ప్రసవానంతరం బరువు తగ్గాలంటే..! ఈ వర్కౌట్లు తప్పనిసరి.. | How She Lost 4-5 Kg Of Postpartum Weight In 4 Months | Sakshi
Sakshi News home page

ప్రసవానంతరం బరువు తగ్గాలంటే..! ఈ వర్కౌట్లు తప్పనిసరి..

Mar 9 2026 11:18 AM | Updated on Mar 9 2026 11:24 AM

How She Lost 4-5 Kg Of Postpartum Weight In 4 Months

ప్రసవానంతరం బరువు తగ్గడం చాలా సవాలుగా ఉంటుంది. మాములుగా బరువు తగ్గడానికి గర్భధారణ అనంతరం తగ్గడానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. పైగా శరీరంలో వచ్చే మార్పులకు తోడు నవజాత శిశువుని హ్యాండిల్‌ చేస్తూ బరువు తగ్గడం తదితరాలన్ని చాలా సవాలుగా ఉంటాయి. ముందుగా శరీరం మునపటి పటుత్వం లేక..కొద్దిపాటి వ్యాయామాలను ఓర్చుకునే శక్తి స్వతహాగా కొత్త తల్లులకు ఉండదు. మరి అలాంటప్పుడు ఎలాంటి తేలిక పాటి వ్యాయామాలు చేయాలి..? కొత్త తల్లులు నిజంగానే తీవ్రమైన వ్యాయామాల జోలికి పోకపోవడమే మంచిదా..? తదితరాల గురించి కంటెంట్‌ క్రియేటర్‌, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ నిధి త్యాగి చెప్పే సలహాలు సూచనలే గురించి సవివరంగా చూద్దామా..!.

ప్రసవానంతరం బరువు తగ్గం అనేది సాధారణ విషయం కాదని అంటోంది నిధి త్యాగి. దీని గురించి ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌లో అమూల్యమైన సలహాలు సూచనలు షేర్‌ చేశారు. ఇక్కడ కొత్త తల్లులు కొలెస్ట్రాల్‌ తగ్గించుకోవడం కంటే..కేలరీలలోటు, కదలికలపై దృష్టిపెట్టాలని అంటోంది. చాలామంది డెలివరీ తర్వాత పాలిస్తారు కాబట్టి బరువు తగ్గిపోతారని అనుకుంటుంటారు. కానీ అది ముమ్మాటికీ అబద్ధమని అంటోంది. తాను ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు మామిడపండ్లు అధికంగా తినేదాన్ని అని ఆ టైంలో ఏకంగా 20 కిలోలకు పైగా అదనపు బరువు ఉన్నానని చెప్పుకొచ్చింది. 

ప్రసవం తర్వాత పదికిలోలు మాత్రమే తగ్గానని, మిగిలిని పదికిలోల బరువు అలాగే ఉందని తెలిపింది. ఏడాదికి పైగా బిడ్డకు పాలిచ్చానని, ఇంట్లో వండిన భోజనం మాత్రమే తీసుకున్నానని, అలాగే తేలికపాటి వాకింగ్‌ వంటివి చేసేదాన్ని అని వెల్లడించింది. కానీ అంతలా కేర్‌ తీసుకున్నా..బరువులో అంతగా మార్పులు కనిపించలేదని అంటోంది. పైగా డెలివరీ తర్వాత బరువు తగ్గడానికి తీవ్రమైన వ్యాయామాల జోలికి అస్సలు పోకూడదని అంటోంది. ఎందుకంటే కొత్త తల్లుల శరీరం సున్నితంగా మారిపోయి ఉంటుంది..దాంతో ఆ వర్కౌట్లు తట్టుకోవడం అంత సులభం కాదని చెబుతోంది. కనీసం 15 నిమిషాలు కూడా చేయలేమని అంటోంది. 

అలా అని బయటకు జిమ్‌ వెళ్లే పరిస్థితి కూడా లేకపోవడంతో హోమ్‌ ఇన్‌స్ట్రక్టర్‌ని నియమించుకున్నట్లు తెలిపింది. అతను సూచించిన కోర్‌ వ్యాయామాలు, కార్డియో, స్ట్రెంగ్త్‌ ట్రైనింగ్‌, వెయిట్‌ ట్రైనింగ్‌ వ్యాయామాలతో బలం పుంజుకోగలిగానని అంటోంది. వీటివల్ల కండరాలు బలోపేతం అవుతుతాయి. కొద్దిపాటి బరువులు ఎత్తి..బోడ్డులోపలికి కోర్‌ని స్ట్రాంగ్‌గా మార్చుకోగలిగానని అంటోంది. 

అలా తాను నాలుగు నెలల్లో నాలుగు నుంచి ఐదు కిలలోలు వరకు తగ్గగలిగానని అంటోంది. ప్రస్తుతం తాను ప్లాంక్‌లు కూడా వేయగలనని, వెన్నునొప్పి లేదని అంటోంది. కానీ ప్రసవానంతరం వేగవంతంగా బరువు తగ్గాలనుకోవడం తప్పులేదు గానీ..ఆ క్రమంలో తప్పుడు మార్గంలో వెళ్లొద్దని, ఆరోగ్యకరమైన మార్గాన్ని ఎంచుకోమని చెబుతోంది కంటెంట్‌ క్రియేటర్‌ నిధి త్యాగి. 

 

(చదవండి: చీరకట్టులో స్నోబోర్డింగ్‌ స్టంట్‌..!)
 

Advertisement
 
Advertisement
Advertisement