ఎల్రక్టానిక్స్, డిఫెన్స్, రెన్యువబుల్స్, ఎలక్ట్రిక్ వాహనాల్లో ఉపయోగించే ఇతరత్రా విలువైన ఖనిజాలు, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ (ఆర్‌ఈఈ) విభాగాల్లోకి కూడా కార్యకలాపాలను విస్తరించే దిశగా ప్రభుత్వ రంగ నేషనల్ అల్యూమినియం కంపెనీ (నాల్కో) అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా దేశీయంగా ఆర్‌ఈఈలు, మెగ్నీషియం, క్రోమైట్ బ్లాక్‌ల వేలంలో పాల్గొనే అవకాశాలను పరిశీలిస్తోంది.
గనుల లాభదాయకత, వేలంలో పాల్గొనడానికి సంబంధించిన సాధ్యాసాధ్యాలను బిడ్ అడ్వైజర్ మదింపు చేస్తారని కంపెనీ సీఎండీ బ్రిజేంద్ర ప్రతాప్ సింగ్ తెలిపారు. అలాగే, జాయింట్ వెంచర్ ఖనిజ్ బిదేశ్ ఇండియా ద్వారా ఆ్రస్టేలియాలో లిథియం గనిలో వాటా కొనుగోలుపై కూడా కసరత్తు జరుగుతోందని ఆయన వివరించారు. దీనితో లిథియం దిగుమతులకు సంబంధించి హామీ లభిస్తుందని, అంతర్జాతీయంగా కొరత నెలకొన్న నేపథ్యంలో దేశీయంగా ఈవీ బ్యాటరీలు, రెన్యువబుల్స్‌కి సరఫరాను పెంచేందుకు ఇది ఉపయోగపడగలదని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: డిజిటల్ భారత్ ముంగిట ‘స్మాల్ లాంగ్వేజ్ మోడల్స్’ విప్లవం


