పొద్దున్నే రెండు ఘోరాలు.. గాలిలో 14 నిండు ప్రాణాలు.. | Gurugram Construction Collapse, 7 Workers Died And Over 10 Trapped Under Debris, Rescue Operations Ongoing | Sakshi
Sakshi News home page

పొద్దున్నే రెండు ఘోరాలు.. గాలిలో 14 నిండు ప్రాణాలు..

Mar 10 2026 9:59 AM | Updated on Mar 10 2026 10:36 AM

Massive Soil Mound Collapses At Gurugrams Construction Site

గురుగ్రామ్: హర్యానాలో మంగళవారం తెల్లవారుజామున రెండు వేర్వేరు చోట్ల పెను విషాదాలు చోటుచేసుకున్నాయి. గురుగ్రామ్‌లోని ఒక భవన నిర్మాణ ప్రాంతంలో భారీ మట్టి దిబ్బ పడి, ఏడుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోగా, జింద్ జిల్లాలోని ఓ పెయింట్ ఫ్యాక్టరీలో జరిగిన అగ్నిప్రమాదంలో మరో ఏడుగురు మహిళా కార్మికులు సజీవ దహనమయ్యారు. ఈ రెండు ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేశాయి.

గురుగ్రామ్‌లోని సిద్ధ్రావలి ప్రాంతంలో ఓ ప్రైవేట్ నిర్మాణ ప్రాంతంలో భారీ ఎత్తున పోగుపోసిన మట్టి ఒక్కసారిగా  జారిపోవడంతో అక్కడ పనిచేస్తున్న సుమారు 20 మందికి పైగా కార్మికులు దాని కింద చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు ఏడు మృతదేహాలను వెలికితీయగా, మరో నలుగురిని కాపాడారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. శిథిలాల కింద ఇంకా పది మందికి పైగా కార్మికులు చిక్కుకుని ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.  సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement