breaking news
Corporate
-
ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ ఆల్‌టైమ్ రికార్డు లాభం
ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) రూ. 1,075 కోట్ల ఆల్‌టైమ్ రికార్డు నికర లాభాన్ని ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్యూ1లో నమోదైన రూ. 463 కోట్లతో పోలిస్తే ఇది ఏకంగా 132.4 శాతం వృద్ధి చెందడం విశేషం. బ్యాంక్ మొత్తం కస్టమర్ వ్యాపారం 18.6% వృద్ధితో రూ.5,10,031 కోట్ల నుంచి రూ.6,04,776 కోట్లకు చేరింది.జారీ చేసిన రుణాలు, అడ్వాన్సులు 20.6 శాతం వృద్ధితో రూ. 3,05,370 కోట్లకు పెరిగాయి. ఆస్తుల నాణ్యత కూడా గణనీయంగా మెరుగైంది. స్థూల నిరర్థక ఆస్తులు 1.97 శాతం నుంచి 1.51 శాతానికి తగ్గింది. నికర ఎన్పీఏ 0.55 శాతం నుంచి 0.44 శాతానికి దిగొచి్చంది. నికర వడ్డీ మార్జిన్ గతేడాది ఉన్న 5.71 శాతం నుంచి 5.96 శాతానికి బలపడింది.ఏయూ స్మాల్ ఫైనాన్స్ లాభం 37% జంప్ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (AU Small Finance Bank) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) అద్భుత ప్రదర్శన కనబరిచింది. బ్యాంక్ నికర లాభం వార్షిక ప్రాతిపదికన 37 శాతం వద్ధితో రూ.796 కోట్లకు చేరింది. ప్రొవిజన్లు తగ్గడం, నికర వడ్డీ మార్జిన్లు 5.9%కి మెరుగుపడటంతో లాభాలు పెరిగాయి. బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం 32 శాతం పెరిగి రూ.2,695 కోట్లకు చేరింది. రుణాలు 23 శాతం వృద్ధి చెందాయి. స్థూల నిరర్థక ఆస్తుల నిష్పత్తి 2.10 శాతానికి తగ్గడం ద్వారా ఆస్తుల నాణ్యత మెరుగైంది. -
రైల్వే తత్కాల్ బుకింగ్‌లో మార్పులు
రైల్వే రిజర్వేషన్ కౌంటర్ల వద్ద రోజూ కనిపించే తోపులాటలు, దళారుల ఆధిపత్యానికి తెరదించేందుకు భారతీయ రైల్వే రంగం సిద్ధం చేసింది. ఆగస్టు 1, 2026 నుంచి తత్కాల్ టికెట్ల జారీ విధానంలో విప్లవాత్మకమైన ‘టోకెన్ వ్యవస్థ’ను ప్రవేశపెడుతున్నారు. ప్రాథమికంగా వెస్ట్ సెంట్రల్ రైల్వే (కోటా డివిజన్) పరిధిలోని రిజర్వేషన్ కౌంటర్ల వద్ద ఈ నూతన నిబంధనలను అమలు చేయనున్నారు. టికెట్ బుకింగ్ సమయాల్లో ఎటువంటి మార్పు లేకపోయినప్పటికీ క్యూలైన్లలో నిలబడే పద్ధతి పూర్తిగా మారనుంది.టోకెన్ల కేటాయింపు వేళలు ఇవే..కొత్త నిబంధనల ప్రకారం కౌంటర్ వద్ద నేరుగా గుమిగూడేందుకు అనుమతించరు. ముందుగా టోకెన్లు పొందిన వారికే ప్రాధాన్యత ఇస్తారు. ఏసీ తరగతుల వారికి ఉదయం 8:30-9:00 గంటల మధ్య టోకెన్లు పంపిణీ చేస్తారు. ప్రతి కౌంటర్‌కు గరిష్ఠంగా 10 టోకెన్లు మాత్రమే ఇస్తారు. (బుకింగ్ సమయం: ఉదయం 10:00 గంటలు). నాన్-ఏసీ తరగతులకు ఉదయం 9:30-10:00 గంటల వరకు టోకెన్లు జారీ చేస్తారు. ప్రతి కౌంటర్‌కు 15 టోకెన్లు కేటాయిస్తారు. (బుకింగ్ సమయం: ఉదయం 11:00 గంటలు)కేటగిరీ ఏ, బీ ప్రాధాన్యతలుదళారీ వ్యవస్థను అరికట్టేందుకు ప్రయాణికులను రెండు వర్గాలుగా విభజించారు. కేటగిరీ ఏ..(తొలి ప్రాధాన్యం) తమ కోసం లేదా తమ కుటుంబ సభ్యుల కోసం టికెట్ బుక్ చేసుకునే ప్రయాణికులు ఈ వర్గంలోకి వస్తారు. వీరు తమ అసలు గుర్తింపు కార్డుతో పాటు కుటుంబ సంబంధాన్ని రుజువు చేసే ఐడీ పత్రాన్ని తప్పనిసరిగా చూపించాలి. కేటగిరీ ‘బీ’ కింద ఇతర ప్రయాణికులకు ఇస్తారు. ‘ఏ’ కేటగిరీ ప్రయాణికుల బుకింగ్ పూర్తయిన తర్వాతే వీరికి అవకాశం కల్పిస్తారు. వీరు తప్పనిసరిగా ఆధార్ కార్డు లేదా అధికారిక గుర్తింపు కార్డు కలిగి ఉండాలి.పారదర్శకత, భద్రతకే ప్రాధాన్యంజారీ చేసిన టోకెన్లపై ప్రయాణికుడి పేరు, వివరాలు స్పష్టంగా ముద్రిస్తారు. ఇవి ఇతరులకు బదిలీ చేయడానికి వీల్లేదు. టోకెన్ ఉన్న వ్యక్తికి మాత్రమే టికెట్ జారీ చేస్తారు. దీనివల్ల ప్రయాణికులు కౌంటర్ల వద్ద నిరంతరం క్యూలో నిలబడాల్సిన అవసరం లేకుండా హాల్లో వేచి ఉండవచ్చు. అటు ఆన్లైన్ ద్వారా ఐఆర్సీటీసీ వెబ్సైట్ లేదా యాప్‌లో తత్కాల్ టికెట్లు బుక్ చేసుకునే వినియోగదారులకు ఆధార్ ఆథెంటికేషన్ తప్పనిసరి. సాధారణ ప్రయాణికులకు తత్కాల్ రిజర్వేషన్ సులభతరం చేయడం, కౌంటర్ల వద్ద రద్దీ తగ్గించడమే లక్ష్యంగా రైల్వే శాఖ ఈ కీలక మార్పులు చేపట్టింది.ఇదీ చదవండి: వసివాడిన పసిడి మెరుపులు -
గూగుల్‌లో ఉద్యోగం నిజంగానే హ్యాపీనా?
ప్రపంచంలోనే ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్‌లో ఉద్యోగం సాధించడం ప్రతి ఐటీ నిపుణుడి డ్రీమ్. ఆకర్షణీయమైన వేతనాలు, కార్పొరేట్ సదుపాయాలు, ప్రపంచ స్థాయి గుర్తింపు ఉండే ఈ సంస్థలో పని సంస్కృతి ఎలా ఉంటుందనే దానిపై నిరంతరం చర్చ జరుగుతూనే ఉంటుంది. ఈ నేపథ్యంలో అమెరికాలోని గూగుల్ విభాగంలో పనిచేస్తున్న ప్రియ అనే భారతీయ టెక్కీ అక్కడి ఉద్యోగ పరిస్థితులు, కెరీర్ ఎదుగుదల, వర్క్-లైఫ్ బ్యాలెన్స్ గురించి వెల్లడించిన విషయాలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.పనివేళల్లో సౌలభ్యంగూగుల్లో రోజూ 10-12 గంటలు తప్పనిసరిగా శ్రమిస్తారనే భావన సరికాదని ప్రియ స్పష్టం చేశారు. ‘గూగుల్‌లో పనివేళల విషయంలో ఎంతో సౌలభ్యం ఉంటుంది. కొన్ని రోజులు ప్రాజెక్ట్ డెడ్‌లైన్స్ ఆధారంగా 10-12 గంటలు పనిచేయాల్సి వచ్చినా మరికొన్ని రోజులు ఎంతో సులభంగా, ప్రశాంతంగా సాగుతాయి. గూగుల్‌లో ఫ్లెక్సిబిలిటీ లేదనడం ముమ్మాటికీ అవాస్తవం’ అని ఆమె పేర్కొన్నారు. ఉద్యోగి ఎంచుకునే లక్ష్యాలు, ఉద్యోగ సంతృప్తి పైనే వారి పనివేళలు ఆధారపడి ఉంటాయని వివరించారు.పోటీ తీవ్రత.. నిరంతర శ్రమగూగుల్లో ప్రవేశించిన ప్రారంభంలో జీవితంలో అన్నీ సాధించినట్లు అనిపించినప్పటికీ కాలక్రమేణా అక్కడ ఉండే తీవ్ర పోటీ వాతావరణం అర్థమవుతుందని ఆమె తెలిపారు. అత్యంత ప్రతిభావంతులైన సహోద్యోగులు మధ్య పనిచేస్తున్నప్పుడు సంస్థలో ఉన్నత స్థాయికి ఎదగాలంటే సాధారణ బాధ్యతలకు మించి శ్రమించాల్సి వస్తుందన్నారు. ముఖ్యంగా ప్రస్తుత ఐటీ రంగాన్ని పట్టిపీడిస్తున్న లేఆఫ్‌ల నేపథ్యంలో నిలకడైన పురోగతి సాధించడం అంత సులభం కాదని అభిప్రాయపడ్డారు.అనుభవాల పాఠంలండన్, చికాగో, న్యూయార్క్ వంటి అంతర్జాతీయ నగరాల్లో నివసించిన అనుభవాలను పంచుకుంటూ విదేశీ అవకాశాలను అందుకోవడం తన కెరీర్‌కు ఎంతో దోహదపడిందని పేర్కొన్నారు. అధిక జీతాలు, హోదాలతో పాటు గ్లోబల్ టెక్ సంస్థలలో రాణించాలంటే నిరంతర నైపుణ్యాభివృద్ధి, మానసిక సంసిద్ధత అత్యంత కీలకమని ఈ పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి.ఇదీ చదవండి: రూ.1 కోటి జీతం.. 3 ఇళ్లు.. తీరా చూస్తే రూ.15 వేల అప్పు! -
బేబీ పౌడర్ వివాదం.. రూ.52 వేలకోట్ల పరిహారం!
అమెరికాకు చెందిన ప్రముఖ ఫార్మాస్యూటికల్ దిగ్గజం జాన్సన్ & జాన్సన్ (Johnson & Johnson) టాల్కం పౌడర్‌కు సంబంధించిన కేసుల కారణంగా మళ్లీ వార్తల్లో నిలిచింది. ఈ కంపెనీ తయారు చేసిన టాల్కం పౌడర్ వినియోగం వల్ల అండాశయ క్యాన్సర్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చాయని, వేలాది మంది కోర్టులను ఆశ్రయించారు. ఈ వివాదం చాన్నాళ్లుగా కొనసాగుతూనే ఉంది. దీనికి ముగింపు పలకడానికి సంస్థ భారీ మొత్తంలో పరిహారం చెల్లించేందుకు సిద్ధమైంది.జాన్సన్ & జాన్సన్ సంస్థ దాదాపు 76,000 కేసులను పరిష్కరించడానికి 5.5 బిలియన్ డాలర్లు (సుమారు రూ.52 వేలకోట్లు) చెల్లించాలని ప్రతిపాదించింది. చాలా సంవత్సరాలుగా కొనసాగుతున్న ఈ న్యాయపోరాటం వల్ల కంపెనీ ప్రతిష్ఠ చాలా వరకు దెబ్బతింది. ఇది సంస్థ ఆర్ధిక పరిస్థితి మీద కూడా ప్రభావం చూపింది. ఈ కారణంగానే.. సంస్థ ఈ వివాదాన్ని శాశ్వతంగా ముగించాలని నిర్ణయించింది.క్యాన్సర్‌కు కారణమయ్యే అస్బెస్టాస్జాన్సన్ & జాన్సన్ తయారు చేసిన టాల్కం బేబీ పౌడర్‌ను ఎక్కువ కాలం ఉపయోగించడం వల్ల..తమకు లేదా తమ కుటుంబ సభ్యులకు అండాశయ క్యాన్సర్ లేదా మెసోథెలియోమా వంటి ప్రమాదకర వ్యాధులు వచ్చాయని ఆరోపణలు వచ్చాయి. టాల్కం పౌడర్‌లో క్యాన్సర్‌కు కారణమయ్యే అస్బెస్టాస్ అనే పదార్థం ఆనవాళ్లు ఉన్నాయని చెబుతున్నారు.బేబీ పౌడర్ అమ్మకాల నిలిపివేతఈ ఆరోపణలను జాన్సన్ & జాన్సన్ కంపెనీ పూర్తిగా తిరస్కరిస్తోంది. తమ ఉత్పత్తులు క్యాన్సర్‌కు కారణమవుతాయని చెప్పడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని సంస్థ స్పష్టం చేసింది. అయినప్పటికీ.. వినియోగదారుల ఆందోళనను దృష్టిలో ఉంచుకుని, 2020లో అమెరికాలో మాత్రమే కాకుండా కెనడాలో కూడా టాల్కం ఆధారిత బేబీ పౌడర్ అమ్మకాలను నిలిపివేసింది. కాగా ఇప్పుడు వివాదానికి ముగింపు పలకడానికి పరిహారం చెల్లించేందుకు సన్నద్ధమైంది.ఇదీ చదవండి: అసలు సమస్య NEET కాదు.. ఆర్జీవీ సంచలన ట్వీట్! -
తర్వాతి హైడ్రోజన్ రైలు రూట్లు ఇవే..
పర్యావరణహిత రవాణా వ్యవస్థే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్’లో భాగంగా ప్రవేశపెట్టిన దేశపు తొలి హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ రైలు ఇటీవలే విజయవంతంగా పట్టాలెక్కింది. హరియాణాలోని జింద్-సోనెపట్ మార్గంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిన రైలు ఇప్పటికే 1,200 కిలోమీటర్లకు పైగా ప్రయాణించింది. ఈ విజయవంతమైన ట్రయల్స్ ఆధారంగా త్వరలోనే ఢిల్లీ రూట్‌తో పాటు చారిత్రాత్మక కాల్కా-శిమ్లా, ఇతర పర్వత ప్రాంతాల (హెరిటేజ్ రూట్లు) వైపు ఈ సేవలను విస్తరించేందుకు భారతీయ రైల్వే వేగంగా అడుగులు వేస్తోంది.జింద్ - సోనెపట్ సక్సెస్తొలి విడతగా ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ఈ హైడ్రోజన్ రైలు ఆశించిన దానికంటే మెరుగైన ఫలితాలను అందించింది. కేవలం కొన్ని రోజుల వ్యవధిలోనే వేలాది మంది ప్రయాణికులను సురక్షితంగా చేరవేయడమే కాకుండా, పర్యావరణానికి ఎంతో మేలు చేసింది.3,200+ లీటర్ల డీజిల్ పొదుపు: కేవలం 1,200 కి.మీల ప్రయాణంలోనే దాదాపు 3,200 లీటర్ల కంటే ఎక్కువ డీజిల్ వాడకాన్ని తగ్గించింది.జీరో కార్బన్ ఉద్గారాలు: ఈ రైలు నుంచి విషపూరిత పొగ లేదా కార్బన్ డై ఆక్సైడ్ వెలువడదు. రసాయన ప్రక్రియ ద్వారా కేవలం నీటి ఆవిరి, స్వచ్ఛమైన గాలి మాత్రమే ఉపఉత్పత్తిగా బయటకు వస్తాయి.శబ్ద రహిత ప్రయాణం: సాంప్రదాయ డీజిల్ ఇంజిన్లతో పోలిస్తే శబ్ద కాలుష్యం దాదాపు శూన్యం.ఢిల్లీ, కాల్కా-శిమ్లా హెరిటేజ్ రూట్లకు విస్తరణజింద్-సోనెపట్ రూట్లో విజయం సాధించడంతో రైల్వే శాఖ తదుపరి దశ పరీక్షలకు సిద్ధమైంది. దేశ రాజధాని పరిసర ప్రాంతాల్లో కాలుష్యాన్ని తగ్గించే లక్ష్యంతో ఢిల్లీ మార్గంలో ట్రయల్ రన్స్ నిర్వహించనున్నారు. ప్రకృతి అందాలకు నిలయమైన యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం కాల్కా-శిమ్లా నారోగేజ్ ట్రాక్‌పై ఈ రైలును నడిపేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే, నీలగిరి మౌంటైన్ రైల్వే, మాథేరాన్ హిల్ రైల్వే, కాంగ్రా వ్యాలీ వంటి ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాల్లో డీజిల్ రైళ్ల స్థానంలో గ్రీన్ హైడ్రోజన్ రైళ్లను తీసుకురానున్నారు.ఇదీ చదవండి: కరుగుతోన్న బంగారు కొండ! -
సీఈఓ ముందే ఉద్యోగుల నినాదాలు!
భారత ఐటీ రంగంలో గత కొన్ని నెలలుగా నిశ్శబ్దంగా రగులుతున్న వేతనాల అసంతృప్తి ఒక్కసారిగా బహిర్గతమైంది. చెన్నై వేదికగా జరిగిన హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ అంతర్గత వార్షిక కార్యక్రమంలో చోటుచేసుకున్న అనూహ్య సంఘటన ఇప్పుడు దేశీయ టెక్ రంగంలో చర్చనీయాంశమైంది. కంపెనీ సీఈఓ సి.విజయకుమార్ వేదికపైకి రాగానే సభలో పాల్గొన్న వందలాది మంది ఉద్యోగులు ఒకేసారి ‘మాకు జీతాల పెంపు కావాలి’ అంటూ నినాదాలు చేయడం, దానికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో క్షణాల్లో వైరల్ కావడం ఐటీ వర్గాల్లో కలకలం రేపింది.లాభాల పంట.. వేతనాల్లో కోత!ఈ సంఘటన కేవలం ఒక కంపెనీకి చెందిన తాత్కాలిక నిరసనగా చూడలేం. కరోనా అనంతర కాలంలో గ్లోబల్ టెక్ రంగం కేవలం ఆర్థిక మందగమనాన్ని మాత్రమే ఎదుర్కొవడం లేదు.. తీవ్రమైన మానవ వనరుల సంక్షోభాన్ని కూడా మోస్తోంది. హెచ్‌సీఎల్‌తో పాటు పలు ప్రముఖ భారతీయ ఐటీ దిగ్గజాలు ఆరోగ్యకరమైన త్రైమాసిక లాభాలను నమోదు చేస్తున్నప్పటికీ అప్రైజల్స్ (జీతాల పెంపు) విషయంలో తీవ్ర ఆలస్యం వహిస్తున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.ప్రాజెక్టుల తగ్గింపు, వ్యయ నియంత్రణ పేరుతో మేనేజ్మెంట్లు తీసుకుంటున్న నిర్ణయాలు క్షేత్రస్థాయి ఇంజినీర్లపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ద్రవ్యోల్బణానికి అనుగుణంగా జీతాలు పెరగకపోవడం, పదోన్నతులు నిలిచిపోవడంతో ఉద్యోగుల్లో సహనం నశించిందనడానికి ఈ ఘటనే నిదర్శనం.కార్పొరేట్ సంస్కృతిలో మార్పుసాధారణంగా భారతీయ ఐటీ ఉద్యోగులు క్రమశిక్షణకు, అంతర్గత నిబంధనలకు కట్టుబడి ఉంటారు. తమ నిరసనలను అధికారిక ఈ-మెయిల్స్ లేదా హెచ్ఆర్ సమావేశాలకే పరిమితం చేస్తారు. అయితే, ఏకంగా కంపెనీ అత్యున్నత నాయకత్వం (సీఈఓ) కళ్ల ముందే బహిరంగంగా నినాదాలు చేశారంటే ఉద్యోగుల పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇది కార్పొరేట్ కమ్యూనికేషన్ వ్యవస్థల వైఫల్యాన్ని కూడా ఎత్తిచూపుతోంది.When the CEO of HCL came on stage, employees started chanting, "We want a hike!" pic.twitter.com/hty1tNGp26— Nandkishor (@devops_nk) July 27, 2026పరిశ్రమకు హెచ్చరికఈ చెన్నై ఘటన ఐటీ యాజమాన్యాలకు ఒక బలమైన హెచ్చరిక. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విస్తరణ, రీ-స్కిల్లింగ్ సవాళ్ల మధ్య ఉద్యోగుల మనోధైర్యాన్ని దెబ్బతీస్తే అది కంపెనీ ఉత్పత్తి సామర్థ్యంపై ప్రభావం చూపుతుంది. మేనేజ్మెంట్లు ఇప్పటికైనా ప్రాజెక్టు లాభాలకే ప్రాధాన్యం ఇవ్వకుండా పారదర్శకమైన వేతన విధానాలను అమలు చేయాలని నిపుణులు చెబుతున్నారు.ఇదీ చదవండి: కరుగుతోన్న బంగారు కొండ! -
రైల్వే ప్లాట్‌ఫాంమీద పడుకునే స్థాయినుంచి, రూ.1.69 లక్షల కోట్ల కంపెనీ!
Satyanarayan Nuwal Success Story అత్యంత తక్కువ పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించి, విజయం సాధించి బిలియనీర్‌గా అవతరించిన వ్యాపారవేత్తల విజయగాథల గురించి చాలానే విన్నాం. అయితే జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నా, ఎన్న సవాళ్లు ఎదురైనా వాటిని అధిగమించి ఏకంగా రూ.72000 కోట్ల ఆస్తికి యజమాని అయిన సక్సెస్ స్టోరీ విన్నారా? చేతిలో చిల్లి గవ్వ లేని స్థితి నుండి.. రైల్వే ప్లాట్‌ఫారమ్‌పై పడుకునే స్థాయి నుండి మొదలై.. పట్టుదలతో దేశంలోనే అత్యంత విజయవంతమైన పారిశ్రామికవేత్తలలో ఒకరిగా నిలిచిన సత్యనారాయణ్ నువాల్ జీవితం ప్రతి ఒక్కరికీ స్పూర్తిదాయకం. పదండి ఈ వివరాలేంటో తెలుసుకుందాం.రాజస్థాన్‌లోని భిల్వారా జిల్లాలో ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన అతని పేరే 72 ఏళ్ల సత్యనారాయణ్ నువాల్ (Satyanarayan Nuwal). సుమారు రూ. 45,650 కోట్ల నికర ఆస్తితో నాగ్‌పూర్‌లోని అత్యంత ధనవంతుడు. సత్యనారాయణ్ నువాల్ సోలార్ ఇండస్ట్రీస్ ఇండియా లిమిటెడ్ వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్. కుటుంబ ఆర్థిక ఇబ్బందుల వల్ల 10వ తరగతితోనే చదువు ఆపేసాడు. 18-19 ఏళ్లకే వివాహం, బాధ్యతలు నెత్తినపడ్డాయి. రాజస్థాన్‌లోని భిల్వారాలో పట్వారీగా పనిచేసిన అతని తండ్రి 1971లోనే రిటైర్ అయ్యారు. తాతగారు ఒక చిన్న కిరాణా కొట్టు నడిపేవారు, సపోర్ట్ చేయడానికి ఎలాంటి కుటుంబ వ్యాపారం లేదు. 18 ఏళ్ల వయసులో సిరా (Ink) తయారీ యూనిట్‌ను ప్రారంభించినా అది విఫలమైంది. దాంతో బతుకుదెరువు కోసం కొత్త ప్రాంతానికి వచ్చాడు.చేతిలో పైసా లేకుండా, ఎటు వెళ్లాలో తెలియని స్థితిలో చేరుకున్నాడు. 1977లో, మహారాష్ట్రలోని బల్హార్షా రైల్వే స్టేషన్‌కు చేరాడు. ఆ రాత్రి అతనికి ఆశ్రయం ఆ రైల్వే ప్లాట్‌ఫారమే అయింది. ఆ రాత్రి ప్లాట్‌ఫారమ్‌పై పడుకున్నప్పుడు, భవిష్యత్తులో తన జీవితం ఎలా మారబోతోందో అతనికి కనీసం ఊహ కూడా లేదు.ఇల్లు అద్దెకు తీసుకోవడానికి కూడా ఆయన దగ్గర తగినంత డబ్బు ఉండేది కాదు. దీంతో ఆయన చాలా రాత్రులు రైల్వే స్టేషన్లోనే గడపవలసి వచ్చింది. ఆ రోజుల్లో జీవనోపాధి కోసం ఆయన ఫౌంటెన్ పెన్నులు కూడా అమ్మేవారు.చిన్న అడుగుతో మొదలైన వ్యాపారంబల్హార్షాలో నువాల్‌కు అబ్దుల్ సత్తార్ అల్లాభాయ్ పరిచయమయ్యారు. ఆయన బావులు తవ్వడానికి, రోడ్లు వేయడానికి, బొగ్గు గనులకు ఉపయోగించే పేలుడు పదార్థాల (Explosives) వ్యాపారి. నువాల్ దీనిని ఒక అవకాశంగా మలుచుకున్నాడు. నెలకు వెయ్యి రూపాయల అద్దె చెల్లించి అబ్దుల్ సత్తార్ లైసెన్స్‌ను ఉపయోగించుకుని వ్యాపారం ప్రారంభించాడు. 25 కేజీల పేలుడు పదార్థాలను రూ. 250కి కొని, రూ.800కి అమ్మేవాడు. లాభాలు తక్కువే అయినా, అది నిజాయితీతో కూడిన శ్రమ.#WATCH | Solar Group Chairman Satyanarayan Nuwal receives Padma Shri award from President Droupadi Murmu for his contribution to India's defence manufacturing ecosystem pic.twitter.com/xEuTePY74k— ANI (@ANI) May 25, 2026త్వరలోనే ఆయన కష్టపడే తత్వాన్ని, నిజాయితీని బ్రిటిష్ కంపెనీ 'ఇంపీరియల్ కెమికల్ ఇండస్ట్రీస్' అధికారులు గుర్తించారు. ఇది ఆయనకు వ్యాపారంలో సరికొత్త తలుపులు తెరిచింది. ఒక చిన్న వ్యాపారిగా ఉన్న నువాల్, ఎక్స్‌ప్లోజివ్స్ బిజినెస్లోని మెళకువలను లోతుగా నేర్చుకున్నాడు.'సోలార్ ఇండస్ట్రీస్' అద్భుత ప్రగతి1995లో, తన 37వ ఏట నువాల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి రూ.60 లక్షల రుణం తీసుకుని సోలార్ ఇండస్ట్రీస్ ఇండియా (Solar Industries India) పేరుతో ఒక చిన్న తయారీ యూనిట్‌ను ప్రారంభించారు. చాలామంది ఇది పెద్ద రిస్క్ అనుకున్నారు, కానీ నువాల్ తనపై నమ్మకంతో ముందడుగు వేశారు.2006 IPOఐపీఓ (IPO)కి వెళ్లే సమయానికి రూ.78 కోట్ల టర్నోవర్, రూ.11 కోట్ల నికర లాభాన్ని సాధించింది. ఈ నిధులతో దేశవ్యాప్తంగా 13 తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం సోలార్ ఇండస్ట్రీస్ భారతదేశంలోని 9 రాష్ట్రాల్లో, 29 నగరాల్లో తయారీ కేంద్రాలను కలిగి ఉంది. వీటితో పాటు జాంబియా, ఘనా, నైజీరియా, టర్కీ, టాంజానియా మరియు సౌత్ ఆఫ్రికాలలో 6 విదేశీ యూనిట్లను నడుపుతోంది.రక్షణ రంగంలో సరికొత్త చరిత్ర2010లో భారతదేశ రక్షణ దళాలకు (Defence Forces) వార్హెడ్ల కోసం పేలుడు పదార్థాలను తయారు చేసే లైసెన్స్‌ను భారత ప్రభుత్వం నుండి పొందిన మొదటి ప్రైవేట్ కంపెనీగా సోలార్ ఇండస్ట్రీస్ రికార్డు సృష్టించింది.'మేక్ ఇన్ ఇండియా' మిషన్‌లో భాగంగా కంపెనీ ఎక్స్‌ప్లోజివ్స్, ప్రొపెల్లెంట్స్, గ్రెనేడ్లు, డ్రోన్లు మరియు వార్హెడ్ల తయారీని ప్రారంభించింది. పినాకా (Pinaka) రాకెట్లు: ఈ రాకెట్ల కమర్షియల్ ప్రొడక్షన్ కంపెనీకి ఒక మైలురాయిగా నిలిచింది. ప్రస్తుతం రక్షణ రంగం నుంచి అంతర్జాతీయ ఆర్డర్లు భారీగా పెరుగుతున్నాయి. కంపెనీ రాబడిలో మెజారిటీ భాగం ఎగుమతుల (Exports) ద్వారానే వస్తోంది.2026 జులై నాటికి సోలార్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ దాదాపు రూ,1.69 లక్షల కోట్లకు చేరుకుంది. ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితాలో స్థానం పొందిన నువాల్ ఆస్తి విలువ సుమారు రూ.7.5 బిలియన్ డాలర్లు (రూ.72,000 కోట్లకు పైగా).ఇదీ చదవండి: హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ నా జీవితాన్నే మార్చేసిందిపద్మశ్రీ పురస్కారం2026, మే 25న రాష్ట్రపతి భవన్లో జరిగిన పౌర పురస్కారాల ప్రదానోత్సవంలో దేశ రక్షణ రంగంలో ఆత్మనిర్భరతను పెంపొందించినందుకు గాను సత్యనారాయణ్ నువాల్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 'పద్మశ్రీ' అవార్డును ప్రదానం చేశారు. ఇంతఎత్తుకు ఎదిగినా ఆయన తన మూలాలను మరచిపోలేదు. నాగ్‌పూర్ పరిసర ప్రాంతాలలో విద్య, సమాజ అభివృద్ధి, సామాజిక సంక్షేమ కార్యక్రమాలకు విస్తృతంగా విరాళాలు అందిస్తూ గొప్ప దాతగా పేరు గాంచారు.ఇదీ చదవండి: వీకెండ్ క్లాస్‌లో ఐఐఎం ప్రొఫెసర్ సర్ప్రైజ్, నెటిజన్లు ఫిదా -
నెలకు రూ.2 లక్షల జీతం.. అయినా పేదవాడినే!
డబ్బు ఎక్కువగా ఉంటే.. జీవితంలో ఎలాంటి సమస్యలు ఉండవని చాలామంది భావిస్తారు. కానీ.. మనసులో ఉండే భయం, చిన్నప్పటి అనుభవాలు, బాధ్యతలు కూడా మన సంతోషాన్ని ప్రభావితం చేస్తాయనేది నిజం. దీనికి బెంగళూరులో నివసిస్తున్న 26 ఏళ్ల టెకీ కథ మంచి ఉదాహరణ.రెడ్దిట్ పోస్టులో వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం.. బెంగళూరులో నివసిస్తున్న యువకుడు ప్రస్తుతం నెలకు రూ.2 లక్షలు సంపాదిస్తున్నాడు. అతనికి ఎలాంటి అప్పులు లేవు. అయినప్పటికీ.. తాను ఇప్పటికీ పేదవాడిననే భావనతో జీవిస్తున్నానని తన మనసులో మాట చెప్పాడు.చిన్నప్పటి నుంచి అతని కుటుంబం చాలా పేదరికంలో జీవించింది. వారి కుటుంబ ఆదాయం నెలకు రూ.6,000 నుంచి రూ.7,000 మాత్రమే ఉండేది. ఒక చిన్న 10×10 గదిలో అందరూ ఉండేవారు. ఆ రోజుల్లో డబ్బు కోసం పడిన కష్టాలు అతని మనసులో బలంగా నాటుకుపోయాయి. అందుకే.. మంచి ఉద్యోగం సంపాదించి తన కుటుంబ జీవితాన్ని మార్చాలనే లక్ష్యంతో కష్టపడ్డాడు.2021లో ఉద్యోగం వచ్చిన తర్వాత తన తల్లిదండ్రులను పని చేయనివ్వకుండా ఇంట్లోనే విశ్రాంతిగా ఉండేలా చేశాడు. వారికోసం స్వగ్రామంలో ఒక డబుల్ బెడ్ రూమ్ ఇల్లు అద్దెకు తీసి ఇచ్చాడు. తాను ఉండటానికి బెంగళూరులో ఒక 2BHK అద్దెకు తీసుకున్నాడు. ప్రతి నెలా తల్లిదండ్రులకు రూ.15,000 నుంచి రూ.20,000 పంపిస్తున్నాడు.అతను సంపాదించిన డబ్బును చాలా జాగ్రత్తగా ఖర్చు చేస్తున్నాడు. ప్రతి నెలా రూ.30,000 మ్యూచువల్ ఫండ్స్‌లో, రూ.10,000 ఫిక్స్డ్ డిపాజిట్లో, మరో రూ.10,000 బంగారం కోసం దాస్తున్నారు. ఇప్పటివరకు స్టాక్స్, FDలు, బంగారం, బ్యాంక్ పొదుపులతో మంచి మొత్తాన్ని కూడబెట్టాడు. స్కూటర్, మ్యాక్ బుక్, ఫోన్ వంటి అవసరమైనవి కొనుగోలు చేశాడు. తల్లిదండ్రుల ఇంటికి అవసరమైన ఫర్నిచర్, ఇతర పరికరాలను కూడా కొనిచ్చాడు.#Rant, Feeling poor: Earning ₹2l a month with ₹0 deptby u/Cautious-Table158 in FinancialAdviceIndiaఅయినా.. కూడా అతనికి తాను ధనవంతుడిననే భావన రాలేదు. ఈ ఏడాది పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడు. పెళ్లికి కనీసం రూ.10 లక్షలు ఖర్చవుతాయని భావిస్తున్నాడు. అదనంగా ఒక కారు, స్వగ్రామంలో స్థలం, ఒక బైక్ కొనాలని కూడా ఉంది. కానీ ఒకటి ఎంచుకుంటే.. మరొకటి చేయలేనేమో అనే భయం అతనిని ఎప్పుడూ వెంటాడుతోంది.అతని బాధలో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. సొంత ఊరిలో ఆటో డ్రైవర్లు, కూలీలుగా పనిచేసే స్నేహితులు తనకంటే తక్కువ సంపాదించినా చాలా సంతోషంగా కనిపిస్తున్నారు. వారు అప్పులు తీసుకుని తమకు నచ్చిన వస్తువులు కొనుగోలు చేస్తూ జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. కానీ నేను మాత్రం రూ.750 కంటే ఎక్కువ ధర ఉన్న చొక్కా కొనాలన్నా చాలా సార్లు ఆలోచిస్తున్నానని చెప్పాడు. డబ్బు ఉన్నా ఖర్చు చేయడానికి భయపడటం అతని మనసులోని అసురక్షిత భావాన్ని చూపిస్తుంది.ఈ పోస్ట్ చూసిన చాలా మంది రెడ్దిట్ వినియోగదారులు అతనికి ధైర్యం చెప్పారు. చిన్నప్పుడు పేదరికంలో పెరిగిన వారికి, తర్వాత ఎంత డబ్బు వచ్చినా 'రేపు ఏమవుతుందో?' అనే భయం పోవడం కష్టం అని వివరించారు. అతను ఇప్పటివరకు సాధించిన విజయాలను గుర్తు చేసుకుని తనపై తాను గర్వపడాలని సూచించారు. అలాగే తొందరపడి పెద్ద రిస్క్‌లు తీసుకోవద్దని, ఓపికగా పెట్టుబడులు పెడితే భవిష్యత్తులో ఇంకా మంచి స్థితికి చేరుకుంటారని సలహా ఇచ్చారు. -
కేంద్ర విద్యాశాఖ మంత్రికి జీతం ఎక్కువా?
నీట్-యూజీ 2026 ప్రశ్నాపత్రం లీక్ వివాదం నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో విద్యాశాఖ మంత్రి పదవికి సంబంధించిన జీతభత్యాలు, అధికారిక సౌకర్యాలపై ఆసక్తి నెలకొంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన రాజీనామాను ఆమోదించగా, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి విద్యాశాఖ అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ అధికారిక ప్రకటన విడుదల చేసింది.కేంద్ర విద్యాశాఖ మంత్రి కేబినెట్ హోదా కలిగిన మంత్రి. అదే సమయంలో లోక్‌సభ లేదా రాజ్యసభ సభ్యుడిగా కూడా ఉంటారు. అందువల్ల పార్లమెంట్ సభ్యులకు వర్తించే వేతనం, భత్యాలతో పాటు కేంద్ర మంత్రులకు ప్రత్యేకంగా లభించే అధికారిక సౌకర్యాలు కూడా పొందుతారు.జీత భత్యాలు ఇవే..ప్రస్తుతం పార్లమెంట్ సభ్యుడిగా నెలకు రూ.1 లక్ష ప్రాథమిక వేతనం లభిస్తుంది. దీనికి అదనంగా నియోజకవర్గ భత్యం రూ.70,000, కార్యాలయ వ్యయాల కోసం రూ.60,000 అందుతాయి. పార్లమెంట్ లేదా దాని కమిటీల సమావేశాలకు హాజరయ్యే ప్రతి రోజుకు రూ.2,000 రోజువారీ భత్యం చెల్లిస్తారు. ఇవి పార్లమెంట్ సభ్యులకు వర్తించే నిబంధనల ప్రకారం అందే ప్రయోజనాలు.కేబినెట్ మంత్రిగా లభించేవి..కేబినెట్ మంత్రిగా విద్యాశాఖ మంత్రికి న్యూఢిల్లీలోని లుటియెన్స్ జోన్లో ప్రభుత్వ బంగ్లా కేటాయిస్తారు. ఈ నివాసానికి అద్దె చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఇంటి నిర్వహణ, అధికారిక అవసరాల కోసం కావాల్సిన మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తుంది.అలాగే అధికారిక వినియోగం కోసం ప్రభుత్వ వాహనం, డ్రైవర్, ఇంధన సౌకర్యం అందుబాటులో ఉంటుంది. భద్రతా సంస్థల ముప్పు అంచనాల ఆధారంగా వ్యక్తిగత భద్రతా సిబ్బంది, ఎస్కార్ట్ వాహనాలు వంటి భద్రతా ఏర్పాట్లు కూడా కల్పిస్తారు.ప్రభుత్వ విధుల నిర్వహణలో భాగంగా దేశవ్యాప్తంగా అధికారిక విమాన ప్రయాణాలు, ఫస్ట్ ఏసీ రైలు ప్రయాణాలకు అర్హత ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (CGHS) కింద మంత్రి, ఆయనపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు వైద్య సదుపాయాలు లభిస్తాయి.మంత్రి కార్యాలయ నిర్వహణ కోసం వ్యక్తిగత సహాయకులు, కార్యదర్శులు, ఇతర సిబ్బందిని ప్రభుత్వం నియమిస్తుంది. అధికారిక నివాసం, కార్యాలయంలో టెలిఫోన్, ఇంటర్నెట్, కమ్యూనికేషన్ వంటి అన్ని అవసరమైన సౌకర్యాలను కూడా ప్రభుత్వం సమకూరుస్తుంది.అయితే, కేంద్ర విద్యాశాఖ మంత్రికి ప్రత్యేకంగా వేరే జీతం ఉండదు. ఆయన కేబినెట్ మంత్రి హోదాలో ఉండటం వల్ల కేంద్ర మంత్రులందరికీ వర్తించే వేతనం, పార్లమెంట్ సభ్యుల భత్యాలు, అధికారిక సౌకర్యాలనే పొందుతారు. -
ఆగస్టులో ఐపీఓల జాతర
ముంబై: దేశీయ ప్రాథమిక మార్కెట్ ఆగస్టులో భారీ ఐపీఓల రాకతో కళకళలాడనుంది. ఇన్వెస్టర్ల నుంచి లభిస్తున్న సానుకూల స్పందన, స్థిరపడుతున్న మార్కెట్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని 12కు పైగా కంపెనీలు తమ తొలి పబ్లిక్ ఆఫర్‌కు సిద్ధమయ్యాయి. రాబోయే నెలలో మార్కెట్లోకి రానున్న ఈ ఐపీఓల ద్వారా కంపెనీలు రూ.25,000 కోట్లకు పైగా నిధులను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. వీటిలో కొత్త షేర్ల జారీ తో పాటు ప్రమోటర్లు, ఇన్వెస్టర్లు వాటాలు విక్రయించే ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) లు కూడా ఉన్నాయి. ‘స్టాక్ మార్కెట్ స్థిరీకరణ సాధించడం, ఇన్వెస్టర్లలో నమ్మకం పెరగడంతో ఇన్నాళ్లూ వేచి చూసిన కంపెనీలు ఇప్పుడు ఐపీఓలకు సన్నద్ధమయ్యాయి. 2026లో ఐపీఓల ద్వారా సుమారు 20 బిలియన్ డాలర్ల (రూ. 1.66 లక్షల కోట్లకు పైగా) నిధులు సమీకరించే అవకాశం ఉంది’ అని ఈక్విరస్ క్యాపిటల్ ఎండీ భవేశ్ షా తెలిపారు. జెప్టో: క్విక్ కామర్స్ దిగ్గజం జెప్టో అత్యంత భారీ ఆఫర్‌తో మార్కెట్లోకి వస్తోంది. కంపెనీ కొత్త షేర్ల జారీ ద్వారా రూ. 8,010 కోట్లు సేకరించడమే కాకుండా, ఓఎఫ్ఎస్ రూపంలో 11.34 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయించనుంది. ట్రూహోమ్: ఈ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ రూ. 3,000 కోట్ల ఐపీఓను ప్రతిపాదించింది. ఇందులో రూ.1,500 కోట్ల విలువైన తాజా షేర్లు, రూ.1,500 కోట్ల ఓఎఫ్ఎస్ ద్వారా విక్రయించనుంది. ఎలివేట్ క్యాంపసెస్: ఈ కంపెనీ పూర్తిగా తాజా ఇష్యూ ద్వారానే రూ. 2,550 కోట్లను సమీకరించాలని నిర్ణయించింది. షిప్‌రాకెట్: లాజిస్టిక్స్ ప్లాట్‌ఫారమ్ షిప్‌రాకెట్ మొత్తం రూ. 2,342.35 కోట్ల నిధుల సమీకరణలో భాగంగా రూ. 1,100 కోట్ల తాజా షేర్లను, ప్రమోటర్ల ద్వారా రూ. 1,242.35 కోట్ల షేర్లను జారీ చేయనుంది.ఈ వారంలో మూడు పబ్లిక్ ఇష్యూలు ఈ వారంలో ప్రధానంగా మూడు పబ్లిక్ ఇష్యూలు సబ్్రస్కిబ్షన్ కోసం రానున్నాయి. వీటన్నింటిలో మణిపాల్ హెల్త్ ఎంటర్ప్రైజెస్ ఐపీఓ అతి పెద్ద ఆఫర్. రూ. 9,275 కోట్ల నిధుల సమీకరణ లక్ష్యంతో వస్తున్న ఈ పబ్లిక్ ఇష్యూ జూలై 29న (బుధవారం) ప్రారంభమై జూలై 31న ముగియనుంది. ధర శ్రేణిని రూ. 560 – రూ. 590గా నిర్ణయించారు. ఈ ఐపీఓలో రూ. 8,000 కోట్ల విలువైన తాజా షేర్ల జారీతో పాటు, ఆఫర్ ఫర్ సేల్ ద్వారా ప్రమోటర్లు రూ. 1,275.22 కోట్ల విలువైన ఈక్విటీలను విక్రయించనున్నారు. అలాగే క్లీన్ ఎనర్జీ రంగానికి చెందిన జునిపర్ గ్రీన్ ఎనర్జీ ఐపీఓ జూలై 30న (గురువారం) ప్రారంభమై ఆగస్టు 3న ముగియనుంది. ఈ కంపెనీ ఎలాంటి ఓఎఫ్ఎస్ లేకుండా, పూర్తిగా కొత్త షేర్ల జారీ ద్వారానే రూ. 1,800 కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. మూడో ఇష్యూ అయిన ఎంవీ ఎలక్ట్రోసిస్టమ్స్ కూడా జూలై 30 నుంచి ఆగస్టు 3 వరకు అందుబాటులో ఉండనుంది. పూర్తిగా తాజా షేర్ల జారీ రూపంలో రానున్న ఈ ఐపీఓ ద్వారా కంపెనీ రూ. 290 కోట్ల నిధులను సేకరించనుంది. -
దలాల్ స్ట్రీట్‌లో బిగ్ ఫైట్
ముంబై: పశ్చిమాసియా ఉద్రిక్తతలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలు, కార్పొరేట్ క్యూ1 ఆర్థిక ఫలితాలు ఈ వారంల దలాల్ స్ట్రీట్‌కు దిశానిర్ధేశం చేయనున్నాయి. ఇరాన్‌పై సైనిక చర్యను అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తాత్కాలికంగా నిలిపివేయడంతో ముడిచమురు ధరలు 100 డాలర్ల స్థాయి నుంచి కొంత తగ్గినప్పటికీ, భౌగోళిక రాజకీయ అనిశ్చితి మార్కెట్లను వెంటాడుతూనే ఉంది. దీనికి తోడు జులై 28–29 తేదీల్లో జరగనున్న ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్ల ప్రకటన, జూలై 28న (మంగళవారం) వెలువడే దేశీయ ఐఐపీ గణాంకాలు కీలక పాత్ర పోషించనున్నాయి. మరోవైపు, కార్పొరేట్ రంగానికి వస్తే ఎల్అండ్టీ, మారుతీ, హెచ్‌యూఎల్, ఐటీసీ వంటి నిఫ్టీ దిగ్గజాల క్యూ1 ఫలితాలు స్టాక్–ఆధారిత ట్రేడింగ్‌ను నడిపిస్తాయి. వీటికి తోడు ఒకే రోజున నిఫ్టీ వీక్లీ, నిఫ్టీ మంత్లీ, బ్యాంక్ నిఫ్టీ మంత్లీ కాంట్రాక్టుల ’సూపర్ ఎక్స్పైరీ’ రాబోతుండటంతో దలాల్ స్ట్రీట్‌లో రోలోవర్లు, షార్ట్ కవరింగ్ వల్ల అస్థిరత తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. కార్పొరేట్ ఫలితాల ప్రకటనలపై కన్ను నేడు ట్రేడింగ్ ప్రారంభంలో మార్కెట్ ప్రధానంగా ఐడీఎఫ్సీ బ్యాంకు, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వంటి దిగ్గజాల జూన్ క్వార్టర్ ఆర్థిక ఫలితాలకు స్పందించాల్సి ఉంటుంది. ఇక ఈ వారంలో లార్సన్ అండ్ టూబ్రో (ఎల్అండ్టీ), ఏషియన్ పేయింట్స్, అదానీ పోర్ట్స్, బజాజ్ ఫైనాన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్ఎం), మారుతీ సుజుకీ, సన్ ఫార్మా, హిందుస్థాన్ యూనిలీవర్ (హెచ్‌యూఎల్), భారత్ ఎల్రక్టానిక్స్ (బీఈఎల్), అదానీ ఎంటర్ప్రైజెస్, ఐఆర్ఎఫ్సీ, ఐటీసీ తదితర కంపెనీలు క్యూ1 ఆర్థిక ఫలితాలను ప్రకటించనున్నాయి. ఫలితాలతో పాటు కంపెనీల డిమాండ్ పరిస్థితులు, మార్జిన్లు, మూలధన వ్యయం (క్యాపెక్స్)పై యాజమాన్యాల వ్యాఖ్యలను విశ్లేషకులు నిశితంగా పరిశీలించనున్నారు. ఫెడ్ రిజర్వ్ నిర్ణయాలపై దృష్టి అమెరికా ఫెడరల్ రిజర్వ్ పాలసీ సమావేశాలు జూలై 28–29 తేదీల్లో జరగనున్నాయి. బుధవారం వెలువడే ప్రకటనలో ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతుందని అంచనాలున్నాయి. అయితే పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, బ్యారెల్ క్రూడాయిల్ ధరలు 100 డాలర్లకు చేరుకోవడంతో ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు ఫెడ్ వడ్డీరేట్లను 0.25 శాతం పెంచే అవకాశం ఉందని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. వడ్డీ రేట్ల నిర్ణయం కంటే కూడా ద్రవ్యోల్బణం, ఆర్థిక వృద్ధి, భవిష్యత్ ద్రవ్య విధానంపై ఫెడ్ ఇచ్చే సంకేతాలే మార్కెట్ దిశను నిర్దేశిస్తాయని చెబుతున్నారు. పశ్చిమాసియా పరిణామాలు... క్రూడాయిల్ దరలు ప్రభావం పశ్చిమాసియాలో శరవేగంగా మారుతున్న పరిణామాలు అంతర్జాతీయ మార్కెట్లలో ఆందోళన కలిగిస్తూనే ఉన్నాయి. వైమానిక క్షిపణి నిల్వలు తగ్గడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ, ఇరాన్‌పై భారీ సైనిక చర్య ప్రణాళికలను డోనాల్డ్ ట్రంప్ నిలిపివేసినట్లు వెలువడిన నివేదికలు మార్కెట్లకు కొంత ఊరటనిచ్చాయి. అయితే మిడిల్ ఈస్ట్‌లో ఏ చిన్న ఉద్రిక్తత తలెత్తినా గ్లోబల్ మార్కెట్లలో అస్థిరత తక్షణం పెరిగే ప్రమాదం ఉంది. మరోవైపు, అమెరికా–ఇరాన్ మధ్య నిలిచిపోయిన శాంతి చర్చలను పునరుద్ధరించడానికి చైనా తీవ్ర ప్రయత్నాలు చేస్తోందన్న వార్తలతో గురువారం (జూలై 23న) 100 డాలర్లకు చేరిన ముడి చమురు ధరలు, శుక్రవారం ఒక్కరోజే 4% కంటే ఎక్కువ పడిపోయాయి. ముడిచమురు ధరల్లో తీవ్ర ఊగిసలాట, ద్రవ్యోల్బణం, ఆర్థిక వృద్ధిపై ఆందోళనలను పెంచడంతో ఇన్వెస్టర్లు ప్రస్తుతం అప్రమత్తత వైఖరి ప్రదర్శిస్తున్నారు. మంగళవారం ‘సూపర్ ఎక్స్పైరీ’ మంగళవారం (జూలై 28) ఒకే ట్రేడింగ్ సెషన్లో నిఫ్టీ–50 వీక్లీ ఎక్స్‌పైరీతో పాటు, నిఫ్టీ–50, బ్యాంక్ నిఫ్టీ ఇండెక్సుల జూలై నెలవారీ ఎఫ్అండ్ఓ ఎక్స్‌పైరీలు ఒకేసారి రాబోతున్నాయి. దీంతో ఈ వారం దలాల్ స్ట్రీట్‌లో అస్థిరత మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుత నెల కాంట్రాక్టుల సెటిల్మెంట్లతో పాటు, ట్రేడర్లు తమ పొజిషన్లను తదుపరి నెలకు రోలోవర్ చేసుకునే ప్రక్రియ వేగవంతం కానుంది. ఈ ఒత్తిడి కారణంగా మార్కెట్లో షార్ట్ కవరింగ్ లేదా ఉన్నట్టుండి భారీ విక్రయాలు నెలకొనే అవకాశం ఉంది. కావున ఎక్స్పైరీ రోజున ఇంట్రాడే ట్రేడర్లు అత్యంత అప్రమత్తంగా ఉంటూ, కఠినమైన స్టాప్లాస్లతో వ్యవహరించడం శ్రేయస్కరం.నిఫ్టీ టెక్నికల్ అవుట్‌లుక్ గత నెల రోజులుగా 23,800 – 24,400 పరిధిలోనే ట్రేడైన నిఫ్టీ, ప్రస్తుతం ఆ స్థాయిలను కోల్పోయింది. సాంకేతికంగా ఇది సమీప కాలంలో మార్కెట్ వైఖరికి ప్రతికూల అంశమే. ప్రస్తుతం నిఫ్టీకి 23,600 వద్ద కీలక మద్దతు ఉంది. ఈ స్థాయిని కోల్పోతే 23,100 వరకు దిగివచ్చే ప్రమాదం ఉంది. ఒకవేళ షార్ట్ కవరింగ్ జరిగి మార్కెట్ కోలుకుంటే నిఫ్టీ 24,000 – 24,100 శ్రేణిలో తొలి నిరోధాన్ని పరీక్షించాల్సి ఉంటుంది. ఆ పైన 24,400 వద్ద మరో బలమైన నిరోధం ఎదురుకావచ్చు.బేరీష్గానే ఎఫ్ఐఐలు గత వారంలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐలు) రూ. 7,180 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. అయితే దేశీయ ఇన్వెస్టర్లు (డీఐఐలు) రూ. 8,640 కోట్ల మేర ఈక్విటీలను కొనుగోలు చేసి మార్కెట్ పతనాన్ని కొంతవరకు అడ్డుకోగలిగారు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ముడిచమురు ధరలపై స్పష్టత వచ్చే వరకు విదేశీ నిధుల ప్రవాహంలో తీవ్ర అస్థిరత కొనసాగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.గతవారమంతా నష్టాలే.. దలాల్ స్ట్రీట్ గతవారంలో వరుసగా అయిదు ట్రేడింగ్ సెషన్లలోనూ నష్టాలనే చవిచూసింది. మళ్లీ తలెత్తిన భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, పెరుగుతున్న ముడి చమురు ధరలు, కంపెనీల మిశ్రమ ఆర్థిక ఫలితాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. అలాగే డాలర్‌తో మారకంలో రూపాయి క్షీణత, అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు మార్కెట్‌పై తీవ్ర ఒత్తిడి తెచ్చాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగ షేర్లలో విక్రయాలు వెల్లువెత్తాయి. ఫలితంగా బెంచ్‌మార్క్ సూచీలు సెన్సెక్స్ 2,091 పాయింట్లు (2.68%), నిఫ్టీ 566 పాయింట్లు (2.33%) చొప్పున భారీగా క్షీణించాయి. -
మోదీ ఎంచుకున్న టెక్ దిగ్గజం.. ఆధార్ రూపకర్తకు కీలక బాధ్యత!
భారతదేశంలో సమాచార సాంకేతిక (ఐటీ) రంగం ప్రపంచ స్థాయికి ఎదగడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తులలో నందన్ నీలేకని ఒకరు. కేవలం ఇన్ఫోసిస్ కో-ఫౌండర్‌గా మాత్రమే కాకుండా.. ఆధార్ (Aadhaar) రూపకల్పనలో చేసిన సేవలకు ఈయనకు ప్రత్యేక గుర్తింపు లభించింది. కాగా.. ఇప్పుడు పరీక్షల సంస్కరణల కోసం నీలేఖని నేతృత్వంలో హైపవర్డ్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయనున్నట్లు పీఎం మోదీ పేర్కొన్నారు.ఎవరీ నందన్ నీలేకనినందన్ నీలేకని 1955 జూన్ 2న కర్ణాటకలోని బెంగళూరులో జన్మించారు. ఆయన తండ్రి మోహన్ రావు నీలేకని టెక్స్టైల్ పరిశ్రమలో పనిచేసేవారు. చిన్నప్పటి నుంచే చదువులో ప్రతిభ కనబరిచిన నందన్, ఐఐటీ బాంబేలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. అక్కడే ఆయనకు సాంకేతిక రంగంపై మరింత ఆసక్తి పెరిగింది.1981లో ఎన్.ఆర్. నారాయణ మూర్తితో కలిసి మరో ఆరుగురు సహ వ్యవస్థాపకులతో కలిసి ఇన్ఫోసిస్ (Infosys) సంస్థను ప్రారంభించారు. అప్పట్లో చిన్న స్థాయిలో మొదలైన ఈ సంస్థ, నేడు ప్రపంచంలోని ప్రముఖ ఐటీ కంపెనీలలో ఒకటిగా ఎదిగింది. కంపెనీ అభివృద్ధిలో నందన్ నీలేకని కీలక పాత్ర పోషించారు. 2002 నుంచి 2007 వరకు ఇన్ఫోసిస్ సీఈవోగా పనిచేసి సంస్థను అంతర్జాతీయ స్థాయిలో మరింత బలోపేతం చేశారు.ఉడాయ్ చైర్మన్2009లో ఆయన కార్పొరేట్ జీవితానికి కొంత విరామం ఇచ్చి.. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ''యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా'' (UIDAI)కి తొలి చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. దేశంలోని ప్రతి పౌరుడికి ప్రత్యేక గుర్తింపు సంఖ్య అందించే ఆధార్ ప్రాజెక్టును విజయవంతంగా అమలు చేయడంలో ఆయన నాయకత్వం కీలకంగా నిలిచింది.రచయితగా నీలేకనివ్యాపారవేత్తగానే మాత్రమే కాకుండా.. రచయితగా కూడా గుర్తింపు పొందారు. 'ఇమాజినింగ్ ఇండియా' అనే పుస్తకంలో భారతదేశ భవిష్యత్తు, ఆర్థిక వ్యవస్థ, విద్య, సాంకేతికత వంటి అంశాలపై తన ఆలోచనలను వివరించారు. ఆయన రచనలు, ప్రసంగాలు యువతకు స్ఫూర్తినిస్తుంటాయి.రాజకీయాల్లో నీలేకని2014లో రాజకీయాల్లోకి కూడా అడుగుపెట్టి బెంగళూరు దక్షిణ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేశారు. అయితే.. ఆ ఎన్నికల్లో విజయం సాధించలేదు. అనంతరం తిరిగి ఇన్ఫోసిస్‌లో చేరి సంస్థ అభివృద్ధిలో తన పాత్రను కొనసాగించారు. ప్రస్తుతం ఆయన ఇన్ఫోసిస్‌కు నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా సేవలందిస్తున్నారు.నందన్ నీలేకని కేవలం విజయవంతమైన వ్యాపారవేత్త మాత్రమే కాదు. డిజిటల్ ఇండియా, ఫిన్‌టెక్, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి రంగాల్లో కూడా విలువైన సూచనలు చేస్తుంటారు. భారతదేశంలో డిజిటల్ విప్లవానికి మార్గం సుగమం చేసిన ప్రముఖ వ్యక్తుల్లో ఆయన ఒకరుగా గుర్తింపు పొందారు. View this post on Instagram A post shared by Narendra Modi (@narendramodi) -
సముద్రంపై ఆఫీస్.. గూగుల్ కో-ఫౌండర్ సూపర్‌యాచ్!
సాధారణంగా.. ప్రపంచంలోని అత్యంత ధనవంతుల గురించి మాట్లాడితే, వారి విలాసవంతమైన జీవనశైలి గురించి కూడా చర్చ జరుగుతుంది. ఎందుకంటే.. ఖరీదైన కార్లు, ప్రైవేట్ జెట్లు, సూపర్యాచ్లు కూడా వారి జీవితంలో భాగమే. అయితే గూగుల్ సహ వ్యవస్థాపకుడు 'సెర్గీ బ్రిన్' మాత్రం తన సూపర్‌యాచ్‌ను కేవలం విహారం కోసం కాకుండా.. సముద్రంపై తేలియాడే ఆఫీసుగా మార్చుకున్నారు. ఈ కారణంగానే ఆయన సూపర్‌యాచ్ 'డ్రాగన్‌ఫ్లై' ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది.జర్మనీకి చెందిన ప్రముఖ నౌకా నిర్మాణ సంస్థ ల్యూర్సెన్ ఈ యాచ్‌ను నిర్మించింది. దాదాపు 466 అడుగుల పొడవు (142.1 మీటర్లు) ఉన్న ఈ సూపర్‌యాచ్‌ను 2024లో సెర్గీ బ్రిన్కు అందజేశారు. ప్రారంభంలో.. దీనిని మరో వ్యక్తి కోసం తయారు చేసినప్పటికీ, చివరికి బ్రిన్ సొంతం చేసుకున్నారు. దీని విలువ 450 మిలియన్ డాలర్లు (రూ.3700 కోట్ల కంటే ఎక్కువ). ఈ యాచ్ ప్రత్యేకత కేవలం విలాసవంతమైన సౌకర్యాలు మాత్రమే కాదు. అందులో ఏర్పాటు చేసిన ప్రత్యేక బిజినెస్ డెక్. సాధారణంగా సూపర్యాచ్లలో ఎక్కువ స్థలాన్ని అతిథుల కోసం, వినోదం కోసం కేటాయిస్తారు. కానీ.. డ్రాగన్‌ఫ్లైలో మాత్రం పూర్తి స్థాయి కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో వ్యక్తిగత ఆఫీస్, సమావేశాల కోసం ప్రత్యేక స్థలం, జిమ్, గేమ్స్ రూమ్‌తో పాటు బయటకు కనిపించని హెలికాప్టర్ హ్యాంగర్ కూడా ఉంది. దీంతో ప్రపంచంలో ఎక్కడ సముద్ర ప్రయాణం చేస్తున్నా.. అవసరమైనప్పుడు హెలికాప్టర్లో వచ్చి నేరుగా యాచ్‌పై దిగవచ్చు. అదే సమయంలో కార్యాలయ పనులను కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనసాగించవచ్చు.డ్రాగన్‌ఫ్లైలో అత్యాధునిక టెక్నాలజీలను కూడా ఉపయోగించారు. ఇందులో డీజిల్ ఎలక్ట్రిక్ హైబ్రిడ్ ఇంజిన్ వ్యవస్థను అమర్చారు. దీని వల్ల ఇంధన వినియోగం తగ్గడమే కాకుండా ప్రయాణ సమయంలో శబ్దం, కంపనాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఈ యాచ్ గరిష్టంగా 24 నాట్స్ వేగంతో ప్రయాణించగలదు. సుదూర సముద్ర ప్రయాణాలను మరింత సురక్షితంగా, సౌకర్యవంతంగా మార్చే ఆధునిక నావిగేషన్ వ్యవస్థలు కూడా ఇందులో ఉన్నాయి.ఈ సూపర్‌యాచ్‌లో ఒకేసారి 18 మంది అతిథులు ఉండటానికి సౌకర్యవంతంగా ఉంది. వారికి సేవలు అందించేందుకు దాదాపు 40 మంది సిబ్బంది ఉండవచ్చు. రెండు హెలిప్యాడ్లు, స్విమ్మింగ్ పూల్స్, విశాలమైన విశ్రాంతి ప్రదేశాలు వంటి అనేక సౌకర్యాలు ఇందులో ఏర్పాటు చేశారు. అందుకే ఇది కేవలం ఒక విలాసవంతమైన యాచ్ మాత్రమే కాదు.. 5 స్టార్ హోటల్‌ను తలపించే తేలియాడే భవనం అని చెప్పవచ్చు.ఇదీ చదవండి: నాసా కొత్త ప్రయోగం.. శని వలయాల రహస్యాలపై దృష్టి! -
ఉద్యోగం పోగొట్టిన రూ.4.5 కోట్ల జీతం!
రూ.4.5 కోట్ల జీతం శాపం కావడం ఏంటి? అంత జీతం వస్తే ఎవరైనా ఎగిరి గంతులేస్తారు కదా.. మరి ఉద్యోగం పోవడం ఏంటి అనుకుంటున్నారా? అయితే ఈ కథనం చదవండి..చైనాకు చెందిన టెక్ దిగ్గజం టెన్సెంట్లో (Tencent) పనిచేస్తున్న ఓ ప్రాజెక్ట్ మేనేజర్‌కు తన భారీ వేతన ప్యాకేజీనే చివరకు ఉద్యోగాన్ని కోల్పోయే పరిస్థితి తీసుకొచ్చింది. కంపెనీ అంతర్గత సమాచారంగా ఉన్న అతని వార్షిక పరిహారం వివరాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, గోప్య సమాచారాన్ని బాహ్య వ్యక్తులతో పంచుకున్నారనే ఆరోపణలపై సంస్థ అతడిని తొలగించింది. ఈ ఘటన చైనాలో కార్పొరేట్ గోప్యత, ఉద్యోగుల వేతన పారదర్శకతపై మరోసారి చర్చకు దారితీసింది.సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ కథనం ప్రకారం.. 'యే'(Ye) అనే ఇంటిపేరుతో ఉన్న ఓ వ్యక్తి టెన్సెంట్కు చెందిన వీషిన్ (Weixin) గ్రూప్‌లో ప్రాజెక్ట్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. ఈ వీషిన్ గ్రూపే ప్రపంచవ్యాప్తంగా 1.3 బిలియన్లకు పైగా వినియోగదారులు ఉపయోగించే వీచాట్ (WeChat) సూపర్ యాప్‌ను అభివృద్ధి చేసి నిర్వహిస్తోంది.కంపెనీ అంతర్గత వ్యవస్థ నుంచి తీసినట్లు భావిస్తున్న ఒక స్క్రీన్‌షాట్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. అందులో యేకు ఏడాదికి సుమారు 3.17 మిలియన్ యువాన్లు (సుమారు రూ.4.5 కోట్లు) వేతన పరిహారం లభిస్తున్నట్లు కనిపించింది. ఇందులో 8.2 లక్షల యువాన్లకు పైగా నగదు బోనస్ (దాదాపు రూ.1.17 కోట్లు), 2.35 మిలియన్ యువాన్ల విలువైన స్టాక్ ప్రోత్సాహకాలు (సుమారు రూ.3.35 కోట్లు) కూడా ఉన్నట్లు వెల్లడైంది. ఈ వివరాలు చైనీస్ సోషల్ మీడియాలో వేగంగా వైరల్ కావడంతో ఉద్యోగుల వేతనాలు, కంపెనీల గోప్యతా విధానాలపై తీవ్ర చర్చ మొదలైంది.టెన్సెంట్ అంతర్గత క్రమశిక్షణా నోటీసు ప్రకారం.. యే సున్నితమైన కార్పొరేట్ సమాచారాన్ని సంస్థ వెలుపలికి చేరవేసినందుకు అతన్ని తొలగించినట్లు పేర్కొంది. ఈ లీక్ కంపెనీకి అంతర్గతంగా, బాహ్యంగా తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిందని సంస్థ అభిప్రాయపడింది. అంతేకాదు, భవిష్యత్తులో టెన్సెంట్లో ఎలాంటి ఉద్యోగానికి కూడా అతడిని పరిగణించబోమని, శాశ్వతంగా బ్లాక్‌లిస్ట్ చేసినట్లు సమాచారం.ఇటీవలి కాలంలో టెన్సెంట్ తన కంప్లయెన్స్, అవినీతి నిరోధక చర్యలను మరింత కఠినతరం చేసింది. కంపెనీ విడుదల చేసిన తాజా వార్షిక నివేదిక ప్రకారం, 2025లో 70కు పైగా నిబంధనల ఉల్లంఘనలు గుర్తించగా, వాటి ఫలితంగా 90 మందికి పైగా ఉద్యోగులను తొలగించారు. మరో 20కు పైగా కేసులను క్రిమినల్ విచారణ కోసం చట్ట అమలు సంస్థలకు పంపించారు. టెన్సెంట్ విధానాల ప్రకారం ఉద్యోగులు వ్యాపార రహస్యాలు, అంతర్గత కమ్యూనికేషన్లు, విడుదల కాని సోర్స్ కోడ్, ఉద్యోగుల రికార్డులు వంటి గోప్య సమాచారాన్ని బహిర్గతం చేయడం నిషేధితం. -
ఇండియా పాస్‌పోర్ట్ పవర్ తగ్గిందా?
ప్రపంచ దేశాల పాస్‌పోర్ట్‌ల బలాన్ని అంచనా వేసే హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ 2026 (జూలై ఎడిషన్)లో భారత పాస్‌పోర్ట్ ర్యాంకింగ్ మరోసారి పడిపోయింది. ఫిబ్రవరిలో 75వ స్థానానికి చేరిన భారత్, మేలో 78వ స్థానానికి జారగా, తాజాగా 81వ స్థానానికి పడిపోయింది. ప్రస్తుతం భారత పాస్‌పోర్ట్‌తో ప్రపంచంలోని 55 దేశాలకు వీసా లేకుండా లేదా వీసా-ఆన్-అరైవల్ సౌకర్యంతో ప్రయాణించవచ్చు. ఈ ర్యాంకింగ్ 199 దేశాల పాస్‌పోర్ట్‌లను, 227 గమ్యస్థానాలకు ఉన్న వీసా సౌకర్యాల ఆధారంగా రూపొందించారు.ఈ ఏడాది ప్రారంభంలో భారత్ 85వ స్థానంలో ఉండగా, ఫిబ్రవరిలో ఒక్కసారిగా 75వ స్థానానికి ఎగబాకింది. అయితే తరువాతి నెలల్లో ఇతర దేశాల వీసా విధానాల్లో వచ్చిన మార్పులు, ప్రపంచవ్యాప్తంగా ప్రయాణ సౌకర్యాల పునర్వ్యవస్థీకరణ ప్రభావంతో భారత్ మళ్లీ క్రమంగా దిగజారింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, హెన్లీ ఇండెక్స్‌లో ర్యాంకు మార్పు అనేది ఒక దేశానికి లభించే వీసా-రహిత గమ్యస్థానాల సంఖ్యతో పాటు ఇతర దేశాల పనితీరుపైనా ఆధారపడి ఉంటుంది.హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ 20వ వార్షికోత్సవ ఎడిషన్ ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా సగటు పాస్‌పోర్ట్‌కు 2006లో 58 గమ్యస్థానాలకు మాత్రమే వీసా-రహిత ప్రవేశం ఉండగా, ప్రస్తుతం అది 108 గమ్యస్థానాలకు పెరిగింది. ఈ ఇండెక్స్‌ను ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ (IATA) టిమాటిక్ డేటా ఆధారంగా రూపొందిస్తారు.ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్‌గా సింగపూర్ మరోసారి అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. సింగపూర్ పౌరులు 192 గమ్యస్థానాలకు వీసా-రహిత లేదా వీసా-ఆన్-అరైవల్ సౌకర్యంతో ప్రయాణించవచ్చు. జపాన్, దక్షిణ కొరియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాయి. యూఏఈ ఈ ఏడాది అత్యధిక పురోగతి సాధించి మూడు స్థానాలు ఎగబాకి రెండో ర్యాంక్‌ను చేరుకుంది. మరోవైపు అమెరికా 10వ స్థానంలో కొనసాగుతోంది. -
గూగుల్‌లో పెట్టుబడి.. అసలు రహస్యం ఇదే!
ప్రముఖ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ 2025 చివరి నాటికి బెర్క్‌షైర్ హాత్వే సీఈఓ పదవి నుంచి వైదొలగి.. ఛైర్మన్‌గా మాత్రమే ఉంటున్నారు. అయితే ఈయన ఈ వయసులో ఎలాంటి పెట్టుబడికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదని, కొత్త సీఈఓ 'గ్రెగ్ అబెల్' అన్నీ చూసుకుంటారని అందరూ అనుకున్నారు.కానీ, ఒక ఇంటర్వ్యూలో బఫెట్ మాట్లాడుతూ.. గూగుల్ మాతృ సంస్థ 'ఆల్ఫాబెట్'లో బెర్క్‌షైర్ పెట్టిన లేటెస్ట్ ఇన్వెస్ట్మెంట్ వెనుక అసలు మాస్టర్ మైండ్ తానేనని వెల్లడించారు.నిజానికి ఈ పెట్టుబడి నిర్ణయం అంతా గ్రెగ్ అబెల్ తీసుకున్నారనే భావించారు. కానీ.. సీఈఓగా తుది నిర్ణయం ఆయనే తీసుకున్నప్పటికీ, అసలు ఈ ఐడియా పుట్టింది మాత్రం బఫెట్ మైండ్‌లోనే. "నేను అతడి ఆమోదం లేకుండా ఏదీ చేయను, అతను నా ఆమోదం లేని పని చేయడు. మేమిద్దరం ఎప్పుడూ మాట్లాడుకుంటూనే ఉంటాం, కానీ ఫైనల్ డెసిషన్ మాత్రం గ్రెగ్ అబెల్ దే" అని బఫెట్ చాలా సింపుల్‌గా చెప్పారు.అయితే గూగుల్‌లో ఇంత ఆలస్యంగా ఇన్వెస్ట్ చేయడానికి అసలు కారణం ఏంటో కూడా బఫెట్ ఓపెన్‌గా చెప్పేశారు. అప్పట్లో గూగుల్ కంపెనీ టెక్నాలజీ రంగంలో ఇంతలా ఎదుగుతుందని బఫెట్ నమ్మలేకపోయారట. అందుకే పెట్టుబడులు పెట్టలేదు. తాను 'పొరపాటు చేశానని' వారెన్ బఫెట్ అన్నారు. ఆ పశ్చాత్తాపం నుంచి బయటపడటానికే ఇప్పుడు ఆల్ఫాబెట్లో భారీగా పెట్టుబడులు పెట్టారు. -
హింద్ జింక్ లాభం డబుల్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో వేదాంత గ్రూప్ సంస్థ హిందుస్తాన్ జింక్ (హెచ్‌జెడ్‌ఎల్) నికర లాభం రెట్టింపునకు పైగా పెరిగి రూ. 5,469 కోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఇది రూ. 2,234 కోట్లు. ఇక ఆదాయం సైతం 72 శాతం ఎగిసి రూ. 13,033 కోట్లకు పెరిగింది. క్రితం క్యూ1లో ఇది రూ. 7,591 కోట్లు.లోహాల ధరలు .. ఉత్పత్తి పెరగడం, బై–ప్రోడక్టుల ద్వారా మరింత ఆదాయం లభించడం, డాలరు పటిష్టంగా ఉండటం తదితర అంశాల కారణంగా ఆదాయం గణనీయంగా వృద్ధి చెందినట్లు కంపెనీ తెలిపింది. మరోవైపు, ప్రభుత్వ రంగ ఉక్కు దిగ్గజం సెయిల్ మాజీ సీఎండీ అమరేందు ప్రకాశ్‌ని చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, హోల్ టైమ్ డైరెక్టర్‌గా నియమించుకున్నట్లు వివరించింది. ఇది ఆగస్టు 1 నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొంది. -
భారీగా తగ్గిన బ్యాంక్ ఆఫ్ బరోడా లాభం.. కేసు సెటిల్మెంట్ ఎఫెక్ట్!
ముంబై: ఎన్ఎంసీ గ్రూప్ వివాదం విషయంలో కోర్టు వెలుపల సెటిల్మెంట్ కోసం భారీగా రూ. 5,680 కోట్లు చెల్లించడం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ)పై తీవ్ర ప్రభావం చూపింది. దీనితో బ్యాంకు లాభం రూ. 1,783 కోట్లకు పరిమితమైంది. గత ఆర్థిక సంవత్సరం క్యూ1తో పోలిస్తే ఇది 48% తక్కువ. అనేక సంవత్సరాలుగా సాగుతున్న సంక్లిష్టమైన వివాదానికి ముగింపు పలికేందుకు అవుట్ ఆఫ్ కోర్టు సెటిల్మెంట్ చేసుకోవడం వ్యాపారపరంగా సరైన నిర్ణయమని బ్యాంకు సీఈవో, ఎండీ దేవదత్త చాంద్ తెలిపారు. దివాలా తీసిన యూఏఈ సంస్థ ఎన్ఎంసీ గ్రూప్ రుణాల మోసంలో బీవోబీ పాత్ర కూడా ఉందంటూ అబుదాబి ఇంగ్లండ్, వేల్స్ కోర్టుల్లో విచారణ జరుగుతోంది. దీని సెటిల్మెంట్కి అబుధాబి బ్రాంచ్ ద్వారా 600 మిలియన్ డాలర్లు (రూ. 5,700 కోట్లు) చెల్లించినట్లు బీవోబీ జూలై 2న వెల్లడించింది. జూన్ త్రైమాసికంలో 17 శాతం రుణాల వృద్ధితో బ్యాంకు రూ. 12,524 కోట్ల నికర వడ్డీ ఆదాయాన్ని ఆర్జించగా, నికర వడ్డీ మార్జిన్ 2.91 శాతం నుంచి 2.77 శాతానికి నెమ్మదించింది. స్థూల మొండిబకాయిలు 1.89 శాతం నుంచి 1.99 శాతానికి పెరిగాయి. -
700 సార్లు రిజెక్ట్ చేశారు.. అయినా పట్టుదలతో..
సాంకేతిక నేపథ్యం లేదు.. చేతిలో ఐఐటీ, ఎన్ఐటీల డిగ్రీలు లేవు.. కంపెనీ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ల నుంచి వరుస నిరాకరణలు.. కుటుంబ సభ్యుల్లో నిరాశ, భవిష్యత్తుపై తీవ్ర భయాందోళనలు. అయినా సరే పట్టుదల వీడకుండా పోరాడి, కేవలం రెండేళ్ల వ్యవధిలోనే నెలకు రూ.25,000 జీతం నుంచి ఏకంగా రూ.22 లక్షల వార్షిక వేతనానికి ఎదిగిన ఓ 24 ఏళ్ల యువకుడి కథనం ఇప్పుడు సోషల్ మీడియా, కార్పొరేట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.ఎంబీఏ నుంచి డేటా సైన్స్ వైపు2022లో ఒక సాధారణ కళాశాల నుంచి బీబీఏ పూర్తి చేసిన సదరు యువకుడు క్యాట్ (సీఏటీ) రాసి మంచి మేనేజ్మెంట్ కళాశాలలో సీటు సాధించడానికి ఏళ్ల సమయం పడుతుందని గ్రహించాడు. సమయం వృథా చేయకూడదనే ఉద్దేశంతో తన మార్గాన్ని డేటా సైన్స్ వైపు మళ్లించాడు. నాన్-టెక్ బ్యాక్‌గ్రౌండ్ అయినప్పటికీ యూట్యూబ్, కొన్ని వంటి డిజిటల్ వేదికల ద్వారా దాదాపు ఏడాదిన్నర పాటు స్వయంగా కోడింగ్, డేటా ఎనలిటిక్స్ నేర్చుకున్నాడు. స్నేహితులు ఉన్నత ఉద్యోగాలు, పైచదువుల కోసం విదేశాలకు వెళ్తున్న సమయంలో తాను మాత్రం గదికే పరిమితమై, తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతూనే నైపుణ్యాలను పెంపొందించుకున్నాడు.700 దరఖాస్తులు.. ఉద్యోగ సంక్షోభంటెక్ డిగ్రీ, అనుభవం లేదన్న కారణంతో 90 శాతానికి పైగా హెచ్ఆర్లు అతడి ప్రొఫైల్‌ను తిరస్కరించారు. దాదాపు 700కు పైగా కంపెనీలకు దరఖాస్తు చేసుకున్నాక నెలకు రూ.25,000 జీతంతో ఒక స్టార్టప్‌లో తొలి ఉద్యోగం లభించింది. అయితే, ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు. మూడు నెలలకే కంపెనీలో ప్రాజెక్టులు లేక ఉద్యోగం పోయింది. రెండు నెలల జీతం కూడా బకాయి పడింది. ఆ విషయాన్ని ఇంట్లో చెప్పకుండా ధైర్యంతో మళ్లీ లింక్డ్ఇన్లో దరఖాస్తులు చేస్తూ నాలుగు నెలల తర్వాత రూ.6 లక్షల ప్యాకేజీతో మరో ఉద్యోగం సాధించాడు.ఆ కంపెనీలో 1.7 ఏళ్లు పనిచేస్తూ సమాంతరంగా నైపుణ్యాలను మరింత పదును పెట్టుకున్న అతడు తాజాగా ఒక ప్రముఖ అమెరికన్ ఎంఎన్సీలో రూ.22 లక్షల వేతనంతో ఆఫర్ లెటర్ సాధించాడు. డిగ్రీల కంటే నిరంతర నైపుణ్యాభివృద్ధి, మానసిక స్థిరత్వం ఉన్నవారికి నేటి డిజిటల్ యుగంలో ఆకాశమే హద్దు అని ఈ సంఘటన స్పష్టం చేస్తోంది.ఇదీ చదవండి: ఒక్క బ్యాంకూ లోన్ ఇవ్వకపోయినా ‘డీటీడీసీ’ ఎలా సాధ్యమైందంటే.. -
ఒక్క బ్యాంకూ లోన్ ఇవ్వకపోయినా ‘డీటీడీసీ’ సాధ్యమైందిలా..
ఒక పారిశ్రామికవేత్త విజయతీరాలకు చేరడానికి కేవలం మూలధనం, వ్యాపార వ్యూహాలు ఉంటే సరిపోవు. క్లిష్ట సమయాల్లో అండగా నిలిచే అపరిమితమైన విశ్వాసం, అంతులేని పట్టుదల కూడా చాలా అవసరమని నిరూపించారు భారతీయ లాజిస్టిక్స్ దిగ్గజం ‘డీటీడీసీ’ వ్యవస్థాపకుడు, సీఎండీ సుభాశిష్ చక్రవర్తి. వ్యాపార ఆలోచన ఎంత గొప్పదైనా బ్యాంకు తలుపులు తడితే నిరాశే ఎదురైన వేళ.. భార్య అందించిన ఆత్మీయ ప్రోత్సాహంతో ప్రారంభమైన ఆయన ప్రయాణం నేడు రూ.2,000 కోట్ల విలువైన వ్యాపార సామ్రాజ్యంగా అవతరించింది.బ్యాంకుల తిరస్కరణ.. భార్య ప్రోత్సాహంచదువుకునే రోజుల్లోనే వ్యాపారంలో అడుగుపెట్టిన సుభాశిష్.. కెమికల్ డిస్ట్రిబ్యూషన్ రంగంలో ఉన్నప్పుడు ఒక ప్రధాన సమస్యను గమనించారు. వినియోగదారులకు సరుకులు చేరినంత వేగంగా దానికి సంబంధించిన కాగితపత్రాలు (పేపర్‌వర్క్) అందడం లేదని గ్రహించారు. ఆ లోపాన్నే ఒక వ్యాపార అవకాశంగా మార్చుకోవాలనుకున్నారు. అలా ఉద్భవించిందే డోర్-టు-డోర్ డెలివరీ స్టార్టప్ ఆలోచన. అయితే ఈ ప్రాజెక్ట్‌కు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు నిరాకరించాయి. ఆ సంక్షోభ సమయంలో ఆయన భార్య తపసి చక్రవర్తి తన ఒంటిపై ఉన్న పసిడి ఆభరణాలను కుదువబెట్టి పెట్టుబడిగా ఆ డబ్బును అందించారు. ఆ విశ్వాసమే డీటీడీసీ ఆవిర్భావానికి పునాదిగా మారింది.ఫ్రాంచైజీ మోడల్‌తో విప్లవంఆర్థిక పరిమితులు ఉన్నప్పటికీ విస్తరణకు సరికొత్త దారి వెతికారు సుభాశిష్. భారతీయ లాజిస్టిక్స్ రంగంలోనే తొలిసారిగా ‘ఫ్రాంచైజీ మోడల్’ను ప్రవేశపెట్టారు. నిధులకు బదులుగా మానవ వనరుల భాగస్వామ్యంతో నెట్‌వర్క్‌ను పెంచుకుంటూ పోయారు. ఫలితంగా ప్రస్తుతం డీటీడీసీకి 16,500 కంటే ఎక్కువ మంది ఛానెల్ పార్టనర్లు ఉన్నారు. దేశంలోని 96 శాతం జనాభాకు ఈ సంస్థ సేవలు అందుబాటులో ఉండగా, ప్రపంచవ్యాప్తంగా ఏడు దేశాల్లో కార్యాలయాలు ఉన్నాయి. రోజూ సుమారు 1,00,000 మంది సిబ్బంది క్షేత్రస్థాయిలో పనిచేస్తూ ఏటా దాదాపు 19 కోట్ల పార్సెళ్లను విజయవంతంగా డెలివరీ చేస్తున్నారు.నవతరం స్టార్టప్‌లకు మార్గదర్శనం‘ఇవాళ మీకు ఎదురయ్యే తిరస్కరణలు మీ ప్రయాణానికి ముగింపు కాదు. మిమ్మల్ని మీరు నమ్మేంతవరకు మిమ్మల్ని నమ్మే ఒక వ్యక్తి తోడున్నా చాలు’ అని సుభాశిష్ చక్రవర్తి పేర్కొన్న వ్యాఖ్యలు నేటి యువ పారిశ్రామికవేత్తలకు దిక్సూచిలాంటివి. ఒక సాదాసీదా మహిళ చూపిన నమ్మకం, వేలాది మంది చిన్న తరహా భాగస్వాములను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడమే అసలైన భారతీయ వ్యాపార విజయం.ఇదీ చదవండి: ‘జాదూగర్’ ఆటకట్టించిన సెబీ -
‘జాదూగర్’ ఆటకట్టించిన సెబీ
యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ ఫ్రంట్ రన్నింగ్ కుంభకోణంలో క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ కీలకమైన ఉత్తర్వులను వెలువరించింది. ఈ అక్రమాలకు ప్రధాన సూత్రధారి అయిన యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ మాజీ చీఫ్ డీలర్ వీరేష్ జోషితో పాటు దుబాయ్‌కి చెందిన ప్రధాన ట్రేడర్ ప్రిజేష్ కురానీలను సెక్యూరిటీస్ మార్కెట్ నుంచి ఏడేళ్ల పాటు నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది.రూ.30.56 కోట్ల అక్రమ లాభాల జప్తుఈ కుంభకోణం ద్వారా ఆర్జించిన రూ.30.56 కోట్ల అక్రమ లాభాలను ఇప్పటికే స్వాధీనం చేసుకున్న సెబీ ఆ మొత్తాన్ని ‘ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ అండ్ ఎడ్యుకేషన్ ఫండ్’కి తరలించాలని ఆదేశించింది. దీనికి అదనంగా దర్యాప్తు కాలం ముగిసిన నాటి నుంచి డిపాజిట్ చేసే తేదీ వరకు సంవత్సరానికి 12 శాతం చొప్పున వడ్డీని కూడా జరిమానాగా చెల్లించాలని స్పష్టం చేసింది.అసలు వివాదం ఏమిటి?సాధారణంగా మ్యూచువల్ ఫండ్ సంస్థలు (యాక్సిస్ వంటివి) మార్కెట్లో ఏదైనా ఒక కంపెనీ షేర్లను వేల కోట్లలో కొనుగోలు చేయడానికి లేదా అమ్మడానికి సిద్ధమైనప్పుడు ఆ షేరు ధర మార్కెట్లో ఒక్కసారిగా పెరగడం లేదా తగ్గడం జరుగుతుంది. ఈ సమాచారం బయటకు రాకముందు అత్యంత రహస్యంగా ఉంటుంది.యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ మాజీ చీఫ్ డీలర్ వీరేష్ జోషి తన వద్ద ఉన్న ఈ రహస్య ట్రేడింగ్ సమాచారాన్ని ఆసరాగా చేసుకున్నాడు. యాక్సిస్ ఫండ్ మార్కెట్లో ఏ షేరును ఎంత పరిమాణంలో కొనుగోలు చేయబోతుందో లేదా అమ్మబోతుందో వీరేష్ జోషి ముందే తెలుసుకునేవాడు. ఈ ముందస్తు సమాచారాన్ని దుబాయ్‌లో ఉన్న ప్రధాన ట్రేడర్ ప్రిజేష్ కురానీకి చేరవేసేవాడు (ఈ చాటింగ్‌లలో జోషిని ‘జాదూగర్’ అని పిలిచేవారు). యాక్సిస్ ఫండ్ తన భారీ ఆర్డర్‌ను మార్కెట్లో పెట్టడానికి కొద్ది నిమిషాల ముందే కురానీ తన వద్ద ఉన్న బినామీ/బోగస్ ఖాతాల ద్వారా ఆ షేర్లను తక్కువ ధరకు కొనేసేవాడు. ఆ వెంటనే యాక్సిస్ ఫండ్ భారీ ఆర్డర్ మార్కెట్లోకి రాగానే షేరు ధర పెరిగేది. అప్పుడు కురానీ ముందే కొన్న షేర్లను అధిక ధరకు యాక్సిస్ ఫండ్కే (లేదా మార్కెట్లో) అమ్మేసి రూ.కోట్లలో లాభాలు గడించేవాడు. సెబీ జరిపిన సమగ్ర విచారణలో సెప్టెంబర్ 1, 2021 నుంచి మార్చి 31, 2022 మధ్యకాలంలో ఈ అక్రమాలు సాగినట్లు తేలింది.సిండికేట్‌పై కఠిన చర్యలువాట్సాప్ చాట్లు, ట్రేడ్ లాగ్‌లు, కాల్ రికార్డుల ఆధారంగా సెబీ ఈ బినామీ వ్యవస్థను ఛేదించింది. తీవ్రతను బట్టి నెట్‌వర్క్‌లోని మిగిలిన భాగస్వాములపై విభిన్న నిషేధాలు విధించింది.7 ఏళ్ల నిషేధం: వీరేష్ జోషి, ప్రిజేష్ కురానీతో పాటు ధరిణి కురానీ, రేఖా కురానీ, భారతి గొడాయా సహా ఏడుగురు.5 ఏళ్ల నిషేధం: బినామీ ఖాతాలు, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసిన సుమిత్ దేశాయ్, ప్రణవ్ వోరా.3 ఏళ్ల నిషేధం: వైభవ్ పాండ్యా, నిశిల్ మార్ఫాటియా, ఆల్గా ట్రేడింగ్, వీసా క్యాపిటల్ పార్టనర్స్ సహా మరో 12 మంది వ్యక్తులు, సంస్థలపై.సాధారణ ఇన్వెస్టర్లు మ్యూచువల్ ఫండ్స్‌పై ఉంచిన నమ్మకాన్ని సొమ్ము చేసుకుంటూ సాగించిన ఈ కార్పొరేట్ అక్రమాన్ని సెబీ నిరోధించిన తీరు మార్కెట్ పారదర్శకతకు, ఇన్వెస్టర్ల విశ్వాస పునరుద్ధరణకు దారితీస్తుంది. ఇన్సైడర్ ట్రేడింగ్, ఫ్రంట్ రన్నింగ్ లాంటి అక్రమాలకు పాల్పడే ఏ శక్తికీ మార్కెట్లో చోటు లేదని సెబీ ఈ తీర్పు ద్వారా స్పష్టమైన హెచ్చరిక పంపింది.ఇదీ చదవండి: ఎగుమతులకు రెక్కలొచ్చేనా? -
రూ.8 లక్షల కోట్ల మార్కెట్‌పై కన్ను!
ఎఫ్ఎంసీజీ దిగ్గజం ఐటీసీ భారీ లక్ష్యాలు నిర్దేశించుకుంది. వచ్చే దశాబ్దకాలంలో (2035 నాటికి) ఎఫ్ఎంసీజీ విభాగంలో తమ ఉత్పత్తులకు సంబంధించి రూ. 8 లక్షల కోట్లకు వృద్ధి చెందనున్న మార్కెట్లో అవకాశాలను అందిపుచ్చుకోవడంపై మరింతగా దృష్టి పెడుతున్నట్లు సంస్థ సీఎండీ సంజీవ్ పురి తెలిపారు.ప్రీమియం ఉత్పత్తులు, యువ జనాభా ఇందుకు తోడ్పడనున్నట్లు సంస్థ వార్షిక సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పారు. ఇతర సంస్థలను కొనుగోలు చేయడం ద్వారా కూడా అధిక వృద్ధికి అవకాశమున్న విభాగాల్లో విస్తరిస్తున్నట్లు వివరించారు. మారుతున్న కొనుగోలుదారుల అవసరాలను అర్థం చేసుకునేందుకు కృత్రిమ మేథ (ఏఐ) సాధనాలను ఉపయోగిస్తున్నట్లు పురి తెలిపారు.ఆన్లైన్, క్విక్ కామర్స్ మాధ్యమాలు వేగంగా విస్తరిస్తున్నాయని, స్మార్ట్ సరఫరా వ్యవస్థలు అనేక ఉత్పత్తులను కొనుగోలుదారుల ఇంటి వద్దకు సురక్షితంగా చేరుస్తున్నాయని చెప్పారు. ఐటీసీ ఎఫ్ఎంసీజీ పోర్ట్‌ఫోలియోలో ప్రస్తుతం 30 పైగా ప్రపంచ స్థాయి బ్రాండ్స్ ఉన్నాయని పురి తెలిపారు.2021 ఆర్థిక సంవత్సరంలో రూ. 14,720 కోట్లుగా ఉన్న ఆదాయం 2026 ఆర్థిక సంవత్సరంలో రూ. 24,200 కోట్లకు ఎగిసిందన్నారు. మరోవైపు పాలసీలపరంగా వివిధ సంస్కరణల తోడ్పాటుతోనే భారత్ అత్యంత వేగవంతంగా వృద్ధి చెందుతున్న ఎకానమీగా నిలుస్తోందని పురి తెలిపారు. -
జాతి వివక్ష ఆరోపణలు.. ఎలాన్ మస్క్ క్లారిటీ!
ప్రపంచ కుబేరుడు.. టెస్లా, స్పేస్ఎక్స్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్ మరోసారి జాతి వివక్ష ఆరోపణల నేపథ్యంలో వార్తల్లో నిలిచారు. అయితే.. ఈసారి సోషల్ మీడియాలో స్పందించకుండా, తన కుటుంబం గురించే ప్రస్తావిస్తూ తాను జాతి వివక్షను నమ్మే వ్యక్తిని కాదని స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.తన భార్య శివోన్ జిలిస్ భారతీయ మూలాలున్న మహిళ అని మస్క్ వెల్లడించారు. ఆమె తల్లి భారతీయురాలు. అయితే జిలిస్ కెనడాలో పెరిగిందని చెప్పారు. తమకు నలుగురు పిల్లలు ఉన్నారని, వారిలో ఒక కుమారుడికి భారతీయ సంతతికి చెందిన ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్ పేరు పెట్టాము. అలాంటప్పుడు నన్ను జాతి వివక్షవాదిగా ఎలా అంటారు?, అని మస్క్ ప్రశ్నించారు.మస్క్ కుమారుడి పేరు స్ట్రైడర్ శేఖర్ సిరియస్. నక్షత్రాల పరిణామం, నిర్మాణంపై చేసిన అద్భుతమైన కృషికి గాను 1983లో భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి గెలుచుకున్న భారత సంతతికి చెందిన ఖగోళ భౌతిక శాస్త్రవేత్త సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్‌కు నివాళిగా 'శేఖర్' అనే మధ్య పేరు పెట్టారు. ఈ విషయాన్ని మస్క్ నిఖిల్ కామత్‌తో జరిగిన ఒక పాడ్‌కాస్ట్‌లో చెప్పారు.జాతి వివక్ష ఆరోపణలకు కారణంగత కొంతకాలంగా వలసలు, జాతి అంశాలు, రాజకీయాలపై మస్క్ చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. యూరప్‌లోని కొన్ని మితవాద రాజకీయ పార్టీలకు ఆయన మద్దతు ఇవ్వడం, వలసలపై చేసిన వ్యాఖ్యలు విమర్శలకు దారితీశాయి. దీంతో ఆయనపై జాతి వివక్ష ఆరోపణలు కూడా వచ్చాయి.అయితే.. ఈ ఆరోపణలను మస్క్ ఎప్పటికప్పుడు ఖండిస్తూనే ఉన్నారు. తన కుటుంబం వివిధ సంస్కృతులు, భిన్న నేపథ్యాల కలయికకు నిదర్శనమని, అలాంటి వ్యక్తిని జాతి వివక్షవాదిగా చెప్పడం సరైంది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. తన వ్యక్తిగత జీవితం, కుటుంబ నేపథ్యమే ఈ ఆరోపణలకు సమాధానమని మస్క్ పేర్కొన్నారు.ఇదీ చదవండి: అమెరికా అప్రమత్తం.. AI నియంత్రణకు కొత్త చట్టం! -
నెలకు రూ.2 లక్షల జీతం.. అప్పుల ఊబిలో ఐటీ ఉద్యోగి!
నెలకు రూ.2 లక్షల జీతం వస్తే.. ఎలాటి ఇబ్బందులు లేకుండా జీవితం సాఫీగా ముందుకు సాగిపోతుందని చాలామంది అనుకుంటారు. కానీ ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక పోస్ట్ దీనికి భిన్నంగా ఉంది. ఇది నెటిజన్లను ఆశ్చర్యపోయేలా చేయడం మాత్రమే కాకుండా.. ఆలోచింపజేసింది కూడా. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.ఒక 27 ఏళ్ల ఐటీ ఉద్యోగి తన జీవితంలో ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందుల గురించి రెడ్డిట్‌లో వెల్లడించాడు. నెలకు రూ.2 లక్షల జీతం వస్తున్నప్పటికీ సమస్యల వలయంలో చిక్కుకున్నట్లు పేర్కొన్నాడు. పెళ్లి తర్వాత తన జీవితంలో వరుసగా ఎన్నో పెద్ద ఖర్చులు వచ్చాయని చెప్పాడు.పెళ్లి ఖర్చులతో పాటు.. కుటుంబ సభ్యులకు అత్యవసర పరిస్థితుల్లో ఆర్థిక సహాయం చేయాల్సి వచ్చింది. కొన్ని నెలలకే భార్యతో కలిసి మరో నగరానికి మారాల్సి రావడంతో కొత్త ఇంటిని పూర్తిగా ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ఇంటి అద్దె, అడ్వాన్స్, ఫర్నిచర్, ఎలక్ట్రానిక్ వస్తువులు, వంట సామగ్రి వంటి అవసరాల కోసం లక్షల రూపాయలు ఖర్చయ్యాయని టెకీ పేర్కొన్నాడు.ఇంతలో మరో ఊహించని సమస్య ఎదురైంది. తన భార్య ఉద్యోగం కోల్పోవడంతో.. కుటుంబం మొత్తం ఒక్కరి జీతంపైనే ఆధారపడాల్సి వచ్చింది. ఆదాయం తగ్గిపోకపోయినా, బాధ్యతలు మాత్రం ఒక్కసారిగా పెరిగిపోయాయి. దీంతో అప్పులు చేయడం తప్ప.. మరో మార్గం కనిపించలేదని ఆయన వివరించాడు.Earning ₹2L/month but drowning in debt, need adviceby u/lonewolf_2298 in FinancialAdviceIndiaప్రస్తుతం ఆయన బంధువుల నుంచి తీసుకున్న రూ.20 లక్షల అప్పుకు ప్రతి నెల రూ.25 వేల చెల్లిస్తున్నారు. మరోవైపు పర్సనల్ లోన్ ఈఎంఐ కూడా రూ.25 వేల వరకు ఉంది. అదనంగా క్రెడిట్ కార్డు ఈఎంఐల కోసం ప్రతి నెల దాదాపు రూ.30 వేల చెల్లిస్తున్నారు. ఈ ఈఎంఐలు మరో రెండు నెలల్లో పూర్తవుతాయని, ఆ తర్వాత కొంత ఉపశమనం లభిస్తుందని అతడు ఆశాభావం వ్యక్తం చేశారు.అంతేకాకుండా.. రూ.6 లక్షల విలువైన మ్యూచువల్ ఫండ్లను తాకట్టు పెట్టి రూ.2.2 లక్షల లోన్ తీసుకున్నారు. ప్రస్తుతం చేతిలో సేవింగ్స్ లేకపోవడమే కాకుండా.. అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడే ఎమర్జెన్సీ ఫండ్ కూడా లేదని చెప్పారు. ఈ పరిస్థితి తనను తీవ్ర ఒత్తిడికి గురి చేస్తోందని ఆయన పేర్కొన్నారు.అయితే తన పరిస్థితిపై ఎవరి సానుభూతి అవసరం లేదని, ఈ సమస్య నుంచి వచ్చే రెండు నుంచి మూడు సంవత్సరాల్లో ఎలా బయటపడాలో చెప్పాలని రెడ్డిట్ యూజర్లను కోరారు. దీనికి స్పందించిన చాలామంది ముందుగా అవసరం లేని ఖర్చులను తగ్గించాలని, అధిక వడ్డీ ఉన్న అప్పులను త్వరగా తీర్చాలని, మళ్లీ పొదుపు ప్రారంభించాలని సూచించారు. అలాగే కుటుంబంలో ఇద్దరూ సంపాదించే పరిస్థితి వస్తే.. ఆర్థిక ఒత్తిడి గణనీయంగా తగ్గుతుందని అభిప్రాయపడ్డారు.ఈ సంఘటన మనకు ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పుతుంది. ఎక్కువ జీతం వస్తే.. అదే ఆర్ధిక భద్రత ఉన్నట్లు కాదు. జీవితంలో అనుకోకుండా వచ్చే బాధ్యతలు, అత్యవసర ఖర్చులు, సరైన ఆర్థిక ప్రణాళిక లేకపోవడం వల్ల ఎవరైనా అప్పుల ఊబిలో చిక్కుకోవచ్చు. కాబట్టి.. ఎంత ఆదాయం ఉన్నా కొంత మొత్తాన్ని పొదుపు చేయడం, అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవడం, అవసరం లేని అప్పులకు దూరంగా ఉండడం చాలా ముఖ్యం. డబ్బు సంపాదించడం ఒక కళ అయితే, దానిని సరిగ్గా నిర్వహించడం అంతకంటే గొప్ప నైపుణ్యం. -
ఐఫోన్ రాలేదు, ఆయిల్ వచ్చింది.. కట్ చేస్తే రూ. 1.81 లక్ష
ఆన్లైన్ షాపింగ్ షాకింగ్ అనుభవాన్నిచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఖరీదైన గాడ్జెట్లు ఆర్డర్ ఇస్తే.. ఇటుకలు, సోప్‌లు వచ్చిన సంఘటనలు గతంలో అనేకం చూశాం. అయితే జరిగిన మోసం పట్ల సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయడం చాలా మంచిదని చాటి చెప్పే సంఘటన ఇది. అలా ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart) కు భారీ షాక్ తగిలింది.అసలు ఏం జరిగిందంటే...ఆన్లైన్ ద్వారా ఆపిల్ ఐఫోన్ (Apple iPhone) ఆర్డర్ చేస్తే దానికి బదులుగా Beard Growth Oil పార్శిల్ పంపింది ఫ్లిప్‌కార్ట్. ముంబైలోని పవాయ్కు చెందిన వినియోగదారుడు 2023 ఏప్రిల్ 22న ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 1,11,793 విలువైన 'ఆపిల్ ఐఫోన్ 14 ప్రో (128 GB)'ను నో-కాస్ట్ ఈఎంఐ (No-cost EMI) ద్వారా ఆర్డర్ చేశారు. బాక్స్ ఓపెన్ చేసి చూడగా ఫోన్‌కు బదులుగా గడ్డం పెరిగే నూనె సీసా ఉంది.తొలుత పట్టించుకోని ఫ్లిప్‌కార్ట్ దీనిపై కస్టమర్ కేర్‌కు పదే పదే ఫిర్యాదు చేసినా, అవసరమైన ఆధారాలు అందించినా సమస్య పరిష్కరించకుండానే ఫ్లిప్‌కార్ట్ ఆ కస్టమర్ కంప్లైంట్‌ను రిసాల్వ్డ్ అని క్లోజ్ చేస్తూ వచ్చింది. దీంతో చిర్రెత్తుకొచ్చిన కస్టమర్ ఫిర్యాదులను ఏమాత్రం పట్టించుకోకుండా క్లోజ్ చేయడంపై వినియోగదారుల ఫోరమ్‌ను ఆశ్రయించారు. దీన్ని విచారించిన ముంబైలోని డిస్ట్రిక్ట్ కన్స్యూమర్ డిస్ప్యూట్స్ రెడ్రెసల్ కమీషన్ కోర్టు వస్తువు విక్రయించాక ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు తమ బాధ్యతల నుంచి తప్పించుకోలేవని తేల్చి చెప్పింది. అతనికి తగిన పరిహారం చెల్లించాలని ఆదేశించింది.పరిహారం ఎంతంటే:ఫోన్ ధర రూ. 1,11,793కు 2023 నుంచి ఏప్రిల్ 22 నుండి 9శాతం వార్షిక వడ్డీతో కలిపి వెనక్కి చెల్లించాలి. అలాగే మానసిక వేదనకు గాను రూ. 50,000 బాధితుడికి చెల్లించాలి. ఇంకా కోర్టుల ఖర్చుల కింద కేసు ఖర్చుల కింద రూ. 20వేలు చెల్లించాలని ఆదేశించింది మొత్తంగా ఫ్లిప్‌కార్ట్ , సెల్లర్ ఉమ్మడిగా రూ. 1.81 లక్షల పైచిలుకు పరిహారాన్ని 45 రోజుల్లోగా చెల్లించాలని తీర్పునిచ్చింది.ఇదీ చదవండి: ధర్మేంద్ర ప్రధాన్‌ను తొలగించేదాకా, చర్చల ప్రసక్తే లేదు : రాహుల్ గాంధీఈ కేసులో ఆపిల్ ఇండియా (Apple India) ను కూడా కస్టమర్ బాధ్యులను చేస్తూ చేర్చారు. అయితే, తమ ఉత్పత్తులను స్వతంత్ర డీలర్ల ద్వారా విక్రయిస్తామని, ప్యాకింగ్ లేదా డెలివరీలో తమ పాత్ర ఏమీ ఉండదని ఆపిల్ వాదించింది. ఈ వాదనను అంగీకరించిన వినియోగదారుల ఫోరమ్ ఆపిల్ ఇండియాపై ఉన్న ఫిర్యాదును కొట్టివేసి, లోపమంతా ఫ్లిప్‌కార్ట్, సెల్లర్‌దేనని తీర్పు ఇచ్చింది.ఇదీ చదవండి: నీట్ ఆందోళనలకు సుప్రీంకోర్టు లాయర్ల మద్దతు, రాజ్యాంగ ప్రవేశిక పఠనం -
అపోలో హాస్పిటల్స్, ఇప్లేన్ ఎంవోయూ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రమాదాల్లో గాయపడిన వారిని సత్వరం ఆస్పత్రికి చేర్చి, కీలక సమయంలో చికిత్స అందేందుకు తోడ్పడేలా యూబిఫ్లై టెక్నాలజీస్ (ఇప్లేన్ కంపెనీ), అపోలో హాస్పిటల్స్ చేతులు కలిపాయి. ఎమర్జెన్సీ హెల్త్ కేర్ వ్యవస్థలో ఎలక్ట్రిక్ ఎయిర్ అంబులెన్స్‌లు, మెడికల్ డెలివరీ డ్రోన్లను వినియోగించే దిశగా అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి.దీనితో పేషంట్లను వేగవంతంగా ఆస్పత్రికి చేర్చేందుకు ఇప్లేన్కి చెందిన ఈ200ఎక్స్ ఎలక్ట్రిక్ ఎయిర్ అంబులెన్స్‌లు, అపోలోకి చెందిన 1066 అంబులెన్స్‌లు..ఆస్పత్రులతో పాటు ఔషధాలు.. ఉత్పత్తులను నిమిషాల్లో సరఫరా చేసే మెడికల్ డెలివరీ డ్రోన్ల వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది. మారుమూల ప్రాంతాల్లోని వారికి కూడా కీలక సమయంలో నాణ్యమైన వైద్యం అందగలదని అపోలో హాస్పిటల్స్ గ్రూప్ చైర్మన్ ప్రతాప్ సి. రెడ్డి తెలిపారు. ఈ భాగస్వామ్యం కింద ఈ200ఎక్స్ ఎయిర్ అంబులెన్స్‌లు, మెడికల్ డెలివరీ డ్రోన్ల కోసం అపోలో ఆర్డర్లు ఇవ్వడానికి, అలాగే ఇప్లేన్లో ఇన్వెస్ట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. -
డెంగ్యూ టీకా ఇక తీసుకోవచ్చు.. డీసీజీఐ అనుమతులు
న్యూఢిల్లీ: డెంగ్యూ నివారణకు ఉద్దేశించిన ’క్యూడెంగా’ టీకా మార్కెటింగ్‌కి ఔషధ రంగ నియంత్రణ సంస్థ డీసీజీఐ అనుమతులు లభించినట్లు టకెడా బయోఫార్మా ఇండియా వెల్లడించింది. డెంగ్యూకి సంబంధించి భారత్‌లో ఆమోదం లభించిన ఈ తొలి టీకాను, 4–60 ఏళ్ల వయస్సు గలవారు తీసుకోవచ్చు.2022లో ప్రవేశపెట్టినప్పటి నుంచి ఈ వేక్సిన్కి 43 దేశాల్లో ఆమోదం లభించిందని, అంతర్జాతీయంగా 3.2 కోట్ల డోస్‌లు సరఫరా అయ్యాయని టకెడా ఇంటర్కాంటినెంటల్ మార్కెట్స్ విభాగం హెడ్ మహేందర్ నాయక్ తెలిపారు. తమ గ్లోబల్ క్లినికల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ఫలితాల ఆధారంగా భారత్‌లో దీనికి ఆమోదం లభించినట్లు వివరించారు. దోమల ద్వారా వ్యాప్తి చెందే ఈ వైరల్ వ్యాధి 125 దేశాల్లో ఉంది. మొత్తం కేసుల్లో భారత్ వాటా మూడో వంతు ఉంటోంది. -
ఇంటికి పిలిస్తే రూ .79,000.. దుబాయ్ కొత్త స్కీమ్!
విదేశాల్లో ఉన్న కుటుంబ సభ్యులు, స్నేహితులను దుబాయ్‌కు ఆహ్వానించే యూఏఈ నివాసితులకు భారీ ప్రోత్సాహకాలు ప్రకటించింది దుబాయ్ ప్రభుత్వం. దుబాయ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకానమీ అండ్ టూరిజం (DET) తాజాగా 'A Dubai Invite' పేరుతో ప్రత్యేక సిటీ అంబాసిడర్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద అర్హత కలిగిన నివాసితులు విదేశాల నుంచి బంధువులు లేదా స్నేహితులను దుబాయ్‌కు తీసుకొస్తే 3,000 దిర్హమ్లకు పైగా (సుమారు రూ.79,000) విలువైన హోటల్ బసలు, రెస్టారెంట్ ఆఫర్లు, పర్యాటక ఆకర్షణల టికెట్లు, లైఫ్‌స్టైల్ ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుంది.ఈ కార్యక్రమం ప్రకారం, 2026 జూలై 20 నుంచి అక్టోబర్ 31 మధ్య దుబాయ్‌కు వచ్చే విదేశీ సందర్శకులను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. సందర్శకులు చేరుకునే ముందు యూఏఈ నివాసితులు ఆన్లైన్లో వారి వివరాలను నమోదు చేయాలి. ఒకేసారి గరిష్ఠంగా ఐదుగురిని నామినేట్ చేయవచ్చు. వారు దుబాయ్ చేరుకున్న తర్వాత అధికారిక వ్యవస్థల ద్వారా రాక ఆటోమేటిక్‌గా వేరిఫై అవుతుంది. అనంతరం 72 గంటల్లో రివార్డులను ఎలా వినియోగించుకోవాలో తెలిపే ఈమెయిల్‌ను టూరిజం డిపార్ట్మెంట్ పంపిస్తుంది. ఈ రివార్డులు 2026 డిసెంబర్ 31 వరకు చెల్లుబాటులో ఉంటాయి.అర్హులు ఎవరంటే..ఈ పథకానికి 18 ఏళ్లు పైబడిన యూఏఈ పౌరులు, చెల్లుబాటు అయ్యే ఎమిరేట్స్ ఐడీ కలిగిన నివాసితులు అర్హులు. ఆహ్వానితులు యూఏఈ నివాసితులు కాకూడదు. వారు చెల్లుబాటు అయ్యే టూరిస్ట్ వీసాతో లేదా వీసా-ఆన్-అరైవల్ అర్హతతో విమానం, సముద్రం లేదా రోడ్డు మార్గంలో దుబాయ్‌కు చేరుకోవాలి. అయితే వీసా ఏర్పాట్లు ఈ పథకంలో భాగం కావని, వాటిని సందర్శకులే స్వయంగా చూసుకోవాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.గుర్తుంచుకోవాల్సిన నిబంధనలుప్రతి సందర్శకుడిని ఈ కార్యక్రమంలో ఒక్కసారి మాత్రమే నామినేట్ చేయవచ్చు. ఇప్పటికే మరో నివాసితుడు అదే వ్యక్తిని నమోదు చేసి ఉంటే, తదుపరి నామినేషన్‌కు రివార్డు వర్తించదు. అలాగే ప్రచార కాలంలో ప్రతి అర్హుడైన నివాసితుడు గరిష్ఠంగా మూడు రివార్డ్ ప్యాకేజీలు మాత్రమే పొందగలడు. పాల్గొనే బ్రాండ్లలో ప్రముఖ హోటళ్లు, రెస్టారెంట్లు, కరీమ్, హాలా వంటి సేవలు ఉన్నాయి. ఇటీవలి నెలల్లో అంతర్జాతీయ పర్యాటకులను మరింతగా ఆకర్షించేందుకు దుబాయ్ చేపడుతున్న చర్యల్లో భాగంగానే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. -
ఆఫీస్‌లో స్కూటీ స్వారీ చేసిన సీఈఓ
కార్పొరేట్ ఉద్యోగాలనగానే వెంటనే గుర్తుకువచ్చేది ఒత్తిడి, నిరంతర లక్ష్యాల సాధన, ఫార్మల్ సమావేశాలు. కానీ, బెంగళూరుకు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ టెక్నాలజీ కంపెనీ ‘నోబ్రోకర్’ కార్యాలయంలో ఇటీవల చోటుచేసుకున్న ఒక సంఘటన కార్పొరేట్ వర్గాల్లో ఉత్సాహాన్ని నింపింది. కంపెనీ సాధించిన అత్యుత్తమ త్రైమాసిక ఫలితాలను జరుపుకొనే క్రమంలో ఆ సంస్థ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ అమిత్ కుమార్ అగర్వాల్ ఏకంగా ఆఫీసు ఆవరణలోనే స్కూటీ నడుపుతూ హల్చల్ చేశారు.ఉద్యోగులకు బహుమతినోబ్రోకర్ ప్రాపర్టీ అండ్ మూవర్స్ విభాగం ఊహించని రీతిలో రికార్డు స్థాయి ఫలితాలను నమోదు చేసింది. నెలల తరబడి జట్టుగా పనిచేసి, నిర్దేశిత లక్ష్యాలను చేరుకున్న ఉద్యోగుల శ్రమను గుర్తించిన యాజమాన్యం, వారికి పారితోషికంగా పలు బహుమతులను ప్రకటించింది. అందులో ప్రధాన ఆకర్షణగా నిలిచిన ద్విచక్రాహనాన్ని సీఈఓ స్వయంగా ఆఫీస్ ఫ్లోర్‌పై నడుపుకుంటూ వచ్చి విజేతలకు అందించడం అందరినీ ఆశ్చర్యపరిచింది.🚨 A Bengaluru-based CEO of NoBroker, rides scooter inside office to celebrate company's 'amazing quarter.' pic.twitter.com/UFq5zhMPh8— Indian Tech & Infra (@IndianTechGuide) July 23, 2026ఈ దృశ్యాన్ని చూసి ఉద్యోగులు చప్పట్లు, కేరింతలతో ఆఫీసును హోరెత్తించారు. దీనికి సంబంధించిన వీడియోను అమిత్ కుమార్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పంచుకుంటూ ‘ఈ రోజు నాకో అత్యంత ముఖ్యమైన పని అప్పగించారు.. అదేంటంటే ఆఫీస్‌లో స్కూటర్ నడపడం!’ అని సరదాగా పేర్కొన్నారు. ‘కష్టపడి పని చేసే ఉద్యోగులకు ధన్యవాదాలు చెప్పడానికి ఫార్మల్ అవార్డు వేడుకల కంటే నాయకులే స్వయంగా వారి సంతోషంలో భాగస్వామి కావడం సరైన పద్ధతి’ అని అమిత్ కుమార్ అగర్వాల్ చెప్పారు.ఇదీ చదవండి: ట్రాఫిక్ రూల్ అతిక్రమిస్తే డిజిటల్ వార్నింగ్ -
ఇన్ఫోసిస్‌లో ఏఐ విప్లవం
భారత ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ఏఐ స్వీకరణలో సరికొత్త మైలురాయిని అందుకుంది. తమ సంస్థలోని దాదాపు 80,000 మంది ఉద్యోగులు ప్రస్తుతం క్లాడ్ కోడ్, కోడెక్స్ వంటి అత్యాధునిక ఏఐ కోడింగ్ అసిస్టెంట్లను రోజువారీ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ వర్క్‌ఫ్లోలో ఉపయోగిస్తున్నారని కంపెనీ సీఈఓ సలీల్ పరేఖ్ వెల్లడించారు. ఇటీవల జరిగిన త్రైమాసిక ఫలితాల విశ్లేషణ సమావేశంలో ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశారు.రాబడిలో 8.2 శాతం ఏఐ వాటాసాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో ఏఐ వినియోగాన్ని వేగవంతం చేసినట్లు వివరిస్తూ జూన్ త్రైమాసికంలో ఇన్ఫోసిస్ సాధించిన మొత్తం రాబడిలో ఏఐ సేవల వాటానే 8.2 శాతానికి చేరిందని పరేఖ్ తెలిపారు. ఈ విభాగం గత కొన్ని త్రైమాసికాలుగా వరుసగా రెండంకెల వృద్ధిని నమోదు చేస్తోంది. ముఖ్యంగా ఏఐ ఏజెంట్లు, ప్రాసెస్ ఆటోమేషన్, డేటా మోడర్నైజేషన్, ఏఐ ఆధారిత సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్ సహా ఆరు వ్యాపార విభాగాల్లో బలమైన డిమాండ్ కనిపిస్తోంది. ఈ క్లయింట్ అవసరాలను తీర్చేందుకు రాబోయే కొద్ది సంవత్సరాల్లో 6,000 మంది ‘ఫ్రంటియర్ ఇంజినీర్ల’ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు.భద్రతతో కూడిన ప్లాట్ఫామ్సంస్థల డేటా భద్రతను కాపాడుతూ ఏఐ సేవలను అందించేందుకు ఇన్ఫోసిస్ తన ‘టోపాజ్ ఫ్యాబ్రిక్’ ప్లాట్‌ఫామ్‌ను మరింత విస్తరిస్తోంది. ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా క్లయింట్లు తమ డేటా సావర్నిటీకి భంగం వాటిల్లకుండా క్లౌడ్ ఆధారిత ఏ ఫౌండేషన్ మోడల్‌నైనా ఉపయోగించుకోవచ్చు. అంతేకాకుండా భారీ స్థాయిలో జెన్ ఏఐ ప్రయోగాలు చేసే సమయంలో కంపెనీలకు భారం కాకుండా ఏఐ టోకెన్ ఖర్చులను తగ్గించడంలో ఇది సాయపడుతోంది.భవిష్యత్తు కార్యాచరణప్రస్తుత స్థూల ఆర్థిక అనిశ్చితులు, క్లయింట్ సంబంధిత పరిణామాల వల్ల ఈ ఆర్థిక సంవత్సరానికి స్థిర కరెన్సీ రాబడి అంచనాను 1.5-3% కి తగ్గించినప్పటికీ ఏఐ విభాగంలో ఇన్ఫోసిస్ దీర్ఘకాలిక భవిష్యత్తుపై ధీమాతో ఉంది. కంపెనీ వద్ద ఉన్న ఏఐ ప్రాజెక్టుల పైప్‌లైన్ ప్రస్తుతం లభిస్తున్న రాబడి కంటే ఎక్కువగా ఉండటమే ఇందుకు నిదర్శనం.ఇదీ చదవండి: ట్రాఫిక్ రూల్ అతిక్రమిస్తే డిజిటల్ వార్నింగ్ -
ఇన్ఫీ లాభం రూ.7,769 కోట్లు
న్యూఢిల్లీ: దేశంలో రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ మిశ్రమ పనితీరును నమోదు చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి క్వార్టర్ (2026–27, క్యూ1)లో రూ.7,769 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గతేడాది ఇదే క్వార్టర్లో రూ. 6,921 కోట్లతో పోలిస్తే లాభం 12.2% పెరిగింది. మొత్తం ఆదాయం 14% వృద్ధితో రూ. 48,211 కోట్లకు చేరింది. క్రితం ఏడాది క్యూ1లో ఆదాయం రూ. 42,279 కోట్లుగా ఉంది. సీక్వెన్షియల్‌గా.. ప్చ్ గత ఆర్థిక సంవత్సరం చివరి క్వార్టర్ (2025–26, క్యూ4)లో నమోదైన లాభం రూ. 8,501 కోట్లతో పోలిస్తే సీక్వెన్షియల్‌గా ఈ ఏడాది క్యూ1లో 8.6 శాతం తగ్గింది. ఆదాయం మాత్రం స్వల్పంగా 3.9 శాతం వృద్ధి చెందింది. గతేడాది క్యూ4లో కంపెనీ రూ. 46,402 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. గైడెన్స్ కోత.. ప్రపంచవ్యాప్తంగా స్థూల ఆర్థిక పరిస్థితుల్లో అనిశ్చితులు కొనసాగుతున్న నేపథ్యంలో 2026–27 పూర్తి ఏడాది ఆదాయం వృద్ధి అంచనాల్లో (గైడెన్స్) ఇన్ఫీ కోత విధించింది. ఆదాయ గైడెన్స్‌ను 1.5–3 శాతానికి తగ్గించింది. గతంలో ఆదాయ వృద్ధి 1.5–3.5 శాతంగా ఉండొచ్చని కంపెనీ అంచనా వేసింది. ఇతర ముఖ్యాంశాలివీ... → క్లయింట్ల కోసం కంపెనీలో 80,000 మంది సిబ్బంది ఏఐ కోడింగ్ టూల్స్ ఉపయోగిస్తున్నారని, వచ్చే కొన్నేళ్లలో 6,000 మంది ఏఐ ఫ్రాంటియర్ ఇంజినీర్ల టీమ్‌ను ఏర్పాటు చేస్తామని ఇన్ఫీ పేర్కొంది.→ జూన్ చివరినాటికి కంపెనీ మొత్తం ఉద్యోగులు సంఖ్య 3,28,062కు చేరింది. మార్చినాటికి సిబ్బంది సంఖ్య 3,28,594తో పోలిస్తే 532 మంది తగ్గారు. ఉద్యోగుల వలసల (అట్రిషన్) రేటు 13%గా నమోదైంది. → ఉద్యోగులకు వేతనాల పెంపు విషయానికొస్తే అక్టోబర్, జనవరి (సీనియర్లకు)లో రెండు విడతల్లో ఉంటుందని కంపెనీ తెలిపింది.→ క్యూ1లో 4,000 మందికి పైగా కాలేజీ గ్రాడ్యుయేట్లను నియమించుకున్నామని కంపెనీ వెల్లడించింది, గతేడాది మాదిరిగానే ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా 20,000 మంది ఫ్రెషర్లకు ఉద్యోగాలిచ్చే ప్రణాళికల్లో ఉన్నామని వెల్లడించింది. → క్యూ1 ఆదాయంలో ఏఐ సర్వీసుల వాటా 8.5 శాతానికి పెరిగింది. → 3.6 బిలియన్ డాలర్ల విలువైన భారీ కాంట్రాక్టులు కుదుర్చుకుంది. ఇన్ఫోసిస్ షేరు ఫ్లాట్‌గా రూ.1,052 వద్ద క్లోజైంది. మార్కెట్ ముగిశాక ఫలితాలు వెలువడ్డాయి. ఇన్ఫీ ఏడీఆర్ 4 శాతం నష్టాల్లో ట్రేడవుతోంది.ఏఐ జోరు ఇప్పుడు ఆదాయం వనరుగా మారుతోంది. ఎంటర్ప్రైజ్ ఏఐని అమలు చేయడం ద్వారా ఇన్ఫోసిస్ స్థిరమైన మార్కెట్ వాటాను దక్కించుకుంటోంది. పటిష్టమైన భారీ డీల్స్ కుదరడం కంపెనీపై క్లయింట్ల నమ్మకానికి నిదర్శనం. దాదాపు అన్ని దిగ్గజ ఏఐ కంపెనీలతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకోవడం, నవకల్పనల ఎకోసిస్టమ్‌ను అందించడం ద్వారా క్లయింట్లు తమ నిర్వహణ ఉత్పాదకతను పెంచుకోవడంలో, వృద్ధి అవకాశాలను అన్‌లాక్ చేయడంలో తోడ్పాటునందిస్తున్నాం.మా ఉద్యోగులందరికీ ఏఐ నైపుణ్యాలను పెంచడానికి కట్టుబడి ఉన్నాం. ఒక క్లయింట్ నిర్ణయం కారణంగా ఆదాయంపై అసాధారణ (వన్‌టైమ్) ప్రభావం పడింది. – సలీల్ పరేఖ్, ఇన్ఫోసిస్ సీఈఓ, ఎండీ -
అదనపు లగేజ్ కోసం.. రైల్వే కొత్త రూల్!
ట్రైన్ జర్నీ చేసేవారికి ఇండియన్ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటి వరకు పరిమితికి మించి లగేజ్ తీసుకెళ్లాలంటే ప్రయాణికులు రైల్వే పార్సిల్ కార్యాలయానికి వెళ్లి ప్రత్యేకంగా బుక్ చేసుకోవాల్సి వచ్చేది. దీంతో సమయం వృథా కావడంతో పాటు, ప్రయాణానికి ముందు అనవసర ఇబ్బందులు కూడా ఎదురయ్యేవి. ఈ సమస్యకు పరిష్కారం చూపుతూ రైల్వే కొత్త నిర్ణయం తీసుకుంది.భారతీయ రైల్వే 2026 జూలై 31 నుంచి టికెట్ రిజర్వేషన్ చేసుకునే సమయంలోనే.. అదనపు లగేజ్ కోసం కూడా ఆన్లైన్లో బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. దీంతో ప్రయాణికులు ఇంటి నుంచే అన్ని పనులు పూర్తి చేసుకోవచ్చు. తద్వారా సులభమైన ప్రయాణ అనుభూతిని పొందవచ్చు.లగేజ్ లిమిట్ ఇలా..ప్రస్తుతం ప్రయాణికుడు ప్రయాణించే క్లాస్ ఆధారంగా ఉచితంగా తీసుకెళ్లే లగేజీకి లిమిట్ ఉంది. ఏసీ ఫస్ట్ క్లాస్‌లో 70 కిలోలు.. ఫస్ట్ క్లాస్, ఏసీ 2-టైర్లో 50 కిలోలు.. ఏసీ 3-టైర్, ఏసీ చెయిర్ కార్, స్లీపర్ క్లాస్‌లో 40 కిలోలు, సెకండ్ క్లాస్‌లో 35 కిలోల వరకు ఉచితంగా తీసుకెళ్లవచ్చు. ఈ పరిమితిని మించి సామాను తీసుకెళ్లాలనుకుంటే అదనంగా డబ్బు చెల్లించాల్సి ఉంటుంది.అయితే.. అన్ని కోచ్‌లకు ఒకే విధమైన నిబంధనలు ఉండవు. ఏసీ 3-టైర్, ఏసీ చెయిర్ కార్లో ఉచిత పరిమితి, గరిష్ఠ పరిమితి రెండూ ఒకటే కావడంతో ఈ తరగతుల్లో అదనపు లగేజ్ బుకింగ్‌కు అనుమతి ఉండదు. మిగతా తరగతుల్లో మాత్రం నిర్ణయించిన గరిష్ఠ పరిమితి వరకు అదనపు లగేజీని బుక్ చేసుకోవచ్చు. ఇందుకు సాధారణ లగేజ్ ఛార్జీ కంటే ఒకటిన్నర రెట్లు ఎక్కువ డబ్బు చెల్లించాలి.జరిగిమానాప్రయాణికులు మరో విషయం కూడా తప్పకుండా గుర్తుంచుకోవాలి. అనుమతించిన బరువుకంటే ఎక్కువ లగేజ్ తీసుకెళ్లి, దానికి సరైన బుకింగ్ చేయకపోతే ప్రయాణ సమయంలో లేదా గమ్యస్థానంలో తనిఖీ చేసినప్పుడు జరిమానా విధించే అవకాశం ఉంది. అందువల్ల ముందుగానే లగేజీని బుక్ చేసుకోవడం మంచిది.బరువుతో పాటు సామాను పరిమాణంపై కూడా రైల్వే నిబంధనలు అమలు చేస్తోంది. ఏసీ 3-టైర్, ఏసీ చెయిర్ కార్లో చిన్న పరిమాణం ఉన్న బ్యాగులకే అనుమతి ఉంటుంది. ఏసీ ఫస్ట్ క్లాస్, ఏసీ 2-టైర్, స్లీపర్, జనరల్ కోచ్‌లలో కొంచెం పెద్ద సైజు బ్యాగులను తీసుకెళ్లవచ్చు. నిర్ణయించిన పరిమాణాన్ని మించిన సామానును కోచ్‌లోకి అనుమతించరు. అలాంటి లగేజీని ప్రత్యేకంగా లగేజ్ లేదా పార్సిల్ వ్యాన్‌లో బుక్ చేయాల్సి ఉంటుంది.పార్సిల్ ద్వారా ఎక్కువ బరువున్న వస్తువులను కూడా పంపించుకునే అవకాశం ఉంది. అయితే మీరు ప్రయాణించే తరగతిని బట్టి గరిష్ఠ బరువు పరిమితి మారుతుంది. లగేజ్ ఛార్జీలు ప్రయాణ దూరం, బరువు, రైలు సేవలను బట్టి నిర్ణయిస్తారు. కనీస ఛార్జీ రూ.30గా ఉంటుంది. మొత్తం మీద ఈ కొత్త విధానం రైలు ప్రయాణికులకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని తెలుస్తోంది.ఇదీ చదవండి: స్కూల్లో నేర్పని డబ్బు పాఠాలు.. కియోసాకి చెప్పిన విషయాలు! -
వచ్చేస్తున్నాయ్ 10 కిలోల గ్యాస్ సిలిండర్లు..
ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) 10 కిలోల ఎల్పీజీ సిలిండర్ల లభ్యతను మరింత విస్తరించనుంది. ఆగస్టు 15 నాటికి దేశంలోని 24 రాష్ట్రాల్లో మరో 100 నగరాలకు ఈ సేవను అందుబాటులోకి తీసుకురానున్నట్లు సంస్థ వెల్లడించింది. చిన్న కుటుంబాలు, ఒంటరిగా నివసించే ఉద్యోగులు, విద్యార్థులు, తరచూ నివాసం మారే వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా ముడి చమురు కొనుగోళ్లలో కూడా బీపీసీఎల్ వైవిధ్యాన్ని పెంచుతోంది. జూన్ త్రైమాసికంలో వెనిజులా, అంగోలా నుంచి దిగుమతులను పెంచగా, 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో మొత్తం ముడి చమురు కొనుగోళ్లలో రష్యా వాటా 38 శాతంగా నమోదైంది. ఇదే సమయంలో స్పాట్ కార్గోల ద్వారా కొనుగోళ్లు గత ఏడాది ఇదే కాలంలోని 44 శాతం నుంచి 69 శాతానికి పెరిగినట్లు సంస్థ తెలిపింది. ప్రస్తుతం కంపెనీ వద్ద 3.8 మిలియన్ టన్నుల ముడి చమురు నిల్వలు ఉండగా, ఇవి సుమారు 35 రోజుల అవసరాలకు సరిపోతాయని వెల్లడించింది. అలాగే మొజాంబిక్ ఎల్ఎన్జీ ప్రాజెక్టు కార్యకలాపాలు 2029 ఆర్థిక సంవత్సరంలో ప్రారంభమవుతాయని అంచనా వేసింది.ఇదిలా ఉండగా, 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో బీపీసీఎల్ రూ.3,962 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. అంతకుముందు త్రైమాసికంలో రూ.3,919 కోట్ల లాభం వచ్చినప్పటికీ, పశ్చిమాసియా ఉద్రిక్తతలతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడం, దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉండటం, ఎల్పీజీ విక్రయాల్లో అండర్రికవరీలు పెరగడం వల్ల మార్జిన్లపై తీవ్ర ప్రభావం పడింది. అయితే ఈ నష్టం మార్కెట్ అంచనా అయిన రూ.12,632 కోట్ల కంటే చాలా తక్కువగా నమోదవడం విశేషం. -
ఢిల్లీలో ఉద్రిక్తతలు.. TCS లొకేషన్ చేంజ్!
జాతీయ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంటున్న ఉద్రిక్త పరిస్థితులు, సీజేపీ ఆందోళనల నేపథ్యంలో ప్రముఖ ఐటీ సేవల దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అప్రమత్తమైంది. ఢిల్లీ క్యాంపస్‌లో పనిచేస్తున్న తమ ఉద్యోగుల భద్రత, ఆటంకం లేని కార్యకలాపాలను దృష్టిలో ఉంచుకొని వారిని నోయిడా లేదా గురుగ్రామ్‌లోని సమీప కార్యాలయాల నుంచి పనిచేయాలని సూచించింది.సురక్షిత ప్రయాణం కోసం ముందస్తు అడ్వైజరీఢిల్లీలోని జంతర్ మంతర్ పరిసరాల్లో కొనసాగుతున్న నిరసనలు, పార్లమెంట్ వైపు చేపట్టిన 'సంసద్ చలో' మార్చ్ కారణంగా ఢిల్లీ పరిధిలో రాకపోకలు ప్రభావితమయ్యాయి. శాంతిభద్రతల పరిరక్షణ చర్యల్లో భాగంగా ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ) రాజీవ్ చౌక్, పటేల్ చౌక్, మండి హౌస్, ఐటీఓ సహా కీలకమైన 16 మెట్రో స్టేషన్లను తాత్కాలికంగా మూసివేసింది.దీనికి తోడు ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు పలు ప్రాంతాల్లో ఆంక్షలు విధించడంతో రోడ్డు రవాణా వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడింది. ఈ పరిస్థితుల్లో ఉద్యోగులు ఆఫీసులకు చేరుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉండటంతో టీసీఎస్ హెచ్ఆర్ విభాగం ముందస్తుగా ఈ నిర్ణయం తీసుకుంది.ఈ పరిస్థితికి కారణం..జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైన పరీక్షల నిర్వహణ వివాదాలు, నీట్ అక్రమాలపై జవాబుదారీతనం డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నేతృత్వంలో విద్యార్థులు, యువజన సంఘాలు ఆందోళనలు చేపట్టాయి. పార్లమెంట్ ముట్టడి పిలుపుతో పోలీసు బలగాలు భద్రతను కట్టుదిట్టం చేశాయి. పలు ప్రాంతాల్లో రాస్తారోకోలు, లాఠీచార్జీలు జరగడంతో రాజధానిలోని వ్యాపార, ఐటీ రంగాలు ముందస్తు జాగ్రత్తలు పాటిస్తున్నాయి.ఇదీ చదవండి: మామిడి రసంలో పల్ప్ ఉంటేనే ట్యాక్స్ బెనిఫిట్ -
నిరుద్యోగులకు జేపీమోర్గాన్ గుడ్‌న్యూస్
కృత్రిమ మేధ ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ సమీకరణాలు వేగంగా మారుతున్న వేళ అమెరికాకు చెందిన అంతర్జాతీయ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ దిగ్గజం జేపీమోర్గాన్ చేజ్ భారతదేశంలో తన కార్యకలాపాలను విస్తరించేందకు సిద్ధంమైంది. దేశంలోని తన గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (జీసీసీ) విభాగాల కోసం సుమారు 1,000 మంది సాంకేతిక నిపుణులను కొత్తగా నియమించుకోవడానికి ప్రణాళికను ప్రకటించింది.కీలక విభాగాల్లో నియామకాలుఈ నయా రిక్రూట్మెంట్ డ్రైవ్ ప్రధానంగా క్లౌడ్ ఆర్కిటెక్చర్, సైబర్ సెక్యూరిటీ, ఏఐ డేటా పైప్‌లైన్స్ వంటి అత్యంత సంక్లిష్టమైన ప్రాధాన్యత కలిగిన సాంకేతిక రంగాలపై కేంద్రీకృతమై ఉంటుంది. అభ్యర్థుల తాజా నైపుణ్యాలను సవాలు చేసేందుకు ‘హ్యాకర్‌ర్యాంక్’ వేదిక ద్వారా కోడింగ్, డేటా స్ట్రక్చర్స్, ఆల్గారిథమ్స్, సిస్టమ్ ఆర్కిటెక్చర్లలో కఠినమైన పరీక్షలు నిర్వహించి ఎంపిక ప్రక్రియను పూర్తి చేయనున్నారు.ఏఐ ప్రభావం ఉన్నా స్థిరంగా డిమాండ్బ్యాంకింగ్ వ్యాపారంలోని పలు సంప్రదాయ, పునరావృత విభాగాల్లో ఏఐ టెక్నాలజీ వాడకం కారణంగా సిబ్బంది అవసరం దాదాపు 40 శాతం వరకు తగ్గిందని జేపీమోర్గాన్ ఇటీవల ధ్రువీకరించింది. అయినా స్పెషలైజ్డ్ ఇంజినీరింగ్, ఏఐ ఆధారిత డేటా నిపుణుల అవసరం నిరంతరం పెరుగుతోందని ఈ నిర్ణయం స్పష్టం చేస్తోంది. భారత్ కేవలం పాతకాలపు బ్యాక్-ఆఫీస్ విధులకే పరిమితం కాకుండా అంతర్జాతీయ స్థాయిలో అత్యున్నత సాంకేతిక ఉత్పత్తులను రూపొందించే ప్రధాన ఐటీ ఇన్నోవేషన్ హబ్‌గా మారుతుందనడానికి ఇది సాక్ష్యంగా నిలుస్తుంది.భారత్‌లో విస్తరణ ఇలా..ప్రస్తుతం జేపీమోర్గాన్ భారతదేశంలోని హైదరాబాద్, ముంబై, బెంగళూరు, నోయిడా, గాంధీనగర్‌లోని గిఫ్ట్ సిటీ వ్యాప్తంగా దాదాపు 55,000 మంది ఉద్యోగులతో కార్యకలాపాలు సాగిస్తోంది. ఇది సంస్థ మొత్తం వర్క్‌ఫోర్స్‌లో ఐదో వంతు. అంతేకాకుండా, ముంబైలోని పవాయ్‌లో 2029 నాటికి ఆసియాలోనే అతిపెద్దదిగా నిలవనున్న 20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త క్యాంపస్‌ను నిర్మిస్తున్నారు. ఇందులో 30,000 మంది కొలువుదీరనున్నారు.ఇదీ చదవండి: ట్రాఫిక్ రూల్ అతిక్రమిస్తే డిజిటల్ వార్నింగ్ -
విజయవాడ మీదుగా వందేభారత్ స్లీపర్!
భారతీయ రైల్వే రవాణా వ్యవస్థలో వందేభారత్ రైలు సుదూర రాత్రి ప్రయాణాల వైపు అడుగులు వేస్తోంది. ఇప్పటివరకు పగటిపూట నడిచే చైర్ కార్ వెర్షన్లతో ఆదరణ పొందిన వందేభారత్ సిరీస్ రైళ్లను అప్డేట్ చేస్తున్నారు. ఇందులో భాగంగా దక్షిణ మధ్య రైల్వే(ఎస్సీఆర్) పరిధిలో ‘వందేభారత్ స్లీపర్’ పేరుతో కొత్త రైళ్లను పట్టాలెక్కించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నారు. ఎస్సీఆర్ పరిధిలో దీన్ని ముందుగా విజయవాడ డివిజన్లో ప్రారంభించేందుకు భారతీయ రైల్వే కసరత్తు చేస్తోంది. రాబోయే దసరా పండుగ నాటికి విజయవాడ మీదుగా ఈ అత్యాధునిక స్లీపర్ సర్వీసును పట్టాలెక్కించాలని రైల్వే శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యంగా విశాఖపట్నం, విజయవాడ మీదుగా బెంగళూరు మార్గంలో ఈ రైలును నడిపే ప్రతిపాదన తుది దశలో ఉన్నట్లు సమాచారం. దేశంలో మొదటి వందేభారత్ స్లీపర్ ఈ ఏడాది జనవరిలోనే హౌరా-కామాఖ్య మధ్య ప్రారంభమైంది. సౌత్ సెంట్రల్ రైల్వే డివిజన్లో మాత్రం ఇంకా ప్రారంభంకాలేదు.విమాన తరహా ప్రయాణ అనుభూతివందేభారత్ స్లీపర్ రైళ్లను విమాన ప్రయాణానికి ఏమాత్రం తీసిపోని విధంగా అత్యున్నత సాంకేతికత, ప్రపంచ స్థాయి సౌకర్యాలతో డిజైన్ చేశారు. మొత్తం 16 ఎయిర్ కండిషన్డ్ కోచ్‌లతో రూపొందించిన ఈ రైలులో 1 ఫస్ట్ ఏసీ, 4 సెకండ్ ఏసీ, 11 థర్డ్ ఏసీ బోగీలు ఉంటాయి. ఒకేసారి సుమారు 823 మంది ప్రయాణించేలా సీటింగ్/బెర్త్ అమరిక ఉంది. గంటకు గరిష్టంగా 180 కిలోమీటర్ల డిజైన్ వేగం ఉన్నప్పటికీ ప్రస్తుత ట్రాక్ సామర్థ్యానికి అనుగుణంగా 160 కి.మీ/గం ఆపరేషనల్ వేగంతో ప్రయాణిస్తుంది. సెల్ఫ్-ప్రొపెల్డ్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ (ఈఎంయూ) సాంకేతికత వల్ల వేగవంతమైన ఆక్సిలరేషన్ సాధ్యమవుతుంది.ప్రత్యేకంగా రూపొందించిన కుషన్ బెర్త్‌లు, శబ్ద కాలుష్యం లేకుండా ఉండే సౌండ్ ప్రూఫ్ క్యాబిన్లు, సాఫ్ట్ ఎల్ఈడీ లైటింగ్, ప్రతి బెర్త్ వద్ద ప్రత్యేక ఛార్జింగ్ పాయింట్లు, వైఫై కనెక్టివిటీ, ఆటోమేటిక్ సెన్సార్ డోర్లు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. పూర్తిస్థాయి స్వదేశీ ప్రమాద నిరోధక వ్యవస్థ ‘కవచ్’, నిరంతర సీసీటీవీ నిఘా, ఏఐ ఆధారిత కోచ్ కండిషన్ మానిటరింగ్ సిస్టమ్, అత్యవసర సమయాల్లో సిబ్బందితో మాట్లాడే టాక్-బ్యాక్ బటన్లు అందుబాటులో ఉంటాయి. పరిశుభ్రత కోసం బయో వాక్యూమ్ టాయిలెట్లు, సెన్సార్ వాటర్ ట్యాప్‌లు అమర్చారు.రవాణా రంగంలో సరికొత్త అధ్యాయంసాధారణ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లు, రాజధాని ఎక్స్‌ప్రెస్‌లతో పోలిస్తే ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించడమే కాకుండా ప్యాసింజర్ సేఫ్టీకి ఇవి ప్రాధాన్యత ఇస్తాయి. తెలుగు రాష్ట్రాల మధ్య వ్యాపార, ఐటీ, రవాణా అవసరాలకు విజయవాడ కీలక కేంద్రంగా ఉన్నందున ఈ స్లీపర్ వందేభారత్ అందుబాటులోకి రావడం ఇక్కడి ప్రయాణికులకు ఊరటనివ్వనుంది. త్వరలోనే అధికారిక టైమ్‌టేబుల్, ప్రారంభ తేదీ వివరాలను రైల్వే బోర్డు ప్రకటించనుంది.ఇదీ చదవండి: ట్రాఫిక్ రూల్ అతిక్రమిస్తే డిజిటల్ వార్నింగ్ -
పంజాబ్ నేషనల్ బ్యాంక్ ట్రిపుల్ ధమాకా!
న్యూఢిల్లీ: స్టాండెలోన్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) నికర లాభం మూడు రెట్లు వృద్ధి చెంది రూ. 5,253 కోట్లకు చేరింది. ట్యాక్స్ చెల్లింపుల భారం తగ్గడం ఇందుకు దోహదపడింది. క్రితం క్యూ1లో బ్యాంకు రూ. 1,675 కోట్ల నికర లాభం నమోదు చేసింది. కొత్త ట్యాక్స్ విధానానికి మళ్లడంతో పన్ను భారం రూ. 3,358 కోట్ల మేర తగ్గినట్లు బ్యాంకు ఎండీ అశోక్ చంద్ర తెలిపారు. దీనితో తొలి త్రైమాసికానికి సంబంధించి అత్యధికంగా రూ. 5 వేల కోట్ల పైగా లాభం సాధ్యపడినట్లు వివరించారు.సమీక్షాకాలంలో మొత్తం ఆదాయం పెద్దగా మార్పు లేకుండా రూ. 37,231 కోట్లకు పరిమితమైంది. నికర వడ్డీ ఆదాయం రూ. 10,578 కోట్ల నుంచి రెండు శాతం వృద్ధితో రూ. 10,798 కోట్లకు పెరిగింది. ఇప్పటి వరకు ఎఫ్సీఎన్ఆర్ (బి) డిపాజిట్లు 425 మిలియన్ డాలర్లు సమీకరించగా, సెప్టెంబర్ 30 ఆఖరు నాటి వరకు 2.5 బిలియన్ డాలర్ల లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు చంద్ర వివరించారు. స్థూల నిరర్థక ఆస్తులు (జీఎన్‌పీఏ) రూ. 42,673 కోట్ల నుంచి రూ. 35,381 కోట్లకు, నికర నిరర్థక ఆస్తులు (ఎన్ఎన్పీఏ) రూ. 4,132 కోట్ల నుంచి రూ. 3,433 కోట్లకు నెమ్మదించాయి. జీఎన్‌పీఏ నిష్పత్తి 3.78 శాతం నుంచి 2.78 శాతానికి, ఎన్ఎన్పీఏ నిష్పత్తి 0.38 శాతం నుంచి 0.26 శాతానికి తగ్గాయి. యస్ బ్యాంక్‌కు రుణ వృద్ధి మద్దతుజూన్ త్రైమాసికంలో యస్ బ్యాంక్ నికర లాభం 32.54 శాతం వృద్ధితో రూ. 808.65 కోట్ల నుంచి రూ. 1,072 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ ఆదాయం 17.5 శాతం పెరిగి రూ. 2,371 కోట్ల నుంచి రూ. 2,786 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్ 2.5 శాతం నుంచి 2.70 శాతానికి పెరిగింది. గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి ఫండ్ (ఆర్ఐడీఎఫ్) బ్యాలెన్స్‌లు మరింత తగ్గి, రిటైల్ రుణాలు పుంజుకునే కొద్దీ మధ్యకాలికంగా మార్జిన్లు మరింత మెరుగుపడగలవని యస్ బ్యాంక్ ఎండీ వినయ్ ఎం టోన్సే తెలిపారు. ఏప్రిల్–జూన్ క్వార్టర్లో మొత్తం డిపాజిట్లు 14.3 శాతం వృద్ధితో రూ. 2.76 లక్షల కోట్ల నుంచి రూ. 3.15 లక్షల కోట్లకు చేరాయి. నికర రుణాలు 18.3 శాతం పెరిగి రూ. 2.85 లక్షల కోట్లకు పెరిగాయి. -
హైడ్రోజన్ రైలుకు స్పందన కరువు!?
భారతీయ రైల్వే హరిత రవాణా దిశగా కీలక అడుగు వేస్తూ దేశంలో తొలి స్వదేశీ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ రైలును హర్యానాలోని జింద్–సోనిపట్ మార్గంలో ప్రారంభించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూలై 17న ఈ రైలును ప్రారంభించారు. 10 కోచ్‌లతో రూపొందించిన ఈ రైలు ఒకేసారి సుమారు 2,600 మంది ప్రయాణికులను తీసుకెళ్లగలదు. ఇది భారతదేశానికే కాకుండా ప్రపంచంలోనే అతిపెద్ద హైడ్రోజన్ రైలు సెట్లలో ఒకటిగా నిలిచింది.అత్యాధునిక సౌకర్యాలు, కేవలం రూ.5 నుంచి రూ.25 మధ్యే టికెట్ ఛార్జీలు ఉన్నప్పటికీ ప్రారంభ రోజుల్లో ప్రయాణికుల స్పందన ఆశించిన స్థాయిలో కనిపించలేదు. తొలి రోజు జింద్ నుంచి బయలుదేరిన రైలులో సాధారణ ప్రయాణికులు సుమారు 20 మంది మాత్రమే ప్రయాణించగా, రెండో రోజూ దాదాపు ఇదే పరిస్థితి కొనసాగినట్లు స్థానిక నివేదికలు పేర్కొంటున్నాయి.ఎందుకు తక్కువ మంది ప్రయాణిస్తున్నారు?రైల్వే వర్గాల అంచనా ప్రకారం, జింద్–సోనిపట్ మార్గంలో ఇప్పటికే పలు ప్యాసింజర్, ఎక్స్‌ప్రెస్ రైళ్లు అందుబాటులో ఉండటంతో ప్రయాణికులకు ప్రత్యామ్నాయాల కొరత లేదు. కొత్త హైడ్రోజన్ రైలు గురించి ఇంకా చాలామందికి పూర్తి అవగాహన లేకపోవడం కూడా మరో కారణంగా భావిస్తున్నారు. ప్రచారం పెరిగి, ప్రజల్లో విశ్వాసం ఏర్పడిన తర్వాత ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.హైడ్రోజన్ రైలు ఎలా పనిచేస్తుంది?సాంప్రదాయ డీజిల్ ఇంజిన్‌కు బదులుగా ఈ రైలు హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ సాంకేతికతను ఉపయోగిస్తుంది. హైడ్రోజన్, గాలిలోని ఆక్సిజన్ మధ్య జరిగే రసాయనిక చర్య ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసి మోటార్లను నడుపుతుంది. ఈ ప్రక్రియలో పొగ లేదా కార్బన్ ఉద్గారాలు వెలువడవు. ఉప ఉత్పత్తిగా నీటి ఆవిరి మాత్రమే విడుదల కావడంతో ఇది పర్యావరణహిత రవాణా వ్యవస్థగా గుర్తింపు పొందింది.ప్రత్యేకతలు ఇవే..🔹 10 కోచ్‌లతో సుమారు 2,600 మంది ప్రయాణికుల సామర్థ్యం.🔹 మెట్రో తరహా ఆటోమేటిక్ డోర్లు.🔹 డిజిటల్ ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లేలు.🔹 పబ్లిక్ అనౌన్స్మెంట్ వ్యవస్థ.🔹 హైడ్రోజన్ లీకేజ్, మంటలు, ఉష్ణోగ్రతలను గుర్తించే బహుళ భద్రతా వ్యవస్థలు.🔹 జింద్‌లో ప్రత్యేక హైడ్రోజన్ నిల్వ, రీఫ్యూయలింగ్ మౌలిక సదుపాయాలు.🔹 గరిష్ఠ డిజైన్ వేగం గంటకు 110 కి.మీ.( ప్రస్తుతం ఈ మార్గంలో గంటకు 75 కి.మీ. వేగంతో నడుస్తోంది)హైడ్రోజన్ ఆధారిత రైలు సేవలను ప్రారంభించిన దేశాల జాబితాలో భారత్ కూడా చేరింది. భవిష్యత్తులో పూర్తిగా విద్యుదీకరణ సాధ్యం కాని మార్గాలు, పర్యావరణ సున్నిత ప్రాంతాల్లో ఇలాంటి రైళ్ల వినియోగాన్ని విస్తరించే దిశగా భారతీయ రైల్వేలు ఈ ప్రాజెక్టును పైలట్‌గా ఉపయోగించనున్నాయి. -
ఎయిర్పోర్ట్ నిర్వాహకులకు ఎయిర్‌లైన్స్ నిర్వహణ హక్కు?
దేశీయ విమానయాన రంగంలో పోటీతత్వాన్ని పెంచేందుకు, ప్రయాణికులకు మరింత మెరుగైన అవకాశాలు అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం విధానపరమైన మార్పుపై కసరత్తు చేస్తోంది. విమానాశ్రయాలను నిర్మించి, నిర్వహించే ప్రైవేటు సంస్థలే స్వయంగా ఎయిర్‌లైన్స్ (విమానయాన సంస్థలు)ను కూడా స్థాపించేందుకు అనుమతించే ప్రతిపాదనను పౌర విమానయాన మంత్రిత్వ శాఖ పరిశీలిస్తోంది.ప్రస్తుత నిబంధనలు.. ప్రతిపాదిత మార్పులుప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం.. ఢిల్లీ, ముంబై వంటి ప్రధాన విమానాశ్రయాలను నిర్వహించే సంస్థలు ఏ ఎయిర్‌లైన్‌లోనూ 10 శాతానికి మించి ఈక్విటీ వాటా పొందేందుకు వీలులేదు. సొంత ప్రయోజనాలను అరికట్టేందుకు గతంలో ఈ నిబంధనను విధించారు. అయితే, ఇప్పుడు ఈ పరిమితులను సడలిస్తే ముంబై సహా 8 విమానాశ్రయాలను నిర్వహిస్తున్న అదానీ గ్రూప్, ఢిల్లీ సహా పలు ఎయిర్‌పోర్ట్‌లను నిర్వహిస్తున్న జీఎంఆర్ గ్రూప్ వంటి దిగ్గజ సంస్థలకు సొంతంగా ఎయిర్‌లైన్స్ ప్రారంభించే మార్గం సుగమమవుతుంది.ద్వంద్వ ఆధిపత్యంపై దెబ్బ!గడిచిన దశాబ్దకాలంలో జెట్ ఎయిర్వేస్, గో ఫస్ట్ వంటి సంస్థలు మూతపడటం, టాటా గ్రూప్‌లో విస్తారా విలీనమవ్వడంతో భారత విమానయాన రంగం ప్రధానంగా రెండు ప్రధాన సంస్థల చేతుల్లోకి వెళ్లిపోయింది. ఇండిగో, ఎయిర్ ఇండియాలు కలిపి ప్రస్తుతం దేశీయ విమాన ప్రయాణికుల మార్కెట్లో ఏకంగా 90 శాతం సామర్థ్యాన్ని ఆక్రమించాయి. ఈ ద్వంద్వ ఆధిపత్యం వల్ల పోటీ తగ్గుతోందనే ఆందోళనలున్నాయి. కొత్త విధానం ద్వారా పెట్టుబడిదారులను ఆహ్వానించి మార్కెట్లో పోటీని పునరుద్ధరించాలని ప్రభుత్వం భావిస్తోంది.ఈ ప్రతిపాదన పరిశ్రమ పరంగా సానుకూలమైనప్పటికీ అమలులో సవాళ్లు ఉన్నాయని కొందరు నిపుణులు చెబుతున్నారు. ఎయిర్పోర్ట్ యజమానులే విమానాలను నడిపితే.. ప్రైమ్ ల్యాండింగ్/టేకాఫ్ స్లాట్ల కేటాయింపు, గ్రౌండ్ హ్యాండ్లింగ్ ఛార్జీలు, టెర్మినల్ స్పేస్ వంటి కీలక అంశాల్లో సొంత ఎయిర్‌లైన్స్‌కే మొదటి ప్రాధాన్యత ఇచ్చుకునే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.కేబినెట్ ఆమోదం తదుపరి అడుగుఈ విధాన సవరణ అమలులోకి రావడానికి న్యాయ మంత్రిత్వ శాఖ క్లియరెన్స్‌తో పాటు కేంద్ర కేబినెట్ ఆమోదం లభించాల్సి ఉంది. 2047 నాటికి దేశంలో విమానాశ్రయాల సంఖ్యను 350కి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్న వేళ కేంద్రం తీసుకునే ఈ నిర్ణయం భారత పౌర విమానయాన భవిష్యత్తును మార్చే అవకాశముంది.ఇదీ చదవండి: ఒక్కరోజులో ధరలు అమాంతం ఇలా.. -
వేదాంత చమురు బ్లాక్ స్వాధీనం సరైనదే!
గుజరాత్ తీరంలోని కీలకమైన ‘కాంబే ఆఫ్‌షోర్’ చమురు, సహజవాయువు బ్లాక్‌ను నిలబెట్టుకోవాలనుకున్న వేదాంత లిమిటెడ్ ప్రయత్నాలకు ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. వేదాంతకు కాంట్రాక్ట్ పొడిగింపును నిరాకరిస్తూ ఆ ఫెసిలిటీని ప్రభుత్వ రంగానికి చెందిన ఓఎన్జీసీకి అప్పగించాలన్న కేంద్రం నిర్ణయాన్ని ఉన్నత న్యాయస్థానం సమర్థించింది.హైకోర్టు కీలక వ్యాఖ్యలుజస్టిస్ పురుషేంద్ర కుమార్ కౌరవ్ నేతృత్వంలోని ధర్మాసనం వేదాంత పిటిషన్‌ను కొట్టివేసింది. 2017 ‘ప్రీ-నెల్ప్’ విధానం కింద ఉత్పత్తి పంచుకునే ఒప్పందం (పీఎస్సీ) పొడిగింపును కోరడం కంపెనీ ప్రాథమిక హక్కు కాదని స్పష్టం చేసింది. దేశ సహజ వనరులకు రక్షణగా ఉన్న ప్రభుత్వానికి దరఖాస్తుదారు సాంకేతిక అర్హతలతో పాటు వారి ప్రవర్తనను పరిశీలించే పూర్తి అధికారముందని కోర్టు పేర్కొంది. ‘ప్రాఫిట్ పెట్రోలియం’ ప్రభుత్వ వాటా నుంచి సుమారు రూ.88 కోట్లను వేదాంత ఏకపక్షంగా మినహాయించుకోవడాన్ని తీవ్రంగా పరిగణించింది.ఏమిటీ వివాదం?గుజరాత్‌లోని సూరత్ జిల్లా సువాలి తీరానికి సమీపంలో ఉన్న CB-OS/2 బ్లాక్‌లోని ‘లక్ష్మి’, ‘గౌరి’ క్షేత్రాల నుంచి రోజుకు 3,400 బ్యారెళ్ల చమురు, 3.4 లక్షల ఎస్సీఎం సహజ వాయువు ఉత్పత్తి అవుతోంది. వేదాంత 1998 నుంచి వీటిని నిర్వహిస్తోంది. 2023 జూన్‌లో ముగిసిన ఒరిజినల్ ఒప్పందాన్ని మరో 10 ఏళ్లు పొడిగించాలని వేదాంత కోరినప్పటికీ నిబంధనల ఉల్లంఘన, బకాయిలను కారణం చూపుతూ కేంద్రం అభ్యర్థనను తిరస్కరించి ఓఎన్జీసీకి అప్పగించాలని ఆదేశించింది.కోర్టు స్టేకు నిరాకరణతీర్పు వెలువడిన వెంటనే ఉన్నత న్యాయస్థానాన్ని (సుప్రీంకోర్టు) ఆశ్రయించేందుకు వీలుగా యథాతథ స్థితి (స్టేటస్ కో) విధించాలని వేదాంత కోరగా హైకోర్టు దానికి నిరాకరించింది. దాంతో ప్రభుత్వాదేశాల అమలుకు మార్గం సుగమమైంది. ఈ ప్రతికూల తీర్పు వార్తలతో స్టాక్ మార్కెట్లో వేదాంత లిమిటెడ్ షేరు క్షీణించింది.ఇదీ చదవండి: ఒక్కరోజులో ధరలు అమాంతం ఇలా.. -
జెఫ్ బెజోస్ సీఈఓగా రీ-ఎంట్రీ!
ఐదేళ్ల క్రితం అమెజాన్ సీఈఓ బాధ్యతల నుంచి వైదొలిగి వ్యాపార కార్యకలాపాలకు కొంత విరామం ప్రకటించిన జెఫ్ బెజోస్ మళ్లీ పూర్తిస్థాయి క్రియాశీలక యాజమాన్యంలోకి రీ-ఎంట్రీ ఇచ్చారు. కృత్రిమ మేధ రంగంలో రూపుదిద్దుకుంటున్న నూతన శకంలో భాగస్వామి అయ్యేందుకు ఆయన ప్రోమెథియస్ (Prometheus) అనే హై-టెక్ ఏఐ స్టార్టప్‌కు కో-సీఈఓగా బాధ్యతలు స్వీకరించడం గ్లోబల్ టెక్ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.‘చూస్తూ కూర్చోలేకపోయాను’ఈ అకస్మాత్ నిర్ణయానికి గల కారణాన్ని బెజోస్ ఇటీవల వెల్లడిస్తూ.. ‘ఏఐ రంగంలో జరుగుతున్న విప్లవాత్మక మార్పులు, దాని అపరిమిత సామర్థ్యాన్ని నిశితంగా గమనించిన తర్వాత నేను కేవలం ప్రేక్షక పాత్రకే పరిమితం కాలేకపోయాను. ఈ సాంకేతిక పరిణామంలో భాగం కావడానికి పూర్తిస్థాయిలో పని చేయాల్సిందేనని నిర్ణయించుకున్నాను’ అని చెప్పారు. ఈ తరహా కఠినమైన రోజువారీ విధులు తనకు శ్రమతో కూడిన సంతృప్తి ఇస్తాయని వ్యాఖ్యానించారు.భౌతిక ప్రపంచం వైపు ఏఐ ప్రయాణంసైంటిస్ట్ విక్ బజాజ్‌తో కలిసి బెజోస్ ఉమ్మడిగా నడిపిస్తున్న ప్రోమెథియస్ సంస్థ డిజిటల్ లేదా టెక్స్ట్ మోడళ్లకే పరిమితం కాకుండా భౌతిక ప్రపంచంలోని ఇంజినీరింగ్, తయారీ, ఆటోమోటివ్, ఏరోస్పేస్ రంగాల కోసం ఏఐ నమూనాలను అభివృద్ధి చేస్తోంది. ప్రారంభంలోనే 6.2 బిలియన్ డాలర్ల నిధుల సమీకరణతో ప్రారంభమైన ఈ స్టార్టప్ ఇటీవల మరో 12 బిలియన్ డాలర్ల నిధులను సమీకరించి 41 బిలియన్ డాలర్ల రికార్డు వ్యాల్యుయేషన్‌ను సొంతం చేసుకుంది.ఉద్యోగాల కోతపై భిన్నమైన దృక్పథంఏఐ సాంకేతికత వల్ల లక్షలాది ఉద్యోగాలు తుడిచిపెట్టుకుపోతాయన్న గ్లోబల్ ఆందోళనలను బెజోస్ తోసిపుచ్చారు. మానవ శ్రమకు ప్రత్యామ్నాయంగా ఏఐ మారదని, ఉత్పాదకతను పెంచే సాధనంగా మాత్రమే పని చేస్తుందని స్పష్టం చేశారు. సాంకేతికత పెరిగేకొద్దీ మానవ అవసరాలు, అవకాశాలు పెరుగుతాయని, ఫలితంగా భవిష్యత్తులో నిరుద్యోగం కంటే నైపుణ్యాలు కలిగిన మానవ వనరుల కొరత ఏర్పడుతుందని అభిప్రాయపడ్డారు.ఇదీ చదవండి: ఒక్కరోజులో ధరలు అమాంతం ఇలా.. -
కోకా-కోలా ‘ఫెయిర్‌లైఫ్’పై సైబర్ దాడి
ప్రపంచ పానీయాల దిగ్గజం ‘ది కోకా-కోలా కంపెనీ’కి చెందిన ప్రముఖ డైరీ బ్రాండ్ ఫెయిర్‌లైఫ్ ర్యాన్సమ్వేర్ సైబర్ దాడికి గురైంది. అమెరికాలోని ఫెయిర్‌లైఫ్ ప్రాసెసింగ్ ప్లాంట్లపై హ్యాకర్లు విరుచుకుపడటంతో ఆ దేశవ్యాప్తంగా డైరీ ఉత్పత్తుల తయారీ ప్రక్రియను యాజమాన్యం తాత్కాలికంగా పూర్తిస్థాయిలో నిలిపివేసింది. ఈ సైబర్ అటాక్ వివరాలను కోకా-కోలా సంస్థ అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ (ఎస్ఈసీ)కి సమర్పించిన ఫార్మ్ 8-కే ఫైలింగ్‌లో అధికారికంగా ధ్రువీకరించింది.ఉత్పత్తి నిలిపివేతహ్యాకర్లు ఫెయిర్‌లైఫ్ నెట్‌వర్క్‌లోకి అక్రమంగా ప్రవేశించి నాణ్యతా నియంత్రణ, తయారీకి సంబంధించిన ఆపరేషనల్ టెక్నాలజీ వ్యవస్థలను సైతం ప్రభావితం చేశారు. నాణ్యత, సాంకేతిక భద్రతపై అనిశ్చితి నెలకొనడంతో సంస్థ ముందస్తు జాగ్రత్తగా సరఫరా వ్యవస్థలను నిలిపివేసింది.అమెరికాలోని ఫెయిర్‌లైఫ్ ఉత్పత్తి కేంద్రాలన్నీ తాత్కాలికంగా మూతపడ్డాయి. కెనడాలోని ఫెయిర్‌లైఫ్ ఉత్పత్తి కేంద్రాలు యథాతథంగా పనిచేస్తున్నాయి. ఈ దాడి వల్ల వినియోగదారులకు చేరిన ఉత్పత్తుల నాణ్యత లేదా భద్రతపై ఎలాంటి ప్రతికూల ప్రభావం పడలేదని కోకా-కోలా స్పష్టం చేసింది. విదేశీ సైబర్ భద్రతా నిపుణుల సాయంతో ‘ఇన్సిడెంట్ రెస్పాన్స్ ప్రోటోకాల్స్’ ప్రారంభించారు. చట్టబద్ధమైన లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలకు సమాచారం అందించారు.బిలియన్ డాలర్ల బ్రాండ్‌పై సైబర్ పంజాఏటా దాదాపు 4 బిలియన్ డాలర్ల (రూ.33,000 కోట్లకు పైగా) విక్రయాలు జరిపే ఫెయిర్‌లైఫ్ బ్రాండ్‌పై ఈ రకమైన డిజిటల్ దాడి జరగడం ఫుడ్ అండ్ బెవరేజెస్ రంగాన్ని షాక్‌కు గురిచేసింది. హ్యాకర్లు 1టీబీ మేర సున్నితమైన కార్పొరేట్ డేటాను చోరీ చేశారనే నివేదికలు వస్తున్నప్పటికీ కోకా-కోలా స్పందిస్తూ ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని, ఆర్థిక పరిణామాలను అంచనా వేస్తున్నామని తెలిపింది.సైబర్ సెక్యూరిటీ విశ్లేషణ.. పరిశ్రమకు హెచ్చరికప్రస్తుతం సైబర్ నేరగాళ్లు కేవలం ఐటీ డేటా వ్యవస్థలనే కాకుండా తయారీ పరిశ్రమల్లో ఉత్పత్తులను నేరుగా నడిపించే ఆపరేషనల్ టెక్నాలజీ సాధనాలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఒక ఉత్పత్తి ప్లాంట్ నిలిచిపోతే సరఫరా గొలుసు విచ్ఛిన్నమై కంపెనీలకు వందల మిలియన్ డాలర్ల నష్టం వాటిల్లుతుంది. ఆధునిక తయారీ రంగాలు తమ ఐటీ, ప్రొడక్షన్ నెట్‌వర్క్‌ల డిజిటల్ భద్రతను అత్యంత కఠినంగా బలోపేతం చేసుకోవాల్సిన అవసరాన్ని ఈ ఫెయిర్‌లైఫ్ ఉదంతం మరోసారి గుర్తుచేసింది. -
రూ.35 లక్షల జాబ్ ఆఫర్.. చివరికి రూ.6.5 లక్షలు!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వేగంగా దూసుకెళ్తోంది. దాదాపు అన్ని రంగాల్లోనూ ఏఐ వల్ల పనులు సులభతరం అవుతున్నాయి. ఇలాంటి సమయంలో ఉద్యోగాలపై దీని ప్రభావం ఎలా ఉంటుందనే ఆందోళన కూడా పెరుగుతోంది. తాజాగా ఓ యువ సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఎదుర్కొన్న అనుభవం సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది.టైర్ 1.5 కాలేజీ నుంచి కొత్తగా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఒక గ్రాడ్యుయేట్, క్యాంపస్ ప్లేస్మెంట్ ద్వారా ఓ ప్రముఖ కంపెనీలో ఆరు నెలల ఇంటర్న్‌షిప్‌కు ఎంపికయ్యాడు. ఈ ఇంటర్న్‌షిప్‌లో మంచి పనితీరు కనబరిస్తే రూ.35 లక్షల వార్షిక ప్యాకేజీతో (35 LPA) ప్రీ-ప్లేస్మెంట్ ఆఫర్ (PPO) ఇస్తామని కంపెనీ తెలిపింది.మంచి ప్యాకేజీతో అవకాశం రావడంతో ఆ విద్యార్థి ఎంతో ఆశతో ఇంటర్న్‌షిప్ ప్రారంభించాడు. తన పూర్తి సామర్థ్యంతో పనిచేశానని, మేనేజర్ నుంచి కూడా మంచి ఫీడ్‌బ్యాక్ వచ్చిందని అతను చెప్పాడు. అంతేకాకుండా, తనకు తప్పకుండా ప్లేస్మెంట్ ఆఫర్ వస్తుందని మేనేజర్ కూడా నమ్మకం కల్పించారని వెల్లడించాడు. కానీ.. చివరి సమయంలో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది.ఇంటర్న్‌షిప్ ముగియడానికి కేవలం రెండు రోజుల ముందు కంపెనీ మొత్తం 90 మంది ఇంటర్న్‌లకు రిజెక్షన్ మెయిల్స్ పంపించింది. దీంతో రూ.35 లక్షల ఉద్యోగం వస్తుందని కలలు కన్న విద్యార్థుల ఆశలు ఒక్కసారిగా కూలిపోయాయి. ఆ కంపెనీ సాఫ్ట్వేర్ డెవలపర్ల స్థానంలో ఏఐ టెక్నాలజీని ఉపయోగించేందుకు ఎక్కువగా పెట్టుబడులు పెట్టడం వల్లే ఈ నిర్ణయం తీసుకుందని ఆ టెక్కీ పేర్కొన్నాడు.ప్రస్తుతం తన చేతిలో ఉన్న ఏకైక అవకాశం క్యాంపస్ ప్లేస్మెంట్ ద్వారా వచ్చిన రూ.6.5 లక్షల ప్యాకేజీ మాత్రమేనని తెలిపాడు. కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ ఫ్రెషర్లకు ఇంటర్వ్యూ అవకాశాలు కూడా రావడం లేదని తన బాధను వ్యక్తం చేశాడు.ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చాలామంది నెటిజన్లు ఆ యువకుడికి మద్దతుగా నిలిచారు. ప్రస్తుతం ఉన్న ఉద్యోగ అవకాశాన్ని స్వీకరించి, అనుభవం సంపాదించిన తర్వాత మెరుగైన అవకాశాల కోసం ప్రయత్నించాలని కొందరు సూచించారు. మొదటి ఉద్యోగం ఎంత పెద్ద ప్యాకేజీతో వచ్చిందన్నది కాకుండా.. అక్కడ నేర్చుకునే విషయాలు కూడా కెరీర్లో కీలకమని కొందరు అభిప్రాయపడ్డారు. అయితే.. మరికొందరు మాత్రం కంపెనీ తీరును తప్పుబట్టారు. రూ.35 లక్షల ఆఫర్ పేరుతో ఇంటర్న్‌ల నుంచి ఎక్కువ కష్టపడేలా చేసి, చివరికి ఆఫర్‌ను వెనక్కి తీసుకోవడం సరైన విధానం కాదని అన్నారు. ఇలాంటి నిర్ణయాలు యువ ఉద్యోగుల నమ్మకాన్ని దెబ్బతీస్తాయని అభిప్రాయపడ్డారు.ఏఐ వల్ల ఉద్యోగుల ఎంత ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందో.. అనే విషయాన్ని ఈ సంఘటన కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది. కొత్త అవకాశాలు వస్తున్నప్పటికీ, కొన్ని సంప్రదాయ ఉద్యోగాలపై ఏఐ ప్రభావం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి విద్యార్థులు, ఉద్యోగార్థులు కేవలం ఒకే నైపుణ్యంపై మాత్రమే ఆధారపడకుండా, ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీలను నేర్చుకుంటూ తమను తాము అభివృద్ధి చేసుకోవడం చాలా అవసరం అని చెబుతున్నారు. -
కేర్ హెల్త్ ఇన్సూరెన్స్‌కు TSHA షాక్!
కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా లబ్ధిదారులకు అందించే క్యాష్‌లెస్ వైద్య సేవలను తక్షణమే నిలిపివేస్తున్నట్లు తెలంగాణ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ (టీఎస్‌హెచ్‌ఏ) ప్రకటించింది.క్లెయిమ్‌ల తిరస్కరణ, చెల్లింపుల్లో నిబంధనలకు విరుద్ధంగా కోతలు విధించడం, తీవ్రమైన జాప్యం, ముందస్తు సమాచారం లేకుండా ఆస్పత్రులను ప్యానెల్ నుంచి తొలగించడం వంటి చర్యలకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ మేరకు కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ మనీష్ దొడేజాకు టీఎస్‌హెచ్‌ఏ లేఖ ద్వారా నోటీసు పంపింది.వివిధ సమస్యలపై సంస్థతో చర్చించేందుకు ఎన్నిసార్లు ప్రయత్నించినా సంబంధిత వ్యక్తుల నుంచి ఎలాంటి స్పందన రాలేదని అసోసియేషన్ ప్రతినిధులు పేర్కొన్నారు. ఫలితంగా ఆస్పత్రుల నిర్వహణ, వైద్య సేవలందింపు కష్టంగా మారడంతోనే క్యాష్‌లెస్ సేవలను నిలిపివేయాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. లబ్ధిదారులు ఇకపై రీయింబర్స్మెంట్ పద్ధతిలోనే వైద్య సేవలు పొందవచ్చని సూచించారు. -
గూగుల్ ఉద్యోగుల ఆందోళన.. సుందర్ పిచాయ్‌కు వినతి!
ప్రపంచవ్యాప్తంగా ఏఐ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఏఐ వల్ల పనులు వేగంగా, సులభంగా పూర్తవుతున్నాయి. అయితే.. మరోవైపు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా ఉద్యోగాలు పోతాయా?.. అనే భయం కూడా చాలా మందిలో పెరుగుతోంది. ఇదే ఆందోళన ఇప్పుడు ప్రముఖ టెక్ దిగ్గజం అయిన గూగుల్ ఉద్యోగుల్లో కూడా కనిపిస్తోంది. దీంతో సుమారు 4500 మందికిపైగా ఉద్యోగులు సీఈఓ సుందర్ పిచాయ్‌కు ఒక పిటిషన్ సమర్పించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.సుందర్ పిచాయ్‌కు అందించిన పిటిషన్లో.. ఏఐ కోసం కంపెనీ భారీగా పెట్టుబడులు పెడుతూనే, మరోవైపు ఉద్యోగులను తొలగించడం సరికాదని వెల్లడించారు. ఉద్యోగులకు భద్రత కల్పించే విధంగా.. కొత్త విధానాలు తీసుకురావాలని వారు కోరారు. అంతే కాకుండా క్యాంపస్ వెలుపల 100 మంది ఉద్యోగులు శాంతియుతంగా నిరసన కూడా చేపట్టారు. ఉద్యోగ భద్రత కోసం.. గూగుల్ చరిత్రలో జరిగిన అతిపెద్ద ఉద్యమాల్లో ఇది ఒకటిగా చెప్పవచ్చు.ఉద్యోగుల డిమాండ్ ఏమిటంటే కంపెనీ లేఆఫ్‌లు చేయాల్సి వచ్చినా.. ముందుగా స్వచ్ఛందంగా ఉద్యోగం వదిలే అవకాశం ఇవ్వాలి. ఉద్యోగం కోల్పోయే వారికి తగిన సెవరెన్స్ ప్యాకేజీ అందించాలి. అలాగే ఉద్యోగుల పనితీరును అంచనా వేసే విధానంలో కూడా మార్పులు చేయాలని కోరుతున్నారు. ఎందుకంటే.. ప్రస్తుతం అమలులో ఉన్న విధానం చాలామందికి అన్యాయం చేస్తోందని ఉద్యోగులు భావిస్తున్నారు.గతంలో కూడా గూగుల్ ఉద్యోగులు.. నైతిక అంశాలపై, ఏఐ వినియోగంపై నిరసనలు చేశారు. కానీ.. ఈసారి పరిస్థితి భిన్నంగా ఉంది. ఇప్పుడు వారి ఆందోళన పూర్తిగా తమ ఉద్యోగాల గురించే. ఏఐ అభివృద్ధి చెందుతున్న కొద్దీ.. తమ ఉద్యోగాలు ప్రమాదంలో పడతాయనే భయం వారిని ఈ ఉద్యమానికి దారితీసింది.ఇదీ చదవండి: వెకేషన్‌కు వెళ్లాడు.. ఉద్యోగం పోయింది! -
ఐఆర్జీసీ ప్రతీకార దాడులు
అమెరికా సైనిక, ఆర్థిక, సాంకేతిక మౌలిక వసతులే లక్ష్యంగా ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివాల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) ప్రతీకార దాడులను తీవ్రతరం చేసింది. దీనిలో భాగంగా బహ్రెయిన్‌లో ఉన్న ప్రముఖ అమెరికన్ టెక్నాలజీ దిగ్గజం అమెజాన్‌కు చెందిన ప్రధాన డేటా ఇన్ఫ్రాస్ట్రక్చర్పై క్రూయిజ్ క్షిపణులతో దాడులు చేసి పూర్తిగా ధ్వంసం చేసినట్లు ఐఆర్జీసీ ప్రకటించింది.ఆపరేషన్ నస్ర్-2లో భాగంగా ప్రతికార దాడిఇరాన్ అధికారిక వార్తా సంస్థల (ఐఆర్ఎన్ఏ, తస్నీమ్) వివరాల ప్రకారం.. తమ ఏరోస్పేస్ బలగాలు ఆపరేషన్ నస్ర్-2లో భాగంగా దాడులను నిర్వహించాయి. ఇటీవల ఇరాన్‌లోని దార్ఖోవిన్ వద్ద అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఏఈఏ) పర్యవేక్షణలో నిర్మాణంలో ఉన్న పౌర అణు విద్యుత్ కేంద్రంపై అమెరికా బలగాలు జరిపిన వైమానిక దాడులకు నిరసనగా ఈ క్షిపణి దాడి చేపట్టినట్లు ఐఆర్జీసీ స్పష్టం చేసింది. అమెరికా సెంట్రల్ కమాండ్ (సెంట్కామ్) హార్మూజ్ జలసంధిలో నౌకాయాన భద్రత నెపంతో ఇరాన్ స్థావరాలపై దాడులకు దిగుతుండటంతో ఇరాన్ సైతం గల్ఫ్ రీజియన్‌లోని అమెరికా రాడార్ వ్యవస్థలు, వైమానిక స్థావరాలతో పాటు ప్రైవేట్ కార్పొరేట్ డిజిటల్ వనరులను కూడా లక్ష్యంగా చేసుకుంటోంది.స్వతంత్ర వర్గాల స్పందన.. ప్రస్తుత పరిస్థితిఐఆర్జీసీ చేసిన ఈ క్షిపణి దాడి ప్రకటనపై అమెజాన్ సంస్థ గానీ, బహ్రెయిన్ ప్రభుత్వ వర్గాలు గానీ ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ధ్రువీకరణ విడుదల చేయలేదు. దాడి వల్ల జరిగిన ఆస్తి నష్టం లేదా ప్రాణనష్టం వివరాలపై స్వతంత్ర వర్గాల నుంచి స్పష్టత రావాల్సి ఉంది.గ్లోబల్ టెక్నాలజీ, ఆర్థిక రంగాలపై ప్రభావంయుద్ధాల్లో కేవలం మిలిటరీ క్యాంపులనే కాకుండా ప్రధాన టెక్ కంపెనీల డేటా సెంటర్లను లక్ష్యంగా చేసుకోవడం అంతర్జాతీయ విశ్లేషకులను ఆందోళనకు గురిచేస్తోంది. బహ్రెయిన్ వంటి కీలక ఆర్థిక కేంద్రంలో అమెజాన్ వెబ్ సర్వీసెస్ మౌలిక వసతులపై దాడి జరగడం వల్ల ప్రాంతీయ డిజిటల్ సేవలు, గ్లోబల్ సప్లై చైన్, అంతర్జాతీయ వాణిజ్య నెట్‌వర్క్‌లు దెబ్బతినే ప్రమాదముంది. ఈ పరిణామాలు పశ్చిమాసియాలో భద్రతా సంక్షోభాన్ని మరింత సంక్లిష్టం చేస్తున్నాయి.ఇదీ చదవండి: మళ్లీ టాప్ గేర్‌లోకి పసిడి.. నేటి ధరలు ఇలా.. -
హోటళ్లకు నోటీసులు.. కస్టమర్లదే అంతిమ నిర్ణయం!
రెస్టారెంట్లలో బిల్లులతో పాటు అడ్డగోలుగా సర్వీస్ ఛార్జ్ పేరిట వినియోగదారులపై అదనపు భారం మోపుతున్న హోటళ్లపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. బిల్లులో కస్టమర్ల అనుమతి లేకుండా సర్వీస్ ఛార్జ్ కలపడం, దానిని తొలగించమని కోరినా నిరాకరించడం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతున్న 41 ప్రముఖ రెస్టారెంట్లపై సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) సుమోటోగా చర్యలు ప్రారంభించింది.వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈ విషయంపై స్పందిస్తూ.. ‘రెస్టారెంట్లు వినియోగదారులను సర్వీస్ ఛార్జ్ చెల్లించమని బలవంతం చేయడానికి వీల్లేదు. ఇది పూర్తిగా కస్టమర్ ఆప్షన్’ అని స్పష్టం చేశారు. నేషనల్ కన్స్యూమర్ హెల్ప్‌లైన్ (ఎన్సీహెచ్)కు అందిన వేలాది ఫిర్యాదుల ఆధారంగా సీసీపీఏ ఈ చర్యలు చేపట్టింది.కోర్టు తీర్పుతో మారిన సమీకరణాలువాస్తవానికి, జులై 2022లోనే సీసీపీఏ రెస్టారెంట్లలో నిర్బంధ సర్వీస్ ఛార్జ్ విధించడాన్ని అనుచిత వ్యాపార ధోరణిగా అభివర్ణిస్తూ మార్గదర్శకాలు విడుదల చేసింది. అయితే, రెస్టారెంట్ అసోసియేషన్లు దీన్ని సవాలు చేస్తూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాయి. గత ఏడాది (మార్చి 2025) ఢిల్లీ హైకోర్టు సీసీపీఏ మార్గదర్శకాలను సమర్థిస్తూ తీర్పునివ్వడంతో చట్టపరమైన అడ్డంకులు తొలగిపోయాయి. ఈ నేపథ్యంలో కేంద్రం ఇప్పుడు మరింత కఠినంగా వ్యవహరిస్తోంది.వినియోగదారులు తెలుసుకోవాల్సినవి..ఆహార పదార్థాలు, వాటిపై పడే పన్నులు మాత్రమే కస్టమర్లు చెల్లించాల్సి ఉంటుంది. రెస్టారెంట్ అందించే సేవ నచ్చితే టిప్ లేదా సర్వీస్ ఛార్జ్ ఇవ్వడం వినియోగదారుడి ఇష్టం. బిల్లులో సర్వీస్ ఛార్జ్ ఉంటే దానిని తీసివేయమని అడిగే హక్కు కస్టమర్‌కు ఉంది. హోటల్ యాజమాన్యం నిరాకరిస్తే అది చట్టరీత్యా నేరం. సర్వీస్ ఛార్జ్ అనేది అధికారిక పన్ను కానందున దానిపై జీఎస్టీ విధించడం నిబంధనలకు విరుద్ధం.ఫిర్యాదు చేయడం ఎలా?ఒకవేళ ఏ రెస్టారెంట్ అయినా సర్వీస్ ఛార్జ్ బలవంతంగా వసూలు చేస్తే వినియోగదారులు జాతీయ వినియోగదారుల హెల్ప్‌లైన్ టోల్ ఫ్రీ నంబర్ 1915 ద్వారా లేదా ఎన్సీహెచ్ యాప్/పోర్టల్ ద్వారా నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. మార్గదర్శకాల అమలు స్థాయి నుంచి ప్రత్యక్ష చర్యల దిశగా కేంద్రం వేసిన ఈ అడుగు వినియోగదారుల హక్కుల పరిరక్షణలో కీలక మైలురాయిగా నిలవనుంది.ఇదీ చదవండి: మళ్లీ టాప్ గేర్‌లోకి పసిడి.. నేటి ధరలు ఇలా.. -
ఎల్ నినో రిస్క్‌ను జయించండిలా!
పసిఫిక్ మహాసముద్రంలో సంభవించే ఉష్ణోగ్రతల మార్పులు (ఎల్ నినో) వాతావరణ సమతుల్యతతోపాటు భారతదేశం వంటి వ్యవసాయాధారిత ఆర్థిక వ్యవస్థలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. వర్షాభావం, కరవు పరిస్థితులు, పంట దిగుబడులు తగ్గడం వల్ల నేరుగా ఆహార ద్రవ్యోల్బణం పెరిగి సాధారణ పౌరుల నుంచి బడా పరిశ్రమల వరకు ప్రతికూల ప్రభావం పడుతోంది. ఈ తరహా వాతావరణ రిస్క్‌ల నుంచి ఆర్థిక వ్యవస్థను, వ్యాపారాలను కాపాడుకోవడానికి బీమా రంగం కీలకమైన రక్షణ కవచంగా మారుతోంది.ఎల్ నినో తెచ్చే ఆర్థిక సవాలురుతుపవనాలు దెబ్బతినడం వల్ల వరి, పప్పుధాన్యాలు, నూనెగింజల ఉత్పత్తి క్షీణిస్తుంది. దీనివల్ల నిత్యావసరాల ధరలు పెరిగి సామాన్యుడిపై భారం పడుతుంది. మరోవైపు రిజర్వాయర్లలో నీటిమట్టాలు తగ్గి జలవిద్యుత్ ఉత్పత్తి, గ్రామీణ వినియోగ సామర్థ్యం పడిపోతాయి.రిస్క్ నివారణలో బీమా పాత్రప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన వంటి పథకాలు వాతావరణ వైపరీత్యాల వల్ల పంట కోల్పోయిన రైతులకు తక్షణ పెట్టుబడి భరోసానిస్తాయి. 85 శాతానికి పైగా చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఎలాంటి బీమా లేకుండా నడుస్తున్నాయి. సప్లై చైన్, బిజినెస్ ఇంటరప్షన్ ఇన్సూరెన్స్ ద్వారా వీటిని దివాలా తీయకుండా కాపాడవచ్చు.పారామెట్రిక్ బీమాసాంప్రదాయ బీమాలో నష్ట అంచనాకు సమయం పడుతుంది. కానీ కొత్తగా వస్తున్న ‘పారామెట్రిక్ ఇన్సూరెన్స్’ మోడల్లో ఒక ప్రాంతంలో వర్షపాతం నిర్దిష్ట స్థాయి కంటే తగ్గితే నష్టంతో సంబంధం లేకుండా తక్షణమే లబ్ధిదారుల ఖాతాల్లోకి పరిహారం జమ అవుతుంది. ఇది రైతులకు, వ్యాపారులకు త్వరిత ఊరటనిస్తుంది.ఎల్ నినో సవాలును అధిగమించడానికి ప్రభుత్వం బీమా ప్రీమియంల్లో సబ్సిడీలను పెంచి, గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కల్పించాలి. బీమా సంస్థలు కూడా తక్కువ ఖర్చుతో కూడిన వాతావరణ బీమా ఉత్పత్తులను అందుబాటులోకి తేవాలి. ముందస్తు రిస్క్ మేనేజ్మెంట్తో కూడిన బీమా కవరేజ్ ద్వారానే ఎల్ నినో ఆర్థిక ప్రతికూలతల నుంచి దేశాన్ని సురక్షితంగా కాపాడుకోగలమని గమనించాలి.ఇదీ చదవండి: బంగారం, వెండిలో ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చా? -
12 సార్లు రిజెక్ట్.. 13వ ప్రయత్నంలో ఉద్యోగం!
జీవితంలో విజయం ఒక్కసారిగా రాదు. ఎన్నో అపజయాలు, నిరాశలను దాటిన తర్వాతే విజయం లభిస్తుంది. దీనికి నిదర్శనంగా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ తన అనుభవాన్ని సోషల్ మీడియా వేదిక 'ఎక్స్'లో షేర్ చేసుకున్నారు. వరుసగా 12 సార్లు తిరస్కరణ ఎదురైనా ఆశ వదులుకోకుండా ప్రయత్నించి, 13వ ప్రయత్నంలో గూగుల్‌లో ఉద్యోగం సాధించిన విషయాన్ని వెల్లడించారు.గూగుల్ మాత్రమే కాదు, మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగం పొందడానికి కూడా తనకు 16 సార్లు తిరస్కరణ ఎదురైందని వెల్లడించాడు. అమెజాన్‌లో మూడుసార్లు అప్లికేషన్ తిరస్కరించబడగా, యాపిల్, ఒరాకిల్ వంటి సంస్థల నుంచి ఒక్కసారి కూడా ఇంటర్వ్యూకు పిలుపు రాలేదని తెలిపారు. అయినప్పటికీ ఎక్కడా నిరాశ చెందకుండా తన ప్రయత్నాలను కొనసాగించినట్లు పేర్కొన్నాడు.తన విజయానికి కారణం కేవలం అదృష్టం మాత్రమే కాదని, సరైన ప్రణాళిక కూడా ముఖ్యమని చెప్పారు. ఉద్యోగాలకు విచక్షణ లేకుండా దరఖాస్తు చేయకుండా, తమ రెజ్యూమ్‌కు సరిపోయే పోస్టులకే అప్లై చేయాలని సూచించారు. అలాగే కంపెనీలో పనిచేస్తున్న పరిచయస్తుల ద్వారా హెచ్ఆర్ను సంప్రదించడం, లింక్డ్ఇన్లో మేనేజర్లతో కనెక్ట్ కావడం వంటి మార్గాలు కూడా ఉద్యోగ అవకాశాలను పెంచుతాయని వివరించారు.ఈ పోస్ట్ చూసిన పలువురు నెటిజన్లు ఆయన పట్టుదలను అభినందించారు. మరికొందరు మాత్రం మంచి కాలేజీ లేదా పెద్ద కంపెనీల అనుభవం కూడా ఉద్యోగ అవకాశాలపై ప్రభావం చూపుతుందని అభిప్రాయపడ్డారు. ఇంకొందరు ఇంటర్వ్యూ సన్నద్ధతను మరింత మెరుగుపరచుకోవాలని సూచించారు.I got into Google after getting rejected 12 times. 13th time was the charm🧿 Now just Google, Amazon - got the offer after 3 rejectionsMicrosoft - got the offer after 16 rejectionsApple - never got a call backOracle - never got a call backApplying in these companies is… pic.twitter.com/gjHMdfzdEA— Soumyadeep Paul (@investwithpaul) July 19, 2026 -
LPG గ్యాస్‌కు చెక్?.. కేంద్రం మాస్టర్ ప్లాన్!
భారతదేశంలో ఇథనాల్ వినియోగం గురించి పెద్ద చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో కొత్త ఆలోచనకు శ్రీకారం చుడుతోంది. త్వరలోనే ఇథనాల్‌ను వంట గ్యాస్ మాదిరిగా ఉపయోగించుకోవడానికి కావలసిన ఏర్పాట్లు చేయనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.భారత్ ఎల్పీజీ వంటగ్యాస్ మీద ఆధారపడటాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. బహుశా ఈ ఏడాది చివరి నాటికి అన్నీ సిద్దమవుతాయని నిపుణులు చెబుతున్నారు.ఇథనాల్ అనేది చెరకు, మొక్కజొన్న, ఇతర ఆహార ధాన్యాల నుంచి తయారయ్యే పరిశుభ్రమైన, పునరుత్పాదక ఇంధనం. ఇప్పటివరకు దీనిని పెట్రోల్‌లో కలిపి వాహనాల్లో వినియోగిస్తున్నారు. ఇకపై అదే ఇథనాల్‌ను ప్రత్యేక స్టవ్‌ల ద్వారా ఇంట్లో వంట చేయడానికి ఉపయోగించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.ఇథనాల్ స్టవ్‌లు కొనుగోలు చేసే వారికి సబ్సిడీ ఇవ్వడానికి కూడా కేంద్రం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ఇథనాల్ సులభంగా అందుబాటులో ఉండేలా సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. దీనికోసం.. భవిష్యత్తులో పెట్రోల్ బంకుల వద్ద ప్రత్యేక ఇథనాల్ పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఇదే జరిగితే.. వినియోగదారులు పెట్రోల్ బంకుల నుంచే ఇథనాల్ కొనుగోలు చేయవచ్చన్నమాట.ప్రస్తుతం భారత్‌లో ఇథనాల్ ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. అయితే అందులో పెద్ద మొత్తంలో వినియోగించకుండా మిగిలిపోతోంది. ఇలా మిగిలిన ఇథనాల్ ఇంధనాన్ని వంట గ్యాస్ కోసం ఉపయోగిస్తే రైతులకు, పరిశ్రమలకు, దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా మేలు జరుగుతుందని నిపుణులు భావిస్తున్నారు.ఇదీ చదవండి: హైడ్రోజన్ రైలుపై తప్పుడు ప్రచారం.. క్లారిటీ ఇచ్చిన రైల్వే! -
కొత్త లేబర్ కోడ్.. జీతం ‘టైమ్’కి ఇవ్వాల్సిందే!
నెలాఖరు తర్వాత జీతం ఎప్పుడు వస్తుందోనని ఎదురుచూసే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వేతనాల కోడ్ (Code on Wages), 2019 కీలక రక్షణ కల్పిస్తోంది. ఈ చట్టం ప్రకారం ఉద్యోగులకు జీతాలు సకాలంలో చెల్లించాల్సిన బాధ్యతను యజమానులపై స్పష్టంగా విధించింది. ముఖ్యంగా జీతం ఆలస్యం చేయడం, అనుమతి లేకుండా కోతలు విధించడం వంటి అంశాలపై ఉద్యోగులు నేరుగా అధికారులను ఆశ్రయించే అవకాశం కల్పించింది. ఈ నిబంధనల ఉద్దేశం ఉద్యోగులకు వేతన భద్రత కల్పించడంతో పాటు యజమానుల్లో జవాబుదారీతనాన్ని పెంచడం.అయితే ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. వేతనాల కోడ్, 2019 చట్టం ఆమోదం పొందినప్పటికీ, దాని పూర్తి అమలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిబంధనలు అమలు చేసిన తర్వాతే పూర్తిగా వర్తిస్తుంది. కేంద్ర ప్రభుత్వం 2026లో తుది నిబంధనలను నోటిఫై చేసినప్పటికీ, అన్ని రాష్ట్రాల్లో ఒకేసారి అమలు కాలేదు. కాబట్టి ఉద్యోగి పనిచేస్తున్న రాష్ట్రంలో అమలులో ఉన్న నిబంధనలను కూడా పరిశీలించాల్సి ఉంటుంది.జీతం ఎప్పటిలోపు చెల్లించాలి?వేతనాల కోడ్ ప్రకారం నెలవారీ వేతనం పొందే ఉద్యోగులకు తదుపరి నెల 7వ తేదీలోపు జీతం చెల్లించాలి. రోజువారీ వేతన కార్మికులకు షిఫ్ట్ ముగిసిన వెంటనే, వారపు వేతన ఉద్యోగులకు వారాంతపు సెలవుకు ముందే వేతనం ఇవ్వాలి. పక్షం రోజుల ప్రాతిపదికన పనిచేసేవారికి ఆ కాలం ముగిసిన రెండు రోజుల్లోపు చెల్లించాల్సి ఉంటుంది.ఉద్యోగం మానేసినా.. రెండు రోజుల్లో సెటిల్మెంట్రాజీనామా చేసినా, ఉద్యోగం నుంచి తొలగించినా లేదా సేవలు రద్దు చేసినా ఉద్యోగి తుది బకాయిలను రెండు పని దినాల్లోపు చెల్లించాలని కోడ్ పేర్కొంటుంది. గతంలో నెలల తరబడి ఫైనల్ సెటిల్మెంట్ కోసం వేచి చూడాల్సిన పరిస్థితులకు ఇది కొంతవరకు చెక్ పెట్టే నిబంధనగా భావిస్తున్నారు.అందరికీ వర్తింపుపాత వేతన చెల్లింపుల చట్టం (Payment of Wages Act, 1936) కింద నిర్దిష్ట వేతన పరిమితిలో ఉన్న ఉద్యోగులకే కొన్ని రక్షణలు ఉండేవి. కానీ కొత్త కోడ్ ప్రకారం జీతం ఎంత ఉన్నా ఉద్యోగులందరికీ సమాన రక్షణ ఉంటుంది. దీంతో సీనియర్ మేనేజ్మెంట్, అధిక వేతన ఉద్యోగులు కూడా ఈ చట్టం పరిధిలోకి వస్తారు.జీతం ఆలస్యమైతే ఏం చేయాలి?యజమాని జీతం నిలిపివేసినా, ఆలస్యం చేసినా లేదా అనుమతి లేని కోతలు విధించినా ఉద్యోగి ‘ఇన్స్పెక్టర్-కమ్-ఫెసిలిటేటర్’ను సంప్రదించవచ్చు. ఈ అధికారి ముందుగా ఇరు పక్షాల మధ్య సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తారు. పరిష్కారం లభించకపోతే కేసును ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్‌కు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. కోడ్ నిబంధనలను ఉల్లంఘించిన యజమానులపై జరిమానాలు, కొన్ని సందర్భాల్లో జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉంది.ఇతర ముఖ్యమైన నిబంధనలుఉద్యోగులకు వేతనం చెల్లించే సమయంలో ఫిజికల్ లేదా ఎలక్ట్రానిక్ పే స్లిప్ ఇవ్వాలని నిబంధనలు సూచిస్తున్నాయి. అలాగే చట్టం అనుమతించిన కోతలకే అవకాశం ఉంటుంది. ఉద్యోగి వేతనానికి సంబంధించిన క్లెయిమ్‌లను నిర్ణీత సమయంలో పరిష్కరించే విధంగా ప్రత్యేక వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు. అధికారులు ఇచ్చిన ఆదేశాలను యజమాని పాటించకపోతే, బకాయిలను భూ ఆదాయ బకాయిల మాదిరిగా వసూలు చేసే అధికారాన్ని కూడా చట్టం కల్పిస్తోంది. -
ఈ ప్రైవేటు బ్యాంకులకు భలే లాభాలొచ్చాయ్..
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ప్రైవేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంకు రూ. 19,060 కోట్ల నికర లాభం (స్టాండెలోన్) ప్రకటించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో నమోదైన రూ. 18,155 కోట్లతో పోలిస్తే ఇది సుమారు 5 శాతం అధికం. మరోవైపు బ్యాంకు ఆదాయం రూ. 99,200 కోట్ల నుంచి రూ. 92,184 కోట్లకు తగ్గింది. వడ్డీ ఆదాయం రూ. 77,470 కోట్ల నుంచి రూ. 79,363 కోట్లకు పెరిగింది. స్థూల నిరర్థక ఆస్తులు (జీఎన్‌పీఏ) 1.4 శాతం నుంచి 1.17 శాతానికి, నికర ఎన్పీఎలు 0.47 శాతం నుంచి 0.41 శాతానికి నెమ్మదించాయి. పార్ట్‌టైమ్ చైర్మన్‌గా మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ నియామకంతో సంస్థకు స్థిరత్వం లభించినట్లవుతుందని ఎండీ, సీఈవో శశిధర్ జగదీశన్ తెలిపారు. ఐసీఐసీఐ బ్యాంక్‌కి రుణ వృద్ధి దన్ను..దేశీయంగా ప్రైవేట్ రంగంలో రెండో అతి పెద్ద బ్యాంకు అయిన ఐసీఐసీఐ బ్యాంక్ తొలి త్రైమాసికంలో నికర లాభం (కన్సాలిడేటెడ్) సుమారు 14 శాతం వృద్ధితో రూ. 13,558 కోట్ల నుంచి రూ. 15,440 కోట్లకు పెరిగింది. రుణాలు 20 శాతం వృద్ధి చెందడం ఇందుకు దోహదపడింది. నికర వడ్డీ ఆదాయం సుమారు 13 శాతం పెరిగి రూ. 24,384 కోట్లకు చేరింది. డిపాజిట్లు 14 శాతం పెరిగాయి. స్థూల నిరర్థక ఆస్తుల (జీఎన్‌పీఏ) నిష్పత్తి 1.67 శాతం నుంచి 1.38 శాతానికి తగ్గింది. స్టాండెలోన్ ప్రాతిపదికన బ్యాంకు నికర లాభం 16 శాతం వృద్ధితో రూ. 12,768 కోట్ల నుంచి రూ. 14,804 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్ స్వల్పంగా 4.36 శాతానికి పెరిగింది. వివిధ కారణాలరీత్యా గత కొంతకాలంగా నెమ్మదించిన కార్పొరేట్ రుణాల విభాగం మళ్లీ గణనీయంగా మెరుగుపడగలదని బ్యాంకు ఈడీ సందీప్ బాత్రా తెలిపారు. కోటక్ మహీంద్రా 23 శాతం అప్..కోటక్ మహీంద్రా బ్యాంకు నికర లాభం గత క్యూ1తో పోలిస్తే 22.6 శాతం వృద్ధితో రూ. 5,480 కోట్లకు (కన్సాలిడేటెడ్) పెరిగింది. స్టాండెలోన్ ప్రాతిపదికన రూ. 3,282 కోట్ల నుంచి రూ. 4,123 కోట్లకు చేరింది. నికర వడ్డీ ఆదాయం 9 శాతం పెరిగి రూ. 7,259 కోట్ల నుంచి రూ. 7,928 కోట్లకు వృద్ధి చెందింది. అయితే, నికర వడ్డీ మార్జిన్ మాత్రం 4.64 శాతం నుంచి 4.53 శాతానికి తగ్గింది. ఈ ఏడాది డిసెంబర్లో వైదొలగాలన్న నిర్ణయానికి వ్యక్తిగత, వృత్తిగత అంశాలు కారణమని బ్యాంకు ఎండీ, సీఈవో అశోక్ వాస్వానీ తెలిపారు. సమీక్షాకాలంలో డిపాజిట్లు 14 శాతం వృద్ధితో రూ. 4,92 లక్షల కోట్ల నుంచి రూ. 5.59 లక్షల కోట్లకు చేరాయి. రుణాలు 15 శాతం పెరిగి రూ. 4.59 లక్షల కోట్ల నుంచి రూ. 5.28 లక్షల కోట్లకు వృద్ధి చెందాయి. యాక్సిస్ బ్యాంక్‌కి తగ్గిన ప్రొవిజనింగ్ భారం..మొండిబాకీలు మొదలైన వాటికి ప్రొవిజనింగ్ తగ్గడం యాక్సిస్ బ్యాంక్ మెరుగైన పనితీరుకు దోహదపడింది. క్యూ1లో సంస్థ నికర లాభం 22 శాతం వృద్ధితో రూ. 7,632 కోట్లకు (కన్సాలిడేటెడ్) చేరింది. స్టాండెలోన్ ప్రాతిపదికన 23 శాతం పెరిగి రూ. 7,114 కోట్లకు వృద్ధి చెందింది. నికర వడ్డీ ఆదాయం 8 శాతం పెరిగి రూ. 14,646 కోట్లుగా నమోదైంది. రుణాలు 19 శాతం వృద్ధి చెందాయి. నికర వడ్డీ మార్జిన్ 3.80 శాతం నుంచి 3.46 శాతానికి తగ్గింది. కార్పొరేట్ రుణాలు 38 శాతం, రిటైల్ రుణాలు 8 శాతం వృద్ధి చెందినట్లు బ్యాంకు సీఈవో అమితాబ్ చౌదరి తెలిపారు. ఇక నుంచి నికర వడ్డీ మార్జిన్లు పుంజుకోగలవని ఆయన పేర్కొన్నారు. సమీక్షాకాలంలో ప్రొవిజనింగ్ రూ. 3,948 కోట్ల నుంచి రూ. 2,223 కోట్లకు తగ్గింది. జీఎన్‌పీఏ నిష్పత్తి 1.23 శాతం నుంచి 1.28 శాతానికి పెరిగింది. -
ఒక్క యాప్.. నాలుగు కోట్ల డౌన్లోడ్స్!
టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో.. దాదాపు అన్ని ప్రభుత్వ సేవలు ప్రజలకు మరింత సులభంగా అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. అలాంటి సేవల్లో ఆధార్ యాప్ ముఖ్యమైనది. ఈ యాప్ ఇప్పటికే 4 కోట్ల డౌన్లోడ్లను దాటిందని ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ (MeitY) వెల్లడించింది. దీన్నిబట్టి చూస్తే ప్రజలకు యాప్ ప్రజలకు ఎంత ఉపయోగకరమైనదో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.ఆధార్ యాప్ ద్వారా.. మొబైల్ నెంబర్‌ను మార్చుకోవడం, అడ్రస్ అప్డేట్ చేయడం, ఈ-ఆధార్ డౌన్లోడ్ చేసుకోవడం, బయోమెట్రిక్ సమాచారాన్ని లాక్ లేదా అన్‌లాక్ చేయడం వంటి సేవలను పొందవచ్చు. దీంతో.. ఆధార్ సేవల కోసం ప్రతిసారి కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం చాలా వరకు తగ్గింది.ప్రభుత్వం విడుదల చేసిన వివరాల ప్రకారం.. ఈ యాప్ ద్వారా ఇప్పటివరకు 49 లక్షల మొబైల్ నెంబర్లు, 11.65 లక్షల చిరునామాలు, 12.5 లక్షల ఈమెయిల్ చిరునామాలు అప్డేట్ అయ్యాయి. అంతేకాకుండా.. 1.91 కోట్లకు పైగా బయోమెట్రిక్ లాక్/అన్‌లాక్ సేవలను వినియోగదారులు ఉపయోగించినట్లు తెలుస్తోంది.ఇదీ చదవండి: ధనవంతుడు vs సంపన్నుడు: కియోసాకి క్లారిటీ -
ఏంటిది? కర్ణాటక పాస్‌పోర్ట్ కోసం భారీ క్యూలు..
స్మార్ట్ఫోన్లు, సోషల్ మీడియా చెక్-ఇన్ల కాలంలోనూ పాతకాలపు స్టాంపుల సేకరణకు మళ్లీ ఆదరణ పెరుగుతోంది. ఇండియా పోస్ట్ కర్ణాటక పోస్టల్ సర్కిల్ ప్రవేశపెట్టిన ‘ఫిలాటెలీ పాస్‌పోర్ట్’ ప్రస్తుతం ప్రయాణికులు, స్టాంప్ కలెక్టర్లలో కొత్త క్రేజ్‌గా మారింది. తాజా ఎడిషన్ విడుదల నేపథ్యంలో బెంగళూరులోని జనరల్ పోస్టాఫీసు ముందు వందలాది మంది తెల్లవారుజామునే క్యూలు కట్టడం ఈ ఆసక్తికి నిదర్శనంగా నిలిచింది. ఈ పాస్‌పోర్ట్ 2024 చివర్లో తొలిసారి అందుబాటులోకి రాగా, ఇప్పుడు కర్ణాటక వ్యాప్తంగా సుమారు 100 పర్యాటక, వారసత్వ ప్రాంతాలను కలుపుతూ నవీకరించిన ఎడిషన్‌ను విడుదల చేశారు. సుమారు 1,500 కాపీల తాజా బ్యాచ్‌కు కూడా భారీ డిమాండ్ నెలకొన్నట్లు తెలుస్తోంది.ఫిలాటెలీ పాస్‌పోర్ట్ అంటే?పేరు పాస్‌పోర్ట్ అయినప్పటికీ దీనికి విదేశీ ప్రయాణాలతో ఎలాంటి సంబంధం లేదు. ఇది కర్ణాటకలోని పర్యాటక ప్రాంతాలను సందర్శించే వారికి ప్రత్యేక జ్ఞాపకంగా రూపొందించిన కలెక్టర్ బుక్లెట్. ఇందులో ప్రతి గమ్యస్థానానికి ఒక ప్రత్యేక పేజీ ఉంటుంది. ఆ ప్రాంతానికి సమీపంలోని గుర్తించిన పోస్టాఫీసుకు వెళ్లి పోస్టల్ స్టాంప్‌ను కొనుగోలు చేసి, అక్కడ మాత్రమే లభించే పర్మనెంట్ పిక్టోరియల్ క్యాన్సిలేషన్ (PPC) ముద్రను వేయించుకోవాలి. దేవాలయాలు, కోటలు, మ్యూజియంలు, వన్యప్రాణి అభయారణ్యాలు, చారిత్రక ప్రదేశాలకు ప్రత్యేక గుర్తులతో ఈ ముద్రలు అందుబాటులో ఉంటాయి.ట్రావెలింగ్‌కి కొత్త అర్థంప్రతి ముద్ర నిజంగా ఆ ప్రాంతాన్ని సందర్శించిన గుర్తుగా నిలుస్తుంది. అందుకే ఈ పాస్‌పోర్ట్‌ను చాలామంది ఒక ‘ట్రావెల్ ఛాలెంజ్’గా కూడా భావిస్తున్నారు. అన్ని గమ్యస్థానాలను సందర్శించి ముద్రలు సేకరించడం ద్వారా రాష్ట్రాన్ని విభిన్న కోణాల్లో అన్వేషించే అవకాశం లభిస్తుంది. సాధారణ సావనీర్లా కొనుక్కునే వస్తువు కాకుండా, స్వయంగా ప్రయాణించి సంపాదించాల్సిన జ్ఞాపకంగా ఇది ప్రత్యేకతను సంతరించుకుంది.సోషల్ మీడియాలో వైరల్ఫిలాటెలీ పాస్‌పోర్ట్‌కు సోషల్ మీడియా కూడా ఊపునిచ్చింది. వివిధ ప్రాంతాల్లో ప్రత్యేక పోస్టల్ ముద్రలు సేకరిస్తున్న వీడియోలు, రీల్స్ వైరల్ కావడంతో యువత కూడా దీనిపై ఆసక్తి చూపుతోంది. దీంతో స్టాంప్ కలెక్టర్లకే పరిమితమైన ఈ అభిరుచి ఇప్పుడు ట్రావెల్ లవర్స్, హెరిటేజ్ ప్రియులను కూడా ఆకర్షిస్తోంది.పాత అభిరుచికి కొత్త ఊపుఫిలాటెలీ అంటే స్టాంపుల సేకరణను ప్రోత్సహించేందుకు ఇండియా పోస్ట్ ఇప్పటికే ప్రత్యేక కవర్లు, స్మారక స్టాంపులు, ‘దీన్‌దయాళ్ స్పార్ష్’ వంటి పథకాలను అమలు చేస్తోంది. ఇప్పుడు ఫిలాటెలీ పాస్‌పోర్ట్ ద్వారా ఆ అభిరుచిని ప్రయాణ అనుభవంతో మేళవించింది. డిజిటల్ యుగంలో ప్రతి ప్రయాణాన్ని భౌతిక గుర్తుగా నిలిపే ఈ వినూత్న ప్రయత్నం కర్ణాటకలో విశేష ఆదరణ పొందుతోంది. View this post on Instagram A post shared by Karnataka Postal Circle (@karnatakapostalcircle) -
ఏఐ మార్కెట్లో తిరుగులేని గుత్తాధిపత్యం!
ప్రపంచ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విప్లవంలో తిరుగులేని చక్రవర్తిగా దూసుకుపోతున్న తైవాన్ సెమీకండక్టర్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ (టీఎస్ఎంసీ) గ్లోబల్ చిప్ మార్కెట్లో తన గుత్తాధిపత్యాన్ని మరింత పటిష్టం చేసుకునే దిశగా నిర్ణయం తీసుకుంది. అమెరికాలోని అరిజోనాలో అధునాతన చిప్ తయారీ కేంద్రాల ఏర్పాటు కోసం మరో 100 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.8.4 లక్షల కోట్లు) అదనపు పెట్టుబడిని అధికారికంగా ప్రకటించింది. దీంతో కేవలం అమెరికాలోనే ఈ సంస్థ మొత్తం పెట్టుబడి రికార్డు స్థాయిలో 265 బిలియన్ డాలర్లకు చేరింది. తద్వారా ఇంటెల్, శామ్సంగ్ వంటి చిప్ ప్రత్యర్థులకు మార్కెట్లో పోటీ పడే అవకాశమే ఇవ్వకుండా చేసింది.లాభాల్లో రికార్డు జంప్!రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాల విడుదల సందర్భంగా కంపెనీ సీఈఓ సి.సి.వేయ్ ఈ వివరాలను వెల్లడించారు. ఏఐ డేటా సెంటర్ల నుంచి వచ్చిన డిమాండ్ కారణంగా టీఎస్ఎంసీ నికర లాభాలు గత ఏడాదితో పోలిస్తే ఏకంగా 77 శాతం వృద్ధితో 706.6 బిలియన్ తైవాన్ డాలర్ల (సుమారు 22 బిలియన్ యూఎస్ డాలర్లు) ఆల్‌టైమ్ రికార్డును తాకాయి. ఈ ఆర్థిక సంవత్సరానికి గాను వార్షిక ఆదాయ వృద్ధి అంచనాలను కూడా గతంలో ఉన్న 30 శాతం నుంచి ఏకంగా 40 శాతానికి పైగా పెంచుతున్నట్లు కంపెనీ ప్రకటించింది.ప్రత్యర్థి కంపెనీలకు అందనంత ఎత్తులో..ఈ అదనపు పెట్టుబడి ద్వారా అరిజోనాలో మరో నాలుగు సరికొత్త గిగా-ఫ్యాక్టరీలను (మొత్తం 12 ఫ్యాక్టరీలు) నిర్మించనున్నారు. వీటిలో నెక్స్ట్-జనరేషన్ సాంకేతికత అయిన 2-నానోమీటర్ అంతకంటే తక్కువ సామర్థ్యం గల చిప్స్, అలాగే సరికొత్త అడ్వాన్స్డ్ ప్యాకేజింగ్ టెక్నాలజీని ఉపయోగించనున్నారు. మార్కెట్ విశ్లేషకుల ప్రకారం.. ఎన్విడియా, యాపిల్, ఏఎండీ వంటి టెక్ దిగ్గజాలకు అవసరమైన ప్రీమియం ఏఐ చిప్స్ సరఫరాలో టీఎస్ఎంసీ వాటా ప్రస్తుతం 90 శాతానికి పైగా ఉంది. ప్రస్తుతం మార్కెట్లో 3-నానోమీటర్ చిప్స్ డిమాండ్ సరఫరా కంటే 50 శాతం ఎక్కువగా ఉంది. ఇలాంటి తరుణంలో కంపెనీ తన పెట్టుబడి బడ్జెట్‌ను 64 బిలియన్ డాలర్లకు పెంచడం ద్వారా 2030 వరకు మార్కెట్‌ను శాసించేది తామేనని స్పష్టం చేసింది.ఇదీ చదవండి: హోమ్ లోన్ కడుతూ అద్దె ఇంట్లో ఉంటున్నారా? -
800 మందికి శాంసంగ్ ఝలక్ : కారణం ఇదే!
గ్లోబల్ టెక్నాలజీ దిగ్గజం శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ వందలమంది ఉద్యోగులకు ఉద్వాసన పలకడం కలకలం రేపింది. అమెరికా (US) మొబైల్, డిస్ప్లే, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ విభాగాలలో ఉద్యోగాల కోతను విధిస్తోంది. రాయిటర్స్ కథనం ప్రకారం, న్యూజెర్సీ,టెక్సాస్‌లోని కంపెనీ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులపై ఈ ప్రభావం ఎక్కువగా పడనుంది.ఆఫీసు చేంజ్ : శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ అమెరికా (SEA) తన కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ ప్రధాన కార్యాలయాన్ని న్యూజెర్సీలోని 'ఎంగ్ల్వుడ్ క్లిఫ్స్' నుండి టెక్సాస్‌లోని 'ప్లానో'కు మారుస్తోంది. 'వార్న్' (WARN) నోటీసు ప్రకారం, ఎంగ్ల్వుడ్ క్లిఫ్స్ కార్యాలయంలోని 739 ఉద్యోగాలపై దీని ప్రభావం పడనుంది. అక్కడ మొత్తం 1,200 మంది ఉద్యోగులు ఉండగా... అందులో 60 శాతానికి పైగా సిబ్బంది ఈ మార్పుల వల్ల ప్రభావితం అవుతున్నారు. ముఖ్యంగా టెక్సాస్‌కు మారడానికి ఇష్టపడని వారిపై వేటు వేసింది.టెక్సాస్ కార్యాలయంలో మార్పులుటెక్సాస్లోని ప్లానో కార్యాలయంలో ఉన్న మొబైల్ విభాగానికి చెందిన సుమారు 100 మంది ఉద్యోగులను తొలగించినట్లు సమాచారం. గత రెండు వారాల్లో సీనియర్ సేల్స్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌లతో సహా 30 మందికి పైగా ఉద్యోగులు తాము కంపెనీ నుండి వైదొలిగినట్లు లింక్డ్ఇన్ (LinkedIn) ద్వారా స్పష్టం చేశారు.శాంసంగ్ వివరణ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), మారుతున్న ఆధునిక టెక్నాలజీ మార్కెట్‌కు అనుగుణంగా ఈ మార్పులు చేసినట్లు శాంసంగ్ వెల్లడించింది. జూన్ 30న ఉద్యోగులకు అంతర్గతంగా సంస్థాగత ఉద్యోగాల తగ్గింపు నోటీసులు ఇచ్చినప్పటికీ, దీనిని భారీ లేఆఫ్స్‌గా భావించకూడదని శాంసంగ్ పేర్కొంది. ప్రభావితమైన ఉద్యోగులలో చాలా మందికి టెక్సాస్‌కు బదిలీ అయ్యే (Relocate) అవకాశం కల్పించామని కంపెనీ తెలిపింది. కేవలం మారడానికి వీలులేని వారు లేదా విధులు రద్దయిన వారు మాత్రమే ఉద్యోగాలు కోల్పోతారని స్పష్టం చేసింది.కంపెనీ సెమీకండక్టర్ (చిప్స్) విభాగం రికార్డు స్థాయిలో లాభాలను ఆర్జిస్తుండగా, చిప్ ధరల పెంపు, తక్కువ మార్జిన్ల కారణంగా కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ విభాగం మాత్రం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. -
మార్కెట్ తడబడ్డా... ఐపీఓలు అదుర్స్
ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెరికా–ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌పై భారీ స్థాయిలో దాడులు మొదలుపెట్టేంత వరకూ భారత మార్కెట్లు బాగానే ఉన్నాయి. పైపెచ్చు జీవితకాల గరిష్ట స్థాయిలకు అటూఇటుగా ఉన్నాయి. బుల్ మార్కెట్ మంచి జోరుమీద ఉండటంతో అప్పటిదాకా వచ్చిన ఐపీఓలకు ఏకంగా 100 రెట్లు, 200 రెట్లు స్థాయిలో స్పందన వచ్చింది. రిటైల్ విభాగంలో అయితే ఏ ఐపీఓకైనా 100 రెట్లకు తక్కువ స్పందన రాలేదంటే అతిశయోక్తి కాదు. వాస్తవానికి అలాంటి స్పందన వచ్చిన ఐపీఓలు కూడా కొన్ని పేలవంగా లిస్టయి ఇన్వెస్టర్లకు నష్టాలు మిగిల్చాయి. కాకపోతే ఇరాన్‌పై దాడులు మొదలయ్యాక పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. మార్కెట్లు కిందపడ్డాయి. కంపెనీలు ఐపీఓలకు రావటానికే ఇష్టపడలేదు. కొన్ని కంపెనీలు అప్పటికే ప్రక్రియ మొత్తం పూర్తిచేసుకుని ఉండటంతో పబ్లిక్ ఇష్యూకు రాక తప్పలేదు. కాకపోతే వాటికి రిటైలర్ల నుంచి వచ్చిన స్పందన నామమాత్రమే. రిటైల్ ఇన్వెస్టర్లకు కేటాయించిన వాటా పూర్తిగా సబ్ర్‌స్కయిబ్ కూడా కాలేదంటే పరిస్థితి ఎలా మారిపోయిందో తెలుసుకోవచ్చు. విచిత్రమేంటో తెలుసా? అప్పటి నుంచి ఇప్పటిదాకా వచ్చిన 6 ఐపీఓల్లో ఒక్కటి తప్ప మిగిలినవన్నీ లాభాలే ఇచ్చాయి. కొన్నయితే ఈ నాలుగు నెలల్లోనే 40–50 శాతానికి పైగా పెరిగాయి. వీటిలో కొన్ని షేర్లయితే లిస్టింగ్ నాడు పెద్దగా లాభాలివ్వకపోయినా... ఆ తరవాత క్రమంగా పెరుగుతూ చక్కటి లాభాలిచ్చాయి. దీనర్థం ఒక్కటే... సబ్ స్క్రిప్షన్ తక్కువయినంత మాత్రాన, లిస్టింగ్ లాభాలు రానంత మాత్రాన ఆ షేర్లు రాణించవని కాదు. మెల్లగా ముందుకెళుతూ అద్భుతమైన రాబడినిస్తాయనేది ఈ షేర్లు చెబుతున్న వాస్తవం. ఆ వివరాలే ఈ ‘సాక్షి వెల్త్’ స్టోరీ...ప్రపంచ మార్కెట్లలో అనిశ్చితి, భౌగోళిక ఉద్రిక్తతలు, వడ్డీ రేట్లపై సందేహాలు... ఇలాంటి ప్రతికూల పరిస్థితుల మధ్య కూడా ఈ ఏడాది ‘మెయిన్ బోర్డు’ ఐపీఓ మార్కెట్ అద్భుతమైన నిలకడ చూపించింది. మార్చి–2026 తరువాత మార్కెట్లోకి వచ్చిన ఆరు ప్రధాన ఐపీఓల్లో ఐదు ఇప్పటికీ ఇష్యూ ధర కంటే ఎగువన ట్రేడవుతుండగా... ఒక్క అమీర్ చంద్ జగదీశ్ కుమార్ ఎక్స్‌పోర్ట్స్’ మాత్రమే ఇష్యూ ధర కంటే దిగువన కొనసాగుతోంది.ఈ మూడూ... 40 శాతానికిపైనే ఇప్పటివరకు అత్యధిక రాబడినిచ్చిన ఐపీఓగా హెక్సగాన్ న్యూట్రిషన్ నిలిచింది. ఇష్యూ ధరతో పోలిస్తే దాదాపు 55 శాతం లాభాన్ని అందించింది. ఆ తర్వాత పవరికా (44 శాతం), సాయి పేరెంటరల్స్ (42 శాతం) టాప్–2, 3, స్థానాల్లో నిలిచాయి. ఏప్రిల్ తరువాత లిస్టయి ఈ మూడు షేర్లూ మూడు 40 శాతానికి పైగా లాభాలివ్వటం గమనార్హం. వీటిలో సాయి పేరెంటరల్స్ హైదరాబాద్‌కు చెందిన ఫార్మా కంపెనీ కావటం విశేషం. లిస్టయిన తరువాత కంపెనీ వెలువరించిన 2025 క్యూ4 ఫలితాలు అంచనాలకు మించి ఉండటంతో ఒకస్థాయిలో షేరు ధర రూ.600 కూడా దాటింది. అత్యధిక లాభాలు అందించిన హెక్సగాన్ కూడా ఫార్మా కంపెనీయే కాగా... పవరికా మొదట్లో తడబడినా ఆ తరువాత డేటాసెంటర్ల బూమ్‌తో ఒక్క నెలలోనే 50 శాతానికిపైగా పెరగటం గమనార్హం. ఒబెరాయ్‌ల కుటుంబానికి చెందిన ఈ కంపెనీ పవన విద్యుదుత్పత్తితో పాటు డేటా సెంటర్లకు భారీ స్థాయి జనరేటర్లను సమకూర్చే వ్యాపారంలో ఉంది. సబ్ స్క్రిప్షన్ ఎక్కువైతే... లాభాలూ ఎక్కువేనా?ఈ ఐపీఓలు మరో ఆసక్తికర విషయాన్ని వెల్లడించాయి. పవరికాకు కేవలం 1.45 రెట్లు మాత్రమే సబ్ స్క్రిప్షన్ లభించింది. అయినప్పటికీ అది 44 శాతం రాబడితో అగ్రగాముల్లో ఒకటిగా నిలిచింది. మరోవైపు నాక్ ప్యాకేజింగ్‌కు 87 రెట్లు, హెక్సాగాన్‌కు 54 రెట్లు సబ్స్క్రిప్షన్ వచ్చింది. కాకపోతే వీటి రాబడులు మాత్రం ఒకేలా లేవు. అమీర్ చంద్ జగదీశ్‌కుమార్ ఎక్స్‌పోర్ట్స్’కు పవరికా కంటే ఎక్కువ సబ్స్క్రిప్షన్ వచ్చినా ఇప్పటికీ ఇష్యూ ధర కంటే దిగువనే ట్రేడవుతోంది. అంటే సబ్ స్క్రిప్షన్ సంఖ్య మాత్రమే షేర్ల రాబడులను నిర్ణయించదని ఈ ఐపీఓలు స్పష్టం చేశాయి.ఈ ఐపీఓలు చెప్పిన పాఠాలివీ..→ లిస్టింగ్ రోజున వచ్చే హైప్ శాశ్వతం కాదు. → భారీ సబ్ స్క్రిప్షన్ అంటే భారీ లాభాలు అన్న గ్యారంటీ లేదు. → చివరికి కంపెనీ వ్యాపార నాణ్యత, వృద్ధి, మార్కెట్ నమ్మకమే పెట్టుబడిదారుల సంపదను నిర్ణయిస్తాయి. మంథా రమణమూర్తి -
మంచి కంపెనీ... షేరు వేరువేరు
బుల్ మార్కెట్లో జరిగేదొకటే. కొన్ని తప్ప అన్ని షేర్లూ పరుగులు పెడతాయి. ఎలా అంటే... అమ్మో! ఇప్పుడు కొనలేకపోతే ఇంకెప్పటికీ ఆ ధర దగ్గర దొరకవేమో!!... అని ఇన్వెస్టర్లు భయపడేలా!. కొంచెం స్టాక్‌మార్కెట్ గురించి తెలిసిన వాళ్లంతా గురువులు, స్నేహితుల రూపంలో అప్పుడే ఎదురవుతారు. ‘‘ఇది మంచి కంపెనీ. ధర ఓకే. జస్ట్ కొని పక్కనపెట్టుకోండి. ఎప్పటికీ అమ్మకపోతేచాలు’’ అని సలహా ఇస్తారు. ఇదిగో... ఇన్వెస్టర్లు తప్పులో కాలేసేదిక్కడే. ఎందుకంటే ‘షేర్లు కొని మర్చిపోండి’ అనే సలహాలో నిజం సగమే. ఒక గొప్ప కంపెనీ షేరును కొన్నంత మాత్రాన అద్భుతమైన లాభాలు వస్తాయని కానీ... ఒక నాసిరకం కంపెనీ షేరును కొన్నంత మాత్రాన నష్టాలు ఖాయమని అనుకోవటానికి వీల్లేదు. ఎందుకంటే కంపెనీ– షేరు కవలలు కాదు. కేవలం సోదరులే. రెండింట్లో తేడాలుండొచ్చు. అనుకున్నట్టుగా రాణించే మంచి కంపెనీలకన్నా, అనూహ్యంగా రాణించే సాధారణ కంపెనీలే బాగా ముందుకెళతాయి. అదెలాగో సోదాహరణంగా వివరించేదే ఈ సాక్షి ‘వెల్త్’ ప్రత్యేక కథనం... ఒక షేరు పెరుగుతుందా? తగ్గుతుందా? ఎన్నాళ్లలో ఎంత రాబడినిస్తుంది? ఇదంతా కేవలం కంపెనీ ఎంత బాగుందన్న దానిపైనే ఆధారపడదు. కంపెనీ వ్యాపారం ఏటా ఏ స్థాయిలో పెరుగుతోంది? ఆ పెరిగే వృద్ధికి మార్కెట్ ఎంత విలువ ఇస్తోంది? ఆ కంపెనీ ఎంత డివిడెండ్ చెల్లిస్తోంది? మనం కొన్న షేరును ఎంతకాలం విక్రయించకుండా ఉంచగలుగుతున్నాం? ఇవన్నీ కలిసే షేరుపై వచ్చే రాబడిని నిర్ణయిస్తాయి. అందుకు కొన్ని ఉదాహరణలివీ... గొప్ప కంపెనీ... కానీ పూర్ ఇన్వెస్ట్మెంట్! పేజ్ ఇండస్ట్రీస్: 2009–2019 మధ్య దేశంలోని కంపెనీల్లో ఇన్వెస్టర్లకు అత్యంత భారీ లాభాలిచ్చిన షేరు ఇదే. ఆదాయం బీభత్సం. మార్జిన్లు అద్భుతం. పెట్టిన మూలధనంపై వచ్చే రాబడి(ఆర్ఓసీఈ) అత్యధికం. దీంతో 2009లో రూ.300 ఉన్న షేరు ధర పదేళ్లలో ఏకంగా రూ.35వేలకు చేరింది. ఇన్వెస్టర్లు ఇక ఈ కంపెనీకి ఎదురులేదనుకున్నారు. ధర ఎంత పెరిగినా కొనటం మొదలుపెట్టారు. వేల్యుయేషన్లు పెరిగాయి. అంటే.. కంపెనీ భవిష్యత్తుకు తగ్గట్టు ముందే షేరు ధర పెరిగిపోయింది. జాకీ బ్రాండ్ దుస్తుల్ని దేశీయంగా విక్రయించే ఈ కంపెనీ వ్యాపారం 2019 తరువాత కూడా అద్భుతంగా కొనసాగింది. కానీ అప్పటికే ఆ భవిష్యత్తు మొత్తం షేరు ధరలో చేరిపోయింది. ఈ ఏడేళ్లలో షేరు ధర రూ.40 వేలకు అటూఇటుగా ఉంది. మరి 2019లోనో ఆ తరువాతో ఇన్వెస్ట్ చేసిన వారికిది పూర్ ఇన్వెస్ట్‌మెంటే కదా? కొటక్ మహీంద్రా బ్యాంక్‌దీ ఇలాంటి స్టోరీనే.దేశంలోని అతికొద్ది అద్భుతమైన ప్రైవేటు బ్యాంకుల్లో ఒకటి. మేనేజ్మెంట్, అండర్‌రైటింగ్, అసెట్ క్వాలిటీ అన్నింటా సూపర్. ఇన్వెస్టర్లకూ ఇష్టమే. కానీ అందరూ ఇష్టపడి కొనటం వల్ల ఈ షేరు వాల్యుయేషన్ బాగా పెరిగిపోయింది. తరువాత రుణాల వృద్ధి తగ్గింది. వ్యాపారం, బుక్ వేల్యూ పెరుగుతున్నా వాల్యుయేషన్ల ప్రీమియం తగ్గటంతో షేరు ధర బాగా పడింది. ఏషియన్ పెయింట్స్దీ ఇలాంటి కథే. ఒకప్పుడు ఇది వ్యాపారానికి బెంచ్‌మార్క్. పోటీ సంస్థలకన్నా అన్నింటా ముందంజే. కానీ గత కొన్నేళ్లుగా షేరుపై రాబడి పెద్దగా లేదు. ఎందుకంటే వ్యాపారం బాగానే ఉన్నా అంచనాలు విపరీతంగా పెరిగాయి. వాటిని అందుకోవటం సాధ్యం కాని స్థితిలో... షేరు ధర పెరుగుదల అంతంతమాత్రంగానే ఉంటోంది. రాబడిలో నిలకడ లేకుంటే... షేరు ధర అంతంతే! నాట్కో ఫార్మా: అప్పుల్లే వు. ఆర్ అండ్ డీ అద్భుతం. మార్జిన్లు సూపర్. పటిష్ఠమైన మేనేజ్మెంట్. కానీ... దీర్ఘకాలలలో చూస్తే ఈ కంపెనీపై రాబడి చాలా నాసిరకం. కారణమేంటి? ఈ కంపెనీ లాభాలన్నీ బ్లాక్బస్టన్ జనరిక్ డ్రగ్స్‌ను ప్రవేశపెట్టడంపైనే ఆధారపడుతూ వస్తున్నాయి. ఒక అద్భుతమైన ఉత్పత్తితో అన్నీ మారిపోతాయి. తరవాత దానికి పోటీ వస్తుంది. మార్జిన్లు పడిపోతాయి. మరో కొత్త ఉత్పత్తిపై ఆధారపడాల్సిన పరిస్థితి. ఈ తరహా అనిశ్చితి మార్కెట్‌కు నచ్చదు. దివీస్ లాబొరేటరీస్: ఇది కూడా నాట్కో తరహాలో దేశీ ఫార్మా కంపెనీనే. కానీ ఈ కంపెనీ పనితీరులో నాటకీయ అనూహ్యతేదీ ఉండదు. బ్లాక్‌బస్టర్ డ్రగ్స్ ఉండవు. కానీ... అదే పనితీరు క్రమం తప్పకుండా కొనసాగుతుంది. మార్జిన్లు, క్యాష్ ఫ్లో, రాబడి... అన్నీ అంచనాలకు తగ్గట్టే ఉంటాయి. అందుకే ఈ కంపెనీ షేరు ఎప్పటికప్పుడు కొత్త గరిష్ఠ స్థాయిలను తాకుతూనే వస్తోంది. కొన్ని సార్లు వేచి చూడాలి... అంతే! రిలయన్స్ ఇండస్ట్రీస్: దేశీ డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్‌ది ప్రత్యేక కథ. 2002–08 మధ్య చూస్తే... చమురు రిఫైనింగ్ బూమ్‌లో ఉంది. షేరు ధర రూ.20 నుంచి ఏకంగా రూ.350కి చేరి ఇన్వెస్టర్లకు సంపద సృష్టించింది. కానీ అప్పటి నుంచి 2016 వరకు వ్యాపారం అద్భుతంగానే ఉన్నా షేరు ధర పెరగలేదు. పైపెచ్చు తగ్గింది. ఆ తరువాతి ఐదేళ్లూ... అంటే 2021 వరకూ చూస్తే జియో వచ్చింది. రిటైల్ పెరిగింది. కంపెనీ విలువ మారిపోయింది. షేరు ఏకంగా మూడు రెట్లు పెరిగి రూ.1400 కూడా తాకింది. మరి తరువాతేంటి? ఇదిగో ఈ ప్రశ్నకు సమాధానంకోసమే మార్కెట్ ఎదురు చూస్తోంది. అందుకే గడిచిన ఐదేళ్లలో షేరు ధర పెరగలేదు. జియో ఐపీవోకు వస్తే దాని విలువెంత? రిటైల్ ఐపీఓ ఎంత? గ్రీన్ ఎనర్జీ ఆదాయాలెలా ఉంటాయి? ఏఐతో వచ్చే లాభమెంత? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానాల కోసం మార్కెట్ వేచిచూస్తోంది. కంపెనీ మారలేదు. వ్యాపారం క్షీణించలేదు. కానీ మార్కెట్ కంపెనీ వృద్ధికి కొత్త ట్రిగ్గర్ కోసం ఎదురుచూసింది. అందుకే ఐదేళ్లపాటు షేరు ధర పెద్దగా కదల్లేదు. ఇదే టైమ్ కరెక్షన్.సాదాసీదా వ్యాపారం... షేరు అద్భుతం! షిప్పింగ్ కంపెనీలను చూడండి. వ్యాపార నాణ్యత అంతంతే. రాబడులు కొన్నిసార్లు మాత్రం అసాధారణమైన రీతిలో ఉంటాయి. ఎందుకంటే అంతర్జాతీయంగా సరకు రవాణా సైకిల్స్ మారుతుంటాయి కనక. దానికి తగ్గట్టే షేర్లూ పెరుగుతుంటాయి. షుగర్ కంపెనీలదీ అదే తీరు. మార్జిన్లు తక్కువ. ప్రభుత్వ నియంత్రణ ఎక్కువ. కానీ... ఇథనాల్ నిర్ణయాలప్పుడు... చక్కెర సీజన్లోను ఈ షేర్లు విపరీతంగా పెరుగుతుంటాయి. కొన్ని చాలాసార్లు రెండుమూడు రెట్ల చొప్పున పెరిగాయి. కానీ వ్యాపారమేమీ అంత నాటకీయంగా మారిపోదు. సీజన్ మారుతుంది... అంతే.షేర్ల రాబడికి గ్రోత్ ఇంజిన్లు ఇవే... పై ఉదాహరణలన్నీ చూశాక ప్రతి ఇన్వెస్టరూ గమనించాల్సినవి ఇవే. → రాబడుల్లో వృద్ధి: కంపెనీ ఆదాయం, లాభం క్రమం తప్పకుండా పెరగాలి. → ఊహించినట్టే: కంపెనీ భవిష్యత్తు రాబడులపై ఇన్వెస్టర్లు ధీమాగా ఉండాలి. → వేల్యుయేషన్: ఎంత పీఈ దగ్గర కొంటున్నామనే విషయంతో పాటు కంపెనీ పీఈ ఏటా ఏ స్థాయిలో పెరుగుతోందో కూడా చూడాలి. అప్పుడే ధర సహేతుకమో కాదో తెలుస్తుంది. → క్యాపిటల్ కేటాయిపు: రాబడుల్లో మిగిలే మొత్తం కంపెనీ విస్తరణ ప్రణాళికలకు ఏ మేరకు సరిపోతుందన్నది కూడా ముఖ్యమే. → టైమ్: ఇది అన్నిటికన్నా ముఖ్యం. కొన్నిసార్లు అన్నీ బాగున్నా మార్కెట్ మాత్రం ఆ కంపెనీ నుంచి మరిన్ని సంకేతాల కోసం ఎదురు చూస్తుంటుంది. ఇన్వెస్టర్లు చూడాల్సినవివే... ఒక షేరు కొనేటపుడు ‘ఇది మంచి కంపెనీయే’ అని సింపుల్‌గా తేల్చేసుకోకుండా... → కంపెనీ రాబడుల్లో వృద్ధి నిలకడగా ఉంటుందా? → వ్యాపార పనితీరు అనుకున్నట్టుగానే సాగుతుందా? → లాభాలను కంపెనీ తెలివిగా వాడి విస్తరణ చేయగలుగుతుందా? → కంపెనీ షేరు విలువ సహేతుకంగానే ఉందా? → ఈ కంపెనీనుంచి మార్కెట్ ఆశిస్తున్నదెంత? కంపెనీ సాధించిందెంత? → వచ్చే ఐదేళ్లలో ఈ కంపెనీ ఏ రకమైన అనూహ్య ఫలితాలు సాధిస్తుంది? అనే ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కుని... ఆ తరువాత ఇన్వెస్ట్ చేస్తేనే అనుకున్న ఫలితాలొస్తాయి. చాలామంది ఇన్వెస్ట్మెంట్ సలహాదారులు ఇన్వెస్టర్లు కంపెనీ యాజమాన్యం తరహాలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చెబుతారు. కానీ అది సరికాదనే అనుకోవాలి. ఎందుకంటే కంపెనీ యాజమాన్యం ‘ఈ వ్యాపారం భవిష్యత్ బాగుంటుందా?’ అనే ఆలోచిస్తుంది. కానీ ఇన్వెస్టర్లు మాత్రం... ‘ఈ వ్యాపారం తాలూకు భవిష్యత్తు వృద్ధి ఇప్పటికే ఈ షేరులో కనిపిస్తోందా?’ అనేది చూడాలి. ఎందుకంటే ఇన్వెస్టర్లు కంపెనీని కొనరు. ఆ కంపెనీ భవిష్యత్ ఆదాయాలను కొంటారు. ఆ భవిష్యత్తుకు ఎంత ధర చెల్లిస్తున్నారన్నదే చివరికి వారి రాబడిని నిర్ణయిస్తుంది. ఆ చెల్లించే ధర మరీ ఎక్కువ అనిపిస్తే ఆ షేరుకు దూరంగానే ఉండాలి. కనీసం కొన్నాళ్లయినా!! మంథా రమణమూర్తి -
వెకేషన్‌కు వెళ్లాడు.. ఉద్యోగం పోయింది!
ఉద్యోగం పోయిందని లేదా తొలగించిందనే విషయం.. సాధారణంగా కంపెనీ నుంచి వచ్చే అధికారిక సమాచారం ద్వారా తెలుస్తుంది. కానీ.. ఓ 31 ఏళ్ల వ్యక్తికి మాత్రం తన ఉద్యోగం కోల్పోయిన విషయం చాలా విచిత్రమైన రీతిలో తెలిసిందని పేర్కొన్నాడు. దీనికి సంబంధించిన ఒక సోషల్ మీడియా పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.రెడ్డిట్‌లో తన అనుభవాన్ని పంచుకున్న ఆ వ్యక్తి.. నా ఉద్యోగం ముగిసిందని కంపెనీ నుంచి ఎలాంటి ముందస్తు సమాచారం రాలేదని వెల్లడించాడు. అయితే.. తనకు తెలియకుండానే ఆఫీస్ మెయిల్లోని 'అవుట్ ఆఫ్ ఆఫీస్' రిప్లైను మార్చారని చెప్పాడు. అందులో తాను ఇక కంపెనీలో ఉద్యోగి కాదని, తనను సంప్రదించాలనుకునే వారు మేనేజర్‌ను సంప్రదించాలని పేర్కొన్నట్లు వివరించాడు.నిజానికి అతడు సెలవుల్లో ఉన్న సమయంలో.. మేనేజర్ నుంచి అకస్మాత్తుగా ఒక కాల్లో పాల్గొనాలని మెసేజ్ వచ్చింది. అయితే.. వేరే టైమ్ జోన్లో ఉండటం, ఇంటర్నెట్ సమస్యల కారణంగా ఆ కాల్‌కు హాజరు కాలేనని చెప్పాడు. దీనికి తన మేనేజర్ 'మీ సెలవులను కొనసాగించండి' అని చెప్పాడు. ఇదే తన ఉద్యోగానికి ఎసరుపెడుతుందని ఊహించలేకపోయానని చెప్పాడు. ఎందుకంటే తన మేనేజర్ చెప్పిన మాటల్లో కూడా ఉద్యోగం ప్రమాదంలో ఉందనే విషయం గ్రహించలేకపోయానని స్పష్టం చేసాడు.ఉద్యోగం పోయిందనే విషయం తన చాలా ఆశ్చర్యంగా అనిపించిందని అతను చెప్పాడు. ఎందుకంటే జనవరిలోనే తనకు ప్రమోషన్ వచ్చిందని, తన పనితీరుపై సహచరులు, ఉన్నతాధికారుల నుంచి మంచి అభిప్రాయాలు ఉన్నాయని తెలిపాడు. అంతేకాకుండా.. కొద్ది రోజుల ముందు తన బాస్‌తో కలిసి భోజనం కూడా చేశాను. అప్పుడు కూడా ఉద్యోగం కోల్పోయే ఎలాంటి సంకేతాలు కనిపించలేదని వెల్లడించాడు.సెలవులు ముగిసిన తర్వాత ఏం చేయాలో తెలియక అతను రెడ్డిట్‌లో సలహాలు కోరాడు. తన పరిస్థితి అర్థం కావడం లేదని, షాక్‌లో ఉన్నానని చెప్పాడు. దీనిపై స్పందించిన చాలామంది నెటిజన్లు అతనికి మద్దతుగా నిలిచారు.ఉద్యోగానికి సంబంధించిన అన్ని ఈమెయిల్స్, మెసేజ్‌లు, ఆధారాలను భద్రపరచుకోవాలని కొందరు సూచించారు. మరికొందరు మాత్రం మిగిలిన సెలవులను ప్రశాంతంగా గడపాలని, పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతే తదుపరి నిర్ణయం తీసుకోవాలని సలహా ఇచ్చారు.ఈ ఘటన ఉద్యోగులను తొలగించే విధానంపై మరోసారి చర్చకు దారితీసింది. ఉద్యోగం నుంచి తొలగించడం కంపెనీలకు అవసరమైన నిర్ణయం అయినప్పటికీ.. సెలవుల్లో ఉన్న ఉద్యోగికి ఈ విధంగా విషయం తెలియజేయడం సరైన పద్ధతి కాదని పలువురు అభిప్రాయపడ్డారు. ఉద్యోగులతో కంపెనీలు మరింత పారదర్శకంగా, గౌరవంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.ఇదీ చదవండి: లెక్కల్లో 51 మార్కులే.. కట్ చేస్తే రూ.వేల కోట్ల కంపెనీ!: ఎవరీ పవన్ కుమార్ చందన? -
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలు.. టికెట్ ధర ఎంతంటే?
భారతదేశం ఎప్పటికప్పుడు కొత్త సాంకేతికతలను అందిపుచ్చుకుని.. వేగంగా ముందుకు దూసుకెళ్తోంది. ఇందులో భాగంగానే ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇండియాలో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించారు. ఈ రైలు పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో తయారవడం భారతీయ శాస్త్రవేత్తలు, ఇంజినీర్ల ప్రతిభకు నిలువెత్తు నిదర్శనం. ఈ కథనంలో ఈ ట్రైన్ టికెట్ ధరలు ఎలా ఉన్నాయనే విషయాలు తెలుసుకుందాం.భారతదేశపు తొలి హైడ్రోజన్ రైలు హర్యానా రాష్ట్రంలోని జింద్ నుంచి సోనిపట్ వరకు నడుస్తుంది. మధ్యలో అనేక చిన్న స్టేషన్లలో ఆగుతూ ప్రజలకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తుంది. అయితే.. ఈ రైలులో ప్రయాణించడానికి అయ్యే ఖర్చు (టికెట్ ధర) కూడా చాలా తక్కువే కావడం గమనార్హం. రూ.5 నుంచి రూ.25 వరకు మాత్రమే టికెట్ చార్జీ ఉండటం వల్ల.. ప్రతి ఒక్కరూ ఈ రైలులో ప్రయాణించవచ్చు. దీన్నిబట్టి చూస్తే.. ఈ ట్రైన్ టికెట్ ప్రారంభ ధర.. సాధారణ ట్రైన్ ప్లాట్‌ఫామ్ టికెట్ రేటు (రూ.10) కంటే తక్కువ అని తెలుస్తోంది.ఈ రైలు సాధారణ డీజిల్ లేదా ఎలక్ట్రిక్ రైళ్ల మాదిరిగా కాకుండా.. హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీతో నడుస్తుంది. అంటే ఈ ట్రైన్ ముందుకు వెళ్ళడానికి డీజిల్, ఎలక్ట్రిక్ (కరెంట్) అవసరం లేదు. హైడ్రోజన్ ఆక్సిజన్‌తో చర్య జరిపి విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుంది. తద్వారా ట్రైన్ ముందుకు వెళ్తుందన్నమాట. ఈ ప్రక్రియలో కేవలం నీటి ఆవిరి మాత్రమే బయటకు వస్తుంది. తద్వారా గాలి కాలుష్యం తగ్గుతుంది.ఇదీ చదవండి: ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై 50% సబ్సిడీ!ఈ రైలులో మొత్తం పది కోచ్‌లు ఉంటాయి. ఒకేసారి సుమారు 2,600 మంది ప్రయాణికులు ప్రయాణించవచ్చు. ప్రయాణికుల భద్రత కోసం హైడ్రోజన్ లీకేజీ, పొగ, మంటలు, అధిక ఉష్ణోగ్రతలను గుర్తించే ఆధునిక భద్రతా వ్యవస్థలను కూడా ఇందులో ఏర్పాటు చేశారు.హైడ్రోజన్ రైలు ప్రారంభం కావడంతో.. భారత్ జర్మనీ, జపాన్, చైనా, అమెరికా వంటి దేశాల సరసన నిలిచింది. ఇది భారతదేశానికి గర్వకారణమైన విషయం. భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని పర్యావరణహిత రైళ్లు దేశవ్యాప్తంగా అందుబాటులోకి వస్తే కాలుష్యం తగ్గడమే కాకుండా ఇంధన వ్యయం కూడా తగ్గుతుంది. ఈ దిశగా ప్రభుత్వం కూడా తగిన చర్యలు తీసుకుంటోంది. -
ఏసీ రైలు ఎక్కేవారికి.. ఇది ఎప్పుడూ గందరగోళమే!!
రైలు ప్రయాణంలో స్లీపర్, 3ఏసీ (3AC), 2ఏసీ (2AC), ఫస్ట్ ఏసీ (1AC) వంటి కోచ్‌ల గురించి చాలామందికి అవగాహన ఉంటుంది. అయితే కొన్ని రైళ్లలో కనిపించే 'AB'అనే కోచ్ గుర్తు మాత్రం ప్రయాణికులను తరచూ అయోమయానికి గురి చేస్తుంది. ఇది ప్రత్యేక కోచ్ కాదని, 2ఏసీ, 3ఏసీ విభాగాలను ఒకే కోచ్‌లో కలిపిన కాంబినేషన్ కోచ్ అని భారతీయ రైల్వే చెబుతోంది.భారతీయ రైల్వేలో సాధారణంగా స్లీపర్ కోచ్‌లకు 'S', థర్డ్ ఏసీకి 'B', సెకండ్ ఏసీకి 'A' అనే కోడ్లు ఉంటాయి. అయితే కొన్ని రైళ్లలో ప్రయాణికుల డిమాండ్, కోచ్‌ల అందుబాటు వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని 'AB' కోచ్‌ను ఏర్పాటు చేస్తారు. ఇందులో ఒక భాగం 2ఏసీ ప్రయాణికులకు, మరో భాగం 3ఏసీ ప్రయాణికులకు కేటాయిస్తారు.ఒకే బెర్త్ నంబర్ రెండు చోట్ల..AB కోచ్‌లో ఎక్కువగా గందరగోళం సృష్టించే అంశం బెర్త్ నంబర్లే. ఉదాహరణకు బెర్త్ నంబర్ 3 ఒకటి 2ఏసీ విభాగంలో ఉండగా, మరో బెర్త్ నంబర్ 3, 3ఏసీ విభాగంలో కూడా ఉండొచ్చు. అందువల్ల ప్రయాణికులు బెర్త్ నంబర్‌తో పాటు టికెట్లో పేర్కొన్న క్లాస్ (2AC లేదా 3AC)ను తప్పనిసరిగా పరిశీలించాలి.మీ సీటును ఎలా గుర్తించాలి?టికెట్లో 2AC అని ఉంటే కోచ్‌లోని 2ఏసీ విభాగానికే వెళ్లాలి. అక్కడ దిగువ, ఎగువ బెర్త్‌లు మాత్రమే ఉంటాయి. మిడిల్ బెర్త్ ఉండదు. అదే 3AC టికెట్ అయితే 3ఏసీ భాగంలో సీటు ఉంటుంది. అక్కడ సాధారణంగా దిగువ, మధ్య, ఎగువ బెర్త్‌లతో పాటు సైడ్ బెర్త్‌లు ఉంటాయి.కోచ్‌ను చూసి కూడా గుర్తించొచ్చు2ఏసీ విభాగంలో ఎక్కువ ప్రైవసీ కోసం బెర్త్‌లకు కర్టెన్లు (కొన్ని రైళ్లలో రైల్వే నిబంధనల ప్రకారం అందుబాటులో ఉంటే) లేదా ప్రత్యేక విభజన ఉంటుంది. 3ఏసీ భాగంలో మాత్రం ఓపెన్ బే తరహా అమరిక కనిపిస్తుంది. దీంతో కోచ్‌లోకి వెళ్లిన వెంటనే ఏ విభాగంలో ఉన్నారో గుర్తించడం సులభమవుతుంది.టికెట్లో కోచ్ నంబర్, క్లాస్, బెర్త్ వివరాలు స్పష్టంగా ఉన్నప్పటికీ సందేహం వస్తే ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్ (TTE) లేదా కోచ్ అటెండెంట్‌ను సంప్రదించడం మంచిది. దీంతో తప్పు సీటులో కూర్చోవడం, ఇతర ప్రయాణికులతో అనవసర ఇబ్బందులు ఎదురుకావడం వంటి సమస్యలను నివారించవచ్చు.అయితే అన్ని రైళ్లలోనూ ఈ AB కోచ్ ఉండదు. ప్రయాణికుల డిమాండ్, రైలు రేక్ అమరిక (Coach Composition) ఆధారంగా మాత్రమే భారతీయ రైల్వే ఇలాంటి కాంబినేషన్ కోచ్‌లను ఉపయోగిస్తుంది. అందువల్ల టికెట్లో క్లాస్, కోచ్, బెర్త్ వివరాలను ముందుగానే పరిశీలించుకోవడం సురక్షితమైన ప్రయాణానికి కీలకం. -
ఆ ప్రముఖ బ్యాంకు ఉద్యోగులకు మళ్లీ గండమే!
కృత్రిమ మేధస్సు (AI), ఆటోమేషన్ విస్తృతంగా వినియోగంలోకి వస్తున్న నేపథ్యంలో ప్రైవేట్ రంగ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్‌లో రానున్న కాలంలో మరిన్ని ఉద్యోగ పాత్రలు తగ్గే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా మిడ్-ఆఫీస్, బ్యాక్-ఆఫీస్ విభాగాల్లో పునరావృతమయ్యే పనులను టెక్నాలజీనే నిర్వహించగలిగితే, అలాంటి ఉద్యోగాల అవసరం క్రమంగా తగ్గవచ్చని బ్యాంక్ యాజమాన్యం సంకేతాలు ఇచ్చింది. అయితే, భారీ స్థాయిలో ఉద్యోగాల తొలగింపులు ఉంటాయా.. ఉంటే ఎప్పుడు ఉంటాయన్న దానిపై మాత్రం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.మొదటి త్రైమాసిక (Q1 FY27) ఫలితాల అనంతరం నిర్వహించిన విశ్లేషకుల సమావేశంలో బ్యాంక్ అధికారులు మాట్లాడుతూ, సాంకేతికత వల్ల ఉద్యోగుల ఉత్పాదకత పెరుగుతోందని తెలిపారు. మిడ్-ఆఫీస్, బ్యాక్-ఆఫీస్‌లో ఉండే 'మేకర్-చెకర్' వంటి బహుళ ధ్రువీకరణ ప్రక్రియలను ఆటోమేట్ చేయడం ద్వారా అనేక కార్యకలాపాలను సరళీకరించే అవకాశం ఉందని వివరించారు. దీని వల్ల ఖాళీ అయ్యే సామర్థ్యాన్ని కస్టమర్ సేవలు, వ్యాపార విస్తరణ వంటి ఫ్రంట్-ఎండ్ కార్యకలాపాల వైపు మళ్లించే వ్యూహాన్ని అనుసరిస్తున్నట్లు వెల్లడించారు.ఇప్పటికే 2025-26 ఆర్థిక సంవత్సరంలో యాక్సిస్ బ్యాంక్ ఉద్యోగుల సంఖ్య సుమారు 3 శాతం తగ్గింది. 2025 ఆర్థిక సంవత్సరంలో ఉన్న 1,04,453 మంది ఉద్యోగులతో పోలిస్తే దాదాపు 3,100 మంది తగ్గినప్పటికీ, అదే సమయంలో బ్యాంక్ దేశవ్యాప్తంగా సుమారు 400 కొత్త శాఖలను ప్రారంభించడం గమనార్హం. ఇది వ్యాపారం మందగించడం వల్ల కాకుండా, సాంకేతికత ఆధారిత సామర్థ్య పెరుగుదల వల్లే సాధ్యమైందని ఎండీ, సీఈఓ అమితాబ్ చౌదరి గతంలో స్పష్టం చేశారు.తాజాగా జూన్ 2026తో ముగిసిన తొలి త్రైమాసికంలో కూడా ఉద్యోగుల సంఖ్య మరో 600 మేర తగ్గి లక్షకు కొద్దిగా పైగా నిలిచింది. అయితే బ్యాంక్ యాజమాన్యం దీన్ని 'లేఆఫ్స్'గా కాకుండా, ఉద్యోగులు సంస్థను విడిచిపెట్టిన తర్వాత ఆ స్థానాలను తిరిగి భర్తీ చేయకుండా ఉత్పాదకతను పెంచే ప్రక్రియగా అభివర్ణించింది. ఏఐ పూర్తి స్థాయి ప్రభావం ఉద్యోగుల సంఖ్యపై కనిపించడానికి మరో 18 నుంచి 24 నెలలు పట్టవచ్చని కూడా అధికారులు పేర్కొన్నారు.👉ఇది చదివారా? అంతరిక్ష శాస్త్రవేత్తలకు జీతాలు తక్కువా?బ్యాంకింగ్ రంగంలో డిజిటలైజేషన్, ఏఐ వినియోగం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో సాధారణ ఆపరేషనల్ పనుల కంటే కస్టమర్ సలహాలు, సంబంధాల నిర్వహణ, డేటా విశ్లేషణ, సాంకేతిక నైపుణ్యాలు అవసరమైన ఉద్యోగాలకు డిమాండ్ పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదే ధోరణి ఇతర ప్రైవేట్ బ్యాంకుల్లోనూ కనిపించడం ప్రారంభమైందని తాజా పరిశ్రమ గణాంకాలు సూచిస్తున్నాయి. -
నిమిషాల్లో కొత్త గ్యాస్ కనెక్షన్.. ఎక్స్‌ప్రెస్ డెలివరీ
ప్రభుత్వ రంగ ఇంధన సంస్థ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) గృహ వినియోగదారులకు మరింత వేగవంతమైన, సౌకర్యవంతమైన సేవలు అందించేందుకు ‘భారత్‌గ్యాస్ లైట్ జిప్ (Bharat gas Lite ZIP)’ పేరుతో కొత్త ప్రీమియం ఎల్పీజీ సేవను ప్రారంభించింది. సంస్థ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ ఖన్నా, డైరెక్టర్ (మార్కెటింగ్) శుభాంకర్ సేన్ సమక్షంలో ఈ సేవను ప్రారంభించారు.ఈ సర్వీస్‌లో ప్రధాన ఆకర్షణ ఎక్స్‌ప్రెస్ డెలివరీతో తక్షణ కొత్త ఎల్పీజీ కనెక్షన్ అందుబాటులో ఉండటమే. ఇది బీపీసీఎల్ ఇటీవల ప్రవేశపెట్టిన భారత్‌గ్యాస్ లైట్ కాంపోజిట్ సిలిండర్ ఆధారంగా రూపొందించబడింది. సాధారణ స్టీల్ సిలిండర్లతో పోలిస్తే ఈ కాంపోజిట్ సిలిండర్ 50 శాతానికి పైగా తేలికగా ఉండటంతో ఎత్తడం, తరలించడం సులభం. తుప్పు పట్టని బాడీ, సిలిండర్‌లో మిగిలిన గ్యాస్ పరిమాణాన్ని బయట నుంచే చూసే వీలు, అధునాతన భద్రతా ప్రమాణాలు, ఆధునిక డిజైన్ వంటి ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి.నేటి వేగవంతమైన జీవనశైలికి అనుగుణంగా వినియోగదారులకు అవాంతరాలు లేని ప్రీమియం ఎల్పీజీ అనుభవం అందించడమే ‘లైట్ జిప్’ లక్ష్యమని బీపీసీఎల్ తెలిపింది. కొత్త కనెక్షన్ కోసం వేచి ఉండే సమయాన్ని తగ్గించి, సేవలను మరింత స్మార్ట్‌గా అందించే దిశగా ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు పేర్కొంది.ప్రస్తుతం ఈ సర్వీస్‌ను ముంబైలో ప్రారంభించగా, వచ్చే ఆగస్టు 15 నాటికి 24 రాష్ట్రాల్లోని మరో 100 నగరాలకు విస్తరించనున్నట్లు బీపీసీఎల్ ప్రకటించింది. దీంతో దేశవ్యాప్తంగా మరిన్ని కుటుంబాలకు తేలికపాటి కాంపోజిట్ సిలిండర్లు, వేగవంతమైన కనెక్షన్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. BPCL has launched Bharatgas Lite ZIP, a premium LPG offering designed to deliver a faster, smarter and more convenient customer experience. The product was launched by Shri Sanjay Khanna, Chairman & Managing Director, BPCL in the presence of Shri Subhankar Sen, Director… pic.twitter.com/maYQM821o5— Bharat Petroleum (@BPCLimited) July 18, 2026 -
ఎన్విడియా సీఈఓ జాకెట్ రూ.9 కోట్లు.. వేలంలో భారీ ధర
ప్రపంచంలోని అత్యంత విలువైన కంపెనీల్లో ఒకటైన ఎన్విడియా (NVIDIA) సీఈఓ జెన్సెన్ హువాంగ్ ధరించిన సిగ్నేచర్ నల్లటి టామ్ ఫోర్డ్ (Tom Ford) లెదర్ జాకెట్ వేలంలో సంచలన ధర పలికింది. న్యూయార్క్‌లో ప్రముఖ వేలంపాట సంస్థ సోథెబీస్ నిర్వహించిన వేలంలో ఈ జాకెట్ 9.6 లక్షల డాలర్లు (సుమారు రూ.9.2 కోట్లు)కు అమ్ముడైంది. ఇది ముందుగా అంచనా వేసిన 40,000–60,000 డాలర్ల విలువ కంటే దాదాపు 16 రెట్లు ఎక్కువ.సోథెబీస్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ జాకెట్ కోసం ప్రపంచవ్యాప్తంగా 45 మంది పోటీపడ్డారు. సంస్థ ఆధునిక కలెక్టిబుల్స్ విభాగం అధిపతి బ్రహ్మ్ వాచ్టర్ దీన్ని "ఏఐ యుగాన్ని నిర్వచించిన ప్రముఖ వ్యక్తుల్లో ఒకరితో అత్యంత సన్నిహితంగా ముడిపడిన అరుదైన స్మారక వస్తువు"గా అభివర్ణించారు.జెన్సెన్ హువాంగ్ నల్లటి లెదర్ జాకెట్ ఆయన వ్యక్తిత్వానికి ప్రతీకగా మారింది. యాపిల్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్‌కి నల్లటి టర్టిల్నెక్ స్వెటర్, మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్‌కి బూడిదరంగు టీ-షర్టు ఎలాగో హువాంగ్‌కు ఈ బ్లాక్ జాకెట్ అలాగే. ఆయన దాదాపు ప్రతి కీలక ఉత్పత్తి ఆవిష్కరణ, డెవలపర్ కాన్ఫరెన్స్, అంతర్జాతీయ వేదికలపై ఇదే తరహా జాకెట్లో కనిపిస్తుంటారు. 2021లో టైమ్ మ్యాగజైన్ ముఖచిత్రంపైనా ఇదే నలుపు జాకెట్‌తో మెరిశారు. వేలానికి వచ్చిన జాకెట్‌ను ఆయన 2023 అక్టోబర్‌లో తైవాన్‌లో జరిగిన హాన్ హై (ఫాక్స్‌కాన్) టెక్ డే కార్యక్రమంలో ధరించినదేనని ఫోటో మ్యాచింగ్ ద్వారా ధ్రువీకరించారు. జాకెట్‌పై హువాంగ్ సంతకాన్ని కూడా నిపుణులు ప్రామాణికంగా నిర్ధారించారు.ఎన్విడియా నాయకత్వంలో జెన్సెన్ హువాంగ్ కంపెనీని కృత్రిమ మేధ (AI) విప్లవానికి కేంద్రబిందువుగా నిలబెట్టారు. ఏఐ చిప్‌లకు పెరిగిన భారీ డిమాండ్‌తో ఎన్విడియా ప్రపంచంలోనే అత్యధిక మార్కెట్ విలువ కలిగిన పబ్లిక్ కంపెనీగా ఎదిగింది.ఈ వేలం ద్వారా వచ్చిన మొత్తం ఆదాయాన్ని ఎడ్జ్ ఇన్స్టిట్యూట్ అనే లాభాపేక్షలేని సంస్థకు అందజేస్తున్నారు. సాంకేతికత, విజ్ఞానం, విద్య రంగాల్లో యువ ఆవిష్కర్తలకు ఫెలోషిప్‌లు, గ్రాంట్లు, పరిశోధన అవకాశాలు కల్పించేందుకు ఈ నిధులను వినియోగించనున్నారు. -
రిలయన్స్ లాభాల రికార్డ్!
న్యూఢిల్లీ: దేశీ కార్పొరేట్ అగ్రగామి రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రోత్సాహకర ఫలితాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి క్వార్టర్ (2026–27, క్యూ1)లో రూ. 23,196 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ఆర్జించింది. గతేడాది ఇదే కాలంలో లాభం రూ.30,783 కోట్లతో పోలిస్తే లాభం 25 శాతం తగ్గింది. అయితే, ఆ క్వార్టర్లో ఏషియన్ పెయింట్స్‌లోని రూ. 8,924 కోట్ల వాటా విక్రయం ద్వారా లభించిన అసాధారణ రాబడి కలిసి ఉండటం వల్ల వార్షికంగా లాభంలో తగ్గుదల నమోదైంది.ఈ వన్‌టైమ్ రాబడిని గనుక పక్కనబెడితే ఈ ఏడాది క్యూ1లో నికర లాభం దాదాపు 6.1 శాతం ఎగబాకి కొత్త రికార్డు నమోదు చేసినట్లు లెక్క. మొత్తం ఆదాయం రూ. 3.12 లక్షల కోట్లకు ఎగబాకింది. గతేడాది క్యూ1లో నమోదైన రూ. 2.48 లక్షల కోట్లతో పోలిస్తే 26 శాతం వృద్ధి చెందింది. ఆయిల్–టు–కెమికల్స్ (ఓ2సీ), రిటైల్, డిజిటల్ సరీ్వసుల వ్యాపారాల స్థిరమైన పనితీరు ఇందుకు ప్రధానంగా దోహదం చేసింది. కాగా, క్యూ1లో ఎబిటా 10.1 శాతం జంప్ చేసి రికార్డు స్థాయిలో రూ. 54,067 కోట్లను తాకింది.ఇతర ముఖ్యాంశాలివీ... క్యూ1లో ఓ2సీ బిజినెస్ ఎబిటా రూ.17,010 కోట్లకు చేరింది. 17.2 శాతం వృద్ధి చెందింది. రిలయన్స్ రిటైల్ నికర లాభం 14.2 శాతం తగ్గి రూ. 2,806 కోట్లకు చేరింది. ఆదాయం 8.6 శాతం పెరిగి రూ.79,745 కోట్లుగా నమోదైంది. ఎబిటా 1.1 శాతం తగ్గుదలతో రూ.6,309 కోట్లుగా ఉంది. కొత్తగా 252 స్టోర్లు జతయ్యాయి. దీంతో మొత్తం షోరూమ్‌ల సంఖ్య 20,169కి చేరింది. రిలయన్స్ కన్జూమర్ ప్రొడక్ట్స్ ఆదాయం 11.6 శాతం పెరిగింది. క్యాంపా కోలా అమ్మకాలు రూ. 2,900 కోట్లుగా నమోదయ్యాయి. రిలయన్స్ ఆయిల్ అండ్ గ్యాస్ వ్యాపార ఎబిటా దాదాపు అదే స్థాయిలో రూ. 4,973 కోట్లుగా నమోదైంది. జూన్ క్వార్టర్లో కంపెనీ రూ.38,682 కోట్ల పెట్టుబడులు వెచ్చించింది. ఓ2సీ విస్తరణ, న్యూ ఎనర్జీ ప్రాజెక్టులతో పాటు కన్జూమర్ బిజినెస్ ఇన్ఫ్రాపై దీన్ని ఇన్వెస్ట్ చేసింది. జూన్ నాటికి నికర రుణ భారం రూ.1,22,914 కోట్లుగా ఉంది. ఫలితాల నేపథ్యంలో శుక్రవారం రిలయన్స్ షేరు ధర 2.6 శాతం లాభంతో రూ.1,327 వద్ద ముగిసింది. మార్కెట్లు ముగిశాక ఫలితాలు వెలువడ్డాయి. -
అదృశ్య బంగారం.. దొరికితే అదృష్టమే!
జపాన్‌కు దక్షిణాన పసిఫిక్ మహాసముద్రంలోని అగ్నిపర్వత సముద్రగర్భ ప్రాంతంలో ప్రపంచంలోనే అత్యధిక సాంద్రత కలిగిన "అదృశ్య బంగారం" (Invisible Gold)ను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ ఆవిష్కరణ సముద్ర గర్భంలోని ఖనిజ సంపదపై ప్రపంచ దృష్టిని మళ్లీ ఆకర్షిస్తోంది. అయితే ఈ బంగారాన్ని తవ్వడం అంత సులభం కాదని, పర్యావరణ పరిరక్షణ కూడా పెద్ద సవాలేనని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు.ఎక్కడ లభించింది?ఈ బంగారు నిల్వలు టోక్యోకు దక్షిణంగా సుమారు 350–360 కిలోమీటర్ల దూరంలో జపాన్ ప్రత్యేక ఆర్థిక మండలిలోని ‘హిగాషి-అయోగాషిమా నోల్ కాల్డెరా (Higashi-Aogashima Knoll Caldera)’ హైడ్రోథర్మల్ ఫీల్డ్‌లో గుర్తించారు. ఇది సముద్ర అడుగున ఉన్న క్రియాశీల అగ్నిపర్వత ప్రాంతం. ఇక్కడ 'బ్లాక్ స్మోకర్స్'గా పిలిచే హైడ్రోథర్మల్ వెంట్ల నుంచి అత్యంత వేడిగా ఉండే, ఖనిజాలతో నిండిన ద్రవాలు వెలువడుతుంటాయి. చల్లటి సముద్రజలాన్ని తాకగానే అవి ఘనీభవించి సల్ఫైడ్ నిక్షేపాలు, చిమ్నీ ఆకారపు నిర్మాణాలను ఏర్పరుస్తాయి. ఈ ప్రక్రియలో రాగి, జింక్, వెండి, బంగారం వంటి లోహాలు సహజంగానే కేంద్రీకృతమవుతాయి.కనిపించని బంగారాన్ని ఎలా గుర్తించారు?ఇప్పటి వరకు బంగారం సాధారణంగా చిన్న కణాలు లేదా రేణువుల రూపంలో ఉంటుందని భావించేవారు. కానీ ఈసారి శాస్త్రవేత్తలు ‘సెకండరీ అయాన్ మాస్ స్పెక్ట్రోమెట్రీ ’(SIMS) అనే అత్యాధునిక సాంకేతికతతో పరిశీలించగా, బంగారం ఎక్కువ భాగం ‘పైరైట్’ (Pyrite) అనే ఐరన్ సల్ఫైడ్ ఖనిజం స్ఫటిక నిర్మాణంలోనే అణు స్థాయిలో కలిసిపోయి ఉందని గుర్తించారు. అందువల్ల ఇది సాధారణ సూక్ష్మదర్శినితో కూడా కనిపించదు. దీనినే "ఇన్విజిబుల్ గోల్డ్"గా పేర్కొంటారు.రికార్డు స్థాయి సాంద్రతసైంటిఫిక్ రిపోర్ట్స్ జర్నల్‌లో ఇటీవల ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. ఈ ప్రాంతంలోని పైరైట్లో బంగారం సాంద్రత గరిష్ఠంగా 1.9 శాతం (19,000 పీపీఎంకు పైగా)నమోదైంది. ఇప్పటివరకు ప్రపంచంలోని సముద్రగర్భ హైడ్రోథర్మల్ నిక్షేపాల్లో నమోదైన అత్యధిక స్థాయిల్లో ఇదొకటిగా పరిశోధకులు పేర్కొన్నారు.తవ్వకాలు సాధ్యమేనా?ఈ ప్రాంతం లోతు ఇతర సముద్రగర్భ ఖనిజ ప్రాంతాలతో పోలిస్తే తక్కువగా ఉండటం, ఖనిజ నిక్షేపాలు సమృద్ధిగా ఉండటం వల్ల భవిష్యత్తులో వాణిజ్యపరంగా మైనింగ్‌కు అనుకూల ప్రాంతంగా భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం పైరైట్లో అణు స్థాయిలో దాగి ఉన్న బంగారాన్ని భారీ స్థాయిలో, ఆర్థికంగా లాభదాయకంగా వెలికితీసే సాంకేతికత ఇంకా అందుబాటులో లేదు. అందువల్ల తక్షణ మైనింగ్ అవకాశాలు లేవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.పర్యావరణంపై ఆందోళనలుహైడ్రోథర్మల్ వెంట్ల చుట్టూ భూమిపై మరెక్కడా కనిపించని ప్రత్యేక సముద్ర జీవవ్యవస్థలు ఉంటాయి. అరుదైన పురుగులు, క్రస్టేషియన్లు, స్పాంజ్లు, పగడాలు, చేపలు వంటి జీవులు ఈ తీవ్ర పరిస్థితుల్లోనే జీవిస్తాయి. ఇలాంటి ప్రాంతాల్లో మైనింగ్ ప్రారంభిస్తే ఈ సున్నితమైన జీవవ్యవస్థలు శాశ్వతంగా దెబ్బతినే ప్రమాదం ఉందని సముద్ర శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అందుకే వాణిజ్య తవ్వకాల కంటే ముందుగా సమగ్ర పర్యావరణ అధ్యయనాలు, కఠినమైన రక్షణ చర్యలు అవసరమని వారు సూచిస్తున్నారు. -
సంపద సృష్టించడం ఎలా..?: కియోసాకి సలహా
ఒక వ్యక్తి ఎంత చదువుకున్నాడు అనే విషయం మాత్రమే.. అతని ఆర్థిక విజయాన్ని నిర్ణయించదని చెబుతారు రాబర్ట్ కియోసాకి. డబ్బును ఎలా అర్థం చేసుకుంటాడు, దాన్ని ఎలా ఉపయోగిస్తాడు, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడు అనేదే అతని ఆర్థిక స్థితిపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. చాలా మంది జీవితంలో ఒకే విధంగా కష్టపడుతున్నప్పటికీ, కొందరు సంపదను సృష్టిస్తారు, మరికొందరు డబ్బు సమస్యలతోనే కొనసాగుతారు. దీనికి ప్రధాన కారణం వారి ఆలోచనా విధానం.చదువు మాత్రమే సంపదను ఇవ్వదుకియోసాకి ఈ భావనను 'పూర్ డాడ్' - 'రిచ్ డాడ్' అనే రెండు భిన్నమైన ఆలోచనా విధానాలతో పోల్చారు.పూర్ డాడ్ బాగా చదువుకున్న వ్యక్తి. ఆయనకు ఉన్నత విద్య ఉన్నప్పటికీ, డబ్బు విషయంలో సాధారణంగా చాలామంది ఆలోచించే విధంగానే ఆలోచిస్తారు. ఉద్యోగం, స్థిరమైన ఆదాయం, భద్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.మరోవైపు రిచ్ డాడ్ పెద్దగా చదువుకోకపోయినా.. డబ్బు ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకున్నారు. ఆయన ఆదాయం వచ్చే మార్గాలను సృష్టించడం, ఆస్తులను పెంచుకోవడం వంటి విషయాలపై దృష్టి పెడతారు. అంటే దీని అర్థం చదువు అవసరం లేదని కాదు. విద్యతో పాటు ఆర్థిక అవగాహన కూడా చాలా ముఖ్యమని చెప్పడం.పెట్టుబడుల విషయంలో.. ఆలోచనలో తేడా!సాధారణంగా చాలామంది పెట్టుబడి పెట్టేటప్పుడు.. 'ఏ పెట్టుబడి సురక్షితమైనది?' అని అడుగుతారు. ఎందుకంటే నష్టం రాకుండా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ ఆర్థికంగా విజయవంతమైన వ్యక్తులు.. 'ఏ పెట్టుబడి నాకు ఆదాయం తెస్తుంది? దానిపై నాకు ఎంత నియంత్రణ ఉంటుంది? దాన్ని ఎలా పెంచుకోవచ్చు?' అని ఆలోచిస్తారు. అంటే ముఖ్యమైన విషయం కేవలం ఏ ఆస్తిలో పెట్టుబడి పెడుతున్నామన్నది కాదు. ఆ ఆస్తి గురించి మనకు ఎంత అవగాహన ఉందన్నదే అసలు విషయం.సేఫ్టీ కోసం వెతకడం vs జ్ఞానం సంపాదించడంపూర్ డాడ్.. 'ప్రమాదం వద్దు.. డబ్బును సురక్షితంగా ఉంచుకోవాలి' అని అనుకుంటారు. కానీ రిచ్ డాడ్ ఆలోచన 'ప్రమాదాన్ని తగ్గించుకోవాలంటే ముందుగా ఆ విషయం గురించి నేర్చుకోవాలి'. పెట్టుబడుల్లో రిస్క్ సహజం. కానీ అవగాహన లేకుండా పెట్టుబడి పెట్టడం మరింత ప్రమాదకరం. ఒక వ్యక్తి పెట్టుబడి పెట్టే రంగం గురించి తెలుసుకుంటే, సరైన నిర్ణయాలు తీసుకునే అవకాశం పెరుగుతుంది. తద్వారా ధనవంతులు అవుతారు. -
రూ.600 టికెట్‌కు.. రూ.10 వేల పరిహారం!
ప్రస్తుతం చాలామంది బస్ టికెట్లను దాదాపు ఆన్లైన్లోనే బుక్ చేసుకుంటున్నారు. దీంతో ప్రయాణం చాలా సులభతరమైంది. అయితే కొన్నిసార్లు టికెట్ కన్ఫర్మ్ అయిన తరువాత కూడా చివరి నిమిషంలో క్యాన్సిల్ అవుతాయి. ఇది ప్రయాణికులకు చాలా ఇబ్బంది కలిగిస్తుంది. అలాంటి సంఘటనే హిమాచల్ ప్రదేశ్‌లో జరిగింది. వినియోగదారుల కమిషన్ దీనిని విచారించి కీలక తీర్పును వెల్లడించింది.2023 అక్టోబర్ 5న జయంత్ పాటియల్ అనే వ్యక్తి పాలంపూర్ నుంచి ఢిల్లీ వెళ్లేందుకు రెడ్‌బస్ ద్వారా రూ.600 చెల్లించి బస్ టికెట్ బుక్ చేసుకున్నాడు. రాత్రి 10:15 గంటలకు బస్సు బయలుదేరాల్సి ఉండటంతో, అతడు సమయానికంటే ముందే బోర్డింగ్ పాయింట్‌కు వెళ్ళాడు.బోర్డింగ్ పాయింట్ చేరుకున్న తరువాత బస్ ఆపరేటర్ అయిన భర్మణి ట్రావెల్స్‌ను సంప్రదించినప్పుడు, రాత్రి 10:15 గంటలకు షెడ్యూల్ ప్రకారం బస్సు ఏదీ లేదని చెప్పినట్లు జయంత్ పేర్కొన్నాడు. ఢిల్లీకి వెళ్లాల్సిన తమ చివరి బస్సు రాత్రి 8 గంటలకే వెళ్లిపోయిందని ఆపరేటర్ అతనికి తెలియజేసినట్లు వెల్లడించాడు.దీంతో షాక్‌కు గురైన జయంత్ వెంటనే రెడ్‌బస్ కస్టమర్ కేర్‌ను సంప్రదించారు. సమస్యను పరిశీలిస్తామని చెప్పిన కొద్ది నిమిషాల్లోనే రాత్రి 9:58 గంటలకు టికెట్ రద్దు చేసినట్లు, డబ్బు రీఫండ్ చేస్తున్నట్లు సందేశం వచ్చింది. అంటే.. బస్సు బయలుదేరడానికి కేవలం 17 నిమిషాల ముందు టికెట్‌ను క్యాన్సిల్ చేశారు. ఇది అతనికి చాలా ఇబ్బంది కలిగించింది.జయంత్ అత్యవసరంగా ఢిల్లీ వెళ్లాల్సిన అవసరం ఉండటంతో మరో మార్గం వెతకాల్సి వచ్చింది. దాదాపు 40 కిలోమీటర్లు ప్రయాణించి సమీప విమానాశ్రయానికి చేరుకుని, మరుసటి రోజు ఉదయానికి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నాడు. దీని కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేసినట్లు కూడా పేర్కొన్నాడు. దీంతో ఆయనకు అదనపు ఆర్థిక భారం పడటమే కాకుండా, తీవ్ర మానసిక ఇబ్బందులు కూడా ఎదురయ్యాయి.ఈ ఘటనపై జయంత్ వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించి నష్టపరిహారం కోరారు. విచారణలో రెడ్‌బస్ తాము కేవలం ప్రయాణికులు, బస్సు ఆపరేటర్లను కలిపే ఆన్లైన్ ప్లాట్‌ఫామ్ మాత్రమేనని, బస్సు నడపడం తమ బాధ్యత కాదని వాదించింది. టికెట్ డబ్బు తిరిగి ఇచ్చామని తెలిపింది.అయితే కమిషన్ ఈ వాదనను అంగీకరించలేదు. ఒకసారి టికెట్ బుక్ చేసి, డబ్బు తీసుకుని, బుకింగ్‌ను కన్ఫర్మ్ చేసిన తర్వాత సేవ అందకపోతే బాధ్యత నుంచి తప్పించుకోలేరని స్పష్టం చేసింది. మరోవైపు భర్మణి ట్రావెల్స్ కూడా బస్సు ఎందుకు నడపలేదనే విషయంపై ఎలాంటి వివరణ ఇవ్వకపోవడాన్ని కమిషన్ తప్పుపట్టింది.కమిషన్ రెడ్‌బస్, భర్మణి ట్రావెల్స్ రెండింటినీ బాధ్యులుగా నిర్ధారించింది. ప్రయాణికుడికి మానసిక వేదన, ఇబ్బందులకు రూ.5,000, కేసు ఖర్చులకు మరో రూ.5,000 చెల్లించాలని ఆదేశించింది. 30 రోజుల్లో డబ్బు చెల్లించకపోతే, ఫిర్యాదు చేసిన తేదీ నుంచి చెల్లించే వరకు ఏడాదికి 9 శాతం వడ్డీతో చెల్లించాలని కమిషన్ ఆదేశించింది.ఇదీ చదవండి: రేషన్ కార్డులో కీలక మార్పులు! -
విప్రో ఫలితాలు వీక్!
న్యూఢిల్లీ: దేశీ ఐటీ దిగ్గజం విప్రో నిరుత్సాహకర ఫలితాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి క్వార్టర్ (2026–27, క్యూ1)లో కంపెనీ రూ.3,352 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ఆర్జించింది. గతేడాది ఇదే కాలంలో రూ.3,330 కోట్లతో పోలిస్తే లాభం దాదాపు ఫ్లాట్‌గా నమోదైంది. కాగా, మొత్తం ఆదాయం 10.6 శాతం జంప్ చేసి రూ.24,479 కోట్లకు చేరింది. గతేడాది క్యూ1లో ఆదాయం రూ.22,135 కోట్లుగా ఉంది. సీక్వెన్షియల్‌గా లాభం డౌన్... క్రితం ఏడాది చివరి క్వార్టర్ (2025–26, క్యూ4)లో నమోదైన రూ. 3,501 కోట్లతో పోలిస్తే సీక్వెన్షియల్‌గా క్యూ1 లాభం 4.2 శాతం దిగజారింది. అయితే, మొత్తం ఆదాయం మాత్రం స్వల్పంగా 1 శాతం పెరిగింది. గతేడాది క్యూ4లో ఆదాయం రూ. 24,236 కోట్లుగా నమోదైంది. గైడెన్స్.. ప్చ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను ఐటీ సేవల వ్యాపార ఆదాయ వృద్ధి అంచనాలు (గైడెన్స్) కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయి. ఆదాయం 2.57 బిలియన్ డాలర్ల నుంచి 2.63 బిలియన్ డాలర్ల మధ్య ఉండొచ్చని కంపెనీ పేర్కొంది. దీని ప్రకారం సీక్వెన్షియల్‌గా ఆదాయ గైడెన్స్ మైనస్ 1.5 శాతం నుంచి ప్లస్ 0.5 శాతంగా లెక్కతేలుతుంది. ఇతర ముఖ్యాంశాలివీ... → ఐటీ సేవలకు సంబంధించిన ఆదాయం క్యూ1లో 2.61 బిలియన్ డాలర్లుగా నమోదైంది. సీక్వెన్షియల్‌గా 1.4 శాతం తగ్గగా, వార్షికంగా 1 శాతం పెరిగింది. → ఐటీ సేవల నిర్వహణ మార్జిన్ 16 శాతంగా నమోదైంది. సీక్వెన్షియల్‌గా 1.3 శాతం, వార్షికంగా 1.2 శాతం తగ్గింది. → కంపెనీ వాటాదారులకు రూ. 2 ముఖ విలువ గల ఒక్కో షేరుపై రూ. 2 మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. దీనికి రికార్డు తేదీ ఈ నెల 27 కాగా, ఆగస్ట్ 14 లోపు చెల్లిస్తుంది. → ఈ ఏడాది జూన్ చివరి నాటికి కంపెనీ మొత్తం సిబ్బంది సంఖ్య 2,43,044కు చేరింది. మార్చి క్వార్టర్‌తో పోలిస్తే 888 మంది ఉద్యోగులు జతయ్యారు. ఉద్యోగుల వలసల రేటు (అట్రిషన్) 13.9 శాతంగా ఉంది. ఫలితాల నేపథ్యంలో విప్రో షేరు ధర గురువారం 1.83 శాతం లాభపడి రూ.178 వద్ద ముగిసింది.క్లయింట్లు టెక్నాలజీ ఆధునీకరణ స్థాయి నుంచి ఏఐ–ఆధారిత ఆపరేటింగ్ మోడల్స్ వైపు మళ్లుతున్నారు. దీనివల్ల నాణ్యత, ఉత్పాదకత మెరుగుపడుతుంది. దీనికి అనుగుణంగా విప్రో అందిస్తున్న కన్సల్టింగ్ ఆధారిత, ఏఐతో కూడిన విధానం వల్ల క్లయింట్లు తమ కీలక వ్యాపారంలో ఏఐని అమలు చేసేందుకు వీలవుతోంది. క్లయింట్లు తమ ఏఐ మార్పుల కోసం మాపై ఉంచుతున్న నమ్మకానికి, మా విస్తృత సామర్థ్యాలకు ఇది నిదర్శనం. – శ్రీని పల్లియా, విప్రో సీఈఓ, ఎండీ -
రూ.10 వేల కోట్ల కంపెనీకి బాస్.. హోమ్ లోన్ ఇవ్వని బ్యాంక్!
సొంతంగా ఒక కంపెనీని నిర్మించడం అనేది చాలా సాహసంతో కూడుకున్న పని, అది పెద్ద విజయం కూడా. అలాంటి వ్యక్తికి బ్యాంకు హోమ్ లోన్ ఇవ్వడం పెద్ద విషయం కాదని చాలామంది అనుకుంటారు. కానీ.. ఇక్కడ ఒక వ్యాపారవేత్తకు ఎదురైన సంఘటన మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ఆ విషయాన్ని తన ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించారు.ఫిన్‌టెక్ సంస్థ రైజ్ (ధన్ పేరెంట్ కంపెనీ) వ్యవస్థాపకుడు ప్రవీణ్ జాధవ్ ఇటీవల హోమ్ లోన్ కోసం ఓ బ్యాంకును ఆశ్రయించారు. అయితే ఆయన దరఖాస్తును బ్యాంకు తిరస్కరించింది. కారణం ఏమిటంటే.. ఆయనను 'హై రిస్క్ బారోవర్'గా పరిగణించడం. దాదాపు 1.2 బిలియన్ డాలర్ల (రూ.10 వేల కోట్ల కంటే ఎక్కువ) విలువైన కంపెనీని నడుపుతున్న వ్యక్తికి కూడా ఈ పరిస్థితి రావడం చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేసింది.తనకు ఎదురైనా అనుభవాన్ని ప్రవీణ్ జాధవ్ సోషల్ మీడియాలో షేర్ చేసిన అతి తక్కువ సమయంలోనే తెగ వైరల్ అయింది. దీంతో పలువురు స్టార్టప్ వ్యవస్థాపకులు, వ్యాపారవేత్తలు కూడా తమకు ఎదురైన ఇలాంటి అనుభవాలను గురించి వెల్లడించారు.నిజానికి బ్యాంకులు ఎవరి కంపెనీ విలువ ఎంత ఉందో అనే విషయాలను పరిగణలోకి తీసుకుని లోన్స్ అందించవు. లోన్ తీసుకున్న వ్యక్తి దాన్ని క్రమం తప్పకుండా తిరిగి చెల్లించగలడా.. లేదా?, అనే అంశాన్నే ప్రధానంగా పరిశీలిస్తాయి. అందుకే గతంలో తీసుకున్న లోన్స్ హిస్టరీ, ఆదాయపు పన్ను రిటర్నులు, స్థిరమైన ఆదాయం వంటి వివరాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాయి.Founder's life is hard!My home loan application got rejected by a top private bank - just because I am a founder.> 25 year of customer> ~800 CIBIL Score> 5x-6x of loan value in relationship with this bank> may be in top 0.1% of its customers by assets> and irony is this…— pj (@BeingPractical) July 14, 2026ఉద్యోగుల విషయంలో ఇది చాలా సులభం. ఎందుకంటే ప్రతి నెలా ఒకే తేదీకి జీతం వస్తుంది. శాలరీ స్లిప్‌లు, బ్యాంక్ స్టేట్మెంట్లు చూసి వారి ఆదాయాన్ని సులభంగా అంచనా వేయవచ్చు. అందుకే వారికి హోమ్ లోన్ ప్రక్రియ కూడా చాలా వేగంగా లభిస్తుంది. కానీ వ్యాపారవేత్తల పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. వారి ఆదాయం ప్రతి నెల ఒకేలా ఉండదు. కంపెనీ లాభాలు, డివిడెండ్లు, షేర్ల విలువ ఆధారంగా ఆదాయం మారుతూ ఉంటుంది. చాలామంది స్టార్టప్ వ్యవస్థాపకులు కంపెనీ విలువ వేల కోట్ల రూపాయలు ఉన్నా, వ్యక్తిగతంగా తక్కువ జీతమే తీసుకుంటుంటారు. ఈ కారణంగా వారి ఆదాయాన్ని బ్యాంకులు స్థిరమైనదిగా పరిగణించకపోవచ్చు.ఈ ఘటనపై స్పందించిన బ్యాంక్‌బజార్ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ రతి శెట్టి కూడా ఇదే విషయాన్ని వివరించారు. బ్యాంకులు ఆదాయం ఎంత స్థిరంగా ఉందో, తిరిగి చెల్లించే సామర్థ్యం ఎంత ఉందో మాత్రమే పరిశీలిస్తాయని చెప్పారు. అయితే సరైన ఆర్థిక పత్రాలు, పన్ను వివరాలు, ఆదాయ రికార్డులు సమర్పిస్తే.. వ్యాపారవేత్తలు కూడా రుణాలు పొందే అవకాశాలు మెరుగుపడతాయని ఆమె అభిప్రాయపడ్డారు. -
‘ఇక చమురు కాదు.. రానున్నది సరికొత్త యుద్ధం’
ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారుల దృష్టి ప్రస్తుతం బిట్‌కాయిన్, షేర్లు, చమురు, రిటైర్మెంట్ ఫండ్లపై ఉండగా, అసలు భవిష్యత్తును నిర్ణయించేది మాత్రం ‘నీరు (Water Rights)’ అని ప్రముఖ ఆర్థిక రచయిత, ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ పుస్తక రచయిత ‘రాబర్ట్ కియోసాకి’ వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన తన ఫేస్బుక్ పోస్టులో నీటి హక్కుల ప్రాధాన్యాన్ని వివరిస్తూ ఆసక్తికరమైన విశ్లేషణను పంచుకున్నారు.కియోసాకి ప్రకారం.. ప్రపంచంలోని అత్యంత తెలివైన పెట్టుబడిదారులు ఇప్పటికే నీటి హక్కులపై దృష్టి పెట్టారని తెలిపారు. 2008 ఆర్థిక సంక్షోభాన్ని ముందుగానే అంచనా వేసిన ప్రముఖ ఇన్వెస్టర్ ‘మైఖేల్ బర్రీ’ ఎన్నో సంవత్సరాలుగా నీటి హక్కులను కొనుగోలు చేస్తున్నారని గుర్తుచేశారు. అలాగే అమెరికాలో 2.7 లక్షల ఎకరాలకు పైగా వ్యవసాయ భూమిని కలిగి ఉన్న బిల్ గేట్స్ లక్ష్యం కేవలం వ్యవసాయం కాదని, ఆ భూములకు అనుబంధంగా ఉన్న నీటి హక్కులను భద్రపరచుకోవడమేనని పేర్కొన్నారు. అదేవిధంగా ‘చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ లాటర్-డే సెయింట్స్’ వాషింగ్టన్ రాష్ట్రంలో వేల ఎకరాల భూమిని కొనుగోలు చేయడానికి ప్రధాన కారణం కూడా నీటి హక్కులేనని చెప్పారు.నీరు లేని భూమికి విలువే లేదు"నీరు లేని భూమి తక్కువ విలువైనది కాదు... పూర్తిగా విలువలేనిది" అని కియోసాకి వ్యాఖ్యానించారు. ప్రపంచంలోని మంచినీటిలో సుమారు 70 శాతం వ్యవసాయానికే వినియోగిస్తుండగా, వాతావరణ మార్పులు, భూగర్భ జలాల క్షీణత, పెరుగుతున్న జనాభా, పాతబడిన నీటి సరఫరా వ్యవస్థలు భవిష్యత్తులో తీవ్రమైన నీటి కొరతకు దారితీస్తాయని హెచ్చరించారు. అమెరికాలోని కాలిఫోర్నియా, అరిజోనా, టెక్సాస్, కొలరాడో నది పరివాహక ప్రాంతాల్లో ఈ సమస్య ఇప్పటికే స్పష్టంగా కనిపిస్తోందని తెలిపారు.నీటినీ ట్రేడ్ చేస్తున్న వాల్ స్ట్రీట్కియోసాకి వెల్లడించిన వివరాల ప్రకారం.. అమెరికాలోని సీఎంఈ గ్రూప్ ఇప్పటికే వాటర్ ఫ్యూచర్స్ మార్కెట్‌ను ప్రారంభించింది. అంటే చమురు మాదిరిగానే నీటిని కూడా ఆర్థిక మార్కెట్లలో ట్రేడ్ చేస్తున్నారని చెప్పారు. కాలిఫోర్నియాలో కొన్ని ప్రాంతాల్లో భూమి కంటే దానికి సంబంధించిన నీటి హక్కులకే ఎక్కువ విలువ ఉందని పేర్కొన్నారు. పెట్టుబడి సంస్థలు వ్యవసాయ భూములను కొనుగోలు చేసి, కొంతకాలం రైతులకు లీజుకు ఇచ్చి, అనంతరం ఆ నీటి హక్కులను నగరాలకు విక్రయించి భారీ లాభాలు ఆర్జిస్తున్నాయని వివరించారు.ధనవంతుల పెట్టుబడుల వ్యూహం ఇదే!మధ్యతరగతి ప్రజలు మ్యూచువల్ ఫండ్లు, సాధారణ పెట్టుబడుల్లో డబ్బు పెడుతుంటే, ధనవంతులు మాత్రం భూమితో పాటు దానికి సంబంధించిన నీటి హక్కులను కొనుగోలు చేస్తున్నారని కియోసాకి అభిప్రాయపడ్డారు. నీటి కొరత పెరిగే కొద్దీ ఆ హక్కుల విలువ మరింత పెరుగుతుందని, తర్వాత వాటిని నగరాలకు విక్రయించడం లేదా లీజుకు ఇవ్వడం ద్వారా భారీ లాభాలు పొందుతున్నారని చెప్పారు.తన 'రిచ్ డాడ్' తనకు నేర్పిన ఒక ముఖ్యమైన సూత్రాన్ని కూడా కియోసాకి గుర్తుచేశారు. "ఏది లేకుండా ప్రపంచం జీవించలేదదో అలాంటి ఆస్తిని కొనుగోలు చేయి" అని తన గురువు చెప్పారని పేర్కొన్నారు. గత 100 సంవత్సరాల్లో ఆ ఆస్తి చమురైతే, రాబోయే 100 సంవత్సరాల్లో అది ‘నీరు’ అవుతుందని తన ఫేస్బుక్ పోస్టులో కియోసాకి అభిప్రాయపడ్డారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీశాయి. -
అంత ఈజీ కాదు.. అందుకే కెనడా నుంచి వచ్చేశా!
అమెరికా, కెనడా, యూరప్ వంటి దేశాల్లో మంచి ఉద్యోగం సంపాదించి.. మంచి జీవితాన్ని గడపాలని చాలా మంది భారతీయులు కలలు కంటారు. ఈ కారణంగానే ప్రతి ఏటా వేలాదిమంది దేశం విడిచి వెళుతుంటారు. అయితే.. విదేశాల్లో జీవితం అందరికీ ఒకేలా ఉండదు అంటున్నారు వ్యాపారవేత్త 'హర్ష్ గుప్తా'. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.హర్ష్ గుప్తా సోషల్ మీడియాలో షేర్ చేసిన వివరాలు ప్రకారం.. తాను పర్మినెంట్ రెసిడెన్సీతో కెనడాలోని టొరొంటోకు వెళ్లారు. కానీ అక్కడ కేవలం 18 నెలలు మాత్రమే ఉండి, తిరిగి భారత్‌కు వచ్చేశారు. తాను తిరిగి ఇండియాకు ఎందుకు తిరిగి వచ్చారో.. చెప్పిన కారణాలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి.ఉద్యోగంహర్ష్ గుప్తా చెప్పిన మొదటి కారణం ఉద్యోగాల గురించి. చాలామంది అనుకునేలా కెనడాలో మంచి ఉద్యోగం సులభంగా దొరకదు. ఒక్కో ఉద్యోగానికి వేల సంఖ్యలో దరఖాస్తులు చేసుకుంటారు, పోటీ కూడా చాలా ఎక్కువగా ఉంటుందని వివరించారు. అందరూ అనుకునేలా జీతాలు పెద్ద స్థాయిలో ఉండవని, కొన్ని పెద్ద కంపెనీలు మాత్రమే ఎక్కువ జీతాలు ఇస్తాయని పేర్కొన్నారు.జీవన వ్యయంజీవన వ్యయం కూడా ఇబ్బందిగా ఉంటుందని హర్ష్ గుప్తా పేర్కొన్నారు. టొరొంటోలో చిన్న అపార్ట్మెంట్కే నెలకు దాదాపు రెండు లక్షల రూపాయల అద్దె చెల్లించాల్సి వచ్చిందని చెప్పారు. తాను నెలకు దాదాపు పది లక్షల రూపాయలు సంపాదించినప్పటికీ, అందులో సగం వరకు పన్నులకే వెళ్లిపోయేదని అన్నారు. అందుకే ఎక్కువ సంపాదించినా.. చేతిలో మిగిలేది అంతంత మాత్రమే అని వెల్లడించారు.ఆరోగ్య సేవలుఆరోగ్య సేవల విషయంలో కూడా మంచి అనుభవం రాలేదని ఆయన పేర్కొన్నారు. ఒక ఫ్యామిలీ డాక్టర్‌ను పొందడానికి ఆరు నెలలు ఎదురుచూడాల్సి వచ్చిందని, స్పెషలిస్ట్ డాక్టర్‌ను కలవడానికి ఇంకా ఎక్కువ సమయం పట్టేదని తెలిపారు. అందువల్ల ప్రభుత్వ వైద్య వ్యవస్థ గురించి బయట వినిపించేంత సౌకర్యం తనకు కనిపించలేదని హర్ష్ గుప్తా చెప్పారు.కెనడాలోని చలి వాతావరణం కూడా పెద్ద సమస్య అని హర్ష్ పేర్కొన్నారు. అక్టోబర్ నుంచి ఏప్రిల్ వరకు ఎక్కువగా చలి ఉండటంతో బయట తిరగడం కష్టమవుతుందని, రోజంతా చలికోట్లు వేసుకోవాల్సి వస్తుందని చెప్పారు. ఈ కారణంగా చాలామందికి ఒంటరితనం, నిరుత్సాహం కూడా కలుగుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.హర్ష్ గుప్తా చెప్పిన విషయాలతో అందరూ ఏకీభవించలేదు. కొందరు నిజంగానే కెనడాలో ఇంటి అద్దెలు, పన్నులు, ఉద్యోగ సమస్యలు ఎక్కువగా ఉన్నాయని చెప్పినప్పటికీ.. మరికొందరు మాత్రం కెనడాలో ప్రశాంతమైన జీవితం, మంచి భద్రత, పిల్లలకు మంచి విద్య, ఆరోగ్యకరమైన వాతావరణం లభిస్తాయని చెప్పారు. కుటుంబంతో జీవించడానికి కెనడా చాలా మంచి దేశమని మరికొందరు తమ అనుభవాలను పంచుకున్నారు. విదేశాలు కొందరికి విజయాన్ని అందిస్తే, మరికొందరికి అనేక ఇబ్బందులను కూడా చూపిస్తాయని ఇంకొందరు అన్నారు.ఇదీ చదవండి: ఇలా చేస్తే.. ట్రైన్ మొత్తం బుక్ చేసుకోవచ్చు! -
తండ్రి జ్ఞాపకార్థం.. రూ.100 కోట్లతో యూనివర్సిటీ!
ఎస్సెల్ గ్రూప్ ఛైర్మన్ అధినేత డాక్టర్ సుభాష్ చంద్ర తన తండ్రి, ప్రముఖ సామాజిక కార్యకర్త స్వర్గీయ నంద కిషోర్ గోయెంకా జ్ఞాపకార్థం ఒక ప్రతిష్టాత్మక విద్యా సంస్థను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. 'శ్రీ నంద్ కిషోర్ గోయెంకా విశ్వవిద్యాలయం' పేరుతో మొత్తం 32 ఎకరాల విస్తీర్ణంలో రూ.100 కోట్ల భారీ వ్యయంతో ఈ యూనివర్సిటీని నిర్మించనున్నారు.యూనివర్సిటీ ముఖ్య విశేషాలుసామాజిక సేవపై ప్రత్యేక కోర్సు: నంద కిషోర్ గోయెంకా వారసత్వాన్ని, మానవీయ విలువలను రాబోయే తరాలకు అందించేలా ఈ విశ్వవిద్యాలయంలో 'సామాజిక సేవ మరియు దాతృత్వం' (Social Service and Philanthropy)పై ఒక ప్రత్యేక కోర్సును ప్రారంభించనున్నారు.పేద విద్యార్థులకు ప్రాధాన్యత: ఆర్థికంగా వెనుకబడిన, పేద విద్యార్థులకు ఈ యూనివర్సిటీలో తగిన స్థానం, ప్రాధాన్యత ఉంటుందని డాక్టర్ సుభాష్ చంద్ర స్పష్టం చేశారు.వచ్చే ఏడాది నుంచే ప్రారంభం: ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన విధి విధానాలను త్వరలోనే పూర్తి చేసి, వచ్చే ఏడాది నుంచే యూనివర్సిటీ విద్యా కార్యకలాపాలు ప్రారంభించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. -
ఉద్యోగానికి రిజైన్ చేయకుండానే ప్రపంచ యాత్ర
‘లక్షల రూపాయల ప్యాకేజీ ఉన్న కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలేసి ప్రపంచాన్ని చుట్టేయడానికి బయలుదేరాను’ అంటూ ప్రస్తుతం సోషల్ మీడియా రీల్స్‌లో చాలా మంది ఇన్‌ఫ్యుయెన్సర్లు చెప్పడం చూశాం. స్థిరమైన కెరీర్‌ను వదులుకుంటేనే కలలను సాకారం చేసుకోగలమనే ఒక భ్రమను ఈ ధోరణి సృష్టిస్తోంది. అయితే, ఈ నెరేటివ్‌ను సవాలు చేస్తూ తన ఫుల్‌టైమ్ 9-5 జాజ్‌ను కాపాడుకుంటూనే ప్రపంచాన్ని చుట్టేస్తున్న పంజాబ్‌కు చెందిన లైఫ్‌స్టైల్, ట్రావెల్ కంటెంట్ క్రియేటర్ ఆనీ శర్మ సరికొత్త పంథాతో వార్తల్లో నిలిచారు.ఆనీ శర్మ తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్న వివరాల ప్రకారం.. స్థిరమైన ఆదాయాన్ని, కెరీర్‌ను పణంగా పెట్టకుండానే ప్రయాణాల పట్ల ఉన్న అభిరుచిని ఎలా కొనసాగించవచ్చో నిరూపించారు. ఆమె అనుసరిస్తున్న వ్యూహాలు కొందరు వర్కింగ్ ప్రొఫెషనల్స్‌కు ఆదర్శంగా నిలుస్తున్నాయి.ముందస్తు ప్రణాళిక: ప్రతి పర్యటనను కొన్ని నెలల ముందే పక్కాగా ప్లాన్ చేసుకోవడం, బడ్జెట్‌ను క్రమశిక్షణతో నిర్వహించడం వల్ల ఖర్చులు అదుపులో ఉంటాయి.శాండ్విచ్ పద్ధతి: ఆమె సాధారణంగా 4-5 రోజుల చిన్న ట్రిప్స్ కాకుండా 10 రోజుల సుదీర్ఘ పర్యటనలను ఎంచుకుంటారు. రెండు వారాంతాలను కలుపుతూ మధ్యలో వచ్చే పనిదినాలను మేనేజ్ చేస్తారు.రిమోట్ వర్క్ వినియోగం: ఆమెకు ఉన్న రిమోట్ వర్క్ సౌలభ్యం దీనికి ఎంతో ఉపయోగపడుతోంది. పర్యటనలో ఉన్నప్పుడు వారాంతాల్లో స్థానిక ప్రాంతాలను అన్వేషిస్తూ పనిదినాల్లో రిమోట్‌గా ఆఫీస్ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.అదనపు ఆదాయ వనరులు: ఉద్యోగ జీతంతో పాటు సోషల్ మీడియా కొలాబొరేషన్స్, బ్రాండ్ స్పాన్సర్షిప్స్ ద్వారా అదనపు ఆదాయాన్ని ఆర్జిస్తూ ప్రయాణ ఖర్చులను సమతుల్యం చేసుకుంటున్నారు.ఉద్యోగాలు వదిలేయండనే తోటివారి ఒత్తిడికు లోనుకావద్దని ఆనీ శర్మ హితవు పలికారు. రిమోట్ వర్క్ సంస్కృతిని, సమయాన్ని స్మార్ట్‌గా మేనేజ్ చేసుకుంటే కెరీర్ ఎదుగుదలను, వ్యక్తిగత సంతోషాన్ని సమతుల్యంగా ముందుకు తీసుకెళ్లవచ్చని ఆమె చెప్పారు.ఇదీ చదవండి: IRCTC వెబ్సైట్ కొత్త అవతారం.. అదిరిపోయే ఫీచర్లు -
మీ అంతరాత్మను కదిలించే పనే చేయండి!
ఆధునిక సాంకేతిక ప్రపంచాన్ని శాసిస్తున్న గూగుల్ మాతృసంస్థ ‘ఆల్ఫాబెట్’ సీఈఓ సుందర్ పిచాయ్ యువతకు, ముఖ్యంగా విద్యార్థులకు సందేశాన్ని ఇచ్చారు. సమాజం తమపై ఉంచే అంచనాలు, తల్లిదండ్రుల కోరికల కోసం కాకుండా తమను ఏ రంగం అయితే అమితంగా ఆకర్షిస్తుందో ఆ రంగంలోనే కెరీర్‌ను ఎంచుకోవాలని పిలుపునిచ్చారు. ఇటీవల ప్రతిష్టాత్మక స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో చేసిన ప్రసంగంలో ఆయన పంచుకున్న అంశాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విద్యార్థుల్లో చర్చకు దారితీశాయి.తల్లిదండ్రుల కలలు.. సమాజపు అంచనాలు వద్దు!‘మీ తల్లిదండ్రులు మీ నుంచి ఏం ఆశిస్తున్నారనే దానిపై లేదా మీ స్నేహితులు ఏం చేస్తున్నారనే దానిపై దృష్టి పెట్టకండి. సమాజం అంచనాలను పక్కనబెట్టండి. రాత్రి వేళల్లో కూడా రూమ్మేట్స్తో మీరు దేని గురించి అయితే ఉత్సాహంగా మాట్లాడుకుంటారో, మీ అంతరాత్మను ఏది కదిలిస్తుందో ఆ రంగంలోనే ముందుకు సాగండి’ అని పిచాయ్ ఉద్ఘాటించారు.భారతదేశంలో మెజారిటీ కుటుంబాలు ఇప్పటికీ పిల్లల ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా ఇంజినీరింగ్, మెడిసిన్ వంటి సంప్రదాయ కోర్సులవైపే మొగ్గు చూపుతున్న తరుణంలో చెన్నైలోని ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి గూగుల్ అధినేతగా ఎదిగిన సుందర్ పిచాయ్ నోట ఈ మాటలు రావడం గమనార్హం.సుందర్ చెప్పే జీవిత సూత్రాలుఆశావాదాన్ని ఎంచుకోండి: ప్రపంచంలో ఆర్థిక అనిశ్చితులు, భౌగోళిక ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ.. పరిస్థితులు మన నియంత్రణలో లేనప్పుడు వాటికి మనం ఎలా స్పందిస్తున్నామనేదే ముఖ్యం. ఎల్లప్పుడూ సానుకూల దృక్పథంతో ఉండాలి.కఠిన సవాళ్లను స్వీకరించండి: గూగుల్ ‘క్రోమ్’ బ్రౌజర్‌ను ప్రారంభించిన కొత్తలో అప్పటి మైక్రోసాఫ్ట్ సీఈఓ స్టీవ్ బాల్మర్ దాన్ని చాలా చిన్న విషయంగా కొట్టిపారేశారు. అయినా వెనకడుగు వేయకుండా కష్టపడటం వల్లే నేడు క్రోమ్ ప్రపంచంలోనే నంబర్ వన్ బ్రౌజర్‌గా నిలిచింది. సవాళ్లను ఎదుర్కొంటేనే గుర్తింపు లభిస్తుంది.ఒత్తిళ్లతో నిర్ణయాలు తీసుకోవద్దు: పిచాయ్ తండ్రి ఏడాది జీతాన్ని పొదుపు చేసి తనను ఉన్నత చదువులకై అమెరికా పంపిన విషయాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు. భారతీయ తల్లిదండ్రులు పిల్లల చదువు కోసం ఎన్నో త్యాగాలు చేస్తారని, అయితే అదే సమయంలో వారి ఆలోచనలను కూడా గౌరవించాల్సిన అవసరం ఉందని ఈ ప్రసంగంలో స్పష్టం చేశారు.ఇదీ చదవండి: IRCTC వెబ్సైట్ కొత్త అవతారం.. అదిరిపోయే ఫీచర్లు -
యూకే వీసా.. ఇండియన్స్‌కి గుడ్ న్యూస్
యునైటెడ్ కింగ్డమ్.. యూకే వెళ్లాలని, అక్కడ చదువుకోవాలని, ఉద్యోగం చేయాలని చాలామంది కలలు కంటుంటారు. అయితే ఆ అవకాశం అందరికీ దొరకదు. కానీ ఇప్పుడు యూకేలో ఉద్యోగం, ఉన్నత విద్య లేదా అంతర్జాతీయ అనుభవం కోసం ఎదురుచూస్తున్న భారత యువతకు మరో కీలక అవకాశం లభించింది. ఇండియా యంగ్ ప్రొఫెషనల్స్ స్కీమ్ (India Young Professionals Scheme - YPS) కింద 2026 సంవత్సరానికి సంబంధించిన రెండో, చివరి బ్యాలెట్ జూలై 21 నుంచి ప్రారంభం కానుంది.ఈ వీసా స్కీమ్ ప్రత్యేకత ఏమిటంటే.. ముందుగానే ఉద్యోగ ఆఫర్ లేదా యజమాని స్పాన్సర్షిప్ అవసరం లేకుండానే అర్హులైన భారతీయులు యూకేలో రెండేళ్ల వరకు నివసిస్తూ, ఉద్యోగం చేయడం లేదా చదువుకోవడం చేయవచ్చు. ఈ వివరాలను యూకే ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది.జూలై 21 నుంచి 48 గంటలపాటు బ్యాలెట్యూకే ప్రభుత్వ షెడ్యూల్ ప్రకారం బ్యాలెట్ జూలై 21, 2026 మధ్యాహ్నం 1:30 గంటలకు (IST)ప్రారంభమై, జూలై 23 మధ్యాహ్నం 1:30 గంటలకు ముగుస్తుంది. ఈ బ్యాలెట్లో నమోదు పూర్తిగా ఉచితం. అయితే బ్యాలెట్లో ఎంపికైన వారికి మాత్రమే తదుపరి వీసా దరఖాస్తు చేసే అవకాశం లభిస్తుంది. ఫలితాలను బ్యాలెట్ ముగిసిన రెండు వారాల్లోపు ఈమెయిల్ ద్వారా తెలియజేస్తారు.మొత్తం 3,000 వీసాలు..2026 సంవత్సరానికి ఈ పథకం కింద మొత్తం 3,000 వీసా స్థానాలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఎక్కువ భాగం ఇప్పటికే ఫిబ్రవరిలో నిర్వహించిన తొలి బ్యాలెట్లో కేటాయించగా, మిగిలిన స్థానాలను ఇప్పుడు నిర్వహించే రెండో, చివరి బ్యాలెట్ ద్వారా భర్తీ చేయనున్నారు. అందుకే ఇది ఈ ఏడాది చివరి అవకాశం కానుంది.అర్హతలు ఇవే..ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థులు కింది అర్హతలు కలిగి ఉండాలి.భారతీయ పౌరుడు అయి ఉండాలి.వయస్సు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.కనీసం బ్యాచిలర్ డిగ్రీ లేదా సమాన అర్హత ఉండాలి.యూకేలో ప్రారంభ ఖర్చులకు సరిపడా 2,530 పౌండ్లు (సుమారు రూ.3.27 లక్షలు) పొదుపు ఉన్నట్లు నిరూపించాలి.ఇతర వీసా అర్హతలను కూడా పూర్తి చేయాలి.దరఖాస్తు ఎలాగంటే..అర్హులైన అభ్యర్థులు యూకే ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లో బ్యాలెట్లో నమోదు చేసుకోవాలి. నమోదు సమయంలో పూర్తి పేరు, పుట్టిన తేదీ, పాస్‌పోర్ట్ వివరాలు, పాస్‌పోర్ట్ స్కాన్ కాపీ, ఫోన్ నంబర్, ఈమెయిల్ వంటి వివరాలు సమర్పించాలి. నమోదు చేసిన సమాచారం పాస్‌పోర్ట్‌లోని వివరాలతో పూర్తిగా సరిపోవాలి.ఎంపికైతే ఏమి చేయాలి?బ్యాలెట్లో పేరు ఎంపికైన వారికి ఈమెయిల్ ద్వారా సమాచారం అందుతుంది. ఆ తేదీ నుంచి 90 రోజుల్లోపు వీసా కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేయాలి. అలాగే వీసా ఫీజు, ఇమ్మిగ్రేషన్ హెల్త్ సర్‌చార్జ్ చెల్లించి, బయోమెట్రిక్ వివరాలు సమర్పించాలి. బ్యాలెట్లో ఎంపిక కావడం మాత్రమే వీసా మంజూరుకు హామీ కాదని, తుది పరిశీలన అనంతరం మాత్రమే వీసా జారీ అవుతుందని యూకే ప్రభుత్వం స్పష్టం చేసింది.ఎంత ఖర్చవుతుంది?వీసా దరఖాస్తు సమయంలో 340 పౌండ్లు వీసా ఫీజుతో పాటు 1,552 పౌండ్లు ఇమ్మిగ్రేషన్ హెల్త్ సర్‌చార్జ్ చెల్లించాలి. అదనంగా కనీసం 2,530 పౌండ్లు వ్యక్తిగత పొదుపు ఉన్నట్లు ఆధారాలు సమర్పించాల్సి ఉంటుంది.గుర్తుంచుకోవాల్సిన విషయాలుఒక్కో బ్యాలెట్‌కు ఒక్కసారి మాత్రమే నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది. ఒకటి కంటే ఎక్కువ ఎంట్రీలు చెల్లవు. ఈసారి ఎంపిక కాకపోయినా అర్హత కొనసాగితే భవిష్యత్‌లో నిర్వహించే బ్యాలెట్లకు మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఈ ఏడాదికి జూలై బ్యాలెట్‌నే చివరిదిగా యూకే ప్రభుత్వం ప్రకటించింది. అందువల్ల ఆసక్తి ఉన్న యువత ముందుగానే అవసరమైన పత్రాలు సిద్ధం చేసుకుని నిర్ణీత గడువులో దరఖాస్తు చేసుకోవడం మంచిది. -
యూపీఐ ఉచిత సేవలకు బ్రేక్?
దేశంలో డిజిటల్ విప్లవానికి మారుపేరుగా నిలిచిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) లావాదేవీల నిర్వహణలో త్వరలోనే ఒక కీలక మార్పు చోటుచేసుకోబోతోంది. గత ఐదేళ్లుగా ‘జీరో’గా ఉన్న మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) లేదా మర్చంట్ ఫీజును పెద్ద వ్యాపార సంస్థల లావాదేవీలపై తిరిగి పునరుద్ధరించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆర్బీఐ కసరత్తు చేస్తున్నాయి. దీనికి సంబంధించిన ముసాయిదా ప్రతిపాదన ప్రస్తుతం ప్రభుత్వం వద్ద తుది ఆమోదం కోసం వేచి ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.ఏమిటీ ప్రతిపాదన? ఎవరిపై ప్రభావం?పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీఐ)తో పాటు బ్యాంకింగ్ రంగానికి చెందిన ప్రముఖులు కేంద్ర ప్రభుత్వానికి అందించిన సిఫార్సుల ప్రకారం.. ఈ కొత్త మర్చంట్ ఫీజు పరిధిలోకి కేవలం పెద్ద వ్యాపారాలు, ఈ-కామర్స్ దిగ్గజాలు మాత్రమే రానున్నాయి.వార్షిక టర్నోవర్ రూ.40 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ (జీఎస్టీ ఫైలింగ్స్ ఆధారంగా) ఉన్న పెద్ద మర్చంట్లు, లేదా రోజువారీ భారీ లావాదేవీలు జరిపే సంస్థలపైనే ఈ ఫీజు విధించే అవకాశం ఉంది.వార్షిక టర్నోవర్ రూ.40 లక్షల లోపు ఉండే చిన్న కిరాణా దుకాణాలు, వీధి వ్యాపారులకు దీని నుంచి పూర్తిగా మినహాయింపు ఉంటుంది.ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి బదిలీ చేసుకునే(పీర్-టు-పీర్) సాధారణ యూపీఐ లావాదేవీలు ఎప్పటికీ ఉచితంగానే కొనసాగుతాయి.గమనిక: ఈ విధానంలో ఒక కఠినమైన నిబంధనను కూడా చేర్చనున్నారు. పెద్ద వ్యాపారులు ఈ ఎండీఆర్ భారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వినియోగదారులపై రుద్దకూడదు. వ్యాపార నిర్వహణ వ్యయం కింద మర్చంట్లే దీన్ని భరించాల్సి ఉంటుంది.ఫీజు పునరుద్ధరణకు దారితీసిన కారణాలుకేంద్ర ప్రభుత్వం జనవరి 2020 నుంచి యూపీఐ, రూపే డెబిట్ కార్డ్ లావాదేవీలపై ఎండీఆర్‌ను పూర్తిగా రద్దు చేసింది. దీనివల్ల డిజిటల్ లావాదేవీలు ఊహించని స్థాయికి పెరిగినప్పటికీ ఫిన్‌టెక్ రంగానికి, బ్యాంకుల మౌలిక వసతుల నిర్వహణకు ఇది తీవ్ర ఆర్థిక భారంగా మారింది.నిపుణుల అంచనాల ప్రకారం.. యూపీఐ వ్యవస్థను సమర్థవంతంగా నడపడానికి, సైబర్ సెక్యూరిటీని బలోపేతం చేయడానికి ఏడాదికి దాదాపు రూ.10,000 కోట్లు అవసరం అవుతుండగా ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ కేవలం కొంత భాగాన్ని మాత్రమే భర్తీ చేస్తోంది.జీరో-ఎండీఆర్ విధానం వల్ల పేమెంట్ గేట్వేలు, బ్యాంకులు, ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం వంటి యాప్‌లకు స్థిరమైన ఆదాయం కరువైంది. ఇది కొత్త ఆవిష్కరణలకు అడ్డుకట్ట వేస్తోందని పార్లమెంటరీ కమిటీ కూడా గతంలో అభిప్రాయపడింది.పెద్ద వ్యాపారాలపై కనీసం 0.25-0.3% వరకు నామమాత్రపు ఎండీఆర్ విధించడం ద్వారా డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను మరింత పటిష్టం చేయవచ్చని పరిశ్రమ వర్గాలు ప్రధాని నరేంద్ర మోదీకి సైతం లేఖ రాశాయి.పరిశ్రమపై పడే ప్రభావంఅమెజాన్, ఫ్లిప్‌కార్ట్, జొమాటో, స్విగ్గీ, జెప్టో వంటి పెద్ద సంస్థలు ఇప్పటికే వీసా, మాస్టర్‌కార్డ్ డెబిట్/ క్రెడిట్ కార్డ్ లావాదేవీల కోసం మర్చంట్ ఫీజులు చెల్లిస్తున్నాయి. కాబట్టి యూపీఐపై కూడా నామమాత్రపు ఫీజు విధిస్తే వారి వ్యాపారాలపై పెద్దగా ప్రభావం పడకపోవచ్చని ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారు. పైగా, దీనివల్ల బ్యాంకులకు, థర్డ్ పార్టీ యాప్‌లకు తగిన ఆదాయం సమకూరి మరింత మెరుగైన సాంకేతికతను అందుబాటులోకి తెచ్చే వీలుంటుంది. ప్రభుత్వ ఉన్నత స్థాయి వర్గాల నుంచి దీనిపై అధికారిక ప్రటకన రావడమే తరువాయి ఈ నిబంధనలు ఎప్పటి నుంచి అమలులోకి వస్తాయనే దానిపై త్వరలోనే స్పష్టత రానుంది.ఇదీ చదవండి: IRCTC వెబ్సైట్ కొత్త అవతారం.. అదిరిపోయే ఫీచర్లు -
ఆధార్ అందుకు పనికిరాదు! తేల్చేసిన హైకోర్టు
దేశంలో అన్నింటికీ ఆధార్ కార్డునే ఆధారంగా చాలా మంది పరిగణిస్తుంటారు. అయితే మోటారు ప్రమాద పరిహారం (Motor Accident Compensation) నిర్ణయించే సమయంలో బాధితుడి వయస్సును కేవలం ఆధార్ కార్డు ఆధారంగా నిర్ణయించరాదని ఛత్తీస్‌గఢ్ హైకోర్టు స్పష్టం చేసింది. ఆధార్ ప్రధానంగా గుర్తింపు పత్రం మాత్రమేనని, అది పుట్టిన తేదీకి తుది, నిర్ధారిత ఆధారంగా పరిగణించలేమని పేర్కొంది.వయస్సు నిర్ధారణ కోసం జనన ధ్రువీకరణ పత్రం, పాఠశాల రికార్డులు, వైద్య పత్రాలు వంటి చట్టబద్ధమైన, విశ్వసనీయ ఆధారాలనే పరిగణనలోకి తీసుకోవాలని న్యాయస్థానం సూచించింది. ఈ తీర్పు గతంలో సుప్రీంకోర్టు వెల్లడించిన న్యాయసూత్రాలకు అనుగుణంగానే ఉందని కోర్టు పేర్కొంది.జస్టిస్ సచిన్ సింగ్ రాజ్‌పుత్ విచారించిన మూడు అనుబంధ మోటారు ప్రమాద అప్పీళ్లలో ఈ కీలక తీర్పు వెలువడింది. గాయపడిన రంజిత్ భుంజియా వయస్సును మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్ (MACT) కేవలం ఆధార్ ఆధారంగా 68 ఏళ్లుగా పరిగణించింది. దీంతో భవిష్యత్ ఆదాయ నష్టాన్ని లెక్కించేందుకు తక్కువ మల్టిప్లయర్ వర్తింపజేసి పరిహారాన్ని తగ్గించింది.అయితే హైకోర్టు పిటిషన్, వైద్య రికార్డులు, వైకల్య ధ్రువీకరణ పత్రాలను పరిశీలించి బాధితుడి వయస్సు 61–65 సంవత్సరాల మధ్య ఉంటుందని నిర్ధారించింది. దాంతో పరిహారాన్ని రూ.96,400 నుంచి రూ.3.90 లక్షలకు పెంచింది. ఇదే ప్రమాదంలో మరణించిన మరో ఇద్దరు బాధితుల కుటుంబాలకు కూడా పరిహారాన్ని పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.ఈ కేసులో బీమా కంపెనీల బాధ్యతపై కూడా హైకోర్టు కీలక స్పష్టత ఇచ్చింది. ప్రీమియం చెల్లించిన సమయం నుంచి కాకుండా, బీమా పాలసీలో పేర్కొన్న తేదీ, సమయం నుంచే బీమా ఒప్పందం అమల్లోకి వస్తుందని తెలిపింది. కాబట్టి ప్రమాదం జరిగిన సమయంలో పాలసీ ఇంకా అమల్లోకి రాకపోతే, ప్రీమియం ముందే చెల్లించినా బీమా సంస్థపై బాధ్యత ఉండదని తీర్పులో పేర్కొంది.మరో ముఖ్యమైన అంశంగా, ఒకే మోటార్‌సైకిల్‌పై ముగ్గురు ప్రయాణించడం ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనే అయినప్పటికీ, ఆ కారణం వల్లే ప్రమాదం జరిగిందని నిరూపించకపోతే దానిని "సహకార నిర్లక్ష్యం" (Contributory Negligence)గా పరిగణించి పరిహారం తగ్గించరాదని హైకోర్టు స్పష్టం చేసింది. ట్రాఫిక్ ఉల్లంఘనకు ప్రమాదంతో ప్రత్యక్ష సంబంధం ఉన్నప్పుడే పరిహారంపై ప్రభావం చూపుతుందని న్యాయస్థానం పేర్కొంది. -
ఈ రైలు ఎక్కాలంటే... ఆస్తులు అమ్ముకోవాల్సిందే!
జపాన్ అంటే ప్రపంచానికి గుర్తొచ్చేది బుల్లెట్ రైళ్లు. గంటకు వందల కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే షింకాన్సెన్ రైళ్లు అక్కడి రవాణా వ్యవస్థకు ప్రతీకగా నిలిచాయి. అయితే అదే జపాన్‌లో వేగానికి పూర్తిగా భిన్నమైన తత్వంతో నడిచే ఓ విలాసవంతమైన రైలు ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తోంది. అదే ‘సెవెన్ స్టార్స్ ఇన్ క్యుషు’ (Seven Stars in Kyushu). గమ్యస్థానానికి త్వరగా చేరుకోవడం కాదు.. ప్రయాణంలోని ప్రతి క్షణాన్ని ఆస్వాదించడమే ఈ రైలు ప్రత్యేకత.2013 అక్టోబర్ 15న జేఆర్ క్యుషు (JR Kyushu) ప్రారంభించిన ఈ లగ్జరీ స్లీపర్ రైలు జపాన్‌లో తొలి క్రూయిజ్-శైలి విలాసవంతమైన రైలుగా గుర్తింపు పొందింది. 2022లో దీన్ని మరింత ఆధునికంగా పునర్నిర్మించి టీ రూమ్, బార్ లౌంజ్, సలోన్ వంటి కొత్త సౌకర్యాలను జోడించారు. ప్రపంచంలోని అత్యుత్తమ లగ్జరీ రైలు ప్రయాణాల్లో ఇది ఒకటిగా గుర్తింపు పొందింది.క్యుషు అందాలను ఆస్వాదించే ప్రత్యేక యాత్రఈ రైలు ఫుకువోకాలోని హకాటా స్టేషన్ నుంచి బయలుదేరి మళ్లీ అక్కడికే చేరుతుంది. సీజన్‌ను బట్టి రెండు రకాల ప్యాకేజీలు అందుబాటులో ఉంటాయి.2 రోజులు – 1 రాత్రి: ఉత్తర క్యుషు ప్రాంతంలోని ప్రకృతి, స్థానిక వంటకాలు, గ్రామీణ సంస్కృతిని పరిచయం చేస్తుంది.4 రోజులు – 3 రాత్రులు: ఫుకువోకా, ఓయిటా, మియాజాకి, కగోషిమా, కుమామోటో, నాగసాకి తదితర ప్రాంతాల గుండా ప్రయాణిస్తూ అగ్నిపర్వతాలు, సముద్రతీరాలు, హాట్ స్ప్రింగ్స్, చారిత్రక పట్టణాలు, కళాకారుల గ్రామాలను చూపిస్తుంది. ప్రతి సీజన్‌కు అనుగుణంగా మార్గంలో స్వల్ప మార్పులు చేస్తారు.రూ.17 లక్షల వరకు టికెట్!ఈ రైలులో ప్రయాణం చాలా ఖరీదైన వ్యవహారమే. సామాన్యులు ఇందులో ప్రయాణించలేరు. 2 రోజుల ప్యాకేజీకి ఒక్కొక్కరికి సుమారు 7 లక్షల నుంచి 16 లక్షల యెన్ల వరకు (దాదాపు రూ.4 లక్షల నుంచి రూ.9.5 లక్షల వరకు) ఖర్చవుతుంది. అదే 4 రోజుల ప్యాకేజీ ఛార్జీ 13.5 లక్షల నుంచి 28.5 లక్షల యెన్ల వరకు (సుమారు రూ.8 లక్షల నుంచి రూ.17 లక్షల వరకు) ఉంటుంది.ఈ టికెట్లోనే లగ్జరీ వసతి, అన్ని భోజనాలు, పానీయాలు, స్థానిక విహారయాత్రలు, ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయి. సీజన్, క్యాబిన్ రకం ఆధారంగా ధరలు మారుతుంటాయి.కళ్లు చెదిరే ప్రత్యేకతలుఈ రైలులో ప్రయాణికుల సంఖ్య చాలా పరిమితం. కొద్దిమందికే అవకాశం ఉండటంతో ప్రతి అతిథికి వ్యక్తిగత సేవలు అందిస్తారు. ప్రముఖ డిజైనర్ ‘ఈజీ మిటూకా’ రూపొందించిన ఇంటీరియర్స్‌లో సంప్రదాయ జపనీస్ చెక్క కళ, చేతితో తయారు చేసిన ఫర్నిచర్, ఆధునిక సౌకర్యాల సమ్మేళనం కనిపిస్తుంది. పెద్ద గాజు కిటికీల ద్వారా పర్వతాలు, సముద్రతీరాలు, అడవులు, గ్రామీణ ప్రాంతాల అందాలను ప్రశాంతంగా వీక్షించేలా రైలు నెమ్మదిగా ప్రయాణిస్తుంది.ఫైవ్ స్టార్ హోటల్‌కు ఏమాత్రం తీసిపోని సూట్లుప్రతి సూట్లో విశాలమైన కిటికీలు, ప్రైవేట్ బాత్రూమ్, లాంజ్ స్పేస్, విలాసవంతమైన చెక్క అలంకరణలు ఉంటాయి. డీలక్స్ సూట్లలో మరింత విశాలమైన స్థలం, అద్భుతమైన వీక్షణలు, అధిక గోప్యత, ప్రీమియం ఫర్నిషింగ్స్ అందుబాటులో ఉంటాయి.రుచుల పండుగఈ రైలు ప్రయాణంలో భోజనం కూడా ప్రధాన ఆకర్షణే. క్యుషు ప్రాంతానికి చెందిన సీజనల్ సీఫుడ్, స్థానిక మాంసాహార వంటకాలు, తాజా వ్యవసాయ ఉత్పత్తులు, ప్రాంతీయ ప్రత్యేక వంటకాలు, జపనీస్ సాకేతో కూడిన మెనూను ప్రముఖ చెఫ్‌లు సిద్ధం చేస్తారు. ప్రతి సీజన్‌కు అనుగుణంగా మెనూ మారుతుంది.రైలు బయటా ప్రత్యేక అనుభూతులుప్రయాణంలో భాగంగా ప్రయాణికులను చారిత్రక దేవాలయాలు, సంప్రదాయ కుండల తయారీ గ్రామాలు, హాట్ స్ప్రింగ్ రిసార్టులు, కళాకారుల వర్క్‌షాప్‌లు, సాంస్కృతిక ప్రదర్శనలకు తీసుకెళ్తారు. దీంతో క్యుషు ప్రాంత సంస్కృతి, సంప్రదాయాలను దగ్గరగా అనుభూతి చెందే అవకాశం లభిస్తుంది.టికెట్ దొరకడం అంత ఈజీ కాదుఈ రైలుకు ప్రపంచవ్యాప్తంగా భారీ డిమాండ్ ఉంది. ప్రతి ట్రిప్‌లో చాలా తక్కువ మంది మాత్రమే ప్రయాణించగలగడం వల్ల సాధారణ రిజర్వేషన్ కాకుండా అనేక సార్లు లాటరీ విధానంలో ప్రయాణికులను ఎంపిక చేస్తారు. అందుకే ఈ రైలులో ప్రయాణించడం ఎంతో అరుదైన అనుభవంగా భావిస్తారు.మొత్తంగా ‘సెవెన్ స్టార్స్ ఇన్ క్యుషు’ కేవలం ఒక రైలు కాదు.. జపాన్ ప్రకృతి, సంస్కృతి, ఆతిథ్యం, వంటకాల్ని ఒకే ప్రయాణంలో అనుభూతి చెందే విలాసవంతమైన జీవనశైలి. లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చినా, జీవితంలో ఒక్కసారైనా ఈ ప్రయాణం చేయాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న లగ్జరీ ట్రావెల్ ప్రేమికులు కలలు కంటుండటానికి ఇదే కారణం. View this post on Instagram A post shared by Kara and Nate (@karaandnate) -
IRCTC వెబ్సైట్ కొత్త అవతారం.. అదిరిపోయే ఫీచర్లు
దేశంలో కోట్లాది మంది రైల్వే ప్రయాణికులకు భారతీయ రైల్వే శాఖ ఊరటనిచ్చింది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సరికొత్త ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) టికెట్ బుకింగ్ వెబ్సైట్ నేడు అధికారికంగా అందుబాటులోకి వచ్చింది. గత వెబ్సైట్లో ఎదుర్కొన్న సాంకేతిక ఇబ్బందులు, తత్కాల్ సమయంలో సర్వర్ నిలిచిపోవడం వంటి సమస్యలకు చెక్ పెడుతూ అత్యాధునిక సాంకేతికతతో, క్లీన్ డిజైన్‌తో ఈ ప్లాట్‌ఫారమ్‌ను తీర్చిదిద్దారు.సామర్థ్యంలో రికార్డు స్థాయి వృద్ధిఈ నూతన పోర్టల్ ప్రధాన బలం దాని బుకింగ్, ప్రాసెసింగ్ సామర్థ్యం. పాత వెబ్సైట్లో నిమిషానికి కేవలం 32,000 టికెట్లు మాత్రమే బుక్ చేసుకునే వీలుండగా ఇప్పుడు అప్‌గ్రేడ్ చేసిన ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (పీఆర్ఎస్) ద్వారా నిమిషానికి ఏకంగా 1.5 లక్షలకు పైగా టికెట్లను ఎలాంటి అంతరాయం లేకుండా బుక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా పీఎన్ఆర్ స్టేటస్, రైళ్ల వివరాల ఎంక్వైరీ సామర్థ్యం నిమిషానికి 4 లక్షల నుంచి రికార్డు స్థాయిలో 40 లక్షలకు పెరిగింది. ఇది తత్కాల్ బుకింగ్ సమయంలో సర్వర్ క్రాష్ అయ్యే అవకాశాలను పూర్తిగా నివారిస్తుంది.ప్రయాణికులను ఆకట్టుకునే ఫీచర్లుసాధారణ సమయాల్లో టికెట్లు బుక్ చేసుకునేటప్పుడు చికాకు కలిగించే క్యాప్చా వెరిఫికేషన్‌ను తొలగించారు. దీనివల్ల తత్కాల్ బుకింగ్ కూడా మరింత వేగంగా ముగుస్తుంది.విమాన ప్రయాణాల తరహాలోనే వివిధ తేదీల్లో ఉండే టికెట్ ధరలను సులభంగా పోల్చి చూసుకునేందుకు వీలుగా ఒక ప్రత్యేక క్యాలెండర్‌ను అందుబాటులోకి తెచ్చారు.ప్రయాణికులు అన్ని తరగతుల సీట్ల లభ్యతను వేర్వేరుగా కాకుండా ఒకే స్క్రీన్‌పై చూసి నిర్ణయం తీసుకోవచ్చు.కింగ్ సమయంలోనే ప్రయాణికులు తమకు నచ్చిన సీటు లేదా బెర్త్‌ను ఎంచుకునే అవకాశాన్ని కల్పించారు.దివ్యాంగులు, విద్యార్థులకు ఒకే వేదికదివ్యాంగులు, విద్యార్థులు, వైద్య అవసరాల కోసం ప్రయాణించే రోగులకు అందించే ప్రత్యేక రాయితీలు, సేవలను వేర్వేరు పోర్టల్స్ ద్వారా కాకుండా ఈ సరికొత్త వెబ్సైట్లో ఒకే ప్లాట్‌ఫారమ్ పరిధిలోకి తీసుకువచ్చారు. దేశంలోని అందరు ప్యాసింజర్లకు ఉపయోగపడేలా ఈ పోర్టల్‌ను ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి తెచ్చారు. చెల్లింపుల ప్రక్రియను వేగవంతం చేయడానికి ఐఆర్సీటీసీ-ఐపే, యూపీఐ సాంకేతికతను మరింత పటిష్టం చేశారు.ఇదీ చదవండి: మళ్లీ సీన్ రివర్స్.. ధరల దడ -
ఉదయం 3:30 వరకు పబ్‌లు, రెస్టారెంట్లు ఓపెన్!
ఫిఫా వరల్డ్ కప్ మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారాల నేపథ్యంలో సిలికాన్ సిటీ బెంగళూరులో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టోర్నమెంట్‌కు సంబంధించిన సెమీఫైనల్స్, ఫైనల్ మ్యాచ్ ఉన్న రోజుల్లో (జులై 14, 15, 19 తేదీలు) నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్లు, పబ్‌లను రాత్రి 1 గంటకు బదులు తెల్లవారుజామున 3:30 గంటల వరకు తెరిచి ఉంచేందుకు బెంగళూరు సిటీ పోలీస్ కమిషనర్ సీమంత్ కుమార్ సింగ్ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. కర్ణాటక పోలీస్ చట్టం పరిధిలో ఈ తాత్కాలిక సడలింపు ఇచ్చారు. అయితే, ఈ ఉత్తర్వులు కేవలం ఆహార పదార్థాల (ఫుడ్) సరఫరాకేనా లేక మద్యం (లిక్కర్) విక్రయాలకు కూడా వర్తిస్తాయా అనే అంశంపై గందరగోళం నెలకొంది.నిర్ణయ నేపథ్యం ఏమిటి?ప్రస్తుతం అమెరికా, కెనడా, మెక్సికో దేశాల వేదికగా జరుగుతున్న అంతర్జాతీయ ఫుట్‌బాల్ మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి 12:30 గంటలకు ప్రారంభమై తెల్లవారుజామున 2:30 గంటల వరకు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ఆర్ఏఐ) బెంగళూరు ప్రతినిధులు కర్ణాటక ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్‌ను కలిసి మ్యాచ్‌లు వీక్షించేందుకు వచ్చే కస్టమర్ల సౌకర్యార్థం నగరంలోని వ్యాపార వేళలను పొడిగించాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి క్రీడాభిమానుల ఉత్సాహాన్ని గౌరవిస్తూనే ప్రజా భద్రత, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.లిక్కర్ అనుమతిపై సందిగ్ధత!పోలీస్ కమిషనరేట్ జారీ చేసిన అధికారిక నోటిఫికేషన్లో ఆహార సేవలను తెల్లవారుజామున 3:30 గంటల వరకు పొడిగిస్తున్నట్లు స్పష్టంగా పేర్కొన్నారు. కానీ, మద్యం సరఫరా, విక్రయాలపై ఎలాంటి ప్రత్యేక ప్రస్తావన చేయలేదు. సాధారణ నిబంధనల ప్రకారం బెంగళూరులో రాత్రి 1 గంట తర్వాత మద్యం విక్రయించడం చట్టవిరుద్ధం. దీంతో పబ్‌లు, బార్ల యజమానులు ఈ ఉత్తర్వులపై సందిగ్ధత వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ నుంచి స్పష్టమైన రాతపూర్వక అనుమతి లేదా నిబంధనల సడలింపు వస్తేనే తెల్లవారుజాము వరకు మద్యం సరఫరా చేయడానికి వీలవుతుందని వాదిస్తున్నారు.శాంతిభద్రతలపై పోలీసుల నిఘామరోవైపు రాత్రి వేళల్లో సమయాన్ని పొడిగించడం వల్ల నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కఠిన నిబంధనలను విధించారు. లైవ్ స్క్రీనింగ్ ఏర్పాటు చేసే యాజమాన్యాలు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చట్టపరమైన చర్యలు ఉంటాయని పోలీస్ కమిషనర్ హెచ్చరించారు. ఫుట్‌బాల్ అభిమానులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, నైట్‌లైఫ్ సంస్కృతికి భంగం కలగకుండా పోలీసులకు సహకరించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఏదేమైనా ఈ నిర్ణయం బెంగళూరు నైట్‌లైఫ్‌కు సరికొత్త ఉత్సాహాన్ని ఇస్తుందా లేక లిక్కర్ సందిగ్ధత వల్ల నీరుగారిపోతుందా అనేది ఎక్సైజ్ శాఖ ఇచ్చే తదుపరి స్పష్టతపైనే ఆధారపడి ఉంది.ఇదీ చదవండి: మళ్లీ సీన్ రివర్స్.. ధరల దడ -
రైళ్లలో దుప్పట్లు మాయం.. రైల్వే యాక్షన్ ప్లాన్ ఇదే!
భారతీయ రైల్వేలో ప్రయాణికులకు అందించే సౌకర్యాలు ఎంత విలాసవంతంగా మారుతున్నాయో, అంతే స్థాయిలో కొందరు ప్రయాణికుల బాధ్యత లోపిస్తోందనడానికి తాజా సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) నివేదిక ఒక నిదర్శనం. ఏసీ కోచ్‌లలో ప్రయాణించే వారు బెడ్షీట్లు, దుప్పట్లు, తువ్వాళ్లను దొంగిలిస్తుండటంతో గడిచిన నాలుగేళ్లలో (జనవరి 2022 నుంచి మే 2026 వరకు) రైల్వే శాఖకు ఏకంగా రూ.104.51 కోట్ల భారీ నష్టం వాటిల్లింది. గణాంకాల ప్రకారం, ప్రతి వెయ్యి మంది ఏసీ ప్రయాణికుల్లో ఒకరు రైల్వే వస్తువులను తమతో పాటు పట్టుకెళ్తున్నారు.మాయమైన వస్తువుల వివరాలురైల్వే పరిధిలోని 54 డివిజన్ల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం.. అత్యధికంగా ఫేస్ టవల్స్ (ముఖం తుడుచుకునే తువ్వాళ్లు) దొంగలిస్తున్నారు.ఫేస్ టవల్స్: 46.54 లక్షలుబెడ్షీట్లు (దుప్పట్లు): 41.13 లక్షలుపిల్లో కవర్లు: 23.59 లక్షలుబ్లాంకెట్లు: 12.95 లక్షలుదిండ్లు: 2.76 లక్షలు2022 నుంచి 2025 మధ్య కాలంలో ఈ తరహా చోరీలు ఏకంగా 56 శాతం పెరగడం గమనార్హం. డివిజన్ల వారీగా చూస్తే రాజస్థాన్‌లోని బికనీర్ డివిజన్ 25.76 లక్షల వస్తువుల నష్టంతో అగ్రస్థానంలో ఉండగా రాంచీ, ఢిల్లీ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అయితే, కొన్ని డివిజన్లు అద్భుతమైన నియంత్రణను ప్రదర్శించాయి. తిరుచిరాపల్లి, పాలక్కాడ్ డివిజన్లలో ఒక్క చోరీ కూడా నమోదు కాకపోవడం విశేషం.ఎవరిపై భారం?రైల్వే నిబంధనల ప్రకారం వస్తువుల బాధ్యత కాంట్రాక్ట్ ఏజెన్సీలదే. వస్తువులు పోయినప్పుడు ఆ నష్టాన్ని కాంట్రాక్టర్ల బిల్లుల నుంచి మినహాయిస్తారు. దురదృష్టవశాత్తూ ఆ కాంట్రాక్టర్లు రోజుకు కేవలం రూ.700 వరకు సంపాదించే అటెండెంట్ల జీతాల నుంచి ఈ మొత్తాన్ని (దిండుకు రూ.115, బ్లాంకెట్‌కు రూ.343 చొప్పున) కట్ చేస్తున్నారు. ప్రయాణికుల నిర్వాకానికి పేద కార్మికులు బలి కావడం ఆందోళనకరం.నియంత్రణకు రైల్వే సరికొత్త వ్యూహంకోచ్ మిత్ర యాప్: అటెండెంట్లు ఈ యాప్ ద్వారా ప్రయాణికుల బోర్డింగ్, డీ-బోర్డింగ్ సమయాలను ట్రాక్ చేస్తూ వస్తువుల పంపిణీని పర్యవేక్షిస్తున్నారు.30 నిమిషాల రూల్: ప్రయాణం ముగియడానికి 30 నిమిషాల ముందే బెడ్‌రోల్ వస్తువులను తిరిగి సేకరించేలా ప్యాకెట్లపై స్పష్టమైన మార్గదర్శకాలు ముద్రిస్తున్నారు.సీసీటీవీ, ఆకస్మిక తనిఖీలు: కోచ్‌లలో నిఘా పెంచడంతో పాటు అనుమానాస్పద ప్రయాణికుల లగేజీని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) సాయంతో చట్టబద్ధంగా తనిఖీ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి.మౌలిక వసతుల కల్పనపై పెట్టాల్సిన నిధులు ఇలాంటి ప్రత్యామ్నాయాలకు ఖర్చవుతుండటం శోచనీయం. ఇప్పటికైనా ప్రయాణికులు బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.ఇదీ చదవండి: మళ్లీ సీన్ రివర్స్.. ధరల దడ -
మైండ్ రీడింగ్, ఎయిర్ టాక్సీ కంపెనీల్లో పెట్టుబడి
భారతీయ స్టార్టప్ విభాగంలో జొమాటో సహ-వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ వ్యాపార ప్రయాణం ఇప్పుడు సరికొత్త మలుపు తిరిగింది. దాదాపు రెండు దశాబ్దాల పాటు దేశంలో ఆహార డెలివరీ రంగాన్ని శాసించిన ఆయన ఇటీవల జొమాటో సీఈఓ బాధ్యతల నుంచి తప్పుకుని భవిష్యత్తును మార్చగల అత్యాధునిక సాంకేతిక (డీప్ టెక్) రంగాలపై దృష్టి పెట్టారు. ప్రధానంగా హెల్త్-టెక్ (ఆరోగ్య సాంకేతికత), ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ (వైమానిక, రక్షణ) రంగాలలో ఆయన చేస్తున్న భారీ పెట్టుబడులు ఇప్పుడు కార్పొరేట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.మెదడు పనితీరును అంచనా వేసే ‘టెంపుల్’హెల్త్-టెక్ రంగంలో దీపిందర్ గోయల్ ‘టెంపుల్’ అనే వేరబుల్ టెక్నాలజీ (ధరించగలిగే పరికరం) స్టార్టప్‌ను ప్రారంభించారు. కేవలం ఆలోచనల స్థాయిలోనే ఈ స్టార్టప్ ‘ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ’ ఫండింగ్ రౌండ్ ద్వారా సుమారు 54 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.450 కోట్లు) పెట్టుబడులను ఆకర్షించింది. దీనితో ఈ కంపెనీ మార్కెట్ విలువ 190 మిలియన్ డాలర్లకు చేరింది.సాధారణ స్మార్ట్‌వాచ్‌లు లేదా ఫిట్నెస్ రింగ్లలా కాకుండా ఈ ‘టెంపుల్’ పరికరాన్ని నుదుటి భాగాన ధరించాల్సి ఉంటుంది. ఇది మెదడులోని రక్త ప్రసరణను నిరంతరం పర్యవేక్షిస్తూ ‘ఎంట్రోపీ’ అనే సరికొత్త బయోమార్కర్ ఆధారంగా మానసిక ఒత్తిడి, ఏకాగ్రత, నిద్ర, అలసట వంటి మెటబాలిక్ మార్పులను రియల్ టైమ్‌లో లెక్కిస్తుంది. అథ్లెట్లు, వ్యాపార దిగ్గజాలు, హై-పర్ఫార్మర్లను లక్ష్యంగా చేసుకుని దాదాపు 1,000 డాలర్ల ధరతో దీనిని మార్కెట్లోకి తీసుకురానున్నారు. దీనితో పాటు మానవ ఆయుష్షును పెంచే పరిశోధనలు చేసే ‘కంటిన్యూ రీసెర్చ్’ సంస్థలోనూ ఆయన గతంలోనే 25 మిలియన్ డాలర్ల సొంత పెట్టుబడి పెట్టడం విశేషం.ఆకాశ మార్గంలో ‘లాట్ ఏరోస్పేస్’భారతీయ విమానయాన రంగాన్ని కూడా గోయల్ విప్లవాత్మకంగా మార్చేందుకు సిద్ధమయ్యారు. జొమాటో మాజీ సీఓఓ సురభి దాస్‌తో కలిసి ఆయన ‘లాట్ ఏరోస్పేస్’ అనే సంస్థను స్థాపించి అందులో 20 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టారు. సాధారణ ఎయిర్ టాక్సీలలా కాకుండా చిన్న నగరాలను అనుసంధానించేందుకు కేవలం 24 మంది ప్రయాణించగల తక్కువ రన్‌వేతో ల్యాండింగ్, టేకాఫ్ కాగల ‘స్టొల్’ (Short Takeoff and Landing) విమానాలను ఈ సంస్థ తయారు చేస్తోంది.ఈ ప్రస్థానంలో భాగంగా ‘లాట్ ఏరోస్పేస్’ ఇటీవల గురుగ్రామ్‌కు చెందిన రక్షణ రంగ రోబోటిక్స్ స్టార్టప్ ‘షరంగ్ శక్తి’ని కొనుగోలు చేసింది. స్వదేశీ రక్షణ సామర్థ్యాలను పెంపొందించడం, అలాగే తదుపరి తరం పౌర విమానయాన సాంకేతికతను భారత్‌లోనే అభివృద్ధి చేయడం ఈ కొనుగోలు ముఖ్య ఉద్దేశమని గోయల్ స్పష్టం చేశారు.ఇదీ చదవండి: కోట్లు ఉన్నా కొరత భావనేనా? -
1600 నెంబర్లను బ్లాక్ చేయొద్దు.. ట్రాయ్ కీలక ఆదేశాలు
నియంత్రిత సంస్థలు, ప్రభుత్వం నుంచి ప్రజలకు సమాచారాన్ని చేరవేసేందుకు ఉద్దేశించిన 1600 నంబర్ సిరీస్ నుంచి వచ్చే ఫోన్ కాల్స్‌ని ఏ యాప్ కూడా బ్లాక్ చేయడానికి వీల్లేదని టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ స్పష్టం చేసింది. అలాగే 140 నంబర్ సిరీస్‌తో వచ్చే ప్రమోషనల్ కాల్స్‌ని తమ నిర్వహణలోని డీఎన్డీ రిజిస్ట్రీ తప్ప ఇతరత్రా ఏ యాప్ కూడా బ్లాక్ చేయడానికి లేదని వివరణ ఇచ్చింది.నిర్దిష్ట సిరీస్‌ల నుంచి వచ్చే కాల్స్‌ని ట్రూకాలర్ యాప్ స్పామ్ కింద లేబులింగ్ చేస్తున్న నేపథ్యంలో ట్రాయ్ వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే, 1600, 140 నంబర్ సిరీస్‌లు దుర్వినియోగమవుతున్నాయంటూ 5.25 లక్షల మంది పైగా యూజర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో వాటిని ట్యాగ్ చేయడం తప్పెలా అవుతుందని ట్రూకాలర్ సీఈవో రిషిత్ ఝున్‌ఝున్‌వాలా తెలిపారు. ఈ రెండు సిరీస్‌లలో రోజూ 5.1 కోట్లకు పైగా కాల్స్‌కి యూజర్లు అసలు స్పందించడం లేదని పేర్కొన్నారు. ప్రస్తుతం ట్రూకాలర్ యూజర్లు ప్రతి రోజూ 140 సిరీస్ నుంచి వచ్చే 4 లక్షల కాల్స్‌ని, 1600 సిరీస్‌కి చెందిన 1.25 లక్షల కాల్స్‌ని బ్లాక్ చేస్తున్నట్లు వివరించారు. -
హైదరాబాద్‌లో ప్రారంభమైన బ్రిక్స్ ఇండియా 2026 సమ్మిట్
హైదరాబాద్‌లోని మారియట్ హోటల్లో మూడు రోజుల పాటు జరిగే బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ ఫోరం సమ్మిట్-2026ను కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయతో కలిసి తెలంగాణ కార్మిక శాఖ మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు. జూలై 14 నుంచి 16 వరకు జరిగే ఈ అంతర్జాతీయ సదస్సుకు బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా సహా 14 దేశాల నుంచి 110 మంది ప్రతినిధులు హాజరవుతున్నారు.ప్రస్తుత కాలంలో ఏఐ, ఆటోమేషన్ వంటి సాంకేతిక మార్పులతో కార్మిక రంగం కొత్త సవాళ్లను ఎదుర్కొంటోందని మంత్రి వివేక్ తెలిపారు. ఈ నేపథ్యంలో కార్మికులకు సామాజిక భద్రత, నైపుణ్యాభివృద్ధి, నిరంతర శిక్షణ అందించడం చాలా ముఖ్యమని పేర్కొన్నారు. కార్మికుల భద్రత, హక్కుల పరిరక్షణతోనే పరిశ్రమల అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు.ఈ సదస్సులో భవిష్యత్ ఉద్యోగాలు, స్కిల్ డెవలప్మెంట్, కార్మిక హక్కులు, సామాజిక భద్రత, ట్రేడ్ యూనియన్ల బలోపేతం వంటి అంశాలపై చర్చలు జరుగుతున్నాయి. వివిధ దేశాల్లో అమలవుతున్న ఉత్తమ కార్మిక విధానాలను అధ్యయనం చేసి, భవిష్యత్ కార్యాచరణకు సిఫార్సులు రూపొందించడం ఈ సమావేశం ప్రధాన లక్ష్యమని తెలిపారు.తెలంగాణ ప్రభుత్వం కూడా యువతకు నైపుణ్యాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెడుతోందని మంత్రి చెప్పారు. అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ల ద్వారా యువతకు ఆధునిక శిక్షణ అందిస్తున్నామని, టామ్‌కామ్ ద్వారా జర్మనీ, జపాన్, యూరప్, మధ్యప్రాచ్య దేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని వివరించారు. ఈ సదస్సుకు భారతీయ మజ్దూర్ సంఘ్ (BMS) ఆతిథ్యం ఇస్తోంది. -
మోస్ట్ పవర్ఫుల్ విమెన్ 2026.. టాప్ 10 జాబితా ఇదే!
ఫార్చ్యూన్ ఇండియా 'మోస్ట్ పవర్ఫుల్ విమెన్ (ఎంపీడబ్ల్యూ) 2026' జాబితాను విడుదల చేసింది. ఇందులో వ్యాపారం, రాజకీయాలు, పారిశ్రామిక రంగం, స్టార్టప్ వంటి వివిధ రంగాల్లోని మహిళలు ఉన్నారు. టాప్ 10 జాబితాలో రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్పర్సన్ నీతా అంబానీ మొదటి స్థానంలో నిలిచారు.తరువాత స్థానాల్లో వరుసగా ''రోష్నీ నాడార్ మల్హోత్రా, రెడ్డి సిస్టర్స్ (శోభన కామినేని, సంగీతా రెడ్డి, ప్రీతా రెడ్డి, సునీతా రెడ్డి), సావిత్రి జిందాల్, డాక్టర్ ప్రీతి అదానీ, కిరణ్ మజుందార్-షా, ఇషా అంబానీ, ప్రియా నాయర్, బేలా బజారియా, లీనా నాయర్'' ఉన్నారు.➤రోష్నీ నాడార్ మల్హోత్రా: హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ చైర్పర్సన్➤శోభన కామినేని, సంగీతా రెడ్డి, ప్రీతా రెడ్డి, సునీతా రెడ్డి: అపోలో హాస్పిటల్స్ యాజమాన్యం➤సావిత్రి జిందాల్: జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ ఛైర్పర్సన్➤డాక్టర్ ప్రీతి అదానీ: అదానీ ఫౌండేషన్ ఛైర్పర్సన్➤కిరణ్ మజుందార్-షా: బయోకాన్ వ్యవస్థాపకురాలు & చైర్పర్సన్➤ఇషా అంబానీ: రిలయన్స్ రిటైల్ డైరెక్టర్➤ప్రియా నాయర్: హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ ఎండీ & సీఈఓ➤బేలా బజారియా: నెట్‌ఫ్లిక్స్ చీఫ్ కంటెంట్ ఆఫీసర్➤లీనా నాయర్: షెనెల్ (ఫ్యాషన్ బ్రాండ్) సీఈఓముంబైలోని ఫోర్ సీజన్స్ హోటల్లో జరిగిన 16వ ఎడిషన్ అవార్డుల ప్రదానోత్సవంలో నీతా అంబానీ ఈ గౌరవాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా నీతా అంబానీ మాట్లాడుతూ.. ఒక తల్లిగా తన కుమార్తె ఇషా అంబానీ (రిలయన్స్ రిటైల్ డైరెక్టర్) కూడా ఈ పవర్ఫుల్ 100 మంది జాబితాలో చోటు దక్కించుకోవడం తనకు గర్వకారణంగా ఉందన్నారు. -
యూఎస్ మార్కెట్‌కు వన్‌ప్లస్ గుడ్‌బై?
ఒకప్పుడు తక్కువ ధరలో ఫ్లాగ్షిప్ ఫోన్ అంటే.. చాలామందికి ముందుగా గుర్తొచ్చేది వన్‌ప్లస్. ప్రీమియం ఫీచర్లను అందుబాటు ధరలో అందిస్తూ ప్రపంచవ్యాప్తంగా.. ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్రాండ్ ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకోబోతోందనే వార్తలు టెక్ ప్రపంచంలో పెద్ద చర్చకు దారితీశాయి.జర్మన్ వార్తా సంస్థ విన్‌ఫ్యూచర్ కథనం ప్రకారం, వన్‌ప్లస్ తన మాతృసంస్థ ఒప్పోతో కలిసి అమెరికా, యూరప్ మార్కెట్ల నుంచి పూర్తిగా వైదొలగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ విషయంపై మీడియాతో ప్రత్యేక సమావేశాలు కూడా నిర్వహించినట్లు సమాచారం. అయితే.. ఈ నిర్ణయానికి అసలు కారణం ఏమిటనే విషయాన్ని కంపెనీ ఇప్పటివరకు వెల్లడించలేదు.నెట్టింట్లో వైరల్ అవుతున్న వార్తలు వన్‌ప్లస్ అభిమానుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. అయితే భారత్‌లో మాత్రం తన వ్యవహారాలను కొనసాగించనుంది. దీనికి కారణం కంపెనీకి భారత్ అతిపెద్ద మార్కెట్ కావడమే. చైనాలో కూడా సంస్థ తన కార్యకలాపాలను యథావిధిగా జరపనుంది.ఇప్పటికే వన్‌ప్లస్ ఫోన్ ఉపయోగిస్తున్న వారికి కూడా కంపెనీ ఒక క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం.. వినియోగంలో ఉన్న ఫోన్లకు వాటి సపోర్ట్ గడువు పూర్తయ్యే వరకు సాఫ్ట్వేర్ అప్డేట్లు, సెక్యూరిటీ అప్డేట్లు, సర్వీస్ సెంటర్ సేవలు అందుబాటులోనే ఉంటాయని తెలిపింది. అయితే.. కొత్త ఫోన్ల విడుదల, లేటెస్ట్ స్టాక్ విక్రయం, స్థానిక మార్కెటింగ్ కార్యక్రమాలు మాత్రం నిలిచిపోయే అవకాశం ఉంది. ఇప్పటికే యూరప్‌లోని కొన్ని దేశాల్లో వన్‌ప్లస్ అధికారిక వెబ్సైట్లలో ఫోన్ల స్టాక్ కూడా దాదాపు ఖాళీ అయిపోయినట్లు తెలుస్తోంది. -
బ్రాండ్ రేస్‌లో దేశీయ దిగ్గజాలు!
ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక మందగమనం వంటి ప్రతికూల పరిస్థితులున్నా భారతీయ బ్రాండ్లు తిరుగులేని వృద్ధిని నమోదు చేస్తున్నాయి. అంతర్జాతీయ సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ దేశీయ మార్కెట్ సత్తాను ప్రపంచ వేదికపై చాటుతున్నాయి. ప్రముఖ బ్రాండ్ వాల్యుయేషన్ కన్సల్టెన్సీ సంస్థ ‘బ్రాండ్ ఫైనాన్స్’ తాజాగా విడుదల చేసిన ‘ఇండియా 100’ నివేదిక ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఈ జాబితాలో భారతదేశపు అత్యంత విలువైన బ్రాండ్‌గా టాటా గ్రూప్ మరోసారి అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది.రూ.2.4 లక్షల కోట్ల మార్కుఈ నివేదిక ప్రకారం, టాటా గ్రూప్ బ్రాండ్ విలువ గతంతో పోలిస్తే 9 శాతం వృద్ధితో 28.6 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.2.39 లక్షల కోట్లు) చేరుకుంది. భారతీయ కార్పొరేట్ చరిత్రలోనే ఒక బ్రాండ్ విలువ 30 బిలియన్ డాలర్ల మైలురాయికి సమీపంగా చేరడం ఇదే తొలిసారి. స్టీల్, ఆటోమొబైల్స్, ఐటీ సర్వీసెస్, కన్స్యూమర్ గూడ్స్ వంటి విభిన్న రంగాల్లో టాటా గ్రూప్ సర్వీసులు అందిస్తుండడమే దీనికి కారణం.తర్వాతి స్థానాల్లో ఇవే..ప్రముఖ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ 14.2 బిలియన్ డాలర్ల బ్రాండ్ విలువతో దేశంలోనే రెండో అత్యంత విలువైన బ్రాండ్‌గా తన స్థానాన్ని స్థిరపరుచుకుంది. కాగా, గతేడాది కాలంలో జరిగిన అతిపెద్ద కార్పొరేట్ విలీనం (HDFC Ltdతో HDFC Bank విలీనం) కారణంగా హెచ్డీఎఫ్సీ గ్రూప్ బ్రాండ్ విలువ పెరిగి ఏకంగా మూడో స్థానానికి (10.4 బిలియన్ డాలర్లు) ఎగబాకింది. ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసీ 10.1 బిలియన్ డాలర్లతో నాలుగో స్థానంలో నిలిచింది.దేశంలోని టాప్ 10 విలువైన బ్రాండ్లు ఇవే..ర్యాంక్కంపెనీ/బ్రాండ్ పేరుబ్రాండ్ విలువ (బి.డాలర్లలో)1టాటా గ్రూప్28.62ఇన్ఫోసిస్ 14.23హెచ్డీఎఫ్సీ గ్రూప్ 10.44ఎల్ఐసీ గ్రూప్10.15రిలయన్స్ ఇండస్ట్రీస్ 8.46ఎస్బీఐ గ్రూప్ 8.27భారతీ ఎయిర్టెల్7.78హెచ్‌సీఎల్ టెక్7.69లార్సెన్ అండ్ టూబ్రో7.210మహీంద్రా గ్రూప్6.6అత్యంత పటిష్టమైన బ్రాండ్‌గా తాజ్బ్రాండ్ విలువే కాకుండా వినియోగదారుల నమ్మకం, కార్పొరేట్ ప్రతిష్ట ఆధారంగా లెక్కించే ‘బ్రాండ్ స్ట్రెంత్ ఇండెక్స్’(బీఎస్ఐ)లో టాటా గ్రూప్‌నకు చెందిన హోటల్స్ బ్రాండ్ తాజ్ ప్రతిభ కనబరిచింది. 100కి 92.9 బీఎస్ఐ స్కోరుతో AAA+ రేటింగ్ సొంతం చేసుకుని దేశంలోనే అత్యంత పటిష్టమైన బ్రాండ్‌గా నిలిచింది.దూసుకుపోతున్న రంగాలు ఇవే..ఈ నివేదికలో అత్యధికంగా 61 శాతం వృద్ధిని నమోదు చేసుకుని టెలికాం రంగం ముందంజలో నిలిచింది. ఎయిర్టెల్, జియో, వొడాఫోన్ ఐడియా వంటి సంస్థలు డిజిటల్ వినియోగం పెరగడంతో వేగంగా పుంజుకున్నాయి.దేశీయ బ్యాంకింగ్ బ్రాండ్ల విలువలో సగటున 26 శాతం వృద్ధి నమోదైంది. ఇండియన్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గరిష్ట వృద్ధిని సాధించాయి.టాటా గ్రూప్‌నకు చెందిన ఫ్యాషన్ రిటైల్ బ్రాండ్ వెస్ట్‌సైడ్ ఏకంగా 122 శాతం బ్రాండ్ విలువ వృద్ధితో భారతదేశంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న బ్రాండ్‌గా రికార్డు సృష్టించింది. ఆ తర్వాత స్థానాల్లో మథర్సన్ (86%), సొనాటా సాఫ్ట్వేర్ (83%) నిలిచాయి.ఇదీ చదవండి: బంగారం ధరల్లో స్పల్ప ఊరట -
టికెట్ ధరల బాదుడుపై కోర్టు సీరియస్!
విమాన చార్జీల నియంత్రణ, ప్రయాణికుల హక్కుల పరిరక్షణ దిశగా అత్యున్నత న్యాయస్థానం కీలక అడుగు వేసింది. ప్రైవేట్ విమానయాన సంస్థలు విధిస్తున్న ఏకపక్ష చార్జీల పెంపునకు అడ్డుకట్ట వేసేలా రూపొందించిన కొత్త విమానయాన నిబంధనలను రెండు వారాల్లోగా తమ ముందు ఉంచాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.రెండు వారాల్లోగా నివేదికజస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. పౌర విమానయాన నియంత్రణ, ప్రయాణికులపై విధిస్తున్న అదనపు భారాలను సవాలు చేస్తూ సామాజిక కార్యకర్త ఎస్.లక్ష్మీనారాయణన్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ నిబంధనల ముసాయిదాను పార్లమెంటులో ప్రవేశపెట్టారా లేదా అనే దానితో సంబంధం లేకుండా, ‘సీల్డ్ కవర్’ (రహస్య పత్రం) రూపంలో కోర్టుకు సమర్పించాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఆగస్టు 3వ తేదీకి వాయిదా వేసింది.కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన న్యాయవాది స్పందిస్తూ.. ‘భారతీయ వాయుయాన్ అధినియం, 2024’ కింద నిబంధనల రూపకల్పన ఇప్పటికే పూర్తయిందని, ప్రస్తుతం వాటి అధికారిక అనువాద ప్రక్రియ జరుగుతోందని అది ముగియగానే పార్లమెంటు ముందు ఉంచుతామని ధర్మాసనానికి వివరించారు. దీనిపై కోర్టు స్పందిస్తూ పార్లమెంటు ఆమోదం కంటే ముందే కోర్టు పరిశీలన కోసం వాటిని అందజేయాలని ఆదేశించింది.చార్జీల దోపిడీపై కోర్టు ఆందోళనపండుగలు, ప్రత్యేక సెలవులు, కుంభమేళా వంటి భారీ ఈవెంట్ల సమయంలో ప్రైవేట్ ఎయిర్‌లైన్స్ విమాన చార్జీలను అడ్డగోలుగా పెంచేస్తున్నాయని (డైనమిక్ ప్రైసింగ్), ఇది ప్రయాణికులను తీవ్రంగా దోపిడీ చేయడమేనని గత విచారణల సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది. ఉదాహరణకు, మహాకుంభ్ సమయంలో భోపాల్-ప్రయాగ్‌రాజ్ మార్గంలో వన్-వే విమాన చార్జీలు ఏకంగా 498 శాతం పెరిగి రూ.2,977 నుంచి రూ.17,796కి చేరిన విషయాన్ని పిటిషన్లో ప్రస్తావించారు.పారదర్శకతలేని విధానాలుపిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది రవీంద్ర శ్రీవాస్తవ వాదనలు వినిపిస్తూ విమాన చార్జీలు, లగేజీ రుసుములు, ఇతర అనుబంధ చార్జీలను నియంత్రించడానికి స్పష్టమైన చట్టబద్ధమైన అధికార సంస్థ లేకపోవడం వల్లే ఎయిర్‌లైన్స్ పారదర్శకత లేని విధానాలను అవలంబిస్తున్నాయని పేర్కొన్నారు. ఎకానమీ క్లాస్ ప్రయాణికులకు ఉచిత చెక్ఇన్ బ్యాగేజీ పరిమితిని 25 కిలోల నుంచి 15 కిలోలకు తగ్గించి, అదనపు లగేజీపై భారీగా వసూలు చేయడం ద్వారా ప్రయాణికులకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చకుండా కేవలం అదనపు ఆదాయ వనరుగా మార్చుకున్నారని పిటిషనర్ కోర్టు దృష్టికి తెచ్చారు.కొత్త చట్టం - నిబంధనల అవశ్యకతబ్రిటిష్ కాలం నాటి ‘ఎయిర్‌క్రాఫ్ట్ యాక్ట్, 1934’ స్థానంలో సివిల్ ఏవియేషన్ రంగాన్ని ఆధునీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ‘భారతీయ వాయుయాన్ అధినియం, 2024’ జనవరి 2025 నుంచి అమలులోకి వచ్చింది. అయితే, దీని పరిధిలో ప్రయాణికుల రక్షణ, ధరల నియంత్రణకు సంబంధించిన పూర్తి స్థాయి నిబంధనలు ఇంకా నోటిఫై కాలేదు. ప్రస్తుత చట్టాల ప్రకారం విమాన చార్జీలు పూర్తిగా మార్కెట్ శక్తుల ఆధారంగానే ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రయాణికుల హక్కులను రక్షించేందుకు కఠినమైన మార్గదర్శకాలు అవసరమని సుప్రీంకోర్టు భావిస్తోంది.ఇదీ చదవండి: ఏఐ ఎందుకో వెనుకబడింది? -
హెచ్‌సీఎల్ టెక్ లాభం 20% అప్
న్యూఢిల్లీ: దేశీ ఐటీ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్ ఆకర్షణీయమైన ఫలితాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (2026–27, క్యూ1)లో రూ.4,624 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.3,843 కోట్లతో పోలిస్తే 20 శాతం జంప్ చేసింది. కంపెనీ మొత్తం ఆదాయం 14 శాతం ఎగసి రూ.34,579 కోట్లకు చేరింది. గతేడాది క్యూ1లో ఆదాయం రూ. 30,349 కోట్లుగా నమోదైంది. సీక్వెన్షియల్‌గానూ పెరుగుదల... గత ఆర్థిక సంవత్సరం నాలుగో క్వార్టర్ (క్యూ4)లో నమోదైన రూ. 4,488 కోట్లతో పోలిస్తే సీక్వెన్షియల్‌గా క్యూ1లో లాభం 3% పెరిగింది. ఆదాయం 1.8% వృద్ధి చెందింది. స్థిరంగా గైడెన్స్... 2026–27 పూర్తి ఏడాది ఆదాయ వృద్ధి అంచనాలను (గైడెన్స్) హెచ్‌సీఎల్ టెక్ స్థిరంగా కొనసాగించింది. గైడెన్స్ 1–4% ఉండొచ్చని పేర్కొంది. సేవల విభాగం ఆదాయం 1.5–4.5% వృద్ధి చెందొచ్చని అంచనా వేసింది. ఇతర ముఖ్యాంశాలు.. → వాటాదారులకు రూ. 2 ముఖ విలువ గల ఒక్కో షేరుపై రూ.12 మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. దీనికి ఈ నెల 17 రికార్డు తేదీ కాగా, 27న చెల్లిస్తుంది. → ఈ ఏడాది మార్చి ఆఖరితో పోలిస్తే జూన్ చివరి నాటికి 3,292 మంది ఉద్యోగులు తగ్గారు. మొత్తం సిబ్బంది సంఖ్య 2,23,889కి చేరింది. ఉద్యోగుల వలసల రేటు 12.7 శాతంగా నమోదైంది. కాగా, క్యూ1లో 1,056 మంది ఫ్రెషర్లను నియమించుకుంది. మార్చి క్వార్టర్లో 1,712 మంది ఫ్రెషర్లతో పోలిస్తే జాబ్ ఆఫర్స్ తగ్గాయి. కంపెనీ షేరు 5 శాతం జంప్ చేసి, రూ.1,221 వద్ద ముగిసింది.ఏఐ డేటా సెంటర్లపై రూ. 3,500 కోట్ల పెట్టుబడిభారత్లో ఏఐ డేటా సెంటర్ల ఏర్పాటు కోసం రూ.3,500 కోట్ల మేర పెట్టుబడులు వెచ్చించేందుకు హెచ్‌సీఎల్ టెక్ డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది. డేటా సెంటర్ల కోసం నెలకొల్పే కొత్త అనుబంధ సంస్థల ద్వారా ఈ నిధులను ఇన్వెస్ట్ చేయనుంది. ప్రైవేటు, ప్రభుత్వ రంగాల్లో ఏఐ ఆధారిత సరీ్వసులు, సొల్యూషన్లకు పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా పూర్తి స్థాయిలో వ్యాపారావకాశాలను దక్కించుకోవడం కోసం ఫుల్–స్ట్యాక్ ఏఐ మార్కెట్లోకి అడుగుపెడుతున్నట్లు కంపెనీ ప్రకటించింది. ‘50 మెగావాట్ల సామర్థ్యం వరకు విస్తరించేలా ఏఐ డేటా సెంటర్లపై రూ.3,500 కోట్ల మేర వ్యూహాత్మక పెట్టుబడులు పెడతాం. ఏఐ డేటా సెంటర్ డిజైన్, ఏఐ క్లౌడ్ కార్యకలాపాలతో పాటు మా సాఫ్ట్వేర్ పోర్ట్‌ఫోలియోల్లో కంపెనీకి ఇప్పటికే ఉన్న సామర్థ్యాలకు ఈ ఇన్వెస్ట్మెంట్ తోడ్పాటునందిస్తుంది. తద్వారా పూర్తిస్థాయి సమగ్ర సేవలకు వీలవుతుంది’ అని హెచ్‌సీఎల్‌టెక్ వెల్లడించింది.ప్రపంచవ్యాప్తంగా కంపెనీల్లో ఆర్టీఫిషియల్ (ఏఐ) మార్పులు చోటుచేసుకుంటున్నాయి, ఈ కొత్త వృద్ధి అవకాశాలను కంపెనీ అందిపుచ్చుకుంటోంది. మా వైవిధ్యమైన పోర్ట్‌ఫోలియోతో క్లయింట్లకు టెక్నాలజీపరంగా వ్యాపార వ్యూహాలను రూపొందించుకోవడంలో తోడ్పడుతున్నాం. వర్ధమాన సాంకేతికతల్లో మా ఉద్యోగులకు నైపుణ్యాలను పెంపొందించడంతో పాటు సంస్థలో ఏఐని అమలు చేస్తున్నాం. – రోష్ని నాడార్ మల్హోత్రా, హెచ్‌సీఎల్ టెక్ చైర్పర్సన్క్యూ1లో కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా 2.4 బిలియన్ డాలర్ల కొత్త ఆర్డర్లను దక్కించుకున్నాం. అడ్వాన్స్డ్ ఏఐ వ్యాపారం సీక్వెన్షియల్‌గా 10.6 శాతం, వార్షికంగా 62.1 శాతం చొప్పున ఎగబాకింది. క్లయింట్లు మా ఏఐ సేవల్ని ఎంచుకుంటున్నారనేందుకు ఇదే నిదర్శనం. నిర్వహణ సామర్థ్యంతో పాటు మార్జిన్ల వృద్ధి దన్నుతో మధ్యకాలికంగా మార్కెట్ వృద్ధిని మించి రాణించగలమన్న నమ్మకం కలుగుతోంది. – సి. విజయకుమార్, హెచ్‌సీఎల్ టెక్ సీఈఓ, ఎండీ -
ఇలా చేస్తే.. ట్రైన్ మొత్తం బుక్ చేసుకోవచ్చు!
పెళ్లి వేడుకలకు, ఆధ్యాత్మిక యాత్రలకు, కార్పొరేట్ టూర్లు లేదా పెద్ద కుటుంబాలతో కలిసి ప్రయాణించాలనుకునే వారికి ఇండియన్ రైల్వే ఒక ప్రత్యేకమైన సౌకర్యం అందిస్తోంది. ఫుల్ టారిఫ్ రేట్ (FTR) స్కీమ్ ద్వారా ప్రయాణికులు ఒక రైల్వే కోచ్‌ను లేదా అవసరమైతే పూర్తి రైలునే బుక్ చేసుకునే అవకాశం ఉంది. ఎక్కువమందితో కలిసి ప్రయాణించాలనుకునే వారికి ఈ ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలంటే.. జర్నీ చేయాల్సిన తేదీకంటే ఆరు నెలల ముందుగానే బుక్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఆన్లైన్ బుకింగ్ సేవను.. ప్రయోగాత్మకంగా వెస్ట్రన్ రైల్వే పరిధిలో ప్రారంభమయ్యే ప్రయాణికులకు మాత్రమే అందుబాటులో ఉంచారు. బుకింగ్‌ను IRCTC FTR పోర్టల్ ద్వారా లేదా ప్రయాణం ప్రారంభమయ్యే స్టేషన్‌లోని చీఫ్ బుకింగ్ సూపర్వైజర్ (CBS) లేదా స్టేషన్ మాస్టర్‌కు దరఖాస్తు చేసి చేయవచ్చు.ఆన్లైన్లో బుక్ చేయాలంటే.. ముందుగా ప్రయాణ వివరాలు, మార్గం, బుకింగ్ రకం వంటి సమాచారాన్ని నమోదు చేయాలి. దరఖాస్తు సమర్పించిన తర్వాత ఒక రిఫరెన్స్ నెంబర్, చెల్లించాల్సిన రిజిస్ట్రేషన్ ఫీజు వివరాలు వస్తాయి. ఈ మొత్తాన్ని దరఖాస్తు చేసిన రోజుతో కలిపి ఆరు రోజుల్లోగా చెల్లించాలి. నిర్ణీత గడువులో చెల్లించకపోతే దరఖాస్తు ఆటోమేటిక్‌గా రద్దవుతుంది. మళ్లీ కొత్తగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.ఆఫ్‌లైన్ బుకింగ్ కోసం ముందుగా.. స్టేషన్ మాస్టర్ లేదా చీఫ్ బుకింగ్ సూపర్వైజర్కు లిఖితపూర్వకంగా దరఖాస్తు ఇవ్వాలి. అధికారులు వివరాలను నమోదు చేసిన తర్వాత రిఫరెన్స్ నెంబర్ ఇస్తారు. ఆ తరువాత యూటీఎస్ కౌంటర్లో రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లిస్తే ఎఫ్టీఆర్ నెంబర్ జారీ చేసి బుకింగ్‌ను పూర్తి చేస్తారు.ఈ స్కీమ్ కింద ఒక టూర్ ప్రోగ్రామ్‌కు సాధారణ రైలులో గరిష్టంగా 10 కోచ్‌ల వరకు రిజర్వ్ చేసుకోవచ్చు. ఒకవేళ పూర్తిగా స్పెషల్ ట్రైన్ బుక్ చేయాలనుకుంటే గరిష్టంగా 24 కోచ్‌ల వరకు బుక్ చేసుకునే అవకాశం ఉంది. ఇందులో రెండు సీటింగ్ కమ్ లగేజ్ కోచ్‌లు కూడా ఉంటాయి.రిజిస్ట్రేషన్ ఫీజు విషయానికి వస్తే.. ఒక కోచ్‌ను ఏడు రోజుల వరకు బుక్ చేయడానికి రూ.50,000 చెల్లించాలి. ప్రయాణం ఏడు రోజుల కంటే ఎక్కువ ఉంటే అదనంగా ప్రతి కోచ్‌కు రోజుకు రూ.10,000 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. పూర్తి రైలును బుక్ చేయాలంటే కనీస రిజిస్ట్రేషన్ మొత్తం రూ.9 లక్షలు. ఇది కనీసం 18 కోచ్‌ల ఆధారంగా లెక్కిస్తారు. 18 కంటే ఎక్కువ కోచ్‌లు ఉంటే ప్రతి అదనపు కోచ్‌కు రూ.50,000 చెల్లించాలి.ఒకవేళ ప్రయాణికుడు లేదా రైల్వే శాఖ బుకింగ్‌ను రద్దు చేసినా, అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం.. చీఫ్ కమర్షియల్ మేనేజర్ కార్యాలయం ద్వారా రీఫండ్ ప్రక్రియ జరుగుతుంది. -
పాక్ కంపెనీలో జాబ్.. రూ.2 కోట్ల ప్యాకేజీ!
కరాచీకి చెందిన ఒక కంపెనీ నుంచి తనకు మంచి జీతంతో కూడిన జాబ్ ఆఫర్ వచ్చిందని పేర్కొంటూ 21 ఏళ్ల టెకీ ఆదిత్య పెట్టిన సోషల్ మీడియా పోస్ట్ ఆన్లైన్లో చర్చనీయాంశమైంది. ఈ పోస్ట్ వైరల్ కావడంతో కొంతమంది ఆసక్తిగా స్పందించగా, మరికొందరు ఇది కేవలం సోషల్ మీడియా ఎంగేజ్మెంట్ కోసం చేసిన ప్రయత్నమా?.. అంటూ అనుమానాలు వ్యక్తం చేశారు.ఆదిత్య షేర్ చేసిన స్క్రీన్‌షాట్ ప్రకారం.. కరాచీ కేంద్రంగా పనిచేస్తున్న ఓ కంపెనీ తనకు సంవత్సరానికి 1.8 లక్షల నుంచి 2.2 లక్షల డాలర్ల వరకు బేస్ శాలరీ ఆఫర్ చేసిందని తెలిపాడు. భారత కరెన్సీలో ఈ వేతనం దాదాపు రూ.2 కోట్లు. కంపెనీ హెడ్ క్వార్టర్ కరాచీలో ఉన్నప్పటికీ, ఎక్కువ మంది ఉద్యోగులు యూకే టైమ్ జోన్ ప్రకారం పనిచేస్తారని ఆఫర్ వివరాల్లో ఉన్నట్లు వెల్లడించాడు.just received an onsite offer from a Karachi-based company.$180-220k base, visa sponsored, and the team operates in the UK timezone. should I go for it? pic.twitter.com/lCa8NdQVXF— aditya (@adxtyahq) July 12, 2026తనకు వచ్చిన ఈ ఆఫర్‌ను అంగీకరించి అక్కడికి వెళ్లాలా?, వద్దా? అని తన ఫాలోవర్లను అడుగుతూ ఆదిత్య తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశాడు.ఈ పోస్ట్ అతి తక్కువ సమయంలోనే వైరల్ అయింది. ఈ పోస్టును చూసినవారిలో.. కొంతమంది నిజంగానే ఇది మంచి కెరీర్ అవకాశం కావచ్చని చెప్పారు. మరికొందరు మాత్రం ఆ ఆఫర్ నిజమా, కాదా? అనే సందేహాలు వ్యక్తం చేశారు. ఇంకొంతమంది ఇలాంటి పోస్టులు కేవలం ఎక్కువ లైక్‌లు, కామెంట్లు, వ్యూస్ కోసం చేసి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. ఇలాంటి అవకాశాలను అంగీకరించే ముందు కంపెనీ వివరాలు, ఉద్యోగ నిజమైనదా కాదా అనే విషయాలను పూర్తిగా పరిశీలించాలని సూచించారు. -
కొత్త రూపంలో IRCTC వెబ్సైట్!
ట్రైన్ టికెట్ బుక్ చేసుకునే సమయంలో వచ్చే సమస్యలను నివారించడానికి తగిన చర్యలు తీసుకోనున్నట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. ఇప్పుడు భారతీయ రైల్వే.. ఐఆర్సీటీసీ వెబ్‌సైట్‌ను పూర్తిగా కొత్త రూపంలోకి తీసుకొస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.రైలు ప్రయాణం చేసే ప్రతి ఒక్కరికీ ఐఆర్సీటీసీ వెబ్సైట్ ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా తత్కాల్ టికెట్లు బుక్ చేసే సమయంలో వెబ్సైట్ నెమ్మదించడం, సర్వర్ సమస్యలు రావడం, టికెట్ బుక్ అయ్యేలోపు సీట్లు అయిపోవడం వంటి సమస్యలను చాలామంది ఎదుర్కొన్నారు. ఈ ఇబ్బందులకు పరిష్కారం చూపేందుకు భారతీయ రైల్వే ఐఆర్సీటీసీ వెబ్‌సైట్‌ను కొత్తగా మారుస్తోంది.జులై 15 నుంచి కొత్త వెర్షన్కొత్త వెబ్సైట్ బీటా వెర్షన్ 2026 జూలై 15 నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. వేగంగా టికెట్ బుక్ చేసుకోవడం, సులభమైన నావిగేషన్, మెరుగైన పనితీరు వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈ కొత్త ప్లాట్‌ఫామ్‌ను అభివృద్ధి చేస్తున్నారు.నిజానికి ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఐఆర్సీటీసీ వెబ్‌సైట్‌పై ప్రయాణికుల నుంచి లెక్కకుమించిన ఫిర్యాదులు అందాయి. అందులో ముఖ్యంగా తత్కాల్ టికెట్ బుకింగ్ సమయంలో ఒకేసారి లక్షలాది మంది ప్రయత్నించడం వల్ల వెబ్సైట్ స్లో అవ్వడం, పేజీలు లోడ్ కాకపోవడం, ఎక్కువసార్లు క్యాప్చా అడగడం, సెషన్ టైమ్ అవుట్ కావడం వనవి ఉన్నాయి. కొత్త వెబ్సైట్ ఈ సమస్యలకు చెక్ పెట్టనున్నట్లు సమాచారం.మొబైల్ యాప్‌లో కూడా..కొత్త వెబ్‌సైట్‌ను ఐఆర్సీటీసీ, సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (CRIS) కలిసి అభివృద్ధి చేస్తున్నాయి. ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అనేక కొత్త ఫీచర్లను ఇందులో చేర్చారు. బీటా వెర్షన్‌ను టెస్ట్ చేసే సమయంలో వినియోగదారుల నుంచి వచ్చిన సూచనలను కూడా పరిగణనలోకి తీసుకున్నారు.కొత్త ఐఆర్సీటీసీ ఫీచర్లు రైల్‌వన్ మొబైల్ యాప్‌లో కూడా అందుబాటులోకి రానున్నాయి. అంటే వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ ఏదైనా ప్రయాణికులకు ఒకే విధమైన అనుభవం లభిస్తుంది. వెబ్సైట్ మార్పులతో పాటు భారతీయ రైల్వే తన పాత ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (PRS)ను కూడా అప్డేట్ చేస్తోంది. దాదాపు 40 ఏళ్ల నాటి ఈ వ్యవస్థ స్థానంలో అధిక ట్రాఫిక్‌ను నిర్వహించగల కొత్త సాంకేతిక వ్యవస్థను తీసుకురానున్నారు.🚨 The Ministry of Railways is launching a new version of the IRCTC website. 1. Ticket booking capacity increased from 32,000 to 1.5 lakh+ tickets per minute.2. PNR & train enquiry capacity increased from 4 lakh to 40 lakh+ enquiries per minute.3. Faster page loading and… pic.twitter.com/Ah2VbS3RK1— Indian Tech & Infra (@IndianTechGuide) July 13, 2026 -
టెక్కీలకు డైరెక్ట్ ఏసీ బస్
ఐటీ కారిడార్ బెంగళూరులో నిత్యం ట్రాఫిక్ నరకం చూసే టెక్కీలకు, ఉద్యోగులకు భారీ ఉపశమనం లభించింది. తుమకూరు నుంచి బెంగళూరు ఐటీ హబ్ ‘ఎలక్ట్రానిక్స్ సిటీ’ మధ్య ప్రయాణించే వందలాది మంది ఉద్యోగుల కోసం బెంగళూరు మహానగర రవాణా సంస్థ (బీఎంటీసీ) సరికొత్త ‘విస్తారా ఏసీ బస్సు’ సేవలను ప్రారంభించింది.బీఎంటీసీ లాంగ్ రూట్దాదాపు 101 కిలోమీటర్ల మేర సాగే ఈ ప్రత్యేక రూట్ ప్రస్తుతం బీఎంటీసీ నడుపుతున్న బస్సు సర్వీసులన్నింటిలోకి అత్యంత పొడవైనది కావడం విశేషం. గ్రేటర్ బెంగళూరు పరిధి దాటి సుమారు 40 కిలోమీటర్ల పరిధి వరకు బస్సులు నడుపుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించడంతో.. స్థానికంగా ఉన్న శాటిలైట్ టౌన్స్‌ను అనుసంధానిస్తూ బీఎంటీసీ ఈ నిర్ణయం తీసుకుంది.‘ప్రజా డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుని ఈ సరికొత్త ఏసీ సర్వీస్‌ను ప్రారంభించాం. ప్రస్తుతం తుమకూరు - ఎలక్ట్రానిక్స్ సిటీ మధ్య ప్రయాణికుల ఆదరణ చాలా బాగుంది. గతంలో మేము నైలామంగళ, హోస్కోట్ మధ్య 80 కిలోమీటర్ల రూట్‌ను ప్రారంభించాం. ఇప్పుడు ఈ 101 కిమీ రూట్ మా నెట్‌వర్క్‌లోనే అతి పెద్దది’ అని బీఎంటీసీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ (ఆపరేషన్స్) జి.టి. ప్రభాకర్ రెడ్డి అన్నారు.ప్రయాణ సమయం, టైమింగ్స్ వివరాలుఈ సరికొత్త సర్వీస్ ద్వారా ప్రయాణికులకు నిత్యం 45 నిమిషాల నుంచి ఒక గంట వరకు ప్రయాణ సమయం ఆదా అవుతోంది. ఉదయం 7:45 గంటలకు తుమకూరులో బయలుదేరి, ఉదయం 9:45 గంటల వరకు ఎలక్ట్రానిక్స్ సిటీకి చేరుకుంటుంది. (ఆఫీస్ వేళలకు సరిగ్గా సరిపోయేలా రూపకల్పన చేశారు). ఎలక్ట్రానిక్స్ సిటీ నుంచి సాయంత్రం ఐటీ ఉద్యోగుల లాగ్-అవుట్ సమయానికి అనుగుణంగా సాయంత్రం 5:45 గంటలకు బయలుదేరి రాత్రి 9:00 గంటల కల్లా తుమకూరు చేరుకుంటుంది. వన్‌వే రూట్లో ప్రయాణ ఛార్జీ రూ.200గా నిర్ణయించారు. ప్రధాన స్టాపులు.. తుమకూరు, నేలమంగళ, మాదవర మీదుగా ‘నైస్ రోడ్’ ద్వారా నేరుగా ఎలక్ట్రానిక్స్ సిటీ చేరుకుంటుంది.ఇదీ చదవండి: కొనుగోలుదారులకు ఊరట.. దిగొచ్చిన బంగారం.. -
అమెరికా గడ్డపై అతిపెద్ద 'బంగారు గని' నిజమేనా?
ప్రముఖ ఆర్థిక విశ్లేషకుడు, ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు ఇన్వెస్టర్లలో తీవ్ర చర్చకు దారితీసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యూఎస్ భూభాగంలో 1 ట్రిలియన్ డాలర్ల (సుమారు రూ. 84 లక్షల కోట్లు) విలువైన ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు నిక్షేపాన్ని వెలికితీసేందుకు ఒక పెద్ద నిర్ణయం తీసుకోబోతున్నారంటూ ఆయన పేర్కొన్నారు.తనకు సన్నిహితుడైన ప్రముఖ పసిడి నిపుణుడు జిమ్ రిక్కార్డ్స్ సమాచారం ప్రకారం.. ఈ పథకం ద్వారా రాబోయే కొన్ని నెలల్లోనే 10 రెట్లు లాభాలు వచ్చే అవకాశం ఉందని కియోసాకి చెప్పుకొచ్చారు. అయితే, కియోసాకి పోస్ట్‌పై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.అసలు నిజం ఏంటి?ఆర్థిక నిపుణుల విశ్లేషణ ప్రకారం.. ఈ పోస్ట్‌లో పేర్కొన్న "ట్రంప్ గోల్డ్ మైన్" అనేది కొత్తగా కనుగొన్నదేమీ కాదు. అలాస్కా ప్రాంతంలో ఎప్పటి నుంచో వివాదాల్లో ఉన్న 'డాన్లిన్ గోల్డ్' (Donlin Gold) లేదా 'పెబుల్ మైన్' (Pebble Mine) వంటి పాత మైనింగ్ ప్రాజెక్టులను ఉద్దేశించి ఈ ప్రచారం జరుగుతోంది. ఇవి పెద్ద నిక్షేపాలే అయినప్పటికీ, అధ్యక్షుడి ఒక్క ఆదేశంతో రాత్రికి రాత్రే బంగారం బయటకు వచ్చేసే పరిస్థితి లేదు. వీటికి ఎన్నో పర్యావరణ అనుమతులు, చట్టపరమైన చిక్కులు ఉన్నాయి.10 రెట్ల లాభాలు సాధ్యమేనా?కొద్ది నెలల్లోనే 10 రెట్లు లాభాలు వస్తాయనే వాదనను మార్కెట్ నిపుణులు తీవ్రంగా కొట్టిపారేస్తున్నారు. ఇదంతా జిమ్ రిక్కార్డ్స్ నడుపుతున్న ఒక ప్రీమియం ఫైనాన్షియల్ న్యూస్‌లెటర్ సబ్స్క్రిప్షన్లను అమ్ముకోవడానికి చేస్తున్న పబ్లిసిటీ స్టంట్ అని కొందరు ఆరోపిస్తున్నారు. బంగారం, మైనింగ్ రంగాలు చాలా అస్థిరంగా ఉంటాయని, తక్కువ సమయంలో ఇలాంటి అసాధారణ లాభాలు రావడం దాదాపు అసాధ్యమని వారు హెచ్చరిస్తున్నారు. -
డీమార్ట్ మూడు నెలల లాభం ఎంతంటే..
న్యూఢిల్లీ: రిటైల్ చెయిన్ డీమార్ట్ మాతృ సంస్థ ఎవెన్యూ సూపర్‌మార్ట్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ. 860 కోట్ల నికర లాభం ప్రకటించింది. గత క్యూ1లో నమోదైన రూ. 773 కోట్లతో పోలిస్తే ఇది 11 శాతం అధికం. ఆదాయం రూ. 16,360 కోట్లతో పోలిస్తే 15 శాతం వృద్ధి చెంది రూ. 18,795 కోట్లకు చేరింది. లాభం మార్జిన్ 4.7 శాతం నుంచి 4.6 శాతానికి నెమ్మదించింది.సమీక్షా కాలంలో కొత్తగా మూడు స్టోర్స్ ప్రారంభించడంతో మొత్తం స్టోర్స్ సంఖ్య 503కి చేరుకుందని సంస్థ ఎండీ (బ్రిక్ అండ్ మోరా్టర్ విభాగం) అన్షుల్ అసాావా తెలిపారు. మరోవైపు అంతగా ఆదాయంలేని ఏడు నగరాల్లో కార్యకలాపాలు నిలిపివేసినట్లు ఆన్లైన్ ప్లాట్‌ఫాం డీమార్ట్ రెడీ సీఈవో విక్రమ్ దాసు తెలిపారు. జూన్ 30 నాటికి 11 నగరాల్లో డీమార్ట్ రెడీ కార్యకలాపాలు సాగిస్తోంది. -
స్మాల్, మిడ్ క్యాప్‌లలో పెట్టుబడి అవకాశాలు
చాలామంది ఇన్వెస్టర్లు మిడ్, స్మాల్–క్యాప్ షేర్లలో పెట్టుబడుల ద్వారానే ఎక్కువ సంపదను సృష్టించుకోగలుగుతుంటారు. ఎందుకంటే, లార్జ్–క్యాప్లతో పోలిస్తే ఈ విభాగంలో పెట్టుబడి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. నిఫ్టీ 100 ఇండెక్స్ పరిధితో పోలిస్తే నిఫ్టీ మిడ్‌స్మాల్‌క్యాప్ 400 ఇండెక్స్‌లో ఎక్కువ రకాల రంగాలు అందుబాటులో ఉన్నాయి. గత రికార్డులను చూసినా లార్జ్–క్యాప్ కంటే మిడ్, స్మాల్–క్యాప్ కంపెనీలే వేగంగా వృద్ధి చెందాయి. 2020–25 ఆర్థిక సంవత్సరాల మధ్య లార్జ్–క్యాప్ కంపెనీల ఆదాయ వృద్ధి 74 శాతంగా ఉంటే, మిడ్, స్మాల్–క్యాప్ కంపెనీల ఆదాయం దాదాపు 82 శాతం పెరిగింది. అలాగే లాభాల వృద్ధి విషయానికి వస్తే.. ఇదే కాలంలో లార్జ్–క్యాప్‌లో 211 శాతం వృద్ధి నమోదైతే, మిడ్, స్మాల్–క్యాప్ కంపెనీలు ఏకంగా 256 శాతం వృద్ధిని సాధించాయి. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ విభాగంలోనూ వీటి హవా పెరిగింది. ఈ విభాగంలో ఉండే మిడ్–క్యాప్ కంపెనీల సంఖ్య 2021లో 63 ఉండగా, 2026 నాటికి 93కి చేరింది. అలాగే స్మాల్–క్యాప్ కంపెనీలు 5 నుంచి 25కి పెరిగాయి. గత 15 ఏళ్ల కాలంలో చూసుకుంటే, చాలా సందర్భాల్లో లార్జ్–క్యాప్ కంటే మిడ్, స్మాల్–క్యాప్ కంపెనీలే ఇన్వెస్టర్లకు మెరుగైన రిటర్న్స్ ఇచ్చాయి. ప్రస్తుతం ఇన్వెస్టర్లకు మిడ్, స్మాల్–క్యాప్ సెగ్మెంట్లలో పెట్టుబడి పెట్టడానికి ’స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్’ (IFS) మెరుగైన సాధనాలుగా నిలుస్తున్నాయి. ఇవి మ్యూచువల్ ఫండ్స్‌లాగే సెబీ నిబంధనల ప్రకారం పనిచేస్తాయి. కాకపోతే పోర్ట్‌ఫోలియో రూపకల్పనలో వీటికి పీఎంఎస్ తరహాలో ఎక్కువ స్వేచ్ఛ ఉంటుంది. ఈ ఫండ్స్ పరిధిలోని ’ఈక్విటీ ఎక్స్–టాప్ 100 లాంగ్–షార్ట్’ వ్యూహం పెద్ద కంపెనీలను పక్కన పెట్టి, పూర్తిగా మిడ్, స్మాల్–క్యాప్ షేర్లపైనే దృష్టి పెడుతుంది. అందుకే ఇది ఇన్వెస్టర్లకు మెరుగైన సాధనంగా ఉంటుంది.ప్రధానంగా నాలుగు సూత్రాలు.. ఇది ప్రధానంగా నాలుగు సూత్రాలపై నడుస్తుంది. కంపెనీల అకౌంటింగ్ పరిశీలన (ఫోరెన్సిక్స్), సముచిత ప్రైసింగ్, ఒకే ఇన్వెస్ట్మెంట్ శైలికి పరిమితం కాకపోవడం, బలమైన బిజినెస్ మోడల్స్ (కార్పొరేట్ గవర్నెన్స్) అనేవి ఈ సూత్రాలు. కేవలం వేగంగా పెరిగే కంపెనీలనే కాకుండా విశ్వసనీయమైన ప్రమాణాలు, వ్యాపారాన్ని విస్తరించే చాన్స్, స్థిరమైన సంపాదన ఉన్న కంపెనీలనే ఎంచుకుంటారు. అలాగే వాల్యూ ఇన్వెస్టింగ్ లేదా గ్రోత్ ఇన్వెస్టింగ్ అనే ఒకే రకమైన శైలికి కట్టుబడి ఉండకుండా, బిజినెస్ క్వాలిటీ, మీడియం–టర్మ్ లాభాల అవకాశాలను బట్టి పోర్ట్‌ఫోలియోను మారుస్తుంటారు. ఇక్కడ అధిక లాభాలు సాధించడానికి ఫ్లెక్సిబిలిటీ, బలమైన నమ్మకమే కారణం. ఈ ఫండ్ ఒకే రంగానికి పరిమితం కాదు. ఇండెక్స్ రూల్స్ తో సంబంధం లేకుండా, ఎక్కడ మంచి అవకాశాలు ఉంటే అక్కడికి నిధులను మళ్లిస్తుంది. ఈ వ్యూహం ద్వారా దాదాపు 35 నుంచి 45 షేర్లతో కూడిన నిర్దిష్ట పోర్ట్‌ఫోలియోను నిర్వహిస్తారు. వీటిలో ప్రతి షేరును క్షుణ్ణంగా స్టడీ చేసిన తర్వాతే ఎంపిక చేస్తారు. డబ్బులు ఇన్వెస్ట్ చేసే ముందే సదరు కంపెనీల అకౌంటింగ్ నాణ్యత, కార్పొరేట్ గవర్నెన్స్ ప్రమాణాలు, మేనేజ్మెంట్ ట్రాక్ రికార్డ్‌ను పూర్తిగా స్క్రీన్ చేయడం ఇక్కడ మరో కీలకమైన అంశం. ఇన్ఫర్మేషన్ గ్యాప్స్, బిజినెస్ రిసు్కలు ఎక్కువగా ఉండే మిడ్, స్మాల్–క్యాప్ సెగ్మెంట్లో ఈ ముందస్తు పరిశీలన చాలా ముఖ్యం. ఇది కేవలం వ్యాల్యుయేషన్పరంగానే కాకుండా, అదనపు రక్షణ పొరలా పనిచేస్తూ రిస్క్ మేనేజ్మెంట్ను మెరుగుపరుస్తుంది. ఈ వ్యూహంలో భాగంగా మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా 101 నుంచి 750 ర్యాంకుల మధ్య ఉన్న కంపెనీలకే 65 శాతానికి పైగా నిధులను కేటాయిస్తారు. దీనివల్ల ఫోకస్ అంతా మిడ్, స్మాల్–క్యాప్ పరిధిలోనే ఉంటుంది. మార్కెట్ పరిస్థితులను బట్టి మిడ్–క్యాప్, స్మాల్–క్యాప్‌ల మధ్య సమతుల్యత ఉండేలా ఎప్పటికప్పుడు పెట్టుబడుల విషయంలో మార్పులు, చేర్పులు చేస్తుంటారు. నిర్దిష్టంగా చెప్పాలంటే .. ప్రస్తుత మార్కెట్ వాతావరణం ఎస్ఐఎఫ్ పెట్టుబడులకు రెండు విధాలుగా సానుకూలంగా ఉంటోంది. ఒకటి వ్యాల్యుయేషన్లు అందుబాటులోకి రావడం కాగా రెండోది వైవిధ్యమైన పెట్టుబడి అవకాశాలు ఉండడం. క్రమశిక్షణ, ఫ్లెక్సిబిలిటీ, స్పష్టమైన వ్యూహంతో ఈ మార్కెట్ హెచ్చుతగ్గులను ఎదుర్కొనే ఫండ్స్ మాత్రమే లాంగ్–టర్మ్‌లో ఇన్వెస్టర్లకు స్థిరమైన, అల్ఫా లాభాలను అందించగలవు.ఇదే సరైన సమయం ఎందుకు అంటే మిడ్, స్మాల్–క్యాప్ (ఎస్ఎంఐడీ) షేర్లలో పెట్టుబడి పెట్టడానికి ఇదే సరైన సమయం అనడానికి ఒక స్పష్టమైన కారణం ఉంది. మార్కెట్లో వచ్చే కరెక్షన్లనేవి అంచనాలను, వ్యాల్యుయేషన్లను మళ్లీ దారికి తెస్తాయి. ఇటీవల మార్కెట్ కరెక్షన్ల వల్ల దాదాపు 75 శాతం మిడ్–క్యాప్ షేర్లు, అలాగే 82 శాతం స్మాల్–క్యాప్ షేర్లు వాటి 52 వారాల గరిష్టాల నుంచి 20 శాతానికి పైగా పతనమయ్యాయి. ఇలా మార్కెట్ పడటం అనేది కేవలం తాత్కాలిక ఒడిదొడుకు మాత్రమే కాదు, మార్కెట్ జోరులో ఓవర్ ప్రైస్ అయిన షేర్ల విలువను ఇది తగ్గిస్తుంది. స్వల్పకాలిక సెంటిమెంట్‌ను పక్కన పెట్టి ఆలోచించే ఇన్వెస్టర్లకు మార్కెట్లోకి ఎంటర్ అవ్వడానికి ఇది మంచి చాన్స్. వ్యాల్యుయేషన్లు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయి. సెపె్టంబర్ 2024లో ఎస్ఎంఐడీ వ్యాల్యుయేషన్లు దాదాపు 39 రెట్లు పెరిగి పీక్ స్టేజ్‌కి చేరాయి. ఆ తర్వాత వచి్చన కరెక్షన్ల వల్ల ఇప్పుడు 25–30 రెట్ల మధ్యకు దిగివచ్చాయి. ఇదే గత ఐదేళ్ల యావరేజ్ కంటే తక్కువ స్థాయి. అంటే, వేగంగా ఎదుగుతున్న వ్యాపారాలలో భాగస్వామ్యం అయ్యే అవకాశాన్ని మార్కెట్ ఇప్పుడు చారిత్రక సగటు ధరలకే అందిస్తోంది. ఇది చాలా ముఖ్యమైన మార్పు. ఎందుకంటే ఈక్విటీల్లో రిటర్న్స్ అనేవి కంపెనీ సంపాదనతో పాటు, మనం ఎంత వ్యాల్యుయేషన్ వద్ద ఇన్వెస్ట్ చేశామనే దానిపై కూడా ఆధారపడి ఉంటాయి. మార్కెట్ పెరిగినా, తగ్గినా లాభపడేలా (లాంగ్, షార్ట్ పొజిషన్ల కలయిక ద్వారా) మిడ్, స్మాల్–క్యాప్ అవకాశాలను అందిపుచ్చుకునే వ్యూహాలు ఇప్పుడు కీలకంగా మారుతాయి. అలాంటి వాటిలో ’అల్టీవా ఈక్విటీ ఎక్స్–టాప్ 100 లాంగ్–షార్ట్ ఫండ్’ ఒకటి. ఈ వ్యూహం ప్రకారం సాధారణంగా 65 శాతం నుంచి 100 శాతం పెట్టుబడులను మిడ్, స్మాల్–క్యాప్ రంగంలోనే ఇన్వెస్ట్ చేస్తారు. అవసరాన్ని బట్టి డెరివేటివ్స్, షార్ట్ పొజిషన్ల ద్వారా రిస్క్ ను తగ్గిస్తూ, రిటర్న్స్ పెంచుకునే వీలుంటుంది.త్రిదీప్ భట్టాచార్య, ప్రెసిడెంట్–సీఐఓ (ఈక్విటీస్) ఎడెల్వీస్ అసెట్ మేనేజ్మెంట్ -
ఆఫీసా? రిసార్టా? రెండు నెలలకే ఇంటర్న్ కన్నీళ్లు
‘కార్పొరేట్ జీవితం అంటేనే ఒక యాంత్రికమైన నరకం.. అక్కడ స్నేహాలుండవు, కేవలం టార్గెట్లు మాత్రమే ఉంటాయి’ నేటి తరం యువతలో, ముఖ్యంగా చదువు పూర్తి చేసుకుని ఉద్యోగాల్లోకి అడుగుపెట్టే విద్యార్థులలో ఉండే సాధారణ అభిప్రాయం ఇది. కానీ, ఒక రెండు నెలల అనుభవం ఆ ఆలోచనలను పూర్తిగా మార్చేయగలదా? అంతర్జాతీయ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ క్యాంపస్‌లో అడుగుపెట్టిన ఒక భారతీయ ఇంటర్న్‌కు సరిగ్గా ఇదే అనుభవం ఎదురైంది. కేవలం రెండు నెలల సమ్మర్ ఇంటర్న్‌షిప్ ముగించుకుని ఢిల్లీకి తిరుగుప్రయాణమైన సదరు ఇంటర్న్ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పంచుకున్న భావోద్వేగ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.రిసార్ట్‌ను తలపించే క్యాంపస్.. వీడలేని బంధాలుసాధారణంగా ఇంటర్న్‌షిప్ అంటే ప్రాజెక్టులు, కోడింగ్, డెడ్లైన్లతో ముగిసిపోతుందని భావిస్తారు. కానీ మైక్రోసాఫ్ట్‌లో గడిపిన కాలం తనకు సరికొత్త ప్రపంచాన్ని పరిచయం చేసిందని ఆ ఇంటర్న్ పేర్కొన్నారు. ‘మైక్రోసాఫ్ట్‌లో నా సమ్మర్ ఇంటర్న్‌షిప్ నిన్నటితో ముగిసింది. కేవలం రెండు నెలల కాలంలోనే ఒక చోటును వదిలి వెళ్లడం ఇంత కష్టంగా ఉంటుందని నేను అస్సలు ఊహించలేదు. నా టీమ్మేట్స్, తోటి ఇంటర్న్స్‌తో కలిసి చేసిన హంగామాను నేను ఎంతగానో మిస్ అవుతున్నాను. ఒక అందమైన రిసార్ట్‌ను తలపించే క్యాంపస్‌లో ఇంతటి అద్భుతమైన వ్యక్తులతో కలిసి పనిచేసే అవకాశం రావడం నా అదృష్టం’ అని ఆ ఇంటర్న్ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.నెటిజన్ల స్పందనఈ పోస్ట్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమవగానే ముఖ్యంగా విద్యార్థులు, యువ ప్రొఫెషనల్స్ దీనికి కనెక్ట్ అయ్యారు. ‘చాలా రిలేటబుల్‌గా ఉంది. ఇటీవల నేను కూడా మూడు నెలల ఇంటర్న్‌షిప్ పూర్తి చేశాను, నాకూ ఇలాగే అనిపించింది’ అని ఒకరు కామెంట్ చేయగా.. మరికొందరు ‘మంచి వాతావరణం, తోడ్పాటు అందించే సహోద్యోగులు ఉంటే ఏ సంస్థ అయినా సొంత ఇల్లులాగే మారుతుంది’ అని అభిప్రాయపడ్డారు.my summer internship at microsoft ended yesterday. never thought leaving after just 2 months would hit this hard. gonna miss all the fun i had with my teammates and co-interns.so grateful to have worked with such amazing people on a campus that literally felt like a resort. i…— Ryuzaki (@ryuzaki2401) July 11, 2026కంపెనీల బ్రాండ్ వాల్యూ పెంచే సంస్కృతినేటి పోటీ ప్రపంచంలో ఐటీ కంపెనీలు కేవలం వ్యాపార లాభాలకే పరిమితం కావడం లేదు. ప్రతిభావంతులైన యువతను ఆకర్షించడానికి గూగుల్, మైక్రోసాఫ్ట్, యాపిల్ వంటి సంస్థలు తమ ఆఫీస్ వాతావరణాన్ని అత్యంత ఆహ్లాదకరంగా మారుస్తున్నాయి. క్రీడలు, వినోదం, మెంటరింగ్ సిస్టమ్ (గైడెన్స్ ఇవ్వడం) వంటి వాటి ద్వారా ఉద్యోగులపై ఒత్తిడి లేకుండా చూస్తున్నాయి. ఈ మైక్రోసాఫ్ట్ ఇంటర్న్ కథనం నిరూపిస్తున్నది ఒక్కటే.. మంచి పని సంస్కృతి కేవలం ఉత్పాదకతను పెంచడమే కాదు, సంస్థ నుంచి బయటకు వచ్చే వ్యక్తులు జీవితాంతం ఆ బ్రాండ్‌కు అంబాసిడర్లుగా మారేలా బలమైన సానుకూల ముద్ర వేస్తుంది. నేటి స్టార్టప్‌లు, ఇతర కార్పొరేట్ సంస్థలు కూడా ఈ తరహా మానవీయ పని సంస్కృతిని అలవర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.ఇదీ చదవండి: బంగారం కొనాలా? వద్దా? -
ఆన్లైన్ రైలు టికెట్లు.. రైల్వే కీలక హెచ్చరిక
ఆన్లైన్లో రైలు టికెట్లు బుక్ చేసుకునే ప్రయాణికులకు భారతీయ రైల్వే కీలక సూచనలు జారీ చేసింది. చాలామంది ప్రయాణికులు ఈ-టికెట్‌ను స్క్రీన్‌షాట్ తీసుకుని లేదా వాట్సాప్‌లో ఫార్వర్డ్ చేసుకుని అదే టికెట్‌గా భావిస్తూ ప్రయాణిస్తున్నారు. అయితే కేవలం వాట్సాప్ స్క్రీన్‌షాట్ లేదా ఫార్వర్డ్ చేసిన టికెట్ చిత్రం మాత్రమే ఉంటే అది చెల్లుబాటు అయ్యే ప్రయాణ పత్రం కాదని రైల్వే స్పష్టం చేసింది.ఇటీవలి కాలంలో IRCTC, ఇతర అధికారిక బుకింగ్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ఈ-టికెట్ల బుకింగ్ విస్తృతంగా పెరగడంతో, టికెట్ వివరాలను కుటుంబ సభ్యులు, స్నేహితులతో వాట్సాప్‌లో పంచుకోవడం సాధారణంగా మారింది. అయితే ఈ పద్ధతి సమాచారాన్ని పంచుకోవడానికి మాత్రమేనని, టికెట్ తనిఖీ సమయంలో మాత్రం అసలు ఈ-టికెట్ లేదా అధికారిక ధ్రువీకరణ తప్పనిసరిగా ఉండాలని అధికారులు చెబుతున్నారు.స్క్రీన్‌షాట్ ఎందుకు చెల్లదు?రైల్వే అధికారుల ప్రకారం స్క్రీన్షాట్లు లేదా వాట్సాప్‌లో ఫార్వర్డ్ చేసిన చిత్రాలను సులభంగా ఎడిట్ చేయడం, మార్పులు చేయడం సాధ్యమవుతుంది. అలాగే ఒకే చిత్రాన్ని ఎక్కువ మందికి పంపించే అవకాశం ఉండటంతో దుర్వినియోగానికి ఆస్కారం ఉంటుంది. టికెట్ ఎగ్జామినర్లు (TTE) ప్రయాణికుల వివరాలను అసలు బుకింగ్ రికార్డులతో సరిపోల్చి ధ్రువీకరిస్తారు. కేవలం స్క్రీన్‌షాట్ ఆధారంగా టికెట్ ప్రామాణికతను నిర్ధారించడం సాధ్యం కాదని అధికారులు పేర్కొంటున్నారు.ఏవి చెల్లుబాటు అయ్యే టికెట్లు?ప్రయాణ సమయంలో కింది వాటిలో ఏదో ఒకటి తప్పనిసరిగా అందుబాటులో ఉండాలి.IRCTC Rail Connect యాప్ లేదా అధికారిక బుకింగ్ ప్లాట్‌ఫారమ్‌లో కనిపించే అసలు ఈ-టికెట్బుకింగ్ సమయంలో వచ్చిన అధికారిక SMSఈ-టికెట్ ప్రింటెడ్ కాపీవీటితో పాటు ఆధార్, ఓటర్ ఐడీ, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ వంటి ప్రభుత్వం జారీ చేసిన చెల్లుబాటు అయ్యే ఫోటో గుర్తింపు కార్డుటికెట్లో ఉన్న పేరు, ఐడీ కార్డులోని పేరుతో సరిపోవడం కూడా తప్పనిసరి.కేవలం వాట్సాప్ స్క్రీన్‌షాట్ మాత్రమే ఉంటే?టికెట్ తనిఖీ సమయంలో ప్రయాణికుడు అసలు ఈ-టికెట్ లేదా అధికారిక బుకింగ్ రుజువును చూపించలేక, కేవలం వాట్సాప్ స్క్రీన్‌షాట్ మాత్రమే చూపిస్తే చెల్లుబాటు అయ్యే టికెట్ లేనట్టుగా పరిగణించే అవకాశం ఉంది. అలాంటి సందర్భంలో రైల్వే చట్టాల ప్రకారం జరిమానా విధించడం, కొత్త టికెట్ కొనుగోలు చేయాలని సూచించడం లేదా అవసరమైతే తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుందని అధికారులు హెచ్చరిస్తున్నారు.టికెట్‌ను షేర్ చేయొచ్చా?ప్రయాణ వివరాలు తెలియజేయడానికి కుటుంబ సభ్యులు లేదా స్నేహితులతో టికెట్ సమాచారాన్ని వాట్సాప్‌లో పంచుకోవడంపై ఎలాంటి నిషేధం లేదు. అయితే ప్రయాణించే వ్యక్తి వద్ద మాత్రం అసలు ఈ-టికెట్ లేదా అధికారిక బుకింగ్ ధ్రువీకరణ తప్పనిసరిగా ఉండాలి. ఫార్వర్డ్ చేసిన చిత్రం కేవలం సమాచారానికే పరిమితం.ప్రయాణికులకు రైల్వే సూచనలుప్రయాణానికి ముందు IRCTC యాప్‌లో ఈ-టికెట్ అందుబాటులో ఉందో లేదో చూసుకోవాలి.బుకింగ్ కన్ఫర్మేషన్ SMSను డిలీట్ చేయకుండా సేవ్ చేసుకోవాలి.చెల్లుబాటు అయ్యే ఫోటో ఐడీ తప్పనిసరిగా వెంట తీసుకెళ్లాలి.మొబైల్ ఫోన్‌కు తగినంత చార్జ్ ఉండేలా చూసుకోవాలి. అవసరమైతే ఈ-టికెట్ ప్రింట్ కూడా వెంట ఉంచుకోవడం మంచిది. -
మన తరఫున క్యూలో నిలబడి సేవ చేస్తారు!
‘జేబు నిండా సొమ్ముంది.. నచ్చిన వస్తువులన్నీ కొనే దమ్ముంది.. కానీ, అవన్నీ మోసుకుంటూ ఆ రద్దీలో ఎవరు నడుస్తారు బాబూ? వద్దులే!’ అని షాపింగ్‌ను వాయిదా వేసుకుంటున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. షాపింగ్ చేయడం మీ వంతు అయితే ఆ బరువును మోయడం మా వంతు అంటూ సరికొత్త సేవలతో ముందుకు వచ్చింది ‘క్యారీమెన్’ అనే స్టార్టప్. న్యూక్లియర్ ఫ్యామిలీల కాలంలో షాపింగ్ బ్యాగులు మోసేందుకు తోడు దొరకడమే కష్టంగా మారిన తరుణంలో ఈ వెరైటీ ‘వెయిట్ లిఫ్టర్స్’ సేవలు ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీలో హాట్ టాపిక్‌గా మారాయి.స్వీయానుభవం నుంచే పుట్టిన ఆలోచన!ఢిల్లీలోని అత్యంత రద్దీ మార్కెట్లయిన లజ్‌పత్ నగర్, సరోజినీ నగర్, చాంద్నీ చౌక్ వంటి ప్రాంతాల్లో షాపింగ్ చేయడం ఒక ఎత్తైతే.. భారీ బ్యాగులు మోస్తూ గంటల తరబడి తిరగడం మరో ఎత్తు. ఈ క్రమంలో షాపింగ్ ఆనందం కాస్తా విరక్తిగా మారుతోందని ‘క్యారీమెన్’ వ్యవస్థాపకులు స్వయంగా గుర్తించారు. ఆ స్వీయానుభవం నుంచే ‘యూ షాప్.. వుయ్ క్యారీ’ అనే సరికొత్త కాన్సెప్ట్‌కు శ్రీకారం చుట్టారు.ఈ స్టార్టప్ ద్వారా బుక్ చేసుకునే ప్రత్యేక సహాయకులు కేవలం కస్టమర్ల బ్యాగులు మోయడానికే పరిమితం కావడం లేదు. షాపర్స్‌కు లగ్జరీ అనుభూతిని మిగులుస్తూ ఎక్కువ సేవలను అందిస్తున్నారు. ఫుడ్ స్టాల్స్ దగ్గర, బిల్లింగ్ కౌంటర్ల వద్ద కస్టమర్ల తరఫున ఈ సహాయకులే క్యూలో నిలబడతారు. షాపింగ్ ముగిసిన తర్వాత సరుకులతో సహా కస్టమర్లను మెట్రో స్టేషన్ లేదా వారి వాహనాల వరకు సురక్షితంగా చేరవేస్తారు. ఎండ/వాన నుంచి రక్షణకు గొడుగులు, మొబైల్ ఛార్జింగ్ కోసం పవర్ బ్యాంకులు, అలసిపోతే కూర్చోవడానికి మడత కుర్చీలు కూడా వీరు వెంట తెచ్చుకుంటారు.ఎవరికి ఎక్కువ ఉపయోగం?ముఖ్యంగా వృద్ధులు, గర్భిణీలు, చిన్న పిల్లలతో వచ్చే కుటుంబాలకు ఈ సేవలు కొండంత అండగా నిలుస్తున్నాయని సంస్థ ప్రతినిధులు పేర్కొంటున్నారు. ప్రస్తుతానికి ఈ సేవలు కేవలం గంటకు రూ.149 చార్జీతో లభిస్తుండటం విశేషం.దేశవ్యాప్త విస్తరణకు ప్రణాళికలుప్రస్తుతానికి దేశ రాజధాని ఢిల్లీలోని ప్రధాన మార్కెట్లలో పైలట్ ప్రాజెక్ట్‌గా అద్భుతమైన రెస్పాన్స్ దక్కించుకుంటున్న ‘క్యారీమెన్’ త్వరలోనే దేశంలోని ఇతర మెట్రో నగరాలైన హైదరాబాద్, బెంగళూరు, ముంబై వంటి ప్రాంతాలకు కూడా తమ సేవలను విస్తరించడానికి సన్నద్ధమవుతోంది. రాబోయే పండుగల సీజన్ నాటికి ఈ సేవలు మరింత విస్తృతం కానున్నాయి.ఇదీ చదవండి: 39 అత్యవసర ఔషధాల ధరల్లో మార్పు -
అతాను చక్రవర్తి ఆరోపణలపై మౌనం వీడిన కేకీ మిస్త్రీ!
దేశీయ బ్యాంకింగ్ రంగంలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్పొరేట్ పాలనా వివాదంపై బ్యాంక్ తాత్కాలిక చైర్మన్ కేకీ మిస్త్రీ ఎట్టకేలకు మౌనం వీడారు. మాజీ నాన్-ఎగ్జ్యూటివ్ చైర్మన్ అతాను చక్రవర్తి తన రాజీనామా లేఖలో లేవనెత్తిన ఆరోపణలను నిరూపించడానికి నిర్వహించిన స్వతంత్ర చట్టపరమైన సమీక్షలో ఎటువంటి ఆధారాలు లభించలేదని బ్యాంక్ స్పష్టం చేసింది. ఈ ఏడాది ఎదుర్కొన్న అతిపెద్ద పాలనా వివాదంపై, బ్యాంక్ తాజా వార్షిక నివేదికలో భాగంగా కేకీ మిస్త్రీ వాటాదారులకు వివరణ ఇచ్చారు.మార్చి 18, 2026న చక్రవర్తి రాజీనామా చేసిన తర్వాత, ఆయన లేవనెత్తిన సమస్యలను పరిశీలించడానికి ప్రముఖ దేశీయ, అంతర్జాతీయ న్యాయ సంస్థలను బోర్డు రంగంలోకి దించింది. ఈ స్వతంత్ర సమీక్ష జూన్ 26, 2026న పూర్తయింది.బాహ్య సమీక్షలో లభించని ఆధారాలువార్షిక నివేదిక ప్రకారం, చక్రవర్తి లేఖలోని చిక్కులను నిరూపించడానికి ఎటువంటి ఆధారాలు లభించలేదు. ఈ ప్రక్రియలో పారదర్శకత కోసం బోర్డు కొన్ని చర్యలు చేపట్టింది. ప్రయోజనాల వైరుధ్యం లేకుండా ఉండేందుకు కేవలం స్వతంత్ర డైరెక్టర్లతో కూడిన ప్రత్యేక కమిటీ పర్యవేక్షణలోనే ఈ సమీక్ష సాగింది. చక్రవర్తి రాజీనామాకు ముందు నాటి రెండేళ్ల కాలానికి సంబంధించిన బోర్డు పత్రాలు, అంతర్గత కమ్యూనికేషన్లను న్యాయ బృందాలు క్షుణ్ణంగా పరిశీలించాయి. ఇందులో భాగంగా ఇండిపెండెంట్ డైరెక్టర్లు, బ్యాంక్ ఎండీ అండ్ సీఈఓ, సీనియర్ మేనేజ్మెంట్ బృందాన్ని విచారించారు.కార్పొరేట్ పాలనకే మొగ్గుకార్పొరేట్ పాలన, పారదర్శకతకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కట్టుబడి ఉంటుందని మిస్త్రీ స్పష్టం చేశారు. ఈ పరిణామాలు బ్యాంకుకు సవాలుతో కూడిన దశను సూచించినప్పటికీ సంస్థ తన అంతర్గత పాలనా చట్రాన్ని మరింత బలోపేతం చేసిందన్నారు. తన రాజీనామాకు ముందు జరిగిన ఏ బోర్డు చర్చల్లోనూ చక్రవర్తి నైతికతకు విరుద్ధమైన పద్ధతులను ఎత్తి చూపలేదని బోర్డు మునుపటి వైఖరిని పునరుద్ఘాటించింది.ఇదీ చదవండి: 39 అత్యవసర ఔషధాల ధరల్లో మార్పు -
అనిల్ అంబానీ గ్రూప్ కథ ముగిసినట్లేనా?
అనిల్ అంబానీ గ్రూప్‌నకు చెందిన మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరోసారి భారీ చర్యకు దిగింది. శనివారం నాటి తాజా ఉత్తర్వుల ప్రకారం గ్రూప్‌నకు చెందిన రూ.1,021 కోట్ల విలువైన తాజా ఆస్తులను ఈడీ తాత్కాలికంగా అటాచ్ చేసింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ) కింద ఈ చర్యలు తీసుకున్నట్లు కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారిక ప్రకటనలో తెలిపింది. ఈ తాజా జప్తుతో కలిపి ఈ గ్రూపునకు సంబంధించి ఇప్పటివరకు అటాచ్ చేసిన మొత్తం ఆస్తుల విలువ రికార్డు స్థాయిలో రూ.20,367 కోట్లకు చేరింది.తాజా జప్తులో ఉన్న ఆస్తులు ఇవే..ఈ ప్రొవిజనల్ అటాచ్మెంట్ ఆర్డర్లో రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఆధీనంలో ఉన్న రిలయన్స్ పవర్ లిమిటెడ్ ఈక్విటీ షేర్లను, సాసన్ పవర్ లిమిటెడ్, రిలయన్స్ పవర్ లిమిటెడ్‌ల నుంచి రావలసిన కొన్ని రుణ వసూళ్ల (లోన్ రిలీవెబుల్స్) మొత్తాలను ఈడీ సీజ్ చేసింది. ఇటీవల ఈ గ్రూపునకు చెందిన ఈ-కాంప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రాంగణాలతో పాటు దాని డైరెక్టర్ల నివాసాల్లో నిర్వహించిన సోదాల్లో లభించిన కీలక పత్రాలు, అనుమానాస్పద లావాదేవీల ఆధారంగా ఈ ఆస్తులను గుర్తించినట్లు ఈడీ స్పష్టం చేసింది.అసలు కేసు ఏమిటి? ప్రజాధనం ఎలా మళ్లింది?ఈ భారీ కుంభకోణం వెనుక ఉన్న మూలాలు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దాఖలు చేసిన ఎఫ్ఐఆర్లలో ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకుల కన్సార్టియం ఇచ్చిన ఫిర్యాదుల మేరకు సీబీఐ ఈ కేసులను నమోదు చేసింది.ఈడీ దర్యాప్తులో తేలిన విషయాలురిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ (RHFL), రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ లిమిటెడ్ (RCFL) సంస్థల ద్వారా బ్యాంకుల నుంచి సేకరించిన దాదాపు రూ.15,548 కోట్ల ప్రజా ధనాన్ని అనిల్ అంబానీ గ్రూప్ పక్కదారి పట్టించింది. గ్రూప్ నియంత్రణలో ఉన్న ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్న డమ్మీ (షెల్) కంపెనీల నెట్వర్క్ ద్వారా ఈ నిధులను క్రమబద్ధంగా మళ్లించినట్లు దర్యాప్తులో నిర్ధారణ అయింది.ఈ కేసులో ఇటీవలే సీబీఐ ముంబైలోని ప్రత్యేక కోర్టులో రూ.4,097 కోట్ల బ్యాంక్ మోసానికి సంబంధించి తొలి చార్జ్‌షీట్‌ను దాఖలు చేసింది. ఇందులో రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ సంస్థలతో పాటు రిలయన్స్ క్యాపిటల్ మాజీ వైస్ చైర్మన్ అమితాబ్ ఝున్‌ఝున్‌వాలా వంటి కీలక అధికారుల పేర్లను చేర్చింది. ప్రస్తుతం ఈ కుంభకోణంలో మరికొంత మంది డైరెక్టర్లు, అనుబంధ సంస్థలు, ప్రభుత్వ అధికారుల పాత్రపై దర్యాప్తు సంస్థలు నిఘా పెట్టాయి. రాబోయే రోజుల్లో ఈ కేసులో మరిన్ని అరెస్టులు, జప్తులు జరిగే అవకాశాలు ఉన్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం.ఇదీ చదవండి: 39 అత్యవసర ఔషధాల ధరల్లో మార్పు -
‘ఫార్చ్యూన్ ఇండియా’ పవర్ఫుల్ మహిళగా నీతా అంబానీ టాప్
భారతదేశ ఆర్థిక, పారిశ్రామిక రంగాలను శాసిస్తున్న అత్యంత ప్రభావవంతమైన మహిళా లీడర్ల జాబితాలో రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్పర్సన్ నీతా అంబానీ ప్రథమ స్థానంలో నిలిచారు. ప్రతిష్టాత్మక సంస్థ ఫార్చ్యూన్ ఇండియా విడుదల చేసిన ‘మోస్ట్ పవర్ఫుల్ విమెన్ (ఎంపీడబ్ల్యూ) 2026’ జాబితాలో ఆమె మొదటిస్థానం కైవసం చేసుకున్నారు. ఇటీవల ముంబైలోని ఫోర్ సీజన్స్ హోటల్లో జరిగిన 16వ ఎడిషన్ అవార్డుల ప్రదానోత్సవంలో ఆమె ఈ గౌరవాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా నీతా అంబానీ మాట్లాడుతూ.. ఒక తల్లిగా తన కుమార్తె ఈషా అంబానీ (రిలయన్స్ రిటైల్ డైరెక్టర్) కూడా ఈ పవర్ఫుల్ 100 మంది జాబితాలో చోటు దక్కించుకోవడం తనకు గర్వకారణంగా ఉందన్నారు.అధికారం అంటే ఇతరులను సాధికారులను చేయడమే!అత్యున్నత పురస్కారాన్ని స్వీకరించిన అనంతరం సదస్సులో నీతా అంబానీ చేసిన ప్రసంగం ఆలోచింపజేసేలా సాగింది. ప్రస్తుత సమాజానికి హార్డ్ పవర్ కంటే మానవీయ విలువలతో కూడిన ‘సాఫ్ట్ పవర్’ అవసరమని ఆమె నొక్కిచెప్పారు. ‘నా దృష్టిలో నిజమైన అధికారం అంటే ఇతరులను సాధికారులను చేయడమే. నేడు ప్రపంచానికి కఠినమైన ఆధిపత్యం వద్దు.. కరుణ, సానుభూతి, ప్రకృతి, జీవకోటి పట్ల అపారమైన గౌరవంతో కూడిన సాఫ్ట్ పవర్ కావాలి. పిల్లలను మనం నమ్మినప్పుడు వారు సాధించలేనిదంటూ లేదు’ అని నీతా అంబానీ అన్నారు.దేశవ్యాప్తంగా విద్యా, ఆరోగ్య, క్రీడా, గ్రామీణాభివృద్ధి రంగాల్లో రిలయన్స్ ఫౌండేషన్ ఇప్పటివరకు 10 కోట్ల (100 మిలియన్లు) మందికి పైగా జీవితాలను ప్రభావితం చేసిందని, అందులో 2.9 కోట్ల మంది పిల్లలు ఉన్నారని ఈ సందర్భంగా నిర్వాహకులు కొనియాడారు.సదస్సులోని ముఖ్య చర్చలుభారత ఆర్థిక వృద్ధికి దిక్సూచిగా మారిన 100 మంది మహిళా శక్తిమూర్తులతో కూడిన ఈ 2026 జాబితా ఆవిష్కరణలో దేశంలోని బిజినెస్, ఫైనాన్స్, టెక్నాలజీ, పబ్లిక్ పాలసీ రంగాల లీడర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన ప్యానెల్ డిస్కషన్లలో పలు కీలక అంశాలు వ్యక్తమయ్యాయి.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వేగవంతమైన సాంకేతిక మార్పులు పరిశ్రమలను మారుస్తున్నప్పటికీ పట్టుదల, కస్టమర్ ఫోకస్, మానవ నిర్ణయాధికారమే శాశ్వత విజయానికి మూలమని బిజినెస్ లీడర్లు స్పష్టం చేశారు.మహిళా సాధికారత అంటే కేవలం బ్యాంక్ ఖాతాలు కలిగి ఉండటం కాదు. సంపద సృష్టి, కుటుంబ ఆర్థిక ప్రణాళికల్లో మహిళలు చురుకైన భాగస్వాములు కావాలని ఫైనాన్స్ రంగానికి చెందిన నిపుణులు అభిప్రాయపడ్డారు.‘వికసిత్ భారత్’ లక్ష్య సాధనలో సురక్షితమైన పని వాతావరణం, బలమైన కన్స్యూమర్ బ్రాండ్లు, మహిళలు-పిల్లల్లో సరైన పోషకాహారం, ఆరోగ్య సంరక్షణ అత్యంత కీలక పాత్ర పోషిస్తాయని సదసులో తెలిపారు. -
రూ.13,000తో రూ.20,000 కోట్ల వ్యాపార సామ్రాజ్యం
విజయానికి డిగ్రీలు అక్కర్లేదు. కేవలం పట్టుదల, వ్యాపార దార్శనికత ఉంటే చాలని నిరూపించిన పారిశ్రామికవేత్త ఆర్జీ చంద్రమోగన్. గణితంలో ఫెయిల్ అయి నెలకు కేవలం రూ.65 జీతానికి అప్రెంటిస్‌గా పనిచేసిన ఒక సాధారణ యువకుడు.. నేడు దేశంలో ప్రముఖ ప్రైవేట్ డెయిరీ సామ్రాజ్యానికి అధిపతిగా ఎదగడం ఒక అద్భుత ప్రయాణం. కేవలం రూ.13,000 ప్రారంభ పెట్టుబడితో మొదలైన ఆయన వ్యాపారం నేడు దాదాపు రూ.20,000 కోట్ల మార్కెట్ విలువ కలిగిన ‘హాట్సన్ ఆగ్రో ప్రొడక్ట్స్’గా రూపాంతరం చెందింది.వైఫల్యం నుంచి పాఠాలుతమిళనాడులోని గ్రామీణ కుటుంబంలో జన్మించిన చంద్రమోగన్ బాల్యం ఒడిదుడుకులతో సాగింది. కుటుంబ వ్యాపారం దెబ్బతినడంతో ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. దీనికి తోడు, పాళయంకోట్టైలోని సెయింట్ జేవియర్స్ కళాశాలలో ప్రీ-యూనివర్శిటీ కోర్సు చదువుతున్న సమయంలో ఆయన గణితంలో ఫెయిలవ్వడంతో చదువు ఆగిపోయింది. ఆ తర్వాత చెన్నైకి 160 కిలోమీటర్ల దూరంలోని విలుప్పురంలోని ఒక కలప డిపోలో నెలకు రూ.65 జీతానికి అప్రెంటిస్‌గా చేరారు. అక్కడ శారీరక శ్రమ చేస్తూ ఆర్డర్లు తీసుకునే క్రమంలోనే.. సొంతంగా ఏదైనా సాధించాలనే బలమైన వ్యాపార కాంక్ష చిగురించింది.రూ.13,000తో ‘అరుణ్’ బ్రాండ్సొంత వ్యాపారం ప్రారంభించాలనే కొడుకు ఆశయానికి తండ్రి అండగా నిలిచారు. కుటుంబానికి ఉన్న పూర్వీకుల భూమిని రూ.13,000కు విక్రయించి పెట్టుబడి పెట్టారు. ఎలాంటి అధికారిక వ్యాపార ప్రణాళికలు లేదా ఇన్వెస్టర్ల సాయం లేకుండా 1970లో చెన్నైలోని రాయపురంలో 250 చదరపు అడుగుల చిన్న అద్దె గదిలో చంద్రమోగన్ తన వ్యాపార ప్రయాణాన్ని ప్రారంభించారు. నలుగురు ఉద్యోగులు, ఒక ప్రాథమిక ఐస్ తయారీ యంత్రంతో రోజుకు 10,000 ఐస్ క్రీమ్‌ల సామర్థ్యంతో ‘అరుణ్’ (Arun Icecreams) బ్రాండ్ పుట్టింది. ప్రారంభ రోజుల్లో చంద్రమోగన్ స్వయంగా చెన్నై వీధుల్లో తోపుడు బండిపై ఐస్ క్రీమ్‌లు అమ్మడం గమనార్హం.ఐస్ క్రీమ్ నుంచి డెయిరీ వైపు అడుగులుదాదాపు దశాబ్దం పాటు ఐస్ క్రీమ్ రంగంలో నిలదొక్కుకున్న చంద్రమోగన్ కేవలం సీజనల్ వ్యాపారమైన ఐస్ క్రీమ్‌ల కంటే నిత్యం డిమాండ్ ఉండే పాలు, పాల ఉత్పత్తుల రంగంలో అపారమైన అవకాశాలు ఉన్నాయని గుర్తించారు. అప్పటికే అసంఘటితంగా ఉన్న భారతీయ డెయిరీ మార్కెట్‌ను క్రమబద్ధీకరించేందుకు 1980ల్లో పాల ప్రాసెసింగ్‌లోకి అడుగుపెట్టారు.కంపెనీ క్రమంగా వెన్న, నెయ్యి, పెరుగు వంటి ఉత్పత్తులను జోడించి విస్తరించింది. వేగవంతమైన లాభాల కంటే.. నమ్మకమైన సరఫరా గొలుసు ఏర్పాటు, రైతులు, రిటైలర్లతో బలమైన సంబంధాలు, పంపిణీ నెట్వర్క్ బలోపేతం పైనే ఆయన దృష్టి సారించారు. ఈ దీర్ఘకాలిక వ్యూహమే ‘హాట్సన్ ఆగ్రో ప్రొడక్ట్స్’ను దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రంగ డెయిరీ సంస్థగా నిలబెట్టింది.గ్లోబల్ బిలియనీర్ల జాబితాలో స్థానంఐదు దశాబ్దాల కృషి ఫలితంగా హాట్సన్ ఆగ్రో మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.20,000 కోట్ల మార్కును దాటింది. ఫోర్బ్స్ గణాంకాల ప్రకారం చంద్రమోగన్ నికర ఆస్తి విలువ 1.6 బిలియన్ డాలర్లు. ఆయన 2023లో భారత ధనవంతుల జాబితాలో 99వ స్థానంలో, 2026 నాటికి ప్రపంచ బిలియనీర్ల జాబితాలో 2,481వ స్థానంలో నిలిచారు. పాడి పరిశ్రమకు చేసిన విశేష సేవలకు గానూ 2018లో ఇండియన్ డెయిరీ అసోసియేషన్ నుంచి ‘ప్యాట్రాన్ అవార్డు’ (పోషక అవార్డు) అందుకున్నారు.ఇదీ చదవండి: 39 అత్యవసర ఔషధాల ధరల్లో మార్పు -
39 అత్యవసర ఔషధాల ధరల్లో మార్పు
దేశంలో సామాన్యుడి వైద్యభారాన్ని తగ్గించే దిశగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిరంతరం వాడాల్సిన అత్యవసర మందుల ధరలను నియంత్రిస్తూ జాతీయ ఔషధ ధరల నియంత్రణ సంస్థ (ఎన్పీపీఏ) సరికొత్త ఉత్తర్వులు జారీ చేసింది. మధుమేహం (డయాబెటిస్), రక్తపోటు (బీపీ), గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక వ్యాధుల చికిత్సకు ఉపయోగించే 39 కీలక ఔషధాల (న్యూ డ్రగ్ ఫార్ములేషన్స్) రిటైల్ ధరలపై ఎన్పీపీఏ గరిష్ఠ పరిమితిని (క్యాపింగ్) విధించింది. డ్రగ్స్ ప్రైస్ కంట్రోల్ ఆర్డర్ (డీపీసీఓ), 2013 నిబంధనల ప్రకారం ఇటీవల జారీ చేసిన ఈ అధికారిక నోటిఫికేషన్లు తక్షణమే అమలులోకి రానున్నాయి.కీలక సవరణలు.. ధరల వివరాలుఎన్పీపీఏ తాజా ఉత్తర్వుల ప్రకారం, నిత్యం ప్రజలు ఉపయోగించే విటమిన్లు, అత్యవసర ఇంజెక్షన్ల ధరలను ఈ క్రింది విధంగా నిర్ణయించారు:కాల్షియం, విటమిన్ D3 మాత్రలు: ఎముకల పుష్టికి, విటమిన్లోప నివారణకు విస్తృతంగా వాడే ఈ మాత్రల గరిష్ఠ రిటైల్ ధరను అన్ని పన్నులతో కలిపి ఒక టాబ్లెట్‌కు రూ.8.93గా స్థిరీకరించారు.యాంటీ-రేబీస్ ఇమ్యునోగ్లోబులిన్ ఇంజెక్షన్: పిచ్చి కుక్కలు లేదా ఇతర జంతువులు కరిచినప్పుడు అత్యవసరంగా ఇచ్చే ఈ ప్రాణరక్షక ఇంజెక్షన్ (150 IU/ml) ధరను రూ.119.48గా సవరించారు.కార్డియాక్, బీపీ ఔషధాలు: గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాలను తగ్గించే క్లోపిడోగ్రెల్ + ఆస్పిరిన్ + అటోర్వాస్టాటిన్ క్యాప్సూల్ ధరను ఒక్కోదానికి రూ.6.37గా, హైపర్‌టెన్షన్ చికిత్సకు వాడే అమ్లోడిపైన్ + బైసోప్రోలోల్ + టెల్మిసార్టాన్ టాబ్లెట్ ధరను రూ.14.74గా నిర్ణయించారు.జీవనశైలి జబ్బుల బాధితులకు ఊరటభారతదేశంలో వైద్య ఖర్చులు చాలా ఎక్కువ. ముఖ్యంగా ఇంట్లో వృద్ధులు లేదా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఉన్న కుటుంబాలకు నెలవారీ మందుల బిల్లులు పెద్ద భారంగా మారుతున్నాయి. తాజా నిర్ణయం ద్వారా బీపీ, షుగర్, హెచ్ఐవీ, శ్వాసకోశ సమస్యలు, కంటి ఇన్ఫెక్షన్ల ఔషధాల ధరలు నియంత్రణలోకి రావడం వల్ల మధ్యతరగతి, పేద కుటుంబాల బడ్జెట్‌కు పెద్ద ఊరట లభించనుంది.ఇదీ చదవండి: నిప్పుల కొలిమిలో నగరాలు -
కలుషిత ఆహారం.. స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌కు నోటీసులు
ప్రముఖ క్విక్-కామర్స్ ప్లాట్‌ఫారమ్ స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌కు భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) షాక్ ఇచ్చింది. వినియోగదారుల నుంచి వచ్చిన నాణ్యత ఫిర్యాదుల నేపథ్యంలో సంస్థకు ఫుడ్ రెగ్యులేటర్ ఏకంగా 9 నోటీసులను జారీ చేసింది. కాలం చెల్లిన, కలుషితమైన, సురక్షితంకాని ఆహార పదార్థాలను సరఫరా చేస్తున్నారనే ఆరోపణలపై ఈ నోటీసులు అందినట్లు జాతీయ మీడియా కథనాలు స్పష్టం చేస్తున్నాయి.లోపభూయిష్ట సేవలు.. కస్టమర్ల ఆగ్రహంఇటీవలి కాలంలో క్విక్ కామర్స్ యాప్‌ల ద్వారా నిమిషాల వ్యవధిలో నిత్యావసరాలు, ఆహార పదార్థాలను డెలివరీ పొందే ధోరణి మెట్రో నగరాల్లో విపరీతంగా పెరిగింది. అయితే, వేగంగా డెలివరీ చేయాలనే తపనలో నాణ్యతా ప్రమాణాలను గాలికొదిలేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ ద్వారా ఆర్డర్ చేసిన వస్తువులలో కొన్ని ప్రధాన లోపాలు ఉన్నట్లు వినియోగదారులు ఫిర్యాదులు చేశారు. అందులో..ఎక్స్పైరీ డేట్ ముగిసిన పాలు, బ్రెడ్, ప్యాక్డ్ ఫుడ్స్ సరఫరా చేయడం.కొన్ని ప్యాకెట్లలో పురుగులు రావడం, కూరగాయలు/పండ్లు కుళ్లిపోయి ఉండటం.నిల్వ ఉంచే ప్రమాణాలు పాటించకపోవడం వల్ల ఆహార భద్రతకు ముప్పు వాటిల్లడం.నోటీసుల్లో ఏముంది?వినియోగదారుల రక్షణ చట్టాలు, ఆహార భద్రత చట్టాల ప్రకారం ఈ లోపాలపై వివరణ ఇవ్వాల్సిందిగా ఫుడ్ రెగ్యులేటర్ స్విగ్గీ యాజమాన్యాన్ని ఆదేశించింది.1. పంపిణీ కేంద్రాల్లో(డార్క్ స్టోర్స్) నిల్వ పద్ధతులు ఎలా ఉన్నాయి?2. క్వాలిటీ చెకింగ్ కోసం ఎలాంటి నిబంధనలు పాటిస్తున్నారు?3. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకునే చర్యలు ఏమిటి?ఈ విధమైన తొమ్మిది నోటీసులకు సంబంధించి స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ నిర్దేశిత గడువులోగా అధికారిక వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఇచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేకపోతే భారీ జరిమానాలతో పాటు సదరు డార్క్ స్టోర్ల లైసెన్సులను రద్దు చేసే అవకాశం కూడా ఉందని కొందరు నిపుణులు అంచనా వేస్తున్నారు.వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలిఈ నేపథ్యంలో వినియోగదారులు ఆన్లైన్లో ఆహార పదార్థాలు, నిత్యావసరాలు ఆర్డర్ చేసేటప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. వస్తువు డెలివరీ అయిన వెంటనే ప్యాకెట్‌పై ఉన్న ఉత్పత్తి తేదీ, ఎక్స్పైరీ తేదీలను తప్పనిసరిగా తనిఖీ చేసుకోవాలి. ఎలాంటి లోపాలున్నా వెంటనే సదరు ప్లాట్‌ఫారమ్‌తో పాటు జాతీయ వినియోగదారుల హెల్ప్‌లైన్ లేదా ఎఫ్ఎస్ఎస్ఏఐకి ఫిర్యాదు చేయవచ్చు.ఇదీ చదవండి: నిప్పుల కొలిమిలో నగరాలు -
యువతకు అలర్ట్.. రాబర్ట్ కియోసాకి పోస్ట్!
బంగారం, వెండి, బిట్‌కాయిన్ గురించి చెప్పే 'రాబర్ట్ కియోసాకి' (Robert Kiyosaki) ఏఐ గురించి, ఉద్యోగాల గురించి వివరించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఎంత వేగంగా అభివృద్ధి చెందుతోందో.. దాని ప్రభావం ఉద్యోగాలపై కూడా అంతే వేగంగా కనిపిస్తోంది. ఇప్పటికే పలు దిగ్గజ కంపెనీలు ఏఐ టెక్నాలజీని తమ పనుల్లో ఉపయోగించడం మొదలెట్టేశాయి. దీన్నిబట్టి చూస్తే రాబోయే రోజుల్లో ఉద్యోగాలు గణనీయంగా తగ్గుతాయని నిపుణులు పేర్కొన్నారు. అమెరికా మాజీ వాణిజ్య శాఖ మంత్రి కూడా ఇదే విషయాన్ని వెల్లడించిందని కియోసాకి పేర్కొన్నారు.అమెరికా మాజీ వాణిజ్య శాఖ మంత్రి అభిప్రాయం ప్రకారం.. 25 నుంచి 35 ఏళ్ల మధ్య వయసున్న యువ ఉద్యోగులు రాబోయే కాలంలో ఏఐ ప్రభావానికి గుయారవుతారు. నిరుద్యోగం బాగా పెరిగిపోతుంది. అడ్మినిస్ట్రేటివ్, ఫైనాన్స్, డేటా విశ్లేషణ వంటివన్నీ కూడా ఏఐ చేతుల్లోకి వెళ్లిపోయే అవకాశం ఉంది. అనేక కంపెనీల సీఈఓలు కూడా ఈ మార్పుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.అమెరికా వద్ద ఏఐ అభివృద్ధికి కావలసిన స్పష్టమైన వ్యూహం ఉన్నప్పటికీ.. ఈ మార్పుల వల్ల ప్రభావితమయ్యే ఉద్యోగులను ఎలా సిద్ధం చేయాలనే దానికి కావాల్సిన ప్రణాళిక లేదని పేర్కొన్నారు. కాబట్టి యువత ఉద్యోగాల కోసం ప్రభుత్వాలు లేదా ఇతర కంపెనీల మీద ఆధారపడకుండా.. తమ భవిష్యత్తును తామే సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.జాబ్ చేస్తున్నవారు సైతం కేవలం ఒక ఉద్యోగంపై మాత్రమే ఆధారపడకుండా.. కొత్త స్కిల్స్ నేర్చుకోవడం, ఏఐతో ఎలా కలిసి పనిచేయాలి అనే విషయాలను నేర్చుకోవాలి. అవసరమైతే సొంతంగా కొత్త ఆదాయ మార్గాలను అన్వేషించడం ముఖ్యమని చెబుతున్నారు. మొత్తం మీద ఏఐ ఉద్యోగాలకు ముప్పు తెస్తుందని స్పష్టంగా తెలుస్తోంది. -
విమానం ఆలస్యమైతే.. ఇవి ఉచితం!
వర్షాకాలంలో భారీ వర్షాల కారణంగా.. విమానాల రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. దీంతో కొన్నిసార్లు విమానాలు ఆలస్యంగా బయలుదేరడం లేదా పూర్తిగా రద్దు కావడం వంటి పరిస్థితులు ఎదురవుతాయి. అలాంటి సమయంలో ప్రయాణికులకు ఇబ్బందులు కలుగుతాయి. అయితే.. విమానం ఆలస్యమైనా లేదా రద్దైనా ప్రయాణికులకు కొన్ని ప్రత్యేకమైన హక్కులు లభిస్తాయి. ఈ హక్కులను పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తన ప్యాసింజర్ చార్టర్లో స్పష్టంగా పేర్కొంది.విమానం ఆలస్యమైతే..నిర్ణీత సమయానికి విమానాశ్రయానికి చేరుకుని చెక్-ఇన్ పూర్తి చేసి ఉంటే, విమానం ఆలస్యమైన సమయాన్ని బట్టి ఎయిర్‌లైన్ సంస్థ ఉచితంగా భోజనం, తాగునీరు లేదా ఇతర రిఫ్రెష్మెంట్లు అందించాలి. ప్రయాణ సమయం, ఆలస్యమైన గంటలను బట్టి ఈ సౌకర్యాలు అందించాలని నిబంధనలు చెబుతున్నాయి.రీఫండ్ ఎంపికదేశీయ విమానం ఆరు గంటలకు పైగా ఆలస్యమవుతుందని ముందే తెలిసినప్పుడు, ఎయిర్‌లైన్ సంస్థ కనీసం 24 గంటల ముందే ప్రయాణికులకు సమాచారం ఇవ్వాలి. అలాంటి పరిస్థితుల్లో ప్రయాణికులు ప్రత్యామ్నాయ విమానాన్ని ఎంచుకోవచ్చు, లేదా పూర్తి టికెట్ మొత్తాన్ని రీఫండ్‌గా పొందవచ్చు.ఒకవేళ ఎయిర్‌లైన్ సంస్థ సరైన సమయంలో ప్రయాణికులకు సమాచారం ఇవ్వకపోతే లేదా అదే టికెట్‌పై బుక్ చేసిన కనెక్టింగ్ ఫ్లైట్ మిస్ అయ్యేలా జరిగితే, కేవలం రీఫండ్ మాత్రమే కాకుండా అదనంగా పరిహారం కూడా చెల్లించాల్సి ఉంటుంది.ప్రత్యామ్నాయ విమానం కోసం ప్రయాణికులు విమానాశ్రయంలో వేచి ఉండాల్సి వస్తే.. ఆ సమయంలో కూడా భోజనం, రిఫ్రెష్మెంట్లు ఉచితంగా అందించాల్సిన బాధ్యత ఎయిర్‌లైన్ సంస్థదే. అయితే.. టికెట్ బుక్ చేసుకునే సమయంలో సరైన మొబైల్ నెంబర్, ఈమెయిల్ వివరాలు ఇవ్వాలి. ఎందుకంటే విమానం ఆలస్యానికి సంబంధించిన వివరాలు ఇక్కడ పంచుకుంటారు. సరైన వివరాలు ఇవ్వని సమయంలో విమానం రద్దు లేదా ఆలస్యం గురించి సమాచారం అందకపోయినా, ఆర్థిక పరిహారం కోరే హక్కు ఉండదు. -
ఐటీ ఉద్యోగులకు మంచి రోజులు
గత కొంతకాలంగా మందగమనంతో (స్లోడౌన్) సాగిన దేశీయ ఐటీ రంగ నియామకాల్లో ఎట్టకేలకు కదలిక వచ్చింది. ప్రముఖ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (క్యూ1) ఊహించని విధంగా 9,000 మందికి పైగా కొత్త ఉద్యోగులను చేర్చుకోవడంతో ఐటీ రంగంలో మళ్లీ మంచి రోజులు మొదలయ్యాయనే సంకేతాలు కనిపిస్తున్నాయి. టీసీఎస్ చూపిన ఈ భారీ సానుకూల ధోరణి తర్వాత ఇప్పుడు మార్కెట్ నిపుణులు, ఉద్యోగార్థుల దృష్టి ఇతర అగ్రశ్రేణి కంపెనీలైన ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, విప్రోల నియామక ప్రణాళికలపై పడింది.నాలుగేళ్లలో లేనంత గరిష్టానికి..ప్రస్తుత క్వార్టర్ (Q1FY27)లో టీసీఎస్ ఏకంగా 9,279 మంది నెట్ ఉద్యోగులను అదనంగా చేర్చుకుంది. ఇది గత నాలుగేళ్లలోనే అత్యుత్తమ త్రైమాసిక నియామక రికార్డు కావడం విశేషం. గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం (Q4FY26)తో పోలిస్తే ఇది మూడు రెట్లు ఎక్కువ. ముఖ్యంగా డొమైన్ నిపుణులు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో అనుభవజ్ఞులైన లాటరల్ హైరింగ్‌పై (అనుభవజ్ఞుల రిక్రూట్మెంట్) టీసీఎస్ దృష్టి పెట్టింది. అంతర్జాతీయ సంస్థ యాక్సెంచర్ ఇటీవలి త్రైమాసికంలో దాదాపు 12,000 మందిని చేర్చుకున్న విధానాన్ని పోలి ఉండటంతో భారత ఐటీ రంగం రికవరీ బాట పట్టిందని ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ నువామా విశ్లేషించింది. ప్రస్తుతం టీసీఎస్ మొత్తం ఉద్యోగుల సంఖ్య 6,13,069 కి చేరింది.మిగిలిన ఐటీ దిగ్గజాల స్థితిఇన్ఫోసిస్ తన గత ఇన్వెస్టర్ల సమావేశంలో ఈ ఆర్థిక సంవత్సరంలో (FY27) సుమారు 20,000 మంది ఫ్రెషర్లను (కాలేజీల నుంచి కొత్తగా పాసైన వారు) నియమించుకుంటామని ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం (FY26) లో కూడా ఇదే సంఖ్యలో ఫ్రెషర్లను తీసుకుంది. అయితే, FY26 చివరి త్రైమాసికం (Q4) లో కంపెనీ ఉద్యోగుల సంఖ్య నెట్‌గా 8,440 మేర తగ్గింది.హెచ్‌సీఎల్ టెక్నాలజీస్హెచ్సీఎల్ టెక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి స్పష్టమైన నియామక గైడెన్స్‌ను (ముందస్తు అంచనా) ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయినప్పటికీ, గత క్వార్టర్ (Q4FY26) వరకు కంపెనీ నియామకాలను కొనసాగించింది. గత త్రైమాసికంలో 1,712 మంది ఫ్రెషర్లను చేర్చుకుంది. ప్రస్తుతం కంపెనీ మొత్తం సిబ్బంది సంఖ్య 2,27,181 గా ఉంది.విప్రోవిప్రో ప్రస్తుతం నియామకాల విషయంలో కాస్త ఆచితూచి వ్యవహరిస్తోంది. భారీ ఎత్తున నియామకాల ప్రకటనలు చేయనప్పటికీ మార్చి 1 నుంచి ఉద్యోగులకు వేతన పెంపును ప్రకటించింది. ఇది రాబోయే రోజుల్లో కంపెనీ లాభాల మార్జిన్లపై స్వల్ప ప్రభావం చూపే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. గత క్వార్టర్ ముగిసే సమయానికి కేవలం 136 మంది మాత్రమే కొత్తగా చేరడంతో విప్రో మొత్తం ఉద్యోగుల సంఖ్య 2,42,156 వద్ద నిలిచింది.ఇదీ చదవండి: బీఎస్ఎన్ఎల్ శాటిలైట్ ఫోన్ లాంచ్! -
ఇండిగోకు డీజీసీఏ హెచ్చరిక
దేశీయ విమానయాన రంగంలో అగ్రగామిగా ఉన్న ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు గగనతల నియంత్రణ సంస్థ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) హెచ్చరిక జారీ చేసింది. విమానాల్లో కార్గో నిర్వహణ, ప్రమాదకర వస్తువుల రవాణాకు సంబంధించిన ప్రామాణిక కార్యాచరణ విధానాల (ఎస్ఓపీ) ఉల్లంఘనలపై ఈ హెచ్చరిక లేఖ పంపింది. ‘ఎయిర్‌క్రాఫ్ట్ (క్యారేజ్ ఆఫ్ డేంజరస్ గూడ్స్) రూల్స్, 2026’ నిబంధనలను విస్మరించడంపై డీజీసీఏ అసంతృప్తి వ్యక్తం చేసింది.ఆడిట్లో బయటపడిన లోపాలుఈ ఏడాది జనవరిలో ఇండిగోకు చెందిన ఒక విమానం ల్యాండ్ అయిన తర్వాత గ్రౌండ్‌పై కార్గో (సరుకులు) కింద చిందినట్లు (స్పిల్లేజ్) అధికారులు గుర్తించారు. ఈ ఉదంతంపై డీజీసీఏ నిశితంగా పరిశీలించి ఇండిగో కార్గో విభాగంలో ప్రత్యేక ఆడిట్ నిర్వహించింది. ఈ తనిఖీల్లో విమానయాన భద్రతా నిబంధనలు, ప్రమాదకర వస్తువుల హ్యాండ్లింగ్ ప్రొసీజర్లలో తీవ్ర లోపాలు ఉన్నట్లు తేలింది. దీనిపై పూర్తి వివరణ ఇస్తూ భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా తీసుకున్న చర్యలపై ‘యాక్షన్ టేకెన్ రిపోర్ట్’ (ఏటీఆర్) సమర్పించాలని డీజీసీఏ ఆదేశించింది. ఈ హెచ్చరిక లేఖను ఎయిర్‌లైన్స్ జులై 8న అందుకుంది.స్టాక్ ఎక్స్ఛేంజీలకు ఆలస్యంగా సమాచారంఈ భద్రతాపరమైన పరిణామానికి సంబంధించి సెబీ ఎల్ఓడీఆర్ రెగ్యులేషన్ 30 ప్రకారం స్టాక్ ఎక్స్ఛేంజీలకు ఇండిగో మాతృసంస్థ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ ఆలస్యంగా సమాచారం ఇచ్చింది. ఈ జాప్యం వెనుక ఎలాంటి దురుద్దేశం లేదని కేవలం సంస్థలోని అంతర్గత కమ్యూనికేషన్ లోపం వల్లే నియంత్రణ సంస్థల లేఖ వివరాలను స్టాక్ మార్కెట్లకు సకాలంలో వెల్లడించలేకపోయామని కంపెనీ సెక్రటరీ, చీఫ్ కాంప్లయన్స్ ఆఫీసర్ నీరజా శర్మ స్పష్టం చేశారు.కార్యకలాపాల పరంగా ఎలాంటి ప్రభావం లేదుఈ హెచ్చరిక లేఖ వల్ల ఇండిగో విమాన సర్వీసులపై గానీ, సంస్థ ఆర్థిక పరిస్థితిపై గానీ ఎలాంటి ప్రతికూల ప్రభావం పడబోదని యాజమాన్యం వెల్లడించింది. డీజీసీఏ కేవలం హెచ్చరిక లేఖ మాత్రమే ఇచ్చిందని, ప్రస్తుతానికి ఎలాంటి జరిమానా , సర్వీసులపై ఆంక్షలు విధించలేదని పేర్కొంది. నిబంధనల ప్రకారం భద్రతా ప్రమాణాలను మరింత కఠినతరం చేస్తామని ప్రకటించింది.ఇదీ చదవండి: బీఎస్ఎన్ఎల్ శాటిలైట్ ఫోన్ లాంచ్! -
ఆటోమొబైల్ దిగ్గజం వోక్స్వ్యాగన్ వినూత్న ప్రయోగం : 100 గొర్రెలతో..!
జర్మనీకి చెందిన ప్రముఖ ఆటోమొబైల్ తయారీ సంస్థ వోక్స్వ్యాగన్ (Volkswagen) వినూత్ర ప్రయోగం విశేషంగా నిలుస్తోంది. పోలాండ్లోని పోజ్నాన్ (Poznań) నగరంలో ఉన్న తన తయారీ ప్లాంట్‌లో ఒక సరికొత్త, పర్యావరణహితమైన ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. అక్కడున్న 31,000 కంటే ఎక్కువ సోలార్ ప్యానెళ్ల కింద పెరిగే గడ్డిని తొలగించేందుకు సాంప్రదాయ మెకానికల్ యంత్రాలకు (Lawnmowers) బదులుగా 100 గొర్రెల మందను రంగంలోకి దించింది. దీనివల్ల ఇంధన ఖర్చులు, నిర్వహణ సమస్యలు తగ్గడమే కాకుండా, సౌర ఫలకాల నీడ వల్ల గొర్రెలకు వేడి నుంచి ఉపశమనం లభిస్తుందని భావిస్తోంది.ఐరోపాలోనే అతిపెద్ద ఆన్-సైట్ సోలార్ ప్యానల్ వ్యవస్థలలో ఒకటి.పోజ్నాన్ ప్లాంట్‌లో ఉన్న 18.3 మెగావాట్ (MW) సోలార్ ప్లాంట్ ఇది వోక్స్వ్యాగన్ ఫ్యాక్టరీకి అవసరమైన వార్షిక విద్యుత్తులో 25 శాతం వరకు అందిస్తుంది. ఇక్కడి ప్యానెళ్ల కింద గడ్డి విపరీతంగా పెరగడం వల్ల నిర్వహణ కష్టంగా మారింది. దీంతో యంత్రాల వాడకాన్ని తగ్గించి,సహజంగా గడ్డిని తొలగించేందుకు గొర్రెలతో మేపుతున్నారు. ఇది యంత్రాల వల్ల వచ్చే కర్బన ఉద్గారాలను, ఖర్చులను తగ్గిస్తుంది.గివ్ అండ్ టేక్ పాలసీదీని వల్ల అటు కంపెనీకి లాభం, ఇటు గొర్రెలకు చక్కటి ఆహారం, చల్లదని వస్తుందని భావిస్తోంది. అంటే ఎండ ఎక్కు వున్నపుడు సోలార్ ప్యానెళ్లు గొర్రెలకు చల్లని నీడను ఇస్తూ, వడదెబ్బ తగలకుండా కాపాడతాయి. అలాగే ప్యానెళ్ల కింద ఏపుగా పెరిగిన గడ్డిని శుభ్రంగా మేసేయడం వల్ల ఫ్యాక్టరీకి నిర్వహణ భారం తగ్గుతుంది. ఈ వినూత్న ప్రయోగంలో వోక్స్వ్యాగన్ సంస్థ పోజ్నాన్ యూనివర్సిటీ ఆఫ్ లైఫ్ సైన్సెస్‌తో చేతులు కలిపింది. జంతు సంరక్షణ, ఆరోగ్యం రక్షణతోపాటు, నేల నాణ్యత, జీవవైవిధ్యం (biodiversity), కీటకాల పెరుగుదలను ప్రోత్సహిస్తుందని పరిశోధకులు చెబు తున్నారు. ఇదీ చదవండి : 20 రోజుల్లోనే కొడుకు, తండ్రిని కోల్పోయాను : న్యాయం చేయండి!గొర్రెల యజమాని ఏమన్నారంటేగొర్రెల యజమాని జస్టినా నోవాక్-గజెక్ మాట్లాడుతూ.. గొర్రెలు భయపడితే గుంపులుగా ఒకేచోట ఉండి పోతాయని, కానీ ఇక్కడ అవి చిన్న చిన్న సమూహాలుగా విడిపోయి ప్రశాంతంగా మేస్తున్నాయని చెప్పారు. దీన్ని బట్టి ఆ జంతువులు అక్కడ చాలా సురక్షితంగా భావిస్తున్నట్లు స్పష్టమవుతోంది. పర్యావరణానికి నష్టం రాకుండా, కార్బన్ ఉద్గారాల బెడద లేకుండా ఆధునిక పరిశ్రమలు ప్రకృతితో కలిసి ఎలా ప్రయాణించ వచ్చో చెప్పడానికి ఈ "సోలార్ ప్యానెల్స్ + గొర్రెల పెంపకం" ఒక అద్భుతమైన ఉదాహరణగా నిలుస్తోంది. ఇదీ చదవండి: 5 రకాల ఫుడ్స్ కంప్లీట్ బంద్ : 11 నెలల్లో 32 కిలోలు తగ్గింది -
నాలుగు ఫ్లాట్లకు రూ. 180 కోట్లు : ఈ డీల్ ఎవరిదో తెలుసా?
ముంబై రియల్ ఎస్టేట్ మార్కెట్లో జరిగిన భారీ డీల్ హాట్ టాపిక్‌గా నిలిచింది. ఆస్క్ (ASK) వెల్త్ అండ్ అసెట్ మేనేజ్మెంట్ గ్రూప్ మాజీ డైరెక్టర్ భారత్ షా కుటుంబం ముంబైలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన వర్లీ ప్రాంతంలో నాలుగు లగ్జరీ అపార్ట్మెంట్లను కొనుగోలు చేసింది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న 'కల్పతరు వన్' (Kalpataru One) ప్రాజెక్ట్‌లో జరిగిన ఈ డీల్ మొత్తం విలువ దాదాపు రూ. 180 కోట్లు. రియల్ ఎస్టేట్ విక్రయాల వృద్ధి నెమ్మదించిందనే ఆందోళనలు ఉన్నప్పటికీ, ముంబై, ఢిల్లీ NCR వంటి ప్రధాన నగరాల్లోని లగ్జరీ ప్రాజెక్టులలో భారీ లావాదేవీలు,ధరల పెరుగుదల కొనసాగుతూనే ఉంది. ఈ ఏడాది జరిగిన అతిపెద్ద నివాస ప్రాపర్టీ లావాదేవీలలో ఇది ఒకటిగా నిలిచింది.రియల్ ఎస్టేట్ డేటా అనలిటిక్స్ సంస్థ 'జాప్కీ' (Zapkey) సేకరించిన రిజిస్ట్రేషన్ పత్రాల ద్వారా ఈ వివరాలు వెలుగులోకి వచ్చాయి. భరత్ షా భార్య ప్రీతి షా, కుమార్తె కిన్నారి షా లిస్టెడ్ డెవలపర్ కల్పతరు లిమిటెడ్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌లోని 34వ, 35వ అంతస్తులలోని అపార్ట్మెంట్లను కొనుగోలు చేశారు. రెరా (RERA) నిబంధనల ప్రకారం ఈ నాలుగు ఫ్లాట్ల మొత్తం కార్పెట్ ఏరియా 17,689 చదరపు అడుగులు (అంటే ఒక్కో అపార్ట్మెంట్ దాదాపు 4,422 చదరపు అడుగులు). చదరపు అడుగు ధర సుమారు రూ. 1.01 లక్షలుగా పలికింది.రూ. 9 కోట్ల స్టాంప్ డ్యూటీమహిళల పేరిట ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేయడం వల్ల మహారాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే 1శాతం రాయితీ లభించినప్పటికీ, ఈ డీల్ కోసం రూ. 8.97 కోట్ల స్టాంప్ డ్యూటీ చెల్లించారు. ఈ ఇళ్లతో పాటు 16 కార్ పార్కింగ్ స్లాట్లు కూడా కేటాయించబడ్డాయి. అంతేకాదు ఈ-క్లినికల్ వర్క్స్ (eClinicalWorks) సీఈఓ గిరీష్ నవాని భార్య రాధి నవాని, వర్లీ సీ ఫేస్‌లోని 'నమన్ క్షానా' ప్రాజెక్ట్‌లో ఒక అపార్ట్‌మెంట్‌ను రూ. 162 కోట్లకు కొనుగోలు చేశారు. ఇదీ చదవండి : 20 రోజుల్లోనే కొడుకు, తండ్రిని కోల్పోయాను : న్యాయం చేయండి! -
రైలు ప్రయాణికులకు అలర్ట్.. అలాంటి టికెట్ చెల్లదు!
డిజిటల్ అన్రిజర్వ్డ్ టికెట్లను ఉపయోగించే ప్రయాణికులకు ఇండియన్ రైల్వే కీలక సూచనలు జారీ చేసింది. రైల్ వన్ (Rail One) యాప్ ద్వారా బుక్ చేసిన అన్రిజర్వ్డ్ టికెట్లను.. టికెట్ తనిఖీ సమయంలో తప్పనిసరిగా అదే యాప్‌లో ఒరిజినల్ రూపంలో చూపించాలని వెల్లడించింది.టికెట్‌కు సంబంధించిన స్క్రీన్‌షాట్, ఫొటో, పీడీఎఫ్ కాపీ లేదా వాట్సాప్‌లో ఫార్వర్డ్ చేసిన కాపీలు చెల్లుబాటు కావని రైల్వే అధికారులు తెలిపారు. డిజిటల్ టికెట్ల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ఈ నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తున్నట్లు వెల్లడించారు.ఇండియన్ రైల్వే ఈ సూచనలు చేయడానికి కారణం ఇటీవల కోర్బా-విశాఖపట్నం లింక్ ఎక్స్‌ప్రెస్ రైలులో చోటు చేసుకున్న ఘటనే. కోర్బా నుంచి రాయ్‌పూర్‌కు ప్రయాణిస్తున్న ఓ మహిళ తన టికెట్‌ను వాట్సాప్‌లో వచ్చిన స్క్రీన్‌షాట్ రూపంలో టికెట్ తనిఖీ అధికారికి చూపించారు. అయితే ఆ టికెట్‌ను ఆమె సోదరుడు రైల్ వన్ యాప్ ద్వారా బుక్ చేసి, స్క్రీన్‌షాట్‌ను ఆమెకు పంపినట్లు తెలిసింది. అయితే.. విచారణలో టికెట్ రైలు బయలుదేరిన తర్వాత బుక్ చేసినట్లు, అలాగే అది ఆమె రిజిస్టర్డ్ మొబైల్ నంబర్లో లేకపోవడంతో అధికారులు దానిని చెల్లని టికెట్‌గా ప్రకటించి నిబంధనల ప్రకారం జరిమానా విధించారు.రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. డిజిటల్ అన్రిజర్వ్డ్ టికెట్ చెల్లుబాటు కావాలంటే, దానిని బుక్ చేసిన అదే మొబైల్ ఫోన్లో, అదే రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్లోని రైల్ వన్ యాప్‌లో అందుబాటులో ఉండాలి. ఇతరులకు పంపిన కాపీలు లేదా స్క్రీన్షాట్లు ప్రయాణానికి పనికిరావు.అంతే కాకుండా.. అన్రిజర్వ్డ్ డిజిటల్ టికెట్‌ను రైలు బయలుదేరే ముందే బుక్ చేయాలని రైల్వేలు స్పష్టం చేశాయి. రైలు స్టేషన్ నుంచి బయలుదేరిన తర్వాత తీసుకున్న టికెట్, యాప్‌లో కనిపించినా కూడా చెల్లదని పేర్కొన్నాయి. కాబట్టి ముందుగా టికెట్ బుక్ చేసుకోవాలి. ప్రయాణికులు టికెట్ బుక్ చేసిన మొబైల్ ఫోన్‌ను ప్రయాణ సమయంలో తమ వెంట ఉంచుకోవాలని, ఫోన్లో తగినంత ఛార్జింగ్ ఉండేలా చూసుకోవాలి. -
దిగ్గజ కంపెనీ లేఆఫ్స్.. ఉద్యోగులకు 39 వారాల వేతనం!
ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ మైక్రోసాఫ్ట్ ఇటీవల సుమారు 4,800 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఇది సంస్థలో పనిచేస్తున్న మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 2.1 శాతం. ప్రస్తుతం కంపెనీ ఏఐ రంగంలో ఎక్కువ పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించడంతో పాటు, ఖర్చులను తగ్గించడంలో భాగంగా ఈ చర్యలను చేపట్టింది.మైక్రోసాఫ్ట్ ఉద్యోగాల కోతలో 'ఎక్స్‌బాక్స్' గేమింగ్ విభాగం ఎక్కువ ప్రభావితమైంది. ఇందులో మొదటి విడతలోనే 1,600 మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయారు. అంతేకాకుండా.. ఎక్స్‌బాక్స్ తనకు చెందిన నాలుగు గేమింగ్ స్టూడియోలను విక్రయించాలని, మరో స్టూడియోతో కూడా విడిపోవాలని నిర్ణయించింది.ఇదిలా ఉండగా.. జాబ్ కోల్పోయిన ఉద్యోగులకు మైక్రోసాఫ్ట్ సెవరెన్స్ ప్యాకేజీ ప్రకటించింది. ఉద్యోగి కంపెనీలో ఎంతకాలం పనిచేశాడు?, ఏ స్థాయిలో ఉన్నాడు? అనే విషయాల ఆధారంగా వారికి 60 రోజుల నుంచి 39 వారాల వరకు వేతనం చెల్లించనుంది. దీంతోపాటు.. కొంతకాలం వరకు ఆరోగ్య బీమా, కంపెనీ షేర్లకు సంబంధించిన ప్రయోజనాలను కూడా కొనసాగించనుంది. ఈ నిర్ణయం ఉద్యోగులు కొత్త అవకాశాలు వెతుక్కోవడానికి కొంత సహాయపడుతుంది.ఎక్స్‌బాక్స్ అధిపతి ఆశా శర్మ ఉద్యోగులకు పంపిన సందేశంలో ప్రస్తుతం సంస్థ ఆర్థిక పరిస్థితి ఆశించినంత బాగా లేదని తెలిపారు. ఇతర గేమింగ్ సంస్థలతో పోలిస్తే తమ లాభాలు చాలా తక్కువగా ఉన్నాయని వెల్లడించారు. అయితే.. ఉద్యోగులను తొలగించడం అనేది వారి పనితీరును బట్టి తీసుకున్న నిర్ణయం కాదని, సంస్థ భవిష్యత్తు.. అభివృద్ధి కోసం ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినదని ఆమె స్పష్టం చేశారు.ఇదీ చదవండి: మస్క్ ప్రసంశలు.. AI రంగంలో వారే టాప్!మైక్రోసాఫ్ట్ తీసుకున్న లేఆఫ్స్ నిర్ణయం ప్రపంచ ఐటీ రంగంలో జరుగుతున్న మార్పులకు ఒక స్పష్టమైన ఉదాహరణ. ఏఐ వంటి కొత్త సాంకేతిక రంగాల్లో ముందంజలో ఉండేందుకు కంపెనీలు తమ వ్యాపార విధానాలను మార్చుకుంటున్నాయి. ఉద్యోగుల తొలగింపులు బాధాకరమైనవే అయినప్పటికీ, సంస్థ భవిష్యత్తు అభివృద్ధి, పోటీ సామర్థ్యాన్ని పెంచుకోవడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. -
టీసీఎస్ బోణీ బాగుంది!
ముంబై: ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) జోరుతో ఐటీ కంపెనీల వృద్ధికి గండి పడుతుందన్న ఆందోళనల నేపథ్యంలో... దేశంలో అతిపెద్ద ఐటీ కంపెనీ టీసీఎస్ మెరుగైన ఆర్థిక ఫలితాలతో బోణీ కొట్టింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి క్వార్టర్ (2026–27, క్యూ1)లో రూ.13,349 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ప్రకటించింది. గతేడాది ఇదే కాలంలో రూ.12,760 కోట్లతో పోలిస్తే లాభం 4.6% పెరిగింది. కాగా, కొన్ని అసాధారణ అంశాలను మినహాయిస్తే, క్యూ1లో లాభం 8.5% వృద్ధితో రూ.13,849 కోట్లుగా నమోదైనట్లు కంపెనీ పేర్కొంది. మొత్తం ఆదాయం 14% జంప్ చేసి రూ.72,275 కోట్లకు ఎగబాకింది. గతేడాది క్యూ1లో ఆదాయం రూ. 63,437 కోట్లుగా నమోదైంది. సీక్వెన్షియల్‌గా చూస్తే... గత ఆర్థిక సంవత్సరం జనవరి–మార్చి (క్యూ4)లో టీసీఎస్ రూ.13,718 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. దీంతో పోలిస్తే సీక్వెన్షియల్‌గా ఈ క్యూ1లో లాభం 2.7% తగ్గింది. ఆదాయం 70,698 కోట్ల నుంచి 2.23% వృద్ధి చెందింది. డివిడెండ్ రూ.12 టీసీఎస్ వాటాదారులకు రూ. 1 ముఖ విలువ గల ఒక్కో షేరుపై రూ.12 చొప్పున మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. దీనికి జూలై 15 రికార్డు తేదీగా నిర్ణయించింది. జూలై 31న చెల్లింపు జరుగుతుంది.ఫలితాల్లో ఇతర ముఖ్యాంశాలు... → క్యూ1లో కంపెనీ 9.5 బిలియన్ డాలర్ల విలువైన కాంట్రాక్టులను దక్కించుకుంది. ఇందులో ఎస్‌కేఎఫ్‌తో కుదుర్చుకున్న 800 మిలియన్ డాలర్ల ఏఐ ఆధారిత మెగా డీల్ కూడా ఉంది. → వార్షికంగా రూ.2.6 బిలియన్ డాలర్ల ఏఐ ఆదాయాన్ని ఆర్జించింది. మార్చి క్వార్టర్‌తో పోలిస్తే 13.6 శాతం వృద్ధి నమోదైంది. → ఆపరేటింగ్ లాభాల మార్జిన్ 24 శాతానికి తగ్గింది. మార్చి క్వార్టర్లో ఇది 25.3 శాతంగా ఉంది. కొత్త పెట్టుబడులు, వేతనాల పెంపు దీనికి ప్రధాన కారణం. → ఏఐ ఎకోసిస్టమ్‌ను విస్తరించడానికి ఆంత్రోపిక్, మిస్ట్రాల్తో వ్యూహాత్మక భాగస్వామ్యాలను కుదుర్చుకున్నట్లు కంపెనీ సీఎఫ్ఓ ఆర్తి సుబ్రమణియన్ వెల్లడించారు. → కన్జూమర్ బిజ మినహా అన్ని రంగాల ఆదాయాలు పెరిగాయి. బీఎఫ్ఎస్ఐ 2.4%, లైఫ్ సైన్సెస్–హెల్త్‌కేర్ 3.5%, ఎనర్జీ–రిసోర్సెస్–యుటిలిటీస్ 6.9% వృద్ధి చెందాయి. → ప్రాంతాల వారీగా చూస్తే, లాటిన్ అమెరికా (–2,1%), యూకే (0.6%) ఆదాయాలు తగ్గాయి. ఉత్తర అమెరికా 2%, యూరప్ 4.3 శాతం, ఆసియా పసిఫిక్ 2.5 శాతం చొప్పున పెరుగుదల నమోదైంది. బీఎస్ఎన్ఎల్తో భారీ డీల్ రద్దయినప్పటికీ, భారత్ నుంచి ఆదాయం 22.9 శాతం ఎగబాకడం విశేషం. → క్యూ1లో 9,279 మంది ఉద్యోగులు జతయ్యారు. నాలుగేళ్లలో ఒకే క్వార్టర్లో అత్యధిక నియామకాలు ఇవే కావడం గమనార్హం. దీంతో జూన్ 30 నాటికి మొత్తం ఉద్యోగుల సంఖ్య 5,93,798కి చేరింది. ఐటీ సేవల్లో ఉద్యోగుల వలసల రేటు (ఆట్రిషన్) 13.6 శాతంగా నమోదైంది. టీసీఎస్ షేరు అర శాతం నష్టంతో రూ.2,048 వద్ద క్లోజైంది. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా కొంతమంది క్లయింట్లు ప్రాజెక్టులను వాయిదా వేయడంతో క్యూ1లో డిమాండ్ కాస్త మందగించింది. అయితే, ప్రస్తుత క్యూ2లో మళ్లీ పుంజుకునే అవకాశం ఉంది. భౌగోళికపరమైన, స్థూల ఆర్థిక ప్రతికూలతలు నెలకొన్నప్పటికీ.. కంపెనీ వృద్ధి పథంలో కొనసాగుతోందనేందుకు క్యూ1 ఫలితాలే నిదర్శనం. ఏఐ, ఆధునీకరణ, సైబర్ సెక్యూరిటీ, సావరీన్ క్లౌడ్‌తో పాటు ప్లాట్‌ఫామ్ సరళీకరణపై కస్టమర్లు పెట్టుబడుల జోరు పెంచారు. మా పటిష్టమైన కొత్త డీల్స్, ఎకోసిస్టమ్ భాగస్వామ్యాల విస్తరణ, కొత్త క్లయింట్లను జత చేసుకోవడంలో మెరుగుదల వంటివి వృద్ధి నిలదొక్కుకోవడానికి దోహదం చేస్తోంది. – కె. కృతివాసన్, టీసీఎస్ సీఈఓ, ఎండీ -
విమాన ప్రయాణాలు పెరిగాయ్..
న్యూఢిల్లీ: దేశీయంగా మే నెలలో 1.53 కోట్ల మంది విమాన ప్రయాణాలు చేశారు. ఇది గతేడాది మే తో పోలిస్తే 9.49 శాతం, ఈ ఏడాది ఏప్రిల్‌తో పోలిస్తే 11 శాతం అధికం. మే నెలలో ఇండిగో మార్కెట్ వాటా 64.9 శాతానికి తగ్గగా, ఎయిరిండియా గ్రూప్ 25.6 శాతానికి పెరిగింది. ఆకాశ ఎయిర్ వాటా పెద్దగా మార్పేమీ లేకుండా 5.8 శాతంగానే కొనసాగగా, స్పైస్‌జెట్ మాత్రం 2.5 శాతానికి క్షీణించింది.జనవరి–మే మధ్య కాలంలో దేశీ విమానయాన సంస్థలు 7.29 కోట్ల మందిని గమ్యస్థానాలకు చేర్చినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఒక నివేదికలో పేర్కొంది. ఈ సంఖ్య వార్షికంగా 1.91 శాతం, నెలవారీగా 9.49 శాతం మేర వృద్ధి చెందినట్లు వివరించింది. 10 కీలక విమానాశ్రయాల్లో సమయపాలన (ఓటీపీ) విషయానికొస్తే 82.8 శాతంతో ఇండిగో అగ్రస్థానంలో ఉండగా, ఆకాశ ఎయిర్, ఎయిరిండియా గ్రూప్ వరుసగా 78.3 శాతం, 74.5 శాతంతో తదుపరి స్థానాల్లో ఉన్నాయి. స్పైస్‌జెట్ ఓటీపీ 26.5 శాతంగా ఉంది.మే నెలలో విమానాల రద్దుతో 63,723 మందిపై ప్రభావం పడగా, పరిహారం..ప్రయాణికులకు సదుపాయాల కల్పన కోసం ఎయిర్‌లైన్స్ రూ. 70.32 లక్షలు వెచ్చించాయి. -
ఎల్రక్టానిక్స్ ముడి వస్తువులకు సుంకాల మినహాయింపు
న్యూఢిల్లీ: ఎల్రక్టానిక్స్ తయారీలో కీలకమైన డిస్ప్లే అసెంబ్లీలు, లిథియం అయాన్ సెల్స్, ఇండక్షన్ కాయిల్ మాడ్యూల్స్‌కి బేసిక్ కస్టమ్స్ సుంకాల (బీసీడీ) నుంచి మినహాయింపునిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, వేరబుల్స్, స్మార్ట్ టీవీల్లాంటి ఎల్రక్టానిక్ డివైజ్‌లను దేశీయంగా తయారు చేసేలా ప్రోత్సహించేందుకు ఇది దోహదపడనుంది.డిస్ప్లే అసెంబ్లీలు, మాడ్యూల్స్‌పై మినహాయింపు 2029 మార్చి 31 వరకు వర్తిస్తుందని కేంద్రం ఒక నోటిఫికేషన్లో పేర్కొంది. దేశీయంగా లిథియం అయాన్ సెల్ తయారీలోకి మరిన్ని పెట్టుబడులు వచ్చేందుకు ఈ నిర్ణయం ఉపయోగపడగలదని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. బ్యాటరీ గిగాఫ్యాక్టరీలు, ఎలక్ట్రిక్ వాహనాల తయారీదార్లు, కన్జూమర్ ఎల్రక్టానిక్స్ కంపెనీలు, డేటా సెంటర్లు మొదలైనవి గణనీయంగా లబ్ధి పొందగలవని పేర్కొన్నాయి. -
స్టైలిష్ లుక్.. రోజంతా కంఫర్ట్.. మార్కెట్లోకి కొత్త శాండల్స్!
ప్రస్తుతం ఫ్యాషన్ అంటే కేవలం దుస్తులు మాత్రమే కాదు.. మన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే ప్రతి అంశం అందులో భాగమైంది. ముఖ్యంగా ఫుట్‌వేర్ విషయంలో యువత స్టైల్‌తో పాటు సౌకర్యానికీ ప్రాధాన్యం ఇస్తోంది. ఈ మారుతున్న ఫ్యాషన్ ధోరణులను దృష్టిలో ఉంచుకుని దేశంలోని ప్రముఖ యువ ఫుట్‌వేర్ బ్రాండ్ స్పార్క్స్ (Sparx) కొత్త ‘చంకీ సోల్ శాండల్స్’ కలెక్షన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది.అంతర్జాతీయ ఫ్యాషన్ ట్రెండ్ల స్ఫూర్తితో రూపొందించిన ఈ శాండల్స్ ఆకర్షణీయమైన డిజైన్‌తో పాటు రోజంతా సౌకర్యవంతంగా ఉండేలా రూపొందించారు. నగరాల్లో రోజువారీ ప్రయాణాలు, వీకెండ్ ట్రిప్స్, వెకేషన్లు లేదా సాధారణ వినియోగం.. ఇలా అన్ని సందర్భాల్లో ఉపయోగించుకునేలా వీటిని డిజైన్ చేశారు. మందంగా ఉండే చంకీ సోల్, స్పోర్టీ లుక్, బలమైన మెటీరియల్, ఆధునిక రంగుల కలయిక ఈ కలెక్షన్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. జీన్స్, కార్గో ప్యాంట్లు, షార్ట్స్ వంటి దుస్తులకు కూడా సులభంగా మ్యాచ్ అయ్యేలా వీటిని రూపొందించారు.శాండల్స్‌లో అడ్జస్టబుల్ స్ట్రాప్స్ ఉండటంతో పాదాలకు సరైన ఫిట్ లభిస్తుంది. మెరుగైన కుషనింగ్, తక్కువ బరువుతో రూపొందించడంతో ఉదయం నుంచి రాత్రి వరకు ధరించినా సౌకర్యంగా ఉంటాయని కంపెనీ తెలిపింది. స్టైల్ కోసం కంఫర్ట్‌ను, కంఫర్ట్ కోసం స్టైల్‌ను వదులుకోవాల్సిన అవసరం లేకుండా ఈ కొత్త కలెక్షన్‌ను రూపొందించామని స్పార్క్స్ వెల్లడించింది. -
హైదరాబాద్‌లో ‘నేషన్వైడ్’ జీసీసీ
ఇన్సూరెన్స్ దిగ్గజం ’నేషన్వైడ్’ హైదరాబాద్‌లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (జీసీసీ) ఏర్పాటు చేసినట్టు బుధవారం ప్రకటించింది. అమెరికా వెలుపల సంస్థ ఏర్పాటు చేసిన మొట్టమొదటి అంతర్జాతీయ క్యాంపస్ ఇదే కావడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా సంస్థకు ఇది నాల్గవ సాంకేతిక హబ్. మారుతున్న వ్యాపార అవసరాలకు అనుగుణంగా వేగవంతమైన నిర్ణయాలు, ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు సంస్థ ’గ్లోబల్ 24/7 ఆపరేటింగ్ మోడల్’ విధానాన్ని ఎంచుకుంది.ఇందులో భాగంగా హైదరాబాద్ కేంద్రం కీలక పాత్ర పోషించనుంది. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, డేటా ఇంజనీరింగ్, అప్లికేషన్ సపోర్ట్ వంటి అత్యాధునిక డిజిటల్ సామర్థ్యాలను ఇక్కడి నుంచే పెంపొందించనున్నారు. ఈ సందర్భంగా ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ ప్రపంచంలోనే బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్ రంగాలకు హైదరాబాద్ అత్యుత్తమ గమ్యస్థానంగా మారిందన్నారు. ప్రపంచంలోని టాప్-10 బీఎఫ్ఎస్ఐ దిగ్గజాల్లో 9 సంస్థలు ఇప్పటికే హైదరాబాద్ నుంచి తమ కార్యకలాపాలను నడిపిస్తున్నాయని గుర్తుచేశారు. ఇప్పుడు ప్రముఖ అమెరికన్ ఇన్సూరెన్స్ సంస్థ ’నేషన్వైడ్’ను తెలంగాణ గ్లోబల్ వాల్యూ సెంటర్స్ జాబితాలోకి స్వాగతించడం సంతోషంగా ఉందన్నారు. -
పుస్తకం మార్చేసిన జీవితం.. స్కూల్ డ్రాపవుట్ నుంచి బిలియనీర్‌గా..
విజయం సాధించాలంటే.. మంచి చదువు, ఉన్నత విద్య, ఆ తర్వాత మంచి ఉద్యోగం.. చాలామంది అనుసరించే మార్గం ఇదే. కానీ భారతదేశంలోని అతిపెద్ద రిటైల్ బ్రోకరేజ్ సంస్థ అయిన జెరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ ప్రయాణం మాత్రం దీనికి పూర్తి భిన్నం. ఎందుకంటే.. పాఠశాల చదువును మధ్యలోనే నిలిపివేసిన ఆయన, ఎలాంటి డిగ్రీ లేకుండానే దేశంలోని అత్యంత విజయవంతమైన యువ పారిశ్రామికవేత్తల్లో ఒకరిగా ఎదిగారు.కోట్ల రూపాయల సంపదను సృష్టించిన నిఖిల్ కామత్ జీవితంలో అత్యంత ప్రభావం చూపిన పాఠం వ్యాపారం కాదు.. ఒక పుస్తకం అని తెలిస్తే తప్పకుండా చాలామంది ఆశ్చర్యపోతారు.సుమారు 34 ఏళ్ల వయసులో నిఖిల్ కామత్, పులిట్జర్ అవార్డు గ్రహీత ఎర్నెస్ట్ బెకర్ రచించిన 'ది డినయల్ ఆఫ్ డెత్' (The Denial of Death) పుస్తకాన్ని చదివారు. మనిషి జీవితానికి పరిమితి ఉందనే వాస్తవాన్ని మాత్రమే కాకుండా.. అతని ఆశయాలు, లక్ష్యాలు, నిర్ణయాలను ఎలా ప్రభావితం చేస్తుందో ఈ పుస్తకం వివరిస్తుంది.ఈ పుస్తకం చదివిన తరువాత నిఖిల్ కామత్ ఒక సాధారణ లెక్క వేసుకున్నారు. సగటు మనిషి ఆయుష్షును ఆధారంగా తీసుకుని తనకు ఇంకా దాదాపు 36 సంవత్సరాల జీవితం మాత్రమే మిగిలి ఉందని అంచనా వేశారు. అది డబ్బు లెక్క కాదు.. సమయం లెక్క. అదే ఆయన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేసింది. "డబ్బు కంటే సమయమే జీవితంలో అత్యంత విలువైన ఆస్తి" అనే భావనను ఆయన మరింత బలంగా అర్థం చేసుకున్నారు. అప్పటి నుంచి విజయాన్ని కొలిచే విధానం, నిర్ణయాలు తీసుకునే తీరు, జీవితానికి ఇచ్చే ప్రాధాన్యత అన్నీ మారిపోయాయని ఆయన పలుమార్లు చెప్పారు.ఆలోచనా విధానాన్ని మార్చిన పుస్తకాలునిఖిల్ కామత్ అభిప్రాయం ప్రకారం, పుస్తకాలు కేవలం విజ్ఞానాన్ని మాత్రమే కాదు.. మనుషులను, సమాజాన్ని, మనల్ని మనం అర్థం చేసుకునే దృక్పథాన్ని కూడా అందిస్తాయి. ఆయన సూచించిన పుస్తకాలలో మోర్గాన్ హౌసెల్ రాసిన ది సైకాలజీ ఆఫ్ మనీ ముఖ్యమైనది. డబ్బు సంపాదించడంలో తెలివితేటల కంటే సహనం, క్రమశిక్షణ, భావోద్వేగాల నియంత్రణ ఎంతో కీలకమని ఈ పుస్తకం వివరిస్తుంది.ర్యాన్ హాలిడే రచించిన 'స్టిల్నెస్ ఈజ్ ది కీ' పుస్తకం.. ఒత్తిడి, అనిశ్చితి మధ్య ప్రశాంతంగా ఆలోచించే వ్యక్తులే సరైన నిర్ణయాలు తీసుకుంటారని చెబుతుంది. రిచర్డ్ డాకిన్స్ రచించిన 'ది సెల్ఫిష్ జీన్' మానవ ప్రవర్తన వెనుక ఉన్న పరిణామ సిద్ధాంతాన్ని వివరిస్తే, ఇసాబెల్ విల్కర్సన్ రచించిన 'కాస్ట్' సమాజంలో అసమానతలు, సామాజిక వ్యవస్థలపై లోతైన విశ్లేషణను అందిస్తుంది.పుస్తకాలు నేర్పే జీవిత పాఠాలుఇక్కడ అందరూ గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే.. నిఖిల్ కామత్ కథను చూసి చదువు అవసరం లేదని భావించడం సరైంది కాదు. ఆయన ప్రయాణం చెప్పే అసలు సందేశం ఏమిటంటే.. నేర్చుకోవడం అనేది పాఠశాల లేదా కళాశాలతో ముగిసిపోదు. కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి, పుస్తకాలు చదివే అలవాటు, విభిన్న అంశాలపై అవగాహన పెంచుకోవడం వ్యక్తిగత వికాసానికి ఎంతో అవసరం. తరగతి గదిలో నేర్చుకోలేని ఎన్నో జీవన పాఠాలను పుస్తకాలు నేర్పగలవని ఆయన గట్టిగా నమ్ముతారు.డబ్బు కాదు.. సమయమే అసలు సంపదవిజయవంతమైన వ్యాపారవేత్తలను చూసినప్పుడు వారు ఎక్కడ పెట్టుబడులు పెట్టారు? ఎలా బిలియనీర్లు అయ్యారు? అనే ప్రశ్నలే ఎక్కువగా వినిపిస్తాయి. కానీ నిఖిల్ కామత్ ఎక్కువగా మాట్లాడేది మరో పెట్టుబడి గురించి.. అదే సమయం.డబ్బు కోల్పోతే తిరిగి సంపాదించవచ్చు, వ్యాపారాన్ని మళ్లీ నిర్మించవచ్చు. కానీ ఒకసారి గడిచిపోయిన సమయాన్ని మాత్రం ఎవరూ తిరిగి తీసుకురాలేరు. అందుకే జీవితంలో నిజంగా విలువైన వాటిపై దృష్టి పెట్టాలని, నిరంతరం నేర్చుకుంటూ ముందుకు సాగాలని ఆయన సూచిస్తున్నారు.ఇదీ చదవండి: మరో పవర్ఫుల్ AI మోడల్ వచ్చేసింది! -
కార్పొరేట్ అగ్రపీఠంపై మిలీనియల్స్ జైత్రయాత్ర!
భారతీయ కార్పొరేట్ కంపెనీల్లో సాంప్రదాయ పద్ధతులకు భిన్నంగా అత్యున్నత నిర్ణయాధికారాలు కలిగిన ‘సీ-సూట్’ (C-Suite - CEO, CFO, CMO, CTO.. వంటి కీలక పదవులు) స్థానాలను యువత వేగంగా చేజిక్కించుకుంటోంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఉన్న అగ్రశ్రేణి ఎగ్జిక్యూటివ్‌లలో మిలీనియల్స్ (యువతరం) ఏకంగా 55 శాతం వాటాతో అతిపెద్ద లీడర్షిప్ గ్రూప్‌గా అవతరించారు. ప్రముఖ ప్రొఫెషనల్ నెట్వర్క్ లింక్డ్ఇన్ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. గత ఏడేళ్లలో సీ-సూట్ విభాగంలో మిలీనియల్స్ ప్రాతినిధ్యం 14.5 శాతం పెరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికత వ్యాపార నిర్ణయాలను శాసిస్తున్న తరుణంలో ఈ మార్పు ప్రాధాన్యత సంతరించుకుంది.మారుతున్న కెరీర్ ముఖచిత్రంగతంలో ఒకే పరిశ్రమలో ఏళ్ల తరబడి పనిచేసిన అనుభవం ఉన్నవారికే లీడర్షిప్ పాత్రలు దక్కేవి. కానీ ఇప్పుడు ఆ ట్రెండ్ మారింది. సీ-సూట్ నాయకుల్లో ఒకే పరిశ్రమకు పరిమితమైన వారి సంఖ్య గతంలో 80 శాతం ఉండగా ఇప్పుడది 58 శాతానికి పడిపోయింది. అంటే.. వివిధ సంస్థలు, విభిన్న రకాల వ్యాపారాలు, మల్టిపుల్ ఫంక్షన్స్‌లో అనుభవం ఉన్నవారికే కంపెనీలు పట్టం కడుతున్నాయి.మరోవైపు, ఏఐ రాకతో కార్పొరేట్ రంగంలో కొత్త ఉద్యోగాల సృష్టి జరుగుతోందని 84 శాతం మంది లీడర్లు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్లు (సీఎంఓ) అత్యధికంగా 94 శాతంతో ఈ మార్పును బలంగా నమ్ముతున్నారు. అంతేకాదు, వ్యాపార నిర్ణయాలు తీసుకోవడంలో 84 శాతం మంది లీడర్లు ఏఐ టూల్స్ ఇచ్చే ఇన్‌పుట్స్‌ను కీలకంగా వాడుతుండటం గమనార్హం.మార్కెట్ కంటే వేగంగా నేర్చుకోవాలి!‘భారత కార్పొరేట్ నాయకత్వం ఇప్పుడు అత్యంత సవాలుతో కూడిన దశలోకి ప్రవేశించింది. ఏఐ యుగంలో పాత రూల్ బుక్స్ కాలంచెల్లుతుంది. స్పష్టమైన రోడ్ మ్యాప్ లేకపోయినా లీడర్లు వేగంగా నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. ఈ క్రమంలో వ్యాపార వ్యూహాలకు సాంకేతికత, ప్రతిభను జోడిస్తున్నవారే సఫలమవుతున్నారు. మార్కెట్ మారుతున్న వేగంతో సమానంగా లీడర్లు నిరంతరం నేర్చుకుంటూనే ఉండాలి’ అని లింక్డ్ఇన్ ఇండియా కంట్రీ మేనేజర్ కుమారేష్ పట్టాభిరామన్ తెలిపారు.వేగం పెంచాలనే ఒత్తిడిటెక్నాలజీ మారుతున్న వేగానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం ఇప్పుడు లీడర్లకు పెద్ద పరీక్షగా మారింది. దాదాపు ఐదింటిలో నలుగురు (79%) సీ-సూట్ లీడర్లు.. ఏఐ వల్ల కలిగే పూర్తి ఫలితాలను అంచనా వేయడానికి ముందే దానిని వ్యాపారాల్లో వేగంగా అమలు చేయాలనే ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఈ ఒత్తిడి సీఎంఓల్లో 82 శాతం, సీటీఓల్లో 81 శాతంగా ఉంది. అలాగే, తీవ్రమైన అనిశ్చితి మధ్య అత్యంత వేగంగా నిర్ణయాలు తీసుకోవడమే తమ ముందున్న అతిపెద్ద సవాలని 39 శాతం మంది లీడర్లు (ముఖ్యంగా 46% మంది సీఎంఓలు, 43% మంది సీఈఓలు) అంగీకరిస్తున్నారు.ఇదీ చదవండి: బంగారం ధరల్లో స్వల్ప మార్పు -
ఎస్బీఐ నుంచి మెగా ఐపీఓకు రంగం సిద్ధం
దేశీయ మ్యూచువల్ ఫండ్ రంగంలో అగ్రగామి సంస్థల్లో ఒకటైన ‘ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్మెంట్ లిమిటెడ్' ఐపీఓకు సర్వం సిద్ధం చేసింది. రూ.11,692.91 కోట్ల అంచనాతో వస్తున్న ఈ పబ్లిక్ ఇష్యూకు సంబంధించిన ప్రైస్ బ్యాండ్‌ను కంపెనీ అధికారికంగా ప్రకటించింది. 2026 సంవత్సరంలోనే దేశీయ ప్రాథమిక మార్కెట్లో భారీ ఐపీఓగా ఇది రికార్డు సృష్టించబోతోంది. ఈ మెగా ఐపీఓకు సంబంధించిన వివరాలు కొన్ని కింద చూద్దాం.రూ.545 - రూ.574 గా ప్రైస్ బ్యాండ్ ఖరారుస్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుబంధ సంస్థ అయిన ఈ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ తన ఐపీఓ ధరల శ్రేణిని ఒక్కో షేరుకు రూ.545-రూ.574 గా నిర్ణయించింది. అప్పర్ ప్రైస్ బ్యాండ్ వద్ద లెక్కగడితే ఈ కంపెనీ మార్కెట్ విలువ ఏకంగా రూ.1.17 లక్షల కోట్లకు చేరనుంది.అయితే, ఈ ఇష్యూ పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ పద్ధతిలో జరుగుతోంది. దీని ద్వారా ప్రమోటర్లు 20 కోట్లకు పైగా షేర్లను విక్రయిస్తున్నారు. ఇందులో ఎలాంటి ఫ్రెష్ ఇష్యూ (తాజా షేర్ల జారీ) లేదు. కాబట్టి, ఐపీఓ ద్వారా వచ్చే నిధులన్నీ విక్రయించే వాటాదారులకే వెళ్తాయి తప్ప కంపెనీ ఖాతాలోకి చేరవని గమనించాలి.రిటైల్ పెట్టుబడిదారులకు కనీస పెట్టుబడి ఎంత?సాధారణ రిటైల్ ఇన్వెస్టర్ల కోసం కంపెనీ కనీస లాట్ పరిమాణాన్ని 26 షేర్లుగా నిర్ణయించింది. ఒక లాట్ కోసం దరఖాస్తు చేయాలంటే అప్పర్ ప్రైస్ బ్యాండ్ (రూ.574) ప్రకారం రిటైల్ పెట్టుబడిదారునికి కనీసం రూ.14,924 అవసరమవుతాయి. గరిష్టంగా ఇన్వెస్టర్లు 26 షేర్ల మల్టిప్లైస్లో మరిన్ని లాట్లకు దరఖాస్తు చేసుకోవచ్చు.ఇదీ చదవండి: బంగారం ధరల్లో స్వల్ప మార్పుపెట్టుబడిదారుల యాంకర్ బుక్ ఓపెనింగ్ జులై 13.సబ్స్క్రిప్షన్ ప్రారంభం జులై 14.సబ్స్క్రిప్షన్ ముగింపు జులై 16.షేర్ల కేటాయింపు ఖరారు జులై 17 (అంచనా).రిఫండ్లు, నిధుల అన్‌బ్లాకింగ్: జులై 20డీమ్యాట్ ఖాతాల్లోకి షేర్ల జమ: జులై 20 -
జీరో కమీషన్ పాలసీపై ఫ్లిప్‌కార్ట్ నిర్ణయం
దేశీయ ఈ-కామర్స్ రంగంలో తీవ్ర పోటీ నెలకొన్న తరుణంలో ఫ్లిప్‌కార్ట్ విక్రేతలకు (సెల్లర్లు) బంపర్ ఆఫర్ ప్రకటించింది. ప్లాట్‌ఫామ్‌పై వ్యాపారాన్ని మరింత సులభతరం చేయడంతోపాటు విక్రేతలకు మరిన్ని లాభాలను చేకూర్చే లక్ష్యంతో తన ‘జీరో-కమీషన్’ విధానాన్ని విస్తరిస్తున్నట్లు తెలిపింది. ఇప్పటివరకు కేవలం రూ.1,000 లోపు ధర గల ఫ్యాషన్ ఉత్పత్తులకే పరిమితమైన ఈ జీరో కమీషన్ నిబంధనను ఇకపై ధరతో నిమిత్తం లేకుండా అన్ని రకాల ఫ్యాషన్ ఉత్పత్తులకు వర్తింపజేస్తున్నట్లు వెల్లడించింది.90,000 మంది విక్రేతలకు ఉపశమనంఫ్లిప్కార్ట్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఫ్యాషన్ విభాగంలో వ్యాపారం చేస్తున్న సుమారు 90,000 మందికి పైగా యాక్టివ్ విక్రేతలు నేరుగా లబ్ధి పొందనున్నారు. గతంలో రూ.1,000 దాటిన ఉత్పత్తులపై కంపెనీకి కమీషన్ చెల్లించాల్సి వచ్చేది. కానీ తాజా నిర్ణయంతో, విక్రేతలు తాము అమ్మే ప్రతి ఫ్యాషన్ ప్రొడక్ట్‌పై పూర్తి మార్జిన్లను (లాభాలను) తామే నిలుపుకునే అవకాశం లభించింది. ఇది ఎంఎస్ఎమ్ఈలు, స్థానిక బ్రాండ్లు, తయారీదారులకు పెద్ద ఊరటనిచ్చే అంశం.దీర్ఘకాలిక పెట్టుబడే లక్ష్యంఈ వ్యూహాత్మక మార్పుపై ఫ్లిప్‌కార్ట్ ఫ్యాషన్ వైస్ ప్రెసిడెంట్ కపిల్ తిరానీ మాట్లాడుతూ.. ‘మా వ్యాపార భాగస్వాముల ప్రయోజనాలకే ఎల్లప్పుడూ మొదటి ప్రాధాన్యం ఇస్తాం. ఈ సెల్లర్-ఫస్ట్ చొరవను మొత్తం ఫ్యాషన్ విభాగానికి విస్తరించడం ద్వారా మా అమ్మకందారులకు మరిన్ని ప్రయోజనాలు చేకూరుస్తాం. దీనివల్ల విక్రేతలు సరికొత్త ఆవిష్కరణలు చేయడం, ప్రొడక్ట్ రేంజ్‌ను విస్తరించడం, తమ సొంత బ్రాండ్ బిల్డింగ్‌పై మరింత నమ్మకంతో పెట్టుబడులు పెట్టడానికి వీలవుతుంది’ అన్నారు.ఇదీ చదవండి: చల్లబడిన బంగారం ధర.. తులం ఎంతంటే.. -
విజింజం పోర్టులో అదానీ వాటా విక్రయంపై కమిటీ
దేశీయ నౌకాయాన రంగంలో వ్యూహాత్మకమైన విజింజం అంతర్జాతీయ పోర్టులో అదానీ గ్రూప్ తన 49 శాతం వాటాను ఉపసంహరించుకోవాలని భావిస్తున్న తరుణంలో కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రతిపాదిత వాటా విక్రయం వల్ల రాష్ట్ర ప్రయోజనాలపై ఎలాంటి ప్రభావం పడుతుందనే అంశంపై సమగ్రంగా అధ్యయనం చేసేందుకు కేరళ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వీడీ సతీశన్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు.రాష్ట్ర ప్రయోజనాలే పరమావధికేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం ముఖ్యమంత్రి సతీశన్ విలేకరులతో మాట్లాడారు. విజింజం పోర్టు కేరళ ఆర్థిక ప్రగతికి కీలకమన్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగించే ఎలాంటి నిర్ణయాన్నీ ప్రభుత్వం తీసుకోబోదని ఆయన స్పష్టం చేశారు. మీడియాలో కథనాలు వచ్చేంత వరకు అదానీ గ్రూప్ తలపెట్టిన ఈ వాటా బదిలీ వ్యవహారం తమ ప్రభుత్వ దృష్టికి రాలేదని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు. అంతర్జాతీయ షిప్పింగ్ దిగ్గజం ఎంఎస్సీ గ్రూప్‌తో అదానీ సంస్థ దాదాపు ఏడాది కాలంగా ఈ వ్యవహారంపై చర్చలు జరుపుతోందనే నిజాన్ని ప్రభుత్వం ఆ తర్వాతే గుర్తించిందని ఆయన వెల్లడించారు.‘వాటా బదిలీకి సంబంధించిన ప్రతిపాదనను అదానీ గ్రూప్ సెబీకి సమర్పించిన రోజే.. ముందస్తుగా రాష్ట్రానికి సమాచారం ఇవ్వకపోవడంపై అసంతృప్తిని తీవ్రంగా వ్యక్తం చేశాం. ఆ తర్వాతే కన్సెషన్ ఒప్పంద నిబంధనల ప్రకారం వాటా బదిలీకి ముందస్తు అనుమతి ఇవ్వాలని కోరుతూ అదానీ గ్రూప్ అధికారికంగా ప్రభుత్వం వద్దకు వచ్చింది’ అని ముఖ్యమంత్రి అన్నారు.గుత్తాధిపత్యం అసాధ్యంవిపక్ష నేత పినరయి విజయన్ చేస్తున్న విమర్శలను ముఖ్యమంత్రి పూర్తిగా కొట్టిపారేశారు. విజయన్ అసలు కన్సెషన్ అగ్రిమెంట్ (రాయితీ ఒప్పందం) చదవకుండానే గుడ్డిగా ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ డీల్ వల్ల ఎమ్మెస్సీ గ్రూప్ గుత్తాధిపత్యం ఏర్పడుతుందన్న వాదనలో వాస్తవం లేదన్నారు. ఏ ఒక్క సంస్థా దీనిపై పూర్తి ఆధిపత్యం చలాయించలేదని సీఎం స్పష్టం చేశారు.కేంద్ర అనుమతులు వస్తేనే డీల్ పూర్తి!ప్రస్తుతానికి వాటా బదిలీ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదని, కాబట్టి రాయితీ ఒప్పందాన్ని అదానీ గ్రూప్ ఉల్లంఘించిందని చెప్పలేమని సీఎం వివరించారు. ఈ లావాదేవీ ముగియాలంటే కేవలం రాష్ట్ర ప్రభుత్వ అనుమతి మాత్రమే సరిపోదని.. దీనికి అనేక రకాల భద్రతా, వ్యూహాత్మక కోణాలు ముడిపడి ఉన్నాయని పేర్కొన్నారు.ఇదీ చదవండి: చల్లబడిన బంగారం ధర.. తులం ఎంతంటే.. -
ఇన్సూరెన్స్ కంపెనీకి రూ.20 లక్షల జరిమానా
వాహన బీమా క్లెయిమ్‌లను సాంకేతిక కారణాలు, చిన్నపాటి లొసుగుల సాకుతో తిరస్కరించే కార్పొరేట్ కంపెనీల ధోరణికి వినియోగదారుల కోర్టు గట్టి షాక్ ఇచ్చింది. ‘కారు డ్యామేజ్ అయిన విధానం, యజమాని చెబుతున్న కథనానికి సరిపోలడం లేదు’ అనే కారణంతో క్లెయిమ్‌ను తిరస్కరించిన ప్రముఖ బీమా సంస్థ బజాజ్ అలియాంజ్కు కోర్టు భారీ జరిమానా విధించింది. పాలసీ నిబంధనల ప్రకారం వాహన యజమానికి రూ.20 లక్షల పరిహారంతో పాటు అదనపు ఖర్చులు చెల్లించాలని ఆదేశిస్తూ చండీగఢ్ వినియోగదారుల వివాదాల పరిష్కార ఫోరమ్ తీర్పును వెలువరించింది.అసలు ఏం జరిగిందంటే..?నగరానికి చెందిన విక్రమ్‌జీత్ సింగ్ అనే కారు యజమాని తన లగ్జరీ కారుకు బజాజ్ అలియాంజ్ సంస్థ నుంచి బీమా పాలసీ తీసుకున్నారు. కారు ప్రమాదానికి గురైనప్పుడు, నష్టపరిహారం కోసం ఆయన కంపెనీకి క్లెయిమ్ దరఖాస్తు చేసుకున్నారు. అయితే, బీమా సంస్థ నియమించిన సర్వేయర్ కారును పరిశీలించి ప్రమాదం జరిగిన తీరుకు, కారుపై ఉన్న డ్యామేజ్ గుర్తులకు పొంతన లేదంటూ నివేదిక ఇచ్చారు. ఈ సాకుతో కంపెనీ క్లెయిమ్‌ను పూర్తిగా తిరస్కరించింది. న్యాయం కోసం సదరు యజమాని వినియోగదారుల ఫోరమ్‌ను ఆశ్రయించారు. తన కారుకు ఇన్సూరెన్స్ రక్షణ ఉన్నప్పటికీ కంపెనీ ఉద్దేశపూర్వకంగానే తన క్లెయిమ్ తిరస్కరించిందని కోర్టుకు వివరించారు.కోర్టు ఆగ్రహం..రెండు వైపుల వాదనలు విన్న వినియోగదారుల ఫోరమ్.. బీమా కంపెనీ వ్యవహరించిన తీరును తీవ్రంగా తప్పుబట్టింది. టెక్నికల్ గ్రౌండ్స్‌ను చూపిస్తూ నమ్మకంగా ఉంటున్న కస్టమర్లను ఇబ్బంది పెట్టడం సరికాదని స్పష్టం చేసింది. ‘బీమా కంపెనీలు కేవలం ప్రీమియంలు వసూలు చేయడానికే పరిమితం కాకూడదు. కస్టమర్ నిజంగా నష్టపోయినప్పుడు ఆదుకోవాల్సిన బాధ్యత వాటిపై ఉంది. సర్వేయర్ నివేదికను సాకుగా చూపి క్లెయిమ్‌ను తిరస్కరించడం వినియోగదారుల హక్కులను కాలరాయడమే’ అని కోర్టు తెలిపింది.ఫోరమ్ జారీ చేసిన ఉత్తర్వులుపాలసీ ఐడీవీ (ఇన్స్యూర్డ్ డిక్లేర్డ్ వ్యాల్యూ) నిబంధనల ప్రకారం వాహన యజమానికి రూ.20 లక్షల క్లెయిమ్ మొత్తాన్ని తక్షణమే చెల్లించాలి.వినియోగదారుడు అనుభవించిన మానసిక క్షోభకు నష్టపరిహారంగా, కస్టమర్‌ను ఇబ్బందులకు గురిచేసినందుకు గానూ రూ.50,000 అదనంగా చెల్లించాలి.కోర్టులో వ్యాజ్యం నడిపినందుకు అయ్యే ఖర్చుల కింద మరో రూ.10,000 యజమానికి అందజేయాలి.కంపెనీలు క్లెయిమ్స్ తిరస్కరించినప్పుడు చాలామంది వాహనదారులు వెనకడుగు వేస్తుంటారు. కానీ, సరైన ఆధారాలు ఉండి కంపెనీ వైపు లోపాలు ఉంటే వినియోగదారుల ఫోరమ్‌ల ద్వారా న్యాయం ఎలా పొందవచ్చో చెప్పడానికి ఈ తీర్పు ఒక ఉదాహరణగా నిలుస్తుందని లీగల్ నిపుణులు పేర్కొంటున్నారు.ఇదీ చదవండి: చల్లబడిన బంగారం ధర.. తులం ఎంతంటే.. -
ట్రిలియనీర్ హోదా కోల్పోయిన మస్క్: ఎందుకంటే?
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మరోసారి వార్తల్లో నిలిచారు. కేవలం మూడు వారాల క్రితం ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌గా చరిత్ర సృష్టించిన ఈయన.. ఇప్పుడు ఆ హోదాను కోల్పోయారు. దీనికి కారణం స్పేస్ఎక్స్ (SpaceX) షేర్ల ధర భారీగా పడిపోవడమే.నిజానికి 2026 జూన్ 12న స్పేస్ఎక్స్ నాస్డాక్లో ఐపీఓ ద్వారా స్టాక్ మార్కెట్లో అడుగుపెట్టింది. ఒక్కో షేర్ ధరను 135 డాలర్లుగా నిర్ణయిస్తే.. లిస్టింగ్ రోజే అది 150 డాలర్లకు చేరుకుంది. ఆ తర్వాత కూడా పెట్టుబడిదారుల నుంచి భారీ స్పందన రావడంతో షేర్ ధర మరింత పెరిగింది. దీంతో కంపెనీ మార్కెట్ విలువ దాదాపు 2.8 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. దీంతో మస్క్ వ్యక్తిగత సంపద కూడా గణనీయంగా పెరిగి 1.4 ట్రిలియన్ డాలర్లను దాటింది. తద్వారా ఈయన ప్రపంచంలో తొలి ట్రిలియనీర్‌గా రికార్డు సృష్టించారు.అయితే.. మస్క్ ఆనందం మూణ్నాళ్ల ముచ్చట అయింది. జూన్ నెలలో పొందిన ట్రిలియనీర్ హోదా.. జులై ప్రారంభం నాటికి పోయింది. ఎందుకంటే స్పేస్ఎక్స్ షేర్లు గరిష్ఠ స్థాయి నుంచి 30 శాతానికి పైగా పడిపోయాయి. దీంతో కంపెనీ మార్కెట్ విలువలో వందల బిలియన్ డాలర్లు ఆవిరయ్యాయి. ట్రిలియనీర్ హోదా కోల్పోయినా.. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా మాత్రం మస్క్ కొనసాగుతున్నారు. -
SBI మేనేజర్ జీతం రూ.35 లక్షలా?
ఇటీవల సోషల్ మీడియాలో ఒక ఎస్బీఐ (SBI) మేనేజర్ ఫారం-16 వైరల్ కావడంతో నెట్టింట్లో పెద్ద చర్చ మొదలైంది. ఆ ఫారం-16లో ఆయన వార్షిక వేతనం రూ.35.24 లక్షలు అని ఉండటంతో చాలామంది ఆశ్చర్యపోయారు. ప్రభుత్వ బ్యాంకులో పనిచేసే ఉద్యోగికి ఇంత పెద్ద జీతమా? అనే సందేహం అందరిలోనూ కలిగింది. అయితే.. ఈ సంఖ్య వెనుక ఉన్న అసలు నిజం తెలుసుకుంటే పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉందని అర్థమవుతుంది.వైరల్ అయిన పోస్టు ప్రకారం, ఉద్యోగి ఎనిమిది సంవత్సరాల క్రితం ఎస్బీఐలో ప్రొబేషనరీ ఆఫీసర్ (PO)గా చేరి, ప్రస్తుతం స్కేల్-3 మేనేజర్ స్థాయికి ఎదిగారు. ఫారం-16లో కనిపిస్తున్న రూ.35.24 లక్షలు ఆయనకు ప్రతి నెల వచ్చే జీతం కాదు. అది మొత్తం సంవత్సరానికి సంబంధించిన గ్రాస్ శాలరీ మాత్రమే.ఈ గ్రాస్ శాలరీలో ప్రతి నెల వచ్చే జీతంతో పాటు, నాలుగు సంవత్సరాలకు ఒకసారి మాత్రమే లభించే.. లీవ్ ఫేర్ కన్సెషన్ (LFC) ఎన్‌క్యాష్‌మెంట్, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ వంటి ప్రత్యేక ప్రయోజనాలు కూడా కలిపి ఉన్నాయి. అందుకే మొత్తం జీతం.. చాలా ఎక్కువగా కనిపిస్తుంది. కానీ ఇది ప్రతి సంవత్సరం లేదా ప్రతి నెల వచ్చే ఆదాయం మాత్రం కాదని స్పష్టమవుతోంది.అంతేకాదు, ఫారం-16లో కనిపించే మొత్తం డబ్బు ఉద్యోగి చేతికి కూడా రాదు. ప్రతి నెలా ఆదాయపు పన్ను, ఎన్పీఎస్ (NPS), ఈపీఎఫ్ (EPF) వంటి తప్పనిసరి కోతలు ఉంటాయి. వీటితో పాటు హోమ్ లోన్, కారు లోన్, బైక్ లోన్ వంటి నెలవారీ ఈఎంఐలు కూడా జీతం నుంచి కట్ అవుతాయి. కాబట్టి.. బ్యాంకు ఖాతాలో జమయ్యే టేక్ హోమ్ శాలరీ గ్రాస్ శాలరీతో పోలిస్తే చాలా తక్కువగా ఉంటుంది.ఈ విషయం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. కొందరు, ఫారం-16 చూసి మాత్రమే ఎవరి జీతాన్ని అంచనా వేయడం సరైంది కాదు. నిజంగా ఉద్యోగి చేతికి ఎంత వస్తుందో కూడా చూడాలి అని అభిప్రాయపడ్డారు. మరికొందరు మాత్రం, ఏమైనా సరే, సంవత్సరానికి రూ.35 లక్షలకు పైగా ప్యాకేజ్ అనేది మంచి జీతమే అని వ్యాఖ్యానించారు. ఇంకొందరు మేనేజర్ ప్రాథమిక వేతనం సుమారు రూ.11-12 లక్షలే అయినప్పటికీ, ఇతర అలవెన్సులు.. ప్రయోజనాలతో కలిపి సంవత్సరానికి మంచి ఆదాయం వస్తుందని తెలిపారు.People often say that SBI employees have a "settled life"but this Scale 3 Manager's salary slip might completely change your perspective.Eight years ago, a young man joined State Bank of India as a Probationary Officer.Today, he is a Scale 3 Manager, and his Form 16 for FY… pic.twitter.com/Iy7TJOkUJI— Pooja (@poojaofficial5) July 5, 2026 -
ట్రాఫిక్ కష్టాలపై క్రిస్ గోపాలకృష్ణన్ ఆవేదన
భారత సిలికాన్ వ్యాలీగా పిలవబడే బెంగళూరు నగరంలో ట్రాఫిక్ కష్టాలు రోజురోజుకూ మితిమీరిపోతున్నాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరినీ ఈ ట్రాఫిక్ నరకం వేధిస్తోంది. తాజాగా, ఐటీ దిగ్గజం ‘ఇన్ఫోసిస్’ సహ వ్యవస్థాపకుడు క్రిస్ గోపాలకృష్ణన్ సోషల్ మీడియా వేదికగా చేసిన ఒక పోస్ట్ బెంగళూరు నగర ట్రాఫిక్ దుస్థితిపై చర్చకు దారితీసింది.కారణాలివే..క్రిస్ గోపాలకృష్ణన్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా నగరం అంతా ఎదుర్కొంటున్న సమస్యను పంచుకున్నారు. ‘బెంగళూరు సిటీలో కేవలం 31 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి నాకు ఈ రోజు దాదాపు రెండున్నర గంటల సమయం పట్టింది. రోజురోజుకూ పరిస్థితి మరింత దిగజారుతోంది. విపరీతమైన ట్రాఫిక్ రద్దీ, అధ్వాన్నమైన రోడ్ల పరిస్థితి, డ్రైవర్లలో క్రమశిక్షణ లేకపోవడమే దీనికి ప్రధాన కారణాలు’ అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఒక ఐటీ రంగానికి చెందిన ప్రముఖుడి నుంచే ఇలాంటి స్పందన రావడంతో బెంగళూరు ఐటీ కారిడార్‌లో ప్రయాణించే వేలాది మంది ఉద్యోగులు, పౌరులు తమ ఆవేదనను కామెంట్ల రూపంలో వెల్లడిస్తున్నారు.‘వర్క్ ఫ్రమ్ హోమ్’ డిమాండ్గోపాలకృష్ణన్ పోస్ట్‌పై స్పందిస్తూ నెటిజన్లు తమ అనుభవాలను ఏకరువు పెడుతున్నారు. ఒక నెటిజన్ తనకు ఇటీవల 28 కిలోమీటర్ల ప్రయాణానికి దాదాపు మూడు గంటల సమయం పట్టిందని, బెంగళూరు ట్రాఫిక్ ప్రయాణం ఒక పీడకలగా మారిందని వాపోయారు. నగరంలో మౌలిక సదుపాయాలు మెరుగవుతాయనే నమ్మకం లేదని, అందువల్ల ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు మళ్లీ పూర్తిస్థాయిలో వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్లు ఇవ్వాలని పలువురు సూచిస్తున్నారు.పరిష్కారాలు ఇవే..ఈ దీర్ఘకాలిక సమస్యకు కేవలం రోడ్ల విస్తరణ మాత్రమే సరిపోదని, ప్రయాణికులతో పాటు ప్రభుత్వం కూడా ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలని నిపుణులు, పౌరులు కోరుతున్నారు. ఐటీ సంస్థలు తమ సిబ్బందిని వ్యక్తిగత వాహనాల్లో కాకుండా మెట్రో, బీఎంటీసీ బస్సు సర్వీసులను ఉపయోగించేలా ప్రోత్సహించాలని పౌరులు డిమాండ్ చేస్తున్నారు. నగరంలో ఏళ్ల తరబడి సాగుతున్న ఫ్లైఓవర్ పనులు, కొత్త మెట్రో కారిడార్ల నిర్మాణాలను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను కోరుతున్నారు. ఇవి పూర్తయితేనే కొంతవరకు ఉపశమనం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.ఇదీ చదవండి: కలెక్టర్ల జీతభత్యాల మాటేంటి? -
హైదరాబాద్‌లో నెస్లే బిజినెస్ సొల్యూషన్స్ జీసీసీ
న్యూఢిల్లీ: స్విస్ కన్జూమర్ గూడ్స్ దిగ్గజం నెస్లేలో భాగమైన నెస్లే బిజినెస్ సొల్యూషన్స్ (ఎన్బీఎస్) హైదరాబాద్‌లో తమ కొత్త గ్లోబల్ కేపబిలిటీ సెంటర్‌ను (జీసీసీ) ఏర్పాటు చేయనుంది. టెక్నాలజీ, ప్రాసెస్ సొల్యూషన్స్ సంస్థ జెన్‌ప్యాక్ట్‌తో కలిసి నెస్లే బిజినెస్ సర్వీసెస్ ఇండియా దీన్ని నెలకొల్పనుంది.కంపెనీ తన వ్యాపార సేవలను మరింత సరళంగా అందించేందుకు, నిర్దిష్ట ప్రమాణాలను పాటించేందుకు అవసరమైన ఆటోమేషన్, ఏఐ మొదలైన అంశాల్లో జెన్‌ప్యాక్ట్ తోడ్పాటు అందిస్తుంది. పటిష్టమైన టెక్నాలజీ వ్యవస్థ, మౌలిక సదుపాయాలు ఉండటంతో పాటు భారత్‌లో జీసీసీలకు హబ్‌గా ఎదుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్‌ను ఎంచుకున్నట్లు ఎన్బీఎస్ హెడ్ లూకా ఫిషెరా తెలిపారు. -
ఇక సహకార జీవిత బీమా సంస్థ
న్యూఢిల్లీ: సహకార రంగంలో జీవిత బీమా కంపెనీని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర సహకార శాఖ మంత్రి అమిత్ షా వెల్లడించారు. బీమా రంగంలో కూడా సహకార సంస్థలు వృద్ధి చెందడానికి ఇది ఉపయోగపడుతుందని చెప్పారు. ఎరువులకు సంబంధించిన కోఆపరేటివ్ ఇఫ్కో ఇప్పటికే జాయింట్ వెంచర్ (ఇఫ్కో–టోకియో) ద్వారా బీమా రంగంలో కార్యకలాపాలు నిర్వహిస్తోందని సహకార శాఖ ఐదో వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం దేశీయంగా 26 జీవిత బీమా సంస్థలు ఉన్నాయి.మరోవైపు, కోఆపరేటివ్ మోడల్‌గా ప్రవేశపెక్టిన భారత్ ట్యాక్సీ సేవలను వచ్చే రెండేళ్లలో 500 నగరాలకు విస్తరించనున్నట్లు మంత్రి వివరించారు. ప్రస్తుతం ఢిల్లీ, లక్నో, చండీగఢ్, ముంబై తదితర నగరాల్లో ఇవి అందుబాటులో ఉండగా.. త్వరలో రాంచీ, పాట్నా, భోపాల్ మొదలైన నగరాల్లోనూ ప్రవేశపెట్టనున్నట్లు షా చెప్పారు. భారత్‌లో 30 కోట్ల మంది పైగా సభ్యులతో 8.5 లక్షల పైచిలుకు సహకార సంఘాలు ఉన్నాయి. కోఆపరేటివ్ రంగంలో మానవ వనరుల సమస్యను పరిష్కరించేందుకు గుజరాత్‌లోని ఆనంద్‌లో ఏర్పాటు చేస్తున్న త్రిభువన్ సహకారి యూనివర్సిటీ తోడ్పడుతుందని మంత్రి చెప్పారు. బ్యాంకింగ్, డెయిరీ, మార్కెటింగ్ తదితర విభాగాల్లో ఈ వర్సిటీ నిపుణులను తయారు చేస్తుందని వివరించారు. -
వినియోగదారులను ముంచే ‘ఉత్తుత్తి’ ప్రకటనలు
మార్కెట్లో లభించే ప్యాకేజ్డ్ ఆహార ఉత్పత్తులపై రంగురంగుల లేబుళ్లు, ఆకర్షణీయమైన ప్రకటనలు చూసి మోసపోతున్న వినియోగదారుల రక్షణే ధ్యేయంగా దేశీయ ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) కఠిన చర్యలకు ఉపక్రమించింది. నిబంధనలను ఉల్లంఘిస్తూ, వినియోగదారులను తప్పుదోవ పట్టించేలా ప్రొడక్ట్ లేబుళ్లపై తప్పుడు వాదనలు చేసినందుకు గాను దేశంలోని మూడు ప్రముఖ ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లకు ఎఫ్ఎస్ఎస్ఏఐ నోటీసులు జారీ చేసింది.ఆహార భద్రత, ప్రమాణాల చట్టం-2006 (ఎఫ్ఎస్ఎస్ యాక్ట్) ప్రకారం వారిపై ఎందుకు కఠిన చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వడానికి ఏడు రోజుల గడువు విధించింది. ఈ జాబితాలో ప్రముఖ డైరీ బ్రాండ్ హెరిటేజ్ ఫుడ్స్ కూడా ఉండటం గమనార్హం.‘ఫ్రెష్ పన్నీర్’, ‘హెల్తీ’ పదాలపై హెరిటేజ్‌కు నోటీసులుప్రముఖ డైరీ సంస్థ హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ విక్రయిస్తున్న ‘హెరిటేజ్ ఫ్రెష్ పన్నీర్’ ఉత్పత్తిపై ఎఫ్ఎస్ఎస్ఏఐ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.‘ఫ్రెష్’ అనే పదంపై అభ్యంతరం: ఎఫ్ఎస్ఎస్ఏఐ నిబంధనలలోని షెడ్యూల్ V ప్రకారం... ఒక ఉత్పత్తికి ‘ఫ్రెష్’ (తాజా) అనే పదాన్ని వాడటానికి కొన్ని కఠినమైన షరతులు ఉన్నాయి. హెరిటేజ్ పన్నీర్ ఆ షరతులను పూర్తిగా సంతృప్తి పరచడం లేదని, తద్వారా ఇది వినియోగదారులను తప్పుదోవ పట్టించేలా ఉందని రెగ్యులేటర్ స్పష్టం చేసింది.‘హెల్తీ హ్యాపీనెస్’ ట్రేడ్‌మార్క్ వివాదం: బ్రాండ్ పేరు లేదా ట్రేడ్మార్క్లో ‘హెల్తీ’ (ఆరోగ్యకరమైనది) అనే పదాన్ని ఉపయోగించడంపై కూడా అభ్యంతరం వ్యక్తమైంది. ఇది ‘ఎఫ్ఎస్ఎస్ (అడ్వర్టైజింగ్ అండ్ క్లెయిమ్స్) రెగ్యులేషన్స్, 2018’లోని రూల్ 8 (3) కు విరుద్ధం. ఈ పదం వల్ల ఆ ఉత్పత్తి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందనే తప్పుడు అభిప్రాయం వినియోగదారుల్లో కలుగుతుందని ఎఫ్ఎస్ఎస్ఏఐ పేర్కొంది.‘100% ఆర్గానిక్’ అంటూ డియా ఫుడ్స్ మాయాజాలం!హాజెల్ నట్ చాక్లెట్‌ను మార్కెట్ చేస్తున్న డియా ఫుడ్స్ సంస్థపై కూడా ఎఫ్ఎస్ఎస్ఏఐ చర్యలు చేపట్టింది. ఈ ప్రొడక్ట్‌పై కంపెనీ చేసిన ‘ఆల్ నేచురల్’, ‘100% ఆర్గానిక్’, ‘శాకాహారి (వేగన్)’ వాదనలు చట్ట విరుద్ధమని తేలింది. ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్‌లో ఈ ఉత్పత్తికి సంబంధించి సేంద్రీయ (ఆర్గానిక్) ఆహారం లేదా శాకాహారి (వేగన్) గుర్తింపు కోసం ముందస్తు అనుమతులు తీసుకోలేదు. అయినప్పటికీ ప్యాకెట్‌పై ‘100% ఆర్గానిక్’ అని ముద్రించడం తీవ్రమైన ఉల్లంఘన కిందకే వస్తుంది.అంతేకాకుండా, మే 28, 2026న FSSAI జారీ చేసిన అడ్వైజరీ ప్రకారం.. ఆహార చట్టాల కింద ‘100%’ అనే పదానికి ఎలాంటి అధికారిక నిర్వచనం లేదా ప్రస్తావన లేదు. కాబట్టి ‘100% ఆర్గానిక్’ అనే వాదన ముమ్మాటికీ వినియోగదారులను మోసం చేయడమేనని రెగ్యులేటర్ తేల్చి చెప్పింది.సిప్జర్ న్యూట్రాస్యూటికల్స్..సిప్జర్ (Sipzer) సంస్థ విక్రయించే జ్యూస్ క్యాప్సూల్స్ లేబులింగ్, ప్రమోషన్లలో అక్రమాలు జరిగినట్లు FSSAI గుర్తించింది. ఈ కంపెనీ లేబుల్‌పై రాసిన ప్రతి అక్షరాన్నీ రెగ్యులేటర్ తూర్పారబట్టింది.FSSAI అప్రూవ్డ్?: కంపెనీ తన ప్యాకింగ్‌పై ‘FSSAI ఆమోదించబడింది’ (FSSAI Approved) అని ముద్రించుకుంది. నిజానికి FSSAI ఏ బ్రాండ్‌నూ ప్రత్యేకంగా ఆమోదించదు. కేవలం ప్రమాణాల లైసెన్స్ మాత్రమే ఇస్తుంది. ఈ లోగోను చూసి జనం ఇది ప్రభుత్వ సర్టిఫైడ్ ప్రొడక్ట్ అని నమ్మే ప్రమాదం ఉంది.శాస్త్రీయ ఆధారాలు లేవు: ‘మీ రోగనిరోధక శక్తిని పెంచండి’, ‘మీ శరీర విషాలను తొలగించండి’ వంటి భారీ డైలాగులకు కంపెనీ వద్ద ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.ప్యాకెట్ పైన టమోటా, దోసకాయ, బ్రోకలీ, క్యాబేజీ, కొత్తిమీర చిత్రాలను ముద్రించారు. కానీ, లోపల ఉన్న పదార్థాల జాబితాలో వీటి ప్రస్తావనే లేదు.లేబుల్‌పై విటమిన్-ఇ, విటమిన్-సి ఉన్నట్లు ప్రకటించినా విటమిన్-ఇ ఎంత ఉందో రాయలేదు. విటమిన్-సి కేవలం 0.1% మాత్రమే ఉంది. అలాగే, రోజువారీ అవసరాలకు ఇది ఎంత మేర తోడ్పడుతుందో తెలిపే ‘ఆర్డీఏ’ (Recommended Dietary Allowance) శాతాన్ని కూడా పేర్కొనలేదు.అధికారిక ఆర్గానిక్ సర్టిఫికేషన్ గుర్తులు కానీ లేకుండానే ‘సేంద్రీయ కూరగాయలతో తయారు చేయబడింది’ అని రాయడం నిబంధనల ఉల్లంఘనే.ఇదీ చదవండి: కుదేలైన దక్షిణాది తేయాకు ఉత్పత్తి! -
కుదేలైన దక్షిణాది తేయాకు ఉత్పత్తి!
భారతదేశంలో ఈ ఏడాది మే (2026) నెలలో దేశవ్యాప్త తేయాకు ఉత్పత్తిలో గణనీయమైన క్షీణత నమోదైంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో నెలకొన్న తీవ్ర వాతావరణ పరిస్థితులు, రుతుపవనాల ముందు కురవాల్సిన వేసవి వర్షాల్లో భారీ లోటు దేశీయ టీ ఉత్పత్తిని దెబ్బతీశాయి. టీ బోర్డు విడుదల చేసిన తాజా అధికారిక గణాంకాల ప్రకారం.. మే 2026లో దేశవ్యాప్త తేయాకు ఉత్పత్తి 3.54 శాతం తగ్గి 131.60 మిలియన్ కిలోలకు పరిమితమైంది.25 శాతం పతనమైన ఉత్పత్తిఈ సీజన్లో ఉత్తర భారత దేశం ఎంతోకొంత నిలదొక్కుకున్నప్పటికీ దక్షిణాది రాష్ట్రాలు మాత్రం వర్షాభావ పరిస్థితులతో తీవ్రంగా నష్టపోయాయి. మే నెలలో దక్షిణాదిలో తేయాకు ఉత్పత్తి ఏకంగా 25 శాతం పడిపోయి 19.88 మిలియన్ కిలోలకు పరిమితమైంది. గత ఏడాది ఇదే కాలంలో ఇక్కడ 26.57 మిలియన్ కిలోల ఉత్పత్తి రావడం గమనార్హం.రాష్ట్రాల వారీగా దక్షిణాది పరిస్థితిదక్షిణాదిలోనే అత్యధికంగా టీ ఉత్పత్తి చేసే తమిళనాడులో ఈసారి పరిస్థితి దారుణంగా ఉంది. గత ఏడాది మే నెలలో 19.04 మిలియన్ కిలోలుగా ఉన్న ఉత్పత్తి ఈ ఏడాది 28 శాతం క్షీణించి 13.63 మిలియన్ కిలోలకు పడిపోయింది.కేరళలో కూడా లోటు వర్షాల ప్రభావం స్పష్టంగా కనిపించింది. ఉత్పత్తి 16 శాతం తగ్గి 5.86 మిలియన్ కిలోలకు (గతంలో 7.03 మిలియన్ కిలోలు) చేరింది.కర్ణాటకలో సైతం ఉత్పత్తి 0.50 మిలియన్ కిలోల నుంచి 0.39 మిలియన్ కిలోలకు పడిపోయింది.ఉత్తరాదిలో స్వల్ప ఊరటదక్షిణాదితో పోలిస్తే ఉత్తర భారతదేశంలో పరిస్థితి కొంత మెరుగ్గానే ఉంది. గత ఏడాది మే నెలలో నమోదైన 109.86 మిలియన్ కిలోలతో పోలిస్తే, ఈసారి ఉత్తరాది ఉత్పత్తి స్వల్పంగా పెరిగి 111.72 మిలియన్ కిలోలకు చేరింది. దేశంలోనే అత్యధికంగా టీ ఉత్పత్తి చేసే అస్సాంలో మే నెల ఉత్పత్తి స్వల్పంగా తగ్గి 64.70 మిలియన్ కిలోలుగా (మే 2025లో 65.04 మిలియన్ కిలోలు) నమోదైంది. ఇందులో అస్సాం లోయ ప్రాంతంలో ఉత్పత్తి 61.83 మిలియన్ కిలోలకు తగ్గగా, కాచర్ ప్రాంతంలో మాత్రం స్వల్పంగా పెరిగి 2.87 మిలియన్ కిలోలకు చేరింది. పశ్చిమ బెంగాల్లో ఇక్కడ టీ ఉత్పత్తి 5 శాతం పెరిగి 42.69 మిలియన్ కిలోలకు (గతంలో 40.68 మిలియన్ కిలోలు) చేరింది. డూయర్స్, తెరాయ్ ప్రాంతాలు మంచి వృద్ధిని కనబరిచినప్పటికీ ప్రపంచ ప్రసిద్ధి చెందిన డార్జిలింగ్ ప్రాంతంలో మాత్రం ఉత్పత్తి స్వల్పంగామే 2026 గణాంకాలు ఇలా..ప్రాంతంమే 2025 ఉత్పత్తి (మి.కిలోల్లో)మే 2026 ఉత్పత్తి (మి.కిలోల్లో)మార్పుభారతదేశం (మొత్తం)136.42131.60-3.54%ఉత్తర భారతదేశం109.86111.72+1.69%దక్షిణ భారతదేశం26.5719.88-25.17%తమిళనాడు19.0413.63-28.41%కేరళ7.035.86-16.64% -
ఒక్క ప్రశ్నతో ఉద్యోగం పోయింది!
జాబ్ ఇంటర్వ్యూ కోసం వెళ్లే అభ్యర్థులు సాధారణంగా అడిగే ప్రశ్నలకు మాత్రమే సమాధానాలు సిద్ధం చేసుకుంటారు. కానీ ఇంటర్వ్యూ ముగిసే సమయంలో ''మీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా?'' అని అడిగితే ఎలా స్పందించాలి? అనే విషయంపై చాలామంది పెద్దగా దృష్టి పెట్టరు. ఇలాంటి సంఘటనే ఒక ఇండియన్ ప్రొడక్ట్ మేనేజర్‌కు ఎదురైంది. దీంతో అతడు ఉద్యోగం సైతం కోల్పోవాల్సి వచ్చింది.కెనడాలో పనిచేస్తున్న ఇండియన్ ప్రొడక్ట్ మేనేజర్ కరణ్ గోగ్నా ఇటీవల తనకు ఎదురైనా ఒక అనుభవాన్ని లింక్డ్ఇన్లో షేర్ చేశారు. అది ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.కరణ్ గోగ్నా ఓ యూజ్డ్ కార్ల స్టార్టప్ కంపెనీలో ప్రిన్సిపల్ ప్రొడక్ట్ మేనేజర్ ఉద్యోగానికి దరఖాస్తు చేశారు. ఇంటర్వ్యూలోని అన్ని దశలను విజయవంతంగా పూర్తి చేశారు. హెచ్ఆర్ ఆయన డాక్యుమెంట్లను తీసుకోవడంతో.. ఉద్యోగం దాదాపు ఖాయమైందని భావించారు. అయితే.. ఆఫర్ లెటర్ ఇవ్వడానికి ముందు కంపెనీ సీఈఓతో ఒక చివరి సమావేశం ఏర్పాటు చేశారు.సీఈఓతో సమావేశం బాగా జరిగిందని, ఉద్యోగం వస్తుందని నమ్మకం కలిగిందని కరణ్ తెలిపారు. చివర్లో సీఈఓ ''మీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా?'' అని అడిగారు. దానికి కరణ్, ''మీ కంపెనీ భవిష్యత్తులో టూ-వీలర్ మార్కెట్లోకి కూడా ప్రవేశించాలని ఆలోచిస్తోందా?'' అని ప్రశ్నించారు.అయితే.. సీఈఓ దానికి నేరుగా సమాధానం చెప్పకుండా, ''మీ అభిప్రాయం ఏమిటి? మేం ఆ మార్కెట్లోకి వెళ్లాలా?'' అని తిరిగి ప్రశ్నించారు. ఇలాంటి ప్రశ్న ఒకటి ఎదురవుతుందని ఊహించని కరణ్ ''కంపెనీ వ్యాపారం గురించి పూర్తిగా అధ్యయనం చేశానని, కానీ టూ-వీలర్ మార్కెట్ గురించి ఎలాంటి అభిప్రాయం లేదని తెలిపారు''. దీంతో ఆ సమయంలో తడబడి స్పష్టతలేని సమాధానం ఇచ్చానని అంగీకరించారు.మరుసటి రోజు హెచ్ఆర్ నుంచి ఫోన్ వచ్చి, కంపెనీ మరో అభ్యర్థిని ఎంపిక చేసుకున్నట్లు తెలిపారు. ఈ సంఘటనను గుర్తు చేసుకుంటూ కరణ్ ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇచ్చారు. ''ఇంటర్వ్యూకు వెళ్లేవారు సమాధానాల కోసం ఎంత సిద్ధమవుతారో, చివర్లో అడిగే ప్రశ్నల కోసం కూడా అంతే సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు''.ఎందుకంటే అభ్యర్థి అడిగే చివరి ప్రశ్న, అతని ఆలోచనా విధానం, వ్యాపార అవగాహన, విశ్లేషణ సామర్థ్యాన్ని ఇంటర్వ్యూవర్‌కు తెలియజేసే చివరి అవకాశం అవుతుందని పేర్కొన్నారు. దీనిపై నెటిజన్లు కూడా తమదైన రీతిలో స్పందించారు. చాలామంది తమకు కూడా ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయని చెప్పారు. -
వినియోగదారులకు బిగ్ షాక్.. మళ్లీ పెరగనున్న మొబైల్ రీఛార్జ్ ధరలు!
న్యూఢిల్లీ: భారత్‌లో ఫోన్ వినియోగదారులకు భారీ షాక్ తగలనుంది. త్వరలో మొబైల్ రీఛార్జ్ బిల్లులు (టెలికాం టారిఫ్‌లు) మరో 12శాతం నుండి 15శాతం వరకు పెరిగే అవకాశం ఉందని సెంట్రమ్ ఇన్స్టిట్యూషనల్ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. టెలికాం మార్కెట్లో పోటీదారుల సంఖ్య తగ్గి, కొన్ని ప్రధాన కంపెనీల ఆధిపత్యం పెరగడంతో ధరల పెంపునకు అనుకూలమైన వాతావరణం ఏర్పడిందని ఈ నివేదిక పేర్కొంది.నెట్వర్క్ అప్గ్రేడ్ల కారణంగా వినియోగదారులు వేగంగా 2జీ నుండి 4జీ,5జీ నెట్‌వర్క్‌లకు మారుతుండటంతో జూన్ త్రైమాసికంలో ప్రైవేట్ టెలికాం ఆపరేటర్ల సగటు ఆదాయం 1 నుండి 1.5 శాతం పెరిగే అవకాశం ఉందని నివేదిక అంచనా వేసింది.మార్కెట్ విశ్లేషణల ప్రకారం.. వొడాఫోన్ ఐడియా కంపెనీ తన చందాదారులను కోల్పోతుండగా, ఆ వాటాను జియో, ఎయిర్టెల్ దక్కించుకుంటున్నాయి. ఈ త్రైమాసికంలో జియో కొత్తగా 70 లక్షల మంది, ఎయిర్టెల్ 50 లక్షల మంది చందాదారులను చేర్చుకునే అవకాశం ఉండగా, వొడాఫోన్ ఐడియా కేవలం 2 లక్షల మంది వినియోగదారులను మాత్రమే పొందే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. ప్రస్తుతం జియో, ఎయిర్టెల్ కంపెనీలు దేశంలోని 90 శాతానికి పైగా జిల్లాల్లో తమ 5జీ సేవలను విస్తరించగా, వొడాఫోన్ ఐడియా సుమారు 100 నగరాల్లో 5జీ నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తెచ్చి, దానిని మరింత విస్తరించే పనిలో పడింది. కాగా, వొడాఫోన్ ఐడియా చెల్లించాల్సిన ఏజీఆర్ బకాయిల భారం రూ.25వేల కోట్లకు తగ్గినట్లు నివేదిక వెల్లడించింది. రాబోయే రోజుల్లో 4జీ, 5జీ నెట్‌వర్క్‌ల వాడకం మరింత పెరగనుండటంతో వినియోగదారుల డేటా వినియోగం కూడా భారీగా కొనసాగుతుందని నివేదిక స్పష్టం చేసింది. -
రూ.2.3 కోట్ల జాబ్.. అందుకే వదిలేశాడు!
చదువు పూర్తయ్యాక మంచి ప్యాకేజీతో జాబ్ వస్తే ఎవరు మాత్రం వద్దనుకుంటారు. కానీ ఐఐటీ బాంబే నుంచి కంప్యూటర్ సైన్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన వివేక్ శర్మ అనే యువకుడు, అమెరికాలో లభించిన భారీ వేతన ఉద్యోగ అవకాశాన్ని తృణప్రాయంగా వదులుకున్నాడు. ఇంతకీ ఆ యువకుడు జాబ్ ఎందుకు వదులుకున్నాడు? దీనికి గల కారణాలు ఏమిటనేది ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.వివేక్‌కు శాన్ఫ్రాన్సిస్కోలోని ఒక స్టార్టప్ సంస్థ నుంచి సంవత్సరానికి దాదాపు 240000 డాలర్ల (సుమారు రూ.2.3 కోట్లు) వేతనంతో జాబ్ ఆఫర్ వచ్చింది. వీసా స్పాన్సర్షిప్, రీలొకేషన్ సౌకర్యాలు కూడా అందుబాటులో ఉండటంతో జీవితం ఉన్నత స్థాయికి చేరుకుంటుందని భావించాడు. అయితే.. అదే సమయంలో అతని తండ్రికి గుండెపోటు రావడం, తల్లి క్యాన్సర్‌తో బాధపడుతున్న పరిస్థితి ఏర్పడింది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో కుటుంబాన్ని వదిలి విదేశాలకు వెళ్లడం కంటే తల్లిదండ్రుల పక్కన ఉండటం ముఖ్యమని భావించిన వివేక్, ఆ ఉద్యోగాన్ని వదులుకున్నాడు.Meet Vivek Sharma, a https://t.co/Ws1j7hoGgc Computer Science gold medalist from IIT Bombay, who left a $240,000-a-year (₹2.9 crore) US job to run a small grocery store beneath his house and take care of his parents by staying close to them.Coming from a simple… pic.twitter.com/7RwTepkL73— Vikas Alwys (@VikasAlwys) July 4, 2026జాబ్ వదులుకోవడంతో కుటుంబ ఆర్థిక పరిస్థితులు కఠినంగా మారడంతో, అతను తన ఇంటి కిందనే చిన్న కిరాణా దుకాణం ప్రారంభించాడు. ఈ వ్యాపారం ద్వారా కుటుంబ అవసరాలను తీర్చుకుంటూ, తల్లిదండ్రుల సంరక్షణను కొనసాగించాడు. ఐఐటీ బాంబే వంటి ప్రతిష్టాత్మక సంస్థలో చదివిన వ్యక్తి ఇలా సాధారణ వ్యాపారం చేయడం చాలామందిని ఆశ్చర్యానికి గురిచేసింది.పరిస్థితులు మెరుగుపడిన తర్వాత, వివేక్ తన పనిని విస్తరించాడు. దుకాణాన్ని నిర్వహించడంతో పాటు పేద పిల్లలకు కోడింగ్ బోధించడం, రాత్రిపూట ఫ్రీలాన్స్ సాఫ్ట్వేర్ ప్రాజెక్టులు చేయడం ప్రారంభించాడు. తన నైపుణ్యాన్ని సమాజ సేవకు ఉపయోగిస్తూ, కుటుంబ బాధ్యతలను కూడా నిర్వహించాడు.కొన్ని సంవత్సరాల తర్వాత అదే అమెరికన్ కంపెనీ మళ్లీ అతనిని సంప్రదించి, ఈసారి రిమోట్‌గా పని చేసే అవకాశం కల్పించినట్లు సమాచారం. దీంతో అతను తన స్వస్థలమైన కాన్పూర్‌లోనే ఉండి టెక్నాలజీ, బోధన, కుటుంబ బాధ్యతలను సమన్వయం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.ఇదీ చదవండి: జియో రూ.448 Vs ఎయిర్టెల్ రూ.469 ప్లాన్.. ఏది బెస్ట్? -
థాయ్‌లాండ్ వెళ్లేవారికి కొత్త రూల్స్.. ముఖ్యంగా ‘క్యాష్’
భారతీయ పర్యాటకులకు అత్యంత ఇష్టమైన విదేశీ గమ్యస్థానాల్లో థాయ్‌లాండ్ ఒకటి. అయితే తాజాగా అక్కడి ప్రవేశ నిబంధనలు కఠినతరం కావడంతో ప్రయాణానికి ముందు అవసరమైన పత్రాలు, వీసా, ఇతర షరతులను తప్పనిసరిగా పరిశీలించాలని బ్యాంకాక్‌లోని భారత రాయబార కార్యాలయం సూచించింది. జూలై 2న విడుదల చేసిన తాజా అడ్వైజరీలో భారతీయులు థాయ్‌లాండ్‌కు బయలుదేరే ముందు పాటించాల్సిన కీలక మార్గదర్శకాలను వెల్లడించింది. ఇటీవల భారతీయ పాస్‌పోర్ట్‌దారులకు అమల్లో ఉన్న వీసా-రహిత ప్రవేశ విధానంలో మార్పులు వచ్చిన నేపథ్యంలో ఈ సూచనలు జారీ చేసినట్లు పేర్కొంది.రాయబార కార్యాలయం సూచనల ప్రకారం.. థాయ్‌లాండ్ చేరుకునే తేదీ నుంచి కనీసం ఆరు నెలల గడువు ఉన్న చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్ట్ తప్పనిసరి. అలాగే కన్ఫర్మ్ అయిన రిటర్న్ విమాన టికెట్, హోటల్ బుకింగ్, స్పష్టమైన ట్రావెల్ ఇటినరరీ (ప్రయాణ ప్రణాళిక) వెంట ఉండాలి. ప్రయాణికులు దేశంలో అడుగుపెట్టే 72 గంటల ముందు థాయ్‌లాండ్ డిజిటల్ అరైవల్ కార్డ్ (TDAC)ను ఆన్లైన్లో తప్పనిసరిగా పూర్తి చేయాలి. దానికి సంబంధించిన క్యూఆర్ కోడ్‌ను ఇమ్మిగ్రేషన్ తనిఖీల సమయంలో చూపించాల్సి ఉంటుంది.వీసా, నగదు నిబంధనలుప్రయాణ ఉద్దేశానికి అనుగుణంగా సరైన వీసా పొందాలని భారత రాయబార కార్యాలయం స్పష్టం చేసింది. ముఖ్యంగా వీసా ఆన్ అరైవల్ (VOA) లేదా వర్తించే ప్రవేశ సదుపాయాన్ని వినియోగించే ప్రయాణికులు ఒక్కొక్కరు కనీసం 20,000 థాయ్ బాట్లు (సుమారు రూ.57,000–58,000) నగదు వెంట ఉంచుకోవాలని సూచించింది. అవసరమైతే దీనికి సంబంధించిన ఆధారాలను ఇమ్మిగ్రేషన్ అధికారులు అడిగే అవకాశం ఉందని హెచ్చరించింది.ఉద్యోగం కోసం వెళ్తుంటే జాగ్రత్తథాయ్లాండ్లో ఉద్యోగం పొందిన వారు పర్యాటక వీసా లేదా వీసా ఆన్ అరైవల్‌పై దేశంలోకి ప్రవేశించకూడదని రాయబార కార్యాలయం స్పష్టం చేసింది. ఉపాధి కోసం వెళ్లేవారు ముందుగానే తగిన వర్క్ లేదా సంబంధిత వీసా తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే స్థానిక ఇమ్మిగ్రేషన్ నిబంధనల ఉల్లంఘనగా పరిగణించే అవకాశం ఉంది. అలాగే థాయ్‌లాండ్ మీదుగా మరో దేశానికి వెళ్లే ట్రాన్సిట్ ప్రయాణికులు తమ తుది గమ్యస్థానానికి అవసరమైన వీసాలు, టికెట్లు, ఇతర పత్రాలను కూడా వెంట ఉంచుకోవాలని సూచించింది.ముఖ్యమైన చెక్‌లిస్ట్ ఇదే..చేరుకునే తేదీ నుంచి కనీసం 6 నెలల గడువు ఉన్న పాస్‌పోర్ట్.కన్ఫర్మ్ అయిన రిటర్న్ టికెట్.ధ్రువీకరించిన హోటల్ బుకింగ్.పూర్తి ప్రయాణ ప్రణాళిక.ప్రయాణానికి 72 గంటల ముందు పూర్తి చేసి TDAC క్యూఆర్ కోడ్ప్రయాణ ఉద్దేశానికి తగిన వీసావెంట కనీసం 20,000 థాయ్ బాట్ల నగదు.ఇమ్మిగ్రేషన్ కౌంటర్‌కు వెళ్లే ముందు అన్ని పత్రాలను సిద్ధంగా ఉంచుకోవడం.గ్రూప్‌గా వెళ్లినా ప్రతి ప్రయాణికుడు తన సొంత పత్రాలు కలిగి ఉండడం.ఉద్యోగం కోసం వెళ్తుంటే టూరిస్ట్ ఎంట్రీ సదుపాయాలను ఉపయోగించకపోవడం.ట్రాన్సిట్ ప్రయాణికులు తుది గమ్యస్థానానికి సంబంధించిన అన్ని పత్రాలు వెంట ఉంచుకోవడం.ప్రయాణానికి ముందు తాజా ఇమ్మిగ్రేషన్ నిబంధనలు, వీసా అర్హతలు, అవసరమైన పత్రాలను మరోసారి ధ్రువీకరించుకోవాలని భారత రాయబార కార్యాలయం భారతీయ పౌరులకు సూచించింది. దీంతో థాయ్‌లాండ్‌లో ప్రవేశ సమయంలో ఇబ్బందులు తలెత్తకుండా, ప్రయాణం సాఫీగా సాగుతుందని పేర్కొంది.Advisory for Indian nationals visiting Thailand. pic.twitter.com/wEAMyH7H0D— India in Thailand (@IndiainThailand) July 2, 2026 -
ప్రపంచంలో మన పాస్‌పోర్ట్ ఎంత పవర్ఫుల్ అంటే..
ప్రపంచ పాస్‌పోర్ట్‌ల బలాన్ని కేవలం వీసా-రహిత ప్రయాణంతోనే కాకుండా, విదేశాల్లో నివసించే అవకాశాలు, పెట్టుబడులు, జీవన నాణ్యత వంటి అంశాల ఆధారంగా అంచనా వేసే ‘గ్లోబల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్ (Global Passport Index–GPI) 2026’ నివేదిక విడుదలైంది. ఈ ఏడాది కూడా యూరప్ దేశాలే ఆధిపత్యం చాటగా, టాప్-10లో తొమ్మిది స్థానాలను యూరోపియన్ దేశాలు కైవసం చేసుకున్నాయి. ఆసియా నుంచి సింగపూర్ మాత్రమే ఈ జాబితాలో చోటు దక్కించుకుంది.ఏమిటీ గ్లోబల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్?గ్లోబల్ సిటిజన్ సొల్యూషన్స్ రూపొందించే ఈ సూచీ, సాధారణ పాస్‌పోర్ట్ ర్యాంకింగ్‌లకు భిన్నంగా ఉంటుంది. ఎక్కువ దేశాలకు వీసా లేకుండా ప్రయాణించే అవకాశాన్ని మాత్రమే కాకుండా, పాస్‌పోర్ట్ కలిగిన వ్యక్తికి ప్రపంచవ్యాప్తంగా లభించే మొత్తం ప్రయోజనాలను అంచనా వేస్తుంది. ఇందులో మొబిలిటీ (50 శాతం), పెట్టుబడి అవకాశాలు (25 శాతం), జీవన నాణ్యత (25 శాతం) అనే మూడు ప్రధాన విభాగాల్లో మొత్తం 14 సూచికలను పరిగణనలోకి తీసుకుంటారు. ఇందుకోసం ప్రపంచ బ్యాంక్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం, సస్టైనబుల్ డెవలప్మెంట్ రిపోర్ట్ వంటి అంతర్జాతీయ సంస్థల గణాంకాలను ఉపయోగిస్తారు.టాప్-10 శక్తివంతమైన పాస్‌పోర్ట్‌లు1. స్వీడన్2. స్విట్జర్లాండ్3. ఫిన్లాండ్4. జర్మనీ5. నెదర్లాండ్స్, 6. డెన్మార్7. ఐర్లాండ్8. యునైటెడ్ కింగ్డమ్9. నార్వే10. సింగపూర్భారత్ పరిస్థితి ఎలా ఉందంటే..?గ్లోబల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్ 2026లో 200 దేశాల్లో భారత్ 125వ స్థానంలో నిలిచింది. మొబిలిటీ విభాగంలో 135వ స్థానం, జీవన నాణ్యతలో 118వ స్థానం నమోదు చేసింది. గత కొన్నేళ్లలో అనేక దేశాలు తమ పౌరులకు అంతర్జాతీయ ప్రయాణ సౌలభ్యాన్ని మరింత విస్తరించగా, ఆ వేగంతో భారత్ పురోగతి సాధించలేదని ఈ నివేదిక సూచిస్తోంది.అయితే, కేవలం వీసా-రహిత ప్రయాణ అవకాశాలను మాత్రమే పరిగణనలోకి తీసుకునే హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో భారత్ ప్రస్తుతం 80వ స్థానంలో ఉంది. తాజా జూలై 2026 అప్డేట్ ప్రకారం భారత పాస్‌పోర్ట్ కలిగిన వారు 56 దేశాలకు వీసా-ఫ్రీ లేదా వీసా-ఆన్-అరైవల్ సౌకర్యంతో ప్రయాణించగలరు. ఈ దేశాల్లో ఎక్కువ భాగం ఆఫ్రికా, ఆసియా, కరేబియన్, పసిఫిక్ ప్రాంతాలకు చెందినవే. అమెరికా, యునైటెడ్ కింగ్డమ్, చాలా యూరోపియన్ దేశాలకు మాత్రం భారతీయులు ఇప్పటికీ ముందస్తు వీసా పొందాల్సి ఉంటుంది. -
నెలకు రూ.4 లక్షలు.. ఫ్రీగా థాయ్‌లాండ్ ట్రిప్!
ఇంటర్న్‌షిప్‌లు అనుభవాన్ని సంపాదించుకోవడానికి విద్యార్థులకు లభించే అవకాశాలు. కానీ కొందరికి అవే జీవితాన్ని మార్చే మలుపులుగా మారిపోతాయి. అలాంటి ఒక ఆసక్తికరమైన సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఫస్ట్ ఇయర్ చదువుతున్న కాలేజ్ స్టూడెంట్ 'సిద్ధార్థ్ దుబే' టాప్‌మేట్ అనే టెక్ స్టార్టప్‌లో సేల్స్ ఇంటర్న్‌గా చేరాడు. అతనికి ఎలాంటి అనుభవం లేకపోయినా.. తన ప్రతిభతో నెలకు రూ.4 లక్షల స్టైపెండ్ అందుకున్నాడు. అంతే కాకుండా.. కంపెనీ ఖర్చులతో థాయ్‌లాండ్ ట్రిఫ్ను గిఫ్ట్‌గా గెలుచుకున్నాడు.ఐఐటి పూర్వ విద్యార్థి, టాప్‌మేట్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ అయిన దినేష్ సింగ్.. సిద్ధార్థ్ దుబే స్టోరీని లింక్డ్ఇన్ పోస్ట్‌లో షేర్ చేసిన తరువాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ పోస్ట్ చాలా వేగంగా వైరల్ అయింది.దినేశ్ సింగ్ తన పోస్టులో వివరిస్తూ.. సిద్ధార్థ్ తన టీమ్‌లో అతి చిన్న వయస్సు వాడైనప్పటికీ.. పెద్ద అనుభవం లేనప్పటికీ అతనిలో ఉన్న కమ్యూనికేషన్ స్కిల్స్, ఆత్మవిశ్వాసం, కొత్త వ్యక్తులతో మాట్లాడి వారి అవసరాలను అర్థం చేసుకుని నమ్మకాన్ని ఏర్పరచగల సామర్థ్యం అతన్ని ప్రత్యేకంగా నిలిపాయి. గత నెలలో అత్యధిక సేల్స్ సాధించినట్లు పేర్కొన్నారు. అతని పనితీరు చూసి కంపెనీ అతనికి స్పెషల్ గిఫ్ట్‌గా పూర్తిగా ఖర్చులు భరించి థాయిలాండ్ ట్రిప్ కూడా ఇచ్చింది.ఈ కథ చాలా మందికి ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తు చేస్తోంది. కేవలం డిగ్రీలు లేదా సర్టిఫికెట్లు మాత్రమే కాదు, మనం మాట్లాడే విధానం, ఆలోచన, ప్రవర్తన కూడా కెరీర్లో పెద్ద మార్పు తీసుకురాగలవు. సోషల్ మీడియాలో కూడా దీనిపై చాలా మంది స్పందించారు. కొందరు ఇది 'టాలెంట్ + అవకాశం' కలిసిన ఉదాహరణ అని చెప్పగా, మరికొందరు 'ప్రతిభకు వయసుతో పనిలేదని' వ్యాఖ్యానించారు. -
ఏటీఎఫ్ సబ్సిడీ.. మాకొద్దులే!
పశ్చిమాసియా ప్రభావంతో పెరుగుతున్న ఇంధన ధరల భారం నుంచి ఎయిర్‌లైన్స్‌కి ఊరట కల్పించేందుకు ప్రభుత్వం ప్రతిపాదించిన ధరల స్థిరీకరణ పథకానికి ఆదరణ కరువైంది. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో దీన్ని ఉపయోగించుకోవడంపై విమానయాన సంస్థలేవీ ఆసక్తి చూపలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి.వివరాల్లోకి వెళ్తే .. ప్రభుత్వం రూ. 10,000 కోట్లతో జెట్ ఫ్యూయల్ రేట్ల స్థిరీకరణ పథకాన్ని ప్రకటించింది. ఎయిర్‌లైన్స్ ఇందులో స్వచ్ఛందంగా చేరొచ్చు. దీని ప్రకారం మూడేళ్ల పాటు పన్నులు మొదలైనవన్నీ కలిపి లీటరుకు రూ. 115 రేటు (ఢిల్లీ ధర) చొప్పున చెల్లించి కొనుక్కునేలా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకోవాల్సి ఉంటుంది.సబ్సిడీపై విక్రయించడం వల్ల ఆయిల్ కంపెనీలకు నష్టాలేవైనా వాటిల్లితే ప్రభుత్వం దాన్ని భర్తీ చేస్తుంది. ఈ స్కీములో చేరని కంపెనీలు మార్కెట్ ధరలను చెల్లించి కొనుక్కోవాల్సి ఉంటుంది. పథకాన్ని ప్రకటించిన జూన్ 3 నాడు రేట్లు సుమారు రూ. 142 స్థాయిలో ఉండగా రూ. 115 రేటును ప్రతిపాదించారు. కానీ ప్రస్తుతం ఆ రెండింటి కన్నా ఏటీఎఫ్ ధర గణనీయంగా తగ్గి రూ. 110 స్థాయికి తగ్గింది. రూ. 38 వేల కోట్లకు ఎయిర్‌లైన్స్ నష్టాలు నిర్వహణ వ్యయాలు పెరిగిపోవడం, డాలరుతో రూపాయి మారకం విలువ పడిపోవడం తదితర అంశాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీ విమానయాన సంస్థల పనితీరుపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపనున్నాయి. 2026–27లో ఎయిర్‌లైన్స్ నష్టాలు ఏకంగా రూ. 36,000–38,000 కోట్లకు పెరగనున్నాయి. రేటింగ్స్ ఏజెన్సీ ఇక్రా ఒక నివేదికలో ఈ విషయాలు వెల్లడించింది. వాస్తవానికి 2027 ఆర్థిక సంవత్సరంలో నష్టాలు రూ. 11,000–12,000 కోట్లకు తగ్గుతాయని ముందుగా అంచనా వేసినప్పటికీ, ఆ తర్వాత పరిస్థితులు మారిపోయినట్లు వివరించింది. -
ఉచితంగా ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్!
భారతదేశంలో ఆధార్ ప్రతి పౌరుడికి ఒక ముఖ్యమైన గుర్తింపు పత్రంగా మారింది. ముఖ్యంగా పిల్లల కోసం ఆధార్ వివరాలు సరిగ్గా ఉండటం చాలా అవసరం. కాబట్టి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) 5 నుంచి 17 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలకు తప్పనిసరి బయోమెట్రిక్ అప్డేట్ చేయాలని చెబుతోంది.పిల్లలు పెరుగుతున్న కొద్దీ వారి వేలిముద్రలు, కంటి (ఐరిస్) నమూనాలు, ముఖ ఆకృతి కొంత మారుతుంది. అందువల్ల చిన్న వయస్సులో తీసుకున్న బయోమెట్రిక్ వివరాలు కాలక్రమేణా సరైన గుర్తింపును ఇవ్వకపోవచ్చు. ఈ సమస్యను నివారించడానికి యూఐడీఏఐ ఈ అప్డేట్ను తప్పనిసరి చేసింది. దీనివల్ల ఆధార్ వివరాలు మరింత ఖచ్చితంగా ఉంటాయి.ఈ బయోమెట్రిక్ అప్డేట్ ముఖ్యంగా విద్యార్థులకు చాలా అవసరం. ఎందుకంటే వీరికి స్కూల్, కాలేజీల్లో ప్రవేశాలు లేదా పోటీ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవడానికి.. ప్రభుత్వ స్కాలర్షిప్లు, ఇంటర్న్‌షిప్‌లు, ఫెలోషిప్‌లకు ఆధార్ ఆధారిత గుర్తింపు అవసరం అవుతుంది. అలాగే ప్రభుత్వ పథకాలు పొందడంలో కూడా ఇది కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి పిల్లల ఆధార్ వివరాలు అప్డేట్లో ఉండటం అవసరం.యూఐడీఏఐ ప్రకారం.. 5 నుంచి 17 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలకు ఈ తప్పనిసరి బయోమెట్రిక్ అప్డేట్ ప్రస్తుతం ఉచితంగా అందుబాటులో ఉంది. ఈ సదుపాయం 2026 సెప్టెంబర్ 30 వరకు కొనసాగుతుంది. ఈ గడువులోపు అప్డేట్ చేయించుకుంటే ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉండదు.ఈ బయోమెట్రిక్ అప్డేట్ ప్రక్రియ చాలా సులభంగా ఉంటుంది. తల్లిదండ్రులు లేదా సంరక్షకులు పిల్లలతో కలిసి సమీపంలోని ఆధార్ సేవా కేంద్రం లేదా నమోదు కేంద్రానికి వెళ్లాలి. అక్కడ పిల్లల వేలిముద్రలు, ఐరిస్ స్కాన్, ఫోటో తీసి అప్డేట్ చేస్తారు. కొన్ని నిమిషాల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుంది.Mandatory Biometric Updates (MBU) are required on attaining the age of 5 & 15 years. Ensure your child's Aadhaar remains updated and accurate.UIDAI is running a special drive and MBU is now free between the age of 5-17 till 30 September 2026.Locate your nearest Aadhaar… pic.twitter.com/5yi4qYF7l0— Aadhaar (@UIDAI) July 4, 2026 -
ఏఐ ఫర్ గుడ్ గ్లోబల్ కమిషన్‌లో అంబానీ, మిట్టల్
ఇంటర్నేషనల్ టెలీకమ్యూనికేషన్ యూనియన్ (ఐటీయూ) చొరవతో ఏర్పాటైన ఏఐ ఫర్ గుడ్ గ్లోబల్ కమిషన్‌లో దేశీ కార్పొరేట్ దిగ్గజాలకు చోటు దక్కింది. వ్యవస్థాపక సభ్యులు, 44 మంది కమిషనర్ల జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ సీఎండీ ముకేశ్ అంబానీ, భారతి ఎంటర్ప్రైజెస్ వ్యవస్థాపకుడు, చైర్మన్ సునీల్ భారతి మిట్టల్ ఉన్నారు.ఈ కమిషన్‌కి రువాండా అధ్యక్షుడు పాల్ కగామే, సేల్స్‌ఫోర్స్ సీఈవో మార్క్ బెనియాఫ్లు కో–చెయిర్‌గా వ్యవహరిస్తారు. వాస్తవ ప్రపంచపు సవాళ్లను పరిష్కరించడంలో ఏఐ సామర్థ్యాలను వినియోగంలోకి తేవడానికి, దానిపై అవగాహన, నమ్మకాన్ని పెంచడానికి ఈ కమిషన్ పని చేస్తుంది. ఫౌండింగ్ మెంబర్‌గా సునీల్ మిట్టల్‌ని ప్రతిపాదించడంపై భారతి ఎంటర్ప్రైజెస్ హర్షం వ్యక్తం చేసింది. -
దేశంలో తొలి గ్రీన్‌ఫీల్డ్ రిఫైనరీ ప్రారంభం!
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజస్థాన్‌లోని.. బలోత్రా జిల్లాలోని పచ్‌పద్ర ప్రాంతంలో దేశంలోని తొలి గ్రీన్‌ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ రిఫైనరీ-పెట్రోకెమికల్ సముదాయాన్ని ప్రారంభించారు. ఇది దేశ ఇంధన, పెట్రోకెమికల్ రంగంలో కొత్త అధ్యాయంగా నిలిచింది. ఈ సముదాయం భారతదేశ ఇంధన భద్రతను బలోపేతం చేయడంతో పాటు దేశీయ పారిశ్రామికాభివృద్ధికి కీలకంగా మారనుంది.ఈ రిఫైనరీని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL), రాజస్థాన్ ప్రభుత్వం సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ఈ గ్రీన్‌ఫీల్డ్ రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌ను రూ. 79,450 కోట్ల కంటే ఎక్కువ పెట్టుబడితో ఏర్పాటు చేశారు. దీని సామర్థ్యం సంవత్సరానికి 9 మిలియన్ మెట్రిక్ టన్నులు. అదనంగా ఏడాదికి 2.4 మిలియన్ మెట్రిక్ టన్నుల పెట్రోకెమికల్ ఉత్పత్తులను తయారు చేసే సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంది.ఈ ప్రాజెక్టు ద్వారా భారతదేశం దిగుమతులపై ఆధారపడే అవసరం తగ్గి, దేశీయంగా పెట్రోకెమికల్ ఉత్పత్తుల తయారీ పెరుగుతుంది. దీనివల్ల దేశ ఇంధన భద్రత మరింత బలోపేతం అవుతుంది. అంతే కాకుండా.. ఈ రిఫైనరీ ఆధారంగా ఇక్కడ పెట్రోకెమికల్, ప్లాస్టిక్ పార్క్ అభివృద్ధి చెందనుంది. దీనివల్ల చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, అనుబంధ పరిశ్రమలు ఏర్పడి స్థానిక ఆర్థికాభివృద్ధికి తోడ్పడతాయి. ఈ ప్రాజెక్టు వేలాది మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలను కల్పిస్తుంది. దీంతో రాజస్థాన్ రాష్ట్రం ఆర్థికంగా మరింత అభివృద్ధి చెందనుంది.#WATCH | Balotra, Rajasthan | Prime Minister Narendra Modi flags off refinery production tankers from the Greenfield Refinery-cum-Petrochemical Complex, developed as a joint venture between Hindustan Petroleum Corporation Limited (HPCL) and the Rajasthan Government, which PM Modi… pic.twitter.com/YHAZSdihQE— ANI (@ANI) July 4, 2026 -
పాల కల్తీపై ఎఫ్‌డీఏ ఉక్కుపాదం
పాల కల్తీని పూర్తిగా అరికట్టడమే లక్ష్యంగా మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) కీలక నిర్ణయం తీసుకుంది. ఆహార భద్రతా ప్రమాణాలను మరింత బలోపేతం చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా పాలు, పాల ఉత్పత్తుల విక్రయాలపై కఠినమైన ఉత్తర్వులను జారీ చేసింది. జులై 3 నుంచి అమల్లోకి వచ్చిన ఈ కొత్త నిబంధనలు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని పాల వ్యాపారాలకు వర్తిస్తాయని అధికారులు స్పష్టం చేశారు. ఇటీవల కాలంలో సింథటిక్ పాలు, పాల కల్తీ, రవాణాలో జరుగుతున్న పలు ఉల్లంఘనలను గుర్తించిన మహారాష్ట్ర ప్రభుత్వం.. ప్రజారోగ్య రక్షణే ధ్యేయంగా ఈ నిర్ణయం తీసుకుంది. కల్తీదారుల పట్ల ప్రభుత్వం ‘జీరో టాలరెన్స్’ విధానాన్ని అవలంబిస్తోందని ఎఫ్‌డీఏ హెచ్చరించింది.కొత్త మార్గదర్శకాలు..పాశ్చరైజ్డ్ పాలను కేవలం సీల్ చేసిన, సరిగ్గా లేబుల్ చేయబడిన, ట్యాంపర్-స్పష్టమైన (ఎవరూ మార్చడానికి వీలులేని) ప్యాకేజింగ్‌లో మాత్రమే విక్రయించాలి.పాలు ఎక్కడి నుంచి సేకరించారు? ఎవరికి సరఫరా చేశారు? అనే పూర్తి రికార్డులను నిర్వహించడం తప్పనిసరి. డైరీ ఫార్మ్ (వ్యవసాయ స్థాయి) నుంచి చివరి వినియోగదారుడికి అమ్మే వరకు ప్రతి దశను ట్రాక్ చేసేలా రికార్డులు ఉండాలి.పాలను నిల్వ చేయడానికి, రవాణా చేయడానికి కేవలం ఫుడ్-గ్రేడ్ స్టెయిన్లెస్ స్టీల్ కంటైనర్లను మాత్రమే ఉపయోగించాలి. ప్లాస్టిక్ లేదా ఇతర నాణ్యత లేని పాత్రల వినియోగాన్ని పూర్తిగా నిషేధించారు.పాలు, పాల ఉత్పత్తుల నిర్వహణ, పంపిణీ ప్రక్రియల్లో పాల్గొనే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే వార్షిక వైద్య ఫిట్నెస్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.ముడి పాలపై ప్రత్యేక హెచ్చరికమార్కెట్లో వినియోగదారులకు నేరుగా విక్రయించే ముడి పాలు ప్యాకెట్లు లేదా కంటైనర్లపై ‘ఉపయోగించడానికి ముందు తప్పనిసరిగా వేడి చేయండి’ అనే హెచ్చరికను ప్రముఖంగా ప్రదర్శించాలని ఎఫ్‌డీఏ ఆదేశించింది.రూ.10 లక్షల వరకు జరిమానా!ఆహార భద్రతా నిబంధనలను ఉల్లంఘించి పాల కల్తీకి పాల్పడే వారిపై కఠిన చర్యలు ఉంటాయని అధికారులు హెచ్చరించారు. నిబంధనల ప్రకారం, కల్తీకి పాల్పడిన వారికి రూ.10 లక్షల వరకు జరిమానా విధించడంతో పాటు చట్టపరమైన క్రిమినల్ చర్యలు కూడా ఉంటాయని స్పష్టం చేశారు.ఇదీ చదవండి: బ్యాటరీ లైఫ్ పెరగాలంటే ఈ తప్పులు చేయకండి! -
అన్ని జానర్ల డేటా నిలిపివేతకు కేంద్రం ఆదేశం!
భారతీయ టెలివిజన్ ప్రసార రంగంలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. దేశంలోని టీవీ ఛానెళ్ల భవితవ్యాన్ని, ప్రకటనల మార్కెట్‌ను శాసించే టెలివిజన్ రేటింగ్లను తక్షణమే నిలిపివేయాలని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ (ఎంఐబీ) ఆదేశాలు జారీ చేసింది. కొత్తగా అమలులోకి వచ్చిన ‘టెలివిజన్ రేటింగ్స్ పాలసీ, 2026’ ప్రకారం.. బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) అధికారికంగా తన లైసెన్స్‌ను పునరుద్ధరించుకునే వరకు అన్ని రకాల జానర్ల టీవీ రేటింగ్‌ల ప్రచురణను పూర్తిగా నిలిపివేయాల్సి ఉంటుంది.గతంలో కేవలం న్యూస్ ఛానెళ్లకు మాత్రమే పరిమితమైన ఈ రేటింగ్స్ నిలిపివేత విధానాన్ని ఇప్పుడు జనరల్ ఎంటర్టైన్మెంట్ (జీఈసీ), స్పోర్ట్స్, సినిమాలు, ప్రాంతీయ ఛానెళ్లతో సహా అన్ని విభాగాలకు విస్తరించడం దేశీయ ప్రసార, ప్రకటనల పరిశ్రమల్లో ఆందోళన కలిగిస్తోంది.ఆదేశాలు ఏం చెబుతున్నాయి?కేంద్ర మంత్రిత్వ శాఖ జారీ చేసిన తాజా ఆదేశాల ప్రకారం.. ‘బార్క్’ సంస్థను పూర్తిగా మూసివేయడం లేదు. అయితే, నవీకరించబడిన కొత్త నియంత్రణ ఫ్రేమ్‌వర్క్‌కు సంస్థ పూర్తిగా అనుగుణంగా ఉందో లేదో ధ్రువీకరించే వరకు రేటింగ్ కార్యకలాపాలు, డేటా ప్రచురణను నిలిపివేయాలని స్పష్టం చేసింది.బార్క్ బ్యాక్-ఎండ్ వ్యవస్థలు యథావిధిగా పనిచేస్తాయని గమనించాలి. అవి ప్రేక్షకుల వ్యుయర్షిప్ డేటాను సేకరిస్తూనే ఉంటాయి. కానీ, మంత్రిత్వ శాఖ తన సమ్మతి సమీక్షను (Compliance Review) పూర్తి చేసి కొత్త విధానం కింద తాజా లైసెన్స్ మంజూరు చేసే వరకు ఎలాంటి గణాంకాలను బహిరంగంగా ప్రచురించడానికి వీల్లేదు.టెలివిజన్ రేటింగ్ వ్యవస్థలో పారదర్శకతను మెరుగుపరచడానికి, పాలనను సరిదిద్దడానికి, ప్రేక్షకుల మెజర్మెంట్లో కచ్చితత్వాన్ని పెంచడానికి ఈ ‘టెలివిజన్ రేటింగ్స్ పాలసీ, 2026’ను ప్రవేశపెట్టారు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అన్ని రేటింగ్ ఏజెన్సీలు సవరించిన ఈ గైడ్‌లైన్స్‌కు లోబడి తమ లైసెన్సులను పునరుద్ధరించుకోవాల్సి ఉంటుంది.న్యూస్ ఛానల్స్ నుంచి అన్ని జానర్ల వరకు..టెలివిజన్ రంగంలో రేటింగ్స్ సస్పెన్షన్ అనేది పూర్తిగా కొత్త విషయమేమీ కాదు. గతంలో టీఆర్పీ డేటా తారుమారు అవుతోందనే ఆరోపణలు, సమగ్రతపై ఆందోళనల నేపథ్యంలో న్యూస్ ఛానెల్ రేటింగ్స్‌పై కొంతకాలం పాటు స్తంభింపజేశారు. కానీ, తాజా ఆదేశం టెలివిజన్ రంగాన్ని పూర్తిగా ప్రభావితం చేయనుంది. వినోదం, క్రీడలు, సినిమాలు, ప్రాంతీయ కంటెంట్‌తో సహా ప్రతి ఒక్క జానర్‌ను దీని పరిధిలోకి తీసుకొచ్చారు.ఇదీ చదవండి: బ్యాటరీ లైఫ్ పెరగాలంటే ఈ తప్పులు చేయకండి! -
బ్రాండ్ల రేటింగ్‌లో ‘టాటా టీ’ టాప్!
వినియోగదారుల కొనుగోలు ఆసక్తి ఆధారంగా ‘టీఆర్ఏ రీసెర్చ్’ విడుదల చేసిన తాజా ఇండెక్స్‌లో ‘టాటా టీ’ అగ్రస్థానంలో నిలిచింది. ఈ రేటింగుల్లో టాటా టీ 455 పాయింట్లతో మొదటి స్థానాన్ని దక్కించుకోగా.. బ్రిటానియా (380.3 పాయింట్లు), ప్రభుత్వ రంగ ఎస్బీఐ (283.8 పాయింట్లు) తర్వాతి స్థానాల్లో నిలిచాయి. అత్యధిక వృద్ధి సాధించిన టాప్–10 బ్రాండ్లలో ఆసుస్ ల్యాప్టాప్స్, గ్లూకాన్ డి, రేమండ్, వివో, శామ్సంగ్ టీవీలు, రిలయన్స్ జియో, శామ్సంగ్ మొబైల్ ఫోన్లు చోటు దక్కించుకున్నాయి.మరోవైపు, ప్రముఖ వాచీల బ్రాండ్ ‘టైటాన్’ ఏకంగా 552 పాయింట్లు కోల్పోయి తీవ్ర క్షీణతను నమోదు చేయగా.. హోండా మోటార్‌సైకిల్స్, డైకిన్ ఏసీలపై కూడా వినియోగదారుల ఆసక్తి తగ్గింది. పశి్చమాసియాలో ఉద్రిక్తతలు తగ్గి క్రూడాయిల్ ధరలు దిగిరావడంతో ‘ఆయిల్ అండ్ గ్యాస్’ విభాగం 77 శాతం క్షీణించింది. అలాగే, మాస్టర్ కార్డ్ తిరిగి ఇండెక్స్‌లోకి ప్రవేశించడం వల్ల ‘క్రెడిట్ కార్డ్ నెట్వర్క్’ విభాగంలో ఏకంగా 523.7 శాతం వృద్ధి నమోదైంది.సీజనల్ ట్రెండ్స్ ప్రభావం రుతుపవనాల ప్రభావంతో వినియోగదారుల కొనుగోలు ప్రాధాన్యతలు మారాయని టీఆర్ఏ నివేదిక తెలిపింది. వర్షాల వల్ల ‘టాటా టీ’, గ్లూకాన్ ‘డి’లకు డిమాండ్ పెరిగింది. చల్లబడిన వాతావరణంతో ఏసీలు (డైకిన్), టూ–వీలర్ల (హోండా) అమ్మకాలు మందగించాయి. అయితే, మార్కెట్ ఒడిదుడుకులను తట్టుకుని బ్రిటానియా మాత్రం బలమైన వృద్ధిని కనబరిచింది. వినియోగదారులు కేవలం బ్రాండ్లను గుర్తించడమే కాకుండా, వాటిని కొనేందుకు ఎంతవరకు సిద్ధంగా ఉన్నారనేది ఈ ‘బైయింగ్ ఇంటెంట్’ సూచిస్తుందని టీఆర్ఏ రీసెర్చ్ సీఈఓ ఎన్. చంద్రమౌళి పేర్కొన్నారు.ఇదీ చదవండి: బ్యాటరీ లైఫ్ పెరగాలంటే ఈ తప్పులు చేయకండి! -
నీతా అంబానీకి ప్రతిష్ఠాత్మక అవార్డు!
రిలయన్స్ ఫౌండేషన్, ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ ఛైర్పర్సన్, వ్యవస్థాపకురాలు అయిన నీతా అంబానీ అమెరికాలో ప్రత్యేక గౌరవాన్ని అందుకున్నారు. ఫ్లోరిడాలోని టాంపా నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ (AAPI) ఆమెకు హ్యూమానిటేరియన్ అవార్డు ప్రదానం చేశారు.ఈ అవార్డును ప్రధానంగా ఆరోగ్యం, విద్య, క్రీడలు, సంస్కృతి, సమాజ అభివృద్ధి వంటి రంగాల్లో అసాధారణ సేవలు చేసిన వ్యక్తులను గౌరవించడానికి ఇస్తారు. నీతా అంబానీ ఈ రంగాల్లో చేసిన సేవలను గుర్తించి ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని అందించారు. ముఖ్యంగా సామాజిక సేవ, దాతృత్వ కార్యక్రమాలు, ప్రజల సంక్షేమం కోసం ఆమె చూపిన నిబద్ధతను ఈ సందర్భంగా ప్రశంసించారు.ఇదే కార్యక్రమంలో.. టాంపా మేయర్ జేన్ కాస్టర్, నీతా అంబానీకి ‘కీ టు ది సిటీ ఆఫ్ టాంపా’ను బహూకరించారు. ఇది అమెరికా అందించే అత్యంత ప్రతిష్టాత్మకమైన పౌర పురస్కారాలలో ఒకటి. సేవలను, వ్యక్తిత్వానికి, మానవతా దృక్పథం వంటి వాటికి గౌరవంగా 'ఈ నగరం మీకు స్వాగతం పలుకుతోంది' అనే సంకేతంగా ఈ గుర్తింపును ఇస్తారు.Reliance Foundation, Founder and Chairperson Mrs. Nita Ambani received the AAPI Humanitarian Award in Tampa, Florida, presented by the American Association of Physicians of Indian Origin. The award recognizes her extraordinary contributions to healthcare, education, sport,… pic.twitter.com/dDnqXEUUQd— Reliance Industries Limited (@RIL_Updates) July 3, 2026 -
రైల్వే రికార్డ్.. రైలెక్కిన 63.81 కోట్ల మంది
దేశ ఆర్థిక వృద్ధికి ఇంజిన్‌గా నిలుస్తూ భారతీయ రైల్వే జూన్ 2026లో సరకు రవాణా, ప్రయాణికుల సేవల్లో గణనీయమైన వృద్ధిని నమోదు చేసింది. అధిక సరకు లోడింగ్, పెరిగిన ప్రయాణికుల రద్దీ, ఆధునిక సేవల విస్తరణతో సౌకర్యవంతమైన ప్రయాణానికి, సరకు రావాణా వృద్ధికి మొత్తంగా ఆర్థిక వృద్ధికి రైల్వే తోడ్పడుతోంది.ప్రయాణికుల రద్దీలోనూ జోరు జూన్ 2026లో ప్రయాణికుల రద్దీ సైతం స్థిరంగా పెరిగింది. గతేడాది ఇదే నెలలో 62.37 కోట్ల మంది ప్రయాణించగా, ఈసారి 63.81 కోట్ల మంది రైళ్లలో ప్రయాణించారు. స్వల్ప, దూర ప్రయాణాలకు ప్రయాణికులను చేరవేసే నాన్–సబర్బన్ విభాగంలో 3.9 శాతం వృద్ధి నమోదైంది. ప్రయాణికుల సంఖ్య 28.90 కోట్ల నుంచి 30.04 కోట్లకు పెరిగింది. సబర్బన్ విభాగంలోనూ 0.9శాతం వృద్ధితో 33.46 కోట్ల నుంచి 33.77 కోట్లకు చేరినట్లు రైల్వే వివరించింది.ప్రీమియం రైలు సేవల విస్తరణతో భారతీయ రైల్వే ప్రయాణికుల సేవలను ఆధునీకరిస్తోంది. వందేభారత్ సరీ్వసుల సంఖ్య 164కు చేరింది. సామర్థ్య పెంపు, కార్యాచరణ సామర్థ్యం మెరుగుదల, ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని చేపట్టే కార్యక్రమాల ద్వారా సమర్థవంతమైన లాజిస్టిక్స్, నమ్మదగిన ప్రయాణికుల సేవలు, ఆధునిక రైల్వే మౌలిక సదుపాయాలను అందించడానికి భారతీయ రైల్వే కట్టుబడి ఉందని కేంద్ర రైల్వే శాఖ వెల్లడించింది. జూన్ 2026లో భారతీయ రైల్వే 142.21 మిలియన్ టన్నుల సరకు రవాణా చేసింది. గతేడాది ఇదే నెలలో 136.71 మిలియన్ టన్నులు రవాణా కాగా, ఈసారి 4 శాతం వృద్ధి నమోదైంది. సరకు రవాణా ద్వారా జూన్ 2025తో పోలిస్తే సుమారు రూ.430 కోట్ల అదనపు ఆదాయం వచి్చంది, ఇది 3 శాతం ఎక్కువ అని కేంద్ర రైల్వే శాఖ గురువారం ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రధాన వస్తువుల్లో గణనీయమైన వృద్ధి కనిపించింది. ఎరువుల లోడింగ్ 19.1శాతం, ఇతర వస్తువుల రవాణాలో 17.3 శాతం వృద్ధి సాధించింది. ఇనుప ఖనిజం(9.4 శాతం), దేశీయ బొగ్గు(4.9శాతం), క్లింకర్ (7.2 శాతం) రవణాలోనూ వృద్ధిని కనబర్చింది. ఇది ఆర్థిక వ్యవస్థలోని ప్రధాన రంగాల నుంచి కొనసాగుతున్న డిమాండ్‌ను ప్రతిబింబిస్తోందని మంత్రిత్వశాఖ తెలిపింది. మొదటి త్రైమాసికంలో 419.08 మిలియన్ టన్నుల సరకు లోడ్ 2026–27 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం(ఏప్రిల్–జూన్)లో రైల్వే 419.08 మిలియన్ టన్నుల సరకును లోడ్ చేసింది. 2025–26 ఇదే కాలంలో 413.05 మిలియన్ టన్నులు కాగా, ఈసారి స్వల్ప వృద్ధి నమోదైంది. ఇనుప ఖనిజం లోడింగ్ 7.44 శాతం, క్లింకర్ 6.54 శాతం, ఇతర వస్తువుల రవాణా 12.16% పెరిగినట్లు రైల్వేశాఖ పేర్కొంది. వేసవి కాలంలో థర్మల్ పవర్ స్టేషన్ల అవసరాలను తీర్చేందుకు గతేడాది జూన్‌తో పోలిస్తే ఈ జూన్‌లో పవర్ ప్లాంట్లకు 7 శాతం ఎక్కువ దేశీయ బొగ్గును రైల్వే సరఫరా చేసింది. దీంతో దేశవ్యాప్తంగా నిరంతర విద్యుత్ ఉత్పత్తికి సహకారం అందినట్లు హర్షం వ్యక్తం చేసింది. -
ఉద్యోగాలపై సైబర్ సెక్యూరిటీ దిగ్గజం నికేష్ అరోరా సంచలన వ్యాఖ్యలు
భారతీయ అమెరికన్ బిలియనీర్ సీఈఓ, సైబర్ సెక్యూరిటీ దిగ్గజం 'పాలో ఆల్టో నెట్వర్క్స్' (Palo Alto Networks) సీఈఓ నికేష్ అరోరా AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏఐ టెక్నాలజీ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో, రాబోయే మూడేళ్లలో కార్పొరేట్ కంపెనీల్లోని కొన్ని కీలక విభాగాల్లో ఉద్యోగుల సంఖ్య సగానికి పడిపోయే అవకాశం ఉందన్నారు. ముఖ్యంగా మార్కెటింగ్, హెచ్ఆర్ (HR), ఫైనాన్స్ విభాగాలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.అదే సమయంలో ఏఐ పరిజ్ఞానం ఉన్న ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతోందని అన్నారు.సగానికిపైగా ఆ ఉద్యోగాలు మాయంఒక పాడ్‌కాస్ట్‌లో నికేష్ అరోరా మాట్లాడుతూ మార్కెటింగ్, ఫైనాన్స్, హెచ్ఆర్ వంటి జనరల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ (G&A) విభాగాలలో ప్రాసెస్ మేనేజ్మెంట్ (నిర్వహణ ప్రక్రియలు) ఎక్కువగా ఉంటుందన్నారు. భవిష్యత్తులో రాబోయే అధునాతన ఏఐ అప్లికేషన్ల ద్వారా ఈ పనులను మరింత తెలివిగా, సులువుగా చేయవచ్చని పేర్కొన్నారు.ప్రస్తుతం కంపెనీలు వాడుతున్న సాస్ (SaaS - సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్) అప్లికేషన్లకు సొంత అభిప్రాయాలు ఉండవు. కానీ రాబోయే ఏఐ అప్లికేషన్లు స్వతంత్రంగా (Autonomous) వ్యవహరిస్తాయి. ఉదాహరణకు, ఒక మార్కెటింగ్ కాపీని చూసి అది బాగోలేదని చెప్తూ, బ్రాండ్‌కు తగినట్లుగా ఎలా మార్చాలో ఏఐ స్వయంగా సూచించగలదు. దీనివల్ల సగటు ఉద్యోగి మరింత స్మార్ట్‌గా పనిచేయగలుగుతాడు. ఫలితంగా, ఎక్కువ మంది ఉద్యోగుల అవసరం ఉండదు. ప్రస్తుతం తమ కంపెనీ మార్కెటింగ్ విభాగంలో ఉన్న 600 మంది సిబ్బందిని ఏఐ సహాయంతో సగానికి తగ్గించే యోచనలో ఉన్నట్లు ఆయన తెలిపారు.ఇదీ చదవండి: నాడు డెలివరీ బాయ్.. నేడు రెండు AI స్టార్టప్స్‌కు ఫౌండర్!డిమాండ్ ఉండే ఉద్యోగాలు ఏవి?ఏఐ యుగంలో కొన్ని ఉద్యోగాలు కోల్పోయినప్పటికీ, టెక్నికల్ , సేల్స్ లాంటి మరికొన్ని విభాగాలకు డిమాండ్ పెరుగుతుందని కూడా అరోరా చెప్పుకొచ్చారు. కంపెనీ ప్రొడక్ట్స్ చాలా బాగున్నప్పుడు, వాటిని ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మందికి చేరవేయడానికి సేల్స్, టెక్నికల్ సిబ్బంది అవసరం పెరుగుతుందన్నారు. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను సమర్థవంతంగా ఉపయోగించగలిగే (AI Savvy) ఉద్యోగులకు మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంటుంది.ఇదీ చదవండి: రూ. 10 లక్షలకు ముంచేశారు, రోజంతా స్టేషన్లోనే : నటి ఆవేదనఉద్యోగులకు హెచ్చరికప్రస్తుతం కార్పొరేట్ సంస్థల్లోని 90శాతం మంది ఉద్యోగులకు AIపై సరైన అవగాహన/పరిజ్ఞానం లేకపోవడమే అతిపెద్ద సవాలని నికేష్ అరోరా అభిప్రాయపడ్డారు. ఇది డార్విన్ సిద్ధాంతం లాంటి సమయం. ఇక్కడ ఎవరు అత్యుత్తమంగా రాణిస్తారో వారే నిలబడతారు. కాబట్టి ఉద్యోగులు స్వయంగా ఏఐ సాంకేతికతను నేర్చుకుని అప్డేట్ అవ్వాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.ఇదీ చదవండి: రూ. 10 లక్షలకు ముంచేశారు, రోజంతా స్టేషన్లోనే : నటి ఆవేదనఒకప్పుడు గూగుల్ సంస్థలో అత్యధిక జీతం తీసుకునే ఉద్యోగిగా రికార్డు సృష్టించిన నికేష్ అరోరా, ఐఐటీ (BHU) వారణాసి పూర్వ విద్యార్థి. ప్రస్తుతం ఆయన నేతృత్వం వహిస్తున్న పాలో ఆల్టో నెట్వర్క్స్ మార్కెట్ విలువ దాదాపు 287 బిలియన్ డాలర్లుగా ఉంది. కాగా గత రెండేళ్లుగా ఏఐ పునర్నిర్మాణం కారణంగా మెటా (Meta), అమెజాన్ (Amazon), ఒరాకిల్ (Oracle), కాగ్నిజెంట్ లాంటి వంటి దిగ్గజ సంస్థలు వేలాది మంది ఉద్యోగులను తొలగించిన సంగతి తెలిసిందే.ఇదీ చదవండి: అయోధ్యరాముడి విరాళాల గోల్మాల్ : స్పందించిన ఆర్ఎస్ఎస్ -
రూ.2 కోట్లు సంపాదించే ఉద్యోగిని ఇంత సిల్లీగా తొలగించారా?
అమెరికాకు చెందిన ఆటోమొబైల్ దిగ్గజం ఫోర్డ్ మోటార్ కంపెనీ రూ.2 కోట్లు సంపాదించే ఓ ఉద్యోగిని కేవలం 1.95 డాలర్లు (సుమారు రూ.186) విలువైన కుకీని దొంగిలించాడనే ఆరోపణతో తొలగించడం తీవ్ర చర్చకు దారితీసింది. అయితే అతడు కుకీకి డబ్బులు చెల్లించినట్లు బ్యాంకు రికార్డులు నిరూపించడంతో కంపెనీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. ఈ ఘటన అమెరికాలో కార్యాలయాల్లో అమలవుతున్న జీరో-టాలరెన్స్ విధానాలు, సెల్ఫ్-చెక్అవుట్ వ్యవస్థల విశ్వసనీయతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.కెంటకీ రాష్ట్రంలోని లూయిస్విల్లేలో ఉన్న కెంటకీ ట్రక్ ప్లాంట్‌లో 11 సంవత్సరాలుగా ఎలక్ట్రిషియన్‌గా పనిచేసిన 60 ఏళ్ల కర్ట్ క్రోమ్ (Kurt Kromm) ఈ ఘటనకు కేంద్రబిందువయ్యాడు. ఈ ప్లాంట్‌లో ఫోర్డ్ సూపర్ డ్యూటీ పికప్ ట్రక్కులు, ఎక్స్‌పెడిషన్ ఎస్యూవీ, లింకన్ నావిగేటర్ వంటి వాహనాలు తయారవుతాయి.క్రోమ్ చెప్పిన వివరాల ప్రకారం, మే నెలలో రాత్రి షిఫ్ట్‌లో పనిచేస్తున్న సమయంలో రక్తంలో చక్కెర స్థాయి తగ్గడంతో క్యాంటీన్లోని సెల్ఫ్-సర్వీస్ కియోస్క్ వద్ద గ్రాండ్మాస్ చాక్లెట్ చిప్ కుకీ కొనుగోలు చేశాడు. మొదటి కియోస్క్‌లో కార్డు స్వైప్ చేసినప్పుడు లావాదేవీ విఫలమైనట్లు సందేశం కనిపించడంతో, పక్కనే ఉన్న మరో కియోస్క్‌లో మళ్లీ చెల్లించి కుకీ తీసుకున్నానని తెలిపాడు.వీడియో ఆధారంగా దొంగతనం ఆరోపణవారం రోజులకు అతడిని అధికారుల కార్యాలయానికి పిలిచి, సీసీటీవీ వీడియోలో కుకీకి చెల్లించకుండా తీసుకెళ్లినట్లు కనిపిస్తోందని, అందువల్ల ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు తెలియజేశారు. తన వద్ద ఎలాంటి వివరణ తీసుకోకుండా ప్లాంట్ నుంచి బయటకు పంపించారని క్రోమ్ ఆరోపించాడు. యూనియన్ ప్రతినిధులు క్షమాపణ చెప్పాలని సూచించినప్పటికీ, తాను ఎలాంటి తప్పు చేయలేదని చెప్పి నిరాకరించాడు. గతేడాది తన సంపాదన 2 లక్షల డాలర్లని (రూ .1.9 కోట్లు), ఆఫీస్ క్యాంటీన్‌కే సుమారు 1,200 డాలర్లు (రూ .1.14 లక్షలు) ఖర్చు చేశానని, దొంగతనం చేయాల్సిన అవసరం తనకేంటని క్రోమ్ ప్రశ్నించారు.బ్యాంకు స్టేట్మెంట్తో బయటపడిన నిజంఇంటికి వెళ్లిన తర్వాత తన బ్యాంకు ఖాతాను పరిశీలించగా 1.95 డాలర్ల డెబిట్ లావాదేవీ విజయవంతంగా నమోదైనట్లు గుర్తించాడు. ఆ ఆధారాలను ఫోర్డ్ యాజమాన్యానికి, యూనియన్‌కు పంపించాడు. అనంతరం కియోస్క్ నిర్వహించే అరామార్క్ (Aramark) కూడా చెల్లింపు జరిగినట్లు ధ్రువీకరించింది. దీంతో ఫోర్డ్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని తిరిగి ఉద్యోగంలో చేరాలని ఆహ్వానించింది.అయితే అప్పటికే క్రోమ్ తన ఇంటికి సమీపంలో మరో ఉద్యోగంలో చేరేందుకు అంగీకరించాడు. గతంలో ఫోర్డ్లో పొందిన గంటకు 48 డాలర్ల వేతనం కంటే ఎక్కువగా కొత్త సంస్థలో 52.51 డాలర్లు, అదనంగా గంటకు 10 డాలర్ల బోనస్ లభించడంతో తిరిగి ఫోర్డ్లో చేరలేదు. ఉద్యోగం కోల్పోయిన ఐదు వారాల కాలానికి ఫోర్డ్ అతనికి బకాయి వేతనాన్ని కూడా చెల్లించినట్లు నివేదికలు పేర్కొన్నాయి.ఫోర్డ్ స్పందనవ్యక్తిగత ఉద్యోగుల వ్యవహారాలపై వ్యాఖ్యానించబోమని ఫోర్డ్ పేర్కొన్నప్పటికీ, "కొన్ని సందర్భాల్లో వ్యవహారాన్ని మరింత మెరుగ్గా నిర్వహించాల్సి ఉండేదని తర్వాత తెలుస్తుంది. మా ఉద్యోగులతో న్యాయంగా వ్యవహరించాలనే లక్ష్యమే మా దృష్టి" అని సంస్థ ప్రతినిధి వెల్లడించారు. ఈ ఘటన అనంతరం ఇలాంటి వివాదాలను పరిష్కరించే విధానాలను పునఃసమీక్షిస్తున్నట్లు కూడా సమాచారం. -
హైదరాబాద్‌లో జీతాలు ఎక్కువ.. జాబ్‌లు తక్కువ!
సాక్షి, సిటీబ్యూరో: అన్నీ ఉన్నా నిరుద్యోగుల ముంగిట శని అన్నట్టుగా ఉంది హైదరాబాద్ నగర పరిస్థితి. ఓ వైపు అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకుపోతూ, ఉద్యోగులకు అత్యధిక జీతాలు అందించే సిటీ ఉపాధి కల్పనలో మాత్రం చేతులెత్తేస్తోంది. ఈ వైరుధ్యాన్ని వెల్లడించాయి కేంద్ర గణాంకాల శాఖ (ఎన్ఎస్ఓ) విడుదల చేసిన తొలి ‘నగర స్థాయి కారి్మక మార్కెట్ నివేదిక’ వెల్లడించింది. 46 నగరాలతో పోలిస్తే.. దాదాపు 10 లక్షలకు పైగా జనాభా ఉన్న దేశంలోని 46 నగరాలతో పోలిస్తే.. హైదరాబాద్ ఉద్యోగాల నాణ్యత, వేతనాలు, ఉత్పాదకతలో ముందంజలో ఉంది. ఆశించిన స్థాయిలో నిరుద్యోగ నిర్మూలన జరగలేదని యువత ఉపాధి సమస్యలు ఆందోళన కలిగిస్తున్నాయని తేల్చింది. హైదరాబాద్‌లో ప్రస్తుతం నిరుద్యోగ రేటు 6.8 శాతంగా నమోదైంది. ఇది మిలియన్ ప్లస్ నగరాల సగటు 4.9 శాతం కంటే ఎక్కువ. బెంగళూరు (2.8%), సూరత్ (1%), హౌరా (0.8%), రాజ్‌కోట్ (0.3%) వంటి నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో నిరుద్యోగం చాలా అధికంగా ఉంది. ఉద్యోగ నాణ్యతలో మేటి.. ఉద్యోగాల నాణ్యత పరంగా హైదరాబాద్‌కు మంచి స్థానం దక్కింది. నగరంలోని ఉద్యోగుల్లో 62.1 శాతం మంది రెగ్యులర్ వేతన ఉద్యోగాల్లో ఉండగా, మిలియన్ ప్లస్ నగరాల సగటు 58.5 శాతంగా ఉంది. ఇది హైదరాబాద్‌లో స్థిరమైన ఉద్యోగాల అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే దానికి నిదర్శనంగా నిలుస్తోంది. రెగ్యులర్ వేతన ఉద్యోగుల సగటు నెలవారీ ఆదాయం రూ.31,153 కాగా, మిగిలిన నగరాల సగటు రూ.28,808 మాత్రమే. స్వయం ఉపాధి పొందుతున్న వారి సగటు నెలవారీ ఆదాయం రూ.30,075, రోజువారీ కూలీల సగటు వేతనం రూ.784గా నమోదైంది. ఉపాధి.. ఏదీ..? లేబర్ ఫోర్స్ పారి్టసిపేషన్ రేట్ హైదరాబాద్‌లో 55.5 శాతంగా నమోదై, మిగతా నగరాల సగటు 52.4 శాతం కంటే ఎక్కువగా ఉంది. అంటే ఉద్యోగాల కోసం ప్రయతి్నంచేవారి సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ, అందరికీ ఉపాధి లభించడం లేదని నివేదిక పేర్కొంది. యువత పరిస్థితి కూడా ఆందోళన కలిగిస్తోంది. 15 నుంచి 29 ఏళ్ల వయసు యువతలో 25.1 శాతం మంది ఉద్యోగంలో కానీ విద్యార్జనలో గానీ లేరు. ఇందులో యువతుల శాతం 37.3 ఉండగా, యువకుల శాతం 12.6 మాత్రమే ఉండటం గమనార్హం.


