సీమంతం వేడుకలో భార్యకు సర్‌ప్రైజ్‌, వైరల్‌ వీడియో | Mangaluru man surprises wife with helicopter flower shower for baby shower | Sakshi
Sakshi News home page

సీమంతం వేడుకలో భార్యకు సర్‌ప్రైజ్‌, వైరల్‌ వీడియో

Mar 3 2026 3:33 PM | Updated on Mar 3 2026 4:02 PM

Mangaluru man surprises wife with helicopter flower shower for baby shower

ఇటీవలి కాలంలో బేబీ షవర్‌ లేదా సీమంతం వేడుకలకు  ప్రాధాన్యత బాగా పెరిగింది. ఈ మధురమైన జ్ఞాపకాన్ని కలకాలం పదిలపర్చుకునేలా మెటర్నిటీ ఫోటోషూట్‌లు కూడా జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే కర్ణాటకలోని మంగళూరులో ఒక వ్యక్తి  తన భార్య బేబీ షవర్ కోసం వినూత్న ఏర్పాటు  చేశాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట సందడిగా మారింది.

మంగళూరులో జరిగిన సీమంత వేడుకలో హెలికాప్టర్‌లో పూల వర్షం కురియడం విశేషంగా నిలిచింది.  మేళతాళాలు, సంప్రదాయ వేషదారణలు, విందుభోజనాల మధ్య ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించి జంట ఫోటోలకు పోజులిస్తుండగా,  ఆకాశం నుంచి పూల వర్షాన్ని చూసి అర్పిత ఆశ్చర్య చకితురాలైంది.  @maamantraventures అనే ఇన్‌స్టాగ్రాంలో వీడియోను షేర్ చేస్తూ, "లవ్‌ ఇన్‌ ఇది ఎయిర్‌..మంగళూరులో ఒక నిజమైన హీరో, తన భార్య బేబీ షవర్ కోసం హెలికాప్టర్ ఫ్లవర్ షవర్‌తో ఆమెను సర్‌ప్రైజ్‌ చేశాడు. మంగళూరులో మొదటిసారి! నిజంగా గుర్తుంచుకోవలసిన వేడుక!" అనే క్యాప్షన్‌ ఇచ్చారు. ఇదిచూసి నెటిజనులను భావోద్వేగానికి లోను చేసింది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by MMV🫰🏻KUSHI Films (@maamantraventures)

వ్యాపారవేత్త ప్రకాష్ కుంపల భార్య అర్పిత బేబీ షవర్ కోసం ఈ  ప్రత్యేక ఏర్పాటు చేశాడు. నగర శివార్లలోని అడయార్ గార్డెన్‌లో అతిథులు హాజరు కాగా సీమంతం వేడుక మధ్య హెలికాప్టర్ ఈ జంటపై పూల వర్షం కురిపించింది. ఈ అద్భుతమైన దృశ్యాల్ని చూసిఅతిథులు కూడా ఆశ్చర్యంగా చూశారు. చాలామంది ఈ అద్భుత క్షణాన్ని తమ మొబైల్ ఫోన్లలో బంధించారు. 

ఇదీ చదవండి: విజయ్‌ దేవరకొండ నయా ట్రెండ్‌ : డైమండ్‌ ఎమరాల్డ్‌ నెక్లెస్‌ స్పెషల్‌ ఎట్రాక్షన్‌

నెటిజనుల స్పందన
పురుషుడు నిజంగా భార్యను ప్రేమిస్తే.. అతని ప్రేమ ఎప్పటికీ అనంతం." అని ఒకరు, చేతిలో డబ్బు ఉంటే ఏమైనా  చేయవచ్చు  మరొకరు వ్యాఖ్యానించారు.  మరోవైపు ఆ డబ్బును ముగ్గురు అమ్మాయిల వివాహాలకు సహాయం చేసి ఉంటే  బావుండేది అని  మరో యూజర్‌ కామెంట్‌ చేయడం గమనార్హం.

(విజయ్‌పై మాజీ అసిస్టెంట్ సెల్వరాజ్ సంచలన ఆరోపణలు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement