breaking news
Lifestyle
-
118 కేజీల నుంచి 84 కేజీలకు! జస్ట్ ఆరు నెల్లలోనే..
ఎన్నో వెయిట్‌లాస్ జర్నీలు చూశాం. కొందరు బరువుతగ్గే సర్జరీలు చేయించుకుని మరి ఆరోగ్యకరమైన జీవనశైలి అనుసరించారు. మరికొందరు కేవలం డైట్ , వర్కౌట్లతో స్లిమ్‌గా మారారు. కానీ ఇతడి కథే వేరు. భారీకాయంతో వివిధ అనారోగాల బారినపడి ఇబ్బందిపడుతున్నప్పటికీ సర్జరీల జోలికి పోలేదు. పైగా తను బరువు ఎలా తగ్గితే మంచిదో.. లైఫ్‌స్టైల్ ట్రైనర్లను సంప్రదించి మరి ఆరోగ్యదాయకమైన విధానంలోనే అంత బరువుని తగ్గించుకున్నాడు. అది కూడా ఆరు నెల్లలోనే స్లిమ్‌గా మారి చూపించడం విశేషం. మరి అతను అనుసరించి వెయిట్‌లాస్ టెక్నిక్ ఏంటంటే..38 ఏళ్ల వయసులో రాజేష్ అనే వ్యక్తి 118 కేజీల బరువుతో మధుమేహం, ఫ్యాటీలివర్, అధిక కొలెస్ట్రాల్, నీరసం, తీవ్రమైన స్లీప్ అప్నియా వంటి సమస్యలతో బాధపడ్డాడు. అప్పటికే డైట్, వర్కౌట్లతో నిలకడగా చేయడానికి స్ట్రగుల్స్ ఫేస్ చేశాడు. చివరికి క్రమం తప్పకుండా చేసే స్టేజ్‌కి చేరుకున్నాక..బరువు తగ్గడానికి కాస్తా విభిన్నమైన పద్ధతిని అనురించాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం లైఫ్‌స్టైల్ కోచ్ ల్యూక్ కౌటిన్హోని సంప్రదించాడు. అయితే అతడి వైద్యులు మందుగా ఆప్నియా కోసం, బరువు కోసం సర్జరీ చేయడం గురించి మాట్లాడారు. అవి రెండు అతని అంతగా సరిపడవని తేలింది. దాంతో రాజేష్ సరైన జీవనశైలి వ్యూహంతో బరువు తగ్గాలని డిసైడ్ అయ్యాడు. అలాగని కఠినమై ఆహార నియమం, తీవ్రమైన వర్కౌట్ల జోలికి పోలేదు. ఎలాంటి జీవనశైలిని అనుసరించాడంటే..జీవక్రియ ఆరోగ్యం, ఇన్సులిన్ నియంత్రణకు సంబంధించినవిపోషకాలతో కూడిన ఆహారం, అదికూడా పరిమిత మేర,సంతృప్తిని కలిగించేలాతన సామర్థ్యానికి అనుగుణంగా సాగే కదలికకాలేయ ఆరోగ్యంకి అనుగుణమైన పోషకాహారాలుచిన్నగా బరువు తగ్గిన సెలబ్రేట్ చేసుకోవడం..నిలకడగా అనుసరించడంఇలా ఒక నెల పాటు పాటించిన తర్వాత నిద్ర మెరుగుపడింది. ఆ తర్వాత శక్తి, ఏకాగ్రత, మానసిక స్థితి, మంచి ఆహారం తీసుకోవడం, శారీరక శ్రమ అన్నీ మెరుగుపడ్డాయి. అలాగే ఏదో డైట్ పాటిస్తున్న భావన లేకుండా దాన్ని ఎంజాయ్ చేస్తూ తీసుకోవడం నేర్చుకున్నాడు. అలాగే వర్కౌట్లను కూడా పెంచుకుంటూ ఆరోగ్యంగానూ ఆత్మవిశ్వాసంగానూ ఉండటం ప్రారంభించాడు. అంతేగాదు చాలామంది బరువు తగ్గడం కోసం ఉపక్రమించి మళ్లీ బ్రేక్ చేస్తుంటారు. అందుకే తాను అలా చేయకుండా ఉండాలనే కీలకమైన వాటిపై దృష్టిసారించి భారంగా కాకుండా ఇష్టంగా చేసేలా అలవాటు చేసుకుని బరువు తగ్గినట్లు వివరించారు రాజేష్. View this post on Instagram A post shared by Luke Coutinho - Official (@luke_coutinho)గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యలు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.ఇదీ చదవండి: 116 కేజీల నుంచి 60 కేజీలకు..! జస్ట్ రెండేళ్ల వ్యవధిలోనే..) -
నయా ట్రెండ్.. నయా లైఫ్! హాయిగా.. హ్యాపీగా..
‘కలకాలం కాకిలా బతకడం కంటే హంసలా ఆరునెలలు బతకడం మేలు’ అని మనకో నానుడి ఉంది. ‘దీర్ఘాయుష్మాన్ భవ’ అని పిన్నలను పెద్దలు దీవించే సంప్రదాయం కూడా మనకు ఉంది. పాతకాలం సామెతలతోనో, ఆచారాలతోనో నేటితరం సరిపెట్టుకోవడం లేదు. దీర్ఘాయుర్దాయాన్ని మాత్రమే కాదు, ఆయువు ఉన్నంత వరకు ఒంట్లో పట్టుసడలని ఆరోగ్యాన్ని కూడా కోరుకుంటున్నారు.పైపై పొగడ్తలను కాదు, ప్రేమతో పలకరించే మనుషులను కోరుకుంటున్నారు. సంపదను పోగేసుకోవడం కంటే జీవితంలో సంతృప్తిని కోరుకుంటున్నారు. ఖరీదైన వస్తువుల కోసం కంటే విలువైన అనుభవాల కోసం ఖర్చు చేయడానికి మొగ్గు చూపుతున్నారు. సమాజం ఒరవడిలో కొట్టుకుపోకుండా, తమదైన సమయాన్ని తమ కోసం కోరుకుంటున్నారు. జీవితాన్ని మరింత అర్థవంతంగా మలచుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. అందుకు అనుగుణంగా జీవనశైలిలో కొత్త ఒరవడిని అనుసరిస్తున్నారు.ఆరోగ్యాన్ని కాపాడుకోవడం నుంచి ఆనందాన్ని వెదుక్కోవడం వరకు; సామాజిక జీవితాన్ని ఆస్వాదించడం నుంచి తన కోసం తనదైన సమయాన్ని కేటాయించుకోవడం వరకు; కొత్త అనుభవాల కోసం అడుగులు వేయడం నుంచి జీవితాన్ని మరింత సరళంగా మార్చుకోవడం వరకు ఈతరం మనిషి కోరుకుంటున్నది ఒక్కటే– ‘జీవితాన్ని ఎలాగోలా గడపడం కాదు, మనస్ఫూర్తిగా జీవించాలి’. ‘తెల్లారిందా, నిద్రలేచామా, తిన్నామా, మళ్లీ నిద్రపోయామా’ అనేదే దినచర్య కాదు. ఆ పని జంతువులు కూడా చేస్తాయి. ఆలోచనల కోసం, ఆనందం కోసం ఆరోగ్యంగా బతకడమే జీవించడం.నేటి తరం మనిషి మళ్లీ తనను తాను వెతుక్కోవడం మొదలుపెట్టాడు. ఎక్కడ పోగొట్టుకుంటామో అక్కడే రాబట్టుకోవాలి అన్నట్లు మళ్లీ మొదటికే పయనమవుతున్నాడు. ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి నిద్రపోయే వరకు పరుగెడుతూనే ఉన్నాడు. శరీరం అలసిపోతూనే ఉంది. అయినా మరుసటి రోజు మళ్లీ అదే పరుగు. కానీ ఒక్కసారి ఆగి చూస్తే, అసలు ఎటు పరుగెడుతున్నాడో మాత్రం తెలియడం లేదు.ఉత్సాహమే ఊపిరి!ఇంతకాలం ‘ఎక్కువ కాలం బతకాలి’ అనేది ప్రధాన లక్ష్యం. ‘బతికినంత కాలం ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలి’ అనేది ఇప్పటి లక్ష్యం. వయసును ఆపడం ఎవరి చేతిలోనూ లేదు. కానీ వయసుతో పాటు ఆరోగ్యాన్ని, చురుకుదనాన్ని కాపాడుకోవడం మన చేతుల్లోనే కొంతవరకు ఉంటుంది. మంచి ఆహారం, క్రమంతప్పని వ్యాయామం, తగినంత నిద్ర, నడక, ప్రకృతితో అనుబంధం, మానసిక ప్రశాంతత– ఇవి ఇప్పుడు అందమైన రూపం కోసం మాత్రమే కాదు, ఆనందభరితమైన, చురుకైన జీవితాన్ని కొనసాగించడానికి అవసరమైన అలవాట్లు.లక్ష్యం కేవలం ఎక్కువ రోజులు జీవించడం కాదు. బతికినంత కాలం మన పనులను మనమే చేసుకునేంత ఆరోగ్యంగా ఉండటం. అరవైలోనూ ఇరవైలా ఇష్టమైన ప్రయాణాలు చేయగలగాలి. డెబ్బై వచ్చినా మనకు నచ్చిన పనులు మనమే చేసుకోగలగాలి. అందుకు శరీరం సహకరించగలిగేలా చూసుకోవాలి. మనసు ఉత్సాహంగా ఉండాలి. అందుకే ఆరోగ్యం ఇప్పుడు అనారోగ్యం వచ్చిన తర్వాత చూసుకునే విషయం కాకుండా ప్రతిరోజూ నిర్మించుకునే జీవన విధానంగా మారాలి.అనుబంధాలకు అగ్రతాంబూలంమన చుట్టూ చాలామంది ఉంటారు. మనసు విప్పి మాట్లాడగలిగే వారు ఎంతమంది? మనపై ప్రేమ కురిపించేవారెందరు? అందుకే పెద్ద పెద్ద వేడుకలు, హడావుడి కార్యక్రమాల కంటే సమయం దొరికినప్పుడల్లా కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేయడం, ఫ్రెండ్స్‌తో కాసేపు మాట్లాడటం, సాయంత్రం సరదాగా కలిసి నడవడం వంటి చిన్న చిన్న క్షణాలకు విలువ పెరుగుతోంది. సంతోషకరమైన జీవితం కావాలంటే ఎప్పుడూ ఖర్చుతో కూడిన వినోదాలే అవసరం లేదు. మనసును తాకే చిన్న ఆత్మీయత చాలాసార్లు పెద్ద ఆనందాన్ని ఇస్తుంది. సోషల్ మీడియాలో వందల మందితో కనెక్ట్ అయినా, మనస్ఫూర్తిగా మాట్లాడేందుకు సమయం లేకుండా పోతున్న తరుణంలో తక్కువ మంది సన్నిహితులు, గాఢమైన అనుబంధం అనే ఆలోచనకు ఈ ట్రెండ్ కొత్త ఉత్తేజాన్నిస్తోంది.ప్రయాణం పదిలం!ప్రయాణం అంటే ఇప్పుడు కేవలం కొత్త ప్రదేశాలను చూసి తిరిగి రావడం కాదు. కొత్త మనుషులను కలవడం, కొత్త సంస్కృతిని తెలుసుకోవడం, ప్రకృతిని ఆస్వాదించడం, మన ఆలోచనలను మార్చే అనుభవాలను పొందడం కూడా ప్రయాణంలో భాగమవుతోంది. ఒక మంచి ప్రయాణం ముగిసిన తర్వాత మన దగ్గర కొన్ని చిత్రాలు మాత్రమే కాదు, కొన్ని జ్ఞాపకాలు, కొన్ని కథలు, కొన్ని కొత్త ఆలోచనలు మిగలాలి.కొన్నిసార్లు ఖరీదైన టూర్ కంటే ఓ ప్రశాంతమైన ఉదయం, సముద్రపు అలల చప్పుడు, కొండల మధ్య నడక మనసుకు ఎక్కువ ఆనందాన్ని ఇస్తాయి. కొన్నిసార్లు ఫోన్ పక్కన పెడితేనే ప్రయాణం మొదలవుతుందనేది వందశాతం నిజం. ఎందుకంటే ప్రతి క్షణాన్ని కెమెరాలో బంధించాలనే ఆలోచనను పక్కనపెట్టి, ఒక్కసారి కళ్లతో చూసి మనసులో దాచుకుంటే ఆ అనుభవం మరింత ప్రత్యేకంగా అనిపిస్తుంది. ‘ప్రయాణం ముగిసేది మనం ఇంటికి చేరుకున్నప్పుడు కాదు, ఆ ప్రయాణం మనలో ఒక జ్ఞాపకంగా మిగిలినప్పుడు.’ట్రెండ్ సెట్ చేద్దామనుకుంటూ...వందేళ్లు బతకాలనే లక్ష్యంతో రోజూ పొద్దున్నే చేదు జ్యూస్‌లు తాగుతూ, ఆపిల్ సైడర్ వెనిగర్‌తో రోజు ప్రారంభించేవారు ఉంటారు. విడ్డూరమేంటంటే, అలా తాగేటప్పుడు వాళ్ల మొహం చూస్తే వందేళ్లు కాదు కదా, ఈ ఐదు నిమిషాలు బతికితే చాలు అనేలా ఎక్స్ప్రెషన్ పెడతారు. ప్రశాంతత కోసం హిమాలయాలకు వెళ్లిన వాళ్లు కూడా, అక్కడ ‘మ్యాగీ తింటూ రీల్స్ చేయడం’ మర్చిపోరు.హెల్దీ లైఫ్ కోసం కొన్న ఫిట్నెస్ బ్యాండులు రోజూ పదివేల అడుగులు వేయమని అలారమ్‌లు మోగిస్తుంటే, వాటిని ఇంట్లో ఆడుకునే పిల్లల చేతికి కట్టేసి కామ్‌గా టీవీ చూసే మహానుభావులు మన మధ్యే కనిపిస్తారు.ఒకప్పుడు ఫ్రెండ్స్ కలవడమంటే కలిసి టీ కొట్టు దగ్గర గంటలు గడపడం. కానీ నేటి రిలాక్స్డ్ సోషియబిలిటీ రూమ్‌లో అందరూ పక్కపక్కనే కూర్చుని, ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా రీల్స్ షేర్ చేసుకోవడం.‘మన మందరం కలిసి ఈ వీకెండ్ ట్రిప్ వెళ్లాలి’ అని వాట్సాప్ గ్రూప్‌లో ప్లాన్ వేయడమే అసలైన ఎంజాయ్మెంట్. ఆ ట్రిప్ ఎప్పటికీ క్యాన్సిల్ అవుతుందని గ్రూప్‌లో ఉన్న ప్రతీ ఒక్కరికీ తెలుసు!ఈరోజు నాకు ప్రశాంతత కావాలి, ఈ టైమ్ నాది అని ఫోన్ సైలెంట్లో పెట్టి డోర్ వేసుకుంటారు. కానీ సరిగ్గా 2 నిమిషాల్లో ‘ఎవరైనా మెసేజ్ చేశారేమో, నోటిఫికేషన్లు వచ్చాయేమో’ అని ఫోన్ అన్ లాక్ చేసి మరీ చూస్తుంటారు.బాత్ రూమ్‌లో షవర్ కింద నిలబడి జీవిత పాఠాల గురించి ఆలోచించే ఆ పదిహేను నిమిషాలే నేటి మానవుడికి దొరికే తనదైన సమయం.‘జీవితంలో కొత్త అనుభవం కావాలి, నన్ను నేను వెతుక్కోవాలి‘ అని కొండలు, కోనలు ఎక్కడానికి సోలో ట్రిప్‌లు వేస్తారు. తీరా అక్కడ కొండ కొనకి వెళ్లాక వెతికేది ‘తనను తాను’ కాదు, ఫోన్ లో ‘సిగ్నల్ వస్తుందా లేదా‘ అని!మనకంటూ మనదైన సమయంఅందరి కోసం పరుగెడుతూ, మనల్ని మనం మర్చిపోవద్దు. కుటుంబం కోసం, పిల్లల కోసం, ఉద్యోగం కోసం, బాధ్యతల కోసం– ఇలా అందరి కోసం సమయం కేటాయిస్తున్నాం. కానీ మన కోసం మనం ఎంత సమయం కేటాయించు కోగలుగుతున్నాం? పుస్తకం చదవడానికి కావచ్చు, సంగీతం వినడానికి కావచ్చు, నిశ్శబ్దంగా కూర్చోవడానికి కావచ్చు, ఇష్టమైన పని చేసుకోవడానికి కావచ్చు– రోజులో కొంత మనదైన సమయం మనకంటూ ఉండాలి.మనల్ని మనం చూసుకోవడం స్వార్థం కాదు. మనసు అలసిపోకుండా చూసుకోవడం. మన మనసుకు నచ్చిన పని చేసేందుకు, విశ్రాంతి తీసుకునేందుకు, మన గురించి మనం ఆలోచించేందుకు కాసేపు సమయం కేటాయించడం. ఇందులో పెద్ద లక్ష్యాలేమీ ఉండవు. మనసుకు కాస్త ఊరటనివ్వడమే లక్ష్యం. రోజులో గంటల సమయం అవసరం లేదు. పది నిమిషాలైనా మన కోసం కేటాయిస్తే, ఆ రోజు మనదిగా అనిపిస్తుంది. అందరి కోసం పరుగెత్తే జీవితంలో ఒక్కసారి మన కోసం ఆగడం కూడా అవసరమే!ప్రశాంతతకే ప్రాధాన్యంఇంతకు ముందు ఎంత లగ్జరీగా ఉంటే అంత సౌకర్యంగా, సంతోషంగా ఉంటారు అనే ఒక భావన ఉండేది. ఇల్లు నిండా వస్తువులు ఉంటేనే జీవితం సంతోషంగా ఉంటుందని లేదు. అవసరమైనవి మాత్రమే ఉంచుకోవడం, ఉపయోగించని వస్తువులను తగ్గించడం, ఉన్నవాటిని విలువగా ఉపయోగించడం ఇప్పుడు కొత్త జీవన విధానంలో భాగమవుతోంది. తక్కువ వస్తువులు అంటే తక్కువ జీవితం కాదు. తక్కువ గందరగోళంలో ఎక్కువ ప్రశాంతత.దుస్తులు, అలంకరణ వస్తువులు, ఇంటి సామగ్రి, ఉపయోగించని పరికరాలు– ఇలా అవసరంలేని వాటిని తగ్గించుకుంటూ సరళమైన జీవితం వైపు అడుగులు వేస్తున్నారు. ఇది కేవలం వస్తువులను తగ్గించుకోవడం కాదు. మన సమయాన్ని, మన డబ్బును, మన శక్తిని ఎక్కడ ఉపయోగించాలో ఎంచుకోవడం. ఇల్లు వస్తువులతో నిండిపోవడం కంటే మనసుకు ప్రశాంతంగా ఉండటం ముఖ్యమనే ఆలోచన పెరుగుతోంది. తక్కువ వస్తువులు, తక్కువ గందరగోళం, తక్కువ ఖర్చు, ఎక్కువ స్వేచ్ఛ.ఆహార శ్రద్ధతోనే ఆరోగ్యంఆహారం విషయంలోనూ కొత్త ఆలోచనలు కనిపిస్తున్నాయి. రుచితో పాటు అది ఎక్కడి నుంచి వచ్చింది? ఎలా తయారైంది? శరీరానికి ఎంత ఉపయోగం? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇంటివంట, స్థానికంగా లభించే పదార్థాలు, కాలానుగుణంగా లభించే పండ్లు, కూరగాయలు, తక్కువగా తయారుచేసిన ఆహారం వంటి వాటికి ప్రాధాన్యం పెరుగుతోంది. ‘కడుపు నిండితే చాలు’ అనే ఆలోచన నుంచి ‘శరీరానికి మేలు చేసే ఆహారం కావాలి’ అనే ఆలోచన వైపు మార్పు కనిపిస్తోంది.ఫాస్ట్‌ఫుడ్, ప్యాకేజ్డ్ ఫుడ్, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్‌కు బదులుగా ఇంటివంట, తాజా కూరగాయలు, పండ్లు, పప్పులు, చిరుధాన్యాలు, సంప్రదాయ ధాన్యాలు, స్థానికంగా లభించే పదార్థాలు వంటి వాటిపై ఆసక్తి పెరుగుతోంది. అంటే ఇప్పుడు ఆహారం అనేది కేవలం ఆకలి తీర్చేది మాత్రమే కాదు, ఆరోగ్యాన్ని నిర్మించే రోజువారీ పెట్టుబడి అనే భావన నవతరంలో బలపడుతోంది. రుచిని వదులుకోకుండా, ఆరోగ్యాన్ని కూడా దృష్టి్టలో పెట్టుకుని తినడం నేటి జీవనశైలిలో ముఖ్యమైన మార్పుగా మారుతోంది.జీవితం పరుగు పందెం కాదుఅందరి కంటే ఎక్కువ సంపాదించాలి, అందరికన్నా మనమే ముందుండాలి అనే ఆలోచనతో పరుగులు పెడుతూనే ఉన్నాం. అదే మనల్ని, మన ఆరోగ్యాన్ని ప్రమాదపుటంచుల్లోకి తీసుకెళ్తోంది. మంచి ఉద్యోగం, డబ్బు, పేరు మాత్రమే విజయం కాదు. ఆరోగ్యంగా ఉండటం, మనకు నచ్చిన వారితో సమయం గడపడం, మనసుకు నచ్చిన జీవితం గడపడం కూడా విజయమే! జీవితమేమీ పరుగు పందెం కాదు, ప్రతి రోజూ గెలవాల్సిన పనిలేదు. రోజులో కొన్ని క్షణాలనైనా ఆనందంగా ఆస్వాదించడమే అసలైన జీవితం. జీవితాన్ని తర్వాత ఎప్పుడో ఆస్వాదిద్దాం అనుకుంటూ ఉంటే, ఆ ‘తర్వాత’ ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు.సాంకేతిక పరిజ్ఞానం మన చేతుల్లోకి వచ్చిన కొద్దీ జీవితం మరింత సులభతరంగా, మరింత వేగవంతంగా మారింది. కానీ అదే సమయంలో నిశ్శబ్దం, విశ్రాంతి, ప్రకృతి, కుటుంబం, ఆరోగ్యం, వ్యక్తిగత సమయం వంటి వాటి విలువ కూడా మనకు మరింత స్పష్టంగా తెలుస్తోంది. అందుకే 2026 జీవనశైలి ఒక విచిత్రమైన మలుపులో నిలిచింది. ఈతరం పనుల్లో వేగాన్ని కోరుకుంటూనే, జీవితంలో నిదానానికి ప్రాధాన్యమిస్తోంది. సౌకర్యాలను ఆస్వాదిస్తూనే, సరళత వైపు అడుగులు వేస్తోంది. సాంకేతికతను అక్కున చేర్చుకుంటూనే, దాని నుంచి కొంత దూరం కావాలని కోరుకుంటోంది.కొత్తదనం కోసం కొత్తగా ప్రయత్నించక్కర్లేదు, ముందు ఆన్లైన్ చెత్తను డంప్ చేస్తే చాలు. జీవితం దానంతట అదే కొత్తగా అనిపిస్తుంది!- రమా జంబులఇదీ చదవండి: డాటర్ ఇన్లా మదర్ -
కంజీవరం చీర, బంగారు ఆభరణాలతో మెరిసిపోతున్న సమంత..!
టాలీవుడ్ నటి సమంత రూత్ ప్రభు మా ఇంటి బంగారం మూవీతో మంచి హిట్‌ని అందుకోవడమే గాక ఆ సినిమా సక్సెస్ మీట్లోనే తను ప్రెగ్నెంట్‌నని ప్రకటించి అభిమానులను ఖుషీ చేసింది. ఆ నేపథ్యంలో కొన్నాళ్లపాటు షూటింగ్ విరామం తీసుకుంటున్నట్లు కూడా ప్రకటించింది. ఎప్పటికప్పుడూ తన గర్భధారణకు సంబంధించిన ప్రతి ఫోటోని షేర్ చేస్తూ మాతృత్వ మధురిమ గురించ పంచుకుంటుంటుంది. అందులో భాగంగానే తన సీమంతం వేడుకకు సంబంధించిన ఫోటోలను కూడా పంచుకుంది. కాబోయే తల్లి సమంత తనకు సంప్రదాయల పట్ల చాలా గౌరవం ఉందంటూ భావోద్వేగంగా పోస్ట్‌లో రాసుకొచ్చింది. ప్రతి మంత్ర ధ్వని, ఆయా జపాల ద్వారా వచ్చే శక్తిలో ఏతో లోతైన ప్రభావం ఉందని నమ్ముతాను. ఆ ఆచారాల వెనుకున్న ఉన్న అర్థం నాకు తెలియకపోవచ్చు కానీ ఏదో తెలియని అనుభూతి, శక్తి మనలో వస్తుందని నమ్ముతానని పేర్కొంది. ఈ వేడుక కోసం ఆమె సాంప్రదాయ భారతీయ మగ్గాల బ్రాండ్ ‘సుత్రాని’ కలెక్షన్ నుంచి పసుపు రంగు కంచివరం చీరను ఎంచుకుంది. కంచివరం చీరలో పుత్తడి బొమ్మలా మెరిసిపోయింది సమంత. ఆ చీర పైన న్న వింటేజ్ ప్రేరేపిత హెర్రింగ్బోన్ బంగారు అంచు, పాత కాంచీపురం నేత నిశబ్ద వైభవాన్ని చాటుతోంది. ఇది చాలా సూక్ష్మంగా కనిపిస్తున్నా ఈ కళ చాలా క్లిష్టమైనదని ఆ బ్రాండ్ పేర్కొంది. ఇక సమంత ఈ వేడుక కోసం 'వర్ణం - ఫైన్ జ్యువెల్స్ లాంజ్' నుంచి ఆభరణాలను ఎంచుకున్నారు. తను జుట్టును ముడి వేసుకుని, తెల్లటి గజ్రా పువ్వులతో అలంకరించుకున్నారు. మేకప్ కోసం సమంత గులాబీ రంగు లిప్‌స్టిక్, బ్లష్, ఐషాడోతో మోనోక్రోమాటిక్ లుక్‌ను ఎంచుకున్నారు. ఈ వేడుకలో భాగంగా చేయించే మంగళ స్నానంలో సైతం ఆమె మస్టర్డ్ పసుపు(ఆవాల పసుపు రంగు) రంగు అనార్కలీ ధరించింది. ఇక సమంత ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన శ్రీకల్పం గురించి కూడా ఇలా వివరించింది. శ్రీవిద్య సంప్రదాయానికి చెందిన ఈ ప్రత్యేక ఆచారంలో దేవి 94 కళలను స్మరిస్తూ.. తల్లి శరీరంలోని ఏడు చక్రాలను మంత్రాలు, పవిత్ర జలంతో శుద్ధి చేసి శక్తివంతం చేసే విధానం గురించి తెలిపింది. ఈ ఆచారంలో భాగంగా తనను కాబోయే తల్లిగా కాకుండా దేవి స్వరూపంగా మరో ప్రాణికి జన్మనిచ్చే పవిత్ర సృష్టికర్తగా గౌరవించడం తనను ఎంతగానో కదిలించిందన సమంత పేర్కొంది. శ్రీచక్ర యంత్రం, తొమ్మిది ఆవరణలు, బిందువు, లలితా త్రిపురసుందరి భావన, దేవి ఖడ్గమాల పఠనం వంటి అంశాలను కూడా ఆమె ప్రస్తావించింది. గర్భంలో ఉండగా శిశువుకు ఈ మంత్రాల ధ్వని ద్వార రక్షణ, ఆశీర్వాదం అందుతుని నమ్ముతాను అంటూ పోస్ట్‌లో రాసుకొచ్చింది. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) (చదవండి: సమంతకు సీమంతం.. ఫోటోలు పంచుకున్న హీరోయిన్) -
జీర్ణించుకోలేకపోయా అందుకే..!నికితా పోర్వాల్ భావోద్వేగభరిత లేఖ
ఇటీవల ముగిసిన మిస్ వరల్డ్ పోటీలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన నికితా పోరాల్ సోషల్ మీడియా వేదికగా భావోద్వేగభరితమైన లేఖ రాశారు. కిరీటాన్ని అందుకోలేకపోయినా..ఆ విస్ వరల్డ్ తనకు అందించి అనుభవం, ఆ ప్రయాణంలో తనకు లభించిన ప్రేమ, నేర్చుకున్న పాఠాలను గురించి లేఖలో పంచుకుంది. తన మిస్‌వరల్డ్ జర్నీకి సంబంధించిన ఫోటోల తోపాటు ఈపోస్ట్ని కూడా జోడించి షేర్ చేసింది. ఆ లేఖలో నికితా ఇలా రాసుకొచ్చింది. "మిస్ వరల్డ్ ఫైనల్ తర్వాత కిరీటం లేకుండా ఇంటికి రావడం అత్యంత కష్టమైన విషయం, అయినా అక్కడ పొందిన ప్రేమను వర్ణించడానికి మాటలు చాలవు. అక్కడ తనకు లభించిన ప్రేమ, మద్దతు..ఇలా ప్రతీదాన్ని జీర్ణించుకోవడానికి చాలా సమయం పట్టింది. మీరంతా నేను కిరీటాన్ని గెలుచుకోవాలని కొండంత ఆశతో ఎదురుచూశారు. అలా ఇంతకుమందెన్నడూ చూడని ఎన్నో కుటుంబాల ప్రేమను సంపాదించుకున్నాను. అందాల పోటీల ప్రపంచంలో అత్యంత విచిత్రమైన మరియు అందమైన విషయం ఏమిటంటే, కొన్నిసార్లు మీకు మద్దతు ఇచ్చే అకౌంట్ల వెనుక ఉన్న ముఖాలు మనకు తెలియవు. తెల్లవారుజామున 2 గంటలకు ఆ ఎడిట్ ఎవరు చేస్తున్నారో, ఆ సుదీర్ఘ సందేశం ఎవరు రాస్తున్నారో, కామెంట్ సెక్షన్లో నాకోసం ఎవరు పోరాడుతున్నారో, అప్డేట్ కోసం పేజీని ఎవరు రిఫ్రెష్ చేస్తున్నారో కూడా తెలియదు... కానీ ఎలాగోలా వారి ప్రేమ మనకు తెలుస్తుంది అంటూ అభిమానులను ఉద్దేశించి రాసింది.". ఆ తర్వాత తన ఓటమి గురించి ఇలా పేర్కొంది. " ‘ఇండియా' అని పిలిచే అదృష్టం దక్కించుకున్నా. అసలు ఆ వారాల పాటు, నా పేరు దాదాపు కనుమరుగైపోయింది, మర్చిపోయా. ఎవరైనా 'ఇండియా!' అని పిలవగానే ఏదో తెలియని పులకింత, ఒక అటెన్షన్ వచ్చేసేవి. నిజానికి నేను కిరీటాన్ని దక్కించుకోవాలని అనుకున్నా..బలంగా కోరుకున్నా..అందుకోసం ఎంతో కష్టపడ్డా. కానీ ఓటమిని ఎదుర్కొన్నా..అయినప్పటికీ ఈ జర్నీలో ఎన్నో జ్ఞాపకాలు, స్నేహాలు, ప్రేమలు సంపాదించుకుని సరికొత్త నికితాగా ఇంటికి తిరిగి వచ్చా. కొన్ని విజయాలు వరించలేకపోయినా..హృదయంలో ఎన్నో జ్ఞాపకాలను పదిలంగా ఉంచుతాయి. ప్రేమతో మీ నికితా అంటూ తన పోస్ట్‌ని ముగించింది నికితా పోర్వాల్. View this post on Instagram A post shared by Nikita Porwal (@nikitaporwal_) (చదవండి: అమ్మాయి నిజంగా బంగారం! ఆ డ్రెస్ అక్షరాల రూ. 4 కోట్లుపైనే..) -
‘జెమ్‌మ్యాక్సింగ్’ ట్రెండ్! జస్ట్ బ్లింగ్ జోడిస్తే ఆ లుక్కే అదుర్స్
ఒకప్పుడు అందంగా కనిపించాలంటే ఖరీదైన వస్తువులు కొనాలి అనుకునేవారు. ఇప్పుడు మాత్రం చేతిలో ఉన్న సాధారణ వస్తువును .. కాస్త క్రియేటివిటీ జోడించి అందంగా మార్చుకోవడమే ఫ్యాషన్‌గా మారింది. అదే జెమ్‌మ్యాక్సింగ్. అంటే వస్తువులు, దుస్తులు, నగలు, యాక్సెసరీస్ వంటి వాటికి రంగు, మెరుపు, రత్నాలు, క్రిస్టల్స్ జోడించి వాటిని మరింత ఆకర్షణీయంగా మార్చే కళకే జెమ్ మ్యాక్సింగ్ అని పేరు. ఫోన్ కవర్‌కు రంగురంగుల రాళ్లు.. కాఫీ కప్పుకు చిన్న క్రిస్టల్స్.. లిప్‌స్టిక్ బాటిల్‌కు మెరిసే స్టోన్స్ .. గోళ్లపై రకరకాల జెమ్స్.. ఇలా కనిపించిన ప్రతిదానికీ ‘బ్లింగ్’ జోడిస్తే ఆ లుక్కే వేరు. సాధారణ వస్తువే అందంగా.. అద్భుతంగా కనిపిస్తుంది. కొన్నేళ్లులగా వస్తున్న మినిమలిజానికి బైబై చెప్తూ.. ‘జెమ్‌మ్యాక్సింగ్’, ‘విమ్సీమ్యాక్సింగ్’, ‘రైన్‌స్టోన్ మ్యాక్సింగ్’ పేర్లతో పిలుస్తున్న ఈ నయా ట్రెండ్ నేటి యువతను విపరీతంగా ఆకర్షిస్తోంది. ఖరీదైనవే కానక్కర్లేదు!ఈ ట్రెండ్‌కు ఒక పరిమితి లేదు. పర్ఫ్యూమ్ బాటిల్, మేకప్ ప్యాకేజింగ్, హెయిర్ క్లిప్స్, హ్యాండ్‌బ్యాగ్స్, షూస్, నెయిల్స్, ఫోన్ కవర్, కాఫీ కప్పు, వాటర్ బాటిల్, లిప్‌స్టిక్, కేకులు.. ఒక్కటేమిటి, ఏదైనా కాన్వాస్‌గా మారి΄ోతుంది.. అలాగని దీనికి ఖరీదైన జెమ్స్‌తో పనిలేదు. చిన్న రైన్‌స్టోన్స్, ΄్లాస్టిక్ జెమ్స్, ముత్యాలు, చార్మ్స్, స్టిక్కర్లు వంటి వాటితోనూ అందమైన లుక్‌ను సృష్టి్టంచవచ్చు. జ్యువెలరీలో అయితే పెద్ద రంగురంగుల రాళ్లు, లేయర్డ్ నెక్లెస్‌లు, స్టేట్మెంట్ రింగులు, భారీ చెవిపోగులతో ‘ఎంత ఎక్కువైతే అంత మంచిది’ అన్నట్టుగా మాగ్జిమలిస్ట్ లుక్ కనిపిస్తోంది. పాత జ్ఞాపకాలకు కొత్త మెరుపుఈ ట్రెండ్ వెనుక ఓ నోస్టాల్జియా కూడా బలంగా ఉంది. 1990ల చివరి, 2000 ప్రారంభంలో బెడ్ జిల్డ్ ఫోన్లు, మెరిసే జీన్స్, రైన్‌స్టోన్ టాప్‌లు, గ్లిట్టర్ మేకప్, అలంకరించిన యాక్సెసరీస్ యువతలో ప్రత్యేక ఆకర్షణగా ఉండేవి. అప్పటి ఆ మెరుపు ఇప్పుడు కొత్త తరం చేతుల్లోకి వచ్చింది. అయితే అప్పటిలా ఒకే రకమైన బ్లింగ్ కాకుండా.. ఇప్పుడు వ్యక్తిగత అభిరుచికి తగినట్టుగా మార్చుకుంటున్నారు.మినిమలిజానికి బైబై!నిన్నామొన్నటి వరకు మినిమలిజం వంటి ధోరణే లగ్జరీకి మారుపేరుగా మారింది. అంటే తక్కువ రంగులు, సింపుల్ నగలు, సాదాసీదా డిజైన్లు.. ఇవే ఖరీదైన స్టైల్‌కు గుర్తులుగా మారాయి. ఇప్పుడు మాత్రం పరిస్థితి మారుతోంది. ప్రతి వస్తువునూ అందంగా ఆలంకరించుకోవాలనే ఆలోచన పెరుగుతోంది. అంతేకాదు ఈ ట్రెండ్ వస్తువులకే కాదు బ్యూటీకి కూడా చేరింది. ముఖంపై చిన్న క్రిస్టల్స్, బాడీ జెమ్స్, జెమ్ నెయిల్స్ వంటి లుక్స్ సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.ఒకప్పుడు ‘తక్కువే’ లగ్జరీ అనేది ఫ్యాషన్ మంత్రంగా ఉండేది. ఇప్పుడు మాత్రం ‘ఎక్కువే’ లగ్జరీ అన్నట్టుగా మారుతోంది. ఈ మెరుపులు మాగ్జిమలిజం తిరిగి వస్తోందనడానికి మరో సంకేతంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే వినూత్న ఆభరణాలు, అలంకార వస్తువుల కోసం నెట్లో సెర్చింగ్ గత ఏడాదితో పోలిస్తే 50 శాతం పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. మహిళలకే కాదు..సెలబ్రిటీలు, ఇన్ఫ్లూయెన్సర్లు సైతం ఈ ట్రెండ్‌ని ఫాలో అవుతూ ప్రచారం కల్పిస్తుండటంతో.. యూత్ ఎక్కువగా దీనిని అనుసరిస్తోంది. ఈ జెమ్‌మ్యాక్సింగ్ మహిళల ఫ్యాషన్‌కు మాత్రమే పరిమితం కాదు. మగవారి దుస్తుల్లోనూ రై స్టోన్ షర్ట్స్, జాకెట్లు, షూస్, టోపీలు వంటి వాటిల్లోనూ దొరుకుతున్నాయి. -
ఎంపీ సుప్రియా సూలే ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..! 50 ఏళ్ల వయసులోనూ..
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ సుప్రియా సూలే రాజకీయంగా సభలు,సమావేశాతో ఎంత బిజీగా ఉన్నా..తన పిట్‌నెస్‌కి సమయం కేటాయిస్తానని ఆమెనే స్వయంగా చెప్పారు. ఒక్కోసారి తన ఫిట్నెస్ మంత్రాని బ్రేక్ చేస్తానని కూడా నవ్వుతూ చెప్పారు. తను ఒక నాయకురాలిగా ఇంతలా బిజీగా ఉన్న అలసట అన్నది తన దరి చేరదని, ఎల్లప్పుడూ చురుకుగా ఉంటానని అన్నారామె. మరి అంతలా ఫిట్‌గా ఉండే ఆమె ఆరోగ్య రహస్యం ఏంటో ఆమె మాటల్లోనే తెలుసుకుందామాతాను బయటకు వెళ్లేటప్పుడు హాయిగా నడిచేలా షూ ధరిస్తానని చెప్పారామె. అలాగే బయటకు వెళ్లేటప్పుడు మరిగించిన వేడి నీళ్లు రెండు లీటర్లు తప్పనిసరి అని అంటున్నారామె. తనకు వీలు కుదిరితే సైక్లింగ్, యోగా తప్పనిసరి అని అన్నారామె. ఇవేమి కుదరదు అనుకుంటే వేగంగా నడుస్తానని చెప్పారామె. 50 ఏళ్ల వయసులోనూ ఆమె తరుచుగా చీరలోనే సైకిల్ తొక్కుతానని అన్నారామె. ఐదేళ్లక్రితం వరకు జిమ్‌కి వెళ్తుండేదాన్ని అన్నారు. కానీ ఇప్పుడు బయట ప్రదేశాల్లో వాకింగ్, జాగింక్కి ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే తనకొక చెడ్డఅలవాటు కూడా ఉందన్నారు. సదా ప్రచారాలు, బహిరంగ సమావేశాల కారణంగా తన పిట్నెస్ లక్ష్యం దెబ్బతింటుంటుందని అన్నారామె. ఆ ఒత్తిడిలో ఎక్కువగా తినేస్తుంటానని అన్నారామె. డైట్ కోక్ తాగనిదే రోజు గడవదని అన్నారు. అది తన బలహీనతగా పేర్కోన్నారు. అలాగే తాను ఇంటి నుంచి తీసుకెళ్లిన భోజనం తినని, సాధ్యమైనంత వరకు కార్యకర్తల ఇళ్లల్లోలేదా ధాబాలో భోజనం చేస్తుంటానని అన్నారు. తన భోజనంలో ఎక్కువుగా కూరగాయలు, మటన్ లేదా చికెన్, జోన్న భక్రీలు తీసుకుంటానని చెప్పారు. అల్పాహరంగా పళ్లు, బాదం పప్పులు, చిరుతిండిగా రెండు రకాల బిస్కెట్లు తింటుంటానని అన్నారు. అలాగే తనకు వేయించిన ఆహారాలు మహా ఇష్టమని అన్నారు. అయితే టీ,కాఫీలకు మాత్రం బానిస కాలేదన్నారు. అలాగే తాను మంచి ఆహార ప్రియురాలినని, ఎంతలా అంటే మహారాష్ట్రలో ఎక్కడెక్కడ అద్బుతమైన ఫుడ్ దొరకుతుందో ఈజీగా చెప్పేయగలను, ఆ ప్రాంతాల్లో ఏం దొరుకుతుందో ఠక్కున చెప్పేస్తానని ధీమాగా చెబుతున్నారామె. అయితే తన దినచర్యలో నాణ్యమైన నిద్ర లేకపోవడం పెద్ద లోపమని అన్నారామె. ఎందుకంటే ఇద్దరు పిల్లల తల్లిగా ఎప్పుడు ఎక్కువసేపు హాయిగా నిద్రపోయిన రోజు లేనే లేదని అన్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సిఫార్సు చేసిన ఆరోగ్య సూత్రాల ప్రకారం కూడా పెద్దలకు కనీసం ఏడు నుంచి 9 గంటలు నిద్ర ఉండాలని సూచించింది. ఇది నిజంగానే ఆమె ఎదుర్కొంటున్న కీలక లోపంగా పేర్కొన్నారు ఆరోగ్య నిపుణులు. ఫిట్నెస్ పరంగా మిగతావన్నీ సవ్యంగా ఉన్నా..నిద్ర అత్యంత కీలకమైనదని, దీనిపై మొత్తం ఆరోగ్యం ఆధారపడి ఉందని హెచ్చరిస్తున్నారు వైద్యులు. View this post on Instagram A post shared by Supriya Sule (@supriyasule) (చదవండి: ఆ కారణంతో బారత్‌లో జరగాల్సిన మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ రద్దు..! వెల్లువెత్తున్న విమర్శలు) -
పైసా ఖర్చు లేకుండా చర్మానికి మెరుపు.. ఈ 3 అలవాట్లు చాలు!
చర్మం కాంతిమంతంగా ఉండటం కోసం రకరకాలుగా ప్రయత్నించి అలసిన వారికి పైసా ఖర్చు లేకుండానే చర్మాన్ని మెరిపించుకునేందుకు కొన్ని మంచి చిట్కాలు ఉన్నాయి. అది ప్రయత్నించి చూస్తే మేనికాంతితోపాటు ఆరోగ్యం కూడా బాగుంటుంది. అదేంటో చూద్దామా...అవి ఏమిటో కాదు... ఉదయాన్నే ఒక గ్లాసు నీరు తాగడం, సూర్యకాంతిలో సేదతీరడం, ఆడుతూ పాడుతూ పనులు చేసుకోవడం వంటివే... లేవగానే గ్లాసుడు నీళ్లు తాగడం వల్ల రాత్రంతా శరీరంలో తగ్గిన నీటి శాతం మళ్లీ సమకూరుతుందంటున్నారు నిపుణులు. ఇది రోజును ఒక ఆరోగ్యకరమైన అలవాటుతో ప్రారంభించేలా చేస్తుంది.తేలికపాటి వ్యాయామాలుఉదయాన్నే శరీరాన్ని సాగదీయడం, యోగా చేయడం లేదా కాసేపు నడవడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇది ఉదయం పూట శరీరం పట్టివేసినట్లు ఉండే సమస్యను తగ్గించడమే కాకుండా, మనస్సుకు ఆనందాన్ని ఇచ్చే ‘న్యూరోట్రాన్స్మీటర్ల’ ఉత్పత్తిని పెంచుతుంది.మెడిటేషన్రోజుకు కేవలం 5 నిమిషాల పాటు ప్రశాంతంగా ధ్యానం చేయడం లేదా లోతుగా శ్వాస తీసుకోవడం వల్ల ఒత్తిడిస్థాయులు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇది రోజంతా పనులను తొందరపాటు లేకుండా ప్రణాళికాబద్ధంగా చేసుకోవడానికి సహాయపడుతుంది. వీటన్నింటి వల్లా మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా ఉండగలం. అలా ఉంటే మేనిమెరుపులు సింపులే కదా మరి!ఇవి చదవండి: పాప్‌కార్న్ పేలేటప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? షాకింగ్ నిజాలు! -
పాప్‌కార్న్ పేలేటప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? షాకింగ్ నిజాలు!
పాప్ కార్న్ ఎనీ టైమ్ స్నాక్.. సరదా కోసం ఎప్పుడు తినాలనిపించినా తింటుంటాం.. మరి పాప్ కార్న్కీ కొన్ని సరదా ముచ్చట్లున్నాయి. సరదాగా చదివేయండి.ఓల్డ్ మెయిడ్స్ – గింజలన్నీ పగిలి పాప్‌కార్న్ అయినా, గిన్నె అడుగున కొన్ని విత్తనాలు అలాగే ఉండిపోతాయి చూశారా? వాటికి అధికారికంగా ఒక పేరుంది... అదే ‘ఓల్డ్ మెయిడ్స్’! గింజ లోపల తగినంత తేమ లేకపోవడం వల్ల ఇవి పేలలేవు. పాప్‌కార్న్ బయట నుంచి ఎండిపోయినట్లు కనిపించినప్పటికీ, దాని లోపల దాదాపు 13% నుంచి 15% వరకు తేమ ఉంటుంది. గింజను వేడి చేసినప్పుడు, లోపల ఉన్న నీరు ఆవిరిగా మారడం ప్రారంభించి పాప్ కార్న్‌గా పనిచేస్తుంది.ఒక చిన్న పాప్‌కార్న్ గింజ పేలినప్పుడు గాలిలోకి ఏకంగా 3 అడుగుల (సుమారు 1 మీటరు) ఎత్తు వరకు ఎగురుతుంది. దాని పరిమాణంతో పోలిస్తే, ఇది ఒలింపిక్ హై జంపర్ కంటే ఎత్తుకు ఎగిరినట్లే!పాప్‌కార్న్ పేలినపుడు ఏర్పడే రూపాలను బట్టి రెండు రకాలుగా విభజిస్తారు. బటర్ ఫ్లై ఆకారం– ఇవి బటర్‌ఫ్లై రెక్కల ఆకారంలో ఉంటాయి. వీటిని ఎక్కువగా థియేటర్లలో ఉపయోగిస్తారు. మష్రూమ్ ఆకారం– గుండ్రంగా, పుట్టగొడుగులా ఉండే ఆకారం. కెరమెల్ పాప్‌కార్న్ తయారీలో విరిగిపోకుండా ఉండేందుకు వీటిని వాడతారు.1920ల కాలంలో సినిమా థియేటర్ల యజమానులు పాప్‌కార్న్‌ను నిషేధించారు. కారణం... థియేటర్లు చాలా రిచ్‌గా కనిపించాలని, పైగా జనాలు నమిలే శబ్దం వల్ల సినిమాల్లోని సంభాషణలు వినపడవని భయపడ్డారు. కానీ ఆర్థిక మాంద్యం వచ్చాక, ఇది చాలా చవకైన వ్యాపారమని మళ్లీ ప్రవేశపెట్టారు.పూర్వం అమెరికాలోని ఆదివాసీలు మొక్కజొన్న కంకులను నేరుగా వేడి ఇసుకలో లేదా మంటల్లో వేసి, అవి పేలి బయటకు ఎగురుతున్నప్పుడు పట్టుకునేవారు.పాప్‌కార్న్ పేలినపుడు వచ్చే శబ్దం విత్తనం పొర పగలడం వల్ల రాదు. లోపల ఉన్న నీటి ఆవిరి ఒక్కసారిగా సూపర్సోనిక్ స్పీడ్‌తో బయటకు వచ్చి, పిండి పదార్థాన్ని విడదీసినప్పుడు వచ్చే చిన్న స్థాయి ‘ధ్వని విస్ఫోటనం’ అది!ఇవి కూడా చదవండి: ఆఫీస్ వర్క్‌లో ఫోకస్ పెరగాలంటే.. ఈ చిన్న బ్రేక్ తప్పనిసరి! -
ఎండ తగులుతున్నా.. విటమిన్-డి రావడం లేదా? షాకింగ్ నిజాలు!
మనదేశంలో అన్ని కాలాల్లోనూ సూర్యరశ్మి సమృద్ధిగా ఉంటుంది. అయినప్పటికీ సుమారుగా 70 నుంచి 90 శాతం మంది ‘విటమిన్–డి’ లోపంతో బాధపడుతున్నారని పలు వైద్య అధ్యయనాలు చెబుతున్నాయి. ఒంటికి ఎండ తగిలితే విటమిన్–డి దానంతట అదే తయారవుతుంది. మరి అలాంటప్పుడు ఈ స్థాయి లోపం ఎందుకు వస్తుందంటే.. జీవనశైలే కారణం..నాలుగు గోడల మధ్యే:ఐటీ, కార్పొరేట్ ఉద్యోగాలు, ఏసీ గదులు, ఆన్ లైన్ చదువుల వల్ల ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండ ముఖం చూడకుండానే సమయం గడిచిపోతోంది.మెలనిన్:భారతీయుల చర్మంలో ఉండే మెలనిన్ అనే వర్ణద్రవ్యం సహజమైన సన్‌స్క్రీన్‌లా పనిచేస్తుంది. దీనివల్ల మన చర్మం సూర్యరశ్మిని తీసుకునే సామర్థ్యం తక్కువ. అందువల్ల ఎక్కువ సమయం ఎండలో గడ΄ాల్సి ఉంటుంది.సరైన సమయం:చాలామంది ఉదయాన్నే లేదా సాయంత్రం వేళల్లో వాకింగ్ చేస్తూ ఎండ తగులుతోంది అనుకుంటారు. కానీ సూర్యరశ్మి నుంచి విటమిన్–డి లభించాలంటే ఆ కిరణాలు చర్మాన్ని తాకాలి. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య సూర్యకిరణాలు అత్యధికంగా ప్రసరిస్తాయి. కానీ, ఆ సమయంలో ఉండే ఎండ తీవ్రత వల్ల ఆ సమయంలో బయటకు రావడానికి ఇష్టపడం.కాలుష్యం:నగరాల్లో పేరుకుపోతున్న ధూళి, పొగ సూర్యకాంతిని నేరుగా భూమిపై పడకుండా అడ్డుకుంటాయి. దీనివల్ల కూడా మనకు తగినంత సూర్యరశ్మి లభించదు. విటమిన్–డి కేవలం ఎముకల గట్టితనానికే కాకుండా, మన ఇమ్యూనిటీకి, గుండె ఆరోగ్యానికి, మానసిక ఉల్లాసానికి ఎంతో కీలకం. అందువల్ల ప్రతిరోజూ కాసేపు ఎండలో గడపడం మన దినచర్యలో భాగం చేసుకుంటే విటమిన్–డి లోపంతో డీలా పడాల్సిన అవసరం ఉండదు.ఇవి కూడా చదవండి: ఆఫీస్ వర్క్‌లో ఫోకస్ పెరగాలంటే.. ఈ చిన్న బ్రేక్ తప్పనిసరి! -
కార్లే లేవు.. నడక, సైక్లింగ్తోనే జీవనం! ఈ ప్రాంతం గురించి విన్నారా?
అమెరికా అంటేనే భారీ రహదారులు, కార్లు, ట్రాఫిక్ గుర్తుకొస్తాయి. కానీ అదే అమెరికాలో కార్లు లేకుండానే ప్రజలు హాయిగా జీవించే ఓ ఆధునిక ప్రాంతం ఉంది. నడక, సైక్లింగ్, ప్రజా రవాణాకే ప్రాధాన్యం ఇస్తూ.. ఆహ్లాదకరమైన వాతావరణంతో ప్రత్యేకంగా నిలిచిన ఈ ప్రాంతం ఇప్పుడు భవిష్యత్ నగరాలకు ఓ కొత్త నమూనాగా మారుతోంది. ఇంతకీ ఆ ప్రాంతం ఎక్కడుంది? అక్కడి ప్రత్యేకతలేంటి? ఇప్పుడు తెలుసుకుందాం!అమెరికాలోని అరిజోనా రాష్ట్రం టెంపేలో ఉన్న కల్డెసాక్ (Culdesac) ప్రాంతం ఇప్పుడు వినూత్నమైన నగర నిర్మాణానికి ఉదాహరణగా నిలుస్తోంది. సాధారణంగా అమెరికా నగరాల్లో కార్ల వినియోగం ఎక్కువగా ఉంటుంది. దీంతో పెద్ద రహదారులు, ట్రాఫిక్, కాలుష్యం, పార్కింగ్ కోసం భారీగా స్థలం అవసరమవుతుంది. అయితే కల్డెసాక్ మాత్రం దీనికి పూర్తిగా భిన్నంగా ఉంది. మొదటి నుంచే కార్ల రహిత ఆధునిక నివాస ప్రాంతంగా దీన్ని రూపొందించారు. ప్రజలు కార్లకు బదులుగా నడక, సైక్లింగ్, ప్రజా రవాణాను ఉపయోగించేలా ఇక్కడి నిర్మాణాన్ని ఏర్పాటు చేశారు.కల్డెసాక్ వాతావరణం, నిర్మాణ శైలి కూడా ప్రత్యేక ఆకర్షణగా మారాయి. ఇక్కడ రోడ్లపై కార్ల రద్దీ కనిపించదు. అందమైన భవనాలు, నడకదారులు, పూల మొక్కలు, అలంకరణ దీపాలతో ఆహ్లాదకరంగా కనిపించే ఈ ప్రాంతాన్ని చూసిన కొందరు పర్యాటకులు ‘ఇది అమెరికాలో ఉన్నట్టుగా అనిపించడం లేదు.. గ్రీస్‌లోని ఏదో ప్రాంతంలా ఉంది’ అని చెబుతుంటారు.సుమారు 17 ఎకరాల్లో విస్తరించిన కల్డెసాక్ ప్రాంతం మధ్యలో ఓ విశాలమైన ప్లాజాను ఏర్పాటు చేశారు. దాని చుట్టూ తక్కువ ఎత్తున్న తెల్లని భవనాలు, సన్నని నడకదారులు, గోడలపై చరిత్రకు సంబంధించిన రంగురంగుల చిత్రాలు, పూల మొక్కలు, అలంకరణ దీపాలు కనిపిస్తాయి. ఈ నిర్మాణ శైలికి ఇటలీ, ఫ్రాన్స్‌లోని కొండ ప్రాంతాలు, తీర గ్రామాల నుంచి స్ఫూర్తి పొందినట్లు ఆర్కిటెక్ట్ డేనియల్ పరోలెక్ తెలిపారు.ఇక్కడ కార్ల వినియోగం లేకపోయినా రవాణాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రజలు నడవడానికి అనువైన ఫుట్‌పాత్‌లు, సైకిళ్ల కోసం ప్రత్యేక దారులు ఏర్పాటు చేశారు. రెస్టారెంట్లు, దుకాణాలు, కొరియన్ కన్వీనియన్స్ స్టోర్, వైద్యుల కార్యాలయం, డాగ్ పార్క్, స్విమ్మింగ్ పూల్, జిమ్, కో-వర్కింగ్ స్పేస్ వంటి సదుపాయాలు కూడా అందుబాటులో ఉన్నాయి.ఇవి కూడా చదవండి: ఇది...ఇ–తాబేలు! 16 ఏళ్ల యువకుడి ఆవిష్కరణకల్డెసాక్ వెలుపలే లైట్ రైల్ స్టేషన్ ఉండటంతో డౌన్‌టౌన్ ఫీనిక్స్, విమానాశ్రయం వంటి ప్రాంతాలకు సులభంగా వెళ్లవచ్చు. దూర ప్రాంతాలకు వెళ్లేందుకు సెల్ఫ్ డ్రైవింగ్ ఎలక్ట్రిక్ వేమో రోబోటాక్సీలు కూడా అందుబాటులో ఉన్నాయి. అలాగే ఈ-బైక్‌లను అద్దెకు తీసుకునే సదుపాయం కూడా ఉంది. అవసరమైనప్పుడు షేర్డ్ ఎలక్ట్రిక్ కార్లను గంటకు సుమారు 5 డాలర్లకు అద్దెకు తీసుకోవచ్చు.అలాగే, కార్లు లేకుండా జీవించే విధానంతో పాటు ఎడారి వాతావరణంలో వేడిని తగ్గించేలా కల్డెసాక్ను రూపొందించడం మరో ప్రత్యేకత. భవనాల గోడలు, పైకప్పులకు తెల్లటి రంగు వేయడం ద్వారా సూర్యకాంతిని ఎక్కువగా ప్రతిబింబించేలా చేశారు. భవనాలను ఒకదానికొకటి దగ్గరగా నిర్మించడంతో అవి పరస్పరం నీడనిచ్చేలా ఉన్నాయి. గాలి నగరంలోకి సులభంగా వచ్చేలా ప్రజలు నడిచే దారులను, భవనాల మధ్య ప్రాంతాలను ప్రత్యేకంగా రూపొందించారు.దీంతో చుట్టుపక్కల ప్రాంతాలతో పోలిస్తే కల్డెసాక్లో నేల ఉపరితల ఉష్ణోగ్రత 30 నుంచి 40 డిగ్రీల ఫారన్‌హీట్ (సుమారు 17 నుంచి 22 డిగ్రీల సెల్సియస్) వరకు తక్కువగా ఉన్నట్లు పరిశోధకుల అధ్యయనంలో తేలింది.కల్డెసాక్ జీవన విధానం పర్యావరణానికే కాకుండా అక్కడి ప్రజల సామాజిక సంబంధాలకు కూడా ఉపయోగపడుతోందని నివాసితులు చెబుతున్నారు. ప్రస్తుతం దాదాపు 21 చిన్న వ్యాపారాలు ఇక్కడ పనిచేస్తున్నాయి. మెక్సికన్ రెస్టారెంట్లు, సిరామిక్స్, కొవ్వొత్తుల తయారీ స్టూడియోలు, బైక్ షాప్, పర్యావరణహిత దుస్తుల దుకాణాలు వంటి వ్యాపారాలు ప్రాంతాన్ని సందడిగా ఉంచుతున్నాయి.కార్ల రాకపోకలు లేకపోవడంతో పొరుగువారు, వ్యాపారులు, సందర్శకులు తరచూ ఒకరినొకరు కలుసుకునే అవకాశం పెరిగిందని అక్కడి నివాసితులు చెబుతున్నారు. దీంతో ఒంటరితనం తగ్గడంతో పాటు కమ్యూనిటీ భావన బలపడుతోందని వారు అంటున్నారు. ఇక్కడికి వచ్చే పర్యాటకులు కూడా ప్రశాంతంగా నడుచుకుంటూ ప్రాంతాన్ని ఆస్వాదించగలగడం ప్రత్యేక అనుభూతిగా చెబుతున్నారు.కార్ల వినియోగాన్ని తగ్గించి నడక, సైక్లింగ్, ప్రజా రవాణాను ప్రోత్సహించడం వల్ల వాయు కాలుష్యం, కార్బన్ ఉద్గారాలను తగ్గించవచ్చని ఐక్యరాజ్యసమితి పేర్కొంటోంది. కల్డెసాక్ పూర్తిగా అభివృద్ధి చెందిన తర్వాత ఏడాదికి సుమారు 3,000 టన్నుల గ్రీన్హౌస్ వాయువుల ఉద్గారాలను నివారించవచ్చని అంచనా.ప్రస్తుతం కల్డెసాక్లో సుమారు 760 నివాస యూనిట్లు, దాదాపు 1,000 మంది నివసించేలా అభివృద్ధి చేయాలనే ప్రణాళిక ఉంది. అమెరికాలోని ఇతర ప్రాంతాల్లోనూ కార్ల వినియోగాన్ని తగ్గించి, నడకకు అనుకూలమైన ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే ఆసక్తి పెరుగుతోంది. దీంతో కల్డెసాక్ భవిష్యత్ నగరాల రూపకల్పనకు కొత్త నమూనాగా మారుతోంది. ప్రజలు కార్లపై ఆధారపడకుండా నడక, సైక్లింగ్, ప్రజా రవాణాతో సౌకర్యవంతంగా జీవించేలా నగరాలను ఎలా రూపొందించవచ్చో ఈ ప్రాంతం చూపిస్తోంది.ఇవి కూడా చదవండి: ప్రకృతి పరీక్ష.. మానస సరోవర్ యాత్ర ఎందుకంత ప్రత్యేకం? -
ధైర్యం వదిలేస్తే ఏం జరుగుతుంది?
వేమన ధైర్యాన్ని మనిషి అసలైన ఆభరణంగా చెప్పాడు.పద్యం... ధైర్యమే పురుషునకు భూషణంబురా ధైర్యహీనునకు దైవమైన తోడురాడురా వేమనాఅర్థం: ధైర్యమే మగవాడికి అసలైన అలంకారం. ధైర్యం లేనివాడికి దేవుడే వచ్చినా సహాయం చేయడు.మరొక పద్యంలో... ధైర్యము గలవానికి ధరణిలో సుఖమురా ధైర్యము లేనికి దరిద్రమే గతిరాధైర్యం ఉన్నవాడికి ఈ లోకంలో సుఖం దొరుకుతుంది. ధైర్యం లేనివాడికి దరిద్రమే దిక్కు.భాస్కర శతకంలో..ధైర్యము గలవాడె ధన్యుడీ లోకానధైర్యమున జయమెల్ల దక్కునురాధైర్యమే లేనిచో దైవమే వచ్చిన కార్యము సాగదురా భావం.. ధైర్యం ఉన్నవాడే ఈ లోకంలో ధన్యుడు. ధైర్యంతోనే అన్ని పనుల్లో జయం వస్తుంది. ధైర్యం లేకపోతే దేవుడే వచ్చినా పని జరగదు.సుమతీ శతకం...బద్దెన సుమతీ శతకంలో ధైర్యాన్ని నేరుగా మగతనంతో పోల్చాడు.‘ధైర్యము విడువకుము ధరణిలో నరుడుధైర్యమున జయమెల్ల దక్కునురా సుమతీధైర్యమే మగతనంబురా సుమతీ‘ మనిషి ఎప్పుడూ ధైర్యాన్ని వదలకూడదు. ధైర్యంతోనే అన్నీ సాధించవచ్చు. ధైర్యమే అసలైన మగతనం.మరొక చోట...ధైర్యము లేనివానికి దైవము తోడుపడడు సుమతీ అని అంటాడు ధీరుని లక్షణాన్ని, గొప్పతనాన్ని ప్రస్తావిస్తాడు, పద్యంలో ధీరులెప్పుడూ న్యాయ మార్గాన్ని వదలరు అని అంటాడు భర్తృహరి.చివరిగా...ధైర్యం అనే అంశాన్ని మంచి పనులకే ముడి పెట్టాలి.. చెడ్డపనులకు చేసే ప్రయత్నం లో చూపిన తెగువ ధైర్యం కాదు. ధర్మం కోసం యుద్ధం చేసినందుకే శ్రీ కష్ణుడు, శ్రీరాముడు, పాండవులు, శివాజీ, ఝాన్సీ భాయి, అల్లూరి సీతారామరాజు... ఎందరో స్వతంత్ర సమర యోధులు ‘దైర్యవంతులు’గా శాశ్వత కీర్తి సంపాదించారు.– డా. కందాళ సత్యనారాయణ మూర్తిఇవి కూడా చదవండి: నిజమైన మార్పు ఎక్కడ మొదలవుతుంది? -
జస్ట్ మూడు నెలల్లో 20 కేజీల బరువు..! ఐతే ఆహారంలో..
బరువు తగ్గడం అంటే అత్యంత కష్టమైన పని కాదని..సునాయాసం ఎంజాయ్ చేస్తే తగ్గొచ్చని చూపిస్తున్నారు పలువురు. అందుకు క్రమశిక్షణ, నిలకడ తోపాటు ఆహారంపై మంచి స్పృహ కూడా కలిగి ఉండటం అత్యంత ప్రధానం. అచ్చం అలానే తూచా తప్పకుండా అనుసరించి జస్ట్ మూడు నెలల్లో కిలోలు కొద్దీ బరువు తగ్గి అందర్నీ ఆశ్చర్యపర్చింది ఈ ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్. ఆమె బరువుని తగ్గించుకోవడంలో హెల్ప్ అయిన ఫిట్నెస్ మంత్ర ఏంటో సవివరంగా చూద్దామా..!.ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ జ్యోతి ఉపాధ్యాయ్ ఒక సాధారణ ఫిట్నెస్ మంత్రాని అనుసరించినట్లు వెల్లడించింది. అదే ఆమెకు మూడు నెలల్లో 20 కిలోలు పైనే తగ్గడానికి సహాయపడినట్లు పేర్కొంది. తాను క్రమం తప్పని వ్యాయామం, ఇంట్లో చేసిన సాధారణ భోజనం తదితరాలన్నింటిని నిలకడగా చేయడం వంటి వాటిపై దృష్టిపెట్టినట్లు తెలిపింది. అంతేగాదు భారతీయ ఆహారంలో సులభంగా లభించే, అత్యంత సుపరిచితమైన పదార్థాలనే తన డైట్లో చేర్చుకున్నట్లు వెల్లడించింది. అలాగే తాను వ్యాయామం చేసేముందు తప్పనిసరిగా స్వెట్ బెల్ట్ ధరిస్తానని తెలిపింది. అలాగే తన తాజా వర్కౌట్లలో 95 కేజీల డెడ్‌లిఫ్ట్‌ను కూడా పూర్తి చేసినట్లు పేర్కొంది. క్రమం తప్పని శిక్షణతో తన బలం నెమ్మదిగా మెరుగుపడుతోందని అంటోంది. ఇక ఆహారం విషయానికొస్తే..ఎండుద్రాక్ష, ఓట్స్, ఇంట్లోనే తయారుచేసే పనీర్ తీసుకుంటానని చెప్పుకొచ్చింది. అలాగే మధ్యాహ్న భోజనంలో రోటీలు, పెరుగు, కూరగాయలు, సలాడ్, పనీర్ కూర, రాత్రి భోజనంలో తేలికగా ఉండేలా బొప్పాయి మాత్రమే తీసుకుంటానని పేర్కొంది.ఇక్కడ తనకు 20 కేజీల బరువు తగ్గడం అనేది క్రమం తప్పని వ్యాయామాలు, నియంత్రిత ఆహారం, నిలకడగా పాటించే దినచర్యల వల్లే సాధ్యమైందని అంటోంది. తక్కువ కేలరీలు తీసుకుంటూ..శారీరకంగా చురుకుగా ఉన్నప్పుడే బరువు తగ్గడం సులభమవుతుందని నొక్కి చెబుతోంది. ముఖ్యంగా తగినంత నీరు తాగడం, పీచుపదార్థాలు అధికంగా ఉండే ఆహారాలు ఎక్కువగా తీసుకోవడం వంటివి బరువు తగ్గడానికి ఎంతగానో ఉపకరిస్తాయని చెబుతోందామె. చివరగా వెయిట్‌లాస్ జర్నీలో సమతుల్య ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామాలు, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లే సరైనవని నొక్కి చెప్పింది ఇన్ఫ్లుయెన్సర్ జ్యోతి. View this post on Instagram A post shared by ज्योति🖤 (@jyotii_upadhyay9)గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: తొలి అడుగుల నుంచి.. ఫస్ట్ ఫ్లైట్ జర్నీ వరకు..! కుమార్తె భావోద్వేగ పోస్ట్ -
ప్రకృతి తన రహస్యాలను దాచుకున్న 5 అద్భుత ప్రదేశాలు!
ఒక చోట చెట్ల వేర్లు వంతెనలుగా మారుతాయి. మరొక చోటు నీటిపై తేలుతున్న ద్వీపాలు కనిపిస్తాయి. ఇంకొక చోటు పూలతో నిండిన లోయలు, ఆకాశాన్ని తాకిన సరస్సులు, వర్షం వచ్చినప్పుడు రంగులు మార్చుకునే మైదానాలు, లోయలు కనిపిస్తాయి. ప్రకృతి తన రహస్యాలను దాచుకున్న ప్రదేశాలు భారతదేశంలో ఎన్నో ఉంటాయి.ఈ ఐదు ప్రదేశాలు అలాంటి ప్రకృతి అద్భుతాలే. మేఘాలయలోని సజీవ వేర్ల వంతెనల నుంచి మహారాష్ట్రలోని కాస్ పీఠభూమి వరకు ప్రతి ప్రదేశంలో ప్రకృతి మనకు కొత్త రూపంలో కనిపిస్తుంది.త్సో మోరీరి సరస్సులడఖ్ అంటే చాలా మందికి ప్యాంగాంగ్ గుర్తొస్తుంది. కానీ చాంగ్థాంగ్లో ఉన్న త్సో మోరీరి ఒక ప్రశాంతమైన అనుభవాన్ని ఇస్తుంది. సుమారు 4,500 మీటర్ల ఎత్తులో, చుట్టూ కొండల మధ్య నీలం రంగులో విస్తరించిన ఈ సరస్సు ఒక పెద్ద ప్రకృతి చిత్రంలా కనిపిస్తుంది.లేహ్ నుంచి త్సో మోరీరి వైపు ప్రయాణం చేస్తుంటే భూదృశ్యం పూర్తిగా మారిపోతుంది. రాళ్లు, గడ్డి మైదానాలు, దూరంగా కనిపించే హిమ శిఖరాల మధ్య చివరికి సరస్సు కనిపించిన క్షణం మర్చిపోలేని దృశ్యంగా మిగిలిపోతుంది. కోర్జోక్ గ్రామం, కోర్జోక్ మఠం, సరస్సు చుట్టూ తిరిగే వలస పక్షులు ఈ ప్రదేశంలో ప్రత్యేక జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. చాంగ్పా సంచార జీవన విధానాన్ని కూడా చూసే అవకాశం లభిస్తుంది.నీళ్లపై తేలే జీవితంమణిపూర్లోని లోక్టక్ సరస్సును మొదటిసారి చూసినప్పుడు అది ఒక పెద్ద సినిమాటిక్ సీన్లా, ఒక కొత్త సముద్రంలా అనిపించవచ్చు. కానీ దగ్గరగా చూస్తే ఆ నీళ్లపై చిన్న చిన్న తేలియాడే ద్వీపాలు కనిపిస్తాయి. వీటిని ఫుమ్డీలు అంటారు. వాటిపై ఇళ్లు, జీవనం, చేపల వేట అన్నీ ఉంటాయి. ఇది ఒక ప్రత్యేక ప్రపంచంలా అనిపిస్తుంది.ఇంఫాల్ నుంచి సుమారు 48 కిలోమీటర్ల దూరంలో ఉన్న లోక్టక్, ఈశాన్య భారతదేశంలో అతి పెద్ద మంచినీటి సరస్సు. అదే సరస్సులో కీబుల్ లాంజోవా జాతీయ ఉద్యానవనం ఉండటం మరో అద్భుతం. ప్రకృతి, నీరు, జీవన విధానం కలిసి ఒక చిత్రంలా కనిపించే అందమైన ప్రదేశం ఇది.మేఘాలు నివసించే లోయనాగాలాండ్, మణిపూర్ మధ్య ఉన్న జుకోవ్ లోయను చూస్తే భూమిపై ఒక పచ్చని సముద్రం పరుచుకున్నట్టు అనిపిస్తుంది. సుమారు 2,452 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ లోయలో సీజనల్ పూలు, వెదురు తోటలు, చిన్న చిన్న సెలయేర్లు అందంగా ఉంటాయి.హైదరాబాద్ నుంచి ప్రయాణం మొదలు పడితే ముందుగా నాగాలాండ్ చేరుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రయాణంలో ఈశాన్య భారతదేశపు భూదృశ్యం మెల్లిగా మారుతుంది. నాగాలాండ్ కొండలు దగ్గరవుతున్న కొద్దీ రోడ్డు ప్రయాణంలోనే ప్రకతి తన రంగులను మార్చుకుంటూ వస్తుంది.జుకోవ్లో ఒక రోజు గడపడం అంటే కేవలం ట్రెక్కింగ్ అనుభవం మాత్రమే కాదు. మేఘాల లోయలో నిలిచిపోయిన సమయం, గాలిలో వెదురు ఆకుల శబ్దం, దూరంగా కనిపించే కొండలు ఇవన్నీ కలిసి ఒక అందమైన నిశ్శబ్దాన్ని సృష్టిస్తాయి. ఎండాకాలంలో కనిపించే ప్రత్యేక జుకోవ్ లిల్లీ ఈ ప్రదేశానికి మరో గుర్తింపు ఇస్తుంది.ఎలా వెళ్లాలి?హైదరాబాద్ నుంచి ఈ ఐదు గమ్యస్థానాలకు వెళ్లే మార్గం అనేది గమ్యస్థానాన్ని బట్టి మారుతుంది. మేఘాలయ, మణిపూర్, నాగాలాండ్ ప్రాంతాలకు మీరు గువాహటి, ఇంఫాల్, దిమాపూర్ నుంచి చేరుకోవచ్చు. లడఖ్ వెళ్లేందుకు హైదరాబాద్ నుంచి లేహ్ చేరుకుని, అక్కడి నుంచి చాంగ్‌థాంగ్ వైపు రోడ్డు ప్రయాణం చేసి వెళ్లవచ్చు. ఈ ప్రయాణం చాలా మందికి నచ్చుతుంది. కాస్ పీఠభూమికి పుణే లేదా సతారా మార్గంలో వెళ్లడం అనుకూలంగా ఉంటుంది.ఆసక్తికరమైన విషయాలులివింగ్ రూట్ బ్రిడ్జ్‌లు అనేవి మేఘాలయలోని ఖాసీ, జైంటియా సామాజిక వర్గాల ప్రజలు ప్రకృతితో కలిసి పెంచిన సజీవ నిర్మాణాలు.లోక్టక్ సరస్సు అనేది ఈశాన్య భారతదేశంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు. ఇందులో కనిపించే ఫుమ్డీలు దీనికి ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయి.జుకో లోయ అనేది నాగాలాండ్, మణిపూర్ సరిహద్దు ప్రాంతంలో ఉన్న లోయ. సీజనల్ పూలతో పాటు జుకోవ్ లిల్లీకి ప్రసిద్ధి.త్సో మోరీరి చాంగ్‌థాంగ్ ప్రాంతంలో సుమారు 4,500 మీటర్ల ఎత్తులో ఉన్న అందమైన, ఎత్తైన ప్రాంతంలోని సరస్సు.కాస్ పీఠభూమి అనేది పశ్చిమ కనుమల్లోని జీవవైవిధ్య ప్రాంతంగా గుర్తింపు పొందింది. ఈ పీఠభూమి యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందింది.దక్షిణాది పూల లోయమహారాష్ట్రలోని సతారా దగ్గర ఉన్న కాస్ పీఠభూమిని మహారాష్ట్రలోని పూల లోయ అని కూడా పిలుస్తారు. వర్షాకాలం తరువాత ఈ పీఠభూమిపై వందల రకాల పూలు ఒకేసారి విరిసి, భూమి మొత్తం రంగుల తివాచీలా మారుతుంది. 1200 మీటర్ల ఎత్తులో ఉన్న కాస్‌లో 850 కిపైగా పూల జాతి మొక్కలు ఉంటాయి.హైదరాబాద్ నుంచి పూణే వైపు ప్రయాణం చేసి, అక్కడి నుంచి సతారా మార్గంలో సాగాల్సి ఉంటుంది. పశ్చిమ కనుమల మధ్య సాగే ఈ ప్రయాణం ఒక ప్రత్యేక అనుభవంగా మిగిలిపోతుంది. ఆగస్ట్ నుంచి అక్టోబర్ మధ్య పూల సీజన్ లో ఈ పీఠభూమి పూర్తిగా మారిపోతుంది. దగ్గరలోని కాస్ సరస్సు, బమ్నోలి, ఠోసేఘర్ జలపాతాలు, సజ్జన్ గడ్ లాంటి ప్రదేశాలు ఈ ప్రయాణంలో ప్రత్యేక ఆకర్షణలుగా మిగిలిపోతాయి.ఏం తినాలి?మేఘాలయలో స్థానిక ఖాసీ వంటకాలు, మణిపూర్‌లో అన్నంతో తయారు చేసే సంప్రదాయ వంటకాలు, నాగాలాండ్‌లో స్థానిక మాంసాహార వంటకాలు, లడఖ్‌లో తుక్పా, మోమోలు, మహారాష్ట్రలో కంది పెఢా, పిట్లా, ఇతర స్థానిక మహారాష్ట్ర వంటకాలు మీ ప్రయాణానికి రుచికరమైన అనుభూతిని ఇస్తాయి.వేర్లతోనే వంతెనలు మేఘాలలో ఖాసీ ప్రజల జీవన విధానం ప్రకతితో మమేకమైన జీవన విధానం. దీనికి సాక్షాలే సజీవ వేర్ల వంతెనలు. ఫికస్ ఎలాస్టికా చెట్ల వేర్లను సంవత్సరాల పాటు పెంచి, నది రెండు వైపుల కలిసేలా తయారు చేసిన ఈ వంతెనలు కాంక్రీట్ నిర్మాణంలా బలంగా ఉంటాయి. కొన్ని వంతెనలు వందేళ్ల పాటు నిలిచి ఉన్నాయని మేఘాలయ పర్యాటక శాఖ చెబుతుంది.నాంగ్రియాట్, సోహ్రా, మాలినాంగ్ ప్రాంతాల్లో ఇలాంటి వంతెనలను చూడవచ్చు. పచ్చని అడవుల్లో నడుస్తుంటే కింద ప్రవహిస్తున్న నీటి మధ్య వేర్లు కలిసి వంతెనలా మారడం చూస్తే, మనిషి, ప్రకృతి మధ్య ఉన్న అనుబంధం ఎలాంటిదో అర్థం అవుతుంది.ఎక్కడ ఉండాలి?లివింగ్ రూట్ బ్రిడ్జ్‌ల సమీపంలో గ్రామీణ హోమ్‌స్టేలు, లోక్టక్ సరస్సు వద్ద సరస్సు ఒడ్డున ఉండే వసతి సౌకర్యాలు, జుకో లోయ ప్రయాణంలో పర్వత రహదారులు కనిపించే వసతి ప్రదేశాలు బాగుంటాయి.త్సో మోరీరి సమీపంలోని కొర్జోక్లో అతిథి గృహాలు, క్యాంపులు అందుబాటులో ఉంటాయి. కాస్, సతారా ప్రాంతంలో హోటళ్లు, హోమ్‌స్టేలు ఉంటాయి. ప్రతీ గమ్యస్థానంలో బస చేయడం కూడా ఒక జ్ఞాపకంగా మారిపోతుంది.ఏం చూడాలి?లివింగ్ రూట్ బ్రిడ్జ్‌ల మధ్య ప్రవహించే నీరు, లోక్టక్ సరస్సులో తేలియాడే ఫుమ్డీలు, జుకో లోయలో కనిపించే సీజనల్ పూలు, త్సో మోరీరి నీలిరంగు సరస్సు, కాస్‌లో విరబూసే సీజనల్ పువ్వులుం ఈ ఐదు గమ్యస్థానాల్లో మీరు ఎక్కడా ప్రయాణ అనుభూతిని మిస్ అవరు. ఈ గమ్యస్థానాలను వేగంగా చుట్టేయాలని కాకుండా ప్రశాంతంగా ఆస్వాదించడానికి ్రపాధాన్యత ఇవ్వండి.సందర్శనీయ ప్రదేశాలుఈ ఐదు ప్రదేశాలలో ఒక్కో ప్రదేశం ఒక్కో అనుభూతిని ఇస్తుంది. మేఘాలయలో మనిషి చేతులతో పెంచిన వేర్ల వంతెనలు ప్రకృతిని ఇబ్బంది పెట్టకుండా జీవితాన్ని కొనసాగించే సందేశాన్ని అందిస్తాయి. అలాగే లోక్టక్లో నీటిపై జీవితం, జుకోలో పూల మధ్య మేఘాలు, త్సో మోరీరిలో ఆకాశం సరస్సులో ప్రతిబింబించడం, వర్షాల తరువాత భూమి పూలనే అక్షరాలుగా మార్చుకుని మాట్లాడటం ఇవన్నీ తప్పకుండా జీవితాంతం గుర్తుండిపోయే అనుభవాలే కదా.యాక్టివిటీస్ఈ ప్రయాణంలో రూట్ బ్రిడ్జ్‌పై నడవడం, లోక్టక్ సరస్సులో తేలియాడే ప్రకతి దశ్యాలను చూడటం, జుకో లోయలో మేఘాల మధ్య నడవడం, త్సో మోరీరి సరస్సు తీరంలో పర్వతాల ప్రతిబింబాలను ఆస్వాదించడం, కాస్‌లో సీజనల్ పూల మధ్య ప్రకృతిని గమనించడం ఇవన్నీ ఒక ప్రత్యేక జ్ఞాపకంగా మిగిలిపోతాయి.యాత్ర, బడ్జెట్ వివరాలుఐదు రోజుల ట్రిప్‌లో బడ్జెట్ అనేది గమ్యస్థానాన్ని బట్టి మారిపోతుంది. హైదరాబాద్ నుంచి విమానంలో ప్రయాణించడం, స్థానిక రవాణా, బస, ఆహారం అన్నీ కలిపి బడ్జెట్ ప్రయాణానికి సుమారు రూ.25,000 నుంచి రూ.35,000 వరకు ఖర్చు అవ్వొచ్చు.సాధారణ స్థాయి ప్రయాణ బడ్జెట్‌తో వెళ్తే రూ.40,000 నుంచి రూ.60,000 వరకు, ప్రత్యేకమైన ప్రయాణ అనుభవానికి అయితే రూ.70,000కు పైగా ఖర్చు కావచ్చు. త్సో మోరీరి, జుకో లోయ, లివింగ్ రూట్ బ్రిడ్జ్‌ల వంటి ప్రాంతాల్లో స్థానిక రవాణా, బస ఆధారంగా బడ్జెట్ పెరిగే అవకాశం కూడా ఉంటుంది.బస విషయానికి వస్తే ఒక్క రాత్రికి రూ.1,000–4,000 మధ్యలో బడ్జెట్ పెట్టుకోవడం మంచిది. ప్రీమియం హోటళ్లకు మరింత ఖర్చు కావచ్చు. ఆహారం కోసం రోజుకు సుమారు రూ.500 నుంచి రూ.1,000 వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. మీ రుచికి, ఎంపికకు అనుగుణంగా ఈ ఖర్చులు మారుతాయి.- ఎం.జి. కిశోర్, ప్రయాణికుడుఇవి కూడా చదవండి: బ్రహ్మపుత్రను ‘రెడ్ రివర్’ అని ఎందుకు అంటారో తెలుసా? -
ఈ రాఖీ పండుగకు ఇలాంటి తీపి రెసిపీలను చేసేయండిలా..!
బెంగాలీ చమ్ చమ్కావలసినవి..ఛెనా తయారీకి– చిక్కటి పాలు: 1 లీటరు, నిమ్మరసం: 2 టేబుల్ స్పూన్లు, కార్న్‌ఫ్లోర్: టీస్పూన్, పాకం కోసం– పంచదార: ఒకటిన్నర కప్పులు, నీళ్ళు: 4 కప్పులు, ఏలకుల పొడి: 1/2 టీస్పూన్, కుంకుమపువ్వు: కొన్ని రేకలు, స్టఫింగ్ కోసం: కోవా (3–4 టేబుల్ స్పూన్లు), డ్రైఫ్రూట్స్: పిస్తా, బాదం ముక్కలు, ఎండు కొబ్బరి పొడి, ఫుడ్ కలర్: 2 చుక్కలు.తయారీ..ముందుగా పాలను ఒక గిన్నెలో పోసి బాగా మరిగించండి. పాలు మరిగిన తర్వాత స్టవ్ ఆపి, 2 నిమిషాలు చల్లారాక అందులో నీటిలో కలిపిన నిమ్మరసాన్ని కొద్దికొద్దిగా వేస్తూ పాలు విరిగేలా తిప్పాలి. పాలు, నీరు వేరయ్యాక, ఒక పలచని కాటన్ క్లాత్‌లో వడకట్టి, వెంటనే చల్లని నీటితో కడిగి నీరంతా పోయేలా 30 నిమిషాల పాటు వేలాడదీయాలి. ఇప్పుడు ఈ ఛెనాని ఒక వెడల్పాటి ప్లేట్లోకి తీసుకుని ఒక టీ స్పూన్ కార్న్‌ఫ్లోర్ వేసి అరచేతితో మెత్తగా ఒత్తాలి. రంగు కావాలనుకుంటే ఫుడ్ కలర్ వేసుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని సమానమైన భాగాలుగా చేసుకుని పగుళ్లు లేకుండా కోలగా ఒత్తుకోవాలి. తరువాత ఒక వెడల్పాటి పాత్రలో చక్కెర, 4 కప్పుల నీళ్ళు పోసి మరిగించాలి. చక్కెర కరిగిన తర్వాత పాకం బాగా మరుగుతున్నప్పుడు, తయారుచేసి పెట్టుకున్న ఛెనా రోల్స్‌ను ఒక్కొక్కటిగా నెమ్మదిగా అందులో వేయాలి. ఇవి 15–20 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌పై ఉడికిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. తరువాత పాకం నుంచి చమ్ చమ్‌లను బయటకు తీసి మధ్యలో చిన్నగా గాటు పెట్టాలి. అందులో కొద్దిగా కోవా నింపాలి. చివరిగా ఎండు కొబ్బరి పొడిలో వీటిని దొర్లించి, పైన పిస్తా, బాదం ముక్కలతో అలంకరిస్తే ఎంతో రుచికరమైన బెంగాలీ చమ్ చమ్ సిద్ధం!బనారసీ పాన్ ఫడ్జ్కావలసినవి..ఫడ్జ్ బేస్ కోసం– వైట్ చాక్లెట్: 400 గ్రాములు, స్వీటెండ్ కండెన్స్డ్ మిల్క్: 1 కప్పు, వెన్న: 2 టేబుల్ స్పూన్లు, గ్రీన్ ఫుడ్ కలర్: 2 చుక్కలు, తాజా తమలపాకులు: 8, పాన్ మసాలా (ఫ్లేవర్ కోసం), గుల్కంద్: 3 టేబుల్ స్పూన్లు, స్వీట్ సోంప్: 2 టేబుల్ స్పూన్లు, టూటీ ఫ్రూటీ: 2 టేబుల్ స్పూన్లు, ఎండు కొబ్బరి పొడి: 2 టేబుల్ స్పూన్లు, ఏలకుల పొడి: 1/2 టీస్పూన్, పాన్ ఎసెన్స్: కొన్ని చుక్కలు, గార్నిషింగ్ కోసం: సన్నగా తరిగిన పిస్తా, బాదం, ఎండిన గులాబీ రేకులు, సిల్వర్ ఫాయిల్.తయారీ..ముందుగా ఒక పాత్రలో పార్చ్మెంట్ పేపర్‌ను తీసుకుని దానికి కొద్దిగా వెన్నపూసి పక్కన పెట్టుకోవాలి. తరువాత పాన్పేస్ట్ కోసం బ్లెండర్లో తమలపాకులతో పాటు కండెన్స్డ్ మిల్క్ పోసి, మెత్తగా గ్రైండ్ చేయండి. ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్లు పోసి మరిగించి, దానిపై వేడి తగిలేలా మరొక గిన్నెను ఉంచండి. అందులో తురిమిన వైట్ చాక్లెట్, వెన్న, తయారుచేసి పెట్టుకున్న తమలపాకు–కండెన్స్డ్ మిల్క్ మిశ్రమాన్ని వేయండి. చాక్లెట్ పూర్తిగా కరిగే వరకు కలపండి. ఈ మిశ్రమంలోనే ఒక చుక్క గ్రీన్ కలర్, పాన్ ఎసెన్స్ కలపవచ్చు. తరువాత స్టవ్ ఆపి, ఆ మిశ్రమంలో గుల్కంద్, స్వీట్ సోంపు, టూటీ ఫ్రూటీ, ఎండు కొబ్బరి పొడి, ఏలకుల పొడి వేసి బాగా కలపండి. ఇపుడు సిద్ధంగా ఉన్న ట్రేలోకి ఈ మిశ్రమాన్ని పోసి, గరిటెతో సమంగా ఒత్తుకొని.. పైన తరిగిన పిస్తా, గులాబీ రేకులు, టూటీ ఫ్రూటీ, సిల్వర్ ఫాయిల్‌తో అందంగా అలంకరించండి. ఈ ట్రేని 3 నుంచి 4 గంటల పాటు ఫ్రిజ్‌లో ఉంచి.. ఫడ్జ్ బాగా గట్టిపడిన తర్వాత, పేపర్ సాయంతో బయటకు తీసి, వేడి నీటిలో ముంచి తుడిచిన పదునైన చాక్‌తో చిన్న చిన్న చతురస్రాకార ముక్కలుగా కట్ చేసుకోవాలి. అంతే బనారసీ పాన్ ఫడ్జ్ సిద్ధం. దీనిని గాలి చొరబడని డబ్బాలో ఉంచి ఫ్రిజ్‌లో పెడితే 2 వారాల వరకు తాజాగా ఉంటుంది.ఫిర్నీకావలసినవి..బాస్మతీ బియ్యం: 3 టేబుల్ స్పూన్లు, చిక్కటి పాలు: 1 లీటరు, పంచదార: 1/2 కప్పు, ఏలకుల పొడి: 1/2 టీస్పూన్, కుంకుమపువ్వు: 10–12 రేకలు (పాలలో నానబెట్టినవి), రోజ్ వాటర్: టీస్పూన్, డ్రై ఫ్రూట్స్: బాదం, జీడిపప్పు, పిస్తా ముక్కలుతయారీ..30 నిమిషాల పాటు నానబెట్టిన బాస్మతీ బియ్యాన్ని పూర్తిగా వడకట్టి, నీళ్లు కలపకుండా మిక్సీలో బరకగా గ్రైండ్ చేసుకోవాలి. తరువాత ఒక మందపాటి పాత్రలో లీటరు పాలు పోసి మీడియం ఫ్లేమ్‌పై మరిగించి.. పాలు ఒక పొంగు వచ్చాక.. ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బియ్యం రవ్వను అందులో వేయాలి. సన్నని మంటపై మిశ్రమం చిక్కగయ్యే వరకు కలుపుతూ ఉడికించాలి. బియ్యం రవ్వ పూర్తిగా మెత్తగా ఉడికి, పాలు చిక్కగా అయ్యాక అందులో పంచదార, నానబెట్టిన కుంకుమపువ్వు పాలు, ఏలకుల పొడి వేసి బాగా కలపాలి. పంచదార కరిగే వరకు మరో 5 నిమిషాలు ఉడికించాలి. స్టవ్ ఆపేసి, అందులో రోజ్‌వాటర్ వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇలా తయారైన ఫిర్నీని మట్టి గ్లాసులలో లేదా గాజు బౌల్స్‌లో పోసి, పైన తరిగిన బాదం, పిస్తా ముక్కలతో అలంకరించాలి. దీనిని కనీసం 2–3 గంటల పాటు ఫ్రిజ్‌లో ఉంచి, బాగా కూల్ అయిన తర్వాత తింటే రుచి అద్భుతంగా ఉంటుంది.(చదవండి: హై‘టెక్’ రాఖీ..! చూడ్డానికి చిన్నవే..సర్ప్రైజ్లో మాత్రం..) -
అది మలబద్ధకమేనా? పిల్లలు ఎందుకు ఆపుకుంటారు ?
మా ఐదేళ్ల బాబుకు రోజూ మలవిసర్జన కావడం లేదు. రెండు మూడు రోజులకు ఒకసారి వెళతాడు. మలవిసర్జనకి వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బంది పడుతూ, నొప్పిగా ఉందని ఏడుస్తాడు. ఇంట్లో వాళ్లు పిల్లాడు మొండిగా చేస్తున్నాడంటున్నారు. ఇంకొందరు ఇది మలబద్ధకమే అంటున్నారు. ఏం చేయాలి? – లక్ష్మి, గుంటూరుమీ సందేహం చాలా సహజం. పిల్లలకు మలవిసర్జన సరిగ్గా రాకపోతే తల్లిదండ్రులు ముందుగా ఆందోళన పడేది ఇదే. అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి. రోజూ మలవిసర్జన రాకపోవడం ఒక్కటే మలబద్ధకం కాదు. కొంతమంది పిల్లలకు రోజూ రావచ్చు; మరికొందరికి రెండు రోజులకు ఒకసారి రావచ్చు. మలం మెత్తగా ఉండి, పిల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తుంటే పెద్దగా ఆందోళన అవసరం లేదు. కానీ మలం చాలా గట్టిగా ఉండటం, మలవిసర్జన చేసేటప్పుడు నొప్పి రావడం, బాగా ఒత్తిడి చేయాల్సి రావడం, మలం పూర్తిగా బయటకు రాకపోవడం, పిల్లలు కావాలనే మలవిసర్జన ఆపుకోవడం వంటి లక్షణాలు ఉంటే మాత్రం మలబద్ధకం గురించి ఆలోచించాలి.పిల్లలుఎందుకు ఆపుకుంటారు?ఇక్కడే చాలామంది తల్లిదండ్రులు పిల్లలను తప్పుగా అర్థం చేసుకుంటారు. పిల్లాడు కావాలనే మలవిసర్జన ఆపుకుంటున్నాడని, మొండితనం చేస్తున్నాడని అనుకుంటారు. కానీ చాలా సందర్భాల్లో అసలు కారణం నొప్పి భయం. ఒకసారి మలం చాలా గట్టిగా వచ్చి నొప్పి కలిగితే, మళ్లీ విసర్జన చేస్తే అదే నొప్పి వస్తుందని పిల్లలు భయపడతారు. అందుకే మలవిసర్జన వచ్చినా ఆపుకుంటాడు. అలా ఆపుకోవడంతో మలం మరింత గట్టిగా మారుతుంది. తర్వాత విసర్జన చేసేటప్పుడు ఇంకా ఎక్కువ నొప్పి వస్తుంది. దీంతో మళ్లీ ఆపుకుంటాడు. ఇలా నొప్పి, భయం, విసర్జన ఆపుకోవడం ఒక చక్రంలా మారుతుంది. అందుకే పిల్లలను తిట్టడం లేదా బలవంతంగా మరుగుదొడ్డిపై కూర్చోబెట్టడం సమస్యను మరింత పెంచవచ్చు. ముందుగా పిల్లవాడు ఎందుకు మలవిసర్జన ఆపుకుంటున్నాడో అర్థం చేసుకోవాలి.పండ్లు పెడితే తగ్గిపోతుందా?పండ్లు, కూరగాయలు, పీచు ఎక్కువగా ఉండే ఆహారం మలబద్ధకం తగ్గడానికి సహాయపడుతుంది. కానీ కేవలం పండ్లు పెట్టడంతోనే సమస్య వెంటనే పూర్తిగా తగ్గిపోతుందని అనుకోకండి. పిల్లల ఆహారంలో పండ్లు, కూరగాయలు, పప్పులు, సంపూర్ణ ధాన్యాలు వంటి పీచు పదార్థాలు ఉండేలా చూడాలి. అలాగే పిల్లలకు సరిపడా నీరు అందాలి. రోజూ కొంతసేపు ఆడుకోవడం, నడవడం వంటి శారీరక కదలికలు కూడా అవసరం.పాలు ఇస్తే బలంగా పెరుగుతారా?పాలు పిల్లల ఎదుగుదలకు అవసరమే. కానీ అవసరానికి మించి పాలు మాత్రమే ఇస్తూ, ఇతర ఆహారాన్ని తగ్గించడం మంచిది కాదు. అలా చేస్తే పీచు పదార్థాలు తక్కువగా తీసుకునే అవకాశం ఉంటుంది. అందుకే పాలు మాత్రమే కాకుండా పండ్లు, కూరగాయలు, పప్పులు, ధాన్యాలతో కూడిన సమతుల ఆహారం ఇవ్వాలి.అలవాటు కూడా ముఖ్యమే?ముఖ్యంగా ఉదయం అల్పాహారం తర్వాత పిల్లలను కొంతసేపు ప్రశాంతంగా మరుగుదొడ్డిపై కూర్చోబెట్టే అలవాటు చేయవచ్చు. తొందరపెట్టకుండా, భయపెట్టకుండా ప్రశాంతంగా ఉండేలా చూడాలి. మరుగుదొడ్డిపై కూర్చున్నప్పుడు పిల్లల కాళ్లు వేలాడకుండా కింద చిన్న పీట ఉంచితే మంచిది. కాళ్లకు సరైన ఆధారం ఉండటం వల్ల మలం సులభంగా బయటకు రావడానికి సహాయపడుతుంది.మలవిసర్జన చేయకపోతే తిట్టాలా? అసలు వద్దు. మలబద్ధకంలో పిల్లలను తిట్టడం, అవమానించడం, బలవంతం చేయడం వల్ల వాళ్లలో మలవిసర్జన చేయడంపై భయం మరింత పెరగవచ్చు. బదులుగా పిల్లలను ప్రోత్సహించాలి. విసర్జన చేయడానికి ప్రయత్నించినా ప్రశంసించాలి. సమస్య గురించి పిల్లలతో ఓపికగా మాట్లాడాలి.మందులు ఇవ్వొచ్చా?అవసర మైనప్పుడు వైద్యుల సూచనతో మందులు ఇవ్వవచ్చు. ముఖ్యంగా మలం చాలా గట్టిగా ఉండి పిల్లలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నప్పుడు లేదా సమస్య పదేపదే వస్తున్నప్పుడు వైద్యుడు తగిన చికిత్స సూచించవచ్చు. అయితే ఇంట్లో పెద్దలకు ఉపయోగించిన మందులను పిల్లలకు స్వయంగా ఇవ్వకండి. అలాగే ఎవరో చెప్పారని మలబద్ధకం మందులు మొదలుపెట్టి, సమస్య తగ్గగానే మీకు మీరే ఆపేయడం కూడా మంచిది కాదు. పిల్లల వయసు, బరువు, సమస్య తీవ్రతను బట్టి చికిత్స మారుతుంది.వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలి?పుట్టినప్పటి నుంచే తీవ్రమైన మలబద్ధకం ఉండటం, పుట్టిన తర్వాత మొదటి రెండు రోజుల్లో మలం రాకపోవడం, పొట్ట ఎక్కువగా ఉబ్బడం, తీవ్రమైన పొట్ట నొప్పి, పదేపదే వాంతులు, మలంలో రక్తం కనిపించడం, బరువు సరిగా పెరగకపోవడం, జ్వరం, పిల్ల చాలా నీరసంగా కనిపించడం లేదా ఇంట్లో తీసుకున్న జాగ్రత్తలతో సమస్య తగ్గకుండా పదేపదే వస్తుండటం వంటి లక్షణాలు ఉంటే పిల్లల వైద్యుడిని సంప్రదించాలి.చివరగా ఒక మాట... పిల్లవాడు విసర్జన ఆపుకుంటున్నాడంటే ముందుగా అతను ఎందుకు అలా చేస్తున్నాడో తెలుసుకోండి. చాలాసార్లు దాని వెనుక మొండితనం కాదు. నొప్పి, ఆ నొప్పిపై భయం ఉంటాయి. ఆ భయాన్ని అర్థం చేసుకోండి. మలబద్ధకాన్ని చిన్న సమస్యగా కాకుండా.. పిల్లల మాట వినండి, కారణాన్ని అర్థం చేసుకోండి, సరైన సమయంలో పరిష్కరించండి.- డా. కె. పవన్ కుమార్, సీనియర్, పీడియాట్రిషియన్, పీడియాట్రిక్ అలర్జిస్ట్, ప్రొఫెసర్ ఆఫ్ పీడియాట్రిక్స్ -
పిల్లలపై ర్యాంకుల భారం మోపవద్దు..! హీరో సూర్య పేరెంటింగ్ టిప్స్
విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీతో మంచి హిట్ అందుకున్న హీరో సూర్య తల్లిదండ్రులను పిల్లలు విషయంలో అలా వ్యవహరించొద్దంటూ చక్కటి పేరెంటింగ్ సలహాలు సూచనలు ఇచ్చారు. పిల్లల పెంపకంలో ఆ విషయంలో ప్రతి పేరెంట్‌ని ఆ విధంగా ఉండొద్దని నొక్కి చెప్పారు. అందరి తల్లిదండ్రులు పిల్లల మార్కుల విషయంలో ఎలా ప్రవర్తిస్తే ప్రయోజనకరంగా ఉంటుందో వివరించడమే గాక తండ్రిగా తన అనుభవాన్ని కూడా షేర్ చేసుకున్నారు. మరి అవేంటో చూసేద్దామా..!.ఆయన ఓ మీడియా ఇంటర్వ్యూలో పిల్లల మార్కుల విషయంలో తల్లిదండ్రుల ఆలోచన తీరు గురించి చాలా ఆసక్తికరంగా మాట్లాడారు. బాల్యాన్ని ఆస్వాదించకుండా వాళ్లను ఎలా పోటీ వాతావరణంలోకి తోసేస్తున్నారో మాట్లాడారు. దయచేసి పిల్లలను పెంచేటప్పుడు ప్రతి పేరెంట్ వారి బాల్యాన్ని కోల్పోయేలా అస్సలు చేయొద్దని హితవు పలికారు. ఎందుకంటే విద్యావ్యవస్థలో అధిక కటాఫ్ మార్కుల పట్ల ఉన్న క్రేజ్‌పై తల్లిదండ్రల్లో ఉండే ఆందోళన తెలియకుండానే పిల్లలకు సంక్రమిస్తుందని అన్నారు. దాంతో వాళ్లకు 18 మార్కుల వస్తే సంతోషంగా ఉండదు..ఫస్ట్ అయితేనే హ్యాపీ అనే ఆలోచనకు వచ్చేస్తారు. తెలియకుండానే మొగ్గదశలోనే వారిలో ఆ భావన నాటుకుపోతోందన్నారు. అధిక కటాఫ్ మార్కులనేవి తీవ్రమైన పోటీకి దారితీసి..పిల్లల్లో తెలియని ఒత్తిడిని కలుగజేస్తాయి. యూనివర్సిటీలు 99.9 శాతం కటాఫ్ అడుగుతుంటాయి, అక్కడ చాలా పోటీ ఉంటుంది, అని పిల్లల్లో నూరిపోస్తుంటారు. దాంతో వాళ్లు తమ మధురమైన బాల్యాన్ని ఆస్వాదించకుండా చేసేస్తాం. నిజానికి దాన్ని ఎలా ఛాలెంజింగ్‌గా తీసుకుంటూ బాల్యాన్ని కూడా ఎలా ఎంజాయ్ చేయాలో వాళ్లకు నేర్పించమని అన్నారు. అలాగే పిల్లల సక్సెస్‌ని జరుపుకునే విధానంపై కూడా మండిపడ్డారు. "మా పిల్లాడికి ఇన్ని మార్కులు వచ్చాయంటూ పక్కంటి వాళ్లతో గర్వంగా చెప్పడంతో వాళ్ల బిడ్డ మానసిక పరిస్థితి ఎలా ఉంటుందనేది ఆలోచించరు. సక్సెస్‌ని ఆనందంగా సెలబ్రేట్ చేసుకోవచ్చు..పక్కవాళ్లకు..తక్కువ మార్కులు వచ్చే పిల్లాడి మనసులో బాధ కలుగజేసేలా కాదని." అంటున్నారు హీరో సూర్య. అదేసమయంలో తాను పోటీతత్వానికి వ్యతిరేకం కాదని అన్నారు. తీవ్రమైన పోటీతత్వం మంచిదే. కానీ దాని విషయంలో అతి అస్సలు వదని అన్నారు. ఈ సందర్భంగా తన పిల్లల విషయంలో తండ్రిగా తాను ఎదుర్కొన్న అనుభవాన్ని గుర్తుచేసుకున్నారు సూర్య. కుమారుడి స్పోర్స్ డే ఘటన..తన కుమారుడు దేవ్ పాఠశాల స్పోర్ట్స్ డే నాటి ఒక సంఘటనను ఆయన గుర్తుచేసుకున్నారు. పిల్లలు సహజంగానే ఎంతటి సానుభూతితో ఉంటారో అర్థం చేసుకోవడంలో ఆ సంఘటన తన దృక్పథాన్ని మార్చిందని ఆయన చెప్పారు. పిల్లలు పరుగెత్తుకుంటూ వెళ్లి, ఒక వాటర్ బాటిల్ తీసుకుని, తిరిగి ముగింపు రేఖకు చేరుకోవాల్సిన ఒక పరుగు పందెంలో దేవ్ పాల్గొన్నట్లు చెప్పారు. "అయితే దేవ్ అత్యంత వేగంగా పరిగెత్తే వారిలో ఒకడు, కానీ ఆ రోజు పరుగుపందెంలో తనకిష్టమైన బ్లూ కలర్ బాటిల్ తోపాటు పింక్ కలర్ బాటిల్ తీసుకొచ్చాడు. దాంతో అతడు అందులో గెలవలేకపోయాడు. ఆ తర్వాత నాతో అప్పా నాకు నీలం రంగు ఇష్టం కాబట్టి వెళ్లి నా నీలం రంగు బాటిల్ తీసుకున్నాను, కానీ అక్కకు గులాబీ రంగు అంటే ఇష్టం అందుకని ఆమె కోసం ఇది కూడా తీసుకొచ్చానని చెప్పాడు. ఇప్పుడు మన దగ్గర రెండు బాటిల్స్ ఉన్నాయి ఒకటి నా కోసం, ఇంకొకటి అక్క కోసం అని అనందంగా అన్నాడు. ఫలితం కంటే నా కుమారుడు తన అక్కు ఇచ్చిన ప్రాధాన్యత మనసుకు హత్తుకుంది. అలాగే తన సహా విద్యార్థి పట్ల దేవ్ ప్రవర్తించిన తీరు కూడా నన్ను ఆకట్టుకుందన్నారు. ఎందుకంటే దేవ్ తాను ఓడిపోయానని బాధపడకుండా తన బలాలు గుర్తిస్తూనే తరగతిలో అత్యంత వేగంగా పరుగెత్తినందుకు ఆ అబ్బాయిని ప్రశంసించాడు. పైగా అతడు అత్యంత వేగంగా పరిగెట్టగలడు, నేను బొమ్మలు బాగా గీయగలను అని అన్నాడు. అంతేగాదు అతడు నా అంత బాగా గీయలేడు నాన్న అని చెప్పిన తీరు నన్ను ఎంతగానో కదిలించింది." అని సూర్య అన్నారు. ఇక్కడ ఆ విధంగా ఆలోచించమని దేవ్‌కి ఎవ్వరూ శిక్షణ ఇవ్వలేదు, అయినా తను కొన్ని విషయాల్లో తన స్నేహితుడు కొన్ని విషయాల్లో రాణించగలడు అని చెప్పగలిగే ఒక స్పష్టత అతడికి ఉండటం నిజంగా అభింనందించదగ్గ విషయం అని అన్నారు సూర్య. కాగా సూర్య జ్యోతిక దంపతులకు 2007లో దియా అనే కుమార్తె, 2010లో దేవ్ అనే కుమారుడు జన్మించారు. తమ పిల్లలు బీ-కరికులం పాఠశాలల్లో చదవడం కోసం చెన్నై నుంచి ముంబైకి మకాం మార్చేశారు ఈ దంపతులు.(చదవండి: అనీమియా @ డిమెన్షియా!) -
30 నిమిషాల నడకతో.. 33 కిలోల బరువు! అదెలాగంటే..
వాకింగ్ అనేది ఫిట్నెస్ పరంగా మంచిదని అందరికీ తెలిసిందే. బరువు తగ్గడానికి బెస్ట్ చాలా బెస్ట్ అని చెబుతారు కానీ దీంతోపాటు కార్డియో వ్యాయామాలు, ఇతర వేగవంతమైన వర్కౌట్లు, డైట్ వంటివి తోడైతేనే ప్రభావవంతంగా ఉంటుంది. అలాంటిది ఈ మహిళ చాలా తక్కువ శ్రమతో.. అది కూడా జస్ట్ 30 నిమిషాల వాకింగ్‌తో ఏకంగా 33 కిలోలు తగ్గి అందర్నీ ఆశ్చర్యఎలానో చూసేద్దామా..బరువు తగ్గడానికి వాకింగ్‌కి మించి బెస్ట్ వ్యాయామం ఇంకొకటి ఉండదు. కాబట్టి దాన్నే ఇలా చేస్తే త్వరిగతిన కేలరీలు కరిగి బరువు సులభంగా తగ్గుతామని చెబుతోంది ఈ యోగా నిపుణురాలు శ్రద్ధ. ప్రతి రోజూ జస్ట్ 30 నిమిషాలు ఇలా నడిస్తే..బరువు అమాంతం తగ్గుతారని చెబుతోంది. తాను అలా చేసే 33 కిలోలకు పైనే బరువు తగ్గినట్లు వెల్లడించింది. అదెలాగో ఇన్‌స్ట్రాగ్రామ్‌లో వీడియో రూపంలో షేర్ చేసి మరి చూపించారు. వీడియోలో ట్రెడ్మిల్ 15% వాలులో ఉండేలా చూసుకుంటూ..వాక్ చేయాలి. అంటే ఎత్తు మీద నుంచి వాకింగ్ చేయడం అన్నమాట. ఇలా వేగంగాచేస్తే చాలట. గంటకు మూడు లేదా 3.5 కిలోమీటర్ల వేగం చాలని అంటోందామె. జస్ట్ 30 నిమిషాల పాటు మూడు సార్లు చేస్తానని వెల్లడించింది. అలాగే వారానికి మూడు సార్లు వెయిట్ ట్రైనింగ్ చేస్తానని పేర్కొంది. మొదటగా 20 కిలోలు తగ్గినప్పుడూ వారానికి ఐదుసార్లు చేసినట్లు తెలిపింది. ఇక్కడ చేతులు ప్రీగా ఉండాలని హెచ్చరిస్తోంది. ట్రెడ్మీల్ని గట్టిగా అస్సలు పట్టుకోకూడదని చెబుతోంది యోగా నిపుణురాలు శ్రద్ధ. ఇదేలా ఉపకరిస్తుందంటే..ట్రెడ్‌మిల్‌తో ఫిట్నెస్ స్థాయి లక్ష్యాలకు అనుగుణంగా వ్యాయామం రూపొందించుకోవడానికి వేగాన్ని, వాలుని సులభంగా సర్దుబాటు చేసుకోవచ్చు. వాలుగా నడవడం వల్ల ఎక్కువ వేగం అవసరం లేకుండానే వ్యాయామ తీవ్రత పెరుగుతుంది. ఇది ముఖ్యంగా కాళ్లు, పిరుదలలో ఎక్కువగా కండర సముహాలను ఉత్తేజపరుస్తుంది. అంటే చదునైనా ఉపరితలంపై నడవడంతో పోలిస్తే..ఎక్కువ కేలరీలు ఖర్చవుతాయి.15% నిటారు వాలు వర్సెస్ చదునైన ఉపరితలంపై పోల్చితే దాదాపు రెట్టింపు కేలరీలు ఖర్చు అవుతాయని అంటున్నారు. అచ్చం జాగింగ్ మాదిరిలా కేలరీల ఖర్చు అవుతాయట. ఇలా నడవడం వల్ల శరీరంపై ఒత్తిడి తగ్గడమే గాక కీళ్లపై ప్రభావం కూడా తగ్గుతుందట.ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే..15% వాలు చాలా నిటారుగా ఉంటుంది కాబట్టి వేగంగా ప్రారంభిస్తే వెన్నుపై తీవ్ర ప్రభావం చూపించే ప్రమాదం ఉందనేది గ్రహించాలి.ట్రెడ్మిల్ వేగాన్ని మితంగా గంటకు 2.0 నుంచి 2.5 మైళ్లకు సెట్ చేయాలి.మొదట్లో 15% వాలు చాలా తీవ్రంగా అనిపిస్తే, 5% లేదా 7% తో ప్రారంభించి, కొన్ని వారాల పాటు క్రమంగా వాలును పెంచడానికి ప్రయత్నించాలి.వెనక్కి వాలడం, ట్రెడ్మిల్ హ్యాండిల్స్‌ను గట్టిగా పట్టుకోవడం మానుకోవాలి.ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకుని వాలుగా నడవడాన్ని దినచర్యలో భాగం చేసుకుని స్థిరంగా కొనసాగిస్తే.. బరువు తగ్గడం చాలా సులభం అని అంటున్నారు ఆరోగ్య నిపుణులు .గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: సల్మాన్ ఖాన్ సోదరి అర్పిత ఖాన్ ఇల్లు ఎలా ఉంటుందో తెలుసా..!ఏకంగా క్రికెట్, ఫుట్‌బాల్..) -
2026లో ఉంటూనే.. 1996 అనుభూతుల కోసం వెతుకులు..
తరం మారేకొద్దీ మార్పులు సహజం. కాని ఇప్పుడున్న జెన్ జీలు అన్నింటినీ ట్రై చేస్తున్నారు. 90ల కాలాన్ని నిజంగా అనుభవించినవాళ్లు ఇప్పుడు పాత జ్ఞాపకాలను గుర్తు జేసుకుంటుంటే, ఆ రోజుల్ని ఎప్పుడూ చూడని ఈ తరం జెన్ జీలు ఓసారి ప్రయత్నించి చూస్తే పోలా అన్నట్టు వైఖరి మార్చుకుంటున్నారు. ప్రముఖ పత్రిక ది గార్డియన్ చేసిన పరిశోధనలో జెన్ జీల గురించి ఆశ్చర్యకరమైన నిజాలు వెల్లడయ్యాయి. ఫోన్ లో చాటింగ్, గేమింగ్, సర్ఫింగ్‌కు సెలవు చెప్పి డిజిటల్ వరల్డ్ నుంచి డిటాక్స్ అవుదామని ప్రయత్నిస్తున్నారు. ఒకప్పుడు సాయంత్రమైతే చాలు... ప్రతి ఖాళీ స్థలమూ ఓ చిన్నసైజు స్టేడియంలా తయారయ్యేది. ఆటలంటే ఆసక్తి లేకపోతే సైకిల్లో స్నేహితుడిని ఎక్కించుకుని వాక్‌మెన్ లో ఇయర్ బడ్స్‌ను ఇద్దరు చెరొకటి తగిలించుకుని పాటలు వింటూ సూరీడు పొద్దు పొడిచేదాకా షికార్లు చేసేవారు. ఇప్పుడు జెన్ జీలు అదే రకపు జీవనశైలిని తమదైన శైలిలో తిరిగి సృష్టించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇదే ట్రెండ్ వైరల్ అవుతోంది.నోస్టాలజీకి వెల్కమ్సోషల్ మీడియా నుంచి పూర్తిగా దూరంగా ఉండాలని జెన్ జీలు భావించడం లేదు. తమ ఇష్టాలను, అభిప్రాయాలను వ్యక్తీకరించాలనుకుంటున్నారు. టిక్‌టాక్, ఫేస్బుక్, ఇన్ స్టాగ్రాంలో వేలాదిమంది యువత 90ల కాలం నాటి అలవాట్లు, వేషధారణతో కనిపిస్తూ ఆ కాలాన్ని రీక్రియేట్ చేస్తున్నారు. యూఎస్‌లో అయితే యువత ఐఫోన్ ను పక్కన పెట్టి డిజిటల్ కెమెరాలు, స్పాటిఫైకి బదులు ఐపోడ్స్, మ్యూజిక్ కీబోర్డ్‌కి బదులు సంగీత వాయిద్యాలు, నోట్స్ యాప్స్‌కి బదులు కాగితంపై రాతలు, గ్రూప్ చాట్స్‌కి బదులు ఉత్తరాలు, ఆన్ లైన్ రీడింగ్‌కు బదులు పుస్తకాలు, క్రాస్ వర్డ్స్, స్కెచ్ బాక్సులు, వినైల్ ప్రింటింగ్లు, గ్రీటింగ్ కార్డ్స్ ఇలా..2026ని కాస్తా 1996లో మార్చేసుకుంటూ కొత్త అనుభూతిని పొందుతున్నారు. ఈ ట్రెండ్‌ను ’అనలాగ్ బ్యాగ్’ అంటూ పరిగణిస్తున్నారు.అగ్రదేశాలలో..అమెరికాలో ఈ అనలాగ్ బ్యాగ్ ట్రెండ్ స్పష్టంగా కనిపిస్తోంది. న్యూయార్క్‌లో ఓ మొబైల్ రహిత కార్యక్రమం నిర్వహించారు. ఆఫ్‌లైన్ డేటింగ్ నుంచి చిన్నచిన్న కళల వరకు నేర్చుకోవడానికి విద్యార్థులు ఆసక్తి చూపారు. అక్కడ పాఠశాలలో మొబైల్ అనుమతులపై పెద్ద చర్చ జరుగుతోంది. జపాన్ లో కూడా రెట్రో సంస్కృతి మరో రూపం దాల్చింది. అక్కడ డిజిటల్ కెమెరాలను వదిలి ఫిల్మీ కెమెరాల వైపు ఆసక్తి చూపుతున్నారు. వస్త్రధారణలో కూడా రెట్రో స్టైల్æను అనుసరిస్తున్నారు. ఆశ్చర్యమేమిటంటే ఈ మార్పు కూడా సోషల్ మీడియా ద్వారానే వేగం పుంజుకుంటోంది. అంటే డిజిటల్ ప్రపంచమే అనలాగ్ హాబీలకు కొత్తతరం అభిమానులను తీసుకొస్తోందన్నమాట.మనదేశంలో..మనదేశంలో కూడా జెన్ జీల లైఫ్ స్టైల్లో మార్పు కనిపిస్తోంది. ఆఫ్‌లైన్ మీటింగ్స్, స్క్రీన్ టైం తగ్గించుకోవడం, 90ల కాలాన్ని రీక్రియేట్ చేస్తూ అప్పటి పాటలకు డ్యాన్సులు వేస్తూ ఇన్ స్టాలో పోస్ట్ చేయడం, పుస్తకం పఠనం, పాత వస్తువులను కొత్తగా అలంకరించడం, ఎంబ్రైడరీ, బేకింగ్, క్లే పాట్ వర్క్స్ వంటి పనులపై ఆసక్తి చూపుతున్నారు. ఢిల్లీ, ముంబై వంటి నగరాల్లో కూడా ఆఫ్‌లైన్ మీటింగ్ క్లబ్స్, థీమ్ పార్టీలు, ప్రత్యక్ష పరిచయాలపై యువత ఆసక్తి చూపుతోంది.డిజిటల్ వరల్డ్‌లో నిరంతర నోటిఫికేన్లు, రోజుకో ఏఐ టూల్‌తో వచ్చే ప్రయోగాలు, ఎప్పుడూ ఆన్ లైన్ లో ఉండాల్సిన ఒత్తిడి, యువతలో పెరుగుతున్న అసంతృప్తి వాళ్లను 90ల కాలం వైపు ఆసక్తిచూపేలా చేశాయి. డిజిటల్‌గా కనెక్ట్ అవ్వచ్చు కాని ఎప్పుడూ మొబైల్ స్క్రీన్ కే పరిమితం కావాల్సిన పనిలేదని యువత చెప్పకనే చెబుతోంది. -
మహిళలూ.. ఆ విషయాలకు క్షమాపణ చెప్పొద్దు..!
భారతీయ అమ్మాయిలకు చిన్నప్పటి నుంచి క్షమాపణలు చెప్పడం నేర్చుకుంటుంటారు. గదిలో గట్టిగా నవ్వినందుకు. ఎక్కువుగా తిన్నందుకు, ఎవరికైనా నొప్పి కలిగినప్పుడు, వద్దని చెప్పాలనుకున్నప్పడు, భావోద్వేగాలను వ్యక్తపరిచనిందుకు ఇలా ప్రతిదాంట్లో క్షమాపణలు చెబుతుంటారు. నిజానికి సారీ వాళ్ల లైఫ్‌లో భాగమైపోతుంది. అదొక నిశబ్ద శిక్షణగా మారిపోతుంది. ఇది ఒకరకంగా తమను తాము చిన్నవారిగా చేసుకునే అలవాటుగా మారిపోతుంటుంది. ముఖ్యంగా మహిళలు క్షమాపణలు చెప్పేలా చేస్తున్న మూడు విషయాలు ఏంటో తెలుసా అంటూ వాటి గురించి వివరించారు సైకాలజీ నిపుణులు. మరి అవేంటో తెలుసుకుందామా..!.మన భారతీయ సమాజంలో అమ్మాయిల కోసం చాలా ఎక్కువగా నియమాలు విధిస్తుంటారు. వాటిలో కొన్ని.. గట్టిగా నవ్వొద్దు, గట్టిగా మాట్లాడకు, ఎక్కువగా తినకు, అలా కూర్చోకు, ఇవి వేసుకోవద్దు, ఆత్మవిశ్వాసంతో ఉండకు ..అలా చేస్తే నిన్ను అహంకారిగా అనుకునే ప్రమాదం ఉందంటూ కట్టడి చేస్తుంటారు చాలామంది. ఆఖరికి సైలెంట్ ఉన్నా, తన అభిప్రాయాలకే కట్టుబడి ఉన్నా, అందరితో సరదాగా ఉన్న ఇలా ప్రతిదాంట్లో ఆంక్షలు ఉంటాయి. నిజానికి ఇవి మనల్ని అలసిపోయేలా చేసేవి, ఒత్తిడికి గురిచేసేవి. వాటన్నింటి వెనుక ఉన్న ఉద్దేశ్యం.. ఒక్కటే నువ్వు సహజంగా ఉన్న తీరు అంత సరైనది కాదు అని చెప్పడమే అని అంటున్నారు సైకాలజీ నిపుణులు. ఈ ప్రపంచంలో ఇమడటానికి ఇవే అర్హతలంటే వాటిని తప్పక వ్యతిరేకించాలని అంటున్నారు. ఇతరుల కోసం నిన్ను నువ్వు మార్చుకోవాల్సి అవసరం లేదని చెబుతున్నారు. నీ చుట్టూ ఉన్నవారి సౌకర్యం కోసం నీ వ్యక్తిత్వాన్ని మార్చుకోవాల్సిన పనిలేదు. నువ్వు ఎలా ఉన్నావో అలా ఉన్నందుకు అస్సలు సారీ చెప్పాల్సిన పనిలేదంటున్నారు. తమను తాము విజయవంతంగా అణచివేసుకుని ఇతరుల ఆమోదాన్ని పొందిన మహిళలు ఈ ప్రపంచానికి అవసరం లేదని, తమను తాము ఉన్నది ఉన్నట్లుగా, సంపూర్ణంగా, ఎలాంటి సంకోచం లేకుండా వ్యక్తపరిచే ధైర్యం ఉన్న మహిళలే కావాలని చెబుతున్నారు మానసిక నిపుణులు. అలాగే భావోద్వేగపూరితంగా ఉన్నందుకు క్షమాపణలు చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే అమ్మాయిలు స్వభావరీత్యా భావోద్వేగపూరితంగా ఉంటారు. మన భారతీయ సమాజం తరతరాలుగా అలాంటి భావోద్వేగాన్ని వ్యక్తపరచడాన్ని సిగ్గుపడే అంశంగా చెబుతుంటారు. ఉదాహరణకు సినిమా చూసి ఏడవడం బలహీనత, అతిగా ఆలోచించడాన్ని వ్యక్తిత్వ లోపంగానూ, విషయాలను లోతుగా అనుభూతి చెందడాన్ని డ్రామాగా, ప్రతిదానికి బాధపడటాన్ని సున్నితత్వంగా చూస్తుంటారు. ఈ భావాలను వ్యక్తపరచడం అనేది సిగ్గుపడే విషయం కాదని నొక్కి చెబుతున్నారు. అవేమి లోపాలు కాదని స్త్రీలను లోతైన సానుభూతిపరులుగా, లోతైన అనుబంధం ఉన్నవారుగా, లోతైన మానవత్వం ఉన్నవారుగా చూసే గుణాలని అన్నారు. అలాగే "కాదు" అని చెప్పేందుకు కూడా క్షమాపణ వద్దనే చెబుతున్నారు. సహజంగా "కాదు" అని చెప్పే అమ్మాయిని సంస్కారహీనురాలుగా, మొండిది, నిర్దయురాలు, స్వార్థపరురాలుగా ముద్రవేసేస్తుంటారు. కానీ ఇక్కడ కాదు అనేది మిమ్మల్ని గౌరవించుకుంటున్నారని అర్థమట. మీకు సరిగా అనిపించని విషయాలకు నిర్మొహమాటంగా కాదు అని చెప్పడమే సరి అని అంటున్నారు. అంటే ఒక పరిస్థితికి, ఒక అభ్యర్థన, ఒక సంబంధానికి ఆత్మగౌరవాన్ని, భద్రతను లేదా శాంతిని పణంగా పెట్టమని కోరే దేనికైనా కాదు అని చెప్పడం అంటే.. ఆమె తాను ముఖ్యమైనదాన్ని అని చెప్పే గీతను నిర్మిస్తున్నట్లు భావం అని అంటున్నారు. అంతేగాదు ఆమె సౌకర్యం, హద్దులు ముఖ్యమైనవని చెప్పడమే అని అంటున్నారు. అందుకే కాదు అని చెప్పడంలో తప్పు లేదు కాబట్టి అందుకోసం క్షమాపణ చెప్పొద్దు. అలాగే నిజాయితీగా ఉన్నందుకు క్షమాపణ చెప్పకండి. అందువల్ల మీరు మీలా ఉండటం, మీ భావాలను అనుభూతి చెందడం, కాదు అని చెప్పడం అనేవి మానవ విలువలు. ఇవి మన ఆత్మగౌరవం, హుందాతనం, అవగాహనతో పాతుకుపోయిన విలువలు అని నొక్కి చెబుతున్నారు మానిసిక నిపుణులు. సో "సారీ" చెప్పేటప్పుడూ ఆలోచించండి..వనితలు..!. -
వంటింట్లోనే రెస్టారెంట్ రుచి.. ఈ రెసిపీలు ట్రై చేయండి!
రోజూ ఒకే రకమైన వంటకాలతో బోర్ కొడుతుందా? అయితే ఈసారి కాస్త వెరైటీగా, ఇంట్లోనే సులభంగా చేసుకునే రుచికరమైన వంటకాలను ట్రై చేయండి. పనసకాయ దమ్ బిర్యానీ, ఆకాకరకాయ వేపుడు, సబుదానా వడ.. మూడు వంటకాలూ రుచితో పాటు మీ భోజనానికి మంచి వెరైటీని తీసుకొస్తాయి.సబుదానా వడకావలసినవి:సగ్గుబియ్యం: కప్పు,బంగాళాదుంపలు: 2 పెద్దవి (ఉడికించి మెత్తగా చిదుముకోవాలి),వేయించిన పల్లీల పొడి: 1/2 కప్పు,పచ్చిమిర్చి: 3 (సన్నగా తరిగినవి),అల్లం తరుగు: టీస్పూన్,జీలకర్ర: టీస్పూన్,నిమ్మరసం: టీస్పూన్,కొత్తిమీర తరుగు: 2 టేబుల్ స్పూన్లు,ఉప్పు: రుచికి సరిపడా,నూనె: వేయించడానికి సరిపడా.తయారీ:ముందుగా సగ్గుబియ్యాన్ని 2–3 సార్లు శుభ్రంగా కడిగి, నీళ్లు పోసి కనీసం 4 నుంచి 5 గంటలు నానబెట్టాలి.తర్వాత అదనంగా ఉన్న నీటిని వంపేయాలి.తరువాత ఒక వెడల్పాటి గిన్నెలో బాగా నానిన సగ్గుబియ్యం, ఉడికించి, చిదుముకున్న బంగాళాదుంపలు, పల్లీల పొడి, పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర, కొత్తిమీర, నిమ్మరసం, ఉప్పు వేసి చపాతీ పిండిలా బాగా కలుపుకోవాలి.చేతులకు కొద్దిగా నూనె లేదా నీళ్లు రాసుకుని, మిశ్రమాన్ని చిన్న నిమ్మకాయ సైజు ఉండలుగా చేసి, అరచేతిలో పెట్టి వడలాగా ఒత్తుకోవాలి.మందం ఎక్కువగా లేకుండా, పగుళ్లు రాకుండా చూసుకోవాలి. తరువాత కడాయిలో నూనె వేడి చేసి.. మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి వడలను ఒక్కొక్కటిగా వేయాలి.ఒక నిమిషం పాటు కదపకుండా ఉంచి, తర్వాత రెండు వైపులా బంగారు రంగు వచ్చే వరకు వేయించి తీసేయాలి. అంతే వేడి వేడి సబుదానా వడ రెడీ!పనసకాయ దమ్ బిర్యానీకావలసినవి:పచ్చి పనసకాయ ముక్కలు: 250 గ్రాములు,బాస్మతీ బియ్యం: రెండు కప్పులు (నానబెట్టినవి),పెరుగు: 1/2 కప్పు,అల్లంవెల్లుల్లి పేస్ట్: ఒకటిన్నర టీ స్పూన్,కారం: సరిపడా,పసుపు: 1/2 టీ స్పూన్,బిర్యానీ మసాలా: ఒకటిన్నర టీ స్పూన్,ధనియాల పొడి: టీ స్పూన్,ఉల్లిపాయలు: 2 (సన్నగా తరిగి ఫ్రై చేసినవి),పచ్చిమిర్చి: 4 (నిలువుగా చీల్చినవి),పుదీనా, కొత్తిమీర: గుప్పెడు,హోల్ బిర్యానీ దినుసులు, నెయ్యి, నూనె: సరిపడా,నిమ్మరసం: టేబుల్ స్పూన్,ఉప్పు: రుచికి సరిపడా.తయారీ:ఇందుకోసం కుక్కర్లో పనసకాయ ముక్కలు, కొద్దిగా నీళ్లు, పసుపు, పావు టీస్పూన్ ఉప్పు వేసి మీడియం మంటపై ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించి నీళ్లు వడకట్టండి.తరువాత ఈ పనస ముక్కలలో పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, బిర్యానీ మసాలా, ధనియాల పొడి, సగం ఫ్రైడ్ ఆనియన్స్, పచ్చిమిర్చి, కొద్దిగా పుదీనా, కొత్తిమీర, నిమ్మరసం, సరిపడా ఉప్పు, స్పూన్ నూనె వేసి బాగా కలిపి మ్యారినేట్ చేయండి.మరొక పెద్ద పాత్రలో నీళ్లు మరిగించి, అందులో షాజీరా, ఏలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, సరిపడా ఉప్పు, స్పూన్ నూనె వేయండి.నీళ్లు మరిగాక నానబెట్టిన బాస్మతీ బియ్యం వేసి 70 శాతం వరకు ఉడికించి నీళ్లను వడకట్టండి.అనంతరం బిర్యానీ పాత్రలో 2 స్పూన్ల నూనె, స్పూన్ నెయ్యి వేసి మ్యారినేట్ చేసిన పనసకాయ ముక్కలను వేసి సన్నని మంటపై 5 నిమిషాలు మగ్గనివ్వండి.దీనిపైన ఉడికించిన బాస్మతీ బియ్యాన్ని లేయర్‌గా పరవండి. దానిపైన మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, కొద్దిగా నెయ్యి వేయండి.మూతపెట్టి ఆవిరి బయటకు పోకుండా 5 నిమిషాలు మీడియం మంటపై, ఆ తర్వాత 10–12 నిమిషాలు సన్నని మంటపై దమ్ చేయండి. అంతే çఘుమఘుమలాడే పనసకాయ దమ్ బిర్యానీ రెడీ!ఆకాకరకాయ వేపుడుకావలసినవి:ఆకాకరకాయలు: 250 గ్రాములు (సన్నగా కట్ చేసిన ముక్కలు),ఉల్లిపాయ: 1 పెద్దది (సన్నగా తరిగినది),పసుపు: 1/2 టీస్పూన్,కారం: రుచికి తగినట్లు,ధనియాల పొడి: టీస్పూన్,వెల్లుల్లి రెబ్బలు: 6 (కచ్చాపచ్చాగా దంచినవి),ఉప్పు: రుచికి సరిపడా,నూనె: 3 టేబుల్ స్పూన్లు,తాళింపు గింజలు: టీస్పూన్,ఎండుమిర్చి: 2,కరివేపాకు: ఒక చిన్న రెమ్మ.తయారీ:ఆకాకరకాయలను శుభ్రంగా కడిగి, సన్నని చక్రాల్లా లేదా పొడవు ముక్కలుగా కట్ చేసుకోవాలి.తరువాత ఒక మూకుడులో నూనె వేడి చేసి కట్ చేసుకున్న ఆకాకరకాయ ముక్కలు, కొద్దిగా పసుపు, ఉప్పు వేసి బాగా కలపండి. ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌పై దోరగా వేయించండి.ముక్కలు సగం వేగాక, వాటిని బాణలికి ఒకవైపు జరిపి, మిగిలిన నూనెలో తాళింపు గింజలు, ఎండుమిర్చి, దంచిన వెల్లుల్లి, కరివేపాకు వేసి వేయించండి.తర్వాత తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించాలి.ఇప్పుడు ఉల్లిపాయలు, ఆకాకరకాయ ముక్కలన్నింటినీ బాగా కలుపుకోవాలి.చివరగా కారం, ధనియాల పొడి వేసి.. ముక్కలు క్రిస్పీగా అయ్యే వరకు వేయించి దించేయండి.వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని ఈ ఫ్రైౖ తింటే చాలా రుచిగా ఉంటుంది. -
లేత ఆకుపచ్చ బనారసీ చీరలో సచిన్ కూతురు..!
సారా టెండ్యూల్కర్ తన తాజా వోగ్ కవర్ షూట్ కోసం లేత ఆకుపచ్చ బనారసీ చీరలో తళుక్కుమన్నారు. ఆమె తన అందమైన రూపంతో భారతీయ గ్లామర్ సరికొత్త నిర్వచనం ఇచ్చింది. ఆమె సంప్రదాయానికి ఆధునికతను జోడించిన అందమైన బనారసీ చీరలో సరికొత్తగా కనిపించింది. ఆమె సంప్రదాయ చీరకు సొగసైన ఐవరీ కార్సెట్ బ్లౌజ్లో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ ఫ్యాషన్-ఫార్వర్డ్ లుక్‌లో ఆఫ్-వైట్ స్వచ్ఛమైన శాటిన్ సిల్క్, ఆర్గాంజ సిల్క్ కార్సెట్ బ్లౌజ్‌ని జత చేశారు. సారా బ్లౌజ్‌ని ఇది స్ట్రక్చర్డ్, స్ట్రాప్‌లెస్ సిల్హౌట్, స స్వీట్హార్ట్ నెక్ లైన్‌తో డిజైన్ చేశారు. ఈ విధమైన డిజైన సాంప్రదాయ భారతీయ దుస్తులకు ఆధునిక సొబగులను జోడించినట్లుగా సరికొత్తగా ఉంది. ఆమెకు సున్నితమైన పాస్టెల్రంగు అందమైన లుక్‌ని ఇవ్వగా, దానిలో ఉన్న పూలనమునాలు ఆమెను మరింత అందంగా కనిపించేలా చేశాయి. ఆమె ఈ అందమైన లుక్‌కి భారీ అలంకరణకు ఆస్కారం ఇవ్వడకుండా మెడచుట్టూ జాలువారే వజ్రాల నెక్లెస్‌ను, దానికి సరిపోయే వజ్రాల కఫ్‌తో పాటు ధరించింది. అందుకు తగ్గట్టుగా తన రూపాన్ని కూడా అందంగా తీర్చిదిద్దుకుంది. ఇక కురులను చక్కగా ముడి వేసుకుంది. బిగుతైన కార్సెట్ బ్లౌజ్ విత్, సాంప్రదాయ కటన్ సిల్క్ బనారసి చీరల కలయికలో సారా అత్యంత సుందరంగా కనిపించింది. నిజానికి ఈ లుక్ సారాకి చక్కటి హుందాతనాన్ని ఇవ్వడమే ఆధునిక ఫాషన్‌కి ప్రతీకగా నిలిచింది. View this post on Instagram A post shared by VOGUE India (@vogueindia) (చదవండి: అనేక భాషలు నేర్చుకుంటే ఏం జరుగుతుందో తెలుసా..!) -
లెమనేడింగ్ ఏడో రుచి.. కష్టాలను తట్టుకునే శక్తి!
మానవాళికి ప్రకృతి షడ్రుచులను ప్రసాదించింది. శాస్త్రవేత్తలు ఇప్పుడు ఏడో రుచిని కనిపెట్టారు. ఆ ఏడో రుచి పేరే... ‘లెమనేడింగ్’! నిజానికి ఇది రుచి కాదు. కష్టాలు వచ్చినప్పుడు వాటిని సరదాగా తీసుకుని... చేదు అనుభవాల నుండి తీపి అనుభూతులను పొందే జీవన విధానం. ఈ స్వభావం మానవుల్లో మునుపు లేదని కాదు. దాన్నిప్పుడు పరిశోధకులు ఉందని రూఢీగా వెల్లడించారు. చెడు కాలంలోనూ చెదరని గుండెతో ఉండటమే లెమనేడింగ్.‘‘జీవితం మీకు నిమ్మకాయలను ప్రసాదిస్తే, నిమ్మరసమే చేసుకుని తాగండి’’ : 20వ శతాబ్దపు ప్రముఖ అమెరికన్ రచయిత, తత్త్వవేత్త, వ్యాపారవేత్త ఎల్బర్ట్ హబ్బర్డ్ చెప్పిన మాట ఇది. 1909లో ‘లిటరరీ డైజెస్ట్’ అనే పత్రికలో ఎల్బర్ట్ ఇలా రాశారు : ‘విధి తనకిచ్చిన నిమ్మకాయలను తీసుకుని, వాటితో నిమ్మరసం వ్యాపారం మొదలుపెట్టేవాడే అసలైన మేధావి’ – అని. అప్పట్నుంచీ ఈ మాట పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సులలో వాడుకగా వినిపిస్తోంది. నిమ్మరసాన్ని ‘లెమనేడ్’ అంటారు. కనుక ఇది ‘లెమనేడ్ ఫిలాసఫీ’ అయింది. తాజాగా అమెరికన్ శాస్త్రవేత్తలు జరిపిన పరిశీలనలో లెమనేడ్ ఫిలాసఫీ మానవ జీవితానికి ప్రశాంతతను చేకూర్చే మాట నిజమే అని నిర్థారణ అవటం విశేషం!నవ్వుతూ బతకాలిరా..!జీవితాన్ని సరదాగా తీసుకునే అలవాటు వల్ల కష్టాలను తట్టుకునే శక్తి పెరుగుతుందట! కష్టాలు, అడ్డంకులు ఎదురైనప్పుడు మనుషులు ఆ పరిస్థితులకు ఎలా స్పందిస్తారో తెలుసుకోవడానికి ఇటీవల శాస్త్రవేత్తలు జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. అధ్యయనం కోసం వారు కోవిడ్–19 సమయంలోని 503 మంది అమెరికన్ల ప్రవర్తన, వారి భావోద్వేగాలను పరిశీలించారు.ఈ పరిశీలనలో శాస్త్రవేత్తలు ఒక ఆసక్తికరమైన విషయాన్ని గమనించారు. జీవితాన్ని కాస్త సరదాగా, ప్రశాంతంగా తీసుకునే మనస్తత్వం ఉన్నవారు, ప్రస్తుతం ఉన్న పరిస్థితులను నిజాయితీగా అంగీకరిస్తూనే, భవిష్యత్తు పట్ల సానుకూల దృక్పథంతో ఉన్నారని తేలింది. వీరు తమకు ఎదురయ్యే సవాళ్లకు త్వరగా అలవాటు పడటమే కాకుండా, రోజువారీ పనులను ఆనందంగా, ఆ పనుల్లో లీనమై మరీ చేయగలిగారు. ఎలాంటి కష్టాలనైనా తట్టుకునే శక్తిని (రెజిలియన్స్) కనబరచారు.ఆలోచనా విధానాన్ని, ప్రవర్తనను మార్చుకుంటూ, సృజనాత్మకంగా ఆలోచిస్తూ, అనుకూలమైన ఫలితాల కోసం ప్రయత్నించే ఈ అలవాటుకు శాస్త్రవేత్తలు ‘లెమనేడింగ్’ అని పేరు పెట్టారు. అంటే ‘చేదు’ లాంటి కష్టాలను కూడా నిమ్మరసంలా తీపిగా/సానుకూలంగా మార్చుకోవడం. దీనినే ఇంకోలా చెప్పాలంటే – జీవితంలో మనకు ఏది ఎదురైతే దానినే, దాని కోసమే ఎదురు చూస్తున్నట్లుగా స్వీకరించటం.చేదులోనే తియ్యని రుచి!జీవితాన్ని కాస్త సరదాగా తీసుకోవడం అంటే, మనం ఉన్న పరిస్థితిని తేలికగా తీసుకుంటున్నామని కాదు, ఆ పరిస్థితిని ఎదుర్కొనే శక్తి మనలో పెరుగుతోందని అర్థం అని పరిశోధకులు చెబుతున్నారు. కోవిడ్–19 లాక్డౌన్ సమయంలో ప్రజల అనుభవాలను వీరు అధ్యయనం చేసినప్పుడు ఓ నిజం వెల్లడైంది. సరదా మనస్తత్వం ఉన్నవారు భవిష్యత్తు పట్ల సానుకూలంగా ఉంటూ, సమస్యలను చాలా చురుగ్గా, సృజనాత్మకంగా ఎదుర్కొన్నారు. అంటే, జీవితం వారికి చేదు వాస్తవాలను (నిమ్మకాయలు) ఇచ్చినప్పుడు, వారు వాటిని తీపి అనుభవాలుగా (నిమ్మరసం) మార్చుకున్నారు!దీనికి సంబంధించిన పరిశోధనా వ్యాసం ‘ఫ్రంటియర్స్ ఇన్ సైకాలజీ’ పత్రిక తాజా సంచికలో అచ్చయింది. ‘‘మా పరిశోధనలో తేలిందేమిటంటే సరదా మనస్తత్త్వం, మానసిక స్థైర్యం అనేవి ‘లెమనేడింగ్’ అనే భావన ద్వారా ఒకదానికొకటి చాలా బలంగా ముడిపడి ఉన్నాయి. కష్ట సమయాల్లో కూడా సానుకూల అనుభవాలను సృష్టించుకునే సామర్థ్యమే ఈ లెమనేడింగ్’’ అని వ్యాసకర్త, ఒరెగాన్ స్టేట్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ షియాంగ్యూ ‘షారన్’ షెన్ అంటున్నారు.‘‘పాండమిక్ (మహమ్మారి) సమయంలో సరదా మనస్తత్వం ఉన్నవారు, లేనివారు ఇద్దరూ ఒకే రకమైన భయాన్ని, ఒంటరితనాన్ని అనుభవించారు. కానీ సరదాగా ఉండే వ్యక్తులు ఆ కష్టతరమైన పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకున్నారు. పోగొట్టుకున్న వాటికి ప్రత్యామ్నాయాలను వెతుక్కున్నారు, అడ్డంకులను ఎదిగే అవకాశాలుగా చూశారు. అన్నిటికంటే ముఖ్యంగా, ఆ పరిస్థితికి ఎలా స్పందించాలన్న విషయాన్ని తమ నియంత్రణలోనే ఉంచుకున్నారు’’ అని షెన్ తెలిపారు.‘లెమనేడింగ్’ పరిశోధన వెనుకడాక్టర్ షెన్, ఆమె సహచర శాస్త్రవేత్తలు మనుషుల సరదా మనస్తత్త్వం (ప్లేఫుల్నెస్) అనేది కష్ట సమయాల్లో జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకోవడానికి చాలా కాలంగా ఆసక్తితో చూస్తున్నారు. కోవిడ్ మహమ్మారి వారికి ఆ విషయాన్ని పెద్ద ఎత్తున పరిశోధించడానికి ఒక మంచి అవకాశాన్ని ఇచ్చింది. ఇందుకోసం వారు అమెరికాలో నివసిస్తున్న 503 మంది వయోజనులను ఎంచుకుని, 2021 ఫిబ్రవరి (కోవిడ్ రెండవ వేవ్, వ్యాక్సిన్ ప్రారంభ సమయం) ఒక సర్వే నిర్వహించారు.ఈ సర్వేలో పాల్గొన్నవారిని – కరోనా సోకుతుందేమో అనే భయం ఎంతవరకు ఉంది? పరిస్థితులు బాగుపడతాయని నమ్ముతున్నారా? వారికి ఇతరుల మద్దతు ఉందా? వారి భావోద్వేగాలు ఎలా ఉన్నాయి? అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. దాంతో పాటు, వారు ఎంత సరదాగా ఉంటారు? ఎంత స్పాంటేనియస్‌గా (సహజంగా / వెంటనే) స్పందిస్తారు? ఆనందంగా ఉండటానికి ఎంతవరకు ప్రయత్నిస్తారు? అనే అంశాల ఆధారంగా వారి సరదా మనస్తత్వాన్ని కొలిచారు.ఈ వివరాల ఆధారంగా శాస్త్రవేత్తలు, సర్వేలో పాల్గొన్న వారిని వారి సరదా మనస్తత్వ స్థాయిని బట్టి నాలుగు భాగాలుగా విభజించారు. సరదా మనస్తత్వం అనేది మనుషుల ఆలోచనలను, ప్రవర్తనను ఎలా మారుస్తుందో స్పష్టంగా అర్థం చేసుకోవడానికి అత్యంత సరదాగా ఉండే మొదటి 126 మందిని, అసలు సరదా లేని చివరి 126 మందితో పోల్చి చూశారు.సానుకూల అవకాశాలపై దృష్టిఅత్యంత సరదాగా ఉండే వ్యక్తులు భవిష్యత్తు పట్ల చాలా ఆశావాదంతో ఉన్నారని, వ్యాక్సిన్ విజయవంతంగా అందుబాటులోకి వస్తుందని; జీవితం మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంటుందని నమ్మారని ఈ పరిశోధన వివరాలు స్పష్టం చేశాయి. అయితే దీని అర్థం వారు అప్పటి పరిస్థితిని పట్టించుకోకుండా, ఊహల్లో బతికారనడం కాదు!‘‘అతిగా ఆశావాదంతో ఉన్నవారు వాస్తవాలను గుర్తించకుండా ప్రతిదీ బాగుందని భ్రమిస్తుంటారు. కానీ మేము గమనించిన ‘స్పాట్లైట్’ (దృష్టి) ప్రభావం అలా కాకుండా చాలా స్పష్టంగా ఉంది’’ అని డాక్టర్ షెన్ వివరించారు. ‘‘సరదా మనస్తత్వం ఉన్నవారు కోవిడ్–19 ప్రమాదాలను తేలికగా తీసుకోలేదు, అలాగని రక్షణ చర్యల ప్రభావంపై అతిగా అంచనాలూ వేసుకోలేదు. వారు తమ ‘స్పాట్లైట్’ ని కేవలం సానుకూల మార్పులు, మెరుగవటానికి ఉండే అవకాశాలపైకి మళ్లించారు. చీకటి లాంటి కష్టసమయాల్లో కూడా ముందుకు సాగే మార్గాలను వెలుగులోకి తెచ్చుకున్నారు’’ అంటారు షెన్.అధిక సరదా మనస్తత్త్వం కలిగినవారు ఆనందాన్ని వెతుక్కోవడానికి ఎక్కువ ఉత్సాహపడ్డారు, సంకోచించకుండా ఆలోచించారు. ఇది అనిశ్చిత పరిస్థితుల్లో కూడా అనేక సానుకూల అవకాశాలను ఊహించడానికి వారికి సహాయపడింది. దీనికి తోడు వారి ప్రవర్తనలో ఉన్న సరళత, పనుల్లో వారు చూపించే శ్రద్ధ.. కష్టాలను తట్టుకునే మానసిక స్థైర్యాన్ని అందించాయి.చిన్న చిన్న మార్పులు చేసుకున్నారుపాండమిక్ సమయంలో ఇరు వర్గాల వ్యక్తులూ సమానంగానే ఒంటరితనాన్ని, భయాన్ని అనుభవించారు. కానీ సరదాగా ఉన్నవారు ఆ పరిస్థితులను తట్టుకోవడానికి సృజనాత్మక, క్రియాశీలక అడుగులు వేశారు. వారు వేరే ఏవో కొత్త వినోద కార్యక్రమాలలో పాల్గొనలేదు, కానీ తాము చేసే పనుల్లోనే సమయాలను మార్చుకోవడం, కొత్త ప్రదేశాలను అన్వేషించడం లేదా చురుగ్గా ఉండటానికి కొత్త మార్గాలు వెతకడం ద్వారా పరిస్థితులకు అనుగుణంగా మారారు. వారు తమ రోజువారీ జీవితంలో మరింత చురుగ్గా, ఆనందంగా, లీనమై గడిపారు.‘‘మా పరిశోధన సరదా మనస్తత్త్వాన్ని కొలవడంపైనే దృష్టి పెట్టినప్పటికీ, ఈ గుణాన్ని పెంపొందించుకోవడానికి కొన్ని మార్గాలను పరిశోధనలు సూచిస్తున్నాయి. ఉదాహరణకు, మీకు ఆనందాన్నిచ్చే పనుల్లో పాల్గొనండి, కొత్త అనుభవాలకు సిద్ధంగా ఉండండి, మిమ్మల్ని నవ్వించే వ్యక్తులతో సమయం గడపండి. సరదాగా ఉండటానికి ఆటలే ఆడాల్సిన పనిలేదు. మన రోజువారీ క్షణాల్లో కాస్త ఆనందం, స్వేచ్ఛ, అనుకూలమైన ఆలోచనా విధానాన్ని తెచ్చుకుంటే చాలు’’ అని షెన్ చెబుతున్నారు. జీవితంలో సరదాలు ఉండాలి‘‘ముఖ్యంగా కష్టకాలంలో మన మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సరదా మనస్తత్వం అనేది చాలా కీలకమైనది. కానీ చాలామంది దీని ప్రాముఖ్యతను గుర్తించరు’’ అని అంటారు షెన్. ‘‘సరదాగా ఉండే వ్యక్తులు.. కష్టాలను ఎంత సమర్థవంతంగా ఎదుర్కొంటారో అర్థం చేసుకోవడం వల్ల, ఇతరులు కూడా ఒత్తిడిని, అనిశ్చితిని జయించే వ్యూహాలను రూపొందించవచ్చు. మనం ప్రస్తుతం ఎదుర్కొంటున్న ప్రపంచ స్థాయి సవాళ్లకు వాస్తవిక అంచనా, సృజనాత్మకమైన సర్దుబాటు రెండూ అవసరం కాబట్టి, ఈ విషయం చాలా ప్రాధాన్యత సంతరించుకుంది’’ అని ఆమె అభిప్రాయపడ్డారు.అయితే, ఈ పరిశోధన ఫలితాలను ప్రతి పరిస్థితికీ లేదా అందరికీ ఒకేలా వర్తింపజేయలేమని షెన్, ఆమె సహచరులు హెచ్చరిస్తున్నారు. వేర్వేరు పరిస్థితుల్లో ఈ సరదా మనస్తత్త్వం వేర్వేరు వ్యక్తులపై భిన్నమైన ప్రభావం చూపవచ్చు. అలాగే, అత్యంత సరదాగా ఉండేవారికి, లేనివారికి మధ్య ఉన్న తేడాలన్నీ కేవలం ఈ ఒక్క గుణం వల్లే వచ్చాయని చెప్పలేము. ‘‘మనుషుల మధ్య ఉన్న ముఖ్యమైన తేడాలను మేము గుర్తించినప్పటికీ, రోజువారీ సంఘటనలకు వారు ఎలా స్పందిస్తారనే దానిపై ప్రభావం చూపే ఈ సరదా మనస్తత్త్వం ఇతర పరిస్థితులకు కూడా (రోజువారీ కానివీ, వివిధ రంగాలకు చెందినవీ) వర్తిస్తుందని చెప్పలేం అని షెన్ పేర్కొన్నారు. ‘‘ఈ ‘సరదా ఆలోచనా విధానం’ ఎలాంటి మార్పులు తీసుకువస్తుందో మరింత పూర్తిగా అర్థం చేసుకోవడానికి, భవిష్యత్తులో జీవితంలోని ఇతర అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుని పరిశోధనలు జరపవలసి ఉంది’’ అని షెన్ అంటున్నారు. – సాక్షి స్పెషల్ డెస్క్- షియాంగ్యూ ‘షారన్’ షెన్, ఒరెగాన్ స్టేట్ యూనివర్సిటీ ప్రొఫెసర్ -
‘ఏడు’ ఏడుపు కాదు.. అదృష్టం తెచ్చిపెట్టింది
కొంతమందికి కొన్ని సంఖ్యలపై ప్రత్యేకమైన నమ్మకం ఉంటుంది. అవి తమ జీవితంలో అదృష్టాన్ని తీసుకొస్తాయని భావిస్తుంటారు. ఏడు అనేది అపశకునం అని ప్రపంచవ్యాప్తంగా చాలామంది నమ్మకం. అయితే.. ఇక్కడో వ్యక్తి లక్కీ నంబర్ ‘7’. చిన్నప్పటి నుంచి తనకు అదృష్ట సంఖ్యగా భావిస్తూ వచ్చాడు. అదే అతన్ని..చివరకు కోటీశ్వరుడిని కూడా చేసింది.అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రం బిస్కో పట్టణానికి చెందిన టోమస్ మునోజ్‌కు లాటరీలో ఏకంగా 10 లక్షల డాలర్లు (సుమారు రూ.9.5 కోట్లు) జాక్‌పాట్‌గా తగిలింది. నార్త్ కరోలినా ఎడ్యుకేషన్ లాటరీ కొత్తగా ప్రారంభించిన ట్రిపుల్ రెడ్ 777 జాక్‌పాట్ స్క్రాచ్-ఆఫ్ గేమ్‌లో ఆయన ఈ భారీ బహుమతిని గెలుచుకున్నారు. కాండర్లోని ఓ దుకాణంలో 10 డాలర్ల విలువైన ట్రిపుల్ రెడ్ 777 జాక్‌పాట్ టికెట్ కనిపించగానే దాన్ని కొనాలని మునోజ్ నిర్ణయించుకున్నారు. కారణం.. ఆ టికెట్‌పై ఉన్న మూడు ‘7’లే.“ఏడు నా అదృష్ట సంఖ్య. నేను 1977లో 7వ తేదీన పుట్టాను” అని మునోజ్ తెలిపారు. తన జీవితంలో 7 నంబర్‌కు ఎప్పటి నుంచో ప్రత్యేక స్థానం ఉందని చెప్పారు. టికెట్‌ను దుకాణంలోనే స్క్రాచ్ చేసిన మునోజ్.. భారీ బహుమతి గెలిచిన విషయం తెలుసుకుని భావోద్వేగానికి గురయ్యారు. “నా శరీరం మొత్తం రకరకాల భావోద్వేగాలతో నిండిపోయింది” అని తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.లాటరీ సంస్థ నుంచి బహుమతి తీసుకునే సమయంలో మునోజ్‌కు రెండు అవకాశాలు ఇచ్చారు. 20 ఏళ్ల పాటు ఏడాదికి 50 వేల డాలర్ల చొప్పున తీసుకోవడం లేదా ఒకేసారి నగదు తీసుకోవడం. ఆయన రెండో ఎంపికను ఎంచుకున్నారు. ఒకేసారి 6 లక్షల డాలర్లు తీసుకున్నారు. పన్నులు మినహాయించిన తర్వాత ఆయనకు 3,96,060 డాలర్లు (సుమారు రూ.3.5 కోట్లకు పైగా) అందాయి.ఈ డబ్బును పెట్టుబడులు పెట్టడంతో పాటు, తనకు ఇష్టమైన పాతకాలపు కార్ల పునరుద్ధరణ (క్లాసిక్ కార్ రీస్టోరేషన్) పనులకు ఉపయోగించనున్నట్లు మునోజ్ తెలిపారు.ఇక ట్రిపుల్ రెడ్ 777 జాక్‌పాట్ గేమ్‌లో మొత్తం మూడు మిలియన్ డాలర్ల బహుమతులు ఉండగా.. అందులో మరో రెండు మిలియన్ డాలర్ల బహుమతులు ఇంకా గెలుచుకోవాల్సి ఉంది. అదృష్ట సంఖ్యలపై నమ్మకం ఉండటం ఒకవైపు అయితే.. అదే సంఖ్యతో జీవితాన్ని మార్చే అవకాశం రావడం మాత్రం మునోజ్ విషయంలో అరుదైన యాదృచ్ఛికంగా మారింది. ‘7’ అతడికి కేవలం సంఖ్య కాదు.. అదృష్టాన్ని తెచ్చిన గుర్తుగా నిలిచిపోయింది.(చదవండి: థాంక్యూ అమ్మ..! భావోద్వేగంలో మైక్రోసాఫ్ట్ ఏఐ డైరెక్టర్ ..) -
నేటి యువత ఖర్చుల బాట..
వయసు ఇరవైల్లో వచ్చే ఆదాయం రేపటి భవిష్యత్తుకు పునాది కావాలా? లేక నేటి లైఫ్‌స్టైల్ ఆర్భాటాలకు వేదిక కావాలా?.. ఇప్పుడు ఇంటర్నెట్లో పర్సనల్ ఫైనాన్స్ విభాగంలో హాట్ టాపిక్‌గా మారిన ప్రశ్న ఇది. ఐటీ హబ్ బెంగళూరులో నివసిస్తున్న సిమ్రిధి మఖిజా అనే యువతి ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న ఆలోచనలు నేటి తరం ఆర్థిక అలవాట్లపై చర్చకు దారితీశాయి.బెంగళూరులో గత ఏడు నెలలుగా ఉంటున్న మఖిజా 20 ఏళ్లలో ఉన్న యువత పాటిస్తున్న ఖరీదైన జీవనశైలిని ప్రశ్నించారు. ఎంత సంపాదించినా సరసమైన ధరకు సేవలు లభించే చోట కూడా విచ్చలవిడిగా ఖర్చు చేయడాన్ని ఆమె తప్పుపట్టారు.జీవనశైలి ద్రవ్యోల్బణంపై ప్రశ్నలుమఖిజా తన వీడియోలో కొన్ని అంశాలను ప్రస్తావించారు. ‘ఒక్క పూట కేఫ్‌ల కోసం ఏకంగా రూ.5,000 ఖర్చు చేస్తున్నారు. మంచి ఇల్లు రూ.20,000కే లభించే అవకాశం ఉన్నప్పటికీ కేవలం హోదా కోసం నెలకు రూ.40,000 అద్దె చెల్లిస్తున్నారు. ఒక్క విహారయాత్ర లేదా షాపింగ్ కోసం రూ.20,000 తగలేస్తున్నారు. ఆదాయం పెరిగినంత మాత్రాన స్వయంచాలకంగా ఖర్చులు పెంచుకుంటూ పోయే లైఫ్‌స్టైల్ ఇన్ఫ్లేషన్ ప్రమాదకరం’ అని ఆమె హెచ్చరించారు. ‘కెరీర్ ప్రారంభంలో సంపాదన పెరగాలి గానీ, ఖర్చులు కాదు. భవిష్యత్తు చాలా అనూహ్యమైంది. అందుకే తక్కువ ఖర్చు చేస్తూ గరిష్టంగా పొదుపు చేయడమే ఉత్తమం’ అని ఆమె అభిప్రాయపడ్డారు.నెటిజన్ల స్పందనఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి. ‘జీవనశైలి ద్రవ్యోల్బణం మీ జీతాల పెరుగుదలను మింగేయకుండా చూసుకోండి’ అని పొదుపు వాదనను కొందరు సమర్థిస్తున్నారు. ‘20ల్లో ఉన్నప్పుడు డబ్బు దాచడంపై కాకుండా సంపాదనను ఎలా పెంచుకోవాలో ఆలోచించండి. సంపాదిస్తున్నప్పుడు జీవితాన్ని ఆస్వాదించడంలో తప్పు లేదు’ అని ఇంకొందరు చెబుతున్నారు. -
రుచి... ఆరోగ్యం... సింపుల్ కుకింగ్!
ఉదయం టిఫిన్‌కు ఏం చేయాలా అని ఆలోచిస్తున్నారా? ఇంట్లో మిగిలిపోయిన బ్రెడ్తోనే కేవలం 10 నిమిషాల్లో రుచికరమైన బ్రెడ్ ఉప్మా తయారు చేసుకోవచ్చు. తక్కువ సమయంలో ఎక్కువ రుచి ఇచ్చే ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి.కావలసినవి:5 నుంచి 6 బ్రెడ్ స్లైస్‌లు, నూనె లేదా బటర్: 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు: 1/2 టీస్పూన్, జీలకర్ర: 1/2 టీస్పూన్, మినపప్పు: 1/2 టీస్పూన్, ఉల్లిపాయ: 1 (సన్నగా తరిగినది), టొమాటో: 1 (చిన్నగా తరిగినది), పచ్చిమిర్చి: 2 (సన్నగా తరిగినవి), అల్లం తరుగు: 1/2 టీస్పూన్, కరివేపాకు: ఒక రెమ్మ, పసుపు: 1/4 టీస్పూన్, కారం: 1/2 టీస్పూన్, నిమ్మరసం: టీస్పూన్, కొత్తిమీర: కొద్దిగా, ఉప్పు: రుచికి సరిపడాతయారీ:- ముందుగా బ్రెడ్ స్లైసెస్ను ప్యాన్ పై కొద్దిగా కాల్చుకుని, చల్లారాక చిన్న చిన్న ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోండి.- ఆ తరువాత తాలింపు కోసం ఒక బాణలిలో నూనె వేసి వేడి చేయండి.- అందులో ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసి చిటపటలాడనివ్వండి.-ఇప్పుడు తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం తరుగు, కరివేపాకు వేసి ఉల్లిపాయలు దోరగా అయ్యే వరకు వేయించండి.- అందులోనే తరిగిన టొమాటో ముక్కలు, పసుపు, కారం, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపండి.-టొమాటోలు మెత్తగా అయ్యే వరకు 2–3 నిమిషాలు మగ్గనివ్వండి. ఇప్పుడు మనం కోసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కలను వేసి, మసాలా అంతా బ్రెడ్ ముక్కలకు పట్టేలా చిన్నగా కలపండి.-బ్రెడ్ క్రిస్పీగా అయ్యేంతవరకు 2–3 నిమిషాలు వేయించండి. చివరగా నిమ్మరసం పిండి, పైన సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆపేయండి. అంతే వేడివేడిగా సర్వ్ చేయడమే!క్యారెట్ పొరియల్కావలసినవి: 5 క్యారెట్లు: 250 గ్రాములు (తురుము లేదా సన్నని ముక్కలు), నూనె: టేబుల్ స్పూన్, ఆవాలు: 1/2 టీ స్పూన్, మినపప్పు: టీ స్పూన్, శనగపప్పు: టీస్పూన్, పచ్చిమిర్చి: 2 (సన్నగా తరిగినవి), ఎండుమిర్చి: 1, కరివేపాకు: ఒక రెమ్మ, ఇంగువ: చిటికెడు, ఉల్లిపాయ: 1 (చిన్నగా తరిగినది), పచ్చి కొబ్బరి తురుము: 2 నుంచి 3 టేబుల్ స్పూన్లు, ఉప్పు: రుచికి సరిపడా.తయారీ:- ముందుగా బాణలిలో నూనె వేసి వేడి చేయండి. అందులో ఆవాలు వేసి చిటపటలాడనిచ్చిన తర్వాత మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి వేసి పప్పులు దోరగా మారే వరకు వేయించండి.- అందులోనే కరివేపాకు, పచ్చిమిర్చి, ఇంగువతో పాటు తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి.. అవి మెత్తబడే వరకు 2 నిమిషాలు వేయించండి.- ఇప్పుడు తరిగిన క్యారెట్ తురుము, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపండి.- మూత పెట్టి సన్నని మంటపై 5 నుంచి 7 నిమిషాల పాటు ఉడికించండి.- క్యారెట్ మెత్తగా ఉడికిన తర్వాత మూత తీసి పచ్చి కొబ్బరి తురుము వేసి బాగా కలిపి స్టవ్ ఆపేయండి.- మరింత హెల్తీ ఫుడ్‌గా మారాలంటే 15 నిమిషాలు నానబెట్టిన పెసరపప్పును కూడా క్యారెట్‌తో పాటు వేసి వేయించుకోవచ్చు. అంతే! కలర్‌ఫుల్ క్యారెట్ పొరియల్ రెడీ!సూజీ కేక్ కావలసినవి: ఉప్మా రవ్వ: కప్పు, పెరుగు: 1/2 కప్పు, చక్కెర: 3/4 కప్పు, పాలు: 1/2 కప్పు (కాచి చల్లార్చినవి), నూనె లేదా వెన్న: 1/4 కప్పు, ఏలకుల పొడి లేదా వెనిలా ఎసెన్ ్స: 1/2 టీస్పూన్, బేకింగ్ పౌడర్: టీస్పూన్, బేకింగ్ సోడా: 1/4 టీస్పూన్, మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్: 2 టేబుల్ స్పూన్లు.తయారీ:- ఒక బౌల్లో పెరుగు, పంచదార పొడి, నూనె వేసి పంచదార కరిగే వరకు బాగా కలపండి.- ఇప్పుడు అందులో రవ్వ, సగం పాలు పోసి బాగా కలిపి 15 నుంచి 20 నిమిషాలు పక్కన పెట్టండి.- ఇపుడు ఒక పెద్ద ప్రెజర్ కుక్కర్ లేదా మందపాటి కడాయిలో అడుగున కప్పు ఉప్పు లేదా ఇసుక వేసి, దానిపై ఒక స్టాండ్ ఉంచండి.- విజిల్, గాస్కెట్ తీసేసి మూత పెట్టి మీడియం మంటపై 10 నిమిషాలు ప్రీ–హీట్ చేయండి.- ఆ తరువాత కేక్ గిన్నెకి కొద్దిగా నూనె రాసి, పొడి పిండి చల్లండి లేదా బటర్ పేపర్ వేసి పక్కన పెట్టండి.- నానిన రవ్వ మిశ్రమం గట్టిపడితే మిగిలిన పాలు పోసి కేక్ బ్యాటర్‌ని చక్కగా కలుపుకోవాలి.- ఇప్పుడు అందులో బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, ఏలకుల పొడి/వెనిలా ఎసెన్ ్స వేసి ఒకే దిశలో నెమ్మదిగా కలపండి.- ఈ మిశ్రమాన్ని కేక్ టిన్ లో పోసి, పైన టూటీ ఫ్రూటీ లేదా జీడిపప్పు ముక్కలు చల్లండి.- ప్రీ–హీట్ చేసిన కుక్కర్లో ఈ గిన్నెను ఉంచి మూత పెట్టి చిన్న మంటపై 35 నుంచి 45 నిమిషాలు బేక్ చేయండి.- తరువాత కేక్ మధ్యలో టూత్‌పిక్ లేదా చాకు గుచ్చి చూడండి.- అది క్లీన్ గా బయటకు వస్తే కేక్ సిద్ధమైనట్లే! కేక్ పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే గిన్నె నుంచి బయటకు తీసి ముక్కలుగా కోయాలి. -
ఫ్రెండ్‌ట్రిప్.. స్నేహ వారధులుగా ప్రయాణాలు..!
ఒకప్పుడు స్నేహం అంటే స్కూల్, కాలేజీ, ఆఫీస్.. లేదా పక్కింటి పరిచయాలు.. అంతే. కానీ ఇప్పుడు స్నేహానికి కొత్త చిరునామాలు పుట్టుకొస్తున్నాయి. ట్రెక్కింగ్, క్యాంపింగ్, సైక్లింగ్, రోడ్ ట్రిప్స్, అడ్వెంచర్ టూర్లు కొత్త స్నేహాల అల్లికకు కేరాఫ్‌గా మారుతున్నాయి. అపరిచితులుగా కలిసిన వారు టూర్ ముగిసే కొన్ని రోజుల వ్యవధిలోనే మంచి మిత్రులుగా మారుతుండడం ఈ స్నేహాల పట్ల నగర వాసుల్లో ఆసక్తిని పెంచుతోంది.‘విభిన్న ఉద్యోగాల రీత్యా నగరానికి వచ్చి స్నేహాల కోసం సాహస యాత్రల్ని ఎంచుకుంటున్నారు’ అని నగరానికి చెందిన ట్రెక్ ఇట్ సంస్థ నిర్వాహకులు వెంకట్ తెలిపారు. ఈ ఆసక్తిని గమనించిన టూర్ ఆపరేటర్లు, ట్రావెల్ కమ్యూనిటీలు ఇప్పుడు కేవలం ‘కొత్త ప్రదేశాలు చూడండి.. కొత్త స్నేహాలను ఏర్పరచుకోండి’ అంటూ ప్రచారాలు హోరెత్తిస్తున్నాయి. సోలోమంటూ.. స్నేహాలకు చలో.. ఈ తరహా యాత్రలు కనీసం 20 మంది నుంచి 50 మంది దాకా బృందంతో నిర్వహిస్తారు. అందరూ కలిసి ఒకే వాహనంలో ప్రయాణించడం, కలిసి భోజనం చేయడం, ఒకే క్యాంప్‌లో బస చేయడం, ప్రయాణంలో ఒకరి గురించి మరొకరు తెలుసుకోవడం, ఫొటోలు దిగడం.. ఇలా మొదలవుతున్న పరిచయం శరవేగంగా స్నేహంగా మారుతోంది. ట్రెక్కింగ్, రాక్ క్లైంబింగ్ వంటి సందర్భాల్లో ఒకరు అలసిపోతే మరొకరు చేయి అందిస్తారు. వాటర్ బాటిల్ ఖాళీ అయితే ఇంకొకరు తమ నీటిని పంచుకుంటారు. ఒకరి బ్యాగ్‌ను మరొకరు కొద్దిసేపు మోస్తారు. ఇదే ‘ట్రిప్ ఫ్రెండ్’ను ‘లైఫ్ ఫ్రెండ్’గా మార్చేస్తోంది.యాత్ర సమాప్తం.. ఆగని స్నేహం.. అడ్వెంచర్ ట్రిప్ పూర్తయిన తర్వాత కూడా వాట్సాప్, ఇన్‌స్టా, ఫేస్‌బుక్స్ సంబంధాలు, తదుపరి ట్రిప్స్ ప్లాన్ చేయడం ద్వారా స్నేహాలు బలోపేతమవుతున్నాయి. సాహస యాత్రలు చేసే అభిరుచి ఎక్కువగా యువతదే అయినప్పటికీ మొత్తం బృందంలో ముగ్గురు నలుగురే మధ్య వయసు్కలు ఉంటారు. సహజంగానే వీరు సమవయసు్కలు కావడంతో స్నేహితులుగా మారుతున్నారు. ఉద్యోగ, కుటుంబ బాధ్యతల మధ్య స్నేహితుల తో బంధాలు తగ్గిపోయిన 40+, 50+ వయసు వారిలోనూ గ్రూప్ ట్రావెల్, ద్వారా కొత్త స్నేహాలు ఏర్పడుతున్నాయి. ఊర్లు వేరు.. దార్లు ఒకటే...‘మాది తిరుపతి, అన్నాడు సునీల్ మాది పీలేరు అన్నాడు రెడ్డి శంకర్. మాది ఒంటిమిట్ట అని చెప్పాడు సంపత్. ఆ ముగ్గురు యువకులు. నగరం నుంచి ప్రారంభం అయే ప్రయాణాల్లో మేము సైతం అంటూ తమ బైక్‌ని కలుపుతారు. లేదా వీరు ముగ్గురూ కలిసి తరచుగా బైక్ ట్రిప్స్ వేస్తుంటారు ‘ఇటీవలే వాయనాడ్, కూర్గ్.. చుట్టు పక్కల ప్రాంతాలకు బైక్స్ మీద వెళ్లి వచ్చాం. ఎవరు ఎక్కడ ఎంత బిజీగా ఉన్నా ట్రిప్ ప్లాన్ చేసుకుంటే మాత్రం బైక్ కిక్ కొట్టాల్సిందే’ అంటోందీ స్నేహ త్రయం. ప్రయాణ అభిరుచే కలిపింది.. కడప నివాసి మహ్మద్ వాసిమ్, నగరవాసి రాజ్ కుమార్ వశిష్టలను ఓ సాహస యాత్ర మంచి స్నేహితులుగా మార్చింది. ఇటీవలే దేవ్‌కుండ్ వాటర్ ఫాల్ తదితర ప్రాంతాల్లో ట్రెక్కింగ్ ముగించుకుని వచ్చిన వీరు తమ తదుపరి మాన్సూన్ ట్రెక్కు సిద్ధమవుతున్నారు.‘తొలుత నేను ట్రిప్ ప్లాన్ చేస్తాను. వాసిమ్ ని సంప్రదించి తను ఓకే అన్నాక ఫైనల్ చేస్తాను’ అంటూ చెప్పారు రాజ్. కుల,మత నేపథ్యాలతో పాటు వృత్తి వ్యాపకాలు కూడా వేర్వేరు. (వాసిమ్ వ్యాపారి కాగా రాజ్ ఐటీ ఉద్యోగి ) అయినా అవేవీ వీరి స్నేహ ప్రయాణానికి అడ్డంకి కాకపోవడం గమనార్హం. -
15 చెర్రీలు.. ధర లక్షల్లో! జపాన్ పండుకు ప్రపంచం ఫిదా!
మామూలుగా చెర్రీ ధర కిలోకు రెండువందల నుంచి నాలుగువందల రూపాయలు ఉంటుంది. కొన్ని అరుదైన రకాల చెర్రీ ధర కిలోకు మూడువేల రూపాయల వరకు కూడా ఉంటుంది. జపాన్‌లో పండే ఈ అత్యంత అరుదైన చెర్రీ ధర మాత్రం చుర్రుమనిపిస్తుంది.ఈ చెర్రీ రకం పేరు ‘అమరీ హార్ట్‌బీట్’. జపాన్‌లో పండించే చెర్రీ రకాలలో ఇవి అత్యంత అరుదైనవి. వీటిని కిలోల లెక్కన కాకుండా, పదిహేనేసి చొప్పున ప్యాక్‌చేసి, అందమైన ప్యాకెట్లలో విక్రయిస్తారు. ఇవి ఇతర రకాల చెర్రీల కంటే ఎక్కువ తీపిగా ఉంటాయి. వీటిలో చక్కెర శాతం మిగిలిన చెర్రీ రకాల కంటే ఇరవై శాతం ఎక్కువగా ఉంటుంది.ఈ చెర్రీలను ఎక్కువగా వేలం పాటల్లో విక్రయిస్తుంటారు. వేలంలో పదిహేనేసి చెర్రీలు ఉండే ఒక్కో ప్యాకెట్ ధర నాలుగున్నర లక్షల నుంచి ఆరులక్షల యెన్ల వరకు పలుకుతుంటుంది. ‘అమరీ హార్ట్‌బీట్’ చెర్రీలలో అత్యంత నాణ్యమైన వాటిని వేరుచేసి, వేలంశాలల్లో విక్రయిస్తుంటారు. మిగిలిన వాటిని లగ్జరీ ఫ్రూట్ షాపుల్లో అమ్ముతుంటారు. లగ్జరీ ఫ్రూట్ షాపుల్లో వీటి ధర ఒక్కో ప్యాకెట్‌కు యాభైవేల యెన్ల వరకు ఉంటుంది. -
పుచ్చకాయలో దాగిన ఆరోగ్య రహస్యాలు..
పుచ్చకాయకు దాదాపు నాలుగువేల ఏళ్లకు పైబడిన చరిత్ర ఉంది. ప్రాచీన ఈజిప్షియన్లు ఎడారి దారుల్లో ప్రయాణించేటప్పుడు మార్గమధ్యంలో దాహార్తిని తీర్చుకోవడానికి పుచ్చకాయలను తప్పనిసరిగా వెంట తీసుకుపోయేవారు.ఆఫ్రికాలో మొదలైన పుచ్చకాయ ప్రస్థానం దాదాపు ప్రపంచమంతటా పాకింది. పుచ్చకాయ ఏడాది పొడవునా పండుతుంది. వేసవి ప్రారంభం నుంచి వేసవి ముగిసే లోపు అత్యధికంగా పండుతుంది.పుచ్చకాయలో అత్యధిక శాతం నీరు ఉంటుంది. వేసవిలో దాహార్తి నుంచి ఉపశమనం కోసం బాగా పనికొస్తుంది. పుచ్చకాయలో అనేక విలువైన పోషకాలు కూడా ఉంటాయి. రుచులకు మెచ్చుకాయ అయిన పుచ్చకాయ విశేషాలను గణాంకాల్లో తెలుసుకుందాం... -
ఒక్క పోజ్... వెయ్యి లైక్స్!
‘ఫొటో తీస్తా... పోజ్ ఇవ్వు!’ అని ఫ్రెండ్ అన్న వెంటనే... ఏం చేయాలో తెలియక చేతులు జేబుల్లో ఎట్టుకుని, తల ఎటు తిప్పాలో అర్థం కాక కెమెరానే చూస్తూ స్టాచ్యూ అయిపోతున్నారా? అయితే ఈ టిప్స్ మీ కోసమే!నడవట్లేదు... మ్యూజిక్ నడుస్తోంది!కెమెరా ముందు బిగుసుకుని నిలబడాల్సిన పని లేదు. ఫ్రెండ్‌ను చూసి నడుస్తూ ఒక కాలు ముందుకు మరో కాలు మడమను పైకి లేపి ఆగండి. ఇక ఒక చేయి జేబులో... మరో చేయి ముందుకు ఊపితే చాలు... ఫొటోలో సినిమా హీరో ఎంట్రీ వైబ్ వచ్చేస్తుంది. ఈ పోజ్ ఎక్కువగా రోడ్డు, పార్క్, కాలేజ్ క్యాంపస్, మాల్‌లలో బాగుంటుంది.సైడ్ లుక్... ఫుల్ హుక్!కెమెరా వైపు ఎప్పుడూ చూడాల్సిన రూల్ లేదు. చిన్ను కొద్దిగా పైకి ఎత్తి, పక్కకు చూస్తే, చూసేవాళ్లే ‘ఏమో... ఏదో ఆలోచిస్తున్నాడు!’ అనుకుంటారు. అసలు మీరు ఆలోచించేది ఇంటికి వెళ్లాక ఏం తినాలన్నదే అయినా... ఫొటోలో మాత్రం చాలా డీప్ థింకర్లా కనిపిస్తారు!ఫ్రెండ్‌తో కలిసి పోజ్... డబుల్ స్టయిల్!ఒక్కడిగా ఫొటో బాగుంటుంది. కాని, ఇద్దరు ఫ్రెండ్స్ ఒకే స్టయిల్లో నడిస్తే, అది వేరే లెవెల్. ఇద్దరూ ఒకే స్టయిల్లో నడవడం, ఒకే డైరెక్షన్ లో చూడడం, ఒకే టైమ్‌లో పోజ్ ఇస్తే, ఫొటోకు సినిమాటిక్ ఫీల్‌ను తీసుకొస్తుంది. ఫ్రెండ్స్‌తో రీల్స్ లేదా ఫొటోషూట్ చేస్తే ఈ పోజ్ తప్పక ట్రై చేయండి. కానీ ఒకడు హీరోలా నడుస్తుంటే, ఇంకొకడు చెప్పు జారి బ్యాలెన్స్ పట్టుకుంటే మాత్రం కామెడీ షో పోస్టర్ అయిపోతుంది!నవ్వాలా? సీరియస్‌గా ఉండాలా?ప్రతి ఫొటోలో పళ్లన్నీ చూపిస్తూ నవ్వితే టూత్‌పేస్ట్ యాడ్‌లా బాగుండదు. అందుకే, కొన్నిసార్లు చిన్న స్మైల్... ఇంకొన్నిసార్లు సైలెంట్ లుక్. ముఖ్యంగా కళ్లలో కాన్ఫిడెన్స్ ఉంటే చాలు. ఫొటోకి అదే అసలైన ఫిల్టర్! గుర్తించుకోండి. పోజ్ అంటే శరీరాన్ని వంచడం కాదు, కాన్ఫిడెన్స్‌ను చూపించడం! అందుకే, కెమెరా ముందు సహజంగా ఉండండి. మీ స్టయిల్‌ను మీరే ఎంజాయ్ చేయండి.చేతులే చాలు.. కాన్ఫిడెన్స్!చేతులు ఎక్కడ పెట్టాలో తెలియక ఇబ్బంది పడేవాళ్లకు ఇది లైఫ్సేవర్ పోజ్. ఒక చేయి లేదా రెండు చేతులు వెనక షర్ట్ లేదా హెయిర్ అడ్జస్ట్ చేస్తున్నట్లు పెట్టండి. అలాగే, భుజాలను నిటారుగా ఉంచి, ఛాతీని కొద్దిగా ముందుకు తీసుకొస్తే కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్‌గా ఆన్ అవుతుంది. అయితే, ఫొటో దిగేటప్పుడు జేబులో మొబైల్, వాలెట్, బైక్ కీ... అన్నీ నింపేస్తే మాత్రం పోజ్ కంటే జేబే హైలైట్ అవుతుంది!నిజం చెప్పాలంటే... మంచి డ్రెస్ వేసుకోవడం కంటే మంచి పోజ్ ఇవ్వడమే చాలా కష్టం. డ్రెస్ షాపులో దొరుకుతుంది. కానీ, స్టయిల్ మాత్రం మీలోనే ఉండాలి! అందుకే, ఇక్కడ కనిపించిన పోజులు పెట్టి ఫొటోలు దిగండి. అప్పుడు ఎక్కువ కష్టపడకుండానే స్టయిలిష్‌గా కనిపిస్తారు. -
ఒంటరిగా ఫ్లైట్ జర్నీ..ఆమె జీవితాన్నే మార్చేసింది..!
ఒక్కోసారి మనం ఎదుర్కొనే పరాజయాలు మనల్ని ఎంతలా కుంగదీస్తాయంటే..ప్రతి చిన్నదానికి భయపడిపోయేలా చేస్తాయ్. ఇంతకు ముందున్నుట్లుగా ఆత్మవిశ్వాసంగా ఉండనివ్వవు. అంతేగాదు ప్రతి పనిలో ఆటంకం కూడా..భయం, ఆందోళనకు దారితీస్తుంది. సింపుల్‌గా చెప్పాలంటే మన మానసిక పరిస్థితి అత్యంత బలహీనంగా అయిపోతుంది. ఆ స్థితి నుంచి ఓ పట్టాన బయపడలేం. సరిగ్గా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోందో ఓ 32 ఏళ్ల మహిళ. ఆ దారుణమైన మానసిక పరిస్థితి నుంచి బయటపడేందుకు ఆమె ఏం చేసిందంటే..గౌహతికి చెందిన 32 ఏళ్ల పూజా దాస్ మహిళ గత కొంతకాలంగా బ్యాంకు పరీక్షల కోసం సన్నద్ధమై ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయింది. దాంతో తీవ్రమైన ఆందోళన, డిప్రెషన్‌కి గురవ్వడమే కాదు, అనారోగ్య సమస్యలు కూడా చుట్టుముట్టాయి. దాంతో ఆమె ఇదివరకటిలా ధైర్యంగా ఎక్కడకి వెళ్లలేకపోతోంది. కనీసం ఏ పనిచేసినా..జరగకపోతే తీవ్రంగా ఆందోళన చెందడం, నా బతికింతే అన్నట్లుగా ఆత్మనూన్యత భావానికి గురయ్యేది. అలా ఒక్కోసారి చచ్చిపోవాలనేకునేంత స్టేజ్‌కి కూడా వెళ్లిపోయేది కూడా. బ్యాంకు ఉద్యోగాన్ని సంపాదించలేకపోయానన్న బాధ ఆమెను అంతలా కుంగదీసింది. ఆ తర్వాత ఆమె ఆ ప్రయత్నాన్ని విరమించుకుని కంటెంట్ క్రియేటర్‌గా మారి ఆన్లైన్లో వీడియోలు పోస్ట్ చేస్తూ సంపాదించడం మొదలు పెట్టినా..ఎందుకో ఆ భయం, బెరుకు ఆమెను వదలి వెళ్లడం లేదు. ముఖ్యంగా అబ్సెసివ్-కంపల్సివ్ డిజార్డర్ (OCD) కారణంగా తీవ్రమైన ఆందోళనతో ఇబ్బంది పడుతుండేది. ఈ సమస్య నుంచి బయటపడాలని తనకు తాను ధైర్యం తెచ్చుకుని ఓ అడుగు ముందుకేసింది. అందుకోసం తాను సోలోగా ఫ్లైట్ జర్నీ చేయాలని నిర్ణయించుకుంది. ఎందుకంటే ముందుగా ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లడం నుంచి అక్కడ జరిగే తనిఖీల వరకు ప్రతీదీ తానే స్వయంగా నిర్వహించుకోవాలని డిసైడ్ అయ్యింది. ఆ క్రమంలో ఎదురయ్యే టెన్షన్, ఒత్తిడి అన్నింటిని అధిగమించాలనే ఇలా చేసింది. అదేంటో ఆమె ఒక్కత్తే వెళ్లి తిరిగి వచ్చేసింది. పైగా తన భర్తకు నేరుగా ఎయిర్‌పోర్ట్‌కి వచ్చేదాక కాల్ చేయలేదు. అది చూసి ఆమె భర్త సైతం ఆశ్చర్యపోయారు. ఎందుకంటే..ఎప్పుడైనా.. ఎక్కడికైనా.. ఒంటిరిగా వెళ్లితే..ఓ వందసార్లుకు పైగా కాల్ చేస్తుంది. అలాంటిది ఈసారి సోలోగా ఫ్లైట్ జర్నీ చేసినా..అంతలా భయపడలేదు, పైగా ఎక్కవ సార్లు భర్తకు కాల్ కూడా చేయలేదు. ప్రతీదీ తానే ధైర్యంగా చేయడమే కాదు ఇదివరకటిలా ఆత్మవిశ్వాసంగా ఉంది. అందుకు సంబంధించిన విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ..నావిలువను బ్యాంకు పోటీ పరీక్షలతో పోల్చుకున్నాని తెలుసుకున్నా. అయినా ప్రతీదీ అనుకున్నట్లుగా జరిపోదు అనేదాన్ని పూర్తిగా నమ్మాలి. నిజానికి ఆ దారిలో గెలవలేకపోతున్నాం అంటే..మరో దారి ఏదో మనకోసం వెయిట్ చేస్తుందని సానుకూలంగా తీసుకుని ముందుకుపోవాలని అర్థమైంది. అలాగే జీవితంలో ఎదురయ్యే కష్టాలు, ఆరోగ్య సమస్యల వల్ల కలిగే భయం మనకు ఎన్నో నేర్పించి. స్ట్రాంగ్‌గా మారుస్తుందని రాసుకొచ్చింది పోస్ట్‌లో. చివరగా జీవితం అంటే బతకడం కోసం గడిపేది కాదు జీవించడం అని ఆత్మవిశ్వాసంగా చెప్పిందామె. అంతేగాదు కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి ప్రతి సవాలుని ఎదుర్కొంటేనే జీవితంలో కిక్కు ఉంటుందని తెలిసందీ.. అని అంటోంది. ఒంటిరిగా చేసిన ఆ జర్నీ తనలో ఎంతో మార్పు తీసుకువచ్చి, ఆత్మవిశ్వాసంగా ఉండేలా చేసిందని సంతోషంగా చెబుతోందామె. కాగా, దాస్ స్వస్థలం అస్సాంలోని మోరిగావ్. ఆమె అత్తమామలతో కలిసి అస్సాంలోని టిన్సుకియాలో ఉండేవారు. ప్రస్తుతం భర్తతో కలిసి హైదరాబాద్‌లో నివశిస్తోంది. (చదవండి: అందాల పోటీల్లో తళుక్కుమన్న స్వగతికా పాణిగ్రాహి) -
ఏఐతో ముందుగానే లంగ్ కేన్సర్..! ఏకంగా 1.45 లక్షల మంది..
నివారణ ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ గోవా ప్రభుత్వం చేపట్టిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత ఊపిరితిత్తుల కేన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమం ఒక ముఖ్యమైన మైలురాయిని అధిగమించింది. ఇప్పటివరకు 1.46 లక్షలకు పైగా పౌరులకు ఈ కార్యక్రమం కింద వైద్య పరీక్షలు చేయించుకున్నారుఆరోగ్య మంత్రి విశ్వజిత్ రాణే తెలిపిన వివరాల ప్రకారం, మొత్తం 1,46,135 మంది పౌరులను రాష్ట్ర ఆరోగ్య శాఖ, ఆంకో క్యూర్.ఏఐ (Qure.ai) సంస్థల భాగస్వామ్యంతో పరీక్షించింది. ఈ కార్యక్రమంలో AI ఆధారిత ఇమేజింగ్ విశ్లేషణ సాంకేతికతను ఉపయోగించి, ఊపిరితిత్తుల కేన్సర్‌ను దాని ప్రారంభ దశలోనే అంటే చికిత్స అత్యంత సాధ్యమయ్యే దశలోనే గుర్తిస్తున్నారు.ఇప్పటివరకు వచ్చిన ఫలితాలు ఆసక్తికరంగా ఉన్నాయి. పరీక్షించిన వారిలో 15,036 మందికి ఊపిరితిత్తుల సంబంధిత అసాధారణతలు (pulmonary abnormalities) ఉన్నట్లు తేలింది. వీరిలో 2,219 మంది తక్షణ వైద్య సహాయం అవసరమైన హై-రిస్క్ కేటగిరీలో ఉన్నట్లు గుర్తించారు.హై-రిస్క్ కేటగిరీలో గుర్తించిన రోగులకు తదుపరి పరిశోధనలు, నిపుణులైన వైద్యుల సంప్రదింపులు, అవసరమైతే చికిత్స ప్రణాళిక వేగంగా అందించనున్నట్లు ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ప్రారంభ దశలోనే వ్యాధిని గుర్తించడం వల్ల, తీవ్రమైన పరిస్థితులు మరింత ముదిరిపోకముందే చికిత్స ప్రారంభించడం సాధ్యమవుతోందని శాఖ పేర్కొంది.కార్యక్రమం ఎలా పనిచేస్తుందిసంప్రదాయ స్క్రీనింగ్ పద్ధతిలో ప్రతి చెస్ట్ స్కాన్‌ను రేడియాలజిస్టులు మాన్యువల్‌గా పరిశీలించాల్సి ఉంటుంది. కానీ ఈ కొత్త విధానంలో, ముందుగా AI వ్యవస్థ స్కాన్లను విశ్లేషించి, అసాధారణతలు కనిపించే స్కాన్లను ప్రాధాన్యతా ప్రాతిపదికన వైద్యుల పరిశీలన కోసం గుర్తు పెడుతుంది. దీనివల్ల స్క్రీనింగ్ ప్రక్రియ వేగవంతమవుతుంది. అలాగే తక్కువ సమయంలో ఎక్కువ మంది పౌరులను పరీక్షించడం సాధ్యమవుతుంది. ప్రస్తుతం ఈ స్క్రీనింగ్ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా 18 కేంద్రాల్లో కొనసాగుతోంది, ఇది దేశంలోనే ఈ తరహా అతిపెద్ద ప్రజారోగ్య స్క్రీనింగ్ కార్యక్రమాల్లో ఒకటిగా నిలుస్తోంది.(చదవండి: తొలి అంధ, చెవిటి వైద్యురాలు.. చికిత్స ఎలా చేస్తారంటే?) . -
భార్యతో జస్ట్ 90 సెకన్లు : వ్యాపారవేత్త ఆదిత్య ఆసక్తికర వ్యాఖ్యలు
ఆధునిక జీవితంలో భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తే తప్ప ఒక సాధారణ కుటుంబం సౌకర్యవంతంగా జీవించలేని పరిస్థితి. అందులో ఎంతో శ్రమ, ఓర్పు, సహనం దాగి ఉంటుంది. అలాంటిది ఒక స్టార్టప్‌ను విజయవంతంగా నడపాలంటే ఇద్దరూ వ్యక్తిగత జీవితంలో చాలా త్యాగాలు చేయాల్సి ఉంటుంది. అలా ఇద్దరు భాగస్వాములు ఒక స్టార్టప్‌ను నిర్మించడంలో పూర్తిగా నిమగ్నమై నప్పుడు జీవితం ఎలా ఉంటుందో వివరిస్తూ ఒక స్టార్టప్ ఫౌండర్ తన భార్యతో గడిపే క్షణాల గురించి సోషల్ మీడియాలో చెప్పుకొచ్చారు. జస్ట్ కొన్ని సెకన్ల పాటు విమానాశ్రయంలో తన భార్యను కలిసిన చిత్రాన్ని పంచుకుంటూ లింక్డ్ఇన్ (LinkedIn) పోస్ట్ ద్వారా వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాల మధ్య సమతుల్యతపై కొత్త చర్చను రేకెత్తించారు.ఢిల్లీకి చెందిన, అట్-హోమ్బ్యూటీ, వెల్నెస్ ప్లాట్‌ఫామ్ (YesMadam) సహ-వ్యవస్థాపకుడు, సీఈఓ ఆదిత్య ఆర్య, (భార్య గరిమా శర్మ) తన పోస్ట్ ద్వారా వ్యక్తిగత జీవిత విశేషాలను షేర్ చేశారు. కలిసి గడపడానికి చాలా తక్కువ సమయం ఉన్నప్పటికీ, ఆ కొన్ని క్షణాలను అర్థవంతంగా మార్చుకోవడానికి ప్రయత్నించామంటూ చెప్పుకొచ్చారు. ఇదీ చదవండి: కంగనా రనౌత్‌లా మారిన సాయోని ఘోష్ : ఏకిపారేస్తున్న నెటిజన్లుబహుశా ఎవరూ వివాహాన్ని ఇలా ప్లాన్ చేసుకోరు. మాలో ఒకరం ల్యాండ్ అవుతున్నాం మరొకరం బయలు దేరుతున్నాం," అని ఆదిత్య ఆర్య తెలిపారు. అయినా, తామిద్దరం ఒకే గేట్ వద్ద 90 సెకన్ల పాటు చేతులు పట్టుకుని, ప్రపంచంలో ఉన్న సమయమంతా మాకే ఉన్నంత గొప్పగా ఫీలయ్యామని తెలిపారు. కేవలం ఈ ఒకటిన్నర భేటీలో తీసుకున్న ఒక పిక్‌ను షేర్ చేశారు. అంతేకాదు విమానాశ్రయంలో తన భార్యను ఇలా అనుకోకుండా కలవడం ఇది మొదటిసారి కాదని ఆయన పేర్కొన్నారు. నిజానికి, చాలా జంటలు డేట్లకు వెళ్తుంటే, తాము మాత్రం "లేఓవర్లు" (విమాన ప్రయాణాల్లో మధ్యలో ఆగడం) చేస్తుంటామని చెప్పారు.ఇది సంస్థ నేర్పిన పాఠం నిజానికి ఎవరూ తన దాంప్యత జీవితాన్ని ఇలా ప్లాన్ చేసుకోరు. కానీ కలిసి ఒక వ్యాపారాన్ని లేదా సంస్థను నిర్మిస్తున్నప్పుడు మీ జీవితం ఆటోమేటిక్‌గా ఈ రూపాన్ని సంతరించుకుంటుంది. తక్కువ సమయాన్ని కూడా గరిష్టంగా ఎలా ఉపయోగించుకోవాలో ‘యస్ మేడమ్’ మాకు నేర్పింది. ఫౌండర్లుగా ఉన్నవారి వివాహ బంధానికి కూడా ఇదే సూత్రం వర్తిస్తుందని తొమ్మిదేళ్ల వైవాహిక జీవితంపై ఆదిత్య వెల్లడించారు.గరిమా శర్మ స్పందనఆదిత్య ఆర్య భార్య కంపెనీ గరిమా శర్మ డైరెక్టర్‌గా ఉన్నారు. ఆమె తన భర్త పోస్ట్‌పై స్పందిస్తూ, ఇతరులకు విచిత్రంగా అనిపించేది తమకు లభించే రొమాన్స్ అని పేర్కొన్నారు. ఒక కంపెనీని నిర్మించడం, ఉపాధిని సృష్టించడం, తామిద్దరం నమ్మే ఆశయం కోసం జీవించడం... మాటలతో మాత్రమే కాకుండా అవకాశాలను సృష్టించడం ద్వారా దేశానికి సేవ చేయవచ్చని తమ పిల్లలకు చూపించడమే తమ లక్ష్యమని ఆమె చెప్పారు. కొందరు ఎయిర్‌పోర్ట్‌లో పక్క పక్కనుంచి వెళుతున్న సాధారణ ప్రయాణీకులా తమని చూడొచ్చు. కానీ తాము మాత్రం ఒకేడ్రీమ్ వైపు అడుగులు వేస్తున్న ఇద్దరిని చూశాం అంటూ గర్వంగా చెప్పుకొచ్చారు. ఇదీ చదవండి: చెఫ్ అవుదామనుకుని స్టార్ హీరో : కళ్లు చెదిరే కార్లు, ఆస్తులు -
లంచ్ బ్రేక్‌లో జెన్‌జీ ఉద్యోగులు ఏం చేస్తున్నారో తెలుసా?
ఉద్యోగ ఒత్తిడి యువతపై ఎంత ప్రభావం చూపుతోందో తెలియజేసే ఓ కొత్త ట్రెండ్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా జెన్‌జీ (Gen Z) ఉద్యోగులు ఆఫీస్ ఒత్తిడిని ఎదుర్కొనేందుకు సాధారణ బ్రేక్‌లకు భిన్నమైన మార్గాలను ఎంచుకుంటున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. లంచ్ బ్రేక్ సమయంలో బయటకు వెళ్లి కొంతసేపు ఒంటరిగా గడపడం, నిద్రపోవడం, భావోద్వేగాలను బయటకు వదిలేయడం వంటి పద్ధతులు కొందరు యువ ఉద్యోగుల్లో కనిపిస్తున్నాయి.అమెరికాలోని కొందరు జెన్‌జీ ఉద్యోగులు ఆఫీస్ ఒత్తిడి నుంచి కాస్త ఉపశమనం పొందేందుకు లంచ్ సమయంలో బయటకు వెళ్లి ఏకాంత ప్రదేశాల్లో సమయం గడుపుతున్నట్లు ఓ నివేదిక వెల్లడించింది. సినిమా థియేటర్లు, మెట్రో స్టేషన్లు, షాపింగ్ మాల్స్‌లోని ఫిట్టింగ్ రూమ్‌లు వంటి ప్రదేశాలను కొందరు తమ ‘సేఫ్ స్పాట్స్’గా మార్చుకున్నారని పేర్కొంది.న్యూయార్క్‌కు చెందిన బెన్ శాండర్సన్ ఉదంతం దీనికి ఉదాహరణగా మారింది. ఆయన ఓ సినిమా థియేటర్లో సుమారు రూ.1,200 (15 డాలర్లు) చెల్లించి టికెట్ తీసుకున్నప్పటికీ సినిమా చూడకుండా రిక్లైనర్ సీటులో 90 నిమిషాలు నిద్రపోయాడు. ఆ నిద్ర తనకు ఎంతో రిలీఫ్ ఇచ్చిందని చెప్పడంతో ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.దీంతో పలువురు యువ ఉద్యోగులు తమ అనుభవాలను పంచుకున్నారు. కొందరు పని ఒత్తిడి ఎక్కువైనప్పుడు ఆఫీస్ నుంచి బయటకు వెళ్లి ఏడ్చిన సందర్భాలు, ఒంటరిగా కూర్చుని మనసు ప్రశాంతం చేసుకున్న సందర్భాలను వెల్లడించారు.భారత్‌లోనూ పెరుగుతున్న పని ఒత్తిడిభారత్లోనూ జెన్‌జీ ఉద్యోగుల పరిస్థితి కొంత భిన్నంగా లేదు. ముఖ్యంగా మెట్రో నగరాల్లోని ఐటీ కంపెనీలు, బీపీఓలు, స్టార్టప్‌లు, ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న యువతలో పని ఒత్తిడి పెరుగుతోంది. ఉదయం నుంచి రాత్రి వరకు ఆన్లైన్లో ఉండాల్సిన పరిస్థితి, నిరంతరం వచ్చే మెయిల్స్, టార్గెట్లు, పనితీరు సమీక్షలు యువ ఉద్యోగుల్లో ఒత్తిడిని పెంచుతున్నాయి. కొందరు ఉద్యోగులు లంచ్ బ్రేక్‌లో నిద్రపోవడం, వాకింగ్‌కు వెళ్లడం, ఫోన్ ఆఫ్ చేసి కొంతసేపు ఒంటరిగా ఉండటం వంటి మార్గాలను అనుసరిస్తున్నారు. ముఖ్యంగా కోవిడ్ తర్వాత వర్క్ కల్చర్‌లో వచ్చిన మార్పులు కూడా యువతపై ప్రభావం చూపాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి హైబ్రిడ్, ఆఫీస్ మోడల్‌కు మారిన తర్వాత పని–వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యత కష్టంగా మారిందని పలువురు చెబుతున్నారు.ఉద్యోగం మారాలన్న ఆలోచన పెరుగుతోందియువ ఉద్యోగుల్లో సంప్రదాయ ఆఫీస్ సంస్కృతిపై అసంతృప్తి పెరుగుతోందని పలు సర్వేలు సూచిస్తున్నాయి. ఎక్కువ పని గంటలు, గుర్తింపు లేకపోవడం, మానసిక ఒత్తిడి, సరైన వర్క్-లైఫ్ బ్యాలెన్స్ లేకపోవడం వంటి కారణాలతో కొందరు ఉద్యోగం మారాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి జెన్‌జీ తరం కేవలం జీతానికే కాకుండా.. పని చేసే వాతావరణం, మానసిక ప్రశాంతత, వ్యక్తిగత జీవితానికి సమయం వంటి అంశాలకు కూడా ప్రాధాన్యం ఇస్తోంది.AI భయం కూడా మరో కారణంమరోవైపు కృత్రిమ మేధస్సు (AI) పెరుగుతున్న వినియోగం కూడా యువ ఉద్యోగుల్లో కొత్త ఆందోళనలకు కారణమవుతోంది. కొన్ని ఉద్యోగాలు ఆటోమేషన్ వల్ల తగ్గిపోతాయనే భయం, కొత్త నైపుణ్యాలు నేర్చుకోవాల్సిన ఒత్తిడి యువతపై ప్రభావం చూపుతోంది. ఏఐ టూల్స్ వేగంగా మారుతున్న నేపథ్యంలో తమ ఉద్యోగ భద్రతపై ఆందోళన చెందుతున్న యువ ఉద్యోగులు కూడా ఉన్నారు. అందుకే కొందరు కొత్త టెక్నాలజీలను నేర్చుకునే ప్రయత్నం చేస్తుండగా.. మరికొందరు ఒత్తిడిని ఎదుర్కోవడంలో ఇబ్బందులు పడుతున్నారు.‘బ్రేక్ కల్చర్’కు పెరుగుతున్న ఆదరణపని ఒత్తిడి నుంచి బయటపడేందుకు కొద్దిసేపు విరామం తీసుకోవడం ఇప్పుడు జెన్‌జీ ఉద్యోగుల్లో సాధారణంగా మారుతోంది. ఇది కేవలం పని నుంచి తప్పించుకోవడం కాదని.. మానసికంగా తిరిగి శక్తిని పొందేందుకు ప్రయత్నమని నిపుణులు చెబుతున్నారు. పెరుగుతున్న పని ఒత్తిడి, ఉద్యోగ భద్రతపై భయం, మానసిక అలసట.. ఇవన్నీ కలిసి జెన్‌జీ ఉద్యోగుల్లో కొత్త రకమైన ‘బ్రేక్ కల్చర్’కు దారితీస్తున్నాయి. ఆఫీస్ బయట కొన్ని నిమిషాల ప్రశాంతత కోసం వెతుకుతున్న ఈ తరం.. పని ప్రపంచంలో మారుతున్న పరిస్థితులకు అద్దం పడుతోంది. -
పావ్ భాజీ, చోలే బటూరేలను తింటూనే బరువు తగ్గా..!
ఎన్నో వెయిట్‌లాస్ జర్నీల్లో మనం ఆరోగ్యకరమైన జీవనశైలి, చక్కటి వర్కౌట్లు, సరైన ఆహారం వంటివి కీలకం అని విన్నాం. చాలామంది ఆయిల్ ఫుడ్లు, జంక్ ఫుడ్లకు దూరంగా ఉంటేనే బరువు సాధ్యమని అనుభవపూర్వకంగా వెల్లడించారు. కానీ ఈ మహిళ మాత్రం నచ్చినవి తింటూనే హెల్దీగా బరువు తగ్గమని చెబుతుంది. ఆమె అలా చేసే ఏకంగా 95 కేజీల దగ్గర 55 కేజీలకు వచ్చానని, సుమారు 25కేజీలపైనే బరువు తగ్గానని చెప్పుకొచ్చింది. అదెలా సాధ్యమో చూద్దామా.!.ఆ మహిళే డైటీషియన్, యూట్యూబర్ సుమన్ పహుజా. తన వ్యక్తిగత జీవితంలో ఒక క్లిష్ట దశలో ఉన్నప్పుడు ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టానని చెప్పుకొచ్చారు. తాను అప్పుడు సుమారు 99కిలోలు పైనే బరువు ఉండేదాన్ని అని అన్నారు. తీవ్రమైన డైటింగ్ కంటే, పట్టుదల, నిలకడ, ఆరోగ్యకరమైన ఆహార ఎంపికలతో స్లిమ్‌గా మారినట్లు తెలిపింది. తన బరువు గురించి తండ్రి, భర్త చేసిన విమర్శలు తనను స్లిమ్‌గా మారేలా ప్రేరేపించాయని చెప్పుకొచ్చారు. అయితే క్రాష్ డైట్లకు బదులుకు నిలకడైన ఆహారపు అలవాట్లు, క్రమం తప్పకుండా వ్యాయామా దినచర్యను పాటించినట్లు తెలిపారు. అలాగే తనకు ఇష్టమైన ఆహారాలను వేటిని వదులుకోలేదన్నారు. తాను ఇప్పటికీ పావ్ భాజీ, చోలే బటూరే వంటి వంటకాలను తింటానని అన్నారు. అయితే వాటిని ఇంట్లోనే తయారు చేసుకుంటానని, దీనివల్ల వాడే పదార్థాలు, పరిమాణాలపై మెరుగైన నియంత్రణ పాటిస్తూ వాటిని ఆస్వాదించగలుగుతున్నానని పహుజా చెప్పారు. ఎలాంటి ఆహారం అంటే..ఆమె రోజువారీ ఆహారంలో అల్పాహారంగా రెండు మల్టీగ్రెయిన్ పరాటాలు, ఒక గిన్నెడు కూరగాయలు, చక్కెర లేని టీతో మొదలవుతుందట. మధ్యాహ్న భోజనంలో సాధారణంగా పండ్లు లేదా సొరకాయ సలాడ్‌తో పాటు ఒక గ్లాసు కోల్డ్ కాఫీ తీసుకుంటానని చెప్పారు. ఇక రాత్రి భోజనంలో, ఉప్పు లేకుండా తయారు చేసిన బ్రోకలీ లేదా వేయించిన క్యాప్సికమ్‌తో పాటు రెండు గుడ్డు తెల్లసొనలు ఉంటాయి. కడుపు నింపే, పోషకమైన, తక్కువ కేలరీలు ఉండే చియా సీడ్ ఫుడ్డింగ్ను తీసుకుంటానని పేర్కొంది. ఇక తన బరువు తగ్గడంలో వ్యాయామం కూడా కీలక పాత్ర పోషించిందన్నారు. తాను వారానికి మూడు రోజులు వర్కౌట్లు చేస్తానని, ప్రధానంగా పరుగెత్తడం, దూకండ వంటి కార్డియో వ్యాయామాలపై దృష్టిపెడతానని అన్నారు. వీటన్నింటి తోపాటు సమయానికి భోజనం చేయడం, ఒత్తిడిని అదుపులో ఉంచుకోవడం కూడా అంతే ముఖ్యమని నొక్కి చెప్పారు. ఆమె నిద్రలేచిన గంటలోపే అల్పాహారం తినడాన్ని ఒక నియమంగా పెట్టుకున్నట్లు తెలిపారు. అలాగే సాయంత్రం 5 గంటల తర్వాత కార్బోహైడ్రేట్లకు దూరంగా ఉంటానని, వారానికి రెండుసార్లు డిటాక్స్ వాటర్ తాగుతానని చెప్పారు. అలాగే డైట్ పాటించని రోజుల్లో కూడా ఇంట్లో వండిన భోజనానికే ప్రాధాన్యత ఇస్తానని చెప్పుకొచ్చారు. ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో ముందుకు సాగడంతోనే బరువు తగ్గానని అన్నారు పహుజా. పైగా ఈ రూపాంతరం తనలో ఆత్మవిశ్వాసాన్ని, ఏకాగ్రతను పెంచేందుకు దోహదపడిందని అంటోంది. చివరగా ఆమె భవిష్యత్తులో తానొక ఆరోగ్యకరమైన సంతోషకరమైన మహిళగా జీవించాలని కోరుకుంటున్నట్లు వెల్లడించింది. View this post on Instagram A post shared by SUMAN PAHUJA (@suman_sunshine)గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: ఈ క్షణం కోసమే ఎదురుచూశా..! ఉప్పొంగి పోయిన తల్లిదండ్రులు..) -
జస్ట్ రూ. 5వేలు, మొబైల్ ఫోన్‌తో.. రూ. 50 కోట్ల వ్యాపారం!
వ్యాపారం అనేది వినయోగదారుల అవసరం, నమ్మకం నుంచే పుడతాయని అంటారు పారిశ్రామిక నిపుణులు. ఏ బ్రాండ్ అయినా మొదట్లో చిన్నగా మొదలవుతుంది. అశేష ప్రజాదరణతోనే బ్రాండ్‌గా స్థిరపడుతుందని అంటారు. అచ్చం అలానే చాలామంది ఎదుర్కొనే, పెదవివిప్పని సమస్యను పరిష్కారం చూపుతూ తన వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకుంది ఓ నటి. అంతేగాదు కేవలం చాలా తక్కువ మొత్తంతో పెట్టుబడి పెట్టి..కోట్లలో డబ్బులు ఆర్జిస్తూ..ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు గొప్ప వ్యాపార సూత్రాలను చెబుతోందామె. ఆ నటి ఎవరంటే..నటిగా కెరీర్ ప్రారంభించి, వ్యాపారవేత్తగా అవతరించిన పరుల్ గులాటికి తన బిజినెస్ జర్నీ ఎలా మొదలైందో ఓ ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నారు. చాలామంది బహిరంగంగా చర్చించడానికి సిగ్గుపడే సమస్యను పరిష్కరించి..అత్యంత గుర్తింపు పొందిన నిష్ హెయిర్ బ్రాండ్ వ్యవస్థాపకురాలిగా మారింది. తాను దీన్ని కేవలం రూ. 5 వేలు పెట్టుబడితో మొదలుపెట్టి..ఇవాళ ఏకంగా రూ. 50 వేల కోట్ల టర్నోవర్ చేసే కంపెనీగా మార్చినట్లు వెల్లడించింది. ఆమె ప్రస్థానం మొదలైందిలా..తాను నటిగా పనిచేస్తూ, టెలివిజన్ వాణిజ్య ప్రకటనలలో నటిస్తున్నప్పుడు వ్యాపారం ప్రారంభించాలనే కోరిక తనలో పుట్టిందని వెల్లడించింది పరుల్. ఆ రోజు నుంచి తనకంటూ వ్యాపారం ఉండాలని నిశ్చయించుకుని..హెయిర్ ఎక్స్ టెన్షన్లపై దృష్టిసారించినట్లు తెలిపింది. ఆమె కేవలం జుట్టు సమస్యలకు పరిష్కారాలను అందరికీ అందుబాటులో, సరసమైన ధరలలో, ఆన్లైన్లో లభించేలా చేయడమే తన లక్ష్యంగా పెట్టుకుంది. అలా ఆమె కేవలం రూ. 5 వేలతో తన వ్యాపార ప్రయాణాన్ని ప్రారంభించింది. నిజానికి 2017లో 'నిష్ హెయిర్' ప్రారంభమైనప్పుడు, క్రియేటర్ ఎకానమీ ఇంకా శైశవ దశలోనే ఉంది. ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ నేటిలా అభివృద్ధి చెందలేదు, అలాగే పరుల్ తన కొత్త బ్రాండ్ కోసం సెలబ్రిటీల ప్రచారాన్ని ఇష్టపడలేదు. బదులుగా ఆమెనే స్వయంగా కంపెనీ ప్రతినిధిగా మారింది. ఇది తాత్కాలికమేనని, ఆ తర్వాత ప్రముఖ తారలనే అంబాసిడర్లుగా నియమించుకోవాల్సిందేనని అనుకుంది. అప్పటి వరకు ఆమె తన ఫోన్లో వీడియోలను రికార్డు చేసి..క్రమం తప్పకుండా కంటెంట్‌ను పోస్ట్ చేయాలని నిర్ణయించుకుంది. ఆ నిర్ణయమే ఆ తర్వాత బ్రాండ్ వృద్ధికి అతిపెద్ద కారణాలలో ఒకటిగా నిలిచింది. అలా ఆమె ఉదయం రాత్రి అని భేదం లేకుండా చాలా పోస్టులు చేసినట్లు తెలిపింది. చివరికి తాను నిష్ హెయిర్ మార్కెటింగ్ విభాగంగా మిగిలిపోయానని అంటోంది. వాళ్లకి తాను బడ్జెట్‌ని ఇవ్వనని, కేవలం రీల్స్ మాత్రమే చేస్తానని అన్నారు. ఎలా సక్సెస్ అయ్యిందంటే..ఆమె తరచుగా టెలివిజన్ వాణిజ్య ప్రకటనల ఆడిషన్లకు హాజరయ్యేది, అక్కడ డజన్ల కొద్దీ మోడళ్లు వెయిటింగ్ రూములలో కలిసి కూర్చునేవారు. అక్కడ, ఆమె ఉద్దేశపూర్వకంగా ప్రజల ముందు తన హెయిర్ ఎక్స్‌టెన్షన్‌ను తీసివేసి, వారిలో ఉత్సుకతను, సంభాషణను రేకెత్తించేది. ఆ వ్యూహం ఫలించి..త్వరలోనే, తోటి నటీనటులు, మోడళ్లు ఆ ఉత్పత్తి ఎక్కడ నుంచి వచ్చిందని, తాము కొనుగోలు చేయగలమా అని అడగడం ప్రారంభించారు. అలా మొదటి కస్టమర్‌ని సంపాదించుకుంది. అయితే ఈ ఉత్తత్తులు ప్రారంభ ధరే రూ. 10 వేలు నుంచి రూ. 12 వేలు మధ్య ఉంటుంది. కానీ ఆమె పెట్టుబడిని తిరిగి రాబట్టుకోవడానికి సహాయపడుతుందన్న ఉద్దేశ్యంతో రూ. 5,000కే అమ్మడానికి అంగీకరించింది. అంతేగాతు తన మొదటి అమ్మకం జరగడానికే నెల పట్టిందని అంటోంది. సోషల్‌మీడియాని ఉపయోగించుకోవడాని కంటే ముందు..పరుల్ వారాంతాల్లో ఫ్లీ మార్కెట్లలో గడుపుతూ, చాలామంది అంతకుముందెన్నడూ చూడని ఒక ఉత్పత్తిని వినియోగదారులకు పరిచయం చేసేది. అంతేగాదు కొనుగోలుదారులను కలసి..ఆ హెయిర్ ఎక్స్టెన్షన్లను ప్రయత్నించమని ప్రోత్సహించేది. ముఖ్యంగా కస్టమర్ల నమ్మకాన్ని గెలుచుకునే ప్రయత్నంపై ఫోకస్ పెట్టేది. ఈ వ్యూహం అమ్మకాలను పెంచేందుకు, అవగాహన కల్పించడానికి ఉపయోగ పడింది. అలా వివిధ నగరాల్లో సుమారు 12 ఫ్లీ మార్కెట్ ఈవెంట్లను పూర్తి చేసే సమయానికి, వ్యాపారం గణనీయమైన సామర్థ్యాన్ని చూపించడం ప్రారంభించింది. ఆ విధంగా పరుల్ అహ్మదాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో లక్ష రూపాయలు సంపాదించిన విషయాన్ని వెల్లడించింది. అంతేగాదు వైరల్ అయిన ప్రతీది అమ్మకాలను తీసుకు రాదు. అందుకు ప్రభావవంతమైన కంటెంట్ కావాలి. వీటన్నింటి తోపాటు అత్యంత ప్రభావవంతమైన కంటెంట్ వ్యూహం, కాబోయే కస్టమర్లకు ఉత్పత్తిని కొన్ని సెకన్లలోనే అర్థమయ్యేలా చేయడం అని చెబుతోంది. బ్రాండ్ వాల్యూ పెరిగే కొద్దీ..మార్కెటింగ్ చేసే విధానం మారాలి..బ్రాండ్ పెరిగేకొద్దీ, పరుల్ దానిని మార్కెట్ చేయడానికి అసాధారణమైన మార్గాలను అన్వేషించారు. అందుకోసం నిష్ హెయిర్ సరఫరా చేసిన నిజమైన మానవ జుట్టుతో తయారు చేసిన దుస్తులు ధరించి ఆమె కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరై అందరి దృష్టిని ఆకర్షించారు. అంతేగాదు ప్రతి వ్యవస్థాపకుడు తనకు సాధ్యమైన చోటల్లా తన ఉత్పత్తిని ప్రోత్సహించేలా నమ్మకాన్ని పెంపొందించుకోవాలని అన్నారు. చివరగా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు మిమ్మల్ని పూర్తిగా నమ్మండి, అలాగే మీ ఆలోచనను పదిమందితో పంచుకోండి అని చెబుతున్నారు. అంతేగాదు తన విజయం అనేది నిధుల సమీకరణతోనో లేదా ప్రకటనల బడ్జెట్లతోనో ప్రారంభం కాదు, నిజమైన సమస్యను పరిష్కరించడంతోనూ, ఉత్పత్తిని నమ్మడంతోనూ, అలాగే రోజు కెమెరా ముందు నిలబడటానికి సిద్ధంగా ఉండటంతో మొదలైందని ఆత్మవిశ్వాసంగా చెబుతోంది పరుల్. View this post on Instagram A post shared by Parul Gulati 🤍 (@gulati06) (చదవండి: ప్లాస్టిక్ కవర్లలో పట్టు చీరలను పెడుతున్నారా..? జానపద గాయని శారీ టిప్స్..) -
హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ నా జీవితాన్నే మార్చేసింది
రిటైర్డ్ ప్రొఫెషనల్ రెజ్లర్, నటుడు జాన్ సీనా తన జుట్టు మార్పిడి (Hair Transplant) ప్రయాణం గురించి ఎప్పుడూ చాలా బహిరంగంగా మాట్లాడతారు. తాజాగా శాన్ డియాగో కామిక్-కాన్ (San Diego Comic-Con) వేడుకలో పాల్గొన్న ఆయన, తన హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ వివరాలను వెల్లడించారు. ఈ మార్పు తన రూపాన్ని మెరుగుపరచడమే కాకుండా, జీవితాన్నే మార్చేసిందని వెల్లడించారు. సిగ్గుతోనే, ఈ ప్రక్రియ గురించి పట్టించుకోలేదని లేదంటే పదేళ్ల క్రితమే చేయించుకుని ఉండేవాడినని తెలిపాడు. అంతేకాదు హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ ప్రక్రియ చుట్టూ సమాజంలో ఉన్న సిగ్గు/సంకోచం (Shame) గురించి ఆయన విచారం వ్యక్తం చేశారు.'PEOPLE' మ్యాగజైన్‌తో మాట్లాడిన జాన్ సీనా ఇప్పటివరకు రెండుసార్లు హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించు కున్నట్లు తెలిపారు. తన కొత్త హెయిర్‌స్టైల్ గురించి చెప్తూ, ఈ ప్రొసీజర్ చాలా బాగా జరిగిందని అన్నారు. ఎక్కువ జుట్టు పొందడమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొంటూ, ఈ జీవితాన్ని మార్చిన మార్పుకు కారణమైన తన వైద్యుడికి ధన్యవాదాలు తెలిపారు: ఎక్కువ జుట్టు కావాలనేది టార్గెట్. దానికి హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సరియైన మార్గం. ఈ క్రమంలో తనకెంతో ఇష్టమైన డాక్టర్ కేన్ ఆండర్సన్ తన జీవితాన్నే పూర్తిగా మార్చే శారని చెప్పుకొచ్చారు.రెండోసారి చికిత్స , అనుభవంజార్జియాలోని 'ఆండర్సన్ సెంటర్ ఫర్ హెయిర్' వైద్యుల సేవలకు ఇంప్రెస్ అయిన సీనా, మొదటి సర్జరీ జరిగిన 15 నెలల తర్వాత మళ్లీ ఫాలో-అప్ కోసం వెళ్లినపుడు తల పూర్తిగా షేవ్ చేస్తే జుట్టు మార్పిడిని మరింత వేగంగా చేయవచ్చని తెలిపారు. అలా తన తొలి ఆపరేషన్పదమూడున్నర గంటలు పట్టిందన్నారు. కానీ రెండోది ఎనిమిది గంటల్లో పూర్తయిందనీ తన డాక్టర్‌పై పూర్తి నమ్మకం ఉందని,ఆయన చెప్పిన ప్రక్రియను నేను నమ్ముతున్నానని తెలిపారు.జాన్ సీనా హెయిర్ జర్నీ FUE అనేది జుట్టును పునరుద్ధరించడానికి వ్యక్తిగత వెండ్రుకల ఫోలికల్స్‌ను వేరు చేసి నాటే ఒక ఆధునిక సర్జరీ పద్ధతి. జూన్ 2026లో జాన్ సీనా తన రెండో వింత 'ఫోలిక్యులర్ యూనిట్ ఎక్స్ట్రాక్షన్' (FUE) చికిత్స గురించి ఫేస్బుక్లో పంచుకున్నారు. దీంతోపాటు గతంలో 2024 చివరలో మొదటిసారి హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకున్నారు. ఆగస్టు 2025లో పీపుల్ మ్యాగజైన్‌తో మాట్లాడుతూ, అభిమానులు, ప్రేక్షకుల వల్లే తాను జుట్టు మార్పడిపై దృష్టి పెట్టానని చెప్పారుతాను బట్టతలను దాచడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, ప్రేక్షకులు రింగ్ సైడ్ వద్ద 'ది బాల్డ్ జాన్ సీనా' అని బోర్డులు పట్టుకుని చూపించారని గుర్తు చేసుకున్నారు. దాంతో తాను రీసెర్చ్ చేసి, జుట్టు, స్కాల్ప్ ఆరోగ్యం గురించి తెలుసుకునేలా అభిమానులే ప్రోత్సహించారని కూడా తెలిపారు. ప్రస్తుతం రెడ్-లైట్ థెరపీ, మినోక్సిడిల్ (Minoxidil), విటమిన్లు, ప్రత్యేకమైన షాంపూ , కండిషనర్ ఉపయోగిస్తున్నానని వెల్లడించారు.అపోహలపై సీనా ఆవేదనహెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ ప్రక్రియ చుట్టూ సమాజంలో ఉన్న సిగ్గు/సంకోచం (Shame) గురించి ఆయన విచారం వ్యక్తం చేశారు. ఈ సంకోచం లేకపోయి ఉంటే తాను దశాబ్దం (10 ఏళ్ల) కిందటే ఈ చికిత్స చేయించుకునే వాడినని అన్నారు. సుమారు 70శాతం నుండి 80శాతం మంది పురుషులు జుట్టు రాలడం లేదా బట్టతల సమస్యతో బాధపడుతున్నారని, కాబట్టి దీని గురించి మాట్లాడటానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదని సీనా అభిప్రాయపడ్డారు.ఎవరీ జాన్ సీనాజాన్ ఫెలిక్స్ ఆంథోనీ సీనా రిటైర్డ్ ప్రొఫెషనల్ రెజ్లర్. మాజీ రాపర్. ప్రొఫెషనల్ రెజ్లింగ్ చరిత్రలో అత్యుత్తమ రెజ్లర్లలో ఒకరిగా గుర్తింపు పొందిన జాన్ సీనా నటుడు కూడా.2002లో రెజ్లింగ్ ప్రపంచంలోకి అడుగుపెట్టిన సీనా కేవలం ఒకదశాబ్దంలోనే గ్లోబల్ సూపర్‌స్టార్‌గా ఎదిగారు. డబ్ల్యూడబ్ల్యూఈ (WWE) లో సూపర్ స్టార్‌గా అభిమానులను అలరించిన సీనా సినీ రంగంలోను రాణించారు. 30 పైగా సినిమాల్లో నటించారు. 24 సంవత్సరాల అద్భుతమైన కెరీర్లో 17సార్లు ప్రపంచ ఛాంపియన్‌గా రికార్డు సృష్టించి, డిసెంబర్ 2025లో ఆయన పోటీల నుండి అధికారికంగా రిటైర్మెంట్ ప్రకటించారు. ప్రస్తుతం WWEకి బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగుతున్నారు.మేక్-ఎ-విష్ (Make-A-Wish) ఫౌండేషన్ ద్వారా వందలాది మంది అనారోగ్యంతో బాధపడుతున్న పిల్లల కోరికలను తీర్చి మానవతావాదిగా నిలిచారు. రెజ్లింగ్‌తో పాటునటనారంగం (హాలీవుడ్)లో 'ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 9' (F9), 'ది సూసైడ్ స్క్వాడ్', 'పీస్‌మేకర్' వంటి ప్రముఖ చిత్రాలు, సిరీస్‌లలో నటించి నటుడిగానూ రాణించారు. -
20ల్లో చేసే తప్పులు.. 30ల్లో కరిగిపోతున్న కలలు!
జీతం వస్తోంది.. ఖర్చవుతోంది. కానీ సంపద మాత్రం పెరగడం లేదు. ఇది నేటి యువత ఎదుర్కొంటున్న వాస్తవం. ఖరీదైన ఫోన్లు, వీకెండ్ ట్రిప్స్, క్రెడిట్ కార్డు షాపింగ్‌లు, సోషల్ మీడియా చూపించే లైఫ్‌స్టైల్...ఇవన్నీ తెలీకుండానే సంపద సృష్టించే అవకాశాలను యువతకు దూరం చేస్తున్నాయి. 20ల్లో చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్లు భవిష్యత్తులో కోట్ల రూపాయల నష్టంగా మారతాయి. అందుకే ఈ వయసులో డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమో దాన్ని సరైన దిశలో నడిపించడం అంతకంటే ముఖ్యం. ఈ ఏడు మనీ మిస్టేక్స్‌ను ఇప్పుడే గుర్తిస్తే యువత భవిష్యత్తు ఆర్థికంగా మరింత బలంగా మారుతుంది. నెలాఖరులో జీతం బ్యాంకు ఖాతాలో పడుతోంది. కానీ కొన్ని రోజుల్లోనే మాయమవుతోంది. ఈనెల నుంచి సేవింగ్స్ మొదలు పెడతా, ఈసారి జీతం పెరిగాక సిప్ (సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్) చేస్తా, ఈ ఈఎంఐ అయ్యాక పెట్టుబడులు ప్లాన్ చేస్తా ఇలా వాయిదాల మీద వాయిదాలు వేస్తూ యువత తమ జీవితంలో అత్యంత విలువైన ఒక దశాబ్దాన్ని కోల్పోతోంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే 20 ఏళ్ల వయసులో చేసే ఆర్థిక పరమైన తప్పులు పెద్దవేం కావు. కానీ వాటి ప్రభావం మాత్రం 30, 40 ఏళ్ల వరకు వెంటాడతాయి. చిన్న అలవాట్లు, చిన్న చిన్న నిర్లక్ష్యాలు, చిన్న ఆనందం కోసం వేసే వాయిదాలు భవిష్యత్తులో చేతికందాల్సిన కోట్ల రూపాయలను దూరం చేస్తాయి. 20ల్లో యువత చేసే తప్పులు ఏమిటి? వాటి నుంచి ఎలా బయటపడాలి ? పర్సనల్ ఫైనాన్స్ (వ్యక్తిగత ఆర్ధిక నిర్వహణ) గురించి ఎక్కడైనా చదివినా, సోషల్ మీడియాలో నిపుణుల సూచనలు విన్నా ఎక్కువమంది యువతే లక్ష్యంగా సలహాలు ఇస్తుంటారు. చిన్న వయసులోనే పొదుపు చేయండి, ఉద్యోగంలో చేరిన నెలనుంచే పెట్టుబడులు ప్రారంభించండి, అప్పులకు దూరంగా ఉండండి అంటూ అనేక సూచనలు ఇస్తుంటారు. పెట్టుబడులు ఎలా చేయాలో వివరిస్తుంటారు. కానీ 90 శాతం యువత ఈ సూచనలను పట్టించుకోరు. కారణం వారికి అవగాహన లేకపోవడం కాదు. కెరీర్ ప్రారంభ దశలో ఎదురయ్యే అనిశ్చితులు, ఆకర్షణలు, కొన్నాళ్ల తర్వాత మొదలెడదాంలే అనే భావన వారిని వెనక్కి నెడతాయి. అయితే 20 ఏళ్ల వయసు ప్రయోగాలు చేయడానికి, రిస్క్ తీసుకోవడానికి, కలలు కనడానికి సరైన సమయం. అయితే యువత ఆనందానికి మాత్రమే ప్రాధాన్యమిస్తారు. కానీ ఆనందం కాస్త ప్రణాళికతో ఉండాలి, భవిష్యత్తుపై దృష్టి పెట్టాలి. ఊహించని సమస్యలపై అవగాహన పెంచుకోవాలి. లేకపోతే 30 ఏళ్ల తర్వాత ‘ఇప్పటిదాకా ఇంత సంపాదించాను, అంతా ఎక్కడికిపోయింది‘ అనే ప్రశ్న ఎదురవుతుంది. అప్పడు పెరిగినబాధ్యతలు, పెరుగుతున్న ఖర్చులు భవిష్యత్తు గురించి బెంగపడేలా చేస్తాయి.యువత భవిష్యత్తును మింగేస్తున్న 7 మనీ ట్రాప్స్ 1. జీతం పెరిగినపుడు జీవనశైలిని అప్‌గ్రేడ్ చేయడం చాలామంది యువత ఉద్యోగంలో చేరిన కొత్తలో జీతం పెరిగిన వెంటనే కొత్త కొత్త మొబైల్ ఫోన్లు, కొనడం, ఖరీదైన రెస్టారెంట్లకు వెళ్లి వేలల్లో ఖర్చుచేయడం, నెలా నెలా విహార యాత్రలకు వెళ్లడం ద్వారా కొత్త లైఫ్ స్టైల్‌ను ఎంచుకుంటారు. ఒక్కోసారి ఇవన్నీ సహజంగానే అనిపిస్తాయి. కానీ ఈ అలవాట్లు భారీ ఖర్చులుగా మారతాయి. దీన్నే లైఫ్ స్టైల్ క్రీప్ అంటారు. జీతం పెరుగుతూ ఉంటుంది. పొదుపు మాత్రం పెరగదు. కానీ జీవన శైలి మారిపోతూ ఉంటుంది. ఫలితంగా పదేళ్లు గడిచేసరికి బ్యాంకు పొదుపు ఖాతాలో పదిరూపాయలు కూడా కనబడదు. దీనికి పరిష్కారం సులభమే. జీతం పెరిగిన ప్రతిసారీ ఆ పెరుగుదలలో కనీసం 50 శాతాన్ని నేరుగా పెట్టుబడి వైపు మళ్లించాలి. అప్పుడే ఆదాయం పెరుగుదల భవిష్యత్తులో సంపదగా మారుతుంది. 2. పెట్టుబడులను వాయిదా వేయడం‘ఈసారి జీతం పెరిగినపుడు పెట్టుబడి మొదలెడతా, వచ్చే ఇంక్రిమెంట్ అందుకున్నాక పొదుపు చేస్తా, ఇంకొన్ని రోజులు ఎంజాయ్ చేసి కాస్త స్థిరపడడ్డాక ఇన్వెస్ట్ స్టార్ట్ చేస్తా‘ యువత నుంచి సాధారణంగా వినిపించే మాటలు ఇవి. కానీ కాంపౌండింగ్ అనే అద్భుతం కాలాన్ని కోరుకుంటుంది. ఉదాహరణకు 22 ఏళ్ల వయసులో నెలకు రూ.5000తో సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) ప్రారంభించిన వ్యక్తి 55 ఏళ్ల వయసు వచ్చేసరికి దాదాపు రూ.2.2 కోట్ల సంపద కూడబెట్టగలడు (ఏడాదికి 12 శాతం రాబడి అంచనాతో). అదే సిప్‌ను 30 ఏళ్ల వయసులో ప్రారంభిస్తే అది రూ.85 లక్షల వరకు మాత్రమే పెరుగుతుంది. ఇక్కడ డబ్బు కన్నా ముందుగా ప్రారంభించడం వల్ల వచ్చిన కాల ప్రయోజనమే ప్రధాన కారణం. అందుకే పెట్టుబడి ఎంత చేశారు కాదు. ఎప్పుడు మొదలెట్టారు అన్నదే అత్యంత కీలకం. 3. క్రెడిట్ కార్డును అదనపు ఆదాయంగా భావించడం క్రెడిట్ కార్డు అనేది ఆదాయం కాదు. అది తాత్కాలిక రుణం మాత్రమే. స్వైప్ చేసినపుడు గర్వంగా అనిపిస్తుంది. కానీ బిల్లు వచ్చినపుడు అసలు వాస్తవం కళ్లు బైర్లు కమ్మేలా చేస్తుంది. వాడిన మొత్తంలో కనీస బకాయి మాత్రమే చెల్లిస్తూ వెళితే ఏడాదికి 36 నుంచి 48 శాతం అదనపు వడ్డీ భారాన్ని మోసే పరిస్థితి ఏర్పడుతుంది. అనుకోని పరిస్థితుల్లో ఉద్యోగం కోల్పోవడం, ఆరోగ్య సమస్యలు వంటి అత్యవసర పరిస్థితుల్లో కూడా క్రెడిట్ కార్డు వాడకుండా ఉండాలంటే కనీసం 6 నుంచి 9 నెలల ఖర్చులకు సరిపడే ఎమర్జెన్సీ ఫండ్‌ను ముందుగానే సిద్ధం చేసుకోవాలి. 4. తెలియని ఇన్వెస్ట్మెంట్ల వెంట పరుగులు తీయడంప్రతి కాలంలో ఏదో ఒక పెట్టుబడి రంగం ప్రపంచవ్యాప్తంగా ఆకర్షణీయంగా, సంచలనంగా మారుతుంది. కొన్నేళ్ల క్రితం క్రిప్టో, తర్వాత డిఫెన్స్ స్టాక్స్, ఆ తర్వాత స్మాల్ క్యాప్ ఫండ్స్, తర్వాత ఫ్లెక్సీ కాప్ ఫండ్లు ఇలా.. వాటిలో పెట్టుబడి పెట్టినవారు భారీ లాభాలు పొందారని, కోటీశ్వరులయ్యారని వార్తలు వస్తూంటాయి. యువతరం ఎక్కువగా ఆ ప్రచారంలో చిక్కుకుని, ఆ ట్రెండ్‌లో భారీగా నష్టపోతోంది. దీర్ఘకాలిక సంపద సృష్టించే పెట్టుబడులకంటే తక్షణ లాభాల ఆశతో ఆప్షన్స్, ఫ్యూచర్స్ ట్రేడింగ్ వైపు యువరం ఆకర్షితులవుతోంది. సోషల్ మీడియాలో ఫిన్ఫ్లూయెర్స్ ప్రభావం, తక్కువ సమయంలో భారీ రాబడులు వస్తాయనే ప్రచారం ఈధోరణిని మరింత పెంచుతున్నాయి. అయితే ఇన్వెస్ట్మెంట్ సంపదను సృష్టిస్తే డెరివేటివ్స్ ట్రేడింగ్ మూలధనాన్నే కరిగించేస్తాయి. ఇక్కడ సమస్య పెట్టుబడి ఎంపికలో కాదు. స్పష్టమైన లక్ష్యం లేకుండా సమయం చూడకుండా ఇన్వెస్ట్ చేయడంలోనే ఉంది. ప్రతిసారి పెట్టుబడి చేసే ముందు రెండు ప్రశ్నలు వేసుకోవాలి. ఒకటి ఈ డబ్బు ఏ అవసరానికి? రెండు.. ఎప్పుడు అవసరం అవుతుంది? ఈ రెండు ప్రశ్నలకు సమాధానం లేకపోతే పెట్టుబడి వ్యూహం కాదు, జూదం అవుతుంది.5. ఇన్సూరెన్స్‌ను పెట్టుబడిగా కొనడంచాలా మంది ఫైనాన్స్ ఏజెంట్లు యూలిప్‌లు. ఎండోమెంట్ పాలసీలు, ఒకే ఉత్పత్తితో రక్షణతో పాటు రాబడి కూడా ఇస్తాయని చెబుతుంటారు. కానీ అవి ఆశించిన ఫలితం ఇవ్వవు. ఈ పాలసీల్లో ఇన్సూరెన్స్ కవరేజీ తక్కువ ఉంటుంది. పెట్టుబడి రాబడులు కూడా రకరకాల ఛార్జీల కారణంగా తగ్గిపోతాయి. అందుకే పర్సనల్ ఫైనాన్స్ నిపుణులు టర్మ్ ఇన్సూరెన్స్ వేరు, పెట్టుబడులు వేరు అనే సూత్రాన్ని సూచిస్తారు. కుటుంబ రక్షణకు టర్మ్ పాలసీ, సంపద కోసం ముచువల్ ఫండ్లు, ఇతర పెట్టుబడులు ఎంచుకోవడం తెలివైన నిర్ణయమవుతుంది. 6. సోషల్ మీడియా ప్రభావంతో ఖర్చు చేయడంసోషల్ మీడియాలో ఇన్ఫ్లూయెన్సర్లు విదేశీ పర్యటనలు, ఖరీదైన రెస్టారెంట్లు, కొత్త కొత్త గాడ్జెట్లు, విలాసవంతమైన జీవితం మాత్రమే చూపిస్తారు. కానీ వాటి వెనక ఉన్న ఈఎంఐలు, క్రెడిట్ కార్డుల బిల్లులు గురించి చెప్పరు. వీటిని తరచూ చూసే యువతరం వాటి ప్రభావంతో తమ ఆర్థిక సామర్థ్యాన్ని మించి ఖర్చు చేస్తారు. తాత్కాలిక ఆనందం కంటే ఆదాయానికి మించిన ఖర్చుతో పెరిగిన ఒత్తిడి తరువాతి రోజోల్లో అనుభవించిన ఆనందాన్ని గుర్తు లేకుండా చేస్తుంది. అందుకే ప్రతిసారి ఖర్చు చేసే ముందు ‘ఇది నిజంగా నాకు అవసరమా? లేక ఇతరులను చూసి చేస్తున్నానా? అని ఆలోచించుకోవడం అవసరం. 7. స్వీయాభివృద్ధికి పెట్టుబడి చేయకపోవడంయువతకు అత్యంత విలువైన ఆస్తి స్టాక్ పోర్ట్ ఫోలియో కాదు. సంపాదన సామర్ధ్యం ప్రధానం. ప్రమోషన్‌కు ఉపకరించే ఒక మంచి కోర్సు, ప్రొఫెషనల్ సర్టిఫికేషన్, నైపుణ్యాన్ని పెంచుకునే సరైన పుస్తకాలుపై చేసే పెట్టుబడి కెరీర్‌ను పూర్తిగా మార్చగలవు. రూ.20000 జీతాన్ని లక్షలకు పెంచే అవకాశం కలుగుతుంది. అందువల్ల ఈ వయసులో సంపద సృష్టించడంలో ముఖ్యమైన పెట్టుబడి మీపై మీరు చేసేదే.అసలు సమస్య ఏమిటి? ఈ ఏడు తప్పిదాల్లో ఒక సామాన్య అంశం ఇమిడి ఉంది. ఇవన్నీ చెడు నిర్ణయాల వల్ల జరిగినవి కావు. నిర్ణయం సరిగా తీసుకోకపోవడం వల్ల జరిగేవి. డబ్బు ఎప్పుడూ ఎవరికోసం ఆగదు. జీతం వచ్చిన క్షణం నుంచి అది అనేక రకాలుగా అనేక మార్గాల్లో ఎటో వెళ్లిపోతుంది. కాబట్టి మంచి ఆర్థిక అలవాట్లను ఆటోమేటిక్‌గా ఏర్పాటు చేసుకోవడం అత్యంత ముఖ్యం.ఆటో డెబిట్ సిప్, ప్రత్యేక సేవింగ్స్ ఖాతా, సరైన టర్మ్ ఇన్సూరెన్స్ వంటి నిర్ణయాలు జీవితాన్ని సులభతరం చేస్తాయి. 20 ఏళ్ల వయసులు సంపద సృష్టించాలి అనుకునే వారికి ఎక్కువ ఆర్థిక నైపుణ్యం ఉండాల్సిన అవసరంలేదు. కానీ త్వరగా సరైన వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నవారు ముందంజలో ఉంటారు. ఈ దశలో తీసుకునే చిన్న ఆర్ధిక నిర్ణయాలు భవిష్యత్తులో కోట్ల రూపాయల తేడాను చూపిస్తాయి. అందుకే 20ల్లో డబ్బును నిర్లక్ష్యం చేయడం కాదు, దానికి సరైన దిశ చూపించడం అత్యంత అవసరం.సంపద సృష్టికి గుర్తుంచుకోవాల్సిన 5 గోల్డెన్ రూల్స్→ జీతం పెరిగినపుడల్లా కనీసం 50 శాతం పెట్టుబడికి మళ్లించండి → మొదటిజీతం నుండే సిప్ ప్రారంభించండి → 6 నుంచి 9 నెలల ఖర్చులకు ఎమెర్జెన్సీ ఫండ్ ఏర్పాటు చేయండి → టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ తప్పనిసరి → నైపుణ్యాలు పెంచుకునేందుకు కొంత ఖర్చు చేయండి – సాక్షి, వెల్త్ డెస్క్ -
షేర్లకూ కావాలి ఫిట్నెస్!
తల్వాల్కర్ జిమ్... ఒకప్పుడు ఇదో మెరుపు. స్టాక్ మార్కెట్లో తొలి ఫిట్నెస్ కంపెనీగా లిస్టయింది. విపరీతంగా విస్తరించింది. భారీగా అప్పులు చేసింది. కట్‌చేస్తే... దివాలా తీసి తెరమరుగైపోయింది. ఇన్వెస్టర్లు మునిగిపోయారు. ఇపుడు కల్ట్ ఫిట్. హృతిక్‌రోషన్ దన్నుతో కొన్నేళ్లుగా ఇదో బ్రాండ్‌ను సృష్టించుకుంది. వీధివీధికీ విస్తరించింది. హృతిక్‌తో సహా ప్రస్తుత ఇన్వెస్టర్లకు ఎగ్జిట్ అవకాశమిస్తూ ఐపీఓకు వస్తోంది. డీఆర్‌హెచ్‌పీ దాఖలు చేసింది. నిజానికి లిస్టయిన... లిస్ట్ కాబోతున్న అచ్చమైన ఫిట్నెస్ కంపెనీలు ఈ రెండే. ఒక కథ ముగిసింది. మరో కథ మొదలవుతోంది. కానీ ఇన్వెస్టర్లు చూడాల్సింది ఇది కాదు. వీటి చుట్టూ ఉన్న ఫిట్నెస్ ఎకానమీని. 15 ఏళ్ల కిందట ఫిట్నెస్ అంటే జిమ్. కానీ ఇపుడది జీవనశైలి. ఆ జీవనశైలిని అనుసరించే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఇదే ఫిట్నెస్ ఎకానమీకి మూలం. ఎందుకంటే ఒకప్పుడు జిమ్‌కు వెళ్లేవారు... ఇపుడు నడుస్తున్నారు. పరుగులు పెడుతున్నారు. ట్రెక్కింగ్ చేస్తున్నారు. బ్యాడ్మింటన్, పికిల్ బాల్ ఆడుతున్నారు. స్మార్ట్‌వాచ్‌లతో అడుగులు లెక్కబెడుతున్నారు. లెక్కలు కట్టుకుని ప్రొటీన్ తింటున్నారు. ఏడాదికోసారి హెల్త్ చెకప్ చేయించుకుంటున్నారు. ఇవన్నీ ఇపుడు అవసరాలుగా మారిపోయాయి. మరి ఈ ఫిట్నెస్ ఎకానమీలో మెరిసే చాన్సున్న కంపెనీలేంటి? రిటైల్ ఇన్వెస్టర్లు గమనించాల్సినవేంటి? ఇవన్నీ విశ్లేషించేదే ఈ ‘సాక్షి వెల్త్’ స్టోరీ...ప్రపంచ మధుమేహ రాజధానిగా మనదేశం మారటం... పెరుగుతున్న ఊబకాయం... యువతకూ గుండె సమస్యలు... ఇవన్నీ వ్యాయామాన్ని తప్పనిసరి మెడిసిన్ జాబితాలో చేర్చేశాయి. మధ్యతరగతి ఆదాయాలు పెరగటం... దానికి సోషల్ మీడియా ప్రచారం తోడవటంతో... యోగా, జిమ్, స్పోర్ట్స్ ఎరీనాలు, మారథాన్ ఈవెంట్లు, ప్రొటీన్ సప్లిమెంట్లు, స్మార్ట్‌వాచ్‌లు, స్పోర్ట్స్‌వేర్ వంటి ఫిట్నెస్ ఎకానమీ వేగంగా విస్తరిస్తోంది. ఈ ఎకానమీలో ఇన్వెస్టర్లు గమనించాల్సిన రంగాలు, కంపెనీల వివరాలివిగో...ఫిట్నెస్ సెంటర్లు నేరుగా బయటకు కనిపించే ఈ రంగంలో లిస్టెడ్ ప్లేయర్లు తక్కువే. తల్వాల్కర్స్ జిమ్ గతంలో లిస్టయినా రకరకాల కారణాల వల్ల దివాలా తీసేసి డీలిస్ట్ అయింది. కల్ట్‌ఫిట్ త్వరలో ఐపీఓకు వస్తోంది. అయితే గోల్డ్స్ జిమ్, ఎనీటైమ్ ఫిట్నెస్, స్నాప్ ఫిట్నెస్ వంటి అన్‌లిస్టెడ్ చెయిన్లు బాగానే రాణిస్తున్నాయి. ఈ రంగం వేగంగా పెరుగుతున్నా... లాభాలు తక్కువేనని చెప్పాలి. పెరుగుతున్న అద్దెలు, అధిక నిర్వహణ ఖర్చులు, తరచూ మారిపోయే కస్టమర్లు, ఒక సెంటర్లో ఎక్కువ మందికి ఏకకాలంలో అవకాశం ఇవ్వలేకపోవటం వంటివి జిమ్‌ల లాభాల్ని పరిమితం చేస్తున్నాయి.రియల్ ఎస్టేట్ మౌలికంగా జరుగుతున్న అతిపెద్ద మార్పు ఇదే. ఎందుకంటే పదేళ్ల కిందట ఇల్లు కొనేటపుడు ఎన్ని బెడ్రూమ్లు? అనేదే చూసేవారు. ఇపుడు క్లబ్‌హౌస్ ఎంత పెద్దది? అన్నదే ప్రధానం. ప్రధాన ప్రాజెక్టుల్లో ఒలింపిక్ సైజ్ స్విమింగ్‌పూల్స్, పూర్తిస్థాయి జిమ్‌లు, యోగా స్టూడియోలు, ఇండోర్ బ్యాడ్మింటన్, స్క్వాష్, సైక్లింగ్– జాగింగ్ ట్రాక్స్, యాక్టివిటీ పార్క్స్ సహజమైపోయాయి. డెవలపర్లు విక్రయిస్తున్నది కేవలం ఫ్లాట్లు కాదు. లైఫ్‌స్టైల్. వారి మధ్య పోటీ అంతా ఈ సౌకర్యాల్లోనే. ఈ రంగం విపరీతంగా పెరగటంతో పాటు లిస్టెడ్ సంస్థలూ ఎక్కువే ఉన్నాయి. ప్రెస్టీజ్ ఎస్టేట్స్, బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్, గోద్రెజ్ ప్రాపర్టీస్, ఒబెరాయ్ రియల్టీ. డీఎల్ఎఫ్, శోభా డెవలపర్స్, కల్పతరు, లోధా, ఎన్సీసీ వంటి ప్రధాన కంపెనీల్ని ఇన్వెస్టర్లు వాచ్ చేయొచ్చు.స్పోర్ట్స్ రిటైల్ జాగింగ్‌కో, వాకింగ్‌కో వెళ్లినపుడే స్పోర్ట్స్ షూ వేయటమనేది పోయింది. నిత్యం వాడే పాదరక్షల్లో ఇది చేరిపోయింది. ఈ మార్పు స్పోర్ట్స్ రిటైల్‌ను ఆకర్షణీయ రంగంగా చేసింది. డెకాథ్లాన్, అడిడాస్, నైకీ, పూమా వంటి అంతర్జాతీయ బ్రాండ్లతో పాటు... పేజ్ ఇండస్ట్రీస్ (అథ్లీజర్), క్యాంపస్ యాక్టివ్‌వేర్, బాటా, రిలాక్సో ఫుట్‌వేర్ వంటి లిస్టెడ్ సంస్థలనూ వాచ్‌లిస్ట్‌లో పెట్టుకోవచ్చు. న్యూట్రిషన్ఫిట్నెస్పై మనసు పెట్టేవారంతా... ఎక్కువ ప్రొటీన్... తక్కువ చక్కెర, హెల్తీ స్నాక్స్ వంటివి రెగ్యులర్ ఆహారాల్లో భాగంగా మార్చేసుకుంటున్నారు. దీంతో ప్రొటీన్ ఇపుడు ప్రధాన స్రవంతిలోకి వచ్చేసింది. హెల్త్‌కార్ట్, ఫాస్ట్ అండ్ అప్, మజిల్ బ్లేజ్, జీఎన్సీ ఇండియా వంటి అన్‌లిస్టెడ్ కంపెనీలతో పాటు బ్రిటానియా, నెస్లే ఇండియా, టాటా కన్సూమర్ ప్రొడక్ట్స్ వంటి లిస్టెడ్వీ ఉన్నాయి.హెల్త్‌కేర్ అనారోగ్య సమస్యలు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవటమే ఫిట్నెస్ ఎకానమీకి మూలం. ఆసుపత్రుల కంటే డయాగ్నస్టిక్ కంపెనీలు, బీమా కంపెనీలు అతిపెద్ద లబ్ధిదారులుగా మారబోతున్నాయి. ప్రధానంగా అపోలో హాస్పిటల్స్, డాక్టర్ లాల్ పాత్లాబ్స్, థైరోకేర్, మెట్రోపాలిటన్ హెల్త్‌కేర్, విజయా డయాగ్నస్టిక్స్ వంటి సంస్థలతో పాటు జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలను కూడా వాచ్‌లిస్ట్‌లో పెట్టుకోవచ్చు.స్పోర్ట్స్ టూరిజంజనం ఇపుడు మారథాన్లు, సైక్లింగ్, ట్రెక్కింగ్, ట్రయాథ్లాన్ వంటి స్పోర్ట్స్ ఈవెంట్ల కోసం రకరకాల ప్రాంతాలకు ప్రయాణిస్తున్నారు. హైదరాబాద్ మారథాన్, లడఖ్ సైక్లింగ్, అడ్వెంచరస్ స్పోర్ట్స్ వంటివేవీ పదేళ్లకిందట పెద్దగా లేవు. కానీ ఇపుడు ఫిట్నెస్తో ట్రావెల్ డిమాండ్ కూడా పెరుగుతోంది. స్మార్ట్ వేరబుల్స్యాపిల్, శామ్సంగ్ వంటి విదేశీ లిస్టెడ్ కంపెనీలతో పాటు బోట్ వంటి దేశీ అన్‌లిస్టెడ్ సంస్థలూ వేరబుల్స్ మార్కెట్‌ను శాసిస్తున్నాయిపుడు. ఎందుకంటే స్మార్ట్‌వాచ్ అనేది కేవలం టైమ్ తెలియజేయటానికి కాదు. హార్ట్ రేట్ నుంచి మొదలు పెడితే... ఎన్ని అడుగులు నడిచారు? ఎంత సేపు మంచి నిద్రపోయారు? ఈసీజీ ఎలా ఉంది? ఒత్తిడి ఎంత ఉంది? కేలరీలెన్ని? ఇవన్నీ చెబుతోంది. అందుకే ఇది అతివేగంగా విస్తరిస్తూ... ఎప్పటికప్పుడు కొత్త ప్లేయర్లు ప్రవేశించడానికి కారణమవుతోంది. స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ఇపుడిపుడే ఎదుగుతున్న రంగమిది. ఒకవంక స్పోర్ట్స్ ఇన్ఫ్రాపై ప్రభుత్వాలు భారీగా వెచ్చిస్తుండగా... మరోవంక ప్రయివేటు అకాడమీలూ వేగంగా పుట్టుకొస్తున్నాయి. ప్రత్యేక మారథాన్లు, సైక్లింగ్, బ్యాడ్మింటన్, పికిల్‌బాల్ వంటి క్రీడల్లో ఇన్ఫ్రా సౌకర్యాలు కల్పిస్తూ ప్రయివేటు ప్లేయర్లు ప్రవేశిస్తున్నారు. వీటన్నిటినీ చూశాక అనిపించేదొకటే!. దేశంలో ఫిట్నెస్ బూమ్ స్పష్టంగా కనిపిస్తోంది. మరి దీని లబ్ధిదారులెవరు? ఒకటి జిమ్‌లు. రెండు యాక్టివ్ లైఫ్‌స్టయిల్‌ను అలవాటుగా మార్చే కంపెనీలు!!. సమాధానం రెండే. ఎందుకంటే ఒక వ్యక్తి కల్ట్‌ఫిట్ జిమ్‌లో చేరి... ఆ తరవాత మానేశాడనుకోండి. తన ఫిట్నెస్ ప్రయాణం ఆగిపోదు కదా!!. తను స్పోర్ట్స్ షూలు వాడతాడు. ప్రొటీన్ పౌడర్ కొంటాడు. స్మార్ట్ వాచ్ పెట్టుకుంటాడు. రోజూ వాకింగ్ చేస్తాడు. తన కమ్యూనిటీలో క్లబ్‌హౌస్ ఉంటే దాన్ని ఉపయోగించుకుంటాడు. ట్రెక్కింగ్‌కు వెళ్లడం... బ్యాడ్మింటన్ ఆడటం వంటివి చేస్తూనే ఉంటాడు. అంటే... తను చేసే ఖర్చు మారింది తప్ప ఆగిపోలేదు. -రమణమూర్తి మంథా -
98 కేజీల నుంచి 78 కేజీలకు..! హెల్ప్ అయిన డైట్‌ప్లాన్..
అధిక బరువు కొందరికీ జంక్‌ఫుడ్, అనారోగ్యకరమైన జీవనశైలి వంటివి ప్రధాన కారణాలు. మరికొందరు గంటలకొద్దీ కూర్చొని పనిచేసే డెస్క్ జాబ్‌లు, సరైన కదలికలు లేకపోవడంతో అధిక బరువు సమస్యను ఎదుర్కొన్నారు. ఆ తర్వాత తగ్గడానికి ప్రయత్నాలు మొదలు పెట్టినా..సక్సెస్ అయినవాళ్లు మాత్రం కొందరే. ఎందువల్ల అంటే ఇక్కడ నిలకడ, క్రమం తప్పకుండా చేయడం అనేవి అత్యంత కీలకం. ఇక్కడొక మహిళ కూడా లాక్డౌన్ కారణంగా కదలికలు లేక ఊహించిన విధంగా లావుగా అయిపోయింది. చివరికి కార్డియో వ్యాయమాలు, సరైన డైట్‌తో బరువు తగ్గడమే కాదు స్ఫూర్తిగా నిలిచింది. ఆ మహిళే..ఆనంద్ భార్గవ్. తాను 2020లో ఉన్నత విద్యను అభ్యసించడానికి మెల్బోర్న్ వెళ్లింది. మునుసటి నెలలోనే లాక్డౌన్ ప్రకటించారు. ఇంటి నుంచి కాలేజ్‌కి హాజరవడం వంటి కారణాల వల్ల కదలికలేని జీవనశైలికి దారితీసి, గణనీయంగా బరువు పెరిగిందామె. ఫలితంగా ఊబకాయ సంబంధిత లక్షణాలను అనుభవించింది. జిమ్‌లో చేరి తగ్గాలని చూసినా..పెద్దగా ప్రయోజనం లేకపోగా, మరింత ఆకలికి దారితీసి నియంత్రణ కోల్పయింది. దాంతో ఆయాసం, పాదాల వాపు వంటి సమస్యలు ఎదుర్కొంది. రక్తపరీక్షలన్నీ సాధారణంగానే ఉన్నా, నడుము నొప్పి, మోకాళ్ల నొప్పి, ఒళ్లునొప్పులు వంటి ఊబకాయం సంబంధిత సమస్యలను ఎదుర్కొన్నట్లు వెల్లడించింది. దాని ఫలితంగా కోపం, ఆందోళన వంటి మానసిక సమస్యలు కూడా ఎక్కువైనట్లు తెలిపింది. ఇక బరువు తగ్గగపోతే కష్టమనే పరిస్థితి ఎదురైంది ఆమెకు. దాంతో ఎలాగైన బరువు తగ్గాని డిసైడ్ అందుకోసం ప్రయత్నం మొదలుపెట్టినట్లు తెలిపింది. తనకు భారతీయ వంటకాలంటే మహా ఇష్టమని, అందుకని ఆ రుచిపోకుండా డైట్ ప్లాన్ చేసుకున్నట్లు వెల్లడించింది. తన అధిక బరువుని అమాంతం తగ్గేలా చేసిన సాధరణ డైట్ ప్లాన్‌ని కూడా పంచుకుంది. ఉదయం: చియా సీడ్ వాటర్, అల్లం-నిమ్మకాయ నీరు, సోంపు, వాము నీరు, గుప్పెడు నట్స్అల్పాహారం: అవకాడో టోస్ట్, పోహా, ఎయిర్-ఫ్రైడ్ బ్రెడ్ పకోరా, లేదా పీనట్ బటర్ టోస్ట్ఉదయం పూట చిరుతిండి: ఆయా కాలాల్లో లభించే పండ్లుమధ్యాహ్న భోజనం: రాజ్మా రైస్ లేదా కధి రైస్‌తో పాటు 100 గ్రాముల సలాడ్, 100 గ్రాముల పెరుగుసాయంత్రం చిరుతిండి: గ్రీన్ టీ లేదా కాఫీ, వేయించిన నట్స్, వేయించిన మఖానా, భేల్ లేదా ఖాఖ్రారాత్రి భోజనం: పప్పు అన్నం, రాగి లేదా బజ్రా రోటీ, కూరగాయలు, బీన్స్ లేదా పులావ్ఈ ఆహారంతో పాటు, ఆమె తగినంత నీరు తాగడంపై కూడా దృష్టి సారించింది. ఆమె ప్రతిరోజూ తప్పనిసరిగా నీరు తాగేది, దీనివల్ల బరువు పెరిగిన తర్వాత తరచుగా వచ్చే కండరాల నొప్పులను నివారించగలిగింది.ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామ దినచర్యను పాటించడం ద్వారా, ఆమె తన శక్తి స్థాయిలు పెరగడాన్ని గమనించడం ప్రారంభించింది. ఆమె మరింత చురుకుగా మారడమే కాకుండా, ఆదిత్య తన మొత్తం ఆరోగ్యం మెరుగుపడటాన్ని కూడా చూసింది. ఆమె గతంలో ఎదుర్కొన్న సమస్యలు వాటంతట అవే తగ్గడం ప్రారంభించాయి. క్రమంగా, ఆమె జిమ్‌లో చేరి, కార్డియో వ్యాయామాలు చేసి, చివరికి 20 కిలోల బరువు తగ్గింది. అలాగే ఆమె ఆరోగ్యకరమైన, చురుకైన జీవనశైలిని కొనసాగిస్తూనే ఉండాలని స్ట్రాంగ్‌గా నిర్ణయించుకుందామె.(చదవండి: అందమైన బుగ్గల కోసం..కుసుమ పూల రసం) -
మధుమేహాన్ని తగ్గించే పరివృత్త త్రికోణాసనం..
శరీరాన్ని ముందుకు వంచి, వెన్నెముకను ఒక వైపుకు తిప్పి చేసే భంగిమ కనుక దీనిని పరివృత్త త్రికోణాసనం అంటారు.చేసే విధానం...ముందుగా మ్యాట్‌పై తాడాసనంలో నిటారుగా నిలబడాలి.రెండు కాళ్లను 3–4 అడుగుల దూరంలో ఉంచండి.కుడి పాదాన్ని ముందుకు, ఎడమ పాదాన్ని సుమారు 45 డిగ్రీలు లోపలికి తిప్పండి.రెండు చేతులను భుజాల స్థాయిలో చాపండి.శ్వాసను బయటకు వదులుతూ నడుము నుంచి ముందుకు వంగండి.ఎడమ చేతిని కుడి పాదం బయట లేదా లోపల నేలపై ఉంచండి.కుడి చేతిని నిటారుగా పైకి ఎత్తి, పై చేతి వేళ్లవైపు చూడాలి.వెన్నెముకను నిటారుగా ఉంచి, సాధారణ శ్వాసతో 20–30 సెకన్లు ఉండాలి.శ్వాసను లోపలికి తీసుకుంటూ నెమ్మదిగా పైకి లేవాలి.ఇదేవిధంగా మరోవైపున కూడా చేయాలి.ప్రయోజనాలు...బరువు నియంత్రణకు తోడ్పడుతుంది.వెన్నెముకకు మంచి ట్విస్ట్ లభించి ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది.కాళ్లు, తుంటి, హ్యామ్‌స్ట్రింగ్స్ బలపడతాయి.జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది.పొత్తికడుపు అవయవాలకు మసాజ్ లభిస్తుంది.నడుము భాగంలోని కొవ్వు తగ్గించే వ్యాయామాలకు సహాయకంగా ఉంటుంది.శరీర సమతుల్యత, ఏకాగ్రత పెరుగుతుంది.ఛాతి విస్తరించి శ్వాస సామర్థ్యం మెరుగుపడుతుంది.భుజాలు, నడుము బిగుతు తగ్గుతుంది.పొత్తికడుపు భాగంపై మృదువైన ఒత్తిడి ఏర్పడి జీర్ణక్రియకు సహాయపడుతుంది.కండరాలు ఎక్కువగా పనిచేయడం వల్ల క్యాలరీల ఖర్చు పెరుగుతుంది.జాగ్రత్తలు...తీవ్రమైన వెన్నునొప్పి, స్లిప్ డిస్క్ ఉన్నవారు చేయ కూడదు.మెడ సమస్యలు ఉన్నవారు పైకి చూడకుండా ముందుకు చూడాలి.గర్భిణీలు ఈ ఆసనాన్ని చేయకూడదు.భోజనం చేసిన వెంటనే చేయకూడదు. కనీసం 3–4 గంటల విరామం ఉండాలి. శరీరాన్ని బలవంతంగా తిప్పకుండా మీ సామర్థ్యానికి అనుగుణంగా మాత్రమే చేయాలి.ప్రతి వైపు 20–30 సెకన్లు ఉండాలి.2–3 రౌండ్లు సాధన చేయాలి.- అనిత పాతర్ల, యోగా ట్రైనర్ -
బోసి మెడ.. ఖాళీ చేతులు.. ఇదేం అలవాటు?
చేతికి వాచ్ లేదు.. వేళ్లకు ఉంగరాలు కనిపించవు.. మెడలో చైన్, చెవులకు ఆభరణాలు కూడా ధరించరు.. ఇలాంటి వారిని చూసినప్పుడు చాలామందికి ఒకే ప్రశ్న వస్తుంది.. “ఇదేం అలవాటు?” అని. కొందరు వీరికి ఫ్యాషన్‌పై ఆసక్తి ఉండదని అనుకుంటారు. కానీ ఆభరణాలకు దూరంగా ఉండటానికి కేవలం ఫ్యాషన్ కారణమే కాదు.. ఇతర కారణాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.సైకాలజీ ప్రకారం.. ఒక వ్యక్తి ఏ వస్తువులు ధరిస్తారు.. ఏవి ధరించరు అన్నది వారి వ్యక్తిగత ఆలోచనా విధానాన్ని ప్రతిబింబించొచ్చు. కొందరికి చేతికి వాచ్, బ్రేస్లెట్, ఉంగరం వంటి వస్తువులు పెట్టుకోవడం అసౌకర్యంగా అనిపిస్తుంది. రోజువారీ పనుల్లో అవి ఇబ్బందిగా అనిపించడం, శరీరంపై అదనంగా ఏదైనా ఉండటం ఇష్టం లేకపోవడం వంటి కారణాలతో వాటికి దూరంగా ఉంటారు.ముఖ్యంగా సింపుల్ జీవనశైలిని ఇష్టపడేవారు తక్కువ వస్తువులతోనే ఉండాలని కోరుకుంటారు. వారికి ఆర్భాటం కంటే సౌకర్యం, స్వేచ్ఛ, సమయం ముఖ్యమని సైకాలజీ నిపుణులు చెబుతున్నారు.ఫ్యాషన్ అంటే వ్యతిరేకత కాదు!ఆభరణాలు ధరించని వారంతా ఫ్యాషన్‌కు వ్యతిరేకమని భావించడం తప్పు. కొందరు తమ రూపాన్ని సహజంగా ఉంచుకోవాలని కోరుకుంటారు. మరికొందరు దుస్తులు, అలంకరణ కంటే వ్యక్తిత్వం, పనితీరు, ఆలోచనలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. అలాగే కొందరికి చిన్నప్పటి నుంచి అలాంటి అలవాటే ఉండొచ్చు. కుటుంబ వాతావరణం, పెరిగిన తీరు, వ్యక్తిగత అనుభవాలు కూడా ఇలాంటి అభిరుచులపై ప్రభావం చూపుతాయి.ఆర్థిక కారణాలు కూడా ఉండొచ్చు!ఆభరణాలకు దూరంగా ఉండటానికి ఆర్థిక కారణాలు కూడా ఒక అంశం కావచ్చు. బంగారం, వెండి వంటి ఆభరణాలు కొనుగోలు చేయడం అందరికీ సాధ్యపడకపోవచ్చు. కొందరు అవసరమైన ఖర్చులకు ప్రాధాన్యం ఇస్తూ ఆభరణాల కొనుగోలును పక్కన పెడతారు. మరికొందరు ఆభరణాలు కొనుగోలు చేయగల సామర్థ్యం ఉన్నప్పటికీ.. వాటిపై డబ్బు ఖర్చు చేయడం కంటే పొదుపు, పెట్టుబడులు లేదంటే ఇతర అవసరాలకు ప్రాధాన్యం ఇస్తారు. కాబట్టి ఎవరైనా ఆభరణాలు ధరించకపోతే దాన్ని కేవలం వారి అభిరుచితోనే ముడిపెట్టలేమని నిపుణులు చెబుతున్నారు.తక్కువ వస్తువులు.. తక్కువ ఆందోళనకొంతమంది జీవితంలో మినిమలిజం (తక్కువ వస్తువులతో సరళంగా జీవించడం)ను పాటిస్తారు. ఎక్కువ వస్తువులను నిర్వహించడం కంటే అవసరమైన వాటితోనే జీవించడం వారికి ఇష్టం. ఇలాంటి వారు దుస్తులు, ఆభరణాలు, ఇతర వస్తువుల ఎంపికలో కూడా సరళతకు ప్రాధాన్యం ఇస్తారు.అయితే ఆభరణాలు ధరించని వ్యక్తి తప్పనిసరిగా అంతర్ముఖి అని, సామాజికంగా కలవలేడని చెప్పలేం. అదే విధంగా ఆభరణాలు ఎక్కువగా ధరించే వారు ఆర్భాటాన్ని ఇష్టపడతారని కూడా భావించకూడదు.అలవాటు వెనుక కారణం ఒక్కటే కాదు..మనిషి ప్రవర్తన అనేది అనేక అంశాల కలయిక. వ్యక్తిగత అభిరుచులు, సౌకర్యం, ఆర్థిక పరిస్థితులు, జీవన విధానం.. ఇలా ఎన్నో విషయాలు కలిసి ఒకరి అలవాట్లను నిర్ణయిస్తాయి. అందుకే బోసి మెడ, ఖాళీ చేతులు కనిపిస్తే దాని వెనుక ఒకే కారణం ఉందని భావించకూడదు. అది వారి స్వంత ఎంపిక కావచ్చు.. వారి జీవనశైలిలో భాగం కావచ్చు.(గమనిక: ఇవి సైకాలజీ, ప్రవర్తనా విశ్లేషణల ఆధారంగా చెప్పే సాధారణ అంశాలు మాత్రమే. ఒక్క అలవాటుతో ఒకరి వ్యక్తిత్వం లేదంటే ఆర్థిక పరిస్థితిని నిర్ణయించలేం.) -
బరువు తగ్గడంలో పురుషులే ఫాస్ట్!
బరువు తగ్గే విషయంలో పురుషులకు, మహిళలకు పోటీ పెడితే.. విజేతలుగా నిలిచేది మగాళ్లే. ఔనండి.. మహిళల కంటే పురుషులే త్వరగా బరువు తగ్గుతారట. స్త్రీ, పురుషులిద్దరు ఒకే షెడ్యూల్లో ఒకే డైట్, ఒకే వ్యాయామం పాటించినా సరే.. పురుషులే వేగంగా బరువు తగ్గుతారు. అయితే, ఈ విషయంలో మహిళల తప్పిదం ఏమీ లేదు. ఇందుకు కొన్ని జీవ సంబంధిత కారణాలు ఉన్నాయి. తాజా అధ్యయనం ప్రకారం.. పురుషులు బరువును కోల్పోవడంలోనే కాదు.. దానివల్ల పొందే ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఎక్కువేనట. మరి, పురుషులే త్వరగా బరువు తగ్గేందుకు గల కారణాలేమిటో చూద్దామా!బరువు తగ్గించడమంటే.. శరీరంలోని క్యాలరీని కరిగించడమే. అసలు విషయం ఏమిటంటే.. ఇతరులతో పోల్చితే ఎక్కువ సన్నని కండరాలు ఉన్నవారు ఎక్కువ క్యాలరీలను ఖర్చు చేస్తారు. పురుషులు వేగంగా బరువు తగ్గడానికి ఇది కూడా ఒక కారణం. మహిళలతో పోలిస్తే.. పురుషులు ఎక్కువ సన్నని కండర ద్రవ్యరాశిని కలిగి ఉంటారు. ఇది ఎక్కువ క్యాలరీలను బర్న్ చేయడానికి సహాయపడుతుంది. కండర ద్రవ్యరాశిని పెంచాలంటే మహిళలు.. పురుషులు కంటే ఎక్కువసేపు శ్రమించాల్సి ఉంటుంది.బరువు తగ్గడంలో జీవక్రియ కూడా భారీ పాత్ర పోషిస్తుంది. జీవక్రియ ఎక్కువగా ఉంటే అధిక క్యాలరీలు ఖర్చవుతాయి. ఫలితంగా త్వరగా బరువు తగ్గుతారు. జీవక్రియ కూడా సన్నని కండరాల వల్లే ప్రభావితమవుతుంది. పురుషులు ఎక్కువ సన్నని కండరాలను కలిగి ఉన్నందున వారు అధిక జీవక్రియను కలిగి ఉంటారు. ఫలితంగా మహిళలతో పోలిస్తే వేగంగా బరువు తగ్గడానికి ఇది సహాయపడుతుంది.పురుషులు, మహిళల్లో వేర్వేరు ్రపాంతాల్లో కొవ్వు నిల్వ ఉంటుంది. ఇది కూడా ఇరువురి బరువులపై ప్రభావం చూపుతంది. పురుషులకు ఎక్కువగా పొత్తి కడుపులో కొవ్వు పేరుకుపోతుంది. మహిళలకు తొడలు, పిరుదుల్లో కొవ్వు పెరుగుతుంది. పొత్తికడుపులో పేరుకుపోయే కొవ్వుతోనే ఆరోగ్యానికి ఎక్కువ ప్రమాదం. అయితే, దీన్ని కరిగించడం సులభమే. తక్కువ వ్యాయామంతోనే త్వరగా పొట్టను తగ్గింవచ్చు.రోజూ ఎంత సేపు నడిస్తే మంచిదంటే..హార్మోన్ల వల్ల కూడా స్త్రీలు.. పురుషులు కంటే ఆలస్యంగా బరువు తగ్గుతారు. పురుషుల కంటే మహిళల్లో 6 నుంచి 11 శాతం కొవ్వు ఎక్కువగా ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. మహిళల్లో ఉండే ఈస్ట్రోజెన్ వల్ల భోజనం తర్వాత క్యాలరీలు ఖర్చు చేసే సామర్థ్యం తక్కువగా ఉంటుంది. ఈస్ట్రోజెన్ స్థాయి పడిపోతే బరువు పెరుగుతారు. పురుషులతో పోల్చితే మహిళలు తగిన డైట్ ΄్లాన్ పాటించలేరు. తమకు ఇష్టమైన ఆహారాన్ని చూడగానే కంట్రోల్ చేసుకోలేరు. అయితే, అత్యధిక శాతం మంది పురుషులు శ్రద్ధగా డైట్ పాటిస్తూ బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తారు. ఫలితంగా మహిళల కంటే వేగంగా పురుషులు బరువు తగ్గుతారు. -
84 కేజీల నుంచి 54 కేజీలకు..! ఈజీగా చేసే కార్డియో వ్యాయామాలివే..
బరువు తగ్గడం అంటే తక్షణ పరిష్కారాల కోసం చూడకుండా.. బదులుగా నిలకడగా చేయగలిగే అలవాట్లను అనుసరించడం అని నొక్కి చెబుతుంటారు ఫిట్నెస్ నిపుణులు. అందుకోసం సక్రమమైన జీవనశైలి, చక్కటి వ్యాయామాలను క్రమం తప్పకుండా చేయాల్సిందే. అలాగని కష్టతరమైనవి కాకుండా తేలిగ్గా చేసే వర్కౌట్లు, రిపిటేషన్స్ ప్రధానం అని అంటోంది ఫిట్నెస్ ఔత్సాహికురాలు అంజలి సచెన్. చేసే వ్యాయామాలు సెట్స్ వారిగా రిపిటేషన్ చేస్తే చాలు..కష్టతరమైన వాటి జోలికి పోనవసరం లేదంటోంది. అంతేగాదు తేలిగ్గా చేసే కార్డియో వ్యాయమాల వివరాలను కూడా ఆమె పంచుకున్నారు. అవేంటంటే..అంజలి సచెన్ అనే ఈ మహిళ, క్రమశిక్షణతో కూడిన దినచర్యను పాటిస్తూ, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్లే తాను 84 కేజీల నుంచి 54 కేజీలకు తగ్గినట్లు తెలిపింది. అందుకోసం ఎలాంటి కార్డియో వ్యాయామాలు చేసేదో వెల్లడించారామె. అదనపు కొవ్వుని తగ్గించుకోవడానికి సహాయపడే వ్యాయామాలు ఇవే..హై నీస్ (మోకాళ్లకు వ్యాయామం)ఆమె 20 రెప్స్‌తో నాలుగు సెట్లు హై నీస్ చేయడంతో ప్రారంభించారు. ఈ డైనమిక్ కార్డియో వ్యాయామంలో, మోకాళ్లను తుంటి ఎత్తుకు తీసుకువస్తూ..చేతులను పంప్ చేస్తూ ఒకే చోట పరుగెత్తాలి లేదా నడవాలి. ఇది హృదయ స్పందన రేటును పెంచడానికి, శరీర దిగువ భాగం శక్తిని పెంపొందించడానికి, కోర్‌ను ఉత్తేజపరచడానికి ఒక అద్భుతమైన వ్యాయామం.జంపింగ్ జాక్స్తరువాత, ఆమె జంపింగ్ జాక్స్‌ను 50 రెప్స్‌తో మూడు సెట్లు చేయమని సిఫార్సు చేసింది. ఈ వ్యాయామంలో, ఆమె తన మోకాళ్లను కొద్దిగా వంచి గెంతింది, తన కాళ్లను బయటకు చాస్తూ, చేతులను బయటకు ఊపుతూ వాటిని ఒక వంపులో పైకి లేపింది.కిక్బ్యాక్స్ఆమె సిఫార్సు చేసిన తదుపరి వ్యాయామం కిక్బ్యాక్స్. ఉత్తమ ఫలితాల కోసం కనీసం 20 రెప్స్‌తో మూడు సెట్లు చేయమని ఆమె సలహా ఇచ్చింది. ఆమె తన చేతులను తుంటిపై ఉంచి నిలబడి, తన కాళ్లను వెనక్కి తన్ని, చేతులను తాకడానికి ప్రయత్నించింది.జంపింగ్ స్క్వాట్స్ఈ జంపింగ్ స్క్వాట్స్‌ను కూడా 12 రెప్స్‌తో మూడు సెట్లు చేయమని సిఫార్సు చేసింది. ఈ వ్యాయామం ఒక ప్రామాణిక బాడీవెయిట్ స్క్వాట్ను నిలువు జంప్‌తో మిళితం చేస్తుంది. అలాగే హృదయ స్పందన రేటును పెంచుతూ కాళ్ల బలాన్ని పెంపొందించడంలో సహాయపడుతుంది.జంపింగ్ లంజెస్సాధారణ లంజెస్ కు బదులుగా, జంపింగ్ లంజెస్లో కాళ్ళను రెండుగా చాపి నిలబడి, నిలువుగా పైకి ఎగిరి గాలిలోనే కాళ్ళ స్థానాలను మార్చుకుని, వేగంగా తిరిగి లోతైన లంజ్ భంగిమలోకి దిగాలి. ఈ వ్యాయామాన్ని 10 రెప్స్ చొప్పున మూడు సెట్లలో చేయాలని ఆ ఇన్ఫ్లుయెన్సర్ సలహా ఇచ్చారు.మౌంటెన్ క్లైంబర్స్చివరి వ్యాయామంగా, మౌంటెన్ క్లైంబర్స్‌ను 15 రెప్స్ చొప్పున మూడు సెట్లలో చేయాలని ఆమె సిఫార్సు చేశారు. ఆమె సాధారణ 'ప్లాంక్' (plank) భంగిమలోకి వచ్చి, ఒక మోకాలిని తన ఛాతీ వైపునకు లాగి, వెంటనే తిరిగి మొదటి స్థితికి తీసుకువచ్చింది. ఈ వ్యాయామం శరీర మధ్య భాగం (కోర్) బలాన్ని,భుజాల స్థిరత్వాన్ని పెంచడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.చివరగా, ఉప్పు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు, ఫాస్ట్ ఫుడ్, శీతల పానీయాలు, చక్కెర అధికంగా ఉండే పదార్థాలు కడుపు ఉబ్బరంగా కనిపించేలా చేస్తాయని ఆమె పేర్కొంది. వీటికి బదులుగా, అరటిపండ్లు, కొబ్బరి నీళ్లు, పాలకూర, అవకాడోలు, ఉబ్బరాన్ని తగ్గించడంలో సహాయపడే ఇతర ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకోవాలని ఆమె సూచించింది. View this post on Instagram A post shared by Anjali Sachan (@_anjali_sachan_)గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆయా వ్యక్తుల ఆరోగ్య చరిత్రని అనుసరించి.వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం చేయడం ఉత్తమం. (చదవండి: వర్షాకాలంలో బియ్యం పాడవ్వకూడదంటే..!) -
జస్ట్ రెండేళ్లలో 142 కేజీల నుంచి 80 కేజీలకు..! నిలకడగా బరువు తగ్గాలంటే..
బరువు తగ్గడం కష్టం కాదు గానీ, మళ్లీ యథావిధిగా పెరగకుండా ఉండటమే అతి పెద్ద టాస్క్ అని అంటున్నారు పలువురు. అందుకే వెయిట్‌లాస్ జర్నీలో నిలకడగా బరువు తగ్గేందుకు ప్రాధాన్యత ఇవ్వమని నొక్కి చెబుతున్నారు ఫిట్నెస్ నిపుణులు. అదే మిమ్మల్ని స్మార్ట్‌గా మార్చి వెయిట్‌లాస్ జర్నీలో విజయం సాధించేలా చేస్తుందని చెబుతున్నారు. అందుకు ఉదాహరణే..ఈ యువకుడు. బరువు తగ్గక మునుపు తన రూపం, ఆ తర్వాత ఉన్న మార్పులను ఇన్స్టాగ్రామ్ వేదికగా వీడియో షేర్ చేశారు.ఆ వ్యక్తే కువార్ కపూర్. ఆయన సుమారు 142 కేజీల బరువు ఉండేవాడినని అన్నారు. బరువు తగ్గక మునుపు ఏవిధంగా ఉన్నానో పంచుకుంటూ..ప్రస్తుతం సుమారు 62 కేజీల పైనే తగ్గి 80 కేజీలకు తగ్గినట్లు వెల్లడించారు వీడియోలో. ఈ మార్పుకి వెనుక రహస్యం క్రాష్ డైట్లు కాదని, సరైన మార్గంలో నిలకడగా చేయడమేనని అన్నారు. తాను సరైన మార్గంలో నిలకడగా కార్డియో దినచర్యపై దృష్టిసారించి రెండేళ్లలోనే ఇంతలా స్మార్ట్‌గా మారానని చెప్పుకొచ్చాడు. అందుకోసం ఎలా కార్షియో సెషన్లు చేయాలో చెప్పారు. ఆయన వీడియోలో చాలామంది నేరుగా పదివేల అడుగులతో వాకింగ్ ప్రారంభిస్తారు. దీంతో త్వరితగతిన అలిసిపోయి..రెండో వారానికల్లా స్కిప్ చేస్తారని అన్నారు. అస్సలు ఈ పద్ధతిని పొరపాటుగా అభివర్ణించారు. అందుకే అతడు కొవ్వు తగ్గడానికి నిలకడగా చేసే కార్డియో ప్రగతిని పంచుకున్నారు. ప్రారంభ అధిక బరువులో..ప్రారంభ దశలో నేరుగా పదివేలు అడుగులు కాకుండా నెమ్మదిగా మొదలు పెట్టానని చెప్పారు. నిర్వహించగలిగితే సాధారణంగా రోజుకు 3000 నుంచి 5000 అడుగులు సరి అని చెప్పారు. లేదా అంతకంటే తక్కువ నడిచినా పర్లేదని అన్నారు. ఇక్కడ అలిసిపోకుండా నిలకడగా ఉండటమే లక్ష్యం అని అన్నారు. అధిక బరువు దశలో..అధిక బరువు ఉన్నవారు వారానికి రెండు సెషన్లలో, ఒకే జోన్లో 8000 అడుగులతో ప్రారంభించాలని ఆయన సిఫార్సు చేశారు. ఆయన ప్రకారం, శరీరం అలవాటుపడినప్పుడు, కార్డియో మెరుగుపడుతుంది. సామర్థ్యానికి మించి ప్రయత్నించే బదులు, సాధారణ వేగంతో చేయాలని కూడా ఆయన సూచించారు.ఓ మోస్తారు మార్పు మొదలయ్యాక..వారానికి రెండు సెషన్లలో, రెండు జోన్లలో 10,000 నుంచి 12,000 అడుగులు వేయాలని ఆ వ్యక్తి సూచించారు. ఎందుకంటే, ఈ దశలో స్థూలకాయం లేదా అధిక బరువు దశలతో పోలిస్తే శరీరం సమర్థవంతంగా పనిచేసే సామర్థ్యం మెరుగుపడుతుందని అన్నారు.బరువు తగ్గే దశఈ దశలో, రెండు లేదా మూడు ప్రాంతాలలో వారానికి రెండుసార్లు 15,000 అడుగులు నడవాలని ఆయన సలహా ఇచ్చారు. ఇది కొవ్వు తగ్గే ప్రక్రియను వేగవంతం చేయడానికి సహాయపడుతుంది. ఒకవేళ జిమ్‌లో పనితీరు తగ్గితే, ఆహారాన్ని కాకుండా కార్డియోను తగ్గించడం మంచిదని కూడా ఆయన తెలిపారు.అత్యంత కీలకమైన దశఇందులో అధిక ఫలితాలు, గొప్ప ప్రయోజనాలు లభిస్తాయి కాబట్టి, రెండు లేదా మూడు విడతలుగా (సెషన్లలో) మొత్తం 20,000 అడుగులు నడవాలని ఆయన సూచించారు. ప్రతి దశకు తగిన కార్డియో వ్యాయామాలను వివరించడంతో పాటు, ఏ దశలో ఉన్నవారైనా సరే వారానికి కనీసం మూడు లేదా నాలుగు సార్లు బరువులు ఎత్తే వ్యాయామాలు (వెయిట్ లిఫ్టింగ్) చేయాలని కూడా సూచించారు. ఇలా కార్డియోని పెంచుకుంటే మెరుగైన ఫలితాలు అందుకోవడమే గాక ఆటోమేటిగ్గా బరువు కూడా తగ్గుతారని చెబుతున్నారు కువార్ కపూర్. View this post on Instagram A post shared by Kuwar Kapur (@fitnessbykuwar)గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: పదవిలో ఉండగా తండ్రైన తొలి ఉపాధ్యక్షుడు..హాట్‌టాపిక్‌గా ఆ శాపం..!) -
మనిషి పతన దశలు
స్వయంకృత అపరాధం మనిషి జీవితంలో జరిగే అనేక మార్పులకు హేతువు. ఒక మనిషి పతనం కావడానికి ఇదే మూలమవుతుంది. ఆ పతనం నాలుగు దశల్లో కొనసాగుతుంది.నైతిక పతనం..మనిషి ప్రవర్తన కృతజ్ఞతాహీనంగా మారుతుంది. సాయం చేసినవారికి ద్రోహం తలపెట్టడం, తిన్న ఇంటి వాసాలు లెక్కించడం జరుగుతుంది.విలువల పతనం..దురాశ, దురలవాట్లు ఎక్కువవుతాయి. ఎలానైనా తాము కోరు కున్నది పొందడానికి అడ్డదారులు వెతుకుతారు.సామాజిక పతనం..మనిషి సామాజిక ప్రాణి అనే విషయం మర్చిపోవడం జరుగుతుంది. తన గురించి ఈ లోకం ఏమి అనుకుంటుందనే భయం ఉండదు. వావి వరసలు చూడరు. స్వార్థం తలకెక్కుతుంది. తను చేసిందే సరైనది అనే భావనతో దుశ్చర్యలకు పాల్పడుతుంటారు.ఆర్థిక పతనం..తనువెల్లా అహంతో నిండిన మనుషులకు ఆర్థిక పతనమే ఆఖరి దశ. ఆర్థిక పతనం మొదలైన తర్వాత క్రమంగా పశ్చాత్తాప లక్షణాలు అంకురిస్తాయి. అందులో అతి కొద్ది మంది మాత్రమే చేసిన తప్పులను సరిదిద్దుకుని కొత్త జీవితాలను మొదలెడతారు. ఎక్కువ శాతం మంది అహం మత్తు నుండి బయటపడకుండా జీవితాలనే బలి చేసుకుంటారు.అందుకే మనుషులు ముందుగా నైతికంగా పతనం చెందకూడదు. విచక్షణా జ్ఞానం కోల్పోకూడదు. ఏది మంచో, ఏది చెడో తెలుసుకుని అడుగులు వేయాలి. కష్టపడకుండా వచ్చేది ఎప్పటికైనా మన దగ్గర ఎక్కువ రోజులు ఉండదు అనే సత్యాన్ని విస్మరించకూడదు.– దుర్గమ్ భైతి -
జస్ట్ ఉద్యోగంతోనే రూ. 15 కోట్లు..!
కోట్లాధికారి కావాలంటే..తాతల ఆస్తి లేదా ఏదైనా సైడ్ ఆదాయం ఉండాలని అనుకుంటారు. కాదు ఎంత సంపాదించినా..ఖర్చులు అదుపులో ఉండాలంటున్నాడు ఈ వ్యక్తి. డబ్బు పెరిగే కొద్ది జీవనశైలి నార్మల్‌గా ఉంటే..చాలు ఎవ్వరైనా ధనవంతులవ్వగలరు, దర్జాగా బతికేలా పదవీవిరణమను ప్లాన్ చేసుకోవచ్చని అంటున్నాడు. అదెలాగంటే..ఈ అమూల్యమైన ఆర్థిక పాఠాలు చెబుతోంది. మాజీ ఐటీ ఉద్యోగి వివేక్ వామన్. విప్రో, పీడబ్ల్యూసీ వంటి సంస్థలలోఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో 24 ఏళ్లు పనిచేసి కోట్లు కూడబెట్టాడు. అంతేగాదు 47 ఏళ్ల వయసులో అంటే రిటైర్మెంట్ ఏజ్ కంటే కాస్త చిన్న వయసులో పదవీ విరణమ చేశారు. ఆయన ఇటీవల '1% క్లబ్' పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్నప్పడు ఈ విషయాలను వెల్లడించారు. ఆయన పాడ్‌కాస్ట్ హోస్ట్ శ్రేయ హెగ్డేతో ప్రస్తుతం తన కుటుంబం మొత్తం నికర ఆస్తి విలువ(net worth) రూ. 15 కోట్లకు చేరిందని వెల్లడించారు. మార్కెట్ ఒడిదుడుకులు ఉన్నప్పటికీ, ప్రస్తుతం ఆ మొత్తం రూ. 20 కోట్లకు పైగా పెరిగింది. ఆయన ఇదంతా కేవలం 9 టు 5 జాబ్‌తోనే కూడబెట్టారు. పైగా ఆయనకు ఎలాంటి తాతముత్తాతల ఆస్తి, వ్యాపారం గానీ లేవన్నారు. తాను 2021లో ఆర్థిక స్వేచ్ఛను సాధించానని గ్రహించిన తర్వాత, తక్షణమే ఉద్యోగాన్ని వదిలి సొంతంగా ఆర్థిక సేవల వ్యాపారాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. అంత సొమ్ముని ఎలా కూడబెట్టారంటే..2021లో వివేక్ వామన్ రూ. 15 కోట్ల నికర ఆస్తితో ఉద్యోగాన్ని వదిలిపెట్టారు. అప్పుడు ఆయన వయసు కేవలం 47 ఏళ్లు మాత్రమే; అంటే భారతదేశంలో సాధారణ పదవీ విరమణ వయసు కంటే చాలా ముందే ఆయన రిటైర్ అయ్యారు. రిజైన్‌కు ముందుకు వరకు ఆయన జీతం రూ. 4 లక్షల నుంచి రూ. 5 లక్షల మధ్యలో ఉండేది. ఆయన తొలి జీతం మాత్రం రూ. 12 వేలు మాత్రమే. ఆయన పొదుపు ప్రారంభించడానికి ఏ జీతమూ తక్కువ కాదంటారు. తాను ఇంత మొత్తాన్ని నిలకడగా పెట్టుబడులు పెట్టడం వల్ల సంపాదించగలిగానన్నారు. దీర్ఘకాలిక పెట్టుబడి అంటే సరిగ్గా అలాగే ఉండాలన్నారు. ఇది సాధ్యమేనా..కేవలం జీతంతోనే ఒక వ్యక్తి త్వరగా పదవీ విరమణ చేసి సంపదను కూడబెట్టడం అనేది పెద్ద విషయం కాదని అంటారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేసి..జీతం తీసుకునే ఉద్యోగి, వారి ఆదాయంతో సంబంధం లేకుండా, త్వరగా పెట్టుబడులు ప్రారంభించేలా క్రమశిక్షణతో ఉంటే సులభంగా ఆర్థిక స్వేచ్ఛను పొందగలరని అన్నారు. యువ ఉద్యోగులు తమ కెరీర్ మొత్తంలో నేర్చుకుంటూ ఉండాలని ఆయన సలహా ఇచ్చారు. అలాగే జీవనశైలి ఖర్చులు తక్కువుగా ఉంచాలని సూచించారు. ఉద్యోగాలు ప్రారంభించినప్పుడే కొత్త నైపుణ్యాలను నేర్చుకుంటూ..ఆదాయాలను పెంచుకునే అవకాశానికి మార్గం సుగమం అవుతుంది. ఇక్కడ ఆదాయం పెరిగినా..ఖర్చులను అదే నిష్పత్తిలో ఉంచొద్దు. మూడోది లక్ష్య-ఆధారిత ఆర్థిక ప్రణాళికను రూపొందించడానికి ఒక మంచి సలహాదారుడితో కలిసి పనిచేయండి. చివరగా చక్రవడ్డీకి అంతరాయం కలిగించవద్దు. డబ్బును విలాసవంతమైన కొనుగోళ్లతో సమానం చేసినప్పటికీ.. ఆర్థిక స్వాతంత్ర్యం అంతకుమించి విలువైనదని అంటున్నారు వామన్. అంతేగాదు సంపదను కూడబెట్టాక..డబ్బు మీకు ఇచ్చే అతిపెద్ద విలాసం మానసిక స్వేచ్ఛ, 'వద్దు' అని చెప్పగల సామర్థ్యం. ఇక్కడ డబ్బుని డబ్బుతో కాకుండా సమయంతో కొలవాలని ఆయన అన్నారు. డబ్బు అనంతమైనది. మీరు ఎంత సంపదను సృష్టించినా, మీ కంటే ధనవంతులు ఎప్పుడూ ఉంటారు. అయితే డబ్బుతో ఆనందాన్ని కొనలేము, కానీ సమయాన్ని కొనవచ్చు. మీ డబ్బుతో మీరు సమయాన్ని కొనగలిగితే, మీ జీవితంలో మీరు కోరుకునే ఆనందానికి మరింత చేరువవుతున్నట్లేనని అన్నారు. (చదవండి: డీఎస్పీగా రైల్వే గేట్‌మ్యాన్..! 12 గంటలు పనిచేస్తూనే..) -
అనురాగ్ కశ్యప్ వెయిట్‌లాస్ స్టోరీ..!అలా తగ్గడం మంచిదేనా?
కొన్ని వెయిట్‌లాస్ స్టోరీలు స్ఫూర్తిదాయకంగా ఉన్నా..అందరికీ సరిపడవు. ఆయా వ్యక్తిగత సమస్యలు, వైద్య నిపుణుల పర్యవేక్షణ ఆధారంగా ప్రయత్నించాలే తప్ప..లేదంటే అసలుకే ప్రమాదం. ఇక్కడ సినీ నిర్మాత అనురాగ్ కశ్యప్ వెయిట్‌లాస్ స్టోరీ అలాంటిదే. ఆయన గుండెపోటుకి గురై కోలుకున్న తర్వాతా దాదాపు 27 కేజీల బరువు తగ్గారు. ఈ అద్భుతమైన మార్పు అందరికీ స్ఫూర్తినిచ్చినప్పటికీ..ఆయన ఫాలో అయిన డైట్ మంచిదేనా అనే సందేహాలు వెల్లువెత్తాయి. మరి ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారు. ఒక్కోసారి ఆరోగ్య సమస్యల రీత్యా క్రాష్డైట్లు ఫాలో అవ్వొచ్చా అంటే..అనురాగ్ కశ్యప్ గుండెపోటు తర్వాత చాలా తక్కువ టైంలోనే అనూహ్యంగా బరువు తగ్గారు. అది కూడా ఇంత వేగంగా అందులోనూ గుండె సంబంధిత సమస్య నుంచి కోలుకున్నాక..ఇది సరైనదేనా అనే సందేహాలు ప్రజల్లో వ్యక్తమయ్యాయి. అయితే వైద్యులు అది ఆయన ఆరోగ్య పరిస్థితికి అనుగుణంగా రూపొందించిన ప్రత్యేక డైట్ అని అంటున్నారు. అలాంటి క్రాష్ డైట్లు అందరికీ సరిపడవని హెచ్చరిస్తున్నారు. ఆయనకి ఉన్న రుగ్మతల దృష్ట్యా నిపుణుల పర్యవేక్షణలో తగిన జాగ్రత్తలతో అనుసరించిని డైట్ అని చెప్పారు. ఇలా గుండెపోటు వచ్చిన వాళ్లందరికి ఇలాంటి క్రాష్ డైట్లు సరిపడవని హెచ్చరించారు. పైగా అది మేలు కంటే కీడే చేసే అవకాశం ఎక్కువ ఉందన్నారు. అలాగే ఇక్కడ ప్రతి రోగి కోలుకోవడం అనేది అప్పటికే ఉన్న ఆరోగ్య పరిస్థితులు, మందులు, పోషకాహార స్థితి, మొత్తం గుండె పనితీరు వంటి అంశాల ఆధారపడి ఉంటుందన్నారు. ఇక్కడ కశ్యప్‌కు ఆస్తమా చరిత్ర, స్టెరాయిడ్ల వాడకం ఉంటం వల్ల వైద్య బృందం ఆయనకు లిక్విడ్ క్రాష్ డైట్‌ని సూచించిందని చెప్పారు. గుండెపోటు తర్వాత క్రాష్‌డైట్ ఎందుకు మంచిదికాదంటే..గుండెపోటు తర్వాత, గుండె కండరం ఇంకా కోలుకుంటూ ఉంటుంది. ఇక్కడ క్రాష్ డైట్లో కేలరీలను తీవ్రంగా పరిమితం చేస్తారు. ఫలితంగా శరీరంపై అదనపు ఒత్తిడిని తగ్గించి, సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. తీవ్రమైన కేలరీల పరిమితి కండరాల క్షీణత, ఎలక్ట్రోలైట్ అసమతుల్యత, అలసట, తలతిరగడం వంటి సమస్యలు కోలుకోవడంలో ఆలస్యానికి దారితీయవచ్చని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. అంతేగాదు గుండె సంబంధిత సమస్యల ప్రమాదాన్ని మరింత పెంచే ప్రమాదం ఉందని అంటుఉన్నారు.గుండె జబ్బులు ఉన్నవాళ్లు ఎలా బరువు తగ్గాలంటే..గుండెపోటు తర్వాత వేగంగా బరువు తగ్గడానికి నిశితమైన వైద్య పర్యవేక్షణలో మాత్రమే ప్రయత్నించాలని వైద్యులు చెబుతున్నారు. గుండె జబ్బులు ఉన్న చాలా మంది రోగులకు వారానికి సుమారు 0.5 నుంచి 1 కిలోల చొప్పున క్రమంగా బరువు తగ్గడం సురక్షితమని సూచిస్తున్నారు. దీర్ఘకాలిక గుండె ఆరోగ్యాన్ని కాపాడే నిలకడైన ఆహారపు అలవాట్లతో బరువు తగ్గడం మంచిదంటున్నారు. గుండెకు మేలు చేసే ఆహారంపీచుపదార్థం అధికంగా ఉండే పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలుచేపలు, పప్పుధాన్యాలు, స్కిన్లెస్ కోడి మాంసం వంటి కొవ్వు తక్కువగా ఉండే ప్రోటీన్ఒమేగా-3 అధికంగా ఉండే ఆహారాలతో సహా ఆరోగ్యకరమైన కొవ్వులురక్తపోటును నియంత్రించడంలో సహాయపడటానికి తక్కువ ఉప్పు ఉన్న భోజనంఅలాగే ఆరోగ్య నిపుణులు ప్రత్యేకంగా సలహా ఇస్తే తప్ప, తీవ్రమైన ఉపవాసాలు, డిటాక్స్ ప్రణాళికలు, జీరో-కార్బ్ డైట్లను సాధారణంగా నివారించాలి.ఈ లక్షణాలు కనిపిస్తే..అకస్మాత్తుగా నీరసించడంగుండె దడనిరంతర నిర్జలీకరణంతల తిరగడం లేదా స్పృహ కోల్పోవడంమానసిక గందరగోళం లేదా అయోమయంఈ లక్షణాలను మనం అనుసరిస్తున్న ఆహార నియమం శరీరంపై అధిక ఒత్తిడిని కలిగిస్తోందనేందుకు సూచనగా గుర్తెరగాలి.అందువల్ల గుండెపోటు నుంచి కోలుకుంటున్న ఎవరైనా క్రాష్ డైట్లకు దూరంగా ఉండాలని, బదులుగా సమతుల్య పోషణ, నిలకడ అనుసరించి చక్కటి జీవనశైలిని పాటించాలని చెబుతున్నారు నిపుణులు. సాధ్యమైనంత వరకు నిలకడగా బరువు తగ్గడంపై దృష్టి పెట్టాలని వైద్యులు నొక్కి చెబుతున్నారు. ఇక్కడ గుండెను కాపాడుకోవడం అంటే త్వరగా బరువు తగ్గడం కాదు, సురక్షితంగా బరువు తగ్గడం అని నొక్కి చెబుతున్నారు వైద్యులు.(చదవండి: ఐఐటీ డ్రాపౌట్ అయినా..మైక్రోసాఫ్ట్, గూగుల్‌లో ఉద్యోగం!) -
దక్షిణాదిలో స్మిటెన్ విస్తరణ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సౌందర్య సాధనాలు, లైఫ్ స్టయిల్ ఉత్పత్తులు మొదలైన వాటిని కొనుగోలుకు ముందే ట్రయల్ చేసేందుకు వీలు కల్పించే స్మిటెన్ తాజాగా దక్షిణాదిలో కార్యకలాపాల విస్తరణలో భాగంగా హైదరాబాద్‌లో స్టోర్ ప్రారంభించింది. కంపెనీకి ఇది ఎనిమిదో స్టోర్. 2027 నాటికి రూ. 100 కోట్ల ఆదాయం, 50 పైచిలుకు స్టోర్స్ స్థాయికి చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సంస్థ తెలిపింది. విశాఖపట్నం, చెన్నై, హుబ్లి, బెంగళూరు తదితర కీలక దక్షిణాది మార్కెట్లలోను రిటైల్ నెట్వర్క్ మరింత పటిష్టం చేసుకునే యోచనలో ఉన్నట్లు సంస్థ తెలిపింది. -
రూ.45 లక్షల ప్యాకేజీ.. నెలాఖరుకు చేతిలో సున్నా!
సంవత్సరానికి రూ.45 లక్షల భారీ ప్యాకేజీ.. సమాజంలో గౌరవప్రదమైన పొజిషన్.. కానీ, నెలాఖరు వచ్చేసరికి చేతిలో రూపాయి మిగలడం లేదు! వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది బెంగళూరులో నివసిస్తున్న ఒక సాఫ్ట్వేర్ కన్సల్టెంట్ పరిస్థితి. గతేడాది మ్యూచువల్ ఫండ్ కన్సల్టెంట్ అన్షుమన్ శర్మతో సూర్య అనే టెక్కీ మాట్లాడిన పాత ఇంటర్వ్యూ క్లిప్ ఇప్పుడు మళ్లీ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో వైరల్‌గా మారింది.గత 14 ఏళ్లుగా బెంగళూరులో స్థిరపడిన సూర్య.. తన భార్య, మూడున్నరేళ్ల బాబుతో కలిసి నివసిస్తున్నాడు. ఏడాదికి రూ.45 లక్షల ప్యాకేజీ ఉన్నప్పటికీ పన్నుల చెల్లింపుల తర్వాత ప్రతి నెలా అతని చేతికి వచ్చే నికర జీతం రూ.2,45,000. ఈ భారీ మొత్తం చేతికి వస్తున్నా పొదుపు చేయడం తనకు చాలా కష్టంగా మారిందని సూర్య వాపోయాడు.ఒక ఇంటర్వ్యూలో అతను మాట్లాడుతూ..‘ప్రస్తుతం నేను ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు ఏంటంటే.. నెలాఖరు వచ్చేసరికి నా డబ్బు ఎక్కడికి వెళ్తుందో నాకే అర్థం కావడం లేదు. చేతిలో ఏమీ మిగలడం లేదు. పెళ్లయి బాబు పుట్టిన తర్వాత ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. దీనివల్ల నా సిప్ పెట్టుబడులను కూడా పెంచలేకపోతున్నాను’ అని చెప్పాడు.ఖర్చుల లెక్కలు ఇవే..సూర్య తన నెలవారీ ఖర్చుల వివరాలను కన్సల్టెంట్‌కు వివరించగా అందులో సింహభాగం హోమ్లోన్కే వెళ్తున్నట్లు చెప్పారు. అతని నెలవారీ ఖర్చుల విభజన ఇలా ఉంది.హోమ్ లోన్ ఈఎంఐ: రూ. 63,000 (ఇది అతని నికర ఆదాయంలో 30% కంటే తక్కువలోనే ఉండటం గమనార్హం)కుమారుడి స్కూల్ ఫీజు: రూ.11,000 (దీనికి అదనంగా రూ.3 లక్షల ప్రవేశ రుసుము ఉంది)ఆహారం, కిరాణా సామాగ్రి: రూ. 12,000ఇతర గృహ ఖర్చులు: రూ. 20,000షాపింగ్, ట్రిప్పులు, ఔటింగ్స్: రూ.32,000నెటిజన్ల మధ్య భిన్నాభిప్రాయాలుఈ ఇంటర్వ్యూ క్లిప్ ఎక్స్‌లో రీపోస్ట్ అవ్వడమే ఆలస్యం.. నెటిజన్లు భిన్నమైన వాదనలు వినిపిస్తున్నారు. ‘భారతదేశంలో ద్రవ్యోల్బణం కంటే పేలవమైన ఆర్థిక ప్రణాళికే పెద్ద సమస్య. నెలకు రూ.2.45 లక్షలు సంపాదిస్తూ కేవలం షాపింగ్, ట్రిప్పుల కోసమే రూ.32 వేలు ఖర్చు చేయడం ఏంటి? బాబు నర్సరీ ఫీజులకే అంత పెడుతుంటే ఇక డబ్బు ఎలా మిగులుతుంది?’ అని ఒక యూజర్ చెప్పారు. మరోవైపు, ఈ వాదనను వ్యతిరేకిస్తూ కొంతమంది సూర్యకు మద్దతుగా నిలిచారు. ‘ఇందులో తప్పు పట్టడానికి ఏముంది? ఒక వ్యక్తి కష్టపడి సంపాదిస్తూ, తన పిల్లలకు మంచి చదువు చెప్పించి, కాస్త విలాసాల కోసం ఖర్చు పెట్టుకుంటే తప్పేంటి?’ అని కౌంటర్ ఇచ్చారు.ఈ బెంగళూరు టెక్కీ ఉదంతం కేవలం ఒక్కరి సమస్య కాదు. భారతదేశంలోని మెట్రో నగరాల్లో అధిక వేతనాలు పొందుతున్న మెజారిటీ ఐటీ ఉద్యోగుల మానసిక, ఆర్థిక పరిస్థితికి ఇది అద్దం పడుతోంది. ఆదాయం పెరిగే కొద్దీ దానికి అనుగుణంగా జీవన ప్రమాణాలు, ఖర్చులు పెంచుకుంటూ పోవడాన్ని ఆర్థిక పరిభాషలో ‘లైఫ్‌స్టైల్ ఇన్ఫ్లేషన్’ అంటారు. రూ.45 లక్షల ప్యాకేజీ ఉన్నా ఏమీ మిగలడం లేదు అనే భావన కలగడానికి కారణం.. భవిష్యత్తు కోసం చేసే పొదుపును ముందే పక్కన పెట్టకుండా, ఖర్చులు పోగా మిగిలినదాన్ని దాచుకుందాం అనుకోవడమేనని కొందరు చెబుతున్నారు.ఇదీ చదవండి: పసిడి పరుగుకు పగ్గాలు.. దిగొచ్చిన ధరలు -
అమ్మాయిలూ ఎల్లప్పుడూ ‘మంచి’గా వద్దు..! పరిశోధనలు సైతం..
చిన్నప్పటి నుంచి ఆడిపిల్లలకు సర్దుకుపోవడం, అందరికి చేదోడు వాదోడుగా, మంచిగా వ్యవహరించేలా పెంచుతారు. పైగా వాళ్ల భావోద్వేగాలను బయటకు వ్యక్తం చేయనివ్వరు పెద్దలు. దాని కారణంగానే మహిళలు ఆ వ్యాధి బారిన పడుతున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో వార్తలు గుప్పుమన్నాయి. ఆ కారణంగానే ఈ వ్యాధి అని పరిశోధనలు కూడా చెబుతున్నాయి. అందుకు సంబంధించిన ఓ మహిళా సంభాషణ వీడియో నెట్టిటంట తెగ వైరల్‌గా మారింది. ఇంతకీ ఇందులో వాస్తవమెంత? వైద్య నిపుణులు ఏమంటున్నారు?ఇటీవల సామాజిక మాధ్యమాల్లో మహిళలకు ఆ కారణంగానే ఆటోఇమ్యూన్ వ్యాధి వస్తోందంటూ పోస్టులు వైరల్ అయ్యాయి. అందుకు లక్షలాదిమంది మహిళలు మద్దతు తెలపడం విశేషం. ప్రతి ఒక్కరు అది వాస్తవమని, ఇప్పటికైన మనమంతా మేల్కొందాం అంటూ పిలుపునివ్వడం విశేషం. అంతేగాదు అమ్మాయిలూ సదా ‘మంచిగా’ ఉండొద్దు అది మన ఆరోగ్యానికే హానికరం అనే నినాదం మొదలైంది. ఇతరులను సంతోషపెట్టే అలవాటు మనల్ని మానసికంగా కుంగదీయడమే కాదు, చివరికీ శారీరక అనారోగ్యానికి గురిచేస్తుందని వాదన మొదలైంది నెట్టింట. ఇలా ఎందుకు అంటున్నారంటే..ఆటోఇమ్యూన్ వ్యాధులతో బాధపడుతోంది అధికంగా మహిళలే కావడంతో ఈ వాదన ఊపందుకుంది నెట్టింట. ఇటీవల ఒక ఇన్ఫ్లుయెన్సర్ హర్పిందర్ కౌర్ ఈ ట్రెండీ వాదన గురించి షేర్ చేస్తూ..'మంచి' అమ్మాయి అంటే అందరితో ఏకీభవించే, నిస్వార్థపరురాలైన సర్దుకుపోయే అమ్మాయిగా నాకు నేర్పించారు. ఇదే ఆ అనారోగ్య సమస్యకు కారణం అని అంటోందామె. ఆ కారణంగానే మహిళల్లో ఈ సమస్య ఎక్కువని. అందుకు ప్రధాన కారణాలు సాంస్కృతిక అలవాట్లు, దీర్ఘకాలిక ఒత్తిడి, వ్యక్తపరచని భావోద్వేగాలు, తమ అవసరాల కంటే ఇతరుల అవసరాలకే ప్రాధాన్యత ఇవ్వడం తదితరాలేనని తేల్చి చెప్పింది. అంతేగాదు ఏళ్ల తరబడి చాలామంది తమ బావోద్వేగాలను అణిచివేసి, నిరంతర సంరక్షణ, ఇతరులను సంతోషపెట్టే తపనతో జీవిస్తారు. దాంతో శరీరం దీర్ఘకాలిక ఒత్తిడికి గురై చివరిక దీర్ఘాకాలిక అనారోగ్యానికి బలి అవుతోందంటూ అవేదన వ్యక్తం చేసింది. ఆఖరికి పరిశోధనలు కూడా ఆటోఇమ్యూన్ వ్యాధులతో బాధపడుతున్న వారిలో దాదాపు 80 శాతం మంది మహిళలేనని పేర్కొంది. View this post on Instagram A post shared by Harpinder Kaur Mann Yoga 🌕 (@harpindermannyoga) లూపస్, స్జోగ్రెన్ సిండ్రోమ్ వంటి వ్యాధులు పురుషుల కంటే మహిళలల్లో ముఖ్యంగా 20 నుంచి 50 ఏళ్ల మధ్య వయసు వారిలో గణనీయంగా అధిక రేట్లలో ప్రభావం చూపుతోందని చెప్పింది. నిజానికి ఈ వైరల్ పోస్టులన్నీ మహిళలు తీవ్ర నిరాశనిస్ప్రహలకు లోనవ్వడంతోనే ఈ వ్యాధులు బాధపడుతున్నారనే విషయాన్ని వ్యక్తం చేశాయి. అలాగే ఇది ఒత్తిడి రుగ్మతలకు సంబంధించిందేనని శాస్త్రవేత్తలు గుర్తించారు కూడా. అయితే దృఢంగా ఉన్నంత మాత్రాన ఈ సమస్యను తిప్పికొట్టగలమని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లేవు. పైగా ఆటోఇమ్యూన్ వ్యాధికి అవే కారణమని శాస్త్రీయంగా నిరూపితం కాలేదు కానీ మహిళలు ఏ విధంగా ఒత్తిడికి లోనవ్వుతున్నారనేది వెల్లడైందంటున్నారు నిఫుణులు. అతేగాదు అమ్మాయిలూ..వద్దు అని చెప్పడం నేర్చుకోవడం, కోపాన్ని వ్యక్తపరచగలగడం, మనకోసం మనం నిలబడటం వంటివి చేస్తే ఈ సమస్య బారిన పడమని ముక్తకంఠంతో నినదించారు. అంతేగాదు ఇలా వ్యవహరించాలంటే మనకు యోగా ఉపకరిస్తుందని, స్వతంత్రంగా, ధైర్యంగా బతకడం ఎలాగో నేర్పిస్తుందని అన్నారు. మానసిక నిపుణులు కూడా ఇవన్నీ సరైనా కారణాలే అయినా..శాస్త్రీయంగా నిర్థారించలేమని అన్నారు. View this post on Instagram A post shared by Tochi Angel (@tochithangel) (చదవండి: కలెక్టర్ గారూ..అదే నా చివరి కోరిక! 94 ఏళ్ల బామ్మ విజ్ఞప్తి..) -
అత్యంత అరుదైన బనారసి కడియల్ నేత చీరలో జాన్వీ కపూర్..!
బాలీవుడ్ నటి, దివంగత టాలీవుడ్ నటి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ ఎప్పటికప్పుడూ తనదైన శైలిలో ఫ్యాషన్‌తో అలరిస్తుంటుంది. టాలీవుడ్ హీరో రామచరణ్ మూవీ పెద్దితో మంచి హిట్‌ని అందుకుంది. ఇటీవల తన అక్క అన్షులా కపూర్ వివాహ వేడుకల్లో అత్యంత అరుదైన చేనేత చీర ధరించి అందర్నీ ఆకర్షించారు. ఈ చీర ఎంత ప్రత్యేకమైనదంటే..నేయడమే అత్యంత విలక్షణం, కష్టతరమైన కళాత్మక పని కూడా. ఆ నేతను నేసే కళాకారులు కూడా ఇప్పుడంతగా లేరు. అంత పురాతనమైన చేనేత చీర ఇది. మరి ఆ చీర విశిష్టత గురించి సవివరంగా తెలుసుకుందామా..!.జాన్వీ కపూర్ ధరించిన బనారసి చీర, క్లిష్టమైన కడియల్ నేత గొప్పతనానికి చెందింది. దీన్ని సౌరవ్ దాస్ రూపొందించారు. మేగాన్ కాన్సెసియో స్టైలింగ్‌లో ఆమె తన చీరను "మత్స్యకారుల భార్యల చోళీ"ల మాదిరి బ్లౌజ్‌ని జత చేశారు. తన చీర లుక్కికి అనుగుణంగా జుమ్కాలు, కడాతో కలిగిన సాంప్రదాయ దేవాలయ ఆభరణాలను ఎంచుకున్నారామె. కురులను వదులుగా వదిలేసి..సింపుల్ మేకప్‌తో అట్రాక్టివ్ లుక్‌తో కనిపించారామె. ఆమె ధరించిన బనారసీ చీర తరతరాలుగా నిలిచిపోయేంత విలువైన కడియల్ నేతతో నేసిన శారీ. ప్రత్యేకత..ఈ చీర వారణాసిలో అత్యంత ప్రజాదరణ పొందిన చేనేత చీరలలో ఒకటి. అక్కడ తంచోయ్, జాంగ్లా, మీనాకారి, గ్యాసర్, రంగకాట్, ఏక్తారా, కధ్వా, కడియల్ తదిత ప్రసిద్ధ చేనేత చీరలు ఉన్నాయి. కోర్వాయిగా పిలిచే ఈ కడియల్ నేత మూడి షటిల్స్తో నేస్తారు. ఈ పద్ధతిలో నేయడానికి అత్యంత నైపుణ్యం గల కళాకారులు అవసరం. కాబట్టి ఇది చాలా అరుదైనది. జాన్వి చీరలో కనిపించే విధంగా..విభిన్నమైన అంచును రూపొందించడానికి ఈ విధమైన పద్ధతిని ఉపయోగిస్తారు. చీర పై, క్రింది అంచులను రూపొందించడాని ఈ మూడు షటిల్స్ పద్ధతిలో నేస్తారు. అలాగే అంచులను కలపడానికి ఇంటర్‌లాకింగ్ పద్ధతిని ఉపయోగిస్తారు. ఇందులో అల్లిక పద్ధతినే కడియల్ అని అంటారు. ఈ పద్ధతిని పైఠానీ చీరలలో కూడా ఉపయోగిస్తారు. ఈ విధానంలో నేయడానికి ఎక్కువ శ్రమ అవసరం. అందుకే పవర్ లూమ్స్ ఈ చీరలను భారీ స్థాయిలో ఉత్పత్తి చేయలేకపోతోంది. అదీగాక దీని వాడకం కూడా తగ్గిపోవడంతో ఈ చీరల కొరత అధికంగా ఉంది. ఇప్పుడిప్పుడే మళ్లీ కడియల్ బ్రోకేడ్ చీరలకు ఆదరణ పెరుగుతుండటం విశేషం. ఈ చీర భారతదేశంలోనే అత్యంత ఆదరణ పొందిన విలువైన చేనేత వస్త్రంగా పేరుగాంచింది కూడా. (చదవండి: 72 కిలోల నుంచి 49 కిలోలకు..! ఆ ఎనిమిది అలవాట్లకు తక్షణమే..) -
ప్రసవానంతరం 14 కిలోల బరువు ...! జస్ట్ 21 రోజుల్లోనే..
ప్రసవానంతరం చాలామంది మహిళలకు నార్మల్ స్థితికి రావడానికి చాలా సమయం పడుతుంది. చాలామందికి ఆ సమయంలో ఉన్నంత లావు తదనంతర కొనసాగుతుంది. పైగా బిడ్డకు పాలివ్వాల్సి ఉంటుంది కాబట్టి బరువు తగ్గడం అన్నది కష్టసాధ్యమైనదే. కానీ ఈ మామ్ 21 రోజుల పాటు జపనీస్ ఆహారపు అలవాట్లను పాటించి ఏకంగా 14 కిలోలు బరువు తగ్గింది. అదెలాగో ఆమె మాటల్లోనే సవివరంగా తెలుసుకుందామా..!.జపనీయులు ఆహార విధానం చాలా సింపుల్‌గా ఉంటుంది. ముఖ్యంగా ఆలోచనాత్మకంగా తినడం, సమతుల్య పరిమాణంలో తీసుకోవడం, అతిగా తినకుండా ఆహారాన్ని ఆస్వాదించడం వంటి వాటిపై ఆధారపడి ఉంటుంది. అందుకే ఈ భారతీయ తల్లి, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మాన్సీ ఆ ఆహారపు అలవాట్లును ప్రయత్నించి చూసి సత్ఫలితాలను అందుకుంది. ఆ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసుకుంది. ఈ జపనీస్ ఆహారపు అలవాట్లు నిజంగానే మంచి మార్పు తీసుకువస్తాయా? లేదా? అనే కుతూహలంతో ఈ ప్రయోగాన్ని ప్రయత్నించి చూసినట్లు తెలిపింది. ఆ నేపథ్యంలోనే 21 రోజుల పాటు జపనీసులు తినే ఆహారపద్ధతిని యథతథంగా పాటించినట్లు తెలిపింది. ఇందులో ఎలాంటి ఆహార మార్పులు, షార్ట్కట్లు ఉండవు. జపాన్ వాళ్లు సరిగ్గా ఎలా తింటారో అలానే తింటే చాలు అంటోంది. ఆ ఐదు జపాన్ రూల్స్..ముందుగా కళ్లతో తినండి..భోజనం తినే ముందు అది చూడటానికి అందంగా ఉండాలని జపనీయులు నమ్ముతారు. చిన్న చిన్న భాగాలు, రకరకాల రంగులు..ఇలా ప్రతిదీ శ్రద్ధగా అమర్చి ఉండాలి అని ఆ ఇన్ఫ్లుయెన్సర్ వివరించారు. ఇది ఒక్కటే తినే వేగాన్ని తగ్గించి, అతిగా తినడాన్ని నివారిస్తుందని చెబుతోందామె.హరా హచి బు..ఇది ఒక సాంప్రదాయ జపనీస్, కన్ఫ్యూషియన్-ప్రేరిత పద్ధతి. దీని అర్థం కడుపు 80% నిండే వరకు తినాలి. ఇది శ్రద్ధగా ఆహార పరిమాణాన్ని నియంత్రించడానికి ఒక సున్నితమైన విధానంగా పనిచేస్తుంది. అలాగే శరీరానికి కడుపు నిండినట్లు గ్రహించడానికి సమయం ఇవ్వడం ద్వారా అతిగా తినడాన్ని నివారిస్తూ జీర్ణక్రియకు సహాయపడవచ్చు. ఇలా ప్రతి భోజనంలో దీనిని పాటిస్తూ.. ఏమీ కోల్పోతున్నాననే భావన కలగకుండా ఆహార పరిమాణాలు సహజంగానే తగ్గుతాయట.ప్రతి భోజనంలో అన్నం.. కానీ చిన్న చిన్న భాగాలుగా!తెల్ల అన్నమే చిన్న చిన్న భాగాలుగా తీసుకుంటానంటోంది. అయితే ప్రోటీన్ ఉండేలా..కూరగాయలు, మిసోసూప్తో కలిపి తింటానని మాన్సీ తెలిపారు. ఈ కలయిక రక్తంలోని చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచుతుంది. పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోకుండా నివారిస్తుందని ఇన్ఫ్లుయెన్సర్ తెలిపారు.భోజనానికి ముందు మిసో సూప్మిసో సూప్‌లో పులియబెట్టిన పదార్థాలు ఉంటాయి. ఇది పేగుల ఆరోగ్యానికి మంచిదని పేర్కొంది. మాన్సీ ప్రకారం, ఇది ఆమె దినచర్యలో ఒక భాగంగా మారిందని చెప్పుకొచ్చింది.భోజనం మధ్యలో చిరుతిండ్లు..మాన్సీ ప్రకారం, జపాన్‌లో భోజనాల మధ్య తినడం అనేది ఒక సాధారణ అలవాటు కాదు. దానికి బదులుగా, మధ్యలో ఏమీ తినకుండా రోజుకు మూడు పూటలా సరిగ్గా భోజనం చేయడంపై దృష్టి పెడతారు. ఇది జీర్ణవ్యవస్థకు విశ్రాంతి తీసుకోవడానికి సమయం ఇస్తుందని, అలాగే ఆకలి సంకేతాల పట్ల శ్రద్ధ వహించడానికి సహాయపడుతుందని పేర్కొంది మాన్సీ.ఇక్కడ ఈ తల్లి మాన్సీ వెయిట్‌లాస్ స్టోరీ.. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పెంపొందించుకోవాలంటే.. మన ప్లేట్లో ఉండే భోజనం ఎంత ముఖ్యమో అంతే విధంగా ఆలోచనాత్మకంగా తినడం, పరిమాణంపై శ్రద్ధ పెట్టడం అంతే ముఖ్యమని చెప్పకనే చెబుతోంది కదూ..!. View this post on Instagram A post shared by Mansi (@mommytoivaan_)గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: ఎలాంటి డైటింగ్ చేయకుండానే 9 కిలోలు..! ఆ నాలుగు రూల్స్ ..) -
హఠ యోగా అంటే..? అమెరికన్లు ఇష్టపడటానికి కారణ ఇదేనా..
ఇవాళ ఉరుకుల పరుగుల కాలంలో యోగా మళ్లీ అందరి జీవితంలో భాగమయ్యేలా క్రేజ్ సంతరించుకుంటుంది. ఆధునికంగా జిమ్, ఏరోబిక్ వంటి ఎన్నో రకాల వర్కౌట్లు ఉన్నా ప్రముఖులు, సెలబ్రిటీల వరకు అంతా యోగాకే ప్రాముఖ్యత ఇవ్వడం విశేషం. అదీగాక మరి కొద్దిరోజుల్లోనే(జూన్ 21)న యోగా దినోత్సవం పురస్కరించుకుని అమెరికన్లు అంతగా మెచ్చే హఠయోగా గురించి సవివరంగా తెలుసుకుందామా.!. గూగుల్స్ ట్రెండ్స్ డేటా ప్రకారం అమెరికన్లు ఎంత ఇష్టపడే సాధాన హఠ యోగా. ఇది శారీరక భంగిమలు, మైండ్‌ఫుల్‌నెస్‌తో చేసే శ్వాస పద్ధతులను మిళితం చేసే సాంప్రదాయ యోగా. ఇది శరీరం, మనస్సు మధ్య బలమైన బంధాన్ని సృష్టించడంపై దష్టిసారించడం వల్లే ప్రజలు అంతగా ఆకర్షితులవ్వుతారని చెబుతున్నారు ప్రముఖ యోగా నిపుణులు. హఠ యోగా అంటే..హఠ యోగా అత్యంత పురాతనమైన..చాలామంది ఆచరించే యోగా రూపాలలో ఒకటి. సాంప్రదాయకంగా, ఇది ఆసనాలు, శ్వాసవ్యాయామాలు, ధ్యానంతో మిళితమయ్యే యోగా ప్రక్రియ. నెమ్మదైన కదలికలతో ఆసనాల్లో ఎక్కువసేపు ఉండాల్సి ఉంటుంది. ఈ పేరులోని 'హా', 'ఠ'లను సూర్యచంద్రులకు ప్రతీకలుగా చెబుతారు యోగా నిపుణులు. అందువల్ల ఇది శరీరం-మనస్సు మధ్య ఘర్షణను శాంతపరిచేలా సమతుల్యత తీసుకురావడాన్ని లక్ష్యంగా చేసుకుంటుందట. అమెరికన్లు ఇష్టపడటానికి రీజన్..ప్రారంభకులు సలుభంగా చేయగలిగేలా ఉండటం తోపాటు అధిక తీవ్రత గల ఫిట్నెస్ తరగతులకు భిన్నంగా నెమ్మదైన కదలిక, శ్వాసపై ఫోకస్ తదితరాల వల్ల ఈజీగా చేయగలమనే నమ్మకంతో ఇష్టపడుతున్నారనేది వాదన. కొందరు కఠినమైన వ్యాయమాల కంటే ఇది శారీరకంగా, మానసికంగా స్ట్రాంగ్‌గా, హెల్దీగా ఉండేలా చేస్తుందని ప్రగాఢంగా విశ్వసించడం మరొక కారణం. అదీగాక ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరూ ఒత్తిడి, నిరాస నిస్ప్రుహలను ఎదుర్కొనడం అధికమవ్వడం వల్లే ఈ హఠ యోగాకి ఆదరణ పెరిగిందని అంటున్నారు యోగా నిపుణులు. కలిగే ఉపయోగాలు..ఏకాగ్రతను పెంచుతుంది. దీనిలోని శ్వాన వ్యాయామాలు భావోద్వేగ పరిస్థితులను హ్యాండిల్ చేసే శక్తిని అందించి ప్రశాంతతను చేకూరుస్తాయి. ఒత్తిడితోకూడని పనివేళలు, డిజిటల్ పరధ్యానంకు చెక్‌పెట్టే గొప్ప సాధనవర్తమానంలో ఉండగలిగే శక్తిని అందిస్తుంది. ఇది శరీరానికి వ్యాయమానికి మించింది కూడా. ధ్యానానిక పునాదిగా మారుతుంది. ఈ కారణాల వల్లే అమెరికన్లు హఠయోగకి ప్రాధాన్యత ఇస్తున్నారని చెబుతున్నారు యోగా నిపుణులు. అక్కడ ఇది ఒక ఫిట్నెస్ ట్రెండ్‌కి మించిందని చెబుతుండటం విశేషం. యోగా గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఈ కింది లింక్‌పై క్లిక్ చేయండి -
భారీగా క్రెడిట్ కార్డు అప్పులు.. కియోసాకి అలర్ట్
ప్రపంచ ప్రసిద్ధ పర్సనల్ పైనాన్స్ పుస్తకం ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) రచయిత రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) అమెరికన్ల పెరుగుతున్న క్రెడిట్ కార్డు అప్పులపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన తన ఫేస్బుక్ ఖాతాలో చేసిన పోస్టులో వినియోగపు అలవాట్లు ఎలా ఆర్థిక భారంగా మారుతున్నాయో వివరించారు.ప్రస్తుతం అమెరికన్లు క్రెడిట్ కార్డులపై 1.28 ట్రిలియన్ డాలర్లు (సుమారు రూ.120 లక్షల కోట్లు) అప్పుల్లో ఉన్నారన్న కియోసాకి, ఈ భారీ అప్పులకు అనవసర ఖర్చులే ప్రధాన కారణమని అభిప్రాయపడ్డారు.అమెరికన్లు చేసిన ఖర్చుల జాబితాను ప్రస్తావిస్తూ ఆయన కొన్ని ఉదాహరణలు కూడా ఇచ్చారు. ఖరీదైన రెస్టారెంట్లలో విందులు, వాడకపోయినా స్ట్రీమింగ్ సర్వీసుల సబ్స్క్రిప్షన్లను కొనసాగించడం, అనవసరంగా దుస్తులు కొనుగోలు చేయడం, విహారయాత్రల కోసం అప్పులు చేయడం, గుర్తింపులేని ఆన్లైన్ షాపింగ్ ఆర్డర్లు, ఉపయోగించని జిమ్ సభ్యత్వాలు వంటి ఖర్చులు ప్రజలను అప్పుల ఊబిలోకి నెడుతున్నాయని ఆయన పేర్కొన్నారు.అలాగే కొత్త గ్యాడ్జెట్లు, అప్గ్రేడ్లు, వివిధ సబ్స్క్రిప్షన్లు, సౌకర్యాల కోసం చెల్లించే అదనపు రుసుములు కొనుగోలు సమయంలో అవసరమైనవిగా అనిపించినప్పటికీ, తర్వాత అవే ఆర్థిక భారంగా మారుతాయని కియోసాకి హెచ్చరించారు.తన ప్రసిద్ధ పుస్తకం ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’లో ఉపయోగించిన “డూడాడ్స్ (Doodads)” అనే పదాన్ని గుర్తుచేస్తూ, అవసరం లేని వస్తువులు మనల్ని ధనవంతుల్లా భావింపజేసినా, వాస్తవానికి పేదరికం వైపు నెడతాయని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం సగటు అమెరికన్ వ్యక్తి సుమారు 7,900 డాలర్లు (దాదాపు రూ.6.8 లక్షలు) క్రెడిట్ కార్డు అప్పుతో ఉన్నారని, దానిపై 24 శాతం వడ్డీ చెల్లిస్తూ మినిమమ్ డ్యూలతో నెట్టుకొస్తున్నారని కియోసాకి తెలిపారు. ఇలాంటి అప్పులపై వడ్డీ చక్రవడ్డీలా పెరుగుతూ ఆర్థిక స్వేచ్ఛను దూరం చేస్తుందని ఆయన హెచ్చరించారు.అందరూ తమ ఖర్చుల అలవాట్లను పరిశీలించుకోవాలని, అవసరం లేని వ్యయాలను తగ్గించి నిజమైన సంపద సృష్టి వైపు అడుగులు వేయాలని ఆయన సూచించారు. ఈ నేపథ్యంలో ఖర్చులను నియంత్రించి ఆర్థిక స్థిరత్వం సాధించేందుకు తాను ఒక ఉచిత మార్గదర్శకాన్ని సిద్ధం చేశానని తన పోస్టులో పేర్కొన్నారు. -
ట్రిలియనీర్ మస్క్.. ఇల్లు మరీ ఇంత సింపులా?
సాధారణంగా సంపన్నుల ఇళ్లు చాలా విలాసవంతంగా ఉంటాయి. భారీ అంతస్తుల్లో, సకల సౌకర్యాలతో ఇంద్ర భవనాలను తలపిస్తుంటాయి. భారతీయ అపర కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ నివాస భవనం యాంటిలియా (Antilia) గురించి విన్నాం కదా. మరి ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌గా (లక్ష కోట్ల డాలర్ల సంపద) నిలిచిన టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ (Elon Musk) ఇల్లు ఇంకెంత విలాసవంతంగా ఉంటోందనన్న ఆసక్తి చాలా మందికి ఉంటుంది. అయితే మస్క్ ఎలాంటి ఇంట్లో నివసిస్తున్నారో తెలిస్తే ఆశ్చర్యపోతారు!ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌గా నిలిచిన టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ మరోసారి వార్తల్లో నిలిచారు. జూన్ 12న జరిగిన ‘స్పేస్ఎక్స్’ చారిత్రాత్మక ఐపీఓ (SpaceX IPO success) అనంతరం కంపెనీ విలువ ట్రిలియన్ల డాలర్ల స్థాయికి చేరుకోవడంతో మస్క్ వ్యక్తిగత సంపద కూడా ఒక ట్రిలియన్ డాలర్ల మార్క్‌ను దాటినట్లు అంతర్జాతీయ మీడియా నివేదించింది.అయితే ఇంత అపార సంపద ఉన్నప్పటికీ మస్క్ జీవనశైలి మాత్రం సంప్రదాయ బిలియనీర్లకు పూర్తి భిన్నంగా ఉంది. అమెరికాలోని బోకా చికా సమీపంలో, స్పేస్ఎక్స్ స్టార్‌బేస్ కేంద్రానికి దగ్గరగా ఉన్న సుమారు 400 చదరపు అడుగుల ప్రీఫ్యాబ్రికేటెడ్ చిన్న ఇంటిలోనే (Elon Musk Tiny House) ఆయన ఎక్కువ సమయం గడుపుతున్నారని పలు నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ ఇంటిని మాడ్యులర్ హౌసింగ్ సంస్థ బాక్సబుల్ (Boxabl) రూపొందించింది.చిన్న పరిమాణంలో ఉన్నప్పటికీ ఈ ఇంటిలో లివింగ్ ఏరియా, బెడ్రూమ్, కిచెన్, బాత్రూమ్ వంటి ప్రాథమిక సౌకర్యాలు ఉన్నాయి. మర్ఫీ బెడ్, బిల్ట్-ఇన్ స్టోరేజ్, శక్తి పొదుపు డిజైన్ వంటి అంశాలు ఇందులో ప్రత్యేకంగా కనిపిస్తాయి. మస్క్ గతంలో ఓసారి ఈ ఇంటి గురించి మాట్లాడుతూ “అద్భుతమైనది”గా అభివర్ణించారు.2020 తర్వాత కాలిఫోర్నియాలోని తన విలాసవంతమైన పలు ఆస్తులను విక్రయించిన మస్క్, వ్యక్తిగత ఆస్తుల కంటే తన వ్యాపార లక్ష్యాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. ముఖ్యంగా స్టార్‌షిప్ రాకెట్ అభివృద్ధి, స్టార్‌లింక్ విస్తరణ, కృత్రిమ మేధ (AI) ప్రాజెక్టులపై పూర్తిగా దృష్టి పెట్టేందుకు స్టార్‌బేస్‌కు సమీపంలోనే మస్క్ నివసిస్తున్నారు.స్పేస్ఎక్స్ ఐపీఓ చరిత్రలోనే అతిపెద్ద పబ్లిక్ ఇష్యూలలో ఒకటిగా నిలిచింది. షేర్లు మార్కెట్లో జోరుగా లిస్టింగ్ కావడంతో కంపెనీ విలువ రెండు ట్రిలియన్ డాలర్లకు చేరువై, మస్క్ సంపద సుమారు 1.1 ట్రిలియన్ డాలర్ల స్థాయిని తాకినట్లు అంచనాలు వెలువడ్డాయి.చదవండి: లక్ష రూపాయల ఫోన్.. ఇప్పుడు సగం ధరకే -
క్షమాగుణానికి నిలువెత్తు రూపం..
కష్టాలు ఎదురైనప్పుడు కుంగిపోవడం, అధికారం చేతికి రాగానే పగ తీర్చుకోవడం మానవ నైజం. కానీ, ఎన్ని అపనిందలు ఎదురైనా అల్లాహ్ పై నమ్మకం కోల్పోకుండా, తప్పు చేసిన వారు కళ్లముందు నిలబడినా కక్ష సాధించకుండా క్షమించిన మహోన్నత చరిత్ర ప్రవక్త యూసుఫ్ (అలైహిస్సలాం)ది. ముళ్లబాటలను అధిగమించి, ఈజిప్ట్ దేశాన్ని కరవు బారి నుంచి రక్షించిన ఒక అద్భుత ప్రజా నాయకుడి జీవిత విశేషాలపై ప్రత్యేక కథనం.యూసుఫ్ (అ) చిన్నతనం నుంచే ఎంతో అందమైనవాడు, అమాయకుడు. ఒకరోజు ఆయన కు ఒక వింత కల వచ్చింది. 11 నక్షత్రాలు, సూర్యచంద్రులు తన ముందు వంగి నమస్కరిస్తున్నట్లు కల కన్నారు. ఈ విషయాన్ని తన తండ్రి యాఖూబ్ (అ) కు చెప్పగా.. ఆయన ఆ కలలోని దైవ సందేశాన్ని గ్రహించారు. ‘నాయనా! ఈ విషయాన్ని నీ సోదరులకు చెప్పకు, వారు అసూయపడతారు’ అని హెచ్చరించారు. కానీ, తండ్రికి యూసుఫ్‌పై ఉన్న మితిమీరిన ప్రేమే అన్నదమ్ముల మధ్య అసూయకు కారణమైంది.బావి నుంచి బానిసగా..అసూయతో రగిలిపోయిన సోదరులు యూసుఫ్‌ను అంతమొందించాలని పథకం వేశారు. ‘ఆడుకోవడానికి తీసుకెళ్తాం’ అని తండ్రిని ఒప్పించి, అడవిలోని ఒక పాడుబడ్డ బావిలోకి యూసుఫ్‌ను తోసేశారు. ఆయన బట్టలకు గొర్రె రక్తం పూసి, ‘తోడేలు తినేసింది’ అని తండ్రిని నమ్మించారు. ఆ కన్నతండ్రి ‘ఇది దైవ పరీక్ష, నేను ఓపిక పడతాను’ అని సహనం వహించారు. మరోవైపు, ఆ బావి మీదుగా వెళ్తున్న వర్తకులు యూసుఫ్‌ను రక్షించి, ఈజిప్ట్సంతలో ఒక అధికారికి బానిసగా అమ్మేశారు.జైలు జీవితం.. కలలోని సత్యంఅక్కడ అపనిందలు, ఆరోపణలు ఎదురైనా యూసుఫ్ తన శీలాన్ని, దైవభీతిని కాపాడుకున్నారు. ఫలితంగా జైలు జీవితం గడపాల్సి వచ్చింది. జైలులోనే ఆయనకు అల్లాహ్ ‘కలల అర్థాలను వివరించే’ అద్భుత జ్ఞానాన్ని ప్రసాదించాడు.సరిగ్గా అదే సమయంలో ఈజిప్ట్ రాజుకు ఒక వింత కల వచ్చింది. 7 బలిసిన ఆవులను, 7 బక్కచిక్కిన ఆవులు మింగేయడం.. అలాగే 7 పచ్చటి పనసలు, 7 ఎండిన పనసలు కనిపించడం రాజును కలవరపెట్టింది. దేశంలోని పండితులెవరూ ఆ కలకు అర్థం చెప్పలేకపోయారు. అప్పుడు జైలు నుంచి యూసుఫ్‌కు పిలుపు వచ్చింది. ఆ కలకు యూసుఫ్ చెప్పిన పరిష్కారం ఇది: ‘రాబోయే 7 ఏళ్లు ఈజిప్ట్‌లో సమృద్ధిగా పంటలు పండుతాయి. ఆ తర్వాత 7 ఏళ్లు ఘోరమైన కరవు వస్తుంది. కాబట్టి తొలి ఏడేళ్ల ధాన్యాన్ని వృథా చేయకుండా ఖజానాలో దాచండి’’యూసుఫ్ మేధస్సుకు ముగ్ధుడైన రాజు, ఆయనను సగౌరవంగా జైలు నుంచి విడుదల చేసి, ఖజానా అధిపతిగా నియమించాడు. బానిస గా వచ్చిన వ్యక్తి, తన మేధస్సుతో ఆ దేశ రక్షకుడి గా మారాడు! పగ కాదు.. ప్రతీకారం అంతకన్నా కాదు!రాజు కన్న కల నిజమైంది. దేశంలో కరవు తాండవించింది. ఆహారం కోసం పొరుగు దేశాల నుంచి జనం ఈజిప్టుకు రావడం ్రపారంభించారు. ఆ గుంపులో యూసుఫ్ సోదరులు కూడా ఉన్నారు. తమను బావిలో పడేసిన అన్నదమ్ములు తన ముందే నిలబడి యాచిస్తుంటే, యూసుఫ్ వారిని గుర్తుపట్టారు. కానీ పగ తీర్చుకోలేదు.చివరకు తన నిజమైన రూపాన్ని బయటపెడుతూ.. ‘నేనే మీ తమ్ముడు యూసుఫ్‌ను. మీ తప్పులను నేను క్షమించేశాను. నాపై మీకు ఎలాంటి నిందలు లేవు‘ అంటూ వారిని కౌగిలించుకున్నారు. తండ్రి యాఖూబ్ (అ) ను, మొత్తం కుటుంబాన్ని ఈజిప్టుకు పిలిపించుకున్నారు. చిన్నప్పుడు కన్న కలకు నిజరూపంగా.. తల్లిదండ్రులు, సోదరులు అందరూ యూసుఫ్ ఉన్నత స్థానాన్ని చూసి గౌరవంతో తలవంచారు. – ముహమ్మద్ ముజాహిద్ -
40ల తరువాత అల్ట్రామారథాన్ : తృటిలో తప్పిన ముప్పు
ఆరోగ్యంగా ఉండాలని అందరూ అనుకుంటారు. ఉద్యోగ ఒత్తిళ్లు, గంటల తరబడి కూర్చునే జాబ్ నుంచి ఫిట్‌గా మారాలని నిర్ణయించుకుని, తీవ్ర కసరత్తు చేస్తారు. కానీ దీనికి సంబంధించి వైద్యుల సలహాలు, మందస్తు ప్రిపరేషన్ లేకపోతే ముప్పు తప్పదు. బెంగళూరుకు చెందిన ఒక ఉద్యోగికి ఎదురైన చేదు అనుభవం ఈ విషయాన్నే మరోసారి రుజువు చేసింది. పరుగు మంచిదే, కానీ ముందస్తు ప్రిపరేషన్ అవసరం,సురక్షితమైన ఆరోగ్యమే అంతిమ లక్ష్యం కావాలి అనే అంశంపై ఓ కథనం.బెంగళూరుకు చెందిన, 40 ఏళ్ల మధ్య వయసు కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని భావించాడు. ఏళ్ల తరబడి ఒత్తిడితో కూడినడెస్క్ జాబ్‌నుంచి ఫిట్‌గా మారాలను కున్నాడు. అంతేకాదు లాంగ్-డిస్టెన్స్ రన్నింగ్‌ను చేపట్టాలని నిర్ణయించుకున్నాడు అమెరికాలో 100 కిలోమీటర్ల అల్ట్రామారథాన్‌ను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. కానీ అంతలోనూ ఊహించని ప్రమాదం అతణ్ని మృత్యువు అంచుల దాకా తీసుకెళ్లింది. ఇంతకీ ఏమైందంటే.అల్ట్రామారథాన్కోసం శ్రద్ధగా శిక్షణ పొందాడు. గుండె జబ్బులు, ఇతర అనారోగ్య సంకేతాలవీ లేకుండా ఆరోగ్యంగా కనిపించాడు. ఆ తర్వాత జరిగిన సంఘటన అతనికి షాక్ ఇచ్చింది. అతను తన ప్రాక్టీస్ రన్ల సమయంలో ట్రాక్‌పై కుప్పకూలిపోయాడు. అక్కడే ఉన్న స్నేహితులు ఎమర్జెన్సీ రూమ్‌కు తీసుకువెళ్లారు. వైద్య పరీక్షలో అతని గుండెకు రక్తాన్ని సరఫరా చేసే మూడు ప్రధాన కరోనరీ ధమనులలో క్లాట్స్ ఉన్నట్లు తేలింది. అంతేకాదు ఆ తరువాత పరీక్షల్లో హై కొలెస్ట్రాల్ స్థాయిలు, కుటుంబంలో గుండె జబ్బుల చరిత్రతో సహా, ఏళ్లుగా గుర్తించడని పలు అంతర్లీన ప్రమాద కారకాలు బయటపడ్డాయి.ఒక విధంగా చెప్పాలంటే అతను చాలా అదృష్టవంతుడు. ఒక పెను ప్రమాదం జరగక ముందే అతని పరిస్థితిని గుర్తించారు. గుండె ఆరోగ్యానికి పరుగు ఉత్తమమైన వ్యాయామమే అయినప్పటికీ, మధ్య వయస్సులో ఎలాంటి ముందస్తు సన్నాహం లేకుండా అకస్మాత్తుగా తీవ్రమైన ఓర్పు శిక్షణను ప్రారంభించడం, సంవత్సరాలుగా నిశ్శబ్దంగా ఉన్న అంతర్లీన వ్యాధిని కొన్నిసార్లు బయట పెట్టగలదని ఈ కేసు గుర్తు చేస్తుంది.పరుగు తీయడం వల్ల గుండె జబ్బులు రావు. నిజానికి ఇది గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే, సుదీర్ఘకాలం పాటు ఎటువంటి శారీరక శ్రమ లేకుండా చాలా కాలం గడిపి, ఒక్కసారిగా 40 ఏళ్ల వయసులో తీవ్రమైన పరుగు పందాలు (మార్గాథాన్లు) ప్రారంభించడం వల్ల, లోపల దాగి ఉన్న గుండె సమస్యలు అకస్మాత్తుగా బయటపడే ప్రమాదం ఉంది. 40 ఏళ్లు పైబడిన వారు ఎందుకు జాగ్రత్తగా ఉండాలి?అధిక కొలెస్ట్రాల్, బీపీ, మధుమేహం, ధూమపానం వంశపారంపర్య గుండె జబ్బుల వంటి రిస్క్ ఫ్యాక్టర్లు చాలా సంవత్సరాలుగా లోపల నెమ్మదిగా ధమనులలో కొవ్వు పేరుకుపోయేలా చేస్తాయి.బయటకు ఎంతో ఫిట్‌గా కనిపించే వ్యక్తికి కూడా లోపల గుండె ధమనులలో తీవ్రమైన బ్లాక్స్ ఉండే అవకాశం ఉంది.ఒక్కసారిగాతీవ్రంగా శ్రమించడం వల్ల గుండెపై ఒత్తిడి పెరిగి, రక్తపోటు ఎక్కువ అవుతుంది. దీనివల్ల లోపల ఉన్న కొవ్వు పలకలు (plaques) ఊడిపోయి హార్ట్ ఎటాక్‌కు దారితీయవచ్చు.40 ఏళలు దాటిన తరువాత ముందే కార్డియాక్ స్క్రీనింగ్ అంటే గుండె పరీక్షలు చేయించుకోవాలి. డాక్టర్ల సలహా మేరకు ECG, ఎకోకార్డియోగ్రామ్ , ట్రెడ్మిల్ టెస్ట్ వంటివి చేయించుకోవడం ఉత్తమం. పరుగు, లేదా కఠిన వ్యాయామాలను ఆరంభించే ముందు ఒకసారి వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి.ప్రధానంగా రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయిలు, కొలెస్ట్రాల్ పరీక్షలతో ఫ్యామిలీ హిస్టరీని కూడా పరిగణనలోకి తీసుకోవాలి.రిస్క్ ఎక్కువగా ఉన్నవారికి 'కరోనరీ CT యాంజియోగ్రఫీ' ద్వారా లోపల ఉన్న బ్లాక్స్‌ను ముందే గుర్తించవచ్చు.వ్యాయామాన్ని ఒకేసారి తీవ్రం చేయకూడదుకొన్ని సంవత్సరాలుగా రన్నింగ్ చేయని వారు ఒక్కసారిగా కొన్ని నెలల్లోనే పెద్ద రేసులకు సిద్ధం కాకూడదు.తొలుతసాధారణ నడకతో ప్రారంభించి, ఆపై వేగంగా నడవడం (Brisk Walking), ఆ తర్వాతే రన్నింగ్ చేయడం అలవాటు చేసుకోవాలి.వేగం లేదా దూరం కంటే క్రమం తప్పకుండా చేయడం (Consistency) ముఖ్యం. దీనివల్ల గుండె, కండరాలు, కీళ్లకు తగిన సమయం దొరుకుతుంది.మరి ఏం చేయాలి?40 ఏళ్లు దాటిన తర్వాత శరీరంలో కండరాల సాంద్రత సహజంగానే తగ్గుతుంది. కాబట్టి కేవలం పరుగు మాత్రమే సరిపోదు. స్ట్రెంత్ ట్రైనింగ్ (కండరాల వ్యాయామం) తప్పనిసరివారానికి కనీసం రెండు సార్లు కండరాలను బలోపేతం చేసే వ్యాయామాలు (Strength Training) చేయాలి.ఇది మోకాళ్లు, నడుము, తుంటి భాగాలపై ఒత్తిడిని తగ్గించి గాయాలు కాకుండా కాపాడుతుంది.అంతేకాదు భారీ భోజనం వెంటనే రన్నింగ్ చేయకూడదు. ఆహారం తిన్న తర్వాత కనీసం రెండు గంటల సమయం ఇచ్చి, ఆపై రన్నింగ్ చేయడం వల్ల జీర్ణక్రియ సమస్యలు రావు. శరీరం కూడా బాగా సహకరిస్తుంది. ఇదీ చదవండి: 10 రోజులు లీవ్ తర్వాత ఉద్యోగికి బాస్ బంపరాఫర్ -
145 కేజీల నుంచి 90 కేజీలకు..! ఆ ఏడు ఆహారాలు..
బరువు తగ్గడం అంటే కేలరీల లోటు, జిమ్‌లో ఎక్కువ గంటలు గడపడం వంటివి మాత్రమే అనుకుంటాం. కానీ దాంతోపాటు ఇతర మార్పులు కూడా తప్పనిసరి. ముఖ్యంగా జీవనశైలిలోని ఆహారపు అలవాట్లే అత్యంత ప్రధానం. తీసుకునే ఆహారం పోషకవంతమైనది, బరువు అదుపులో ఉంచేది తీసుకుంటే అద్భుతాలు సృష్టించొచ్చు అని అంటోంది ఈ ముంబై ఇన్ఫ్లుయెన్సర్. ఆమె ఒకప్పుడు ఏకంగా 145 కేజీల పైనే బరువు ఉండేదాన్ని అని తెలిపింది. ఇప్పుడు ఏకంగా 55 కేజీల బరువు తగ్గి నాజుగ్గా మారానని, అందుకోసం ఆ ఏడు ఆహారాలను తీసుకుంటున్నానంటూ తన వెయిట్‌లాస్ సీక్రెట్‌ని వెల్లడించారామె. మరి ఆ ఆహారాలేంటో సవివరంగా తెలుసుకుందామా..!.ముంబై ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ డాలీ సుమారు 145 నుంచి 90 కేజీ బరువు తగ్గేందుకు చేసిన ఆ ఏడు ఆహార మార్పుల గురించి సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఆ పోస్ట్‌లో తాను చేసిన ఈ ఆహారపు మార్పులు అదనపు కేలరీలను తగ్గించి..వేగంగా బరువు తగ్గేందుకు సహాయపడిందని నమ్మకంగా చెబుతోందామె. మరి అవేంటంటే..చక్కెర పానీయాలుడాలీ చక్కెర పానీయాలను పూర్తిగా దూరంగా ఉన్నట్లు తెలిపింది. ఈ చక్కెర పానీయాలను అధికంగా తీసుకోవడం వల్ల అధిక కేలరీలు శరీరంలోకి చేరి, బరువు పెరిగే అవకాశం ఉందని చెప్పుకొచ్చింది. దానికి బదులుగా, తాను నిమ్మరసం, కొబ్బరి నీరు, చక్కెర లేని గ్రీన్ టీ వంటి ప్రత్యామ్నాయాలను తీసుకున్నట్లు డాలీ వెల్లడించింది. తెల్ల రొట్టె(మైదాతో చేసేవి)శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచి, అతిగా తినడానికి దారితీస్తుంది. కాబట్లి ఆమె తెల్ల రొట్టెను పూర్తిగా తగ్గించేసింది. దానికి బదులుగా ఆ ఇన్ఫ్లుయెన్సర్ గోధుమ రొట్టె, మల్టీగ్రెయిన్ బ్రెడ్, ఓట్స్‌ను తీసుకోవడం ప్రారంభించింది.చిప్స్, ప్యాక్ చేసిన స్నాక్స్వాటిలో ఉప్పు, కేలరీలు అధికంగా ఉండటం వల్ల ఆమె చిప్స్, ప్యాక్ చేసిన స్నాక్స్ తినడం మానేసినట్లు పేర్కొంది. దానికి బదులుగా ఆమె మితంగా వేయించిన మఖానా, వేయించిన శనగలు, నట్స్‌ను ఎంచుకుంది.ఫాస్ట్ ఫుడ్ఫాస్ట్ ఫుడ్‌లో కొవ్వు, ఉప్పు, కేలరీలు అధికంగా ఉండటం వల్ల దానిని పూర్తిగా తగ్గించేసింది. దానికి బదులుగా డాలీ పనీర్ శాండ్విచ్లు, గోధుమ కూరగాయల ర్యాప్‌లు లేదా ఇంట్లో తయారుచేసిన భోజనం వంటి ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలను ఎంచుకుందామె.ఐస్ క్రీమ్ఐస్ క్రీమ్‌లో తరచుగా చక్కెర,కేలరీలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి దానిని తన ఆహారం నుంచి తొలగించింది. గ్రీక్ యోగర్ట్, పండ్లు, ఫ్రోజెన్ బనానా స్మూతీలు లేదా చిన్న మొత్తంలో డార్క్ చాక్లెట్ తినడం ద్వారా ఆమె తన కోరికలను నియంత్రించుకుంది.మద్యంమద్యపానం డీహైడ్రేషన్‌కు, ముఖం ఉబ్బడానికి కారణమవుతుందని అందుకే తాను దానిని పూర్తిగా మానేసినట్లు తెలిపింది డాలీ. నిమ్మరసం కలిపిన సోడా నీరు, చక్కెర కలపని తాజా పండ్ల రసం, డిటాక్స్ వాటర్ ఆమె ఇష్టపడే ప్రత్యామ్నాయాలుగా మారాయి.ప్రాసెస్ చేసిన ఆహారాలుప్రాసెస్ చేసిన ఆహారాలలో తరచుగా సోడియం సంకలితాలు అధికంగా ఉంటాయి కాబట్టి వాటిని మానేశారు. దానికి బదులుగా, ఆమె గుడ్లు, టోఫు, పనీర్, పెరుగు, పప్పుధాన్యాలు, మొక్కల ఆధారిత ప్రోటీన్ వంటి సహజమైన ఆహార వనరులపై దృష్టి సారించింది.పైన చెప్పిన ఈ ఆహార పదార్థాలను పూర్తిగా తగ్గించి.. ఎక్కువ నీరు తీసుకుంటూ.. బాగా నిద్రపోండి. అలాగే మీరు నిర్దేశించుకున్న డైట్ క్రమం తప్పకుండా ఉండేలా చూసుకోమని సూచిస్తోంది. ఇలా చేస్తే కచ్చితంగా శరీరం వేగంగా నాజూకుగా మారుతుందంటూ తన పోస్ట్‌ని ముగించింది డాలీ.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.(చదవండి: ఒక్క ఏడాదిలో 35 కిలోలు..!ఆ ఆరుబోరింగ్ అలవాట్లు..) -
'నేను బాగానే ఉన్నాను' సిండ్రోమ్: ఇంత ప్రమాదకరమైనదా?
నేను బాగానే ఉన్నాను..అనేది సానుకూలమైన ధోరణి అనుకుంటాం. కానీ అది ఎంతలా మన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసేలా చేస్తుందో తెలిస్తే విస్తుపోతారు. నిజానికి ఈ సిండ్రోమ్‌తో బాధపడుతున్నామని వైద్యుల, మానసిక నిపుణులు సైతం ముందుగా గుర్తించలేరట. మనకు ఎవరైనా మీరు ఎలా ఉన్నారు? అనగానే ఐమ్ ఫైన్, థాంక్యూ అని నేర్పిస్తారు చిన్నప్పటి నుంచి. కానీ ఈ సమాధానమే పెద్దయ్యాక సర్దుబాటు పద్ధతిగా మారి మానసిక క్షోభగా పరిణామం చెందుతోందని గుర్తించమని చెబుతున్నారు నిపుణులు. ఇదేంటని విస్తుపోకండి. అసలు ఏంటి సిండ్రోమ్..బాగున్నా అన్నా ధోరణి ఇంత ప్రమాదకరంగా ఎలా మారుతుందంటే..ఈ సిండ్రోమ్ మనల్ని మభ్యపెట్టి బతికేలా చేస్తుందని హెచ్చరిస్తున్నారు. సింపుల్‌గా చెప్పాలంటే ఒక వ్యక్తి క్షోభకు సంబంధించిన హెచ్చరిక సంకేతాలను విస్మరించి అంతా తన అధీనంలో ఉండాలనే ధోరణినే 'నేను బాగానే ఉన్నాను' సిండ్రోమ్ అంటారట. మస్తత్వవేత్తలు ఇది ఒక రకమైన లక్షణాలను అంగీకరించకుండా.. భావోద్వేగాలను అణిచివేసే స్థితిగా చెబుతున్నారు. దీనివల్ల ఆయా వ్యక్తులు ఎలాంటి పరిస్థితుల్లోనైనా ముందుకు సాగాలని భావించి, తమలోని ఆందోళన సంకేతాలను తక్కువగా అంచనా వేస్తారు లేదా విస్మరిస్తారని అంటున్నారు. అంతేగాదు ఈ 'నేను బాగానే ఉన్నాను' అనేది కేవలం మామూలుగా చెప్పే సమాధానం కాదు. అదొక సర్దబాటు విధానంగా మారిపోతుంది. ముఖ్యంగా ఉద్యోగ నిపుణులు ఎదుర్కొంటున్న సమస్యే ఇదని అంటున్నారు. అంటే వృత్తిరీత్యా సమావేశాలు, టార్గెట్లు, అదనపు వర్క్‌ని పరమావధిగా చూస్తూ..భోజనం మానేయడం, నిద్రలేని రాత్రలు, నిరంతర అలసట, భావోద్వేగపరమైన నీరసం వంటి హెచ్చరిక సంకేతాలను విస్మరిస్తూ..అంతా తమ అధీనంటో ఉందన్నట్లు పనులు చేస్తుంటారని చెబుతున్నారు మానసిక నిపుణుల. ఇక్కడ జీవించడం లేదు కేవలం పోటీ పడుతున్నాం. ఫలితంగా స్వీయం సంరక్షణను నిర్లక్ష్యం చేస్తున్నామని అంటున్నారు. పరిస్థితులు చక్కబడ్డాక ఆరోగ్య సమస్యలు గురించి ఆలోచించ్చని అనుకుంటూ..తెలియకుండానే ఆ భయానక వలయంలో కూరుకుపోతారని అంటున్నారు. అంతేగాదు దీని కారణంగా అనారోగ్య అలవాట్ల బారిన పడతారని కూడా అంటున్నారు. ఈ సిండ్రోమ్ సంకేతాలు..నిద్రలేమిఏకాగ్రత లోపంజ్ఞాపకశక్తి సమస్యలువైద్యపరంగా వివరించలేని ఆకలి లేదా బరువులో మార్పులుపనిలో ఉత్పాదకత తగ్గడంసామాజిక ఒంటరితనంఅభిరుచులపై ఆసక్తి లేకపోవడంచిరాకుఆవేశపూరిత ప్రవర్తనతరచుగా వచ్చే తలనొప్పులు, జీర్ణకోశ సంబంధిత సమస్యలు,అలసట వంటి శారీరక అనారోగ్యాలుఈ లక్షణాలు ఒక్కోసారి ఆపీసు లేదా కార్యాలయాల్లో తమ కార్యకలాపాలు గణనీయంగా తగ్గిపోయినప్పుడూ కూడా ఈ పరిస్థితి ఎదురయ్యే ఛాన్స్ ఉందంటున్నారు. దీనివల్ల సాధారణ పనులు కూడా చేసుకోలేని విధంగా ఇబ్బంది పడతారని హెచ్చరిస్తున్నారు. నిజానికి నిరాకరణ నుంచి 'నేను బాగానే ఉన్నాను' అనే సిండ్రోమ్ వస్తుందట. మానసిక నిరాకరణ అనేది తరుచుగా భయం, సామాజిక కండిషనింగ్ నుంచి పుడుతుందని అంటున్నారు. చాలామంది తాము బలంగా ఉండాలని, సమస్యలను స్వయంగా పరిష్కరించుకోవాలని ఇతరులకు భారం కాకూడదని భావిస్తూ పెరుగుతారు. అది కాస్తా తమ బాధను అంగీకరించడానికి ఇబ్బందిపడే మనస్తత్వాన్ని పెంపొందిస్తుంది. ఇక్కడ మనం బాధను అంగీకరిస్తే బలహీనంగా కనిపిస్తామని సిగ్గుపడి చివరకి నిరాకరణ ధోరణి మొదలవ్వుతుందని అంటున్నారు. అందుకే భావోద్వేగాలను అణిచివేయొద్దు, బాధ, ఒత్తిడి, ఆందోళన వంటి పరిస్థితులను అంగీకరించి వాటి నుంచి బయటపడే మార్గం చూడండి తప్ప అణిచేసేలా బాగానే ఉన్నాను అనే మాటకు ఆస్కారం ఇవ్వకండి. ఇక్కడ బాగానే ఉన్నాను అను మాటకు కట్టుబడి ఉండేలా స్వీయ భద్రతపై దృష్టిపెట్టండి, ఆరోగ్యాన్ని పట్టించుకోండి..తర్వాత అనే మాటకు అవకాశం ఇవ్వొద్దు అని సూచిస్తున్నారు మానసిక నిపుణులు. (చదవండి: ఐదువేల ఏళ్ల నాటి 'మమ్మీ'లో సజీవంగా పేగు బ్యాక్టీరియా..! అతడి చివరి భోజనం..) -
బ్రీజీ ఔట్ఫిట్... క్రేజీ స్టయిల్
చిన్నప్పుడు అమ్మ కొనే బట్టలన్నీ లూజ్ లూజ్‌గా ఉన్నాయని ఫీల్ అయ్యిన వారే, ఇప్పుడు వెతికి వెతికి మరీ అవే కొనుక్కుంటున్నారు! కారణం, టాప్ ట్రెండీ ఫ్యాషన్స్‌లో ఇప్పుడు ఓవర్సైజ్డ్, రిలాక్స్డ్ ఫిట్ కూడా ఒక హాట్ స్టయిల్‌గా మారిపోయింది. అందుకే, లూజ్‌గా, లైట్‌గా, గాలి ఆడేలా ఉండే ఈ ఔట్ఫిట్స్ సమ్మర్లో కంఫర్ట్‌తో పాటు స్టయిల్ కూడా ఇస్తున్నాయి.హీరో లినెన్ !సమ్మర్ అనగానే గుర్తొచ్చేది లినెన్ బట్టలే. వీటిల్లో రిసార్ట్ కాలర్ అంటే ఓపెన్ కాలర్ షర్ట్స్ వేసుకుంటే పక్కా బీచ్ వైబ్ వస్తుంది. వీటికి లోపల ఒక ప్లేన్ ఫిట్టెడ్ టీషర్ట్ వేసి, పైన షర్ట్ బటన్స్ తీసేసి ఓపెన్‌గా వదిలేయండి. లేయర్డ్ లుక్ వస్తుంది, ఎండ కూడా తక్కువగా తగులుతుంది. నిట్టెడ్ పోలోస్కి క్లాస్రెగ్యులర్ కాలర్ టీషర్ట్స్ బోర్ కొడితే, ఈ నిట్టెడ్ అంటే అల్లిక డిజైన్ పోలోస్ ట్రై చేయండి. ఇవి గాలి బాగా ఆడేలా ఉండటంతో పాటు, ఒక ప్రీమియం లుక్ కూడా ఇస్తాయి.వైడ్ లెగ్ ప్లీటెడ్ ట్రౌజర్స్ కింద లూజ్‌గా ఉంటూ, పైన ప్లీట్స్ ఉండే ఈ ప్యాంట్లు వేసుకుంటే క్లాస్ లుక్ వస్తుంది. ఇటు గాలికి గాలి ఆడుతుంది, అటు ఆఫీస్ మీటింగ్స్ లేదా స్మార్ట్ క్యాజువల్ ఈవెంట్స్‌కి కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. లైట్ కలర్స్‌లో ప్లీటెడ్ ట్రౌజర్స్ వేసుకుని, లోఫర్స్ జోడిస్తే సమ్మర్ ఫ్యాషన్‌లో మీరే టాపర్!డ్రాస్ట్రింగ్ లినెన్ ప్యాంట్స్బెల్ట్ పెట్టుకునే ఓపిక కూడా లేని ఎండల్లో తాడు ఉండే ఈ లినెన్ ప్యాంట్లు బెస్ట్ చాయిస్. క్యాజువల్ అవుటింగ్స్, ఈవినింగ్ వాక్స్, ట్రావెల్స్ ఏదైనా సరే ఈజీగా సెట్ అయిపోతాయి.జాగ్రత్తలు!లూజ్ ఫిట్ అంటే చాలా పెద్ద సైజ్ కాదు. లేదంటే బెడ్‌షీట్‌లా కనిపించే చాన్స్ ఉంది.లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్స్ మాత్రమే ఎంచుకోండి. మందపాటి మెటీరియల్ అయితే సమ్మర్లో భరించలేరు.ఒక ఔట్ఫిట్లో చాలా ప్రింట్స్ వద్దు. రిలాక్స్డ్ ఫిట్ అంటే క్లీన్, సింపుల్ లుక్ బెటర్.లైట్ కలర్స్ వేసుకుంటే సమ్మర్లో కూల్‌గా కనిపిస్తారు. బ్లాక్‌తో పూర్తి ఔట్ఫిట్ అయితే సూర్యుడు కూడా మీతో పర్సనల్‌గా కనెక్ట్ అయిపోతాడు! కొండి దీపిక(చదవండి: ఆ కారణంగానే 56 ఏళ్ల నాటి ఆ కప్పులోనే 'టీ' ..! మానసిక నిపుణులు సైతం..) -
‘నేను అచ్చం ఏఐ బొమ్మలా కనిపించాలి’ అంటున్నారు!
అందానికి సంబంధించి ఏ.ఐ జనరేటెడ్ చిత్రాలు ఆహా అనిపించినా వాస్తవానికి ఆమడ దూరంలో ఉంటాయి. న్యూయార్క్‌కు చెందిన డెర్మటాలజిస్ట్ డేచర్ వెబ్స్టే దగ్గరికి ఒక అమ్మాయి వచ్చి ఏఐ జనరేటెడ్ చిత్రాన్ని చూపించి ‘ఈ ఇమేజ్‌లో ఉన్న అమ్మాయిలాగే కనిపించాలనుకుంటున్నాను’ అని చెప్పింది. ఆ మాటకు వెబ్స్టే షాక్ అయ్యారు.‘ఈ ఇమేజ్లోలాంటి పెద్ద పెదవులు, పెద్ద కళ్లు, చెక్కినట్లు ఉండే దవడతో నేను కనిపించాలి’ అని అడిగిన ఆ అమ్మాయి వెబ్స్టేను మరింత ఆశ్చర్యానికి గురి చేసింది. గత కొంతకాలంగా సోషల్ మీడియా ఫిల్టర్లు సౌందర్య ప్రమాణాలను మార్చిన తీరుకు ఈ సంఘటన అద్దం పడుతుంది. ఏఐ సృష్టించిన సౌందర్య చిత్రాలు నిజజీవితంలో సాధ్యపడతాయని కొంతమంది నమ్ముతున్నారు.ఒక అధ్యయనం ప్రకారం... తమ ఫొటోలను ఎడిట్ చేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టూల్స్‌ను ఉపయోగించే వారిలో కొంతమందికి, అందాలకు సంబంధించి ప్లాస్టిక్ సర్జరీ ఎన్నో అద్భుతాలు చేస్తుందనే విషయంలో చాలా అంచనాలు ఉన్నాయి. 70 ఏళ్ల వయసు ఉన్న ఒక మహిళ మాన్హాటన్లోని ఒక ప్లాస్టిక్ సర్జన్ దగ్గరకు ఏఐ జనరేట్ చేసిన తన ఫొటోతో వచ్చింది. సర్జికల్ టైమ్ మిషన్ కావాలని, తాను తన మనవరాలిలా కనిపించాలని అడిగి ఆ సర్జన్ షాక్ అయ్యేలా చేసింది.‘అలా కుదరదు’ అని నచ్చచెప్పినా ఆ బామ్మ వినలేదు. ‘అలా కనిపించేలా చేయండి’ అని పట్టుబట్టింది. ఫైనల్‌గా చెప్పొచ్చేదేమిటంటే... ఏ.ఐ ఇమేజ్‌లతో హాస్పిటల్స్‌కు వస్తున్న వారిని చూసినప్పుడు వైద్యుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి! -
ఆకాశంలో ఒక పెద్ద కుటుంబం!
సూర్యుడు... సౌరకుటుంబంలో ఇంటికి పెద్దవాడు సూర్యుడు. మన ఇంటికి నాన్న ఎలాగో అలా. సూర్యుడి చుట్టూ తిరిగే పిల్లల్లాంటి గ్రహాలే మన ప్లానెట్స్. సూర్యుడు వెలుగు, వేడి ఇస్తాడు. ‘టైమ్‌కు లేవండి!’ అని చెప్పే నాన్నలా ఉంటాడు. అందరూ అతని చుట్టూ తిరుగుతుంటారు.బుధుడు...ఇంటి చిన్న తమ్ముడు ఎలా వేగంగా పరుగెడతాడో బుధుడు కూడా అలానే!. సూర్యుడికి చాలా దగ్గరగా ఉంటాడు. ‘నేనే ఫస్ట్!’ అనేలా ఉంటాడు. పగలు వేడిగా... రాత్రిళ్లు చల్లగా చిన్నపిల్లల మూడ్స్ మార్చుకున్నట్టే ఉంటాడన్నమాట.శుక్రుడు...స్టైల్ క్వీన్‌గా పిలిచే ఈ గ్రహం ఆకాశంలో చాలా బ్రైట్‌గా కనిపిస్తుంది. ‘నేను చాలా అందంగా ఉంటాను!’ అనుకునే అక్కలా ఉంటుందన్నమాట. మబ్బులతో ఫుల్ మేకప్ వేసుకున్నట్టుంటుంది. బయటకి వైబ్రెంట్‌గా కనిపిస్తూ, లోపల హాట్ హాట్‌గా ఉంటుంది. భూమి...అమ్మ ప్రేమలా ఉంటుంది. మనందరం ఉండేది భూమిపైనే కదా! గిరగిరా తిరుగుతుంది ఇంట్లో అందరికీ అన్నీ అమర్చి పెట్టే అమ్మలా. కానీ, మనల్ని ఎక్కడా పడేయదు. జాగ్రత్తగా అందరికీ నీళ్లు, గాలి, ఆహారం ఇస్తుంది. చెట్లు, పక్షులు, మనుషులు.. అందరికీ ఇల్లు భూమే. అందుకే భూమి అంటే ప్రేమతో నిండిన ఇల్లు అన్నమాట.అంగారకుడు...ఎర్రగా కనిపించే గ్రహం. నా జోలికి ఎవరైనా వచ్చారా.. అంతే! అన్నట్టుగా ఉంటాడు. లోపల అంతా ఎడారిలా ΄÷డిగా ఉంటుంది. భవిష్యత్తులో మనుషులు అక్కడికి వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు. రఫ్‌గా కనిపించినా ఇంట్రెస్టింగ్ గ్రహం.గురుడు...ఇంటిలో పెద్దన్న అమ్మకు, నాన్నకు, తమ్ముడు, చెల్లెలికి సపోర్ట్‌గా ఎలా ఉంటాడో అలా ఉంటాడు. సౌర కుటుంబంలోనే అతిపెద్ద గ్రహం. పెద్ద అన్నలా అందరినీ కా΄ాడుతాడు. ‘నేను బిగ్ బాస్!’ అన్నట్టుంటాడు. చాలా పెద్దవాడు కానీ గ్యాస్ నింపిన పెద్ద బెలూన్లా కనిపిస్తాడు.శని...శాటర్న్గా పిలిచే ఈ గ్రహం చూడటానికి చాలా స్టైలిష్‌గా ఉంటుంది. ఫ్యాషన్ అంటే ఇష్టం ఉన్న తాతయ్యలా ఉంటాడు. శని చుట్టూ ఉన్న రింగ్స్ చూసారా? ఐస్, రాళ్లతో ఆ రింగ్స్ ఏర్పడ్డాయట. ఆకాశంలో ఫ్యాషన్ స్టార్ అంటే శనిగ్రహమే.ఇంకా యూరేనస్, నెఫ్ట్యూన్ వంటి గ్రహాలు కూడా ఉన్నాయి. కానీ, అవి దూరపు బంధువుల్లాంటివి. ఎప్పుడో వాళ్ల వాళ్ల గురించి ఇంట్లోవాళ్లు చెబుతుంటే వింటుంటాం. ఆకాశంలో మనలాగే ఒకరు కోపంగా, ఒకరు వేగంగా, ఒకరు ప్రేమగా, ఒకరు బ్రైట్‌గా, ఒక పెద్దగా, ఒకరు చాలా చిన్నగా... ఇలా విభిన్నంగా కనిపిస్తుంటాయి. ఎవరికి వాళ్లే అత్యంత ప్రత్యేకం. కానీ, అందరూ కలిసి ఉండటం వల్ల ఒక కుటుంబంగా స్పెషల్‌గా నిలిచిపోయారు అని చెప్పవచ్చు. ఈ విధానం వల్ల పిల్లలు రిలేషన్స్ గురించి, మనలోని భావోద్వేగాల గురించి, విభిన్న వ్యక్తుల గురించి అర్థం చేసుకుంటారు. వారి సృజనాత్మకతకు పని చెబుతారు. - నిర్వహణ: నిర్మలారెడ్డి -
60 ఏళ్ల తల్లి వెయిట్‌లాస్ స్టోరీ..! దెబ్బకు థైరాయిడ్, షుగర్..
పెద్దవాళ్లు అందులోనూ ఇంట్లోనే ఉండే తల్లులు బరువు తగ్గే ప్రయత్నాలు చేసేందుకు సిగ్గుపడుతుంటారు. అందులోనూ ఈ వయసులోనా..! అనే భయం వాళ్లను వెంటాడుతుంటుంది. ఓ అమ్మ ఆ మూసధోరణిని బద్దలుకొట్టేలా..జిమ్‌కి వెళ్లి ఏకంగా 18 కిలోలు తగ్గింది. అంతేగాదు ఎన్నాళ్లుగానో వేధిస్తున్న దీర్ఘకాలిక వ్యాధులకు సైతం చెక్ పెట్టింది. అదెలాగో తెలుసుకుందామా..!.కంటెంట్ క్రియేటర్ హరీష్ ఠాకూర్ తన తల్లి స్ఫూర్తిదాయకమైన వెయిట్‌లాస్ జర్నీని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. తాను ఎన్నోసార్లు తన తల్లికి వ్యాయామాలు చేయమని చెప్పినా..ఆమె సామాజిక ఒత్తిడి, ఇతరులు ఏమనుకుంటారో అన్న భయంతో ఎలా వెనకాడుతూ ఉండేదో చెప్పుకొచ్చారు. తన బలవంతంపైనే ఏదోలా జిమ్‌కి వచ్చిందని నాటి సంగతులను గుర్తుచేసుకున్నారు. అలా ఒక ఏడాదిపాటు క్రమం తప్పకుండా వ్యాయామాలు చేసిన తర్వాత ఆమె తల్లిలో వచ్చిన మార్పుని చూసి ఆశ్చర్యపోయానని అన్నారు. ఆమె కూడా తనంతాటే ఇష్టంగా వ్యాయామాలు చేయడం ప్రారంభించిందని అన్నారు. ఫలితంగా రక్తపోటు, థైరాయిడ్ ఆరోగ్యం మెరుగపడిందని అన్నారు. ఈ మేరకు హరీష్ తల్లి సైతం జిమ్‌కి వెళ్లాక ఆరోగ్యం బాగుందని, ఏకంగా 18 కిలోలు తగ్గానని అంటోంది. అంతేగాదు షుగర్, రక్తపోటు, థైరాయిడ్ సమస్యలన్నీ తగ్గిపోయాయని ఆనందంగా చెబుతోంది. అలాగే కంటెంట్ క్రియేటర్ హరీష్ కూడా అందరు తమ తల్లిదండ్రుల ఆరోగ్యానికే ప్రాదాన్యత ఇవ్వాలని కోరాడు. అంతేగాదు తల్లి వ్యాయమాలు చేస్తున్న వీడియోలను కూడా షేర్ చేశారు. ఆమె ఫిట్నెస్ చర్యలో భాగంగా డెడ్లిఫ్ట్లను కూడా ఎత్తుతారామె. ఆమె కూడా తనలా ఇతరులు ఏమనుకుంటారో అని భయపడే వాళ్లు తమ పిల్లలు మాట విని ఆరోగ్యంగా ఉండాలని అన్నారామె.పెద్దలకు మంచిదేనా..?60 ఏళ్ల అనంతరం సరైన మార్గదర్శకత్వంలో వ్యాయామం చేయడం వల్ల బలం, సమతుల్యత, చలనశీలత తదితరాలన్ని మెరుగుపడతాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. క్రమం తప్పని వ్యాయామాలు కండరాల క్షీణతను తగ్గించి, ఎముకలను బలోపేతం చేసి పడిపోయే ప్రమాదాన్ని నివారిస్తుందన్నారు. View this post on Instagram A post shared by HotFix | Harish Thakur (@itshotfix) (చదవండి: 30 రోజుల్లో ఏడు కిలోలు..! ఆ 15 రూల్స్ మస్ట్) -
కుమార్తెలకు గ్రాండ్‌గా పెళ్లి చేయడం 'గిప్ట్' కాదు..!
మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లోట్విషా శర్మ ఉదంతం యావత్తు దేశాన్ని దిగ్బ్రాంతికి గురిచేసింది. ఈ కేసు రోజుకో మలుపుతిగరుతూ చాలా షాకింగ్ విషయాలే వెలుగులోకి వస్తున్నాయి. అదీగాక ఈ కేసు విచారణ సందర్భంగా ధర్మాసనం చేసిన కీలక వ్యాఖ్యలు అందర్నీ ఆలోచింపచేసేలా ఉన్నాయి. సుప్రీంకోర్టు ఈ కేసు వాదోపవాదనలు విచారిస్తూ..అసలు వరకట్నం కోరలకు కన్న కూతురిని బలి చేయడం కంటే, విడాకులు తీసుకుని పుట్టింట్లో ఆమెను బతనివ్వడమే మేలని హితవు పలకడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. అంతేగాదు ధర్మాసనం వ్యాఖ్యలు ప్రతి తల్లిదండ్రుల తీరుకు చెంపెట్టులా ఉండటం విశేషం. అలాగే మానసిక నిపుణులు సైతం కూతుళ్ల విషయంలో తల్లిదండ్రుల ధోరణి మారాలని హితవు పలుకుతున్నారు. కష్టపడి చదివించి పాతికేళ్లు అల్లారుముద్దుగా పెంచుకున్న కూతుర్ని పెళ్లి అనే రెండక్షరాలకు బలి అవ్వకాకుండా ఎలా కాపాడుకోవాలి, ఎలా పెంచాలి వంటి వాటి గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.ప్రతి పేరెంట్ తమ కుమార్తెలకు అంగరంగ వైభవంగా పెళ్లిచేయడం గొప్ప బహుమతి కాదని అంటున్నారు. వివాహం తనను ఊపిరాడనివ్వని పరిస్థితుల్లోకి నెట్టేస్తే..ధైర్యంగా బయటకొచ్చి నిలబడేలా ఉండాలి, అందుకు ఆమె కుటుంబ సభ్యులు కూడా సహకరించాలని అంటున్నారు. వరకట్నం మరణాలను నివారించాలంటే పేరెంట్స్‌ని తమ కుమార్తెలను జీవితంలో ఎదురయ్యే ఒడిదుకులకు ఆమెను సిద్ధం చేసేలా ట్రైన్ చేయాలి. సాంప్రదాయకంగా పెళ్లి చేయడం కంటే..ఆమెకు ఈ వైవాహిక బంధం రక్షణ, స్వేచ్ఛను ఇవ్వగలదా చూడాలి. అలాగే మన ఇంటి ఆడపిల్లలకు ముందుకు మానసిక ధైర్యం, ఆర్ధిక స్వేచ్ఛ వంటివి నేర్పించాలి. ఇక వివాహానికి పునాది త్యాగం కాదు, భద్రతే ముఖ్యం అని గ్రహించాలి. అలాగే ఆడపిల్లలకు అత్తంటిలో సమస్యలు, హింసను ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడితే ప్రతి తల్లిదండ్రులు సద్దుకోమని చెప్పడం కాదు. ధైర్యంగా బయటకు వచ్చేలా స్వేచ్ఛను ఇవ్వాలి. దీంతోపాటు ప్రతి తల్లిదండ్రల్లో పెళ్లితో తమ అమ్మాయి పరాయిది అనే భావాన్ని తొలగించాలి.ఆ వైవాహిక జీవితం నరకప్రాయంగా మారినప్పుడు ఆమె కుటుంబ సభ్యులు దగ్గరగా తీసుకోవాలి, భద్రత అందించాలి. చిన్నప్పటి నుంచి అత్తారింటికి వెళ్లే అమ్మాయి ఇలా ఉండాలి అని స్టోపాయిజన్లా కుమార్తెలకు ఎక్కించడం మానాలి. అంతేగాదు ఆడపిల్లలు కూడా అత్తంట్లో సమస్య వస్తే..పుట్టింటికి వెళ్లడాన్ని అపరాధ భావంలా కాకుండా తన హక్కుగా ధైర్యంగా వచ్చేలా చేయాలి. అలాగే శ్రద్ధ అన్న పేరుతో కుమార్తెలను ప్రతి నిమిషం పర్యవేక్షించడం, కట్టుబాట్లు విధించడం వంటివి చేయకూడదని అంటున్నారు. వాళ్లను ఆత్మవిశ్వాసం ఉన్న వ్యక్తుల్లా తీర్చిదిద్దాలన్నారు. ఆడిపిల్లకు ఇచ్చే బంగారం, డబ్బు అత్యవసర నిధుల్లోకి మళ్లించాలి. అది ఆమెకు పెళ్లి తర్వాత భరోసానిచ్చే నిధిలా ఉంటుంది. సమస్య ఎదురైతే ధైర్యంగా బయటకకు వచ్చి బతకగలను అన్న ధైర్యం అందిస్తుంది. లక్షలు ఖర్చుపెట్టి ఆర్భాటంగా పెళ్లి చేస్తే..కేవలం నాలుగు రోజులే గుర్తుంటుంది. అదే డబ్బు మిగిల్చి ఆమె స్త్రీ ధనంగా ఇస్తే..ఆమెకు భరోసానిస్తుందని చెబుతున్నారు మానసిక నిపుణులు. ఒకవేళ కూతురు పుట్టింట్లో ఉంటే చుట్టూ జనాలు ఏం అనుకుంటారో అన్న భయంతో ముందే తలుపులు వేసుకుని కూర్చొవద్దని పిలుపునిస్తున్నారు. మన అమ్మాయికి అత్తంట్లో కష్టం వస్తే భయపడొద్దు..ఎప్పటికీ పుట్టింటి తలుపులు నీ కోసం తెరిచే ఉంటాయన్న నమ్మకం ఇవ్వండని సూచిస్తున్నారు. అలాగే బాధను సాధరణీకరించొద్దు, తొలగించి, ఆత్మవిశ్వాసంతో తలెత్తుకుని బతికేలా ధైర్యం ఇవ్వండని చెబుతున్నారు మానసిక నిపుణులు.(చదవండి: మంచి ఉద్యోగం నుంచి సివిల్స్, లవ్ అన్ని ఫెయిల్ చివరికి..!) -
అతి ఖర్చులూ... అప్పులూ ఎప్పుడూ చేటే!
‘ధనమూలం ఇదం జగత్’ అని అనిపించారు వాల్మీకి లక్ష్మణుడి చేత.. ఆది కావ్యంగా ఆదరింపబడి అనునిత్యం మన బతుకుల్లో అల్లుకు పోయిన రామాయణంలోని మాట... నేటికీ అన్వయింపబడే మాట..యుగాలు మారినా, కాలాలు మారినా శిలాశాసనంగా ఉన్న మాట.. ధనమే రాజ్యాలు ఏలుతోంది.. మూలంగా మారి బలంగా తయారై చంచలమైన డబ్బు నిశ్చలంగా నిలిచిపోయింది.భర్తృహరి తన శతకంలో ‘అన్ని గుణాలు ధనాన్ని ఆశ్రయించి ఉంటాయి’ అని అంటారు... ఇది లోకం పోకడ అని అనుకున్నప్పటికి ధనానికి నల్గురు దాయాదులు.. ధర్మం, అగ్ని, రాజు, దొంగలని భర్తృహరి సెలవిచ్చారు.. ధర్మం అంటే మనం స్వయంగా సక్రమంగా ఖర్చు పెట్టేది, అగ్ని అంటే ప్రభుత్వం ప్రకృతి వైపరీత్యం ద్వారా పోయేది, రాజు అంటే మనం చెల్లించే పన్నులు, దొంగలు అంటే దొంగలు ఎత్తుకొని పోయేది.. ఈ మధ్య తరచు జరిగే నేరాల వలన పోతోంది...ధర్మం, అర్థం, కామం, మోక్షం... ఈ నాల్గు పురుషార్థాలుగా చెప్తారు...అర్ధం పురుష లక్షణం అంటారు.. కాలానుగుణంగా ‘ముదితల్ నేర్వగ రాని విద్య లేదన్నట్లు పరిగణనలో తీసుకొని అర్థం మానవ లక్షణం అని అనొచ్చు.. అయితే ఏదైనా ధర్మబద్ధంగా వుండాలి, చట్టబద్ధంగా, న్యాయపరంగా ఉండాలి..దశరథుడి పరిపాలన ధర్మంగా సాగింది.. రామరాజ్యం గూర్చి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. రమణి వ్యామోహంతో లంకేశుడు రాజ్యం, ప్రాణం పోగొట్టుకుంటే, రాజ్యలక్ష్మి కోసం రారాజు దుర్యోధనుడు ఆధోగతి పాలయినాడు.. ఇతరుల ఆస్తి కోసం, డబ్బు కోసం దురాశ పడ్డ వాళ్ళు నిలువలేక పోయారు..సాధనమున సమకూరు పనులు ధరలోన అని వేమన సెలవిచ్చినప్పటికీ, సా‘ధన’ము వలన అన్నీ సమకూరతాయి అన్నది సత్యం...పైసా మే పరమాత్మ హై అని మన ఎదురుగా లక్ష్మీదేవిని ఆవిష్కరణ చేసిన వాళ్ళున్నారు, కొండమీద కోతి అయినా దిగి రావాల్సిందే అనే అహంకార పూరితులూ ఉన్నారు... అప్పుచేసి పప్పు కూడు వద్దన్నారు.. అప్పులేని వాడు అధిక సంపన్నుడని వేమనగారు గౌరవించినా.. అప్పుల అప్పారావులు ఎక్కువైపోయారు.. ఆడంబరాలకి వెళ్లి అప్పు చేసి, తిప్పలు తప్పక కటకటాలలో చిప్పకూడు తిన్నవాళ్లు ఉన్నారు..పంచతంత్రంలో చెప్పిన అష్టకష్టాల్లో ‘అప్పు’ ఒక కష్టం.. అయినా జనాలు మారటం లేదు..‘అప్పిచ్చు వాడున్న’ ఊరిలో నివసించమన్న సలహా సుమతీ శతకంలో ఉంది.. కాని అప్పులు చేయమని కాదు.. అదే సుమతీ శతకంలో అప్పు చేసి వ్యయం చేస్తే కీడు చేస్తుందన్నాడు...కాలాంతకుడు కాలం చెల్లాక వస్తాడు, అప్పులవాడు ఎప్పుడైనా వస్తాడన్నది ఒక నిజం..దాశరథి శతకంలో భక్తరామదాసు ప్రస్తావించిన ఏడు వ్యసనాలలో అర్థదూషణం ఒకటి..మహాభారతం ఉద్యోగ పర్వం విదురనీతిలో వ్యసనాల జాబితాలో వృథావ్యయం ఒకటి...ఎందరో రచయితలు, వ్యాసకర్తలు, సినీదర్శకులు వారి సామాజిక బాధ్యతలో భాగంగా అర్థం గూర్చి చెప్తూ సక్రమంగా సంపాదించమని, అప్పులు వద్దని, పొదుపు మంత్రం పాటించండి అనీ సెలవిచ్చారు.ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఖర్చు తగ్గించే చర్యలు పాటించండి అని పిలుపు ఇచ్చారు.ఇం‘ధనం’ వాడకం తగ్గించడం, ఖర్చులు వాయిదాలో భాగంగా బంగారం కొనుగోలు, విదేశీ ప్రయాణం ఏడాదిపాటు వద్దని, స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించమని చెప్పారు.మీ పొదుపే మీ భద్రత అన్నారు అబ్దుల్ కలాం.. చాణుక్యనీతిలో తెలివి గా ఖర్చుపెట్టమని ఉంది.చివరిగా..సంచయాత్ వర్థతే విత్తం అన్నారు.. పొదుపు వలన సంపద పెరుగుతుంది..అర్థమనర్థం భావయ నిత్యం అన్నారు ఆది శంకరాచార్యులు వారు.. అర్థం అనర్థం కాని... సంతుష్టం: కో పీ శ్రీ మాన్... ఎవడు సంతుష్టుడో వాడే శ్రీమంతుడు...మరీ వేదాంతానికి పోకపోయినా సక్రమ మార్గంలో నడుచుకుంటూ వెళదాం. – డాక్టర్ కందాల సత్యనారాయణ మూర్తి -
ఆహార అలవాట్లలో మార్పు
భారతీయుల రోజువారీ ఆహార అలవాట్లలో మార్పులొస్తున్నాయి. ఒకప్పుడు జిమ్‌కు వెళ్లేవారో, బాడీ బిల్డర్లో అధికంగా తీసుకునే ప్రోటీన్ (మాంసకృత్తులు)పై ఇప్పుడు సామాన్యులకు ఆసక్తి పెరిగింది. దేశవ్యాప్తంగా హెల్త్, ఫిట్నెస్ పట్ల అవగాహన పెరగడంతో చాలా మంది తమ రోజువారీ ఫుడ్మెనూలో ప్రోటీన్ ఆధారిత ఆహారానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రముఖ క్విక్ కామర్స్ ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టామార్ట్ తాజాగా విడుదల చేసిన 2023-2025 కాలానికి సంబంధించిన నివేదికలో కొన్ని కీలక విషయాలు వెల్లడయ్యాయి. గడిచిన రెండేళ్లలోనే ఇన్‌స్టామార్ట్‌లో ప్రోటీన్ ఉత్పత్తుల ఆర్డర్లు ఏకంగా 150 శాతం వృద్ధి చెందగా వినియోగదారులు వీటికోసం చేసే ఖర్చు ఏకంగా మూడు రెట్లు పెరగడం గమనార్హం.టైర్-2 నగరాల్లో వృద్ధి!ఒకప్పుడు హెల్తీ లైఫ్‌స్టైల్ ట్రెండ్స్ కేవలం మెట్రో నగరాలకే పరిమితం అనుకునేవారు. కానీ ఇప్పుడు సీన్ మారింది. మెట్రో నగరాలతో పోలిస్తే టైర్-2, 3 నగరాల్లో ప్రోటీన్ ఆర్డర్ల వృద్ధి రేటు 200 శాతం వేగంగా ఉంది. వైజాగ్ వంటి నగరాలు ప్రస్తుతం భారతదేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రోటీన్ వినియోగ హబ్‌లుగా మారుతున్నాయి. ఇక్కడి ప్రజలు తమ రోజువారీ సరుకుల లిస్ట్‌లో సాంప్రదాయ ఆహారంతో పాటు ఆధునిక ప్రోటీన్ ప్రొడక్ట్స్‌ను కూడా చేరుస్తున్నారు.ప్రోటీన్ ఆర్డర్ల ట్రెండ్‌పై ఇన్‌స్టామార్ట్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ హరి కుమార్ మాట్లాడుతూ ‘మేం నిత్యావసరాలను వేగంగా అందించడంతోపాటు భారతీయుల జీవన విధానంలో వస్తున్న ఒక ప్రాథమిక మార్పులో భాగస్వామ్యం అవుతున్నాం. ఇది హెల్తీ లైఫ్‌స్టైల్ వైపు మళ్లుతున్న ట్రెండ్‌ను సూచిస్తుంది. మెట్రోల నుంచి చిన్న నగరాల వరకు ప్రతి ఒక్కరికీ నాణ్యమైన పోషకాహారాన్ని అందుబాటులోకి తీసుకురావడమే మా లక్ష్యం’ అని పేర్కొన్నారు.నివేదికలోని కొన్ని అంశాలు..మార్నింగ్ విండో క్రేజ్ (ఉదయం 7 నుంచి 11 గంటలు): దేశవ్యాప్తంగా ప్రోటీన్ ఉత్పత్తుల ఆర్డర్లు అత్యధికంగా ఉదయం 7 గంటల నుంచి 11 గంటల మధ్యే వస్తున్నాయి. అంటే ప్రజలు తమ బ్రేక్‌ఫాస్ట్‌ను ప్రోటీన్-రిచ్‌గా మార్చుకోవడానికి ఇష్టపడుతున్నారు.నంబర్ 1 కాంబో: భారతీయుల ఇన్‌స్టామార్ట్ కార్ట్‌లో అత్యధికంగా ఆర్డర్ అవుతున్న నంబర్ వన్ హెల్తీ కాంబో.. కోడిగుడ్లు, పనీర్. వీటి తర్వాత చికెన్, శనగలు ఉన్నాయి.2025 నాటి డేటా ప్రకారం.. యాప్‌లో అత్యధికంగా వెతికిన ప్రోటీన్ పదం ‘పీనట్ బటర్’. రెండో స్థానంలో గ్రీక్ యోగర్ట్ నిలిచింది.చెన్నై యూజర్ రికార్డ్: ప్రోటీన్ డైట్ కోసం ఒక చెన్నై వినియోగదారుడు ఏకంగా రూ.2,71,385 ఖర్చు చేశాడు. ఇందులో ఎక్కువ భాగం పీనట్ ఆధారిత ప్రోటీన్ స్టేపుల్స్ ఉండటం విశేషం.ట్రెండీ స్నాక్స్ వైపు మొగ్గు..సాధారణ చిప్స్, స్నాక్స్ స్థానంలో ఇప్పుడు హెల్తీ ప్రత్యామ్నాయాల కోసం చూస్తున్నారు. ప్రోటీన్ యోగర్ట్, ప్రోటీన్ స్నాక్స్ (ప్రోటీన్ చిప్స్) కేటగిరీ ఏటా ఏకంగా 300 శాతం వృద్ధితో దూసుకుపోతోంది. యువత ఆకలి వేసినప్పుడు జంక్ ఫుడ్ జోలికి వెళ్లకుండా ఇటువంటి హై-ప్రోటీన్ స్నాక్స్‌ను ఎంచుకుంటున్నారు.సాంప్రదాయ ప్రోటీన్‌కు డిమాండ్ఆధునిక మార్పులు వస్తున్నప్పటికీ మన దేశీయ పాతకాలపు ప్రోటీన్ వనరుల క్రేజ్ తగ్గలేదు. భారతీయ సాంప్రదాయ సూపర్ ఫుడ్స్ అయిన సోయా చంక్స్, సత్తు (వేయించిన శనగల పిండి)ల డిమాండ్‌లో కూడా 100 శాతానికి పైగా వృద్ధి కనిపించింది. మొత్తంగా చూస్తే.. భారతదేశంలో క్విక్ కామర్స్ విప్లవం వస్తువులను వేగంగా డెలివరీ చేయడంతోపాటు ప్రజలు మరింత ఆరోగ్యకరమైన, సమతుల్యమైన జీవనశైలిని అలవర్చుకోవడంలో కీలక పాత్ర పోషిస్తోంది. రాబోయే రోజుల్లో ఈ ప్రోటీన్ డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.ఇదీ చదవండి: ఒక్కరోజులో మారిపోయిన బంగారం ధరలు -
బియ్యం, మినప్పుతో పనిలేకుండా క్షణాల్లో దోసె చేసేయండిలా..!
మీరు ఇప్పటివరవకు ప్లెయిన్ దోసె నుంచి చీజ్, పనీర్ దోసల వరకు రుచి చూసి ఉంటారు. కానీ ఉన్నఫలంగా దోసె తినాలనిపించినప్పుడు.. తగిన పిండి, పులియబెట్టడంవంటి ప్రక్రియ ఇబ్బంది పెడుతుంది. ఇలాంటి పరిస్థితిలో దోసను మార్కెట్‌కు వెళ్లి లేదా ఆర్డర్ చేసి మాత్రమే తినగలం. కానీ పిండి అవసరం లేని ఈ దోస వంటకాన్ని ప్రముఖ చెఫ్ కునాల్ కపూర్ మనతో పంచుకున్నారు.ఇందులోని ప్రత్యేకత ఏమిటంటే? ఈ దోసె తయారీకి బియ్యం, పప్పులు, పిండి పదార్థాలు అవసరం లేదు. దీనికోసం కేవలం పాపడ్, నీళ్లు, నెయ్యి ఉంటే చాలు. పులియబెట్టే ప్రక్రియ లేకుండానే.. నిమిషాల్లో సూపర్ క్రిస్పీ 'పాపడ్ దోసె'ను తయారు చేసుకోవచ్చు. వైరల్ అవుతున్న ఈ రెసిపీతో కమ్మని రుచిని ఆశ్వాదించవచ్చు. క్షణాల్లో మీ ముందుండే ఈ పాపడ్ దోసెను ఎలా తయారు చేయాలో చూద్దాం!కావలసినవి:- పాపడ్- నీరు- నెయ్యితయారుచేసే విధానం:1. ముందుగా పాపడ్‌ను కత్తెరతో గానీ, చేతితో రెండు భాగాలుగా విరవండి.2. వాటిని నీటిలో వేసి కాసేపు నానబెట్టాలి. దీంతో పాపడ్ పూర్తిగా మెత్తగా అవడంతోపాటు కొద్దిగా జిగురుగా మారుతుంది.3. నానబెట్టిన పాపడ్‌ను మిక్సర్ గ్రైండర్లో వేసి మెత్తని పేస్ట్ లాగా అయ్యేంత వరకు బాగా గ్రైండ్ చేయాలి. ఇదే మీ తక్షణ దోసె పిండి.4. ఒక బాణలిని వేడి చేసి, దానిపై కొద్దిగా నీళ్ళు చల్లి, గరిటెతో పిండిని పోసి దోసెలాగా పలుచగా పరచాలి.5. అవసరమైతే కారం, ఉల్లిపాయలు కలిపి, పైన కొద్దిగా నెయ్యి వేసి దోసెను బాగా కాల్చండి. దీంతో.. కరకరలాడే పాపడ్ దోసె రెడీ. దీనిని చట్నీలో, సాంబార్‌తో కూడా వేడివేడిగా తినవచ్చు.ఇదీ చదవండి: షాకింగ్ ఘటన : మృత్యువు ఇలా కూడా..! -
హంటా రాలేదు.. ఆందోళన వద్దు!
ఇటీవల హంటా వైరస్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరగుతోంది. గతంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న సమయంలోనూ అది విదేశాల్లోనే ఉందనీ, మన దేశంలోకి ప్రవేశించలేదని అన్నప్పటికీ... క్రమంగా అది విదేశాల నుంచి వచ్చిన ఒకరిద్దరితో మొదలై క్రమంగా దేశాన్నంతా చుట్టుముట్టింది. అదేలాంటి ఆందోళనే ఇప్పుడు దేశంలోని కొంతమందిలో మొదలైంది. అయితే ఇప్పటివరకు హాంటా వైరస్మనదేశంలోకి ప్రవేశించలేదు. భారతీయులిద్దరికి వచ్చినట్టు వార్తలు వచ్చినప్పటికీ విదేశాల్లో ఒక డచ్ క్రుయిజ్ షిప్ మీద ఉన్న ఇద్దరు క్రూ మెంబర్లలో కనిపిందన్నది మాత్రమే న్యూస్. ఈ వైరస్‌కు సంబంధించినంత వరకు ప్రస్తుతానికి దేశమంతా సురక్షితమే. అయితే ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో హాంటా వైరస్ స్వైరవిహారం చేస్తున్న నేపథ్యంలో ఈ వైరస్ గురించి ప్రాథమిక సమాచారం కోసం ఈ కథనం.హంటావైరస్ కారణంగా వచ్చే వ్యాధులు చాలా తీవ్రమైన అనారోగ్యాలతో పాటు కొంతవరకు మరణాలకూ కారణమవుతుంది. ఈ వైరస్ కుటుంబంలోని వైరస్లు ప్రధానంగా రెండు రకాల వ్యాధులకు కారణమవుతాయన్నది వైద్యుల మాట. వ్యాప్తికి కారకాలు: ఈ వైరస్ ప్రధానంగా ఎలుకలు. ఈ (ఎలుక / రోడెంట్) జాతికి చెందిన కొన్ని రకాల మూషిక జాతుల ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెందుతూ దానివల్ల కలిగే వ్యాధులకు కారణమవుతుంది. ముఖ్యంగా ఎలుకల మూత్రం, విసర్జనలతో పాటు వాటి లాలాజలంతో మనుషులకు కాంటాక్ట్ సంభవించినప్పుడు మానవుల్లో ఈ వైరస్ సోకుతుంది. అరుదుగా ఎలుక కరవడం లేదా గీరడం వల్ల కూడా వ్యాపించవచ్చు. ఇక మనుషులకు సోకాక... ఇది వ్యక్తి నుంచి వ్యక్తి (పర్సన్ టు పర్సన్) వ్యాప్తి చెందే అవకాశముంది. బాధితులతో బాగా సన్నిహితంగా ఉన్నవారిలో ఇలా వ్యాప్తిచెందే అవకాశాలెక్కువ.హాంటా వైరస్‌తో వచ్చే వ్యాధులు... హాంటావైరస్లు రెండు ప్రధాన సిండ్రోమ్‌లకు కారణమవుతాయి. అవి... 1. హాంటావైరస్ పల్మనరీ సిండ్రోమ్ (హెచ్‌పీఎస్) 2. హీమరేజిక్ ఫీవర్ విత్ రీనల్ సిండ్రోమ్ (హెచ్ఎఫ్ఆర్ఎస్) హీమరేజిక్ ఫీవర్ విత్ రీనల్ సిండ్రోమ్ (హెచ్ఎఫ్ఆర్ఎస్) అనేది ప్రధానంగా యూరప్‌తో ΄ాటు ఆసియాలోని కొన్ని దేశాల్లో కనిపిస్తుంది.లక్షణాలు... హాంటావైరస్ పల్మనరీ సిండ్రోమ్ (హెచ్‌పీఎస్) : ఈ వైరస్ ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తుంది. ఒక్కోసారి ప్రాణాంతకంగా కూడా పరిణమించవచ్చు. ఎలుక నుంచి వైరస్ వ్యాప్తి చెందిన ఒకటి నుంచి ఎనిమిది వారాల తర్వాత లక్షణాలు కనిపించడం మొదలువుతాయి. హీమరేజిక్ ఫీవర్ విత్ రీనల్ సిండ్రోమ్ (హెచ్ఎఫ్ఆర్ఎస్) : ఇది మూత్రపిండా(కిడ్నీ)లను ప్రభావితం చేసే వ్యాధి. వైరస్ సోకిన ఒకటి నుంచి రెండు వారాల్లో లక్షణాలు కనిపించడం మొదలవుతుంది. అయితే అరుదుగా లక్షణాలు కనిపించడానికి కొందరిలో ఎనిమిది వారాలూ పట్టవచ్చు.ప్రారంభ లక్షణాలు: జ్వరం / వణుకు తీవ్రమైన తలనొప్పి వెన్నునొప్పి కడుపు నొప్పి వికారంచూపు మసకబారడం కొంతమందిలో ముఖం ఎర్రబారడం ∙కళ్లు వాచడం లేదా ఎర్రబారడంచర్మంపై దద్దుర్ల వంటివి కనిపించవచ్చు. మలి లక్షణాలు: ప్రారంభ లక్షణాలు కనిపించిన కొద్దిరోజుల్లో ఈ కింద పేర్కొన్న లక్షణాలూ కనిపిస్తాయి. బీపీ తగ్గడం / పడిపోవడం రక్తప్రసరణ తగ్గడం షాక్‌కు గురికావడం అంతర్గత రక్తస్రావం (ఇంటర్నల్ హేమరేజ్) మూత్రపిండాలు విఫలం కావడం (రీనల్ ఫెయిల్యూర్... ఈ కారణంగా దేహంలో నీరు చేరి మనిషి ఉబ్బినట్లుగా కనిపించవచ్చు). నిర్ధారణ : ఆ ప్రాంతంలో హాంటా వైరస్ వ్యాప్తి ఉన్నప్పుడు లక్షణాలను బట్టి అవి హాంటా వైరస్ కారణంగా కావచ్చని అనుమానిస్తారు. వైరస్ సోకిన 72 గంటల లోపల హాంటావైరస్ను గుర్తించడం కష్టం. తొలి పరీక్షలో వైరస్ ఆనవాళ్లు కనిపించకపోతే, లక్షణాలు మొదలైన 72 గంటల తర్వాత మళ్లీ పరీక్ష చేస్తారు. బాధితులు పూర్తిగా కోలుకోవడానికి కొన్ని వారాలు మొదలుకొని కొన్ని నెలలు పట్టవచ్చు. అయితే ప్రస్తుతానికి హాంటా వైరస్ అనేది దేశంలో లేనేలేదు కాబట్టి దీని గురించి ప్రత్యేకంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. - డాక్టర్ కె. శివరాజుసీనియర్ ఫిజీషియన్చదవండి: Watermelon: భోజనం తర్వాత తీసుకోకపోవడమే మంచిదా..? -
సముద్రమంత ప్రేమ : ఎవరీ సతీష్ భాస్కర్
World Turtle Day ‘సతీష్ భాస్కర్’ అనే పేరు వినబడగానే చాలామందికి తాబేళ్లు గుర్తుకు వస్తాయి.ఆయనకు ‘తాబేళ్ల సంరక్షకుడు’ అని పేరు. చిన్నప్పటి నుంచి సతీష్ భాస్కర్‌కు సముద్రపు తాబేళ్లు అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టమే తనను తాబేళ్ల ప్రపంచంలోకి తీసుకు వెళ్లింది. ఆ ప్రపంచంలో ఆయన వాటి గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నారు.తన ప్రయాణంలో ఎన్నో ఆటంకాలు ఎదుర్కొన్నారు.అయితే ఆయన ఉక్కు సంకల్పం ముందు ఆ ఆటంకాలు నిలవలేకపోయాయి... తాబేళ్ల పరిరక్షణ కోసం ఎవరి తోడూ లేకున్నా వేల కిలోమీటర్ల దూరం ఒంటరి ప్రయాణం చేశారు సతీష్ భాస్కర్. తీర్ర΄ాంత మార్గాలలో ప్రయాణిస్తున్నప్పుడు ఒక చిన్న ట్రాన్సిస్టర్ రేడియో, అలుపెరుగని స్ఫూర్తి ఆయనకు తోడుగా ఉండేవి. అండమాన్ దీవుల తీరాలలో సముద్ర తాబేళ్ల పరిరక్షణకు భాస్కర్ చేపట్టిన కార్యక్రమాలు విస్తృతమైన ఆయన పరిశోధనకు గీటురాయిగా మారాయి.ఆకలితో కొన్ని రోజులు...లక్షద్వీప్‌లోని జనావాసాలు లేని సుహేలి ద్వీ΄ానికి వెళ్లారు భాస్కర్. అక్కడ అయిదు నెలల పాటు తాబేళ్లపై సర్వేలు నిర్వహించారు. ఆ ద్వీపానికి వెళ్లడం చాలా కష్టం. అయినా అష్టకష్టాలు పడి అక్కడికి చేరుకున్నారు. అండమాన్ ద్వీపంలో ఉన్నప్పుడు ఒకానొక సమయంలో తినడానికి అతడి దగర్గ ఏమీ లేదు. ఆకలిని తట్టుకోలేని పరిస్థితులలో అక్కడి ఆదిమ గిరిజన తెగ వారి దగ్గర కాల్చిన మాంసం తెచ్చుకొని కడుపు నింపుకున్నారు.టర్టిల్ వాకర్సుహేలి ద్వీపంలో ఉన్నప్పుడు కేరళ, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అండమాన్ నికోబార్ దీవులు, ఇండోనేషియాలోని వెస్ట్ పపువా వంటి తీర్ర ప్రాంతాల వెంబడి అలుపెరుగకుండా ప్రయాణిస్తున్నప్పుడు, ప్రతిచోట తన ప్రయాణానికి పరమార్థాన్ని వెదుక్కున్నారు భాస్కర్. తాబేళ్ల ప్రపంచం గురించి సూక్ష్మస్థాయిలో అర్థం చేసుకోవడానికి తాను చేసిన ప్రయాణాలు ఉపకరించాయి. ‘టర్టిల్ వాకర్’ పేరుతో భాస్కర్‌పై 75 నిమిషాల డాక్యుమెంటరీ చిత్రాన్ని తీశారు తైరా మాలనీ. ఈ డాక్యుమెంటరీ జాక్సన్ వైల్డ్ మీడియా అవార్డ్స్‌లో కన్జర్వేషన్, గ్రాండ్ టెటాన్ అవార్డులను అందుకుంది. సతీష్ భాస్కర్ ప్రయాణం గురించి ఈ డాక్యుమెంటరీ చెప్పే మాట...‘అతడిది...మృత్యువును ధిక్కరించే అన్వేషణ’సముద్ర తాబేళ్ల ఆవాసాలను గుర్తించే ప్రయత్నంలో మన దేశంలో తీర్ర΄ాంతంలో నాలుగువేల కిలోమీటర్లు ప్రయాణించారు భాస్కర్. గూళ్లు కట్టే విధానం నుంచి గుడ్ల స్వభావం వరకు తాబేళ్లకు సంబంధించి అనేక కోణాలలో అధ్యయనం చేశారు. ఆయన సాహసాలు, ప్రయత్నాలు రాబోయే తరాలు తాబేళ్లను అర్థం చేసుకోవడానికి మార్గదర్శకంగా నిలిచాయి.తాబేళ్ల సంరక్షణ కోసం...గుడ్లు, మాంసం, పెంకులు, చర్మం కోసం తాబేళ్లను వధిస్తున్నారు వేటగాళ్లు. మరోవైపు... చేపల వలలతో ప్రమాదవశాత్తు తాబేళ్ల ఆవాసాలు నాశనం అవుతున్నాయి. ఈ విషయాలు సతీష్ భాస్కర్‌ను తీవ్రంగా కలచివేశాయి. బాధపడడానికి మాత్రమే పరిమితం కాకుండా తన జీవితాన్ని తాబేళ్ల సంరక్షణకు అంకితం చేశారు. తాబేళ్ల స్థితి గతులు, పరిరక్షణపై యాభైకి పైగా రిపోర్ట్లు వెలువరించారు. -
ప్లీజ్..వ్యాధులకు ఆహారం ఇవ్వడం ఆపండి!
మనం తీసుకునే ఆహారంపైనే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. శరీరానికి శక్తినిచ్చే ఆహారమే ఆరోగ్యకరమైనది. నాలుకకు రుచిగా, కంటికి ఇంపుగా కనిపించే జంక్‌ఫుడ్ ఎన్నటికీ అనారోగ్యమే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. తీసుకునే ఆహారం విషయంలో శ్రద్ద తీసుకుంటే ఆరోగ్యకరమైన జీవితం సొంతం అవుతుందని అంటున్నారు. మనం తీసుకునే ఆహారమే ఒత్తిడి, అలసట, నిరుత్సాహం వంటి మూడ్స్‌కి కారణమవుతుందని గమనించారా అని ప్రశ్నిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. ఆ ఆహారం కారణంగానే..మన ఒత్తిడి, ఆందోళన బారిన పడి క్రమంగా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే ప్రమాదం పొంచి ఉందని చెబుతున్నారు నిపుణులు. అదెలాగో వారి మాటల్లోనే తెలుసుకుందాం.మన తీసుకునే ఆహారం కేవలం కేలరీలు మాత్రమే కాదు, శక్తి, మానసిక స్థితి, నిద్ర, ఏకాగ్రత, స్వస్థత వంటి వాటిక మూలం. నిరంతరం అలసటగా, ఉబ్బరంగా, ఆందోళన, నిరుత్సాహం, ఒత్తిడి ఎదురవ్వుతుంటే శరీరం ఆహారాన్నికాదు పోషణను కోరుకుంటుందని అర్థమట. అందుకే శుభ్రమైన ఆహరం తినమని సూచిస్తున్నారు నిపుణులు. ముఖ్యంగా హైడ్రేటెడ్‌గా ఉండేందుకు ఎక్కువ నీరు తాగమని చెబుతున్నారు. ప్రాసెస్ చేసిన ఆహారానికి బదులుగా సహజమైన ఆహారాన్నే ఎంచుకోమని సూచిస్తున్నారు. ఎందుకంటే ఆరోగ్యకరమైన ఆహారంతోనే ఆరోగ్యకరమైన మనస్సు + ఆరోగ్యకరమైన శరీరం అని నొక్కి చెబుతున్నారు. దయచేసి వ్యాధులకు ఆహారం ఇవ్వడం ఆపండి.. స్వస్థతకు ఆహారం ఇవ్వడం ప్రారంభించండి అని కోరుతున్నారు ఆరోగ్య నిపుణులు.డా. ఆదర్శ గౌడచీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO)AIC-SRS-ICAR-NDRI ఫౌండేషన్, అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ (నీతి ఆయోగ్)గమనిక: ఇది కేవలం అవగాహన కోసం నిపుణుల ఆధారంగా ఇచ్చిన కథనం. అనుసరించే ముందు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: చేతులతో ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన తొలి వ్యక్తి..!) -
సెల్యుమా అడ్వాన్స్డ్ లైట్థెరపీని ఆవిష్కరించిన సినీ నటి
హైదరాబాద్ : చర్మ కణాల సహజ మరమ్మతు ప్రక్రియను ప్రోత్సహిస్తూ ఎలాంటి శస్త్ర చికిత్స అవసరం లేకుండా నిర్వహించే సెల్యూమా అడ్వాన్స్డ్ లైట్ థెరపీ సిస్టమ్‌ను సినీ నటి స్రవంతి చొక్కారపు ప్రారంభించారు.బంజారాహిల్స్ రోడ్ నెం. 7లోని నిషితాస్ క్లినిక్‌లో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రముఖ చర్మవ్యాది నిపుణురాలు డాక్టర్ నిషితా రంకాతో కలిసి ఈ ఎల్ఈడీ లైట్థెరపి విధానాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా డాక్టర్ నిషితా రంకా మాట్లాడుతూ సెల్యుమా ఎల్ఈడీ లైట్ థెరపీ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన అత్యాధునిక వైద్యం అని వెల్లడించారు. ప్రత్యేక తరంగాల ద్వారా కాంతితో కణాల్లో శక్తి ఉత్పత్తి చేస్తూ సమస్యలను పరిష్కరించే దిశగా ఈ చికిత్స పని చేస్తుందని ఆమె తెలిపారు. -
ఒత్తిడి లేకుండా వందేళ్లు బతకాలంటే..!
ఒత్తిడి లేకుండా హాయిగా వందేళ్లు బతికేయాలని అందరికీ ఉంటుంది. అలాంటి జీవితం పొందాలంటే కోటీశ్వరుడే కానక్కర్లేదు. ఉరుకులు పరుగులతో రోజును గడపనక్కర్లేదు. చేయాల్సిందల్లా ప్రకృతితో, కుటుంబంతో, సంఘంతో సన్నిహితంగా గడపడమే. ఇది ఇంత సులువా అని ఎవరికైనా అనిపించవచ్చు. కానీ అలా బతకడాన్ని క్రమంగా అలవాటు చేసుకుంటే ఎవరైనా సరే దాన్నో జీవన విధానంగా మార్చుకోవచ్చు. దాన్ని నిరూపించి చూపిస్తున్నారు ఇకారియా ద్వీప ప్రజలు. అదెలాగో చూద్దాం.గ్రీస్‌లోని ఇకారియా ద్వీపం ప్రపంచంలోని ఐదు ’బ్లూ జోన్లలో ఒకటి. అక్కడ ప్రతి ముగ్గురిలో ఒకరు 90 ఏళ్లకుపైగా జీవిస్తారు. వారి సుదీర్ఘ ఆయుష్షు వెనకున్న రహస్యం కేవలం వారు తినే ఆహారం మాత్రమే కాదు.. వారి విలక్షణమైన జీవనశైలి. వారి మంత్రం ‘నిదానమే ప్రధానం’.నిదానమైన జీవనశైలిఇకారియా ప్రజలకు ‘సమయం’ విషయంలో అస్సలు టెన్షన్ ఉండదు. వారు ఉదయం అలారం పెట్టుకొని పరుగు పరుగున లేవరు. నిద్ర లేవగానే నిదానంగా కాఫీ తాగుతూ కుటుంబంతో గడుపుతారు. అక్కడ వ్యాపారస్తులు కూడా తమ ఇష్టానుసారం షాపులు తెరుస్తారు. కస్టమర్లు కూడా గంటల తరబడి వేచి ఉండటానికి ఇబ్బంది పడరు. ఈ ధోరణి వల్ల వారిలో గుండె జబ్బులకు ప్రధాన కారణమైన ‘కార్టిసాల్’ (ఒత్తిడి హార్మోన్) చాలా తక్కువగాఉంటోందని తేలింది.మధ్యాహ్న నిద్ర ఇకారియాలోమధ్యాహ్నం కాసేపు కునుకు తీయడం ఒక అలవాటు. ప్రతిరోజూ మధ్యాహ్నంకనీసం 30 నిమిషాలనిద్ర వల్ల గుండె జబ్బుల ప్రమాదం 37% తగ్గుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఇది వారిని రోజంతా ఉల్లాసంగా ఉంచుతోంది.ఆహార రహస్యాలుఇకారియావాసులు తినే ఆహారం పూర్తిగా ప్రకృతికి దగ్గరగా ఉంటుంది. ఆకుకూరలు, కూరగాయలు, తృణధాన్యాలు, ఆలివ్ ఆయిల్ ఎక్కువగా తీసుకుంటారు. వారు ప్రతిరోజూ రోజ్మేరీ, సేజ్, పుదీనాతో చేసిన టీ తాగుతారు. ఇవి శరీరంలోని మలినాలను తొలగించి రక్తపోటును తగ్గిస్తాయి. రెడ్ మీట్ చాలా అరుదుగా తీసుకుంటారు. చక్కెర వాడకంచాలా తక్కువ.శారీరక శ్రమ ఇకారియా ప్రజలు జిమ్‌కు వెళ్లి బరువులు ఎత్తరు. కానీ రోజంతా కదులుతూనే ఉంటారు. ఇకారియా ద్వీపం కొండ ప్రాంతం కాబట్టి పక్కింటికి వెళ్లాలన్నా మెట్లు ఎక్కాలి. తోట పని చేయడం, నడవడం వారి దైనందిన జీవితంలో భాగం. ఈ సహజమైన శ్రమ వారిని 90 ఏళ్లలో కూడా దృఢంగా ఉంచుతోంది.సామాజిక అనుబంధాలు ఇకారియాలో ఎవరూ ఒంటరిగా ఉండరు. సాయంత్రం వేళల్లో స్నేహితులు, బంధువులతో కలిసి నవ్వుతూ చిన్నచిన్న పార్టీలు చేసుకుంటూ గడుపుతారు. వారిలో ఒంటరితనం అనే మాటే వినిపించదు. ఈ సామాజిక మద్దతు మానసిక ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతోంది.మరి మనం ఏం చేద్దాం?హడావుడి పడకుండా నిదానంగా పనులు చేయడం, ఆస్వాదిస్తూ పనుల్లో మునిగిపోవడం, ప్రకృతితో గడపడం, అవకాశం దొరికినప్పుడు తోటపని లేదాచిన్ననడక అలవాటు చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. అలాగే సహజ సిద్ధమైనఆహారం, పానీయాలు తీసుకోవడం, మధ్యాహ్నం చిన్న కునుకు తీయడం, కాసేపు డిజిటల్ ప్రపంచానికి దూరంగా ఉండి, కుటుంబ సభ్యులతో ముఖాముఖి మాట్లాడటం, స్నేహితులను పెంచుకొని వారితో కొన్ని గంటలు సరదాగా గడపడం చేస్తే చాలు..మనమూ దీర్ఘాయుష్షుతో జీవించగలం. సాక్షి స్పెషల్ డెస్క్(చదవండి: రెండు వారాల పాటు గ్రీన్ టీ తాగితే ఏం జరుగుతుందంటే..) -
శాకాహార బాడీబిల్డర్‌గా విదేశీయుడు..! ఏకంగా డబ్ల్యూహెచ్ఓ..
మన హిందూ సనాతన ధర్మాన్ని అనుసరిస్తూ ఈ విదేశీయుడిని చూస్తే నిజంగా నోటమాట రాదు. అతడి విధానం, ఆహార్యం అన్ని మనల్ని మంత్రముగ్ధల్ని చేస్తాయి. వామ్మో శారీర దృఢత్వాన్ని, ఆధ్యాత్మిక భక్తితో మిళితం చేసిన ఆ వ్యక్తిని చూస్తే.. సంభ్రమాశ్చర్యాలకు లోనవ్వడం ఖాయం. ఎందుకంటే..ఇజ్రాయెలీలో జన్మించిన తమల్ కృష్ణ కృపా దాస్ 2009లో భారతదేశానికి వలస వచ్చినట్లు తెలిపారు. ఆయన ప్రస్తుతం పశ్చిమబెంగాల్లోని మాయాపూర్‌లో నివశిస్తున్నట్లు తెలిపారు. తాను భారత్‌కి వచ్చి ఇక్కడి హిందూ మతాన్ని అనుసరిస్తూ సనాతన ధర్మాన్ని పాటిస్తున్నట్లు తెలిపారు. అంతేగాదు తన వేషధారణ, ఆహారం తదితరాల గురించి ఇన్స్టాగ్రామ్ వేదికగా వీడియోని కూడా షేర్ చేశారు. ఆ వీడియోలో తమల్ తనకు పోషకాహారం అంటే కేవలం స్థూల పోషకాలే కాదని స్వచ్ఛత, 'భగవంతునికి సమర్పణ' అని చెప్పారు. తాను స్వచ్ఛమైన శాకాహార బాడీబిల్డర్నని చెప్పారు. తాను సనాతన ధర్మ అనుచరుడిగా అల్పాహారంగా ఏం తీసుకుంటాడో వివరించాడు. తమల్ తన రోజులో మొదటి భోజనాన్ని శుభ్రంగా ఉంచడంతో ప్రారంభిస్తాడు. ప్రతీదీ చాలా శుభ్రంగా కడుగుతూ తయారు చేసే విధానం అత్యంత ఆకట్టుకుంటుంది. ఎందుకంటే దుకాణంలో లేదా బయటి నుంచి వచ్చే ప్రతీదానిపై ఎలా దుమ్ము, బ్యాక్టీరియాలతో నిండి ఉంటుందో సవివరంగా చెప్పాడు. పరిశుభ్రతకు మించి.. భోజనం కంటికి అందంగా, ఆధ్యాత్మికంగా ఆరోగ్యకరంగా కనిపించడమే ముఖ్యమని చెబుతుండటం విశేషం. మామిడి, నారింజ, బొప్పాయి, డ్రాగన్ ఫ్రూట్, ద్రాక్షలను చాలా అందంగా అమర్చిన విధానం గురించి వివరిస్తూ..దీనిని దేవునికి సమర్పిస్తున్నాం కాబట్టి చాలా అందంగా పరిశుభ్రంగా తయారు చేయాలని అంటున్నాడు. పెరుగుని చక్కగా తయారు చేయాలి. కప్పులలో గడ్డకట్టిన పెరుగు, పిస్తా అంటే చాలా ఇష్టమని అంటున్నాడు. అతడు ఒక్క ముద్ద కూడా తినకముందే పూజ చేసి ఆహారానని భగవంతుడికి నివేదిస్తాడు. తాను ఏం తయారు చేసినా.. భగవంతుడు దానిని స్వీకరించాలని ప్రార్థిస్తాను. అన్నింటికన్నా..ముఖ్యమైన విషయం ఆహారాన్ని తినేముందు భగవంతునికి సమర్పిస్తే ప్రసాదమవుతుంది. అది మనల్ని మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండేలా చేయండంలో సహాయపడుతుందని చెబుతున్నాడు. వేషధారణ..తమల్ తన మెడలో పవిత్రమైన తులసి పూసలను, ధోవతిని (నడుముకు కట్టుకునే వస్త్రం), భుజంపై చాదర్ తదితరాలను ధరిస్తాడు. ఆ వస్త్రాలపై తరచుగా సంస్కృత మంత్రాలు లేదా 'హరే కృష్ణ' ముద్రలు ఉంటాయి. అతను ఎక్కువగా గుండు చేయించుకుని చిన్న శిఖతో కనిపిస్తాడు. ఆరోగ్యకరమైన ఆహారం వెనుకున్న శాస్త్రం..డబ్ల్యూహెచ్ఓ కూడా..తమల్ తీసుకునే పండ్లతో నిండిన అల్పాహారం ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సులకు అనుగుణంగా ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, సమతుల్య అల్పాహారం ఒక వ్యక్తి రోజువారీ పోషకాహార అవసరాలలో దాదాపు 30 శాతాన్ని తీర్చుతుందట.WHO మార్గదర్శకాల ప్రకారం: "అల్పాహారం రోజులో మొదటి భోజనం; అందువల్ల, సమతుల్యంగా ఉండేలా కేర్ తీసుకోవలి. కనీసం రెండు రకాల పదార్థాలు అందించాలి: ఒకటి ప్రధాన ఆహార పదార్థాలు, మరొకటి ప్రోటీన్. అందువల్ల అల్పాహారంలో కూరగాయలు, పండ్లు తప్పనిసరిగా చేర్చాలి." ఇక్కడ తమల్కు, అతని ఆధ్యాత్మిక సాధనతో బలపడిన ఈ పోషకాహార పునాది, అతని ప్రొఫెషనల్ బాడీబిల్డింగ్ కెరీర్‌కు చోదక శక్తిగా పనిచేస్తోంది. View this post on Instagram A post shared by Sankalpa Mantra Sadhana (@mantra_saadhana) (చదవండి: కుమారుడి ఊహించని సర్ప్రైజ్..! కన్నీళ్లు పెట్టుకున్న తల్లిదండ్రులు) -
నేను క్లాస్ తను మాస్!
రహస్య గోరఖ్ నటనతోనే కాదు, తన నిజాయితీ మాటలతో కూడా అందరినీ ఆకట్టుకునే తెలుగింటి అమ్మాయి. జీవిత భాగస్వామిగా కిరణ్ అబ్బవరంను ఎంచుకున్న ఈ సుందరి, తన మనసులోని భావాలను మనతో పంచుకుంది. ఆ విషయాలే మీకోసం..నాది సినిమా ప్రేమకథనా అసలు పేరు ఐశ్వర్య గోరఖ్. సినిమా ప్రపంచమే నాకు రహస్య అనే పేరు పెట్టింది. అదే ప్రపంచం నా మొదటి సినిమా ‘రాజా వారు రాణి గారు’తో జీవిత భాగస్వామిని కూడా ఇచ్చింది. మా ప్రేమకథ ఒక చిన్న రహస్యంలా మొదలై, ఇప్పుడు అందరి ఆశీస్సులతో పెళ్లి వరకు రావడం నాకు ఎంతో ఆనందంగా ఉంది.చదువుకే ప్రాధాన్యంచదువు విషయంలో నేను చాలా శ్రద్ధ చూపించాను. బీబీఏ పూర్తి చేసిన తర్వాత, అమెరికాలోని లాస్ ఏంజెలెస్‌లో అడ్వరై్టజింగ్ అండ్ మార్కెటింగ్ కోర్సు చేశాను. ఆ సమయంలోనే నటనపై ఆసక్తి పెరిగింది. అయినా చదువును మధ్యలో వదిలిపెట్టకుండా, గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాకే పూర్తిస్థాయిలో కెమెరా ముందుకు వచ్చాను.ఫొటోగ్రఫీ నా ప్రశాంత ప్రపంచంషూటింగ్ గ్యాప్ దొరికినప్పుడల్లా అందమైన ప్రదేశాలను కెమెరాలో బంధించడం నాకు ఎంతో ఇష్టం. ఆ పని నాకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది.ఊరోడిని పెళ్లి చేసుకున్నా!నేను పుట్టి పెరిగింది అంతా హైదరాబాద్‌లోనే, కాని, కిరణ్ మాత్రం పక్కా పల్లెటూరోడు. షూటింగ్ సెట్లో మొదలైన మా పరిచయం ఎప్పుడు ప్రేమగా మారిందో మాకే తెలియదు. ఐదేళ్ల పాటు సాగిన మా ప్రయాణాన్ని మా కుటుంబ సభ్యులు కూడా ఎంతో గౌరవంగా అంగీకరించారు.వంట చేయడం నా ప్రత్యేక హాబీకొత్త కొత్త వంటకాలు చేయడం నాకు హాబీ. ముఖ్యంగా స్వీట్లు తయారు చేయడంలో నాకు మంచి నైపుణ్యం ఉంది. పెళ్లి తర్వాత కిరణ్ కోసం మరిన్ని ఆంధ్ర శైలి వంటకాలు కూడా నేర్చుకున్నాను.బిర్యానీ అంటే ఒక ఎమోషన్హైదరాబాదీస్కు బిర్యానీ అంటే ఒక ఎమోషన్. నా ఫేవరెట్ ఫుడ్ కూడా బిర్యానీనే. అయితే ప్రస్తుతం ఆరోగ్యకరమైన ఆహారంపై కొంత శ్రద్ధ పెడుతున్నాను. అయినా అప్పుడప్పుడు బిర్యానీ రుచిని ఆస్వాదిస్తున్నాను.భవిష్యత్తు కుటుంబం, కెరీర్ రెండూ కలిసిభవిష్యత్తులో నటిగా కొనసాగుతూనే, కిరణ్‌తో కలిసి ఒక అందమైన కుటుంబ జీవితం గడపడం నా లక్ష్యం. అభిమానులు చూపిస్తున్న ప్రేమే నాకు అతిపెద్ద విజయం. ప్రస్తుతం ‘కిరణ్ అబ్బవరం’ నిర్మాణ సంస్థ పనులతో బిజీగా ఉన్నాను. -
దాపుడు అరలో దాగిన గౌరవం..!
స్త్రీ జీవితంలో అనేక ఖాళీ అరలు ఉంటాయి. కాని స్త్రీ జీవితంలో తప్పక ఉండాల్సిన ఒక ‘దాపుడు అర’ గురించి ఎందరు ఆలోచిస్తారు? ‘తాయి కెళవి’ సినిమాలో ముసలవ్వ ఈ దాపుడు అర మాట్లాడుతుంది. ఆ ఒక్క అర ఎంత ఆత్మవిశ్వాసం ఇస్తుందో కూడా ఈ సినిమా చెప్పింది. ఇది అచ్చంగా ఒక బతుకు గోరే తల్లి కథ.‘తాయి కెళవి’ చూస్తే తెలుగు వారి గొప్పతనం తెలిసొస్తుంది. ఇది గతంలో అంటే 1990లోనే వచ్చిన నామిని సుబ్రహ్మణ్యం నాయుడు ‘బతుకుగోరే తల్లి’, ఆర్.ఎం.ఉమామహేశ్వర రావు ‘బిడ్డలు గల్ల తల్లి’ కథలను గుర్తు చేస్తుంది. పైకి గయ్యాళులుగా కనిపించే ఆ తల్లులు బిడ్డల క్షేమం కోసం లోపల ఎంత దయాళువుగా ఉంటారో పై రెండు కథలు గొప్పగా చూపాయి. అవి సినిమాలుగా తీసి ఉంటే మన గొప్ప తెలిసేది. తమిళంలో ‘తాయి కెళవి’ (జేజమ్మ) గా తీయడం వల్ల ఆ పేరు వారికి దక్కింది.పాటిబండ్ల రజని రాసిన ‘జేబు’ కథలో ఇలాగే ఒక తల్లి ఉంటుంది. ఆమెను అందరూ ‘జేబు రమణమ్మ’ అని పిలుస్తూ ఉంటారు. దానికి కారణం ఆమె తన చిన్నప్పుడు ‘మగవాళ్లకు జేబు ఉన్నట్టుగా ఆడవాళ్లకు ఎందుకు ఉండదు’ అని ప్రశ్నిస్తుంది. మగవాళ్ల బలానికి, అహానికి జేబు కారణం అని, దాని నుంచి పుట్టే డబ్బు కారణమని జేబు రమణమ్మ అర్థం చేసుకుంటుంది. తను మరణించే వరకు తన ఆర్థిక స్వాతంత్య్రం గురించి నిర్లక్ష్యం వహించదు. అంతేకాదు, సొంత కోడలి పేర్న ఉన్న ఆస్తిని కొడుకు అమ్మడానికి చూస్తూ... అమ్మమని కోడల్ని బలవంతం చేస్తుంటే కోడల్ని వారించి ‘నీ ఆస్తి వాడికిచ్చావంటే నువ్వు బానిస బతుకు బతకాల్సి వస్తుంది’ అని చెప్పి, కొడుకు ఆగ్రహానికి గురయ్యి చావు కొని తెచ్చుకుంటుంది. మగవాళ్లు ఆడవాళ్లకు డబ్బు అందనివ్వరు. వారి దగ్గర ఉన్నది లాక్కునే దాకా ఊరుకోరు.‘తాయి కెళవి’ పాత్ర పోషించిన రాధిక ఈ లోకరీతిని పూర్తిగా అర్థం చేసుకుంటుంది. మన దగ్గర పైసలు ఉంటే లోకం మన ముఖం చూస్తుంది, ఖాళీచేతులు ఉన్నవారిని ఈసడిస్తుంది అని గ్రహిస్తుంది. డబ్బు లేనప్పుడు దయచూపని లోకంతో దయగా వ్యవహరించాల్సిన పని లేదనుకుంటుంది. అందుకే కఠినంగా వడ్డీ వసూలు చేస్తుంటుంది. ‘సుఖంగా బతకడానికి డబ్బు కావాలో వద్దో తెలియదు గానీ గౌరవంగా బతకడానికి డబ్బు కావాలి’ అంటుంది. అందుకై మంచంలో ఒక రహస్య అరను ఏర్పాటు చేసుకుంటుంది. పైసా పైసా దాచి ఆ డబ్బుతో బంగారం కొని అదంతా ఆ అరలో భద్రం చేసుకుని ఉంటుంది. ప్రతి స్త్రీకి, గృహిణికి ఈ రహస్య అర అవసరం ఏమిటో సినిమా చూస్తే అర్థమవుతుంది.తాయి కెళవి కుమార్తె సురళిని మొగుడు మూడు తులాల బంగారం ఇవ్వలేదని వదిలేసి ఉంటాడు. అతను కూతురిని పీడించుకుని తింటున్నాడని రాధిక గ్రహిస్తుంది. సహించడం త్యాగం కాదు, బానిసత్వం ఆమె దృష్టిలో. అందుకే కూతురిని తన దగ్గర ఉంచుకుని స్వేచ్ఛాజీవిగా మారుస్తుంది. తల్లిగా తన దగ్గర డబ్బు లేక΄ోతే దీనమైన మాటలు చెప్పి భర్త దగ్గరకు పంపేదేమో. కాని ఈ తల్లి దగ్గర డబ్బు ఉంది. ఆ డబ్బుతో కూతురికి కొత్త జీవితం ఇవ్వగలదు. అందుకే నీచుడైన అల్లుడితో విడాకులు ఇప్పించి రెండో మనువు చేస్తుంది. సొంత డబ్బు కలిగి ఉన్న తల్లికి వచ్చే ధైర్యం ఎలాంటిదో ఈ సినిమా చూపి దోవను సంకేతం చేస్తుంది.‘చదువుకోండి. దానితోపాటు సంపాదించడం నేర్చుకోండి. మీ పర్సులో ఉన్న నాలుగు నోట్లే మీకు రక్షణ. మీ జీతమే మీకు స్వేచ్ఛ. మీరు డబ్బు దాచిన అర మీ పిల్లల జీవితాలు సరిదిద్దే మంత్రదండం’ అని నాలుగు తిట్లు కలిపి మరీ చె΄్తోంది ‘తాయి కెళవి’.– కె.(చదవండి: పెరిమెనోపాజ్ ఎఫెక్ట్: ఈ మధ్య బరువు పెరుగుతున్నారా!) -
బాడీలోని ప్రతి అవయవం కోసం ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే..!
శరీరం సంక్రమంగా పనిచేయాలంటే ఆరోగ్యకరమైన ఆహారం ఎంతో ముఖ్యం. నిజానికి శరీరం వివిధ భాగాలతో కూడిన ఒక జట్టులా పనిచేస్తుంది. ప్రతి అవయవానికి దానికంటూ ఒక పాత్ర, సొంత అవసరాలు, ఇష్టమైన పోషకాలు ఉండాయి. జీర్ణవ్యవస్థకు సహాయపడేది ఊపిరితిత్తులకు లేదా కళ్లకు సరిపడకపోవచ్చు. అందుకే తెలివిగా తినడం అంటే కేవలం స్వచ్ఛమైన ఆహారం తీసుకోవడం మాత్రమే కాదు అది బలవర్ధకమైనదై ఉండాలి కూడా అని చెబుతున్నారు పోషకాహార నిపుణురాలు లాన్విత్ బాత్ర. అవయవాలు సక్రమంగా పనిచేసేలా, ఏకాగ్రత, శ్వాస బాగుండేలా ఎలాంటి పోషకాహారం తినాలో, జీవనశైలిలో అందుకు తగ్గట్టుగా చిన్న చిన్న మార్పుల చోటు చేసుకోవాలో ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసుకున్నారు.శరీరంలోని ప్రతి భాగానికి సరైన ఆహారాలు1. ఊపిరితిత్తులు: వాపు నివారణపై (Anti-Inflammation) దృష్టి సారించండిమెరుగైన శ్వాస, ఊపిరితిత్తుల ఆరోగ్యం కోసంఅల్లం, పసుపు, సిట్రస్ పండ్లను (పుల్లని పండ్లు) ప్రత్యేకంగా సూచించారు. వీటిలో జింజెరోల్, కర్కుమిన్, విటమిన్ సీ వంటి సమ్మేళనాలు ఉంటాయి. ఇవి వాపును తగ్గించడానికి, ఊపిరితిత్తుల కణజాలాన్ని రక్షించడానికి సహాయపడతాయి. అందుకోసం ఉదయపు టీ లేదా జ్యూస్‌లో తాజా అల్లం, పసుపును చేర్చుకోండి.2 కాలేయం (Liver): విషతుల్యాల నిర్మూలనకు (Detox), కొలెస్ట్రాల్ జీవక్రియకు మద్దతునివ్వండి. శరీరం నుంచి విషతుల్యాలను తొలగించడానికి (detox) కాలేయం ఎంతో కష్టపడి పనిచేస్తుంది. బ్రకోలి (సల్ఫోరాఫేన్ పుష్కలంగా ఉండేది), గ్రీన్ టీ, ఆలివ్ నూనె వంటి ఆహారాలు ఈ ప్రక్రియకు మద్దతునివ్వడానికి, కొవ్వు పేరుకుపోకుండా రక్షించడానికి సహాయపడతాయి. అంతేగాదు కొన్ని సులభమైన మార్పులతో, రోజువారీ ఆహారం ద్వారా వాటికి మద్దతు ఇవ్వవచ్చు.3. పేగు ఆరోగ్యం: మంచి బ్యాక్టీరియా కోసం.. ఆరోగ్యకరమైన పేగుకు ప్రోబయోటిక్స్, ప్రీబయోటిక్స్ రెండూ అవసరం. పెరుగు మీకు సజీవ మంచి బ్యాక్టీరియాను అందిస్తుంది. అయితే అరటిపండ్లు, చియా గింజలు వాటికి ఆహారం అందించే ఫైబర్‌ను అందిస్తాయి.సులభమైన, జీర్ణవ్యవస్థకు మేలు చేసే చిరుతిండి కోసం పెరుగు, చియా గింజలను కలిపి ప్రయత్నించండి.4. కళ్ళు: ఒత్తిడి నుంచి రక్షణస్క్రీన్ సమయం పెరగడంతో, కంటి ఆరోగ్యం మునుపెన్నడూ లేనంతగా ముఖ్యమైంది. క్యారెట్లు, చిలగడదుంపలలో బీటా-కెరోటిన్ (విటమిన్ ఎ) పుష్కలంగా ఉంటుంది, అదే సమయంలో ఉసిరి రెటీనాను రక్షించడానికి విటమిన్ సీ ని అందిస్తుంది. రోజువారీ భోజనంలో కనీసం ఒక నారింజ రంగు కూరగాయను చేర్చుకోండి.చిన్న చిన్న ఆహార ఎంపికలు శరీరంలోని వివిధ భాగాలకు వివిధ రకాలుగా సహాయపడతాయి. అందువల్ల ఏమి తింటున్నారు, ఎందుకు తింటున్నారు అనే దానిపై కాస్త శ్రద్ధ పెట్టి తీసుకోవడం అనేది చాలా ముఖ్యమని చెబుతున్నారు పోషకాహారు నిపుణులు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే కాదు. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించాలి. (చదవండి: పాద' సేవలను గుర్తించండి!) -
పెరుగు అన్నం vs లెమన్ రైస్: ఈ సమ్మర్లో ఏది మంచిదంటే..
డయబెటిస్ రోగులు రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉండేలా మితంగా అన్నం తినడమే మేలు అని వైద్యులు సూచిస్తుంటారు. అందులోనూ మన భారతీయ ఆహారంలో ప్రధానంగా ఉండే రైస్‌ని తక్కువగా, కూర ఎక్కువగా కలుపుకుని తినమని చెబుతుంటారు. పైగా ఇలాంటి హాట్ సమ్మర్లో ప్రజలంతా తేలికపాటి వంటకాల వైపే మొగ్గు చూపుతారు. ముఖ్యంగా పెరుగన్నం, నిమ్మకాయ పులిహార వంటి తేలికపాటి వంటకాలనే తరుచుగా చేసుకుంటారు. మరి రైస్ కంటెంట్ తక్కువగా తీసుకోవాల్సిన మధుమేహ రోగులకు మరి ఇవి మంచివేనా అంటే..మరి ఈ రెండు వంటకాలలోని పోషక విలువలు వేరువేరుగా పరిశీలించి ఏది తీసుకోవడం మంచిదో పోషకాహార నిపుణులు మాటల్లో తెలుసుకుందామా..!.అన్నం తింటే చక్కెర స్థాయిలు పెరగడానికి రీజన్..రైస్ రక్తంలో చక్కెరను ఎందుకు పెంచుతుందంటే..శుద్ధి చేసిన తెల్ల బియ్యం రకాన్ని బట్టి దాని గ్లైసెమిక్ ఇండెక్స్ 58గా ఉంటుందని తెలుస్తోంది. ఒకేసారి ఎక్కువగా అన్నం తింటే రక్తంలో చక్కెర వేగంగా పెరుగుతుంది, కాబట్టి వైద్యులు డయాబెటిస్ పేషెంట్లను అన్నం తీసుకునే పరిమాణాన్ని నియంత్రించుకోవాలని సూచిస్తుంటారు.పెరుగు అన్నం..పెరుగు, అన్నంతో పాటు రకరకాల మసాలాలు, కరివేపాకు కలిపి తయారు చేస్తారు. ఇది రుచిని జోడించడమే కాకుండా, రక్తంలో చక్కెరను పెంచే ప్రభావాన్ని కూడా తగ్గిస్తుంది. వేడి తీవ్రంగా ఉన్నందున మధ్యాహ్న భోజనానికి ఇది చాలా అనువైనది. శరీరానికి చల్లదనాన్ని అందిస్తూ..రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉండేలా చూసుకునే పోషకమైన ఆహారం.దీని తయారీలో సాదా అన్నాన్ని పెరుగుతో కలుపుతారు. దీనిలో ప్రయోజనకరమైన ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఇది కార్బోహైడ్రేట్ల శోషణ రేటును నెమ్మదింపజేస్తుంది. అన్నంలో పెరుగు కలపడం వల్ల ఇన్సులిన్ సున్నితత్వంపై దాని ప్రభావం నెమ్మదిగా ఉంటుంది. ఇది మెదడుని ప్రశాంతంగా ఉంచడమే కాకుండా జీర్ణక్రియను మెరుగ్గా ఉంచుతుంది. దీనిలో ప్రోటీన్, మెరుగైన కొవ్వులు ఉంటాయి. ఇవి రక్తంలోని చక్కెర స్థాయిలను ప్రభావితం చేస్తాయి. వేసవి వేడికి చక్కటి ఉపశమనం కూడా. అలాగే గ్లూకోజ్ ప్రతిస్పందనను స్థిరీకరిస్తుంది కూడా. రక్తంలో చక్కెర నియంత్రణ కోసం ఇది బెస్ట్ ఆహారం.నిమ్మకాయ పులిహోర(లెమన్ రైస్)ఇది కార్బోహైడ్రేట్ల జీర్ణక్రియను కూడా నెమ్మదింపజేస్తుంది, అందువల్ల ఇది ఇతర వేసవి ఆహారాల కంటే మెరుగైన ప్రత్యామ్నాయంగా ఉంటుంది. దీని తయారీకి ఉపయోగించే నూనె, వేరుశెనగలు మరియు ఆవాలు కలపడం వల్ల రక్తంలో చక్కెర నియంత్రణ మరింత మెరుగుపడుతుంది.ఏది మంచిదంటే..పెరుగు అన్నం సాధారణంగా భోజనం తర్వాత గ్లూకోజ్ పెరుగుదలను నెమ్మదింపజేస్తుంది, కాబట్టి దానిని ఎలా తీసుకుంటే మంచిదనే దానిపై అవగాహన అవసరం. నియంత్రించుకోవడం అవసరం.నిమ్మకాయ అన్నం ఇందులో ఉపయోగించే నూనె పరిమాణంపై ఆధారపడి ఉంటుంది , అలాగే తినే పరిమాణం కూడా అత్యంత ముఖ్యం.రోజులోని సమయం, శారీరక శ్రమ స్థాయి, వ్యక్తిగతంగా గ్లూకోజ్ తట్టుకునే సామర్థ్యం వంటి అంశాలు రక్తంలో చక్కెరను ప్రభావితం చేస్తాయి. అందువల్ల ఆ రెండింటిని తీసుకునే పరిమాణం అనేది అత్యంత ప్రధానం అని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. తీపిలేని పెరుగు, మిగతా కూరగాయలు జోడించి తీసుకుంటే శరీరంలో చక్కెర స్థాయిలు సమంగా ఉంటాయి. ఇక నిమ్మకాయ పులిహోరలో వేరుశెనగలు తక్కువగా వేసుకుంటూ..మిగతా కూరగాయలు జోడిస్తే ఇది కూడా మధుమేహ రోగులకు మంచి బలవర్ధకమైన ఆహరమే అవుతుంది. ఇవి రెండూ కూడా డయాబెటిస్ రోగులకు మంచివే గానీ చేసే విధానం, పరిమాణం వంటి ఆధారంగానే మంచి ప్రయోజనాలను పొందగలరని వైద్యులు చెబుతున్నారు. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: అతిగా వ్యాయామాలు చేయడం ఇంత ప్రమాదమా..! ? పాపం ఆ తల్లి..) -
జంతువుల నుంచి మనుషులకు ఏటా 5 కొత్త వ్యాధులు..!
సృష్టిలో ప్రతి జీవరాశి తన మనుగడను కొనసాగించడానికి శక్తి అత్యవసరం. ఈ శక్తి ప్రధానంగా ఆహారం ద్వారానే లభిస్తుంది. ముఖ్యంగా మానవాళికి అవసరమైన పోషకాలు పంటలు, పశుసంపద ద్వారా లభించే ఆహార పదార్థాలపై ఆధారపడి ఉంటాయి. పశువైద్యులు కేవలం జంతువులకు చికిత్స చేసే వైద్యులు మాత్రమే కాదు. ఆహార భద్రతకు రక్షకులు కూడా. ఆరోగ్యదాయక పశుపోషణ ద్వారా ప్రజారోగ్యాన్ని, పర్యావరణ సమతుల్యతను కాపాడుతున్నారు. ‘పశు వైద్యులు– ఆహార ఆరోగ్య సంరక్షకులు’ అనే థీమ్‌తో ఈ సంవత్సరం ప్రపంచ పశు వైద్య దినోత్సవాన్ని జరుపుకోవటం అత్యంత సముచితం.పశు సంపద ఆర్థిక, సామాజిక అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తుంది. పెరుగుతున్న జనాభా, మారుతున్న జీవనశైలి, పెరుగుతున్న పోషక అవసరాల నేపథ్యంలో పశు వైద్య రంగం ప్రాముఖ్యత మరింత పెరుగుతోంది. మన పూర్వీకులు పశువులను, ప్రకృతిని సమానంగా గౌరవించి, పర్యావరణహితమైన విధానాలతో వ్యవసాయం, జీవన విధానాన్ని అభివృద్ధి చేశారు. ఈ సమతుల్య జీవన విధానాన్ని మళ్లీ ఆచరిస్తే, భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన, సుస్థిరమైన జీవితం అందించవచ్చు.ఆరోగ్యంపై సమగ్ర దృక్పథంపశువైద్యం కేవలం జంతువుల వైద్యంతో పరిమితం కాకుండా.. మనుషుల ఆరోగ్యం, పశువుల ఆరోగ్యం, పర్యావరణ ఆరోగ్యం వేర్వేరు కాదు అంతా ఒక్కటే (వన్ హెల్త్) అనే సమగ్ర విధానాన్ని అనుసరిస్తుంది. ఈ మూడూ పరస్పరం అనుసంధానమైనవి. పశువైద్యులు పశువుల ఆరోగ్యాన్ని మాత్రమే కాపాడటమే కాకుండా పరోక్షంగా ప్రజారోగ్యాన్ని పరిరక్షిస్తున్నారు. ముఖ్యంగా ఆహారంగా ఉపయోగించే పశువులకు చికిత్స ఇచ్చేటప్పుడు మందుల అవశేషాలు పాలు, మాంసం, గుడ్లు వంటి ఆహార పదార్థాలలో ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవడం అత్యంత కీలకం.సంక్రమిత వ్యాధుల నియంత్రణపశువుల నుండి మనుషులకు, అలాగే మనుషుల నుండి పశువులకు సంక్రమించే వ్యాధులను జూనోటిక్ వ్యాధులు అంటారు. ఉదాహరణకు: రేబీస్, బ్రూసెల్లోసిస్, టీవీ వంటివి. ప్రస్తుతం గుర్తించిన సంక్రమిత వ్యాధులలో సుమారు 60% జంతువుల ద్వారా వ్యాపిస్తున్నాయి. ప్రతి సంవత్సరం కనీసం 5 కొత్త వ్యాధులు జంతువుల నుండి మనుషులకు వస్తున్నాయని అంచనా. అరణ్య ప్రాంతాలలో మానవ జోక్యం పెరగటం ఈ వ్యాధుల వ్యాప్తికి ముఖ్య కారణం. ఈ నేపథ్యంలో పశువైద్యులు ఆధునిక సాంకేతిక పద్ధతులతో వ్యాధులను ముందుగానే గుర్తించి నియంత్రించడంలో కీలకపాత్ర పోషిస్తున్నారు.యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ (ఏఎంఆర్) ప్రపంచ ఆరోగ్యానికి అత్యంత పెద్ద సవాళ్లలో ఒకటి. అనవసరంగా, అధికంగా యాంటీ బయోటిక్స్ వాడటం వల్ల మందుల ప్రభావం తగ్గుతుంది. ఆహారంలో అవశేషాలు చేరి ప్రజారోగ్యానికి హాని కలుగుతుంది. ఈ సమస్యను నివారించడానికి పశువైద్యులు బాధ్యతాయుతమైన ఔషధ వినియోగాన్ని ప్రోత్సహించాలి. పశుసంపద సుస్థిర ఆహార భద్రతలో కీలకపాత్ర పోషిస్తోంది. ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏవో) అంచనాలప్రకారం, ప్రపంచానికి అవసరమైన ప్రోటీన్‌లో సుమారు 30–40% జంతువుల నుంచి లభిస్తుంది. అయితే, ప్రతి సంవత్సరం సుమారు 20% ఆహారం పశువ్యాధుల వల్ల కోల్పోతున్నాం. పశువుల విసర్జితాల పునర్వినియోగం ద్వారా సేంద్రియ వ్యవసాయం, గోఆధారిత వ్యవసాయం వర్థిల్లుతుంది. తద్వారా పర్యావరణం, పశువులు, మనుషుల మధ్య సమన్వయంతో ఆహార గొలుసును కాపాడుకోవచ్చు.14.5% వరకు పశువుల ఉద్గారాలుప్రస్తుతం పశువైద్య రంగం ఎదుర్కొంటున్న ప్రధాన సవాలు వాతావరణ మార్పు. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 14.5% హరిత గృహ ఉద్గార వాయువులు పశుసంపద నుంచి వెలువడుతున్నాయని అంచనా. దీర్ఘకాలిక సగటు ప్రపంచ ఉష్ణోగ్రత 1 డిగ్రీల సెల్షియస్ పెరిగితే 10–15% వరకు పశువుల పెరుగుదల, వ్యవసాయోత్పత్తి తగ్గుతుంది. అయితే, పశుసంపద మనకు ముఖ్యమైన ప్రోటీన్ వనరుగా కూడా ఉంది. ఈ పరిస్థితుల్లో పశువైద్యులు మీథేన్ ఉద్గారాలను తగ్గించే పద్ధతులు, సుస్థిర పశుసంవర్ధన విధానాలు, కార్బన్ క్రెడిట్ అవకాశాలపై దృష్టి సారిస్తున్నారు. రైతులకు అదనపు ఆదాయం కల్పించే విధంగా కార్బన్ మార్కెట్లో భాగస్వామ్యం కల్పించడం కూడా ఒక ముఖ్య లక్ష్యం.మీథేన్ ఉద్గారాలుప్రపంచంలో అత్యధిక పశుసంపద కలిగిన దేశం మనదే. ఎఫ్ఏఓ, ఐసీఏఆర్ అంచనాల ప్రకారం భారతదేశంలో మొత్తం హరిత గృహ వాయువు ఉద్గారాల్లో సుమారు 14–16% వ్యవసాయం నుంచి వెలువడుతుంటే, అందులో పశుసంపద ఉద్గారాల వాటా 55–60%. పాల ఉత్పత్తిలో దేశంలోనే ముఖ్య రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి. ఏపీలో వ్యవసాయ ఉద్గారాల్లో పశుసంపద వాటా 30–35%గా ఉంది. ముఖ్యంగా డెయిరీ రంగంలో గేదెల ద్వారా ఎక్కువ మీథేన్ వెలువడుతోందని అంచనా. నెమరు వేసేటప్పుడు జీర్ణప్రక్రియ వల్ల వెలువడే మీథేన్ పశు ఉద్గారాల్లో 85%ను ఆక్రమిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో వెలువడే వ్యవసాయ ఉద్గారాలలో పశుసంపద ఉద్గారాల వాటా 25–30%. తెలంగాణలో గొర్రెలు, మేకల సంఖ్య అధికంగా ఉండటం వల్ల ఉద్గారాల తీరు భిన్నంగాఉంటుంది. తెలంగాణ ఎస్‌ఏపీసీసీ చెబుతున్న దాని ప్రకారం మీథేన్ ఉద్గారాలు పశువుల నుండే ఎక్కువ వెలువడుతున్నాయి.ముఖ్యమైన విశేషాలుప్రపంచంలోని అన్ని దేశాల కంటే మన దేశంలో పశుసంపద ఎక్కువ. కానీ తక్కువ. కానీ, ముఖ్యంగా ఒక్కో పశువు తలసరి ఉత్పాదకత తక్కువ. ప్రపంచంలోని గేదెల సంఖ్యలో 50% మన దేశంలోనే ఉంది. ఈ కారణంగా మొత్తం ఉద్గారాలు ఎక్కువగా కనిపిస్తాయి. కానీ పాలు, మాంసం, గుడ్ల ఉత్పత్తి క్రమంలో వెలువడే ఉద్గారాలను తగ్గించే అవకాశం ఉంది. పశువైద్యులు కేవలం జంతువుల వైద్యులు మాత్రమే కాదు. ఆహార భద్రతకు రక్షకులు కూడా. ఆరోగ్యదాయక పశుపోషణ ద్వారా ప్రజారోగ్యాన్ని కాపాడుతున్నారు. పర్యావరణ సమతుల్యతకు మార్గదర్శకులుగా నిలుస్తున్నారు. వన్ హెల్త్ దృక్పథంతో పశువైద్యులు సమగ్ర సుస్థిర అభివృద్ధికి మార్గం సుగమం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘పశు వైద్యులు– ఆహార, ఆరోగ్య సంరక్షకులు’ అనటంలో ఎంతమాత్రమూ అతిశయోక్తి లేదు. – డా. మల్లంపల్లి సాయిబుచ్చారావు (99122 92229), అసిస్టెంట్ డైరెక్టర్(ఏహెచ్), ఏరియా వెటర్నరీ ఆసుపత్రి, జీలుగుమిల్లి, ఏలూరు జిల్లా. saii@doctor.com(చదవండి: World Banana Day: 'అరటిపండు'ని ప్రపంచ ఫలం అంటారు ఎందుకో తెలుసా..!) -
ఏడు రోజుల్లో ఐదు కిలోల బరువు..! అమ్మ చెప్పే డైట్ ప్లాన్
బరువు తగ్గడం ఇటీవల కాలంలో ఓ క్రేజీ ట్రెండ్‌గా మారింది. అందులోనూ క్రాష్ డైట్లు, బరువు తగ్గే మందులు జోలి పోకుండా ఆరోగ్యకరంగా తగ్గడం అనేది అందర్నీ ఆకర్షిస్తున్న ఫిట్నెస్ మంత్రలా మారింది. పైగా అందరు ఆరోగ్య స్పృహతో బరువు తగ్గే ప్రయత్నమే చేస్తుండటం విశేషం. ఈసారి అలానే 40 ఏళ్ల తల్లి చాలా సింపుల్ డైట్‌ప్లాన్‌తో కేవలంలో ఏడు రోజుల్లో 5 కిలోలు తగ్గి అందర్నీ ఆశ్చర్యపరిచింది. వారంలోనే ఇంతలా బరువు తగ్గేందుకు సమతుల్య ఆహారంపైనే ఆధారపడ్డానని చెబుతోందామె. మరి ఆమె ఎలాంటి డైట్‌ప్లాన్‌తో తగ్గిందో ఆమె మాటల్లోనే తెలుసుకుందామా..!.40 ఏళ్ల వయసులో ఇద్దరు పిల్లల తల్లి కంటెంట్ క్రియేటర్ రత్న చందు కేవలం ఏడు రోజుల్లోనే ఐదు కిలోలు బరువు తగ్గేందుకు ఆ డైట్ ప్లాన్ సహాయపడిందని ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసుకుంది. తాను సమతుల్య ఆహారంపైనే ఫోకస్ పెట్టి బరువు తగ్గినట్లు వెల్లడించింది. మీ ఉదయాన్ని గోరువెచ్చని నిమ్మరసం, చిటికెడు సైంధవ లవణంతో ప్రారంభించాలని సిఫార్సు చేశారు. ఆ తర్వాత జీలకర్ర, వాము, సోంపు గింజలతో ఇంట్లో తయారుచేసిన డిటాక్స్ డ్రింక్‌ను తీసుకున్నట్లు తెలిపింది. దీనివల్ల అల్పాహారానికి ముందు జీర్ణక్రియను నెమ్మదిగా యాక్టివ్ అయ్యేలా చేస్తుంది. ఇక బ్రేక్‌ఫాస్ట్‌గా గిన్నెడు పండ్ల మిశ్రమం, నానబెట్టిన గింజలు, ఒక మిల్లెట్ దోస, బుల్లెట్ కాఫీ ఉంటాయి. ఉదయంపూట మిమ్మలని చురుకుగా ఉంచే శక్తివంతమైన ఆహారాల మిశ్రమం ఇది.ఉదయంపూట శక్తి కోసం..పాలకూర, దోసకాయ, అల్లంతో చేసిన గ్రీన్ జ్యూస్ తాగమని సూచించారు. కానీ వర్షాకాలంలో కడుపు సమస్యలను నివారించడానికి పచ్చి పదార్థాలను తినవద్దని కూడా ఆ కంటెంట్ క్రియేటర్ పేర్కొన్నారు.సమతుల్యమైన మధ్యాహ్న భోజనం ముఖ్యంమధ్యాహ్న భోజనం చాలా తేలిగ్గా ఉండాలని చెప్పారు. రోటీలు, వండిన కూరగాయలు, పప్పు, పనీర్, చోలే, గ్రీక్ యోగర్ట్, వంటి ప్రోటీన్ మూలం తీసుకునేలా చూసుకున్నట్లు తెలిపారామె. ఇందులో తగినన్ని కార్బోహైడ్రేట్లు, ఫైబర్, ప్రోటీన్‌తో కూడిన శక్తిమంతమైన భోజనం.స్నాక్స్..ప్రాసెస్ చేసిన స్నాక్స్‌కు బదులుగా, వేయించిన శనగలు, మఖానా, వేరుశెనగలు, గ్రీన్ టీ తినమని తెలిపారు.తేలికపాటి రాత్రి భోజనం, త్వరగారాత్రి భోజనానికి కూరగాయల సూప్, కిచిడీ, లేదా పనీర్‌తో వేయించిన కూరగాయల వంటి వాటిని ఎంచుకున్నట్లు తెలిపింది. అయితే ఈ భోజనం తప్పకుండా సాయంత్రం ఏడు గంటలకల్లా తీసుకోవాలని అన్నారు.నిద్రపోయే ముందు అది తప్పనిసరి..పంచదార, పాలు కాకుండా ఒక కప్పు మునగ టీతో రోజును ముగించమని చెబుతోంది. ప్రతిరోజూ ఒక గంట పాటు నడవడం, యోగా వంటి వర్కౌట్లు చేయాలని నొక్కి చెప్పింది. కచ్చితంగా జంక్‌ఫుడ్‌కి మాత్రం తప్పనిసరిగా దూరంగా ఉండాలని సూచించింది. చివరగా ఇన్ఫ్లుయెన్సర్ ఒక వారంలో 5 కిలోలు తగ్గడం అనేది వ్యక్తిని బట్టి మారుతుందని చెబుతుండటం గమనార్హం. ఈ డైట్‌ప్లాన్‌ని చిన్నగా మొదలుపెడితేనే మొత్తం ఆరోగ్యంపై ప్రభావంతమైన మెరుగుదలను తప్పక చూస్తారని అంటోంది ఇద్దరు పిల్లల తల్లి రత్న చందు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ చిట్కాలను పాటించే ముందు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను అనుసరించడం ఉత్తమం. View this post on Instagram A post shared by Ratna Chandu (@glow_fit_mom)(చదవండి: ఇప్పటికీ ఆ దృశ్యం నీలినీడలా వెంటాడుతోంది..! పహల్గామ్ బాధితురాలి మనో వ్యథ) -
రోగాలు రాకుండా ఉండాలా? హైదరాబాద్ లో ట్రెండ్ అవుతున్న పాతకాలపు ఆహారం
-
ఆ నవవధువు ధైర్యానికి..అందరి కళ్లల్లో నీళ్లు తిరిగాయ్..!
ప్రతి మనిషిలో ఏదో ఒక లోపం ఉంటుంది. కానీ శారీరక లోపం పైకే కనిపిస్తుంది కాబట్టి ఈజీగా చులకనగా చూసేస్తాం. ఎక్కడో కొందరే మెచ్యూరిటీగా వ్యవహరిస్తారు. కానీ అలాంటి వాళ్లు పక్కనే ఉంటే జీవితంలో ప్రతిదాన్ని ఇట్టే జయించగలరు. ముఖ్యంగా తమలోని లోపాన్ని ఆనందంగా స్వీకరించి ధైర్యంగా నిలబడగలుగుతారు, స్ఫూర్తిగా నిలుస్తారు. అందుకు నిదర్శనం ఈ నవవధువే. ఆమె కథ వింటే అందం గొప్పతనం ఏంటో తెలుస్తుంది. ఆ అమ్మాయే మహిమా ఘాయ్. ముంబైకి చెందిన మహిమ తన పెళ్లి రోజున జుట్టు లేకుండా వేడుకలోకి అడుగుపెట్టి..అందర్ని ఆశ్చర్యచకితుల్ని చేసింది. పైగా అక్కడ ఎవ్వరు నవవధువు బట్టతలను చూడలేదు. ఆమె స్థైర్యం, ఆత్మవిశ్వాసం అందర్నీ మంత్రముగ్ధుల్ని చేసింది. సహజత్వం గొప్పతనాన్ని చాటుతున్నట్లుగా అనిపించింది. అందం ప్రమాణాలకు అతీతమైనదని నిరూపించిన గొప్ప దృశ్యం అది. హుందాతనం, ఆత్మవిశ్వాసానికి మించిన సౌందర్యం ఇంకొకటి లేదని ఆ ఘటన నిరూపించింది. పెళ్లికూతురు అంటే ఇలానే ఉండాలనే అభిప్రాయాల్ని బేఖాతురు చేస్తూ వచ్చిన విధం అందర్నీ కట్టిపడేసింది. మహిమ అంత ధైర్యంగా అంత ముఖ్యమైన ఘట్టంలో అలా ఎలా కనిపించిందంటే..మహిమ కథేంటో తెలుసుకోవాల్సిందే..!.అంగీకరించక తప్పని పరిస్థితి..మహిమ చిన్నతనంలో అలోపేసియా బారిన పడింది. దాంతో జుట్టు ఊడిపోతుండేది. ఆమె పెరుగుతున్న కొద్దీ తలపై జుట్టపెరగక మచ్చలు ఎక్కువవుతుండేవి. మళ్లీ జుట్టురావాలనే ఉద్దేశ్యంతో ఎన్నో ఇంటి చికిత్సలు, వైద్య చికిత్సలు ఎన్నో చేయించుకుంది. ఏవి ఫలితం ఇవ్వలేదు. ఎంతో డబ్బు ఖర్చు పెట్టింది ఆమె కుటుంబం. చివరికి వైద్యులు ఆమె వ్యాధిని నిర్థారించారు. ఆ పరిస్థితిని అర్థం చేసుకోవడం తప్ప మరో మార్గం లేదని తేల్చి చెప్పారు. నవ్వు మాయమైన క్షణం..పెద్దయ్యే కొద్ది ఆత్మనూన్యత భావంతో తీవ్ర క్షోభని అనుభవించింది. తనలో తాను కుంగిపోవడం, తరచుగా ఎవరు పట్టించుకోవడం లేదనే భావన వంటి అభద్రతాభావం ఎక్కువైపు తుండేవి. తన పరిస్థితిని దాచేందుకు, అందరి దృష్టిని మరల్చడానికి విగ్గులు ధరిస్తుండేది. ఇది కూడా ఆమెకు ఉపశమనం ఇవ్వకపోగా ఆభద్రతా భావాన్ని మరింత ఎక్కువయ్యేలా చేసేవి. ఒక రోజు కాలేజ్‌లో చేసిన చిలిపి పని అందరి ముందు ఆమె నిజరూపం భయటపడంతో అలా గంటల తరబడి ఏడుస్తూ ఉండిపోయింది. ఆ రోజు నుంచి ఆమె ముఖంలో నవ్వు మాయమైపోయింది. సరిగ్గా ఆ కష్టసమయంలో తాను చేసే కళాకృతులే మహిమకు కొండంత బలాన్ని ఇచ్చేవి. మహిమ స్వతహగా విజువల్ ఆర్టిస్ట్. బొమ్మలేయడంలో దిట్ట.అతడి రాకతో వచ్చిన మార్పు..ఆ క్రమంలో ఆన్లైన్ ఆర్డర్లపై ప్రాజెక్టులు తీసుకోవడంతో..శశాంక్ అనే వ్యక్తి పరిచయం అవుతాడు. ఆ వృత్తిపరమైన పరిచయం కాస్త ప్రేమగా మారింది. అతని ఆలోచనాత్మక ప్రవర్తన, నిజాయితీ ఆమెను ఎంతగానో ఇంప్రెస్ చేశాయి. అతడితో ఉంటే మహిమకు అభ్రతభావం మొత్తం తొలిగిపోయేది. అయితే తన గురించి శశాంక్‌కి పూర్తిగా తెలియాలని విగ్గు తీసి చూపింది. తన నిజ స్వరూపాన్ని చూసినప్పుడు కూడా శశాంక్ ఆమెతో మెలిగిన తీరు మహిమను మరింతగా ఆకట్టుకున్నాయి. అది శారీరక లోపం కంటే మంచి మనసుని చూసే అతడి విధానం మహిమలో ఉన్న అనుమానాలన్నింటిని పటాపంచలు చేసింది. ఆ తర్వాత ఇద్దరు 2025లో పెళ్లి చేసుకోవాలని నిర్ణియించుకున్నారు. అయితే శశాంక్ కుటుంబ తనను ఎలా చూస్తుందో అని ఆందోళన చెందింది. వాళ్లు కూడా ఆమెను మనస్ఫూర్తిగా తమ కుటుంబంలోకి స్వాగతించారు. ఆ నేపథ్యంలోనే మహిమ ఇక ఎప్పటికి ముసుగు వెనుక దాగుడు మూతలు వద్దు అనుకుని ఇలా జుట్టు లేకుండానే నవ వధువుగా పెళ్లిపందిరిలోకి వచ్చింది. ఆ పెళ్లికి వచ్చిన వాళ్లు సైతం ఆమె బట్టతలను చూడలేదు, పెళ్లి కూతురు ఆత్మవిశ్వాసం, స్థైర్యం అందరి మనసులను కదిలించాయి. తన వ్యక్తిత్వానికి ప్రతిరూపంగా నిలిచిన ఆ వధువుని అంతా గౌరవప్రదంగా చూశారు. మన లోపాన్ని(స్థితిని) మనం అంగీకరించడంతోనే గుర్తింపు మొదలవ్వుతుందని ఈ వధువు మహిమ నిరూపించింది. తనను తాను యథావిధిగా స్వీకరించడమే అందం అని అంటోంది మహిమ..! View this post on Instagram A post shared by Humans of Bombay (@officialhumansofbombay) (చదవండి: సైకిల్‌పై సవారీ.. ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన మహిళ!) -
చిన్నారులకు ఆ చిరుతిండ్లు వద్దు..!
ఇటీవల చిన్నపిల్లల వైద్యుల వద్ద కేసులు పెరుగుతున్నాయి. కడుపు నొప్పి, వాంతులు ఇతర అనారోగ్య కారణాలతో చిన్నారులను తల్లిదండ్రులు వైద్యుల వద్దకు తీసుకెళ్తున్నారు. దీనికి చిన్నారులకు ఇస్తున్న ఆహారంలో మార్పులే కారణంగా చెప్పవచ్చు. ఒకప్పుడు చిన్న పిల్లలు మారాం చేస్తే.. ఇంట్లో ఉండే బెల్లం లేదా తయారు చేసుకునే సాంప్రదాయ చిరుతిళ్లను ఇచ్చేవారు. వీటి వలన వారి ఆరోగ్యానికి ఎంతో మేలు జరిగేది. అయితే కాల క్రమేణ ప్రస్తుతం మార్కెట్లోకి జంక్ ఫుడ్ విస్తరించింది. చిన్నారులను ఆకట్టుకునే విధంగా వివిధ రకాల ప్యాకింగ్లతో పాటు వారి ఆరోగ్యానికి హాని కలిగించే ఆహార పదార్థాలతో ఈ జంక్ ఫుడ్ ప్రభావం మారుమూల గ్రామీణ ప్రాంతాల వరకు పాకింది. వీటి వలన చిన్నారుల ఆరోగ్య, మానసిక వికాసం పూర్తిగా నాశనమవుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం టెక్కలి ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పోషణ్ పక్వాడ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఎదుగుదలకు హానికరం చిన్నారుల ఎదుగుదలపై ఈ జంక్ ఫుడ్స్ తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి. ముఖ్యంగా ఎక్కువ క్యాలరీలు, చక్కెర, ఉప్పు ప్రభావంతో వారిలో రోగ నిరోధక శక్తి నశించి అనారోగ్య సమస్యలకు దారి తీస్తాయి. వీటిలో ఎటువంటి ప్రోటీన్లు, విటమిన్లు ఉండవు. దీనివల్ల పెరుగుదల, రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. బర్గర్లు, పిజ్జా, చిప్స్, సోడాల్లో పోషకాలు తక్కువ, క్యాలరీలు ఎక్కువ ఉంటాయి. దీంతో శరీరం పోషక లోపంతో ఎదుగుతుంది. అధిక బరువు, గుండె, లివర్ సమస్యలకు దారి తీస్తాయి. ఎక్కువ చక్కెర, ఫ్యాట్స్ వలన స్థూలకాయం, మధుమేహపు ప్రమాదం, ఫాటీ లివర్ మొదలైన సమస్యలు చిన్న వయసులోనే వచ్చే ప్రమాదం ఉంది. అలాగే ఏకాగ్రత తగ్గి, చిరాకు, అలసట, నిద్రలేమి సమస్యలు వస్తాయి. తల్లిదండ్రుల్లో మార్పు రావాలి చిన్నారులకు జంక్ ఫుడ్‌ను మాన్పించే విషయంలో తల్లిదండ్రుల నుంచి మార్పు రావాలి. ఇంట్లో తల్లిదండ్రుల ఆహార అలవాట్లుకు అనుగుణంగా పిల్లల ప్రవర్తనలో మార్పు కనిపిస్తుంది. ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించే విషయంలో ఆకర్షణీయంగా ఇంట్లోనే పదార్థాలను తయారు చేసి వారికి అందివ్వాలి. అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో ఆహారాన్ని తయారు చేయడంలో పిల్లలు భాగస్వామ్యం ఉండే విధంగా చూడాలి. దీనివలన వారు తయారు చేసిన ఆహారాన్ని ఎలాగైనా తినాలి అనే మార్పు వస్తుంది. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినే విషయంలో వారిని ప్రోత్సహించే విధంగా చిన్నపాటి ప్రోత్సాహకాలు అందజేయాలి. దీనివలన ఆరోగ్యకరమైన ఆహారంపై ఆసక్తి పెరుగుతుంది. ఆకర్షణీయమైన ప్యాకింగ్ ఆహారం అనారోగ్యం అనే విషయంపై చిన్నారులకు అవగాహన కల్పించాలి.అవగాహన కల్పిస్తున్నాం పోషణ్ పక్వాడ కార్యక్రమంలో భాగంగా చిన్నారులకు జంక్ ఫుడ్ మాన్పించే విధంగా తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నాం. ఆకర్షణీయమైన ప్యాకింగ్‌లో ఉండే ఆహార పదార్థాల వలన ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. సంప్రదాయ ఆహార పదార్థాలు తయారు చేసి పిల్లలకు అందివ్వాలి. దీనివలన వారిలో శారీరక, మానసిక ఎదుగుదల ఉంటుంది. – విద్యా శతపతి, సీడీపీవో, టెక్కలి జంక్‌ఫుడ్‌తో అనారోగ్య సమస్యలు జంక్ ఫుడ్ వలన చిన్నారుల్లో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఊబకాయం, గుండె, పొట్ట సమస్యలతో పాటు మెదడు ఎదుగుదల లేకుండా చేస్తాయి. జంక్‌ఫుడ్ ఆకర్షణకు గురి కాకుండా చూసుకోవాలి. ఈ విషయంలో తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. – బీఆర్కే మహారాజ్, చిన్న పిల్లల వైద్యు నిపుణుడు, టెక్కలి జిల్లా ఆస్పత్రిసంప్రదాయ ఆహారంతో మేలుచిన్నారుల శారీరక, మానసిక ఎదుగుదలకు కొన్ని రకాల సాంప్రదాయ ఆహారాలను అలవాటు చేయాలి. ఈ విషయంలో తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాలి. ఇంట్లో వండిన సమతుల్య ఆహారం అనగా పప్పు, కూరలతో చేసిన ఆహారం, పాలు, గుడ్లు, చికెన్, చేపలు వంటి ప్రోటీన్ ఆధారిత ఆహారం వారి పెరుగుదలకు ఎంతో మంచిది. వీటితో పాటు పండ్లు, కూరగాయలు, అరటి, పచ్చి కూరలు, క్యారట్, బీట్రూట్తో చేసిన ఆహార పదార్థాలతో విటమిన్లు, ఖనిజ లవణాలు లభిస్తాయి. (చదవండి: మామ్ వెయిట్‌లాస్ జర్నీ..! నో క్రాష్ డైట్, నో స్ట్రిక్ట్ రూల్స్..ఏకంగా 22 కేజీలు..) -
మామ్ వెయిట్‌లాస్ జర్నీ..! 82కేజీల నుంచి 60 కేజీలకు..
బరువు పెరడం ఆధునిక కాలంలో చాలామందిని వేధిస్తున్న తీవ్ర సమస్య. ముఖ్యంగా ముఖం, కాళ్లు చేతులలో ఫ్యాట్ పేరుకుపోయి..ఊబకాయంతో కనపించేలా చేస్తుంది ఈ అధిక బరువు. తగ్గాలన్నా ఆలోచన రావడం, దానిపై నిలకడతో సాగడంతోనే ఈ సమస్యకు చెక్పెట్టగలరు. లేదంటే తగ్గినట్లే తగ్గి..మళ్లీ యథాస్థితికి వచ్చేస్తుంటారు. అందులోనూ మహిళలు పెళ్లి ముందు వరకు సన్నజాజిలా అందంగా కనిపించనవాళ్లు..పిల్లలు పుట్టడంతోనే ఈ సమస్య బారినపడుతుంటారు. అందుకు మాతృత్వం, ఇంటి బాధ్యతలు నడుమ తన శరీరంపై కేర్ ఉండక ఈ అధిక బరువు బారిన సునాయాసంగా పడిపోతుంటారు. అలాంటి వాళ్లు కూడా కాస్త పిల్లలు తమ పనులు చేసుకునే స్థాయికి చేరుకున్నాక..తమ ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుని వెయిట్‌లాస్ అయ్యి..స్ఫూర్తిగా నిలుస్తున్నారు. అలాంటి కోవకు చెందిందే ఈ మామ్ కూడా.ఆ తల్లే నూపుర్ కల్రా. చెన్నైకి చెందిన ఫ్యాషన్ బ్రాండ్ వ్యవస్థాపకురాలు, ప్రముఖ ఇన్ఫ్లుయెన్సర్ కూడా ఆమె. ఇటీవల తన ఇన్స్టాగ్రామ్ వేదిక తన వెయిట్‌లాస్ జర్నీ గురించి షేర్ చేసుకున్నారు. తాను 22 కేజీల వరకు అధిక బరువుని ఎలా తగ్గించుకుందో వెల్లడించారు. తాను ఎలాంటి క్రాష్ డైట్ పాటించలేదని అన్నారు.ప్రోటీన్ తప్పనిసరిగా..ఆహారం, ప్రోటీన్ సప్లిమెంట్లు తన లైఫ్‌లో పెద్ద గేమ్ ఛేంజర్ అని అంటోంది. ప్రోటీన్ తృప్తికి, శక్తికి, క్రమబద్ధతకు సహాయపడుతుందట. అయితే ఏ ప్రోటీన్ మీకు సరిపోతుందనేది పోషకహార నిపుణులను సంప్రదించే పాటించమని నొక్కి చెబుతోంది.ఇంటి భోజనంఆ ఇన్ఫ్లుయెన్సర్ స్విగ్గీ, జొమాటో, డెలివరీ ఫ్లాట్‌ఫాంల నుంచి ఆర్డర్ చేసిన భోజనాల కంటే ఇంట్లో వండిన ఆహారాన్నే ఎంచుకన్నట్లు తెలిపింది. ఎప్పుడైనా..బరువు తగ్గాలనుకునేవారు ఇంట్లో వండిన భోజనాన్నే ప్రిఫర్ చేయడం ముఖ్యం.ఎక్కువగా నీరు తాగడం..డీహైడ్రేషన్ బారినపడటం వల్లే తినాలనే కోరికలు ఎక్కువవుతాయట. అందుకే తగినంత నీరు తాగితే తీపి పదార్థాలు, వేయించిన ఆహారాల జోలికి పోరు అని అంటోంది.అలాగని స్వీట్లకు దూరం కాలేదట..ఇంట్లో వండిన ఆహారానికే ప్రాధాన్యత ఇస్తూ..నచ్చిన స్వీట్లు తినేదట. అయితే ఎంత మోతాదులో తినాలనేది నిర్ణయించుకుని మరి ప్లాన్ ప్రకారం తినేదాన్ని అంటోంది. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ సూచనుల పాటించే ముందు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. View this post on Instagram A post shared by Noopur Kalra (@noopurkalra) (చదవండి: చలువ చేసే మారేడు పానకం..!) -
జస్ట్ ఆరు నెలల్లో 32 కిలోలు..! యంగ్‌లుక్‌లో 48 ఏళ్ల వ్యక్తి..
బరువు పెరగడం అనేది ముమ్మాటికి అధికంగా తినడం వల్ల మాత్రమే కాదు. ఉరుకుల పరుగుల జీవన విధానానికి తోడు విపరీతమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. దాన్ని అధిగమించే క్రమంలో చెడు ఆహారపు అలవాట్లకు బానిస అవ్వడంతో అధిక బరువుకి దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు. అలానే ఇక్కడొక వ్యక్తి ఊబకాయం బారినపడి రోజువారీ పనులు చేసుకోలేక పలు అవస్థలు పడ్డాడు. కనీసం ఫ్లైట్ జర్నీ సైతం కష్టంగా మారింది. అక్కడ చైర్లు తన భారీకాయాని సరిపోక ఇబ్బందులు, వార్డ్‌రోబ్‌లో బట్టలన్నీ డబుల్ఎక్స్ఎల్ సైజులే. కనీసం తనకు నచ్చిన డ్రెస్ తనసైజులో దొరకక పడే కష్టాలతో విసుగెత్తిపోయాడు. చివరికి బరువు తగ్గి స్మార్ట్‌గా మారాలని గట్టిగా నిశ్చయించుకుని మరి ఎవ్వరూ గుర్తుపట్టలేనంతగా తగ్గిపోయి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. అది కూడా ఆరు నెలల వ్యవధిలోనే ఆరోగ్యకరమైన రీతీలో బరువు తగ్గడం విశేషం. అదెలాగో ఆ వ్యక్తి మాటల్లోనే సవివరంగా చూద్దామా..!.ఆ వ్యక్తే 48 ఏళ్ల డేవిడ్. అతడు ఆరు నెలల క్రితం సుమారు 128 కిలోల బరువు ఉండేవాడు. 48 ఏళ్ల వయసులో చాలా చురుకుగా ఉండేవాడు, చక్కగా వ్యాపారాన్ని రన్ చేసేవాడు. తన పిల్లల బాస్కెట్‌బాల్, సాకర్ జట్లకు కోచ్‌గా వ్యవహరించాడు. కానీ అతడు తన ఆరోగ్యం పట్ల చాలా చాలా ఆసంతృప్తిగా ఉన్నాడు. రోజువారీ పరిస్థితులు ఒత్తిడితో కూడుకున్నవిగా మారాయి. ప్రయాణాలకు సామాన్లు సర్దుకోవడం ఒక పెద్ద పనిగా అనిపించేది. విమాన సీట్లు చాలా అసౌకర్యంగా ఉండేవి అతడికి. ఆఖరికి సరిగ్గా సరిపోయే బట్లలు దొరకడం ఓ సవాలుగా ఉండేది. దీనికి కారణం పని ఒత్తిడి. ఆ స్ట్రెస్ కారణంగా జంక్‌ఫుడ్‌కి బానిసయ్యాడు. అది కాస్తా అతడి రూపురేఖల్ని మార్చేసేలా అధిక బరువుకి దారితీసింది. ఇకలాభం లేదు ఇలా ఉంటే..రాను రాను తన కదలికలే భారంగా మారపోతాయేమో అనేంత భయం వేసింది. దాంతో బరువు తగ్గాలని స్ట్రాంగ్‌గా డిసైడ్ అయ్యి ఫిట్నెస్ కోచ్ కెవ్ని సంప్రదించాడు. అతడి మార్గదర్శంకలో సరైన జీవనశైలిని అవలంబించి కేవలం ఆరు నెలల్లోనే 32 కిలోలు తగ్గాడు. ఇంతకుముందు బట్టలు సర్దుకోవడం, జర్నీలకు వెళ్లడం ఎంత భారంగా ఫీలయ్యాడో..ఇప్పుడు చాలా ఆత్మవిశ్వాసంగా తేలిగ్గా చేసేస్తున్నాడు. అంతేగాదు కొలరాడోకు విమాన ప్రయాణంలో సౌకర్యవంతంగా వెళ్తున్నట్లు చెప్పుకొచ్చాడు డేవిడ్. అంత సులభంగా, వేగవంతంగా బరువు ఎలా తగ్గాడో..తన వెయిట్‌లాస్ జర్నీ ఎలా సాగిందో అతడి ఫిట్నెస్ కోచ్ కెవ్ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా షేర్ చేసుకున్నాడు. పైగా అతడు ఎలాంటి ఫుడ్ తీసుకునేవాడో కూడా వివరించాడు.బరువు తగ్గేందుకు పాటించాల్సినవి..స్థిరంగా బరువు తగ్గాలంటే..ప్రోటీన్ల కోసం ఆహారంలో చికెన్ బ్రెస్ట్, సిర్లోయిన్ స్టీక్, సాల్మన్, గుడ్లు, టర్కీ బేకన్, రొయ్యలు, గ్రీక్ యోగర్ట్, కాటేజ్ చీజ్ తదితరాలు తీసుకోవాలి. కార్బోహైడ్రేట్ల కోసం తెల్లటి అన్నం, కెవ్ బ్రోకలీ, ఆస్పరాగస్, మిరపకాయలు, పాలకూర, పచ్చి బీన్స్ తదితరాలను సిఫార్సు చేస్తున్నారు. అంతేగాదు క్రియేటివ్ మెగ్నీషియం, ఎలక్ట్రోలైట్స్ వంటి సంప్లిమెంట్లను కూడా జోడించినట్లు తెలిపారు కోచ్ కెవ్.ఫుడ్ ప్లాన్..ప్రణాళికతో కూడిన భోజనం, అది కూడా సమతుల్యం ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు.భోజనం 1: ప్రోటీన్ షేక్‌తో గ్రీక్ యోగర్ట్, లేదా టర్కీ బేకన్‌తో 3 గుడ్లు, లేదా అధిక ప్రోటీన్ యోగర్ట్‌తో కాటేజ్ చీజ్.భోజనం 2: అన్నం, బ్రోకలీతో చికెన్, చిలగడదుంప, కూరగాయలతో మటన్, లేదా అన్నం, ఆకుకూరలతో సాల్మన్ ఉన్నాయి.భోజనం 3: బంగాళదుంపలు, ఆస్పరాగస్‌తో చికెన్ లేదా కాలీఫ్లవర్ రైస్ విత్ మిరపకాయలు, కూరగాయలతో రొయ్యలుతినమని కోచ్ కెవ్ సిఫార్సు చేసినట్లు తెలిపారు.మెరుగైన ఫలితాల కోసం..సత్వరమే మార్పులు పొందాలంటే సక్రమైన విధంగా దినచర్యను అనుసరించాల్సి ఉంటుంది.ఉదయం 5:30 గంటలకు నిద్రలేచి, రాత్రి 10 గంటలకల్లా పడుకోవాలి.మద్యపానానికి దూరంగా ఉండటం, రాత్రి 7 గంటల తర్వాత తినడం ఆపడంప్రతిరోజూ కనీసం 8 వేల అడుగులు నడవాలివారానికి 3–4 సార్లు 45 నిమిషాల పాటు తీవ్రమైన శక్తి శిక్షణ వ్యాయామాలు చేయడం.ఉదయం 30 నిమిషాలు సూర్యరశ్మిలో గడపడం, రెండుసార్లు బయట నడవడంప్రతిరోజూ కనీసం 150 గ్రాముల ప్రోటీన్ తీసుకోవడంనీరు, ఎలక్ట్రోలైట్లతో శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోండిప్రతిరోజూ 5 గ్రాముల క్రియేటిన్, నిద్రపోయే ముందు 400mg మెగ్నీషియం తీసుకోండిఈ విధమైన దినచర్యతో ఆరు నెలల్లో 129 కిలోల నుంచి 96 కిలోలుకు చేరుకుని యువకుడి మాదిరిగా తన శరీరాకృతిని మార్చుకున్నాడు. సంకల్పం ఎంత బలంగా ఉంటే అంత తొందరగా పరివర్తన వస్తుందనడానికి డేవిడ్ వెయిట్‌లాస్ స్టోరీనే ఉదాహరణ.గమనిక: ఈ కథనం కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. David lost 70lbs in 6 months at 48 years old.He came to us at 283 lbs.Active guy. Runs a business. Coaches his kids' basketball and soccer teams.But he wasn't where he wanted to be with his health and knew he needed to make a change.He knew what was wrong. He just… pic.twitter.com/zTiabcWAt7— Coach Kev - Belly Fat Pro (@AskCoachKev) April 10, 2026 (చదవండి: గొప్ప డాక్టర్ని అవ్వాలనుకున్నా..కానీ ఆ ఒక్క రీజన్..!) -
కమల్ హాసన్ సౌందర్య చిట్కా..! ఇది చర్మం, జుట్టు ఆరోగ్యానికి..
నటి శృతి హాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విలక్షణ నటుడు కమల్ హాసన్ తనయగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి గాయనిగా, నటిగా నూటికి నూరు మార్కులు దక్కించుకుంది. శృతి ఎప్పటికప్పుడూ ఆరోగ్యానికి సంబంధించిన ఆసక్తికరమైన టిప్స్ షేర్ చేస్తూ..ఆరోగ్యంపై స్ప్రుహను కలిగిస్తుంటారామె. అలానే ఈసారి తన జుట్టు, చర్మం ఆరోగ్యం కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుందో షేర్ చేస్తూ..ఆ విషయంలో తన తండ్రి ఇచ్చిన సౌందర్య చిట్కా గురించి మాట్లాడింది. ఆ చిట్కా చాలా బాగా పనిచేస్తుందని, దాన్ని గట్టిగా నమ్ముతానంటూ ఆ బ్యూటి టిప్ గురించి వివరించింది. ఇంతకీ ఏంటా సౌందర్య చిట్కా అంటే..కూలీ నటి శృతి తాను ఆయిల్‌ని ఎంతో ఇష్టపడతానని, దీన్ని ఒంటికి, జుట్టుకి రాసుకుంటానని అన్నారామె. ఇదేమి రెసిపీ లాంటిది కాకపోయినా..ఎంతో ఇష్టమని అంటోంది. నువ్వులు, కొబ్బరి నూనెతో కలగలసిన నూనె అంటే మహా ఇష్టమని, ఇది చర్మానికి, జుట్టుకి బాగా పనిచేస్తుందని తన నాన్నే(కమల హాసన్) స్వయంగా చెప్పారని చెప్పుకొచ్చింది. నిపుణులు ఏమంటున్నారంటే..జుట్టు ఆరోగ్యానికి నువ్వులు వల్ల కలిగే అనేక ప్రయోజనాల కారణంగా సాంప్రదాయంగానూ, ఆధునికంగా కేశ సంరక్షణకు ది బెస్ట్ అని అన్నారు. దీనిలో అవసరమైన ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్ ఈ, బి కాంప్లెక్స్ విటమిన్లు, మెగ్నీషియం, కాల్షియం, వంటి ఖనిజాలతో నిండి ఉంటుందని తెలిపారు. తలకు తీవ్రంగా తేమను అందించి జుట్టు కుదుళ్లను బలపరిచి, పెరుగుదలను ప్రేరేపిస్తుందని అన్నారు. దీనిలో సహజంగా ఉండే యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు చుండ్రుని, వివిధ చర్మ సమస్యలను అరికట్టి..జుట్టు పెరుగుదలకు దోహదపడుతుందని చెప్పారు. అలాగే ఇది సూర్యుడి నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాల నుంచి రక్షిస్తుందని తెలిపారు. అంతేగాదు దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు జుట్టుని డల్‌గా కానివ్వకుండా నిరోధిస్తాయని అన్నారు. గోరువెచ్చని నూనెతో మసాజ్‌లు తలకు రక్తప్రసరణను అందించి జుట్టు ఆరోగ్యానికి, విశ్రాంతికి సహాయపడతాయని చెప్పారు. అంతేగాదు ఆయుర్వేదం ప్రకారం..అన్ని నూనెల్లోకెల్లా నువ్వులు నూనె అత్యంత శ్రేష్టమైనదని అన్నారు. ఈ నువ్వుల నూనెని సౌందర్యం, ఔషధ ఉత్పత్తులలో వినియోగిస్తారని చెబుతున్నారు. సాంప్రదాయకంగా, నువ్వుల నూనె నాడీ వ్యవస్థపై వెచ్చదనాన్ని, ప్రశాంతతను కలిగించే ప్రభావాలను కలిగి ఉండటం వల్ల అత్యంత ప్రభావవంతమైన నూనెగా పేరుగాంచింది. అంతేగాదు ఆయుర్వేదం నువ్వుల నూనెను నూనెలకే రాజుగా పరిగణిస్తుంది. ఎందుకంటే ఇది వ్యాధికారకాలను నిర్మూలించి, రోగనిరోధక శక్తిని మెరుగుపరచడమే కాకుండా శక్తిని సమతుల్యం చేయడం వంటి అనేక ప్రయోజనాలను పుష్కలంగా అందిస్తుందని చెబుతున్నారు.గమనిక: ఇది కేవలం అవగాన కోసం మాత్రమే. పాటించే ముందు వ్యక్తిగత నిపుణులు లేదా వైద్యులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: సామాజిక బాధ్యత అంటే ఇదే..! రెప్పపాటులో ఆ పాప..) -
'ఆశా తాయ్' మహారాష్ట్ర ఫ్యాషన్ ఐకాన్..!
92 ఏళ్ల వయసులో ఆశా భోంస్లే కన్నుమూశారు. ఆమె మరణంతో, ప్రపంచం వేలాది పాటలు పాడిన ఒక గాత్రాన్ని మాత్రమే కోల్పోలేదు, హుందాతనానికి, ఫ్యాషన్ శైలికి కంచుకోట అయినా ఓ మహోన్నత వ్యక్తిని కోల్పోయాం అంటున్నారు ఫ్యాషన్ నిపుణుల. 'పియా తు అబ్ తో ఆజా', 'దిల్ చీజ్ క్యా హై', 'దమ్ మరో దమ్' వంటి అనేక హిట్ పాటలతో ప్రసిద్ధి చెందిన ఆమె ఆహార్యం పరంగా నిరంతరం కొత్తదనాన్ని కోరుకునేవారని చెబుతున్నారు. మరి ఆశా ఫ్యాషన్ పరంగా ఎలాంటివి ఇష్టపడేవారు, చీరల సెలక్షన్ తదితర విశేషాల గురించి తెలుసుకుందామా..!.రూపం పరంగా రాజీపడని విధంగా రెడీ అయ్యేవారట. వాటిలో అత్యంత హైలెట్ అయ్యేవి ఆమె చీరలు. ఆమె వార్డ్రోబ్ మొత్తం మహారాష్ట్ర సౌందర్యానికి కేరాఫ్ అడ్రస్ అని చెప్పొచ్చు. ఆమె తరుచుగా మందపాటి బంగారు జరీ అంచులతో కూడిన ఐవరీ క్రీమ్ లేదా పాస్టల్ రంగులో ఉండే బరువైన పట్టు లేదా కాటన్ సిల్క్ చీరలనే ఇష్టపడేవారట. ముక్కుపుడక..ఇక ఆశాలో మరో ప్రత్యేకత ముక్కుపుడక. ఆమె సాంప్రదాయ మహారాష్ట్ర ముక్కుపుడక లేకుండా అలంకరణ పూర్తి చేసేవారు కాదట. ఇది ఆమె మూలాల నేపథ్యాన్ని, హుందాతనానికి ప్రతీకగా నిలిచేవని చెబుతున్నారు ఫ్యాషన్ ప్రియులు. ఇలా ఆమె పండుగలు, పర్వదినాల్లోనే కాకుండా అంతర్జాతీయ వేదికలపై సైతం మహారాష్ట్ర శైలి ముక్కుపుడకనే ధరించేవారట. ముఖాన కచ్చితంగా ఎర్రటి బొట్టు గుండ్రంగా పెద్దదిగా ఉండాల్సిందేనట. ఇది ఆమె వ్యక్తిత్వానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అంతేగాదు గాయని ఆశ అనేక వరుసల ముత్యాల హారాలు, బరువైన బంగారు లేదా వజ్రాల ఆభరణాలు లేకుండా బయటకు వచ్చేవారు కాదట. సింపుల్‌గా చెప్పాలంటే సాంప్రదాయన్ని, ఆధునికతను మేళవించేలా ఆభరణాలను ఎంచుకునేవారట. అంతేగాదు ఆమెను అభిమానులు ఎక్కువగా సొగసైన చీరలు, చక్కగా చుట్టిన కొప్పులోనే గుర్తించుకుంటారు. చెప్పాలంటే అభిమానుల హృదయంలో తన వేషధారణ నాటుకుని పోయేలా ఆహార్యాన్ని మెయింటైన్ చేసేవారు. పైగ మహారాష్ట్ర ప్రజలు ఆమెను ముద్దుగా 'ఆశా తాయ్'(తాయ్ అంటే మహారాష్ట్రలో అక్క అని అర్థం) అని పిలుచుకుంటుంటారు. అంతేగాదు ఆమె ప్రసిద్ధ పాప్ సంగీతం.. 1997లో లెస్లే లూయిస్‌తో కలిసి 'జనం సంఝా కరో' అనే విలక్షణమైన పాటను విడుదల చేసే టైంలో కూడా పాశ్చాత్య దుస్తులను ధరించడానికి ఒప్పుకోలేదు. మ్యూజిక్‌కి వేషధారణతో పనిలేదని, జనాల మనసుకు హత్తుకుందా లేదా అనేది ముఖ్యం అని అన్నారు. చివరి వరకు ఆశా తన సంగీత కచేరీలలో ఎర్రటి బొట్టు, అందమైన మహారాష్ట్ర చీరలతోనే విలక్షణంగా కనిపించారామె. View this post on Instagram A post shared by Zanai Bhosle💜 (@zanaibhosle) (చదవండి: ఆశా భోంస్లే మృతి: ఛాతీ ఇన్ఫెక్షన్లు ఎందుకంత ప్రమాదకరం..) -
ఆ నటుడికి మోటార్ న్యూరాన్ వ్యాధి.. ఎందువల్ల వస్తుందంటే..?
గేమ్ ఆఫ్ థ్రోన్స్ నటుడు మైఖేల్ పాట్రిక్ 35 ఏళ్ల వయసులో నాడీ సంబంధిత వ్యాధి మోటార్ న్యూరాన్ వ్యాధితో మృతి చెందారు. ఏప్రిల్ 9, 2026న, అతను మరణించినట్లు ఆయన భార్య నవోమి షీహాన్ ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించారు. ఆయన గత రాత్రి నార్తర్న్ ఐర్లాండ్ హాస్పిస్‌లో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపింది. ఆయనకు ఫిబ్రవరి 1, 2023న అతనికి మోటార్ న్యూరాన్ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. ఆయన పది రోజుల క్రితం ఆస్పత్రిలో చేరారు, అక్కడ అద్భుతమైన వైద్యుల బృందం ఆయనకు చికిత్స అందించారు. నయం చేయలేని ఈ వ్యాధి కారణంగా ఆయన తన కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో తుదిశ్వాస విడిచారు. ఒక్కసారిగా అక్కడ విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ నేపథ్యంలో ఆ నటుడిని పొట్టనబెట్టుకున్న మోటార్ న్యూరాన్ వ్యాధి అంటే..?, ఎందువల్ల వస్తుంది తదితరాల గురించి సవివరంగా తెలుసుకుందామా.!.మోటార్ న్యూరాన్ వ్యాధి అంటే ..పేరు సూచించినట్లుగా, మోటార్ న్యూరాన్ వ్యాధి (MND) అనేది న్యూరాన్లు, చలనశీలతకు సంబంధించిన ఒక వ్యాధి. క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ నివేదిక ప్రకారం, MND అనేది మోటార్ న్యూరాన్లను నాశనం చేసే నరాల సంబంధిత రుగ్మతల సమూహాన్ని సూచిస్తుంది. ఈ న్యూరాన్లు మింగడం, మాట్లాడటం, నడవడం, శ్వాస తీసుకోవడం వంటి కార్యకలాపాలలో పాల్గొంటాయి.సింపుల్‌గా చెప్పాలంటే.. మెదడులోని న్యూరాన్ల (ఎగువ మోటార్ న్యూరాన్లు) నుంచి వచ్చే సందేశాలు సాధారణంగా వెన్నుపాములోని న్యూరాన్లకు (దిగువ మోటార్ న్యూరాన్లు) ప్రసారం చేయబడతాయి. అక్కడి నుంచి, సందేశాలు శరీరంలోని కండరాలకు చేరి, అవి పనిచేయడానికి వీలు కల్పిస్తాయి. కండరాలు దిగువ మోటార్ న్యూరాన్ల నుంచి సందేశాలను అందుకోలేనప్పుడు, అవి బలహీనపడి కుంచించుకుపోవడం ప్రారంభిస్తాయి. అదేవిధంగా, దిగువ మోటార్ న్యూరాన్లు ఎగువ మోటార్ న్యూరాన్ల నుంచి సంకేతాలను అందుకోలేనప్పుడు, కండరాలు బిగుసుకుపోతాయి, దీనివల్ల స్వచ్ఛంద కదలికలు నెమ్మది నెమ్మదిగా కష్టంగా మారతాయి.కాలక్రమేణా, రోగి నడిచే సామర్థ్యాన్ని లేదా శరీర కదలికలను నియంత్రించే సామర్థ్యాన్ని కోల్పోవచ్చు. మోటార్ న్యూరాన్ వ్యాధులకు ప్రస్తుతం ఎలాంటి నివారణ లేదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఇది అంతకంతకు తీవ్రమయ్యే వ్యాధి కాబట్టి, కాలక్రమేణా దీని తీవ్రత పెరుగుతుంది.అయితే, కొన్ని చికిత్సలు ఒక వ్యక్తి జీవన నాణ్యతపై ప్రభావాన్ని తగ్గించగలవు, కానీ మోటార్ న్యూరాన్లు వారాలు, నెలల తరబడి క్షీణిస్తూనే ఉంటాయి, చివరికి రోగిని అంగవైకల్యానికి గురిచేసి, మరణానికి దారితీస్తాయి.మోటార్ న్యూరాన్ వ్యాధుల లక్షణాలుMND లక్షణాలు మొదట్లో స్పష్టంగా కనిపించకపోవచ్చు, కానీ అవి క్రమంగా పెరగవచ్చు. మాటలు తడబడటంకాళ్ళలో బలహీనతకండరాలు అదరడంబరువు తగ్గడంపట్టు బలహీనపడటంఅసంకల్పితంగా ఏడవడం లేదా నవ్వడం వంటి భావోద్వేగాలను నియంత్రించడంలో ఇబ్బందినిద్రకు భంగం కలగడంఊపిరి ఆడకపోవడంగందరగోళంపదేపదే ఛాతీ ఇన్ఫెక్షన్ రావడంఉదయం పూట తలనొప్పిఅలసటవాస్తవానికి ఈ వ్యాధికి కచ్చితమైన లక్షణం అంటూ ఉండదని చెబుతున్నారు నిపుణులు. కాలక్రమేణా మోటార్ న్యూరాన్లు క్రమంగా పనిచేయడం ఆపేస్తాయని పరిశోధనల్లో వెల్లడైందని చెబుతున్నారు నిపుణులు. MND వంశపారంపర్యంగా రావచ్చు, అంటే ఇది ఒక తరం నుంచి మరొక తరానికి సంక్రమించవచ్చు. ఒకే ఒక్క జన్యు మార్పు కూడా ఈ వ్యాధి వంశపారంపర్యంగా రావడానికి కారణం కావచ్చు.MND సాధారణంగా 60 మరియు 70 ఏళ్ల వయస్సు గల వారిని ప్రభావితం చేస్తుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఒక్కోసారి ఇది పెద్దలు పిల్లలను కూడా ప్రభావితం చేయగలదు. ఒక వ్యక్తికి దగ్గరి బంధువుకు ఈ వ్యాధి లేదా ఫ్రంటోటెంపోరల్ డిమెన్షియా అనే సంబంధిత రుగ్మత ఉంటే, ఆ వ్యక్తికి MND వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.(చదవండి: నటి ప్రియాంక చోప్రా తల్లి బ్యూటీ టిప్: మెరిసే చర్మం కోసం..) -
నటి ప్రియాంక చోప్రా తల్లి బ్యూటీ టిప్: మెరిసే చర్మం కోసం..
ఆరోగ్యకరమైన, కాతివంతమైన చర్మం కావాలంటే సరైన కేర్ అవనరం. అందుకు సులభమైన మార్గం మనం ఇంట్లోనే సహజంగా ఫేస్ ప్యాక్‌ను తయారు చేసుకోవడం. తద్వారా ఎలాంటి దుష్ప్రభావలు లేని మంచి కాంతివంతమైన, మెరిసే చర్మాన్ని ఈజీగా పొందొచ్చు. అదెలాగో నటి ప్రియాంక చోప్రా తల్లి, డాక్టర్ మధు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఆ సౌందర్య చిట్కా ఏంటో చూసేద్దామా..!ప్రియాంక తల్లి డాక్టర్ మధు మాట్లాడుతూ.. "నేను ఎప్పుడు ఫేస్‌వాష్ కానీ సోప్ కానీ వాడలేదు. అప్పుడప్పుడు నేను స్ర్కబ్స్ ఉపయోగిస్తాను. ఇలా చేస్తే డెడ్ సెల్స్ పోయి, చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది. నేను ఎప్పుడు హెల్దీ స్కిస్నే మెయింటెస్ చేస్తాను. ఏ చర్మ సమస్యలకైనా నా కూతురు నేన ఈ ఫేస్ ప్యాక్‌నే వాడతాం. ఈ ప్యాక్‌లో పసుపు, శెనగపిండి వంటి పదార్ధాల వలన చర్మానికి మంచి గ్లోయింగ్ రావడమే గాక తాజాగా కనిపిస్తుంది. " అంటూ ఆ ప్యాక్ చేసుకునే విధానం గురించి వివరించారామె. ఎలా చేసుకోవాలంటే..ఒక గిన్నెలోకిలోకి 2 టేబుల్స్పున్ల శెనగపిండి, డ్రై స్కిన్ ఉంటే ఇంట్లో చేసిన క్రీమ్, తాజా పెరుగు, కొద్దిగా తేనె కలిపి ముఖానికి అప్లై చేసి ఆరిపోయేంత వరకు ఉంచితే చాలు. ఆ తర్వాత ముఖం ఎంత కాంతివంతంగా ఉంటుందో ట్రై చేసి చూడండి మరి... View this post on Instagram A post shared by Dr Madhu Akhouri Chopra (@drmadhuakhourichopra) (చదవండి: 'పన్ను' వసూలు చేసే బ్యాడ్ హ్యాబిట్స్) -
ఆ వ్యాధి మళ్లీ తిరగబెడుతుందని ఊహించలేదు..! : దీపికా కక్కర్
దీపికా కక్కర్ టెలివిజన్ పరిశ్రమలో అత్యంత ప్రియమైన నటీమణులలో ఒకరు. ససురాల్ సిమర్ కా , కహాం హమ్ కహాం తుమ్‌లాంటి షోల పాత్రల్లోని నటనతో పాపులర్ అయింది. ఒకప్పుడు అత్యధిక పారితోషికం తీసుకునే టెలివిజన్ నటిగా నిలిచింది. ఆమె గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోంది. గతేడాది వైద్యులు ఆమె కాలేయం దగ్గర టెన్నిస్ బంతి పరిమాణంలో కేన్సర్ గడ్డ ఉందని నిర్థారించినట్లు తెలిపారామె. వైద్యులు ఆమెకు శస్త్ర చికిత్స చేసి ఆ గడ్డతోపాటు కాలేయంలో 22 శాతం తొలగించారు. హమ్మయ్యా బయటపడ్డాను అనుకునేలోపే ఆ వ్యాధి మరోసారి తిరగబట్టి గట్టి షాకిచ్చింది. దీంతో ఆస్పత్రులు చుట్టూ తిరుగుతూ..కనీసం మాతృత్వాన్ని ఆస్వాదించలేకపోతున్నాననంటూ తన గోడును సోషల్ మీడియా వేదికగా వెళ్లబోసుకుంది. అంతేగాదు ఆరోగ్య సమస్యలు వ్యక్తిగత జీవితాన్ని ఎలా ఇరకాటంలో పడేస్తాయో ఆమె మాటల్లోనే తెలుసుకుందాం.నటి దీపికా కాకర్‌కు కాలేయం దగ్గర 1.3 సెం.మీ సిస్ట్ మళ్లీ రావడంతో మరో శస్త్ర చికిత్స జరిగింది. కాలేయ కేన్సర్‌కు చికిత్స పొందుతున్న దీపికాకు ఈ కేన్సర్ మళ్లీ తిరగబెట్టడం ఒక భావోద్వేగపరమైన ఎదురుదెబ్బగా మారిందామెకు. ఈ మేరకు పోస్ట్‌లో ఊహించన ఈ మలుపు తనను తీవ్ర ఒత్తిడికి గురి చేస్తోందని పంచుకున్నారు. తన ఆరోగ్య సమస్యలు వ్యక్తిగత జీవితాన్ని, ముఖ్యంగా మాతృత్వాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోందని వాపోయారు. తన కొడుకు రుహాన్‌తో సమయం గడపలేకపోతున్నాన్న బాధ తనను కలిచివేస్తోందని అంటోంది. ఆస్పత్రి సందర్శనలే దినచర్యగా మారిపోవడంతో అలిసిపోతున్నానని అంటోంది. ఇక తన భర్త షోయబ్ తన కారణంగా పనులతో బిజీ అయిపోయాడని చెప్పుకొచ్చింది. ఆస్పత్రిలో ఉంటే రుహాన్ చూడలేను పోనీ ఇంటికి వస్తే చికిత్సతో అలిసిపోయి పడుకుంటాను అంతే ఇది తన దినచర్యను పూర్తిగా మార్చేసిందన్నారు. నిజానికి అనారోగ్యంతో ఉన్నప్పుడే మనం బలంగా ఉండాలి, సానుకూలంగా ఉండాలి. కానీ ఊహించని విధంగా మరోసారి ఈ కేన్సర్ తిరగబెట్టడం ఒకింత బాధ, భయం ఆవరించాయని కన్నీటి పర్యంతమైంది. ఒకరకంగా ఈ పరిస్థితి తన ఆరోగ్యం, జీవనశైలి పట్ల ఎంత అప్రమత్తంగా ఉండాలో తెలియజేసిందన్నారు. మన శరీరాలు చలా సంక్లిష్టమైనవి, బలమైనవి, ప్రతిరోజు వివిధ చికిత్సలు తట్టుకుంటున్నందుకు అవి నిజంగా గొప్పవి అని మెచ్చుకుంది. ఏ అనారోగ్యం వచ్చినా..మన శరీరంలో హార్మోన్లు ఎంతలా మార్పులు చెందినా..మన జీవితాలను సజావుగా గడుపుతామని అన్నారు. తనలా మళ్లీ మళ్లీ సిస్ట్ వచ్చినా కొందరితో మాట్లాడుతూ.. ఈ సమస్యను ఎదుర్కొనేలా తనను తాను బలోపేతం చేసుకుంటున్నట్లు తెలిపారు దీపికా. అలాగే అనారోగ్యం కారణంగా క్రమం తప్పకుండా వ్లాగ్‌లో పోస్ట్‌లు పెట్టలేకపోతున్నానని అన్నారు. తన చుట్టూ ఉన్నవారు నవ్వుతూనే ఉంటున్నారు కానీ, లోపల ఎంత ఆందోళన ఉందో గ్రహించగలను, ముఖ్యంగా అమ్మ, అత్తయ్య ఎంత బాధపడుతున్నారో ఊహించగలను అంటూ తన పోస్ట్‌ని ముగించింది.(చదవండి: పుష్-అప్స్లో ఈ 75 ఏళ్ల బామ్మే స్ఫూర్తి..! జస్ట్ 12 వారాల్లో..) -
జస్ట్ రెండు నెలల్లో 12 కేజీల బరువు..! నో స్ట్రిక్ట్ డైట్, నో చీట్మీల్స్
బరువు తగ్గడం అనేది కొందరికి సంక్లిష్టమైనది, అంత సులభంగా సాధ్యమయ్యేది కాదు. కానీ కొందరికి మాత్రం సాధారణ డైట్‌తోనే అద్భుతంగా మ్యాజిక్ చేస్తారు. కేవలం నిలకడ, క్రమశిక్షణతో తన ఆహార్యాన్నే మార్చుకుని..స్మార్ట్‌గా బరువు తగ్గడం ఎలాగో చూపిస్తారు. ఇక్కడ ఇషాన్ కర్దే అలానే బరువు తగ్గి ఆశ్చర్యపరిచాడు. అదికూడా కేవలం రెండు నెలల్లో ఏకంగా 12 కేజీలు తగ్గాడు. స్ట్రిక్ట్ డైట్, కఠినమైన వ్యాయామాలు లేవు. ఇషాన్ కర్దే బరువు తగ్గడం అనేది ప్రాథమికంగా నిలకడ, సమతుల్య పోషణ, స్థిరమైన ఆహారపు అలవాట్లపై ఆధారపడి ఉంటుందని చెబుతున్నాడు. క్రమబద్ధమైన రోజువారీ ఆహారంతో శక్తి స్థాయిలను కాపాడుకుంటూనే కొలెస్ట్రాల్‌ని తగ్గించుకోవచ్చని వెల్లడించాడు. వివిధ రకాల షార్ట్‌కట్ డైట్ల వైపుకి పరిగెట్టడం కంటే..సింపుల్‌గా, ఆరోగ్యప్రదంగా తేలికపాటి వాటితోనే స్మార్ట్‌గా బరువు తగ్గొచ్చని అంటున్నాడు. తాను నాలుగు పూటలా భోజనాన్ని ఆస్వాదిస్తూనే రెండు నెలల్లో 12 కేజీల దాక బరువు తగ్గానని చెబుతున్నాడు. ఇషాన్ కర్దే తనకు ఉపకరించిన డైట్‌ప్లాన్ గురించి ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో షేర్ చేసుకున్నాడు. తాను డైట్‌ని 90% క్రమం తప్పకుండా పాటించానని, తీరిక లేని రోజుల్లో మధ్యాహ్న భోజనానికి బదులుగా ప్రోటీన్ అధికంగా ఉండే చికెన్ ర్యాప్‌లు/రైస్ బౌల్స్ తీసుకున్నానని చెప్పారు. అయితే చీట్ మీల్స్, చక్కెర, చిప్స్, బిస్కెట్లు వంటివి అస్సలు తీసుకోలేదని వెల్లడించాడు.అల్పాహారంఈషాన్ తన రోజును ప్రోటీన్ ఓట్స్, 150 ml పాలు, 1 స్కూప్ వే ప్రోటీన్‌తో కూడిన అల్పాహారంతో ప్రారంభించేవాడు. తన భోజనంలో పోషక విలువలను విశ్లేషించి మరి తీసుకునేవాడు. దాని ప్రకారం మొత్తం 35 గ్రాముల ప్రోటీన్, 35 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 8 గ్రాముల కొవ్వులు ఉండేలా కేర్ తీసుకున్నారు. ప్రోటీన్, ఫైబర్ ఆకలిని అదుపులో ఉంచి మధ్యాహ్నాం పూట నీరసించపోకుండా నివారించేవని అన్నారు.మధ్యాహ్న భోజనంఈషాన్ ప్రోటీన్, కార్బోహైడ్రేట్ల మిశ్రమానికే కట్టుబడి ఉంటూ, కొవ్వు శాతాన్ని కొద్దిగా పెంచాడు. అతని భోజనంలో 200 గ్రాముల చికెన్ బ్రెస్ట్ లేదా పనీర్, 2 రోటీలు, తేలికపాటి గ్రేవీ, సలాడ్లు ఉన్నాయి. ఈ భోజనం నుంచి 50 గ్రాముల ప్రోటీన్, 45 నుంచి 50 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 10 నుంచి 12 గ్రాముల కొవ్వు అందుతుంది.సాయంత్రం స్నాక్స్..అతను సాయంత్రం ఒక పండు, గుప్పెడు నట్స్, 5 గుడ్డు తెల్లసొన తీసుకునేవాడట. ఇలా తింటే 22 నుంచి 24 గ్రాముల ప్రోటీన్, 25 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 8 గ్రాముల కొవ్వు లభిస్తాయి.రాత్రి భోజనంరోజులో చివరి భోజనంగా, ఈషాన్ తేలికపాటి ఆహారాన్ని తీసుకున్నాడు. అతను 200 గ్రాముల చికెన్ లేదా పనీర్ సలాడ్ తీసుకున్నాడు, దీనిలో 45 గ్రాముల ప్రోటీన్, 5 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 8 గ్రాముల కొవ్వు ఉంటాయి. అంతేగాదు బరువు తగ్గేందుకు ఎల్లప్పుడూ కష్టతరమైన ఆహారనియమాలు, తీవ్రమైన వ్యాయామాలు అవసరం లేదని ఈషాన్ వెయిట్‌లాస్ జర్నీ రుజువు చేస్తోంది. పైగా ఒక సాధారణ దినచర్యను క్రమంతప్పకుండా పాటించడం అనేది అత్యంత కీలకమని నొక్కి చెబుతోంది కూడా. View this post on Instagram A post shared by Eshaan Karde (@eshaankarde)గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. మరిన్ని వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: స్క్రీన్ అలవాటు ఇంత ప్రమాదకరమైనదా..?! ఆయర్వేద చిట్కాలు) -
ఊబకాయం నుంచి స్మార్ట్‌గా..! ఏకంగా 204 కిలోల నుంచి 92 కిలోలకు..
కొందరు సుమోలు మాదిరిగా భారీ శరీరంతో ఉంటారు. వాళ్లు వెయిట్‌లాస్ అవ్వడం చాలాకష్టం. బరువు తగ్గే సర్జరీలు, ఫిట్నెస్ నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే కాస్త బరువు తగ్గగలిగే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఊబకాయులు బరువు తగ్గడం అంత సులభం కాదు. పైగా ఆ క్రమంలో చాలా నరకం చవి చూడాల్సి ఉంటుంది. కానీ ఈ మహిళ బరువు తగ్గాలనే కోరిక బలంగా ఉంటే..పట్టుదలతో ఇట్టే ఆ సమస్యను జయించొచ్చు అని నిరూపించిందామె.ఆ మహిళ అమెరికాలోని కొలరాడోకు చెందిన కంటెంట్ క్రియేటర్ అనా అలోన్సో. తన శరీర బరువులో సగానికి పైగా బరువు తగ్గిన జర్నీని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది. నిజానికి ఆమె బరువు 204 కిలోలు. పట్టుదల, మానసిక స్థైర్యంతో బరువు తగ్గడానికి స్థిరంగా కట్టుబడి మరి స్మార్ట్‌గా మారింది ఆ పిల్లల తల్లి. ఒకప్పుడు అధిక బరువుతో..చిన్నపాటి కదలికలకే అల్లడిపోయే సవాళ్లను ఎదుర్కొంది. నిరంతర ఆయాసంతో బయటకు అడుగుపెట్టాలంటేనే ఇబ్బంది పడేది. ముఖ్యంగా తన రూపం కారణంగా నలుగురిలోకి రావడానికి చాలా ఇబ్బందిపడేది. తాను ఎలాగైన చురుకైన తల్లిగా ఆత్మవిశ్వాసంతో ఉండాలన్న ఆరాటం ఆమెను బరువు తగ్గేందుకు పురికొల్పొంది. ముఖ్యంగా బరువు తగ్గి మంచి శరీరాకృతితో ఆత్మగౌరవంతో ఉండాలనే ఆకాంక్షతో చాలా పట్టుదలతో నిలకడగా బరువు తగ్గేందుకు ఉపక్రమించానని చెప్పుకొచ్చింది అనా.శారీరక పరివర్తన ఎలా సాధించిందంటే..మొదట్లో చిన్న పాటి కదలికలు కూడా కష్టమైందామెకు. సాధార వ్యాయామాలకే అలిసిపోయేది. అయితే అసౌకర్యాన్ని భరిస్తూ ముందుకు సాగింది. అయితే నిలకడగా చేయడం ప్రతీది మార్చేసింది. కాలక్రమేణ బరువులు ఎత్తడం, స్క్వాట్స్ చేయడం, బహిరంగ పోటీల్లో పాల్గొనేంత వరకు పురోగతి సాధించింది. ఆమె పరివర్తన మొత్తం రాత్రికి రాత్రే జరగలేదు. మంచి జీవనశైలిని అవలంభిస్తూ..క్రమం తప్పకుండా వ్యాయామాలు చేస్తూ..తగ్గడం సాధ్యమే అని నిరూపించింది. ఎలా విజయవంతమైందంటే..ఆరోగ్యకరమైన బరువు తగ్గడం కోసం అనా అనుసరించిన ముఖ్యమైన సూత్రాలేంటంటే..క్రమం తప్పని వ్యాయామాలు కాలక్రమేణ బలాన్ని పెంచుకోవడానికి, కొవ్వును కరిగించుకోవడానికి, ఓర్పును మెరుగుపరుచుకోవడానికి సహయాపడ్డాయి. మొదట్లో ఎక్కువ దూరం వాకింగ్ చేసేది. ఆ తర్వాత రోజుకు రెండుసార్లు వ్యాయామాలు చేసేలా జిమ్‌లో చేరింది. అక్కడ బరువైన బార్బెల్స్, స్క్వాట్స్ వంటివి చేసింది.జీవనశైలిలో మార్పులుతీవ్రమైన డైటింగ్‌కు బదులుగాచ నిలకడైన అలవాట్లపై దృష్టి పెట్టింది.మానసిక స్థైర్యంఒక్కోసారి వద్దు అనుకునే టైంలో భావోద్వేగంగా బలంగా ఉండటం ఎలాగో తెలుసుకుంది. ఎందుకు ఈ లక్ష్యం అనేది మననం చేసుకుంటూ..నిలకడగా చేస్తుండేది. ఆ తర్వాత సమర్థవంతంగా బరువు తగ్గినా.. ఎక్సెస్ స్కిన్‌తో కొంచెం ఇబ్బంది పడింది. కానీ ప్రతిపని సునాయాసంగా చేసుకునే సామర్థ్యం పెంపొందించుకోగలిగానని ఆత్మవిశ్వాసంగా చెబుతోంది. ఇక్కడ అనా కథ ఎందరికో స్ఫూర్తి. ఆమె వెయిట్‌లాస్ స్టోరీ ఆరోగ్యం అనేది మనస్తత్వంతో గాఢంగా ముడిపడి ఉంటుందనే విషయాన్ని నొక్కి చెబుతోంది. నిరంతర కృషి, మానసిక బలం స్థిరమైన అలవాట్లతో, అత్యంత సవాలుతో కూడిన వెయిట్‌లాస్ జర్నీ అద్భుతమైన ఫలితాలకు దారితీస్తుంది అనేందుకు అనానే ఉదాహరణ. గమనిక: ఇదికేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. View this post on Instagram A post shared by Ana Alonso (@ana.fitness.vsg) (చదవండి: సూపర్ స్టార్ రజనీకాంత్ పేరెంటింగ్ టిప్స్..! తండ్రిగా, హీరోగా ఎలా బ్యాలెన్స్ చేశారంటే..) -
సూపర్ స్టార్ రజనీకాంత్ పేరెంటింగ్ టిప్స్..!
తమిళ సూపర్ స్టార్, తలైవా రజినీకాంత్ అసలు పేరు శివాజీ రావు గైక్వాడ్. ఐదు దశాబ్దాలకుపైగా సుమారు 170 సినిమాల్లో నటించారు. ఇందులో కేవలం తమిళ సినిమాలు మాత్రమే కాకుండా తెలుగు, కన్నడ, మలయాళం మొదలైన భాషల సినిమాలు ఉన్నాయి. తన నటనతో, స్టైల్‌తో ఎంతోమంది అభిమానుల మనసుదోచుకున్న ఈయన ఏడు పదులు వయసుదాటినా..అభిమానులను అలరించేలా యంగ్ హీరోల మాదిరిగా స్టెప్పులు వేస్తూ నటిస్తుండటం విశేషం. సినీ పరిశ్రమలో నటుడుగా తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకోవడం తోపాటు అటు కుటుంబాన్ని బ్యాలెన్స్ చేస్తూ మంచి తండ్రిగా మన్నననలను అందుకున్నారు. రజనీకాంత్, భార్య లత దంపతులకు ఐశ్వర్య, సౌందర్య అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన కుమార్తెలు కూడా ఇప్పటికే చిత్ర పరిశ్రమలో దర్శకులుగా, నిర్మాతలుగా కళాకారిణులుగా స్థిరపడ్డారు. ఆయన ఆడిపిల్లలు అనే తారతమ్యం చూపకుండా నచ్చిన రంగంలోకి వచ్చే స్వేచ్ఛను ఇవ్వడమే కాకుండా తండ్రిగా అన్ని విధాలుగా సపోర్టు చేస్తూ..నాన్న అనే పదానికి గొప్ప అర్థం ఇచ్చారాయన. అలాంటి సూపర్‌స్టార్ నుంచి నేర్చుకోవాల్సిన పేరెంటింగ్ పాఠాలేంటో తెలుసుకుందామా..!పిల్లల వ్యక్తిత్వాన్ని గౌరవించడం..తల్లిదండ్రులు పిల్లల జీవితాన్ని నియంత్రించడానికి బదులుగా సొంత మార్గాన్ని ఎంచుకునేలా కుమార్తెలను ప్రోత్సహించారు రజనీ. ఇక్కడ పిల్లలను ఫలానా చేయమని డైరెక్షన్ ఇవ్వడం లేదా బలవంతం చేయడం వంటివి చేయకూడదు. వారి భావనలు, ఆలోచనలు, వ్యక్తిత్వాన్ని గౌరవించాలి. అందులో ఉండే సాధకబాధలు అర్థమయ్యేలా వివరించాలే తప్ప..నిర్బంధించకూడదు. ఇక్కడ మంచి తండ్రిగా రజనీ తన కుమార్తెల విషయంలో అదే చేశారు. ముఖ్యంగా పిల్లలను అర్థం చేసుకోవాలని నొక్కి చెబుతున్నారు రజనీ. పిల్లలతో సన్నిహితంగా ఉండటం..అతిముఖ్యమైన పేరెంటింగ్ పాఠం పిల్లలతో అత్యంత సాన్నిహిత్యంగా ఉండటం. ఇక్కడ నటుడు రజనీకాంత్ తన కుమార్తెలు, కుటుంబంతో చక్కటిన సత్సంబంధాలను నెరుపుతారు. తల్లిదండ్రులు పిల్లలతో మంచి కమ్యూనికేషన్ ఉంటేనే వాళ్లు తాము అత్యంత సురక్షితంగా ఉన్నామనే భావన ఏర్పడుతుంది. అలాగే తల్లిదండ్రులపై మంచి నమ్మకాన్ని ఏర్పరచుకుంటారు. స్ట్రిక్ట్‌గా ఉండటం కంటే..పిల్లలతో స్నేహపూర్వకంగా మెలిగే పెంపకమే మంచిదని చెబుతున్నారు మానసిక నిపుణులు.పిల్లల డ్రీమ్స్‌కి మద్దతివ్వండి..రజనీ కూతుళ్లు ఇద్దరు సినీ రంగాన్నే ఎంచుకున్నారు. చిత్రపరిశ్రమలో తమకంటూ మంచి కెరీర్‌ని నిర్మించుకున్నారు. రజనీకాంత్ తన పిల్లల కలలకు, ఆశయాలకు మద్దతిచ్చారు. పిల్లల కోసం అన్నీ చేయడం పెంపకం కాదు, కష్ట సమయాల్లో పిల్లలకు అండగా నిలవడం, వారి పక్కన ఉండటమే అసలైన పెంపకం. అంతేగదు పిల్లల కలలకు, ఆశయాలకు మద్దతిచ్చినప్పుడే పిల్లలు స్వతంత్రంగా, ఆత్మవిశ్వాసంతో ఎదుగుతారు. ఆధనిక తల్లిదండ్రులు నేర్చుకోవాల్సిన అతి ముఖ్యమైన పెంపక పాఠం.కుటుంబానికే తొలి ప్రాధాన్యత..అలాగే పేరెంట్స్ తమ తమ ఉద్యోగాల్లో ఎంత బిజీగా ఉన్నా..కుటుంబానికే తొలి ప్రాధాన్యత ఇవ్వాలి. ఇక్కడ సూపర్‌స్టార్ రజనీ నుంచి నేర్చుకోవాల్సిన అతి ముఖ్యమైన పేరెంటింగ్ పాఠం ఇది. ఆయన నటుడిగా బిజీగా ఉన్నా..కుటుంబంతో గడిపే సమయానికి ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తానని ఆయనే స్వయంగా పలుమార్లు చెప్పారు కూడా. కుటుంబమే లేకుంటే మనం లేం, అందువల్ల మొదటి ప్రాధాన్యత ఫ్యామిలీకే ఇవ్వండి అప్పుడే ఎందులోనైనా సక్సెస్ అవ్వగలం అని చెబుతున్నారు రజనీ. -
జస్ట్ ఆ నాలుగు జీవనశైలి మార్పులతో.. 90 నుంచి 55 కేజీల బరువు!
వెయిట్‌లాస్ అనగానే కఠినమైన ఆహారాలు, ఇష్టమైన ఫుడ్‌ని వదులుకోవడం, తీవ్రమైన వ్యాయామాలు గంటలు తరబడి చేయడం అని భావిస్తుంటారు చాలామంది. కానీ అవేమి కానేకాదు అని కొందరు అనుభవ పూర్వకంగా తెలుసుకోవడమే గాక, చాలా సింపుల్ లైఫ్‌స్టైల్స్‌తో కిలోల కొద్ది బరువు తగ్గి ఇతరులకు ప్రేరణగా నిలుస్తుంటారు. అలాంటి కోవకు చెందిందే ఈ ముంబైకి చెందిన ఇన్ఫ్లుయెన్సర్. ఇంతకీ ఆమె బరువు తగ్గడం కోసం ఎలాంటి మార్పులు జోడించిందంటే..కంటెంట్ క్రియేటర్ మల్లికా ఫతేపురియా తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా సరికొత్త వెయిట్‌లాస్ జర్నీని పంచుకున్నారు. ఒకప్పుడు తాను 90 కిలోల బరువు ఉండేదాన్ని అని , ప్రస్తుతం 55 కిలోలకు చేరి సుమారు 35 కేజీ బరువు తగ్గానని చెప్పుకొచ్చారు. అయితే తన వెయిట్‌లాస్ జర్నీలో ఏం చేసింది అనేదానికంటే..ఏం మానేశాను, వేటికి దూరంగా ఉన్నాను అనేదే ఎక్కువగా ఉంటుందని అంటోందామె.బరువు తగ్గడం కోసం..డైట్లు చేయడం:తాను కఠినమైన డైట్లు పాటించిన ప్రతిసారీ కొంత బరువు తగ్గినట్లు తగ్గి..మళ్ళీ యథావిధి బరువుకి వచ్చేసేదాన్ని అని కంటెంట్ క్రియేటర్ పంచుకున్నారు. బరువు తగ్గడాన్ని ఒక స్వల్పకాలిక లక్ష్యంగా చూడటం మానేసి, తాను పాటించగలిగే అలవాట్లపై దృష్టి పెట్టడంతో ఆమె జీవితంలో అనూహ్య మలుపు వచ్చింది.కార్బోహైడ్రేట్లను తగ్గించడంరొట్టె, అన్నం, లేదా పాస్తా వంటి ఆహారాలను పూర్తిగా మానేయడానికి బదులుగా, తక్కువ మొత్తంలో తీసుకునేలా కేర్ తీసుకున్నానని అంటోంది. ఆమె ప్రకారం, అసలు సమస్య ఈ ఆహారాలు కాదని.. సమతుల్యంగా తినడంలోనే సమస్య అంతా ఉందని అంటున్నారు.విసుగు పుట్టించే భోజనాన్ని బలవంతంగా తినడం..కఠినమైన ఆహార డైట్లు శిక్షలా మారాక..బరువు తగ్గడం కంటే..సమస్యే అధికంగా మారే అవకాశాలే ఎక్కువని అంటోంది. అందుకే ఆస్వాదించకలిగేలా భోజనాన్ని ఆరోగ్యమైన విధంగా తీసుకుంటే..ఏదో కోల్పోయానన్న భావన దరిచేరదు. హెల్దీగా, ఆనందంగా బరువు తగ్గుతాం అని అంటోంది.అతిగా వ్యాయామం చేయడంతీవ్రమైన రోజువారీ వ్యాయామాలు అవసరమని తాను భావించేదాన్ని అని మల్లిక చెప్పారు. కానీ కాలక్రమేణా, నడవడం, శక్తి శిక్షణ, క్రమం తప్పకుండా చురుకుగా ఉండటం వంటి సాధారణ విషయాలు చాలా బాగా పనిచేస్తాయని గ్రహించానని అంటున్నారామె. అంతేగాదు బరువు తగ్గడం అంటే మంచి ఆహారాన్ని వదులుకోవడం లేదా మిమ్మల్ని బాధకు గురిచేసుకోవడం వంటివి కానేకాదు అని అంటోంది. నిలకడతో సమతుల్యానికి పీటవేస్తే చాలు బరువు తగ్గడం సులభం అని అంటోంది మల్లికా.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. View this post on Instagram A post shared by Mallika Fatehpuria (@mallikafatehpuria) (చదవండి: 14 ఏళ్లకే స్కూల్ డ్రాపౌట్..కానీ ఆ ఆవిష్కరణ..!) -
మీ గరిష్ట సామర్థ్యాన్ని అందుకోవడం ఎలా?
చాలామంది తమ జీవిత కాలమంతా కేవలం అవసరాల కోసమే బ్రతుకుతారు. కొద్దిమంది మాత్రమే తమ 'గరిష్ట సామర్థ్యాన్ని' (Full Potential) అందుకుంటారు. సైకాలజీలో Abraham Maslow చెప్పిన 'Hierarchy of Needs'లో అత్యున్నత శిఖరం ఈ'Self-Actualization' (ఆత్మ సాక్షాత్కారం లేదా స్వయం పరిపూర్ణత).సెల్ఫ్-యాక్చువలైజేషన్ అంటే పర్ఫెక్ట్ గా మారిపోవడం కాదు, మీలోని 'యథార్థమైన వెర్షన్' (Authentic Version) ని ఆవిష్కరించడం. మీరు ఒక డాక్టరో, ఇంజనీరో లేదా సైకాలజిస్టో కావచ్చు.. కానీ ఆ వృత్తిలో మీరు మీ ప్రత్యేకతను (Uniqueness) ఎలా చూపిస్తున్నారు అనేదే ముఖ్యం.మాస్లో పిరమిడ్‌లో మీరు ఎక్కడ ఉన్నారు?మాస్లో ప్రకారం, మనిషికి ఐదు రకాల అవసరాలు ఉంటాయి.1. శారీరక అవసరాలు: తిండి, నిద్ర.2. భద్రత: ఇల్లు, ఉద్యోగం.3. ప్రేమ/సంబంధాలు: కుటుంబం, స్నేహితులు.4. గౌరవం (Esteem): గుర్తింపు, ఆత్మగౌరవం.5. Self-Actualization: మీ అంతిమ లక్ష్యం, సృజనాత్మకత.చాలామంది మొదటి నాలుగు మెట్ల దగ్గరే ఆగిపోతారు. మీరు ఐదో మెట్టు ఎక్కాలంటే, మీ భయాలను దాటి మీ Purpose వైపు ప్రయాణించాలి.సెల్ఫ్-యాక్చువలైజ్డ్ వ్యక్తి లక్షణాలుమీరు గరిష్ట సామర్థ్యాన్ని అందుకుంటున్నారని చెప్పడానికి కొన్ని సంకేతాలు:Reality Perception: మీరు ప్రపంచాన్ని ఉన్నది ఉన్నట్లుగా చూస్తారు, భ్రమల్లో ఉండరు.Acceptance: మిమ్మల్ని మీరు, ఇతరులను ఏ విధమైన జడ్జిమెంట్ లేకుండా అంగీకరిస్తారు.Spontaneity: మీ ఆలోచనల్లో, పనుల్లో ఒక సహజత్వం ఉంటుంది.Peak Experiences: పని చేస్తున్నప్పుడు సమయాన్ని మర్చిపోయే Flow Stateని అనుభవిస్తారు.మోటివేషన్ మాయ vs యథార్థ వికాసం"వేరే ఎవరో సాధించిన దాన్ని చూసి నువ్వు కూడా అదే సాధించు" అని మోటివేషన్ చెప్తుంది. ఇది మిమ్మల్ని 'కాపీ' గా మారుస్తుంది. కానీ సైకాలజీ, "నీ లోపల ఉన్న ప్రత్యేకమైన విత్తనం ఏంటో చూడు, అది వృక్షం అయ్యేలా చెయ్యి" అని చెప్తుంది. సెల్ఫ్-యాక్చువలైజేషన్ అంటే ఇతరులతో పోటీ పడటం కాదు, మీ నిన్నటి వెర్షన్‌ని అధిగమించడం.మీ పొటెన్షియల్‌ని అన్‌లాక్ చేయండిGenius Matrix Hubఫిలాసఫీ ప్రకారం, ఈ శిఖరాన్ని చేరే మార్గం:Step 1: Break Social Conditioning"లోకం ఏమనుకుంటుందో" అని మీ కలలను చంపుకునే ఆ పాత మనస్తత్వాన్ని 'Break' చేయండి. ఇతరుల అంచనాల కోసం కాకుండా, మీ ఆత్మ తృప్తి కోసం జీవించడం మొదలుపెట్టండి. మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకునే ఆ 'లిమిటింగ్ బిలీఫ్స్' ని తొలగించండి.Step 2: Build Purpose Driven Lifeమీకు నచ్చిన పనిని, ప్రపంచానికి అవసరమైన పనిని గుర్తించి దాన్ని 'Build' చేయండి. మీ ప్రతిభను పదును పెట్టుకోండి. ప్రతిరోజూ 1% మెరుగవ్వాలనే 'Kaizen' సూత్రాన్ని పాటించండి. మీ సామర్థ్యం పెరిగే కొద్దీ మీ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది.Step 3: Beyond Transcendenceమీరు ఒక స్థాయికి చేరాక, మీ పొటెన్షియల్ ని ఇతరుల మేలు కోసం వాడండి. మీరు కేవలం మీ కోసం కాకుండా, సమాజం కోసం ఒక 'వారసత్వాన్ని' వదిలి వెళ్ళినప్పుడే మీరు సంపూర్ణంగా సెల్ఫ్-యాక్చువలైజ్డ్ అయినట్లు. ఇదే 'Beyond' స్టేజ్.మీరు మీ పూర్తి స్థాయిలో ఉన్నారా?ఈ రోజు మీరు ఒక చిన్న విశ్లేషణ చేయండి:1. మీలో ఉన్న ఆ ఒక్క ప్రత్యేకమైన టాలెంట్ ఏంటి? దాన్ని మీరు 100% వాడుతున్నారా?2. మీకు ఏ పనులు చేస్తున్నప్పుడు సమయాన్ని మర్చిపోతున్నారు? (Flow State)3. మీరు చనిపోయిన తర్వాత, జనం మిమ్మల్ని ఏమని గుర్తుంచుకోవాలి అని కోరుకుంటున్నారు?మీరే ఒక మాస్టర్ పీస్!బ్రో, ప్రతి విత్తనంలో ఒక అడవి దాగి ఉంటుంది. అలాగే మీలో ఒక అసాధారణమైన శక్తి ఉంది. దాన్ని బయటకు తీయడమే మీ జీవిత లక్ష్యం కావాలి. సెల్ఫ్-యాక్చువలైజేషన్ అనేది ఒక పాయింట్ కాదు, అది ఒక ప్రయాణం. ఆ ప్రయాణంలో మీరు ఎంత ఎదిగితే, ప్రపంచం అంత వెలుగుతుంది."What a man can be, he must be."- Abraham Maslow సైకాలజిస్ట్ విశేష్ Genius Matrix Hub 8019 000066www.psyvisesh.com(చదవండి: మీ వ్యక్తిత్వాన్ని చంపేసే మనుషులకు దూరంగా..) -
మనుషులతో ఎలా కనెక్ట్ అవ్వాలి?
చాలామందికి నెట్వర్కింగ్ అంటేనే ఒక రకమైన విరక్తి. ఎందుకంటే అందులో కృత్రిమమైన నవ్వులు (Fake Smiles), అవసరం కోసం చేసే పొగడ్తలు ఉంటాయని భయపడతారు. కానీ, నిజమైన నెట్వర్కింగ్ అంటే మీ ముసుగును తీసివేసి, మీ సహజత్వంతో (Authenticity) ఎదుటివారిని ఆకట్టుకోవడం.మనుషులు 'ఫేక్'ని కనిపెట్టడంలో చాలా దిట్ట. మీరు పళ్ళు ఇరవదీసి నవ్వినా, లోపల ఏదో ఆశిస్తున్నారని వారికి అర్థమైపోతుంది. నెట్వర్కింగ్ అనేది ఒక 'బిజినెస్ డీల్' కాదు, అది ఒక 'హ్యూమన్ కనెక్షన్'. మీరు మీలా ఉంటూనే ప్రపంచాన్ని ఎలా ప్రభావితం చేయవచ్చో చూద్దాం.'The Power of Being Real…సైకాలజీలో 'Pratfall Effect' అనే కాన్సెప్ట్ ఉంది. దీని ప్రకారం, మనుషులు పర్ఫెక్ట్గా ఉండేవారి కంటే, చిన్న చిన్న లోపాలు ఉండి సహజంగా ఉండేవారిని ఎక్కువగా ఇష్టపడతారు.అందువల్ల మీరు అంతా తెలిసినట్టు నటించనవసరం లేదు. "నాకు ఈ విషయం తెలియదు, మీరు వివరిస్తారా?" అని అడగడం కూడా ఒక అద్భుతమైన కనెక్టింగ్ టూల్. ఇది ఎదుటివారికి 'వాల్యూ' ఇస్తుంది.Curiosity Over Presentationనెట్వర్కింగ్ ఈవెంట్లలో చాలామంది "నేను నా గురించి ఏం చెప్పాలి?" అని టెన్షన్ పడతారు. కానీ అసలైన టెక్నిక్ ఏంటంటే, మీ గురించి చెప్పడం తగ్గించి, ఎదుటివారి గురించి అడగడం పెంచండి.ఒక వ్యక్తిని కలిసినప్పుడు "మీరు ఏం చేస్తారు?" అనే రొటీన్ ప్రశ్న కంటే, "ప్రస్తుతం మీరు ఏ ప్రాజెక్ట్ గురించి ఎక్సైటెడ్ గా ఉన్నారు?" లేదా "మీ ప్రయాణం ఎలా మొదలైంది?" అని అడగండి.మీరు వారిపై చూపే 'నిజమైన ఆసక్తి' (Genuine Interest) వెయ్యి నవ్వుల కంటే ఎక్కువ ప్రభావం చూపుతుంది.మోటివేషన్ మాయ vs సహజ సిద్ధాంతం"అందరితో కలవాలి, అందరికీ కార్డులు ఇవ్వాలి, అందరినీ ఇంప్రెస్ చేయాలి" అని మోటివేషన్ స్పీకర్లు చెప్తారు. దీనివల్ల ఒత్తిడి పెరుగుతుంది. ఇది మిమ్మల్ని అలసిపోయేలా చేస్తుంది."వందమందిని కలవనక్కర్లేదు. ముగ్గురిని కలిసినా, వారితో లోతైన కనెక్షన్ ఏర్పరచుకో" అని సైకాలజీ చెప్తుంది. క్వాంటిటీ కంటే క్వాలిటీ ముఖ్యం.సహజమైన కనెక్షన్ బిల్డింగ్Genius Matrix Hub ఫిలాసఫీ ప్రకారం, ముసుగులు లేని నెట్వర్కింగ్ ఇలా ఉంటుంది.Step 1: ఇంప్రెస్ చేయాలనే తపన తగ్గించుకోండిఎదుటివారిని మెప్పించాలి లేదా వారిని బురిడీ కొట్టించాలి అనే ఆలోచనను 'Break' చేయండి. మీరు ఎవరికైనా ఏదైనా 'అమ్మడానికి' వెళ్లడం లేదు, ఒక 'సంబంధాన్ని' నిర్మించడానికి వెళ్తున్నారు. ఆ ఒత్తిడి పోతే మీ ముఖంలో సహజమైన ప్రశాంతత వస్తుంది.Step 2: Build Common Groundమీకు, అవతలి వ్యక్తికి మధ్య ఉన్న పోలికలను వెతకండి. అది ఒక హాబీ కావచ్చు, ఒక ఊరు కావచ్చు, లేదా ఒకే రకమైన సమస్య కావచ్చు. మనుషులు తమలాంటి వారితో కనెక్ట్ అవ్వడానికి ఇష్టపడతారు. దీనికి నకిలీ నవ్వులు అవసరం లేదు, కేవలం Observation ఉంటే చాలు.Step 3: Beyond (నిస్వార్థ సహాయం - Selfless Value)కనెక్షన్ ఏర్పడిన తర్వాత, "నేను వారికి ఎలా సహాయపడగలను?" అని ఆలోచించండి. వారికి ఒక మంచి కాంటాక్ట్ ఇవ్వడం లేదా ఒక ఉపయోగపడే సమాచారాన్ని షేర్ చేయడం చేయండి. మీరు ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేసినప్పుడు, ఆ కనెక్షన్ జీవితకాలం నిలుస్తుంది. ఇదే 'Beyond' స్టేజ్.మీ కనెక్షన్స్ ఎంత నిజం?ఈ రోజు మీరు ఒక చిన్న విశ్లేషణ చేయండి.1. మీ కాంటాక్ట్ లిస్ట్ లో ఉన్న వారిలో, ఎంతమందితో మీరు కేవలం అవసరం లేకుండా పలకరిస్తారు?2. మీరు కొత్తవారిని కలిసినప్పుడు మీ గురించి గొప్పలు చెప్పుకుంటున్నారా లేక వారి గురించి వింటున్నారా?3. మీరు మాట్లాడేటప్పుడు మీ నవ్వు మనస్ఫూర్తిగా వస్తోందా లేక అది ఒక 'డ్యూటీ' లా అనిపిస్తోందా?సహజత్వమే మీ అసలైన బ్రాండ్!బ్రో, ప్రపంచం నకిలీలతో నిండిపోయింది. అక్కడ మీరు మీలా 'ఒరిజినల్' గా ఉండటమే అతిపెద్ద ఆకర్షణ. ఫేక్ స్మైల్స్ అవసరం లేదు, మీ కళ్ళలో నిజాయితీ ఉంటే చాలు. మనుషులు మీ తెలివితేటల కంటే మీ వైబ్ తోనే ఎక్కువగా కనెక్ట్ అవుతారు."Be yourself; everyone else is already taken." - Oscar Wild సైకాలజిస్ట్ విశేష్ Genius Matrix Hub 8019 000066www.psyvisesh.com -
హీరో వరుణ్ ధావన్ కుమార్తెకు డీడీహెచ్..? ఎందువల్ల వస్తుందంటే..
బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన విలక్షణమైన నటనతో వేలాదిమంది అభిమానులను సంపాదించుకున్న క్రేజీ హీరో. ధావన్ ఇటీవల అనురాగ్ సింగ్ దర్శకత్వంలో వచ్చిన ‘బోర్డర్ 2’ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్నారు. ఇటీవల ఆయన తన కుమార్తె లారాకు సంబంధించిన వ్యాధి గురించి ఓ ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నారు. అంతేగాదు ఆయన దీనిపై ఓ పుస్తకం కూడా రాయాలనకుంటున్నా అంటూ చాలా భావోద్వేగంగా ఆ వ్యాధి గురించి వివరించారిలా.హీరో వరుణ్ ధావన్ తన కుమార్తె లారాకు డెవలప్మెంటల్ డిస్ప్లాసియా ఆఫ్ ది హిప్(DDH) అనే చలన సంబంధిత సమస్య ఉన్నట్లు నిర్ధారణ అయిందని వెల్లడించారు. ఈ వ్యాధిని ముందుగానే గుర్తించడంతో లారా కోలుకోవడానికి సహాయపడిందని ధావన్ తెలిపారు. ఆమెకు ఒకటిన్నర సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు, DHH (డెవలప్మెంటల్ హిప్ డిస్ప్లాసియా) ఉన్నట్లు నిర్ధారణ అయిందని చెప్పారు. అంటే, తుంటి ఎముక సాకెట్ నుంచి జారిపోవడం. ఒక కాలు మరొక కాలు కంటే పొడవుగా పెరుగుతుంది, దీనివల్ల నడవడం చాలా కష్టమవుతుందని అన్నారు. అంటే వాళ్లు సరిగ్గా పరిగెత్తలేరు, నడవలేరు అని చెప్పుకొచ్చారు. దీన్ని పాశ్చాత్య దేశాలలో పుట్టినప్పుడే దీనిని సరిగ్గా నిర్ధారిస్తారు, కానీ భారతదేశంలో అలా కాదని అన్నారు. అయితే తన కూతురికి శస్త్ర చికిత్స చేయావలసిన అవసరం రాలేదన్నారు. ఒకే ప్రక్రియతో ఎముకను తిరిగి యథాస్థానంలోకి పెట్టగలిగారు. ఆమెకు స్పైకా కాస్ట్ వేయాల్సి వచ్చింది. దీనివల్ల ఆ చిన్నారి రెండున్నర నెలల పాటు ప్లాస్టర్ కట్టులో ఉండాలి. ఇది చాలా కష్టం. బిడ్డకు మత్తుమందు ఇచ్చి, ఆ తర్వాత ఆమె ప్లాస్టర్ కట్టుతోనే మేల్కొంటుందని చెప్పారు. అయితే ప్రస్తుతం ప్లాస్టర్ తీసేశారని అన్నారు. తాను దీనిపై పుస్తకం కూడా రాయాలని అనుకుంటున్నట్లు తెలిపారు. హిప్ డెవలప్మెంటల్ డిస్ప్లాసియా(DDH)అంటే..DDH అనేది శిశువులు,చిన్నపిల్లలలో తుంటిలోని 'బాల్ అండ్ సాకెట్' కీలు సరిగ్గా అమరని ఒక పరిస్థితి. సాధారణ పిల్లలలో, తుంటి కీలు తొడ ఎముకను కటి ఎముకకు కలుపుతుంది. తొడ ఎముక పైభాగం బంతిలా గుండ్రంగా ఉండి, గిన్నె ఆకారంలో ఉండే తుంటి సాకెట్ లోపల అమరి ఉంటుంది.అయితే, DDH ఉన్న పిల్లలలో, తుంటి సాకెట్ చాలా లోతు తక్కువగా ఉంటుంది మరియు తొడ ఎముక తల గట్టిగా పట్టుకోబడదు. అందువల్ల, తుంటి కీలు వదులుగా ఉంటుంది. కొన్ని పరిస్థితులలో తొడ ఎముక సాకెట్ నుంచి బయటకు కూడా రావచ్చు, దీనివల్ల కీలు తప్పిపోతుంది (డిస్లోకేషన్). శారీరక పరీక్ష సమయంలో ఎముకను సాకెట్లో కదిలించవచ్చు, కానీ అది స్థానభ్రంశం చెందదు.కారణాలుఈ పరిస్థితి ఒకటి లేదా రెండు తుంటి కీళ్లలో సంభవించవచ్చు.అయితే, ఇది సాధారణంగా ఎడమ తుంటి కీలులో ఎక్కువగా కనిపిస్తుంది. DDH వచ్చే ప్రమాదాన్ని పెంచే కొన్ని కారకాలు ఉన్నాయి.అమ్మాయిలుమొదటి సంతానంకుటుంబాలలో చిన్నతనంలో తుంటి సమస్యలు ఉన్నవారు (తల్లిదండ్రులు, సోదరులు లేదా సోదరీమణులు)గర్భధారణ 28 వారాల తర్వాత బ్రీచ్ పొజిషన్లో (పాదాలు లేదా పిరుదులు క్రిందికి) జన్మించిన శిశువులులక్షణాలుతుంటి కీలు తప్పిన కొంతమంది శిశువులలో బయటకు ఎటువంటి లక్షణాలు కనిపించవు. అయితే, శిశువుకు ఈ క్రింది లక్షణాలు ఉంటే తక్షణమే వైద్యుడిని సంప్రదించండి.కాళ్ళు వేర్వేరు పొడవులలో ఉండటంతొడపై అసమాన చర్మపు మడతలుఒక వైపు కదలిక లేదా వశ్యత తక్కువగా ఉండటంకుంటుతూ నడవడం, కాలి వేళ్ళపై నడవడం, లేదా తూలుతూ నడవడంనిర్ధారణNHS ప్రకారం, శిశువు పుట్టిన 72 గంటలలోపు లేదా 6 నుంచి 8 వారాల వయస్సులో గుర్తిస్తారు. సాధారణంగా నవజాత శిశువుల శారీరక పరీక్షలో భాగంగా వారి తుంటిని తనిఖీ చేస్తారు. ఈ పరీక్షలో, ఏవైనా సమస్యలు ఉన్నాయేమో చూడటానికి శిశువు తుంటి కీళ్ళను సున్నితంగా కదిలించడం కూడా ఉంటుంది.ఒకవేళ డాక్టర్, బిడ్డ తుంటి అస్థిరంగా ఉందని భావిస్తే, 4 నుంచి 6 వారాల వయస్సు మధ్యలో వారి తుంటికి అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించాలి.కుటుంబ చరిత్రలో లేదా చిన్నతనంలో తుంటికి సంబంధించిన సమస్యలు ఉండి ఉంటేగర్భధారణ 28 వారాల తర్వాత బిడ్డ బ్రీచ్ పొజిషన్లో (కాళ్ళు లేదా పిరుదులు కిందికి ఉండేలా) జన్మించి ఉంటేకవలలు లేదా అంతకంటే ఎక్కువ మంది శిశువులు పుట్టి, వారిలో ఒక శిశువు బ్రీచ్ పొజిషన్లో ఉంటే, ప్రతి శిశువుకు 4 నుంచి6 వారాల వయస్సు వచ్చేసరికి వారి తుంటికి అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించాలి.ఎదురయ్యే సమస్యలు..నడవడంలో ఇబ్బందులు, ఉదాహరణకు కుంటి నడకనొప్పితుంటి, వెన్నుపూసల ఆస్టియో ఆర్థరైటిస్సకాలంలో వ్యాధిని గుర్తించి చికిత్స అందిస్తే, పిల్లలకు శస్త్రచికిత్స అవసరం తక్కువగా ఉంటుందని, వారు సాధారణంగా ఎదిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని వైద్య నిపుణుల చెబుతున్నారు. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: ఆ వ్యాయామ మెషీన్‌తో 113 కిలోల నుంచి 90కిలోలు..! ఆ సర్జరీ సైతం..) -
సద్గురు పేరెంటింగ్ సలహా..! నటి అలియా భట్ రియాక్షన్..
బాలీవుడ్‌లోని అత్యంత ప్రజాదరణ పొందిన సెలబ్రిటీ కపుల్ అలియా భట్, రణబీర్ కపూర్లు. 'బ్రహ్మాస్త్ర' సినిమా షూటింగ్ సమయంలో ప్రేమలో పడిన వీరు, ఐదేళ్ల డేటింగ్ అనంతరం ఏప్రిల్ 14, 2022న వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు రాహా అనే కుమార్తె ఉంది. అయితే అలియా ఇటీవల చెన్నైలో JITO చెన్నై ప్లస్ (జైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్) నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ 'ఇన్ కన్వర్సేషన్ విత్ ది మిస్టిక్' పేరుతో జరిగిన ఈ కార్యక్రమంలో అలియా భట్, సద్గురు ఆధ్యాత్మిక సంభాషణలలో పాల్గొన్నారు. అక్కడ ఆమె సద్గురుని పిల్లల పెంపకంపై సలహా కోరుతూ ఆయనను ఇలా అడిగారు. "తాము మంచి తల్లిదండ్రులుగా ఉంటున్నామో లేదో అని ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులకు మీరు ఇచ్చే ఒకే ఒక్క సలహా ఏమిటి?" అని సూటిగా ప్రశ్నించారు. ఆయన నవ్వుతూ, "ఆందోళన చెందే తల్లిదండ్రులు మంచి తల్లిదండ్రులు కారు" అని అన్నారు. ఆ మాటకు అలియా వెంటనే నవ్వులు చిందించారు. ఆ తర్వాత ఆధ్యాత్మిక గురువు అలియా భట్‌ను తన బిడ్డ గురించి ఎక్కువగా ఆందోళన చెందవద్దని హెచ్చరించారు. అలాగే ఆందోళన చెందడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని సూచించారు కూడా. ఆయన సలహాకు అక్కడ ఉన్న ప్రేక్షకులు కూడా పగలబడి నవ్వారు. కాసేపటి తర్వాత అలియా పిల్లల పెంపకం విషయంలో ఆందోళనను పక్కన పెట్టగలమని అస్సలు అనుకోలేనన్నారు. సద్గురు మీరు కూడా దీన్ని అంగీకరిస్తారనే అనుకుంటున్నా అని నవ్వుతూ అన్నారామె. రాహా పుట్టినప్పుడు, అలియా భట్, రణబీర్ కపూర్ దంపతులు ఆమె ఫోటోలు తీయవద్దని పాపరాజీలను కోరారు. నిజానికి, వారు చాలా కాలం పాటు ఆమె ముఖాన్ని అత్యంత గోప్యంగా ఉంచారు. కాగా, ఆలియా కెరీర్ పరంగా 'ఆల్ఫా', 'లవ్ అండ్ వార్' చిత్రాలలో కనిపించనున్నారు. ఈ రెండు సినిమాలు కూడా ఈ ఏడాదే విడుదల కానున్నాయి.Truly excited to see Sadhguru ji and alia Bhat’s full conversation pic.twitter.com/mCJF3pm0r9— SgInclusive (@SgInclusivess) March 27, 2026 (చదవండి: కాలులో ఆకస్మికంగా భరించలేని నొప్పి..క్షణాల్లో ప్రాణాంతకంగా మారి..) -
'ధురంధర్ 2' కోసం రణవీర్ సింగ్ ఆరు వారాల్లోనే ఏకంగా పదికిలోలు..!
రణ్వీర్ సింగ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ 'ధురంధర్ 2' మూవీ రికార్డు రేంజ్ కలెక్షన్లతో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. మార్చి 19న ప్రారంభమైన వసూళ్ల వేట ఐదురోజుల వరకు అలానే కొనసాగుతూ వెళ్తోందంటే ఆ సినిమా క్రేజ్ ఏ రేంజ్లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా ఈ మూవీలో స్పై హంజా అలీ మజారిగా నటించిన రణవీర్ సింగ్ ఈ పాత్ర కోసం ఎంతలా కష్టపడ్డారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ పాత్రలో ఒదిగిపోయేలా క్రూరంగా కనిపించేందుకు చాలా తక్కువ టైంలోనే పదికిలోలు పైనే బరువు పెరిగారట. విలక్షణ పాత్రలతో అభిమానులను మెప్పించే రణవీర్ ఫిజిక్ పరంగా చాలా కేర్ తీసుకుంటారట. అది కూడా ఆరోగ్యకరమైన రీతీలోను ఉంటుందని, ఎలాంటి షార్టకట్లు ఫాలో అవ్వరని చెబుతున్నాడు అతని ఫిట్నెస్ కోచ్. అంత తక్కువ వ్యవధిలో రణవీర్ శరీరాన్ని అంతలా ఎలా మార్చగలిగాడో తెలుసుకుందామా..!.గత కొన్నేళ్లుగా, నటుడిగా రణవీర్ సింగ్ విలక్షణమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించారు. ముఖ్యంగా 'ధురంధర్: ది రివెంజ్' చిత్రంలో ఆయన నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అంతలా అభిమానులను కట్టిపడేసేలా తెరపై ఆ పాత్రను పండించడం కోసం రణవీర్ ఎంతలా కష్టపడ్డారో వింటే నోటమాట రాదు. ఆ విషయాన్ని స్వయంగా ఆ మూవీలో నటించని సహనటుడు, సెలబ్రిటీ ఫిట్నెస్ కోచ్ ముస్తఫా అహ్మద్ వెల్లడించారు. ఆయన 'ధురంధర్: ది రివెంజ్'లో రిజ్వాన్ షా పాత్రలో ఒదిగిపోయారు. ఫిట్నెస్ కోచ్ ముస్తఫా రణవీర్ సింగ్ తెరపై క్రూరంగా కనిపంచడం కోసం కేవలం ఆరు వారాల్లోనే పదికిలోల బరువు పెరిగారట. నిజానికి షూటింగ్ చేసే సమయం తక్కవు ఉండటంతో చాలా తక్కువ వ్యవధిలోనే రణవీర్‌సింగ్ బరువు పెరగక తప్పని పరిస్థితని చెప్పుకొచ్చారు. రణవీర్ దాదాపు పదికిలోలు దాక పెరగాల్సి ఉంది. అయితే ఆ టైంకి రణవీర్ బరువు కేవలం 76 నుంచి 77 కిలోలు ఉన్నట్లు తెలిపారు. అయితే షూటింగ్ ప్రారంభమయ్యే సమయానికి రణవీర్ ఏకంగా 87-88 కిలోలకు చేరి అందర్నీ ఆశ్చర్యపరిచారు. అన్నింటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే రణవీర్‌కి ఏ పని అప్పగించినా ఓ యంత్రంలా చేసేస్తారని అంటున్నాడు కోచ్ ముస్తఫా. తాను రోజుకు 3,000-3,600 కేలరీలు తీసుకుంటుండగా, రణ్వీర్ తీసుకునేది రోజుకు 3,600 నుండి 4,000 కేలరీలు. అందులో ఎక్కువ భాగం 600-700 కేలరీలు ప్రోటీన్ షేక్‌ల నుంచే ఎక్కువగా తీసుకుంటున్నారు. అంటే రోజుకు రెండు ప్రోటీన్ షేక్‌లు, 240 గ్రాముల ప్రోటీన్ కోసం చికెన్, మటన్ ఎక్కువుగా తీసుకునేవాడట. View this post on Instagram A post shared by Mustafa Ahmed (@mustafa_thebull_ahmed) తాను ఆరువారాల్లో కేవలం రెండు నెలలు మాత్రమే ట్రైన్ చేశానని, మిగతా మొత్త ఆయన స్వయంగా కేర్ తీసుకున్నదేనని అంటున్నాడు. షూటింగ్ షెడ్యూల్ రీత్యా పూర్తి స్థాయిలో ఆయనకు శిక్షణ ఇవ్వకపోయినా రణవీర్ తన పాత్ర బాగా కనిపించాలనే ఉద్దేశ్యతో చాలా జాగ్రత్తతు తీసుకుంటారని, ఆ విషయంలో ఆయనకు సాటిరారెవ్వరూ అని ప్రశంసిస్తున్నాడు. శ్వాసను మెరుగుపరుచుకుంటూ..వెయిట్ ట్రైనింగ్ చేస్తాడు. చాలామంది శరీరం కండలు తిరిగిన దేహంలా కనిపించేలా చేస్తే..ఆయన మాత్రం బలంతో కూడిన కండరాల కోసం ప్రయత్నిస్తాడని అన్నారు. తెరపై అతడు చాలా సమర్థుడైన వ్యక్తిలా కనిపించేందుకు భోజన విరామ సమయంలో సైతం వెయిట్ ట్రైనింగ్ చేసేవాడని అన్నారు. అలా చేస్తే ఫిట్నెస్ కోచ్‌కి ట్రైనింగ్ సులభతరం అవుతుందని చెబుతున్నాడు. ఇక్కడ రణవీర్ ఫిట్నెస్ నిపుణుల పర్యవేక్షణలో చాలా ఆరోగ్యకరమైన రీతీలోనే బరువు పెరిగారనేది గ్రహించాల్సిన ముఖ్యమైన విషయం. కాగా, రణవీర్ సింగ్, ముస్తఫా ఈ మూవీ కోసం దాదాపు 16 నుంచి 18 గంటలు చిత్రీకరణలో పాల్గొన్నారట.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యలు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. View this post on Instagram A post shared by Mustafa Ahmed (@mustafa_thebull_ahmed) (చదవండి: కూరగాయలు అమ్ముతూ.. కోట్లకు పడగలెత్తిన యువకుడు!) -
దంపతుల ఫిట్నెస్ కోసం..! మిలింద్ సోమన్ టిప్స్
భారత్‌లో ఫిట్నెస్ అందరికీ అందుబాటులో ఉండేలా అవగాహన కల్పిచే వ్యక్తుల్లో ప్రముఖులు మిలింద్ సోమన్. ఆయన 90వ దశకపు పాప్ సంస్కృతికి ప్రతీకగా నిలిచిన వ్యక్తి నుంచి..ఎండ్యూరెన్స్ స్పోర్ట్స్‌కు పోస్టర్ బాయ్‌గా మారే వరకు సోమన్ ప్రయాణం..కండరాల నిర్మాణం కంటే..క్రమశిక్షణకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఆయన చేసే మారథాన్లు, లాంగ్ వాక్‌లు అన్ని ఆర్భాటానికి తావివ్వకుండా చెప్పులు కూడా లేకుండా నిశబ్దంగా సాగుతాయి. అలాంటి సోమన్ దంపతులు హెల్దీ లైఫ్‌ని లీడ్ చేయాలంటే ఆహరంతో కాకుండా, కదలికలతో బంధాన్ని ఏర్పాటు చేసుకోండి అని పిలుపునిస్తూ..పలు ఆసక్తికర ఫిట్నెస్ సలహాలు ఇచ్చారు. అవేంటంటే..సోమన్ దృష్టిలో, ఫిట్నెస్ అంటే ఒకేసారి చేసే వ్యాయామాలు లేదా ఒకే రకమైన దినచర్యలు కాదని అంటారు. ఇది ఉమ్మడి లక్ష్యానికి సంబంధించినదిగా చేసుకుంటే దంపతులు ఇరువురు ఆరోగ్యంగా ఉంటారని చెబుతున్నారు. జంటలు కలసి వ్యాయామాలకు సంబంధించి..సింపుల్ వాటిని ఎంచుకుంటూ సాగితే..వారి మధ్య బంధం మరింత బలపడుతుందని అంటున్నారు. అంతేగాదు జీవితం నుంచి ఇరువురు ఏం ఆశిస్తున్నారో ఇద్దరికీ స్పష్టత వస్తుంది. ఇక్కడ సోమన్ తాను ఎక్కువసేపు శ్రమించే కార్యకలాపాలవైపు మొగ్గు చూపితే..ఆమె యోగా ద్వారా ప్రశాంతతను తీసుకువస్తుందట. ఈ వైరుధ్యం వారిని విభజించకుండా, ఇద్దరి విధానాలను మరింతగా బలపరించిందని చెబుతున్నారు సోమన్. ప్రతిసారి ఒకే వర్కౌట్లని చేయడం కాదు, ఆరోగ్యంగా ఉండటానికి ఒకరి విధానాన్ని మరొకరు గౌరవించుకోవడం ముఖ్యం. View this post on Instagram A post shared by Milind Usha Soman (@milindrunning) జంక్ ఫుడ్ డేట్స్‌కు అతీతంగాచాలామటుకు దంపతులు భోజనానికి బయట ప్రాధాన్యత ఇస్తారు. అర్థారాత్రి వరకు చిరుతిండ్లు తినడం, వారాంతపు విలాసాలతో బిజీగా ఉంటారు. అయితే దంపతులు ఈ అలవాట్లను శారీరక కార్యకలాపాలతో భర్తీ చేస్తే..ఇద్దరి ఆరోగ్యానికి ఎంత మేలు చేకూరుతుందని పిలుపునిస్తున్నారు. అవి సరదా సరదాగా సాగే విహారయాత్రలు, వాకింగ్, ఈత కొట్టడం, తదితర మార్గాల్లో కొత్తదనంతో కూడిన వ్యాయామ కదలికలను అన్వేషించాలి. ఇవి శారీరక మానిసిక ఆరోగ్యాన్ని బలోపేతం చేసే మంచి అలవాట్లకు మారతాయట. ఈ జీవనశైలితో జంటలు మరింత బలంగా, సంతోషంగా, పైగా ఒకరికొకరు అనేలా అనుబంధంగా ఉంటారని బలంగా నమ్ముతానని చెబుతున్నారు సోమన్. సోమన్ ఫిట్నెస్..తరచుగా ఫిట్నెస్ ఐకాన్‌గా పిలిచే సోమన్ దినచర్య ఎంతమాత్రం కఠినంగా ఉండదు. ఆయన జిమ్‌కి వెళ్లరు, పర్సనల్ ట్రైనర్ కూడా లేరు. కానీ కొన్ని వారాలు లేదా మూడు, నాలుగుసార్లు పరుగెట్టడం, మరికొన్ని వారాలు అస్సలు పరిగెత్తకుండా ఉంటారు. తీవ్రత వ్యాయామాల కంటే..నిలకడకు ప్రాధాన్యత ఇస్తారు సోమన్. ఎక్కువగా పుష్-అప్స్, స్క్వాట్స్, ప్లాంక్స్ వంటి ప్రాథమిక వ్యాయామాలు చేస్తుంటారు. ప్రయాణిస్తున్నప్పుడూ కూడా కదలకలు ఉండేలా చూసుకుంటారాయన.ఫిట్నెస్ ప్రయాణంపై మహిళలకు సూచనలు..బిజీగా ఉండే పట్టణ జీవనశైలిలో ఉన్న మహిళలకు సోమన్ ఆచరణాత్మకమైన సలహాలందించారు. అవేంటంటే..మూడు కిలోల మీటర్ల దూరం నుంచి క్రమంగా ఐదు లేదా పది కిలోమీటర్లకు నడక పెంచడం. అలాగే అతివేగంగా వ్యాయామాలు చేయొద్దని సూచించారు. అన్నింటికంటే నిలకడను నేర్చుకోమని చెబుతున్నారు. తాను తొమ్మిదేళ్ల వయసులో జాతీయ స్థాయి ఈతగాడిగా లైఫ్‌ని ప్రారంభించి..కదలికల చుట్టూ కేంద్రీకృతమైన జీవితానికి పునాది వేశానని చెబుతున్నారు. ఆయన క్రీడాకారుడి నుంచి సూపర్‌మోడల్‌గా, చివరికి ఫిట్నెస్ కోసం బహిరంగంగా ప్రచారం చేసే వ్యక్తిగా మారడం వరకు చూస్తే..అదంగా అసాధారణంగా కనిపిస్తుందని అన్నారు. సోమన్ దార్శనికతను ప్రతిబింబించే కార్యక్రమం ఏదైనా ఉందంటే అది పింకాథాన్ మాత్రమే. కేవలం మహిళల కోసం ఒక పరుగు పోటీగా ప్రారంభమైన ఇది, క్రమంగా మహిళలు తమ ఆరోగ్యానికి ప్రాధాన్యతనిచ్చేలా ప్రోత్సహించే ఒక దేశవ్యాప్త ఉద్యమంగా రూపుదిద్దుకోవడం విశేషం.మొదటిసారి పరుగెత్తేవారి నుంచి దృష్టి లోపం ఉన్నవారి వరకు, పసిపిల్లలతో పరుగెత్తే తల్లుల నుంచి చీరలు కట్టుకున్న అమ్మమ్మల వరకు, ఫిట్నెస్ ఎవరి కోసం అనే మూస ధోరణులను పింకాథాన్ నిరంతరం సవాలు చేస్తూ వస్తోంది.దాని ఎదుగుదల కూడా అంతే స్పష్టంగా ఉంది. వివిధ నగరాల్లో పాల్గొనేవారి సంఖ్య పెరగడంతో, వేలాది మంది మహిళలు ఇందులో చేరడంతో, ఈ కార్యక్రమం కేవలం ఒక మారథాన్ స్థాయిని దాటిపోయింది. ఇది ఇప్పుడు శారీరక, మానసిక, భావోద్వేగ శ్రేయస్సును ప్రోత్సహించే ఒక సమాజంగా మారింది. View this post on Instagram A post shared by Milind Usha Soman (@milindrunning) (చదవండి: పూనకాలకు కారణం ఏంటో తెలుసా..!) -
ఇండియాలోనే స్విట్జర్లాండ్
లడఖ్ ప్రాంతం సమ్మర్లో ప్రత్యేక దృశ్యాన్ని అందిస్తుంది. హిమాలయాల కొండల మధ్య ఉన్న లోయలు, మోనాస్టరీస్ మధ్య నడిచే ప్రయాణం ప్రకృతి సౌందర్యాన్ని అద్భుతంగా చూపిస్తుంది. ఉదయం వేళలో పర్వతాలపై పడే సూర్యకిరణాలు చుట్టుపక్కల ప్రాంతాలను బంగారు రంగులోకి మార్చేస్తాయి.గ్రామాల మధ్య జీవనంచిన్న గ్రామాల్లో ప్రజల జీవనం ప్రకృతి రిథమ్‌తో కలిసి నడుస్తుంది. వీధుల్లో నడిచే ప్రజలు, మోనాస్టరీస్ పక్కన కనిపించే ప్రశాంత వాతావరణం ప్రయాణికులకు ఒక ప్రత్యేకమైన అనుభూతిని అందిస్తుంది. హిమాలయన్ గాలులు, దూరంగా కనిపించే మంచు పర్వతాలు ఈ ప్రదేశాన్ని మరింత ప్రత్యేకంగా నిలబెడుతాయి.హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి?హైదరాబాద్ నుండి ముందుగా వాయు మార్గంలో లేదా ట్రైన్ ద్వారా ఢిల్లీకి చేరుకోవాలి. అక్కడి నుంచి లేహ్‌కి డైరెక్ట్ ఫ్లైట్ వెళ్లవచ్చు. లేహ్ విమానాశ్రయం నుండి ప్రయాణం ప్రారంభమైన తర్వాత హిమాలయాల మధ్య రోడ్ జర్నీ ఒక అద్భుత అనుభవాన్ని అందిస్తుంది. జీరో వాలీ అనే ప్రదేశం అరుణాచల్ ప్రదేశ్‌లో ఉన్న ఒక అందమైన లోయ. ఈస్టర్న్ హిమాలయాస్ కొండల మధ్యలో ఉన్న ఈ ప్రదేశం సమ్మర్లో పచ్చని రంగులతో కనిపిస్తుంది. వ్యాలీ మధ్య స్ప్రెడ్ అయిన పాడీ ఫీల్డ్స్, ఫారెస్ట్ ప్రాంతం ఈ ప్రదేశాన్ని ఒక నేచురల్ కాన్వాస్‌లా మార్చేస్తాయి. ఉదయ సమయంలో వ్యాలీ మీద పడే సాఫ్ట్ వెలుగు చుట్టూ ఉన్న హిల్స్‌ని మరింత అందంగా చూపిస్తుంది. మేఘాలు కొండల మధ్య నెమ్మదిగా సాగుతుంటే, ఈ ప్రదేశం మొత్తం ఒక ప్రశాంతమైన మరో లోకంలో విహరిస్తున్నట్టు అనిపిస్తుంది.అపాతాని సంస్కృతిజీరో వాలీలో జీవించే అపాతాని ట్రైబ్ ప్రజల జీవనం ప్రకృతితో కలిసి నడుస్తుంది. విలేజెస్ మధ్య కనిపించే బాంబూ హౌజెస్, పాడీ ఫీల్డ్స్ మధ్య ఉన్న ఫుట్‌పాత్స్ ఈ ప్రదేశంలో లైఫ్ రిథమ్ ఎలా ఉంటుందో చూపిస్తాయి. స్థానిక మార్కెట్లలో ప్రజలు సమయం గడపడం, వ్యాలీ మధ్యలో కనిపించే గ్రామాలు ఈ ప్రయాణాన్ని ఒక కల్చరల్ అనుభవంగా మార్చేస్తాయి. సమ్మర్ సీజన్లో వ్యాలీలో పచ్చని రంగులు మరింత విస్తృతంగా కనిపిస్తాయి.హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి?హైదరాబాద్ నుంచి ముందుగా అస్సాంలోని గౌహతి వరకు వాయు మార్గంలో చేరుకోవచ్చు. అక్కడి నుండి రోడ్డు మార్గంలో జీరో వ్యాలీకి వెళ్లవచ్చు. గౌహతి నుంచి ఇటానగర్ మీదుగా కొండల మధ్య నడిచే రోడ్స్ ద్వారా వ్యాలీ ప్రయాణం ప్రారంభమవుతుంది. ఈస్టర్న్ హిమాలయాస్ మధ్య నడిచే ఈ రోడ్డు ప్రయాణంలో అడవులు, లోయలు, జలపాతాలు ఎన్నో కనిపిస్తాయి. ఇవన్నీ మీ ప్రయాణాన్ని ఒక మెమోరబుల్ జర్నీగా మార్చేస్తాయి. (చదవండి: లాంజ్‌లో ఫ్రీగా కూర్చోవడానికి ఇలా చేయండి) -
పక్షవాతానికి వార్నింగ్ బెల్..!
పక్షవాతం అనే సమస్య అకస్మాత్తుగా వైకల్యం తెచ్చిపెట్టి మరొకరిపై ఆధారపడేలా చేస్తుంది. ఒకసారి పక్షవాతానికి గురైతే చాలాకాలం మరొకరిపై ఆధారపడాల్సి రావచ్చు. లేదా కొన్ని సందర్భాల్లో జీవితాంతం ఆ బాధ తప్పకపోచ్చు. అయితే అంతటి తీవ్రమైన పక్షవాతం కూడా తాను వచ్చే ముందర కొన్ని వార్నింగ్ సిగ్నల్స్ పంపుతుంది. వాటిని తెలుసుకుని ముందే జాగ్రత్త పడితే ఆ ముప్పు తప్పుతుంది. ‘ట్రాన్సియెంట్ ఇస్కిమిక్ ఎటాక్’ (టీఐఏ) అనేవే ఆ వార్నింగ్ సిగ్నల్స్. ప్రమాద ఘంటికలను మోగించే ఆ హెచ్చరిక ఏమిటో చూద్దాం...ట్రాన్సియెంట్ ఇస్కిమిక్ ఎటాక్ (సంక్షిప్తంగా ‘టీఐఏ’)ను పక్షవాతానికి (బ్రెయిన్ స్ట్రోక్‌కు) ముందస్తు సూచనగా పరిగణించవచ్చు. పక్షవాతంలో ఉండే లక్షణాలే ‘టీఐఏ’లోనూ కనిపిస్తయి. కాకపోతే అవి తాత్కాలికంగా కనిపించి తగ్గిపోతాయి. కానీ పక్షవాతంలో అలా కాదు. ఆ లక్షణాలు అలాగే ఉండిపోతాయి. ఈ నేపథ్యంలో ‘టీఐఏ’ను ఓ ముందస్తు హెచ్చరికలా పరిగణించి, జాగ్రత్తపడితే భవిష్యత్తులో వచ్చే వైకల్యపు ముప్పు చాలావరకు నివారించవచ్చు. అయితే టీఐఏ ఒకసారి కనిపించిందంటే అది మళ్లీ వచ్చేందుకు (రికరెన్స్కు) అవకాశం ఎక్కువ. అందుకే దాన్ని తేలిగ్గా తీసుకోకుండా ఎందుకు వచ్చిందో తెలుసుకుని, పక్షవాతానికి వాడే మందుల్ని జీవితాంతం వాడాలి. పక్షవాతమే వచ్చినంత జాగ్రత్తగా ఉండాలి. టీఐఏ లక్షణాలు: ముఖంలోని ఓ పక్కభాగంలో అకస్మాత్తుగా బలహీనంగా అనిపించడం ఒకవైపు చేయి లేదా కాలూ బలహీనపడటం లేదా తాత్కాలికంగా పడిపోవడం మాట ముద్దముద్దగా రావడం లేదా మాట పడిపోవడం నిలకడగా నిలవలేకపోవడం (బ్యాలెన్స్ తప్పడం) అకస్మాత్తుగా ఒకటి లేదా రెండు కళ్లు కనిపించకపోవడం లేదా ఒకే వస్తువు రెండుగా కనిపించడం. ట్రాన్సియెంట్ ఇస్కిమిక్ అటాక్‌లో ఈ లక్షణాలన్నీ సాధారణంగా కాసేపే ఉండవచ్చు. ఇవన్నీ గంటలోపే తగ్గిపోతాయి. అయితే పక్షవాతం వచ్చినప్పుడు అవే లక్షణాలు చాలాకాలం పాటు లేదా జీవితాంతం ఉండిపోతాయి. అందుకే టీఐఏ హెచ్చరికలను సీరియస్‌గా తీసుకుని, డాక్టర్‌ను సంప్రదించి వారు సూచించిన మందులు, సలహాలు పాటించాలి. అంతేకాకుండా... తగిన జీవనశైలి మార్పులతో (లైఫ్‌స్టైల్ మాడిఫికేషన్స్‌తో) భవిష్యత్తులో రాబోయే పక్షవాతాన్ని నివారించుకోవచ్చు. ట్రాన్సియెంట్ ఇస్కిమిక్ అటాక్‌కు కారణాలు... 1) మెదడుకు రక్తాన్ని సప్లై చేసే రక్తనాళాలు లేదా మెదడులోని రక్తనాళాలు సన్నబడటం. 2) గుండెలో లేదా మెదడుకు సరఫరా చేసే రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టి, అవి రక్తప్రవాహంలో కొట్టుకు΄ోయి మెదడులోని రక్తసరఫరాకు అడ్డుపడటం. టీఐయే / పక్షవాతం ముప్పు ఎవరెవరిలో... రక్తంలో కొవ్వులు ఎక్కువగా ఉన్నవారిలో అధిక రక్తపోటు (హైబీపీ), డయాబెటిస్ ఉన్నవారిలో పొగతాగడం, మద్యపానం అలవాటు ఉన్నవారిలో నిద్రలో గురకపెట్టే వారిలో (స్లీప్ ఆప్నియా), నిర్ధారణ: టీఐఏ లక్షణాల ఆధారంగా దాన్ని నిర్ధారణ చేయడం తేలికే. సాధారణంగా ఎమ్మారై బ్రెయిన్, కెరోటిడ్ డాప్లర్ ఈసీజీ, 2డీ ఎకో, బ్లడ్ కోయాగ్యులేషన్ పారామీటర్స్ వంటి పరీక్షలతో టీఐఏని నిర్ధారణ చేస్తారు. చికిత్స: రక్తాన్ని పలుచబార్చే ఆస్పిరిన్, క్లోపిడోగ్రెల్, అసిట్రోమ్, స్టాటిన్స్ వంటి మందులను సూచిస్తారు. రక్తనాళాలు సన్నబారడం 70 శాతం కంటే ఎక్కువగా జరిగితే స్టెంటింగ్ లేదా ఎండరాక్టమీ వంటి ప్రక్రియలు చేయాల్సిరావచ్చు.డా. రంజిత్, సీనియర్ న్యూరాలజిస్ట్ (చదవండి: 'మత్తు'కు మందు ఇలా..!) -
జస్ట్ 12 వారాల్లో 73 కిలోల నుంచి 66 కిలోల బరువు..!
బరువు తగ్గడం అనేది అత్యంత కష్టమైన సవాలుగా భావిస్తుంటారు చాలామంది. అలాంటిది ఆరు పదుల వయసులో వెయిట్లాస్కు ఉపక్రమించి సక్సెస్ అందుకుంది ఈ మహిళ. అది కూడా మూడు నెలల్లో తగ్గి వయసు కేవలం సంఖ్య మాత్రమే అని ప్రూవ్ చేసింది. ఒత్తిడితో కూడిన వృత్తిజీవితాన్ని హ్యాండిల్ చేస్తూ..బరువు తగ్గడం విశేషం. మరి అంతలా స్లిమ్‌గా మారిన ఆ మహిళ ఫిట్నెస్ మంత్రా ఏంటో చూద్దామా..!.కెరీర్ కోచ్ అయిన క్రిస్ బోయెట్చెర్ తాను ఫిట్నెస్కి వయసు ఎప్పుడు అడ్డంకి కాదని నిరూపించడానికే ఈ వెయిట్‌లాస్ జర్నీకి ఉపక్రమించినట్లు తెలిపారు. ఇంతకుమునుపు పని నిమిత్తం జర్నీలు, ఎక్కువ గంటల పని, తదితరాలతో బిజీగా గడిపి, ఆరోగ్యాన్ని అస్సలు పట్టించుకోలేదని చెప్పుకొచ్చింది. అందుకే తన జీవితానికి అనుకూలమైన వ్యవస్థకు కట్టుబడి ఉండాలని డిసైడ్ అయ్యానని అంటోంది. అలా మూడు నెలల్లో తన శరీరాకృతిని మార్చుకోగలిగానని అంటోంది. ఆ క్రమంలో దశాబ్దాలుగా అనుభూతి చెందని బలాన్ని తిరిగి పొందగలిగానని చెబుతోంది. తనకు ఎంత తీరిక లేని దినచర్యతో ఉన్నప్పటికీ, క్రమబద్ధమైన ప్లాన్‌ని మిస్ చేయలేదట. ఇన్నాళ్లు ఆత్యానూన్యత భావంతో ఉన్న అధిక బరువుని..సక్రమమైన జీవనశైలితో చెక్‌పెట్టి స్లిమ్‌గా మారినిట్లు చెబుతోంది. అలా 73 కిలోల నుంచి 66 కిలోలకు అనూహ్యంగా తగ్గిపోయానని అంటోంది. అలాగే తానేమి కఠినమైన త్యాగాలు చేయలేదని, తన వాస్తవిక జీవితానికి అనుకూలమైన, నిర్వహించదగిన జీవనశైలిని ఏర్పాటు చేసుకున్నట్లు పేర్కొంది. అయితే ఆ ప్రణాళిక పక్కాగా ఫాలో అయ్యేలా కేర్ తీసుకున్నానని, దాంతో నాజూకుగా మారి ఆత్మవిశ్వాసంతో అందరి ముందుకు రాగలిగానని అంటోంది. నెటిజన్లు సైతం ఆమె రూపు రేఖల్ని చూసి ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఒక వ్యక్తి ఎన్ని దశాబ్దాలు జీవించినా సరైన జీవన విధానం, నిరంతర కృషి, బలం, ఆత్మవిశ్వాసంతో మొత్తం ఆరోగ్యాన్ని ఇట్టే మార్చుకోగలరని ప్రూవ్చేసింది, స్ఫూర్తిదాయకంగా నిలిచింది మేరీ అంటూ పోస్టులు పెడుతున్నారు. Mary is a 62 year old administrator.She thought she would never lose the belly fat and build strength at her age.Mary was beginning to believe "I'm too old for that." But she decided to try anyway.She was dealing with travel for work, long hours, and the belief that her… pic.twitter.com/atZvUZgTnO— Chris Boettcher (@chrisboettcher9) February 16, 2026 (చదవండి: మూడు వేల ఏళ్లనాటి పురాతన తైలం..! నలుపుదనాన్ని తొలగించి..) -
ఒక వ్యక్తిని 'కరిష్మాటిక్' అని ఎప్పుడు పిలుస్తారంటే..
చాలామంది కరిష్మా (Charisma) పుట్టుకతో వచ్చే వరం అనుకుంటారు, లేదా కేవలం సినిమా స్టార్లకు మాత్రమే ఉంటుందని భ్రమిస్తారు. కానీ సైకాలజీ ప్రకారం, కరిష్మా అనేది నేర్చుకోగలిగే ఒక Behavioral Skill.కరిష్మా అంటే అందంగా ఉండటం కాదు, ఎదుటివారిని 'అందంగా' ఫీలయ్యేలా చేయడం. మీరు ఒక గదిలోకి అడుగుపెట్టినప్పుడు, అక్కడ ఉన్న వాతావరణం మీ రాకతో పాజిటివ్‌గా మారితే... అదే కరిష్మా. ఆకర్షణీయమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి పక్కన ఉంటే మనకు తెలియని ఒక ఉత్సాహం, నమ్మకం కలుగుతాయి. దీనికి వెనుక ఉన్న సైన్స్ మరియు సైకాలజీని డీకోడ్ చేద్దాం.The Charisma Trifectaఒక వ్యక్తిని మనం 'కరిష్మాటిక్' అని ఎప్పుడు అంటామంటే, వారిలో ఈ మూడు లక్షణాలు ఉన్నప్పుడు:1. Presence: మీరు ఎవరితో ఉన్నారో, ఆ క్షణంలో పూర్తిగా వారితోనే ఉండటం. మీ మనసు ఎక్కడో ఉండి, మీరు అక్కడ ఉన్నట్లు నటిస్తే కరిష్మా మాయమైపోతుంది. మీ ఏకాగ్రతే మీ ఆకర్షణ.2. Power: ఇది ఎదుటివారిని భయపెట్టే శక్తి కాదు. మీ జ్ఞానం, మీ హోదా, మీ ఆత్మవిశ్వాసం లేదా మీ శారీరక దృఢత్వం ద్వారా వచ్చే 'ప్రభావం'. లోకానికి మీరు ఏదో ఒకటి సాధించగలరనే నమ్మకం కలిగించడం.3. Warmth: మీ శక్తిని ఎదుటివారి మేలు కోసం వాడతారనే భరోసా. మీరు ఎంత పవర్ఫుల్ అయినా, మీలో ఆత్మీయత లేకపోతే మిమ్మల్ని 'అహంకారి' అంటారు. శక్తికి ఆత్మీయత తోడైనప్పుడే అది 'కరిష్మా' అవుతుంది.The Halo Effectసైకాలజీలో Halo Effect అనే ఒక కాన్సెప్ట్ ఉంది. ఒక వ్యక్తిలో ఒక మంచి లక్షణం ఉంటే, మన మెదడు ఆటోమేటిక్‌గా ఆ వ్యక్తి తెలివైనవాడు, నమ్మదగ్గవాడు అని భావిస్తుంది. ఉదాహరణకు, మంచి డ్రెస్సింగ్ లేదా మంచి నవ్వు. కరిష్మాటిక్ వ్యక్తులు ఈ విషయాన్ని అర్థం చేసుకుని తమ బాడీ లాంగ్వేజ్‌ని, ప్రెజెన్స్‌ని అద్భుతంగా మెయింటైన్ చేస్తారు.రియల్ కరిష్మామోటివేషన్ స్పీకర్లు, పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్లు "ఎప్పుడూ నవ్వుతూ ఉండు, బిగ్గరగా మాట్లాడు, అందరినీ పొగుడు" అని చెప్తుంది. ఇది ఒక్కోసారి Fake గా అనిపిస్తుంది. కానీ కరిష్మా అనేది లోపలి నుండి రావాలి. మీరు మీ గురించి మీరు గొప్పగా ఫీలైనప్పుడు, ఎదుటివారిలో మంచిని చూడగలిగినప్పుడు మీ కళ్ళలో ఒక మెరుపు వస్తుంది. అదే అసలైన ఆకర్షణ.మీ చరిష్మా కోడ్‌ని అన్‌లాక్ చేయండిGenius Matrix Hub ఫిలాసఫీ ప్రకారం, మీరు ఒక ఆకర్షణీయమైన లీడర్‌గా మారే మార్గం ఇది.Step 1: అభద్రతా భావం, పరధ్యానం బ్రేక్ చేయండిమీరు మాట్లాడేటప్పుడు ఫోన్ చూడటం లేదా మీ గురించి మీరు తక్కువగా ఊహించుకోవడం వంటి పాత అలవాట్లను 'Break' చేయండి. అభద్రతా భావం (Insecurity) ఉన్న చోట కరిష్మా ఉండదు.Step 2: యాక్టివ్ ఎంగేజ్మెంట్ఎదుటివారితో మాట్లాడేటప్పుడు వారి కళ్ళలోకి చూసి మాట్లాడండి. వారు చెప్పేది శ్రద్ధగా వినండి. మీరు వారిని ఎంత గౌరవిస్తారో మీ బాడీ లాంగ్వేజ్ ద్వారా బిల్డ్ చేయండి. మీ నడకలో, నిలబడే తీరులో ఒక 'గ్రేస్' ఉండాలి.Step 3: ప్రభావితం చేసే శక్తిమీరు ఒక రూమ్‌లోకి వెళ్ళినప్పుడు మీ అవసరం అక్కడ ఉండాలి. మీ జ్ఞానంతో, మీ వినయంతో అందరినీ ఆకట్టుకోండి. మీరు లేని సమయంలో కూడా మీ గురించి అందరూ గొప్పగా చెప్పుకోవాలి. ఇదే 'Beyond' స్టేజ్.మీ కరిష్మా చెకప్ఈ రోజు మీరు ఒక చిన్న విశ్లేషణ చేయండి.1. మీరు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు వారికి మీరు ఇస్తున్న 'అటెన్షన్' ఎంత?2. మీలో Power and Warmth బ్యాలెన్స్డ్గా ఉన్నాయా?3. మిమ్మల్ని కలిసిన తర్వాత ఒక వ్యక్తి సంతోషంగా ఫీలవుతున్నాడా లేక ఇబ్బందిగా ఫీలవుతున్నాడా?కరిష్మా అంటే ఎదుటివారిని గెలవడం!బ్రో, ఆకర్షణీయమైన వ్యక్తిత్వం అంటే కేవలం అందంగా కనిపించడం కాదు, అద్భుతంగా ప్రవర్తించడం. మీరు మీ చుట్టూ ఉన్నవారిని ఎంతగా ప్రోత్సహిస్తారో, వారిని ఎంతగా అర్థం చేసుకుంటారో.. అదే మీ కరిష్మాను పెంచుతుంది. ఇది మీ ప్రొఫెషనల్ గ్రోత్ కి ఒక రాకెట్ ఇంజిన్ లాంటిది."Charisma is the ability to influence without logic."సైకాలజిస్ట్ విశేష్ Genius Matrix Hub 8019 000066www.psyvisesh.com(చదవండి: కొత్త ఆలోచనలను మనసులో ఎలా నాటాలి?) -
మూడు వేల ఏళ్లనాటి పురాతన తైలం..! నలుపుదనాన్ని తొలగించి..
చర్మసంరక్షణకు సంబంధించిన కొబ్బరి నూనె, నువ్వుల నూనె, ఆలివ్ నూనె వంటి ఎన్నో ఆయిల్స్ రాసి, అంతగా ప్రయోజనం పొందక విసిగిపోయినవాళ్లెందరో ఉన్నారు. సరిగ్గా ఆ టైంలో నెట్టింట వైరల్‌గా మారింది నల్పమరాది తైలం. అసలేంటి తైలం అని అందరిలోనూ ఒకటే కుతుహలం రేకెత్తించింది. ఇంతకీ ఏంటి ఆయిల్..? చర్మ సంరక్షణలో ఎలా ఉపయోగపడుతుందంటే..ఆ ఆయిల్ నల్పమరాది తైలం. ఇది భారతదేశంలోని కేరళకు చెందిన ఒక సాంప్రదాయ ఆయుర్వేద ఔషధ తైలం. కేరళ ఆయుర్వేదం నుంచి ఉద్భవించింది. చర్మ సమస్యలకు చికిత్స చేయడానికి, ఛాయను మెరుగుపర్చడానికి, ఎండవల్ల వచ్చిన టాన్(నలుపుదనాన్ని)ని తొలగించడం కోసం ప్రత్యేకంగా రూపొందించారు. దీని తయారీలో తరుచుగా కొబ్బరినూనె లేదా నువ్వుల నూనెను ఉపయోగిస్తారు. ఇటీవల గత కొన్ని రోజులుగా ఈ ఆయిల్ గురించి నెట్టింట వైరల్ అవ్వడంతో ఈ తైలం హాట్‌టాపిక్‌గా మారింది. అంతేగాదు తాము ఈ ఆయిల్‌ని వినియోగించి చూశాం అంటూ ఇస్తున్న రివ్యూలు కూడా ఈ క్రేజ్‌కి కొంత కారణం. దాంతో ఈ ప్రొడక్ట్ ప్రధాన ఆకర్షణగా మారడమే గాక, తరతరాలుగా విశ్వసిస్తున్న ఈ ఆయిల్ పట్ల ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్లు, చర్మ సంరక్షణ ప్రియులను నుంచి పెద్ద ఎత్తున్న సానుకూల స్పందన రావడం విశేషం. తయారీ..నల్పమరాది తైలం ప్రధానంగా మర్రి, రావి, గోమేధిక, అత్తి వంటి నాలుగు రకాల చెట్ల బెరడులతో తయారు చేస్తారు. ఇది చర్మాన్ని స్వస్థపరిచి, కాంతివంతం చేస్తుంది. ఈ తైలానికి సాధారణంగా నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనెను ఆధారంగా చేసుకుని తయారు చేస్తారు. ఇందులో పసుపు, వెటివర్, ఆమ్లా, వంటివి కూడా జోడిస్తారు. ఇవి చర్మాన్ని పునరుజ్జీవింప చేయడానికి ఉపయోగపడతాయి.మూడువేల ఏళ్లకు పైగా చర్రిత కలిగిన పురాతన తైలం కేరళలో ఉద్భవించిందని చాలామంది ప్రజల గట్టి నమ్మకం. నాలుగు పవిత్రమైన చెట్ల బెరడు నుంచి వచ్చిన మిశ్రమం కావడంత దీన్ని "నల్పమరం" అని పిలస్తారు. దీన్ని గాయాలు మాన్పడానికి, చర్మాన్ని మెరుగుపరచడానికి ఎక్కువుగా వినియోగించేవారట. ఇది శిశువుల చర్మాన్ని మృదువుగా ఉంచుతుందట. మంత్రసానులు ఈ నూనెలోని పలుచని ద్రావణాన్ని శిశువుల మసాజ్ కోసం వినియోగిస్తారట. అంతేగాదు ప్రపంచ యుద్ధాల సమయంలో, కేరళ, తమిళనాడులోని కొన్ని ప్రాంతాల మహిళలు సాంప్రదాయ నల్పమరాది తైలం మిశ్రమాలను పునరుద్ధరించి, వాటిని కొబ్బరి ఆకుల బుట్టలలో నిల్వ చేసేవారట. అంతటి విశిష్టత కలిగిని నూనెని మీరు కూడా ట్రై చేసి చూడండి మరి...!. View this post on Instagram A post shared by Dr Midhila Reghunath (B.A.M.S) (@ayursutraabydrmidhila) (చదవండి: 9-5 పనిచేసే ఉద్యోగులు బరువు తగ్గాలంటే..!) -
9-5 పనిచేసే ఉద్యోగులు బరువు తగ్గాలంటే..!
చాలామటుకు 9 టు 5 ఉద్యోగాల చేసే వాళ్ల పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందట. పగలు అంత ఆపీస్‌లోనే గడిచిపోవడంతో వ్యక్తిగతంగా సమయం కేటాయించుకునే వీలు అస్సలు ఉండు. అందులోనూ ఇక ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టేంత అవకాశం అస్సలు ఉండదు. అలాంటప్పుడు అధిక బరువు సంబంధిత అనారోగ్య సమస్యల బారిన ఇట్టే పడుతుంటారు. అలాంటివాళ్లు ఫిట్‌గా ఉండాలంటే ఈ ఫిట్నెస్ అండ్ మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యాలకు ప్రసిద్ధిగాంచిన విద్యుత్ జమ్మాల్ టిప్స్ ఫాలో అయితే చాలు. మరి అవేంటో చూద్దామా..!.టాటాప్లే ఫిట్‌నెస్‌లో ‘ఫిట్ అండ్ ఫేమస్’తో జరిగిన సంభాషణలో ప్రముఖ ఫిట్నెస్ నిపుణుడు విద్యుత్ జమ్వాల్ ఇలా చెప్పుకొచ్చారు. సమయం దొరికినప్పుడు వ్యాయామం చేస్తానని, దొరకనప్పుడు అస్సలు బాధపడని అన్నారు. కానీ ఆఫీస్‌కి వెళ్లేవారు, క్రమబద్ధమైన జీవితం గడిపేవారు ముఖ్యంగా 9-5 ఉద్యోగాలు చేసేవారు నెలకు ఐదు కిలోలు తగ్గాలని లక్ష్యం పెట్టుకోవాలని సూచించారు. అందుకోసం కనీసం పదికిలోమీటర్లు లేదా కనీసం ఒక కిలోమీటరైనా నడవాలని చెప్పారు. వాళ్ల అవసరాలకు అనుగుణంగా టైమ్టైబుల్ పెట్టుకోవడం, దాన్ని అలవాటు చేసుకోవడం అత్యంత ముఖ్యమని అన్నారు. అలా చేస్తే కచ్చితంగా అనారోగ్యం బారిన పడరని అన్నారు.వాకింగ్ ఒక్కటి చాలా..!?దీర్ఘకాలిక ఆరోగ్యానికి నడక ఒక అద్బుతమైన పునాది. దీనివల్ల హృదయ సంబంధ ఆరోగ్యం, బరువు నియంత్రణ, మెరుగైన జీవనశైలి, వంటి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. సంపూర్ణ ఫిట్నెస్ కోసం వాకింగ్ మాత్రమే సరిపోదు. బల శిక్షణ, ఫ్లెక్సిబిలిటీ వ్యాయమాలు కూడా తోడవ్వాలి అని చెబుతున్నారు. కేవలం నడకపైనే ఆధారపడితే కష్టమని అన్నారు. దీర్ఘకాలికా ఆరోగ్యం కోసం శరీరానికి తగినంత కదలిక ఉండాలని, నడవడంలో కూడా కొంగొత్త వాటిని జోడించి వాక్ చేయడం మరింత మంచిదని అన్నారు. కండరాలను పెంచుకోవడానికి వారానికి కనీసం రెండుసార్లు రెసిస్టెన్స్ వ్యాయామాలు తప్పకుండా చేయాలి. దినచర్యలో యోగా, స్ట్రెచింగ్‌ను నేర్చుకుంటే మరింత మంచిదని చెప్పుకొచ్చారు. View this post on Instagram A post shared by Vidyut Jammwal (@mevidyutjammwal) (చదవండి: మా మాష్టారే పేషెంట్‌గా..!) -
కొత్త ఆలోచనలను మనసులో ఎలా నాటాలి?
మనం మట్టిలో ఒక విత్తనాన్ని వేయగానే అది చెట్టు అవ్వదు కదా! దానికి నీరు, ఎరువు, సరైన సమయం కావాలి. అలాగే, మన మనసులో కొత్త ఆలోచనలను నాటడం (Planting Ideas) కూడా ఒక కళ. దీన్నే మనం 'The Build Stage' అంటాం.మనసు ఒక సారవంతమైన భూమి లాంటిది. మీరు అందులో ఏది నాటితే అదే పెరుగుతుంది. మీరు ఇప్పటివరకు మీ మనసులో 'నేను ఓడిపోతాను', 'నేను ఎవరికీ పనికిరాను' అనే కలుపు మొక్కలను నాటారు. ఇప్పుడు ఆ స్థానంలో 'విజయం', 'అద్భుతమైన వ్యక్తిత్వం' అనే విత్తనాలను నాటే సమయం ఆసన్నమైంది.1. The Germination of an Ideaఒక ఆలోచన మనసులో స్థిరపడాలంటే దానికి ఒక క్రమపద్ధతి ఉంటుంది.Exposure: ముందుగా మీరు కొత్త ఆలోచనలకు మీ మనసును తెరవాలి, గొప్ప వ్యక్తులను కలవడం, కొత్త పుస్తకాలు చదవడం లాంటివి చేయాలి. Acceptance: ‘‘ఆ ఆలోచన నా జీవితానికి ఉపయోగపడుతుంది" అని మీరు నమ్మాలి.Repetition (పునరావృతం): ఆ ఆలోచనను రోజుకు వందసార్లు మీ మెదడుకు గుర్తు చేయాలి.2. మెదడును ఎలా రీ-వైర్ చేయాలి? (Neuroplasticity)మనం చేసే పనులను బట్టి మన మెదడులోని నాడీ మార్గాలు (Neural Pathways) మారిపోతాయి. దీన్ని సైకాలజీలో 'Neuroplasticity' అంటారు. మీరు ఒకే నెగటివ్ ఆలోచనను పదే పదే చేస్తే, మీ మెదడు దానికి అలవాటు పడిపోతుంది. అలాగే, మీరు కొత్త ఆలోచనను పదే పదే ప్రాక్టీస్ చేస్తే, మెదడు దాన్ని ఒక కొత్త 'హైవే' లాగా మార్చేస్తుంది.3. నిజమైన 'బిల్డ్' పద్ధతిమోటివేషన్ "ఒకే రోజులో నీ లైఫ్ మార్చేయ్, రేపటి నుండే కొత్తగా ఉండు" అని చెప్తుంది. ఇది ఒక అబద్ధం, ఎందుకంటే 20 ఏళ్ల అలవాటు ఒక్క రోజులో పోదు. సైకాలజీ కొత్త ఆలోచనను చిన్న చిన్న పనుల ద్వారా ప్రాక్టీస్ చేయమంటుంది (Incremental Building). ఉదాహరణకు, మీరు 'కాన్ఫిడెంట్' అవ్వాలనుకుంటే, ఒకే రోజులో స్టేజ్ ఎక్కక్కర్లేదు. ముందు అద్దం ముందు మాట్లాడండి, ఆ తర్వాత స్నేహితుల ముందు మాట్లాడండి. ఇది నిజమైన 'బిల్డ్' పద్ధతి.4. మీ మనసులో కొత్త పంట!Genius Matrix ఫిలాసఫీ ప్రకారం, మీ కొత్త పర్సనాలిటీని ఎలా నిర్మించాలో చూద్దాం.Step 1: కలుపు మొక్కల తొలగింపు (Break)మీ పాత భయాలు, నమ్మకాలు ఒక 'కలుపు' లాంటివి. పాత పద్ధతిలో "నేను చేయలేను" అనే నెగటివ్ సెల్ఫ్-టాక్ ఎక్కడ మొదలవుతుందో అక్కడ 'బ్రేక్' చేయండి. అది రాగానే దాన్ని తుడిచేయండి.Step 2: నిర్మాణాత్మక ఆచరణ (Build)కొత్త ఆలోచనలకు మద్దతు ఇచ్చే వాతావరణాన్నిబిల్డ్ చేయండి. మీ లక్ష్యానికి సంబంధించిన వ్యక్తులతో తిరగండి, ఆ విషయాలపైనే వినండి. ఏ ఆలోచనను మీరు పదే పదే వింటారో, అదే మీ పర్సనాలిటీగా మారుతుంది. ఇది 'నిర్మాణం' (Build).Step 3: ఆటోమేషన్ (Beyond)ఒక్కసారి కొత్త ఆలోచన మీ సబ్-కాన్షియస్ మైండ్ లోకి వెళ్తే, ఇక మీరు కష్టపడక్కర్లేదు. అది మీ ప్రవర్తనలో, మీ మాటల్లో ఆటోమేటిక్‌గా కనిపిస్తుంది. మీరు మారుతారు, మీ జీవితం మారుతుంది. ఇదే 'Beyond' స్టేజ్.5. మీ మనసులో ఏముంది?ఈ రోజు ఒక చిన్న విశ్లేషణ చేయండి.ఈ వారం మీరు నాటాలనుకుంటున్న ఆ ఒక్క 'కొత్త ఆలోచన' ఏంటి?దాన్ని నాటడానికి మీరు వేస్తున్న మొదటి చిన్న అడుగు ఏంటి?మీరు నాటబోయే ఆ విత్తనం రేపు ఎలాంటి ఫలాలను (Results) ఇస్తుంది?మీరే మీ తోటమాలి!బ్రో, మనసు అనే తోటలో కలుపు మొక్కలు వాటంతట అవే వస్తాయి, కానీ మంచి మొక్కలు మనం నాటుకోవాలి. మీరు మీ మైండ్‌కి తోటమాలి లాంటివారు. ఏ ఆలోచనను పెరగనివ్వాలో, దేన్ని తీసేయాలో నిర్ణయం మీదే. మీ కొత్త వ్యక్తిత్వాన్ని ఒక అద్భుతమైన తోటలా నిర్మించుకోండి.గుర్తుంచుకోండి, "Your life is the harvest of your thoughts."సైకాలజిస్ట్ విశేష్ Genius Matrix Hub 8019 000066www.psyvisesh.com -
నటి జ్యోతిక మోడర్న్ పేరెంటింగ్ టిప్స్..!
రీల్ లైఫ్‌లోనే గాదు రియల్ లైఫ్‌లో కూడా బ్యూటీఫుల్ కపుల్ ఎవరంటే ఠక్కున చెప్పేస్తారు సూర్య-జ్యోతికలని. ఈ ఇద్దరు నటనపరంగానే కాదు, వ్యక్తితత్వ పరంగానూ నూటికి నూరు మార్కులు దక్కించుకున్న గొప్ప జంటగా పేరు తెచ్చుకున్నారు. ఈ దంపతులకు కుమార్తె దియా, కుమారుడు దేవ్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. హీరో సూర్యతో పెళ్లి తర్వాత నటనకు విరామం ఇచ్చిన జ్యోతిక కొంతకాలం తర్వాత రీ ఎంట్రీ ఇచ్చి..అశేష ఆదరాభిమానాలను అందుకుంది. అయితే ఆమె ఒక పక్క తన వృత్తిని, మాతృత్వాన్ని బ్యాలెన్స్ చేస్తూ..సూపర్ విమెన్‌గా పేరుతెచ్చుకుంది కూడా. మరి అలాంటి జ్యోతిక పిల్లల పెంపకం విషయంలో ఎలాంటి కేర్ తీసుకుంటుంది?, ఆమె చెప్పే అమూల్యమైన పేరెంటింగ్ టిప్స్ గురించి సవివరంగా తెలుసుకుందామా.!.ఒక ఇంటర్వూలో జ్యోతిక తాను తల్లిగా మారాక తనకు జీవితం పట్ల ఉన్న దృక్పథం పూర్తిగా మారిపోయిందన్నారు. ముఖ్యంగా తన పిల్లలను మీడియాకి, సెలబ్రిటీ హోదాకి చాలా దూరంగా ఉంచుతానని చెబుతున్నారు. వాళ్లకు సహనం, భావోద్వేగాల విలువ గురించి నేర్పిస్తుంటానని చెప్పారు. పేరెంట్స్‌గా పిల్లలను విలువలతో పెంచడం తోపాటు తాము కూడా కొన్ని విషయాలను వారి నుంచి నేర్చుకున్నామని అన్నారు. జీవితంలో కొన్ని సమయాల్లో వేగాన్ని తగ్గించి చిన్ని చిన్ని విషయాలను కూడా ఆస్వాదించడం, వాటి విలువ గురించి తెలుసుకోవడంలో పిల్లలు ఎంతగానో సహాయపడ్డారని అంటోంది. బాధ్యత, నిస్వార్థ ప్రేమ విలువలను తన పిల్లల ద్వారా తెలుసుకోగలిగానని చెబుతోంది. పిల్లలు ఎదుగుతుండటాన్ని చూడటం జీవితంలో అత్యంత సంతృప్తికరమైన క్షణాల్లో ఒకటని అన్నారు. అలాగే పిల్లల పెంపకంలో అత్యంత ముఖ్యమైనది వారి వ్యక్తిత్వాన్ని ప్రోత్సాహించడం అని ప్రగాఢంగా విశ్వసిస్తానని చెప్పారు. పిల్లలు నిజంగా దేనిపట్ల మక్కువ కలిగి ఉన్నారో తెలుసుకుంటూ..ఆ విషయాలను అన్వేషించి, ఆ దిశలో వెళ్లేలా స్వేచ్ఛను ఇవ్వడానికే ప్రయత్నిస్తానని అన్నారామె. దీనివల్ల పిల్లలు ఇతరుల ఆదేశాలకు లేదా నిర్ణయాలకు లోబడకుండా, తమను తాము వ్యక్తీకరించుకోగలిగేలా ధైర్యం ఆత్మవిశ్వాసంతో ముందుగకు సాగుతారని అంటోందామె. అంతేగాదు పిల్లలందరూ తమదైన రీతిలో ప్రత్యేకమైనవారని, విశిష్టమైన వాళ్లని నమ్ముతానని అన్నారు. అంతేగాదు సినీ ఆడంబరాలకు అతీతంగా వాస్తవాలను తెలసుకునేలా పెంచుతానని, ముఖ్యంగా ఒదిగి ఉండేలా పెంచుతానని అన్నారు. అలాగే ఆమె ప్రతి తల్లిదండ్రలు త పిల్లలతో కలిసి ఈ మూడు పనులు చేయాలని అన్నారు. అవేంటంటే..ప్రతిరోజూ పిల్లలతో కనీసం ఒక గంట నాణ్యమైన సమయం గడపడం ముఖ్యం. కలిసి భోజనం చేయండి, ఎటువంటి అంతరాయం లేకుండా మాట్లాడండి, బహుశా ఒక గేమ్ లేకా వాళ్లకు నచ్చిదాంతో మమేకమైతే.. పిల్లలు తమ మనసు విప్పి, వారు ఏమి ఆలోచిస్తున్నారో, వారిలో నిజంగా ఏమి జరుగుతుందో మనకు చెప్పడానికి సహాయపడుతుంది. వారి ప్రాణ స్నేహితుడు ఎవరు, వారికి ఎవరు ఇష్టం, ఒక పిల్లవాడిని ఎందుకు ఇష్టపడరు, ఏ ఉపాధ్యాయుడితో ఏమి జరుగుతోంది వంటి సాధారణ విషయాలు సైతం మనతో పంచుకుంటారు. రెండొవది ప్రయాణం చేయడం. కలిసి ప్రయాణం చేసినప్పుడు కుటుంబ బంధం చాలా బలపడుతుంది.మూడవది వారికి ఆదర్శంగా ఉండటం; వారికి సలహాలు ఇవ్వకండి.చివరగా ప్రతి తల్లి తన వృత్తి జీవితాన్ని, కుటుంబ జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకోగల సామర్థ్యం ఆమెకు ఉంటుందని చెబుతోంది జ్యోతిక. తన మటుకు ఎంత బిజీగా ఉన్నా..కుటుంబానికి ప్రాధ్యాన్యత ఇస్తానని, రెండిటిని సమతుల్యం చేసుకునే పనులను బ్యాలెన్స్ చేస్తానని అన్నారామె. (చదవండి: నీతా అంబానీకి మానవతా పురస్కారం..!) -
వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ సూసీ వైల్స్కు రొమ్ము కేన్సర్..
వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ సూసీ వైల్స్కు తొలిదశ రొమ్ము కేన్సర్‌తో బాధపడుతున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నారు. అంతేగాదు వేల్స్‌ని ఒక విశ్వసనీయ సలహాదారుగా ప్రశంసించారు కూడా. ఆమె సాధ్యమైనంత తొందరగా కోలుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆమె ఒక అద్భుతమైన చీఫ్ ఆఫ్ స్టాఫ్, అలాగే నాకు తెలిసిన అత్యంత బలమైన వ్యక్తులలో ఒకరామె. దురదృష్టవశాత్తు వేల్స్‌కి తొలిదశ రొమ్ము కేన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయిందని అన్నారు. ఆమె సత్వరమే ఈ సవాలుని స్వీకరించి ధైర్యంగా పోరాడాలని స్ట్రాంగ్‌గా నిర్ణయించుకున్నారు. ఆమెకు కోలుకునే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయని చెప్పారు. ఆమె వెంట అద్భుతమైన వైద్య బృందం ఉందని, చికిత్స సమయంలో, ఆమె దాదాపు పూర్తి సమయం వైట్ హౌస్‌లోనే గడుపుతారని పోస్ట్‌లో వెల్లడించారు ట్రంప్. ఈ నేపథ్యంలో తొలిదశ రొమ్ము కేన్సర్ అంటే..?, ఇతర భాగాలకు వ్యాపించకముందే ముందుగా ఎలా గుర్తిస్తారు, ఎలాంటి చికిత్స అందిస్తారు, తదితరాల గురించి సవివరంగా తెలుసుకుందామా.!.తొలిదశ రొమ్ము కేన్సర్ అంటే ఏమిటి?తొలిదశ రొమ్ము కేన్సర్‌లో సాధారణంగా స్టేజ్ 0, స్టేజ్ I, కొన్ని స్టేజ్ II కేన్సర్లు ఉంటాయి. ఈ దశలో, కణితి రొమ్ముకే పరిమితమై ఉంటుంది లేదా సమీపంలోని శోషరస కణుపులకు చాలా తక్కువగా వ్యాపించి ఉంటుంది. ఇక్కడ కేన్సర్ ఒకే చోట కేంద్రీకృతమై ఉన్నందున, తర్వాతి దశలతో పోలిస్తే సత్వరమే చికిత్స తీసుకుని సులభంగా కోలుకోగలుగుతారు సదరు రోగులుఅంతేగాదు 'ది బ్రెస్ట్' అనే జర్నల్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం, స్టేజ్ I రొమ్ము కేన్సర్‌కు ఐదేళ్ల మనుగడ రేటు దాదాపు 90% కాగా, స్టేజ్ IVకు ఇది సుమారు 26% మాత్రమేనని తెలుస్తోంది. ఇక్కడ వైల్స్ విషయంలో "తొలిదశ" అనేది ఆమె సాధ్యమైనంత తొందరగానే ఈ సమస్య నుంచి బయటపడతారనేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇక్కడ రొమ్ము కేన్సర్‌ను ముందుగానే గుర్తించడం వల్ల కలిగే ముఖ్య ప్రయోజనాలను హైటెల్ చేసింది. ఈ దశలో మనుగడ రేట్లను గణనీయంగా మెరుగుపరుస్తుంది. చాలా సందర్భాలలో, తొలిదశ రొమ్ము కేన్సర్‌కు చికిత్స తీసుకుంటూనే రోజువారీ పనులను కొనసాగించొచ్చు కూడా. ఇక్కడ వైల్స్ కూడా ఆ నేపథ్యంలోనే చికిత్స పొందుతూనే పని కొనసాగించాలని నిర్ణయించుకున్నారామె. కానీ ఈ తొలి దశలలో, రొమ్ము కేన్సర్‌ని అంత సులభంగా గర్తించకపోవచ్చు. అయితే, అది ఇచ్చే హెచ్చరిక సంకేతాలను విస్మరించకూడదు:అవేంటంటే..రొమ్ములో లేదా చంకలో గడ్డరొమ్ము పరిమాణం లేదా ఆకారంలో మార్పులుచర్మంపై గుంటలు పడటం లేదా ముడతలు పడటంతల్లిపాలు కాకుండా చనుమొన నుంచి ఇతర స్రావాలు రావడంచనుమొన చుట్టూ చర్మం ఎర్రబడటం లేదా పొలుసులుగా మారడంనిరంతర రొమ్ము నొప్పిఅన్ని గడ్డలూ కేన్సర్ గడ్డలు కావని గమనించడం ముఖ్యం, కానీ ఏదైనా అసాధారణ మార్పును వెంటనే ఆరోగ్య నిపుణుడిచే పరీక్ష చేయించుకోవాలి.ఈ కేన్సర్ ఎవరిలో అధికం అంటే..వయస్సు: వయసు పెరిగే కొద్దీ ప్రమాదం పెరుగుతుందికుటుంబ చరిత్ర: దగ్గరి బంధువులకు రొమ్ము కేన్సర్ ఉండటం ప్రమాదాన్ని పెంచుతుందిజన్యు మార్పులు: BRCA1 మరియు BRCA2 వంటి వారసత్వంగా వచ్చే మార్పులుహార్మోన్ల కారకాలు: చిన్న వయసులోనే రుతుస్రావం ప్రారంభం కావడం లేదా ఆలస్యంగా మెనోపాజ్ రావడంజీవనశైలి కారకాలు: ఊబకాయం, మద్యపానం, శారీరక శ్రమ లేకపోవడంఅయితే, రొమ్ము కేన్సర్‌తో బాధపడుతున్న చాలా మందికి ముందుగా ఎలాంటి స్పష్టమైన ప్రమాద కారకాలు కనిపించకపోవచ్చు. అందుకే క్రమం తప్పని స్క్రీనింగ్ చాలా కీలకం.ఎలా నిర్ధారిస్తారంటే?ఒక అధ్యయనం ప్రకారం, స్క్రీనింగ్ పరీక్షల్లో మహిళల్లో మామోగ్రఫీ అనే సాధనం మరణాల రేటును 20% వరకు తగ్గించగలదు. వాస్తవానికి సాధారణ స్క్రీనింగ్ పరీక్షల ద్వారానే ప్రారంభ దశ రొమ్ము కేన్సర్‌ను చాలామటుకు సులభంగా గుర్తిస్తారు. అత్యంత సాధారణ పద్ధతులు:మామోగ్రఫీ: రొమ్ము ఎక్స్-రే, ఇది చిన్న కణితులను గుర్తించగలదుఅల్ట్రాసౌండ్: ఘన గడ్డలు, ద్రవంతో నిండిన తిత్తుల మధ్య తేడాను గుర్తించడంలో సహాయపడుతుందిబయాప్సీ: కేన్సర్‌ను నిర్ధారించడానికి కణజాల నమూనాను తీసుకుంటారు40 ఏళ్లు పైబడిన మహిళలకు లేదా అధిక ప్రమాదం ఉన్నవారికి క్రమమైన స్క్రీనింగ్ చాలా ముఖ్యం.చికిత్సా పద్ధతులుప్రారంభ దశ రొమ్ము కేన్సర్‌కు చికిత్స అనేది కణితి పరిమాణం, రకం, అది వ్యాపించిందా లేదా అనే దానితో సహా అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. సాధారణ చికిత్సా విధానాలు:శస్త్రచికిత్స: కణితిని తొలగించడం (లంపెక్టమీ) లేదా మొత్తం రొమ్మును తొలగించడం (మాస్టెక్టమీ)రేడియోథెరపీ: శస్త్రచికిత్స తర్వాత మిగిలిపోయిన కేన్సర్ కణాలను నాశనం చేయడానికి తరచుగా ఉపయోగిస్తారుహార్మోన్ థెరపీ: హార్మోన్ రిసెప్టర్-పాజిటివ్‌గా ఉండే కేన్సర్ల కోసంకీమోథెరపీ: కొన్ని సందర్భాల్లో, కేన్సర్ మళ్లీ వచ్చే ప్రమాదాన్ని తగ్గించడానికిటార్గెటెడ్ థెరపీ: నిర్దిష్ట కేన్సర్ కణ లక్షణాలపై దృష్టి పెడుతుందివైద్యులు సాధారణంగా ప్రతి వ్యక్తికి అనుగుణంగా చికిత్సా ప్రణాళికలను రూపొందిస్తారు. తద్వారా కొద్దిపాటి దుష్ప్రభావాలతో సులభంగా ఈ కేన్సర్ బారి నుంచి బయటపడేలా చేస్తారు. ఏదిఏమైనా ఈ రొమ్ము కేన్సర్‌ని ముందుగా గుర్తించడమనేది చాలా శక్తిమంతమైనది. ఎందుకంటే ఈ దశలో చికిత్స అందించడం సులభం అవుతుంది. కొద్దిపాటి చికిత్సతోనే తొందరగా బయటపడే అవకాశాలు పుష్కలంగా ఉంటాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.(చదవండి: అంకుర్ వారికూ ఫిట్నెస్ సీక్రెట్..! నో స్టెరాయిడ్లు, నో షార్ట్‌కట్) -
అంకుర్ వారికూ ఫిట్నెస్ సీక్రెట్..! నో స్టెరాయిడ్లు, నో షార్ట్‌కట్
వ్యాపారవేత్త, కంటెంట్ క్రియేటర్ అంకుర్ వారికూ సోషల్ మీడియా వేదికగా 45 ఏళ్ల వయసులో 13% శరీర కొవ్వుని ఎలా తగ్గించుకున్నారో సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు. తాను ఎలాంటి స్టెరాయిడ్లు, షార్ట్కట్లు, ఏఐ సలహాలు తీసుకోలేదని చెప్పారు. నిజానికి వయసు పెరిగే కొద్దీ శరీర కొవ్వు సాధారణంగా పెరుగుతుంది. బరువు స్థిరంగా ఉన్నా కొలెస్టాల్ స్థాయిలు పెరుగుతాయట. పైగా వయసుతోపాటు కండర ద్రవ్యరాశిని కోల్పోతామట. దాంతో చర్మం కింద, పొత్తుకడుపు వంటి అంతర్గత అవయవాలలోకి కొవ్వు విసరల్ ఫ్యాట్‌గా స్టోర్ అవుతుందని చెబుతున్నారు. ఇది టైప్2, గుండెజబ్బుల ప్రమాదాన్ని పెంచుతుందట. పైగా రానురాను బరువు తగ్గడం కష్టంగా మారిపోతుందట. పురుషులలో సుమారు 40 ఏళ్ల వయసు వచ్చేటప్పటికీ..టెస్టోస్టెరాన్ క్రమంగా తగ్గడం జరుగుతుంది. దాంతో కండరాలను నిర్మించడం, కొవ్వు పంపిణీ చేయడంలో సామర్థ్యం తగ్గుతుందని చెబుతున్నారు అంకుర్ వారికూ. అందుకే తాను 3టీ ఫార్ములాతో ఆరోగ్యకరమైన రీతీలో కొలెస్ట్రాల్‌ని తగ్గించుకున్నట్లు వెల్లడించారు. ఏంటా ఫార్ములా..? ఎలా అనుసరించాలంటే..T3 ఫార్ములా:T1 - ట్రాక్ వారానికి సుమారు 0.5 కిలోల బరువు తగ్గడానికి, రోజుకు 300 నుండి 500 కేలరీల స్వల్ప లోటు ఆరోగ్యకరమైనదట. డైట ప్లాన్..ఉదయం 9:30 - 1 స్కూప్ వే ప్రోటీన్, క్రియేటిన్, 1 వాల్నట్, 4 బాదం పప్పులు, 4 జీడిపప్పులు, 5-6 ఎండుద్రాక్షలుఉదయం 11 గంటలకు - 200 గ్రాముల పనీర్/టోఫు/టెంపే, లేదా దాల్ చిల్లా, అప్పుడప్పుడు గుడ్లు.మధ్యాహ్నం 1 గంటకు - పండ్లుసాయంత్రం 4 గంటలకు - 2 రోటీలు (ఎమ్మర్ గోధుమ/జొన్న/సోయా బీన్) + కూర + పప్పు + తక్కువ కొవ్వు గల పెరుగుసాయంత్రం 6:30 గంటలకు - పెరుగుతో 1 స్కూప్ వే ప్రోటీన్అయితే తనకు ఇష్టమైన చోలే భటూరేని మాత్రం వదిలేయలేదట. అలాగే మిఠాయిని కూడా తిన్నట్లు తెలిపారు. అయితే కేలరీలు బ్యాలెన్స్‌గా ఉండేలా కేర్ తీసుకున్నారట.T2 - శిక్షణగుండె ఆరోగ్యానికి కార్డియో మంచిదే అయినప్పటికీ, వృద్ధులలో దీర్ఘకాలిక కొవ్వు తగ్గడానికి స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అత్యంత ప్రభావవంతమైన సాధనం.ఎందుకంటే ఇది జీవక్రియ రేటును పెంచుతుంది. ఒకేసారి ఎక్కువ కండర సమూహాలను ఉత్తేజపరచడానికి, సిట్-టు-స్టాండ్స్ లేదా మోడిఫైడ్ ప్లాంక్స్ వంటి బహుళ కీళ్లను ఉపయోగించే వ్యాయామాలపై దృష్టి పెట్టాలి.వ్యాయామ దినచర్య:టెన్నిస్ - వారానికి 6 రోజులు, 1 గంట (కార్డియో పూర్తయింది)వెయిట్స్ - వారానికి 6 రోజులు, 45 నిమిషాలుప్రతి రోజు: 2 వ్యాయామాలు x 3 శరీర భాగాలకు సంబంధించిన వర్కౌట్లు = 6 వ్యాయామాలు10-12 సార్లు పునరావృతం చేస్తూ మొత్త మూడు సెట్లు చేయాలి.T3 - రూపాంతరంమార్పులను నమోదు చేయడానికి రోజువారీ బరువును, వారపు కొలతలను ట్రాక్ చేసినట్లు తెలిపారు. అలాగే తన ఫోటోలను తన ట్రైనర్‌కు పంపిచినట్లు చెప్పారు.చాలామటుకు అదే డైట్ ప్లాన్ ఫాలో అయినట్లు తెలిపారు.సెలవులకు టూర్‌కి వెళ్లేముందు లేదా బ్రేక్ తీసుకోవాలనుకుంటే.. మరింతగా ఈ దినచర్యను వేగవంతం చేసినట్లు తెలిపారు. శరీరంలోని కొవ్వును తగ్గించడం అంటే మొత్తం బరువు తగ్గడానికి తోడ్పడటమే కాకుండా, దీర్ఘకాలిక వయస్సు సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుందట. ఇక్కడ కండర ద్రవ్యరాశిని పెంచుకుంటూ అదనపు శరీర కొవ్వుని తగ్గించుకుంటే..మొత్తం జీవన నాణ్యతనే మెరుగుపడుతుంది. ఆరోగ్యకరమైన వృద్ధాప్యాన్ని అనుభవించవచ్చు అని చెప్పుకొచ్చారు అంకుర్ వారికూ.మొత్తం బరువు తగ్గడానికి తోడ్పడటమే కాకుండా, దీర్ఘకాలిక, వయస్సు సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది మరియు శారీరక స్వాతంత్ర్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుంది. అందువల్ల, కండర ద్రవ్యరాశిని పెంచుకుంటూ అదనపు శరీర కొవ్వును కోల్పోవడం మొత్తం జీవన నాణ్యతను మెరుగుపరుస్తుంది మరియు వృద్ధాప్య జీవసంబంధమైన సూచికలను నెమ్మదింపజేస్తుంది.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చిం. మరిన్ని వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను పంపించడం ఉత్తమం. (చదవండి: వెల్నెస్ కొత్త ట్రెండ్..ఒత్తిడిపై 'ఎత్తు') -
వెల్నెస్ కొత్త ట్రెండ్..ఒత్తిడిపై 'ఎత్తు'
ఒకప్పుడు ‘సక్సెస్’ అంటే మంచి జాబ్, భారీ ప్యాకేజ్, లగ్జరీ లైఫ్.. అని భావించిన నగర జీవనం క్రమంగా మారుతోంది. హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో ప్రజలు ‘క్వాలిటీ ఆఫ్ లైఫ్’ వైపు మళ్లుతున్నారు. ఒత్తిడి, జీవనశైలి వ్యాధుల మధ్య ఇరుక్కున్న అర్బన్ జనరేషన్ ఇప్పుడు ఆరోగ్యం లేకపోతే సంపాదనకు అర్థం లేదనే ధోరణికి వచ్చేసింది. ఈ మార్పే వెల్నెస్ ఇండస్ట్రీకి కొత్త ఊపిరి పోస్తోంది. వెల్నెస్ అనగానే కేవలం యోగా క్లాస్/ డైట్ మాత్రమే కాదు.., మానసిక ప్రశాంతత, శారీరక చురుకుదనం, భావోద్వేగ సమతుల్యత.. ఇవన్నీ కలిసిన సమగ్ర జీవన విధానమే నేటి వెల్నెస్ అని లైఫ్‌స్టైల్ కోచ్ డా.శ్రీ సోహం చెబుతున్నారు. ఈ సందర్భంగా ‘సాక్షి’ పంచుకున్న ఆలోచనలు ఆయన మాటల్లోనే.. కాలుష్యంతో నిండిన నగర జీవితానికి కొద్దిసేపైనా బ్రేక్ ఇవ్వాలనే తపన యువతలో పెరుగుతోంది. ఆరోగ్యం కోసం ప్రజలు తిరిగి మూలాల వైపు అడుగేస్తున్నారు. వారాంతాల్లో కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా గడపాలన్న ఆలోచన కూడా వెల్నెస్ ట్రెండ్‌గా మారింది. ఇప్పటికే హైదరాబాద్ అవుట్‌స్కర్ట్స్‌లో చిన్న గెస్ట్‌హౌస్‌లు, నేచర్ గార్డెన్లు, వీకెండ్ రిట్రీట్స్ పెరుగుతున్నాయి. ఈ ప్రయాణంలో సరైన గైడెన్స్ ఉంటే శరీరం–మనసు రెంటిలోనూ అద్భుతమైన మార్పులు వస్తాయి. కార్పొరేట్ కల్చర్‌లోనూ వెల్నెస్ కీలకాంశంగా మారుతోంది. ఉద్యోగులకు ఒత్తిడి తగ్గించేందుకు, ఉత్పాదకత పెంచేందుకు అనేక కంపెనీలు యోగా, మెడిటేషన్, మైండ్‌ఫుల్‌నెస్ ప్రోగ్రామ్స్ సీఎస్ఆర్ కార్యక్రమాల్లో భాగం చేస్తున్నాయి. ‘సమతుల ఆహారం, సరైన నిద్ర, విశ్రాంతి, ఆరోగ్యకరమైన వాతావరణం ఉంటే ఉద్యోగుల పనితీరు సహజంగానే పెరుగుతుంది. కొన్ని సంస్థల హెచ్ఆర్ విభాగం దీనిపై ఆలోచన చేయాల్సి ఉంది. కాన్షియస్.. మ్యాడ్ నెస్.. హైదరాబాద్ అంటే ఫుడ్ లవర్స్ సిటీ. రుచికరమైన ఆహారానికి తగ్గట్టుగా సరైన వ్యాయామం లేకపోవడం వల్ల ఇన్సోమ్నియా, పీసీఓడీ, థైరాయిడ్, షుగర్, బీపీ వంటి సమస్యలు సాధారణమయ్యాయి. ఇన్‌ఫెరి్టలిటీ సమస్యలు, ఐవీఎఫ్ క్లినిక్స్ పెరుగుతుండడమే దీనికి నిదర్శనం. తినడం తప్పు కాదు.. కానీ మనం ఏమి తింటున్నామో తెలుసుకుని తినాలి.. అప్పుడప్పుడు ఉపవాసం బాడీని డీటాక్స్ చేస్తుంది. యువతపై సోషల్ మీడియా ప్రభావం ఉన్నా.. ‘స్టాప్ లెర్నింగ్, స్టార్ట్ అన్‌లెర్నింగ్’ అనే భావన ఆకర్షణగా మారుతోంది. సమస్యల నుంచి పారిపోకుండా.. జీవితంలోని ప్రతి క్షణాన్ని అవగాహనతో అనుభవించాలనే ఆలోచన ‘కాన్సియస్ మ్యాడ్ నెస్’ కాన్సెప్ట్‌కు బలం ఇస్తోంది. ఈ ఆలోచనలతో ఈ నెల 21న గండిపేటలోని ఆయర్వన్ వాటర్ సైడ్‌లో యోగా, మెడిటేషన్, భజన్ జ్యూమింగ్ ఎక్స్పీరియన్స్ అందించనున్నాం. రానున్న ఐదేళ్లలో హైదరాబాద్ లైఫ్స్టైల్లో వెల్నెస్ కేవలం ట్రెండ్ కాదు.. అవసరంగా మారబోతోంది. సంపాదనతో పాటు ఆరోగ్యాన్ని కూడా సమానంగా చూసుకునే దిశగా యువత అడుగులు వేస్తోంది. స్ట్రెస్ నుంచి స్ట్రెంగ్త్‌కి ప్రయాణమే నేటి హైదరాబాద్ కొత్త లైఫ్‌స్టైల్. -
ఈ సర్జరీలతో గుండెకు బైపాస్..!
గుండెకు రక్తాన్ని అందించే రక్తనాళాల్లో కొవ్వు ఉండల వల్ల గానీ లేదా రక్తం గడ్డకట్టడంతో ఏర్పడిన క్లాట్స్ వల్లగానీ వల్ల రక్తప్రసరణకు అడ్డంకులు ఏర్పడి... గుండెకు అవసరమైన రక్తం అందకుండా పోయే ప్రమాదం ఉంటుంది. ఈ సమస్య తలెత్తాక... రక్తనాళాలు ఇంకా పూర్తిగా మూసుకుపోనప్పుడు స్టెంట్ వేయడమన్నది చాలామందికి తెలిసిన విషయమే. స్టెంట్ వేశాక రక్తాన్ని పలచబార్చే మందులు కూడా ఇస్తుంటారు. అయితే మరికొన్ని సందర్భాల్లో గుండెకు రకరకాల శస్త్రచికిత్సలు చేస్తుంటారు. ఈ క్రమంలో బైపాస్ సర్జరీ, ఓపెన్ హార్ట్ సర్జరీ, బీటింగ్ హార్ట్ సర్జరీ... అనే రకరకాల శస్త్రచికిత్సల పేర్లు వినిపిస్తుంటాయి. ఈ సర్జరీలు ఏమిటి, రకరకాల శస్త్రచికిత్సల తాలూకు ప్రయోజనాలేమిటి లాంటి అనేక విషయాలను తెలుసుకుందాం.గుండెకు రక్తం అందించే రక్తనాళాల్లో ఏదైనా అడ్డంకి వచ్చినప్పుడు... నిజానికి శస్త్రచికిత్స కంటే ముందుగా స్టెంట్ ద్వారా ఆ అడ్డంకిని తొలగించడానికి గుండె డాక్టర్లు ప్రయత్నిస్తారు. ముందుగా ఆ స్టెంట్ అంటే ఏమిటో చూద్దాం.స్టెంట్ అంటే ఏమిటి...? గుండె రక్తనాళాల్లో ఏర్పడిన అడ్డంకులను తొలగించడానికి రక్తనాళాల్లోకి వెళ్లాక అక్కడ మూసుకు΄ోయిన రక్తనాళాన్ని వెడల్పు చేసే ఉపకరణాన్ని స్టెంట్ అంటారు. ఇందులోనూ రకరకాలు ఉంటాయి. ఉదాహరణకు ఒక బెలూన్ వంటి ఉపకరనాన్ని పంపి, రక్తనాళం మూసుకుపోయిన చోట దాన్ని ఉబ్బేలా చేయడం ద్వారా అక్కడ ఏర్పడిన అడ్డంకిని తొలగించడాన్ని బెలూన్ యాంజియోప్లాస్టీ లేదా బెలూన్ స్టెంట్ అమర్చడంగా చెబుతారు.నిజానికి ఇలా స్టెంట్ వేయడమన్నది పూర్తి స్థాయి శస్త్రచికిత్స కాదు. మొదట్లో తొడ భాగం లోని రక్తనాళాల నుంచి గుండెలోని రక్తనాళాల వరకు వెళ్లి అక్కడ మూసుకు΄ోయిన చోట స్టెంట్ వేసేవారు. అయితే ఇటీవల మణికట్టు నుంచే స్టెంట్‌ను పంపడమూ జరుగుతోంది. గుండెకు ఏరకమైన చికిత్స అవసరమనే విషయాన్ని తెలుసుకోడానికి... తొలుత యాంజియోగ్రామ్ అనే పరీక్ష చేయించి, అటు తర్వాత గుండెకు రక్తాన్ని అందించే రక్తనాళాల్లో ఏదైనా సమస్య కనిపిస్తే... బైపాస్ చేయించాలా లేదా మందులతోనే సమస్యను పరిష్కరించవచ్చా లేదంటే స్టెంట్ వేయించాలా అని చాలా మంది అయోమయానికి గురయ్యే అవకాశం ఉంది. నిజానికి ఈ ఏయే సందర్భాల్లో చేస్తారో, అవి ఎలా ఉపయోగపడతాయో తెలుసుకుందాం.గుండెకు చేసే రకరకాల శస్త్రచికిత్సలేమిటి... వాటితో ప్రయోజనాలేమిటంటే... గుండెకు చేసే శస్త్రచికిత్సలు ప్రధానంగా రెండు రకాలు. మొదటిది బైపాస్ సర్జరీ. రెండోవి వాల్వ్ సర్జరీలు. వీటిల్లో... బైపాస్ సర్జరీలోనే... ఓపెన్ హార్ట్ సర్జరీ... దాంతోపాటు పలు సందర్భాల్లో నిర్వహించే రకరకాల సర్జరీలైన బీటింగ్ హార్ట్ సర్జరీ, మినిమల్లీ ఇన్వేజివ్ కార్డియాక్ సర్జరీ, టోటల్ ఆర్టీరియల్ రీవాస్క్యులైజేషన్, ఎండోస్కోప్క్ సర్జరీ, హైబ్రిడ్ సర్జరీ, రొబోటిక్ బైపాస్ సర్జరీ వంటి వాటినీ అనుసరిస్తుంటారు. వాటి గురించి వరసగా...బైపాస్ శస్త్రచికిత్స అంటే : ముందుగా బైపాస్ శస్త్రచికిత్స అంటే ఏమిటో చూద్దాం. గుండెకు రక్తాన్ని తీసుకెళ్లే రక్తనాళల్లో ఏవైనా అడ్డంకులు ఉంటే... వాటిని వెడల్పు చేయకుండా అలాగే వదిలేసి... వాటికి ప్రత్యామ్నాయంగా వేరే రక్తనాళాలను ఉపయోగించి, ఈ కొత్తమార్గం ద్వారా గుండెకు యథాతథంగా రక్తప్రసరణ జరిగేలా చేయడమే బైపాస్ శస్త్రచికిత్స. అంటే... ఇందులో అడ్డంకి ఉన్న రక్తనాళానికి పక్కగా... కరొనరీ ఆర్టరీ (బృహద్ధమని) నుంచి నేరుగా గుండెకండరానికి రక్తం అందేలా మరో రక్తనాళాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ ప్రక్రియలో కరొనరీ ఆర్టరీ నుంచి గుండె కండరానికి రక్తం అందేలా చేయడానికి అవసరమైన అదనపు రక్తనాళాన్ని కాలి నుంచి తీసుకున్న రక్తనాళాన్నిగాని లేదా రొమ్ము ఎముక పక్కనే ఉన్న మ్యామరీ ధమనిని గాని ఉపయోగిస్తారు. ఇలా చేసే క్రమంలో ఒకవేళ సిరను ఉపయోగిస్తే దాన్ని వీనస్ గ్రాఫ్ట్ అని, ధమనిని ఉపయోగిస్తే ఆర్టీరియల్ గ్రాఫ్ట్ అంటారు.బైపాస్ ఎవరికి అవసరం, దాంతో ఒనగూరే ప్రయోజనాలేమిటంటే... గుండెకు రక్తసరఫరా చేసే ప్రధాన రక్తనాళమైన లెఫ్ట్ మెయిన్‌లో అడ్డంకులు ఏర్పడినప్పుడు గుండెలో ఎడమపక్క ఉండే ముఖ్య రక్తనాళంలోని మొదటిభాగంలోనే అడ్డంకి ఉన్నప్పుడు గుండె తాలూకు పంపింగ్ సామర్థ్యం తక్కువగా ఉన్నప్పుడు ∙గుండెకు రక్తాన్ని అందించే రక్తనాళంలో అనేకచోట్ల అడ్డంకులు ఏర్పడినప్పుడు ∙డయాబెటిస్ (మధుమేహ వ్యాధి) ఉన్న వారికి. ఓపెన్‌హార్ట్ సర్జరీ అంటే...? బైపాస్ శస్త్రచికిత్స సమయంలో రొమ్ముఎముకను చీల్చి సర్జన్ గుండె వరకు వెళ్తాడు. అయితే గండె అనుక్షణం కొట్టుకుంటూ ఉంటుందన్న విషయం తెలిసిందే. ఇలా గుండె నిత్యం స్పందిస్తూ ఉండగా ఆపరేషన్ చేయడం ఒకింత కష్టంగా, సంక్లిష్టంగా ఉంటుంది. అందుకే తాత్కాలికంగా గుండెను ఆపేసి (అచేతన స్థితిలో ఉంచి) ఈ ఆపరేషన్ నిర్వహిస్తారు. అలా గుండె అచేతన స్థితిలో ఉన్నప్పుడు శరీరానికి అవసరమైన రక్తప్రసరణ యథాతథంగా కొనసాగేందుకు హార్ట్‌లంగ్ మెషిన్ అనే పరికరాన్ని వాడతారు. ఏ శస్త్రచికిత్సలోనైతే ఈ హార్ట్‌లంగ్ మెషిన్‌ను వాడతారో... దాన్ని ‘ఓపెన్‌హార్ట్ సర్జరీ’ పరిగణించవచ్చు.బీటింగ్ హార్ట్ సర్జరీ అంటే...? దీన్ని ‘ఆఫ్ పంప్ సర్జరీ’ అని కూడా అంటారు. ఇందులో కూడా రొమ్ము ఎముకను చీలుస్తారు. అయితే ఈ ప్రక్రియలో గుండె స్పందనలను ఆపడం, మళ్లీ ్ర΄ారంభించడం గానీ జరగదు. ఓ పక్క గుండె స్పందనలు యథావిధిగా కొనసాగుతుండగానే బై΄ాస్ సర్జరీ నిర్వహిస్తారు. ఆక్టోపస్ అనే ఒక ప్రత్యేక పరికరం ద్వారా గుండెలో ఆపరేషన్ జరుగుతున్న భాగం వరకు కదలకుండా చేసి, ఈ శస్త్రచికిత్స చేస్తారు. సాధారణ బై΄ాస్ శస్త్రచికిత్స తర్వాత కొంతమందిలో పక్షవాతం, మతిమరపు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే బీటింగ్ హార్ట్ సర్జరీ వల్ల అలాంటి ఆ దుష్ప్రభావాలు వచ్చే అవకాశాలు బాగా తగ్గి΄ోతాయి.మినిమల్లీ ఇన్వేజివ్ కార్డియాక్ సర్జరీ అంటే..? గత కొద్దికాలంగా గుండె శస్త్రచికిత్సలో అత్యంత ఆధునికమైన, చాలా అధునాతమైన వినూత్న వైద్య పురోగతి జరుగుతోంది. కేవలం చాలా చిన్న గాటు సహాయంతోనే బై΄ాస్ సర్జరీ నిర్వహించడం కూడా వీటిల్లో ఒకటి. ఇందులో ఎదుర్రొమ్ము ఎముకను చీల్చాల్సిన అవసరమే ఉండదు. అయితే పెద్ద శస్త్రచికిత్సల్లోలాగే మత్తు మందు ఇవ్వాల్సి ఉంటుంది. చర్మంపైన చాలా చిన్నవైన గాట్లు పెడుతూ వెంటనే తగ్గి΄ోయి మూసుకు΄ోయే రంధ్రాలు చేయడం ద్వారా ఈ లాపరోస్కోపిక్ ఆపరేషన్ చేస్తారు. గాటు, గాయం చాలా చిన్నవిగా ఉండటం వల్ల రోగులు చాలా త్వరగా కోలుకుంటారు. రక్తస్రావం, నొప్పి కూడా చాలా తక్కువే. శస్త్రచికిత్స తర్వాత ఆయాసం వంటి సమస్యలూ ఉత్పన్నం కావు. కానీ సర్జన్‌కు కేవలం గుండెలోని కొద్దిభాగం మాత్రమే కనిపిస్తుంటుంది కాబట్టి ఈ తరహా శస్త్రచికిత్స నిర్వహించడానికి అతడికి చాలా నైపుణ్యం కావాలి. పైగా పేషెంట్లదరికీ ఈ చికిత్స చేయడం సాధ్యం కాకపోవచ్చు.టీసీఆర్‌ఏటీ : ఈ ‘టీసీఆర్‌ఏటీ’ అనేది ‘టోటల్ కొరనరీ రీవాస్క్యులరైజేషన్ బై యాంటీరియర్ కొరకాటమీ’ అనే సర్జరీ ప్రక్రియ తాలూకు సంక్షిప్త రూపం. దీన్ని ఎదుర్రొమ్ముకు ఏమాత్రం కోత లేకుండా చేస్తారు. ఈ శస్త్రచికిత్సలో చిన్న గాటుతోనే (మినిమల్లీ ఇన్వేజివ్గానే) గుండె తాలూకు కీలకమైన ధమని అయిన ‘కొరనరీ ఆర్టరీకి సంబంధించిన అనేక రక్తనాళాలకు బై΄ాస్ దారులు ఏర్పాటు చేయడం సాధ్యమవుతుంది. దాంతో గుండె కండరాలకు రక్తం ఎలాంటి అంతరాయం లేకుండా అందుతుంది. కేవలం 6 నుంచి 10 సెంటీమీటర్ల చిన్నపాటి గాటుతోనే గుండెకు బైపాస్ (కార్డియోపల్మునరీ బైపాస్ –సీపీబీ) శస్త్రచికిత్స నిర్వహిస్తారు. మిగతా బైపాస్ ప్రక్రియలతో పోలిస్తే ఇదెంతో సురక్షితమైనదీ, నొప్పి చాలా చాలా తక్కువ. ఇందులో పేషెంట్ కోలుకోవడం చాలా వేగంగా జరుగుతుంది.కంప్లీట్ ఆర్టీరియల్ రీవాస్క్యులరైజేషన్ అంటే..? బైపాస్ శస్త్రచికిత్స చేసేప్పుడు జబ్బుపడ్డ ప్రతి ముఖ్యమైన రక్తనాళానికీ బైపాస్ గ్రాఫ్ట్ చేస్తారు. అంటే ఎన్ని రక్తనాళాల్లో అడ్డంకులు ఉంటే అన్ని చోట్లా బైపాస్ చేయడం కోసం అన్ని ప్రత్యామ్నాయ రక్తనాళాలను అతికిస్తారు... అంటే గ్రాఫ్ట్ చేస్తారని అర్థం. చాలామందిలో ఒక్కోసారి మూడు లేక నాలుగు గ్రాఫ్ట్‌లు కూడా వేయాల్సి వస్తుంది. ప్రస్తుతం ప్రతి బై΄ాస్ సర్జరీలోనూ కనీసం ఒక ధమనిని ఉపయోగించడం పరి΄ాటి అయ్యింది. సాధారణంగా రొమ్ము ఎముకకు రక్తసరఫరా చేసే రొమ్ముఎముక ధమని (ఇంటర్నల్ మ్యామరీ ఆర్టరీ)ని ఉపయోగించి ఎల్ఏడీ కరొనరీ ధమని అనే దానికి అనుసంధానం (గ్రాఫ్ట్) చేస్తారు. కాలి నుంచి తీసిన సిరలతో పోలిస్తే ఇలా రొమ్ముఎముక నుంచి తీసిన ధమని చాలా కాలం పాటు మన్నికతో ఉంటుంది. అయితే టోటల్ ఆర్టీరియల్ రీవాస్క్యులరైజేషన్లో కాలినుంచి సిరలను తీయకుండా మణికట్టులోని ధమనులను, ఎడమ, కుడి రొమ్ము ఎముక ధమనులను ఉపయోగించి సర్జరీ చేస్తారు.ఎండోస్కోపిక్ సర్జరీ అంటే...? ప్రస్తుతం చేస్తున్న సరికొత్త శస్త్రచికిత్సల్లో మణికట్టు నుంచి తీసే ధమని గానీ... లేదా కాలి నుంచి తీసే సిరల విషయంలోగానీ... పూర్తిగా గాటు పెట్టి తీయకుండా, చిన్న రంధ్రం మాత్రమే చేసి వాటిని సేకరిస్తారు. ఇలా చేయడం వల్ల చేసే గాయం చాలా చిన్నది కావడం వల్ల పేషెంట్ చాలా త్వరితంగా కోలుకోవడం సాధ్యమవుతుంది.హైబ్రీడ్ సర్జరీ అంటే...? కొన్నిసార్లు బై΄ాస్ శస్త్రచికిత్సలో పేషెంట్ చాలా సీరియస్‌గానూ అతడి పరిస్థితి అత్యంత సంక్లిష్టపరిస్థితిలో ఉన్నప్పుడు కొన్ని రక్తనాళాలకు యాంజియో΄్లాస్టీ ద్వారా, మరికొన్నింటికి బై΄ాస్ ద్వారా శస్త్రచికిత్స నిర్వహించడం వల్ల చాలా రిస్క్‌లు తగ్గుతాయి. ఇలా చేయడం ద్వారా పేషెంట్‌ను చాలా త్వరగా కోలుకునేలా చేయవచ్చు. ఇలా ఒకే సర్జరీలో పలు రకాల శస్త్రచికిత్స ప్రక్రియలను చేయడాన్ని ‘హైబ్రీడ్ బై΄ాస్ సర్జరీ’ అంటారు.రొబోటిక్ బైపాస్ సర్జరీ అంటే...?ఈ ప్రక్రియలో డాక్టర్లు తమ బై΄ాస్ శస్త్రచికిత్సను రోబో సహాయంతో చేస్తుంటారు. ఈ ప్రక్రియలో మొదట మినిమల్లీ ఇన్వేసివ్ సర్జరీ లేదా ఎండోస్కోపిక్ సర్జరీలో చాలా చిన్న రంధ్రం మాత్రమే చేసి, దాని ద్వారా మిగతా శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది. అంత చిన్న రంధ్రం నుంచి డాక్టర్ వేళ్లు రోగి శరీరంలోకి ప్రవేశింపజేయడం కష్టం. అందుకే రోబో తాలూకు సన్నని వేళ్లని ఆ రంధ్రంలోకి ప్రవేశింపజేసి, డాక్టర్లు (శస్త్రచికిత్సకులు) లోపలి దృశ్యాన్ని తెరమీద చూస్తూ... రోబో వేళ్లను బయటి నుంచే యంత్రాల సహాయంతో నియంత్రిస్తూ శస్త్రచికిత్స పూర్తి చేస్తారు.బైపాస్ సర్జరీ తర్వాత... బైపాస్ శస్త్రచికిత్స తర్వాత పేషెంట్ కోలుకోడానికి 2–3 నెలలు పడుతుంది. మొదట్లో కొద్దిగా నీరసంగా ఉండటం చాలా సాధారణంగా జరిగే పరిణామమే. రొమ్ముఎముక చీల్చడం వల్ల ఛాతీకండరాల్లో, మెడ ఎముకల్లో, వెన్నుపూసల్లో, జబ్బల్లో నొప్పులు ఉండటాన్ని డాక్టర్లు సాధారణంగా చూస్తుంటారు. అదే సమయంలో కాలు లేదా చేతి నుంచి రక్తనాళం బయటకు తీస్తారు కాబట్టి అక్కడ కూడా కొంత నొప్పి, వాపు ఉండవచ్చు. కొందరు ఈ ఆపరేషన్ తర్వాత మనోనిబ్బరం కోల్పోతారు. మరికొందరికి జ్ఞాపకశక్తి, దృష్టికేంద్రీకరణ శక్తి కొద్దిగా తగ్గవచ్చు. కానీ ఆర్నెల్లో పేషెంట్ తన పూర్వస్థితికి చేరుకునే అవకాశం ఉంటుంది.త్వరగా కోలుకోవడం కోసం... పేషెంట్లు తమ జీవనోపాధి కోసం చేసే పనులు అంతగా బరువైనవి కాక΄ోతే రెండు నెలల తర్వాతి నుంచే తమ వృత్తులకు హాజరుకావచ్చు. అయితే కాస్తంత బరువు పనులు చేసేవారు కనీసం మూడు నెలలు ఆగడం మంచిది. ఇక ఈ ఆపరేషన్ తర్వాత రెండునెలల పాటు వాహనం నడపడం అంత మంచిది కాదు. శస్త్రచికిత్స తర్వాత పేషెంట్ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవి...పొగతాగడం పూర్తిగా మానేయడం. ∙మంచి పుష్టికరమైన పోషకాహారం తీసుకుంటూ, దేహానికి శ్రమ కలగని విధంగా తగినంత వ్యాయామం చేస్తూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం. ∙బరువును అదుపులో ఉంచుకోవడం. ∙మనోనిబ్బరంతో వ్యవహరించడం.చివరగా... పైన సూచించిన జాగ్రత్తలను పాటిస్తూ, వైద్యులు చేసే సూచనలను తప్పక అనుసరించడం ద్వారా గుండె శస్త్రచికిత్స తర్వాత కూడా సాధారణ జీవితాన్ని గడపడం ఇప్పుడు చాలావరకు సాధ్యమే.నిర్వహణ: యాసీన్డాక్టర్ ఎం.ఎస్.ఎస్. ముఖర్జీ, సీనియర్ కార్డియాలజిస్ట్డాక్టర్ టి. వంశీధర్, సీనియర్ కార్డియో థొరాసిక్ సర్జన్ (చదవండి: పైల్స్ నుంచి ఫ్రీ అవ్వండి ఇలా..!) -
76 రోజుల్లో ఏడు కిలోల బరువు..!
బరువు తగ్గడంలో కొందరు అనుసరించే ఆరోగ్యకరమైన విధానాలు ఎందరికో ప్రేరణగా ఉంటాయి. అలాంటి వెయిట్‌లాస్ జర్నీ గురించి మహారాష్ట్ర వైద్యుడు చూసిన ఒక కేసు గురించి చెప్పుకొచ్చారు. ఒక రియల్ జంట అద్భుతంగా బరువు తగ్గినం విధానాన్ని షేర్చేసుకున్నారు. మొదట తన వద్దకు కాస్త తగ్గితే చాలని వచ్చిన వాళ్లు ఎంతలా అనూహ్యంగా బరువు తగ్గారో చెప్పారు. జస్ట్ రెండున్నర నెలలో ఇంతలా బరువు తగ్గుతారని అస్సలు ఊహించలేదని అంటున్నారు. మరి అదెలాగో చూద్దామా..!పిసిఒఎస్, డయాబెటిస్, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్, ఊబకాయం తదితరాల హోపియోపతిక్ ప్రాక్టీషనర్ డాక్టర్ సయాజిరావ్ గైక్వాడ్ తన అనుభవంలో చూసిన ఒక జంట కేసు గురించి చెప్పుకొచ్చారు. ఆ దంపతులు సాధారణ వెయిట్‌లాస్ కోసం వచ్చారని అన్నారు. సూచించిన కొద్ది ఆహారపు మార్పులతో ఇద్దరూ జస్ట్ రెండున్నరనెలల్లోనే ఏకంగా ఏడు కిలోలు తగ్గారని చెప్పారు. భర్త 71 కిలోల నుంచి 64 కిలోలకు, భార్య 82 నుంచి 75 కిలోలకు తగ్గారని చెప్పుకొచ్చారు. ఇలా బరువు తగ్గడంతో ఇద్దరికి వాపు, ఎల్డీఎల్ స్థాయిలు, బొడ్డుకొవ్వు కూడా గణనీయంగా తగ్గిందని పేర్కొన్నారు. మలబద్దక సమస్య కూడా చాలావరకు తగ్గిందని అన్నారు. అయితే ఈ దంపతులు ఎలాంటి క్రాష్‌డైట్ అనుసరించలేదని, స్థిరమైన ఆహార విధానాన్ని అనుసరించారని చెప్పారు. ఈ ఇద్దరు ఉపకరించిన ఆ ఏడు ఆహారపు అలవాట్ల గురించి వెల్లడించారు.రెండుపూటలా తినడం..ప్రతి రోజు రెండు పూటలా తింటే చాలని అన్నారు. అలాగని అల్పాహారం ఎక్కువగా తీసుకోవద్దని సూచించారు.ప్రోటీన్‌కు ప్రాధాన్యత ఇవ్వండినిపుణుడి ప్రకారం, ప్రతి భోజనంలో ప్రోటీన్‌ను కీలకమైన భాగంగా చేసుకోవడం వల్ల సులభంగా బరువు తగ్గుతారని అన్నారు. ముఖ్యంగా గుడ్లు, పప్పులు, పెరుగు, పనీర్‌ను వారి ఆహారంలో చేర్చుకోవాలని ఆయన దంపతులకు సలహా ఇచ్చారు.శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లను తొలగించారుతరువాత, హోమియోపతి నిపుణుడు ఆహారం నుంచి శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లను తొలగించాలని సూచించారు. ఈ జంట స్వీట్లు, చక్కెర, బేకరీ ఆహారాలను తినకుండా ఉండాలని చెప్పానని అన్నారు.ఫైబర్ అధికంగా ఉండే కూరగాయలు చేర్చుకోవడం..నిపుణుడు దంపతులకు ప్రతిరోజూ వారి భోజనంలో ఫైబర్ అధికంగా ఉండే కూరగాయలను చేర్చుకోవాలని సలహా ఇచ్చారు. ఆ ఆహార ప్రణాళికలో ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పనిసరి అయిన అంశం. ఇది కడుపు నిండిన భావనను పెంచుతుంది. అలాగే రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.ప్రాసెస్ చేసిన ఆహారాన్ని నివారించండిబర్గర్లు, పిజ్జాలు, సమోసాలు వంటి ప్రాసెస్ చేసిన ఆహారాలు దరిచేరనివ్వదని సూచించారు. బరువు తగ్గడానికి ప్రయత్నించే వాళ్లు సదా ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. డాక్టర్ సాయాజీరావు గైక్వాడ్ దంపతులు ఇంట్లో వండిన భోజనం మాత్రమే తినాలని, అల్ట్రా-ప్రాసెస్ చేసిన ఆహారాన్ని నివారించాలని చెప్పారు.రోజుకు 30-40 నిమిషాలు నడవండినిపుణుడు దంపతులను రోజుకు 30-40 నిమిషాలు నడవమని సూచించారు. అది కూడా ముఖ్యంగా భోజనం తర్వాత.స్థిరంగా ఉండండిబరువు తగ్గడం అనేది ఒక్కసారిగా జరిపోయేది కాదు. క్రమంత తప్పకుండా బరువు తగ్గడానికి ఏర్పాటు చేసుకున్న నియమాలను ఉల్లంఘించకుండా చూసకోవడం అత్యంత కీలకం. ఇక్కడ బరువు తగ్గడం అంత తేలికై పని కాకపోవచ్చు. కానీ శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లకు దూరంగా ఉంటూ..ఆకలి కోరికలు తగ్గేలా ఫైబర్ సమృద్ధిగా ఉండే ఆహారం తీసుకుంటే..వెయిట్‌లాస్ అనేది అత్యంత ఈజీ. అన్నింట్లంకంటే ముఖ్యమైనది స్థిరత్వాన్ని మెయింటైన్ చేయడమే అన్ని నొక్కి చెబుతున్నారు డాక్టర్ సయాజిరావ్ గైక్వాడ్. 2.5 months.One couple.Simple home-cooked food.✅ Results:• Weight ↓ 7 kg (both)• HbA1c improved• LDL cholesterol ↓• Waist ↓ ~3 inches• Constipation resolved• Energy levels ↑No crash diets.No supplements.Just disciplined nutrition. pic.twitter.com/d2302h5Iti— Dr.Sayajirao Gaikwad (@DietDrsayajirao) March 9, 2026 (చదవండి: ధన్యవాదాలకు మించింది..!ఇలాంటి కూతుళ్లు ఉంటే..) -
రోజూ వైన్, మాంసం : షాకిస్తున్న 102 ఏళ్ల బామ్మ
తూర్పు చైనాకు చెందిన 102 ఏళ్ల వృద్ధురాలు తన ఫిట్నెస్తో అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. జీవితంపై ఆమె దృక్పథం, లైఫ్‌స్టైల్, ఫుడ్ తదితర వివరాలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి. సాధారణంగా వందేళ్లు జీవించినవారు కఠినమైన ఆహార నియమాలు, చక్కటి జీవనశైలి, నియమ నిబద్ధతతో ఉంటారని అనుకుంటాం కదా. కానీ ఈమె అలవాట్లు అందుకు భిన్నం. ప్రస్తుతం సెంచరీ దాటేసింది తైజౌ గ్రామీణ ప్రాంతంలో నివసించే జిన్ బావోలింగ్ (Jin Baoling).సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ఈ 102 ఏళ్ల జిన్ బావోలింగ్ కొడుకు, కోడలు మనవరాలు సహా సన్నిహిత కుటుంబ సభ్యులతో జీవిస్తోంది. వృద్ధురాలి. దీర్ఘాయువు రహస్యాలు, దినచర్యఏంటో తెలిస్తే షాకవ్వక మానరు.తైజౌ ఈవినింగ్ న్యూస్ నివేదిక ప్రకారం, వందేళ్లు నిండిన ఆమె మానసికంగా చురుగ్గా, సాధారణంగా మంచి శారీరక స్థితిలో ఉంటుంది. గత 50 ఏళ్లుగా ఆమె ఆసుపత్రి మెట్లు ఎక్కకపోవడం విశేషం.జిన్ బావోలింగ్ రోజులో దాదాపు 15 గంటలు నిద్రపోతుందట. ఉదయం 9 గంటలకు నిద్రలేచి, తన తోటలో సూర్యరశ్మిలో కూర్చుని సమయం గడుపుతుంది.గటిపూట కూడా అప్పుడప్పుడు కునుకు తీస్తుంది. రాత్రి 7 గంటలకల్లా పడుకుంటుంది. ప ఆమె ఆరోగ్యంలో ఈ విశ్రాంతి కీలక పాత్ర పోషిస్తుందని ఆమె కుమారుడు చెబుతున్నారు.ఆహారపు అలవాట్లలో మాంసాహారం ఎక్కువ, కూరగాయలు తక్కువ ఉండటం మరో విశేషం. సాధారణంగా వయసు పెరిగే కొద్దీ కూరగాయలు తినాలని చెబుతుంటారు, కానీ ఈమె మాత్రం కూరగాయలను అస్సలు ఇష్టపడరు. పైగా 'పిగ్ ట్రాటర్స్' (పంది కాళ్లు) అంటే చాలా ఇష్టం. దీన్ని చైనాలో చాలా రుచికరమైనవిగా భావిస్తారు. కొల్లాజెన్‌లో సమృద్ధిగా ఉండే ఇది చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అలాగే కొన్నిసాంప్రదాయ చైనీస్ వైద్యంలో ఉపయోగిస్తారట. జిన్ దీన్ని దాదాపు ప్రతిరోజూ తింటుంది. ఇంకా డంప్లింగ్స్, స్టీమ్డ్ బన్స్ లేదా వంటోన్స్ తోపాటు,రోజుకు మూడు ఆరెంజ్ పండ్లు, రెండు గుడ్లు తీసుకుంటారు. వీటితో పాటు కేకులు, బ్రెడ్ , బ్రౌన్ షుగర్, ఖర్జూరాలతో చేసిన టీని ఎంజాయ్ చేస్తారు. ఏమి తిన్నా అన్నీ టైం ప్రకారం తినాల్సిందే.ప్రతీ పూట మందు ఉండాల్సిందే ఆమె ఆహారంలో మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, జిన్ ప్రతీ భోజనంతో పాటు రైస్ వైన్ (బియ్యంతో చేసిన మద్యం) తాగుతుంది. ఖర్జూరాలు, లిచీ వంటి పండ్లతో నిల్వ చేసిన ప్రత్యేకమైన వైన్ ఆమె కోసం ఇంట్లోనే సిద్ధంగా ఉంటుంది.ఇంకా ఈమె కోసమే ప్రత్యేకంగా తయారు చేసిన ఖర్జూరం, లాంగన్, లీచీ , యమ్బెర్రీస్, రైస్ వైన్ జాడిలు ఉంటాయి.కాళ్ళ కీళ్ళు సమస్యల కారణంగా నడిచేటప్పుడు జిన్‌కు సహాయం అవసరం కానీ 102 ఏళ్లు ఉన్నప్పటికీ ఆమె చూపు ఇంకా స్పష్టంగానే ఉంది. చేతులు కూడా వణకవు. ఖాళీ సమయంలో సాక్సులు కుట్టడం, చెప్పుల సోల్స్ రిపేర్ చేయడం వంటి చిన్న చిన్న పనులు చేస్తూ చురుగ్గా ఉంటుంది. ఆమెలోని పాజిటివ్ మైండ్‌సెటే దీర్ఘాయువుకు ప్రధాన కారణం అంటారు ఆమె కుమారుడు. అలాగే ఎప్పుడూ ఎవరితోనూ గొడవ పడకుండా, మనసులో కుళ్లు,కుతంత్రాలు లేకుండా కుటుంబం అంతా కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటుం దని చెప్పారు. దృఢత్వం, ఉల్లాసమైన వ్యక్తిత్వం కారణంగా, స్థానికులు ఆమెను ఆప్యాయంగా "ఓల్డ్ బేబీ" అని పిలుచుకుంటున్నారు.నెటిజన్లు స్పందనతమకు నచ్చినట్లు జీవించడమే అసలైన ఆరోగ్యం" అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.ఆమె అలవాట్లను ప్రశంసించారు. “ఆయుర్దాయం కోసం ఉత్తమ ఔషధం ఏమిటంటే, మీరు చాలా సుఖంగా ఉండే విధంగా జీవించడం, అతిగా ఆలోచించని హృదయంతో జీవించడం.” అని ఒకరు, “అమ్మమ్మ జిన్ సుదీర్ఘ నిద్ర , చక్కటి విశ్రాంతితో యువకులను మించిపోయింది.”అని మరొకరు వ్యాఖ్యానించారు.. “ఒక వందేళ్లు దాటిన వ్యక్తి అసాధారణ ఆరోగ్య అలవాట్లతో తన సొంతనిబంధనల ప్రకారం జీవితాన్ని గడుపుతున్నందుకు చాలా సంతోషం. నా తాతకు 94 సంవత్సరాలు, అతను తాగడం, ఆలస్యంగా మేల్కొని ఉండటం, ఎక్కువ పాటలు పాడటం, చెస్ ఇష్టపడతాడు.” అంటూ మరొక నెటిజన్ తన అనుభవాన్ని పంచుకున్నారు. -
సహానుభూతి పవర్..! ఎలా బిల్డ్ చేయాలంటే..
మనుషులతో ఉన్న అతిపెద్ద సమస్య ఏంటంటే.. మనం ఎప్పుడూ 'మన' కోణం నుండే ప్రపంచాన్ని చూస్తాం. అందుకే గొడవలు, అపార్థాలు వస్తాయి. కానీ, నిజమైన వ్యక్తిత్వ వికాసం సహానుభూతి (empathy)లో ఉంటుంది. ఇది మీ పర్సనాలిటీని ఒక అసాధారణమైన స్థాయికి తీసుకెళ్తుంది. ఎంపతీ ఉన్న వ్యక్తి ఎదుటివారి దృష్టిని అర్థంచేసుకుని (Walking in their shoes), వారు ఏమనిపిస్తుందో ఆలోచించగలడు. ఇదే మీకు దొరికే అత్యంత శక్తివంతమైన సామాజిక ఆయుధం.1. Sympathy vs EmpathySympathy (జాలి): ఎదుటివారిని చూసి బాధపడటం. ఇది పైపైన ఉంటుంది.Empathy (సహానుభూతి): ఎదుటివారి బాధను, ఆనందాన్ని లోతుగా అనుభూతి చెందడం.ప్రఖ్యాత సైకాలజిస్ట్ కార్ల్ రోజర్స్ ప్రకారం, ఎంపతీ అంటే ఎదుటివ్యక్తిపై ఎలాంటి తీర్పులు ఇవ్వకుండా (Non-judgmental) వారిని అర్థం చేసుకోవడం. ఇది ఒక 'సూపర్ పవర్' ఎందుకంటే, ప్రపంచంలో ఎవరూ తమని అర్థం చేసుకునే వ్యక్తిని వదులుకోరు.2. ఇది ఒక సూపర్ పవర్ ఎలా అవుతుంది?మీరు ఎంపతీని పెంచుకుంటే మీకు కలిగే లాభాలు.Influence: మీరు ఎదుటివారిని డామినేట్ చేయకుండానే, వారి మనసు గెలుచుకోగలరు. మీ మాటలకు, మీ ప్రవర్తనకు ఒక ప్రత్యేకమైన విలువ వస్తుంది.Conflict Resolution: గొడవలు పడే వ్యక్తుల మధ్య మీరు ఉంటే, మీరు వారిద్దరి కోణాన్ని అర్థం చేసుకుని, సులభంగా పరిష్కరించగలరు.Emotional Intelligence: మీ EQ ఆకాశాన్ని తాకుతుంది. ఎదుటివారికి మీరు ఇచ్చే 'అర్థం చేసుకునే అవకాశం' వారికి ఒక గొప్ప ఊరటనిస్తుంది.3. నిజమైన ఎంపతీట్రైనర్స్ "ఎదుటివారిని ఎలా మానిప్యులేట్ చేయాలో నేర్చుకో" అని చెప్తారు. ఇది మీకు అశాంతిని మిగులుస్తుంది. "ఎదుటివారికి మీరు ఇచ్చే గౌరవం, మీకున్న హృదయ విశాలతను పెంచుతుంది" అని సైకాలజీ చెప్తుంది. ఎంపతీ అనేది ఒక 'హార్ట్ సెంట్రిక్' పవర్, ఇది మిమ్మల్ని మనిషిగా ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తుంది.4. ఎంపతీని ఎలా బిల్డ్ చేయాలి?Genius Matrix ఫిలాసఫీ ప్రకారం, ఈ సూపర్ పవర్‌ను ఎలా ప్రాక్టీస్ చేయాలో చూద్దాం:Step 1: జడ్జిమెంట్ బ్రేక్ చేయండిఎదుటి వ్యక్తిని చూడగానే "వీడు ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు?" అని జడ్జ్ చేయడం మానేయండి. ఆ జడ్జిమెంట్ మీ మెదడులో పడితే, ఆ వ్యక్తిని అర్థం చేసుకునే అవకాశం పోతుంది. ఈ అహంకారాన్ని 'Break' చేయండి.Step 2: లిజనింగ్ స్పేస్వారు మాట్లాడుతున్నప్పుడు, మీ సమాధానం గురించి కాకుండా, వారు ఆ మాట ఎందుకు అంటున్నారో అని ఆలోచించండి. వారు ఏదైనా అంటున్నప్పుడు "నీకు అలా అనిపించడానికి కారణం ఏంటి?" అని అడగండి. ఇది మీకు వారి మనసులో ఒక స్థానాన్ని 'Build' చేస్తుంది.Step 3: యూనివర్సల్ కనెక్షన్ప్రతి వ్యక్తిలోనూ ఒక గాయం, ఒక ఆశ, ఒక భయం ఉంటాయి. ఎదుటివారిని చూసినప్పుడు వారి 'ముసుగు'ను కాకుండా, వారిలోని 'మనిషి'ని చూడటం మొదలుపెడితే, మీరు ఒక యూనివర్సల్ స్థాయికి చేరుకుంటారు. ఇదే 'Beyond' స్టేజ్.5. ఒక పరీక్ష!ఈ రోజు మీరు ఒక చిన్న పని చేయండి.మీకు నచ్చని వ్యక్తిని ఎంచుకోండి.ఆ వ్యక్తి స్థానంలో ఉండి, తన బాధను, తన కష్టాలను ఆలోచించడానికి ప్రయత్నించండి.మీకు అప్పుడూ కోపం వస్తోందా? లేక ఒక రకమైన అర్థం చేసుకునే భావం కలుగుతోందా?ప్రపంచం మీకు మిత్రులుగా మారుతుంది!బ్రో, ప్రపంచం లోని సమస్యలన్నీ మాయమవ్వాలంటే ఎంపతీ ఒక్కటే మార్గం. మీరు ఎంపతీని వాడినప్పుడల్లా మీరు ఎదుటివారిని గెలవడమే కాదు, మీ మనసును విస్తరించుకుంటున్నారు. ఇదే అసలైన లెగసీ!"Empathy is a bridge that connects the heart of one person to another."సైకాలజిస్ట్ విశేష్ Genius Matrix Hub 8019 000066www.psyvisesh.com(చదవండి: మీ మాట..మీ బాట) -
ఫిట్నెస్ అంటే సిక్స్ ప్యాక్ కాదు..ఆ సామర్థ్యం పొందడమే!
భారతదేశంలో గ్లామర్ రంగంలో ఉంటూ ఫిట్‌నెస్‌లో గట్టి ప్రభావం చూపిన కొద్దిమంది వ్యక్తులలో మిలింద్ సోమన్ ఒకరు. సాధారణంగా ప్రతీ ఒక్కరూ రిటైర్ మెంట్ తీసుకునే 60 సంవత్సరాల వయస్సులో ఆయన యువ తరానికి గొప్ప ప్రేరణగా మారాడు. కానీ, సోమన్ తనను తాను ప్రేరణగా భావించుకోడు, అది మన చుట్టూ ఎప్పటి నుంచో ఉన్నదని గమనించడంలోనే తేడా ఉందని అంటాడు. తాను ఎవరినీ ఉద్దేశపూర్వకంగా ప్రేరేపించలేదని ఆయన అంటున్నాడు. అయితే కొందరైనా ప్రేరణ పొందినందుకు తనకు సంతోషంగా ఉందన్నాడు. మిళింద్ సోమన్ 1990లలో సూపర్ మోడల్‌గా నిలిచాడు. ఆ తర్వాత జుర్మ్, ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్,, డిసెంబర్ 16, ఎమర్జెన్సీ వంటి చిత్రాలు సిరీస్‌లలో నటించడం ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. వీటికి అదనంగా, అతను రన్నింగ్ ట్రాక్‌పై తనకు సాటిలేని స్థానాన్ని కూడా సుస్థిరం చేసుకున్నాడు సుదూర ప్రాంతాలు, కఠినమైన భూభాగాలు అసాధ్యమైన పరిస్థితులను పరుగుతో కవర్ చేశాడు.మనం మహిళలకు మాత్రమే ఒక ప్రత్యేక ఫిట్నెస్ ఈవెంట్‌ను సృష్టిస్తే? ఈ ప్రశ్నకు సమాధానంగా గత 2012లో, సోమన్ ఆయన భార్య అంకితా కోన్వర్‌లు కలిసి పింక్‌థాన్‌ను స్థాపించారు ఇప్పుడు ఆ ఈవెంట్ భారతదేశంలోనే అతిపెద్ద మహిళల పరుగు కార్యక్రమంగా అవతరించింది. ఈ సందర్భంగా ఆయన ఇటీవల మీడియాతో మాట్లాడుతూ పలు విషయాలు అనుభవాలు పంచుకున్నారు.చాలా మంది కండలు తిరిగిన శరీరం అనుకుంటారని అయితే తన దృష్టిలో ఫిట్నెస్ అంటే అది ఒత్తిడిని ఎదుర్కోగల సామర్థ్యం అని ఆయన పేర్కొంటాడు. శారీరక ఒత్తిడి, మానసిక ఒత్తిడి, భావోద్వేగ ఒత్తిడి... వీటిని ఎంత బాగా ఎదుర్కోగలిగితే, జీవితం అంత మెరుగ్గా ఉంటుందని ఆయన స్పష్టం చేస్తున్నాడు. ఇది సిక్స్ ప్యాక్స్ లేదా బైసెప్స్ గురించి అవి అందించే లుక్స్ గురించి కాదు. ఇది మన శరీరపు పనితీరు గురించి అని విశ్లేషిస్తున్నాడు.తాను దాదాపు 25 సంవత్సరాల క్రితమే పరుగు ప్రారంభించానని, కొంత కాలం తర్వాత చాలా మంది పరుగు ప్రారంభించారని, అలాగే కేవలం ముంబైలో మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా పరుగు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని గమనించానన్నాడు. అయితే మహిళల భాగస్వామ్యం 4–5 శాతం మించి ఉండడం లేని పరిస్థితిలో.. మనం మహిళలకు మాత్రమే ఒక ఈవెంట్‌ను సృష్టించాలని ఆలోచించానన్నాడు. అయితే వారు స్పందిస్తారా?అని తొలిదశలో సందేహించానన్నాడు. ఎందుకంటే చాలా మంది మహిళలు ఇప్పటికీ వ్యాయామం క్రీడలు అంటే పురుషుల కోసమే అని భావిస్తున్నారని..అయితే మేం ధైర్యంగా ముందడుగు వేశామన్నాడు. చీర ధరించి పరుగులు తీయడం, చీర ధరించి సైక్లింగ్ చేయడం, యోగా నడక...వంటివన్నీమేళవించి.. ఈ కార్యక్రమం తన కోసం కాదని ఏ మహిళా భావించకుండా దీనిలో భాగం చేశామని వివరించాడు. మహిళలు ఎవరికోసమో లేదా బయటి దానికోసమో కాదు, తమ కోసం తాము పరుగు తీయడమే ఈ కార్యక్రమ లక్ష్యమన్నాడు. View this post on Instagram A post shared by Milind Usha Soman (@milindrunning)(చదవండి: ఆపిల్ వాచ్ ధరిస్తున్నారా..? పోషకాహార నిపుణుల స్ట్రాంగ్ వార్నింగ్) -
చిన్న అలవాట్లు.. పెద్ద మార్పులు
చాలామంది పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే పెద్ద పెద్ద పనులు చేయడమే అనుకుంటారు. కానీ, అసలైన విప్లవం చిన్న చిన్న అలవాట్లలోనే ఉంది. అవి మన వ్యక్తిత్వాన్ని నిలబెట్టే ఇటుకలని జేమ్స్ క్లియర్ (James Clear) అంటాడు.మనం చేసే ప్రతి పనికి, మనకు ఒక 'ఐడెంటిటీ' (Identity) ఉంటుంది. మీరు రోజూ చదివితే మీరు 'రీడర్' అవుతారు. మీరు రోజూ వ్యాయామం చేస్తే మీరు 'అథ్లెట్' అవుతారు. మన పర్సనాలిటీ అనేది మనం రోజూ చేసే పనుల మొత్తమే. అయితే, కొత్త అలవాట్లను మొదలుపెట్టడం చాలా కష్టం. అందుకే, Habit Stacking అనే టెక్నిక్ మీకు అద్భుతంగా పనిచేస్తుంది.1. Habit Stacking అంటే ఏంటి?మీకు ఇప్పటికే అలవాటుగా ఉన్న ఒక పాత పనిని (Anchor Habit), కొత్తగా మీరు చేయాలనుకుంటున్న పనితో కలిపి (Stack) చేయడం.పాత అలవాటు (Anchor): కాఫీ తాగడం, పళ్ళు తోముకోవడం, బాత్రూమ్కి వెళ్లడం.కొత్త అలవాటు (New Habit): పుస్తకం చదవడం, మెడిటేషన్, ప్లానింగ్.ఉదాహరణకు, "నేను కాఫీ తాగాక, వెంటనే 5 నిమిషాలు నా గోల్స్ రాసుకుంటాను" అని నిర్ణయించుకుంటారు. ఇక్కడ 'కాఫీ తాగడం' అనేది పాత అలవాటు, 'గోల్స్ రాయడం' అనేది కొత్త అలవాటు. దీనివల్ల మీరు కొత్తగా ఏమీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, పాతది దానంతట అదే మిమ్మల్ని కొత్త పనికి తీసుకెళ్తుంది.2. పర్సనాలిటీకి ఇది ఎందుకు కీలకం?ఒక రోజులో లేదా ఒక వారంలో లేదా ఒక నెలలో నా పర్సనాలిటీ మారిపోవాలనే లక్ష్యం పెట్టుకుంటే మెదడు భయపడుతుంది. అదే చిన్న అలవాట్లతో మనం మెదడుకు తెలియకుండానే గొప్ప మార్పులను తీసుకొస్తాం.Consistency: ఇది మిమ్మల్ని క్రమశిక్షణతో ఉంచుతుంది.Compound Effect: చిన్న అలవాట్లు రోజులు గడిచేకొద్దీ పెద్ద రిజల్ట్స్‌ని ఇస్తాయి.Self-Identity: "నేను ప్రతిరోజూ 5 నిమిషాలు మెడిటేషన్ చేస్తున్నాను" అని మీ మైండ్ నమ్మినప్పుడు, మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.3. మోటివేషన్ మాయ vs సైకలాజికల్ సిస్టమ్స్"రేపటి నుండి రోజూ రెండు గంటలు చదువుతాను" అనుకోవడం మోటివేషన్. కానీ రెండు రోజుల్లో ఆపేస్తారు"నేను ప్రతిరోజూ పడుకునే ముందు 1 పేజీ చదువుతాను" అని చిన్నదిగా మొదలుపెట్టడం అలవాటు చేసుకోండి. అలవాటు అనేది 'గోల్' కాదు, అది ఒక 'సిస్టమ్'.4. మీ 'Habit Stack' ని బిల్డ్ చేయండిGenius Matrix Hub ఫిలాసఫీ ప్రకారం, మీ కొత్త పర్సనాలిటీకి కావాల్సిన స్టాక్ ఇది.Step 1: చెడు అలవాట్లను బ్రేక్ చేయండిముందుగా మీకు ఉన్న చెడు అలవాట్లను గుర్తించి వాటిని 'బ్రేక్' చేయండి. ఉదాహరణకు, నిద్రలేవగానే ఫోన్ చూడటం. దానికి బదులుగా ఒక మంచి హ్యాబిట్ స్టాక్ పెట్టండి.Step 2: మీ స్టాక్ ని డిజైన్ చేయండిమీ డైలీ రొటీన్లో ఈ మూడు స్టాక్స్‌ను ప్రయత్నించండి:ఉదయం: "నేను లేవగానే, ఒక గ్లాసు నీళ్లు తాగి, రెండు నిమిషాలు నా పర్సనాలిటీ లక్ష్యం గురించి ఆలోచిస్తాను."మధ్యాహ్నం: "నేను లంచ్ చేశాక, ఒక పేజీ పర్సనాలిటీ డెవలప్మెంట్ పుస్తకం చదువుతాను."రాత్రి: "నేను పడుకునే ముందు, రోజంతా ఏం నేర్చుకున్నానో ఒక డైరీలో రాస్తాను."Step 3: ఆటో-పైలట్ పర్సనాలిటీఒక్కసారి ఈ స్టాక్స్ ఆటోమేటిక్ అయిపోతే, మీ వ్యక్తిత్వం దానంతట అదే మారుతుంది. అప్పుడు మీరు ఆలోచించక్కర్లేదు, మీ అలవాట్లే మిమ్మల్ని గెలిపిస్తాయి. ఇదే 'Beyond' స్టేజ్.5. ఈరోజు మీరు ఏ స్టాక్ మొదలుపెడతారు?ఈ రోజు మీరు ఒక చిన్న పని చేయండి.మీకున్న ఒక మంచి పాత అలవాటుని గుర్తించండి (ఉదా: టీ తాగడం).దానికి జత చేయాల్సిన ఒక చిన్న కొత్త అలవాటుని ఎంచుకోండి (ఉదా: రెండు నిమిషాల ప్రార్థన లేదా ప్లానింగ్).వచ్చే ఏడు రోజులు దీన్ని కచ్చితంగా చేయండి.మీ అలవాట్లే మీ వారసత్వం!బ్రో, ఒక మహా వృక్షం చిన్న విత్తనం నుండే మొదలవుతుంది. మీ పర్సనాలిటీ కూడా అంతే. చిన్న చిన్న అలవాట్లే రేపు మీ లెగసీ (Legacy) గా మిగిలిపోతాయి. గొప్ప వ్యక్తులు గొప్పగా ఉండటం వల్ల గొప్పవారు కాలేదు, వారు చేసే పనులు గొప్పవి కాబట్టి గొప్పవారు అయ్యారు."We are what we repeatedly do. Excellence, then, is not an act, but a habit." : Aristotleసైకాలజిస్ట్ విశేష్ Genius Matrix Hub 8019 000066www.psyvisesh.com(చదవండి: అణిగిపోవద్దు..అతిగా అరవవద్దు..!) -
సహజ సౌందర్యానికి కేరాఫ్ ఈ నటి..! రియల్ బ్యూటీ అంటే..
