breaking news
Personal Finance
-
భార్యను కాదని పిల్లలకు పెన్షన్ రాసేయొచ్చా?
సహధర్మచారిణిగా భార్యకు జీవితంలోనూ, ఆర్థిక భద్రతలోనూ ప్రాథమిక హక్కు ఉంటుందనేది జగమెరిగిన సత్యం. మరి ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న భర్త, తన భార్యను పూర్తిగా మినహాయించి (Exclude) కేవలం పిల్లలకే ఫ్యామిలీ పెన్షన్ దక్కేలా నామినేషన్ చేయవచ్చా? కుటుంబంలో మనస్పర్థలు, కలహాలు వచ్చినా చట్టపరంగా భార్యకు దక్కాల్సిన హక్కును భర్త ఏకపక్షంగా కాలరాయవచ్చా? అంటే, కేంద్ర సీసీఎస్ (పెన్షన్) నిబంధనలు ఏం చెబుతున్నాయో కింద చూద్దాం.మొదటి ప్రాధాన్యత ఎవరికంటే..కేంద్ర సివిల్ సర్వీసెస్ (పెన్షన్) నిబంధనలు, 2021 (సీసీఎస్ పెన్షన్ రూల్స్)లోని రూల్ 50 ప్రకారం.. ఒక ప్రభుత్వ ఉద్యోగి లేదా పెన్షనర్ మరణిస్తే ఆయన పొందే ఫ్యామిలీ పెన్షన్‌పై పూర్తి హక్కు చట్టబద్ధమైన భార్యకే ఉంటుంది. భర్త తన సర్వీస్ రికార్డుల్లో లేదా నామినేషన్ ఫారమ్‌లో భార్య పేరు కాదని పిల్లల పేర్లు రాసినప్పటికీ సాంకేతికంగా అది చెల్లదు. భర్త తన ఇష్టారాజ్యంగా నామినేషన్ మార్చడానికి వీల్లేదు. పెన్షన్ డిస్బర్సింగ్ అథారిటీ చట్టబద్ధ నిబంధనల ప్రకారమే నడుచుకుంటుంది. భార్య మరణించినా లేదా చట్టబద్ధంగా విడాకులు పూర్తయినా లేక ఆమె పెన్షన్‌కు అనర్హురాలైనా రెండో ప్రాధాన్యతగా 25 ఏళ్లలోపు ఉన్న పిల్లలకు (లేదా దివ్యాంగులైన సంతానానికి) ఆ ఫ్యామిలీ పెన్షన్ అందుతుంది.మహిళా ఉద్యోగులకే ఆ ప్రత్యేక మినహాయింపు!ఇక్కడ ఒక ముఖ్యమైన చట్టపరమైన సవరణను గమనించాలి. 2024 ప్రారంభంలో కేంద్ర పెన్షన్, పెన్షనర్ల సంక్షేమ శాఖ నిబంధనల్లో ఒక మార్పు తెచ్చింది. దాంపత్య వివాదాలు, విడాకుల పిటిషన్లు లేదా గృహహింస చట్టం కింద కేసులు నడుస్తున్న సందర్భాల్లో.. మహిళా ఉద్యోగులు తమ భర్తను మినహాయించి, తమ పిల్లలకు ఫ్యామిలీ పెన్షన్ వెళ్లేలా ముందస్తుగా అభ్యర్థించే వెసులుబాటు కల్పించారు. అయితే ఈ మినహాయింపు కేవలం మహిళా ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుంది. పురుష ఉద్యోగులకు తమ భార్యను నామినేషన్ నుంచి తొలగించే హక్కును చట్టం ఎక్కడా ఇవ్వలేదు.అవగాహన లేకపోతే తీవ్ర నష్టం!చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లు పరిస్థితి చేయిదాటాక బాధపడేకంటే పెన్షన్ నిబంధనలపై స్పష్టత కలిగి ఉండటం శ్రేయస్కరం. భార్యాభర్తల మధ్య ఎన్ని అభిప్రాయభేదాలు ఉన్నప్పటికీ చట్టబద్ధమైన విడాకుల డిక్రీ కోర్టు నుంచి పొందే వరకు భార్య పెన్షన్ హక్కుదారుగానే ఉంటుంది. కాబట్టి నామినేషన్ల విషయంలో సొంత నిర్ణయాలు చెల్లవని న్యాయ నిపుణులు తేల్చిచెబుతున్నారు.ఇదీ చదవండి: పసిడి, వెండి ధరల హొయలు.. నేటి ధరలు ఇలా.. -
పీపీఎఫ్ కాంపౌండింగ్ మ్యాజిక్ తెలుసా?
‘గింజ నాటిన వెంటనే నీడ రాదు.. విత్తనం మొలకెత్తి వృక్షం కావడానికి కాలం పడుతుంది’ ఆర్థిక ప్రణాళికలోనూ ఇది అక్షర సత్యం. ఆనంద్ అనే ఒక సగటు తండ్రి తన కుమార్తె పుట్టిన 11వ రోజే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) ఖాతా తెరిచాడు. పెట్టుబడుల్లో నిపుణుడు కాకపోయినా చిన్నతనంలోనే పొదుపు చేయాలని భావించాడు. మూడేళ్ల తర్వాత తన ఖాతా స్టేట్మెంట్ చూసుకున్నప్పుడు కాంపౌండింగ్ (చక్రవడ్డీ) శక్తేంటో ఆయనకు స్పష్టంగా అర్థమైంది.మైనర్ పీపీఎఫ్ ఖాతా.. నియమాలుపిల్లల ఉన్నత చదువులు, భవిష్యత్ అవసరాల కోసం పీపీఎఫ్ ఒక నమ్మకమైన నిధి. 1968లో ప్రారంభమైన ఈ ప్రభుత్వ మద్దతు గల పథకం భారతీయ కుటుంబాలకు (కేంద్ర ప్రభుత్వ హామీ) భద్రతను ఇస్తుంది.ఖాతా నిర్వహణ: 18 ఏళ్ల లోపు ఉన్న మైనర్ బిడ్డ పేరిట తల్లి లేదా తండ్రి (ఒకరు మాత్రమే గార్డియన్‌గా) ఖాతా తెరవవచ్చు. తపాలా కార్యాలయం లేదా గుర్తింపు పొందిన బ్యాంకుల ద్వారా దీనిని ప్రారంభించవచ్చు.డిపాజిట్ పరిమితులు: ఒక ఆర్థిక సంవత్సరంలో కనిష్ఠంగా రూ.500 నుంచి గరిష్ఠంగా రూ.1.5 లక్షల వరకు జమ చేయవచ్చు. ఇక్కడ గమనించాల్సిన కీలకమైన అంశం ఏమిటంటే.. తల్లిదండ్రుల సొంత పీపీఎఫ్, మైనర్ పిల్లల ఖాతా రెండూ కలిపి గరిష్ఠ వార్షిక పరిమితి రూ.1.5 లక్షలు మించకూడదు.కాలపరిమితి.. ఉపసంహరణలు: ఈ పథకం లాక్-ఇన్ పీరియడ్ 15 సంవత్సరాలు. ఖాతా తెరిచిన 3వ సంవత్సరం నుంచి 6వ సంవత్సరం వరకు రుణం పొందే సౌకర్యం ఉంది. 7వ సంవత్సరం నుంచి పాక్షిక విత్‌డ్రావల్స్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. మెచ్యూరిటీ తర్వాత ప్రతి 5 ఏళ్ల బ్లాక్ చొప్పున గడువును పొడిగించుకోవచ్చు.ప్రస్తుత వడ్డీ రేటువడ్డీని ప్రతి నెలా 5వ తేదీ నుంచి నెలాఖరు వరకు ఉన్న అతి తక్కువ నిల్వ (లోయెస్ట్ బ్యాలెన్స్) ఆధారంగా లెక్కిస్తారు. అయితే, ఈ వడ్డీ మార్చి 31న వార్షికంగా ఖాతాలో జమ అవుతుంది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రతి మూడు నెలలకొకసారి (త్రైమాసిక ప్రాతిపదికన) పీపీఎఫ్ వడ్డీ రేట్లను సమీక్షించి ప్రకటిస్తుంది. ప్రస్తుతం ఏటా 7.1 శాతం వడ్డీ ఉంది.పన్ను మినహాయింపుపీపీఎఫ్ పథకానికి ఆదాయపు పన్ను చట్టం కింద ఈఈఈ (Exempt-Exempt-Exempt) హోదా ఉంది. సెక్షన్ 80సీ కింద డిపాజిట్లకు పన్ను మినహాయింపు దక్కడంతో పాటు వడ్డీ, మెచ్యూరిటీ మొత్తం పూర్తి పన్ను రహితం. షేర్ మార్కెట్ ఒడుదొడుకులకు దూరంగా సురక్షితమైన ఆర్థిక ప్రయాణాన్ని కోరుకునే వారికి పీపీఎఫ్ మంచి అవకాశమని నిపుణులు చెబుతున్నారు. పిల్లలు పెద్దయ్యే సరికి వారి ఉన్నత విద్యకు ఆర్థికంగా డోకా లేకుండా చేయడానికి పీపీఎఫ్ ఒక మెరుగైన సాధనం.ఇదీ చదవండి: పసిడి, వెండి ధరల హొయలు.. నేటి ధరలు ఇలా.. -
ఫిక్స్డ్ డిపాజిట్లు చేస్తుంటే జాగ్రత్త!
భారతీయులకు అత్యంత సురక్షితమైన, నమ్మకమైన పెట్టుబడి మార్గం అనగానే ముందు గుర్తొచ్చేది ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డీ). స్థిరమైన రాబడి కోసం మెజారిటీ ప్రజలు ఎఫ్డీలనే ఆశ్రయిస్తుంటారు. అయితే, ఎలాంటి ముందస్తు ప్రణాళిక, పరిశోధన లేకుండా నిశ్చింతగా చేసే ఎఫ్డీ పెట్టుబడులు ఒక్కోసారి అసలుకే ఎసరు తెచ్చి తీవ్ర నిరాశను మిగిల్చే అవకాశం ఉంది. ఎఫ్‌డీల్లో డబ్బు దాచే ముందు ప్రతీ పెట్టుబడిదారు తప్పక గుర్తుంచుకోవాల్సిన ఐదు కీలకమైన పొరపాట్లు, వాటి పరిష్కారాలు ఇక్కడ పరిశీలిద్దాం..పన్ను పరిణామాలను విస్మరించడంఎఫ్డీలపై వచ్చే వడ్డీ రాబడి పూర్తిగా పన్ను పరిధిలోకి వస్తుంది. మీ ఇన్కమ్ టాక్స్ స్లాబ్ ప్రకారమే పన్ను వర్తిస్తుంది. ఆర్థిక సంవత్సరంలో వడ్డీ రూ.40,000 (సీనియర్ సిటిజన్లకు రూ.50,000) దాటితే బ్యాంకులు మూలం వద్దే పన్ను మినహాయింపు (టీడీఎస్) చేస్తాయి. టాక్స్ పరిగణనలోకి తీసుకోకుండా వచ్చే వడ్డీ మొత్తాన్ని నికర లాభంగా భావించడం పెద్ద పొరపాటు.ద్రవ్యోల్బణం ప్రభావాన్ని అంచనా వేయకపోవడంద్రవ్యోల్బణం పెరిగే కొద్దీ రూపాయి కొనుగోలు శక్తి వేగంగా తగ్గుతుంది. మీ ఎఫ్డీ వడ్డీ రేటు 7 శాతం ఉండి, మార్కెట్లో ద్రవ్యోల్బణం కూడా 6–7% ఉంటే.. పన్నులు పోను మీ నికర వాస్తవ రాబడి సున్నాకే సమానం. కేవలం ఎఫ్‌డీలపైనే ఆధారపడకుండా ద్రవ్యోల్బణాన్ని తట్టుకునే ఇతర మార్గాలనూ పరిశీలించాలి.గడువుకు ముందే ఉపసంహరణఅత్యవసర నిధి వేరుగా ఉంచుకోకుండా మొత్తం సొమ్మును దీర్ఘకాలిక ఎఫ్‌డీల్లో పెడితే హఠాత్తుగా డబ్బు అవసరమైనప్పుడు ఎఫ్డీని గడువు తీరకుండానే ఉపసంహరించుకోవాల్సి వస్తుంది. దీనివల్ల బ్యాంకులు 0.5%-1% వరకు జరిమానా విధించడమే కాకుండా వడ్డీ రేటును తగ్గిస్తాయి.ఎఫ్డీ లాడరింగ్ విధానం పాటించకపోవడంమొత్తం సొమ్మును ఒకే ఎఫ్డీలో ఒకే కాలపరిమితికి లాక్ చేయడం వల్ల భవిష్యత్తులో వడ్డీ రేట్లు పెరిగినప్పుడు ఆ అవకాశాన్ని కోల్పోతారు. అలాకాకుండా సొమ్మును విడదీసి వేర్వేరు గడువులతో (1 సంవత్సరం, 2 ఏళ్లు, 3 ఏళ్లు) డిపాజిట్ చేసే లాడరింగ్ పద్ధతి పాటిస్తే ద్రవ్యలభ్యత పెరగడంతో పాటు అధిక రాబడి లభిస్తుంది.బ్యాంకుల వడ్డీ రేట్లను పోల్చి చూడకపోవడంకేవలం అలవాటు పడిన ఒకే బ్యాంకులోనే పెట్టుబడి పెట్టడం మరొక పొరపాటు. ప్రైవేట్ బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు అందించే వడ్డీ రేట్లతో పోల్చి చూసి ఆర్బీఐ డిపాజిట్ ఇన్సూరెన్స్ పరిమితులను (రూ.5 లక్షల వరకు భద్రత) దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోవాలి.ఇదీ చదవండి: తాతముత్తాతల ఆస్తి హక్కులు పొందడం ఎలా? -
8th Pay Commission: ఉద్యోగుల పంట పండినట్లే!!
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 8వ కేంద్ర వేతన సంఘం (8th Central Pay Commission) ప్రక్రియ వేగంగా సాగుతోంది. కొత్త వేతన సవరణలో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఎంత ఉండబోతుందనే అంశంపైనే ఉద్యోగుల్లో ప్రధాన చర్చ జరుగుతోంది. ఫిట్ మెంట్ ఫ్యాక్టర్ నిర్ణయించిన తర్వాత తమ కనీస వేతనం రూ.69 వేలకు పెరుగుతుందని ఉద్యోగులు భావిస్తున్నారు. అయితే ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం లేదా 8వ వేతన సంఘం ఫిట్మెంట్ ఫ్యాక్టర్‌ను అధికారికంగా ఖరారు చేయలేదు.రూ.69,000 వరకు బేసిక్ పే?8వ వేతన సంఘంతో గత ఏప్రిల్ 28న జరిగిన సమావేశంలో నేషనల్ కౌన్సిల్–జాయింట్ కన్సల్టేటివ్ మెషినరీ (NC-JCM) ఉద్యోగుల తరఫున పలు కీలక ప్రతిపాదనలు చేసింది. ఇందులో ప్రస్తుతం ఉన్న కనీస ప్రాథమిక వేతనం రూ.18,000ను రూ.69,000కు పెంచాలని, అందుకు అనుగుణంగా 3.833 ఫిట్మెంట్ ఫ్యాక్టర్‌ను పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఈ లెక్క 18,000 × 3.833 ఆధారంగా రూపొందింది. అంటే ఇది ఉద్యోగ సంఘాల డిమాండ్ మాత్రమే. 8వ వేతన సంఘం తుది సిఫార్సులు, ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వచ్చినప్పుడే కొత్త వేతనాలు ఎంత ఉంటాయో స్పష్టమవుతుంది.ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అంటే ఏమిటి?ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అనేది ప్రస్తుత ప్రాథమిక వేతనాన్ని గుణించి సవరించిన ప్రాథమిక వేతనాన్ని నిర్ణయించేందుకు ఉపయోగించే గుణకం. ఉదాహరణకు ప్రస్తుతం లెవెల్-1 ఉద్యోగికి రూ.18,000 ప్రాథమిక వేతనం ఉంది. ఒకవేళ 3.833 ఫ్యాక్టర్‌నే అమలు చేస్తే అది సుమారు రూ.68,994 అవుతుంది. ఉద్యోగ సంఘాల రూ.69,000 కనీస వేతన డిమాండ్‌కు ఇది దగ్గరగా ఉంటుంది.అదే ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2.57గా ఉంటే రూ.18,000 ప్రాథమిక వేతనం రూ.46,260 అవుతుంది. 2.00 అయితే రూ.36,000, 1.83 అయితే రూ.32,940గా ఉంటుంది. అయితే ఈ లెక్కలు ప్రాథమిక వేతనానికి మాత్రమే వర్తిస్తాయి. చేతికి వచ్చే మొత్తం జీతం ఇంతే శాతంలో పెరుగుతుందని భావించకూడదు. డీఏ, హెచ్ఆర్ఏ, ఇతర అలవెన్సులు, కొత్త పే మ్యాట్రిక్స్ వంటి అంశాలపై తుది వేతనం ఆధారపడి ఉంటుంది.3.833పై ఎందుకు ఆశలు?ఉద్యోగ సంఘాల లెక్కల ప్రకారం జీవన వ్యయం, కుటుంబ అవసరాలు, ద్రవ్యోల్బణం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని కనీస వేతనాన్ని రూ.69,000గా నిర్ణయించాలనే ప్రతిపాదన వచ్చింది. దీనికి అనుగుణంగానే 3.833 ఫిట్మెంట్ ఫ్యాక్టర్‌ను సూచించారు. ఉద్యోగ సంఘాల డిమాండ్లలో వార్షిక ఇన్‌క్రిమెంట్‌ను ప్రస్తుత 3 శాతం నుంచి 6 శాతానికి పెంచాలన్న ప్రతిపాదన కూడా ఉంది.8వ వేతన సంఘం తుది నిర్ణయం ఎప్పుడు?8వ కేంద్ర వేతన సంఘాన్ని కేంద్ర ప్రభుత్వం 2025 నవంబర్ 3న ఏర్పాటు చేసింది. కమిషన్‌కు తన నివేదిక సమర్పించేందుకు 18 నెలల గడువు ఇచ్చారు. ప్రస్తుతం ఉద్యోగులు, పెన్షనర్లు, ఉద్యోగ సంఘాలు, వివిధ సంస్థల నుంచి అభిప్రాయాలు, డిమాండ్లను సేకరించే ప్రక్రియ కొనసాగుతోంది.కమిషన్ 2026 ఆగస్టు 31–సెప్టెంబర్ 1 తేదీల్లో జైపూర్‌లో ఉద్యోగ, పెన్షనర్ సంఘాలతో సమావేశాలు నిర్వహించనుంది. అనంతరం దేశంలోని పలు ప్రాంతాల్లో సంప్రదింపులు కొనసాగనున్నాయి.ఇదీ చదవండి: ఐటీ కంపెనీ ఉద్యోగులకు బోనస్.. జీతాల పెంపుపై అప్డేట్ -
తాతముత్తాతల ఆస్తి హక్కులు పొందడం ఎలా?
తండ్రి లేదా తాతలు, ముత్తాతల నుంచి సంక్రమించిన ఆస్తికి సంబంధించి ఒరిజినల్ సేల్ డీడ్ (క్రయపత్రం) లేకపోవడం, చట్టబద్ధమైన విల్లు రాయకుండానే వారు మరణించడం భారతీయ కుటుంబాల్లో తరచూ ఎదురయ్యే ప్రధాన సమస్య. ఇటువంటి సందర్భాల్లో చట్టబద్ధమైన యాజమాన్య హక్కులను ఎలా నిరూపించుకోవాలి? ఆ ఆస్తిపై వచ్చే అద్దె ఆదాయానికి సంబంధించి ఎలాంటి నిబంధనలు పాటించాలనే దానిపై న్యాయ, పన్ను నిపుణులు స్పష్టమైన దిశానిర్దేశం చేస్తున్నారు.యాజమాన్య హక్కుల నిర్ధారణఒరిజినల్ సేల్ డీడ్ పోయినట్లు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు (ఎఫ్ఐఆర్) చేసి నాన్-ట్రేసబుల్ సర్టిఫికేట్ పొందాలి. అనంతరం రెండు పత్రికల్లో (ఒక ఇంగ్లీష్, ఒక ప్రాంతీయ భాష) బహిరంగ ప్రకటన ఇవ్వాలి.సబ్-రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి లింక్ డాక్యుమెంట్లు, ‘సర్టిఫైడ్ కాపీ’ పొందాలి. ఇది ఒరిజినల్ పత్రంతో సమానమైన న్యాయపరమైన గుర్తింపు కలిగి ఉంటుంది.విల్లు లేనందున వారసులందరూ తమ హక్కులను నిరూపించుకోవడానికి తహసీల్దార్ ద్వారా లీగల్ హెయిర్ సర్టిఫికేట్ లేదా సివిల్ కోర్టు నుంచి సక్సెషన్ సర్టిఫికేట్ పొందడం తప్పనిసరి.రెవెన్యూ/మున్సిపల్ రికార్డుల్లో పేరు మార్పిడి (మ్యుటేషన్) చేయించాలి. వారసుల్లో ఎవరైనా తమ వాటాను వదులుకోవాలనుకుంటే ‘రిలీజ్ డీడ్’ రిజిస్టర్ చేయాలి.ఇదీ చదవండి: ట్రంప్ ఆరోగ్యంపై నిజనిజాలు! -
బ్యాంకులు, అప్పులవారి కన్నుపడని ఆర్థిక కానుక!
ప్రస్తుత రోజుల్లో కుటుంబ ఆర్థిక భద్రత కోసం టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడం ప్రతి ఒక్కరికీ అనివార్యంగా మారింది. అయితే, పాలసీదారుడు అకాల మరణం చెందితే ఆ బీమా పరిహారం నిజంగానే ఆయన భార్యాపిల్లలకు అందుతుందా? లేక పాలసీదారులకు ఉన్న అప్పులు, వ్యాపార బాధ్యతల కింద బ్యాంకులకు చెల్లుతుందా? ఈ ప్రశ్నకు చట్టపరమైన పరిష్కారమే ‘మ్యారీడ్ ఉమెన్స్ ప్రాపర్టీ (ఎండబ్ల్యూపీ) యాక్ట్, 1874’. దీని గురించి తెలుసుకుందాం.మనం టర్మ్ ఇన్సూరెన్స్ అప్లికేషన్ ఫారమ్ నింపే సమయంలో ‘I would like to buy this policy under Married Women’s Property Act’ అనే ఒక చెక్ బాక్స్ కనిపిస్తుంది. దీన్ని ఎంచుకోవడం వల్ల పాలసీ ద్వారా వచ్చే డెత్ బెనిఫిట్ (బీమా పరిహారం) పూర్తిగా ఒక ప్రత్యేక లీగల్ ట్రస్ట్‌గా మారుతుంది. 1874 నాటి ఈ చట్టం (సెక్షన్ 6) ప్రకారం, ఈ నిధులపై కేవలం భార్య, పిల్లలకు మాత్రమే సంపూర్ణ హక్కులు ఉంటాయి.ఎండబ్ల్యూపీ యాక్ట్‌తో లభించే ప్రయోజనాలుపాలసీదారుడి పేరు మీద గృహ రుణాలు, బిజినెస్ లోన్లు లేదా వ్యక్తిగత అప్పులు ఎంత ఉన్నప్పటికీ ఆయన మరణానంతరం బ్యాంకులు గానీ, అప్పు ఇచ్చినవారు గానీ ఈ బీమా సొమ్మును జప్తు చేయడానికి కోర్టుల ద్వారా కూడా వీల్లేదు.విల్లు లేదా ఇతర వారసత్వ వివాదాలతో సంబంధం లేకుండా ఇతర కుటుంబ సభ్యులు (Extended Family) ఈ సొమ్ముపై ఎలాంటి హక్కులు కోరలేరు. పరిహారం నేరుగా నామినేట్ చేసిన భార్యాపిల్లలకే చేరుతుంది.ఒకసారి పాలసీని ఎండబ్ల్యూపీ యాక్ట్ కింద తీసుకుంటే భవిష్యత్తులో పాలసీదారుడు కూడా లబ్ధిదారులను మార్చడానికి వీలుండదు. ఇది లబ్ధిదారుల హక్కును శాశ్వతంగా కాపాడుతుంది.ఎవరికి ఇది అత్యవసరం?ముఖ్యంగా సొంత వ్యాపారం చేసేవారు, భారీగా రుణాలు ఉన్న ఉద్యోగులు, ఉమ్మడి కుటుంబాల్లో నివసించేవారు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ఈ ఆప్షన్‌ను ఎంచుకోవడం శ్రేయస్కరం. అయితే.. టర్మ్ పాలసీ కొనుగోలు చేసేటప్పుడు మాత్రమే ఈ చెక్ బాక్స్‌ను ఎంచుకునే అవకాశం ఉంటుంది. ఒకసారి పాలసీ జారీ అయిన తర్వాత దీన్ని జోడించడం సాధ్యం కాదు. చిన్న అజాగ్రత్తతో కుటుంబ భవిష్యత్తును ప్రమాదంలో పడేయకుండా టర్మ్ పాలసీతో పాటు ఎండబ్ల్యూపీ యాక్ట్ ఆప్షన్‌ను ఎంచుకుని భార్యాపిల్లల ఆర్థిక స్వతంత్రతను కాపాడటం కుటుంబ పెద్ద బాధ్యత అని గమనించాలి.ఇదీ చదవండి: ట్రంప్ ఆరోగ్యంపై నిజనిజాలు! -
కేంద్ర బ్యాంకులు భయపడుతున్నాయ్: కియోసాకి
కృత్రిమ మేధ (AI) వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రపంచ కేంద్ర బ్యాంకుల విధాన నిర్ణయాలు మరింత క్లిష్టంగా మారుతున్నాయని ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన తన ఫేస్బుక్ ఖాతాలో చేసిన ఓ పోస్ట్‌లో బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ (BIS) నివేదికను ప్రస్తావిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.కేంద్ర బ్యాంకుల విధాన నిర్ణయాలను ఏఐ ప్రభావితం చేస్తోందని కియోసాకి పేర్కొన్నారు. జూలై 28న BIS విడుదల చేసిన విశ్లేషణలో.. ఏఐ ఒకేసారి ఆర్థిక వ్యవస్థలో డిమాండ్, సరఫరా రెండింటినీ ప్రభావితం చేయడం వల్ల సాధారణ ఆర్థిక సంకేతాలు స్పష్టత కోల్పోతున్నాయని ఆర్థికవేత్తలు పేర్కొన్నట్లు ఆయన వివరించారు. దీంతో ఆర్థిక వ్యవస్థలో అసలు పరిస్థితులను అంచనా వేయడం, దానికి అనుగుణంగా ద్రవ్య విధానాన్ని నిర్ణయించడం కేంద్ర బ్యాంకులకు కష్టతరమవుతోందని తెలిపారు.దీన్ని కియోసాకి తనదైన శైలిలో విశ్లేషించారు. కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచినా, తగ్గించినా వాటి ప్రభావం ఆర్థిక వ్యవస్థపై కనిపించడానికి కొంత సమయం పడుతుందని అన్నారు. అయితే ఏఐ వేగవంతమైన మార్పుల కారణంగా ఈ ‘లాగ్’ తగ్గిపోతోందని పేర్కొన్నారు. కేంద్ర బ్యాంకులు నిర్ణయం తీసుకునేలోపే ఏఐ కారణంగా మార్కెట్లు, వ్యాపార కార్యకలాపాలు వేగంగా మారిపోయే పరిస్థితి ఏర్పడుతోందని అభిప్రాయపడ్డారు.డేటా సెంటర్లు, చిప్‌లపై భారీ పెట్టుబడులు ఆర్థిక వ్యవస్థలో వేడి పెరుగుతోందన్న సంకేతాలుగా కనిపించవచ్చని, అయితే అవి భవిష్యత్ ఉత్పాదకతను పెంచే దీర్ఘకాలిక పెట్టుబడులు కూడా కావచ్చని కియోసాకి వివరించారు. అదే సమయంలో ఏఐ ద్వారా ఉత్పాదకత పెరగడం వల్ల ఆర్థిక వ్యవస్థలో ఉన్న డిమాండ్ ఒత్తిళ్లు బయటకు కనిపించకుండా పోయే అవకాశం ఉందన్నారు. ఫలితంగా ద్రవ్యోల్బణ పరిస్థితులను అంచనా వేయడం మరింత కష్టమవుతుందని పేర్కొన్నారు.భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల ప్రభావాన్ని కూడా ఏఐ కొంతమేర సమతుల్యం చేస్తోందని కియోసాకి అన్నారు. ముఖ్యంగా ఇరాన్ యుద్ధం కారణంగా ఇంధన ధరలు పెరిగినప్పటికీ, ఏఐ ఆధారిత పెట్టుబడులు, ఉత్పాదకత వంటి అంశాలు ఆ ప్రభావాన్ని కొంతమేర ఎదుర్కొంటున్నాయని ఆయన పేర్కొన్నారు.‘పాలసీ మిస్క్యాలిబ్రేషన్’ అంటే విధాన నిర్ణయాలు తప్పుగా ఉండే ప్రమాదం పెరగడమేనని కియోసాకి వ్యాఖ్యానించారు. కేంద్ర బ్యాంకులు ఆర్థిక వ్యవస్థను నియంత్రించేందుకు ఉపయోగించే కాలవ్యవధి, ఆలస్యం వంటి అంశాలపై ఏఐ ప్రభావం చూపుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.తన ‘రిచ్ డాడ్’ చెప్పిన మాటలను కూడా కియోసాకి ఈ సందర్భంగా గుర్తుచేశారు. డబ్బును నియంత్రించే వ్యక్తులకే అది ఎలా పనిచేస్తుందో అర్థం కాని పరిస్థితి ఏర్పడినప్పుడే అత్యంత ప్రమాదకరమైన ఆర్థిక సమయం మొదలవుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రపంచం అలాంటి దశలోనే ఉందేమోనని ఆయన సందేహం వ్యక్తం చేశారు. -
ఇన్వెస్టర్స్.. ఇవిగో న్యూ ఫండ్ ఆఫర్స్
నిర్దిష్ట యులిప్స్ ద్వారా దీర్ఘకాలికంగా పెట్టుబడుల అవకాశాలను అందించేలా ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కొత్తగా బీఎస్ఈ 500 మొమెంటం వేల్యూ 50 ఇండెక్స్ ఫండ్‌ని ప్రవేశపెట్టింది. ఇది ఆకర్షణీయమైన వేల్యూయేషన్స్తో పాటు సానుకూల మొమెంటం కూడా ఉన్న స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తుంది. మారే మార్కెట్ వేల్యుయేషన్స్, ట్రెండ్స్‌ని బట్టి ప్రతి మూడు నెలలకోసారి దీన్ని సమీక్షించి, పోర్ట్‌ఫోలియోలో మార్పులు చేర్పులు చేస్తారు.తద్వారా పెట్టుబడుల విషయంలో క్రమశిక్షణ పాటిస్తూనే దీర్ఘకాలికంగా ఈక్విటీల వృద్ధి ప్రయోజనాలను కూడా పొందేందుకు ఇన్వెస్టర్లకు ఇది ఉపయోగపడుతుందని సంస్థ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ మనీష్ కుమార్ తెలిపారు. బీఎస్ఈ 500లోని 50 వైవిధ్యమైన కంపెనీలను నిర్దిష్ట రూల్స్‌కి లోబడి ఈ ఫండ్ ఎంచుకుని ఇన్వెస్ట్ చేస్తుంది. దీన్ని ఐసీఐసీఐ ప్రూ స్మార్ట్‌కిడ్ అష్యూర్, సిగ్నేచర్ అష్యూర్, సిగ్నేచర్ ఆన్లైన్ తదితర యులిప్స్ పథకాలతో తీసుకోవచ్చు. 2026 జూన్ 30 నాటికి కంపెనీ నిర్వహణలో రూ. 3.34 లక్షల కోట్ల అసెట్స్ ఉన్నాయి.క్వాంటమ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్వివిధ మార్కెట్ క్యాప్‌లవ్యాప్తంగా స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసే ఫ్లెక్సీ క్యాప్ ఫండ్‌ను క్వాంటమ్ మ్యూచువల్ ఫండ్ ఆవిష్కరించింది. ఇది సెప్టెంబర్ 4 వరకు అందుబాటులో ఉంటుంది. బాటమ్–అప్ సెలెక్షన్ పద్ధతిలో ఎంపిక చేసిన లార్జ్, మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దీర్ఘకాలంలో పెట్టుబడి వృద్ధికి దోహదపడేలా ఈ ఫండ్ ఉంటుంది. వ్యాపార నాణ్యత, మేనేజ్మెంట్ సామర్థ్యాలు, నిలకడగా ఆదాయార్జన అవకాశాలు, కార్పొరేట్ గవర్నెన్స్‌లాంటి అంశాలను ఇందుకు ప్రాతిపదికగా ఉంటాయి. సముచితమైన ధరకు లభిస్తూ, వృద్ధి చెందే అవకాశాలు ఉన్న స్టాక్స్‌పై ఇది దృష్టి పెడుతుంది. సీఐవో చిరాగ్ మెహతా, ఫండ్ మేనేజర్ కేతన్ గుజరాతీ దీన్ని నిర్వహిస్తారు. కనీసం రూ. 500 నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు. -
11న బ్యాంకుల సమ్మె.. నాలుగు రోజులు బంద్!
దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సేవలకు మరోసారి అంతరాయం ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. ఐదు రోజుల బ్యాంకింగ్ విధానం అమలులో జాప్యం, పనితీరు ఆధారిత ప్రోత్సాహక పథకం (PLI)పై విభేదాలు, పెన్షన్‌కు సంబంధించిన డిమాండ్లు పరిష్కారం కాకపోవడాన్ని నిరసిస్తూ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) సెప్టెంబర్ 11న దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది. సమ్మె అమల్లోకి వస్తే ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల శాఖల కార్యకలాపాలపై ప్రభావం పడే అవకాశం ఉంది.నాలుగు రోజుల పాటు ప్రభావం?సెప్టెంబర్ 11 శుక్రవారం. ఆ తర్వాత సెప్టెంబర్ 12 రెండో శనివారం, 13 ఆదివారం కావడంతో బ్యాంకింగ్ సేవలకు వరుసగా అంతరాయం ఏర్పడొచ్చు. మరోవైపు సెప్టెంబర్ 14న గణేశ్ చతుర్థి సందర్భంగా కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు ఉంది. దీంతో ఆయా ప్రాంతాల్లో బ్యాంకు శాఖలు వరుసగా నాలుగు రోజులపాటు మూసి ఉండే పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది.సెప్టెంబర్‌లో మరో భారీ సమ్మెసెప్టెంబర్ 11తో ఆందోళన ఆగదని యూనియన్స్ ఫోరం స్పష్టం చేసింది. డిమాండ్లపై పురోగతి లేకపోతే సెప్టెంబర్ 28 నుంచి మూడు రోజుల దేశవ్యాప్త సమ్మెకు దిగుతామని ప్రకటించింది. ఈ సమ్మె సెప్టెంబర్ 28–30 తేదీల్లో జరగనుంది. సెప్టెంబర్ 28న అర్ధవార్షిక ముగింపు కార్యకలాపాలు ఉండటం వల్ల బ్యాంకింగ్ రంగంపై దీని ప్రభావం మరింత ఎక్కువగా ఉండొచ్చని యూనియన్లు భావిస్తున్నాయి. ఇక డిమాండ్లు పరిష్కారం కాకపోతే అక్టోబర్ 26 నుంచి నిరవధిక సమ్మెకు వెళ్లాలని యూనియన్స్ ఫోరం నిర్ణయించింది.ఖాతాదారులు ఏం చేయాలి?సెప్టెంబర్‌లో వరుస సమ్మె పిలుపుల నేపథ్యంలో చెక్కులు, నగదు లావాదేవీలు, బ్యాంకు శాఖల్లో చేయాల్సిన ఇతర అత్యవసర పనులను ముందుగానే పూర్తి చేసుకోవడం మంచిది. అయితే UPI, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, ఏటీఎం వంటి డిజిటల్ సేవలు సాధారణంగా బ్యాంకుల సమ్మె ఉన్నప్పటికీ పనిచేసే అవకాశం ఉంటుంది. అత్యవసర లావాదేవీల కోసం ఖాతాదారులు ప్రత్యామ్నాయ డిజిటల్ మార్గాలను సిద్ధంగా ఉంచుకోవడం మంచిది.ఇదీ చదవండి: ఈ వారం బ్యాంకులకు సెలవులు.. 4 రోజులు బంద్! -
Income Tax: రిటర్నులు వేశాక ఏం చేయాలి..
2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను 2026 జూలై 31 గడువు లోపలే ఆదాయపు పన్ను రిటర్నులు వేసినందుకు సంతోషం. ఒక పెద్ద పని అయిపోయింది. నిజమే..ఒక పెద్ద బాధ్యత నెరవేర్చినట్లే. అయితే, ‘‘ఇల్లు అలకగానే పండుగ కాదు’’ అనే పాతకాలం సామెతలాగా, ఫైల్ చేయడం పూర్తయిపోయినా.. ఇంకా చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయి. యువకిశోరం అర్జున్ జూలైలో గడువు ముగిసేలోగానే ఫారంని క్లిక్ చేసి, సబ్మిట్ చేసేశాడు. కానీ, పాన్, ఆధార్ కార్డుతో అనుసంధానం కాకపోవడం వల్ల ఫారం V మీద సంతకం పెట్టి, బెంగళూరులో అధికారులకు పంపడం మాత్రం మరిచిపోయాడు. 30 రోజుల్లోపల ‘వేలిడేట్’ చేయకపోవడం వల్ల రిటర్ను చెల్లదు. డిఫెక్టివ్ రిటర్న్ అవుతుంది.రిటర్న్ వేయటానికి ముందే పాన్, ఆధార్ లింక్ చేసుకోవాలి. లేదా కనీసం రిటర్న్ వేసిన వెంటనే లింక్ చేసి, ఓటీపీ ద్వారా రిటర్నులను ‘వేలిడేట్’ చేసుకోవచ్చు. ఏదైనా సాంకేతిక కారణాల వల్ల జాప్యం అయితే, వెంటనే ఫారం V.. అంటే ’అక్నాలెడ్జ్మెంట్’ను స్వయంగా సంతకం పెట్టి, ఆ కాగితాన్ని బెంగళూరుకు పంపాలి. 30లోపల వారికి అందాలి. ఫారం Vలో అన్ని వివరాలు స్పష్టంగా ఉన్నాయి. ఇలా ‘వెరిఫికేషన్’ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయండి.నెట్ బ్యాంకింగ్ ద్వారా ఎల్రక్టానిక్గా వేలిడేట్ చేసుకోవచ్చు. బ్యాంకు అకౌంటుని ముందుగానే తెలియజేసి, తద్వారా కూడా వేలిడేట్ చేయొచ్చు. డీమ్యాట్ ద్వారా ఒక మార్గం. ఇక పాన్–ఆధార్ అనుసంధానం మంచి మార్గం. ఇవీ కాకుంటే ఫారం Vని సంతకం పెట్టి పోస్ట్ చేయడం మరో మార్గం.వెరిఫై అయితేనే ప్రాసెసింగ్.. రిటర్ను వేసినప్పటి నుంచి ఘడియలు లెక్కపెడతారు కొందరు .. రిఫండు కోసం. రిఫండు ఇంకా రాలేదని వాపోతారు మరికొంత మంది. వెరిఫై అయిన తర్వాతే మొదలవుతుంది అసెస్మెంటు. అంతవరకూ ముట్టుకోరు. ఏవైనా తప్పులు దొర్లాయా.. గడువు తేదీ నాడు వేసేయాలన్న తొందరలో ఏవైనా తప్పులు దొర్లాయా? ఏదైనా ఆదాయం మరచిపోయారా? టీడీఎస్ తక్కువ జమ అయిందా.. ఆదాయ వర్గీకరణలో తప్పు జరిగిందా.. మీ యజమానికి లెక్కల్లో పొరపాట్లు ఏర్పడ్డాయా.. క్యాపిటల్ గెయిన్స్ లెక్కల్లో తప్పులు దొరికాయా.. ఇలాంటి ఎన్నో పరిస్థితులు ఏర్పడితే గాభరాపడొద్దు. మీరు మీ రిటర్నులను రివైజ్ చేసుకోవచ్చు.ఒక ఉదాహరణ.. ప్రాక్టికల్ కేసు. ఒక అసెస్సీ బ్యాంకులో జూలై 31నాడు సెల్ఫ్ అసెస్మెంట్ చలానాలను ఉదయం 10 గంటలకు బ్యాంకులో జమచేశారు. కానీ సాయంకాలం రికార్డులలో అప్డేట్ కాలేదు. అయితే అన్ని వివరాలను పొందుపరుస్తూ, చలాన్ చెల్లించినట్లు రిటర్న్ వేసేశారు. దీని వల్ల లేటు ఫీజు పడలేదు. ఆగస్టు 1నాడు రికార్డుల్లో అప్డేట్ అయిన తర్వాత రిటర్న్ రివైజ్ చేసి, దాఖలు చేశారు. ఎలాంటి అదనపు ఖర్చు లేదు. రివైజ్ చేయడం వల్ల పన్ను భారం పెరిగితే దాన్ని చెల్లించాలి. ఇందుకు గడువు తేది 2026 డిసెంబర్ 31. ఇక డిపార్టుమెంటు వారి వంతు. బంతి వారి చేతిలో ఉంది. వారు ప్రాసెసింగ్ మొదలుపెట్టి, ఆర్డర్లు పాస్ చేస్తారు. ఈ విషయాన్ని తెలిపే ఆర్డరు/వర్తమానం.. పాత చట్టం ప్రకారం 143 (1).. కొత్త చట్టంలో 270 (1) కింద వస్తుంది. వారానికొకసారి మీరు పోర్టల్‌లో ఈ సమాచారం కోసం ఎదురుచూడండి. ముందుగా మీకు మెసేజ్ వస్తుంది. ఈ సమాచారంలో ప్రాసెసింగ్ పూర్తి అయ్యిందని, సమాచారం పంపుతామని ఉంటుంది. అలా అన్న వెంటనే పంపరు కానీ.. తొందరలోనే వస్తుంది.ఇప్పుడేం చేయాలి.. మీరు వేసిన రిటర్నుల్లో ఆదాయం, పన్ను భారంలో ఎలాంటి తేడాలు లేకపోతే, మీరు వేసిన దానితో సమ్మతిస్తున్నట్లు చెప్తారు. పన్నుభారం కన్నా ఎక్కువ పన్ను చెల్లిస్తే మీకు రిఫండు ఇస్తారు. రిఫండు తగ్గొచ్చు, పెరగవచ్చు. అయితే ప్రతి మార్పుకి/తేడాకి వివరణ ఇస్తారు. ఆదాయంలో మార్పులు రావొచ్చు. లెక్కింపుల్లో తప్పులు రావొచ్చు. పన్ను భారం మారవచ్చు. చెల్లించిన పన్నుల ఎంట్రీలు పూర్తిగా ఉండకపోవచ్చు. ఆ మేరకు లెక్కలు మారవచ్చు.ఏయే మార్పులు వచ్చాయో వాటిని గమనించండి. వాటిని విశ్లేషించండి. అవి తప్పనిపిస్తే వాటితో విభేదించండి. అయితే, ప్రతి దానికి, వివరణ, సంజాయిషీ ఉండాలి. రిఫండు వస్తే సంతోషం. లేదా కారణాలను విశ్లేషించండి. సరైన జవాబు ఇవ్వండి. దీనితో ఈ కథ ముగిసినట్లే. కథ కంచికి. మనం ఇంటికి. అంతటితో ఆ కథకు ముగింపు పలికి, ప్రస్తుతం నడుస్తున్న ఆర్థిక సంవత్సరం గురించి ఆలోచిద్దాం. -
తల్లిదండ్రులకు అలర్ట్.. పిల్లల ఆధార్‌పై బిగ్ అప్డేట్!
పిల్లలకు ఆధార్ కార్డు ఉంది అంటే.. మాత్రమే సరిపోదు. వాళ్లు పెరుగుతున్న కొద్దీ.. ఆధార్‌లోని బయోమెట్రిక్ వివరాలను కూడా తప్పకుండా అప్డేట్ చేయాలి. చిన్న పిల్లలకు ఆధార్ తీసుకునే సమయంలో వేలిముద్రలు, కంటి ఐరిస్ వివరాలు నమోదు చేయరు. కాబట్టి, పిల్లలకు 5 ఏళ్లు వచ్చిన తర్వాత వీటిని అప్డేట్ చేయడం తప్పనిసరి.ఇటీవల యూఐడీఏఐ దేశవ్యాప్తంగా చేపట్టిన ప్రత్యేక కార్యక్రమంలో 2 కోట్లకు పైగా మాండేటరీ బయోమెట్రిక్ అప్డేట్స్ (MBU) పూర్తయ్యాయి. 2025 సెప్టెంబర్‌లో ప్రారంభమైన ఈ కార్యక్రమం ద్వారా 1.56 లక్షలకు పైగా పాఠశాలలను కూడా కవర్ చేశారు.MBU అంటే ఏంటి?చిన్న పిల్లలకు ఆధార్ నమోదు చేసేటప్పుడు సాధారణంగా వారి పేరు, పుట్టిన తేదీ, చిరునామా వంటి వివరాలతో పాటు ఫొటో తీసుకుంటారు. కానీ.. ఐదేళ్లలోపు పిల్లల వేలిముద్రలు, ఐరిస్ వివరాలను నమోదు చేయరు. పిల్లలు పెరిగే కొద్దీ వారి బయోమెట్రిక్ వివరాలను ఆధార్‌లో చేర్చాల్సి ఉంటుంది. దీనినే మాండేటరీ బయోమెట్రిక్ అప్డేట్స్ అంటారు.పిల్లలకు ప్రధానంగా రెండుసార్లు బయోమెట్రిక్ అప్డేట్ చేయాలి. మొదట 5 ఏళ్లు పూర్తయిన తర్వాత, రెండోసారి 15 ఏళ్లు పూర్తయిన తర్వాత అప్డేట్ చేయాలి. ఈ సమయంలో వేలిముద్రలు, ఐరిస్ స్కాన్‌తో పాటు లేటెస్ట్ ఫొటోను కూడా ఆధార్‌లో అప్డేట్ చేస్తారు.పిల్లలకు ఉచితమేనా?ప్రస్తుతం 5 నుంచి 17 ఏళ్ల మధ్య ఉన్న పిల్లలకు బయోమెట్రిక్ అప్డేట్పై ఫీజు మినహాయింపు ఉంది. 2026 సెప్టెంబర్ 30 వరకు వర్తించే నిబంధనల ప్రకారం ఈ అప్డేట్ను ఉచితంగా చేసుకోవచ్చు.2025 అక్టోబర్ 1 నుంచి 7-15 ఏళ్ల పిల్లలకు MBU ఛార్జీలను ఒక సంవత్సరం పాటు యూఐడీఏఐ మాఫీ చేసింది. 5-7 ఏళ్లు, 15-17 ఏళ్ల పిల్లలకు కూడా MBU ఉచితంగానే కొనసాగుతోంది. కాబట్టి.. ప్రస్తుతం అర్హత ఉన్న పిల్లల తల్లిదండ్రులు బయోమెట్రిక్ అప్డేట్ కోసం అదనంగా డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు.అప్డేట్ చేయకపోతే ఇబ్బందులు వస్తాయా?పిల్లల ఆధార్ బయోమెట్రిక్ వివరాలు అప్డేట్ చేయకపోతే భవిష్యత్తులో కొన్ని సందర్భాల్లో అథెంటికేషన్ సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది.ఉదాహరణకు ప్రభుత్వ పథకాలు, స్కాలర్షిప్లు, విద్యకు సంబంధించిన సేవలు, అలాగే NEET, JEE, CUET వంటి పరీక్షల సమయంలో ఆధార్ ఆధారిత గుర్తింపు అవసరం కావచ్చు. కేవైసీ వంటి ఇతర సేవల్లోనూ ఆధార్ అథెంటికేషన్ ఉపయోగిస్తారు. పిల్లలు పెరిగిన తర్వాత పాత బయోమెట్రిక్ వివరాలతో అథెంటికేషన్ చేయడంలో సమస్యలు రాకుండా ఉండేందుకు సరైన సమయంలో MBU చేయించడం మంచిది.ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ ఎలా చేయాలి?➤ఈ ప్రక్రియను పూర్తిగా ఆన్లైన్లో చేయలేరు. పిల్లలను తప్పనిసరిగా ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్‌కు తీసుకెళ్లాలి.➤కాబట్టి.. ముందుగా సమీపంలోని ఆధార్ కేంద్రాన్ని గుర్తించాలి. దీనికోసం భువన్ ఆధార్ పోర్టల్ ఉపయోగించవచ్చు. ➤కేంద్రానికి వెళ్లేటప్పుడు పిల్లల ఆధార్ నెంబర్‌ను వెంట తీసుకెళ్లడం మంచిది. ➤అక్కడ పిల్లల వేలిముద్రలు, ఐరిస్ స్కాన్, ఫొటో తీసుకుంటారు.అప్డేట్ స్టేటస్ ఎలా చెక్ చేయాలి?బయోమెట్రిక్ అప్డేట్ చేసిన వెంటనే ఆధార్‌లో మార్పులు కనిపించకపోవచ్చు. సాధారణంగా కొన్ని వారాల సమయం పట్టవచ్చు. కాబట్టి.. యూఆర్ఎన్ నెంబర్ ఉపయోగించి యూఐడీఏఐ వెబ్సైట్లో అప్డేట్ స్టేటస్‌ను చెక్ చేసుకోవచ్చు.ఇదీ చదవండి: PF విత్‌డ్రా చేస్తే ట్యాక్స్ పడుతుందా? -
PF విత్‌డ్రా చేస్తే ట్యాక్స్ పడుతుందా?
పీఎఫ్ (PF) డబ్బు అంటే.. ఉద్యోగులకు భవిష్యత్ అవసరాల కోసం ఉపయోగపడే ముఖ్యమైన పొదుపు. అందుకే, చాలా మంది పీఎఫ్ బ్యాలెన్స్‌ను పూర్తిగా సురక్షితమైనదిగా భావిస్తుంటారు. అయితే.. పీఎఫ్ మొత్తాన్ని ఎప్పుడు పడితే అప్పుడు విత్‌డ్రా చేసుకుంటే మాత్రం పన్ను నిబంధనలు వర్తించే అవకాశం ఉంది. ముఖ్యంగా మీరు ఎంతకాలం ఉద్యోగంలో కొనసాగారు?, పీఎఫ్‌ను ఎప్పుడు విత్‌డ్రా చేస్తున్నారు? అనే అంశాలపై ట్యాక్స్ ఆధారపడి ఉంటుంది.ఐదేళ్లలోపు పీఎఫ్ విత్‌డ్రా చేస్తే..మీరు ఒకే సంస్థలో లేదా వేర్వేరు సంస్థల్లో కలిపి ఐదేళ్ల నిరంతర సర్వీస్ పూర్తి చేయకముందే పీఎఫ్ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకుంటే, కొన్ని సందర్భాల్లో ఆ మొత్తం పన్ను పరిధిలోకి వస్తుంది.ఉదాహరణకు.. మీరు ఒక కంపెనీలో మూడేళ్లు పనిచేసి, తర్వాత మరో కంపెనీకి మారారని అనుకుందాం. మొదటి కంపెనీ పీఎఫ్‌ను రెండో కంపెనీ పీఎఫ్ ఖాతాకు ట్రాన్స్ఫర్ చేస్తే, ఈ సర్వీస్ కాలం సాధారణంగా కొనసాగింపుగానే పరిగణిస్తారు. కాబట్టి కంపెనీ మారినంత మాత్రాన ఐదేళ్ల సర్వీస్ మళ్లీ మొదటి నుంచి లెక్కించరు. కానీ.. ఐదేళ్లు పూర్తికాకముందే పీఎఫ్‌ను విత్‌డ్రా చేస్తే ట్యాక్స్ నిబంధనలు వర్తించవచ్చు.TDS కూడా కట్ అవుతుందిఐదేళ్ల సర్వీస్ పూర్తి కాకముందే పీఎఫ్ విత్‌డ్రా చేసినప్పుడు, కొన్ని పరిస్థితుల్లో టీడీఎస్ కూడా కట్ అయ్యే అవకాశం ఉంది. పాన్ వివరాలు అందుబాటులో ఉంటే.. సాధారణంగా 10 శాతం టీడీఎస్ వర్తించే అవకాశం ఉంటుంది. పాన్ ఇవ్వకపోతే ఎక్కువ రేటుతో టీడీఎస్ కట్ అవుతుంది. అందుకే.. పీఎఫ్ విత్‌డ్రా చేసే ముందు మీ పాన్ వివరాలు యూఏఎన్ ఖాతాలో సరిగ్గా అప్డేట్ అయ్యాయా లేదా చూసుకోవడం మంచిది.ఐదేళ్లు పూర్తయితే ట్యాక్స్ ఉండదా?సాధారణంగా ఐదేళ్లు ఉద్యోగం పూర్తయిన తర్వాత పీఎఫ్ విత్‌డ్రా చేసుకుంటే.. పన్ను మినహాయింపు లభిస్తుంది. ఉద్యోగం మారినప్పుడు పీఎఫ్‌ను కొత్త ఖాతాకు ట్రాన్స్ఫర్ చేసుకుంటూ వెళ్తే సర్వీస్ కొనసాగింపును కాపాడుకోవచ్చు. అందుకే అత్యవసరం లేకపోతే కేవలం ఉద్యోగం మారిన కారణంతో పీఎఫ్ మొత్తాన్ని వెంటనే విత్‌డ్రా చేసుకోవడం కంటే, కొత్త ఉద్యోగంలోని పీఎఫ్ ఖాతాకు ట్రాన్స్ఫర్ చేయడం ప్రయోజనకరంగా ఉండొచ్చు.మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఒక ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగి వాటా రూ.2.5 లక్షల కంటే ఎక్కువ ఉంటే, అదనపు మొత్తంలో వచ్చే వడ్డీపై పన్ను విధిస్తారు. అందువల్ల పెద్ద జీతాలు పొందే ఉద్యోగులు, ఎక్కువ మొత్తంలో పీఎఫ్ కాంట్రిబ్యూషన్ చేసే వారు తమ పీఎఫ్ స్టేట్మెంట్లో కాంట్రిబ్యూషన్, వడ్డీ వివరాలను గమనించడం మంచిది.ఫారమ్ 15G, 15H ఎప్పుడు ఉపయోగపడతాయి?కొన్ని సందర్భాల్లో ఫారమ్ 15G లేదా ఫారమ్ 15H సమర్పించడం ద్వారా టీడీఎస్ కట్ కాకుండా చూసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఈ ఫారాలను ప్రతి ఒక్కరూ ఇవ్వలేరు. ఆదాయం, వయస్సు, పన్ను బాధ్యత వంటి అర్హతలను బట్టి ఇవి వర్తిస్తాయి. అందుకే పెద్ద మొత్తంలో పీఎఫ్ విత్‌డ్రా చేయబోతున్నవారు ముందుగా తమ పన్ను పరిస్థితిని పరిశీలించడం మంచిది.ఇదీ చదవండి: EPFO బిగ్ అప్డేట్.. ఉద్యోగులకు గుడ్‌న్యూస్! -
డాలర్లు వస్తున్నాయ్.. జాగ్రత్త!
అమెరికా మరోసారి క్వాంటిటేటివ్ ఈజింగ్ (QE) పేరుతో డాలర్లను ముద్రించేందుకు సిద్ధమవుతోందని ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ రచయిత రాబర్ట్ కియోసాకి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన తన ఎక్స్ (X) ఖాతాలో ఓ పోస్ట్ చేశారు. అమెరికా ట్రెజరీ తీసుకునే ఇలాంటి చర్యలతో డాలర్ కొనుగోలు శక్తిని సూచించే డీఎక్స్‌వై (DXY) సూచీ పడిపోతుందని, ఫలితంగా ద్రవ్యోల్బణం పెరుగుతుందని ఆయన వ్యాఖ్యానించారు.డాలర్లలో పొదుపు చేసుకునే వారే అధికంగా నష్టపోతారని కియోసాకి హెచ్చరించారు. ఆర్థికంగా అవగాహన ఉన్న పెట్టుబడిదారులు విలువ పెరిగే బంగారం, వెండి, బిట్‌కాయిన్, కొంత రియల్ ఎస్టేట్ వంటి ఆస్తుల్లో పెట్టుబడులు పెట్టి సంపదను పెంచుకుంటారని చెప్పారు. ఆర్థిక పరిజ్ఞానం లేని వారు విలువ కోల్పోయే ఆస్తుల్లో పెట్టుబడులు పెట్టి నష్టపోతారని పేర్కొన్నారు.ఇదీ చదవండి: బంగారం భారీ ధరలు.. కియోసాకి కామెంట్స్‘ఆర్థిక విద్య ఖరీదైనదని మీరు భావిస్తే.. ఆర్థిక అజ్ఞానానికి చెల్లించే మూల్యం ఎంత?’ అని గతంలో తాను చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా కియోసాకి గుర్తుచేశారు. ఆర్థిక విద్య కోసం వెచ్చించే సమయం, డబ్బు కంటే.. ఆర్థిక అవగాహన లేకపోవడం వల్ల సంపాదించలేని డబ్బే అతిపెద్ద ఖర్చు అని తన ‘రిచ్ డాడ్’ చెప్పేవారని ఆయన పేర్కొన్నారు.PRINTING MORE FAKE $US Treasury announces another round of QE (Quantatative Easing) aka printing fake $.DXY (index of purchasing power of dollars) CRASHES, which means INFLATION Booms….which means savers of fake $ are the biggest losers.Don’t be a Loser.As stated in my…— Robert Kiyosaki (@theRealKiyosaki) August 22, 2026 -
ఈ వారం బ్యాంకులకు సెలవులు.. 4 రోజులు బంద్!
దేశ ప్రజల దైనందిన జీవితంలో బ్యాంకులు భాగమైపోయాయి. ఏదో ఒక పని నిమిత్తం బ్యాంకులకు వెళ్లాల్సిన అవసరం చాలా మందికి వస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో బ్యాంకుల పనిదినాలు, సెలవుల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ వారం ఆగస్టు 24 నుంచి 30 వరకు దేశంలోని పలు రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవులు ఉండనున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) హాలిడే క్యాలెండర్ ప్రకారం ఈ వారంలో ప్రాంతీయ పండుగలు, ప్రత్యేక సందర్భాల కారణంగా కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకు శాఖలు మూతపడనున్నాయి. సాధారణ పనిదినాల్లో బ్యాంకులు యథావిధిగా పనిచేస్తాయి.ఈ వారం బ్యాంకు సెలవులుఆగస్టు 25, మంగళవారం: మిలాద్-ఉన్-నబీ, మిలాద్-ఇ-షెరీఫ్ సందర్భంగా కేరళ, ఆంధ్రప్రదేశ్‌లో బ్యాంకులకు సెలవు ఉంటుంది. కేరళలో తొలి ఓణం వేడుకల కారణంగానూ బ్యాంకు శాఖలు మూసి ఉంటాయి.ఆగస్టు 26, బుధవారం: ఈద్-ఎ-మిలాద్, బరావాఫత్, మిలాద్-ఉన్-నబీ, తిరుఓణం వేడుకల కారణంగా మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఉత్తరాఖండ్, తెలంగాణ, మణిపూర్, జమ్మూకశ్మీర్, ఉత్తరప్రదేశ్, కేరళ, ఢిల్లీ, బిహార్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు ఉంటుంది.ఆగస్టు 28, శుక్రవారం: రక్షా బంధన్ సందర్భంగా గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, రాజస్థాన్, జమ్మూకశ్మీర్, ఉత్తరప్రదేశ్, కేరళ, హిమాచల్‌ప్రదేశ్‌లోని బ్యాంకులకు సెలవు ఉంటుంది.ఆగస్టు 30, ఆదివారం: దేశవ్యాప్తంగా బ్యాంకులకు సాధారణ వారాంతపు సెలవు ఉంటుంది. కాగా, ఆగస్టు 29 శనివారం కావడంతో ఆ రోజు బ్యాంకులు సాధారణంగా తెరిచి ఉంటాయి.అందుబాటులో డిజిటల్ బ్యాంకింగ్ సేవలుబ్యాంకు సెలవు రోజుల్లో భౌతిక శాఖల్లో సేవలు అందుబాటులో ఉండవు. అయితే డిజిటల్ బ్యాంకింగ్ సేవలను వినియోగదారులు యథావిధిగా పొందవచ్చు. ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ, ఏటీఎం వంటి సేవలు సాధారణంగా 24 గంటలూ అందుబాటులో ఉంటాయి. అలాగే ఎన్ఈఎఫ్టీ, ఆర్టీజీఎస్ వంటి ఆన్లైన్ లావాదేవీ సేవలను కూడా వినియోగించుకోవచ్చు.ఇదీ చదవండి: బాండ్లు అమ్మేయండి.. బంగారం కొనేయండి: బిలియనీర్ ఇన్వెస్టర్ హెచ్చరిక.. సూచన -
EPFO బిగ్ అప్డేట్.. ఉద్యోగులకు గుడ్‌న్యూస్!
ఉద్యోగుల భవిష్యత్ భద్రత కోసం ఈపీఎఫ్(ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్) చాలా అవసరం. ఎందుకంటే.. ప్రతి నెల జీతం నుంచి కొంత మొత్తం పీఎఫ్ ఖాతాలో జమ అవుతూ, ఉద్యోగి రిటైర్ అయినప్పుడు, లేదా అవసరమైన సమయంలో ఈ మొత్తం ఆర్థికంగా ఎంతో ఉపయోగపడుతుంది. అయితే.. కొన్ని సందర్భాల్లో అర్హత ఉన్న ఉద్యోగులు ఈపీఎఫ్ పరిధిలోకి రాకుండా ఉండిపోయారు. ఇలాంటి వారికి ఇప్పుడు EPFO ఒక ప్రత్యేక అవకాశాన్ని కల్పిస్తోంది. అదే ఎంప్లాయీస్ ఎన్రోల్మెంట్ క్యాంపెయిన్ 2026 (EEC 2026).EEC 2026 ఉద్దేశంగతంలో ఈపీఎఫ్ కవరేజీకి దూరంగా ఉన్న అర్హులైన ఉద్యోగులను తిరిగి ఈపీఎఫ్ పరిధిలోకి తీసుకురావడమే ఈ క్యాంపెయిన్ ప్రధాన ఉద్దేశం. అంటే.. తమ సంస్థలో అర్హత ఉన్నప్పటికీ ఈపీఎఫ్‌లో నమోదు కాని ఉద్యోగులు.. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు.ఎప్పటి వరకు అవకాశం2026 జూన్ 29 నుంచి ఈ క్యాంపెయిన్ అమల్లోకి వచ్చింది. అక్టోబర్ 31, 2026 వరకు అర్హత ఉన్న ఉద్యోగులను నమోదు చేసుకోవచ్చు. అయితే.. సంస్థలు చివరి తేదీ వరకు వేచి ఉండకుండా, తమ ఉద్యోగుల రికార్డులను ముందుగానే పరిశీలించుకోవాలని ఈపీఎఫ్ఓ సూచించింది.ఎవరు అర్హులు?ఈపీఎఫ్ పరిధిలోకి రావాల్సి ఉన్నప్పటికీ.. గతంలో నమోదు కాని ఉద్యోగులను ఈ క్యాంపెయిన్ ద్వారా చేర్చుకోవచ్చు. అయితే కొన్ని షరతులు ఉన్నాయి. ముఖ్యంగా.. యజమాని ఉద్యోగిని డిక్లేర్ చేసే తేదీకి ఆ ఉద్యోగి జీవించి ఉండటంతో పాటు, అదే సంస్థలో ఉద్యోగం చేస్తూ ఉండాలి. అలాగే ఈఈసీ 2026 కింద నిర్దేశించిన ఇతర నిబంధనలను కూడా పాటించాల్సి ఉంటుంది.ఉద్యోగులకు ప్రయోజనం ఏమిటి?ఒక ఉద్యోగి EPFలో చేరితే భవిష్యత్తు కోసం పొదుపు మాత్రమే కాకుండా, నిబంధనలకు అనుగుణంగా పెన్షన్, ఇన్సూరెన్స్ వంటి సామాజిక భద్రతా ప్రయోజనాలు కూడా లభించే అవకాశం ఉంటుంది.ప్రతి ఉద్యోగి ఉమాంగ్ (UMANG) యాప్ ద్వారా ఫేస్ అథెంటికేషన్ ఆధారిత యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN)ను రూపొందించాలి. ఆ తరువాత తరఫున ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్లను ఎలక్ట్రానిక్ చలాన్ కమ్ రిటర్న్ (ECR) ద్వారా చెల్లించాలి.యజమానులు ఏం చేయాలి?సంస్థలు ముందుగా తమ ఉద్యోగుల వివరాలను పరిశీలించాలి. ముఖ్యంగా గతంలో EPFలో నమోదు కాకుండా మిగిలిపోయిన అర్హులైన ఉద్యోగులు ఎవరైనా ఉన్నారా? అనే విషయాన్ని గుర్తించాలి. దీని కోసం ఉద్యోగుల జీతాల రికార్డులు, ఎంప్లాయ్మెంట్ వివరాలు, EPF రికార్డులను పరిశీలించడం అవసరం. అర్హత ఉన్న ఉద్యోగులు కనిపిస్తే EEC 2026 కింద అవసరమైన ప్రక్రియను పూర్తి చేయాలి.ఇదీ చదవండి: పసిడి ప్రియులకు షాక్.. భారమైపోతున్న బంగారం! -
బ్యాంక్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్!
డిజిటల్ చెల్లింపులు, యూపీఐ, నెట్ బ్యాంకింగ్ వంటి సౌకర్యాలు అందుబాటులోకి వచ్చినప్పటికీ.. బ్యాంక్ చెక్కుల వినియోగం మాత్రం పూర్తిగా తగ్గలేదు. ముఖ్యంగా వ్యాపార లావాదేవీలు, ఆస్తుల కొనుగోలు, లేదా పెద్ద మొత్తాల చెల్లింపుల కోసం ఇప్పటికీ చెక్కులను ఉపయోగిస్తున్నారు. దీంతో.. చెక్కుల భద్రతపై బ్యాంకులు మరింత దృష్టి పెడుతున్నాయి. ఇందులో భాగంగానే కొత్త భద్రతలను ప్రవేశపెడుతున్నాయి.చెక్కుల్లో కొత్త భద్రతలు ఎందుకు?చెక్కుల ద్వారా జరిగే మోసాలను తగ్గించేందుకు బ్యాంకులు కొత్త భద్రతా విధానాలను ప్రవేశపెడుతున్నాయి. చెక్కును మార్చడం, నకిలీ చెక్కులు ఉపయోగించడం వంటి మోసాలను అరికట్టేందుకు ప్రత్యేక కోడ్లు, ఇతర భద్రతలను చేర్చుతున్నారు.ఉదాహరణకు.. బ్యాంక్ ఆఫ్ ఇండియా (BOI) కొత్త చెక్ లీఫ్లపై అక్షరాలు, సంఖ్యల కలయికతో కూడిన అల్ఫాన్యూమరిక్ కోడ్‌ను ప్రవేశపెట్టింది. ఈ కోడ్ ద్వారా చెక్‌ను సులభంగా గుర్తించడంతో పాటు, దాని వివరాలను ధృవీకరించడంలో బ్యాంకుకు సహాయం అవుతుంది.అల్ఫాన్యూమరిక్ కోడ్ అంటే ఏమిటి?అల్ఫాన్యూమరిక్ కోడ్ అంటే.. అక్షరాలు, సంఖ్యలు కలిపి ఉండే ఒక ప్రత్యేక గుర్తింపు కోడ్. ఇది చెక్ లీఫ్‌ను గుర్తించడానికి, చెక్ క్లియరింగ్ సమయంలో ధృవీకరణను మరింత బలోపేతం చేయడానికి ఉపయోగపడుతుంది. పాత చెక్బుక్లో ఈ కోడ్ లేనప్పటికీ చెల్లుబాటు అవుతాయి. అయితే.. ప్రతి బ్యాంకు దీనికి సంబంధించి తన ఖాతాదారులకు వేర్వేరు సూచనలు ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా సందేహం ఉంటే.. మీ బ్యాంకు ద్వారా అధికారిక సమాచారం తెలుసుకోవడం మంచిది.ఆర్బీఐ తీసుకుంటున్న చర్యలుచెక్కుల క్లియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) చెక్ ట్రంకేషన్ సిస్టమ్(CTS)ను అమలు చేస్తోంది. ఈ విధానంలో చెక్‌ను ఫిజికల్‌గా ఒక బ్యాంకు నుంచి మరొక బ్యాంకుకు పంపకుండా.. చెక్ ఎలక్ట్రానిక్ ఇమేజ్, అవసరమైన సమాచారాన్ని చెల్లింపు బ్యాంకుకు పంపిస్తారు. దీంతో చెక్ క్లియరింగ్ ప్రక్రియ వేగంగా, సురక్షితంగా జరుగుతుంది.డిసెంబర్ 31, 2026 గడువుఅల్ఫాన్యూమరిక్ కోడ్ లేని కొన్ని చెక్కులకు, ముఖ్యంగా రూ.50,000 లేదా అంతకంటే ఎక్కువ విలువైన చెక్కులకు, 2026 డిసెంబర్ 31 గడువు ఉందని కొన్ని వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అయితే.. ఇది అన్ని బ్యాంకులకు వర్తించే సాధారణ RBI గడువు అని భావించకూడదు. ఖాతాదారులు తమ బ్యాంకు నుంచి వచ్చిన అధికారిక సమాచారాన్ని మాత్రమే ఆధారంగా చేసుకోవాలి.పాత చెక్‌బుక్‌ను మార్చాల్సిన అవసరం ఉందా?, ఏదైనా చివరి తేదీ ఉందా?, అనే విషయాలను బ్యాంకు శాఖను సంప్రదించడం లేదా బ్యాంకు అధికారిక వెబ్సైట్ చూడడం ద్వారా తెలుసుకోవచ్చు.ఇదీ చదవండి: SBI ఖాతాదారులకు షాక్.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్!కొత్త చెక్బుక్కు ఛార్జీలు ఉంటాయా?కొత్త చెక్‌బుక్ కోసం వసూలు చేసే ఛార్జీలు బ్యాంకు, ఖాతా రకాన్ని బట్టి మారుతాయి. ఉదాహరణకు.. బ్యాంక్ ఆఫ్ ఇండియా సేవింగ్స్ ఖాతాదారులకు ఒక ఆర్థిక సంవత్సరంలో 25 లీఫ్‌లను ఉచితంగా అందిస్తుందని పేర్కొంది. అదనపు చెక్ లీఫ్లకు బ్యాంకు నిర్ణయించిన ఛార్జీలు వర్తించవచ్చు. అందువల్ల కొత్త చెక్‌బుక్ తీసుకునే ముందు మీ బ్యాంకు తాజా ఛార్జీల వివరాలను తెలుసుకోవడం మంచిది.చెక్ ఎంతకాలం చెల్లుతుంది?సాధారణంగా.. ఒక చెక్‌పై ఉన్న తేదీ నుంచి మూడు నెలల వరకు చెల్లుబాటు అవుతుంది. అందువల్ల చెక్‌ను ఎక్కువ కాలం ఉంచకుండా.. మూడు నెలల లోపే బ్యాంకులో జమ చేయాలి. చెక్ బౌన్స్ అయితే పరిస్థితులను బట్టి ఆర్థిక, చట్టపరమైన సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ 1881లోని సెక్షన్ 138 కింద చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. -
‘బాండ్లు అమ్మేయండి.. బంగారం కొనేయండి’
అమెరికా భారీగా పెరుగుతున్న ప్రభుత్వ రుణభారం భవిష్యత్తులో తీవ్ర ఆర్థిక సంక్షోభానికి దారితీసే అవకాశం ఉందని బిలియనీర్ ఇన్వెస్టర్, బ్రిడ్జ్‌వాటర్ అసోసియేట్స్ వ్యవస్థాపకుడు రే డాలియో హెచ్చరించారు. ప్రస్తుత ఆర్థిక విధానాల్లో మార్పు రాకపోతే అమెరికా రుణ సంక్షోభం మరో మూడు సంవత్సరాల్లో ఎదురయ్యే అవకాశం ఉందని ఆయన అంచనా వేశారు.ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు అమెరికా బాండ్లలో తమ పెట్టుబడులను తగ్గించి, పోర్ట్‌ఫోలియోలో 10–15 శాతం వరకు బంగారానికి కేటాయించాలని సూచించారు. అలాగే కొంతమేర బిట్‌కాయిన్‌ను కూడా కలిగి ఉండటం ద్వారా పెట్టుబడుల రిస్క్‌ను తగ్గించుకోవచ్చని పేర్కొన్నారు.శుక్రవారం లింక్డ్ఇన్లో చేసిన పోస్టులో డాలియో.. బలమైన ఆర్థిక స్థితి ఉన్న దేశాలు, వివిధ రకాల ఆస్తుల్లో పెట్టుబడులను విస్తరించుకోవాలని సూచించారు. ముఖ్యంగా ప్రభుత్వ బాండ్లపై అధికంగా ఆధారపడటం కంటే బంగారం, ఇతర ప్రత్యామ్నాయ ఆస్తులను కలిగి ఉండటం మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు.మూడు సంవత్సరాల్లో సంక్షోభం?అమెరికా రుణభారం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వానికి వడ్డీ చెల్లింపుల భారమూ భారీగా పెరుగుతోంది. అమెరికా ఫెడరల్ ప్రభుత్వ నికర వడ్డీ వ్యయం 2026లోనే సుమారు 1 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని కాంగ్రెస్ బడ్జెట్ కార్యాలయం (CBO) అంచనా వేసింది. 2026లో ప్రభుత్వ ఆదాయం సుమారు 5.6 ట్రిలియన్ డాలర్లుగా ఉండొచ్చని CBO అంచనా వేస్తోంది.డాలియో దృష్టిలో ఇది సాధారణ రుణ సమస్య మాత్రమే కాదు. ప్రభుత్వ రుణాన్ని తీర్చేందుకు చెల్లించాల్సిన వడ్డీ వ్యయం పెరుగుతూనే ఉండటం, అదే సమయంలో భారీగా కొత్త రుణాలు సమీకరించాల్సి రావడం ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడిని పెంచుతుందని ఆయన చాలాకాలంగా హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వ రుణానికి తగినంత డిమాండ్ లేకపోతే అధిక వడ్డీ రేట్లను అంగీకరించాల్సి రావచ్చు లేదా కేంద్ర బ్యాంకు ద్వారా మరింత డబ్బు సృష్టించే పరిస్థితి రావచ్చని ఆయన అభిప్రాయం. అటువంటి పరిణామాలు కరెన్సీపై ఒత్తిడి, ద్రవ్యోల్బణం వంటి సమస్యలను పెంచే అవకాశం ఉందనేది ఆయన విశ్లేషణ.బాండ్ల మార్కెట్లో ఒత్తిడిడాలియో వ్యాఖ్యలు వెలువడుతున్న సమయంలోనే అమెరికా ట్రెజరీ బాండ్ మార్కెట్లో ఒత్తిడి పెరిగింది. ఆగస్టు 21న 30 ఏళ్ల ట్రెజరీ ఈల్డ్ 5.27 శాతానికి చేరగా, వారంలో అది 2007 తర్వాతి అత్యధిక స్థాయిలకు సమీపించింది. అమెరికా ప్రభుత్వ రుణభారం 40 ట్రిలియన్ డాలర్లను దాటడం కూడా పెట్టుబడిదారుల ఆందోళనకు కారణమవుతోంది.పరిస్థితిని చక్కదిద్దేందుకు అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ దీర్ఘకాలిక ప్రభుత్వ బాండ్ల బైబ్యాక్‌లను పెంచే ప్రణాళికను ప్రకటించారు. అయితే ఈ చర్యతో ఈల్డ్స్‌లో వచ్చిన ప్రారంభ తగ్గుదల నిలవలేదు. దీంతో మార్కెట్లో ఇది తాత్కాలిక పరిష్కారమే తప్ప, అమెరికా ద్రవ్య లోటు, రుణభారం వంటి మూల సమస్యలను పరిష్కరించదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.బంగారం, బిట్‌కాయిన్‌కు డిమాండ్అమెరికా రుణభారం, డాలర్‌పై ఆందోళనలు పెరగడంతో ఈ వారం మదుపరులు బంగారం, బిట్‌కాయిన్ వంటి ప్రత్యామ్నాయ ఆస్తులవైపు మొగ్గుచూపారు. ఆగస్టు 21న స్పాట్ గోల్డ్ ఔన్స్‌కు 4,623.94 డాలర్ల వరకు పెరిగి మూడు నెలల గరిష్ఠాన్ని తాకింది. ఈ వారంలో పసిడి ధర 5 శాతానికి పైగా పెరిగింది.ఇదే సమయంలో బిట్‌కాయిన్ 79,000 డాలర్లకు సమీపంలోకి వెళ్లి, అనంతరం 77,000 డాలర్ల ప్రాంతంలో ట్రేడైంది. ఈ వారంలో క్రిప్టోకరెన్సీ సుమారు 23 శాతం వరకు లాభపడింది. 2023 మార్చి తర్వాత ఇదే అత్యంత బలమైన వారపు ర్యాలీగా నిలిచింది.లోటును తగ్గించాలిఅమెరికా బడ్జెట్ లోటును స్థూల దేశీయోత్పత్తి (GDP)లో సుమారు 3 శాతానికి తగ్గించే దిశగా చర్యలు తీసుకోవాలని డాలియో సూచించారు. ఇందుకోసం ప్రభుత్వ వ్యయాల్లో కోతలు, అధిక పన్ను ఆదాయం, తక్కువ వడ్డీ రేట్లు వంటి చర్యల కలయిక అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదే తరహా రుణ, ఆర్థిక ఒత్తిళ్లు బ్రిటన్, చైనా, జపాన్ వంటి దేశాల్లోనూ ఉన్నాయని పేర్కొన్నారు.ఇదీ చదవండి: బంగారం భారీ ధరలు.. కియోసాకి కామెంట్స్ -
8వ వేతన సంఘంపై పెన్షనర్ల కన్ను!
దేశంలో 8వ వేతన సంఘం చర్చలు ఇప్పుడు కీలక దశకు చేరుకున్నాయి. 2025 నవంబర్ 3న ఏర్పాటు చేసిన ఈ కమిషన్‌కు 18 నెలల గడువు ఇచ్చారు. ఇప్పటికే అందులో సగానికి పైగా సమయం పూర్తయింది. దీంతో.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులే కాకుండా, పెన్షనర్లు కూడా తమ డిమాండ్లపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా 2026 జనవరి 1కి ముందు రిటైర్ అయిన ఉద్యోగుల పెన్షన్, ఫ్యామిలీ పెన్షన్‌ను కూడా సవరించాలనే డిమాండ్ ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తోంది.పాత పెన్షనర్లకు కూడా ప్రయోజనాలు కావాలని.. భారత్ పెన్షనర్స్ సమాజ్ (BPS), ఆల్ ఇండియా డిఫెన్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (AIDEF) వంటి పెన్షనర్ సంఘాలు కేంద్ర ప్రభుత్వానికి చెబుతున్నాయి. 8వ వేతన సంఘం నిబంధనల్లో పాత పెన్షనర్ల పెన్షన్ సవరణపై స్పష్టత లేదని, అందుకే దీనిని స్పష్టంగా చేర్చాలని కోరుతున్నాయి.2026 జనవరి 1కి ముందు రిటైర్ అయిన వారితో పాటు ఆ తర్వాత రిటైర్ అయ్యే ఉద్యోగుల పెన్షన్‌ను కూడా సవరించాలని, పాత-కొత్త పెన్షనర్ల మధ్య తేడాలు లేకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నాయి. ఫ్యామిలీ పెన్షన్, ఇతర రిటైర్మెంట్ ప్రయోజనాలను కూడా ఇందులో భాగం చేయాలని కోరుతున్నాయి.8వ వేతన సంఘం టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్‌లో ఉన్న 'అన్‌ఫండెడ్ కాస్ట్ ఆఫ్ నాన్-కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్' అనే పదంపై కూడా పెన్షనర్ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగి ఎన్నో ఏళ్ల పాటు పనిచేసిన తర్వాత పొందే పెన్షన్‌ను కేవలం ప్రభుత్వంపై పడే అదనపు ఖర్చుగా చూడటం సరికాదని AIDEF వాదిస్తోంది. BPS కూడా ఈ పదాన్ని తొలగించాలని, లేదా మార్చాలని కోరింది. పెన్షన్ విషయంలో ప్రభుత్వం స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలని, వేతన సవరణతో పాటు పెన్షన్ సవరణ కూడా సమగ్రంగా జరగాలని సంఘాలు కోరుతున్నాయి.పెన్షనర్ల ఇతర డిమాండ్లుపెన్షన్ సవరణ ఒక్కటే కాకుండా.. మరికొన్ని అంశాలను కూడా పెన్షనర్ సంఘాలు ప్రభుత్వం ముందు ఉంచాయి. ఇందులో పాత పెన్షన్ విధానం (OPS) పునరుద్ధరణ, మెరుగైన ఆరోగ్య సేవలు, కేంద్ర నిధులతో నడిచే స్వయం ప్రతిపత్తి, చట్టబద్ధ సంస్థలకు 8వ వేతన సంఘం ప్రయోజనాలు అందించడం వంటి డిమాండ్లు ఉన్నాయి. అంతే కాకుండా.. పోస్టల్ శాఖలో కీలకంగా పనిచేస్తున్న గ్రామీణ డాక్ సేవక్ (GDS)లకు కూడా తగిన ప్రయోజనాలు కల్పించాలని కోరుతున్నారు.ఇక నిర్ణయం ఎప్పుడు?ప్రస్తుతం పెన్షనర్లలో ప్రధానంగా ఉన్న ఆందోళన.. తాము 8వ వేతన సంఘం పరిధిలోకి వస్తామా? లేదా? అనే విషయంలో స్పష్టత లేకపోవడమే. కమిషన్ తుది నివేదిక ఇచ్చేలోపు ఈ సందేహానికి ప్రభుత్వం సమాధానం ఇవ్వాలని పెన్షనర్ సంఘాలు కోరుతున్నాయి. రాబోయే రోజుల్లో చెన్నై, పుదుచ్చేరి, చండీగఢ్, జైపూర్ వంటి ప్రాంతాల్లో 8వ వేతన సంఘం మరిన్ని సమావేశాలు నిర్వహించనుంది. ఈ సమావేశాల్లో పెన్షనర్ల డిమాండ్లపై ఎలాంటి చర్చ జరుగుతుంది, చివరకు ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.ఇదీ చదవండి: ఉద్యోగుల కనీస వేతనం.. రూ.55 నుంచి రూ.18,000 వరకు! -
వాట్సాప్‌లో KYC చేస్తున్నారా?.. తస్మాత్ జాగ్రత్త!
బ్యాంక్ లోన్, క్రెడిట్ కార్డ్, ప్రాపర్టీ కొనుగోలు, హోటల్ బుకింగ్ లేదా ఇతర సేవల కోసం పాన్, ఆధార్, బ్యాంక్ స్టేట్మెంట్ వంటి పత్రాలను అడగడం సర్వసాధారణమైపోయింది. అయితే చాలాసార్లు వీటిని వాట్సాప్ ద్వారా పంపండి అని ఏజెంట్ అడిగితే.. ఏ మాత్రం ఆలోచించకుండా పంపిస్తుంటారు. ఇది చాలా ప్రమాదం. ఎందుకో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.డాక్యుమెంట్స్ పంపిస్తే..మనకు సంబంధించిన డాక్యుమెంట్లను ఏజెంటుకు లేదా ఇతర వ్యక్తులకు పంపిస్తే ఏం కాదులే అనుకుంటే పొరపాటే. ఎందుకంటే.. ఆ డాక్యుమెంట్ అవతలి వ్యక్తి ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా ల్యాప్‌టాప్‌లో సేవ్ చేసుకోవచ్చు. ఆ తరువాత ఆ డాక్యుమెంట్స్ ఎక్కడికి వెళ్తాయో.. ఎన్ని కాపీలు తయారవుతాయో కూడా మనకు తెలియదు. వీటిని ఉపయోగించి కొంతమంది మోసాలకు పాల్పడవచ్చు.కొన్నిసార్లు బ్యాంక్ లేదా కంపెనీలకు కేవైసీ అవసరం కావొచ్చు. అలాంటి.. సందర్భంలో ఆ కేవైసీని ఒక ఉద్యోగి తన వ్యక్తిగత వాట్సాప్ నెంబర్ ద్వారా సేకరిస్తాడు. ఇది కూడా ఒక సమస్యే అనే విషయం మర్చిపోకూడదు. ఎందుకంటే.. ఆ ఉద్యోగి కంపెనీ మారవచ్చు. లేదా ఉద్యోగం వదిలేయవచ్చు. అలాంటప్పుడు మీ వ్యక్తిగత సమాచారం కంపెనీ అధికారిక వ్యవస్థలో కాకుండా, ఒక వ్యక్తి ఫోనులో ఉంటుంది. తద్వారా భవిష్యత్తులో మీ పత్రాలను తప్పుడు పనులకు ఉపయోగించే అవకాశం ఉంటుంది.డేటా దుర్వినియోగం అయితే?పాన్, ఆధార్, బ్యాంక్ స్టేట్మెంట్లో మన వ్యక్తిగత, ఆర్థిక వివరాలు ఉంటాయి. ఈ సమాచారం తప్పుడు వ్యక్తుల చేతుల్లోకి వెళితే అనుచిత కాల్స్, మెసేజస్, గుర్తింపు దుర్వినియోగం, ఆర్థిక మోసాలు వంటివి జరగవచ్చు. కాబట్టి వ్యక్తిగత సమాచారం తెలిపే పత్రాల విషయంలో తప్పకుండా జాగ్రత్త వహించాలి.DPDP చట్టం మనకు ఏం చెబుతోంది?భారతదేశంలోని డిజిటల్ వ్యక్తిగత డేటా పరిరక్షణ చట్టం (Digital Personal Data Protection Act) ప్రకారం.. వ్యక్తిగత డేటాను బాధ్యతగా సేకరించడం, ఉపయోగించడం, నిర్వహించడం వంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తుంది. సింపుల్‌గా చెప్పాలంటే, ఒక సంస్థ మీ వ్యక్తిగత సమాచారం తీసుకుంటే దానికి ఒక స్పష్టమైన ఉద్దేశ్యం ఉండాలి, ఆ డేటాను బాధ్యతగా నిర్వహించాలి.భారతదేశంలో సైబర్ మోసాలు ఎక్కువవుతున్నాయి. ఇలాంటి సమయంలో మీ వ్యక్తిగా సమాచారం పంపించే ముందు తప్పకుండా ఆలోచించాలి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2024-25 వార్షిక నివేదిక ప్రకారం.. రూ. 36,014 కోట్ల విలువైన 23,953 బ్యాంకింగ్ మోసాల కేసులు నమోదయ్యాయి. దీన్నిబట్టి చూస్తే ప్రజలు ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలుస్తోంది.సురక్షితమైన మార్గం ఏమిటి?బ్యాంక్స్, హోటల్స్ లేదా ఇతర కంపెనీలకు కొన్నిసార్లు ఐడెంటిటీ వెరిఫికేషన్ నిజంగానే అవసరం కావొచ్చు. అలాంటప్పుడు మీ డాక్యుమెంట్లను వాట్సాప్ నెంబరుకు పంపించకుండా.. అధికారిక వెబ్సైట్, సెక్యూర్ అప్లోడ్ పోర్టల్ లేదా డిజిటల్ వెరిఫికేషన్ సిస్టం ద్వారా షేర్ చేయడం మంచిది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. మీ డేటాను ఎవరు తీసుకుంటున్నారు, ఎందుకు తీసుకుంటున్నారు, ఎలా ఉపయోగిస్తున్నారు అనే విషయం మీకు తెలిసి ఉండాలి. -
సంపద పెంచుకోవాలంటే.. అంకుర్ వారికూ ఆర్ధిక సూత్రాలు!
సాధారణంగా ఆదాయం పెరిగే కొద్దీ ఖర్చులు కూడా పెరుగుతుంటాయి. ఖరీదైన వస్తువులు కొనడం, లైఫ్‌స్టైల్ మార్చుకోవడం అనేది చాలామందికి అలవాటే. అయితే.. వ్యాపారవేత్త, రచయిత అంకుర్ వారికూ (Ankur Warikoo) మాత్రం డబ్బును ఖర్చు చేసే విషయంలో కొన్ని నియమాలు పాటిస్తే.. భవిష్యత్తులో మంచి సంపదను కూడబెట్టుకోవచ్చని చెబుతున్నారు.తాను, తన భార్య రుచి కలిసి పాటిస్తున్న ఐదు మనీ రూల్స్‌ను అంకుర్ వారికూ సోషల్ మీడియాలో షేర్ చేశారు. తాము సంపన్న కుటుంబాల నుంచి రాలేదని, తమ జీవితంలో నిజమైన ఆర్థిక స్థిరత్వం గత 6-7 ఏళ్లలోనే వచ్చిందని ఆయన చెప్పారు. ఈ ఐదు అలవాట్లు తమ కుటుంబం డబ్బును చూసే విధానాన్ని మార్చాయని తెలిపారు.మొదటి నియమం - డబ్బున్నవారిలా కనిపించడానికి ఖర్చు చేయకూడదుఇతరులను ఆకట్టుకోవడానికి ఖరీదైన వస్తువులు కొనడం కంటే.. భవిష్యత్తులో సంపదను పెంచే ఆస్తులపై డబ్బు పెట్టాలని ఆయన చెబుతున్నారు. అందుకే.. తమ డబ్బులో ఎక్కువ భాగాన్ని స్టాక్స్, బంగారం వంటి వాటిలో పెట్టుబడి పెడతామని చెప్పారు. కుటుంబానికి ఒక ఇల్లు మాత్రమే ఉందని, కారు కూడా సొంతంగా కొనకుండా అద్దెకు ఉపయోగిస్తున్నామని తెలిపారు.రెండో నియమం - ముఖ్యమైన విషయాల కోసం ఎక్కువ ఖర్చు చేయడంముఖ్యంగా ఆరోగ్యం విషయంలో రాజీ పడకూడదనేది వారి ఆలోచన. నాణ్యమైన ఆహారం కోసం ఎంత ఖర్చైనా పెట్టడానికి సిద్ధంగా ఉంటామని అంకుర్ చెప్పారు. తమ కూరగాయలను సేంద్రీయ పద్ధతిలో పండించే అద్దె పొలం ఉందని, బయట నుంచి ఫుడ్ ఆర్డర్ చేయడం కూడా చాలా తక్కువగా ఉంటుందని తెలిపారు.మూడో నియమం - వస్తువుల కంటే జ్ఞాపకాలను సంపాదించుకోవడంఖరీదైన వస్తువులు కొనడం కంటే కుటుంబంతో కలిసి ప్రయాణాలు చేయడం, క్రీడా కార్యక్రమాలకు వెళ్లడం, మ్యూజియంలు చూడటం వంటి అనుభవాలకు డబ్బు ఖర్చు చేయడం ఎక్కువ విలువైనదని ఆయన భావిస్తున్నారు. గత ఏడాది తమ కుటుంబం ఏకంగా 116 రోజులు ప్రయాణించిందని చెప్పారు. తాము వెళ్లే ప్రదేశాల గురించి తెలుసుకోవడానికి.. అవసరమైతే చరిత్రకారులను కూడా వెంట తీసుకెళ్తామని తెలిపారు.నాలుగో నియమం - ఖర్చు చేసే ముందు పెట్టుబడి పెట్టడంఆదాయం వచ్చిన రోజే ముందుగా పెట్టుబడి పెడతామని అంకుర్ చెప్పారు. ఆ తర్వాత మిగిలిన డబ్బుతోనే ఖర్చులు చేస్తామని తెలిపారు. అంటే ముందుగా పెట్టుబడి.. ఆ తర్వాత ఖర్చు అన్నమాట. దీంతో నెలాఖరుకు చేతిలో కొన్ని వేల రూపాయలు మాత్రమే మిగులుతాయని, మిగిలిన డబ్బంతా అప్పటికే పెట్టుబడిగా మారిపోయి ఉంటుందని వివరించారు.ఐదో నియమం - నేర్చుకోవడానికి ఎలాంటి పరిమితి పెట్టుకోకపోవడంపుస్తకాలు, కొత్త విషయాలు నేర్చుకోవడానికి తమ కుటుంబంలో ప్రత్యేకంగా బడ్జెట్ పెట్టుకోలేదని ఆయన చెప్పారు. వారి ఇంట్లో లివింగ్ రూమ్ కూడా లైబ్రరీలా ఉంటుందని తెలిపారు. కుటుంబంలోని నలుగురూ పుస్తకాలు చదవడంతో పాటు కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటారని చెప్పారు. పాటరీ, పియానో నుంచి పైథాన్ ప్రోగ్రామింగ్ వరకు వివిధ కోర్సులు, క్లాసులకు హాజరవుతున్నట్లు తెలిపారు.అయితే ఈ నియమాలను ప్రతి ఒక్కరూ పాటించాల్సిన అవసరం లేదని అంకుర్ స్పష్టం చేశారు. ఇవి తమ కుటుంబం పాటిస్తున్న నియమాలు మాత్రమే అని చెప్పారు. అయితే అందరూ.. తమ ఆదాయం, అవసరాలు, భవిష్యత్తు లక్ష్యాలకు తగ్గట్టుగా సొంత మనీ రూల్స్ పెట్టుకోవాలని సూచించారు. -
ఉద్యోగుల కనీస వేతనం.. రూ.55 నుంచి రూ.18,000 వరకు!
భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి.. 79 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ కాలంలో దేశంలో ఎన్నో మార్పులు జరిగాయి. అదే విధంగా.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కూడా భారీ మార్పులు వచ్చాయి. ఒకప్పుడు నెలకు కేవలం రూ.55గా ఉన్న కనీస ప్రాథమిక వేతనం, ఇప్పుడు 7వ వేతన సంఘం ప్రకారం రూ.18,000కు చేరుకుంది. ప్రస్తుతం ఉద్యోగులంతా 8వ వేతన సంఘం కోసం ఎదురుచూస్తున్నారు.అసలు ఈ ప్రయాణం ఎలా మొదలైందంటే.. 1వ వేతన సంఘం 1946లో అమల్లోకి వచ్చింది. అంటే.. మన దేశానికి స్వాతంత్య్రం రాకముందే అన్నమాట. అప్పట్లో.. ప్రభుత్వ ఉద్యోగుల కనీస ప్రాథమిక వేతనం రూ.55గా ఉండేది.ఆ తర్వాత 2వ వేతన సంఘం 1959లో వచ్చింది. దీంతో కనీస జీతం రూ.55 నుంచి రూ.80కు పెరిగింది.3వ వేతన సంఘం 1973లో అమల్లోకి వచ్చింది. ఈసారి కనీస ప్రాథమిక వేతనం రూ.196కు పెరిగింది.ఇక 4వ వేతన సంఘం 1986లో వచ్చినప్పుడు జీతాల్లో మరింత పెద్ద మార్పు కనిపించింది. కనీస ప్రాథమిక వేతనం రూ.750కు పెరిగింది.తర్వాత 5వ వేతన సంఘం 1996లో అమల్లోకి వచ్చింది. కనీస జీతం రూ.2,550కు చేరుకుంది.6వ వేతన సంఘం 2006లో వచ్చినప్పుడు కనీస ప్రాథమిక వేతనం రూ.7,000గా నిర్ణయించారు.అయితే అసలు పెద్ద మార్పు 7వ వేతన సంఘం 2016లో వచ్చినప్పుడు జరిగింది. కనీస ప్రాథమిక వేతనం ఒక్కసారిగా రూ.18,000కు పెరిగింది.7వ వేతన సంఘం ప్రత్యేకత కేవలం జీతం పెంచడమే కాదు. అప్పటివరకు ఉన్న పే బాండ్, గ్రేడ్ పే విధానాన్ని తొలగించి పే మ్యాట్రిక్స్ విధానాన్ని తీసుకొచ్చారు. దీని వల్ల ఉద్యోగుల జీతాలను ఒక కొత్త, సులభమైన నిర్మాణం ద్వారా నిర్ణయించే అవకాశం ఏర్పడింది.ఇప్పుడు అందరి చూపు 8వ వేతన సంఘంపై ఉంది. ప్రభుత్వ ఉద్యోగులు తమ జీతాలు ఎంత పెరుగుతాయో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే 8వ వేతన సంఘంలో కనీస ప్రాథమిక వేతనం ఎంత ఉంటుందనేది ఇప్పటివరకు తుది నిర్ణయం కాలేదు. వేతన సంఘం సిఫారసులు చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం వాటిని పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటుంది.ఇదీ చదవండి: అమెరికా అప్పులు.. కియోసాకి సంచలన వ్యాఖ్యలు! -
ఒరిజినల్ ఆస్తి పత్రాలు పోతే ఏం చేయాలి?
సొంత ఇల్లు లేదా స్థలానికి సంబంధించిన ఒరిజినల్ సేల్ డీడ్ (రిజిస్ట్రేషన్ కాగితాలు) పొరపాటున పోగొట్టుకోవడం లేదా ప్రమాదవశాత్తు పాడైపోవడం ఆస్తిదారులకు తీవ్ర మానసిక ఒత్తిడిని కలిగించే అంశమే. అయితే, ఒరిజినల్ డాక్యుమెంట్లు చేజారినంత మాత్రాన ఆస్తిపై యాజమాన్య హక్కులు కోల్పోతారని భావించడం పూర్తిగా అపోహ మాత్రమే. భారతీయ రిజిస్ట్రేషన్ చట్టం-1908 ప్రకారం సరైన న్యాయపరమైన ప్రక్రియను పాటించడం ద్వారా మీ హక్కులను సమర్థవంతంగా పరిరక్షించుకోవచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.చేపట్టాల్సిన చట్టబద్ధమైన చర్యలుపోలీస్ ఫిర్యాదు (ఎఫ్ఐఆర్)దస్తావేజులు పోయినట్లు గుర్తించిన వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసి నాన్-ట్రేసబుల్ సర్టిఫికేట్ పొందాలి. భవిష్యత్తులో ఈ పత్రాలు దుర్వినియోగం కాకుండా, ఫోర్జరీకి గురికాకుండా ఇది ప్రాథమిక చట్టపరమైన రక్షణగా పనిచేస్తుంది.ప్రజా ప్రకటన (పత్రికా నోటీసు)ఒక ప్రముఖ ఆంగ్ల దినపత్రికతో పాటు స్థానిక ప్రాంతీయ (తెలుగు) దినపత్రికలో ఆస్తి వివరాలు, సర్వే నంబర్లు, పోయిన పత్రాల సమాచారాన్ని పేర్కొంటూ పబ్లిక్ నోటీసు ఇవ్వాలి. 15-21 రోజుల గడువులో ఎలాంటి అభ్యంతరాలు రాకపోతే ఆ పత్రికా నోటీసు కాపీ స్పష్టమైన ఆధారంగా ఉపయోగపడుతుంది.నోటరీ అఫిడవిట్, ఇండెమ్నిటీ బాండ్పత్రాలు పోయిన తీరును వివరిస్తూ నోటరీ సమక్షంలో అఫిడవిట్ రాయించుకోవాలి. భవిష్యత్తులో ఆస్తి అమ్మకం సమయంలో కొనుగోలుదారులు లేదా బ్యాంకుల సందేహాలను నివృత్తి చేయడానికి ఇండెమ్నిటీ బాండ్ ఎంతో దోహదపడుతుంది.సబ్-రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి సర్టిఫైడ్ కాపీరిజిస్ట్రేషన్ చట్టం సెక్షన్ 57 ప్రకారం ప్రభుత్వ రికార్డులలో ప్రతి ఆస్తి రిజిస్ట్రేషన్ ప్రతి శాశ్వతంగా భద్రపరుస్తారు. కాబట్టి సంబంధిత సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకుని చట్టబద్ధమైన సర్టిఫైడ్ కాపీ (ధ్రువీకృత నకలు) పొందవచ్చు. ఇది ఒరిజినల్ పత్రంతో సమానమైన న్యాయపరమైన విలువను కలిగి ఉంటుంది.బ్యాంకుల నిర్లక్ష్యం ఉంటే పరిహారం తప్పనిసరిఒకవేళ హోమ్ లోన్ కోసం బ్యాంకులో కుదువబెట్టిన ఒరిజినల్ పత్రాలను బ్యాంకే పోగొడితే భారతీయ రిజర్వ్ బ్యాంక్ మార్గదర్శకాల ప్రకారం సదరు బ్యాంకు పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. బాధితుడికి నష్టపరిహారం చెల్లించడంతో పాటు సొంత ఖర్చులతో డూప్లికేట్ పత్రాలను తీసివ్వడం బ్యాంకు బాధ్యత.కాబట్టి, ఆస్తి పత్రాలు పోయినప్పుడు అధైర్యపడకుండా ఎఫ్ఐఆర్, పత్రికా ప్రకటన, సర్టిఫైడ్ కాపీ ప్రాసెస్ పూర్తి చేయడం ద్వారా మీ ఆస్తి హక్కులను పూర్తిస్థాయిలో సురక్షితం చేసుకోవచ్చు.ఇదీ చదవండి: అన్నదాతకు ఆర్థిక స్వాతంత్ర్యం రావాలంటే.. -
పోస్టల్ శాఖ గుడ్ న్యూస్.. ఇక మరింత మందికి ఆ బెనిఫిట్
గ్రామీణ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ (ఆర్పీఎల్ఐ) పథకంలో కీలక మార్పు చోటుచేసుకుంది. ఇప్పటివరకు గ్రామీణ ప్రాంతాల్లో శాశ్వతంగా నివసించే వారికి ప్రధానంగా అందుబాటులో ఉన్న ఈ ప్రభుత్వ మద్దతు ఉన్న జీవిత బీమా పథకం పరిధిని కేంద్ర ప్రభుత్వం మరింత విస్తరించింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర కమ్యూనికేషన్స్, గ్రామీణాభివృద్ధి శాఖ ఈ మార్పును ప్రకటించింది.బ్యాంక్ ఖాతా ఉంటే అదనపు అర్హతకొత్త నిబంధనల ప్రకారం పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంక్ (POSB) లేదా ఏదైనా షెడ్యూల్డ్ బ్యాంకులో యాక్టివ్ సేవింగ్స్ బ్యాంక్ ఖాతా ఉండటం కూడా ఆర్పీఎల్ఐకి అదనపు అర్హతగా పరిగణించనున్నారు. దీంతో కేవలం గ్రామీణ నివాసాన్ని ఆధారంగా చేసుకునే సంప్రదాయ అర్హతకు ఉన్న పరిమితి కొంతవరకు తొలగనుంది. ఫలితంగా దేశవ్యాప్తంగా మరింత మంది ఆర్పీఎల్ఐ కవరేజీ పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది.అయితే, ఇండియా పోస్ట్ అధికారిక వివరాల ప్రకారం ఆర్పీఎల్ఐ ప్రాథమికంగా గ్రామీణ ప్రాంతాల్లో శాశ్వతంగా నివసించే భారతీయులకు ఉద్దేశించిన పథకమే. సాధారణంగా 19 నుంచి 55 ఏళ్ల వయసున్న వారు ఆర్పీఎల్ఐ పాలసీలకు అర్హులు.1995లో ప్రారంభమైన పథకంగ్రామీణ ప్రజలకు, ముఖ్యంగా బలహీన వర్గాలు, మహిళా కార్మికులకు జీవిత బీమా రక్షణను అందించాలనే ఉద్దేశంతో ఆర్పీఎల్ఐని 1995 మార్చి 24న ప్రారంభించారు. దేశంలోని విస్తృత పోస్టాఫీస్ నెట్‌వర్క్‌ను ఉపయోగించుకుని గ్రామీణ ప్రాంతాల్లో బీమా విస్తరణను పెంచడం దీని ప్రధాన లక్ష్యం.ఆర్పీఎల్ఐ కింద గ్రామ సురక్ష, గ్రామ సంతోష్, గ్రామ సువిధ, గ్రామ సుమంగళ్, గ్రామ ప్రియ, బాల జీవన్ బీమా వంటి వివిధ పాలసీ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.అర్హత నిరూపణ కూడా సులభతరంకొత్త విధానంలో బ్యాంక్ ఖాతా ఉన్నట్లు నిరూపించేందుకు కస్టమర్లకు మరిన్ని డిజిటల్ మార్గాలను అందుబాటులోకి తీసుకురానున్నారు. కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ (CBS) వివరాలు, ఈ-మెయిల్ స్టేట్మెంట్లు, మొబైల్ బ్యాంకింగ్ స్క్రీన్షాట్లు, ఏటీఎం స్టేట్మెంట్లు లేదా అప్డేట్ చేసిన పాస్‌బుక్ వంటి ఆధారాలను ఉపయోగించే అవకాశం ఉంటుంది.యాక్టివ్ బ్యాంక్ ఖాతాకు చెల్లుబాటు అయ్యే డిజిటల్ ఆధారం ఉన్నప్పుడు ప్రత్యేకంగా భౌతిక బ్యాంక్ సర్టిఫికెట్ సమర్పించాల్సిన అవసరం ఉండదని ప్రభుత్వం పేర్కొంది. దీంతో పాలసీ దరఖాస్తు సమయంలో పత్రాల భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకుంది.డిజిటల్ వ్యవస్థలతో వేగంగా సేవలుఇండియా పోస్ట్ తన బీమా సేవలను కూడా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లతో అనుసంధానిస్తోంది. ఆర్పీఎల్ఐ/PLI కస్టమర్లు ఆన్లైన్లో కోట్ పొందడం, దరఖాస్తు చేయడం, పత్రాలను సమర్పించడం వంటి సేవలను వినియోగించుకోవచ్చు. పాలసీ జారీకి అవసరమైన పత్రాల పరిశీలన పూర్తయిన తర్వాత సాధారణంగా 10 రోజులు పడుతుందని ఇండియా పోస్ట్ కస్టమర్ పోర్టల్ పేర్కొంటోంది.ఇదే సమయంలో పోస్టాఫీస్ సేవింగ్స్ వ్యవస్థలో CBSతో పాటు ఇంటర్నెట్, మొబైల్ బ్యాంకింగ్, ఆన్లైన్ ఖాతా సేవలు, NEFT/RTGS, IPPB–POSA అనుసంధానం వంటి డిజిటల్ సదుపాయాలు విస్తరించాయి. దేశవ్యాప్తంగా 1.64 లక్షలకు పైగా పోస్టాఫీసుల నెట్వర్క్ ద్వారా 45 కోట్లకు పైగా POSB ఖాతాదారులకు సేవలు అందుతున్నాయని కేంద్ర ప్రభుత్వం 2026 ఫిబ్రవరిలో వెల్లడించింది.ఇక 2025 ఆగస్టులో దేశవ్యాప్తంగా అడ్వాన్స్డ్ పోస్టల్ టెక్నాలజీ (APT) ప్లాట్‌ఫామ్‌ను అమలు చేయడంతో పోస్టల్ సేవల డిజిటలైజేషన్ మరింత వేగం పుంజుకుంది. దాదాపు 1.70 లక్షల పోస్టల్ కార్యాలయాలను ఈ ఆధునిక వ్యవస్థతో అనుసంధానించినట్లు ప్రభుత్వం తెలిపింది.బీమా అందరికీ చేరువ చేయడమే లక్ష్యందేశంలో బీమా విస్తరణను పెంచే #InsuranceForAll లక్ష్యానికి అనుగుణంగా ఆర్పీఎల్ఐ అర్హతలను విస్తరించినట్లు కేంద్రం పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ ఖర్చుతో జీవిత బీమా రక్షణను అందించడమే కాకుండా, బ్యాంకింగ్, డిజిటల్ ఆధారాలను ఉపయోగించడం ద్వారా దరఖాస్తు ప్రక్రియను సులభతరం చేయడం ఈ మార్పు ఉద్దేశం. -
బంగారం, వెండి కొనుగోళ్లకు కొత్త పోర్టల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెక్, ఈ–కామర్స్ సంస్థ నిహార్ ఇన్ఫో గ్లోబల్ తాజాగా పసిడి, వెండి కొనుగోళ్లకు సంబంధించి గోల్డ్‌ఎన్‌సిల్వర్.షాప్ పోర్టల్‌ను సరికొత్తగా తీర్చిదిద్దింది. భౌతిక, డిజిటల్, ఈటీఎఫ్‌ల రూపంలో బంగారం, వెండి నాణేలు, కడ్డీలు మొదలైన వాటిని పారదర్శకమైన విధంగా ఒకే చోట కొనుగోలు చేసేందుకు ఇది ఉపయోగపడుతుందని సంస్థ డైరెక్టర్ బీఎస్ఎన్ సూర్యనారాయణ తెలిపారు.ప్రస్తుతం ప్రయోగాత్మకంగా అమలు చేస్తుండగా, డిసెంబర్ ఆఖరు నాటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. దీనికోసం ఎంఎంటీసీ–పీఏఎంపీ, ఆగ్మంట్, జిరోధా మొదలైన సంస్థలతో జట్టు కట్టినట్లు ఆయన వివరించారు. దీని ద్వారా ఆర్థిక సంస్థలతో కలిసి పసిడి రుణాలను కూడా అందించనున్నట్లు పేర్కొన్నారు. జనవరి నాటికి యాప్ వెర్షన్ కూడా తేనున్నట్లు పేర్కొన్నారు. -
కియోసాకి ప్రశ్న.. ఘాటుగా స్పందించిన నెటిజన్లు!
తరచుగా పెట్టుబడులకు సంబంధించిన విషయాలను వెల్లడించే రాబర్ట్ కియోసాకి, తాజాగా ఉద్యోగ జీవితం గురించి చెప్పారు. ''జీవితం అంటే కేవలం ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు పని చేసి, నెలాఖరులో జీతం తీసుకోవడమేనా?'' అని ప్రశ్నించారు.చాలామంది చిన్నప్పటి నుంచి ఒకే విధమైన మార్గంలో వెళ్తుంటారు. చదువు.. ఉద్యోగం.. జీతం.. ఖర్చులు.. మళ్లీ ఉద్యోగం. ఇలా సంవత్సరాలు గడిచిపోతాయి. మనం డబ్బు సంపాదిస్తున్నాం, కుటుంబాన్ని చూసుకుంటున్నాం, బాధ్యతలు నిర్వర్తిస్తున్నాం. కానీ ఒక సమయంలో మనల్ని మనమే ''నేను అసలు ఎందుకు ఇలా జీవిస్తున్నాను? నా జీవితానికి అర్థం ఏమిటి?'' అని బహుశా ఆలోచించకపోవచ్చు.ఇదే విషయాన్ని కియోసాకి చెబుతూ.. నేను పని చేస్తున్నానంటే, అది ''కేవలం డబ్బు సంపాదించడానికి మాత్రం కాదు. జీవిత లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి చేస్తున్నా'' అని పేర్కొన్నారు. అంటే మనం చేసే పని మనకు డబ్బు మాత్రమే కాకుండా, ఒక సంతృప్తిని, ఒక ఉద్దేశ్యాన్ని కూడా ఇవ్వాలని ఆయన ఉద్దేశ్యం.కియోసాకి ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయిన తరువాత.. నెటిజన్లు తమదైన రీతిలో స్పందించారు. కొందరు ఆయన మాటలతో ఏకీభవించినప్పటికీ.. మరికొందరు వ్యతిరేకించారు.చాలామంది ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉద్యోగం చేస్తున్నారు. కుటుంబాన్ని పోషించడం, పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వడం లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు అని అన్నారు. జీవిత లక్ష్యం అంటే ఏదో పెద్ద విజయం సాధించడంలో దొరకదు. కొన్నిసార్లు, ఒక సాధారణ పనిని నిలకడగా, చక్కగా చేయడంలో కూడా అది లభిస్తుందని ఇంకొందరు అన్నారు.9 to 5 for just $?Found it interesting my last X had so few loves relative to number of views.My previous X was dedicated to working to fulfill your spirit’s mission…your life’s purpose….for the gift of life.Working 9 to 5 just for $…seems to me…. to be an empty life.…— Robert Kiyosaki (@theRealKiyosaki) August 14, 2026 -
డబ్బు, పేరు కాదు.. అందుకే 'రిచ్ డాడ్' బుక్ రాశా!
రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత ''రాబర్ట్ కియోసాకి'' ఒక ట్వీట్లో చాలా సింపుల్‌గా ఒక లోతైన విషయాన్ని చెప్పారు. ఆయన ఒకప్పుడు రాక్ అండ్ రోల్ బిజినెస్‌లో పనిచేస్తూ.. ది పోలీస్, వాన్ హాలెన్, ఐరన్ మైడెన్ వంటి ప్రముఖ బ్యాండ్ల కోసం ఉత్పత్తులు తయారు చేసేవారు. ఆ సమయంలో ఆయనకు మంచి డబ్బు వచ్చేది, ఫేమస్ బ్యాండ్లతో కలిసి ఉండే అవకాశం ఉండేది. జీవితం చాలా సరదాగా, విజయవంతంగా ఉన్నప్పటికీ.. తనలో మాత్రం ఏదో లోటు ఉందని గుర్తించినట్లు పేర్కొన్నారు.ఆ సమయంలోనే ఆయన డాక్టర్ ఆర్. బక్మినిస్టర్ ఫులర్ను కలిశారు. కొంతకాలం పాటు ఆయన దగ్గర చదువుకున్నారు. ఆ సమయంలో తాను చెప్పిన మాటలు కియోసాకిని బాగా ప్రభావితం చేశాయి. మన జీవితం కేవలం మన కోసం, మన డబ్బు కోసం, మన సుఖం కోసం మాత్రమే కాదని అర్థం చేసుకున్నారు.చాలామంది జీవితంలో ఒక దశకు వచ్చిన తర్వాత ''నేను ఇది ఎందుకు చేస్తున్నాను?'', ''నా జీవితానికి అసలు అర్థం ఏంటి?'' అని ఆలోచిస్తారు. కియోసాకి కూడా అలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నారు. డబ్బు ఉన్నా, పేరు ఉన్నా, ఆనందంగా ఉన్నా తనకు ఏదో లోటుగా అనిపించింది. దాంతో ఆయనకు అర్థమైన విషయం ఏమిటంటే.. డబ్బు సంపాదించడం మాత్రమే జీవిత లక్ష్యం కాదు. మన వల్ల ఇతరులకు ఎంత ఉపయోగం జరుగుతోంది అనేదే అసలు విషయం.ఆ ఆలోచనను తన జీవితంలో అమలు చేసిన తర్వాతే కియోసాకి క్యాష్‌ఫ్లో అనే బోర్డ్ గేమ్‌ను రూపొందించారు, అలాగే రిచ్ డాడ్ పూర్ డాడ్ (Rich Dad Poor Dad) పుస్తకాన్ని రాశారు. వీటి ద్వారా ప్రజలకు డబ్బు గురించి, పెట్టుబడుల గురించి, ఆర్థిక స్వేచ్ఛ గురించి కొత్తగా ఆలోచించే అవకాశం కల్పించారు.అంటే.. తనకు తెలిసిన విషయాలను తన దగ్గరే ఉంచుకోకుండా, వాటిని ఇతరులతో పంచుకోవడం ద్వారా తన జీవితానికి ఒక అర్థం దొరికిందని ఆయన చెప్పాలనుకున్నారు.కియోసాకి చెప్పే మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. మన జీవిత లక్ష్యం ఎప్పుడూ మనకు వెంటనే అర్థం కాదు. కొన్నిసార్లు మనం ఏం చేయాలో తెలియక అయోమయంలో ఉంటాం. కానీ ఇతరులకు ఉపయోగపడే పనులు చేస్తూ ముందుకు వెళ్తే.. మన దారి మనకే క్రమంగా అర్థమవుతుంది. జీవితంలో ఎంత డబ్బు సంపాదించాం అనేదాని కంటే, మన వల్ల ఎంతమంది జీవితాల్లో మంచి మార్పు వచ్చింది అనేది కూడా ముఖ్యమే.చివరికి ''నీ జీవిత లక్ష్యం ఏంటి? దేవుడు నిన్ను ఈ భూమిపైకి ఎందుకు పంపాడు?'' ఇవి ప్రతి ఒక్కరూ తమను తాము ప్రశ్నించుకోవాల్సిన విషయాలు అని కియోసాకి తన ట్వీట్ ముగించాడు. మొత్తం మీద జీవితం అంటే కేవలం మన కోసం బతకడం కాదు. మన ప్రతిభ, మన అనుభవం, మన సంపాదన, మన జ్ఞానం ద్వారా ఇతరులకు ఉపయోగపడేలా జీవించినప్పుడే మన జీవితానికి నిజమైన అర్థం వస్తుందని ఆయన స్పష్టం చేశారు.WORDS of TRANSFORMATION💥Years ago, I was making a lot of money in the Rock n Roll business developing products for bands such as the Police, Van Halen, Iron Maiden and more. It was fun because I often got to hangout back stage with the band. As much fun and profitable as…— Robert Kiyosaki (@theRealKiyosaki) August 13, 2026 -
రిటైర్మెంట్ నిధికి ఏది శ్రీరామరక్ష?
ఉద్యోగ జీవితంలో అడుగుపెట్టిన ప్రతి వేతన జీవిని వేధించే ప్రధాన ప్రశ్న.. ‘నా భవిష్యత్తు అవసరాలకు, రిటైర్మెంట్ నిధికి ఈపీఎఫ్ మేలా? లేక పీపీఎఫ్ ఉత్తమమా?’. ప్రభుత్వం అందించే ఈ రెండు పబ్లిక్ సేవింగ్స్ స్కీమ్‌లూ సురక్షితమైనవే అయినప్పటికీ వాటి వార్షిక రాబడులు, విత్‌డ్రా నిబంధనలు, పన్ను ప్రయోజనాల్లో స్పష్టమైన తేడాలు ఉన్నాయి.వడ్డీలో తేడాఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్) ప్రస్తుతం 8.25% వార్షిక వడ్డీ రేటును అందిస్తోంది. ఉద్యోగి జీతం నుంచి కట్ అయ్యే 12 శాతం మొత్తానికి సమానంగా యాజమాన్యం కూడా కాంట్రిబ్యూట్ చేయడం ఈపీఎఫ్‌లో అతిపెద్ద ప్లస్ పాయింట్. మరోవైపు, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) ప్రస్తుతం 7.1% వడ్డీ రేటును అందిస్తోంది. ఇందులో కేవలం వ్యక్తిగత పెట్టుబడికి మాత్రమే అవకాశముంటుంది. ఆర్థిక చక్రవడ్డీ ప్రాతిపదికన చూస్తే ఈపీఎఫ్ అందించే అధిక వడ్డీ రేటు సుదీర్ఘ కాలంలో పెద్ద మొత్తంలో నిధి రూపుదిద్దుకోవడానికి దోహదపడుతుంది.పన్ను ప్రయోజనాలుపన్ను ప్రయోజనాల విషయానికి వస్తే రెండు స్కీమ్‌లూ ప్రాథమికంగా ఒకే కేటగిరీ కిందకే వస్తాయి. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80సీ కింద రెండింటిలోనూ మినహాయింపు పొందే వీలుంది. అయితే, ఒక ఆర్థిక సంవత్సరంలో ఈపీఎఫ్‌లో ఉద్యోగి కాంట్రిబ్యూషన్ రూ.2.5 లక్షలు దాటితే ఆ పైబడిన మొత్తంపై వచ్చే వడ్డీకి పన్ను వర్తిస్తుంది. కానీ పీపీఎఫ్‌లో ఏటా గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు మాత్రమే డిపాజిట్ చేయడానికి పరిమితి ఉంటుంది. వడ్డీ, మెచ్యూరిటీ మొత్తంపై ఎలాంటి పన్ను ఉండదు.ఏది ఉత్తమం?భవిష్యత్తును సురక్షితం చేసుకోవాలనుకునే వేతన జీవులకు ఈపీఎఫ్ ప్రాథమిక ప్రాధాన్యతగా ఉండాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. సంస్థ ఇచ్చే కాంట్రిబ్యూషన్, 8.25% వడ్డీ కలవడం దీనికి ప్రధాన కారణం. ఇక అదనంగా పొదుపు చేయాలనుకునేవారు లేదా పన్ను మినహాయింపుల కోసం తమ పోర్ట్‌ఫోలియోను డైవర్సిఫై చేసేందుకు పీపీఎఫ్‌ను సెకండరీ ఆప్షన్‌గా ఎంచుకోవడం ఉత్తమం. వీపీఎఫ్ (Voluntary Provident Fund) ద్వారా ఈపీఎఫ్లోనే అదనపు నిధులు కేటాయించడం కూడా సురక్షితమైన, అధిక రాబడినిచ్చే వ్యూహంగా మారుతుంది.ఇదీ చదవండి: మళ్లీ భగ్గుమన్న బంగారం.. ధరకు రెక్కలు! -
బంగారం కొనుగోలుపై కియోసాకి కీలక వ్యాఖ్యలు
బంగారం మరోసారి ఆల్‌టైమ్ గరిష్ఠాన్ని తాకిన నేపథ్యంలో ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ రచయిత రాబర్ట్ కియోసాకి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బంగారాన్ని సాధారణ రిటైల్ ఇన్వెస్టర్లు మాత్రమే కాకుండా, అమెరికా డాలర్లను పెద్ద మొత్తంలో కలిగి ఉన్న కేంద్ర బ్యాంకులు కూడా భారీగా కొనుగోలు చేస్తున్నాయని ఆయన తన ఫేస్బుక్ పోస్ట్‌లో పేర్కొన్నారు. ప్రపంచ దేశాలు అమెరికా డాలర్లకు బదులుగా బంగారాన్ని నిల్వ చేసుకునే ధోరణి గత 50 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా పెరిగిందని ఆయన అన్నారు.1971 ఆగస్టు 15న అప్పటి అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ డాలర్‌ను బంగారంతో మార్పిడి చేసే విధానాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించడాన్ని కియోసాకి ప్రస్తావించారు. అప్పట్లో ఇది తాత్కాలిక నిర్ణయమని చెప్పినా, 54 ఏళ్లుగా అది కొనసాగుతోందని అన్నారు. అంతకుముందు డాలర్ విలువకు బంగారం ఆధారం ఉండేదని, ఆ తర్వాత అది ప్రభుత్వంపై, దాని విశ్వసనీయతపై ఆధారపడే కరెన్సీగా మారిందని వివరించారు.అమెరికా అప్పులు భారీగా పెరిగిన నేపథ్యంలో ప్రపంచ దేశాలు తమ డాలర్ నిల్వలను బంగారంగా మార్చుకునే ధోరణి పెరుగుతోందని కియోసాకి అభిప్రాయపడ్డారు. ‘‘ఎవరైతే హామీలు ఇస్తున్నారో.. వారే ఇప్పుడు ఆ హామీల నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నారు’’ అనే అర్థంలో ఆయన వ్యాఖ్యానించారు.తన ‘రిచ్ డాడ్’ నుంచి నేర్చుకున్న పాఠాన్ని ప్రస్తావిస్తూ.. ఇతరుల హామీపై ఆధారపడే డబ్బు, ఎవరి హామీ అవసరం లేని డబ్బు అనే రెండు రకాల సంపద ఉంటాయని కియోసాకి పేర్కొన్నారు. అయితే బంగారాన్ని కేవలం కొనుగోలు చేసి భద్రపరచడం కంటే, బంగారాన్ని ఉత్పత్తి చేసే గనుల్లో పెట్టుబడి పెట్టడమే మెరుగైన వ్యూహమని ఆయన సూచించారు.బంగారు గనుల్లో పెట్టుబడి పెడితే బంగారం విలువతో పాటు గని ద్వారా వచ్చే ఆదాయం, భవిష్యత్తులో ఆ వ్యాపారం పెరిగే కొద్దీ లభించే విలువ కూడా పెట్టుబడిదారుడికి దక్కుతుందని కియోసాకి వివరించారు. ఈ సందర్భంగా ‘ది క్యాపిటల్ క్లబ్’ పేరుతో పెట్టుబడి అవకాశాలను అందించే సంస్థను, దాని ద్వారా బంగారం-వెండి మైనింగ్ ఆపరేషన్‌లో పెట్టుబడి అవకాశాన్ని ఆయన ప్రస్తావించారు. -
అందుకే.. త్వరగా ఫెయిల్ అవ్వు!
జీవితంలో ఫెయిల్యూర్ అంటే చాలామందికి భయం. ఎందుకంటే.. ఏదైనా పని మొదలుపెట్టే ముందు ''ఇది ఫెయిల్ అయితే?'' అనే ఆలోచనే ఎక్కువగా ఉంటుంది. దీంతో రిస్క్ తీసుకోకుండా సేఫ్‌గా ఉండటానికే ప్రయత్నిస్తారు. కానీ.. నిజానికి ఫెయిల్యూర్ అనేది అంతం కాదు.. మనం చేసిన తప్పుల నుంచి నేర్చుకునే అవకాశం. ఇదే విషయాన్ని రాబర్ట్ కియోసాకి తన జీవితంలో ఎదురైన అనుభవం ద్వారా పేర్కొన్నారు. ఈ విషయాన్ని తన ఫేస్బుక్ పోస్టు ద్వారా వెల్లడించారు.25 ఏళ్ల వయసులో అతని మొదటి బిజినెస్ పూర్తిగా విఫలమైంది. దీంతో చాలా బాధపడ్డాను. ఎవరైనా తనను ఓదార్చాలని అనుకున్నాను. కానీ అతని రిచ్ డాడ్ మాత్రం ''నువ్వు చాలా త్వరగా ఫెయిల్ కాలేదు.. పనిచేయని బిజినెస్‌ను కాపాడటానికి చాలా కాలం ప్రయత్నించావు. అయితే మరోసారి త్వరగా ఫెయిల్ అవ్వు.. త్వరగా నేర్చుకో.. త్వరగా ముందుకు వెళ్లు'' అని చెప్పారు అని కియోసాకి అన్నారు.ఆ సమయంలో ఆ మాటలు వినడం కష్టంగా అనిపించినా.. తర్వాత అవే తన జీవితంలో ఎంతో ఉపయోగపడ్డాయని కియోసాకి చెప్పారు. మనలో చాలామంది ఫెయిల్యూర్‌ను ఒక తీర్పులా చూస్తాం. ఒకసారి ఓడిపోతే మనలో సామర్థ్యం లేదని భావిస్తాం. అందుకే ..సేఫ్ జాబ్‌లోనే ఉండిపోతాం, కొత్త బిజినెస్ మొదలుపెట్టడానికి భయపడతాం, రిస్క్ ఉన్న పెట్టుబడులకు దూరంగా ఉంటాం.కానీ.. ప్రయత్నించకపోవడం కూడా ఒక రకమైన నష్టమే. ఎందుకంటే ప్రయత్నిస్తే ఫెయిల్ కావచ్చు.. కానీ ప్రయత్నించకపోతే ఏం జరుగుతుందో తెలుసుకునే అవకాశం కూడా ఉండదు.మొదటి బిజినెస్ ఫెయిల్ అయిన తర్వాత అతను తన తప్పులను ఒక్కొక్కటిగా విశ్లేషించుకున్నన్నాను. డబ్బును సరిగ్గా నిర్వహించకపోవడం, సరైన బిజినెస్ భాగస్వాములను ఎంచుకోకపోవడం, తన ఆలోచనలను రక్షించుకోకపోవడం, కొద్దిమంది కస్టమర్లపైనే ఎక్కువగా ఆధారపడటం వంటి విషయాల నుంచి పాఠాలు నేర్చుకున్నాను. రెండోసారి కూడా కొన్ని తప్పులు జరిగాయి. కానీ ఈసారి వాటి నుంచి మరిన్ని విషయాలు నేర్చుకున్నాను.ఇక్కడ ''త్వరగా ఫెయిల్ అవ్వాలి'' అంటే కావాలని ఓడిపోవాలని కాదు. ఒక పనిని పట్టుకుని ఎక్కువ సమయం, డబ్బు వృథా చేయకూడదన్నదే అసలు అర్థం. ఒక ఆలోచన పనిచేయడం లేదని అర్థమైతే.. కారణం తెలుసుకుని మార్పులు చేయాలి లేదా మరో దారిలో ప్రయత్నించాలి. చిన్న స్థాయిలో తప్పులు చేసి వాటి నుంచి నేర్చుకుంటే.. భవిష్యత్తులో పెద్ద నష్టాలను కూడా తప్పించుకోవచ్చు. -
EPFO సభ్యులకు హెచ్చరిక!
