మాట నిలబెట్టుకున్న మెగాస్టార్‌.. వరుణవి కోసం.. | Megastar Chiranjeevi Fulfils His Promise, Donates ₹5 Lakhs To Little Singer Varunavi, More Details Inside | Sakshi
Sakshi News home page

మాటపై నిలబడ్డ చిరంజీవి.. వరుణవి కోసం..

Jan 10 2026 1:54 PM | Updated on Jan 10 2026 2:43 PM

Chiranjeevi Gifts Rs 5 Lakh Check to Blind Singer Varunavi

చిన్నారి వరుణవి గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. సరిగమప లిటిల్‌ ఛాంప్స్‌ అనే సింగింగ్‌ రియాలిటీ షోలో ఈ చిన్నారి పాల్గొంది. పాపకు కళ్లు లేనప్పటికీ.. కమ్మనైన మాటలు, పాటలతో అందరినీ ఫిదా చేస్తుంటుంది. అందుకే తనను అందరూ ఎంతో స్పెషల్‌గా ట్రీట్‌ చేస్తుంటారు. ఎలిమినేషన్‌ అనేది లేకుండా గ్రాండ్‌ ఫినాలే వరకు వరుణవిని తీసుకొచ్చారు.

మాటిచ్చిన మెగాస్టార్‌
ఈ షోకి సుధీర్‌ యాంకర్‌గా వ్యవహరిస్తుండగా దర్శకుడు అనిల్‌ రావిపూడి, పాటల రచయిత అనంత్‌ శ్రీరామ్‌, సింగర్‌ శైలజ జడ్జిలుగా ఉన్నారు. ఇటీవలే అనిల్‌ రావిపూడి.. వరుణవి కోరిక మేరకు ఆమెను చిరంజీవి దగ్గరకు తీసుకెళ్లాడు. ఆ సమయంలో చిన్నారి గాత్రానికి, మాటలకు తెగ మురిసిపోయాడు మెగాస్టార్‌. తనకు ఎటువంటి సహాయం చేయడానికైనా రెడీ అని మాటిచ్చాడు.

మాట నిలబెట్టుకున్న చిరంజీవి
ఇప్పుడా మాటను నిలబెట్టుకున్నాడు. సరిగమప లిటిల్‌ ఛాంప్స్‌ గ్రాండ్‌ ఫినాలేకు చిరంజీవి కూతురు, నిర్మాత సుస్మిత హాజరైంది. మెగాస్టార్‌ పంపించిన రూ.5 లక్షల చెక్కును వరుణవి కుటుంబానికి అందించింది. ఈ డబ్బును వరుణవి పేరుపై ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేయబోతున్నట్లు తెలిపింది.

చదవండి: నాచే నాచే కాపీనా? రాజాసాబ్‌కు ఏకంగా చెప్పు చూపించాడా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement