మలబద్ధకం నివారణ కోసం... | Health Tips: home remedies to relieve constipation naturally | Sakshi
Sakshi News home page

మలబద్ధకం నివారణ కోసం..! ఈట్‌ ఫ్రూట్‌

Dec 7 2025 2:32 PM | Updated on Dec 7 2025 2:57 PM

Health Tips: home remedies to relieve constipation naturally

మలబద్ధకం చాలామందిని బాధిస్తూ ఉంటుంది. ఫ్రీ మోషన్‌ కాకపోవడం వల్ల వచ్చే ఈ సమస్యతో దీర్ఘకాలంలో మరిన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలూ ఉంటాయి. అందుకే ఈ సమస్యను నివారించుకోవడం ఎంతోముఖ్యం. అందుకు పాటించాల్సిన కొన్ని సూచనలు

ఫైబర్‌ (పీచు) సమృద్ధిగా ఉండే ఆహారాలతో మలబద్ధకాన్ని నివారించుకోవడం తేలికే. వాటివల్ల జీర్ణాశయమార్గం శుభ్రమవ్వడమే కాకుండా తేలిగ్గా విరేచనం అయ్యేందుకు ఆ పీచు సహాయపడుతుంది. ఫైబర్‌ వల్ల దేహంలో మనం తీసుకున్న పిండిపదార్థాల నుంచి చక్కెర నెమ్మదిగా విడుదలవుతుంది. ఫలితంగా రక్తంలో చక్కెర మోతాదులు ఒకేసారి పెరగవు. పొట్టుతో కూడిన అన్ని రకాల ధాన్యాల్లోనూ ఈ పీచు ఎక్కువ. అందుకే పొట్టు తీయని ధాన్యాలు... మరీ ముఖ్యంగా వరి విషయానికి వస్తే దంపుడు బియ్యం వంటివి మేలు చేస్తాయి. ఇక మామూలు ధాన్యాల్లో కంటే తృణధాన్యాల్లో పీచు మోతాదులు ఎక్కువ. కాయగూరలు, ఆకుకూరలు, మొలకెత్తిన ధాన్యాల్లోనూ పీచుపాళ్లు ఎక్కువ. ఇవి మలబద్ధకంతో పాటు చాలా రకాల క్యాన్సర్లనూ నివారిస్తాయి. 

చిక్కుళ్లలో ప్రోటీన్‌ తోపాటు ఫైబర్‌ కూడా ఎక్కువే. ఇవి కండరాలకు బలాన్నివ్వడంతోపాటు మలబద్దకం నివారణకూ తోడ్పడుతూ ఒకేసారి రెండు ప్రయోజనాలనిస్తాయి. తాజాపండ్లలోనూ పీచు ఎక్కువగానే ఉంటుంది. అందుకే అతిగా తీపి ఉండని  తాజాపండ్లు డయాబెటిస్‌ ఉన్నవారికీ మేలు చేస్తాయి. బొప్పాయి, పుచ్చ, నారింజ వంటి పండ్లలో పీచు మోతాదు ఎక్కువగా ఉండటంతో మలబద్ధకాన్ని తేలిగ్గా నివారిస్తాయి. పండ్లను పళ్లరసాల రూపంలో తీసుకుంటే అందులో పీచుపదార్థాలు దాదాపుగా ఉండవు. అందుకే పండ్లను కొరికి తినడమే మేలు. 

పీచుపదార్థాలతోపాటు తగినన్ని నీళ్లు తాగడం వల్ల విరేచనం సాఫీగా అవుతుంది.  రోజుకు కనీసం రెండు లీటర్ల (కనీసం పది గ్లాసుల) నీళ్లు తాగడం మంచిది.       
(చదవండి: డయాబెటిక్‌ నెఫ్రోపతి: చాపకింద నీరులా వ్యాపిస్తుంది..జరభద్రం)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement