బాధ్యత నెరవేర్చాం
సిరిసిల్లటౌన్/సిరిసిల్లఅర్బన్: మున్సిపాలిటీ ఎన్నికల్లో యువత ఓటెత్తారు. కొత్తగా ఓటుహక్కు వచ్చిన వారు ఉత్సాహంగా పాల్గొనగా.. వృద్ధులు తమ అనుభవ పాఠాలు చెబుతూ క్యూలైన్‌లో కనిపించారు. ఇటు యువత.. అటు అనుభవజ్ఞులైన వృద్ధులు తమ ఓటుహక్కును వినియోగించుకునేందుకు భారీగా క్యూలైన్‌లో నిల్చున్నారు. ఓటరుచైతన్యంపై ‘సాక్షి’ పలకరించగా తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు.
ఓటుహక్కును వినియోగించుకోవాలనే హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా సిరిసిల్లకు వచ్చిన. వార్డుల్లో సమస్యల పరిష్కా రం, అభివృద్ధి సాధారణమే. కానీ యువతరానికి ఉపాధి అవకాశాలు కల్పించే నాయకత్వం బలపడాలి.
– ఆర్.సుప్రియ, అకౌంటెంట్
మొదటిసారి ఓటేసిన. ఎంతో ఉత్సాహంగా ఉంది. రాజ్యాంగం నాకు కల్పించిన హక్కును సరైన నాయకులకు బలపరిచిన. వార్డులో స్నేహంగా ఉంటూ అభివృద్ధి సాధించాలి. ప్రజాసేవలో ఎల్లప్పుడు ఉండేవారే గెలవాలి.
– బొడ్డు ప్రవళిక, సిరిసిల్ల
బాధ్యత నెరవేర్చాం
బాధ్యత నెరవేర్చాం