దాదాపు అన్ని సేవలు ఆన్లైన్ పూర్తవుతున్న సమయంలో.. సైబర్ మోసాలు కూడా పెరిగిపోయాయి. నకిలీ వెబ్సైట్లు, లింకులు, మెసేజ్‌లతో ఉద్యోగులను మోసం చేసే ప్రయత్నాలు ఎక్కువవుతున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని ఈపీఎఫ్ఓ (EPFO) తన సభ్యులను హెచ్చరించింది.ఈపీఎఫ్ఓ తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు చేస్తూ.. ఏదైనా లింక్‌పై క్లిక్ చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని సూచించింది. నకిలీ లింక్‌లను నమ్మొద్దని, వెబ్సైట్ యూఆర్ఎల్ను జాగ్రత్తగా పరిశీలించాలని తెలిపింది. ముఖ్యంగా.. ఆన్లైన్లో పీఎఫ్‌కు సంబంధించిన సేవలను ఉపయోగించేటప్పుడు వ్యక్తిగత వివరాలను కాపాడుకోవాలని సూచించింది.ప్రస్తుతం చాలామంది ఉద్యోగులు యూఏఎన్, పీఎఫ్ బ్యాలెన్స్, క్లెయిమ్ తదితర సేవల కోసం ఆన్‌లైన్‌లోకి వెళ్తుంటారు. ఇదే సమయంలో కొందరు మోసగాళ్లు ఈపీఎఫ్ఓ అధికారిక వెబ్‌సైట్‌ను పోలిన నకిలీ వెబ్సైట్లను తయారు చేస్తున్నారు. వాటి ద్వారా యూఏఎన్, పాస్వర్డ్, ఆధార్, పాన్, బ్యాంక్ వివరాలు, ఓటీపీ వంటి సమాచారాన్ని సేకరించే ప్రయత్నం చేస్తున్నారు.అందుకే పీఎఫ్‌కు సంబంధించిన సేవలను ఉపయోగించేటప్పుడు తప్పకుండా వెబ్సైట్ అడ్రస్‌ను చెక్ చేయాలి. ముఖ్యంగా యూఆర్ఎల్లో స్పెల్లింగ్ తప్పులు ఉన్నాయా? డొమైన్ పేరు అనుమానాస్పదంగా ఉందా? వంటి విషయాలను గమనించాలి. అంతే కాకుండా ఎస్ఎంఎస్, వాట్సాప్, ఈమెయిల్ లేదా సోషల్ మీడియాలో ఎవరైనా పంపిన లింక్‌ను చూసి వెంటనే క్లిక్ చేయకూడదు.ఈపీఎఫ్ఓ సభ్యులు తమ యూఏఎన్ నెంబర్, పాస్వర్డ్, ఆధార్, పాన్, బ్యాంక్ వివరాలు, ఓటీపీ వంటి సమాచారాన్ని అనధికారిక వెబ్సైట్లలో నమోదు చేయకూడదు. ముఖ్యంగా ఎవరి నుంచైనా ఫోన్ కాల్, ఎస్ఎంఎస్, వాట్సాప్ మెసేజ్ లేదా ఈమెయిల్ వచ్చి ఓటీపీ లేదా వ్యక్తిగత వివరాలు అడిగితే.. వెంటనే అప్రమత్తం కావాలి. ఈపీఎఫ్ఓ ఇలాంటి మార్గాల ద్వారా సభ్యుల నుంచి ఓటీపీలు, పాస్వర్డ్లు లేదా లాగిన్ వివరాలను అడగదు.జాగ్రత్తలుపీఎఫ్కు సంబంధించిన సేవల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను మాత్రమే ఉపయోగించాలిఇంటర్నెట్లో కనిపించే రాండమ్ లింక్‌లను లేదా ఎవరో పంపిన లింక్‌లను నమ్మకూడదుఅనుమానాస్పద లింక్‌లు వస్తే వాటిపై క్లిక్ చేయకుండా.. నేరుగా అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి సేవలను ఉపయోగించాలి.లాగిన్ చేసే ముందు URLను మరోసారి పరిశీలించాలిఅధికారిక వెబ్సైట్లా కనిపించే నకిలీ సైట్లు కూడా ఉండే అవకాశం ఉంది కాబట్టి.. చిన్న స్పెల్లింగ్ మార్పులను కూడా నిర్లక్ష్యం చేయకూడదు.ఏదైనా అనుమానాస్పద వెబ్సైట్, మెసేజ్ లేదా ఫిషింగ్ వంటివి కనిపిస్తే సంబంధిత అధికారిక ఛానళ్ల ద్వారా ఫిర్యాదు చేయాలిThink Before You Click! EPFO urges all members to stay vigilant online. Avoid fake links, verify URLs and protect your personal information at all times.#EPFOWithYou #HumHainNa #EPFO #ईपीएफओ pic.twitter.com/LwQVy0S84g— EPFO (@officialepfo) August 9, 2026 -
న్యూ ఫండ్ ఆఫర్స్: ఇన్వెస్కో నుంచి రెండు ఫండ్స్
ఇన్వెస్కో ఇండియా రెండు న్యూ ఫండ్ ఆఫర్స్‌ని ప్రకటించింది. బీఎస్ఈ సెన్సెక్స్ ఈటీఎఫ్, నిఫ్టీ బ్యాంక్ ఈటీఎఫ్ వీటిలో ఉన్నాయి. ఇవి ఆగస్టు 11తో ముగుస్తాయి. అభిషేక్ బాహినిపతి వీటికి ఫండ్ మేనేజర్‌గా వ్యవహరిస్తారు. తక్కువ ట్రాకింగ్ ఎర్రర్స్కి లోబడి దేశీయంగా కీలకమైన లార్జ్ క్యాప్, బ్యాంకింగ్ రంగాల్లో తక్కువ వ్యయాలతో ప్యాసివ్ పద్ధతిలో ఇన్వెస్ట్ చేసేందుకు ఈ ఫండ్స్ ఉపయోగపడతాయి.దీర్ఘకాలిక ఆర్థిక వృద్ధితో ముడిపడి ఉన్న సెన్సెక్స్‌లోని 30 దిగ్గజ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసేందుకు బీఎస్ఈ సెన్సెక్స్ ఈటీఎఫ్ ఉపయోగపడుతుంది. ఆర్థిక వ్యవహారాలకు కీలకంగా నిల్చే దిగ్గజ ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకింగ్ సంస్థల్లో ఇన్వెస్ట్ చేసేందుకు నిఫ్టీ బ్యాంక్ ఈటీఎఫ్ సహాయకరంగా ఉంటుంది. ఎన్ఎఫ్వో వ్యవధిలో కనీసం రూ.5,000 నుంచి ఇన్వెస్ట చేయొచ్చు. కోటక్ డైవర్సిఫైడ్ ఈక్విటీ ఆల్ క్యాప్ ఓమ్ని ఎఫ్వోఎఫ్కోటక్ మహీంద్రా అసెట్ మేనేజ్మెంట్ సంస్థ కొత్తగా డైవర్సిఫైడ్ ఈక్విటీ ఆల్ క్యాప్ ఓమ్ని ఫండ్ ఆఫ్ ఫండ్ (ఎఫ్‌వోఎఫ్)ను ఆవిష్కరించింది. ఈ ఎన్ఎఫ్వో ఆగస్టు 19తో ముగుస్తుంది. ఇది వివిధ మార్కెట్ క్యాపిటలైజేషన్లవ్యాప్తంగా యాక్టివ్, ప్యాసివ్ ఈక్విటీ ఆధారిత స్కీముల్లో ఈ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తుంది. ఒకే సాధనంతో పెట్టుబడుల డైవర్సిఫికేషన్ ప్రయోజనాలను కల్పించడం, తద్వారా దీర్ఘకాలికంగా మూలధన వృద్ధికి తోడ్పడటం దీని లక్ష్యం. ఇందులో కనీసం రూ. 1,000 నుంచి, సిప్ విధానంలో రూ. 500 నుంచి (కనీసం రెండు ఇన్స్టాల్మెంట్లు) ఇన్వెస్ట్ చేయొచ్చు. -
ITR-4: లెక్కలు లేకున్నా.. సక్రమంగా రిటర్నులు
ఈ వారం ఫారం 4 గురించి తెలుసుకుందాం. ‘లెక్కలు’ అనగానే వ్యాపారం/వృత్తులకు వర్తిస్తాయి. జీతాలు, ఇంటద్దె, క్యాపిటల్ గెయిన్స్, ఇతర ఆదాయాలు.. వీటిలో దేనికి దానికే ప్రత్యేకంగా, చట్టపరంగా బుక్స్ రాయాలి. ఆదాయం పన్ను చట్టంలో ‘అకౌంటు బుక్స్’.. అంటే, ఏమిటో నిర్వచనం ఇచ్చారు. దీని ప్రకారం బుక్స్‌ని నిర్వహించండి. కొంత టర్నోవరు, వసూళ్లు దాటితే ఆడిట్ చేయాలి. కానీ, ఒక మినహాయింపు ఇచ్చారు. మీరు అకౌంట్ బుక్స్ రాయనవసరం లేదు. ఆడిట్ వైపే వెళ్లక్కర్లేదు.ఫారం ఐటీఆర్ – 4 అంటే ఏమిటి.. 🔷 వ్యక్తులు/హిందూ ఉమ్మడి కుటుంబం, భాగస్వామ్య సంస్థలు 🔷 రెసిడెంట్లు అయి ఉండాలి 🔷 సంవత్సరంలో ఆదాయం రూ. 50,00,000 దాటకూడదు 🔷 పాత చట్టం ప్రకారం 44 ఏడీ, 44ఏడీఏ, 44 ఏఈల వ్యాపారం ఉండాలి. 🔷 వ్యాపారం/వృత్తి ఆదాయంతో పాటు జీతం, పెన్షన్, ఒక ఇంటి మీద ఆదాయం, వ్యవసాయం ఆదాయం రూ. 5,000 లోపల, నిర్దేశించిన ఇతర ఆదాయాలు 🔷 నాన్–రెసిడెంట్లు, రూ. 50,00,000 ఆదాయం దాటినవారు, స్వల్పకాలిక క్యాపిటల్ గెయిన్స్ వారు, లాంగ్‌టర్మ్‌లో రూ. 1,25,000 దాటిన వారు, కంపెనీ డైరెక్టర్లు, రెండు ఇళ్ల మీద ఆదాయం ఉన్నవారు, లాటరీ ఆదాయం ఉన్నవారు.. వీళ్లంతా ఈ ఫారం వేయకూడదు.44ఏడీఏ అంటే ఎవరు.. వృత్తి నిపుణులు – లీగల్, మెడికల్, ఇంజనీరింగ్, ఆర్కిటెక్ట్, అకౌంటింగ్, టెక్నికల్ కన్సల్టెన్సీ, ఇంటీరియర్ డెకరేషన్.. వీరందరూ, వారి టర్నోవరు/వసూళ్లు.. సంవత్సరానికి రూ. 50,00,000 దాటకపోతే.. వ్యవహారాల్లో 5 శాతం లోపల నగదు లావాదేవీలు జరిపితే రూ. 75,00,000 దాటకపోతే, వీరు 50 శాతం ఆదాయంగా చూపించాలి.44 ఏడీ అంటే ఎవరు.. పై సెక్షన్ వృత్తి నిపుణులకు వర్తిస్తే, ఈ సెక్షన్ వ్యాపారస్తులకు, టర్నోవరు/వసూళ్లు రూ. 2 కోట్లు దాటకూడదు. 5 శాతం నగదు వ్యవహారాలు దాటకుండా ఉంటే రూ. 3 కోట్లు. వీరు ఈ టర్నోవరుపైన 6 శాతం చొప్పున లాభం ప్రకటించాలి. 6 శాతం దాటి చూపినా ఫర్వాలేదు. కానీ 6 శాతం కన్నా తక్కువ చూపిస్తే బుక్స్ రాసి ఆడిట్ చేయించాలి. ఇదంతా బ్యాంకింగ్ చానల్. నగదు వ్యవహారాలైతే 8 శాతం చొప్పున చూపించాలి.44ఏఈ ఎవరంటే.. ఇది కేవలం ట్రాన్స్పోర్ట్ వ్యాపారస్తులకే వర్తిస్తుంది. సొంతంగా గానీ.. అద్దెకు గానీ, లీజుగా గానీ కేవలం 10 వాహనాలు లేదా తక్కువ ఉండాలి. ప్యాసింజరు బళ్లకు వర్తించదు. హెవీ వెహికల్ అయితే, ఒక టన్నుకి రూ. 1,000. ఇతర వెహికల్ అయితే ఒక బండికి రూ. 7,500.పైన చెప్పిన మూడు రకాలవారికి 🔷 బుక్స్ అవసరం లేదు 🔷 ఆడిట్ అవసరం లేదు 🔷 వ్యాపార ఖర్చులు మినహాయింపు 🔷 పాత పద్ధతిలో అయితే 80సీ మొదలైన తగ్గింపులుంటాయిఅయితే ముఖ్యమైన విషయం 🔷 ఇతర రికార్డులు, వ్యాపారానికి సంబంధించి అన్ని రిజిస్ట్రేషన్లు మొదలైనవన్నీ ఉండాలి. 🔷 జీఎస్టీ రికార్డులు ఉండాలి 🔷 బ్యాంకు అకౌంటు బుక్స్ ఉండాలి 🔷 బిల్లులు, ఇన్వాయిస్లు, వసూళ్లకు సంబంధించి రికార్డులు ఉండాలి 🔷 లాగ్ బుక్స్ ఉండాలికొన్ని పరిమితులు/ఆంక్షలు ఉన్నాయి. అవి దాటలేదని నిర్ధారించడానికి అవసరమైన రికార్డులుంటే లెక్కలు లేకుండానే, సక్రమంగా రిటర్నులు వేయొచ్చు. -
పోర్ట్‌ఫోలియోకి స్థిరత్వం, వృద్ధికి దన్ను
స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసే విషయంలో ‘పెట్టుబడి పెట్టాలా వద్దా’ అని కాకుండా .. ‘ఎందులో పెట్టాలి’ అనేదే అత్యంత క్లిష్టమైన సవాలుగా అనిపిస్తుంది. సాధారణంగా చాలాకాలంగా లార్జ్ క్యాప్ కంపెనీలు స్థిరత్వానికి, నిలకడైన వ్యాపారాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉంటూ, పోర్ట్‌ఫోలియోలకు దన్నుగా నిలుస్తున్నాయి. మరోవైపు, మిడ్ క్యాప్ స్టాక్స్.. కార్పొరేట్ రంగ తదుపరి వృద్ధిలో భాగస్వాములయ్యే అవకాశాలను కల్పిస్తున్నాయి. అయితే, ఈ రెండింటికీ పోర్ట్‌ఫోలియోల్లో స్థానం ఉంటున్నప్పటికీ, వీటి మధ్య సరైన సమతుల్యతను సాధించడం చెప్పినంత ఈజీ కాదు. మ్యూచువల్ ఫండ్స్ సంస్థల సమాఖ్య యాంఫీ డేటా ప్రకారం ’లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్స్’ కేటగిరీలోకి నిధుల ప్రవాహం గణనీయంగా పెరిగింది. 2025 జూన్‌లో రూ. 3,497 కోట్లుగా ఉన్న పెట్టుబడులు, 2026 జూన్ నాటికి 24 శాతం పెరిగి రూ. 4,321 కోట్లకు చేరాయి. ఇదే సమయంలో ఫక్తు లార్జ్ క్యాప్ ఫండ్ కేటగిరీలోకి పెట్టుబడులు ఒక మోస్తరుగానే వృద్ధి చెంది రూ. 2,067 కోట్లు వచ్చాయి. ఈక్విటీ పెట్టుబడుల్లోనే డైవర్సిఫికేషన్ ద్వారా మిడ్ క్యాప్ కంపెనీల ఆదాయ వృద్ధి సామర్థ్యాన్ని, లార్జ్ క్యాప్ కంపెనీల స్థిరత్వం అలాగే లిక్విడిటీ ప్రయోజనాలను కూడా పొందాలని భావిస్తున్న ఇన్వెస్టర్ల సంఖ్య వేగంగా పెరుగుతోందని ఇది తెలియజేస్తోంది. ఈ కేటగిరీకి ఎందుకింత ప్రాధాన్యత.. లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్ ప్రత్యేకత అంతా కూడా దీన్ని నిర్వహించే విధానంలోనే ఉంటుంది. సెబీ నిబంధనల ప్రకారం ఈ ఫండ్స్ తమ దగ్గరున్న నిధుల్లో కనీసం 35 శాతాన్ని లార్జ్ క్యాప్ కంపెనీల్లో, మరో 35 శాతాన్ని మిడ్ క్యాప్ కంపెనీల్లో తప్పనిసరిగా ఇన్వెస్ట్ చేయాలి. మిగతా భాగాన్ని ఫండ్ మేనేజర్ తన విచక్షణకు అనుగుణంగా పెట్టుబడులు పెట్టొచ్చు. ఈ విధానం వల్ల రెండు విభాగాల్లోనూ ఎప్పుడూ సరైన ప్రాతినిధ్యం ఉండటమే కాకుండా, అధిక లాభాలకు ఆస్కారమున్న సాధనానికి కేటాయింపులను పెంచేందుకు వీలుంటుంది. డబుల్ ప్రయోజనాలు.. సాధారణంగా లార్జ్ క్యాప్ కంపెనీలకు నిరూపితమైన వ్యాపార మోడల్స్, పటిష్టమైన బ్యాలెన్స్ ఉంటాయి. ఆర్థిక సవాళ్లను తట్టుకుని నిలబడే సామర్థ్యాలు ఉండటం వల్ల మార్కెట్ తీవ్ర హెచ్చుతగ్గులకు లోనైనా కూడా పోర్ట్‌ఫోలియోకి ఇవి కొంత స్థిరత్వాన్ని ఇస్తాయి. ఇక మిడ్ క్యాప్ కంపెనీలను చూస్తే ఇవి చిన్న సంస్థలకంటే మెరుగైన వృద్ధి దశలో ఉండి, ఇంకా లార్జ్ క్యాప్ స్థాయికి చేరుకోనివై ఉంటాయి. వ్యాపార విస్తరణ, మార్కెట్లో స్థానాన్ని పటిష్టం చేసుకోవడం, లాభదాయకతను పెంచుకోవడం ద్వారా ఇవి దీర్ఘకాలంలో అధిక ఆదాయ వృద్ధిని అందిస్తాయి.అయితే, దీనికి తగ్గట్లుగానే వీటిలో రిస్క్‌లు, ఒడిదుడుకులు కాస్త ఎక్కువగానే ఉంటాయి. ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో ఈ రెండింటి కలయిక చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మార్కెట్లోని పలు రంగాల్లో లార్జ్ క్యాప్‌లు ఆకర్షణీయమైన విలువకే లభిస్తుండగా, మిడ్ క్యాప్‌లు మరింత మెరుగైన రాబడిని పొందే అవకాశం కల్పిస్తున్నాయి. ఈ రెండింటినీ కలపడం ద్వారా ఒకే పోర్ట్‌ఫోలియో ద్వారా ఇన్వెస్టర్లు స్థిరత్వంతో పాటు వృద్ధి అవకాశాలనూ పొందవచ్చు. నిబంధనలకు ప్రాధాన్యత.. ఈ కేటగిరీ కేవలం విభిన్న క్యాపిటలైజేషన్ ఉండే కంపెనీల కలయికగా మాత్రమే కాకుండా, పెట్టుబడులను సొంతంగా నిర్వహించుకునే ఇన్వెస్టర్లకు ఎదురయ్యే ఒక ప్రధాన సమస్యకు పరిష్కార మార్గాన్ని కూడా చూపుతుంది. చాలామంది ఇన్వెస్టర్లు ఇటీవల బాగా రాణించిన రంగాల్లోనే పెట్టుబడులు పెట్టడమో లేదా నష్టాల్లో ఉన్న విభాగాల నుంచి వెంటనే పెట్టుబడులను వెనక్కి తీసుకోవడమో చేస్తుంటారు. ఇలాంటి ఆలోచన విధానం సహజమే అయినప్పటికీ, మార్కెట్ పరిస్థితులు మారినప్పుడు పోర్ట్‌ఫోలియో తీవ్రంగా దెబ్బతింటుంది.లార్జ్–క్యాప్, మిడ్–క్యాప్ కంపెనీలకి తప్పనిసరిగా కేటాయింపులు ఉండేలా చూడటం ద్వారా ఇలాంటి ఆలోచనా ధోరణుల వల్ల, ఇన్వెస్టర్లు నష్టాల బారిన పడకుండా చూసేందుకు తోడ్పడుతుంది. ఇన్వెస్టర్ వ్యక్తిగత నిర్ణయాలపై ఆధారపడకుండా, ఈ ఫండ్ నిర్మాణ స్వరూపంలోనే క్రమశిక్షణ ఒక భాగంగా ఉంటుంది. కాబట్టి లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ విభాగాల్లో ఏది ఎప్పుడు మెరుగ్గా రాణిస్తుందో అనేది అంచనాలు వేసుకోవాల్సిన పని ఇన్వెస్టర్లకు ఉండదు. పోర్ట్‌ఫోలియోలో ఎప్పుడూ రెండూ ఉంటాయి కాబట్టి, మార్కెట్ ఎలా ఉన్నా, ఆయా సమయాల్లో లభించే అవకాశాలను ఇది అందిపుచ్చుకుంటుంది. ఎవరికి అనుకూలం..? ఈక్విటీల్లో పెట్టుబడులపరంగా వీలైనన్ని ఎక్కువ ప్రయోజనాలను కోరుకుంటున్నా, మార్కెట్ పరిస్థితులకు తగ్గట్లు తమ పెట్టుబడులను తాము స్వయంగా నిర్వహించుకోలేని ఇన్వెస్టర్లకు లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్స్ అనువుగా ఉంటాయి. లార్జ్–క్యాప్, మిడ్–క్యాప్ ఫండ్లను విడివిడిగా కొనుగోలు చేసి నిర్వహించుకోవడానికి బదులుగా, స్థిరత్వం అలాగే వృద్ధి రెండింటినీ ఒకే ఫండ్ ద్వారా పొందాలనుకునే కొత్త ఇన్వెస్టర్లకు ఇది సరైన ఎంపిక. ఇప్పటికే లార్జ్ క్యాప్ లేదా ఇండెక్స్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసి, స్మాల్ క్యాప్స్‌లో రిస్కుల బారిన పడకుండా, అధిక వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఈక్విటీల్లో మరింత ఇన్వెస్ట్ చేయాలనుకునేవారికి కూడా ఇది అనువుగా ఉంటుంది. ఎందుకంటే ఈ కేటగిరీ ఫండ్స్ ఇటు లార్జ్ క్యాప్స్, అటు మిడ్ క్యాప్స్‌కి అర్థవంతంగా పెట్టుబడులు కేటాయిస్తూనే, కొంత మేర స్మాల్ క్యాప్స్‌లో కూడా ఇన్వెస్ట్ చేసేందుకు అవకాశం ఉంటుంది. తద్వారా ఈక్విటీ మార్కెట్లలో అవకాశాలను సమతూకంతో అందించే ప్రయత్నం చేస్తాయి. వేర్వేరు ఫండ్లలో పెట్టుబడులు పెట్టి వాటిని తరచూ రీబ్యాలెన్స్ చేసే శ్రమ లేకుండా, ఒకే ఈక్విటీ ఫండ్ తమ పోర్ట్‌ఫోలియోకి ప్రధాన ఆధారంగా ఉండాలని కోరుకునే వారికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. చివరిగా.. ఈక్విటీ పెట్టుబడుల విషయంలో అందరికీ ఒకే సూత్రం వర్తించదు. ఏ ఒక్క ఫండ్ కేటగిరీ కూడా అన్ని అవసరాలనూ తీర్చలేదు. అయితే, లార్జ్ అండ్ మిడ్–క్యాప్ ఫండ్లు నిరూపితమైన పెద్ద కంపెనీల స్థిరత్వాన్ని, ఎదుగుతున్న కంపెనీల వృద్ధి సామర్థ్యాలని ఒక నియమావళికి లోబడి ఇన్వెస్టర్లకు అందిస్తాయి. గడిచిన ఏడాది కాలంగా ఈ ఫండ్స్‌లోకి పెరిగిన నిధులను చూస్తే, ఇన్వెస్టర్లు కేవలం ఒకే రకమైన మార్కెట్–క్యాప్‌పై ఆధారపడకుండా స్థిరత్వంతో కూడిన వృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నారని అర్థమవుతోంది. పెట్టుబడుల కేటాయింపుల్లో క్రియాశీలకంగా మార్పులు, చేర్పులు చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఇటు స్థిరత్వం అటు వృద్ధి ప్రయోజనాలను పొందాలనుకునే వారికి లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్స్ ఉపయోగకరంగా ఉంటాయి. మార్కెట్లో ఒక్కో సెగ్మెంట్ ఒక్కో సందర్భంలో రాణిస్తుంది. తదుపరి రాణించబోయే సెగ్మెంట్ గురించి అంచనాలు వేసుకంటూ, ఊహాగానాల్లో ఉండిపోకుండా, పరిస్థితులు ఎలా ఉన్నా పెట్టుబడులను కొనసాగించిన వారికే ప్రయోజనాలు దక్కుతాయనేది గుర్తుంచుకోవాలి. ఇందుకోసం లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్స్ క్రమశిక్షణతో కూడుకున్న విధానంగా ఉపయోగపడతాయి. -
EMI లాక్: కోటక్ బ్యాంక్ హైబ్రిడ్ హోమ్ లోన్
న్యూఢిల్లీ: గృహ రుణాల ఈఎంఐల భారం విషయంలో రుణగ్రహీతలకు స్పష్టత ఉండే విధంగా ప్రైవేట్ రంగ కోటక్ మహీంద్రా బ్యాంక్ కొత్తగా హైబ్రిడ్ హోమ్ లోన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. దీనితో వడ్డీ రేటు 65 నెలల వరకు స్థిరంగా ఉండేలా లాక్ చేసుకునేందుకు వీలవుతుంది. రుణం తీసుకున్న తొలినాళ్లలో ఈఎంఐల భారం విషంయలో కొంత వెసులుబాటు పొందేందుకు ఇది సహాయకరంగా ఉంటుందని కోటక్ మహీంద్రా బ్యాంక్ తెలిపింది.ఈ పథకం కింద 39, 52 లేదా 65 నెలల వరకు ఈఎంఐని లాక్ చేసుకోవచ్చని పేర్కొంది. ఫలితంగా కీలకమైన రెపో రేట్లు మారినా ఆ ప్రభావం వాయిదాలపై ఉండదని తెలిపింది. ఉదాహరణకు ఇటీవల వడ్డీ రేట్ల పెరుగుదల ధోరణులను చూస్తే, ఈ పథకం కింద రూ. 1 కోటి గృహ రుణం తీసుకున్న వారికి కనీసం రూ. 3.46 లక్షల వరకు ఆదా అవుతుందని పేర్కొంది. ప్రస్తుతం కోటక్ మహీంద్రా బ్యాంక్ గృహ రుణాలపై వడ్డీ రేటు 7.6% నుంచి ప్రారంభమవుతోంది. -
UPI సృష్టికర్త ఎవరు.. ఎలా మొదలైంది ఈ డిజిటల్ విప్లవం?
దేశంలో డిజిటల్ చెల్లింపులకు పర్యాయపదంగా మారిపోయిన యూపీఐ ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచింది. యూపీఐ లావాదేవీలపై భవిష్యత్‌లో ఎంపిక చేసిన కొన్ని వ్యాపార లావాదేవీలకు స్వల్ప ఛార్జీలు విధించే అవకాశం ఉందన్న ప్రభుత్వ తాజా ప్రకటనతో దీనిపై చర్చ మొదలైంది. అయితే యూపీఐపై ఛార్జీల గురించి మాట్లాడుతున్న ఈ సమయంలో.. అసలు యూపీఐ ఎలా పుట్టింది? దీని వెనుక ఎవరున్నారు? అనే ప్రశ్నలు సహజంగానే తలెత్తుతాయి.. మరి సమాధానాలు తెలుసుకుందామా..ఒక వ్యక్తి సృష్టి కాదు.. ఒక వ్యవస్థ ఆవిష్కరణయూపీఐ (Unified Payments Interface)ని ఒక్క వ్యక్తి సృష్టించలేదు. దీనిని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) అభివృద్ధి చేసింది. ఆర్బీఐ నియంత్రణలో పనిచేసే ఎన్పీసీఐ.. దేశంలోని రిటైల్ పేమెంట్ వ్యవస్థలకు మౌలిక వేదికగా ఏర్పడింది. ఇప్పటికే ఉన్న IMPS మౌలిక సదుపాయాలపై ఆధారపడి, వివిధ బ్యాంకు ఖాతాలను ఒకే ఇంటర్ఫేస్ ద్వారా అనుసంధానించి తక్షణ చెల్లింపులు చేసేలా యూపీఐని రూపొందించారు.అంటే యూపీఐ అనేది ఒక యాప్ కాదు. బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు, వినియోగదారులు, వ్యాపారులను ఒకే వ్యవస్థలో అనుసంధానించే పేమెంట్ ప్రోటోకాల్. అందుకే ఒక బ్యాంకు ఖాతా నుంచి మరో బ్యాంకు ఖాతాకు, వేర్వేరు యాప్‌లను ఉపయోగించినా, నేరుగా డబ్బు పంపడం సాధ్యమవుతోంది.2016లో కీలక అడుగుయూపీఐ ప్రయోగాత్మకంగా 2016 ఏప్రిల్ 11న ప్రారంభమైంది. ముంబైలో అప్పటి ఆర్బీఐ గవర్నర్ డాక్టర్ రఘురామ్ రాజన్ దీనిని పైలట్‌గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎన్‌పీసీఐకి అప్పటి సలహాదారుగా ఉన్న నందన్ నీలేకని, ఎన్పీసీఐ చైర్మన్ బాలచంద్రన్ ఎం., అప్పటి ఎండీ & సీఈవో ఏపీ హోటా, సీవోవో దిలీప్ అస్బే తదితరులు కీలకంగా పాల్గొన్నారు.నందన్ నీలేకని పేరు ఎందుకు వినిపిస్తుంది?యూపీఐ గురించి మాట్లాడినప్పుడు నందన్ నీలేకని పేరు తరచూ వినిపిస్తుంది. అందుకు కారణం ఆయన అప్పట్లో ఎన్‌పీసీఐకి సలహాదారుగా ఉండటం, డిజిటల్ పేమెంట్స్‌కు సంబంధించిన వ్యవస్థల రూపకల్పనలో కీలకంగా సహకరించడం. అదే సమయంలో యూపీఐని డిజైన్ చేయడం, నిర్మించడం, ఆపరేషనల్ చేయడంలో దిలీప్ అస్బే కీలక పాత్ర పోషించినట్లు అంతర్జాతీయ టెలికాం యూనియన్ (ITU) ప్రొఫైల్ కూడా పేర్కొంటుంది. ఆయన అప్పట్లో ఎన్పీసీఐ సీవోవోగా ఉండగా యూపీఐ ప్రాజెక్టులో కీలకంగా పనిచేశారు.21 బ్యాంకులతో ప్రారంభం2016 ఏప్రిల్‌లో ప్రారంభమైన పైలట్‌లో 21 మెంబర్ బ్యాంకులు పాల్గొన్నాయి. ఆ తర్వాత ఆగస్టు 25 నుంచి యూపీఐ సాధారణ వినియోగదారులకు అందుబాటులోకి రావడం ప్రారంభమైంది. మొదట్లో యూపీఐ ద్వారా డబ్బు పంపడం, డబ్బు కోరడం వంటి ప్రాథమిక సేవలు మాత్రమే ఉండగా.. కాలక్రమేణా QR చెల్లింపులు, ఆటోపే, యూపీఐ లైట్, 123పే వంటి అనేక సేవలు జతయ్యాయి.ఇక్కడే యూపీఐ ప్రత్యేకత బయటపడింది. బ్యాంకు ఖాతా నంబర్, IFSC వంటి వివరాలు ప్రతిసారీ నమోదు చేయాల్సిన అవసరం లేకుండా యూపీఐ ID, మొబైల్ నంబర్ లేదా QR కోడ్ ద్వారా చెల్లింపులు చేయగలిగే విధానాన్ని ఇది తీసుకొచ్చింది.యూపీఐకి అసలు బలం.. ఇంటర్ఆపరబిలిటీయూపీఐ విజయానికి ప్రధాన కారణాల్లో ఒకటి దాని ఇంటర్ఆపరబిలిటీ. అంటే ఒకే యాప్‌కు లేదా ఒకే బ్యాంకుకు వినియోగదారు పరిమితం కాకుండా.. వివిధ బ్యాంకు ఖాతాలను వివిధ యూపీఐ యాప్‌లతో ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. ఇదే విధానం భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల స్వరూపాన్ని మార్చింది. నగదు, కార్డు, నెట్ బ్యాంకింగ్ వంటి పద్ధతుల మధ్య ఉన్న గ్యాప్‌ను యూపీఐ తగ్గించింది. ముఖ్యంగా చిన్న దుకాణాలు, వీధి వ్యాపారులు, క్యాబ్ డ్రైవర్లు, స్వయం ఉపాధి చేసుకునేవారికి QR కోడ్ ద్వారా చెల్లింపులు స్వీకరించడం సులభమైంది.నేడు ఎక్కడికి చేరింది?యూపీఐ ఇప్పుడు కోట్లాది భారతీయుల రోజువారీ చెల్లింపు సాధనంగా మారింది. 2026 జూన్ నాటికి యూపీఐ ప్లాట్‌ఫామ్‌పై 55.49 కోట్ల మంది వినియోగదారులు నమోదయ్యారని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. FY 2025-26లో యూపీఐ ద్వారా 24,162 కోట్ల లావాదేవీలు, మొత్తం రూ.314 లక్షల కోట్ల విలువైన లావాదేవీలు జరిగాయి. ఎన్పీసీఐ గణాంకాల ప్రకారం 2026 మేలోనే యూపీఐ ద్వారా సుమారు రూ.29.90 లక్షల కోట్ల విలువైన 2,320.19 కోట్ల లావాదేవీలు జరిగాయి.ఇప్పుడు ఛార్జీల చర్చ ఎందుకు?యూపీఐ ఇంత పెద్ద స్థాయికి చేరడంతో దాని మౌలిక సదుపాయాలను నిర్వహించే బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు, ఫిన్‌టెక్ సంస్థల ఆదాయ నమూనాపై చర్చ పెరిగింది. ప్రస్తుతం సాధారణ వినియోగదారుల యూపీఐ చెల్లింపులపై ఛార్జీ లేదు. గతంలోనూ రూ.2,000కు పైబడిన యూపీఐ చెల్లింపులపై జీఎస్టీ విధిస్తారన్న ప్రచారాన్ని ప్రభుత్వం ఖండించింది.తాజాగా ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసిన విషయం ఏమిటంటే.. వ్యక్తి నుంచి వ్యక్తికి (P2P) యూపీఐ లావాదేవీలు ఉచితంగానే కొనసాగుతాయి. భవిష్యత్‌లో ఎండీఆర్ (Merchant Discount Rate -MDR) తీసుకొచ్చినా అది పరిమిత సంఖ్యలో, నిర్దిష్ట పరిమితికి మించిన కొన్ని వ్యాపార లావాదేవీలకే వర్తించే అవకాశం ఉందని ప్రభుత్వం తెలిపింది. సాధారణ వినియోగదారుడిపై నేరుగా ఛార్జీ విధించే ఉద్దేశం లేదని స్పష్టం చేసింది. -
యూపీఐ ఛార్జీలపై ఫోన్‌పే సీఈవో కీలక వ్యాఖ్యలు
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) ఛార్జీలపై ఫోన్‌పే వ్యవస్థాపకుడు, సీఈవో సమీర్ నిగమ్ కీలక వ్యాఖ్యలు చేశారు. యూపీఐ వినియోగంపై భారతీయ వినియోగదారులకు ఎలాంటి ఛార్జీలు విధించబోమని స్పష్టం చేశారు. యూపీఐ ద్వారా చెల్లింపులు చేసే వినియోగదారులు ఎలాంటి లావాదేవీ రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు.ఎక్స్‌లో చేసిన ఓ పోస్టులో సమీర్ నిగమ్ స్పందిస్తూ.. ‘‘యూపీఐ భారతీయ వినియోగదారులందరికీ ఉచితం. యూపీఐ చెల్లింపులు చేసినందుకు వినియోగదారుల నుంచి ఎలాంటి ఛార్జీలు వసూలు చేయరు’’ అని పేర్కొన్నారు.ఇదే విషయాన్ని పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (PCI) కూడా స్పష్టం చేసింది. పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ యాక్ట్, 2007ను సవరించే బిల్లును లోక్‌సభ ఆమోదించిన నేపథ్యంలో యూపీఐ ఛార్జీలపై చర్చ మొదలైంది. అయితే వినియోగదారులు, చిన్న వ్యాపారులకు యూపీఐ సేవలు ఉచితంగానే కొనసాగుతాయని పీసీఐ తెలిపింది.యూపీఐ సహా నోటిఫై చేసిన ఎలక్ట్రానిక్ చెల్లింపు విధానాలపై ఛార్జీలు విధించే అవకాశాన్ని ప్రభుత్వానికి కల్పించేలా చట్ట సవరణ బిల్లు రూపొందించారు. అయితే దీనర్థం వినియోగదారుల నుంచి నేరుగా యూపీఐ లావాదేవీ ఛార్జీలు వసూలు చేస్తారని కాదని పీసీఐ పేర్కొంది.2016లో యూపీఐ ప్రారంభమైనప్పటి నుంచి వినియోగదారులకు ఈ సేవ ఉచితంగానే అందుతోందని అసోసియేషన్ తెలిపింది. భవిష్యత్తులోనూ ప్రతి భారతీయుడు ఎలాంటి లావాదేవీ రుసుము లేకుండా తక్షణ డిజిటల్ చెల్లింపులు చేసుకోవచ్చని పేర్కొంది.చిన్న వ్యాపారులకూ ఛార్జీలు లేవుకిరాణా దుకాణాలు సహా చిన్న వ్యాపారులు కూడా యూపీఐ చెల్లింపులను స్వీకరించేందుకు మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) చెల్లించాల్సిన అవసరం లేదని పీసీఐ స్పష్టం చేసింది. యూపీఐ ఛార్జీలపై జరుగుతున్న చర్చ ప్రధానంగా ఈ వ్యవస్థకు అవసరమైన మౌలిక సదుపాయాలకు దీర్ఘకాలిక, స్థిరమైన ఆర్థిక నమూనాను అభివృద్ధి చేయడంపైనే ఉందని తెలిపింది.ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద రియల్‌టైమ్ పేమెంట్ వ్యవస్థగా యూపీఐ ఎదిగింది. కోట్లాది మంది వినియోగదారులు, వ్యాపారులు రోజువారీ చెల్లింపుల కోసం దీనిని వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో యూపీఐ వినియోగదారులు, చిన్న వ్యాపారులకు ఉచిత సేవలు కొనసాగుతాయని ఫోన్‌పే సీఈవో, పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్పష్టత ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది.𝐔𝐏𝐈 𝐢𝐬 𝐚𝐧𝐝 𝐰𝐢𝐥𝐥 𝐫𝐞𝐦𝐚𝐢𝐧 𝐟𝐫𝐞𝐞 𝐟𝐨𝐫 𝐚𝐥𝐥 𝐈𝐧𝐝𝐢𝐚𝐧 𝐜𝐨𝐧𝐬𝐮𝐦𝐞𝐫𝐬!‘Consumers will NOT BE CHARGED anything for making UPI payments.— Sameer Nigam (@_sameernigam) August 8, 2026 -
SGB: కాసుల పంట పండించిన గోల్డ్ బాండ్స్!
సావరిన్ గోల్డ్ బాండ్లు (SGB) బంగారంలో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి కేంద్ర ప్రభుత్వం తరఫున ఆర్బీఐ అందించే సురక్షితమైన పెట్టుబడి పథకం. ఈ బాండ్ల ద్వారా బంగారం ధర పెరుగుదల వల్ల లాభం పొందడంతో పాటు ప్రతి సంవత్సరం 2.5 శాతం స్థిర వడ్డీ కూడా లభిస్తుంది. అయితే ఇప్పుడు ఆర్బీఐ 2020–21 సిరీస్ XIలో పెట్టుబడి పెట్టిన వారికి గడువు పూర్తికాకముందే.. నిర్ణీత నిబంధనల ప్రకారం బాండ్లను ముందస్తుగా ఉపసంహరించుకునే అవకాశాన్ని కల్పించింది.సావరిన్ గోల్డ్ బాండ్లు జారీ అయిన ఐదు సంవత్సరాల తర్వాత నిర్ణీత వడ్డీ చెల్లింపు తేదీల్లో మాత్రమే ముందస్తు ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆగస్టు 8, 9 తేదీల్లో బ్యాంకులకు సెలవులు ఉండటంతో ఆర్బీఐ ఆగస్టు 7 నుంచే ఈ ప్రక్రియను ప్రారంభించింది. ముందస్తు విమోచనం చేసుకునే వారికి ఒక గ్రాము (యూనిట్) ధరను రూ. 14,564గా నిర్ణయించింది. ఈ ధరను ఆగస్టు 4, 5, 6 తేదీలలో 999 స్వచ్ఛత గల బంగారం సగటు ముగింపు ధర ఆధారంగా నిర్ణయించారు. ఇందుకోసం ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) ప్రకటించిన బంగారం ధరలను పరిగణనలోకి తీసుకున్నారు.సావరిన్ గోల్డ్ బాండ్లు విడుదలైన సమయంలో ఆన్లైన్లో గ్రాము ధర రూ. 4,862 మాత్రమే. ప్రస్తుతం అదే యూనిట్‌కు రూ. 14,564 లభిస్తోంది. అంటే ఒక గ్రాముపై రూ. 9,702 లాభం వస్తోంది. దీంతో పెట్టుబడిదారులు దాదాపు 200 శాతం లాభాన్ని పొందుతున్నారు. ఉదాహరణకు.. ఒక వ్యక్తి ఐదు సంవత్సరాల క్రితం రూ. 1 లక్ష పెట్టుబడి పెట్టి ఉంటే, ప్రస్తుతం ఆ పెట్టుబడి విలువ సుమారుగా రూ. 3 లక్షలకు చేరుతుందన్నమాట.అంతేకాకుండా.. పెట్టుబడిదారులకు మొత్తం కాలానికి ప్రతి సంవత్సరం 2.5 శాతం స్థిర వడ్డీ కూడా లభిస్తుంది. ఈ వడ్డీని ప్రతి ఆరు నెలలకు ఒకసారి పెట్టుబడిదారుడి బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. సాధారణంగా సావరిన్ గోల్డ్ బాండ్లకు ఎనిమిది సంవత్సరాల మెచ్యూరిటీ ఉంటుంది. అయితే ఐదు సంవత్సరాలు పూర్తైన తర్వాత నిర్ణీత వడ్డీ చెల్లింపు తేదీల్లో ముందస్తు ఉపసంహరణకు అవకాశం కల్పిస్తారు. చివరగా బాండ్‌ను మెచ్యూరిటీ సమయంలో లేదా ముందస్తు విమోచనం చేసుకున్నప్పుడు అసలు పెట్టుబడితో పాటు చివరి వడ్డీ కూడా అందుతుంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఆన్లైన్లో బాండ్లు కొనుగోలు చేసిన వారికి గ్రాముకు రూ. 50 తగ్గింపు ఇచ్చారు. దీంతో వారు తక్కువ ధరకు బాండ్లు కొనుగోలు చేసి, ప్రస్తుతం మరింత అధిక లాభాన్ని పొందుతున్నారు.ఇదీ చదవండి: ఇదే జరిగితే.. బంగారం ధరలు మరింత పైకి! -
కేంద్రం అలర్ట్.. గ్యాస్ వినియోగదారులకు లాస్ట్ ఛాన్స్!
ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు.. కేంద్ర ప్రభుత్వం ఒక ముఖ్యమైన సూచన చేసింది. గ్యాస్ సిలిండర్ కనెక్షన్ ఉన్న ప్రతి వినియోగదారు తప్పనిసరిగా ఈకేవైసీ (e-KYC) ప్రక్రియను పూర్తి చేయాలని వెల్లడించింది.నిజానికి ఈకేవైసీ పూర్తి చేయడానికి 2026 జూలై 31 వరకు గడువు ఇచ్చారు. కానీ.. తర్వాత వినియోగదారుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ గడువును ఆగస్టు 16 వరకు పొడిగించారు. అయితే ఈ తేదీని పొడిగిస్తారా?, లేదా? అనే విషయం అధికారికంగా వెల్లడికాలేదు. కాబట్టి గడువు లోపల గ్యాస్ వినియోగదారులు ఈకేవైసీ చేయించుకోవాలన్నమాట.ఈకేవైసీ పూర్తి చేయకపోతే.. భవిష్యత్తులో గ్యాస్ సిలిండర్ బుకింగ్, డెలివరీ వంటివాటిలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వం అందించే గ్యాస్ సబ్సిడీపై.. కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన వంటి పథకాల ద్వారా అర్హులైన వినియోగదారులకు వచ్చే సబ్సిడీ నిధులు ఈకేవైసీ పూర్తికాకపోతే నిలిచిపోయే పరిస్థితి ఏర్పడవచ్చు. కాబట్టి వినియోగదారులు ఈ విషయాన్ని తప్పకుండా గుర్తుంచుకోవాలి.అయితే.. ఈకేవైసీ పూర్తి చేసిన తర్వాత మళ్లీ సబ్సిడీ ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుంది. అందువల్ల గ్యాస్ సబ్సిడీ ఆగిపోకుండా ఉండాలన్నా, సిలిండర్ సరఫరాలో ఎలాంటి సమస్యలు రాకుండా ఉండాలన్నా ప్రతి వినియోగదారు ఈ ప్రక్రియను పూర్తి చేయడం మంచిది.ఈకేవైసీ చేయడానికి వినియోగదారులు పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. గ్యాస్ పంపిణీ సంస్థలు మూడు సులభమైన మార్గాలను అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఒకటి.. వినియోగదారులు తమ గ్యాస్ ఏజెన్సీ లేదా పంపిణీ సంస్థ ద్వారా ఇంటి వద్ద నుంచే ఈకేవైసీ పూర్తి చేసుకోవచ్చు. రెండవది, నేరుగా గ్యాస్ ఏజెన్సీ కార్యాలయానికి వెళ్లి ఆధార్ ఆధారిత ధృవీకరణతో ప్రక్రియ పూర్తి చేయవచ్చు. మూడవది, సిలిండర్ డెలివరీకి వచ్చే సిబ్బంది వద్ద ఉండే బయోమెట్రిక్ పరికరం ద్వారా కూడా ఈకేవైసీ చేయించుకోవచ్చు. -
యుద్ధాలతోనే వారికి భారీ లాభాలు: కియోసాకి కామెంట్స్
యుద్ధాలు సామాన్య ప్రజలకు తీవ్ర నష్టాన్ని, ఆర్థిక భారాన్ని మిగిల్చినా.. కొన్ని రంగాల్లోని కంపెనీలు, పెట్టుబడిదారులకు మాత్రం భారీ లాభాలను తెచ్చిపెడతాయని ప్రముఖ ఆర్థిక వ్యాఖ్యాత, ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ రచయిత రాబర్ట్ కియోసాకి పేర్కొన్నారు. ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ఆయన ఫేస్బుక్లో చేసిన తాజా పోస్టులో యుద్ధాలు, ద్రవ్యోల్బణం, కమోడిటీ ధరలు, రియల్ ఆస్తుల మధ్య సంబంధాన్ని వివరించారు.చరిత్రలో జరిగిన దాదాపు ప్రతి పెద్ద యుద్ధం కొంతమందిని అపారంగా సంపన్నులను చేసిందని కియోసాకి అన్నారు. ప్రస్తుత ఇరాన్ యుద్ధం కూడా ఇందుకు భిన్నంగా లేదని పేర్కొన్నారు. యుద్ధ సమయంలో చమురు, రక్షణ రంగాలకు చెందిన కంపెనీలు భారీగా లాభపడుతున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఇంధన సరఫరాలకు అంతరాయం ఏర్పడటంతో చమురు ధరలు పెరగడం, అదే సమయంలో ఆయుధాల డిమాండ్ పెరగడం వంటి పరిణామాలు ఆయా రంగాల కంపెనీలకు ప్రయోజనం చేకూరుస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.ఇరాన్ యుద్ధం కారణంగా గ్లోబల్ ఎనర్జీ మార్కెట్లలో తీవ్ర అంతరాయాలు ఏర్పడటంతో షెల్ వంటి చమురు సంస్థలు భారీ లాభాలను నమోదు చేశాయి. 2026 తొలి త్రైమాసికంలో షెల్ సుమారు 6.9 బిలియన్ డాలర్ల లాభాన్ని ప్రకటించింది. మరోవైపు రక్షణ రంగంలో లాక్‌హీడ్ మార్టిన్, ఆర్టీఎక్స్, బోయింగ్, నార్త్రోప్ గ్రమ్మన్ వంటి సంస్థలు భారీ ఆర్డర్ బ్యాక్‌లాగ్‌లను నమోదు చేశాయి. యుద్ధం కారణంగా ఆయుధ నిల్వలను తిరిగి నింపేందుకు ప్రభుత్వాలు రక్షణ వ్యయాన్ని పెంచుతున్నాయని నివేదికలు వెల్లడించాయి.కియోసాకి తన పోస్టులో మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం, వియత్నాం యుద్ధం, గల్ఫ్ యుద్ధం, ఇరాక్, ఉక్రెయిన్ వంటి సంఘర్షణలను ప్రస్తావించారు. యుద్ధాల సమయంలో సరఫరా వ్యవస్థలు దెబ్బతినడం వల్ల చమురు, ఇతర కమోడిటీల ధరలు పెరుగుతాయని.. దీంతో రియల్ ఆస్తులు, కమోడిటీలను కలిగి ఉన్నవారికి లాభాలు వచ్చే అవకాశం ఉంటుందని వివరించారు.అయితే ఈ ధరల పెరుగుదల భారాన్ని సాధారణ ప్రజలు భరించాల్సి వస్తుందని కియోసాకి పేర్కొన్నారు. పెట్రోల్, విద్యుత్, ఆహారం, రవాణా వంటి వాటి ధరలు పెరగడం ద్వారా యుద్ధ ప్రభావం సామాన్య, మధ్యతరగతి కుటుంబాలపై పడుతుందని అన్నారు. మరోవైపు చమురు, రక్షణ రంగాల్లో పెట్టుబడులు పెట్టిన వారికి అధిక రాబడులు వచ్చే పరిస్థితి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇరాన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత అమెరికాలో ఇంధన ధరలు కూడా గణనీయంగా పెరిగినట్లు నివేదికలు పేర్కొన్నాయి.ప్రతి సంక్షోభంలోనూ లాభపడుతున్నదెవరు?తన ‘రిచ్ డాడ్’ తనకు దశాబ్దాల క్రితమే ఈ విధానాన్ని వివరించారని కియోసాకి తెలిపారు. సంక్షోభ సమయంలో డబ్బు ఏ దిశగా వెళ్తుందో గుర్తించడం కీలకమని పేర్కొన్నారు. ‘‘ప్రతి సంక్షోభంలో ట్రేడ్‌లో సరైన వైపు ఎవరు ఉన్నారో తెలుసుకోండి. ఆ తర్వాత మీరు ఏ వైపు ఉన్నారో ప్రశ్నించుకోండి’’ అనే సందేశాన్ని తన పోస్టులో పంచుకున్నారు. యుద్ధాలు కేవలం భౌగోళిక, రాజకీయ పరిణామాలను మాత్రమే కాకుండా.. చమురు, కమోడిటీలు, సరఫరా వ్యవస్థలు, కరెన్సీలు, ద్రవ్యోల్బణం, స్టాక్ మార్కెట్లపైనా ప్రభావం చూపుతాయని కియోసాకి తన పోస్టులో వివరించారు. -
‘రిచ్ డాడ్’ చదివినా పేదరికం ఎందుకు?
‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ పుస్తకంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన రచయిత, ఆర్థిక వ్యాఖ్యాత, ఇన్వెస్ట్మెంట్ గురూ రాబర్ట్ కియోసాకి తాజాగా చేసిన ఫేస్బుక్ పోస్టులో ఆర్థిక విజయానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. చాలా మంది ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ పుస్తకాన్ని చదివి, అందులోని విషయాలను అంగీకరించినప్పటికీ.. ఆచరణలో పెట్టకపోవడం వల్లే ఆర్థికంగా ఎదగలేకపోతున్నారని ఆయన పేర్కొన్నారు.తనకు తన ‘రిచ్ డాడ్’ పుస్తకాలు ఇవ్వలేదని, అనుభవాల ద్వారా నేర్పించారని కియోసాకి గుర్తుచేసుకున్నారు. తొమ్మిదేళ్ల వయసులోనే తన స్టోర్‌లో ఉచితంగా పని చేయించారని, సరుకుల లెక్కలు చూసుకోవడం, కస్టమర్లను గమనించడం, డబ్బు ఎలా చేతులు మారుతుందో తెలుసుకోవడం వంటి విషయాలను నేర్పించారని తెలిపారు. నిజ జీవితంలో తప్పులు చేయడం, వాటి నుంచి నేర్చుకోవడం ద్వారా తన ఆలోచనా విధానం మారిందని చెప్పారు.ఆర్థిక విద్యలో ఎక్కువ భాగం పుస్తకాలు, పాడ్‌కాస్ట్‌లు, యూట్యూబ్ వీడియోలు, సెమినార్ల వంటి వాటి ద్వారా సాగుతోందని కియోసాకి అభిప్రాయపడ్డారు. ప్రజలు ఆర్థిక సమాచారాన్ని వినోదంలా నిష్క్రియాత్మకంగా తీసుకుంటున్నారని, కానీ దాన్ని ఆచరణలో పెట్టకపోవడం వల్ల వారి జీవితాల్లో మార్పు రావడం లేదని పేర్కొన్నారు.‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ పుస్తకాన్ని ప్రజలకు అన్ని సమాధానాలు చెప్పేందుకు కాకుండా.. సరైన ప్రశ్నలు ఎలా అడగాలో ఆలోచింపజేసేందుకు రాశానని కియోసాకి తెలిపారు. పుస్తకం కేవలం ప్రారంభం మాత్రమేనని, అసలైన ఆర్థిక విద్య అనుభవాల నుంచే మొదలవుతుందని చెప్పారు. మొదటి ఆస్తిని కొనుగోలు చేసి తప్పు చేయడం, వ్యాపారం ప్రారంభించి ఆదాయం గురించి భయపడటం, బ్యాంకు నుంచి రుణం కోసం ప్రయత్నించి తిరస్కరణ ఎదుర్కోవడం, ఆర్థిక నివేదికను చదవలేకపోవడం వంటి అనుభవాలే ఎక్కువగా నేర్పిస్తాయని వివరించారు.పెట్టుబడుల గురించి కేవలం చదవడం ఆపి.. చిన్న మొత్తాలతో అయినా పెట్టుబడులు ప్రారంభించాలని కియోసాకి సూచించారు. పెద్ద మొత్తాలతో తప్పులు చేసే ముందు చిన్న మొత్తాలతో అనుభవం సంపాదించాలని పేర్కొన్నారు. చదవడం కంటే ఆచరణ ద్వారా నేర్చుకున్న విషయాలే ఎక్కువకాలం గుర్తుంటాయని ఆయన తన పోస్టులో వెల్లడించారు. -
డిజిటల్ మోసగాళ్ల కొత్త పన్నాగాలు
దేశంలో డిజిటల్ విప్లవంతో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) రోజువారీ లావాదేవీలకు ప్రధాన ఆధారంగా మారింది. అయితే, ఇదే సాంకేతికతను ఆసరాగా చేసుకుని డిజిటల్ మోసగాళ్లు కొత్త రకం సైబర్ నేరాలకు తెరలేపుతున్నారు. చెల్లింపు పూర్తయినట్లు చూపించే ‘నకిలీ స్క్రీన్షాట్ల’ ద్వారా వ్యాపారులను, సాధారణ వినియోగదారులను బురిడీ కొట్టిస్తున్న ఘటనలు ఇటీవల విపరీతంగా పెరుగుతున్నాయి.మోసం ఎలా జరుగుతోంది?గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం వంటి ప్రముఖ యూపీఐ యాప్‌ల తరహాలోనే కనిపించే అనేక ఫేక్ పేమెంట్ ప్రాంక్ యాప్‌లు (స్పూఫ్ యాప్స్) ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి. సైబర్ కేటుగాళ్లు వీటిని ఉపయోగించి వ్యాపారి పేరు, ఫోన్ నంబర్, పంపాల్సిన మొత్తం, తేదీ, సమయాన్ని దాఖలు చేసి క్షణాల్లో నిజమైన పేమెంట్ సక్సెస్ స్క్రీన్ తరహాలోనే ఉండే నకిలీ స్క్రీన్‌షాట్‌ను క్రియేట్ చేస్తున్నారు. కస్టమర్ తమ ఫోన్ స్క్రీన్‌పై ఆ సందేశాన్ని చూపించి డబ్బులు జమ అయినట్లు నమ్మించి వస్తువులతో పరారవుతున్నారు.నకిలీ చెల్లింపులను గుర్తించడం ఎలా?కొనుగోలుదారుడి ఫోన్ స్క్రీన్‌పై Payment Successful అని చూపిస్తే.. మీ సొంత యూపీఐ యాప్‌లోని Transaction Historyని సరిచూసుకోండి.కొందరు మెసేజ్ పంపినట్లు నకిలీ SMS నోటిఫికేషన్లు సృష్టిస్తారు. ఆ సమయంలో మీ బ్యాంక్ నుంచి వచ్చే అధికారిక SMS, సౌండ్ బాక్స్ నోటిఫికేషన్‌పైనే ఆధారపడాలి.ఇంకొందరు ఆదరాబాదరాగా వ్యాపారిని నమ్మించే ప్రయత్నం చేస్తారు. అప్పుడు వ్యాపార సముదాయాల్లో పేటీఎం/ఫోన్‌పే సౌండ్ బాక్స్ ఏర్పాటు చేయడం ఉత్తమం.ఫేక్ యాప్‌ల ద్వారా రూపొందించిన స్క్రీన్షాట్లను జాగ్రత్తగా పరిశీలిస్తే అక్షరాల పరిమాణం (ఫాంట్ సైజ్), రంగు, అలైన్మెంట్, యూపీఐ ట్రాన్సాక్షన్ ఐడీ ఫార్మాట్లో స్పష్టమైన తేడాలు కనిపిస్తాయి.ఇదీ చదవండి: ఆపద వస్తే తెలియాల్సిన అంశాలు ఇవే.. -
ఆపద వస్తే తెలియాల్సిన అంశాలు ఇవే..
కుటుంబ భవిష్యత్తుకు ఆర్థిక భద్రత కల్పించేందుకు ప్రతి ఒక్కరూ నిత్యం శ్రమిస్తారు. బ్యాంకు డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్స్, రియల్ ఎస్టేట్, ఇన్సూరెన్స్ పాలసీలు, స్టాక్స్ రూపంలో రకరకాల పెట్టుబడులు పెడుతుంటారు. కానీ, ‘ఒకవేళ ఉన్నపళంగా మీకేదైనా అనుకోని ప్రమాదం జరిగితే.. మీ సంపాదన, పెట్టుబడుల వివరాలన్నీ మీ కుటుంబానికి తెలుసా?’ అని ప్రశ్నించుకుంటే మెజారిటీ సమాధానం ‘నో’.భారతదేశంలో లక్షల కోట్ల రూపాయలకు పైగా డబ్బు అన్క్లెయిమ్డ్ డిపాజిట్లుగా (బాధితులు లేదా వారసులు క్లెయిమ్ చేయని నిధులు) బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు, మ్యూచువల్ ఫండ్స్, పీఎఫ్ ఖాతాల్లో మూలుగుతోందని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెచ్చిన ‘ఉద్గమ్’ పోర్టల్ వంటి ఖాతాల జాబితాను పరిశీలిస్తే ఈ నిజం తెలుస్తుంది. కుటుంబంలో సంపాదించే వ్యక్తి అకస్మాత్తుగా దూరమైనప్పుడు సరైన సమాచారం లేక ఎంతోమంది ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్నాయి.ఈ సమస్య తలెత్తకుండా నివారించడానికి ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సిన విషయాలు..మాస్టర్ ఫైనాన్షియల్ బ్లూప్రింట్మీకున్న అన్ని రకాల బ్యాంకు ఖాతాలు, మ్యూచువల్ ఫండ్ ఫోలియోలు, డీమ్యాట్ అకౌంట్లు, ఫిక్స్డ్ డిపాజిట్లు, లైఫ్/హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు, లాకర్లు, రియల్ ఎస్టేట్ పత్రాలు, రుణాల వివరాలతో ఒక స్పష్టమైన జాబితాను తయారు చేయాలి. వీటిని ఒక సురక్షిత ఫైలులో లేదా ఎన్క్రిప్టెడ్ డిజిటల్ వాల్ట్‌లో భద్రపరిచి ఆ వివరాలను జీవిత భాగస్వామితో పంచుకోవాలి.నామినేషన్లను అప్డేట్ చేయడంప్రతి ఆర్థిక ఖాతాకు నూరు శాతం నామినేషన్ పూర్తి చేయాలి. వివాహం, పిల్లల జననం వంటి జీవితంలో వచ్చే మార్పులకు అనుగుణంగా నామినీల వివరాలను ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలి.స్పష్టమైన విల్లు రాయడంచట్ట ప్రకారం నామినీ కేవలం నిధులను స్వీకరించే సంరక్షకుడు (ట్రస్టీ) మాత్రమే, పూర్తి హక్కుదారు కాకపోవచ్చు. ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా మీ ఆస్తులు మీ వారసులకు చెందేలా ఒక స్పష్టమైన విల్లు తయారుచేయడం శ్రేయస్కరం.కుటుంబంలో ఆర్థిక పారదర్శకతఆర్థిక అంశాలను రహస్యంగా ఉంచే అలవాటును పక్కనపెట్టి ఇంట్లో వీటి గురించి చర్చించండి. మీ ఫైనాన్షియల్ అడ్వైజర్, చార్టర్డ్ అకౌంటెంట్ లేదా న్యాయవాది కాంటాక్ట్ వివరాలు కుటుంబ సభ్యులకు తెలిసి ఉండాలి.కేవలం సంపదను సృష్టించడమే కాదు.. ఆ సంపద అనుకోని ఆపద సమయంలో కుటుంబానికి అండగా నిలిచేలా జాగ్రత్త పడటమే నిజమైన ఆర్థిక ప్రణాళిక. మీ కష్టార్జితం అనాథ కాకుండా ఉండాలంటే నేడే మీ ఆర్థిక బ్లూప్రింట్‌ను సిద్ధం చేసి కుటుంబంతో పంచుకోండి.ఇదీ చదవండి: మళ్లీ నింగినంటుతున్న బంగారం ధరలు -
UPI వాడకం ఆపేశా.. దెబ్బకు నా దశ తిరిగింది
న్యూఢిల్లీ: డిజిటల్ విప్లవం వచ్చాక రూపాయి చాక్లెట్ కొనాలన్నా.. వేల రూపాయల షాపింగ్ చేయాలన్నా అందరం ‘యూపీఐ’నే వినియోగిస్తున్నాం. అయితే, ఈ డిజిటల్ చెల్లింపుల వల్ల పర్సు ఖాళీ అవ్వడం లేదు కానీ.. బ్యాంక్ బ్యాలెన్స్ ఇట్టే కరిగిపోతోంది. సరిగ్గా ఇదే సమస్యను గమనించిన ఢిల్లీకి చెందిన ‘సదఫ్’ అనే యువతి ఒక క్రేజీ నిర్ణయం తీసుకుంది.గత మూడు నెలలుగా ఆమె యూపీఐ వాడకాన్ని దాదాపు నిలిపివేసి, పాత పద్ధతిలో కేవలం నగదు మాత్రమే వాడుతోంది. దీంతో దెబ్బకు తన దశ తిరిగినట్లు చెప్పుకొచ్చింది.తన ఆర్థిక జీవితంలో వచ్చిన మార్పులను వివరిస్తూ ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.చేతితో డబ్బులు ఇస్తుంటే ఆ నొప్పి తెలుస్తోంది!తన అనుభవాన్ని పంచుకుంటూ.. గత ఆరు నెలల్లో తాను సాధించిన అతిపెద్ద విజయం ఇదేనని సదఫ్ పేర్కొంది. యూపీఐ ఉన్నప్పుడు రూ. 50, రూ. 100 చొప్పున ఐదారు సార్లు ఈజీగా స్కాన్ చేసేస్తాం. అది పెద్ద మొత్తంగా అనిపించదు. తీరా చూస్తే రోజు ముగిసేసరికి తెలియకుండానే రూ. 1,000 ఖర్చయిపోతుంది.కానీ, వాలెట్ నుండి రూ.500 నోటు తీసి అవతలి వ్యక్తికి ఇచ్చేటప్పుడు డబ్బు మన చేతిలోంచి వెళ్తున్నట్లు అనిపిస్తుంది. నా చేతిలో ఎంత ఉంది, ఎంత ఖర్చయింది అనేది స్పష్టంగా కళ్లముందు కనిపిస్తుంది. ఈ ఒక్క మార్పు నా అనవసరపు ఖర్చులను పూర్తిగా అడ్డుకుంది అని ఆమె వివరించింది.అయితే ఈ రోజుల్లో వంద శాతం యూపీఐ లేకుండా బతకడం ప్రాక్టికల్ కాదు కాబట్టి, ఆమె ఒక కొత్త పద్ధతిని పాటిస్తోంది. రోజువారీ అవసరాలన్నింటికీ 80శాతం కేవలం చేతిలోని నగదునే వాడుతుంది. చిల్లర సమస్య ఉన్నప్పుడు, లేదా క్యాష్ తీసుకోవడానికి షాపుల వారు నిరాకరించినప్పుడు మాత్రమే 20శాతం యూపీఐ వాడుతుంది.ఈ వీడియోపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. చాలా మంది ఆమె నిర్ణయాన్ని సమర్థిస్తూ కామెంట్లు పెడుతున్నారు. నిజమే.. బ్యాంక్ అకౌంట్ చూస్తే డబ్బులు మాయమవుతున్నాయి కానీ.. పర్సులో పెడితే మాత్రం అలాగే ఉంటున్నాయి’ అని ఒక యూజర్ అంటుంటే మధ్యలో అకౌంట్లు ఫ్రీజ్ అవుతున్నాయనే వార్తల వల్ల నేను కూడా యూపీఐ తగ్గించాను అని మరొకరు పేర్కొన్నారు.ఇప్పుడు చాలా మంది వ్యాపారులు, మాల్స్ వాళ్లు రూ. 5, రూ. 10 చిల్లర ఇవ్వడం లేదు. చిల్లర దొరకడమే పెద్ద టాస్క్ అయిపోయింది’అని కొందరు నెటిజన్లు పెదవి విరిచారు. సమస్యలు ఎలా ఉన్నా, డిజిటల్ యుగంలో క్రేజీగా ఖర్చు పెట్టే ఈ తరానికి.. ఈ ఢిల్లీ యువతి ఐడియా మాత్రం ఒక మంచి ఆర్థిక పాఠం అని చెప్పక తప్పదు! View this post on Instagram A post shared by Sadaf (@rockstarz.gf) -
ఇన్వెస్టర్లూ.. ఇదిగో ఈ ఫండ్ చూశారా?
లార్జ్‌క్యాప్‌ల స్థిరత్వంతో పాటు మిడ్‌క్యాప్‌ల వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకోవాలనుకునే ఇన్వెస్టర్లకు ‘లార్జ్ అండ్ మిడ్‌క్యాప్’ ఫండ్లు ఆకర్షణీయమైన ఎంపిక. ఈ విభాగంలో ‘బంధన్ లార్జ్ అండ్ మిడ్‌క్యాప్ ఫండ్’ దీర్ఘకాలిక రాబడులు, వైవిధ్యమైన పోర్ట్‌ఫోలియోతో ప్రత్యేకతను చాటుతోంది. లార్జ్, మిడ్‌క్యాప్‌లతో పాటు ఎంపిక చేసిన స్మాల్‌క్యాప్ షేర్ల ద్వారా అదనపు వృద్ధిని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఫండ్ మూడు, అయిదు, ఏడు, పదేళ్ల కాలంలో కేటగిరీ సగటు, బెంచ్‌మార్క్ కంటే మెరుగైన ఎస్ఐపీ రాబడులను నమోదు చేసింది.పెట్టుబడి వ్యూహం సెబీ నిబంధనల ప్రకారం లార్జ్ అండ్ మిడ్‌క్యాప్ ఫండ్లు కనీసం 35 శాతం చొప్పున లార్జ్‌క్యాప్, మిడ్‌క్యాప్ షేర్లలో పెట్టుబడి పెట్టాలి. ఈ ప్రాతిపదికన బంధన్ ఫండ్ పోర్ట్‌ఫోలియోను అధిక వృద్ధి సామర్థ్యం, నాణ్యమైన కంపెనీలు (54%), థీమాటిక్–సైక్లికల్ అవకాశాలు (31%), వాల్యూ ఆధారిత పెట్టుబడులు (11%) అనే మూడు విభాగాలుగా నిర్మిస్తోంది. లార్జ్, మిడ్‌క్యాప్‌లతో పాటు ఎంపిక చేసిన స్మాల్‌క్యాప్ షేర్లలో పెట్టుబడుల ద్వారా బెంచ్‌మార్క్ కంటే అదనపు రాబడులను సాధించడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. మార్కెట్ పరిస్థితులు, వాల్యుయేషన్లు, వ్యాపార సైకిళ్లకు అనుగుణంగా రంగాలు, షేర్ల కేటాయింపులను ఎప్పటికప్పుడు మార్చుకోవడం దీని ప్రత్యేకత.రిస్క్ విశ్లేషణ గత ఐదేళ్లలో మిడ్, స్మాల్‌క్యాప్ షేర్ల ఉమ్మడి వాటా 57 శాతానికి పైగా పెరగడంతో ఫండ్ మరింత వృద్ధి ఆధారితంగా మారింది. దీంతో దీర్ఘకాలంలో అధిక రాబడులకు అవకాశం ఉన్నప్పటికీ, స్వల్పకాలంలో ఒడిదుడుకులు ఎక్కువగా ఉండొచ్చు. గత దశాబ్దంలో ఈ ఫండ్ రెండుసార్లు 18–19 శాతం, ఒకసారి దాదాపు 40 శాతం మేర క్షీణించింది. అందువల్ల 5–7 ఏళ్ల పెట్టుబడి కాలపరిమితితో ఎస్ఐపీ మార్గంలో పెట్టుబడి పెట్టడం సముచితం.ఎవరికి అనుకూలం కనీసం 5–7 ఏళ్ల పెట్టుబడి కాలపరిమితి ఉన్న ఇన్వెస్టర్లకు ఈ ఫండ్ అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఎస్ఐపీ ద్వారా క్రమబద్ధంగా పెట్టుబడి పెట్టేవారికి ఇది మెరుగైన ఎంపిక. అయితే, మిడ్, స్మాల్‌క్యాప్ కేటాయింపులు అధికంగా ఉండటంతో ఒక్కసారిగా భారీ మొత్తాన్ని పెట్టుబడి పెట్టడం కంటే దశలవారీగా పెట్టుబడి కొనసాగించడం శ్రేయస్కరం. అలాగే, ఈ ఫండ్‌ను ఒక్క ఈక్విటీ ఫండ్‌పైనే ఆధారపడకుండా, లార్జ్‌క్యాప్ లేదా ఫ్లెక్సీక్యాప్ ఫండ్‌తో కలిపి పోర్ట్‌ఫోలియోలో భాగంగా ఉంచుకుంటే రిస్క్ బ్యాలెన్స్ అవుతుంది. పోర్ట్‌ఫోలియో కేటాయింపులుజూన్ 2026 నాటికి ఫండ్ పోర్ట్‌ఫోలియోలో లార్జ్‌క్యాప్‌లకు 38.5%, మిడ్‌క్యాప్‌లకు 35.6%, స్మాల్క్యాప్లకు 21.4% కేటాయింపులు ఉన్నాయి. మిగిలిన 4.5% నగదు, ఇతర ఈక్విటీయేతర ఆస్తుల్లో ఉంది. మిడ్, స్మాల్క్యాప్ల ఉమ్మడి వాటా 57 శాతానికి పైగా ఉండటం పోర్ట్‌ఫోలియోలో వృద్ధి ఆధారిత ధోరణిని సూచిస్తోంది. టాప్–10 హోల్డింగ్స్ వాటా 26.7 శాతానికే పరిమితం కావడం కొన్ని షేర్లపై అధికంగా ఆధారపడకుండా పోర్ట్‌ఫోలియోను వైవిధ్యంగా ఉంచుతోంది.రాబడుల పనితీరు దీర్ఘకాలిక ఎస్ఐపీ రాబడుల్లో ఈ ఫండ్ మూడు, ఐదు, ఏడు, పదేళ్ల కాలాల్లోనూ కేటగిరీ సగటు, బెంచ్‌మార్క్‌ను అధిగమించింది. రోలింగ్ రాబడులు: గత ఏడేళ్ల ఎన్ఏవీ చరిత్ర ఆధారంగా లెక్కించిన రోలింగ్ రాబడుల్లోనూ ఈ ఫండ్ నిలకడైన పనితీరును ప్రదర్శించింది. మూడేళ్లు, ఐదేళ్ల రోలింగ్ రాబడుల్లో కనిష్ట, సగటు, గరిష్ట మూడు ప్రమాణాల్లోనూ బెంచ్‌మార్క్‌ను అధిగమించడం దీర్ఘకాలిక పనితీరుకు నిదర్శనం. -
హెల్త్ ఇన్సూరెన్స్ మార్చుకోవాలనుకుంటున్నారా?
ఆర్థిక ప్రణాళికలో హెల్త్ ఇన్సూరెన్స్ ఒక ముఖ్యమైన భాగంగా మారింది. మనలో చాలామందికి ఇప్పటికే ఏదో ఒక రూపంలో ఆరోగ్య బీమా ఉంటోంది. అయితే, జీవితంలో వివాహం, కుటుంబ బాధ్యతలు లేదా ఆదాయం పెరగడం వంటి మార్పులకు అనుగుణంగా బీమా ప్రయోజనాలు కూడా మారాల్సి ఉంటుంది. ఉదాహరణకు, మీరు ఒంటరిగా ఉన్నప్పుడు బేసిక్ వ్యక్తిగత పాలసీతో ప్రారంభించి ఉండవచ్చు. తర్వాత, వివాహమయ్యాక జీవిత భాగస్వామిని కూడా ఇన్సూరెన్స్ పరిధిలో చేర్చాలని లేదా మరింత ఎక్కువ కవరేజీతో పాటు యాడ్–ఆన్లు ఉన్న పాలసీని ఎంచుకోవాలనుకోవచ్చు. అలాంటి సందర్భాల్లో మీరు మీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని మార్చుకోవడమో లేదా బదిలీ చేయడమో గురించి ఆలోచించవచ్చు. ఇక్కడే మైగ్రేషన్, పోర్టింగ్ అనే పరిభాష తెరపైకి వస్తుంది. మైగ్రేషన్ అంటే ఏమిటి? మైగ్రేషన్ అంటే మీ ప్రస్తుత హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను అదే ఇన్సూరెన్స్ కంపెనీలో అప్‌గ్రేడ్ చేయడం. దీని ద్వారా మీ ప్రస్తుత బీమా సంస్థ మరింత విస్తృతంగా కవరేజ్ అందించే ప్లాన్‌కి మారవచ్చు లేదా మీ కుటుంబంలో కొత్త సభ్యులను కూడా పాలసీలో చేర్చుకోవచ్చు. సంక్షిప్తంగా చెప్పాలంటే, మైగ్రేషన్ అంటే అదే కంపెనీలో ఉంటూ మెరుగైన ప్లాన్‌కి మారడం.పోర్టింగ్ అంటే ఏమిటి? పోర్టింగ్ అంటే మీ ఆరోగ్య బీమా పాలసీని ఒక కంపెనీ నుండి మరొక సంస్థకి బదిలీ చేయడం. మీ అవసరాలకు సరిపోయే మెరుగైన ప్రయోజనాలు లేదా సేవలను మరో బీమా సంస్థ అందిస్తే, మీరు పోర్టింగ్‌ను ఎంచుకోవచ్చు. మీ ప్రస్తుత ఇన్సూరర్ సేవలపై అసంతృప్తి ఉన్నప్పుడు లేదా వేరే చోట మీ అవసరాలకు తగ్గట్లు మరింత అనుకూలమైన ప్లాన్ దొరికినప్పుడు ఇది ఉపయోగకరంగా ఉంటుంది.ఎంచుకోవడం ఇలా.. మైగ్రేషన్: మీరు మైగ్రేట్ అయినప్పుడు, అదే బీమా కంపెనీలో ఒక పాలసీ నుండి మరో పాలసీకి మారతారు. మీ వివరాలు అప్పటికే ఇన్సూరర్ వద్ద ఉండటం వల్ల ఈ ప్రాసెస్ సాధారణంగా సులభంగా ఉంటుంది. దీని వలన కీలక ప్రయోజనాలు ఏమిటంటే వెయిటింగ్ పీరియడ్ క్రెడిట్లు, బోనస్‌ల వంటి కొనసాగుతున్న ప్రయోజనాలు యథాతథంగా ఉంటాయి. మీ ఇన్సూరర్ నిబంధనలకు లోబడి, మైగ్రేషన్‌కి సాధారణంగా ఏ సమయంలోనైనా వీలుంటుంది. మీ ఇన్సూరర్ సేవలతో మీరు సంతృప్తిగా ఉన్నప్పటికీ, మరింత కవరేజ్ లేదా అదనపు ఫీచర్లు కావాలనుకుంటే, తక్కువ రిస్‌్కతో దీనిని ఎంచుకోవచ్చు.పోర్టింగ్: ఈ విధానంలో మీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కొత్త బీమా సంస్థకి బదిలీ అవుతుంది. ఐఆర్డీఏఐ నిబంధనల ప్రకారం, మీకు ఇప్పటికే లభించే ప్రయోజనాలు, అంటే వెయిటింగ్ పీరియడ్ క్రెడిట్లు, బోనస్‌లు వంటి వాటిని కోల్పోకుండా కొనసాగిస్తారు. కొత్త ఇన్సూరర్ మీ ఆరోగ్య స్థితి, దరఖాస్తును పరిశీలిస్తారు. వాటి ఆధారంగా ప్రీమియం పెరగవచ్చు లేదా పెరగకపోవచ్చు. పాలసీ రెన్యూవల్ సమయంలో మాత్రమే పోర్టింగ్ చేయవచ్చు. మీ ప్రస్తుత పాలసీ ముగియడానికి 30–60 రోజుల ముందు దరఖాస్తు చేయాలి. మీ ప్రస్తుత బీమా కంపెనీ అందించే సేవలు, క్లెయిమ్ ప్రాసెస్ లేదా ప్రీమియంలపై అసంతృప్తిగా ఉంటే, ఇతర ఆప్షన్లను పరిశీలించడానికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది.ఇది గుర్తుంచుకోవాలిమైగ్రేషన్, పోర్టింగ్ రెండూ మీ అవసరాలు మారుతున్న కొద్దీ హెల్త్ ఇన్సూరెన్స్‌ను సర్దుబాటు చేసుకునే సౌకర్యాన్ని కల్పిస్తాయి. అయితే, ఆలోచన లేకుండా తొందరపడి ఇన్సూరర్‌ను మార్చడం చేయకూడదు. అలాగే, మైగ్రేట్ చేయాలా లేదా పోర్ట్ చేయాలా అనే నిర్ణయం తీసుకునే ముందు ఆయా బీమా సంస్థలు అందించే అదనపు ప్రయోజనాలు, సేవలను జాగ్రత్తగా పరిశీలించండి. మీ అవసరాలకు ఏ మార్గం అత్యంత అనుకూలంగా ఉంటుందో ఖచ్చితంగా తెలియకపోతే, మీ ఇన్సూరెన్స్ సంస్థను లేదా విశ్వసనీయ సలహాదారుని సంప్రదించి తగిన సలహా తీసుకోండి. ఏది చేసినా దీర్ఘకాలికంగా ఆరోగ్య రక్షణకు అనుకూలంగా ఉండే నిర్ణయాన్ని తీసుకోండి. -
Income Tax: ప్లానింగ్ అంటే ఎగవేత కాదు..
ఒకప్పుడు ట్యాక్స్ ప్లానింగ్ అంటే కేవలం పన్ను ఎగవేత లేదా పన్నుభారం తగ్గించడానికి మార్గాలను ఎంచుకునే ఆలోచనలో ఉండేవారు. కంపెనీలు కానీ, వ్యాపార సంస్థలు కానీ, వ్యక్తులు కానీ పన్ను భారం తగ్గించుకోవడానికి అవకాశం ఉంటే పూర్తిగా ఎగవేత.. లేదా కుదిరినంతగా ఎగవేత .. ఇలా ఆలోచనలు ఉండేవి. ట్యాక్స్ ప్లానింగ్ అంటే చట్టరీత్యా నేరం కాదు. తప్పు కాదు. నిషిద్ధమైనదీ కాదు. ఇంగ్లిషులో ట్యాక్స్ ఎవాయిడెన్స్ అంటే ప్లానింగ్‌లో సక్రమమైన మార్గం. అమల్లో ఉన్న ఆప్షన్లలో దేని వల్ల తక్కువ పన్ను భారం ఏర్పడుతుందో, ఆ పద్ధతిని ఎంచుకోవడమే. మీరు మీ ఆదాయ పట్టికను తయారు చేసి, అవసరమైన డిడక్షన్లు ఉంటే పాత పద్ధతిలో, అర్హత లేకపోతే కొత్త పద్ధతిలో లెక్కలు వేసుకోండి. ట్యాక్సబుల్ ఇన్‌కం లెక్కించండి. పన్నుభారం లెక్కించి, ఏది తక్కువో నిర్ధారించుకుని, ఆ వైపు మొగ్గు చూపండి. ఇదొక విధానం. తప్పులేదు. పన్ను భారం లేకుండా ఉండటానికి, లేదా తగ్గించుకోవడానికి అడ్డదిడ్డమైన దార్లు తొక్కకండి.ఇక వ్యాపారంపరంగా ఆలోచిస్తే, ఏ వ్యాపారం పెట్టాలి, ఆ వ్యాపారం నిర్వహించడానికి కంపెనీయా, భాగస్వామ్యమా సొంత వ్యాపారమా.. ఎటువంటి సంస్థని స్థాపించాలి.. ఆయా సంస్థలకు పన్ను విధానం ఎలా ఉంటుంది .. పన్ను రేటెంత? ఇలా మొదలై ఇన్కంట్యాక్స్పరంగా ఎలా పన్నుభారం తగ్గించుకోవాలి .. ఎలా అడుగు ముందుకేయాలి.. ఇవన్నీ 80వ దశకం.. 90లు, 2000, 2010, 2020 మొదట్లోని ఆలోచనలు.పెద్ద పెద్ద కంపెనీల్లో ట్యాక్సేషన్కి ప్రత్యేకమైన డిపార్టుమెంటు, అందులో ప్రత్యేక వృత్తి నిపుణులు, సమావేశాలు, సమలోచనలు, సమాధానాలు, లెక్కలు, పన్ను రేట్ల విశ్లేషణ, ఫైన్లు, పెనాల్టీలు, లిటిగేషన్, చట్టంలోని పదపదానికి విశ్లేషణ, భాష్యం, అభిప్రాయ సేకరణ, విశ్లేషణ, అన్వయం, అమలు .. తర్వాత అసెస్మెంటు పూర్తి ఉత్తర్వులు, విశ్లేషణ, అప్పీళ్లు, గెలవడం, ఓడిపోవడం, ట్రిబ్యునల్ ఒక అంకం .. అవసరమైతే హైకోర్టు.. ఇంకా తప్పనిసరి అయితే సుప్రీం కోర్టు వరకు వెళ్లే వ్యవహారం. ఒక అంచనా ప్రకారం సుప్రీం కోర్టులో 6,000 పైచిలుకు కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. రాజ్యసభలో జవాబు ప్రకారం 41,450 కేసులు వివిధ హైకోర్టుల్లో పెండింగ్. వీటి వల్ల రూ. 4.9 ట్రిలియన్ల రెవెన్యూ భవితవ్యం తేలాలి. ఇక ట్రిబ్యునల్ వద్ద 22,230 కేసులు ఉన్నాయి. ఇవి ఎప్పుడు అవుతాయి. అనిశి్చతి..అయోమయ పరిస్థితి. త్రిశంకు స్వర్గంలో హడావిడి.పరిస్థితులు.. దృష్టి మారుతున్నాయి.. ఇప్పుడు పరిస్థితి మారింది. జనాల దృష్టి మారింది. లిటిగేషన్ని కోరుకోవడం లేదు. బదులుగా ఆ సమయాన్ని, వనరులను ఆస్తుల అభివృద్ధి వైపు మళ్లిస్తున్నారు. వృథా ప్రయాసలతో గెలిచే గెలుపు కన్నా, ఆది నుంచే నిర్దేశించిన పన్ను భారానికి సిద్ధపడి, చెల్లించి ఊపిరి పీల్చుకుంటున్నారు. మెటీరియల్, లేబర్, వడ్డీ, ఖర్చులతో పాటు మరో ఖర్చు ‘ఇన్‌కం ట్యాక్స్’ అని భావిస్తున్నారు. లాభం ఎక్కువ సంపాదించి కొంత భాగం పన్నుగా గవర్నమెంటు ఇవ్వడానికి ముందుకు రండి. తన కూతురు పెళ్లికని సిద్ధపడి స్థిరాస్తి విక్రయించగా వచి్చన లాభాల మీద పన్ను చెల్లించి, పిల్ల పెళ్లి ఘనంగా చేశాడు సిద్ధరామయ్య. పిల్లాడి చదువు కోసం జాగాలు అమ్మేసి పన్ను చెల్లించి మిగతా మొత్తంతో చదువు చదివించాడు చలపతిరావు అనే ఒక రైతు. కొనడం, అమ్మడం.. లాభం మళ్లీ కొనడం, అమ్మడం పన్నులు సక్రమంగా చెల్లించి పేరు మోసిన బిల్డర్ అయ్యారు బాబూరావు. ఆయన దగ్గర బ్లాక్, వైట్ ఉండదు. అంతా వైటే.పన్ను సమస్యే కాదు.. నిజమే, మీరు ఎన్నో ఖర్చులు పెడుతున్నారు. విలాసవంతమైన జీవితం సాగిస్తున్నారు. ఎన్నెన్నో దేశాల కన్నా మన దేశంలో ఆదాయపు పన్ను రేట్లు తక్కువనే చెప్పాలి. పన్నుని ఒక ఖర్చుగా భావించుకోండి. పన్ను రేటు ప్రాథమిక సమస్య కాదు. దానితో నిమిత్తం లేకుండా, చెల్లించడం ఒక సంస్కృతి. అలాగే వ్యాపారస్తులు కూడా జీఎస్టీ, ఉత్పత్తి వ్యయ నియంత్రణ, ధరల స్థిరీకరణ, చట్టాన్ని గౌరవించడం, చట్టాన్ని తూచా తప్పకుండా ఫాలో కావడం, ముందుచూపుతో, గ్లోబలైజ్డ్ పోటీ ప్రపంచంలో నిలవడానికి ‘నాణ్యత’ మొదలైన అంశాలు ప్లాన్ చేసుకోవాలి. -
లక్షాధికారిని చేసే SBI స్కీమ్..
చిన్న మొత్తాలను క్రమం తప్పకుండా పొదుపు చేస్తే భవిష్యత్తులో పెద్ద మొత్తాన్ని సమకూర్చుకోవచ్చు. ఇందుకోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) అందిస్తున్న ‘హర్ ఘర్ లఖ్పతి’ రికరింగ్ డిపాజిట్ (ఆర్డీ) పథకం ఆసక్తికరమైన ఎంపికగా నిలుస్తోంది. మార్కెట్ ఆధారిత పెట్టుబడులతో పోలిస్తే ముందుగా నిర్ణయించిన వడ్డీ రేటుతో పొదుపు చేసుకునే అవకాశం ఉండటంతో, క్రమశిక్షణతో సేవింగ్స్ చేయాలనుకునేవారికి ఇది ఉపయోగపడుతుంది.ఏమిటీ ‘హర్ ఘర్ లఖ్పతి’?‘హర్ ఘర్ లఖ్పతి’ అనేది ప్రత్యేకంగా రూపొందించిన ఆర్డీ పథకం. ఇందులో ప్రతి నెలా నిర్ణీత మొత్తాన్ని జమ చేస్తూ.. మెచ్యూరిటీ సమయానికి కనీసం రూ.1 లక్ష లేదా అంతకంటే ఎక్కువ మొత్తాన్ని (రూ.2 లక్షలు, రూ.5 లక్షలు, రూ.10 లక్షలు మొదలైన గుణిజాలలో) పొందేలా లక్ష్యాన్ని ఎంచుకోవచ్చు. ఈ పథకంలో 3 సంవత్సరాల నుంచి గరిష్టంగా 10 సంవత్సరాల వరకు కాలపరిమితిని ఎంచుకునే అవకాశం ఉంది. సింగిల్‌గా లేదా జాయింట్‌గా ఈ ఖాతా తెరవవచ్చు. 10 ఏళ్లు పైబడిన మైనర్లు కూడా కొన్ని షరతులతో ఈ ఖాతాను తెరవవచ్చు.రోజుకు రూ.20తో రూ.1 లక్ష సాధ్యమేనా?ఎస్బీఐ అధికారికంగా అందుబాటులో ఉంచిన రూ.1 లక్ష మెచ్యూరిటీ పట్టిక ప్రకారం, సాధారణ ఖాతాదారు 10 సంవత్సరాల కాలానికి నెలకు రూ.610 చెల్లిస్తే రూ.1 లక్ష లక్ష్యాన్ని చేరుకోవచ్చు. అంటే రోజుకు సగటున దాదాపు రూ.20 పొదుపు చేసినట్టే. అయితే ఇది రోజువారీగా బ్యాంకుకు రూ.20 చెల్లించే విధానం కాదు.. నెలవారీ ఆర్డీ వాయిదా రూ.610గా ఉంటుంది.అదే రూ.1 లక్ష లక్ష్యానికి 3 సంవత్సరాల కాలాన్ని ఎంచుకుంటే నెలకు రూ.2,510, 5 సంవత్సరాలకు రూ.1,420, 7 సంవత్సరాలకు రూ.960 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. కాలపరిమితి పెరిగే కొద్దీ నెలవారీ వాయిదా తగ్గుతుంది.వడ్డీ రేట్లు ఎంత?ఎస్బీఐ అధికారికంగా ప్రచురించిన హర్ ఘర్ లఖ్పతి పట్టికలో 3, 4 సంవత్సరాల కాలానికి సాధారణ ఖాతాదారులకు 6.55 శాతం, 5 నుంచి 10 సంవత్సరాల కాలానికి 6.30 శాతం వడ్డీ రేటు చూపిస్తోంది. సీనియర్ సిటిజన్లకు ఇదే కాలాల్లో వరుసగా 7.05 శాతం, 6.80 శాతంగా ఉంది. అయితే ఆర్డీ వడ్డీ రేట్లు మారితే లక్ష్య మొత్తానికి అవసరమైన నెలవారీ వాయిదా కూడా మారవచ్చని ఎస్బీఐ స్పష్టం చేసింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఈ పట్టిక 11 నవంబర్ 2025న చివరిసారిగా అప్డేట్ చేసినదిగా బ్యాంకు వెబ్సైట్లో ఉంది. అందువల్ల ఖాతా తెరిచే సమయంలో వర్తించే రేటును బ్యాంకులో నిర్ధారించుకోవడం మంచిది.వాయిదా ఆలస్యమైతే పెనాల్టీఆర్డీ వాయిదా సమయానికి చెల్లించకపోతే పెనాల్టీ ఉంటుంది. 5 సంవత్సరాలు లేదా అంతకంటే తక్కువ కాలపరిమితి ఉన్న ఆర్డీలకు నెలకు ప్రతి రూ.100పై రూ.1.50, 5 సంవత్సరాలకు మించిన కాలానికి ప్రతి రూ.100పై రూ.2 చొప్పున ఆలస్య రుసుము వర్తిస్తుంది. అయితే పెనాల్టీగా వసూలు చేసే మొత్తం డిపాజిటర్‌కు చెల్లించే వడ్డీని మించకూడదు.వరుసగా ఆరు వాయిదాలు చెల్లించకపోతే ఖాతాను ముందుగానే మూసివేసి, మిగిలిన మొత్తాన్ని లింక్ చేసిన సేవింగ్స్ ఖాతాకు బదిలీ చేయవచ్చు. మూడు లేదా అంతకంటే ఎక్కువ వరుస వాయిదాలు బకాయి ఉండి ఖాతా క్రమబద్ధీకరించకపోతే మెచ్యూరిటీ తర్వాత చెల్లింపుపై రూ.10 సర్వీస్ ఛార్జీ కూడా వర్తించవచ్చు.మధ్యలో డబ్బు అవసరమైతే?పథకం నుంచి ముందుగానే బయటకు రావడానికి అవకాశం ఉంది. అయితే ముందస్తు ఉపసంహరణకు పెనాల్టీ ఉంటుంది. రూ.5 లక్షల వరకు ప్రిన్సిపల్ ఉన్న డిపాజిట్లకు 0.50 శాతం, రూ.5 లక్షలకు మించిన మొత్తానికి 1 శాతం పెనాల్టీ వర్తిస్తుంది. అలాగే ఖాతా తెరిచిన సమయంలో ఉన్న వడ్డీ రేటు లేదా కాంట్రాక్ట్ రేటు కంటే తగ్గిన రేటుతో వడ్డీ లెక్కించే నిబంధనలు ఉన్నాయి.పన్నుల విషయానికి వస్తే..ఈ పథకం ద్వారా వచ్చే వడ్డీకి పన్ను నిబంధనలు వర్తిస్తాయి. ఎస్బీఐ కూడా టీడీఎస్ ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారమే ఉంటుందని స్పష్టం చేసింది. అదే సమయంలో ఆదాయపు పన్ను శాఖ తాజా AY 2026-27 సమాచారంలో సీనియర్ సిటిజన్ల బ్యాంకు డిపాజిట్ వడ్డీపై సెక్షన్ 194A కింద రూ.50,000 వరకు టీడీఎస్ ఉండదని, అలాగే సెక్షన్ 80TTB కింద డిపాజిట్ వడ్డీపై గరిష్టంగా రూ.50,000 వరకు మినహాయింపు ఉందని పేర్కొంది.ఎలా ప్రారంభించాలి?హర్ ఘర్ లఖ్పతి ఖాతాను ఎస్బీఐ బ్యాంకింగ్ చానళ్ల ద్వారా తెరవవచ్చు. ఖాతా తెరవడానికి అవసరమైన కేవైసీ పత్రాలు, ప్రక్రియ వ్యక్తిగత పరిస్థితులపై ఆధారపడి ఉండొచ్చు. అందువల్ల ఆధార్, పాన్, ఫొటో వంటి పత్రాలు సిద్ధంగా ఉంచుకుని, ఆన్లైన్లో లేదా సమీప ఎస్బీఐ శాఖలో ప్రస్తుత ప్రక్రియను నిర్ధారించుకోవడం మంచిది.ఇదీ చదవండి: ఇంటితోనే ఇంకో ఇల్లు కొనచ్చు: కియోసాకి కిటుకు -
రోజూ ట్రేడింగ్ దండగ.. ఓపికే అసలైన పెట్టుబడి
స్టాక్ మార్కెట్ ప్రపంచంలో విజయం సాధించాలంటే రోజూ కొనుగోలు, అమ్మకాలు జరపాల్సిన అవసరం లేదు. ఇన్వెస్ట్మెంట్ రంగంలో వందలాది నిర్ణయాలు తీసుకోవడం కంటే అత్యంత నాణ్యమైన నాలుగైదు సరియైన నిర్ణయాలు తీసుకోవడంతో సుదీర్ఘకాలంలో అపారమైన సంపదను సృష్టించవచ్చని దిగ్గజ ఇన్వెస్టర్, బెర్క్‌షైర్ హాత్వే మాజీ సీఈఓ వారెన్ బఫెట్ తెలిపారు.బలవంతపు 'కాల్డ్ స్ట్రైక్స్’బేస్‌బాల్ దిగ్గజం టెడ్ విలియమ్స్ రాసిన ‘ది సైన్స్ ఆఫ్ హిట్టింగ్’ పుస్తకాన్ని ఉదహరిస్తూ బఫెట్ ఒక ఆసక్తికరమైన పోలికను చెప్పారు. బేస్‌బాల్‌లో బ్యాటర్ వైపు వచ్చే ప్రతి బంతిని ఆడాల్సి ఉంటుంది. అలా ఆడకపోతే అవుట్ అయ్యే ప్రమాదం ఉంది. కానీ ఇన్వెస్ట్మెంట్ మార్కెట్లో అలాంటి బలవంతపు 'కాల్డ్ స్ట్రైక్స్' ఏవీ ఉండవు. అంటే.. మనకు నచ్చిన కంపెనీ సరైన ధరకు లభించే వరకు ఇన్వెస్టర్ ఏళ్ల తరబడి ఓర్పుతో వేచి ఉండే అవకాశముంది.పంచ్ కార్డ్ సిద్ధాంతంఒక వ్యక్తికి తన జీవితకాలంలో కేవలం 20 ఇన్వెస్ట్మెంట్ నిర్ణయాలు మాత్రమే తీసుకోవడానికి వీలుగా ఒక పంచ్ కార్డ్ ఇస్తే అతను ప్రతి నిర్ణయాన్ని ఎంత క్షుణ్ణంగా ఆలోచించి తీసుకుంటాడో ఊహించుకోవాలని బఫెట్ పేర్కొన్నారు. మార్కెట్లో కనిపించే ప్రతి అవకాశం వెంట పడకుండా అత్యంత నాణ్యమైన కొన్ని కంపెనీలపైనే దృష్టి పెట్టడం వల్ల అత్యుత్తమ ఫలితాలు వస్తాయి.అర్థమైన వ్యాపారాల్లోనే పెట్టుబడులుతొలినాళ్లలో అమెజాన్ బిజినెస్ మోడల్ తనకు సరిగ్గా అర్థం కాకపోవడం వల్ల దానిలో పెట్టుబడి పెట్టలేకపోయానని బఫెట్ అంగీకరించారు. ప్రతీ కంపెనీని లేదా రంగాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఇన్వెస్టర్‌కు లేదు. తనకు స్పష్టమైన పరిజ్ఞానం ఉన్న కోకాకోలా, బ్యాంక్ ఆఫ్ అమెరికా వంటి వ్యాపార నమూనాలను ఎంచుకోవడం వల్లే బెర్క్‌షైర్ హాత్వే దశాబ్దాలుగా మార్కెట్లను శాసించే లాభాలను సంపాదించగలిగింది.నేటి వేగవంతమైన డిజిటల్ మార్కెట్లలో రోజూ ట్రేడింగ్ చేస్తూ ఆందోళన చెందే చిన్నతరహా ఇన్వెస్టర్లకు బఫెట్ పాఠం ఒక కంటివిప్పు. రోజువారీ హెచ్చుతగ్గులకు ప్రభావితం కాకుండా స్పష్టమైన అవగాహన ఉన్న కొన్ని నాణ్యమైన కంపెనీలను ఎంచుకుని, దీర్ఘకాలిక దృష్టితో నిరీక్షించడమే విజయానికి నిజమైన రాజమార్గం అని నిపుణులు సూచిస్తున్నారు.ఇదీ చదవండి: నేటి యువత ఖర్చుల బాట.. -
నేటి యువత ఖర్చుల బాట..
వయసు ఇరవైల్లో వచ్చే ఆదాయం రేపటి భవిష్యత్తుకు పునాది కావాలా? లేక నేటి లైఫ్‌స్టైల్ ఆర్భాటాలకు వేదిక కావాలా?.. ఇప్పుడు ఇంటర్నెట్లో పర్సనల్ ఫైనాన్స్ విభాగంలో హాట్ టాపిక్‌గా మారిన ప్రశ్న ఇది. ఐటీ హబ్ బెంగళూరులో నివసిస్తున్న సిమ్రిధి మఖిజా అనే యువతి ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న ఆలోచనలు నేటి తరం ఆర్థిక అలవాట్లపై చర్చకు దారితీశాయి.బెంగళూరులో గత ఏడు నెలలుగా ఉంటున్న మఖిజా 20 ఏళ్లలో ఉన్న యువత పాటిస్తున్న ఖరీదైన జీవనశైలిని ప్రశ్నించారు. ఎంత సంపాదించినా సరసమైన ధరకు సేవలు లభించే చోట కూడా విచ్చలవిడిగా ఖర్చు చేయడాన్ని ఆమె తప్పుపట్టారు.జీవనశైలి ద్రవ్యోల్బణంపై ప్రశ్నలుమఖిజా తన వీడియోలో కొన్ని అంశాలను ప్రస్తావించారు. ‘ఒక్క పూట కేఫ్‌ల కోసం ఏకంగా రూ.5,000 ఖర్చు చేస్తున్నారు. మంచి ఇల్లు రూ.20,000కే లభించే అవకాశం ఉన్నప్పటికీ కేవలం హోదా కోసం నెలకు రూ.40,000 అద్దె చెల్లిస్తున్నారు. ఒక్క విహారయాత్ర లేదా షాపింగ్ కోసం రూ.20,000 తగలేస్తున్నారు. ఆదాయం పెరిగినంత మాత్రాన స్వయంచాలకంగా ఖర్చులు పెంచుకుంటూ పోయే లైఫ్‌స్టైల్ ఇన్ఫ్లేషన్ ప్రమాదకరం’ అని ఆమె హెచ్చరించారు. ‘కెరీర్ ప్రారంభంలో సంపాదన పెరగాలి గానీ, ఖర్చులు కాదు. భవిష్యత్తు చాలా అనూహ్యమైంది. అందుకే తక్కువ ఖర్చు చేస్తూ గరిష్టంగా పొదుపు చేయడమే ఉత్తమం’ అని ఆమె అభిప్రాయపడ్డారు.నెటిజన్ల స్పందనఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి. ‘జీవనశైలి ద్రవ్యోల్బణం మీ జీతాల పెరుగుదలను మింగేయకుండా చూసుకోండి’ అని పొదుపు వాదనను కొందరు సమర్థిస్తున్నారు. ‘20ల్లో ఉన్నప్పుడు డబ్బు దాచడంపై కాకుండా సంపాదనను ఎలా పెంచుకోవాలో ఆలోచించండి. సంపాదిస్తున్నప్పుడు జీవితాన్ని ఆస్వాదించడంలో తప్పు లేదు’ అని ఇంకొందరు చెబుతున్నారు. -
రోజుకు రూ.96,383 కోట్లు.. క్యాష్ కాదు!
దేశంలో డిజిటల్ చెల్లింపుల జోరు కొనసాగుతోంది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) జూలైలో కొత్త రికార్డు సృష్టించింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) గణాంకాల ప్రకారం.. జూలైలో యూపీఐ ద్వారా 2,366 కోట్ల లావాదేవీలు జరిగాయి. జూన్‌లో నమోదైన 2,272 కోట్లతో పోలిస్తే ఇది 4.1 శాతం అధికం. గతేడాది జూలైతో పోలిస్తే లావాదేవీల సంఖ్య ఏకంగా 22 శాతం పెరిగింది.లావాదేవీల విలువ కూడా భారీగా పెరిగింది. జూన్‌లో రూ.28.92 లక్షల కోట్లుగా ఉన్న యూపీఐ లావాదేవీల విలువ.. జూలైలో రూ.29.88 లక్షల కోట్లకు చేరింది. నెలవారీగా ఇది 3.3 శాతం వృద్ధి. అయితే మేలో నమోదైన రూ.29.90 లక్షల కోట్ల రికార్డుతో పోలిస్తే జూలై విలువ స్వల్పంగా తక్కువగానే ఉంది. అంటే జూలైలో లావాదేవీల సంఖ్య మాత్రం ఆల్‌టైమ్ గరిష్ఠానికి చేరగా, విలువలో కొత్త రికార్డు నమోదు కాలేదు.జూలైలో యూపీఐ రోజుకు సగటున 76.3 కోట్ల లావాదేవీలను ప్రాసెస్ చేసింది. జూన్‌లో ఈ సగటు 75.7 కోట్లుగా ఉంది. రోజువారీ లావాదేవీల సగటు విలువ రూ.96,383 కోట్లుగా నమోదైంది. జూన్‌లోని రూ.96,405 కోట్లతో పోలిస్తే ఇది దాదాపు స్థిరంగానే ఉంది.ఫాస్టాగ్ లావాదేవీలకు బ్రేక్మరోవైపు, ఎన్ఈటీసీ ఫాస్టాగ్ లావాదేవీల్లో తగ్గుదల కనిపించింది. జూలైలో 34.7 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. జూన్‌లోని 36.2 కోట్లతో పోలిస్తే 4.1 శాతం తగ్గాయి. ఏడాది ప్రాతిపదికన చూస్తే దాదాపు 6 శాతం క్షీణత నమోదైంది. ఫాస్టాగ్ లావాదేవీల విలువ కూడా స్వల్పంగా తగ్గింది. జూన్‌లో రూ.7,215 కోట్లుగా ఉన్న విలువ.. జూలైలో రూ.7,143 కోట్లకు పడిపోయింది. మేలో నమోదైన రూ.7,308 కోట్లతో పోల్చినా ఇది తక్కువే.ఫాస్టాగ్ వినియోగంలో ఈ మార్పు నేపథ్యంలో, కేంద్రం అమలు చేస్తున్న వార్షిక పాస్ పథకం కూడా కీలకంగా మారింది. 2026-27లో రూ.3,075 చెల్లించి పొందే వార్షిక పాస్‌తో నేషనల్ హైవేలు, ఎక్స్‌ప్రెస్‌వేల టోల్ ప్లాజాల వద్ద ఏడాదిలో 200 సార్లు లేదా ఒక సంవత్సరం వరకు ప్రయాణించే అవకాశం ఉంది. జూన్ 2026 నాటికి 77 లక్షలకు పైగా వార్షిక పాస్‌లు జారీ కాగా, ఇవి 63 కోట్ల టోల్ లావాదేవీలకు దోహదపడ్డాయని కేంద్రం తెలిపింది.ఇక యూపీఐ విస్తరణ కూడా వేగంగా కొనసాగుతోంది. జూన్ 2026 నాటికి దేశంలో 55.49 కోట్ల మంది యూజర్లు యూపీఐ ప్లాట్‌ఫామ్‌పై నమోదయ్యారని కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. విదేశాల్లోనూ యూపీఐ వినియోగం విస్తరిస్తోంది. గ్రీస్, నేపాల్ వంటి దేశాల్లో కొత్త అనుసంధానాలు నమోదయ్యాయి.ఇదీ చదవండి: బంగారం, వెండి ధరలు.. వారంలో ఎంత తగ్గాయంటే.. -
ఐటీ రిటర్న్స్‌కు భారీ స్పందన..
2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలుకు భారీ స్పందన లభించింది. 2026-27 అసెస్మెంట్ ఇయర్ (AY 2026-27) కోసం జూలై 31 నాటికి 5.9 కోట్లకు పైగా ఆదాయపు పన్ను రిటర్నులు (ITRs) దాఖలైనట్లు ఆదాయపు పన్ను శాఖ వెల్లడించింది. సాధారణంగా ఆడిట్ అవసరం లేని వ్యక్తులు, హిందూ అవిభక్త కుటుంబాల (HUFs) రిటర్నులు దాఖలుకు గడువు జూలై 31తో ముగిసింది.ఈ సందర్భంగా పన్ను చెల్లింపుదారులకు ఆదాయపు పన్ను శాఖ ‘ఎక్స్’ వేదికగా కృతజ్ఞతలు తెలిపింది. సకాలంలో రిటర్నులు దాఖలు చేయడం పన్ను చెల్లింపుదారుల విశ్వాసం, అనుసరణను ప్రతిబింబిస్తోందని పేర్కొంది.ఐటీఆర్-1లో స్వల్ప తగ్గుదలఅందుబాటులో ఉన్న గణాంకాలను పరిశీలిస్తే ఐటీఆర్-1 (సహజ్) దాఖలులో గత ఏడాదితో పోలిస్తే స్వల్ప తగ్గుదల కనిపించింది. ఈసారి సుమారు 3.15 కోట్ల ఐటీఆర్-1లు దాఖలయ్యాయి. గత ఏడాది ఇదే సమయానికి ఈ సంఖ్య సుమారు 3.3 కోట్లుగా ఉంది. మరోవైపు ఐటీఆర్-2 దాఖలులు గత ఏడాది స్థాయికి దగ్గరగా ఉన్నట్లు సమాచారం.కొత్త పన్ను విధానంలో రూ.12 లక్షల వరకు సాధారణ ఆదాయంపై రిబేట్ ప్రయోజనం అందుబాటులోకి రావడం ఐటీఆర్-1 దాఖలులపై కొంత ప్రభావం చూపినట్లు నిపుణులు భావిస్తున్నారు. ముఖ్యంగా పన్ను చెల్లించాల్సిన బాధ్యత లేని కొంతమంది వ్యక్తులు రిటర్న్ దాఖలు చేయాల్సిన అవసరం లేకపోవడంతో ఫైలింగ్స్‌లో స్వల్ప మార్పు కనిపించవచ్చు.ఐటీఆర్-3, ఐటీఆర్-4కు ఇంకా గడువుజూలై 31 గడువు అన్ని రకాల పన్ను చెల్లింపుదారులకు వర్తించదు. వ్యాపారం లేదా వృత్తి ద్వారా ఆదాయం పొందే, ఆడిట్ అవసరం లేని అర్హత కలిగిన పన్ను చెల్లింపుదారులకు ఐటీఆర్-3, ఐటీఆర్-4 దాఖలు గడువు ఆగస్టు 31 వరకు ఉంది. ఆదాయపు పన్ను శాఖ కూడా ఐటీఆర్-4కు ఆగస్టు 31నే గడువుగా పేర్కొంది.ఆడిట్ అవసరమయ్యే కేసులకు వేర్వేరు గడువులు ఉంటాయి. అందువల్ల మొత్తం ఐటీఆర్ ఫైలింగ్స్ సంఖ్య రానున్న వారాల్లో మరింత పెరిగే అవకాశం ఉంది.ఐటీఆర్-1, ఐటీఆర్-2 ఎవరికి?ఐటీఆర్-1 (సహజ్) ప్రధానంగా నివాస భారతీయ వ్యక్తులు ఉపయోగించే సరళీకృత రిటర్న్ ఫారం. మొత్తం ఆదాయం రూ.50 లక్షల వరకు ఉండి జీతం/పెన్షన్, ఇంటి ఆస్తి, ఇతర ఆదాయాలు, నిర్దిష్ట పరిమితుల్లో మూలధన లాభాలు, రూ.5,000 వరకు వ్యవసాయ ఆదాయం ఉన్న అర్హత కలిగిన వ్యక్తులు దీనిని దాఖలు చేయవచ్చు.ఐటీఆర్-2 వ్యాపారం లేదా వృత్తి ద్వారా ఆదాయం లేని వ్యక్తులు, హెచ్‌యూఎఫ్‌లు ఉపయోగించే ఫారం. ఐటీఆర్-1కు అర్హత లేని, అయితే వ్యాపారం/వృత్తి ఆదాయం లేని వ్యక్తులు ఇందులో రిటర్న్ దాఖలు చేస్తారు. ఉదాహరణకు కొన్ని రకాల మూలధన లాభాలు ఉన్నవారికి ఐటీఆర్-2 వర్తిస్తుంది.గడువు దాటితే?జూలై 31లోపు రిటర్న్ దాఖలు చేయలేకపోయిన అర్హత కలిగిన పన్ను చెల్లింపుదారులు డిసెంబర్ 31 వరకు బిలేటెడ్ రిటర్న్ దాఖలు చేయవచ్చు. అయితే ఆదాయం రూ.5 లక్షలకు మించితే సాధారణంగా రూ.5,000 వరకు, రూ.5 లక్షలలోపు ఉంటే రూ.1,000 ఆలస్య రుసుము వర్తించవచ్చు. పన్ను బకాయిలపై వడ్డీ కూడా పడే అవకాశం ఉంది. అందువల్ల గడువు ముగిసినా ఇంకా రిటర్న్ దాఖలు చేయాల్సినవారు వీలైనంత త్వరగా బిలేటెడ్ రిటర్న్ సమర్పించడం మంచిది.Thank you, taxpayers! 🙏🇮🇳Over 5.9 Crore ITRs filed for AY 2026–27 by July 31st! Your trust and timely compliance provide the energy that fuels India’s growth.@nsitharamanoffc @officeofPCM @FinMinIndia @PIB_India pic.twitter.com/aShMxcuqOW— Income Tax India (@IncomeTaxIndia) August 1, 2026 -
EPF పెన్షన్.. టెన్షన్!
సాక్షి, హైదరాబాద్: పెన్షనర్లకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) షాకిచ్చింది. ప్రతి నెలా చివరి రోజు కంటే రెండ్రోజుల ముందే (28, 29వ తేదీ) ఇచ్చే పెన్షన్ డబ్బులు...జూలై నెల గడిచినా జాడలేకపోవడంతో పెన్షనర్లలో తీవ్ర ఆందోళన మొదలైంది. దీంతో శుక్రవారం (జూలై 31) ఈపీఎఫ్ కార్యాలయాల్లో పెద్ద ఎత్తున పెన్షనర్లు ప్రత్యక్షమయ్యారు. పెన్షన్ డబ్బులు రాకపోవడంపై ఆరా తీశారు. అయితే అధికారుల నుంచి సరైన సమాధానం రాకపోవడం వారిని మరింత ఆందోళనకు గురి చేసింది.కాగా, ఈపీఎఫ్ఓ తాజాగా నూతనంగా రూపొందించిన సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులోకి తీసుకొచి్చంది. ఇందులో కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో కొన్ని కార్యక్రమాలకు అవాంతరం ఏర్పడడంతో పెన్షన్ చెల్లింపుల్లో జాప్యం జరిగి ఉండొచ్చని అభిప్రాయం వ్యక్తమవుతున్నప్పటికీ దీన్ని అధికారికంగా ధుృవీకరించడం లేదు. దేశవ్యాప్తంగా 82.11లక్షల మంది పెన్షనర్లున్నారు. తాజాగా నెలకొన్న సాంకేతిక సమస్యలతో వీరందరికీ పెన్షన్ అందలేదని తెలుస్తోంది.దేశవ్యాప్తంగా ఉన్న పెన్షనర్లలో అత్యధికంగా తెలంగాణ రీజియన్ పరిధిలో దాదాపు 8 లక్షల మంది ఉన్నారు. ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు ప్రతి నెలా అందే పెన్షన్ అత్యంత పరిమితమే. రూ.1500 నుంచి సర్వీసుకు తగినట్లు రూ.7వేల వరకు గరిష్టంగా అందుతుంది. నెలవారీ వ్యక్తిగత ఖర్చులు, మందుల కొనుగోలు, ఇతరత్రా చిన్న అవసరాలకు ఈ డబ్బుల మీదే ఆధారపడుతుంటారు.తాజాగా జూలై నెల పెన్షన్ డబ్బులు అందకపోవడంతో వారంతా ఒక్కసారిగా అయోమయంలో పడ్డారు. ఎప్పటిలోగా చెల్లింపులు చేస్తారనే స్పష్టత లేకపోవడంతో పెన్షనర్లు తీవ్ర గందరగోళంలో పడ్డారు. తక్షణమే పెన్షన్ డబ్బులు విడుదల చేయాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఈపీఎఫ్ఓ తగిన చర్యలు తీసుకోవాలని పెన్షనర్లు కోరుతున్నారు. -
మారుతున్న ట్రెండ్.. పెరుగుతున్న లోన్స్!
భారత్‌లో అధికారిక రుణ వ్యవస్థ గత కొన్నేళ్లలో వేగంగా విస్తరించిందని ట్రాన్స్‌యూనియన్ సిబిల్ (TransUnion CIBIL) విడుదల చేసిన తాజా నివేదిక 'అన్లాకింగ్ యాక్సెస్: జర్నీ ఆఫ్ క్రెడిట్ ఎక్స్పాన్షన్ ఇన్ ఇండియా' వెల్లడించింది. 2017లో లోన్ తీసుకోవడానికి అర్హత కలిగిన వారిలో కేవలం 35 శాతం మంది మాత్రమే కనీసం ఒక్కసారైనా లోన్ తీసుకున్నట్లు తెలిసింది. అయితే ఈ సంఖ్య 2026 నాటికి 74 శాతానికి చేరింది. అంటే.. గత తొమ్మిదేళ్లలో భారతీయులు బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకోవడం గణనీయంగా పెరిగిందని నివేదిక పేర్కొంది.లోన్స్ తీసుకునే వారిలో మహిళలు, యువత, సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాల ప్రజల భాగస్వామ్యం కూడా వేగంగా పెరుగుతోంది. అలాగే మహారాష్ట్ర, తమిళనాడు వంటి సంప్రదాయ మార్కెట్లతో పాటు.. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బిహార్ వంటి రాష్ట్రాల్లో కూడా రుణాల వృద్ధి వేగంగా నమోదవుతోంది.ప్రజల్లో క్రెడిట్‌పై అవగాహన కూడా పెరిగిందని నివేదికలో వెల్లడైంది. 2018లో తమ క్రెడిట్ స్కోర్‌ను పరిశీలించే వారి సంఖ్య కేవలం 1 శాతం ఉండగా, 2026 నాటికి అది 35 శాతానికి పెరిగింది. వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ కార్డులు, వ్యాపార రుణాల వినియోగం కూడా గణనీయంగా పెరిగినట్లు నివేదిక తెలిపింది. అయితే.. కొత్తగా రుణాలు తీసుకునే వారి సంఖ్య కొంత తగ్గినప్పటికీ, ఇంకా అధికారిక రుణ వ్యవస్థలోకి రాని వ్యక్తులు, చిన్న వ్యాపారాలను చేర్చుకునేందుకు భారీ అవకాశాలు ఉన్నాయని ట్రాన్స్‌యూనియన్ సిబిల్ అభిప్రాయపడింది. డిజిటల్ బ్యాంకింగ్, యూపీఐ, ఫిన్‌టెక్ సేవల విస్తరణతో దేశంలో రుణాల లభ్యత మరింత పెరిగిందని సంస్థ పేర్కొంది. -
బంగారం లాంటి సంపాదన.. అయినా ఐటీ జంట భయాందోళన!
చేతిలో మంచి ఆదాయం.. అప్పులు లేవు.. కోట్ల రూపాయల విలువైన బంగారం.. అమెరికా స్టాక్స్‌లో పెట్టుబడులు.. అయినా భవిష్యత్తుపై భయం. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఓ యువ ఐటీ దంపతులు తమ ఉద్యోగ భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన తీరు సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది.‘హై ఎర్నర్.. కానీ ఇంకా రిచ్ కాదు’ అంటూ 27 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజినీర్ రెడిట్‌లో తన ఆర్థిక పరిస్థితిని పంచుకున్నాడు. తనకు, 23 ఏళ్ల తన భార్యకు కలిపి నెలకు సుమారు రూ.5 లక్షల నికర ఆదాయం వస్తుందని తెలిపాడు. చిన్న పట్టణంలో రిమోట్‌గా పనిచేస్తున్నామని పేర్కొన్నాడు. తమకు ఎలాంటి రుణాలు లేవని, తల్లిదండ్రుల ఇల్లు, సొంత కారు ఉన్నాయని వివరించాడు.రూ.95 లక్షలకు పైగా ఆస్తులురెడిట్ పోస్ట్ ప్రకారం.. ఈ జంట వద్ద సుమారు రూ.15 లక్షల విలువైన బంగారు నాణేలు, రూ.7 లక్షల అమెరికా స్టాక్స్, రూ.3 లక్షల ఎఫ్డీలు ఉన్నాయి. వీటికి అదనంగా తనకు, తన భార్య వద్ద సుమారు రూ.70 లక్షల విలువైన బంగారు ఆభరణాలు ఉన్నాయని చెప్పాడు. అంటే, పేర్కొన్న ఆస్తుల విలువే సుమారు రూ.95 లక్షలకు చేరుతుంది. దీనికి కారు, తల్లిదండ్రుల ఇల్లు వంటి అంశాలను కలిపితే వారి ఆర్థిక స్థితి మరింత బలంగా కనిపిస్తుంది. అంతేకాదు.. ఇద్దరికీ వ్యక్తిగత ఆరోగ్య బీమా కింద రూ.10 లక్షల చొప్పున, టర్మ్ ఇన్సూరెన్స్ కింద రూ.3 కోట్ల చొప్పున కవరేజీ ఉందని కూడా ఆ రెడిట్ పోస్ట్‌లో పేర్కొన్నాడు.ఐదేళ్లలో రూ.3–4 కోట్ల లక్ష్యంఇంత మంచి ఆదాయం, ఆస్తులు ఉన్నప్పటికీ ఈ యువకుడిని ప్రధానంగా వేధిస్తున్నది ఉద్యోగ భద్రత. AI వేగంగా అభివృద్ధి చెందుతున్నందున వచ్చే ఐదారు సంవత్సరాల్లో అనేక సంప్రదాయ ఉద్యోగాలు కనుమరుగయ్యే అవకాశం ఉందని అతను అభిప్రాయపడ్డాడు. అందుకే ప్రస్తుతం ఉన్న అధిక ఆదాయాన్ని ఉపయోగించుకుని రూ.3–4 కోట్ల సురక్షిత నికర సంపదను నిర్మించాలనుకుంటున్నట్లు తెలిపాడు.తన ప్రాథమిక పెట్టుబడి ప్రణాళికలో ప్రతి నెలా 10 గ్రాముల బంగారం కొనుగోలు చేయడం, రూ.2 లక్షలను ఎఫ్‌డీల్లో పెట్టడం, మిగిలిన మొత్తంలో సుమారు 1,500 డాలర్లను అమెరికా స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టడం వంటి అంశాలను ప్రస్తావించాడు. అయితే, తాము ఇద్దరూ సాఫ్ట్వేర్ ఇంజినీర్లమే కావడంతో తమ ప్రస్తుత ఉద్యోగాల స్థిరత్వంపై నమ్మకం తగ్గుతోందని అతను చెప్పాడు. కన్సల్టింగ్, సర్వీసెస్ ఆధారిత ఐటీ కంపెనీల భవిష్యత్తుపై కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాడు.ఈ రెడిట్ పోస్ట్‌పై స్పందించిన పలువురు నెటిజన్లు జంట ఆర్థిక పరిస్థితిని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 27 ఏళ్ల వయసులో అప్పులు లేకుండా రూ.1 కోట్లకు దగ్గరగా ఆస్తులు కలిగి ఉండటం మంచి స్థితి అని కొందరు పేర్కొన్నారు. మరికొందరు మాత్రం పెట్టుబడుల్లో వైవిధ్యం అవసరమని సూచించారు. ఇంకొందరు ‘సంపాదన పెంచుకోవడం’పై దృష్టి పెట్టాలని, AI వల్ల ఉద్యోగాలు మారుతున్న సమయంలో కొత్త టెక్నాలజీలను నేర్చుకోవాలని సూచించారు. -
గూగుల్ పేలో SBI కొత్త క్రెడిట్ కార్డు..
డిజిటల్ చెల్లింపుల రంగంలో మరో కీలక అడుగు పడింది. గూగుల్ పే, ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ లిమిటెడ్ భాగస్వామ్యంతో ‘గూగుల్ పే ఫ్లెక్స్ ఎస్బీఐ క్రెడిట్ కార్డు’ను అందుబాటులోకి తీసుకొచ్చాయి. తాజాగా ప్రారంభమైన ఈ కో-బ్రాండెడ్ కార్డు ద్వారా క్రెడిట్ కార్డు చెల్లింపులు, యూపీఐ లావాదేవీలు, రివార్డులను ఒకే డిజిటల్ వేదికలో నిర్వహించుకునే అవకాశం లభిస్తుంది.కార్డు కోసం దరఖాస్తు చేయడం నుంచి ఖాతా నిర్వహణ, లావాదేవీలను పరిశీలించడం, చెల్లింపులు చేయడం, కొన్ని సందర్భాల్లో బకాయిలను ఈఎంఐగా మార్చుకోవడం వరకు అనేక సేవలను గూగుల్ పే యాప్ నుంచే పొందవచ్చు. ఎస్బీఐ కార్డు నిబంధనల ప్రకారం, గూగుల్ పే ఫ్లెక్స్ కార్డుదారులకు ‘Pay in EMI’ సదుపాయం కూడా అందుబాటులో ఉంది. ఇందులో అర్హత ఉన్న రిటైల్ లావాదేవీలను కనీసం రూ.2,500 నుంచి 3, 6, 9, 12, 18, 24, 36 నెలల కాలవ్యవధులకు ఈఎంఐగా మార్చుకోవచ్చు.‘స్టార్స్’ రూపంలో రివార్డులుఈ కార్డులో ప్రత్యేక ఆకర్షణ ‘స్టార్స్’ రివార్డ్ ప్రోగ్రామ్. ఇందులో ఒక స్టార్ విలువ రూ.1గా ఉంటుంది. అర్హత కలిగిన కొనుగోళ్లపై కస్టమర్లు స్టార్స్‌ను సంపాదించి, గూగుల్ పేలో అందుబాటులో ఉన్న ఎంపిక చేసిన వోచర్లు లేదా చెల్లింపుల సమయంలో వాటిని వినియోగించుకోవచ్చు.కిరాణా, యుటిలిటీ బిల్లులు, షాపింగ్, ప్రయాణం వంటి రోజువారీ ఖర్చులపై రివార్డులు పొందేలా ఈ కార్డును రూపొందించారు. ఖర్చు స్థాయిని బట్టి రివార్డ్ ప్రయోజనాలు మారేలా నిర్మాణం ఉంటుంది. ప్రాథమిక రివార్డ్ నిర్మాణంలో ఏడాదికి గరిష్ఠంగా 18,000 స్టార్స్ వరకు సంపాదించే అవకాశం ఉంటుంది.కొత్త కస్టమర్లకు రూ.1,000 వరకు వెల్కమ్ బెనిఫిట్ కూడా అందిస్తోంది. మొదటి గూగుల్ పే చెల్లింపు, జాయినింగ్ ఫీజు చెల్లింపు, ప్రారంభ ఖర్చు మైలురాళ్లకు అనుసంధానమైన ప్రయోజనాలు ఇందులో ఉన్నాయి.రూ.1 లక్ష ఖర్చు చేస్తే ఫీజు మాఫీగూగుల్ పే ఫ్లెక్స్ ఎస్బీఐ కార్డుకు జాయినింగ్, వార్షిక రెన్యువల్ ఫీజు రూ.499గా ఉంది. దీనికి వర్తించే పన్నులు అదనం. అయితే కార్డుదారుడు ఏడాదిలో రూ.1 లక్ష ఖర్చు చేస్తే ఈ వార్షిక ఫీజును మాఫీ చేస్తారు. ఈ కార్డు వీసా, రూపే నెట్‌వర్క్‌లలో అందుబాటులోకి వచ్చింది. రూపే వేరియంట్‌ను యూపీఐకి లింక్ చేసుకుని, యూపీఐకి అనుకూలమైన వ్యాపారుల వద్ద క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపులు చేయవచ్చు. ట్యాప్-టు-పే లావాదేవీల కోసం గూగుల్ పే టోకెనైజేషన్ వంటి డిజిటల్ చెల్లింపు సదుపాయాలకు కూడా మద్దతు ఉంది.అయితే యూపీఐ ద్వారా క్రెడిట్ కార్డు వినియోగం ప్రధానంగా వ్యాపార చెల్లింపులకే వర్తిస్తుంది. వ్యక్తిగత బ్యాంకు ఖాతాలకు డబ్బు బదిలీ, కొన్ని ప్రత్యేక కేటగిరీల చెల్లింపులకు రూపే క్రెడిట్ కార్డు-ఆన్-యూపీఐ సదుపాయం వర్తించదు. -
వద్దు బాబోయ్ ఈ ఆడంబరాలు..
భారతీయ వివాహాలు అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది ఆడంబరం, వైభవం, భారీ ఖర్చులు. మరీ ముఖ్యంగా సోషల్ మీడియా యుగంలో ‘బిగ్ ఫ్యాట్ వెడ్డింగ్స్’ సంస్కృతి మరింత శృతిమించింది. కొద్ది గంటలు లేదా కొన్ని రోజుల పాటు జరిగే వేడుకల కోసం రూ.లక్షలు ఖర్చు చేయడం పరిపాటైపోయింది. అయితే, ఈ ఆడంబరాల సంస్కృతిపై ఒక యువతి అభిప్రాయాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారాయి.జీవితంలో ఘోరమైన తప్పు ఇదే!ఇన్స్టాగ్రామ్ యూజర్ ప్రణతి తన రాబోయే వివాహం కోసం రూ.30 లక్షలు ఖర్చు చేయాల్సి రావడంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తన జీవితంలో ఇది అత్యంత ఘోరమైన తప్పిదం అన్నారు. సామాజిక నిబంధనలు, సమాజం విధించిన ఆచారాల కోసమే తాను ఈ ఖర్చు భరించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆమె పలు వ్యాఖ్యలు చేశారు.‘20 ఏళ్ల వయసున్నవారు తమ కష్టార్జితంలో లేదా సంపదలో మెజారిటీ భాగాన్ని కేవలం ఒక్క రోజు వేడుక కోసం ఎందుకు ఖర్చు చేస్తారో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. రూ.30 లక్షలు అనేది కేవలం పెళ్లి బడ్జెట్ మాత్రమే కాదు.. అది ఒక సొంతింటి డౌన్ పేమెంట్! ఒక కొత్త వ్యాపారానికి మొదటి పెట్టుబడి. మహిళల కోణంలో ఆలోచిస్తే ఏళ్ల తరబడి చేసే ఎస్ఐపీల మొత్తం. కానీ, సమాజం కోసం మనం దీన్ని వృథాగా ఖర్చు చేస్తున్నాం’ అన్నారు.ఆర్థిక స్వేచ్ఛను దెబ్బతీస్తున్న ఆడంబరాలుఈ మొత్తాన్ని ఆదా చేసుకుంటే ఒక వ్యక్తి జీవిత గమనమే మారిపోతుందని ప్రణతి అన్నారు. ఆ నిధి ఇచ్చే ఆర్థిక వెసులుబాటుతో..నచ్చని ఉద్యోగాన్ని నిర్దాక్ష్యణ్యంగా వీడవచ్చు.మానసిక ప్రశాంతత లేని చెడు బంధాల నుంచి విముక్తి పొందవచ్చు.కెరీర్లో అవసరమైనప్పుడు విరామం తీసుకునే స్వేచ్ఛ లభిస్తుంది.‘మనం పుట్టినప్పుడే తల్లిదండ్రులు ఈ మొత్తాన్ని మన పేరిట పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే.. మనకు 25 ఏళ్లు వచ్చేసరికి వారు కేవలం పెళ్లి మాత్రమే కాదు, ఆర్థిక స్వేచ్ఛను బహుమతిగా ఇచ్చినవారవుతారు. వివాహాలు జ్ఞాపకాలను మాత్రమే ఇస్తాయి. కానీ సంపద ఎన్నో సౌకర్యాలను ఇస్తుంది. అందుకే ఆడంబరమైన పెళ్లిళ్లకు నేను స్వస్తి పలుకుతున్నాను’ అని ఆమె స్పష్టం చేశారు.భారతదేశంలో వివాహం అనేది కేవలం ఇద్దరి కలయిక మాత్రమే కాదు, అదొక సామాజిక హోదాగా మారింది. అయితే, సమాజం చూపించే ఆడంబరాల ఉచ్చులో పడి యువత తమ భవిష్యత్తు ఆర్థిక భద్రతను, ప్యాషన్లను బలిపెడుతోందనడానికి ప్రణతి లేవనెత్తిన పాయింట్లు నిదర్శనం. వివాహ వేడుకల ఆడంబరం కంటే ఆ తర్వాత ప్రారంభమయ్యే జీవితానికి అవసరమయ్యే ఆర్థిక స్థిరత్వానికే నేటి యువత ప్రాధాన్యమివ్వాలని నిపుణులు చెబుతున్నారు. View this post on Instagram A post shared by Pranati’s Brain (@pranati.2000)ఇదీ చదవండి: రైల్వే తత్కాల్ బుకింగ్‌లో మార్పులు -
‘సామ్రాజ్యాలు కూలిపోతాయి.. బంగారం నిలుస్తుంది’
ప్రపంచ ప్రసిద్ధ ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ పుస్తక రచయిత, ఇన్వెస్ట్మెంట్ నిపుణుడు రాబర్ట్ కియోసాకి మరోసారి బంగారం, వెండిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ చరిత్రలో ప్రతి సామ్రాజ్యం ఒకే చక్రాన్ని అనుసరిస్తుందని, అధికంగా కరెన్సీ ముద్రించడం చివరికి ఆర్థిక వ్యవస్థను బలహీనపరుస్తుందని ఆయన తన ఫేస్బుక్ పోస్టులో పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కాగితపు కరెన్సీ కంటే బంగారం, వెండి వంటి వాస్తవ ఆస్తులే సంపదను కాపాడగలవని ఆయన అభిప్రాయపడ్డారు.రోమన్ సామ్రాజ్యం నుంచి స్పెయిన్, బ్రిటన్ వరకు చరిత్రను పరిశీలిస్తే, కరెన్సీ విలువ తగ్గిన ప్రతిసారి బంగారం తన విలువను నిలబెట్టుకుందని కియోసాకి తెలిపారు. ప్రభుత్వాలు ఎంత డబ్బునైనా ముద్రించగలవని, కానీ బంగారం లేదా వెండిని ముద్రించడం సాధ్యం కాదని ఆయన చెప్పారు. అందుకే ధనవంతులు తమ సంపదను బంగారం, వెండి వంటి పరిమిత లభ్యత కలిగిన ఆస్తుల్లో నిల్వ చేస్తారని వివరించారు.ద్రవ్యోల్బణం ప్రజల కొనుగోలు శక్తిని క్రమంగా తగ్గిస్తుందని, అలాంటి సమయంలో బంగారం, వెండి కొనుగోలు శక్తిని రక్షించే సాధనాలుగా పనిచేస్తాయని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వాలపై నమ్మకం తగ్గినప్పుడు బంగారం ధరలు పెరుగుతున్నట్లు కనిపించినా, వాస్తవానికి కరెన్సీ విలువే తగ్గుతోందని ఆయన వ్యాఖ్యానించారు.తాను అమెరికా అంతమవుతుందని చెప్పడం లేదని, అయితే అమెరికా డాలర్ ఆధిపత్యం క్రమంగా తగ్గే దిశగా సాగుతోందని కియోసాకి అభిప్రాయపడ్డారు. చరిత్రలో కరెన్సీ విలువను అధికంగా తగ్గించిన ప్రతి సామ్రాజ్యం చివరకు తన ఆధిపత్యాన్ని కోల్పోయిందని గుర్తు చేశారు.బంగారం, వెండి ఒక్క రాత్రిలో ధనవంతులను చేసే పెట్టుబడులు కాదని, ఆర్థిక సంక్షోభాల నుంచి రక్షించే "ఫైనాన్షియల్ లైఫ్బోట్లు" అని ఆయన పేర్కొన్నారు. పరిస్థితులు మరింత క్లిష్టం అయ్యే వరకు వేచి చూడకుండా, చిన్న మొత్తంతో అయినా వెండి నాణెం లేదా చిన్న పరిమాణంలోని బంగారం కొనుగోలు చేసి నిజమైన సంపదను కూడబెట్టడం ప్రారంభించాలని తన ఫాలోవర్లకు సూచించారు. కాగితపు కరెన్సీలో మాత్రమే పొదుపు చేస్తే కాలక్రమంలో కొనుగోలు శక్తి తగ్గిపోతుందని, బంగారం, వెండి వంటి వాస్తవ ఆస్తులే దీర్ఘకాలంలో సంపదను రక్షిస్తాయని ఆయన తన పోస్టులో స్పష్టం చేశారు. -
ఐటీఆర్ అలర్ట్: రూ.5000 పెనాల్టీ.. దగ్గరకొచ్చేసింది!
ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలుకు గడువు ముగియడానికి ఇంక కేవలం రెండు రోజులు మాత్రమే మిగిలి ఉంది. దీంతో పన్ను చెల్లింపుదారులు అప్రమత్తంగా ఉండాలని ఇన్కమ్ ట్యాక్స్ నిపుణులు సూచిస్తున్నారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి (AY 2026–27) సంబంధించిన ఐటీ రిటర్న్‌లను ఆడిట్ అవసరం లేని వేతన ఉద్యోగులు, పెన్షనర్లు, సాధారణ వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు జూలై 31 లోపు తప్పనిసరిగా దాఖలు చేయాలి. ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం ఈ గడువును పొడిగిస్తూ ఎలాంటి ప్రకటన చేయలేదు.గడువు దాటిన తర్వాత కూడా డిసెంబర్ 31 వరకు బిలేటెడ్ రిటర్న్ (Belated Return) దాఖలు చేసే అవకాశం ఉన్నప్పటికీ, ఇందుకు పలు ఆర్థిక, పన్ను సంబంధిత ప్రతికూల ప్రభావాలు ఎదురయ్యే అవకాశం ఉంది.గడువు మిస్ అయితే ఎదురయ్యే ప్రధాన పరిణామాలురూ.5,000 వరకు లేట్ ఫీజుఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 234F ప్రకారం, మొత్తం ఆదాయం రూ.5 లక్షలకు మించి ఉంటే గరిష్ఠంగా రూ.5,000 వరకు ఆలస్య రుసుము చెల్లించాల్సి ఉంటుంది. మొత్తం ఆదాయం రూ.5 లక్షలలోపు ఉంటే ఈ రుసుము రూ.1,000కే పరిమితం అవుతుంది.చెల్లించాల్సిన పన్నుపై వడ్డీచెల్లించాల్సిన పన్ను బకాయి ఉంటే, సెక్షన్ 234A ప్రకారం నెలకు 1 శాతం చొప్పున వడ్డీ విధిస్తారు. ఈ వడ్డీ అసలు గడువు తేదీ నుంచి రిటర్న్ దాఖలు చేసే వరకు లెక్కిస్తారు.పాత పన్ను విధానాన్ని ఎంచుకునే అవకాశం కోల్పోవచ్చువ్యాపార ఆదాయం ఉన్న పన్ను చెల్లింపుదారులు పాత పన్ను విధానాన్ని కొనసాగించాలంటే గడువులోపు అవసరమైన ప్రక్రియను పూర్తి చేయాలి. ఆలస్యంగా రిటర్న్ దాఖలు చేస్తే కొత్త పన్ను విధానమే వర్తించే అవకాశం ఉంటుంది.ట్యాక్స్ రీఫండ్‌లో జాప్యంరిటర్న్ దాఖలు చేసి, అది ప్రాసెస్ అయిన తర్వాతే ఆదాయపు పన్ను శాఖ రీఫండ్‌ను జారీ చేస్తుంది. ఆలస్యంగా రిటర్న్ దాఖలు చేస్తే రీఫండ్ కూడా ఆలస్యంగా వచ్చే అవకాశం ఉంది.రీఫండ్‌పై వడ్డీ తగ్గే అవకాశంరీఫండ్కు అర్హత ఉన్నవారికి కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం వడ్డీ కూడా చెల్లిస్తుంది. అయితే రిటర్న్ ఆలస్యంగా దాఖలు చేస్తే ఆ వడ్డీ ప్రయోజనం తగ్గే అవకాశం ఉంది.క్యారీ ఫార్వర్డ్ కష్టంమూలధన లాభాలు (Capital Gains), వ్యాపార నష్టాలు వంటి కొన్ని నష్టాలను భవిష్యత్ సంవత్సరాలకు క్యారీ ఫార్వర్డ్ చేసుకునే అవకాశం కూడా ఆలస్యంగా రిటర్న్ దాఖలు చేస్తే కోల్పోయే ప్రమాదం ఉంది.పన్ను నిపుణుల సూచన ప్రకారం, చివరి రోజుల్లో ఈ-ఫైలింగ్ పోర్టల్‌పై ట్రాఫిక్ అధికంగా ఉండే అవకాశం ఉన్నందున, ఫారమ్-16, AIS, 26AS, బ్యాంక్ వివరాలు, పెట్టుబడి ఆధారాలు సిద్ధం చేసుకుని వీలైనంత త్వరగా ఐటీఆర్‌ను దాఖలు చేయడం మంచిది. -
ఈఎంఐలు క్రమంగా చెల్లిస్తున్నా సిబిల్ తగ్గుతోందా?
ప్రతి నెలా ఈఎంఐలు, క్రెడిట్ కార్డు బిల్లులను గడువులోగా చెల్లిస్తున్నప్పటికీ సిబిల్ లేదా క్రెడిట్ స్కోర్ అకస్మాత్తుగా పడిపోవడం చాలామంది రుణగ్రహీతలను గందరగోళానికి గురిచేస్తుంటుంది. క్రమం తప్పకుండా చెల్లింపులు చేస్తున్నా స్కోర్ ఎందుకు తగ్గుతోందనే సందేహం సహజమే. అయితే, క్రెడిట్ స్కోర్ లెక్కింపులో సమయానికి చెల్లింపులు చేయడం అనేది ఒక భాగం (దాదాపు 35% వెయిటేజీ) మాత్రమే. మిగిలిన 65% స్కోర్ ఇతర కీలక ఆర్థిక అంశాలపై ఆధారపడి ఉంటుందని బ్యాంకింగ్ రంగ నిపుణులు పేర్కొంటున్నారు.క్రెడిట్ వినియోగ నిష్పత్తి పెరగడంమీకున్న మొత్తం క్రెడిట్ కార్డు పరిమితిలో 30 శాతం కంటే ఎక్కువ లిమిట్ వాడటం స్కోరును దెబ్బతీస్తుంది. బిల్లును గడువులోగా పూర్తిగా చెల్లించినప్పటికీ స్టేట్మెంట్ జనరేట్ అయ్యే సమయానికి మీ వినియోగం ఎక్కువగా ఉంటే సిబిల్ దాన్ని అధిక రుణం తీసుకునే అలవాటు ఉందని పరిగణిస్తుంది.పాత క్రెడిట్ కార్డులను రద్దు చేయడంపాత క్రెడిట్ కార్డులను క్లోజ్ చేయడం వల్ల మీ మొత్తం క్రెడిట్ లిమిట్ తగ్గిపోతుంది. అంతేకాకుండా, మీ క్రెడిట్ హిస్టరీ కాలపరిమితి తగ్గి సగటు ఖాతా డ్యూరేషన్ చిన్నదవుతుంది. ఇది సిబిల్ స్కోరుపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.స్వల్పవ్యవధిలో ఎక్కువ దరఖాస్తులుతక్కువ సమయంలో వివిధ బ్యాంకులు లేదా ఫిన్‌టెక్ యాప్‌లలో రుణాలు, క్రెడిట్ కార్డుల కోసం పదేపదే దరఖాస్తు చేస్తే బ్యాంకులు హార్డ్ ఎంక్వైరీలు చేస్తాయి. ఇది రుణగ్రహీత తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిలో ఉన్నాడనే సంకేతాన్ని ఇస్తుంది.గ్యారెంటర్/కో-అప్లికెంట్ డిఫాల్ట్లుమీరు వేరొకరి రుణానికి గ్యారెంటర్‌గా లేదా జాయింట్ లోన్ కో-అప్లికెంట్‌గా ఉంటే వారు చెల్లింపుల్లో ఆలస్యం చేసినా లేదా డిఫాల్ట్ అయినా ఆ నెగెటివ్ ప్రభావం మీ స్కోర్‌పై కూడా పడుతుంది.సిబిల్ రిపోర్టులో తప్పుడు సమాచారంబ్యాంకులు లేదా క్రెడిట్ బ్యూరోల వైపు నుంచి జరిగే సాంకేతిక లోపాల వల్ల మీ ఖాతాలో నమోదు కాలేని చెల్లింపులు లేదా వేరొకరి రుణాలు మీ రిపోర్టులో కనిపించే అవకాశం ఉంది.ఇదీ చదవండి: రూ.1 కోటి జీతం.. 3 ఇళ్లు.. తీరా చూస్తే రూ.15 వేల అప్పు! -
రూ.1 కోటి జీతం.. 3 ఇళ్లు.. తీరా చూస్తే రూ.15 వేల అప్పు!
అత్యున్నత విద్యాసంస్థల్లో చదువు, ఏడాదికి రూ.1 కోటిపైనే వేతన ప్యాకేజీ, సొంతంగా మూడు ఇళ్లు.. ఇలా చూస్తే అతనో సంపన్నుడు. కానీ, ఆదాయపు పన్ను రిటర్నుల (ఐటీఆర్) సమయానికి వచ్చేసరికి రూ.15,000 పన్ను చెల్లించడానికి కూడా అతని వద్ద నగదు లేకపోవడం గమనార్హం. చివరికి ఆ కొద్దిపాటి మొత్తాన్ని కూడా అప్పుగా తెచ్చి పన్ను చెల్లించిన ఉదంతం ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.అసలేం జరిగింది?ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్ (సీఏ) ప్రతిభా గోయల్ సోషల్ మీడియా వేదికగా ఈ ఆసక్తికర కథనాన్ని పంచుకున్నారు. గత ఐదేళ్లుగా రూ.1 కోటికి పైగా వార్షిక వేతనం పొందుతున్న ఒక ఐఐటీ గ్రాడ్యుయేట్ తన వద్దకు ఐటీఆర్ దాఖలు చేయడానికి వచ్చారని ఆమె తెలిపారు. అతని పేరిట మూడు ఇళ్లు ఉన్నాయని, అందులో రెండు ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్నాయని పేర్కొన్నారు. అయితే, రిటర్నులు దాఖలు చేసే సమయంలో మిగిలిన రూ.15,000 పన్ను బకాయి చెల్లించేందుకు కూడా అతని వద్ద నగదు అందుబాటులో లేదు. ‘ఆగస్టులో జీతం వచ్చేవరకు వేచి ఉండగలరా?’ అని ఆ క్లయింట్ అడిగినట్లు సీఏ వెల్లడించారు. గడువు దాటితే వడ్డీ భారం పెరుగుతుందని సూచించడంతో సదరు ఐటీ ఉద్యోగి వేరొకరి వద్ద అప్పుగా తీసుకువచ్చి పన్ను చెల్లించి ఐటీఆర్ పూర్తి చేశారు.ఆస్తి ఉంది... నగదు లేదు!ఈ సంఘటనపై గోయల్ స్పందిస్తూ.. దేశంలో ఆర్థిక అక్షరాస్యత ఎంత అవసరమో చెప్పడానికి ఇదే నిదర్శనం అని తెలిపారు. భారీ వేతనాలు పొందుతున్నప్పటికీ సంపాదన మొత్తాన్ని స్థిరాస్తుల్లో లేదా ఈఎంఐలలో లాక్ చేసి అత్యవసర నగదు లభ్యతను పక్కనబెట్టడం తీవ్రమైన నష్టాలకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలుఈ పోస్ట్ వైర్ కావడంపై నెటిజన్ల నుంచి భిన్నమైన స్పందనలు వ్యక్తమయ్యాయి. ‘క్లిష్టమైన సమస్యలను పరిష్కరించే ఐఐటీయన్లు ప్రాథమిక ఆర్థిక సూత్రాలను మరిచిపోవడం ఆశ్చర్యంగా ఉంది’ అని ఒకరు వ్యాఖ్యానించారు. ‘ఆస్తుల రూపంలో సంపద ఉన్నప్పటికీ నగదు లభ్యత లేకపోవడం (అస్సెట్ రిచ్, క్యాష్ పూర్) వల్లే జరిగింది’ అని మరొకరు విశ్లేషించారు. లిక్విడిటీ సంక్షోభం ఎదుర్కొనే వారిలో రూ.50 లక్షలకు పైగా ప్యాకేజీలు ఉన్నవారే ఎక్కువగా ఉంటున్నారని మరికొందరు సీఏలు అభిప్రాయపడ్డారు.ఇదీ చదవండి: కరుగుతోన్న బంగారు కొండ! -
ధనికుల కోసం మొదలై.. మధ్యతరగతిపై ప్రభావం!
డబ్బు సంపాదించే ప్రతి ఒక్కరి జీవితంలో ట్యాక్స్ ఒక ముఖ్యమైన అంశం. అయితే.. ఆదాయ పన్ను (Income Tax) ఎలా వచ్చింది? ఎవరు ఎక్కువగా చెల్లిస్తున్నారు? అనే విషయాలు చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. దీని గురించి వివరిస్తూ రాబర్ట్ కియోసాకి సుదీర్ఘ పోస్ట్ చేశారు. మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.అమెరికా ఆదాయ పన్ను చరిత్రను పరిశీలిస్తే.. మొదట ఇది కేవలం ధనికుల నుంచి మాత్రమే పన్ను వసూలు చేయాలనే ఉద్దేశంతో ప్రారంభమైంది. కానీ.. కాలక్రమేణా ఈ పన్ను విధానం మారుతూ, సాధారణ ఉద్యోగులు, మధ్యతరగతి ప్రజలపై కూడా ప్రభావం చూపడం మొదలైంది.ఆదాయ పన్ను విధానం1913కు ముందు అమెరికా ప్రభుత్వం ప్రధానంగా వాణిజ్య సుంకాలు, దిగుమతి పన్నుల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకునేది. ఆ సమయంలో సాధారణ ప్రజలు తమ జీతాలపై ఫెడరల్ ఆదాయ పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండేది కాదు. ఆ తరువాత అమెరికా రాజ్యాంగంలోని 16వ సవరణ ద్వారా ఆదాయ పన్ను విధానం అమల్లోకి వచ్చింది.అప్పట్లో.. దీనిని ధనికులపై మాత్రమే విధించే పన్నుగా ప్రజలకు వివరించారు. ప్రారంభ దశలో చాలా ఎక్కువ ఆదాయం ఉన్నవారికే పన్ను వర్తించేది. దీంతో సాధారణ ప్రజలు ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. ధనికులు తమ వాటా చెల్లించడం న్యాయమేనని చాలామంది భావించారు.పన్ను వ్యవస్థలో మార్పులుఅయితే, సంవత్సరాలు గడిచేకొద్దీ పన్ను వ్యవస్థలో అనేక మార్పులు వచ్చాయి. పన్ను రేట్లు పెరిగాయి, నియమాలు మారాయి, పన్ను చెల్లించే వారి పరిధి కూడా విస్తరించింది. దీంతో ఒకప్పుడు ధనికులపై మాత్రమే ఉన్న పన్ను భారం క్రమంగా.. మధ్యతరగతి ఉద్యోగులపై కూడా పడింది.ఇక్కడ ప్రధానంగా ప్రస్తావించే విషయం ఏమిటంటే.. ఆదాయం వచ్చే విధానం. సాధారణ ఉద్యోగులు తమ శ్రమకు ప్రతిఫలంగా జీతం పొందుతారు. ఈ జీతంపై నేరుగా పన్ను విధించడం జరుగుతుంది. మరోవైపు.. వ్యాపారాలు, పెట్టుబడులు, ఆస్తుల ద్వారా ఆదాయం పొందేవారికి పన్ను చట్టాల్లో కొన్ని ప్రయోజనాలు ఉంటాయి. వ్యాపారాలు చేసే వారు ఖర్చుల తగ్గింపులు, ఆస్తుల విలువ తగ్గింపు వంటి పన్ను ప్రయోజనాలను ఉపయోగించుకోగలరు. అందువల్ల సంపదను సృష్టించే మార్గాలను ఎంచుకున్నవారు పన్ను వ్యవస్థలో ఉన్న అవకాశాలను ఉపయోగించుకుంటారని ఆర్థిక నిపుణులు చెబుతారు. వారెన్ బఫెట్ ఉదాహరణఈ విషయాన్ని వివరించేందుకు వారెన్ బఫెట్ ఉదాహరణను కూడా ప్రస్తావిస్తారు. తన సెక్రటరీ తనకంటే ఎక్కువ పన్ను రేటు చెల్లించినట్లు ఆయన ఒకసారి చెప్పారు. దీనికి కారణం వారికి ఆదాయం వచ్చే విధానం వేర్వేరుగా ఉండటమే అని వివరించారు.కేవలం ఎక్కువ సంపాదించడం మాత్రమే కాకుండా, డబ్బు ఎలా వస్తోంది, పెట్టుబడులు ఎలా పనిచేస్తాయి, పన్ను వ్యవస్థ ఎలా ఉంటుంది అనే విషయాలపై అవగాహన కలిగి ఉండటం కూడా ముఖ్యం. అయితే.. పన్ను వ్యవస్థలు ప్రతి దేశంలోనూ ఆ దేశ ఆర్థిక పరిస్థితులు, ప్రభుత్వ విధానాలు, ప్రజల అవసరాల ఆధారంగా మారుతూ ఉంటాయి. ఆదాయ పన్ను ద్వారా ప్రభుత్వాలు రోడ్లు, విద్య, వైద్యం, రక్షణ వంటి ప్రజా సేవలకు అవసరమైన నిధులను సమకూర్చుకుంటాయి.ఆదాయ పన్ను చరిత్ర మనకు ఒక విషయాన్ని స్పష్టం చేస్తుంది. ఆర్థికంగా ఎదగాలంటే.. సంపాదనతో పాటు ఆర్థిక అవగాహన కూడా అవసరం. జీతంపై ఆధారపడే వ్యక్తి.. వ్యాపారం లేదా పెట్టుబడుల ద్వారా సంపాదించే వ్యక్తి ఒకే పన్ను వ్యవస్థలో ఉన్నప్పటికీ వారి ఆర్థిక పరిస్థితులు భిన్నంగా ఉండవచ్చు. అందుకే డబ్బు సంపాదించడం మాత్రమే కాకుండా, దాన్ని నిర్వహించడం, ఆర్థిక నియమాలను అర్థం చేసుకోవడం కూడా చాలా ముఖ్యం.ఇదీ చదవండి: ఇంకా తగ్గనున్న బంగారం ధరలు! -
EPFO సభ్యుడు మరణిస్తే నగదు క్లెయిమ్ ఎలా?
ఉద్యోగస్థుల ఆర్థిక భద్రతకు అండగా నిలిచే ‘ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ’ (ఈపీఎఫ్ఓ) సభ్యుడు అకస్మాత్తుగా మరణిస్తే సదరు కుటుంబ సభ్యులు లేదా నామినీలు పీఎఫ్ నగదును ఎలా పొందాలో పూర్తి సమాచారం అందుబాటులో ఉంది. క్లెయిమ్‌ల తిరస్కరణను తగ్గించి ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఈపీఎఫ్ఓ ఇటీవల తన పాత వ్యవస్థను నూతన సీఐటీఈఎస్ (కేంద్రీకృత ఐటీ సేవలు) వ్యవస్థలోకి మార్చింది. ఆటోమేటెడ్ ప్రీ-వాలిడేషన్ ద్వారా దరఖాస్తులను వేగంగా పరిశీలిస్తున్నారు.ఎవరు క్లెయిమ్ చేయవచ్చు?ఈపీఎఫ్ఓ నిబంధనల ప్రకారం, మరణించిన సభ్యుని ఆన్లైన్ ఈ-నామినేషన్ ఆధారంగా నామినీ దరఖాస్తు చేయవచ్చు. నామినీ మైనర్ (18 ఏళ్ల కంటే తక్కువ) అయితే, అతడి సంరక్షకులు (గారెంట్) పీఎఫ్ నిధుల కోసం దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ నామినేషన్ లేకపోతే తహసీల్దార్ లేదా మేజిస్ట్రేట్ ధ్రువీకరించిన వారసత్వ ధ్రువీకరణ పత్రంతో చట్టబద్ధమైన వారసులు క్లెయిమ్ చేసుకోవచ్చు.ఏ ఫారాలు దేనికి..ఫారమ్ 20: సభ్యుని ఖాతాలో జమ అయిన పీఎఫ్ మొత్తాన్ని ఒకేసారి విత్‌డ్రా చేసుకోవడానికి.ఫారమ్ 10డీ: అర్హత కలిగిన కుటుంబ సభ్యులకు నెలవారీ పెన్షన్ అందించడానికి.ఫారమ్ 5ఐఎఫ్: ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ (ఈడీఎల్ఐ) పథకం కింద లభించే ఉచిత జీవిత బీమా పరిహారాన్ని పొందేందుకు.ఆన్లైన్ దరఖాస్తు విధానంప్రస్తుతం ఈ ఆన్లైన్ క్లెయిమ్ సేవ ఈపీఎఫ్ఓ అధికారిక యూనిఫైడ్ పోర్టల్‌లో అందుబాటులో ఉంది.దశ 1: ఈపీఎఫ్ఓ మెంబర్ పోర్టల్‌లోకి వెళ్లి డెత్ క్లెయిమ్ ఫారమ్ ఎంచుకోవాలి.దశ 2: మరణించిన సభ్యుని 12 అంకెల యూఏఎన్, లబ్ధిదారుని ఆధార్ సంఖ్య, పేరు, పుట్టిన తేదీ నమోదు చేసి 'Get Authorisation PIN' పై క్లిక్ చేయాలి.దశ 3: అవసరమైన వివరాలను బ్లాక్ లెటర్లలో స్పష్టంగా పూర్తి చేసి క్లెయిమ్ రకాన్ని (ఫారమ్ 20/10D/5IF) ఎంచుకోవాలి.దశ 4: సభ్యుని మరణ ధ్రువీకరణ పత్రం, లబ్ధిదారుని బ్యాంక్ పాస్‌బుక్ లేదా క్యాన్సిల్డ్ చెక్ కాపీని (ఐఎఫ్ఎస్సీ కోడ్, అకౌంట్ నంబర్ స్పష్టంగా కనిపించేలా) అప్లోడ్ చేయాలి.దశ 5: ఆధార్‌తో లింకైన మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీ ఎంటర్ చేసి దరఖాస్తును సబ్మిట్ చేయాలి.ఇదీ చదవండి: ఒక రివార్డ్ పాయింట్.. రూ.1 అనుకుంటున్నారా? -
ఆదాయపు పన్ను శాఖ వారు.. మీ సేవలో..
ఔనండి.. నిజమే. ఆదాయపు పన్ను శాఖ వారు ఇందుకు సిద్ధమవుతున్నారు. జూలై 24వ తేదీన 167వ ఇన్‌కం ట్యాక్స్ డే నిర్వహించిన సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదాయపు పన్ను డిపార్టుమెంటుకి దశ–దిశ నిర్దేశించారు. ఈ సూచనలు అమలైతే చాలా మంచిదే అనుకోవచ్చు. ఈ ఫ్రేమ్‌వర్క్‌లో 5 ప్రాధాన్యతలతో కూడుకున్న మూడు పిల్లర్లతో పాటు ఏడు ప్రధాన సూత్రాలు ఉన్నాయి. వివరాల్లోకి వెళితే..దేశంలో అప్పీళ్ల సంఖ్య లక్షల్లో పేరుకుపోయింది. వాటిని శీఘ్రగతిని పూర్తి చేయమని నిర్దేశించారు ఆర్థిక మంత్రి. అనిశ్చితి నుంచి కచ్చితమైన పరిస్థితికి వెళ్లాలని నిర్దేసం. కొత్త చట్టంలో మార్పుల వల్ల అప్పీళ్ల సంఖ్యను తగ్గించవచ్చని ఆశాభావం నెలకొంది. ముందుగా మూడు మూల స్తంభాలు చూస్తే..🔹 సకాలంలో సర్క్యులర్ల ద్వార పన్ను చెల్లింపుదార్ల బాధ్యతలను వారికి తెలియజేయడం. (క్లారిటీ) 🔹 అధికారుల పరిధిలో చట్టంలో వివిధ అంశాలకు వివరణ ఇచ్చేటప్పుడు స్థిరత్వం, నిలకడ, క్రమబద్ధత. (కన్సిస్టెన్సీ) 🔹 అప్పేలేట్ అధికారులు ఇచ్చే ఆర్డర్లలో విషయం తెలుసుకుని, భవిష్యత్ సంస్కరణలకు అవసరమైన సమాచారం గురించి నిరంతరం నేర్చుకోవడం (కంటిన్యూస్ లెర్నింగ్).వీటి వల్ల లిటిగేషన్లను నివారించవచ్చు. లిటిగేషన్ ఏర్పడ్డ తర్వాత మేనేజ్ చేయడం కన్నా ముందుగానే నివారించవచ్చని, దానికి ఈ మూడు అంశాలు ప్రాతిపదికగా ఉండాలనేది ఆలోచన. నిజమే. లిటిగేషనే లేకపోతే, అంతా సాఫీగానే ఉంటుంది కదా.ఇక పన్ను వ్యవస్థపై ‘విశ్వాసం’ పెంపొందించాలంటే ‘రెస్పాన్సివ్ ట్యాక్స్ గవర్నెన్స్’ ఆవశ్యకతను ప్రతిఫలించేలా ‘5R’లు.. అంటే 5 ప్రాధాన్యతలను గుర్తించారు. అవేంటంటే, పట్టుకోవడం, ప్రతిస్పందించడం, పరిష్కరించడం, పునఃసమీక్షించడం, పన్ను విధానాలను సంస్కరించడం. ఇది చాలా మంచి ఆలోచన. ఇలా చేస్తే, అధికారులను ‘మా మంచి వారు.. మనసున్న వారు’ అని అనకతప్పదు. పట్టుకోవడం అంటే కేసులు పట్టుకోవడం. ట్యాక్స్ పేయర్స్ ఫిర్యాదులను తెలుసుకోవడం. వాటిని అర్థం చేసుకుని, స్పష్టంగా, పూర్తి సమాచారాన్ని, మర్యాదకరంగా ప్రతి స్థాయిలో ఇస్తూ, ప్రతి స్పందించడం. సకాలంలో సమగ్రంగా పరిష్కారం ఇవ్వడం. ఫిర్యాదులకు కారణాలను తెలుసుకుంటూ, వాటి ద్వారా నేర్చుకుంటూ, జాగ్రత్త వహించడం. అలాగే పన్ను మదింపు విధానం ప్రాసెస్, సిస్టం, పద్ధతులను పునఃసమీక్షించుకుని, ఫిర్యాదుల సంఖ్యను తగ్గించడం.. ఇలా ఈ ఐదు అంశాలూ ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. నిజాయితీ గల పన్ను చెల్లింపుదార్లకు వెసులుబాట్లు, సౌలభ్యం కల్పించడం.. పన్ను ఎగవేతదార్లను వదలకపోవడం అనే విధానాన్ని పాటించాలనేది హితవు. రెండు వర్గాల వారితోనూ ఒకే విధంగా వ్యవహరించకుండా ఎవరికి తగ్గ ట్రీట్మెంట్ వారికివ్వాలని అర్థం. వికసిత భారత్ వైపు అడుగులు వేయాలంటే ఏడు సూత్రాలను పొందుపరిచారు. 🔹 స్వయంగా, స్వతహాగా పాటించడం 🔹 సరళీకృత విధి విధానాలు 🔹 పన్ను విధానంలో అనిశ్చితి లేకుండా అమలుపరచడం, బలోపేతం చేయడం 🔹 టెక్నాలజీని విస్తృతంగా, బాధ్యతాయుతంగా వాడుకోవడం 🔹 డిపార్టుమెంటుని సంస్థాగతంగా, పటిష్టంగా చేయడం 🔹 ప్రజల విశ్వసనీయతని పెంపొందించడం 🔹 నిరంతర అభివృద్ధి వైపు నిత్యం అడుగులు వేయడంఆ మూడు స్తంభాలతో పాటు ఐదు ప్రాధాన్యతలను అమలు చేస్తూ ఏడు సూత్రాలను పాటిస్తే నిజంగానే నిజాయితీపరులకు న్యాయం జరుగుతుంది. -
ఒక రివార్డ్ పాయింట్.. రూ.1 అనుకుంటున్నారా?
క్రెడిట్ కార్డుతో మనం చేసే ప్రతి స్వైపింగ్ లేదా ఆన్లైన్ కొనుగోలుపై బ్యాంకులు రివార్డ్ పాయింట్లను ఖాతాలో జమ చేస్తుంటాయి. అయితే మెజారిటీ వినియోగదారులు ‘ఒక రివార్డ్ పాయింట్ అంటే ఒక రూపాయి’ అనే అపోహలో ఉంటారు. వాస్తవానికి బ్యాంకింగ్ నిబంధనల ప్రకారం ప్రతీ రివార్డ్ పాయింట్ విలువ మీరు దాన్ని ఏ విధంగా రిడీమ్ (వినియోగం) చేసుకుంటున్నారు అనే అంశంపై ఆధారపడి 20 పైసల నుంచి ఒక రూపాయి వరకు మారుతుంటుంది.రీడెంప్షన్ పద్ధతిని బట్టి పాయింట్ విలువపాయింట్లను విమాన టికెట్లు లేదా హోటల్ రూమ్‌ల కోసం ఉపయోగిస్తే ప్రతి పాయింట్‌కు అత్యధికంగా కార్లును అనుసరించి రూ.0.50- రూ.1.00 వరకు లభిస్తుంది.అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ప్రముఖ ఈ-కామర్స్ వౌచర్లుగా మార్చుకుంటే ఒక పాయింట్ విలువ రూ.0.30-రూ.0.50 మధ్య ఉంటుంది.రివార్డ్ పాయింట్లను నేరుగా క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపుగా మార్చుకుంటే బ్యాంకును బట్టి ఒక పాయింట్‌కు కేవలం రూ.0.20-రూ.0.25 మాత్రమే వస్తుంది.బ్యాంకు రివార్డ్ క్యాటలాగ్‌లో లభించే ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు కొనుగోలు చేస్తే పాయింట్ విలువ రూ.0.10-రూ.0.20 కి పడిపోతుంది.గరిష్ఠంగా మలచుకోవడానికి సూత్రాలుభారతదేశంలో చాలా క్రెడిట్ కార్డ్ పాయింట్లకు 12-36 నెలల గడువు ఉంటుంది. వాడకుండా వదిలేస్తే పాయింట్లు రద్దయిపోతాయి. ప్రతి ఆరు నెలలకు ఒకసారి మీ రివార్డ్ పోర్టల్‌ను తనిఖీ చేసి పాయింట్లను రీడీమ్ చేసుకోవడం శ్రేయస్కరం.ప్రయాణాలు, ఇంధనం లేదా ఆన్లైన్ షాపింగ్‌ల కోసం ప్రత్యేక కో-బ్రాండెడ్ కార్డ్‌లను వాడటం వల్ల సాధారణ 1X పాయింట్ల కంటే 5X-10X వేగంతో ఎక్కువ పాయింట్లు లభిస్తాయి.రివార్డ్ పాయింట్ల ఆశతో అనవసర ఖర్చులు చేయడం లేదా క్రెడిట్ కార్డ్ బిల్లు బకాయిలపై నెలకు 3%-3.5% (ఏడాదికి 36% - 42%) వడ్డీ చెల్లించడం వల్ల మీరు పొందే 1%-2% రివార్డ్ ప్రయోజనం పూర్తిగా వ్యర్థమవుతుంది. -
24 గంటల్లో రూ.20 లక్షలు ఖాళీ!
భారతదేశంలో పెళ్లి అంటే కేవలం ఇద్దరు వ్యక్తులు ఒక్కటయ్యే కార్యక్రమం మాత్రమే కాదు.. రెండు కుటుంబాలు కలిసి జరుపుకునే పెద్ద వేడుక. మన దేశంలో వివాహాలకు ప్రత్యేకమైన స్థానం ఉంది. అందుకే.. చాలామంది తమ పెళ్లిని జీవితంలో గుర్తుండిపోయేలా ఎంతో ఘనంగా నిర్వహించాలని కోరుకుంటారు. దీనికోసం ఎంత ఖర్చు చేయడానికైనా వెనుకాడరు.ప్రస్తుతం భారతీయ పెళ్లిళ్ల విషయంలో రెండు రకాల ఆలోచనలు కనిపిస్తున్నాయి. కొంతమంది పెళ్లిని ఎంతో వైభవంగా నిర్వహించాలని భావించి భారీగా డబ్బు ఖర్చు చేస్తుంటారు. మరికొందరు మాత్రం అవసరానికి మించి ఖర్చు చేయకుండా.. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఆచరణాత్మకంగా పెళ్లి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు.ఇలాంటి పెళ్లి ఖర్చులపై.. బెంగళూరుకు చెందిన చార్టర్డ్ అకౌంటెంట్ మీనల్ గోయల్ చేసిన ఓ సోషల్ మీడియా పోస్ట్ ప్రస్తుతం చర్చకు దారితీసింది. కేవలం రెండు రోజుల్లోనే రూ.20 లక్షల బడ్జెట్ ఎలా ఖర్చైపోతుందో ఆమె వివరించారు.మీనల్ గోయల్ లెక్కల ప్రకారం.. సాధారణంగా రూ.20 లక్షల బడ్జెట్ ఉన్న ఓ పెళ్లిలో ఎక్కువ మొత్తం ఆహారం, వేదిక, అలంకరణ వంటి వాటికే ఖర్చు అవుతోంది. సుమారు రూ.6 లక్షలు భోజనాల కోసం, రూ.5 లక్షలు పెళ్లి వేదిక కోసం, రూ.3 లక్షలు అలంకరణ కోసం ఖర్చవుతాయని తెలిపారు. ఇక ఫోటోగ్రఫీకి రూ.2 లక్షలు, వినోద కార్యక్రమాలు లేదా డీజే కోసం మరో రూ.2 లక్షలు ఖర్చు అవుతాయని, మిగిలిన రూ.2 లక్షలు ఇతర చిన్నచిన్న ఖర్చులకు వెళ్తాయని వివరించారు.అయితే.. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. ఇంత పెద్ద మొత్తం ఖర్చు చేసినా ఆ వేడుకలు కొన్ని గంటలు మాత్రమే ఉంటాయని మీనల్ గోయల్ చెప్పారు. కేవలం 24 గంటల్లోనే రూ.20 లక్షలు ఖర్చైపోతాయని ఆమె తన పోస్ట్‌లో పేర్కొన్నారు.పెళ్లిళ్లు చేసుకోవద్దని లేదా వేడుకలను తగ్గించుకోవాలని మీనల్ గోయల్ ఉద్దేశ్యం కాదు. కానీ ఆర్థిక పరిస్థితికి తగ్గట్టుగా ఖర్చు చేయాలని సూచించారు. పెళ్లి అనేది కేవలం ఒక రోజు జరిగే వేడుక మాత్రమే కాదని.. దాని తర్వాత ప్రారంభమయ్యే కొత్త జీవితానికి ఆర్థిక భద్రత కూడా ఎంతో ముఖ్యమని ఆమె పేర్కొన్నారు.పెళ్లిని ఘనంగా జరుపుకోవడం కంటే, పెళ్లి తర్వాత జీవితం సంతోషంగా, ప్రశాంతంగా సాగడం ముఖ్యం. ఒక రోజు జరిగే వేడుక కోసం అధికంగా ఖర్చు చేసి ఆర్థిక ఒత్తిడిని తెచ్చుకోవడం కంటే.. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవడం మంచిదని సూచించారు. View this post on Instagram A post shared by Meenal Goel | Finance (@ca.meenalgoel) -
‘బంగారం, వెండి.. అందుకే అక్కడ దాచుకుంటున్నా’
‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ రచయిత, ప్రముఖ పెట్టుబడి నిపుణుడు రాబర్ట్ కియోసాకి అమెరికా పెరుగుతున్న ప్రభుత్వ అప్పులపై మరోసారి ఆందోళన వ్యక్తం చేశారు. తన అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో చేసిన తాజా పోస్టులో అమెరికా రుణభారం ప్రమాదకర స్థాయికి చేరిందని పేర్కొంటూ, కరెన్సీని పొదుపు చేయడం కంటే వాస్తవ ఆస్తులను (Real Assets) కూడబెట్టడం మంచిదని అభిప్రాయపడ్డారు.కియోసాకి ప్రకారం.. 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం (GFC)కు ముందు అమెరికా ప్రభుత్వ రుణం సుమారు 9.5 ట్రిలియన్ డాలర్లు ఉండగా, ప్రస్తుతం అది 39 ట్రిలియన్ డాలర్లకు చేరువలో ఉందన్నారు. ఇదే సమయంలో అమెరికా బాండ్ మార్కెట్ కూడా ఒత్తిడిని ఎదుర్కొంటోందని ఆయన వ్యాఖ్యానించారు.ఈ సందర్భంగా ఆయన ఒక ఆసక్తికరమైన పోలికను ప్రస్తావించారు. "మీరు నిమిషానికి ఒక డాలర్ చొప్పున ఖర్చు చేస్తే ఒక ట్రిలియన్ డాలర్లు ఖర్చు చేయడానికి 32 వేల సంవత్సరాలు పడుతుంది. కానీ అమెరికా ప్రభుత్వం దాదాపు ప్రతి 90 రోజులకు ఒక ట్రిలియన్ డాలర్ల మేర కొత్త అప్పు సృష్టిస్తోంది" అని పేర్కొన్నారు.ఈ పరిస్థితుల్లో ప్రజలు డబ్బును పొదుపు చేయాలా? అని ప్రశ్నిస్తూ, తన పుస్తకం ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’లో చెప్పిన మూడు ప్రధాన ఆర్థిక సూత్రాల్లో ఒకటైన "ధనవంతులు నగదును పొదుపు చేయరు" అనే విషయాన్ని గుర్తు చేశారు.తాను 1965 నుంచి వెండి, 1971 నుంచి బంగారం, 2012 నుంచి బిట్‌కాయిన్, 2022 నుంచి ఎథీరియం కూడబెట్టుకుంటున్నానని కియోసాకి వెల్లడించారు. అలాగే తన బంగారం, వెండి నిల్వలను స్విట్జర్లాండ్ వెలుపల ఉన్న స్విస్ వాల్ట్‌లలో భద్రపరుస్తున్నానని చెప్పారు. గతంలో అమెరికా ప్రభుత్వం బంగారం వ్యక్తిగత యాజమాన్యాన్ని నిషేధించి స్వాధీనం చేసుకున్న చరిత్ర ఉందని కూడా ఆయన తన పోస్టులో ప్రస్తావించారు.ప్రపంచం ప్రస్తుతం ఆర్థికంగా అల్లకల్లోల పరిస్థితులను ఎదుర్కొంటోందని పేర్కొన్న కియోసాకి, "ఇవి ప్రపంచ చరిత్రలో అత్యంత అనిశ్చిత కాలాలు. జాగ్రత్తగా ఉండండి. నేను చేస్తున్నది ఇదే. మరి మీరు ఏమి చేస్తున్నారు?" అంటూ తన పోస్టును ముగించారు.HOW MUCH DEBT?FYI: In 2008, just before the GFC: (Great Financial Crisis) the US debt was approximately $9.5 trillion.Today, just as US Bonds are crashing, US Debt is approaching $39 trillion.Q: If you spent $1 a minute how long would it take you to spend $1 trillion?…— Robert Kiyosaki (@theRealKiyosaki) July 25, 2026 -
ఇక అన్ని ఆర్థిక సేవలకూ ఒకే ఐడీ.. కేవైసీ కొత్త రూల్స్
బ్యాంకు ఖాతా తెరవాలన్నా, కొత్తగా జీవిత బీమా పాలసీ తీసుకోవాలన్నా, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టాలన్నా వినియోగదారులు ప్రతిసారీ ఆధార్, పాన్, చిరునామా ధ్రువీకరణ పత్రాలను సమర్పించే రోజులకు కాలం చెల్లనుంది. దేశవ్యాప్తంగా అన్ని ఆర్థిక సేవలకు ఒకే ఒక్క కామన్ కస్టమర్ ఐడీ అందించే సెంట్రల్ నో–యువర్–కస్టమర్ 2.0 (సీకేవైసీ 2.0) వ్యవస్థ వచ్చే నెల నుంచి అమల్లోకి రానుంది. భారతీయ రిజర్వ్ బ్యాంక్, సెబీ, బీమా నియంత్రణ మండలి సంయుక్తంగా ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెస్తున్నాయి.ప్రస్తుత వ్యవస్థలో లోపాల సవరణకే.. ప్రస్తుత విధానంలో దేశవ్యాప్తంగా సుమారు 120 కోట్ల కస్టమర్ రికార్డులతో కూడిన ఒక కేవైసీ రిజిస్ట్రీ ఉన్నప్పటికీ అందులో డూప్లికేట్ డేటా, అసంపూర్ణ వివరాలు, పాత సమాచారం ఉండటంతో బ్యాంకులు దాన్ని విస్తృతంగా ఉపయోగించలేకపోతున్నాయి. దీంతో వినియోగదారులు ప్రతి కొత్త ఖాతా తెరిచేటప్పుడు దరఖాస్తులతోపాటు కేవైసీ ధ్రువీకరణ పత్రాలు సమర్పించాల్సి వస్తోంది. కొత్తగా వస్తున్న సీకేవైసీ 2.0 వ్యవస్థ ఈ లోపాలను పూర్తిగా సవరిస్తుంది. ఇకపై ఒక వినియోగదారుడు ఒక ఆర్థిక సంస్థలో తన కేవైసీ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేస్తే ఆ వివరాలు డిజిటల్ రూపంలో కేంద్ర రిజిస్ట్రీలో భద్రంగా ఉంటాయి. భవిష్యత్తులో వేరే బ్యాంకులో ఖాతా తెరిచేటప్పుడు, కొత్త బీమా పాలసీ తీసుకునేటప్పుడు మళ్లీ కాగితాలు సమరి్పంచాల్సిన అవసరం ఉండదు.ఒక్క ఓటీపీతో సురక్షితంగా.. వినియోగదారుల వ్యక్తిగత సమాచార భద్రత, గోప్యతకు ఈ వ్యవస్థలో అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఒక ఆర్థిక సంస్థ కస్టమర్ కేవైసీ వివరాలను కేంద్ర రిజిస్ట్రీ నుంచి పొందాలనుకుంటే.. ఆ కస్టమర్ అనుమతి తప్పనిసరి. ఇందుకోసం వినియోగదారుడి మొబైల్ నంబరుకు వన్‌టైమ్ పాస్వర్డ్ (ఓటీపీ) పంపిస్తారు. కస్టమర్ ఆ ఓటీపీని నమోదు చేసి సమ్మతి తెలిపాకే బ్యాంకులు, బీమా కంపెనీలు కేంద్ర డేటాబేస్ నుంచి ఆ వివరాలను సేకరిస్తాయి.రెండు దశల్లో అమలు.. తొలి దశ: వచ్చే నెల ప్రారంభం నుంచి దేశంలోని అన్ని బ్యాంకులు, బీమా కంపెనీలలో ఈ సీకేవైసీ 2.0 సేవలు అందుబాటులోకి వస్తాయి. కొత్త ఖాతాల ఓపెనింగ్, అడ్రస్ అప్డేషన్లు దీని ద్వారా వేగంగా ముగుస్తాయి. రెండో దశ: మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ బ్రోకింగ్ సంస్థలు, ఇతర క్యాపిటల్ మార్కెట్ భాగస్వాములకు సంబంధించిన రంగాలు ఈ ఏడాది ఆఖరుకల్లా దీని పరిధిలోకి రానున్నాయి. నమ్మకాన్ని పెంచే కాన్ఫిడెన్స్ స్కోర్.. ఈ సరికొత్త వ్యవస్థలో అత్యంత కీలకమైన మార్పు కాన్ఫిడెన్స్ స్కోర్‌ను పరిచయం చేయడం. ఈ విధానం ప్రకారం ప్రతి కస్టమర్ రికార్డుకూ ఒక నిర్దిష్ట స్కోర్ కేటాయిస్తారు. ఈ స్కోర్ ఆధారంగా కస్టమర్ సమాచారం ఎంతవరకు కచ్చితమైనదో, గతంలో ఏ ఆర్థిక సంస్థ దానిని ధ్రువీకరించిందో కొత్తగా చేర్చుకొనే బ్యాంకులకు సులభంగా అర్థమవుతుంది. సమాచార భద్రతకు సంబంధించి ఈ విధానం అత్యంత సురక్షితమైనది. ఎందుకంటే కేంద్ర రిజిస్ట్రీలో భద్రపరిచే డేటా అధునాతన ఎన్క్రిప్షన్ సాంకేతికతతో రక్షిస్తారు. దీనివల్ల థర్డ్ పార్టీ యాప్‌లు, సైబర్ నేరగాళ్లు కస్టమర్ల ఆర్థిక సమాచారాన్ని దొంగిలించడం సాధ్యం కాదు. ఈ డేటాబేస్ పర్యవేక్షణ నిరంతరం సాగడం వల్ల ఆర్థిక మోసాల నియంత్రణకు, భద్రతను పటిష్టం చేయడానికి దోహదపడుతుంది.సీకేవైసీ నంబర్ ఇలా తెలుసుకోండి.. గతంలో ఏదైనా బ్యాంకులో, మ్యూచువల్ ఫండ్‌లో కేవైసీ పూర్తి చేసినప్పుడు కేంద్ర రిజిస్ట్రీ 14 అంకెల ప్రత్యేక సీకేవైసీ ఐడెంటిఫికేషన్ నంబర్ కేటాయించి ఉంటుంది. దీన్ని తెలుసుకోవాలంటే ప్రభుత్వ అధీకృత డిజిటల్ కేవైసీ వెబ్సైట్లు, ఆర్థిక సేవల యాప్‌లలోకి వెళ్లి నో యువర్ సీకేవైసీ అనే లింక్‌పై క్లిక్ చేయాలి. అక్కడ పాన్ నంబర్, పుట్టిన తేదీ, క్యాప్చా కోడ్‌ను నమోదు చేయాలి. ఆ వెంటనే రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేయగానే 14 అంకెల ప్రత్యేక నంబర్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. ఈ నంబర్ ద్వారానే సీకేవైసీ 2.0 పరిధిలోకి కస్టమర్ వివరాలు నేరుగా బదిలీ అవుతాయి. -
ఈపీఎఫ్ వడ్డీ డబ్బులు వచ్చేశాయ్.. చెక్ చేసుకోండి
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) 2025–26 ఆర్థిక సంవత్సరానికి ప్రకటించిన 8.25 శాతం వడ్డీని సభ్యుల ఖాతాల్లో జమ చేసే ప్రక్రియను ప్రారంభించింది. జూలై 15 నుంచి దేశవ్యాప్తంగా పలువురు సభ్యుల పాస్‌బుక్‌లలో వడ్డీ ఎంట్రీలు కనిపిస్తున్నాయి. ఈసారి కొత్త కేంద్రీకృత ఐటీ వ్యవస్థ (CITES) అమల్లోకి రావడంతో గత సంవత్సరాలతో పోలిస్తే వడ్డీ జమ ప్రక్రియ వేగంగా పూర్తవుతోంది.కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా తెలిపిన వివరాల ప్రకారం, సుమారు 34 కోట్ల ఈపీఎఫ్ ఖాతాల్లో రూ.1.44 లక్షల కోట్లకు పైగా వడ్డీ జమ అవుతోంది. ప్రభుత్వం 8.25 శాతం వడ్డీ రేటును అధికారికంగా నోటిఫై చేసిన అనంతరం ఈ ప్రక్రియను ఆటోమేటిక్‌గా ప్రారంభించినట్లు ఆయన వెల్లడించారు. ఈసారి డిజిటల్ అప్‌గ్రేడ్ కారణంగా సభ్యులు సాధారణంగా సెప్టెంబర్–అక్టోబర్ వరకు ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా జూలైలోనే వడ్డీ జమ కావడం విశేషం.EPFO వడ్డీ పడిందో లేదో.. ఎలా చెక్ చేయాలి?EPFO పోర్టల్ ద్వారా..సభ్యులు EPFO పాస్‌బుక్ పోర్టల్‌లో తమ UAN, పాస్‌వర్డ్‌తో లాగిన్ అయి సంబంధిత మెంబర్ ఐడీని ఎంచుకుంటే తాజా వడ్డీ ఎంట్రీని చూడొచ్చు. పాస్‌బుక్‌లో ఉద్యోగి వాటా, యజమాని వాటా, జమ అయిన వడ్డీ వివరాలు కనిపిస్తాయి. ఇందుకోసం UAN యాక్టివ్‌గా ఉండటంతో పాటు మొబైల్ నంబర్‌కు లింక్ అయి ఉండాలి.UMANG యాప్ ద్వారా..పాస్‌బుక్ పోర్టల్‌తో పాటు సభ్యులు UMANG యాప్ ద్వారా కూడా వడ్డీ వివరాలు తెలుసుకోవచ్చు. ముందుగా మీ మొబైల్లో ఉమాంగ్ యాప్ లేకపోతే ప్లేస్టోర్‌లోకి వెళ్లి డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత యాప్ ఓపెన్ చేసి EPFO serviceను ఎంచుకోండి. ఇక్కడ View Passbook ఆప్షన్‌ను సెలెక్ట్ చేయండి. ఇప్పుడు మీ UAN ఎంటర్ చేసి ఓటీపీతో లాగిన్ అవ్వండి. అనంతరం మీ ఈపీఎఫ్ బ్యాలెన్స్ ఇక్కడ కనిపిస్తుంది.మిస్డ్ కాల్, SMS ద్వారా PF బ్యాలెన్స్మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 7738299899కు EPFOHO UAN (మీ UAN నంబర్) SMS పంపినా, లేదా 9966044425కు మిస్డ్ కాల్ ఇచ్చినా ఖాతా వివరాలు SMS రూపంలో అందుతాయి. అయితే ఈ సేవలు ఉపయోగించాలంటే UAN ఆధార్, బ్యాంక్ లేదా పాన్‌తో అనుసంధానమై ఉండాలి.EPFO వడ్డీ కనిపించకపోతే ఆందోళన వద్దు..EPFO అన్ని ఖాతాల్లో ఒకేసారి వడ్డీ జమ చేయదు. దశలవారీగా ఎంట్రీలు అప్డేట్ అవుతాయి. కాబట్టి కొంతమంది సభ్యుల పాస్‌బుక్‌లలో వడ్డీ ఆలస్యంగా కనిపించే అవకాశం ఉంది. వడ్డీ కనిపించకపోయినా సభ్యులకు నష్టం ఉండదు. అర్హత ఉన్న మొత్తానికి వడ్డీ పూర్తిగా జమ అవుతుంది. కొన్ని రోజుల తర్వాత కూడా అప్డేట్ కాకపోతే EPFiGMS పోర్టల్‌లో ఫిర్యాదు చేయవచ్చు లేదా సమీప EPFO కార్యాలయాన్ని సంప్రదించవచ్చు. -
మీ నామినీ మీకంటే ముందే మరణిస్తే..
