే భారీగా మద్యం విక్రయాలు సాగుతున్నాయి. దీనివల్ల బార్ అండ్ రెస్టారెంట్ల (2బీ) మనుగడ రానురాను ప్రశ్నార్థకంగా మారుతోంది. ముఖ్యంగా జీహెచ్ఎంసీ (కోర్ హైదరాబాద్) పరిధిలోని బార్ల నిర్వహణ యజమానులకు కష్టతరమవుతోంది. దీంతో బార్ల లైసెన్సులు కూడా రెన్యూవల్ కావట్లేదు. చాలా కాలంగా రెన్యూవల్ చేయని బార్ల లైసెన్సులను రద్దు చేసి కొత్తగా ఇటీవల నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ ఆశించిన స్పందన రాలేదు. హైదరాబాద్ పరిధిలో ఆదాయం తక్కువగా ఉండగా ఓఆర్ఆర్, శివారు ప్రాంతాల్లో బార్లకు డిమాండ్ బాగా కనిపిస్తోంది. ఎక్సైజ్ చట్టం ప్రకారం జీహెచ్ఎంసీ, శివారు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలోని బార్ అండ్ రెస్టారెంట్లకు పరిమితులున్నాయి. ఏ ప్రాంతంలోని బార్లు ఆ ప్రాంతంలోనే ఏర్పాటు చేసుకోవాల్సి వస్తోంది. ఈ క్రమంలో జీహెచ్ఎంసీ, శివారు ప్రాంతాల్లోని బార్ల లైసెన్సుల పరిధి పెంచాలంటూ ఎక్సైజ్ శాఖ ప్రభుత్వాన్ని చాలా కాలంగా కోరుతోంది. తద్వారా హైదరాబాద్ చుట్టుపక్కల తీసుకున్న బార్ లైసెన్సును ఏ మున్సిపాలిటీ, కార్పొరేషన్, ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో అయినా వినియోగించుకునే వెసులుబాటు యజమానులకు లభిస్తుందని చెబుతోంది. ఈ ప్రతిపాదనను పరిశీలించిన ప్రభుత్వం హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లోని బార్ అండ్ రెస్టారెంట్ల లైసెన్సులన్నింటినీ టీసీయూఆర్ పరిధిలోనికి తీసుకురావాలని నిర్ణయించింది. ఈ మేరకు వచ్చే కేబినెట్లో ఎక్సైజ్ చట్టంలోని 2బీ షాపుల విధానానికి సవరణలను ఆమోదించనుందని సమాచారం. అదే జరిగితే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో బార్ అండ్ రెస్టారెంట్ల లైసెన్సులకు గిరాకీ పెరగడంతోపాటు ప్రభుత్వానికి ఆదాయమూ పెరిగే అవకాశం ఉందని ఎక్సైజ్ వర్గాలు చెబుతున్నాయి. -
అరెకపూడి ఆక్రమణ హైడ్రాకు కనపడదా?
నిజాంపేట్/మణికొండ: పెద్దలను కాపాడేందుకు పేదల ఇళ్లను కూల్చేస్తున్నారని, హైడ్రాతో ప్రభుత్వం ప్రజలను భయాందోళనకు గురి చేస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎ మ్మెల్సీలు, మాజీ మంత్రులు ఆరోపించారు. ఆదివారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, గాజులరామారంలోని సర్వే నంబర్ 307లోని భూమిని పరిశీలించారు. ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ కుటుంబ సభ్యులు ఈ సర్వే నంబర్లో 11 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించారంటూ నిరసన తెలిపారు.సర్వే నంబర్ 307లో పేదలకు చెందిన సుమారు 270 ఇళ్లను కూల్చిన హైడ్రా అధికారులు.. అరెకపూడి గాంధీకి చెందిన 11 ఎకరాల స్థలానికి వేసిన బారికేడ్లను కూల్చిన వెంటనే తిరిగి నిర్మిస్తే మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన గాం«దీ.. పార్టీ మారినందుకు రూ.1,100 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని నజరానాగా కట్టబెట్టిందని ఆరోపించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు కేపీ వివేకానంద్, మధుసూదనాచారి, జగదీశ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాధవరం కృష్ణారావు, సునీతా లక్ష్మారెడ్డి, బండారి లక్ష్మారెడ్డి, శంభీపూర్ రాజు, లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆదివారం మరోవైపు నార్సింగిలోని శ్రీ ఆదిత్య కేడియా రియల్టర్స్ సంస్థ మూసీ నదిలో నిర్మిస్తున్న భవనాన్ని ఎమ్మెల్యేలు సు«దీర్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ నవీన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డిలతో కలిసి మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరిశీలించారు.పేదలు కట్టుకున్న గృహాలను మూసీ సుందరీకరణ పేరుతో కూల్చివేశారని, అదే మూసీ నదిలో నిర్మిస్తున్న శ్రీఆదిత్య నిర్మాణానికి ఎందుకు మార్కింగ్ వేయలేదని ఆమె ప్రశ్నించారు. పేదల ఆస్తులు కూల్చటం, పెద్దల వద్ద డబ్బులు దండుకోవటమే హైడ్రా పనా? అని నిలదీశారు. నేను సిద్ధం.. మీరు సిద్ధమా: అరెకపూడిఆల్విన్ కాలనీ: తన భూములపై వస్తున్న ఆరోపణలపై అరి కెపూడి ఆదివారం వివరణ ఇచ్చారు. ‘సర్వే నంబర్ 307లో 11 ఎకరాలు కొన్న మాట వాస్తవమే. 9 మంది కుటుంబ సభ్యులు, మాజీ కార్పొరేటర్ శోభనాద్రి, నిజామాబాద్‌కు చెందిన కొందరు కలిసి 11 ఎకరాలను 1991లో కొనుగోలు చేశాం. 2014 నుంచి 2024 దాకా ఏ ఎమ్మెల్యే ఎంత అక్రమాస్తులు సంపాదించాడో తేల్చేందుకు సీబీఐ, ఈడీతో దర్యాప్తునకు మీరు సిద్ధమేనా?’ అని సవాల్ చేశారు. -
రేవంత్ పాలనలో అభివృద్ధి నిల్
గోల్కొండ: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాలనలో అభివృద్ధి శూన్యమని.. అందుకే అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ అట్టడుగున నిలిచిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా తమ పార్టీ అభ్యర్థి మాగంటి సునీతకు మద్దతుగా ఆదివారం ఆయన షేక్‌పేట్ డివిజన్లోని ఆదిత్య ఇంప్రెస్ గేటెడ్ కమ్యూనిటీలో ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సీఎం రేవంత్‌రెడ్డి పాలనను ఎండగట్టారు. జనరేటర్లు, వాటర్ ట్యాంకర్లకు చెక్ పెట్టాం.. పదేళ్ల పాలనలో కేసీఆర్ రాష్ట్రాభివృద్ధితో గ్రామీణ ప్రజలతోపాటు హైదరాబాద్‌వాసుల మన్ననలు పొందారని కేటీఆర్ గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్ర అవతరణకు ముందు అపార్ట్మెంట్లలో జనరేటర్లు, వాటర్ ట్యాంకర్లు లెక్కకు మించి ఉండేవని.. తమ పాలనలో అవన్నీ మాయమయ్యాయన్నారు. కేసీఆర్ కరెంటు కోతలకు చెక్ పెట్టడమే కాకుండా కృష్ణా, గోదావరి నీటిని నగర ప్రజలకు అందించారని చెప్పారు. బీఆర్ఎస్ పాలనలో ఐటీ ఉద్యోగాల కోసం వేలాది మంది హైదరాబాద్ వచ్చారన్నారు. కోవిడ్ సమయంలోనూ ఒక్క హైదరాబాద్‌లోనే 42 ఫ్లైఓవర్లు నిర్మించినట్లు చెప్పారు. కాంగ్రెస్ పాలనలో నత్తనడకన అభివృద్ధి రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్‌లో అభివృద్ధి నత్తనడకన సాగుతోందని కేటీఆర్ విమర్శించారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రజారవాణా అభివృద్ది చెందలేదన్నారు. ఆరు గ్యారంటీలంటూ ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపించిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయకుండా మోసం చేసిందని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్‌లోని ఒక్క సీట్లోనూ గెలవలేకపోయిన కాంగ్రెస్ పార్టీ.. పరువు కాపాడుకోవడానికి జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో గెలిచేందుకు అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఇందుకోసం ఎంఐఎంకు బానిసగా మా రి ఆ పార్టీ షరతులన్నింటినీ ఒప్పుకుందని దుయ్యబట్టారు. నగరవాసులు ఓటేయకుంటే రిగ్గింగ్‌కు అవకాశం నగరవాసుల ఓటింగ్ సరళిలోనూ మార్పు రావాలని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. విద్యావంతులు, ఉద్యోగులు ఎక్కువగా ఉండే హైదరాబాద్ నగరంలో ఓటింగ్ శాతం తక్కువగా ఉంటోందన్నారు. ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు రాకపోతే రిగ్గింగ్ జరిగే అవకాశం ఉంటుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రసంగాల కోసం.. సైన్యాన్ని అవమానిస్తారా..?సీఎం రేవంత్‌పై ఎక్స్ వేదికగా కేటీఆర్ విమర్శలు సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భారతీయ సైన్యంపై చేసిన అవమానకర, దిగజారుడు వ్యాఖ్యలపై వెంటనే క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు డిమాండ్ చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ ఆదివారం ఎక్స్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. ‘యూనిఫాం ధరించిన వీరులు సరిహద్దుల్లో అత్యంత క్రూరమైన పరిస్థితుల్లో కష్టపడుతుంటేనే మనం సురక్షితంగా జీవించగలుగుతున్నాం. ఎన్నికల ప్రసంగం కోసం భారతీయ సైన్యాన్ని తక్కువ చేసి పాకిస్తాన్‌ను పొగడటం ఏమిటి.. భారతీయ సైన్యానికి క్షమాపణ చెప్పి మీ మాటలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను. నోట్ల కట్టలతో పట్టుబడిన వ్యక్తి గూండాలను, రౌడీ షీటర్లను ఆరాధించడం సహజమే. కానీ తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తిగా కొంచెం మర్యాదగా ప్రవర్తించండి. తెలంగాణ ప్రతినిధిగా మీరు బాధ్యతాయుతంగా ప్రవర్తించి, సైనికులను గౌరవించాలి’ అని కేటీఆర్ విమర్శలు గుప్పించారు. -
బిసి రిజర్వేషన్ల కోసం రాజ్యాంగ సవరణ చేయాల్సిందే
బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం ఈనెల 20వ తేదీ నుండి జరిగే పార్లమెంట్ సమావేశంలోనే రాజ్యాంగ సవరణ చేసి బీసీ రిజర్వేషన్ల చట్టానికి ఆమోద తెల్పాల్సిందేనని, లేదంటే గల్లీ నుండి ఢిల్లీ వరకు బీసీలు ఇక ప్రత్యక్ష పోరాటానికి సిద్ధపడాలని అఖిలపక్ష పార్టీల నేతలు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ నాయకులు సంయుక్తంగా హెచ్చరించారునేడు(ఆదివారం, నవంబర్ 2వ తేదీ) హైదరాబాదులోని బంజారాహిల్స్ లో ఉన్న కళింగ కల్చరర్ సెంటర్ లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల పెంపు భవిష్యత్ కార్యాచరణ పై బీసీ జేఏసీ రాష్ట్రస్థాయి విస్తృత సమావేశం నిర్వహించింది ఈ సమావేశానికి బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షత వహించగా, కో చైర్మన్ దాసు సురేష్ , కోఆర్డినేటర్ గుజ్జ కృష్ణలు సమన్వయం చేశారుఉదయం 11 గంటలకు ప్రారంభమైన జేఏసీ సమావేశం సాయంత్రం 6 గంటల వరకు 7 గంటల పాటు సుదీర్ఘంగా కొనసాగింది సభ చాలా ఉత్కంఠ భరితంగా, సమాలోచనలతో దీర్ఘకాలిక వ్యూహం తో జరిగింది ఈ సమావేశo లో బీసీ సంఘాలు, కుల సంఘాలు, ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ, న్యాయవాద, డాక్టర్స్, మేధావుల సంఘాల నేతలతో పాటు రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల నుండి ప్రొఫెసర్లు, విద్యార్థి నాయకులు వేలాదిమంది హాజరయ్యారు ఈ సమావేశానికి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్, మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్, మాజీ స్పీకర్ మధుసూదన్ చారి, మాజీ ఎంపీ వి హనుమంతరావు, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ, మాల మానాడు జాతీయ అధ్యక్షులు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్ ఈరావత్ అనిల్, ప్రముఖ సినీ నటులు ఆర్.నారాయణమూర్తి, సినీ దర్శకులు ఎన్ శంకర్, తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షులు జూలురీ గౌరీశంకర్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చోల్లేటి ప్రభాకర్, పాల్గొని మాట్లాడారుబీజేపీ నేతగా రాలేదు.. బీసీ బిడ్డగా వచ్చా: ఈటెల రాజేందర్బీసీ జేఏసీ సమావేశానికి బిజెపి నేతగా తాను రాలేదని, ఒక బీసీ బిడ్డగా హాజరయ్యానని, బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీసీ జేఏసీ చేస్తున్నాం పోరాటానికి తన వంతు మద్దతు ఉంటుందని ఈటెల రాజేందర్ తెలిపారు దేశంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వచ్చిన తర్వాత రిజర్వేషన్లు లేని వర్గం అంటూ ఏదీ లేదని రిజర్వేషన్లు అనుభవిస్తున్న సామాజిక వర్గాలలో బీసీలకే అన్యాయం జరుగుతుందని దగా పడ్డ బీసీలు దండుగట్టే సమయం ఆసన్నమైందన్నారు బీసీ జేఏసీ నాయకత్వం ఏ రాజకీయ పార్టీలో లేనటువంటి నిస్వార్థంతో నిజాయితీతో బీసీల కోసం ఉద్యమించేవారు బాధ్యత తీసుకోవాలని గమ్యాన్ని ముద్దాడె వరకు ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలని ఆయన ఆకాంక్షించారువెనకకు తగ్గే ప్రసక్తి లేదుబీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ వెనుకకు తగ్గే ప్రసక్తి లేదని, రాహుల్ గాంధీ ఆదేశించిన విధంగానే కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో అసెంబ్లీలో చేసిన చట్టం అమలు చేయాలని వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఇండియా కూటమి తరఫున ఒత్తిడి తీసుకువస్తామని, కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున త్వరలోనే అఖిలపక్షంతో ఢిల్లీకి వెళ్లి ప్రధానిని కలుస్తామని వారు అన్నారు బీసీ రిజర్వేషన్ల విషయంలో బీసీ జేఏసీ చేస్తున్న పోరాటానికి బీసీ బిడ్డలుగా కాంగ్రెస్ పార్టీగా తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని కాంగ్రెస్ నేతలు వి హనమంతరావు, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, మైనింగ్ చైర్మన్ ఈరవత్ అనిల్ వెల్లడించారుతెలంగాణలో మరో ఉద్యమం: మధుసూదన్ చారి, శ్రీనివాస్ గౌడ్దశాబ్దాలుగా బీసీలకు రాజకీయంగా అన్యాయం జరుగుతూనే ఉందని పార్టీలను పక్కనపెట్టి బీసీలకు సామాజిక న్యాయం దక్కడానికి తెలంగాణలో మరో పోరాటాన్ని రూపొందించాలని వారు పిలుపునిచ్చారు బీసీ రిజర్వేషన్ల సాధనలో బీసీలు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కాదు అనే రీతిలో ఒక్కటే జట్టు గట్టి పోరాడాలని, టిఆర్ఎస్ పార్టీగా, బీసీ బిడ్డలుగా బీసీ జేఏసీ ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ఉంటుందని వారు వెల్లడించారు తెలంగాణ ఉద్యమ తరాహాలోనే బీసీ రిజర్వేషన్ల ఉద్యమాన్ని ముందుకు నడిపించాలని వారు సూచించారుమేము ప్రత్యక్షంగానే ఉద్యమంలో పాల్గొంటాంబీసీ ఉద్యమానికి ఎమ్మార్పీఎస్ వెన్నంటి ఉంటుందని, బయట నుండి మద్దతు ఇవ్వకుండా బీసీ ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొనడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ అన్నారు బీసీ ఉద్యమాన్ని శాంతియుతంగా ప్రజాస్వామ్యుతంగా ముందుకు తీసుకెళ్తే కచ్చితంగా విజయం సాధించడం ఖాయమన్నారు నాటి దేశ స్వాతంత్ర పోరాటం నుండి నేటి వర్గీకరణ పోరాటం వరకు శాంతియుతంగా పోరాడితేనే విజయం సిద్ధించిందని, ఇప్పుడు కూడా కాంగ్రెస్ బిజెపిలను ఒత్తిడి పెంచడానికి శాంతియుత పోరాటమే లక్ష్యంగా బీసీ ఉద్యమం ముందుకు సాగలని ఆయన తెలిపారు బీసీ జెఎసి రాజీ లేకుండా నిజాయితీగా కొట్లాడాలని, జాజుల శ్రీనివాస్ గౌడ్ నాయకత్వాన్ని ఎమ్మార్పీఎస్ బలపరుస్తుందని ఆయన వెల్లడించారురాజకీయాలకు అతీతంగా బహుజనులు ఏకమవుతాంబీసీలు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒంటరి కాదని బీసీ సమాజానికి సకల జనులు అండగా నిలబడతారని ఇది మొన్న జరిగిన రాష్ట్ర బంద్ తో తేటతలమైందన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. బీసీ ఉద్యమానికి మాల మాదిగ, ఆదివాసి, గిరిజన, మైనార్టీ సమాజం తోడుగా ఉంటుందని రాజకీయాలకు అతీతంగా బహుజనులు ఏకమై బీసీ రిజర్వేషన్ల ఉద్యమాన్ని బలపరుస్తామని ఆయన వెల్లడించారుపోరాడితే పోయేది ఏమీలేదు: ఆర్.నారాయణమూర్తితరతరాలుగా బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దడానికి అంబేద్కర్ ఫూలే చూపించిన మార్గంలో బీసీలు ఐక్యమై గల్లీ నుండి ఢిల్లీ వరకు దండుగట్టాలని, పోరాడితే పోయేది ఏమీలేదని, చరిత్రలో పోరాడిన సమాజమే విజయ తీరాలకు చేరిందని బీసీలు కూడా తమ హక్కుల కోసం ఐక్యంగా ముందుకు కదలాలని ఆయన పిలుపునిచ్చా పల్లె పల్లెకు విస్తరించాలి: రిటైర్డ్ ఐఏఎస్ కొల్లేటి ప్రభాకర్బీసీ రిజర్వేషన్ల ఉద్యమాన్ని పల్లె పల్లెకు విస్తరించాలని, రాష్ట్ర బంద్ తర్వాత బీసీ ఉద్యమం రాష్ట్రంలో బలపడిందని బిసిల బలాన్ని బలగాన్ని చూపించే తరుణ వాసనమైందని ఆయన తెలిపారు బీసీ జేఏసీ కార్యాచరణ (అష్టంగా ఆందోళనలు)బీసీ జేఏసీ విస్తృత స్థాయి సమావేశంలో అష్టంగా ఆందోళనలు పేరుతో భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణను జేఏసీ వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్, కో చైర్మన్ దాసు సురేష్ కోఆర్డినేటర్ గుజ్జ కృష్ణలు ప్రకటించారు1) నవంబర్ ఆరవ తేదీన రాష్ట్రవ్యాప్తంగా పూలే అంబేడ్కర్ విగ్రహాల ముందు బీసీల మౌన దీక్షలు2) నవంబర్ 13న రాష్ట్రవ్యాప్తంగా సామాజిక న్యాయసాధన కోసం పల్లె నుండి పట్నం వరకు "బీసీల ధర్మపోరాట దీక్షలు"3) నవంబర్ 16వ తేదీన రన్ ఫర్ సోషల్ జస్టిస్ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు4) నవంబర్ 20 నుండి పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నందున నవంబర్ 18వ తేదీన పార్లమెంటు సభ్యుల పైన ఒత్తిడి పెంచడానికి "ఎంపీలతో బీసీల ములాఖత్"5) నవంబర్ 23వ తేదీన బీసీ రిజర్వేషన్లపై అఖిలపక్ష పార్టీల సమావేశం6) డిసెంబర్ మొదటి వారంలో బీసీల చలో ఢిల్లీ పార్లమెంటు ముట్టడి7) డిసెంబర్ మూడోవారం నుండి పల్లె నుండి పట్నం వరకు బీసీల బస్సు యాత్ర8) జనవరి 4వ వారంలో లక్షలాది మందితో "వేలవృత్తులు- కోట్ల గొంతులు" అనే నినాదంతో హైదరాబాదులో భారీ బహిరంగ సభ -
హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం
సాక్షి,హైదరాబాద్: హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. నగరంలో ఆదివారం సాయంత్రం బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, మియాపూర్, చందానగర్, జీడిమెట్ల, కుత్బుల్లాపూర్, సికింద్రాబాద్, తిరుమలగిరి, అల్వాల్, బొల్లారం, జవహార్ నగర్ ప్రాంతాల్లో వర్షం ముమ్మరంగా కురవడంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.వర్షం తీవ్రతకు లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. పలు రహదారులు జలమయం కావడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడిన చోట్ల పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్‌ను నియంత్రిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. #HYDTPinfo 🚨 Traffic Update 🚨Water logging reported infront of Praja Bhavan. Vehicle movement is affected in the area. Commuters are advised to take alternative routes to avoid delays. #HyderabadTraffic #TrafficUpdate #DriveSafe pic.twitter.com/yXZ2Dj3ASR— Hyderabad Traffic Police (@HYDTP) November 2, 2025 Water logging reported near Virinchi Hospital, Road No. 1/10, Banjara Hills, Hyderabad.Vehicle movement is affected in the area. Commuters are advised to take alternative routes to avoid delays.#HyderabadTraffic #TrafficUpdate #DriveSafe #hyderabad #hyderabadrains #Indtoday pic.twitter.com/1LFx7zCMDW— indtoday (@ind2day) November 2, 2025 హైదరాబాద్‌తో పాటు యాదాద్రి భువనగిరి జిల్లాలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. చౌటుప్పల్, నారాయణపురం, పోచంపల్లి ప్రాంతాల్లో వర్షం కారణంగా వ్యవసాయ రంగానికి నష్టం వాటిల్లింది. చౌటుప్పల్ మార్కెట్ యార్డులో నిల్వ ఉన్న ధాన్యం తడిసిన ఘటన రైతులను ఆందోళనకు గురిచేసింది. అధికారులు వెంటనే స్పందించి ధాన్యాన్ని కాపాడే చర్యలు చేపట్టారు.వాతావరణ శాఖ ప్రకారం, ఈ వర్షాలు మరో రెండు రోజులు కొనసాగే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే మాత్రమే బయటకు రావాలని సూచించారు. అత్యవసర సేవల కోసం నగర పాలక సంస్థ ప్రత్యేక బృందాలను రంగంలోకి దించింది. -
పేదలకో న్యాయం.. పెద్దలకు మరో న్యాయమా?: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: హైడ్రా అరాచకాలంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రేవంత్ సర్కార్ ఒక్క కొత్త నిర్మాణం చేపట్టలేదని కేటీఆర్ మండిపడ్డారు. ఎఫ్టీఎల్ పరిధిలో మంత్రి వివేక్, రేవంత్ సోదరుడి ఇల్లు ఉంది. పట్నం మహేందర్ గెస్ట్‌హౌస్ చెరువు మధ్యలో ఉంది. పేదలకు ఒక న్యాయం.. పెద్దలకు మరో న్యాయమా?’’ అంటూ కేటీఆర్ నిలదీశారు.‘‘కేసీఆర్ హయాంలో హైదరాబాద్‌లో ఫ్లై ఓవర్లు, అండర్ పాసులు నిర్మించాం. కొత్త జిల్లాలు ఏర్పాటు, ఫ్లోరైడ్ మహమ్మారిని తరిమేశాం. రేవంత్ సర్కార్ కొత్తగా ఒక్క నిర్మాణం చేపట్టలేదు. 500 రోజుల్లో కేసీఆర్ తిరిగి అధికారంలోకి వస్తారు. హైడ్రా బాధితులను ఆదుకుంటాం. హైడ్రా పై భట్టి విక్రమార్క పీపీటీ పేరుతో 15 బిల్డర్ల పేర్లు చెప్పారు.. కానీ ఇప్పటి వరకూ ఒక్కరిపై యాక్షన్ ఎందుకు తీసుకోలేదు?. హైడ్రా చేసేది మంచే అయితే భట్టి చెప్పిన వారిపై చర్యలు ఎందుకు లేవు?. ఎఫ్టీఎల్ పరిధిలో కూల్చివేస్తామన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కి పొంగులేటి ఇంటిని కూల్చే ధైర్యం ఉందా?’’ అంటూ కేటీఆర్ ప్రశ్నించారు.‘‘మంత్రి వివేక్ ఇల్లు, రేవంత్ సోదరుడు తిరుపతిరెడ్డి ఇల్లు ఎఫ్టీఎల్లో ఉంది. పట్నం మహేందర్ రెడ్డి గెస్ట్ హౌస్ చెరువు మధ్యలో ఉంది. శాసన మండల చైర్మన్ సుఖేందర్‌రెడ్డి ఇల్లు చెరువు పక్కనే ఉంది. వీరిపై చర్యలు ఉండవు కానీ సున్నం చెరువు వద్ద పేదల చెరువు మాత్రం వెంటనే కూల్చి వేస్తారు. గాజుల రామారం వద్ద బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ భూమిని అలానే ఉంచారు. పేదల ఇల్లు మాత్రం కూల్చారు. మా పార్టీ నుంచి కాంగ్రెస్‌లో చేరారు కాబట్టి ఆయన భూమిపై ఎలాంటి చర్యలు లేవా?. సీఎం ఒత్తిడితో అధికారులు అక్కడ ఉండే ఆయన భూమికి ఫెన్సింగ్ వేశారు...మూసిలో అడ్డంగా కట్టిన ప్రాజెక్టును మంత్రులు అధికారులు ఎందుకు కూల్చలేదు. యూపీలో బుల్డోజర్ వస్తే అడ్డుకుంటా అన్న రాహుల్ గాంధీ తెలంగాణలో బుల్డోజర్ పేదల ఇల్లు కూలుస్తుంటే ఎందుకు మాట్లాడరు. పదేళ్లు కేసీఆర్ అధికారంలో ఉండగా పేదలకు న్యాయమే చేశాం తప్ప ఎవరికీ అన్యాయం చేయలేదు. హైడ్రా కూల్చివేతలపై బాధితులు మాట్లాడుతూ కన్నీటి పర్యంతం అవుతున్నారు. నోటీసులు లేకుండా తమ ఇళ్ళను కూల్చివేశారు. సామాన్లు సైతం తీసుకోకుండా కూల్చివేయడంతో బాధితులు రోడ్డున పడ్డారు’’ అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
తెలుగు యూట్యూబర్‌కు బంపరాఫర్
తన వద్ద పెద్దగా డబ్బు లేదు.. ఎవరి సపోర్ట్ కూడా లేదు.. కానీ, పెద్ద ప్రణాళిక ఉంది.. అంతకుమించి పట్టుదల ఉంది.. దాంతోనే రోజూ కొత్త విషయాలు నేర్చుకొని.. ఆ అంశాలనే ప్రజలతో పంచుకున్నాడు. వంద రూపాయలతో మొదలైన యూట్యూబర్ జీవితం నెలకు రూ.3లక్షల వరకు చేరింది. ఇలా సంపాదిస్తూ తెలుగు యూట్యూబర్లలో అగ్రగామిగా నిలిచాడు.ప్రపంచమే గుప్పిట్లో చేరిన ఈరోజుల్లో నిత్యం కొత్త విషయాలను వీక్షకులకు అందిస్తూ తనదైన శైలిలో ముందుకు సాగుతున్నాడు గోదావరిఖనికి చెందిన సయ్యద్ హఫీజ్. మొదట్లో హఫీజ్ వీడియోలకు కావలిసినంత వీక్షకులు రాకపోగా, ఇదెవరు చూస్తారని స్నేహితులు ఎగతాళి చేశారు. అయినా నిరాశ పడలేదు. క్రమశిక్షణ, నిరంతరకృషితో వీక్షకులు పెరుగుతూనే వచ్చారు. తన కృషికి ఫలితంగా గోల్డెన్ వీసా వరించింది. ప్రజలకు అవసరమైన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం నేర్చుకోవడమే కాదు.. ప్రజలతో పంచుకోవడం విశేషం. గోదావరిఖని(రామగుండం): రోజూ రూ.వందతో మొదలైన యూట్యూబర్ జీవితం నేడు నెలకు రూ.2లక్షల నుంచి 3లక్షల వరకు సంపాధిస్తూ తెలుగు యూట్యూబర్లలో అగ్రగామిగా నిలిచాడు. సింగరేణి కార్మికుని బిడ్డగా ఈప్రాంత వాసులను టెక్నాలజీలో అనేక అంశాల్లో చైతన్యవంతం చేస్తున్నాడు. సెల్ఫోన్లో నిత్యం కొత్త విషయాలను వీక్షకులకు అందిస్తూ తనదైన శైలిలో ముందుకు సాగుతున్నాడు. ముందుగా యైటింక్లయిన్‌కాలనీలో కంప్యూటర్ సెంటర్ నడిపించిన హఫీజ్‌ను యూట్యూబ్ ఉన్నత శిఖరాలకు చేర్చింది. ప్రస్తుతం ఎన్టీపీసీలో ఉంటూ TELUGU TECH TUTS యూట్యూబ్ చానెల్ నిర్వహిస్తూ అంతర్జాతీయ స్థాయిలో పేరు సాధించి యూఏఈ గోల్డెన్వీసా అందుకున్నాడు.చిన్ననాటి నుంచి ఆసక్తిచిన్నప్పటి నుంచి కంప్యూటర్‌పై పట్టున్న హఫీజ్ మొబైల్, కంప్యూటర్ గాడ్జెట్ల గురించి తెలుసుకునేందుకు ఆసక్తి కనబర్చేవాడు. మొదట ఇంగ్లిష్ టెక్ యూట్యూబర్ల వీడియోలు చూస్తూ పట్టు సాధించాడు. 2011లో “తెలుగు టెక్ ట్యూట్’ యూట్యూబ్ చానల్ ప్రారంభించాడు. మొదట్లో స్మార్ట్‌ఫోన్ కెమెరాతోనే వీడియోలు తీయడం ప్రారంభించాడు. హఫీజ్ వీడియోలకు కావలిసినంత వీక్షకులు లేకపోయినా, స్నేహితులు కొందరు ఇదెవరు చూస్తారని ఎగతాలి చేశారు.పట్టుదల, క్రమశిక్షణహఫీజ్ క్రమశిక్షణ, నిరంతరకృషితో వీక్షకులు పెరుగుతూ వచ్చారు. మొబైల్ రివ్యూలు, కొత్త యాప్స్ పరిచయం, ఆన్లైన్ సంపాదన మార్గాలు, సెక్యూరిటీ ట్రిక్స్ తదితర విషయాలను వీక్షకులకు వివరించాడు. తెలుగులో లక్ష మంది సబ్‌స్రై్కబర్స్, వన్ మిలియన్ వ్యూస్ సాధించిన టెక్ చానల్‌గా రికార్డుకెక్కింది. 2018లో సోషల్ మీడియా సమ్మిట్ అవార్డు, 2019లో టాప్ తెలుగు క్రియేటర్స్ జాబితాలో చోటు దక్కింది.2022లో ఫోర్బ్స్ ఇండియా డిజిటల్ స్టార్ లిస్ట్‌లో చోటు సాధించగా, బెస్ట్ తెలుగు టెక్క్రియేటర్ అవార్డు వరించింది. యూట్యూబ్ కాకుండా బ్రాండ్ డీల్స్, స్పాన్సర్షిప్స్, యాప్ ప్రమోషన్స్ ద్వారా ప్రతినెలా రూ.2 లక్షల నుంచి 3లక్షల ఆదాయం వస్తోంది. హఫీజ్ కృషిని గుర్తించిన యూఏఈ ప్రభుత్వం గోల్డెన్ వీసా అందించింది. పదేళ్ల పాటు యూఏఈలో కుటుంబ సభ్యులతో సహా జీవించే అవకాశం ఉంటుంది.మరింత మందిని తయారుచేస్తాటెక్, యూట్యూబ్, ఆన్లైన్ క్రియేటివ్ ఫీల్డ్‌లో ముందుకు రావాలనుకునే యువతకు గైడెన్స్ ఇవ్వాలని ఉంది. యువతకు ఉచిత వర్క్‌షాప్‌లు, ఆన్లైన్ గైడెన్స్ ప్రోగ్రామ్‌లు, స్మార్ట్ డిజిటల్ కెరీర్ మార్గాలు చూపించాలనుకుంటున్న.– సయ్యద్ హఫీజ్, తెలుగు టెక్ట్యూట్ క్రియేటర్ -
పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని..
