breaking news
Kakinada
-
శెట్టిబలిజలు అన్నింటా ఉన్నతంగా ఉండాలి
అమలాపురం టౌన్: శెట్టిబలిజ సామాజక వర్గీయులంతా అన్ని రంగాల్లో ఉన్నతి సాధించాలని, అందరూ చదువుకుని అక్షరాస్యత శాతాన్ని పెంచినప్పుడే సామాజిక అభివృద్ధి సాకారమవుతుందని రాజ్య సభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ పిలుపునిచ్చారు. కోనసీమ శెట్టిబలిజ కార్తిక వన సమారాధన కమిటీ ఽఆధ్వర్యంలో అమలాపురంలోని వాసర్ల గార్డెన్స్‌లో ఆదివారం జరిగిన కార్యక్రమానికి బోస్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. శెట్టిబలిజ సామాజిక వర్గంలో అక్షరాస్యత ప్రస్తుతం 67 శాతం మాత్రమే ఉందని, ఇది మరింత పెరిగినప్పుడే మనం అన్నింటా అభివృద్ధి చెందుతారని ఆయన ఆక్షాంక్షించారు. ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ, శాసన మండలి మాజీ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, డీసీఎంఎస్ చైర్మన్ పెచ్చెట్టి చంద్రమౌళి తదితర ప్రముఖలు హాజరై ప్రసంగించారు. అమలాపురం మున్సిపల్ చైర్పర్సన్ రెడ్డి నాగేంద్రమణి, అమలాపురం, అల్లవరం, అంబాజీపేట ఎంపీపీలు కుడుపూడి భాగ్యలక్ష్మి, ఇళ్ల శేషగిరిరావు, దొమ్మేటి వెంకటేశ్వరరావు, కోనసీమ శెట్టిబలిజ కార్తిక వన సమారాధన కమిటీ ప్రతినిధులు దొమ్మేటి మీరా సాహెబ్ శెట్టి, సంసాని బులినాని, చెల్లుబోయిన శ్రీనివాసరావు, పితాని బాలకృష్ణ, మట్టపర్తి నాగేంద్ర, కుడుపూడి బాబు, వాసంశెట్టి తాతాజీ, గొవ్వాల రాజేష్, చిట్టూరి పెదబాబు, గుత్తుల చిరంజీవిరావు, కుడుపూడి సత్య శైలజ, విత్తనాల శేఖర్, కుడుపూడి భరత్ భూషణ్, విత్తనాల మూర్తి, కముజు రమణ, దొమ్మేటి రాము, కేతా భాను, దంగేటి రుద్ర, వాసర్ల వెంకన్న, దొంగ నాగ సుధారాణి, చొల్లంగి సుబ్బిరామ్ తదితరులు కార్తిక వన సమారాధనలో సేవలు అందించారు. కోనసీమ వ్యాప్తంగా శెట్టిబలిజ సామాజిక వర్గీయులు దాదాపు 15 వేల మంది కుటుంబ సమేతంగా హజరై వేడుకల్లో పాల్గొని ఉల్లాసంగా గడిపారు. తొలుత శెట్టిబలిజ నేతలు ఉసిరి చెట్టు వద్ద కార్తిక వన పూజలు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. మహిళలకు పలు రకాల ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. అనంతరం అంతా సహ పంక్తి భోజనాలు చేసి ఆత్మీయతను చాటారు. విద్యావంతులై ప్రయోజకులు కావాలి కోనసీమ శెట్టిబలిజ కార్తిక వన సమారాధనలో ఎంపీ బోస్ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఎమ్మెల్సీ శ్రీనివాస్, మాజీ మంత్రి వేణు -
ప్రతిభకు ప్రోత్సాహం
● ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఎడ్యుకేషనల్ ఎపిఫనీ మెరిట్ టెస్ట్ ● పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ దరఖాస్తులకు ఆహ్వానం ● రిజిస్ట్రేషన్‌కు 14 తుది గడువు రాయవరం: విద్యార్థుల్లో దాగి ఉన్న సృజన, ప్రతిభను వెలికి తీసేందుకు ప్రభుత్వంతో పాటు, పలు ఎన్జీవో సంస్థలు ఏటా వివిధ పరీక్షలు నిర్వహిస్తుంటాయి. అలాగే ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎడ్యుకేషనల్ ఎపిఫనీ మెరిట్ టెస్ట్(ఈఈఎంటీ) స్వచ్ఛంధ సంస్థ ప్రభుత్వ పాఠశాలల్లోని 7, 10 తరగతుల విద్యార్థులకు 2025–26 విద్యా సంవత్సరానికి ప్రతిభా పరీక్షను నిర్వహించనుంది. 12 ఏళ్లుగా ఎటువంటి రుసుమూ లేకుండా ఈ పరీక్ష నిర్వహిస్తోంది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో పరీక్షకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు అక్టోబరు 30న షెడ్యూల్‌ను విడుదల చేశారు. నచ్చిన చోటే పరీక్ష ఈఈఎంటీ పరీక్ష ప్రిలిమ్స్, మెయిన్ రెండు దశల్లో నిర్వహిస్తారు. ఈ పరీక్షను విద్యార్థి అభీష్టం మేరకు ఇంటి వద్ద నుంచి లేదా పాఠశాల నుంచి అటెండ్ అయ్యే అవకాశం కల్పించారు. ఈ పరీక్షలను శ్రీకోడ్ తంత్రశ్రీ సాఫ్ట్వేర్ ద్వారా నిర్వహిస్తారు. డిసెంబరు 6న ప్రిలిమినరీ పరీక్ష, 7న ఫలితాలు విడుదల చేస్తారు. 40 శాతం పైబడి మార్కులు పొందడంతో పాటుగా, ఆన్లైన్ పరీక్ష నియమ నిబంధనలు సక్రమంగా పాటించిన వారు మెయిన్ పరీక్షకు అర్హత పొందుతారు. మెయిన్ పరీక్షకు డిసెంబరు 8 నుంచి 12 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పరీక్ష డిసెంబరు 27న నిర్వహిస్తారు. జిల్లాకు ఒక పరీక్ష కేంద్రం ఉండగా, అభ్యర్థి ఎంచుకున్న కేంద్రంలో పరీక్ష రాయాలి. పరీక్షలో 50 శాతం మార్కులు పొంది ఆన్లైన్ నిబంధనలు కచ్చితంగా పాటించిన వారికి బహుమతులు అందజేస్తారు. పరీక్షను మొబైల్ ఫోన్/ల్యాప్‌టాప్/ట్యాబ్/కంప్యూటర్ వీటిలో ఏదైనా ఒక దానిని ఎంచుకుని నిబంధనలకు లోబడి పరీక్ష రాయాల్సి ఉంటుంది. ప్రిలిమ్స్ రాసే వారికి నవంబరు 29న మాక్ టెస్ట్, మెయిన్స్ పరీక్ష రాసే వారికి డిసెంబరు 20న మాక్ టెస్ట్ రాసే అవకాశం కల్పిస్తారు. హెచ్‌టీటీపీఎస్:ఎడ్యుకేషనల్‌ఎపిఫనీ.ఓఆర్జీ–ఈఈఎంటీ2026/రిజిస్ట్రేషన్.పీహెచ్‌పీ లింక్ ద్వారా అభ్యుర్థులు దరఖాస్తు చేసుకోవాలి. రెండు మాధ్యమాల్లో పరీక్షలు విద్యార్థులకు రాష్ట్ర అకడమిక్ క్యాలెండరు 2025–26 సిలబస్‌ను అనుసరించి, డిసెంబరులో పూర్తయిన సిలబస్‌పై 80 శాతం ప్రశ్నలు, జనరల్ నాలెడ్జ్‌పై 20 శాతం ప్రశ్నలు ఇస్తారు. తెలుగు, ఇంగ్లీష్ మాధ్యమాల్లో పరీక్షలు ఉంటాయి. గణితం, సైన్స్, సోషల్ సబ్జెక్టులు, జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ (విద్యార్థుల తరగతి స్థాయి) మేధా సంబంధిత ప్రశ్నలు ఇస్తారు. రిజిస్ట్రేషన్ సమయంలో విద్యార్థి పేరు, పరీక్ష రాసే మొబైల్ నంబరు, విద్యార్థి/తల్లిదండ్రుల ఈ మెయిల్, విద్యార్థి పుట్టిన తేదీ, విద్యార్థి ఫొటో (2ఎంబీ కన్నా తక్కువ సైజు), తరగతి, జిల్లా, మండలం, పాఠశాల పేరు, హెచ్ఎంల పేరు, హెచ్ఎం ఈ మెయిల్ వంటి వివరాలతో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. పరీక్ష నిర్వహణ ఇలా గణితం, సైన్స్, సోషల్ సబ్జెక్టులపై పరీక్ష ఉంటుంది. విద్యార్థుల తరగతి స్థాయి ఆధారంగా జనరల్ నాలెడ్జ్ మరియు కరెంట్ అఫైర్స్‌పై ప్రశ్నలు ఇస్తారు. ప్రిలిమ్స్ పరీక్షలో 60 ప్రశ్నలు 100 మార్కులకు, మెయిన్స్ పరీక్ష 60 ప్రశ్నలు 100 మార్కులకు ఇస్తారు. ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలు 60 నిమిషాల నిడివితో నిర్వహిస్తారు. 1 తేలిక మార్కు ప్రశ్నలకు ఒకటి, మధ్యస్థ రకం ప్రశ్నలకు 2, కఠినతరం ప్రశ్నలకు మూడు మార్కుల వంతున కేటాయిస్తారు. బహుమతులు ఇచ్చేదిలా ఈ పోటీల్లో 162 మంది విజేతలకు దాదాపుగా రూ.9 లక్షల విలువైన నగదు బహుమతులు అందించనున్నారు. రాష్ట్ర స్థాయిలో పదో తరగతిలో ప్రథమ బహుమతిగా రూ.30 వేలు, ద్వితీయ బహుమతిగా రూ.25 వేలు, తతీయ బహుమతిగా రూ.20వేలు, 7వ తరగతితో రూ.20వేలు, రూ.15వేలు, రూ.10వేలు వరుసగా ప్రథమ, ద్వితీయ, తతీయ స్థానాల్లో నిలిచిన వారికి అందజేస్తారు. జిల్లా స్థాయిలో 10వ తరగతిలో రూ.8వేలు, రూ.6వేలు, రూ.4వేలు, 7వ తరగతి విద్యార్థులకు రూ.5వేలు, రూ.4వేలు, రూ.3వేలు వరుసగా మూడు స్థానాల్లో నిలిచిన వారికి నగదు బహుమతులుగా ఇస్తారు. మండల స్థాయిలో 10, 7 తరగతుల్లో ప్రథమ స్థానం పొందిన వారికి జ్ఞాపిక, ప్రశంసా పత్రాన్ని అందజేస్తారు. ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన వారికి ప్రశంసా పత్రాన్ని మాత్రమే ఇస్తారు. మండల స్థాయిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో ఈఈఎంటీ–2025 పరీక్షకు సంబంధించి మరింత సమాచారారం తెలుసుకునే వారు, సందేహాల నివృత్తికి 9951002400 నంబరుకు ఫోన్ చేయవచ్చని పూర్వపు స్టేట్ కోఆర్డినేటర్ దూదేకుల నబి తెలియజేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఈఈఎంటీ పరీక్షలను నిర్వహిస్తున్నారు. విద్యార్థులు అధిక శాతం హాజరయ్యేలా హెచ్ఎంలు, ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలి. – డాక్టర్ షేక్ సలీం బాషా, డీఈవో, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఈఈఎంటీ పరీక్షలను పూర్తిగా ఆన్లైన్లో నిర్వహిస్తున్నాం. ప్రభుత్వ పాఠశాల్లో విద్యార్థులను ప్రోత్సహించేందుకు తవనం వెంకట్రావు వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్న సంస్థ ద్వారా పూర్తిగా ఉచితంగా పోటీలు నిర్వహిస్తున్నాం. – దూదేకుల నబి, ఈఈఎంటీ, పూర్వపు రాష్ట్ర సమన్వయ కర్త -
పెట్రోలు బంక్‌లో అగ్నిప్రమాదం
తప్పిన పెనుముప్పు కంబాలచెరువు (రాజమహేంద్రవరం): స్థానిక గోకవరం బస్టాండ్ వద్ద ఉన్న భారత్ పెట్రోలియం బంక్‌లో ఆదివారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బంకుకు వచ్చిన వాహనం నుంచి ఒక వాల్వు తెరచి డీజిల్ అన్లోడ్ చేస్తుండగా అకస్మాత్తుగా స్పార్క్ వచ్చి నిప్పు అంటుకుంది. ఈ హఠాత్ పరిణామంతో పెట్రోలు కోసం వచ్చిన వినియోగదారులు, చుట్టుపక్కల వారు భయంతో పరుగులు తీశారు. ఇంతలో పక్కనే ఉన్న అగ్నిమాపక కార్యాలయం సిబ్బంది సమాచారం తెలుసుకుని వచ్చి ఏ త్రిబుల్ ఎఫ్ ఫోమ్ (నురగ) ను చల్లి మంటలను అదుపు చేశారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.50 వేలు ఆస్తినష్టం వాటిలినట్లు అగ్నిమాపకశాఖాధికారి పేరూరి శ్రీనివాస్ తెలిపారు. శతాధిక వృద్ధుడి మృతి కరప: మండలం కూరాడ గ్రామానికి చెందిన శతాధిక వృద్ధ పాస్టర్ మోర్త అండ్రేయ (104) ఆదివారం మృతి చెందారు. ఆండ్రేయ సొంత గ్రామం రామచంద్రపురం సమీపంలోని నరసాపురపేట. ఆ గ్రామం నుంచి 1975లో కరప మండలం కూరాడ గ్రామానికి వచ్చి స్థిరపడ్డారు. కొద్దిరోజుల ముందు వరకు ఆయన సువార్త చెప్పేవారు. ఇంతవరకు ఆయన తన పనులు తానే చేసుకునేవారని, వయసురీత్యా కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఆదివారం పరలోకగతులయ్యారని బంధువులు తెలిపారు. ఆయనకు ముగ్గురు కుమారు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆండ్రేయ మృతికి మండల అంబేడ్కర్ యువజనసేవా సంఘం ప్రతినిధి చిన్నం వెంకటేశ్వరరావు తదితర గ్రామస్తులు సంతాపం వ్యక్తంచేశారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్త కొబ్బరి (క్వింటాల్) 20,000 – 22,500 కొత్త కొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 30,000 గటగట (వెయ్యి) 28,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 29,000 గటగట (వెయ్యి) 27,000 నీటికాయ పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 23,000 – 25,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి)23,000 – 25,500 కొబ్బరి నూనె (15 కిలోలు) 5,250 కిలో 350 -
బతుకుతెరువుకు వచ్చి కడతేరిపోయారు
గండేపల్లి: బతుకుతెరువు కోసం జిల్లా దాటి వచ్చిన వారు విగత జీవులయ్యారు. యజమానిని రక్షించే యత్నంలో సహాయకుడితో సహా విద్యుదాఘాతానికి గురై సెకన్ల వ్యవధిలో ఇద్దరూ మృత్యువాత పడ్డారు. పోలీసుల కధనం మేరకు పశ్చిమ గోదావరి జిల్లా ఇరగరవం మండలం పేకేరు గ్రామానికి చెందిన కరిపెట్టి సింహాద్రి(57) తన దగ్గర ఉన్న వరికోత యంత్రంతో స్థానికంగా పలు ప్రాంతాల్లో వరి కోత కోస్తుంటాడు. ఈ క్రమంలో ఆదివారం మండలంలోని గండేపల్లి, రామయ్యపాలెం మీదుగా ఐషర్ వ్యాన్‌లో వరికోతకు యంత్రాన్ని తీసుకువెళ్తున్నాడు. రామయ్యపాలెం గ్రామ శివారుకు వచ్చే సరికి యంత్రం పైపునకు 11 కేవీ విద్యుత్ తీగలు అడ్డం వచ్చాయి. వాటిని తొలగించేందుకు డ్రైవింగ్ సీటు నుంచి కిందకు దిగిన సింహాద్రి వ్యాన్‌కు అడుగు భాగంలో కర్రను తీసే యత్నంలో తలుపుపై చేయి వేయడంతో ఒక్కసారిగా విద్యుదాఘాతానికి గురయ్యాడు. ఆ వెనుకే మోటారు సైకిల్‌పై వస్తున్న పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం రాపాక గ్రామానికి చెందిన సహాయకుడు గెడ్డం సందీప్ (17) సింహాద్రిని రక్షించబోయాడు. దీంతో అతడు సైతం విద్యుదాఘాతానికి గురై ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ఓనర్ కం డ్రైవర్‌గా పనిచేసుకుంటున్న సింహాద్రికి భార్య విజయలక్ష్మి, ఇద్దరు కొడుకులు ఉన్నారు. సందీప్‌కు తల్లి, తండ్రి, ఇద్దరు అక్కలు ఉండగా మరో అక్కకు వివాహం కావాల్సి ఉందన్నారు. సీతానగరానికి కోతలకు వెళ్తుండగా.. కలవచర్లలో శనివారం వరికోత ముగించుకున్న సింహాద్రి, సందీప్‌లు ఆదివారం సీతానగరం వెళ్లాల్సి ఉండగా ఇక్కడకు వచ్చి ఇలా మృతి చెందారని వరికోత యంత్రాన్ని పురమాయించిన వ్యక్తి పేర్కొన్నాడు. చాలా కాలంగా కిందికి వేలాడుతున్న విద్యుత్ తీగలను అధికారులు పట్టించుకోకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెప్తున్నారు. ప్రమాదస్థలం వద్దకు చేరుకున్న సీఐ వైఆర్కే శ్రీనివాస్, ఎసై యు.వి.శివ నాగబాబు, సిబ్బంది క్షేత్రస్థాయిలో వివరాలు తెలుసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జెడ్.రాగంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేయనున్నట్టు తెలియజేశారు. విద్యుత్‌శాఖ ఏఈ సంఘటన వద్ద ప్రమాదకరంగా ఉన్న తీగలను సరిచేయించారు. గమనించి ఉంటే ప్రమాదం తప్పేది సింహాద్రి వెళ్తున్న మార్గంలో కొద్ది నిమిషాల ముందు మరో వాహనం వరికోత యంత్రాన్ని తీసుకువెళ్లిందని ఆ వాహన డ్రైవర్ సమాచారం అందజేసేంతలో ఇలా జరిగిపోయిందని స్తానికులు పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన కొద్దిసేపటికే రామయ్యపాలెం, సింగరంపాలెం గ్రామస్తులు సంఘటనాస్థలం వద్దకు చేరుకుని సహాయక చర్యలు అందజేసే యత్నం చేసినప్పటికి ప్రయోజనం లేకపోయిందన్నారు. వరికోత యంత్రానికి విద్యుత్ తీగలు తగిలి ఘటన యజమానితో సహా సహాయకుడూ క్షణాల్లో మృతి మృతులిద్దరూ ‘పశ్చిమ’ వాసులే -
అతితెలివితో అడ్డంగా దొరికి..
● బాలిక హత్య కేసులో నిందితుడి అరెస్టు ● అప్పులపాలై అడ్డదారిలో వెళ్లి దురాగతం ● ఆత్మహత్యను హత్య కేసుగా నమోదు ● చాకచక్యంగా ఛేదించిన పోలీసులు రామచంద్రపురం: అత్యాసకు పోయి, దొంగతనం చేస్తూ అన్నెం పున్నెం ఎరుగని బాలికను హత్య చేసి మీడియాను, పోలీసులను తప్పుదోవ పట్టించే యత్నంలో చివరకు హంతకుడు పోలీసులకు దొరికిపోయాడు. రామచంద్రపురం పట్టణంలో ఈ నెల 4న జరిగిన బాలిక మృతి కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి పోలీసుల విచారణలో వెలుగు చూసిన విషయాలు విస్మయం కలిగించాయి. స్థానిక డీఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ రాహుల్ మీనా మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. రామచంద్రపురం మండలం అంబికపల్లి అగ్రహారానికి చెందిన పెయ్యల వీరవెంకట శ్రీనివాస్, అలియాస్ శ్రీనివాస్ ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తూ ఒక యూట్యూబ్ చానల్‌కు రిపోర్టర్‌గా వ్యవహరిస్తున్నాడు. పట్టణంలోని త్యాగరాజు నగర్లో ఒక ఇంట్లో చిర్రా సునీత తన కూతురుతో కలిసి అద్దెకు ఉంటున్నారు. వీరి కుటుంబంతో శ్రీనివాస్ సన్నిహితంగా ఉంటున్నాడు. అయితే శ్రీనివాస్ బ్యాంకు అప్పులు, చెల్లెలి పెళ్లికి చేసిన అప్పులు వంటి వాటితో సతమతమవుతున్నాడు. ఈ క్రమంలో శ్రీనివాస్ ఈనెల 4వ తేదీన సునీత ఇంటికి వెళ్లాడు. అప్పటికే సునీత కుమార్తె (10) ఇంట్లో ఉంది. బంగారం, సొమ్ము అపహరించేందుకు వచ్చిన శ్రీనివాస్ ఇంట్లోకి రాగానే ఆ చిన్నారి ఎందుకు వచ్చావని ప్రశ్నించింది. ఫ్యాన్ రిపేరు చేయటానికి వచ్చానని అబద్ధం చెప్పాడు. దీంతో ఫ్యాన్ బాగానే ఉంది కదా అమ్మకు ఫోన్ చేసి చెబుతాను అని ఫోన్ చేస్తుండగా తన బండారం ఎక్కడ తెలిసిపోతుందోనని ఇంట్లో మంచం మీద ఉన్న చున్నీని బాలిక మెడకు చుట్టి మంచంపైకి తోసి అమె ముఖాన్ని మంచంపై అదిమిపట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. ఎవ్వరికీ అనుమానం రాకుండా బాలిక శవాన్ని చున్నీతో ఫ్యాన్‌కు ఉరితీయటం ద్వారా ఆత్మహత్యగా చిత్రీకరించాడు. తనకు ఉన్న అనుభవంతో తలుపులు లోపల గడియపెట్టి వెళ్లిపోయాడు. తన విధులు ముగించుకుని ఇంటికి వచ్చిన సునీత తన కూతురు ఉరి వేసి ఉండటాన్ని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మృతదేహాన్ని ఏరియా ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించిన పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. అయితే ఇంట్లోనే ఉంటూ తనకు ఏమీ తెలియనట్లు వ్యవహరించిన శ్రీనివాస్, ఏం జరుగుతుందనే విషయాన్ని ఎప్పటికప్పుడు మీడియాకు లీకులు ఇస్తూ ఉండేవాడు. ఫోరెన్సిక్ నిపుణులు వచ్చి వేలిముద్రలు సేకరించారు. బాలిక మృతిలో అత్యుత్సాహంతో వ్యవహరిస్తున్న శ్రీనివాస్‌పై పోలీసులకు అనుమానం వచ్చి అతని వేలిముద్రలు కూడా సేకరించారు. అయితే ఇంట్లో ఉన్న ఫ్యానుకు, తదితర చోట్ల ఉన్న వేలిముద్రలతో సరిపోలడంతో అతడిని పోలీసులు అదుపులోనికి తీసుకుని విచారించగా నేరం అంగీకరించినట్లు ఎస్పీ రాహుల్ మీనా వెల్లడించారు. రామచంద్రపురం డీఎస్పీ రఘువీర్, సీఐ వెంకటనారాయణ, ఎస్సై ఎస్.నాగేశ్వరరావు ఎంతో చాకచక్యంగా అన్ని కోణాల్లోను దర్యాప్తు చేయటంతో శ్రీనివాస్ బాలికను హత్య చేసినట్లు నిర్థారించినట్టు ఎస్పీ వెల్లడించారు. అప్పుల పాలైన శ్రీనివాస్ దొంగతనం చేసే ప్రయత్నంలో బాలికను హతమార్చినట్లు తెలిపారు. అన్ని కోణాల్లోను దర్యాప్తును ముమ్మరం చేసి నిందితుడిని పట్టుకున్న పోలీసులను ఎస్పీ అభినందించారు. -
గోదావరిలో మునిగి విద్యార్థి మృతి
కపిలేశ్వరపురం (మండపేట): అంబాజీపేట మండలం పుల్లేటికుర్రు గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థి నామాడి బన్ను (17) గౌతమి గోదావరి నదిలో స్నానానికి దిగి ప్రమాదవశాత్తూ మృతి చెందాడు. అంగర ఎస్సై జి.హరీష్‌కుమార్ కథనం ప్రకారం బన్ను మరో ఇద్దరు స్నేహితులతో కలిసి కపిలేశ్వరపురం మండలం కేదారిలంక గ్రామ శివారు వీధివారిలంకలోని పర్యాటక కేంద్రం ధనమ్మమర్రికి వచ్చాడు. స్నేహితులతో కలిసి గోదావరిలో స్నానానికి దిగారు. ఇంతలో బన్ను ప్రమాదవశాత్తూ నీటిలో మునిగి మృతిచెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి తండ్రి అబ్బులు ఫిర్యాదుపై మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. అబ్బులుకు బన్ను పెద్ద కుమారుడు కాగా చిన్న కుమారుడు అభిషేక్ ఆరో తరగతి చదువుతున్నాడు. పుల్లేటికుర్రులో విషాదఛాయలు అంబాజీపేట: అప్పటివరకు స్నేహితులతో ఉల్లాసంగా గడిపిన బన్ను నీట మునిగి మృతి చెందడంతో చీకురుమెల్లివారిపేటలో విషాదం అలుముకుంది. బన్ను స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతుండగా, అతని తండ్రి నామాడి అబ్రహం ఆటో నడిపి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. బన్ను మృతి వార్త తెలిసి గ్రామ సర్పంచ్ జల్లి బాలరాజు, ఉప సర్పంచ్ వీరా రవి, ఎంపీటీసీలు కుసుమ వెంకటేష్, వడలి కృష్ణమూర్తి, హెచ్ఎం, ఉపాధ్యాయులు, స్థానికులు సంతాపం వ్యక్తం చేశారు. వివాహిత ఆత్మహత్య కపిలేశ్వరపురం: భర్త వ్యవహార శైలితో మనస్తాపానికి గురై మండపేట మండలం ద్వారపూడి గ్రామ శివారు వేములపల్లికి చెందిన మట్టా రేఖ (24) ఆదివారం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్సై వి.కిశోర్ కథనం ప్రకారం రేఖకు అల్లవరం మండలం బోడసకుర్రు గ్రామానికి చెందిన మట్టా వేణుతో వివాహమైంది. కొంతకాలం క్రితం రేఖ వేములపల్లిలోని తండ్రి నేదునూరి శ్రీను ఇంటికి ప్రసవానికి వచ్చింది. ఆ సమయంలో రేఖ, వేణుల మధ్య తరచుగా ఫోన్లో వాగ్వాదం జరిగేది. దీంతో మనస్తాపం చెందిన రేఖ ఆదివారం వేములపల్లిలోని కొబ్బరితోటలో ఉరి వేసుకుని మృతి చెందింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మండపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తండ్రి శ్రీను ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై కిశోర్ తెలిపారు. రేఖకు నాలుగు నెలల కుమారుడు ఉన్నాడు. -
షార్ట్ సర్క్యూట్‌తో తాటాకిళ్లు దగ్ధం
● రూ.15 లక్షల ఆస్తి నష్టం అంబాజీపేట: స్థలం కొనుగోలు కోసం అప్పు చేసి మరి కొద్ది సమయంలో ఆ మొత్తాన్ని అందజేస్తామనుకుంటే కళ్ల ఎదుటే రూ.7 లక్షలు కాలిపోయాయని బాధితులు బావురుమన్నారు. కె.పెదపూడి తిరుమనాథంవారిపాలెం శివారులో ఆదివారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిన అగ్ని ప్రమాదంలో రెండు తాటాకిళ్లు దగ్ధం కాగా నాలుగు కుటుంబాల వారు నిరాశ్రులయ్యారు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు, ఈతకోట సుబ్బారావు, ఈతకోట శ్రీనివాసరావు, ఈతకోట ఈశ్వరరావు, ఈతకోట మంగాయమ్మలకు చెందిన రెండు తాటాకిళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. తొలుత సుబ్బారావు, శ్రీనివాసరావులు నివాసమున్న ఇంటికి మంటలు వ్యాపించి పక్కనే ఉన్న ఈశ్వరరావు, మంగాయమ్మల ఇంటికి వ్యాపించాయి. స్థానికులు మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తుండగా ఇంటిలో ఉన్న సిలిండర్ పేలడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ అగ్ని ప్రమాదంలో స్థలం కొనుగోలు కోసం ఇంటిలో దాచుకున్న సుబ్బారావుకు చెందిన రూ.1.5 లక్షల నగదు, 12 గ్రాముల బంగారం, అతని కుమారుల స్టడీ సర్టిఫికెట్లు, శ్రీనివాసరావుకు చెందిన రూ.2.5 లక్షల నగదు, 18 గ్రాముల బంగారం, విదార్హత సర్టిఫికెట్లు, మంగాయమ్మకు చెందిన రూ.1.5 లక్షల నగదు, 18 గ్రాముల బంగారం, విద్యార్హత సర్టిఫికెట్లు, ఈశ్వరరావుకు చెందిన రూ.2,7 లక్షల నగదు, 14 గ్రాముల బంగారం, స్టడీ సర్టిఫికెట్లు, గృహోపకరణాలు ఈ ప్రమాదంలో కాలి బూడిదయ్యాయి. మొత్తంగా రూ.15 లక్షల ఆస్తి నష్టం సంభవించినట్లు అమలాపురం అగ్నిమాపక అధికారులు తెలిపారు. మంటలను అదుపు చేసేందుకు వచ్చిన అగ్నిమాపక వాహనం లోపలకు వచ్చే అవకాశం లేకపోవడంతో స్థానికులు మంటలను అదుపు చేసేందుకు నానా ఇబ్బందులు పడ్డారు. అంబాజీపేట భవాని సేవా సమితి ఆధ్వర్యంలో గురు భవానీలు దంగేటి సాయిబాబు, మల్లేశ్వరి దంపతులు, మట్టపర్తి ఏసు, మట్టపర్తి శ్రీనివాస్, పాటి శేఖర్, గుత్తుల పండు, పితాని శ్రీనులు బాధితులకు 50 కేజీల బియ్యం, చీరలను పంపిణీ చేశారు. సంఘటనా స్థలాన్ని పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పరిశీలించి బాధిత కుటుంబాలకు మనోధైర్యం కల్పించారు. ప్రభుత్వం అందించిన ఆర్థిక సాయం 10 కేజీల చొప్పున బియ్యం, కేజీ బంగాళదుంపలు, వంట నూనె, ఉల్లిపాయలను అంజేశారు. కార్యక్రమంలో ఆర్ఐ కె.ఏడుకొండలు, వీఆర్వో వెంకటరమణ, కూటమి నాయకులు పాల్గొన్నారు. -
పిఠాపురం: కర్పూరం వెలిగించి.. హుండీలో వేసి..
సాక్షి, కాకినాడ జిల్లా: పిఠాపురంలో భక్తురాలు అత్యుత్సాహం ప్రదర్శించింది. కర్పూర హారతి వెలిగించి హుండీలో వేసింది. దీంతోహుండీలో నోట్లకు నిప్పు అంటుకుంది. శ్రీపాద శ్రీవల్లభ సంస్థానంలో ఘటన జరిగింది. హుండీ నుండి పొగలు రావడాన్ని గమనించిన ఆలయ సిబ్బంది.. నీళ్లు పోసి మంటల్ని ఆర్పివేశారు. కాలిన నోట్లను వేరు చేసిన సిబ్బంది.. నోట్లను హెయిర్ డ్రైయర్‌తో ఆరబెట్టారు.శృంగార వల్లభస్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులుతొలి తిరుపతిగా ప్రసిద్ధి చెందిన తిరుపతి గ్రామంలోని శృంగార వల్లభస్వామి ఆలయానికి శనివారం భక్తులు పోటెత్తారు. జిల్లా నలుమూలల నుంచి అనేక మంది భక్తులు కాలినడకన ఆలయానికి చేరుకుని మొక్కులు తీర్చుకోవడానికి ఆలయానికి తరలివచ్చారు. సుమారు 20 వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నట్లు ఆలయ ఈఓ వడ్డి శ్రీనివాసరావు తెలిపారు.ప్రత్యేక దర్శనం టిక్కెట్ల ద్వారా రూ.2,45,750, అన్నదాన విరాళాలకు రూ.78,315, కేశ ఖండన ద్వారా రూ.5,920, తులాభారం ద్వారా రూ.450, లడ్డు ప్రసాదం విక్రయం ద్వారా రూ.29,895లతో రూ.3,60,330 ఆదాయం వచ్చిందని చెప్పారు. 4,200 మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించారని ఈఓ తెలిపారు. ఆలయ అర్చకులు పెద్దింటి పురుషోత్తమాచార్యులు, నారాయణాచార్యులు పూజలు నిర్వహించారు. దేవస్తాన సిబ్బంది, గ్రామ పెద్దలు భక్తులకు సేవలందించారు. -
పాత స్నేహితులే ప్రాణం తీశారు
● వీడిన శ్రీనివాస్ హత్య కేసు మిస్టరీ ● 8 మంది అరెస్ట్, పరారీలో మరొకడు ● వివరాలు వెల్లడించిన ఎస్పీ రాహుల్ మీనా అమలాపురం టౌన్: పాత స్నేహితులే కాలయములయ్యారు. మాట్లాడాలని పిలిచి మిత్రుడిని హత్య చేశారు. అమలాపురం పట్టణం కొంకాపల్లికి చెందిన కంచిపల్లి శ్రీనివాస్ హత్య కేసు మిస్టరీ వీడింది. ఈ ఘటనకు సంబంధించి 8 మందిని పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎస్పీ రాహుల్ మీనా ఈ వివరాలు వెల్లడించారు. నిందితులను ఏఎస్పీ ఏవీఆర్‌పీబీ ప్రసాద్, అమలాపురం డీఎస్పీ టీఎస్ఆర్కే ప్రసాద్, అమలాపురం పట్టణ సీఐ పి.వీరబాబు, క్రైమ్ సీఐ ఎం.గజేంద్ర కుమార్, పట్టణ ఎస్సైలు ప్రవేశపెట్టారు. ప్రధాన నిందితుడైన ఎ–1 పట్టణానికి చెందిన గంగుమళ్ల షణ్ముఖేశ్వరరావు (కాసుబాబు), అడబాల శంకర్ బంగారు (వరసకు కాసుబాబు కుమారుడు), సలాది రాంబాబు (అప్పన్న), భాస్కర్ల దుర్గ నాగ ప్రసాద్ (డ్రైవర్), అమలాపురం రూరల్ మండలానికి చెందిన కరాటం నరేష్, రాజోలు మండలం వేగివారిపాలేనికి చెందిన యర్రంశెట్టి లింగయ్య నాయుడు, తెలంగాణ రాష్ట్రం మేడ్చల్ జిల్లా నాగారం గ్రామానికి చెందిన మోరం సత్యగంగా మాణిక్యాలరావు, మోరం వీర వెంకట సత్య శ్రీనివాస్‌లను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. కేసులో ఎ–5 నిందితుడైన రావులపాలేనికి చెందిన పెనుమంట్ల అనిల్ పరారీలో ఉన్నాడు. వీరిని ముమ్మిడివరం పరిసర ప్రాంతాల్లో వివిధ చోట్ల శుక్రవా రం అరెస్ట్ చేశారు. కాల్ డేటాలు, వీడియో, ఆడియో పుటేజీల ఆధారంగా కేసును ఛేదించారు. హత్యకు ఉపయోగించిన కత్తి, మూడు కార్లు, ఒక బైక్, స్కూటర్, 15 సెల్ ఫోన్లను నిందితులను నుంచి స్వాధీనం చేసుకునిసీజ్ చేశారు. హత్య జరిగిన తీరు అమలాపురం పట్టణంలో రౌడీగా చెలామణి అవుతున్న కాసుబాబును దూషిస్తూ కంచిపల్లి శ్రీనివాస్ మాట్లాడిన మాటల ఆడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. అప్పటికే అప్పులు, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న కాసుబాబు ఆ ఆడియా తన వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసిందని భావించాడు. మళ్లీ రౌడీగా తన ఉనికి చాటుకునేందుకు, భయం పుట్టించేందుకు శ్రీనివాస్‌ను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలో శ్రీనివాస్ పాత స్నేహితులైన సలాది రాంబాబు, భాస్కర్ల దుర్గా నాగ ప్రసాద్‌ను సంప్రదించి, హత్యకు పథకం చేశాడు. ఆ ప్రకారం.. గత నెల 25న కంచిపల్లి శ్రీనివాస్‌ను మాట్లాడే పని ఉందంటూ సలాది రాంబాబు, భాస్కర్ల దుర్గా నాగప్రసాద్ పిలిచారు. రాత్రి 11.30 గంటల సమయంలో కారులో తీసుకువెళ్లి మద్యం పట్టించారు. అనంతరం అంబాజీపేట మండలం వక్కలంక వద్ద శ్రీనివాస్‌ను కత్తితో పొడిచి హత్య చేశారు. మృతదేహాన్ని కారు డిక్కీలో పెట్టి ఆ దృశ్యాన్ని వీడియో తీసి కాసుబాబు స్మార్ట్ ఫోన్‌కు పంపించారు. అదే రోజు రాత్రి పి.గన్నవరం మండలం ఆర్.ఏనుగపల్లి వద్ద వైనతేయ గోదావరిలో మృతదేహాన్ని పడేశారు. కేసు నమోదు ఇంటి నుంచి వెళ్లిన శ్రీనివాస్ తిరిగి రాకపోవడంతో అతడి భార్య దేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు 27న పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేశారు. అయితే 29న వైనతేయ నదితో శరీరంపై గాయాలతో శ్రీనివాస్ మృతదేహం కనిపించడంతో హత్య కేసుగా మార్చి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసు అధికారులకు ఎస్పీ అభినందన ఈ కేసును చాకచక్యంగా దర్యాప్తు చేసి మిస్టరీ ఛేదించిన డీఎస్పీ టీఎస్ఆర్కే ప్రసాద్, పట్టణ సీఐ పి.వీరబాబు, క్రైమ్ సీఐ ఎం.గజేంద్ర కుమార్, ఎస్సై ఎన్ఏ కిషోర్ బాబు, ఐటీ కోర్ టీమ్ సిబ్బందిని, కానిస్టేబుళ్లను ఎస్పీ మీనా ప్రత్యేకంగా అభినందించారు. -
రెప్పపాటులో మృత్యుకాటు
● విషాద ఉదయం కిర్లంపూడి/ఏలేశ్వరం/ప్రత్తిపాడు: సమయం ఉదయం ఏడు గంటలు.. పనికి వెళుతున్న కూలీలు, కాలేజీకి వెళుతున్న విద్యార్థులతో ఆ ప్రాంతం రద్దీగా ఉంది. ఇంతలో ఓ కారు వారిపైకి దూసుకొచ్చింది. రెప్పపాటులో బీభత్సం సృష్టించింది. ముగ్గురి ప్రాణాలు తీసి, మరో ముగ్గురిని తీవ్రంగా గాయపర్చింది. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషయంగా ఉంది. కారులో బెలూన్లు తెరుచుకోవడంతో దానిలోని వారందరూ సురక్షితంగా బయటపడ్డారు. కిర్లంపూడి మండలం సోమవారం గ్రామంలో శనివారం ఈ ఘటన చోటుచోసుకుంది. మృతుల్లో ఒకరైన మోర్త ఆనందరావు కుమారుడు తాతారావు ఫిర్యాదు మేరకు కిర్లంపూడి పోలీసులు కేసు నమోదు చేశారు. వివాహానికి వెళ్లి వస్తూ.. విశాఖపట్నంలో కుమారుడి వివాహంలో పాల్గొన్న జగ్గంపేటకు చెందిన టీడీపీ నాయకుడు వేములకొండ జోగారావు, ఆయన భార్య, బంధువులు కారులో ఇంటికి బయలుదేరారు. సోమవారం గ్రామానికి వచ్చేసరికీ జోగారావు కనురెప్ప పడడంతో కారు అదుపు తప్పింది. రోడ్డు పక్కనే మోటారు సైకిల్‌పై నిలిచి ఉన్న ఏలేశ్వరానికి చెందిన కాకాడ రాజు (60)ను ఢీకొంది. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ తర్వాత బిల్డింగ్ మెటీరియల్‌తో తోపుడు బండిని తోసుకు వస్తున్న సోమవరం గ్రామానికి చెందిన మోర్త ఆనందరావు (60), మోర్త కొండయ్య (31)ను ఢీకొంది. ఆ వేగానికి తోపుడు బండి నుజ్జునుజ్జయ్యింది. కారు అక్కడితో ఆగకుండా బస్ షెల్టర్‌లో నిలబడిన బత్తిన భద్రాన్ని గుద్దుకుంటూ షెల్టర్ దిమ్మ పైకి ఎక్కి లోపలకు దూసుకు పోయింది. కాలేజీకి వెళ్లటానికి అక్కడే కూర్చుని కుండ్రపు చైతన్య, చీపురుపల్లి ఫణిశ్రీ అనే యువతులను ఢీకొంది. ఆర్తనాదాలు రెప్పపాటులో కారు బీభత్సం సృష్టించడంతో అక్కడున్న వారందరూ భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంలో కొండయ్య, కాకాడ రాజు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రత్తిపాడు సీహెచ్‌సీకి తరలించే మార్గం మధ్యలో ఆనందరావు కన్నుమూశాడు. గాయపడిన భద్రం, చైతన్య, ఫణిశ్రీలను కాకినాడ ఆసుపత్రికి తరలించారు. కారులో బెలూన్లు ఓపెన్ కావడంతో దానిలో వారందరూ ప్రాణాలతో బయటపడ్డారు. స్థానికులు వారిని బయటకు లాగి రక్షించారు. మిన్నంటిన రోదనలు ప్రమాదం జరిగిన కొద్ది సేపటికి మృతుల కుటుంబ సభ్యులు అక్కడకు చేరుకుని విలపించడంతో ఘటనా స్థలం రోదనలతో నిండిపోయింది. జగ్గంపేట సీఐ వైఆర్కే శ్రీనివాస్, కిర్లంపూడి ఇన్చార్జి ఎస్సై రఘునాథరావు అక్కడకు చేరుకుని జాతీయ రహదారిపై స్తంభించిన ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు. బాధితులను మెరుగైన చికిత్స కోసం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద స్థలంలో మృతదేహాలను ప్రత్తిపాడు, జగ్గంపేట సీహెచ్‌సీలకు తీసుకువెళ్లారు. సీహెచ్‌సీకి మృతదేహాలు ఆనందరావు, రాజు, మృత దేహాలను ప్రత్తిపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్‌సీ)కు, కొండయ్య మృతదేహాన్ని జగ్గంపేట ఆస్పర్రికి తీసుకువెళ్లారు. వారిని చూసి కుటుంబ సభ్యులు, బంధువులు బోరున విలపించారు. బాధితులను జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ పరామర్శించారు. మట్టి ఖర్చుల కోసం మృతుల కుటుంబాలకు రూ.25 వేల వంతున ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆర్థిక సాయం చేశారు. కేంద్ర మాజీ మంత్రి ఎంఎం పల్లంరాజు మృతుల కుటుంబాలతో ఫోన్లో మాట్లాడారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలి: మాజీ మంత్రి తోట నరసింహం మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని వైఎస్సార్ సీపీ జగ్గంపేట కో ఆర్డినేటర్, మాజీ మంత్రి తోట నరసింహం డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలను ప్రత్తిపాడు సీహెచ్‌సీలో పరామర్శించారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ సోమవరం గ్రామంలో ఇది రెండో పెద్ద ప్రమాదమన్నారు. గతంలో జరిగిన ప్రమాదంలో కూడా ప్రాణనష్టం జరిగిందన్నారు. ఈ ప్రదేశంలో అండర్ నిర్మించాలని కోరారు. ఆయన వెంట పార్టీ నాయకులు అడబాల నాగు, అంబటి కొండలరావు, బళ్ల కామేశ్వరరావు తదితరులు ఉన్నారు. రూ.50 లక్షల నష్ట పరిహారం అందించాలి: ముద్రగడ గిరిబాబు సోమవరం గ్రామంలో జరిగిన దుర్ఘటనపై వైఎస్సార్ సీపీ ప్రత్తిపాడు కో ఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. స్థానిక సీహెచ్‌సీలో కాకాడ రాజు కుటుంబాన్ని పరామర్శించి, ధైర్యం చెప్పారు. ఆయన మాట్లాడుతూ కాకాడ రాజు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, ఎకరం పొలం ఇవ్వాలని, రూ.50 లక్షల నష్టపరిహారం అందజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆయన వెంట వైఎస్సార్ సీపీ నాయకులు గుడాల వెంకటరత్నం, మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ శేరు కృష్ణ, సామంతుల సూర్య కుమార్, కోరాడ ప్రసాద్, వాగు బలరామ్, పినిశెట్టి ప్రకాష్, అందే చిట్టికొండ తదితరులు ఉన్నారు. సోమవరం గ్రామంలో కారు బీభత్సం అదుపు తప్పి జనం పైకి.. ముగ్గురి మృతి, మరో ముగ్గురికి గాయాలు బాధిత కుటుంబాలకు వైఎస్సార్ సీపీ నాయకుల పరామర్శ కాకినాడ క్రైం: సోమవరం గ్రామంలో జరిగిన కారు ప్రమాదంలో గాయపడిన ముగ్గురు క్షతగాత్రులను కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. వారిలో 52 ఏళ్ల బత్తిన భద్రం, 17 ఏళ్ల కూండ్రపు దుర్గా చైతన్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. మరో బాధితురాలైన 17 ఏళ్ల చీపురుపల్లి ఆదిత్య ఫణిశ్రీ స్రవంతి ఆరోగ్యం నిలకడగా ఉంది. భద్రానికి తల, ఛాతి, కాళ్లకు తీవ్ర గాయాలవ్వడంతో ట్రామాకేర్ ఐసీయూలో అపస్మారక స్థితిలో ఉన్నాడు. అతడికి వెంటిలేటర్‌పై వైద్య సేవలు కొనసాగుతున్నాయి. దుర్గా చైతన్యను ఆర్ఐసీయూ–2లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఆమె ఎడమ తొడ ఛిద్రమైంది. శరీరంలో అతి బలమైన ఎముకై న ఫీమర్ మధ్య భాగం పూర్తిగా దెబ్బతిని మలద్వారం దిశగా చీలిక ఏర్పడింది. ఈ స్థితి ఆమెకు ప్రాణాపాయాన్ని తెచ్చిపెట్టింది. వీరిద్దరినీ రక్షించేందుకు వైద్యులు కష్టపడుతున్నారు. స్రవంతి ఎడమ కాలికి తీవ్రగాయం కావడంతో వైద్యం అందించి ఫీమేలు ఆర్ధో వార్డుకు ఆమెకు ఎటువంటి ప్రాణాపాయం లేదని వైద్యులు నిర్ధారించారు. -
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
నల్లజర్ల: విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి చెందిన ఘటన పోతవరంలో శనివారం ఉదయం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన తాడిచర్ల హరిబాబు (28) స్నానం చేయడానికి బాత్రూమ్లోని గీజర్ స్విచ్ వేశాడు. దానికి విద్యుత్ సరఫరా జరగడంతో షాక్‌కు గురయ్యాడు. అపస్మారక స్థితిలో ఉన్న అతడిని కొయ్యలగూడెం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. హరిబాబు పోతవరంలో చెప్పుల షాపు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతడికి భార్య గౌతమీ ప్రియ, కుమార్తె ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై దుర్గాప్రసాదరావు తెలిపారు. కదిలే రైలు ఎక్కబోతూ జారి పడి.. ● తండ్రీ కుమార్తెలకు తీవ్ర గాయాలు ● నిడదవోలు స్టేషన్లో ఘటన నిడదవోలు: కదులుతున్న రైలును ఎక్కే ప్రయత్నంలో తండ్రీ కుమార్తెలు జారిపడి తీవ్ర గాయాలపాలయ్యారు. నిడదవోలు రైల్వేస్టేషన్లో శనివారం ఈ ఘటన జరిగింది. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి గ్రామానికి చెందిన టి.ఉమా మహేశ్వరరావు తన కుటుంబంతో తిరుపతి–పూరి ఎక్స్‌ప్రెస్‌లో తిరుపతికి బయలుదేరారు. రైలు నిడదవోలు రైల్వేస్టేషన్లో ఆగిన సమయంలో ఉమా మహేశ్వరరావు తన నాలుగేళ్ల కుమార్తె పవిత్రను తీసుకుని వాటర్ బాటిల్ కోసం స్టేషన్లో దిగారు. ఇంతలో రైలు కదిలిపోవడంతో కంగారుగా ఎక్కే ప్రయత్నం చేశారు. ఒక చేతితో కుమార్తెను ఎత్తుకుని, మరో చేతితో రైలు ముఖద్వారం వద్ద నున్న ఐరన్ రాడ్‌ను పట్టుకునే క్రమంతో అదుపుతప్పి ఇద్దరూ జారిపడి ప్లాట్‌ఫాంపై పడ్డారు. వెంటనే రైలును పైలట్ నిలిపివేవడంతో లోపల ఉన్న బంధువులు దిగారు. రైల్వే పోలీసులు అక్కడకు వచ్చి తీవ్రంగా గాయపడిన తండ్రీ కుమార్తెలను నిడదవోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పెద్ద దిక్కు కోల్పోయిన కుటుంబం
కారు ఢీకొనడంతో మృతి చెందిన కాకడ రాజు స్వగ్రామం ఏలేశ్వరం. తాపీమేసీ్త్రగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతడికి భార్య అర్జమ్మ, ముగ్గురు కుమారైలు, ముగ్గురు కుమారులు ఉన్నారు. వారిలో చిన కుమారుడికి మాత్రమే వివాహం కావాల్సి ఉంది. అర్జమ్మ తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా రహదారి పక్కనే బొప్పాయి, పుచ్చకాయలు విక్రయిస్తుంది. రాజు ఆ కాయలను పెద్దాపురం నుంచి కొనుగోలు చేసి ఏలేశ్వరం తీసుకు వస్తాడు. రోజూ మాదిరిగానే పెద్దాపురం వెళ్లి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. -
వాహనాల దొంగల ముఠా అరెస్టు
రూ.60 లక్షల విలువైన 40 వాహనాల స్వాధీనం కాకినాడ క్రైం: సునాయాసంగా డబ్బు సంపాదించే లక్ష్యంతో మోటార్ వాహనాల చోరీలకు పాల్పడుతున్న ఐదుగురు దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఎస్పీ బిందుమాధవ్ శనివారం స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో విలేకరులకు వివరాలు వెల్లడించారు. కాకినాడ రూరల్ మండలం తూరంగి గ్రామానికి చెందిన పెమ్మాడి ఆశీర్వాదం, పెందుర్తి లోవరాజు, కరప గ్రామానికి చెందిన కాల కృష్ణార్జున్, కాకినాడ వెంకట్నగర్కి చెందిన కొల్లి దుర్గాప్రసాద్, జగన్నాథపురానికి చెందిన కనుమూరి గణేష్‌లకు వివిధ సందర్భాల్లో పరిచయం ఏర్పడింది. స్నేహితులుగా మారిన వీరు చెడు వ్యసనాలకు బానిసలుగా మారారు. ఈ క్రమంలో సులభంగా డబ్బు సంపాదించాలన్న ఉద్దేశంతో సుమారు ఏడాదిన్నరగా వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్నారు. తాళం లేకపోయినా తాడు సాయంతో ఆటో ఇంజిన్ స్టార్ట్ చేయడం, ద్విచక్ర వాహనాలను నకిలీ తాళంతో తస్కరించడంలో వీరు దిట్ట. ఇలా కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, అనకాపల్లి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వీరు చోరీలకు పాల్పడ్డారు. ఆయా పోలీస్ స్టేషన్లలో వీరిపై మొత్తం 40 కేసులు నమోదయ్యాయి. సుమారు రూ.60 లక్షల విలువైన 18 ఆటోలు, 22 ద్విచక్ర వాహనాలను వీరి నుంచి స్వాఽధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. శుక్రవారం రాత్రి విరవాడ సెంటర్ వద్ద నిందితులను అదుపులోకి తీసుకున్నామన్నారు. ఎస్డీపీవో పాటిల్ దేవరాజ్ మనీష్ పర్యవేక్షణలో సీసీఎస్ సీఐ వి.కృష్ణ కేసు ఛేదనలో కీలకంగా వ్యవహరించారని ఎస్పీ చెప్పారు. ఆయనకు పిఠాపురం సీఐ శ్రీనివాస్ బృందం సహకరించినట్టు తెలిపారు. -
ఆస్పత్రిలో వ్యక్తి మృతిపై అధికారుల విచారణ
సామర్లకోట: స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంలో వైద్యానికి వచ్చిన మలిరెడ్డి భూచక్రం మృతి చెందిన ఘటనపై జిల్లా అధికారులు శనివారం సాయంత్రం ఆ ఆస్పత్రిలో విచారణ ప్రారంభించారు. ట్రైనీ కలెక్టర్ మనిషా జంగు, కాకినాడ ఆర్డీఓ ఎస్ మల్లిబాబు, డీఎంఅండ్‌హెచ్‌ఓ కార్యాలయ సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్.లావణ్య కుమారి, హెచ్ఓడీ డాక్టర్ యశోదమ్మ విచారణ చేశారు. సామాజిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ దవులూరి దొరబాబు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో కలెక్టర్ ఆదేశాలతో అధికారులు ఈ విచారణ ప్రారంభించారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి డ్యూటీలో ఉన్న సిబ్బంది నుంచి సమాచారం సేకరించారు. డ్యూటీలో ఉండాల్సిన డాక్టర్‌ను విచారణ చేశారు. విధుల్లో ఉండాల్సిన డాక్టర్ డ్యూటీలో లేరని నిర్ధారించారు. అనంతరం భూచక్రం కుటుంబ సభ్యులతో మాట్లాడారు. దీనిపై నివేదికను కలెక్టర్‌కు అందజేస్తామని ఆర్డీఓ తెలిపారు. -
ప్రైవేటీకరణపై ప్రజా ఉద్యమం
● కార్పొరేట్ సంస్థలకు వైద్య కళాశాలలను దోచిపెట్టే ఎత్తుగడ ● 12న భారీ ర్యాలీలు ● పోస్టర్ ఆవిష్కరణలో దాడిశెట్టి రాజా సాక్షి ప్రతినిధి, కాకినాడ: ప్రభుత్వ రంగంలో శ్రీకారం చుట్టిన వైద్య కళాశాలలను ప్రైవేటీకరించే నిర్ణయాన్ని వెనక్కు తీసుకునే వరకు కూటమి సర్కార్‌పై ప్రజా భాగస్వామ్యంతో పోరుబాటు కొనసాగించాలని మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు దాడిశెటి రాజా పిలుపునిచ్చారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పేదలకు వైద్య విద్యను దగ్గరచేస్తే చంద్రబాబు సర్కార్ ఆ విద్యను కార్పొరేట్ సంస్థల గుత్తాదిపత్యానికి అప్పగిస్తోందని ఆక్షేపించారు. శనివారం వైఎస్సార్ సీపీ కాకినాడ జిల్లా పార్టీ కార్యాలయంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు నిరసనగా ఈనెల 12న తలపెట్టిన ర్యాలీలకు సంబంఽధించిన ప్రజా ఉద్యమ పోస్టర్‌ను పార్టీ నేతలతో కలిసి రాజా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్రెడ్డి ఎంతో ముందుచూపుతో కేవలం ఐదేళ్ల కాలంలో కేంద్రంతో పోరాడి రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలను ప్రభుత్వ రంగంలో తీసుకువచ్చారన్నారు. ఇందులో ఐదు కాలేజీలను ప్రభుత్వ సొమ్ముతో దాదాపు పూర్తిచేస్తే వాటిని చంద్రబాబు ఒక్క కలంపోటుతో పీపీపీ అంటూ సొంత వారికి కట్టబెట్టేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల ప్రాంతీయ సమన్వయకర్త, మాజీ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ కూటమి సర్కార్ తీరుకు నిరసనగా ఇప్పటికే కోటి సంతకాల సేకరణ ప్రజాభాగస్వామ్యంతో ఒక ఉద్యమంగా జరుగుతోందన్నారు. ఇందుకు కొనసాగింపుగా ఈ నెల 12న అన్ని నియోజకవర్గాల్లో ర్యాలీలు నిర్వహించి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు నిరసనగా అధికారులకు వినతిపత్రాలు అందచేయనున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ విప్పర్తి వేణుగోపాల్, మాజీ మంత్రి, జగ్గంపేట కో ఆర్డినేటర్ తోట నరసింహం, పార్టీ మహిళా విభాగం వర్కింగ్ ప్రసిడెంట్, పిఠాపురం కో ఆర్డినేటర్ వంగా గీత, మాజీ ఎమ్మెల్యే, కాకినాడ సిటీ కో ఆర్డినేటర్ ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, పెద్దాపురం కో ఆర్డినేటర్ దవులూరి దొరబాబు, రాష్ట్ర కార్యదర్శులు, పార్టీ పరిశీలకులు గుబ్బల తులసీకుమార్, ఒమ్మి రఘురామ్, కొప్పన శివ, పార్టీ జిల్లా అనుబంధ విభాగాల నుంచి మహిళ అధ్యక్షురాలు వర్థినీడి సుజాత, పార్టీ ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి, మహిళా రాష్ట్ర కార్యదర్శి రాగిరెడ్డి దీప్తికుమార్, మహిళా నేతలు మాకినీడి శేషుకుమారి, పి.సరోజ, పార్టీ కాకినాడ నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సుంకర విద్యాసాగర్, పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు రాగిరెడ్డి అనిల్‌కుమార్(బన్నీ), బీసీ సెల్ అధ్యక్షుడు అల్లి రాజబాబు, ఎస్ఈసీ సభ్యుడు బెజవాడ సత్యనారాయణ, రోకళ్ల సత్య, మధు తదితరులు పాల్గొన్నారు. -
ధాన్యం కొనుగోడులు!
● కొనుగోలు కేంద్రాలపై ప్రకటనలకే పరిమితమైన అధికారులు ● విక్రయాలు మొదలుపెట్టేసిన దళారులు ● ఇప్పటికే 50 వేల టన్నులు విక్రయం పిఠాపురం: ప్రస్తుతం గోదావరి డెల్టా, ఏలేరు పరిధిలో వరి కోతలు ప్రారంభమయ్యాయి. కోతలు జోరుగా సాగుతుండగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కాక ప్రైవేటు వ్యాపారులదే హవాగా మారింది. దీంతో ఒక పక్క దిగుబడులు ఆశించిన స్థాయిలో లేక మద్దతు ధర రాక రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటిలాగే ప్రభుత్వం హడావుడి చేస్తోంది. ఇదిగో కొనుగోలు కేంద్రాలు అంటూ సమావేశాలు, సమీక్షలు, అవగాహనలంటూ హంగామా చేస్తోంది. ఒక్క గింజ కూడా వదల కుండా కొనుగోలు చేస్తామన్న ప్రకటనలు తప్ప ఇప్పటికీ ఒక్క గింజ కూడా కొనలేదని రైతులు ఆరోపిస్తున్నారు. ఒక పక్క జిల్లాలో వరి కోతలు ముమ్మరంగా జరుగుతుండగా ధాన్యం విక్రయాలు అదే స్థాయిలో ప్రైవేటు వ్యాపారులకు చేస్తున్నారు. ప్రతి రోజు వందల టన్నుల ధాన్యం మిల్లులకు చేరుతోంది. యంత్రాల ద్వారా కోతలు చేపట్టడంతో ఆ వెంటనే ధాన్యం విక్రయాలు జరిగిపోతున్నాయి. కాని ప్రభుత్వం మాత్రం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించకపోవడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే 70 శాతానికి పైగా వరిపంట కోతకు సిద్ధం కాగా పలు చోట్ల వరి కోతలు ప్రారంభించారు. ప్రైవేటు వ్యాపారులదే హవా జిల్లాలో వరికోతలు నూర్పులు ముమ్మరంగా చేపట్టనున్న నేపథ్యంలో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలు చోట్ల వరి కోతలు ప్రారంభం కావడంతో ప్రైవేటు వ్యాపారులు ధాన్యం కొనుగోళ్లను ప్రారంభించేశారు. యంత్రాలతో కోసిన ధాన్యాన్ని కళ్లాల్లోనే కొనుగోలు చేసి మిల్లులకు తరలిస్తున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు లేక పోవడం వల్లే తాము ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. ప్రైవేటు వ్యాపారులు ఇచ్చిన ధరనే తీసుకోవాలి తప్ప మద్దతు ధర వచ్చే అవకాశం లేక ఆదాయం బాగా పడిపోతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఽవరి కోతలు ప్రారంభం నాటికి ధాన్యం కొనుగోలు కేంద్రాలు సిద్ధం చేయాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంపై రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు లేక ప్రైవేటు వ్యాపారులు సిండికేట్‌గా మారారు. తాము చెప్పిందే ధర అన్నట్టుగా రైతులను దోచుకుంటున్నారు. వేరే దారి లేక వారు అడిగినంత ధరకు అమ్ముకోవాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. రబీ సీజన్లో ప్రైవేటు వ్యాపారులు రైతులను నట్టేముంచుతున్నా అడిగే నాధుడు కనిపించడం లేదు. ఆ నిబంధనలే శాపాలు ప్రభుత్వం ఒక వేళ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా ముందు మేము రైతు సేవా కేంద్రానికి వెళ్లి సమాచారం ఇచ్చి కూపన్ తీసుకోవాలి. తరువాత సిబ్బంది వారికి వీలు కుదిరనప్పుడు వచ్చి నమూనాలు తీసుకువెళ్తారు. తేమ ఎక్కువైతే ఆరబెట్టి తెండి అంటారు. ఇంతలో ఏ వర్షమైనా వస్తే అవి కాస్తా తడిసిపోయి నష్టమే మిగులుతుంది. ముఖ్యంగా పచ్చి ధాన్యాన్ని ప్రభుత్వం కొనదు. దీని వల్ల ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించక తప్పడం లేదు. దీంతో వ్యాపారులు వారి ఇష్టానుసారం ధర నిర్ణయించి కొంటున్నారు. మాకు నష్టాలు తప్పడం లేదు. ఆరబెట్టి అమ్ముదామని కళ్లాల్లో ఉంచిన ధాన్యం రోజుల క్రితం వచ్చిన వానకు తడిసి పోయాయి. – గంధం కృష్ణ, రైతు, కొత్తపల్లి నష్టం వచ్చినా తప్పడం లేదు రోజురోజుకు ధాన్యం ధరలు తగ్గించేస్తున్నారు. ఎందుకని అడిగే వారు లేరు ఎవరికి వారే ధాన్యం అమ్ముడైతే చాలన్నట్టు వ్యవహరిస్తున్నారు. కోత కోయక ముందు రూ.1450 అన్నారు. తీరా కోసాకా పచ్చి ధాన్యం అంటూ రూ.1200 అంటున్నారు. కనీసం ఎకరానికి రూ.8 వేల నుంచి రూ.10 వేల నష్టం తప్పడం లేదు. ప్రస్తుతం అంతా యంత్రాలతో కోతలు కోస్తుండడం వల్ల అంతా పచ్చి ధాన్యమే ఉంటుంది. ప్రైవేటు వ్యాపారులు పచ్చి ధాన్యం ఎలా ఉన్నది అలా కొంటున్నారు. అందుకే వారు అడిగిన ధరకు విక్రయించాల్సి వస్తోంది. అదే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అయితే ధాన్యం ఎండబెట్టి పూర్తిగా ఆరాకా ఎగరబోసి ఏ విధమైన తుక్కు లేకుండా చేసి అమ్మితేనే కొంటారు. అందుకే ధర లేక పోయినా ప్రైవేటు వ్యాపారులకే విక్రయిస్తున్నాం. – కరణం శ్రీను, రైతు కొనుగోలు కేంద్రాలఏర్పాటుకు చర్యలు జిల్లాలో ఇప్పుడిప్పుడే వరి కోతలు ప్రారంభించారు. పూర్తి స్థాయిలో కోతలు ప్రారంభమయ్యే లోపు అన్ని మండలాల్లోను కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నాము. ఆయా ప్రాంతాల్లో తొలుత కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు చేపట్టాం. ఇప్పటికే అన్ని రైతు సేవా కేంద్రాలలోను ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించాం. ఈ విషయం రైతులకు తెలియక ప్రైవేటు వ్యాపారులకు అమ్ముతున్నారు. రైతులకు తెలిసేలా ప్రచారం చేయడానికి చర్యలు తీసుకుంటాం. – స్వాతి, ఏడీఏ, పిఠాపురం వ్యవసాయ శాఖ జిల్లాలో వరి సాగు వివరాలు ఖరీఫ్ సాగు భూములు – 1,58,120 ఎకరాలు సాగు చేసిన రైతులు – 1.45 లక్షల మంది ఏటా ధాన్యం దిగుబడి – 5.70 లక్షల టన్నులు వారం రోజులుగా విక్రయించిన ధాన్యం – సుమారు 50 వేల టన్నులు ప్రతి రోజు – 1500 నుంచి 2000 టన్నుల ధాన్యం విక్రయం -
రత్నగిరి కిటకిట
అన్నవరం: కార్తికమాసం మూడో శనివారం సందర్భంగా సత్యదేవుని దర్శనానికి రికార్డు స్థాయిలో సుమారు 70 వేల మంది భక్తులు వచ్చినట్టు అధికారులు అంచనా వేశారు. వీరి రాకతో అన్నవరం మెయిన్ రోడ్డు, రైల్వేస్టేషన్ రోడ్లలో పలుమార్లు వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. కాగా స్వామివారి వ్రతాలు 7,900 జరగడంతో వ్రతమండపాలు, క్యూలైన్లు భక్తులతో నిండిపోయాయి. కాగా స్వామివారి ఆలయాన్ని శనివారం వేకువజామున ఒంటిగంటకు తెరిచి పూజల అనంతరం రెండు గంటల నుంచి భక్తులకు దర్శనాలు, వ్రతాలు ప్రారంభించారు. అంతరాలయం టికెట్ తీసుకున్నవారికి సైతం బయట నుంచే దర్శనాలు కల్పించారు. రూ.80 లక్షల ఆదాయం శనివారం భక్తుల ద్వారా దేవస్థానానికి రూ.80 లక్షల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. వ్రతాల ద్వారా సుమారు రూ.40 లక్షలు, ప్రసాదాల విక్రయాల ద్వారా రూ.30 లక్షలు, ఇతర విభాగాల ద్వారా రూ.పది లక్షలు వచ్చింది. దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్ ఏర్పాట్లు పర్యవేక్షించారు. ప్రొఫెసర్ వేధింపులపై ఆందోళన కంబాలచెరువు(రాజమహేంద్రవరం): రాజమహేంద్రవరం అల్లురామలింగయ్య ప్రభుత్వ హోమియో వైద్య కళాశాలలో ప్రొఫెసర్ల వేధింపులు అధికమయ్యాయి. వీటిని తట్టుకోలేని వైద్య విద్యార్థులు శనివారం రోడ్డెక్కారు. తాము కళాశాలలో జరిగే ప్రాక్టికల్స్‌కు హాజరుకాలేమని, వేధింపులకు గురిచేస్తున్న ప్రొఫెసర్లను తొలగించకపోతే తాము ఇక్కడ విద్యను అభ్యసించలేమని చెబుతున్నారు. ఇక్కడ పీజీ మొదటి సంవత్సరం చదువుతున్న గాయత్రి అనే విద్యార్థిని ప్రొఫెసర్ మంజుల వేధింపులకు తాళలేక ఆసుపత్రి పాలైంది. దీంతో ఆమె తల్లిదండ్రులు హోమియో కళాశాల వద్ద ఆందోళనకు దిగారు. తాను వేరే ప్రొఫెసర్ స్టూడెంట్‌ని కావడం వల్లే మంజుల తనను వేధిస్తున్నారని గాయత్రి తెలిపింది. భోజన సమయంలో పంపకపోవడం, సాయంత్రం 4 గంటలకు కళాశాల అయిపోయినా 5.30 వరకు పంపకపోవడం చేస్తున్నారని పేర్కొంది. ఇదిలావుండగా కళాశాల ప్రాంగణంలో అందరి మధ్య దూషిస్తూ, బెదిరించడంతో గాయత్రి మనస్తాపం చెంది రెండు రోజులుగా ఆహారం మానేసింది. దీంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. వెంటనే ఆమె స్నేహితులు గాయత్రిని ఆస్పత్రికి తరలించారు. విషయం తెలిసిన ఆమె తల్లిదండ్రులు ఆసుపత్రికి చేరుకున్నారు. ఆమె కోలుకున్న అనంతరం కళాశాల వద్దకు వచ్చి ఆందోళన చేశారు. తమకు న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటామని, వేధింపులకు గురిచేస్తున్న ప్రొఫెసర్ మంజులను తొలగించాలని డిమాండ్ చేశారు. తాను ఎవరినీ వేధించలేదని, గాయత్రిని క్లాస్ చూడమని చెబితే తాను వేరే క్లాస్‌కు వెళ్లిందని, ఈ విషయం మీద పేపర్‌పై రాసి ఇమ్మని అడిగానని మంజుల వివరించారు. కాగా ఈ ప్రొఫెసర్ గతంలోను పలు వివాదాలకు కారకురాలయ్యారని, కళాశాలలో వేరే ప్రొఫెసర్‌పై ఆమె పోలీసు కేసులు కూడా పెట్టారని చెప్తున్నారు. ఇద్దరు హెచ్‌వోడీల మధ్య వైరుధ్యాల నేపథ్యంలో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని కళాశాల వర్గాలు చెప్తున్నాయి. -
సేవే సత్యవ్రతమై..
● సత్యదేవుని సేవలో ఎందరో మమేకం ● భక్తుల సేవలో కొందరు.. వాహనాలు.. ● ఆలయ అవసరాలు తీరుస్తూ ఇంకొందరు అన్నవరం: దైవం మానుష రూపేణా అంటారు. ఆయన అనుమతి లేకుండా పరమాత్ముని దర్శించలేమని కూడా పెద్దలు అంటుంటారు. అందుకు మార్గాన్నీ.. ఆ ప్రయత్నంలో భక్తులు అలసి సొలసిపోకుండా, ఎటువంటి అవాంతరాలు తలెత్తకుండా అనుక్షణం విభిన్న రూపాలలో వారికి సాయపడుతూ తన దర్శనభాగ్యం కల్పిస్తున్నాడు. భక్తజన సేవే మాధవ సేవగా వారికి తోడునీడగా నడుస్తున్నవారెందరో.. కార్తికమాసంలో సత్యదేవుని సన్నిధికి వచ్చే లక్షలాది భక్తులకు ఎందరో స్వచ్ఛందంగా సేవ చేస్తున్నారు. మానవసేవే మాధవ సేవగా భావించి ప్రతిఫలాపేక్ష లేకుండా పని చేసుకుపోతున్నారు. ఆలయానికి నిత్యం వచ్చే భక్తులకే కాకుండా ఈ నెల రెండో తేదీన జరిగిన స్వామివారి తెప్పోత్సవం, ఐదో తేదీన జరిగిన గిరిప్రదక్షిణల విజయవంతం కావడంలో ఆలయ సిబ్బందితో పాటు వీరి సేవా ఎంతో కీలకంగా నిలిచాయి. భక్తుల సేవకు విద్యాసంస్థల బస్సులు : కార్తికమాసంలో భక్తులకు సేవలందించేందుకు పలు విద్యాసంస్థలు సైతం ముందుకు వచ్చి తమ వంతు సాయం చేస్తున్నా యి. భక్తుల రద్దీ అధికంగా ఉండే శని, ఆది, సోమవారాలలో, పర్వదినాలలో అన్నవరం రైల్వేస్టేషన్ నుంచి రత్నగిరికి, అక్కడి నుంచి సత్యగిరికి విద్యాసంస్థలు 15 బస్సులు అందించాయి. పాయకరావుపేటకు చెందిన శ్రీప్రకాష్ విద్యాసంస్థలు ఎనిమిది, తిరుమల విద్యాసంస్థలు నాలుగు, అరబిందో సంస్థ రెండు, కాకినాడకు చెందిన దాత వాసిరెడ్డి ఏసుదాసు ఒక బస్సు అందచేసినట్టు ఆలయ ఈఈ వి.రామకృష్ణ తెలిపారు. ఇదే కోవలో స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండు బస్సులు, రెండు బ్యాటరీ కార్లు విరాళంగా సమర్పించారు. అలాగే విశాఖపట్నానికి చెందిన లారస్ ఫార్మా కంపెనీ రూ.2.5 కోట్ల వ్యయంతో పశ్చిమ రాజగోపురానికి ఎదురుగా విశ్రాంతి షెడ్డు నిర్మించింది. ఇక సత్య దేవుని హుండీ లెక్కింపులో విశాఖకే చెందిన శ్రీహరి సేవ, శ్రీవారి సేవా సభ్యులు 400 మంది చాలా కాలంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. దీంతో హుండీ లెక్కింపు అత్యంత వేగంగా మధ్యాహ్నం ఒంటిగంటకే పూర్తయిపోతోంది. అలాగే గిరి ప్రదక్షణలో లక్షలాది మంది భక్తులకు తాగునీరు, పాలు, పళ్లు, ఫలహారాల పంపిణీలో దాతల సేవ ప్రశంసనీయం. ప్రత్యక్షంగా కనపడేవారు వీరైతే.. పరోక్షంగా దేవుని సేవలో నిమగ్నమైన మహానుభావులెందరో. మహిళా సేవకులే అధికం.. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో మహిళలు రత్నగిరిపై స్వచ్ఛంద సేవలు అందిస్తున్నారు. క్యూ లైన్లలో భక్తులకు తాగునీటి సరఫరా, సర్క్యులర్ మండపం వద్ద పులిహోర పంపిణీ, తులసి కొమ్మల నుంచి పత్రి వేరు చేయడం, వ్రతాలకు సామగ్రి సిద్ధం చేయడం, స్వామివారి ఆలయం, యంత్రాలయం, వ్రత మండపాలు, గోకులం, రావిచెట్టు తదితర చోట్ల భక్తులను నియంత్రించడం వంటి సేవలు చేస్తున్నారు. నాలుగు గంటలకు ఒక బ్యాచ్ చొప్పున నాలుగు షిప్టులలో వీరికి సేవలు కేటాయిస్తున్నారు. -
కాకినాడలో ‘పెళ్లి’ కారు బీభత్సం.. ముగ్గురు మృతి
సాక్షి, కాకినాడ: కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. బస్సు షెల్టర్‌లో వేచి ఉన్న ప్రయాణికుల పైకి అతి వేగంతో వచ్చిన పెళ్లి కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు.ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కిర్లంపూడి మండలం సోమవారం జాతీయ రహదారిపై ఓ కారు బీభత్సం సృష్టించింది. అన్నవరంలో పెళ్లి ముగించుకుని జగ్గంపేట తిరిగి వెళ్తుండగా కారు ఫ్రంట్ టైర్ పేలడంతో కారు అదుపు తప్పింది. ఈ క్రమంలో రోడ్డు పక్కన బస్సు షెల్టర్‌లో బస్సు కోసం వేచి ఉన్న ప్రయాణికులపైకి కారు దూసుకెళ్లింది. అనంతరం, బైక్, రిక్షాను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, గాయపడిన వారిని అంబులెన్స్‌లో స్థానిక ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులలో ఇద్దరు విద్యార్థులు ఉన్నట్టు తెలుస్తోంది. ఇది కూడా చదవండి: కృష్ణపట్నం పోర్టులో ‘ఎస్’ ట్యాక్స్.. ఇష్టారాజ్యంగా దోపిడీ.. -
సత్యదేవా.. చూడవయ్యా..
భార్యపై కత్తితో దాడి గోపాలపురం: భార్యపై అనుమానంతో ఓ వ్యక్తి కత్తితో దాడి చేశా డు. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఎస్సై పి.మనోహర్ తెలిపిన వివరాల ప్రకా రం గోపాలపురం మండలం దొండపూడికి చెందిన కాసాని సింధుజ, రామకృష్ణ భార్యభర్తలు. కాగా.. భార్యపై రామకృష్ణకు అనుమా నం కలిగింది. దీంతో గురువారం అర్ధరాత్రి మద్యం మత్తులో కత్తితో ఆమైపె దాడి చేశారు. ఈ ఘటనలో సింధుజ ముఖంపై తీవ్ర గాయమైంది. ఆమెను కుటుంబ సభ్యులు రాజమహేంద్రవరం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఈ మేరకు రామకృష్ణపై హత్యాయత్నం కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు. రేషన్ బియ్యం స్వాధీనం నల్లజర్ల: ఏలూరు నుంచి కాకినాడ పోర్టుకు అక్రమంగా రవాణా చేస్తున్న ఏడు టన్నుల రేషన్ బియ్యాన్ని శుక్రవారం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతపల్లి శివారు టోల్‌ప్లాజా వద్ద సివిల్ సప్లయిస్, విజిలెన్స్ అధికారులు సోదాలు నిర్వహిస్తుండగా రెండు మినీ వ్యాన్లలో రవాణా అవుతున్న ఈ బియ్యాన్ని గుర్తించారు. నిందితులపై 6ఏ, 7 కేసులు నమోదు చేసి, స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని గోపాలపురం సివిల్ సప్లయి గోదాముకు తరలించినట్టు సీఎస్ డీటీ సత్యనారాయణరావు తెలిపారు. ఈ దాడిలో విజిలెన్స్ సీఐ మధుబాబు సిబ్బంది పాల్గొన్నారు. ● అన్నవరంలో గిరి ప్రదక్షిణ విజయవంతం ● కానీ భక్తులకు కొన్ని ఇబ్బందులు ● వచ్చే ఏడాదికై నా పరిష్కరించాలని వినతి అన్నవరం: రత్నగిరి కొలువైన వీర వేంకట సత్యనారాయణస్వామిని దర్శించుకునేందుకు రాష్ట్రంతో పాటు దేశ నలుమూలల నుంచీ భక్తులు తరలివస్తారు. స్వామివారి వ్రతం ఆచరించి, సత్యదేవుని దర్శించుకుని, రావిచెట్టుకు పూజలు చేసి మొక్కులు చెల్లించుకుంటారు. ఇక పండగలు, ప్రత్యేకమైన రోజుల్లో భారీగా పోటెత్తుతారు. కార్తిక మాసాన్ని పురస్కరించుకుని ఈ నెల 5న జరిగిన గిరి ప్రదక్షిణకు సుమారు మూడు లక్షల మంది భక్తులు తరలివచ్చారు. ఆ రద్దీకి అనుగుణంగా ఆలయ అధికారులు, సిబ్బంది, పోలీసులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. అయితే గిరి ప్రదక్షిణలో మాత్రం భక్తులు కొన్ని ఇబ్బందులు పడ్డాయి. వాటి పరిష్కారం దిశగా ఆలయ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. సమన్వయంతో.. గిరి ప్రదక్షిణ విజయవంతం కావడంతో దేవదాయశాఖ ఉన్నతాధికారులు, అన్నవరం దేవస్థానం అధికారులు, పోలీసులు, భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల ఒకటో తేదీ, ఏకాదశి నాడు కాశీబుగ్గ వేంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగిన దుర్ఘటన నేపథ్యంలో అందరూ అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా దేవదాయశాఖ కమిషనర్ కె.రామచంద్ర మోహన్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. కాకినాడ డీసీ రమేష్ బాబు, లోవ, వాడపల్లి దేవస్థానాల ఈఓలు విశ్వనాథరాజు, చక్రధరరావులను ఏర్పాట్ల పర్యవేక్షణకు నియమించారు. రాజమహేంద్రవరం ఆర్జేసీ త్రినాథరావును గిరి ప్రదక్షిణ, కార్తిక పౌర్ణిమ ఏర్పాట్ల ప్రత్యేకాధికారిగా నియమించారు. అన్నవరం దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావును రత్నగిరిపై ఏర్పాట్లు చూడాలని, కొండ దిగువన దేవదాయశాఖ అధికారులు చూడాలని ఆదేశాలిచ్చారు. దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్ కార్తిక మాసం ప్రారంభం నుంచే ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. అందరి సమన్వయం, సహకారంతో గిరి ప్రదక్షిణ విజయవంతమైంది. సమస్యలు ఇవే.. ● గిరి ప్రదక్షిణ జరిగే పుష్కర కాలువ రోడ్డు దారుణంగా ఉంది. దీనిపై ఉన్న గులకరాళ్ల వల్ల భక్తులు చాలా ఇబ్బంది పడ్డారు. ఈ నేపథ్యంలో వచ్చే గిరి ప్రదక్షిణ సమయానికి ఇక్కడ బీటీ రోడ్డు లేదా సిమెంట్ రోడ్డు నిర్మించాలి. దేవస్థానం, అటవీశాఖ సంయుక్తంగా ఈ రోడ్డుకు ఇరువైపులా నీడనిచ్చే మొక్కలు పెంచాలి. ఆ పని ఇప్పుడే ప్రారంభిస్తే వచ్చే ఏడాదికి అవి పెరిగి గిరి ప్రదక్షిణ సమయంలో భక్తులకు నీడనిస్తాయి. ● గిరి ప్రదక్షిణ రోజు సుమారు పది కిలోమీటర్ల ట్రాఫిక్ నిలిచిపోయింది. అక్కడ ఆగిపోయిన వందల వాహనాల్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీనికి పరిష్కారం ఆలోచించాలి. ● గిరి ప్రదక్షిణ రోజు ఉదయం నుంచి రాత్రి వరకూ ఆర్టీసీ బస్సులను అన్నవరం గ్రామంలోకి అనుమతించడం లేదు. ఆటోలదీ అదే పరిస్థితి. దీని వల్ల ఆ రోజు సత్యదేవుని ఆలయానికి వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్సుల కోసం కనీసం రెండు కిలోమీటర్లు హైవే వరకూ నడిచి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ● ఇలాంటి సమయంలో జాతీయ రహదారిపై రాజమహేంద్రవరం వైపు వెళ్లే భక్తుల కోసం సత్యదేవుని నూతన నమూనా ఆలయం వద్ద, విశాఖపట్నం వైపు వెళ్లే భక్తుల కోసం మరో ఖాళీ ప్రదేశంలో బస్సులు ఆగేలా చూడాలి. అక్కడ వరకూ భక్తులను ఆటోలు, లేదా దేవస్థానం బస్సుల ద్వారా తరలించాలి. దీని కోసం అన్నవరం రైల్వేస్టేషన్ రోడ్డు నుంచి హైవే వరకూ గల జన్మభూమి రోడ్డును ఉపయోగించుకోవాలి. అవసరమైతే ఆ రోడ్డును ఇంకా విశాలం చేయాలి. ● వైశాఖ శుద్ధ ఏకాదశి రోజు జరిగే సత్యదేవుని కల్యాణం సమయంలో గ్రామంలో మద్యం షాపులను మూసేస్తారు. ఆ ఉత్సవాలు నిర్వహించే ఐదు రోజులూ రాత్రి వేళలో కూడా స్వామివారి ఊరేగింపు సమయాలలో ఆ షాపులను బంద్ చేస్తారు. కానీ మూడు లక్షల మంది భక్తులు వచ్చిన గిరి ప్రదక్షిణ రోజు మాత్రం ఈ షాపులు తెరిచి యఽథేచ్ఛగా మద్యం విక్రయాలు సాగించారు. బాలికను మోసగించిన యువకుడి అరెస్ట్ కొత్తపల్లి: బాలికను ప్రేమ పేరుతో మోసగించి, శారీరక సంబంధం పెట్టుకున్న యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసి, అరెస్టు చేసినట్టు పిఠాపురం సీఐ శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం స్థానిక పోలీస్ స్టేషన్లో విలేకరులకు వివరాలు వెల్లడించారు. వివరాల్లోకి వెళితే.. అమీనాబాద్ గ్రామానికి చెందిన బాలికతో అదే గ్రామానికి చెందిన కోడా అంజిబాబు గతేడాదిగా ప్రేమ వ్యవహారం నడుపుతున్నాడు. 2025 ఫిబ్రవరిలో ఆమె కుటుంబ సబ్యులు లేని సమయంలో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. బాలిక గర్భవతి కావడంతో అబార్షన్ మాత్రలు ఇచ్చి, గర్భాన్ని విచ్చిన్నం చేయించాడు. ఆ తర్వాత బాలికను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించాడు. దీనిపై బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, అంజిబాబును అరెస్టు చేశారు. సమావేశంలో ఎస్సై వెంకటేష్, సిబ్బంది పాల్గొన్నారు. బంగారు పతకాలు సాధించిన అక్కాచెల్లెళ్లు సామర్లకోట: వేట్లపాలెం జిల్లా పరిషత్ హైస్కూల్‌కు చెందిన దాసరి సుదీష్ట, దాసరి హరిక అనే అక్కా చెల్లెళ్లు రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీల్లో బంగారు పతకాలు సాధించారు. ఈ విషయాన్ని ఆ పాఠశాల పిజకల్ డైరెక్టర్ యార్లగడ్డ బంగార్రాజు శుక్రవారం స్థానిక విలేకర్లకు తెలిపారు. ఈ నెల 4 నుంచి 6వ తేదీ వరకూ కృష్ణా జిల్లాలో జరిగిన పోటీల్లో అండర్ – 14 విభాగం నుంచి సుదీష్ట, అండర్ 17 విభాగం నుంచి దాసరి హరిక బంగారు పతకం గెలుచుకున్నారు. దీంతో ఉత్తర్ ప్రదేశ్‌లో డిసెంబర్ 8 నుంచి 12 వరకు జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. కాగా.. అన్నాచెల్లెళ్లను ఎంపీపీ బొబ్బరాడ సత్తిబాబు, పాఠశాల హెచ్ఎం పి. అనురాధ, సర్పంచ్ చిల్లి వెంకటలక్ష్మీ, ఉపసర్పంచ్ గోలి శ్రీరామ్‌లు అభినందించారు.07పీటీపీ46,47: బంగారు పతకం సాధించిన హరిక, సుదీష్ట -
దేశభక్తిని పెంపొందించిన వందేమాతరం
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): వందేమాతరం గేయం భారతీయుల్లో దేశభక్తిని పెంపొందించిందని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు అన్నారు. ఆ గేయానికి 150 వసంతాలు పూర్తయిన సందర్భంగా శుక్రవా రం కాకినాడ జెడ్పీ కార్యాలయంలో కార్యక్రమం నిర్వహించారు. జెడ్పీ చైర్మన్ వి.వేణుగోపాలరావు, జెడ్పీ సీఈవో లక్ష్మణరావు, ఇతర సిబ్బంది వందేమాతరం గేయాన్ని ఆలపించారు. ఆ గేయ రచయిత బంకించంద్ర చటర్జీ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. -
స్క్వాష్ ఛాంపియన్షిప్ ప్రారంభం
బాలాజీచెరువు: అంతర జిల్లాల 69వ ఎస్జీఎఫ్ స్క్వాష్ చాంపియన్‌షిఫ్ 2025–26లో భాగంగా అండర్ 14, 17, 19 విభాగంలో బాల, బాలికలకు స్థానిక డీఎస్ఏ గ్రౌండ్స్‌లో శుక్రవారం పోటీలు మొదలయ్యాయి. ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ.. జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఈ ఇండోర్ గేమ్ గుండె ఆరోగ్యాన్ని బలోపేతం చేస్తుందని, శక్తి సమన్వయాన్ని పెంపొందిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో డీఎస్డీవో సతీష్ కుమార్, స్వ్కాష్ కోచ్ లక్ష్మణ్, జుడో కోచ్ తేజ, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ మెహబూబ్ బాషా, ఎస్జీఎఫ్ సెక్రటరీ సుధారాణి, కె.శ్రీనివాస్, హాకీ కోచ్ రవిరాజ్, వివిధ జిల్లాల పీడీలు పాల్గొన్నారు. బెలూన్లు ఎగురవేసి పోటీలను ప్రారంభిస్తున్న అతిథులు -
వైద్యుడు అందుబాటులో లేక వ్యక్తి మృతి!
సామర్లకోట: స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంలో చికిత్సకు వచ్చిన వ్యక్తి మృతి చెందాడు. డ్యూటీలో ఉండాల్సిన డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో ఈ ఘోరం జరిగిందనే ఆరోపిస్తున్నారు. స్థానికులు, మున్సిపల్ వైస్ చైర్మన్ ఉబా జాన్ మోజెస్ తెలిపిన వివరాల ప్రకారం.. ఉప్పువారి వీధికి చెందిన మలిరెడ్డి భూలోకం (56) గ్యాస్ నెప్పితో శుక్రవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో సామాజిక ఆరోగ్య కేంద్రానికి వచ్చాడు. ఆ సమయంలో డ్యూటీలో ఉండాల్సిన డాక్టర్ లేరు. దీంతో ట్రైనీ డాక్టర్ ఆ రోగి పరిస్థితిని డాక్టర్‌కు వాట్సాప్‌లో తెలియజేశారు. కానీ వైద్యం అందే లోపు భూలోకం మృతి చెందాడు. కాగా.. డాక్టర్ నిర్లక్ష్యం కారణంగానే భూలోకం మృతి చెందారని మోజెస్ అన్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేస్తున్న డాక్టర్.. ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యం చేయడం జరుగుతోందని ఆరోపించారు. విషయం తెలుసుకొని సీఐ ఎ. కృష్ణభగవాన్ ఆధ్వర్యంలో ఎస్సై మూర్తి ఆస్పత్రికి వచ్చి వివరాలు సేకరించారు. మృతుని కుటుంబ సభ్యుడు, వైస్ చైర్మన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వ్యక్తి పీక కోసి పరారీ కొత్తపల్లి: పొన్నాడ శివారు కోనపాపపేటకు చెందిన సోదే జాన్ గురువారం రాత్రి స్ధానిక ఎన్ఎస్ఆర్ హేచరీకి సమీపంలోని తీరంలో ఉన్న రేకుల షెడ్డులో బల్లపై నిద్రిస్తున్నాడు. సుమారు 10.30 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తి వచ్చి జాన్ పీక కోసి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన అతడిని బంధువులు పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి నుంచి వచ్చిన సమాచారం మేరకు ఎస్సై వెంకటేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. గంజాయి తరలిస్తున్న ముగ్గురి అరెస్ట్ గండేపల్లి: గంజాయి తరలిస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేసి, వారి నుంచి రూ. 3,73,500 విలువైన కారు, మూడు సెల్ ఫోన్లు, 2 వేల నగదు స్వాధీనం చేసుకున్నామని జగ్గంపేట సీఐ వైఆర్కే శ్రీనివాస్ తెలిపారు. వివరాల్లోకి వెళితే.. విజయనగరం జిల్లాకు చెందిన తాకు నరసింహసింగ్, పున్నాన తేజ, మహిందర్ సింగ్‌లు 21.7 కేజీల గంజాయిని 11 ప్యాకెట్లలో ప్యాక్ చేసి కారులో తరలిస్తున్నారు. గండేపల్లి మండలం ఎన్టీ రాజాపురం రోడ్డులో శుక్రవారం వాహనాలను తనిఖీ చేస్తున్న ఎస్సై యూవీ శివ నాగబాబు, సిబ్బంది వీరిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పెద్దాపురం కోర్టుకు తరలించగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు. కాగా.. నరసింహసింగ్పై 4, తేజ పై 8, మహిందర్ సింగ్‌పై 3 దొంగతనం కేసులు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. అలాగే మరో 13 మందికి దీనిలో ప్రమేయం ఉందని, వారిపై తొందరలోనే చర్యలు తీసుకుంటామన్నారు. 07పీటీపీ57: సామాజిక ఆరోగ్య కేంద్రంలో మృతి చెందిన భూలోకం -
సత్యదేవుని హుండీ ఆదాయం రూ.1.73 కోట్లు
అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని వీర వేంకట సత్యనారాయణస్వామికి హుండీల ద్వారా రూ.1.73 కోట్లు సమకూరింది. దేవస్థానంలో హుండీలను శుక్రవారం ఉదయం ఎనిమిది గంటలకు తెరిచి ఆదాయాన్ని లెక్కించగా మధ్యాహ్నం 12 గంటలకు పూర్తయ్యింది. దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వీర్ల సుబ్బారావు, ఇతర సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గత 30 రోజులకు ఈ ఆదాయం సమకూరినట్టు ఆలయ అధికారులు తెలిపారు. హుండీల ఆదాయంలో 1,62,76,244 నగదు, 10,61,567 చిల్లర నాణేలతో పాటు 37 గ్రాముల బంగారం, 800 గ్రాముల వెండి, 41 అమెరికా డాలర్లు, పది ఇంగ్లాండ్ పౌండ్లు, రెండు సింగపూర్ డాలర్లు, ఐదు సౌదీ సెంట్రల్ బ్యాంక్ రియల్స్, 25 బూటాన్ కరెన్సీ, రెండు వేల కాంగోలీస్ ప్రాంక్, రెండు మలేషియా రింగిట్స్ రెండు, 20 స్కాట్లాండ్ పౌండ్లు, ఒక కువైట్ దీనార్ ఉన్నాయి. ప్రతి ఏడాదీ కార్తిక మాసంలో తొలి విడతగా పౌర్ణమి తర్వాత, రెండో విడతగా కార్తికమాసం ముగిశాక హుండీల ఆదాయం లెక్కించడం ఆనవాయితీ. ఆ ప్రకారమే తొలివిడతగా స్వామివారి హుండీల ఆదాయాన్ని లెక్కించారు. గత 30 రోజుల్లో రోజుకు సరాసరి 5,77,927 చొప్పున సమకూరింది. మోంథా తుపాన్ కారణంగా గత నెల 27 నుంచి 31 వరకూ ఐదు రోజుల పాటు సత్యదేవుని ఆలయానికి భక్తులు రాలేదు. దీంతో ఆదాయం తగ్గినట్టు అధికారులు భావిస్తున్నారు. సత్యదేవుని దర్శించిన 40 వేల మంది రత్నగిరి కొలువైన సత్యదేవున్ని సుమారు 40 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన వారితో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆలయం ప్రాంగణం కిటకిటలాడింది. సత్యదేవుని వ్రతాలు 2,500 నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం వచ్చినట్టు అధికారులు తెలిపారు. స్వామి వారి ఆలయాన్ని తెల్లవారుజాము మూడు గంటలకు తెరిచి పూజలు చేశారు. వ్రతాలు కూడా ఆ సమయం నుంచే ప్రారంభించారు. స్వామివారిని దర్శించిన భక్తులు సప్త గోకులంలో గోవులకు ప్రదక్షిణ చేశారు. తూర్పురాజగోపురం ఎదురుగా గల రావిచెట్టు వద్ద జ్యోతులు వెలిగించి పూజలు చేశారు. నేటి నుంచి మూడు రోజులు రద్దీ అన్నవరం దేవస్థానానికి శని, ఆది, సోమవారాల్లో (8, 9, 10 తేదీలు) భక్తులు పెద్దసంఖ్యలో వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ మూడు రోజులూ అర్ధరాత్రి దాటక ఒంటి గంట నుంచే సత్యదేవుని వ్రతాలు ప్రారంభిస్తారు. రెండు గంటల నుంచి స్వామివారి దర్శనానికి భక్తులను అనుమతించనున్నారు. ఈ మూడు రోజులు వసతి గదులను భక్తులందరికీ ఇవ్వలేమని, గమనించాలని ఈఓ వీర్ల సుబ్బారావు కోరారు. -
సా..గుతున్న రహదారి విస్తరణ
కాకినాడ రూరల్: కాకినాడలోని పోర్టులకు మెరుగైన రవాణా సదుపాయానికి ఆజాదీ కా అమృత్ మాసోత్సవ్లో భాగంగా గతిశక్తి పథకం కింద కేంద్ర ప్రభుత్వం చొరవతో నాడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంగా రాష్ట్ర ప్రభుత్వం రహదారి విస్తరణ పనులను చేపట్టింది. ఏడీబీ రోడ్లు రాక్ సిరామిక్ నుంచి యాంకరేజ్ పోర్టు వరకు రూ.557 కోట్లతో రెండు ప్యాకేజీల్లో ఈ పనులను 2023లో ప్రారంభించింది. రాక్ సిరామిక్ నుంచి అచ్చంపేట జంక్షన్ వద్ద గోకుల్ గార్డెన్ వరకు 12.2 కిలోమీటర్ల మేర రూ.408 కోట్లతో ఒక ప్యాకేజీ, గోకుల్ గార్డెన్ నుంచి లైట్ హౌస్ మీదుగా యాంకరేజ్‌పోర్టు వరకు రూ.149 కోట్లతో మరో ప్యాకేజీగా పనులు ప్రారంభించారు. మొదటి ప్యాకేజీలో ఏడీబీ రోడ్డులో రాక్ సిరామిక్ నుంచి సామర్లకోటకు బైపాస్ మార్గంగా కెనాల్ రోడ్డు మీదుగా భీమేశ్వరస్వామి ఆలయం వెనక నుంచి ముత్యాలమ్మ గుడి పక్క నుంచి నాలుగు లైన్ల రోడ్లు నిర్మాణం పనులు చాలా వరకు పూర్తయ్యాయి. ఇందులో రాక్ సిరామిక్ నుంచి ద్వారపూడి కెనాల్ రోడ్డు వరకు 3.6 కిలో మీటర్లు (రెండు లైన్లు), ముత్యాలమ్మ గుడి నుంచి రైల్వే ట్రాక్ మీదుగా కిలో మీటరు మేర ప్లైఓవర్ నిర్మాణం చేపట్టారు. అలాగే అచ్చంపేట జంక్షన్ వద్ద కాకినాడ – పిఠాపురం ప్రధాన రహదారికి అండర్ పాస్ వంతెన నిర్మాణ పనులు చేపడుతున్నారు. మరో ప్యాకేజీగా రాపాక గార్డెన్ వరకు యాంకరేజ్ పోర్టు వరకు గత ప్రభుత్వంలోనే పనులు వేగంగా సాగాయి. తరువాత ఏమైందో ఏమో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మొత్తానికి పనులు నిలిచిపోయాయి. నాలుగు లైన్ల రహదారి విస్తరణ పనులు మధ్యలో నిలిచిపోవడంతో పాముగుంట, ఓఎన్సీ కార్యాలయం, సూర్యారావుపేట వద్ద దుమ్ము దూళితో స్థానికులు, ప్రయాణికులు నరకం చూస్తున్నారు. అదానీ ఆయిల్ రిఫైనరీ, కోరమాండల్ జంక్షన్ వద్ద పోర్టు రోడ్డులో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. సీ పోర్టు వద్ద రహదారి పూర్తిగా ధ్వంసమవ్వడంతో ఈ మార్గంలో రాకపోకలు సాగించేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల మోంథా తుఫాన్ ప్రభావంతో వర్షాలకు రోడ్డుపై నీరు నిలిచిపోయి పెద్ద గతుకుల్లో ద్విచక్ర వాహనచోదకులు రాకపోకలు సాగించేందుకు నరకం చూశారు. కుంభాభిషేకం వద్ద సముద్రం నుంచి బ్యాక్ వాటర్ వచ్చే కాల్వపై వంతెన ద్వారా ఈ మార్గం ఉండడంతో ఆ వంతెన స్థానే కొత్తగా నాలుగు లైన్ల రోడ్డుకు అనుగుణంగా వంతెన నిర్మాణానికి ప్రతిపాదనలు చేశారు. రోడ్డు విస్తరణ పనులు మధ్యలో నిలిచిపోవడంతో ఆ ప్రభావం వంతెనపై పడింది. ఇటీవల మోంధా తుఫాన్‌కు బోటును రక్షించుకునే ప్రయత్నంలో దుమ్ములపేటకు చెందిన గద్దేపల్లి సాయిరామ్ అనే మత్స్యకార యువకుడు మృతి చెందడంతో ఆగ్రహించిన మత్స్యకారులు కొత్త వంతెన నిర్మాణం జరిగి ఉంటే బోట్లు కాల్వలోకి వెళ్లేవి కావని అప్పుడు ప్రమాదం జరిగేది కాదని ఇటీవల కుంభాభిషేకం వద్ద ధర్నా చేసిన సంగతి తెలిసిందే. తక్షణమే రహదారి విస్తరణ పనులతో పాటు వంతెన నిర్మాణం పనులు చేపట్టాలని జిల్లా వాసులు కోరుకుంటున్నారు. రూ.149 కోట్ల ప్యాకేజీ పనులకు చర్యలు ఏడీబీ రోడ్డు విస్తరణలో భాగంగా రాక్ సిరామిక్ పరిశ్రమ నుంచి యాంకరేజ్ పోర్టు వరకు నాలుగు లైన్ల రహదారి విస్తరణ పనులు కాంట్రాక్టర్ భాగస్వాముల మధ్య సమన్వయ లోపంతో జాప్యమయ్యాయి. ఇటీవల చర్చలు జరిపాం. పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకున్నాం. – బి.కృష్ణమూర్తి, పీడీ, నేషనల్ హైవేస్, రాజమండ్రి నాడు జగన్ హయాంలో పనులకు బీజం కూటమి ప్రభుత్వంలో మంద గమనం రాక్ సిరామిక్ నుంచి యాంకరేజ్ పోర్టు వరకు రెండు ప్యాకేజిల్లో పనులు అవస్థలు పడుతున్న ప్రయాణికులు -
ముందస్తు పరీక్షలతో క్యాన్సర్ నివారణ
కరప: ఆరోగ్య నియమాలు పాటిస్తూ ముందస్తు పరీక్షలు చేయించుకుని వైద్యుల సలహాలు అనుసరిస్తే క్యాన్సర్ నివారించవచ్చని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ జె.నరసింహనాయక్ పేర్కొన్నారు. జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం సందర్భంగా శుక్రవారం మండలం నడకుదురు ఆరోగ్య ఉపకేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వైద్య సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశావర్కర్లు గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి ప్రజల్లో క్యాన్సర్‌పై ఉన్న అపోహలు తొలగించాలన్నారు. క్యాన్సర్ నివారణకు నిర్వహిస్తున్న ముందస్తు పరీక్షలపై ప్రతి ఒక్కరినీ చైతన్యపరచాలన్నారు. ముందుగానే స్క్రీనింగ్ చేయించుకుని, తదుపరి జరిపే చిన్నపరీక్ష ద్వారా క్యాన్సర్ నిర్ధారించి, నివారణకు మందులు ఇవ్వడం జరుగుతుందని డీఎంహెచ్ఓ వివరించారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశావర్కర్లతో నిర్వహించిన జాతీయ క్యాన్సర్ అవగాహన ర్యాలీలో ఆయన పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు. తర్వాత ఫ్రైడే డ్రైడేలో ఆయన పాల్గొని పంచాయతీ సిబ్బంది నిర్వహిస్తున్న పారిశుధ్య కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ కేవీ సుబ్బరాజు, జిల్లా మలేరియా అధికారి డాక్టర్ ఐ.ప్రభాకర్, జిల్లా ఎన్సీడీ నోడల్ అధికారి డాక్టర్ వి.అరుణ, కరప పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ వి.ఏంజలిన్ తదితర సిబ్బంది పాల్గొన్నారు. ‘శివసదన్’కు రూ.10 లక్షల విరాళం అన్నవరం: రత్నగిరిపై సత్రం డోనార్ స్కీం కింద శివసదన్ సత్రంలో ఒక గదికి కాకినాడకు చెందిన ములకల సుబ్బారావు, కనకదుర్గ దంపతులు రూ.పది లక్షలు విరాళంగా సమర్పించారు. ఆ మేరకు చెక్కును శుక్రవారం దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావుకు అందచేశారు. దాత దంపతుల అభీష్టం మేరకు ఈ పథకం కింద ఆ సత్రంలో గదిని కేటాయించడంతో బాటు పలు ప్రయోజనాలు, ఆలయంలో గౌరవ మర్యాదలు లభించేలా చర్యలు తీసుకుంటామని ఈఓ తెలిపారు. 10 నుంచి సమ్మెటివ్ పరీక్షలుకంబాలచెరువు: అన్ని యాజమాన్య పాఠశాలలకు ఈ నెల పదో తేదీ నుంచి సమ్మెటివ్ 1 పరీక్షలు నిర్వహిస్తున్నామని అర్బన్ రేంజ్ డీఐ బి.దిలీప్‌కుమార్ శుక్రవారం తెలిపారు. మండల కేంద్రానికి చేరిన ప్రశ్న పత్రాల బండిళ్లను ప్రధా నోపాధ్యాయులు సరిచూసుకున్న పిదప బాక్సులలో భద్రపరిచామని ఆయన తెలిపారు. పరీక్షకు గంట ముందు ప్రధానోపాధ్యాయులకు మాత్రమే ప్రశ్న పత్రాల బండిళ్లను అందచేస్తామని ఆయన అన్నారు. కార్యక్రమంలో ఎస్‌కేవీటీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల స్కూల్ కాంప్లెక్స్ చైర్మన్ ఎంవీఎం సుబ్రహ్మణ్యం, సీఆర్ఎంటీలు జయంతి శాస్త్రి, జె.శ్రీనివాసరావు, పబ్బినీడి ప్రసాద్, కుమారి, ఇందిర, నాగలక్ష్మి, కోటేశ్వరి, అర్బన్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. -
స్వాతంత్య్ర స్ఫూర్తి వందేమాతరం
జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి పిఠాపురం: వందేమాతరం గేయం భారతీయుల్లో స్వాతంత్య్ర కాంక్షను రగిలించిందని, ఈ గేయం స్ఫూర్తితో ఎందరో మహనీయులు స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొన్నారని కలెక్టర్ షణ్మోహన్ పేర్కొన్నారు. వందేమాతరం గేయం నేటితో 150 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుక్రవారం పిఠాపురం ఆర్ఆర్బీహెచ్ఆర్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ప్రజాప్రతినిధులతో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్వాతంత్య్ర సమరయోధుల చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించారు. అనంతరం విద్యార్థులతో కలిసి ఆయన వందేమాతరం గేయాన్ని ఆలపించారు. అనంతరం అంతర్జాతీయ బాలల హక్కుల వారోత్సవాల్లో భాగంగా బేటీ బచావో – బేటీ పడావో కార్యక్రమం కింద జిల్లా సీ్త్ర, సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాలలకు ఒక్కరోజు క్షేత్రస్థాయి అవగాహన కార్యక్రమానికి సంబంధించిన బస్సును జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ 1875 సంవత్సరం నవంబర్ 7న బెంగాలీ కవి బంకించంద్ర ఛటర్జీ ఆనందమఠ్ అనే నవల నుంచి ఈ వందేమాతరం గేయాన్ని రచించడం జరిగిందన్నారు. అనతి కాలంలోనే ఈ గేయం భారతీయుల్లో స్వాతంత్య్ర స్ఫూర్తిని రగిలించిందన్నారు. నేటి యువత ఈ గీతాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి, పిఠాపురం మాజీ ఎమ్మెల్యేలు ఎస్వీఎస్ఎన్ వర్మ, పెండెం దొరబాబు, కాకినాడ ఆర్డీవో ఎస్ మల్లి బాబు, పాడా ఏపీడీ వసంత మాధవి, జిల్లా బాలల పరిరక్షణ విభాగం కౌన్సిలర్ బి.దుర్గారాణి, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
పదికి పదునైన ప్రణాళిక
● వంద శాతం ఫలితాలే లక్ష్యం ● వంద రోజుల కార్యాచరణకు సన్నద్ధం ● జిల్లా ర్యాంకు పెంచేందుకు డిసెంబర్ ఒకటి నుంచి అమలు ● ఇప్పటికే 85 శాతం సిలబస్ పూర్తి బాలాజీచెరువు (కాకినాడ సిటీ): పదో తరగతి ఫలితాల్లో జిల్లా ర్యాంకు ఏ యేటికాయేడు దిగజారిపోతోంది. ఉమ్మడి జిల్లాలో ఒకప్పుడు రెండు, మూడు స్థానాల్లో ఉండే ర్యాంకు రాను రాను పడిపోతోంది. గత ఏడాది 15 ర్యాంక్‌లోకి జారిపోయింది. ఈ సారి ఉత్తమ ఫలితాలు సాధించాలన్న లక్ష్యంతో జిల్లా విద్యాశాఖాధికారి నూతన కార్య క్రమానికి రూపకల్పన చేశారు. ఉత్తీర్ణత శాతం పెంచేందుకు వంద రోజుల ప్రణాళిక రూపొందించారు. దీనిని పక్కాగా అమలు చేయాలని ఎంఈఓలు, డీవైఈఓలకు ఆదేశాలు జారీ చేశారు. పదో తరగతి ఫలితాల్లో మెరుగైన ర్యాంకు సాధించేందుకు ఈ పదునైన ప్రణాళిక ఉపయోగపడాలన్న ఉద్దేశంతో ముందుకు సాగుతున్నారు. ఉత్తమ ఫలితాలకు పది సూత్రాలు.. ● జిల్లా వ్యాప్తంగా ఏటా ఉత్తీర్ణత శాతం తక్కువగా ఉన్న పాఠశాలల్లో బోధనను విద్యాశాఖాధికారులు నిత్యం పర్యవేక్షించాలి. ప్రతిరోజూ పాఠశాలలను సందర్శించాలి. ● ఆ సమయంలో విద్యార్థులతో ఆప్యాయంగా మాట్లాడి, వారి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి. పాఠ్యాంశాలు బోధించే ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులతో మాట్లాడి, బోధన తీరు మెరుగుపరిచేందుకు కృషి చేయాలి. ● క్లిష్టమైన పాఠ్యాంశాలైన గణితం, ఆంగ్లం, సైన్స్ బోధన ఎలా సాగుతోందో పక్కాగా పరిశీలించాలి. ● ఆయా పాఠ్యాంశాలు బోధించే ఉపాధ్యాయులు సబ్జెక్టుల వారీగా పరీక్షల్లో తప్పకుండా వస్తాయని భావించే ప్రశ్నలను విద్యార్థులకు బోధించాలి. ● పరీక్షల్లో తప్పకుండా ఇస్తారు అని భావించే ప్రశ్న లను విద్యార్థులు సులువుగా అర్ధం చేసుకుని రాసేలా మెరుగైన శిక్షణ ఇవ్వాలి. ● చదువులో వెనుబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపి, వారు ప్రతి సబ్జెకులోనూ ఉత్తీర్ణులయ్యేలా తీర్చిదిద్దాలి. ● పరీక్షల్లో తప్పక వస్తాయని భావించే ప్రశ్నలను ప్రతిరోజూ విద్యార్థులతో చూడకుండా రాయించాలి. వారికి హోమ్‌వర్క్ కూడా ఇవ్వాలి. ● ఉపాధ్యాయులు ప్రతివారం విద్యార్థుల సామర్థ్యానికి సంబంధించిన నివేదికను రూపొందించి వారికి ఇవ్వాలి. బాగా వెనుబడిన విద్యార్థులను దత్తత తీసుకుని వారికి శిక్షణ ఇవ్వాలి. ● పాఠశాల హెచ్ఎం ప్రతివారం విద్యార్థులు ఎన్ని మార్కులు సాధిస్తారనే అంశంపై నివేదిక రూపొందించి, ఉపాధ్యాయులకు దిశా నిర్దేశం చేయాలి. ● విద్యార్థులకు బొమ్మలు గీయడం, మ్యాప్ పాయింటింగ్, గ్రాఫ్ తదితర అంశాల్లో ప్రత్యేక శిక్షణ ఇచ్చి, వారిని పరీక్షలకు సమాయత్తం చేయాలి. మార్చి 16 నుంచి పది పరీక్షలు 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి జిల్లా విద్యాశాఖాధికారి ప్రత్యేక దృష్టి సారించారు. వచ్చే ఏడాది మార్చి 16వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు జరగనున్న నేపథ్యంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను ఉపాధ్యాయులు అందుకు తగిన విధంగా అప్రమత్తం చేయాలని సూచించారు. ఇందులో భాగంగా జిల్లాలోని ప్రతి ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు నవంబర్ లోపు పూర్తి సిలబస్ పూర్తి చేయాలని డీఈఓ ఆదేశించారు. అలాగే పది పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు మూడు నెలలుగా ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు తెలుస్తోంది. వంద శాతం ఉత్తీర్ణతే లక్ష్యం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న పదో తరగతి విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా డిసెంబర్ ఒకటో తేదీ నుంచి వంద రోజుల కార్యాచరణ ప్రణాళికను అమలు చేయనున్నట్లు డీఈఓ పిల్లి రమేష్ తెలిపారు. ఇందులో ప్రధానంగా విద్యార్థులకు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఆయన ఆదేశిం చారు. ప్రతి విద్యార్థినీ సంబంధిత ఉపాధ్యాయులు దత్తత తీసుకుని, వారి అభ్యసన స్థాయిని నిరంతరం పరిశీలించాలని తెలిపారు. ఏదైనా పాఠ్యాంశంలో వెనకబడి ఉన్న విద్యార్థులకు ప్రత్యేక తరగతులు, పునశ్చరణ తరగతులు నిర్వహించాలని ఆదేశించారు. ప్రతిరోజు ఒక పాఠ్యాంశం చొప్పున రివిజన్ చేయాలని, ప్రతి విద్యార్థి తప్ప నిసరిగా ఉత్తీర్ణత సాధించేలా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ ఏడాది 29,866 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారని ఆయన తెలిపారు. పర్యవేక్షణ.. పాఠశాలల సందర్శన.. మండల, జిల్లాస్థాయి విద్యాశాఖాధికారులు నిత్యం పాఠశాలలను సందర్శించి, బోధన విధానం, విద్యార్థుల అభ్యసన స్థాయిపై సూచనలు జారీ చేస్తున్నారు. పాఠశాలలో సిలబస్ పూర్తి చేయని ఉపాధ్యాయులు పక్కాగా ఈ నెలలో సిలబస్ పూర్తి చేసి తీరాల్సి ఉంది. స్లో లెర్నర్స్ కోసం ఇప్పటికే స్టడీ మెటీరియల్ ప్రతి పాఠశాలకు అందించారు. ప్రథమ స్థానంలో నిలిపేందుకు.. డిసెంబర్ ఒకటో తేదీ నుంచి జిల్లాలో వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలులోకి రానుంది. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులను పబ్లిక్ పరీక్షలకు సన్నద్ధం చేయడానికి అన్ని చర్యలు తీసుకోనున్నాం. చదువులో కాస్త వెనుకబడిన విద్యార్థులను సైతం ఈ ప్రణాళికతో ఉత్తీర్ణత దిశగా సన్నద్ధం చేస్తాం. వచ్చే ఏడాది పది ఫలితాల్లో కాకినాడ జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపేందుకు ప్రయత్నిస్తున్నాం. – పిల్లి రమేష్, డీఈఓ, కాకినాడ జిల్లా జిల్లాలో పది ఫలితాల వివరాలు సంవత్సరం విద్యార్థుల ఉత్తీర్ణులు ఉత్తీర్ణత హాజరు శాతం 2021–22 66,175 46,579 65.83 2022–23 27,358 18,608 68.02 2023–24 27,671 22,993 83.09 2024–25 27368 22,508 82.24 -
శనివారం శ్రీ 8 శ్రీ నవంబర్ శ్రీ 2025
కత్తిపోట్లు.. పక్కలో బల్లేలు!● మూలపేటలో అలరించిన కళారూపాలు ● ఉత్సాహంగా గౌరీదేవి మహోత్సవాలు మండలంలో మూలపేటలో గౌరీదేవి మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం నిర్వహించిన కత్తిపోటు వేషాలు స్థానికులను అమితంగా ఆకట్టుకున్నాయి. ప్రాచీనకళ అయిన ఈ కత్తిపోటు వేషాలను మూలపేట వాసులు పూర్వం నుంచి ప్రదర్శిస్తున్నారు. కార్తిక మాసంలో గౌరీదేవిని తాము ఆడపడుచుగా భావించి గ్రామంలో నిలిపి ప్రత్యేక పూజలు చేస్తామని ఉత్సవ నిర్వహకులు తెలిపారు. ఈ సందర్భంగా కత్తిపోటు వేషాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఈ వేషాలు వేసి మూడేళ్లు అయ్యిందని, మళ్లీ ఈ ఏడాది ప్రదర్శిస్తున్నట్టు వారు తెలిపారు. ఇందులో గునపం పోటు, రంపపు కోత, బల్లెం పోటు, గొడ్డలి నరుకు, జబ్బ నరుకు, మహిషాసురమర్దిని, నరకాసుర వధ వంటి అంశాలను ప్రదర్శించారు. కత్తిపోటు వేషాల సందర్భంగా వివిధ గ్రామాల నుంచి వచ్చిన భక్తులతో మూలపేట గ్రామం కిక్కిరిసిపోయింది. ఈ కార్యక్రమాన్ని పట్టుశాలీ సంఘం సభ్యులు పర్యవేక్షణలో నిర్వహించారు. – కొత్తపల్లిబల్లెంపోటు జబ్బ నరుకు పక్కలో బల్లెంత్రిశూలంతో పొడిచి దుష్ట సంహారం చేస్తున్న వినాయకుడు మహిషాసురుని మర్దిస్తున్న జగన్మాత కత్తిపోటు వేషాలను చూసేందుకు వచ్చిన భక్తులు -
గొల్లపల్లిని ఫోన్లో పరామర్శించిన వైఎస్ జగన్
సాక్షి, కోనసీమ జిల్లా: అస్వస్థతకు గురైన వైఎస్సార్సీపీ రాజోలు కో ఆర్డినేటర్, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావును ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫోన్లో పరామర్శించారు. గొల్లపల్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. గొల్లపల్లి కుమారుడు శ్రీధర్‌కు ధైర్యం చెప్పారు.గొల్లపల్లి సూర్యారావు (నవంబర్ 5, బుధవారం) గుండెపోటుకు గురయ్యారు. ఆయనను వెంటనే అమలాపురం కిమ్స్ హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందించారు. రాజోలు మండలం శివకోడులో గురువారం జరిగే రచ్చబండ కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించడానికి ఆయన బుధవారం వెళ్లారు. పార్టీ నాయకుడు ఇంటిలో మెట్లు ఎక్కి వెళుతుండగా అకస్మాత్తుగా గుండె నొప్పి వచ్చింది. వెంటనే పార్టీ నాయకులు స్థానిక ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించారు.ఈసీజీలో తేడా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం అమలాపురం కిమ్స్ హాస్పిటల్లో చేర్పించారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ అమలాపురం కో ఆర్డినేటర్ డాక్టర్ శ్రీకాంత్.. కిమ్స్ వైద్యులతో మాట్లాడారు. కిమ్స్ గుండె వైద్యుడు అభిషేక్ వర్మ ఆధ్వర్యంలో వైద్య నిపుణుల బృందం గొల్లపల్లి గుండెలోని క్లాట్స్ తొలగించి రెండు స్టంట్లు వేశారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. సూర్యారావు ఆరోగ్యం మెరుగ్గా ఉందని, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చెందవద్దని డాక్టర్ శ్రీకాంత్ సూచించారు. కిమ్స్ చైర్మన్ కేవీవీ సత్యనారాయణరాజు (చైతన్యరాజు) పర్యవేక్షణలో సూర్యారావుకు వైద్యులు సేవలు అందిస్తున్నారు. -
‘స్ధానిక స్వపరిపాలనకు మార్గదర్శి వైఎస్ జగన్ ’
కాకినాడ: ‘విజన్ యూనిట్’ అంటూ సచివాలయాల పేరును మార్చాలనుకుంటున్న కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ నేత కురసాల కన్నబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పేరు మార్చవచ్చేమో కానీ వ్యవస్థను సృష్టించిన వాళ్లను మార్చలేరంటూ ధ్వజమెత్తారు. స్ధానిక స్వపరిపాలన,ప్రజల వద్దకే పాలన కలకు నిజమైన రూపం ఇచ్చింది మాజీ సిఎం వైఎస్ జగన్ అని, స్ధానిక స్వపరిపాలనకు వైఎస్ జగన్ మార్గదర్శి అని స్పష్టం చేశారు కురసాల.ఈరోజు(శుక్రవారం, నవంబర్ 7వ తేదీ) కాకినాడ నుంచి మాట్లాడిన కురసాల.. ‘తుపాన్ భాధితుల కోసం ప్రభుత్వం ఆలోచిస్తుందని ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఐతే కొన్ని పేపర్లు చూస్తే డేటా ఆధారిత సెంటర్లు అని రాసి ఉన్నాయి. తుపాను తర్వాత చంద్రబాబు లండన్ వెళ్లిపోతే.. మంత్రి లోకేష్ క్రికెట్ మ్యాచ్ చూడటానికి ముంబై వెళ్లిపోయాడన్నారు. లండన్ బాబు వచ్చి డేటా ఆధారిత పరిపాలన కోసం మాట్లాడుతున్నారు. తుపాన్ వల్ల ఎంత పంట నష్టం జరిగింది? ఎంత మంది రైతులు నష్టపోయారు? ఎన్ని రోడ్లు పోయాయంటే డేటా లేదు.స్ధానిక స్వపరిపాలన , ప్రజల వద్దకే పాలన కలకు నిజమైన రూపం ఇచ్చింది మాజీ సీఎం వైఎస్ జగన్. విజన్ యూనిట్ అని సచివాలయాల పేరు మార్చాలనుకున్నారు. పేరు మార్చవచ్చేమో కానీ... వ్యవస్ధలను సృష్టించిన వాళ్ళను మార్చలేరు. *హెడ్ లైన్లు..అందమైన ఫోటోలకు తప్పా... నిన్న ఏం చేశాం అనే దానిపై ఫాలోఫ్ ఉంటుందా?, బెల్టు షాపుల మీద ఉక్కుపాదం అని చంద్రబాబు చెబుతున్నారు.. గత 16 నెలలుగా ఏం చేశారు?, ప్రభుత్వ మద్యానికి సమాంతరంగా నకిలీ మద్యాన్ని తీసుకువచ్చారు.మద్యం అమ్మకాలు ఎందుకు తగ్గాయో మీరే నమ్మట్లేదు. నకిలీ మద్యాన్ని అమ్మడం వల్లే మద్యం అమ్మకాలు తగ్గాయి. చాలా గందరగోళం లో ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. సచివాలయాలను విజన్ యూనిట్ అని చంద్రబాబు అంటున్నారు కధా? ఎవరూ విజనరీనో చంద్రబాబు చెప్పాలి. వాట్సప్ లో సేవలు అందుతున్నప్పుడు ..లోకేష్ దగ్గరికి, కలెక్టరేట్ లకు ఎందుకు ప్రజలు తమ అర్జీలను తీసుకువెళ్తున్నారు’ అని కురసాల ప్రశ్నించారు. బండి సంజయ్‌కు నో.. కేటీఆర్ ఓకే -
కొత్త అక్విడెక్టుపై రాకపోకల బంద్
● 20 రోజుల్లో మరమ్మతులు ప్రారంభం ● పాత అక్విడెక్టు మీదుగా ట్రాఫిక్ మళ్లింపునకు పరిశీలన ● 40 రోజులపాటు వాహనాల రాకపోకలకు బ్రేక్ పి.గన్నవరం: సీఎస్ఆర్ నిధులు రూ.49.03 లక్షల వ్యయంతో పి.గన్నవరం కొత్త అక్విడెక్టుకు 20 రోజుల్లో మరమ్మతులను ప్రారంభించేందుకు చర్యలు చేపట్టినట్టు ఇరిగేషన్ డీఈఈ భూపతిరాజు ప్రసాద్‌రాజు తెలిపారు. దీంతో 40 రోజుల పాటు కొత్త అక్విడెక్టుపై వాహనాల రాకపోకలను నిలిపివేయనున్నట్టు ఆయన వివరించారు. ఈ నేపథ్యంలో రాజోలు దీవి ప్రజలకు ఇబ్బందులు లేకుండా పాత అక్విడెక్టుపై చిన్న తరహా వాహనాల రాకపోకలను మళ్లించేందుకు గురువారం ఆయన డీసీ వైస్ చైర్మన్ చొల్లంగి సత్తిబాబుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా డీఈఈ విలేకరులతో మాట్లాడారు. కొత్త అక్డిడెక్టుపై పిల్లర్ల మధ్య ఎక్స్పాన్షన్ జాయింట్లు దెబ్బతినడంతో గోతులు ఏర్పడి ప్రయాణికులు ప్రమాదాలకు గురవుతున్నారు. ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ఈ సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లడంతో ఆయన నిధులు మంజూరు చేశారని డీఈఈ వివరించారు. ఈ పనులకు ఇప్పటికే టెండర్లు ఖరారు చేశామన్నారు. దెబ్బతిన్న జాయింట్ల వద్ద ఇనుప కడ్డీలు, రబ్బర్ స్ట్రిప్ ఏర్పాటు చేయడంతో పాటు, దెబ్బతిన్న రోడ్డుపై సిమెంట్, కాంక్రీట్‌తో వేరింగ్ కోట్ వేస్తాన్నారు. ఈ పనులు పూర్తి చేసేందుకు 20 రోజులు, అనంతరం వాటర్ క్యూరింగ్‌కు 20 రోజులు పడుతుందన్నారు. మరమ్మత్తులకు మెటీరియల్ అంతా సిద్దమైతేనే కొత్త అక్విడెక్టుపై రాకపోకలు నిలిపివేస్తామన్నారు. ఈ నేపథ్యంలో 40 రోజుల పాటు పాత అక్విడెక్టుపై చిన్న వాహనాల రాకపోకలకు మాత్రమే అనుమతి ఇస్తామని, భారీ వాహనాలకు అనుమతి ఉండదన్నారు. ఏటిగట్టుపైకి మార్కెట్ తరలింపు.. ఈ నేపథ్యంలో పాత అక్విడెక్టు మీదుగా ట్రాఫిక్‌ను మళ్లించేందుకు గాను దారిలో ఉన్న డైలీ మార్కెట్‌ను ఏటిగట్టుపైకి తరలించనున్నట్టు డీఈ ప్రసాద్‌రాజు తెలిపారు. మార్కెట్లో షెడ్లను తొలగించాలని అక్కడి వ్యాపారులకు ఆదేశాలిస్తామని తెలిపారు. అలాగే పాత అక్విడెక్టుపై నిరుపయోగంలో ఉన్న నిర్మాణాలను తొలగించి వాహనాల రాకపోకలకు మార్గం ఏర్పాటు చేస్తామని డీఈఈ వివరించారు. కార్యక్రమంలో నీటి సంఘం అధ్యక్షుడు కొల్నాడ సత్యనారాయణ రాజు తదితరులు పాల్గొన్నారు. -
చలమలశెట్టి సునీల్‌కు పరామర్శ
సాక్షి ప్రతినిధి, కాకినాడ: పితృ వియోగంతో బాధపడుతున్న ప్రముఖ వ్యాపార వేత్త, గ్రీన్కో యాజమాన్య ప్రతినిధి చలమలశెట్టి సునీల్‌ను గురువారం మచిలీపట్నంలో మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా పలకరించారు. సునీల్‌తోపాటు సోదరులైన అనిల్‌కుమార్, వెంకటేశ్వరరావులను పరామర్శించి, డాక్టర్ సురేంద్రనాథ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సునీల్ తండ్రి సురేంద్రనాథ్ వైద్యుడిగా అందించిన సేవలు వెలకట్టలేనివని రాజా పేర్కొన్నారు. రాజా వెంట పార్టీ ప్రత్తిపాడు కో–ఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి జమీలు, మాదిరెడ్డి దొరబాబు ఉన్నారు. -
ఉపాధికి దొరకని హామీ!
● జీతాలు లేక రోడ్డున పడ్డ టీఏలు ● పస్తులతో సహవాసం ● కనికరం లేని కూటమి సర్కార్ సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉపాధి హామీ పథకంలో క్షేత్ర స్థాయిలో ఉపాధి కూలీలకు అవసరమైన అన్ని రకాల సేవలు అందించే టెక్నికల్ అసిస్టెంట్ల పరిస్థితి దయనీయంగా మారింది. పది మంది నిరుపేదలకు పనులు కల్పించడంలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న టెక్నికల్ అసిస్టెంట్లు పస్తులతో సహవాసం చేస్తున్నారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకంలో అన్నీ తానై అందరికీ ఉపాధి చూపించే సాంకేతిక నిపుణులు ఆకలి కేకలతో అల్లాడిపోతున్నారు. ఉపాధి హామీలో చిరుద్యోగులైన టెక్నికల్ అసిస్టెంట్ల కుటుంబాలకు కూటమి సర్కార్ నిర్వాకంతో పూటగడవడమే గగనమవుతోంది. అసలే ఉన్న జీతాలే సరిపోక అల్లాడుతుంటే ఉన్న జీతం కూడా ఇవ్వకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తుంటే టెక్నికల్ అసిస్టెంట్లు అష్టకష్టాలు పడుతున్నారు. ఉద్యోగాల్లో జాయిన్ అయి 18 ఏళ్లు గడచిపోయింది. చాలీచాలని జీతాలైనా ఉన్న ఉద్యోగాలు వదులుకోలేక, బయటకు వస్తే ప్రత్యామ్నాయం లేక పోవడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఉన్నచోటే సర్దుకుపోతున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో.. 2007 మే నెలలో జిల్లా స్థాయి ఎంపిక కమిటీ (డీఎస్సీ)లో లిఖిత పూర్వక పరీక్షతోపాటు ఇంటర్వ్యూలలో అన్నింటా అర్హత సాధించిన వారిని టెక్నికల్ అసిస్టెంట్‌గా ఎంపిక చేశారు. ఇంటర్ తరువాత ఐటీఐ లేదా తత్సమాన డిప్లొమా(సివిల్) చేసిన వారికి ప్రాధాన్యం ఇచ్చారు. అప్పట్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రాతిపదికన వీరిని ఎంపిక చేశారు. జనాభా ప్రామాణికంగా రెండు, మూడు గ్రామాలకు ఒక టెక్నికల్ అసిస్టెంట్‌ను నియమించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉపాధి హామీ పథకంలో టెక్నికల్ అసిస్టెంట్(టీఏ)లుగా 200 నుంచి 250 మంది పనిచేస్తున్నారు. ఇలా 18 ఏళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న టీఏలకు 50 ఏళ్లు వయసు దాటిపోయింది. రూ.4,500తో ప్రారంభమైన వేతనాలు సర్వీసును బట్టి రూ.18,500 నుంచి రూ.28,000కు చేరుకున్నాయి. వేతనాల పెంపు, పీఆర్సీ, నగదు రహిత ఆరోగ్య కార్డులు...ఇలా వివిధ సౌకర్యాలు కల్పించేందుకు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం సమాయత్తమైన దశలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటంతో అర్ధంతరంగా ఆ ప్రక్రియ నిలిచిపోయింది. కేంద్రం నుంచి నిధులు విడుదలైనా.. అక్కడి నుంచి టెక్నికల్ అసిస్టెంట్ల కష్టాలు మళ్లీ మొదటికి వచ్చాయి. తొమ్మిదో పీఆర్సీ వరకు సక్రమంగానే అందుకున్నారు. 10వ పీఆర్సీ అమలు చేయాల్సి వచ్చేసరికి కూటమి సర్కార్ చేతులెత్తేసి తమను నిలువునా దగా చేసిందని టీఏలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గడచిన రెండు నెలలుగా వేతనాలు కూడా ఇవ్వకపోవడంతో టెక్నికల్ అసిస్టెంట్లు పూట గడవడమే కష్టంగా మారిందని ఆవేదన చెందుతున్నారు. వచ్చే జీతం సరిపోక నానా పాట్లు పడుతుంటే ఆ జీతం కూడా ఇవ్వకుండా ప్రభుత్వం ముప్పు తిప్పలు పెడుతోందని మండిపడుతున్నారు. నెల జీతమే ఆధారంగా కుటుంబాలు పోషించుకుంటుంటే ప్రభుత్వం మానవత్వం లేకుండా తమ జీవితాలతో ఆటలాడుకుంటోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటి పూట గడవడమే కనాకష్టమైపోతోన్న తరుణంలో రెండు నెలలుగా వేతనాలు వేయకుండా చంద్రబాబు సర్కార్ మానసికంగా వేధిస్తోందంటున్నారు. కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకం కోసం విడుదల చేసిన నిధుల్లో వేతనాల కోసం మెటీరియల్ కాంపొనెంట్ నుంచి 6 శాతం కేటాయిస్తోందంటున్నారు. ఆ మేరకు కేంద్రం నుంచి నిధులు విడుదలైనా రాష్ట్ర ప్రభుత్వం వేతనాలు విడుదల చేయకుండా తమను గాలికొదిలేసిందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉపాధి హామీ పథకంలో పనిచేసే ప్రాంతం కొలతల దగ్గర నుంచి కూలీలకు వేతనాలు వేసే వరకు అన్ని విభాగాల్లోను క్రియాశీలక పాత్ర పోషించే తమను ఇలా వేతనాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేయడం తగునా అని టీఏలు ప్రశ్నిస్తున్నారు. డిమాండ్ల సాధనకు ఆందోళన నగదు రహిత ఆరోగ్య కార్డులు, మిగిలిన అన్ని శాఖల ఉద్యోగుల మాదిరిగానే ఉద్యోగ విరమణ వయస్సు 60 సంవత్సరాల నుంచి 62కు పెంచాలని టీఏలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. బేసిక్ వేతనంపై 23 శాతం పెంచేందుకు కూడా ప్రభుత్వం ముందుకురావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం గ్రాడ్యుటీ కూడా లేకపోవడంతో రిటైర్మెంట్ అనంతరం తీవ్ర అన్యాయానికి గురవుతున్నామని టీఏలు మదనపడుతున్నారు. ఇటీవల ముగ్గురు టీఏలు పదవీ విరమణ చేస్తే ప్రభుత్వం నుంచి ఏ ప్రయోజనం కూడా చూపించని విషయాన్ని ఎవరికి చెప్పుకున్నా తమకు న్యాయం చేయలేదంటున్నారు. రెండు నెలల వేతనాలు విడుదల సహా వివిధ డిమాండ్ల సాధన కోసం గురువారం జిల్లావ్యాప్తంగా ఉన్న టీఏలు ఎంజీఎన్ఆర్ఈజీఎస్ టీఏల అసోసియేషన్ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా నీటి యాజమాన్య సంస్థ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. సమస్యలు పరిష్కరించకుంటే దశల వారీ ఆందోళనకు సిద్ధం కావాల్సి ఉంటుందని వారు హెచ్చరించారు. జీతాల్లేకుండా కుటుంబ పోషణ ఎలా? మార్కెట్లో నిత్యవసరాల ధరలు ఆకాశాన్ని అంటి వేతనాలు లేక నానా అగచాట్లు పడుతున్నాం. రెండు నెలలు జీతాలు లేకుండా కుటుంబ పోషణ ఏ రకంగా జరుగుతుంది. వేతనాలతోపాటు ఉద్యోగ విరమణ వయోపరిమితిని 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచాలి. నగదు రహిత ఆరోగ్య కార్డులను విడుదల చేసి టెక్నికల్ అసిస్టెంట్ల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. – డేగల సుధీర్, ప్రెసిడెంట్ ఎంజీఎన్ఆర్ ఈజీఎస్ టెక్నికల్ అసిస్టెంట్స్ అసోసియేషన్ 10వ పీఆర్సీ వర్తింపజేయాలి వేతనాలు అందక మా కుటుంబాలు రోడ్డున పడ్డాయి. అన్ని అర్హతలు ఉండడంతో ఉద్యోగం ఇచ్చారు. అప్పటి నుంచి కనీస వేతనం పెంచకుండా అన్యాయం చేస్తున్నారు. తక్షణం వేతనాలు విడుదల చేసి 10వ పీఆర్సీ మాకు వర్తింపచేసేలా ప్రభుత్వం స్పందించాలి. మా సమస్యలు పరిష్కరించకపోతే దశలవారీ ఉద్యమానికి సిద్ధం కావాల్సి వస్తుంది. – ఎం.ప్రసాద్, వైస్ ప్రెసిడెంట్, ఎంజీఎన్ఆర్ ఈజీఎస్ టెక్నికల్ అసిస్టెంట్స్ అసోసియేషన్ -
క్లస్టర్ వ్యవస్థకు మంగళం!
● ఇక గ్రామ పంచాయతీలకు స్వయం ప్రతిపత్తి హోదా ● నాలుగు గ్రేడ్లుగా విభజన ● కార్యదర్శి పదవి పంచాయతీ అభివృద్ధి అధికారిగా మార్పు ● కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇదే పంథా ● అన్ని విభాగాలను నిర్వీర్యం చేసే కుట్ర సాక్షి, రాజమహేంద్రవరం: గ్రామ పంచాయతీల్లో క్లస్టర్ వ్యవస్థకు కూటమి సర్కారు మంగళం పాడింది. వాటి స్థానంలో పంచాయతీలకు స్వయం ప్రతిపత్తి హోదా కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పరిణామం పంచాయతీ పాలన వ్యవస్థలో సమూల మార్పులు తీసుకువస్తుందని ప్రభుత్వం వెల్లడిస్తోంది. మున్సిపల్ పాలన తరహాలో గ్రామ పరిపాలన సాగునుందన్న అభిప్రాయం వెల్లడవుతోంది. ఇదిలా ఉంటే సాఫీగా నడుస్తున్న వ్యవస్థలను గందరగోళానికి గురి చేయడం తగదన్న వాదన వినిపిస్తోంది. సంస్కరణల పేరుతో ఇప్పటికే గ్రామ పంచాయతీలు, ఆర్బీకేలను ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. విద్యాశాఖలో సైతం ఇదే తరహా వ్యవహారానికి తెర తీసింది. దీనికితోడు ఏళ్ల తరబడి ఉన్న పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందన్న వాదన వినిపిస్తోంది. ఉద్యోగులకు లాభం చేకూరుస్తున్నామన్న నెపంతో క్లస్టర్ వ్యవస్థలో నిర్వహించే విధులే నూతన విధానంలో సైతం ఉండనున్నాయి. పని అదే అయినా.. కూటమి మార్క్ చూపించుకోవాలన్న ప్రయత్నంలో భాగంగానే ఈ మార్పులు చేస్తోందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి ‘తూర్పు’లో ఇలా.. కూటమి ప్రభుత్వం సరికొత్త విధానానికి నాంది పలికింది. ప్రస్తుతం అమలులో ఉన్న పంచాయతీ క్లస్టర్ వ్యవస్థను రద్దు చేసి, రాష్ట్రవ్యాప్తంగా 19,351 గ్రామ పంచాయతీలను స్వతంత్ర పరిపాలనా యూనిట్లుగా ప్రకటించింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా 60 మండలాలు ఉండగా.. 76 పంచాయతీలను స్పెషల్ గేడ్ర్ పంచాయతీలుగా విభజించారు. విభజన ఈ విధంగా.. పంచాయతీలను నాలుగు గ్రేడ్లుగా విభజించారు. పంచాయతీ కార్యదర్శుల పేరును ‘పంచాయతీ అభివృద్ధి అధికారి (పీడీఓ)గా మార్చారు. ప్రతి పంచాయతీలో ప్రధానంగా పారిశుధ్యం, తాగునీటి సరఫరా, గ్రామీణ ప్రణాళిక, వీధి దీపాల నిర్వహణ, ఇంజినీరింగ్, ఆదాయం– పన్ను వసూళ్లు విభాగాలు ఉండనున్నాయి. సిబ్బంది మార్పులు కొత్తగా ఏర్పడే రూర్బన్ పంచాయతీల్లో జూనియర్ అసిస్టెంట్లు, బిల్ కలెక్టర్లను సీనియర్ అసిస్టెంట్లుగా అప్‌గ్రేడ్ చేస్తారు. డిజిటల్ అసిస్టెంట్లతో ప్రత్యేక ఐటీ విభాగం ఏర్పాటు చేస్తారు. కార్యదర్శుల ఖాళీలను 2025–26 ప్యానెల్‌కు ముందే భర్తీ చేయాలని నిర్ణయించారు. స్పెషల్ గ్రేడ్ పంచాయతీ అంటే.. ఆ గ్రామ పంచాయతీలో పది వేలకు పైగా జనాభా కలిగి ఉండి, రూ.కోటికి పైగా ఆదాయం ఉన్న పంచాయతీలను స్పెషల్ గ్రేడ్ పంచాయతీగా పరిగణిస్తారు. గిరిజన ప్రాంతాల్లో ఐదు వేలకు పైగా జనాభా ఉంటే సరిపోతుంది. ఇప్పటి వరకు కొనసాగుతున్న గ్రేడ్–1 కార్యదర్శి స్థాయిని పెంచుతూ డిప్యూటీ ఎంపీడీఓగా నియమిస్తారు. గ్రేడ్–1 పంచాయతీ పంచాయతీలో 4,000 నుంచి 10,000లోపు జనాభా.. రూ.30,000 నుంచి రూ.కోటి లోపు ఆదాయం ఉన్న పంచాయతీలను గ్రేడ్–1 పంచాయతీలుగా పరిగణిస్తారు. గిరిజన ప్రాంతాల్లో 3 నుంచి 5 వేల లోపు జనాభా ఉంటే సరిపోతుంది. మండల కేంద్రంలోని అన్ని పంచాయతీలను గ్రేడ్–1 పరిధిలోకి తీసుకువస్తున్నారు. గ్రేడ్–2 పంచాయతీ గ్రామ పంచాయతీలో 2 వేల నుంచి 4 వేల మధ్య జనాభా ఉండాలి. గిరిజన ప్రాంతాల్లో 1,500 నుంచి 3,000 లోపు ఉంటే సరిపోతుంది. గ్రేడ్–3 పంచాయతీ జనాభా 2,000 లోపు, గిరిజన ప్రాంతాల్లో 1,500లో ఉన్న పంచాయతీలు ఈ కోవలోకి వస్తాయి. ఇదే సందర్భంలో పంచాయతీ కార్యదర్శిని గ్రేడ్ల వారీగా ఎగ్గిక్యూటివ్ అధికారి (ఈఓ)గా పిలుస్తారు. నూతన వర్గీకరణలో క్లర్కులు, బిల్ కలెక్టర్లు, అటెండర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, పారిశుధ్య కార్మికులు, రాత్రి కాపలా దారులు, ఎలక్ట్రీషియన్లు అదనంగా రానున్నారు. అర్బన్ పంచాయతీలు రూర్బన్‌గా విభజన అర్బన్ ప్రాంతాల్లో ఉన్న పంచాయతీలను రూర్బన్‌గా విభిజించి ప్రత్యేక హోదా కల్పించనున్నారు. సెక్రటరీగా ఉండటమే ఉత్తమం పంచాయతీ వ్యవస్థ పురాతనమైనది. పంచాయతీ అధికారికి సెక్రటరీగా గౌరవం, గుర్తింపు ఉంది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆ పోస్టుకు పంచాయతీ అభివృద్ధి అధికారి (పీడీఓ)గా నామకరణం చేయడం ఎంతవరకు సమంజసమన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కూటమి నిర్ణయం 73వ రాజ్యాంగ సవరణకు భిన్నంగా ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వసూళ్లపై దృష్టి పెట్టేందుకేనా? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆదాయ మార్గాల అన్వేషణ ప్రారంభించింది. ఇందులో భాగంగా పంచాయతీల్లో పన్నుల వసూళ్లపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇప్పటి వరకు ఉన్న క్లస్టర్ వ్యవస్థలో రెండు పంచాయతీలకు కలిపి ఒక సెక్రటరీ ఉండటంతో వసూళ్లు మందగిస్తున్నాయి. ఒక్కో పంచాయతీని విడదీసి ప్రత్యేక హోదా ఇస్తే.. వసూళ్లు బాగుంటాయన్న భావనతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.కూటమి మార్క్‌కు తహ తహ ఇప్పటి వరకు పంచాయతీ కార్యదర్శుల పోస్టులు ఐదు గ్రేడ్లుగా ఉండేవి. సచివాలయ ఉద్యోగులు ఆరో గ్రేడ్‌గా ఉండగా వాటిని ప్రస్తుతం మూడు గ్రేడ్లుగా మార్పు చేస్తున్నారు. ఇది ఉద్యోగులకు కొంత ఊరట కలిగించనుంది. అయితే ఉద్యోగులకు లాభం కల్పిస్తున్నామని చెబుతూ కూటమి సర్కారు పాత విధానానికి కొత్త తరహా కలరింగ్ ఇస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటి వరకు పంచాయతీల్లో అభివృద్ధి పనులు, పారిశుధ్యం, ఇతర నిర్వహణ పనులు పంచాయతీ సెక్రటరీల పర్యవేక్షణలో నిర్వహిస్తున్నారు. కొత్తగా సైతం పేరు మార్చి వారికే ఆ బాధ్యతలు అప్పగించారు. కేవలం కూటమి సర్కారు తన మార్క్ చూపించుకునేందుకు పడుతున్న పాట్లలో భాగంగానే ఈ మార్పులు చేస్తోందన్న భావన ప్రజల్లో కలుగుతోంది. -
రత్నగిరికి పోటెత్తిన భక్తులు
అన్నవరం: రత్నగిరి సత్యదేవుని ఆలయం గురువారం వేలాదిగా తరలివచ్చిన భక్తులతో కిటకిట లాడింది. ఉదయం నుంచి భక్తులు సత్యదేవుని సన్నిధికి తరలివచ్చారు. సుమారు 30 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించగావ్రతాలు 2,500 జరిగాయని అధికారులు తెలిపారు. నిత్య కల్యాణంలో రూ.1,116 చొప్పున టిక్కెట్లు కొనుగోలు చేసి 20 మంది భక్తులు పాల్గొన్నారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.30 లక్షల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. సుమారు ఆరు వేల మంది భక్తులకు పులిహోర, దద్దోజనం పంపిణీ చేశారు. కాగా కార్తికమాసంలో తొలివిడతగా సత్యదేవుని హుండీ ఆదాయాన్ని శుక్రవారం లెక్కించనున్నారు. ఉదయం ఏడు గంటల నుంచి సత్యదేవుని నిత్యకల్యాణ మండపంలో ఈ లెక్కింపు జరుగనుంది. ఎస్ఐఆర్కు సిద్ధం కావాలి బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్–ఎస్ఐఆర్) ప్రక్రియపై పూర్తిస్థాయి అవగాహన పెంపొందించుకొని పూర్తి సన్నద్ధతతో ఉండాలని కలెక్టర్ షణ్మోహన్ అధికారులకు సూచించారు. గురువారం రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈవో) వివేక్ యాదవ్ వెలగపూడి సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెనన్స్‌కు కలెక్టర్ షణ్మోహన్ తన క్యాంపు కార్యాలయం నుంచి హాజరయ్యారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం, 1950లోని కీలక సెక్షన్లు, ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రాధాన్యం, గత ఎస్ఐఆర్ (2002), సమగ్ర సవరణ ప్రక్రియలో భాగస్వామ్య పక్షాలు, బూత్ లెవెల్ అధికారి (బీఎల్వో), బూత్ లెవెల్ ఏజెంట్ (బీఎల్ఏ), ఈఆర్వోలు, ఏఈఆర్వోలు తదితరుల పాత్ర, ఎన్యూమరేషన్ ఫారాలు (ఈఎఫ్), ఇంటింటి సందర్శన, పరిశీలన తదితర అంశాలతో పాటు రాజకీయ పార్టీల భాగస్వామ్యంపై సీఈవో వివేక్ యాదవ్ జిల్లాల కలెక్టర్లకు వివరించారు. అనంతరం కలెక్టర్ షణ్మోహన్ మాట్లాడుతూ సన్నద్ధతలో భాగంగా ఎస్ఐఆర్ ప్రక్రియలోని ముఖ్య దశలపై అధికారులు పూర్తిస్థాయి అవగాహన పెంపొందించుకోవాలన్నారు. కాకినాడ జిల్లాలో ఎస్ఐఆర్ ప్రక్రియ విజయవంతం చేసేందుకు కృషి చేయాలని అధికారులకు సూచించారు. వివిధ ఫారాల పరిష్కారం, ఎపిక్ కార్డుల జారీ తదితర అంశాలపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. నేడు వందేమాతరం 150వ వార్షికోత్సవం సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): దేశభక్తి గీతం ‘వందేమాతరం’ రచించి 150 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా శుక్రవారం ఉదయం 10 గంటలకు జిల్లావ్యాప్తంగా సామూహిక వందేమాతరం గానం నిర్వహించనున్నట్టు కలెక్టర్ కీర్తి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమాన్ని జిల్లావ్యాప్తంగా ఒకే సమయానికి నిర్వహించేందుకు డివిజన్, మండల, గ్రామ స్థాయి అధికారులకు సూచనలు జారీ చేసినట్లు తెలిపారు. ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలని పిలుపు నిచ్చారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయం, విద్యాసంస్థల, సంస్థల ప్రాంగణంలో ఉదయం 10 గంటలకు వందేమాతరం గేయం సామూహికంగా ఆలపించాలన్నారు. వంట నౌకరీ భూములు స్వాధీనం కొత్తపేట: ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ, భూ సమేత వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో గతంలో వంట నౌకరీ నిమిత్తం ఇచ్చిన భూమిని తిరిగి స్వాధీనం చేసుకున్నారు. వంట నౌకరీ వ్యక్తులు సరిగా చేయనందున చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ (సీసీఎల్ఏ) ఉత్తర్వుల మేరకు ధర్మదాయ శాఖ అధికారులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. ఈఓ నల్లం సూర్య చక్రధరరావు వెల్లడించిన వివరాల మేరకు వాడపల్లి గ్రామంలో 27/2 సర్వే నెంబరులో 2.6 ఎకరాల భూమి, 48/4ఏ సర్వే నెంబరులో 4.61 ఎకరాల భూమిని గతంలో వంట నౌకరీ నిమిత్తం ఇచ్చారని, వారు సరిగా చేయకపోవడం వలన, హైకోర్టు తీర్పు, దానిని అనుసరించి సీసీఎల్‌సీ ఉత్తర్వుల మేరకు తిరిగి భూములను వారు స్వాధీనం చేసుకున్నారు. ఆయా భూముల్లో ‘ఈ భూమి వాడపల్లి వేంకటేశ్వరస్వామివారి దేవస్థానమునకు సంబంధించినది. ఎవరైనా అక్రమిస్తే ఎండోమెండ్స్ యాక్ట్ 30/1987 కింద శిక్షార్హులని హెచ్చరిక బోర్డులు ఏర్పాటుచేశారు. అడిషనల్ కమిషనర్ వి.సత్యనారాయణ, మండల రెవెన్యూ అధికారులు, పోలీసు, దేవస్థానం సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. -
ఆమె ఖ్యాతి.. ఖగోళమంత!
● ఆస్ట్రానాట్ అభ్యర్థిగా కై వల్య ఎంపిక ● వ్యోమగామిగా నాలుగేళ్ల పాటు శిక్షణ ● అసాధారణ ప్రతిభ ఆమె సొంతం ● అంతర్జాతీయ పటంపై ఆమె సంతకం ఖగోళ శాస్త్రవేత్తగా దేశానికి సేవలందించమే నా లక్ష్యం ఆస్ట్రోనాట్ అభ్యర్థిగా ఎంపిక కావడం ఎంతో సంతోషంగా ఉంది. ఏరోస్పేస్ ఇంజినీరింగ్ పూర్తి చేసి ఖగోళ శాస్త్రవేత్తగా దేశానికి సేవలందించమే నా లక్ష్యం. చిన్నతనం నుంచి ఖగోళ శాస్త్రంపై ఆసక్తి ఉంది. అంతరిక్ష వ్యామగామి కల్పనా చావ్లా, స్టీఫెన్ హాకింగ్, అబ్దుల్ కలాం అంటే ఎంతో ఇష్టం. వారిని ఆదర్శంగా తీసుకుని దేశానికి సేవలందిస్తాను. తల్లిదండ్రుల నన్ను ఎంతగానో ప్రొత్సహిస్తున్నారు. – కుంచాల కై వల్యరెడ్డి, నిడదవోలు నిడదవోలు: పట్టణానికి చెందిన కుంచాల కై వల్యరెడ్డి అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ టైటాన్స్ స్పేస్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో 2029లో చేపట్టనున్న అంతరిక్ష యాత్రకు ఆస్ట్రోనాట్‌గా ఎంపిక కావడంతో స్థానికంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. పదేళ్ల ప్రాయంలోనే వివిధ కళలు, పోటీ పరీక్షల్లో తనకంటూ ప్రత్యేకత చాటుతూ ముందుకు దూసుకుపోతోంది. తల్లిదండ్రుల ప్రొత్సాహంతో అనేక పోటీల్లో విజయకేతనం ఎగువవేస్తూ ఎన్నో పతకాలను సొంతం చేసుకుంది. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణానికి చెందిన కుంచాల శ్రీనివాసరెడ్డి, విజయలక్ష్మి దంపతులకు మొదటి సంతానం కై వల్యరెడ్డి. తండ్రి పంచాయతీ ఈవోగా, తల్లి మనోజ్ఞ ఛారిటబుల్ ట్రస్టు చైర్మన్‌గా సామాజిక సేవ చేస్తున్నారు. కౌవల్య నాలుగేళ్ల ప్రాయం నుంచే చిత్రలేఖనం, ఫ్యాన్సీ, డ్రెస్, వ్యాసరచన, వక్తృత్వం, కూచిపూడి, భరతనాట్యం, కరాటే వంటి పోటీల్లో విశేష ప్రతిభ కనబరుస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది. కరెన్సీ, నాణేలు, స్టాంపుల సేకరణలో దేశ, విదేశీ కరెన్సీ, పురాతన నాణేలు, విదేశీ స్టాంపుల సేకరణలో ఆమె ఆసక్తి చూపేది. ఐదో తరగతిలో ఉండగా విదేశీ కరెన్సీ సేరణతో పాటు వివిధ దేశాల కరెన్సీ పేర్లు కూడా టక్కున చెప్పిన ప్రతిభాశాలి. ఏలూరులో ఇటీవల జరిగిన డివిజనల్ విదేశీ కరెన్సీ అవగాహన సదస్సులో ప్రదర్శించి అందరినీ ఆటకట్టుకుంది. ఆకట్టుకుంటున్న వేషధారణలు... అంతే కాదు జాతీయ నాయకుల వేషధారణలో ఆమె ఎన్నోసార్లు మెరిసింది. సమైక్యాంధ్ర ఉధ్యమంలో భాగంగా 66 రోజుల పాటు కౌవల్య తెలుగుతల్లి, భరతమాత, గాందీ, పొట్టి శ్రీరాములు, అల్లూరి సీతారామరాజు వేషధారణలో అందరినీ ఆకట్టుకుంది. సమైక్యతా రాగాన్ని ఆలపిస్తూ వేషధారణలతో అనేక ప్రదర్శనలు ఇచ్చి ఉన్నతాధికారుల మన్ననలు పొందింది. మనోజ్ఞ ట్రస్టు ఆధ్వర్యంలో చేపడుతున్న సేవా కార్యాక్రమాల్లో వృద్ధులు, అనాథ పిల్లలకు స్వయంగా భోజనాలు వడ్డిస్తూ తన సేవా నిరతిని చాటుకుంటోంది. నాసా కోర్సు పూర్తి చేసిన కై వల్యరెడ్డి అమెరికాలో 2023లో నాసా నిర్వహించిన కోర్సును కై వల్యరెడ్డి పూర్తి చేసింది. వ్యామగామి కావడమే లక్ష్యంగా అడుగులు వేసింది. నాసా అందిస్తున్న ఐఏఎస్పీ (ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రామ్) కోర్సును విజయవంతంగా పూర్తి చేసింది. ఔత్సాహిక విద్యార్థులను ప్రోత్సహించేందుకు అమెరికాలోని ఎయిర్ స్పేస్ అండ్ రాకెట్ సెంటర్, నాసా సంయుక్త ఆధ్వర్యంలో ఏటా నవంబర్‌లో ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రాం (ఐఏఎస్పీ) శిక్షణ అందిస్తోంది. విద్యార్థులకు పది రోజుల పాటు వ్యామగామికి సంబంధించిన పలు అంశాలపై అవగాహన కల్పించడంతో పాటు శిక్షణ ఇస్తారు. ప్రపంచవ్యాప్తంగా 50 మందికి ఈ అవకాశం లభిస్తుంది. 2023లో భారత్ నుంచి ఎంపికై న వారిలో కై వల్యరెడ్డి ఒకరు. అతి చిన్న వయసులో ఐఏఎస్‌పీకి ఎంపికై శిక్షణ పూర్తి చేసుకున్న భారతీయురాలిగా రికార్డు సైతం నమోదు చేసింది. శిక్షణలో భాగంగా సొంతంగా విమానం నడపడం, మల్టీ యాక్సెస్ ట్రైనింగ్, జీరో గ్రావిటీ, స్కూబా డైవింగ్ తదితర అంశాలను నేర్చుకుంది.కైవల్య విజయాలివీ.. గతంలో ఆస్ట్రాయిడ్‌ను గుర్తించి, స్పేస్‌పోర్ట్ ఇండియా ఫౌండేషన్ (న్యూడిల్లీ)అంబాసిడర్ బృంద సభ్యులుగా చిన్నతనంలోనే కైవల్యరెడ్డి ఎంపికయ్యారు. ఇంటర్నేషనల్ ఆస్ట్రానానమికల్ సెర్చ్ కొలాబరేషన్ సహకారంతో నిర్వహించిన క్యాంపెయిన్‌లో ఆస్ట్రాయిడ్‌ను గుర్తించింది. చిన్నతనంలోనే కైవల్య అంతర్జాతీయ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సొంతం చేసుకుంది. ఆవర్తన పట్టిక 118 మూలకాలను కేవలం నిమిషం 33 సెంకండ్లలో టేబుల్‌పై క్రమపద్ధతిలో అమర్చడం ద్వారా ఈ రికార్డును సొంతం చేసుకుంది. అంతర్జాతీయ జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు కైవల్యకు ఆర్ట్స్ క్రాప్ట్ విభాగంలో అవార్డు అందజేశారు. ముఖ్యంగా పెదవులతో బొమ్మలు వేయడం, జుట్టుతో బొమ్మలు గీయడం, తోలు బొమ్మల తయారీ, విద్యార్థులకు అర్ధమయ్యెలా ఖగోళశాస్త్రాన్ని బోధించడంతో ఆర్ట్స్ క్రాఫ్ట్ విభాగంలో అవార్డును సొంతం చేసుకుంది. జర్మనీకి చెందిన ఇంటర్నేషనల్ ఆస్ట్రానమీ, ఆస్ట్రో ఫిజిక్స్ అంతర్జాతీయ స్థాయిలో 82 దేశాల విద్యార్థులకు నిర్వహించిన ఆన్లైన్ ప్రతిభా పోటీలలో ఆమె మూడు రౌండ్లలో ప్రతిభ కనబరిచి సిల్వర్ ఆనర్‌ను సాధించింది. విశాఖలో జరిగిన ప్రపంచ సైన్స్ కాంగ్రెస్‌లో పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చింది. స్పేస్‌పోర్ట్ ఇండియా ఫౌండేషన్ న్యూఢిల్లీ వారు కైవల్యను స్పేస్ అంబాసిడర్‌గా, కమ్యునికేటర్గా నియమించారు. రోడ్లపై తిరుగుతున్న ఆవులు, కుక్కలు, జంతువులను సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఎలా కాపాడాలనే ప్రాజెక్టుకు మద్రాస్‌కు చెందిన జవహర్లాల్ నెహ్రూ యూనివర్శిటీ వారు ప్రఽథమ బహుమతిని అందజేశారు. 2019లో తాడేపల్లిగూడెంలో సిరిమువ్వ సోషల్ సర్వీసెస్ అండ్ ఆర్ట్స్ సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన కూచిపూడి నృత్య పోటీల్లో ప్రథమ స్థానం సాధించి నాట్య బాల అవార్డు పొందింది. జాతీయ హిందీ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన హిందీ వక్తృత్వ పోటీల్లో జిల్లాలో ప్రధమ స్ధానం సాధించింది. సాక్షి ఆధ్వర్యంలో స్పెల్‌బీ పోటీలో జిల్లా స్థాయిలో రాణించి హైద్రాబాద్‌లో పాల్గొనేందుకు అర్హత సాధించింది. చాగల్లులో ఇటీవల జరిగిన అంతర్జాతీయ కరాటే పోటీలలో బంగారు, రజిత పతకాలను కై వసం చేసుకుంది. నిడదవోలులో నిర్వహించిన జాతీయ స్థాయి కరాటే పోటీల్లో రెండు బంగారు పతకాలను సొంతం చేసుకుంది. ఉభయ తెలుగు రాష్ట్రాల స్థాయిలో పాలకొల్లులో నిర్వహించిన గుజోరియో కరాటే చాంపియన్ పోటీల్లో ప్రధమ, ద్వితీయ స్థానాలు సాధించింది. విజయవాడలో నిర్వహించిన సౌత్ ఇండియా కరాటే చాంపియన్ షిప్ పోటీలలో కటా, కుమిటి విభాగంలో బంగారు పతకాలు సాధించింది. పెనుగొండలో నిర్వహించిన జాతీయ స్థాయి కరాటే పోటీల్లో రెండు బంగారు పతకాలు సాధించింది. అమరావతిలో నిర్వహించిన అంతర్జాతీయ కరాటే పోటీల్లో బ్లాక్ బెల్ట్‌తో పాటు రెండు బంగారు, రజత పతకాలు సాధించింది. నిడదవోలులో నిర్వహించిన అంతర్జాతీయ కరాటే పోటీలలో బంగారు పతకాన్ని సొంతం చేసుకుంది. చీరాలలో నిర్వహించిన అంతర్జాతీయ కరాటే పోటీల్లో బంగారు పతకాన్ని కై వసం చేసుకుంది. -
నేటి నుంచి రాష్ట్రస్థాయి స్క్వాష్, జూడో పోటీలు
● 13 జిల్లాల నుంచి క్రీడాకారులు హాజరు ● డీఎస్‌ఏలో ఏర్పాట్లు పూర్తి బాలాజీచెరువు: కాకినాడ జిల్లా క్రీడా మైదానంలో పాఠశాల క్రీడా సమాఖ్య అండర్ –14, 17 ఆధ్వర్యంలో శుక్రవారం నుంచి జరగనున్న రాష్ట్రస్థాయి స్క్వాష్, జూడో పోటీలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ పోటీలకు 13 జిల్లాల నుంచి 200 మంది స్క్వాష్‌కు, 300 మంది జూడోకు హాజరుకానున్నారు. పోటీల నిర్వహణ నిమిత్తం నిర్వాహకులు స్క్వాష్ కోర్టు, జూడో హాలును సిద్ధం చేశారు. బాలురు, బాలికలకు కాకినాడ జిల్లా క్రీడా మైదానం, వాకలపూడి జెడ్పీ హైస్కూల్లో వసతి ఏర్పాట్లు కల్పించారు. గురువారం పోటీల నిర్వహణ ఏర్పాట్లను డీఈవో రమేష్, ఎస్జిఎఫ్ఐ కార్యదర్శులు శ్రీను, సుధారాణి పర్యవేక్షించారు. ఉదయం 10 గంటలకు స్క్వాష్ పోటీలు, సాయంత్రం 4 గంటలకు జూడో పోటీలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా ఎస్జీఎఫ్ఐ కార్యదర్శి శ్రీను మాట్లాడుతూ డీఈవో సూచనల మేరకు వివిధ జిల్లాల నుంచి హాజరయ్యే క్రీడాకారులకు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశామని తెలిపారు. పోటీల నిర్వహణలో జిల్లాకు చెందిన వ్యాయామ ఉపాధ్యాయులు సహకారాన్ని అందిస్తున్నారు. విధుల నుంచి స్కూల్ అసిస్టెంట్ తొలగింపు బాలాజీచెరువు (కాకినాడ సిటీ): స్థానిక జగన్నాధపురం బచ్చు రామం నగరపాలక సంస్థ బాలికోన్నత పాఠశాల గణిత ఉపాధ్యాయుడు కేవీవీ సత్యనారాయణను విధులు నుంచి తొలగిస్తూ జిల్లా విద్యాశాఖాఽధికారి ఉత్తర్వులు జారీచేశారు. కొనేళ్లుగా ఆయన బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతోపాటు తప్పుడు పదజాలంతో వారిని వేధిస్తున్నారు. దీంతో 8, 9 తరగతుల విద్యార్థులు వారి తల్లిదండ్రులకు ఫిర్యాదు చేయడంతో ఈ నెల 4న వారంతా పాఠశాలకు వచ్చి హెచ్ఏంకు విషయాన్ని వివరించారు. ఆయన ఉన్నత అధికారులకు సమాచారం నివేదించారు. ఎంఈఓ సుబ్బారావు, డీవైఈఓ సత్యనారాయణ పాఠశాలకు వచ్చి విద్యార్థులను విచారించి జిల్లా కార్యాలయానికి నివేదిక అందజేశారు. దాని ఆధారంగా డీఈఓ పిల్లి రమేష్ ఆయనను విధుల నుంచి తొలగించారు. హైవేపై కారు దగ్ధం మరమ్మతు అనంతరం ట్రైల్ వేస్తుండగా ఘటన తుని రూరల్: తుని మండలం ఎస్.అన్నవరం శివారు గెడ్లబీడు సమీపంలో జాతీయ రహదారిపై గురువారం మధ్యాహ్నం కారు దగ్ధమైంది. తునికి చెందిన వైద్యుడు తన కారును మరమ్మతుల నిమిత్తం షెడ్డుకు ఇచ్చారు. మరమ్మతులు అనంతరం ట్రైల్ వేసేందుకు మెకానిక్ కారును తుని నుంచి జాతీయ రహదారిపైకి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందడంతో అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. బ్యాటరీ షార్టు సర్క్యూట్‌తో పొగరావడాన్ని మెకానిక్ గమనించి కారు దిగి చూడగా ఒక్కసారిగా కారులో మంటలు వ్యాపించి దగ్ధమైనట్టు అగ్నిమాపక అధికారి కె.రాముడు తెలిపారు. ప్రాణాపాయం తప్పిందని, రూ.తొమ్మిది లక్షలు నష్టం వాటిల్లిందన్నారు. -
టికెట్ తీసుకోమన్నందుకు దాడి
● ఆర్డీసీ సిబ్బందిపై ప్రయాణికురాలి వాగ్వాదం ● ఆపై బంధువులతో కలసి బస్సు నిలిపివేత ఐ.పోలవరం: అమలాపురం–కాకినాడ మార్గంలో వెళ్తున్న ఆర్టీసీ బస్‌పై ఓ ప్రయాణికురాలి బంధువులు దాడి చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే అమలాపురంలోని కిమ్స్ హాస్పిటల్ దగ్గర మురమళ్ల గ్రామానికి చెందిన ఓ యువతి బుధవారం రాత్రి బస్సు ఎక్కింది. ఆమె ఆధార్ కార్డు చూపకపోవడంతో కండక్టర్ టికెట్ తీసుకోమన్నారు. దీంతో ఆమె అతడితో వాగ్వాదానికి దిగింది. ఆమె వ్యవహార శైలితో డ్రైవర్, కండక్టర్లు ఆమెను అనాతవరం సమీపంలో దింపి వెళ్లిపోయారు. ఈ విషయం తెలుసుకున్న యువతి బంధువులు ఆగ్రహంతో మురమళ్ల వద్ద బస్సును ఆపి, బస్సు అద్దాలు ధ్వంసం చేసి డ్రైవర్, కండక్టర్లపై దాడి చేసేందుకు యత్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. బస్సు సిబ్బంది, యువతి బంధువుల మధ్య జరిగిన ఘర్షణపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
అట్టహాసంగా సెపక్తక్రా పోటీలు
ప్రతిజ్ఞ చేస్తున్న క్రీడాకారులు క్రీడా మైదానంలో హోరాహోరీగా తలపడుతున్న క్రీడాకారులుదేవరపల్లి: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ 69వ అంతర్ జిల్లాల సెపక్తక్రా చాంపియన్ షిప్ 2025–26 అండర్ 17 బాల, బాలికల పోటీలు దేవరపల్లి మండలం దుద్దుకూరు రంగరాయ జెడ్పీ హైస్కూలు క్రీడా మైదానంలో గురువారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. పోటీలను ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట్రాజు, విద్యాశాఖ ఆర్జేడీ జి. నాగమణి ప్రారంభించారు. రెండు రోజుల పాటు సాగనున్న పోటీలకు రాష్ట్రంలోని పూర్వపు 13 జిల్లాల నుంచి సుమారు 150 మంది క్రీడాకారులు, 52 మంది కోచ్‌లు, మేనేజర్లు పాల్గొన్నారు. కార్యక్రమంలో రీజినల్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇన్స్పెక్టర్ జాన్సన్, ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇన్స్పెక్టర్ ఎస్కే మెహబూబా బాషా, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి బాలమూర్తి, జిల్లా కార్యదర్శి ఏడీవీ ప్రసాద్, డీవైఈఓ రమణరావు, ఎంఈఓ ఎం.తిరుమలదాస్, శాప్ డైరెక్టర్ పేరం రవీంద్రనాథ్, హెచ్ఎం పి.వీర్రాజు, విద్యాకమిటీ చైర్మన్ పావాడ సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే వెంకట్రాజు మాట్లాడుతూ క్రీడలు విద్యలో అంతర్భాగమని పేర్కొన్నారు. నాయకులు పాఠశాలలను దత్తత తీసుకుని క్రీడల అభివృద్ధికి వసతులు కల్పించాలని ఆయన కోరారు. ఈ నెల 28న దేవరపల్లిలో నిర్వహిస్తున్న గ్రామీణ బాలోత్సవాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఉమ్మడి 13జిల్లాల నుంచి 150 మంది క్రీడాకారులు హాజరు -
అంతోటా సస్యరక్షణ
ఐ.పోలవరం: రైతు కష్టం నీట మునిగింది.. మోంథా తుపానుతో కురిసిన భారీ వర్షాలకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఉద్యాన పంట చేలల్లోకి నీరు చేరింది.. ప్రధానంగా కోకో, కూరగాయ పంటలు ముంపు బారిన పడ్డాయి. ఈదురు గాలులకు చెట్లు దెబ్బతిన్నాయి. అయితే ముంపు నీరు సకాలంలో తొలగిస్తే ఈ పంటలకు పెద్దగా నష్టం వాటిల్లదని జిల్లా ఉద్యాన శాఖ అధికారి బీవీ రమణ తెలిపారు. ఆయా తోటల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆయన మాటల్లోనే... కోకో తోటలు లోతట్టు ప్రాంతాల్లో ఉంటే తోట చుట్టూ కందకాలను తవ్వడం ద్వారా మురుగు నీటి వసతి కల్పించడం వల్ల చెట్టు కుళ్లిపోకుండా చేయడంతో పాటు భూమి కోతకు గురవ్వకుండా చూసుకోవచ్చు. తుపాను కారణంగా ఈదురు గాలుల బారిన పడిన తోటల్లో విరిగిన కోకో చెట్ల కాండం, ఫ్యాన్ కొమ్మలను పదునైన కత్తి లేదా రంపం సాయంతో కత్తిరించాలి. కత్తిరించిన భాగాలను 1 శాతం బోర్డో మిశ్రమం లేదా మూడు శాతం కాపర్ ఆక్సీక్లోరైడ్ పేస్ట్‌తో పూయాలి. వర్షాలు అధికంగా ఉన్నప్పుడు వచ్చే ఫైటోఫోరా కాయకుళ్లు, గజ్జి తెగులును నివారించేందుకు ఒక శాతం బోర్డో మిశ్రమం, కాపర్ ఆక్సీక్లోరైడ్ మూడు గ్రాములు ఒక లీటరు నీటికి కలిపి కొమ్మలు, ఆకులపై పిచికారీ చేయాలి. అదే విధంగా గజ్జి తెగులు నివారణకు కాపర్ ఆక్సీక్లోరైడ్ లేదా బోర్డ్ పెస్ట్‌ను కాండంపై పూతలా వేయాలి. ఫ నీటి ముంపునకు గురైన కోకో తోటల్లో భూమి ద్వారా వ్యాప్తి చెందే శిలీంధ్ర తెగుళ్ల నివారణకు ఒక శాతం బోర్డో మిశ్రమం లేదా 0.3 శాతం కాపర్ ఆక్సీక్లోరైడ్ ద్రావణాన్ని చెట్టుకు 3 లీటర్ల చొప్పున మొదలు వద్ద నేలను తడపాలి. ఫ కోకో తోటలలో పిందె పడిపోకుండా ఉండడానికి, కాయకుళ్లు తెగులు నివారణకు 1 శాతం బోర్డో మిశ్రమం లేదా 0.3% కాపర్ ఆక్సీక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేయాలి. ఫ ఆకులు పండు బారిన కోకో తోటల్లో చెట్లపై 0.5 శాతం చొప్పున 13:0:46 లేదా 19:19:19 వంటి నీటిలో కరిగే రసాయన ఎరువులను వారం నుంచి పది రోజుల వ్యవధిలో రెండు నుంచి మూడు సార్లు పిచికారీ చేయాలి. ఫ నీరు నిలిచిన తోటల్లో తరచూ ఆకులపై కనిపించే ఇనుము, జింకు ధాతు లోప నివారణకు 0. 5 శాతం ఫెరరస్ సల్ఫేట్, 0.25 శాతం జింక్ సల్ఫేట్ మిశ్రమాన్ని పిచికారీ చేయాలి. ఫ తోటలు సాధారణ స్థితికి వచ్చిన వెంటనే మొక్క మొదలు మట్టిని వేస్తుండాలి. పడిపోయిన మొక్కల వేరు దెబ్బతినకుండా జాగ్రత్తగా నిలబెట్టుకోవాలి. ఫ మొక్కలు సాధారణ స్థితికి వచ్చిన వెంటనే, సిఫారసు చేసిన దానికంటే ఎక్కువగా మరో మోతాదు ఎరువులను (100:40:140 గ్రాముల ఎన్పీకే) ఒక్కో మొక్కకు వేయాలి. ఫ ముంపు తొలగిస్తేనే కోకో, కూరగాయ పంటలకు మేలు ఫ జిల్లా ఉద్యానశాఖ అధికారి రమణ వెల్లడి కూరగాయ పంటల్లో ఇలా చేద్దాం కూరగాయల తోటలు, పొలాల్లో నిలిచిన నీటిని సాధ్యమైనంత త్వరగా బయటకు పంపివేయాలి. వర్షాలు ఆగిన వెంటనే 19:19:19 లేదా 13:0:45 లేదా యూరియా వంటి పోషకాలను పంటపై పిచికారీ చేయాలి. అవసరాన్ని బట్టి సూక్ష్మ పోషకాలను కూడా పిచికారీ చేసుకోవాలి. నేల కొంచెం ఆరిన తరువాత రసాయన ఎరువులను నేలలో వేసుకోవాలి. అధిక వర్షాలను విత్తనం మొలకెత్తనప్పుడు లేదా లేత మొక్కలు దెబ్బతిన్నప్పుడు నర్సరీలో నారు పెంచుకుని సమయాన్ని ఆదా చేసుకోవచ్చు. వర్షాలు ఆగిన వెంటనే అంతర సేద్యం చేసే కలుపును తొలగించడమే కాకుండా నేల త్వరగా ఆరేటట్లు చూసుకోవాలి. సస్యరక్షణ చర్యలు ఫ ఆకు తినే పొగాకు లద్దెపురుగు నివారణకు విషపు ఎరలను (అన్ని కూరగాయ పంటలు) ఉపయోగించాలి. ఫ అక్షింతల పురుగు, చిత్త పురుగు నివారణకు వర్షాలు ఆగిన వెంటనే క్లోరిఫైరిఫాస్ రెండు మిల్లీలీటర్లు లీటరు నీటిలో, లేదా థయోడికార్బ్ ఒక గ్రాము లీటరు నీటిలో పిచికారీ చేయాలి. (ముఖ్యంగా వంగ, కాకర, ఆకాకర) ఫ ఎండు తెగులు నివారణకు కాపర్ ఆక్సీక్లోరైడ్ మూడు గ్రాములు ఒక లీటరు నీటికి లేదా మెటాలాక్సిల్ మంకోజెబ్ రెండు గ్రాములు ఒక లీటరు నీటికి మొక్కల మొదళ్లలో వేయాలి (మిరప, టమోటా, క్యాబేజీ వంటి వాటికి). ఫ ఆకుమచ్చ తెగులు నివారణకు కార్బండిజం ఒక గ్రాము లీటరు నీటికి, లేదా మంకోజెబ్ 2.5 గ్రాము లు ఒక లీటరు నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి (మిరప, టమోటా, చిక్కుడు, ఆకుకూరలు). ఫ బూజు తెగులు నివారణకు డైమిథోమర్స్ 1.5 గ్రాములు ఒక లీటరు నీటికి, లేదా మెటాలాక్సిల్, మంకోజెబ్ కలిపి రెండు గ్రాములు ఒక లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. (బీర, కాకర దోస, పొట్ల, సొర) ఫ బాక్టీరియా మచ్చ తెగులు నివారణకు కాపర్ ఆక్సీక్లోరైడ్ మూడు గ్రాముల మందు ఒక లీటరు నీటికి, ప్లాంటామైసిన్ రెండు గ్రాములు ఒక లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. (టమోటా, వంగ, క్యాప్సికం) -
ఊరికొకరు ఎమ్మెల్యేగా చలామనీ!
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఏ నియోజకవర్గానికై నా ఒకే ఒక ఎమ్మెల్యే ఉంటారు. అక్కడి అధికారులైనా, అనధికారులైనా ఆ ఎమ్మెల్యే చెప్పిందే ఆచరిస్తారు. కానీ ఊరికొక ఎమ్మెల్యే ఉన్నారంటే మీరు నమ్ముతారా? నమ్మి తీరాల్సిందే. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఊరికొకరు ఎమ్మెల్యేగా చలామణి అవుతున్నారు. ఈ వింత పోకడ చూసి ఆ పార్టీ నేతలతో పాటు జనం కూడా విస్తుపోతున్నారు. ఈ నియోజకవర్గానికి జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నియోజకవర్గంలో ఆ పార్టీకి చెందిన పలువురు ద్వితీయశ్రేణి నేతలు పెత్తనం చలాయిస్తున్నారు. అధికారులు, అనధికారులు అనే తేడా లేకుండా ఎవరైనా తాము చెప్పినట్టు చేయాల్సిందేనని హుకుం జారీచేస్తున్నారు. మరికొందరైతే మేం చెప్పినట్టు చేయకుంటే శంకరగిరి మాన్యాలు పడతారంటూ అధికారులకు వార్నింగ్‌లు కూడా ఇస్తున్నారు. వివిధ శాఖల అధికారులు నేతల ఆగడాలు భరించలేకున్నా చేసేదేమీ లేక మిన్నకుండి పోతున్నారు. కొందరైతే గత్యంతరం లేని పరిస్థితుల్లో సమీప మండలాలకు బదిలీలు చేయించుకుని మరీ వెళ్లిపోతున్నారు. అటు కరప, ఇటు కాకినాడ రూరల్ మండలాల్లో నియోజకవర్గ ముఖ్యనేత పేరు చెప్పి అనుచర గణం చెలరేగిపోతోంది. అదేమని స్థానికులు నేతలను ప్రశ్నించే ధైర్యం చేయలేక పోతున్నారు. దానిని ఆసరాగా చేసుకుని అడిగే నాథుడు లేడనే ధైర్యంతో ద్వితీయ శ్రేణి నేతలు బరి తెగిస్తున్నారు. షాడోలకు కమీషన్ ఇవ్వాల్సిందే! గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌లను ఉత్సవ విగ్రహాలుగా చేసి అధికారాన్నంతటినీ వారే చలాయిస్తున్నారు. గ్రామ స్థాయిలో పాలనా వ్యవహారాలను చక్కబెట్టే వీఆర్వోలు, సచివాలయ ఉద్యోగులు, కార్యదర్శులు చేసేదేమీ లేక వారు చెప్పిన పనులను తలాడించి చేసుకుపోతున్నారు. అడ్డగోలుగా ఉన్న పనులు చేయలేమంటే ముఖ్యనేత అనుచరులం మా మాటే కాదంటారా అంటూ బెదిరింపులకు కూడా వెనుకాడటం లేదు. గత్యంతరం లేని పరిస్థితుల్లో కార్యదర్శులతో సహా ఇతర అధికారులు ఆ షాడో ఎమ్మెల్యేలు చెప్పిందే చేస్తున్నారు. వ్యవసాయ కార్యకలాపాలను చక్కబెట్టే ఒక కీలక పోస్టుకు ఇటీవలనే ఎంపికై న ముఖ్యనేత అనుచరుడు కరప మండలానికి అంతా తానే అన్నట్టు సామంత రాజులా అధికారాన్ని చలాయిస్తుండటంపై జనసేనలో సీనియర్లే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మండలంలో రియల్టర్లకు అనుకూలంగా వ్యవసాయ భూముల కన్వర్షన్, ఇల్లు నిర్మాణ ప్లాన్లకు అనుమతులు...ఇలా ఒక్కో పనికి ఒకో రేటు పెట్టి మరీ వసూళ్ల పర్వాన్ని సాగిస్తున్నారు. రియల్ ఎస్టేట్ వెంచర్ వేయాలంటే ముందుగా షాడో ఎమ్మెల్యే అనుమతి తప్పనిసరి, ఆయన ఓకే అనాలంటే ఎకరాకు రూ.2 లక్షలు ముట్టచెప్పాల్సిందే. ఇంటి ప్లాన్ అనుమతి కావాలంటే రూ.50వేలు తాంబూలం ఇచ్చుకోవాల్సిందే. ఆ షాడో ఎమ్మెల్యేకు మరో అర డజను మంది నేతలు చేరి ఈ కమీషన్ల దందాను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. మా వాళ్లను నాలుగురాళ్లు వెనకేసుకోనివ్వండి! చివరకు జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కూడా విడిచిపెట్టలేదంటున్నారు. తప్పుడు మస్తర్లు వేయించుకుని, తమ పార్టీ వారికి బయోమెట్రిక్ వేయించి, పనిచేయకుండా పంపించేసి దగ్గరుండి వేతనాలు ఇప్పిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కరప ఫీల్డ్ అసిస్టెంట్ వాసంశెట్టి రాముకు ప్రభుత్వ ఉద్యోగం రావడంతో ఆ పోస్టును వదులుకున్నారు. ఈ పోస్టులో జనసేన నాయకుడు తన సోదరుడిని జాబ్ కార్డు లేకున్నా వేయించుకున్నారు. పనులను పార్టీ పక్షపాతంతో జనసేన సానుభూతిపరులకే ఇస్తున్నారు. ద్వితీయ శ్రేణి నేతల వేధింపులు, బెదిరింపులు భరించలేకున్నామని ముఖ్యనేత వద్దకు వెళుతుంటే వారికి వకాల్తా పుచ్చుకుని మాట్లాడుతుండటంపై జనం మండిపడుతున్నారు. ‘పాపం మా వాళ్లు ఆరేళ్లుగా డబ్బు ఖర్చు పెట్టి, కష్టపడుతున్నారు. ఇప్పుడే కదా అవకాశం వచ్చింది. నాలుగురాళ్లు వెనకేసుకోనివ్వండి’ అంటూ ముఖ్యనేత సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఈ తరహా అక్రమ కార్యకలాపాలపై పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ గతంలో ఒకసారి ముఖ్యనేతకు గట్టి హెచ్చరిక చేశారనే ప్రచారం విస్తృతంగా జరిగింది. అయినా ఎక్కడా మార్పు మాత్రం కనిపించడం లేదని ఆ పార్టీలోనే చర్చ నడుస్తోంది. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో వింత పోకడ యథేచ్ఛగా ద్వితీయ శ్రేణి నేతల దందా ప్రతి పనికి ముట్టజెప్పాల్సిందే నానాజీ మనుషులమంటూ ఆగడాలు గతంలో జనసేన అధినేత పవన్ పిలిచి చీవాట్లు అయినా తీరు మార్చుకోని ముఖ్యనేత భయపడుతున్న అధికారులు మండల కేంద్రం కరప గ్రామ పంచాయతీలో బాగా మేతకు అలవాటు పడ్డ నేత అక్కడే తిష్టవేసి తన ఆదేశాలు పాటించాల్సిందేనని స్థానిక అధికారులకు బెదిరిస్తున్నాడు. తన అనుమతి లేకుండా ఒక్క పనిచేసినా చూస్తూ ఊరుకోనంటూ హెచ్చరిస్తుండటంతో అధికారులు భయపడుతున్నారు. ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడిని తన మాట కాదంటే బయట మండలాలకు వెళ్లడానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరికలు చేస్తున్నాడు. దాదాపు కూటమి నేతలందరిదీ ఇదే తీరుగా కనిపిస్తోంది. ఈ వేధింపులు భరించలేక పెనుగుదురు గ్రామ సచివాలయ ఉద్యోగి ఒకరు పెదపూడి మండలానికి బదిలీ చేయించుకుని వెళ్లిపోయారు. అప్పటికే ఆయన ముఖ్య నేతకు రూ.2 లక్షలు ఇచ్చి బదిలీ లేకుండా ఆ స్థానంలో కొనసాగుతున్నారు. అయితే మండల నేత కమీషన్ల దందాకు భయపడి బదిలీపై వెళ్లిపోవడం తప్ప ఆయనకు మరో మార్గం లేకపోయింది. -
అన్నవరం.. భక్త జన సాగరం!
అన్నవరం: కార్తిక పౌర్ణిమ సందర్భంగా బుధవారం నిర్వహించిన సత్యదేవుని గిరి ప్రదక్షిణలో పాల్గొన్న లక్షలాది మంది భక్తులతో అన్నవరం కిక్కిరిసిపోయింది. ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఎక్కడ చూసినా జనమే. ఉదయం ఎనిమిది గంటలకు పల్లకీ మీద, మధ్యాహ్నం రెండు గంటలకు సత్యరథం మీద సాగిన ఈ గిరి ప్రదక్షిణలో రెండు లక్షలకు పైగా భక్తులు పాల్గొన్నారని అంచనా. ఉదయం పల్లకీ మీద, మధ్యాహ్నం ప్రచార రథంపై సత్యదేవుని గిరి ప్రదక్షిణ నిర్వహించారు. ఇసుకేస్తే రాలని విధంగా భక్తులు తరలి రావడంతో అన్నవరం మెయిన్‌రోడ్డుపై గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అయింది. దేవుడే కొండ దిగి వచ్చిన వేళ... తన చెంతకు రాలేని భక్తులకు, రత్నగిరి, సత్యగిరులపై వృక్షాలు, పక్షులకు దర్శన భాగ్యం కల్పించేందుకు సత్యదేవుడు కొండ దిగివచ్చిన వేళ అది. సత్యదేవుడు, దేవేరి అనంతలక్ష్మీ సత్యవతీ అమ్మవారితో కలిసి లక్ష లాది మంది భక్తజనం వెంట రాగా పంపానది తీరం వెంబడి సాగిన గిరి ప్రదక్షిణ నభూతో నభవిష్యతి అన్నట్టుగా సాగింది. భక్తులు సత్యనారాయణ, లక్ష్మీనారాయణ అంటూ స్వామివారి నామం జపిస్తూ 8.5 కిలోమీటర్లు మేర సాగిన గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. ఉదయం ఆరు గంటల నుంచి భక్తులు తొలిపాంచాకు చేరుకోవడంతో అక్కడ తీవ్ర రద్దీ ఏర్పడింది. ఉదయం ఏడు గంటలకు సత్యదేవుడు అమ్మవార్లను మేళతాళాల మధ్య రత్నగిరి నుంచి కొండదిగువన గల తొలిపాంచా వద్దకు ఊరేగింపుగా తీసుకువచ్చారు. స్వామి, అమ్మవార్లకు పండితులు ప్రత్యేక పూజలు చేసి పల్లకీ మీద ప్రతిష్ఠించారు. ఉదయం 8–30 గంటలకు ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ, ఆలయ చైర్మన్ ఐవీ రోహిత్, గిరి ప్రదక్షిణ ప్రత్యేకాధికారి వీ త్రినాథరావు, ఈఓ వీర్ల సుబ్బారావు కొబ్బరికాయలు కొట్టి గిరి ప్రదక్షిణ ప్రారంభించారు. భజనలు, కోలాట నృత్యాలు, మహిళల భక్తి గీతాల నడుమ సత్యరథంతో గిరి ప్రదక్షిణ సాగింది. ఉదయం పల్లకీలో.. అన్నవరం మెయిన్ రోడ్డు మీదుగా బెండపూడి సమీపంలోని పుష్కర కాల్వ వద్దకు ఉదయం తొమ్మిది గంటలకు పల్లకీ చేరింది. అక్కడ భక్తులు ఘనంగా స్వాగతం పలికారు. అక్కడి నుంచి పుష్కర కాల్వ వెంబడి పంపా తీరం వరకూ గిరి ప్రదక్షిణ సాగింది. మధ్యలో మూడుచోట్ల స్వామి, అమ్మవార్లకు భక్తులు స్వాగతం పలికారు. ఆ ప్రదేశాలలో స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు పూజలు చేశారు. మధ్యాహ్నం సత్యరథంపై.. సత్యరథంపై మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభమైన గిరి ప్రదక్షిణ సాయంత్రం మూడు గంటలకు బెండపూడి ఆర్చి వద్దకు చేరింది. ఆ తరువాత పుష్కర కాల్వ వెంబడి సాగింది. పంపా ఘాట్‌కు సాయంత్రం ఆరు గంటలకు చేరింది. అక్కడ పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఊరేగింపుగా స్వామి అమ్మవార్లను రత్నగిరికి చేర్చారు. గిరి ప్రదక్షిణలో జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, నర్సాపురం పార్లమెంటరీ వైఎస్సార్ సీపీ పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు పాల్గొన్నారు. ఆలయ వేద పండితులు గొల్లపల్లి ఘనపాఠీ, యనమండ్ర శర్మ, గంగాధరబట్ల గంగబాబు, ముష్టి పురుషోత్తం అవధాని, చిట్టి శివ ఘనపాఠీ, సంతోష్ ఘనపాఠీ, ప్రధానార్చకులు ఇంద్రగంటి నర్శింహమూర్తి, కోట సుబ్రహ్మణ్యం కార్యక్రమం నిర్వహించారు. గిరి ప్రదక్షిణను ప్రారంభించిన ఎమ్మెల్యే సత్యప్రభ. చిత్రంలో చైర్మన్ రోహిత్, ఆర్జేసీ త్రినాథరావు, ఈఓ సుబ్బారావు, ప్రత్తిపాడు సీఐ సూర్యఅప్పారావు సత్యరథంతో గిరి ప్రదక్షిణలో పాల్గొన్న అధికారులు భక్తుల రద్దీ కారణంగా జాతీయ రహదారిపై నిలిచిపోయిన వాహనాలు నభూతో నభవిష్యతి అన్నట్టు సాగిన సత్యదేవుని గిరి ప్రదక్షిణ పాల్గొన్న రెండు లక్షల మందికి పైగా భక్తులు ఉదయం పల్లకీపై, మధ్యాహ్నం ప్రచార రథంపై రెండుసార్లు నిర్వహించినా తరగని జనం జాతీయ రహదారిపై పలుమార్లు ట్రాఫిక్ జామ్ -
డీఎం అండ్ హెచ్‌వో వెంకటేశ్వరరావు
ప్రకృతిని సంరక్షిస్తే జీవితం సురక్షితం రాజమహేంద్రవరం రూరల్: ప్రకృతిని సంరక్షించడం ద్వారా మానవ జీవితం సురక్షితమవుతుందని, చెట్లు నాటడం జీవ రక్షణకు దారి తీస్తుందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ కె.వెంకటేశ్వరరావు అన్నారు. బుధవారం ‘‘వరల్డ్ వన్ హెల్త్ డే’’ పురస్కరించుకొని బొమ్మూరులోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి కార్యాలయంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 9వ తేదీన ‘‘వన్ హెల్త్’’ వారోత్సవ కార్యక్రమాలు జిల్లాలో నిర్వహిస్తున్నామన్నారు. ఆరోగ్యం మహాభాగ్యం. ఒకరి ఆరోగ్యాన్ని కాపాడితే, సమాజంలోని ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని కాపాడినట్టే అవుతుందన్నారు. ప్రకృతిని కాపాడినప్పుడే స్వచ్ఛమైన గాలి, నీరు, ఆహారం సాధ్యమవుతుందన్నారు. వ్యాయామం, యోగా మన ఆరోగ్యానికి మూలాధారమని ఆయన తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి పౌరుడు తన వంతు పాత్ర పోషించాలన్నారు.‘‘వన్ వరల్డ్ హెల్త్ డే’’ సందర్భంగా ప్రజల్లో సామాజిక ఆరోగ్య అవగాహన పెంపొందించడం, పర్యావరణ పరిరక్షణపై చైతన్యం కల్పించడం ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జ్ జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ షమ్మీకుమార్, డీపీఎంయూ డాక్టర్ శ్రీవల్లి, సూపరింటెండెంట్ స్టాలిన్, సి.సి. రాజు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. -
మూడు చక్రాల వాహనాల మంజూరు దరఖాస్తుల ఆహ్వానం
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): కాకినాడ జిల్లాలోని విభిన్న ప్రతిభావంతులైన వారికి నియోజకవర్గానికి 10 చొప్పున మూడు చక్రాల మోటారు వాహనాల మంజూరుకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విభిన్న ప్రతిభావంతుల సహాయ సంస్థ సహాయ సంచాలకులు ఏవై శ్రీనివాస్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా ఈనెల 25వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. 18 సంవత్సరాల పైబడి 45 సంవత్సరాలలోపు వారు అర్హులన్నారు. కుటుంబ వార్షిక ఆదాయం గరిష్టంగా రూ.3 లక్షల కంటే ఎక్కువ ఉండకూడదన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలన్నారు. అభ్యర్థి గతంలో ప్రభుత్వం, ప్రభుత్వ ఏజెన్సీ, ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా వాహనం పొంది ఉండకూడదన్నారు. క్యాన్సర్ బ్లాక్ నిర్మాణానికి రూ.50 లక్షల విరాళం బాలాజీచెరువు (కాకినాడ సిటీ): కాకినాడలో అత్యాధునిక సౌకర్యాలతో ఏర్పాటవుతున్న క్యాన్సర్ బ్లాక్‌కు రూ.50 లక్షల విరాళాన్ని కాకినాడకు చెందిన ప్రవాస భారతీయులు ముత్యాల సీత, కుటుంబ సభ్యులు ప్రకటించారు. కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆస్పత్రికి అనుబంధంగా అత్యాధునిక క్యాన్సర్ వైద్యాన్ని అందించే లక్ష్యంతో ప్రభుత్వ ఐటీఐ వెనుక క్యాన్సర్ బ్లాక్ నిర్మిస్తున్నారు. రెడ్‌క్రాస్ క్యాన్సర్ బ్లాక్‌కు అమెరికాలో స్థిరపడిన ముత్యాల భాస్కరరావు భార్య సీత, కుటుంబ సభ్యులు ఈ విరాళాన్ని ప్రకటించారు. ఈ బ్లాక్‌ను రూ.7.08 కోట్లతో నిర్మిస్తున్నారు. విరాళాన్ని ప్రకటించి పేదలకు అత్యంత ఖరీదైన క్యాన్సర్ వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి చేయూతనందిస్తోన్న ముత్యాల కుటుంబానికి కలెక్టర్ షన్మోహన్ సగిలి, రెడ్‌క్రాస్ రాష్ట్ర చైర్మన్ వైడీ రామారావు కృతజ్ఞతలు తెలిపారు. మండపేటను ‘తూర్పు’లో కలపాలి కపిలేశ్వరపురం (మండపేట): జిల్లా పరిధిలో ఉన్న మండపేట నియోజకవర్గాన్ని తూర్పుగోదావరి జిల్లాలో విలీనం చేయాలంటూ జేఏసీ నాయకులు బుధవారం కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్‌ను కోరారు. ఏడిద గ్రామ పర్యటనకు వచ్చిన కలెక్టర్‌కు ఆ మేరకు వినతి పత్రాన్ని అందజేశారు. జేఈసీ చైర్మన్ కామన ప్రభాకరరావు, మున్సిపల్ చైర్పర్సన్ పతివాడ నూక దుర్గారాణి, దళిత నాయకుడు ధూళి జయరాజు, బీజేపీ నాయకుడు కోన సత్యనారాయణ, సీఐటీయూ జిల్లా కార్యదర్శి కె.కృష్ణవేణి తదితరులు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ తమ డిమాండ్‌కు సానుకూలంగా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని కోరారు. -
9,800 వ్రతాల నిర్వహణ
అన్నవరం : కార్తిక పౌర్ణిమ పర్వదినం సందర్బంగా బుధవారం రత్నగిరి సత్యదేవుని ఆలయానికి భక్తులు లక్షలాదిగా తరలివచ్చారు. దేవస్థానం ఘాట్‌రోడ్లు, మల్టీ లెవిల్ పార్కింగ్ స్థలాలు కార్లతో నిండిపోయాయి. రికార్డు స్థాయిలో సుమారు లక్ష మంది భక్తులు సత్యదేవుని దర్శించారని అధికారులు అంచనా వేశారు. స్వామివారి వ్రతాలు రికార్డు స్థాయిలో 9,800 జరిగాయి. వ్రతాల ద్వారా సుమారు రూ.60 లక్షలు, మిగిలిన విభాగాల ద్వారా రూ.40 లక్షలు వచ్చిందని అంచనా. మంగళవారం రాత్రికే సుమారు 30 వేల మంది భక్తులు రత్నగిరికి చేరుకోవడంతో స్వామివారి ఆలయాన్ని బుధవారం తెల్లవారుజామున ఒంటిగంటకు తెరచి వ్రతాలు ప్రారంభించారు. రెండు గంటల నుంచి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించారు. సాయంత్రం ఆరు గంటల వరకు స్వామివారి వ్రత మండపాలు, నిత్య కల్యాణ మండపం, పాత కల్యాణ మండపాలు అన్నీ వ్రతాలాచరించే భక్తులతో నిండిపోయాయి. అంతరాలయ దర్శనం టిక్కెట్ తీసుకున్న భక్తులను కూడా వెలుపల నుంచే దర్శనానికి అనుమతించారు. తూర్పు రాజగోపురం ఎదురుగా గల రావిచెట్టు వద్ద, ఆలయ ప్రాంగణంలో, ధ్వజస్తంభం వద్ద ఏర్పాటు చేసిన ర్యాకులలో భక్తులు జ్యోతులు వెలిగించారు. -
ఆకలితో 'అల'మట..
‘సముద్రపు అలలపై బతుకు నావ ఎదురీత. ఆటుపోట్లు దాటుకుంటూ అలుపెరగని సుదీర్ఘ సాహస యాత్ర. కుటుంబ పోషణ కోసం ప్రాణాలొడ్డి మత్స్యకారుల చేపల వేట. వలకు పరిగె చిక్కితేనే బువ్వ దక్కేది. దినదినగండం నూరేళ్ల ఆయుష్షు.. ఇదీ మత్స్యకారుల జీవన చిత్రం’ – ఉప్పాడ నుంచి సాక్షి ప్రతినిధి యిర్రింకి ఉమామహేశ్వరరావుతుపాను గండం దాటినా కష్టాల సుడిగుండంలోనే కొట్టుమిట్టాడుతున్న మత్స్యకారుల జీవనం ఒడ్డున పడ్డ చేపలా తయారైంది. జగన్ ప్రభుత్వ హయాంలో ఉన్న భరోసా తమకు ఇప్పుడు లభించడంలేదని మత్స్యకారులు పేర్కొంటున్నారు. తుపాను ప్రభావంతో రూ.83.21 లక్షల విలువైన 486 బోట్లు, వలలు దెబ్బతిన్నట్టు అధికారిక అంచనా. వాస్తవానికి సముద్రంలోని చేపల వేటనే నమ్ముకుని బతికే 8.50 లక్షల మంది జీవనాన్ని తుపాను అతలాకుతలం చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు చేపల వేట నిషేధం కొనసాగింది. ఆ తర్వాత అరకొరగా వేట కొనసాగినా.. ఇటీవల వర్షాలు, తుపాన్ల దెబ్బకు పూర్తిగా ఆగిపోయింది. తుపాన్ గండం దాటిపోవడంతో రెండు రోజులుగా సముద్రంలోకి వేటకు వెళ్తున్న మత్స్యకారులకు పరిగె కూడా పడటం లేదని వాపోతున్నారు. ‘అప్పులు తీరే మార్గంలేదు. కుటుంబం గడిచే పరిస్థితి లేదు. ఎట్టా బతికేది.’ అంటూ మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. ఉప్పాడ ప్రాంతంలో ఉపాధి కోల్పోయిన ఏడు వేల కుటుంబాలుఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలోని ఉప్పాడ ప్రాంతంలో సుమారు ఏడు వేల మత్స్యకార కుటుంబాలు ఉపాధి కోల్పోయి తీవ్ర ఆవేదనలో మునిగిపోయాయి. ఉప్పాడ గ్రామంలోని మత్స్యకార ఇళ్లు సముద్ర కోతకు గురై కూలిపోతున్నా, ప్రభుత్వం ఆదుకునే చర్యలు చేపట్టడంలేదు. తమ ఉపాధిని, ఊరిని కాపాడాలని సెప్టెంబర్ 23, 24 తేదీల్లో ఉప్పాడ మత్స్యకారులు ఆందోళనకు దిగి పవన్‌కు అక్టోబర్ 10వ తేదీ వరకు డెడ్‌లైన్ పెట్టారు. దీంతో ఆ ప్రాంతానికి వెళ్లిన పవన్ ‘వంద రోజుల్లో సమస్యలు పరిష్కరిస్తానని’ హామీ ఇచ్చారు. తాజా తుపాను వల్ల మరింత కష్టాల్లో చిక్కుకున్న తమను పవన్ కనీసం పలకరించి భరోసా ఇవ్వకపోవడంపై మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెరుగుతున్న అప్పులు.. తరుగుతున్న ఆదాయం‘జగన్ మాకు ఇంటి స్థలం ఇచ్చారు. సాయం అందించారు’ అని పిఠాపురం నియోజకవర్గంలోని సుబ్బంపేటకు చెందిన సూరాడ చిన కోదండం గుర్తుచేసుకుంటూ, ఇప్పుడు అంతటి భరోసా ప్రభుత్వం నుంచి లభించడంలేదని పేర్కొన్నాడు. ‘తీసుకున్న డ్వాక్రా రుణానికి నెలకు రూ.6 వేలు, ప్రైవేట్ అప్పుల వాళ్లకు రూ.5 వేలు, ఇల్లు గడవడానికి మరో రూ.10 వేలు కలిపి కనీసం రూ.20 వేలకుపైగా అవసరమవుతోంది. ఆదాయం లేదు. దిక్కుతోచడం లేదు’’ అని కోదండం పేర్కొన్నారు.వృత్తి రక్షణకు సహకరించాలిఉప్పాడతోపాటు సమీప గ్రామాలకు చెందిన దాదాపు 900 బోట్లపై చేపల వేటతో ఏడు వేలకుపైగా కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. ప్రభుత్వం చేపల వేటపై రెండు నెలలు నిషేధం విధించింది. ఇప్పుడు వరుసగా వర్షాలు, తుపాన్లతో ఉపాధి కోల్పోయాం. ప్రభుత్వం ఆర్థిక సాయం అందించడంతోపాటు మా వృత్తి రక్షణకు సహకరించాలి. – ఎస్.సింహాద్రి, ఉప్పాడచేప చిక్కకపోతే పస్తులే..చేపలు చిక్కకపోతే పస్తులు ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంతకంటే మాకు వేరే వృత్తి తెలియదు. ప్రభుత్వం నిత్యావసర సరుకులతోపాటు ఆర్థిక సాయం కూడా చేయాలి. మమ్మల్ని ఆదుకోవడంతోపాటు మా బతుకుదెరువును కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. – పుట్టా అప్పలరావు, ఉప్పాడఆక్వా రంగానికి ‘జగన్’ ఆక్సిజన్వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో రాష్ట్రంలోని మత్స్యకారులకు భరోసా ఇవ్వడంతోపాటు ఆక్వా రంగానికి ఆక్సిజన్ అందించారు. మత్స్యకార భరోసా పెంచారు. బోట్లకు డీజిల్ సబ్సిడీ పెంచారు. నవరత్నాల ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించి అండగా నిలిచారు. కరోనా కష్టకాలంలోను మత్స్యకారులను ఆదుకున్నారు. రాష్ట్రంలో ఆక్వా రంగానికి విద్యుత్ సబ్సిడీ, ధరలు దక్కేలా చేయడం, మార్కెటింగ్ వంటి విషయాల్లో చేపలు, రొయ్యల రైతులకు జగన్ అండగా నిలిచారు. – వడ్డి రఘురామ్, మాజీ వైస్ చైర్మన్, ఏపీ ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథారిటీఅందరికీ సాయం అందించాలిమోంథాకు రాష్ట్రంలో మత్స్యకారులందరూ ఉపాధి కోల్పోయారు. కాగా కేవలం 23 వేల మందికి మాత్రమే 50 కిలోల బియ్యం, నిత్యావసరాలు ప్రభుత్వం అందిస్తోంది. మిగిలిన అందరికీ నిత్యావసరాలు, ఆర్థిక సాయం అందాలి. చేపలు అమ్ముకుని జీవించే మహిళలకు కూడా సాయం అందించాలి.– అర్జిల్లి దాసు, జాతీయ మత్స్యకార సంఘాల సమాఖ్య ప్రధాన కార్యదర్శిగంగ పుత్రులకు వైఎస్సార్సీపీ ప్రభుత్వ అండ..వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జగన్ ఐదేళ్లపాటు రాష్ట్రంలోని గంగపుత్రులకు కొండంత అండగా నిలిచి భరోసా కల్పించారు. మత్స్యకార భరోసా (వేట నిషేధ భృతి)తోపాటు ఆయిల్ సబ్సిడీ పెంపు, నవరత్నాలు ద్వారా అనేక సంక్షేమ పథకాలు (డీబీటీ), (నాన్–డీబీటీ)తో వారు ఆర్థికంగాను, సామాజికంగాను, రాజకీయంగాను నిలదొక్కుకునేలా చేశారు. జగన్ కృషితో రాష్ట్రంలో వేటకు వెళ్లే బోట్ల సంఖ్యే కాకుండా.. వేటపై ఆధారపడి జీవనోపాధి పొందే వారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. కొన్ని కీలక అంశాలు పరిశీలిస్తే..» ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మత్స్యకార భరోసా (వేట నిషేధ భృతి)ని రూ.4 వేల నుంచి రూ.10 వేలకు పెంచడంతోపాటు నిషేధ సమయం ప్రారంభంలోనే నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేశారు.» మెకనైజ్డ్, మోటరైజ్డ్ బోట్లకే కాదు..తెప్పలు ఇతర సంప్రదాయ నావలపై వేట సాగించే వారికి సైతం ఈ సాయాన్ని అందించారు. » గత టీడీపీ పాలనలో ఏటా సగటున 60 వేల మంది లబ్ధి పొందితే వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 1.16 లక్షల మంది లబ్ధి పొందారు» ఆయిల్ సబ్సిడీగా గత టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో రూ.59.42కోట్లు ఇస్తే.. వైఎస్సార్సీపీ హయాంలో రూ.148.04కోట్లు ఇచ్చారు.» 50 ఏళ్లు పైబడిన మత్స్యకారులకు ఇస్తోన్న పింఛన్ గత టీడీపీ హయాం (2014–15)లో 42,729 మందికి వర్తింపచేయగా వైఎస్సార్సీపీ హయాంలో 2023–24లో 69,741 మందికి ఇచ్చారు. గత టీడీపీ హయాంలో పింఛన్ కోసం రూ.51.57 కోట్లు ఖర్చు చేయగా, వైఎస్సార్సీపీ రూ.759.47 కోట్లు ఖర్చు చేసింది.» మత్స్యకార భరోసాకు గత టీడీపీ పాలనలో రూ.104.62కోట్లు ఇస్తే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఐదేళ్లలో రూ. 538.01 కోట్లు ఇచ్చింది. » గత టీడీపీ ప్రభుత్వం డీజిల్‌పై లీటర్‌కు రూ. 6.03 చొప్పున సబ్సిడీ ఇవ్వగా, దాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వం రూ.9కి పెంచింది.» వేటకు వెళ్లే ముందు ఆయిల్ నింపేటప్పుడేసబ్సిడీని మినహాయించుకుని చెల్లించే వెసులుబాటును కల్పించారు.» గతంలో 1,100 బోట్లకు మించి ఆయిల్ సబ్సిడీని వర్తింప చేసిన దాఖలాలు లేవు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో తెప్పలు, నావలతో సహా ఆయిల్ సబ్సిడీని సద్వినియోగం చేసుకున్న బోట్ల సంఖ్య ఏకంగా 23,209కి చేరింది.» చేపల వేట సమయంలో ప్రమాదవశాత్తు మృతి చెందిన మత్స్యకారుల కుటుంబాలకు గత టీడీపీ హయాంలో తొలి ఏడాది రూ.2 లక్షల చొప్పున పరిహారం ఇవ్వగా, ఆ తర్వాత దాన్ని రూ.5 లక్షలకు పెంచారు. ఇలా బాబు హయాంలో 300 మంది వేటకు వెళ్లి మృతి చెందితే కేవలం రూ.11.43 కోట్ల పరిహారం మాత్రమే ఇచ్చారు. ఈ పరిహారాన్ని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచిన వైఎస్ జగన్ ప్రభుత్వం ఐదేళ్లలో 175 మందికి ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున రూ.16.87 కోట్ల పరిహారాన్ని అందజేసింది.» జీఎస్పీసీ పైపులైన్ నిర్మాణం వల్ల డాక్టర్ కోనసీమ అంబేడ్కర్ జిల్లాలో జీవనోపాధి కోల్పోయిన 16,554 మంది మత్స్యకార కుటుంబాలకు రూ.78.22కోట్లు, ఓఎన్జీసీ పైపులైన్ తవ్వకాల వల్ల జీవనోపాధి కోల్పోయిన 23,458 మంది కుటుంబాలకు ఐదు విడతల్లో రూ.647.44 కోట్లు సాయాన్ని ప్రభుత్వం అందించింది.» వివిధ పథకాల ద్వారా ఐదేళ్లలో జగన్ ప్రభుత్వం రూ.4,913 కోట్ల లబ్ధిని నేరుగా మత్స్యకారులకు అందించింది.జీవన ఆటు'బోట్లు'555 రాష్ట్రంలోని మత్స్యకార గ్రామాలు 2.50 లక్షలు:సముద్రంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు8.50 లక్షలు:సముద్రంలో చేపలవేటపై ఆధారపడి జీవించేవారురూ.20 లక్షలు: బోటు కనీస విలువరూ.5 లక్షలు: బోటులోని వల విలువరూ.1.50 లక్షలు:బోటుపై ఒక్కసారి వేటకు వెళితే అందులోకి బోటుకు డీజిల్, బియ్యం, సరుకుల వ్యయంరూ.20 లక్షలు: బోటులో వెళ్లే ఎనిమిది మందికి ముందస్తు పెట్టుబడి కింద యజమానికి ఇచ్చేది -
వైఎస్సార్సీపీ నేత గొల్లపల్లి సూర్యారావుకు గుండెపోటు
సాక్షి, కోనసీమ జిల్లా: మాజీ మంత్రి, రాజోలు వైఎస్సార్సీపీ ఇంఛార్జ్ గొల్లపల్లి సూర్యారావు గుండెపోటుకు గురయ్యారు. ఆయాన్ని అమలాపురం కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. స్టంట్ వేసిన వైద్యులు.. గొల్లపల్లి ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. రాజోలులో పార్టీ కార్యక్రమాలకు వెళ్తుండగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హుటాహుటిన అమలాపురం కిమ్స్‌కు తరలించి ఆయనకు వైద్యం అందించారు. -
కోనసీమ: బాలిక మృతిపై అనుమానాలు
సాక్షి, కోనసీమ జిల్లా: రామచంద్రాపురంలో పదేళ్ల బాలిక రంజిత మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతిపై బాలిక తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంటి ఓనర్ కుమారుడు జకీర్‌పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జకీర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో ఫుటేజ్ దొరకలేదు.బాలిక మృతి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఐదో తరగతి చదువుతున్న 11 ఏళ్ల రంజిత ఇంట్లో ఎవరు లేని సమయంలో చున్నీతో ఫ్యాన్‌కి ఉరిపోసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఉదయం స్కూలుకు వెళ్లిన బాలిక.. సాయంత్రం ఆత్మహత్యకు పాల్పడటంపై అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. బాలికలు ఎవరైనా హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారేమోనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కేసు నమోదు చేసిన రామచంద్రాపురం పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.బాలిక తల్లి సునీత స్థానిక ఏరియా ఆసుపత్రిలో స్టాఫ్ నర్సుగా పని చేస్తుండగా, తండ్రి రాజు ముంబైలో మెరైన్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. దంపతులకు రంజిత చిన్న కుమార్తె కాగా, నవోదయాలో పెద్దకుమార్తె తొమ్మిదో తరగతి చదువుతోంది. కాకినాడలో ఉన్న బంధువులు వద్దకెళ్లిన తల్లి.. ఆమె వచ్చేసరికి ఈ ఘటన చోటుచేసుకుంది. బాలికను ఎవరైనా హత్య చేశారా? అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. -
భక్తజన సంద్రమైన రత్నగిరి
అన్నవరం: రత్నగిరి మంగళవారం సాయంత్రం నుంచి భక్తజన సంద్రంగా మారింది. బుధవారం కార్తిక పౌర్ణమి కావడంతో సత్యదేవుని దర్శించేందుకు వేలాదిగా భక్తులు మంగళవారం సాయంత్రం నుంచే రత్నగిరికి తరలి రావడం ప్రారంభించారు. హైదరాబాద్, విజయవాడ తదితర ప్రాంతాల నుంచి వచ్చిన పలు రైళ్ల నుంచి వేలాది మంది భక్తులు అన్నవరం రైల్వే స్టేషన్లో దిగారు. దీంతో, స్టేషన్ ఆవరణంతా కిటకిటలాడింది. వీరందరూ దేవస్థానం బస్సులు, ఆటోల్లో రత్నగిరికి చేరుకున్నారు. రాత్రి 9 గంటల సమయానికి రత్నగిరికి సుమారు 25 వేల మంది చేరుకున్నారు. ఇంకా బుధవారం తెల్లవారుజామున వచ్చే రైళ్లు, బస్సులతో పాటు ప్రైవేటు వాహనాల్లో భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో వీరి సంఖ్య సుమారు లక్షకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. రద్దీని తట్టుకునేందుకు వీలుగా సత్యదేవుని ఆలయాన్ని వేకువజామున ఒంటి గంటకే తెరచి, వ్రతాల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. దాదాపు ఆ సమయం నుంచే స్వామివారి దర్శనాలకు కూడా భక్తులను అనుమతించాలని నిర్ణయించారు. వ్రత మండపాలతో పాటు నిత్య కల్యాణ మండపంలో కూడా వ్రతాలు నిర్వహించనున్నారు. ఆలయ ప్రాంగణంలో తొక్కిసలాట జరగకుండా ఉండేందుకు పశ్చిమ రాజగోపురం వద్ద కంపార్టుమెంట్ల ద్వారా భక్తులను క్రమపద్ధతిలో స్వామివారి దర్శనానికి అనుమతించనున్నారు. రావిచెట్టు వద్ద జ్యోతులు వెలిగించే మహిళల కోసం ఇనుప ర్యాకులు ఏర్పాటు చేశారు. వీటిని వాడపల్లి ఆలయం నుంచి తీసుకు వచ్చారు. దేవస్థానంలో ఏర్పాట్లను ఆర్జేసీ త్రినాథరావు, దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ సుబ్బారావు, డిప్యూటీ కమిషనర్ రమేష్‌బాబు, లోవ, వాడపల్లి దేవస్థానాల ఈఓలు విశ్వనాథరాజు, సూర్యచక్రధరరావు పర్యవేక్షిస్తున్నారు. సత్యదేవుని మంగళవారం సుమారు 30 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. వ్రతాలు 1,500 జరిగాయి. సుమారు 5 వేల మందికి పులిహోర, దధ్యోదనం పంపిణీ చేశారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.30 లక్షల ఆదాయం సమకూరింది. -
టెట్ నిబంధన సరికాదు
డీఎస్సీ అమలు చేసిన నాటి నుంచి కాకుండా మధ్యలో ఇలాంటి నిబంధన తెర పైకి తీసుకురావడం సరైంది కాదు. దీనివల్ల నాటి ఉపాధ్యాయులు ఇబ్బందులకు గురవుతారు. 20 నుంచి 30 ఏళ్లుగా ఒకే కేడర్‌లో పని చేసి, చివరి దశలో ఉద్యోగోన్నతి వస్తుందనే ఆశతో ఎదురు చూస్తున్న సీనియర్ టీచర్ల ఆశలపై నీళ్లు జల్లే ప్రయత్నమే ఇది. దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. దీనిపై కూటమి ప్రభుత్వం స్పందించి టీచర్లకు న్యాయం చేయాలి. – ఎన్ఎస్ఎస్ వెంకటేశ్వరరావు, ఎస్టీయూ రాష్ట్ర కమిటీ సభ్యుడు రద్దు చేయాలి ఉద్యోగోన్నతులకు తప్పనిసరిగా టెట్ ఉత్తీర్ణత ఉండాలనే నిబంధన సరి కాదు. కూటమి ప్రభుత్వం టెట్ నోటిఫికేషన్ జారీ చేస్తే చాలా మంది సీనియర్ టీచర్లకు అన్యాయం జరుగుతుంది. టెట్ రాయాలంటే 45 ఏళ్లలోపు ఉండాలన్న నిబంధన ఉంది. సర్వీసులో ఉన్న చాలా మంది టీచర్లు ఉద్యోగ విరమణకు సైతం సమీపంలో ఉన్నారు. ఈ వయస్సులో అలాంటి వారు టెట్ రాసి అర్హత సాధించడం ఎలాగని ప్రశ్నిస్తున్నాం. టెట్ నిబంధనను రద్దు చేయాలి. – కుసుమంచి కాశీ విశ్వనాథ్, ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రభుత్వం దృష్టి సారించాలి ఈ సమస్యపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించాలి. 2010 కంటే ముందు టీచర్లుగా నియమితులైన వారు టెట్ ఉత్తీర్ణత సాధించాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం స్పందించి, న్యాయం చేయాలి. రెండు మూడు దశాబ్దాలుగా పని చేస్తున్న టీచర్లు వృత్తిపరంగా ఎప్పటికప్పుడు అనేక శిక్షణలు పొందుతూనే ఉన్నారు. అందువల్ల టెట్ ఉత్తీర్ణత సాధించాలన్న నిబంధన సరైంది కాదు. – ఎం.శ్రీనివాస్, ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు తాత్కాలిక మినహాయింపు ఇవ్వొచ్చు విద్యాహక్కు చట్టం సెక్షన్–23(2) ప్రకారం టెట్ నుంచి తాత్కాలిక మినహాయింపు ఇచ్చే వెసులుబాటు ఉంది. ఎన్సీటీఈ నోటిఫికేషన్ కంటే ముందు జారీ చేసిన డీఎస్సీలలో నియమించిన వారు సర్వీసులో కొనసాగడానికి, ఉద్యోగోన్నతి పొందడానికి మినహాయింపు ఇవ్వాలి. సుప్రీం తీర్పు ప్రకారం రెండేళ్లల్లో టెట్ ఉత్తీర్ణత సాధించడం సాధ్యం కాదు. – బి.నూకరాజు, పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి -
ఠాట్.. వీల్లేదు
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్న చందంగా ఉంది ప్రభుత్వ ఉపాధ్యాయుల పరిస్థితి. ప్రస్తుతం సర్వీసు కొనసాగించాలన్నా, ఉద్యోగోన్నతి పొందాలన్నా వారు టీచర్ ఎలిజబిలిటీ టెస్ట్ (టెట్) ఉత్తీర్ణులు కావాల్సిందేనని ఇటీవల సుప్రీంకోర్టు కోర్టు తీర్పునిచ్చింది. దీనిపై వివిధ రాష్ట్రాలు రివ్యూ పిటిషన్ వేసేందుకు సిద్ధమవుతూండగా.. మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మాత్రం టెట్ నిర్వహణకు కసరత్తు చేస్తోంది. పైగా రెండేళ్లలోపు టెట్ పాస్ కావాలంటూ నిబంధన విధించారు. దీనిపై ఉపాధ్యాయుల్లో ఆందోళన నెలకొంది. విద్యా హక్కు చట్టం అమలులోకి వచ్చిన తర్వాత ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి కొన్ని మార్పులు చేపట్టారు. విద్యార్హతలతో పాటు వృత్తి సామర్థ్యాలను పరీక్షించి నాణ్యమైన అభ్యర్థులను ఎంపిక చేయాలనే ఉద్దేశంతో టెట్‌ను ప్రవేశపెట్టారు. ఎప్పుడో 20, 25 ఏళ్ల కిందట ఎంపికై న తమకు ఈ వయస్సులో టెట్ రాసి ఉత్తీర్ణత సాధించడం సాధ్యమవుతుందా అని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. పిల్లలకు పాఠాలు బోధించి, పరీక్షలు నిర్వహిస్తున్న తమకే ఇప్పుడు పరీక్షా కాలం ఎదురవుతోందని జిల్లాలోని టీచర్లు ఆవేదన చెందుతున్నారు. వారికి తప్పనిసరి జిల్లాల్లో 2010 నుంచి ఉపాధ్యాయ పోస్టులు సాధించిన వారందరూ టెట్ ఉత్తీర్ణత పొందినవారే. అంతకంటే ముందు డీఎస్సీలో మాత్రమే ప్రతిభ చూపి ఉపాధ్యాయ పోస్టులు పొందిన వారు జిల్లాలో దాదాపు 4 వేల మంది వరకూ ఉన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఐదేళ్ల లోపు ఉద్యోగ విరమణ పొందేవారు మినహా మిగతా వారందరూ 2027 ఆగస్టు 31 లోగా టెట్ ఉత్తీర్ణత సాధించాల్సి ఉంది. అలా జరగకపోతే ఉద్యోగం వదులుకోవాల్సిందేనని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. దీనిపై జిల్లాలోని వేలాది మంది టీచర్లు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. సర్వీసు నిబంధనల్లో లేకున్నా.. 2010 ఆగస్టు నాటికి సర్వీసులో ఉన్న టీచర్లకు టెట్ తప్పనిసరనే విషయం నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్సీటీఈ) నిబంధనల్లో ఎక్కడా లేదని ఉపాధ్యాయ నేతలు చెబుతున్నారు. అలాగే, రాష్ట్ర ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ సైతం వృత్తిలో ఉన్న టీచర్లు టెట్ అర్హత కలిగి ఉండాలనే ఉత్తర్వులు ఎక్కడా ఇవ్వలేదని స్పష్టం చేస్తున్నారు. దీనిని కేవలం ఉపాధ్యాయ వృత్తిలోకి రావాలనుకునే వారికి మాత్రమే వర్తింపజేయాలని చెబుతున్నారు. రివ్యూ పిటిషన్ వేయాలి టెట్ పరీక్షపై వేలాది మంది టీచర్లు ఆందోళన చెందుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. సుప్రీంకోర్టు తీర్పుపై పునఃసమీక్ష కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేయాలని వారు కోరుతున్నారు. ఈ మేరకు ఉపాధ్యాయ సంఘాల నాయకులు కూటమి ప్రజాప్రతినిధులకు వినతులు ఇచ్చినా ఏ మాత్రం స్పందన లేదు. ఉద్యోగోన్నతి పొందడానికి టెట్ నుంచి పూర్తి మినహాయింపు ఇచ్చేలా చట్ట సవరణ చేయాలని పలువురు కోరుతున్నారు. బోధన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని, ఉద్యోగంలో కొనసాగడానికి, 50 సంవత్సరాలు దాటిన వారికి ఉద్యోగోన్నతి పొందేందుకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని, ఉద్యోగోన్నతి తర్వాత టెట్ పాసవడానికి నాలుగేళ్ల సమయం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. పాథమిక పాఠశాలలు 933 ప్రాథమికోన్నత పాఠశాలలు 105 ఉన్నత పాఠశాలలు 247 మొత్తం 1,285 విధులు నిర్వహిస్తున్న టీచర్లు 7,150 ఫ సర్వీసులో ఉన్న టీచర్లు టెట్ రాయాల్సిందేనన్న ‘సుప్రీం’ ఫ ఆ దిశగా కూటమి సర్కారు కసరత్తు ఫ ఆందోళనలో ప్రభుత్వ ఉపాధ్యాయులుప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి సర్వీసులో ఉన్న టీచర్లు టెట్ ఉత్తీర్ణత సాధించాలన్న సుప్రీం తీర్పుపై కూటమి ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాలి. త్వరలోనే టెట్ నిర్వహణకు నోటిఫికేషన్ జారీ చేస్తామని చెబుతున్నారు. టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇచ్చేలా జీఓ జారీ చేయాలి. – వాకాడ వెంకటరమణ, జిల్లా సీపీఎస్ ఉద్యోగుల సంఘం కన్వీనర్ మానవీయ కోణంలో పరిశీలించాలి టెట్ ఉత్తీర్ణత సాధించాలన్న తీర్పును అత్యున్నత న్యాయస్థానం మానవీయ కోణంలో పరిశీలించాలి. టెట్‌కు ప్రిపేరయ్యేందుకు సమయం ఉండదు. దీనిని సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకుని న్యాయం చేయాలి. రెండేళ్లలో టెట్ ఉత్తీర్ణత సాధించకపోతే ఉద్యోగం వదులుకోవాలని చెప్పడం దారుణం. – చింతాడ ప్రదీప్ కుమార్, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు -
గిరి ప్రదక్షిణకు రెడీ
అన్నవరం: కొండ పైకి ఎక్కి తన దర్శనానికి రాలేని దీనులకు దర్శనమిచ్చేందుకు.. సాక్షాత్తూ ఆ సత్యదేవుడే.. దేవేరి అనంతలక్ష్మీ సత్యవతీదేవి సమేతుడై.. స్వయంగా రత్నగిరి దిగివచ్చే మహోన్నత కార్యక్రమం.. స్వామివారి గిరి ప్రదక్షిణకు సర్వం సిద్ధమైంది. కార్తిక పౌర్ణమి పర్వదినం సందర్భంగా బుధవారం ఈ కార్యక్రమం వైభవంగా జరగనుంది. ఉదయం 8 గంటల నుంచి పల్లకీ మీద, మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రచార రథం మీద సత్యదేవుని గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు దేవస్థానం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి రెండు లక్షల మందికి పైగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా దేవదాయ శాఖ అధికారులు, పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గతంలో ఉదయం 8 గంటల నుంచే గిరి ప్రదక్షిణ నిర్వహించేవారు. ఆ సమయంలో అటు సత్యదేవుని దర్శనానికి రత్నగిరికి వచ్చే భక్తులు, ఇటు గిరి ప్రదక్షిణ భక్తులతో కొండ దిగువన ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఈ నేపథ్యంలో గత ఏడాది నుంచి ఉదయం పల్లకీ మీద వైదిక సిబ్బందితో లాంఛనంగా.. మధ్యాహ్నం 2 గంటల నుంచి సత్యదేవుని ప్రచార రథంతో అధికారికంగా గిరి ప్రదక్షిణ నిర్వహిస్తున్నారు. రెండు కార్యక్రమాల్లోనూ భక్తులు పాల్గొనవచ్చని దేవస్థానం అధికారులు స్పష్టం చేశారు. ఏర్పాట్లపై సమీక్ష ఈ కార్యక్రమం ఏర్పాట్లను గిరి ప్రదక్షిణ ప్రత్యేక అధికారి, దేవదాయ శాఖ రాజమహేంద్రవరం రీజినల్ జాయింట్ కమిషనర్ (ఆర్జేసీ) వి.త్రినాథరావు మంగళవారం పరిశీలించారు. అనంతరం అధికారులతో సాయంత్రం సమీక్ష జరిపారు. విభాగాల వారీగా చేసిన ఏర్పాట్లు తెలుసుకుని తగు ఆదేశాలిచ్చారు. దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వీర్ల సుబ్బారావు, వాడపల్లి, లోవ దేవస్థానం ఈఓలు నల్లం సూర్యచక్రధరరావు, విశ్వనాథరాజు, ఇతర అధికారులు పాల్గొన్నారు. అనంతరం గిరి ప్రదక్షిణ రోడ్డును త్రినాథరావు పరిశీలించారు. ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి అందరూ కృషి చేయాలని త్రినాథరావు కోరారు. ఫ అన్నవరం పుణ్యక్షేత్రంలో నేడు నిర్వహణ ఫ ఉదయం 8 గంటలకు పల్లకీ మీద ఫ మధ్యాహ్నం 2 గంటలకు సత్యరథంతో కార్యక్రమం ఫ సాయంత్రం 6.30 గంటలకు పంపా హారతులు ఫ రాత్రి 7 గంటలకు జ్వాలాతోరణం ఫ విస్తృత ఏర్పాట్లు చేసిన అధికారులు మధ్యాహ్నం గిరి ప్రదక్షిణ ప్రణాళిక ఇదీ..ఫ మధ్యాహ్నం 1.30 గంటలకు గ్యారేజీ నుంచి సత్యదేవుని ప్రచార రథం తొలి పావంచా వద్దకు చేరుకుంటుంది. ప్రచార రథంపై సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్లకు పూజలు చేసి, హారతులిచ్చిన అనంతరం రెండు గంటలకు గిరి ప్రదక్షిణ ప్రారంభమవుతుంది. ఫ తొలి పావంచా నుంచి 8.5 కిలోమీటర్ల మేర ప్రదక్షిణ సాగుతుంది. ఫ తొలి పావంచా నుంచి హైవే ఆర్చి వరకూ 2 కిలోమీటర్లు అన్నవరం మెయిన్ రోడ్డు మీద.. ఆర్చి నుంచి బెండపూడి శివారు పుష్కర కాలువ వరకూ 1.5 కిలోమీటర్లు జాతీయ రహదారి–16 మీద రాజమహేంద్రవరం – విశాఖపట్నం లైనులో ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఫ పుష్కర కాలువ రోడ్డు నుంచి పంపా నది వరకూ 5 కిలోమీటర్లు మెటల్ రోడ్డు మీద గిరి ప్రదక్షిణ జరుగుతుంది. ఫ మార్గం మధ్యలో సుబ్రహ్మణ్య స్వామి గుడి సెంటర్, సాక్షి గణపతి ఆలయం, పాత రత్నగిరి రిసార్ట్స్ సెంటర్, జాతీయ రహదారి మీద ఆర్చి, పుష్కర కాలువ ప్రారంభంలో, మధ్యలో మరో రెండుచోట్ల కొంతసేపు ఆపుతారు. ఫ గిరి ప్రదక్షిణ మార్గంలో 12 చోట్ల మంచినీరు, పాలు, బిస్కెట్లు, పులిహోర, పండ్లు పంపిణీ చేస్తారు. ఐదుచోట్ల టాయిలెట్లు ఏర్పాటు చేశారు. ఫ భక్తులు విశ్రాంతి తీసుకునేందుకు నాలుగుచోట్ల ఏర్పాట్లు చేశారు. ఫ గిరి ప్రదక్షిణ పూర్తయ్యేటప్పటికి సాయంత్రం 6 గంటలు దాటే అవకాశం ఉండటంతో.. ఆ మార్గంలో విద్యుద్దీపాలు అమర్చారు. ఫ సాయంత్రం 6 గంటలకు పంపా నది వద్ద తెప్పోత్సవ పంటు మీద సత్యదేవుని పంపా నదీ హారతుల కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తారు. తొలుత సత్యదేవునికి పూజలు చేసిన అనంతరం అర్చకులు పంపా నదికి చీర, సారె సమర్పి స్తారు. ఆ తరువాత నదీమతల్లికి పంచహారతులు సమర్పిస్తారు. కార్యక్రమం అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేస్తారు. ఫ రాత్రి 7 గంటలకు తొలి పావంచా వద్ద సత్యదేవుని జ్వాలాతోరణం కార్యక్రమం నిర్వహించనున్నారు. ఫ పెద్దాపురం, కాకినాడ డీఎస్పీలు, ఎనిమిది మంది సీఐలు, 16 మంది ఎస్సైలు, 724 మంది పోలీసులతో పాటు రెండు రోప్ పార్టీలు భద్రతా ఏర్పాట్లలో పాల్గొంటున్నాయి. ఫ కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ విభాగం నుంచి ఆరుగురు తహసీల్దార్లు, 20 మంది వీఆర్ఓలు కూడా ఈ ఏర్పాట్లలో పాల్గొంటున్నట్లు పెద్దాపురం ఇన్చార్జి ఆర్డీఓ మల్లిబాబు తెలిపారు. -
నంబర్ గేమ్‌కు కొండంత అండ
ఫ కాకినాడ పోలీసుల అదుపులో నిర్వాహకులు ఫ పట్టుబడ్డ ముగ్గురు టీడీపీ ప్రజాప్రతినిధి అనుయాయులు కాకినాడ క్రైం: నగరంలో నంబర్ గేమ్ నిర్వహిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోమవారం రాత్రి స్పెషల్ బ్రాంచ్ బృందం కాకినాడలోని వేర్వేరు ప్రాంతాల్లో తనిఖీలు చేసింది. ఆ సందర్భంగా సంతచెరువు పార్క్, కల్పనా సెంటర్, జగన్నాథపురం మార్కెట్లో గుట్టు చప్పుడు కాకుండా నంబర్ గేమ్ లాటరీ నిర్వహిస్తున్న ముగ్గురు పోలీసులకు పట్టుబడ్డారు. ఈ ముగ్గురూ స్థానిక టీడీపీ ప్రజాప్రతినిధికి అత్యంత సన్నిహితులు కావడం గమనార్హం. వీరిలో ఓ వ్యక్తి లారీల ట్రాన్స్‌పోర్టు వ్యాపారం చేసేవాడు. మరొకరు గత టీడీపీ హయాం నుంచీ ఇదే చీకటి దందాను జీవనోపాధిగా మలచుకొని రూ.కోట్లకు పడగెత్తాడు. మూడో వ్యక్తి ఫ్లెక్సీల్లో మెరుస్తూంటాడు. పండగ పబ్బాలొస్తే తన అభిమాన నాయకుడిని శుభాకాంక్షలు, అభినందనలతో ముంచెత్తుతూంటాడు. తన వినయం ఊరందరికీ తెలిసొచ్చేలా భారీ ఫ్లెక్సీలు కట్టి మురిసిపోతూంటాడు. నేత అండతో చిన్నాచితకా కాంట్రాక్టులు పొందుతూంటాడు. ఈ ఏడాది నంబర్ గేమ్ లాటరీని అనధికార వేలం పాటలో దక్కించుకున్న వారిలో ఈ ముగ్గురూ ఉన్నారు. టీడీపీ నాయకుడికి నెలవారీ కలెక్షన్లలో వాటాలిచ్చి కొండంత అండతో తమ పబ్బం గడుపుకొంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. వీరితో పాటు ఇంకెంతమంది ఉన్నారనే కోణంలో పోలీసు విచారణ కొనసాగుతోంది. పోలీసులపై అధికార పార్టీ ఒత్తిడి నేపథ్యంలో పట్టుబడిన వారికి తగిన శిక్ష పడుతుందా అనే చర్చ సామాన్యులతో పాటు కూటమి కేడర్‌లోనూ నడుస్తోంది. రామకృష్ణపై సస్పెన్షన్ వేటు ఫ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలపై చర్యలు ఫ దాడిశెట్టి రాజా హెచ్చరిక సాక్షి ప్రతినిధి, కాకినాడ: పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న కారణంగా రౌతులపూడి మండలానికి చెందిన రాపర్తి రామకృష్ణను వైఎస్సార్ సీపీ నుంచి సస్పెండ్ చేశారు. గుమ్మరేగుల గ్రామానికి చెందిన రామకృష్ణ పార్టీలో జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. స్థానిక కార్యకర్తలు, నేతలకు కనీస సమాచారం లేకుండా కార్యక్రమాలు నిర్వహించడం, ఇతర పార్టీల నాయకులతో చెట్టపట్టాలేసుకుని తిరగడం, పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫొటోలతో సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేసుకోవడం వంటి ఆరోపణలపై ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఇప్పటికే మూడు పర్యాయాలు ఈ విషయాలపై హెచ్చరించినప్పటికీ పెడచెవిన పెట్టడంతో క్రమశిక్షణా చర్య తీసుకోవాల్సి వచ్చిందని మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా మంగళవారం మీడియాకు తెలిపారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారు ఏ స్థాయిలో ఉన్నా చర్యలు ఇదే రీతిలో ఉంటాయని హెచ్చరించారు. -
ఎస్‌ఐఎఫ్‌టీ ల్యాబ్‌లకు జాతీయ గుర్తింపు
కాకినాడ రూరల్: ఇక్కడి రాష్ట్ర మత్స్య సాంకేతిక పరిజ్ఞాన సంస్థ(ఎస్‌ఐఎఫ్‌టీ)లోని మరో రెండు ల్యాబ్‌లకు కొత్తగా నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ క్యాలిబ్రేషన్ లేబొరేటరీస్ (ఎన్ఏబీఎల్) గుర్తింపు లభించింది. దీంతో పాటు ఇక్కడ పాటిస్తున్న ప్రమాణాలకు గానూ ఎస్‌ఐఎఫ్‌టీలోని 4 ల్యాబ్‌లకు గతంలో ఇచ్చిన గుర్తింపును కొనసాగించనున్నారు. శాసీ్త్రయంగా అవసరాలకు అనుగుణంగా ఆక్వా రైతులకు సేవలు అందించడంలోను, మత్స్య ఉత్పత్తుల నాణ్యత పెంపొందించడంలోను ఎస్‌ఐఎఫ్‌టీ కీలకంగా వ్యవహరిస్తోంది. ఇక్కడి నీరు, మట్టి నమూనా విశ్లేషణ పరీక్షా ల్యాబ్‌కు.. సూక్ష్మజీవ, వ్యాధి నిర్ధారణ (మైక్రో బయాలజీ) ల్యాబ్‌కు, మాలిక్యులర్ లెవెల్ డయాగ్నోసిస్ (పీసీఆర్) ల్యాబ్‌కు, మేత నాణ్యత విశ్లేషణ (ఫీడ్) ల్యాబ్‌లకు 2021 ఆగస్టులో ఐఎస్ఓ/ఐఈసీ 17025–2017 ప్రమాణాల మేరకు ఎన్ఏబీఎల్ గుర్తింపు లభించింది, అప్పటి నుంచీ ఈ గుర్తింపును ఏటా పునరుద్ధరిస్తున్నారు. ఈ ఏడాది గడువు గత ఆగస్టు 8తో ముగిసింది. సెప్టెంబర్ 6, 7 తేదీల్లో రెన్యువల్ ఆడిట్ నిర్వహించారు. అనంతరం గతంలో గుర్తింపు పొందిన 4 ల్యాబ్‌లకు ఎన్ఏబీఎల్ గుర్తింపు కొనసాగింపునకు అనుమతి ఇచ్చారు. దీంతోపాటు కొత్తగా మరో రెండు ల్యాబ్‌లు ఎల్సీ–ఎంఎస్/ఎంఎస్, జీసీ–ఎంఎస్/ఎంఎస్‌లకు కూడా ఎన్ఏబీఎల్ గుర్తింపు లభించింది. లిక్విడ్ క్రోమోటోగ్రఫీ విత్ టాండమ్ మాస్ స్పెక్రోమెట్రీ (ఎల్సీ–ఎంఎస్/ఎంఎస్) ల్యాబ్ ద్వారా చేపలు, చేప ఉత్పత్తుల్లో ఉండే యాంటీబయాటిక్స్‌ను గుర్తిస్తారు. గ్యాస్ క్రోమోటోగ్రఫీ విత్ టాండన్ మాస్ స్పెక్రోమెట్రీ (జీసీ–ఎంఎస్/ఎంఎస్) ల్యాబ్ ద్వారా పెస్టిసైడ్స్‌ను గుర్తిస్తారు. సద్వినియోగం చేసుకోవాలి ఎస్‌ఐఎఫ్‌టీ ల్యాబ్‌లలో పరీక్షించిన ఉత్పత్తుల కు మాత్రమే అంతర్జాతీయంగా ఎగుమతి చేసే అవకాశం ఉంటుంది. రాష్ట్రంలోని 23 జిల్లాల పరిధిలో జియోట్యాగ్ అయిన 5.76 లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఆక్వా సాగు జరుగుతోంది. ఆక్వా రైతులు తమ ఉత్పత్తుల పరీక్షల నిర్వహణకు రాష్ట్ర రిఫరల్ ల్యాబ్‌గా ఉన్న ఎస్‌ఐఎఫ్‌టీ సేవలను వినియోగించుకోవచ్చు. – డాక్టర్ ఎస్.అంజలి, ప్రిన్సిపాల్, ఎస్‌ఐఎఫ్‌టీ, కాకినాడ -
ఉద్యోగులు నైపుణ్యాలు మెరుగుపరుచుకోవాలి
సామర్లకోట: ఉద్యోగులు నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం ద్వారా ప్రజలకు ఉత్తమ సేవలందించవచ్చని విస్తరణ శిక్షణ కేంద్రం (ఈటీసీ) ప్రిన్సిపాల్ కేఎన్వీ ప్రసాదరావు అన్నారు. స్థానిక ఈటీసీలో శ్రీకాకుళం నుంచి ఏలూరు వరకూ ఉన్న 11 జిల్లాల్లోని డిప్యూటీ ఎంపీడీఓలకు సుస్థిరాభివృద్ధి లక్ష్యాలపై శిక్షణను సోమవారం ఆయన ప్రారంభించారు. ఉద్యోగులు సాంకేతిక, నైపుణ్యతను పెంపొందించుకుంటే పంచాయతీ రాజ్ శాఖలో పదోన్నతులు త్వరగా వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం గ్రామాల్లో సమస్యలు లేకుండా ప్రజల అవసరాలను గుర్తించడానికి సుస్థిరాభివృద్ధి అంశాలపై ఉద్యోగులకు శిక్షణ ఇవ్వాలని ఆదేశించిందన్నారు. అదే విధంగా ఎంపీడీఓ, జిల్లా పరిషత్తు కార్యాలయాల్లో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్లు, టైపిస్టులకు ఆరు రోజుల పాటు నిర్వహించే ప్రాథమిక శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించారు. వైస్ ప్రిన్సిపాల్ జి.రమణ, డీడీఓ డి.శ్రీనివాసరావు, ఎంపీడీఓ ఎస్ఎస్ శర్మ, ఫ్యాకల్టీ కె.సుశీల శిక్షణ తరగతులు నిర్వహించారు. -
చోరీ కేసులో నిందితుల అరెస్ట్
తాళ్లపూడి: వృద్ధురాలి మెడలో బంగారు మంగళ సూత్రాల తాడు తెంచుకుని పరారైన కేసులో ముగ్గురిని సోమవారం అరెస్ట్ చేసి రూ.2.50 లక్షల సొత్తు రికవరీ చేశారు. తాళ్లపూడి ఎస్సై టి.రామకృష్ణ కథనం ప్రకారం.. గత నెల 8న తాళ్లపూడి మండలం గజ్జరంలో గన్నిన నరసమాంబ (70) తన ఇంటి వద్ద ఒంటరిగా ఉన్న సమయంలో ఇద్దరు వ్యక్తులు వచ్చారు. టీవీ పని చేయడం లేదని ఫిర్యాదు వచ్చిందని, దానిని బాగు చేయడానికి వచ్చామని ఆమెకు చెప్పారు. టీవీ బాగానే పని చేస్తుందని నరసమాంబ చెప్పగా, అయితే టీవీ పక్కన నిలబడితే ఫొటో తీసుకుంటామని చెప్పి, ఆమెను బెదిరించి మెడలోని బంగారు మంగళ సూత్రాల తాడును లాక్కొని బయటకు వచ్చేశారు. అప్పటికే బయట బైక్‌పై ఉన్న మూడో వ్యక్తి సహాయంతో పరారయ్యారు. ఈ మేరకు బాధితురాలు తాళ్లపూడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. సోమవారం బల్లిపాడు గోదావరి ర్యాంపు వద్ద ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందులో షేక్ సుభానీ జానీ, దేశగిరి గంగరాజు, వడ్డి శరణ్రాజులను పట్టుకుని, చోరీ సొత్తుతో పాటు బైక్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. సీసీ కెమేరాల ఆధారంగా నిందితులను పట్టుకున్నామన్నారు. -
మృత్యు శకటం.. వేస్తారా కళ్లెం!
ఫ గాలి వేగంతో దూసుకెళ్తున్న టిప్పర్లు ఫ భారీగా ఇసుక, గ్రావెల్ తరలింపు ఫ ఉమ్మడి జిల్లాలో పొంచి ఉన్న ప్రమాదాలు ఫ రంగారెడ్డి జిల్లా ఘటన నేపథ్యంలో అప్రమత్తత అవసరం అమలాపురం టౌన్: అడ్డూ అదుపూ ఉండదు.. వేగానికి కళ్లెం అసలే లేదు.. అధికారుల పర్యవేక్షణ కానరాదు.. రోడ్డెక్కితే ఆగమేఘాల మీద దూసుకుపోతున్నా, ఎందరో ప్రాణాలు తీస్తున్నా ఎవరికీ పట్టదు.. టిప్పర్ల జోరుకు అడ్డూ అదుపు కనిపించదు.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇసుక, గ్రావెల్ లోడ్లతో టిప్పర్లు రోడ్లపై రయ్‌రయ్‌మంటూ దూసుకుపోతున్నాయి. వీటిపై మైనింగ్, ట్రాన్స్‌పోర్టు, పోలీస్, రెవెన్యూ శాఖల అధికారుల నియంత్రణ లేకపోవడం, సరైన నిఘా ఉండక తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డుపై వెళ్లే ప్రజల ప్రాణాలు ఒక్కోసారి గాల్లో కలిసిపోతున్నాయి. తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల వద్ద ఆర్టీసీ బస్సు, టిప్పర్ ఢీకొన్న ప్రమాదంలో దాదాపు 19 మంది మృత్యువాత పడ్డారు. టిప్పర్ వేగంగా వెళ్లడం వల్లే ఈ ప్రమాదం జరిగి అంత మంది ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఈ దుస్థితి తెలంగాణ రాష్ట్రంలోనే కాదు మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కూడా ఉంది. టిప్పర్ల అతివేగం వల్ల రోడ్డు ప్రమాదాలు పొంచి ఉన్నాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి జిల్లాలో దాదాపు 30కి పైగా ఇసుక ర్యాంపులు, 26 వరకూ క్వారీలు ఉన్నాయి. వీటి ద్వారా దాదాపు రెండు వేల టిప్పర్లు నిత్యం ఇసుక, గ్రావెల్‌తో రోడ్లపై రయ్రయ్ మంటూ అతి వేగంగా పరుగులు తీస్తున్నాయి. ఈ వేగమే ఒక్కోసారి అనర్థమై రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఎక్కువగా నదీ పాయలు ఉండడంతో ఇసుక ర్యాంపుల నుంచి ఈ టిప్పర్లు అధిక లోడుతో ఇసుకను వేగంగా రవాణా చేస్తున్నాయి. ఒక్కో టిప్పర్ రోజుకు మూడు లేదా నాలుగు ట్రిప్పులు వేయాల్సి ఉంటుంది. అలాగే రాజమహేంద్రవరం, ఐ.పంగిడి పరిసర గ్రామాల్లో ఎక్కువగా ర్యాంపులు, క్వారీల నుంచి కూడా టిప్పర్లు గ్రావెల్ లోడుతో అతివేగంగా రోడ్లపై దూసుకుపోతున్నాయి. ఈ టిప్పర్లకు రోజుకు ఇన్ని ట్రిప్పులని లక్ష్యాన్ని నిర్దేశించడంతో కొందరు డ్రైవర్లు అతివేగంగా నడుపుతున్నారు. కాకినాడ జిల్లాలో ప్రత్తిపాడు, ఏలేశ్వరం తదితర ప్రాంతాల నుంచి గ్రావెల్ లోడ్లతో టిప్పర్లు జిల్లా కేంద్రం కాకినాడ నగరానికి ఎక్కువగా వస్తున్నాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇటీవల కాలంలో భవనాలు, అపార్ట్మెంట్ల నిర్మాణాలు అధికం కావడంతో టిప్పర్ల ద్వారా ఇసుక, గ్రావెల్, ఇటుక వంటి మెటీరియల్ ఎక్కువగా ఎగుమతి, దిగుమతులు అవుతున్నాయి. మైన్స్ శాఖ అధికారులు తమ శాఖ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటున్నా అతి వేగాన్ని మాత్రం నియంత్రించలేకపోతున్నారు. ట్రాన్స్‌పోర్టు, పోలీస్ శాఖల అధికారులు టిప్పర్లపై పర్యవేక్షణ అంతంత మాత్రంగానే ఉండడం, సరైన నిఘా పెట్టకపోవడంతో వాటి వేగాన్ని ఎవరూ నియంత్రించక చేయలేక చేతులెత్తేస్తున్నారు. ఫలితంగా టిప్పర్ల వేగంపై నియంత్రణ కరవై రోడ్డు ప్రమాదాలు, మరణాలు అనివార్యమవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం చేవళ్ల రోడ్డు ప్రమాదంలో జరిగిన ప్రాణ నష్టం స్థాయి ఉమ్మడి జిల్లాలో ఇప్ప టి దాకా జరగకపోవడం మంచి పరిణామమే గాని పొంచి ఉన్న రోడ్డు ప్రమాదాలు, ప్రాణ నష్టాన్ని జిల్లా ప్రజలు ఊహించుకుని బెంబేలెత్తుతున్నారు. టిప్పర్లు ఇసుక లేదా గ్రావెల్ తరలిస్తున్నప్పుడు విధిగా ఆ లోడుపై బరకం కప్పాలి. బరకం వినియోగించకపోవడం వల్ల ఇసుక లేదా గ్రావెల్ వెనుక వచ్చే వాహనచోదకుల కళ్లలో పడి ఇబ్బందిగా ఉంటుంది. ఈ నియంత్రణ చర్యలు అంతంత మాత్రంగానే అమలవుతున్నాయని వాహనచోదకులు అంటున్నారు. 124 కేసుల నమోదు టిప్పర్ల అతివేగాన్ని జిల్లా రవాణా శాఖ ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం. టిప్పర్లపై ఇసుక, గ్రావెల్ తరలిస్తున్నప్పుడు బరకాలు కప్పకపోవడం, ఇరుకు రోడ్లలో సైతం అతి వేగంగా వెళ్లడం, టిప్పన్ కండీషన్ సక్రమంగా లేకపోవడం వంటి సమస్యలపై తరచూ తనిఖీలు నిర్వహించి బాధ్యులపై చర్యలు తీసుకుంటున్నాం. ఈ నేరాలపై జిల్లాలో ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకూ 124 కేసులు నమోదు చేశాం. –డి.శ్రీనివాస్, జిల్లా రవాణాధికారి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా -
మల్లవరం శివాలయంలో చోరీ
గోకవరం: మల్లవరం గ్రామంలో ఉమామల్లేశ్వరస్వామి ఆలయం (శివాలయం)లో చోరీ జరిగింది. ఆలయ కమిటీ సభ్యుల వివరాల ప్రకారం.. కార్తిక మాసంలో క్షీరాబ్ధి ద్వాదశిని పురస్కరించుకుని ఆదివారం రాత్రి 10 గంటల వరకూ మల్లవరం శివాలయంలో పూజలు నిర్వహించి అనంతరం తాళాలు వేశారు. సోమవారం తెల్లవారుజామున 3.30 సమయంలో ఆలయ అర్చకుడు సాయిశర్మ తాళాలు తెరిచి చూడగా ఆలయ ప్రాంగణంలో హుండీలు చోరీకి గురైనట్టు గుర్తించి కమిటీ సభ్యులకు సమాచారం అందించారు. వారు వచ్చి పరిశీలించగా నాలుగు హుండీలను పగులగొట్టి నగదు చోరీ చేసినట్టు గుర్తించారు. ఈ విషయాన్ని పోలీసులకు తెలపగా కోరుకొండ సీఐ సత్యకిశోర్, గోకవరం ఎస్సై పవన్‌కుమార్‌లు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం రాజమహేంద్రవరం నుంచి క్లూస్ టీం వచ్చి ఆధారాలు సేకరించింది. ఆలయ సమీపంలో రెండు హుండీలను గుర్తించారు. -
‘నన్నయ’లో రెజ్లింగ్ పోటీలు
రాజానగరం: ఆదికవి నన్నయ యూనివర్సిటీ, ఎన్టీఆర్ కన్వెన్షన్ సెంటర్లో రెజ్లింగ్ మెన్ అండ్ ఉమెన్ ఇంటర్ కాలేజీయెట్ కం యూనివర్సిటీ టీమ్ సెలక్షన్స్ సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ పోటీలకు యూనివర్సిటీ అనుబంధ కళాశాలల నుంచి 51 మంది క్రీడాకారులు హాజరయ్యారు. ఉమెన్ ఫ్రీ స్టైల్ 50 నుంచి 70 కిలోల కేటగిరీ, మెన్ ఫ్రీ స్టైల్ 57 నుంచి 125 కిలోల కేటగిరీలో పోటీలు జరిగాయి. అలాగే రెజ్లింగ్ గ్రీకో రోమన్ విధానంలో 55 నుంచి 130 కిలోల కేటగిరీ వరకూ నిర్వహించిన పోటీల్లో క్రీడాకారులు ప్రతిభ కనబరిచారు. ప్రతిభ చాటిన వారిని యూనివర్సిటీ టీమ్‌గా ఎంపిక చేసి, పంజాబ్‌లోని చండీఘర్ యూనివర్సిటీలో జరిగే సౌత్ జోన్ పోటీలకు పంపిస్తామని వీసీ ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ, రిజిస్టార్, స్పోర్ట్సు బోర్డు సెక్రటరీ ఆచార్య కేవీ స్వామి తెలిపారు. ఈ పోటీలకు ఆర్గనైజింగ్ చైర్మన్‌గా ఆచార్య డి.జ్యోతిర్మయి, పరిశీలకులుగా డాక్టర్ బీవీ నరసింహరాజు వ్యవహరించగా, కె.కనకదుర్గ, ఎ.ధర్మేంద్రలు సెలక్షన్ కమిటీ సభ్యులుగా పాల్గొన్నారు. -
85.61 మీటర్లకు చేరిన ఏలేరు
ఏలేశ్వరం: ఇటీవల కురిసిన వర్షాలతో ఏలేరు రిజర్వాయర్‌లో నీటి నిల్వలు మరింత పెరిగాయి. పరీవాహక ప్రాంతం నుంచి 2,479 క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 86.56 మీటర్లు కాగా సోమవారం 85.61 మీటర్లకు చేరింది. పూర్తి సామర్థ్యం 24.11 టీఎంసీలు కాగా, నీటి నిల్వలు 22.18 టీఎంసీలకు చేరాయి. ఆయకట్టుకు 3 వేలు, విశాఖకు 175 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తున్నారు. పంపా, తిమ్మరాజు చెరువుకు నీటి విడుదల నిలిపివేశారు. పీజీఆర్ఎస్కు 571 అర్జీలుబోట్క్లబ్ (కాకినాడ సిటీ): కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన జిల్లా స్థాయి ప్రజా ఫిర్యాదుల వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు 571 అర్జీలు సమర్పించారు. వారి నుంచి వివిధ శాఖల అధికారులు, అర్జీలు స్వీకరించారు. బియ్యం కార్డుల మంజూరు, ఇళ్ల స్థలాలు, ఆన్లైన్లో భూమి వివరాల నమోదు, పూడికల తొలగింపు, పారిశుధ్యం తదితర సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ప్రజలు అర్జీలు సమర్పించారు. వివాహానికి పార్కింగ్ స్థలం ● అద్దెకిచ్చిన అన్నవరం దేవస్థానం సీఆర్ఓ అధికారులు ● పెళ్లి సెట్టింగ్‌ను అడ్డుకున్న ఇంజినీరింగ్ అధికారులు ● చైర్మన్ ఆగ్రహం అన్నవరం: సత్యదేవుని సన్నిధిలో సెంట్రల్ రిజర్వేషన్ కార్యాలయం (సీఆర్ఓ) విభాగం అధికారుల నిర్వాకానికిదో మచ్చుతునక. వివరాలివీ.. కార్తిక మాసంలో సత్యదేవుని ఆలయానికి వేలాదిగా భక్తులు వస్తున్న విషయం తెలిసిందే. వారి వాహనాల పార్కింగ్‌కు సత్యగిరిపై హరిహర సదన్ సత్రం ఎదురుగా ఉన్న స్థలాన్ని కేటాయించారు. అయితే, ఇదే స్థలాన్ని సీఆర్ఓ అధికారులు ఈ నెల 8న జరిగే వివాహానికి అద్దెకివ్వడం వివాదాస్పదమైంది. ఆ పెళ్లి బృందం వారు ఆ స్థలంలో ఐదు రోజుల ముందు నుంచే వివాహ సెట్టింగ్ వేయడం మొదలు పెట్టారు. ఇది గమనించిన దేవస్థానం ఇంజినీరింగ్ ఈఈ రామకృష్ణ అభ్యంతరం తెలిపారు. ఆ స్థలాన్ని తాము ముందుగానే రిజర్వ్ చేసుకున్నామని ఆ పెళ్లి బృందం వారు చెప్పడంతో విషయాన్ని దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ నేపథ్యంలో సీఆర్ఓ అధికారులపై చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్తిక పౌర్ణమి సందర్భంగా బుధవారం వేలాదిగా భక్తులు తరలి వస్తారని, వారి వాహనాలను అక్కడే నిలపాల్సి వస్తుందని, అలాగే, ఎనిమిదో తేదీ శనివారం కూడా రద్దీ ఉంటుందని, ఇవేమీ చూసుకోకుండా ఆ స్థలాన్ని పెళ్లికి రిజర్వ్ చేశారని ప్రశ్నించారు. భక్తుల వాహనాలు నిలిపే స్థలాలను కార్తిక మాసం పూర్తయ్యేంత వరకూ వివాహాలకు ఇవ్వవద్దని ఆదేశించారు. జీజీహెచ్ సూపరింటెండెంట్‌గా సత్యనారాయణ సాక్షి, రాజమహేంద్రవరం: స్థానిక ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి (జీజీహెచ్) సూపరింటెండెంట్‌గా డాక్టర్ పచ్చిమాల వీర వెంకట సత్యనారాయణ నియమితులయ్యారు. ఈ మేరకు వైద్య విద్య సంచాలకుడు రఘునందన్ గంభీర సోమవారం ఉత్తర్వులు వెలువరించారు. ఇప్పటి వరకూ ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా కొనసాగిన డాక్టర్ సౌభాగ్యలక్ష్మి గత నెలాఖరున ఉద్యోగ విరమణ చేశారు. ఆ స్థానంలో సత్యనారాయణ నియమితులయ్యారు. ఆయన అదే ఆస్పత్రిలో రెండేళ్లుగా జనరల్ మెడిసిన్ విభాగం ప్రొఫెసర్, హెచ్ఓడీ హోదాలో కొనసాగుతున్నారు. సత్యనారాయణ 1983 బ్యాచ్ కాకినాడ రంగరాయ వైద్య కళాశాల (ఆర్ఎంసీ) విద్యార్థి. అదే కళాశాలలో 1996లో మెడిసిన్‌లో పీజీ పూర్తి చేశారు. తొలి పోస్టింగ్ 1999లో ఆర్ఎంసీలోనే అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా లభించింది. 2006లో అసోసియేట్ ప్రొఫెసర్‌గా ఉద్యోగోన్నతి పొంది, 2012 వరకూ కొనసాగారు. అప్పటి నుంచి 2015 వరకూ కార్డియాలజీ విభాగంలో అసోసియేట్, ప్రొఫెసర్ హోదాల్లో పని చేశారు. 2016 నుంచి 2017 మధ్య ఏడాది పాటు కాకినాడ జీజీహెచ్‌లో సీఎస్ ఆర్ఎంఓగా పని చేశారు. 2023 వరకూ పేరెంట్ డిపార్ట్మెంట్ జనరల్ మెడిసిన్ విభాగంలో ప్రొఫెసర్ హోదాలో కొనసాగారు. రాజమహేంద్రవరం జీజీహెచ్‌లో కొన్ని రోజుల పాటు ఇన్చార్జి సూపరింటెండెంట్‌గా పని చేశారు. 26 ఏళ్ల వృత్తి జీవితంలో 10 మంది కలెక్టర్ల నుంచి ఉత్తమ వైద్యుడిగా అవార్డులు అందుకున్నారు. జీజీహెచ్ సూపరింటెండెంట్‌గా నియమితులైన పీవీవీను కాకినాడ ఆర్ఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ విష్ణువర్ధన్, ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు వైద్యాధికారులు, సిబ్బంది, వివిధ సంఘాల నేతలు అభినందించారు. -
ఇలాంటి నిబంధనలు ఎప్పుడూ చూడలేదు
ఆరుగాలం కష్టపడి పండించిన పంట తుపాను దెబ్బకు నేలపాలైంది. మాబోటి రైతుల పరిస్థితి అయోమయంలో పడింది. నష్టపరిహారం అందుకుంటే మునిగిపోగా మిగిలిన పంటను ప్రభుత్వం కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయనని అంటే ఎలా? ఇదివరకు ఎప్పుడూ ఇలాంటి నిబంధనలు చూడలేదు. క్షేత్ర స్థాయిలో 33 శాతం పైన పంట నష్టపోయిన రైతుల పేర్లు మాత్రమే రాస్తున్నారు. ఇది దారుణం. పైగా ఆ సర్వే నంబర్లలో ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయదని చెప్పడం అన్యాయం. మిగిలిన పంటను ఎక్కడ అమ్ముకోవాలి? ఇలాంటి నిబంధనలతో రైతును మరిన్ని నష్టాల్లోకి నెట్టేయడం కాకుండా ప్రభుత్వం ఉదారంగా వ్యవహరించాలి. – పితాని సుబ్రహ్మణ్యం, రైతు, పీఏసీఎస్ మాజీ చైర్మన్, తణుకువాడ, కాజులూరు పరిహారానికి, కొనుగోలుకు ముడి పెడతారా? నష్ట పరిహారానికి, ధాన్యం కొనుగోలుకు ముడి పెట్టడం అన్యాయం. తుపానుతో దెబ్బ తిన్న రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వానికి ఇలాంటి నిబంధనలు పెట్టడం సమంజసం కాదు. నష్టపరిహారం పొందిన రైతుల నుంచి సీఎంఆర్ ద్వారా ధాన్యం కొనుగోలు చేయబోమని అంటే ఏమైపోవాలి? ఈ మాట చాలా వింతగా ఉంది. ఇది సరైన విధానం కాదు. ముంపుతో పోయిన ధాన్యం ఎలానూ పోయింది. కనీసం మిగిలిన ధాన్యాన్నయినా ప్రభుత్వం కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తుందనుకుంటే ఇప్పుడు ఇలా చెప్పడం అన్యాయం. ప్రభుత్వం పరోక్షంగా దళారులను ప్రోత్సహించినట్టే. ఈ విధానాన్ని విరమించుకోవాలి. – బదిరెడ్డి వీర ప్రకాశరావు, రైతు, వీకే రాయపురం, సామర్లకోట మండలం -
మీరూ ముంచేస్తారా..బాబూ!
మంగళవారం శ్రీ 4 శ్రీ నవంబర్ శ్రీ 2025● ఇప్పటికే ముంచేసిన ‘మోంథా’ ● రైతులకు పరిహారం ఎగ్గొట్టేందుకు సర్కారు ఎత్తులు ● ఆ సాయం చేస్తే ధాన్యం కొనబోమని మెలిక ● మరోవైపు కస్టమ్ మిల్లింగ్కూ చేతులెత్తేస్తున్న ప్రభుత్వం ● ఇటు పరిహారం రాదు.. అటు బీమా అందదు ● ఇప్పుడు ధాన్యం కొనుగోలుకూ ససేమిరా ● తుపాను బాధిత రైతులపై సర్కారు నిర్దయసాక్షి ప్రతినిధి, కాకినాడ: పెనుగాలులు, భారీ వర్షాలతో విరుచుకుపడిన మోంథా తుపాను ఇప్పటికే రైతులను నిండా ముంచేసింది. ఈ పరిస్థితుల్లో వారిని ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆదుకోవాలి. కొండంత ధైర్యాన్నివ్వాలి. పంట నష్టపోయిన రైతులకు బీమాతో సంబంధం లేకుండా పరిహారం ఇవ్వాలి. దీంతో పాటు మిగిలిన పంటను కస్టమ్ మిల్లింగ్ (సీఎంఆర్) ద్వారా కొనుగోలు చేసి, వారిని ఒడ్డున పడేయాలి. కానీ, వీటన్నింటికీ భిన్నంగా కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు తమను మరింతగా ముంచేసేలా ఉన్నాయని రైతులు కలత చెందుతున్నారు. విపత్తులతో పంట ముంపునకు గురైతే క్షేత్ర స్థాయిలో రెవెన్యూ, వ్యవసాయ అధికారులు పరిశీలన జరిపి, జిల్లా యంత్రాంగానికి నివేదికలు అందిస్తారు. వాటి ఆధారంగా ప్రభుత్వమే బాధిత రైతులకు పరిహారం అందిస్తుంది. కానీ, కూటమి సర్కారు నష్టపరిహారాన్ని తగ్గించేందుకు, వీలైనంతగా ఎగ్గొట్టేందుకు సాంకేతిక కారణాలతో కొర్రీలు వేస్తోందని, నష్టం అంచనాలు రూపొందించే ప్రక్రియకు రైతులను దూరం పెట్టే ఆలోచనలు చేస్తోందని, పండించిన పంట కొనుగోలు చేయకుండా గతంలో ఎన్నడూ లేని నిబంధనలు పెడుతోందని రైతు సంఘాల ప్రతినిధులు మండిపడుతున్నారు. సీఎంఆర్‌కు నో! తుపానుతో నష్టపరిహారం అందుకునే రైతులు పండించిన ధాన్యాన్ని కస్టమ్ మిల్డ్ రైస్ (సీఎమ్ఆర్) ద్వారా కొనుగోలు చేయలేమని ప్రభుత్వం చెబుతోంది. ఈ మేరకు జిల్లాలకు ఉత్తర్వులు వచ్చినట్టు రెవెన్యూ వర్గాల ద్వారా తెలుస్తోంది. నష్టపరిహారం కోసం అర్జీ పెట్టుకున్న రైతుల వద్ద ముంపులో ఉన్న పంటను కొనుగోలు చేయబోమని ప్రభుత్వం తెగేసి చెబుతోంది. ఈ మేరకు మండల స్థాయిలో టాంటాంలు కూడా వేయించింది. రెండు రోజుల క్రితం కరప తదితర మండలాల్లో ఈ విధంగా టాంటాంలు వేయించడంపై రైతులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇలా చేయడం వలన రైతులు భయపడి, తమకు పంట నష్టం జరిగినట్లు దరఖాస్తు చేయకుండా వెనక్కు తగ్గుతారనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు కనిపిస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో పంట నష్టపోయిన రైతులకు అక్కడి ప్రభుత్వం ఎకరాకు రూ.10 వేలు ప్రకటించింది. ఇదే తరహాలో ఇక్కడ కూడా ప్రకటిస్తే.. ఆ మేరకు పరిహారం అందుకునే రైతుల సంఖ్యలో కోత పెట్టేందుకే కూటమి సర్కారు ఇటువంటి నిబంధన తెచ్చిందని రైతు సంఘాల ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటు తుపానుకు పోయిన పంట ఎలాగూ పోయింది.. మిగిలినదైనా కస్టమ్ మిల్లింగ్‌లో అమ్ముకుందామనుకుంటే ప్రభుత్వం ఆ అవకాశం కూడా లేకుండా చేస్తోందని, తద్వారా ధాన్యం కొనుగోలు నుంచి తప్పుకుంటోందని రైతులు మండిపడుతున్నారు. మానవత్వం మరచి.. రెండున్నర ఎకరాల్లో వరి సాగు చేసిన ఓ రైతు అంతా సవ్యంగా సాగితే 90 నుంచి 120 బస్తాల (75 కేజీలు) దిగుబడి వస్తుందని ఆశ పడ్డారు. తీరా చూస్తే పంటంతా తుపానుతో మునిగిపోయింది. ఇప్పుడు ఎకరాకు 10 నుంచి 15 బస్తాల దిగుబడి వస్తే గొప్పేననే పరిస్థితి. ఈ లెక్కన రెండున్నర ఎకరాలకు 40 బస్తాలు కూడా వచ్చే పరిస్థితి లేదు. అంటే తుపానుతో ఆ రైతు సగటున 60 బస్తాలు పైనే కోల్పోతున్న పరిస్థితి. ప్రభుత్వ పరిహారం ఎకరాకు రూ.5 వేలు వస్తుందని లెక్క వేసినా రెండున్నర ఎకరాలకు రూ.12,500కు మించి ఒక్క పైసా కూడా రాదు. ఈ పరిస్థితుల్లో చేసిన అప్పులు తీర్చలేక చావే శరణ్యమంటున్న రైతులను మానవతా దృక్పథంతో ఆదుకోవాల్సిన ప్రభుత్వం పలాయన మంత్రం పఠిస్తోందని రైతు ప్రతినిధులు ఆక్షేపిస్తున్నారు. నష్టపరిహారం పొందితే సీఎంఆర్ ద్వారా కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) లభించే అవకాశం లేకుండా చేయడం అన్యాయమంటూ రైతులు నిప్పులు చెరుగుతున్నారు. ఇప్పుడు వచ్చే ధాన్యంలో తేమ, రంగు మారి, మొలకలొచ్చే అవకాశం ఉండటంతో మద్దతు ధర ఇవ్వడానికి మిల్లర్లు ముందుకు రారు. అటు ప్రభుత్వం ఎంఎస్పీకి కొనదు. దీంతో, మిల్లర్లు, దళారులు చెప్పిందే రేటు అనే పరిస్థితి ఏర్పడుతుంది. అదే కనుక జరిగితే ప్రతి బస్తాకు రూ.400 నుంచి రూ.500 వరకూ నష్టం తప్పదని వాపోతున్నారు. మిల్లర్లకు పరోక్షంగా అయాచిత లబ్ధి చేకూర్చే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఇలాంటి ఆలోచనలు చేస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐదేళ్లూ జగన్ అండ విపత్తుల వేళ రైతులు నష్టపోయినప్పుడు వారివద్ద మిగిలిన పంటను ప్రభుత్వం కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాలి. మొలకలొచ్చినా. రంగు మారినా, నూకలైనా సరే మద్దతు ధరకు కొనుగోలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం విపత్తులతో రైతులు నష్టపోయిన ప్రతి సందర్భంలోనూ ఇదే విధానం పక్కాగా అమలు చేసి, అండగా నిలిచింది. నష్టపోయిన ప్రతి ఎకరాకు, దెబ్బ తిన్న ప్రతి రైతుకు సీజన్ ముగియకుండానే పరిహారం (ఇన్పుట్ సబ్సిడీ) నేరుగా అందించింది. రైతుల విజ్ఞాపన మేరకు తేమ శాతం నిబంధనను 20 నుంచి 22 శాతం వరకూ పెంచి మరీ కనీస మద్దతు ధరకు ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేసింది. మోంథా తుపానుతో జిల్లాలో వరికి నష్టమిలా.. సాగు విస్తీర్ణం 2.12 లక్షల ఎకరాలు పంట నష్టం 60,000 ఎకరాలు నష్టపోయిన రైతులు 40,000 దిగుబడి అంచనా 6 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు లక్ష్యం 3 లక్షల మెట్రిక్ టన్నులు కరప మండలంలో సత్యనారాయణ అనే చిన్నకారు రైతు స్వర్ణ రకం వరి సాగు చేశారు. బ్యాంకులో బంగారం తాకట్టు పెట్టి 1.50 లక్షలు అప్పు తెచ్చి, పంట పెట్టుబడి పెట్టారు. పంట చేతికొచ్చే సమయంలో మోంథా తుపాను దెబ్బ తీసింది. పంట మొత్తం నేలనంటేసింది. అంతా బాగుంటే ఎకరాకు 40 బస్తాల పైనే దిగుబడి వస్తుందని ఆయన లెక్కలేసుకున్నారు. ఇప్పుడు పరిస్థితి తలకిందులైంది. పడిపోయిన పంటను యంత్రాలతో కోయిస్తే 15, 17 బస్తాల దిగుబడి కూడా రాదు. మరోవైపు ఎకరాకు 18 బస్తాల కౌలు చెల్లించాలి. ఇలాంటి పరిస్థితుల్లో నష్టపోయిన పంటకు పరిహారం మాట దేవుడెరుగు.. కనీసం మిగిలిన ధాన్యమైనా కొనుగోలు చేస్తారా అంటే అదీ కనిపించడం లేదు. రైతు సేవా కేంద్రానికి వెళ్లి నష్టపరిహారం కోసం దరఖాస్తు చేసుకుంటే ప్రభుత్వం.. కనీస మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేయదని తెగేసి చెబుతున్నారు. పంట నష్టం జరిగినట్టు పరిహారం పొందుతున్నారు కాబట్టి కస్టమ్ మిల్లింగ్‌లో కొనుగోలు చేయడానికి అసలు ఆ రైతు వద్ద ధాన్యమే లేదన్నది ప్రభుత్వ వాదన. ఇలాగైతే తన పరిస్థితేం కావాలని సత్యనారాయణ కలత చెందుతున్నారు. -
రత్నగిరి.. భక్తఝరి
● సత్యదేవుని దర్శించిన 50 వేల మంది, 6 వేల వ్రతాల ఆచరణ ● రూ.50 లక్షల ఆదాయంఅన్నవరం: కార్తిక సోమవారం కావడంతో వేలాదిగా తరలి వచ్చిన భక్తులతో రత్నగిరి కిటకిటలాడింది. సత్యదేవుని దర్శనానికి భక్తులు ఉదయం నుంచీ తండోపతండోపాలుగా తరలి వచ్చారు. ఆలయ ప్రాంగణం, వ్రత మండపాలు, క్యూ లైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. సుమారు 50 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. సత్యదేవుని వ్రతాలు 6 వేలు జరిగాయని అధికారులు తెలిపారు. స్వామివారి నిత్య కల్యాణంలో 27 మంది భక్తులు రూ.1,116 చొప్పున టికెట్లు కొనుగోలు చేసి పాల్గొన్నారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.50 లక్షల ఆదాయం వచ్చిందని అధికారులు చెప్పారు. సత్యదేవుని దర్శించిన భక్తులు సప్తగోకులంలో గోవులకు ప్రదక్షిణ చేసి, శ్రీకృష్ణుడిని దర్శించుకున్నారు. అనంతరం రావిచెట్టు వద్ద జ్యోతులు వెలిగించి, ప్రదక్షిణ చేశారు. సుమారు 6 వేల మంది భక్తులకు పులిహోర, దధ్యోదనం పంపిణీ చేశారు. ఆశించిన మేరకు జరగని వ్రతాలు కార్తిక సోమవారం సందర్భంగా స్వామివారి వ్రతాలు 8 వేల నుంచి 10 వేల వరకూ జరుగుతాయని దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేశారు. కానీ, ఆ మేరకు జరగకపోవడంతో కొంత నిరుత్సాహానికి గురయ్యారు. అయితే, కార్తిక పౌర్ణమి సందర్భంగా బుధవారం అధిక సంఖ్యలో భక్తులు వస్తారని భావిస్తున్నారు. ఆ రోజు 10 వేలకు పైగా వ్రతాలు జరుగుతాయని భావిస్తూ ఆ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ రోజు వేకువజామున ఒంటి గంటకే సత్యదేవుని వ్రతాలు ప్రారంభిస్తారు. తెల్లవారుజామును 2 గంటల నుంచే స్వామివారి దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని బుధవారం సత్యదేవుని అంతరాలయ దర్శనం, యంత్రాలయం దర్శనాలను నియంత్రించనున్నారు. ఆలయ సమీపాన మరో రూ.1,500 వ్రత మండపం సత్యదేవుని వ్రతాలు రూ.1,500 టికెట్టుపై ఆచరించేవారు ఎక్కువగా ఉంటున్నారు. అనివేటి మండపంలోని ధ్వజస్తంభం వద్ద మాత్రమే ఈ వ్రతాలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఒక బ్యాచ్‌లో 200 మంది మాత్రమే వ్రతమాచరించే వీలుంది. దీంతో మిగిలిన వారు ఎ క్కువ సమయం వేచి ఉండాల్సి వస్తోంది. కార్తిక పౌర్ణ మి నాడు రూ.1,500 వ్రతాలు ఆచరించేవారి కోసం స్వామివారి ఆలయానికి ఉత్తరం వైపున ఉన్న మండపం మీద తాత్కాలికంగా షెడ్డు నిర్మాణానికి ఏర్పా ట్లు చేస్తున్నారు. కార్తిక పౌర్ణమి నాడు రూ.1,500 వ్రతాలు నిర్వహించే పురోహితులకు ఆ మేరకు ఆదేశాలిచ్చామని చైర్మన్ ఐవీ రోహిత్ తెలిపారు. -
గిరి ప్రదక్షిణలో భద్రంసుమా!
● సత్యదేవుని సన్నిధికి రేపు లక్షల మంది వస్తారని అంచనా ● అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలి ● కాశీబుగ్గ దుర్ఘటన నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి ● వీడియో కాన్ఫరెన్స్‌లో దేవదాయ శాఖ కమిషనర్అన్నవరం: కాశీబుగ్గ వేంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 9 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటన నేపథ్యంలో అన్నవరం దివ్యక్షేత్రంలో బుధవారం జరిగే సత్యదేవుని గిరి ప్రదక్షిణకు విస్తృత ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆ ఒక్క రోజే 3 లక్షల మంది భక్తులు అన్నవరం వచ్చే అవకాశమున్న నేపథ్యంలో దేవదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్ర మోహన్ సోమవారం అన్నవరం దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వీర్ల సుబ్బారావు, కాకినాడ ఉప కమిషనర్ రమేష్‌బాబు, లోవ, వాడపల్లి దేవస్థానాల ఈఓలు విశ్వనాథరాజు, చక్రధరరావు, ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కమిషనర్ ఆదేశాలివీ.. ● ఉదయం 8 గంటలకల్లా తొలి పావంచా నుంచి గిరి ప్రదక్షిణ సత్యదేవుని పల్లకిలో లాంఛనంగా ప్రారంభించి మధ్యాహ్నం 12కు ముగించాలి. ● మధ్యాహ్నం 2 గంటలకు అధికారికంగా సత్యదేవుని ప్రచార రథం మీద స్వామివారి గిరి ప్రదక్షిణ ప్రారంభించాలి. ఇందులో సుమారు 2 లక్షల మంది భక్తులు పాల్గొనే అవకాశం ఉంటుంది. అందువలన వారికి ఇబ్బంది కలగకుండా, తొక్కిసలాటకు అవకాశం లేకుండా ఏర్పాట్లు చేయాలి. ● స్వామివారి ప్రచార రథం చుట్టూ రోప్ పార్టీ ఉండాలి. ఎక్కడా ఆగకుండా గిరి ప్రదక్షిణ సాగిపోయేలా చూడాలి. సాధ్యమైనంత వరకూ చీకటి పడే సమయానికి పంపా తీరానికి చేరుకోవాలి. ● కొండ దిగువన గిరి ప్రదక్షిణ ఏర్పాట్లు చూసేందుకు దేవదాయ శాఖ రీజినల్ కమిషనర్ (రాజమహేంద్రవరం) వి.త్రినాథరావును ప్రత్యేక అధికారిగా నియమించాం. ఆయన మంగళవారం నుంచి అన్నవరంలోనే ఉండి, గిరి ప్రదక్షిణ ఏర్పాట్లు చూస్తారు. ఆయనకు కాకినాడ డీసీ రమేష్‌బాబు, లోవ, వాడపల్లి ఈఓలు విశ్వనాథరాజు, చక్రధర్‌రావు సహకరించాలి. ● రత్నగిరిపై ఏర్పాట్లను దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావు పర్యవేక్షించాలి. ఆ రోజు సత్యదేవుని దర్శనానికి లక్ష మంది భక్తులు వచ్చే అవకాశం ఉంటుంది. మధ్యాహ్నం భక్తుల రద్దీ తగ్గాక గిరి ప్రదక్షిణ ఏర్పాట్లలో పాల్గొనాలి. భక్తుల ఏర్పాట్లు వదిలేసి వైదిక కార్యక్రమాలు, పూజలు అంటూ వెళ్లకూడదు. గిరి ప్రదక్షిణలో ఎక్కడ లోటు జరిగినా ఈఓదే బాధ్యత. ● దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్ గిరి ప్రదక్షిణ ప్రారంభోత్సవం తదితర కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ ఆయన కూడా రత్నగిరిపై సేవలందించవచ్చు. ● గిరి ప్రదక్షిణ రోడ్డులో పులిహోర, బిస్కెట్లు, ఇతర ఫలహారాల స్టాల్స్, మంచినీటి పాయింట్లు, టాయిలెట్లు తదితర ఏర్పాట్లను మంగళవారం మరోసారి పరిశీలించాలి. ● గత నెల 25న అన్నవరంలో జరిపిన సమీక్షలో దేవస్థానంలో అన్నిచోట్లా సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించినా చాలాచోట్ల పెట్టలేదు. వాటిని వెంటనే ఏర్పాటు చేయాలి. ఎస్పీ సమీక్ష జిల్లా ఎస్పీ జి.బిందుమాధవ్ సోమవారం సాయంత్రం అన్నవరం వచ్చి, గిరి ప్రదక్షిణ రోడ్డును పరిశీలించారు. అనంతరం ఈఓ సుబ్బారావు, ఇంటెలిజెన్స్, పెద్దాపురం డీఎస్పీలు కేవీ సత్యనారాయణ, శ్రీహరిరాజు, ప్రత్తిపాడు సీఐ సూర్య అప్పారావు, ఎస్సై శ్రీహరిబాబు తదితరులతో సమావేశమై, గిరి ప్రదక్షిణ ఏర్పాట్లపై సమీక్షించారు. ఆయన ఆదేశాలివీ.. ● గిరి ప్రదక్షిణ సమయంలో ట్రాఫిక్ నియంత్రణపై దృష్టి పెట్టాలి. మధ్యాహ్నం 12 గంటల నుంచి అన్నవరం గ్రామంలోకి వాహనాల రాకపోకలను నియంత్రించాలి. వాహనాలను హైవే మీదనే అనుమతించాలి. ● గిరి ప్రదక్షిణ పుష్కర కాలువ వరకూ సుమారు రెండు కిలోమీటర్లు హైవే మీదనే సాగుతుంది. ఆ సమయంలో రాజమహేంద్రవరం – విశాఖపట్నం వైపు రోడ్డు మీద వచ్చే వాహనాలను పక్క లేన్‌లోకి మళ్లించాలి. భారీ వాహనాలను ఎక్కడికక్కడే నిలిపివేయాలి. ● అంబులెన్సులు, అగ్నిమాపక యంత్రం, రక్షణ బృందాలను సిద్ధంగా ఉంచుకోవాలి. ● సేవాదళాలు, వలంటీర్ల ద్వారా భక్తులకు సహకారం అందించాలి. ● గిరి ప్రదక్షిణ జరిగే మార్గమంతటా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. -
జీజీహెచ్ హ్యాట్రిక్
కాకినాడ క్రైం: తల్లీబిడ్డలు బాగుంటే కుటుంబం బాగుంటుంది. కుటుంబం బాగుంటే సమాజం బాగుంటుందనే సూత్రంతో నూరా హెల్త్ సంస్థ మాతాశిశు సంరక్షణ కోసం నిర్వహిస్తున్న కేర్ కంపానియన్ ప్రోగ్రాం (సీసీపీ) అమలులో కాకినాడ జీజీహెచ్ హ్యాట్రిక్ సాధించింది. ఈ కార్యక్రమాన్ని కొన్నాళ్లుగా నిర్వహిస్తున్నప్పటికీ గడచిన మూడు నెలల్లో ఎన్నడూ లేని పురోగతి సాధిస్తోంది. వరుసగా మూడుసార్లు రాష్ట్రంలోనే ఉత్తమ స్థానంలో నిలిచింది. తద్వారా మాతాశిశు సంరక్షణలో కీలక భూమిక పోషిస్తోంది. సీసీపీ కార్యక్రమం కింద జీజీహెచ్‌లోని ఎన్ఐసీయూ, పీఐసీయూ, ఎస్ఎన్సీయూ, ఏఎన్సీ, పీఎన్సీ, పోస్ట్ గైనిక్ విభాగాల్లో వైద్య సేవలు పొందుతున్న బాలింతలు, వారి సహాయకులకు మాతా శిశు సంరక్షణపై అవగాహన కల్పిస్తారు. ఈ కార్యక్రమ నిర్వహణకు జిల్లా కన్సెల్టెంట్‌గా పబ్లిక్ హెల్త్ నిపుణుడు డాక్టర్ వేదాంతం కార్తీక్‌ను కాకినాడ, కోనసీమ జిల్లాల ప్రత్యేకాధికారిగా నియమించారు. మాతృ సంరక్షణ, శిశు మరణాల నివారణే సీసీపీ లక్ష్యం. ఈ దిశగా తల్లితో పాటు శిశువుకు సంరక్షకులుగా వ్యవహరిస్తున్న వారికి అవగాహన కల్పిస్తారు. రక్షణ చర్యలు బోధించడం, ఆసుపత్రిలో చేరికలు తగ్గించడం, తల్లీబిడ్డలను పూర్తి ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దడం ఈ కార్యక్రమం లక్ష్యాలు. శిక్షణ ఇలా.. స్థానిక భాషలో వీడియోలు, పోస్టర్లు, లైవ్ డెమోలు ఇవ్వడం ద్వారా తల్లికి, శిశు సంరక్షకులకు శిక్షణ ఇస్తున్నారు. 30 నుంచి 40 నిమిషాల పాటు సెషన్లు నిర్వహిస్తారు. ప్రతి సెషన్‌కు కనిష్టంగా 5 నుంచి 25 మంది వరకూ బాలింతలు, వారి సహాయకులు ఉంటారు. అవగాహన అనంతరం, క్విజ్ నిర్వహించి ఫీడ్‌బ్యాక్ కోరుతారు. రోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకూ 12 నుంచి 15 సెషన్లు నిర్వహిస్తున్నారు. చంటిపిల్లల విభాగం తొలి అంతస్తులో టెర్మ్, ప్రీ టెర్మ్, సెప్సి, స్టెప్‌డౌన్ యూనిట్లతో పాటు రెండో అంతస్తులోని టెర్మ్, ప్రీ టెర్మ్, రూమ్–ఎ, బిలలో ఈ సెషన్లు జరుగుతున్నాయి. తల్లికి.. ప్రసవానంతరం ఆరోగ్య సంరక్షణకు సూచనలు చేస్తారు. తీసుకోవలసిన ఆహారం నుంచి రోజువారీ అలవాట్లపై అవగాహన కల్పిస్తారు. వైవాహిక జీవితంపై అవగాహన కల్పించి, మరో బిడ్డను కనాలనుకుంటే ఆ ప్రణాళికను వివరిస్తారు. ఇల్లు, పరిసరాల్లో పారిశుధ్య నిర్వహణపై అవగాహన కల్పిస్తారు. ప్రసవానంతరం రుతుక్రమాన్ని, ఆ సమయంలో ఉండే విధానాన్ని వివరిస్తున్నారు. రక్తహీనతను దూరం చేసే శాసీ్త్రయ విధానాలపై అవగాహన కల్పిస్తారు. ముర్రుపాల ప్రయోజనాన్ని తల్లికి వివరిస్తారు. సిజేరియన్ జరిగితే, తీసుకోవలసిన జాగ్రత్తలపై తల్లితో పాటు సహాయకులకు సూచనలిస్తారు. ప్రభుత్వ ప్రయోజనాలను పొందేందుకు దరఖాస్తు చేసుకునే విధానం వివరిస్తారు. జీజీహెచ్‌లోని మదర్ మిల్క్ బ్యాంకు ప్రయోజనాలను తెలియజేస్తారు. బిడ్డ ఆకలికి తగినట్టుగా పాలు స్రవించేలా అవగాహన పెంపొందిస్తారు. ప్రసవానంతర ఆరోగ్యం, శరీర సౌష్టవాన్ని పెంపొందించుకునేందుకు వ్యాయామాలు, యోగాసనాలను వివరిస్తారు. బిడ్డ కోసం.. బిడ్డకు అందించాల్సిన ద్రవరూప పోషకాహారాలను పరిచయం చేస్తారు. శిశువు వివిధ అనారోగ్యాలకు గురైతే వాటిని ముందుగానే గుర్తించేలా లక్షణాలను వివరిస్తారు. వయసుకు తగ్గ బరువు పెరిగేందుకు పౌష్టికాహారాన్ని సూచిస్తారు. టీకాల ప్రణాళికను వివరిస్తారు. బిడ్డ నమోదు, జనన ధ్రువీకరణ పత్రాలను పొందడంలో సహాయసహకారాలు అందిస్తారు. తల్లీబిడ్డలకు అందాల్సిన ప్రభుత్వ ప్రయోజనాలు ఏవైనా ఉంటే వాటిని సకాలంలో అందేలా చూస్తారు. ఫార్ములా ఫీడ్ తయారు చేసే విధానంపై అవగాహన కల్పిస్తారు. పాలు పట్టిన తర్వాత అరుగుదలకు బిడ్డను ఎత్తుకునే విధానంతో పాటు వివిధ పొజిషన్లు, బర్ఫింగ్పై అవగాహన పెంపొందిస్తారు. మొదటి స్థానంలో నిలిచిందిలా.. గత జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో అత్యధిక సెషన్లు నిర్వహించడం ద్వారా రాష్ట్రంలోని 21 బోధనాస్పత్రుల్లో కాకినాడ జీజీహెచ్ మొదటి స్థానంలో నిలిచింది. జూలైలో 9,580 మంది తల్లులకు, వారి సహాయకులకు 358 సెషన్లు నిర్వహించారు. ఆగస్టులో మొత్తం 586 సెషన్లు నిర్వహించగా, 12,026 మంది తల్లులు, వారి సహాయకులు హాజరయ్యారు. సెప్టెంబర్‌లో 700 సెషన్లతో రాష్ట్రంలో మరే ఆసుపత్రికీ సాధ్యం కాని మైలురాయిని అధిగమించారు. ఆ నెలలో 15,400 మంది సెషన్లకు హాజరయ్యారు. గడచిన మూడు నెలలుగా నర్సింగ్ సూపరింటెండెంట్ టీఎన్ కల్పనా మౌళి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రసవానంతరం వైద్య సేవలు పొందుతున్న మహిళలు, చంటి పిల్లలుండే అన్ని వార్డుల్లో సీసీపీపై అవగాహన కల్పిస్తున్నారు. ఫ సీసీపీలో రాష్ట్రంలోనే మూడుసార్లు ఉత్తమ స్థానం ఫ మాతా శిశు సంరక్షణలో కీలక భూమిక సమన్వయంతో ఉన్నత స్థానం జిల్లా కన్సెల్టెంట్ డాక్టర్ కార్తీక్ మార్గనిర్దేశంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి ఆధ్వర్యంలో పీడియాట్రిక్స్ హెచ్ఓడీ డాక్టర్ మాణిక్యాంబ పర్యవేక్షణలో, నా సమక్షంలో సీసీపీ నిర్వహిస్తున్నాం. మాస్టర్ ట్రైనర్లు నేకూరి శిరీష, నందికోళ్ల అనితాదేవి సహా కౌన్సిలర్లుగా నర్సులు కీలక పాత్ర పోషించారు. సమన్వయంతో రాష్ట్రంలోనే ఉన్నత స్థానం సాధించాం. ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లి, మాతాశిశు మరణాల నివారణలో కీలక పాత్ర పోషిస్తాం. – టీఎన్ కల్పన మౌళి, నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్–1, జీజీహెచ్, కాకినాడ వాట్సాప్ ద్వారా సీసీపీ సేవలు సీసీపీలో భాగంగా తల్లీబిడ్డల సంరక్షణకు మొబైల్ కేర్ కంపానియన్ సర్వీసెస్ (ఎంసీసీ) పేరిట వాట్సాప్ సేవలు అందిస్తున్నాం. వార్డులో ఉన్నప్పుడే వారిని నర్సులు స్కానర్ ద్వారా అనుసంధానం చేస్తారు. తల్లులు లేదా వారి సహాయకులు ఓ చిన్న వాట్సాప్ మెసేజ్ ద్వారా పూర్తి స్థాయి సేవలు పొందవచ్చు. మాతాశిశు మరణాల నివారణే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. నర్సింగ్ సూపరింటెండెంట్ కల్పన, కౌన్సిలర్ల హోదాలో నర్సులు కష్టం ఫలితంగానే జీజీహెచ్ రాష్ట్రంలోనే తొలి స్థానం సాధించింది. ఆ బృందానికి అభినందనలు. – డాక్టర్ ఎస్.లావణ్యకుమారి, సూపరింటెండెంట్, జీజీహెచ్, కాకినాడ -
కడు రమ్యమై.. నేత్రపర్వమై..
అన్నవరం: నింగి వీధుల నుంచి చల్లని చంద్రుడు ప్రసరిస్తున్న తెల్లని కిరణాల కాంతుల్లో.. క్షీర సాగరాన్ని తలపిస్తున్న పావన పంపా సరోవరంలో.. భక్తవరదుడైన సత్యదేవుని తెప్పోత్సవం ఆదివారం రాత్రి కడు రమ్యంగా.. కన్నుల పండువగా జరిగింది. క్షీరాబ్ధి ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ వేడుక నిర్వహించారు. వేద పండితుల సుస్వర మంత్రోచ్చారణలు.. మంగళ వాయిద్యాల ఘోష.. కళ్లు మిరుమిట్లు గొలిపే బాణసంచా కాల్పుల నడుమ.. సర్వాంగ సుందరంగా అలంకరించిన హంస వాహనంపై.. రత్నగిరివాసుడు సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్లు పంపా జలాల్లో మూడుసార్లు విహరించారు. ఈ సుమనోహర దృశ్యాన్ని కన్నులారా చూసి.. వేలాదిగా తరలివచ్చిన భక్తులు పులకించారు. ఉత్సవం నిర్వహించారిలా.. ఫ సాయంత్రం 5.30 గంటలకు సత్యదేవుడు, అమ్మవార్లను, క్షేత్ర పాలకులు సీతారాములను మేళతాళాలతో ఊరేగింపుగా రత్నగిరి నుంచి పంపా తీరానికి తీసుకువచ్చారు. అక్కడ, దివ్యంగా అలంకరించిన మండపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సింహాసనంపై సత్యదేవుడు, అమ్మవార్లను, ఆ పక్కనే మరో ఆసనంపై సీతారాములను వేంచేయించారు. వేదపండితులు అక్కడ తులసీ ధాత్రి పూజ నిర్వహించి, సత్యదేవుడు, అమ్మవార్లకు వేదాశీస్సులు అందజేశారు. ఫ సత్యదేవుడు, అమ్మవార్లను సాయంత్రం 6.30 గంటలకు మేళతాళాల నడుమ ఊరేగింపుగా పంపా ఒడ్డున అప్పటికే సిద్ధంగా ఉంచిన హంస వాహనం మీదకు తీసుకువచ్చారు. దానిపై ఏర్పాటు చేసిన ప్రత్యేక మండపంలో వేంచేయించి, పునఃపూజలు నిర్వహించి, హారతులిచ్చి, తెప్పోత్సవం ప్రారంభించారు. ఫ నీలాల నింగిలో నిశి వేళ రంగురంగుల పూలు విరబూసినట్టుగా.. ఉత్సవం సాగుతున్న సమయంలో కళ్లు మిరుమిట్లు గొలిపేలా బాణసంచా కాల్పులు జరిపారు. ఫ పంపా తీరం వెంబడి, ఘాట్ రోడ్డు పొడవునా ఉన్న భక్తులు.. రాత్రి 8.30 గంటల వరకూ జరిగిన ఈ వేడుకను తిలకించి, పులకించారు. ఫ ఉత్సవం ముగిసిన అనంతరం స్వామి, అమ్మవార్లను మేళతాళాలతో తిరిగి రత్నగిరికి చేర్చారు. ఫ ఉత్సవం అనంతరం ఘాట్ రోడ్డు టోల్ గేటు వద్ద భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఫ కార్యక్రమంలో ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ, దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వీర్ల సుబ్బారావు దంపతులు తదితరులు పాల్గొన్నారు. ఫ వేద పండితులు గొల్లపల్లి ఘనపాఠి, యనమండ్ర శర్మ, గంగాధరభట్ల గంగబాబు, శివ, ముష్టి పురుషోత్తం, ప్రధానార్చకులు ఇంద్రగంటి నరసింహమూర్తి, కోట సుబ్రహ్మణ్యం, కల్యాణబ్రహ్మ చామర్తి కన్నబాబు, పురోహితులు పాలంకి పట్టాభి, అంగర సతీష్, అర్చకులు సుధీర్, దత్తాత్రేయశర్మ, రామ్‌కుమార్ తదితరులు వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. ఫ సత్యదేవుని తెప్పోత్సవాన్ని పురస్కరించుకుని టోల్ గేటు నుంచి పంపా తీరం వరకూ రంగురంగుల విద్యుద్దీపాలను శోభాయమానంగా అలంకరించారు. వీటి కాంతులతో పాటు బాణసంచా వెలుగులో ప్రతిబింబించడంతో పంపా సరోవరం కూడా కొత్త అందాలను అద్దుకుంది. విస్తృత బందోబస్తు తెప్పోత్సవం సందర్భంగా ఎంటువంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు ఆధ్వర్యాన ప్రత్తిపాడు సీఐ బి.సూర్య అప్పారావు, అన్నవరం ఎస్సై శ్రీహరిబాబు, 300 మంది పోలీసులతో విస్తృత బందోబస్తు ఏర్పాటు చేశారు. ముందు జాగ్రత్తగా తుని అగ్నిమాపక శకటాన్ని పంపా తీరం వద్ద సిద్ధంగా ఉంచారు. తెప్పోత్సవం జరిగినంతసేపూ జలాశయంలో గజ ఈతగాళ్లతో రెండు మోటార్ బోట్లు హంసవాహనం చుట్టూ రక్షణగా తిరిగాయి. ఫ వైభవంగా సత్యదేవుని తెప్పోత్సవం ఫ పంపా సరోవరంలో హంస వాహనంపై స్వామి, అమ్మవార్ల విహారం ఫ వేలాదిగా తరలి వచ్చిన భక్తజనం -
రత్నగిరిపై భక్తజనసంద్రం
ఫ సత్యదేవుని దర్శించిన 60 వేల మంది ఫ 6,200 వ్రతాలు ఫ రూ.60 లక్షల ఆదాయం అన్నవరం: క్షీరాబ్ధి ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని రత్నగిరి భక్తజన సంద్రమే అయ్యింది. సత్యదేవుని దర్శించుకునేందుకు ఆదివారం వేలాదిగా భక్తులు తరలివచ్చారు. ఆలయాన్ని తెల్లవారుజామున 2 గంటకు తెరచి పూజలు చేసి, భక్తులను సత్యదేవుని దర్శనానికి అనుమతించారు. స్వామివారి వ్రతాలు కూడా తెల్లవారుజామున 2 గంటల నుంచే నిర్వహించారు. తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకూ ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగింది. దీంతో, ఉదయం 9 గంటల నుంచే అంతరాలయ దర్శనాలు నిలిపివేశారు. వెలుపలి నుంచే సత్యదేవుని దర్శించేలా ఏర్పాట్లు చేశారు. యంత్రాలయ దర్శనాలకు కూడా వెలుపలి నుంచే అనుమతించారు. వ్రత మండపాలతో పాటు నిత్య కల్యాణ మండపంలో కూడా సత్యదేవుని వ్రతాలు నిర్వహించారు. సుమారు 60 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని అధికారులు తెలిపారు. వ్రతాలు 6,200 జరిగాయి. సుమారు 15 వేల మందికి పులిహోర, దధ్యోదనం పంపిణీ చేశారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.60 లక్షల ఆదాయం వచ్చిందని అధికారులు చెప్పారు. వ్రత మండపాలు, క్యూ లైన్లు, స్వామివారి ఆలయంలో ఏర్పాట్లను దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్ పరిశీలించి, సిబ్బందికి తగు సూచనలిచ్చారు. నేడు కూడా భక్తుల తాకిడి కార్తిక మాసం రెండో సోమవారం కావడంతో రత్నగిరికి నేడు కూడా భక్తులు అధిక సంఖ్యలో తరలి రానున్నారు. సుమారు లక్ష మంది వస్తారని, 10 వేలకు పైగా వ్రతాలు జరుగుతాయనే అంచనాతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. స్వామివారి వ్రతాలు వేకువజామున ఒంటి గంటకు ప్రారంభించనున్నారు. తెల్లవారుజామున 2 గంటల నుంచి స్వామివారి దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. తగ్గిన వ్రతాలు గత ఏడాది కార్తిక మాసంతో పోలిస్తే ఈసారి వ్రతాల సంఖ్య తగ్గింది. ఈ ఏడాది కార్తికం గత నెల 21న ప్రారంభమైంది. నాటి నుంచి ఆదివారం వరకూ మొత్తం 13 రోజుల్లో 34,350 వ్రతాలు జరిగాయని అధికారులు తెలిపారు. గత ఏడాది కార్తికం మొదటి 13 రోజుల్లో ఏకంగా 50,878 వ్రతాలు జరిగాయి. గత నెల 28 నుంచి 31వ తేదీ వరకూ మోంథా తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురవడంతో నాలుగు రోజుల పాటు ఆలయానికి భక్తులు పెద్దగా రాలేదు. ఫలితంగా గత ఏడాది కార్తికం కన్నా వ్రతాలు 16 వేలు తక్కువగా జరిగాయి. 2022 కార్తికంలో 1,42,373 వ్రతాలు జరిగాయి. 2023 కార్తికంలో మిచాంగ్ తుపాను ప్రభావంతో వారం రోజుల పాటు భక్తులు పెద్దగా రాలేదు. దీంతో ఆ ఏడాది 1,25,000 వ్రతాలు మాత్రమే జరిగాయి. గత ఏడాది కార్తికంలో ఎటువంటి విపత్తులూ లేకపోవడంతో వ్రతాల సంఖ్య 1,47,122కు పెరిగింది. దీనిని అధిగమించాలంటే ఈ కార్తికంలో అధికమించాలంటే ఇంకా 1.13 లక్షల వ్రతాలు జరగాల్సి ఉంది. -
జిల్లావ్యాప్తంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు
కరప: జిల్లావ్యాప్తంగా సమరసత సేవా ఫౌండేషన్ సభ్యులు గుడి కేంద్రంగా కలసికట్టుగా ధార్మిక కార్యక్రమాలు నిర్వహించాలని ఆ సంస్థ జిల్లా ధర్మ ప్రచారక్ పడాల రఘు సూచించారు. పెనుగుదురులో ఆదివారం జరిగిన మండల సమరసత సేవా ఫౌండేషన్ సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామాల్లోని ఆలయాల్లో ఫౌండేషన్ ఆధ్వర్యాన వారం వారం భజనలు, ప్రతి పౌర్ణమికి సామూహిక హారతులు, ఏకాదశి రోజున నగర సంకీర్తనలు, సత్సంగం, ధార్మిక జట్లు నిర్వహించాలని సూచించారు. ప్రతి హిందువు ధర్మాన్ని ఆచరిస్తూ, భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను పరిరక్షించాలని కోరారు. ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం నుంచి ఈ నెల 9వ తేదీ వరకూ గృహ సంపర్క సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం మండల సమరసత సేవా ఫౌండేషన్ సభ్యులతో కలసి ఇంటింటికీ తిరిగి గృహసంపర్క సమావేశాలు నిర్వహించారు. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు, భజనల గురించి వివరించారు. జిల్లా బాల వికాస కేంద్రాల ప్రముఖులు గుండు విశ్వనాథం, యానాం కన్వీనర్ ముమ్మిడి చంటిబాబు, మండల కన్వీనర్ కాదా సత్యనారాయణ, మండల మహిళా కన్వీనర్ పేకేటి లక్ష్మీకాంతం, కె.వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు. -
రావిచెట్టు వద్ద క్యూల ఏర్పాటు
అన్నవరం: రత్నగిరిపై సత్యదేవుని సన్నిధిలో ఉన్న రావిచెట్టు వద్ద ఆవు నేతి దీపాలు వెలిగించే మహిళల కోసం ప్రత్యేక క్యూలు నిర్మించారు. ‘భక్తులకేదీ అభయం’ శీర్షికన ‘సాక్షి’ ఆదివారం ప్రచురించిన కథనానికి దేవస్థానం అధికారులు స్పందించారు. ఈ కథనంలో అన్నవరం దేవస్థానంలో భద్రత గురించి ప్రస్తావిస్తూ.. ఆవు నేతి దీపాలు వెలిగించే మహిళలు రావిచెట్టు వద్దకు వెళ్లే దారి చాలా చిన్నదిగా ఉందని, అక్కడ ఏర్పాటు చేసిన బారికేడ్లు తొలగించి, విశాలమైన మార్గం ఏర్పాటు చేయాలని ‘సాక్షి’ సూచించింది. ఈ నేపథ్యంలో దేవస్థానం అధికారులు రావిచెట్టు వద్దకు మహిళలు వెళ్లేందుకు మూడు వరుసల్లో క్యూ లైన్లు నిర్మించారు. అలాగే, దీపారాధన అనంతరం వెలుపలకు వచ్చేందుకు కూడా మరో మార్గం ఏర్పాటు చేశారు.అయినవిల్లి ఆలయం కిటకిట అయినవిల్లి: విఘ్నేశ్వర స్వామివారిని ఆదివారం అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రధానార్చకులు మాచరి వినాయకరావు ఆధ్వర్యంలో స్వామికి తెల్లవారు జామున మేలుకొలుపు సేవ, పంచామృతాభిషేకం, ఏకాదశ, లఘున్యాస పూర్వక అభిషేకాలు, శ్రీలక్ష్మీగణపతి హోమం, గరిక పూజ జరిపారు. అర్చకులు స్వామిని వివిధ పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. స్వామికి మహా నివేదన చేశారు. రాత్రి ఎనిమిది గంటలకు స్వామికి విశేష సేవలు చేసి ఆలయ తలుపులు వేశారు. లఘున్యాస ఏకాదశ రుద్రాభిషేకాల్లో 237 మంది పాల్గొన్నారు. ఏడుగురికి అక్షరభ్యాసాలు నిర్వహించారు. ఎనిమిది మందికి తులాభారం నిర్వహించారు. ఒకరికి నామకరణ చేయగా శ్రీ లక్ష్మీగణపతిహోమంలో 21 జంటలు పాల్గొన్నాయి. స్వామికి ఒక భక్తుడు తలనీలాలు సమర్పించారు. 40 మంది వాహన పూజలు చేయించుకున్నారు. 4,860 మంది భక్తులు స్వామివారి అన్న ప్రసాదం స్వీకరించారు. ఆదివారం ఒక్క రోజు స్వామివారికి వివిధ పూజ టిక్కెట్లు, అన్నదాన విరాళాల ద్వారా రూ.3,78,641 లభించినట్లు ఈఓ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు. అవార్డు నిరాకరించిన విద్యుత్ శాఖ ఏఈ మలికిపురం: ఉత్తమ సేవలకు అవార్డు వస్తే ప్రభుత్వ ఉద్యోగులు ఉత్సాహంగా స్వీకరిస్తారు. అది అరుదుగా లభించే అవకాశం. అయితే అలా ఉత్తమ సేవలకు అవార్డుకు ఎంపిక అయిన మలికిపురం, సఖినేటిపల్లి మండలాల విద్యుత్ శాఖ ఏఈ బొలిశెట్టి ప్రసాద్ అవార్డు స్వీకరణకు నిరాకరించారు. ఇటీవల సంభవించిన పెను తుపానులో విశేష సేవలు అందించిన ప్రసాద్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి జిల్లా స్థాయి లో ఉత్తమ ఉద్యోగి అవార్డు స్వీకరణకు ఆహ్వానం వచ్చింది. శనివారం వెళ్లాలి. అయితే తుపానుకు దెబ్బతిన్న స్తంభాల పునరుద్ధరణ పనులలో సఖినేటిపల్లి మండలంలో విద్యుత్‌శాఖ ఎలక్ట్రీషియన్ యడ్ల శంకర్ ప్రమాదవశాత్తూ మృతి చెందాడు. మనస్థాపానికి గురైన ప్రసాద్ తనకు ప్రకటించిన అవార్డు తీసుకునేందుకు నిరాకరించారు. హిందువులు సంఘటితంగా ఉండాలి గోకవరం: హిందూ దేవాలయాలు ఆర్థికంగా పరిపుష్టి కలిగి ఉండాలంటే హిందువులందరూ సంఘటితంగా ఉండాలని అహోబిల రామానుజ జీయర్ స్వామి అన్నారు. మండలంలోని గుమ్మళ్ళదొడ్డి శ్రీరామగిరి దేవాలయం వద్ద నూతనంగా నిర్మించిన పుష్కరిణి ప్రారంభోత్సవంలో ఆదివారం ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ప్రధాన రహదారి నుంచి కోలాటం, బాణసంచా కాల్పులు, వివిధ సాంస్కృతిక ప్రదర్శనల నడుమ వల్మీక వేంకటేశ్వరస్వామి ఆలయం వరకూ ఊరేగింపుగా తీసుకువెళ్లారు. స్వామివారికి జీయర్ స్వామి ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రీరామగిరి చేరుకున్నారు. ఆలయం వద్ద లక్ష వత్తుల దీపం వెలిగించారు. తులసీధాత్రి పూజలో పాల్గొన్నారు. అనంతరం పుష్కరిణిని ప్రారంభించి, స్వామివారి తెప్పోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు అనుగ్రహభాషణం చేశారు. కార్యక్రమంలో అర్చకులు, శ్రీ సీతారామ నామ సంకీర్తన సంఘం సభ్యులు, అధిక సంఖ్యలో గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు. -
కాలువలో దూకి యువకుడి ఆత్మహత్య
గోకవరం: మండలంలోని తంటికొండ, గాదెలపాలెం గ్రామాల మధ్య ఉన్న పోలవరం కాలువలో దూకి యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తంటికొండకు చెందిన కామిశెట్టి పుష్పభగవాన్ (22) శుక్రవారం రాత్రి పోలవరం కాలువలో దూకాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కాలువలో గాలించగా శనివారం ఉదయం విగతజీవిగా తేలాడు. మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై పవన్ కుమార్ తెలిపారు. మృతుడు ఫార్మసీలో డిప్లమో చేస్తున్నాడని, ప్రేమ వ్యవహారమే ఆత్మహత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. 800 సెల్ఫోన్ల రికవరీ కాకినాడ క్రైం: దొంగిలించబడిన, పోగొట్టుకున్న 800 సెల్ఫోన్లను వాటి యజమానులకు పోలీసులు అప్పగించారు. కాకినాడలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్పీ బిందు మాధవ్ ఆ వివరాలు వెల్లడించారు. సాంకేతికతను వినియోగించి సెల్ఫోన్లను గుర్తించామన్నారు. దీనిలో పోలీస్ ఐటీ కోర్ విభాగం కీలకంగా వ్యవహరించిందన్నారు. రికవరీ చేసి అప్పగించిన 800 సెల్ఫోన్ల విలువ సుమారు రూ.1.36 కోట్లని తెలిపారు. 4న ఉమ్మడి జిల్లా క్రికెట్ జట్ల ఎంపిక అమలాపురం రూరల్: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో ఈ నెల 4న అంబాజీపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో క్రికెట్ జట్ల ఎంపిక నిర్వహించనున్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి షేక్ సలీమ్ బాషా శనివారం ఈ విషయం తెలి పారు. అండర్ 14 బాలురు, అండర్ 17 బాలికల జట్లను ఎంపిక చేస్తామన్నారు. పాల్గొనే విద్యార్థులు ఆ రోజు ఉదయం 9 గంటల లోపు రిపోర్టు చేయాలన్నారు. ఇతర వివరాలకు ఎస్జీఎఫ్ సెక్రటరీలు కొండేపూడి ఈశ్వరరావు 93469 20718, ఏఎస్ఎస్ రమాదేవి 94400 94984లను సంప్రదించాలన్నారు. -
కన్నీరే మిగిలింది
కరప మండలం జెడ్.భావారంలో నీటిలో నానుతున్న వరి పంటసాక్షి ప్రతినిధి, కాకినాడ: ‘మరో వారం రోజులు ఆగితే గట్టెక్కేసే వాళ్లమే. అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి వేసిన పంట చేతికొచ్చే తరుణంలో ప్రకృతి కన్నెర్ర చేసింది. కోలుకోలేని దెబ్బ కొట్టింది. అసలు ఈ విపత్తు నుంచి బయటపడతామనే నమ్మకం కోల్పోయాం. నిండా మునిగిన పంట దక్కుతుందో లేదో తెలియడం లేదు. చేసిన అప్పులు ఎలా తీర్చాలో అర్థం కాని అయోమయంలో పడ్డాం.’ ● జిల్లాలో ఏ రైతును కదిలించినా ఇదే ఆవేదన వ్యక్తమవుతోంది. దిగుబడి ఆశాజనకంగా ఉంటుందని, ఎకరాకు కనీసం 40 బస్తాలకు తక్కువ కాకుండా వస్తాయని చాలా మంది రైతులు ఆశ పడ్డారు. చేసిన అప్పులు తీసేయగా ఎకరాకు గరిష్టంగా రూ.20 వేలయినా మిగులుతాయని లెక్కలేసుకున్నారు. తీరా చూస్తే తమ ఆశలపై మోంథా తుపాను నీళ్లు జల్లేసి, పంటల్ని తుడిచిపెట్టేసిందని వివిధ గ్రామాల్లో రైతులు గగ్గోలు పెడుతున్నారు. మోంథా తుపానుతో నిండా మునిగిన పంట పొలాల్లో రైతుల ఇబ్బందులపై శుక్ర, శనివారాల్లో ‘సాక్షి’ క్షేత్ర స్థాయి పరిశీలన చేసింది. ఎక్కడ చూసినా కన్నీటిపర్యంతమైన రైతులే కనిపించారు. ఎక్కడ చూసినా అదే వేదన ● పిఠాపురం, గొల్లప్రోలు, గోకవరం, పెద్దాపురం, సామర్లకోట, కరప, తాళ్లరేవు తదితర మండలాల్లోని గ్రామాల్లో రైతులను పలకరిస్తే తమ కష్టమంతా నీటి పాలైందని చెమర్చిన కళ్లతో చెబుతున్నారు. ఆయా మండలాల్లోని పెనుగుదురు, నడకుదురు, వేములవాడ, వేళంగి, కొవ్వూరు, చెందుర్తి, చేబ్రోలు, పవర, పనసపాడు, సర్పవరం తదితర గ్రామాల్లో పలకరించిన ప్రతి రైతు కళ్ల వెంబడి నీళ్లు సుడులుగా తిరిగాయి. ● కరప, సామర్లకోట, పిఠాపురం, గొల్లప్రోలు మండలాల్లోని పలు గ్రామాల్లో వరి పంట వెన్ను వరకూ ముంపులో నానుతూ కనిపించింది. ఇక ఆ పంట దక్కడం దేవుని దయ పైనే ఆధారపడి ఉంటుందని రైతులు తీరని వేదనతో చెప్పారు. ముంపు నీరు దిగక పొట్టలు కుళ్లిపోయి ధాన్యం తాలుగా మారిపోతుందని చెప్పారు. ● ఈనిక దశ నుంచి గింజ పాలు పోసుకునే దశలో పంట ఉండగా ఇంతటి దారుణంగా నష్టపోతామని అనుకోలేదని రైతులు గొల్లుమంటున్నారు. సగంలో సగమైనా పంట చేతికందుతుందనే నమ్మకం లేదని, ప్రతి ఎకరా వరి సాగుకు పెట్టిన సుమారు రూ.36 వేల పెట్టుబడి కళ్లెదుటే కరిగిపోతోందని కన్నీటిపర్యంతమవుతున్నారు. ● సామర్లకోట, పెద్దాపురం, గొల్లప్రోలు, పిఠాపురం తదితర మండలాల్లోని గ్రామాల రైతులు ఏలేరు జలాశయం పోటెత్తడమే తమ కొంప ముంచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. లేదంటే ఈసారి పంటలో సిరులు కురిసేవని చెప్పారు. ఏలేరు పరీవాహక ప్రాంతాల్లో డ్రైన్లకు పూడికలు తీయకపోవడంతో తమ పొలాలు ముంపునకు గురవుతున్నాయని పలువురు రైతులు వాపోయారు. ఈ ప్రాంతాల్లో గుర్రపు డెక్కతో పూడుకుపోయిన డ్రెయిన్ల నుంచి మురుగు నీరు దిగక నష్టపోయిన రైతులే కనిపించారు. ● జగ్గంపేట, పెద్దాపురం, ప్రత్తిపాడు, పిఠాపురం, తుని నియోజకవర్గాల్లోని సుమారు 67 వేల ఎకరాలకు సాగునీరు అందించే ఏలేరు రిజర్వాయర్ ఆయకట్టు రైతుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. సుమారు 10 వేల క్యూసెక్కుల నీరు అవలీలగా పారేలా రూపొందించిన ఏలేరు కాలువలు అవసాన దశకు చేరుకున్నాయి. గతంలో 100 మీటర్ల వెడల్పుతో ఉండే ఏలేరు కాలువ ఆక్రమణలతో ప్రస్తుతం 20 మీటర్లు కూడా లేనివిధంగా కుచించుకుపోయింది. పలుచోట్ల గట్లు కోతకు గురై, అండలుగా జారి శిథిలావస్థకు చేరడం ఏలేరు రైతులకు పెను సవాల్‌గా మారింది. ● పొలాల్లోని ముంపు నీరు బయటకు వెళ్లే దారి లేక, పంటను కాపాడుకునే ప్రయత్నాల్లో పలువురు రైతులు ఉన్నారు. కొన్నిచోట్ల రైతులు వరి దుబ్బులను కట్టలుగా కట్టి రోడ్డు పైకి తెచ్చి మాసూలు చేసుకుంటున్నారు. ముంపు నీరు లాగినా.. నేలనంటేసిన పంట కోతకు కూడా పనికిరాదని చెబుతున్నారు. మోంథా తుపానుతో కుదేలైన రైతులు పంట చేతికందే సమయంలో తీరని నష్టం ఈదురు గాలులు, వర్షానికి నేలకొరిగిన వరి పెట్టుబడులు చేతికందే పరిస్థితి లేదని గగ్గోలు నష్టాలు ఇలా... ప్రస్తుత ఖరీఫ్‌లో జిల్లా రైతులు 2.10 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. మోంథా తుపాను తాకిడితో 60 వేల ఎకరాల్లో పంట సర్వనాశనమైంది. దీంతో, 33,590 మంది రైతుల భవితవ్యం అగమ్యగోచరంగా మారింది. ఒక్క వరి పంటకే రూ.150 కోట్లు పైగా నష్టం వాటిల్లిందన్నది ప్రాథమిక అంచనా. సుమారు 1,200 మంది రైతులకు సంబంధించి సుమారు 2 వేల ఎకరాల్లో మిర్చి, పత్తి, దొండ వంటి పంటలు దెబ్బ తిన్నాయి. ఏలేరు పొంగి ప్రవహిస్తూండటంతో సుమారు 52 వేల ఎకరాల్లో సాగు ప్రశ్నార్థకంగా మారిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. పెద్దాపురం, సామర్లకోట మండలాల్లో 20 వేల ఎకరాలు, కాజులూరులో 18,700 ఎకరాల్లో సాగు జరగగా సుమారు 80 శాతం పంటకు నష్టం వాటిల్లిందన్నది అధికారుల ప్రాథమిక అంచనా.జిల్లాలో పంట నష్టం వివరాలు ముంపునకు గురైన వరి 60,000 ఎకరాలు వరి నష్టం అంచనా రూ.150 కోట్లు పైనే పత్తి 7,000 ఎకరాలు మొక్కజొన్న 2,000 ఎకరాలు మిర్చి 300 ఎకరాలు -
అన్నవరం
అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని వీర వెంకట సత్యనారాయణస్వామి ఆలయానికి ఎప్పుడూ భక్తుల రద్దీ ఉంటుంది. మామూలు రోజుల్లోనే వేల సంఖ్యలో వచ్చే భక్తులు కార్తిక మాసంలో లక్షలకు పెరుగుతారు. ఈ నేపథ్యంలో దేవస్థానంలో భక్తుల భద్రతకు మరిన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవాలనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నెలలోని 3, 10, 17వ తేదీల్లో కార్తిక సోమవారాల సందర్భంగా అనేక మంది విచ్చేస్తారు. ఈ నెల ఐదో కార్తిక పౌర్ణిమ అత్యంత కీలకం. ఆ రోజు సత్యదేవుని దర్శనానికి లక్ష మంది భక్తులు వస్తారని అంచనా. అదే రోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి సత్యదేవుని గిరిప్రదక్షణ జరగనుంది. గతేడాది ఆ కార్యక్రమంలో రెండు లక్షల మంది భక్తులు పాల్గొన్నారు. ఈ ఏడాది ఇంకా ఎక్కువయ్యే అవకాశం ఉంది. కాగా..దేవస్థానంలో భక్తులకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. గంటల తరబడి క్యూలో నిలబడి ఆలయానికి వచ్చేటప్పటికి వారిలో సహనం తగ్గుతోంది. ఆలయంలో సిబ్బంది కదలండి అని తోస్తుంటే వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భక్తులను క్యూలైన్ల కంపార్ట్మెంట్లలో కొద్దిసేపు కూర్చునేలా చేయాలి. ఆ సమయంలో వారికి మజ్జిగ, ఫలహారాలు, చిన్నారులకు బిస్కెట్లు, పాలు పంపిణీ చేస్తే కొంత సేద తీరే అవకాశం ఉంటుంది. రావిచెట్టు వద్ద ఆవునేతి దీపాలు వెలిగించేందుకు వెళ్లే మార్గం చాలా చిన్నదిగా ఉంది. అక్కడ ఏర్పాటు చేసిన బారికేడ్లను కొంత మేర తొలగించి విశాలంగా చేయాలి. దేవస్థానంలో చాలా చోట్ల భక్తులను కంట్రోల్ చేయడానికి బారికేడ్లు ఏర్పాటు చేసి వాటికి తాళాలు వేశారు. ఇది మంచిదే అయినా అత్యవసరమైనప్పుడు ఆ తాళాలు తీయడానికి సిబ్బంది అక్కడ ఉండడం లేదు. ఏదైనా తొక్కిసలాట జరిగినపుడు ఇది చాలా ఇబ్బందిగా మారింది. కార్తిక మాసం పర్వదినాలలో 108 అంబులెన్స్ రత్నగిరి మీదనే ఉండేలా ఏర్పాట్లు చేయాలి. ప్రస్తుతం కొండదిగువన ఉంది. -
వ్యసనాలకు బానిసలై గంజాయి విక్రయాలు
● నలుగురిని పట్టుకున్న పోలీసులు ● వారిలో ఇద్దరు మైనర్లు ● రూ.1.20 లక్షల విలువైన 24 కేజీల గంజాయి స్వాధీనంకాకినాడ రూరల్: వ్యసనాలకు బానిసలైన నలుగురు గంజాయిని విక్రయిస్తూ డబ్బు సంపాదిస్తున్నారు. ఈ క్రమంలో వారిని శనివారం పోలీసులు పట్టుకున్నారు. నిందితుల్లో ఇద్దరు పాత నేరస్తులు, మిగిలిన ఇద్దరూ మైనర్లు. సర్పవరం సీఐ పెద్దిరాజు తెలిపిన వివరాల ప్రకారం.. గంజాయిపై వచ్చిన విశ్వనీయ సమాచారం మేరకు ఎస్సై పి.శ్రీనివాస్‌కుమార్ సిబ్బందితో శనివారం ఉదయం దాడి చేశారు. రమణయ్యపేట ఏపీఐఐసీ పారిశ్రామిక వాడ సమీపంలోని ఖాళీ భవనంలో నలుగురిని గంజాయితో పట్టుకున్నారు. వారి వద్ద ఆరు కిలోల చొప్పున గంజాయి ఉన్నట్టు గుర్తించారు. డిప్యూటీ తహసీల్దార్ కల్యాణ్ చక్రవర్తి, మధ్యవర్తుల సమక్షంలో నిందితుల నుంచి రూ.1.20 లక్షల విలువైన 24 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో రమణయ్యపేటకు చెందిన బులిపె అజయ్ కుమార్, ఇంద్రపాలెం గ్రామానికి చెందిన అనపర్తి శివశంకర్ పాత నేరస్తులు, మిగిలిన ఇద్దరూ 17 ఏళ్ల మైనర్లు. ప్రధాన నిందితులను జ్యూడీషియల్ రిమాండ్‌కు, మైనర్లను రాజమహేంద్రవరం జువైనైల్ జస్టిస్ బోర్డుకు తరలించారు. వీరందరూ స్నేహితులని, వ్యసనాలకు అలవాటు పడడంతో డబ్బు కోసం నర్సీపట్నం ఏజెన్సీ నుంచి కిలో రూ.2 వేలకు గంజాయి కొనుగోలు చేసి కాకినాడలో విక్రయాలకు పాల్పడుతున్నారని సీఐ పెద్దిరాజు తెలిపారు. -
రత్నగిరిపై ప్రభంజనం
● సత్యదేవుని దర్శించిన 80 వేల మంది ● 8 వేల వ్రతాలు.. రూ.80 లక్షల ఆదాయం అన్నవరం: కార్తిక శుద్ధ ఏకాదశి పర్వదినం కావడంతో వేలాదిగా వచ్చిన భక్తులతో రత్నగిరి శనివారం కిక్కిరిసిపోయింది. సుమారు 80 వేల మంది భక్తులు సత్యదేవుని దర్శించారని అధికారులు అంచనా వేశారు. స్వామివారి వ్రతాలు 8 వేలు జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.80 లక్షల ఆదాయం వచ్చిందని అధికారులు అంచనా వేశారు. సత్యదేవుని ఉచిత దర్శనానికి రెండు గంటలు, రూ.200 టికెట్టు దర్శనానికి గంట సమయం పట్టింది. ఉదయం 9 గంటల వరకూ మాత్రమే రూ.200 టికెట్టుపై అంతరాలయ దర్శనానికి భక్తులను అనుమతించారు. ఆ తరువాత రద్దీ అధికంగా ఉండడంతో అంతరాలయ దర్శనం నిలిపివేసి, ఆ భక్తులను కూడా వెలుపలి నుంచే అనుమతించారు. వ్రత మండపాలతో బాటు సత్యదేవుని నిత్య కల్యాణ మండపంలో కూడా స్వామివారి రూ.300 వ్రతాలు నిర్వహించారు. స్వామివారి నిత్య కల్యాణాన్ని పాత కల్యాణ మండపంలో జరిపారు. దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్ ఉదయం నుంచీ ఆలయ ప్రాంగణంలోనే ఉండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. వ్రత మండపాలు, క్యూ లైన్లు పరిశీలించి, సిబ్బందికి తగు సూచనలు చేశారు. స్వామివారి ఆలయం వద్ద దర్శనం చేసుకుని వెలుపలకు వస్తున్న భక్తులకు అభిముఖంగా కొంతమంది భక్తులను ఆలయానికి తీసుకువస్తూండటంతో వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావు కమాండ్ కంట్రోల్ రూములో సీసీ కెమెరాల ద్వారా ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఏకాదశి పర్వదినం సందర్భంగా సత్యదేవునికి ఉదయం 7 గంటలకు స్వర్ణ పుష్పార్చన, 9 నుంచి 11 గంటల వరకూ కుంకుమార్చన నిర్వహించారు. నేడు సత్యదేవుని తెప్పోత్సవం క్షీరాబ్ధి ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్ల తెప్పోత్సవం ఆదివారం సాయంత్రం పంపా సరోవరంలో ఘనంగా నిర్వహించనున్నారు. స్వామి, అమ్మవార్లను సాయంత్రం 5 గంటలకు రత్నగిరి నుంచి ఊరేగింపుగా పంపా తీరానికి తీసుకువస్తారు. అక్కడి పూజా మండపంలో 5.30 గంటలకు తులసీధాత్రి పూజ నిర్వహిస్తారు. సాయంత్రం ఆరు గంటలకు పంపా సరోవరంలో హంస వాహనంగా అలంకరించిన పంటు మీద ఉన్న రుద్రాక్ష మండపంలో స్వామి, అమ్మవార్లను వేంచేయించి, పూజలు చేస్తారు. అనంతరం పండితుల మంత్రోచ్చారణలు, కళ్లు మిరుమిట్లుగొలిపే బాణసంచా కాల్పుల నడుమ సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసిన హంస వాహనంపై స్వామి, అమ్మవార్లు సాయంత్రం 6.30 గంటల నుంచి పంపా సరోవరంలో మూడుసార్లు విహరించనున్నారు. దేవస్థానంలో స్వామివారి కల్యాణం తరువాత అంతటి ప్రాధాన్యం ఉన్న ఈ వేడుకను కన్నులారా వీక్షించేందుకు వేలాదిగా భక్తులు తరలి రానున్నారు. ఈ నేపథ్యంలో విస్తృత ఏర్పాట్లు చేశామని దేవస్థానం చైర్మన్ రోహిత్, ఈఓ సుబ్బారావు తెలిపారు. తెప్పోత్సవ నిర్వహణపై వారు అధికారులతో సమీక్షించారు. భక్తులందరూ ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు వీలుగా పంపా తీరంలో బారికేడ్లు నిర్మించామన్నారు. తెప్పోత్సవం అనంతరం భక్తులకు ప్రసాదం పంపిణీ చేస్తారు. తెప్పోత్సవం నిర్వహించే పవర్ హౌస్ వద్ద పంపా తీరాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఘాట్ రోడ్ ముఖద్వారం నుంచి పవర్ హౌస్ వరకూ రంగురంగుల విద్యుద్దీపాలతో అలంకరించారు. తెప్ప మీదకు 33 మందిని మాత్రమే అనుమతిస్తారు. వీరందరూ విధిగా లైఫ్ జాకెట్లు ధరించాలి. తెప్పోత్సవానికి ప్రజాప్రతినిధులను, జిల్లా అధికారులను ఆహ్వానించారు. వీరి కోసం పంపా తీరంలో వీఐపీ లాంజ్ ఏర్పాటు చేశారు. తెప్పోత్సవానికి 150 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. పంపాలో గజ ఈతగాళ్లు, రెండు మోటార్ బోట్లను, అగ్నిమాపక శకటాన్ని కూడా ముందు జాగ్రత్తగా సిద్ధం చేశారు. మోటార్ బోట్లతో కూడా పంపాలో ట్రయల్ రన్ నిర్వహించారు. -
భక్తులకేదీ అభయం!
● ఉమ్మడి జిల్లాలో ప్రముఖ ఆలయాలు ● పోటెత్తుతున్న భక్తులు ● వసతులు మెరుగుపర్చాలని డిమాండ్ ● కాశీబుగ్గ ఘటన నేపథ్యంలో అలెర్ట్ ● పూర్తిస్థాయిలో లేని భద్రత అంతర్వేది రథయాత్రలో కిక్కిరిసిన భక్తులు (ఫైల్) ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అనేక ప్రముఖ ఆలయాలు ఉన్నాయి. వీటిని సందర్శించడానికి రాష్ట్ర నలుమూలల నుంచీ అనేక మంది భక్తులు తరలివస్తారు. సాధారణ రోజుల్లోనే రద్దీగా ఉండే ఈ ఆలయాలకు ప్రత్యేక మైన రోజుల్లో ఇసుకస్తే రాలనంతగా పోటెత్తుతారు. అయితే ఆలయాలకు వస్తున్న భక్తుల భద్రతకు ప్రభుత్వం ఎంత భరోసా ఇస్తుందనేది ప్రశ్నార్థకంగా మారింది. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం జరిగిన తొక్కిసలాటలో భక్తులు మృతి చెందారు. ప్రభుత్వం సరైన భద్రతా చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందనే విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని ప్రముఖ ఆలయాల్లో భక్తుల భద్రతకు మరిన్ని చర్యలు తీసుకోవాలి.అంతర్వేది సఖినేటిపల్లి: అంతర్వేదిలోని శ్రీలక్ష్మీ నృసింహస్వామివారి దేవస్థానం ఎంతో ప్రముఖమైంది. ఏటా ఫిబ్రవరిలో (మాఘమాసం) స్వామివారికి వార్షిక దివ్య తిరుకల్యాణ మహోత్సవాలు నిర్వహిస్తారు. వీటిలో ప్రధాన ఘట్టాలైన స్వామివారి కల్యాణం, స్వామివారి రథోత్సవం, చక్రవారీ (పౌర్ణమి సముద్ర స్నానం)లకు సుమారు 4 లక్షల మంది భక్తులు తరలివస్తారు. రథోత్సవంలోనే సుమారు 2 లక్షల మంది పాల్గొంటారు. వీరందరికీ యాత్ర పొడవునా ప్రస్తుతం ఉన్న భద్రత సరిపోవడం లేదని అభిప్రాయం వ్యక్తమవుతోంది. అలాగే ఉత్సవాల్లో పౌర్ణమి స్నానాలు అనంతరం స్వామివారి దర్శనానికి ఆలయానికి వచ్చే అసంఖ్యాకమైన భక్తులు ప్రాంగణంలో కిక్కిరిసి ఉంటారు. వీరందరికీ అరకొరగా భద్రత కల్పిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. కార్తిక మాసంలో కూడా ఆలయానికి అయ్యప్ప భక్తులు, సాధారణ భక్తులు పోటెత్తుతారు. ఈ నెలలో సుమారు 2 లక్షల మంది దర్శించుకుంటారు. -
బాలికపై అత్యాచారం చేసిన నిందితుడి అరెస్టు
ఐ.పోలవరం: బాలికకు చాక్లెట్ ఇచ్చి అత్యాచారానికి పాల్పడిన బాణాపురానికి చెందిన రాయపరెడ్డి సత్య వెంకట కృష్ణ (బాబీ)ని శనివారం పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు అమలాపురం డీఎస్పీ టీఎస్ఆర్కే ప్రసాద్ పాత ఇంజరం పోలీస్ స్టేషన్లో విలేకరులతో మాట్లాడారు. తినుబండారాలు ఇచ్చి బాలికను అత్యాచారం చేసినట్లు నిందితుడు ప్రాథమిక విచారణలో అంగీకరించాడన్నారు. బాలిక ఇంటికి అక్టోబర్ 25న వెళ్లి చాక్లెట్లు ఇవ్వటం ఇస్తుండగా తల్లి గమనించిందని, దీనిపై బాలికను నిలదీయగా నిందితుడి ఘాతుకాన్ని బాలిక తన తల్లికి చెప్పిందన్నారు. దీనిపై ఆమె తన కుటుంబ సభ్యులతో చర్చించి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిందని, ఆ మేరకు ఐ.పోలవరం పోలీసులు కేసు నమోదు చేసినట్టు డీఎస్పీ తెలిపారు. గతంలోనూ పలు కేసులు రాయపురెడ్డి బాబీపై గతంలో పలు కేసులు ఉన్నాయని డీఎస్పీ అన్నారు. 2001, 2002 సంవత్సరాలలో ఐ.పోలవరం పోలీస్ స్టేషన్లో రెండు మోటారు సైకిల్ దొంగతనం కేసులు, రాజానగరం పోలీస్ స్టేషన్లో 2005లో ఒక దొంగనోట్ల మార్పిడి కేసు ఉన్నాయని తెలిపారు. -
జిల్లా మలేరియా అధికారిగా ప్రభాకర్
కాకినాడ క్రైం: జిల్లా మలేరియా అధికారి(డీఎంఓ)గా ఇన్చార్జి హోదాలో డాక్టర్ ఇంజేటి ప్రభాకర్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఆ స్థానంలో పని చేస్తున్న డాక్టర్ పి.విల్సన్‌ను కాకినాడ పోర్టు వైద్యాధికారిగా నియమించారు. ప్రభాకర్‌ను జిల్లా, వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలోని డీఎంఓ చాంబర్లో వివిధ ఉద్యోగ సంఘాల నేతలు కలిసి అభినందనలు తెలిపారు. అనంతరం ఆయన సిబ్బందినుద్దేశించి మాట్లాడుతూ, కాకినాడను దోమల రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పని చేయాలని అన్నారు. మలేరియాను సమూలంగా రూపుమాపాలన్నారు. తొలి తిరుపతికి పోటెత్తిన భక్తులుపెద్దాపురం (సామర్లకోట): పెద్దాపురం మండలంలో తొలి తిరుపతిగా ప్రసిద్ధి చెందిన తిరుపతి గ్రామంలో వేంచేసియున్న శృంగార వల్లభస్వామి ఆలయానికి శనివారం ఏకాదశి పర్వదినం కావడంతో భక్తులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి అనేక మంది భక్తులు కాలినడకన ఆలయానికి చేరుకుని, స్వామివారికి ముడుపులు, మొక్కులు చెల్లించుకున్నారు. సుమారు 28 వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నట్లు ఆలయ ఈఓ వడ్డి శ్రీనివాసరావు తెలిపారు. ప్రత్యేక దర్శనం టికెట్ల ద్వారా రూ.2,69,700, అన్నదాన విరాళాలు రూ.1,09,339, కేశఖండన ద్వారా రూ.6,480, తులాభారం ద్వారా రూ.600, లడ్డూ ప్రసాదం విక్రయాల ద్వారా రూ.26,665 కలిపి మొత్తం రూ.4,12,774 ఆదాయం వచ్చిందని వివరించారు. ఆరు వేల మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించారని ఈఓ తెలిపారు. అర్చకులు పెద్దింటి పురుషోత్తమాచార్యులు, నారాయణాచార్యులు పూజాదికాలు నిర్వహించారు. జనసేన విభేదాలతో అందని తుపాను సహాయం శంఖవరం: తుపాను సహాయం పంపిణీలోనూ జనసేనలోని ఇరు వర్గాలు పైచేయి కోసం వివాదానికి దిగారు. దీంతో, తుపాను బాధితులకు సహాయం పంపిణీ కార్యక్రమం కాస్తా వాయిదా పడింది. వివరాలివీ.. కత్తిపూడిలో 20 మంది తుపాను బాధితులకు ఒక్కొక్కరికీ ఒక బియ్యం బస్తా, రూ.5 వేల నగదు పంపిణీ చేసేందుకు విజయవాడ రైల్వే డివిజన్ వినియోగదారుల సలహా మండలి సభ్యుడు గొర్లి నాగేశ్వరరావు సన్నాహాలు చేపట్టారు. పార్టీ నియోజకవర్గ బాధ్యతలు తాత్కాలికంగా నిర్వహిస్తున్న మేడిశెట్టి సూర్యకిరణ్ (బాబీ) వర్గం ఈ విషయం తెలుసుకుని, ఈ కార్యక్రమాన్ని అడ్డుకుంది. దీంతో, ఇరు వర్గాల మధ్య వివాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అన్నవరం ఎస్సై సురేష్‌బాబు తన సిబ్బందితో కలసి సంఘటనా స్థలానికి చేరుకుని, పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. విషయాన్ని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు దృష్టికి తీసుకువెళ్లడంతో ఆయన ఫోనులో మాట్లాడి, పరిస్థితిని అదుపులోకి తీసుకు వచ్చారు. ఈ వివాదం నేపథ్యంలో తుపాను సహాయం పంపిణీని వాయిదా వేశారు. దీనిపై బాధితులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సీఎం, డిప్యూటీ సీఎంలపై విమర్శల పేరిట ఇద్దరిపై కేసు తొండంగి: ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లపై సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ పైడికొండ గ్రామానికి చెందిన ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ గ్రామానికి చెందిన పెండ్యాల పంపారావు, మాగబత్తుల కృష్ణార్జునలు సామాజిక మాధ్యమాల్లో సీఎం, డిప్యూటీ సీఎంలను కించపరుస్తూ వ్యాఖ్యలు చేశారని తొండంగి ఎస్సై జగన్మోహన్రావు శనివారం తెలిపారు. వీరు డ్వాక్రా గ్రూపులను, తిరుపతి వెంకటేశ్వరస్వామిని కించపరిచారంటూ అదే గ్రామానికి చెందిన జాగు గోవిందు, నర్సే వీరస్వామి, పలివెల లోవరాజు, మేడిశెట్టి రామారావులు ఫిర్యాదు చేశారన్నారు. ఈ మేరకు పంపారావు, కృష్ణార్జునలపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు. -
ఆదివారం శ్రీ 2 శ్రీ నవంబర్ శ్రీ 2025
పాలు పోసుకునే స్థితిలో పంట పాడైంది పెద్దాపురం మండలం కాండ్రకోటకు చెందిన కొనగళ్ల వెంకటేశ్వర్లు సన్నకారు రైతు. తాతలు ఇచ్చిన భూమి సాగు చేసుకుంటున్నారు. రెండెకరాల్లో రూ.60 వేలు పెట్టుబడి పెట్టి వరి సా గు చేశారు. చేను కోతకు వచ్చే సమయంలో మోంథా తుపాను ముంచేసిందని ఆవేదన చెందుతున్నారు. భూ మిపై ఆధారపడి జీవించే రైతును ప్రభుత్వం ఆదుకుంటుందా లేదా అనే అయోమయ స్థితిలో వెంకటేశ్వర్లు కుటుంబం ఉంది. పడిపోయిన చేనును నిలబెట్టడానికి ఎకరాకు రూ.10 వేల అదనపు ఖర్చవుతుందని చెప్పారు. చేను పడిపోవడంతో ఎకరాకు 10 బస్తాల వరకూ దిగుబడి తగ్గిపోతుందని ఆయన ఆవేదన చెందుతున్నారు. పెట్టుబడి కూడా దక్కేలా లేదు కాజులూరు మండలం మొగలిపాలేనికి చెందిన ఈ కౌలు రైతు పేరు నల్లమిల్లి ఆదిరెడ్డి. వ్యవసాయ కూలీగా పొట్ట పోసుకుంటూనే గ్రామంలోని ఓ రైతు వద్ద రెండెకరాలు కౌలుకు తీసుకుని వరి సాగు చేశారు. ఎరువుల షాపుల వద్ద, షావుకారుల వద్ద అప్పులు చేసి మరీ ఇప్పటి వరకూ ఎకరాకు రూ.25 వేల చొప్పున పెట్టుబడి పెట్టారు. ఏపుగా పెరిగిన పంటను చూసి ఎకరాకు 30 నుంచి 40 బస్తాల దిగుబడి వస్తుందని ఆశ పడ్డారు. ఇంతలోనే ఆయన ఆశలపై తుపాను నీళ్లు జల్లేసింది. ఈదురుగాలులతో కూడిన వర్షాలకు పంట నేలనంటేయడంతో ఇప్పుడు 20 బస్తాలకు మించి దిగుబడి వచ్చే పరిస్థితి లేదని ఆదిరెడ్డి ఆవేదనగా చెప్పారు. మరోవైపు పడిపోయిన పంటను నిలబెట్టి కోత కోసి, మాసూళ్లు చేసి, గింజ ఒడ్డుకు చేర్చడానికి మరో రూ.15 వేలు ఖర్చవుతుందని, పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని, రైతుకు కౌలు ఎలా చెల్లించాలో అర్థం కావడం లేదని ఆయన వాపోతున్నారు. నిర్లక్ష్యమే ముంచుతోంది పిఠాపురం మండలం రాపర్తికి చెందిన మోరుకుర్తి సూరిబాబు కౌలుకు ఐదెకరాల్లో సాగు చేస్తున్నారు. గత ఏడాది వచ్చిన ఏలేరు వరదల్లో ఈయన పొలం పక్కనే ఎకరం పొడవునా గండి పడింది. దానిని పూడ్చాలని అధికారులకు ఎన్నోసార్లు మొర పెట్టుకున్నారు. గండ్లు పూడ్చుతున్నట్లు యంత్రాలతో హడావుడి చేశారు. కేవలం గట్టుపై నడిచి వెళ్లేలా చేశారు తప్ప ఎక్కడా పటిష్టంగా పూడ్చలేదు. ఇప్పుడు మళ్లీ ఏలేరు నుంచి అదనపు జలాలు వదిలేస్తూండటంతో మళ్లీ గండి పడే పరిస్థితి వచ్చింది. గత్యంతరం లేక ఇక్కడి రైతులందరూ కలసి ఇసుక బస్తాలు వేసి, గండి పడకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే చాలాచోట్ల గండ్లు పడ్డాయి. ఇక్కడ కూడా పడే అవకాశం ఉంది. అదే కనుక జరిగితే తమ పంటలు తమకు దక్కే అవకాశం ఉండదని సూరిబాబు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు వచ్చి అధికారులు, నేతలు వచ్చి అది చేస్తాం ఇది చేస్తాం అంటున్నారని, పంటలు పోయాక చేసేదేమీ ఉండదని ఆయన వాపోతున్నారు. -
బాలుడి దారుణ హత్య
గండేపల్లి: పూటుగా తాగిన మద్యం మత్తు తలకెక్కి, విచక్షణ కోల్పోయి, ఏం చేస్తున్నాడో తెలియని పరిస్థితుల్లో ఓ కిరాతకుడు బాలుడిని కత్తితో నరికి చంపేశాడు. కాకినాడ జిల్లా గండేపల్లి మండలం యర్రంపాలెం గ్రామంలో జరిగిన ఈ సంఘటన తీవ్ర కలకలం రేపింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. యర్రంపాలేనికి చెందిన బుంగా బాబ్జీ అలియాస్ బాబీ (17), అతడి స్నేహితుడు ఇజ్జిన చందు శుక్రవారం రాత్రి 12 గంటల సమయంలో కొమ్ము సత్తిబాబుకు చెందిన ఇంటి పునాదిపై కూర్చుని సెల్ఫోన్లో ఆడుతున్నారు. దీనికి ఎదురుగా నివాసం ఉంటున్న కాకర చిన్ని (సుమారు 50 ఏళ్లు) వీళ్ల వద్దకు వచ్చాడు. అర్ధరాత్రి ఏం పని మీకు, వెళ్లిపోవాలని చెప్పాడు. అప్పటికే అతడు పూటుగా తాగి ఉన్నాడు. ఈ క్రమంలో బాబీ, చిన్ని మధ్య స్వల్ప వివాదం చోటుచేసుకుంది. తీవ్ర ఆగ్రహానికి గురైన చిన్ని.. అక్కడే ఉంటే నరికేస్తానంటూ బాబీని బెదిరించి ఇంటికి వెళ్లిపోయాడు. కొద్దిసేపటికే తిరిగి కత్తి పట్టుకుని వచ్చి, బాబీ మెడపై ఒక్కసారిగా నరికాడు. తీవ్రంగా గాయపడిన బాబీ అక్కడి నుంచి ఇంటికెళ్తూ రోడ్డుపై కుప్పకూలిపోయాడు. స్థానికుల సహాయంతో కుటుంబ సభ్యులు అతడిని ఆటోలో పెద్దాపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. చిన్నిని బంధువులు శనివారం పోలీసులకు అప్పగించినట్లు తెలిసింది. ‘రాత్రి అన్నం తిని అందరం పడుకున్నాం. ఎప్పుడు బయటకెళ్లాడో తెలీదు. నా కొడుకుని తీసుకురండి’ అంటూ హతుడు బాబీ తల్లి విజయకుమారి బోరున విలపిస్తోంది. ఘటన స్థలాన్ని పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు, ఇన్చార్జి సీఐ బి. సూర్య అప్పారావు, గండేపల్లి ఎస్సై యూవీ శివనాగబాబు, సిబ్బంది పరిశీలించారు. -
‘ప్రభుత్వ వైఫల్యమే ఈ దుర్ఘటనకు కారణం’
కాకినాడ: కాశీబగ్గ దుర్ఘటనకు ప్రభుత్వ వైఫల్యం, నిర్లక్ష్యమే కారణమని మండిపడ్డారు వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర రీజియన్ కో-ఆర్డినేటర్ కురసాల కన్నబాబు. ‘ సాక్షి’ తో మాట్లాడిన ఆయన.. కాశీబుగ్గ దర్ఘటన అనేది అత్యం దురుదృష్టకరం. ప్రభుత్వ వైఫల్యం..నిర్లక్ష్యం కారణంగా ఈ సంఘటన జరిగింది. వేలాదిగా భక్తులు తరలివచ్చినప్పుడు ఆలయం వద్ద ప్రభుత్వం ఎలాంటి భద్రత చర్యలు తీసుకుంది?, తిరుమల, సింహచలం, కాశిబుగ్గ ఘటనలు కలిచి వేస్తున్నాయి. రాష్ట్రంలో ఇవాళ 23 వేల దేవదాయ శాఖకు చెందిన ఆలయాలు దిక్కు మొక్కు లేకుండా ఉన్నాయి.. ఆలయాలను ప్రైవేటు వ్యక్తులు కట్టినా...ఆ ఆలయాలకు భక్తులు తరలివస్తే.. దానిని ప్రైవేటు టెంపుల్‌గా చూడవద్దని కోర్టు తీర్పులు చెబుతున్నాయి.పర్వదిన్నాల్లో ఏ ఆలయాలకు ఎంత మంది భక్తులు వస్తారో అని పోలీసు శాఖకు అంచనాలేదు. సిని తారాలకు మాత్రం భారీగా బందోబస్తు ఉంటుంది. పోలీసు అధికారుల నుండి హోం మంత్రి వరకు భక్తుల విషయంలో చాల నిర్లక్ష్యంగా ఉన్నారు. రాష్ట్రంలో రూల్ బుక్ లేదు...రెడ్ బుక్ మాత్రమే ఉంది. ఘటనపై విచారణ జరిపి, భాధ్యులపై చర్యలు తీసుకోవాలి. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలి’అని కురసాల కన్నబాబు సూచించారు.కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట: 9 మంది మృతి -
అందని సాయంపై ఆగ్రహజ్వాల
మర్రిపాలెం(విశాఖ జిల్లా)పూసపాటిరేగ(విజయనగరం జిల్లా)/కాకినాడ రూరల్: మోంథా తుపాను బాధితులకు నష్టపరిహారం అందించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది. దొడ్డిదారిన పచ్చచొక్కాలకు పరిహారాన్ని పరిమితం చేసింది. అసలైన బాధితులను మోసగించింది. పునరావాస కేంద్రాల్లో నిద్రించిన వారికే పరిహారం అంటూ సాకులు వెతికింది. వాస్తవానికి తుపాను సమయంలో బంధువుల ఇళ్లలో తలదాచుకోవాలని అధికారులు, సిబ్బందే సూచించి.. ఇప్పుడు పరిహారానికి ఎగనామం పెట్టడంపై బాధితులు భగ్గుమంటున్నారు. ప్రభుత్వ తీరుపై దుమ్మెత్తిపోస్తున్నారు. కూటమి ఎమ్మెల్యేలను నిలదీస్తున్నారు. దీంతో బాధితులకు సమాధానం చెప్పలేక ఎమ్మెల్యేలు మెల్లిగా జారుకుంటున్నారు. వాంబేకాలనీవాసుల ఆగ్రహం మోంథా తుపాను ప్రభావంతో విశాఖపట్నం 51వ వార్డు మాధవధార వాంబే కాలనీలో ఇళ్లు పెచ్చులూడిపోయాయి. తుపాను సమయంలో కలెక్టర్ హరేందిర ప్రసాద్, విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్‌రాజు కాలనీలో ఇళ్లను పరిశీలించి బాధితులను మాధవధార మాధవస్వామి కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి వెళ్లాలని సూచించారు. అయితే సిబ్బంది మాత్రం అవకాశం ఉన్నవారు బంధువుల ఇళ్లకు వెళ్లాలని చెప్పారు. ఆ సమయంలో అందరి కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులు తీసుకుని వారి పేర్లు కూడా నమోదు చేసుకున్నారు. పునరావాస కేంద్రానికి 60 కుటుంబాలు వెళ్లగా, మరికొందరు బంధువుల ఇళ్ల వద్ద తలదాచుకున్నారు. తీరా నష్టపరిహారం విషయానికి వచ్చేసరికి అధికారులు చాలామందికి ఎగనామం పెట్టారు. వాంబేకాలనీలో 80 కుటుంబాలు ఉండగా, శుక్రవారం మాధవధార ఆర్టీవో కార్యాలయం సమీపంలోని కార్యాచరణ ప్రణాళిక కార్యాలయం(పీ–4)లో జరిగిన పరిహారం పంపిణీ కార్యక్రమంలో 30 కుటుంబాలకు మాత్రమే నిత్యావసరాలతోపాటు రూ.3వేల నగదు అందించారు. దీంతో బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజును నిలదీశారు. ఎమ్మెల్యే వారికి నచ్చజెప్పే యత్నం చేయగా.. వారు వినలేదు. దీంతో ఎమ్మెల్యే అక్కడి నుంచి చల్లగా జారుకున్నారు. ఈ సందర్భంగా బాధితులు లక్ష్మి, పైడిపల్లి సత్యవతి, నాగమణి తదితరులు మాట్లాడుతూ తమకు తక్షణం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. జనసేన ఎమ్మెల్యే నాగమాధవిపై బాధితుల ఆగ్రహం విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గ జనసేన ఎమ్మెల్యే లోకం నాగమాధవికి శుక్రవారం చేదు అనుభవం ఎదురయింది. మోంథా తుపాను ప్రభావంతో నష్టపోయిన మత్స్యకార కుటుంబాలకు బియ్యం పంపిణీకి వచి్చన ఆమెను కోనాడ గ్రామ బాధితులు నిలదీశారు. గ్రామంలో 590 మత్స్యకార కుటుంబాలు ఉంటే కేవలం మత్స్యకార భరోసా అందిన 27 కుటుంబాలకే బియ్యం ఇవ్వడంపై ధ్వజ మెత్తారు. ఎమ్మెల్యేను నిలదీశారు. అందరికీ బియ్యం అందించాలని డిమాండ్ చేశారు. దీంతో ఎమ్మెల్యే బియ్యం పంపిణీ చేయకుండానే పోలీసుల సాయంతో గ్రామం నుంచి వెళ్లిపోయారు. అనంతరం కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డిని కలిసిన మత్స్యకార నాయకులు అందరికీ బియ్యం అందించాలని వినతిపత్రం అందించారు. గత ప్రభుత్వంలో వివక్ష లేకుండా సాయం పంపిణీ చేశారని వివరించారు. కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యేకూ నిరసన సెగ కాకినాడ రూరల్ మండలం పోలవరం, సూర్యారావు పేట గ్రామాలలోని మత్స్యకారులకు శుక్రవారం బియ్యం పంపిణీ చేయడానికి వచ్చిన జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీని తుపాను బాధితులు నిలదీశారు. నేమాం గ్రామ పరిధిలోని సూర్యారావుపేటలో సుమారు 245 మత్స్యకార కుటుంబాలు ఉంటే కేవలం 48 కుటుంబాలనే నష్టపరిహారానికి ఎంపిక చేయడం తగదని నిరసన వ్యక్తం చేశారు. ఆందోళనకారుల్లో ఎక్కువ మంది టీడీపీ సానుభూతిపరులు ఉండడం గమనార్హం. దీంతో ఎమ్మెల్యే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. అనంతరం తమ్మవరం గ్రామ పరిధిలోని పోలవరంలోనూ ఎమ్మెల్యేకు నిరసన సెగ తగిలింది. గ్రామంలో 250 కుటుంబాలు ఉంటే 77 కుటుంబాలను ఎంపిక చేయడమేమిటని ప్రశ్నించారు. అందరికీ ఇస్తేనే తీసుకుంటామని సరుకులు తీసుకునేందుకు నిరాకరించారు. అలాగే సూర్యారావుపేటలో సులభ్ కాంప్లెక్స్ నిర్మించకపోవడంతో స్థానికులు ఎమ్మెల్యేను నిలదీశారు. -
బాలికపై జనసేన నేత లైంగిక దాడి
ఐ.పోలవరం: రాష్ట్రంలో కూటమి నేతల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. అక్రమాలు, దౌర్జన్యాలు, మహిళలు, బాలికలపై అఘాయిత్యాల్లో కూటమి నేతలు ముందుంటున్నారు. కాకినాడ జిల్లా తునిలో ఇటీవల గురుకుల పాఠశాల విద్యార్థినిపై టీడీపీ నాయకుడు నారాయణరావు అఘాయిత్యానికి పాల్పడటం, ఆనక అతడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం తెలిసిందే. ఇప్పుడు అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఓ జనసేన నాయకుడు ఆరో తరగతి చదువుతున్న బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. తండ్రి లేని 11 ఏళ్ల బాలికకు చాక్లెట్లు ఇచ్చి, మాయమాటలతో లోబరుచుకుని పలు పర్యాయాలు లైంగిక దాడి జరిపాడు. ఈ బాగోతం బయటపడితే పరువు పోతుందని కొందరు కూటమి నేతలు ఆ బాలిక తల్లితో పాటు బంధువులతో కేసు లేకుండా రాజీ చేసేందుకు యత్నించారు. రాజకీయంగా తీవ్ర ఒత్తిళ్లు కూడా తెచ్చారు. అయినప్పటికీ బాలిక తల్లి ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాలిక తల్లి నిలదీయడంతో.. అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఐ.పోలవరం సమీప గ్రామానికి చెందిన బాలికపై బాణాపురానికి చెందిన జనసేన యువజన నాయకుడు రాయపురెడ్డి సత్యవెంకటకృష్ణ (బాబీ) ఈ దారుణానికి పాల్పడ్డాడు. బాలిక తండ్రి రెండేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. నిరుపేద కుటుంబానికి చెందిన ఆ బాలిక తన తల్లితో కలసి పూరి గుడిసెలో నివసిస్తోంది. ఆ బాలికకు బాబీ మాయమాటలు చెప్పి పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడినట్టు కుటుంబ సభ్యులు పోలీసులకు ఇచి్చన ఫిర్యాదులో పేర్కొన్నారు. గ్రామ సమీపంలోని ఒక భవనం నుంచి ఆ బాలికతో కలసి బాబీ గురువారం బయటకు వస్తుండగా ఆమె తల్లి అనుమానంతో నిలదీసింది. దీంతో తనపై బాబీ అనేక పర్యాయాలు అఘాయిత్యానికి పాల్పడ్డాడని ఆ బాలిక చెప్పింది. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేయగా.. వారు గురువారం రాత్రి జిల్లా ఎస్పీ రాహుల్ మీనాను కలిసి ఫిర్యాదు చేశారు. వెంకట కృష్ణపై పోక్సో, బీఎన్ఎస్ చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు. రాజీకి తీవ్ర యత్నాలు బాబీని కేసు నుంచి తప్పించేందుకు, రాజీ చేసేందుకు జనసేన, టీడీపీ నేతలు తెరవెనుక తీవ్రంగా యతి్నంచారు. అయితే, బాలిక తల్లి సహా కుటుంబ సభ్యులు ససేమిరా అనడంతో చివరకు అమలాపురం డీఎస్పీ ప్రసాద్ శుక్రవారం కేసు నమోదు చేసి, విచారణ జరిపారు. డీఎస్పీ కథనం ప్రకారం.. నిందితుడు బాబీ ఐ.పోలవరం జెడ్పీ హైసూ్కల్లో విద్యాకమిటీ సభ్యుడు. క్రీడాకారుడు కావడంతో విద్యార్థులకు క్రీడా శిక్షణ ఇస్తుంటాడు. బాధితురాలు నిందితుడికి సమీప బంధువు. ఆమె తండ్రి రెండేళ్ల క్రితం మృతి చెందారు. తల్లి ఆక్వా కార్మికురాలు. నిందితుడు ఆ బాలికకు తరచూ చాక్లెట్లు కొనిపెడుతూ తన బంధువుకు చెందిన ఖాళీగా ఉన్న ఇంట్లో అఘాయిత్యానికి బరితెగిస్తున్నట్టు విచారణలో తేలిందని డీఎస్పీ చెప్పారు. నిందితుడి బారిన పడిన వారిలో ఇంకొందరు బాలికలూ ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. పరారీలో ఉన్న నిందితుడు బాబీని త్వరలోనే అరెస్టు చేస్తామని చెప్పారు.వైఎస్సార్సీపీ నేతల పరామర్శబాధిత కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ ముమ్మిడివరం నియోజకవర్గ కో–ఆర్డినేటర్ పొన్నాడ వెంకటసతీష్ కుమార్, పార్టీ సీఈసీ సభ్యుడు పితాని బాలకృష్ణ, కాశి మునిబాలకుమారి తదితరులు పరామర్శించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. -
సైనిక పాఠశాలల స్వాగతం
● ఆరు, తొమ్మిదో తరగతుల ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం ● నేటితో గడువు పూర్తి ● వచ్చే ఏడాది జనవరిలో పరీక్ష ముఖ్యమైన తేదీలు నోటిఫికేషన్ విడుదల : 10.10.2025 దరఖాస్తుకు చివరి తేది: 30.10.2025 తప్పుల సవరణకు: నవంబరు 2 నుంచి 4 వరకు అడ్మిట్ కార్డు (హాల్ టికెట్) జారీ: 2026 జనవరి మొదటి వారం ప్రవేశ పరీక్ష: 2026 జనవరి రెండో వారం రాయవరం: సైన్యంలో చేరి దేశ రక్షణలో పాలు పంచుకోవాలనే కోరిక చాలా మందికి ఉంటుంది. దాన్ని సాధించడం కోసం అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో సైనిక్ పాఠశాలలు పిల్లలకు ఈ అవకాశం కల్పిస్తున్నాయి. దీనిలో భాగంగా 2026–27 విద్యా సంవత్సరంలో సైనిక్ స్కూళ్లలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. దీనికి దరఖాస్తు చేసుకునేందుకు గురువారంతో గడువు ముగియనుంది. 6, 9 తరగతుల్లో ప్రవేశాలకు ఏటా నోటిఫికేషన్‌ను సైనిక్ స్కూల్ సొసైటీ జారీ చేస్తుంది. ఈ ప్రవేశ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్డీటీఏ) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏటా డిసెంబర్లో విడుదలయ్యే నోటిఫికేషన్ ఈ ఏడాది అక్టోబర్ రెండోవారంలోనే వచ్చింది. విద్యార్థులకు అవకాశం సైనిక్ పాఠశాలలో సీటు సాధిస్తే గుణాత్మకమైన విద్యతో పాటు సహ పాఠ్య కార్యక్రమాలు ఉంటాయి. ఆరో తరగతిలో బాలురతో పాటు బాలికలు ప్రవేశం పొందవచ్చు. 9వ తరగతిలో ప్రవేశాలకు బాలురు మాత్రమే అర్హులు. ప్రవేశ పరీక్ష, వైద్య పరీక్షల్లో విజయం సాధించాలి. ప్రవేశం పొందిన విద్యార్థులు ఇంటర్మీడియట్ వరకు అక్కడే చదువుకునే అవకాశముంది. వయో పరిమితి ఆరో తరగతిలో చేరే విద్యార్థులు 10 నుంచి 12 ఏళ్లు (01 ఏప్రిల్ 2014 నుంచి 31 మార్చి 2016), 9వ తరగతిలో చేరే విద్యార్థులు 13 నుంచి 15 ఏళ్లు (01 ఏప్రిల్ 2011 నుంచి 31 మార్చి 2013 మధ్య జన్మించాలి) ఉండాలి. ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో చదివిన వారికి అవకాశం ఉంటుంది. దరఖాస్తు విధానం 2026 జనవరి నెలలో ప్రవేశ పరీక్ష ఉంటుంది. ఆసక్తి, అర్హత ఉన్న విద్యార్థులు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఏఐఎస్ఎస్ఈఈ.ఎన్టీఏ.ఎన్ఐసీ.ఇన్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి. అవసరమైన ధ్రువపత్రాలు, ఫొటో, సంతకాలను అప్లోడ్ చేయాలి. జనరల్, డిఫెన్స్ కేటగిరీ అభ్యర్థులు రూ.850, ఎస్సీ, ఎస్టీలు రూ.700, ఆన్లైన్లో ఫీజు చెల్లించాలి. దరఖాస్తు ప్రక్రియ పూర్తవగానే రిజిస్టర్ చేసుకున్న సెల్ నంబర్‌కు మెసేజ్ వస్తుంది. గల్లంతైన బాలుడి మృతదేహం లభ్యం కాకినాడ రూరల్: మండలంలోని సూర్యారావుపేట పర కాలువ వద్ద సోమవారం గల్లంతైన పోలవరపు సాయి చరణ్ రుత్విక్ (11) మృత దేహం లభ్యమైంది. తుపాను ప్రభావంతో కాలువలో నీరు ఉధృతంగా రావడంతో సాయి చరణ్ గల్లంతైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సూర్యారావుపేట న్యూ ఎన్టీఆర్ బీచ్‌లోని హరిత రిసార్ట్స్ వద్ద బుధవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో బాలుడి మృతదేహన్ని పోలీసులు గుర్తించారు. అతడి కోసం రెండు రోజులుగా ఎస్డీఆర్ఎఫ్, అగ్ని మాపక సిబ్బంది, తిమ్మాపురం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేకుండా పోయింది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని ఎస్సై గణేష్ కుమార్ తెలిపారు. -
ఎంపీ మా సమస్యలు వినలేదు
రోడ్డుపై బైఠాయించి మత్స్యకారుల నిరసన కొత్తపల్లి: ఓట్లు వేయమని ఇంటివద్దకే వస్తారు. ఓటు వేసి నెగ్గిన తరువాత మా సమస్యలు చెప్పడానికి వస్తే వినకుండానే వెళ్లిపోతారా అంటూ నాయకర్ కాలనీ–1కి చెందిన మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉప్పాడ తీర ప్రాంతంలో బుధవారం ఎంపీ ఉదయ శ్రీనివాస్ పర్యటించి తిరిగి వస్తుండగా నాయకర్ కాలనీ–1చెందిన మత్స్యకారులు తమ సమస్యలు చెప్పుకునేందుకు ఆయన కారు ఆపారు. అయితే ఎంపీ కారు ఆపకుండా వెళ్లిపోవడంతో మత్స్యకారులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. తుపాను సమస్యలను తెలపడానికి కారు ఆపినా ఆపకుండా వెళ్లిపోవడమేమిటంటూ మండిపడ్డారు. రెండు రోజులుగా తుపాను కారణంగా చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలి పలు గృహాలు దెబ్బతిన్నాయని, విద్యుత్ లేక ఇబ్బందులకు గురవుతున్నామని ఆయన దృష్టికి తీసుకువెళ్లేందుకు యత్నిస్తే ఎంపీ వినకుండా వెళ్లిపోయారని కంబాల పాండురంగ ఆవేదన వ్యక్తం చేశాడు. మాజీ ఎంపీ వంగా గీత వచ్చి మా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మాకు ఽధైర్యం చెప్పి వెళ్లారు. అధికారంలో ఉన్న ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వచ్చారని తెలిసి మా సమస్యలు చెప్పుకునేందుకు రోడ్డుపైకి వచ్చామని కారు ఆపమని అడిగినా ఆపకుండా వెళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. వేట లేక పూట గడవని పరిస్ధితుల్లో ఉన్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఏలేరుకు వరద నీరు తగ్గుముఖం ఏలేశ్వరం: మోంథా తుపాను ప్రభావం అంతగా లేకపోవడంతో ఏలేరు రిజర్వాయర్‌కు వరద నీరు తగ్గుముఖం పట్టింది. పరీవాహక ప్రాంతంలో వర్షాలు తగ్గడంతో ప్రాజెక్టులోకి 2,392 క్యూసెక్కుల మేర నీటి నిల్వలు వచ్చి చేరాయి. బుధవారం నాటికి ప్రాజెక్టులో 86.56 మీటర్లకు 85.35 మీటర్లు, 24.11 టీఎంసీలకు గాను 21.66 టీఎంసీల మేర నీటినిల్వలు ఉన్నాయి. దిగువ ప్రాంతానికి 4,500, విశాఖకు 175 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. నేడు తెరుచుకోనున్న విద్యాసంస్థలు బాలాజీచెరువు (కాకినాడ సిటీ): తుపాను ప్రభావం తగ్గడంతో ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు గురువారం నుంచి పనిచేయాలని డీఈఓ పిల్లి రమేష్ బుధవారం తెలిపారు. వీటితో పాటు, ఇంటర్మీడియెట్ కళాశాలలు, ఐటీఐలు, పాలిటెక్నిక్, ఇంజినీరింగ్ కళాశాలలు తెరచుకోనున్నాయి. తొలుత ఈ నెల 31 వరకూ సెలవులు ప్రకటించిన విషయం విదితమే. -
నిండా ముంచిన మోంథా
సాక్షిప్రతినిధి, కాకినాడ: మోంథా తుపాను జిల్లాపై పెద్దగా ప్రభావం చూపించలేదు. ఒకటి, రెండు ఘటనలు మినహాయిస్తే పెద్దగా ప్రమాదాలు కూడా చోటు చేసుకోలేదు. అయితే తుపాను రైతులకు మాత్రం కష్టాల కన్నీళ్లను మిగిల్చిపోయింది. తుపాను కాకినాడ సమీపాన తీరం దాటుతుందనే అంచనాలు తప్పడంతో జిల్లా ప్రజలు ఊరటపొందారు. అయితే వరి, ఇతర ఉద్యాన పంటలు వేసిన రైతులకు మాత్రం ఈ తుపాను అశనిపాతమైంది. జిల్లాలో ఈదురుగాలులు, రెండు రోజులుగా కురిసిన వర్షాలు రైతులను నట్టేట ముంచేశాయి. జిల్లాలో బుధవారం 2.76 సెంటీమీటర్ల వర్షం కురిసింది. 0.6 సెంటీమీటర్లతో కోటనందూరు మండలంలో అత్యధిక వర్షపాతం నమోదైంది. ఈ వర్షాలతో నీట మునిగిన పంట అసలు దక్కుతుందా లేదా అనే ఆందోళనలో రైతులున్నారు. పొట్టదశలో ఉన్న వరి పంట వారం, పది రోజులు ఆగితే చేతికొచ్చేసేది. అటువంటి వరి పంట తుపానుతో నీటమునిగి జిల్లాలో రైతులు కన్నీరు పెడుతున్నారు. జిల్లాలో 12 నుంచి 15 మండలాల్లో వరితోపాటు ఇతర వాణిజ్య పంటలు ముంపులో ఉండటం రైతులకు కంటిపై కునుకు లేకుండా చేస్తోంది. రైతులకు భారీ నష్టం ఆరుగాలం శ్రమటోడ్చి పండించిన వరికి ఇలాంటి విపత్తు వస్తుందని ఊహించలేదని రైతులు లబోదిబోమంటున్నారు. నారుమడి వేసిన దగ్గర నుంచి ట్రాక్టర్ దమ్ములు చేసి, గట్లంకలు వేసి, కలుపుతీసి నాట్లు వేసి, ఎరువులు వేసి, మందులు పిచికారీ చేసే సరికి ఎకరాకు రూ.35 వేల నుంచి రూ.40వేలు ఖర్చయిందని, మాయదారి తుపాను నిండా ముంచేసిందని వాపోతున్నారు. ముంపులో ఉన్న నీరు ఎప్పుడు లాగేస్తుంది, తాము ఎప్పుడు బయటపడతామని రైతులు గంపెడాశతో ఎదురుచూస్తున్నారు. జిల్లాలో 40వేల పై చిలుకు ఎకరాల్లో వరి పంట నీట మునిగిందని ప్రాథమిక అంచనా. జిల్లాలో ముంపునకు గురైన వరి పంటతో పాటు ఉద్యానవన పంటల నష్టం అంచనాల కోసం క్షేత్రస్థాయిలో యంత్రాంగానికి కలెక్టర్ షణ్మోహన్ సగిలి బుధవారం రాత్రి ఆదేశాలు జారీచేశారు. వరి పంటతో పాటు ఉద్యాన పంటలు కూడా ముంపునకు గురయ్యాయి. గొల్లప్రోలు, పిఠాపురం, తుని రూరల్ తదితర మండలాల్లో ఆరేడు వేల ఎకరాల్లో పత్తి, మిర్చి, కాయగూరలు తదితర ఉద్యానవన పంటలు వర్షంతో దెబ్బతిన్నాయి. మొత్తంగా జిల్లాఅంతటా కలిపి 10వేల పై బడే రైతుల పంటలు ముంపునకు గురయ్యాయంటున్నారు. కాజులూరు, సామర్లకోట, పెదపూడి, కరప, కిర్లంపూడి తదితర మండలాల్లో అత్యధికంగా పంట పొలాలు ముంపులో ఉన్నాయి. వరితో పాటు ఇతర వాణిజ్య పంటలకు 20 మండలాల్లో ముంపులో ఉన్నాయి. గొల్లప్రోలు, తొండంగి, తుని, శంఖవరం, రౌతులపూడి మండలాల్లో పత్తి పంట దెబ్బతింది. గొల్లప్రోలు మండలంలో వరితో పాటు దెబ్బతిన్న పత్తి పంటను పిఠాపురం వైఎస్సార్ సీపీ కోఆర్డినేటర్, మాజీ ఎంపీ వంగా గీత పరిశీలించి రైతుల సాధక బాధలను తెలుసుకుని అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. పెద్దాపురం నియోజకవర్గ పరిధిలో పలు ఆయకట్టులో వెదజల్లు పద్ధతిలో సాగుచేసిన పొలాల్లో వరి పంట నేలకొరిగింది. సుమారు 10వేల ఎకరాల వరకు వర్షాలకు ముంపు బారిన పడ్డాయి. తుని నియోజకవర్గంలో సుమారు 1,200 ఎకరాల్లో వరి, మరో 1,000 ఎకరాల్లో పత్తి పంట నీట మునిగింది. ప్రత్తిపాడు నియోజకవర్గంలో 1,245 ఎకరాల్లో వరి, 200 ఎకరాల్లో అరటి, 230 ఎకరాల్లో పత్తిపంట ముంపులో ఉంది. ఏలేరు, సుద్దగడ్డ కాలువలు పొంగి పొర్లుతుండడంతో గొల్లప్రోలు, పిఠాపురం మండలాల్లో వరి పంటతో సహా ఇతర వాణిజ్య పంటలు కూడా వరద బారిన పడతాయనే ఆందోళన రైతుల్లో నెలకొంది. ఉప్పాడలో కూలిన గృహాలు చి‘వరి’లో కష్టాల కన్నీళ్లు... ఎంత కష్టం..ఎంత నష్టం ముంపులో 40 వేల ఎకరాల వరి 7 వేల ఎకరాల్లో దెబ్బతిన్న ఉద్యాన పంటలు ఏపీఈపీడీసీఎల్‌కు రూ.1.12 కోట్ల నష్టం ‘తుపాను నిండా ముంచేసింది’ అప్పులు చేసి సాగు చేసిన వరి పంటను తుపాను అడియాశలు చేసింది. 14 ఎకరాలలో వరి సాగు చేశాను. 8 ఎకరాల్లో పంట నేలకు ఒరిగిపోయింది. ఇప్పటికే ఎకరాకు సుమారు రూ.36వేలు వరకు ఖర్చు చేశాను. వ్యవసాయశాఖ అధికారులు వరి చేలు పైకిలేపి కట్టలు కట్టండి అని చెబుతున్నారు. – జానిక శివ, రైతు, తామరాడ, కిర్లంపూడి మండలం మినుము నాశనమైపోయింది ఆరు ఎకరాల మినుము పంట సాగు చేశాను. తుపానుకు పంట మొత్తం తడిసిపోయింది. గింజలు మొలకలు వస్తున్నాయి. సుమారు రూ.1,20,000 వరకు పెట్టుబడి పెట్టాను. పంట చేతికి రాకుండానే ఇలా అయింది. ఎకరం వరి సాగు చేశాను. వర్షాలు ఎక్కువైతే వరి పంటను కూడా నష్టం పోయే అవకాశం ఉంది. ప్రభుత్వం ఆదుకోవాలి. – దమ్ము అప్పారావు, కౌలు రైతు, పి.నాయకంపల్లి, గండేపల్లి మండలం -
స్వీట్ స్టాల్ పొయ్యిపై పడిన కొబ్బరి చెట్టు
● చెలరేగిన మంటలు ● తప్పిన ప్రమాదం పి.గన్నవరం: మండలంలోని నరేంద్రపురం గ్రామంలో మంగళవారం సాయంత్రం స్వీట్స్ తయారీ షెడ్డుపై ఈదురు గాలులకు కొబ్బరిచెట్టు విరిగిపడింది. దీంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో పాటు, అక్కడ పనిచేస్తున్న నలుగురు త్రుటిలో తప్పించుకోవడంతో ప్రమాదం తప్పింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నరేంద్రపురం గ్రామంలో పప్పుల వెంకటేష్ స్వీట్ స్టాల్ నడుపుతున్నాడు. అతని షాపు వెనుక భాగంలోని షెడ్డులో స్వీట్, హాట్ తయారు చేస్తుంటారు. ఈ క్రమంలో మంగళవారం స్వీట్స్ తయారు చేస్తుండగా ఈదురు గాలులకు పక్కనే ఉన్న కొబ్బరిచెట్టు పెళ, పెళమని శబ్దం చేస్తూ విరిగి తయారీ కేంద్రంపై పడిపోయింది. దీంతో మంటలు వ్యాపించాయి. ఈ శబ్దాలను గమనించిన నలుగురు వ్యక్తులు అక్కడి నుంచి తప్పించుకున్నారు. రెండు కళాయిల్లో మరుగుతూ ఉన్న నూనె కూడా చెల్లాచెదురుగా పడిపోయింది. స్థానికులు మంటలు అదుపు చేశారు. ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. స్వీట్ స్టాల్ యజమానికి నష్టం వాటిల్లింది. -
యథావిధిగా జీతాలు ఆలస్యం!
● అన్నవరం దేవస్థానం శానిటరీ ఉద్యోగులకు తప్పని వేతన వ్యథ ● అక్టోబర్ 28 వచ్చినా 349 మందికి అందని వైనం అన్నవరం: శ్రీవీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్న 349 మంది పారిశుధ్య సిబ్బందికి అక్టోబర్ 28వ తేదీ వచ్చినా ఇంకా వేతనాలు చెల్లించకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. వీరికి రూ.52 లక్షలు జీతాల రూపంలో చెల్లించాల్సి ఉంది. జీతాల చెల్లింపు ఆలస్యం కావడం ఇదే మొదటి సారి కాదు. ఈ ఏడాది నాలుగు సార్లు జీతాల చెల్లింపు ఆలస్యమైంది. అయితే సాక్షి దినపత్రికలో వార్తలు ప్రచురితమయ్యాక అధికారులు చర్యలు తీసుకొని జీతాలు చెల్లించారు. అయితే జీతాల చెల్లింపులో ఆలస్యానికి కారణం దేవస్థానానికి పారిశుధ్య సిబ్బందిని సరఫరా చేస్తున్న గుంటూరుకు చెందిన కనకదుర్గా ఏజెన్సీ కాంట్రాక్టర్ అని చెప్పేవారు. పాత కాంట్రాక్ట్ చివరి నెలలో కూడా తప్పని ఇబ్బంది హైదరాబాద్‌కు చెందిన కేఎల్‌టీఎస్ సంస్థ రెండేళ్లుగా దేవస్థానంలో శానిటరీ విధులు నిర్వహిస్తోంది. గత ఫిబ్రవరితో ఈ సంస్థ గడువు ముగిసిన నేపథ్యంలో కొత్త టెండర్ ఖరారయ్యే వరకు మార్చి ఒకటో తేదీ నుంచి తాత్కాలికంగా శానిటరీ సిబ్బంది సరఫరాకు గుంటూరుకు చెందిన కనకదుర్గా ఏజెన్సీకి కాంట్రాక్ట్ అప్పగించారు. ఏడు ప్రముఖ దేవస్థానాల శానిటరీ టెండర్ తిరుపతికి చెందిన పద్మావతి హాస్పటాలిటీ అండ్ ఫెసిలిటీ మేనేజ్మెంట్ సంస్థ దక్కించుకుంది. దాంతో అక్టోబర్ ఒకటో తేదీ నుంచి అన్నవరం దేవస్థానంలో శానిటరీ విధులు నిర్వహిస్తోంది. కనకదుర్గా శానిటరీ కాంట్రాక్టర్ కింద పనిచేసిన 349 మంది సిబ్బందికి సెప్టెంబర్ నెల జీతాలు చెల్లించాల్సి ఉంది. ఈ నెల 28వ తేదీ వచ్చినా జీతాలు చెల్లించలేదు. జీతాల బిల్లు ఆడిట్‌కు పంపించాం శానిటరీ సిబ్బంది సెప్టెంబర్ నెల జీతాల బిల్లు ఆడిట్‌కు పంపించాం. ఆడిటర్ సెలవులో ఉన్నా రు. ఆయన రెండు మూడు రోజు ల్లో వచ్చేస్తారు. ఆయన బిల్లు క్లియర్ చేసి పంపించిన వెంటనే జీతాలు చెల్లిస్తాం. – వీర్ల సుబ్బారావు, ఈఓ, అన్నవరం దేవస్థానంఈసారి ఆలస్యానికి కారణం దేవస్థానం అధికారులే.. కనకదుర్గా ఏజెన్సీ ఈ నెల నాలుగో తేదీనే సిబ్బందికి చెల్లించాల్సిన పీఎఫ్ మొత్తాన్ని ముందుగా బ్యాంకులో జమ చేసి ఆ చలానాలు దేవస్థానానికి అందజేసింది. ఆ చలానాలు పరిశీలించి వెంటనే జీతాలు చెల్లింపునకు చర్యలు తీసుకోవాలి. వారం రోజుల వ్యవధిలోనే జీతాల మొత్తాన్ని కాంట్రాక్టర్ అకౌంట్‌కు జమ చేయాలి. అలా జమ చేసిన గంటలోపు సిబ్బంది ఖాతాలకు జీతం జమ అవుతుంది. అయితే కనకదుర్గా ఏజెన్సీ కాంట్రాక్టర్ పీఎఫ్ చెల్లించి 24 రోజులు గడచినా సిబ్బందికి జీతాలు అందకపోవడం అధికారుల నిర్లక్ష్యంగానే పరిగణించాలి. -
తుపాను అయినా.. షాపు మూసేదేలే!
నల్లజర్ల: ఒక పక్క మోంథా తుపాను పెను ముప్పుగా దూసుకువస్తోంది. ఈ కారణంగా నల్లజర్ల మండలంలో భారీ ఈదురుగాలులు, ఎడతెరిపి లేని వర్షాలు పడుతుండటంతో వివిధ గ్రామాల్లో ప్రజల్ని పోలీసు శాఖ అప్రమత్తం చేసి ఇళ్లకు వెళ్లేలా అప్రమత్తం చేసింది. హోటళ్లు, షాపులను మూసి వేయించారు. కానీ, మద్యం షాపులు, దాబాల జోలికి పోలీసులు వెళ్లలేదని, వాటికి తుపాను ప్రమాదం ఉండదా? అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. కలెక్టర్ మాత్రం అన్ని షాపులు, వ్యాపార సంస్థలు మూసి వేయించాలని ఆదేశాలు జారీ చేసినా.. మద్యం షాపులు, దాబాలు రాత్రి 8 దాటినా యథావిధిగా కొనసాగుతున్నాయి. -
కన్నీరు రాకుండా..
ఫ ముంపు పంటలను కాపాడుకుందాం ఫ సస్యరక్షణ చర్యలు అవశ్యం ఫ ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త నందకిశోర్ ఐ.పోలవరం: వర్షం.. పుడమి పుత్రులకు కన్నీరు తెచ్చింది.. కష్టాన్ని నీట నాన్చింది.. బంగాళాఖాతంలో మోంథా తుపాను ప్రభావంతో పడుతున్న వర్షాలకు వందల ఎకరాల్లో వరి చేలు నేలకొరగడం, నీట మునగడం జరిగింది. ఈ నేపథ్యంలో రైతులు పంటలను రక్షించుకునేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త, కన్వీనర్ డాక్టర్ ఎం.నంద కిశోర్ వెల్లడించారు. అవి ఆయన మాటల్లోనే.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్‌లో 1.63 లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగింది. ప్రస్తుతం పంట పూత, పాలు పోసుకునే దశ, గింజ గట్టిపడే దశలలో ఉంది. ముఖ్యంగా ఎంటీయూ– 1318, స్వర్ణ, సంపద స్వర్ణ మొదలైన రకాలు పూత దశలో వర్షాలు కురిసినప్పుడు సంపర్కం జరగకపోవడం వల్ల తాలు గింజలు ఏర్పడతాయి. ఎంటీయూ– 1318 రకాలు గొలుసు కట్టు దగ్గరగా ఉండటం వల్ల గింజ రంగు మారడం, మాని పండు తెగులు వచ్చే అవకాశం ఉంది. నిరంతర వర్షాలతో గింజలో నిద్రావస్థ తొలిగి మొలక వచ్చే ప్రమాదం ఉంది. బ్యాక్టీరియా ఎండాకు తెగులు మరియు మాగుడు తెగులు వ్యాపించే ప్రమాదముంది. పాలు పోసుకునే దశలో ఉన్న రకాలు (స్వర్ణ, సంపద స్వర్ణ, మొదలైనవి) వర్షాల వల్ల పడిపోతే పొలంలో నీటిని అంతర్గత కాలువల ద్వారా తొలగించాలి. చిన్న కాలువలను ఏర్పాటు చేస్తే మంచి ఫలితం ఉంటోంది. ఎక్కువగా నీరు నిలిచిన చోట పెద్ద కాలువలు చేసి మోటార్ల ద్వారా తొలగించాలి. కోత సమయం ఉంటే.. ఫ గింజ తోడుకొని లేదా గట్టి పడే దశలో లేదా కోత దశలో అకాల వర్షాలతో మొక్క పడిపోయి నేలకొరిగే అవకాశం ఉంది. దీనితోపాటు పడిపోయిన చేనుల నుంచి వచ్చే ధాన్యం మిల్లింగ్ సమయంలో విరిగిపోయి నూక ఎక్కువ రావచ్చు. కోసిన పొలంలో ఉన్న పనలు వర్షానికి తడిచినట్లయితే నీరు పూర్తిగా బయటకు పోవటానికి కాలవలు ఏర్పాటు చేసుకోవాలి. ఫ గింజ మొలకెత్తకుండా ఉండటానికి 5 శాతం ఉప్పు ద్రావణాన్ని పనలపై పడేవిధంగా పిచికారీ చేయాలి. నిద్రావస్థ లేనటువంటి సాంబ మసూరి వంటి రకాలు మరియు నిద్రావస్థ ఉన్న రకాలలో వారం రోజుల పాటు చేను పడిపోయి నీట మునిగినప్పుడు మొలక వచ్చి నష్టం ఎక్కువగా ఉంటుంది. దీనిని నివారించడానికి చేనుకు సమతుల్యంగా ఎరువులు వేయాలి. ఫ వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తల సిఫారసు మేరకు పొటాష్ వేయడం, వెదజల్లిన పద్ధతిలో ఎక్కువ విత్తనం వేయకుండా ఉండటం, అవసరానికి మించి నీరు పెట్టకుండా ఉంటే చేసు పడటాన్ని తగ్గించవచ్చు. వారం రోజుల కన్నా ఎక్కువగా నీట మునిగినట్లయితే గింజలలో నిద్రావస్థ తొలిగి చేనుపైనే మొలక వచ్చే అవకాశం ఉంది. ఇలా చేద్దాం.. ఫ గింజలు రంగు మారడం, మాగుడు, మానిపండు తెగుళ్ల వ్యాప్తి నివారణకు ఎకరాకు 200 మిల్లీలీటర్ల ప్రోపికోనాజోల్ మందును పిచికారీ చేయాలి. ఫ గింజ గట్టిపడే దశలో ఉన్న పంట అధిక వర్షాలకు ముంపు బారిన ఉంటే అంతర్గత కాలువల ద్వారా తొలగించాలి. ఫ నిలిచిన లేదా పడిపోయిన పంటలో కంకిలో మొలకలు కనపడితే 5 శాతం ఉప్పు ద్రావణం (50 గ్రాములు స్ఫటిక ఉప్పు / లీటరు నీటికి) కలిపి పిచికారీ చేయాలి. ఇది మొలకలు రంగు మార్పును తగ్గిస్తుంది. తెగుళ్ల నియంత్రణ ఇలా.. ప్రస్తుతం బ్యాక్టీరియా ఎండాకు తెగులు, మాగుడు తెగులు వ్యాపించే అవకాశం ఉంది. బ్యాక్టీరియా ఎండాకు తెగులు కనిపిస్తే ప్లాంటోమైసిస్ ఒక మిల్లీలీటరును లీటరు నీటిలో కలపాలి, అలాగే కొసైడ్ (కాపర్ ఆక్సి క్లోరైడ్) 2 గ్రాముల మందును లీటరు నీటిలో కలిపి ఈ రెండింటి మిశ్రమాన్ని కలిపి పిచికారీ చేయాలి. నీరు తగ్గిన తరువాత హెక్సాకోనాజోల్ 400 మి.లీ/ఎకరాకు లేదా ప్రోపికోనాజోల్ 200 మి.లీ/ఎకరాకు పిచికారీ చేయడం ద్వారా మాగుడు తెగులు వ్యాప్తి తగ్గుతోంది. -
లారీ ఢీకొని బాలుడి మృతి
రాజానగరం: మండలంలోని శ్రీకృష్ణపట్నం – పాత తుంగపాడు మధ్య మంగళవారం జరిగిన ప్రమాదంలో 14 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. మరో బాలుడికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానిక ఎస్సై నారాయణమ్మ తెలిపిన వివరాలిలా వున్నాయి. పాత తుంగపాడుకు చెందిన నాగులాపల్లి జాన్వె వెస్లీ (14), తన స్నేహితుడు బోయిడి దుర్గాప్రసాద్‌తో కలిసి బైకుపై శ్రీకృష్ణపట్నం వస్తుండగా ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. లారీ ఢీ కొట్టిన వెంటనే బైకుపై వెనుక కూర్చున జాన్‌వెస్లీ కింద పడిపోవడంతోపాటు లారీ కొంతదూరం లాక్కుపోవడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. డ్రైవ్ చేస్తున్న దుర్గాప్రసాద్‌కి స్వల్ప గాయాలయ్యాయి. కాగా మృతుడు ద్వారపూడిలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై నారాయణమ్మ తెలిపారు. -
మత్స్యకార యువకుడి గల్లంతు
కాకినాడ క్రైం: మోంథా తుపాను కారణంగా సముద్ర అలల ఉధృతికి కాకినాడకు చెందిన ఓ మత్స్యకార యువకుడు గల్లంతయ్యాడు. వివరాలలోకెళితే కాకినాడ దుమ్ములపేటకు చెందిన 21 ఏళ్ల గందేపల్లి సాయిరాం తన బోట్‌ను కాకినాడలోని కుంభాభిషేకం తీరంలో లంగర్ వేసి ఉంచాడు. సముద్రలోని అలల ఉధృతితో లంగర్ తెగి బోట్ సముద్రంలోకి వెళ్లిపోయే అవకాశం ఉందని గ్రహించి ఏటిమొగ కల్వర్టు వద్దకు తన బోట్‌ను తరలించాలని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలో కుంభాభిషేకం తీరంలో లంగర్ వేసి ఉన్న బోట్‌పైకి ఎక్కి లంగర్ తాడును లాగబోతూ ప్రమాదవశాత్తూ సముద్రంలోకి జారిపడి గల్లంతయ్యాడు. సహ మత్స్యకారులు గాలించినా ప్రయోజనం లేకపోయింది. కుటుంబ సభ్యులు కాకినాడ పోర్టు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సాయిరాంకు భార్య, కుమారుడు ఉన్నారు. -
ముమ్మరంగా సహాయక చర్యలు
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): జిల్లాలో తుపాను సహాయక చర్యలు ముమ్మరంగా చేపట్టామని కలెక్టర్ షణ్మోహన్ సగిలి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయనేమన్నారంటే.. ఫ తాగునీటి సరఫరాకు 24 ట్యాంకర్లు వినియోగిస్తున్నాం. ఫ ఆహార సరఫరాకు 191 మందిని, పాల సరఫరాకు ఒక సంస్థను గుర్తించి సిద్ధంగా ఉంచాం. ఇప్పటి వరకూ 21,513 ఆహార పొట్లాలు, 1,313 వాటర్ క్యాన్లు పంపిణీ చేశాం. ఫ ముందు జాగ్రత్తగా 95 మంది గర్భిణులను, 1,400 మంది బాలింతలను 52 ఆస్పత్రులకు తరలించి వైద్యుల పర్యవేక్షణలో ఉంచాం. ఫ విద్యాసంస్థలన్నింటికీ సెలవులు ప్రకటించాం. హాస్టళ్ల నుంచి 14,499 మంది విద్యార్థులను సురక్షితంగా ఇంటికి పంపించాం. ఫ సముద్రంలో వేటలో ఉన్న బోట్లన్నింటినీ తీరానికి రప్పించాం. 4,573 బోట్లు కొట్టుకుపోకుండా ఉప్పుటేరు, క్రీక్‌ల్లో ఉంచుకోవాల్సిందిగా మత్స్యకారులకు సూచించాం. ఫ రోడ్లు, ఇతర మౌలిక వసతులకు ఎదురయ్యే అవాంతరాలను ఎప్పటికప్పుడు పునరుద్ధరించేందుకు 47 క్రేన్లు, 124 జనరేటర్లు, 66 ఫోర్క్ లిఫ్ట్‌లు, 99 ఎస్క్వేటర్లు, 28 రోడ్డు రోలర్లు, 26 అగ్నిమాపక శకటాలు, 4 డంపర్లు, 12 హార్వెస్టర్లను అందుబాటులో ఉంచాం. ఫ సహాయ పునరావాస కార్యక్రమాలకు 1,602 పాఠశాల బస్సులు, 28 గూడ్స్ క్యారియర్లు, 907 ట్రాక్టర్లు, 3,336 ట్రైలర్లను సిద్ధంగా ఉంచాం. ఫ విద్యుత్ సరఫరాలో అంతరాయాలను ఎప్పటికప్పుడు చక్కదిద్దేందుకు 3 వేల స్తంభాలు, 44 క్రేన్లు, 33 ప్రైవేట్ వాహనాలు, 11 జేసీబీలు, 41 పోల్ డ్రిల్లింగ్ మెషీన్లు, 45 జనరేటర్లు, 55 పవర్ రంపాలు, 526 కండక్టర్లు, 245 ట్రాన్స్ఫార్మర్లు, 1,000 మంది సిబ్బందిని సిద్ధంగా ఉంచాం. ఫ 49,269 టన్నులు ఫోర్టిఫైడ్ బియ్యం, 9.81 టన్నుల బెల్లం, రాగి పిండి, 296 టన్నుల పంచదార, 30,185 నూనె ప్యాకెట్లు, 10 టన్నుల ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, 12 టన్నుల టమాటాలు అందుబాటులో ఉంచాం. ఫ ప్రమాదకరమైన రూట్లలో 44 ఆర్టీసీ బస్సులను రద్దు చేశాం. -
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
కాకినాడ రూరల్: మోంథా తుపాను ప్రభావం తీవ్రంగా ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజినల్ కో ఆర్డినేటర్ కురసాల కన్నబాబు అన్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో మంగళవారం ఆయన పర్యటించారు. సూర్యారావుపేట బీచ్ వద్ద అల్లకల్లోలంగా ఉన్న సముద్రాన్ని పరిశీలించారు. నేమాం, పోలవరం, సూర్యారావుపేట, వాకలపూడి ఫిషింగ్ హార్బర్లను సందర్శించి, తుపాను ప్రభావం ఎక్కువగా ఉందని గుర్తించారు. సముద్రం పోటు ఉండటంతో గ్రామాల నుంచి వచ్చే నీరు ఎగదన్ని ముంపు సమస్య తలెత్తుతుందన్నారు. హార్బర్‌పేటలో మత్స్యకారులను కలసి తుపాను తీవ్రంగా ఉన్నందున పునరావాస కేంద్రాలకు వెళ్లాలని సూచించారు. ఇళ్ల కంటే ప్రాణాలు ముఖ్యమని అన్నారు. ఈ సందర్భంగా కన్నబాబు మీడియాతో మాట్లాడుతూ, వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు తీర గ్రామాలను సందర్శించామన్నారు. తుపాను బాధిత ప్రజలకు సేవలందించేందుకు తమ పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరంతరం సిద్ధంగా ఉంటామన్నారు. గాలుల తీవ్రతకు కరెంట్ సరఫరా నిలిచిపోయే ప్రమాదం ఉన్నందున అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి, తాగునీటికి ఇబ్బంది లేకుండా చూడాలని కోరారు. పునరావాస కేంద్రాల్లో మెరుగైన సదుపాయాలతో పాటు నాణ్యమైన ఆహారం అందించాలని సూచించారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సేవలందించాలని కోరారు. గత ప్రభుత్వం మాదిరిగా ఆదుకోండి గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో తుపానులు వచ్చినప్పుడు వలంటీర్లు, సచివాలయ సిబ్బందితో మందులు, నిత్యావసర సరకులు, నేరుగా ఇళ్లకే పంపించామని కన్నబాబు గుర్తు చేశారు. ఆర్ఓ ప్లాంట్ క్యాన్లు, వాటర్ ప్యాకెట్లు అందించామన్నారు. పునరావాస కేంద్రాల నుంచి తిరిగి వెళ్లేటప్పుడు బాధితులకు రూ.2 వేల సహాయం అందించామని చెప్పారు. తుపాను ప్రభావం ఎక్కువగా ఉన్నందున ఎక్కడా అలసత్వం లేకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలూ తీసుకోవాలని కోరారు. ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టాలు జరగకుండా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. తమ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి మాదిరిగా ప్రజలను ఆదుకోవాలని కూటమి ప్రభుత్వాన్ని కన్నబాబు కోరారు. ముఖ్యంగా జీవనోపాధి కోల్పోతున్న మత్స్యకారులను, వరి పంట దెబ్బ తిని నష్టపోతున్న రైతులను ఆదుకోవాలని కన్నబాబు విజ్ఞప్తి చేశారు. తాము మాట్లాడేది రాజకీయమని అనుకోకుండా, ప్రజలకు సాయం చేసేందుకు ప్రభుత్వం అండగా ఉండాలని అన్నారు. పంటల బీమా లేకపోవడంతో వరి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ఈ–క్రాప్ కూడా చేయలేదని, దీనిపై ప్రభుత్వం విధానపరమైన చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. అప్పటి సీఎం జగన్ రైతులను కంటికి రెప్పలా ఆదుకునేందుకు ఉచిత పంటల బీమా అమలు చేశారని, రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు సేవలందించామని గుర్తు చేశారు. తుపానుతో నష్టపోయే రైతులను గాలికి వదిలేయరాదని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఆరోగ్యశ్రీ సేవలు నిలచిపోయాయని, తుపాను వలన అంటువ్యాధులు, ఇతర సమస్యలు వస్తే ప్రజలు ఎక్కడకు వెళ్లాలని కన్నబాబు ప్రశ్నించారు. కార్యక్రమంలో నేమాం సర్పంచ్ రామదేవు చిన్నా, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఫ తుపాను ప్రభావం తీవ్రంగా ఉంది ఫ వైఎస్సార్ సీపీ తరఫున అండగా ఉంటాం ఫ ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలి ఫ మాజీ మంత్రి కురసాల కన్నబాబు -
పర కాల్వలో పడి బాలుడి గల్లంతు
● మేనమామతో కాజ్ వే దాటుతుండగా గోతిలో పడిన బైక్ ● రాత్రి వరకు ఎస్డీఆర్ఎఫ్, ఫైర్ సిబ్బంది గాలింపు కాకినాడ రూరల్: మండలంలోని సూర్యారావుపేట గ్రామ పరిధిలోని పర కాల్వలో సోమవారం 12 ఏళ్ల బాలుడు పోలవరపు సాయి చరణ్ రుత్విక్ గల్లంతయ్యాడు. తిమ్మాపురం పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కాకినాడ మధురానగర్‌కు చెందిన పోలవరపు రమణకు భార్య, పాప, బాబు ఉన్నారు. రమణ వాచ్‌మన్‌గా పనిచేస్తున్నాడు. బడికి సెలవు ఇవ్వడంతో కుమారుడు చరణ్ కాకినాడ ఆర్టీఓ కార్యాలయం వద్ద గల మేనమామ కొప్పిశెట్టి శ్రీనివాస్ ఇంటికి వచ్చాడు. నేమాం గ్రామంలో శ్రీనివాస్ ఇల్లు నిర్మించుకుంటుండడంతో చూసేందుకు మేనల్లుడితో కలిసి ఉదయం 11గంటల సమయంలో బయలుదేరాడు. సూర్యారావుపేట గ్రామం దాటిన తరువాత పోలవరం గ్రామ మార్గంలో పంట పొలాల్లో నుంచి వచ్చే నీటితో ఉధృతంగా ప్రవహిస్తున్న పర కాల్వ కాజ్ వే దాటే ప్రయత్నం చేశారు. కాజ్ వే పైనుంచి నీరు ప్రవహిస్తుండడంతో బైక్‌పై వెళుతూ నీటి అడుగున వంతెనపై ఉన్న గోతిలో పడ్డారు. శ్రీనివాస్ ఒక వైపునకు, చరణ్ కాల్వ వైపు పడిపోయారు. శ్రీనివాస్ తేరుకుని వచ్చే లోపు కాల్వలో ఈదుతూ చరణ్ కనిపించాడు. వెంటనే అవతలి ఒడ్డుకు వెళ్లే ప్రయత్నాన్ని శ్రీనివాస్ చేసేలోపు చరణ్ నీటి ప్రవాహంలో గల్లంతయ్యాడు. దీంతో వెంటనే స్థానికులు, కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. విషయం తెలుసుకున్న తిమ్మాపురం ఎస్సై గణేష్‌కుమార్, సిబ్బంది పర కాల్వ వద్దకు చేరుకుని ప్రమాదం జరిగిన ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు. ప్రయోజనం లేకపోవడంతో ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. గల్లంతైన బాలుడి కోసం ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది మధ్యాహ్నం 3.30 గంటల నుంచి గాలించారు. రాత్రి చీకటి పడేవరకు దాదాపు మూడు గంటల పాటు కాల్వ దిగువ భాగంలో గాలింపు చేపట్టినా బాలుడి ఆచూకీ లభ్యం కాలేదు. ప్రమాదం జరిగిన కాల్వను తహసీల్దార్ కుమారి తదితరులు సందర్శించారు. తుపాను నేపథ్యంలో ప్రమాదభరితమైన పర కాల్వ కాజ్వే వంతెనపై రాకపోకలు బంద్ చేయకపోవడం వల్లనే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. -
ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఎస్ఎఫ్ఐ ధర్నా
బాలాజీచెరువు: దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలంటూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. స్థానిక కలెక్టరేట్ ఎదుట సోమవారం వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఆందోళన చేపట్టారు. ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేసి విద్యార్థులను ఆదుకోవాలని ఆందోళనకారులు కోరారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.6,400 కోట్లు పెండింగ్ బకాయిలు ఉన్నాయని, దీంతో పరీక్ష ఫీజు సైతం కళాశాలలు కట్టించుకోవడం లేదన్నారు. నేటితో ఇంజినీరింగ్ ద్వితీయ సంవత్సర పరీక్ష ఫీజు చివరి తేదీ అని జేఎన్టీయూకే ప్రకటించిందని, విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం.గంగా సూరిబాబు, నగర అధ్యక్షుడు వాసుదేవ్, నాయకులు జయరాం, కరిష్మా, శశిప్రియ, శీరిష, దుర్గాప్రసాద్, వివేక్ పాల్గొన్నారు. కారు డ్రైవర్ అదృశ్యం అమలాపురం టౌన్: కొంకాపల్లికి చెందిన కారు డ్రైవర్ కంచిపల్లి శ్రీనివాస్ అదృశ్యమైనట్టు అతని కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్టణ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదైంది. ఈ నెల 25వ తేదీ సాయంత్రం 4 గంటలకు తెలుపు రంగు సుజుకి యాక్సెస్ స్కూటీపై రాజమహేంద్రవరం వెళుతున్నానని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. తిరిగి ఇంటికి రాలేదు. స్నేహితులు, బంధువుల ఇళ్లలో అతని ఆచూకీ కోసం ప్రయత్నించినప్పటికీ ఫలితం లేదు. దీంతో అతని కుటుంబీకులు పట్టణ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ పి.వీరబాబు తెలిపారు. శ్రీనివాస్ ఆచూకీ తెలిసిన వారు డయల్ 112కి లేదా పట్టణ సీఐ 94407 96561, ఎస్సై 98481 32305 ఫోన్ నంబర్లకు సమాచారం ఇవ్వాలని సీఐ వీరబాబు తెలిపారు. కాలువలో పడి వ్యక్తి మృతి తాళ్లరేవు: మండల పరిధిలోని లచ్చిపాలెం గ్రామానికి చెందిన కొండేపూడి గోవిందు(43) ప్రమాదవశాత్తూ కాలువలో పడి మృతి చెందాడు. గోవిందు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు ఈ నెల 25వ తేదీన గోవిందు స్థానిక బ్యాంక్ కెనాల్లో చేపలు పట్టేందుకు వెళ్లాడు. అయితే భారీ వర్షాల నేపథ్యంలో గల్లంతయ్యాడని, గాలింపు చర్యలు చేపట్టగా సోమవారం కేంద్రపాలిత ప్రాంతమైన యానాం దరియాలతిప్పలో మృతదేహం లభించిందన్నారు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పేకాడుతున్న 18 మంది అరెస్టు రావులపాలెం: రెండు వేర్వేరు ప్రాంతాల్లో పేకాడుతున్న జూదరులను సోమవారం రాత్రి రావులపాలెం పోలీసులు దాడి చేసి అరెస్టు చేశారు. మండలంలోని వెదిరేశ్వరం గ్రామంలో ఒక ఇంటిలో పేకాడుతున్న సీఐ శేఖర్‌బాబుకు అందిన సమాచారంతో దాడి చేసి 10 మందిని పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.25,070 నగదు, తొమ్మిది సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. స్థానిక బండిరేవు పుంతలో పేకాడుతున్న మరో ఎనిమిది మందిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి 2,305 నగదు స్వాధీనం చేసుకున్నట్టు సీఐ తెలిపారు. కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్త కొబ్బరి (క్వింటాల్) 20,000 – 22,500 కొత్త కొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 30,000 గటగట (వెయ్యి) 28,000అంబాజీపేట కొబ్బరి మార్కెట్ -
తుపాను నుంచి పశువులను ఇలా కాపాడాలి
పశు సంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ విజయరెడ్డి అమలాపురం టౌన్: మోంథా తుపాను హెచ్చరికల నేపథ్యంలో పశువులను మేపే రైతులంతా తమ పశువుల పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తంగా ఉండాలని పశు సంవర్ధక శాఖ అమలాపురం సహాయ సంచాలకులు డాక్టర్ ఎల్. విజయరెడ్డి సూచించారు. తన పరిధిలో ఉన్న రైతులను, పశు వైద్యాధికారులు, సహాయకులను ఆయన అప్రమత్తం చేశారు. పశువులను పెంచే పలు ప్రాంతాలకు డాక్టర్ విజయరెడ్డి సోమవారం వెళ్లి పశు పోషణ రైతులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. తుపాను కారణంగా పశువుల్లో అస్వస్థత, మరణాలు సంభవించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు అవగాహన కల్పించారు. జాగ్రత్తలు ఇలా.. ● పశువుల షెడ్లు గాలి వానకు కూలి పోకుండా మరమ్మతులు చేయించాలి. ● పశువులకు నట్టల నివారణ మందులను వాడి వ్యాధి నిరోధక టీకాలు వేయించాలి. ● బాహ్య పరాన్న జీవుల నిర్మూలన మందులను వాడాలి. ● విష సర్పాల నుంచి కాపాడుకోవాలి. ● అధిక వర్షాలు, తుపాను సమయంలో పశువులను రాటకు కట్టకుండా వదిలేయాలి. ● లేగ దూడలు చలి బారిన పడకుండా వెచ్చని వాతావరణం కల్పించాలి. ● అవసరాలకు అనుగుణంగా దాణాను, మేతను నిల్వ ఉంచుకోవాలి. ● పశువులను విద్యుత్ తీగలకు, కరెంట్ స్తంభాలకు దూరంగా ఉంచాలి. ● వాతావరణ కేంద్రం సూచనలకు అనుగుణంగా యాజమాన్య పద్ధతులు పాటించాలి. ● పశువుల మేత తడిసిపోకుండా భద్ర పరుచుకోవాలి. ● పశువుల దాణా తడిస్తే బూజు పడుతుంది కాబట్టి జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి. ● పశువులను వర్షంలో మేతలకు తోలకూడదు. ● కూలిపోయే అవకాశం ఉన్న చెట్ల కింద, గోడల దగ్గర, పాకల దగ్గర పశువులను కట్టకూడదు. ● పశువులు వర్షంలో తడిస్తే శరీర ఉష్ణోగ్రత తగ్గిపోయి జబ్బు పడి చనిపోయే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా దూడలు, గొర్రెలను తడవకుండా కాపాడుకోవాలి. ● పశువులకు ఏమైనా జబ్బుగా ఉంటే దగ్గరలోని పశు వైద్య సిబ్బందికి తెలియజేస్తే తక్షణమే వైద్యం అందుతుంది. ● పశువులు ఎక్కడైనా చనిపోతే పశు వైద్య సిబ్బందికి తెలియజేస్తే పై అధికారులకు వివరాలు పంపేందుకు వీలు ఉంటుంది. ● గేదెలు, ఆవులకు పచ్చిక దొమ్మ, జబ్బ వాపు రాకుండా, గొర్రెలకు నేల మరక రాకుండా టీకాలు వేయించుకోవాలి. ● పశువులకు తుపాను కారణంగా ఏ చిన్న సమస్య ఎదురైనా తక్షణమే ఆ సమాచారాన్ని రైతులకు సమీపంలో ఉన్న పశు వైద్యాలయం లేదా పశు వైద్యాధికారులకు అందజేస్తే తమ సిబ్బంది తక్షణమే స్పందిస్తారని సహాయ సంచాలకులు డాక్టర్ విజయరెడ్డి విజ్ఞప్తి చేశారు. -
తుపాను నేపథ్యంలో పలు రైళ్ల రద్దు
రాజమహేంద్రవరం సిటీ: తుపాను ప్రభావంతో తూర్పుగోదావరి జిల్లా మీదుగా నడిచే పలు రైళ్లను మంగళవారం రద్దు చేసినట్లు అధికారులు సోమవారం ప్రకటించారు. తిరుపతి– విశాఖపట్నం(08584), మహబూబ్‌నగర్– విశాఖపట్నం (12862), చైన్నె– విశాఖపట్నం స్పెషల్ (22802), రాజమహేంద్రవరం– విశాఖపట్నం(67286), భువనేశ్వర్ – బెంగళూరు ఎక్స్‌ప్రెస్ (18463), భువనేశ్వర్ – సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్(17015), భువనేశ్వర్ –పాండిచ్చేరి (20851) రైళ్లను రద్దు చేసినట్లు ప్రకటించారు. రద్దయిన రైళ్లలో రిజర్వేషన్ పొందిన ప్రయాణికులకు టికెట్ పూర్తి మొత్తాన్ని అందించేందుకు అవసరమైన కౌంటర్లను స్టేషన్లో ఏర్పాటు చేశారు. ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని 24 గంటలు అందుబాటులో ఉండేలా రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్లు రైల్వే స్టేషన్ సీటీఐ సుంకర చంద్రమౌళి తెలిపారు. ప్రయాణికులు రైళ్ల రాకపోకల వివరాలను తెలుసుకునేందుకు 83319 87657 నంబర్లో సంప్రదించాలన్నారు. -
రత్నగిరిపై మోంథా ఎఫెక్ట్
● కార్తిక సోమవారం 80 వేల మంది వస్తారని అంచనా ● తుపాను ప్రభావంతో 40 వేలకే పరిమితమైన భక్తులు అన్నవరం: రత్నగిరిపై మోంథా తుపాను ప్రభావం పడింది. కార్తిక మాసంలో తొలి సోమవారం కావడంతో సుమారు 80 వేల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేసి, ఆ మేరకు ఏర్పాట్లు చేశారు. అయితే తుపాను హెచ్చరికలతో భక్తుల సంఖ్య 40 వేలకే పరిమితమైంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ మాత్రమే ఆలయంలో రద్దీ నెలకొనగా, ఆ తరువాత నుంచి దేవస్థానం క్యూ లైన్లు ఖాళీగా దర్శనమిచ్చాయి. సత్యదేవుని వ్రతాలు ఏడు వేలు జరుగుతాయని అధికారులు భావించగా 4,500 మాత్రమే జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.35 లక్షల ఆదాయం సమకూరింది. ఆలయంలో ఏర్పాట్లను దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వీర్ల సుబ్బారావు పర్యవేక్షించారు. తుపాను ప్రభావంతో మంగళ, బుధవారాల్లో కూడా భక్తులు పెద్దగా రకపోవచ్చునని అంచనా వేస్తున్నారు. వర్షంతో ఇబ్బందులు తుపాను ప్రభావంతో రత్నగిరిపై కురిసిన వర్షంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. దేవస్థానంలో పలుచోట్ల విశ్రాంతి షెడ్లు నిర్మించినప్పటికీ ఆలయం చుట్టూ ఉన్న రథం పాత్, పశ్చిమ రాజగోపురం ముందు గ్రీన్ షేడ్ నెట్‌తో ఏర్పాటు చేసిన షెల్టర్లే ఉన్నాయి. వీటి ద్వారా ఎండ నుంచి రక్షణ ఉంటుంది తప్ప వర్షం వస్తే ఏమాత్రం ఉపయోగం ఉండదు. దీంతో, వర్షం కురిసిన సమయంలో వీటి కింద ఉన్న భక్తులు తడిసిపోయారు. పశ్చిమ రాజగోపురం లోపలకు వెళ్లేందుకు నిర్మించిన ర్యాంపు మీద కూడా షెల్టర్ లేక భక్తులు వర్షంలో తడవాల్సి వచ్చింది. ఇక్కడ పొడవాటి షెల్టర్ నిర్మించినా అది ర్యాంపు వరకూ లేకపోవడంతో ఇబ్బంది తప్పలేదు. ఆదివారం రాత్రి, సోమవారం తెల్లవారుజామున దేవస్థానంలో పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. ఆ నవదంపతులు వారి బంధువులు, ఇతర ప్రాంతాల్లో వివాహాలు చేసుకున్న వారు సత్యదేవుని దర్శనానికి వచ్చి, వర్షంలో ఇబ్బంది పడ్డారు. వర్షానికి తడిసిపోకుండా పలువురు గొడుగులు వేసుకుని, వ్రత మండపాలు, ఆలయానికి వెళ్లారు. కార్తిక మాసం సందర్భంగా దేవస్థానంలో పలుచోట్ల వేసిన రేకులతో షెడ్లు నిర్మించి, వాటిని క్లాత్‌తో అలంకరించారు. తుపాను గాలులకు ఆ షెడ్డు రేకులు ఎగిరిపోయే అవకాశం ఉండటంతో, వాటిని తాళ్లతో గట్టిగా కట్టి రక్షణ చర్యలు చేపట్టారు. మొత్తం అన్ని షెడ్ల మీద ఇటువంటి చర్యలు తీసుకున్నట్లు దేవస్థానం ఈఈ రామకృష్ణ తెలిపారు. ఇలా చేస్తే మేలు రథం పాత్లో తూర్పు రాజగోపురానికి ఇరువైపులా టెన్సిల్ షెడ్లు భక్తులకు వర్షం నుంచి రక్షణ కల్పించాయి. ఇదేవిధంగా రథం పాత్ చుట్టూ కూడా గ్రీన్ షేడ్ నెట్ స్థానంలో టెన్సిల్ షెడ్లు నిర్మిస్తే భక్తులకు సౌకర్యవంతంగా ఉంటుంది. వర్షం కురిస్తే శని, ఆదివారాల్లో నిర్వహించే స్వామివారి తిరుచ్చి, రథ సేవలను నిలిపివేస్తున్నారు. టెన్సిల్ షెడ్లు నిర్మిస్తే వర్షం వచ్చినా ఆ సేవలు యథాతథంగా నిర్వహించే అవకాశం ఉంటుంది. -
‘మోంథా’ పెను ముప్పు!
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: ఉగ్రరూపం దాల్చుతూ.. సాగరాన్ని చీల్చుకుంటూ.. రాష్ట్రంపై విరుచుకుపడేందుకు మోంథా తుపాను పెను ఉప్పెనలా దూసుకొస్తోంది. ఓవైపు బలమైన ఈదురు గాలులు కకావికలం చేస్తుండగా.. జడివానలు జడిపిస్తున్నాయి. రోడ్డు మార్గాలు జలమయమయ్యాయి.. రైలు మార్గాలను ముంపు ముప్పు భయపెడుతోంది. భీకర గాలులు వాయుమార్గాన్ని సైతం స్తంభింపజేస్తున్నాయి. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై తదితర ప్రాంతాల నుంచి విజయవాడ, విశాఖ, తిరుపతికి వచ్చే పలు విమానాలను పెను తుపాను కారణంగా రద్దు చేశారు. దక్షిణ మధ్య రైల్వే, తూర్పు కోస్తా రైల్వే జోన్ల పరిధిలో 97 రైళ్లను రద్దు చేశారు. సముద్రం అల్ల కల్లోలం కావడంతో జల రవాణా స్తంభించిపోయింది. పోర్టుల్లో సరుకు రవాణా కార్గో షిప్పులకు లంగరు వేశారు. నౌకాదళానికి చెందిన నౌకలు ప్రధాన కేంద్రాలకు చేరుకున్నాయి. కాకినాడ తీరంలో రాకాసి అలల హోరు.. తీరం వైపు దూసుకొస్తున్న మోంథా తుపాను ధాటికి రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. విశాఖ జిల్లా తడిసి ముద్దవగా కాకినాడ తీరంలో రాకాసి అలలు విరుచుకుపడుతున్నాయి. తీవ్ర వాయుగుండం నుంచి సోమవారం ఉదయానికి తుపానుగా మారింది. ఆగ్నేయ, పశ్చిమ మధ్య, నైరుతి బంగాళాఖాతంలో ఉన్న తుపాను గంటకు 13 నుంచి 18 కిలోమీటర్ల వేగంతో ఉత్తర, వాయవ్య దిశగా కదులుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రాత్రి సమయానికి విశాఖకు 460 కిలోమీటర్లు, కాకినాడకు 410, చెన్నైకి 400 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. మంగళవారం ఉదయానికి ఇది తీవ్ర తుపానుగా మారి ముందుకు కదలనుంది. బుధవారం తెల్లవారు జామున కాకినాడ– అమలాపురం మధ్యలో తీరాన్ని దాటే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రచండ వేగంతో.. తుపాను తీరాన్ని సమీపిస్తున్న కొద్దీ వేగం పెరుగుతోంది. తుపాను తీరాన్ని దాటే సమయంలో గంటకు 90 నుంచి 100 కిలోమీటర్లు, గరిష్టంగా 110 కిలోమీటర్ల వేగంతో పెను గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. విశాఖపట్నం జిల్లాలో ఎడతెగని వర్షం.. మోంథా తుపాను ప్రభావంతో ఉత్తరాంధ్ర అంతటా ఎడతెగని వర్షాలు కురవగా మిగిలిన చోట్ల ఓ మోస్తరు వర్షాలు పడ్డాయి. విశాఖ నగరంతోపాటు జిల్లా వ్యాప్తంగా ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురవడంతో పలుచోట్ల చెట్లు విరిగి రోడ్డుపై కూలిపోయాయి. విశాఖ రూరల్ పరిధిలోని జాతర ప్రాంగణం వద్ద 9.2 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. మధురవాడ, కాపులుప్పాడ, పెందుర్తి, సీతమ్మధార, ఎండాడ, సాగర్ నగర్, మహారాణిపేట, గోపాలపట్నం, గాజువాక, సబ్బవరం ప్రాంతాల్లో 6 నుంచి 8 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డయింది. అనకాపల్లి జిల్లా గంధవరంలో 5.8, శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం విజయరాంపురంలో 5.7 సెంటీమీటర్ల వర్షం పడింది. అంబేడ్కర్ కోనసీమ, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, తిరుపతి, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, అన్నమయ్య జిల్లాల్లోనూ పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. కాకినాడ సముద్ర తీరంలో రెండు మీటర్లపైగా ఎత్తులో అలలు ఎగిసిపడుతున్నాయి. విశాఖ బీచ్‌లో కోస్టల్ బ్యాటరీ వద్ద ఎగసిపడుతున్న అలలు నేడు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు.. తుపాను ప్రభావంతో మంగళవారం ప్రకాశం, బాపట్ల, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, విజయనగరం జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు (20 సెంటీ మీటర్లకుపైగా), కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు (15 నుంచి 20 సెంటీ మీటర్లు) కురిసే అవకాశం ఉంది. తిరుపతి, అన్నమయ్య, వైఎస్సార్ కడప, చిత్తూరు, నెల్లూరు, నంద్యాల, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మిగిలిన జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రేపు కూడా కుండపోతే..! ఈ నెల 29వ తేదీన బాపట్ల, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, విజయనగరం జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. నంద్యాల, ప్రకాశం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. దీనివల్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు, కమ్యూనికేషన్ వ్యవస్థకు ఆటంకం, వరదలు, పిడుగులు, నేల కోతకు గురి కావడం, రోడ్లు దెబ్బతినడం, బలహీనమైన నిర్మాణాలు, గుడిసెలు నేలమట్టమయ్యే ప్రమాదం ఉందని పేర్కొంది. భారీ వర్షాలకు పలుచోట్ల వాగులు ఉప్పొంగి ఆకస్మిక వరదలు ముంచెత్తే ప్రమాదం ఉందని అప్రమత్తం చేసింది. అందుకనుగుణంగా ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. ఈ నెల 30వ తేదీ వరకు మత్స్యకారులు వేట కోసం సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరించింది. అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేందుకు, తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సరఫరాను పునరుద్ధరించేందుకు సంసిద్ధంగా ఉండాలని విద్యుత్ సంస్థలతో నిర్వహించిన సమీక్షలో సీఎస్ కె.విజయానంద్ ఆదేశించారు. శ్రీకాకుళం జిల్లా కంచిలిలో కురుస్తున్న వర్షం ప్రాణనష్టం వాటిల్లకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు సహాయక చర్యలపై ఉత్తరాంధ్ర జిల్లాల జోనల్ ఇన్చార్జి అజయ్‌జైన్ మీడియాకు తెలిపారు. ఇప్పటికే 32,400 మందిని పునరావాస కేంద్రాలకు తరలించామని.. ఐదు ఎన్డీఆర్ఎఫ్, ఆరు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. తుపాను ప్రభావిత జిల్లాల్లో 2,914 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 233 మండలాల్లోని 1,419 గ్రామాలు, 44 మున్సిపాలిటీల్లో తుపాను ప్రభావం చూపే అవకాశం ఉందని అంచనా వేసినట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అన్నదాతల్లో ఆందోళన.. అన్నదాత చివరి ఆశలపై మోంథా తుపాను నీళ్లు జల్లింది. డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లావ్యాప్తంగా 1.63 లక్షల ఎకరాల్లో ఖరీఫ్‌లో వరి సాగు చేపట్టగా ప్రస్తుతం గింజ గట్టి పడుతున్న దశలో ఉంది. గత వారం అల్పపీడన ప్రభావంతో మూడు రోజుల పాటు కురిసిన భారీ వర్షాలకు వరి చేలల్లో ముంపు నీరు చేరింది. కొబ్బరి రైతుల్లోనూ తుపాను తీవ్ర కలవరం రేపుతోంది. 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తాయని హెచ్చరిస్తుండటంతో 1996 తుపాను గుర్తు చేసుకుని ఆందోళన చెందుతున్నారు. నేడు, రేపు 17 జిల్లాల్లో రెడ్ అలెర్ట్..ముంచుకొస్తున్న తుపాను ముప్పుతో అంతటా అప్రమత్తత నెలకొంది. మంగళ, బుధవారం 17 జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు పడే అవకాశాలుండటంతో రెడ్ అలెర్ట్ జారీ చేశారు. రాష్ట్రంలో ముందస్తు చర్యలు చేపట్టాలంటూ కేంద్ర ప్రభుత్వం కూడా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో హై అలెర్ట్ ప్రకటించారు. పలు జిల్లాల్లో నాలుగు రోజులపాటు అన్ని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. ఉద్యోగులకు మూడు రోజుల పాటు సెలవులు రద్దు చేసి సహాయక చర్యల్లో నిమగ్నం చేశారు. పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలుతుపాను నేపథ్యంలో కాకినాడ పోర్టులో 7వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. విశాఖ, గంగవరం పోర్టుల్లో 6వ నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేయగా మచిలీపట్నం, కృష్ణపట్నం, నిజాంపట్నం పోర్టుల్లో 5వ నంబర్ ప్రమాద హెచ్చరికలు వెలువడ్డాయి. కళింగపట్నం, భీమునిపట్నం, వాడరేవు పోర్టుల్లో మూడో నంబర్ ప్రమాద హెచ్చరికలు ఎగుర వేశారు. తీర ప్రాంతాలకు సందర్శకులు రాకుండా నిషేధాజ్ఞలు జారీ చేశారు. ప్రధాన బీచ్‌లలో పోలీసులు, మెరైన్ సిబ్బంది పహారా కాస్తున్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. కాగా రెడ్ అలెర్ట్ జారీ చేసిన జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు... ఆరెంజ్ అలెర్ట్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. ఎల్లో అలెర్ట్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.తుపాను కారణంగా అలల తాకిడి పెరగడంతో విశాఖ బీచ్ రోడ్డులో కృష్ణ మందిర్ వద్ద కోతకు గురైన తీరం కోనసీమకు పెను గండం..!సాక్షి, అమలాపురం: పెను తుపాను గండం కోనసీమను వణికిస్తోంది. సముద్రం ముందుకు చొచ్చుకు రావడంతో రాకాసి అలలు రెండు, మూడు మీటర్ల ఎత్తున ఎగసిపడుతున్నాయి. ఓడలరేవు వద్ద ఓఎన్జీసీ వశిష్ట టెర్మినల్ ప్రధాన గోడను అలలు తాకుతున్నాయి. సరుగుడు తోటలు సముద్రంలో కలసిపోతున్నాయి. కాట్రేనికోన మండలం నదీపాయల మధ్య ఉన్న మగసానితిప్ప గ్రామంలోని మత్స్యకారులను బలుసుతిప్పకు తరలించి పునరావాసం కల్పించారు. లంక గ్రామాల రైతులు పాడి పశువులను మైదాన ప్రాంతాలకు తరలించారు. జిల్లాలో 120 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ తెలిపారు. భయం గుప్పెట్లో కాకినాడసాక్షి ప్రతినిధి, కాకినాడ: మోంథా తుపాను కాకినాడ సమీపంలో తీరం దాటనుందనే భారత వాతావరణ శాఖ హెచ్చరికలతో జిల్లాలోని తీర ప్రాంత మండలాల ప్రజలు భయంతో వణికిపోతున్నారు. జిల్లాలోని 12 మండలాలపై ఈ తుపాను తీవ్ర ప్రభావం చూపించనుంది. ఈ నేపథ్యంలో కాకినాడ డీప్ వాటర్ పోర్టు, యాంకరేజ్ పోర్టుల్లో కార్యకలాపాలను నిలిపివేశారు. కాకినాడ–ఉప్పాడ బీచ్ రోడ్డు, బీచ్ పార్కులలో రాకపోకలను ఆపేశారు. కాకినాడ జిల్లాలోని అన్ని పాఠశాలలు, కళాశాలలకు ఈ నెల 29వ తేదీ వరకు సెలవులు ప్రకటించారు. జిల్లావ్యాప్తంగా 269 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. సోమవారం కాకినాడ రూరల్‌లోని పర్ర కాలువ వంతెనపై ప్రవహిస్తున్న నీటిలో పడి 12 ఏళ్ల బాలుడు గల్లంతయ్యాడు. రెడ్ అలెర్ట్ జిల్లాలివే..శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, విజయనగరం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం.ఆరెంజ్ అలెర్ట్ జిల్లాలుశ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, వైఎస్సార్ కడప, నంద్యాలఎల్లో అలెర్ట్ జిల్లాలుచిత్తూరు, కర్నూలు, శ్రీసత్యసాయి, అనంతపురంతెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు మొంథా తుఫాను ప్రభావం తెలంగాణపైనా ఉన్నట్లు వాతావరణ శాఖ చెప్పింది. రానున్న రెండు రోజులపాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించింది. మంగళ, బుధవారాల్లో రాష్ట్రంలోని 8 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లోని కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ, అత్యంత భారీ వర్షాలు కూడా నమోదు కావొచ్చని హెచ్చరించింది. మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు, కొన్నిచోట్ల భారీ వర్షాలు నమోదు కావొచ్చని వివరించింది. తీవ్ర తుపాను కారణంగా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈమేరకు జిల్లా కలెక్టర్లు ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకోవాలని వాతావరణ శాఖ సూచనలు జారీ చేసింది. 8 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ తెలంగాణలోని ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మంచిర్యాల, నిర్మల్, మహబూబాబాద్... భద్రాద్రి కొత్తగూడెం,ఈ జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ, అత్యంత భారీ వర్షాలు కూడా నమోదు కావొచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. విమానాల రద్దు మోంథా తుపాను ప్రభావంలో విజయవాడ, విశాఖపట్నం నుంచి హైదరాబాద్, తిరుపతితోపాటు దేశంలోని వివిధ గమ్యస్థానాలకు రాకపోకలు సాగించే విమానాలను కొన్ని ఎయిర్‌లైన్స్ సంస్థలు ఇప్పటికే రద్దు చేశాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో 30కి పైగా విమానాల రాకపోకలపై తుపాను ప్రభావం తీవ్రంగా ఉందని ఎయిర్‌పోర్టు వర్గాలు తెలిపాయి. అలాగే, దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మంగళవారం, బుధవారం ప్రయాణించాల్సిన 54 రైళ్లను రద్దు చేశారు. ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ పరిధిలో 43 రైళ్లను రద్దు చేశారు. మొత్తం 97 రైళ్లను రద్దు చేసినట్లు ఆయా డివిజన్ల అధికారులు ప్రకటించారు. విజయవాడ డివిజన్ పరిధిలోని విజయవాడ, భీమవరం, నిడదవోలు, గుంటూరు, కాకినాడ, తెనాలి, రేపల్లె, మార్కాపురం, మచిలీపట్నం, నరసాపూర్, ఒంగోలు, రాజమహేంద్రవరం నుంచి బయలుదేరే రైళ్లను రద్దు చేసినట్లు డివిజనల్ అధికారులు వెల్లడించారు. ఈ విషయాన్ని రిజర్వేషన్ చేయించుకున్న ప్రయాణికులకు ఎంఎస్ఎస్ ద్వారా సమాచారం పంపామని, టికెట్ల డబ్బును వారి ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు. కాగా, కాకినాడ, మచిలీపట్నం పోర్టుల్లో లోకల్ వార్నింగ్ సిగ్నల్–4 ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. తమిళనాడు, ఒడిశాలో.. తమిళనాడు, ఒడిశాలోనూ మోంథా ప్రభావం చూపుతోంది. చెన్నైతోపాటు ఉత్తర తమిళనాడులోని నాలుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసనట్లు ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. మోంథా నేపథ్యంలో ఒడిశా కూడా అప్రమత్తమైంది. దక్షిణ ఒడిశాలో 8 జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీచేశారు. మూడువేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. -
1996 ప్రళయం.. కోనసీమ వాసుల భయం
మోంథా తుపాను కాకినాడ జిల్లా వాసుల్లో భయాందోళన రేపుతోంది. పెను తుపానుగా మారి ఊహించని రీతిలో విధ్వంసం కలిగిస్తుందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో జిల్లా ప్రజలు భీతిల్లుతున్నారు. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. పెను తుపానుగా మారిపోయి, కాకినాడ సమీపంలో తీర దాటుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ సమయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని ప్రజలను హెచ్చరించింది. తుపాను తీరం దాటే సమయంలో సుమారు 110 కిలోమీటర్ల వేగంతో భీకర గాలులు వీస్తాయని, కుండపోతగా వర్షం పడుతుందని తెలిపింది. ఈ నేపథ్యంలో 1996 నాటి ప్రళయాన్ని గుర్తు చేసుకుని కాకినాడ జిల్లా వాసులు కంపితులవుతున్నారు.1996 ప్రళయం 1996 నవంబరు 6న కాకినాడ – యానాం మధ్య తీరం దాటిన ప్రపంచ తుపాను కోనసీమను కకావికలం చేసింది. సుమారు 215 కిలోమీటర్ల వేగంతో వీచిన పెను గాలులు ధాటికి కోనసీమ ప్రాంతం చిన్నాభిన్నమైంది. సముద్ర తీరంలో అలలు భారీ ఎత్తున అలలు ఎగసిపడి ఉప్పెన ముంచెత్తడంతో కాట్రేనికోన, ఉప్పలగుప్తం, అల్లవరం మండలాల్లో సముద్ర తీర మత్స్యకార గ్రామాలు ధ్వంసమయ్యాయి. కాట్రేనికోన మండలం భైరవపాలెం, బలుసుతిప్ప గ్రామాలు నామరూపాల్లేకుండా పోయాయి.భారీగా ప్రాణ, ఆస్తి నష్టంఅధికారిక లెక్కల ప్రకారం.. నాటి తుపాను బీభత్సానికి 1,077 మంది ప్రాణాలు కోల్పోగా, సుమారు 2.25 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. 6.47 లక్షల ఇళ్లు దెబ్బ తిన్నాయి. వీటిలో 40 వేల ఇళ్లు పూర్తిగా నేలమట్టమయ్యాయి. వేలాది పశువులు, మూగ ప్రాణులు మృత్యువాత పడ్డాయి. 5.97 లక్షల ఎకరాల్లో పంటలు నాశనమయ్యాయి. 20 లక్షలకు పైగా కొబ్బరి చెట్లు నేల కూలాయి. ఆ తుపాను వచ్చి సుమారు 30 ఏళ్లవుతున్నా నాటి విషాదం ఈ ప్రాంత వాసులకు ఇప్పటికీ కళ్ల ముందే కదలాడుతోంది.ప్రభుత్వ వైఫల్యం1996 నాటి తుపాను నుంచి కోలుకునేందుకు కోనసీమ (Konaseema) వాసులకు పదేళ్ల సమయం పట్టిందంటే దాని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. నాటి ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోకపోవడంతో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. అప్పుడు ఉమ్మడి రాష్ట్రానికి చంబ్రాబు నాయుడు సీఎంగా ఉన్నారు. తుపాను ముందు హెచ్చరికలు చేయకపోవడంతో పాటు కనీస జాగ్రత్తలు తీసుకోలేకపోవడంతో కోనసీమకు తీరని నష్టం జరిగింది.ప్రస్తుతం.. అప్రమత్తంనాటి అనుభవాలను గమనంలోకి తీసుకుని కాకినాడ జిల్లా (Kakinada District) అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మోంథా తుపాను (Cyclone Montha) నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలిస్తున్నారు. ఉప్పాడ రోడ్డును ముందు జాగ్రత్తగా మూసివేశారు. జిల్లాలోని స్కూల్స్, కాలేజీలు అన్నింటికీ నాలుగు రోజులు సెలువులు ప్రకటించారు. మత్స్యకారులను చేపల వేటకు వెళ్లకుండా కట్టడి చేశారు. అలాగే పొలం పనులను వాయిదా వేసుకోవాలని రైతులకు సూచించారు.చదవండి: కాకినాడ తీరానికి ఉప్పెన ముప్పు!గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అధికారులందరినీ అప్రమత్తం చేశారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొవడానికి సిద్ధం చేశారు. కలెక్టర్ షణ్మోహన్ సగిలితో పాటు జిల్లా ప్రత్యేక అధికారి మైలవరపు కృష్ణతేజ (Krishna Teja Mylavarapu) ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ, కిందిస్థాయి అధికారులకు తగువిధంగా ఆదేశాలిస్తున్నారు. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి సహాయక చర్యలను అనుక్షణం పర్యవేక్షిస్తున్నారు. పునరావాస కేంద్రాల్లో అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారు. ముఖ్యంగా వైద్యపరంగా అన్ని జాగ్రత్తలు చేపడుతున్నారు. -
దూసుకొస్తున్న మోంథా
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): గత వారంలో అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలు కురిశాయి. వాటి నుంచి జిల్లా వాసులు తేరుకుంటున్నారు. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఎండ కాసి, వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది. కానీ, ఇదే సమయంలో మోంథా తుపాను ఉగ్ర రూపంతో దూసుకొస్తోందన్న వార్త మాత్రం జిల్లా వాసులను కలవరపరుస్తోంది. మారిన వాతావరణం తుపాను ప్రశాంతత అనే రీతిలో కనిపిస్తోంది. ఈ తుపాను తీవ్ర రూపం దాల్చి కాకినాడ వద్ద తీరం దాటుతుందనే వార్తతో ఇక్కడి ప్రజల గుండెల్లో అలజడి రేగుతోంది. పలువురు 1996 తుపాను సృష్టించిన విధ్వంసాన్ని గుర్తు చేసుకుని వణికిపోతున్నారు.వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి, తుపానుగా మారుతుందని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించిన విష యం తెలిసిందే. దీనికి ‘మోంథా’ అని పేరు పెట్టారు. ఇది కాకినాడ సమీపంలో తీరం దాటుతుందని, ఆ సమయంలో 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని, కనీసం 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ తుపాను ప్రభావంతో సోమవారం నుంచి గురువారం వరకూ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవవచ్చని భావిస్తున్నారు. మరోవైపు సముద్ర అలలు పెద్ద ఎత్తున ఎగసిపడే ప్రమాదం పొంచి ఉంది. వాతావరణ శాఖ జిల్లాకు రెడ్ అలర్ట్ ప్రకటించింది.ముందస్తు చర్యలుతుపాను నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. కలెక్టర్ షణ్మోహన్ సగిలి జిల్లాలోని ఉన్నతాధికారులు, మండల, జోన్ అధికారులతో ఆదివారం అత్యవసర టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎటువంటి విపత్తు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. ప్రాణ, ఆస్తి, పంట నష్టాలు జరగకుండా అవసరమైన ముందస్తు జాగ్రత్తలన్నీ తీసుకోవాలని సూచించారు. జిల్లా, డివిజన్, మండల, గ్రామ స్థాయిల్లో పని చేసే అధికారులు, సిబ్బంది వారివారి ప్రదేశాల్లోనే ఉండాలని ఆదేశించారు. ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు రద్దు చేశారు.తీర ప్రాంతం.. అప్రమత్తంతుపాను ప్రభావం ముందుగా సముద్ర తీర ప్రాంతం పైనే ఉంటుంది. అందువలన జిల్లా యంత్రాంగం ప్రధానంగా తీర గ్రామాలపై దృష్టి సారించింది. తొండంగి, యు.కొత్తపల్లి, కాకినాడ రూరల్, కాకినాడ సిటీ, తాళ్లరేవు మండలాలు సముద్ర తీరంలో ఉన్నాయి. ఆయా మండలాల నుంచి సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులను ఇప్పటికే వెనక్కి రప్పిస్తున్నారు. ఎవరైనా మత్స్యకారులు సముద్రంలోకి వెళ్తే వారిని సురక్షితంగా తీరానికి చేర్చేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ షణ్మోహన్ మత్స్య శాఖ అధికారులను ఆదేశించారు. తుపాను ప్రభావం ఉండే గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయా గ్రామాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిల్లావ్యాప్తంగా 269 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ షణ్మోహన్ తెలిపారు. కలెక్టరేట్లో కంట్రోల్ రూము ఏర్పాటు చేశారు.హోప్ ఐలాండ్ నుంచి..రెవెన్యూ అధికారులు ఆదివారం ఉదయం కాకినాడ సమీపంలోని హోప్ ఐలాండ్‌కు వెళ్లి అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు రావాలని సూచించారు. అయితే, అక్కడి ప్రజలు ససేమిరా అనడంతో చేసేది లేక తిరిగి వచ్చారు. మోంథా తుపాను ప్రభావం జిల్లాపై అధికంగా ఉన్న విషయం చెప్పి, వారిని అక్కడి నుంచి తరలించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించడంతో రెవెన్యూ, పోలీసు అధికారులు సాయంత్రం అక్కడకు ప్రత్యేక బోట్లు పంపించారు. పోలీసుల సాయంతో ఉన్న హోప్ ఐలాండ్‌లో ఉన్న 110 మందిని తాళ్లరేవులోని సురక్షిత ప్రాంతాలకు తీసుకొచ్చారు.ఉప్పాడ రోడ్డు మూసివేతకాకినాడ నుంచి సూర్యారావుపేట మీదుగా ఉప్పాడ వెళ్లే ప్రధాన రహదారిని తుపాను కారణంగా మూసివేశారు. ఈ రోడ్డులో ఎవ్వరూ వెళ్లకుండా పోలీసులు గస్తీ ఏర్పాటు చేశారు. కాకినాడ సూర్యారావుపేట బీచ్లోనికి కూడా సందర్శకులు వెళ్లకుండా ఏర్పాట్లు చేశారు.31 వరకూ విద్యా సంస్థలకు సెలవుమోంథా తుపాను నేపథ్యంలో జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ, బీసీ, గురుకుల హాస్టళ్లలోని విద్యార్థులను సైతం వారి వారి ఇళ్లకు పంపిచేశారు.పీజీఆర్ఎస్ రద్దుకలెక్టరేట్తో పాటు ఆర్డీఓ, మండల కార్యాలయాలు, సచివాలయాల్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమాన్ని తుపాను నేపథ్యంలో ఈ వారం రద్దు చేశారు. కలెక్టర్ షణ్మోహన్ ఈ విషయం తెలిపారు.జిల్లాకు ప్రత్యేకాధికారిమోంథా తుపాను నేపథ్యంలో జిల్లాకు ఐఏఎస్ అధికారి మైలవరపు కృష్ణతేజను ప్రత్యేకాధికారిగా నియమించారు. ఆయన జిల్లాలోని అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు.కలెక్టరేట్ కంట్రోల్ రూము నంబర్ 0884–2356801సన్నద్ధంగా ఉండాలిబోట్క్లబ్ (కాకినాడ సిటీ): మోంథా తుపానును సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు పూర్తి సన్నద్ధతతో ఉండాలని కలెక్టర్ షణ్మోహన్, జిల్లా ప్రత్యేక అధికారి మైలవరపు కృష్ణతేజ అధికారులను ఆదేశించారు. తుపాను నేపథ్యంలో చేపట్టాల్సిన చర్యలపై ఎస్పీ బిందుమాధవ్, ఇతర ఉన్నతాధికారులు జిల్లాలోని అన్న మండలాల క్షేత్రస్థాయి అధికారులతో కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, తొండంగి, ఉప్పాడ, తాళ్లరేవు, కాకినాడ రూరల్, పట్టణ ప్రాంతాల అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అన్ని గ్రామాల్లోనూ తుపాను హెచ్చరికలు జారీ చేసి, ప్రజలు అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎక్కడా ప్రాణ, ఆస్తి నష్టాలు జరగకుండా ఎంపీడీఓలు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, మండల ప్రత్యేకాధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాల్లోని సహాయక శిబిరాలకు, బాలింతలు, వృద్ధులను సమీప ఆస్పత్రులకు ముందుగానే తరలించాలని సూచించారు. ఆస్పత్రుల్లో వైద్యులకు ప్రత్యేక డ్యూటీలు వేసి, మందులు సిద్ధంగా ఉంచాలని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. 108, 104 వాహనాలు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. పునరావాస కేంద్రాలకు అవసరమైన కూరగాయలు, నిత్యావసర వస్తువులు, ఇతర సామగ్రిని ముందుగానే సిద్ధం చేసుకోవాలన్నారు. కోతకు వచ్చిన పంటలు రెండు మూడు రోజుల పాటు కోయకుండా రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. వీఆర్ఓలు, పంచాయతీ కార్యదర్శుల ద్వారా సహాయక శిబిరాలను గుర్తించాలని, ఏయే ప్రాంత ప్రజలను ఎక్కడికి తరలించాలో ముందుగానే జాబితా సిద్ధం చేసుకోవాలని అన్నారు. -
చంద్రుడు ప్రతిష్ఠించిన సోమేశ్వరులు
పడమర వెంటూరు ద్రాక్షారామకు పడమర దిక్కులో రాయవరం మండలం వెంటూరులో పార్వతీ సమేత ఉమాసోమేశ్వరస్వామి పూజలందుకుంటున్నారు. వెంటూరు చేరుకోవాలంటే రామచంద్రపురం–వాకతిప్ప ఆర్టీసీ బస్సులో వెళ్లవచ్చు. రామచంద్రపురం నుంచి నేరుగా ఆటోల సౌకర్యం ఉంది. వెంటూరులోని పార్వతీ సమేత ఉమాసోమేశ్వరస్వామి తూర్పున కోలంక ద్రాక్షారామ భీమేశ్వరాలయానికి తూర్పున కాజులూరు మండలం కోలంక గ్రామంలో పార్వతీ సమేత ఉమా సోమేశ్వరస్వామివారు నెలకొని ఉన్నారు. కార్తిక మాసంలో ఈ స్వామిని దర్శించుకుని పూజలు చేస్తే కోర్కెలు తీరుతాయని ప్రసిద్ధి. కోలంకకు చేరుకోవాలంటే ద్రాక్షారామ నుంచి యానాం వెళ్లే ఆర్టీసీ బస్సు ఎక్కాలి. ఆటో సదుపాయమూ ఉంది. కోలంకలోని పార్వతీ సమేత ఉమాసోమేశ్వరస్వామి ● ఎనిమిది దిక్కుల్లో కొలువైన అష్ట సోమేశ్వరాలయాలు ● భక్తుల పాలిట వరాలు ● కార్తిక మాసంలో దర్శించుకుంటే విశేష పుణ్యఫలం రామచంద్రపురం: కార్తిక మాసం ఈశ్వరునికి ఎంతో ప్రీతి పాత్రమైనది. భక్తిశ్రద్ధలతో కొలిస్తే ఈశ్వరానుగ్రహం తప్పక దొరుకుతుందని పండితుల ఉవాచ. ఈశ్వరానుగ్రహం పొందేందుకు నలుదిక్కులా అష్టసోమేశ్వరాలయాల్లో ఆ స్వామి కొలువుదీరిన అరుదైన ఆలయాలున్నాయి. దేవతలతో ప్రతిష్ఠించినట్టు విశేష ప్రాచుర్యం పొందిన ఆ ఆలయాల్లో ఈశ్వరుడు కొలువయ్యాడు. అష్టసోమేశ్వరాలయాలను దర్శించుకుంటే భగవత్ సంకల్పం నెరవేరుతుందని పండితులు చెబుతున్నారు. కార్తిక మాసంలో అష్ట సోమేశ్వరాలయ దర్శనానికి ఎంతో ప్రాముఖ్యముంది. రామచంద్రపురం, మండపేట పరిసర ప్రాంతాల్లోని అష్ట సోమేశ్వరాలయాలకు ప్రత్యేకత ఉంది. ద్రాక్షారామలోని మాణిక్యాంబ సమేత భీమేశ్వరాలయం దక్షిణ కాశీగా విరాజిల్లుతోంది. సూర్యునితో స్వయం ప్రతిష్ఠగా ప్రసిద్ధికెక్కిన ద్రాక్షారామ భీమేశ్వరుడు అష్ట సోమేశ్వరాలయాల నడుమ కొలువుదీరి పూజలందుకుంటున్నారు. అనుకోని అవాంతరం కారణంగా కాలహరణమై ముహూర్త సమయం మించిపోతుండడంతో భీమేశ్వరుడు స్వయంభు లింగంగా ద్రాక్షారామలో అవతరించారు. భీమలింగాన్ని సూర్యభగవానుడు ప్రతిష్ఠించి భీమేశ్వరునికి ప్రథమార్చన చేసినట్టు పురాణ ప్రతీతి. ఇంద్రాది దేవతలు పూజించగా, సప్త గోదావరి పవిత్ర జలాలతో స్వామివారిని సప్త రుషులు అభిషేకించారు. సూర్య ప్రతిష్ఠత తాపాన్ని, ఉగ్రతను నియంత్రించేందుకు ఆగమ సంప్రదాయం ప్రకారం నలు దిక్కులే కాకుండా, విదిక్కుల్లోనూ సోమేశ్వరాలయాలు వెలిశాయి. చంద్రునితో స్వయం ప్రతిష్ఠితాలుగా ద్రాక్షారామ భీమేశ్వరాలయం అష్ట దిక్కుల్లోనూ సోమేశ్వరాలయాలు ప్రతిష్ఠించబడినట్టు పురాణగాథలు చెబుతున్నాయి. ద్రాక్షారామ భీమేశ్వరునికి ఒక్కొక్క యోజన దూరంలో అష్టసోమేశ్వరాలయాలు నెలకొని ఉండటం విశేషం. కార్తిక మాసంలో ద్రాక్షారామ భీమేశ్వరుని దర్శనంతో పాటు, అష్ట సోమేశ్వరాలయాల్లోని సోమేశ్వరులను దర్శించుకోవడాన్ని భక్తులు పవిత్రంగా భావిస్తారు. సూర్య ప్రతిష్ఠ గావించిన భీమేశ్వరుని దర్శనం అనంతరం.. చంద్ర ప్రతిష్ఠితాలుగా పేరొందిన అష్ట సోమేశ్వరాలయాల్లోని స్వామివారి దర్శనంతో భక్తులకు సకల పాప పరిహారంతో పాటు, ఎంతో పుణ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం. -
రాజకీయ బలోపేతమే శెట్టిబలిజల లక్ష్యం
● సందడిగా శెట్టిబలిజ కార్తిక వన మహోత్సవం, ఉచిత వివాహ పరిచయ వేదిక ● మంత్రులు, ఎమ్మెల్సీలు, ప్రముఖుల హాజరు రాజమహేంద్రవరం రూరల్: శెట్టిబలిజ సామాజిక వర్గం రాజకీయంగా బలోపేతం కావాల్సిన అవసరం ఉందని పలువురు ప్రముఖులు స్పష్టం చేశారు. రాష్ట్ర శెట్టిబలిజ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం హైవే పక్కనున్న చెరుకూరి తోటలో శెట్టిబలిజ కార్తిక వన మహోత్సవం, శెట్టిబలిజ వధూవరుల ఉచిత వివాహ పరిచయ వేదిక నిర్వహించారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, విశిష్ట అతిథులుగా పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణ, రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్తిబాబు, శాసన మండలి మాజీ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, వైఎస్సార్ సీపీ రాజమండ్రి పార్లమెంటరీ ఇన్చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణ మాట్లాడుతూ, శెట్టబలిజలు రాజకీయంగా ఎదగాలని ఆకాంక్షించారు. మంత్రి సుభాష్ మాట్లాడుతూ, శెట్టిబలిజ సామాజిక వర్గ సంక్షేమానికి చర్యలు తీసుకుంటామన్నారు. త్వరలో ఆదరణ పథకంలో గీత సామాజిక వర్గం వారికి ఉపకరణాలు అందిస్తామని, బీసీ కార్పొరేషన్ రుణాలూ అందుతాయని చెప్పారు. ఈ సందర్భంగా శెట్టిబలిజ సంఘానికి సేవలు చేసిన ప్రముఖుల స్మారక అవార్డులను పది మందికి ప్రదానం చేశారు. సంఘ నూతన సంవత్సర క్యాలెండర్‌ను మంత్రి సుభాష్ ఆవిష్కరించారు. అనంతరం సంఘ రాష్ట్ర నాయకుడు సానబోయిన రామారావును సత్కరించారు. సంఘ రాజమండ్రి నాయకులు, శెట్టిబలిజ ప్రముఖులను మంత్రి శాలువా, జ్ఞాపికలతో సన్మానించారు. కార్యక్రమంలో రాష్ట్ర శెట్టిబలిజ, గౌడ, ఈడిగ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పాలిక శ్రీను, రాష్ట్ర ఖాదీ బోర్డు మాజీ వైస్ చైర్మన్ పిల్లి నిర్మల, సంఘ ప్రతినిధులు, సంఘీయులు, మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
ఏలేరు.. డేంజర్!
● రిజర్వాయర్‌లో పెరుగుతున్న నీటిమట్టం ● దిగువకు అదనపు జలాల విడుదల ● అధిక మొత్తంలో ఒకేసారి వదిలేస్తే ముంపు ముప్పు ● పరీవాహక ప్రాంత ప్రజల్లో కలవరం పిఠాపురం: జిల్లాలోని ఏలేశ్వరం వద్ద ఉన్న ఏలేరు జలాశయం డేంజర్ బెల్స్ మోగిస్తోంది. వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయం నీటిమట్టం దాదాపు గరిష్ట స్థాయికి చేరుకుంది. దీని పూర్తి స్థాయి నీటిమట్టం 86.56 మీటర్లు కాగా, శనివారం నాటికే 85.57 మీటర్లకు చేరింది. పూర్తి సామర్థ్యం 24.11 టీఎంసీలు కాగా, నీటి నిల్వలు సుమారు 23 టీఎంసీలకు చేరుకున్నాయి. ఈ తరుణంలోనే మోంథా తుపాను దూసుకొస్తూండటంతో మరింతగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇప్పటికే ఏలేరు రిజర్వాయర్ లోనికి వరద నీరు భారీగా వచ్చి చేరుతూండటంతో అధికారులు రోజుకు 3 వేల క్యూసెక్కుల చొప్పున నీటిని దిగువకు విడిచిపెడుతున్నారు. నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరుకోవడంతో ఎక్కువ మొత్తంలో అదనపు జలాలు వదిలేందుకు అధికారులు రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది. దీంతో, తమకు మరోసారి ముంపు ముప్పు తప్పదేమోనని పరీవాహక ప్రాంతాల్లోని ప్రజలు కలవరపడుతున్నారు. గత ఏడాది అపార నష్టం గత ఏడాది సెప్టెంబర్ నెలలో ఏలేరు అదనపు జలాలను కాలువ సామర్థ్యానికి మించి ఒక్కసారిగా వదిలేయడంతో పిఠాపురం, గొల్లప్రోలు, యు.కొత్తపల్లి మండలాల్లో అపార నష్టం సంభవించింది. ఈ మూడు మండలాల్లోనూ వరి, వాణిజ్య పంటలు పూర్తిగా నీట మునిగి, పనికి రాకుండా పోయాయి. మొత్తం 42 వేల ఎకరాల్లో వరి సాగు చేయగా సుమారు 36 వేల ఎకరాల్లో పంట ముంపు బారిన పడింది. ఎకరానికి రైతులు రూ.25 వేల పెట్టుబడి పెట్టగా, అంతా వరదల్లో తుడిచిపెట్టుకుపోయింది. నాటి ఏలేరు వరదల కారణంగా సుమారు రూ.150 కోట్ల మేర నష్టం సంభవించింది. ఏలేరు కాలువకు గండి పడిన ప్రాంతాల నుంచి భారీగా ఇసుక, మట్టి వచ్చి పొలాల్లో మేటలు వేసింది. పిఠాపురం మండలం రాపర్తి, రాయవరంతో పాటు గొల్లప్రోలు మండలంలోని వివిధ గ్రామాల్లో సుమారు 200 ఎకరాల్లో ఇసుక మేటలు వేసింది. రైతులు దిక్కుతోచని స్థితిని ఎదుర్కొన్నారు. రాపర్తి ప్రాంతంలోని వరి పొలాల్లో సుమారు 2 అడుగుల మేర ఇసుక మేటలు వేసింది. ఆ ఇసుక తొలగించుకోడానికి సైతం రైతులు వేలాది రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చింది. మరోవైపు నాడు రూ.కోట్లు వెచ్చించి, ఏలేరు, పిఠాపురం బ్రాంచి కెనాల్ (పీబీసీ) గండ్ల పూడ్చివేత పేరుతో కూటమి నేతలు తూతూమంత్రంగా పనులు చేసి, చేతులు దులిపేసుకున్నారనే ఆరోపణలున్నాయి. ఇప్పటికీ ఎక్కడి గండ్లు అక్కడే ఉన్నాయి. ప్రస్తుతం ఈ ప్రాంతంలో వరి పైరు చిరుపొట్ట దశలో ఉంది. ఈ తరుణంలో ఇప్పుడు మళ్లీ ఏలేరు నుంచి నీటిని ఒక్కసారిగా వదిలేస్తే తమకు మరోసారి కోలుకోలేని దెబ్బ తగులుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. కాగా, మరోసారి వరద ఖాయమని భావిస్తున్న అధికారులు ముందు జాగ్రత్త చర్యల పేరిట కాలువల్లో పూడికల తొలగింపు చేపట్టారు. పిఠాపురం మండలం మాధవపురం వద్ద ఏలేరు కాలువకు గత ఏడాది సెప్టెంబర్‌లో గండి పడటంతో నీట మునిగిన ఇసుకపల్లి గ్రామం, పంట చేలుఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు మాధవపురం గండి పూడ్చి మా పంటలు కాపాడాలని ఎన్నిసార్లు మొర పెట్టుకుంటున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. దీనిపై పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (పాడా) అధికారులకు గ్రీవెన్స్‌లో ఫిర్యాదులు చేశాం. అయినా ఫలితం లేదు. ఇది పెద్ద గండి కాదని వదిలేసినట్లు ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. వరద వచ్చినప్పుడు ఏలేరు అదనపు జలాలు, పీబీసీ నీరు ఒకేసారి వచ్చి పడటంతో ఈ కాలువకు గండి పడింది. దీనివల్లే గత ఏడాది సుమారు 2 వేల ఎకరాల్లో వరి పంట, వందలాదిగా ఇళ్లు నీట మునిగా యనే విషయం గుర్తించాలి. అటువంటిది ఇది పెద్ద గండి కాదనడం ఎంతవరకూ సమంజసమో అధి కారులే చెప్పాలి. అన్ని గండ్లూ పూడ్చివేస్తున్నామ ని అధికారులు, నేతలు చెబుతున్నారు. కానీ, అవసరమైన, ప్రమాదకరమైన ఇలాంటి గండ్లను ప ట్టించుకోవడం లేదు. మాధవపురం గండిని ఇప్ప టికై నా పూడ్చి, గట్టును పటిష్టపరచకపోతే వేలాది ఎకరాలు నీట మునగడం మరోసారి ఖాయం. – వై.ప్రసాదరెడ్డి, రైతు, నాగులాపల్లి, యు.కొత్తపల్లి మండలం -
జాకీలతో ఇంటి ఎత్తు పెంపు
కపిలేశ్వరపురం (మండపేట): మండపేట మండలం మారేడుబాక మహిళా నగర్‌లోని ఓ ఇల్లు ఇప్పుడు అందరి దృష్టి ఆకర్షించింది. కొన్నేళ్లుగా పల్లంలో ఉన్న ఆ ఇల్లు ఇప్పుడు మూడు అడుగుల ఎత్తుకు పెరిగింది. సాధారణంగా ఇల్లు అనుకూలంగా లేకపోతే కూల్చి మళ్లీ కడతారు. ఇక్కడ ఇల్లు కూల్చకుండానే ఎత్తు చేశారు. పల్లంలో ఉంటున్న ఇంట్లో నివసించడానికి ఇబ్బందిగా భావించిన యజమాని మోటుపల్లి వీరగణేష్.. ఆ ఇంటిని కూల్చే సాహసం చేయలేకపోయారు. ఇంటిని ఎత్తు చేసేలా ప్రత్యామ్నాయ ఆలోచన చేశారు. జాకీల సాయంతో ఇంటి ఎత్తు పెంచే విజయవాడలోని ఓ సంస్థ ప్రతినిధులను సంప్రదించారు. స్థానిక పరిస్థితుల నేపథ్యంలో మూడు అడుగులు ఎత్తు చేయవచ్చంటూ సంస్థ ప్రతినిధులు భరోసా ఇచ్చారు. అందుకయ్యే ఖర్చును చెల్లించేందుకు యజమాని సిద్ధపడటంతో, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి, జాకీలతో ఇంటిని మూడు అడుగుల ఎత్తు పెంచారు. ప్రస్తుతం ఆ ప్రక్రియ పూర్తికావడంతో అనుబంధ పనులను చేస్తున్నారు. -
పేద కుటుంబంలో చిమ్మిన విషాదం
● బైక్‌ను ట్రాక్టర్ ఢీకొని తల్లి మృతి ● కుమారుడి పరిస్థితి విషమం ● కూలీ పనులకు వెళ్లొస్తుండగా ప్రమాదం గండేపల్లి/జగ్గంపేట: రెక్కాడితే కానీ డొక్కాడని ఆ పేద కుటుంబంపై ట్రాక్టర్ రూపంలో పెనుకష్టం వచ్చి పడింది. కూలీ పనులే జీవనాధారంగా బతుకుతున్న ఆ కుటుంబంలో ఒకరిని మృత్యువు బలిగొనగా.. మరొకరు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ట్రాక్టర్ ఢీకొన్న సంఘటనలో తల్లి మృతి చెందగా, కొడుకు పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని గుర్రప్పాలెం పంచాయతీ పరిధిలోని సగరపేటకు చెందిన తల్లీకొడుకులు నక్కా చిట్టమ్మ(40), బాపిరాజు ఆదివారం మోటార్ సైకిల్‌పై జగ్గంపేట కూలీ పనులకు వెళ్లారు. తిరిగి ఇంటికి వస్తుండగా.. సగరపేట సమీపంలో ఎదురుగా వచ్చిన ట్రాక్టర్ బలంగా ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. బంధువులు, స్థానికులు క్షతగాత్రులను చికిత్స కోసం గండేపల్లి మండలం జెడ్.రాగంపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే చిట్టమ్మ మరణించినట్టు ధ్రువీకరించారు. తీవ్ర గాయాలతో ఉన్న బాపిరాజును మెరుగైన వైద్యం కోసం కాకినాడలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎసై టి.రఘునాథరావు తెలిపారు. రెక్కాడితే కానీ.. పేద కుటుంబం కావడంతో రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి ఆ కుటుంబానిది. మృతురాలు చిట్టమ్మ, భర్త వెంకన్న, పెద్ద కొడుకు పురుషోత్తం, చిన్న కొడుకు బాపిరాజు కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఆదివారం కూలీ పనులు ముగించుకుని వస్తుండగా ఈ ప్రమాదానికి గురయ్యారు. డ్రైవర్ నిర్లక్ష్యమే కారణం మట్టిని తరలిస్తున్న ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనలో మృతురాలి తలకు తీవ్ర గాయమై, కొంత భాగం ట్రాక్టర్ ట్రక్కుకు అంటుకున్నట్టు చెప్పారు. గ్రామంలో జన సంచారం ఉండే ప్రాంతంలో ట్రాక్టర్‌ను డ్రైవర్ అజాగ్రత్తగా, వేగంగా నడిపి ప్రమాదానికి కారణమయ్యాడన్నారు. ఇటువంటి వాటిపై అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
రత్నగిరిపై భక్తజన ప్రవాహం
● కొనసాగుతున్న రద్దీ ● సత్యదేవుని దర్శించిన 50 వేల మంది ● రూ.50 లక్షల ఆదాయం అన్నవరం: రత్నగిరిపై ఆదివారం కూడా భక్తుల రద్దీ కొనసాగింది. సత్యదేవుని దర్శించేందుకు వేలాదిగా భక్తులు రావడంతో ఆలయ ప్రాంగణం, వ్రత, విశ్రాంతి మండపాలు కిక్కిరిసిపోయాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకూ భక్తుల రద్దీ కొనసాగింది. స్వామివారిని సుమారు 50 వేల మంది దర్శించుకున్నారు. సత్యదేవుని వ్రతాలు ఐదు వేలు జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.50 లక్షల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని సత్యదేవుని ఆలయాన్ని తెల్లవారుజాముప 2 గంటలకే తెరిచి, భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించడంలో పాటు వ్రతాల నిర్వహణ కూడా ప్రారంభించారు. వ్రత మండపాలతో పాటు పాత కల్యాణ మండపంలో కూడా వ్రతాలు నిర్వహించారు. స్వామివారి ఉచిత దర్శనానికి 2 గంటలు, రూ.200 టికెట్టుతో దర్శనానికి గంట సమయం పట్టింది. స్వామివారిని దర్శించిన భక్తులు సప్త గోకులంలో గోవులకు ప్రదక్షిణ చేశారు. తూర్పు రాజగోపురం ముందున్న రావిచెట్టు వద్ద జ్యోతులు వెలిగించారు. నిత్యాన్నదాన పథకం వద్ద భక్తులకు పులిహోర, దద్ధోజనం పంపిణీ చేశారు. దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్ ఉదయం నుంచీ ఆలయ ప్రాంగణంలోను, ఈఓ వీర్ల సుబ్బారావు సత్యగిరి పైన ఏర్పాట్లను పరిశీలించారు. నేడు కూడా కిటకిట! కార్తిక మాసంలో తొలి సోమవారం కావడంతో సత్యదేవుని ఆలయానికి నేడు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తారనే అంచనాతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వేకువజామున ఒంటి గంట నుంచే వ్రతాల నిర్వహణకు, దర్శనాలకు భక్తులను అనుమతించనున్నారు. సుమారు 60 వేల మందికి పైగా భక్తులు వస్తారనే అంచనాతో ఏర్పాట్లు చేస్తున్నారు. ఐదు వేలకు పైగా వ్రతాలు జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. భక్తులకు తీరని కష్టాలు ● కార్తిక మాసంలో పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేయడంలో అధికారుల వైఫల్యం కనిపిస్తోంది. ● పడమటి రాజగోపురం లోపల ఉన్న క్యూల నుంచి, అక్కడ నిర్మించిన కంపార్ట్మెంట్లలోకి భక్తులను పంపిస్తున్నారు. అక్కడ భక్తులకు మంచినీరు అందించడం లేదు. కేవలం క్యూలలోనే మంచినీరు సరఫరా చేస్తున్నారు. దీంతో భక్తులు ఇబ్బంది పడుతున్నారు. ● వ్రత మండపాలకు ఎలా వెళ్లాలి, రూ.300, రూ.వెయ్యి, రూ.1,500 వ్రత మండపాలకు ఎలా వెళ్లాలో తెలిపే సైన్ బోర్డులు ఎక్కడా ఏర్పాటు చేయలేదు. అలాగే, ప్రసాదం కౌంటర్లు తెలిపే బోర్డులు కూడా లేవు. వీటిని తూర్పు, పశ్చిమ రాజగోపురం వద్ద ఏర్పాటు చేయాలి. దర్శనం టికెట్లు, టాయిలెట్లు ఎక్కడ ఉన్నాయో తెలిపే బోర్డులు కూడా ఏర్పాటు చేయాలి. ● డిజిటల్ చెల్లింపులు చేయవచ్చనే ఉద్దేశంతో చాలామంది భక్తులు నగదు తక్కువ తెచ్చుకుంటున్నారు. కానీ, రత్నగిరిపై సెల్‌ఫోన్ సిగ్నల్స్ లేక, డిజిటల్ చెల్లింపులు జరగక ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యపై గతంలో ‘సాక్షి’ పలు కథనాలు ప్రచురించింది. దీంతో, గత ఏప్రిల్‌లో జిల్లా కలెక్టర్ షణ్మోహన్ దేవస్థానానికి వచ్చినప్పుడు భక్తుల సౌకర్యార్థం ఉచిత వైఫై సదుపాయం కల్పించారు. కొన్నాళ్లు అది బాగానే ఉపయోగపడినా పరిస్థితి ఇప్పుడు మళ్లీ పూర్వ స్థితికి వచ్చేసింది. ● దేవస్థానంలోని ఎస్బీఐ, యూనియన్ బ్యాంక్ ఏటీఎంలలో చాలినంత నగదు ఉండక భక్తులు ఇబ్బంది పడుతున్నారు. ● దర్శనం చేసుకున్న భక్తులు తిరిగి రథం పాత్‌లోకి రాకుండా తూర్పు రాజగోపురం దిగువన ఉన్న మెట్ల ద్వారా సర్కులర్ మండపం వైపు వెళ్లేలా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో సన్ డయల్ ఎదురుగా బారికేడ్లు కట్టి, భక్తులు వెనక్కి రాకుండా చేశారు. అయితే, సన్ డయల్ వెనుక టాయిలెట్లు ఉన్నాయి. ఈ బారికేడ్ల వలన ఆ టాయిలెట్ల వద్దకు భక్తులు వెళ్లలేని పరిస్థితి. రథం పాత్‌కు సమీపాన ఇక్కడ మాత్రమే టాయిలెట్లు ఉన్నాయి. లేదంటే రామాలయం పాత మెయిన్ గెస్ట్ హౌస్ వెనుకన లేదా పశ్చిమ రాజగోపురం వద్ద ఉన్న టాయిలెట్ల వద్దకు భక్తులు వెళ్లాలి. ఇవి చాలా దూరం. అందువలన సన్ డయల్ వద్ద ఉన్న టాయిలెట్లు భక్తులు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేయాలి. -
పశువులను అక్రమంగా తరలిస్తున్న వ్యాన్ సీజ్
రాయవరం: పశువులను అక్రమంగా తరలిస్తున్న వ్యాన్‌ను పోలీసులు స్వాదీనం చేసుకుని, పశువులను రక్షించిన ఘటన రాయవరం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ విషయాన్ని రాయవరం ఎస్సై డి.సురేష్‌బాబు ఆదివారం విలేకరులకు తెలిపారు. జగ్గంపేట సంతలో పశువులను కొనుగోలు చేసి, అక్కడి నుంచి రామచంద్రపురం వరకు, అక్కడి నుంచి నెల్లూరుకు ఓ వ్యాన్‌పై తరలిస్తున్నారు. కొత్తూరుకు చెందిన సంసేన్ను, తమిళనాడు జిల్లా తిరువళ్లూరు ప్రాంతానికి చెందిన వ్యాన్ డ్రైవర్ వెట్రివేల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వ్యాన్‌లో అక్రమంగా తరలిస్తున్న 16 ఎద్దులు, 14 చిన్న దూడలను సంరక్షించి, సామర్లకోట గోశాలకు తరలించారు. అక్రమంగా పశువులను తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేశారు. అలాగే వ్యాన్‌ను సీజ్ చేసినట్టు ఎస్సై సురేష్‌బాబు తెలిపారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్త కొబ్బరి (క్వింటాల్) 20,000 – 22,500 కొత్త కొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 30,000 గటగట (వెయ్యి) 28,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 29,000 గటగట (వెయ్యి) 27,000 నీటికాయ పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 23,000 – 25,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి)23,000 – 25,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 5,250 కిలో 350 -
చెరువులో వృద్ధురాలి మృతదేహం
సీతానగరం: ఏం కష్టం వచ్చిందో.. ఏమిటో ఓ పండుటాకు చెరువులో నిర్జీవమై కనిపించింది. మండలంలోని కాటవరానికి చెందిన తెలగారెడ్డి నాగమణి (96) వారం రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆదివారం చెరువులో ఆమె మృతదేహం కనిపించింది. ఆమె మనవడు, మనవడి భార్య బండారు బ్రహ్మం, అరుణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మతిస్తిమితం లేని వృద్ధురాలు నాగమణి ఎవరికీ చెప్పకుండా ఈ నెల 19న ఇంటి నుంచి వెళ్లిపోయింది. దీంతో కుటుంబ సభ్యులు తమ బంధువులను ఆరా తీసినా.. ఆమె ఆచూకీ దొరకలేదు. దీనిపై ఈ నెల 20న స్థానిక పోలీసులకు వారు సమాచారం ఇచ్చారు. కాటవరంలోని మొండి పుంత చెరువులో ఆమె మృతదేహం ఉన్నట్టు ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు స్థానికుల ద్వారా తెలిసింది. అది నాగమణి మృతదేహంగా కుంటుంబ సభ్యులు గుర్తించారు. దీనిపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్సై రాంకుమార్ తెలిపారు. -
మోంథా తుపాను ఎఫెక్ట్: కాకినాడ తీరానికి ఉప్పెన ముప్పు
సాక్షి, విశాఖపట్నం: మోంథా తీవ్ర తుపాను ప్రభావంతో కాకినాడ తీరంలో ఉప్పెనకు అవకాశం ఉందని.. విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. తీవ్ర తుపాను తీరం దాటే సమయంలో అలలు సాధారణం కంటే ఒక మీటర్ ఎత్తున ఎసిగిపడనున్నాయని.. తీవ్ర తుపానుగానే తీరం దాటుతుందని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. గడిచిన 6 గంటల్లో గంటకు 6 గంటల వేగంతో వాయుగుండం కదులుతోంది. తీరంలో గాలుల ఉధృతి పెరుగుతోంది. ప్రస్తుతం 35 నుంచి 55 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి.సఖినేటిపల్లి-నర్సాపురం రాకపోకలు నిలిపివేతఅంబేద్కర్ కోనసీమ జిల్లా: సఖినేటిపల్లి మండలం మోంథా తుపాను హెచ్చరికల నేపథ్యంలో సఖినేటిపల్లి -నర్సాపురం రాకపోకలను అధికారులు నిలిపివేశారు. ఈ రోజు నుండి తుపాను ఉధృతి తగ్గే వరకు రేవులో రాకపోకలు నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.తీర ప్రాంతాల్లో అలర్ట్..మొంథా తుపాన్ నేపథ్యంలో తీర ప్రాంతాలను కృష్ణా జిల్లా యంత్రాంగం అలర్ట్ చేసింది. పర్యాటక ప్రాంతాల్లో సందర్శకులకు అనుమతి రద్దు చేశారు. మచిపలీట్నంలోని మంగినపూడి బీచ్, కోడూరు మండలం పాలకాయతిప్ప వద్ద హంసల దీవి బీచ్‌లను మూసివేశారు. మంగినపూడి బీచ్‌లో జిల్లా కలెక్టర్ డికే.బాలాజీ, మత్స్యశాఖ అధికారులు పర్యటించారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేశారు. సందర్శకులను బీచ్‌లోకి రాకుండా పికెట్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. -
ఏడు వారాల స్వామీ.. మనసా స్మరామి
కొత్తపేట: భక్తుల కోరిన కోర్కెలు తీరుస్తూ ఏడు వారాల వెంకన్నగా ప్రసిద్ధికెక్కిన వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి క్షేత్రం శనివారం భక్తజనంతో కోలాహలంగా మారింది. రాష్ట్రం నలుమూలల నుంచీ భక్తులు వాడపల్లి క్షేత్రానికి భారీగా తరలివచ్చారు. కొందరు స్వామివారిని దర్శించుకునేందుకు కాలినడకన చేరుకున్నారు. ఏడు ప్రదక్షిణలు చేస్తున్న వేలాది మంది భక్తులతో మాడ వీధులు, స్వామి దర్శనానికి క్యూలైన్లు నిండిపోయాయి. ఏడుకొండల వాడా.. గోవిందా.. గోవింద నామస్మరణతో క్షేత్రం మార్మోగింది. దేవదాయ – ధర్మదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు పర్యవేక్షణలో సిబ్బంది ఏర్పాట్లు చేశారు. స్వామివారికి ఆలయ ప్రధాన అర్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంతశ్రీనివాస్ ఆధ్వర్యంలో అర్చకులు, వేద పండితులు ఉదయం సుప్రభాత సేవ, నీరాజన మంత్రపుష్పం తదితర పూజాధికాలు నిర్వహించారు. స్వామివారిని ప్రత్యేకంగా సుగంధ పరిమళ పుష్పాలతో విశేషంగా అలంకరించారు. శ్రీవేంకటేశ్వర సహిత ఐశ్వర్యలక్ష్మీ హోమం నిర్వహించారు. స్వామివారి దర్శనం అనంతరం ఆలయ ప్రాంగణంలో వేంచేసియున్న అన్నపూర్ణా సమేత విశ్వేశ్వరస్వామిని దర్శించుకుని, తీర్థ ప్రసాదాలు, అన్నప్రసాదం స్వీకరించారు. వేలాదిగా తరలివచ్చిన భక్తుల విశిష్ట దర్శనం, ప్రత్యేక దర్శనం, వేదాశీర్వచనం, ఆన్లైన్, నిత్య, శాశ్వత అన్నదానం విరాళాలు, లడ్డు విక్రయం తదితర రూపాల్లో ఈ ఒక్కరోజు రాత్రి 8 గంటల వరకూ దేవస్థానానికి రూ. 42.01 ,916 ఆదాయం వచ్చినట్లు ఈఓ చక్రధరరావు తెలిపారు. ధర్మపథం కార్యక్రమంలో భాగంగా రాత్రి వివిధ ప్రాంతాలకు చెందిన నృత్య కళాకారుల బృందం కూచిపూడి నృత్య ప్రదర్శన చేసింది. -
భక్తులకు అన్ని వసతులూ కల్పించాలి
● దేవదాయ కమిషనర్ రామచంద్రమోహన్ ● కార్తిక మాసం ఏర్పాట్లపై అసంతృప్తి ● దేవస్థానం సిబ్బందికి పలు సూచనలు అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్ధానానికి కార్తికమాసంలో విచ్చేసే భక్తుల కోసం చేసిన ఏర్పాట్లపై దేవదాయ ధర్మాదాయశాఖ కమిషనర్ కె.రామచంద్రమోహన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన శనివారం దేవస్థానంలో వివిధ విభాగాలను పరిశీలించారు. కార్తిక మాసంలోని ఏకాదశి, పౌర్ణిమ వంటి పర్వదినాలలో అధిక సంఖ్య భక్తులు వస్తారని, దానికి తగ్గట్టుగా ఇక్కడ ఏర్పాట్లు కనిపించడం లేదన్నారు. ఈఓ వీర్ల సుబ్బారావు, దేవస్థానం సిబ్బంది మధ్య సమన్వయలోపం కనిపిస్తోందని, అభిప్రాయ భేదాలను పక్కన సమన్వయంతో పనిచేయాలన్నారు. శానిటేషన్ విభాగంలో అదనపు సిబ్బందిని ఇంకా నియమించలేదని దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్ చెప్పడంతో ఆ విషయంపై కూడా కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విష్ణుసదన్ సత్రం ఆవరణలో ఫ్లోరింగ్ అపరిశుభ్రంగా ఉందన్నారు. విష్ణుసత్రంలో వివాహాలు చేసుకున్నాక కల్యాణ మండపాలను అలాగే వదిలేయకూడదని, సంబంధిత కాంట్రాక్టర్‌తో చెప్పి వెంటనే వాటిని తొలగించాలని ఆదేశించారు. సిబ్బందితో సమావేశం దేవస్థానంలో పరిశీలన అనంతరం సిబ్బందితో కమిషనర్ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కార్తికమాసంలో శని, ఆది, సోమవారాలతో పాటు దశమి, ఏకాదశి, క్షీరాబ్ది ద్వాదశి పర్వదినాలలో తెల్లవారుజాము ఒంటి గంట నుంచి, ఇతర రోజుల్లో తెల్లవారుజాము మూడు గంటల నుంచి స్వామివారి వ్రతాల నిర్వహణ, భక్తులకు దర్శనం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నవంబర్ 2న జరిగే సత్యదేవుని తెప్పోత్సవం, ఐదున జరిగే సత్యదేవుని గిరి ప్రదక్షణకు భారీగా ఏర్పాట్లు చేయాలన్నారు. సమావేశంలో దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వీర్ల సుబ్బారావు, ఈఈలు నూకరత్నం, రామకృష్ణ, ఏఈఓలు కృష్ణారావు, ఎల్ శ్రీనివాస్ భాస్కర్ పాల్గొన్నారు. సత్యదేవుని దర్శించిన 40 వేల మంది కార్తికమాసంలోని తొలి శనివారం సందర్భంగా అన్నవరం దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. సుమారు 40 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించారు. స్వామివారి వ్రతాలు 2,500 నిర్వహించారు. సప్త గోకులంలో గోవులకు ప్రదక్షిణ చేసి, రావిచెట్టు వద్ద దీపాలు వెలిగించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.30 లక్షల ఆదాయం సమకూరింది. ఐదు వేల మంది భక్తులకు అన్నదాన పథకంలో భోజనం పెట్టారు. ఆలయ ప్రాకారంలో సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారిని తిరుచ్చి వాహనంపై ఘనంగా ఊరేగించారు. కార్తికమాసం రద్దీ కారణంగా ఉదయం పది గంటలకు జరగాల్సిన తిరుచ్చి సేవను సాయంత్రం నాలుగు గంటలకు మార్చారు. సత్యదేవుడు, అమ్మవారి ఉత్సవ మూర్తులను తిరుచ్చి వాహనంపై ప్రతిష్ఠించి, అర్చకుడు కంచిభట్ల కుమార్ పూజలు చేశారు. వేద పండితుల మంత్రోచ్ఛారణ, మంగళవాయిద్యాల నడుమ పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రాగా మూడు సార్లు ఆలయ ప్రాకారంలో ఊరేగించారు. తిరిగి స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ఆలయానికి చేర్చారు. -
వైఎస్సార్ సీపీలో పలువురికి పదవులు
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ అధిష్టానం పలువురు జిల్లా నాయకులను వివిధ హోదాల్లో నియమించింది. జిల్లా ఐటీ వింగ్ ఉపాఽధ్యక్షుడిగా దిడ్డి ప్రతాప్ (జగ్గంపేట), జనరల్ సెక్రటరీలుగా మేడిశెట్టి సీతారామ్ (తుని), కేఎన్ఎం స్వామి (పిఠాపురం), సెక్రటరీలుగా బొకిస ప్రసాద్ (తుని), మొగిలి శ్రీనివాస్ (జగ్గంపేట), ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా త్రిమూర్తుల నాగేంద్ర(తుని), పైలా గంగాధర్ (తుని), తూము సురేష్ (జగ్గంపేట), అడారి రమేష్ (జగ్గంపేట) నియమితులయ్యారు. డాక్టర్స్ విభాగంలో.. జిల్లా డాక్టర్స్ వింగ్ ఉపాధ్యక్షులుగా గొర్లి విష్ణు (తుని), వేగి సాంబశివ (జగ్గంపేట), సెక్రటరీలుగా యాసరపు వెంకట రమణ (తుని), నాంబారి సత్యనారాయణ (జగ్గంపేట), ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా బర్ల శ్రీను (తుని), యాసరపు భూషణం (తుని), యల్లపు పవన్ కుమార్ (జగ్గంపేట), ములపర్తి నాగేశ్వరరావు (జగ్గంపేట)లను నియమించారు. జిల్లా వలంటీర్ల విభాగంలో.. జిల్లా వలంటీర్ల విభాగం ఉపాధ్యక్షుడిగా ఉమ్మలూరి వెంకట రమణ (ప్రత్తిపాడు), జనరల్ సెక్రటరీలుగా అడిగర్ల ప్రసాద్ (తుని), మడగల నవీన్ (జగ్గంపేట), సెక్రటరీలుగా గరగ నాగ దుర్గాప్రసాద్ (తుని), అమరాది కాశి (ప్రత్తిపాడు), మంగరౌతు గౌరి (జగ్గంపేట), ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా బట్ట సాయి (తుని), మేడిశెట్టి ఫణీంద్ర సాయి (తుని), అడబాల వెంకట రమణమూర్తి (ప్రత్తిపాడు), మాదపురెడ్డి జితేంద్ర (ప్రత్తిపాడు), కె.అప్పారావు (జగ్గంపేట), పిల్ల అప్పారావు (జగ్గంపేట) నియమితులయ్యారు. -
హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వాలు
● సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సింగరావు ● పెద్దాపురంలో జిల్లా మహాసభలు ప్రారంభం పెద్దాపురం (సామర్లకోట): కేంద్రం, రాష్ట్రంలో ఉన్న డబుల్ ఇంజిన్ సర్కార్ కార్మికుల హక్కులను కాలరాస్తోందని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ నర్సింగరావు అన్నారు. పెద్దాపురంలో శనివారం ప్రారంభమైన సీఐటీయూ జిల్లా మహాసభల్లో ఆయన పాల్గొన్నారు. ఈ మేరకు యాసలపు సూర్యారావు భవనంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు దువ్వా శేషబాబ్జీ జెండాను ఆవిష్కరించారు. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి, అమర వీరులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నర్సింగరావు మాట్లాడుతూ ప్రజల సంపదను కార్పొరేట్ సంస్థలకు ప్రభుత్వాలు దోచిపెడుతున్నాయని, అంతర్జాతీయంగా చమురు రేట్లు తగ్గినప్పటికీ దేశంలో పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు పెరగడంతో ప్రజలపై భారం విపరీతంగా పడిందన్నారు. కార్పొరేట్ సంస్థల లాభాలపై పన్ను రేటును 33 నుంచి 20 శాతానికి తగ్గించడం దారుణమన్నారు. ట్రంప్ టారిఫ్‌లు, టెర్రరిజం విధానంతో ఇతర దేశాలపై దాడికి అమెరికా పూనుకుందన్నారు. దీన్ని చైనా తిప్పికొట్టినా, ప్రధాన మోదీ మాత్రం ట్రంప్‌కు సలాం చేస్తున్నారన్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ప్రభుత్వ భూములను కారు చౌకగా కార్పొరేట్ సంస్థలకు అప్పగిస్తోందన్నారు. సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షురాలు బేబీరాణి మాట్లాడుతూ దేశంలో పోర్టులు, ఎయిర్ పోర్టులను అదానీకి మోదీ అప్పగించారన్నారు. మహాసభలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి జి.అప్పారెడ్డి, ఎన్ఎఫ్ఐ జిల్లా కార్య దర్శి ఎం.సూరిబాబు, జిల్లా నాయకులు భాస్కర్, వల్లు రాజబాబు, సీహెచ్ రాజ్ కుమార్, మలక వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. -
AP: కాకినాడ వైపు దూసుకొస్తున్న మోంథా తుపాను
ప.గో, కృష్ణా జిల్లాలకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలుఒక్కో జిల్లాకు 30 మంది సిబ్బందితో కూడిన ఎన్డీఆర్ఎఫ్ టీమ్రేపటి నుంచి 3 రోజుల పాటు స్కూళ్లకు సెలవు ప్రకటించిన కలెక్టర్తుపాను నేపథ్యంలో సెలవులు ప్రకటిస్తూ ఉత్తర్వులు విజయవాడ: మోంథా తుఫాన్ కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశంవాతావరణ హెచ్చరికల నేపధ్యంలో రేపట్నుంచి కృష్ణా,ఎన్టీఆర్ జిల్లాల్లో మూడు రోజుల పాటు పాఠశాలలకు సెలవులు27,28,29 తేదీల్లో జిల్లాలోని అన్ని ప్రభుత్వ , ప్రైవేట్ విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన రెండు జిల్లాల కలెక్టర్లుజిల్లాలోని అన్ని సంక్షేమ హాస్టల్స్ లోని విద్యార్ధులు ఇళ్లకు వెళ్లిపోయేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలుకలెక్టర్ల ఆదేశాల మేరకు కృష్ణా,ఎన్టీఆర్ జిల్లాల్లోని హాస్టల్స్ నుంచి ఇళ్లకు వెళ్లిపోయిన విద్యార్ధులువిద్యార్ధులను ఇళ్లకు తీసుకెళ్లిన తల్లిదండ్రులుగుంటూరు: కలెక్టర్ కార్యాలయంలో మోంథా తుఫాన్ దృష్ట్యా జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ప్రత్యేక అధికారి సిసోడియా,జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారీయాస్పెషల్ ఆఫీసర్ సిసోడియా కామెంట్స్రానున్న 3 రోజుల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందిఅధికారులను అప్రమత్తం చేసాంలోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసాంప్రభుత్వ పాఠశాల ల్లో 16 పునరావాస కేంద్రాల్లో అధికారులు వుంటారుతుఫాన్ కి ఎక్కువ నష్టం జరగకుండా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాంజిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారీయా కామెంట్స్27,28,29 తేదీలలో భారీ వర్షం ఈదురుగాలులు ఉంటాయిగుంటూరు జిల్లాలో ఎక్కడ ప్రాణ నష్టం జరగకూడదు18 మండలాల్లో అధికారులు దగ్గరనుండి పర్యవేక్షణ చేస్తున్నారుప్రజల కోసం కంట్రోల్ నెంబర్ కూడా ఏర్పాటు చేసాంవ్యవసాయ రంగానికి నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలిరూరల్ ప్రాంతాల్లో ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నాంఅత్యాసవసర పరిస్థితి ఉంటేనే ప్రజలు బయటకు రావాలికాలేజీ స్కూల్స్ అంగన్ వాడి కేంద్రాలు 3 రోజులు సెలవలు ప్రకటించాంప్రజలకు సమస్య ఉంటే తప్పకుండా కాల్ సెంటర్ కి కాల్ చేయండినగరంలో 12 లోతట్టు ప్రాంతాల ను తెలుసుకున్నాంప్రధానంగా ఉన్న పీకల వాగు పొంగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం ఏలూరు జిల్లా:ఏలూరు జిల్లాలో మోంథా తుఫాన్ ప్రభావం..ఈనెల27, 28న జిల్లాలో తీవ్రమైన గాలులు, భారీ వర్షాలు ఉండే అవకాశంజిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీలకు 27, 28 తేదీలలో సెలవువాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు, ప్రజలను అప్రమత్తం చేసిన జిల్లా అధికారులుగోదావరి నదిలోనికి పర్యాటక లాంచీలను నిలిపివేతజిల్లా, అన్ని మండలాలలో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటుఏలూరు జిల్లా కంట్రోల్ రూమ్ నెంబర్ 9491041419, టోల్ ఫ్రీ నెంబర్ 18002331077ప్రజలకు అందుబాటులో గ్రామానికి ఒక నోడల్ అధికారి*తుఫాన్ తీవ్రతపై జిల్లా ఎస్పీతో కలిసి అధికారులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అప్రమత్తం చేసిన జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్విపశ్చిమ గోదావరి జిల్లామోంథా తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లాలో ముందస్తు విస్తృత ఏర్పాట్లు.జిల్లా కలెక్టరేట్ తో పాటు ఆర్డీవో కార్యాల యాల్లో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు..జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ నెంబర్.. 08816 299219,భీమవరం ఆర్డీవో కార్యాలయంలో .. 98484 13739, 87907 31315,నరసాపురం ఆర్టీవో కార్యాలయంలో 93911 85874,తాడేపల్లి గూడెం ఆర్డీవో కార్యాలయంలో 93817 01036, 98497 12358కాకినాడ:మోంథా తుపాన్ నేపథ్యంలో స్కూళ్లకు సెలవులురేపటి నుంచి ఐదు రోజులపాటు సెలవు ప్రకటించిన కలెక్టర్ాకాకినాడలో 14 పునరావాస కేంద్రాలు ఏర్పాటుకాకినాడ పోర్టులో మూడో ప్రమాద హెచ్చరిక జారీఉప్పాడ-కాకినాడ బీచ్ రోడ్డులో రాకపోకలు నిలిపివేతకాకినాడలో బీచ్‌లు మూసివేత విశాఖ:విశాఖ జిల్లాలో రెండు రోజుల పాటు స్కూళ్లకు సెలవుసోమ, మంగళవారాలు స్కూళ్లకు సెలవుబాపట్లమోంథా తుపాన్ నేపథ్యంలో స్కూళ్లకు సెలవులురేపటి నుంచి నాలుగు రోజుల పాటు సెలవు ప్రకటించిన కలెక్టర్తుపాన్ ాకారణంగా బాపట్ల జిల్లాలోని బీచ్‌లు మూసివేతయాత్రికులు, భక్తులు బీచ్‌లకు రావొద్దని పోలీసుల హెచ్చరికలువిశాఖ:మోంథా తుపాన్ నేపథ్యంలో రైల్వే జోన్ హై అలెర్ట్రైల్వే వంతెనలు, పట్టాలు, యార్డులు, సిగ్నలింగ్ వ్యవస్థపై నిఘాఅత్యవసర సేవల కోసం రైళ్లు ిసిద్ధం చేసిన అధికారులుట్రాక్, సిగ్నలింగ్, విద్యుత్ పునరుద్ధరణ కోసం ప్రత్యేక బృందాలువిశాఖ, విజయనగరం, శ్రీకాకుళం స్టేషన్లలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటుతుపాను పరిస్థితులను నిరంతరం సమీక్షిస్తున్న వాల్తేరు డీఆర్ఎమ్ ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం బలపడింది. తీవ్రవాయుగుండంగా కేంద్రీకృతమైంది. గడిచిన 6 గంటల్లో గంటకు 10 కి.మీ వేగంతో వాయుగుండం కదిలింది. రాబోయే 24 గంటల్లో తుపానుగా బలపడే అవకాశం ఉందని.. మంగళవారం (అక్టోబర్ 28) ఉదయానికి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.ప్రస్తుతానికి పోర్ట్ బ్లెయిర్ కి 610 కి.మీ, చెన్నైకి 790 కి.మీ, విశాఖపట్నంకి 850 కి.మీ, కాకినాడకి 840 కి.మీ, గోపాల్పూర్ కి 950 కి.మీ. దూరంలో కేంద్రీకృతమైందని పేర్కొంది. మంగళవారం రాత్రి తీరం దాటే అవకాశం మచిలీపట్నం-కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉందని.. రేపు, ఎల్లుండి(సోమ, మంగళ కోస్తాంధ్రలో భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.మోంథా తుఫాన్.. కాకినాడ వైపు దూసుకొస్తోంది. అప్రమత్తమైన అధికారులు.. తుపాన్‌ను ఎదుర్కోనేందుకు సన్నద్ధమయ్యారు. కాకినాడ- ఉప్పాడ రోడ్డులో ఈనెల 30 వరకు రాకపోకలు నిలిపివేశారు. వాకలపూడి బీచ్, ఎన్టీఆర్ బీచ్ మూసివేశారు. హోప్ ఐలాండ్‌లో నివాసం ఉంటున్న మత్స్యకారులను తీరానికి తరలిస్తున్నారు. సముద్రంలోకి మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. అధికారులు, సిబ్బందికి సెలవులను ప్రభుత్వం రద్దు చేసింది. తుపాను సహయక చర్యల కోసం కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు.అల్లూరి సీతారామరాజు జిల్లా: తుపాను ప్రభావంతో పాపికొండల విహార యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. వాగులు వద్దకి వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. పర్యాటక ప్రాంతాలన్నీ తాత్కాలికంగా మూయించివేసిన పోలీసులు.. సబ్ కలెక్టర్ ఆఫీస్ వద్ద కంట్రోల్ రూమ్‌ని ఏర్పాటు చేశారు.విజయవాడ: భారీవర్షాల నేపథ్యంలో కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల యంత్రాంగం అప్రమత్తమైంది. ఈనెల 27, 28, 29వ తేదీల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. 27, 28 ,29వ తేదీల్లో కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు కలెక్టర్లు సెలవులు ప్రకటించారు. అన్ని సంక్షేమ హాస్టల్స్ లోని విద్యార్ధులు రేపు సాయంత్రంలోగా (ఈనెల 26) ఇళ్లకు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు ఆదేశాలిచ్చారు. -
తుని లైంగిక దాడి నిందితుడి ఆత్మహత్య
తుని రూరల్: కాకినాడ జిల్లా తుని మండలం జగన్నాథగిరి గురుకుల పాఠశాల విద్యార్థిని(13)పై లైంగిక దాడికి యత్నించిన టీడీపీ నాయకుడు తాటిక నారాయణరావు (62) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు కథనం ప్రకారం...విద్యార్థినిపై లైంగిక దాడి యత్నానికి సంబంధించి తుని కొండవారపేటకు చెందిన నారాయణరావుపై పోలీసులు బుధవారం ఉదయం కేసు నమోదు చేశారు. సాయంత్రం 5 గంటలకు అరెస్టు చేశారు. వైద్య పరీక్షల అనంతరం రాత్రి 10.30 సమయంలో మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచేందుకు రూరల్ స్టేషన్ నుంచి పోలీసులు ఎస్కార్ట్‌తో తుని బయల్దేరారు. ఈ క్రమంలో బహిర్భూమికి వెళ్లాలని నారాయణరావు చెప్పడంతో మార్గంమధ్యలో కోమటిచెరువు వద్ద వాహనం ఆపారు. జోరుగా వాన కురుస్తుండడంతో ఎస్కార్ట్ సిబ్బంది చెట్టు కింద నిల్చున్నారు. నారాయణరావు చెరువు వద్దకు వెళ్లాడు. కొంతసేపటికి పెద్ద శబ్దం వినిపించడంతో ఎస్కార్ట్ సిబ్బంది వెళ్లి చూశారు. నారాయణరావు కనిపించలేదు. చెరువులో దూకి పారిపోయాడా? ప్రమాదవశాత్తు జారిపడ్డాడా? అనే అనుమానంతో గాలింపు చేపట్టారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అర్ధరాత్రి వరకు వెదికినా నారాయణరావు ఆచూకీ లభించలేదు. గురువారం ఉదయం గజ ఈతగాళ్లను రప్పించి, చెరువులో వలలు వేశారు. క్విక్ క్యూఆర్టీ టీమ్ చెరువు చుట్టూ గాలించింది. ఉదయం నారాయణరావు మృతదేహం లభించింది. పోలీసులు మృతదేహాన్ని తుని ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
తుని కేసులో చెరువు దగ్గర ఏం జరిగింది?
సాక్షి, కాకినాడ: తుని ఘటన(tuni Incident)లో పోలీసుల అదుపులో టీడీపీ నేత నారాయణరావు మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పారిపోయే ప్రయత్నం చేశాడా? నిజంగానే ఆత్మహత్యకు ప్రయత్నించాడా? అనేది చెరువు దగ్గర ఏం జరిగిందో తెలిస్తేనే నిర్ధారణ అయ్యే అవకాశం ఉంది. ఈలోపే నారాయణ మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ బంధువులు ఆందోళనకు దిగారు. ‘‘నలుగురు పోలీసులు రాత్రి మా ఇంటికి వచ్చి రిమాండ్ పేరిట బలవంతంగా సంతకాలు సేకరించారు. రాత్రి పదిన్నర గంటల ప్రాంతంలో చెరువులోకి దూకాడని అంటున్నారు. చనిపోయాడని మాత్రం ఈ ఉదయం 7గం. సమాచారం ఇచ్చారు. ఘటన జరిగిన వెంటనే మాకు ఎందుకు సమాచారం ఇవ్వలేదు?. అందుకే అనుమానాలు కలుగుతున్నాయి. మా అనుమానాలు నివృత్తి చేయాలంటే.. పోలీస్ స్టేషన్ నుండి రిమాండ్ కోసం తరలిస్తుండగా మార్గ మద్యలో ఉన్న సీసీ కెమెరాలు బయటపెట్టాలి’’ అని నారాయణరావు కొడుకు సురేష్, కోడలు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో కోమటి చెరువు వద్ద కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నారాయణరావుది సూసైడ్ కాదంటూ బంధువులు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు వాళ్లను పక్కకు లాగేసి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు. అయితే.. పోలీసులు మాత్రం ఆ అనుమానాలను తోసిపుచ్చుతున్నారు. చేసిన పనికి సిగ్గుపడి నారాయణరావు ఆత్మహత్య చేసుకుని ఉంటాడని చెబుతున్నారు(Narayanarao Suicide). ‘‘అర్ధరాత్రి మెజిస్ట్రేట్ వద్దకు తీసుకెళ్తున్న సమయంలో వాష్‌రూమ్ వస్తుందని నారాయణరావు అడిగాడు. వెంటనే ఎస్కార్ట్ వాహనం ఆపాం. వర్షం పడుతుండడంతో పోలీసులు పక్కనే ఉన్న చెట్ల కిందకు వెళ్లారు. చీకటి కావడంతో నిందితుడు పోలీసులకు కనిపించలేదు. ఈలోపు నీళ్లలో దూకినట్లు శబ్దం వచ్చిందని సిబ్బంది చెప్పారు. రాత్రంతా వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. ఈ ఉదయం వెతికితే మృతదేహం దొరికింది’’ అని పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు తెలిపారు.సంచలన విషయాలు.. తుని మైనర్ బాలిక(13) లైంగిక దాడి కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. బాలికకు మాయమాటలు చెప్పి.. వరుసకు తాతను అవుతానంటూ హాస్టల్ సిబ్బందిని నమ్మించి నారాయణరావు ఆమెను ఐదుసార్లు బయటకు తీసుకెళ్లాడు. బాలికకు తండ్రి లేకపోవడంతో నారాయణరావు చెప్పింది నిజమేనని హాస్టల్ సిబ్బంది నమ్మారు. అలా.. మూడు సార్లు బాలికపై అఘాయిత్యానికి పాల్పడినట్లు తేలిందని పోలీసులు వెల్లడించారు. మరోసారి తన వెంట తీసుకెళ్లి ఓ తోటలో అఘాయిత్యానికి పాల్పడబోయాడు. అది గమనించి తోట కాపలాదారు అడ్డుకున్నాడు. ఆ సమయంలో తాను టీడీపీ నేతనని, తన జోలికి వస్తే ఖబడ్దార్ అంటూ బెదిరించాడు. ఈలోపు కొందరు వీడియో తీసి అతగాడి బాగోతాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దీంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నారాయణరావును గుడ్డలూడదీసి చితకబాది పోలీసులకు అప్పగించారు. బుధవారం సాయంత్రం నారాయణరావును అరెస్ట్ చేసిన పోలీసులు.. ఘటనపై కేసు నమోదు చేసిన రాత్రి మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచేందుకు తీసుకెళ్తున్న క్రమంలో చెరువులో దూకేశాడని చెబుతున్నారు. -
టీడీపీ నేత అరాచకం బాలికపై లైంగిక దాడికి యత్నం
తుని రూరల్ : తాతయ్యా అని పిలిపించుకుంటూనే మనవరాలి వయసున్న 13 ఏళ్ల బాలికపై టీడీపీ నాయకుడు లైంగిక దాడికి యత్నించాడు. దీనిని అడ్డుకున్న యువకుడిపై ‘నేను కౌన్సిలర్‌ను. మేం ఎస్సీలం’ అంటూ బెదిరింపులకు దిగాడు. సోషల్ మీడియా ద్వారా విషయం తెలుసుకున్న స్థానికులు ఆ టీడీపీ నేతకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. కాకినాడ జిల్లా తుని మండలం ఎస్.అన్నవరం శివారులో జరిగిన ఈ సంఘటన వివరాలివీ.. జగన్నాథగిరిలోని ఏపీ గురుకుల బాలికల పాఠశాలలో తుని పట్టణానికి చెందిన బాలిక ఎనిమిదో తరగతి చదువుతోంది.తండ్రి లేడు. సెలవులకు తల్లి వద్దకు వెళ్లి, వస్తుంటుంది. అదే ప్రాంతానికి చెందిన టీడీపీ నాయకుడు తాటిక నారాయణరావు (62) మంగళవారం 11 గంటలకు పాఠశాలకు వెళ్లి ఇంజక్షన్ చేయించాలని ఉపాధ్యాయులకు చెప్పి ఆ బాలికను తుని మండలం హంసవరం శివారున నిర్మానుష్యంగా ఉన్న తోటలోకి తీసుకెళ్లాడు. అదే సమయంలో కాపలాదారుడు తోటకు వచ్చాడు. బాలిక వస్త్రాలను నారాయణరావు విప్పడాన్ని గమనించి మందలించాడు.దీంతో.. ఆవేశం కట్టలు తెంచుకున్న నారాయణరావు ‘నేను ఎవరినో తెలుసా? కౌన్సిలర్‌ను. ఎస్సీలం. మాది వీరవరపుపేట’ అంటూ కాపలాదారుడిని బెదిరించాడు. వాస్తవానికి నారాయణరావుది కొండవారపేట అయినప్పటికీ, తప్పించుకునేందుకు వీరవరపుపేట అని తప్పుగా చెప్పాడు. ఈ విషయం పోలీసులకు తెలియజేస్తానని, తన తోటలోకి ఎందుకు వచ్చారంటూ నారాయణరావును, బాలికను ఆ కాపలాదారు నిలదీశాడు.బహిర్భూమికి వచ్చామని నమ్మబలికే ప్రయత్నం చేసూ్తనే నారాయణరావు బెదిరింపులకు దిగాడు. దీంతో, బాలికకు న్యాయంచేయాలనే ఉద్దేశంతో ఆమె కుటుంబ సభ్యులకు తెలిసున్న వ్యక్తుల ద్వారా కాపలాదారు సమాచారం అందించాడు. ఈలోపు బాలికను గురుకుల పాఠశాలలో దించి, నారాయణరావు కొండవారపేట వెళ్లిపోయాడు. అప్పటికే విషయం తెలియడంతో స్థానికులు నారాయణరావును మంగళవారం రాత్రి పటు్టకుని దేహశుద్ధి చేసి, పోలీసులకు అప్పగించారు.నాలుగైదుసార్లు ఇలాగే..తాతయ్యనంటూ చెప్పి, గతంలో నాలుగైదుసార్లు ఆ బాలికను నారాయణరావు బయటకు తీసుకువెళ్లినట్లు ఉపాధ్యాయులు చెప్పారు. తాజాగా, ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఐసీడీఎస్, పోలీస్, విద్యాశాఖ అధికారులు బుధవారం గురుకుల పాఠశాలకు చేరుకున్నారు. బాలిక నుంచి వివరాలు సేకరించారు. గురుకుల పాఠశాల నుంచి తీసుకెళ్లినందుకు కిడ్నాప్ కేసు, లైంగిక దాడికి యత్నించడంపై పోక్సో చట్టం కింద నారాయణరావుపై కఠినమైన కేసులు నమోదుచేస్తున్నామని పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు మీడియాకు తెలిపారు. వైఎస్సార్సీపీ నాయకులు, పెద్ద సంఖ్యలో దళిత సంఘాల నేతలు, యువకులు పాఠశాల వద్ద ఆందోళన చేశారు. బాలికకు న్యాయం చేయాలని, నిందితుడిని అరెస్టుచేసి, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.విచారణకు మూడు బృందాలు..బాలికపై లైంగిక దాడికి యత్నించిన నారాయణరావును అరెస్టు చేసినట్లు పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు మీడియాకు తెలిపారు. తల్లి అనుమతిలేకుండా పాఠశాల నుంచి తీసుకెళ్లడం, లైంగిక దాడికి యత్నించడం, తరచూ బాలికను బయటకు తీసుకెళ్లడంపై వేర్వేరుగా మూడు కఠినమైన కేసులు నమోదుచేశామని చెప్పారు. ఈ కేసులలో నిందితుడికి 30 ఏళ్లకు పైగా శిక్ష పడుతుందన్నారు. 15 రోజుల్లో చార్‌్జషీట్ దాఖలు చేస్తామన్నారు. విచారణకు ప్రత్యేక బృందాలను నియమించామని డీఎస్పీ తెలిపారు. -
ఏపీని నేరాంధ్రప్రదేశ్‌గా మార్చేశారు
తుని రూరల్: కూటమి పాలనలో రాష్ట్రం నేరాంధ్రప్రదేశ్‌గా మారిపోయిందని, దుర్మార్గమైన పరిపాలన సాగుతోందని, లైంగిక దాడులు, హత్యలు, డ్రగ్స్ పెరిగిపోయాయని మాజీ ఎమ్మెల్సీ అంగుళూరి శివకుమారి ఆరోపించారు. తుని మండలం జగన్నాథగిరి గురుకుల పాఠశాలలో లైంగిక దాడి యత్నానికి గురైన బాధిత బాలికను వైఎస్సార్ సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు వర్ధినీడి సుజాత, జిల్లా ప్రధాన కార్యదర్శి రాయి మేరీ అవినాష్‌తో కలసి బుధవారం మాజీ ఎమ్మెల్సీ శివకుమారి పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, దళితులపై, మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నా హోం మంత్రి వంగలపూడి అనిత స్పందించరు, మాట్లాడరని మండిపడ్డారు. పాయకరావుపేట, తుని, ప్రత్తిపాడు నియోజకవర్గాల్లో మహిళలే ఎమ్మెల్యేలుగా ఉన్నారని, పిఠాపురంలో డిప్యూటీ సీఎం ఉన్నారని, ఈ ప్రాంతంలోనే ఇటువంటి ఘటన చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోందని అన్నారు. అయినప్పటికీ ఈ దారుణంపై ఎవ్వరూ స్పందించకపోవడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని ఎటువైపు తీసుకువెళ్తోందో చెప్పాలన్నారు. లైంగిక దాడికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని, బాధిత బాలికకు న్యాయం చేయాలని, ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఏవిధంగా ఆదుకుంటుందో ప్రకటించాలని, పాఠశాల నిర్వహకులపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఫ రాష్ట్రంలో దుర్మార్గమైన పరిపాలన సాగుతోంది ఫ లైంగిక దాడులు, హత్యలు, డ్రగ్స్ పెరిగిపోయాయి ఫ అయినా హోం మంత్రి స్పందించరు ఫ మాజీ ఎమ్మెల్సీ శివకుమారి ఆగ్రహం ఫ బాధిత బాలికకు పరామర్శ -
ఇక మౌనం సాధ్యం కాదు
ఇక మౌనం సాధ్యం కాదు. ప్రైవేటు ఆస్పత్రుల వైద్యులు, నర్సులు, సిబ్బంది ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న బకాయిలు వెంటనే చెల్లించాలి. ఆలస్యంగా జరుగుతోన్న చెల్లింపుల్లో మార్పులు రావాలి. ప్యాకేజీ రివిజన్ వంటి సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలి. ఇది ఆరోగ్య రంగం నిలదొక్కుకునే స్థితినే ప్రమాదంలోకి నెట్టేస్తున్న పరిస్థితులపై పోరాటం మాత్రమే. పెండింగ్ బకాయిలపై స్పష్టమైన రోడ్ మ్యాప్ ప్రకటించాలి. ఏడాది కాలంగా నెట్వర్క్ ఆస్పత్రులు పడుతున్న ఆర్థిక ఇబ్బందులను ప్రజలు అర్థం చేసుకుంటారని భావిస్తున్నాం. ఇంత కాలం సేవలందించిన మాకు ఈ కష్ట కాలంలో అండగా నిలవాలని అభ్యర్థిస్తున్నాం. – డాక్టర్ వై.కల్యాణ్ చక్రవర్తి, కో ఆర్డినేటర్, ఏపీ స్పెషాలిటీ ఆస్పత్రుల అసోసియేషన్ (ఆషా), కాకినాడ -
కక్ష సాధింపే..
‘సాక్షి’ దిన పత్రిక, ఎడిటర్, విలేకర్లపై పోలీసులు కక్ష సాధింపుతోనే వేధిస్తున్నారు. నకిలీ మద్యం వార్తలను జీర్ణించుకోలేకే కూటమి ప్రభుత్వం ఇలాంటి కుట్రలకు పాల్పడుతోంది. ‘సాక్షి’ రాసే వార్తల వల్ల ప్రభుత్వానికి ఏమైనా ఇబ్బందులుంటే ఖండనలు లేదా వివరణలు ఇచ్చుకోవాలే తప్ప ఇలా పత్రిక ప్రధాన కార్యాలయానికి పోలీసులను పంపించి వేధించడం సబబు కాదు. ముఖ్యంగా ‘సాక్షి’ ఎడిటర్ ధనంజయరెడ్డిని, ఆయన స్థాయి, విలువను గుర్తించకుండా పోలీసులు కేసులు నమోదు చేయడం, నోటీసులు ఇవ్వడం దారుణం. కూటమి ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టుకుని చేస్తున్న ఈ కుట్ర రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారు. ‘సాక్షి’పై ప్రభుత్వం ఎన్ని కుయుక్తులు పన్నినా ప్రజల అండదండలు ఎప్పుడూ ఉంటాయి. – పినిపే విశ్వరూప్, మాజీ మంత్రి, అమలాపురం పైశాచికత్వానికి పరాకాష్ట ‘సాక్షి’ దినపత్రికపై దాడి ప్రభుత్వ పైచాచికత్వానికి పరాకాష్ట. ‘సాక్షి’ పట్ల, పత్రిక ఎడిటర్ పట్ల కూటమి ప్రభుత్వం, దాని తరఫున పోలీసు అధికారులు దాడులు, బెదిరింపులకు దిగడం వాస్తవాలపై, ప్రజలపై దాడి చేయడమే. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపే మీడియాపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. పత్రికా స్వేచ్ఛను హరించడమంటే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే. ఈ సంస్కృతి సరి కాదు. ప్రజాస్వామ్యవాదులు అక్రమ కేసులను ఖండించాలి. ప్రభుత్వ దమన నీతిపై ప్రశ్నించాలి. ప్రజాస్వామ్యం కోసం పత్రికా స్వేచ్ఛను కాపాడాలి. – చిర్ల జగ్గిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే, కొత్తపేట, వైఎస్సార్ సీపీ కోనసీమ జిల్లా అధ్యక్షుడు -
పిఠాపురం వైద్యులపై విచారణ జరపాలి
పిఠాపురం: పురిటిలోనే తల్లి మృత్యువాత పడటం చాలా దారుణమని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి, పార్టీ మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వంగా గీతా విశ్వనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. పిఠాపురం ఆస్పత్రిలో వైద్యం వికటించి, బాలింత మృత్యువాత పడిన సంఘటన పైన, సంబంధిత వైద్యుల పైన విచారణ జరపాలని డిమాండ్ చేశారు. గొల్లప్రోలు మండలం చేబ్రోలులో మృతురాలి కుటుంబాన్ని బుధవారం ఆమె పరామర్శించారు. బాధిత కుటుంబానికి వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో అత్యంత పటిష్టంగా పని చేసిన వైద్య రంగాన్ని కూటమి ప్రభుత్వం పట్టించకోవడం మానివేసిందన్నారు. మాతా శిశు సంరక్షణలో ప్రభుత్వాస్పత్రికి మించింది లేదనే నమ్మకం గతంలో ఉండేదని, కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వాస్పత్రికి వెళ్తే ప్రమాదమన్నట్టుగా ప్రజల్లో భయాందోళనలు కలిగించేలా చేస్తున్నారని దుయ్యబట్టారు. చేబ్రోలుకు చెందిన శ్రీదుర్గను హైరిస్క్ బాలింతగా అంగన్వాడీ, ఆశా వర్కర్లు ధ్రువీకరించారన్నారు. నెలలు నిండకుండా కేవలం వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి వెళ్తే ఆమె బలవంతంగా పురుడు పోసే ప్రయత్నం చేసినట్లు మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు ఆరోపిస్తున్నారన్నారు. ఎటువంటి రక్షణ చర్యలూ తీసుకోకుండా బలవంతంగా పురుడు పోయడం వల్లనే తల్లి చనిపోయిందని చెబుతున్నారన్నారు. చివరకు పుట్టిన బిడ్డ కూడా అనారోగ్యంతో దివ్యాంగురాలిగా ఉందని, దీనంతటికీ వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. ఈ సంఘటనను ఇప్పటికే జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారని, ఉన్నతాధికారులతో విచారణ జరిపించి, బాలింత మృతికి కారకులైన వైద్యులపై చర్యలు తీసుకోవాలని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని గీత డిమాండ్ చేశారు. పిఠాపురం ప్రభుత్వాసుపత్రిలో దిగజారిపోతున్న వైద్య సేవలపై అధికార పార్టీ నేతలు, అధికారులు దృష్టి సారించాలని, పేదలకు మంచి వైద్యం అందేలా చూడాలని కోరారు. కార్యక్రమంలో గొల్లప్రోలు జెడ్పీటీసీ సభ్యుడు ఉలవకాయల నాగ లోవరాజు, సర్పంచ్ దొండపాటి లోవతల్లి తదితరులు పాల్గొన్నారు.ఫ వైద్య వ్యవస్థను పాలకులు పట్టించుకోడం లేదు ఫ పురిటిలోనే తల్లి మృత్యువాత పడటం దారుణం ఫ బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలి ఫ వైద్యులపై చర్యలు తీసుకోవాలి ఫ వైఎస్సార్ సీపీ నేత వంగా గీత -
రత్నగిరిపై రద్దీ
అన్నవరం: కార్తిక మాసం తొలి రోజైన బుధవారం నుంచే రత్నగిరిపై భక్తుల రద్దీ మొదలైంది. సాధారణంగా కార్తిక శుద్ధ చవితి (నాగుల చవితి) వరకూ రత్నగిరికి భక్తుల తాకిడి పెద్దగా ఉండదు. కానీ, తొలి రోజైన పాడ్యమి నాడే సుమారు 30 వేల మంది భక్తులు సత్యదేవుని దర్శించుకోవడం విశేషం. తెల్లవారుజామున 4 గంటలకే స్వామివారి ఆలయం తెరచి భక్తులను దర్శనానికి అనుమతించడంతో పాటు వ్రతాల నిర్వహణ కూడా ప్రారంభించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ భక్తుల రద్దీ కొనసాగింది. స్వామివారి ఉచిత దర్శనానికి గంట, అంతరాలయ దర్శనానికి అరగంట సమయం పట్టింది. స్వామివారిని దర్శించిన భక్తులు సప్తగోకులంలో గోవులకు ప్రదక్షిణ చేశారు. తూర్పు రాజగోపురం ముందున్న రావిచెట్టు వద్ద జ్యోతులు వెలిగించి, పూజలు చేశారు. సత్యదేవుని వ్రతాలు 1,800 జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.30 లక్షల ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు. సత్యదేవుని సన్నిధిలో శనివారం నుంచి భక్తుల రద్దీ అధికంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఆ తరువాత ఆదివారం, సోమవారం పర్వదినాలు కావడంతో ఆ మూడు రోజులూ సత్యదేవుని ఆలయానికి లక్ష మందికి పైగా భక్తులు వచ్చేస్తారనే అంచనాతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. స్వామివారి వ్రతాలు ఆది, సోమవారాల్లో తెల్లవారుజామున ఒంటి గంట నుంచి నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. -
టీడీపీ నేత కీచకపర్వం.. గురుకుల హాస్టల్ మైనర్‌ను తోటకు తీసుకెళ్లి..
సాక్షి, కాకినాడ: కాకినాడ జిల్లాలో తునిలో టీడీపీ నాయకుడి కీచక పర్వం వెలుగులోకి వచ్చింది. ఓ మైనర్ పట్ల సదరు టీడీపీ నేత అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆయన బాగోతాన్ని గుర్తించిన స్థానికులు బాలికను రక్షించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. తునిలో టీడీపీ నాయకుడు తాటిక నారాయణ రావు అకృత్యాలు బయటకు వచ్చాయి. తుని రూరల్ గురుకుల పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న మైనర్ పట్ల నారాయణ రావు దారుణంగా ప్రవర్తించాడు. మైనర్‌ను హస్టల్ నుండి తీసుకుని వెళ్ళి హంసవరం సపోటా తోటల్లో ఆమెతో నారాయణ రావు అసభ్యంగా తాకాడు. ఇంతలో నారాయణ రావు బాగోతాన్ని గుర్తించిన స్థానికులు.. వెంటనే స్పందించి మైనర్‌ను రక్షించారు. ఈ క్రమంలో నారాయణ రావు ప్రశ్నించగా.. ఆమెను మూత్ర విసర్జన కోసం అక్కడికి తీసుకువచ్చానని బుకాయించాడు. అంతటితో ఆగకుండా తాను టీడీపీ కౌన్సిలర్‌ను అంటూ.. తను ప్రశ్నిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బెదిరింపులకు దిగాడు. అయితే, హాస్టల్ నుండి మైనర్‌ను నారాయణ రావు బయటకు తీసుకువెళ్లడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. -
చెల్లీ అని పిలుస్తూనే.. బాలికపై అత్యాచారం
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): బాలికపై లైంగిక దాడికి పాల్పడిన యువకుడిపై మంగళవారం కిడ్నాప్, అత్యాచారం, పోక్సో కేసులు నమోదయ్యాయి. రాజమహేంద్రవరం టూటౌన్ పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. కాకినాడలోని గుడారిగుంట ప్రకాశ్ నగర్‌కు చెందిన బాలిక రాజమహేంద్రవరంలోని వెల్పేర్ హాస్టల్లో ఉంటూ పదో తరగతి చదువుతోంది. ఆమెకు రావులపాలేనికి చెందిన అజయ్ అనే యువకుడు పరిచయమయ్యాడు. ఆ బాలికను చెల్లి అని పిలుస్తూ, ఏదైనా అవసరం అయితే తనకు చెప్పమనేవాడు. ఇదిలావుండగా సోమవారం సాయంత్రం 5 గంటల సమయంలో బాలిక సబ్బులు, ఇతర సామగ్రి తీసుకువస్తానని హాస్టల్ వార్డెన్‌కు చెప్పి బయటకు వెళ్లింది. అదే రోజు రాత్రి ఏడు గంటలకు బాలిక తల్లి హాస్టల్‌కు వచ్చింది. ఆ సమయంలో ఆ బాలిక బయట నుంచి రావడంతో తల్లి ఎక్కడికి వెళ్లావని అడిగింది. దీంతో ఆమె జరిగిదంతా చెప్పింది. తనను అజయ్, అతడి స్నేహితుడు బయటకు తీసుకెళ్లారని, స్నేహితుడు తమను రైల్వే స్టేషన్ ఎదురుగానున్న హోటల్ వద్ద దింపి వెళ్లిపోయాడని తెలిపింది. ఆ తర్వాత అజయ్ తనను హోటల్ రూమ్‌లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడని చెప్పింది. దీంతో బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు వెంటనే లాడ్జి వద్దకు వెళ్లి సమాచారం సేకరించారు. లాడ్జి నిర్వాహకులు జరిగిదంతా చెప్పారు. యువకుడు, బాలిక వచ్చి తాము వేరే ఊరు నుంచి పరీక్షలు రాయడానికి వచ్చామని, మర్నాడు వెళ్లిపోతామని చెప్పారన్నారు. దీంతో పోలీసులు అజయ్‌పై కేసు నమోదు చేశారు. అలాగే మైనర్లకు రూమ్ ఇచ్చిన లాడ్జి నిర్వాహకులపై చర్యలు తీసుకోనున్నారు. అజయ్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. -
సహజ ప్రసవం చేసి ప్రాణాలు తీసేశారంటూ..
పిఠాపురం: సహజ ప్రసవం (నార్మల్ డెలివరీ) చేసి గర్భిణి ప్రాణాలు తీసేశారంటూ ఆమె బంధువులు మంగళవారం పిఠాపురం ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఆందోళన చేశారు. వైద్యురాలు సుజాత నిర్వాకం కారణంగా తమ బిడ్డ చనిపోయిందని ఆరోపించారు. వివరాల్లోకి వెళితే.. గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామానికి చెందిన దొండపాటి శ్రీ దుర్గ (25) అనే గర్భిణి పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు పొందుతున్నారు. ఆమె ఈ నెల 13న వైద్య పరీక్షలకు ఆస్పత్రికి రాగా, వైద్యుల సూచన మేరకు డెలివరీ కోసం చేరారు. ఆమెకు డాక్టర్ సుజాత నార్మల్ డెలివరీ చేశారు. పాప పుట్టినప్పటికీ శ్రీదుర్గ అపస్మారకస్థితికి చేరుకుంది. దీంతో వెంటనే అంబులెన్స్‌లో కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గుండెకు సంబంధించిన సమస్యలు కూడా తలెత్తడంతో వైద్యులు చికిత్స అందించినప్పటికీ ఆమె 14వ తేదీన మృతి చెందింది. అనంతరం మృతదేహానికి కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. స్కానింగ్ రిపోర్టులు పరిశీలించగా.. ఘటన జరిగిన వారం రోజుల తర్వాత శ్రీదుర్గ స్కానింగ్ రిపోర్టులను ఆమె కుటుంబ సభ్యులు వేరే వైద్యులకు చూపించారు. వాటిని పరిశీలించిన వైద్యులు..శ్రీదుర్గ హైరిస్క్ ట్రీట్మెంట్ పొందుతోందని, ఆమెకు నార్మల్ డెలివరీ చేయడం రిస్క్ అన్నారు. ఉమ్మనీరు తక్కువగా ఉండడంతో ప్రత్యేక పర్యవేక్షణలో పురుగు పోయాలని చెప్పారు. దీంతో శ్రీదుర్గ కుటుంబ సభ్యులు మంగళవారం పిఠాపురం ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఆందోళన చేశారు. నార్మల్ డెలివరీ చేయడం వల్లే తమ బిడ్డ చనిపోయిందని, పుట్టిన పాప దివ్యాంగురాలిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని శ్రీదుర్గ తల్లిదండ్రులు దొండపాటి రాజు, సుబ్బారావు ఆరోపించారు. బలవంతంగా డెలివరీ చేయడం వల్ల పుట్టిన బిడ్డ కుడి చేయి, కన్ను పని చేయడం లేదని మృతురాలి సోదరి వేమగిరి సత్యలత తెలిపారు. ఘటనా స్థలానికి పోలీసులు పరిస్థితి విషమించడంతో పిఠాపురం ఎస్సైతో పాటు సిబ్బంది ఆస్పత్రికి వచ్చి బాధితులకు నచ్చచెప్పారు. మిగిలిన రోగులు ఇబ్బంది పడతారని ఆందోళన చేయవద్దని సూచించారు. విషయం తెలుసుకున్న గొల్లప్రోలు జెడ్పీటీసీ వులవకాయల నాగలోవరాజు ఆస్పత్రికి చేరుకుని, బాధితుల తరఫున డాక్టర్ సుజాతతో మాట్లాడారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులతో కలసి పాడా పీడీ చైత్ర వర్షిణికి ఫిర్యాదు చేశారు. స్పందించిన పీడీ ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తాన్నారు. కాగా.. డాక్టర్ సుజాత మాట్లాడుతూ గర్భిణి శ్రీదుర్గ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నానన్నారు. అయితే డెలివరీ సమయంలో ఆమె సహకరించలేదన్నారు. వైద్యురాలిగా తనకు 18 ఏళ్ల అనుభవం ఉందని తెలిపారు. -
కంటిపై పొడిస్తే నోట్లోకొచ్చిన్ కత్తి!
కాకినాడ క్రైం/పి.గన్నవరం: దీపావళి పండగ పూట మద్యం తాగి పేట్రేగిపోయిన భర్త, కత్తితో తన భార్య కంట్లో పొడిచాడు. ఆ కత్తి మొన నోటి గుండా బయటకు వచి్చంది. మృత్యువుతో పోరాడుతున్న ఆమెకు కాకినాడ జీజీహెచ్ వైద్యులు పునర్జన్మనిచ్చారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం ఊడుమూడి గ్రామానికి చెందిన 35 ఏళ్ల నేలపూడి పల్లాలమ్మ (పల్లవి) భర్త గంగరాజు తాగొచ్చి నిత్యం వేధిస్తుండేవాడు. దీపావళి రోజున మద్యం తాగి వచ్చి భార్యతో గొడవ పడ్డాడు. అర్ధరాత్రి ఇంట్లో కూరలు తరిగే కత్తి తీసుకొని భార్యను చంపే ఉద్దేశంతో తలపై బలంగా పొడవబోయాడు. ఈ క్రమంలో కత్తి గురి తప్పి పల్లాలమ్మ ఎడమ కంటికి పై భాగంలో గుచ్చుకుంది. భార్య విలవిల్లాడుతున్నా వదిలి పెట్టకుండా కత్తిని గంగరాజు బలంగా నొక్కుతూ మరింత లోతుకు దింపాడు. దీంతో, ఆ కత్తి మొన నోటి గుండా బయటకి వచ్చేసింది. ఈ దారుణాన్ని గమనించిన కుటుంబ సభ్యులు బాధితురాలిని అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో కాకినాడ జీజీహెచ్‌లో చేర్చారు. తక్షణమే స్పందించిన వైద్యులు మంగళవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో శస్త్రచికిత్స మొదలు పెట్టారు. రెండు గంటల పాటు సుదీర్ఘ శస్త్రచికిత్స నిర్వహించి, దిగబడిన కత్తిని విజయవంతంగా తొలగించి, పల్లాలమ్మ ప్రాణాలు కాపాడారు. క్లిష్టతరమైన ఈ శస్త్రచికిత్స జీజీహెచ్ సూపరింటెండెంట్ లావణ్య కుమారి పర్యవేక్షణలో రంగరాయ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ విష్ణువర్ధన్ నేతృత్వంలో జరిగింది. బాధితురాలికి ఎస్ఐసీయూలో ఉంచి వైద్య సేవలు అందిస్తున్నారు. పల్లాలమ్మ కంటి చూపు, ప్రాణాలు రెండూ నిలిచాయని వైద్యులు నిర్ధారించారు. బాధితురాలి కుటుంబీకులు వైద్య బృందానికి ధన్యవాదాలు తెలిపారు. -
బుధవారం శ్రీ 22 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్టే.. పత్రికలకు భారత రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛకు భంగం కలిగించేలా కూటమి ప్రభుత్వం పోలీసు శాఖ ద్వారా అణచివేత ధోరణి అవలంబించడం సమంజసం కాదు. పత్రికల స్వేచ్ఛను హరించడానికి, హక్కులను నిర్మూలించడానికి ఎవరైనా ప్రయత్నిస్తే వారు శిక్షార్హులు కూడా. పత్రికా స్వాతంత్య్రం అణచివేతకు ప్రయత్నించిన వారిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలి. – పిల్లి సుభాష్‌చంద్రబోస్, రాజ్యసభ సభ్యుడు కేసులు ఉపసంహరించాలి పత్రికలకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది. ఆ స్వేచ్ఛను హరించేలా కొత్త సంప్రదాయానికి కూటమి ప్రభుత్వం తెర తీసింది. ‘సాక్షి’ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోంది. ఆ పత్రిక ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డితో పాటు జర్నలిస్టులపై కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తోంది. పత్రిక కార్యాలయంపై దాడులు తగవు. పత్రికలకు గౌరవం ఇవ్వాలి. కేసులు ఉపసంహరించాలి. – కురసాల కన్నబాబు, మాజీ మంత్రి, కాకినాడ జిల్లా -
ఆకాశ దీపంతో శుభారంభం
ఫ రత్నగిరిపై కార్తిక మాసోత్సవాలకు శ్రీకారం ఫ పూర్తయిన ఏర్పాట్లు అన్నవరం: ఆకాశ దీపం ఏర్పాటు ద్వారా రత్నగిరిపై కార్తిక మాసోత్సవాలకు అర్చకులు మంగళవారం శ్రీకారం చుట్టారు. సత్యదేవుని ప్రధానాలయంలో ధ్వజస్తంభం వద్ద ప్రత్యేక పూజలు చేసి, ఆకాశ దీపం ఏర్పాటు చేశారు. కార్తిక అమావాస్య అయిన నవంబరు 20వ తేదీ వరకూ ప్రతి రోజూ ఆకాశ దీపం ఏర్పాటు చేస్తామని ప్రధానార్చకుడు కోట సుబ్రహ్మణ్యం తెలిపారు. బుధవారం తెల్లవారుజాము నుంచి పాడ్యమి దీపాలు ఏర్పాటు చేయనున్నారు. కార్తిక అమావాస్య వరకూ వీటిని వెలిగిస్తారు. మార్గశిర పాడ్యమి తెల్లవారుజామున పోలిస్వర్గం దీపాలు వెలిగించి, నదుల్లో వదలడం ద్వారా కార్తిక మాసోత్సవాలు ముగియనున్నాయి. కార్తిక మాసం సందర్భంగా అన్నవరం దేవస్థానంలో చేపట్టిన ఏర్పాట్లు పూర్తి చేశారు. పశ్చిమ రాజగోపురం ఎదురుగా లారెల్స్ ఫార్మాస్యూటికల్స్ చేపట్టిన భక్తుల విశ్రాంతి షెడ్డు నిర్మాణం పూర్తయింది. అలాగే, క్యూ లైన్లు, విశ్రాంతి మండపాలు, పార్కింగ్ స్థలాలు కూడా సిద్ధం చేశారు. కార్తిక మాసంలో శని, ఆది, సోమ, దశమి, ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి తదితర పర్వదినాల్లో అర్ధరాత్రి 2 గంటల నుంచి మిగిలిన రోజుల్లో తెల్లవారుజామున 4 గంటల నుంచి సత్యదేవుని వ్రతాలు ప్రారంభిస్తారు. అలాగే, స్వామివారి దర్శనాలు కూడా పర్వదినాల్లో అర్ధరాత్రి నుంచి, మిగిలిన రోజుల్లో తెల్లవారుజాము నుంచి ప్రారంభమవుతాయి. వ్రతాలు, దర్శనాల టికెట్లు, ప్రసాదం విక్రయాలకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. ప్రత్యేక అధికారుల నియామకం కార్తిక మాసంలో భక్తుల రద్దీకి తగినట్లుగా ఏర్పాట్లు చేయడానికి, నవంబరు 2న తెప్పోత్సవం, 5న గిరి ప్రదక్షిణ ఏర్పాట్ల పర్యవేక్షణకు గాను దేవదాయ శాఖ కాకినాడ డిప్యూటీ కమిషనర్ రమేష్‌బాబు, లోవ తలుపులమ్మ తల్లి, వాడపల్లి దేవస్థానం ఈఓలు పి.విశ్వనాథరాజు, ఎన్ఎస్ చక్రధర్‌రావు ప్రత్యేకాధికారులుగా నియమితులయ్యారు. ఈ మేరకు దేవదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్ర మోహన్ ఉత్తర్వులు జారీ చేశారు. అన్నవరం దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావుతో కలసి వీరు కార్తిక మాసం ఏర్పాట్లను పర్యవేక్షిస్తారు. -
యువకుడిపై కానిస్టేబుల్ దాడి
సామర్లకోట: కానిస్టేబుల్ తీవ్రంగా కొట్టడంతో ఓ యువకుడు ప్రాణాపాయస్థితికి చేరాడు. ప్రస్తుతం కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వివరాల్లోకి వెళితే.. దీపావళి సందర్భంగా ఏటా బ్రౌన్‌పేట – కోటపేటకు చెందిన యువకులు తారాజువ్వలను నేలబారున విడిచిపెట్టే పోటీ పెట్టుకుంటారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి రెండు వర్గాలకు చెందిన యువకులు జువ్వలు వేసుకోవడం ప్రారంభించారు. పోలీసులు అక్కడకు చేరుకుని రెండు పర్యాయాలు వారిని చెదరగొట్టారు. ఈ క్రమంలో జువ్వల పోటీతో ఎటువంటి సంబంధం లేని దడాల అక్షయ కుమార్ అనే యువకుడు ఇంటి నుంచి బయటకు వచ్చాడు. అతడిని కానిస్టేబుల్ సతీష్ కుమార్ కొట్టడం ప్రారంభించాడు. ఆ క్రమంలో అక్షయ కుమార్ వీపుపై లాఠీ బలంగా తగలడంతో స్పృహ తప్పి పడిపోయాడు. విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే హుటాహుటిన స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్షయ కుమార్‌కు చిన్నతనం నుంచీ పక్షవాతం ఉంది. ఎప్పుడైతే కానిస్టేబుల్ లాఠీతో కొట్టాడో అతడు కోమాలోకి వెళ్లాడు. ఆస్పత్రి సిబ్బంది వైద్యం ప్రారంభించిన కొద్ది సేపటికి ఊపిరి ఆగి పోవడంతో అక్షయ కుమార్ చనిపోయాడని భావించారు. ఇంతలో డాక్టర్ వచ్చి సీపీఆర్ చేయడంతో ఊపిరి పీల్చుకున్నాడు. వెంటనే 108లో కాకినాడ తరలించడానికి ప్రయత్నం చేయగా దాదాపు గంటంప్పావు వరకూ అంబులెన్స్ అందుబాటులోకి రాలేదు. ఆ తర్వాత 108లో పోలీసుల సహకారంతో కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పెద్దాపురం డీఎస్పీ డి.శ్రీహరిరాజు, సీఐ ఎ.కృష్ణ భగవాన్ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాట్లు చేశారు. బాధితుడికి న్యాయం చేయాలి అమాయకుడైన అక్షయ కుమార్‌ను కానిస్టేబుల్ లాఠీతో కొట్టడం దారుణమని దళిత సంఘాల నాయకులు సతీష్ బాబు, లింగం శివప్రసాద్, నేతల హరిబాబు, పిట్టా సత్యనారాయణ అన్నారు. ఆ కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేసి, అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అక్షయ కుమార్‌కు అవుట్ సోర్సింగ్‌లో ఉద్యోగం ఇవ్వాలన్నారు. గతంలో కూడా ఒక దళిత యువకుడు చనిపోవడానికి పోలీసులే కారణమని గుర్తు చేశారు. దీనిపై విచారణ చేసి క్షతగాత్రుడికి న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇచ్చారు. ప్రాణాపాయస్థితిలో బాధితుడు గంటంపావు వరకూ రాని108 అంబులెన్స్ కాకినాడ ఆస్పత్రిలో చికిత్స తారాజువ్వల పోటీలో కలకలం -
ఘనంగా పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం
కాకినాడ క్రైం: స్థానిక జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం మంగళవారం ఘనంగా జరిగింది. జిల్లా ఎస్పీ బిందుమాధవ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ షణ్మోహన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విశిష్ట అతిథులుగా స్థానిక ప్రజాప్రతినిథులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అమరవీరుల స్థూపం వద్ద పరేడ్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విధులు నిర్వర్తిస్తూండటం స్ఫూర్తిదాయకమని అన్నారు. నాయకులు మాట్లాడుతూ పోలీసు అమర వీరుల కుటుంబాలకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. ఆయా కుటుంబాలకు నగదు అందించి, పండ్లు పంచారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, ఎమ్మెల్యేలు వనమాడి వెంకటేశ్వరరావు, చినరాజప్ప, పోలీసు అధికారులు పాల్గొన్నారు.డీఏ జీఓ మోసపూరితం కరప: రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు డీఏ మంజూరు చేస్తూ జారీ చేసిన జీఓ మోసపూరితమైనదని యూటీఎఫ్ జిల్లా నాయకుడు ఐ.ప్రసాదరావు విమర్శించారు. గురజనాపల్లిలో మంగళవారం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు 2024 జనవరి నుంచి ఇవ్వాల్సిన కరవు భత్యం (డీఏ) 3.64 శాతం ఈ నెల నుంచి చెల్లించేందుకు జీఓ 60 జారీ చేశారన్నారు. అయితే 2024 జనవరి నుంచి చెల్లించాల్సిన 21 నెలల బకాయిలు ఉద్యోగులు రిటైరయ్యాక చెల్లిస్తామంటూ జీఓ జారీ చేయడం సరికాదన్నారు. పెన్షనర్లకు 2027–28లో చెల్లించాలంటూ మరో జీఓ 61 జారీ చేశారన్నారు. ఇది ఉద్యోగులను మోసం చేయడమేనని పేర్కొన్నారు. సర్వీసులో ఉన్న ఉద్యోగులకు వారి ఖాతాల్లో తక్షణం జమ చేయాలని, అలా సర్దుబాటు కాకుంటే ఉద్యోగ, ఉపాధ్యాయుల వ్యక్తిగత పీఎఫ్ ఖాతాల్లో బకాయిలు జమ చేయాలని ప్రసాదరావు డిమాండ్ చేశారు. సీపీఎస్ ఉద్యోగులకు 90 శాతం నగదు, పెన్షనర్లకు తక్షణం నగదు చెల్లించాలని కోరారు. ఎరియర్లకు సంబంధించిన జీఓను సవరించాలని యూటీఎఫ్ జిల్లా నాయకుడు ప్రసాదరావు అన్నారు. ఇటువంటి జీఓల మూలంగా ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతారన్నారు. భవిష్యత్‌లో ఉద్యోగులకు డీఏ చెల్లించకుండా ప్రభుత్వాలు తాత్సారం చేసే అవకాశముందని చెప్పారు. ఈ జీఓ సవరణ కోసం ఉద్యమించేందుకు ఉద్యోగులు, ఉపాధ్యాయులు సన్నద్ధం కావాలని ప్రసాదరావు పిలుపునిచ్చారు. నేటి నుంచి కార్తిక మాసోత్సవాలు సామర్లకోట: స్థానిక పంచారామ క్షేత్రమైన బాలాత్రిపుర సుందరీ సమేత కుమారారామ భీమేశ్వరస్వామి ఆలయంలో కార్తిక మాసోత్సవాలు బుధవారం ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఆలయాన్ని విద్యుద్దీపాలతో అలంకరించారు. కోనేరులో గోదావరి జలాలు నింపారు. ఉచిత దర్శనంతో పాటు ప్రత్యేక దర్శనాలకు సంబంధించి క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. రోజూ సాయంత్రం ఆకాశ దీపం వెలిగించి, పూజలు చేస్తారు. కార్తిక మాసంలో నవంబర్ 5న పౌర్ణమి, 6న కృత్తికా నక్షత్రాన్ని పురస్కరించుకొని స్వామివారి గ్రామోత్సవం, అనంతరం జ్వాలాతోరణం నిర్వహిస్తారు. 18న మాస శివరాత్రి పూజలు, 20వ తేదిన అమావాస్యను పురస్కరించుకొని ఆలయంలో కోటి దీపోత్సవం, 21న పోలి పాడ్యమి సందర్భంగా స్వామి వారి జటాజూటం అలంకరణ ఉంటాయని ఈఓ బళ్ల నీలకంఠం, ట్రస్టు బోర్డు చైర్మన్ కంటే జగదీష్ మోహనరావు తెలిపారు. -
తిన్నారంటే తిప్పలే..
రావులపాలెం/అమలాపురం టౌన్: ఇటీవల కాలంలో స్ట్రీల్ ఫుడ్ వ్యాపారం విపరీతంగా పెరిగింది. వీధుల్లో ఏర్పాటు చేసే చిన్న చిన్న బళ్ల వద్ద ఆహార పదార్థాలను తినేవారు ఎక్కువయ్యారు. పిల్లలతో సరదాగా బయటకు వచ్చిన తల్లిదండ్రులు, షికారుకు వచ్చిన యువత, వాకింగ్ వచ్చిన పెద్దలు.. ఇలా అందరూ బండ్లపై అమ్మే పదార్థాలను ఇష్టంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో రోడ్ల చెంతన, వీధుల్లో ఫాస్ట్‌ఫుడ్, టిఫిన్ సెంటర్లు, బజ్జీ దుకాణాలు, పానీపూరీ బండ్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. అయితే వీటి నిర్వాహకుల్లో కొందరు నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడంతో ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారు. ప్రతి వీధిలోనూ.. రావులపాలెంతో పాటు ప్రధాన జాతీయ రహదారి, ఆర్అండ్బీ రోడ్లు విస్తరించిన పరిసర గ్రామాల్లో రోడ్ల వెంబడి అనేక ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు వెలిశాయి. దీనికి తోడు మిరపకాయ బజ్జీలు, న్యూడిల్స్, పానీపూరీ, మాంసం పకోడీ విక్రయించే తోపుడు బండ్లు ప్రతి వీధిలోనూ దర్శనమిస్తున్నాయి. అయితే వీరిలో కొందరు వ్యాపారులు ఒకే నూనెను అనేకసార్లు మరిగించి, వాడడం వల్ల వినియోగదారుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధులకు కారణవుతోంది. ఇలా ఆహార కాలుష్య కోరల్లో చిక్కుకుంటున్నది తొలుత యువతే. ఇటీవల ఏదైనా సుస్తీ చేసి ఆస్పత్రులకు వెళితే తొలుత డాక్టర్లు.. ఫాస్ట్ ఫుడ్, వీధి బళ్లమీద విక్రయించే ఆహారం తీసుకోవద్దని సలహా ఇస్తున్నారు. నిఘా కరవు ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లపై ఫుడ్ సేఫ్టీ, పంచాయతీ, పొల్యూషన్ కంట్రోల్ అధికారుల నిఘా కరవైంది. కేవలం పెద్ద హోటళ్లపై మాత్రమే దాడులు, తనిఖీ చేస్తున్నారు. తర్వాత రాజకీయ ఒత్తిళ్లతో కేసులను నీరుగార్చేస్తున్నారు. రావులపాలెంలో ఇటీవల ప్రముఖ హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ, విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. నిల్వ ఉన్న ఆహార పదార్థాలను గుర్తించి కేసులు నమోదు చేశారు. అలాగే రాజకీయ, ఆర్థిక పలుకుబడులతో నామమాత్రపు కేసులు నమోదు చేసి చేతులు దులుపుకొన్నారు. కానీ స్ట్రీట్ ఫుడ్ దుకాణాలను ఏ అధికారులూపట్టించుకున్న దాఖలాలులేవు. పొగతో కాలుష్యం కొత్తపేట నియోజకవర్గంలోని రావులపాలెం, కొత్తపేట, ఆలమూరు, ఆత్రేయపురం పరిసర గ్రామాల రోడ్ల చెంత తాత్కాలికంగా ఫాస్ట్ ఫుడ్, న్యూడిల్స్, పానీపూరీ, మాంసం పకోడీ షాపులు, తోపుడు బండ్లు అనేక ఉన్నాయి. ఈ వ్యాపారులందరూ రోజూ సాయంత్రం నాలుగింటికి తమ వ్యాపారం మొదలు పెడతారు. మరిగించిన నూనెలోనే పదార్థాలను తయారు చేయడం వల్ల తిన్నవారి ఆరోగ్యం పెను ప్రమాదంలో పడుతోంది. న్యూడిల్స్, పానీపూరీ, ఫ్రైడ్ రైస్ కూడా ఈ కోవలోకే వస్తాయి. అలాగే ఈ షాపులు, తోపుడు బండ్లపై గ్యాస్ సిలిండర్ల వాడడం, నూనె మరగడం వల్ల వచ్చే పొగతో వెలువడే ఆయా ప్రాంతాల్లో కాలుష్యం కమ్ముకుంటోంది. రావులపాలెంలో హైవే సర్వీసు రోడ్డు, రింగ్ రోడ్డు, పార్కు వద్ద, మార్కెట్ సెంటర్, రైతు బజార్ సెంటర్, ఊబలంక రోడ్డు, అమలాపురం రోడ్డు ఇలా చెప్పుకుంటూ పోతే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, రెడీమేడ్ ఆహార పదార్థాలు విక్రయించే తోపుడు బండ్లు అనేకం దర్శనమిస్తాయి. ఒక్క రావులపాలెం పంచాయతీ పరిధిలో స్ట్రీట్ పుట్ బండ్లు సుమారు 60 వరకూ ఉన్నట్టు సమాచారం. జిల్లా కేంద్రంలో.. జిల్లా కేంద్రమైన అమలాపురం పట్టణంలో హోటళ్లు, పాస్ట్ ఫుడ్ సెంటర్లు రెట్టింపు అయ్యాయి. అయితే పలు హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో ఆహారం కలుషితం అవుతోందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల ఒక మాంసాహార హోటల్లోని పలావులో మండ్ర కప్ప ఉందన్న విషయం సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. దీంతో మున్సిపాలిటీ, ఫుడ్ సేఫ్టీ అధికారుల్లో కదలిక మొదలైంది. అప్పటి వరకూ పలు మున్సిపల్ కౌన్సిల్ సమావేశాల్లో కొందరు కౌన్సిలర్లు పట్టణంలో కలుషిత ఆహారం అధికమవుతోందని ఆందోళన చెందినా కదలిక లేదు. అమలాపురం పట్టణం వ్యాప్తంగా పలు కూడళ్లలో దాదాపు 24 వరకూ పాస్ట్ ఫుడ్ సెంటర్లు ఉన్నాయి. వాటిలో పదార్థాల తయారీకి ఉపయోగించే పొయ్యిల గొట్టాలను రోడ్డు వైపు పెట్టేస్తున్నారు. వాటి నుంచి ఆయిల్ తుంపర్లు, పొగ విపరీతంగా వెలువడుతోంది. హోటళ్ల కంటే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలోనే ఆహార కలుిషితం ఎక్కువ అవుతోందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంబాజీపేటలోని ఓ హోటల్లో టిఫిన్ తిన్న 20 మంది అస్వస్థతకు గురై ఆస్పత్రుల పాలవడంతో కలుషిత ఆహారంపై ప్రజల్లో మరింత ఆందోళన పెరిగింది. ఫుడ్ సేఫ్టీ అధికారులు తరచూ హోటళ్లు, పాస్ట్ ఫుడ్ సెంటర్లపై దాడులు, తనిఖీలు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.సహజ ప్రసవం చేసి ప్రాణాలు తీసేశారంటూ.. విపరీతంగా పెరిగిన ఫాస్ట్ ఫుడ్ దుకాణాలు కొన్నింటిలో నాణ్యతకు తిలోదకాలు లైసెన్సులు లేకుండా వ్యాపారం ప్రమాదంలో ప్రజారోగ్యందృష్టి సారించని అధికారులు పంచాయతీ పరంగా శానిటేషన్, ఎన్విరాల్మెంట్ పరిశుభ్రత అంటూ అధికారులకు ఈ సెంటర్లు, షాపులను తనిఖీ చేసే అధికారం ఉన్నా.. వారు ప్లాస్టిక్ కవర్లు తదితర సామగ్రిపైనే దృష్టి పెడుతున్నారు. కల్తీ ఆహార విక్రయాలు, కాలుష్యాన్ని పట్టించుకోవడం లేదు. గతంలో పంచాయతీలకు శానిటరీ ఇన్స్పెక్టర్లు ఉండేవారు, ఇప్పుడు ఆ పోస్టులు లేకపోవడంతో పంచాయతీ సెక్రటరీలు, గుమస్తాలపై ఈ భారం పడింది. జిల్లా స్థాయిలో ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ అధికారులు ఈ తరహా దుకాణాలను తనిఖీలు చేస్తే నిర్వాహకులకు కనీసం భయమైనా ఉంటుంది. ఈ దుకాణాల నిర్వహణకు ఎవ్వరూ లైసెన్సులు తీసుకోవడం లేదు. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, రోడ్ల చెంత తిను బండారాలు విక్రయించే ప్రతి వీధి వ్యాపారి తప్పని సరిగా లైసెన్స్ పొందాలని ఫుడ్ సేఫ్టీ అధికారులు చెబుతున్నారు. -
దెబ్బ తిన్న యంత్రాలు
వివిధ యూనిట్లలోని యంత్రాల్లోకి ముంపు నీరు చేరి రోజుల తరబడి నిలిచిపోవడంతో ఆ యంత్రాలు ఇక పని చేయవేమోనని యజమానులు దిగులు చెందుతున్నారు. ఇక్కడ తయారయ్యే ట్రాన్స్ఫార్మర్లు, వెల్డింగ్ మెషీన్లు, ప్యానల్ బోర్డులు రాష్ట్రంలోని పలు జిల్లాలకు వెళ్తూంటాయి. అప్పుడే నాలుగైదు రోజులుగా పనులు నిలిచిపోవడంతో రూ.లక్షల్లో నష్టపోతున్నామని వారు మధనపడుతున్నారు. వెల్డింగ్ మెషీన్లు, ఒక మోస్తరు యంత్ర పరికరాలు ముంపులో ఉండటంతో నీరు లాగేసినా తిరిగి అవి పని చేస్తాయో లేవోననే దిగులు వారిని వెంటాడుతోంది. -
ఫారెస్ట్ రిజర్వ్‌గా మధ్యలంక
మామిడికుదురు: బి.దొడ్డవరం గ్రామంలోని మధ్యలంకను గ్రామ పంచాయతీ అనుమతితో ఫారెస్ట్ రిజర్వ్ ప్రాంతంగా ప్రకటిస్తామని జిల్లా ఫారెస్టు అధికారి ఎంవీ ప్రసాదరావు తెలిపారు. ఆయన మంగళవారం బోటులో సిబ్బందితో వెళ్లి మధ్యలంకలో నివాసం ఉంటున్న పక్షులను పరిశీలించారు. ఆగ్నేయాసియా నుంచి వలస వచ్చిన ఓపెన్ బిల్ స్టార్క్ పక్షులు గత మూడేళ్లుగా అక్కడ నివాసం ఉంటున్నాయన్నారు. వలస వచ్చిన పక్షులు నత్తలను కొట్టుకుని ఆహారంగా తింటాయన్నారు. మధ్యలంకలో సుమారుగా 10 వేల వరకు పక్షులు ఉంటాయని చెప్పారు. వాటి పరిరక్షణ కోసం ఆ ప్రాంతాన్ని రిజర్వు ప్రాంతంగా ప్రకటించేందుకు కార్యాచరణ చేపడతామన్నారు. -
బీసీ, ఓబీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం నూతన కమిటీ
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): బీసీ, ఓబీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా నూతన కమిటీ ఎన్నిక మంగళవారం స్థానిక రా మారావుపేటలో జరిగింది. ప్రస్తు త జిల్లా అధ్యక్షుడు రామానుజన్ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు గుత్తుల వీరబ్రహ్మం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సంఘం నూతన అధ్యక్షుడిగా వాసంశెట్టి కామేశ్వరరావు (వి ద్యాశాఖ), గౌరవాధ్యక్షుడిగా రామానుజన్ శ్రీనివాస్ (విద్యుత్ శాఖ), ప్రధాన కార్యదర్శిగా జోగా రామకృష్ణ (వైద్య, ఆరోగ్య శాఖ), ఆర్థిక కార్యదర్శిగా నరసింహమూర్తి (విద్యా శాఖ), రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా గంటి రాధాకృష్ణ, కాకినాడ పట్టణ శాఖ గౌరవాధ్యక్షుడిగా చోడే శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా సంగాడి రాజసింహవర్మ, అధ్యక్షుడిగా కడలి నాగరాజు, ప్రధా న కార్యదర్శి ముక్తేష్, సంయుక్త కార్యదర్శిగా ములంపాక శ్రీనివాసరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కామేశ్వరరావు మాట్లాడుతూ, జిల్లాలోని అన్ని మండలాల్లో కమిటీలు ఏర్పాటు చేసి, సంఘాన్ని బలోపేతం చేస్తా నని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సంఘం ఉమ్మడి జిల్లా కార్యవర్గ సభ్యులు సిద్ధి వెంకటేశ్వరరావు, అద్దంకి వెంకన్నబాబు, ముల్లు సత్యనారాయణ, జిల్లా కార్యవర్గ సభ్యులు దొమ్మేటి సుధాకర్, రాపాక శ్రీనివా స్, వీరభద్రరావు, డి.ఏడుకొండలు, టేకుమూడి శ్రీనివాస్, సత్యప్రసాద్, గుత్తుల వెంకటేష్ పాల్గొన్నారు. -
చర్యలు తీసుకుంటున్నాం
స్ట్రీట్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ దుకాణాలపై ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులను అనుసరించి ఎప్పటి కప్పుడు చర్యలు తీసుకుంటున్నాం. ప్రధానంగా చిరు వ్యాపారులు చేస్తున్న రోడ్ల ఆక్రమణ, శానిటేషన్ విషయాల్లో అవగాహన సమావేశాలు పెట్టి హెచ్చరిస్తున్నాం. పంచాయతీ పరిధిలో ఉన్న ప్రతి అంశంపై దృష్టి సారించడంతో పాటు నిబంధనలు పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. – ఎల్.దుర్గాప్రసాద్, పంచాయతీ కార్యదర్శి, రావులపాలెం ● -
అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి
కాకినాడ క్రైం: బేకరీలో పనిచేసే మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. వివరాల్లోకి వెళితే.. కాకినాడ సంతచెరువు జంక్షన్లో ఉన్న ఎస్ఆర్కే బిల్డింగ్‌లో కర్ణాటకకు చెందిన కేఎస్ వెంకటేష్ అనే వ్యక్తి జై మారుతీ బెంగళూరు అయ్యంగార్ బేకరీని నడిపిస్తున్నాడు. ఈ భవనం కింద అంతస్తులో బేకరీ, మొదటి అంతస్తులో తయారీ కేంద్రం ఉంది. బాలాజీ చెరువుకు చెందిన ర్యాలీ లక్ష్మి (40) దాదాపు రెండు నెలలుగా ఈ తయారీ కేంద్రంలో పని చేస్తోంది. రోజూ మాదిరిగానే మంగళవారం ఆమె తయారీ కేంద్రానికి వచ్చింది. సాయంత్రం 5.30 సమయంలో అదే అంతస్తులో మరో దుకాణం నడుపుతున్న వ్యక్తి.. బేకరీ తయారీ కేంద్రంలో మహిళ పడిపోయి ఉండడాన్ని చూసి షాపు యజమాని వెంకటేష్‌కు సమాచారం అందించాడు. అతడు వెళ్లి చూసే సరికీ లక్ష్మి విగత జీవిగా కనిపించింది. ఆయన ఈ విషయాన్ని లక్ష్మి కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించాడు. ఆమెను కాకినాడ జీజీహెచ్‌కు తరలించగా, అప్పటికే లక్ష్మి మృతి చెందిందని వైద్యులు నిర్ధారణ చేశారు. ఈ ఘటనపై కాకినాడ త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా.. భర్తతో వేరుపడిన లక్ష్మికి పదేళ్ల కుమార్తె ఉంది. బేకరీలో పనిచేసుకుంటూ బాలికను పోషిస్తోంది. -
వానోస్తే ముంపే..
ఆటోనగర్‌లో మెకానిక్ షెడ్ల నిర్వాహకులం తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. వానొస్తే ముంపు తప్పడం లేదు. విలువైన సామగ్రి, ఇంజిన్లు చెడిపోతున్నాయి. రోడ్లు, మౌలిక సదుపాయాలు లేవు. – మణికంఠ ● శాశ్వత పరిష్కారం చూపాలి ఆటోనగర్‌లో చాలా సమస్యలున్నాయి. రోడ్లు, డ్రైనేజీలు సక్రమంగా లేవు. ముఖ్యంగా వర్షాలకు ముంపులోకి వెళ్లడంతో పనులు నిలిచిపోతున్నాయి. ఉపాధి దెబ్బ తింటోంది. ఏపీఐఐసీ అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి, ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. – సతీష్ రూ.2.50 కోట్లతో డ్రైనేజీకి ప్రతిపాదన ఆటోనగర్ పల్లపు ప్రాంతంగా మారింది. పంట పొలాలను ఆనుకుని ఉండటంతో వర్షాలకు నీరు బయటకు పోవడం లేదు. పంట పొలాల్లోని గోదావరి, ఏలేరు జలాలు ఆటోనగర్ ఇండస్ట్రియల్ పార్కులోకి వస్తున్నాయి. పలు షాపుల్లోకి నీరు చేరడంతో పాటు వీధులు మునిగిపోయి ముంపులో ఉంటున్నాయి. సమస్య పరిష్కారానికి రూ.2.50 కోట్లతో మేజర్ డ్రైనేజీ నిర్మాణానికి ప్రతిపాదనలు చేశాం. – అబ్బిరెడ్డి రమణారెడ్డి, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్, కాకినాడ -
దారీతెన్నూ లేదు!
సాక్షి ప్రతినిధి, కాకినాడ: పారిశ్రామిక ప్రగతిలో పరుగులు పెడుతున్నామంటున్న కూటమి సర్కారు.. పారిశ్రామిక వాడ నిండా మునిగిపోయినా నిర్లక్ష్యాన్నే ప్రదర్శిస్తోంది. పరిశ్రమల ఏర్పాటు కోసం పెదబాబు, చినబాబు దేశాలు పట్టుకుని తిరుగుతున్నారు. విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్, అమరావతిలో క్లౌడ్ టెక్నాలజీ వంటి ఉన్నత సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చేస్తోందని గొప్పగా ప్రకటించుకుంటున్నారు. అసలు అవన్నీ ఎప్పుడు వస్తాయో తెలియదు కానీ ఉన్న పారిశ్రామికవాడలు కాస్తా నిండా నీట మునిగిపోతున్నా నిర్లక్ష్యం చూపుతున్నారు. ఇలా ఏర్పడింది.. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాగా ఉండగా కాకినాడ సర్పవరం భావనారాయణస్వామి ఆలయ సమీపాన సుమారు 25 ఎకరాల్లో పారిశ్రామికవాడ (ఆటోనగర్) ఏర్పాటైంది. మోటారు వాహనాల వర్క్‌షాపులు, వెల్డింగ్ మెషీన్ యూనిట్లు, ట్రాన్స్ఫార్మర్లు, ప్యానల్ బోర్డుల తయారీ వంటి యూనిట్లు అప్పట్లో కాకినాడ నగరంలో ఎక్కడి పడితే అక్కడ నిర్వహించేవారు. దీనివలన నగరంలో కాలుష్యం పెరిగిపోవడంతో పాటు జనావాసాలకు చాలా ఇబ్బందులు ఎదురయ్యేవి. ఈ నేపథ్యంలో అప్పటి మోటార్ యూనియన్ ప్రతినిధిగా నాగం వీర్రాజు తదితరులు 1999 నుంచి జరిపిన కృషి ఫలితంగా ఆటోనగర్ ఏర్పాటుకు అంకురార్పణ జరిగింది. అప్పట్లో ఒక్కొక్కరికి ఐదారు వందలు నుంచి ఏడు వందల మీటర్ల స్థలాలు వంతున మీటరు రూ.170కి ఏపీఐఐసీ ద్వారా ఇచ్చారు. ఇక్కడి వారందరూ మోటార్ ఇంజిన్ల మరమ్మతులు, విడి భాగాల అసెంబ్లింగ్, లారీ, ట్రాక్టర్ తదితర మెకానిక్ షెడ్లు, ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతుల వంటి చిన్న, మధ్యతరహా యూనిట్లు 260 వరకూ ఇక్కడున్నాయి. ఆటోనగర్‌పై ఆధారపడి ప్రత్యక్షంగా, పరోక్షంగా 12 వేల కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. ఆక్రమణలతో.. సామర్లకోట నుంచి కాకినాడకు వచ్చే గోదావరి కాలువ ముంపే ఆటోనగర్‌కు పెద్ద శాపంగా మారింది. మాధవపట్నం వద్ద ఈ కాలువ ఆక్రమణలతో కుచించుకుపోయింది. మాధవపట్నం నుంచి కాకినాడ రూరల్ మండలం సర్పవరం వెళ్లే మార్గంలో ఈ కాలువ వెడల్పు 12 అడుగులు ఉండాలి. కానీ, ఆక్రమణలతో నాలుగడుగులకు కుదించుకుపోయింది. దీంతో, ఇది దిగువన ఉన్న ఆటోనగర్‌ను ముంచెత్తుతోందని యూనిట్ల యజమానులు, కార్మికులు చెబుతున్నారు. ఆటోనగర్ వరకూ ఉన్న ఈ కాలువ ఆక్రమణలకు గురవుతున్నా ఏపీఐఐసీతో పాటు సంబంధిత అధికారులెవ్వరూ పట్టించుకోవడం లేదు. చాలా కాలంగా ఈ సమస్యపై మొర పెట్టుకుంటున్నా ప్రభుత్వం నుంచి కనీస స్పందన కూడా లేదని ఆటోనగర్‌లోని యజమానులు, కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతర్గత డ్రైన్ల నిర్మాణం, రోడ్లు మరమ్మతులు చేపట్టాల్సిన యంత్రాంగం నిధుల్లేవంటూ చేతులెత్తేస్తోంది. ఇన్ని వేల మంది పొట్ట కొడుతున్న ఆటోనగర్ ఇండస్ట్రియల్ పార్క్ సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఇక్కడి వారు కోరుతున్నారు. ఫ ఆటోనగర్‌లో అష్టకష్టాలు ఫ పోటెత్తిన సామర్లకోట గోదావరి కాలువ ఫ వెళ్లేదెలా.. బయటకు వచ్చేదెలా? ఫ ముంపులో లక్షల విలువైన యూనిట్లు ఐదారు రోజులుగా ముంపులో.. నగరంలో ఇష్టమొచ్చినట్టు నిర్వహిస్తున్న మోటార్ రంగాన్ని ఒకచోట ఏర్పాటు చేయాలనే సంకల్పం మంచిదే. కానీ తాంబూలం ఇచ్చేశాం అనే సామెత చందంగా స్థలాలిచ్చారు తప్ప, కనీస మౌలిక వసతులు కూడా కల్పించ లేదు. అదే ఇప్పుడు ఆటోనగర్‌కు శాపమైంది. ఏపీఐఐసీ అజమాయిషీలో నడుస్తున్న ఈ ఆటోనగర్ ప్రస్తుతం సామర్లకోట – కాకినాడ కాలువ ముంపు నీటితో మునిగిపోయింది. ఐదారురోజులుగా ముంపు నీటిలో నానుతున్నా పట్టించుకున్న నాథుడే లేకుండా పోయాడు. ఆటోనగర్‌లో ఎనిమిది అంతర్గత రహదారులున్నాయి. వీటిలో కొన్ని మోకాలి లోతు, మరికొన్ని నడుం లోతు నీట మునిగిపోయాయి. ఎటు చూసినా ముంపు నీరు ముట్టడించడంతో ఆయా యూనిట్లలో అడుగు పెట్టలేని దుస్థితి నెలకొంది. ఆటోనగర్‌కు వెళ్లాలన్నా, అక్కడి నుంచి బయటకు రావాలన్నా నరకం చూస్తున్నారు. ముంపుతో పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఎప్పటి మాదిరిగానే రోజువారీ పనులు ముగించుకుని ఎక్కడి మెషీన్లు అక్కడే విడిచిపెట్టి, ఇంటికి వెళ్లి తిరిగి వచ్చేసరికి ముంపులో మునిగిపోయి లక్షల్లో నష్టపోయామని ఆయా యూనిట్ల యజమానులు గగ్గోలు పెడుతున్నారు. -
‘చంద్రబాబు.. దీనినే క్రెడిట్ చోరీ అంటారు’
కాకినాడ: 2019 నుంచి 2024 కాలంలో దేశంలో ఎక్కడా జరగని విప్లవాత్మక సంస్కరణలను మాజీ సీఎం వైఎస్ జగన్ చేస్తే.. దాన్ని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు తన ఖాతాలో వేసుకుంటున్నారని వైఎస్సార్సీపీ నేత కురసాల కన్నబాబు విమర్శించారు. దీనినే క్రెడిట్ చోరీ అంటారు.. చంద్రబాబు అని కురసాల ఎద్దేవా చేశారు. ‘గత మరచిపోయిన చంద్రబాబు.. అన్నీ తానే చేశాను అంటున్నారు.వైఎస్ జగన్ చేసిన మంచిని కూటమీ ప్రభుత్వం చోరి చేస్తుంది. చంద్రబాబుకు తోడు ఆయన కొడుకు లోకేష్ నలభై ఆబద్దలు చెబుతున్నాడు. నోరు తెరుస్తే నిజం చెప్పకుండా తండ్రి కొడుకులు పచ్చి ఆబద్దలు ఆడుతున్నారు. గ్రీన్ ఎనర్జీ,డేటా సెంటర్,పోర్టు లను తామే కొబ్బరి కొట్టి ప్రారంభించినట్లు చెబుతున్నారు. భోగాపురం ఎయిర్‌పోర్టుకు కనీసం గత చంద్రబాబు పాలనలో భూసేకరణ చేయ్యలేదు. *సెజ్ భూములను తిరిగి ఇవ్వడం కూడా తనదే క్రెడిట్ గా చెప్పుకున్నారు. *దీనికి వంత పాడుతున్న ఎల్లో మీడియా.. సెజ్ భూములను తిరిగి ఇస్తున్నట్లుగా గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వ్యవసాయ మంత్రిగా ఉన్న నన్ను సెజ్ భూములు తిరిగి ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన కమీటికి ఛైర్మన్‌గా నియమించారు.ఆనాడు జీవో నెం : 158 ద్వారా 2180 ఎకరాల సెజ్ భూములను వెనక్కి ఇచ్చేశారు. సెజ్ భూములు తిరిగి ఇవ్వడానికి ఇప్పుడు కూటమి ప్రభుత్వం మళ్ళీ మోమో ఇచ్చింది. గతంలో వైఎస్ జగన్ ఇచ్చిన జీవోను అమలు చేయ్యమని ఆ మోమో లో ఉంది. గత టిడిపి పాలనలో సెజ్ పోరాట కమీటి నాయకులను గృహనిర్భం చేశారు. ఉద్యమకారులపై పోలీసులతో దమణకాండ చేసి... అక్రమ కేసులు పెట్టించారు. జైళ్ళల్లో నిర్బందించి రైతులను, ఉద్యమకారులను వేధించారు. 2014కు ముందు సెజ్ భూముల్లో ఏరువాక చేసి భూములని తిరిగి ఇచ్చేస్తానని హమీ ఇచ్చారు చంద్రబాబు. సెజ్ కోసమే భూసేకరణ ముఖ్యం.. గ్రామలు ఎలా పోయిన పర్వాలేదని ఆనాడు చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఏపీ లో వదిలేయగా లేనిది..మా భూములు ఇవ్వాలని 16 రాష్ట్రాలకు సంబంధించిన సెజ్ భూముల కేసులు సుప్రీం కోర్టులో నడుస్తున్నాయి. 158 జీవో ద్వారా స్ధానికులకు 78% ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పాం...దానిని అమలు చేయ్యండి. సెజ్ రైతులపై చంద్రబాబు సర్కార్ బనాయించిన అక్రమ కేసులను జగన్ ఎత్తివేశారు.వాటిలో ఇంకా ఉన్న కొన్ని కేసుల ఇప్పుడు ఎత్తివేయ్యండి. దీవీస్ తీసుకున్న ఎస్సైన్డ్ భూములు ఎకరాకు రూ.10 లక్షలు రైతులకు ఇప్పించారు. జిఎంఆర్ రూ. 300 కోట్లు, కేవీ రావ్ 600 కోట్లు రుణాలు తెచ్చారు. శ్మసానాలు,చెరువులను కూడా సేకరించారు. వాటిపై చంద్రబాబు ఎందుకు విచారణ జరపరు. క్రెడిట్ చోరి తప్పా...మరో ఆలోచన చంద్రబాబుకు లేదు. సెజ్ లో జరిగిన తప్పులపై చర్యలు తీసుకోండి. కూటమి ప్రభుత్వం లో పబ్లిసిటీ పీక్...పనిలో వీక్. కార్పోరేట్ కంపెనీలు అంటే...జీ హుజీర్ అంటూ చంద్రబాబు సాగిలపడిపోతాడు’ అని ధ్వజమెత్తారు కురసాల కన్నబాబు.విశాఖలో గూగుల్ డేటా సెంటర్.. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కీలక వ్యాఖ్యలు -
కాకినాడ జిల్లా: దీపావళీ వేడుకల్లో పోలీసుల అత్యుత్సాహం
సాక్షి, కాకినాడ జిల్లా: సామర్లకోట బ్రౌన్ పేటలో పోలీసుల అత్యుత్సాహం ప్రదర్శించారు. రోడ్డు మీద బాణాసంచా కాలుస్తున్న యువకులను పోలీసులు చెదరగొట్టారు. బాణాసంచా కాల్పులను చూసేందుకు వచ్చిన అక్షయ్ కుమార్ గాయపడ్డాడు.ఆ యువకుడిని సామర్లకోట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కానిస్టేబుల్ సతీష్ కుమార్.. అక్షయ్ కుమార్ మెడపై లాఠీతో కొట్టారంటూ బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసుల తీరును నిరసిస్తూ ఆసుపత్రి వద్ద దళిత సంఘాలు అందోళన చేపట్టాయి. పోలీసు వాహనాన్ని బాధితుడి బంధువులు అడ్డుకున్నారు. -
కార్తికం.. భక్త్యుత్సవం
అన్నవరం: హరిహరాదులకు ప్రీతికరమైన కార్తిక మాసం బుధవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా అన్ని ఆలయాల్లో ఏర్పాట్లు చురుకుగా జరుగుతున్నాయి. సామర్లకోటలోని పంచారామ క్షేత్రం శ్రీ కుమారారామ భీమేశ్వరస్వామి ఆలయం, పిఠాపురం పాదగయ క్షేత్రంతో పాటు హరిహర క్షేత్రంగా భాసిల్లుతున్న అన్నవరం శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామి దేవస్థానంలో కార్తిక మాసోత్సవాలకు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆశ్వయుజ అమావాస్య సోమవారం సాయంత్రం ప్రారంభమై మంగళవారం సాయంత్రానికి ముగుస్తుంది. అయితే, శుద్ధ పాడ్యమి తిథి ఉదయం వేళకు ఉండటాన్ని పరిగణనలోకి తీసుకుంటారు కాబట్టి పంచాంగం ప్రకారం బుధవారమే కార్తిక మాసం ఆరంభమవుతుంది. అయితే, కార్తిక శుద్ధ పాడ్యమి తిధి మంగళవారం సాయంత్రమే వస్తున్నందున ఆలయాల్లో మాత్రం ఆ రోజు రాత్రి ఆకాశ దీపం ఏర్పాటుతో కార్తిక మాసోత్సవాలు ప్రారంభించనున్నారు. అన్నవరం దేవస్థానంలో అర్చకులు మంగళవారం రాత్రి ధ్వజస్తంభం వద్ద ఆకాశ దీపం ఏర్పాటు చేయడం ద్వారా కార్తిక మాసోత్సవాలకు శ్రీకారం చుడతారు. కార్తిక అమావాస్య అయిన నవంబర్ 20వ తేదీ వరకూ ప్రతి రోజూ ఆకాశ దీపం ఏర్పాటు చేస్తామని ప్రధానార్చకుడు కోట సుబ్రహ్మణ్యం తెలిపారు. ఇవీ ఏర్పాట్లుకార్తిక మాసంలో సత్యదేవుని సన్నిధికి లక్షలాదిగా భక్తులు తరలి రానున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని దేవస్థానంలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఫ శని, ఆది, సోమవారాలతో పాటు, దశమి, ఏకాదశి, క్షీరాబ్ది ద్వాదశి, కార్తిక పౌర్ణమి తదితర 16 పర్వదినాల్లో వేలాదిగా భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున తెల్లవారుజామున ఒంటి గంట నుంచే సత్యదేవుని వ్రతాలు, 2 గంటల నుంచి స్వామివారి దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. ఫ పౌర్ణమి, ఏకాదశి, పర్వదినాల్లో పశ్చిమ రాజగోపురం వద్ద రోప్ పార్టీ ఏర్పాటు చేసి, అధిక సంఖ్యలో వచ్చే భక్తులను బృందాల వారీగా దర్శనానికి అనుమతిస్తారు. ఫ పర్వదినాల్లో ముందు రోజు రాత్రే వ్రతాల టికెట్లు ఇస్తారు. దీనికి గాను ఇప్పటికే ఉన్న వాటికి అదనంగా కౌంటర్లు ఏర్పాటు చేస్తారు. స్వామివారి దర్శనం టికెట్లు, ప్రసాద విక్రయాలకు కూడా అదనంగా కౌంటర్లు ఏర్పాటు చేస్తారు. ఫ కార్తిక శుద్ధ ద్వాదశి (క్షీరాబ్ది ద్వాదశి) సందర్భంగా నవంబర్ రెండో తేదీ రాత్రి 6.30 గంటల నుంచి పంపా సరోవరంలో సత్యదేవుని తెప్పోత్సవం ఘనంగా నిర్వహిస్తారు. ఫ కార్తిక పౌర్ణమి సందర్భంగా నవంబర్ ఐదో తేదీ ఉదయం సత్యదేవుని గిరి ప్రదక్షిణ పల్లకీ మీద లాంఛనంగా నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు సత్యరథంతో గిరి ప్రదక్షిణ ఘనంగా ప్రారంభించి, సాయంత్రం ఆరున్నర గంటలకు ముగిస్తారు. అదే రోజు సాయంత్రం 5.45 గంటలకు పంపా జలాశయం వద్ద పంపా హారతులు, రాత్రి 7 గంటలకు తొలి పావంచా వద్ద జ్వాలాతోరణం నిర్వహిస్తారు. ఫ కార్తికం నెల రోజులూ చిన్న కార్లు, ఆటోలు మినహా మరే ఇతర వాహనాలను కొండ మీదకు అనుమతించరు. పెద్ద వాహనాలను భక్తులు కళాశాల మైదానంలో నిలిపివేసి, దేవస్థానం బస్సులు, ఆటోల ద్వారా కొండ మీదకు చేరుకోవాలి. ఫ కొండ మీదకు వచ్చే చిన్న కార్లను సత్యగిరి రోడ్డు పక్కన, సత్రాల ఆవరణలో నిలుపు చేస్తారు. దీనికోసం పార్కింగ్ స్థలాన్ని ప్రత్యేకంగా విశాలంగా రూపొందిస్తున్నారు. సుమారు 4 వేల కార్ల పార్కింగ్‌కు ఏర్పాట్లు చేస్తున్నారు. కొండ దిగువకు వెళ్లే వాహనాలను ఆదిశంకర మార్గ్ ద్వారా పంపిస్తారు. ఫ రత్నగిరిపై 2 వేల మంది సేద తీరేందుకు వీలుగా డార్మెట్రీ, విష్ణు సదన్‌లో 36 హాళ్లు ఉన్నాయి. సీఆర్ఓ కార్యాలయం వద్ద నిర్మించిన డార్మెట్రీలో లాకర్లతో పాటు అన్ని సదుపాయాలూ కల్పించారు. ఈఓ కార్యాలయం దిగువన ఉన్న మెయిన్ క్యాంటీన్‌ను కూడా డార్మెట్రీగా మార్చనున్నారు. ఫ విద్యుత్ సరఫరా 24 గంటలూ నిరాటంకంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. ఫ దేవస్థానం, కొండ దిగువన మెయిన్ రోడ్డు, రైల్వే స్టేషన్ రోడ్డులో పారిశుధ్యం మెరుగు పడేలా అదనపు సిబ్బందిని నియమించారు. ఫ భక్తుల కోసం రత్నగిరి పైన, దిగువన 457 టాయిలెట్లు ఉన్నాయి. గిరి ప్రదక్షిణ రోడ్డులో 24 టాయిలెట్లు తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. గిరి ప్రదక్షిణ రోడ్డులో ఈసారి విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయనున్నారు. ఫ కార్తిక మాసంలో అన్నదానానికి బదులు సర్కులర్ మండపం వద్ద ఉదయం నుంచి సాయంత్రం వరకూ భక్తులకు పులిహోర, దద్ధోజనం.. చిన్నారులకు పాలు, బిస్కెట్లు పంపిణీ చేస్తారు. అన్నదాన పథకంలో సెక్యూరిటీ సిబ్బందికి, కళాకారులకు మాత్రమే భోజన సౌకర్యం ఉంటుంది. ఫ పశ్చిమ రాజగోపురం వద్ద లారెస్ ఫార్మాస్యూటికల్స్ (విశాఖపట్నం) నిర్మించిన విశ్రాంతి షెడ్డులో సుమారు 5 వేల మంది భక్తులు సేద తీరే అవకాశం ఉంది. ఈ షెడ్డులోనే భక్తులకు వ్రతాలు, దర్శనం, ప్రసాదాల టికెట్ల విక్రయాలకు కౌంటర్లు ఏర్పాటు చేయనున్నారు. రూ.3 కోట్లతో ఏర్పాట్లు కార్తిక మాసంలో లక్షలాదిగా వచ్చే భక్తుల కోసం దాదాపు రూ.3 కోట్ల వ్యయంతో నిర్మాణా లు చేపట్టాం. వివిధ సత్రాలకు రూ.కోటితో మరమ్మతులు చేసి, రంగులు వేయించాం. వ్రతాలాచరించే భక్తుల కోసం కూడా తగిన ఏర్పాట్లు చేశాం. భక్తులను ఇబ్బంది పెట్టవద్దని వ్రత పురోహితులను ఆదేశించాం. రూ.15 లక్షలతో తెప్పోత్సవ ఏర్పాట్లు చురుకుగా జరుగుతున్నాయి. గిరి ప్రదక్షిణకు కూడా ఏర్పాట్లు చేస్తున్నాము. ఇందులో పాల్గొనే భక్తులకు మజ్జిగ, పండ్లు, ఫలహారాలు పంపిణీ చేస్తాం. – వీర్ల సుబ్బారావు, ఈఓ, అన్నవరం దేవస్థానం 22 లక్షల మంది వస్తారని అంచనా గత ఏడాది కార్తికంలో సత్యదేవుని ఆలయానికి 20 లక్షల మంది భక్తులు వచ్చారన్నది అంచనా. ఈసారి 22 లక్షల మందికి పైగా వస్తారని భావిస్తూ ఆ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. 2022 కార్తికంలో 1.42 లక్షలు వ్రతాలు జరిగాయి. 2023లో తుపాన్ల కారణంగా ఆ సంఖ్య 1.25 లక్షలకే పరిమితమైంది. గత ఏడాది కార్తికంలో 1.47 లక్షలకు పెరిగింది. ఈసారి సుమారు 1.50 లక్షల వ్రతాలు జరుగుతాయని అంచనా వేస్తున్నారు. గత ఏడాది కార్తికంలో సత్యదేవుని ప్రసాదం ప్యాకెట్లు 22 లక్షలు విక్రయించారు. ఈసారి 25 లక్షలకు పైగా విక్రయించే అవకాశం ఉంది. దీనికి అవసరమైన గోధుమలు, నెయ్యి, పంచదార సిద్ధంగా ఉంచారు. గత కార్తికంలో సత్యదేవునికి రూ.21.14 కోట్ల ఆదాయం వచ్చింది. ఈసారి రూ.25 కోట్లు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. సాక్షి, కాకినాడ 99516 02838ఫ రేపు రాత్రి ఆకాశ దీపంతో ఉత్సవాల ప్రారంభం ఫ నవంబరు 2న సత్యదేవుని తెప్పోత్సవం ఫ 5న గిరి ప్రదక్షిణ ఫ రత్నగిరిపై విస్తృతంగా ఏర్పాట్లు -
పండగ పూటా.. పస్తులే..
కాకినాడ క్రైం: మహిళా, శిశు సంక్షేమ శాఖ (ఐసీడీఎస్) అనుబంధ విభాగాల్లో పని చేస్తున్న ఉద్యోగులకు పండగ పూటా పస్తులు తప్పడం లేదు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ వంటి ఉన్నత చదువులు చదివి, ప్రభుత్వ ఒప్పంద ఉద్యోగాల్లో చేరి, గొడ్డు చాకిరీ చేస్తున్నా.. వారికి ప్రభుత్వం నెలల తరబడి జీతాలు చెల్లించడం లేదు. ఐసీడీఎస్‌కు అనుబంధంగా జిల్లా బాలల పరిరక్షణ విభాగం (డీపీయూ), శిశుగృహ, వన్‌స్టాప్ సెంటర్ (ఓఎస్సీ), డొమెస్టిక్ వయోలెన్స్ సెల్(డీవీసీ) సీ్త్రలు, బాలలు, శిశువుల సంక్షేమం, సంరక్షణ కోసం పని చేస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా ఈ విభాగాల్లో 40 మంది పని చేస్తున్నారు. వారికి ప్రభుత్వం మూడు నుంచి ఏడు నెలలుగా జీతాలు చెల్లించడం లేదు. దీంతో, దీపావళి పండగ వేళ పిల్లలు నాలుగు టపాసులు కొనమంటే చేతిలో చిల్లిగవ్వ లేక, నిస్సహాయంగా వారి ముఖాలు చూడాల్సి వస్తోందని ఆ ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. శిశుగృహ ఈ విభాగం చిన్నారుల వసతి, సంక్షేమాన్ని పర్యవేక్షిస్తుంది. ఇందులో మొత్తం 12 మంది ఉద్యోగులున్నారు. వీరిలో మేనేజర్, వైద్యుడు, నర్సు, సోషల్ వర్కర్, చౌకీదారుతో పాటు ఆరుగురు ఆయాలుంటారు. నిర్లక్ష్యానికి గురైన శిశువులు, చెత్తకుప్పల్లో దొరికిన ఆడ శిశువులు, రోడ్లు, ఆసుపత్రుల్లో విడిచేసిన పిల్లలకు శిశుగృహే సొంతిల్లు. ఇక్కడి సిబ్బంది పూర్తి సేవా నిరతితో పని చేస్తూంటారు. ఎవరూ లేని అనాథ చిన్నారులను తమ కన్నబిడ్డల్లా చూసుకుంటారు. వారికి జీతాలు చెల్లించి నాలుగు నెలలైంది. వీరి బాధను కనీసం వినే నాథుడే లేడు. డొమెస్టిక్ వయోలెన్స్ సెల్ గృహ హింసకు గురైన ప్రతి మహిళకు డొమెస్టిక్ వయోలెన్స్ సెల్ కొండంత బలాన్నిస్తుంది. ఇంటి నుంచి, తమ వారి నుంచి కూడా పొందలేని రక్షణను ఈ సెల్లో మహిళ పొందగలుగుతుంది. అక్కడి న్యాయనిపుణులు ఆమె సమస్యకు పరిష్కారం సూచిస్తారు. కష్టం నుంచి బయట పడేంత వరకూ ఆమెకు రక్షణగా నిలుస్తారు. ఈ విభాగంలో సోషల్ కౌన్సిలర్, లీగల్ కౌన్సిలర్, డీఈఓ, ఇద్దరు హోంగార్డులు పని చేస్తున్నారు. వీరిలో పోలీసులకు తప్ప మరెవ్వరికీ మూడు నెలలుగా జీతాల్లేవు. విధులకు రావడానికి కూడా వాహనంలో పెట్రోలు కూడా లేక ఇబ్బంది పడుతున్నామని వారు ఆవేదన చెందుతున్నారు. ఫ ఏడు నెలలుగా జీతాల్లేవు ఫ ఉద్యోగుల విలవిల ఫ ఐసీడీఎస్ అనుబంధ విభాగాల్లో దుస్థితి -
వన్‌స్టాప్ సెంటర్
మహిళలు, బాలబాలికలు, మేజర్లు, మైనర్లు ఇలా ఎవరికై నా కష్టమొచ్చిందంటే వారికి కొండంత అండగా నిలుస్తోంది కాకినాడ జీజీహెచ్‌లోని సఖి వన్‌స్టాప్ సెంటర్. బాధితులను సంరక్షించి, తాత్కాలిక వసతి కల్పించి, అన్ని రకాలుగా రక్షణ కల్పిస్తున్నారు. వారి సంరక్షణ కోసం వన్‌స్టాప్ సెంటర్లో పోలీసులు, న్యాయ నిపుణులు కూడా పని చేస్తారు. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ శైలజ ఇటీవల కాకినాడలో పర్యటించిన సందర్భంగా వన్‌స్టాప్ సెంటర్ సేవలను ప్రశంసించారు. ఈ సెంటర్‌కు కలెక్టర్ షణ్మోహన్ స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర అవార్డు అందజేశారు కూడా. ఈ సెంటర్లో ఒక అడ్మినిస్ట్రేటర్, పారా లీగల్ పర్సనల్, కౌన్సిలర్, ఐటీ పర్సన్‌తో పాటు కేసు వర్కర్లు ఇద్దరు, సెక్యూరిటీ గార్డులు, హెల్పర్లు ముగ్గురు చొప్పున మొత్తం 12 మంది ఉన్నారు. వీరిలో ఏ ఒక్కరికీ ఏడు నెలలుగా జీతాలు చెల్లించడం లేదు. అధికారులు సిఫారసులు చేసినా ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ప్రతిష్టంభన కొనసాగుతోంది. జీతాల విడుదలకు రిజర్వు బ్యాంకుకు సిఫారసు చేయాల్సి ఉండగా, ప్రభుత్వం ఆ పని ఇప్పటి వరకూ చేయడం లేదు. దీంతో, ఈ ఉద్యోగుల కంట కన్నీళ్లు తప్పడం లేదు. -
బాలల పరిరక్షణ విభాగం
ఇందులో డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి (డీసీపీఓ), ముగ్గురు పీఓలు, ఒక కౌన్సిలర్, ఇద్దరు సోషల్ వర్కర్లు, ఒక డేటా ఎనలిస్టు, ఒక అకౌంటెంట్, ఒక ఏడీఈఓ, కింది స్థాయిలో అవుట్‌రీచ్ వర్కర్ (ఓఆర్‌డబ్ల్యు) పని చేస్తూంటారు. రోడ్లపై తిరుగుతున్న బాలల నుంచి, చిన్నారులను చంకనెత్తుకొని భిక్షాటన చేస్తున్న వారి వరకూ.. పిల్లలకు ఎక్కడ ఏ కష్టమొచ్చినా వీరు అమాంతం వాలిపోతారు. బాలల సంరక్షణపై నిత్యం సమావేశాలు, అవగాహన సదస్సులు నిర్వహిస్తారు. బాలల హక్కుల పరిరక్షణ, సంక్షేమం కోసం రోడ్లు పట్టి, ఎండనక వాననక పాటు పడతారు. ఆ సేవలకు మంత్రముగ్ధులైన కలెక్టరే వారిని ఘనంగా సత్కరించారు. ఇటువంటి కీలక శాఖలోని సిబ్బందికి నాలుగు నెలలుగా ప్రభుత్వం జీతాలు ఇవ్వడం లేదు. దీంతో, వారి ఇళ్లల్లో ఏ పండగకూ సందడి లేకుండా పోయింది. వీరికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి జీతాలు చెల్లించాలి. అయితే, కేంద్రం నుంచి సొమ్ము రాలేదంటూ రాష్ట్ర ప్రభుత్వం తప్పించుకుంటోంది. బడ్జెట్ విడుదల కాలేదనే సాకుతో మిన్నకుంటోంది. -
నేడు పీజీఆర్ఎస్ రద్దు
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్) కార్యక్రమాన్ని దీపావళి పండగను పురస్కరించుకుని ఈ వారం రద్దు చేశారు. జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి ఆదివారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకుని, ప్రమాదాల బారిన పడకుండా పండగ నిర్వహించుకోవాలని సూచించారు. జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండగ ప్రతి ఇంట్లో వెలుగులు నింపాలని ఆకాక్షించారు. కాలుష్యం లేని, ఆనందకరమైన దీపావళిని ప్రతి ఒక్కరూ నిర్వహించుకోవాలని కోరారు. హరిత టపాసులకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఉత్సాహంగా ‘చెకుముకి’ పోటీలు కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లా స్థాయి చెకుముకి సైన్స్ సంబరాలు నిర్వహించినట్లు జనవిజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కె.భీమయ్య, ఎన్.రవిబాబు ఆదివారం తెలిపారు. జిల్లాలోని అన్ని మండలాల్లోనూ వివిధ పాఠశాలల్లో ఈ సంబరాలు నిర్వహించామన్నారు. నాలుగు స్థాయిల్లో ఈ పోటీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. మొదటి స్థాయిలో పాఠశాల స్థాయి సంబరాలకు 8, 9, 10 తరగతుల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారని తెలిపారు. నవంబర్ 1న మండల, పట్టణ స్థాయిల్లో చెకుముకి పరీక్ష జరుగుతుందని, పాఠశాల స్థాయి విజేతలు ఈ పోటీల్లో పాల్గొనాలని సూచించారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
● అతడి భార్యకు తీవ్రగాయాలు ● విజయవాడ నుంచి ఇచ్చాపురం వెళ్తుండగా ఘటన ప్రత్తిపాడు: మండలం ధర్మవరం గ్రామ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరు గాయ పడిన ఘటన శనివారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం లొద్దిపుట్టి గ్రామానికి చెందిన పిట్టా వసంతకుమార్ (32) విజయవాడలోని ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నాడు. తన స్వగ్రామం వెళ్లేందుకు తన భార్య సంధ్యతో కలిసి బైక్‌పై బయలుదేరాడు. అరకు లోయ వెళ్లి, అక్కడి నుంచి స్వగ్రామం వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు. జాతీయ రహదారిపై ధర్మవరం గ్రామ సమీపంలో రొయ్యల మేత తీసుకువెళ్తున్న వ్యాన్ మరమ్మతులకు గురికావడంతో నిలిపివేశారు. ఆగి ఉన్న వ్యాన్‌ను వసంతకుమార్ బైక్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన సంధ్యను ప్రత్తిపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ తరలించారు. మృతదేహాన్ని శవపరీక్షకై స్థానిక సీహెచ్‌సీ తరలించారు. ప్రత్తిపాడు ఎస్సై ఎస్.లక్ష్మీకాంతం కేసు దర్యాప్తు చేస్తున్నారు.


