న్యూఢిల్లీ: రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్ల ఉత్పత్తి కోసం ఉద్దేశించిన రూ. 7,280 కోట్ల స్కీముతో దేశీయంగా వాటి తయారీకి, సరఫరాకి ఊతం లభిస్తుందని పరిశ్రమ ధీమా వ్యక్తం చేసింది. తవ్వకం, వెలికితీత, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ప్రాసెసింగ్, వివిధ రంగాలకు అవసరమయ్యే మ్యాగ్నెట్ల తయారీ వ్యవస్థకు ఈ పథకంతో గణనీయంగా ప్రయోజనం చేకూరుతుందని భారతీయ ఖనిజ పరిశ్రమ సంస్థల సమాఖ్య ఎఫ్‌ఐఎంఐ పర్కొంది. దేశ వ్యూహాత్మక తయారీ సామర్థ్యాలను పటిష్టం చేసేందుకు ఈ ప్రోత్సాహక స్కీము తోడ్పడుతుందని అసోచాం సెక్రటరీ జనరల్ మనీష్ సింఘాల్ తెలిపారు.
ఎలక్ట్రిక్ మొబిలిటీ, ఎల్రక్టానిక్స్, మెడికల్ డివైజ్‌లు, పునరుత్పాదక విద్యుత్, రక్షణ తదితర రంగాల వృద్ధిపై భారత్ ప్రధానంగా దృష్టి పెడుతున్న పరిస్థితుల్లో వార్షికంగా 6,000 టన్నుల (ఎంటీపీఏ) రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ల తయారీ సామర్థ్యాన్ని సంతరించుకునేందుకు ప్రయతి్నంచడమనేది సకాలంలో తీసుకుంటున్న చర్యగా ఆయన అభివరి్ణంచారు. దీనివల్ల దిగుమతులపై ఆధారపడే పరిస్థితి తగ్గుతుందని, భవిష్యత్ టెక్నాలజీల అభివృద్ధిలో భారత్ మరింత ప్రముఖ పాత్ర పోషించే అవకాశం ఉంటుందని సింఘాల్ వివరించారు. దీనితో మైనింగ్, ప్రాసెసింగ్, అడ్వాన్స్‌డ్ మెటీరియల్స్ తదితర విభాగాలవ్యాప్తంగా కొత్త అవకాశాలు అందుబాటులోకి వస్తాయని ఈవై ఇండియా పార్ట్‌నర్ రాజు కుమార్ తెలిపారు.