బాలీవుడ్ నటి కొల్హాపురే ఒకప్పుడు అత్యంత బిజీగా ఉండే హీరోయిన్లలో ఆమె ఒకరు. 'ప్యార్ ఝక్తా నహీ' వంటి హిట్ చిత్రాల్లో నటించిన ఆమె ప్రస్తుతం ఉర్దూ నాటకాల్లో నటిస్తూ తన నటనను మెరుగుపరుచుకుంటున్నారామె. ఆరు పదుల వయసులోనూ..నటి పద్మిని ఎవర్గ్రీన్ అందంతో గ్లామర్‌గా ఉంటారామె. అంతలా నవయవ్వనంగా ఉండటానికి గల కారణాలను వెల్లడిస్తూ..అందంపై తన అభిప్రాయాన్ని చాలా అద్భుతంగా వివరించారామె.ప్రముఖ నటి పద్మిని కొల్హాపురే తన సహజ సౌందర్యం, స్క్రీన్ ప్రెజెన్స్ పరంగా అందరికీ ఆరాధ్య దేవత ఆమె. ఇటీవల ఒక ఇంటర్యూలో తన చర్మ సంరక్షణ, మేకప్ అలవాట్ల గురించి షేర్ చేసుకున్నారు. అలాగే నిజమైన అందం సౌందర్య సాధనాలకు మించినదని ఎందుకు విశ్వసిస్తుందో కూడా చెప్పారామె. తాను స్వతహాగా కఠినమైన చర్మ సంరక్షణను అనుసరించే వ్యక్తిని కాదని అన్నారామె. తాను రసాయన ఉత్పత్తుల కంటే సహజ సౌందర్య సాధనాలనే ఎంచుకుంటానని అన్నారు. ముఖ్యంగా సహజ సేంద్రీయ ఆయుర్వేద ఉత్పత్తులనే ఉపయోగిస్తానని చెప్పారామె. ముఖ్యంగా ఇంట్లోనే లభించే వాటికే ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. వంటింట్లో బాగా ఉపయోగించే పసుపుని పెరుగుతో కలిపి ముఖానికి అప్లై చేసేవాళ్లమని అన్నారు. అలాగే పసుపు, ఉప్పుతో సదా పుక్కిలించేవాళ్లమని, ఇది నోటి ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెబుతోంది. సినీ ఇండస్ట్రీలో ఉన్నప్పుడూ..24/7 మేకప్ వేసుకోవాల్సి వచ్చేదన్నారు. కొన్నిసార్లు అలిసిపోయి నిద్రపోయేటప్పుడు కూడా తొలగించుకోలేకపోయే వాళ్లమని నాటి పరిస్థితులను గుర్తుచేసుకున్నారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు బాగా మారిపోయాయని చెబుతున్నారు. ప్రస్తుతం తాను చర్మాన్ని బాగా చూసుకోవడానికి ప్రయత్నిస్తున్నానని, అస్సలు మేకప్ వాడటం లేదని అన్నారు. తన బ్యూటీకిట్ మూడింటిని తప్పనిసరిగా వాడతానని అన్నారు. వాసెలిన్, మేకప్ రిమూవర్, సహజ వైప్‌లను ఇష్టపడతానని చెప్పారు. అవన్నీ కూడా సహజసిద్ధమైనవేనని చెప్పారు. మేకప్ పరంగా చాలా తక్కువ ప్రొడక్ట్స్, సౌకర్యవంతమైనవే ఉపయోగిస్తానని చెబుతున్నారు.హెయిర్ కేర్ ఎలాగంటే..జుట్టు సంరక్షణ విషయానికి వస్తే నేను సాంప్రదాయ పద్ధతులను ఇష్టపడతానని చెప్పారు. ఆయుర్వేద షాంపూలు, షికాకాయి, భ్రింగ్ రాజ్ వంటివి ఉపయోగిస్తానని చెప్పారు. హెయిర్ డ్రైయర్లు, కర్లర్లు వంటివి తక్కువగానే ఉపయోగిస్తానని అన్నారు. తలకు సైతం కెమికల్స్ లేనివే ఎంచుకుంటానని అన్నారు. చివరగా అందం అనేది బాహ్యంగా కంటే అంతర్గతంగా ప్రతిబింబించేది అని నమ్ముతానన్నారు. స్వచ్ఛమైన హృదయం కలిగి ఉండి, నిస్వార్థపరులు అయితే ఆ అందం మీ ముఖంపై తొణికిసలాడుతుంది. మెరిసే చర్మం కోసం ప్రజలు బాగా తినాలని, తగినంత విశ్రాంతి తీసుకోవాలని, హైడ్రేటెడ్‌గా ఉండాలని అన్నారు. అలాగే అప్పట్లో తమకు రెండే రెండు మేకప్ బ్రాండ్లు ఉండేవని, ఇప్పుడు తల నుంచి కాలి వరకు ఇబ్బడిముబ్బడిగా బ్రాండెడ్ మేకప్ ఉత్పత్తులు ఉన్నాయిని అన్నారు.(చదవండి: ఇప్పటికీ డ్రైవింగ్ చేస్తున్న 82 ఏళ్ల బామ్మ..! కేన్సర్ రోగులకు..) -
కడుపులో బుజ్జాయిలు ఎందుకు అడ్డం తిరుగుతారంటే..!
రోబో సినిమా చూశారా? అందులో రోబో చిట్టి ఓ మహిళకు ప్రసవం చేస్తుంటాడు. అడ్డం తిరిగిన బిడ్డను బయటకు తీసుకురావడానికి తాను ప్రయత్నిస్తానంటే లేడీ డాక్టర్ వద్దంటుంది. తానేదో చాలా పురాతన ప్రక్రియను అమలు చేస్తానంటూ బిడ్డను సరైన రీతిలో తిప్పడం కంప్యూటర్ మీద ప్రేక్షకులకు కనిపిస్తూ ఉంటుంది. దీన్ని బట్టి మనకు తెలిసేదేమిటంటే... ఓ చిన్నారి బుద్ధిగా ఈలోకంలోకి రావాలంటే... తల్లిలోంచి మొదట తలను బయటకు తేవాలి. కానీ కొంతమంది చిలిపి చిన్నారులు మొదటే లోకానికి ‘ఎదురు తిరుగుతారు’! ఈ ప్రపంచంలోకి వచ్చేటప్పుడు మొట్టమొదటి పనే పూర్తిగా భిన్నంగా చేస్తారు. అందుకే ఇలాంటి బిడ్డల్ని తల్లులూ, అత్తమ్మలూ, నానమ్మలూ, అమ్మమ్మలూ ‘ఎదురుకాళ్ల’తో పుట్టాడంటూ ముద్దుగా మురిపెంగా తిడుతుంటారు. వీళ్లనే ఇంగ్లిష్‌లో ‘బ్రీచ్’ బేబీస్ అంటారు. కడుపులోని బిడ్డ ఎందుకిలా అడ్డం తిరుగుతాడు. ఇలా తిరిగి΄ోయినప్పుడు డాక్టర్లు ఏం చేస్తారు... వంటి అనేక అంశాలపై అవగాహన కోసం ఈ కథనం.నిజానికి ఎదురుకాళ్లు అంటారుగానీ... తల ముందుకు రావాల్సిన చోట వాస్తవంగా బిడ్డ పిరుదులు ముందుకు వస్తాయి. అలా అడ్డం తిరిగినప్పుడు ప్రసవమూ సాఫీగా జరగదు. అలాంటప్పుడు ఆ చిన్నారిని ఈ లోకంలోకి తీసుకువచ్చేందుకు చాలాసార్లు శస్త్రచికిత్సలు చేయాల్సి ఉంటుంది. ప్రసవం వేళకు పిండం అడ్డం తిరిగి పుట్టేందుకు ప్రయత్నించే ఈ ‘బ్రీచ్’ బేబీ విషయంలో ఏయే ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉంటాయి. వాటి సంగతేమిటో చూద్దాం...బిడ్డ పుట్టేవరకూ గర్భసంచిలోని ఆమ్నియాటిక్ ఫ్లుయిడ్ అనే ద్రవంలో తేలియాడుతూ ఉంటుంది. మనం ఉమ్మనీరు అని పిలిచే ఆ ద్రవంలో అన్నివైపులకూ తిరుగుతూ... తనకు అందుబాటులో ఉన్న స్పేస్‌లో తలను ఎటువైపునకైనా తిప్పుతూ తిరిగే ఆ పిండం సరిగ్గా ప్రసవం వేళకు మాత్రం తలను బయటపెడుతూ ఈలోకంలోకి రావాలి. అలా శిరస్సు ముందుగా బయటకు రావడాన్ని సంప్రదాయ భాషలో ‘శీర్షోదయం’ అని అంటుంటారు. అయితే ఇలా శీర్షోదయం కాకుండా బిడ్డ అడ్డం తిరిగే కండిషన్స్ దాదాపు 3 శాతం నుంచి 4 శాతం ప్రసవాల్లో కనిపిస్తుంటాయి. ఇటీవల కొద్దిగా పెరిగాయి కూడా. గతంలోనైతే ఇలా బిడ్డ అడ్డం తిరిగే కండిషన్ కారణంగా దాదాపు 25 శాతం కేసుల్లో శిశుమరణాలు చోటుచేసుకుంటూ ఉండేవి. కానీ ఇటీవల దాదాపూ ప్రతి ప్రసవమూ ఆసుపత్రుల్లో (ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్) జరిగేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ తరహా ప్రసవం ముప్పులు చాలావరకు తగ్గాయంటూ నిశ్చయంగా చెప్పవచ్చు. బిడ్డ అడ్డం తిరగడానికి కారణాలు... ప్రసవం వేళకు బిడ్డ పూర్తిగా ఎదగకపోవడం (ప్రీ–మెచ్యురిటీ). ఒక అండం మాత్రమే కాకుండా అనేక అండాల ఫలదీకరణ జరగడం (మల్టీఫీటల్ జెస్టేషన్) (సాధారణంగా ఇలాంటి కండిషన్స్‌లోనే కవలలు (ట్విన్స్) వంటి కేసుల్లోనూ సహజ ప్రసవం జరగకపోవచ్చు).పుట్టుకతో ఏర్పడే లోపాల వల్ల... బిడ్డ తలకు బాగా నీరు పట్టి ఉండటం (హైడ్రోసెఫాలస్), బిడ్డ మెదడు ఎదగాల్సిన చోట చాలా సందర్భాల్లో అది లోపించి, మెదడులోని అనేక భాగాలు ఎదగకపోవడం (అనెన్సెఫాలస్). కడుపులో బిడ్డకు పిండ దశలోనే అనేక రకాల లోపాలు ఏర్పడటం. ఎవరైనా తల్లికి వరసగా తన మూడు ప్రసవాల్లోనూ (లేదా అంతకంటే ఎక్కువగానూ) చిన్నారులు ఎదురుకాళ్లతో పుడితే... ఆ తల్లికి సాధారణంగా మరోసారి కూడా ఇలాంటి కండిషన్ ఏర్పడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. దీన్నే వైద్యపరిభాషలో ‘మల్టీపారా విత్ లాక్స్ అబ్డామిన్’గా చెబుతారు. బిడ్డను అంటిపెట్టుకుని ఉండే మాయ.. గర్భాశయ ముఖద్వారంలోకి ప్రవేశించడం.ఈసీవీ ఎవరిలో చేయవచ్చంటే... ప్రెగ్నెన్సీ 36 – 37 వారాల వ్యవధి తర్వాత ప్రయత్నించవచ్చు. కాబోయే తల్లికి ఎలాంటి కాంప్లికేషన్లూ లేనప్పుడు మాత్రమే ప్రయత్నించాలి. ఉమ్మనీరు తగినంతగా ఉండాలి. ఈసీవీ విజయవంతం అవడానికి కేవలం 50 % మాత్రమే అవకాశముంటుంది. (అయితే కొన్నిసార్లు ఈసీవీ ప్రక్రియ తర్వాత కూడా చిన్నారి తిరిగి మళ్లీ బ్రీచ్ కండిషన్‌కు వెళ్లవచ్చు... అంటే మళ్లీ చిన్నారి ఎదురు తిరిగేందుకు అవకాశముంది). ఒకవేళ ఆ టైమ్‌లో పురిటి నొప్పులు వచ్చినప్పుడు బేబీ బ్రీచ్డ్ కండిషన్లో ఉంటే... ఆ టైమ్‌లో ఈసీవీ చేయడం సరికాదు. నేరుగా సిజేరియన్‌కు వెళ్లాల్సి ఉంటుంది. బ్రీచ్ బేబీస్ విషయంలో ప్రత్యామ్నాయ మార్గాలుఒకవేళ కాబోయే తల్లిదండ్రులు సిజేరియన్‌ను కోరుకోకపోతే అప్పుడు ‘ఎక్స్టర్నల్ సెఫాలిక్ వర్షన్’ (ఈసీవీ) అనే ప్రత్యామ్నాయానికి వెళ్లవచ్చు. అయితే ఇలాంటి సందర్భాల్లో ఆ తల్లిదండ్రులు ఈప్రోసిజర్లో ఉన్న ముప్పు దీన్ని ఎప్పుడు చేస్తారన్న అంశాలు తప్పక తెలుసుకుని ఈప్రోసిజర్పై అవగాహన ఏర్పరచుకోవడం చాలా ముఖ్యం. ఎక్స్టర్నల్ సెఫాలిక్ వర్షన్ (ఈసీవీ) అంటే..బిడ్డ కడుపులోంచి బయటికి రావడానికి అనువైన రీతిలో తిరగకుండా... (తలను ముందుకు తీసుకురాకుండా) ఇతరత్రా పొజిషన్స్‌లో ఉన్నప్పుడు నేరుగా శస్త్రచికిత్సతో బిడ్డను బయటకు తీసుకురావడానికి బదులుగా ప్రసవం మొదట్నుంచీ కొద్దికొద్దిగా ప్రయత్నిస్తూ... చిన్నారి తల భాగాన్ని ముందుకు తీసుకొచ్చేలా చేయడాన్ని ‘ఎక్స్టర్నల్ సెఫాలిక్ వర్షన్–ఈసీవీ’ అంటారు. సాధారణంగా కడుపులోని బిడ్డ గర్భసంచిలోని ఉమ్మనీటిలో నిత్యం దొర్లుతున్నట్లుగా అటూఇటూ తిరుగుతూ ఉంటుందన్న సంగతి తెలిసిందే. గర్భసంచిలో బిడ్డ ఎదుగుతున్న కొద్దీ బిడ్డ సైజు పెరుగుతూ, అది ఎటుపడితే అటు తిరగడానికి వీలుకల్పించే ఉమ్మనీటి ద్రవం తగ్గుతూ పోతుంది. అయితే ప్రసవం సమయానికి బిడ్డ తల ఆటోమేటిగ్గా బయటకు రావడానికి వీలుగా కిందివైపునకు తిరుగుతుంది. కొందరిలో ఇలా తిరగకపోతే తల్లి కడుపుపై చేతులుంచి బయటినుంచే లోపలి పిండాన్ని తిరిగేలా చేస్తూ తలను కిందివైపునకు తిరిగేలా చేసే ప్రక్రియను ‘ఎక్స్టర్నల్ సెఫాలిక్ వర్షన్’ (ఈసీవీ) అంటారు.బిడ్డ అడ్డం తిరగడంలో రకాలు బిడ్డ కేవలం ఎదురు కాళ్లతోనే కాకుండా ఇంకా అనేక రకాలుగా బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తుంటాడు. ఇలా బిడ్డ అడ్డం తిరగడమన్నది ఎన్ని రకాలుగా జరుగుతుందో చూద్దాం...1) ఫ్రాంక్ / ఇన్‌కంప్లీట్ బ్రీచ్... ఇందులో బిడ్డ తన తలకు బదులుగా మొదట తన పిరుదులను బయటకు తేవడానికి ప్రయత్నిస్తుంటుంది. ఇలాంటి పొజిషన్లో బిడ్డ ఒక పాదం తన చెవుల దగ్గర ఉంటుంది.2) కంప్లీట్ బ్రీచ్ / ఫ్లెక్సెడ్ బ్రీచ్... ఈ కేస్లోనూ బిడ్డ తలకు బదులుగా పిరుదులను తొలుత బయటకు తేవడానికి ప్రయత్నిస్తుంటుంది. అయితే ఈ పొజిషన్లో ‘ఫ్రాంక్ / ఇన్‌కంప్లీట్ బ్రీచ్’లోలా ఒక పాదం మాత్రమే చెవి దగ్గర ఉండదు. బిడ్డ రెండు పాదాలూ ముడుచుకుని ఉంటాయి.3) ఫూట్లింగ్ ప్రజెంటేషన్... ఈ కండిషన్లో బిడ్డ పిరుదులు, మోకాళ్లు... ఇవన్నీ ముడుచుకునే ఉంటాయి. లేదా ఒక కాలు పూర్తిగా చాపి ఉంటుంది. అయితే పాదాలు పిరుదుల కంటే కింది భాగంలో ఉండి ప్రసవం కష్టమవుతుంది. బిడ్డ అడ్డం తిరిగిన సందర్భాల్లో తల్లిదండ్రులు ఎలాంటి రిస్క్ తీసుకోకూడదనుకుంటే మాత్రం సిజేరియన్ సెక్షన్‌కు వెళ్లడం చాలా సురక్షితమైన, మంచి ప్రత్యామ్నాయం. మొదటి ప్రెగ్నెన్సీ విషయంలో ఇది మరింత అవసరం కూడా. ఈసీవీ చేయడానికి సాధ్యం కాని పరిస్థితులు ఏమిటంటే...తలలో పుట్టుకతో వచ్చే లోపాలు హైడ్రోసెఫాలస్ / అనెన్సెఫాలీ వంటి పుట్టుకతోనే లోపాలున్న సందర్భాల్లో : కొందరు బిడ్డల్లో మెదడు ఎదగాల్సిన చోట కేవలం నీరు మాత్రమే ఉంటుంది. ఈ కండిషన్‌ను హైడ్రోసెఫాలస్ కండిషన్ అంటారు. ఇక మరికొందరు బిడ్డల్లో మెదడులోని అన్ని భాగాలూ పూర్తిగా ఎదగ కుండా ఉండిపోతాయి. ఈ కండిషన్స్‌ను అనెన్సెఫాలీ కండిషన్ అంటారు. ఈ రెండు సందర్భాల్లోనూ ఈసీవీ చేయడం ఏమాత్రం సాధ్యం కాదు. ఆలిగో హైడ్రామ్నియస్ (అంటే ఉమ్మనీరు చాలా తక్కువగా ఉండటం లేదా పాలీ హైడ్రామ్నియస్ (అంటే ఉమ్మనీరు అవసరమైనదాని కంటే ఎక్కువగా ఉండటం. యుటెరైన్ అనామలీస్ : యుటెరన్ లోపాలున్నప్పుడు. ఫూట్లింగ్ బ్రీచ్ : అంటే పుట్టే సమయంలో కడుపులోని బిడ్డ కాళ్లు మొదట బయటకు రావడం. ఎక్స్టెండెడ్ హెడ్ అండ్ కార్డ్ ఎరౌండ్ నెక్ : బిడ్డ పుట్టే సమయంలో తల బయటకు వచ్చేందుకు బర్త్ కెనాల్లో తగినంత స్థలం లేక΄ోవడంతో తలమీద చాలా ఒత్తిడి పడటం. ఇక కార్డ్ ఎరౌండ్ నెక్ అంటే బొడ్డుతాడు మెడ చుట్టూ బిగుసుకుపోయే కండిషన్. ప్రీవియస్ సిజేరియన్ : గతంలో జరిగిన ప్రసవంలో సిజేరియన్తో బిడ్డను బయటకు తీసుకువచ్చిన కేస్ అయి ఉండటం. ప్లాసెంటా ప్రివియా : ఈ కండిషన్లో గర్భధారణ జరిగినప్పుడు మాయ (ప్లాసెంటా) గర్భాశయం కింది భాగానికి అతుక్కుపోయి, గర్భాశయ ముఖద్వారాన్ని (సర్విక్స్‌ను) పాక్షికంగా గానీ, పూర్తిగాగానీ కప్పి ఉంచడం.యాంటీరియర్ ప్లాసెంటా : గర్భధారణ సమయంలో బిడ్డకు పోషకాలు అందించే బొడ్డుతాడు (మాయ) గర్భాశయం ముందువైపు గోడకు అతుక్కుపోయి ఉండటం (ఇది చాలా సాధారణం, ఆరోగ్యకరమైన గర్భధారణకు సంకేతం).ఈసీవీ చేయించుకోవాలని కోరేవారు అన్ని వసతులూ ఉండే మంచి ప్రసూతి ఆసుపత్రిని ఎంచుకుని అక్కడ బాగా అనుభవజ్ఞులైన ‘ఆబ్స్ట్రెట్రీషియన్స్’ (గర్భస్త పిండ వైద్యచికిత్స, ప్రసూతి నిపుణులు) ఉన్నారేమో ఎంక్వైరీ చేయాలి. అక్కడ ఈసీవీ జరుగుతున్నప్పుడు కడుపులోని బిడ్డను కంప్యూటర్ తెరపై ఎప్పుడూ చూసేందుకు వీలయ్యేలా ‘రియల్ టైమ్ అల్ట్రాసౌండ్ డాప్లర్’ సౌకర్యమూ ఉండాలి. చదవండి: ప్రసవానంతరం బరువు తగ్గాలంటే..! ఈ వర్కౌట్లు తప్పనిసరి..ఈ డాప్లర్ ఉండటం వల్ల ఈసీవీ చేస్తున్నప్పుడు బిడ్డ తాలూకు బొడ్డు తాడు అతడి మెడకు చుట్టుకుపోయి బిగుసుకుపోతుందా లేక మామూలుగానే ఉందా అని ఎప్పటికప్పుడు పరిశీలనగా చూడటానికి వీలవుతుంది. ఇలా చేస్తున్నప్పుడు ఒకవేళ తల్లికి తీవ్రమైన నొప్పి కలుగుతున్నా లేదా బిడ్డ తాలూకు గుండె స్పందనలు తగ్గుతున్నా లేదా ఈ గుండె స్పందనల్లోని లయ (రిథమ్) క్రమబద్ధంగా లేక΄ోయినా ఈ ప్రక్రియను నిలిపివేయాలి. వీలుకాకపోతే అప్పుడు శస్త్రచికిత్స (సిజేరియన్ సెక్షన్)కు తప్పక వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.చివరగా... శస్త్రచికిత్స వల్ల తమకు ఒనగూరే ప్రయోజనాలూ, ఆర్థిక అంశాల కారణంగా కొందరు డాక్టర్లు శస్త్రచికిత్స (సిజేరియన్)లను ప్రోత్సహిస్తున్నారనే వాదన చాలా సందర్భాల్లో వినిపిస్తూ ఉంటుంది. చాలామందిలోనూ ఈ అ΄ోహ ఉంటుంది. ఇందులో వృత్తిలో నైతికతకు సంబంధించిన అంశాలతోపాటు శస్త్రచికిత్స చేయడం తప్ప ఇతరత్రా అవకాశాలు లేని పరిస్థితులూ ఉంటాయి. దాంతో లోకంలో ఈ శస్త్రచికిత్సల విషయంలో చాలా వాదనలూ, భిన్నాభిప్రాయాలు వినిపిస్తూ ఉంటాయి. ఇక మరికొందరు తల్లులు తాము ప్రసవం తాలూకు నొప్పులను భరించడానికి ఇష్టపడకపోవడం అనే అంశమూ శస్త్రచికిత్సలను తప్పనిసరి చేస్తోంది. కాబట్టి ఈ అంశాలన్నింటిలోనూ డాక్టరుకూ, ప్రసవమవుతున్న తల్లికీ... ఈ ఇరువురికీ ఓ స్పష్టత ఉండాలి. తమ డాక్టరును నమ్మి, తనపై పూర్తిగా విశ్వాసం ఉంచినప్పుడే ప్రసవం విషయంలో అంతా సజావుగా జరిగిపోతుంది. అందుకే తాము నమ్మకం ఉంచిన డాక్టర్ దగ్గరే ప్రసవం జరిగేలా చూసుకోవడం ఇటు కాబోయే తల్లికీ, తన కుటుంబ సభ్యులకూ, అటు డాక్టరుకూ సౌకర్యంగా ఉంటుందని గుర్తుంచుకోవాలి. - నిర్వహణ: యాసీన్ -
అణిగిపోవద్దు..అతిగా అరవవద్దు..!
పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే అందరినీ మెప్పించడం లేదా అందరినీ ఎదిరించడమని చాలామంది అపోహపడుతుంటారు. మీరు గమనిస్తే, ఆఫీసులోనో లేదా కుటుంబంలోనో కొందరు వ్యక్తులు ఎప్పుడూ అందరినీ ప్లీజ్ చేస్తూ ఉంటారు, కొందరు మాత్రం ఎప్పుడూ గొడవ పడుతుంటారు. ఈ రెండూ సరైన పద్ధతులు కావు. అసలైన పర్సనాలిటీ గ్రోత్ 'Assertiveness' (నిశ్చయత) లో ఉంది. ఇది ఎదుటివారిని గౌరవిస్తూనే, మన హక్కులను మనం కాపాడుకోవడం.1. మూడు రకాల ప్రవర్తనలు (The Behavioral Spectrum)సైకాలజీలో మనం మనుషులతో ప్రవర్తించే విధానాన్ని మూడు రకాలుగా విభజించవచ్చు.Passive (అణగిపోవడం): ఎదుటివారు ఏమనుకుంటారో అని మీ అభిప్రాయాలను దాచుకోవడం. దీనివల్ల మీ ఆత్మగౌరవం తగ్గుతుంది, దీనివల్ల మీకు లేనిపోని ఒత్తిడి పెరుగుతుంది.Aggressive (అతిగా అరవడం): ఎదుటివారిని తక్కువ చేసి మాట్లాడటం, డామినేట్ చేయడం. దీనివల్ల మనుషులు మీకు దూరమవుతారు, మీ చుట్టూ ఉన్నవారు భయపడతారు తప్ప గౌరవించరు.Assertive (The Golden Mean): "నా అభిప్రాయం ముఖ్యం, అలాగే నీ అభిప్రాయం కూడా ముఖ్యం." ఇది ఎదుటివారిని హర్ట్ చేయకుండా మీ బౌండరీని మీరు సెట్ చేసుకోవడం.2. Assertiveness ఎందుకు అవసరం? Assertiveness అనేది కేవలం ఒక కమ్యూనికేషన్ స్కిల్ మాత్రమే కాదు, అది మీ ఆత్మగౌరవానికి (Self-Respect) ప్రతిరూపం.మీరు 'Assertive' గా ఉన్నప్పుడు, మీ నిర్ణయాలకు ఒక విలువ ఉంటుంది.మీరు చెప్పే 'Yes' కు ఒక గౌరవం, చెప్పే 'No' కు ఒక క్లారిటీ ఉంటుంది.అతిగా అరవాల్సిన అవసరం లేదు, అణగిపోవాల్సిన అవసరం అస్సలు లేదు.3. మోటివేషన్ మాయ vs నిజమైన సైకాలజీట్రైనర్స్ "ఎవ్వరినీ వదిలిపెట్టకు, సింహంలా ఉండు, గర్జించు" అని చెప్తారు. ఇది మీకు అగ్రెసివ్ ట్యాగ్‌ను ఇస్తుంది. కానీ సైకాలజీ మీ గొంతును కాదు, మీ పాయింట్‌ని బలంగా చెప్పమంటుంది. కోపం తగ్గించి, స్పష్టతను పెంచుకోమంటుంది. నిజమైన నాయకుడు అరిచి పని చేయించడు, తన క్లారిటీతో పని చేయిస్తాడు.4. Assertive గా ఉండటం ఎలా?Genius Matrix ఫిలాసఫీ ప్రకారం, ఈ ఆర్ట్‌ను ఎలా బిల్డ్ చేయాలో చూద్దాం.Step 1: మొహమాటాన్ని బ్రేక్ చేయండిమొహమాటం అనేది ఒక జబ్బు. "నేను వాళ్ళని ఏమీ అనకూడదు" అనే ఆలోచనని బ్రేక్ చేయండి. మీరు ఎదుటివారికి రెస్పెక్ట్ ఇవ్వడం అంటే, వారు చెప్పే ప్రతి తప్పుకు తల ఊపడం కాదు. మీ బౌండరీలను దాటినప్పుడు సున్నితంగా, బలంగా 'No' చెప్పడం ప్రాక్టీస్ చేయండి.Step 2: Build 'I' స్టేట్మెంట్స్ఇతరులను విమర్శించేటప్పుడు "నువ్వు తప్పు చేస్తున్నావు" అనకుండా, "నీ వల్ల నాకు ఇలా ఇబ్బందిగా ఉంది" (I feel... when you...) అని చెప్పండి. ఇది ఎదుటివారిని డిఫెన్సివ్ మోడ్‌లో పడకుండా, మీ పాయింట్‌ని అర్థం చేసుకునేలా చేస్తుంది. దీన్నే మనం బిల్డ్ చేసుకోవాలి.Step 3: ప్రశాంతతే బలంమీరు ఏ పరిస్థితిలో అయినా ప్రశాంతంగా, క్లారిటీతో మాట్లాడగలిగినప్పుడు, అది మీ వ్యక్తిత్వానికి ఒక గొప్ప బలాన్ని ఇస్తుంది. మీరు ఎవరినీ డామినేట్ చేయరు, ఎవరూ మిమ్మల్ని డామినేట్ చేయలేరు. ఇదే 'Beyond' స్టేజ్.5. మీరు ఎక్కడ ఉన్నారు?ఈ రోజు మీరు ఒక చిన్న విశ్లేషణ చేయండి.మీరు నిన్నటి రోజున ఎవరికైనా ఇష్టం లేకపోయినా 'సరే' అని అన్నారా? (Passive)మీరు ఎవరి మీదైనా అనవసరంగా కోప్పడ్డారా? (Aggressive)ఏ సందర్భంలో మీరు మీ పాయింట్‌ను గౌరవంగా చెప్పగలిగారు? (Assertive)మీ గొంతుకే మీ ఆయుధం!బ్రో, మీ గొంతులో ఉండేది కేవలం శబ్దం మాత్రమే కాదు, మీ అస్తిత్వం (Identity). దాన్ని అణచివేయనివ్వకండి, అలాగని దాన్ని ఎదుటివారిపైకి గర్జనలా వాడకండి. ఒక స్పష్టమైన, ప్రశాంతమైన, దృఢమైన గొంతుకను డెవలప్ చేసుకోండి."Assertiveness is not about what you say, but how you say it."సైకాలజిస్ట్ విశేష్ Genius Matrix Hub 8019 000066www.psyvisesh.com(చదవండి: దెబ్బ తగిలినా తిరిగి నిలబడే తత్వం) -
ప్రసవానంతరం బరువు తగ్గాలంటే..! ఈ వర్కౌట్లు తప్పనిసరి..
ప్రసవానంతరం బరువు తగ్గడం చాలా సవాలుగా ఉంటుంది. మాములుగా బరువు తగ్గడానికి గర్భధారణ అనంతరం తగ్గడానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. పైగా శరీరంలో వచ్చే మార్పులకు తోడు నవజాత శిశువుని హ్యాండిల్ చేస్తూ బరువు తగ్గడం తదితరాలన్ని చాలా సవాలుగా ఉంటాయి. ముందుగా శరీరం మునపటి పటుత్వం లేక..కొద్దిపాటి వ్యాయామాలను ఓర్చుకునే శక్తి స్వతహాగా కొత్త తల్లులకు ఉండదు. మరి అలాంటప్పుడు ఎలాంటి తేలిక పాటి వ్యాయామాలు చేయాలి..? కొత్త తల్లులు నిజంగానే తీవ్రమైన వ్యాయామాల జోలికి పోకపోవడమే మంచిదా..? తదితరాల గురించి కంటెంట్ క్రియేటర్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ నిధి త్యాగి చెప్పే సలహాలు సూచనలే గురించి సవివరంగా చూద్దామా..!.ప్రసవానంతరం బరువు తగ్గం అనేది సాధారణ విషయం కాదని అంటోంది నిధి త్యాగి. దీని గురించి ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో అమూల్యమైన సలహాలు సూచనలు షేర్ చేశారు. ఇక్కడ కొత్త తల్లులు కొలెస్ట్రాల్ తగ్గించుకోవడం కంటే..కేలరీలలోటు, కదలికలపై దృష్టిపెట్టాలని అంటోంది. చాలామంది డెలివరీ తర్వాత పాలిస్తారు కాబట్టి బరువు తగ్గిపోతారని అనుకుంటుంటారు. కానీ అది ముమ్మాటికీ అబద్ధమని అంటోంది. తాను ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు మామిడపండ్లు అధికంగా తినేదాన్ని అని ఆ టైంలో ఏకంగా 20 కిలోలకు పైగా అదనపు బరువు ఉన్నానని చెప్పుకొచ్చింది. ప్రసవం తర్వాత పదికిలోలు మాత్రమే తగ్గానని, మిగిలిని పదికిలోల బరువు అలాగే ఉందని తెలిపింది. ఏడాదికి పైగా బిడ్డకు పాలిచ్చానని, ఇంట్లో వండిన భోజనం మాత్రమే తీసుకున్నానని, అలాగే తేలికపాటి వాకింగ్ వంటివి చేసేదాన్ని అని వెల్లడించింది. కానీ అంతలా కేర్ తీసుకున్నా..బరువులో అంతగా మార్పులు కనిపించలేదని అంటోంది. పైగా డెలివరీ తర్వాత బరువు తగ్గడానికి తీవ్రమైన వ్యాయామాల జోలికి అస్సలు పోకూడదని అంటోంది. ఎందుకంటే కొత్త తల్లుల శరీరం సున్నితంగా మారిపోయి ఉంటుంది..దాంతో ఆ వర్కౌట్లు తట్టుకోవడం అంత సులభం కాదని చెబుతోంది. కనీసం 15 నిమిషాలు కూడా చేయలేమని అంటోంది. అలా అని బయటకు జిమ్ వెళ్లే పరిస్థితి కూడా లేకపోవడంతో హోమ్ ఇన్‌స్ట్రక్టర్‌ని నియమించుకున్నట్లు తెలిపింది. అతను సూచించిన కోర్ వ్యాయామాలు, కార్డియో, స్ట్రెంగ్త్ ట్రైనింగ్, వెయిట్ ట్రైనింగ్ వ్యాయామాలతో బలం పుంజుకోగలిగానని అంటోంది. వీటివల్ల కండరాలు బలోపేతం అవుతుతాయి. కొద్దిపాటి బరువులు ఎత్తి..బోడ్డులోపలికి కోర్ని స్ట్రాంగ్‌గా మార్చుకోగలిగానని అంటోంది. అలా తాను నాలుగు నెలల్లో నాలుగు నుంచి ఐదు కిలలోలు వరకు తగ్గగలిగానని అంటోంది. ప్రస్తుతం తాను ప్లాంక్‌లు కూడా వేయగలనని, వెన్నునొప్పి లేదని అంటోంది. కానీ ప్రసవానంతరం వేగవంతంగా బరువు తగ్గాలనుకోవడం తప్పులేదు గానీ..ఆ క్రమంలో తప్పుడు మార్గంలో వెళ్లొద్దని, ఆరోగ్యకరమైన మార్గాన్ని ఎంచుకోమని చెబుతోంది కంటెంట్ క్రియేటర్ నిధి త్యాగి. View this post on Instagram A post shared by Nidhi Tyagi (@thenidhityagi) (చదవండి: చీరకట్టులో స్నోబోర్డింగ్ స్టంట్..!) -
కలుపు మొక్కలకు భయపడొద్దు
సమాజం మనల్ని ఇలానే ఉండాలని నిర్దేశిస్తుంది. కొన్ని కలుపు మొక్కలు మనల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తాయి. మన లక్ష్యాలను నెరవేర్చుకోనివ్వకుండా అడ్డంకులు సృష్టిస్తాయి.అయినా ఆగిపోకుండా మహిళలు ధైర్యంగా బతుకుతూ ముందుకు సాగిపోవాలి అంటున్నారు నటి, దర్శకురాలు వరలక్ష్మి.⇒ నా స్కూల్ డేస్‌లో నేను ఈవ్ టీజింగ్‌కి గురైన సందర్భాలు చాలా ఎక్కువ. వాళ్లందరికీ నా స్టైల్లో నేను బుద్ధి చెప్పాను. కొందరికి మాటలతో చెబితే పనికి రాదు; అలాంటివాళ్లకు చెంప దెబ్బతో సమాధానం చెప్పడం చాలా అవసరం.⇒ అమ్మాయిలను వేధించేవాళ్లు ఎక్కడున్నా వారికి బ్యాక్‌గ్రౌండ్‌తో సంబంధం లేదు. కొత్త అమ్మాయిలనూ వేధిస్తారు... బ్యాక్‌గ్రౌండ్ ఉన్న అమ్మాయిలనూ ఇబ్బందులపాలు చేస్తారు. వాళ్లకు ఎవరూ స్పెషల్ కాదు. నేనైతే సినిమాలో యాక్షన్ రోల్స్ చేసినప్పుడు ఎలా కొడతానో అలాగే రియల్ లైఫ్‌లోనూ. అయితే ‘అలాంటివాళ్లను ఇలా చేయండి’ అని నేను ఎవరికీ సలహా ఇవ్వను. ఎందుకంటే ఒక్కొక్కరి తీరు ఒక్కోలా ఉంటుంది. కాని నేను చెప్పేదొక్కటే– పరిస్థితి ఏదైనా కావొచ్చు, ధైర్యంగా ఎదుర్కోండి.⇒ నా కెరీర్ ఆరంభంలో నేను ‘ఇన్సెక్యూరిటీ’కి గురయ్యాను. దానికి కారణం సరైన అవకాశాలు రాకపోవడమే. అయితే ఆ అభద్రతాభావం నన్ను మానసికంగా కుంగదీయలేదు. శరత్‌కుమార్‌గారి కూతురిగా నాకు ఒక విజిటింగ్ కార్డ్ ఉంటుంది. కాని, నన్ను నేను నిరూపించుకోవాల్సిందే! ఆర్టిస్ట్‌గా నాకు దక్కే ప్రతి చాన్స్ ద్వారా నన్ను నేను నిరూపించుకుంటూ వస్తున్నాను.⇒ అమ్మాయిలు వాళ్లకు నచ్చినట్లు వాళ్లు ఉండాలి. అమ్మాయిలు సున్నితంగానే ఉండాలి. అప్పుడే అందరికీ నచ్చుతారు. ఇగోయిస్ట్లను ఇష్టపడరని చాలామంది ఫిక్స్ అయిపోతారు. అసలు ఒకరికి నచ్చేట్లు ఉండాలని ఎందుకు అనుకోవాలి? మన వ్యక్తిత్వానికి తగ్గట్టు మనం నడుచుకోవాలి. వేరేవాళ్ల కోసం మన తీరు మార్చుకుంటే మనకంటూ ఒక ఉనికి ఉండదు. సమానత్వం అనేది మనకి ఇక్కడే ఉంది. ఇక మనం ఎందుకు తక్కువ అవుతాం.⇒ మహిళలు ఎదుర్కొనే ప్రధాన సమస్యల్లో ‘బాడీ షేమింగ్’ ఒకటి. సన్నగా ఉంటే మరీ సన్నగానా? అంటారు. బొద్దుగా ఉన్నా విమర్శిస్తారు. ఇప్పుడు ఒక గదిలో పదిమంది ఉంటే ఐదుగురికి వెజ్ పలావ్ నచ్చుతుంది, మరో ఐదుగురికి నాన్‌వెజ్ బిర్యానీ నచ్చుతుంది. ఎవరి టేస్ట్ వారిది. అలాగే ఎవరి బాడీ వారిది, ఎవరి చాయిస్ వారిది. దాన్ని విమర్శించే హక్కు ఎవరికీ లేదు. మనం ఎలా ఉండాలనుకుంటున్నామో అలానే ఉండాలి. ఎవరేం అనుకుంటే మనకేంటి? మన వ్యక్తిత్వమే మనం.⇒ కొన్ని విషయాల్లో అమ్మాయిలకు అమ్మాయిలే శత్రువులైపోతారు. చదువుకో! జాబ్ చెయ్! పెళ్లి చేసుకో!– ఇలా సలహాలు ఇస్తారు. ఒకవేళ పెళ్లి చేసుకోలేదనుకోండి, ‘ఇంకా పెళ్లి చేసుకోకపోవడం ఏంటి?’ అంటారు. ఆ అమ్మాయి వెనక కామెంట్ చేస్తారు. ఇలాంటి ఆడవాళ్ల తీరు మారాలి.⇒ సినిమా ఇండస్ట్రీలో నేను ఎదుర్కొన్న కొన్ని చేదు అనుభవాలే ‘సేవ్ శక్తి’ పౌండేషన్ ఆరంభించేలా చేశాయి. నాకు ఎదురైన సమస్యలను ధైర్యంగా ఎదుర్కొన్నాను. నాలా ఎదుర్కోలేనివాళ్ల కోసమే ఈ ఫౌండేషన్ ఆరంభించాను. డిప్రెషన్‌కు గురైనవారిని అందులోంచి బయటకు తేవడానికి డాక్టర్స్ సహాయం తీసుకుంటాం. ఇప్పటివరకూ చాలామంది అమ్మాయిలకు హెల్ప్ చేశాం. ‘సేవ్ శక్తి’కి సంబంధించిన వ్యవహారాలను ఎక్కువగా మా అమ్మ ఛాయ చూసుకుంటారు.⇒ స్టేజి మీద నేను సాధారణంగా ఎమోషనల్ అవ్వను. కాని, ఆ రోజు (‘సరస్వతి’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్. ఈ సినిమా ద్వారా వరలక్ష్మి దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు) అలా ఎందుకు అయ్యానంటే నటిగా స్టార్ట్ అయి, డైరెక్టర్ స్థాయికి రావడం చిన్న విషయం కాదు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నాకెన్నో అవకాశాలు ఇచ్చింది. అలాంటి ఒక ఇండస్ట్రీ వేదిక మీద మాట్లాడుతున్నప్పుడు కాస్త ఎమోషనల్‌గా అనిపించింది. - డి.జి. భవాని -
పాత ఆలోచనా విధానాన్ని కూల్చేయండి
ఇప్పటివరకు మనల్ని మనం గమనించాం, మన లోపాలను గుర్తించాం, మన మెదడు మనకు చెప్పే అబద్ధాలను పట్టుకున్నాం. ఇప్పుడు ఆ పాత పునాదిని పూర్తిగా కూల్చివేసి (Break), కొత్తదానికి సిద్ధమయ్యే సమయం. ఎందుకంటే, పాత భవనం మీద కొత్త ఇల్లు కట్టలేం కదా! మన పాత పర్సనాలిటీని ఎలా 'బ్రేక్' చేయాలో చూద్దాం.పర్సనాలిటీ డెవలప్మెంట్లో 'బ్రేక్' చేయడం అంటే మనల్ని మనం నాశనం చేసుకోవడం కాదు, మనల్ని మనం పరిమితం చేస్తున్న ఆ పాత 'ఐడెంటిటీ' (Identity) ని వదిలించుకోవడం. దీనినే సైకాలజీలో 'De-conditioning' అంటారు. మీరు ఇన్నాళ్లూ నమ్మిన 'నేను' అనే వ్యక్తి, కేవలం పరిస్థితులు సృష్టించిన ప్రతిబింబం మాత్రమే. ఆ ప్రతిబింబాన్ని ఇప్పుడు తుడిచేయాలి.1. పాత పునాది ఎందుకు కూలిపోవాలి?చాలామంది తమ పాత అలవాట్లను, పాత భయాలను ఎందుకు వదలలేకపోతారంటే, అవి వారికి సుపరిచితమైనవి. అవి మనకు కష్టం కలిగించినా, అవి మనకు తెలిసినవి కాబట్టి వాటిని వదలడానికి భయపడతాం.పాత ఆలోచనలు = మీ గతం.కొత్త పర్సనాలిటీ = మీ భవిష్యత్తు.ఈ రెండింటికీ మధ్య ఒక గ్యాప్ ఉంటుంది, అదే 'The Void' (శూన్యం). ఈ శూన్యంలోకి వెళ్లడానికి చాలామంది భయపడతారు. కానీ, ఆ శూన్యమే మీ కొత్త వ్యక్తిత్వానికి పునాది!2. కూల్చివేతకు కావాల్సిన మూడు ఆయుధాలుమీ పాత ఐడెంటిటీని బ్రేక్ చేయడానికి మీకు మూడు ముఖ్యమైన ఆయుధాలు కావాలి.Radical Honesty: మీకు మీరు అబద్ధం చెప్పుకోవడం మానేయాలి. "నాకు కోపం రాదు" అని అబద్ధం చెప్పే బదులు, "నేను అతిగా రియాక్ట్ అవుతున్నాను, అది నా బలహీనత" అని ఒప్పుకోవాలి. నిజం మాట్లాడటం మొదలుపెడితే, పాత అబద్ధపు గోడలు దానంతట అదే కూలిపోతాయి.Detachment: మీ ఆలోచనలు, మీ భావోద్వేగాలు మాత్రమే మీరు కాదు. కోపం వచ్చినప్పుడు "నేను కోపంగా ఉన్నాను" అనడం కంటే, "నాలో కోపం అనే భావం కలుగుతోంది" అని అనండి. ఆ ఆలోచనల నుండి మిమ్మల్ని మీరు వేరు (Detach) చేసుకున్నప్పుడే మీరు వాటిని బ్రేక్ చేయగలరు.Destruction of Comfort Zone: ప్రతిరోజూ మీకు భయం కలిగించే చిన్న పనిని చేయండి. మీ పాత వ్యక్తిత్వం ఎక్కడైతే ఆగిపోతుందో, అక్కడ మీరు అడుగు వేయండి.3. మార్కెట్ మోటివేషన్ vs రియల్ సైకాలజీమార్కెట్ "నేను గెలుస్తాను, నేను తోపు" అని అరుస్తూ గోడలను బద్దలు కొట్టమంటుంది. ఇది తాత్కాలిక జోష్.సైకాలజీ (CBT & Mindfulness) గోడలను కొట్టడం కాదు, ఆ గోడలు అసలు ఎందుకు కట్టామో (పాస్ట్ ట్రామాస్) అర్థం చేసుకుని, వాటిని ఇటుక ఇటుకగా విడదీయమంటుంది. అప్పుడే మళ్ళీ ఆ గోడలు కట్టే అవకాశం ఉండదు.4. మీ నూతన నిర్మాణానికి సిద్ధం!Genius Matrix ఫిలాసఫీ ప్రకారం, ఈ కూల్చివేత ప్రక్రియ ఎలా ఉండాలి?Step 1: Break (అహాన్ని వదిలేయడం)మీరు ఇన్నాళ్లు కాపాడుకున్న ఆ 'ఇమేజ్'ని వదిలేయండి. "నేను అంటే ఇలాగే ఉంటాను" అనే ఫిక్స్డ్ మైండ్‌సెట్‌ను వదిలేయండి. మీ పాత ఐడెంటిటీని 'డీ-కన్స్ట్రక్ట్' (Deconstruct) చేయండి. ఇది నొప్పిగా ఉంటుంది, కానీ ఇది అవసరం.Step 2: Build (నిశ్శబ్దం)పాత పర్సనాలిటీ కూలిపోయిన తర్వాత, కొత్తది కట్టే ముందు కొద్ది రోజులు 'నిశ్శబ్దం'గా ఉండండి. ఏ ప్లాన్లు లేని, ఏ లేబుల్స్ లేని ఒక శూన్య స్థితిలో ఉండండి. అక్కడే మీ అసలైన పర్పస్ (Purpose) పుడుతుంది.Step 3: Beyond (కొత్త ప్రతిబింబం)ఇప్పుడు మీరు కొత్త ఇటుకలతో, కొత్త ఆలోచనలతో మీ వ్యక్తిత్వాన్ని నిర్మించుకోండి. ఈసారి ఇది మీ ఛాయిస్, సమాజం వేసిన అచ్చు కాదు. ఇదే మీరు 'Beyond' స్టేజ్‌లోకి వెళ్ళే మార్గం.5. మీ పాత వ్యక్తిత్వానికి వీడ్కోలు!ఈ రోజు ఒక చిన్న విచారణ చేయండి.* మీ పాత ఐడెంటిటీలో మిమ్మల్ని ఇబ్బందిపెట్టిన ఒక లక్షణం ఏది?* ఆ లక్షణాన్ని వదిలేస్తే, మీరు పోగొట్టుకునేది ఏంటి? (బహుశా అది ఒక భద్రత కావచ్చు).* ఆ భద్రతను వదిలి, కొత్తగా మారుతానని మీకు మీరు ఒక ప్రామిస్ చేసుకోండి.కూల్చండి.. అప్పుడే నిర్మించగలరు!బ్రో, పాత గోడలను కూల్చడం బాధాకరమే కావచ్చు. కానీ గుర్తుంచుకోండి, ఆ గోడల వల్ల మీరు ఇప్పటివరకు ఎంతో పరిమితంగా బతికారు. ఇప్పుడు ఆ పరిమితులు లేవు. మీరు గాలిలో ఎగరడానికి సిద్ధంగా ఉన్నారు."Sometimes, you have to break yourself to become whole."సైకాలజిస్ట్ విశేష్ Genius Matrix Hub 8019 000066www.psyvisesh.com -
సౌందర్య సాధనాలకన్నా చిరునవ్వే అసలైన అందం!
వెండితెరపై తన సహజ సిద్ధమైన నటనతో ఎంతో మంది హృదయాలను గెలుచుకున్న నటి సాయి పల్లవి, తన వ్యక్తిత్వంతోనూ ఎంతోమందికి రోల్ మోడల్‌గా నిలుస్తోంది. తాను గ్లామర్ ప్రపంచంలో ఉన్నప్పటికీ, మహిళలు తమని తాము ఎలా ఉన్నా ప్రేమించుకోవాలని నేర్పిస్తోంది. మన విలువలకు విరుద్ధంగా ఉండేవి ఎంతటి విలువగలవయినా తిరస్కరించాలి అనే సూత్రాన్ని ఆచరించి చూపించారు. రూ. 2 కోట్ల విలువైన ఫెయిర్‌నెస్ క్రీమ్ యాడ్‌ని తిరస్కరించి, రంగు అనేది అందానికి కొలమానం కాదని నిరూపించారు. మేకప్ లేకుండా తెరపై కనిపించి .. నీలా నువ్వు ఉన్నప్పుడే ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుందని, ఇతరుల కోసం మారాల్సిన అవసరం లేదని చెప్పకనే చెప్పారు. మొటిమలున్నా, జుట్టు రింగులుగా ఉన్నా.. అది దేవుడిచ్చిన వరమని, సౌందర్య సాధనాలకన్నా చిరునవ్వుతో వెలిగే ముఖమే మిన్న అని చెబుతున్నారు. అలాగే చదువు అనేది ప్రతి ఒక్కరికి ఒక ఆయుధమని, అది మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని చాటి చెప్పారు. మనం చేసే పనిపై ఇష్టం ఉంటే విజయం దానంతట అదే వస్తుందని ఆమె అంటారు. విజయాలు, అపజయాలు తాత్కాలికమని, అవి నిన్ను ప్రభావితం చేయనివ్వద్దని సూచిస్తారు. బాల్యంలో స్టేజ్ ఫియర్ ఉన్న సాయిపల్లవి.. భయం ఉన్న చోటే ధైర్యాన్ని వెతుక్కోవాలని తన జీవిత విజయాల ద్వారా నిరూపిస్తారు. (చదవండి: అత్యంత యవ్వనంగా 60 ఏళ్ల తాత..! అతడి గ్లామర్ రహస్యం ఇదే..) -
ఆహార వృథాను అరికట్టే ‘అర్క ట్రైసైకిల్’
ఎండలు ఏటేటా అంతకంతకూ మండిపోతున్నాయి. రైతులు ఆరుగాలం కష్టపడి పండించే ఆకుకూరలు, కూరగాయలు, పండ్లను తోపుడు బండ్ల ద్వారా వినియోగదారుల ఇళ్ల దగ్గరకు తెచ్చి చిరు వ్యాపారులు (కొందరు సేంద్రియ / ప్రకృతి వ్యవసాయదారులు కూడా) అమ్ముతూ ఉంటారు. అయితే, ఇలా పండిన పంట తినేవారి ఇంటికి చేర్చే లోగా రోజువారీగా 10–15% వరకు ఎండకు వడపడి, రంగు మారి, దుమ్మూ ధూళి పడి పాడైపోయి వృథా అవుతున్నాయని అంచనా. ఈ వృథాను అరికట్టగలిగితే విలువైన ఆహారం వృథా కాకుండా ఉంటుంది. రిటైల్ విక్రయదారుల ఆదాయమూ పెరుగుతుంది. సాధారణ తోపుడు బండ్ల వల్ల జరిగే ఈ నష్టాన్ని అరికట్టడానికి బెంగళూరులోని భారతీయ ఉద్యాన పంటల పరిశోధనా సంస్థ (ఐఐహెచ్ఆర్) సౌర విద్యుత్తుతో నడిచే ట్రైసైకిల్‌ను రూపొందించింది. దీనికి ‘అర్క ట్రైసైకిల్’ అని పేరు పెట్టారు (కర్ణాటకలో ‘అర్కావతి’ నది ఒడ్డున ఐఐహెచ్ఆర్ ఉంది. అందుకే ఈ సంస్థలో రూపొందే కొత్త వంగడాలు, ఇతర ఉత్పత్తులకు కూడా ముందు అర్క అని పెడుతూ ఉంటారు. అర్క అని ఏ వంగడం, ఉత్పత్తి పేరులో ఉంటే అది బెంగళూరు ఐఐహెచ్ఆర్ అభివృద్ధి చేసిందని తెలుసుకోవచ్చు). అందంగా, సౌకర్యవంతంగా ఐఐహెచ్ఆర్ శాస్త్రవేత్తలు తయారు చేసిన ఈ ట్రైసైకిల్.. సౌర విద్యుత్తుతో నడుస్తుంది. ఇందులో ఉంచే కూరగాయలు, పండ్లు తదితర ఉత్పత్తులు పాడైపోకుండా ఉష్ణోగ్రత, తేమలను ‘ఎవాపరేటివ్ కూలింగ్’ పద్ధతిలో నియంత్రించవచ్చు. కూరగాయల బరువుతో కూడిన తోపుడు బండిని నెట్టుకుంటూ వెళ్లే చాకిరీని అర్క ట్రైసైకిల్ చాలా వరకు తగ్గిస్తుంది. సాధారణ తోపుడు బండితో తిరిగే ప్రాంతాల కన్నా ట్రైసైకిల్ ద్వారా ఎక్కువ ప్రాంతాల్లో వేగంగా తిరుగుతూ.. తక్కువ కాలంలోనే ఎక్కువ ఉత్పత్తులను అమ్ముకోవచ్చు. సౌర విద్యుత్తు ద్వారా చల్లగాలి ప్రసరించే ఏర్పాటు ఉండటం వల్ల అర్క ట్రైసైకిల్ ద్వారా తీసుకెళ్లే కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పుట్టగొడుగులను కోత తర్వాత 36–48 గంటల పాటు తాజాగా ఉంచుకుంటూ అమ్ముకోవడానికి వీలవుతుంది. తక్కువ కష్టంతో తక్కువ కాలంలోనే ఎక్కువ ప్రాంతాల్లో ట్రైసైకిల్ తిరుగుతుంది. కూరగాయలు, పండ్లు, ఆకుకూరల నాణ్యత, నిల్వ సామర్థ్యం కూడా బాగా పెరుగుతుంది. ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి సేంద్రియ/ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పండించిన వ్యవసాయోత్పత్తులను నాణ్యంగా, తాజాగా వినియోగదారుల ఇళ్లకు తీసుకెళ్లి ఇవ్వటం అర్క ట్రైసైకిల్ వల్ల సాధ్యమవుతుందని దీన్ని రూపొందించిన ఐఐహెచ్ఆర్ ప్రధాన శాస్త్రవేత్త డా. జి. సెంథిల్ కుమార్ ‘సాక్షి’తో చెప్పారు. అర్క ట్రైసైకిల్ ప్రత్యేకతలుభారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసిఏఆర్) కు అనుబంధ సంస్థ అయిన బెంగళూరులోని భారతీయ ఉద్యాన పంటల పరిశోధనా సంస్థ (ఐఐహెచ్ఆర్) రూపకల్పన చేసినది. దీని పైనే సౌర ఫలకాలు ఉంటాయి. ఎండలో తిరిగేటప్పుడే బ్యాటరీ చార్జ్ అవుతూ ఉంటుంది. ఆ శక్తితోనే ట్రైసైకిల్ నడుస్తుంది. దీన్ని నడిపే వ్యక్తి సైకిల్ తొక్కనవసరం లేదు. నెట్టుకుంటూ వెళ్లాల్సిన అవసరం లేదు. ఆ కష్టం తప్పుతుంది. బ్యాటరీ ఫూర్తిగా చార్జి అయితే 50 కిలోమీటర్ల దూరం నిరాటంకంగా ప్రయాణిస్తుంది.ఇందులో 20 ప్లాస్టిక్ క్రేట్స్‌ను పెట్టుకునే ఏర్పాటు ఉంది. ఒక్కో క్రేట్లో 10 కిలోల సరుకును పెట్టవచ్చు. 200 కిలోల ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, పుట్టగొడుగులను తీసుకెళ్లవచ్చు.సౌరవిద్యుత్తుతో ఎవాపరేటివ్ కూలింగ్ సిస్టం ద్వారా గాలిని చల్లబరిచి ఈ ట్రైసైకిల్లోని పచ్చి సరుకు పాడవకుండా ఉండేందుకు సరిపోయే చల్లదనాన్ని ఇచ్చే వ్యవస్థ ఉంది. రాత్రి పూట అమ్మకాలు చేయడానికి వీలుగా ఎల్ఇడి బల్బులు ఉన్నాయి. డిజిటల్ కాటా ఉంది. ప్రజలకు వినిపించేలా ఉత్పత్తుల వివరాలు పెద్దగా వినపడేలా చెప్పడానికి సోలార్ విద్యుత్‌తో నడిచే మైక్ ఉంటుంది. మబ్బులున్నప్పుడు దీన్ని విద్యుత్‌తో చార్జ్ చేసుకోవచ్చు.వినియోగదారుల భద్రత కోసం ఆటోమేటిక్‌గా శానిటైజర్ పరికరం ఉంది. తోపుడు బండ్ల వ్యాపరులకు కూరగాయలు, పండ్ల వృథాను తగ్గించుకొని అధిక ఆదాయం పొందేందుకు ట్రైసైకిల్ ఉపయోగపడుతుంది. తమ ఇళ్ల దగ్గరకే వచ్చి పరిశుభ్రంగా, తాజాగా ఉండే కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు, పుట్టగొడుగులు అమ్ముతున్నందున అర్క ట్రైసైకిల్ పట్ల వినియోగదారులు ఆకర్షితులవుతారు. అర్క ట్రైసైకిల్ ధర రూ. లక్షన్నర. తోపుడు బండిపై అమ్మితే వృథా అయ్యే కూరగాయలు, ఆకుకూరలు, పండ్లను ట్రైసైకిల్ ద్వారా నిక్షేపంగా అమ్ముకోవచ్చు కాబట్టి రెండేళ్లలో దీని ఖర్చును తిరిగి రాబట్టుకోవచ్చు. నిర్వహణ పతంగి రాంబాబుసాక్షి, సాగుబడి డెస్క్(చదవండి: జస్ట్ మూడు నెలల్లో 14 కిలోలు బరువు తగ్గాలంటే..!) -
జస్ట్ మూడు నెలల్లో 14 కిలోలు బరువు తగ్గాలంటే..!
శీతాకాలం కంటే వేసవికాలంలో బరువు తగ్గడం చాలా సులభం. అందులోనూ ప్రస్తుతం చలికాలం ముగిసి.. వేసవికాలంలోకి ప్రవేశిస్తున్నాం. ఇన్నాళ్లు చలికి భయపడి ముసుగుతన్ని పడుకున్న వాళ్లంతా ఒక్కసారిగా ఈ మండే ఎండల్లో అయినా కొలెస్ట్రాల్ తగ్గించుకుని బరువు తగ్గాలని ప్రయత్నిస్తుంటారు. అలాంటివాళ్లు ప్రముఖ ఫిట్నెస్ కోచ్ డాన్ గో నెట్టింట షేర్ చేసిన పదహారు రూల్స్ తప్పక ఫాలో అవ్వాల్సిందే. ఎందుకంటే ఆయన వేసవి సమీపించగానే చాలామంది వెయిట్లాస్కు ప్లాన్ చేస్తుంటారు. అలాంటి వాళ్ల కోసం ఇన్స్టాగ్రామ్ వేదికగా వెయిట్‌లాస్ టిప్స్ షేర్ చేశారు ఫిట్నెస్ కోచ్ డాన్‌గో. ఆరోగ్యప్రదంగా తక్కువ టైంలో కిలోల కొద్ది బరువు తగ్గి.. మెరుగైన ఫలితాలు సత్వరమే అందుకోవాలంటే ఈ పదహారు రూల్స్ తప్పనిసరిగా పాటించాలని చెబుతున్నారు. మరి అవేంటో తెలుసుకుందామా..!.నిద్రకు కొన్ని గంటల ముందు తినకపోవడం..నిద్రవేళకు కనీసం మూడు నుంచి ఐదు గంటలు ముందు తినడం మానేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇది ఎక్కువగా ఆహారం తీసుకోవడాన్ని నిరోధిస్తుంది. నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. ఆకలిని నియంత్రించడంలో సహాయపడుతుంది. కేలరీలు తీసుకోవడంలో కేర్.. శరీర బరువుని 12తో గుణించగా వచ్చిన మొత్తంని మీ రోజువారీ కేలరీలుగా కేటాయించండి. ఈ అసాధారణ సూత్రాన్ని తప్పక అనుసరించమని కోరారు ఫిట్నెస్ కోచ్.ప్రోటీన్‌కు ప్రాధాన్యత ఇవ్వడం..రోజువారీ ఆహారంలో తగినంత ప్రోటీన్ అవనసం. శరీర బరవుని ఏడుతో గుణిస్తే వచ్చిన మొత్తం మీర రోజువారిగా తీసుకోవాల్సిన ప్రోటీన్గా గుర్తించండి. ఈ విధానం వల్ల కొలెస్ట్రాల్‌ని తగ్గించుకుంటూ..కండరాలను నిర్మించడానికి, నిర్వహించొచ్చని చెబుతున్నారు. అందుకు ఈ మాత్రం ప్రోటీన్ తప్పనిసరి అని అన్నారు.ఆహారంలో జోడించాల్సిన ఆహారాలురోజువారీ ఆహారంలో ఏం చేర్చుకోవాలంటే..గ్రీకు పెరుగునీరు, కాఫీ, టీలీన్ గ్రౌండ్ బీఫ్ (వీలైతే అదనపు లీన్)చికెన్ బ్రెస్ట్ టర్కీ (గ్రౌండ్ లేదా బ్రెస్ట్)కొవ్వు చేపగుడ్లు, గుడ్డులోని తెల్లసొనకాటేజ్ చీజ్లీఫీ గ్రీన్స్బంగాళాదుంపలుషెల్ఫిష్బీన్స్, కాయధాన్యాలుబెర్రీలుఆపిల్, నారింజ, కివి, ద్రాక్షపండు వంటి అధిక ఫైబర్ పండ్లుఆకుపచ్చ క్రూసిఫెరస్ కూరగాయలుకాలీఫ్లవర్, గుమ్మడికాయ, పుట్టగొడుగులు, మిరియాలు, ఆస్పరాగస్, దోసకాయలు వంటి ఇతర అధిక-పరిమాణ కూరగాయలురోజుకు రెండు పూటల భోజనం..ఫిట్నెస్ కోచ్ రోజుకు రెండు పూటలా భోజనం తీసుకునేలా చూసుకోమని సూచించారు.భోజన షెడ్యూల్లో తీసుకోవాల్సిన కేర్..ఫిట్నెస్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, సరైన భోజన షెడ్యూల్ ఈ క్రింది విధంగా ఉంటుంది:పడుకునే ముందు 3 నుంచి 5 గంటల ముందు చివరి భోజనంనిద్రలేచిన 1 నుంచి 2 గంటల ముందు మొదటి భోజనంరెండవ భోజనం మధ్యలో ఉండాలిఅల్పాహారంలో ఏమి చేర్చాలిఅల్పాహారంలో ఏమి చేర్చాలి అనేది ఇక్కడ ఉంది:గ్రీకు పెరుగు - ప్రేగులకు మంచిదిప్రోటీన్ పౌడర్ - ఆకలిని నియంత్రిస్తుంది, కండరాలను మెరుగుపరుస్తుందిబ్లూబెర్రీస్ - ఫైబర్, యాంటీఆక్సిడెంట్లను అందిస్తుంది. అలాగే వాపును తగ్గించడంలో సహాయపడుతుంది.హైడ్రేటెట్‌గా ఉండండిశరీరానికి తగిప హైడ్రేషన్ కూడా అవసరం. దీని కోసం, ఫిట్నెస్ కోచ్ ఉదయం 500 మి.లీ నీరు, అలాగే భోజనానికి ముందు తర్వాత త్రాగాలని సూచిస్తున్నారు. అయితే, పడుకునే రెండు గంటల ముందు నీరు త్రాగడం మానేయాలని చెబుతున్నారు.శక్తిమంతమైన వ్యాయామాలు..ఆహారంతో పాటు, ఒక రోజు విశ్రాంతితో వారానికి మూడు సార్లు కాస్త ఫోర్స్‌తో కూడిన వ్యాయామాలు చేయాలని సూచిస్తున్నారు. అవసరైమతే కాస్త అధిక ఫోర్స్‌తో చేసే వర్కౌట్లు మరింతగా చేసేలా ప్లాన్ చేయాలని సూచిస్తున్నారు.శరీరాన్ని కదిలిస్తూ ఉండండిశక్తి శిక్షణ తర్వాత, శరీరానికి సరైన కదలిక కూడా అవసరం. రోజుకు కనీసం 8 వేల నుంచి 10 వేల అడుగులు వేయండి" అని ఫిట్‌నెస్‌కోచ్ సిఫార్సు చేస్తున్నారు. డెస్క్ ఉద్యోగం చేస్తున్న వ్యక్తి తన ప్రణాలికకు అంతరాయం కలగకుండా..డెస్క్ కింద ట్రెడ్మిల్ తీసుకోవడం, వాక్ చేస్తూ మీటింగ్‌లు ప్లాన్ చేయడం వంటివి చేయాలి.నాణ్యమైన నిద్రకు ప్రాధాన్యత ఇవ్వండిచక్కటి సౌకర్యవంతమైన బెడ్రూమ్లో నిద్రపోవాలి. బెడ్రూమ్ చూడగానే నిద్ర వచ్చేలా ఆహ్లాదంగా ఉంచుకోవాలి.స్థిరమైన నిద్ర దినచర్య..మంచి నిద్ర తోపాటు ఇవి కూడా ఉండాలి.ఉదయం నిద్ర లేవగానే సూర్యరశ్మిని పొందండిముఖ్యంగా వారాంతాల్లో ఒకే సమయంలో నిద్రపోండి, మేల్కొనండిశరీరాన్ని చల్లబరచడానికి వేడి స్నానం లేదా స్నానం చేయండిమంచానికి ఒక గంట ముందు స్క్రీన్లను చూడటం మానుకోండిసూర్యుడు అస్తమించేటప్పుడు మసకబారిన లైట్లు లేదా ఎరుపు రంగు ప్రకాశించే బల్బులను ఉపయోగించండిపురోగతిని ట్రాక్ చేయండివార గడిచినప్పుడల్లా..బరువు, శరీరం కొలతల్లో వచ్చిన మార్పులు గమనించాలి. అందుకు తగ్గట్లుగా పోషకాహారం తీసుకుంటుండాలి. అలాగే ఆ మార్పులను ఫోటోలు తీస్తూ..గమనించుకోవాలన్నారు.పరివర్తనను గుర్తించి..మెయింటైయిన్ చేయాలి..కేవలం ట్రాక్ చేయడమే కాకుండా, బాడీలోని మార్పులను గమనిస్తూ..ఆ దిశగా ప్లాన్‌లో మార్పులు చేర్పులు చేసుకుంటుండాలి. ఈ సమయంలో ఆల్కహాల్‌ను నివారించండిమెరుగైన ఫలితాలు అందుకుంటున్నప్పుడు ఆల్కహాల్ జోలికి వెళ్లొద్దని సూచిస్తున్నారు.నిరాశను దరిచేరనివ్వకుండా యాక్టివ్‌గా ఉండటం..అద్దంలో మార్పులు చూస్తూ..మరింత ఆత్మవిశ్వాసంతో డైట్‌ని, రూల్స్నిన స్థిరత్వంతో పాటించాలి. ఇలా చేస్తే..ఈ సమ్మర్లో సత్వరమే బరువు తగ్గడం పెద్ద కష్టం కాదని చెబుతున్నారు డాన్‌గో. అంతేగాదు నియమానుసారంగా సూచించిన ఈ రూల్స్ అన్నింటిని క్రమం తప్పకుండా ఫాలో అయితే ఈజీగా 14 కిలోలు తగ్గుతారని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. View this post on Instagram A post shared by Dan Go | High Performance Health Coach (@coachdango)గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: Arjun-Saaniya Chandhok Wedding: అంజలి, సారా ఆ చీరలే ఎందుకు ఎంచుకున్నారంటే..) -
మీ మైండ్ మీకు అబద్ధాలు చెప్తోందా?
మన మెదడు ఒక అద్భుతమైన యంత్రం, కానీ ఒక్కోసారి అది మనకే విరుద్ధంగా పనిచేస్తుంది. మనకు తెలియకుండానే, మన మనసు వాస్తవాలను వక్రీకరించి మనకు అబద్ధాలు చెప్తుంది. దీన్నే సైకాలజీలో "Cognitive Distortions" (ఆలోచనా వైకల్యాలు) అంటారు. వీటిని గుర్తించి, అదుపులో ఉంచుకోవడం అంటే.. మీ మెదడులో సాగుతున్న 'తప్పుడు కోడింగ్'ను సరిచేయడమే.చాలామందికి ఒక అలవాటు ఉంటుంది—ఒక చిన్న తప్పు జరిగితే, "నేను ఎప్పుడూ తప్పులే చేస్తాను" అని అనుకుంటారు. లేదా ఒక వ్యక్తి మిమ్మల్ని పలకరించకపోతే, "అతనికి నా మీద కోపం, అందరూ నన్ను ద్వేషిస్తున్నారు" అని భ్రమపడతారు. ఇవన్నీ నిజాలు కావు, ఇవన్నీ మీ మెదడు సృష్టించిన భ్రమలు. ఆరోన్ బెక్ (Aaron Beck) అనే సైకాలజిస్ట్ ఈ Cognitive Distortions అనే కాన్సెప్ట్‌ను ప్రపంచానికి పరిచయం చేశారు.1. మన మెదడు ఆడుతున్న 3 పెద్ద అబద్ధాలుమీ మెదడు రోజువారీ జీవితంలో మిమ్మల్ని మోసం చేసే కొన్ని ముఖ్యమైన మార్గాలు ఇక్కడ ఉన్నాయి:All-or-Nothing Thinking: "నేను ఒక పనిని పర్ఫెక్ట్గా చేయాలి, లేదంటే నేను ఫెయిల్యూర్" అని అనుకోవడం. అంటే, మధ్యేమార్గం (Grey area) ఉండదు. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పూర్తిగా దెబ్బతీస్తుంది.Catastrophizing: చిన్న సమస్య జరిగినా.. "ఇక నా జీవితం అయిపోయింది, అంతా నాశనం" అని అతిగా ఊహించుకోవడం.Mind Reading: "ఎదుటివారు నా గురించి ఏమనుకుంటున్నారో నాకు తెలుసు" అని భ్రమపడటం. వాస్తవానికి, వారు మీ గురించి అస్సలు ఆలోచించడం లేదు.2. ఈ అబద్ధాలు మీ పర్సనాలిటీని ఎలా నాశనం చేస్తాయి?ఈ 'డిస్టార్షన్స్' వల్ల మీరు నిరంతరం ఒత్తిడిలో ఉంటారు.మీరు ఎప్పుడూ తప్పు చేస్తానేమోనని భయపడుతుంటారు (Anxiety).ఎదుటివారి గురించి తప్పుడు అభిప్రాయాలు పెంచుకుని రిలేషన్షిప్స్ పాడు చేసుకుంటారు.అతిగా ఆలోచించి (Overthinking) మీ శక్తిని కోల్పోతారు.3. పాజిటివ్‌గా ఉంటే సరిపోదుట్రైనర్స్ "అన్నీ పాజిటివ్‌గానే చూడు" అని చెప్తారు. కానీ, అబద్ధం చెప్పే మెదడుకు 'పాజిటివ్ థింకింగ్' కేవలం ఒక ప్లాస్టర్ లాంటిది. మార్కెట్ పాజిటివిటీని నమ్మమంటుంది.సైకాలజీ (CBT - Cognitive Behavioral Therapy) మీ మెదడు అబద్ధం చెప్తున్నప్పుడు దాన్ని పట్టుకుని, "ఇది నిజమేనా? దీనికి ఆధారం ఏంటి?" అని లాజిక్‌తో ప్రశ్నించమంటుంది. దీన్నే 'Reality Testing' అంటారు.4. మీ మైండ్ ని రీ-సెట్ చేసుకోండిGenius Matrix ఫిలాసఫీ ప్రకారం, ఈ డిస్టార్షన్స్ ని ఎలా అదుపు చేయాలో చూద్దాం.Step 1: అబద్ధాన్ని పట్టుకోండిమీ మైండ్ ఎప్పుడు నెగటివ్ ఆలోచనలను ఇస్తుందో, వెంటనే 'STOP' అని అనుకోండి. "నేను నా మెదడు చెప్పే అబద్ధాన్ని నమ్మను" అని గట్టిగా చెప్పండి. ఇది ఒక చిన్న 'Break'.Step 2: లాజికల్ ఛాలెంజ్మీ మైండ్ చెప్పిన నెగటివ్ ఆలోచనకు ఒక కోర్టు విచారణ పెట్టండి.* "నేను ఫెయిల్యూర్" అని మీ మెదడు చెప్తే.. "గతంలో నేను సాధించిన విజయాలు ఏంటి?" అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. సాక్ష్యాలతో మీ మెదడు అబద్ధాన్ని ఖండించండి.Step 3: క్లారిటీ ఒక్కసారి మీ మెదడు అబద్ధాలు చెప్తోందని మీకు తెలిస్తే, మీరు ఇక వాటికి భయపడరు. మీ మైండ్ ఒక అద్దంలా మారుతుంది—అక్కడ వాస్తవాలు మాత్రమే కనిపిస్తాయి, అపోహలు కాదు. ఇదే 'Beyond' స్టేజ్.5. మీ మైండ్ చెప్పే అబద్ధాల లిస్ట్ఈ రోజు ఒక చిన్న పని చేయండి.ఈ రోజు మీకు వచ్చిన అతి పెద్ద నెగటివ్ ఆలోచనను రాసుకోండి.ఆ ఆలోచన 'Distortion' (అబద్ధం) అని మీకు అనిపిస్తోందా?ఆ ఆలోచన నిజం కాదని నిరూపించే 3 వాస్తవాలను రాయండి.మీ మెదడుకి మీరు యజమాని!బ్రో, మీ మైండ్ ఒక సర్వెంట్ లాంటిది. కానీ అది ఒక్కోసారి యజమానిలా ప్రవర్తిస్తూ మీకు తప్పుడు సమాచారం ఇస్తుంది. దాన్ని నమ్మడం మానేసి, దాని మీద నిఘా పెట్టండి. మీ మెదడు చెప్పే ప్రతిదీ నిజం కాదు, అది కేవలం ఒక ఆలోచన (Thought) మాత్రమే.గుర్తుంచుకోండి, "Don't believe everything you think."సైకాలజిస్ట్ విశేష్ Genius Matrix Hub 8019 000066www.psyvisesh.com -
అర్జున్-సానియా వివాహంలో పుత్తడి బొమ్మలా నీతా స్టైలిష్ లుక్..!
సచిన్- అంజలి దంపతుల కుమారుడు, క్రికెటర్ అర్జున్ టెండుల్కర్, యువ వ్యాపారవేత్త సానియా చందోక్‌ల వివాహం గురువారం ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు క్రికట్ దిగ్గజాలు, బాలీవుడ్ సెలబ్రిటీలు, ప్రముఖులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ వేడుకలో అంబానీ కుటుంబ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అనంత్-రాధిక మర్చంట్ల వివాహవేడుక జరిగిన అదే ప్రదేశంలో అర్జున్ సానియాల వివాహం జరగడం విశేషం. ఆ నేపథ్యంలో ఆ సచిన్ టెండూల్కర్ ఇంట జరిగే పెళ్లి తంతుకి సంబంధించిన ప్రతీది అంబానీ కుటుంబమే స్వయంగా చూసుకుంది. అందుకు సచిన్ కూడా సభా ముఖంగా కృతజ్ఞతలు చెప్పుకున్నాడు కూడా. కాగా ఈ వేడుకలో ఫ్యాషన్‌కి ఐకాన్‌గా ఉండే రిలయన్స్ ఛైర్మన్, తన సిగ్నేచర్స్టైల్తో మెరిశారు. వేడుకుకు తగిన విధంగా తన ఆహార్యాన్ని ప్రతిబింబించేలా కేర్ తీసుకుంటారు నీతా. ఆమె ఈ వేడుకకి రిలయన్స్ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ, పెద్ద కుమారుడు ఆకాష్ అతడి భార్య శ్లోకా మెహతాలతో కలిసి విచ్చేశారు. ఈ వేడుకలో ఆయు ధరించిన చీర, ధగ ధగ మెరిసిపోతున్న నెక్లెస్ అత్యంత హైలెట్‌గా నిలిచాయి. నీతా ఈ వేడుక కోసం రాచరికపు స్టైల్ ఐవరీ బంగారు సిల్క్ చీర ఎంచుకున్నారు. ఈ ఆరుగజాల చీరలో నీతా బంగారపు బొమ్మలా ముగ్ధమనోహరంగా కనిపించారు. బంగారు మోటీఫ్‌లతో అలకరిచిన ఆ ఫ్యాబ్రిక్ ప్రకాశవంతమైన ఆకృతిని ఇచ్చింది. నిలువు జరీ చారలతో ఎంబ్రాయిడరీ స్లీవ్ బోర్డర్లు చీర లుక్‌ని మరింత అందంగా కనిపించేలా చేసింది. ఆ చీరకు సింపుల్‌గా స్టేట్మెంట్ డైమండ్ నెక్లస్ చీర అందాన్ని అమాంతం రెట్టింపు చేసింది. చెవికి కూడా డైమండ్ స్టడ్ పోగులు ధరించి స్టైల్ పరంగా నీతాకు సాటిరారెవ్వరూ అనేంతగా ఉంది ఆమె ఆహార్యం. ఇక ముఖేశ్ అంబానీ కూడా క్లాసిక్ బ్లాక్ బంధ్ గలా సూట్లో హుందాగా కనిపించారు. అంతేగాదు ఈ జంట ఆధునాతన సంప్రదాయంతో కలగలసిన స్టైలిష్ లుక్‌లో అందరి మనసులను దోచుకున్నారు. View this post on Instagram A post shared by Pallav Paliwal (@pallav_paliwal) (చదవండి: 'మిర్చి హోలీ'..రంగు పులుముకున్న పుడమి తల్లి..!: ఆనంద్ మహీంద్రా) -
బుల్లి ఫ్యాషన్ డిజైనర్..! జస్ట్ పదేళ్లకే..
ఫ్యాషన్ డిజైనర్ అవ్వడం అంత ఈజీకాదు. ఆ రంగం ఎంత ఇష్టమైనా.. దానిలోని మెళుకువలపై పట్టు సాధించేది మాత్రం టీనేజ్ వయసుకే. అంతకంటే చిన్న వయసులో అంత సులభం కాదు..పైగా క్లాత్‌ని పట్టుకుని కుట్టుగల నేర్పరితనం, క్రియేటివిటీ ఉండదు. కానీ ఈ బుడతడు..పిట్ట కొంచెం కూత ఘనంలా అలవోకగా పలు రకాల ఫాబ్రిక్లను అందమైన డిజైనర్‌వేర్‌లా తీర్చిదిద్దుతుండటం విశేషం. అంతేకాదండోయ్ ఏకంగా ప్రతిష్టాత్మక ఫ్యాషన్ వీక్‌లో దిగ్గజ డిజైనర్ల మధ్య..తన ఫ్యాషన్వేర్ని ప్రదర్శించనున్నాడు కూడా. ఇలా అత్యంత పిన్నవయసులో ఫ్యాషన్ డిజైనర్‌గా అంతర్జాతీయ వేదికపై ప్రదర్శించనున్న చిన్నారిగా సరికొత్త చరిత్రను సృష్టించాడు. ఆ చిన్నారి ఎవరంటే..ఆ చిచ్చర పిడుగే మాక్స్ అలెగ్జాండర్. ఆ చిన్నారి తల్లిదండ్రులు జాక్ అలెగ్జాండర్, షెర్రీ మాడిసన్ దంపతులు. పూర్తిగా భాషై పట్టు రాని ఆ వయసుకే ఈ బాలుడు మాక్స్ స్కెచ్ పట్టుకుని డిజైన్లు, సూది దారం సాయంతో చక్కటి కళ్లు చెదిరిపోయే ఫ్యాషన్వేర్లను క్రియేట్ చేసేస్తాడు. తనలోని ఫ్యాషన్ క్రియేటివిటీ తన సోదరి సమంత కారణంగా బయటకు వచ్చిందట. ఆమెకు ప్రస్తుతం 14 ఏళ్లు. తాను తయారు చేసిన డిజైనర్వేర్లన్నీ తన అక్క కోసమేనని, ఆమె వాటిని ధరించి చూడటం నిజంగా చాలా ఆనందాన్నిస్తుందని చెబుతున్నాడు మాక్స్. అతడి క్రియేటివిటీ అత్యంత విభిన్నం..ఫ్యాషన్ డిజైనర్లు ముందుగా తమ క్రియేటివిటీ లేదా ఆలోచనను కాగితంపై స్కెచ్‌తో పని చెబితే..మాక్స్ మాత్రం ముందుగా దాన్ని మడతలతో కట్టి చూస్తాడు. ఆ తర్వాత ముక్కలుగా కట్ చేసి కుట్టేస్తాడు. తనకు డ్రేపింగ్ అంటే ఇష్టమని, ముందుగా ధరిస్తేనే..క్రియేటివిటీ తళుక్కుమని బుర్రలో ప్రత్యక్షమవుతుందని చెబుతున్నాడు మాక్స్. అలా ఇప్పటివరకు ఈ చిన్నారి 150కి పైగా డిజైనర్‌వేర్‌లు రూపొందించాడు. వాటిలో దుస్తులు, జాకెట్లు, స్కార్ఫ్‌లు, బ్యాగులు, కిమోనోలు, సూట్లు, స్టఫ్డ్ యానిమల్స కూడా ఉన్నాయి. అంతేగాదు తన సొంత రన్‌వే షోను ప్రదర్శించిన అతి పిన్న వయస్కుడిగా గిన్నిస్ రికార్డు కూడా నెలకొల్పాడు. 2024లో ఎనిమిదేళ్ల వయసులో ఐక్యరాజ్యసమితలో ఫ్యాషన్ స్థిరత్వంపై ప్రసంగించాడు. వ్యర్థాలను పునర్వినియోగం చేసి.. దుస్తులుగా ఎలా మలచొచ్చో ఆలోచనాత్మకంగా వివరించాడు. పైగా దాన్ని కార్యరూపంలోకి తీసుకొచ్చేలా కాఫీ బీన్ బ్యాగ్‌ల నుంచి రూపొందించిన డిజైనర్‌వేర్‌లలో మెరిశారు మోడళ్లు. అలాగే ఆ చిన్నారి మాక్స్ చదువుకుంటూనే ఫ్యాషన్ వీక్‌లలో తన ప్రదర్శనలను ఇస్తుంటాడు. ఇదేగాక మాక్స్‌కి పలు స్కిల్ కూడా ఉన్నాయి. అవేంటంటే వంట చేస్తాడు, పికిల్‌బాల్, టెన్నిస్ వంటివి ఆడతాడు, కథలు రాస్తాడు. అలాగే తనకొక రెస్టారెంట్, కారు వాష్‌ని ఉండాలని కలలుకంటుంటాడు. పైగా ఇంజనీర్ కావలన్నిది అతడి ధ్యేయం కూడా. ఇక మాక్స్ తన పాఠశాల చదువుకి ఆటంకం లేకుండా వారాంతాల్లో ఫ్యాషన్‌కి సంబంధించిన స్కిల్స్‌లో నిమగ్నమవుతుంటాడట. నిజంగా పెన్సిల్ పట్టుకుని కుదురుగా బొమ్మలు వేయని ఆ చిరుప్రాయంలో ఇంత అసామాన్య ఫ్యాషన్ డిజైనర్ ప్రతిభ మాటలకందనిది కదూ..!.వీడియోపై క్లిక్ చేయండి(చదవండి: తనకు తాను ఓటు వేసుకుని మేయర్ అయిన మహిళ..! ఎక్కడంటే..) -
93 ఏళ్ల వయసులోనూ చలాకీగా విదేశీ బామ్మ..! ఆమె హెల్త్ సీక్రెట్ ఇదే..
ఆ బామ్మ చూస్తే తొమ్మిది పదుల వయసు అనిపించదు. వృద్ధాప్యాన్నే తిప్పికొట్టేలా ఆరోగ్యంగా,చలాకీగా ఉంటుందా బామ్మ. స్వతహాగా అమెరికన్ అయినా ఆమె మన భారత్‌ని మెచ్చి ఇక్కడే స్థిరనివాసం ఏర్పరుచుకుంది. పైగా మన ఆధ్యాత్మికతకు ఫిదా అయ్యి..మన భారతీయత ఉట్టిపడేలా ఆహార్యం, సంస్కృతిని మార్చేస్తుకుందామె. పైగా ఈ గడ్డపైనే ఓ సామాన్య భక్తురాలిలా జీవిస్తోందామె. ఎవరామె అంటే..ఆ బామ్మే అమెరికాలోని కాలిఫోర్నియా బే ఏరియాకు చెందిన సుషుమ్న. దీర్ఘాయువు అనేది ఎక్కడ నుంచో కాదని, మన సంతోషం, జీవనవిధానం నుంచే వస్తుందని చెప్పలా జీవిస్తోంది ఈ బామ్మ. యాంటీ ఏజింగ్ ట్రెండ్‌కి సరిగ్గా సరిపోతుంది ఆమె జీవన విధానం. ఇప్పటికీ రెండు పూటల సైక్లింగ్ చేస్తుందట. తనకు ఎలాంటి వైద్య మస్యలు లేవని అంటోంది. బుద్దిపూర్వకంగా తినడం, శరీరానికి సరిపడ వ్యాయామాలు, స్నేహితులతో కలివిడిగా ఉండటం ఇవే తనను ఆరోగ్యంగా ఉంచుతున్నాయని చెబుతోంది. తొంభైఏళ్ల వయసులో కూడా తన పనులు తానే చలాకీగా చేసుకుంటానని అంటోంది. తనకు ఆర్థరైటిస్ తప్ప మరే సమస్యలు లేవని చెబుతోంది. వ్యవస్థాపకురాలు కమెల్ జాబర్ ఈ విదేశీ బామ్మ హెల్దీ లైఫ్ సీక్రెట్ గురించి నెట్టింట షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. ఆమె ప్రతి విషయాన్ని సానుకూలత దృక్పథంతో చూసే తీరే ఆమె దీర్ఘాయువుకి కారణం అంటూ ఆమె జీవిన విధానం గురించి పోస్ట్‌లో తెలిపారు. పైగా ఈ బామ్మ తాను ఇంత ఆరోగ్యంగా ఉండటానికి కారణం మెడిసిన్స్ మానేయడమేనని హాస్యస్పదంగా చెబుతుంటుందని అన్నారు. ఆమె ఇప్పుడు కాలిఫోర్నియా, తమిళనాడులలోని ఆధ్యాత్మిక కమ్యునిటీలో సభ్యురాలు కూడా. 2001 నుంచి ఈ కమ్యూనిటిలో సభ్యురాలిగా అంకితభావంతో సేవలందిస్తోంది. ఒకప్పుడు ప్రముఖ సంస్థలో విజయవంతమైన సేల్స్ మేనేజర్ పనిచేసిన తదనంతరం ఈ జీవనశైలికి మారిపోయిందని చెప్పుకొచ్చారు పోస్ట్‌లో. నెటిజన్లు కూడా ఈ బామ్మ వృద్ధాప్యాన్ని తిప్పికొట్టిన సూపర్బామ్మ అంటూ పోస్టులు పెట్టారు. విదేశాల్లో హైఫై లైఫ్‌ని పక్కన పెట్టి మన సంస్కృతి, వేషధారణను నేర్చుకుని ఆధ్యాత్మికవేత్తగా జీవించడం నిజంగా ప్రశంసించదగ్గ విషయం అంటూ ఆ బామ్మపై పొగడ్తల వర్షం కురిపించారు. View this post on Instagram A post shared by Kamel Jaber (@i__kamel) (చదవండి: నడక చాలు...జిమ్‌కు వీడ్కోలు...!) -
హర్మోన్లు ప్రవర్తనను ఎలా ప్రభావితం చేస్తాయంటే..!
పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే కేవలం ఆలోచనలు, అలవాట్లు మాత్రమే కాదు. అది మీ శరీరంలో జరిగే Chemistry కూడా. చాలామంది తమ కోపానికి, బద్ధకానికి, ఆందోళనకు కారణం 'చేతకానితనం' అనుకుంటారు. కానీ, అది కేవలం కొన్ని హార్మోన్ల హెచ్చుతగ్గులు మాత్రమే అని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.మనం ఒక వ్యక్తిని "కోపిష్టి" అంటాం, లేదా "చాలా ప్రశాంతమైన వ్యక్తి" అంటాం. కానీ ఒక వ్యక్తి మెదడులో నిరంతరం జరిగే రసాయన చర్యలే ఆ వ్యక్తిత్వాన్ని రూపొందిస్తాయి. మీ హార్మోన్లు మీ కళ్ళకు కనిపించవు కానీ, మీరు ఎలా ప్రవర్తించాలో, మీరు ఎలా ఆలోచించాలో అవే నిర్ణయిస్తాయి.1. The Fantastic Four...మన ప్రవర్తనను ప్రధానంగా నాలుగు హార్మోన్లు ప్రభావితం చేస్తాయి. వీటిని మనం 'హ్యాపీ హార్మోన్లు' అని పిలుస్తాం.Dopamine - The Reward Molecule: మీరు ఒక లక్ష్యాన్ని చేరుకున్నప్పుడు లేదా కొత్త విషయాన్ని నేర్చుకున్నప్పుడు విడుదలవుతుంది. ఇది లేకపోతే మీరు బద్ధకంగా ఉంటారు, ఏ పని చేయాలన్నా ఉత్సాహం ఉండదు.Serotonin - The Mood Stabilizer: ఇది మనలోని ఆత్మవిశ్వాసాన్ని, సామాజిక హోదాను నియంత్రిస్తుంది. ఇది తక్కువైతే వ్యక్తి డిప్రెషన్లోకి వెళ్లడం, విపరీతమైన ఆందోళన చెందడం జరుగుతుంది.Oxytocin - The Bonding Hormone: ఇది మనుషులతో మనల్ని కలిపి ఉంచుతుంది. ఇది ఎక్కువ ఉంటే మీరు నలుగురితో కలిసిపోయి ఉంటారు, తక్కువ ఉంటే ఒంటరితనం (Loneliness) ఫీలవుతారు.Endorphins - The Pain Killer: ఇవి ఒత్తిడిని, శారీరక నొప్పిని తగ్గిస్తాయి. వ్యాయామం చేసినప్పుడు ఇవి ఎక్కువగా విడుదలవుతాయి.2. కార్టిసాల్: మీ పర్సనాలిటీకి శత్రువుమీరు ఎప్పుడూ ఒత్తిడిలో ఉన్నప్పుడు మీ శరీరంలో కార్టిసాల్ (Cortisol) విడుదలవుతుంది. ఇది ఎక్కువ కాలం ఉంటే, మీ మెదడులోని 'హిప్పోకాంపస్' (జ్ఞాపకశక్తికి సంబంధించింది) బలహీనపడుతుంది. దీనివల్ల మీరు త్వరగా మర్చిపోవడం, కోపపడటం, నిర్ణయాలు తీసుకోవడంలో తడబడటం జరుగుతుంది. మీరు చేస్తున్న 'ట్రిగ్గర్' పనులన్నీ ఈ కార్టిసాల్ ని పెంచేవే!3. మోటివేషన్ vs బయోలాజికల్ ఫ్యాక్ట్స్సో-కాల్డ్ ట్రైనర్లు "నీ మైండ్ సెట్ మార్చుకో, అంతా మారుతుంది" అని చెప్తారు. అది నిజమే, కానీ ఆ మైండ్ సెట్ మారాలంటే మీ శరీరంలో హార్మోన్ల సమతుల్యత ఉండాలి.మీరు రోజుకు 30 నిమిషాలు ఎండలో తిరగకపోతే, లేదా వ్యాయామం చేయకపోతే.. మీ మెదడులో సెరోటోనిన్ ఉత్పత్తి తగ్గుతుంది. అప్పుడు మీరు ఎంత పాజిటివ్ గా ఆలోచించాలనుకున్నా, మీ బయోలజీ మీకు సహకరించదు.4. బయోలాజికల్ రీ-ప్రోగ్రామింగ్Genius Matrix ఫిలాసఫీ ప్రకారం, మీ హార్మోన్లను మీరు ఎలా కంట్రోల్ చేయవచ్చు?Step 1: శారీరక అడ్డంకులను బ్రేక్ చేయండిమీరు బద్ధకంతో ఉన్నప్పుడు "నేను సోమరిపోతుని" అని అనుకోవద్దు. మీ శరీరానికి కావాల్సిన పోషకాలు, నిద్ర లేవేమో అని విశ్లేషించండి. మీ బయోలాజికల్ సైకిల్ ని 'Break' చేసి, సరైన నిద్ర, ఆహారం వైపు అడుగు వేయండి.Step 2: హార్మోనల్ హ్యాకింగ్Dopamine Detox: సోషల్ మీడియా లైకుల ద్వారా వచ్చే తక్షణ డోపమైన్‌ని ఆపేసి, కష్టపడి ఏదైనా పని చేయడం ద్వారా వచ్చే డోపమైన్‌ని అలవాటు చేసుకోండి.Oxytocin Boost: తోటి మనుషులతో కనెక్ట్ అవ్వండి, ఇది మీ స్ట్రెస్ ని తగ్గిస్తుంది.Step 3: బయో-మాస్టరీఒక్కసారి మీ శరీరంలోని రసాయన శాస్త్రం మీకు అర్థమైతే, మీరు ఒక మాస్టర్ లా ఉంటారు. ఎప్పుడు ఎనర్జిటిక్ గా ఉండాలో, ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలో మీ హార్మోన్ల ద్వారానే మీరు కంట్రోల్ చేసుకోగలరు.5. మీ హార్మోన్ల చెకప్ఈ రోజు మీరు ఈ చిన్న గమనికను గమనించండి.ఉదయం లేచినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? (ఉత్సాహమా లేక బద్ధకమా?) - ఇది మీ నిద్ర నాణ్యత మరియు డోపమైన్ లెవెల్స్ ని చెప్తుంది.సాయంత్రం వేళల్లో మీకు ఒత్తిడిగా అనిపిస్తుందా? - ఇది మీ కార్టిసాల్ లెవెల్స్ ని చూపిస్తుంది.మీరు ఫిజికల్ యాక్టివిటీ (వ్యాయామం) చేస్తున్నారా? - లేకపోతే మీ ఎండార్ఫిన్లు పని చేయడం లేదని అర్థం.మీ శరీరం మీ దేవాలయం!బ్రో, వ్యక్తిత్వం అంటే కేవలం మీ ఆలోచనలే కాదు, మీ శరీరం కూడా. మీరు మీ హార్మోన్లను పట్టించుకోకుండా, కేవలం మైండ్‌సెట్ మీద పనిచేస్తే అది పక్షవాతం ఉన్న వ్యక్తికి పరిగెత్తమని చెప్పినట్లే ఉంటుంది. మీ శరీరాన్ని సరిగ్గా చూసుకోండి, అప్పుడు మీ మైండ్ మీకు మద్దతు ఇస్తుంది."A healthy mind needs a healthy chemistry."సైకాలజిస్ట్ విశేష్ Genius Matrix Hub 8019 000066www.psyvisesh.com -
వెలుగులతో రంగులు మార్చే భూమి..!
హిమాచల్ ప్రదేశ్‌లో ఉన్న స్పితి వ్యాలీ అంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది మంచుతో నిండిన పర్వతాలు కాదు వెలుగు, నీడల మధ్య నడిచే ఒక నిశ్బబ్ద నాటకం. మధ్యాహ్నం వెలుగుల్లో భారీ పర్వతాలకు ఒక కొత్త రంగు వస్తుంది. సాయంత్రం వెలుగుల్లో మరో రంగు అక్కడ సందడి చేస్తుంది. ఎడారిలా కనిపించే ఈ భూమిలో ప్రకృతి భాషను అర్థం చేసుకుంటే ఇక్కడి అందాల వెనక భావాలు కూడా అర్థం అవుతాయి. ఇక్కడి ప్రయాణం అనేది నెమ్మదిగా మనసును కబ్జా చేసే ఒక చక్కని పాటలోని సాహిత్యంలా ఉంటుంది. లోయల మధ్యలో వెలుగు నీడల ఈ ఆటను గమనిస్తే ప్రతీ గంట ఒక పెయింటింగ్‌లా ఉంటుంది. సందర్శనీయ స్థలాలుహిమాచల్ ప్రదేశ్‌లోని లాహోల్ స్పితి జిల్లాలో ఉండే స్పితి వ్యాలీలో ఎన్నో అందమైన సందర్శనీయ స్థలాలు ఉన్నాయి. అందులో కీ మోనాస్టరీ, చంద్రతాల్ లేక్, కిబ్బర్ గ్రామం ఇవన్నీ చూస్తే మనం చూస్తున్నది సీనరీకాదుంకాలమే నిశ్బబ్దంగా సాగుతోంది అనిపిస్తుంది. రోడ్డుపై వచ్చే ప్రతీ మలుపు ఒక సోస్ట్కార్డులా ఉంటుంది.హైదరాబాద్ నుంచి ఎలా చేరుకోవాలిహైదరాబాద్ నుండి ఢిల్లీకి ఫ్లైట్ లేదా రైలులో వెళ్లవచ్చు. అక్కడి నుంచి మనాలీకి రోడ్డు జర్నీ ప్రారంభించవచ్చు. ఇక మనాలిలో మీకు నచ్చినంత టైమ్ స్సెండ్ చేసి స్పితీ వ్యాలీకి క్యాబ్ లేదా లోకల్ ట్రాన్స్‌పోర్టుతో అందమైన పర్వతాలను చూస్తూ చేరుకోవచ్చు. ఈ ప్రయాణంలో గమ్యస్థానం కన్నా ప్రయాణ అనుభవమే జీవితాంతం గుర్తుండి΄ోతుంది. (చదవండి: హోళీ..కలర్‌ఫుల్ టూర్ కోసం..ఈ పర్యాటక ప్రాంతాలకు వెళ్లాల్సిందే..!) -
హోళీ..కలర్‌ఫుల్ టూర్ కోసం..!
యమునా తీరంలో రంగుల ఆటవెలది... బ్రజ్ భూమిలో రంగుల కథలు...మాధవుడి నగరంలో రంగుల హరివిల్లు... కృష్ణ నగరంలో వసంత స్వాగతం...గోపాలుడి జన్మభూమిలో రంగుల ఋతువు...ఇంద్ర ధనస్సు రంగుల మధ్య ఓ మధురమైన దైవిక స్పర్శ...ఇవన్నీ కనులవిందుగా దర్శించాలంటే ఆ ప్రాంతాల గుండా ప్రయాణించాల్సిందే!! కొన్ని నగరాలు చూడటానికి కాదు అనుభూతి చెందడానికే అన్నట్టు ఉంటాయి. అలాంటి ఒక పవిత్రమైన ప్రదేశమే మధుర. ఇక్కడ రంగులు కూడా ఒక భక్తి భాషలో మాట్లాడుతాయి. ఉత్తర ప్రదేశ్‌లో ఉన్న మధుర, యమునా నదీ తీరం నిదానంగా, ఆగిపోయిన కాలంలా ఉంటుంది. ఇక్కడ ప్రతి గల్లీలో కృష్ణ నామస్మరణ, ప్రతి సంధ్యలో దీపాల ప్రకాశం, ప్రతి వసంతం రంగుల ప్రణయంలా ఉంటుంది. మధుర అంటే కేవలం ఒక చరిత్ర మాత్రమే కాదు. ఇది ఒక జీవన విధానం.కృష్ణ జన్మభూమి వైభవంమధురలో ప్రయాణం ప్రారంభమయ్యే ప్రదేశం శ్రీ కృష్ణ జన్మభూమి. ఆ ప్రాంతంలో నడుస్తుంటే అక్కడి ప్రాచీన శిల్పం, మందిర గోపురాలను చూస్తుంటే మది నిండా ప్రశాంతమైన భావం కలుగుతుంది. ఇక్కడ సంధ్యా సమయంలో శంఖ నాదం వినిపిస్తుంది. అలాగే భక్తుల మధ్య ఒక సమన్వయం కనిపిస్తుంది. ద్వారకాదీశ్ మందిరం వద్ద సంధ్యా హారతి సమయంలో దీపాల వెలుగు, భజనల్లో కలిసిన భక్తుల స్వరం ఇవన్నీ ఒక ప్యూర్ డివోషనల్ ఆరాను క్రియేట్ చేస్తాయి.యమునా తీరంలో నిశ్శబ్ద వేదంవిశ్రామ్ ఘాట్ దగ్గర ప్రతి ఉదయం యమునా తీరాన్ని తాకే సూర్యుడి కిరణాలు కనులకు ఆనందాన్ని, మనసుకు ప్రశాంతతను కలిగిస్తాయి. నదిపై అలా అలా సాగుతున్న తెప్ప, నీటిపై ప్రతిబింబించే ఆకాశం, నిదానంగా సాగే జీవితం. ఇదే అక్కడి ప్రతి ఉదయం కనిపించే దృశ్యం. ఇక్కడ నడుస్తుంటే మధుర అనేది ఒక ప్రదేశంలా కాదు, ఒక ఫీలింగ్ అని అనిపిస్తుంది. ఇక్కడ ప్రయాణం అంటే వేగం కాదు, కాలానికి తగిన విలువ అనిపిస్తుంది. బ్రజ్ భూమిలో రంగుల ఋతువుమధురలో హోలి అంటే పండుగ కాదు. ఒక జీవితోత్సవం. వసంత కాలంలో నగరం మొత్తం రంగులతో నవ్వుతుంది. గులాల్ బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపించే గీతాలు, భజనల మధ్య ప్రతి గాలిలో ఉత్సాహం కనిపిస్తుంది. బర్సానా, వృందావన్ ప్రాంతాలు హోలి సందర్భంగా ప్రత్యేక వాతావరణం క్రియేట్ చేస్తాయి. రాధాకృష్ణుల మధుర స్మృతులు, రంగుల మధ్య భక్తి భావం, నగరం మొత్తం ఒక వేదికలా మారుతుంది. ఇక్కడ హోలి అంటే రంగులతో ఆడే ఒక క్రీడ మాత్రమే కాదు. ఒక పరంపర. ఒక సంప్రదాయం. ఒక ఆచారం. కాలం అందించే ఆనందానికి ప్రతీక కూడా.‘రాధే రాధే’ అనే పలుకే మధురం...మధుర అనగానే ముందుగా అక్కడి ‘పెడా’గుర్తుకు వస్తుంది. అయితే దీంతోపాటు అక్కడి ప్రత్యేక అల్పాహారాన్ని రుచి చూడడం మర్చి΄ోవద్దు. పెడా, లస్సీ, చాట్ లాంటి తినుబండారాలు నగరంలో ప్రతి చోట సులభంగా లభిస్తాయి. స్థానికుల జీవితంలో భాగమైన వీటిని ఆస్వాదిస్తూ మీరు కూడా కాసేపు అక్కడి స్థానికులుగా మారిపోవచ్చు.పర్యాటకులు ఎక్కడికి వెళ్తున్నా అక్కడి స్థానికుల్లా జీవిస్తేనే పర్యటనలోని అందమైన అనుభూతులను సొంతం చేసుకోగలరు. అందుకే అంటారు రోమ్‌లో ఉన్నప్పుడు రోమన్‌లా ఉండాలి అని. అలాగే మధురలో ఉన్నప్పుడు మధురవాసిలా మారిపోవాలి. ఇక్కడ ప్రతి గల్లీలో ఒక మిఠాయి దుకాణం, అందులో చిరునవ్వు చిందిస్తూ ‘‘రాధే రాధే’’ అని పలకరించే వ్యాపారి కనిపిస్తాడు. మీరు కూడా ‘రాధే రాధే’ అని పలకరించండి.చేయాల్సిన పనులుమధురలో యమునా తీరంలో ఉదయానే కాసేపు అలా తిరగడం ఒక చక్కని అనుభూతిని అందిస్తుంది. అందుకే ఏ కొత్త ప్రాంతానికి వెళ్లినా మార్నింగ్ వాక్ చేసే అవకాశాన్ని ఎవరూ మిస్ చేయకూడదు. ఇది ఎవరూ చెప్పని ఒక ట్రావెల్ హ్యాక్.వీటితోపాటు సాయంత్రం సమయంలో హారతి చూడటం, గోవర్ధన గిరి పరిక్రమ చేయడం, హోలీ సందర్భంగా రంగుల మధ్య భజనలు వినడం, బృందావన్‌లో సంధ్యా సమయాన భక్తి గీతాలను వినడం ఇవన్నీ మధుర ప్రయాణంలో నిదానంగా మనసును హత్తుకునే విషయాలుగా మిగిలిపోతాయి.సందర్శనీయ స్థలాలుమధుర అనేది ఆ నందకిశోరుడు, అతని భక్తుల ప్రపంచం. ఇక్కడ బృందావన్‌లో బాంకే బిహారీ ఆలయం, గోవర్ధన పర్వతం, గోకులం, బర్సానా లాంటి ప్రదేశాలు కనిపిస్తాయి. ప్రతి ప్రదేశానికి ఒక చరిత్ర ఉంటుంది. ప్రతి గల్లీకి ఒక కథ ఉంటుంది. ప్రతీ వీధిలో ఒక ఙ్ఞాపకాల నిధి ఉంటుంది. గోవర్ధన పరిక్రమ సమయంలో భక్తులు నిదానంగా నడుస్తూ భక్తిలో నిమగ్నమవుతారు. గోకులంలో బాల కృష్ణుడి లీలల గురించి భక్తులు మాట్లాడే విషయాలు మీరు ఇగ్నోర్ చేయలేరు. బృందావన్ వీధుల్లో ప్రతి సంధ్యా సమయంలో భజనలు వినిపిస్తాయి.ఎలా వెళ్లాలి ?ఢిల్లీ నుంచి రైలు, రోడ్డు మార్గంలో మధురకు సులభంగా చేరుకోవచ్చు.రైలు యాత్రలో యమునా నది పక్కనే కనిపించే దృశ్యాలు ప్రయాణాన్ని మరింత మనోహరంగా మార్చేస్తాయి. ఆగ్రా, ఢిల్లీ నుంచి రోడ్డుమార్గంలో సాగే ప్రయాణం .. బ్రజ్ భూమిలో అడుగుపెడుతూనే ఆనందానుభూతిని కలిగిస్తుంది.ఎక్కడ ఉండాలి ?మధురలో చిన్నా పెద్ద ధర్మశాలల నుంచి ఆధునిక హోటల్స్ వరకు అనేక వసతి సదు΄ాయాలు ఉన్నాయి. యమునా తీరం దగ్గర ఉన్న వసతి స్థలాలు సంధ్యా సమయంలో ప్రత్యేక ప్రశాంతతను ఇస్తాయి. మీరు అడ్వాన్స్‌గా బుక్ చేసుకుంటే నదీతీరంలో ఉన్న హోటల్స్‌లో తక్కువ ధరకే రూమ్స్ లభించే అవకాశం ఉంది. అందుకే ట్రైన్ లేదా ఫ్లైట్ టికెట్స్ వంటివి బుక్ చేసుకునే సమయంలో రూమ్స్ కూడా బుక్ చేసుకోవడం ఒక మంచి ప్రయాణికుడి లక్షణం. ఏం చూడాలి ? మధుర ప్రయాణికులకు ఒక మధురమైన అనుభూతిని కల్పిస్తుంది. ఇక్కడికి వస్తే మీరు కృష్ణ జన్మభూమి, ద్వారకాదీశ్ మందిరం, విశ్రామ్ ఘాట్, బృందావన్, గోవర్ధన్ వంటి అనేక ప్రదేశాలను కవర్ చేయవచ్చు. ఈ యాత్రను మధురంగా మార్చుకోవాలి అనుకుంటే చెక్ లిస్ట్ పెట్టుకుని వివిధ ్ర΄ాంతాలను అన్వేషించడం కన్నా ప్రశాంతంగా ఒక్కో ప్రాంతాన్ని ఫీల్ అవ్వాలి. ఎందుకంటే మధుర అనేది పర్యాటక ప్రదేశం కన్నా ముందు ఒక పవిత్రమైన ప్రాంతం. ఇక్కడ ప్రతి ప్రదేశం భక్తి, శిల్పకళ, సంప్రదాయం కలిసి ఒక ఆధ్యాత్మిక అనుభవాన్ని అందిస్తాయి.– ఎం.జి. కిశోర్, ప్రయాణికుడు (చదవండి: Munnar Tourist Place: "పచ్చందనమే పచ్చదనమే"..!) -
జస్ట్ రెండేళ్లలో 17కిలోలు తగ్గిన టీనేజర్..!
ఇంతవరకు చూసిన వెయిట్‌లాస్ జర్నీలలో ఇది అత్యంత విభిన్నం. ఓ టీనేజర్ అధిక బరువు తగ్గేంచేందుకు ఎలా ప్రయత్నించాడో వివరించే వెయిట్‌లాస్ స్టోరీ ఇది. తన పదహారవ పుట్టిన రోజున తీసుకున్న నిర్ణయం..తనలో ఎంతలా పరివర్తనకు దారితీసిందో తెలిపాడు. అయితే జిమ్‌కి వెళ్లలేదని, అలాగే ఎలాంటి కఠినమైన డైట్లు పాటించలేదని అంటున్నాడు. కానీ రెండేళ్లలో 17 కిలోలు పైనే తగ్గానని అంటున్నాడు. జిమ్, డైట్ పాటించకుండా ఆ టీనేజర్ ఎలా బరువుతగ్గాడంటే..ఇంటి వ్యాయామాలతో అని చెబుతున్నాడు. అదేంటి అనుకోకండి. ఎందుకంటే తాను స్లిమ్‌గా ఆరోగ్యకరమైన బరువుతో ఉండాలనుకుంటున్నట్లు తల్లిదండ్రులకు చెప్పి..వారి సహాయసహకారాలతో బరువు తగ్గాడు. పేరెంట్స్ సాయంతోనే..ఇంటిలోనే చేసే వ్యాయామా పరికరాలను కొనుగోలు చేసి మరి..వర్కౌట్లకు ఉపక్రమించాడు. బరువులు ఎత్తే ప్లేట్ల తోపాటు బార్బెల్ వంటి పరకరాలతో మంచి పురోగతిని అందుకున్నాడు. మొదట్లో పుల్అప్బార్లతో వేలాడిదీసినట్లు ఉండటం దాదాపు అసాధ్యం అనిపించింది. ఒకపుల్అప్ని కూడా పూర్తి చేయలేకపోయేవాడు. అయితే క్రమం తప్పకుండా సాధన చేసి..మంచి మెరుగుదలను అందుకున్నాడు. సరైన టెక్నిక్‌తో ఇవాళ సుమారు 18 పుల్‌అప్‌లు దాక నిర్వహించి..కండరాల బలాన్ని పెంపొందించుకుంటున్నాడు. అలా రెండేళ్లలో చూస్తుండగానే దాదాపు 17 కిలోలు తగ్గి..చాలా స్మార్ట్‌గా మారిన తన పరివర్తన పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నాడు ఆ టీనేజర్. కేవలం క్రమశిక్షణ, నిబద్ధతత, క్రమం తప్పకుండా చేయడం వంటివి వెయిట్‌లాస్‌కి ప్రధానమైనవని అంటున్నాడు. బరువు తగ్గడం గురించి భయపడే వారికి తన వెయిట్‌లాస్ స్టోరీ ప్రేరణ అని చెప్పడమే గాక, స్లిమ్‌గా మారేలా ఇతరులను ప్రోత్సహిస్తానని కూడా చెబుతున్నాడు.(చదవండి: పదేపదే వైఫ్యల్యాలు, ఆర్థిక కష్టాలు..కానీ ఇవాళ సీఈవోగా విద్యార్థులకు..!) -
హార్ట్‌బీట్ 120 దాటినప్పుడల్లా..14 సెకన్లపాటు ఆగిపోయే గుండెజబ్బు..!
పుట్టుకతో వచ్చే రెండు రకాల గుండె లోపాలతో జన్మించిన కార్షియాక్ స్పెషలిస్ట్ అయినా ఆ మహిళ అలుపెరగని పోరాటం చేసి మరి జీవిస్తోందామె. ఒకటి, రెండు కాదు ఏకంగా తొమ్మిది ఆపరేషన్లు చేయించుకున్నా ఆశా అనే జ్యోతిని వెలిగిస్తూ..తన ప్రాణాన్ని నిలబెట్టుకుంది. ప్రాణాంతకమైన ఆ గుండె పరిస్థితిని మందులతో నిర్వహిస్తూనే ఆరోగ్యకరంగా జీవిస్తూ..స్ఫూర్తిగా నిలుస్తున్నారు. చిన్నపాటి అనారోగ్య పరిస్థితికి కుంగిపోయే వారికి ఆమె కథ ఓ ప్రేరణపుట్టుకతో వచ్చే గుండె లోపాలతో జన్మించిన కార్డియాక్ స్పెషలిస్ట్ ఏంజెలికి అసిమాకి ఇంటర్మెటెంట్ ఏవీ బ్లాక కారణంగా 14 సెకన్లపాట్లు గుండె ఆగిపోయే పరిస్థితితో పోరాడుతోందామె. ప్రాణాంతకమైన పరిస్థితిలో పోరాడుతున్న ఆమెకు సరిగ్గా 36 ఏళ్ల వయసులో వచ్చిన స్ట్రోక్ మరోసారి కుప్పకూలిపోయేలా చేసింది. అప్పుడే తెలిసింది ఈ ప్రాణాంతక పరిస్థితికి తోడు గుండెలో "గ్యాపింగ్ హోల్" కూడా ఉందని నిర్థారణ అయ్యింది. ఆమెది ఆకస్మిక కార్డియాక్ మ సంబంధం ఉన్న పరిస్థితికి ఇది మరింత ప్రమాదకరమైన సంకట స్థితి.ఎప్పటి నుంచి పోరాడుతోందంటే..25 ఏళ్ల వయసులో ఏంజెలికీ తొలిసారిగా తనకు గుండెజబ్బుకి సంబంధించిన లక్షణాలు తొలిసారిగా కనిపించాయని చెప్పుకొచ్చింది. నెమ్మదిగా తలతిరడం నుంచి మొదలై నెలలుగా మూర్చపోయే వరకు దారితీసింది. గుండె జబ్బుల కుటుంబ చరిత్ర లేకపోయినా..ఆమె ప్రాణాంతక గుండెజబ్బు బారినపడింది. పలు వైద్య పరీక్షల అనంతరం ఆమె హృదయస్పందన నిమిషానికి 120 బీట్స్ దాటినప్పుడల్లా ఆమె గుండె 14 సెకన్ల వరకు ఆగిపోతుందని వైద్యులు నిర్ధారించారు. దీని కారణంగా గుండెలో "పై నుంచి దిగువ గదులకు విద్యుత్ ప్రవహించదు, కాబట్టి ఆమెకు పేస్‌మేకర్ అవసరం. ఈ తీవ్రమైన గుండె జబ్బు గురించి వినడంతోనే ఏంజెలి ఇక తన జీవితం ముగిసిపోయిందనుకుంది. ఎందుకంటే బెడరూమ్ నుంచి బాత్రూమ్ వరకు కూడా వెళ్లలేనంతగా స్ప్రుహతప్పి పడిపోయేది. ఆ తర్వాత ఏంజెలికి ఫేస్మేకర్ని అమర్చారు. 1990లలో ఈ యంత్రంలో అనేక సమస్యలతో రావడంతో మళ్లీ కష్టాలు మొదలయ్యాయి ఆమెకు. ముఖ్యంగా బ్యాటరీలను నిరంతరం మార్చాల్సి వచ్చేది. ఆ క్రమంలో మెదడులోని రక్తనాళం పగిలి రక్తస్రావం కావడంతో స్ట్రోక్‌ను ఎదుర్కొంది. దాంతో ఆమెకు ఓపెన్-హార్ట్ సర్జరీతో సహా ఐదు ఫేస్మేకర్లు, మూడు అబ్లేషన్ల, ఒక ఓపెన్-హార్ట్ సర్జరీతో సహ తొమ్మిది వైద్య చికిత్సలు తీసుకుంది. ఇలా ఆమె జీవితాంతం ఇన్ని అనారోగ్య సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ..లండన్ నుండి కార్డియోమయోపతిలో పిహెచ్డి పూర్తి చేసింది, తర్వాత హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఇంటర్న్ చేసింది, అక్కడ ఆమె ఫ్యాకల్టీ సభ్యురాలిగా పనిచేసింది,. అలాగే అమెరికాలో 11 ఏళ్లు గడిపింది. అంతేగాదు ఏంజెలి తనలాంటి గుండె సమస్యతో బాధపడుతున్న వారికోసం..ఆ వ్యాధి నిర్థారణ పర్యవేక్షణ కోసం..ఒక పద్ధతిని ఆవిష్కరించింది. ఇది ప్రమాదకరమైన గుండె బయాప్సీలకు సురక్షితమైన ప్రత్యామ్నాయాన్ని అందిస్తుంది. ఇక ఏంజెలికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అదీగాక ఏంజెలి పుట్టుకతో వచ్చే గుండెజబ్బు కారణంగా అనేక గర్భస్రావాలను ఎదుర్కొని మరి..ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారామె. అయితే ఆ పిల్లలు ఇద్దరు పూర్తి స్థాయిలో ఆరోగ్యంగా ఉన్నారు. పుట్టుకతో వచ్చే గుండె సమస్యల లోపాన్ని అధిగమించడమే కాకుండా దాన్నే తన కెరీర్‌గా ఎంచుకుని..ఆ సమస్యకు చెక్‌పెట్టే దిశగా అడుగులు వేయడం నిజంగా ప్రశంసించదగ్గ విషయం.(చదవండి: ఆర్మీ ట్రైనింగ్ సెంటర్లో మెనింగోకాకల్ ఇన్ఫెక్షన్ కలకలం..! ఎందువల్ల వస్తుందంటే..) -
ఆర్మీ ట్రైనింగ్ సెంటర్లో మెనింగోకాకల్ ఇన్ఫెక్షన్ కలకలం..! ఎందువల్ల వస్తుందంటే..
షిల్లాంగ్‌లోని ఆర్మీ శిక్షణా కేంద్రంలో ఇద్దరు అగ్నివీర్ శిక్షణార్థులు అనుమానిత మెనింగోకాకల్ ఇన్ఫెక్షన్ బారినపడి గంటల వ్యవధిలోనే మరణించారు. ఒక్కసారిగా అస్సాం రెజిమెంటల్ సెంటర్ ఉలక్కిపడింది. సత్వరమై సైనిక సౌకర్యంలో చుట్టుపక్కల కాంటాక్ట్ ట్రేసింగ్, ఆయా వ్యక్తులతో టచ్‌లో ఉన్నవారిని ఐసోలేషన్‌లో ఉంచడం తదితరాలతో వ్యాధి వ్యాప్తి చెందకుండా నిరోధించేలా సత్వరమే అన్ని చర్యలు చేపట్టింది. కేవలం ఆర్మీ శిక్షణా కేంద్రంలోనే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలపై కూడా గట్టి నిఘా ఉంచినట్లు స్థానిక ఆరోగ్య అధికారులు తెలిపారు. ఇంతకీ అసలేంటి మెనింగోకాకల్ వ్యాధి ..? ఎందువల్ల వస్తుందంటే..?మెనింగోకాకల్ వ్యాధి అంటే ..?మెనింజైటిస్ మెదడు, వెన్నుపాము చుట్టూ ఉన్న కణజాలాల వాపుకు కారణమవుతుంది. ఈ వ్యాధిని ప్రపంచ ఆరోగ్యానికి ఒక తీవ్రమైన ముప్పుగా అభివర్ణించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ). ఇది అనేక రకాల బ్యాక్టీరియాలు, వైరస్లు, శిలీంధ్రాలు, పరాన్నజీవుల వల్ల సంభవిస్తుందని WHO పేర్కొంది. అయితే ఇది అంటువ్యాధి లాంటిదేనా..? కాదా అనేది కచ్చితంగా చెప్పలేమని అంటున్నారు వైద్యులు.బాక్టీరియల్ మెనింజైటిస్ అత్యంత తీవ్రమైన రకం మెనింజైటిస్ అని WHO చెబుతోంది. దీని కారణంగా రోగికి తీవ్రమైన, ప్రాణాంతక పరిస్థితి ఏర్పడుతుందని తెలిపింది. మెనింగోకోకస్ అనేది నీసేరియా మెనింగిటిడిస్ అనే బాక్టీరియా వల్ల కలిగే బాక్టీరియల్ మెనింజైటిస్.వ్యాధి లక్షణాలుక్లీవ్ల్యాండ్ క్లినిక్ ప్రకారం మెనింగోకాకల్ వ్యాధి యొక్క కొన్ని సాధారణ లక్షణాలు:ప్రకాశవంతమైన కాంతి వల్ల ఇబ్బంది పడటంవిరేచనాలుజ్వరంతలనొప్పివాంతులుముదురు రంగులోకి మారినట్లు కనిపించే చర్మ దద్దుర్లుగట్టి మెడగందరగోళం,చిరాకుచాలా నిద్రమత్తుగా అనిపించడంనడవడానికి లేదా నిటారుగా ఉండటానికి ఇబ్బందివిపరీతమైన మంటలు, నొప్పులుకీళ్లు, కండరాల నొప్పిఆకలి లేకపోవడంఎవరికీ ఈ ప్రమాదం అధికం అంటే..ఈ ఇన్ఫెక్షన్ ఏ వ్యక్తినైనా ప్రభావితం చేయవచ్చు, అయితే, కొంతమందికి ఎక్కువ ప్రమాదాలు ఉంటాయి. ఒక సంవత్సరం కంటే తక్కువ వయస్సు ఉన్నవారు, టీనేజర్ లేదా చిన్న వయస్సులో ఉన్నవారుప్లీహ గాయం లేదా ప్లీహము లేకపోవడంసికిల్ సెల్ వ్యాధి ఉన్నవాళ్లకుకాంప్లిమెంట్ ఇన్హిబిటర్ మందులు తీసుకునేవాళ్లుమెనింగోకాకల్ వ్యాధి సాధారణంగా ఉండే ప్రాంతాలను సందర్శించడం వల్లదీనికారణంగా ఎదురయ్యే అనారోగ్య సమస్యలు..బాధిత వ్యక్తులు వెంటనే వైద్య చికిత్స పొందకపోతే ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు, చికిత్స పొందినప్పటికీ ప్రజలు చనిపోవచ్చు. ఈ వ్యాధి కారణంగా ఎదురయ్యే సమస్యలు..మెదడు దెబ్బతినడంమూత్రపిండాల నష్టంఅవయవాలు కోల్పోవడంనరాల దెబ్బతినడంపూర్తిగా వినికిడి లోపంనివారణ చర్యలువ్యాక్సిన్లు సాధారణ రకాల బాక్టీరియల్ మెనింజైటిస్ నుంచి ఉత్తమ రక్షణను అందిస్తాయని WHO చెబుతోంది. మెనింగోకాకస్, న్యుమోకాకస్, హేమోఫిలస్ ఇన్ఫ్లుఎంజా టైప్ బి (Hib) వల్ల కలిగే మెనింగోకాకల్ వ్యాధిని టీకాలు నిరోధించగలవు. ఇతర నివారణ చర్యలు..11-12 సంవత్సరాల వయస్సులో మెనింగోకాకల్ కంజుగేట్ (MenACWY) వంటి టీకాలు వేయించడం.16 ఏళ్ల లోపు వాళ్లకు బూస్టర్‌డోస్‌లు వేయించడం. అలాగే సెరోగ్రూప్ B నుంచి అదనపు రక్షణ కోసం సిఫార్సు చేసిన MenB టీకాలు వేయించడం. టీకాలు సాధారణ జాతులను (A, C, W, Y, B) లక్ష్యంగా చేసుకుంటాయి. టీనేజ్ పిల్లలు, టీనేజర్లు, HIV లేదా అస్ప్లెనియా వంటి ఆరోగ్య ప్రమాదాలు ఉన్నవారికి ఈ టీకాలు వేయించడం మంచిది.పరిశుభ్రత పద్ధతులు: ముఖ్యంగా బాత్రూమ్ ఉపయోగించిన తర్వాత లేదా తినడానికి ముందు సబ్బుతో తరచుగా చేతులు కడుక్కోండి. కడగని చేతులతో కళ్ళు, ముక్కు లేదా నోటిని తాకకుండా ఉండండి. పానీయాలు, ఆహారం, పాత్రలు, లిప్‌స్టిక్‌లు లేదా సిగరెట్లను పంచుకోవద్దు, దగ్గు/తుమ్ము వచ్చినప్పుడు చేతులు లేదా జేబురుమాల్ అడ్డుపెట్టుకోవడం. ఈ చర్యలు తీసుకుంటే శ్వాసకోశ బిందువుల ద్వారా వ్యాప్తి చెందే ఈ బ్యాక్టీరియాను కట్టడి చేయొచ్చు. ముఖ్యంగా దద్దుర్లు, మెడనొప్పి, జ్వరం వంటి లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యం సహాయం తీసుకోవడం ఉత్తమం. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. మరిన్ని వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: రీల్స్ పిచ్చి వర్సెస్ చదువు..!) -
ముసుగు వెయ్యొద్దు మనసు మీద..!
పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే చాలామంది తమలో ఉన్న లోపాలన్నింటినీ కప్పెట్టేసి, ఒక పర్ఫెక్ట్ ముసుగు వేసుకోవడం అనుకుంటారు. "నేను ఎప్పుడూ కాన్ఫిడెంట్‌గా ఉండాలి", "నాకు అసలు భయం వేయకూడదు" అని తమకు తాము అబద్ధాలు చెప్పుకుంటారు.కానీ సైకాలజీ ప్రకారం, మీలోని లోపాన్ని మీరు అంగీకరించనంత కాలం, దాన్ని మీరు మార్చలేరు. అంగీకారం (Acceptance) అనేది బలహీనత కాదు, అది మార్పుకు అవసరమైన అసలైన ధైర్యం.అంగీకారమే మార్పుకు ద్వారంకార్ల్ రోజర్స్ తన 'Client-Centered Therapy'లో ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పారు. మనం మనలోని ఏదైనా ఒక నెగటివ్ లక్షణాన్ని వ్యతిరేకిస్తూ, దాన్ని అసహ్యించుకుంటున్నంత కాలం, మన మెదడు ఆ లక్షణాన్ని డిఫెన్స్ మోడ్‌లో రక్షిస్తుంది. ఉదాహరణకు, అతిగా కోపం రావడం లేదా అసూయ పడటం.కానీ, "అవును, ప్రస్తుతం నాలో ఈ కోపం ఉంది" అని మీరు ఎప్పుడైతే నిజాయితీగా అంగీకరిస్తారో, అప్పుడు మీ మనసులో ఉన్న ఆందోళన (Anxiety) తగ్గుతుంది. ఆ ప్రశాంతతలోనే మార్పు సాధ్యమవుతుంది.ముసుగుల భారంసో-కాల్డ్ ట్రైనర్లు మిమ్మల్ని ఎప్పుడూ "నటన" చేయమని ప్రోత్సహిస్తారు. "నీ బలహీనతలను ఎవరికీ చూపించకు, పులిలా గర్జించు, లోపల ఏమున్నా బయటకు మాత్రం తోపులా కనిపించు" అని చెప్తారు.ఇది మీలో 'Incongruence' (అంతర్ఘర్షణ) పెంచుతుంది. బయట మీరు గొప్పగా నటిస్తున్నా, లోపల మీ 'Real Self' కు అది అబద్ధం అని తెలుసు. ఈ అబద్ధం మీ సెల్ఫ్-ఎస్టీమ్ (Self-esteem) ని దెబ్బతీస్తుంది. నిజమైన వికాసం అంటే లోపాలను దాచడం కాదు, వాటిని అంగీకరించి, బాధ్యత తీసుకోవడం.అంగీకారం అంటే రాజీ పడటం కాదు"నన్ను నేను ఇలాగే ఒప్పుకుంటే ఇక నేను ఎప్పటికీ మారలేనేమో?" అని చాలామందికి అనుమానం ఉంటుందిResignation (నిరాశ): "నేను ఇంతే, నా జీవితం మారదు" అని వదిలేయడం బలహీనత.Acceptance (అంగీకారం): "ప్రస్తుతానికి నేను ఈ స్థితిలో ఉన్నాను, ఇది నా వాస్తవం. ఇక్కడి నుండి నేను ఎలా ముందుకు వెళ్ళాలి?" అని ఆలోచించడం బలం.ఉదాహరణకు, ఒక వ్యక్తికి స్టేజ్ ఫియర్ ఉందనుకోండి. "నాకు భయం లేదు" అని నటించడం కంటే, "అవును, నాకు స్టేజ్ ఎక్కాలంటే భయంగా ఉంది.. ఈ భయాన్ని జయించడానికి నేను ఏం చేయాలి?" అనడం నిజమైన పర్సనాలిటీ గ్రోత్.అంగీకార ప్రక్రియGenius Matrix మోడల్ ఉపయోగించి మనల్ని మనం ఎలా అంగీకరించాలో చూద్దాం.Step 1: అవమానాన్ని బద్దలు కొట్టండిమన లోపాలను ఒప్పుకోవడానికి మనకు అడ్డుపడేది 'సిగ్గు' (Shame). "నాలో ఈ లోపం ఉందని తెలిస్తే నలుగురు ఏమనుకుంటారు?" అనే భయాన్ని 'Break' చేయండి. మీ లోపాలు మిమ్మల్ని తక్కువ మనిషిని చేయవు, అవి మిమ్మల్ని ఒక 'మనిషి'గా చూపిస్తాయి.Step 2: నిజాయితీ గల పునాదిమీ బలహీనతలను ఒక పేపర్ మీద రాయండి. వాటిని చూసి బాధపడకండి. "అవును, ఇవి నాలో ఉన్నాయి" అని గట్టిగా చదవండి. ఎప్పుడైతే మీరు వాటిని వెలుగులోకి తెస్తారో, వాటికి మిమ్మల్ని భయపెట్టే శక్తి పోతుంది. ఇక్కడే మీ కొత్త వ్యక్తిత్వానికి పునాది 'Build' అవుతుంది.Step 3: పరిపూర్ణతకు ఆవలపరిపూర్ణత (Perfection) అనేది ఒక భ్రమ. మనం మనుషులం, దేవుళ్ళం కాదు. మన లోపాలను అంగీకరిస్తూనే, వాటిని మెరుగుపరుచుకుంటూ ముందుకు వెళ్ళడమే 'Beyond' స్టేజ్. ఇక్కడ మీరు ఎవరికీ సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉండదు.మీతో మీరు సంధి చేసుకోండిఈ రోజు ఒక ప్రశాంతమైన చోట కూర్చుని ఈ చిన్న పని చేయండి.మీలో మీకు నచ్చని మూడు విషయాలను గుర్తించండి. ఉదా: బద్ధకం, అసూయ, ఫిజికల్ అప్పియరెన్స్.ఆ మూడు విషయాల వైపు చూస్తూ.. "నిన్ను నేను అంగీకరిస్తున్నాను, నిన్ను మార్చుకోవడానికి నేను ప్రయత్నిస్తాను" అని మనసులో అనుకోండి.ఈ అంగీకారం తర్వాత మీ మనసు ఎంత ప్రశాంతంగా ఉందో గమనించండి.గాయాలే మీ గుర్తులు!బ్రో, ఒక పగిలిన కప్పును బంగారంతో అతికించినప్పుడు (Kintsugi Art), అది మామూలు కప్పు కంటే ఎక్కువ విలువను, అందాన్ని పొందుతుంది. మన లోపాలు కూడా అంతే. వాటిని దాచకండి, వాటిని అంగీకరించి గౌరవించండి. అప్పుడే మీరు మీ Real Personality ని ప్రపంచానికి చూపగలరు.గుర్తుంచుకోండి, "You can't heal what you don't reveal."సైకాలజిస్ట్ విశేష్ Genius Matrix Hub 8019 000066www.psyvisesh.com(చదవండి: The Inner Critic: మిమ్మల్ని నిరంతరం వెనక్కిలాగే శత్రువుని జయించాలంటే..!) -
యువతలో మానసిక అనారోగ్యం!
న్యూఢిల్లీ: ఆధునిక కాలంలో కుటుంబ బంధాలు బలహీనపడడం, జీవన శైలి మారిపోవడం, స్మార్ట్ఫోన్లు యువత మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. కుంగుబాటుకు గురి చేస్తున్నాయి. ప్రపంచమంతటా ఈ పరిణామం నెలకొంది. భారత్ సైతం ఇందుకు మినహాయింపు కాదు. దేశంలో 18 నుంచి 34 ఏళ్లలోపు యువతలో మానసిక అనారోగ్య సమస్యలు అధికంగా కనిపిస్తున్నాయి. మానసిక ఆరోగ్య గణన(ఎంహెచ్‌క్యూ) ర్యాకింగ్‌లో 84 దేశాలకుగాను భారత్‌కు 60వ స్థానంలో నిలిచిందంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. అమెరికా చెందిన సేపియన్ ల్యాబ్స్ ‘గ్లోబల్ మైండ్ హెల్త్’పేరిట ఈ అధ్యయనం నిర్వహించింది. తాజాగా తమ నివేదికను విడుదల చేసింది. భారతీయ యువతలో మానసిక ఆరోగ్యం దిగవ స్థాయిలో ఉన్నట్లు తేలి్చచెప్పింది. దేశంలో 55 ఏళ్లు దాటిన పెద్దలతో పోలిస్తే 18–34 ఏళ్ల యువతలోనే ఈ సమస్య ఎక్కువగా ఉన్నట్లు పేర్కొంది. → సేపియన్ ల్యాబ్స్ అధ్యయనం ప్రకారం.. భారతీయ యువత సగటు ఎంహెచ్‌క్యూ స్కోర్ 33గా ఉంది. వారు ‘బాధల్లో ఉన్న, కష్టపడుతున్న’కేటగిరీలో నిలిచారు. → 55 ఏళ్లు దాటిన పెద్దల సగటు స్కోర్ దాదాపు 100గా ఉండడం గమనార్హం. వారు ‘జీవితాన్ని చక్కగా నిర్వహించుకుంటున్న, విజయవంతమైన’కేటగిరీలో ఉన్నారు. → కోవిడ్–19 మహమ్మారి మొదలైన తర్వాత యువతలో మానసిక అనారోగ్య సమస్యలు పెరిగిపోయాయని, వారు ఇప్పటికీ పూర్తిస్థాయిలో సాధారణ స్థితికి చేరుకోలేదని సేపియన్ ల్యాబ్స్ వ్యవస్థాపకులు, చీఫ్ సైంటిస్టు తార త్యాగరాజన్ చెప్పారు. 2019 నుంచి తాము అధ్యయనం కొనసాగిస్తున్నామని, 55 ఏళ్లు దాటినవారి మెంటల్ హెల్త్‌లో పెద్దగా మార్పులు లేవని వెల్లడించారు. వారి ఎంహెచ్‌క్యూ స్కోర్ స్థిరంగా ఉందని స్పష్టంచేశారు. → ప్రపంచవ్యాప్తంగా చూస్తే అన్ని దేశాల్లో పెద్దల కంటే 18–34 ఏళ్ల యువతే మానసిక అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఎదుర్కొంటోంది. → చీకటి ఖండంగా భావించే ఆఫ్రికాలోని ఘన, నైజీరియా, జింబాబ్వే, కెన్యా, టాంజానియా తదితర దేశాల్లోని యువతలో మానసిక అనారోగ్య సమస్యలు తక్కువగా ఉన్నట్లు తేలింది. అంటే వారిలో మెంటల్ హెల్త్ మెరుగ్గానే ఉన్నట్లు స్పష్టమవుతోంది. → జపాన్, తైవాన్, హాంకాంగ్, యునైటెడ్ కింగ్డమ్(యూకే), చైనా యువతలో మెంటల్ హెల్త్ ఏమాత్రం బాగా లేదని అధ్యయనం తెలియజేసింది → రెండేళ్లపాటు ఈ సర్వే నిర్వహించారు. 84 దేశాల్లో 10 లక్షల మందికిపైగా ప్రజలను ప్రశ్నించారు. ఇంటర్నెట్ ద్వారా వారి అభిప్రాయాలు సేకరించారు. వీరిలో వేర్వేరు వయసులకు చెందినవారు ఉన్నారు. ఆధునిక జీవితం యువత మానసిక ఆరోగ్యంపై కొంత ప్రతికూల ప్రభావం చూపుతున్నట్లు గుర్తించారు. → సంపన్న, అభివృద్ధి చెందిన దేశాల్లోనూ యువతలో కుంగుబాటు లక్షణాలు కనిపిస్తున్నాయి. వారి మానసిక ఆరోగ్యం క్రమంగా దిగజారుతోంది. → భారత్‌లో 18–34 ఏళ్ల యువతలో 64 శాతం మంది తాము కుటుంబ సభ్యులతో చక్కటి సంబంధాలు కొనసాగిస్తున్నామని చెప్పారు. 55 ఏళ్లు దాటివారిలో 78 శాతం మంది ఇదే మాట చెప్పారు. ఆధికంగా ఆదాయం ఆర్జిస్తున్నవారి కంటే కుటుంబంతో కలిసి ఉన్నవారే మానసికంగా ఆరోగ్యంగా ఉంటున్నారు. → ప్రపంచవ్యాప్తంగా సగటున 14 ఏళ్లకు మొదటిసారిగా స్మార్ట్‌ఫోన్ ఉపయోగిస్తుండగా, భారత్‌లో సగటున 16.5 ఏళ్లకు స్మార్ట్‌ఫోన్ వాడకం ప్రారంభిస్తున్నారు. → ఇండియాలో 55 ఏళ్లు దాటినవారిలో కేవలం 11 శాతం మంది అతిగా శుద్ధి చేసిన ఆహారం తీసుకుంటున్నారు. యువతలో మాత్రం ఏకంగా 44 శాతం మంది ఇలాంటి హానికర ఆహారం స్వీకరిస్తున్నారు. → ప్రజల్లో మానసిక అనారోగ్య సమస్యలపై పశ్చిమ దేశాలు దృష్టి పెడుతున్నాయి. దీనిపై పరిశోధన, పరిష్కార మార్గాల కోసం ప్రతిఏటా నిధుల కేటాయింపులు పెంచుతున్నాయి. అమెరికా ప్రభుత్వం 2024లో ఇందుకోసం 2.2 బిలియన్ డాలర్లు వెచి్చంచింది. యూకే సైతం భారీగానే నిధులు ఖర్చుచేస్తోంది. అయినప్పటికీ ఆశించిన ఫలితాలు కనిపించడం లేదని నిపుణులు చెబుతున్నారు. → మానసిక అనారోగ్యం విషయంలో కేవలం చికిత్సతో సరిపెట్టకుండా.. అందుకు మూల కారణం ఏమటన్నది పరిశోధిస్తున్నామని తార త్యాగరాజన్ తెలియజేశారు. కుటుంబ బంధాలు బలహీన పడడం, ఆధ్యాతి్మక అంశాలపై దృష్టి పెట్టకపోవడం, చిన్న వయసులోనే స్మార్ట్ఫోన్లకు బానిస కావడం, ఆరోగ్యకరమైన ఆహారాన్ని స్వీకరించకుండా.. అతిగా శుద్ధి చేసిన ఆహారం తీసుకోవడం వంటివి యువతకు ముప్పుగా పరిణమిస్తున్నాయ ని వివరించారు. జీవనశైలిలో మార్పులు చేసుకుంటే మానసిక ఆరోగ్యం తప్పకుండా మెరుగుపడుతుందని సూచించారు. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో అనుబంధం పెంచుకోవాలని చెప్పారు. -
ఐడియా అదుర్స్..! ఫ్యాషన్‌ని ఇలా కూడా చూపించొచ్చా..!?
సోషల్ మీడియా పుణ్యమా అని..చాలామంది ఓవర్‌నైట్ స్టార్లుగా, సెలబ్రిటీ హోదాను పొందుతున్నారు. ఆ జాబితాలోకి చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా అందరు చేరి.. సక్సెస్‌ని అందుకోవడం విశేషం. అయితే ఫ్యాషన్ వద్దకు వచ్చేటప్పటకీ.. మనలోపల టాలెంట్ మొత్తం తీసి ..రీల్స్ చేసినా..క్లిక్ అవ్వడం కొంచెం కష్టమే. ముఖ్యంగా అందరికి చేరువవ్వాలంటే అంత సులభమైన టాస్క్ కాదు. ఫ్యాషన్ అనగానే బాగా డబ్బున్నవాళ్లకే చెల్లుతుందనే అభిప్రాయం బాగా ఎక్కువ జనాల్లో. కానీ దాన్ని సామాన్యుల చెంతకు చేర్చి..అది మన లైఫ్‌లో భాగమనిపించేలా అందంగా చూపించింది ఈ అమ్మాయి. ఈ ఒక్క రీల్‌తో సెన్సేషన్‌గా స్టార్‌గా మారి.. ప్రపంచ వేదికపై నిలిచింది. అంతేగాదు ఎవరా ఆ అమ్మాయి అంత కూల్‌గా, చాలా క్యాజువల్‌గా ఫ్యాషన్‌ని ఎంత బాగా పరిచయం చేసింది.. అని నెటిజన్లు చర్చించుకోవడం మొదలుపెట్టారు. ఇంతకీ ఎవరంటే ఆమె..ఆ అమ్మాయే దియా జౌకానీ. వృత్తిరీత్యా ఆమె హై-ఎండ్ ఫ్యాషన్ డిజైనర్. ఇన్‌స్టాగ్రామ్‌లో"కూల్ గర్ల్ ఫ్రమ్ ఇండియా" అనే క్యాప్షన్‌తో ఆమె షేర్ చేసిన ఫ్యాషన్ వీడియో నెట్టిం ప్రభంజనం సృష్టించింది. ఎవరీ కూల్గర్ల్ అని చర్చలకు తెరతీసేలా..హాట్‌టాపిక్‌గా మారిందామె. ఆ రీల్లో ఆమె ధరించిన దుస్తులు కూడా స్వయంగా ఆమె డిజైన్ చేసినవేనట. సోషల్ మీడియాను ఆమె తన ఫ్యాషన్ ప్రదర్శనకు ఫ్లాట్‌ఫామ్‌గా ఉపయోగించుకుంటూ..తన డిజైన్లను ఇలా రీల్స్ ద్వారా నిశబ్దంగా ప్రదర్శించింది. తన డిజైనర్‌వేర్‌లతో చాలా స్మార్ట్‌గా మార్కెటింగ్ చేస్తోందామె. ఆ వీడియోలో దియా హై ఫ్యాషన్‌ను సరదాగా ధరించగలిగేలా ఆకర్షించింది. అంతేగాదు దియా ఇన్‌స్టాగ్రామ్‌లో మొత్తం ఆమె ఫ్యాషన్ ప్రపంచాన్ని చూడొచ్చు. తన కంటెంట్ మొత్తం చాలా నిరాడంబరంగా ప్రజెంట్ చేస్తుండటంతో..ప్రజలు ఒక్క క్షణం వేచి వీక్షించగలిగేలా ఆకట్టుకుంటున్నాయి ఆ వీడియోలు. ప్రస్తుతం దియా చేసిన "కూల్ గర్ల్ ఫ్రమ్ ఇండియా" ఎంత ట్రెండీగా మారిందంటే..అందురు ఆమెలా అనుకరించే యత్నం చేస్తున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు..ఆ వీడియో ఎంతగా నెటిజన్ల మనసులను తాకిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.కాగా, నెట్టింట వైరల్ అవుతున్న ఆ వీడియోల బ్యాగ్రౌండ్లో క్లాసిక్ ఫ్రాంక్ ఓషన్స్ నైట్స్ ప్లే అవుతూ ఉంటే.. దియా చక్కటి ఫ్యాషన్‌వేర్‌లో చాయ్ తాగుతూ కనిపిస్తుంది. ఆ తర్వాత నగర వీధుల గుండా నడవడం ప్రారంభిస్తుంది. కొద్ది సెకన్లలో గుర్రపు స్వారీ చేస్తూ, కొబ్బరి నీళ్ళు తాగుతూ ఉండటం లేదా ఆమె వ్యక్తిగత రైడ్ లాగా JCB పారపై కూర్చోవడం..ఇలా విలక్షణంగా కనబడుతుంది ఆయా వీడియోలలో. అయితే వాటి అన్నింటిలోనూ దియా వివరణాత్మక, హై-ఫ్యాషన్ దుస్తులను ధరించడం స్పష్టంగా చూడొచ్చు. View this post on Instagram A post shared by 🪔 (@diyajoukani)ఈ వీడియో ఇంతలా క్లిక్ అవడానికి కేవలం ప్రజెంటేషన్ చేసిన విధానమే ఆమెను ఐకానిక్‌గా మార్చేసింది. ఇక్కడ దియా విలాసవంతమైన దుస్తులను ధరించింది కానీ..స్టూడియో లేదా లగ్జరీ నేపథ్యం ఎంచుకోకుండా..ఇలా సాధారణ వీధుల గుండా వెళ్తూ..హై ఫ్యాషన్ మన రోజువారీ జీవితంలో భాగం చేసుకోవడం ఎలాగో నేర్పుతున్నట్లుగా ఉంది. అందుకే ఇది ఎక్కువ మంది ప్రజలకు రీచ్ అయ్యి..అంతలా వ్యూస్, లైక్‌లు వచ్చాయి ఆ వీడియోకి. ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేస్తుందని అన్నట్లుగా ఒక్క రీల్‌తో దియా సెన్సేషన్‌గా మారింది కదూ..!. View this post on Instagram A post shared by 🪔 (@diyajoukani) (చదవండి: అరుదైన పెళ్లి: ట్విన్ సిస్టర్స్‌ని పెళ్లాడిన ట్విన్ బ్రదర్స్..!) -
జస్ట్ 11 నెలల్లో 52 కిలోలు బరువు తగ్గింది..! నో జిమ్, నో స్ట్రిక్ట్ డైట్..
బరువు తగ్గడం అందరికీ ఒకలా ఉండదు. కొందరికి చాలా కష్టమైనదిగా..మరికొందరికి చాలా తేలికైన వాటితో సులభంగా తగ్గే టాస్క్‌లా ఉంటుంది. అయితే ఇక్కడ స్థిరత్వాన్ని బ్రేక్ చేయకపోతేనే..లక్ష్యానికి చేరుకోగలం. ఇక్కడ ట్యునిషియాకు చెందిన హిబా అల్లా వెయిట్‌లాస్ స్టోరీ ఆ విధంగానే సాగింది. ఆమె ఓర్పుతో స్థిరత్వంతో బరువు తగ్గే ప్రయాణాన్ని మొదలు పెట్టి ఏకంగా 133 కిలోల బరువు నుంచి 52 కిలోలకు తగ్గి అందర్నీ ఆశ్చర్యపరిచింది. అదికూడా జస్ట్ 11 నెలల్లో ఈ ఫలితాన్ని అందుకుని స్ఫూర్తిగా నిలిచిందామె. ఇంతకీ ఆమె ఎలాంటి ట్రిక్స్ అనుసరించిందంటే..ట్యునీషియాలోని ట్యునీస్కు చెందని 22 ఏళ్ల హిబా అల్లా అయాది ఒక స్టూడెంట్. ఆమె ఎత్తు 5 అడుగులు 8 అంగుళాలు, బరువు ఏకంగా 133.3 కిలోలు ఉండేది. ఆమె రూపం భారీగా ఉండి..కనీసం నాలుగు అడుగులు వేయాలన్నా..ఆయాసంతో ఇబ్బందిపడేది. శ్వాస తీసుకోవడంలో నిరంతరం అలసటను ఎదుర్కొనేది. ఆరోగ్యం రోజు రోజుకి భారంగా మారిపోవడం మొదలైంది. ఇక తనకు తానుగా బరువు తగ్గేందుకు ఉపక్రమించకపోతే..ఉనికే కష్టమవుతుందని అర్థమైంది హిబాకు. దాంతో వెయిట్‌లాస్ అయ్యేందుకు రెడీ అయ్యింది. అయితే ఆమె అందరు అనుక్నుట్లుగా బరువు తగ్గడం అంటే..తినడం తగ్గించడం, నోరు కట్టేసుకోవడం కాదంటోంది. ఆమె తింటూనే బరువు తగ్గే ప్రయత్నం చేసిందంటే. అయితే తినే వాటిలో ఆరోగ్యకరమైనవి, ప్రోటీన్,ఫైబర్ ఉండేవి ఎంచుకున్నట్లు తెలిపింది. ముందుగా ఆకలి తీరి సంతృప్తిని కలిగించేలా భోజనం ఉండేలా చూసుకునేదాన్ని. అప్పుడు బరువు తగ్గడం భారంగా..భయానకంగా ఉండదట. పైగా తరుచుగా అద్దంలో చూసుకోవడం..స్లిమ్‌గా మారాలనే లక్ష్యాన్ని నిరంతరం గుర్తుచేస్తుంది. నోరు ఆటోమేటిగ్గా అదుపులో ఉండేలా ఆహారం తీసుకునేలా మైండ్‌సెట్ అవుతుందట. ఆమెకు అధిక బరువు కారణంగా జిమ్ సభ్యత్వం లభించలేదట. అందుకని హిబా వర్కౌట్లకు బదులుగా నడకను ఎంచుకుందట. నెమ్మదిగా చిన్న అడుగులతో మొదలు పెట్టి..కిలోమీటర్ల కొద్ది నడకను పెంచుకుంటూ పోయేదాన్ని అంటోంది. అధికంగా నీటిని తీసుకోవడం, తాజా పండ్లను తీసుకోవడం వంటివి చేసేదట. అలేగు ఉప్పు, చక్కెరలను మితంగా తీసుకునేదట. ఇక బరువు తగ్గడం శారీరకం భావోద్వేగ పోరాటంగా అభివర్ణించింది. మొదట్లో అంత తొందరగా తన బాడీలో మార్పులు సంతరించుకోలేదని, అయినా..ఎక్కడ అసహనం చెందకుండా ఓర్పుతో తన దినచర్యను కొనసాగించానని చెప్పుకొచ్చింది. ఏం తీసుకున్నా..ఆరోగ్యకరమైన విధంగా ఎంచుకోవడం, వాకింగ్ని స్కిప్ చేయకపోవడం వంటి అలవాట్లతో బరువు తగ్గడం ప్రారంభమవ్వడం మొదలైంది. అయితే తాను ఆ ఉత్సాహంతో అలసిపోతున్నప్పుడూ కూడా ఓపికతో తన డైలీ యాక్టివిటీని కొనసాగించేదాన్ని అంటోంది. అలా ఇవాళ 52.45 కిలోలు బరువుతగ్గి 52 కిలోల ఆరోగ్యకరమైన బరువుతో ఉన్నా అని నవ్వతూ చెప్పింది హిబా. అంతేగాదు బరువు తగ్గడం అనేది శిక్ష కాదని, శరీరం, జీవితానికి ఇచ్చే గౌరవప్రదమైన చర్యగా అభిర్ణించింది. ఈ రోజు తాను ఆరోగ్యంగా, హాయిగా శ్వాస తీసుకునే ఆహ్లాదభరితమైన జీవితాన్ని ఆస్వాదిస్తున్నానని ఆనందంగా చెబుతోంది. దయచేసి బరువు తగ్గడం అంటే..విపరీతమైన వర్కౌట్లు, కఠినమైన ఆహారంగా భావించొద్దు..సంతృప్తికరంగా తింటూ..ఎంజాయ్ చేస్తూ తగ్గాలి..అప్పుడే మంచి ఫలితాలు అందుకోగలం అని నమ్మకంగా చెబుతోంది హిబా.(చదవండి: బిడ్డలు పుట్టే అవకాశం లేదన్నారు..!కానీ ఆ మహిళ ..) -
అద్దంలో కనిపించని అసలు రూపం
మనం ప్రతిరోజూ అద్దం ముందు నిలబడి జుట్టు సర్దుకుంటాం, మేకప్ వేసుకుంటాం. కానీ మన కంటికి కనిపించని మరొక అద్దం మన మనసులో ఉంది. అక్కడ మన గురించి మనం ఒక చిత్రాన్ని గీసి ఉంచాం. సైకాలజీలో దీన్నే 'Self-Image' (స్వీయ ప్రతిబింబం) అంటారు. ఇదే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది.ఎస్, ప్రపంచం మిమ్మల్ని ఎలా చూస్తుంది అనేది కాదు, మీరు మిమ్మల్ని ఎలా చూసుకుంటున్నారు అనేదే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది.మాక్స్వెల్ మాల్ట్జ్ పరిశోధన...డాక్టర్ మాక్స్వెల్ మాల్ట్జ్ ఒక ప్లాస్టిక్ సర్జన్. ప్రమాదాల్లో ముఖం దెబ్బతిన్న వారికి లేదా పుట్టుకతో లోపాలు ఉన్నవారికి ఆయన ఆపరేషన్ చేసేవారు. చాలామంది ఆపరేషన్ తర్వాత కొత్త ముఖంతో ఆత్మవిశ్వాసంతో ఉండేవారు. కానీ కొంతమంది మాత్రం, ముఖం పర్ఫెక్ట్గా మారినా, "డాక్టర్, నా ముఖం ఇంకా అలాగే ఉంది, నేను ఇంకా వికారంగానే కనిపిస్తున్నాను" అని చెప్పేవారు.మనం బయట ఎన్ని మార్పులు చేసినా, మన మనసులోని అద్దంలో ఉన్న చిత్రం (Mental Blueprint) మారకపోతే ఏదీ మారదని ఆయనకు అర్థమైంది. దీన్నే ఆయన 'Psychocybernetics' అన్నారు. అంటే మన మెదడు ఒక ఆటో-పైలట్ మెకానిజం లాంటిది; మన అంతరంగంలో మన గురించి మనం ఎలాంటి చిత్రం గీసుకుంటే, మన జీవితం అటువైపే ప్రయాణిస్తుంది.సెల్ఫ్-ఇమేజ్: మీ జీవితపు థర్మోస్టాట్మీ ఇంట్లోని ఏసీ 24 డిగ్రీల దగ్గర ఉందనుకోండి, బయట ఎండ ఎంత ఉన్నా అది గదిని 24 దగ్గరే ఉంచుతుంది. మీ సెల్ఫ్-ఇమేజ్ కూడా మీ జీవితానికి ఒక థర్మోస్టాట్ లాంటిది.ఒక విద్యార్థి "నేను యావరేజ్ స్టూడెంట్‌ని" అని నమ్మితే, అతను ఎంత బాగా చదివినా చివరికి యావరేజ్ మార్కులే తెచ్చుకుంటాడు. ఎందుకంటే, అతని సబ్-కాన్షియస్ మైండ్ అతన్ని అంతకు మించి వెళ్లనివ్వదు.ఒక వ్యక్తి "నాకు అదృష్టం లేదు" అని నమ్మితే, అద్భుతమైన అవకాశం తలుపు తట్టినా దాన్ని అతను చేజేతులా వదిలేస్తాడు.పాజిటివ్ థింకింగ్ ఎందుకు విఫలమవుతుంది?పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్స్, మోటివేషనల్ స్పీకర్స్ మనకు "నువ్వు గొప్పవాడివి అని గట్టిగా అరువు" అని చెప్తారు. కానీ "నేను దేనికీ పనికిరాను" అని మీ అంతరంగంలో మీరు నమ్ముతున్నంత కాలం, ఆ అరుపులు కేవలం శబ్దాలుగానే మిగిలిపోతాయి. మార్కెట్ విల్ పవర్ వాడమంటుంది. సైకాలజీ ఇమాజినేషన్ వాడమంటుంది.మన సెల్ఫ్-ఇమేజ్ లోపల ఎంత బలంగా ఉంటుందంటే, దానికి వ్యతిరేకంగా మనం చేసే ప్రయత్నాలన్నీ నీటి మీద గీతలు లాంటివే. మనల్ని మనం మార్చుకోవాలంటే మన విల్ పవర్ ని కాదు, మన సెల్ఫ్-ఇమేజ్ ని మార్చాలి.మీ లోపలి అద్దాన్ని క్లీన్ చేసుకోండిGenius Matrix మోడల్ బ్రేక్, బిల్డ్, బియాండ్ ఉపయోగించి ఈ సెల్ఫ్-ఇమేజ్ ని ఎలా రీ-డిజైన్ చేయాలో చూద్దాం.Step 1: Break (పాత ముద్రను గుర్తించడం)ముందుగా అద్దంలో మీకు కనిపించని ఆ 'నెగటివ్ ఇమేజ్' ను గుర్తించండి."నేను ఒక పిరికివాడిని," "నేను ఎప్పుడూ ఫెయిల్ అవుతాను" వంటి వాక్యాలు మీ మైండ్ లో ఎప్పుడు పడ్డాయి?మనసులో ఉన్న ఆ పాత గాయాలకు ప్లాస్టిక్ సర్జరీ చేయాలి. పాత ముద్రను 'Break' చేయడమే మొదటి మెట్టు.Step 2: Build (మెంటల్ రిహార్సల్)మాక్స్వెల్ మాల్ట్జ్ ఒక గొప్ప టెక్నిక్ చెప్పారు—'Creative Visualization'.ప్రతిరోజూ 10 నిమిషాలు కళ్ళు మూసుకుని, మీరు ఎలా ఉండాలని కోరుకుంటున్నారో అలాంటి వ్యక్తిగా మిమ్మల్ని మీరు ఊహించుకోండి.మీ మెదడుకు వాస్తవానికి, ఊహకు మధ్య తేడా తెలియదు. మీరు పదే పదే ఒక కొత్త చిత్రాన్ని ఇస్తే, అది పాత సెల్ఫ్-ఇమేజ్ ని తుడిచేసి కొత్తదాన్ని 'Build' చేస్తుంది.Step 3: Beyond (కొత్త అస్తిత్వం)ఒక్కసారి మీ సెల్ఫ్-ఇమేజ్ మారితే, మీరు మీ పరిమితులను దాటి ప్రయాణిస్తారు. మీరు ఎవరికో ఏదో నిరూపించాల్సిన అవసరం ఉండదు. మీరు మీ మనసు లోపలి అద్దంలో ఒక 'విన్నర్' గా కనిపిస్తారు. ఇదే 'Beyond' స్టేజ్.అద్దం అబద్ధం చెప్పదు!ఈ రోజు మీరు ఒక చిన్న ఎక్సర్సైజ్ చేయండి:కళ్ళు మూసుకుని, ఒక వ్యక్తిగా మీ గురించి మీరు ఏమనుకుంటున్నారో ఒక వాక్యంలో రాసుకోండి. (అది మీ సెల్ఫ్-ఇమేజ్).ఆ వాక్యం నిజమేనా? దానికి ఆధారాలు ఏంటి?మీరు ఎలా ఉండాలని కోరుకుంటున్నారో ఆ కొత్త ఇమేజ్ ని ఇప్పుడే డిజైన్ చేయండి. దాన్ని రోజూ ప్రాక్టీస్ చేయండి.లోపలి అందమే అసలైన శక్తి!బ్రో, ముఖానికి వేసుకునే రంగులు వర్షం వస్తే పోతాయి. కానీ మనసులో వేసుకునే ఈ 'సెల్ఫ్-ఇమేజ్' రంగులు జీవితాంతం ఉంటాయి. మీ మనసు లోపలి అద్దంలో ఉన్న మలినాలను తుడిచేయండి. మీరు ఒక అద్భుతమైన సృష్టి అని ముందు మీరు నమ్మండి.. ప్రపంచం దానంతట అదే నమ్ముతుంది. గుర్తుంచుకోండి, "You cannot outperform your own self-image."సైకాలజిస్ట్ విశేష్ Genius Matrix Hub 8019 000066www.psyvisesh.com -
కోకిలాబెన్ అంబానీ 92వ పుట్టినరోజు వేడుకలు..! ఆమె మార్క్ ఉండేలా..
వ్యాపార ప్రపంచంలో అపరకుబేరుల్లా వెలుగుతున్న ఫ్యామిలీ అంబానీ. అలాంటి వంశ పార్యంపర్య వ్యాపారానికి వెన్నుముకగా నిలిచిన శక్తిమంతమైన మహిళ కోకిలాబెన్ అంబానీ అంటే అతిశయోక్తి కాదు. ధీరూభాయ్ వ్యాపార ప్రపంచాన్ని శాసించినా, ముఖేష్ అంబానీ ఆసియా కుబేరుడిగా అవతరించినా.. దీని వెనుకున్న గొప్ప మహిళా మూర్తి కోకిలా బెన్. ఇవాళ కోకిల్ బెన్ 92వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. అయితే ఆమె సంపన్న మహిళ వలే గ్రాండ్‌గా కాకుండా చాలా సాదాసీదాగా జరుపుకుంటూ..సింపుల్సిటీకీ కేరాఫ్‌గా నిలిచారామె. ఆఖరికి ధరించిన చీర సైతం సాధారణమైన నిమ్మపండు రంగు షిఫాన్ చీరలో కాలాతీత సౌందర్యానికి కట్టుబడి ఉన్నట్లుగా.. తన ప్రత్యేక శైలితో ఆకట్టుకున్నారామె. అంబానీ అప్డేట్ ఇన్‌స్టాగ్రామ్‌లో అందుకు సంబందించిన ఫోటోలు, వీడియోలు షేర్ చేశాడరు. భారీ అలంకరణలు, ఖరీదైన ఆభరణాలుగానీ ధరించకుండా..ఆహ్లాదకరమైన పసుపు రంగు చీరతో నవ్వుతూ కనిపించారామె. ఒక సాధారణ గొలుసు, సున్నితమైన చెవుపోగులు, సాంప్రదాయ ఎరుపు బిండితో తన లుక్‌ని పూర్తిచేసింది. సహజ అలంకరణకు మించిన బ్యూటీ మరొకటి ఉండదని చెప్పకనే చెప్పారు కోకిలాబెన్. ఇక ఈ వేడుకలో ఆమె ఉనికిని తెలియజేసేలా చేతులు, కాళ్ల గుర్తుల ఫ్రేమ్‌తో సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. కోకిలాబెన్ నేపథ్యం..1934లో గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో జన్మించిన కోకిలాబెన్ అంబానీ, అంబానీ కుటుంబానికి మాతృమూర్తి, రిలయన్స్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకుడు ధీరూభాయ్ అంబానీ భార్య. 1955లో ధీరూభాయ్‌ను వివాహం చేసుకుని కొంతకాలం యెమెన్‌లోని ఆడెన్‌లో నివశించారు. ఆ తర్వాత వ్యాపార సామ్రాజ్యం అభివృద్ధి చెందడంలో ఆమె కీలక సహాయక పాత్ర పోషించారామె. అలాగే 2002లో ఆయన మరణం తర్వాత, కుమారులు ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీల మధ్య జరిగిన హై ప్రొఫైల్ వివాదానికి ఆమె మధ్యవర్తిత్వం వహించారు. అలా 2005లో రిలయన్స్ గ్రూప్ విభజనకు దారితీసింది. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ హాస్పిటల్‌తో సహా పలు దాతృత్వ కార్యక్రమాల్లో ఆమె పాత్ర కూడా ఉంది. సంప్రదాయాలకు కట్టుబడి ఉండే గౌరవనీయమైన వ్యక్తిగా పేరుతెచ్చుకున్నారు కోకిలాబెన్. View this post on Instagram A post shared by Ambani Family (@ambani_update) (చదవండి: పిల్లలకు నేర్పించాల్సింది ఇదే..! గుడ్ పేరెంటింగ్ స్టైల్) -
నాట్యమయూరి సుధా చంద్రన్ వెల్నెస్ సీక్రెట్..!
భారతీయ భరతనాట్య నృత్యకారిణి, నటి సుధాచంద్రన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నటిగానూ, నృత్యకారిణిగా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుని, గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే బుల్లితెరపై విలక్షణమైన నటతో అశేష ప్రేక్షక ఆదరాభిమానాలు పొందారామె. అలాంటి సుధాచంద్రన్ ఆరు పదుల వయసులో కూడా అంతే అందం, ఫిట్నెస్తో యాక్టివ్‌గా ఉండే ఆమె..అందం, ఆరోగ్యపరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారామె. ప్రస్తుతం ఉన్న హెల్త్ అండ్ బ్యూటీ ట్రెండ్లకు విరుద్ధంగా పూర్వకాల నాటి ఆయుర్వేద ఆచారాలే తన అందం, ఆరోగ్యం వెనుక సీక్రెట్ అంటోందామె. వాటి గొప్పతనం గురించి సుధా మాటల్లోనే సవివరంగా తెలుసుకుందామా..!. View this post on Instagram A post shared by Sudhaa Chandran (@sudhaachandran) ప్రస్తుతం బ్యూటీ అనగానే సీరమ్‌లు, షీట్ మాస్క్‌లు ట్రెండ్ల హవా ఎక్కువగా ఉంది. పైగా చాలామంది సీనియర్ సెలబ్రిటీలు ఈ ఆధునిక కాలానికి అనుగుణంగా ఉన్న ట్రెండ్లే అనుసరిస్తే..ఆమె పాతకాలం నాటి ఆయుర్వేదం, నాటి ఆచార సంప్రదాయలకే జై కొడుతోంది సుధాచంద్రన్. అంతేగాదు ఆరోగ్యం, చర్మ సంరక్షణ అనేవి దినచర్యలు కావని, అవి మన అమ్మమ్మల నాటి జ్ఞాపకాతో ముడిపడి ఉన్నావి, తరతరాలుగా ఒకరి నుంచి ఒకరికి సంక్రమించినవిగా పేర్కొన్నారామె. తాను దక్షిణి భారత్‌లోని కేరళ నుంచి వచ్చానని, అందువల్ల దేశీ ఆచారాలకే ప్రాముఖ్యత ఇస్తానని అన్నారామె. తనకు ఆయుర్వేదం ఒక ట్రెండ్ కాదని, అదొక జీవన విధానమని అన్నారు. చిన్ననాటి నుంచి చూసినవే ఈనాటికి తూ.చా తప్పకుండా ఆచరిస్తున్నానని అన్నారామె. దక్షిణ భారత దేశం నుంచి రావడంతో మంగళ, శుఖ్రవారాల్లో తలస్నానం తప్పనిసరి అని చెప్పారు. కొబ్బరి నూనె రాసుకుని మరి స్నానం చేయడం అలవాటని కూడా చెప్పారామె. తన అమ్మమ్మ జుట్టు అందంగా, ఒత్తుగా ఉండాలంటే కొబ్బరినూనె తప్పనిసరి అని చెబుతూ తాను పాఠశాలకి వెళ్తున్నప్పుడూ అమ్మమ్మ ఎంతలా తన జుట్టుకి శ్రద్ధగా నూనె రాసేవారో గుర్తు తెచ్చుకున్నారామె. అలాగే 15 రోజులకొకసారి కడుపుని శుభ్రపరుచుకోవడం అంటే..సాఫీగా విరేచనాలు అయ్యేలా కేటాయించడం. మన పురాతన భారతీయ వైద్య విధానమైన ఆయుర్వేదన్నే గట్టిగా విశ్వసిస్తానని చెప్పారామె. కనీసం జలుబు చేసినప్పుడు కూడా దశములారాష్టాన్ని క్రమం తప్పకుండా ఉపయోగిస్తానని చెప్పారామె. దశములారాష్టం అనేది సాంప్రదాయ ఆయుర్వేద టానిక్. ఇది పది వేర్లు, ఇతర మూలిక మిశ్రమాలతో తయారు చేస్తారని తెలిపారు. శ్వాసకోశ ఆరోగ్యానికి చాలామంచిదని చెప్పారు. అలాగే కళ్లకు పెట్టుకునే కాజల్ కూడా ఇంట్లో తయారుచేసినదే వాడతానని, ఇది తన అమ్మమ్మ నుంచి అమ్మకు..అలా తనకు సంక్రమించిన ఆచారమని. అదే తాను ఇప్పటికీ ఫాలో అవుతానని అన్నారామె. అలాగే జుట్టు ఆరోగ్యానికి ఆముదం కూడా ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారామె. అలాగే మాయిశ్చరైజింగ్ కొబ్బరి నూనెని ఉపయోగిస్తానని, ఆఖరికి మేకప్‌ని తొలగించేందుకు కూడా వెట్ వైప్స్ వాడనని, కొబ్బరినూనెతోనే తొలగిస్తానని అన్నారామె. తాను కేరళ నుంచి వచ్చి ముంబైలో స్థిరపడ్డా తన మూలాలను, ఇంటి ఆచారాలనే అనుసరిస్తానని చెప్పారామె. అంతేగాదు కేరళ మసాజ్‌లు తీసుకుంటానని కూడా అన్నారు. శరీరంలోని అదనపు నీటి నిలుపుదలను తొలగించేందు ఎంతగానో ఉపకరిస్తాయని అన్నారు. తాను కొత్తగా ఎలాంటి ప్రయోగాలు చేసేందుకు ఇష్టపడనని, తరతరాల సంప్రదాయాలు, ఆచారాలనే పాటిస్తానని చెప్పారామె. అప్పుడే జీవితం చాలా సులభంగా తేలికగా ఉంటుందన్నారామె. కానీ నేటితరం మార్కెట్లో వచ్చేప్రతి ట్రెండ్ ఫాలో అయ్యి జీవితాన్ని క్లిష్టతరంగా మార్చుకుని సమస్యలు కొనితెచ్చుకుంటున్నారంటూ..తన పోస్ట్‌ని ముగించారు సుధాచంద్రన్. View this post on Instagram A post shared by Sudhaa Chandran (@sudhaachandran) (చదవండి: The 'Ideal Self' Trap: ఎదుటివారిలా ఉండాలనుకోవడమే సమస్య!) -
ఫేక్ పర్సనాలిటీ వద్దు..మీరు మీలా ఉండండి..!
మనం రోజూ ఉదయం లేవగానే ఇన్స్టాగ్రామ్ లేదా యూట్యూబ్ ఓపెన్ చేస్తాం. అక్కడ ఒకరు సిక్స్ ప్యాక్ బాడీతో కనిపిస్తారు, ఇంకొకరు ఖరీదైన కారులో తిరుగుతూ కనిపిస్తారు, మరొకరు అద్భుతంగా ఇంగ్లీష్ మాట్లాడుతుంటారు. వారిని చూడగానే "నేను కూడా వాళ్ళలాగే ఉండాలి" అనే ఆలోచన మొదలవుతుంది.మెల్లమెల్లగా మనం 'మనం'లా ఉండటం మానేసి, ఎవరోలా మారడానికి ప్రయత్నిస్తాం. సైకాలజీలో దీన్నే 'Ideal Self Trap' అంటారు. ఇది ఒక మానసిక జబ్బు లాంటిది, ఇది మీ అసలైన వ్యక్తిత్వాన్ని (Real Personality) చంపేస్తుంది.1. Real Self vs. Ideal Self: అసలు గొడవ ఎక్కడ?కార్ల్ రోజర్స్ సిద్ధాంతం ప్రకారం, ప్రతి వ్యక్తిలో రెండు రూపాలు ఉంటాయి. ఒకటి మనం ప్రస్తుతం ఉన్న రూపం (Real Self), రెండోది మనం ఎలా ఉండాలని కోరుకుంటామో ఆ రూపం (Ideal Self).Real Self (నిజమైన నేను): ప్రస్తుతం మీరు ఎవరు? మీ బలాలు ఏంటి? మీ బలహీనతలు ఏంటి? మీ సహజమైన ప్రవర్తన ఎలా ఉంటుంది? అనేది ఇది.Ideal Self (ఆదర్శవంతమైన నేను): మీరు ఎలా ఉండాలని కోరుకుంటున్నారు? సమాజం మిమ్మల్ని ఎలా చూడాలని మీరు ఆశపడుతున్నారు? అనేది ఇది.ఈ రెండింటి మధ్య దూరం పెరిగినప్పుడు మనిషిలో 'Anxiety' (ఆందోళన) మరియు 'Self-Hatred' (తన్ను తాను అసహ్యించుకోవడం) మొదలవుతాయి.ఉదాహరణకు, మీరు సహజంగా మితభాషి (Introvert) అనుకుందాం. కానీ మీరు ఒక పాపులర్ మోటివేషనల్ స్పీకర్‌ను చూసి, అతనిలాగా గలగలా మాట్లాడాలని (Extrovert) ప్రయత్నిస్తే.. మీరు మీ 'Real Self'ను మోసం చేస్తున్నట్లే. ఈ గ్యాప్ పెరిగే కొద్దీ మీ పర్సనాలిటీ విచ్ఛిన్నమవుతుంది.2. మార్కెట్ మోటివేషన్ ఎలా ట్రాప్ చేస్తుంది?పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్లు, motivation స్పీకర్లు ఈ 'Ideal Self' ట్రాప్‌ను క్యాష్ చేసుకుంటారు. "నువ్వు వారిలా తయారవ్వచ్చు, వీరిలా గెలవొచ్చు, ఈ స్టెప్స్ ఫాలో అయితే నువ్వు ఒక సూపర్ హ్యూమన్ అవుతావు" అని చెప్తారు. అంటే వారు మీకు ఒక 'అద్దె వ్యక్తిత్వాన్ని' (Borrowed Personality) అమ్ముతున్నారు.సైకాలజీ ఏం చెప్తుందంటే.. "నువ్వు ఎవరిలాగో అవ్వాల్సిన అవసరం లేదు. నీలోని ఉత్తమ వెర్షన్‌గా మారితే చాలు."వేరొకరిని కాపీ కొట్టడం అంటే మీ ఒరిజినాలిటీని ఖననం చేయడమే. పులిని చూసి నక్క వాత పెట్టుకున్న చందంగా, మార్కెట్ ఇచ్చే 'సక్సెస్ టిప్స్' మిమ్మల్ని ఒక ఫేక్ పర్సనాలిటీగా మారుస్తాయి.3. ఎదుటివారిలా ఉండాలనుకోవడం 'జబ్బు' ఎందుకు?ఇది జబ్బు అని ఎందుకు అంటున్నానంటే, దీనివల్ల మూడు ప్రమాదాలు ఉన్నాయి:Constant Comparison (నిరంతర పోలిక): మీరు ఎప్పుడూ ఇతరులతో పోల్చుకుంటూ ఉంటారు. దీనివల్ల మీ దగ్గర ఉన్నవి మీకు తక్కువగా అనిపిస్తాయి.Loss of Identity (గుర్తింపు కోల్పోవడం): మీకంటూ సొంత ఆలోచనలు ఉండవు. ఎదుటివారు దేన్ని సక్సెస్ అంటే దాన్నే మీరు కూడా సక్సెస్ అనుకుంటారు.Low Self-Esteem: మీరు 'Ideal Self'ను అందుకోలేనప్పుడు.. "నేను దేనికీ పనికిరాను" అనే భావన బలపడుతుంది.4. Real Personality Development: ట్రాప్ నుండి బయటపడటం ఎలా?Genius Matrix Hub ఫిలాసఫీ ప్రకారం, ఈ ట్రాప్ నుండి బయటపడి మీ లెగసీని ఎలా నిర్మించుకోవాలి?STEP 1: BREAK (ముసుగును తొలగించండి)ముందుగా మీరు ఎవరిని చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారో గుర్తించండి."నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నది నా అవసరం కోసమా? లేక పక్కింటి వ్యక్తిని చూసి గొప్పలు పోవడానికా?""నేను ఈ బట్టలు వేసుకుంటున్నది నాకు నచ్చిందా? లేక సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టడానికా?"ఈ విశ్లేషణ మీలోని 'ఫేక్ ఐడియల్ సెల్ఫ్'ని బ్రేక్ చేస్తుంది.STEP 2: BUILD (కంగ్రూయెన్స్ - ఏకీకరణ)మీ 'Real Self'కు మరియు 'Ideal Self'కు మధ్య ఉన్న దూరాన్ని తగ్గించాలి. అంటే, అసాధ్యమైన లక్ష్యాలు పెట్టుకోకుండా.. మీ సహజ సిద్ధమైన నైపుణ్యాలను (Natural Talents) పెంచుకోవడంపై దృష్టి పెట్టాలి.* మీరు మంచి రచయిత అయితే, బలవంతంగా స్పీకర్ అవ్వాలని ట్రై చేయకండి. మీ రైటింగ్‌లోనే మీ పర్సనాలిటీని బిల్డ్ చేయండి.* Self-Acceptance (నిన్ను నీవు అంగీకరించడం) లేనిదే వికాసం మొదలవ్వదు.STEP 3: BEYOND (అథెంటిసిటీ)ఒక్కసారి మీరు ఎదుటివారిలా ఉండాలనే తాపత్రయం వదిలేస్తే, మీలో ఒక వింతైన ధైర్యం వస్తుంది. అదే అథెంటిసిటీ (Authenticity). ప్రపంచం ఎప్పుడూ 'ఒరిజినల్'కే విలువ ఇస్తుంది, 'కాపీ'కి కాదు. మీరు మీలా ఉంటూనే ప్రపంచాన్ని ప్రభావితం చేయడమే 'Beyond' స్టేజ్.5. మీ కోసం చిన్న పరీక్షఈ రోజు మీరు ఒక ప్రశాంతమైన చోట కూర్చుని ఈ ప్రశ్నలకు సమాధానం వెతకండి:నేను ఏ విషయంలో ఇతరులను చూసి అసూయ పడుతున్నాను? ఆ లక్షణం నిజంగా నా వ్యక్తిత్వానికి అవసరమా?నేను ఎవరి ముందైనా నటించకుండా ఉండగలుగుతున్నానా?నన్ను నేను మెరుగుపరుచుకోవాలనుకుంటున్నది నా ఆనందం కోసమా? లేక లోకానికి నిరూపించుకోవడానికా?మీ సీటులో మీరు కూర్చోండి!బ్రో, ప్రపంచం ఒక పెద్ద నాటక రంగం అయితే, ఇక్కడ అందరూ హీరోలే అవ్వాలని చూస్తున్నారు. కానీ నిజమైన సక్సెస్ ఎక్కడ ఉందంటే.. మీకు కేటాయించిన పాత్రను (మీ రియల్ సెల్ఫ్) అద్భుతంగా పండించడంలోనే ఉంది.ఎదుటివారిలా ఉండాలనుకోవడం ఒక జబ్బు అయితే, దానికి మందు "మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం". మీలోని లోపాలను కూడా గౌరవించండి, అవే మిమ్మల్ని ప్రత్యేకంగా నిలబెడతాయి."Be a first-rate version of yourself, instead of a second-rate version of somebody else."సైకాలజిస్ట్ విశేష్ Genius Matrix Hub 8019 000066www.psyvisesh.com(చదవండి: Parenting or Programming: మిమ్మల్ని మీరు మార్చుకోవచ్చా?) -
ఖర్చులకు కళ్లెం వేద్దాం!
ఒకప్పుడు విలాసం అనుకున్నవన్నీ ఇప్పుడు అవసరాలైపోయాయి. స్మార్ట్ఫోన్లు, కార్లు, లాప్‌టాప్‌లు, ఏటా ఒకటిరెండు సార్లు వైద్య పరీక్షలు, విహార యాత్రలు... ఇవన్నీ ఇపుడు జీవితంలో భాగమైపోయాయి. ఇక కొంచెం ఆదాయం పెరిగిందంటే వీటన్నిట్లోనూ ‘బెటర్మెంట్’ తప్పదనిపిస్తుంది. మెరుగైన ఫోన్లు, ఆధునిక ల్యాప్‌టాప్‌లు, సురక్షితమైన కార్లు, నాణ్యమైన చదువు, నమ్మకమైన ఆరోగ్య సంరక్షణ, డిజిటల్ సబ్స్క్రిప్షన్లు, విదేశీ విహారాలు ఇవన్నీ అప్‌గ్రేడెడ్ వెర్షన్లతో అవసరాలుగా మారి మనముందు కూర్చుంటున్నాయి. ఆదాయం పెరిగినప్పుడు సరే!!. కానీ ఆదాయం తక్కువ ఉన్నా కూడా వీటికోసం పరుగులుపెట్టి ఖర్చులు చేస్తేనే సమస్య. ఈ సమస్య ఇపుడు పెరుగుతోంది. పెద్దదవుతోంది. కుటుంబాలను ఒత్తిడిలోకి నెడుతోంది. మరేం చేయాలి? ఇదిగో ఈ వెల్త్ స్టోరీ చూడండి...మనకు, మన ఆదాయానికి తగ్గట్లుగా జీవన శైలిని పెంచుకోవటం తప్పు కాదు. కానీ పరిమితు లు లేకుండా పెంచుకుంటూ పోతేనే సమస్య. అందుకే లైఫ్‌స్టయిల్‌ను తెలివిగా నియంత్రించుకోవటం తప్పనిసరి. ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవటం... అవసరాలను స్పష్టంగా వర్గీకరించుకోవటం... స్వీయ పరిమితులు విధించుకోవటం ఎలాగో చూద్దాం. ద్రవ్యోల్బణం.. సైలెంట్ కిల్లర్ ఆదాయం పెరుగుతున్నప్పుడు లైఫ్స్టయిల్పరమైన ద్రవ్యోల్బణం పెరుగుతుంటుంది. ఖర్చు చేయడమనేది నిశ్శబ్దంగా, చాలా వేగంగా పెరిగిపోతుంది. జీతం పెరగ్గానే ఆటోమేటిక్‌గా పెంచుకునేవి కొన్ని ఉంటాయి. అవేంటంటే.. → మరింత పెద్ద ఇల్లు, మరింత ఎక్కువ అద్దె → కారును అప్‌గ్రేడ్ చేసుకోవడం లేదా ఈఎంఐలపై గ్యాడ్జెట్లు కొనుగోలు చేయటం. → మరింత తరచుగా బయట తినటం, ఫుడ్ డెలివరీ సరీ్వసులను ఆశ్రయించటం. → జిమ్‌తో పాటు అనేక ఓటీటీలు, యాప్‌లు సబ్స్క్రయిబ్ చెయ్యటం. వాస్తవానికి వీటిని విడివిడిగా చూస్తే ఒక్కో దానిపై చేసే ఖర్చు సముచితమైనదిగానే అనిపిస్తుంది. కానీ వాటన్నింటినీ కలిపి చూస్తే మాత్రం మనకు తెలియకుండానే పొదుపు సామర్థ్యం తగ్గిపోతున్న విషయం అర్థమవుతుంది. గతంతో పోలిస్తే ప్రస్తుతం ఎక్కువగానే సంపాదిస్తున్నప్పటికీ చాలా కుటుంబాలు, తక్కువగా పొదుపు చేస్తుండటానికి ప్రధాన కారణం ఇదే. ‘అవసర ఖర్చుల’ భ్రమ .. అవసరమనే పేరుతో ఇప్పుడు చేసే చాలా మటుకు ఖర్చులు, నిజంగా అవసరమైనవేనా అంటే సరైన సమాధానం దొరకదు. ఉదాహరణకు స్మార్ట్‌ఫోన్ అనేది అవసరం. కానీ ప్రతి సంవత్సరం వేలకు వేలు పోసి దాన్ని అప్‌గ్రేడ్ చేసుకోవడం అవసరమేనా? అలాగే అప్పుడప్పుడు బయట హోటళ్లలో తినడం సాధారణమే. కానీ అది ఎంత తరచుగా జరుగుతోందనేది ముఖ్యం. విహారయాత్రలు ము ఖ్యమే. కానీ ఎంత తరచుగా వెళ్తున్నాం? ఎంత ఖర్చు పెడుతున్నాం? అనేది అత్యంత ప్రధానం. ఖర్చులనేవి సమస్య కాదు. హద్దులు లేకపోవడమే అసలు సవాలు. ఏం చేయాలంటే.. జీవన విధానానికి పెద్దగా ఇబ్బంది లేకుండానే ఖర్చులను అదుపు చేసుకునేందుకు కొన్ని మార్గాలు ఉంటాయి. అవేంటంటే.. → పరిమితి విధించుకోవడం జీవన వ్యయాలనేవి ఆదాయానికి మించిన వేగంతో పెరగకూడదు. పాటించాల్సిన సింపుల్ రూల్ ఏమిటంటే, ఆదాయం 10 శాతం పెరిగితే, లైఫ్‌స్టయిల్ ఖర్చులు 5–6 శాతానికి మించి పెరగకుండా చూసుకోవాలి. → పొదుపును ఆటోమేట్ చేయాలి ఖర్చు చేయడానికి ముందు పొదుపు చేయాలి. దీనితో లైఫ్‌స్టయిల్ ఖర్చులు ఆటోమేటిక్‌గా దానికి తగ్గట్లు సర్దుకుంటాయి. → ఒక్కొక్కటిగా అప్‌గ్రేడ్ ఇల్లు, కారు, గ్యాడ్జెట్లు ఇలాంటి వాటన్నింటినీ ఒకేసారి అప్‌గ్రేడ్ చేయడం పెట్టుకోవద్దు. ఒక్కొక్కటిగా చేసుకుంటే కాస్త వెసులుబాటు లభిస్తుంది. → సబ్‌్రస్కిప్షన్లను సరిచూసుకోవాలి.. ఉపయోగించని వాటిని క్యాన్సిల్ చేసేయాలి. దీనివల్ల గణనీయంగా ఆదా అవుతుంది. మూడు కేటగిరీలు.. వృధా ఎక్కడవుతోందో గ్రహించాలంటే మనం చేసే ఖర్చులను తప్పనిసరైనవి, లైఫ్‌స్టయిల్‌ని బట్టి ఉండేవి, లీకేజీలనే మూడు కేటగిరీల కింద విడగొట్టుకోవాలి. వాటిని ఒకసారి విశ్లేషించి చూసుకుంటే, ఎక్కడ ఖర్చు చేయాలి, ఎక్కడ కట్టడి చేసుకోవాలనే దానిపై అవగాహన వస్తుంది. లైఫ్‌స్టయిల్‌ని బట్టి సరిదిద్దుకునేవి కాస్త స్మార్ట్‌గా వ్యవహరిస్తే ఈ కింది వాటిని కొంత కంట్రోల్ చేసుకోవడానికి వీలుంటుంది. → బయట హోటళ్లలో తినడం → విహార యాత్రలు → సబ్స్క్రిప్షన్లు→ అప్‌గ్రేడెడ్ గ్యాడ్జెట్లు → తరచుగా వాహనాలను అప్‌గ్రేడ్ చేసుకుంటూ ఉండటంతప్పనిసరైన ఖర్చులు ఇలాంటివి జీవిత నాణ్యతను మెరుగుపరుస్తాయి. వీటి విషయంలో రాజీపడే పరిస్థితి ఉండదు. → విద్య → ఆరోగ్య సంరక్షణ → ప్రాథమిక హౌసింగ్ → బీమా → నిత్యావసరాలులీకేజీలు అదనంగా ఎలాంటి ప్రయోజనం లభించకుండా చేసే ఖర్చులు ఈ బకెట్ కిందికి వస్తాయి. → ఉపయోగించని సబ్స్క్రిప్షన్లు, అడ్డదిడ్డంగా ఆన్లైన్లో షాపింగ్ → క్రెడిట్ కార్డ్ బాకీలను రోలోవర్ చేస్తుండటం. → ఖర్చు చేస్తున్నామని గ్రహించకుండానే కన్వీనియెంట్గా చేసే వ్యయాలురియాలిటీ చెక్ లైఫ్‌స్టయిల్‌కి సంబంధించి అప్‌గ్రేడ్స్ చేసుకోవడంలో తప్పేమీ లేదు. కోరుకున్నట్లుగా, బాగా జీవించాలనుకోవడమేమీ తప్పిదం కూడా కాదు. కాకపోతే, అడ్డూ అదుపూ లేకుండా లైఫ్‌స్టయిల్ ఖర్చులను పెంచుకోవడమే తప్పు. రేపటి రోజున వచ్చే ఆదాయాన్ని నేడే ఖర్చు చేసేయకుండా జాగ్రత్తపడితేనే ఆర్థికంగా నిశ్చింతగా ఉంటుంది. ఇందుకోసం ఆదాయంలో ఖర్చులకు చేసే కేటాయింపుల విషయంలో పాటించతగిన సింపుల్ సూత్రం ఒకటి ఉంది. → 50%– తప్పనిసరి అవసరాలు → 30% – లైఫ్‌స్టయిల్, కోరికలు → 20% – పొదుపు, పెట్టుబడులు. లైఫ్‌స్టయిల్ ఖర్చులు 40 శాతాన్ని దాటాయంటే, పొదుపు కేటాయింపులు ఆటోమేటిక్‌గా పడిపోతాయి. -
డెంటల్ యాబ్సెస్ అంటే..? ఎందువల్ల వస్తుందంటే..
ఎప్పుడైనా మీ పంటిచిగురు దగ్గర తెల్లగా... చిన్న ఉండలాంటి సంచిలో కాస్త చీము నిండినట్టుగా చిన్న తిత్తి మాదిరిగా కనిపించిందా? కొద్దిగా వాచినట్టుగా, నొప్పిగా, బాధగా ఏదో చిగుర్లకు వచ్చిన సమస్యగా అనిపించిందా? దాన్ని ‘డెంటల్ యాబ్సెస్’ అంటారు. అంటే నోటి పుండు. ఒక్కసారి అది బాగా పొడుస్తున్నట్టుగా తీవ్రమైన నొప్పి రావచ్చు. జ్వరం కూడా కనిపించవచ్చు. కారణం అదో బ్యాక్టీరియల్ సమస్య. ఈ డెంటల్ యాబ్సెస్ అంటే ఏమిటీ, అదెందుకు వస్తుంది, చికిత్స ఏమిటన్న అనేక విషయాలను తెలుసుకుందాం...పంటి చిగురుకు ఏదైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చి దాన్నిండా చీము చేరడం వల్ల వచ్చే సమస్యే ‘పంటి యాబ్సెస్’. నిజానికి పంటిచిగురు దగ్గర చీము చేరడం వల్ల ఈ సమస్య వస్తుంది. ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కోడానికి తెల్లరక్తకణాలు రంగంలోకి దిగడం తెలిసిందే. ఇలా యుద్ధానికి సన్నద్ధమైన ఈ తెల్లరక్తకణాలు... బ్యాక్టీరియాతో జరిగిన పోరాటంలో నశించాక... ఆ తెల్లరక్తకణాల తాలూకు మృతకణాలన్నీ చీము రూపంలో అక్కడ ఓ తిత్తి (పాకెట్)లాగా ఉండి΄ోతాయి. దాంతో నోరు తెరచి చూసుకున్నప్పుడు ఓ తెల్లటి చీము ఉండ కనిపిస్తుంది.తగ్గినట్టు ఉన్నా ఉపేక్షించడం సరికాదు... పంటి చిగురు దగ్గర కనిపించిన ఆ ఇన్ఫెక్షన్ చిగురుకు పాకే అవకాశముంది. అంతేకాదు... అది పంటిని వదులు చేసేందుకూ ఛాన్స్ ఉంది. ఒక్కోసారి ఆ గడ్డ చిదిమినట్లవుతుంది. ఇది జరిగినప్పుడు నొప్పి కాస్తా అకస్మాత్తుగా చేత్తో తీసేసినట్లు అవుతుంది. మొదట ఉన్న తీవ్రమైన నొప్పి అకస్మాత్తుగా లేకుండా పోయి, నొప్పి లేదంటే సమస్య తగ్గిపోయిందని కాదు. సాధారణంగా డెంటల్ యాబ్సెస్ అన్నది దానంతట తగ్గి΄ోవడం కాస్త అరుదే. అందుకే అలా పంటి చిరుగురు ప్రాంతంలో తెల్లటి చీము ఉండ కనిపించిందంటే తప్పక చికిత్స తీసుకోవడం అవసరం. ఇతర అవయవాలకూ పాకవచ్చుడెంటల్ యాబ్సెస్కు తగిన చికిత్స తీసుకోకపోవడం వల్ల ఒక్కోసారి ఆ సూక్ష్మజీవులు రక్తప్రవాహంలో కలిసి ఇతరచోట్లకూ పాకే అవకాశముంది. ఒకవేళ ఇన్ఫెక్షన్ దవడకూ, తలకూ, మెడకు కూడా పాకితే ఆ ప్రాంతాల్లోనూ తీవ్రమైన నొప్పి రావచ్చు. ఒక్కోసారి భరించలేనంత నొప్పిగా కూడా ఉండవచ్చు. లక్షణాలుసాధారణంగా నోట్లో పేరుకు΄ోయే బ్యాక్టీరియా సంఖ్య చాలా ఎక్కువ. దీన్నే ఓరల్ బ్యాక్టీరియా, ఓరో–ఫ్యారింజియల్ బ్యాక్టీరియా అంటారు. వీటిలో చాలావరకు నిరపాయకరమైనవే ఎక్కువ. అయితే హానికరమైన బ్యాక్టీరియాతో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు నోరు బ్యాక్టీరియా పెరుగుదలకు దోహదంచేసే భాగం అయినందున అవి వేగంగా పెరుగుతాయి. పలువరసలో ఏదైనా భాగం దెబ్బతిని ఉంటే అక్కడ బ్యాక్టీరియా విస్తరించేందుకు అవకాశాలు మరింతగా పెరుగుతాయి. దాంతో చీముగడ్డ (పస్ పాకెట్) ఏర్పడటంతో మరికొన్ని లక్షణాలూ కనిపిస్తుంటాయి. అవి... ∙ మాటిమాటికీ పొడిచినట్లుగా తీవ్రమైన నొప్పి ∙ చల్లటి లేదా వేడి ప్రదార్థాలు తీసుకున్నప్పుడు జిల్లుమనడం. ∙ఏదైనా వస్తువు నమలగానే పొడుచుకువచ్చినట్టుగా నొప్పి కలగడం. గొంతులోని గ్రంథులు వాచడం. నోటిలో దుర్వాసన వస్తున్న భావన లేదా దుర్వాసన రావడం. ఏదైనా తినేపదార్థం నోట్లోకి తీసుకుంటే దాని రుచి మారినట్లు అనిపించడం. (ఇలా అనిపిస్తుందంటే అది చీముగడ్డ పగిలినందుకు సూచన. అయితే అప్పటికీ ఇన్ఫెక్షన్ మాత్రం శరీరంలోనే ఉంటుంది. కాబట్టి అది శరీరంలోని ఇతర ప్రాంతాలకు పాకే అవకాశమున్నందున... అలా జరగడం మరింత ప్రమాదానికి దారితీసే ముప్పున్నందున... తప్పనిసరిగా డెంటల్ డాక్టర్‌ను కలిసి తగిన సూచనలూ, చికిత్స తీసుకోవాలి. నివారణప్రతిరోజూ క్రమంతప్పకుండా ఉదయం, రాత్రి బ్రషింగ్ చేసుకోవడం. ∙బ్రషింగ్ కోసం మృదువైన బ్రిజిల్స్ ఉన్న టూత్బ్రష్నే వాడంటం. పైన చిగుళ్లూ, పళ్లూ కలిసే చోటి నుంచి కింద మళ్లీ చిగుళ్లూ, పళ్లూ కలిసే చోటు వరకు గుండ్రంగా బ్రష్ చేసుకోవడం. పంటికి బయటివైపే కాకుండా లోపలి వైపునా బ్రష్ చేసుకోవడంతో పాటు నమిలే ప్రదేశాలల్లో... అంటే పంటిపైన వెడల్పుగా ఉంటే ప్రాంతంలోనూ చక్కగా బ్రష్ చేసుకోవడం. బ్రషింగ్ టైమ్ రెండు లేదా మూడు నిమిషాలకు మించకుండా చూసుకోవడం. నాలుకపైనున్న బక్టీరియాను తొలగించుకోడానికి కనీసం 30 సెకన్ల పాటు స్క్రబ్ చేసుకోవడం. చిగుర్ల ఆరోగ్యం కోసం బ్రషింగ్ తర్వాత చేత్తో చిగుళ్లపై మృదువుగా మసాజ్ చేసుకోవడం. ప్రతి ఆర్నెల్లకోసారి క్రమంతప్పకుండా దంత పరీక్షలు చేయించుకోవడం. చికిత్సపంటి యాబ్సెస్కు డాక్టర్లు సాధారణ యాంటీబయాటిక్స్‌తో చికిత్స అందిస్తారు. మరీఅవసరమైన వారికి ఆ చీముపాకెట్ను తొలగించడంతోటు రూట్‌కెనాల్ అవసరం పడవచ్చు. డాక్టర్ ప్రత్యూష, సీనియర్ కన్సల్టెంట్ డెంటల్ – కాస్మెటిక్ సర్జన్ (చదవండి: అరుదైన కేన్సర్లతో పోరాడిన యువ యోధురాలు..!) -
అతనంటే విపరీతమైన క్రష్!
‘ఇద్దరమ్మాయిలతో’ సినిమాలో అమాయకపు ఆకాంక్షగా, ‘సరైనోడు’లో పవర్ఫుల్ ఎమ్మెల్యేగా మనల్ని మెప్పించిన ఈ మలయాళ కుట్టి, తన వ్యక్తిగత జీవితం, కెరీర్ రహస్యాలను ఇప్పుడు మనతో పంచుకుంటోంది క్యాథరిన్ ట్రెసా. ఆ విశేషాలు...⇒ చిన్నప్పుడు అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ అంటే విపరీతమైన క్రష్. ఆయన టీవీలో కనిపిస్తేనే అన్నం తినేదాన్నని అమ్మ ఇప్పటికీ ఆటపట్టిస్తుంది. అలా ఎందుకు చేసేదాన్నో ఇప్పటికీ నాకు మిస్టరీనే.⇒ నేను మలయాళీ క్రిస్టియన్ . పుట్టి పెరిగింది దుబాయ్‌లో. కాలేజీ రోజుల్లో బెంగళూరుకు షిఫ్ట్ అయ్యాను. అక్కడే నా మోడలింగ్ ప్రయాణం మొదలైంది. ఆ తర్వాత కన్నడ సినిమా ‘శంకర్ ఐపీఎస్’ అవకాశం నా కెరీర్‌కు కొత్త మలుపును ఇచ్చింది.⇒ సినిమాల్లోకి రాకముందు నేను ప్రొఫెషనల్ స్థాయిలో ఐస్ స్కేటింగ్ చేసేదాన్ని. మంచు మీద వేగంగా బ్యాలెన్ ్స చేయడం అంటే చాలా ఇష్టం. ఇప్పటికీ వెకేషన్ కు వెళ్తే స్కేటింగ్ షూస్ నా బకెట్లిస్ట్లో తప్పకుండా ఉంటాయి.⇒ సంగీతం నాకు మెడిటేషన్ లాంటిది. మనసు బాగాలేనప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు పియానో వాయిస్తాను. నేను క్వాలిఫైడ్ పియానిస్ట్‌ని.⇒ తెలుగులో ‘చమ్మక్ చల్లో’తో ఎంట్రీ ఇచ్చాను. కాని, నిజమైన బ్రేక్ ఇచ్చింది ‘ఇద్దరమ్మాయిలతో’. ‘సరైనోడు’లో ఎమ్మెల్యే పాత్ర నా ఆల్‌టైమ్ ఫేవరెట్.⇒ కేరళలో ఒక సినిమా షూటింగ్ సమయంలో నేను ఏనుగుపై నుంచి కింద పడిపోయాను. తృటిలో ప్రాణాపాయం తప్పింది. అప్పటి నుంచి ఏనుగులంటే ప్రేమ ఉన్నా, వాటి దగ్గరికి వెళ్లాలంటే భయం.⇒ ఒక గంట ఖాళీ దొరికినా బిజినెస్ మ్యాగజైన్స్ చదువుతాను. సినిమాల్లోకి రాకపోయి ఉంటే కచ్చితంగా సక్సెస్ఫుల్ బిజినెస్ వుమన్ గా మారేదాన్ని. నా ఆర్థిక నిర్ణయాలు అన్నీ నేనే తీసుకుంటాను.⇒ పాత ఫొటోలను ఆల్బమ్స్‌గా చేసి దాచుకోవడం నా అలవాటు. డిజిటల్ యుగంలో ఉన్నా, ప్రింట్ ఫొటోలే నా సెంటిమెంట్.⇒ నా జీవితంలో అతిపెద్ద బాధ నా తమ్ముడు క్రిస్టోఫర్ మరణం. ఎనిమిదేళ్ల క్రితం తను సూసైడ్ చేసుకున్నాడు. ఆ లోటు తీరనిది.⇒ స్వీట్స్ అంటే నాకు పిచ్చి. ముఖ్యంగా తాపేశ్వరం మడతకాజా, మైసూర్ పాక్. అలాగే ‘లిక్విడ్ డైట్’ మీద నాకు మంచి కంట్రోల్ ఉంది. బాడీని డీటాక్స్ చేయడానికి వారంలో ఒకరోజు కేవలం కొబ్బరి నీళ్లు, గ్రీన్ జ్యూస్‌లతోనే ఉంటాను. అదే నా గ్లామర్ రహస్యం.⇒ నా డ్రీమ్ మ్యాన్ పొడవుగా, ఫిట్‌గా ఉండాలి. ముఖ్యంగా మంచి సెన్సాఫ్ హ్యూమర్ ఉండాలి.⇒ గ్లామర్ పాత్రల కంటే నటనకు ప్రాధాన్యమున్న పాత్రలే ఎంచుకుంటాను. అందుకే అప్పుడప్పుడు గ్యాప్ వస్తుంది. నా కెరీర్లో ఇంకా మంచి కామెడీ సినిమాలు చేయాలని ఉంది. -
సోలో లైఫే సో బెటరూ
సాక్షి, స్పెషల్ డెస్క్: ఇటీవలి వరకు కూడా ఈ లోకం అంతా ‘జంట’లమయమే! హోటల్ కువెళ్తే ఎదురెదురుగా రెండు కుర్చీలు, ట్రావెల్ ప్యాకేజీలంటే తప్పనిసరిగా కపుల్ ఆఫర్లు, వీకెండ్స్ అంటే ఫ్యామిలీ హడావిడి. కానీ ఈ ‘నిండైన’ దృశ్యం మెల్లిగా మార్పు చెందుతోంది. ఎక్కడ చూసినా సోలో ‘రాజా సాబ్’లు, ఏకాంతవాస రాణీ రత్నమాలలు దర్శనం ఇవ్వటం మామూలైపోయింది.సింగిల్ రిజర్వేషన్రెస్టారెంట్లలో సింగిల్ టేబుల్ రిజర్వేషన్‌తో మొదలైన ఈ ధోరణి, ఎవరో తోడు లేని వారు చేస్తున్న పని కాదు. ఎవరి తోడూ అవసరం లేదని అనుకుంటున్న వారు ఎంచుకుంటున్న మార్గం. మునుపటిలా, ‘‘ఎవరైనా కలిసి వస్తే వెళ్దాంలే..’’ అని వేచి ఉండే రోజులు పోయాయి! ఇప్పుడు తినటానికైనా ఒక్కరే,విహరించటానికైనా ఒక్కరే.ఎవరూ లేక కాదుఇదేమీ ఒంటరితనం కాదు. ఒక స్వీయ చికిత్స. తనకి నచ్చినట్టు తాను ఉండటం మాత్రమే. ఎవరితోనూ సంబంధం ఉండదు. ఎవరితోనూ సర్దుబాటు ఉండదు. తనకు నచ్చిన దారి, తనకు నచ్చిన వేగం, తనకు నచ్చిన స్థలం! సింపుల్‌గా చెప్పాలంటే ఇదొక స్వేచ్ఛ.వింత అసలే కాదుభోజనం, ప్రయాణం, వినోదం.. ఇప్పుడు సోలో జీవన శైలికి సంకేతంగా మారింది. లైవ్ ఈవెంట్లకు ఒక్కరే వెళ్లేవారు ఎక్కువయ్యారు. ఉదయ్‌పూర్, కూర్గ్, సిక్కిం వంటి సురక్షిత మైన ప్రాంతాలకు మహిళలు ఒంటరి ప్రయాణాలను ఎంచుకుంటున్నారు. డిమ్ లైట్ల డైనింగ్ హాళ్లలో టేబుల్‌కు ఒకరే కూర్చొని భోజనాన్ని ఆస్వాదిస్తున్నారు. ఇది ఖర్చు తగ్గించుకోవటం కాదు, ఎంతైనా ఖర్చుపెట్టి ఏకాంతాన్ని కొనుక్కోవటం.మార్కెట్ పసిగట్టేసింది!ఇదేదో చిన్న మార్పు కాదని బిజినెస్ లోకానికి అర్థమైపోయింది. రాబోయే కాలంలో సమాజాన్ని ముంచెత్తనున్న ఒక పెద్ద ‘వేవ్’ అని కనిపెట్టేసింది. ఇకనేం, కంపెనీల ఆలోచనా విధానమే మారిపోయింది. నిన్న మొన్నటి వరకు ‘ఫ్యామిలీ’ చుట్టూ తిరిగిన మార్కెట్ ఇప్పుడు లైట్ హౌస్లా తన ఫోకస్‌ను ఒంటరి కెరటాల మీదకు మళ్లించింది.ఇండియాలో ‘ఒంటరి’ డేటా⇒ 2020నాటికి ఉన్న ఒంటరి వ్యక్తుల గృహాల సంఖ్య 1 కోటి 74 లక్షలు⇒ 2030కి ఒంటరి గృహాల సంఖ్యలో అంచనా పెరుగుదల 5.5 శాతం⇒ సోలో దేశీయ ప్రయాణాల బుకింగ్‌లలో పెరుగుదల : ఏటా 20–35 శాతం⇒ గత ఏడాది ఒంటరిగా ఈవెంట్లకు, సినిమాలకు వెళ్లినవారు : 18 లక్షలకు పైగా⇒ 2025–2030 మధ్య పెరగనున్న సోలో ట్రావెల్ మార్కెట్ విలువ సుమారు : రూ. 359 కోట్ల 36 లక్షల 50 వేలు -
అరుదైన కేన్సర్లతో పోరాడిన యువ యోధురాలు..!
మహమ్మారి కేన్సర్ ఎంతటి బలవంతుడినైన బలహీనుడిగా మార్చేస్తుంది. అంతలా మానసికంగా, శారీరకంగా ఢీలా పడేలా చేసే వ్యాధిని..19 ఏళ్ల అమ్మాయి అలుపెరగని పోరాటం చేసి..మట్టికరిపించింది. ఎందరో కేన్సర్ బాధితులకు స్ఫూర్తిగా నిలవడమే గాక..ప్లీజ్ పోరాడండి అని ధైర్యం చెబుతోంది. యువ కేన్సర్ వారియర్ అని అందరిచేత ప్రశంసలందుకుంటోంది. ఆ అమ్మాయే 19 ఏళ్ల లకితా ఫిద్రా..కెన్యాకు చెందిన ఆమెకు ఐదేళ్ల వయసులో ఉండగా తండ్రి కేన్సర్‌తో మరణించాడు. ఒంటరి తల్లి పెంపకంలో సాగుతున్న ఆమె జీవితం సరిగ్గా పదేళ్ల వయసులో ఊహించని మలుపు తిరిగింది. ఒకరోజు ఆటలు ఆడుకుంటుండగా, సడెన్‌గా కుడిమోకాలులో విపరీతమైన నొప్పి..అల్లాడిపోతోంది. తీరా వైద్యుల వద్దకు తీసుకువెళ్తే..వాళ్లు నార్మల్ సమస్యగానే భావించి చికిత్స అందిస్తున్నారు. ఎప్పుడైతే ఆమె కుటుంబ చరిత్రలో తండ్రి అత్త సార్కోమా కేన్సర్ బాధితులని తెలిసిందో..వెంటనే అనుమానంతో డాక్లర్లు వైద్య పరీక్షలు చేయగా..తీవ్రమైన ఆస్టియోసార్కోమా కేన్సర్ నిర్థారణ అయ్యింది. స్కానింగ్‌లో ఆమె కుడి తొడ ఎముకలో ఈ కేన్సర్ కణితిని గుర్తించారు. దాంతో వైద్యులు కీమోథెరపీ చేయించి, లింబ్ సాల్వేజ్ సర్జరీ చేశారు. ఈ ప్రక్రియలో మోకాలి కీలును టైటానియం ఇంప్లాంట్‌తో భర్తీ చేశారు. ఆ తర్వాత రెండేళ్లకు హాయిగా స్కూల్‌కి వెళ్లి..యథావిధిగా చదువుకోడం ప్రారంభించింది. మళ్లీ ఆ మహమ్మారి 2020లో దాడి చేసింది. ఈసారి ఆమె కాలుని పూర్తిగా తొలగించక తప్పలేదు. అదే ఏడాది అదనపు కీమోథెరపీ, ఎముకమజ్జ మార్పిడి జరిగాయి. ఆమె సొంత స్టెమ్ సెల్స్ ఉపయోగించి మొట్టమొదిటి మార్పిడి చేశారు. దాదాపు వందరోజులపైనే ఆస్ప్రత్రిలో చికిత్స పొందింది. అక్కడితో ఆ కేన్సర్ విజృంభణ ఆగలేదు. ముచ్చటగా మూడోసారి 2022లో, ఆమెకు మైలోడిస్ప్లాస్టిక్ సిండ్రోమ్ అభివృద్ధి చెందింది. ఇది అతి తీవ్రమైన ఎముక మజ్జ రుగ్మత.ఇది మళ్లీ దాడిచేసే అరుదైన కేన్సర్‌వ్యాధి. అయితే ఈసారి ఆమెకు అండగా తల్లి నిలబడింది. తల్లి ఎముకమజ్జ మార్పిడితో లకితాకి చికిత్స అందించారు. ఈప్రక్రియ విజయవంతమైంది. ఇక్కడ లకితా మూడోసారి ఎదుర్కొన్న తీవ్రమైన ఎముకమజ్జ మార్పడి..బహుళ కేన్సర్లకు దారితీసే జీవితకాల ప్రమాదం. కానీ ఆమె జన్యువులు దూకుడు లేకుండా చికిత్సా వ్యూహానికి అనుమతించి..తగ్గుముఖం పట్టడం విశేషం. అయితే ఆమెకు సదా వైద్యు పర్యవేక్షణ తప్పనిసరి. కనీసం రెండు మూడేళ్ల కొకసారి కేన్సర్ పరీక్షలు చేయిచుకోక తప్పదు. ఇన్ని కష్టాల మధ్య చదువుని నిర్లక్ష్యం చేయలేదు. ఆమె ఇప్పుడు సైకాలజీ, సామాజిక శాస్త్రం, సాహిత్యం ఏ లెవెల్‌ను చదువుతోంది. పైగా విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించాలనే యోచనలో ఉంది. తాను పరుగెత్తలేకపోయినా, జిమ్నాస్టిక్స్ చేయలేకపోతేనేం..డ్యాన్స్ చేయగలను, పేయింటింగ్ వేయగలను అంటోంది. పునరావృతమయ్యే బోన్ కేన్సర్, లి-ఫ్రామిని సిండ్రోమ్‌పై ధైర్యంగా పోరాడిని ధీరురాలిగా గుర్తింపు తెచ్చుకుంది. అలాగే కేన్సర్ బాధితుల్లో స్థైర్యాన్ని నింపేలా గొప్ప సందేశాన్ని కూడా అందిస్తుంటుంది. మీరు కేన్సర్ రోగిగా ఆస్పత్రల్లో గడపడం కష్టమే అయినపపటికీ తెలియన ధైర్యంతో సాగుతారు. ఆ వ్యాధని చూసి భయపడినప్పటికీ స్ట్రాంగ్‌గా మారతారు. అప్పుడు తెలుస్తుంది మీరు రోగి కాదు..హీరో అనే సందేశాలతో వాళ్లను వీరోచితంగా కేన్సర్‌పై పోరాడేలా చేస్తుంది లకితా. (చదవండి: నిజమైన వ్యక్తిత్వ వికాసం మొదలయ్యేది అప్పుడే..!) -
గుండెపోటు మరోసారి రాకూడదంటే..!
గుండెపోటు అనేది తీవ్రమైన ఆరోగ్య సమస్య, ఒక్కోసారి ప్రాణాంతకం కూడా. అందువల్ల గుండె పోటు నుంచి బయటపడ్డ రోగులు..మరోసారి ఆ పరిస్థితి రాకుండా జాగ్రత్తగా ఉండాలి. అందుకోసం తప్పనిసరిగా ఈ జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు నిపుణులు. అవేంటంటే..తీసుకోవాల్సిన జాగ్రత్తలు..కొద్ది మోతాదులో వ్యాయామాలు చేయడంవేళకు భోజనం చేయాలిఅధిక కేలరీలు, కొలస్ట్రాల్‌తో కూడిన భోజనం నివారించాలి.డైట్ ఎలా ఉండాలంటే..1. తృణధాన్యాలు - ఓట్స్, బ్రౌన్ రైస్, మిల్లెట్లు, గోధుమలు తీసుకోవాలి. ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించి, రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచుతాయి.2. తాజా కూరగాయలు, పండ్లు - ఆకుకూరలు, టమోటాలు, క్యారెట్లు, బెర్రీలు, ఆపిల్స్, సిట్రస్ పండ్లు తీసుకోవాలి. వీటిలోని యాంటీఆక్సిడెంట్లు మంటను తగ్గిస్తాయి ధమనుల ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతాయి.3. ఆరోగ్యకరమైన కొవ్వులు మితంగా - నట్స్, ఆలివ్ నూనె, ఆవాల నూనె, కొద్ది మొత్తంలో తీసుకోవాలి. ఇవి మంచి HDL కొలెస్ట్రాల్‌ను అందించి గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉండేలా చేస్తాయి. 4. ప్రోటీన్ కంటెంట్ కోసం - పప్పుధాన్యాలు, చిక్కుళ్ళు, టోఫు, తక్కువ కొవ్వు ఉన్న పాల ఉత్పత్తులు, చేపలు, స్కిన్లెస్ చికెన్. సాల్మన్ వంటి కొవ్వు చేపలు గుండెకు రక్షణ కల్పించే ఒమేగా-3 కొవ్వులను అందిస్తాయి.5. ఇంట్లో వండిన భోజనానికే ప్రాధాన్యత ఇవ్వండి. ఉప్పు వినియోగాన్ని తగ్గించాలి.రోగులు ఖచ్చితంగా నివారించాల్సినవి..1. అధిక ఉప్పు: ప్యాక్ చేసిన స్నాక్ ఫుడ్స్, ఊరగాయలు, పాపడ్లు, సాస్‌లు, తినడానికి సిద్ధంగా ఉన్న ఉత్పత్తులు తదితరాలు సోడియం ప్రధానంగా ఉండే ఆహారాలు. ఇవి రక్తపోటును పెంచి, గుండెపై భారం పడేలా చేస్తాయి.2. డీప్-ఫ్రైడ్ ఫుడ్స్, బేకరీ ఉత్పత్తులు, ఫాస్ట్ ఫుడ్స్, నామ్కీన్లు, వేయించిన రుచికరమైన స్నాక్స్ చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతాయి. కాబట్టి వీటిని పూర్తిగా నివారించాలి.3. శుద్ధి చేసిన చక్కెరలు, చక్కెర పానీయాలు - స్వీట్లు, డెజర్ట్‌లు, శీతల పానీయాలు, ప్యాక్ చేసిన జ్యూస్‌లు, తదితరాలు అధిక బరువుకి, గుండె జబ్బులకు కారణమవుతాయి.4. మటన్ వంటి ఎర్రటి మాంసం వినియోగాన్ని తగ్గించాలి5. ఆల్కహాల్ - మద్యం వినియోగాన్ని నివారించాలి లేదా పరిమితం చేయాలి. ఆల్కహాల్ రక్తపోటును పెంచుతుంది,పైగా గుండెకు నేరుగా విషపూరితమైనది కూడా.గుండె ఆరోగ్యం బాగుండాలంటే..కొద్దిపాటి వ్యాయామాలు, మందులు, ఒత్తిడి నిర్వహణ, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే చాలని చెబుతున్నారు నిపుణులు.డాక్టర్ గిరీష్ గాడ్బోల్, డైరెక్టర్ అండ్ సీనియర్ కన్సల్టెంట్,ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ -
ఆ తాతగారి లైఫ్‌స్టైల్‌కి ఫిదా అవ్వాల్సిందే..!
ఇటీవలకాలంలో అందరిలో ఆరోగ్య స్ప్రుహ ఎక్కువైంది. మంచి ఆహారపు అలవాట్లు,వర్కౌట్లతో హెల్దీగా ఉండే ప్రయత్నం చేస్తున్నారు. మరికొందరు ప్రోటీన్ పౌడర్లు, జిమ్‌లు వంటి వాటితో ఆరోగ్యకరమైన వృద్ధాప్య జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. కానీ ఈ తాత అంతలా ఆరోగ్యం కోసం ఏమాత్రం ఖర్చు చేయకుండానే..చాలా చురుకుగా, దీర్ఘాయువుతో ఉండటం విశేషం. ఈ ఏజ్‌లో కూడా అన్ని పనులు తానే చాలా యాక్టివ్‌గా చేసుకుంటున్న తీరుకి ఫిదా అవ్వాల్సిందే. మరి అతడి ఆరోగ్య రహస్యం ఏంటో చూద్దామా..ఆ తాత గారి గురించి ఆయన మనవరాలు కంటెంట్ క్రియేటర్ 28 ఏళ్ల సింధూ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో రూపంలో పోస్ట్ చేయడంతో అది నెట్టింట సంచలనంగా మారడమే కాదు, ప్రశంసలు వెల్లువెత్తాయి. తన తాతగారికి దగ్గర దగ్గర 95 ఏళ్ల ఉంటాయని, ఆయన రిటైర్డ్ అనస్థీషియాలజిస్ట్ అని వీడియోలో వివరిస్తోంది సింధు. ఆమె తన తాతగారి రోజు ఉదయం 5.30 గంటలకు యోగాతో ప్రారంభమవుతుందని, పదవీవిరమణ చేసి రెండు దశాబ్దాలకు పైనే అవుతున్నా..ల్యాప్‌టాప్‌లో వైద్య సాహిత్యం గురించి చదవడం, కొత్త సాంకేతిక నైపుణ్యాలను నేర్చుకోవడం వంటి వాటితో కాలక్షేపం చేస్తారు. వీటి అన్నింటి తోపాటు అప్పుడప్పుడు షాపింగ్ ట్రిప్పులు, రోజువారీ పూజ, ధ్యానం, యాప్‌లు లేకుండా సాధన చేయడం తదితరాలు ఉన్నాయి. ఇవేగాక తన వంటను తానే చేసుకుంటారని, "మినీ ఇడ్లీలు" వండటంలో మంచి నిపుణుడని చమత్కరిస్తోంది. ఆయన రిటైర్ అయ్యాక కూడా వైద్యవృత్తిపై ఆసక్తి ఏమాత్రం తగ్గలేదని, ఇప్పటికీ వాటికి సంబంధించినవి చదవడం, ఆర్టికల్స్ రాయడం వంటివి చేస్తుంటారని చెబుతోంది. ఆయన తమిళనాడులోని మధురైలో చాలా ఏళ్లుగా అనస్థీషియాలజిస్ట్‌గా పనిచేసినట్లు పేర్కొంది. తన తాతగారి రోజువారీ దినచర్య దీర్ఘకాల ఆరోగ్యానికి ఖరీదైన ధోరణులతో పనిలేదని నిరూపించింది. ఇప్పటికీ ఆయన హ్యాపీగా వాక్ చేస్తారు, వంటకూడా చేసుకుంటారు, కొత్తకొత్త నైపుణ్యాలను నేర్చుకుంటుంటారు. పైగా ఆయన ఎలాంటి జిమ్ సభ్యుత్వం లేకుండా, కనీసం సప్లిమెంట్లపై ఆధారపడకుండా.. జస్ట్ శ్రద్ధ అనే రెండు అక్షరాల పదంపై ఫోకస్ పెట్టి ఆరోగ్యకరమైన జీవితాన్ని ఆస్వాదిస్తున్నాడని సింధు చెపుకొచ్చింది. దక్షిణాసియా హిందూ సంప్రదాయల్లో వందల ఏళ్ల నుంచి రోజువారీ కదలికలు, భావోద్వేగాలపై నియంత్రణ, మానసిక స్పష్టత తదితరాలు ఉన్నాయి. అయితే వాటిని కంటిన్యూ చేసేలా జీవన విధానంలో భాగమైతే తన తాతలా సుదీర్ఘకాలం ఆరోగ్యంగా జీవితాన్ని గడపొచ్చని అంటోంది. చిన్న చిన్న వాటిల్లో కూడా ఆనందాన్ని వెతుక్కునే మనస్తత్వం ఉన్నవారికి ఎదురే ఉండదని, అది వారికి బలోపేతంగా ఉండేలా సామర్థ్యాన్ని అందిస్తుందని అంటోంది. View this post on Instagram A post shared by Sindhu 👩🏽🍳 (@sindhusfoodforthought) (చదవండి: అంబానీల ఆడపడుచు కోడలు.. లెహంగా ధర తెలిస్తే షాక్!)


