breaking news
Rajanna
-
జ్ఞానం పంచుతాం.. ఆకలి తీరుస్తాం
సిరిసిల్లటౌన్: సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలోని పదోవార్డు చిన్నబోనాలలోని ఎస్సీ గురుకుల హాస్టల్లో మెస్ కాంట్రాక్టర్ సరిగ్గా విధులకు హాజరుకాకపోవడంతో ఉపాధ్యాయినులు వంట చేశారు. మెస్ కాంట్రాక్టర్‌కు సమయానికి రాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో విద్యార్థుల ఆకలి తీర్చేందుకు మహిళా టీచర్లు వంట చేసి వడ్డించారు. 540 మంది విద్యార్థులు ఉన్న హాస్టల్లో ఆదివారం సాయంత్రం 4 గంటల వరకు విద్యార్థులకు భోజనం అందలేదు. ఈ విషయం తెలుసుకున్న మాజీ కౌన్సిలర్ సోమవారం స్కూల్‌కు చేరుకొని పాఠశాల సిబ్బందితో కలిసి విద్యార్థులకు వంట చేసి వడ్డించారు. -
హాస్టల్ సౌకర్యం కల్పించాలి
బెస్ట్ అవైలేబుల్ స్కూళ్లకు ఎంపికై న విద్యార్థులకు చదువుతోపాటు హాస్టల్ వసతి కల్పించాలి. మా పిల్లలు తంగళ్లపల్లిలోని సరస్వతి హైస్కూల్లో చదువుతున్నారు. ఈ విద్యాసంవత్సరం స్కూల్ యాజమాన్యం హాస్టల్ సౌకర్యం లేదంటుంది. ప్రభుత్వం రెండేళ్లుగా బిల్లులు ఇవ్వకపోవడంతోనే హాస్టల్ సౌకర్యం కల్పిస్తలేమని స్పష్టం చేసింది. కలెక్టర్ స్పందించి స్కూల్ యాజమాన్యంతో మాట్లాడి విద్యార్థులకు న్యాయం చేయాలి. – బెస్ట్ అవైలేబుల్ విద్యార్థుల తల్లిదండ్రులు -
‘మొక్క’వోని లక్ష్యం చేరేనా !
● జిల్లాలో 6.77లక్షల మొక్కలు లక్ష్యం ● నర్సరీల్లో 12 లక్షల మొక్కలు సిద్ధం ● గ్రామీణులకు అవగాహన కరువు ● లక్ష్యం చేరడంపై అనుమానాలుముస్తాబాద్(సిరిసిల్ల): పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా చేపట్టిన వనమహోత్సవం నీరసంగా కొనసాగుతోంది. గ్రామీణులకు ఈ కార్యక్రమంపై అవగాహన లేకపోవడంతో ముందుకురావడం లేదు. ఉపాధిహామీలో నాటాల్సిన మొక్కలపై అధికారుల నిర్లక్ష్యానికి లక్ష్యం పూర్తయ్యేలా లేదు. జిల్లాలో 6.77లక్షల మొక్కలు నాటాలన్న లక్ష్యం చేరడం అనుమానంగా కనిపిస్తుంది. గతేడాది ఉపాధిహామీలో 6.06లక్షల మొక్కలు నాటారు. తూతు మంత్రంగా నర్సరీలు జిల్లాలో 255 నర్సరీల్లో నామమాత్రంగానే మొక్కల పెంపకం చేపట్టినట్లు విమర్శలు వస్తున్నాయి. జిల్లాలోని అత్యధిక నర్సరీల్లో 3వేల మొక్కలు పెంచారు. అయితే కొన్ని మొక్కలు సరిగ్గా ఎదగలేవు. కొన్ని నర్సరీల్లో ఖాళీ కవర్లే కనిపిస్తున్నాయి. కొన్ని నర్సరీల్లో గతేడాది పెంచిన మొక్కలే కనిపిస్తున్నాయి. వైద్యారోగ్యశాఖ 2వేలు, విద్యాశాఖ 2వేలు, ఇరిగేషన్ 7వేలు, పోలీస్‌శాఖ 4వేలు, వ్యవసాయశాఖ 22వేలు, ఉద్యానవనశాఖ 6వేల మొక్కలు పెంపకం లక్ష్యంగా పెట్టుకున్నారు. కమ్యూనిటీ ప్రదేశాల్లోనే పెంపకం జిల్లాలో పది విడతల్లో హరితహరంలో చేపట్టిన మొక్కల పెంపకంతో ఖాళీ ప్రదేశాలు లేకుండా పోయాయి. ప్రభుత్వ, బంజేరు భూములతోపాటు రోడ్లు, కాల్వల వెంట పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. వనమహోత్సవంలో కులసంఘాల భవనాలు, ఖాళీ ప్రదేశాలతోపాటు ఎండిపోయిన మొక్కల స్థానంలో మళ్లీ నాటే కార్యక్రమాలు చేపట్టారు. ఇప్పటికే కొన్ని గ్రామాల్లో గుంతలు తీసి పెట్టుకున్నారు. వనమహోత్సవం లక్ష్యం బోయినపల్లి 30వేలు చందుర్తి 70వేలు ఇల్లంతకుంట 76వేలు గంభీరావుపేట 76వేలు కోనరావుపేట 80వేలు ముస్తాబాద్ 75వేలు రుద్రంగి 10వేలు తంగళ్లపల్లి 75వేలు వీర్నపల్లి 10వేలు వేములవాడ(ఆర్) 20వేలు వేములవాడ అర్బన్ 10వేలు ఎల్లారెడ్డిపేట 80వేలు సిరిసిల్ల మున్సిపల్ 2.08లక్షలు వేములవాడ మున్సిపల్స్ 2.08లక్షలు -
తల్లిదండ్రులకు విశ్వాసం కల్పించాలని..
సప్తగిరికాలనీ(కరీంనగర్): కరీంనగర్ జిల్లా కేంద్రంలోని రాంనగర్‌కు చెందిన స్రవంతి కరీంనగర్‌రూరల్ మండలం చెర్లభూత్కూర్‌లోని జెడ్పీ హైస్కూల్లో మ్యాథ్స్ టీచర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. స్వస్థలం పెద్దపల్లి జిల్లా ధూళికట్ట కాగా కరీంనగర్లో నివాసముంటున్నారు. భర్త శ్రీకాంత్ ల్యాబ్ టెక్నీషీయన్. కూతురు అమూల్య 6వ తరగతి, కుమారుడు సాయిమోక్షిత్ 4వ తరగతి చదువుతున్నారు. గతంలో వీరు కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు స్కూల్లో చదువగా.. ప్రస్తుతం తల్లి వెంటే చెర్లభూత్కూర్ ప్రభుత్వ బడికి వెళ్తున్నారు. గ్రామంలోని తల్లిదండ్రులకు ప్రభుత్వ బడిపై నమ్మకం కల్పించేందుకు తన పిల్లలనూ అక్కడే చదివిపిస్తున్నట్లు టీచర్ స్రవంతి తెలిపారు. -
సర్కార్ బడికి జైకొట్టి
బడిపై నమ్మకం కల్పించాలని● తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించిన టీచర్లు ● స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న ఉద్యోగులుప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం.. గవర్నమెంట్ టీచర్లపై భరోసా పెంచాలనే పలువురు ఉపాధ్యాయులు తమ పిల్లలను సర్కార్ బడికి పంపుతున్నారు. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా విద్యాబోధన ఉంటుందని చెప్పేందుకే తాము పనిచేస్తున్న స్కూళ్లకు పిల్లలను తీసుకెళ్తున్నారు. సార్లే.. తమ పిల్లలను ఊరిలోని బడికి తీసుకొస్తుంటే.. మిగతా తల్లిదండ్రులు తమ పిల్లలనూ చేర్పిస్తున్నారు. ఇటీవల ఉపాధ్యాయులు చేపట్టిన బడిబాటలో విద్యార్థుల సంఖ్య పెరగడానికి ఇదే కారణం. తమ పిల్లలను సర్కార్ బడికి పంపుతున్న ఉపాధ్యాయులు ఆదర్శంగా నిలుస్తున్నారు.రుద్రంగి(వేములవాడ): తన ముగ్గురు పిల్లలనూ సర్కార్ స్కూళ్లలోనే చదివిపిస్తున్నారు రాజన్నసిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం వీరునితండాకు చెందిన టీచర్ భూక్య తిరుపతి. రుద్రంగి ప్రైమరీ స్కూల్లో టీచర్‌గా విధులు నిర్వర్తిస్తున్న భూక్య తిరుపతికి భూక్య ప్రీతిజ, భూక్య నిహారిక, భూక్య అయాన్ అద్వైత్ పిల్లలు. నిహారికను గతంలో తాను పనిచేసిన రుద్రంగి ప్రైమరీ స్కూల్‌కు తీసుకెళ్లేవారు. ప్రస్తుతం మానాలలోని స్కూల్లో విధులు నిర్వర్తిస్తున్న తిరుపతి తన కొడుకు అయాన్ అద్వైత్ను అదే పాఠశాలకు వెంట తీసుకెళ్తున్నారు. ఇద్దరు కూతుళ్లు భూక్య ప్రీతిజ 10వ తరగతి, భూక్య నిహారిక 7వ తరగతి.. గురుకులాల్లో చదువుతున్నారు. కథలాపూర్(వేములవాడ): కథలాపూర్ మండలం దుంపేటకు చెందిన గుండేటి రవికుమార్–పద్మలత దంపతులు ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులు. వీరు మండలంలోని పోసానిపేట ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ దంపతుల చిన్నకుమారుడు లౌకిక్ నాలుగో తరగతి వారు పనిచేస్తున్న పోసానిపేట ప్రభుత్వ పాఠశాలలోనే చదువుతున్నాడు. నిత్యం తమ వెంటే స్కూల్‌కు తీసుకెళ్తున్నారు. వీరిని చూసి గ్రామంలోని తల్లిదండ్రులు సైతం తమ పిల్లలను పాఠశాలకు పంపడంతో విద్యార్థుల సంఖ్య పెరిగింది. తల్లిదండ్రుల బడికి కొడుకు -
ప్రభుత్వ పాఠశాలలోనే పిల్లలు
యైటింక్లయిన్‌కాలనీ: రామగుండం మండలం న్యూమారేడుపాకలోని నర్సింహపురం(ఎంపీపీఎస్) ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్న ఉపాధ్యాయుడు వి.అనిల్‌కుమార్ తన ఇద్దరు కుమారులను అదే పాఠశాలలో చదివిపిస్తున్నారు. పెద్దకుమారుడు శ్రీహన్ 5వ తరగతి, చిన్నకుమారుడు 2వ తరగతి చదువుతున్నారు. వారిద్దరిని నిత్యం తనతోపాటు బైక్‌పై ప్రభుత్వ బడికి తీసుకొస్తున్నాడు. తను పనిచేస్తున్న పాఠశాలలోనే ఇద్దరు పిల్లలను చదివిపిస్తూ.. గ్రామంలోని తల్లిదండ్రుల్లో నమ్మకం పెంచినట్లు టీచర్ అనిల్‌కుమార్ తెలిపారు. -
మహిళల ఆర్థికాభివృద్ధికి బాటలు
● కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ● 37 మందికి రూ.38 లక్షల రుణాలుసిరిసిల్ల: మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం బాటలు వేస్తోందని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా పేర్కొన్నారు. కలెక్టరేట్లో సోమవారం 37 మంది మహిళలకు రూ.38లక్షల బ్యాంకు రుణాలు అందించారు. కలెక్టర్ మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల(ఎస్‌హెచ్‌జీ) సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం బీమా సౌకర్యం కల్పిస్తుందని తెలిపారు. తీసుకున్న రుణాలతో ఆర్థికంగా బలోపేతమై.. తిరిగి చెల్లించాలని కోరారు. ముస్తాబాద్ మండలంలో 14 మందికి రూ.14.96లక్షలు, తంగళ్లపల్లిలో ఒక్కరికి రూ.30వేలు, గంభీరావుపేటలో 8 మందికి రూ.7.66లక్షలు, వీర్నపల్లి మండలంలో ఇద్దరికి రూ.2.67లక్షలు, ఎల్లారెడ్డిపేట మండలంలో 12 మందికి రూ.13.04లక్షల రుణాలు అందించారు. మహిళా సంఘాల సభ్యులు ఇద్దరు ప్రమాదశాత్తు మరణించగా వారి కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున ఆర్థికసాయాన్ని పంపిణీ చేశారు. సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాభాయ్, డీఆర్డీవో శేషాద్రి, జెడ్పీ సీఈవో వినోద్‌కుమార్ పాల్గొన్నారు. పర్యావరణ్ కాంపిటీషన్ పోస్టర్ ఆవిష్కరణ జిల్లాలో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించేందుకు నేషనల్ స్టూడెంట్ పర్యావరణ్ కాంపిటీషన్–2025 పోస్టర్‌ను కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా సోమవారం ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణలో భాగంగా నీటిసంరక్షణ, చెట్లు నాటడం, తడి పొడిచెత్త వేరు చేయడం అనే అంశాల మీద అవగాహన కల్పించాలన్నారు. జిల్లా విద్యాధికారి వినోద్ కుమార్, డీవైఎస్వో రాందాస్, జాతీయ హరిత దళం కోఆర్డినేటర్ పాముల దేవయ్య పాల్గొన్నారు. -
ముంపు గ్రామాల్లో ప్రత్యేక శిబిరాలు
● చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సిరిసిల్ల: మధ్యమానేరు ముంపు గ్రామాల నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, ప్రత్యేక శిబిరాలు నిర్వహించి దరఖాస్తులు తీసుకుంటామని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. కలెక్టరేట్లో సోమవారం బోయినపల్లి మండలంలోని ముంపు గ్రామాలు కొదురుపాక, వరదవెల్లి, నీలోజిపల్లి నిర్వాసితులతో సమావేశమయ్యారు. ఎమ్మెల్యే సత్యం అర్హులందరికీ పరిహారం, మిగతా ప్రయోజనాలు అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. దరఖాస్తులపై మరోసారి అధికారులతో సర్వే చేయిస్తామని తెలిపారు. కొదురుపాకలో గురువారం, వరదవెల్లిలో శుక్రవారం, నీలోజిపల్లిలో శనివారం రెవెన్యూ అధికారులు ప్రత్యేక శిబిరం నిర్వహించి దరఖాస్తులు స్వీకరిస్తారని స్పష్టం చేశారు. కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా, వేములవాడ ఆర్డీవో, ఎస్డీసీ రాధాబాయ్, బోయినపల్లి తహసీల్దార్ నారాయణరెడ్డి, కలెక్టరేట్ పర్యవేక్షకులు శ్రీకాంత్, ముంపు గ్రామాల ఐక్యవేదిక ప్రతినిధి కూస రవీందర్ తదితరులు పాల్గొన్నారు. గ్రీవెన్స్ డేతో భరోసా సిరిసిల్లక్రైం: సమస్యల పరిష్కార లక్ష్యంగా, బాధితులకు భరోసాగా నిలిచేందుకు గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నట్లు ఎస్పీ మహేశ్ బీ గీతే పేర్కొన్నారు. జిల్లా పోలీస్ ఆఫీస్‌లో సోమవారం 27 ఫిర్యాదులు స్వీకరించారు. వెంటనే పరిష్కరించాలని ఆయా ఠాణాల అధికారులకు సూచించారు. అప్రమత్తంగా ఉండాలిఇల్లంతకుంట(మానకొండూర్): వర్షాకాలంలో వచ్చే వ్యాధులపై వైద్యసిబ్బంది అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్‌వో రజిత సూచించారు. స్థానిక పీహెచ్‌సీని సోమవారం తనిఖీ చేశారు. మందుల నిల్వలపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ శాంత ఉద్యోగ విరమణ సందర్భంగా ఆమెను సన్మానించారు. వైద్యులు శరణ్య, జీవనజ్యోతి, ప్రోగ్రాం అధికారులు డాక్టర్ అంజేలియో ఆల్ఫ్రెడ్, నయీమ్జహ, రామకృష్ణ, అనిత, హెచ్‌ఈవో వెంకటరమణ ప్రసాద్ పాల్గొన్నారు. సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్‌గా ఖదీర్‌పాషా సిరిసిల్ల: మున్సిపల్ కమిషనర్‌గా ఖదీర్‌పాషా సోమవారం విధుల్లో చేరారు. నిజామాబాద్ మున్సిపల్ నుంచి పదోన్నతిపై సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్‌గా ఇటీవల బదిలీ అయ్యారు. ఇన్చార్జి కమిషనర్ పి.వాణి పూలమొక్క అందించి స్వాగతం పలికారు. మున్సిపల్ డీఈఈగా ఉన్న వాణి ఇన్చార్జి కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. పూర్తిస్థాయి కమిషనర్ రావడంతో ఆమె డీఈఈగా కొనసాగనున్నారు. టీపీవో సాయికృష్ణ, మున్సిపల్ అధికారులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. ఇరిగేషన్ ఇన్చార్జి ఈఈగా ప్రశాంత్ సిరిసిల్ల: జిల్లా నీటిపారుదలశాఖ ఇన్చార్జి ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్‌గా టి.ప్రశాంత్ బాధ్యతలు స్వీకరించారు. చందుర్తిలో ఇరిగేషన్ డీఈఈగా విధులు నిర్వహించే ప్రశాంత్‌కు ఇరిగేషన్ శాఖ ఈఈగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. -
అర్జీలు స్వీకరించి.. పరిష్కారానికి ఆదేశించి
– వివరాలు 8లోu ● ప్రజావాణిలో 157 దరఖాస్తుల స్వీకరణ ● సమస్యలు ఆలకించిన కలెక్టర్ సందీప్కుమార్ఝాసిరిసిల్లఅర్బన్: క్షేత్రస్థాయిలో సమస్యలు పరి ష్కారం కాక బాధితులు కలెక్టరేట్ బాట పడుతున్నారు. జిల్లా నలుమూలల నుంచి సోమవారం కలెక్టరేట్లోని ప్రజావాణికి భారీగా బాధితులు త రలివచ్చారు. అర్జీదారుల నుంచి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాబా యి, డీఆర్డీవో శేషాద్రి అర్జీలు స్వీకరించారు. ఈ ప్రజావాణిలో మొత్తం 157 దరఖాస్తులు వ చ్చా యి. ఆయా దరఖాస్తులను పరిశీలిస్తూ పరి ష్కారానికి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లా రు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి ప్రతి ఒక్కరు కృషిచేయాలన్నారు. -
పిల్లల చేయిపట్టి.. సర్కార్ బడికి జైకొట్టి
తాము పనిచేస్తున్న సర్కార్ స్కూళ్లపై నమ్మకం పెంపొందించడం.. విద్యార్థుల సంఖ్య పెంచడమే లక్ష్యంగా టీచర్లు తమ పిల్లలను తమతోపాటే తీసుకెళ్తున్నారు. ప్రభుత్వ కొలువు చేస్తూ ప్రైవేట్ స్కూళ్లకు పంపడం సరికాదని.. సర్కార్ స్కూళ్లలో చేర్పించారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని.. ప్రైవేట్‌కు దీటుగా విద్యాబోధన సాగుతోందంటూ టీచర్లు చాటిచెబుతున్నారు. పిల్లలను తాము పనిచేస్తున్న స్కూళ్లకు తీసుకెళ్తూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ ఉపాధ్యాయులు. ● ప్రభుత్వ పాఠశాలకు పంతుళ్ల పిల్లలు ● నమ్మకం కల్పిస్తున్న టీచర్లు ● స్ఫూర్తి పొందుతున్న తల్లిదండ్రులు ● సర్కార్ స్కూళ్లలో పెరుగుతున్న ప్రవేశాలు తమతోనే పిల్లలు రాయికల్: జగిత్యాల జిల్లా రాయికల్‌కు చెందిన పుర్రె రమేశ్, కవిత దంపతులు ప్రభుత్వ ఉపాధ్యాయులు. రమేశ్ రాయికల్ హైస్కూల్లో పీడీగా, కవిత రాయికల్ మండలం ఇటిక్యాలలోని ప్రైమరీ స్కూల్లో టీచర్‌గా పనిచేస్తున్నారు. వీరి కూతురు ఆరాధ్యను వారు పనిచేస్తున్న స్కూల్లో చేర్పించారు. మొదట్లో కవిత పనిచేసిన భూపతిపూర్‌లో 1 నుంచి 3వ తరగతి, ప్రస్తుతం ఇటిక్యాలలో 4వ తరగతిలో చేర్పించారు. పిల్లలనూ సర్కార్ బడికే.. ఇల్లంతకుంట: మండలంలోని వంతడుపుల గ్రామానికి చెందిన రెవెన్యూ ఉద్యోగి యామ రాజు తన ఇద్దరు కూతుళ్లను ప్రభుత్వ బడిలోనే చేర్పించారు. రాజు కూతుళ్లు యామ ధీరజ, తనూజ మండలంలోని రహీంఖాన్‌పేట ప్రభుత్వ మోడల్ స్కూల్లో చదువుతున్నారు. పెద్ద కూతురు ఇంటర్లో 987 మార్కులు సాధించి ప్రస్తుతం కోటిలోని ఉమెన్స్ డిగ్రీ కాలేజీలో చేరింది. చిన్నకూతురు తనూజ మోడల్స్కూల్లో పదో తరగతి చదువుతోంది.కోనరావుపేట: కోనరావుపేట మండల కేంద్రానికి చెందిన తీపిరి సంజీవ్ స్థానిక మండల పరిషత్ పాఠశాలలో పనిచేస్తున్నారు. తన కుమారుడు జయసూర్యని కూడా అదే పాఠశాలలో రెండో తరగతి చదివిస్తున్నారు. ప్రతి రోజూ తండ్రీకొడుకులు బైక్‌పై స్కూల్‌కు వెళ్లి వస్తున్నారు. కథలాపూర్(వేములవాడ): మండలంలోని దుంపేట ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో పనిచేస్తున్న లింగంపేట సతీశ్ తన కొడుకు వరుణ్‌తేజ్ అదే స్కూల్లో 8వ తరగతి చదువుతున్నారు. తల్లీకొడుకులు ఒకే బడికి.. కోరుట్ల: ఈ తల్లులు ప్రభుత్వ టీచర్లు. తమ పిల్లలను సైతం వారు పనిచేస్తున్న స్కూళ్లకు తీసుకెళ్తూ విద్యాబుద్ధులు నేర్పుతున్నారు. కోరుట్ల మండలం అయిలాపూర్‌లో ప్రాథమికోన్నత పాఠశాలలో ఎస్జీటీగా పనిచేస్తున్న సీహెచ్ శ్రీలక్ష్మీ తన కుమారుడు శ్రీయాన్‌ను అదే స్కూల్లో 4వ తరగతిలో చదివిపిస్తున్నారు. నిత్యం తనతోపాటు స్కూల్‌కు తీసుకెళ్తున్నారు. శ్రీలక్ష్మీ మాట్లాడుతూ.. ప్రభుత్వ స్కూళ్లలో స్వేచ్ఛాపూరిత వాతావరణంలో విద్యాభ్యాసం సాగుతోందని, అప్పుడే విద్యార్థుల్లో సృజనాత్మకశక్తి పెరుగుతుందన్నారు. కోరుట్లరూరల్: కోరుట్ల మండలం మాదాపూర్ ప్రాథమిక పాఠశాల ఎస్జీటీ ఎలిగేటి రాజమణి తన కుమారుడిని అదే పాఠశాలలో చదివిస్తోంది. కోరుట్లకు చెందిన రాజమణి తన కొడుకు హిమాన్ష్‌ను తాను పనిచేస్తున్న స్కూల్లోనే 3వ తరగతిలో చేర్పించింది. నిత్యం బైక్‌పై కొడుకును తీసుకొని స్కూల్‌కు వెళ్లి వస్తోంది. రెండేళ్ల క్రితం ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండిలో పనిచేసే సమయంలోనూ తన కొడుకును తీసుకెళ్లేవారు. ప్రభుత్వ పాఠశాలలో ఉత్తమ బోధన అందుతుండడంతోనే తీసుకెళ్తున్నట్లు రాజమణి తెలిపారు. జ్యోతినగర్: ఎన్టీపీసీ రామగుండం టెంపరరీ టౌన్‌షిప్‌లోని జెడ్పీ హైస్కూల్లో ఫిజికల్ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న జావెద్ తన పిల్లలను అదే బడిలో చదివిపిస్తున్నారు. తన పెద్ద కొడుకు నవీదుల్ రెహమాన్‌ను అదే స్కూల్లో 7వ తరగతి, చిన్న కొడుకు టిప్పు ఉల్ రహమాన్‌ను దుర్గయ్యపల్లి స్కూల్లో 4వ తరగతిలో చేర్పించాడు. ధర్మపురి: ధర్మపురి మండలం రాయపట్నం స్కూల్లో పనిచేస్తున్న బండారు రాజు తన కొడుకు రోహన్‌ను అదే బడిలో 3వ తరగతిలో చేర్పించారు. గతంలో వెల్గటూర్ మండలం కిషన్‌రావుపేటలో పనిచేసిన సమయంలో తన వెంటే కొడుకును తీసుకెళ్లారు. బోధనపై నమ్మకంతో.. వేములవాడ: కథలాపూర్ స్కూల్లో పనిచేస్తున్న టీచర్ కిష్టయ్య తన కూతురు మధురిమను వేములవాడలోని బాలికల హైస్కూల్లో చేర్పించారు. ప్రస్తుతం 9వ తరగతి చదువుతోంది. ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య అందుతుందనే చేర్పించినట్లు కిష్టయ్య పేర్కొన్నారు. జమ్మికుంట: ప్రభుత్వ పాఠశాలలో బోధనపై నమ్మకం కల్పించేందుకు తన కుమారుడిని చేర్పించినట్లు టీచర్ బానోత్ సత్యజోస్ తెలిపారు. భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం పర్లపల్లిలోని స్కూల్లో సత్యజోస్ టీచర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. జమ్మికుంటలో ఉంటున్నారు. ఏడాది క్రితం బదిలీపై పర్లపల్లి పాఠశాలకు వచ్చారు. తన కొడుకు బానోతు సుశాంత్‌ను జమ్మికుంట హైస్కూల్లో 9వ తరగతిలో చేర్పించారు. విద్య వ్యాపారం కాదని.. సారంగాపూర్: ప్రస్తుతం విద్యను వ్యాపారం చేసేశారని.. కాదని చెప్పేందుకే తన పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివిపిస్తున్నట్లు గొడుగు మధుసూదన్ తెలిపారు. బీర్పూర్ మండలం నర్సింహులపల్లికి చెందిన మధుసూదన్ కండ్లపల్లిలో టీచర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. పెద్ద కుమార్తె నిత్య 10వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలో చదివి ప్రస్తుతం ఇంటర్మీడియెట్‌లో చేరింది. చిన్న కూతురు శ్రీనిధి నర్సింహులపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. కండ్లపల్లిలో విధులు నిర్వహిస్తూనే నర్సింహులపల్లిలోని స్కూల్‌కు వెళ్లి అదనంగా ఒక పీరియడ్ బోధిస్తున్నారు. -
మామిడి తోట.. పేలిన తూటా!
● ప్రభుత్వంతో చర్చల ప్రతినిధి రియాజ్‌తోపాటు నలుగురి ఎన్కౌంటర్ ● బందనకల్ ఎన్‌కౌంటర్‌కు 20 ఏళ్లు ● హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నేడు సంస్మరణ సభ ● శాంతమ్మ సమర గాథ సీడీ ఆవిష్కరణ సిరిసిల్ల: అది 2005 జూలై 1వ తేదీ... అప్పుడే తెల్లవారుతోంది.. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్–సిద్దిపేట ప్రధాన రహదారి పక్కనే మామిడితోట.. అక్కడ అన్నీ పోలీసు జీపులు.. సాయుధ పోలీసుల పహరా.. పొలాల వద్దకు వెళ్లే రైతులను అటుగా వెళ్లకుండా.. కట్టడి చేస్తున్న పోలీసులు.. ఏంజరిగిందో తెలియక స్థానికుల హైరానా.. పొద్దెక్కుతోంది.. సూర్యుడు ఎరుపెక్కుతున్నాడు.. నేలపై గడ్డిపరకలపై మంచు బిందులు తడారిపోతున్నాయి.. మామిడి తోటలో నాలుగు శవాలు రక్తం ముద్దలుగా ఉన్నాయి. బందనకల్‌లో జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు సీపీఐ(ఎంఎల్) జనశక్తి నక్సలైట్టు మృతి చెందారు. ఆ ఎన్కౌంటర్ మృతుల్లో 2004 అక్టోబరులో ప్రభుత్వం నక్సలైట్లతో జరిపిన శాంతి చర్చల జనశక్తి ప్రతినిధిగా వచ్చిన రియాజ్ అలియాస్ వెంకటేశ్ ఉన్నారు. మరో ముగ్గురిలో మానేరు ప్రాంత దళనాయకులు గంభీరావుపేట మండలం ముచ్చర్లకు చెందిన రాగుల శ్రీశైలం అలియాస్ విజయ్, సిద్దిపేట జిల్లా చిట్టాపూర్‌కు చెందిన గౌతమ్, జనగామ జిల్లా కడవెండికి చెందిన పెద్దిరాజు ఉన్నారు. ఆ ఘటన జరిగి సరిగ్గా నేటికి 20 ఏళ్లు అవుతుంది. చెల్లాచెదురుగా శవాలు బందనకల్–మోహిణికుంట శివారుల్లోని మామిడితోటలో ఎన్కౌంటర్ శవాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. అందరి చేతుల వద్ద కిట్ బ్యాగులు.. ఆయుధాలు.. రియాజ్ శవం వద్ద విప్లవ సాహిత్యం.. తూటా గాయాలతో.. రక్తం గడ్డకట్టి.. నలుపెక్కిపోయింది. శవాలు విసిరేసినట్లుగా పడిఉన్నాయి. అప్పటి జిల్లా ఓఎస్డీ (ఆపరేషన్ ఆన్ స్పెషల్ డ్యూటీ) సంఘటన స్థలానికి వచ్చేంత వరకు మీడియాను అనుమతించకుండా పోలీసులు కట్టడిచేశారు. సాయుధ నక్సలైట్లు మామిడితోటలో సమావేశమైనట్లు అందిన సమాచారం మేరకు ప్రత్యేక పోలీసులతో గాలింపులు జరుపుగుతుండగా.. పోలీసులను చూసి నక్సలైట్లు కాల్పులు జరిపారు.. ఆత్మరక్షణ కోసం పోలీసులు జరిపిన కాల్పుల్లో నలుగురు సాయుధ నక్సలైట్లు చనిపోయారు. మిగితా వాళ్లు తప్పించుకున్నారు.. ఇది ఓఎస్డీ ప్రకటన సారాంశం. ఎన్‌కౌంటర్‌కు ముందే.. బంధీలు అయ్యారని పత్రికల్లో ప్రకటన హైదరాబాద్ కాచీగూడ ప్రాంతంలో జనశక్తి చర్చల ప్రతినిధి రియాజ్ మరో ముగ్గురిని అప్పటి కరీంనగర్ జిల్లా పోలీసులు బంధించారని, వారిని ఎన్కౌంటర్ చేసే ప్రమాదం ఉందని, రాజ్యాంగ బద్దంగా వారిపై ఏమైనా పోలీసులు కేసులు ఉంటే.. వెంటనే కోర్టులో హాజరు పరచాలని అప్పటి ‘జనశక్తి’ ప్రతినిధి చందన్న, ఇతర ప్రజాసంఘాల పేరిట ప్రకటన వెలువడింది. ఆ ప్రకటన అన్ని ప్రముఖ పత్రికల్లో ఎన్కౌంటర్ కంటే ముందే ప్రచురితమైంది. కానీ.. ఆ నలుగురిని పట్టించిన కోవర్టును రక్షించుకోడానికి ఆ రాత్రి ఎన్కౌంటర్ పోలీసులకు అనివార్యమైంది. శాంతి దూతను చంపుతారా? అంటూ.. అప్పటి టీఆర్ఎస్(బీఆర్ఎస్) ఎమ్మెల్యేలు ఆ ఎన్‌కౌంటర్‌ను ఖండించారు. హోంమంత్రి జానారెడ్డి ఎన్‌కౌంటర్‌పై విచారం వ్యక్తం చేశారు. రియాజ్ కుటుంబానికి ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. చంపి సాయం చేయడం ఏమిటని రియాజ్ భార్య లక్ష్మీదేవి సర్కార్ సాయాన్ని తిరస్కరించారు. అప్పట్లో ఈ ఎన్కౌంటర్ చర్చనీయాంశమైంది. ప్రభుత్వం ఒకింత ఢిపెన్స్‌లో పడింది. న్యాయవిచారణకు ఆదేశించింది. కావలి నుంచి సిరిసిల్లకు.. ఎన్కౌంటర్ మృతుడు రియాజ్ అలియాస్ వెంకటేశ్ సొంతూరు నెల్లూరు జిల్లా కావలి సమీపంలోని అయ్యంగారిపల్లె. నిరుపేద మత్స్యకారుల కుటుంబంలో పుట్టిన వెంకటేశ్ ఉన్నత చదువుల కోసం హైదరాబాద్‌కు వచ్చారు. పుస్తకాల పురుగుగా.. నిరంతరం అధ్యయనం చేసే వెంకటేశ్ ప్రజాఉద్యమాల్లో పాల్గొంటూ.. జనశక్తి పార్టీ పక్షాన 2004లో చర్చల ప్రతినిధి అయ్యాడు. ఆ చర్చల్లో జనశక్తి పక్షాన వేములవాడకు చెందిన కూర దేవేందర్ అలియాస్ అమర్ ప్రముఖుడు. రెండో వ్యక్తి రియాజ్. బందనకల్ ఎన్కౌంటర్లో మరణించిన మరో మృతుడు జనశక్తి లీగల్ ఆర్గనైజర్ పెద్ది రాజు విద్యావంతుడు. మారుమోగిన రియాజ్ పాటలు బందనకల్ ఎన్కౌంటర్ మృతుడు రియాజ్‌పై అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అనేక పాటలను వెలువరించింది. మిత్రకలం పేరుతో అమర్ రాసిన పాటను విమలక్క గానంచేసింది. శ్ఙ్రీకడలి నిన్ను కడుపులోన దాసుకున్న రాతిరి.. అలలే ఊయలగా నిను ఆడించిన రాతిరి.. అయ్యంగారిపల్లె.. హాహాకారాల్లో కరిగి.. కన్నతండ్రి వలలోకి కన్నబిడ్డనిచ్చిన రుద్రుడు ఆ సముద్రుడికి ఉన్న మనసు.. ఈ కాంగ్రెసు సర్కారుకు లేక పాయే.. రియాజు.. రియాజు నా వెంకటేశూ.. అంటూ.. సాగే పల్లవితో వచ్చిన పాటతో పాటు.. బందనకల్ ఎన్కౌంటర్ మృతుల స్మృతి గీతాలు ఆరు పాటలు పల్లెల్లో మారుమోగాయి. రియాజ్‌పై అనే క వ్యాసాలు వచ్చాయి. ఆయన రచనలపై పీడీఎస్‌యూ(విజృంభణ) పుస్తకం ప్రచురించింది. నేడు హైదరాబాద్‌లో సంస్మరణ సభ బందనకల్ అమరుల 20వ వర్ధంతి సభను హైదరాబాద్ సుందరయ్యవిజ్ఞాన కేంద్రంలో మంగళవారం తెలంగాణ రాష్ట్ర అమరుల స్మారక కమిటీ పేరుతో వర్ధంతి సభ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శాంతమ్మ సమరగాథ పాటల సీడీని ఆవిష్కరించనున్నారు. అమరవీరుల స్మారక కమిటీ కన్వీనర్ డేగల రమ, జస్టిస్ చంద్రకుమార్, ప్రొఫెసర్ జి.హరగోపాల్, జీవన్‌కుమార్, ఆచార్యా కట్టా భగవంతరెడ్డి, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య గౌరవాధ్యక్షురాలు విమల, నాగిరెడ్డి, వెల్తురు సదానందం, మల్లేశం, టి.అంజయ్య, అల్లూరి విజయ్, ఏపూరి మల్సూర్, రమేశ్ పోతుల, అరుణ, రాయమల్లు పాల్గొననున్నారు. -
నాన్న వెంటే పిల్లలు
కరీంనగర్‌స్పోర్ట్స్: తాము పనిచేస్తున్న ప్రభుత్వ పాఠశాలలకు తమ పిల్లలను తీసుకెళ్తున్నారు ఈ తండ్రులు. వీరిని చూసి గ్రామంలోని తల్లిదండ్రులు సైతం తమ పిల్లలను సర్కార్ బడులకు పంపుతున్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ఒద్యారం గ్రామానికి చెందిన సత్యనారాయణ ప్రస్తుతం వేములవాడలోని జెడ్పీ హైస్కూల్(బాలికలు)లో విధులు నిర్వర్తిస్తున్నారు. కరోనా సంక్షోభానికి ముందు కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తూ పిల్లలనూ అక్కడే చదివిపించేవారు. అనంతరం ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం రావడంతో తాను పనిచేస్తున్న స్కూల్‌కే తన పిల్లలను తీసుకెళ్తున్నారు. పెద్ద కూతురు అనన్య ప్రభాస 8వ తరగతి, చిన్నకూతురు ప్రవస్థి 5వ తరగతి చదువుతున్నారు. -
‘మానసిక సమస్యలను నిర్లక్ష్యం చేయొద్దు’
సిరిసిల్లటౌన్: మానసిక సమస్యలపై నిర్లక్ష్యం చేయొద్దని మైండ్ కేర్ అండ్ కౌన్సిలింగ్ సెంటర్ సైకాలజిస్టు పున్నంచందర్ సూచించారు. ప్రగతినగర్‌లోని నేతకార్మికులకు సోమవారం కౌన్సిలింగ్ నిర్వహించారు. నిద్రలేమితో మానసిక సమస్యలు, శారీరక అనారోగ్యాలు వస్తాయన్నారు. జీవనశైలిలో మార్పులతో బ్లడ్‌ప్రెషర్, డయాబెటీస్, క్యాన్సర్స్ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు. అనుకూల దృక్పథంతో ముందుకెళ్లాలని సూచించారు. భార్యాభర్తల మధ్య మనస్పర్థలను తొలగించేందుకు మైండ్‌కేర్ సెంటర్ ద్వారా ఫ్యామిలీ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మైండ్‌కేర్ అండ్ కౌన్సిలింగ్ సెంటర్ సిబ్బంది కొండ ఉమ, రాపెల్లి లత, బూర శ్రీమతి పాల్గొన్నారు. ఆర్టీసీ టూర్ ప్యాకేజీకి స్పందన ● సిరిసిల్ల డీఎం ప్రకాశ్‌రావు సిరిసిల్లటౌన్: ఆర్టీసీ ఆధ్వర్యంలో చేపట్టిన ఆధ్యాత్మికత యాత్రలకు ప్రయాణికుల నుంచి విశేష స్పందన వచ్చిందని సిరిసిల్ల డీఎం ప్రకాశ్‌రావు పేర్కొన్నారు. ఈనెల 27న సిరిసిల్ల నుంచి వివిధ ఆలయాల సందర్శనకు ఆర్టీసీ ప్రవేశపెట్టిన టూర్ ప్యాకేజీ విశేషాలను సోమవారం మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక బస్సు నడపడంతో ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేశారన్నారు. అరుణాచలం. మంత్రాలయం, భద్రాచలం, పంచారామాలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు. 30 నుంచి 40 మంది ప్రయాణికులు సిద్ధంగా ఉంటే బస్సును ఏర్పాటు చేస్తామని తెలిపారు. వివరాలకు 90634 03971, 6304 17121, 73828 50616, 99592 25929లలో సంప్రదించాలని కోరారు. -
నిధులు లేక నిరాధరణ
గంభీరావుపేట(సిరిసిల్ల): నిధుల కొరత.. పాలకుల నిర్లక్ష్యానికి జిల్లాలోని ఏకై క చేపపిల్లల ఉత్పత్తికేంద్రం నిరాధరణకు గురవుతుంది. 50 ఏళ్ల క్రితం నర్మాల ఎగువమానేరు జలాశయంలోని నీటిని ఆధారం చేసుకొని దాదాపు 16 ఎకరాల్లో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఆఫీస్ భవనం, ఫిష్పాండ్స్ శిథిలావస్థకు చేరాయి. కార్యాలయంలోని సామగ్రి పాడైపోయింది. అక్కడికి వెళ్లేందుకు కనీసం రోడ్డు సౌకర్యం కూడా లేదు. ఇక్కడ మూడేళ్లుగా చేపపిల్లల ఉత్పత్తి, పెంపకం నిలిచిపోయింది. ఫిష్పాండ్స్ పగుళ్లుబారాయి. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన టార్పాలిన్ కవర్లకు సైతం కాలం చెల్లిపోయింది. పాడైపోతున్న సామగ్రి ఏటా వేలాది చేపపిల్లలను ఉత్పత్తి చేసి తక్కువ ధరకు మత్స్యకారులకు అందించాలనే లక్ష్యంతో ఏర్పాటైన కేంద్రం పాలకుల నిర్లక్ష్యానికి గురవుతుంది. భవనాలు, ఫిష్పాండ్స్, సామగ్రి పాడైపోతున్నాయి. ఏళ్ల తరబడి నిధులు లేక మరమ్మతులకు నోచుకోవడం లేదు. కేంద్రాన్ని పునరుద్ధరిస్తే స్థానిక మత్స్యకారులకు, రైతులకు ఎంతో మేలు కలుగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పాతపాండ్స్ను తొలగించి కొత్తవి నిర్మించి చేపపిల్లల ఉత్పత్తి చేయాలని మత్స్యకారులు కోరుతున్నారు. మత్స్యకారులకు శిక్షణ కేంద్రంగా సైతం అభివృద్ధి చేయవచ్చు. గతంలో కేంద్రం పునరుద్ధరణకు అధికారులు రూ.60లక్షల అంచనాతో ప్రతిపాదనలు పంపినా మరమ్మతుకు నోచుకోలేదు. నీరసించిపోతున్న చేపపిల్లల ఉత్పత్తి కేంద్రం శిథిలావస్థలో భవనం.. ఫిష్పాండ్స్ 50 ఏళ్ల క్రితం 16 ఎకరాలలో ఏర్పాటు పట్టించుకోని పాలకులు, అధికారులు -
లోలెవల్ కష్టాలు తీరేదెప్పుడో?
● కల్వర్టులపై నుంచి పారుతున్న వరద ● వర్షాకాలంలో నిలిచిపోతున్న రాకపోకలు ● ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు ● పట్టించుకోని అధికారులుఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): వర్షాకాలం వచ్చిందంటే జిల్లాలో 95 లోలెవల్ కల్వర్టుల వద్ద వరద పొంగి ప్రవహిస్తుంటుంది. ఫలితంగా పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోతున్నాయి. కొన్నేళ్లుగా ఈ సమస్య ఎదురవుతున్నా పాలకులు, అధికారులు పట్టించుకోవడం లేదు. జిల్లా వ్యాప్తంగా 1,636 రహదారులుండగా.. 95 రహదారులపై గల లోలెవల్ కల్వర్టులపై నుంచి నీరు పారుతోంది. చందుర్తి, రుద్రంగి, కోనరావుపేట, వీర్నపల్లి, ఎల్లారెడ్డిపేట, ఇల్లంతకుంట, ముస్తాబాద్ మండలాల్లో వరదకష్టాలు ఎక్కువగా ఉన్నాయి. ఆర్అండ్బీ, పంచాయతీరాజ్‌శాఖల మధ్య సమన్వయం లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రయాణం నరకం ● ఎల్లారెడ్డిపేట మండలం పదిర, ముస్తాబాద్ మండలం రామలక్ష్మణపల్లి మధ్య మానేరువాగుపై వంతెన నిర్మాణం కలగానే మిగిలిపోయింది. మానేరువాగుపై వంతెన నిర్మాణానికి సుమారు రూ.50కోట్ల వరకు ఖర్చవుతుందని అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అక్కపల్లి వద్ద వాగు పొంగుతుండడంతో ప్రతీ సీజన్లో రాకపోకలు నిలిచిపోతున్నాయి. ● ఎల్లారెడ్డిపేట ఉమ్మడి మండలంలోనే నాలుగు రూట్లలో 8 లోలెవల్ కల్వర్టులతో 17 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతున్నాయి. జిల్లాలో రోడ్ల వివరాలు రోడ్ల విస్తీర్ణం : 595.869 కిలోమీటర్లు బీటీ రోడ్లు : 570.061 కిలోమీటర్లు మట్టి రోడ్లు : 5.05 కిలోమీటర్లు సీసీ రోడ్లు : 20.308 కిలోమీటర్లు పంచాయతీరాజ్ రోడ్లు : 1,041 కిలోమీటర్లు ఆర్అండ్బీ రోడ్లు : 595 కిలోమీటర్లు లోలెవల్ వంతెనలు, కల్వర్టులు : 95 ఇది ఎల్లారెడ్డిపేట మండలం పదిర–రామలక్ష్మణుపల్లి గ్రామాల మధ్య గల మానేరువాగుపై ఉన్న లోలెవల్ వంతెన. గతంలో కురిసిన వరదనీటితో కల్వర్టు కొట్టుకుపోవడంతో ప్రస్తుతం మానేరువాగుపై తాత్కాలికంగా రోడ్డు వేశారు. రూ.50కోట్లతో వంతెన నిర్మించాలన్న ప్రతిపాదనలు బుట్టదా ఖలయ్యాయి. ఫలితంగా ఏటా వర్షాకాలంలో మానేరువాగు పొంగి రాకపోకలు నిలిచిపోతున్నాయి. శాశ్వత పరిష్కారంగా వంతెన నిర్మించాలనే డిమాండ్ ఉంది. ఇది ఎల్లారెడ్డిపేట మండలం అక్కపల్లి శివారులోని లేతమామిండ్లవాగుపై ఉన్న లోలెవల్ కల్వర్టుపై నుంచి పారుతున్న వరదనీరు. చిన్నపాటి వర్షానికి ఇక్కడ వరద వచ్చి మండల కేంద్రానికి అక్కపల్లి మధ్య రాకపోకలు నిలిచిపోతుంటాయి. అంతేకాకుండా కోనరావుపేట– ఎల్లారెడ్డిపేట మండలాల మధ్య సంబంధాలు తెగిపోతున్నాయి. ఈ వాగుపై వంతెన నిర్మించాలన్న విన్నపాలు నెరవేరడం లేదు. ఇలాంటి పరిస్థితులు జిల్లా వ్యాప్తంగా 95 లోలెవల్ కల్వర్టుల వద్ద ఉంది. ఏటా వర్షాకాలంలో లోలెవల్ కల్వర్టుల కష్టాలు తీరడం లేదు. -
గడువులోగా గగనమే !
● ఈనెలాఖరులోగా సగం బట్ట ఉత్పత్తి అసాధ్యం ● ఇందిరా మహిళాశక్తి చీరల ఆర్డర్లు 4.30కోట్ల మీటర్లు ● ఇప్పటికీ ఉత్పత్తి 80 లక్షల మీటర్లు ● ఇంకా 3.50 కోట్ల మీటర్లు ఉత్పత్తి చేయాలి ● కార్మికుల కొరత.. నాణ్యత మెలికసిరిసిల్ల: మహిళా శక్తి చీరల ఉత్పత్తి నత్తకు నడక నేర్పేలా సాగుతోంది. ఈనెలాఖరులోగా సగం లక్ష్యం పూర్తి చేయడం అసాధ్యంగా కనిపిస్తోంది. సిరిసిల్లలో 131 మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ (మ్యాక్స్) సంఘాల పరిధిలో 27వేల మరమగ్గాలు ఉండగా.. 6972 సాంచాలపైనే చీరల బట్ట ఉత్పత్తి అవుతుంది. మిగతా సాంచాలపై పాలిస్టర్ బట్ట ఉత్పత్తి చేస్తున్నారు. ఇందుకు ప్రధాన కారణంగా.. స్థానికంగా కార్మికుల కొరత తీవ్రంగా ఉంది. ఉత్తరాది రాష్ట్రాల నుంచి వచ్చినా సరిపోవడం లేదు. దీంతో నిత్యం సిరిసిల్లలో 9.85 లక్షల మీటర్లు ఉత్పత్తి చేయాల్సి ఉండగా ప్రస్తుతం 4.18 లక్షల మీటర్లు ఉత్పత్తి చేస్తున్నారు. ఈక్రమంలో ఈనెల 17న కలెక్టరేట్లో రాష్ట్ర చేనేత జౌళి, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజ రామయ్య వస్త్రోత్పత్తిదారులతో సమావేశమయ్యారు. ఈనెలాఖరులోగా 50 శాతం పూర్తి చేసిన సొసైటీలకే ఆర్డర్ ఇస్తామని స్పష్టం చేశారు. అయితే చీరల ఉత్పత్తి తీరును పరిశీలిస్తే ఈనెలాఖరులోగా 25 శాతం ఉత్పత్తి కూడా అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. కార్మికుల కొరత సిరిసిల్లలో నేతకార్మికుల కొరత వేధిస్తోంది. ఇటీవల స్థానిక వస్త్రపరిశ్రమలో సంక్షోభంతో చాలా మంది నైపుణ్యం గల కార్మికుల ఇతర రంగాల్లో స్థిరపడ్డారు. గతంలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ పనిచేసిన వారు కూడా స్థానికంగా ఉపాధి లేక వారి స్వస్థలాల్లోనే పనులు చేసుకుంటున్నారు. దీంతో స్థానిక వస్త్రపరిశ్రమలో నైపుణ్యం గల కార్మికుల కొరత తీవ్రంగా ఉంది. చాలీచాలని వేతనాలతో స్థానిక కార్మికులు సైతం వస్త్రోత్పత్తి పనికి రావడం లేదు. గతంలో బతుకమ్మ చీరలు ఉత్పత్తి చేసిన కార్మికులకు 10 శాతం యారన్ సబ్సిడీని అందించారు. అప్పట్లో అందరికీ ఈ సబ్సిడీ ఇవ్వడంతో ఆసక్తిగా బతుకమ్మ చీరల బట్టను ఉత్పత్తి చేశారు. కానీ ఇప్పుడు పొరుగు రాష్ట్రాల కూలీలకు కేవలం మీటరుకు రూ.5.25 కూలీ చెల్లిస్తున్నారు. 10 శాతం యారన్ సబ్సిడీ వర్తించడం లేదు. దీంతో పొరుగు రాష్ట్రాల కార్మికులు తప్ప స్థానికులు పనికి రావడం లేదు. ఆగస్టులో చీరల పంపిణీ అసాధ్యమే.. రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘాల సభ్యులకు ఏటా రెండు చీరలను ఇస్తామని సీఎం రేవంత్‌రెడ్డి గతేడాది ఆగస్టు 8న చేనేత దినోత్సవం రోజు ప్రకటించారు. ఆ మేరకు ఈ ఏడాది ఆగస్టులో చీరలు పంపిణీ చేయాలని ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తుండగా.. చీరల బట్ట పూర్తిస్థాయిలో ఉత్పత్తి అసాధ్యంగా కనిపిస్తుంది. కనీసం ఒక్క చీరనైనా అందించే అవకాశాలను అధికారులు పరిశీలిస్తున్నారు. సిరిసిల్లలో ఉత్పత్తి అయిన చీరల బట్టను ప్రాసెసింగ్ చేసి, రంగుల్లో ప్రింటింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ మొత్తం ప్రక్రియ పూర్తి చేయాలంటే మరో నెల రోజులు పడుతుందని భావిస్తున్నారు. నాణ్యతపై తనిఖీలు ఇందిరా మహిళాశక్తి చీరల బట్ట సేకరణను ఈనెల 23న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ప్రారంభించారు. ఆసాముల వద్ద ఉత్పత్తి అయిన బట్టను యజమానులు సేకరించే సమయంలోనే డ్యామేజీ లేకుండా పరిశీలిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్ గోదాములోనూ చీరలబట్టను అన్ని కోణాల్లో తనిఖీ చేస్తున్నారు. 48 ఇంచుల వెడల్పుతో ఉండేలా చూస్తున్నారు. డిజైన్లు సరిగా వస్తున్నాయో లేవో కూడా చెక్ చేసుకోవాలంట్నున్నారు. గతంలో కంటే నాణ్యమైన చీరల ఉత్పత్తి జరుగుతున్నా గడువులోగా లక్ష్యం చేరడం కష్టంగా కనిపిస్తుంది. చీరల బట్ట ఆర్డర్ల స్వరూపం మొదటి ఆర్డర్ .. జనవరిలో 2.12 కోట్ల మీటర్లు రెండో ఆర్డర్ .. మార్చిలో 2.18 కోట్ల మీటర్లు ప్రస్తుతం నడుస్తున్న సాంచాలు 6,972ఉత్పత్తి అయిన చీరల బట్ట 80 లక్షల మీటర్లు గోదాముకు చేరిన వస్త్రాలు 10 లక్షల మీటర్లు నిత్యం ఉత్పత్తి అవుతున్న బట్ట 4.18 లక్షల మీటర్లు నిత్యం ఉత్పత్తి చేయాల్సిన లక్ష్యం 9.85 లక్షల మీటర్లు జూన్ నెలాఖరులోగా ఉత్పత్తి అయ్యేది కోటి మీటర్లు -
వైద్యకళాశాలను సందర్శించిన మానిటరింగ్ కమిటీ
సిరిసిల్లఅర్బన్: జిల్లాలోని ప్రభుత్వ వైద్యకళాశాల, అనుబంధ బోధన ఆస్పత్రిని ఆదివారం మెడికల్ కాలేజీ మానిటరింగ్ కమిటీ బృందం(ఎంసీఎంసీ) సభ్యులు సందర్శించారు. వైద్యకళాశాల, అనుబంధ బోధన ఆసుపత్రిని పరిశీలించారు. నిర్మాణంలో ఉన్న భవనం, హాస్టల్ బిల్డింగ్, క్రిటికల్ కేర్ యూనిట్, ప్రిన్సిపాల్, సూపరింటెండెంట్ క్వార్టర్స్, అతిథిగృహం త్వరగా పూర్తిచేయాలని సూచించారు. అనంతరం ప్రభుత్వ బోధన ఆస్పత్రిని తనిఖీ చేసి సదుపాయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. వైద్యవిద్యా సంచాలకులు డాక్టర్ శివరాంప్రసాద్, కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా, డాక్టర్ దావూద్ సులేమాన్, టీజీఎంఎస్ఐడీసీ ఈఈ విశ్వప్రసాద్, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ బి.లక్ష్మీనారాయణ, మెడికల్ సూపరింటెండెంట్ ఎం.లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
కోడెలను సంరక్షించుకోవాలి
● పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు ● కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ● రాజన్న గోశాలలో 137 జతల కోడెలు పంపిణీవేములవాడఅర్బన్: రాజన్న కోడెలను రైతులు జాగ్రత్తగా సంరక్షించుకోవాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా సూచించారు. వేములవాడ మున్సిపల్ పరిధి తిప్పాపూర్‌లోని రాజన్న గోశాలలో కోడెల కోసం దరఖాస్తు చేసుకున్న రైతుల వివరాలు పరిశీలించారు. అర్హులైన రైతులకు 137 జతల కోడెలను ఆదివారం పంపిణీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ గోశాల నుంచి పంపిణీ చేసే కోడెలను వ్యవసాయ అవసరాలకు మాత్రమే ఉపయోగించాలన్నారు. పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాజ న్న ఆలయ ఈవో రాధాభాయి, జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి రవీందర్‌రెడ్డి, గోశాల కమిటీ సభ్యులు రాధాకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వైకుంఠధామం నిర్మించాలి
గ్రామంలో వైకుంఠధామం లేక ఇబ్బంది పడాల్సి వస్తోంది. మున్సిపల్ అధికారులకు చాలాసార్లు చెప్పిన పట్టించుకోలేదు. ప్రస్తుతం ఎవరైనా మృతిచెందితే సుమారు 2 కిలోమీటర్ల దూరంలోని చెరువు వద్దకు వెళ్లి దహన సంస్కారాలు నిర్వహించాల్సి వస్తోంది. ఇప్పటికై నా నిధులు కేటాయించి వైకుంఠధామం నిర్మించాలి. – బొల్గం నాగరాజు, మాజీ కౌన్సిలర్, చిన్నబోనాల సౌకర్యాలు కల్పిస్తాం గ్రామాలకు దూరంగా ఉన్న వైకుంఠధామాలకు నిధులు మంజురైతే మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. విద్యుత్ సౌకర్యం లేని వాటిలో సోలార్ప్లాంట్లను ఏర్పాటు చేస్తాం. – షర్పొద్దీన్, జిల్లా పంచాయతీ అధికారి -
ప్రజల మన్ననలు పొందేలా పనిచేయాలి
సిరిసిల్ల ఎడ్యుకేషన్: ప్రజల మన్ననలు పొందేలా.. పోలీస్ అధికారులు, సిబ్బంది క్రమశిక్షణతో పనిచేయాలని ఎస్పీ మహేశ్ బీ గీతే కోరారు. జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలోని పరేడ్ మైదానంలో జిల్లా ఆర్ముడ్ రిజర్వ్, సివిల్ పోలీస్ సిబ్బంది, హోమ్‌గార్డ్ సిబ్బంది శనివారం నిర్వహించిన వీక్లీ పరేడ్‌లో పాల్గొని మాట్లాడారు. ఉద్యోగులు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని సూచించారు. వాకింగ్, వ్యాయామం చేయాలన్నారు. సిబ్బందికి ఏదైనా సమస్య ఉంటే తనను కలవాలని తెలిపారు. అదనపు ఎస్పీ చంద్రయ్య, ఆర్ఐలు రమేశ్, మధుకర్, యాదగిరి, సీఐలు కృష్ణ, మొగిలి, మధుకర్, ఎస్సైలు కిరణ్‌కుమార్, వినీతరెడ్డి, జునైద్, శ్రవణ్‌యాదవ్ పాల్గొన్నారు.● ఎస్పీ మహేశ్ బీ గీతే -
పల్లెతల్లీ.. ప్రణమిల్లి
ఆదివారం శ్రీ 29 శ్రీ జూన్ శ్రీ 2025బోనం.. ఆగమనం●● ఆషాఢ మాసంలో బోనాల వైభవం ● తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక ● పల్లె తల్లులకు పట్టాభిషేకం ● ఇయ్యాల్టి నుంచి బోనాల వేడుకలుఆషాఢ మాసం.. శుభకార్యాలకు దూరంగా ఉంటూనే పుణ్య కార్యాలకు, ఆధ్యాత్మిక వేడుకలకు ఆలవాలమైన మాసం. ఈమాసంలో తెలంగాణ పల్లె, పట్టణం బోనాల వేడుకలతో హోర్తెతిపోతుంది. ముల్లోకాలు కాపాడే అమ్మవారిని ఆరాధించడం బోనాల వెనుక సిసలైన నేపథ్యం. పోచమ్మ, పెద్దమ్మ, మైసమ్మ, ఎల్లమ్మ వంటి గ్రామ దేవతలకు కొత్త కుండలో బోనం (భోజనం) నివేదన చేసి పిల్లాపాపల్ని చల్లగా చూడాలంటూ కోరుకుంటారు. డప్పుచప్పుళ్లు, శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలు, మేళతాళాలతో మహిళలు నెత్తిన బోనాలతో ఊరేగింపుగా వెళ్లి అమ్మవారలకు నైవేద్యం సమర్పిస్తారు. ఆదివారం వివిధ కులసంఘాల ఆధ్వర్యంలో బోనాల ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. – విద్యానగర్(కరీంనగర్)/సిరిసిల్లకల్చరల్– వివరాలు 8లోuన్యూస్‌రీల్ -
ప్రజాసంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్రుద్రంగి(వేములవాడ): పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. రుద్రంగిలోని గ్రామపంచాయతీ ఆవరణలో అర్హులైన నలుగురు లబ్ధిదారులకు కల్యాణలక్ష్మీ, షాదీముబారక్, 19 మంది లబ్ధిదారులకు రూ.6.66లక్షల విలువ సీఎమ్మార్‌ఎఫ్ చెక్కులను శనివారం పంపిణీ చేశారు. విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్, ఎరువులు, మేలైన వంగడాలను ప్రభుత్వం తరఫున అందిస్తున్నామన్నారు. రుద్రంగి ఏఎంసీ చైర్మన్ చెలుకల తిరుపతి, మాజీ జెడ్పీటీసి గట్ల మీనయ్య, మాజీ సర్పంచ్ తర్రె ప్రభలత, మాజీ ఉపసర్పంచ్ బైరి గంగమల్లయ్య, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు తర్రె మనోహర్, డీసీసీ కార్యదర్శులు గడ్డం శ్రీనివాస్‌రెడ్డి, తర్రె లింగం, నాయకులు ఎర్రం గంగనర్సయ్య, పల్లి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. -
బ్యాక్‌బిల్లింగ్‌ను పరిష్కరించండి
సిరిసిల్ల: సిరిసిల్ల వస్త్రపరిశ్రమకు ప్రభుత్వం ఇస్తున్న 50 శాతం విద్యుత్ సబ్సిడీ విషయంలో సెస్ విధించిన బ్యాక్‌బిల్లింగ్‌ను రద్దు చేయాలని వస్త్రోత్పత్తిదారులు డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, చేనేత, జౌళిశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావుకు విన్నవించారు. హైదరాబాద్‌లో ని సెక్రటేరియట్లో రాష్ట్ర మినరల్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్తిని అనిల్‌కుమార్, సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కె.కె.మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో కలిశారు. సిరిసిల్ల పాలిస్టర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆడెపు భాస్కర్, చేనేత వస్త్రవ్యాపార సంఘం అధ్యక్షుడు తాటిపాముల దామోదర్, కార్యదర్శి గౌడ రాజు, ఉపాధ్యక్షుడు ఏనుగుల ఎల్లయ్య, పాలిస్టర్ అసోసియేషన్ కార్యదర్శి అంకాలపు రవి, వెల్దండి దేవదాస్, బూట్ల నవీన్, సతీశ్, బండారి అశోక్, దూస వినయ్ పాల్గొన్నారు. సెస్‌లో అక్రమాలపై ఫిర్యాదు సిరిసిల్లటౌన్: సహకార విద్యుత్ సరఫరా సంఘం(సెస్) సిరిసిల్లలో అవినీతి, అక్రమాలపై రాష్ట్ర సహకారశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావుకు సిరిసిల్ల పౌరసంక్షేమ సమితి ఫిర్యాదు చేసింది. శనివారం మంత్రిని హైదరాబాద్‌లో కలిసిన అనంతరం సమితి అధ్యక్షుడు మీడియాతో మాట్లాడారు. 2014 నుంచి 2022, 2022 నుంచి 2025 వరకు సంస్థలో జరిగిన అవినీతిపై విచారణ చేపట్టాలని కోరినట్లు తెలిపారు. సెస్ చైర్మన్ చిక్కాల రామారావు తన పరిధిని అతిక్రమించి అలవెన్సులు పొందుతుండడంతో సంస్థపై భా రం పడుతుందన్నారు. సెస్ మహాసభలో ప్రవేశపెట్టిన ఎజెండాలోని కొన్ని అంశాలతో సంస్థకు నష్టం వాటిల్లే అవకాశం ఉందన్నారు. పులి లక్ష్మీపతి, సబ్బని లక్ష్మీరాజం, కుసుల గణేశ్, చిప్ప దేవదాసు, జోగినిపల్లి సంపత్‌రావు ఉన్నారు. -
అంత్యక్రియలకూ అవస్థలే..
● ఊరికి దూరంగా వైకుంఠధామాలు ● సగానికి పైగా నిరుపయోగం ● విలీన గ్రామాల్లో అసంపూర్తి నిర్మాణాలుసిరిసిల్లఅర్బన్: ఆఖరీ మజిలీ గౌరవప్రదంగా ముగియాలని అందరూ కోరుకుంటారు. జిల్లాలోని చాలా గ్రామాల్లో వైకుంఠధామాలు అసౌకర్యాల మధ్య కొనసాగుతున్నాయి. రోడ్డు వసతి లేకపోవడం.. శ్మశానవాటికల్లో కనీస సౌకర్యాలు లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. జిల్లాలోని 13 మండలాల్లో 255 గ్రామపంచాయతీలు ఉండగా అన్ని గ్రామాల్లో ఉపాధిహామీ పథకం ద్వారా ఒక్కో నిర్మాణానికి రూ.12.60 లక్షల చొప్పున రూ.32.13కోట్ల వ్యయంతో వైకుంఠధామాలు నిర్మించారు. నీటి వసతి లేక.. రోడ్డు సౌకర్యం కరువై ఇబ్బంది పడుతున్నారు. అసంపూర్తి నిర్మాణాలు ● సిరిసిల్ల పట్టణ పరిధిలోని సర్దాపూర్, జగ్గారావుపల్లి, చంద్రంపేట, రాజీవ్‌నగర్, చిన్నబోనాల గ్రామాల్లో వైకుంఠధామాలు లేవు. ● సర్ధాపూర్, చంద్రంపేటల్లో అసంపూర్తిగానే వదిలేశారు. ● రగుడు వైకుంఠధామంలో విద్యుత్ కనెక్షన్ ఇవ్వలేదు. ● చిన్నబోనాలలో స్థలం ఉన్నా వైకుంఠధామం నిర్మించలేదు. దీంతో పంటపొలాలు, గ్రామశివారులోని చెరువులో దహన సంస్కారాలు నిర్వహిస్తున్నారు. -
బీమా.. అతివలకు ధీమా
● ప్రీమియం చెల్లిస్తున్న ప్రభుత్వం ● రుణ, ప్రమాదబీమా అమలు ● బాధిత కుటుంబాలకు పరిహారం ● 10,014 సంఘాలు.. 1,15,171 మంది సభ్యులుగంభీరావుపేట(సిరిసిల్ల): మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడంతోపాటు ఆపద వస్తే ఆదుకునేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. గ్రామీణ మహిళలు వ్యాపారాల ద్వారా ఆర్థికంగా స్థిరత్వం పొందేందుకు రుణాలు మంజూరు చేస్తుంది. ఈక్రమంలోనే స్వయం సహాయక సంఘాల మహిళలకు ప్రభుత్వం అండగా నిలిచేందుకు రుణ, ప్రమాదబీమా పథకాలకు శ్రీకారం చుట్టింది. ప్రమాదంలో మృతిచెందిన స్వయం సహాయక సంఘ మహిళల కుటుంబాలకు రూ.10 లక్షల వరకు పరిహారం అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. రుణం పొందిన మహిళ సహజంగా మృతిచెందితే ఆమె కుటుంబానికి రుణబీమాను వర్తింపజేసి అండగా నిలువనుంది. ప్రమాదబీమాను 2024 మార్చి 14 నుంచి వర్తింపజేయనుంది. జిల్లాలో 10,014 స్వయం సహాయక సంఘాల్లో 1,15,171 మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. బీమా.. భవిష్యత్‌కు రక్షణ కవచం ● జిల్లాలో ఇప్పటి వరకు 8 మంది మహిళలు ప్రమాదవశాత్తు మృతిచెందినట్లు అధికారులు గుర్తించారు. వారికి ప్రమాదబీమా పథకం కింద పరిహారం అందించనున్నారు. ● సహజ మరణం పొందిన మహిళల కోసం అమలు చేస్తున్న రుణబీమా పథకం కోసం 157 మందిని గుర్తించారు. వీరిలో 80 మందికి బీమాపథకం సొమ్ము రూ.70,43,675 చెల్లించినట్లు అధికారులు చెబుతున్నారు. మృతిచెందిన సభ్యురాలు సీ్త్రనిధి, బ్యాంక్ లింకేజీ రుణాలు తీసుకొని చెల్లించకపోయి ఉంటే ప్రభుత్వం ప్రకటించిన రూ.10 లక్షల్లో రుణ బకాయిలు మినహాయించుకొని మిగతా డబ్బులు బాధిత కుటుంబాలకు అందజేస్తారు. ● సహజ మరణం పొందిన సభ్యులకు మాత్రం రూ.2లక్షల్లోపు రుణబకాయిలు ఉంటే ప్రభుత్వమే చెల్లించి వారి రుణఖాతాలను మూసివేయనుంది. ● ప్రమాదంలో 50 శాతం వైకల్యం పొందితే రూ.5లక్షలు చెల్లిస్తారు. మృతిచెందిన మహిళకు పొదపు అప్పు ఉంటే అది కూడా పూర్తిగా మాఫీ చేస్తారు. ఇందుకోసం గాయాలపాలైన మహిళ అంగవైకల్యం తెలుపుతూ సదరం సర్టిఫికెట్, చికిత్స పొందిన ఆసుపత్రి పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. ● బీమాసౌకర్యం 18 నుంచి 60 ఏళ్ల వయస్సు ఉన్న సభ్యులకు మాత్రమే వర్తించనుంది. ప్రీమియం చెల్లించకుండానే బీమా మహిళా స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులు గతంలో కొంతమేర ప్రీమియం చెల్లిస్తే మిగతాది ప్రభుత్వం జమచేసేది. ప్రస్తుతం మహిళా సంఘాలకు ప్రభుత్వమే నేరుగా ఆర్థికసాయం అందించాలని నిర్ణయించింది. ఎలాంటి ప్రీమియం చెల్లించకుండానే రుణ, ప్రమాదబీమాలను అమలు చేస్తోంది. -
నమ్మకం..భరోసా
కోనరావుపేట(వేములవాడ): నాణ్యమైన బోధన.. ఆకట్టుకునే సౌకర్యాలు.. ఉపాధ్యాయులు కల్పిస్తు న్న విశ్వాసంతో తల్లిదండ్రులు తమ పిల్లలను కోనరావుపేటలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు పంపిస్తున్నారు. ఈ విద్యాసంవత్సరంలో కొత్తగా 111 మంది అడ్మిషన్లు తీసుకున్నారంటే ఆ పాఠశాలలోని ఉపాధ్యాయులపై నమ్మకానికి నిదర్శనం. హెచ్ఎం మదన్‌లాల్ పట్టుదల.. ఉపాధ్యాయుల కృషితో రోజురోజుకు ఈ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. ప్రైవేట్‌కు దీటుగా గుర్తింపు పొందిన పీఎంశ్రీ కోనరావుపేట ఉపాధ్యాయులను మిగతా వారు ఆదర్శంగా తీసుకుంటే ప్రభుత్వ బడులు బలోపేతం కావడం ఖాయంగా కనిపిస్తోంది. పీఎంశ్రీ నిధులతో సౌకర్యాలు కోనరావుపేట మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలను 2024–25 విద్యాసంవత్సరంలో పీఎంశ్రీ పథకానికి ఎంపిక చేశారు. అప్పటి నుంచి పాఠశాలలో ప్రీప్రైమరీ నిర్వహిస్తున్నారు. ఏటా వస్తున్న నిధులతో పాఠశాలలో మౌలిక సౌకర్యాలు మెరుగయ్యాయి. విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎడ్యుకేషన్టూర్లకు వెళ్తున్నారు. పాఠశాలలో అన్ని రకాల క్రీడావస్తువులు అందుబాటులో ఉన్నాయి. నాలుగు హౌస్‌లుగా విద్యార్థులు విద్యార్థులను రెడ్, గ్రీన్, యెల్లో, బ్లూ హౌస్‌లుగా విభజించారు. ఆయా గ్రూపుల్లోని విద్యార్థులు ఒక్కోవారం పాఠశాల నిర్వహణ బాధ్యతలు చూసుకోవాల్సి ఉంటుంది. పాఠశాలలోని ప్రార్థన నుంచి మధ్యాహ్న భోజనం నాణ్యత, విద్యార్థులు తింటున్నారా.. లేదా.. అనే బాధ్యతలు ఈ నాలుగు గ్రూపుల్లోని విద్యార్థులు చూసుకుంటున్నారు. దీని ద్వారా నాయకత్వ లక్షణాలు అభివృద్ధి చెందుతాయని హెచ్ఎం మదన్‌లాల్ పేర్కొంటున్నారు. ఈ నాలుగు హౌస్‌ల విద్యార్థులకు నాలుగు రంగుల్లో టీషర్టులను దాతల సహాయంతో సమకూర్చారు. 230కి చేరిన విద్యార్థుల సంఖ్య కోనరావుపేట పాఠశాలలో గత విద్యాసంవత్సరం 153 మంది విద్యార్థులు విద్యనభ్యసించారు. వీరిలో 30 మంది ఆరో తరగతికి వెళ్లారు. దీంతో వి ద్యార్థుల సంఖ్య 123కు పడిపోయింది. ఈ విద్యాసంవత్సరం ఆరంభానికి ముందే హెచ్ఎం, ఉపాధ్యాయులు ఇంటింటా తిరిగి ప్రైవేట్ పాఠశాలలకు వెళ్తున్న చిన్నారుల తల్లిదండ్రులను కలిశారు. వారిలో నమ్మకాన్ని కల్పించారు. వివిధ ప్రైవేట్ పాఠశాలలకు వెళ్తున్న 111 మంది విద్యార్థులు ప్ర భుత్వ పాఠశాలలో చేరడంలో సఫలీకృతులయ్యా రు. దీంతో విద్యార్థుల సంఖ్య 234కు చేరింది. ప్రైవేట్ నుంచి ప్రభుత్వ స్కూల్లో చేరిన విద్యార్థులు నాణ్యమైన విద్యనందిస్తున్న ఉపాధ్యాయులు కోనరావుపేట పీఎంశ్రీ పాఠశాలలో కొత్తగా 111 అడ్మిషన్లు 234కు చేరిన విద్యార్థులుఇద్దరు పిల్లలు ప్రభుత్వ స్కూల్‌కే నాకు ఇద్దరు కొడుకులు. గతేడాది ఇద్దరిని నిమ్మపల్లిలోని ఓ ప్రైవేట్ పాఠశాలకు పంపాను. కోనరావుపేటలోని పీఎంశ్రీ పాఠశాలలో విద్యాబోధన బాగుండడంతోపాటు ఉపాధ్యాయుల అంకితభావంతో ఈ సంవత్సరం ఇద్దరిని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చేర్పించాను. – రాస రవీందర్‌రెడ్డి, విద్యార్థుల తండ్రి పాఠశాల బాగుంది నేను పీఎంశ్రీ పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నాను. పాఠశాల ఆవరణ, పరిసరాలు ఆహ్లాదకరంగా ఉంటుంది. ఉపాధ్యాయులు ప్రైవేట్ పాఠశాలల కంటే బాగా పాఠాలు చెబుతున్నారు. నిత్యం అన్ని రకాల ఆటలు ఆడిపిస్తున్నారు. కంప్యూటర్ గురించి కూడా చెబుతున్నారు. – కరెడ్ల హర్షవర్థన్, ఐదో తరగతి నాణ్యమైన విద్యాబోధన కోనరావుపేటలోని పీఎంశ్రీ పాఠశాల విద్యార్థులకు ప్రైవేట్ పాఠశాలలకంటే నాణ్యమైన విద్యాబోధన అందిస్తున్నాం. క్రమశిక్షణతోపాటు అన్నిరకాల క్రీడలు, కంప్యూటర్ పరిజ్ఞానాన్ని పరిచయం చేస్తున్నాం. వీటన్నింటిని ప్రత్యక్షంగా చూసిన తల్లిదండ్రులు తమ పిల్లలను మా పాఠశాలలో చేర్పిస్తున్నారు. – అజ్మీరా మదన్‌లాల్, హెచ్ఎం కోనరావుపేట -
పాలిసెట్ కౌన్సిలింగ్
వేములవాడఅర్బన్: అగ్రహారం శ్రీరాజరాజేశ్వరస్వామి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో శుక్రవారం పాలీసెట్ ప్రవేశపరీక్షలో ర్యాంకులు సాధించిన అభ్యర్థుల అడ్మిషన్ కోసం కౌన్సిలింగ్ శుక్రవారం ప్రారంభమైనట్లు ప్రి న్సిపాల్ ప్రభాకరాచారి తెలిపారు. తొలిరోజు 200 మంది ధ్రువపత్రాల పరిశీలన పూర్తయినట్లు తెలిపారు. ముందుగా స్లాట్ బుకింగ్ చే సుకోవాలని సూచించారు. ఈనెల 29 వరకు కౌన్సిలింగ్ కొనసాగుతుందని తెలిపారు. పోలీస్ వాహనాలు కండీషన్లో ఉండాలి తంగళ్లపల్లి(సిరిసిల్ల): పోలీస్ వాహనాలు కండీషన్లో ఉండేలా చూడాలని ఎప్పటికప్పుడు సర్వీసింగ్ చేయించాలని ఆర్ఐ ఎంటీవో వి.మధుకర్ సూచించారు. తంగళ్లపల్లి ఠానాలో పోలీస్ వాహనాలను శుక్రవారం పరిశీలించారు. ఎస్సై ఎం.ఉపేంద్రచారి, ఏఎస్సై రవీందర్, యూనిట్ మెకానిక్ సమీయొద్దీన్ పాల్గొన్నారు. సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి సిరిసిల్లకల్చరల్: ప్రజాసంఘాల ఆధ్వర్యంలో జూలై 9న తలపెట్టిన సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ ప్రతినిధులు అజ్జ వేణు, కడారి రాములు కోరారు. ఈమేరకు జిల్లా ఉన్నతాధికారులకు శుక్రవారం సమ్మె నోటీస్ అందజేశారు. విహారయాత్రకు ఆర్టీసీ బస్సులు వేములవాడఅర్బన్: వేములవాడ ఆర్టీసీ డిపో ఆధ్వర్యంలో ప్రతీ శనివారం విహారయాత్రకు ఆర్టీసీ బస్సులను అందుబాటులో ఉంచుతున్నట్లు డిపో మేనేజర్ శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం కొడిమ్యాల గ్రామ ప్రజలు గన్నేరువరం మండలం ఖాసీంపేటలోని మానసాదేవీ, వర్గల్ సరస్వతీదేవి, యాదగిరిగుట్ట, స్వర్ణగిరికి బస్సులో వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ శనివారం విహారయాత్ర ఉంటుందని, గ్రామంలో 30 మంది కలిసి వారు ఎంచుకున్న ఆలయలకు బస్సు సౌకర్యం కల్పించనున్నట్లు వివరించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కల్వర్టు పనులు అడ్డగింత కోనరావుపేట(వేములవాడ): మండలంలోని మంగళ్లపల్లి నుంచి సుద్దాల వరకు చేపట్టిన తారురోడ్డు పనుల్లో భాగంగా నిర్మిస్తున్న కల్వ ర్టు పనులను రైతులు అడ్డుకున్నారు. రైతులు మాట్లాడుతూ కల్వర్టు పనులను లోతుగా తవ్వి చేస్తుండడంతో వర్షాలకు పొలాల్లోకి నీరు చేరి పంటలు నష్టపోతామన్నారు. కల్వర్టు నుంచి బతుకమ్మకుంట వరకు కాల్వ ఉందని, లోతు తగ్గించి నిర్మిస్తే వర్షపు నీరు కాల్వ ద్వారా కుంటలోకి చేరుతుందన్నారు. అధికారులు పునరాలోచించి రైతులకు నష్టం జరుగకుండా చూడాలని కోరారు. దొబ్బల నరేశ్, మాసం దావీవ్, దిలీప్, ఆనందం, దాసు, దొబ్బల కాంతయ్య, ప్రతాప్‌రెడ్డి, బొడ్డు స్వామి పాల్గొన్నారు. -
లింగనిర్ధారణ నిషేధం
● జిల్లా వైద్యాధికారి ఎస్.రజిత సిరిసిల్ల: గర్భస్థ లింగ నిర్ధారణ చేయడం నేరమని, ఎవరై చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని డీఎంహెచ్‌వో రజిత హెచ్చరించారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆఫీస్‌లో శుక్రవారం పీసీపీఎన్డీటీ అడ్వయిజరీ కమిటీ సమావేశంలో మాట్లాడారు. పీసీపీఎన్డీటీ యాక్ట్–1994–1996 నిబంధనలకు విరుద్ధంగా నడిపే స్కానింగ్ సెంటర్లను సీజ్ చేస్తామన్నారు. నిబంధనలు పాటించకుంటే రూ.50వేల జరిమానాలతోపాటు మూడేళ్ల జైలుశిక్ష విధిస్తారని తెలిపారు. ఎవరైనా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే 94400 54641లో తెలపాలని కోరారు. ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ అంజలి ఆల్ఫ్రెడ్, డాక్టర్లు అనిత, రామకృష్ణ, సంపత్, ఎన్జీవో ప్రతినిధి చింతోజు భాస్కర్, లీగల్ అడ్వయిజర్ శాంతిప్రకాశ్ శుక్లా, ఝాన్సీలక్ష్మీ, టమటమ రామానుజమ్మ, డిప్యూటీ డెమో రాజ్‌కుమార్, హెచ్‌ఈలు బాలయ్య, మహేశ్ తదితరులు పాల్గొన్నారు. -
● జూలైలోగా వంద శాతం పూర్తి చేయాలి ● చేనేత, జౌళిశాఖ జేడీ ఎన్.వెంకటేశ్వర్రావు
సిరిసిల్ల: రేయింబవళ్లు ఇందిరా మహిళాశక్తి చీరలు ఉత్పత్తి చేయాలని, జూలైలోగా వందశాతం పూర్తి చేయాలని చేనేత, జౌళిశాఖ జాయింట్ డైరెక్టర్ ఎన్.వెంకటేశ్వర్రావు సూచించారు. బీవై నగర్‌లోని జౌళిశాఖ ఆఫీస్‌లో శుక్రవారం వస్త్రోత్పత్తిదారులతో చీరల ఉత్పత్తిపై సమీక్షించారు. జేడీ మాట్లాడుతూ రెండు విడతల్లో ఇచ్చిన చీరల ఆర్డర్లలో నెలాఖరులోగా 50 శాతం చీరలను పూర్తి చేయాలని, జూలై నెలాఖరులోగా వందశాతం ఉత్పత్తి చేయాలన్నారు. ఆగస్టు 15న చీరల పంపిణీకి ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తుందని తెలిపారు. రాత్రి షిప్ట్‌ను మళ్లీ పునరుద్ధరించాలని సూచించారు. వస్త్రోత్పత్తిదారుల వద్ద నిల్వ ఉన్న చీరల బట్టను వెంటనే గోదాముకు పంపించాలని సూచించారు. గతంలో బతుకమ్మ చీరలకు సంబంధించిన పెండింగ్ బిల్లుల చెల్లింపుల్లో కోతలు విధించారని వస్త్రోత్పత్తిదారులు జేడీకి తెలపగా.. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. జేటీవో ప్రభాకర్, ఏడీలు రాఘవరావు, హిమజకుమార్, గౌతమ్, సిరిసిల్ల పాలిస్టర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆడెపు భాస్కర్, వస్త్రోత్పత్తిదారులు రవి, బూట్ల నవీన్, మండల సత్యం, అనుమాండ్ల రాంనారాయణ, ఆసాములు బీమని రామచంద్రం తదితరులు పాల్గొన్నారు. -
● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
వేములవాడ: ఆరోగ్య తెలంగాణ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. స్థానిక మండల పరిషత్‌లో 76 మందికి కల్యాణలక్ష్మీ, షాది ముబారక్ చెక్కులు, 54 మందికి సీఎమ్మార్‌ఎఫ్ చెక్కులను శుక్రవారం అందజేసి మాట్లాడారు. ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5లక్షల నుంచి రూ.10లక్షలకు పెంచి ప్రజా ఆరోగ్య భద్రతపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని చాటుకున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని గత ప్రభుత్వం అప్పులకుప్పగా మార్చినా సీఎం రేవంత్‌రెడ్డి అభివృద్ధిలో తీసుకెళ్తున్నారని పేర్కొన్నారు. వేములవాడ పట్టణాన్ని, రాజన్న ఆలయాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లడానికి కృషి చేస్తున్నామన్నారు. -
స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్‌దే గెలుపు
సిరిసిల్లకల్చరల్: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ విజయభేరీ మోగించనుందని పార్లమెంట్ కో–కన్వీనర్ కనమేని చక్రధర్‌రెడ్డి పేర్కొన్నారు. పట్టణంలో శుక్రవారం ప్రెస్మీట్లో మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రాన్ని అప్పులు ఊబిలోకి నెట్టినప్పటికీ ప్రణాళికాబద్ధంగా ప్రజాపాలన అందిస్తున్న కాంగ్రెస్ తన హామీలను నెరవేరుస్తోందన్నారు. రైతుభరోసా సొమ్ముతో రైతుఉల పండుగ చేసుకుంటున్నారన్నారు. సంక్షేమ పథకాలతో ప్రజలు సంతోషంగా ఉంటే బీఆర్ఎస్ నేతలు ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. ఇప్పటికై నా వారు తీరు మార్చుకోవాలని సూచించారు. పార్టీ పట్టణాధ్యక్షుడు చొప్పదండి ప్రకాశ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అంజన్‌రెడ్డి, సర్పంచ్ల ఫోరం మాజీ అధ్యక్షుడు కిషన్‌రావు, మాజీ సర్పంచ్ లక్ష్మణ్‌గౌడ్, సోషల్ మీడియా ఇన్చార్జి ఎడ్ల తిరుపతి, యూత్ కాంగ్రెస్ సెక్రటరీ అంజిరెడ్డి, ఆకుల పరశురాం, విఠల్‌రెడ్డి, శ్రీనివాస్, సూర్యప్రసాద్ పాల్గొన్నారు.● పార్లమెంట్ కో–కన్వీనర్ చక్రధర్‌రెడ్డి -
● 9వ ప్యాకేజీ రైతుల ఆందోళన
వీర్నపల్లి(సిరిసిల్ల): 9వ ప్యాకేజీ పైపులైన్ పనుల్లో భూమి కోల్పోయిన రైతులకు ఉన్న మొత్తం భూమి పట్టాల వివరాలు గల్లంతయ్యాయని, తమకు న్యాయం చేయాలంటూ శుక్రవారం వీర్నపల్లి తహసీల్దార్ ఆఫీస్ ఎదుట ధర్నా చేశారు. వారు మాట్లాడుతూ.. పైపులైన్ పనుల్లో పోయిన భూమి మాత్రమే పట్టాల నుంచి డిలీట్ అవుతుందని అధికారులు చెబితే.. మొత్తం భూమి పోయిందన్నారు. వీర్నపల్లి, మద్దిమల్ల, బంజేరు, కంచర్ల గ్రామాల్లోని రైతులు కూడా ఈ సమస్య ఎదుర్కొంటున్నారని తెలిపారు. అధికారులు స్పందించి పైపులైన్లో పోగా మిగిలిన భూమి వివరాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రైతులు ప్రకాశ్, దర్శనాల లింబాద్రి, అన్నారం జనార్దన్, లక్ష్మణ్, శేఖర్, మల్లారపు అరుణ్‌కుమార్, పిట్ల నాగరాజు, రాజేశం, ప్రవీణ్, దేవయ్య, నర్సయ్య, శంకర్, అంజయ్య పాల్గొన్నారు. -
పశువులకు మందుల్లేవ్ !
● ప్రైవేటు షాపులే దిక్కు ● ఆర్థికంగా నష్టపోతున్న పశు పోషకులు ● 15 నెలలుగా నిలిచిన మందుల సరఫరా ● పట్టించుకోని జిల్లా అధికారులు ● జిల్లాలో పశుసంపద 4,78,523 ఇతను పాశం బాబు. వీర్నపల్లికి చెందిన బాబుకు 60 వరకు గొర్రెలు ఉంటాయి. నిత్యం శివారు అడవుల్లో గొర్రెలను మేపుతుంటాడు. వీర్నపల్లిలో పశువైద్యశాల ఉన్నా డాక్టర్ లేరు. ఇన్చార్జి డాక్టర్ వచ్చిపోతుంటారు. ఆస్పత్రిలో మందులు లేవు. దీంతో గొర్రెలకు ఏ జబ్బు సోకినా సిరిసిల్ల, వేములవాడ, ఎల్లారెడ్డిపేట వంటి ప్రాంతాలకు వెళ్లి పశువుల మందుల దుకాణాల్లో ప్రైవేటుగా కొనుగోలు చేయాల్సిందే. గొర్రెలకు నట్టల నివారణ మందులు కూడా ఇవ్వడం లేదు.రుద్రంగి మండల కేంద్రం శివారులో నీటిమడుగులో బర్రెలు బొర్లుతున్నాయి. మురికినీరు కావడంతో బర్రెలకు జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. ఇవే పశువులు ఇచ్చే పాలను సమాజంలోనే అనేక మంది తాగుతున్నారు. బర్రెపాలతో టీ, కాఫీలు, పెరుగు చేసుకుని ఆరగిస్తున్నాం. నోరు లేని మూగజీవాలు సమాజానికి పౌష్టికాహారాన్ని అందిస్తుండగా.. వాటికి అనారోగ్యం ఏర్పడితే.. మందులు ఇచ్చే దిక్కులేదు. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా పశువైద్యశాలల్లో మందులు లేవు. -
టెంపుల్ సిటీగా అభివృద్ధి చేస్తా
● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్వేములవాడ: వేములవాడను టెంపుల్‌సిటీగా అభివృద్ధి చేస్తానని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. పట్టణంలోని 13, 14, 15, 16వ వార్డుల్లో సైడ్‌డ్రైన్, సీసీరోడ్లు, సీసీ కల్వర్టుల నిర్మాణనికి గురువారం శంకుస్థాపన చేశారు. ప్రజాప్రభుత్వంలో అన్నివర్గాల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. సంతోష్‌నగర్‌లో మహిళల కోరిక మేరకు బతుకమ్మ తెప్ప నిర్మిస్తామని తెలిపారు. గతంలో తాగునీటి సరఫరా కోసం ఇదే కాలనీలో రూ.15కోట్లతో తాగునీటి ట్యాంక్ నిర్మాణం చేపట్టినట్లు చెప్పారు. రోడ్డు విస్తరణలో దుకాణాలు కోల్పోతున్న వారి కోసం ప్రభుత్వం ప్రత్యేక ఆలోచన చేస్తుందని వెల్లడించారు. త్వరలోనే రాజన్న ఆలయ అభివృద్ధికి రూ.76కోట్లతో టెండర్లు పిలువనున్నట్లు చెప్పారు. రాబోవు రోజుల్లో ఏ ఎన్నిక వచ్చిన మీ మద్దతు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఇవ్వాలని కోరారు. -
ఎస్సైల బదిలీలు
సిరిసిల్లక్రైం: జిల్లాలో పనిచేస్తున్న ఎస్సైలను బదిలీ చేస్తూ ఎస్పీ మహేశ్ బీ గీతే గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎల్లారెడ్డిపేట ఎస్సై రమాకాంత్‌ను గంభీరావుపేటకు, సిరిసిల్ల ఎస్సై శ్రీనివాసరావును ఇల్లంతకుంటకు, తంగళ్లపల్లి ఎస్సై రామ్మోహన్‌ను వేములవాడకు, రుద్రంగి ఎస్సై మోతిరామును ఎల్లారెడ్డిపేటకు, వేములవాడ ఎస్సై లఘుపతిని డీఎస్‌బీకి, వేములవాడ ఎస్సై గణేశ్‌ను సీసీ ఎస్‌కు, ఉపేంద్రచారిని తంగళ్లపల్లి ఎస్సైగా నియమిస్తూ ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రొఫెషనల్ ఎస్సైలు వేముల లక్ష్మణ్‌ను వీర్నపల్లికి, వినీతారెడ్డిని సిరిసిల్లకు, పోరండ్ల అని ల్కుమార్ను వేములవాడకు, బి.శ్రీనివాస్‌ను రుద్రంగికి, కె.రాహుల్‌రెడ్డిని ఎల్లారెడ్డిపేట ఎస్సైగా నియమించారు. వేములవాడ టౌన్ ఎస్సై వెంకటరాజంను డీఎస్బీ వేములవాడ, సిరిసిల్ల టౌన్ ఎస్సై శంకర్‌నాయక్‌ను డీఎస్బీ సిరిసిల్లకు, డీఎస్బీలోని సుబ్రహ్మణ్యచారిని గంభీరావుపేట ఎస్సైగా నియమించారు. వేములవాడలో మరోసారి కూల్చివేతలు వేములవాడ: వేములవాడ మెయిన్‌రోడ్డు విస్తరణలో భాగంగా గురువారం రాజన్న ఆలయ ప్రధాన ద్వారం ఎదుట ఉన్న పాత నిర్మాణాలను గురువారం కూల్చివేశారు. 88 నిర్మాణాలకు కోర్టు స్టే ఉండడంతో మిగతా వాటిని కూల్చివేస్తున్నారు. ఇప్పటికే కూల్చేసిన భవనాల శిథిలాలు అలాగే ఉండగా, మరిన్ని కూల్చేయడంతో రోడ్డు దుమ్ముతో నిండిపోతుందని స్థానికులు పేర్కొంటున్నారు. కూల్చివేతలు త్వరగా పూర్తి చేసి శిథిలాలను తొలగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. మాదక ద్రవ్యాలను నివారించాలి సిరిసిల్లకల్చరల్: మత్తు పదార్థాలు సామాజిక అనర్థాలకు దారితీస్తాయని.. వాటిని నివారించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రాధికా జైస్వాల్ కోరారు. నెహ్రూనగర్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గురువారం మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన రాధికా జైస్వాల్ మాట్లాడుతూ మత్తు పదార్థాలకు అలవాటైన వ్యక్తులు అరాచక శక్తులుగా మారే ప్రమాదం ఉందన్నారు. విద్యార్ధి దశలోనే మాదక ద్రవ్యాలతో కలిగే దుష్ప్రభావాలను అర్థం చేసుకోవాలని సూచించారు. న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు జూపెల్లి శ్రీనివాసరావు, లోక్ అదాలత్ సభ్యులు చింతోజు భాస్కర్, ఆడెపు వేణు, సైకియాట్రిస్ట్ డాక్టర్ ప్రవీణ్, డిప్యూటీ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ మల్లేశ్‌యాదవ్, రిజర్వ్ ఎస్సై సాయికిరణ్, పాఠశాల హెచ్ఎం భాగ్యరేఖ పాల్గొన్నారు. గోశాల సిబ్బందికి నియామక పత్రాలు వేములవాడఅర్బన్: తిప్పాపూర్ గోశాలలో కొత్తగా నియమించిన సిబ్బందికి గురువారంనియామకపత్రాలను అందజేశారు. వేములవాడ రాజన్న ఆలయ ప్రాంగణంలో 40 మందికి గాను 38 మంది సిబ్బందికి జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి రవీందర్‌రెడ్డి నియామక పత్రాలు అందజేశారు. వారిని శుక్రవారం నుంచి విధులకు హాజరుకావాలని సూచించారు. వేములవాడ పరిధిలోని హన్మక్కపల్లిలో 25 ఎకరాలు, మర్రిపల్లిలో 40 ఎకరాలు ప్రభుత్వ భూమి కేటాయించారు. దానిలో రాజన్న గోశాలలోని కోడెల కోసం పచ్చిగడ్డి పెంచాలని జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి రవీందర్‌రెడ్డికి కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా తెలిపారు. జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్‌బేగం, తహసీల్దార్లతో జిల్లా పశు సంవర్ధకశాఖ అధికారి ఆయా స్థలాలను పరిశీలించారు. నేడు జాబ్‌మేళా సిరిసిల్లకల్చరల్: ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగా వకాశాలు కల్పించేందుకు శుక్రవారం సిరిసిల్లలోని ఎంప్లాయిమెంట్ ఆఫీస్‌లో మినీ జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి నీల రాఘవేందర్ ప్రకటనలో తెలిపారు. ఎంపికై న అభ్యర్థులకు రూ.10వేల నుంచి రూ.20వేల వేతనం లభిస్తుందని పేర్కొన్నారు. ఎస్సెస్సీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణులు జిల్లాకు చెందిన నిరుద్యోగ యువతీ, యువకులు తమ విద్యార్హతల ధ్రువపత్రాలతో ఉదయం 11 గంటలకు కలెక్టరేట్లోని ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో హాజరుకావాలని సూచించారు. -
నోరూరించే పౌష్టికాహారం
● కేజీబీవీల్లో కొత్త మెనూ ● ఈ విద్యాసంవత్సరం నుంచే అమల్లోకి.. ● జిల్లాలోని 13 కేజీబీవీలలో అమలు ● పెరుగుతున్న అడ్మిషన్లుగంభీరావుపేట(సిరిసిల్ల): నోరూరించే టిఫిన్స్.. ఘుమఘుమలాడే కిచిడి.. పొగలుగక్కే సాంబారు.. మనసు కోరుకునే పండ్లు.. ఇవన్నీ ఏదో ఫైవ్‌స్టార్ హోటల్లోని మెనూ కాదు.. కస్తూర్భాగాంధీ విద్యాలయం విద్యార్థినులకు అందించే పౌష్టికాహారం. కేజీబీవీల్లోని విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఆరోగ్యకరమైన, రుచికరమైన కొత్త మెనూను రూపొందించింది. వంట సిబ్బంది సైతం ఇటీవల వంటల తయారీపై శిక్షణ పొందారు. ఈ కొత్త మెనూకు విద్యార్థుల నుంచి స్పందన లభిస్తోంది. కేజీబీవీల్లో చదువుతున్న విద్యార్థినులకు పౌష్టికాహారం అందించి, అనారోగ్య సమస్యల నుంచి దూరం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. పెరిగిన మెస్‌చార్జీలు కొత్త మెనూ అమలుతోపాటు మెస్ నిర్వహణ ఖర్చులు పెరగడంతో మెస్‌చార్జీలను కూడా పెంచింది. గతంలో 6–10, ఇంటర్ విద్యార్థినులకు ఒకేలా నెలకు రూ.1225 ప్రభుత్వం అందించేది. కానీ కొత్త మెనూ ప్రకారం 6–7 తరగతుల విద్యార్థినులకు నెలకు రూ.1330, 8–10 తరగతుల విద్యార్థినులకు నెలకు రూ.1,540, ఇంటర్ విద్యార్థినులకు నెలకు రూ.2,100 చొప్పున అందించనున్నారు. కొత్త మెనూ ఇదే.. ఉదయం : టమాట, కిచిడీ, సాంబారు, బూస్ట్, పూరి, రాగిజావ, ఉప్మా, పులిహోర, వడ, బోండా, చపాతి, జీరా రైస్‌తోపాటు రోజుకు ఒక్కో రకమైన పండ్లు అందించాలి. అందులో అరటి పండు, జామ, వాటర్‌మిలన్, బొప్పాయి, సపోట ఉండాలి. మధ్యాహ్నం: టమాట పప్పుతో కూడిన అన్నం, నెయ్యి, రసం, పెరుగు, ఉడకబెట్టిన గుడ్లు, చికెన్ అందించాలి. సాయంత్రం: ఉడకబెట్టిన శనగలు, కోడిగుడ్డు, బజ్జీ, బెల్లంపల్లీలు, అల్లంచాయ్, మిల్లెట్స్, బిస్కెట్లు, పకోడి ఇవ్వాలి. రాత్రి: వివిధ రకాల కూరలతో తయారు చేసిన అన్నం సాంబారు, మజ్జిగ అందించాలి. నెలలో రెండు సార్లు మటన్, ఐదుసార్లు గుడ్లు, ప్రతి రోజు నెయ్యి అందించాలి. -
డ్రగ్స్‌ను దరి చేరనీయొద్దు
సిరిసిల్ల: విద్యార్థులు, యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని, దరిచేరనీయొద్దని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా కోరారు. జిల్లా కేంద్రంలో గురువారం యాంటీడ్రగ్ డే ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మనాయక కల్యాణ మండపంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ విద్యార్థులు, యువత పక్కా ప్రణాళిక ప్రకారం చదువుకొని ఉన్నత ఉద్యోగాలు సాధించాలని సూచించారు. డ్రగ్స్ వినియోగంతో మెదడు, కిడ్నీలు, ఊపిరితిత్తులు దెబ్బతింటాయన్నారు. డ్రగ్స్ వినియోగంతో శారీరక, మానసిక ఇబ్బందులు, సామాజిక రుగ్మతలు తలెత్తుతాయని తెలిపారు. డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించాలని కోరారు. జిల్లా ఎస్పీ మహేశ్ బీ గీతే మాట్లాడుతూ డ్రగ్స్ వినియోగించినా.. విక్రయించినా.. తరలించినా పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. విద్యార్థులు, యువత డ్రగ్స్‌కు దూరంగా ఉంటూ యాంటీడ్రగ్ సోల్జర్‌గా మారాలని కోరారు. విజేతలకు బహుమతులు యాంటీ డ్రగ్ డే సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన, చిత్రలేఖన ఇతర పోటీల్లోని విజేతలకు ప్రశంసాపత్రాలను కలెక్టర్, ఎస్పీ చేతుల మీదుగా అందించారు. అంతకుముందు ర్యాలీలో విద్యార్థులు ప్లకార్డులు ప్రదర్శించారు. విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. విద్యార్థులు గీసిన చిత్రాలు.. తయారు చేసిన పెయింటింగ్స్‌ను అభినందించారు. యాంటీ డ్రగ్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై కలెక్టర్, ఎస్పీ, జిల్లా అధికారులు సంతకాలు చేశారు. వేములవాడ ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి, అదనపు ఎస్పీ చంద్రయ్య, జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం, సీఐలు కృష్ణ, మొగిలి, శ్రీనివాస్, వీరప్రసాద్, శ్రీనివాస్, నటేశ్, మధుకర్, నాగేశ్వరరావు, ఆర్ఐలు రమేశ్, మధుకర్, యాదగిరి పాల్గొన్నారు. డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సిరిసిల్లలో యాంటీ డ్రగ్ డే ర్యాలీ -
తాటి వనం.. ఉపాధి ఘనం
● ఏడు ఎకరాల్లో ఈత, తాటిచెట్ల పెంపకం ● ఆదర్శణీయం కార్మికుల స్వయంకృషి ● 95 గీతాకార్మిక కుటుంబాలకు లాభంముస్తాబాద్(సిరిసిల్ల): తాటి, ఈతవనాలు కనుమరుగవుతుండడాన్ని ముస్తాబాద్‌కు చెందిన గౌడకులస్తులు రెండు దశాబ్దాల క్రితమే గమనించారు. ఏడు ఎకరాలు ప్రత్యేకంగా కొనుగోలు చేసి తాటి, ఈత మొక్కలు నాటారు. నేడు చెట్లుగా ఎదిగి స్వచ్ఛమైన కల్లును అందిస్తున్నాయి. ముస్తాబాద్ పట్టణంలోని గీతాకార్మికుల స్వయంకృషికి నిలువెత్తు నిదర్శనంగా ఈత, తాటివనం నిలుస్తోంది. ఐదేళ్ల క్రితం నాటిన మొక్కలు మండల కేంద్రం చుట్టుపక్కల ఉన్న పల్లెల్లో కల్లుకు మంచి పేరు ఉండగా.. ముస్తాబాద్‌లో చెట్లు లేని చోట కల్లు దొరకదనే ప్రచారం ఉంది. దీంతో పదిహేనేళ్ల క్రితం ముస్తాబాద్ శివారులో ఏడు ఎకరాలు కొనుగోలు చేశారు. ఐదేళ్ల క్రితం ఐదు ఎకరాల్లో తాటి, రెండు ఎకరాల్లో ఈతమొక్కలు నాటారు. ఒక బోరు వేసి నీటిని అందించారు. కల్లులో పోషకాలతోపాటు ఆరోగ్యానికి మేలు చేసే అంశాలు ఉన్నాయన్న నమ్మకంతో చాలా మంది కల్లు సేవించడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇటీవల స్వచ్ఛమైన కల్లుకు డిమాండ్ పెరిగింది. ఈనేపథ్యంలోనే 400 తాటి, 2వేల ఈత చెట్లను పెంచారు. వారి కృషి ఫలించి మొక్కలు చెట్లుగా ఎదిగాయి. ఇప్పుడు రోజుకు 500 లీటర్ల కల్లు వస్తుంది. కల్లుతోపాటు నీరా విక్రయాలు చేపడతామని గౌడకార్మికులు తెలిపారు. -
పిల్లలు బడిబాట
● ప్రభుత్వ పాఠశాలల్లో పెరిగిన ఎన్రోల్మెంట్ ● అత్యధిక విద్యార్థుల నమోదుతో జగిత్యాల టాప్ ● తక్కువ నమోదుతో సిరిసిల్ల లాస్ట్ ● గతేడాది కన్నా పెరిగిన విద్యార్థుల నమోదుసాక్షిప్రతినిధి, కరీంనగర్: బడిబాట కార్యక్రమం సత్ఫలితాలిస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో చేరాలంటూ ప్రభుత్వం, విద్యాశాఖాధికారులు, ఉపాధ్యాయులు చేసిన ప్రచారం ఫలించింది. 2024–25 విద్యా సంవత్సరం కన్నా ఈసారి విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. విద్యార్థుల ఎన్రోల్మెంట్లో పురోగతి కనిపించింది. కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల్లో పెరుగుదల నమోదవడాన్ని అంతా స్వాగతిస్తున్నారు. జగిత్యాల 39శాతం పెరుగుదలతో తొలిస్థానంలో నిలవగా కరీంనగర్ 32శాతంతో రెండోస్థానం దక్కించుకుంది. ఇక పెద్దపల్లి 19శాతంతో మూడోస్థానంలో నిలవగా సిరిసిల్ల 10శాతంతో నాలుగోస్థానం దక్కించుకుంది. ఈ పురోగతిలో జిల్లాల కలెక్టర్లు, విద్యాశాఖాధికారులు, ఎంఈవో, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల కృషి ఉంది. అన్ని ప్రభుత్వ పాఠశాలల సిబ్బంది తమ పరిధిలో విద్యార్థులను ప్రభుత్వపాఠశాలలో చేర్చాలని ఇంటింటి ప్రచారం నిర్వహించడం కలిసొచ్చింది. చాలామంది ప్రభుత్వ ఉపాధ్యాయులు సొంతఖర్చులు వెచ్చించి మరీ ప్లెక్సీలు, పోస్టర్లు, రీల్స్, వీడియోలు, సోషల్ మీడియా ద్వారా విరివిగా ప్రచారం చేశారు. ఆ ప్రయత్నాల ఫలితాలే ఈ ఏడాది విద్యార్థుల ఎన్రోల్మెంట్ పెరిగేలా చేశాయి. అగ్రభాగాన జగిత్యాల.. ఈ బడిబాట కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. జగిత్యాల అగ్రభాగన నిలవడం వెనక పలు కారణాలు ఉన్నాయి. భౌగోళిక విస్తీర్ణంలో జగిత్యాల పెద్దది. ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలు, విద్యార్థుల సంఖ్య అధికంగా ఉండటం, గ్రామీణ జనాభా అధికంగా ఉండటం వంటి అంశాలు కలిసి వచ్చాయి. కలెక్టర్, డీఈవో, ఎంఈవోలు క్రమశిక్షణతో పనిచేయడం ఎన్రోల్మెంట్ పెరుగుదలకు దోహదం చేసింది. ఇక మిగిలిన జిల్లాలు విస్తీర్ణం, జనాభా పరంగా చిన్నవి కావడంతో ఎన్రోల్మెంట్లోనూ జగిత్యాల తరువాత స్థానంలో నిలిచాయి. కరీంనగర్‌తోపాటు సిరిసిల్లకు ఇన్చార్జిగా ఉండే డీఈవోను ఇటీవల వివాదాస్పద ప్రవర్తనతో ఉన్నతాధికారులు తప్పించారు. అనంతరం కామారెడ్డి డీఈవోకు సిరిసిల్ల అదనపు బాధ్యతలు ఇచ్చినా.. ఆయన విధుల్లో చేరలేదు. దీంతో జెడ్పీ సీఈవోకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. టీచర్ల విషయంలో పర్యవేక్షణ కొరవడి ఎన్రోల్మెంట్లో కాస్త వెనకబడింది. సిరిసిల్ల చిన్న జిల్లా కావడం, విస్తీర్ణపరంగా, జనాభాపరంగా చిన్నది కావడం కూడా కారణాలే.ప్రభుత్వ పాఠశాలల్లో పెరిగిన విద్యార్థుల వివరాలు జిల్లా గతేడాది ఈ ఏడాది పెరుగుదల (శాతం) జగిత్యాల 3,690 5,147 39కరీంనగర్ 4,831 6,393 32పెద్దపల్లి 3,612 4,295 19సిరిసిల్ల 6,280 6,901 10 తల్లిదండ్రులను ఒప్పించాంబాలల బలోపేతం కోసం బడిబాటలో ప్రతీ ఇంటి తలుపుతట్టి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాం. ఉచిత యూనిఫారాలు, పుస్తకాలు, స్టేషనరీ పంపిణీ చేశాం. నాణ్యమైన భోజనం, ప్రత్యేక తరగతుల గురించి వివరించాం. ఖర్చుల భారం తగ్గడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడం ప్రారంభించారు. – కె.రాము, డీఈవో, జగిత్యాల -
వర్షాకాలం వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
● జిల్లా వైద్యాధికారి ఎస్.రజితసిరిసిల్ల: వర్షాకాల వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని, దోమల వృద్ధి నివారణకు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేలా ప్రజల్లో అవగాహన కల్పించాలని జిల్లా వైద్యాధికారి ఎస్.రజిత కోరారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆఫీస్‌లో గురువారం జిల్లా వైద్యాధికారులతో మిడ్‌లెవెల్ హెల్త్ (ఎంఎల్‌హెచ్‌పీ)పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుడూ వర్షాకాలంలో వ్యాపించే వ్యాధులు డెంగీ, మలేరియా, చికున్‌గున్యా, జ్వరాలపై వైద్యసేవలు అందిస్తూ అవి వ్యాపించకుండా ప్రజలను చైతన్యపరచాలన్నారు. కేంద్ర ఆరోగ్య పథకాల్లో ఉచిత సమగ్ర వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయాలని, ఆరోగ్య శిబిరాలను పల్లెల్లో నిర్వహించాలన్నారు. ఆరోగ్య ప్రగతి నివేదికలు అందించాలన్నారు. జిల్లాలో డయేరియా నివారణపై రోజువారీ నివేదికలు ఇవ్వాలని, జిల్లా మాతాశిశు సంరక్షణ అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాలు జరిగేలా చూడాలన్నారు. పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు క్రమం తప్పకుండా అందించాలని రజిత కోరారు. ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ సంపత్‌కుమార్, డాక్టర్ రామకృష్ణ, డాక్టర్ అనిత, డాక్టర్ నహీమా జహా, ప్రాథమిక కేంద్రాల వైద్యులు, ఎంఎల్‌హెచ్‌పీలు పాల్గొన్నారు. -
స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు సాధించాలి
● జెడ్పీ సీఈవో వినోద్ సిరిసిల్ల: జిల్లాలోని గ్రామపంచాయతీలు స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ విభాగంలో జాతీయ అవార్డులు సాధించేలా కృషిచేయాలని జెడ్పీ సీఈవో వినోద్ కోరారు. కలెక్టరేట్ నుంచి బుధవారం డీఆర్డీవో శేషాద్రి, డీపీవో షరీఫొద్దీన్తో కలిసి ఎంపీడీవోలతో గూగుల్‌మీట్ నిర్వహించారు. వినోద్ మాట్లాడుతూ స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ–2025 జాతీయస్థాయి అవార్డులు సాధించేలా అన్ని కోణాల్లోనూ గ్రామాలను తీర్చిదిద్దాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ స్థాయి బృందాలు గ్రామాలను సందర్శించినప్పుడు పరిశీలించే అంశాలను వివరించారు. గ్రామాల్లో ఓడీఎఫ్ ప్లస్‌లో భాగంగా చేసిన పనులను పరిశీలించి 120 మార్కులు, సర్వీస్ లెవెల్ ప్రోగ్రెస్‌కు 240, మొబైల్యాప్ ద్వారా సిటిజన్ ఫీడ్ బ్యాక్‌కు 100, డైరెక్ట్ అబ్జర్వేషన్‌కు 540 మార్కులు ఉంటాయని వివరించారు. ఇంటింటికీ టాయిలెట్లు ఉండాలని, తడి, పొడి చెత్తను ఇంటి వద్దనే వేరుచేసి గ్రామపంచాయతీ ట్రాక్టర్‌కు ఇవ్వాలని సూచించారు. మురికినీటి నిర్వహణలో భాగంగా ప్రతీ ఇంటికి ఇంకుడుగుంతలు ఉండాలని, డ్రెయినేజీ ఎండింగ్ పాయింట్ సోక్పిట్లు నిర్మించాలని సూచించారు. ప్లాస్టిక్ ఇతర వస్తువులను ప్లాస్టిక్‌వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్‌కు తరలించాలని తెలిపారు. జిల్లాస్థాయిలో ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్, గోబర్‌గ్యాస్ ప్లాంట్లను సందర్శిస్తారని వివరించారు. డీఎల్పీవో నరేశ్, స్వచ్ఛభారత్ మిషన్ కన్సల్టెంట్ సురేశ్, ప్రేమ్, ఎంఐఎస్ కన్సల్టెంట్ పాల్గొన్నారు. -
నెలంతా పరేషన్
● మూడు నెలల కోటాతో ముప్పుతిప్పలు ● మొదట్లో సాంకేతిక సమస్యలు ● రేషన్‌షాపులకు చేరిన 96 శాతం బియ్యం ● కొనసాగుతున్న పంపిణీ● ఇతను పోతు శ్రీనివాస్. జిల్లా కేంద్రంలోని బీవై నగర్‌కు చెందిన శ్రీనివాస్ బీడీకంపెనీలో పనిచేస్తాడు. ఇంట్లో భార్య, ఇద్దరు పిల్లలు ఉంటారు. నెలకు 24 కిలోల బియ్యం వస్తాయి. మూడు నెలల బియ్యం 72 కిలోలు వచ్చాయి. మొన్నటి వరకు రేషన్‌షాపు వద్ద రద్దీగా ఉండడంతో బియ్యం తీసుకెళ్లేందుకు ఇబ్బంది పడ్డాడు. రెండు, మూడుసార్లు షాపు వద్దకు వచ్చి మర్లిపోయాడు. బుధవారం రేషన్‌షాపు వద్ద పెద్దగా రద్దీ లేకపోవడంతో రేషన్‌బియ్యం తీసుకెళ్తున్నాడు. ● ఇతను బోయినపల్లికి చెందిన నేతకార్మికుడు మహేశుని శ్రీధర్. మూడు నెలల బియ్యం కోటాను ఒకేసారి ఇస్తున్నారని రేషన్‌షాపు వద్దకు వెళ్లగా కోటా అయిపోయింది. మరో 50 క్వింటాళ్ల బియ్యం రావాలే. అవి వచ్చిన తర్వాత ఇస్తానని డీలర్ చెప్పడంతో షాపు చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. ఇప్పటికీ కోటా రాలేదని డీలర్ చెబుతున్నాడు. సకాలంలో బియ్యం కోటా రాకపోవడంతో శ్రీధర్ నిరాశకు గురవుతున్నాడు. ప్రజాపంపిణీ స్వరూపం ఇలా.. గ్రామాలు : 260 రేషన్ షాపులు : 345 రేషన్‌కార్డులు : 1,77,851 అంత్యోదయకార్డులు : 13,748 అంత్యోదయ అన్నయోజన కార్డులు : 203 రేషన్‌బియ్యం పొందే వారు : 5,35,920 ప్రతి నెలా బియ్యం సరఫరా : 3,565 మెట్రిక్ టన్నులు మూడు నెలల కోటా : 10,696 మెట్రిక్ టన్నులు రేషన్ షాపులకు చేరిన బియ్యం : 10,323 మెట్రిక్ టన్నులు -
ఆలయంలో ఆకస్మిక తనిఖీలు
వేములవాడ: రాజన్న ఆలయంలోని పలు వి భాగాలు, ప్రసాదాల తయారీ గోదాంలను ఈవో రాధాభాయి బుధవారం తనిఖీ చేశారు. గోదాముల్లో సరుకుల నాణ్యత, పరిణామం, ఎక్స్పైరీ తేదీని పరిశీలించారు. ఈవో ఆకస్మిక తనిఖీలలో ఆలయంలోని కౌంటర్లు, ఇతర విభాగాల సిబ్బంది అప్రమత్తమయ్యారు. సర్కారు నిర్లక్ష్యంతో విద్యార్థుల అవస్థలు ● బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సబ్బని హరీశ్ సిరిసిల్లటౌన్: కాంగ్రెస్ సర్కారు నిర్వాకంతో ప్రభుత్వ బడుల్లో విద్యార్థులు అవస్థలు పడుతున్నారని బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సబ్బని హరీశ్ పేర్కొన్నారు. విద్యాసంస్థల్లో సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బుధవారం సిరిసిల్లలో బీఆర్ఎస్వీ బడిబాట చేపట్టారు. సదుపాయాలు, విద్యాప్రమాణాల గురించి శివనగర్ జెడ్పీ హైస్కూల్లో విద్యార్థులతో మాట్లాడి తెలుసుకున్నారు. మెట్టెల సాయిదీపక్, వల్లబోజు వెంకటరమణ, రాచమల్ల మోహన్ తదితరులు పాల్గొన్నారు. రేపటి నుంచి పాలీసెట్ ధ్రువపత్రాల పరిశీలన సిరిసిల్లకల్చరల్: పాలీసెట్ ఉత్తీర్ణులకు శుక్రవారం నుంచి ధ్రువపత్రాలు పరిశీలించనున్నట్లు అగ్రహారంలోని శ్రీరాజరాజేశ్వర ప్రభు త్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రభాకరా చారి ప్రకటనలో తెలిపారు. స్లాట్ బుక్ చేసుకున్న విద్యార్థుల సర్టిఫికెట్లను జూలై 1 వరకు పరిశీలించిన అనంతరం కోర్సులు, కళాశాలల ఎంపిక కోసం వెబ్ ఆప్షన్లు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. జూలై 4న సీట్లు కేటాయించనున్నట్లు పేర్కొన్నారు. వివరాలకు https//tgpolycet.nic.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు. మెరుగైన వైద్యసేవలు అందించాలి ● జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రాధిక ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వాహకులు రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రాధిక జైస్వాల్ పేర్కొన్నారు. ఎల్లారెడ్డిపేటలోని అశ్విని ఆస్పత్రిని బుధవా రం పరిశీలించారు. రాధిక జైస్వాల్ మాట్లాడు తూ కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించడం అభినందనీయమన్నారు. లోక్ అదాలత్ స భ్యులు చింతోజ్ భాస్కర్, ఆస్పత్రి నిర్వాహకులు డాక్టర్ సత్యనారాయణస్వామి ఉన్నారు. డిగ్రీ తరగతులు నిర్వహించాలి సిరిసిల్లటౌన్: ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఎల్లారెడ్డిపేటలో నెలకొల్పి మూడేళ్లు గడుస్తున్నా ఎక్కడ ఉందో కూడా తెలియని అయోమయ పరిస్థితులున్నాయని ఏబీవీపీ జిల్లా కన్వీనర్ లోపెల్లి రాజురావు పేర్కొన్నారు. కళాశాలలో నెలకొన్న సమస్యలపై బుధవారం కలెక్టర్‌కు ఫిర్యాదు చేసి మీడియాతో మాట్లాడారు. కళా శాలకు కనీసం బోర్డు ఏర్పాటు చేయలేదని, ప్రచారానికి కరపత్రాలు పంపిణీ చేయడం లేదన్నారు. విద్యార్థి నాయకులు ధనూష్, శ్రీనివాస్ ఉన్నారు. ఒప్పందం ప్రకారం కూలీ చెల్లించాలి సిరిసిల్లటౌన్: పాలిస్టర్ వస్త్రానికి పవర్లూమ్ కార్మికులు, ఆసాములకు ఒప్పందం ప్రకారం యజమానులు కూలీ చెల్లించాలని పవర్‌లూమ్స్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షు డు మూశం రమేశ్ కోరారు. ఈమేరకు సీఐటీయూ ఆధ్వర్యంలో పాలిస్టర్ వస్త్రోత్పత్తిదారుల సంఘం ఎదుట బుధవారం ధర్నా చేపట్టారు. పాలిస్టర్ వస్త్రానికి పవర్లూమ్ కార్మికులకు, ఆసాములకు కూలీ తగ్గించి ఇస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలని కోరారు. పాలిస్టర్ వస్త్ర ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ఆడెపు భాస్కర్, అంకారపు రవిలకు వినతిపత్రాలు అందజేశారు. -
యూ టర్న్.. ప్రాణాలు పోతున్నాయి
● ముందుగానే హెచ్చరించిన ‘సాక్షి’ ● స్పందించని అధికారులు వేములవాడఅర్బన్: వేములవాడ మండలం అగ్రహారం హనుమాన్ ఆలయం ఎదుట కరీంనగర్–సిరిసిల్ల ప్రధాన రహదారిపై యూ ప్రమాదకరంగా ఉంది. తరచూ ఇక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని ఈనెల 14న ‘సాక్షి’ లో ‘డేంజర్ యూ టర్న్’ శీర్షికతో కథనం ప్రచురితమైంది. అధికారులు అప్పుడే స్పందించి ఉంటే బుధవారం ప్రమాదం జరి గేది కాదని స్థానికులు చర్చించుకుంటున్నారు. యూ టర్న్ వద్ద హనుమా న్ ఆలయం, ఆర్టీసీ బస్టాండ్, కరీంనగర్ పాలడెయిరీ, పాలిటెక్నిక్, డిగ్రీ, జేఎన్టీయూ ఇంజినీరింగ్ కాలేజీలు ఉన్నాయి. విద్యార్థులు, భక్తులతో ఆ ప్రాంతం రద్దీగా ఉంటుంది. ఇంత రద్దీగా ఉన్న ప్రాంతంలో ప్రధాన రహదారిపై యూ టర్న్ ప్రమాదకరంగా ఉంది. ఇక్కడ యూటర్న్‌ను మూసివేసి కొంచెం దూరంలో ఇవ్వాలని స్థానికులు కోరుతున్నారు. అంతేకాకుండా ఆ ప్రాంతంలో స్టాపర్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. -
దశాబ్దాల కల.. నెరవేరుతున్న వేళ
వేములవాడ: ఆధ్యాత్మిక పట్టణం.. దక్షిణకాశీలో ఇక నుంచి ట్రాఫిక్‌జామ్.. వాహనాల హారన్మోతలకు చెక్ పడనుంది. వేములవాడ పట్టణ ప్రజలు.. రాజన్న భక్తులు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న రోడ్డు విస్తరణ పనులు ఎట్టకేలకు మొదలయ్యాయి. 80 ఫీట్లతో రోడ్డు విస్తరణకు అధికారులు పనులు మొదలుపెట్టారు. తిప్పాపూర్ మూలవాగు వంతెన నుంచి రాజన్న ఆలయం వరకు ప్రధాన రహదారిని 80 ఫీట్లతో విస్తరించనున్నారు. ఇప్పటికే రోడ్డుకు ఇరువైపులా ఉన్న నిర్మాణాలు తొలగించారు. కోర్టు స్టే ఉండడంతో 88 నిర్మాణాలు కూల్చివేతలు నిలిచిపోయాయి. త్వరలోనే పనులు ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. 88 నిర్మాణాలపై కోర్టు స్టే ఈ రోడ్డు విస్తరణలో 750 మీటర్లు భూసేకరణ చేస్తున్నారు. ఇందులో 322 నిర్మాణాలు కూల్చివేస్తున్నారు. ఇందులో 254 మంది నిర్వాసితులుగా మిగిలిపోతున్నారు. వీరికి ప్రభుత్వం పరిహారం అందజేసింది. అయితే 322 నిర్మాణాల్లో 88 నిర్మాణాలపై కోర్టులో స్టే ఉండడంతో కూల్చివేతలు నిలిపివేశారు. కోర్టు అనుమతి అనంతరం పనులు వేగవంతం చేయనున్నారు. ఈ 80 ఫీట్ల రోడ్డు పనులకు ప్రభుత్వం రూ.47.50 కోట్లు మంజూరుచేసింది. ఈ డబ్బులు కలెక్టర్ ఖాతాలో ఉన్నాయి. వేములవాడలో 80 ఫీట్ల రోడ్డు విస్తరణకు మోక్షం హర్షం వ్యక్తం చేస్తున్న భక్తులు, స్థానికులు కోర్టు స్టేతో నిలిచిన 88 కూల్చివేతలు త్వరలోనే పనులు ప్రారంభిస్తామంటున్న అధికారులు వివరాలు ఇలా.. నిర్వాసితులు : 254 నిర్మాణాలు : 322 భూసేకరణ : 750 మీటర్లు రోడ్డు విస్తరణ : 80 ఫీట్లు -
ఎమర్జెన్సీపై బీజేపీ నిరసన
సిరిసిల్లటౌన్: కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమర్జెన్సీ విధించి 50 ఏళ్లు కావడంతో బీజేపీ ఆధ్వర్యంలో బుధవారం నిరసన ర్యాలీ చేపట్టారు. సిరిసిల్లలో చేపట్టిన నిరసన ర్యాలీలో నల్లబ్యాడ్జీలు ధరించారు. ఎమర్జెన్సీ రోజుల్లో జైలుకు వెళ్లిన జిల్లాకు చెందిన ప్రభాకర్‌రావు, గాల్రెడ్డిలను సన్మానించారు. భువనగిరి మాజీ ఎంపీ బుర్ర నర్సయ్యగౌడ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎర్ర మహేశ్, అల్లాడి రమేశ్, స్టేట్ కౌన్సిల్ మెంబర్ మ్యాన రాంప్రసాద్, పార్లమెంట్ కో–కన్వీనర్ ఆడెపు రవీందర్, సిరిసిల్ల అసెంబ్లీ కన్వీనర్ మల్లారెడ్డి, సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు దుమాల శ్రీకాంత్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు రాగుల రాజిరెడ్డి, మహిళా మోర్చా అధ్యక్షురాలు పల్లం అన్నపూర్ణ, జిల్లా అధికార ప్రతినిధి నవీన్‌యాదవ్, నాగుల శ్రీనివాస్, పండుగ మాధవి పాల్గొన్నారు. -
60 ఏండ్ల కల సాకారం
అరవై ఏండ్ల కల సాకారమైంది. వేములవాడకు మూడు బస్టాండులు ఉన్నాయి. ఆటోలు తిరుగుతాయి కాబట్టి రోడ్ల వెడల్పు అనివార్యం. రాజన్న గుడి నుంచి పోలీస్‌స్టేషన్ వరకూ రోడ్ల వెడల్పు పనులు చేపట్టాలి. అభివృద్ధి పనులతోనే పట్టణ రూపురేఖలు మారుతాయి. – ఎండీ ఖాజాపాషా, రిటైర్డ్ కండక్టర్, వేములవాడ సరైన పరిహారం ఇవ్వాలి 40 ఏండ్లుగా నాకు మెయిన్‌రోడ్డులో చెప్పుల దుకాణం ఉంది. రోడ్డు వెడల్పుతో నా దుకాణం పోయింది. నాకున్న 18 గజాల స్థలానికి అమ్ముకుంటే రూ.50 లక్షలు వచ్చేవి. ప్రభుత్వం రూ.3.30లక్షలు ఇచ్చింది. పరిహారం న్యాయపరంగా ఉండాలి. ఇటీవల ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ వద్దకు వెళ్లి మొరపెట్టుకున్నాను. న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. – దోర బాలయ్య, ఫుట్‌వేర్, వేములవాడ -
పచ్చిగడ్డి సాగుచేయాలి
● కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ● రాజన్న గోశాల తనిఖీ వేములవాడఅర్బన్: రాజన్న గోశాలలోని కోడెలకు సంబంధించిన దాణ కోసం పచ్చిగడ్డిని సాగు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా తెలిపారు. వేములవాడ మున్సిపల్ పరిధి తిప్పాపూర్ గోశాలను కలెక్టర్ బుధవారం తనిఖీ చేశారు. గోశాల ఆవరణలోని కోడెలు, గడ్డిని పరిశీలించారు. గోశాల ఆవరణలో మట్టిని చదును చేయించాలని సూచించారు. కోడెలకు నిత్యం పచ్చిగడ్డి అందించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. వేములవాడ పరిధిలోని హనుమక్కపల్లిలో 22 ఎకరాలు, మర్రిపల్లిలో 40 ఎకరాలు, మూడపల్లిలోని 20 ఎకరాల ప్రభుత్వ భూముల్లో పచ్చిగడ్డి పెంపకానికి చర్యలు తీసుకోవాలని జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి రవీందర్‌రెడ్డిని ఆదేశించారు. గోశాలలో పనిచేసేందుకు ఇటీవల నియమించిన సిబ్బందిని విధుల్లోకి తీసుకోవాలని, వారికి డ్రెస్‌కోడ్, ఐడీ కార్డ్ అందించాలని సూచించారు. రాజన్న ఆలయ ఇన్చార్జి ఈవో రాధాభాయ్, పశుసంవర్ధక అధికారి రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు. పౌష్టికాహారం అందిస్తూ.. పాఠాలు బోధించాలి అంగన్వాడీ, ప్రాథమిక పాఠశాలల్లోని విద్యార్థులకు పౌష్టికాహారం అందిస్తూ పాఠాలు బోధించాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ఆదేశించారు. వేములవాడ మున్సిపల్ పరిధిలోని తిప్పాపూర్ అంగన్వాడీ కేంద్రం, ప్రాథమిక పాఠశాలను బుధవారం తనిఖీ చేశారు. అంగన్వాడీ కేంద్రంలో పిల్లల హాజరు వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో తరగతి గదులను పరిశీలించారు. స్కూల్లో ప్రధానోపాధ్యాయుడు విధులకు హాజరు కాకపోవడంతో విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని డీఈవో వినోద్‌కుమార్‌ను ఆదేశించారు. ఎరువుల కొరత సృష్టిస్తే చర్యలు సిరిసిల్ల: జిల్లాలో ఎరువుల కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా హెచ్చరించారు. కలెక్టరేట్లో బుధవారం ఎరువుల సరఫరాపై కంపెనీల డీలర్లు, వ్యవసాయశాఖ అధికారులతో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అవసరమైన మేర స్టోరేజీ అందుబాటులో ఉందన్నారు. ప్రతీ డీలర్ నిబంధనల ప్రకారం ఆన్లైన్ ఈ–పాస్ యంత్రాల ద్వారా ఎరువులు విక్రయించాలని ఆదేశించారు. బల్క్‌స్టాక్ పెట్టుకొని కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎరువుల షాపులకు ఎంత స్టాక్ ఏ సమయంలో సరఫరా చేస్తున్నారు, ప్రతీ షాప్ వద్ద ప్రస్తుతం ఎంత స్టాక్ ఉందనే వివరాలు అందించాలన్నారు. జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్‌బేగం, వ్యవసాయాధికారి(టెక్) కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. -
ట్రాక్టర్ ఇసుక 5 వేలు!
● ఇందిరమ్మ ఇళ్ల పేరిట దందాముస్తాబాద్(సిరిసిల్ల): ముస్తాబాద్‌లో ఇసుక ధర చుక్కలనంటుతోంది. ఇల్లు నిర్మించుకునే సామాన్యులు ట్రాక్టర్ ఇసుక ధర చెబితే హడలిపోతున్నారు. వారం క్రితం వరకు ఇసుక ట్రాక్టర్ ట్రిప్పు ధర రూ.6వేలు పలకగా.. ఇప్పుడు అది రూ.5వేలకు చేరింది. అది కూడా ఇందిరమ్మ ఇళ్ల పేరుతో కొండాపూర్ మానేరు వాగు రీచ్ నుంచి వస్తున్న ఇసుక పక్కదారిపడుతోందనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. రోజుకు 60 నుంచి 80 ట్రిప్పుల వరకు రెవెన్యూ అధికారులు ఇందిరమ్మ ఇళ్ల కోసం అనుమతి పత్రాలు జారీ చేస్తున్నారు. ఒక్కో లబ్ధిదారుడి పేరుతో రవాణా అవుతున్న ఇసుక ప్రైవేటు భవనాల నిర్మాణాలకు, పొరుగు జిల్లాకు తరలిస్తున్నారు. ట్రాక్టర్ యజమానులు సిండికేట్‌గా మారి అమాంతం ఇసుక ధర పెంచారని వినియోగదారులు లబోదిబోమంటున్నారు. ఒక్కో ట్రిప్పునకు రూ.5వేలు తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై ముస్తాబాద్ తహసీల్దార్ సురేశ్‌కు అనేక ఫిర్యాదులు రావడంతో ఇసుక ట్రాక్టర్ల యజమానులకు హెచ్చరికలు జారీ చేశారు. ఆరునెలల క్రితం ట్రాక్టర్ ట్రిప్పు ఇసుక రూ.2,500 నుంచి రూ.3వేలు పలికింది. ఇందిరమ్మ ఇల్లుకు ఎలాంటి టోకేన్ను ప్రభుత్వం తీసుకోవడం లేదు. అయినా రూ.5వేలు వసూలు చేయడంపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. జిల్లా కలెక్టర్ ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు. -
సిల్ట్ తీయక పదిరోజులైంది
అప్పట్లో వారం రోజులకు ఒకసారైనా మోరీల్లో సిల్టు తీసేటోళ్లు. ఇప్పుడు పదిరోజులు దాటింది. వానలు పడుతున్నయి. మోరీలు సరిగా లేక దోమలు పెరిగినయి. వాడకట్టులో చాలా మందికి జ్వరాలు వస్తున్నయి. మోరీలు, రోడ్డుపై చెత్తను శుభ్రం చేయాలి. – కొనవేణి కనకయ్య, ఆసిఫ్‌పుర, సిరిసిల్ల ఇంటి ముందు దుర్వాసన మావాడలో చెత్తను తీసుకొచ్చి మా ఇంటి ముందే పోస్తున్నారు. చెత్తడబ్బాలను ఇంకో చోట ఏర్పాటు చేసి వాటిలో పడేసేలా చూడాలి. చెత్తలో ఆహారం కోసం వీధికుక్కలు వచ్చి చిందరవందర చేస్తాయి. ఇంటి ముందే చెత్తకుప్ప కావడంతో ఒక్కటే దుర్వాసన వస్తుంది. మున్సిపాల్టోళ్లకు చెబితే సమస్య తీర్చడం లేదు. – మూశం సువర్ణ, 37వ వార్డు, సిరిసిల్ల ప్రణాళికతో పారిశుధ్య పనులు పారిశుధ్య పనులు ప్రణాళిక బద్ధంగా జరుగుతున్నాయి. షెడ్యూల్ ప్రకారం ఇంటింటా చె త్తసేకరణ, వార్డుల్లో మోరీలు తీయిస్తున్నాం. కొంత సిబ్బంది కొరతతో ప్రతీ వార్డుకు టీం వర్క్ చేయిస్తున్నాం. ఎవరైనా ఫిర్యాదు చేస్తే వెంటనే స్పందించి సమస్య పరిష్కారం చేశా ము. వర్షాకాలం ప్రత్యేక డ్రైవ్స్ చేపడుతాం. ఫాగింగ్ మిషన్ తింపుతున్నాం. – పోసు వాణి, మున్సిపల్ ఇన్చార్జి కమిషనర్, సిరిసిల్ల -
చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి
● ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి వేములవాడరూరల్: మాదకద్రవ్యాల నిర్మూలనలో విద్యార్థులు భాగస్వామ్యం కావాలని వేములవాడ ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి అన్నారు. నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం వేములవాడలోని బీసీ రెసిడెన్షియల్ పాఠశాల ఆవరణలో విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. ఆరోగ్యకరమైన జీవితం కోసం ప్రతి ఒక్కరూ ప్రకృతిని ప్రేమిస్తూ చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. యువత గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని కోరారు. విద్యార్థుల కదలికలపై అధ్యాపకులు నిఘా ఉంచాలన్నారు. అలాగే మండలంలోని చెక్కపల్లి ప్రభుత్వ పాఠశాలలో డ్రగ్స్‌కు వ్యతిరేకంగా వేములవాడ రూరల్ ఎస్సై అంజయ్య విద్యార్థులకు క్లాపింగ్, వ్యాయామం చేయించారు. ఎంఈవో లోకిని కిషన్ తదితరులు పాల్గొన్నారు. -
రైతువేదికలకు డబ్బులు
సాక్షిప్రతినిధి,కరీంనగర్: రైతు భరోసా నిధులు విడుదల సందర్భంగా రైతు వేదికల వద్ద సంబరాల కోసం ఎట్టకేలకు నిధులు విడుదలయ్యా యి. వాస్తవానికి రైతు భరోసా ప్రారంభం, ము గింపు సందర్భంగా రైతు వేదికల వద్ద సీఎంతో ముఖాముఖి కార్యక్రమాలను ప్రభుత్వం ఏర్పా టు చేసింది. ఇందుకోసం ప్రతీ రైతు వేదికకు 200 మంది రైతులను తరలించాలని ఏఈవో (అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్)లకు టార్గెట్లు విధించింది. ఇటీవల జరిగిన కార్యక్రమానికి రై తులను తరలించడం, వారికి టీ, స్నాక్స్ ఖర్చుల ను భరించడం వంటి పనులు ఏఈవోలే చూసుకున్నారు. తాజాగా ముగింపు వేడుకులకు సైతం ఏఈవోలు నిర్వహించాలని చెప్పడంతో వారంతా తలలు పట్టుకున్నారు. గత వేడుక డబ్బులే రాకపోగా, మరోసారి చేతి నుంచి డబ్బులు ఎలా పెట్టుకోవాలో తెలియక సతమతమయ్యారు. ఈ విషయాన్ని మంగళవారం ‘సాక్షి’ దినపత్రికలో ‘అన్నదాతా.. రైతువేదికకు రా వా? ’ శీర్షికన ప్రచురితమైన కథనంపై ప్రభుత్వం స్పందించింది. మంగళవారం మధ్యాహ్నం అన్ని రైతు వేది కల వద్ద సంబరాలు నిర్వహించేందుకు ఏఈ వోలకు కావాల్సిన నిధులు విడుదల చేసింది. ● విడుదల చేసిన వ్యవసాయ శాఖ -
గోశాల నిర్మించాలని వినతి
వేములవాడరూరల్: వేములవాడ రూరల్ మండలంలోని మర్రిపల్లి గ్రామశివారులో రాజన్న కోడెలకు గోశాలను నిర్మించాలని విప్ ఆది శ్రీనివాస్ మంగళవారం సీఎం రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. మర్రిపల్లిలో 40 ఎకరాల స్థలంలో ఆధునిక గోశాల నిర్మించాలని కోరారు. ఇందుకు సీఎం సానుకూలంగా స్పందించినట్లు విప్ తెలిపారు. సీఐటీయూ సమ్మె నోటీస్సిరిసిల్లటౌన్: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోవాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కోడం రమణ కోరారు. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్ల రద్దు, ఇతర డిమాండ్లతో దేశం, రాష్ట్రంలోని అన్ని కార్మిక సంఘాల జాయింట్ ప్లాట్ ఫామ్ ఆధ్వర్యంలో జూలై 9న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఈమేరకు మంగళవారం జిల్లా అధికారులకు సమ్మె నోటీసు అందజేశారు. పారిశ్రామిక వివాదాల చట్టాన్ని అనుసరించి సమ్మె నోటీసు ఇవ్వడం జరిగిందన్నారు. ఆయన వెంట అధ్యక్షుడు ఎగమంటి ఎల్లారెడ్డి తదితరులు ఉన్నారు. 26 నుంచి పాలిసెట్ ధ్రువపత్రాల పరిశీలనవేములవాడరూరల్: ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు టీజీ పాలిసెట్–2025లో ర్యాంకులు సాధించిన విద్యార్థుల ధృవపత్రాలను ఈ నెల 26 నుంచి పరిశీలించనున్నట్లు అగ్రహారం పాలిటెక్నికల్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రభాకరచారి తెలిపారు. పాలిసెట్ ర్యాంక్‌కార్డు, ఆధార్, ఎస్సెస్సీ మెమో, 4 నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్స్, ఆదాయం, కులం, ఈడబ్ల్యూఎస్, టీసీ ఒరిజినల్, జిరాక్స్‌లు రెండు సెట్లు ఉండాలని పేర్కొన్నారు. -
మాదకద్రవ్యాలను కట్టడి చేద్దాం
● కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా సిరిసిల్ల: జిల్లాలో మాదకద్రవ్యాలను కట్టడి చేద్దామని, డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలపై విస్తృత ప్రచారం చేయాలని కలెక్టర్ సందీప్‌కుమార్‌ఝా కోరారు. కలెక్టరేట్లో మంగళవారం ఎస్పీ మహే శ్ బీ గితేతో కలిసి నార్కోటిక్ కంట్రోల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, డ్రగ్స్, మాదకద్రవ్యాల నియంత్రణకు జిల్లా నార్కోటిక్ సమావేశంలో పాల్గొనే ప్ర తి శాఖ ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకొని అమలు చేయాలన్నారు. జిల్లాలో వస్త్ర పరిశ్రమ కార్మికులు మద్యానికి బానిసై అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకుంటున్నారని, వాటిని నియంత్రించాలన్నారు. స్కూళ్లు, కాలేజీలు, గురుకులాల్లో డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలపై వైద్య అధికారులతో అవగాహన కల్పించాలని ఆదేశించారు. జిల్లా ఆసుపత్రిలో డీ అడిక్షన్ సెంటర్ ఏర్పాటు చేసి, అవసరమైన వారికి చికిత్స అందించాలని సూచించారు. జిల్లాలో గంజాయి సాగు కనిపిస్తే వెంటనే పోలీస్ అధికారులకు సమాచారం అందించాలని అటవీశాఖ అధికారులను ఆదేశించారు. ఎస్పీ మాట్లాడుతూ, యువత గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని కోరారు. విద్యాసంస్థల్లో యాంటీ ర్యాగింగ్ కమిటీలు ఏర్పాటు చేసి ర్యాగింగ్ మొదటి దశలోనే కట్టడి చేయాలని, కళాశాలల యాజమాన్యాలు విద్యార్థుల అలవాట్లను, నడవడికను ఎప్పటికప్పుడు గమనించాలని సూచించారు. ఈ సందర్భంగా ‘జాగ్రత్త!! మాదక ద్రవ్యాలు..మీ జీవితా న్ని నాశనం చేస్తాయి...డ్రగ్స్ కు నో చెప్పండి’ అనే పోస్టర్లు రిలీజ్ చేశారు. సమావేశంలో డీఎంహెచ్‌వో ఎస్.రజిత, డీఏవో అఫ్జల్ బేగం, కార్మిక శాఖ అధికారి నజీర్ అహ్మద్ పాల్గొన్నారు. రైతుభరోసాతో అన్నదాతలకు ఆసరాఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): రైతు భరోసాతో అన్నదాతలకు ప్రభుత్వం ఆసరాగా నిలుస్తుందని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా పేర్కొన్నారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు భరోసా విజయోత్సవ సంబరాల్లో భాగంగా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లబొప్పాపూర్ రైతువేదికలో హాజరయ్యారు. హైదరాబాద్ నుంచి సీఎం ప్రసంగాన్ని వీక్షించారు. డీఏవో అఫ్జల్‌బేగం, ఏఎంసీ చైర్పర్సన్ సాబేరా బేగం, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
జిల్లాలో రైతు భరోసా రూ.145.24 కోట్లు
సిరిసిల్ల: జిల్లాలోని రైతులకు వానాకాలం సీజన్ వ్యవసాయ పెట్టుబడులకు రైతు భరోసా పథకంలో రూ.145.24 కోట్లు జమ అయ్యాయని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా మంగళవారం తెలిపారు. జిల్లాలోని 13 మండలాల పరిధిలో 1,24,292 మంది రైతుల బ్యాంక్ ఖాతాల్లో రూ.145,24,03,068 డబ్బులు జమ అయ్యాయని పేర్కొన్నారు. రైతులు వ్యవసాయ పెట్టుబడులకు ప్రభుత్వం ఇచ్చిన రైతు భరోసాను వినియోగించుకోవాలని కోరారు. సామాజిక తనిఖీ ప్రజావేదిక తంగళ్లపల్లి(సిరిసిల్ల): మండలంలోని 30 గ్రామాలకు సంబంధించి నాల్గో విడత సామాజిక తనిఖీ ప్రజావేదిక మంగళవారం మండల పరిషత్ కార్యాలయంలో డీఆర్డీవో శేషాద్రి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఉపాధి పనులకు సంబంధించి రూ.6,92,25,556, దాంతోపాటు పంచాయతీరాజ్ పనులు రూ.2,27,99,287 గాను సామాజిక తనిఖీ గ్రామ సభల్లో సేకరించిన వివరాలను డీఆర్పీలు చదివి వినిపించారు. కొన్ని గ్రామాల్లో చెల్లింపులకు సంబంధించి నిర్వహణ లోపం గుర్తించి ఫెనాల్టీ, రికవరీ రూ.45,886 జరిమానాు విధించినట్లు డీఆర్డీవో తెలిపారు. సమావేశంలో ఎంపీడీవో కె.లక్ష్మీనారాయణ, ఎంపీవో మీర్జా అఫ్జల్ అహ్మద్ బేగ్, తనిఖీ అధికారులు రామారావు, పంచాయతీ కార్యదర్శులు, ఎస్ఆర్పీలు, ఈజీఎస్ సిబ్బంది, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. -
గాడితప్పిన స్వచ్ఛత
● ‘మీరు చూస్తున్న ఈ ఫొటో సిరిసిల్ల మున్సిపల్ ప్రథమ చైర్పర్సన్ రుద్ర సత్తమ్మ కొడుకు రాజేంద్రప్రసాద్ ఇల్లు. వెంకంపేటలో గల తన ఇంట్లోకి ఇలా డ్రైనేజి నీరు వస్తుంటుంది. బయట డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక వర్షం పడినప్పుడు, డ్రైనేజీలో నీరు ఎక్కువగా ప్రవహించినప్పుడు ఇలా ఇంట్లోకి వస్తోంది. చాలా రోజులుగా ఈ సమస్య పరిష్కారం కావడం లేదు.’సిరిసిల్లటౌన్: స్వచ్ఛతలో ఘనకీర్తి సాధించిన సిరిసిల్లలో చెత్తపై చిత్తశుద్ధి కొరవడుతుంది. పలు వార్డులు, ప్రధాన కూడళ్లలో పారిశుధ్యం పడకేయడం విమర్శలకు తావిస్తుంది. నిత్యం చెత్తసేకరణలో ఆదర్శ విధానాలు అవలంబించిన బల్దియా ఇటీవల వెనక్కు తగ్గుతుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక విలీన గ్రామాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. వానాకాలం సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్న నేపథ్యంలో జిల్లా కేంద్రంలో కొరవడిన పారిశుధ్యంపై కథనం. మసకబారుతున్న స్వచ్ఛ బాధ్యత తొమ్మిదేళ్లుగా సిరిసిల్ల బల్దియా జాతీయస్థాయిలో వందశాతం స్వచ్ఛత సాధిస్తూ వస్తుంది. బల్దియా పాలకవర్గం, అధికారులు పక్కా ప్రణాళికతో చెత్తసేకరణ పనులు చేపడుతున్నారు. అయితే ఇటీవల పారిశుధ్యంపై పట్టింపులేమితో విమర్శలు వస్తున్నాయి. మున్సిపల్ పరిధిలోని బహిరంగ ప్రదేశాల్లో మల, మూత్ర విసర్జన నిషేధం అమలు చేయడమే కాకుండా, ప్రజలు చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా కట్టుదిట్టం చేయడంలో సఫ లీకృతులయ్యారు. పట్టణంలో వందశాతం మరుగుదొడ్లు నిర్మించుకునేలా చేసి ఓడీఎఫ్ పట్టణంగా, పబ్లిక్ టాయిలెట్స్ వినియోగం, ప్లాస్టిక్ నిషేధం తదితర పనులతో ఓడీఎఫ్ ప్లస్ పట్టణంగా పేరొందింది. ఇంటింటికీ రెండు చెత్తబుట్టలు అందించి తడి, పొడి చెత్త సేకరిస్తూ వర్మీ కంపోస్టు(ఎరువు) తయారు చేయడంలో బల్దియా ముందుంటోంది. కానీ, ప్రస్తుతం పట్టణంలోని అన్ని కాలనీలతో పాటు విలీనమైన ఏడు గ్రామాల్లో చెత్తపై చిత్తశుద్ధి కరువవడం విమర్శలకు తావిస్తుంది. చెత్తశుద్ధిని కొనసాగించాలి ● ప్రథమశ్రేణి మున్సిపల్‌గా ఆవిర్భవించిన సిరిసిల్లలో రోజూ ఉదయం 27 వాహనాలతో ఇంటింటా చెత్త సేకరిస్తారు. ● పారిశుధ్య పనులను ఇన్చార్జి శానిటరీ ఇన్స్పెక్టర్ కిరణ్, ఇన్చార్జి కమిషనర్ వాణి శానిటేషన్ విధులను పర్యవేక్షిస్తున్నారు. 23 రూట్లలో సుమారు 80 మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. ● 39 వార్డుల్లో 277 మంది కార్మికులు, ప్రత్యేక అధికారులు అహర్నిశలు పని చేస్తూ పట్టణ ప్రజలు ఆరోగ్యంగా ఉండేలా విధులు నిర్వర్తిస్తున్నారు. ● అయితే గతం పాలకవర్గం సభ్యులతో పాటు అధికారగణం రోజూ వార్డుల సందర్శనలో భాగంగా పారిశుధ్యం నూరుశాతం అమలు చేసేవారు. ప్రస్తుతం అధికారుల వార్డు సందర్శనలు అంతంతే అని ప్రజలు పేర్కొంటున్నారు.సిరిసిల్ల మున్సిపల్ ప్రొఫైల్: పట్టణ జనాభా 1,11,000వార్డులు 39శానిటేషన్ సిబ్బంది 277రోజూ చెత్త ఉత్పత్తి 52 మెట్రిక్ టన్నులు సేకరిస్తున్న చెత్త 48 మెట్రిక్ టన్నులు రోజూ ప్లాస్టిక్ పదార్థాల ఉత్పత్తి 12 టన్నులు సిరిసిల్ల బల్దియాలో పేరుకుపోతున్న చెత్తాచెదారం పారిశుధ్యంపై కొరవడిన చిత్తశుద్ధి విజృంభిస్తున్న వానాకాలం వ్యాధులు మురికికూపాలుగా ఓపెన్ ప్లాట్లు ‘ఈ ఫొటోలో ఉన్నది సిరిసిల్ల జూనియర్ కళాశాల ముందు గల 5 రూపాయల భోజన నిలయం ముందు డస్ట్‌బిన్. చాలా రోజులుగా ఇలాగే చెత్తతో నిండి ఉంటోంది. జిల్లా కేంద్రంలోని ప్రధాన సెంటర్ అంబేడ్కర్ చౌరస్తాలో చెత్తడబ్బాలోంచి డస్ట్‌ను తీసుకెళ్లడానికి మూడ్రోజులుగా బల్దియా సిబ్బంది రావడం లేదు. నిత్యం వేలాది సంఖ్యలో జనం తిరిగే ఈప్రాంతం చెత్త చెదారంతో నిండడం విమర్శలకు తావిస్తుంది.’ -
సిరిసిల్ల బల్దియా కమిషనర్‌గా ఖాదర్‌పాషా
సిరిసిల్లటౌన్: సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్‌గా ఖాదర్‌పాషాను ప్రభుత్వం నియమించింది. రాష్ట్ర వ్యాప్తంగా బదిలీలు, పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి 39 మంది కమిషనర్లను నియమించింది. ఈమేరకు మంగళవారం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సూపరింటెండెంట్‌గా ఉన్న ఖాదర్‌పాషా ప్రథమ శ్రేణి మున్సిపాలిటీ సిరిసిల్ల కు కమిషనర్‌గా పదోన్నతిపై రానున్నారు. ఇక్కడ కమిషనర్‌గా పనిచేసిన ఎస్.సమ్మయ్య ఏప్రిల్ 22న అకస్మాత్తుగా దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు. డీఈఈగా పనిచేస్తున్న పోసు వాణి ఇన్చార్జి కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఉన్నత లక్ష్యంతో ముందుకెళ్లాలిఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ఉత్తమ పౌరులుగా ఎదగాలని డీఈవో వినోద్‌కుమార్ సూచించారు. మండలంలోని రాచర్లబొప్పాపూర్, ఎల్లారెడ్డిపేట, కోరుట్లపేట ప్రభుత్వ పాఠశాలలను మంగళవారం సందర్శించారు. జెడ్పీహెచ్ఎస్ బొ ప్పాపూర్లో పదోతరగతి విద్యార్థులతో మా ట్లాడారు. మౌలిక వసతుల కల్పనలో భాగంగా అదనపు తరగతి గదులకు ప్రతిపాదనలు పంపాలని హెచ్ఎంకు సూచించారు. కోరుట్లపేట ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచాలన్నారు. ఎల్లారెడ్డిపేట హైస్కూల్లో మధ్యాహ్న భోజనం పరిశీలించి, నాణ్యతపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. కోఆర్డినేటర్ శ్రీధర్, ఎంఈవో గాలిపల్లి కృష్ణహరి, హెచ్ఎంలు మనోహరాచారి, సత్తయ్య, మధుమాలతి పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానంసిరిసిల్ల/సిరిసిల్లకల్చరల్: సాహసరంగంలో పాల్గొన్న వ్యక్తులను గుర్తించి టెన్సింగ్ నార్కే నేషనల్ అడ్వెంచర్ అవార్డుతో సత్కరించేందుకు యు వజన క్రీడల శాఖ నిర్ణయించిందని జిల్లా డీఎస్డీవో అజ్మీర రాందాస్ తెలి పారు. ఈ మేరకు http:// awards. gov. in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. భూమి, సముద్రం, ఆకాశంలో సాహసయాత్రలు చేసినవారి నుంచి అందిన దరఖాస్తుల్లోంచి ఎంపిక చేస్తామన్నా రు. అదనంగా సాహసరంగంలో జీవితకాల సాధన పురస్కారాన్ని కూ డా అందజేస్తామన్నారు. అర్హత గల సాహసికులు మూడేళ్లుగా నిర్వహించిన సాహసకృత్యాల నేపథ్యంలో దరఖాస్తు చేసుకోవాలన్నా రు. వివరాలకు 94402 39783 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు. ప్రైవేట్ స్కూల్ వ్యాన్ అడ్డగింతకోనరావుపేట(వేములవాడ): మండలంలోని గొల్లపల్లి(వట్టిమల్ల) గ్రామంలో ప్రైవేట్ స్కూళ్లకు చెందిన వ్యాన్లను గ్రామస్తులు అడ్డుకున్నారు. ప్రైవేట్ పాఠశాలకు పంపిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి చిన్నారులను ప్రభుత్వ పాఠశాలకే పంపాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలో అన్ని రకాల వసతులు కల్పిస్తున్నారని పేర్కొన్నారు. మాజీ సర్పంచ్ గోపు పర్శరాములు, మాజీ ఉపసర్పంచ్ భుక్యా రాజు పాల్గొన్నారు. వామపక్షాల నిరసనసిరిసిల్లటౌన్: ఇరాన్‌పై అమెరికా బాంబుదా డులకు పాల్పడడంపై వామపక్షాలు మండిపడ్డాయి. మంగళవారం జిల్లా కేంద్రంలో సీపీఎం, సీపీఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలను హోరెత్తించారు. ఈసందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి మూశం రమేశ్ మాట్లాడుతూ, ఇరాన్‌పై అమెరికా బాంబుదాడులు చేసి ఆసియా ఖండాన్ని యుద్ధమంటల్లోకి నె ట్టి ప్రపంచశాంతికి విఘాతం కలిగించిందని విమర్శించారు. నాయకులు ఎగమంటి ఎల్లారెడ్డి, కోడం రమణ, మల్లారపు అరుణ్‌కుమార్, జువ్వాజి విమల, ఎర్రవెల్లి నాగరాజు పాల్గొన్నారు. అలాగే సీపీఐ నా యకులు గాంధీచౌక్‌లో కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. జిల్లా కార్యవర్గ స భ్యులు ఎలిగేటి రాజశేఖర్, కడారి రాములు, మీసం లక్ష్మణ్, తిరుపతిరెడ్డి, అనిల్ పాల్గొన్నారు. -
ప్రైవేట్‌స్కూల్ వాహనాలు అడ్డుకున్న గ్రామస్తులు
చందుర్తి(వేములవాడ): మండలంలోని బండపల్లి గ్రామస్తులు సోమవారం ప్రైవేట్ స్కూల్ వాహనాన్ని అడ్డుకున్నారు. బండపల్లి నుంచి 65 మందికి పైగా విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలకు వెళ్తున్నారని, ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థుల సంఖ్య 24కు పడిపోవడంతో బడి మూతపడే దశకు చేరుకుంటోందని పాఠశాల ఉపాధ్యాయులు గ్రామస్తుల దృష్టికి తీసుకెళ్లారు. గ్రామస్తులు సోమవారం ఏకమై మాజీ సర్పంచ్ కటకం మల్లేశం ఆధ్వర్యంలో ప్రైవేట్‌స్కూల్ వాహనాలను అడ్డుకున్నారు. దీంతో కొందరు ప్రభుత్వ ఉపాధ్యాయులు తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తే తాము పాఠశాలలకు పంపిస్తామని పట్టుబట్టారు. చివరికి గ్రామంలోని 25 మంది విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతోంద నిజిల్లా, ప్రాథమిక పాఠశాలల ప్రధా నోపాధ్యాయులు ఆనందరెడ్డి, అనిల్‌రావు తెలిపారు. శ్యాంప్రసాద్ జీవితం ఆదర్శనీయం ● బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి సిరిసిల్లటౌన్: డాక్టర్ శ్యాంప్రసాద్ జీవితం ఆదర్శనీయమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి పేర్కొన్నారు. సిరిసిల్లలోని పార్టీ ఆఫీస్‌లో సోమవారం నివాళి అర్పించారు. సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు దుమాల శ్రీకాంత్, స్టేట్ కౌన్సిల్ మెంబర్ మ్యాన రాంప్రసాద్, గరిపెల్లి ప్రభాకర్, నాగుల శ్రీనివాస్, మహిళా మోర్చా పట్టణ అధ్యక్షురాలు వైశాలి తదితరులు పాల్గొన్నారు. రూ.8.60 కోట్లతో పద్మశాలీ భవనం సిరిసిల్లటౌన్: రూ.8.60కోట్లతో సిరిసిల్లలో పద్మశాలీ భవనం పనులు ప్రారంభించబోతున్నట్లు ఆ సంఘం పట్టణాధ్యక్షుడు గోలి వెంకటరమణ తెలిపారు. స్థానిక సంఘం ఆఫీస్‌లో సోమవారం ప్రెస్మీట్లో మాట్లాడారు. గతంలో నిధుల కొరతతో నిలిచిపోయిన పద్మశాలీ, మార్కండేయ ఆలయాల పనులు మంత్రులు పొన్నం ప్రభాకర్‌గౌడ్, తుమ్మల నాగేశ్వర్రావు, విప్ ఆది శ్రీనివాస్, సిరిసిల్ల నియోజకవర్గం ఇన్చార్జి కేకే మహేందర్‌రెడ్డి చొరవతో జరుగుతున్నాయన్నారు. సంఘం ప్రధాన కార్యదర్శి మండల సత్యం, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు కాముని వనిత, తాటిపాముల దామోదర్, రాపెల్లి ప్రవీణ్, మోర రవి, గాజుల బాలయ్య, కోడం శ్రీనివాస్ పాల్గొన్నారు. చదువుకున్న బడికి ఎమ్మెల్యే చేయూత ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తాను చిన్న నాడు చదువుకున్న స్వగ్రామం కోరుట్లపేటలోని ప్రాథమి కోన్నత పాఠశాలకు చేయూతగా నిలిచారు. బడిని సోమవారం పరిశీలించిన సందర్భంగా ఉపాధ్యాయుల కొరత ఉందని తెలుసుకొని.. విద్యావలంటీర్‌ను నియమించుకోవాలని ప్రతీ నెల వేతనంగా రూ.6వేలు చెల్లిస్తానని హామీ ఇచ్చారు. తన ఊరిలోని బడిని అభివృద్ధి చేయాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝాతో ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యంను పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది సన్మానించారు. -
పొగాకుతోనే క్షయవ్యాధి
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): పొగాకు తీసుకునే వారిలో ఎక్కువ మంది క్షయవ్యాధికి గురవుతున్నారని మండల వైద్యాధికారి సారియా అంజుమ్ పేర్కొన్నారు. ఎల్లారెడ్డిపేట పీహెచ్సీలో సోమవారం టీబీ ముక్త్ అభియాన్‌లో భాగంగా 118 మందికి పైగా టీబీ స్క్రీనింగ్ పరీక్షలు చేశారు. 14 మంది అనుమానితులను గుర్తించి పరీక్షల కోసం సిరిసిల్ల ఏరియా ఆస్పత్రికి తరలించారు. వైద్యాధికారిణి మాట్లాడుతూ దీర్ఘకాలిక వ్యాధులు షుగర్, క్యాన్సర్, బీపీతోపాటు పొగాకు తీసుకునే వారు క్షయవ్యాధికి గురవుతున్నట్లు తెలి పారు. రెండు వారాలకు మించి దగ్గు, జ్వరం, ఆకలి లేకపోవడం, రాత్రిపూట చెమటలు పట్టడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. ఏఎంసీ చైర్మన్ సాబేరా బేగం, వైస్‌చైర్మన్ రాంరెడ్డి, సూపర్వైజర్ నాగరాజు పాల్గొన్నారు. -
మహిళలు గర్వపడేలా చీరలుండాలి
సిరిసిల్ల: రాష్ట్రంలోని మహిళా సంఘాల సభ్యులు ఆత్మగౌరవంతో కట్టుకునేలా సిరిసిల్ల నేతన్నలు నాణ్యమైన చీరలను ఉత్పత్తి చేయాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కోరారు. సిరిసిల్ల ఏఎంసీ గోదాంలో సోమవారం ఇందిరా మహిళాశక్తి చీరల బట్ట సేకరణకు శ్రీకారం చుట్టారు. విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ నేతన్నలు, రైతన్నల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. నేతన్నల సంక్షేమానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. గతంలో కంటే మెరుగైన ఆర్డర్లను ఇచ్చామని, సకాలంలో వస్త్రాన్ని ఉత్పత్తి చేసి సిరిసిల్ల పేరు నిలబెట్టాలన్నారు. వేములవాడలో రూ.50కోట్లతో నూలుడిపోను ఏర్పాటు చేసి 90 శాతం అరువుపై అందిస్తున్నామని తెలిపారు. చేనేత కార్మికుల రూ.లక్షలోపు రుణాలు మాఫీ చేశామని పేర్కొన్నారు. నేతన్నలకు 4.30 కోట్ల మీటర్ల చీరల ఉత్పత్తి ఆర్డర్లు ఇవ్వగా.. ఇప్పటి వరకు 65 లక్షల మీటర్లు తయారు చేశారని, జూన్ నెలాఖరులోగా 50 శాతం పూర్తి చేయాలని సూచించారు. ఆత్మగౌరవంతో కట్టుకోవాలి రాష్ట్రమంతటికీ సిరిసిల్ల చీరలు సకాలంలో ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించాలి రూ.150కోట్లతో రాజన్న ఆలయ అభివృద్ధి సిరిసిల్లలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ -
పాఠాలు చెప్పేవారేరి?
● 92 పాఠశాలల్లో సింగిల్ టీచర్ ! ● జిల్లాలో 307 పోస్టులు ఖాళీ ● కుంటుపడుతున్న విద్యాబోధన ● సర్దుబాటుపైనే ఆశలుగంభీరావుపేట(సిరిసిల్ల): జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల ఖాళీలు వెక్కిరిస్తున్నాయి. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులు లేక బోధన కుంటుపడుతోంది. జిల్లాలోని 92 స్కూళ్లలో సింగిల్టీచర్ విధులు నిర్వర్తిస్తుండగా.. 307 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. త్వరలో చేపట్టబోయే టీచర్ల సర్దుబాటు ప్రక్రియపైనే విద్యార్థులు ఆశలు పెట్టుకున్నారు. ఏకోపాధ్యాయ పాఠశాలల్లో.. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రతీ తరగతికి తగిన ఉపాధ్యాయులు ఉండాలి. కానీ జిల్లావ్యాప్తంగా 92 పాఠశాలల్లో ఒక్క టీచరే విధులు నిర్వర్తించాల్సి వస్తోంది. ఒకే టీచర్ అన్ని తరగతులకు, అన్ని సబ్జెక్టులు బోధించాల్సిన బాధ్యతలతో అలసిపోతుండడంతో బోధన నాణ్యతపై ప్రభావం పడుతోంది. దీంతో విద్యార్థులకు గణితం, భౌతికశాస్త్రం, ఇంగ్లిష్ వంటి ప్రధాన సబ్జెక్టుల్లో బలహీనతలు ఏర్పడుతున్నాయి. ఇది అతికష్టమైనప్పటికీ ఉపాధ్యాయులు తమవంతు కృషి చేస్తుండగా.. విద్యార్థులు మాత్రం సరైన పాఠాలు, బోధనను పొందలేకపోతున్నారు. పాఠశాలల్లో సౌకర్యాలు ఉన్నా టీచర్ల కొరతతో అవి వృథాగానే మారుతున్నాయి. మౌలిక వసతుల వినియోగం, పాఠశాల నిర్వహణలో పనుల భారం నెలకొంటోంది. ఏకోపాధ్యాయ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను కేటాయించాల్సిన అవసరం ఉంది. ఈ పాఠశాలల్లో నాణ్యత గురించి మాట్లాడలేం. సర్దుబాటుపైనే ఆశలు జూలైలో టీచర్ల సర్దుబాటు ప్రక్రియ నిర్వహిస్తారని తెలుస్తోంది. విద్యార్థుల సంఖ్య లేని పాఠశాలల నుంచి అవసరమైన చోటుకు బదిలీచేసే ప్రక్రియతో విద్యార్థులకు న్యాయం జరిగే అవకాశం ఉంటుందంటున్నారు. గత విద్యాసంవత్సరం నాటి విద్యార్థుల సంఖ్యను పరిగణనలోకి తీసుకొని మండలా లు, జిల్లాల వారీగా ఎన్ని పాఠశాలల్లో ఎక్కువగా ఉపాధ్యాయులు ఉన్నారు? ఎన్ని చోట్ల అవసరమో.. గణాంకాలు తయారుచేసి సర్దుబాటు ప్రక్రియ చేస్తారని తెలుస్తోంది. జూలై 15 నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేస్తారని సమాచారం. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 1–10 మంది విద్యార్థులుంటే ఒక టీచర్, 11 నుంచి 60 మంది ఉంటే ఇద్దరు, 61 నుంచి 90 వరకు 3, 91 నుంచి 120 వరకు 4, 121 నుంచి 150 వరకు 5, 151 నుంచి 200 వరకు విద్యార్థులుంటే ఆరుగురు టీచర్ల చొప్పున నియమించాల్సి ఉంటుంది. విద్యార్థుల సంఖ్య 200 దాటితే ప్రతీ 40 మందికి ఒక టీచర్ చొప్పున నియమించాల్సి ఉంటుంది. జిల్లాలో 307 పోస్టులు ఖాళీలు జిల్లా వ్యాప్తంగా వివిధ పాఠశాలల్లో 307 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎస్జీటీలు 190, స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ 11, ఫిజిక్స్ 6, బయోసైన్స్ 12, సోషల్ 17, ఆంగ్లం 10, తెలుగు 12, హిందీ 9, స్కూల్ అసిస్టెంట్ పీడీ 6, స్పెషల్ ఎడ్యుకేషన్ 8, లాంగ్వేజ్ పండిట్ పోస్టులు తెలుగు 6, ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం 13, ఎస్జీటీ స్పెషల్ ఎడ్యుకేషన్ 7 చొప్పున ఖాళీగా ఉన్నాయి. -
అన్నదాతా.. రైతు వేదికకు రావా?
● కర్షకులను బతిమాలుకుంటున్న ఏఈవోలు ● సీఎం కార్యక్రమం కోసం ఏఈవోలకు టార్గెట్లు ● ప్రతీ ఆర్వీకి 200 మంది రైతులను తరలించాలని ఆదేశాలు ● ఉమ్మడి జిల్లాలో 50 వేలకుపైగా రైతుల తరలింపు ● రైతులకు ఇచ్చే టీ, స్నాక్స్ డబ్బులు మాత్రం ఇవ్వరట ● మొన్నటి కార్యక్రమానికి పెట్టిన డబ్బులే రాలేదుసాక్షిప్రతినిధి,కరీంనగర్: రైతు వేదికల్లో ముఖ్యమంత్రితో ఏర్పాటు చేసిన ముఖాముఖి కార్యక్రమంతో ఏఈవో (అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్)లు ఇబ్బందులు పడుతున్నారు. సీఎం కార్యక్రమానికి రైతు వేదిక(ఆర్వీ)ల వద్దకు రైతులను తరలించాలని జిల్లా వ్యవసాయాధికారులు టార్గెట్లు విధించడంతో ఇబ్బందులు మొదలయ్యాయి. ప్రతీ ఆర్వీలో కనీసం 200 మందికి తగ్గకుండా రైతులను తరలించాలని ఆదేశాల్లో స్పష్టం చేయడంతో ఏఈవోలు ఇప్పుడు అదే పనిలో తలమునకలయ్యారు. వాస్తవానికి ఈ కార్యక్రమానికి వచ్చేందుకు మెజారిటీ రైతులు సుముఖంగా లేరు. ప్రస్తుతం చాలా చోట్ల వ్యవసాయ పనులు మొదలవుతున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం సా యంత్రం 5 గంటలకు సీఎంతో జరిగే ముఖాముఖి లో తప్పకుండా రైతుభరోసా లబ్ధిదారులతో సీఎం మాట్లాడనున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు 50 వేలమంది రైతులకు ఏఈ వోలు ఫోన్లు చేసి కార్యక్రమానికి రావాల్సిందిగా బతిమాలుతున్నారు.మొన్నామధ్య రైతుభరోసా ప్రారంభం సందర్భంగా కూడా రైతులతో ముఖ్య మంత్రితో ఇలాంటి కార్యక్రమాన్నే నిర్వహించారు. అప్పుడు ప్రతీ ఏఈవోలకు నిర్వహణ ఖర్చుల కింద రూ. 5 వేలు చెల్లిస్తామని చెప్పారు. దీంతో ఆ కా ర్యక్రమంలో హాజరైన ప్రతీ రైతుకు టీ, స్నాక్స్‌ను ఏఈవోలే అందించారు. ఇందుకోసం వారే చేతి నుంచి డబ్బులు పెట్టుకున్నారు. ఆ డబ్బులు ఎపు డు వస్తాయా? అని ఎదురుచూస్తుంటే.. తీరా మరో సారి అలాంటి కార్యక్రమమే నిర్వహించాలని ఉన్నతాధికారులు ఆదేశించడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. చేసేది లేక మళ్లీ రైతులకు ఫోన్లు చేస్తూ.. చేతి చమురు వదిలించేందుకు సిద్ధమవుతున్నారు. రైతు వేదికల్లో ఇబ్బందులివీ! చాలాచోట్ల తాగునీరు సదుపాయం లేదు కుర్చీలు వేసే సిబ్బంది లేరు టీ, స్నాక్స్ ఇచ్చే దిక్కు లేదు మరుగుదొడ్లు శుభ్రం చేసే వారు లేరు రైతు వేదికకు కనీసం ఊడ్చే సిబ్బంది లేరు టెక్నికల్ ఎక్విప్మెంట్కు డబ్బులు రావు, నిర్వహణకు సిబ్బంది లేరు..జిల్లా రైతు వేదికలు ఏఈవోలు కరీంనగర్ 75 71జగిత్యాల 52 71పెద్దపల్లి 54 52సిరిసిల్ల 57 53 -
డ్రగ్స్ నిర్మూలనతోనే బంగారు భవిష్యత్
సిరిసిల్లక్రైం/ఇల్లంతకుంట(మానకొండూర్): డ్రగ్స్ నిర్మూలనతోనే భావితరాల భవిష్యత్ బాగుంటుందని.. ఇందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎస్పీ మహేశ్ బీ గీతే కోరారు. మత్తు పదార్థాల నిర్మూలనపై సిరిసిల్లలో సోమవారం చేపట్టిన 2కే రన్‌ను ప్రారంభించి మాట్లాడారు. డ్రగ్‌రహిత సమాజమే లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు. గంజాయి, మత్తుపదార్థాల సమాచారాన్ని 87126 71111, డయల్ 100లో సమాచారం ఇవ్వాలని కోరారు. సీఐలు మొగిలి, నాగేశ్వరరావు, నటేశ్, మధుకర్, స్పెషల్‌బ్రాంచ్ సీఐ రవి, ఆర్ఐలు మధుకర్, రమేశ్, ఎస్సైలు కిరణ్‌కుమార్, రామ్మోహన్, శ్రీకాంత్, లక్ష్మణ్, శ్రీని వాస్, ఆర్ఎస్ఐ రాజు తదితరులు పాల్గొన్నారు. ఇల్లంతకుంట ఠాణాలో మొక్క నాటిన ఎస్పీ ఇల్లంతకుంట పోలీస్‌స్టేషన్ ఆవరణలో ఆవరణలో మొక్కలు నాటి మాట్లాడారు. మత్తు పదార్థాల నిర్మూలనలో విద్యార్థులు భాగస్వాములు కావాలని ఎస్పీ కోరారు. వేములవాడ ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి, సిరిసిల్ల రూరల్ సీఐ మొగిలి, టాస్క్‌ఫోర్స్ సీఐ నటేశ్, ఆర్ఐలు మధుకర్, యాదగిరి, ఎస్సై సిరిసిల్ల అశోక్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. బాధితులకు భరోసా గ్రీవెన్స్ డే సమస్యల పరిష్కార లక్ష్యంగా, బాధితులకు భరోసాగా ఉండేందుకు ప్రతీ సోమవారం గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నట్లు ఎస్పీ మహేశ్ బీ గీతే పేర్కొన్నారు. 36 ఫిర్యాదులు స్వీకరించి.. పరిష్కరించాలని ఆయా ఠాణాల అధికారులకు ఆదేశించారు. చట్టప్రకారం బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని సూచించారు. ఎస్పీ మహేశ్ బీ గీతే సిరిసిల్లలో 2కే రన్ -
తరగతికి ఒక టీచర్‌ను నియమించాలి
విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా ప్రతీ తరగతికి ఒక ఉపాధ్యాయుడిని నియమించాలి. ఖాళీలను భర్తీ చేయాలి. శాసీ్త్రయమైన హేతుబద్ధీకరణ జరగాలి. ప్రాథమిక పాఠశాలల్లో కనీసం తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండాలి. ఏకోపాధ్యాయ పాఠశాలల్లో ఉపాధ్యాయులకు పనిభారం పెరుగుతోంది. వివిధ తరగతుల విద్యార్థులకు ఒకేసారి బోధించడం సాధ్యం కాదు. విద్యాప్రమాణాలు తగ్గుతాయి. – పాతూరి మహేందర్‌రెడ్డి, టీపీటీఎఫ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు విద్యారంగం బలోపేతంపై దృష్టి పెట్టాలి విద్యారంగంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. భావిభారత పౌరులను తీర్చిదిద్దే బడుల్లో ఉపాధ్యాయులు లేక విద్యాబోధన కుంటుపడుతోంది. జిల్లాలో దూరంగా ఉన్న గంభీరావుపేట మండలంలోని చాలా ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. విద్యార్థుల చదువుకు ప్రాధాన్యతనిస్తూ టీచర్ పోస్టులను భర్తీ చేయాలి. – దోసల శంకర్, గంభీరావుపేట -
కరెంట్ కట్‌కట
బోయినపల్లి(వేములవాడ): జిల్లాలో తరచూ విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుంది. చినుకులు పడితే చాలు చీకట్లు కమ్ముకుంటున్నాయి. ముఖ్యంగా మండల కేంద్రాలు, గ్రామాల్లో కరెంట్ కట్‌కట మొదలైంది. గతంలో ఎన్నడూ ఇలాంటి కరెంట్ కోతలు చూడలేదని ప్రజలు వాపోతున్నారు. ఆదివారం, సోమవారం రాత్రి వేళ కరెంట్ సరఫరాలో తరచూ అంతరాయం ఏర్పడింది. దీంతో బోయినపల్లి, ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్ మండల కేంద్రాల్లో చీకట్లు అలుముకున్నాయి. అర్ధరాత్రులు కరెంట్ పోతే తిరిగి రావడం లేదని వాపోతున్నారు. గాలి, వాన ఏది లేకున్నా ఒక్కోసారి కరెంట్ ఎందుకు తీసేస్తున్నారో అర్థం కావడం లేదని పలువురు వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మధ్యాహ్నం వేళ కూడా తరచూ కరెంట్ పోతుండడంతో వివిధ పనులపై మండల కేంద్రాలకు వచ్చిన వారు బ్యాంకు, తపాలా, మీసేవల కోసం గంటల తరబడి అక్కడే ఎదురుచూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. చెట్లకొమ్మలు కొట్టినా తొలగని అంతరాయం వర్షాకాలంలో ఈదురుగాలులకు చెట్లకొమ్మలు విద్యుత్‌తీగలకు తగిలి కరెంట్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని ఇటీవల జిల్లా వ్యాప్తంగా చెట్లకొమ్మలు తొలగించారు. చెట్లకొమ్మలు తొలగించినా నిత్యం కరెంట్ పోతుండడంతో జిల్లా ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పంటల కోతలు పూర్తయినా విద్యుత్ అంతరాయ కలగడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. సెస్ ఉన్నతాధికారులు స్పందించి బోయినపల్లి, ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్ మండల కేంద్రాల్లో విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు. తరచూ అంతరాయం చినుకుపడితే చీకట్లే.. అర్ధరాత్రి విద్యుత్‌కోతలు పట్టించుకోని విద్యుత్ అధికారులు -
సారూ.. పట్టించుకోండి
సిరిసిల్లఅర్బన్: సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జిల్లా నలుమూలల నుంచి ప్రజలు కలెక్టరేట్ బాట పట్టారు. గత వారం ప్రజావాణి రద్దు కావడంతో సోమవారం భారీగా తరలివచ్చారు. బాధితుల నుంచి అర్జీలను కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా, ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాబాయి, డీఆర్డీవో శేషాద్రిలు స్వీకరించారు. మొత్తం వివిధ సమస్యలపై 261 దరఖాస్తులు వచ్చాయి. సమస్యలు పరిశీలిస్తూ పరిష్కారానికి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను నిర్ణీత సమయంలో పరిష్కరించాలని సూచించారు.అర్జీలు స్వీకరిస్తున్న కలెక్టర్ సందీప్‌కుమార్ ఝాపెన్షన్, ఇందిరమ్మ ఇల్లు మంజురు చేయండి ఉపాఽధి కోసం నా భర్త మలేషియా వెళ్లి చనిపోయాడు. మాకు ఎలాంటి ఆస్తులు లేవు. సిరిసిల్ల పట్టణంలోని శివనగర్‌లో అద్దె ఇంట్లో ఉంటున్నాం. నాకు కుమారుడు, కూతురు ఉన్నారు. కూతురు రిష్విత అంగవికలాంగురాలు. కదలలేని స్థితిలో ఉంది. కూలీ పనిచేస్తూ కుటుంబాన్ని పోషించడం ఇబ్బందిగా ఉంది. నా కు విడో పెన్షన్, ఇందిరమ్మ ఇల్లు ఇప్పించండి. – తోట జయశ్రీ, శివనగర్ భూమి రిజిస్టేషన్ రద్దు చేయండి నేను పట్వారీగా పనిచేసి రిటైర్డ్ అయ్యాను. నా భార్య 2010లో మృతిచెందింది. నాకు ఒక కూతురు, ఇద్దరు కుమారులు. 2010 నుంచి 2015 వరకు నా పెద్దకుమార్తె వద్ద ఉన్నాను. 2015 నుంచి 2024 వరకు చిన్నకుమారుడి వద్ద ఉన్నాను. గ్రామ పెద్దల సమక్షంలో ఇద్దరు కుమారులు చెరో నెల పోషిస్తామన్నారు. పెద్ద కొడుకు అశోక్ పట్టించుకోవడం లేదు. పెద్ద కొడుకు, కోడలు పేరిట చేసిన వ్యవసాయ భూమి రిజిస్టేషన్ ను రద్దు చేయండి. – అమ్ముల గౌరయ్య, పెద్దలింగాపూర్(ఇల్లంతకుంట) ఒర్రెను పూడ్చిన వారిపై చర్యలు తీసుకోవాలి సిరిసిల్ల పట్టణ పరిధిలోని చిన్నబోనాలలో 40 ఏళ్లుగా ఉన్న ఒర్రెను, తొవ్వను కొందరు ఇటీవల పూడ్చివేశారు. పెద్దచెరువు నుంచి వచ్చే కాల్వను మలుపడంతో మా భూమిలోకి వరద నీరు వచ్చే ప్రమాదం ఉంది. పంట నష్టపోతాం. పెద్దచెరువు కాలువను, ఒర్రెను పూడ్చివేసిన వారిపై చట్టరీత్య చర్యలు తీసుకోవాలి. – నిమ్మల రాజు, చిన్నబోనాల(సిరిసిల్ల) -
హోటళ్లపై ఫారెస్ట్ అధికారుల దాడి
వేములవాడరూరల్: హోటళ్లలో వన్యప్రాణుల మాంసం విక్రయిస్తున్నారని సోమవారం ‘సాక్షి’ దినపత్రికలో ప్రచురితమైంది. దీనికి స్పందించిన ఫారెస్ట్ అధికారులు వేములవాడ మండలంలోని నాంపల్లిలోని హోటళ్లలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎవరైనా వన్యప్రాణులను విక్రయిస్తే సమాచారం ఇవ్వాలని, హోటళ్లలో మాంసం విక్రయించొద్దని వేములవాడ సెక్షన్ ఆఫీసర్ అబ్జల్ హుస్సేన్ హెచ్చరించారు. ఆయన వెంట సాయబుస్సేన్, ప్రసాద్, స్వామి, రవి, సిబ్బంది ఉన్నారు.అనుమతి లేని షెడ్డు తొలగింపువేములవాడరూరల్: వేములవాడ మండలంలోని మర్రిపల్లి శివారులో అనుమతులు లేకుండా రైస్‌మిల్లు యజమానులు షెడ్డు నిర్మాణం చేపట్టారు. ఈ విషయాన్ని ‘సాక్షి’లో అనుమతి లేని నిర్మాణాలు... పట్టించుకోని అధికారులు శీర్షికన సోమవారం కథనం ప్రచురితమైంది. సాక్షి కథనానికి స్పందించిన అధికారులు వెంటనే షెడ్డు కూల్చివేయాలని మర్రిపల్లి కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు. గ్రామ కార్యదర్శి జేసీబీతో షెడ్డును కూల్చివేసినట్లు తెలి పారు. కూల్చివేత ఖర్చులు కూడా యజమానుల నుంచి వసూలు చేస్తామని తెలిపారు.విద్యార్థి అదృశ్యంఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన విద్యార్థి మహమ్మద్ తాజొద్దీన్(8) సోమవారం పాఠశాలకు వెళ్లి అదృశ్యమయ్యాడు. మండల కేంద్రంలోని కిషన్దాస్పేటలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు వెళ్లిన విద్యార్థి సాయంత్రం ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విద్యార్థి అదృశ్యమవడం స్థానికంగా కలకలం రేపింది. కుటుంబ సభ్యులు ఎంత గాలించినా ఆచూకీ లభించలేదు. పాఠశాల నుంచి ఇంటికి వస్తున్న తాజొద్దీన్‌ను ఎవరైనా కిడ్నాప్ చేశారా.. అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి, విద్యార్థి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. తాజొద్దీన్ ఆచూకీ తెలిస్తే డయల్ 100 లేదా 87126 56374 లేదా 90004 57637లో సమాచారం అందించాలని ఎస్సై రమాకాంత్ కోరారు.ఏషియన్ షాట్‌ఫుట్ పోటీలకు అడవిబిడ్డసిరిసిల్లటౌన్: ఏషియన్ పారా టైక్వాండో చాంపియన్ పోటీలకు జిల్లాకు చెందిన అడవిబిడ్డ భూక్య సక్కుబాయి ఎంపికయ్యారు. పంజాబ్‌లో ఈనెల 21, 22 తేదీల్లో నిర్వహించిన ఓపెన్ సెలక్షన్స్ ట్రయల్ ఫర్ ఏషియన్ పారా టైక్వాండో చాంపియన్‌షిప్ జీ–4 పోటీలు జరిగాయి. వీర్నపల్లి మండలం బంగిరెడ్డిపల్లితండాకు చెందిన సక్కుబాయి బ్రౌంజ్ మెడల్ సాఽధించారు. జూలై 28 నుంచి 30 వరకు మలేషియాలో జరిగే ఏషియన్ పోటీల్లో పాల్గొననుంది.వ్యవసాయరంగ అభివృద్ధికి బాటలు● డీఆర్డీవోను కలిసిన సమగ్ర రైతు సహకార సంస్థ ప్రతినిధులుసిరిసిల్ల: జిల్లాలో వ్యవసాయరంగ అభివృద్ధికి బాటలు వేయాలని డీఆర్డీవో శేషాద్రి కోరారు. కలెక్టరేట్లో సోమవారం సమగ్ర రైతు సహకార సంస్థ ప్రతినిధులు డీఆర్డీవోను కలిశారు. డీఆర్డీవో శేషాద్రి మాట్లాడుతూ రైతులు ఆధునిక విధానాల్లో సాగు చేసి అధిక దిగుబడులు సాధించేలా ప్రోత్సహించాలన్నారు. కరీంనగర్ జిల్లాలో చేపడుతున్న విధానాలను రాజన్న సిరిసిల్ల జిల్లాలోనూ అమలు చేస్తామని సంస్థ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ జి.స్వప్నరెడ్డి తెలిపారు. సంస్థ అడ్మిన్ మేనేజర్ భాగ్యలక్ష్మి, డివిజన్ మేనేజర్ జింక నాగరాజు, ఎంఈలు సాదియా, లక్ష్మణ్, రాము, రాజు తదితరులు పాల్గొన్నారు. -
కొడుకుకు పింఛన్ ఇప్పించండి
మాది గంభీరావుపేట మండలం గజసింగవరం. నాకు ఒక్కగానొక్క కొడుకు పోతు సిద్దిరాములు(65)కు మాట పడిపోయింది. నాలుగేళ్ల క్రితం నా కోడలు లక్ష్మి మృతిచెందింది. పక్షవాతంతో ఐదేళ్లుగా కొడుకు నడవలేని స్థితిలో ఉన్నాడు. నా కొడుకుకు పింఛన్ మంజూరు చేసి ఆదుకోండి. – పోతు నర్సవ్వ, గజసింగవరం(గంభీరావుపేట) గిఫ్ట్ డీడ్‌ను రద్దు చేయండి నాకు సమాచారం ఇవ్వకుండా ఇల్లు, ఖాళీ స్థలాన్ని నా రెండో కూతురు పాతూరి పద్మ గిఫ్ట్ డీడ్ చేయించుకుంది. పెన్షన్ కోసమని చెప్పి సంతకాలు చేయించుకొని భూమిని ఆమె పేరుమీద మార్చుకుంది. ఆ గిఫ్ట్ డీడ్ రిజిస్టేషన్ను రద్దు చేసి, తిరిగి నా పేరిట పట్టా చేయండి. – సోమిరెడ్డి లక్ష్మి, బందనకల్(ముస్తాబాద్) -
గూడు చెదిరింది..గుండె పగిలింది
● షాట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం ● రోడ్డునపడిన కుటుంబంవేములవాడరూరల్: కూలీ పనులు చేసుకుంటూ ఆ కుటుంబం సంతోషంగా ఉంటుంది. సోమవారం మధ్యాహ్నం విద్యుత్‌షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగి ఇంటికి నిప్పంటుకుంది. ఫైరింజన్ అధికా రులకు సమాచారం అందించగా వారు వచ్చేలోపే సగం ఇల్లు కాలిపోయింది. ఇంట్లోని ఎలాంటి వస్తు వు మిగులలేదు. ఈ సంఘటన చూసిన చుట్టుపక్క ల వారు స్పందించి తోచిన సాయం అందించారు. ఇది వేములవాడ రూరల్ మండలం హన్మాజీపేటలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ గొర్రె మైసయ్య కుటుంబసభ్యులు మధ్యాహ్నం పనులపై బయటకు వెళ్లారు. అదే సమయంలో ఇంటి నుంచి దట్టమైన పొగలు రావడంతో చు ట్టుపక్కల వారు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు వచ్చేలోపే ఇల్లు కాలిపోతుందన్న విషయాన్ని ఫైరింజన్ అధికారులకు తెలిపా రు. ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినా అదుపులోకి రాలేవు. ఇంట్లో ఉన్న వస్తువులు, నగదు, బంగారంతోపాటు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఎలాంటి వస్తువులు లేకవడంతో ఆ కుటుంబాన్ని అయ్యోపాపం అంటూ తోచిన సహాయం అందించారు. కాలిబూడిదైన ఇంటిని చూసి కుటుంబసభ్యులు గుండెలు పగిలేలా రోదించారు. విషయం తెలుసుకున్న రూ రల్ ఆర్ఐ బాలు సంఘటన స్థలానికి వెళ్లి జరిగిన నష్టాన్ని అంచనా వేసి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలంటూ గ్రామస్తులు విన్నవించుకున్నారు. బాధితులకు విప్ భరోసా మండలంలోని హన్మాజిపేట గ్రామంలో షార్ట్ సర్క్యూట్‌తో గొర్రె మైసయ్య ఇల్లు పూర్తిగా కాలిపోయింది. విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ బాధిత కుటుంబాన్ని సోమవారం సాయంత్రం పరామర్శించారు. బాధితులకు అండగా ఉంటానంటూ మనోధైర్యం కల్పించారు. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకున్నారు. సెస్ అధికారులు, జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి తక్షణమే సహాయం అందించాలని ఆదేశించారు. వారి కుటుంబానికి నిత్యావసర వస్తువులు, ఇందిరమ్మ ఇల్లు వెంటనే మంజూరుకు హామీ ఇచ్చారు. -
హన్మాజీపేట బడి.. ‘జ్ఞాన’వెలుగుల గుడి
● మేధావుల పుట్టినిల్లు ఈ హైస్కూల్ ● జ్ఞానపీఠానికి ఎదిగిన సినారె ● ఎస్‌యూ వీసీగా మల్లేశంవేములవాడ: పెద్దబడిగా పిలుచుకునే హన్మాజీ పేట సర్కారు బడి మేధావులకు పుట్టినిల్లు. జ్ఞానపీఠం అందుకున్న సినారె.. ఒగ్గుకళాకారుడు మి ద్దె రాములు.. ఎస్‌యూ వైస్‌చాన్స్‌లర్ సంకసాల మల్లేశం.. ఇలా చెప్పుకుంటే పోతే పెద్ద జాబితా నే ఉంటుంది. వేములవాడరూరల్ మండలం హన్మాజీపేట హైస్కూల్లో అక్షరాలు దిద్దిన ఎందరో నేడు అత్యున్నత స్థానాల్లో ఉన్నారు. సీఎం కార్యాలయంలో కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న కొండబత్తిని శంకర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా జెడ్పీ చైర్మన్‌గా పనిచేసిన తీగల రవీందర్‌గౌడ్, హైకోర్టులో గవర్నమెంట్ ప్లీడర్‌గా విధులు నిర్వహించిన తీగల రాంప్రసాద్‌గౌడ్.. వంటి వారెందరో ఇక్కడ చదువుకున్నవారు. కవులు, కళాకారులు, క్రీడాకారులు, మీడియారంగ ప్రముఖులు, వ్యాపారవేత్తలు ఈ బడిబిడ్డలే. 75 ఏళ్ల వజ్రోత్సవాలు పదూర్లకు మధ్యలో ఉన్న హన్మాజీపేట బడి ఆ గ్రామాల విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పింది. పాఠశాల పుట్టి 75 ఏండ్లు అవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఇటీవల పూర్వ విద్యార్థులు వజ్రోత్సవాలను అత్యంత వైభవంగా జరుపుకున్నారు. దాదాపు 2వేల మంది పూర్వవిద్యార్థులు రెండు రోజులపాటు పండుగ చేసుకుని మురిసిపోయారు. విద్యాబుద్ధులు నేర్పించిన అధ్యాపకులను సన్మానించారు. -
చోరీ కేసుల్లో వ్యక్తికి జైలు
సిరిసిల్లకల్చరల్: రెండు చోరీలకు పాల్పడ్డ నిందితుడికి ఒక కేసులో 5 నెలల 14 రోజులు, మరో కేసులో 3 నెలల 14 రోజులు జైలుశిక్ష విధిస్తూ సోమవారం ప్రథమశ్రేణి న్యాయమూర్తి ప్రవీణ్ తీర్పు వెలువరించారు. 2025 జనవరి 9న బల్యాలనగర్కు చెందిన బల్యాల వినయ్ తన బైక్‌ను గాంధీనగర్ హనుమాన్ గుడి దగ్గర పార్క్ చేశాడు. ఒక గంట తర్వాత వచ్చి చూసేసరికి బండి చోరీకి గురైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు ఇల్లంతకుంటకు చెందిన దుర్మెట్ట నరేశ్‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. అలాగే 2014 అక్టోబర్ 8న మరో ద్విచక్రవాహనాన్ని తన షాపు ముందు పార్క్ చేసి సాయంత్రం తిరిగి వచ్చి చూడగా వాహనం చోరీకి గురైందని గుర్తించిన యజమాని నెహ్రూనగర్‌కు చెందిన దేవనపల్లి విష్ణుప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసులోనూ నిందితుడు దుర్మెట్ట నరేశ్‌గా పోలీసులు గుర్తించారు. కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. పీపీ చెలుమల సందీప్ కేసు వాదించగా సాక్ష్యాధారాలను పరిశీలించిన తరువాత నిందితుడికి మొదటి కేసులో 5 నెలల 14 రోజులు, రెండో కేసులో 3 నెలల 14 రోజులపాటు కారాగార శిక్ష విధించారు. దాడి కేసులో ఒకరికి జైలు సిరిసిల్లకల్చరల్: ఓ వ్యక్తిపై దాడి చేసిన కేసులో నిందితుడికి 4 నెలల 23 రోజుల జైలుశిక్ష విధిస్తూ ప్రథమ శ్రేణి న్యాయమూర్తి ప్రవీణ్ సోమవారం తీర్పునిచ్చారు. సిరిసిల్ల టౌన్ సీఐ కృష్ణ తెలిపిన వివరాలు. స్థానిక అంబేడ్కర్‌నగర్‌కు చెందిన నక్క భార్గవ్‌పై కూరగాయలు కొనుగోలు చేసి ఇంటికి తిరిగొస్తున్న దారిలో పాతకక్షలను మనసులో పెట్టుకుని అడ్డగట్ల శివ అనే వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో భార్గవ్ తలకు గాయాలయ్యాయి. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన అప్పటి ఎస్సై సీహెచ్.శ్రీకాంత్ కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశాడు. నలుగురు సాక్షులను విచారించిన న్యాయస్థానం నేరం రుజువు కావడంతో నిందితుడికి 4 నెలల 23 రోజుల జైలు శిక్ష విధించింది. సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకంముస్తాబాద్: రైతులకు భరోసా ఇచ్చేది ఒక్క కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమేనని పార్టీ మండల అధ్యక్షుడు యెల్ల బాల్‌రెడ్డి అన్నారు. రైతు భరోసా నిధుల విడుదలపై మండలంలోని చిప్పలపల్లి, చీకోడు గ్రామాల్లో సీఎం రేవంత్‌రెడ్డి చిత్రపటానికి సోమవారం క్షీరాభిషేకం చేశారు. ఏఎంసీ చైర్పర్సన్ తలారి రాణి, వైస్‌చైర్మన్ రాంరెడ్డి, కొప్పు రమేశ్, కొండల్‌రెడ్డి, రాజు, గుండెల్లి శ్రీనివాస్, బాల్‌రెడ్డి, రాజలింగం, శ్రీను, నరేశ్ పాల్గొన్నారు. -
నిలిచిన చేపల విక్రయాలు
సిరిసిల్లటౌన్: ఏళ్లుగా చేపల విక్రయాలు కొనసాగిస్తున్న పాతమార్కెట్ పక్షం రోజులుగా బోసిపోయింది. రైతుబజార్లో విక్రయించుకోవాలని అధి కారులు సూచించగా.. అక్కడ వ్యాపారం సరి గ్గా జరుగడం లేదని గంగపుత్రులు పేర్కొంటున్నా రు. అధికారుల సూచనలతో ఈనెల 15న రైతుబజార్లో చేపలు విక్రయించేందుకు దుకాణాలు పెట్టుకుంటే వ్యాపారం పెద్దగా జరుగలేదని వాపోతున్నారు. అధికారులు పాతమార్కెట్లో వద్దనడంతో గంగపుత్రులు పూర్తిగా చేపల అమ్మకాలనే బంద్ చేశారు. బోసిపోయిన ఫిష్ మార్కెట్ సిరిసిల్లలోని పాతకూరగాయల మార్కెట్ ప్రాంగణంలోనే దశాబ్దాలుగా ఫిష్, మటన్ మార్కెట్లు నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో రైతుబజార్ నిర్మించగా.. ఆ సమయంలోనే ఫిష్, మటన్ మార్కెట్లను అక్కడికి తరలించడానికి అధికారులు చర్యలు చేపట్టారు. పట్టణ శివారులోని కొత్త రైతుబజారుకు వినియోగదారులు తక్కువగా వస్తుండడంతో చేపలు, మటన్ మార్కెట్లు పాత మార్కెట్లోనే కొనసాగుతున్నాయి.ఆ సమయంలో రైతుబజారులోకి కూరగాయల రైతులను, అడ్తీదారులను మాత్రమే తరలించారు. పాతకూరగాయల మార్కెట్లో వ్యాపారులు మాత్రమే కూరగాయలు, పండ్ల వ్యాపారాలు చేసుకుంటున్నారు. గంగపుత్రులు మాత్రం పాతమార్కెట్లోనే చేపలు విక్రయిస్తామని విన్నవించగా.. ప్రజాప్రతినిధులు, అధికారులు అంగీకరించడం లేదు. దీంతో గత పదిహేను రోజులుగా సిరిసిల్లలో చేపల విక్రయాలు నిలిచిపోయాయి. సంప్రదింపులు చేపడుతున్నాం చేపల మార్కెట్‌ను రైతబజారులో ఏర్పాటుకు గంగపుత్రులతో సంప్రదింపులు చేపడుతున్నాం. వారి సంఘం ఎన్నికల నేపథ్యంలో కొద్దిరోజులు చేపల విక్రయాలు నిలిపివేశారు. రైతుబజారులో మంచి వాతావరణంలో ఫిష్, మటన్ మార్కెట్ల ఏర్పాటుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. ఫిష్, మటన్ వ్యాపారులు ఇక్కడకు వస్తే వసతులు కల్పిస్తాం. – వెల్ముల స్వరూపరెడ్డి, ఏఎంసీ చైర్మన్ రైతుబజార్‌కు రావాలంటున్న అధికారులు పాతమార్కెట్లో నిషేధంపై గంగపుత్రుల నిరసన పక్షం రోజులుగా కొలిక్కిరాని సమస్య -
సిరిసిల్ల ‘సెస్’ ఎండీగా మోహన్‌రెడ్డి
సిరిసిల్ల: సహకార విద్యుత్ సరఫరా సంఘం(సెస్) మేనేజింగ్ డైరెక్టర్‌గా పిన్నింటి మోహన్‌రెడ్డి సోమవారం విధుల్లో చేరారు. గతంలో ‘సెస్’ ఎండీగా పనిచేసిన విజయేందర్‌రెడ్డి దీర్ఘకాలిక సెలవు పెట్టి అమెరికా వెళ్లారు. ఆయన స్థానంలో ఎన్పీడీసీఎల్ చీఫ్ ఇంజినీర్‌గా రిటైర్డు అయిన మోహన్‌రెడ్డిని నియమిస్తూ ‘సెస్’ పాలకవర్గం నిర్ణయం తీసుకుంది. ఈమేరకు ఆయన ‘సెస్’ ఇన్చార్జి ఎండీ, అకౌంట్స్ ఆఫీసర్ ఎల్.శ్రీనివాస్‌రెడ్డి నుంచి బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఎన్పీడీసీఎల్ రాష్ట్ర డైరెక్టర్‌గా పనిచేసిన అనుభవం ఉన్న మోహన్‌రెడ్డి నెలకు రూ.2.50లక్షల వేతనంతో ‘సెస్’ మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ‘సెస్’ చైర్మన్ చిక్కాల రామారావు, వైస్‌చైర్మన్ దేవరకొండ తిరుపతి, డైరెక్టర్లు గౌరినేని నారాయణరావు, కొట్టెపల్లి సుధాకర్, ఉద్యోగులు ఎండీకి శుభాకాంక్షలు తెలిపారు. దర్శావళిపై అక్రమ నిర్మాణాలు నిలిపివేయాలి ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండలంలోని సింగారం గ్రామ శివారులో దర్శావళి గుట్టపై ఉన్న ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలను నిలిపివేయాలని బీజేపీ మండల అధ్యక్షుడు రేపాక రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం తహసీల్దార్ సుజాతకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అక్రమ కట్టడాలపై పూర్తిస్థాయిలో విచారణ చేసి వాటిని కూల్చివేయాలని కోరారు. పొన్నాల తిరుపతిరెడ్డి, కంచర్ల పర్శరాములు, పారిపల్లి సంజీవరెడ్డి, ఆంజనేయులు, బందారపు లక్ష్మారెడ్డి, సాయి, నంది నరేశ్, దయాకర్‌రెడ్డి, రంజిత్, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అదనపు ట్రాన్స్‌ఫార్మర్‌తో నిరంతర విద్యుత్ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): అదనపు ట్రాన్స్‌ఫార్మర్‌తో వ్యవసాయ రంగానికి నిరంతర విద్యుత్ సరఫరా ఉంటుందని సెస్ డైరెక్టర్ వరుస కృష్ణహరి, ఏఎంసీ చైర్మన్ సాబేరా బేగం అన్నారు. మండలంలోని నారాయణపూర్‌లో అదనపు ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేయగా సోమవారం ప్రారంభించారు. ఈ ట్రాన్స్ఫార్మర్ ద్వారా 18 వ్యవసాయ బావులకు విద్యుత్ సరఫరా అవుతుందన్నారు. సెస్ ఏఈఈ పృథ్వీధర్‌గౌడ్, లైన్మెన్ ప్రవీణ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య, పార్టీ మండల అధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి, నాయకులు గౌస్, రాంరెడ్డి, బండారి బాల్‌రెడ్డి, నిమ్మ మల్లారెడ్డి, మహేందర్, ప్రభాకర్‌రెడ్డి, భాస్కర్, హెల్పర్ సతీశ్ పాల్గొన్నారు. -
జామ..లాభాల తోట
గంభీరావుపేట(సిరిసిల్ల): జామతోటలు పెంచా లంటే రైతులు వెనుకంజ వేస్తుంటారు. ఏడాదంతా పంట కోసం ఎదురుచూడాలని.. దిగుబడి కూడా అంతంతే వస్తుందనే ఆలోచనలో ఉంటా రు. కానీ గంభీరావుపేట మండలం నర్మాలకు చెందిన యువరైతు బొంగు మల్లేశంయాదవ్ ప్ర యోగాత్మకంగా సేంద్రియ విధానంలో తైవాన్ జామను సాగుచేస్తున్నాడు. ఏడాదంతా దిగుబడి వచ్చేలా ప్రణాళికాబద్ధంగా పెంచుతున్నాడు. రెండేళ్ల క్రితం వరకు వరి సాగుచేసిన మల్లేశం పంట మార్పిడి చేయాలని జామ సాగుచేస్తున్నాడు. విభిన్న ఆలోచనలతో.. హార్టికల్చరల్ అధికారుల సలహాలతో సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తూ అధిక దిగుబడులు సాధిస్తున్నాడు. తైవాన్ జామకు మార్కెట్లోనూ డిమాండ్ ఉంది. నాలుగు నెలల నుంచి పూతపూసి ఆరో నెల నుంచి కాపు వస్తుందని రైతు తెలిపాడు. ఎకరాకు దాదాపు 10 టన్నుల దిగుబడి సాధిస్తున్నట్లు వివరించాడు. సేంద్రియ పద్ధతిలోనే.. తనకున్న ఎకరం భూమిలో రెండేళ్ల క్రితం జామ మొక్కలు నాటాడు. ఖమ్మం జిల్లా అశ్వరావుపేట నుంచి 700 మొక్కలు తెప్పించాడు. మొక్కలకు మధ్య మీటర్ దూరం ఉండేలా నాటాడు. జీవా మృతం, కోళ్లఎరువు, పశువుల పేడ, వేపపిండి, వేపనూనెతో సేంద్రియ పద్ధతిలో పెంచుతున్నా డు. కలుపు మొక్కలు తొలగిస్తున్నాడు. అటవీ జంతువులు, కోతుల బెడద లేకుండా ముళ్లకంచెఏర్పాటు చేసుకున్నాడు. అంతరపంటలుగా బీర, దోస, కాకర, టమాట, వంకాయ, వేరుశనగ, బెండకాయ సాగుచేస్తున్నాడు. జామ, కూరగాయలు విక్రయిస్తూ లాభాలు ఆర్జిస్తున్నాడు. మార్కెట్లో డిమాండ్ ఉంది జామపండ్లకు మార్కెట్లో డిమాండ్ ఉంది. జా మపండ్లను స్థానిక మార్కెట్లోనే విక్రయిస్తున్నాను. జామతోట సాగులో నా తల్లిదండ్రులు సహకరిస్తున్నారు. కోతులు, అడవి పందుల బెడద తీవ్రంగా ఉంది. తాత్కాలికంగా ముళ్లకంచెతో రక్షణ ఏర్పాటు చేసుకున్న. ప్రభుత్వం సబ్సిడీపై సోలార్ ఫెన్సింగ్ ఇస్తే బాగుంటుంది. – బొంగు మల్లేశంయాదవ్, యువరైతు, నర్మాల -
సమగ్ర అభివృద్ధికి బాటలు వేద్దాం
వాతావరణం ఆకాశం మేఘావృతమవుతుంది. వర్షం కురిసే అవకాశం లేదు. గాలిలో తేమ అధికంగా ఉంటుంది. రాత్రి వేళ ఈదురుగాలులు వీస్తాయి.వర్షం కోసం కప్పతల్లి ఆట బోయినపల్లి(చొప్పదండి): వర్షాలు కురవాలని కోరుతూ బోయినపల్లిలో ఆదివారం కప్పతల్లి ఆట ఆడారు. మొదట గ్రామ దేవతలకు జలాభిషేకాలు చేశారు. ● పథకాల అమలులో పారదర్శకత పాటించాలి ● కష్టకాలంలోనూ పథకాలు అమలు చేస్తున్నాం ● విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు అధిక ప్రాధాన్యం ● జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ● మూడు శాఖలపై నాలుగు గంటలపాటు సమీక్షసోమవారం శ్రీ 23 శ్రీ జూన్ శ్రీ 2025కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లా సమగ్ర అభివృద్ధికి బాసటగా నిలవాలని జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు పిలుపునిచ్చారు. ఆదివారం కరీంనగర్ కలెక్టరేట్లో వ్యవసాయం, విద్య, హౌసింగ్ శాఖలపై మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో కలిసి నాలుగు గంటలపాటు సమీక్షించారు. వర్షాభావ పరిస్థితులు, క్రాప్ బుకింగ్, సాగు వివరాలు, విత్తనాలు, ఎరువుల లభ్యత, రైతుభరోసా, ఆయిల్ పాం సాగు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, గ్రౌండింగ్తీరును ఆయా జిల్లాల కలెక్టర్లు మంత్రికి వివరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో అస్తవ్యస్త పరిస్థితులను సరిచేస్తూ.. పాలన సాగిస్తున్నామని, ఎక్కడా ఎటువంటి అవినీతికి ఆస్కారం లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. జూలై వరకు అవసరమైన విత్తనాలు, ఎరువుల స్టాక్ అందుబాటులో ఉంచుకోవాలన్నారు. అవసరమైన మేరకే యూరి యా వాడాలన్నారు. ఆయిల్‌పాం సాగుపై మరింత శ్రద్ధ చూపి జిల్లాలకు కేటాయించిన లక్ష్యాన్ని మించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలన్నారు. పంచాయతీరాజ్, ఆర్అండ్బీ, విద్యాశాఖ అధికారులు శిథిలావస్థలో ఉన్న భవనాలను ఖాళీ చేయించాలన్నారు. ● రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ నిరుపేదలందరికీ ఇందిర మ్మ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. ఎమ్మెల్యేల దృష్టిలో ఉన్న నిరుపేదల జాబితాను కలెక్టర్లకు అందిస్తే ఇందిరమ్మ కమిటీలో చర్చించి పార్టీలకతీతంగా మంజూరు చేస్తామన్నారు. కూరగాయ ల సాగు విస్తరించాలని, కల్తీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. ● మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ రైతు భరోసా రైతుల ఖాతాలో జమ చేస్తున్నందుకు మంత్రి తుమ్మలకు కృతజ్ఞతలు తెలిపారు. రైతులు ఆయిల్ పాం సాగువైపు దృష్టి సారించాలన్నారు. క్యాష్ క్రాప్స్, హార్టికల్చర్ పంటలను ప్రోత్సహించాలని సూచించారు. ప్రభుత్వ బడులను బలోపేతం చేయాలన్నారు. ● వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో ఎరువుల కొరత లేదన్నారు. రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు పూర్తి చేశామని, రైతుభరోసా ఖాతాల్లో జమ అవుతోందని తెలిపారు. వేములవాడలో సూరమ్మ ప్రాజెక్టు, శ్రీపాద నారాయణపురం ప్రాజెక్టుల భూ సేకరణ నిధులు విడుదల చేయాలని కోరారు. ● కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ ఆయిల్ పాం సాగును ప్రోత్సహించాలన్నారు. తాను 48 ఎకరాల్లో ఆయిల్ పాం సాగు చేస్తున్నట్లు తెలిపారు. ఆయిల్ పాం ప్రాసెస్ యూనిట్‌ను చిగురుమామిడిలో ఏర్పాటు చే యాలని కోరారు. కరీంనగర్లో గతంలో సీఎం స్పెషల్ ఫండ్ కింద రూ.350 కోట్లతో 120రోడ్ల పనులు ప్రారంభించామని, వాటిని పూర్తి చేయి ంచాలని విజ్ఞప్తి చేశారు. కేబుల్ బ్రిడ్జి డైనమిక్ లైటింగ్ వ్యవస్థ పనితీరు పర్యవేక్షించాలన్నారు. ● జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ సీడ్ ప్రాసెసింగ్ ప్లాంట్ జగిత్యాల ప్రాంతంలో ఏర్పాటు చేయాలని కోరారు. ఆయిల్‌పాం సాగుపై అవగాహన కల్పిస్తున్నామని, పంటకు ధర పెంచేలా చూడాలని అన్నారు. ● కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో ఎమ్మెల్యేల జాబితాను పరిగణనలోకి తీసుకోవాలని కోరా రు. మెట్పల్లి హైస్కూల్ శిథిలావస్థలో ఉందని, పక్కనే జూనియర్ కళాశాల భవనం 80శాతం పూర్తయిందని, దానిని పూర్తి చేసి స్కూల్ పిల్లలను ఆ భవనానికి తరలించాలని అన్నారు. ఉర్దూ ప్రభుత్వ పాఠశాల పనులు పూర్తిచేయాలని కోరారు. ● పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణా రావు మాట్లాడుతూ వ్యవసాయంపై గ్రామాల్లో సదస్సులు పెట్టి రైతులకు సలహాలు, సూచనలను శాస్త్రవేత్తల ద్వారా ఇప్పించామన్నారు. పంట మార్పిడిపై ప్రచారం చేయాల్సిన అవస రం ఉందన్నారు. ఐదేళ్లుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పత్తి పంట తగ్గిపోతోందని, వరి, మొక్కజొన్న సాగు పెరుగుతోందని అన్నారు. ● రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ మాట్లాడుతూ తమ ప్రాంతంలో ఎత్తిపోతలు పూర్తి చేయడంతో అంతర్గాం, పాలకుర్తి మండలాలకు తొలిసారి సాగునీరు వచ్చిందని, గతం కంటే రెండింతల పంట పండుతోందని తెలిపారు. సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సీఎల్, కేశోరాం సిమెంట్ వంటి సంస్థల డీఎంఎఫ్టీ నిధులు జిల్లాకు రావడం లేదని అన్నారు. ● మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ పాఠశాలల్లో విద్యార్థులకు చదవడం, రాయడం, సామాన్య, గణితం వంటి విద్యా ప్రమాణాలు పెంచేలా చూడాలన్నారు. వృత్తి విద్యా కోర్సుల ద్వారా యువతను ప్రయోజకులను చేసేందుకు స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటును స్వాగతించారు. ● చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ చొప్పదండి ప్రాంతంలోని చేనేత కార్మికుల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని, గంగాధర మండలానికి డిగ్రీ కళాశాల మంజూరు చేయాలని కోరారు. ● సమీక్ష సమావేశంలో ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్, కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల కలెక్టర్లు పమేలా సత్పతి, కోయ శ్రీహర్ష, సందీప్ కుమార్ ఝా, సత్య ప్రసాద్, రాష్ట్ర మినిమం వేజ్‌బోర్డు సలహా మండలి చైర్మన్ జనక్‌ప్రసాద్, కరీంనగర్, సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల గ్రంథాలయ సంస్థ చైర్మన్లు సత్తు మల్లేశం, కేడం లింగమూర్తి, నాగుల సత్యనారాయణ, ఆర్టీఏ మెంబర్ పడాల రాహుల్, అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలు, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు.‘రేషన్‌లో చక్కెర ఇవ్వాలి’ సిరిసిల్లటౌన్: రేషన్‌షాపుల్లో ఏఏవై కార్డుదారులకు చక్కెర పంపిణీ చేయాలని సిరిసిల్ల పౌరసంక్షేమ సమితి అధ్యక్షుడు బియ్యంకార్ శ్రీనివాస్ కోరారు. సిరిసిల్లలో ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఏఏవై కార్డుదారులకు నెలకో కిలో చొప్పున మూడు నెలలకు మూడు కిలోలకు బదులు ఒకే కిలో ఇస్తున్నారన్నారు. డీఎస్వో స్పందించాలని కోరారు. సమితి కోశాధికారి చిప్ప దేవదాస్, సభ్యులు వేముల పోసెట్టి, దేవులపల్లి శ్రీరాములు పాల్గొన్నారు. న్యూస్‌రీల్ -
రెండు బస్తాలు కట్ చేశారు
ఇల్లంతకుంటలోని ఐకేపీ తిరుగుడు ధాన్యం కొనుగోలు కేంద్రంలో 143 బస్తాలు అమ్మినాను. తూకం పూర్తయి, ధాన్యం పోయిన తర్వాత రెండు బస్తాలు కట్ చేసి మిగతా వాటికి రూపాయలు కట్టిస్తామంటున్నారు. అలా ఎలా చేస్తారు. – చింతలపల్లి రాజురెడ్డి, పత్తికుంటపల్లివెంటనే చెప్పలేదు సెంటర్ నుంచి లోడైన లారీ వెంబడి రైతుల వివరాలు తెలిపే ట్రక్‌షీట్ పంపించాం. అన్లోడ్ అయిన వెంటనే వివరాలు తెలపలేదు. కొనుగోలు పూర్తయిన తర్వాత ఒకేసారి 18 లారీలలో 53 క్వింటాళ్లు తరుగుగా చూపించారు. సోమవారం కలెక్టరేట్‌కు వెళ్తున్నాను. – కట్ట వాణిశ్రీ, ఐకేపీ ఏపీఎం -
నిషా తెగింపు
సిరిసిల్ల: మత్తులో యువత చిత్తవుతున్నారు. మద్యం..గంజాయి సేవిస్తూ నిషాలో తూగుతున్నా రు. మత్తులోనే రోడ్లపైకి వచ్చి ప్రమాదాలకు కారణ మవుతున్నారు. పోలీసులు నిత్యం డ్రంకెన్‌డ్రైవ్ తని ఖీలు చేస్తున్నా మందుబాబులు మారడం లేదు. జిల్లాలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో 90 శాతం తాగిన మైకంలోనే జరుగుతున్నాయి. మద్యంషాపులు అన్ని ప్రాంతాల్లో అందుబాటులో ఉండడంతోపాటు అక్రమంగా నిర్వహించే బెల్ట్‌షాపులు ప్రతి ఊరులోనూ ఉండడంతో మత్తు ఆవహిస్తుంది. గంజాయిని సిగరేట్లు.. చాక్లేట్లలో వినియోగిస్తూ యువతరం మత్తులో మునుగుతోంది. కట్టడి చేయలేని కన్నవాళ్లు ● పిల్లలు యువకులుగా మారే క్రమంలో వారిని కట్టడి చేయడం తల్లిదండ్రులకు సాధ్యం కావడం లేదు. యువకులు బయట ఏం చేస్తున్నారో.. ఏం సేవిస్తున్నారో చూసే సమయం తల్లిదండ్రులకు లేకుండా పోతోంది. ప్రాథమిక దశలో గుర్తించకపోవడంతోనే మత్తుకు బానిసలుగా మారిపోతున్నారు. చేయిదాటిన తర్వాత గుర్తించిన ఏం చేయలేని అసహాయస్థితిలో కన్నవాళ్లు కుమిలిపోతున్నారు. ● ఇటీవల సిరిసిల్ల పట్టణ శివారులో పోలీసులు తనిఖీలు చేస్తుండగా కారులో వచ్చిన యువకుడు ఒకరు మత్తులో ఉన్నాడు. పోలీసులు బ్రీథింగ్ అనలైజర్‌తో చెక్ చేయగా.. మత్తులో ఉన్నట్లు నిర్ధారణ అయింది. వెంటనే పోలీసులు కారు కీస్ తీసుకోగా.. సదరు యువకుడు పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. అతన్ని, కారును పోలీసులు ఠాణాకు పంపించారు. మత్తు దిగిన తరువాత పోలీసులు తమదైన శైలిలో మర్యాద చేశారు. జరిగిన విషయం తెలిసి అతని తల్లిదండ్రులు తల్లిడిల్లిపోయారు. ఇలా జిల్లాలో పిల్లల చర్యలతో పెద్దలు ఇబ్బందులు పడుతున్నారు. ● చందుర్తికి చెందిన ఓ యువకుడు మద్యం మత్తులోనే తన సొంత పెద్దమ్మ తలను కత్తితో నరికి ధర్జాగా ఠాణాకు వెళ్లి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. గతంలోనూ హత్యచేసిన సదరు యువకుడు గంజాయి, మద్యంకు బానిసకావడంతో ఇలాంటి అఘాయితాల్యలకు బరితెగించాడు. కేసులకూ భయపడని వైనం ● జిల్లాలో నిత్యం డ్రంకెన్‌డ్రైవ్ కేసులు, బహిరంగంగా మద్యం సేవించే కేసులు నమోదవుతున్నాయి. కానీ యువకులు పోలీసు కేసులకూ భయపడడం లేదు. డ్రంకెన్‌డ్రైవ్ కేసుల్లో జైలుశిక్షలు పడుతున్నా మద్యం మత్తును వదలడం లేదు. సినిమాలు, సోషల్‌మీడియా ప్రభావంతో యువత పెడదారుల్లో సాగుతోంది. పోలీసులనే ఎదిరించడం, వాదించడం, కేసుల్లో ఇరుక్కోవడం జరుగుతుంది. మత్తులో జరుగుతున్న ఘటనలతో అభం శుభం తెలియని వ్యక్తులు, ఆ వ్యక్తులపై ఆధారపడిన కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. బాధ్యత అందరిదీ.. ● మద్యం, గంజాయి, డ్రగ్స్ మత్తును వదిలించేందుకు ప్రభుత్వ యంత్రాంగంలోని అన్ని శాఖలు, పౌరసమాజం బాధ్యత తీసుకోవాల్సిందే. జిల్లాలో అనధికారికంగా నడుస్తున్న బెల్ట్‌షాపులను కట్టడి చేయాలి. మరోవైపు గంజాయి సరఫరా చేస్తున్న ముఠాలను పట్టుకోవాలి. మద్యం తాగితే రోడ్డు ఎక్కకుండా అడ్డుకోవాలి. సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి. మత్తుకు బానిసలుగా మారిన వారిని డీ–ఆడిక్షన్ సెంటర్లకు పంపించి వైద్యం చేయించాలి. స్కూల్, కళాశాల స్థాయిల్లో మత్తు ప్రభావాన్ని వివరిస్తూ అవగాహన కల్పించాలి. పోలీసుల తనిఖీలు పెరగాలి. తప్పుచేస్తే శిక్ష పడుతుందనే భయం ఉండాలి. మత్తును వదిలించేందుకు జిల్లాలోని అన్ని ప్రభుత్వశాఖలు నడుం బిగించాల్సిన అవసరం ఉంది. మత్తులో యువతచిత్తు రోడ్డు ప్రమాదాలు.. పోతున్న ప్రాణాలు మద్యం మత్తు.. గంజాయి జోష్ కట్టడి చేయలేకపోతున్న కన్నవాళ్లు పోలీస్ కేసులకూ భయపడని వైనం అది వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం స్టేజీ. ఎప్పుడూ సందడిగా ఉండే వేములవాడ–కరీంనగర్ ప్రధాన రహదారి. బుధవారం రాత్రి ఎవరి పనులు వారు ముగించుకుని ఇళ్లకు చేరుతున్న వేళ నాంపల్లి వైపు నుంచి ఓ కారు దూసుకొచ్చింది. రోడ్డు పక్కన వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. అంతే.. ఆ వాహనంపై ఉన్న యువకుడు దర్శి(35) అక్కడికక్కడే మృతిచెందాడు. అందరూ చూస్తుండగానే ఆ కారు వేగంగా కరీంనగర్ వైపు వెళ్లింది. సరిగ్గా రెండు కిలోమీటర్లు వెళ్లగానే ఆరెపల్లి స్టేజీ వద్ద మరో ద్విచక్రవాహనాన్ని అదే కారు ఢీకొట్టింది. మల్యాల పండరీనాథ్(25) అనే యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. ద్విచక్రవాహనం వెనుక కూర్చున్న చందు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ రెండు ఘటనలకు కారణమైన వ్యక్తి కరీంనగర్ పట్టణ శివారులోని రేకుర్తికి చెందిన యువకుడు రాచకొండ రాజశేఖర్(21). మద్యంమత్తులో కారుడ్రైవింగ్ చేసి రెండు నిండు ప్రాణాలను బలితీసుకోవడమే కాకుండా.. తాను తీవ్రంగా గాయపడి మృత్యువుతో పోరాడుతున్నాడు. ఈ రోడ్డు ప్రమాదంలో మృతుడు పండరీనాథ్‌కు 25 రోజుల కిందటే పెళ్లి కాగా.. దర్శి వలస కార్మికుడు. తంగళ్లపల్లి మండలం నేరెళ్ల వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వేములవాడ శివారులోని చింతలఠాణా ఆర్అండ్ఆర్ కాలనీకి చెందిన కుర్మ నరేశ్(38) మరణించాడు. నరేశ్ సిద్దిపేట వైపు వెళ్తుండగా.. ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి, ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మరణించాడు. ఈ ప్రమాదానికి కారణమైన వ్యక్తి 22 ఏళ్ల యువకుడు. ఉదయం పూటనే మత్తులో ఉన్నాడు. వాహనదారులపైకి ఎదురుతిరుగుతూ పదేళ్లు జైలుకు వెళ్తానంటూ.. మర్లపడి మాట్లాడుతున్నాడు. అతనికి బ్రీథింగ్ అనలైజర్ పరీక్ష చేయగా 219 పాయింట్లు మత్తు వచ్చింది. ఇలా తాగిన మైకంలో ఓ నిండు ప్రాణాన్ని సదరు యువకుడు నషాళానికి ఎక్కిన నిషాలో బలితీసుకున్నాడు. -
వేములవాడ అభివృద్ధికి ప్రణాళికలు
● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వేములవాడఅర్బన్: వేములవాడ పట్టణ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. పట్టణంలోని 3వ వార్డు లక్ష్మీపురం, 17వ వార్డు శాసీ్త్రనగర్, 18వ వార్డు గాంధీనగర్‌లో ఆదివారం రూ.32 లక్షలతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజాప్రభుత్వంలో అన్ని వర్గాల సంక్షేమమే పరమావధిగా ముందుకు పోతున్నామన్నారు. వేములవాడ పట్టణం, రాజన్న ఆలయాలను సమానంగా అభివృద్ధి చేస్తామన్నారు. ఇళ్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు. మున్సిపల్ కమిషనర్ అన్వేశ్, పార్టీ పట్టణాధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్, నాయకులు సాగరం వెంకటస్వామి, పుల్కం రాజు, అరుణ్‌తేజాచారి, కట్కూరి శ్రీనివాస్ పాల్గొన్నారు. -
చట్టాలు తెలియక కటకటాల్లోకి..
సిరిసిల్ల: బతుకుదెరువు కోసం ఉన్న ఊరిని, కన్నవారిని, కట్టుకున్న భార్యను వదిలి గల్ఫ్ దేశం వెళ్తే.. అక్కడి చట్టాలు తెలియక జైలుపాలైన ఘటన వెలుగులోకి వచ్చింది. రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం మండెపల్లికి చెందిన నక్క బాలనర్సు సౌదీ అరేబియాలో జైలుపాలయ్యాడు. తన భర్తను విడిపించాలని కోరుతూ అతని భార్య దేవేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించింది. సౌదీ చట్టాలపై అవగాహన లేకపోవడంతో మూడున్నర ఏళ్ల జైలుశిక్ష పడింది. ప్రస్తుతం రియాద్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 1న జైలుపాలైన బాలనర్సుకు సౌదీలోని ఇండియన్ ఎంబసీ ద్వారా న్యాయ సహాయం అందించి, క్షమాభిక్ష ఇప్పించాలని అతని భార్య నక్క దేవేంద్ర హైదరాబాద్ ప్రజాభవన్‌లోని ‘ప్రవాసీ ప్రజావాణి’ని ఆశ్రయించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నారై అడ్వయిజరీ కమిటీ వైస్‌చైర్మన్ మంద భీంరెడ్డి, సెలవుపై సౌదీ నుంచి వచ్చిన సామాజిక సేవకులు ఆసాని రాజిరెడ్డి, మహ్మద్ నవీద్లతో కలిసి సీఎం ప్రజావాణి ఇన్చార్జి, సీనియర్ ఐఏఎస్ అధికారిణి దివ్యదేవారాజన్ను కలిసి గోడు వినిపించారు. ఇంటి డ్రైవర్ ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా బాలనర్సు తన అరబ్ యజమాని పిల్లలను పాఠశాలకు తీసుకెళ్లేవాడని తెలిపింది. పిల్లలతో స్నేహపూర్వక ప్రవర్తనను యజమాని అపార్థం చేసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. స్థానిక ఆచార వ్యవహారాలు, సున్నితత్వం తెలియకపోవడంతో అపోహలకు దారితీసి జైలుపాలయ్యాడని ఆమె తెలిపారు. వెంటనే స్పందించిన సీనియర్ ఐఏఎస్ అధికారిణి దివ్యదేవారాజన్, రాష్ట్ర ఎన్నారై విభాగం ఐఏఎస్ అధికారి సీహెచ్ శివలింగయ్యతో మాట్లాడారు. రియాద్‌లోని భారత రాయబార కార్యాలయంతో సమన్వయం చేస్తూ, సౌదీ అధికారుల వద్దకు క్షమాభిక్ష అభ్యర్థనను పంపడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గల్ఫ్ బాటలో జైలుపాలైన బాలనర్సు విడుదల కోసం అతని కుటుంబం నిరీక్షిస్తోంది. సౌదీ జైలులో మండెపల్లివాసి విడుదల చేయాలని ప్రవాసీ ప్రజావాణిని ఆశ్రయించిన వలసజీవి భార్య మూడున్నరేళ్ల జైలుశిక్ష క్షమాభిక్ష కోసం రాష్ట్ర ప్రభుత్వ సహాయం కోరిన కుటుంబం స్పందించిన ఐఏఎస్ అధికారిణి దివ్యదేవరాజన్ -
సగం సీట్లు ఖాళీ
● గంభీరావుపేటలో ఇంటర్, డిగ్రీ, పీజీ కళాశాల విద్యార్థినుల హాస్టల్ ● పాఠశాల విద్యార్థుల కోసం ఎస్సీ బాలుర వసతి గృహం ● రెండింటిలోనూ వంద చొప్పున సీట్లు ● అడ్మిషన్ల కోసం ప్రచారబాటలో అధికారులు గంభీరావుపేట(సిరిసిల్ల): విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన హాస్టళ్లలో సగం సీట్లు కూడా భర్తీ కావడం లేదు. అధికారుల ప్రచారం చేసినా చాలా మంది ఆసక్తి చూపడం లేదు. ఫలితంగా సగంలోపే సీట్లు భర్తీ అవుతున్నాయి. షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ కళాశాలలు, పాఠశాలల విద్యార్థుల కోసం గంభీరావుపేట మండల కేంద్రంలో రెండు వసతి గృహాలను వేర్వేరుగా ఏర్పాటు చేశారు. ఆరో తరగతి నుంచి పదో తరగతి విద్యార్థుల కోసం ఎస్సీ బాలుర వసతి గృహం. ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ కళాశాలల విద్యార్థినుల కోసం మరో హాస్టల్ ఏర్పాటు చేశారు. రెండు హాస్టళ్లలో వంద సీట్ల చొప్పున కేటాయించారు. సగం సీట్లు ఖాళీ ప్రస్తుతానికి రెండు హాస్టళ్లలో సగం సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. దాదాపు 50 విద్యార్థుల్లోపే ఉన్నారు. గతేడాది పొడవునా ఆ సీట్లు ఖాళీగానే ఉన్నాయి. ఈ విద్యాసంవత్సరంలో విద్యార్థుల సంఖ్య పూర్తిస్థాయిలో భర్తీ చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. అన్ని రకాల వసతులు ఉన్నా వసతిగృహంలో సీట్లు ఎందుకు ఖాళీగా ఉంటున్నాయో చర్చిస్తూ.. విద్యార్థుల సంఖ్య పెంచాలనే ఉద్దేశంతో అధికారులు వసతిగృహంలో చేరాలని, చేర్పించాలని ప్రచారం చేస్తున్నారు. ఇటు కళాశాల అధ్యాపకులతో.. అటు పాఠశాలల ఉపాధ్యాయులతో కలిసి ప్రచారబాటలో పాల్గొంటున్నారు. వసతిగృహాల్లో కల్పిస్తున్న సదుపాయాలపై తల్లిదండ్రులకు వివరిస్తున్నారు. ఇతర మండలాలకు చెందిన విద్యార్థులకు సైతం ప్రవేశాలు కల్పించడం జరుగుతుందని అధికారులు పేర్కొంటున్నారు. వసతిగృహానికి కేటాయించిన వందసీట్లలో ఎస్సీలకు 75 శాతం, బీసీలకు 12, ఎస్టీలకు 6 శాతం చొప్పున సీట్లు కేటాయిస్తున్నారు. రెండు హాస్టళ్లలోనూ ప్రస్తుతం సగానికి పైగా సీట్లు ఖాళీగానే ఉన్నాయి. హాస్టళ్లలో పౌష్టికాహారం విద్యార్థులకు అన్ని రకాల సదుపాయాలతోపాటు నాణ్యమైన పౌష్టికాహారం అందిస్తున్నారు. ఉదయం 7 గంటలకు రాగిజావ, పాలు ఇస్తారు. అనంతరం గంట తర్వాత బ్రేక్‌ఫాస్ట్‌లో భాగంగా ఉప్మా, పులిహోర, కిచిడి, చపాతి, పూరీ, ఇడ్లి, జీర రైస్, టమాట అన్నం.. ఇలా రోజుకో రకంగా ఇస్తారు. మధ్యాహ్నం పాఠశాలలో భోజనం ఉంటుంది. సాయంత్రం 5 గంటలకు స్నాక్స్ కింద పల్లీపట్టీలు, అటుకులు, బిస్కెట్స్, శనగలు, బబ్బర్లు, స్వీట్స్తోపాటు ప్రతి ఆదివారం మధ్యాహ్నం చికెన్‌రైస్, గుడ్డు ప్రత్యేకంగా అందిస్తారు. వారంలో రెండు రోజులు గుడ్డుతోపాటు అరటిపళ్లు, ఇతర పళ్లు విద్యార్థులకు అందించనున్నారు. అవగాహన కల్పిస్తున్నాం గంభీరావుపేటలోని కళా శాల, పాఠశాల విద్యార్థుల కోసం ఏర్పాటుచేసిన ఎస్సీ బాలుర, బాలికల వసతిగృహాల్లో అడ్మిషన్ల కోసం ప్ర చారం నిర్వహిస్తున్నాం. వసతిగృహాల్లో ఉండి చదువుకునేలా అవగా హన కల్పిస్తున్నాం. ఇప్పుడిప్పుడే పాఠశాలలు, కళాశాలలు ప్రారంభమయ్యాయి. వంద సీట్లు భర్తీ చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. గంభీరావుపేట మండలంతోపాటు చుట్టుపక్క ల మండలాల్లోనూ విద్యార్థుల తల్లిదండ్రులకు హాస్టల్ ప్రత్యేకతలను, ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాల గురించి అవగాహన కల్పిస్తున్నాం. – భూదేవి, వసతిగృహాల సంక్షేమాధికారి, గంభీరావుపేట -
జీతం.. సతమతం
కరీంనగర్ అర్బన్: పాడి పరిశ్రమ వృద్ధిలో కీలక పాత్ర పోషించే గోపాలమిత్రలు వేతనాలు అందక మదనపడుతున్నారు. గౌరవ వేతనంతో సేవలందిస్తుండగా 9నెలలుగా సదరు వేతనం లేక ఆందోళన చెందుతున్నారు. కేంద్ర ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అందించే 9నెలల గౌరవ వేతనం రాకపోవడంతో అప్పులతో కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. పశు సంపద అభివృద్ధి కోసం గ్రామాల్లో విస్తృతంగా సేవలందిస్తున్నా సక్రమంగా వేతనాలు రాక సతమతమవుతున్నారు. ఆర్ఎంపీల్లా గోపాలమిత్రలు 2000 సంవత్సరంలో జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ (డిస్ట్రిక్ లైవ్ స్టాక్ డెవలప్ మెంట్ ఏజెన్సీ (డీఎల్‌డీఏ)) ద్వారా గోపాలమిత్ర వ్యవస్థను ఏర్పాటు చేశారు. జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పశువులకు కృత్రిమ గర్భధారణ చేయడంతో పాటు పాడి రైతులకు అందుబాటులో ఉంటూ పశువులకు ప్రథమ చికిత్స అందిస్తున్నారు. నట్టల నివారణ మందులు, వాక్సినేషన్, బీమా చేయడం పశువైద్యుల సూచనల మేరకు అన్ని రకాల వైద్య సేవలను అందిస్తున్నారు. వేతనంలో 40 చొప్పున కట్ ఆయా మండలాల్లో ఉన్న గోపాలమిత్ర సిబ్బంది నెలకు 80నుంచి 120 పశువులకు కృత్రిమ గర్భధారణ (నేమన్) చేయాలి. దీనికి గోపాలమిత్ర సిబ్బంది రూ.40 చొప్పున రైతుల నుంచి వసూలు చేసి ప్రభుత్వ ఖాతాలో జమ చేయాల్సి ఉంటుంది. ప్రతి నెలా నిర్ధేశించిన లక్ష్యాన్ని గోపాలమిత్రలు పూర్తి చేయాల్సిందే. లేదంటే నెల జీతంలో కోత తప్పదు. ఒక్కో పశువుకు రూ.40 చొప్పున వారి వేతనం నుంచి కట్ చేస్తారు. ఒక్కోనెల అనుకున్న లక్ష్యం పూర్తి చేయకపోవడంతో ప్రభుత్వం ఇస్తున్న గౌరవ వేతనం కనీసం రెండు వేలు కూడా రావడం లేదని గోపాలమిత్రలు అవేదన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ పోషణ భారం జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ(డీఎల్‌డీఏ) ద్వారా పశు సంవర్థకశాఖలో ఉమ్మడి జిల్లాలో 135 మంది గోపాలమిత్ర సిబ్బంది పని చేస్తున్నారు. వీరికి రాష్ట్ర ప్రభుత్వం రూ.11,050 చొప్పున గౌరవవేతనం అందిస్తోంది. చాలీచాలనీ వేతనం కూడా ప్రతినెలా అందడం లేదు. జిల్లాలో ఇప్పటికే గోపాలమిత్రలకు ఏడు నెలల వేతనం చెల్లించాల్సి ఉంది. రెండేళ్లుగా కేంద్ర ప్రభుత్వం అందించాల్సిన పారితోషికం సైతం రాలేదు. దీంతో కుటుంబ పోషణ భారంగా మారిందని, ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు గోపాలమిత్ర సిబ్బంది వాపోతున్నారు. గోపాలమిత్రలకు 9నెలలుగా అందని వేతనం కృత్రిమ గర్భధారణ లక్ష్యం పూర్తికాకుంటే జీతంలో కోత -
కుమ్మరికుంటలో కారు ఢీకొని వృద్ధుడు మృతి
జూలపల్లి(పెద్దపల్లి): పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం కుమ్మరికుంటలో కారు ఢీకొ ని అదే గ్రామానికి చెందిన నాగవెల్లి మొండయ్య(59) మృతి చెందాడు. ఎస్సై సనత్‌కుమార్ కథనం ప్రకారం.. కుమ్మరికుంటకు చెందిన మొండయ్య శుక్రవారం సైకిల్‌పై పోస్టాఫీసుకు వెళ్తున్నాడు. ఇదే గ్రామానికి చెందిన కమటం రవి తన కారును వేగంగా, అజాగ్రత్తగా నడుపుతూ సైకిల్‌పై వెళ్తున్న మొండయ్యను ఢీకొట్టాడు. కిందపడ్డ మొండయ్య తలకు బలమైన గాయం కావడంతో పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రథమ చికిత్స తర్వాత కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందాడు. మృతుడి కుమారుడు సతీశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు. అప్పులబాధతో నేతకార్మికుడి ఆత్మహత్య సిరిసిల్లక్రైం: ప్రమాదంలో కాలువిరగడంతో పని చేయలేక.. అప్పులు తీర్చే మార్గం కనిపించక సిరిసిల్లలో నేతకార్మికుడు శని వారం ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలు. రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సుందరయ్యనగర్‌కు చెందిన నేతకార్మికుడు వలస రమేశ్(48) పవర్‌లూమ్స్ నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. రెండేళ్ల క్రితం రమేశ్ కాలుకు దెబ్బతగిలి పనికి దురయ్యాడు. సరైన ఉపాధి లేక.. కుటుంబ పోషణ కోసం చేసిన అప్పులు రూ.5లక్షలు ఎలా తీర్చాలో తెలియక మనోవేదనకు గురయ్యాడు. ఈ క్రమంలో స్థానిక కార్గిల్‌లేక్‌లో శనివారం దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని భార్య లావణ్య, కుమారులు సాయిచరణ్, సచిన్ ఉన్నారు. మృతుని భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల అదుపులో నకిలీ సర్టిఫికెట్ల తయారీ ముఠా?కోరుట్ల: కోరుట్ల పట్టణంలోని పోచమ్మ ఆలయం సమీపంలో నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ముఠాను రెండురోజుల క్రితం జగిత్యాల టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపడున్నట్లు సమాచారం. పోలీసులు దాడి చేసిన సమయంలో నాలుగైదు డిగ్రీ సర్టిఫికెట్లు దొరికినట్లు తెలిసింది. మంత్ర కంప్యూటర్స్ పేరిట సాగుతున్న ఓ కంప్యూటర్ ఇనిస్టిట్యూట్లోనే నకిలీ సర్టిఫికెట్ల ముఠా దందా నడుపుతున్నట్ల తెలిసింది. కోరుట్లలో ఉన్న నకిలీ సర్టిఫికెట్ల తయారుదారులతో ఇంకా ఎవరికై నా సంబంధాలు ఉన్నాయా..? అన్న విషయంలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. నకిలీ డిగ్రీ సర్టిఫికెట్లను రూ.15వేల నుంచి రూ.30 వేల వరకు అమ్మినట్లు సమాచారం. కేవలం డిగ్రీ కాకుండా ఇతరత్రా నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
రాగి తీగ దొంగల అరెస్ట్
మెట్పల్లి: ట్రాన్స్ఫార్మర్ల నుంచి రాగి తీగ, ఆయిల్‌ను ఎత్తుకెళ్తూ.. రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న ఇద్దరు దొంగలను మెట్పల్లి పోలీసులు పట్టుకున్నారు. ఎస్సై కిరణ్‌కుమార్ కథనం ప్రకారం.. మోతె సాయి(22), పల్లపు మల్లేశం(32) ఆర్థిక ఇబ్బందుల కారణంగా దొంగతనాలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరు కలిసి పలుచోట్ల ట్రాన్స్ఫార్మర్ల నుంచి రాగి తీగ, ఆయిల్ అపహరించి అమ్ముతూ వచ్చిన సొమ్ముతో జల్సాలు చేస్తున్నారు. రైతుల ఫిర్యాదు మేరకు పక్కా సమాచారంతో ఇద్దరిని పట్టుకొని వారి నుంచి వంద కిలోల రాగి వైరు, ద్విచక్రవాహనం, చోరీలకు ఉపయోగించే సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి ఇద్దరి అరెస్ట్ చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. కొత్తపల్లిలో రెండు లారీల ఢీ ● ఓ డ్రైవర్‌కు విరిగిన కాలు.. మరో డ్రైవర్, క్లీనర్‌కు గాయాలు కొత్తపల్లి(కరీంనగర్): కొత్తపల్లిలో శనివారం వేకువజామున రెండు లారీలు ఢీకొన్నాయి. కరీంనగర్– జగిత్యాల ప్రధాన రహదారి కొత్తపల్లి చెరువు స మీపంలో ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్లు నిద్రమత్తులో ఉండడంతోనే ప్రమాదం జరిగినట్లు స్థానికులు వెల్లడించారు. స్థానికులు, బ్లూకోల్ట్స్ పోలీసుల వివరాల మేరకు.. నిజామాబాద్‌లో రైస్‌మిల్లు సా మగ్రి ఖాళీ చేసి కరీంనగర్ వైపు వస్తున్న లారీ ఖ మ్మం నుంచి గ్రానైట్ లోడ్‌తో గంగాధర వైపు వెళ్తు న్న మరో లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ముందు భాగాలు దెబ్బతిన్నాయి. గ్రానైట్ లోడ్‌తో ఉన్న లారీ కొత్తపల్లి చెరువులో పడిపోయింది. ఓ లారీ డ్రైవర్ పురుషోత్తంరెడ్డి, క్లీనర్లు లారీ నుంచి బయట పడగా తలకు గాయాలయ్యాయి. లారీ యజమాని సూచనల మేరకు హైదరాబాద్ వెళ్లిపోయారు. రాజస్థాన్ రిజిస్ట్రేషన్ గల డ్రైవర్ భన్సీలాల్‌కు గాయాలు అధికంగా కావడంతో పాటు కాలు విరిగడంతో కరీంనగర్‌లోని ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేర్చాడు. స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న కొత్తపల్లి పోలీసులు లారీలను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. -
తూకంలో తేడాపై రోడ్డెక్కిన రైతులు
సిరిసిల్లఅర్బన్: ఐకేపీ ద్వారా విక్రయించిన సన్‌ఫ్లవర్ పంట తూకంలో తేడాపై ఇల్లంతకుంట మండలానికి చెందిన రైతులు శనివారం కలెక్టరేట్ వద్ద ఆందోళనకు దిగారు. మండలంలోని ముస్కానిపేట, గాలిపల్లి, చిన్నకేసన్నపల్లి, పత్తికుంటపల్లి, తాళ్లపల్లి గ్రామాలకు చెందిన సుమారు 50 మంది రైతులు కలెక్టరేట్‌కు తరలివచ్చారు. వారు మాట్లాడుతూ ఐకేపీ ద్వారా విక్రయించిన సన్‌ఫ్లవర్ పంట తూకంలో వచ్చిన క్వింటాళ్లు.. మార్క్‌ఫెడ్ తీసుకున్న తూకానికి తేడా వస్తుందన్నారు. ఒక్కో రైతుకు మూడు క్వింటాళ్ల వరకు నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించి డీఆర్డీవో శేషాద్రిని పిలిపించి తూకంలో తేడాలపై విచారణ చేపట్టి రిపోర్టు ఇవ్వాలని ఆదేశించారు. అనంతరం రైతులు డీఆర్డీవోకు వివరాలతో కూడిన వినతిపత్రం అందించారు. సుధాకర్‌రెడ్డి, ఐదు గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు. డీఆర్డీవోకు వినతిపత్రం -
న్యాయం చేయండి
మంథని: పోలీసులకు భయపడి తన కుమారుడు ఆత్మహత్యకు యత్నించి ఇప్పుడు అచేతనా స్థితిలోకి వెళ్లాడని, తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబం, స్థానికులతో కలిసి శనివారం పట్టణంలోని ప్రధాన చౌరస్తాలో ధర్నాకు దిగింది. అచేతనా స్థితిలోని తన కుమారుడిని అంబులెన్స్‌లో ఉంచి ఆవేదన వ్యక్తం చేశారు. యువకుడి తల్లి శీలం రాజేశ్వరి కథనం ప్రకారం.. మంథని లోని శ్రీపాదకాలనీకి చెందిన తన కుమారుడు రాజ్‌కుమార్ ఎంగేజ్మెంట్కు వెళ్లి ఇంటికి వస్తుండగా వడ్లకల్లం వద్ద ఇద్దరు దోస్తులు మాట్లాడుకొని ఒకరినొకరు చిన్నగా కొట్టుకున్నారు. మరుసటి రోజు 30 మంది దాకా వచ్చి కేసు పెట్టారు. దీంతో రాజ్‌కుమార్‌ను పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి కొట్టడంతో మనస్తాపం చెందాడు. తన కుమారుడిని అన్యాయంగా పోలీస్‌స్టేషన్ తీసుకెళ్లారని, కొంతమంది ప్రజాప్రతినిధుల పేర్లు చెబుతూ పోలీసులు కొట్టారని ఆమె వివరించింది. ఈ క్రమంలో అవమానంతో మదనపడుతూ స్నానానికి వెళ్లి బాత్రూంలోనే ఉరివేసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో ఎనిమిది నెలలుగా చికిత్స పొందు తున్నాడు. అయినా, ఇంకా కోలుకోలేదు. దీంతో రాజ్‌కుమార్‌ను అంబులెన్స్‌లోనే తల్లిదండ్రులు, బంధువులు పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాకు తీసుకొచ్చారు. మంథని ఎస్సై, కానిస్టేబుల్, స్థానిక మాజీ కౌన్సిలర్, ప్రజాప్రతినిధులు, మరికొందరు హమాలీ కార్మికులపై చర్యలు తీసుకోవాలని బంధువులు ఆందోళన చేశారు. సమాచారం అందుకున్న మంథని సీఐ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బాధితులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని నచ్చజెప్పారు. అచేతనా స్థితిలోని కుమారుడితో ధర్నా పోలీసులు, ప్రజాప్రతినిధులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ -
రోడ్డు ప్రమాదంలో వీఆర్ఏకు గాయాలు
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల ఎల్లారెడ్డిపేట తహసీల్దార్ ఆఫీస్ ఎదుట శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వీఆర్‌ఏతోపాటు మరొకరు తీవ్రంగా గాయపడ్డాడు. వీఆర్ఏ పరిస్థితి విషమంగా ఉంది. ఎస్సై రమాకాంత్ తెలిపిన వివరాలు. మండల కేంద్రానికి చెందిన బాధ పెద్దరాములు తహసీల్దార్ ఆఫీస్‌లో వీఆర్ఏగా పనిచేస్తున్నారు. శనివారం విధులకు హాజరయ్యేందుకు తన ద్విచక్రవాహనంపై వెళ్తుండగా.. రాజన్నపేటకు చెందిన తిమోతి అనే యువకుడు బైక్‌పై వేగంగా వస్తూ ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో రాములు కుడికాలు విరిగింది. తిమోతి స్వల్పంగా గాయపడ్డాడు. క్షతగాత్రులను 108 వాహనంలో స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. రాములను బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, రెడ్డి సంఘం జిల్లా అధ్యక్షుడు గుండారపు కృష్ణారెడ్డి, కాంగ్రెస్ నాయకులు నంది కిషన్, బండారి బాల్‌రెడ్డి, బాధ రమేశ్ పరామర్శించారు. తహసీల్దార్ సుజాత రాములును పరామర్శించి, పరిస్థితి గురించి తెలుసుకున్నారు. రెవెన్యూశాఖ తరఫున తక్షణసాయంగా రూ.20వేలు ఆర్ఐ శ్రావణ్మార్ రాములు కుటుంబానికి అందజేశారు. పరిస్థితి విషమం -
ప్రైవేటు ఇసుక.. ప్రభుత్వ బిల్లులు !
● రెవె‘న్యూ’ బాగోతం–2 ● ఇసుక పర్మిట్లలో కొత్త కోణం ● ‘సాక్షి’ కథనంతో రంగంలోకి ఆర్డీవో ● విచారణలో వెలుగుచూసిన పలు విషయాలుసిరిసిల్లటౌన్: ప్రైవేట్ పనులకు ప్రభుత్వ వే బిల్లులు ఇవ్వడం సిరిసిల్లలో చర్చనీయంగా మారింది. జిల్లా కేంద్రం శివారులోని మానేరువాగు నుంచి ప్రైవేట్ పనులకు వెళ్తున్న ఇసుక ట్రాక్టర్లకు ప్రభుత్వ పనులకు సంబంధించిన వే బిల్లులు ఇచ్చినట్లు విచారణలో తేలింది. శుక్రవారం ఇందిరమ్మ ఇళ్ల ఇసుక ప్రైవేట్ పనులకు వెళ్తున్న విషయంపై ‘సాక్షి’లో వచ్చిన కథనం స్థానికంగా దుమారం రేపింది. ఉన్నతాధికారుల్లో కదలిక రావడంతో కలెక్టర్ ఆదేశాలతో సిరిసిల్ల ఆర్డీవో శనివారం మానేరువాగులోని ఇసుకరీచ్ వద్ద తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో మరో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ వే బిల్లులను ప్రైవేటు పనులకు ఇస్తున్నట్లు తేలింది. ఈ విషయం స్థానికంగా చర్చకు దారితీసింది. విచారణ చేపట్టిన ఆర్డీవో సిరిసిల్ల ఇసుకరీచ్ నుంచి ఇందిరమ్మ ఇండ్లతోపాటు ప్రైవేటు వ్యక్తులకు వే బిల్లులను శుక్రవారం రెవెన్యూ అధికారులు కేటాయించిన విషయంపై కలెక్టర్ విచారణకు ఆదేశించారు. ఈమేరకు సిరిసిల్ల ఇసుకరీచ్‌లో ఆర్డీవో వెంకటేశ్వర్లు శనివారం తనిఖీలు చేపట్టారు. రీచ్‌లో వందలాది సంఖ్యలో ఇసుక ట్రాక్టర్లు ఉండగా వాటికి కేటాయించిన వేబిల్లులపై అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ట్రాక్టర్ల వద్దకు పోయి వేబిల్లులు పరిశీలించారు. ప్రైౖవేటు నిర్మాణం పనులకు ప్రభుత్వ రశీదులు ఇస్తున్నట్లు విచారణలో తేలింది. ప్రైవేటు పనులకు అందించే వేబిల్లు బుక్కులు అయిపోవడంతో ప్రభుత్వ వేబిల్లులను అందించినట్లు అధికారులు బదులిచ్చారు. ఈవిషయమై ఆర్డీవోను వివరణ కోరగా.. అసలు ప్రభుత్వ వేబిల్లులు ప్రైవేటు పనులకు అందించే అవకాశంపై విచారణ కొనసాగుతోందని తెలిపారు. జాబితా ఇందిరమ్మ.. వేబిల్లులు ప్రైవేటు ప్రైవేటు పనులకు ఇసుక పర్మిట్ల జాబితా సిరిసిల్ల మండలం ఇందిరమ్మ ఇండ్ల పనులకు అని ఉండడం పలు అనుమానాలను తావిస్తోంది. ఈనేపథ్యంలో ఆర్డీవో వెంకటేశ్వర్లు శనివారం ప్రైవేటు పనులకు ప్రభుత్వ రశీ దులు అందించడాన్ని గ మనించి వాటిని ప్రైవేటు వేబిల్లులుగా సవరించినట్లు సమాచారం. ఆర్డీవో రాకతో అధికారులు ట్రాక్టర్లను చాలా సమయం అక్కడే నిలిపివేశారు. చలాన్లు చెల్లించి పర్మిట్లు పొందిన ప్రైవేటు వ్యక్తులు, ట్రాక్టర్ల నిర్వాహకులు ఇలా ట్రాక్టర్లు నిలిపివేయడంతో ఇ బ్బందిపడ్డారు. ప్రభుత్వానికి చలాన్ చెల్లించి పర్మి ట్లు పొంది ఇసుక తీసుకెళ్తుంటే ఎందుకు అవాంతరాలు కలిగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే సిరిసిల్లో రెవె‘న్యూ’ లీలల వ్యవహారం ఎన్ని రో జులుగా సాగుతోంది, బాధ్యులు ఎవరన్న విషయం ఉన్నతాధికారుల విచారణలో తేల నుంది. బాధ్యులకు మెమో ఇచ్చాంఇందిరమ్మ ఇండ్లతోపాటు ప్రైవేటు వ్యక్తులకు ఇసుక పర్మిషన్ ఇచ్చిన విషయంలో అక్రమాలు జరుగలేదు. ప్రైవేటు వ్యక్తులు జిల్లా కలెక్టర్ పేరున రెండు రోజుల క్రితమే డీడీ రూపంలో రూ.19,200 చెల్లించారు. అందుకే వారికి కూడా అనుమతులు జారీ అయ్యాయి. ఈ అంశం ఉన్నతాధికారుల విచారణలో ఉంది. ఇప్పటికే ఓ అధికారికి మెమో ఇవ్వడం జరిగింది. – మహేశ్‌కుమార్, తహసీల్దార్, సిరిసిల్ల -
రైతుభరోసా రూ.133.53 కోట్లు
● కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా సిరిసిల్ల: జిల్లాలో అన్నదాతలకు రైతుభరోసా పథకంలో రూ.133.53 కోట్లు జమయ్యాయని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా శనివారం తెలిపారు. ఖరీఫ్(వానాకాలం) సీజన్ సాగుకోసం జిల్లాలోని 1,22,019 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో ఎకరానికి రూ.6వేల చొప్పున రూ.133,53,84,248 జమయ్యాయని వివరించారు. యోగాతో ప్రశాంతత ● ఎస్పీ మహేశ్ బీ గీతే సిరిసిల్లక్రైం: యోగాతో మానసిక, శారీరక ఆరోగ్యం, ప్రశాంత జీవనం సొంతమని ఎస్పీ మహేశ్ బీ గీతే పేర్కొన్నారు. భారత్ ప్రపంచానికి ఇచ్చిన విలువైన కానుక యోగా అన్నారు. ప్రతి ఒక్కరూ యోగా దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయం ఆవరణలో శనివారం నిర్వహించిన యోగా డేలో పాల్గొన్నారు. వేములవాడ ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి, అదనపు ఎస్పీ చంద్రయ్య, సీఐలు, ఆర్ఐలు, ఎస్ఐలు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కోడెలకు పచ్చిగడ్డి ఇచ్చేందుకు ముందుకురావాలి ● జిల్లా పశు వైద్యాధికారి రవీందర్‌రెడ్డి సిరిసిల్ల: వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి గోశాలలోని కోడెలకు దాతలు పచ్చిగడ్డి ఇచ్చేందుకు ముందుకురావాలని జిల్లా పశువైద్యాధికారి రవీందర్‌రెడ్డి శనివారం కోరారు. రాజన్న కోడెలకు దాతలు పచ్చిగడ్డి వితరణ చేసి స్వామి వారి సేవలో భాగస్వాములు కావాలన్నారు. చందుర్తి మండలం లింగంపేటకు చెందిన పెగ్గర్ల రమేశ్‌రావు, ఏనుగుల అనిల్ గోశాలకు 1500 కిలోల పచ్చిగడ్డి పంపించారని తెలిపారు. ఇప్పటి వరకు 7,500 కిలోల గడ్డిని దాతలు వితరణ చేశారని చెప్పా రు. రైతులు చంద్రశేఖర్‌రావు, రామారావు, బోడపట్ల జలంధర్, ఈగ ప్రవీణ్, మనోహర్ పచ్చిగడ్డిని పంపించినట్లు వివరించారు. ఆసాములకు కూలీ పెంచి ఇవ్వాలి ● పవర్‌లూమ్స్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు రమేశ్ సిరిసిల్లటౌన్: వస్త్రపరిశ్రమలోని పాలిస్టర్ వస్త్రోత్పత్తి ఆసాములకు తగ్గించి కాకుండా కూలీ పెంచి ఇవ్వాలని పవర్‌లూమ్స్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మూశం రమేశ్ డిమాండ్ చేశారు. సిరిసిల్లలోని సీఐటీయూ కార్యాలయంలో శనివారం నిర్వహించిన ప్రెస్మీట్లో మాట్లాడారు. పవర్లూమ్, వార్పిన్, వైపని కార్మికులు, ఆసాములకు కూలీ నూతన ఒప్పందం చేయాలని కోరారు. కూలీ పెంచి ఇవ్వకుండా కార్మికులను, ఆసాములను శ్రమదోపిడీకి గురిచేస్తున్నారన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తగ్గించిన కూలీని వెంటనే పెంచి ఇవ్వకపోతే ఈనెల 25న పాలిస్టర్ వస్త్రవ్యాపార సంఘ భవనం ఎదుట ధర్నా చేయనున్నట్లు హెచ్చరించారు. పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కోడం రమణ, పట్టణ అధ్యక్షుడు నక్క దేవదాస్ తదితరులు పాల్గొన్నారు. సార్ జీవితం భావితరాలకు స్ఫూర్తి ● బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య సిరిసిల్లటౌన్: తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ జీవితం భావితరాలకు ఆదర్శప్రాయమని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య పేర్కొన్నారు. జయశంకర్ వర్ధంతిని శనివారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో నిర్వహించారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, మాజీ వైస్‌చైర్మన్ గూడూరి ప్రవీణ్, న్యాలకొండ రాఘవరెడ్డి, కుంభాల మల్లారెడ్డి, కల్లూరి రాజు తదితరులు పాల్గొన్నారు. -
ఆరోగ్య‘యోగం’
సిరిసిల్లటౌన్: ప్రపంచానికి భారత్ అందించిన ఆరోగ్య కానుకగా యోగాను డీఎంహెచ్‌వో రజిత అభివర్ణించారు. అంతర్జాతీయ యోగా డే వేడుకలను సిరిసిల్లలో శనివారం నిర్వహించారు. పద్మనాయక కల్యాణ మండపంలో సామూహిక యోగా కార్యక్రమం ఆయుష్, పతంజలి యోగా సమితి ఆధ్వర్యంలో నిర్వహించారు. సామూహిక యోగాసనాలు అలరించాయి. జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ రామకృష్ణ, డాక్టర్ నవీన్, జిల్లా ఆయుష్ నోడల్ అధికారి డాక్టర్ శశిప్రభ, నోడల్ అధికారులు డాక్టర్ సౌమిని, డాక్టర్ శ్వేత, డాక్టర్ సాయిదీప్తి, డీపీఎం తిరుపతి, జిల్లా క్రీడల యువజనశాఖ అధికారి అజ్మీర్ రాందాసు, పతంజలి యోగా సమితి సీనియర్ సలహాదారులు, మున్సిపల్ మాజీ చైర్మన్ ఆడెపు రవీందర్, భారత్ స్వాభిమాన్ ట్రస్టు అధ్యక్షుడు గుడ్ల రవి, సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు చేపలు బుచ్చయ్య, పతంజలి సమితి అధ్యక్షుడు బిల్లా శ్రీకాంత్. యోగా క్రీడాకారులు పెరుమాండ్ల దేవయ్య, యోగాసన స్పోర్ట్స్ సహాయ కార్యదర్శి చిటికెన శ్రీనివాస్, ఒడ్నాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని జిల్లా ఆయుష్ యునానీ డిస్పెన్సరీ యోగా శిక్షకులు బొల్లాజీ శ్రీనివాస్, టి.స్వప్న నిర్వహించారు. కొత్తచెరువు పార్కులో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో యోగా డే నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి, పట్టణ అధ్యక్షుడు దుమాల శ్రీకాంత్, యోగా గురువు పల్లికొండ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక గీతానగర్ హైస్కూల్లో నిర్వహించిన వేడుకల్లో హెచ్ఎం శారద, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. -
షాపు తెరుచుకోక ప‘రేషన్’
● పేదల బియ్యం పంపిణీలో అలసత్వం ● 23వ వార్డు ప్రజలకు తప్పని తిప్పలుసిరిసిల్లటౌన్: జిల్లా కేంద్రంలోని రేషన్ దుకాణాలు మూడు నెలల బియ్యం కోసం వచ్చిన లబ్ధిదారులతో కళకళలాడుతుంటే ఒక్క షాప్ మాత్రం మూసివేసి ఉంది. అధికారుల నిర్లక్ష్యం.. డీలర్ల అత్యుత్సాహం.. రాజకీయ నేతల జోక్యంతో స్థానిక వెంకంపేటలోని రేషన్ దుకాణం పరిధిలోని లబ్ధిదారులకు బియ్యం అందడం లేదు. పట్టణంలోని 23వ వార్డులోని రేషన్ దుకాణం నంబర్ 3908001 డీలర్ నెల క్రితం మరణించారు. అప్పటి నుంచి రేషన్‌షాపు తెరుచుకోవడం లేదు. అయితే సమీప రేషన్ దుకాణం డీలర్‌కు ఇన్చార్జీ బాధ్యతలు ఇవ్వాలి. కానీ రాజకీయ నేతల ఒత్తిళ్లు, డీలర్ల అత్యుత్సాహంతో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. సదరు రేషన్‌షాపులో సుమారు 600 మంది లబ్ధిదారులు ఉన్నారు. ఈ రేషన్‌షాపు పరిధిలో మూడు నెలల బియ్యం పంపిణీకి లబ్ధిదారులు వేచిచూస్తున్నారు. రెవెన్యూ అధికారులు రేషన్డీలర్కు అప్పగించడంలో జాప్యంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి తమ ప్రాంతానికి ఇన్చార్జి రేషన్‌డీలర్‌ను కేటాయించి మూడు నెలల బియ్యం పంపిణీ చేయించాలని కోరుతున్నారు. ఈ విషయంపై సిరిసిల్ల తహసీల్దార్ మహేశ్‌కుమార్‌ను వివరణ కోరగా.. రేషన్‌షాపునకు ఇన్చార్జీని నియమించేందుకు ఆర్డీవోను కోరినట్లు తెలిపారు. వెంటనే నియమిస్తామన్నారు. -
వార్షిక రుణప్రణాళిక రూ.4,890 కోట్లు
● డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించాలి ● క్యూఆర్ కోడ్ లేని వ్యాపారులను గుర్తించాలి ● జిల్లాస్థాయి బ్యాంకర్ల సమావేశంలో కలెక్టర్ సందీప్‌కుమార్ ఝాసిరిసిల్ల: జిల్లా 2025–2026 వార్షిక రుణ ప్రణా ళికను రూ.4,890 కోట్లుగా నిర్ణయించారు. ఈమేరకు పంటరుణాలు, ప్రభుత్వ ప్రాధాన్యత రంగా లకు రుణాలు, విద్యారుణాలు, మహిళా సంఘాలకు రుణాలు అందించాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా బ్యాంకర్లను ఆదేశించారు. కలెక్టరేట్లో శనివారం బ్యాంకర్లతో త్రైమాసిక డీసీసీ, డీఎల్ఆర్సీ సమావేశంలో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణులకు అవసరమున్న చోట బ్యాంక్ నూతన బ్రాంచ్‌లు ప్రారంభించేందుకు గల అవకాశాలు పరిశీలించాలని సూచించారు. 500 ఇండ్లు ఉన్న ఆవాసాలలో 323 బ్యాంకింగ్ ఔట్లెట్లను ఏర్పాటు చేశామన్నారు. బ్యాంకులు డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించాలన్నారు. క్యూఆర్ కోడ్ లేని వ్యాపారులను గుర్తించి, బ్యాంకు ఖాతాలు ప్రారంభింపజేయాలని సూచించా రు. జన్‌ధన్ బ్యాంక్ ఖాతాదారులు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, పీఎంజేజేబీవై పథకాలలో నమోదు చేసుకునేలా చూడాలన్నారు. ఆర్థిక అక్షరాస్యత పెంచాలని సూచించారు. మహిళా సంఘాలకు.. జిల్లాలో 82 స్వశక్తి సంఘాలకు రూ.8.17కోట్లు, మెప్మా కింద 118 సంఘాలకు రూ.14.50కోట్లు బ్యాంకు రుణాలు అందించామని అధికారులు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో సెర్ఫ్ రుణాల పంపిణీ వేగవంతం చేయాలని, ఎంసీపీలను త్వరగా బ్యాంకులకు సమర్పించాలని కోరారు. స్వయంఉపాధిని ప్రోత్సహించేందుకు వివిధ పథకాల కింద యువతకు రుణాలు అందించాలని, స్టాండ్ ఆఫ్ ఇండియా కింద 16 యూనిట్లకు రూ.2కోట్లు రుణాలు మంజూరు చేశామని, ముద్ర రుణాల కింద 8,220 మందికి రూ.101.24కోట్ల రుణాలు అందించామని, పీఎంఎఫ్ఎంఈలో 63 దరఖాస్తులను ఆమోదించామన్నారు. పీఎం విశ్వకర్మ పథకంలో జిల్లాలో 343 దరఖాస్తులను మంజూరు చేశామని అధికారులు వివరించారు. వార్షిక రుణప్రణాళిక విడుదల 2025–26 ఆర్థిక సంవత్సరానికి వార్షిక రుణప్రణాళిక మొత్తం రూ.4,890కోట్ల రుణాల పంపిణీ లక్ష్యంగా తయారు చేయడం జరిగింది. వీటిలో 92,428 మంది రైతులకు రూ.1,700 కోట్ల పంటరుణాలు, 22,525 మంది రైతులకు రూ.1,006 కోట్ల వ్యవసాయ టర్మ్ రుణాలు, 10,082 మందికి రూ.277కోట్ల వ్యవసాయాధారిత రుణాలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎంఎస్ఎంఈ రంగానికి రూ.612.30 కోట్లు లక్ష్యంగా నిర్ధేశించడం జరిగింది. ఆర్బీఐ ప్రతినిధి వి.సాయితేజ్‌రెడ్డి, నాబార్డు డీడీఎం దిలీప్‌చంద్ర, యూబీఐ రీజినల్ హెడ్ డి.అపర్ణరెడ్డి, లీడ్ బ్యాంకు మేనేజర్ టి.మల్లికార్జున్‌రావు, డీఆర్డీవో శేషాద్రి, డీవీహెచ్‌వో రవీందర్‌రెడ్డి, జీఎండీఐసీ హనుమంతు, ఈడీఎస్సీ కార్పొరేషన్ స్వప్న, మున్సిపల్ కమిషనర్లు, వివిధ శాఖల బ్యాంక్ మేనేజర్లు తదితరులు పాల్గొన్నారు. ఇందిరా మహిళా శక్తి భవనం పూర్తి చేయండిజిల్లా ఇందిరా మహిళా శక్తి భవనం పనులు గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ఆదేశించారు. సిరిసిల్ల ము న్సిపల్ పరిధిలోని మెడికల్ కళాశాల సమీపంలో రూ.5కోట్లతో ఎకరం స్థలంలో నిర్మిస్తున్న భవన నిర్మాణ పనులను కలెక్టర్ శనివారం పరిశీలించారు. ఈ ఏడాది నవంబర్‌లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని కస్తూర్బాగాంధీ బాలిక విద్యాలయాన్ని తనిఖీ చేశారు. వంట గది, స్టోర్‌రూమ్ పరిశీలించారు. తరగతి గదుల్లో పాఠ్యాంశాలు బోధిస్తున్న తీరును పరిశీలించారు. విద్యార్థులకు మ్యాథ్స్ పాఠ్యాంశాలు బోధించారు. -
చినుకు పడదు.. చింత తీరదు
● వాడిపోతున్న మొలకలు ● భూమిలో నీటిజాడ కరువు ● ముందస్తు తొలకరి ఆశలు ఆవిరి ● ముఖం చాటేసిన వరుణుడు ● ఆందోళనలో అన్నదాతలు ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): తొలకరి జల్లులు ముందే పలకరించడంతో జిల్లాలోని రైతులు పత్తి విత్తనాలు విత్తుకున్నారు. గత పదిహేను రోజులుగా వర్షాలు ముఖం చాటేయడంతో భూమిలో నాటిన విత్తనాలు మొలకెత్తడం లేదు. కొంత నీటి తడి ఉన్న భూముల్లో మొలకెత్తిన పత్తిమొలకలు వాడిపోతున్నాయి. వర్షాలు సరిగ్గా కురువకపోవడంతో భూగర్భజలాలు అడుగంటి పలువురు రైతుల బోర్లు వట్టిపోతున్నాయి. దీంతో ఏం చేయాలో తెలియని దిక్కుతోచని స్థితిలో రైతులు ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురియాలని కోరుతూ.. రైతులు ఆలయాలు, పూజలు, కప్పతల్లి ఆటలు ఆడుతున్నారు. వరుణదేవుడు కరుణించాలని గ్రామ దేవతలకు అభిషేకాలు చేస్తున్నారు. ఎకరానికి రూ.10వేల పెట్టుబడి పత్తి విత్తనాలు విత్తుకోవడానికి రైతులు ఎకరానికి దాదాపు రూ.10వేల వరకు పెట్టుబడి పెట్టారు. ఎకరానికి మూడు ప్యాకెట్ల విత్తనాలకు రూ.3వేలు, దుక్కి దున్నేందుకు ట్రాక్టర్‌కు రూ.5వేలు, కూలీలకు రూ.2వేల వరకు ఖర్చు పెట్టారు. తీరా విత్తనాలు నాటిన తర్వాత వర్షాలు ముఖం చాటేయడంతో మొలకెత్తడం లేదు. మొదట్లో వేసిన విత్తనాలు మొలకెత్తని చోట్ల మళ్లీ విత్తనాలు విత్తుకోవాల్సిన పరిస్థితి. దీనికి అదనంగా రైతులు పెట్టుబడి పెట్టాల్సి వస్తోంది. పెట్టుబడి డబ్బులు కూడా మీదపడేలా ఉన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెనుకపడ్డ వర్షాలు ఈ సీజన్లో ముందస్తుగా తొలకరి పలకరించడంతో రైతులు విత్తనాలు వేసుకున్నారు. అయితే తర్వాత వర్షాలు కురవడం లేదు. గతేడాది జూన్ నెలలో సాధారణ వర్షపాతం 133 శాతం కాగా 167.08 శాతం అనగా 26 శాతం అధికంగా కురిసింది. ఈ ఏడాది ఈ జూన్‌లో ఇప్పటి వరకు ఒక్క రోజు మాత్రమే వర్షం కురిసింది. ఈనెల 12న వేములవాడలో 9.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఈనెలలో 80 శాతం లోటు వర్షపాతం ఉంది. దీంతో మొలకలు వాడిపోతున్నాయి. ఇతను ఎల్లారెడ్డిపేట మండలం దుమాలకు చెందిన రైతు గుల్లపల్లి నరసింహారెడ్డి. తొలకరి జల్లులు కురవడంతో తనకున్న భూమిలో రెండు ఎకరాలలో పత్తి విత్తనాలు విత్తుకున్నాడు. తర్వాత వర్షం కురువకపోవడంతో విత్తనాలు మొలకెత్తలేదు. దీంతో స్ప్రింక్లర్లు ఏర్పా టు చేసి నీటితడి అందించడంతో ఐదా రు రోజుల్లో విత్తనాలు మొలకెత్తాయి. అయితే వారం రోజుల్లోపే బోరులో నీళ్లు సరిపోక స్ప్రింక్లర్లు పనిచేయలేదు. దీంతో ఇప్పుడు స్ప్రింక్లర్లు తొలగించి.. వర్షం కోసం ఎదురుచూస్తున్నాడు. 8 ఎకరాల్లో పత్తి పెట్టిన నాకున్న 8 ఎకరాలలో పత్తి విత్తనాలు నాటిన. అయితే తొలుత వర్షం పడడంతో దుక్కి దున్ని విత్తనాలు నాటుకున్న. కానీ తర్వాత వర్షాలు కురువకపోవడంతో కొన్ని విత్తనాలు భూమిలోనే మురిగిపోయినయి. కొంతమేరకు మొలకెత్తకపోగా, మొలకెత్తినవి కూడా వాడిపోతున్నాయి. ఇప్పటి వరకు దాదాపు రూ.30వేల వరకు నష్టపోయిన. – ఉల్లి దేవయ్య, దుమాల అడుగున్నర లోతు తడి ఉంటేనే విత్తుకోవాలి రైతులు తొలకరి జల్లులు కురువగానే పత్తి విత్తనాలు విత్తుకున్నారు. అడుగున్నర లోతు తడి ఉంటేనే ఎప్పుడైనా విత్తనాలు నాటుకోవాలి. నేలలో తడి లేకపోవడంతోనే మొలకలు రావడం లేదు. జూలై నెలాఖరు నాటికి కూడా పత్తి వేసుకోవచ్చు. రైతులు ఆందోళన చెందవద్దు. – అఫ్జల్‌బేగం, జిల్లా వ్యవసాయాధికారిజిల్లా సమాచారం రైతులు 31,490విస్తీర్ణం 50,500 ఎకరాలు ఎకరానికి పెట్టుబడి రూ.10వేలు -
క్రీడలకు పెద్దపీట
● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ● సిరిసిల్లలో ఆర్చరీ అకాడమీ ప్రారంభంసిరిసిల్లఅర్బన్/వేములవాడఅర్బన్/చందుర్తి: ప్రజాపాలనలో రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తోందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని రాజీవ్‌నగర్ మినీస్టేడియంలో ఏర్పాటు చేసిన ఆర్చరీ అకాడమీని రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ శివసేనరెడ్డితో కలిసి శుక్రవారం ప్రారంభించారు. వారు మాట్లాడుతూ క్రీడలు మానసికోల్లాసానికి దోహదపడతాయన్నారు. రాష్ట్రంలోనే ఆర్చరీ అకాడమినీ సిరిసిల్లలో ప్రారంభించుకోవడం అభినందనీయమన్నారు. పదేళ్లలో క్రీడలకు రూ.400 కోట్లు కేటాయిస్తే తమ ప్రభుత్వంలో 11 నెలల్లోనే రూ.800 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. అనంతరం పట్టణంలోని బతుకమ్మఘాట్ వద్ద క్రికెట్ స్టేడియం నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు. వేములవాడ రాజన్నను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. తిప్పాపూర్‌లోని మినీస్టేడియం పరిశీలించి మాట్లాడారు. వేములవాడలో ఇండోర్ స్టేడియం, చందుర్తి మండలం మూడపల్లి వద్ద మినీస్టేడియం నిర్మాణాలకు స్థలాలను పరిశీలించినట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోనీ క్రీడాకారుల ప్రతిభను వెలికితీసేందుకు సీఎం కప్ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించినట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు సంగీతం శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాశ్, సిరిసిల్ల మార్కెట్ కమిటీ అధ్యక్షురాలు వెలుముల స్వరూప, సూర దేవరాజు, చక్రధర్‌రెడ్డి, క్రీడలశాఖ అధికారి రాందాస్, శ్రీకుమార్, యెల్లె లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. -
1,17,858 మందికి రైతు భరోసా
● కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా సిరిసిల్ల: జిల్లాలోని 1,17,858 మంది రైతులకు రూ.119,46,81,630 రైతు భరోసా డబ్బులు వారి బ్యాంకు ఖాతాల్లో జమయ్యాయని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా శుక్రవారం తెలిపారు. రైతులకు ఖరీఫ్ సీజన్(వానా కాలం) వ్యవసాయంలో పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వం ఎకరానికి రూ.6వేల చొప్పున అందించిందని వివరించారు. ఎలాంటి పరిమితులు విధించకుండా రైతుభరోసా డబ్బులు విడుదల చేసినట్లు పేర్కొన్నారు. బైపాస్‌రోడ్డు విస్తరణపై చర్చ ఇల్లంతకుంట(మానకొండూర్): ఇల్లంతకుంట మండల కేంద్రంలోని వివేకానంద చౌరస్తా నుంచి ఎస్సీ కాలనీ వరకు బైపాస్‌రోడ్డు విస్తరణపై శుక్రవారం చర్చించారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఇంటి యజమానులకు సెట్‌బ్యాక్ కావాలని గత నెల 12న నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంతో పంచాయతీ ఆఫీస్‌లో స్పెషల్ ఆఫీసర్ సమావేశం ఏర్పాటు చేశారు. బైపాస్‌రోడ్డును అభివృద్ధి చేసేందుకు ఉపాధిహామీ ద్వారా రూ.50లక్షలు మంజూరయ్యాయి. కొందరు తెలిపిన అభ్యంతరాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెల్తామని గ్రామపంచాయతీ అధి కారులు తెలిపారు. స్పెషల్ ఆఫీసర్ శ్రీని వాస్, కార్యదర్శి వరుణ్‌కుమార్ పాల్గొన్నారు. ఈవో ఆకస్మిక తనిఖీ వేములవాడ: రాజన్న అనుబంధ బద్దిపోచ మ్మ, భీమేశ్వరాలయాల్లో ఈవో రాధాభాయి శుక్రవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. కౌంటర్లు, క్యూలైన్లు పరిశీలించారు. భక్తులకు అసౌకర్యాలు కలుగకుండా చర్యలు తీసుకో వాలని అధికారులను ఆదేశించారు. ఏఈవో అశోక్, పర్యవేక్షకుడు రాజు ఉన్నారు. అనంతపద్మనాభస్వామి ఆలయంలో రేవతీ నక్షత్రోత్సవం సందర్భంగా అభిషేకం, పరివార దేవతార్చనలు, సదస్యం నిర్వహించారు. వేములవాడలో అడ్వకేట్ల నిరసన వేములవాడ: హైదరాబాద్‌లోని సిటీ సివిల్‌కోర్టు బార్ అసోసియేషన్ మాజీ క్యాషియర్ పి.నారాయణపై దాడిని ఖండిస్తూ వేములవాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అడ్వకేట్లు శుక్రవారం నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గడ్డం సత్యనారాయణరెడ్డి, ఉపాధ్యక్షులు కటకం జనార్దన్, అడ్వకేట్లు నాగుల సత్యనారాయణ, నేరెళ్ల తిరుమల్‌గౌడ్, పొత్తూరి అనిల్‌కుమార్, గుడిసె సదానందం, కిషోర్రావు, పురుషోత్తం, పెంట రాజు, వేముల సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలిఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): స్వీప్‌లో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రారంభించే కొత్త వ్యాపారాలతో మహిళా సంఘాల సభ్యులు ఆర్థికాభివృద్ధి సాధించాలని సెర్ఫ్ డీపీఎం వీరయ్య, జిల్లా ఇన్చార్జి డీపీఎం శ్రీనివాస్ పేర్కొన్నారు. ఎల్లారెడ్డిపేటలోని కావేరి మండల సమాఖ్య కార్యాలయంలో శుక్రవారం వీర్నపల్లి, గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట మండలాల సంఘాల్లోని 25 మంది మహిళలను సీఆర్పీలుగా చేయడానికి మౌఖిక, లిఖిత పరీక్ష నిర్వహించారు. జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు భాగ్య, ఏపీఎంలు నర్సయ్య, సుదర్శన్, మల్లేశం, సీసీలు పాల్గొన్నారు. చిన్నబోనాల శివారులో చిరుత సంచారం సిరిసిల్లఅర్బన్: చిన్నబోనాల శివారులో చిరుత సంచరించడంతో గ్రామస్తులు భ యాందోళనకు గురయ్యారు. శివారులోని పంట పొలంలో చిరుత అడుగులను అటవీశాఖ అధికారులు గుర్తించారు. రైతులు, గ్రామ స్తులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. -
బాధితులకు భరోసాగా ఉండాలి
● ఎస్పీ మహేశ్ బీ గీతేసిరిసిల్ల ఎడ్యుకేషన్: మహిళలు, చిన్నారులకు అండగా భరోసా కేంద్రాలు ఉండాలని ఎస్పీ మహేశ్ బీ గీతే పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని భరోసా కేంద్రాన్ని ఎస్పీ సందర్శించారు. బాధితులకు తక్షణ సూచనలు, సలహాలు, సహాయం అందించాలని కేంద్రం నిర్వాహకులకు సూచించారు. భరోసా సెంటర్ కల్పిస్తున్న సేవలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. లైంగికదాడికి గురైన బాధితురాలు ఫిర్యాదు చేసినప్పటి నుంచి కేసు ట్రయల్, పరిహారం ఇప్పించే వరకూ అండగా నిలవాలన్నారు. లైంగిక, భౌతికదాడులకు గురైన బాధితులకు భరోసా సెంటర్లో కల్పించే న్యాయసలహాలు, సైకలాజికల్ కౌన్సెలింగ్, వైద్యపరంగా తీసుకుంటున్న చర్యలు, మహిళల వేధింపులపై నమోదవుతున్న కేసుల వివరాలు తెలుసుకున్నారు. డీసీఆర్బీ సీఐ నాగేశ్వరరావు ఉన్నారు. -
– వివరాలు 8లోu
అస్తమా, బీపీ పోయాయి కరీంనగర్‌స్పోర్ట్స్: సర్వరోగ నివారణి యోగా అనే దానికి నేనే నిదర్శనం. యోగాసనాలు చేయకముందు బీపీ, ఆస్తమాతో బాధపడ్డాను. ఇక్కడ డేకేర్ సెంటర్‌కు వచ్చినప్పటి నుంచి అన్ని నయమయ్యాయి. ఇప్పుడు చాలా చురుకుగా ఉండగలుగుతున్నాను. – కె.అరుణ యోగాతో నయమైంది కరీంనగర్‌స్పోర్ట్స్: 2013 నుంచి 2016 వరకు అనారోగ్యంతో బాధపడ్డాను. యోగా చేయాలని పలువురు చెప్పడంతో ప్రతీ రోజు సాధన చేస్తున్నాను. ప్రస్తుతం ఎలాంటి రోగాలు లేకుండా చాలా సంతోషంగా గడుపుతున్నాను. – కె.వందన -
వర్షాలు కురవాలని..
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): వరుణుడు కరుణించి వర్షాలు కురిపించాలని కోరుతూ ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో రైతులు శుక్రవారం శివాలయంలో శివలింగంను జలదిగ్బంధం చేశారు. అనంతరం కర్రకు కప్పను కట్టి కప్పతల్లి ఆట ఆడారు. ఇంటింటికీ తిరుగగా మహిళలు కప్పతల్లిపై నీళ్లు పోసి వర్షాలు కురువాలని వేడుకున్నారు. రెడ్డి సంక్షేమ సంఘాల అధ్యక్షులు ముత్యాల ప్రభాకర్‌రెడ్డి, రెడ్డి సంఘం మండలాధ్యక్షుడు గుండాడి వెంకట్‌రెడ్డి, సద్ది లక్ష్మారెడ్డి, చందుపట్ల లక్ష్మారెడ్డి, రాగుల ఎల్లారెడ్డి, పారిపల్లి సంజీవరెడ్డి, బందారపు మల్లారెడ్డి, రాంరెడ్డి, రాజిరెడ్డి, ముత్యంరెడ్డి, నంది కిషన్, బాపురెడ్డి, భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు. -
సాధికారతే లక్ష్యంగా..
గంభీరావుపేట(సిరిసిల్ల): మహిళా సాధికారతే లక్ష్యంగా అధికారులు ముందుకెళ్తున్నారు. జిల్లాలోని ఐకేపీ మహిళా సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు, కోశాధికారులకు ఆర్థిక కార్యకలాపాలు, నాయకత్వ లక్షణాలు, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం, ప్రభుత్వ పథకాల అమలుపై శిక్షణ ఇచ్చారు. ఒక్కో సంఘంలో 10 నుంచి 20 మంది సభ్యులు ఉంటారు. మొదట గ్రామైక్య అధ్యక్షురాలిని, తర్వాత మండల సమాఖ్య అధ్యక్షులను ఎన్నుకున్నారు. వారి ద్వారా జిల్లా సమాఖ్య అధ్యక్షులు, కార్యదర్శి, కోశాధికారులను ఎన్నుకున్నారు. వీరికి శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. సీనియర్ రిసోర్స్పర్సన్లు శిక్షణనిస్తున్నారు. జిల్లాలో 441 గ్రామైక్య సంఘాలు జిల్లాలో 441 గ్రామైక్య సంఘాలు, 10,014 స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. వాటిలో 1,15,317 మంది సభ్యులు ఉన్నారు. నూతనంగా గ్రామైక్య సంఘాలకు ఎన్నికై న పాలకవర్గాలకు సంఘాల నిర్వహణ, ఆర్థిక కార్యకలాపాలు, నాయకత్వ లక్షణాలపై అవగాహన కల్పించారు. మహిళలు తమ హక్కులపై చైతన్యం పొందడమే కాకుండా సామాజిక రంగాల్లో చురుకుగా పాల్గొనేలా శిక్షణ ఇచ్చారు. శిక్షకులు, సామూహిక చర్చలు, ప్రాక్టికల్ సెషన్లు, విజువల్ ప్రజెంటేషన్ల ద్వారా శిక్షణ ఇచ్చారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు మహిళా సంఘాల మధ్య సరైన సంబంధం ఏర్పడేందుకు ఈ శిక్షణ బలమైన పునాది కానుంది. మహిళా సంఘాలకు కొత్త సారథులు ముగిసిన శిక్షణ తరగతులు జిల్లాలో 441 గ్రామైక్య సంఘాలు -
రెవె‘న్యూ’ బాగోతం !
● ఇందిరమ్మ ఇసుక పక్కదారి ● అధికారుల కినుక.. ఆందోళనలో లబ్ధిదారులు ● వెల్లువెత్తిన విమర్శలుసిరిసిల్లటౌన్: అక్రమ ఇసుక రవాణా కఠినతరం చేయాలన్న ప్రభుత్వ ఆదేశాలను సిరిసిల్ల రెవెన్యూ అధికారులు బేఖాతర్ చేస్తున్నారనటానికి ఇదో నిదర్శనం. కేవలం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికే కేటాయించాల్సిన ఇసుకను ప్రైవేటు నిర్మాణాలకు కేటాయించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ప్రైవేటు వ్యక్తులకు ఇసుకను అందించడం సిరిసిల్లలో శుక్రవారం దుమారం రేపింది. ఇందిరమ్మ లబ్ధిదారులకు అడ్డగోలు నిబంధనలు పెట్టే అధికారులు తమకు అనుకూలమైన వారికి ఇసుకను అందజేయడంపై స్థానికులు విమర్శలు గుప్పించారు. అసలేం జరిగింది? పట్టణంలో ఇందిరమ్మ లబ్ధిదారులకు శుక్రవారం స్థానిక రీచ్ నుంచి ఇసుక తీసుకునేందుకు రెవెన్యూ అధికారులు పర్మిషన్ ఇచ్చారు. మున్సిపల్ అధికారులు సుమారు 30 మందికి శుక్రవారం ఇసుక తీసుకునేందుకు రెవెన్యూ అధికారులకు సిఫారసు లేఖలు అందించినట్లు సమాచారం. లబ్ధి దారులతోపాటు రెవెన్యూ అధికారులు నిబంధలకు విరుద్ధంగా ప్రైవేటు వ్యక్తుల పేర్లనూ జాబితాలో చేర్చినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈవిషయమై శుక్రవారం పలువురు రెవెన్యూ సిబ్బందితో వాగ్వాదానికి దిగడం వైరల్ అయ్యింది. కలెక్టర్ పేరుతో అధికారుల బుకాయింపు ! మున్సిపల్ నుంచి సిఫారసు లేఖలు తెచ్చుకున్న ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకే శుక్రవారం రెవెన్యూ అధికారులు ఇసుకకు అనుమతించాల్సి ఉండగా ప్రైవేటు వ్యక్తులకు ఎలా అందించారని స్థానికులు వాపోయారు. ఈవిషయమై రెవెన్యూ అధికారులను ప్రశ్నిస్తే కలెక్టర్ ఆదేశాలున్నాయని బుకాయిస్తున్నారన్నారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఒక్కొక్కరికి కేవలం రెండు, మూడు ట్రిప్పుల ఇసుక మాత్రమే అవసరం ఉంటుందని ఇందుకు ఒక్కో ట్రిప్పుకు ట్రాక్టర్ యజమానులు రూ.2వేలు తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. అయితే రెవెన్యూ అధికారులు ప్రైవేటు వ్యక్తులతో కుమ్మక్కై అధిక సంఖ్యలో ఇసుక ట్రిప్పులను కేటాయించినట్లు ఆరోపించారు. అధికారుల అండతో ఇసుకను కొందరు ఒక్కో ట్రిప్పునకు రూ.3,500 వరకు వసూలు చేసినట్లు సమాచారం. అధిక సంఖ్యలో ఇసుక ట్రిప్పులను సిరిసిల్ల బైపాస్‌రోడ్డుకు తరలించారని ఆ ప్రాంతంలో ప్రైవేటు నిర్మాణాలే తప్ప ఇంది రమ్మ ఇండ్ల నిర్మాణాలు లేవని పేర్కొన్నారు. మా సిబ్బందిని మందలించాం ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు శుక్రవారం ఇసుక పర్మిట్లు ఇచ్చే క్రమంలో మా సిబ్బంది ఓవర్‌లుక్‌లో వెళ్లారు. ఈవిషయమై వారిని మందలించాం. ప్రైవేటు నిర్మాణాలకు ఇసుక ట్రిప్పుల కేటాయింపుపై విచారణ చేపడుతున్నాం. ఇకపై అలా జరగకుండా చర్యలు తీసుకుంటాం. – మహేశ్‌కుమార్, సిరిసిల్ల తహసీల్దార్ -
యోగాసనాలతో సుఖప్రసవాలు
● జిల్లా వైద్యాధికారి డాక్టర్ ఎస్.రజితసిరిసిల్ల: యోగాసనాలతో గర్భిణులు సుఖప్రసవాలకు అవకాశం ఉందని, సులభంగా వీలైన మేరకు ఆసనాలు సాధన చేసి సీ–సెక్షన్(ఆపరేషన్) లేకుండా నార్మల్‌గా డెలివరీ అయ్యే అవకాశం ఉంటుందని జిల్లా వైద్యాధికారి ఎస్.రజిత పేర్కొన్నారు. కలెక్టరేట్లో శుక్రవారం జిల్లా సంక్షేమశాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ఆదేశాలతో గర్భిణులకు, బాలింతలకు అంగన్వాడీ టీచర్లకు యోగాపై శిక్షణ ఇచ్చారు. జిల్లా వైద్యాధికారి మాట్లాడుతూ దేశంలోనే ఉమ్మడి కరీంనగర్ జిల్లా సీ–సెక్షన్లలో ముందుందని, నార్మల్ డెలివరీల కోసం యోగాసనాలను నేర్చుకోవాలన్నారు. నిత్య సాధనతో ఆరోగ్యం బాగుంటుందన్నారు. జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం మాట్లాడుతూ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మహిళల ఆరోగ్యం, మానసిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా ఆర్యజనని అనే ప్రత్యేక కార్యక్రమంలో యోగా శిక్షణ ఏర్పాటు చేశామన్నారు. మహిళలు గర్భవతులుగా ఉన్నప్పుడు, బాలింతలు అయినప్పుడు చేయాల్సిన ప్రత్యేక ఆసనాలపై అవగాహన ఉండాలన్నారు. యోగాతో పుట్టబోయే శిశువు ఆరోగ్యంగా ఉండడంతో పాటు సాధారణ ప్రసవాలు జరుగుతాయని లక్ష్మీరాజం వివరించారు. రామకృష్ణ మఠం డాక్టర్లు అంజలి, దీప్తి, పిల్లల డాక్టర్ సురేంద్రబాబు, సీడీపీవోలు సౌందర్య, ఉమారాణి, జిల్లా మిషన్ కోఆర్డినేటర్ రోజా, పోషణ అభియాన్ కోఆర్డినేటర్ బాలకిషన్, ఇన్చార్జి ప్రొటెక్షన్ ఆఫీసర్ శ్రీనివాస్, చైల్డ్ హెల్ప్‌లైన్ కో–ఆర్డినేటర్ పరమేశ్వర్, సఖీ కో–ఆర్డినేటర్ మమత పాల్గొన్నారు. -
హెచ్ఎంలే ఎంఈవోలు
ముస్తాబాద్(సిరిసిల్ల): విద్యావ్యవస్థపై ఆజమాయిషీ లేకుండా పోతోంది. పర్యవేక్షించే అధికారులు లేక వ్యవస్థ గాడితప్పుతోంది. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం పలు పథకాలు ప్రవేశపెడుతుండగా.. మరోవైపు ఖాళీ పోస్టులు ఇబ్బందులు పెడుతున్నాయి. గత ఎస్సెస్సీ పరీక్షల్లో రాష్ట్రంలోనే ఐదో స్థానంతో అత్యుత్తమ ఫలితాలు సాధించిన జిల్లాలో ఎంఈవో, ఉపాధ్యాయపోస్టుల ఖాళీలు విద్యాభిమానులను కలవరపెడుతున్నాయి. జిల్లాలోని 13 మండలాలతోపాటు సిరిసిల్ల, వేములవాడ టౌన్లలో ప్రధానోపాధ్యాయులనే మండల విద్యాధికారులుగా ప్రభుత్వం నియమించింది. గత ప్రభుత్వం ఒకరికి మూడు నుంచి నాలుగు మండలాలకు ఇన్చార్జి ఇవ్వగా, కాంగ్రెస్ ప్రభుత్వం ఒక హెచ్ఎంకు ఒక మండలం బాధ్యతలు అప్పగించడం కొంతవరకు ఉపశమనం కలిగించే అంశమే. క్రమబద్ధీరణతోనే ఖాళీలు భర్తీ ప్రభుత్వం జిల్లాను యూనిట్‌గా కాకుండా మండలాన్ని యూనిట్‌గా తీసుకుని పాఠశాలలను క్రమబద్ధీకరిస్తే ఖాళీలు ఉండబోవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఉపాధ్యాయ సంఘాలు ఈ విషయంలో ఆలోచన చేస్తే ప్రభుత్వం క్రమబద్ధీకరణకు ముందుకొచ్చే అవకాశాలు లేకపోలేదు. జిల్లాలో ఎస్జీటీ పోస్టులే 190 ఖాళీగా ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్ పోస్టుల్లో గణితం 11, భౌతిక శాస్త్రం 6, బయోలజీ 12, సాంఘికశాస్త్రం 17, ఇంగ్లిష్ 10, తెలుగు 12, హిందీ 9, ఫిజికల్ డైరెక్టర్లు 6, స్పెషల్ టీచర్లు 8, ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం పోస్టులు 13, స్పెషల్ ఎడ్యుకేషన్ ఎస్జీటీలు 7 ఖాళీగా ఉన్నాయి. లాంగ్వేజ్ పండిట్లు తెలుగు 6 ఖాళీయే. విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తి అశాసీ్త్రయంగా ఉండడంతోపాటు పలువురు 317 జీవోతో బదిలీలు కావడం, స్పౌజ్, ఇతర కారణాలతోపాటు, ఉద్యోగ విరమణ చేయడం ద్వారా ఖాళీలు ఏర్పడుతున్నాయి. జిల్లా విద్యాధికారిగా జెడ్పీ సీఈవో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. జిల్లాలో పాఠశాలలు ఇలా.. ప్రాథమిక పాఠశాలలు 489 ప్రాథమికోన్నత 37 జెడ్పీ ఉన్నత 113 కస్తూరిబా విద్యాలయాలు 13 మోడల్ స్కూళ్లు 13 విద్యార్థుల సంఖ్య 48,382 ఉపాధ్యాయ ఖాళీలు(ఎస్జీటీ) 190 స్కూల్ అసిస్టెంట్ 131 విద్యాశాఖలో వెక్కిరిస్తున్న ఖాళీలు జెడ్పీ సీఈవోకు డీఈవో బాధ్యతలు విద్యాసంవత్సరం ఆరంభంలోనే బాలారిష్టాలు ‘ఇది ముస్తాబాద్ మండలం బందనకల్ ప్రాథమిక పాఠశాల. ఇక్కడ గతంలో నలుగురు ఉపాధ్యాయులు ఉండేవారు. స్పౌజ్ విషయంలో ఇద్దరు బదిలీపై వెళ్లారు. ప్రస్తుతం ఇద్దరు ఉండగా, అందులో ప్రధానోపాధ్యాయుడు ఆగస్టులో ఉద్యోగ విరమణ చేయనున్నారు. ప్రస్తుతం పాఠశాలలో 55 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ బడిబాటలో మరో 20 మంది చేరే అవకాశం ఉంది. ఈనేపథ్యంలో కొద్ది రోజులపాటు పాఠశాలను ఒక్క టీచరే నెట్టుకొచ్చే అవకాశం ఉంది. ఇలాంటి టీచర్ల కొరత పాఠశాలు జిల్లాలోని మండలాల్లో ఉన్నాయి. ప్రభుత్వం ఇటీవల డీఎస్సీ నిర్వహించి, ఉపాధ్యాయ నియామకాలు చేపట్టినా ఖాళీలు ఉన్నాయి’. విధులు నిర్వర్తిస్తున్నాం ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎంఈవోగా పనిచేస్తూనే హెచ్ఎంగా విధులు నిర్వర్తిస్తున్నాం. కొంత పని ఒత్తిడి ఉన్నా అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తున్నాం. ఉపాధ్యాయులు, సిబ్బంది సహకారంతో ఇబ్బంది లేకుండా పనిచేస్తున్నాం. పాఠశాల నిర్వహణతోపాటు ఎంఈ వోగా పనిచేయడంతో ఒత్తిడి పెరుగుతోంది. – నిమ్మ రాజిరెడ్డి, ఎంఈవో, ముస్తాబాద్ నియామకాలు చేపట్టాలి విద్యాశాఖలో శాసీ్త్రయ పద్ధతిలో హేతుబద్ధీకరణ జరగాలి. ప్రాథమిక పాఠశాలల్లో కనీసం తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండాలి. ఉన్నత పాఠశాలలో సంఖ్యతో సంబంధం లేకుండా విషయాల వారీగా నిపుణులు ఉండాలి. బదిలీలు, పదోన్నతులు క్రమం తప్పకుండా చేపట్టి నియామకాలు జరగాలి. – పాతూరి మహేందర్‌రెడ్డి, టీపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ‘ఇతను ముస్తాబాద్ ఎంఈవో నిమ్మ రాజిరెడ్డి. సోమవారం ఉదయం 8 గంటలకే తాను హెచ్ఎంగా ఉన్న ముస్తాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చేరుకున్నారు. 10 గంటల వరకు అడ్మిషన్లు, పాలనాపరమైన విధులు నిర్వర్తించి తర్వాత ఒంటి గంట వరకు హెచ్ఎంలతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఎమ్మార్సీకి చేరుకుని నోట్‌బుక్స్ పంపిణీ చూసుకున్నారు. తెర్లుమద్దిలో మధ్యాహ్న భోజన విషయంలో తలెత్తిన వివాదంపై చర్చించారు. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు పదోతరగతి విద్యార్థులకు మ్యాథ్స్ బోధించారు. కమ్యూనికేషన్ స్కిల్స్‌పై విద్యార్థులకు వివరించారు. ఒక్కరే అధికారి బహుముఖ సేవలతో తీరిక లేకుండా గడిపారు. ఇలా ఇతనొక్కరే కాదు.. జిల్లాలోని ఎంఈవోలందరిదీ ఇదే పరిస్థితి’. -
సదరం క్యాంపు సద్వినియోగం చేసుకోవాలి
సిరిసిల్లటౌన్: దివ్యాంగులు జిల్లా ఆస్పత్రిలో నిర్వహిస్తున్న సదరం క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా లీగల్‌సెల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి రాధికా జైశ్వా ల్ కోరారు. సిరిసిల్ల జిల్లా ఆస్పత్రిలో గురువారం నిర్వహించిన సదరం క్యాంపును సందర్శించి మాట్లాడారు. వినికిడిలోపం, మేధో వైకల్యం, లో కో మోటార్, తక్కువ దృష్టి, మానసిక అనారో గ్యం, మెంటల్ రిటార్డేషన్ వంటి వైకల్యాలున్న పిల్లలకు యూడీఐడీ కార్డులను జారీ చేయడంపై పర్యవేక్షించారు. జనవరి 1 నుంచి జూన్ 15 వరకు 43 మంది పిల్లలు స్క్రీనింగ్ చేయబడ్డార ని, ఇప్పటి వరకు 26 మంది పిల్లలు యూడీఐడీ కార్డులు పొందినట్లు తెలిపారు. లోక్ అదాలత్ సభ్యుడు చింతోజు భాస్కర్ హాజరయ్యారు. -
చినుకొస్తే మునకే !
● హైటెన్షన్‌లో లోతట్టు ప్రజలు ● పూర్తికాని వరదకాల్వ పనులు ● శాశ్వత పరిష్కారం కోరుతున్న స్థానికులు ● తాత్కాలిక చర్యలతో సరిపెడుతున్న అధికారులుసిరిసిల్లటౌన్: వర్షాకాలం వచ్చిందంటే చాలు సిరిసిల్ల పట్టణ ప్రజలు వణికిపోతున్నారు. ఏటా వర్షాకాలంలో జిల్లా కేంద్రంలోని లోతట్లు ప్రాంతాలు జలమయం అవుతుండడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. మూడేళ్ల క్రితం జరిగిన ప్రాణ, ఆస్తినష్టం నుంచి ప్రజలు ఇంకా తేరుకోలేదు. పట్టణంలోని పై ప్రాంతం నుంచి వచ్చే వరదనీటిని కట్టడి చేయటంలో అధికారులు ఏళ్లుగా కుస్తీ పడుతూనే ఉన్నారు. అయినా సమస్య తీరడం లేదు. ఇటీవల తొలకరి జల్లులు కురిసిన సమయంలో పాతబస్టాండ్, సంజీవయ్యనగర్, శాంతినగర్లలోని రోడ్లు జలమయమయ్యాయి. చిన్నపాటి వర్షానికే ఇలాగైతే జోరు వర్షాలు కురిస్తే పరిస్థితి ఏంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. సిరిసిల్లలోని లోతట్టు ప్రాంతాలపై ‘సాక్షి’ ఫోకస్. సమస్యలు ఇవీ.. ● పాతబస్టాండు సమీపంలో రూ.45లక్షలతో నిర్మించిన ప్రధాన డ్రైనేజీ కాల్వ పైనుంచి వచ్చే వరద నీటిని రోడ్డుపైకి రానీయకుండా పునరుద్ధరించాలి. ● పట్టణంలో వరదలు రాకుండా చేపడుతున్న కాల్వలు, రోడ్లు, డ్రైనేజీలు పూర్తికాకపోవడం విమర్శలకు తావిస్తోంది. ● శాంతినగర్ ప్రాంతం నుంచి శ్రీనగర్ ప్రాంతం గుండా శాశ్వత వరదకాల్వ పనులు పూర్తికాలేదు. ● లోతట్టు ప్రాంతాలైన అంబికానగర్, వెంకంపేట, తారకరామానగర్, పద్మనగర్, అశోక్‌నగర్, అనంతనగర్, సర్ధార్‌నగర్, సంజీవయ్యనగర్, ఆసిఫ్‌పుర, ఆటోనగర్, శాంతినగర్‌లలో వరద చేరకుండా పటిష్ట చర్యలు చేపట్టాలి. ● చెరువుల ఆక్రమిత నాలాలు, మత్తడికాల్వలు పునరుద్ధరిస్తే సమస్య పరిష్కారమయ్యే అవకాశంపై అధికారులు, పాలకులు దృష్టి సారించడం లేదు. ఇవిగో పరిష్కారాలు పట్టణలలోని అన్ని చెరువులకు సంబంధించిన మత్తడి, నాలాలు పునరుద్ధరించాలి. లోతట్టు ప్రాంతాలకు ముంపు వాటిల్లకుండా ముందస్తు ప్రణాళికతో కొత్తనాలాలు నిర్మించాలి. పాతబస్టాండులోని ఫుట్‌పాత్ కింద డ్రెయినేజీ పూర్తిగా సిల్టుతో నిండి దుర్గంధం వస్తుంది. పూర్తిస్థాయిలో క్లీన్ చేయించి, పెద్దబజారుకు వరదనీరు వెళ్లకుండా అడ్డుకట్ట వేయాలి. ప్రధాన మురుగుకాల్వలు కబ్జా కాకుండా చర్యలు తీసుకోవాలి. సిల్టు పేరుకుపోకుండా నెలరోజులకోసారైనా శుభ్రం చేయాలి. లోతట్టు ప్రాంతాల నుంచి వచ్చే నీరు రోడ్డుపైకి రాకుండా..పటిష్ట కాలువలు కట్టించి నేరుగా మానేరువాగులో కలిసేలా చేయాలి. ఇప్పటికే కబ్జాకు గురైనా నాలాలను స్వాధీనం చేసుకుని, పునరుద్ధరించాలి. -
రైతుల ఖాతాల్లో రూ.99.52కోట్లు జమ
● కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సిరిసిల్ల: జిల్లాలోని రైతుల బ్యాంకు ఖాతాల్లో రైతుభరోసా చెల్లింపులు కొనసాగుతున్నాయని, ఇప్పటి వరకు 1,10,322 మందికి పెట్టుబడి సాయం జమయిందని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా గురువారం తెలిపారు. ఖరీఫ్ (వానాకాలం) సీజన్ సాగు పెట్టుబడి కోసం రైతుల బ్యాంకు ఖాతాల్లో ఎకరానికి రూ.6వేల చొప్పున రైతుభరోసా విడుదల చేసిందని కలెక్టర్ వివరించారు. గత నాలుగు రోజుల్లో రైతుల బ్యాంక్ ఖాతాల్లో రూ.99,52,19,906 జమయినట్లు ప్రకటించారు. క్షయవ్యాధి కేసులు తగ్గించాలి ● డీఎంహెచ్‌వో రజిత కోనరావుపేట(వేములవాడ): జిల్లాలో క్షయవ్యాధి నివారణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ రజిత సూచించారు. కోనరావుపేట పీహెచ్సీలో టీబీ చాంపియన్స్‌కు ఒక్క రోజు శిక్షణ నిర్వహించారు. డాక్టర్ రజిత మాట్లాడుతూ జిల్లాలో క్షయవ్యాధి కేసులు తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలు వివరించారు. టీబీ వ్యాధికి గురై మందులు వాడి కోలుకున్న వారిని టీబీ చాంపియన్స్‌గా పిలుస్తున్నట్లు పేర్కొన్నారు. టీబీ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ అనిత, పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వేణుమాధవ్, ఇంపాక్ట్ ఇండియా జిల్లా అధికారి దండుబోయిన శ్రీనివాస్, ఎస్టీఎస్ జైత్య, పీహెచ్సీ సూపర్వైజర్లు, ఎంఎల్‌హెచ్‌పీ, ఏఎన్ఎంలు పాల్గొన్నారు. అన్నదానానికి రూ.2లక్షల విరాళం వేములవాడ: రాజన్న అన్నదాన సత్రానికి న్యూఢిల్లీలో నివాసముంటున్న బోయినపల్లి మండలం వరదవెల్లికి చెందిన పీచర శ్రీహర్ష, సుప్రీంకోర్టు అడ్వకేట్ కృష్ణ తలో రూ.లక్ష చొప్పున రూ.2లక్షలు ఏఈవో శ్రవణ్‌కు గురువారం అందజేశారు. భక్తులకు అన్నదానం కోసం వినియోగించాలని కోరారు. సాగునీటి ఇబ్బందులు తొలగిస్తాం ● ఎగువమానేరు డిప్యూటీ డీఈఈ రవికుమార్ ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎగువమానేరు ఆయకట్టు రైతులకు ఈ ఖరీఫ్ సీజన్లో సాగునీటి సమస్య రాకుండా, డీ10 లెవల్ కాల్వలను మరమ్మతు చేస్తున్నట్లు ఎగువమానేరు కాలువల డిప్యూటీ డీఈఈ రవికుమార్ పేర్కొన్నారు. మండలంలోని బండలింగంపల్లి శివారులో డీ10 లెవల్ కాలువల మరమ్మతులో భాగంగా గురువారం అధికారులు కొలతలు తీసి పరిశీలించారు. రవికుమార్ మాట్లాడుతూ రూ.5లక్షల వ్యయంతో ఈ సీజన్లో కాలువల వెంట పిచ్చిమొక్కలు, గడ్డి పెరుగకుండా సీసీ వేయడం, తూములు, షట్టర్ల మరమ్మతు పనులు పూర్తి చేస్తామన్నారు. చివరి ఆయకట్టు భూములు తడిసేలా నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు. ఏఈఈ, వర్క్ ఇన్స్పెక్టర్ రాజు, మాజీ సర్పంచ్ బాల్‌రాజ్ నర్సాగౌడ్ ఉన్నారు. ఘనంగా చౌడాలమ్మ కల్యాణం వేములవాడరూరల్: వేములవాడ రూరల్ మండలం బొల్లారంలో చౌడాలమ్మ కల్యాణ మహోత్సవాన్ని గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, వకుళాభరణం శ్రీనివాస్, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు సంగ స్వామి ఉన్నారు. -
కల్తీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు
ముస్తాబాద్(సిరిసిల్ల): రైతులకు కల్తీ విత్తనాలు, ఎరువులు, పెస్టిసైడ్స్ విక్రయిస్తే చట్టరీత్య చర్యలు తీసుకుంటామని టాస్క్‌ఫోర్స్ టీం అధికారులు హెచ్చరించారు. ముస్తాబాద్‌లో ఎరువులు, విత్తనాల దుకాణాల్లో టాస్క్‌ఫోర్స్ టీం గురువారం ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. ముస్తాబాద్, తంగళ్లపల్లి మండలాల వ్యవసాయాధికారులు దుర్గరా జు, సంజీవ్, ఎస్సై గణేశ్ ఆధ్వర్యంలో దాడులు చేశారు. నిర్వాహకులు తప్పనిసరిగా లైసెన్స్ కలి గి ఉండాలన్నారు. స్టాక్ రిజిష్టర్లు, ఎరువులు, విత్తనాలను పరిశీలించారు. రైతులు తప్పకుండా రశీదులు పొందాలని సూచించారు. నకిలీ విత్తనా లు, పెస్టిసైడ్స్ విక్రయిస్తే పోలీసులకు సమాచా రం అందించాలన్నారు. ఎరువులు, విత్తనాలు ఎవరైన అక్రమంగా నిల్వ చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. -
నేతన్నలు ‘త్రిఫ్ట్’లో చేరేందుకు చాన్స్
● నేడు, రేపు అవకాశం సిరిసిల్ల: జిల్లాలోని నేతకార్మికులు త్రిఫ్ట్ పొదుపు పథకంలో చేరేందుకు మరో రెండు రోజులు గడువును పొడిగించారు. నేతకార్మికులకు సౌకర్యవంతంగా ఉండాలని సిరిసిల్ల బీ.వై.నగర్‌లోని పాతచేనేత, జౌళిశాఖ ఆఫీస్‌లో హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేశారు. వస్త్రపరిశ్రమ అనుబంధరంగాల్లో పనిచేసే కార్మికులు ప్రతి నెలా గరిష్టంగా రూ.1,200 పొదుపు ఖాతాలో జమచేస్తే ప్రభుత్వం అంతే మొత్తం చెల్లిస్తుంది. ప్రతి నెలా కార్మికుడి పొదుపు ఖాతాలో రూ.2,400 జమకావడంతో వడ్డీతో సహా.. రెండేళ్ల తరువాత కార్మికులు పొందవచ్చు. ఈ త్రిఫ్ట్ పొదుపు పథకంలో చేరేందుకు తొలుత జూన్ 19 వరకు అవకాశం ఉండేది. దీంతో సిరిసిల్ల చేనేత, జౌళిశాఖ పాత ఆఫీస్‌లో కార్మికులు గురువారం కిక్కిరిసిపోయారు. దీంతో దరఖాస్తులను ఇచ్చేందుకు మరో రెండు రోజులు శుక్ర, శనివారాల్లో అవకాశం కల్పించారు. పవర్లూమ్ కార్మికులు, అనుబంధ రంగాల కార్మికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చేనేత, జౌళిశాఖ అధికారులు కోరుతున్నారు. -
ఆరోగ్య‘యోగ’ం
సిరిసిల్ల: నిత్య సాధనతో సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని ఆయుష్ యునానీ డిస్పెన్సరీ యోగా శిక్షకులు బి.శ్రీనివాస్, టి.స్వప్న తెలిపారు. అంతర్జాతీయ యోగా దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా కలెక్టరేట్లో గురువారం కామన్ యోగా ప్రొటోకాల్‌పై జిల్లా అధికారులు, సిబ్బందికి అవగాహన కల్పించారు. ప్రతి రోజు యోగా చేయడం ద్వారా కలిగే లాభాల గురించి వివరించారు. జెడ్పీ సీఈవో వినోద్‌కుమార్, డీడబ్ల్యూవో లక్ష్మీరాజం, ఉపాధి కల్పనాధికారి ఉపేందర్‌రావు, డీఏవో అఫ్జల్‌బేగం, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ స్వప్న, కలెక్టరేట్ అడ్మినిస్ట్రేషన ఆఫీసర్ రామ్‌రెడ్డి, ఆయుష్ జిల్లా నోడల్ అధికారి డాక్టర్ శశిప్రభ, డాక్టర్ సౌమిని, డాక్టర్ శ్వేత, డాక్టర్ స్వరూప, డాక్టర్ కళ్యాణి, డీపీఎం తిరుపతి, డీటీవో లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. -
రాజన్న కోడెలను కంటికి రెప్పలా చూసుకోవాలి
● జిల్లా పశువైద్యాధికారి రవీందర్‌రెడ్డి ● గోశాలలకు ఎంపికై న సిబ్బందికి అవగాహన సదస్సుసిరిసిల్ల: వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయానికి సంబంధించిన రెండు గోశాలలోని కోడెలను కొత్తగా ఎంపికై న సిబ్బంది కోడెలను కంటికి రెప్పలా చూసుకోవాలని, నిత్యం పర్యవేక్షిస్తూ సంరక్షించాలని, జిల్లా పశువైద్యాధికారి రవీందర్‌రెడ్డి కోరారు. వేములవాడలోని ఆలయానికి సంబంధించిన తిప్పాపూర్ గోశాల, ఆలయానికి సమీపంలోని కట్టకింద గోశాలలో పనిచేసేందుకు ఎంపికై న వారికి గురువారం కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా పశువైద్యాధికారి రవీందర్ రెడ్డి, జిల్లా ఉపాధి కల్పనాధికారి రాఘవేందర్ శిక్షణ ఇచ్చారు. ప్రతి రోజు జీవాలకు పచ్చిగడ్డి, ఎండుగడ్డి, దాణా మూడు సార్లు ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. పరిశుభ్రమైన నీటిని అందుబాటులో ఉంచాలని సూచించారు. జీవాల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ గోశాలలోని పశువైద్యాధికారి దృష్టికి తీసుకెళ్లాలని తెలిపారు. ప్రతి ఒక్క సిబ్బంది బాధ్యతగా తమ విధులు నిర్వర్తించి జీవాలను సంరక్షించాలని స్పష్టం చేశారు. ఎంపికై న సిబ్బంది అడిగిన పలు ప్రశ్నలకు పశువైద్యాధికారులు సమాధానాలు ఇచ్చారు. -
రోడ్డ్యామ్లో వ్యర్థాలు తీసేయాలి
రాళ్లబావి– శాంతినగర్ రోడ్డ్యామ్లో వ్యర్థాలను తొలగించాలి. డ్రెయినేజీల్లో సిల్టు నిండింది. డ్రెయినేజీలు పెద్దవిగా నిర్మిస్తే వరదనీరు కింది ప్రాంతాలకు సులువుగా వెళ్తుంది. చిన్నపాటి వర్షానికే రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. – తిప్పవరం రజనీకాంత్, రాళ్లబావి పదిహేనేళ్లుగా ఇదే తంతు.. చిన్న వర్షం పడితే చాలు సంజీవయ్యనగర్ కమాన్ ప్రాంతం వరదల్లో చిక్కుకుంటుంది. మా ఏరియాలో దవాఖానాలు ఎక్కువగా ఉన్నాయి. వాన పడితే రోగులు వైద్యం చేయించుకోలేక, స్థానికులం ఇంట్లో నుంచి బయటకు రాలేకపోతున్నాం. అధికారులు ఈ సమస్యను సీరియస్‌గా తీసుకోవాలి. కొత్తగా మోరీలు నిర్మించాలి. – వడ్నాల శేఖర్‌బాబు, సంజీవయ్యనగర్ వరదల ముప్పు తప్పించాలి ఏటా మా శ్రీనగర్ కాలనీకి వరద ముప్పు ఉంటుంది. కొత్తచెరువు నుంచి వచ్చే వరద, మత్తడికాల్వలు కబ్జాకు గురయ్యాయి. వరదల నివారణకు కచ్చా నాలా తవ్వారు. శాశ్వత పరిష్కారం చూపడం లేదు. కాలనీల్లో సీసీరోడ్లు, మోరీలు పూర్తిస్థాయిలో నిర్మించాలి. – కందాల నవీన్‌కుమార్, శ్రీనగర్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు -
మత్తుపదార్థాల నియంత్రణలో యువత కీలకం
● ఎస్పీ మహేశ్ బీ గీతే సిరిసిల్లక్రైం: జిల్లాలో గంజాయి, డ్రగ్స్ నియంత్రణలో యువత కీలకంగా వ్యవహరించాలని ఎస్పీ మహేశ్ బీ గీతే కోరారు. జిల్లా వ్యాప్తంగా పాఠశాల, కళాశాలల్లో విద్యార్థులకు మాదకద్రవ్యాలతో కలిగే అనర్ధాలపై వారంపాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. నషా ముక్త్ భారత్ అభియాన్‌లో భాగంగా తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ద్వారా జిల్లా వ్యాప్తంగా పాఠశాల, కళాశాలల్లో అవగాహన కల్పించనున్నట్లు వివరించారు. 20న జిల్లా, మండల కమిటీ సమావేశం, 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం, 22న డ్రగ్ హాట్స్పాట్లలో అవగాహన కార్యక్రమం, 23న మొక్కలు నాటడం, 24న స్లోగన్ రైటింగ్ కాంపిటీషన్, 25న పెయింటింగ్ కాంపిటీషన్, 26న అంతర్జాతీయ మాదక ద్రవ్య సేవన వ్యతిరేక దినోత్సవం, ర్యాలీ, ప్రతిజ్ఞ, సమావేశం వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వివరించారు. -
నిర్వాసితులకు సరైన పరిహారం అందించాలి
వేములవాడ: వేములవాడ పట్టణంలో రోడ్ల వెడల్పులో భాగంగా నిర్వాసితులపట్ల అధికారులు వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నామనీ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనర్సింహారావు అన్నారు. బుధవారం విలేకరులతో మాట్లాడారు. ఏళ్ల తరబడిగా ఉన్న దుకాణాలు, నివాసాలు కోల్పోతున్నవారికి మానవీయ కోణంలో కనీస గడువు, సరైన పరిహారం ఇవ్వకుండా అధికారులు వ్యవహరించిన తీరు బాధాకరమన్నారు. రహదారి విస్తరణకు తాము వ్యతిరేకం కాదని నిర్వాసితులు పదే పదే చెబుతున్నా స్థానిక ఎమ్మెల్యే అధికారులతో చొరవచూపాల్సింది పోయి పూర్తిగా వైఫల్యం చెందారన్నారు. పరిహారం ఇవ్వకముందే ఇల్లు, దుకాణాలు ఖాళీ చేయాలని నోటీసులు ఇవ్వడంపై ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా రాచరిక పాలనలో ఉన్నామా అని ప్రశ్నించారు. గోశాల విషయంలో తాము నిలదీయడం వల్లే యంత్రాంగం కదిలిందని, వేములవాడలో 100 ఎకరాల్లో గోశాల ఏర్పాటుకు సీఎం చొరవ చూపడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. క్రాంతికుమార్, పోలాస నరేందర్, నిమ్మశెట్టి విజయ్, జోగిని శంకర్, నరాల శేఖర్, గోలి మహేశ్ తదితరులు ఉన్నారు. -
క్రీడా ప్రాంగణం పరిశీలన
చందుర్తి(వేములవాడ): క్రికెట్ స్టేడియం ఏర్పాటు కోసం చందుర్తి మండలం మూడపల్లి గ్రామంలోని క్రీడా ప్రాంగణాన్ని బుధవారం సాయంత్రం కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా పరిశీలించారు. ఈనెల 20న ఎస్ఏటీజీ చైర్మన్ శివసేనరెడ్డి శంకుస్థాపన చేయనున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లా పౌరసంబంధాల శాఖ అధికారి శ్రీధర్, జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి రాందాస్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్‌ను కలిసిన ఏఎంసీ చైర్మన్ ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): కలెక్టర్‌గా సందీప్‌కుమార్ ఝా ఏడాది సక్సెస్ ఫుల్‌గా నిలిచారని ఏఎంసీ చైర్మన్ సాబేరా బేగం అన్నారు. బుధవారం కలెక్టర్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య, ఏఎంసీ వైస్ చైర్మన్ రాంరెడ్డి, నాయకులు తదితరులున్నారు. -
ఏటీసీకి పరిపాలన అనుమతులు
రుద్రంగి(వేములవాడ): రుద్రంగి మండల కేంద్రంలో ఏర్పాటు చేసే అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ) కళాశాలకు పరిపాలన అనుమతులు మంజూరైనట్లు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రకటనలో తెలిపారు. ఈ టెక్నాలజీ సెంటర్లో రెండేళ్ల కాల పరిమితి కలిగిన ఆరు అడ్వాన్స్డ్ టెక్నాలజీ కోర్సులు ఉంటాయని పేర్కొన్నారు. అడ్వాన్స్డ్ సీఎన్సీ మిషనింగ్ టెక్నీషియన్ 48, ఆర్టీసియన్ యూజింగ్ అడ్వాన్స్డ్ టూల్ 20, బేసిక్ డిజైనర్, వర్చువల్ వెరిఫయర్ 48, ఇండస్ట్రియల్ రోబోటిక్స్, డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నీషియన్ 40, మెకానిక్ ఎలక్ట్రానిక్ వెహికల్ 48, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ అండ్ ఆటోమేషన్ 40 సీట్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు. గల్ఫ్ వెళ్లేవారికి స్కిల్ డెవలప్మెంట్ పెంపొందించేందుకు అవకాశం, యువతలో నైపుణ్యాలను పెంపొందించేందుకు మెరుగైన ఉద్యోగ అవకాశాలు దొరికేందుకు ఏటీసీ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఫారెస్ట్ అధికారులను అడ్డుకున్న రైతులువీర్నపల్లి(సిరిసిల్ల): మండలంలోని రంగంపేట గ్రామంలో అటవీశాఖ భూమిలో చెట్లు నాటేందుకు గాను సర్వే చేసేందుకు బుధవారం ఫారెస్ట్ అధికారులు, సిబ్బంది రాగా రైతులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ, 30 ఏళ్లుగా ఆ భూమిని సాగుచేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నామని, ఇప్పుడు తమ పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజనులకు పోడు పట్టాలు ఇచ్చి బీసీలమైన తమకు పట్టాలు ఇవ్వకుండా అప్పటి ప్రభుత్వం అన్యాయం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమపై దయచూపి పోడు పట్టాలు ఇవ్వాలని కోరారు. రైతులు ఎదురుతిరగడంతో ఫారెస్టు అధికారులు చేసేదేమీ లేక ప్లాంటేషన్ సర్వే చేయకుండానే వెనుదిరిగారు. ఎఫ్ఎస్వో పద్మలతను వివరణ కోరగా, సిరిసిల్ల ఫారెస్ట్ రేంజ్ అధికారి శ్రీహరిప్రసాద్ ఆదేశాల మేరకు రంగంపేటలో పోడు భూమిలో సర్వే కోసం వచ్చామన్నారు. కూల్చివేతలు ముమ్మరంవేములవాడ: వేములవాడలో రోడ్ల వెడల్పు ప్రక్రియ బుధవారం మూడోరోజు కొనసాగింది. భారీ ఎగ్జావేటర్లతో రెండు, మూడు అంతస్తుల భవనాలను నేలమట్టం చేశారు. మొత్తం 148 భవనాలను పూర్తిగా కూల్చేసినట్లు అధికారులు తెలిపారు. 10 మంది తహసీల్దార్లు బృందాలుగా ఏర్పడి తమకు సూచించిన ప్రాంతాల్లో విధులు నిర్వర్తించారు. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక దుకాణాలు కోల్పోయిన వ్యాపారులు తమతమ సామగ్రిని సర్దుకునే ప్రయత్నంలో మునిగితేలారు. ఒలింపిక్స్ వారోత్సవాలుసిరిసిల్ల: కేంద్రంలో బుధవారం ఒలింపిక్స్ వారోత్సవాలను నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఈనెల 18 నుంచి 23 వరకు వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తొలిరోజు జూనియర్ కళాశాల మైదానంలో వాకర్స్‌తో కలిసి వాకింగ్ నిర్వహించారు. అందరిలోనూ క్రీడాస్ఫూర్తిని నింపేందుకు వారోత్సవాలు నిర్వహిస్తున్నామని జిల్లా యువజన, క్రీడల అధికారి ఆజ్మీరా రాందాస్ తెలిపారు. ఎంఈవో దూస రఘుపతి, యోగా మాస్టర్లు, వ్యాయామ ఉపాధ్యాయులు, వస్త్రోత్పత్తిదారులు, యువకులు పాల్గొన్నారు. రైతు భరోసా రూ.73.85 కోట్లు జమసిరిసిల్ల: జిల్లాలోని 97,841 మంది రైతులకు రైతు భరోసా పథకంలో రూ.73.85 కోట్లు బుధవారం నాటికి జమ అయ్యాయని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా తెలిపారు. వానాకాలం సీజన్ సాగు పెట్టుబడి కోసం ఎకరానికి రూ.6వేల చొప్పున ప్రభుత్వం విడుదల చేసిందని వివరించారు. మూడు రోజుల్లో రైతుల బ్యాంక్ ఖాతాల్లో రూ.73,85,58,689 డబ్బులు జమయ్యాయని పేర్కొన్నారు. -
టీకా వేసిన తర్వాత అబ్జర్వేషన్లో ఉంచాలి
సిరిసిల్ల/ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల):: వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది క్షేత్రస్థాయిలో విధులను నిర్లక్ష్యంగా నిర్వహించినా, సమయ పాలన పాటించకపోయినా సీసీఏ రూల్స్ ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్యాధికారి ఎస్.రజిత అన్నారు. సిరిసిల్ల పట్టణ శివారులోని చిన్నబోనాల, పెద్దూరు, ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ ఆరోగ్య ఉప కేంద్రాలను బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, వైద్య సిబ్బంది అంకితభావంతో పని చేయాలని, ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలన్నారు. 0–5 ఏళ్ల మధ్య వయసు పిల్లలకు టీకాలు వేసినప్పుడు వెంటనే వారిని ఇంటికి పంపించకుండా రెండు గంటల పాటు అబ్జర్వేషన్లో ఉంచుకోవాలని సూచించారు. టీకాలు వేసిన పిల్లలను మరో రెండు రోజుల పాటు ఆశావర్కర్లు, ఏఎన్ఎంలు వారి ఇళ్లకు వెళ్లి పరిశీలించాలన్నారు. ఆమె వెంట డీఐవో డాక్టర్ సంపత్‌కుమార్, డాక్టర్ నహీంజహా, సిబ్బంది ఉన్నారు. -
భూముల సర్వేకు గ్రహణం
● ఎండాకాలంలో సర్వేయర్లకు డిప్యూటేషన్ ● జిల్లా సర్వే అధికారి, డీఐలు ఇన్‌చార్జీలే.. ● వేధిస్తున్న కొరత.. రైతులకు తప్పని తిప్పలుఐదేళ్లుగా ఎదురుచూస్తున్నాం నర్సింగాపూర్ రెవెన్యూ శివారులో 422, 424 సర్వే నంబర్లలో భూములు సర్వే చేసి హద్దులు నిర్ణయించాలని 2020లో ఏడీ సర్వేయర్‌కు దరఖాస్తు చేసుకున్నా. ఇప్పటి వరకు సర్వేకు రాలేదు. హద్దులు చూపించలేదు. ఐదేళ్లుగా భూమి సర్వే కోసం ఎదురుచూస్తున్నాం. – మొకిడి మారుతి, వెంకట్రావుపల్లి బోయినపల్లి(చొప్పదండి): వానాకాలంలో పంటల సాగుకు ముందే భూముల సర్వే చేయించుకుందామనుకున్న రైతులకు నిరాశ ఎదురైంది. జిల్లాలో తగినంత మంది సర్వేయర్లు లేక దరఖాస్తులకు మోక్షం లభించడం లేదు. ఉన్న కొద్ది మంది సర్వేయర్లు ఎండాకాలంలో ప్రభుత్వ పనులపై వెళ్లారు. దీంతో జిల్లాలో భూముల సర్వే పడకేసింది. భూసర్వేకు దరఖాస్తు చేసి ఏళ్లు గడిచినా సర్వేయర్లు రావడం లేదని రైతులు వాపోతున్నారు. జిల్లాలోని 13 మండలాల్లో సుమారు 91,416 సర్వేనంబర్ల పరిధిలో 4,68,532 ఎకరాల భూములు ఉన్నాయి. సర్వేయర్ల కొరత ఒక్కో సర్వే నంబర్‌కు ఒక్కో టిపన్ ఉంటుంది. టిపన్లో సర్వేనంబర్ భూ విస్తీర్ణం మ్యాప్ ఉంటుండగా, దీని ఆధారంగా సర్వేయర్లు భూములను సర్వే చేస్తారు. రైతులు తమ భూములు సర్వే చేయాలని ఆన్లైన్లో చలాన్ చెల్లిస్తే తహసీల్దార్ ఆదేశాలతో సర్వేయర్ క్షేత్రస్థాయిలో సర్వేకు వస్తారు. అయితే జిల్లాలో సర్వేయర్ల కొరత తీవ్రంగా ఉంది. జగిత్యాల జిల్లా సర్వే అధికారి వెంకటరెడ్డి, రాజన్నసిరిసిల్ల జిల్లా ఇన్చార్జి అధికారిగా పనిచేస్తున్నారు. సిరిసిల్ల ఎల్ఏ డీఐ సిరిసిల్ల, వేములవాడ ఇన్చార్జి డీఐగా చేస్తున్నారు. జిల్లాలో ఏడుగురు మాత్రమే సర్వేయర్లు ఉన్నారు. ఇందులో ఒకరు ఇటీవల ఏసీబీకి ట్రాప్ అయ్యారు. డిప్యూటేషన్‌పై.. వేములవాడ టెంపుల్ రోడ్ల విస్తరణకు, భూభారతి పైలట్ ప్రాజెక్టులో భాగంగా రుద్రంగికి సర్వేయర్లు ఇటీవల డిప్యూటేషన్‌పై వెళ్లారు. ఇప్పుడు లైసెన్స్డ్ సర్వేయర్లకు శిక్షణ ఇచ్చేందుకు వెళ్తున్నారు. ఎండాకాలంలో భూములు ఖాళీగా ఉండడంతో సర్వేకు అనుకూలం. అయితే ఈ వేసవిలో సర్వేయర్లు బిజీగా ఉన్నారు. ప్రస్తుతం కొత్తగా నియమితులయ్యే 156 మంది లైసెన్స్డ్ సర్వేయర్లకు శిక్షణ ఇస్తున్నారు. లైసెన్స్డ్ సర్వేయర్లు విధుల్లో చేరేసరికి వర్షాలు ఊపందుకొని.. సర్వే పనులకు ఆటంకం కలుగుతుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.జిల్లా సమాచారం సర్వే అధికారి : 01 (ఇన్చార్జి అధికారి) డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే : 03 (వేములవాడ, సిరిసిల్ల ఇన్చార్జి) సర్వేయర్లు : 07 (ఒకరు ఏసీబీకి ట్రాప్) సర్వే నంబర్లు : 91,416 భూమి విస్తీర్ణం : 4.68 లక్షల ఎకరాలు -
కొనసాగుతున్న కూల్చివేతలు
వేములవాడ: వేములవాడలో రోడ్ల వెడల్పు ప్రక్రియ మంగళవారం కొనసాగింది. అధునాతన మిషన్లతో 80 ఫీట్ల వరకున్న దుకాణాలను కూల్చివేశారు. యుద్ధప్రాతిపదికన జరుగుతున్న ఈ పనుల్లో 10 మంది తహసీల్దార్లు బృందాలుగా ఏర్పడి ఒక్కో బృందం ఒక్కో బిట్‌ను పూర్తి చేసేందుకు తీవ్రంగా శ్రమించారు. ఇక దుకాణదారులు తమ సామగ్రిని సర్దుకునే పనిలో నిమగ్నమయ్యారు. వీటీడీఏకు రూ.25 కోట్లు మంజూరు వేములవాడ పట్టణాభివృద్ధికి మున్సిపల్‌శాఖ నుంచి వీటీడీఏకు రూ.25 కోట్లు మంజూరు చేసినట్లు విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. రాజన్న ఆలయం, పట్టణాభివృద్ధి సమాంతరంగా చేపడుతామని, వేములవాడను టెంపుల్ సిటీగా మార్చుతామని పేర్కొన్నారు. విస్తరణ పనులు పరిశీలనపట్టణంలోని మూలవాగు బ్రిడ్జి నుంచి రాజన్న ఆలయం వరకు చేపట్టే రోడ్ల విస్తరణ పనులను మంగళవారం ఎస్పీ మహేశ్ బీ గీతే పరిశీలించారు. కూల్చివేతల నేపథ్యంలో 200కు పైగా పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎస్పీ బందోబస్తును పరిశీలించారు. ఆయన వెంట ఏఎస్పీ చంద్రయ్య, మున్సిపల్ కమిషనర్ అన్వేశ్, సీఐలు, ఎస్సైలు ఉన్నారు. -
వాతావరణం
ఆకాశం మేఘావృతమవుతుంది. గాలిలో తేమ ఉంటుంది. అక్కడక్కడ స్వల్పంగా వర్షం కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలులు వీస్తాయి. కరెంట్ స్తంభాలను తాకొద్దు● వర్షాకాలంలో అప్రమత్తంగా ఉండాలి ● ఫ్యూజ్‌వైరు పోతే హెల్పర్‌ను పిలవాలి ● తుప్పు పట్టిన స్తంభాలను తొలగిస్తున్నాం ● ‘సాక్షి’తో ‘సెస్’ ఇన్చార్జి మేనేజింగ్ డైరెక్టర్ లోక శ్రీనివాస్రెడ్డిసిరిసిల్ల: విద్యుత్ వినియోగం మనిషి జీవితంలో అనివార్యమైంది. కరెంట్ సరఫరా లేకుండా రోజు గడవడం కూడా కష్టమే. విద్యుత్ ఎంత అవసరమో.. దాన్ని ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా నిండు ప్రాణాలను బలి తీసుకుంటుంది. ఈనేపథ్యంలో వర్షాకాలంలో విద్యుత్ విషయంలో వినియోగదారులు మరింత అప్రమత్తంగా ఉండాలని సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం(సెస్) ఇన్చార్జి మేనేజింగ్ డైరెక్టర్ లోక శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. జిల్లాలో విద్యుత్ పంపిణీ సేవలు అందించే ‘సెస్’ పరంగా తీసుకుంటున్న చర్యలు, వానాకాలంలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను మంగళవారం ‘సాక్షి’కి వివరించారు.. ఆ విశేషాలు.. ఆయన మాటల్లోనే..కరెంట్ విషయంలో అజాగ్రత్త వద్దు వర్షాకాలంలో ఇనుప స్తంభాలు, సిమెంట్ స్తంభాలు ఏవైనా వాటిని తాకవద్దు. వర్షాలకు అవి తడిసి ఉంటాయి. ఎర్తింగ్ సరిగా లేక షాక్ వచ్చే ప్రమాదం ఉంటుంది. మనుషులే కాకుండా, పశువులు సైతం స్తంభాలు, సపోర్టింగ్ వైర్లను తాకకుండా చూసుకోవాలి. ఇటీవల బోయినపల్లిలో ఓ గేదె విద్యుత్ షాక్‌తో మరణించింది. ముస్తాబాద్‌లో ఒకరు ఇంట్లోనే కరెంట్ షాక్‌కు గురై మృత్యువాత పడ్డారు. కరెంట్ విషయంలో ఎవరూ అజాగ్రత్తగా వ్యవహరించవద్దు. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా నిండు ప్రాణాలు పోతాయి. అప్రమత్తంగా ఉండడమే మంచిది. తుప్పుపట్టిన స్తంభాలను మార్చుతున్నం జిల్లా వ్యాప్తంగా తుప్పుపట్టిన, వంగిపోయిన స్తంభాలను ఇప్పటికే పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమంలో మార్చాము. ఇంకా ఆయా మండలాల్లో 801 ప్రదేశాలను గుర్తించి స్తంభాలు మార్చేందుకు పరిపాలనా అనుమతులు తీసుకున్నాం. 643 స్తంభాల మార్పిడికి మంజూరు చేశాం. ఇంకా 158 మార్చేందుకు మంజూరు రావాల్సి ఉంది. జిల్లాలో ఎక్కడ తుప్పు పట్టిన, ప్రమాదకరంగా స్తంభాలు ఉన్నా వెంటనే మార్చాలని మా క్షేత్రస్థాయి ఇంజినీర్లకు ఆదేశాలు జారీ చేశాం. ఎక్కడికక్కడ పనులు జరుగుతున్నాయి. రైతులు ట్రాన్స్ఫార్మర్లు ఎక్కవద్దు జిల్లాలో ట్రాన్స్ఫార్మర్లపై ఫ్యూజ్ వైర్లు పోయినప్పుడు స్థానిక రైతులు, లేదా కొంత పరిజ్ఞానం ఉన్నవారు ‘సెస్’ హెల్పర్ సాయం తీసుకోకుండా.. నేరుగా ట్రాన్స్ఫార్మర్ హ్యాండిల్ కొట్టి ఫ్యూజ్‌వైర్లు వేస్తారు. ఇది తప్పు. కచ్చితంగా మా సిబ్బందితోనే వేయించాలి. కొంత ఆలస్యమైనా అదే శ్రేయస్కరం. కానీ, కొందరు వారే ఫ్యూజ్‌వైరు వేసేందుకు ట్రాన్స్ఫార్మర్ పైకి వెళ్తారు. అలాంటప్పుడు ట్రాన్స్ఫార్మర్ౖపై పూర్తిస్థాయి విద్యుత్ సరఫరా నిలిచిపోకుండా, వేరే లైన్‌తో అనుసంధానమై సరఫరా ఉంటుంది. అది తెలియక ప్రమాదాలు జరుగుతాయి. రైతులు ఎట్టిపరిస్థితుల్లోనూ ట్రాన్స్ఫార్మర్ ఎక్కవద్దు. వ్యవసాయ మోటార్లు పెట్టేప్పుడు జాగ్రత్తగా ఉండాలి. చెప్పులు వేసుకోవాలి. తడి చేతులతో మోటార్లు, స్టార్టర్లను ముట్టవద్దు. విద్యుత్ వైరింగ్ సరిగా ఉందా లేదా అని ఎలక్ట్ట్రీషియన్తో చెక్ చేయించాలి. వైర్ల ఇన్సిలేషన్ తొలగిపోయి ప్రమాదాలు జరుగుతాయి. ముందు చూపుతో వ్యవహరించాలి.విద్యుత్ అంతరాయాన్ని కట్టడి చేసేందుకు.. విద్యుత్ అంతరాయాన్ని కట్టడి చేసేందుకు జిల్లాలో ముందస్తుగానే వర్షాకాల విద్యుత్ లైన్ల నిర్వహణను పూర్తి చేశాం. ఇంకా కొన్ని ప్రాంతాల్లో పనులు జరుగుతున్నాయి. వైర్ల కింద ఉన్న చెట్లు, కొమ్మలను తొలగించాం. ‘సెస్’ క్షేత్రస్థాయి సిబ్బందికి సేఫ్టీ కిట్లను అందించాం. ఇంకా పంపిణీ చేసేందుకు కొనుగోలుకు ప్రతిపాదించాం. వానాకాలంలో విద్యుత్ ఇన్డెక్షన్ వస్తుంది. అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సూచించాం.సమర్థవంతంగా సేవలు జిల్లావ్యాప్తంగా ‘సెస్’ ద్వారా సమర్థవంతంగా విద్యుత్ పంపిణీ సేవలు అందిస్తున్నాం. జిల్లాలో 2,04,571 కనెక్షన్లు ఉన్నాయి. ఇవి కాకుండా వ్యవసాయ కనెక్షన్లు 79,449 ఉన్నాయి. వ్యవసాయ కనెక్షన్లు రోజురోజుకు పెరుగుతున్నాయి. 10,626 ట్రాన్స్ఫార్మర్లు, 76 సబ్స్టేషన్లతో లో ఓల్టేజీ లేకుండా విద్యుత్ సరఫరా చేస్తున్నాం. గృహజ్యోతి పథకంలో 1,05,746 మందికి 200 యూనిట్ల వరకు విద్యుత్‌ను ఉచితంగా అందిస్తున్నాం. ప్రభుత్వం ప్రతి నెలా రూ.4.11 కోట్లు గృహజ్యోతి పథకంలో చెల్లిస్తుంది. పవర్‌లూమ్స్‌కు 25 హెచ్‌పీల వరకు 50 శాతం సబ్సిడీతో విద్యుత్ అందిస్తున్నాం. వేసవిలో గరిష్టంగా మే నెలలో రూ.22.27 కోట్ల విలువైన విద్యుత్ వినియోగించాం. వినియోగదారుల నుంచి రూ.14.47 కోట్ల బిల్లులు వసూలు చేశాం. కరెంట్ వైరింగ్‌లో ఇంట్లో కానీ, పరిశ్రమల్లో, వ్యవసాయ క్షేత్రాల్లోనైనా ఏ మాత్రం అనుమానం వచ్చినా ఎలక్ట్రీషియన్‌తో చెక్ చేయించుకోవడం మంచిది. వర్షాకాలంలోనే కాదు.. అన్ని కాలాల్లోనూ కరెంట్ విషయంలో ముందు జాగ్రత్త ఎంతో మేలు. కరెంట్ ప్రమాదాల్లో పరిహారం విద్యుత్ ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులకు ‘సెస్’ ద్వారా పరిహారం చెల్లిస్తాం. నిజానికి సంస్థ పరంగా ఏదైనా పొరపాటు ఉంటేనే పరిహారం ఇవ్వాలి. కానీ, మానవత్వంతో మా పొరపాటు లేకపోయినా పరిహారం చెల్లించాల్సి వస్తుంది. ప్రాణం అమూల్య మైంది. 2025లో మూడు కేసులు నమోదు కాగా, చనిపోయిన ఘటనలో రూ.5 లక్షలు, గేదె చనిపోతే రూ.40వేలు, గొర్రె చనిపోతే రూ.7 వేలు పరిహారం చెల్లించాం. కరెంట్ సరఫరాలో ఏ మాత్రం ఇబ్బందులు ఎదురైనా మా సిబ్బందికి సమాచారం అందించాలి. కొంచెం.. వెనకా ముందు.. తప్పకుండా వస్తారు. ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మా దృష్టి తీసుకురావాలి. -
సిరిసిల్ల విలవిల!
కోవిడ్ దెబ్బకు సాక్షిప్రతినిధి,కరీంనగర్: ప్రపంచదేశాలను గడగడలాడించిన కోవిడ్ మహమ్మారి మిగిల్చిన విషాదాలు అన్నీ ఇన్నీ కావు. ప్రజలను ఆర్థికంగా, ఆరోగ్యపరంగా నిలువుదోపిడీ చేసి వేలాది మందిని బలితీసుకున్న ఆ వ్యాధి వదలిన ఆనవాళ్లు ఇప్పట్లో చెరిగేలా లేవు. తాజాగా ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన పాపులేషన్ రిపోర్ట్ సమర్పించిన ‘సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్’ (సీఆర్ఎస్) డేటా పలు ఆసక్తికర విషయాలు వెల్ల డించింది. ఈ డేటా ప్రకారం.. దేశంలో జననాల కన్నా అత్యధిక మరణాలు చోటు చేసుకున్న 49 జిల్లాల్లో సిరిసిల్ల జిల్లా కూడా ఒకటి. కోవిడ్ అనంతరం ప్రజల ఆరోగ్యాలు, జీవనశైలిలో మార్పులు రావడం, సెకండ్ వేవ్ తీవ్రంగా విజంభించడంతో ఆ ఏడాది మరణాలు అధికంగా సంభవించాయి. సీఆర్ఎస్ డేటా ప్రకారం.. 2021లో నమోదైన జనన మరణాలను పరిశీలిస్తే, 5,130 మరణాలకు 5,028 జననాలు చోటు చేసుకున్నాయి. ఆ మరణాలు కేవలం సిరిసిల్ల జిల్లాకు మాత్రమే పరిమితం కాలేదు. ఆ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 2,34,425 మరణాలు రికార్డయ్యాయి. అందులో 1,35,725 మంది పురుషులు కాగా, 98,700 మంది మహిళలు ఉన్నారు. ఈ గణాంకాల ప్రకారం.. మహిళల కన్నా పురుషులు 40శాతం మంది అధికంగా మరణించారు. ఆ ఏడాది చోటు చేసుకున్న మరణాల్లో పట్ణణ ప్రాంతాల్లో 61,553 పురుషులు, 46,674 మంది మహిళలు మరణించగా.. అదే సమయంలో గ్రామీణ ప్రాంతంలో 1,06,327 మరణాలు సంభవించాయి. 2021లో జననాల కన్నా మరణాలు అధికం ఆ మరణాల్లో పురుషులే ఎక్కువ మృతులంతా 65 ఏళ్ల నుంచి 69 ఏళ్ల వారే ఐరాస ‘సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్’ డేటాలో వెల్లడి 2022లో తిరిగి పుంజుకున్న జననాలుపురుషుల్లోనే మరణాలు అధికండేటా ప్రకారం 65 నుంచి 69 ఏళ్ల వయసు వారిలో మరణాల రేటు అధికంగా ఉంది. ఈ వయసులో ఉన్న వారిలో 85,945 మరణాలు రికార్డయ్యాయి. ఇక 70 ఏళ్ల పైబడిన వారిలో 51,516 మరణాలు నమోదయ్యాయి. 55 నుంచి 64 ఏళ్ల 42,349 మంది మరణాలు, 45– 54 వయసు గ్రూపులో 12,184 మరణాలు చోటు చేసుకున్నాయి. ఈ స్థాయిలో మరణాలు చోటు చేసుకోవడానికి కోవిడ్ ప్రధాన కారణమని నిపుణులు భావిస్తున్నారు. అదే సమయంలో జీవన విధానంలో మార్పులు, బీపీ, హైపర్ టెన్షన్, గుండె సంబంధిత వ్యాధులు కూడా వీరి మరణాలకు కారణమై ఉంటాయని అంచనా వేస్తున్నారు. తెలంగాణ మరణాల రికార్డులో ముందంజలో ఉంది. 75శాతం మేరకు మరణాలు అప్పటికప్పుడే రిపోర్టు అవుతున్నాయి. మిగిలినవి తరువాత రిపోర్టు అవుతున్నాయి. సీఆర్ఎస్ డేటా ప్రకారం.. 2022లో రాజన్న సిరిసిల్లలో 2022లో 3220 మరణాలు నమోదవగా, 7647 జననాలు నమోదయ్యాయి. ఏడాది తరువాత కోవిడ్ ప్రభావం తగ్గిపోవడంతో మరణాలు కూడా తగ్గుముఖం పట్టి ఉంటాయని భావిస్తున్నారు. -
నేతన్నలకు గతంలో కంటే మెరుగైన ఉపాధి
సిరిసిల్ల: జిల్లాలోని నేతన్నలకు, వస్త్రపరిశ్రమకు గతంలో కంటే మెరుగైన వస్త్రోత్పత్తి ఆర్డర్లను ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి కల్పిస్తుందని విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో చేనేత జౌళి, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యార్, కలెక్టర్ సందీప్‌కుమార్ ఝాతో కలిసి ఇందిరా మహిళా శక్తి చీరల ఉత్పత్తిపై సమీక్షించారు. ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ, ఇందిరా మహిళా శక్తి ఆర్డర్ ద్వారా కార్మికులకు ఏడాదిలో 8 నెలల పాటు ఉపాధి లభిస్తుందన్నారు. మిగతా 4 నెలలు కూడా ఉపాధి కల్పించేలా ప్రభుత్వం తరఫున ఇతర శాఖల నుంచి కూడా పెద్ద ఎత్తున ఆర్డర్లు ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. లక్ష్యం సాధించకుంటే ఆర్డర్లు రద్దు.. శైలజ రామయ్యార్ మాట్లాడుతూ, సిరిసిల్లలోని 131 మ్యాక్స్ సొసైటీలు ఆర్డర్లు పొంది చీరలు ఉత్పత్తి చేయడంలో వెనకబడ్డాయని, ఈ నెలాఖరులోగా 50 శాతం ఉత్పత్తిని పూర్తి చేయాలన్నారు. లక్ష్యం సాధించని సొసైటీలకు ఆర్డర్ రద్దు చేస్తామని స్పష్టం చేశారు. అనంతరం సొసైటీల వారీగా చీరల ఉత్పత్తి పురోగతిని సమీక్షించారు. అంతకు ముందు పవర్లూమ్ కార్ఖానాల్లో ఇందిరా మహిళా శక్తి చీరల ఉత్పత్తిని పరిశీలించారు. అలాగే టెక్స్టైల్ పార్క్ యజమానులతో సమీక్షించారు. టెక్స్టైల్ పార్క్‌కు మరిన్ని వస్త్రోత్పత్తి ఆర్డర్లు ముందస్తుగా ఇవ్వాలని పార్క్ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు అన్నల్దాస్ అనిల్‌కుమార్ కోరారు. జౌళిశాఖ జేడీ వెంకటేశ్వర్రావు, గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, సిరిసిల్ల ఏఎంసీ చైర్మన్ వెల్ముల స్వరూపారెడ్డి, జౌళిశాఖ ఏడీ రాఘవరావు, పాలిస్టర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆడెపు భాస్కర్, మాజీ అధ్యక్షుడు గోవిందు రవి, మంచె శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు సంగీతం శ్రీనివాస్, చొప్పదండి ప్రకాశ్, బొప్ప దేవయ్య, వైద్య శివప్రసాద్, ఆడెపు చంద్రకళ, గుండ్లపల్లి గౌతమ్, కార్మిక నాయకులు మూషం రమేశ్, వస్త్రోత్పత్తిదారులు పాల్గొన్నారు. విప్ ఆది శ్రీనివాస్ -
ఆయిల్‌పామ్‌పై ఆసక్తి
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): తక్కువ నీరు.. ఎక్కువ దిగుబడి.. అత్యధిక సబ్సిడీలు ఆయిల్పామ్సాగుపై ఆసక్తి పెంచుతోంది. ఒక్కసారి నాటితే ముప్పై ఏళ్ల వరకు దిగుబడి వచ్చే పంట కావడంతో జిల్లా రైతులు ముందుకొస్తున్నారు. రైతుల ఆసక్తిని గమనించిన హార్టికల్చర్, వ్యవసాయశాఖల అధికారులు వారిని ప్రోత్సహిస్తూ సాగువైపు అడుగులు వేయిస్తున్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా 726 మంది రైతులు 2,189 ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ను 2022–23 మధ్యలో సాగు చేశారు. ఈ పంటలను గమనించిన చుట్టుపక్కల రైతులు ఈయేడు సాగుచేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. మండలాల్లో కలెక్షన్ సెంటర్లు రైతులు సాగుచేసిన పంటను విక్రయించేందుకు ఇ బ్బందులు పడకుండా ఉండేందుకు అధికారులు మ ండలాల్లో కలెక్షన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. పంట కోసిన తర్వాత మండలంలోని కలెక్షన్ సెంటర్ వర కు తీసుకెళ్లే బాధ్యత రైతుపై ఉంటుంది. అక్కడి నుంచి ఫ్యాక్టరీకి కలెక్షన్ సెంటర్ నిర్వాహకులే తీసుకెళ్తారు. ఈ రవాణా ఖర్చులు కూడా రైతుల నుంచి వ సూలు చేయరు. ప్రస్తుతం మార్కెట్లో ఒక టన్ను ఆ యిల్పామ్కు రూ.21వేలు పలుకుతుంది. పంటను ఫ్యాక్టరీకి తరలించిన తర్వాత మూడు పనిదినాల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమవుతాయి. సాగు ఖర్చు ఇలా.. రైతుల ఆసక్తిని బట్టి ఎంత విస్తీర్ణంలోనైనా సాగుచేసుకోవచ్చు. దీనికి ప్రభుత్వం 90 శాతం సబ్సిడీ ఇ స్తుంది. ఒక ఎకరంలో 50 మొక్కలు నాటాల్సి ఉంటుంది. 50 మొక్కలకు సబ్సిడీ లేకుండా రూ.9,600 వ్యయం అవుతుంది. సబ్సిడీ వస్తుండడంతో రైతు కేవలం రూ.వెయ్యి చెల్లిస్తే ఎకరంలో 50 మొక్కలు నాటుకోవచ్చు. డ్రిప్ సిస్టమ్, ఇతర ప రికరాలు ప్రభుత్వమే 90 శాతం సబ్సిడీపై అంది స్తుంది. బిందుసేద్యం ద్వారా నీరు అందుతుంది కాబట్టి ఎకరం వరిపంట పండించే నీటితోనే ఐదెకరాల్లో ఆయిల్‌పామ్ సాగుచేయవచ్చు. అంతరపంటగా వరి కాకుండా మిగతా పంటలు సాగుచేసుకోవచ్చు. ఇలా మొదటి మూడేళ్ల వరకు అంతరపంటలు సాగుచేసి ఆదాయం పొందవచ్చు. పెరుగుతున్న సాగువిస్తీర్ణం జిల్లాలో 726 మంది రైతులు 2,189 ఎకరాల్లో సాగు రెండేళ్ల క్రితం ముందుకొచ్చిన రైతులు ఈ ఏుడాది చేతికి రానున్న పంట తక్కువ ఖర్చు.. అధిక దిగుబడి టన్నుకు రూ.21వేలు పలుకుతున్న ధర -
76,974 మంది రైతులకు రూ.43.22 కోట్లు
సిరిసిల్ల: జిల్లాలోని 76,974 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.43.22 కోట్ల రైతు భరోసా సొమ్ము మంగళవారం జమయిందని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా తెలిపారు. వానాకాలం సాగు కోసం రైతులకు ఉపయోగపడేలా రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకంలో పెట్టుబడి సాయాన్ని విడుదల చేసిందని పేర్కొన్నారు. అలాగే వేములవాడ పట్టణంలోరోడ్డు విస్తరణలో భూములు కోల్పోతున్న బాధితులకు కలెక్టరేట్లో పరిహారం చెక్కులు పంపిణీ చేశారు. ఇప్పటి వరకు 150 మంది నిర్వాసితులకు పరిహారం చెక్కులు అందజేశామని, మిగతావారు కూడా పరిహారం తీసుకునేందుకు సుముఖంగా ఉన్నారని కలెక్టర్ వివరించారు. నిర్వాసితుల అందరికీ పరిహారం చెక్కులు అందిస్తామని వేములవాడ ఆర్డీవో రాధాబాయి తెలిపారు. విద్యార్థుల సంఖ్య పెంచాలిబోయినపల్లి(చొప్పదండి): ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని డీఈవో ఎస్.వినోద్ పేర్కొన్నారు. మండలంలోని వరదవెల్లి హై స్కూల్‌ను మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలో విద్యార్థుల సంఖ్య త క్కువగా ఉందని పెంచాలని కోరారు. ప్రభు త్వ బడుల్లో నాణ్యమైన విద్య అందుతుందనే విషయం ప్రజలకు చెప్పాలన్నారు. హెచ్ఎం రాములు, ఉపాధ్యాయులు ఉన్నారు. సివిల్ సర్వీసెస్ లాంగ్ టర్మ్ శిక్షణ తరగతులు సిరిసిల్లకల్చరల్: బీసీ స్టడీ సర్కిల్ హైదరాబాద్‌లో 150 మంది అభ్యర్థులకు సివిల్ సర్వీసెస్ పరీక్షలకు శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి బి.రాజమనోహర్‌రావు ప్రకటనలో తెలిపారు. జూలై 12న నిర్వహించే అర్హత పరీక్షలో ప్రతిభ చూపిన 100 మంది అభ్యర్థులతో పాటు మరో 50 మందిని గతంలో సివిల్స్ ప్రిలిమ్స్‌లో ఉత్తీర్ణులైన వారిని ఎంపిక చేస్తామన్నారు. జూలై 8లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసిన అభ్యర్థులకు స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఎంపికై న వారికి ఉచిత వసతి, బోర్డింగ్‌తో పాటు రవాణ భత్యంగా రూ.5వేలు, స్టైఫండ్‌గా మరో రూ.5వేలు అందజేస్తామన్నారు. www.tgbcstudy circle.cgg.gov.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేయాలన్నారు. మరింత సమాచారం కోసం 040–24071178 ఫోన్ నంబర్లో సంప్రదించాలని సూచించారు. ఆర్టీసీ స్పెషల్ ప్యాకేజీని వినియోగించుకోవాలిసిరిసిల్ల అర్బన్: సిరిసిల్ల నుంచి పుణ్యక్షేత్రాలకు వెళ్లేందుకు స్పెషల్ టూర్ ప్యాకేజీని ప్రజలు సద్వి నియోగం చేసుకోవాలని ఆర్టీసీ డిపో మేనేజర్ ఎ.ప్రకాశ్‌రావు తెలిపారు. ఈ నెల 27న ఆషాఢమాసం సందర్భంగా డీలక్స్ బస్సులో సిరిసిల్ల నుంచి మానసాదేవి ఆలయం, కొమురవెల్లి, కొండపోచమ్మ, యాదాద్రి, స్వర్ణగిరి ఆలయాల దైవదర్శనం ఉంటుందన్నారు. బస్సు శుక్రవారం సాయంత్రం బయలుదేరి శనివారం సాయంత్రం చేరుకుంటుందని, ఒక్కో ప్రయాణికుడికి రూ.670 టికెట్ ధర ఉంటుందని వివరించారు. ఆసక్తి గలవారు 90634 03971, 73828 50616 నంబర్లలో సంప్రదించాలని పేర్కొన్నారు. దరఖాస్తుల ఆహ్వానం సిరిసిల్లకల్చరల్: గ్వాలియర్‌లోని లక్ష్మీబాయి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో వచ్చే విద్యాసంవత్సరానికి ప్రవేశాల కోసం యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఎంపిక పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడల అధికారి అజ్మీర రాందాస్ తెలిపారు. పీజీడీఎస్సీ, పీజీడీఎస్ఎస్సీ, డీఎస్సీ, పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఫిట్నెస్ మేనేజ్మెంట్, పీజీ డిప్లొమా ఇన్స్ట్రెంత్, స్పోర్ట్స్ కండిషనింగ్ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు అవకాశం కల్పించనున్నట్లు వెల్లడించారు. ఆసక్తి గల క్రీడాకారులు www.lnipe.edu.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, మరిన్ని వివరాలకు 94402 39783 నంబర్లో సంప్రదించాలని సూచించారు. -
బడిపాఠం.. బతుకునేస్తం
రాజన్నకు సందడి వేములవాడ: రాజన్నను సోమవారం 40 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. భక్తుల ద్వారా రూ.35లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ● చదువులమ్మ చెట్టు నీడలో.. విరిసిన విద్యాకుసుమాలు ● ఆరున్నర దశాబ్దాలుగా వెలుగులు పంచుతున్న గంభీరావుపేట హైస్కూల్ ● నాటి విద్యార్థులు.. నేటి అధికారులు వాతావరణం ఆకాశం మేఘావృతమవుతుంది. అక్కడక్కడ స్వల్పంగా వర్షం కురిసే అవకాశం ఉంది. గాలిలో తేమ అధికంగా ఉంటుంది. ఈదురుగాలులు వీస్తాయి. గంభీరావుపేట(సిరిసిల్ల): అది స్వాతంత్య్రానికి ముందు ఏర్పడ్డ ప్రాథమికోన్నత పాఠశాల. కాలక్రమంలో హైస్కూల్‌గా మారి ఆరున్నర దశాబ్దాలుగా ఎందరో విద్యార్థులకు జ్ఞానాన్ని పంచుతోంది. అప్పట్లో సిరిసిల్ల, గాలిపల్లి, గంభీరావుపేటలో తప్ప మరెక్కడా ఉన్నత పాఠశాల లేదు. ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలతోపాటు ఉర్దూ మీడియం స్కూల్ కూడా ఇక్కడ ఉంది. గంభీరావుపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు 67 ఏళ్ల చరిత్ర ఉంది. 1943లో నెలకొల్పిన ప్రాథమికోన్నత పాఠశాల.. 1958లో ఉన్నత పాఠశాలగా రూపాంతరం చెంది గ్రామీణ ప్రాంతంలో విద్యాకుసుమాలను తీర్చిదిద్దుతోంది. ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత, ఉర్దూ మీడియం ప్రాథమిక, ఉన్నత పాఠశాలలుగా విడిపోయి కేజీ టు పీజీ ప్రాంగణంలో కొనసాగుతున్నాయి. గ్రామంలో చిన్న పెంకుటిల్లులో మొదలైన బడి నేడు విద్యాపీఠంగా ఎదిగింది. 67 వసంతాలు పూర్తి చేసుకుని సగర్వంగా నిలబడింది. ఈ పాఠశాలలో చదువుకున్న వారు దేశవిదేశాల్లో ఉన్నత స్థానాల్లో పనిచేస్తున్నారు. డాక్టర్లు, ఇంజినీర్లు, అధ్యాపకులు, అధికారులు, వ్యాపారవేత్తలుగా అనేక రంగాల్లో ఎదిగిన వారు ఈ పాఠశాలలో అక్షరాలు దిద్దినవారే. గురువుగారిని గౌరవించు.. పుస్తకాన్ని నమ్ము.. చదువులోనే నీ జీవితం మార్గం ఉంది.. అనే మౌలిక భావన తమ విజయాల్లో భాగస్వామిగా మారిందని పూర్వ విద్యార్థులు చెబుతుంటారు. ప్రస్తుతం పాఠశాల నూతన రూపాన్ని సంతరించుకుంది. స్మార్ట్ క్లాస్‌లు, కంప్యూటర్ ల్యాబ్‌లు, పుస్తక సమృద్ధి గ్రంథాలయాలు ఏర్పాటై విద్యార్థుల్లో అవగాహనను పెంచుతున్నాయి. జీవితాలనే మార్చేసిన విద్యాలయం మా చిన్నతనంలో క్రమశిక్షణతో కూడిన విద్యనందించిన విద్యాలయం గంభీరావుపేట పెద్దబడి. మా జీవితాలనే మార్చేసిన విద్యాసంస్థ. నేను ఈ పాఠశాలలో 1982–83 విద్యాసంవత్సరంలో పదోతరగతి పూర్తి చేసుకున్న. పక్కనే ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివిన. ఇటీవల జరిగిన పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి వెళ్లినప్పుడు ఆనాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నాం. పాత వారిలా ఇప్పటి విద్యార్థులు లక్ష్యాల వైపు దూసుకెళ్లాలి. – జీవన్‌రెడ్డి, డీఎస్పీ, గంభీరావుపేట ఆ జ్ఞానంతోనే మా విజయాలు మా విద్య, ఉద్యోగ విజయాల వెనుక గంభీరావుపేట పెద్దబడి గొప్పతనం ఉంది. నేను ఈ బడిలో ప్రాథమిక విద్యతోపాటు 1989–90లో పదోతరగతి వరకు చదువుకున్న. క్రమశిక్షణ, భయం, భక్తితో కూడిన విద్యాబోధన కొనసాగేది. పాఠశాలలో వార్షికోత్సవాలు, విజేతల కథలు, ఉపాధ్యాయుల అంకితభావం.. ఇలా ఒక సాంస్కృతిక, విద్యాచైతన్య కేంద్రంగా బడి ఉండేది. అనేక మంది విద్యార్థుల భవిష్యత్‌కు జీవం పోసిన విద్యానిలయం. – చంద్రశేఖర్, ఎకై ్సజ్ సీఐ, రాష్ట్ర టాస్క్‌ఫోర్స్ చదువుకున్న బడిలోనే పనిచేశా నేను ఈ బడిలో 1971–72లో పదోతరగతి చదువుకున్న. బడిలో నేర్చుకున్న అక్షరజ్ఞానంతో ఉన్నత చదువులు చదివి గెజిటెట్ ప్రధానోపాధ్యాయునిగా ఇదే పాఠశాలలో పనిచేశా. మండల విద్యాధికారిగా పనిచేశాను. చాలా సంతృప్తిగా అనిపించింది. చుట్టుపక్కల ఎక్కడా లేనప్పుడు గంభీరావుపేటలో విద్యాబోధన సాగింది. – పురుషోత్తం, రిటైడ్డ్ ఎంఈవో, గంభీరావుపేట ఆదరణ అలాగే ఉంది గంభీరావుపేట జెడ్పీహెచ్‌ఎస్‌కు ఘనమైన చరిత్ర ఉంది. స్వాతంత్య్రానికి ముందే పాఠశాల నెలకొల్పబడింది. తర్వాత ఉన్నత పాఠశాలగా మారింది. చాలా మంది ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దిన విద్యాసంస్థ. ప్రస్తుతానికి బడికి ఆదరణ తగ్గడం లేదు. ఇప్పుడు 257 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఇంకా పెరిగే అవకాశం ఉంది. – శ్రీనివాస్, ప్రస్తుత హెడ్మాస్టర్, గంభీరావుపేట -
కాంగ్రెస్‌తో అన్నివర్గాలకు న్యాయం
● రాజన్నను దర్శించుకున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ వేములవాడ: కాంగ్రెస్ ప్రభుత్వంతోనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మ ణ్‌కుమార్ పేర్కొన్నారు. వేములవాడ రాజన్నను సోమవారం దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, అర్చకులు మంత్రికి పూర్ణకుంభకలశంతో స్వాగతం పలికారు. కల్యాణ మండపంలో ప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారం చేపట్టిన 18 నెలల్లోనే రైతులకు రుణమాఫీ, సన్నబియ్యం, రికార్డు స్థాయిలో రేషన్ కార్డుల పంపిణీ, మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం, 59వేల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. -
స్కానింగ్ సెంటర్ల తనిఖీ
సిరిసిల్ల: జిల్లా కేంద్రంలోని స్కానింగ్ సెంటర్లను వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు సోమవారం తనిఖీ చేశారు. పట్టణంలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో స్కానింగ్ సెంటర్లను ఆకస్మికంగా పరిశీలించారు. స్కానింగ్ చేయించుకున్న వారి వివరాలు, రికార్డులను తనిఖీ చేశారు. సీ–సెక్షన్ కాన్పులు తగ్గించి సాధారణ ప్రసవాలు చేయాలని కోరారు. లింగనిర్ధారణ చేయడం నేరమని ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ అంజలి ఆల్ఫ్రెడ్ స్పష్టం చేశారు. డిప్యూటీ డెమో రాజ్‌కుమార్, ప్రైవేటు ఆస్పత్రుల డాక్టర్లు లీలాశిరీష, వాణి, హెచ్.ఈ. బాలయ్య తదితరులు పాల్గొన్నారు. -
శిక్షణ దూరమై.. నైపుణ్యం కరువై
● సిరిసిల్లలో మూతపడ్డ పవర్లూమ్ శిక్షణ కేంద్రం ● శిక్షణ లేక.. కార్మికులు దొరక్క ● నైపుణ్య కార్మికుల కొరతతో ఇబ్బంది ● నేడు చేనేత, జౌళిశాఖ కమిషనర్ రాక ● మహిళాశక్తి చీరల ఉత్పత్తిపై సమీక్ష సిరిసిల్ల: స్థానిక యువతకు పవర్‌లూమ్స్‌పై శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన శిక్షణ కేంద్రం పదేళ్లుగా మూతపడింది. శిక్షణ తరగతులు లేక నైపుణ్యం గల కార్మికుల కొరత ఏర్పడింది. 2005లో పవర్లూమ్ శిక్షణ కేంద్రాన్ని బద్దెనపల్లి టెక్స్టైల్ పార్క్‌లో ప్రారంభించారు. పదోతరగతి చదువుకున్న యువకులకు ఆ సమయంలో ప్రతీ నెల రూ.1000 ఉపకార వేతనం ఇస్తూ ఆరు నెలలపాటు శిక్షణ ఇచ్చే వారు. శిక్షణ పొందిన యువకులు స్థానికంగా టెక్స్టైల్ పార్క్‌లోని ఆధునిక ర్యాపియర్ లూమ్స్, సిరిసిల్లలోని పవర్‌లూమ్స్ నడిపే శిక్షణ పొందేవారు. ఏడేళ్ల పాటు ఓ వెయ్యి మందికి శిక్షణ ఇచ్చారు. 2015 నుంచి టెక్స్టైల్ పార్క్‌లోని పవర్లూమ్ శిక్షణ కేంద్రం మూతపడింది. అప్పటి నుంచి యువతకు శిక్షణ లేక.. సాంచాలు నడిపే నైపుణ్యం గల కార్మికుల కొరత ఏర్పడింది. ఉపకార వేతనం అసలు సమస్య ప్రభుత్వం ఇచ్చే రూ.వెయ్యి ఖర్చులకు సరిపోక.. సిరిసిల్ల నుంచి టెక్స్టైల్ పార్క్ వరకు వెళ్లి రావడం ఇబ్బందిగా మారడంతో శిక్షణ పొందేందుకు యువత ముందుకు రాలేదు. దీంతో శిక్షణ కేంద్రం మూతపడింది. చేనేత, జౌళిశాఖ అధికారులు 2017లో రూ.5వేల ఉపకార వేతనం ఇవ్వాలని ప్రతిపాదిస్తూ ప్రభుత్వానికి పంపించగా.. ఆ ప్రతిపాదనలను బుట్టదాఖలు చేయడంతో పవర్‌లూమ్స్ శిక్షణ కేంద్రం మూతపడింది. అయితే శిక్షణ కేంద్రంలోని సిబ్బంది మాత్రం ఖాళీగా కూర్చుంటూ జీతాలు పొందుతున్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా రూ.8వేల ఉపకార వేతనం ఇస్తూ ఆరు నెలలపాటు ఆధునిక మగ్గాలపై, సిరిసిల్లలోని సాంచాలపై బట్టను ఉత్పత్తి చేసే విధంగా శిక్షణ ఇస్తే వస్త్రపరిశ్రమకు నైపుణ్యం గల కార్మికులు లభిస్తారు. ఇప్పటికై నా జౌళిశాఖ ఉన్నతాధికారులు పవర్లూమ్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభిస్తే యువకుల ఉపాధికి ఊతమిచ్చినట్లు అవుతుంది. శిక్షణ ఇస్తేనే ఉపాధి రక్షణ సిరిసిల్లలో కాలం చెల్లిన మగ్గాలను నడుపుతూ మార్కెట్లో డిమాండ్ లేని పాలిస్టర్ బట్టను ఉత్పత్తి చేస్తూ వస్త్రపరిశ్రమ తరచూ సంక్షోభానికి గురవుతుంది. నాణ్యమైన నూలుతో బట్టను తయారు చేస్తే.. మార్కెట్లో ఎలాంటి ఇబ్బంది లేదు. సాంచాలు నడిపే కార్మికుల కొరతను తీర్చేందుకు ప్రభుత్వం పవర్లూమ్ శిక్షణ కేంద్రాన్ని మళ్లీ ప్రారంభించాల్సిన అవసరం ఉంది. ఆ శిక్షణతోనే సిరిసిల్ల పరిశ్రమకు రక్షణ ఉంటుంది. ఉత్తరాది కార్మికులతో సిరిసిల్లలో ఇప్పుడు వస్త్రపరిశ్రమ మనుగడ సాగిస్తున్నా.. భవిష్యత్‌లో ఇబ్బందులు తప్పవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక యువతకు శిక్షణనిస్తే ఉపాధికి రక్షణ లభిస్తుంది. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. నేడు సిరిసిల్లకు చేనేత, జౌళిశాఖ కమిషనర్ రాష్ట్ర చేనేత, జౌళిశాఖ కమిషనర్ శైలజారామయ్యర్ మంగళవారం సిరిసిల్లకు వస్తున్నారు. స్థానిక వస్త్రపరిశ్రమకు 4.24 కోట్ల మీటర్ల మహిళాశక్తి చీరల ఉత్పత్తి ఆర్డర్లను ప్రభుత్వం అందించగా.. ఇప్పటి వరకు 50 లక్షల మీటర్లు మాత్రమే ఉత్పత్తి అయింది. 26వేల మరమగ్గాలు ఉండగా.. 5,600 సాంచాలపైనే చీరల బట్ట ఉత్పత్తి అవుతుంది. నిత్యం లక్షా 50వేల మీటర్ల చీరల బట్ట ఉత్పత్తి కావాల్సి ఉండగా.. కేవలం 35వేల మీటర్లు ఉత్పత్తి అవుతుంది. మహిళాశక్తి చీరల బట్ట ఉత్పత్తిలో వేగాన్ని పెంచేలా వస్త్రోత్పత్తిదారులను ప్రోత్సహించేందుకు జౌళిశాఖ కమిషనర్ సిరిసిల్లకు వస్తున్నారు. -
నిర్వాసితుల సమస్యలు పరిష్కరించండి
బోయినపల్లి(చొప్పదండి): మిడ్‌మానేరు నిర్వాసితుల పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని ముంపు గ్రామాల ఐఖ్యవేదిక అధ్యక్షుడు కూస రవీందర్ కోరారు. ఈమేరకు కొదురుపాక, నీలోజిపల్లి గ్రామాల నిర్వాసితులతో కలిసి సోమవారం ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు వినతిపత్రం అందజేశారు. స్పందించిన ఎమ్మెల్యే ఈనెల 20, 21వ తేదీలలో నిర్వాసితులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేయాలని కలెక్టర్ సందీప్‌కుమార్‌ఝాతో మాట్లాడినట్లు రవీందర్ తెలిపారు. బొలుమాల శంకర్, నాగుల వంశీ, శాలివాహన శ్రీనివాస్, గొట్ల వెంకటేశం, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. సోషలిస్టు భావాలు విస్తృత పరచాలి ● సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు టి.స్కైలాబ్‌బాబు సిరిసిల్లటౌన్: దేశంలో సోషలిస్టు భావాలు విస్తృత పరచాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు టి.స్కైలాబ్‌బాబు కోరారు. సిరిసిల్లలో సోమవారం నిర్వహించిన సీపీఎం రాజ కీయ శిక్షణ శిబిరంలో మాట్లాడారు. దేశంలో బీజేపీ పాలనలో పేదరికం పెరిగిపోతుందన్నారు. ప్రజల్లో ఆర్థిక అసమానతలు తొలగినప్పుడే దేశం అన్నిరంగాల్లో ముందుకెళ్తుందన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి మూశం రమేశ్, నాయకులు మల్లారపు అరుణ్‌కుమార్, ఎగమంటి ఎల్లారెడ్డి, జువ్వాజి విమల, కోడం రమణ, ఎరవెల్లి నాగరాజు, సూరం పద్మ పాల్గొన్నారు. అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్‌లో శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానం సిరిసిల్లకల్చరల్: అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్‌లో ఏడాది శిక్షణకు అర్హులైన ఎస్సీ లా పట్టభద్రుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఎస్సీడీవో బి.రాజమనోహర్‌రావు సోమవారం ప్రకటనలో కోరారు. జూలై 31లోపు తమ ప్రతిపాదనలను http://telanganaepass. cgg.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. హార్డ్‌కాపీలను జిల్లా ఎస్సీడీవో కార్యాలయంలో గడువులోపు అందజేయాలని తెలిపారు. 19, 26, 27 తేదీల్లో సదరం శిబిరాలు సిరిసిల్ల: జిల్లా జనరల్ ఆస్పత్రిలో జూన్ 19, 26, 27, జూలై 2వ తేదీల్లో సదరం శిబిరాలు నిర్వహిస్తున్నట్లు ఆస్పత్రి పర్యవేక్షకులు డాక్టర్ లక్ష్మీనారాయణ సోమవారం తెలిపారు. జూన్ 19న ఆర్థో, 26న కంటిచూపు, వినికిడి, 27న మానసిక ఆరోగ్యంపై శిబిరం ఉంటుందని వివరించారు. జూలై 2న మరోసారి ఆర్థో శిబిరం ఉంటుందని తెలిపారు. దివ్యాంగులు సంబంధిత మెడికల్ డాక్యుమెంట్లు, ఎక్స్–రే, యూడీఐడీ అప్లికేషన్ ఫామ్, ఆధార్‌కార్డ్, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో, ఫోన్ నంబర్ వెంట తెచ్చుకోవాలని సూచించారు. 21న యోగా దినోత్సవం సిరిసిల్లటౌన్: అంతర్జాతీయ యోగా దినోత్సవం ఈనెల 21న సిరిసిల్లలో నిర్వహిస్తున్నట్లు తెలంగాణ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎలిగేటి కృష్ణ తెలిపారు. యోగా డే వేడుకల కరపత్రాలను సోమవారం ఇందిరాపార్కులో ఆవిష్కరించారు. అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు గాజుల నారాయణ, ఆంకారపు రవి, బిళ్ల శ్రీకాంత్, ఎర్రగుంట మహేశ్ తదితరులు పాల్గొన్నారు. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదలసిరిసిల్ల ఎడ్యుకేషన్: ఇంటర్మీడియట్లో ఫెయిలైన విద్యార్థుల కోసం విద్యాశాఖ నిర్వహించిన అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. ఫస్టియర్‌లో 2,376 మంది హాజరుకాగా 1,419 ఉత్తీర్ణులయ్యారు. సెకండియర్‌లో 1,483 మంది హాజరుకాగా 778 మంది ఉత్తీర్ణత సాధించారు. -
సాదాబైనామాలే ఎక్కువ
● పైలెట్ ప్రాజెక్టులోనూ ఇవే దరఖాస్తులు ● సివిల్ తగాదాల విషయంలోనూ ఇదే తీరు ● సర్వే నంబర్ల మిస్సింగ్‌పైనా భారీగా అప్లికేషన్లు ● పీవోటీ కేసులు సిరిసిల్లలో అధికం ● సాదాబైనామాల్లో జగిత్యాల టాప్సాక్షి ప్రతినిధి, కరీంనగర్: భూ భారతి పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపికై న ప్రతి మండలంలోనూ సాదాబైనామా దరఖాస్తులే ఎక్కువగా వచ్చాయి. తెల్లకాగితాలపై రాసుకున్న లావాదేవీల రెగ్యులరైజేషన్ కోసం గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో 2016, 2020లో రెండు దఫాలుగా సాదాబైనామా దరఖాస్తులు స్వీకరించారు. 2014 జూన్2 లోపు సాదాబైనామాలకే వర్తిస్తుందనే షరతు విధించారు. తొలుత 2016లో 11.19 లక్షల అప్లికేషన్లు వస్తే 6.15 లక్షల అప్లికేషన్లను పరిష్కరించి, సరైన ఆధారాలు లేవని 3లక్షల అప్లికేషన్లను తిరస్కరించారు. మరో 2.04 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉండిపోయాయి. 2020 అక్టోబరు 12 నుంచి నవంబరు 10 వరకు మరో సారి సాదాబైనామా అప్లికేషన్లను స్వీకరించారు. ఆ సమయంలో మరో 7.20 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. పాతవాటితో కలిపితే మొత్తం అప్లికేషన్ల సంఖ్య 9.24 లక్షలకు చేరింది. అయితే వాటిని అప్పటి ప్రభుత్వం పరిష్కరించలేకపోయింది. ధరణి చట్టంలోనూ సాదాబైనామా ద్వారా పాస్‌బుక్కులు మంజూరు చేసే అవకాశం లేకపోవడంతో హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసి స్టే విధించింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకొచ్చాక తెచ్చిన భూభారతి చట్టం ద్వారా పెండింగ్‌లో ఉన్న సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారానికి వెసులుబాటు కల్పించింది. అయితే హైకోర్టు స్టే ఎత్తివేస్తేనే పాత అర్జీలు పరిష్కారం కానున్నాయి. ఇటీవల నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సుల్లో పాతవాటితోపాటు కొత్త దరఖాస్తులు కూడా వస్తున్నాయి. కొత్త దరఖాస్తులను పరిష్కరించే వెసులుబాటు భూ భారతి చట్టంలో లేదు. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లాపరంగా పరిశీలిస్తే సాదాబైనామా కోసం వచ్చిన దరఖాస్తుల్లో జగిత్యాలలోనే అధికంగా ఉన్నాయి. అదే సమయంలో సిరిసిల్లలో పీవోటీ (ప్రీవెన్షన్ ఆఫ్ ట్రాన్స్ఫర్) దరఖాస్తులు ఎక్కువగా రావడం గమనార్హం. పెద్దపల్లి జిల్లాలో పీవోటీ కేసులు అత్యల్పంగా ఉన్నాయి. పీఓటీ కేసులు ఎక్కువే.. నిబంధనల ప్రకారం అసైన్డ్ ల్యాండ్స్ అమ్మకాలు, కొనుగోళ్లు నిషేధం. ఎస్సీ, ఎస్టీ, బీసీలు, ఇతర పేదలకు ఇచ్చిన భూములు అన్యాక్రాంతం కావొద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం తెలంగాణ అసైన్డ్ ల్యాండ్స్(ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్) యాక్ట్– 1977 తీసుకొచ్చింది. చాలామంది పేదలు తమ అవసరాల కోసం అసైన్డ్ ల్యాండ్స్‌ను అమ్ముకున్నారు. కొనుగోలుదారులు కూడా అసైన్డ్ ల్యాండ్ పొందగలిగిన పేదవారే అయితే రీఅసైన్ చేసే వెసులుబాటును ప్రభుత్వం పలుమార్లు కల్పించింది. రాష్ట్రంలో చివరిసారిగా 2017లో భూరికార్డుల ప్రక్షాళన సమయంలో ఇలాంటి అవకాశం కల్పిస్తే చాలామంది వినియోగించుకున్నారు. 2017 తర్వాత అసైన్డ్ ల్యాండ్స్ కొనుగోలు చేసినవారికి ఈ వెసులుబాటు వర్తించదు. కానీ.. ఇటీవల నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సుల్లో 2017 తర్వాత అసైన్డ్ ల్యాండ్ కొనుగోలు చేసిన వ్యక్తుల నుంచి రీఅసైన్మెంట్ కోసం అర్జీలు వస్తున్నాయి. మొత్తం అర్జీల్లో 15 నుంచి 20 శాతం వరకు ఇవే ఉంటున్నాయి. దీన్ని బట్టి ఒక్కో మండలంలో వందల సంఖ్యలో అసైన్డ్ ల్యాండ్స్ చేతులు మారినట్లు తెలుస్తోంది. అలాగే కొందరు తాము ఏళ్లుగా సాగు చేసుకుంటున్న ప్రభుత్వ, ఫారెస్ట్ భూములకు పట్టాలివ్వాలని దరఖాస్తు పెట్టుకుంటున్నారు. ఇలాంటివారికి కొత్తగా భూమి అసైన్ చేయాలంటే ఎమ్మెల్యేల అధ్యక్షతన ల్యాండ్ అసైన్మెంట్ కమిటీలు నియమించాల్సి ఉంటుంది. ఉమ్మడి జిల్లా వివరాలు జిల్లా సాదాబైనామా సర్వే నంబరు మిస్సింగ్ పీవోటీ పెద్దపల్లి 4,569 2,149 30కరీంనగర్ 2,204 1,162 40సిరిసిల్ల 1,523 1,180 948జగిత్యాల 6,360 3,192 76 సివిల్, మిస్సింగ్ సర్వే నంబర్లు కుటుంబ సభ్యుల మధ్య భూమి వాటాల పంపకాల్లో వచ్చిన తేడాలు, ఒకరి భూమిని మరొకరు పట్టా చేయించుకోవడం, ఒకరి భూమిపై మరొకరు కబ్జాలో ఉండడం, భూమి హక్కుపై వారసత్వం విషయంలో వివాదం, ధరణిలో, సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో డబుల్ రిజిస్ట్రేషన్లు వంటి అనేక సివిల్ వివాదాలపై అప్లికేషన్లు వచ్చాయి. ఇలాంటి వివాదాల పరిష్కారం కూడా తహసీల్దార్ల చేతుల్లో లేదు. వీటి పరిష్కారానికి రెవెన్యూ కోర్టులు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కోర్టులే పిటిషన్లను విచారించి హక్కుదారులను తేల్చాల్సి ఉంటుంది. భూ వివాదాలకు సంబంధించి మరో ప్రధాన సమస్య.. మిస్సింగ్ సర్వేలకు సంబంధించి కూడా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వేలాదిగా దరఖాస్తులు వస్తున్నాయి. -
పోలీస్ బందోబస్తు మధ్య ‘విస్తరణ’
వేములవాడ: ఆధ్యాత్మిక క్షేత్రం కొలువుదీరిన వే ములవాడలో రోడ్ల విస్తరణ పనులు పోలీస్ బందోబస్తు మధ్య కొనసాగుతున్నాయి. 144 సెక్షన్ విధించి 10 మంది తహసీల్దార్లు 10 బృందాలుగా ఏర్పడి 12 జేసీబీలు, 15 ట్రాక్టర్లు, 150 మంది కా ర్మికుల సహాయంతో 150 దుకాణాలను కూల్చి వేశారు. మూలవాగు బ్రిడ్జి నుంచి ఆలయం వరకు ఉన్న మెయిన్‌రోడ్డును రూ.47కోట్లతో 80 ఫీట్ల వరకు విస్తరించాలని సంకల్పించారు. ఇందుకు 750 మీటర్ల మేర స్థలం అవసరం ఏర్పడింది. 254 మంది లబ్ధిదారులు ఉండగా, ఇందులో 322 నిర్మాణాలు కూల్చివేయాల్సి ఉంది. కొంతమంది కోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకోగా, మిగతా వారికి జిల్లా అధికారులు నోటీసులు అందజేశా రు. మొదటిదఫాగా 150 ఇళ్లను కూల్చాలని టార్గెట్ పెట్టుకోగా.. సోమవారం 90 పూర్తికాగా, 60 ఇళ్లను పాక్షికంగా కూల్చివేశారు. ఇప్పటికే 50 మందికిపైగా నష్టపరిహారం చెల్లించామని, స్టే ఉన్న వాటిపై వెకేట్ చేసేందుకు కోర్టులో పిటిషన్ దాఖలు చేశామని భూసేకరణ అధికారి, వేములవాడ ఆర్డీవో రాధాభాయి తెలిపారు. వ్యాపారులు, ప్రజలు సహకరించాలని కోరారు. బ్రిడ్జి నుంచి గుడి వరకు విస్తరణ మూలవాగు బ్రిడ్జి నుంచి రాజన్న గుడి వరకు మెయిన్‌రోడ్డును 80 ఫీట్లతో విస్తరించనున్నారు. మున్సిపల్, రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులు సమన్వయంతో ముందుకుసాగారు. వంద మందికి పరిహారం పంపిణీ సిరిసిల్ల: వేములవాడ పట్టణంలో రోడ్డు విస్తరణలో భూములు కోల్పోతున్న నిర్వాసితులకు సోమవారం కలెక్టరేట్లో చెక్కులు పంపిణీ చేశారు. భూములు కోల్పోతున్న నిర్వాసితులకు కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా, వేములవాడ ఆర్డీవో రాధాభాయి చెక్కులను జారీ చేశారు. ఇప్పటి వరకు వంద మందికి చెక్కులు అందించినట్లు ఆర్డీవో రాధాభాయి వెల్లడించారు. వేములవాడలోని ఇంకా చాలా మంది నష్టపరిహారం చెక్కులు తీసుకునేందుకు ముందుకొస్తున్నట్లు తెలిపారు. రోడ్డు విస్తరణ పనులు పరిశీలించిన కలెక్టర్ రోడ్డు విస్తరణ పనులను కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా పరిశీలించారు. సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు, రెవెన్యూ, మున్సిపల్, ఆర్అండ్బీ శాఖల అధికారులు పాల్గొన్నారు. 10 మంది తహసీల్దార్లు.. 10 బృందాలు కరెంట్ నిలిపివేసి.. 144 సెక్షన్ విధించి 200 మంది పోలీసులతో బందోబస్తు పనులు పర్యవేక్షించిన కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా 150కి పైగా దుకాణాల కూల్చివేత నేడూ కొనసాగనున్న పనులు -
నీరు.. రంగు మారింది!
సిరిసిల్ల: నల్లా నీరు రంగుమారింది. మిషన్ భగీరథ ద్వారా మురికిగా నీరు వస్తుండడంతో తాగేందుకు కాదు కదా.. అవసరాలకూ వినియోగించుకునేందుకు జనం ఇబ్బంది పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా సరఫరా అయ్యే మిషన్ భగీరథ నీరు బోయినపల్లి మండలం మాన్వాడ వద్ద నిర్మించిన మధ్యమానేరు(శ్రీరాజరాజేశ్వర) జలాశయం ఆధారం. ప్రస్తుతం మిడ్‌మానేరులో నీటినిల్వలు తగ్గిపోయాయి. 26 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం గల రిజర్వాయర్‌లో ప్రస్తుతం 6 టీఎంసీలు మా త్రమే ఉన్నాయి. నిండా నీరుంటే వేగంగా ఇన్‌టెక్ వెల్ నిండేది. కానీ నీటినిల్వలు లేక ఫ్లో తగ్గడంతో నీటిశుద్ధి పంపులకు పూర్తిస్థాయిలో నీరు రావడం లేదు. ఫలి తంగా నీటి సరఫరాకు ఇబ్బందులు ఎదురవుతున్నా యి. ఇటీవల వర్షాలకు కొద్దిగా కొత్త నీరు చేరడంతో నిల్వ ఉన్న నీరురంగుమారుతోందనే అనుమానాలు ఉన్నాయి. రంగు మారుతున్న నీరు మధ్యమానేరులో నీటినిల్వలు తగ్గి రంగుమారిన నీరు సరఫరా అవుతోంది. మధ్యమానేరు నుంచి నీటిని పంపింగ్ చేసి అగ్రహారంలోని ప్లాంటులో శుద్ధి చేసిన నీ టిని సరఫరా చేస్తున్నారు. కానీ, ఆ నీరు రంగుమారిపో యి సరఫరా అవుతుందనే ఆరోపణలు ఉన్నాయి. మిషన్ భగీరథ నీటిసరఫరా పైపుల లీకేజీ, అంతర్గతంగా నల్లా పైపుల లీకేజీలతో తాగునీరు కలుషితమవుతుందనే అనుమానాలు ఉన్నాయి. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి నల్లగా వచ్చే నల్లానీటి సరఫరాను మెరుగుపరచాలని ప్రజలు కోరుతున్నారు.నిత్యం పరీక్షలు చేస్తున్నాం మురికిగా మిషన్ భగీరథ నీరు అడుగంటిన మధ్యమానేరు జలాశయం ‘నల్లా’నీటితో జనం ఇబ్బందులు ఇది సిరిసిల్ల పట్టణంలోని సంజీవయ్యనగర్‌లో నల్లా ద్వారా వస్తున్న మిషన్ భగీరథ నీరు. నల్లగా రంగు మారి రావడంతో ఆ నీటిని తాగేందుకు జనం జంకుతున్నారు. ఇంట్లో అవసరాలకు సైతం మిషన్ భగీరథ నీటిని వాడుకునేందుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వారం రోజులుగా జిల్లాలో నల్లానీళ్లు మురికిగా సరఫరా అవుతున్నాయి. మిషన్ భగీరథ స్వరూపం మండలాలు : 12 మున్సిపాలిటీలు : 02ఆవాస ప్రాంతాలు : 359తాగునీరు పొందే జనాభా : 6 లక్షలు నల్లాలు : 1,26,766నిర్మాణ వ్యయం : రూ.1,085 కోట్లు పైపులైన్ పొడవు : 1,263.77 కిలోమీటర్లు నీళ్ల ట్యాంకులు : 625పాత నీళ్లట్యాంకులు : 378కొత్త నీళ్లట్యాంకులు : 247రోజుకు అవసరమైన నీరు : 10 కోట్ల లీటర్లు వినియోగించే మోటార్లు : 20 అవసరమయ్యే విద్యుత్ : 5.976 మెగావాట్స్ ఆధారం : మధ్యమానేరు మధ్యమానేరులో నీటి నిల్వ : 6 టీఎంసీలు మిషన్ భగీరథ నీటి సరఫరాకు ఇబ్బందులు లేవు. నిత్యం నీటిని శుద్ధిచేసి సరఫరా చేస్తున్నాం. శుద్ధి చేసిన నీటికి రోజూ పరీక్షలు చేస్తున్నాం. ఎలాంటి లోపాలు లేవు. మధ్యమానేరులో నీటి నిల్వలు తగ్గినా సరఫరాకు ఇబ్బంది లేదు. నల్లా నీరు రంగు మారి రావడానికి ఆయా ప్రాంతాల్లో పైపులైన్ లీకేజీలు కారణం కావచ్చు. ఇటీవల రంగుమారి నీరు వస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. దానిపై క్లారిటీ ఇచ్చాం. నీటిని శుద్ధి చేయడంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం.– అన్వర్, మిషన్ భగీరథ ఈఈ, సిరిసిల్ల -
16 పోస్టులు.. 904 దరఖాస్తులు
సిరిసిల్ల/సిరిసిల్లకల్చరల్: జిల్లా సంక్షేమ అధికారి ఆఫీస్‌లో వివిధ పోస్టులకు ఆదివారం ఇంటర్వ్యూలు నిర్వహించారు. జిల్లాలో మొత్తం 16 పోస్టులకు ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసి, దరఖాస్తులు ఆహ్వానించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 904 దరఖాస్తులు వచ్చాయి. కలెక్టరేట్లో ఆరు రకాల పోస్టులు డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, ప్రొటెక్షన్ ఆఫీసర్లు(2), లీగల్ ఆఫీసర్, కౌన్సిలర్, సోషల్ వర్కర్ల కోసం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్హత, పని అనుభవం తదితర అంశాలపై అడిగి తెలుసుకున్నారు. మిగతా 10 రకాల పోస్టులకు సోమ, మంగళవారాల్లో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం తెలిపారు. 16 పోస్టులకు 900 మంది తరలిరావడంతో కలెక్టరేట్ కిక్కిరిసిపోయింది. ● -
భూ నిర్వాసితులకు మూడో విడత పరిహారం
సిరిసిల్ల: జిల్లాలోని వేములవాడ రాజన్న ఆలయ రోడ్డు విస్తరణలో భూములు కోల్పోతున్న నిర్వాసితులకు ఆదివారం మూడో విడతగా చెక్కులు పంపిణీ చేశారు. వేములవాడ మూలవాగు బ్రిడ్జి నుంచి శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయం వరకు రోడ్డు విస్తరణ చేపట్టనున్న నేపథ్యంలో భూములు కోల్పోతున్న నిర్వాసితులకు కలెక్టర్, వేములవాడ ఆర్డీవో రాధాబాయి చెక్కులు అందజేశారు. ఇప్పటివరకు మొత్తం 70 మందికి పరిహారం చెక్కులు అందించినట్లు భూసేకరణ విభాగం ప్రత్యేక ఉప కలెక్టర్ రాధాబాయి తెలిపారు. కార్యక్రమంలో వేములవాడ తహసీల్దార్ ఉమారాణి తదితరులు పాల్గొన్నారు. ● కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా -
ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత
వేములవాడ: ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. ఆదివారం పట్టణంలోని సాయినగర్‌లో గల తన గృహంలో బ్రాహ్మణోత్తముల మంత్రోచ్చరణల మధ్య వారాహిపూజ, హోమం ఘనంగా నిర్వహించారు. వారాహి అమ్మవార్ల దీవెనలతో అందరూ సంతోషంగా ఉండాలన్నారు. సకాలంలో వర్షాలు కురిసి పాడిపంటలు బాగుండాలనీ, ప్రజలంతా ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో తులతూగాలని వేడుకున్నారు. కార్యక్రమంలో నియోజకవర్గంలోని ప్రముఖ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. వయోధికుల చట్టంపై ప్రచారం చేయాలిసిరిసిల్లకల్చరల్: వయోవృద్ధుల హక్కుల పరిరక్షణకు సంబంధించి విస్తృత ప్రచారం చేయాలని ఆల్ సీనియర్ సిటిజన్ల సంఘం తీర్మానించింది. ఆదివారం స్థానిక వస్త్ర, వ్యాపార సంఘ భవనంలో వయోధికుల హక్కులకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్ష, కార్యదర్శులు చేపూరి బుచ్చయ్య, డాక్టర్ జనపాల శంకరయ్య మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పోస్టర్ ప్రదర్శించేలా యంత్రాంగం చర్యలు తీసుకోవాలన్నారు. వయోవృద్ధులు సైతం తమ బాధలను సంఘ ప్రతినిధులకు తెలియజేస్తే అవసరమైన సహాయాన్ని అందిస్తామన్నారు. ఏనుగుల ఎల్లయ్య, దొంత దేవదాస్, గుడ్ల శ్రీధర్, కై లాసం, విద్యాసాగర్, గజ్జెల్లి రామచంద్రం తదితరులు పాల్గొన్నారు. ఆలయ అధికారులపై చర్యలు తీసుకోవాలివేములవాడ: ఆలయంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగం చేసే తన కుమారుడు పెంట ఓంకార్ అధికారుల వేధింపులు భరించలేక గతనెల 30న ఆత్మహత్య చేసుకున్నాడని పేర్కొంటూ అతడి తల్లి లక్ష్మి ఆధ్వర్యంలో కుటుంబ సభ్యులు, బంధువులు ఆదివారం ఈవో కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఇంజినీరింగ్ విభాగంలో పని చేస్తున్న క్రమంలో రాంకిషన్‌రావు, నాగరాజు తన కుమారుడిని సొంత పనులకు వాడుకుంటూ వేధింపులకు గురి చేశారని, వారి వల్లే తన కుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని, విచారణ జరిపించి సదరు అధికారులపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని ఆలయ ఈవోకు వినతిపత్రం సమర్పించారు. ఈ విషయమై రాంకిషన్‌రావును వివరణ కోరగా.. భక్తుల రద్దీ సమయంలో నీటి సరఫరాలో ఏర్పడిన ఇబ్బందులపై ఓంకార్‌ను ప్రశ్నించామని, ఇందుకు తను సంజాయిషి రాసి ఇచ్చాడని, ఓంకార్ మృతికి తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. -
ఏడాది పాలనలో కలెక్టర్ మార్క్
సిరిసిల్ల: జిల్లా కలెక్టర్‌గా పని చేయడం ఐఏఎస్ అధికారుల సర్వీసులో అరుదైన అవకాశం. జిల్లా పాలనాధికారిగా అన్ని ప్రభుత్వ శాఖలపై ఆజమాయిషీ ఉండే బాధ్యత. కలెక్టర్‌గా సందీప్‌కుమార్ ఝా 2024 జూన్ 16న విధుల్లో చేరారు. ఆయన బాధ్యతలు చేపట్టి నేటికి సరిగ్గా ఏడాది పూర్తయింది. జిల్లాకు వచ్చినప్పుటి నుంచి తనదైన శైలిలో ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. నిత్యం క్షేత్రస్థాయి పర్యటనలు, ఆకస్మిక తనిఖీలతో జిల్లాలో విద్య, వైద్య సేవలు సామాన్యులకు మెరుగ్గా అందేలా కృషి చేస్తున్నారు. విద్యపై ప్రత్యేక దృష్టి చదువు ఒక్కటే సమాజాన్ని ఉన్నత స్థితికి తీసుకెళ్తుందని గుర్తించిన కలెక్టర్ పేద పిల్లలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. తరచూ తనిఖీలు చేస్తూ.. పిల్లలకు నాణ్యమైన భోజనం అందేలా చర్యలు తీసుకున్నారు. చదువులో వెనకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టిపెట్టాలని సూచించారు. అనేక సందర్భాల్లో ఉపాధ్యాయుడిగా మారి పాఠాలు బోధించారు. విద్యార్థులకు ప్రశ్నలు సంధించి సమాధానాలు రాబట్టారు. వేసవిలో ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ తరగతులకు వెళ్లి.. గురువులకే గురువుగా మారి బోధనాంశాల్లో మెలకువలు చెప్పారు. ఇలా జిల్లాలో విద్యపై ప్రత్యేక దృష్ఠిసారించారు. పదో తరగతి, ఇంటర్ ఫలితాల్లోనూ జిల్లాను ముందు వరసలో ఉంచారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకుని విద్యా వ్యవస్థను క్రమశిక్షణలో ఉంచారు. సర్కారు వైద్యంపై నమ్మకం పెంచేలా.. జిల్లాలో ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం పెంచేలా వైద్యసేవలు విస్తరించేలా కలెక్టర్ తరచూ తనిఖీలు చేశారు. సిరిసిల్ల ప్రభుత్వ జనరల్ ఆస్పత్రితో పాటు, వేములవాడ ప్రాంతీయ వైద్యశాల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను తరచూ తనిఖీలు చేశారు. ఆస్పత్రుల్లో రోగులతో మాట్లాడుతూ, వారికి అందుతున్న సేవలను ఆరా తీశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసూతి సేవలు అందేలా, అనవసరపు సిజేరియన్లు చేయకుండా కట్టడి చేశారు. పీహెచ్‌సీల్లోనూ డెలివరీలు చేయాలని సూచించారు. మాతా, శిశు మరణాలు లేకుండా, పేదలకు పౌష్టికాహారం అందేలా ఐసీడీఎస్ అధికారులతో తరచూ సమీక్షించారు. వృద్ధాశ్రమాలను తనిఖీ చేస్తూ, వారి యోగక్షేమాలను పర్యవేక్షించారు. ‘దివ్య’మైన ఉపాధి జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవతో ట్రాన్స్జెండర్ల ఉపాధికి సిరిసిల్ల రెండో బైపాస్ రోడ్డులో పెట్రోల్ బంక్ ఏర్పాటు చేశారు. అక్కడ లభించే రూ.10వేలతో తాము బతకలేమని ట్రాన్స్‌జెంటర్లు పెట్రోల్ బంక్‌లో పని చేసేందుకు నిరాకరించారు. వెంటనే ఆ పెట్రోల్ బంక్‌ను దివ్యాంగుల ఉపాధికి కేంద్రంగా మార్చారు. ప్రత్యేకంగా తన కోటాలో నిధులు కేటాయించి బంక్ నిర్వహణకు అండగా నిలిచారు. ప్రస్తుతం 16 మంది దివ్యాంగులు ఉపాధి పొందుతున్నారు. ఇది జిల్లాలో కలెక్టర్ మార్క్ కార్యం. మరో వైపు ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఏడు వేల మంది లబ్ధిదారులకు నేరుగా మంజూరు పత్రాలను అన్ని మండలాల్లో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి అందించడం విశేషం. రాష్ట్రంలో ఏ కలెక్టర్ చేయని విధంగా ఇందిరమ్మ లబ్ధిదారులకు మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. వేములవాడ ఆలయ అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ దైవభక్తి ఎక్కువగా ఉన్న కలెక్టర్ వేములవాడ ఆలయ అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. అద్దె భవనంలో ఉన్న ఆలయ అభివృద్ధి అథారిటీ ఆఫీస్‌ను కలెక్టరేట్‌కు మార్చుకున్నారు. ఎప్పుడు సమయం దొరికినా జిల్లాలోని ముఖ్యమైన ఆలయాలను సందర్శిస్తున్నారు. విద్య, వైద్యంపై తనదైన ముద్ర బడిలో టీచర్‌గా పాఠాలు బోధిస్తూ.. పేదలకు మెరుగైన వైద్యసేవలు అందేలా.. జిల్లా కలెక్టర్‌గా సందీప్‌కుమార్ ఝా ఏడాది అడుగుజాడలుప్రతీ వారం సమీక్షలు నిత్యం క్షేత్రస్థాయిలో పర్యటించడం, అదే స్థాయిలో ప్రభుత్వ శాఖలపై నిర్దిష్టమైన రోజు సమీక్షించడం కలెక్టర్ నైజం. ఎంతో ఓపికగా.. గంటల తరబడి అలసిపోకుండా ప్రభుత్వ శాఖలపై సమీక్షిస్తున్నారు. జిల్లాలో ధాన్యం కొనుగోళ్లను మహిళా సంఘాలకు కట్టబెట్టి రూ.7కోట్ల కమీషన్ వచ్చేలా చేశారు. మహిళా సంఘాలకు బ్యాంకు రుణాలు, విద్యార్థులకు కంటి పరీక్షలు, నిరుద్యోగులకు జాబ్ మేళాలు, ప్రభుత్వ భూములను పరిరక్షించడం, ఇసుక అక్రమ రవాణాను కట్టడి చేయడంలో ప్రగతిశీలంగా.. ప్రభావంతంగా పని చేశారు. కలెక్టర్‌గా కొన్ని వివాదాలు ఆయన్ని చుట్టు ముట్టినా, అవేమీ లెక్కచేయకుండా.. తనదైన శైలిలో సందీప్‌కుమార్ ఝా పాలనాధికారిగా ఏడాది పూర్తి చేసుకున్నారు. -
మెప్పించి.. రప్పించేలా..
● ప్రభుత్వ విద్యపై ఉపాధ్యాయుల విస్తృత ప్రచారం ● ప్రవేశాలు వచ్చేలా కృషి ● తల్లిదండ్రులకు అవగాహనసిరిసిల్ల ఎడ్యుకేషన్: ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ఉపాధ్యాయులు బడిబాట కార్యక్రమం ద్వారా కృషి చేస్తున్నారు. సర్కార్ బడుల్లో కల్పిస్తున్న వసతి సౌకర్యాలను వివరించడంతోపాటు బోధన చేసే అధ్యాపకుల నైపుణ్యతను తె లుపుతూ నూతన విద్యార్థులను ఆకర్షించేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరో ఐదు రోజులపాటు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించి ప్రభు త్వ పాఠశాలల్లో కనీస సంఖ్యలో విద్యార్థులు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పది రోజుల్లో దా దాపు 630పైగా అడ్మిషన్లు నమోదు చేసినట్లు గణాంకాలు ఉన్నాయి. ఆకర్షించే విధంగా.. పాఠశాలలకు విద్యార్థులు ఆనందంగా వచ్చేలా స్కూల్ ఆవరణను ఆకర్షణీయంగా అలంకరించి స్వాగత తోరణాలను ఏర్పాటు చేశారు. మరికొందరు ఉపాధ్యాయులు ప్లకార్డులతో స్వాగతం పలుకుతున్నారు. ప్రాథమిక పాఠశాలల్లో ఆటపాటలతో కూడిన విద్యనందిస్తామంటూ చెప్పే ఉపాధ్యాయులు ఒకవైపు ఉంటే ఉన్నత పాఠశాలల్లో ల్యాబ్ సౌకర్యాలతో ప్రాక్టికల్ మెథడ్‌లో విద్యాబోధన చేస్తామని స్కూల్ అసిస్టెంట్ టీచర్లు భరోసా ఇస్తూ, ప్రభుత్వ పాఠశాలల్లోనే సమర్థవంతమైన బోధన ఉంటుందని తల్లిదండ్రులకు వివరించి అడ్మిషన్లు చేర్చుకుంటున్నారు. సమావేశాలు.. సామూహిక అక్షభ్యాసం విద్యార్థులకు తాము అందించే సేవలను వివరించేలా పాఠశాలల ఆవరణలోనే అమ్మ ఆదర్శ కమిటీల సాయంతో తల్లిదండ్రులకు సమావేశాలు నిర్వహిస్తున్నారు. సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాలు చేపడుతున్నారు. విద్యార్థులకు ప్రభుత్వం అందించే నోటుబుక్కులు, పుస్తకాలు పంపిణీ చేస్తున్నారు. ఒకే ఒక్కడు.. కపిల నరేశ్ తాను ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న పా ఠశాలలోనే తన కూతురు సహస్రాన్వితను మూడో తరగతిలో చేర్చి ఉపాధ్యాయులు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు కపిల నరేశ్. తన కూతురు పూర్వ ప్రాథమిక విద్యను అంగన్వాడీ పాఠశాలలో చదివిందని, కొన్ని అనివార్య కారణాల వల్ల ఒక ఏడాది మాత్రమే ప్రైవేటు పాఠశాలలో చదివి మళ్లీ తాను పనిచేస్తున్న చందుర్తి ప్రభుత్వ పాఠశాలలో మూడో తరగతిలో చేర్చినట్లు నరేశ్ తెలిపాడు. ఉపాధ్యాయుల సహకారంతో చాలాసార్లు తన కూతురు స్వ గ్రామం తిమ్మాపూర్‌కు వెళ్లి ప్రభుత్వ బడిలో చది విందని, ఈ ఏడాది తాను చందుర్తిలో పనిచేయడం వల్ల తనతోనే పాఠశాలకు వస్తుందని ఆనందంగా తెలిపాడు. 15 ఎస్ఆర్ఎల్ 153: ఇటీవల తన కూతురును పభుత్వ పాఠశాలలో చేర్చిన ఉపాధ్యాయుడు నరేశ్ -
రోడ్ల విస్తరణ పనులు షురూ
వేములవాడ: వేములవాడ పట్టణంలోని మెయిన్‌రోడ్డు విస్తరణ పనులు ఆదివారం మొదలయ్యాయి. కొన్ని దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న రోడ్ల వెడల్పు ప్రక్రియ ఎట్టకేలకు మొదలైంది. పలుమార్లు కొలతలు తీయడం, యజమానులు అడ్డు చెప్పడం జరుగుతూ వచ్చింది. పక్షం రోజుల క్రితం దుకాణాలకు అధికారులు నోటీసులు అంటించిన విషయం తెలిసిందే. దుకాణాలు ఖాళీ చేయకుంటే ఇబ్బందులు పడతారంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. కాగా, నాలుగురోజుల నుంచి 343 మంది నిర్వాసితుల్లో మొదట 10 మంది, రెండోసారి 40 మంది, ఆదివారం మరో 10 మందికి నష్టపరిహారాన్ని జిల్లా కలెక్టర్ అందజేశారు. దీంతో ఆదివారం మున్సిపల్ అధికారులు తమ వాహనాలతో తరలివెళ్లి పలు దుకాణాలను కూల్చివేశారు. దీంతో వ్యాపారులు బెంబేలెత్తిపోయి తమతమ దుకాణాల్లోని సామగ్రిని సర్దుకునే ప్రయత్నం చేశారు. కాగా ఇందులో కొంత మంది యజమానులు కోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు. రూ.47 కోట్లతో మూ లవాగు బ్రిడ్జ్ నుంచి రాజన్న ఆలయం వరకు 80 ఫిట్లతో రోడ్లను వెడల్పు చేయనున్నారు. నేటి నుంచి 144 సెక్షన్.. వేములవాడలో రోడ్ల విస్తరణ పనుల్లో భాగంగా ఈనెల 16 ఉదయం 6 గంటల నుంచి పనులు పూర్తయ్యే వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని టౌన్ సీఐ వీరప్రసాద్ ప్రకటనలో పేర్కొన్నారు. రోడ్డు విస్తరణ చేపట్టే ప్రాంతం నుంచి 100 మీటర్ల వరకు ఈ నిబంధన అమల్లో ఉంటుందని తెలిపారు. -
‘కేటీఆర్‌పై విమర్శలు అర్థరహితం’
సిరిసిల్లటౌన్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, ఎమ్మె ల్యే రాజేందర్‌రెడ్డిల విమర్శలు అర్థరహితమని బీ ఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కంచర్ల రవిగౌడ్ అన్నారు. ఆదివారం తెలంగాణ భవనంలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు కేటీఆర్‌పై విమర్శలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. మరోసారి విమర్శలు చేస్తే సరైన రీతిలో బుద్ధి చెబుతామని హెచ్చరించారు. నాయకులు ముద్దం అనిల్‌గౌడ్, కాసర్ల శ్రీనివాస్, ఎస్కే అఫ్రోజ్, ఎండీ ఆర్జు, అనిల్, రాజు, నవీన్ తదితరులు పాల్గొన్నారు. -
పోలీస్ సంఘం అధ్యక్షుడు
ముస్తాబాద్ పాఠశాలలో చది విన చీకోడుకు చెందిన కరెడ్ల శ్రీనివాస్‌రెడ్డి డీఎస్పీ స్థాయికి ఎదిగారు. చీకోడు నుంచి ముస్తాబాద్ స్కూల్‌కు రోజూ నడిచి వచ్చి చదువుకున్న శ్రీని వాస్‌రెడ్డి పోలీస్‌శాఖలో ఉమ్మడి రాష్ట్ర పోలీస్ అధి కారుల సంఘం అధ్యక్షుడిగా, ప్రస్తుతం తెలంగాణ సీనియర్ వైస్‌ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్నారు. టీజీఎస్పీలో అసిస్టెంట్ కమాండెంట్‌గా వెల్ఫేర్ లైజన్ ఆఫీసర్‌గా హైదరాబాద్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. తన పుట్టిన ఊరు చీకోడులో అనేక సేవ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. -
పేదల డాక్టర్..
ముస్తాబాద్‌కు చెందిన డాక్టర్ చింతోజు శంకర్ 1971–72లో పదో తరగతి ఇక్కడే చదివారు. తన తండ్రి డాక్టర్ చింతోజు బ్రహ్మం, సోదరుడు చింతోజు రాజారాం స్ఫూర్తిగా కాకతీయ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్, ఉస్మానియాలో గైనకాలజీ కోర్సు చదివారు. 1982లోనే ముస్తాబాద్‌లో పీపుల్స్ హాస్పిటల్ స్థాపించారు. వేలాది మందికి చికిత్స అందించారు. ల్యాప్రోస్కోపిక్ సర్జరీల్లో శంకర్ అందెవేసిన చేయి అని అందరూ అంటుంటారు. లక్షకు పైగా ఆపరేషన్లు చేసిన ఘనత డాక్టర్ శంకర్ సొంతం. గ్రామీణ ప్రాంతంలో ఉంటూ 50 ఏళ్లుగా వైద్యసేవలు అందిస్తున్నారు. ఇటీవల రూ.2లక్షలు వెచ్చించి తాను చదువుకున్న పాఠశాలలో కంప్యూటర్, సైన్స్ ల్యాబ్‌లు ఏర్పాటు చేయించారు. -
నాన్న ఫిట్టర్.. కొడుకు ఐఎఫ్ఎస్
గోదావరిఖని: నాన్న పోత్సాహంతో ఐఎఫ్ఎస్లో 40వ ర్యాంకు సాఽ దించాను. సొంతంగా సివిల్‌కు ప్రిపేరై రెండో ప్రయత్నంలో విజ యం సాధించా. ఐఎఫ్ఎస్ సాధించడంలో సింగరేణిలో ఈపీ ఫిట్టర్‌గా పనిచేస్తున్న మా నాన్న నర్సింహారెడ్డి పోత్సాహం ఎంతగానో ఉంది. గ్రూప్–2లో డీఎస్పీ ఉద్యోగం లభించగా, ఐఎఫ్ఎస్ వైపే మొగ్గు చూపుతున్నా. – ఐఎఫ్ఎస్ అభ్యర్థి అవినాశ్‌రెడ్డి, గోదావరిఖని తండ్రి హమాలీ.. కొడుకు జడ్జి జగిత్యాల: ఇంటిపెద్ద హమాలీగా పనిచేస్తూ కొడుకును ఉన్నతస్థానాల్లో నిలబెట్టి ఆదర్శంగా నిలిచాడు. జగిత్యాల మండలం హస్నాబాద్ గ్రామానికి చెందిన కనకయ్య–యాదవ్వ దంపతులది పేద కుటుంబం. అదే గ్రామంలో అద్దెకుంటూ కనకయ్య జగిత్యాలలో హమాలీగా చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వీరికి ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. ఒక కుమార్తె భవాని పెళ్లి కాగా, భార్గవి ప్రైవేటు టీచర్. తండ్రి కూలీ పని చేసుకుంటూ నరేశ్‌ను హైదరాబాద్‌లో చదివించాడు. నరేశ్ పట్టుదలతో చదివి ఇటీవల జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. కుమారుని చదువు కోసం కనుకయ్య హమాలీ పనిచేస్తూ రాత్రనక పగలనక కష్టపడి జూనియర్ సివిల్ జడ్జిగా ఉన్నతస్థానంలో నిలబెట్టాడు. తండ్రి తన కోసం ఎంతో కష్టపడి తనను ఈ స్థానంలో నిలబెట్టినందుకు ఎంతో గర్వంగా ఉందని నరేశ్ పేర్కొన్నారు. -
రాజన్న గోశాలలో సిబ్బంది నియామకానికి ఇంటర్వ్యూలు
సిరిసిల్ల: వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయ గోశాలలో సిబ్బంది నియామకానికి ఇంటర్వ్యూలను శనివారం కలెక్టరేట్లో నిర్వహించారు. 40 పోస్టులకు 250 మంది దరఖాస్తు చేసుకోగా 200 మంది హాజరయ్యారు. కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా, జిల్లా ఉపాధి కల్పనాధికారి రాఘవేందర్, జిల్లా అధికారులు కలిసి అభ్యర్థులకు నిర్వహించారు. అర్హత కలిగిన 40 మందిని ఎంపికచేసి వారికి నియామకపత్రాలు అందజేస్తామని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రకటించారు. రక్తదానం ప్రాణదానంతో సమానం సిరిసిల్ల: రక్తదానం ప్రాణదానంతో సమానమని, మనం ఇచ్చే రక్తం వేరొకరి ప్రాణాలను కాపాడుతుందని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి ఎస్.రజిత పేర్కొన్నారు. స్థానిక అంబేడ్కర్‌నగర్ ఆరోగ్య కేంద్రంలో ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా శనివారం రక్తదాన శిబిరం నిర్వహించారు. జిల్లా వైద్యాధికారి మాట్లాడుతూ రక్తదానంతో ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయన్నారు. గుండె సంబంధిత వ్యాధులు, గొంతు, పెద్ద పేగు క్యాన్సర్లు, సమస్యలు వచ్చే అవకాశం తగ్గుతుందని పేర్కొన్నారు. ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ సంపత్‌కుమార్, డాక్టర్ రామకృష్ణ, డాక్టర్ అనిత, డాక్టర్ అభినయ్, డాక్టర్ నయిమా జహా పాల్గొన్నారు. మెడికల్ కాలేజీలో.. సిరిసిల్ల మెడికల్ కాలేజీలోనూ రక్తదాతల దినో త్సవం నిర్వహించారు. మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ బి.లక్ష్మీనారాయణ రక్తదానం చేసి అందరిలో స్ఫూర్తి నింపారు. ఆ యన మాట్లాడుతూ రక్తం మానవ శరీరంలోనే ఉత్పత్తి అవుతుందని ఏ ఫ్యాక్టరీలోనూ రక్తం లభించదన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండేందుకు రక్తదానం చేయాలని సూచించారు. జిల్లా జనరల్ ఆస్పత్రి పర్యవేక్షకులు డాక్టర్ ఎం.లక్ష్మీనారాయణ, మెడికల్ కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కె.అరుణ్, బి.స్వాతి, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. ఉద్యమ పాఠ్యాంశం తొలగింపు దుర్మార్గం సిరిసిల్లటౌన్: పాఠ్యపుస్తకాల్లో నుంచి తెలంగాణ ఉద్యమ పాఠ్యాంశాన్ని తొలగించడం దుర్మార్గమైన చర్య అని బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సబ్బని హరీశ్ పేర్కొన్నారు. ప్రభుత్వ విధానాన్ని నిరసిస్తూ శనివారం సిరిసిల్లలో అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేసి మాట్లాడారు. పదో తరగతి పుస్తకంలో తెలంగాణ ఉద్యమచరిత్ర పాఠ్యాంశాన్ని కాంగ్రెస్ సర్కారు తొలగించడం నాలుగున్నర కోట్ల ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా ఉందన్నారు. తొలగించిన పాఠ్యాంశాన్ని వెంటనే చేర్చాలని డిమాండ్ చేశారు. నాయకులు ఎస్.కే.బాబా, మెట్టల సాయి, దీపక్, వెంకటరమణ, అశోక్, భరత్, విజయ్ పాల్గొన్నారు. -
దశాబ్దాల కల.. ఫలిస్తున్న వేళ
● వేములవాడలో 80 ఫీట్ల రోడ్ల విస్తరణ ● 343 మంది నిర్వాసితులకు పరిహారం సిద్ధం ● ఇప్పటికే 50 మందికి చెక్కులు పంపిణీ సిరిసిల్ల: వేములవాడ రాజన్న ఆలయం ఎదుట రోడ్ల విస్తరణకు తొలి అడుగు పడింది. మూలవాగు వంతెన నుంచి ఆలయం వరకు ఉన్న ఇరుకురోడ్డుతో భక్తులు, పట్టణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గుడి ముందు రోడ్లను 80 ఫీట్ల మేరకు విస్తరించాలని నిర్ణయించారు. ఈమేరకు షాపులు, ఇళ్లను కోల్పోయే నిర్వాసితులకు ప్రభుత్వం నిధులు కేటాయించింది. ఇప్పటికే 40 మందికి శుక్రవారం చెక్కులను పంపిణీ చేయగా.. తాజాగా శనివారం పది మంది నిర్వాసితులకు చెక్కులను కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా, వేములవాడ ఆర్డీవో, ఆలయ ఇన్చార్జి ఈవో రాధాబాయి అందించారు. రోడ్డు విస్తరణతో 343 మంది తమ ఇళ్లను, షాపులను కోల్పోతున్నారు. ప్రజాప్రయోజనాల కోసం భూములు, ఇంటి స్థలాలను ఇస్తున్న నిర్వాసితులకు చెక్కులను అందించడంతో రోడ్డు విస్తరణకు మార్గం సుగమమైంది. పరిహారం తీసుకోకుండా కోర్టుకు వెళ్లే వారి సొమ్మును కోర్టులో డిపాజిట్ చేసే అవకాశం ఉంది. నిర్వాసితులు పరిహారం చెక్కులు తీసుకోవడంతో రోడ్డు విస్తరణకు అడ్డంకులు తొలగిపోయాయి. ఇక పనులు చకచక సాగనున్నాయి. -
ఆలనా.. పాలన
మా తాత బంగారంనాన్న.. ఒక ధైర్యం.. ఆరాధించే దైవం.. అమ్మ మనకు ప్రపంచాన్ని పరిచయం చేస్తే.. నాన్న ప్రపంచానికి మనల్ని పరిచయం చేస్తాడు. చిన్నతనంలో బుడిబుడి అడుగులు ఎలా వేయాలో నేర్పిస్తాడు. యుక్తవయసులో తప్పటడుగులు వేయకుండా సలహాలిస్తాడు. పిల్లలు స్థిరపడేందుకు జీవితకాలం కష్టపడే తండ్రి పిల్లల విజయాన్ని తన విజయంగా గర్వపడతాడు. పిల్లల జీవితాల్లో వెలుగునిచ్చేందుకు కొవ్వొత్తిలా కరిగిపోతాడు నాన్న.. ఇలా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చాలా మంది తండ్రులు తమ పిల్లలు ఉన్నత శిఖరాలకు చేరేందుకు కష్టపడ్డారు. తాము పేదింట్లో పుట్టినా.. పిల్లలకు ఏ లోటూ లేకుండా చూసుకుని చదివించి, కొలువు కొట్టేలా చేశారు మరికొందరు. అనాథ పిల్లలను అక్కున చేర్చుకుని సపర్యలు చేస్తూ.. నాన్న అని పిలిపించుకుంటున్నారు మరికొందరు.. నేడు ఫాదర్స్‌డే సందర్భంగా ఆదర్శ తండ్రులపై సండే స్పెషల్.అమెరికాలోని జార్జియాలో స్థిరపడిన జగదీశ్, సతీశ్ దంపతులుపిల్లలకు స్నానం చేయిస్తున్న వీరస్వామిజమ్మికుంట(హుజూరాబాద్): తల్లిదండ్రుల అకాలమరణంతో అనాథలైన పిల్ల లను అక్కున చేర్చుకొని చేరదీసి ఆదరిస్తున్నారు జమ్మికుంట మున్సిపల్ పరిధి కొత్తపల్లికి చెందిన ఆదర్శ దంపతులు గోపరాజు వీరస్వామి, శోభారాణి. వీరస్వామి చదువుకునే రోజుల్లో విప్లవ పార్టీలో పని చేశారు. తర్వాత వీరస్వామి, శోభారాణి ఆదర్శ వివాహం చేసుకున్నారు. అనాథ, నిరుపేద పిల్లలకు ఆశ్రయం కల్పించి, సేవ చేయాలనే సంకల్పంతో 2008లో ఏడుగురు పిల్లలతో స్పందన అనాథ బాలబాలికల సేవా సంస్థను ప్రారంభించారు. ప్రస్తుతం ఆశ్రమంలో 25 మంది అనాథ, నిరుపేద పిల్లలు ఉంటున్నారు. వారికి భోజనం, విద్య, వైద్యం, వసతి కల్పిస్తున్నారు. దాతలు చేయూత అందిస్తున్నారు. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి, వారు జీవితంలో స్థిరపడేలా సేవలు అందిస్తూ సేవ దృక్పథాన్ని చాటుతున్నారు. ప్రస్తుతం అద్దె ఇంట్లో ఆశ్రమం నిర్వహిస్తుండగా, ప్రభుత్వం స్థలం ఇస్తే స్థిర నివాసం ఏర్పాటు చేసి అనాథ పిల్లలకు అన్నీతామై, అమ్మానాన్న లోటు లేకుండా సేవ చేస్తామని నిర్వాహకులు వేడుకుంటున్నారు.ధర్మపురి: కొడుకులు లేకపోవడంతో చిన్న కూతురు కొడుకును దత్తత తీసుకొని ఉన్నత చదువులు చదివించి అమెరికాలో ఓ సాఫ్ట్వేర్ కంపెనీకే యజమాని కావడం మా తాత చేసిన పుణ్యమే అంటున్నారు మనువలు. ధర్మపురికి చెందిన తన్నీరు నారాయణ తాపీమేసీ్త్ర. కొడుకులు లేకపోవడంతో చిన్న కూతురు కొడుకు జగదీశ్‌ను దత్తత తీసుకుని ఉన్నత చదువులు చదివించాడు. జగదీశ్‌తో పాటు చిన్న మనువడు సతీశ్‌ను ప్రయోజకులను చేశా డు. కూతురు బిడ్డలే తన బిడ్డలుగా భావించి ఇద్దరు మనుమలను ఎంసీఏ వరకు చది వించాడు. తాత చదివించిన ఉన్నత చదువులతో జగదీశ్ అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో ఓ సాఫ్ట్వేర్ కంపెనీకి అధిపతి అయ్యాడు. సతీశ్ కూడా జార్జియాలో టీసీఎస్ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌గా పని చేస్తూ నెలకు రూ.4 లక్షల వరకు సంపాదిస్తున్నారు. తమ తాత మృతిచెందినా ఆయన కృషి వల్లే ఉన్నతస్థాయికి ఎదిగామని పేర్కొన్నారు ఇద్దరు మనువలు.అనాథలకు అన్నీ తామై..– వివరాలు 8లోu -
చిన్న జీవితంలో చిక్కులు వద్దు
సిరిసిల్లకల్చరల్: జీవితం చాలా చిన్నది. వీలైనంత ప్రశాంతంగా జీవించాలే తప్ప చిన్న చిన్న తగా దాలు, స్పర్థలకు పోవద్దని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.నీరజ సూచించారు. సిరిసిల్లలోని జిల్లా కోర్టులో శనివారం నిర్వహించిన మెగా లోక్ అదాలత్‌లో మాట్లాడారు. పరస్పర చర్చలు, సంప్రదింపుల ద్వారా వివాదాలను పరిష్కరించుకుని ప్రశాంతంగా జీవించాలన్నారు. మెగా లోక్ అదాలత్‌లో 12,856 కేసుల్లో కక్షిదారులు రాజీమార్గాన్ని అనుసరించారు. రూ.3,88,50,607 విలువైన కేసులు పరిష్కారానికి నోచుకున్నాయి. ఫస్ట్ డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జి బి.పుష్పలత, సీనియర్ సివిల్ జడ్జి పి.లక్ష్మణాచారి, డీఎల్ఎస్ఏ కార్యదర్శి రాధికా జైస్వాల్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎ.ప్రవీణ్, ఫస్ట్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కావేటి సృజన, సెకండ్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి గడ్డం మేఘన, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జూపెల్లి శ్రీనివాసరావు, జిల్లా అదనపు ఎస్పీ చంద్రయ్య, ప బ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీనివాస్, లోక్ అదాలత్ సభ్యులు ఆడెపు వేణు, చింతోజు భాస్కర్ పాల్గొన్నారు. సామరస్యంగా మెదలుకోవాలి వేములవాడ: చిన్నచిన్న తగాదాలతో కేసులు పెట్టుకోవద్దని, సామరస్యంగా మెదలుకోవాలని వేములవాడ సీనియర్ సివిల్ కోర్టు జడ్జి అనిల్‌కుమార్ జా దవ్ సూచించారు. వేములవాడ కోర్టులో లోక్ అదాలత్‌లో మాట్లాడారు. లోక్‌అదాలత్ మెంబర్లు తిరుమల్‌గౌడ్, అనిల్‌కుమార్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గుండ రవి పాల్గొన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.నీరజ లోక్‌అదాలత్‌లో 12,856 కేసుల పరిష్కారం -
ఫూలే దంపతుల జీవితం ఆదర్శనీయం
● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ● ఫూలే దంపతుల విగ్రహ ప్రతిష్ఠకు భూమిపూజ సిరిసిల్లటౌన్: మహాత్మా జ్యోతిబాఫూలే దంపతుల జీవితం అన్ని తరా లకు, వర్గాలకు ఆదర్శనీయమని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. సిరిసిల్లలోని కేంద్ర గ్రంథాలయం ఆవరణలో ఫూలే దంపతుల విగ్రహ ప్రతిష్ఠకు శనివారం భూమి పూజ చేసి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగుతోందన్నారు. సీఎంగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించిన వెంటనే హైదరాబాద్ ప్రగతిభవన్‌కు మహాత్మా జ్యోతిబాపూలే పేరు పెట్టినట్లు తెలిపారు. మహా నుభావులను స్మరించుకోవడం జాతి బాధ్యతగా భావించి సిరిసిల్లలో ఫూలే దంపతుల విగ్రహాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు. సమాజంలో అసమానతలు తొలగించడంలో ఆ పుణ్యదంపతుల కృషి ఎనలేనిదని కొనియాడారు. సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కేకే మహేందర్‌రెడ్డితో కలిసి భూమిపూజ చేశారు. జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్మన్ వెల్ముల స్వరూపరెడ్డి, ముదిరాజ్ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చొక్కాల రాము, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాశ్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఆకునూరి బాలరాజు, సంగీతం శ్రీనివాస్, బొప్ప దేవయ్య, గడ్డం నర్సయ్య, ఆడెపు చంద్రకళ, కాముని వనిత, వంకాయల కార్తీక్ పాల్గొన్నారు. -
సర్కార్ బడి..సేవకుల గుడి
● సమాజ సేవలో ముస్తాబాద్ హైస్కూల్ పూర్వ విద్యార్థులు ● వైద్యులు..ఉపాధ్యాయులుగా సేవలు ● బడి రుణం తీర్చుకుంటున్న పలువురు ముస్తాబాద్(సిరిసిల్ల): సర్కార్ బడి.. ఈ పదమే నేడు చులకనగా మారింది. కానీ ప్రస్తుతం సమాజంలో అత్యున్నత స్థానాల్లో సేవలందిస్తున్న వారందరూ అక్కడే అక్షరాలు దిద్దినవారు. ముస్తాబాద్ ప్రభుత్వ హైస్కూల్లో చదివిన వారెందరో వైద్యులు.. ఉపాధ్యాయులుగా ఎదిగారు. ప్రభుత్వ బడిలో చదివి.. ఎదిగిన వారు తమ పిల్లలను రంగురంగుల భవనాలతో ఆకర్షిస్తున్న ప్రైవేట్ స్కూళ్లకు పంపుతూ.. వారు చదువుకున్న సర్కార్ బడిని చిన్నచూపు చూస్తున్నారు. ఈ తరుణంలోనే ప్రభుత్వ పాఠశాలలో చదివి మార్గదర్శకులుగా నిలిచిన వారి విజయాల గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ముస్తాబాద్ సర్కార్ బడిలో చదువుకుని నేడు ఉన్నత స్థానాల్లో ఉన్న వారి గురించి తెలుసుకుంటే మనసు ఉప్పొంగుతుంది. విజేతలను అందించిన ఘనత ముస్తాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలది. ఈ బడికి 75 ఏళ్ల చరిత్ర ఉంది. వైద్యులు చింతోజు శంకర్, చింతోజు రాజారాం, రాజకీయ నాయకుడు కేకే మహేందర్‌రెడ్డి, డీఎస్పీ కరెడ్ల శ్రీనివాస్‌రెడ్డి, జేఎన్టీయూ రిటైర్డ్ రిజిస్ట్రార్ తాండ్ర విఠల్, ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ నర్సింహారెడ్డి, డైట్ కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేసిన పాపాలాల్, హైకోర్టు అడ్వకేట్ రాజమల్లారెడ్డి, ప్రొఫెసర్ ఆనందరెడ్డి, ఆర్డీవో గూడ సురేందర్‌రెడ్డి, బీఎస్ఎన్ఎల్ జిల్లా అధికారి చిన్ని సంజీవ్‌రెడ్డి.. ఇలాంటి వారు ఎందరో ఇక్కడే అక్షరాలు దిద్దారు. వారి స్ఫూర్తిగా ప్రభుత్వ బడిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. -
నేతకార్మికులు కావలెను
సిరిసిల్ల: వస్త్రోత్పత్తికి నైపుణ్యం గల నేతకార్మికుల కొరత వేధిస్తోంది. తరచూ వస్త్రవ్యాపారంలో సంక్షోభం తలెత్తుతుండడంతో వస్త్రోత్పత్తి నిలిచిపోతుంది. దీంతో కార్మికులకు పని దొరక్క ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈక్రమంలోనే చాలా మంది నైపుణ్యం గల కార్మికులు ఇతర రంగాల వైపు మళ్లిపోయారు. ఒకప్పుడు పుష్కలమైన ఉపాధి దొరకడంతో ఉమ్మడి వరంగల్, కరీంనగర్, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాలకు చెందిన నేతకార్మికులు ఇక్కడికి వలస వచ్చారు. ప్రభుత్వ వస్త్రోత్పత్తి ఆర్డర్లు లేక.. వచ్చినా నూలు అందుబాటులో లేక తరచూ సాంచాలు బంద్ పడుతుండడంతో సరిగ్గా పనిలేక స్వస్థలాలకు వెళ్లిపోయారు. స్థానిక నేతకార్మికులు సైతం నమ్మకం లేని వస్త్రోత్పత్తిపై ఆధారపడకుండా కొందరు ఆటోలు కొనుక్కోగా.. మరికొందరు ఊరూరా తిరుగుతూ కూరగాయలు విక్రయిస్తున్నారు. ఇలా వస్త్రోత్పత్తి రంగానికి ఒక్కొక్కరుగా దూరమయ్యారు. ఉత్తరాది కార్మికులపైనే ఆధారం స్థానికంగా నైపుణ్యం గల నేతకార్మికుల కొరత ఏర్పడడంతో కొందరు ఆసాములు బిహార్, ఉత్తరప్రదేశ్, ఝార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల నుంచి కార్మికులను తెప్పిస్తున్నారు. భీవండీ, ముంబయి వంటి పట్టణాల్లో పవర్‌లూమ్స్ నడిపిన అనుభవం ఉన్న ఉత్తరాది కార్మికులను సిరిసిల్లకు రప్పిస్తున్నారు. అయినా వస్త్రపరిశ్రమ అవసరాల మేరకు ఉత్తరాధి కార్మికులు పూర్తి స్థాయిలో రావడం లేదు. మహిళాశక్తి చీరల ఉత్పత్తికి విఘాతం రాష్ట్రంలోని మహిళలకు ఏటా రెండు చీరలు అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం మహిళాశక్తి చీరల ఉత్పత్తి ఆర్డర్లను సిరిసిల్ల నేతన్నలకు అందించింది. ప్రస్తుతం రెండు విడతల్లో 4.24 కోట్ల మీటర్ల వస్త్రోత్పత్తి ఆర్డర్లను 130 మ్యాక్స్ సంఘాలకు అందించారు. ఒక్కో మీటరుకు రూ.34 ప్రభుత్వం చెల్లిస్తుండగా.. బట్టను నేసే కార్మికుడికి రూ.5.25 చొప్పున చెల్లించాలని ఒప్పందం చేశారు. సొంతంగా వస్త్రోత్పత్తి చేయలేని మ్యాక్స్ సంఘాలకు ప్రభుత్వమే నూలు డిపో ద్వారా యారన్(నూలు)ను సరఫరా చేస్తుంది. దీంతో వస్త్రోత్పత్తిదారులపై నూలు కొనుగోలు భారం తప్పింది. ఆగస్టు 15వ తేదీలోగా రాష్ట్రంలోని సుమారు 66 లక్షల మంది మహిళలకు ఒక్కో చీరను ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈమేరకు మహిళాశక్తి చీరల ఉత్పత్తి ఆర్డర్లు ఇవ్వగా.. పని నిదానంగా సాగుతోంది. సిరిసిల్లలో డాబీ, జకార్డ్ పరికరాలను అమర్చిన సాంచాలు 17 వేల వరకు ఉండగా.. ప్రస్తుతం 4,230 సాంచాలపై మహిళాశక్తి చీరల బట్ట ఉత్పత్తి అవుతుంది. రోజుకు 1.25లక్షల మీటర్ల చీరల బట్ట ఉత్పత్తి కావాల్సి ఉండగా.. ప్రస్తుతం 32వేల మీటర్లు మాత్రమే ఉత్పత్తి అవుతుంది. అనేక మంది ఆసాములకు సాంచాలు ఉన్నా.. బట్ట నేసేందుకు కార్మికులు లేక ఖాళీగా ఉంటున్నాయి. కార్మికుల కొరతతో పొద్దాంత మాత్రమే వస్త్రోత్పత్తి సాగుతుంది. రాత్రి వేళల్లో సాంచాలు బంద్ ఉంటున్నాయి. సిరిసిల్లలో పవర్లూమ్ వర్కర్ల కొరత ఇతర పనుల్లో స్థిరపడిన నేతకార్మికులు ఉత్తరాది రాష్ట్రాల కార్మికులతో వస్త్రోత్పత్తి మహిళాశక్తి చీరల ఆర్డర్లు.. దొరకని కార్మికులువిచిత్ర పరిస్థితి పనులు లేక నేతకార్మికులు రోడ్డున పడే పరిస్థితులు ఒకప్పుడు ఉండగా.. ఇప్పుడు కార్మికులు లేక సాంచాలపై వస్త్రోత్పత్తి నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. కొత్తగా యువకులు ఈ పని చేసేందుకు ముందుకు రావడం లేదు. పొరుగు రాష్ట్రాల కార్మికులను తెచ్చుకునే పరిస్థితులు రావడంతో వారు గంటల తరబడి రెస్ట్ లేకుండా పని చేయడంతో వారితో స్థానిక కార్మికులు పోటీ పడలేక, వస్త్రోత్పత్తి పనికి దూరమవుతున్నారు. కార్మికులు దొరకడం లేదు ఇతను చందా రాజమౌళి. గణేశ్‌నగర్‌కు చెందిన రాజమౌళి వద్ద 48 సాంచాలు ఉన్నాయి. కానీ పవర్లూమ్ వర్కర్లు లేక రాజమౌళితోపాటు మరొకరు మాత్రమే మహిళాశక్తి చీరల బట్టను ఉత్పత్తి చేస్తున్నారు. ఇంకా ఏడుగురు నేతకార్మికులు అవసరం. కానీ నైపుణ్యం గల కార్మికులు దొరక్క సాంచాలు నడవడం లేదు. ఇలాంటి పరిస్థితి సర్ధార్‌నగర్‌కు చెందిన వస్త్రోత్పత్తిదారులు మండల సత్యం, బూట్ల సతీశ్‌కుమార్‌లు నేతకార్మికుల కోసం నిరీక్షిస్తున్నారు. ఇతను బిహార్ రాష్ట్రం మధుబని జిల్లా పూర్సోలియాకు చెందిన జమీర్. స్థానికంగా ఓ కార్ఖానాలో పనిచేస్తున్నాడు. నిత్యం 12 గంటలపాటు పనిచేస్తూ పాలిస్టర్ బట్టను ఉత్పత్తి చేస్తూ నెలకు రూ.14వేలు సంపాదిస్తున్నాడు. ఇప్పుడు మహిళా శక్తి చీరల బట్టను ఉత్పత్తి చేస్తూ నెలకు రూ.26వేలు సంపాదిస్తున్నాడు. జమీర్ లాగే ఉత్తరప్రదేశ్, బిహార్, ఝార్ఖండ్‌లకు చెందిన 200 మంది కార్మికులు సిరిసిల్లలో పనిచేస్తున్నారు. ప్రభుత్వ వస్త్రోత్పత్తి ఆర్డర్లు వచ్చాయి. బట్ట నేసేందుకు కార్మికులు లేరు. చాలా మంది ఆసాములు, వస్త్రోత్పత్తిదారులు కార్మికుల కోసం వెతుకుతున్నారు. మా కార్ఖానాలోనే నలుగురు ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన కార్మికులు పనిచేస్తున్నారు. ఒక్క పూటనే పనిచేయిస్తూ.. సాంచాలు బందుపెట్టుకుంటున్నారు. పొరుగు జిల్లాలకు వెళ్లిపోయిన వారు తిరిగి రావడం లేదు. కార్మికుల కొరత తీవ్రంగా ఉంది. – ఆడెపు భాస్కర్, పాలిస్టర్ అసోసియేషన్ అధ్యక్షుడు, సిరిసిల్ల -
నేడు జాతీయ లోక్‌అదాలత్
సిరిసిల్లకల్చరల్: పెండింగ్ కేసుల పరిష్కారం కోసం శనివారం మెగా జాతీయ లోక్‌అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.నీరజ తెలిపారు. పరస్పర చర్చల ద్వారా పరిష్కరించుకోదగిన కేసులను అదాలత్‌లో పరిష్కరించుకోవాలని సూచించారు. వీలైనన్ని ఎక్కువ కేసులు పరిష్కారం అయ్యేలా కృషి చేయాలని న్యాయవాదులకు సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్య ● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్వేములవాడఅర్బన్: ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్య అందించడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. వేములవాడలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం విద్యార్థులకు యూనిఫామ్స్, పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు. అనంతరం అంగన్వాడీ విద్యార్థులకు అక్షరాభ్యాసం చేయించారు. రుద్రంగిలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ మంజూరు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఏఎంసీ చైర్మన్ రొండి రాజు, కనికరపు రాకేశ్, మండల విద్యాధికారి బన్నాజీ తదితరులు పాల్గొన్నారు. నాణ్యమైన సేవలందించాలి ● జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజంగంభీరావుపేట(సిరిసిల్ల): అంగన్వాడీ కేంద్రాల్లో నాణ్యమైన పౌష్టికాహారంతోపాటు ఆట పాటలతో కూడిన విద్యనందించాలని జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం కోరారు. మండలంలోని లింగన్నపేట ఐసీడీఎస్ సెక్టార్ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల్లో శుక్రవారం సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమంలో పాల్గొన్నారు. చిన్నారుల్లో పోషకాహార లోపం నివారించేందుకు సరైన పౌష్టికాహారం అందించాలన్నారు. డీహబ్ కో–ఆర్డినేటర్ రోజా, డీసీపీయూ ప్రొటెక్షన్ అధికారి శ్రీనివాస్, టీచర్లు గీతబాల, వనజ, రజని, ఉమారాణి, సునీత పాల్గొన్నారు. మహిళలు పరీక్షలు చేయించుకోవాలి ● జిల్లా వైద్యాధికారి రజిత సిరిసిల్ల: జిల్లాలో స్వశక్తి సంఘాల మహిళలు, మున్సిపల్లో పనిచేసే మహిళా సిబ్బంది విధిగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి ఎస్.రజిత కోరారు. సుందరయ్యనగర్, అంబేడ్కర్‌నగర్, వేములవాడలోని ఆరోగ్య కేంద్రాలను శుక్రవారం తనిఖీ చేశారు. డీఎంహెచ్‌వో మాట్లాడుతూ మహిళలకు ఉచితంగా స్క్రీనింగ్ హెల్త్‌క్యాంప్‌లను నిర్వహిస్తున్నట్లు తెలిపా రు. రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్, నోటి క్యాన్సర్, దీర్ఘకాల వ్యాధుల(మధుమేహం, రక్తపోటు) పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ప్రోగ్రాం ఆఫీసర్ రామకృష్ణ, డీపీవో రాజేందర్, పట్టణ ఆరోగ్య కేంద్రం వైద్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. మున్సిపల్ ఉద్యోగులకు గుండె వైద్యశిబిరంసిరిసిల్లటౌన్: మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు, సిబ్బందికి శుక్రవారం ఉచిత గుండె వైద్యశిబిరం నిర్వహించారు. స్థానిక సినారె కళామందిరంలో నిర్వహించిన కార్యక్రమాన్ని ఇన్చార్జి కమిషనర్ పోసు వాణి ప్రారంభించారు. కరీంనగర్ మెడికవర్ ఆస్పత్రి ఆధ్వర్యంలో 220 మంది ఉద్యోగులు, కార్మికులకు ఉచితంగా టూడీ ఈకో, షుగర్, బీపీ పరీక్షలు చేశారు. ఆస్పత్రి సెంటర్ హెడ్ గుర్రం కిరణ్ మాట్లాడుతూ ఆరోగ్యంగా జీవించడానికి వైద్యుల సలహాలు పాటించాలన్నారు. మున్సిపల్ ఈఈ రఘు, మెప్మా కోఆర్డినేటర్ మహాలక్ష్మి, ఆస్పత్రి మార్కెటింగ్ మేనేజర్ కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు విస్తరణ నిర్వాసితులకు పరిహారం
● వేములవాడలో 40 మందికి చెక్కులు అందజేత వేములవాడ: పట్టణంలోని ప్రధాన రహదారి విస్తరణలో భూములు కోల్పోతున్న నిర్వాసితులకు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాధాభాయి శుక్రవారం పరిహారం చెక్కులు పంపిణీ చేశారు. తిప్పాపూర్ బ్రిడ్జి నుంచి రాజన్న ఆలయం వరకు చేపట్టే రోడ్డు విస్తరణలో భూములు కోల్పోతున్న 40 మంది నిర్వాసితులకు శుక్రవారం కలెక్టరేట్లో చెక్కులు పంపిణీ చేశారు. రోడ్డు విస్తరణలో 343 మంది భూములు కోల్పోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అధికారులు దుకాణాలు ఖాళీ చేయాలని నోటీసులు అంటించారు. -
రాజన్న ఆలయ ఈవోగా రాధాభాయి
● ఆలయంలో పూజలు.. బాధ్యతల స్వీకరణ వేములవాడ: రాజన్న ఆలయ ఈవోగా ఆర్డీవో రాధాభాయిని నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు వెలువరించింది. ఇక్కడ పనిచేస్తున్న ఈవో కొప్పుల వినోద్‌రెడ్డిని హైదరాబాద్ డీసీగా బదిలీ చేశారు. ఈవోగా రాధాభాయి శుక్రవారం బాధ్యతలు స్వీకరించి, రాజన్నను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేదోక్త ఆశీర్వచనం గావించారు. ఏఈవో బి.శ్రీనివాస్ ప్రసాదాలు అందించారు. రోడ్డు ఆక్రమిత నిర్మాణాలు కూల్చివేతసిరిసిల్లటౌన్: రోడ్డు ఆక్రమిత నిర్మాణాలపై సిరిసిల్ల బల్దియా చర్యలు చేపట్టింది. శుక్రవారం స్థానిక మార్కెట్ ఏరియాలోని పలు దుకాణాల ముందున్న గద్దెలు రోడ్డు ఆక్రమించి నిర్మించారన్న ఫిర్యాదుపై మున్సిపల్ ఇన్చార్జి కమిషనర్ పోసు వాణి ఆదేశాలతో అధికారులు కూల్చివేతలు ప్రారంభించారు. స్థానిక బాలాజీ స్వీట్‌హౌస్ పక్క సందిలో రోడ్డుపై నిర్మించిన గద్దెలను జేసీబీ సాయంతో టీపీబీవో గణేశ్, నయీం, సిబ్బంది సహకారంతో కూల్చివేతలు చేపట్టారు. కాగా సదరు ఇళ్ల యజమానులే స్వతహాగా తొలగించుకుంటామని హామీ ఇవ్వడంతో అధికారులు వెనుదిరిగారు. -
డేంజర్ యూ టర్న్
వేములవాడఅర్బన్: వేములవాడ మండలం అగ్రహారం స్టేజీ వద్ద సిరిసిల్ల–వేములవాడ ప్రధాన రహదారిపై యూటర్న్ డేంజర్‌గా ఉంది. అంజన్న ఆలయం ఎదుట డివైడర్ నుంచి వాహనాలు యూటర్న్ తీసుకుంటున్న సమయంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. అగ్రహారం స్టేజీ వద్ద.. హనుమన్ ఆలయం, కరీంనగర్ డెయిరీ పాలశీతలీకరణ కేంద్రం, రోడ్డు అటు వైపు పాలిటెక్నిక్, డీగ్రీ, జేఎన్టీయూ కళాశాలలు ఉండడంతో ఎప్పుడూ ఇక్కడ విద్యార్థులతో రద్దీగా ఉంటుంది. ఈ ప్రాంతంలో ఉన్న యూటర్న్‌ను మూసివేసి కొంచెం దూరంలో ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.