నల్గొండ జిల్లా: తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేసి మోసం చేశాడని ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ధర్నాకు దిగింది. ఈ ఘటన నకిరేకల్ మండలం నెల్లిబండలో శనివారం వెలుగులోకి వచ్చింది. నెల్లిబండ గ్రామానికి చెందిన బాధితురాలు రేణుక తెలిపిన వివరాల ప్రకారం.. తనకు నెల్లిబండ గ్రామానికే చెందిన ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడిందని, అతడు తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి సహజీనం చేసి గర్భవతిని చేయడంతో ఆడబిడ్డకు జన్మనిచ్చినట్లు రేణుక తెలిపింది. బిడ్డ పుట్టిన తర్వాత తనను పట్టించుకోకుండా మరో మహిళను పెళ్లి చేసుకుని అన్యాయం చేశాడని, తనకు న్యాయం చేయాలని శనివారం అతడి ఇంటి ముందు ధర్నాకు దిగినట్లు ఆమె పేర్కొంది. కాగా ఈ విషయంలో గ్రామ పెద్దమనుషులు జోక్యం చేసుకుని పంచాయితీ చేస్తున్నట్లు తెలిసింది. ఈ ఘటనపై ఎలాంటి పోలీసు కేసు నమోదు కాలేదు. -
బీఆర్ఎస్ ఆఫీసుపై దాడి.. కేటీఆర్ సంచలన హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్: భద్రాచలంలోని మణుగూరులో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై దాడి, ధ్వంసంపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో గూండాల రాజ్యం, రౌడీయిజం పెరిగిపోయింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.మణుగూరు ఘటనపై కేటీఆర్ మాట్లాడుతూ..‘కాంగ్రెస్ పాలనలో రౌడీయిజం పెరిగిపోయింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం నలుమూలలా, గ్రామస్థాయి నుంచి రాష్ట్ర రాజధాని దాకా ప్రతి చోటా రౌడీల రాజ్యం నడుస్తోంది. అరాచకత్వం కొనసాగుతోంది. దీనికి చరమగీతం పాడే రోజు దగ్గరలోనే ఉంది’ అని హెచ్చరించారు. మరోవైపు.. పార్టీ ఆఫీసు దాడి ఘటనను వ్యతిరేకిస్తూ మణుగూరు అంబేద్కర్ సెంటర్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసనలకు దిగారు. ఆందోళన కార్యకర్తలు చేపట్టారు.ఇక, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని బీఆర్ఎస్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఇక్కడి కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఫర్నిచర్‌కు నిప్పు పెట్టడంతో పాటు ఆవరణలో ఫ్లెక్సీలు చింపేశారు. ప్రభుత్వ స్థలంలో భారత రాష్ట్ర సమితి కార్యాలయం నిర్మించారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. పార్టీ ఆఫీసుపై బీఆర్ఎస్ జెండాను తొలగించి కాంగ్రెస్ జెండాను ఎగురవేశారు. దీంతో, పట్టణంలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. కాంగ్రెస్ గుండాగిరి ?బీఆర్ఎస్ కార్యాలయంపై కాంగ్రెస్ అల్లరి మూకల దాడిభద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు బీఆర్ఎస్ కార్యాలయంలో జెండా గద్దెను ధ్వంసం చేసి, కార్యాలయ భవనం మీద దాడి చేసిన కాంగ్రెస్ pic.twitter.com/vPW8AXh45D— Pavani Goud BRS (@PAVANIGOUD_BRS) November 2, 2025 -
ఊరూ.. పల్లెటూరు..!
‘కరీంనగర్ సిటీకి చెందిన ఓ ఉద్యోగ దంపతులు 25 ఏళ్లక్రితం హుజూరాబాద్ సమీపంలోని చెల్పూర్ గ్రామంలో అద్దెకు ఉండేవారు. అక్కడ వీరికి జన్మించిన చంటిబాబుకు స్నానం చేయించడం.. ఏడిస్తే ఆడిపించడం వంటివి ఇంటి యజమానురాలు చేసేవారు. ఆ చిన్నోడు ఆమెను అమ్మమ్మ అనేవాడు. తర్వాత ఆ దంపతులు బదిలీపై వెళ్లిపోయారు. ఈక్రమంలో తల్లిదండ్రులు ఊళ్లో కిరాయికి ఉన్న ఇంటి యజమాని.. వారి పిల్లల గురించి తరచూ మాట్లాడుకోవడం వినేవాడు. ఆ పసిపిల్లోడు ఎదిగి ఉద్యోగ రీత్యా అమెరికా వెళ్లాడు. ఇటీవల అద్దె ఇంటి అమ్మమ్మను కలిసేందుకు వచ్చాడు. చిన్నప్పుడు తనను లాలించారని గుర్తుకు తెచ్చుకుని ఆ కుటుంబ సభ్యులను హత్తుకున్నాడు. ఇంటి యజమాని అప్పటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు’.హుజూరాబాద్: పల్లెలు.. ఆత్మీయతకు ముల్లెలు. ఊరోళ్లంతా రక్త సంబంధీకులు కాకపోయినా.. సామాజిక వర్గాలు వేరైనా బంధువుల్లా కలిసుంటారు.. ఎవరింట్లోనైనా ఏదైనా పనిపడితే మేమున్నామంటూ భరోసా ఇస్తారు. ఇరుగుపొరుగువారు పోగవుతారు. చేయిచేయి కలిపి పనికానిస్తారు. పంట కోతకొచ్చింది.. కూలీలు దొరకట్టేదని బాధపడుతుంటే.. చూస్తూ ఊరుకోకుండా సాయంగా నడుంబిగిస్తారు. పల్లెటూరి ముల్లెను విప్పి చూస్తే ఇలాంటి ఆత్మీయ అనుబంధాలెన్నో కనిపిస్తాయి.తలా ఓ చేయి వేస్తరు..ఊళ్లలో జరిగే శుభకార్యాలు.. విందులు.. ఇతర కార్యాలకు వంటలు చేసేందుకు ఒకరినొకరు సహకరించుకునే తీరూ చాలా గొప్పగా ఉంటుంది. ఒకరిద్దరే ఉన్నా.. ఇరుగుపొరుగు వారు సాయంగా నిలిచి వంటావార్పు చేసి ఎవరికీ ఏ కష్టం.. నష్టం రాకుండా చూస్తారు. వంటచేసి వడ్డించే దాకా అన్నీ తామై వ్యవహరించే విధానం పల్లె సిగలో చక్కని నగలా కనిపిస్తుంది. అదే పట్టణాల్లోనైతే ఈ పనులన్నీ ఎక్కడ చేస్తామని క్యాటరింగ్‌కు అప్పగిస్తారు.వాళ్లకు వీళ్లు.. వీళ్లకు వాళ్లువరికోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఊళ్లలో ఇంటి పక్కోళ్ల పొలానికి వీళ్లు వెళ్లి కోతల్లో పాల్గొంటారు.. వాళ్ల పొలం కోతకు వస్తే వీళ్లు వెళ్తారు. ఇలా ఇంటి చు ట్టూ ఉన్నవారితో ప్రేమానురాగాలు కొనసాగిస్తారు. ఏ చిన్న పండుగ చేసుకున్నా.. ఇంట్ల ఏది వండినా పంచుకొని తింటారు. ఈ పద్ధతి వల్ల డబ్బులు లేకుండా చేను పని, ఇంటి పనులు పూర్తవుతాయి. ఇలా ఒకరి పనుల్లో ఒకరు భాగస్వామ్యం అవ్వడాన్ని గ్రామాల్లో ‘బదిలీ’ అంటారు. వరికోతలు పూర్తయ్యాక.. కొత్తబియ్యం వండి ఒకరినొకరు బంతి భోజనాలకు పిలుచుకుంటారు. ఇప్పుడు పరిస్థితి మారుతుంది. కొన్ని పల్లెలు మూలవాసం మర్చిపోతున్నాయి. ఆత్మీతకు దూరమవుతున్నాయి.స్వచ్ఛందంగా కదిలి.. రోడ్డు నిర్మించిగంభీరావుపేట(సిరిసిల్ల): వర్షాల ప్రభావంతో వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ధాన్యం ఇంటికి తెచ్చుకునేందుకు రైతులకు దారిలేదు. రైతులంతా స్వచ్ఛందంగా కదిలారు. గంభీరావుపేట మండలం గోరింటాలకు చెందిన రైతులు చేయిచేయి కలిపారు. గ్రామ శివారులోని వాగుపై వంతెన లేకపోవడంతో తాత్కాలిక మట్టిరోడ్డును ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇలా రైతులు ఐక్యంగా కలిసిరావడం.. ఒకరికొకరు సాయం చేసుకోవడం పల్లె బంధానికి అద్దంపడుతోంది. సాగుకు సాయంగా వచ్చేవారునా యుక్త వయస్సులో ఒకరినొ కరు సాయం చేసుకుంటూ సాగు పనులు చేసేవాళ్లం. సరదా మాట లు మాట్లాడుకుంటూ పనులు చేస్తుంటే పని చేసినట్టు ఉండేవి కావు. కానీ, ఇప్పుడు డబ్బుకు ప్రా« దాన్యం పెరిగింది. బంధుత్వాల మధ్య వైరంగా మారి బంధాలను దూరం చేసుకుంటున్నారు. డ బ్బు ప్రాధాన్యతను పక్కన బెట్టి స్నేహంగా ఒకరినొ కరు సాయం చేసుకుంటూ సంతోషంగా జీవించవచ్చు. – మూగల సంజీవరెడ్డి,రైతు, ధర్మరాజుపల్లి పండుగ వచ్చిందంటే..ఒకప్పుడు పండుగ వచ్చిదంటే పల్లెలకు కొత్త రూపం వచ్చేది. దూ ర బంధువులు ఊరికి వచ్చారంటే కలివిడిగి తిరుగుతుండేవారు. పండుగకు వచ్చిన వారు యోగక్షేమాలను అడిగి తెలుసుకొని సా యం చేసేవారు. ఇప్పుడు బట్టలు, బంగారంపై మోజు తప్ప పండుగలకు ప్రాధాన్యం ఇవ్వడం లే దు. ప్రస్తుత యువతకు మంచి విషయాలు చెప్పాలంటే వారు ఎలా తీసుకుంటారో అర్థం కాని పరిస్థితి ఉంది. – కనకం విజయ, రాంపూర్ ముచ్చటగా ఉంటదిమా ఇంట్లో పెద్దలు పండుగలు, పెళ్లిల్ల తంతుపై వారు యుక్త వయస్సులో ఉన్నప్పుడు ఆచరించిన పద్ధతి, వ్యవహారాల గురించి చెబుతుంటే ముచ్చటగా ఉంటది. అప్పట్లో ప్రతీ విషయాన్ని పక్కవారితో వారు పంచుకునే తీరు ఆశ్చర్యం వేస్తోంది. నాటి ఆచార వ్యవహారాలను నేటి యువత పాటిస్తే భవిష్యత్ తరాలు బాగుంటాయి. – బండారి మహేశ్, తుమ్మన్నపల్లి∙ ఒకప్పటి పల్లెల్లో కలివిడితనం∙ ఒకరికొకరు సాయంగా మేమున్నామంటూ భరోసా ∙ సోషల్ మీడియా రాకతో ఊళ్లలో దూరమవుతున్న పల్లె సంస్కృతి -
Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (నవంబర్ 02-09)
-
Aadhaar: ఇక ఇంట్లోంచే ఆధార్ అప్డేట్
సాక్షి,హైదరాబాద్: బహుళ ప్రయోజనకారిగా ఉపయోగపడుతున్న ఆధార్‌లో మార్పులు, చేర్పుల కోసం ఆధార్ సేవా కేంద్రాలకు పరుగులు తీయాల్సిన అవసరం లేదు. టోకెన్ తీసుకొని క్యూలో నిల్చోవాల్సిన పని లేదు. ఇక ఇంట్లోంచే ఆన్లైన్ ద్వారా వెబ్సైట్లో మొత్తం దిద్దుబాటు ప్రక్రియను పూర్తి చేసుకునే విధంగా భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) మరింత వెసుబాటు కల్పించింది. త్వరితగతిన పూర్తి.. ఆధార్ అప్డేట్ ప్రక్రియలో పాన్‌కార్డులు, పాస్‌పోర్ట్‌లు, డ్రైవింగ్ లైసెన్స్‌లు, రేషన్ కార్డులు వంటి ప్రభుత్వ పత్రాలతో సహా వినియోగదారులు ఇచ్చే సమాచారం కూడా డిజిటల్‌గా ధ్రువీకరిస్తారు. ఇది అప్డేట్స్ ప్రాసెస్‌ను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తయ్యే పరిస్థితిని కల్పిస్తుంది. పౌరులు తమ పేరు, చిరునామా, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్ వంటి కీలక సమాచారాన్ని ఆన్లైన్లోనే అప్డేట్ చేసుకోవచ్చు. వాస్తవంగా ఆధార్ అప్డేట్కు డిజిటల్ వెసులుబాటు ఉంది, అయితే.. అన్ని రకాల అప్డేట్లు చేయడం ఆన్లైన్లో సాధ్యం కాదు. చిరునామా వంటి వివరాలను యూఐడీఏఐ పోర్టల్ లేదా మై ఆధార్ యాప్ ద్వారా ఆన్లైన్లో అప్డేట్ చేయవచ్చు. కానీ.. ఫొటో, వేలిముద్రలు, ఐరిస్ వంటి బయోమెట్రిక్ వివరాలను మార్చడానికి తప్పనిసరిగా ఆధార్ నమోదు కేంద్రాన్ని సందర్శించాల్సి ఉంటుంది. అప్డేట్ ఇలా.. చిరునామా అప్డేట్: గుర్తింపు చిరునామా ఏదైనా రుజువు ప్రతం ఉంటే, పోర్టల్ లేదా మై ఆధార్ యాప్‌ని ఉపయోగించి చిరునామాను ఆన్లైన్లో అప్డేట్ చేయవచ్చు. డాక్యుమెంట్ల అప్లోడ్: గుర్తింపు చిరునామా రుజువు పత్రాలను ఆన్లైన్లో ఉచితంగా అప్లోడ్ చేయవచ్చు (జూన్ 14, 2026 వరకు). మొబైల్ నంబర్: ఆన్లైన్ సేవలను ఉపయోగించడానికి మొబైల్ నంబర్‌ను ఆధార్‌కు తప్పనిసరిగా నమోదు చేసుకోవచ్చు ఐరిస్, బయోమెట్రిక్ కోసం బయోమెట్రిక్ అప్డేట్: ఆధార్ నమోదు, అప్డేట్ కేంద్రానికి వెళ్లడం ద్వారా మాత్రమే ఫొటో, వేలిముద్రలు, ఐరిస్ వంటి బయోమెట్రిక్ వివరాలను అప్డేట్ చేసుకునే వెసులుబాటు ఉంది. -
బీబీనగర్‌లో కారు బీభత్సం.. చెరువులోకి ఎగిరిపడిన యువతి
సాక్షి, యాదాద్రి భువనగిరి: బీబీనగర్‌లో కారు బీభత్సం సృష్టించింది. యువతి, యువకులను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. కారు ఢీకొట్టడంతో యువతి చెరువులోకి ఎగిరిపడింది. అతి వేగంగా వచ్చి చెరువు కట్ట మూల మలుపు వద్ద డివైడర్‌ను ఢీ కొట్టిన థార్ వాహనం.. అదే సమయంలో అక్కడే నిలిచి ఉన్న యువతి, యువకుడిని ఢీ కొట్టింది.అక్కడికక్కడే యువకుడు మృతి చెందగా.. యువతి చెరువులో పడిపోయి మృతి చెందింది. థార్ వాహనంలో ఉన్న ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
రేసు మొదలైంది: ముగ్గురు నేతలు, ఒక విజేత!
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ‘జూబ్లీహిల్స్’ ఉప ఎన్నిక ప్రధాన రాజకీయ పక్షాలకు అగ్ని పరీక్షగా మారింది. అధికార కాంగ్రెస్‌తో పాటు ప్రధాన ప్రతిపక్షాలైన బీఆర్ఎస్, బీజేపీలు గెలుపు కోసం అవసరమయ్యే అన్ని అ్రస్తాలను ప్రయోగిస్తూ సర్వశక్తులొడ్డుతున్నాయి. అధికార కాంగ్రెస్ అభివృద్ధి మంత్రం, బీసీ కార్డు, సినీ కార్మికుల సంక్షేమం, మైనారిటీ వర్గానికి మంత్రి పదవి ఇవ్వడం వంటివి కాగా.. బీఆర్ఎస్ సానుభూతి, మూడు పర్యాయాలుగా ప్రాతినిధ్యం, ప్రభుత్వ వైఫల్యాలు, ఆరు గ్యారంటీల బాకీ కార్డు, ప్రత్యర్థుల కుటుంబ నేపథ్యం తమకు కలిసి వచ్చే అంశాలుగా భావిస్తోంది. బీజేపీ హిందూత్వ ఎజెండా, ప్రభుత్వ వైఫల్యాలను ప్రధాన ప్రచారాస్త్రాలుగా మల్చుకుంటోంది. మూడు పక్షాలూ హేమాహేమీలను ఎన్నికల ప్రచారంలో దింపడంతో మాటల తూటాలు రాజకీయ అగ్గి రాజేస్తున్నాయి. ఆయా పారీ్టల గెలుపోటములపై బలాలతో పాటు బలహీనతలు ప్రభావం చూపనున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కాంగ్రెస్‌కు అనుకూల అంశాలు రాష్ట్రంలో అధికారంలో ఉండటం, కేవలం రెండు నెలల్లో రూ.150 కోట్లకుపైగా విలువైన అభివృద్ధి పనులు, రాష్ట్ర మంత్రి వర్గంలో మైనారిటీ సామాజిక వర్గానికి చెందిన అజహరుద్దీన్‌కు మంత్రివర్గంలో అవకాశం కల్పించడం, పార్టీ అభ్యరిత్వం ఎంపికలో బీసీ కార్డు ప్రయోగం. ఎన్నికల బరిలో దిగిన యువనేత నవీన్ యాదవ్‌కు వ్యక్తిగత పరిచయాలు, మజ్లిస్, వాపపక్షాలు, టీజేసీ, సినీ కారి్మకులు, బీసీ సంఘాల మద్దతు, సీఎంతో పాటు ఏఐసీసీ ఇన్చార్జి మీనాక్షీ నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, మంత్రులు ఫోకస్ పెట్టడం. గత 12 ఏళ్లుగా సిట్టింగ్ ఎమ్మెల్యే వైఫల్యాలు. ప్రతికూల అంశాలు: నియోజకవర్గంలో సంస్థాగత పట్టుతో పాటు స్థానిక ప్రాతినిధ్యం లేకపోవడం, పార్టీలలోని కొత్త, పాత కేడర్‌లో అంతర్గత కుమ్ములాటలు, కొరవడిన సమన్వయం, నవీన్ యాదవ్ కుటుంబ నేపథ్యం, దివంగత మాగంటి గోపీనాథ్ మూడు పర్యాయాల పాటు ప్రాతినిధ్యం వహించడం. బీఆర్ఎస్కు గట్టి కేడర్, గడిచిన రెండేళ్లలో ప్రభుత్వ వైఫల్యాలపై ప్రత్యర్థుల ప్రచారం తదితర అంశాలు ప్రభావం చూపనున్నాయి. బీఆర్ఎస్కు కలిసొచ్చే అంశాలు.. సానుభూతి గత మూడు పర్యాయాల పాటు ప్రాతినిధ్యం, సంస్థాగతంగా గట్టి ఓటు బ్యాంక్, స్థానిక ప్రాతినిధ్యం, ముస్లిం మైనారిటీల్లో పట్టున్న సోషల్ వర్కర్ పారీ్టలో చేరడం, ఎన్నికల ప్రచార భారాన్ని మొత్తాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన భుజస్కంధాలపై వేసుకోవడం, గత రెండేళ్లలో ప్రభుత్వ వైఫల్యాలు, ఆరు గ్యారంటీల బాకీ కార్డు. ప్రతికూల అంశాలు: అధికారంలో లేకపోవడం, పలువురు ముఖ్య నేతలు, కార్పొరేటర్లు పార్టీ ఫిరాయించడం, అధికారంలో ఉన్నప్పుడు మిత్రపక్షమైన మజ్లిస్ కాంగ్రెస్ పంచన చేరడం. తాజాగా అధికార కాంగ్రెస్ అభివృద్ధి మంత్రం, ప్రత్యర్థి యువకుడు కావడంతో పాటు వ్యక్తిగత పరిచయాలు అధికంగా ఉండటం.కమలం పార్టీకి అనుకూల అంశాలు హిందూత్వ ఎజెండా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చర్మిషా. కేంద్రంలో అధికారంలో ఉండటం, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ మాజీ మజ్లిస్ నేత కావడం, మజ్లిస్ బేషరతుగా మద్దతు ఇవ్వడం, టీడీపీ, జనసేన పారీ్టల మద్దతు. అభ్యర్థి దీపక్ రెడ్డికి విరివిగా వ్యక్తిగత పరిచయాలు ఉండటం ప్రతికూల అంశాలు: సంస్థాగతంగా బలహీనంగా ఉండటం. స్థానిక ప్రాతినిధ్యం లేకపోవడం. బీజేపీ పోటీ చేయడం రెండోసారి కావడం. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 14% ఓట్లు లభించడం. కాంగ్రెస్, బీఆర్ఎస్లతో పోలిస్తే పారీ్టకి బలమైన కేడర్ నెట్వర్క్ లేకపోవడం. -
మణుగూరులో ఉద్రిక్తత
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: మణుగూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీఆర్ఎస్ కార్యాలయాన్ని ముట్టడించిన కాంగ్రెస్ నేతలు.. ఫర్నిచర్‌ను తగలబెట్టారు. మంటలను ఫైర్ సిబ్బంది, పోలీసులు అదుపు చేస్తున్నారు. గతంలో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లిన రేగా కాంతారావు.. కాంగ్రెస్ కార్యాలయాన్ని బీఆర్ఎస్ కార్యాలయంగా మార్చారంటూ కాంగ్రెస్ శ్రేణులు ఆరోపిస్తున్నాయి.ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కాంగ్రెస్ కార్యాలయాన్ని ఆక్రమించి బీఆర్ఎస్ కార్యాలయంగా మార్చుకున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు.. ఇప్పుడు ఆ కార్యాలయాన్ని స్వాధీన పరుచుకునేందుకు ప్రయత్నం చేశారు. బీఆర్ఎస్ ఆఫీస్‌పై కాంగ్రెస్ జెండా ఎగురవేశారు. -
బయోటెక్నాలజీ విద్యార్థులకు శుభవార్త
నిజామాబాద్: తెలంగాణ యూనివర్సిటీ (నిజామాబాద్) ఎం.ఎస్సీ బయోటెక్నాలజీ విద్యార్థులకు శుభవార్త. ఫెడరేషన్ ఆఫ్ ఏషియన్ బయోటెక్ అసోసియేషన్స్ (ఫాబా)ఆధ్వర్యంలో నిర్వహించిన 10 రోజుల ప్రత్యక్ష శిక్షణ కార్యక్రమానికి ఎస్సీఎస్ ఛారిటబుల్ ట్రస్ట్ లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించింది.ఈ శిక్షణ ద్వారా విద్యార్థులు ప్రయోగాలను వారి చేతులతో స్వయంగా చేసే అవకాశం లభించింది. పరిశ్రమ స్థాయి నైపుణ్యాలను పెంచే ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి, ఫాబా ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్, ప్రొఫెసర్ పల్లూ రెడ్డన్న, వారి బృందం చేసిన కృషి ప్రశంసనీయంగా నిలిచింది. విద్యార్థులు తమ అకడమిక్ పరిజ్ఞానాన్ని ఆచరణలో పెట్టడానికి, భవిష్యత్తులో పరిశ్రమలకు సిద్ధం కావడానికి ఈ శిక్షణ ఎంతగానో దోహదపడింది. ఇలాంటి విలువైన కార్యక్రమానికి తోడ్పాటు అందించిన ఎస్సీఎస్ ఛారిటబుల్ ట్రస్ట్‌ను, ఫాబా బృందాన్ని, విద్యార్థులను ప్రోత్సహించిన ప్రొఫెసర్ ప్రవీణ్‌ను యూనివర్సిటీ వర్గాలు అభినందించాయి. -
వికారాబాద్‌లో దారుణం.. భార్యపై అనుమానంతో వదిన, కూతురును..
సాక్షి కులకచర్ల: వికారాబాద్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కులకచర్ల మండల కేంద్రంలో భార్య, ఇద్దరు పిల్లలు, వదినను వేపూరి యాదయ్య అనే వ్యక్తి కత్తితో దారుణంగా నరికి చంపాడు. అనంతరం నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.వివరాల ప్రకారం.. యాదయ్య, అలవేలు భార్యాభర్తలు. వారికి అపర్ణ, శ్రావణి ఇద్దరు కుమార్తెలు. రోజువారీ కూలీగా పనిచేసే యాదయ్యకు భార్య అలవేలుపై అనుమానం ఎక్కువ అని కుటుంబ సభ్యులు, స్థానికులు చెబుతున్నారు. ఆమెపై అనుమానంతో ప్రతీరోజు గొడవ పడేవాడని చుట్టుపక్కల వారు తెలిపారు. ఈ క్రమంలోనే వారం రోజులుగా భార్యాభర్తల మధ్య ఘర్షణలు తీవ్రమయ్యాయి. భార్యను యాదయ్య తీవ్రంగా కొట్టినట్టు కూడా తెలిసింది.దీంతో, ఇద్దరిని రాజీ చేసేందుకు వదిన హన్మమ్మ వారి ఇంటికి వచ్చింది. శనివారం రాత్రి వారి మధ్య చర్చలు జరిగాయి. ఆ తరువాత అందరూ పడుకున్న సమయంలో అర్ధరాత్రి యాదయ్య దారుణానికి ఒడిగట్టాడు. భార్య అలవేలు (32), కూతురు శ్రావణి (13), వదిన హన్మమ్మ (40)ను కోడవలితో గొంతుకోసి హత్య చేశాడు. పెద్దకుమార్తె అపర్ణపై కూడా దాడి చేయబోగా ఆమె తప్పించుకొని పారిపోయింది. ఈ విషయాన్ని చుట్టుపక్కల వారికి చెప్పడంతో.. వారు వచ్చేలోపే యాదయ్య ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. పరిగి డీఎస్పీ శ్రీనివాస్ హత్య జరిగిన ప్రాంతానికి వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. నలుగురు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
మజ్లిస్ ముందు మోకరిల్లుతున్నాయ్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్, బీఆర్ఎస్లు మజ్లిస్‌కు మోకరిల్లుతున్నాయని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా ఆయన ఇంటింటి ప్రచారంలో మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఇప్పుడు మజ్లిస్ కనుసన్నల్లో ఉందని.. కాంగ్రెస్, బీఆర్ఎస్లకు మజ్లిస్ ఓటు బ్యాంకే ముఖ్యంగా మారిందని దుయ్యబట్టారు. ఈ పరిస్థితుల నుంచి జూబ్లీహిల్స్‌ను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కేవలం ఒక్క నియోజకవర్గానికే పరిమితమైంది కాదని.. మొత్తం రాష్ట్రాన్ని ప్రభావితం చేసేలా కీలకంగా మారిందని చెప్పారు. మజ్లిస్ సానుభూతిపరుల ఓట్ల కోసమే సోనియా, రాహుల్‌గాం«దీలు అజహరుద్దీన్‌ను మంత్రి పదవి కట్టబెట్టారని కిషన్‌రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ అవకాశవాద రాజకీయాలపై కార్పెట్ బాంబింగ్ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇళ్ల పేరిట, రేవంత్ సర్కార్ ఇందిరమ్మ ఇళ్ల పేరిట పేదలను దగా చేస్తున్నాయని మండిపడ్డారు. ఆరు గ్యారంటీలు, 420 హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్‌రెడ్డి సర్కార్ వాటి అమలులో మీనమేషాలు లెక్కిస్తోందని దుయ్యబట్టారు. రూ. 4 వేల నిరుద్యోగ భృతి, మహిళలకు రూ. 2,500, విద్యార్థినులకు స్కూటీలు, నిరుద్యోగులకు ఉద్యోగాలు, విద్యా భరోసా కార్డులు, వివాహమైతే తులం బంగారం వంటి పథకాలను అమలు చేయాలంటూ ప్రచారానికి వచ్చే కాంగ్రెస్ నేతలను నిలదీయాలని ప్రజలకు కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు.ప్రత్యేక తెలంగాణలో కేసీఆర్ కుటుంబానికే ఉద్యోగాలు వచ్చాయని.. బంగారు తెలంగాణ అని చెప్పి కేసీఆర్ సొంత కుటుంబాన్నే బంగారం చేసుకున్నారని విమర్శించారు. డబుల్ బెడ్రూం పథకం కేవలం ప్రచారానికి వాడుకొని కేసీఆర్ ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రజలకు ఏం చేశాయని పార్టీలకు ప్రజలు ఓటు వేయాలని కిషన్‌రెడ్డి నిలదీశారు. పాకిస్తాన్ అంటే వాళ్లకు ప్రేమ శత్రు దేశమైన పాకిస్తాన్‌పై కాంగ్రెస్ పార్టీ గురు, శిష్యులకు ప్రేమ ఎక్కువని కిషన్‌రెడ్డి ఆరోపించారు. సర్జికల్ స్ట్రైక్స్, ఆపరేషన్ సిందూర్‌ను చులకన చేసి భారతీయ సైనికుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా మాట్లాడటం కాంగ్రెస్ పార్టీకే చెల్లిందని ఎద్దేవా చేశారు. పాక్‌కు మద్దతుగా మాట్లాడటం సిగ్గుచేటన్నారు. ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తున్న బీజేపీకి ఓటు వేసి తమ పార్టీ అభ్యర్థి దీపక్‌రెడ్డిని గెలిపించాలని ప్రజలను కోరారు. -
తుమ్మిడిహెట్టి డీపీఆర్‌కు గ్రీన్‌సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ప్రాణహిత–చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టు నిర్మాణం పునరుద్ధరణ దిశగా కీలక ముందడుగు పడింది. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కొత్వాల్ కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద బరాజ్ నిర్మించి సుందిళ్ల బరాజ్‌తో అనుసంధానం చేసే పనుల కోసం రూ. 11.88 కోట్ల అంచనా వ్యయంతో సవివర పథక నివేదిక (డీపీఆర్) తయారు చేసేందుకు పరిపాలనా అనుమతులు జారీ అయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్ బొజ్జా గత నెల 30న ఉత్తర్వులు జారీ చేశారు.ప్రాజెక్టు నిర్మిత స్థలంలో సర్వేతోపాటు సమగ్ర అధ్యయనాలను కన్సల్టెన్సీ ద్వారా జరిపి డీపీఆర్ రూపొందించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. త్వరలో కన్సల్టెన్సీ సేవల కోసం నీటిపారుదల శాఖ టెండర్లను ఆహ్వానించనుంది. ప్రాణహిత–చేవెళ్లను రెండు దశల్లో నిర్మించాలని ఇటీవల తీసుకున్న నిర్ణయం మేరకు ప్రస్తుతానికి తుమ్మిడిహెట్టి నుంచి సుందిళ్ల బరాజ్‌కు నీటి తరలింపు పనుల కోసమే డీపీఆర్ తయారీకి ప్రభుత్వం అనుమతిచి్చంది. మలి దశలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు నీటి తరలింపు పనులకు ప్రభుత్వం అనుమతించే అవకాశం ఉంది. ఆదిలాబాద్ సహా కాళేశ్వరం ప్రాజెక్టుకు నీళ్లు.. ప్రాణహిత–చెవెళ్ల ప్రాజెక్టు పునరుద్ధరణలో భాగంగా తుమ్మిడిహెట్టి వద్ద గోదావరిపై బరాజ్ నిర్మించి అక్కడి నుంచి 71.5 కి.మీ. దూరంలోని మైలారం వరకు గ్రావిటీ కాల్వ ద్వారా నీటిని తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అక్కడి నుంచి 20.06 కి.మీ. మేర ఒక సొరంగం తవ్వి టేకుమట్ల వాగులో నీటిని పోయనుంది. వాగులో 11 కి.మీ. ప్రయాణించాక నీరు దిగువన ఉన్న సుందిళ్ల బరాజ్‌కు చేరుకోనుంది. సుందిళ్ల బరాజ్ నుంచి నీటిని ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి ఎత్తిపోయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టు కింద ప్రతిపాదించిన ఆయకట్టుకు సైతం తుమ్మిడిహెట్టి నుంచి వచ్చే నీటి సరఫరాకు వీలు కలగనుంది. ఇక తుమ్మిడిహెట్టి బరాజ్ నుంచి నేరుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సాగు, తాగునీటి సరఫరా చేయనున్నారు. ప్రాణహిత–చేవెళ్ల పేరు... రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు పనులను పునరుద్ధరించి తుమ్మిడిహెట్టి వద్ద బరాజ్ నిర్మిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రకటించడం తెలిసిందే. తాజాగా ప్రాజెక్టు డీపీఆర్ రూపకల్పన కోసం ఇచి్చన జీవోలో మాత్రం ఎక్కడా ప్రాణహిత–చేవెళ్ల పేరును ప్రభుత్వం ప్రస్తావించలేదు. తుమ్మిడిహెట్టి వద్ద బరాజ్ నిర్మించి గ్రావిటీ కాల్వ, సొరంగ మార్గంలో సుందిళ్ల బరాజ్‌తో అనుసంధానించే పనులకే డీపీఆర్ రూపకల్పనకు అనుమతిస్తున్నట్లు జీవోలో ఉంది. ఉమ్మడి ఏపీలో రూపొందించిన ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు డీపీఆర్‌తో సంబంధం లేకుండా పూర్తిగా కొత్త ప్రాజెక్టుగా దీన్ని నిర్మించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. -
దేవుడి మాన్యంలో ఆక్రమణల్ని ఈవోలే కూల్చేయొచ్చు
సాక్షి, హైదరాబాద్: దేవాదాయ భూములను ఆక్రమించి చేపట్టే నిర్మాణాలను ఇక నుంచి స్వయంగా ఆ దేవాలయ కార్యనిర్వహణాధికారి (ఈఓ) ఆధ్వర్యంలోనే కూల్చివేసేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేయబోతోంది. అందుకోసం దేవాదాయ శాఖ చట్టాన్ని సవరించాలని నిర్ణయించింది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఈ మేరకు కార్యాచరణ చేపట్టనుందని సమాచారం. ఈ మార్పు వల్ల దేవుడి మాన్యాన్ని కాజేసేందుకు ప్రయత్నించే వారి ఆగడాలకు కొంతవరకు కళ్లెం వేసే వీలుంటుందని భావిస్తోంది. దీంతోపాటు ఇప్పటికే అన్యాక్రాంతమైన దేవాలయ భూములను తిరిగి స్వాదీనం చేసుకోవటం కూడా కొంత సులువు కానుంది. వేల ఎకరాలు అన్యాక్రాంతం..: రాష్ట్రవ్యాప్తంగా 13,941 ఎకరాల దేవాదాయ భూములు ప్రస్తుతం కబ్జాదారుల అధీనంలో ఉన్నాయి. అత్యంత విలువైన ప్రాంతంగా ఉన్న మంచిరేవులలో వేణుగోపాల స్వామి దేవాలయ భూమిని కాజేసేందుకు రాజకీయ నేతలే పావులు కదుపుతున్నారు. ఇందులో ఓ కీలక నేత ముమ్మరంగా తెరవెనక పావులు కదుపుతున్నట్టు సమాచారం. దీంతోపాటు ఇంకా ఎన్నో భూములు కబ్జా చెరలోకి చేరుతున్నాయి. విషయం తెలిసినా ఆ దేవాలయ ఈఓ స్థాయిలో ఎలాంటి చర్యలు తీసుకునే వీలే లేకుండా పోయింది. దేవుడి మాన్యం కబ్జాలపై ఆ ప్రాంత దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఎండోమెంట్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించి, అది దేవుడి భూమే అని రుజువులు చూపించాల్సి వస్తోంది. దేవాదాయ శాఖ చట్టంలో ఉన్న లోపాల వల్ల కళ్ల ముందే కబ్జా జరుగుతున్నా అధికారులు చేష్టలుడిగి చూడాల్సి వస్తోంది. ట్రిబ్యునల్‌లో కేసు తేలేలోపు ఆ భూముల్లో నిర్మాణాలు వెలుస్తున్నాయి. అధికారులకు సరైన ఆధారాలు చిక్కని పక్షంలో ఇక ఆ భూములు పరాధీనమైనట్టే. రాష్ట్రవ్యాప్తంగా 8,611.20 ఎకరాల భూమి కోర్టు కేసుల్లో చిక్కుకుంది. ఈ లొసుగులను తొలగిస్తే సమస్య చాలా వరకు పరిష్కారమవుతుందని దేవాదాయ శాఖలోని ఓ డిప్యూటేషన్ అధికారి గుర్తించి ఆ శాఖ మంత్రికి ప్రతిపాదించారు. దీంతో దేవాదాయ శాఖ చట్టంలోని సెక్షన్ 83, 84లను రద్దు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం చెరువు స్థలాలను కబ్జా చేస్తే హైడ్రా రంగంలోకి దిగి వాటిని స్వాధీనం చేసుకుంటోంది. ఇదే తరహాలో దేవుడి భూముల విషయంలోనూ యంత్రాంగానికి అధికారం ఉండేలా చట్ట సవరణలో పొందు పరచాలని ప్రభుత్వం భావిస్తోంది. -
2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ?: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్/రహ్మత్‌నగర్: గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఏటా రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలిచ్చిందో చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు డిమాండ్ చేశారు. మరో ఎన్నికల హామీ అయిన నిరుద్యోగ భృతి ఏమైందని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం రాత్రి రహ్మత్‌నగర్ డివిజన్లో నిర్వహించిన భారీ రోడ్‌షోలో కేటీఆర్ మాట్లాడారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఓడిపోతున్నామనే నిరాశతో సీఎం నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌కు ఓట్లు వేయకుంటే అన్నీ రద్దుచేస్తామని ధమ్కీ ఇస్తున్నారని విమర్శించారు. ఎగిరెగిరి పడితే జూబ్లీహిల్స్ ప్రజలు పెట్టే వాతలకు ప్రభుత్వమే పతనమయ్యే రోజు వస్తుందని హెచ్చరించారు. ఉప ఎన్నికల్లో దొంగ ఓట్లతో గెలవాలని రేవంత్‌రెడ్డి ప్లాన్ వేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వానికి కౌంట్‌డౌన్ మొదలైందని, 500 రోజుల్లో తిరిగి కేసీఆర్ సీఎం కాబోతున్నారని తెలిపారు. ‘గోపన్న లేడని, సునీతమ్మ ఆడబిడ్డ అని అనుకోవద్దు. ఆడబిడ్డ అంటే ఆదిశక్తి. రౌడీలు సతాయిస్తే ఎట్లా అని అనుకోవద్దు. జనతా గ్యారేజ్ వంటి బీఆర్ఎస్ భవన్ పక్కనే ఉంది. మీరు ఒక్క ఫోన్ కొడితే 40 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వస్తా. బీఆర్ఎస్ పార్టీ మొత్తం మీకు అండగా ఉంటుంది’అని భరోసా ఇచ్చారు. గోపీనాథ్ కాపాడిన శివమ్మ పాపిరెడ్డి హిల్స్ స్థలంలో పెద్ద స్టేడియం కట్టించి ఆయన పేరు పెడతామన్నారు. ఒక్క ఆడబిడ్డను ఓడించేందుకు సీఎం, మంత్రులు కాలికి బలపం కట్టుకొని గల్లీగల్లీ తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీతో రేవంత్‌రెడ్డిది పేగుబంధం సీఎం రేవంత్‌రెడ్డికి కాంగ్రెస్‌తో ఉన్నది ఫేక్ బంధమైతే.. బీజేపీతో ఉన్నది పేగు బంధమని కేటీఆర్ ఆరోపించారు. బతికి ఉన్నప్పుడు ఆయన మామ జైపాల్‌రెడ్డిని బండబూతులు తిట్టిన రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు కుటుంబ విలువల గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. సెటిల్మెంట్లు చేసే బ్లాక్‌మెయిలర్ సెంటిమెంట్ గురించి మాట్లాడితే ఏం చెప్పాలి? అని ప్రశ్నించారు. కరోనా సమయంలో రూపాయి ఆమ్దానీ లేకున్నా కేసీఆర్ ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా ఆపలేదని, ఇప్పుడు సీఎంకు కనీసం గురుకుల పాఠశాలలు నడపడం తెలియట్లేదని ఎద్దేవా చేశారు. సీఎం ఎన్ని ఎత్తులు వేసినా బీఆర్ఎస్కు భారీ విజయం దక్కబోతోందని అన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు దేశపతి శ్రీనివాస్, మాగంటి సునీత, మహమూద్ అలీ, నిరంజన్ రెడ్డి, దాస్యం వినయ్‌భాస్కర్, విష్ణువర్ధన్‌రెడ్డి, బాల్క సుమన్ తదితరులు పాల్గొన్నారు. కాగా, శనివారం తెలంగాణ భవన్లో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ బీఆర్ఎస్లో చేశారు. ఆయనకు కేటీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహా్వనించారు. -
ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డలకు పెద్దపీట: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డలకు పెద్దపీట వేస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా శనివారం రాత్రి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు మద్దతుగా బోరబండ, ఎర్రగడ్డ డివిజన్లలో రోడ్ షొ నిర్వహించి కార్నర్ మీటింగ్‌లలో ప్రజలనుద్దేశంచి ఆయన ప్రసంగించారు. 2014లో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఐదేళ్లు మహిళా మంత్రి లేదని.. తాము అధికారంలోకి రాగానే సీతక్క, కొండా సురేఖలకు మంత్రి పదవులు ఇచ్చామని గుర్తుచేశారు. శిల్పారామం దగ్గర మహిళా స్వయం సహాయక సంఘాల ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం స్టాల్స్ ఇచ్చామన్నారు. ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తే దాన్ని రద్దు చేయాలని మాట్లాడటం బీఆర్ఎస్ బద్ధిని తెలియజేస్తోందని విమర్శించారు. ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని సొంత చెల్లెలిని ఇంటి నుంచి బయటకు పంపిన కేటీఆర్.. జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేస్తున్న ఆ పార్టీ అభ్యర్థి సునీతమ్మను మంచిగా చూసుకుంటాడా అని ప్రశ్నించారు. ఇవన్నీ కేటీఆర్ చెల్లెలే బయటకు వచ్చి చెబుతోందన్నారు. సొంత చెల్లికి అన్నం పెట్టని వారు పిన్నమ్మ కూతురికి బంగారు గాజులు పెడతానంటే ప్రజలు నమ్ముతారా? అని ఎద్దేవా చేశారు. పదేళ్లు పట్టించుకోలేదేం? ఉపఎన్నికలో సెంటిమెంట్ రాజేయాలని బీఆర్ఎస్ చూస్తోందని.. పదేళ్లు అధికారంలో ఉన్నా, అదే పార్టీకి చెందిన వ్యక్తి ఎమ్మెల్యేగా పనిచేసినా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సమస్యలు ఎందుకు పరిష్కారం కాలేదో ప్రజలు ఆలోచించాలన్నారు. ఇప్పుడు తాడు బొంగరం లేకుండా అభివృద్ధి చేస్తామని ఓట్లు దండుకోవడానికి ఆ పార్టీ నేతలు ముందుకొస్తున్నారని దుయ్యబట్టారు. మాయమాటలు చెప్పే వాళ్లకు ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. బీఆర్ఎస్ను గెలిపించేందుకు బీజేపీ ప్రయత్నం పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని గెలిపించేందుకు బీఆర్ఎస్ పనిచేసిందని.. అందుకు ప్రతిగా జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీఆర్ఎస్ను గెలిపించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కేంద్రంలో ప్రతి సందర్భంలో మోదీ సర్కారుకు కేసీఆర్ మద్దతు పలికారని గుర్తుచేశారు. రాష్ట్రానికి నయా పైసా నిధులు తేలేని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కొత్తగా సమస్యలు ఉన్నట్లు మాట్లాడటం విడ్డూరంగా ఉందని విమర్శించారు. సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్‌రెడ్డి.. దాని పరిధిలోకి వచ్చే జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానంలోని బోరబండకు వచ్చి సమస్యలు ఎందుకు పరిష్కరించలేదని సీఎం నిలదీశారు. ఆశీర్వదిస్తే రూ. వందల కోట్లతో అభివృద్ధి ‘బీఆర్ఎస్కు పదేళ్లు అవకాశం కల్పించినా అభివృద్ధి జరగలేదు. కాంగ్రెస్‌కు ఈసారి అవకాశం ఇవ్వండి. అభివృద్ధి చేసి చూపిస్తాం’ అని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. సాధారణ ఎన్నికల్లో అజహరుద్దీన్‌ను గెలిపిస్తే మంత్రిని చేస్తామని మాట ఇచ్చామని.. ఇచ్చిన మాట ప్రకారం ఆయన్ను మంత్రి పదవి ఇచ్చామని తెలిపారు. స్థానికుడైన నవీన్ యాదవ్‌ను ఆశీర్వదిస్తే రూ. వందల కోట్లతో ఈ ప్రాంతాన్ని అభివద్ధి చేసే బాధ్యత తాను తీసుకుంటానని రేవంత్ హామీ ఇచ్చారు. అందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చే బాధ్యత నవీన్ తీసుకుంటాడన్నారు. రోడ్ షో కార్నర్ మీటింగ్‌లలో పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, అజహరుద్దీన్, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు. -
రేపటి నుంచి ప్రైవేటు కాలేజీలు బంద్
సాక్షి, హైదరాబాద్: ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల చెల్లింపుపై ప్రభుత్వం ఎటూ తేల్చకపోవటంతో తెలంగాణ ప్రైటు ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య (ఎఫ్‌ఏటీహెచ్‌ఏ) ఆందోళనకు సిద్ధమైంది. ఈ నెల 3వ తేదీ నుంచి ప్రైవేటు కళాశాలలను నిరవధికంగా బంద్ చేయాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని ఫతి చైర్మన్ ఎం రమేశ్‌బాబు శనివారం మీడియా సమావేశంలో వెల్లడించారు. ప్రభుత్వం ఫీజు బకాయిలు చెల్లించేవరకు కళాశాలలను తెరిచే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఈ నెల 6న ప్రైవేటు కాలేజీల్లో పనిచేస్తున్న లక్షన్నర మంది సిబ్బందితో హైదరాబాద్‌లో సభ ఏర్పాటు చేస్తామని తెలిపారు.ఫీజు బకాయిలు అడిగితే విజిలెన్స్ విచారణకు ఆదేశించడం ఏమిటని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తామన్న రూ.900 కోట్లు ఆదివారం సాయంత్రంలోగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇచి్చన హామీ ప్రకారం నిధులు విడుదల చేయకుంటే సోమవారం నుంచి బంద్ కొనసాగుతుందని స్పష్టంచేశారు. పరీక్షలు వాయిదా వేయాలని యూనివర్సిటీలు కోరుతున్నామని చెప్పారు. ఈ నెల 10 లేదా 11న పది లక్షల మంది విద్యార్థులతో హైదరాబాద్‌లో భారీ నిరసన కార్యక్రమం నిర్వహిస్తామని ప్రకటించారు.ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేల ఇళ్లను, కలెక్టరేట్లను ముట్టడిస్తామని తెలిపారు. రూ.1,200 కోట్ల బకాయిలను విడుదల చేయాలని కోరితే ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని ఆరోపించారు. ఇప్పటివరకు కేవలం రూ.300 కోట్లు మాత్రమే ఇచ్చారని తెలిపారు. విద్యార్థులకు, తల్లిదండ్రులకు కలిగే అసౌకర్యానికి క్షమాపణ చెప్పారు. ఈ సమావేశంలో ఫతి సెక్రటరీ జనరల్ కెఎస్.రవికుమార్, వైస్ చైర్మన్ అల్లాపూర్ శ్రీనివాస్, ఆర్గనైజింగ్ సెక్రటరీ కె.సునీల్ తదితరులు పాల్గొన్నారు. -
జనవరి 21 నుంచి జేఈఈ మెయిన్
సాక్షి, హైదరాబాద్: కేంద్రీయ విద్యాసంస్థల్లోని యూజీ కోర్సుల్లో 2026–27 విద్యాసంవత్సరంలో ప్రవేశాల కోసం నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ జేఈఈ (మెయిన్–2026 షెడ్యూల్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) శనివారం విడుదల చేసింది. మొదటి సెషన్ పరీక్షలు వచ్చే ఏడాది జనవరి 21 నుంచి 30 మధ్య నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీల్లో బీఈ/బీటెక్, బీఆర్క్, బీప్లానింగ్ కోర్సుల్లో అడ్మిషన్లకు జేఈఈ మెయిన్‌లో సాధించే పర్సంటైల్ కీలకం. విద్యార్థుల సౌకర్యార్థం జేఈఈ మెయిన్‌ను ఏటా రెండు సేషన్లలో నిర్వహిస్తున్నారు.ఈ పరీక్షలకు హాజరు కావాలనుకున్న విద్యార్థులు ఈ నెల 27న రాత్రి 9 గంటలకల్లా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొని అదేరోజు రాత్రి 11:50 గంటల్లోగా ఆన్లైన్లో ఫీజు చెల్లించాలని పేర్కొంది. ఏయే నగరాల్లో పరీక్ష కేంద్రాలు కేటాయించేదీ జనవరి మొదటి వారంలో ప్రకటిస్తామని ఎన్టీఏ తెలిపింది. అడ్మిట్ కార్డు డౌన్లోడ్ వివరాలను వెబ్సైట్ ద్వారా తెలియజేయనుంది. మొదటి సెషన్ జేఈఈ మెయిన్ ఫలితాలను ఫిబ్రవరి 12న విడుదల చేస్తామని ఎన్టీఏ ప్రాథమిక తేదీని ఖరారు చేసింది.13 భాషల్లో పరీక్ష...: జేఈఈ మెయిన్ పరీక్షలను 13 భాషల్లో నిర్వహించనున్నట్లు ఎన్టీఏ వెల్లడించింది. ఆంగ్లంతోపాటు హిందీ, తెలుగు, అస్సామీ, బెంగాలీ, గుజరాతి, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళం, ఉర్దూ భాషల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. మొదటి సెషన్లో పరీక్షలు రాసిన విద్యార్థులు రెండో సెషన్ పరీక్షలు కూడా రాసే అవకాశం ఉంటుంది. తొలి సెషన్ దరఖాస్తు ఆధారంగా ఫీజు చెల్లించి రెండో సెషన్ పరీక్షలు కూడా రాయొచ్చు. రెండో సెషన్ పరీక్షలు ఏప్రిల్‌లో జరగనున్నాయి. జేఈఈ మెయిన్ సిలబస్‌ను ఎన్టీఏ వెబ్సైట్లో పొందుపరిచింది. -
కార్పొరేట్ శక్తుల కోసమే ఆపరేషన్ కగార్
సాక్షి, హైదరాబాద్ : అటవీ ప్రాంతంలోని ఖనిజ సంపద కార్పొరేట్ శక్తులకు ఇచ్చేందుకే ఆపరేషన్ కగార్ అని ఇటీవల జనజీవన స్రవంతిలోకి వచ్చిన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు పుల్లూరి ప్రసాద్‌రావు అలియాస్ చంద్రన్న అలియాస్ శంకరన్న అన్నారు. కాలంతోపాటు మారకపోవడమే మావోయిస్టు పార్టీకి భారీ నష్టం చేసిందని చెప్పారు. అయితే సమాజంలో తారతమ్యాలు పోనంత వరకు ప్రజల్లో మావోయిస్టు భావజాలం బతికే ఉంటుందని స్పష్టం చేశారు. 45 ఏళ్ల ఉద్యమ జీవితంలో పీడిత ప్రజల కోసం పనిచేశానన్న తృప్తి ఉందన్నారు. డీజీపీ బి.శివధర్‌రెడ్డి ఎదుట ఇటీవల లొంగిపోయిన చంద్రన్న ‘సాక్షి’ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు అంశాలపై తన మనోగతాన్ని ఆవిష్కరించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే...రీమౌల్డ్ చేయలేకపోయాంమావోయిస్టు పార్టీ కేవలం కొన్ని సమస్యలకు, అటవీ ప్రాంతానికే పరిమితమైంది. పట్టణ ప్రాంతాలు, మైదాన ప్రాంతాల్లో పార్టీ విస్తరణ చేయలేదు. గతంలో మేధావులు, చదువుకున్నవారు చేరేవారు..క్రమంగా వారు పార్టీలోకి రావడం తగ్గింది. అటవీ ప్రాంతంలోనూ నిరక్షరాస్యులే పార్టీలో ఉన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి రిక్రూట్మెంట్ చాలా తగ్గింది. అగ్ర నాయకత్వం మధ్య సమన్వయం దెబ్బతిన్నదినంబాల కేశవరావు ఎన్కౌంటర్ తర్వాత పార్టీ అగ్ర నాయకత్వంలోని వారి మధ్య విబేధాలు బహిర్గతమ య్యాయి. కగార్ దాడి పెరిగిన తర్వాత దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న సీసీ (సెంట్రల్ కమిటీ) మెంబర్లు, పొలిట్ బ్యూరో సభ్యుల వంటి కీలక నాయకులు ఒక్క దగ్గరకు చేరే అవకాశాలు లేకుండా పోయాయి. మరోవైపు కోవర్టుల బెడద పెరగడంతోనూ పార్టీ బలహీనపడుతూ వస్తోంది. బయట ప్రచారంలో ఉన్నట్టుగా అక్కడ కుల వివక్షకు తావులేదు. మా దినచర్య ఇలా... ఉద్యమ జీవితంలో అడవిలో ఉదయం 4 గంటలకు మా దైనందిన జీవితం మొదలయ్యేది. చుట్టుపక్కల ప్రాంతాల్లో పెట్రోలింగ్ చేస్తాం. అంతా ఓకే అనుకున్నాక ఉదయం 6 గంటలకు రోల్‌కాల్ ఉంటుంది. ఆ తర్వాత ప్రతిరోజు వ్యాయామం. 8 గంటలకు కిచిడీ, చింతపులుసుతో టిఫిన్. ఆ తర్వాత పేపర్లలో వార్తలు, ఇతర అంశాలపై సమష్టిగా చదవడం..మధ్యాహ్నం 12 గంటలకే భోజనం. తర్వాత రెస్ట్. 2 గంటల నుంచి కాసేపు ఏదో ఒక అంశంపై వ్యక్తిగతంగా చదవడం ఉంటుంది. సాయంత్రం 5 గంటలకే రాత్రి భోజనం..ఆరు గంటలకు గప్‌చుప్ అయిపోవాలి. ఒకవేళ శత్రువు అలికిడి ఉండే ఆ రోజు వంట బంద్. పొయ్యి పెడితే పొగతో మా జాడ తెలుస్తుంది. డ్రోన్లు తిరుగుతున్నట్టు అనుమానం ఉంటే వంట బంద్ పెట్టి, మూమెంట్ లేకుండా అలర్ట్‌గా ఉంటాం. పరిస్థితి సరిగా ఉంటే అర్ధరాత్రి తర్వాతే వండుకుంటాం. ప్రతి సీసీ సభ్యుడికి ఏడు నుంచి పది మంది వ్యక్తిగత భద్రత ఉంటుంది.రూ.వందల కోట్ల డంప్‌లు.. కిలోల కొద్దీ బంగారం శుద్ధ అబద్ధం పార్టీ ఖర్చుల కోసం స్థానికుల నుంచి స్వచ్ఛందంగా విరాళాలు.. తునికాకు, ఇతర కాంట్రాక్టర్ల నుంచి పర్సెంటేజీల రూపంలో ఫండ్ వసూలు చేయడం వాస్తవమే. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ రాబడి కూడా లేదు. అయితే, మావోయిస్టుల దగ్గర రూ.వందల కోట్ల డంప్ లు, కిలోల కొద్ది బంగారం నిల్వలు ఉన్నాయన్న వార్తలు శుద్ధ అబ ద్దం. నేను మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీగా 17 ఏళ్లు పనిచేశాను. నా భార్య ఇప్పటికీ చిన్న గుడిసెలో ఉంటోంది. ఈ మధ్యే ఇందిరమ్మ ఇల్లు వచ్చిందని నాకు తెలిసింది. నా దగ్గరే రూ. వందల కోట్లు ఉంటే మా వారు బిల్డింగ్లు కట్టాలి కదా..పార్టీ నడపడానికి కొంత మొత్తంలో డబ్బులు ఉంటాయి కానీ.. వందల కోట్లు లేవు. నేను ఉద్యమంలోకి వెళ్లిన తర్వాత కేవలం 1990లో ఒకసారి వచ్చి కుటుంబాన్ని కలిసి వెళ్లాను. మళ్లీ ఇప్పటి వరకు ఎవరినీ కలవలేదు. అయితే, కుటుంబాన్ని కలిసేందుకు రెండు, మూడేళ్లకు ఒకసారి పరిస్థితిని బట్టి పర్మిషన్ ఇస్తారు. ఆ టైంలో వెళ్లి రావొచ్చు. అయితే అది అందరికీ సాధ్యం కాదు. ఆరోగ్యం బాగయ్యాక భవిష్యత్ ప్రణాళిక నేను ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలనుకుంటున్నా. ఆ తర్వాత బయటి పరిస్థితులను తెలుసుకుంటా. సమాజాన్ని అర్థం చేసుకొని, సమ స్యలపై నా పోరాటం నిర్ణయించుకుంటా. ఏ రాజకీయ పార్టీలో నే ను చేరను. ఎన్నికల్లో ప్రత్యక్షంగా పాల్గొనను. ప్రజాసంఘాల్లో పనిచేస్తా. కుటుంబంతో కలిసి ఉంటా. బయటకు వచ్చిన తర్వాత కూ డా మావోయిస్టు పార్టీ నుంచి వచ్చే వ్యతిరేకతను ఎదుర్కొనక తప్పదు. -
సీనియారిటీ తేలదు.. పదోన్నతి రాదు!
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ అభివృద్ధి శాఖలో వసతిగృహ సంక్షేమాధికారి (హెచ్‌డబ్ల్యూఓ) గ్రేడ్–1 కేటగిరీ అధికారుల పదోన్నతులపై ప్రతిష్టంభన తొలగట్లేదు. అర్హతలున్నప్పటికీ వారిని సహాయ సాంఘిక సంక్షేమాధికారి (ఏఎస్డబ్ల్యూఓ)గా పదోన్నతి ఇవ్వట్లేదు. దాదాపు రెండు దశాబ్దాలు కావొస్తున్నా కనీస పదోన్నతి కల్పించకపోవడంపై ఆయా ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. అర్హతలున్న పలువురు హెచ్‌డబ్ల్యూఓలు ఏడాదిన్నరగా పదవీ విరమణ పొందుతున్నట్లు ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి. సంక్షేమశాఖలన్నింట్లోనూ హెచ్‌డబ్ల్యూఓ పోస్టుల్లో అందరూ ఏకకాలంలో నియమితులైనప్పటికీ బీసీ, ఎస్టీ సంక్షేమ శాఖల్లోని అధికారులు జిల్లాస్థాయి అధికారి హోదా పదోన్నతి పొందగా ఎస్సీ అభివృద్ధి శాఖలో మాత్రం అదే కేడర్‌లో హెచ్‌డబ్ల్యూఓలుగానే మిగిలిపోయారు.తాజాగా గ్రూప్–2 ఉద్యోగ నియామకాలు పూర్తవగా పలువురు ఏఎస్‌డబ్ల్యూఓలుగా ఎస్సీ అభివృద్ధి శాఖలో నియమితులై విధుల్లో చేరారు. కానీ ఏళ్లు గడుస్తున్నా సీనియర్ హెచ్‌డబ్ల్యూఓలకు పదోన్నతులు ఇవ్వకపోవడంతో కొత్తగా ఉద్యోగాల్లో కొలువుదీరిన వారి కంటే జూనియర్లుగా మిగిలిపోయామంటూ మండిపడుతున్నారు. జాడలేని సీనియారిటీ జాబితా... సాధారణంగా ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ నియామకాల ప్రక్రియ పదోన్నతులు, నేరుగా నియామకాలు (డైరెక్ట్ రిక్రూట్మెంట్) పద్ధతిలో జరుగుతుంది. 30 శాతం ఖాళీలను డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో భర్తీ చేస్తే 70 శాతం పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేస్తారు. ఎస్సీ అభివృద్ధి శాఖలోనూ ఏఎస్డబ్ల్యూఓ పోస్టులను హెచ్‌డబ్ల్యూఓ (గ్రేడ్–1) అధికారులకు పదోన్నతులు ఇచ్చి భర్తీ చేయాలి. కానీ దాదాపు రెండు దశాబ్దాలుగా పదోన్నతుల ప్రక్రియ నిలిచిపోయింది. శాఖాపరమైన పదోన్నతులకు నిర్ణయం తీసుకొనే డిపార్ట్మెంటల్ ప్రమోషన్స్ కమిటీ ఐదేళ్లుగా కనీసం భేటీ కాకపోవడం గమనార్హం. కోర్టు కేసును సాకుగా చూపుతూ పదోన్నతుల ప్రక్రియను కొంతకాలంగా వాయిదా వేస్తూ వచ్చారు. ఈ కేసులో మూడేళ్ల క్రితమే కోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ దాన్ని ప్రభుత్వం అమలు చేయట్లేదని పలువురు హెచ్‌డబ్ల్యూఓలు చెబుతున్నారు. పదోన్నతులు కల్పించాలంటే ముందుగా సీనియారిటీ జాబితా రూపొందించాలి. ఇందుకుగాను ప్రస్తుతం విధుల్లో కొనసాగుతున్న హెచ్‌డబ్ల్యూఓ (గ్రేడ్–1) సీనియారిటీ జాబితాను వెల్లడించాలి. కానీ ఈ దిశగా ఎస్సీ అభివృద్ధి శాఖ కమిషనరేట్ చర్యలు చేపట్టట్లేదు. ఈ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా ఫలితం లేదని అధికారులు చెబుతున్నారు. సంబంధిత మంత్రితోపాటు ముఖ్యమంత్రి కార్యాలయంలో ఫిర్యాదు చేయడంతో ఎస్సీ అభివృద్ధి శాఖ ఇటీవల హడావుడిగా ప్రాథమిక సీనియారిటీ జాబితాను బహిర్గతం చేసింది. దీనిపై అభ్యంతరాలను స్వీకరించిన అధికారులు... నాలుగు నెలలు గడిచినా నిర్ణయం తీసుకోలేదు. కాగా, సీనియారిటీ జాబితాను జోనల్ స్థాయిలో రూపొందించాల్సి ఉండగా కేవలం జిల్లా స్థాయిలో రూపొందించుకోవాలని పేర్కొనడం ఇప్పుడు హెచ్‌డబ్ల్యూఓల్లో తీవ్ర గందరగోళం సృష్టిస్తోంది. -
ఈవీలు.. రయ్ రయ్
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ ఆర్టీసీలో ఈవీలు (ఎలక్ట్రికల్ వాహనాలు) పరుగులు తీస్తున్నాయి. కాలుష్య రహిత, పర్యావరణహితమైన ప్రయాణ సదుపాయం కోసం నగరంలో పూర్తిస్థాయిలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టేందుకు ఆర్టీసీ చర్యలు చేపట్టింది. ప్రస్తుతం నగరంలోని వివిధ మార్గాల్లో 265 ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయి. ఈ నెలలో కొత్తగా మరో 50 బస్సులు అందుబాటులోకి రానున్నాయి. ఆర్డినరీతో పాటు, మెట్రో ఎక్స్‌ప్రెస్, మెట్రో డీలక్స్ విభాగాల్లోనూ ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టారు. వచ్చే ఏడాది మార్చి నాటికి మరో 225 బస్సులను ప్రవేశపెట్టనున్నారు. దీంతో ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్లో ఈవీల సంఖ్య 540కి చేరనుంది. మెరుగైన.. నాణ్యమైన సేవల కోసం.. ప్రస్తుతం నగరంలోని 25 డిపోల్లో నిత్యం 2,850 బస్సులు ప్రయాణికులకు రవాణా సదుపాయాన్ని అందజేస్తున్నాయి. ప్రతిరోజూ 24 లక్షల మంది సిటీ బస్సుల్లో రాకపోకలు సాగిస్తున్నారు. వీరిలో 16 లక్షల మందికి పైగా మహిళా ప్రయాణికులు. రెండేళ్ల క్రితం మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించినప్పటి నుంచి సిటీ బస్సుల్లో ఆక్యుపెన్సీ గణనీయంగా పెరిగింది. గతంలో కేవలం 65 శాతం వరకు ఆక్యుపెన్సీ ఉండగా, మహిళా ప్రయాణికుల సంఖ్య పెరగడంతో ప్రస్తుతం 100 శాతం ఆక్యుపెన్సీ నమోదవుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలోనే ప్రయాణికులకు మరింత మెరుగైన, నాణ్యమైన సదుపాయాన్ని అందజేసేందుకు దశలవారీగా ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తెచ్చేందుకు కార్యాచరణను సిద్ధం చేశారు. పీఎం– ఈ డ్రైవ్ షురూ... దేశంలోని మెట్రో నగరాల్లో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టేందుకు కేంద్రం ప్రధానమంత్రి ఎలక్ట్రిక్ డ్రైవ్ (పీఎం–ఈ డ్రైవ్)కు శ్రీకారం చుట్టింది. ఈ పథకం కింద హైదరాబాద్ ఆర్టీసీకి మరో 2000 బస్సులు రానున్నాయి. వీటి కోసం ఈ నెలలో టెండర్లను ఖరారు చేయనున్నారు. వచ్చే ఏడాది మార్చి నుంచి ఈ 2000 బస్సులను దశలవారీగా ప్రవేశపెట్టనున్నారు. ప్రస్తుతం నడుస్తున్న డీజిల్ బస్సులను జిల్లాలకు తరలిస్తారు. దీంతో 2027 నాటికి నగరంలో పూర్తిగా కాలుష్యరహిత, పర్యావరణ ఎలక్ట్రిక్ బస్సులు మాత్రమే తిరగనున్నాయి. హెచ్ఎండీఏకు భారంగా డబుల్ డెక్కర్ బస్సులు.. హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) ఆధ్వర్యంలో నడుస్తున్న 6 డబుల్ డెక్కర్ ఎలక్ట్రిక్ ఆర్థికంగా పెనుభారంగా మారాయి. నిజాం కాలం నాటి డబుల్ డెక్కర్ బస్సులకు పూర్వవైభవాన్ని తెచ్చేందుకు అప్పటి ప్రభుత్వం 2023లో ఈ బస్సులను కొనుగోలు చేసింది. హెచ్ఎండీఏ ఒక్కో బస్సును రూ.2.16 కోట్ల చొప్పున కొనుగోలు చేసింది. కానీ.. ట్యాంక్‌బండ్, నెక్లెస్‌రోడ్డు, లుంబిని పార్కు, సెక్రటేరియట్ రూట్లో మాత్రమే ఇవి సందర్శకులకు అలంకార ప్రాయంగా కనిపించడం గమనార్హం. -
నిర్మాణ రంగంపై ‘బిహారీ’ దెబ్బ
సాక్షి, హైదరాబాద్: బిహార్ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర రాజధానిలో నిర్మాణ రంగ పనులు నెమ్మదిస్తున్నాయి. ఈ నెల 6, 11 తేదీల్లో రెండు దశల్లో బిహార్ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అక్కడి రాజకీయ పార్టీలు వలస ఓటర్ల తరలింపుపై దృష్టి సారించాయి. వారిని సొంత ప్రాంతాలకు రప్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాయి. పలు ప్రధాన పార్టీలు వలస ఓటర్లను రప్పించేందుకు రైలు, బస్ టికెట్లు, భోజన ఏర్పాట్లలో నిమగ్నమయ్యాయి. వలస ఓటర్లకు సెలవు ఇవ్వాలిందిగా ఆయా వలస కార్మికులు పనిచేసే కర్మాగారాల యాజమాన్యాలతో సంప్రదింపులు జరుపుతున్నారు. దీంతో సొంతూళ్ల పయనమైన వలసదారులతో రైళ్లు, ప్రత్యేక బస్సులు కిటకిటలాడుతున్నాయి. ఇప్పటికే గత నెలాఖరులో దీపావళి, ఛట్ పూజ కోసం సొంతూళ్లకు వెళ్లిన కొందరు బిహారీలు ఇక ఎన్నికల తర్వాతే తిరిగి పనికి వస్తారని ఓ నిర్మాణదారుడు తెలిపారు. ఇప్పటికే కార్మికుల కొరతను ఎదుర్కొంటున్న తెలంగాణలో బిహార్ ఎన్నికల రూపంలో మరిన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెబుతున్నారు. 8–10 లక్షల మంది బిహారీలు.. బిహార్ ప్రభుత్వ గణాంకాల ప్రకారం సుమారు 45.78 లక్షల మంది బీహారీలు వివిధ రాష్ట్రాలలో పనిచేస్తున్నారు. తెలంగాణలో ప్రస్తుతం 25–30 లక్షల మంది వలస కార్మికులు ఉండగా.. ఇందులో బిహార్ నుంచే సుమారు 8–10 లక్షల మంది ఉంటారని అంచనా. ఇందులో 80 శాతం బ్లూ కాలర్ వర్కర్లు కాగా.. మిగిలిన వారు వైట్ కాలర్ ప్రొఫెషనల్స్, విద్యార్థులు ఉంటారు. బిహారీలు ఎక్కువగా గ్రేటర్ హైదరాబాద్, నిజామాబాద్, కరీంనగర్, నల్లగొండ, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాలో వలస వచ్చి స్థానికంగా ఉపాధి పొందుతున్నారు. హైదరాబాద్‌లో ఎక్కువగా బోరబండ, గచ్చిబౌలి, కొండాపూర్, మాదాపూర్, హఫీజ్‌పేట, సికింద్రాబాద్‌లో నివసిస్తున్నారు. గ్రేటర్ రియల్టీపై ప్రభావం.. దేశవ్యాప్తంగా నిర్మాణ రంగానికి వచ్చే ఐదేళ్లలో 4.5 కోట్ల మంది నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తి అవసరం ఉంటుందని అంచనా. ప్రస్తుతం మన రాష్ట్రంలో వేర్వేరు రాష్ట్రాల నుంచి సుమారు 18 లక్షల మంది వలస కార్మికులు ఇక్కడకు వచ్చి నిర్మాణ రంగంలో పనిచేస్తున్నారని భారత స్థిరాస్తి డెవలపర్ల సమాఖ్య (క్రెడాయ్) తెలంగాణ అధ్యయనం వెల్లడించింది. ప్రధానంగా బిహారీలు హైదరాబాద్‌లో నిర్మాణ రంగంతో పాటు రైస్ మిల్లులు, చికెన్ షాపులు, పారిశ్రామిక వాడల్లో కార్మికులుగా పనిచేస్తున్నారు. తాజాగా బిహార్ ఎన్నికల నేపథ్యంలో వీరిలో చాలా మంది సొంతూళ్లకు పయనమవుతున్నారని, దీంతో నిర్మాణ పనులు నెమ్మదించే అవకాశాలున్నాయని క్రెడాయ్ తెలంగాణ అధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డి తెలిపారు. -
మేనేజ్మెంట్ సీట్లలోనూ 85 శాతం స్థానికులకే..
సాక్షి, హైదరాబాద్ : పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్యవిద్య మేనేజ్మెంట్ సీట్ల భర్తీపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మేనేజ్మెంట్ సీట్లను అఖిల భారతస్థాయిలో భర్తీ చేసుకునే అవకాశం ఉండగా.. తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు 85 శాతం సీట్లను రిజర్వ్ చేయాలని నిర్ణయించింది. అఖిలభారత స్థాయిలో కేవలం 15 శాతం సీట్లను మాత్రమే వైద్య కళాశాలల యాజమాన్యాలు భర్తీ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు నేడో రేపో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. రాష్ట్రంలో మొత్తం 31 పీజీ వైద్య కళాశాలల్లో 2025–26 విద్యా సంవత్సరానికి 2,983 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో 19 ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో 1,511 సీట్లలో కన్వీనర్ కోటా కింద 7,70 సీట్లు భర్తీ చేయగా.. మిగిలిన 741 సీట్లను యాజమాన్యాలు అఖిలభారత కోటా కింద భర్తీ చేస్తున్నాయి.మేనేజ్మెంట్ కోటా సీట్లను కూడా 85 శాతం తెలంగాణ విద్యార్థులతోనే భర్తీ చేయాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా చేసిన విజ్ఞప్తి మేరకు సీఎం రేవంత్‌రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు. అందుకు అనుగుణంగా ఉత్తర్వులు జారీ చేయాలని వైద్యారోగ్య శాఖ కార్యదర్శిని సీఎం ఆదేశించారు. తద్వారా పీజీ సీట్లలో తెలంగాణ విద్యార్థులకు 318 సీట్లతోపాటు 70 పీజీ డెంటల్ సీట్లు కూడా అదనంగా అందుబాటులోకి రానున్నాయి. 56 పీజీ వైద్య సీట్లు ఆలిండియా కోటా కింద రిజర్వ్ కానున్నాయి. రాష్ట్ర విద్యార్థులకు లబ్ధి చేకూర్చే నిర్ణయం తీసుకున్నందుకు సీఎం రేవంత్‌రెడ్డికి మంత్రి దామోదర్ రాజనర్సింహ కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలో స్పెషలిస్ట్ డాక్టర్ల సంఖ్య పెరుగుతుందని, తద్వారా ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందుతాయన్నారు. -
‘వక్క’సారి నాటితే వందేళ్లు
దీర్ఘకాలిక ఆదాయం వచ్చే కొబ్బరి తోటల జాబితాలో ‘వక్క’పంట కూడా నిలుస్తోంది. ఈ రెండు పంటలు కనీసం 60 నుంచి 100 ఏళ్ల వరకు దిగుబడి ఇస్తున్నాయి. తద్వారా రెండు నుంచి మూడు తరాలకు స్థిరమైన ఆదాయం లభిస్తోంది. కొబ్బరి తోటల్లో అంతర పంటగా వక్క సాగుకు అవకాశం ఉంది. ఒకవేళ వక్కపంటను నేరుగా సాగు చేస్తే కొన్నేళ్లపాటు అంతర పంటలతో అదనపు ఆదాయం కూడా పొందొచ్చు. – దమ్మపేటఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొదలైన వక్క దిగుబడిఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే తొలిసారి దమ్మపేట, అశ్వారావుపేట, సత్తుపల్లి తదితర మండలాల్లో రైతులు కొబ్బరి, ఆయిల్‌పామ్ క్షేత్రాల్లో వక్క పంటను అంతర పంటగా సుమారు 2 వేల ఎకరాలకు పైగానే సాగు చేశారు. అశ్వారావుపేట మండలం గంగారంలో వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, దమ్మపేట మండలం మందలపల్లిలో సేంద్రియ రైతు దేవరపల్లి హరికృష్ణ తమ కొబ్బరి తోటల్లో అంతర పంటగా సాగు చేసిన వక్క తోటల్లో ఇటీవల దిగుబడి మొదలైంది. తాజాగా పచ్చి వక్క గెలలను కోయగా ఎకరాకు టన్ను నుంచి రెండు టన్నుల వరకు దిగుబడి వచి్చంది. టన్ను రూ.45 వేల చొప్పున విక్రయించారు. వక్క పంట జీవితకాలం 60–100 ఏళ్ల వరకు ఉంటుందని, అయితే 80 ఏళ్ల తర్వాత మొక్కలు ఎత్తు పెరిగి కోత కష్టం కావడంతో అంతవరకే ఆపేస్తారని చెబుతున్నారు. అయితే రాష్ట్రంలో ఆ వయస్సు తోటలు ఎక్కడా లేవు. టన్ను ధర రూ.48 వేలకు పైనే.. ప్రస్తుతం పచ్చి వక్క టన్ను ధర రూ.48 వేల నుంచి రూ.52 వేల వరకు పలుకుతోంది. పెట్టుబడి వ్యయం తక్కువగా ఉండి దీర్ఘకాలం స్థిర ఆదాయాన్ని ఇచ్చే పంట కావడంతో రైతులు ఇప్పుడిప్పుడే ఆసక్తి చూపుతున్నారు. వక్క సాగుకు నీరు నిలవని పొడి, గట్టు, మెరక నేలలు అనుకూలంగా ఉంటాయి. తేమతో కూడిన మంచి ఉష్ణోగ్రతలు (14 డిగ్రీల నుంచి 36 డిగ్రీలు) మొక్క పెరుగుదల, దిగుబడికి దోహదం చేస్తాయి.ఏపీలోని ఏలూరు జిల్లా నర్సరీల్లో రూ.50 అంతకన్నా కాస్త ఎక్కువ ధరలో మొక్కలు లభిస్తాయి. జూన్ నుంచి డిసెంబర్ వరకు ఎకరానికి 500’–700 మొక్కలు నాటుకోవచ్చు. కొబ్బరిలో అయితే అంతర పంటగా ఎకరాకు 400 మొక్కలు నాటొచ్చు. మొక్కల పెరుగుదల, కాలానుగుణంగా నీరు, పశువుల పేడ, సేంద్రియ, రసాయన ఎరువులను తగు మోతాదులో వాడాలి. మొదటి రెండేళ్లు అరటి, జాజి, మిరియాలు వంటివి అంతర పంటలుగా సాగు చేసుకోవచ్చు. సాగుకు ఏటా పెట్టుబడి రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు ఉంటుంది. దిగుబడి..ఆదాయం వక్కలకు మార్కెట్లో డిమాండ్ పడిపోయే ప్రమాదం లేదు. ఈ మేరకు రైతులు నమ్మకంగా సాగు చేయొచ్చని అధికారులు సూచిస్తున్నారు. పంట దిగుబడి 5–6 ఏళ్లకు మొదలై తొలుత క్వింటా నుంచి రెండు క్వింటాళ్ల దిగుబడి వస్తుందని చెబుతున్నారు. ఆ తర్వాత గరిష్టంగా ఎకరాకు 5– 8 క్వింటాళ్ల వరకు దిగుబడి రావొచ్చు. తద్వారా ఎకరా తోట నుంచి ఏటా రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల ఆదాయం సమకూరుతుంది.ఆరో ఏట నుంచి దిగుబడి రెండెకరాల కొబ్బరి తోటలో అంతర పంటగా ఎకరాకు 400 వక్క మొక్కలు నాటి సేంద్రియ ఎరువులే వాడా. పెట్టుబడి ఎకరాకు రూ.30 వేలు దాటలేదు. ఆరో ఏట ఎకరానికి టన్నుకు పైగానే దిగుబడి వచ్చింది. ఏపీలోని ఏలూరు జిల్లా సీతానగరంలో ఉన్న ప్రొసెసింగ్ యూనిట్ వారు టన్ను రూ.45 వేల చొప్పున కొనుగోలు చేశారు. – దేవరపల్లి హరికృష్ణ, రైతు, మందలపల్లి -
కులవివక్షను ఎదుర్కోవడానికే దళిత ఆత్మగౌరవ పోరాటం
కవాడిగూడ/గన్‌పౌండ్రీ(హైదరాబాద్): సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్.గవాయ్ మీద దాడి జరిగితే.. ఈ దేశ వ్యవస్థలన్నీ ఎలాంటి చర్యలకు ఉపక్రమించకుండా మౌనం వహించి అంటరానితనాన్ని ప్రదర్శించాయని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ విమర్శించారు. జస్టిస్ బీఆర్.గవాయ్ మీద జరిగిన దాడిని నిరసిస్తూ శనివారం సాయంత్రం 4 గంటలకు ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఇందిరా పార్కు నుంచి బషీర్‌బాగ్‌లోని బాబూ జగ్జీవన్‌రామ్ విగ్రహం వరకు వేలాది మంది దళితులు ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా మంద కృష్ణ మాట్లాడుతూ జస్టిస్ బీఆర్ గవాయ్ దళితుడు కావడం వల్లనే ఈ దాడి జరిగిందని, ఆయన స్థానంలో ఉన్నత వర్గాలకు చెందిన న్యాయమూర్తులు ఉంటే ఈ దాడి జరిగి ఉండేదా అని ప్రశ్నించారు. అందువల్లనే ఈ దాడిని దళితుల మీద జరిగిన దాడిగా చూస్తున్నామని చెప్పారు. ఇంత కులవివక్ష పాటించడం అత్యంత అమానుషం అని ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీ పోలీసులు ఎందుకు కేసు పెట్టలేదు..సుప్రీంకోర్టు సుమోటోగా కేసు ఎందుకు స్వీకరించలేదు. జాతీయ మానవ హక్కుల కమిషన్ మౌనంగా ఎందుకు ఉండిపోయింది అని ప్రశ్నించారు.ఇలాంటి పరిస్థితుల్లో దళితులకు రక్షణ ఎక్కడ ఉంటుందని ఆందోళన వ్య క్తం చేశారు. హైదరాబాద్‌లో జరుగుతున్న దళితుల ఆత్మగౌరవ పోరాటం కేవలం ఆరంభం మాత్రమే.. ఇక జాతీయస్థాయిలో ఉద్యమం ఉధృతం చేస్తామని చెప్పారు. ఈ నెల 17న చలో ఢిల్లీకి పిలుపునిస్తున్నామన్నారు. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున దళితులను సమీకరించి దళిత ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ మున్నంగి నాగరాజు మాదిగ ఎంఆర్పీఎస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గోవిందు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు రుద్రపోగు సురేశ్ పాల్గొన్నారు. -
తగ్గుతున్న వేతన అంతరం
సాక్షి, హైదరాబాద్: భారత్‌లో కొన్ని రంగాల్లో పురుషులు– మహిళల మధ్య వేతన అంతరం క్రమంగా తగ్గుతోంది. ముఖ్యంగా మార్కెటింగ్, సేల్స్ రంగాల్లో జెండర్ పే గ్యాప్ తగ్గుదల నమోదైనట్టు సర్వేల్లో తేలింది. ఆయా రంగాల్లో అమెరికా, ఫ్రాన్స్, కెనడాలలో ఈ అంతరం అత్యధికంగా ఉండగా, మనదేశంలో మాత్రం ప్రపంచంలోనే అతి తక్కువగా లింగ వేతన అంతరాలు ఉన్నట్టు ‘డీల్’సంస్థ ‘స్టేట్ ఆఫ్ గ్లోబల్ కంపెన్సేషన్ రిపోర్ట్–2025’లో తెలిపింది.భారత్‌లో పురుషులు, మహిళల సగటు జీతాలు ప్రస్తుతం దాదాపు ఒకేలా ఉన్నాయని, ఏడాదికి 13– 23 వేల అమెరికన్ డాలర్ల మధ్య ఉన్నట్టుగా వెల్లడించింది. ఇది పెరుగుతున్న వేతన సమానత్వం, డేటా ఆధారిత పరిహార నమూనాల వినియోగానికి సంకేతమని పేర్కొంది. అయితే, టెక్, ప్రొడక్ట్ ఇతర రంగాల్లో మాత్రం వేతన అంతరం ఇంకా ఎక్కువగానే ఉందని తెలిపింది. సర్వేలోని కీలక అంశాలు.. ⇒ ఈ అధ్యయనంలో 150 దేశాలలో పది లక్షలకు పైగా కాంట్రాక్టు కార్మీకులు, 35 వేల కంటే ఎక్కువ మంది కస్టమర్లు పాల్గొన్నారు. ⇒ భారత్‌లో ఇంజనీరింగ్, డేటా నిపుణుల సగటు వేతనం ఏడాదికి 40 శాతం తగ్గిందని, 2024లో 36 వేల అమెరికన్ డాలర్ల నుంచి 2025లో 22 వేల అమెరికన్ డాలర్లకు తగ్గిందని కూడా నివేదికలో తెలిపారు. ⇒ ఇండియాలో 60 నుంచి 70 శాతం పూర్తికాల ఉద్యోగులు, 30 నుంచి 40 శాతం కాంట్రాక్ట్ కార్మీకులతో హైబ్రిడ్ వర్క్‌ఫోర్స్ నిర్మాణంపై ఎక్కువగా ఆధారపడటం కొనసాగుతోందని పేర్కొంది. ⇒ టెక్నాలజీ, స్పెషలిస్ట్ సేవలకు అత్యధిక సగటు పరిహారాన్ని యూఎస్, యూకే, కెనడా అందిస్తున్నాయని నివేదిక తెలిపింది. నైపుణ్యాల కొరత, పరిమిత బెంచ్‌మార్క్ డేటా కారణంగా ఏఐ, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ మార్కెటింగ్ కమాండ్ ఉద్యోగాలు 20 నుంచి 25 శాతం వరకు ప్రీమియంలను చెల్లిస్తున్నట్టు తేల్చింది. ⇒ 2021 నుంచి భారత్, బ్రెజిల్ వంటి అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో టెక్నాలజీ నిపుణులకు మధ్యస్థ ఈక్విటీ గ్రాంట్లు కూడా క్రమంగా పెరిగినట్టు తెలిపింది. ఈక్విటీ ప్యాకేజీ పరిమాణంలో యూఎస్ ముందంజలో ఉండగా.. కెనడా, ఫ్రాన్స్ తరువాతి స్థానాల్లో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా సాంకేతికత, ఉత్పత్తి రంగాల్లో లింగ వేతన అసమానతలు ఎక్కువగా కనిపిస్తున్నాయని పేర్కొంది. ⇒ ‘లింగ వేతన అంతరం గణనీయంగా తగ్గిన కొన్ని దేశాలలో భారత్ ఒకటిగా ఉండటం ప్రోత్సాహకరంగా ఉంది. ఈ పురోగతి పక్షపాతం కంటే యోగ్యతకు ప్రతిఫలమిచ్చే న్యాయబద్ధత, పారదర్శకత, డేటా ఆధారిత పరిహార నమూనాల వైపు విస్తృత మార్పును ప్రతిబింబిస్తుంది’అని డీల్ ఏపీఏసీ జనరల్ మేనేజర్ మార్క్ సామ్లాల్ పేర్కొన్నారు. -
ఎంత ఖర్చయినా ధరిస్తాం
ఈ రోజుల్లో చేతి వేళ్లకు, మణికట్టుకు స్మార్ట్ గ్యాడ్జెట్స్ ధరించే ట్రెండ్ పెరిగిపోయింది. చాలామంది చేతులకు స్మార్ట్ వాచ్‌లు కనిపిస్తున్నాయి. ఆరోగ్య స్పృహ ఉన్నవారు స్మార్ట్ రిస్ట్ బ్యాండ్లు, స్మార్ట్ రింగులు వంటివి ధరిస్తున్నారు. చెవుల్లో పెట్టుకునే వైర్లెస్ ఇయర్ బడ్స్ కూడా ఇప్పుడు సర్వసాధారణం అయిపోయాయి. ఇలాంటివన్నీ కలిపి.. 2024లో దేశంలో మొత్తం సుమారు 12 కోట్ల యూనిట్లు అమ్ముడయ్యాయంటే వాటి క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. మనదేశంలో రిస్ట్ బ్యాండ్ సగటు అమ్మకం ధర (ఏఎస్పీ) సుమారుగా రూ.12,000 ఉందని ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ (ఐడీసీ) గణాంకాలు చెబుతున్నాయి. మొత్తంగా చూస్తే ఇలా వేళ్లకో, మణికట్టుకో ధరించే స్మార్ట్ గ్యాడ్జెట్ల సగటు అమ్మకం ధర ప్రస్తుతం రూ.1,920 వరకూ ఉంది. ధర పెరుగుతున్నా వా టిని కొనడానికి ఎవరూ వెనకాడటం లేదు. 2025లో మొదటి ఆరు నెలల్లో 5 కోట్లకుపైగా ఇలాంటి స్మార్ట్ గ్యాడ్జెట్లు అమ్ముడవడమే ఇందుకు నిదర్శనం. ఇప్పుడిప్పుడే స్మార్ట్ రింగ్స్‌కి మార్కెట్ పెరుగుతోంది. అలాగే మెటా, లెన్స్కార్ట్ల వంటివి ఉత్పత్తులు మార్కె ట్లోకి తీసుకురావడంతో స్మార్ట్ గ్లాసెస్‌కి కూడా ఆదరణ పెరుగుతోంది. రిస్ట్ బ్యాండ్లు కూడా యువతను ఆకట్టుకుంటున్నాయి. భారీగా షిప్మెంట్లు2025 రెండో త్రైమాసికంలో (ఏప్రిల్ – జూన్) స్మార్ట్ గ్యాడ్జెట్ల షిప్మెంట్లు (రిటైలర్లకు తయారీ సంస్థలు సరఫరా చేసే సంఖ్య) 2.67 కోట్ల వరకు జరిగాయని ఐడీసీ చెబుతోంది. స్మార్ట్ రిస్ట్ బ్యాండ్ల షిప్మెంట్లు రికార్డు స్థాయిలో 118% పెరిగాయి. ఇదే సమయంలో స్మార్ట్ రింగ్స్ సుమారు 75వేలు, స్మార్ట్ గ్లాసెస్ 50వేలకుపైగా మార్కెట్లోకి అడుగుపెట్టాయి. ఈసారి మార్కెట్లోకి వచ్చిన ఇయర్వేర్లో సింహభాగం వైర్లెస్ ఇయర్‌బడ్స్ (టీడబ్ల్యూఎస్) కావడం.. వీటికి పెరుగుతున్న క్రేజ్‌కి నిదర్శనం.మొదట్లో అదో క్రేజ్స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల వంటి ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లకీ, ఈ స్మార్ట్ గ్యాడ్జెట్లకీ చాలా తేడా ఉంది. ‘వీటిపై మొదట్లో క్రేజ్ ఎక్కువ ఉంటోంది. ఎందుకంటే.. ఆరోగ్య, ఆహార సంబంధ విషయాలపై ఇచ్చే వివరాలు, స్కోర్లు ఆసక్తికరంగా ఉంటాయి. రానురాను.. రోజూ అవే విషయాలను ఆ గ్యాడ్జెట్స్ ఇస్తుండటంతో వాటిని వాడే వారిలో మొదట్లో ఉన్న ఆసక్తి తరవాత ఉండటం లేదు. మొదట్లో అందరూ చూడాలని, అందులోని వివరాలు తెలుసుకోవాలని పెట్టుకునేవారు.. తరవాత్తరవాత అందరూ చూడాలని మాత్రమే వాటిని ధరిస్తున్నారు’ అంటున్నారు టెక్ నిపుణులు. చాలామంది ఇలా బోర్ కొట్టడం వల్ల తమ మొదటి స్మార్ట్ వాచ్‌ను అప్డేట్ చేయడం లేదు. ‘చాలా స్మార్ట్ వాచ్‌లు రోజువారీ నడిచిన అడుగుల లెక్క, గుండె కొట్టుకునే రేటు వంటివి తప్ప కొత్త విషయాలు ఉండటం లేదు’ అంటున్నారు వినియోగదారులు.ఆలోచించి కొంటున్నారు‘ఇవి వన్‌టైమ్ పర్చేజ్ ఐటెమ్స్‌గా మారిపోతున్నాయి. అంటే స్మార్ట్‌ఫోన్‌ని చాలామంది ఏడాదికొకటి మారుస్తారు. కానీ, స్మార్ట్ వాచ్‌లు, రింగ్‌ల వంటి వాటిని ఒకసారి కొన్నాక... మళ్లీ కొత్తది కొనేందుకు ఇష్టపడటం లేదు. చాలా విషయాల్లో ఈ తరం వారు.. ఒక వస్తువును చూడగానే లేదా దాని గురించి వినగానే కొనేస్తుంటారు. కానీ, ఈ స్మార్ట్ గ్యాడ్జెట్ల విషయంలో అలా కాదు. ఒకటికి పదిసార్లు ఆలోచించి కొంటున్నారు. అందుకే వీటి ధరలను పెంచాల్సి వస్తోంది. కానీ, ఉత్పత్తిలో ప్రత్యేకత ఉంటే వాటిని ఎంత ధర పెట్టి కొనడాని కైనా వినియోగదారులు సిద్ధపడుతున్నారు’ అని కంపెనీలు చెబుతున్నాయి. -
అన్నీ ఉన్నా... అరచేతిలో అలజడి!
అధికారంలో ఉన్న పార్టీ అభ్యర్థులు ఉప ఎన్నికల్లో గెలవడం పెద్ద విశేషమేమీ కాదు. గెలవడానికి అవసరమైన వనరులన్నీ వారికి పుష్కలంగా అందుబాటులో ఉంటాయి. సాధారణ ఎన్నికలకు ఇంకో రెండు మూడేళ్ల గడువు ఉన్న సందర్భాల్లో ఆ ప్రాంతంలో ఉండే ప్రభావశీల వర్గాలు కూడా అధికార పార్టీకి అనుకూలంగా మెలగడం చూస్తూనే ఉన్నాము. స్థానిక సమస్యల పరిష్కారానికి కదలిక వచ్చే అవకాశముంటుందన్న ఆశ సహజం కనుక అధికార పార్టీ వైపు కొంత మొగ్గు ఉంటుంది. అధికార దుర్వినియోగమనే ఆయుధాన్ని కూడా పాలకపార్టీలిప్పుడు యథేచ్ఛగా వాడేస్తున్నాయి.తెలంగాణలో మొన్నటి సాధారణ ఎన్నికలకు ఏడాది ముందు మునుగోడు అసెంబ్లీ సీటుకు ఉప ఎన్నిక జరిగింది. అప్పటికే బీఆర్ఎస్ తొమ్మిదేళ్లుగా అధికారంలో ఉన్నది. ప్రభుత్వ వ్యతిరేక వాతావరణం పరుచుకుంటున్న దశ అది. బీజేపీ తరఫున పోటీ చేసిన రాజగోపాల్‌రెడ్డికి నియోజకవర్గంలో గణనీయమైన పలుకుబడి ఉన్నది. అర్థబలం, అంగబలం కూడా ఆయనకు దండిగానే ఉన్నాయి. అయినప్పటికీ అధికార పార్టీకి ఉండే వనరుల దన్నుతో బలమైన రాజగోపాల్‌రెడ్డిని బీఆర్ఎస్ ఓడించ గలిగింది.అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఇంకా మూడేళ్ల పదవీకాలం మిగిలే ఉన్న దశలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికను ఎదుర్కొంటున్నది. పార్టీ తరఫున పదిమంది మంత్రులు, పలువురు ఎంపీలు, 30 మంది ఎమ్మెల్యేలు నియో జకవర్గ వ్యాప్తంగా జాతర చేస్తున్నారు. రాజు తలుచుకుంటే దెబ్బలకు, నేటి ప్రజా ప్రభుత్వాలు తలుచుకుంటే డబ్బులకు కరువేముంటుంది? బీసీ రిజర్వేషన్ల అంశం మీద రాష్ట్రవ్యాప్తంగా బీసీ ఉద్యమానికి సన్నాహాలు జరుగుతున్న సందర్భం. ఈ నేపథ్యంలో స్థానికంగా ఉన్న బలమైన బీసీ వర్గం అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ బరిలోకి దించింది. ప్రత్యర్థులు ప్రచారం చేస్తున్నట్లు రౌడీషీటరా? సంఘసేవకుడా? అనే మీమాంసను పక్కనబెడితే కాంగ్రెస్ అభ్యర్థి తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ అక్కడ అంతో ఇంతో పలుకుబడి ఉన్న వ్యక్తే.సంఘ సేవకులకు మాత్రమే టిక్కెట్లిస్తామనే నియమాన్ని దేశంలో ఏ రాజకీయ పార్టీ పెట్టుకోకపోవడం ఒక నయా వాస్తవి కత. రౌడీషీటర్, యాంటీసోషల్ వగైరా టైటిళ్లు బలహీన వర్గాలకు లభించినంత సులభంగా ఉన్నత వర్గాలకు లభించవు. అదేవిధంగా కొన్ని బిరుదులూ, సత్కారాలూ ఉన్నత వర్గాలకు లభించినంత తేలిగ్గా బలహీన వర్గాలకు దక్కవు. ఇదొక సామాజిక రీతి. అయినప్పటికీ పెద్ద సంఖ్యలో వలసవచ్చిన ప్రజలు నివాసం ఏర్పరచుకున్న ప్రాంతం కనుక, దాదాపు లక్షమంది అపార్టుమెంట్లలో నివసిస్తున్న భద్రలోకులు కనుక రౌడీషీటర్ ప్రచారం వల్ల తమకు మేలు జరుగుతుందని బీఆర్ఎస్ శ్రేణులు నమ్మకంతో ఉన్నాయి.మైసూర్ పాక్‌లో మైసూర్ ఉండదనే కుళ్లు జోకు తరహాలోనే హైదరాబాద్‌లోనే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో జూబ్లీ హిల్స్ ఉండదు. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ప్రాంతాలు ఖైరతాబాద్ నియోజకవర్గంలో భాగంగా ఉన్నాయి. శ్రీనగర్ కాలనీ, మధురా నగర్, యూసఫ్‌గూడ, వెంగళరావు నగర్, ఎల్లారెడ్డిగూడ, సోమాజిగూడ వంటి మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఉండే ప్రాంతాలతోపాటు షేక్‌పేట, రహ మత్ నగర్, బోరబండ, ఎర్రగడ్డ వంటి కార్మికులు, చిరుద్యో గులు ఎక్కువగా ఉండే ప్రదేశాలు ఈ నియోజకవర్గంలోకి వస్తాయి. మొత్తం ఓటర్లలో ఇరవై ఐదు శాతం మంది ముస్లిం మైనారిటీలు. మజ్లిస్ పార్టీ తన అభ్యర్థిని రంగంలోకి దించకుండా కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించింది. హైదరాబాద్‌లో కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్యన ప్రధాన పోటీ ఉన్న సందర్భాల్లోనే ముస్లిం ఓటు కాంగ్రెస్‌కు పడే సంప్రదాయం ఉన్నది. రెండు సెక్యులర్ పార్టీల మధ్యనే ప్రధాన పోటీ ఉన్నప్పుడు ముస్లిం ఓటు ఏకపక్షంగా ఉండదు.జూబ్లీ హిల్స్‌లో బీజేపీ అభ్యర్థి రంగంలో ఉన్నప్పటికీ ప్రధాన పోటీ మాత్రం బీఆర్ఎస్–కాంగ్రెస్‌ల మధ్యనే నెల కొన్నట్టు ప్రచార పర్వంలో నిరూపితమైంది. ముస్లిం ఓటు కూడా ఏకపక్షంగా లేదని అర్థమైనందువల్లనే హఠాత్తుగా అజారుద్దీన్‌కు మంత్రిపదవి నిర్ణయాన్ని కాంగ్రెస్ తీసుకున్నట్టు తేలిగ్గానే అర్థం చేసుకోవచ్చు. ముస్లిం మైనారిటీకి ఒక మంత్రి పదవి ఇవ్వాలనేది కాంగ్రెస్ సంకల్పమైతే ఇంతకు ముందే ఈ నిర్ణయాన్ని తీసుకొని ఉండేది. కొత్తగా ముగ్గుర్ని మంత్రివర్గంలోకి తీసుకున్న సందర్భంలోనే వారికే ప్రాతినిధ్యం కల్పించి ఉండేది. అలాకాకుండా ఉప ఎన్నిక పోలింగ్‌కు సరిగ్గా పది రోజుల ముందు అజారుద్దీన్ చేత మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించడం కచ్చితంగా అనైతిక చర్యగానే భావించవలసి ఉంటుంది.అజారుద్దీన్ జూబ్లీ హిల్స్ నియోజకవర్గం ఓటరు కాక పోవచ్చు. కానీ ఆ నియోజకవర్గం నుంచి గత సాధారణ ఎన్ని కల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఉప ఎన్నికల సందర్భంగా కూడా పార్టీ టిక్కెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. ఆయనకు టికెట్ ఇవ్వడానికి నిరాకరించిన పార్టీ ప్రచార రంగంలో మైనారిటీ ఓటుపై భరోసా కనిపించకపోవడం వల్లనే ఇప్పుడు ఆదరాబాదరాగా మంత్రి పదవి కట్టబెట్టిందనే వాదనలో ఔచిత్యం కనిపిస్తున్నది. క్రీడారంగంలో దేశానికి అజర్ చేసిన సేవకు గుర్తింపుగానే ఆయనకు మంత్రిపదవి ఇచ్చినట్టు కాంగ్రెస్ చేస్తున్న ప్రచారంలో పస లేదు. అటువంటి గ్రహింపు కేవలం పోలింగ్‌కు పది రోజుల ముందే కలగడమేమిటనే ప్రశ్నకు వారి దగ్గర సమాధానం లేదు.ఆరు మాసాల్లోగా అజర్ భాయ్ శాసనమండలికో, శాసనసభకో ఎన్నిక కావలసి ఉన్నది. లేకపోతే ఈ మంత్రి పదవి ఆరు నెలల ముచ్చటగానే మిగిలిపోతుంది. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణల నేపథ్యంలో క్రికెటర్‌గా ఆయనపై జీవితకాల నిషేధం కొనసాగుతున్నది. హెచ్‌సీఏ అధ్యక్షునిగా ఉన్న కాలంలో నిధుల దుర్వినియోగం ఆరోపణలపై ఆయన క్రిమినల్ కేసును ఎదు ర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో గవర్నర్ కోటాలో ఆయన్ను ఎమ్మెల్సీగా నామినేట్ చేయడానికి కేంద్రం ఏ మేరకు సహక రిస్తుందనేది అనుమానమే. గడువులోగా ఏదో సభకు ఎన్నిక కానట్టయితే ‘దేశానికి అజర్ చేసిన సేవలకు’గాను ఆయన్ను కాంగ్రెస్ పార్టీ అవమానించినట్టవుతుంది.మజ్లిస్ మద్దతు కారణంగా గుండుగుత్తగా పడే మైనారిటీ ఓట్లతో జూబ్లీ హిల్స్ గెలుపు తమకు నల్లేరుపై బండి నడకే కాగలదని కాంగ్రెస్ పార్టీ తొలుత భావించినట్టుంది. క్షేత్ర స్థాయిలో ఏదో తేడా కొట్టడంతోనే హడావిడిగా అసందర్భంగా అజారుద్దీన్‌కు మంత్రి పదవి కట్టబెట్టారనే అభిప్రాయం బల పడుతున్నది. బీజేపీ అభ్యర్థిని ప్రధాన పోటీదారుగా నియోజక వర్గ ప్రజలు భావించడం లేదు. అందువల్ల అక్కడ మతపరమైన పోలరైజేషన్ ఏమాత్రం కనిపించడం లేదు. ప్రధాన పోటీ దార్లుగా కనిపిస్తున్న కాంగ్రెస్–బీఆర్ఎస్లు అభివృద్ధి ఎజెండానే ప్రచారం చేసుకుంటున్నాయి. ఓటర్లు కూడా ఇదే ప్రాతిపదికన చీలుతున్నారు. ఇందులో మైనారిటీ, మెజారిటీ అన్న తేడాలేమీ కనిపించడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో అజారుద్దీన్‌కు మంత్రిపదవి ఇవ్వడం వల్లనో, ముంబైలో సల్మాన్‌ఖాన్‌తో ముఖ్యమంత్రి దిగిన ఫొటోలను సీఎమ్ఓ విడుదల చేయడం వల్లనో మైనారిటీలు ప్రభావితులయ్యే అవకాశాలు తక్కువ.ఉచిత బస్సు ప్రయాణంపై మహిళల్లో సానుకూల స్పందనే ఉన్నది. అదే సందర్భంలో ఇంటింటి ప్రచారానికి వెళ్తున్న కాంగ్రెస్ నేతలను అక్కడక్కడా మహిళలే నిలదీస్తున్న వార్తలు కూడా మీడియాలో రిపోర్టవుతున్నాయి. ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్టుగా మహాలక్ష్మి పథకం కింద నెలకు రెండున్నర వేల గురించి అడుగుతున్నారు. తులం బంగారం సంగతేమిటని నిలదీస్తున్నారు. ‘మాకు స్కూటీలిస్తామన్నారు, ఇంకెప్పుడి స్తార’ని ఒకచోట పది మంది బాలికలు ప్రశ్నించారు. వృద్ధాప్య పెన్షన్‌ను పెంచుతామని ఇచ్చిన హామీని విస్మరించడాన్ని కూడా ప్రశ్నిస్తున్నారు.ఉప ఎన్నికలకు ముందు 200 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు కాంగ్రెస్ ప్రభుత్వం శంకుస్థాపనలు చేసింది. అందులో కొన్ని పనులు పూర్తి చేశారు కూడా! ఇది కాంగ్రెస్ అభ్యర్థికి మేలు చేసే అంశం. కానీ, కంటోన్మెంట్ ఉప ఎన్నికకు ముందు అక్కడ కాంగ్రెస్ వాళ్లు అనేక హామీలు గుప్పించి మోసం చేశారని ఆ ప్రాంతం నుంచి వచ్చిన మహిళల టీమ్ ఒకటి జూబ్లీ హిల్స్‌లో విస్తారంగా ప్రచారం చేస్తున్నది. ఇటువంటి ఉదంతాలు కొన్ని స్వచ్ఛందంగా జరిగి ఉండవచ్చు. కొన్ని ప్రతిపక్ష పార్టీ ఆర్గనైజ్ చేసి ఉండవచ్చు. ఎలా జరిగినా ఇవి కాంగ్రెస్ ప్రచారానికి ఇబ్బంది కలిగించే విషయాలే! కేసీఆర్ హయాంలో తమకు అందిన రంజాన్ తోఫా, షాదీ ముబారక్‌ల గురించి కూడా మైనారిటీ ప్రజలు గుర్తు చేస్తున్నారు.కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో నియోజకవర్గానికి జరిగిన లబ్ధిపై బీఆర్ఎస్ పార్టీ ఒక పత్రాన్ని విడుదల చేసింది. దానితోపాటు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చి ఎగవేసిన అంశాలను ఉటంకిస్తూ ఒక బాకీ పత్రాన్ని కూడా ఆ పార్టీ ప్రచారంలో పెట్టింది. ఇవి జనంలో చర్చనీయాంశాలుగా మారాయి. సినీ రంగంలో పనిచేసే కార్మికులు దాదాపు పది హేను వేలమంది వరకు ఈ నియోజకవర్గంలో ఓటర్లుగా ఉన్నారు. వీరిని ప్రసన్నం చేసుకోవడానికి స్వయంగా ముఖ్య మంత్రే ఒక సభకు హాజరై, వారికి అనేక హామీలిచ్చారు. కానీ ఆ కార్మికులు సంతృప్తి చెందినట్లయితే కనిపించలేదు. పదివేల మంది వరకున్న ఆటోడ్రైవర్ల కుటుంబాలు పూర్తిగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయి.గడచిన రెండేళ్ళలో మార్కెట్లో ద్రవ్య చలామణీ బాగా తగ్గిందనే అభిప్రాయం ప్రజల్లో ఉన్నది. దాని ప్రభావం అన్ని రంగాల మీద కనిపిస్తున్నది. జీఎస్టీ వసూళ్లలో, స్థిరాస్తి రిజి స్ట్రేషన్లలో కాంగ్రెస్ ప్రభుత్వ అథోముఖయానం దీన్ని ధ్రువీక రిస్తున్నది. కేసీఆర్ కాలం నాటి పరిస్థితులను నేటి పరిస్థితులతో జనం పోల్చి చూసుకుంటున్నారు. ఈ రకంగా క్షేత్రస్థాయి నాడి కాంగ్రెస్‌కు అంత సానుకూలంగా ఏమీ లేదు. కానీ అధికార పార్టీగా దానికుండే బలాలను కూడా తీసిపారేయలేము. పెద్ద సంఖ్యలో ఉన్న మైనారిటీ ఓట్ల కోసం ఆ పార్టీ సర్వశక్తులు ఒడ్డుతున్నది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై ప్రభుత్వం వేసిన ఎత్తుగడ మిస్ఫైరయినప్పటికీ అందులోంచి ప్రయోజనం పొందడం కోసం ప్రయత్నాలను మానలేదు. నియోజకవర్గంలో విస్తృత సంబంధాలున్న కుటుంబాన్ని బరి లోకి దింపింది. రేషన్ కార్డుల మీద సన్నబియ్యం పంపిణీ చేయడం కూడా కలిసొస్తుందని ఆ పార్టీ ఆశిస్తున్నది. కొత్తగా నియోజకవర్గంలో నలభై వేల రేషన్ కార్డులు పంపిణీ చేసినట్టు ప్రచారం చేసుకుంటున్నారు. కానీ వాస్తవాలు పరిశీలిస్తే వెయ్యికి మించి పంపిణీ చేయలేదని తెలిసింది. ఇక డబ్బులు వెద జల్లడం, ప్రలోభాలకు తెరలేపడం అధికార పార్టీకి పెద్ద కష్టమేమీ కాదు. ఇలాంటి అనుకూలాంశాలు ఉన్నప్పటికీ కాంగ్రెస్‌లో ఏదో తెలియని అలజడి కనిపిస్తున్నది. ఓడిపోతే తర్వాత పర్యవసానాలెలా ఉంటాయోనన్న కలవరం ఆ శిబిరంలో నెలకొన్నది. ఉపఎన్నిక పోలింగ్‌కు ఇంకా 9 రోజుల సమయం ఉంది. ఆలోగా అధికార పార్టీకి అనుకూలంగా ఏదైనా అద్భుతం జరుగుతుందేమో చూడాలి!వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
మాపై దుష్ప్రచారంలో బీజేపీ, బీఆర్ఎస్ పోటీ
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మెజార్టీని పెంచుకునేందుకు కాంగ్రెస్ పని చేస్తుంటే... బీజేపీ, బీఆర్ఎస్ మాత్రం మాపై తప్పుడు ప్రచారంతో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు పోటీ పడుతున్నాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎల్లారెడ్డిగూడలోని శాలివాహన నగర్ కాలనీ కమ్యూనిటీ హాల్లో స్థానిక కాంగ్రెస్ నాయకులు శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... తమ స్వార్ధ రాజకీయాల కోసం బీఆర్ఎస్, బీజేపీ అవాస్తవాలను ప్రచారం చేస్తూ ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నాయని మండిపడ్డారు. ఈ ఉప ఎన్నికల్లో లబ్ది పొందేందుకే ఇప్పుడు కొత్త డైవర్షన్ డ్రామాకు తెరదీశారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తమకు అనుకూలంగా వక్రీకరించుకొని మాపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. మా ప్రభుత్వం ప్రజలకు మంచి చేసే ఏ ఒక్క ప్రధాన సంక్షేమ పథకాన్ని రద్దు చేయలేదని, ఆపలేదన్నారు. అలాంటి ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి యుద్ధం చేసి గెలిచిన చక్రవర్తిలా ఫీల్ అవుతున్నారని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. నేను రాజు కాదు అని ప్రజల సొమ్ముకు ధర్మకర్త మాత్రమే అని ఇప్పటికే ఎన్నోసార్లు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారన్నారు. ఎన్నికల ముందు నిరుద్యోగులకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటామని, ఈ విషయంలో మా చిత్తశుద్ధిని శంకించే అర్హత బీఆర్ఎస్ కు గానీ బీజేపీకి గానీ లేదన్నారు. ఆరు గ్యారంటీలను దశలవారీగా అమలు చేసేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామన్నారు. ఈ ఇందిరమ్మ రాజ్యంలో ఎవరికీ అన్యాయం జరగదని, జరగనివ్వమన్నారు. అక్రమ నిర్మాణాలు తొలగించే ముందు, పేదలకు పునరావాసం కల్పించాకే చర్యలు తీసుకుంటామన్నారు. ఈ విషయంలో అధికారుల అత్యుత్సాహాన్ని సహించమన్నారు. ఇప్పటికైనా ప్రజల తీర్పును గౌరవించి, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించాలని కోరారు. ప్రతిపక్షాల జూటా మాటలు నమ్మి మోసపోవద్దని, తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలే అజెండాగా ముందుకెళ్తున్న ఈ ప్రజా ప్రభుత్వానికి అండగా ఉండాలని జూబ్లీహిల్స్ ఓటర్లకు మంత్రి శ్రీధర్ బాబు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ కు మద్దతు తెలిపిన మాదిగ దండోరా, తెలంగాణ మాదిగ హక్కుల దండోరా, టి.ఎం.ఆర్.పి.ఎస్, ఉస్మానియా యూనివర్సిటీ టీజీఆర్ఎస్ఏ తదితర 9 దళిత సంఘాల ప్రతినిధులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఏఐసీసీ ఇంచార్జ్ విశ్వనాథ్, ఎమ్మెల్యేలు విజయ రామరావు, మక్కన్ సింగ్ ఠాకూర్, మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్, మాజీ ఎమ్మెల్సీ భాను ప్రసాద్ తదితరులు హాజరయ్యారు. -
ఎవర్రా మీరంతా.. చెప్పులను కూడా వదలరా..?
సాక్షి, హైదరాబాద్: ఈ చోరీ చూసి మరీ.. ఇలా ఉన్నారేంట్రా బాబూ.. అంటూ హైదరాబాద్ వాసులు అవాక్కవుతున్నారు. ఎల్బీ నగర్‌లోని ఓంకార్ నగర్, శక్తి నగర్లలో చెప్పుల దొంగలు చెలరేగిపోతున్నారు. మంగళ వారం అర్ధరాత్రి 1:30 గంటల ప్రాంతంలో నాలుగు ఇళ్లు, ఒక అపార్ట్మెంట్లో ముగ్గురు ఆగంతకులు వేర్వేరుగా ప్రవేశించి చెప్పులను మూటలుగా కట్టుకుని పారిపోయారు.ఒక ఆగంతకుడు అయితే మహిళలు ధరించే నైటీలు కూడా తీసుకెళ్ళాడు. నిందితులు చారల టీ షర్టులు, మాస్క్ ధరించి ఉన్నారు. నిందితులు మతి స్థిమితం కోల్పోయి ఉన్నారా? లేక భవిష్యత్తులో పెద్ద దోపిడీ జరపడానికి రెక్కీ నిర్వహించారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. -
సీఎం రేవంత్ వ్యాఖ్యలపై సీఈవోకు బీజేపీ ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై సీఈఓ సుదర్శన్ రెడ్డికి బీజేపీ ఫిర్యాదు చేసింది. మోడల్ కోడ్ ఉల్లంఘనపై సీఎంపై ఎస్ఈసీకి బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచారంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు ఫిర్యాదులో బీజేపీ పేర్కొంది. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు దేశ సైన్యాన్ని అవమానపర్చేవిధంగా ఉన్నాయని బీజేపీ ఆరోపిస్తోంది. సైన్యంపై తప్పుడు, అవమానకర వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఎన్నికల నియమావళి ఉల్లంఘనగా పరిగణించాలంటూ విజ్ఞప్తి చేసింది. “దేశ భద్రతా బలగాల గౌరవాన్ని దెబ్బతీసే విధంగా సీఎం వ్యాఖ్యలు ఉన్నాయని.. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు అత్యంత అభ్యంతరకరమైవని బీజేపీ మండిపడుతోంది. -
Hyd: ఎల్లుండి నుంచి ప్రైవేట్ కాలేజీల నిరవధిక బంద్
హైదరాబాద్: ఫీజు రీయింబర్స్ బకాయిలు చెల్లించకపోతే నవంబర్ 3వ తేదీ నుంని ప్రైవేటీ కాలేజీలను నిరవధికంగా బంద్ చేస్తామని ముందుగా హెచ్చరించిన ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య.. అందుకు సమాయత్తమైంది. ఎల్లుండి(సోమవారం) నుంచి ప్రైవేట్ కాలేజీలను నిరవధికంగా బంద్ చేయనున్నట్లు మరోసారి హెచ్చరించింది. ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాకపోవడంతో బంద్‌కు సిద్ధమైంది. ఈ మేరకు ఉన్నత విద్యా సంస్థ సమాఖ్య చైర్మన్ రమేష్ బాబు మాట్లాడుతూ.. ‘ గత ఆరు నెలలుగా ప్రభుత్వంతో చర్చలు జరిపి రూ. 1200 కోట్ల బకాయిలు అడిగాం. పెండింగ్ ఉన్న వాటిలో కేవలం 12 శాతం మాత్రమే అడిగాం. కానీ 300 కోట్లు దసరాకి ఇచ్చి మిగతావి పట్టించుకోలేదు. నవంబర్ 1 వరకు ఇవ్వాలని కోరాం. ప్రభుత్వం కనీసం మా గోడు కూడా వినడం లేదు. అందుకే 3 వ తేదీ నుంచి కాలేజీల నిరవధిక బంద్. మా మీద విజిలెన్స్ విచారణకు ఆదేశం దుర్మార్గం. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి రేపటి వరకు మంచి నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాము. బంద్ సమయంలో జరిగే ఎగ్జామ్స్ వాయిదా వేయాలని యూనివర్సిటీలకు విజ్ఞప్తి చేశాం. లక్ష మంది కాలేజీల స్టాఫ్‌తో హైదరాబాద్‌లో సమావేశం. నవంబర్ 10 లేదా 11న పది లక్షల మంది విద్యార్థులతో చలో హైదరాబాద్. ఒకటి రెండు కాలేజీలకు ఎందుకు బకాయిలు చెల్లించారు..పది పర్సంట్ లంచం తీసుకొని ఇచ్చారా ...?, ఆ కాలేజీలపై విచారణ జరపాలి. అత్యంత ఫ్రాడ్ జరిగే దగ్గర విజిలెన్స్ విచారణ చేయాలి. విద్యార్థులకు, తల్లిదండ్రులకు కలిగే అసౌకర్యానికి క్షమాపణ చెబుతున్నాను’ అని రమేష్ బాబు తెలిపారు.. -
క్రియేటివిటీ హబ్‌గా హైదరాబాద్: మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్ కేవలం ఐటీ రాజధానిగా మాత్రమే కాదు, భారతదేశపు క్రియేటివిటీ హబ్‌గానూ తీర్చిదిద్దాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ వీఎఫ్ఎక్స్ యానిమేషన్ అండ్ గేమింగ్ అసోసియేషన్ (టీవీఏజీఏ) సంయుక్తాధ్వర్యంలో హైటెక్ సిటీలోని హెచ్ఐఐసీలో రెండ్రోజుల పాటు 'ఇండియాజాయ్ 2025' పేరిట నిర్వహించనున్న ఇండియాస్ ప్రీమియర్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ కాంగ్రెగేషన్ ను శనివారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు.సాంకేతికత, సృజనాత్మకత కలిసే చోటుగా హైదరాబాద్ పిక్సెల్, కవిత్వం, అవకాశాల నగరంగా ప్రపంచానికి మార్గ నిర్దేశం చేస్తుందని ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు వివరించారు. క్రియేటివ్ రంగానికి చేయుతనిచ్చేలా క్రియేటివ్ ఫ్యూచర్స్ ఫండ్, ఈస్పోర్ట్స్ అకాడమీ, మహిళా క్రియేటర్ల కోసం ప్రత్యేక ప్లాట్‌ఫామ్‌ను ప్రభుత్వంతో కలిసి ఏర్పాటు చేసేందుకు ముందుకు రావాలని సంబంధిత దిగ్గజ సంస్థలకు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం 3.1 బిలియన్ డాలర్లుగా ఉన్న భారతదేశ గేమింగ్ పరిశ్రమ విలువ 20 శాతం సీఏజీఆర్ తో 2028 నాటికి 6 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందన్నారు.భారతదేశ మొత్తం వీఎఫ్ఎక్స్ అవుట్‌పుట్‌లో మన వాటా సుమారు 25 శాతం ఉండటం మనకు గర్వకారణమన్నారు. హైదరాబాద్ ఓటీటీ కంటెంట్ ప్రొడక్షన్ లో 35 శాతం వృద్ధి రేటు నమోదు కావడం ఇక్కడి ఎకో సిస్టంపై ఉన్న నమ్మకానికి నిదర్శనమన్నారు. ఇమేజ్ టవర్, ఏఐ ఇన్నోవేషన్ హబ్, ఏఐ సిటీ తదితరాల అందుబాటులోకి వస్తే ఈ ఎకో సిస్టం మరింత పటిష్టం అవుతుందన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఇమేజ్ టవర్‌ను వచ్చే ఏడాదిలో అందుబాటులోకి తెస్తామన్నారు.క్రియేటివిటీలో సానుభూతి, వైవిధ్యం, సస్టైనబులిటీ, భారతీయ గుర్తింపు ప్రతిబింబించేలా చొరవ తీసుకోవాలని యువ క్రియేటర్స్ కు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం కేవలం నియంత్రించేదిగా కాకుండా "కో క్రియేటర్"గా మీకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజయ్ జాజు, తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ దిల్ రాజు, యువ కథానాయకుడు తేజ సజ్జా, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్, టీవీఏజీఏ ప్రెసిడెంట్ రాజీవ్ చిలక, కార్యదర్శి మాధవ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని..
వనపర్తి జిల్లా: వనపర్తి జిల్లా కేంద్రంలో దారుణ హత్య కేసు వెలుగుచూసింది. వివాహేతర సంబంధం కారణంగా భార్యే భర్త ప్రాణాలు తీసింది. జిల్లా కేంద్రంలో కురుమూర్తి, నాగమణి దంపతులు నివసిస్తున్నారు. భార్య నాగమణి నందిమల్ల శ్రీకాంత్ అనే వ్యక్తితో వివాహేత బంధం పెట్టుకుంది. తమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించి, అతనిని హత్య చేయాలని పథకం వేసింది. అక్టోబరు 28న ప్రియుడు నందిమల్ల శ్రీకాంత్‌తో కలిసి భర్త కురుమూర్తిని హత్య చేసింది.అనంతరం కారులో తీసుకెల్లి శ్రీశైలం వెళ్లి డ్యాంలో మృతదేహాన్ని పడేశారు. కురుమూర్తి సోదరి చెన్నమ్మ ఫిర్యాదు చేసింది. ఈ అంశంపై వనపర్తి రెండో ఎస్సై శశిధర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.. రంగంలోకి దిగిన పోలీసులు, నాగమణి, శ్రీకాంత్‌లను అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో అసలు విషయం బయటపడింది. ఈ దారుణ హత్య కేసు వనపర్తిలో సంచలనం రేపింది. భార్య చేతిలో భర్త ప్రాణాలు కోల్పోవడం పట్ల స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
మైనార్టీ మంత్రి కాంగ్రెస్‌ను ఒడ్డున పడేస్తారా?
ప్రముఖ క్రికెటర్, మాజీ ఎంపీ అజహరుద్దీన్ తెలంగాణ కేబినెట్లో మంత్రి అయ్యారు. అభిమానులు, క్రికెట్ ప్రేమికులు సంతోషించాల్సిన వార్తే కానీ.. ఇంకో పది రోజుల్లో జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక ఉన్న తరుణంలో అకస్మాత్తుగా ఈయన ఒక్కరినే మంత్రిని చేయడం రాజకీయ వర్గాల్లో చర్చకు కారణమవుతోంది. కాంగ్రెస్ పార్టీకి అంత అనుకూలంగా లేకపోవడం వల్లనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారన్న విమర్శలు వస్తున్నాయి. సహజంగానే భారతీయ జనతా పార్టీ ఈ అంశంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అజహర్‌పై తీవ్రమైన అభియోగాలు మోపుతూ, మతపరంగా రాజకీయ లబ్ది పొందడానికి యత్నిస్తున్నారు. భారత రాష్ట్ర సమితి నేరుగా ఆరోపణలు చేయకుండా, రేవంత్ ఈ పదవి మైనార్టీలను మోసం చేయడానికి ఇచ్చారని, ఇది ఆరు నెలల పదవేనని వ్యాఖ్యానిస్తోంది. మైనార్టీ ఓటు బ్యాంకును ఆకట్టుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఈ పని చేసిందన్నది బహిరంగ రహస్యమే. ఎందుకంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మైనార్టీ ఓటర్ల సంఖ్య సుమారు లక్ష. పైగా రాష్ట్ర కేబినెట్లో మైనార్టీలెవరూ లేకపోవడంపై అసంతృప్తి ఉందని సీఎం రేవంత్‌కు నిఘా వర్గాల ద్వారా తెలిసిందట. అయితే.. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్‌కు విరుద్ధంగా మంత్రి పదవి ఇవ్వడమేమిటని బీజేపీ ప్రశ్నించింది. అయితే రాజస్థాన్‌లో బీజేపీ కూడా ఉప ఎన్నికల సమయంలోనే ఒకరికి మంత్రి పదవి ఇచ్చిన విషయాన్ని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్పడంతో ఈ వాదన వీగిపోయినట్లయింది. బీజేపీ మైనార్టీల ప్రయోజనాలకు అడ్డుపడుతోందని, గవర్నర్‌పై కేంద్రం ద్వారా ఒత్తిడి తీసుకొచ్చి అజహరుద్దీన్ ప్రమాణ స్వీకారం జరక్కుండా చూసే ప్రయత్నమూ చేసిందని కాంగ్రెస్ ఆరోపించింది. రాజస్థాన్ అనుభవం లేకపోతే, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్నికల సంఘాన్ని ప్రభావితం చేసి ఉండేదేమో. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 2023లోనే అధికారం చేపట్టినప్పటికీ మైనార్టీ ఎమ్మెల్యేలు ఎవరూ లేకపోవడంతో కేబినెట్లో ఈ వర్గానికి ప్రాతినిథ్యం లేకుండా పోయింది. షబ్బీర్ అలీ వంటి సీనియర్ నేతలు మంత్రి పదవి ఆశించినా సలహాదారు పదవితో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు అజహర్‌ను మంత్రిని చేయడం మైనార్టీ ప్రాతినిథ్యం కోసం కాదని, ఉప ఎన్నికల్లో పరిస్థితి అంత బాగాలేదన్న సమాచారంతోనేనని కొందరు విశ్లేషకుల అంచనా. కొన్ని రోజుల క్రితం సినీ కార్మికులు సీఎం రేవంత్‌ను సన్మానిస్తూ ఒక కార్యక్రమం నిర్వహించారు. ఇది కూడా పరోక్షంగా ఎన్నికల ప్రచార సభే. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ యాభై వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తారని చెబుతున్నా లోలోపలి అనుమానం కారణంగానే మైనార్టీ వర్గానికి చెందిన అజహర్‌ను మంత్రి చేశారని వీరు అంటున్నారు.ఉప ఎన్నికల్లో అధికార పార్టీ గెలవడం సాధారణంగా జరిగేదే కానీ.. ఓటమి ప్రభావం రాష్ట్రం మొత్తమ్మీద ఉండే అవకాశం ఉంది కాబట్టి కాంగ్రెస్ అన్ని జాగ్రత్తలూ తీసుకుంటోందని అంచనా. ఇప్పటివరకూ జరిగిన సర్వేల ప్రకారం ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ల మధ్య హోరాహోరీ నడుస్తోంది. బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో గట్టి పోటీ ఇస్తోంది. కొందరు మైనార్టీ నేతలను కూడా ఆకర్శించడం కూడా కాంగ్రెస్ దృష్టిని మీరిపోలేదు. ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత పెరుగుతోందన్న విషయాన్ని కూడా కాంగ్రెస్ పరిగణలోకి తీసుకున్నట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్ తరఫున సీఎం సహా పలువురు మంత్రులు ప్రచారం నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ పక్షాన కేటీఆర్, హరీష్ రావులు ప్రధాన బాధ్యత వహిస్తున్నారు. బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పార్లమెంటు నియోజకవర్గంలో జూబ్లీహిల్స్ కూడా ఒక సెగ్మెంట్. దీంతో ఈ ఉప ఎన్నిక ఆయనకు కూడా ఇది ప్రతిష్టాత్మకంగా మారింది. కాంగ్రెస్, బీఆర్ఎస్లు మైనార్టీ ఓటర్లపై ఆశలు పెట్టుకున్నాయి. ఇంతకీ అజహర్ నియామకం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కు వ్యతిరేకమా? కాదా? ఏ రాజకీయ పార్టీ కూడా ఇలా వ్యవహరించరాదనే చెప్పాలి. ఇది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కిందకు రాకపోయినా, మోరల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కిందకు వస్తుందని ఒక సీనియర్ అధికారి అభిప్రాయయపడ్డారు. అయితే ఈ కాలంలో రాజకీయ పార్టీల నుంచి నైతికత ఆశించడం అత్యాశే. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అజహర్‌పై దేశద్రోహంతోపాటు తీవ్రమైన కేసులున్నాయని వ్యాఖ్యానించారు. క్రికెట్లో ఒక వెలుగు వెలిగిన అజహర్‌కు ఆ తరువాత ఫిక్సింగ్ అభియోగాల మరకలూ అంటాయి. క్రికెట్‌కు దూరమయ్యారు. రాజకీయాలకు దగ్గరయ్యారు. ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలుపొందారు. ఆ తరువాత రాజస్థాన్ నుంచి పోటీ చేశారు కానీ గెలవలేదు. అప్పటి నుంచి ఆయన తెలంగాణ రాజకీయాల్లోనే కొనసాగుతున్నారు. కాంగ్రెస్ ప్రముఖుడిగా, వర్కింగ్ అధ్యక్షుడిగా జూబ్లీహిల్స్ నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. ఈ ఉప ఎన్నికలోనూ బరిలోకి దిగాలని ఆశించినా టిక్కెట్ నవీన్ యాదవ్‌కు ఇవ్వాలన్న రేవంత్ నిర్ణయంతో అది జరగలేదు. అజహర్ అభ్యర్థిత్వాన్ని ఎంఐఎం కూడా వ్యతిరేకించిందని సమాచారం. కాంగ్రెస్ పార్టీ గవర్నర్ కోటా కింద అజహరుద్దీన్‌కు ఎమ్మెల్సీ పదవి కేటాయించింది కానీ.. దానికి ఇంతవరకు గవర్నర్ ఆమోద ముద్ర వేయలేదు. అంటే.. ఎమ్మెల్సీ కాకముందే అజహర్ నేరుగా మంత్రి అయ్యారన్నమాట. ఇంకో ఆరు నెలల్లోపు అజహర్ ఎమ్మెల్సీ కాలేకపోతే మంత్రి పదవి వదలుకోవల్సి ఉంటుంది. వాస్తవానికి మూడు నెలల క్రితమే అజహర్‌ను మంత్రిని చేయడంపై నిర్ణయం జరిగిందని మహేష్ గౌడ్ చెబుతున్న మాటలు నమ్మ శక్యంగా లేవు. ఎందుకంటే కొంత కాలం క్రితమే ఆయన అజహర్‌కు మంత్రి పదవి ఇస్తున్న సంగతి తనకు తెలియదని చెప్పారు. ఏతావాతా... అజహర్‌కు మంత్రి పదవి దక్కడం కాంగ్రెస్‌కు మేలు చేస్తుందా? లేదా? అన్నది ఇంకో పది రోజుల్లో తేలనుంది!కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
కిషన్ రెడ్డి.. మీకేం తెలుసు: అజారుద్దీన్ ఫైర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రాజకీయం మరోసారి హీటెక్కింది. కాంగ్రెస్, బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలకు మంత్రి అజారుద్దీన్ కౌంటరిచ్చారు. దేశ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిన తనను దేశ ద్రోహి అంటూ వ్యాఖ్యలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.మంత్రి అజారుద్దీన్ తాజాగా సాక్షితో మాట్లాడుతూ..‘కిషన్ రెడ్డి.. మీరేం మాట్లాడుతున్నారు. నా గురించి మీకు ఏం తెలుసు. నేను హిందూ, ముస్లిం అన్ని వర్గాల వాడిని.. అందరివాడిని. జూబ్లీహిల్స్ ఎన్నికల కోసమే బీజేపీ నన్ను టార్గెట్ చేసింది. దేశ గొప్పతనాన్ని చాటి చెప్పిన నేను దేశ ద్రోహినా?. నా దేశభక్తిపై ఎవరూ సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో జూబ్లీహిల్స్ ఎన్నికలకు తన మంత్రి పదవికి సంబంధం లేదని తెలిపారు. తనను కేబినెట్లోకి తీసుకోవడం సీఎం రేవంత్ రెడ్డి, హైకమాండ్ నిర్ణయమని పేర్కొన్నారు. సీఎం ఏ శాఖలు ఇచ్చినా సంతోషమే.. నాకు ఇవి ఇవ్వాలని నేను అడగడం లేదు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం పనిచేస్తానని తెలిపారు. ఏ శాఖ ఇచ్చినా న్యాయం చేస్తాననే నమ్మకం ఉందని అన్నారు.కిషన్‌రెడ్డి ఆరోపణలు.. ఇక, అంతకుముందు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. అజారుద్దీన్‌పై సంచలన ఆరోపణలు చేశారు. దేశ ద్రోహానికి పాల్పడి భారత్‌కు చెడ్డపేరు తెచ్చిన వ్యక్తి అజారుద్దీన్ అని విమర్శించారు. అలాంటి వ్యక్తికి కాంగ్రెస్ మంత్రి పదవి ఇవ్వడం ప్రజాస్వామ్యానికి అవమానమని వ్యాఖ్యానించారు. ఆయనపై అనేక కేసులు ఉన్నాయని తెలిపారు. దేశ గౌరవానికి భంగం కలిగించిన వ్యక్తిని గవర్నర్ కోటాలో కాంగ్రెస్ ఎలా ఎమ్మెల్సీని చేస్తుందని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.టీపీసీసీ విమర్శలు..మరోవైపు.. కిషన్ రెడ్డి వ్యాఖ్యలకు టీపీసీపీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కౌంటరిచ్చారు. తాజాగా మహేష్ గౌడ్ మాట్లాడుతూ.. అజారుద్దీన్‌పై కిషన్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, ఆయనకు మంత్రి పదవి ఇస్తే బీజేపీ నేతలకు ఎందుకంత అక్కసు అని ఫైర్ అయ్యారు. అజార్‌కు మంత్రి పదవి ఇచ్చే విషయంలో మూడు నెలల ముందే హైకమాండ్ నిర్ణయం తీసుకుందన్నారు. సుదీర్ఘ కాలం దేశానికి ఆయన సేవలందించారని, ఈ నేపథ్యంలో అజార్ విషయంలో కాంగ్రెస్ ప్రత్యేక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు. ఇండియా క్రికెట్ టీం కెప్టెన్‌గా దేశానికి అజారుద్దీన్ ఎన్నో విజయాలు సాధించి పెట్టారని, ఎంపీగా ప్రజలకు సేవ చేశారని గుర్తుచేశారు. అజార్‌కు మంత్రి పదవి ఇవ్వడంతో రాష్ట్రంలోని మైనార్టీలకు ఎంతో మేలు జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. -
పొద్దుటూరికి పెద్ద పదవి
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : రెండేళ్ల నిరీక్షణ ఫలించింది. ఎట్టకేలకు జిల్లాకు పెద్ద పదవి వరించింది. బోధన్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డికి పూర్తిస్థాయి కేబినెట్ హో దాతో కూడిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పదవిని కేటాయించారు. రాష్ట్రంలో అన్ని ప్రధాన ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలు తీరును సమీక్షించేలా ఆయనను ఈ పదవిలో నియమించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్త ర్వులు జారీ చేశారు. అన్ని జిల్లాల కలెక్టర్లకు ఇందుకు సంబంధించిన ఆదేశాలు పంపించారు. మంత్రి అనే ఒక్క మాటే లేదు కానీ, మంత్రికి ఉన్న అన్ని అధికారాలను సుదర్శన్‌రెడ్డికి కట్టబెట్టారు. సచివాలయంలో మంత్రుల గదులతో సమానంగా చాంబర్‌ను కేటాయించనున్నారు. ఆ విభాగంలో ప్రిన్సిపల్ సెక్రటరీ, ఇద్దరు సెక్రటరీలను ప్ర భుత్వం నియమించనుంది. ఇక ముఖ్యంగా అన్ని కేబినెట్ సమావేశాలకు సుదర్శన్‌రెడ్డిని ప్రత్యేక ఆ హ్వానితుడిగా హాజరయ్యేలా ఉత్తర్వులు ఇచ్చారు. అన్నిరకాల సంక్షేమ, అభివృద్ధి పనులకు సంబంధించి పర్యవేక్షణ చేయడంతో పాటు సమీక్ష చేసి ఆ యా వివరాలను కేబినెట్‌కు పంపే అధికారం కల్పించారు. సుదర్శన్‌రెడ్డికి ఈ పదవి కేటాయించడంతో జిల్లా కాంగ్రెస్ శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతోంది. రాజకీయంగా చైతన్యమైన ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు గత రెండేళ్లుగా కేబినెట్ బెర్త్ కేటాయించకపోవడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అయ్యింది. ఉ మ్మడి జిల్లా చరిత్రలో గత కొన్ని దశాబ్దాలుగా మంత్రి లేకుండా ఉన్న పరిస్థితి లేదు. కాంగ్రెస్ నాయ కులు, కార్యకర్తలు సైతం తీవ్ర అసహనానికి లోనవుతూ వచ్చారు. ఈ నేపథ్యంలో సుదర్శన్‌రెడ్డికి ద క్కిన ఈ పదవితో ఊరట చెందుతున్నారు. ఇకమీ దట జిల్లాలో అభివృద్ధి పనులు మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లే అవకాశం లభించిందని కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నాయి. జిల్లాలో ఇప్పటివర కు అనధికారిక మంత్రిగా ఉన్న సుదర్శన్‌రెడ్డికి తా జా పదవితో ప్రజలకు మరిన్ని సేవలు అందించే అ వకాశం కలిగిందంటున్నారు. ఇదిలా ఉండగా ఉమ్మడి జిల్లా నుంచి మొదలైన రాజకీయ సంచలనాలు రాష్ట్రంలో పెనుమార్పులు కలిగించిన చరిత్ర కళ్లముందే కనిపిస్తుంది. ప్రముఖ సినీ నటుడు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిని ఎమ్మెల్యేగా గెలి పించడం, మొదట్లో బీ ఆర్ఎస్కు జిల్లా ప్ర జాపరిషత్లో విజయాన్ని ఇచ్చి రాష్ట్ర సాధనకు పునాది వేయడం సంచలనం అయ్యింది. అదే విధంగా రానురాను జిల్లాలో బీజే పీ ప్రాబల్యం పెరుగుతుండడం, వరుసగా రెండుసార్లు ఎంపీగా అర్వింద్ విజయం, ఉమ్మడి జిల్లాలో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు గెలుపొందడం, కామారెడ్డిలో ఏకంగా కేసీఆర్, రేవంత్రెడ్డిలనే ఓడించి బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డిని గెలిపించడం.. తదితర రాజకీయ మలుపులకు ఉమ్మడి జిల్లా వేదికగా నిలిచింది. ఇంతటి పెనుమార్పులకు కారణమయ్యే జిల్లాలో రెండేళ్లుగా మంత్రి లేకపోవడంతో కాంగ్రెస్ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తూ వచ్చారు. తాజాగా సుదర్శన్‌రెడ్డికి కీలకమైన ఈ పదవి దక్కడంతో ఊరట నిచ్చిందని చెబుతున్నారు. అజహరుద్దీన్‌కు మంత్రిగా అవకాశం కలి్పంచిన నేపథ్యంలో సుదర్శన్‌రెడ్డికి మంత్రి పదవి కేటాయింపుపై జిల్లాలో తీవ్రంగా చర్చలు చోటుచేసుకున్నా యి. రాజకీయ వర్గాలే కాకుండా సాధారణ ప్రజల్లో నూ ఈ అంశం నానింది. అజహరుద్దీన్‌కు మంత్రి పదవి కేటాయించడంతో ఇక జిల్లాకు మంత్రి పదవి రానట్లేనని పలువురిలో తీవ్ర అసహనం వ్యక్తమయ్యింది. ఈ నేపథ్యంలో సుదర్శన్‌రెడ్డికి కీలకమైన పదవి కేటాయించడంతో భారీ ఓదార్పు నిచ్చింది.శుభాకాంక్షలు తెలిపిన మహేశ్‌కుమార్ గౌడ్సాక్షిప్రతినిధి,నిజామాబాద్: ప్రజల్లో, రాజకీయా ల్లో మంచి పట్టున్న సీనియర్ నాయకుడు, బో ధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని ప్రభుత్వ సలహాదారుగా నియమించడంపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ శుభాకాంక్షలు తెలిపారు. మంచి అనుభవం ఉన్న వ్యక్తిని ప్రభుత్వ సంక్షే మ, అభివృద్ధి పథకాలపై సలహాదారుడిగా ని యమించడంతో పథకాల అమలు మరింత వే గంగా జరిగే అవకాశాలు ఉంటాయన్నారు. అవకాశం కలి్పంచిన సీఎం రేవంత్‌రెడ్డి, డి ప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులకు, కాంగ్రెస్ అధిష్టానానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. -
మియాపూర్‌లో హైడ్రా కూల్చివేతలు!
సాక్షి, హైదరాబాద్: నగరంలోని మియాపూర్‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేతకు హైడ్రా సిద్ధమైంది. స్థానికంగా సర్వే నెంబర్ మార్చి అక్రమ నిర్మాణం జరిపినట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు హైడ్రా అధికారులు రంగంలోకి అక్కడికి చేరుకున్నారు. ఘటనా స్థలంలో భారీగా పోలీసులు మోహరించారు.దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. మియాపూర్‌లో సర్వే నెంబర్ 100లో భారీగా అక్రమ నిర్మాణాలు జరిగాయి. సర్వే నెంబర్ మార్చి.. హెచ్ఎండీఏ ఫెన్సింగ్ తొలగించిన నిర్మాణదారులు అక్కడ అక్రమంగా నిర్మాణాలను చేపట్టారు. ప్రభుత్వ భూమి సర్వే నంబరు 100లో అక్రమంగా 307, 308తో దొంగ రికార్డులు సృష్టించారు. ఈ క్రమంలో స్థానికులు.. హైడ్రాకు ఫిర్యాదు చేశారు. దీంతో, రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు.. అక్రమ నిర్మాణాలను గుర్తించి కూల్చివేతలకు సిద్ధమయ్యారు. స్థానికంగా ఎలాంటి అవాంఛనీయ ఘటన చోటుచేసుకుండా అక్కడ పోలీసులు భారీగా మోహరించారు. -
ప్రిన్సిపాల్ మందలించారని..
నల్గొండ జిల్లా: ప్రిన్సిపాల్ మందలించడంతోపాటు, ఉపాధ్యాయురాలు విద్యార్థుల ముందు హేళనగా మాట్లాడారని మనస్థాపం చెందిన విద్యార్థిని శుక్రవారం సాయంత్రం డెటాల్ తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. తిరుమలగిరి సాగర్‌కు చెందిన సభావట్ శ్రీను, కళ దంపతుల కుమార్తె సభావట్ మౌనిక దేవరకొండ పట్టణ పరిధిలో గల టీటీడబ్ల్యూఆర్ఎస్ బాలికల గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. మౌనిక వారం క్రితం తన ఇంటికి వెళ్లి శుక్రవారం పాఠశాలకు వచ్చింది. అయితే విద్యార్థిని తరచుగా పాఠశాలకు గైర్హాజరు అవుతుండడంతో ప్రిన్సిపాల్ మందలించారు. అదేవిధంగా ఉపాధ్యాయురాలు తోటి విద్యార్థినుల ముందు మౌనికతో హేళనగా మాట్లాడారు. దీంతో మనస్థాపం చెందిన విద్యార్థిని సాయంత్రం హాస్టల్ గదిలో ఉన్న డెటాల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన తోటి విద్యార్థినులు అక్కడ ఉన్న ఉపాధ్యాయులకు చెప్పడంతో హుటాహుటిన దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. ప్రస్తుతం మౌనిక ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. టీచర్ల వేధింపుల వల్లే తమ కుమార్తె ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని విద్యార్థిని తల్లిదండ్రులు ఆరోపించారు. గతంలోనూ పాఠశాలకు ఆలస్యంగా వచ్చిందని గంటసేపు తరగతి బయట నిలబెట్టడంతో కళ్లు తిరిగి కిందపడిన సందర్భాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. -
లడ్డూ ఇప్పిస్తామని చెప్పి..
యాదాద్రి భువనగిరి జిల్లా : మద్యం మత్తులో ఉన్న ఇద్దరు కామాంధులు లడ్డూ ఇస్తానని ఆశ చూపించి నాలుగేళ్ల చిన్నారిని తమ వెంట తీసుకెళ్లి లైంగికదాడికి యత్నించారు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లింగోజిగూడెం గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రేవా జిల్లా మహాసువ గ్రామానికి చెందిన దినేష్ కాల్(45), శివరాజ్ కాల్(44) గత మూడు నెలల క్రితం లింగోజిగూడెం గ్రామానికి వచ్చారు. స్థానికంగా ఉన్న ఓ పరిశ్రమలో కాంట్రాక్టర్ కింద దినసరి కూలీలుగా పనిచేస్తున్నారు. వీరు లింగోజిగూడెం గ్రామంలోని బీసీకాలనీలో (రైస్విుల్ దగ్గర) మరికొంత మంది కూలీలతో కలిసి అద్దె ఇంట్లో ఉంటున్నారు. అదేవిధంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలహాబాద్‌కు చెందిన బాలిక కుటుంబం సైతం మూడు నెలల క్రితం ఉపాధి నిమిత్తం ఇక్కడికి వచ్చారు. బాలిక తండ్రి అదే పరిశ్రమలో పెయింటింగ్ కాంట్రాక్టర్ వద్ద కార్మికుడిగా పనిచేస్తున్నాడు. వీరు.. నిందితులు ఉంటున్న ఇంటి వెనుక భాగంలో ఉన్న అద్దె ఇంట్లో ఉంటున్నారు. లడ్డూ ఇప్పిస్తామని చెప్పి.. చిన్నారి తండ్రి కూలికి వెళ్లగా తల్లి ఇంటి వద్దే ఉంది. శుక్రవారం ఉదయం 11గంటల సమయంలో తల్లి ఇంట్లో దుస్తులు ఉతుకుతండగా చిన్నారులు బయట ఆడుకుంటున్నారు. డ్యూటీకి వెళ్లని దినేష్, శివరాజ్‌లు పూటుగా మద్యం సేవించారు. మద్యం మత్తులో ఉన్న వారిద్దరు ఇంటి ఆరుబయట ఆడుకుంటున్న చిన్నారి దగ్గరకు వెళ్లారు. లడ్డూ ఇప్పిస్తానని ఆశ చూపించి తమ వెంట తీసుకెళ్లారు. వారు బాలికపై లైంగిక దాడికి యత్నిస్తుండగా రోదించడంతో బాలిక తల్లి బయటకు వచ్చి వెతకసాగింది. ఇద్దరు వ్యక్తులు మీ కుమార్తెను తీసుకెళ్లారని స్థానికంగా ఉన్న ఓ బాలిక చెప్పింది. దీంతో వెంటనే పక్కింటి వారి సాయంతో తల్లి అక్కడకు వెళ్లి బాలికను తీసుకువచ్చి పోలీసులకు సమాచారమిచి్చంది. పోలీసులు అక్కడకు చేరుకుని స్థానికులతో మాట్లాడి వివరాలు సేకరించారు. వైద్యచికిత్స నిమిత్తం బాలికను చౌటుప్పల్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి, మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ మన్మథకుమార్ తెలిపారు. -
Siddipeta: బస్సు కిందకు దూకి వ్యక్తి ఆత్మహత్య
సిద్దిపేటఅర్బన్: రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తి ఆర్టీసీ బస్సును ఎక్కేందుకు ఆపి బస్సు ఎక్కకుండా ముందు టైరు కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శుక్రవారం సిద్దిపేట అర్బన్ మండలం పొన్నాల శివారులోని దాబాల వద్ద జరిగింది. త్రీటౌన్ పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల మేరకు... మద్దూరు మండలం వల్లంపట్ల గ్రామానికి చెందిన నారదాసు బాలరాజు (47) హైదరాబాద్‌లోని తన బావ ఇంటికి వెళ్లి శుక్రవారం తిరిగి స్వగ్రామానికి వెళ్తున్నాడు. దుద్దెడ చౌరస్తా వద్ద దిగాల్సి ఉండగా అక్కడ దిగకుండా పొన్నాల శివారులోని ఫ్లైఓవర్ వద్ద దిగాడు. జనగామ బస్సు ఎక్కేందుకుగాను హైదరాబాద్ వైపు రోడ్డు మధ్యలో నుంచి నడుచుకుంటూ వెళ్తుండగా వెనుక నుంచి సిద్దిపేట నుంచి సికింద్రాబాద్ వెళ్లే ఆర్టీసీ బస్సు రావడంతో దానిని ఆపాడు. బస్సు ఆగగానే బస్సు ఎక్కుతున్నట్లు ప్రయత్నించి బస్సెక్కకుండా ఒక్క సారిగా ముందు టైరు కిందకు దూకేశాడు. అయితే ఇది గమనించని డ్రైవర్ బస్సును ముందుకు కదిలించగా అదే సమయంలో పక్క నుంచి బైక్‌పై వెళ్తున్న ఓ వ్యక్తి డ్రైవర్‌కు చెప్పడంతో బస్సును ఆపి చూడగా బాలరాజు ఛాతీపై తీవ్ర గాయాలయ్యాయి. కాగా చికిత్స నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి ఆత్మహత్యకు గల కారణాలేంటనే విషయాలు ఇంకా తెలియరాలేదు. మృతుడి కొడుకు రాజేందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ చంద్రయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
మినిస్టర్ అజ్జూ భాయ్
సాక్షి, హైదరాబాద్: పక్కా హైదరాబాదీ. భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహమ్మద్ అజహరుద్దీన్ (అజ్జూ భాయ్) మినిస్టర్ బన్‌గయా. శుక్రవారం రేవంత్ సర్కార్ మంత్రి వర్గంలో కొత్తగా చేరిపోయారు. పదకొండేళ్ల క్రితం ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ లోక్‌సభ స్థానానికి ప్రాతినిధ్యం వహించిన అజహరుద్దీన్.. సొంత గడ్డపై తాజాగా పెద్దల సభకు ఎంపికై.. ఆమోదానికి ముందే మంత్రిగా ప్రమాణం చేశారు. రాష్ట్ర మంత్రి వర్గంలో బెర్త్‌కు మైనారిటీ కేటగిరీ, హైదరాబాద్ కోటా కలిసి వచ్చింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో మంత్రి పదవి వరించినట్లయింది. రెండేళ్ల క్రితం జరిగిన సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేసిన ఓటమి పాలైన అజహరుద్దీన్.. ఉప ఎన్నికల్లో తిరిగి పోటీ చేసేందుకు ఆసక్తి కనబర్చగా కాంగ్రెస్ అధిష్టానం ఆయనను ఎన్నికల బరి నుంచి తప్పించి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎంపిక చేసి సిఫార్సు చేసింది. అయితే.. గవర్నర్ వద్ద ఎమ్మెల్సీ నియామక దస్త్రం పెండింగ్‌లో ఉండటంతో అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో ఉప ఎన్నికల ప్రచారంలో ఆయన అంటీముట్టనట్లు ఉండిపోయారు. మరోవైపు అధికార కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో సుమారు 24 శాతం మైనారిటీలు ఉండటంతో మంత్రి పదవి ఇచి్చనట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్‌తోనే రాజకీయ అరంగేట్రం భారత్ క్రికెట్ జట్టు సారథిగా వ్యవహరించిన అజహరుద్దీన్.. కాంగ్రెస్‌తోనే రాజకీయ అరంగేట్రం చేసి తొలిసారిగా ఎంపీగా గెలుపొందారు. రెండు పర్యాయాలు పార్లమెంట్‌కు, ఒకసారి అసెంబ్లీ స్థానానికి పోటీ చేసినా.. ఒకసారి మాత్రమే ఆయన విజయం సాధించారు. 2009లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తర్‌ప్రదేశ్‌లోని మొరాదాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యరి్ధగా బరిలో దిగి విజయం సాధించి పార్లమెంట్లో అడుగుపెట్టారు. 2014లో జరిగిన ఎన్నికల్లో రాజస్థాన్‌లోని టోంక్ సవాయీ మాధోపుర్ లోక్‌సభ స్థానం కాంగ్రెస్ అభ్యరి్థగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2019లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఆయనకు టికెట్ ఇవ్వలేదు. ఆ తర్వాత ఆయన సొంత రాష్ట్రం తెలంగాణపై దృష్టి సారించారు. 2023 సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇటీవల సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో ఉప ఎన్నికలు అనివార్యం కావడంతో తిరిగి పోటీ చేసేందుకు ఆసక్తి కనబర్చగా.. అనూహ్యంగా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవికి సిఫార్సు అయి తాజాగా మంత్రిగా ప్రమాణం చేశారు. మణికట్టుతో కనికట్టు.. టీమ్ ఇండియా కెప్టెన్ తనదైన ముద్రతో పాటు మణికట్టు కదలికలతో బ్యాట్‌ను సొగసుగా తిప్పుతూ పరుగుల వరద పారించడంలో అజహరుద్దీన్ దిట్ట. మొత్తం కెరీర్లో 99 టెస్ట్ మ్యాచ్‌లు, 334 వన్డేలు ఆడిన అజహర్..Œ Œ 47 టెస్ట్‌లు, 174 వన్డేలకు కెప్టెన్‌గా వ్యవహరించారు. అజహరుద్దీన్ నాయకత్వలో టీమ్ ఇండియా 14 టెస్టులు, 90 వన్డేలు సాధించింది. అత్యధిక విజయాల కెపె్టన్‌గా అజహర్‌కు పేరుంది. కాగా.. 2000లో మ్యాచ్ ఫిక్సింగ్ వివాదంలో చిక్కుకుని సీబీఐ విచారణను ఎదుర్కొన్నారు. బీసీసీఐ జీవితకాల నిషేధం విధించింది. కొద్ది రోజుల క్రితం సుప్రీంకోర్టు ఆయనను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు వేసింది. ఆ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కోల్పోయిన అజహరుద్దీన్.. రాజకీయాలపై దృష్టి సారించి ఏకంగా మంత్రి అయ్యారు. -
హీటెక్కిన పాలి'ట్రిక్స్'..
సాక్షి, హైదరాబాద్: అధికార, ప్రతిపక్షాల మధ్య జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం హీటెక్కుతోంది. పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్దీ రాజకీయ వాతావరణం హాట్‌హాట్‌గా మారుతోంది. ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఇంటింటి ప్రచారంలో ఆరోపణలు, ప్రత్యారోపణలు, వ్యక్తిగత విమర్శనాస్త్రాలు గుప్పిస్తూనే.. నియమావళి ఉల్లఘనలపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదుల పరంపర కొన సాగిస్తున్నాయి. తాజాగా శుక్రవారం కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు మద్దతుగా సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు మద్దతుగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షోలు, కార్నర్ మీటింగ్‌ల్లో పాల్గొనగా.. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్‌రెడ్డి కోసం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి డోర్ టు డోర్ ప్రచారం చేయడంతో పొలిటికల్ హీట్ మరింత పెరిగినట్లయింది. మరోవైపు రాష్ట్ర మంత్రులు, మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అసెంబ్లీ సెగ్మెంట్లో డివిజన్లవారీగా తిష్ట వేసి తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు ఓటర్లను ఆకర్షించేందుకు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. అధికార కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా అభివృద్ధి మంత్రం జపిస్తుండగా, విజయం సాధిస్తామని ధీమాతో బీఆర్ఎస్, పాగా వేసేందుకు బీజేపీ ప్రతిష్టాత్మకంగా పోరాడుతున్నాయి. అందరి దృష్టి ఇక్కడే.. తెలుగు రాష్ట్రాల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక హాట్ టాపిక్‌గా మారింది. ఈ నియోజకవర్గంలో సెటిలర్లు, సెలబ్రిటీలు, సంపన్నుల ఓట్లు కూడా ఉండటంతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రధాన పక్షా లు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఊ హకు అందని విధంగా నిర్ణయాలతో ట్విస్టులపై ట్విస్టు లు ఇస్తున్నాయి. అధికార కాంగ్రెస్ మైనారిటీ ఓట్లను తమ వైపు తిప్పుకునేందుకు ఏకంగా సాధారణ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన అజహరుద్దీన్‌కు మంత్రి పదవి కట్టబెట్టింది. బీఆర్ఎస్ దూకుడు పెంచింది. మాటా ముచ్చటా కార్యక్రమంతో టీ దుకాణాలు, ఇతర రద్దీ ప్రాంతాల్లో ప్రజలను కలిసి ఓట్లు అభ్యర్థించడంతో పాటు పదేళ్ల బీఆర్ఎస్ పాలన విజయాలను.. రెండేళ్ల కాంగ్రెస్ పాలన వైఫల్యాలను ప్రజలకు వివరిస్తోంది. రోడ్ షోలు అదుర్స్ అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ శుక్రవారం రాత్రి పోటా పోటీగా నిర్వహించిన రోడ్ షోలు ఆ పారీ్టల శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేపట్టిన రోడ్ షోకు అడుగడుగునా ఘన స్వాగతం లభించింది. పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరయ్యాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్‌షో గులాబీవనాన్ని తలపించింది. నందినగర్‌లోని నివాసం నుంచి రోడ్ షోకు బయలుదేరేముందు పార్టీ మహిళా నేతలు కేటీఆర్‌కు హారతి పట్టారు. అడుగడుగునా గులాబీ జెండాలతో ఘన స్వాగతం పలికారు. వారి ఉత్సాహం చూసి కేటీఆర్ సైతం జెండా ఊపారు. ‘అందరూ బాగున్నారా. ‘కొడుతున్నామా జూబ్లీహిల్స్‌ను మళ్లీ. కేసీఆర్ నాయకత్వం వరి్ధల్లాలి’ అన్నారు. దీనికి స్పందిస్తూ జనం చేయి చూపడంతో అది చూపొద్దు. మొండిచేయి డేంజర్. పిడికిలి బిగించాలి అని పిలుపునిచ్చారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఇంటింటికీ వెళ్లి బీజేపీ అభ్యర్థి దీపక్‌రెడ్డికి ఓటు వేయాలని అభ్యర్థించారు. -
అజ్జూ భాయ్ మనోడే...
హైదరాబాద్: దేశంలోనే పేరొందిన కళాశాలలో నిజాం కళాశాల ఒకటి. ఇందులో చదువుకున్న విద్యార్థిని విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో అత్యుత్తమ స్థాయిలో తమ సేవలను అందిస్తున్నారు. రాష్ట్ర మంత్రిగా భారత క్రికెట్ జట్టు మాజీ కెఫ్టెన్ మహమ్మద్ అజహరుద్దీన్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేయడం పట్ల నిజాం కళాశాల పూర్వ విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. నిజాం కళాశాలలో విద్యనభ్యసించిన వ్యక్తి నేడు రాష్ట్ర మంత్రి స్థాయికి ఎదగడం గర్వంగా ఉందని కళాశాల బోధనా సిబ్బంది పేర్కొన్నారు. నిజాం కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఏవీ రాజశేఖర్ మాట్లాడుతూ అజహరుద్దీన్ ప్రజలకు మంచి సేవలు అందించి కళాశాల ప్రఖ్యాతలను మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఎందరో ప్రముఖులు.. 130 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన నిజాం కళాశాలలో ఎంతోమంది విద్యార్థులు విద్యనభ్యసించారు. ఇక్కడ విద్య అభ్యసించిన విద్యార్థులు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో అనేకమంది వివిధ హోదాలలో పనిచేశారు. ఎన్.కిరణ్‌కుమార్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పని చేయగా, మల్లు భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబు, కేటీఆర్‌లు మంత్రులుగా పనిచేశారు. అదేవిధంగా నాదెండ్ల మనోహర్, ప్రొఫెసర్ కోదండరాం, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, నటుడు బాలకృష్ణలతో పాటు మరెందరో ప్రముఖులు చట్టసభల్లో తమ గొంతును వినిపించారు. అంతే కాకుండా అంతరిక్ష యాత్రికుడు రాకేష్ శర్మ, ఐపీఎస్ అధికారులు సీవీ ఆనంద్, స్టీఫెన్ రవీంద్ర సైతం ఇదే కళాశాల విద్యార్థులు కావడం గమనార్హం. -
నాడు తల్లి.. నేడు కూతురు
జగిత్యాలక్రైం: నాడు భర్త, అత్త, కుటుంబ సభ్యుల వేధింపులతో తల్లి ఇంట్లో దూలానికి ఉరేసుకోగా, నేడు కూతురు సైతం అదే దూలానికి ఉరేసుకుని ప్రాణాలు వదిలిన ఘటన జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం కొండాపూర్ గ్రామంలో గురువారం జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు.. పెగడపల్లి మండలం బతికెపల్లి గ్రామానికి చెందిన జ్యోతిని 16 ఏళ్ల క్రితం ఎండపల్లి మండలం కొండాపూర్‌కు చెందిన వెనంక రవికి ఇచ్చి వివాహం చేశారు. వీరికి సహస్ర (16), మణికార్తీక్ సంతానం. ఈనేపథ్యంలో భర్త, అత్తింటి కుటుంబ సభ్యులు జ్యోతిని వేధింపులకు గురిచేయడంతో 2017లో ఇంట్లో దూలానికి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీంతో రవి, సవిత అనే మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. ఈక్రమంలో సహస్త్ర ఎండపల్లి మండలం కుమ్మరిపల్లి కసూ్తరిబాగాంధీ బాలికల పాఠశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. నెల క్రితం ఆమెకు ముక్కు ఆపరేషన్ జరిగింది. వసతి గృహంలో ముక్కు నొప్పి ఎక్కువ కావడంతో ఇంటి వద్దే ఉంటోంది. గురువారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో గతంలో తల్లి ఆత్మహత్య చేసుకున్న దూలానికే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కాగా మృతురాలి అమ్మమ్మ పొరండ్ల సుగుణ తన మనుమరాలి మృతిపై అనుమానాలున్నాయని, తండ్రి రవి, సవతి తల్లి సవిత, వెన్నంకి లక్ష్మి, వెన్నంకి శ్రీనివాస్‌లు కారణమని ఫిర్యాదు చేసింది. వేధింపులు భరించలేకనే కొద్దిరోజులుగా ఇబ్బందులు పడుతుందని, కుటుంబసభ్యులు ఆమెను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్గటూర్ ఎస్సై ఉమాసాగర్ తెలిపారు. కాగా, తల్లీకూతుళ్లు ఒకే దూలానికి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. సహస్ర మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జగిత్యాల ఆస్పత్రి మార్చురీ గదిలో ఉంచగా, స్నేహితులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. -
ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు..
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ వార్షిక పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యా హ్నం 12 గంటల వరకు పరీక్షా సమయం ఉండనుంది. ఈ మేరకు బోర్డు శుక్రవారం ఎగ్జామ్ టైంటేబుల్ విడుదల చేసింది. వచ్చే ఏడాది జనవరి 21న ఫస్టియర్ విద్యార్థులకు, 22న సెకండియర్ విద్యార్థులకు ప్రాక్టికల్స్‌ను నిర్వహించనుంది. జేఈఈకి హాజరయ్యే వారికి ప్రయోగపరీక్షల విషయంలో వెసులుబాటు కల్పించనుంది. జనవరి 23న ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్, 24న ఎన్విరాన్మెంటల్ ఎగ్జామినేషన్ పరీక్షలను ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించనుంది. ఫీజు ఖరారు..: ఇంటర్ పరీక్షల ఫీజు గడువును బోర్డు ఖరారు చేసింది. జనరల్ విద్యార్థులకు రూ. 530గా, ప్రయోగ పరీక్షలకు రూ. 100గా నిర్ణయించింది. వొకేషనల్ విద్యార్థులకు రూ. 870 (థియరీ రూ. 530+ప్రాక్టికల్స్ రూ. 240+ఇంగ్లిష్ ప్రాక్టికల్స్ రూ. 100)గా ఖరారు చేసింది. ఈ నెల 14 వరకు ఫైన్ లేకుండా ఫీజు చెల్లించవచ్చు. రూ. 100 ఫైన్‌తో ఈ నెల 24 వరకు, రూ. 500 ఫైన్‌తో డిసెంబర్ ఒకటి వరకు, రూ. 1,000 ఫైన్‌తో డిసెంబర్ 8 వరకు, రూ. 2 వేల ఫైన్‌తో డిసెంబర్ 15 వరకు ఫీజు చెల్లించొచ్చు. -
వదలని వరద.. బురద
వరంగల్ అర్బన్/హన్మకొండ: సాక్షిప్రతినిధి, ఖమ్మం: అక్కన్నపేట(హుస్నాబాద్): డిండి: వరంగల్ నగరంలోని పలు కాలనీలు ఇంకా జలదిగ్భంధంలోనే ఉన్నాయి. వర్షం తగ్గి మూడు రోజులు గడిచినా వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ నుంచి వరద నీరు వస్తుండటం వల్ల తాము ఏమీ చేయలేమని బల్దియా అధికారులు చేతులెత్తేయడం పట్ల కాలనీల వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరంగల్‌లో మోంథా తుపానుతో 45 కాలనీలు నీట మునిగాయి. అందులో 39 కాలనీల్లో నీటి ఉధృతి పూర్తిగా తగ్గుముఖం పట్టడంతో బాధితులు ఇళ్లల్లోకి చేరుకున్నారు. కానీ, ఇళ్లన్నీ బురదతో నిండిపోయి దుర్గంధం వెదజల్లుతుండటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బురద మేటలను తొలగించి ఇళ్లను శుభ్రం చేసుకునే పనుల్లో నిమగ్నయ్యారు.హనుమకొండ పరిధిలోని వివేక్‌నగర్, అమరావతి నగర్, టీవీ టవర్ కాలనీ, కుడా కాలనీ, నందితా నగర్, రాంనగర్, రాజాజీ నగర్లో ఏ ఇంటిని చూసినా పేరుకు పోయిన ఒండ్రు మట్టిని తొలగిస్తూ కనిపించారు. విద్యార్థుల పుస్తకాలు, సర్టిఫికెట్లు బయట ఆరబెట్టారు. వరంగల్ ఎగువన ఉన్న చెరువులు మత్తళ్లు పోస్తుండటంతో వరద కొనసాగుతోంది. దీంతో హంటర్ రోడ్డులోని ఎన్టీఆర్ నగర్ కాలనీ, సంతోషిమాత కాలనీ, బృందవన కాలనీ, అండర్ రైల్వే గేట్ ప్రాంతంలోని శివనగర్, మైసయ్య నగర్, ఎన్ఎన్ నగర్, బీఆర్ నగర్ కాలనీల్లో ఇళ్లు జలదిగ్భంధంలోనే ఉన్నాయి. సూమారు 300 కుటుంబాలు ఇంకా పునరావాస కేంద్రాల్లోనే ఉన్నాయి. వరద తాకిడికి నగరంలోని పలుచోట్ల రోడ్లు ధ్వంసమయ్యాయి. హనుమకొండలోని 100 ఫీట్ల రోడ్డు గోపాల్పూర్ చెరువు నుంచి సమ్మయ్య నగర్ క్రాస్ వరకు పూర్తిగా పాడైంది. శాంతించిన మున్నేరు: మోంథా తుపాను కారణంగా ఖమ్మంలో ఉప్పొంగి ప్రవ హించిన మున్నేరు వాగు శుక్రవారం శాంతించింది. గురు వారం రాత్రి ఖమ్మం కాల్వొడ్డు సమీపాన 26 అడుగుల మేర ప్రవహించగా, శుక్రవారం 15 అడుగులకు తగ్గింది. దీంతో పునరావాస కేంద్రాల్లో ఉన్న బాధితులు ఇళ్లకు చేరుకున్నారు. మున్నేరు పరీవాహకంలో ఖమ్మం నగరంలోని కాలనీలతోపాటు ఖమ్మంరూరల్ మండలం జలగం నగర్ లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరింది.బ్యాక్ వాటర్‌తో పలు కాలనీలు నిండిపోయాయి. మరోపక్క ఆకేరు నదికి భారీగా వరద చేరింది. గురువారం తిరుమలాయపాలెం మండలం రాకాసితండా వద్ద సీతారామ అక్విడక్ట్‌ను ఆనుకుని నది ప్రవహించింది. వరద తగ్గినా కాలనీల్లోని రోడ్లు, ఇళ్లలో బురద చేరటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తుపాను కారణంగా ఖమ్మం జిల్లాలో వరి, పత్తితో పాటు ఇతర పంటలు దాదాపు 62,400 ఎకరాల్లో దెబ్బతిన్నాయని అధికారులు ప్రాథమి కంగా అంచనా వేశారు. అనధికారికంగా మరో 15 వేల ఎకరాలపై ప్రభావం చూపినట్లు సమాచారం.శ్రీశైలం హైవేపై బ్రిడ్జికి మరమ్మతునల్లగొండ జిల్లా డిండి ప్రాజెక్టు సమీపంలో హైదరాబాద్ – శ్రీశైలం రహదారిపై కోతకు గురైన బ్రిడ్జి పునురుద్ధరణ పనులు శుక్రవారం కొనసాగాయి. వరద ప్రవాహం తగ్గటంతో అధికారులు రోడ్డు మరమ్మతు పనులను వేగవంతం చేశారు. ఈ మార్గం గుండా నాలుగు రోజుల నుంచి రాకపోకలు నిలిచిపోవడంతో హైదరాబాద్, దేవరకొండ, కల్వకుర్తి, శ్రీశైలం, మద్ది మడుగు, ఉమామహేశ్వరం, అచ్చంపేట, తెల్కపల్లి, నాగర్‌కర్నూల్ తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.గల్లంతైన దంపతుల మృతదేహాలు లభ్యం‘అమ్మ, చెల్లితో కలిసి పుట్టిన రోజు వేడుకలు జరుపుకొందామని భర్తతో కలిసి బైక్‌పై బయలుదేరి, సిద్దిపేట జి ల్లా అక్కన్నపేట మండలం మోత్కులపల్లి శివారులో వా గు దాటుతుండగా వరద ఉధృతికి కొట్టుకుపోయిన దంపతులు ప్రణయ్, కల్పన మృతదేహాలు శుక్రవారం ల భించాయి. దీంతో మృతదేహాల వద్ద బంధువులు, కు టుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. కల్పన పుట్టిన రోజే డేత్డేగా మారడం ఇరు కుటుంబాల్లో తీవ్ర విషా దాన్ని నింపింది. ఘటనపై ప్రణయ్ తండ్రి ఇసంపల్లి ప్ర భాకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యా ప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చాతరాజు ప్రశాంత్ తెలిపారు. -
రిఫ్రిజిరేటెడ్ కంటైనర్లలో విదేశాలకు ఔషధాలు
సాక్షి, హైదరాబాద్: దేశంలో తొలిసారి హైదరాబాద్ నుంచి రిఫ్రిజిరేటెడ్ (రీఫర్) కంటైనర్లలో బల్క్ డ్రగ్, ఇతర ఔషధాలు రైలు మార్గంలో ముంబై పోర్టుకు తరలింపు మొదలైంది. ఫార్మా హబ్‌గా ఎదిగిన హైదరాబాద్ నగరం నుంచి విదేశాలకు బల్క్‌డ్రగ్, సాధారణ మందులు ఎగుమతి అవుతుంటాయి. మందులను తయారు చేసే కంపెనీలు రోడ్డు మార్గాన వాటిని పోర్టుకు తరలిస్తూ వస్తున్నాయి. ఈ తంతు ఇబ్బందికరంగా మారటంతో ఇప్పుడు ప్రైవేటు సైడింగ్, జపాన్ సంస్థల భాగస్వామ్యంతో దక్షిణ మధ్య రైల్వే రిఫ్రిజిరేటెడ్ కంటైనర్లతో కూడి భారీ సరుకు రవాణా రైళ్లను నడపటం ప్రారంభించింది.ముంబైలోని పోర్టుకు తక్కువ సమయంలో వాటిని తరలిస్తుండగా, అక్కడి నుంచి ఓడల్లో విదేశాలకు అవి ఎగుమతి అవుతున్నాయి. తాజాగా అమెరికాకు 90 రిఫ్రిజిరేటెడ్ కంటైనర్లలో బల్క్ డ్రగ్, ఇతర మందులను నగర శివారులోని తిమ్మాపూర్ ప్రైవేట్ కంటైనర్ సైడింగ్ ద్వారా ముంబై పోర్టుకు తరలించింది. ఇక నుంచి వారం పదిరోజులకో రేక్‌ను అలా నడిపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఒకేసారి అన్ని కంపెనీల సరుకు.. విదేశాలకు ఎగుమతి అవుతున్న ఔషధాలు, బల్క్ డ్రగ్‌లో దాదాపు 80 శాతం హైదరాబాద్‌లోనే తయారవుతున్నాయి. ఇక్కడి కంపెనీలు వేటికవిగా తమ ఉత్పత్తులను ముంబై పోర్టుకు తరలిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలంలోని తిమ్మాపూర్‌లో ఉన్న డొమెస్టిక్ ప్రైవేట్ మల్టీ టెరి్మనల్ (డీపీఎంటీ) సంస్థ ఫార్మా కంపెనీలతోపాటు దక్షిణ మధ్య రైల్వేతో ఒప్పందం చేసుకుంది. ఇక నుంచి రోడ్డు మార్గాన వేటికవిగా కాకుండా ఒకేసారి రైలు ద్వారా తరలించేలా ఒప్పందం జరిగింది. ఇందుకోసం మందులు, బల్క్ డ్రగ్‌కు నిర్ధారిత టెంపరేచర్ ఉండేలా రిఫ్రిజిరేటెడ్ (రీఫర్) కంటెయినర్లను వినియోగిస్తున్నారు. ప్రసుత్తం ఈ తరహా కంటైనర్లు అందుబాటులో లేవు. దీంతో జపాన్‌కు చెందిన ఓషియన్ ఎక్స్‌ప్రెస్ నెట్వర్క్ (ఓఎన్ఈ)తో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ సంస్థ కావాల్సినన్ని రీఫర్ కంటైనర్లను అందుబాటులో ఉంచింది. 44 గంటల్లోనే ముంబై పోర్టుకు... సాధారణంగా సరుకు రవాణా రైళ్లు చాలా నెమ్మదిగా కదులుతుంటాయి. హైదరాబాద్ నుంచి ముంబై పోర్టుకు సరుకు రవాణా రైలు ఎలాంటి ఆటంకం లేకుండా సాగితే దాదాపు 65 గంటల నుంచి 70 గంటల సమయం తీసుకుంటుంది. అలా ఆలస్యంగా సాగితే రిఫ్రిజిరేటెడ్ కంటైనర్లకు విద్యుత్తు సరఫరాలో ఇబ్బంది ఏర్పడుతుంది. రైలు చివరలో ఉండే జనరేటర్ కార్ కేవలం 72 గంటలే పనిచేస్తుంది. దీంతో ముంబై పోర్టుకు 72 గంటల్లోగా మందులు చేర్చాల్సి ఉంది.కానీ, తాజాగా దక్షిణ మధ్య రైల్వే కేవలం 44 గంటల్లోనే రైలును గమ్యస్థానం చేర్చి బల్క్ డ్రగ్, మందులను అన్లోడ్ చేయగలిగింది. ఇందుకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంది. ఇతర రైళ్ల కోసం ఈ రైలును ఆపకుండా సిగ్నల్ ఫ్రీకి చర్యలు తీసుకుంది. దాని వేగాన్ని కూడా పెంచి నడిపింది. ఇందుకు శక్తివంతమైన లోకోమోటివ్లను వినియోగించారు. ఇక నుంచి ప్రతి బుధవారం ఒక రిఫ్రిజిరేటెడ్ కంటైనర్లతో కూడిన రేక్‌ను నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. -
కాంగ్రెస్ పార్టీకి ఓటడిగే హక్కు లేదు
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలను ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి విమర్శించారు. ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా శుక్రవారం హైదరాబాద్ ఎర్రగడ్డ డివిజన్లోని పలు కాలనీల్లో ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పాదయాత్రగా అందరినీ పలకరిస్తూ ముందుకు కదిలారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు కావొస్తున్నా అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఇచి్చన హామీలను అమలు చేయట్లేదని మండిపడ్డారు. జూబ్లీహిల్స్‌లో కనీస మౌలిక సదుపాయాలు లేక దయనీయ పరిస్థితులు కనిపిస్తున్నాయన్నారు. ఎక్కడ చూసినా గుంతల రహదారులు, పొంగుతున్న మురుగు కాల్వలు, వెలగని వీధి దీపాలే దర్శనమిస్తున్నాయని చెప్పారు.నియోజకవర్గానికి చుట్టూ ఉన్న కూకట్పల్లి, ఖైరతాబాద్, శేరిలింగంపల్లి ప్రాంతాలు గతంతో పోలిస్తే బాగా అభివృద్ధి చెందినప్పటికీ జూబ్లీహిల్స్ మాత్రం అలాగే ఉండిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులకు అవకాశం కల్పించిన నియోజకవర్గ ప్రజలు.. ఈసారి బీజేపీ అభ్యర్థి ని గెలిపించాలని కోరారు. ఇతర పార్టీల్లా రాజకీయాలు చేయాలనుకోవట్లేదని.. తమ నిజాయతీనే తమను గెలిపిస్తుందని నమ్ముతున్నట్లు చెప్పారు. కాంగ్రెస్, మజ్లిస్ పార్టీల గూండాయిజం, రౌడీయిజాన్ని అంగీకరించబోమని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్ ప్రభావం లేదని.. కాంగ్రెస్‌ను నమ్మే పరిస్థితి ప్రజల్లో కనిపించట్లేదని అన్నారు. మజ్లిస్ ఓట్లపై నమ్మకంతోనే కాంగ్రెస్ జూబ్లీహిల్స్‌లో పోటీ చేస్తోందని ఆయన ఆరోపించారు. అందుకే మజ్లిస్ నుంచి అభ్యర్థి ని తెచ్చుకున్నారని దుయ్యబట్టారు. బీజేపీ అభ్యర్థి దీపక్‌రెడ్డి స్థానికంగా అందుబాటులో ఉంటాడని.. ఆయనకు ఒక్క ఫోన్ కాల్ చేయగానే ప్రజాసమస్యల పరిష్కారానికి ముందుండి నడుస్తాడని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం అనంతరం ఎన్నికల్లో వ్యవహరించాల్సిన వ్యూహాలపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. -
మరమ్మతులు లేక రోడ్లు నీళ్లపాలు
సాక్షి, హైదరాబాద్: అసలే నిధులు లేక రోడ్ల నిర్వహణ అధ్వానంగా మారిన తరుణంలో... భారీ వర్షాలు రోడ్లను తీవ్రంగా దెబ్బతీశాయి. కొన్నేళ్లుగా మరమ్మతులు లేక రోడ్ల తారుపూత బలహీనంగా మారటంతో, భారీ వర్షాలకు కొట్టుకుపోతున్నాయి.ఈ వానాకాలంలో ఇప్పటి వరకు కురిసిన భారీ వర్షాలతో రోడ్లకు రూ.1,543 కోట్ల మేర నష్టం వాటిల్లింది. ఇప్పటి వరకు 1,641 కి.మీ. మేర రోడ్డు ఉపరితల భాగం దెబ్బతిన్నట్టు అధికారులు గుర్తించారు. మొత్తం 1,500 ప్రాంతాల్లో రోడ్లకు నష్టం వాటిల్లింది. గత నెలలో కురిసిన అతి భారీ వర్షాలతో మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్, జగిత్యాల, వికారాబాద్, సిద్దిపేట, సంగారెడ్డి, కరీంనగర్ తదితర ప్రాంతాల్లో రోడ్లకు తీవ్ర నష్టం వాటిల్లగా, తాజా తుపాను ప్రభావంతో వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల్లో రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి.ఈ తుపానుతో 400 ప్రాంతాల్లో రోడ్లకు నష్టం వాటిల్లినట్టు శుక్రవారం రోడ్లు భవనాల శాఖ ప్రభుత్వానికి నివేదించింది. 241 కి.మీ. మేర రోడ్ల ఉపరితల తారు పూత కొట్టుకుపోయినట్టు పేర్కొంది. 15 ప్రాంతాల్లో రోడ్లు కోతకు గురయ్యాయి. 74 కల్వర్టులు, వంతెనలకు నష్టం వాటిల్లింది. ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా తాత్కాలికంగా రోడ్లకు మరమ్మతు చేసేందుకు రూ.9.95 కోట్లు అవసరమవుతాయని, శాశ్వత ప్రాతిపదికన మరమ్మతు చేసేందుకు రూ.265.43 కోట్లు అవసరమవుతాయని ఆ నివేదికలో పేర్కొంది. ఐదేళ్లకోసారి మరమ్మతులు చేయాల్సి ఉన్నా... సాధారణంగా రోడ్లకు ప్రతి ఐదేళ్లకోమారు మరమ్మతులు చేయాలి. ఇది భారీ వ్యయంతో కూడుకున్న పని కావటంతో ఎనిమిదేళ్లకోసారైనా చేయాలన్న అభిప్రాయాన్ని ఇండియన్ రోడ్ కాంగ్రెస్ వ్యక్తం చేస్తోంది. కానీ తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో ఒక్కసారి కూడా రాష్ట్రంలో రోడ్ల మరమ్మతులు జరగలేదు. మూడేళ్ల క్రితం నాటి ప్రభుత్వం ఆ మేరకు చర్యలు తీసుకునేందుకు సిద్ధమైనా, ఎన్నికలు ముంచుకురావటంతో అది పూర్తిస్థాయిలో అమలులోకి రాలేదు. కొన్ని రోడ్లకే పనులు పరిమితమయ్యాయి.అప్పటికే కాంట్రాక్టర్లకు పాత బకాయిలు రూ.1,000 కోట్లకు పైగా ఉండటం, కొత్తగా నిధులు విడుదల చేయటం కష్టంగా మారటంతో మరమ్మతులు ముందుకు సాగలేదు. ఈ నేపథ్యంలో గతేడాది, ఈసారి రికార్డు స్థాయి వర్షపాతం నమోదవటంతో రోడ్లకు తీవ్ర నష్టం వాటిల్లింది. మరమ్మతులు జరిగితే, వరద పోటును రోడ్లు కొంతమేర అయినా తట్టుకుంటాయి. అవి లేక తారుపూత బలహీనంగా మారి, అది కొట్టుకుపోయి రోడ్లకు కోత తప్పడం లేదు. ఇప్పటికిప్పుడు రూ.8 వేల కోట్లకుపైగా వ్యయం చేస్తే తప్ప రోడ్ల మరమ్మతులు పూర్తయ్యే అవకాశం లేదు. ఇంత పెద్ద మొత్తం కేటాయించటం ఖజానాకు కష్టంగా మారింది. కేంద్ర సాయం కోసం ఎదురుచూపు భారీ వర్షాలతో రోడ్లు దెబ్బతిన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకుంటుంది. అయితే గతేడాది తెలంగాణలో రోడ్లకు జరిగిన నష్టాన్ని అంచనా వేసిన కేంద్రం సాయాన్ని మాత్రం విడుదల చేయలేదు. అప్పట్లో భారీ వర్షాలకు జరిగిన నష్టం రూ.2,300 కోట్లుగా అంచనా వేశారు. కేంద్ర బృందాలు రాష్ట్రంలో పర్యటించి నష్టాన్ని పరిశీలించి వెళ్లినా, నిధులు రాలేదు. 20 రోజుల క్రితం ఈ దఫా నష్టాన్ని అంచనా వేసేందుకు ఢిల్లీ నుంచి వచ్చిన నాలుగు బృందాలు మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్, జగిత్యాల, వికారాబాద్, సిద్దిపేట, సంగారెడ్డి తదితర ప్రాంతాలకు వెళ్లి రోడ్లకు జరిగిన నష్టాన్ని పరిశీలించాయి. రాష్ట్రవ్యాప్తంగా 1,400 కి.మీ. మేర 1,100 ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతిన్నట్టు రాష్ట్ర అధికారులు వారికి వివరించారు.వీటి తాత్కాలిక మరమ్మతులకు రూ.75 కోట్లు ఖర్చు చేశామని, శాశ్వత ప్రాతిపదికన మరమ్మతు చేయటానికి రూ.1,278 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేసినట్టు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం నిబంధనలను అనుసరించి రూపొందించిన ఈ అంచనా కంటే రాష్ట్ర ప్రభుత్వ అంచనా మరింత ఎక్కువగా ఉండనుందని అధికారులు పేర్కొంటున్నారు. దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతు చేసి పూర్తిస్థాయిలో పునరుద్ధరించేందుకు రూ.2,400 కోట్ల వరకు ఖర్చవుతుందని పేర్కొంటున్నారు. కేంద్రం ఇచ్చే నిధులు పోను, మిగతా మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది.కానీ, ఇప్పటి వరకు కేంద్రం నుంచి ఎలాంటి ఊరట సమాచారం అందలేదు. ఇంతలోనే తుపాను ప్రభావంతో మళ్లీ రోడ్లకు నష్టం వాటిల్లింది. ఈ నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందాలు మళ్లీ వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈలోపు పూర్తి నష్టం వివరాలతో కేంద్రానికి నివేదిక అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ⇒ జాతీయ రహదారులకు రూ.35 కోట్ల వరకు నష్టం వాటిల్లినట్టు ఆ విభాగ అధికారులు అంచనా వేశారు. తాత్కాలిక మరమ్మతులకు రూ.8 కోట్లు ఖర్చు అవుతాయని పేర్కొంటున్నారు. ఈ రోడ్ల మరమ్మతుకు ఎలాగూ కేంద్ర నిధులే వాడనున్నందున రాష్ట్ర ప్రభుత్వంపై భారం ఉండబోదు. తాజా తుపాను ప్రభావంతో రోడ్లకు తీవ్ర నష్టం వాటిల్లిన జిల్లాలు ⇒ కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, వరంగల్, హనుమకొండ, ములుగు, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, జనగామ, సిద్దిపేట, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూలు మొత్తం రోడ్లు కొట్టుకుపోయిన ప్రాంతాలు: 400 రోడ్ల ఉపరితల తారు ధ్వంసమైన నిడివి: 241 కి.మీ. రోడ్లు భారీ కోతకు గురైన ప్రాంతాలు: 15 రోడ్ల మీదుగా వరద పోటెత్తిన ప్రాంతాలు: 258 నష్టం వాటిల్లిన కల్వర్టులు, వంతెనలు: 74 -
మంత్రిగా అజహరుద్దీన్ ప్రమాణ స్వీకారం
సాక్షి, హైదరాబాద్: మాజీ క్రికెటర్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహ్మద్ అజహరుద్దీన్ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. శుక్రవారం రాజ్‌భవన్‌లోని దర్బార్ హాల్లో జరిగిన కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ ఆయనతో ప్రమాణం చేయించారు. ఇంగ్లిష్ లో అల్లా సాక్షిగా అజహరుద్దీన్ ప్రమాణం చేశారు. ఉదయం 12:26 నిమిషాలకు ప్రారంభమైన ప్రమాణ స్వీకార కార్యక్రమం ఐదు నిమిషాల్లో ముగిసింది.ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ముంబై నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చి అక్కడి నుంచి నేరుగా రాజ్‌భవన్‌కు వచ్చారు. అజారుద్దీన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతోపాటు సహచర మంత్రులు (కొండా సురేఖ, సీతక్క మినహా) హాజరయ్యారు. నూతన మంత్రిగా ప్రమాణం చేసిన అజహరుద్దీన్‌ను అభినందించారు. ప్రమాణ స్వీకార అనంతరం గవర్నర్‌తో కలిసి సీఎం, కేబినెట్ సహచరులు గ్రూప్ ఫొటో దిగారు. ఏ శాఖ ఇస్తారో..? అజహరుద్దీన్‌కు ఏ శాఖ ఇస్తారన్నది రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ హయాంలో మైనారిటీలకు ఉప ముఖ్యమంత్రి హోదాలో హోం మంత్రిత్వ శాఖను కేటాయించిన నేపథ్యంలో అజహరుద్దీన్‌కు కూడా మంచి అవకాశం లభిస్తుందనే చర్చ జరుగుతోంది. ఆయనకు కూడా హోంశాఖ కేటాయిస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే, మైనారిటీ సంక్షేమంతోపాటు క్రీడాశాఖ అజారుద్దీన్‌కు కేటాయిస్తారని తెలుస్తోంది. శుక్రవారం సాయంత్రానికే అజహరుద్దీన్‌కు శాఖ కేటాయిస్తారని భావించినా వరంగల్ పర్యటన, జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో సీఎం రేవంత్ ఉన్న నేపథ్యంలో సాధ్యం కాలేదు. శనివారం అజహరుద్దీన్¯ మంత్రిత్వ శాఖపై స్పష్టత వస్తుందని ప్రభుత్వ వర్గాల ద్వారా తెలిసింది. ఏ శాఖ ఇచ్చినా ఓకే: మంత్రి అజహరుద్దీన్ తనకు మంత్రిగా అవకాశం కల్పించినందుకు సంతోషంగా ఉందని, ఏ శాఖ ఇచ్చినా ఇబ్బంది లేదని రాష్ట్ర మంత్రి అజహరుద్దీన్ వ్యాఖ్యానించారు. మంత్రిగా ప్రమాణం చేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ కా>ంగ్రెస్ పార్టీ అధిష్టానం, ముఖ్యమంత్రి, రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. తనను మంత్రిగా చూసినందుకు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు సంతోషపడుతున్నారని చెప్పారు. బీజేపీ, బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలు సరైనవి కావన్నారు. తన గురించి గూగుల్‌ను అడిగితే తెలుస్తుందని, తన దేశభక్తి గురించి కిషన్‌రెడ్డి సర్టీఫికెట్ అవసరం లేదని చెప్పారు. జూబ్లీహిల్స్ ఎన్నికకు, తనకు మంత్రి పదవి ఇవ్వడానికి ఎలాంటి సంబంధం లేదని, తాను పార్టీ పట్ల నిబద్ధతతో ఉన్నందునే మంత్రి పదవి ఇచ్చారని చెప్పారు. -
ఇల్లు కూలగొట్టుడే ఇందిరమ్మ రాజ్యమా?
సాక్షి, హైదరాబాద్/గోల్కొండ: పేదల ఇళ్లు కూలగొట్టుడే ఇందిరమ్మ రాజ్యమా? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు ప్రశ్నించారు. హైదరాబాద్‌లో కేసీఆర్ లక్ష ఇళ్లు కడితే రేవంత్‌రెడ్డి సర్కారు హైడ్రా బుల్డోజర్తో వేల ఇళ్లు కూల్చిందని ఆరోపించారు. ఆ పేదల శాపాలే కాంగ్రెస్ పార్టీకి జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఉరితాళ్లై చుట్టుకుంటాయని దుయ్యబట్టారు. ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు మద్దతుగా శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లోని పలుచోట్ల ఆయన రోడ్ షోలు నిర్వహించారు. తొలుత షేక్‌పేటలో ప్రచార వాహనం నుంచి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. కేసీఆర్ ప్రభుత్వం జీవో 58, 59 కింద 1.5 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలిచ్చిందని గుర్తుచేశారు. ఒక్క జూబ్లీహిల్స్లోనే 3,500 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టిందన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఇంటి పట్టా ఇవ్వలేదు సరికదా పేదల ఇళ్లు కూలగొడుతోందని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌కు డిపాజిట్ పోతేనే ప్రజలకు బాకీలన్నీ వస్తాయి.. కాంగ్రెస్ ప్రభుత్వంపై విసిగిపోయిన 4 కోట్ల మంది ప్రజల గోస తీర్చే అవకాశం 4 లక్షల మంది జూబ్లీహిల్స్ ఓటర్లకు వచ్చిందని కేటీఆర్ చెప్పారు. ఈ ఉపఎన్నికలో కాంగ్రెస్ డిపాజిట్ కోల్పోయి చిత్తుచిత్తుగా ఓడితేనే ప్రజలకు రావాల్సిన బాకీలన్నీ వస్తాయన్నారు. మైనారిటీలను ఆకట్టుకోవడానికే కాంగ్రెస్ పార్టీ అజహరుద్దీన్‌కు మంత్రి పదవి ఇచ్చిందని కేటీఆర్ ఆరోపించారు. రెండేళ్లుగా మైనారిటీలకు ప్రాతినిధ్యం లేని కేబినెట్‌ను కొనసాగించిన రేవంత్‌రెడ్డి.. ఆర్ఎస్ఎస్ విధానాలను అమలు చేస్తున్నారని దుయ్యబట్టారు.బీఆర్ఎస్ కులమతాల పునాదులపై పనిచేయదని.. కానీ కాంగ్రెస్ ఆ పని చేస్తోందని మండిపడ్డారు. ఆడబిడ్డలు, వృద్ధులు, ఆటోడ్రైవర్లు సహా అన్ని వర్గాల ప్రజలకు కాంగ్రెస్ 420 హామీలిచ్చినా ఏ ఒక్కటీ అమలు చేయలేదని విమర్శించారు. దోచుకున్న సొమ్ముతో ప్రజలకు రూ. 5 వేల చొప్పున ఇచ్చి ఓట్లు కొనేందుకు వస్తోందని కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ నేతలిచ్చే డబ్బు తీసుకొని ఆడపడుచులైతే మిగతా రూ. 55 వేలు ఏవని అడగాలని.. మిగతా వారు వారికిచ్చిన హామీలకు అనుగుణంగా మిగతా అప్పు ఎప్పుడు తీరుస్తారని ప్రశ్నించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. నాడు అగ్రస్థానం.. నేడు అట్టడుగుకు.. బీఆర్ఎస్ హయాంలో సంపద సృష్టిలో నంబర్ వన్‌గా ఉన్న తెలంగాణ ప్రస్తుతం రేవంత్ సర్కారు పాలనలో అట్టడుగున 28వ ర్యాంక్‌కు పడిపోయిందని కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రియల్ ఎస్టేట్‌ను నాశనం చేసిందని.. ఆటోవాళ్ల ఉపాధి దెబ్బతీయడం వల్ల 162 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని ఆరోపించారు. ఉన్న పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు తరలిపోతుంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తోందని నిలదీశారు. నగర ప్రజల్ని, గ్రామీణ రైతాంగాన్ని మోసం చేసిన కాంగ్రెస్ రెండేళ్ల పాలనను, పదేళ్ల కేసీఆర్ పాలనను చూసిన ప్రజలంతా ఆలోచించి ఓటు వేయాలని కేటీఆర్ కోరారు. -
ఎకరానికి రూ. 10 వేలు
సాక్షి ప్రతినిధి, వరంగల్: రాష్ట్రంలో మోంథా తుపాను వల్ల నష్టపోయిన రైతులు, ప్రజలను ఆదుకుంటామని, ఎవరూ అధైర్యపడవద్దని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో 12 జిల్లాల్లో తుపాను ప్రభావం ఉందని చెప్పారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10 వేల పరిహారం ఇస్తామని ప్రకటించారు. వరదల్లో ఇల్లు మునిగిన వారికి రూ.15 వేలు, పూర్తిగా కూలిపోతే ఇందిరమ్మ పథకం కింద ఇల్లు మంజూరు చేస్తామని తెలిపారు. హనుమకొండ, వరంగల్ జిల్లాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం శుక్రవారం ఏరియల్ సర్వే నిర్వహించారు.మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొండా సురేఖ, వరంగల్ పశి్చమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, కలెక్టర్లు, అధికారులతో కలిసి నగరంలోని వరద ప్రభావిత కాలనీలు సమ్మయ్యనగర్, పోతననగర్, రంగంపేటలో పర్యటించారు. అనంతరం హనుమకొండ కలెక్టరేట్లో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, సీఎస్ రామకృష్ణారావుతో కలిసి వరదలపై సమీక్ష నిర్వహించారు. తుపాను ప్రభావిత 12 జిల్లాల కలెక్టర్లు, అధికారులకు దిశానిర్దేశం చేశారు. తక్షణమే నివేదికలు ఇవ్వండి.. తుపాను ప్రభావంపై వెంటనే పూర్తిస్థాయి నివేదికలు అందించాలని జిల్లా కలెక్టర్లను సీఎం ఆదేశించారు. ‘రాష్ట్రంలో 12 జిల్లాల్లో మోంథా తుపాను ప్రభావం ఉంది. ఏడు జిల్లాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. ఆయా జిల్లాల ఇన్చార్జి మంత్రులు అక్కడి కలెక్టర్లతో సత్వరం సమీక్షలు నిర్వహించి నివేదికలు సిద్ధం చేయాలి. వరదలు తగ్గుముఖం పట్టినందున వెంటనే పారిశుద్ధ్య పనులు చేపట్టాలి. చెత్తను తొలగించి, శానిటేషన్ చేయాలి. కలెక్టర్లు, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి నివేదికలు పంపాలి. వరదల వల్ల మరణించినవారి జాబితాలను పారదర్శకంగా ఇచ్చేలా పోలీసు శాఖ వెంటనే ఎఫ్ఐఆర్లు నమోదుచేసి నివేదికలు అందించాలి.మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల నష్టపరిహారం ఇస్తాం. వరదల వల్ల మేకలు, గొర్రెలు మృతి చెందితే రూ.5 వేలు, పెద్ద పశువులు మృత్యువాత పడితే రూ.50 వేలు ఇచ్చేలా పశుసంవర్ధక శాఖ నివేదికలు పంపాలి. పత్తి, వరి చేతికి వచ్చే ముందు నష్టం జరిగితే ఎకరానికి రూ.10 వేలు ఇస్తాం. నీట మునిగిన పంటతోపాటు ఇసుక మేటలు వేసిన ప్రాంతాల బాధిత రైతులకు ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా అవసరాన్ని బట్టి రూ.లక్ష వరకు సాయం చేసేందుకు పంచాయతీరాజ్ శాఖ అధికారులు అంచనాలు తయారు చేయాలి. ఇల్లు మునిగినవారికి రూ.15 వేలు ఇచ్చేందుకు అధికారులు చర్యలు చేపట్టాలి.వరదలకు ఇళ్లు కూలి నిరాశ్రయులైన వారికి ప్రత్యేక కోటా కింద ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేందుకు జాబితా సిద్ధం చేయాలి. అర్హులకు ప్రభుత్వ స్థలంలో ఇంటి పట్టాలు ఇచ్చే అంశంపై సంబంధిత అధికారులు దృష్టి పెట్టాలి. వరద ప్రాంతాలపై అన్ని జిల్లాల నుంచి నివేదికలు వచ్చాక మరోసారి సమీక్ష నిర్వహిస్తాం’అని సీఎం తెలిపారు. కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించాలి జిల్లా కలెక్టర్లు, అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి పరిస్థితిని అంచనా వేయాలని సీఎం ఆదేశించారు. వార్షిక నివేదికలో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుతోపాటు ఎన్ని క్షేత్రస్థాయి పర్యటనలు చేశారన్న వివరాలు కూడా చూస్తామని చెప్పారు. కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించేలా స్పెషల్ చీఫ్ సెక్రెటరీ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. క్షేత్రస్థాయి పరిస్థితులపై నిర్లక్ష్యం వల్లే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రావటంలేదని అన్నారు.ఈ విషయంలో పారదర్శకత లోపం కనిపిస్తే సహించేది లేదని హెచ్చరించారు. బాగా పనిచేసేవారికి ప్రభుత్వం నుంచి ప్రశంసలు కూడా ఉంటాయని తెలిపారు. వరదలపై వెంటనే పూర్తి నివేదికలు పంపిస్తే కేంద్ర ప్రభుత్వానికి పరిహారం కోసం పంపుతామని, ఇందు కోసం ప్రజాప్రతినిధుల సహకారం తీసుకోవాలని అధికారులకు సూచించారు. వరద నీటి నిర్వహణపై నీటిపారుదల శాఖ సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. శాఖల మధ్య సమన్వయం లేక సమస్యలు పెరుగుతున్నాయని అసహనం వ్యక్తంచేశారు. అన్ని శాఖలు ఇరిగేషన్ శాఖతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. నాలాల కబ్జాదారులపై ఉక్కుపాదం.. వరంగల్ నగరంలో నాలాల నిర్వహణ సరిగా లేకపోవటం వల్లే తరచూ వరదలు వస్తున్నాయని సీఎం అన్నారు. చెరువులోకి వెళ్లే నాలాలు కబ్జాకు గురైతే ఆ కబ్జాలను తప్పక తొలగించాలని ఆదేశించారు. ఎంతటివారైనా వదిలిపెట్టేది లేదని, పదిమంది కోసం పదివేల ఇళ్లు నీట మునుగుతున్నాయని అన్నారు. జీవితకాలం కష్టపడి సంపాందించుకున్న ఇంటి సామగ్రి, పిల్లల సరి్టఫికెట్లు వంటి కీలక వస్తువులు నీటి పాలవుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. నాలాల కబ్జాపై ఉక్కుపాదం మోపాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు అధికారుల కమిటీ వేయాలని ఆదేశించారు. కాలనీవాసుల గోడు విన్న సీఎంసమ్మయ్యనగర్, పోతననగర్, రంగంపేట కాలనీల్లో పర్యటించిన సీఎం.. బాధితులతో మాట్లాడారు. బాధితులు సీఎంకు తమ సమస్యలు ఏకరువు పెట్టగా.. ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం వరద నష్టంపై హనుమకొండ కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ఫొటోల ఎగ్జిబిషన్ పరిశీలించారు. ఈ కార్యక్రమాల్లో మంత్రులతో పాటు సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రామచంద్రనాయక్, వరంగల్ ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మేయర్ గుండు సుధారాణి, స్టేషన్‌ఘన్‌పూర్, పరకాల, నర్సంపేట, వర్ధన్నపేట ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, దొంతి మాధవరెడ్డి, కేఆర్ నాగరాజు, హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు స్నేహ శబరీష్, డాక్టర్ సత్య శారద, వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ తదితరులు పాల్గొన్నారు. -
గద్వాల గురుకులంలో ఫుడ్‌పాయిజన్
సాక్షి, గద్వాల: ధర్మవరం మండల పరిధిలోని గురుకుల పాఠశాలలో శుక్రవారం సాయంత్రం ఫుడ్ పాయిజన్ ఘటన చోటు చేసుకుంది. దీంతో పిల్లలను ఆంబులెన్స్‌లో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. కోలుకున్న విద్యార్థులను డిశ్చార్జి చేయగా.. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం అందుతోంది. శుక్రవారం సాయంత్రం భోజనంలో పిల్లలకు రైస్, ఎగ్, చారు, కాలీఫ్లవర్ కర్రీ వడ్డించారు. అది తిన్న విద్యార్థుల్లో 86 మంది వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు లోనయ్యారు. వెంటనే 108 ఆంబులెన్స్‌లో వాళ్లను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కోలుకున్న విద్యార్థులను తిరిగి గురుకులానికి తరలించామని.. మరికొందరు ఇంకా చికిత్స పొందుతున్నారని జోగులాంబ గద్వాల్ జిల్లా విద్యాశాఖ అధికారులు అంటున్నారు. ఫుడ్‌పాయిజన్ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నట్లు వెల్లడించారు. -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త
సాక్షి,హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి శాఖకు సంబంధించిన పెండింగ్ బిల్లులు సుమారు 1,031 కోట్లు విడుదలయ్యాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఆదేశం మేరకు ఆర్థిక శాఖ అధికారులు విడుదల చేశారు.దీంతో ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు రూ.712 కోట్లు కాగా.. పంచాయతీ రాజ్, ఆర్ అండ్‌బీ శాఖలో 46,956 బిల్లులకు సంబంధించిన నిధులను విడుదల చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఆర్థిక శాఖ అధికారులతో సమీక్షించిన అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలు జారీ చేశారు