ఆర్థిక ప్రణాళికలో నామినేషన్ ప్రక్రియ అత్యంత కీలకమైనది. బ్యాంక్ డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్స్, డిమాట్ ఖాతాలు, ఇన్సూరెన్స్ వంటి పెట్టుబడుల్లో మన తర్వాత ఆ నిధులను స్వీకరించడానికి నామినీని నియమిస్తుంటాం. అయితే, పెట్టుబడిదారుడి కంటే ముందే సదరు నామినీ మరణిస్తే ఆ పెట్టుబడుల పరిస్థితి ఏమిటి? ఆర్బీఐ, సెబీ నిబంధనలు ఏం చెబుతున్నాయి? ఈ అంశంపై ప్రతి పెట్టుబడిదారుడికి అవగాహన ఉండటం అవసరం.నామినీ అంటే యజమాని కాదు..చాలామంది భావిస్తున్నట్లు నామినీ అంటే ఆస్తికి పూర్తి చట్టబద్ధ యజమాని కాదు. నామినీ కేవలం ఒక ‘ట్రస్టీ’ (కస్టోడియన్) మాత్రమే. పెట్టుబడిదారుడి మరణానంతరం ఆర్థిక సంస్థల నుంచి నిధులను స్వీకరించి, విల్లు లేదా వ్యక్తిగత వారసత్వ చట్టాల ప్రకారం అసలైన చట్టబద్ధమైన వారసులకు అందించడమే నామినీ ప్రధాన బాధ్యత.నామినీ ముందే మరణిస్తే ఏమవుతుంది?పెట్టుబడిదారుడు జీవించి ఉండగానే నామినీ మరణిస్తే ఆ నామినేషన్ హక్కు స్వయంచాలకంగా చెల్లకుండా పోతుంది. మరణించిన నామినీ చట్టబద్ధ వారసులకు ఈ పెట్టుబడిపై ఎలాంటి హక్కులు దక్కవు. ఒకవేళ పెట్టుబడిదారుడు ఈ విషయాన్ని గమనించక కొత్త నామినీని చేర్చకుండానే మరణిస్తే.. ఆ పెట్టుబడి ఖాతా నామినీ లేని ఖాతా (Account without Nomination)గా మారుతుంది.నామినీ లేకపోతే ఎదురయ్యే క్లెయిమ్ చిక్కులుఖాతాకు నామినీ లేనప్పుడు పెట్టుబడిదారుడి మరణానంతరం ఆయన చట్టబద్ధ వారసులు ఆ డబ్బును పొందడం సంక్లిష్టంగా మారుతుంది. దీనికోసం బ్యాంకులు, మ్యూచువల్ ఫండ్ సంస్థలు తీవ్రమైన కాగితాల ప్రక్రియను కోరతాయి.1. కోర్టు ద్వారా సక్సెషన్ సర్టిఫికేట్ లేదా ప్రొబేట్ చేసిన విల్లు.2. లీగల్ హెయిర్ సర్టిఫికేట్.3. ఇతర వారసుల నుంచి ఎన్ఓసీ.4. ఇండెమ్నిటీ బాండ్(నష్టపరిహార హామీ పత్రం), అఫిడవిట్లు.ఈ ప్రక్రియ పూర్తవ్వడానికి నెలలు, సంవత్సరాల సమయం పట్టడంతోపాటు కోర్టు చుట్టూ తిరగాల్సి రావొచ్చు. దీని వల్ల కుటుంబసభ్యులకు తీవ్ర మానసిక, ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి.పెట్టుబడిదారులు వెంటనే చేయాల్సింది..నామినీ మరణించిన విషయం తెలిసిన వెంటనే సంబంధిత బ్యాంక్ లేదా ఫండ్ హౌస్‌ను సంప్రదించి కొత్త నామినీ పేరును నమోదు చేయాలి.సెబీ, ఆర్బీఐ నిబంధనల ప్రకారం ఒకరి కంటే ఎక్కువ మందిని (ఉదాహరణకు భార్య, పిల్లలు) నామినీలుగా చేర్చి, వారికి నిధుల్లో కేటాయించాల్సిన వాటాల శాతాన్ని ముందుగానే నిర్ణయించవచ్చు.నామినేషన్‌తో పాటు ఒక స్పష్టమైన విల్లు తయారుచేసి రిజిస్టర్ చేసుకోవడం ద్వారా భవిష్యత్తులో వారసుల మధ్య వచ్చే చట్టపరమైన వివాదాలకు శాశ్వతంగా చెక్ పెట్టవచ్చు.ఏటా ఒకసారి లేదా కుటుంబంలో వివాహం, జననం, మరణం వంటి ముఖ్యమైన సంఘటనలు జరిగినప్పుడు మీ పెట్టుబడుల్లోని నామినేషన్ వివరాలను సమీక్షించుకోవడం శ్రేయస్కరం.ఇదీ చదవండి: ఒక్క బ్యాంకూ లోన్ ఇవ్వకపోయినా ‘డీటీడీసీ’ ఎలా సాధ్యమైందంటే.. -
కొత్తగా పెళ్లయ్యిందా? తొలి ఏడాదిలో చేయాల్సింది ఇదే..
నూతనంగా వివాహ బంధంలోకి అడుగుపెట్టిన జంటలకు తొలి ఏడాది ఎంతో మనోహరంగా, అదే సమయంలో బాధ్యతాయుతంగా సాగుతుంది. కొత్త జీవితాన్ని పంచుకుంటున్నప్పుడు భావోద్వేగ అనుబంధంతో పాటు ఆర్థిక సమీకరణాలను చక్కదిద్దుకోవడం చాలా ముఖ్యం. భార్యాభర్తల మధ్య ఆర్థిక పారదర్శకత లోపిస్తే భవిష్యత్తులో అనవసర మనస్పర్ధలు తలెత్తే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. తొలి ఏడాదిలోనే తీసుకునే ఐదు కీలక ఆర్థిక నిర్ణయాలు దంపతుల జీవితానికి బలమైన, సురక్షితమైన పునాది వేస్తాయని చెబుతున్నారు.పారదర్శక సంభాషణ.. ఉమ్మడి బడ్జెట్ముందుగా ఇద్దరి ఆదాయాలు, ఉన్న రుణాలు, వ్యక్తిగత ఆర్థిక లక్ష్యాలపై ఒకరికొకరు స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలి. నెలవారీ నిత్యావసర ఖర్చులు, పొదుపు కోసం స్పష్టమైన బడ్జెట్‌ను తయారు చేసుకోవాలి. ఉమ్మడి గృహ ఖర్చుల కోసం ఒక జాయింట్ బ్యాంక్ అకౌంట్, వ్యక్తిగత స్వేచ్ఛాయుత ఖర్చుల కోసం ప్రత్యేక ఖాతాలను నిర్వహించడం ఉత్తమం.అత్యవసర నిధి ఏర్పాటుజీవితంలో ఎదురయ్యే ఊహించని సవాళ్లను ఎదుర్కొనేందుకు కనీసం 3-6 నెలల కుటుంబ ఖర్చులకు సరిపడా మొత్తాన్ని ద్రవ్యరూపంలో (లిక్విడ్ ఫండ్స్ లేదా ఫిక్స్డ్ డిపాజిట్) ఎమర్జెన్సీ ఫండ్‌గా పక్కన పెట్టాలి. ఇది ఉద్యోగ మార్పులు లేదా ఆకస్మిక వైద్య అత్యవసర సమయాల్లో ఆర్థిక రక్షణగా నిలుస్తుంది.ఇన్సూరెన్స్ కవరేజ్వివాహానంతరం హెల్త్ ఇన్సూరెన్స్ విధానాన్ని అప్డేట్ చేసుకోవాలి. వేర్వేరు పాలసీల కంటే ఇద్దరినీ కవర్ చేసే ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్‌ను ఎంచుకోవడం లేదా కంపెనీ అందించే గ్రూప్ ఇన్సూరెన్స్‌లో జీవిత భాగస్వామి పేరును చేర్చడం ప్రయోజనకరం. అలాగే, టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్, బ్యాంక్ అకౌంట్లలో భాగస్వామిని ప్రాథమిక నామినీగా మార్చడం మరచిపోకూడదు.అప్పుల నిర్వహణవివాహానికి ముందు ఉన్న వ్యక్తిగత రుణాలు, విద్యా రుణాలు లేదా క్రెడిట్ కార్డ్ బకాయిలను వీలైనంత త్వరగా తగ్గించుకునే ప్రణాళిక రూపొందించుకోవాలి. సకాలంలో ఈఎంఐలు చెల్లిస్తూ ఇద్దరి సిబిల్ స్కోర్లను మెరుగుపరచుకోవడం భవిష్యత్తులో హోమ్ లోన్ వంటి పెద్ద రుణాలకు మార్గం సుగమం చేస్తుంది.దీర్ఘకాలిక లక్ష్యాలుసొంత ఇల్లు, విదేశీ పర్యటనలు, పిల్లల భవిష్యత్తు, రిటైర్మెంట్ వంటి దీర్ఘకాలిక లక్ష్యాల కోసం మొదటి ఏడాది నుంచే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ (సిప్), పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) లేదా నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్) వంటి సాధనాల్లో పెట్టుబడులు ప్రారంభించాలి.ఆర్థిక క్రమశిక్షణ అనేది ఒక రోజులో వచ్చేది కాదు. దంపతులిద్దరూ క్రమం తప్పకుండా ప్రతి నెలా తమ ఆర్థిక స్థితిగతులను సమీక్షించుకోవాలి. పరస్పర సహకారంతో అడుగులు వేస్తే మొదటి ఏడాదే కాదు, రాబోయే సమస్త జీవితం సమృద్ధిగా, సుఖమయంగా మారుతుంది.ఇదీ చదవండి: ఒక్క బ్యాంకూ లోన్ ఇవ్వకపోయినా ‘డీటీడీసీ’ ఎలా సాధ్యమైందంటే.. -
కొత్త ఇల్లు.. కొత్త లోన్.. ఈ తప్పులు చేయొద్దు
ఇల్లు కొనుక్కోవడం చాలా మందికి జీవితకాల కల. అయితే గృహ రుణం (హోమ్ లోన్) తీసుకునే సమయంలో చేసే చిన్న పొరపాట్లు భవిష్యత్తులో లక్షల రూపాయల అదనపు ఆర్థిక భారంగా మారే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మొదటిసారి ఇల్లు కొనేవారు తక్కువ ఈఎంఐ (EMI) లేదా గరిష్ట రుణం పొందడంపైనే దృష్టి పెట్టడం వల్ల దీర్ఘకాలంలో భారీ వడ్డీ భారం మోయాల్సి వస్తుందని చెబుతున్నారు.బేసిక్ హోమ్ లోన్ సంస్థ సీఈవో, సహ వ్యవస్థాపకుడు అతుల్ మోంగా ప్రకారం.. గృహ రుణం ఎంపికలో నెలవారీ ఈఎంఐ మాత్రమే కాకుండా మొత్తం రుణ వ్యయం, వడ్డీ, డౌన్ పేమెంట్, అదనపు ఖర్చులు, భవిష్యత్ ఆర్థిక పరిస్థితులను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. తక్కువ ఈఎంఐ కనిపించడం ఆకర్షణీయంగా అనిపించినా, రుణ కాలపరిమితి ఎక్కువైతే మొత్తం చెల్లించాల్సిన వడ్డీ లక్షల్లో పెరిగే అవకాశం ఉంటుంది.హోమ్‌లోన్ తీసుకునేటప్పుడు చేసే ప్రధాన తప్పులుఅత్యధిక రుణ కాలపరిమితి ఎంచుకోవడం30 ఏళ్ల వంటి సుదీర్ఘ రుణ కాలపరిమితి వల్ల నెలవారీ ఈఎంఐ తగ్గినా, మొత్తం రుణ కాలంలో చెల్లించే వడ్డీ భారీగా పెరుగుతుంది. కాబట్టి ఈఎంఐని భరించగలిగే స్థాయిలో ఉంచుతూ, సాధ్యమైనంత తక్కువ కాలపరిమితిని ఎంచుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.చాలా తక్కువ డౌన్ పేమెంట్ చేయడండౌన్ పేమెంట్ మరీ తక్కువగా ఉంటే రుణ మొత్తం పెరుగుతుంది. దీంతో వడ్డీ కూడా ఎక్కువగా చెల్లించాల్సి వస్తుంది. సాధ్యమైనంత ఎక్కువ డౌన్ పేమెంట్ చేస్తే రుణభారం తగ్గి, నెలవారీ ఈఎంఐ కూడా తగ్గే అవకాశం ఉంటుంది.హిడెన్ కాస్ట్లను లెక్కలోకి తీసుకోకపోవడంఇంటి ధరతో పాటు స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలు, ప్రాసెసింగ్ ఫీజులు, బీమా, జీఎస్టీ (వర్తించే చోట), ఇంటీరియర్ ఖర్చులు, మెయింటెనెన్స్ డిపాజిట్ వంటి వ్యయాలు కూడా ఉంటాయి. వీటిని ముందుగానే అంచనా వేయకపోతే బడ్జెట్ దెబ్బతినే అవకాశం ఉంది.క్రెడిట్ స్కోర్‌ను నిర్లక్ష్యం చేయడంమెరుగైన క్రెడిట్ స్కోర్ ఉంటే బ్యాంకులు తక్కువ వడ్డీ రేటుతో రుణం ఇచ్చే అవకాశం ఉంటుంది. సాధారణంగా 750 లేదా అంతకంటే ఎక్కువ CIBIL స్కోర్ ఉన్న వారికి మెరుగైన షరతులతో రుణం లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని బ్యాంకింగ్ రంగ నిపుణులు చెబుతున్నారు.అర్హత ఉన్నంత మొత్తాన్ని పూర్తిగా రుణంగా తీసుకోవడంబ్యాంకు ఎంత రుణం ఇవ్వడానికి సిద్ధంగా ఉందన్నది ఒక అంశం మాత్రమే. కానీ కుటుంబ ఆదాయం, ఇతర ఈఎంఐలు, పిల్లల చదువు, వైద్య అవసరాలు, అత్యవసర నిధి వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. భవిష్యత్తులో వడ్డీ రేట్లు పెరిగినా ఈఎంఐ చెల్లించగలిగే స్థాయిలోనే రుణాన్ని పరిమితం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.స్మార్ట్ ప్లానింగ్‌తో లక్షలు ఆదా చేయొచ్చుఉదాహరణకు రూ.60 లక్షల గృహ రుణాన్ని 20 ఏళ్లకు బదులుగా 30 ఏళ్లకు తీసుకుంటే నెలవారీ ఈఎంఐ తగ్గవచ్చు. కానీ మొత్తం రుణ కాలంలో చెల్లించాల్సిన వడ్డీ అనేక లక్షల రూపాయలు అదనంగా పెరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల ఈఎంఐ ఎంత అనే అంశంతో పాటు మొత్తం రుణ వ్యయం ఎంత అవుతుందో కూడా ముందుగానే లెక్కించుకోవడం అవసరం.రుణం తీసుకునే ముందు గుర్తుంచుకోవాల్సిన విషయాలు» మొత్తం ఇంటి కొనుగోలు వ్యయాన్ని ముందుగానే అంచనా వేయాలి.» కనీసం 20–30 శాతం వరకు డౌన్ పేమెంట్ చేయగలిగితే రుణభారం తగ్గుతుంది.» అత్యవసర ఖర్చుల కోసం ప్రత్యేక నిధిని ఉంచుకోవాలి.» మంచి క్రెడిట్ స్కోర్‌ను కొనసాగించడం ద్వారా తక్కువ వడ్డీ రేటు పొందే అవకాశాలు పెరుగుతాయి.» ఆదాయంలో అధిక భాగం ఈఎంఐలకే వెళ్లకుండా ఆర్థిక సమతుల్యతను కాపాడుకోవాలి.ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం, మంచి గృహ రుణం అంటే కేవలం తక్కువ ఈఎంఐ లేదా పెద్ద మొత్తం రుణం కాదు. కుటుంబ ఆర్థిక స్థిరత్వాన్ని దెబ్బతీయకుండా, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని తీసుకునే నిర్ణయమే నిజమైన స్మార్ట్ హోమ్ లోన్ ఎంపిక. మొదటిసారి ఇల్లు కొనేవారు ఈ అంశాలను జాగ్రత్తగా పరిశీలిస్తే భవిష్యత్తులో లక్షల రూపాయల అదనపు భారం నుంచి తప్పించుకోవచ్చు. -
నెలకు రూ.4 లక్షలు సంపాదిస్తున్నా నచ్చడం లేదట!
నెలకు దాదాపు రూ.4 లక్షల ఆదాయం, ఖర్చులు తక్కువ, మంచి పొదుపు.. అయినప్పటికీ భారత్‌లో భవిష్యత్తు కనిపించడం లేదని, విదేశాలకు వెళ్లి స్థిరపడాలని కోరుకుంటున్న 26 ఏళ్ల రిమోట్ ఉద్యోగి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ఈ అంశం వ్యక్తిగత ఆర్థిక ప్రణాళికతో పాటు యువతలో పెరుగుతున్న వలస ధోరణిపై మరోసారి చర్చకు దారితీసింది.'ఫిక్స్ యువర్ ఫైనాన్స్' అనే పోడ్కాస్ట్లో పర్సనల్ ఫైనాన్స్ కోచ్ అన్షుమన్ శర్మతో మాట్లాడిన డేనియల్ (మార్చిన పేరు కావచ్చని భావిస్తున్నారు) ప్రస్తుతం యూరప్‌కు చెందిన ఒక సంస్థలో రిమోట్‌గా పనిచేస్తున్నట్లు తెలిపాడు. తనకు నెలకు సుమారు 3,700 యూరోలు జీతంగా వస్తోందని, భారత కరెన్సీలో అది సుమారు రూ.4 లక్షలు ఉంటుందని వివరించాడు. తన నెలవారీ ఖర్చులు కేవలం రూ.1.20 లక్షల వరకు మాత్రమే ఉండటంతో మిగిలిన మొత్తాన్ని పొదుపు చేస్తున్నానని చెప్పాడు.ఆస్ట్రేలియాకు వెళ్తాడట..ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియా పర్మినెంట్ రెసిడెన్సీ (PR) కోసం దరఖాస్తు చేసుకోవాలని భావిస్తున్నట్లు డేనియల్ వెల్లడించాడు. దీనిపై స్పందించిన అన్షుమన్ శర్మ, ప్రతి నెలా రూ.1.5 లక్షలను రికరింగ్ డిపాజిట్ (RD)లో పెట్టుబడి పెడితే, కొన్ని నెలల్లోనే పీఆర్ ప్రక్రియకు అవసరమైన నిధులు సిద్ధమవుతాయని సూచించారు."డబ్బు కాదు.. జీవన నాణ్యత ముఖ్యం"ఇంత మంచి ఆదాయం ఉన్నప్పటికీ ఎందుకు విదేశాలకు వెళ్లాలని అనుకుంటున్నావని అడగగా, డేనియల్ ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. తన నిర్ణయం పూర్తిగా జీవన నాణ్యత (Quality of Life), పాలన, పిల్లల భవిష్యత్తు వంటి అంశాలపై ఆధారపడి ఉందని చెప్పాడు. భారత్‌లో దీర్ఘకాలికంగా తన కుటుంబానికి ఆశించిన స్థాయి అవకాశాలు కనిపించడం లేదని అభిప్రాయపడ్డాడు.అన్షుమన్ శర్మ కూడా యువతలో పెరుగుతున్న వలస ఆలోచనలపై మాట్లాడుతూ, అధిక పన్నులు, కాలుష్యం, విద్యా వ్యవస్థలోని సమస్యలు, ఉద్యోగాలపై అనిశ్చితి వంటి కారణాలు చాలా మందిని విదేశాల వైపు ఆకర్షిస్తున్నాయని వ్యాఖ్యానించారు.సోషల్ మీడియాలో భిన్న స్పందనలుఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు మిశ్రమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. "ఆస్ట్రేలియాలో కూడా ఆదాయపు పన్ను చాలా ఎక్కువే" అని కొందరు గుర్తుచేశారు. మరికొందరు "అక్కడ జీవన వ్యయం కూడా భారీగా ఉంటుంది. నెలకు 3,700 యూరోలు లేదా దానికి సమానమైన ఆదాయంతో ఆస్ట్రేలియాలో పెద్దగా పొదుపు చేయడం కష్టమే" అని వ్యాఖ్యానించారు.ఇంకొందరు విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు మాత్రం, "విదేశాల్లో అవకాశాలు ఉన్నప్పటికీ భారత్‌లో కుటుంబ బంధాలు, తక్కువ జీవన వ్యయం వంటి ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ప్రతి ఒక్కరి పరిస్థితి వేరు" అని అభిప్రాయపడ్డారు.వాస్తవ పరిస్థితి ఏమిటి?ఇటీవలి సంవత్సరాల్లో ఆస్ట్రేలియా, కెనడా వంటి దేశాలు నైపుణ్యం కలిగిన వలసదారులపై ఇమ్మిగ్రేషన్ నిబంధనలను మరింత కఠినతరం చేస్తున్నాయి. అలాగే అక్కడ ఇంటి అద్దెలు, ఆరోగ్య సేవలు, జీవన వ్యయం గణనీయంగా పెరిగాయి. అందువల్ల విదేశాలకు వెళ్లే ముందు ఉద్యోగ భద్రత, వీసా నిబంధనలు, పన్నులు, జీవన వ్యయం, కుటుంబ అవసరాలు వంటి అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. -
బంగారం కొనేవాళ్లకు అలర్ట్.. ఆ మార్క్, కోడ్ ఉన్నాయా?
బంగారం కొనుగోలు అనేది ప్రతి కుటుంబానికి ఒక ముఖ్యమైన పెట్టుబడి. అయితే బంగారం కొనే సమయంలో నాణ్యతను నిర్ధారించుకోవడం అత్యంత కీలకం. అందుకే భారత ప్రభుత్వం బంగారు ఆభరణాలపై హాల్‌మార్కింగ్‌ను తప్పనిసరి చేసింది. అయినప్పటికీ కొంతమంది వ్యాపారులు ఇప్పటికీ నిబంధనలు ఉల్లంఘిస్తూ హాల్‌మార్క్ లేని నగలను విక్రయిస్తున్నట్లు భారతీయ ప్రమాణాల బ్యూరో (BIS) ఇటీవల నిర్వహించిన తనిఖీల్లో బయటపడింది.తెలంగాణలోని 13 జిల్లాల్లో జరిగిన సోదాల్లో భారీ మొత్తంలో హాల్‌మార్క్ లేని బంగారు నగలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఒక్క వరంగల్‌లోనే దాదాపు రూ.10 కోట్ల విలువైన బంగారం సీజ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో హాల్‌మార్క్ అంటే ఏమిటి? హెచ్‌యూఐడీ (HUID) అంటే ఏమిటి? బంగారం కొనేటప్పుడు వినియోగదారులు ఏ విషయాలు తప్పనిసరిగా పరిశీలించాలి? తెలుసుకుందాం..హాల్‌మార్క్ అంటే ఏమిటి?హాల్‌మార్క్ అనేది బంగారు ఆభరణం స్వచ్ఛతకు ప్రభుత్వం ఇచ్చే నాణ్యత ధ్రువీకరణ. భారతీయ ప్రమాణాల బ్యూరో (BIS) నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా బంగారం స్వచ్ఛతను పరీక్షించిన తర్వాత మాత్రమే ఈ గుర్తును ఇస్తారు. దీంతో వినియోగదారు కొనుగోలు చేస్తున్న బంగారం పేర్కొన్న క్యారెట్ నాణ్యత కలిగి ఉందనే నమ్మకం ఉంటుంది.హెచ్‌యూఐడీ అంటే ఏమిటి?హెచ్‌యూఐడీ (HUID - Hallmark Unique Identification Number) అనేది ప్రతి హాల్‌మార్క్ చేసిన బంగారు ఆభరణానికి ప్రత్యేకంగా కేటాయించే ఆరు అంకెల ఆల్ఫా-న్యూమరిక్ కోడ్. ప్రతి నగకు ఒక ప్రత్యేక HUID ఉంటుంది. ఈ కోడ్ ద్వారా ఆ నగను ఏ అస్సేయింగ్ సెంటర్లో పరీక్షించారు, ఎప్పుడు హాల్‌మార్క్ చేశారు వంటి వివరాలను బీఐఎస్ రికార్డుల్లో గుర్తించవచ్చు.హాల్‌మార్క్ నగపై ఏమేమి ఉంటాయి?హాల్‌మార్క్ చేసిన బంగారు నగపై సాధారణంగా ఈ వివరాలు ఉంటాయి.🔹 BIS లోగో🔹 బంగారం స్వచ్ఛత (22K916, 18K750, 14K585 వంటివి)🔹 HUID కోడ్HUIDను ఎలా చెక్ చేయాలి?వినియోగదారులు BIS Care మొబైల్ యాప్ ద్వారా లేదా BIS వెబ్సైట్లో HUID నంబర్‌ను నమోదు చేసి ఆ నగకు సంబంధించిన వివరాలను ధ్రవీకరించవచ్చు. HUID సరిపోలకపోతే లేదా వివరాలు కనిపించకపోతే వెంటనే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు.హాల్‌మార్క్ ఎందుకంత ముఖ్యమంటే..కొనుగోలు చేసిన బంగారం నిజమైన స్వచ్ఛత కలిగి ఉందని హామీ లభిస్తుంది. తక్కువ నాణ్యత గల బంగారాన్ని అధిక ధరకు విక్రయించే అవకాశాలు తగ్గుతాయి. భవిష్యత్తులో అమ్మేటప్పుడు లేదా తాకట్టు పెట్టేటప్పుడు సరైన విలువ లభిస్తుంది.బంగారం కొనేటప్పుడు తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సినవి🔹 హాల్‌మార్క్ ఉందో లేదో పరిశీలించండి.🔹 HUID కోడ్‌ను తప్పనిసరిగా వెరిఫై చేయండి.🔹 BIS రిజిస్టర్డ్ జువెలర్ వద్ద నుంచే కొనుగోలు చేయండి.🔹 బిల్లు తప్పనిసరిగా తీసుకోండి.🔹 బిల్లులో బంగారం స్వచ్ఛత, బరువు, HUID వివరాలు ఉన్నాయో లేదో చూసుకోండి.నిబంధనలు ఉల్లంఘిస్తే ఏం జరుగుతుంది?హాల్‌మార్కింగ్ నిబంధనలు పాటించని జువెలర్లపై BIS చట్టపరమైన చర్యలు తీసుకుంటుంది. జరిమానాలతో పాటు, తీవ్రమైన ఉల్లంఘనలపై లైసెన్స్ రద్దు చేసే అధికారమూ BISకు ఉంది. ఇటీవల తెలంగాణలో జరిగిన తనిఖీలు నిబంధనలు ఉల్లంఘించే వ్యాపారులపై ప్రభుత్వం అవలంబిస్తున్న కఠిన వైఖరికి నిదర్శనం. -
విదేశీ పెట్టుబడుల నిబంధనలు సరళతరం
ముంబై: విదేశాల్లో భారతీయ కంపెనీల లిస్టింగ్‌తో పాటు విదేశీ పెట్టుబడుల నిబంధనలను మరింత సరళతరం చేసేలా రిజర్వ్ బ్యాంకు ముసాయిదాను రూపొందించింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విధానాలకు అనుగుణంగా రెగ్యులేటరీపరమైన సంక్లిష్టతను తగ్గించి, స్పష్టతనిచ్చేలా వివిధ ప్రొవిజన్లను క్రమబద్ధీకరించడం, వ్యాపారాల నిర్వహణను మరింత సులభతరం చేయడం, భవిష్యత్ పరిస్థితులకు తగ్గట్లుగా నియంత్రణ వ్యవస్థను తీర్చిదిద్దడం దీని లక్ష్యం.పీఎఫ్ఆర్డీఏ చట్ట నిబంధనలకు లోబడి ఎన్నారైలు కూడా నేషనల్ పెన్షన్ సిస్టమ్‌లో చేరవచ్చని పేర్కొంది. వీటిపై ఆగస్టు 31లోగా సంబంధిత వర్గాలు తమ అభిప్రాయాలను ఆర్బీఐకి సమర్పించాల్సి ఉంటుంది. విదేశీ మారక నిర్వహణ చట్ట నిబంధనలను సమీక్షిస్తామంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో ప్రకటించిన నేపథ్యంలో ఏర్పాటైన కమిటీ సిఫార్సుల మేరకు ఆర్బీఐ ఈ ముసాయిదా నిబంధనలను రూపొందించింది. -
స్కూల్లో నేర్పని డబ్బు పాఠాలు.. కియోసాకి చెప్పిన విషయాలు!
గోల్డ్, సిల్వర్, రియల్ ఎస్టేట్, బిట్‌కాయిన్ వంటివాటిలో పెట్టుబడుల గురించి చెప్పే రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత 'రాబర్ట్ కియోసాకి' ఇప్పుడు డబ్బు విషయంలో తీసుకోవాల్సిన ముఖ్యమైన నిర్ణయాల గురించి వివరించారు. దీనికి సంబంధించిన ఫేస్బుక్ వైరల్ అవుతోంది. మరిన్ని వివరాలు ఈ కథనంలో..మన జీవితంలో ప్రతి వయసుకు ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుంది. ముఖ్యంగా 20, 30, 40 సంవత్సరాల వయసు అనేది మన ఆర్థిక భవిష్యత్తును నిర్ణయించే కీలక దశలు. ఈ సమయంలో తీసుకునే నిర్ణయాలు మన జీవితాంతం ప్రభావం చూపిస్తాయి. కానీ దురదృష్టవశాత్తూ డబ్బు సంపాదించడం, పెట్టుబడులు పెట్టడం, ఆస్తులు సృష్టించడం వంటి విషయాలను మనకు ఎవరూ స్పష్టంగా నేర్పించరు.20 ఏళ్ల వయసులో.. డబ్బు కంటే నేర్చుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ సమయంలో ఎక్కువ జీతం వచ్చే ఉద్యోగం కంటే, మనకు ఎక్కువ అనుభవం, కొత్త నైపుణ్యాలు నేర్పించే అవకాశాలను ఎంచుకోవడం మంచిది. సేల్స్ ఎలా చేయాలి, డబ్బు ఎలా తిరుగుతుంది, వ్యాపారం ఎలా నడుస్తుంది, ఆర్థిక విషయాలను ఎలా అర్థం చేసుకోవాలి? వంటి అంశాలు నేర్చుకోవాలి. ఈ వయసులో సంపాదన కొంచెం తక్కువగా ఉన్నా పర్వాలేదు.. ఎందుకంటే మనం సంపాదించుకునే జ్ఞానం, నైపుణ్యాలు భవిష్యత్తులో ఎక్కువ అవకాశాలను తీసుకొస్తాయి.30 ఏళ్ల వయసు.. వచ్చేసరికి ఆస్తులు నిర్మించడం ప్రారంభించాలి. అంటే.. కేవలం జీతం మీద ఆధారపడకుండా, భవిష్యత్తులో ఆదాయం వచ్చే మార్గాలను ఏర్పాటు చేసుకోవాలి. చిన్న మొత్తంతో అయినా పెట్టుబడులు పెట్టడం అలవాటు చేసుకోవాలి. అది ఒక చిన్న వ్యాపారం కావచ్చు, రియల్ ఎస్టేట్ పెట్టుబడి కావచ్చు లేదా ప్రతి నెల ఆదాయం వచ్చే ఏదైనా మార్గం కావచ్చు. మొత్తం మీద ఈ వయసులో పెట్టుబడులు పెట్టడం గురించి తెలుసుకోవాలి, ఇన్వెస్ట్ చేయడం ముఖ్యం.ఇక 40 ఏళ్ల వయసులో.. కేవలం జీతం కోసం పనిచేసే పరిస్థితి నుంచి బయటపడేందుకు ప్రయత్నించాలి. ఈ దశలో మన ఆదాయాన్ని ఆస్తులుగా మార్చుకోవాలి. ఎందుకంటే ఒక ఉద్యోగంపై పూర్తిగా ఆధారపడటం ప్రమాదకరంగా మారవచ్చు. ఉద్యోగం కోల్పోవడం, ఆరోగ్య సమస్యలు లేదా ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు వచ్చినప్పుడు ఇబ్బందులు ఎదురవుతాయి. అందుకే మనం పని చేయకపోయినా ఆదాయం వచ్చే విధంగా పెట్టుబడులు, వ్యాపారాలు లేదా ఇతర ఆదాయ మార్గాలను పెంచుకోవాలి.నిజానికి డబ్బు గురించి చాలా ముఖ్యమైన విషయాలు మనకు పాఠశాలల్లో నేర్పించరు. మంచి ఉద్యోగం సంపాదించడం మాత్రమే కాదు.. సంపాదించిన డబ్బును ఎలా పెంచుకోవాలి, ఎలా కాపాడుకోవాలి అనేది కూడా తప్పకుండా తెలుసుకోవాలి. 20ల్లో నేర్చుకోవాలి.. 30ల్లో నిర్మించాలి.. 40ల్లో ఆర్థిక స్వేచ్ఛ వైపు అడుగులు వేయాలి. ఈ సూత్రాలను ముందుగానే అర్థం చేసుకుంటే, భవిష్యత్తులో డబ్బు కోసం మాత్రమే పనిచేయకుండా, డబ్బు మన కోసం పనిచేసే పరిస్థితిని సృష్టించుకోవచ్చు అని కియోసాకి చెబుతున్నారు.ఇదీ చదవండి: ధనవంతుడు vs సంపన్నుడు: కియోసాకి క్లారిటీ -
మీ నెలవారీ పెన్షన్ ఆగిపోయిందా?
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) నుంచి వచ్చే నెలవారీ పెన్షన్ హఠాత్తుగా ఆగిపోయిందా? దానికి ప్రధాన కారణం మీ డిజిటల్ జీవిత ప్రమాణ పత్రం (జీవన్ ప్రమాణ్) గడువు ముగిసిపోవడమే కావచ్చు. ఏటా పెన్షనర్లు తమ డిజిటల్ జీవిత ప్రమాణ పత్రాన్ని సమర్పించడం తప్పనిసరి. మీరు సమర్పించిన తేదీ నుంచి ఏడాది పాటు దీని చెల్లుబాటు ఉంటుంది. అయితే దీని కోసం ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా సులభంగా ఇంటి నుంచే దీన్ని సబ్మిట్ చేసుకునే వెసులుబాటును ఈపీఎఫ్ఓ అందుబాటులోకి తెచ్చింది.డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ సమర్పించడం ఎలా?మీ జీవన్ ప్రమాణ్ పత్రం ఇంకా అమలులో ఉందో లేదో తెలుసుకోవడానికి ఈపీఎఫ్ఓ అధికారిక వెబ్‌సైట్‌లోని ‘పెన్షనర్స్ పోర్టల్’ ద్వారా సులభంగా పరిశీలించుకోవచ్చు.జీవన్ ప్రమాణ్‌ను సమర్పించే దశలు..ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లో 'UMANG' యాప్‌తో పాటు Aadhaar Face RD యాప్‌ను డౌన్లోడ్ చేసుకోండి.ఉమంగ్ యాప్‌ను ఓపెన్ చేసి Jeevan Pramaan Certificate విభాగంలోకి వెళ్లి Generate Life Certificate ఆప్షన్ ఎంచుకోవాలి.తర్వాత Face Authentication క్లిక్ చేయాలి.మీ ఆధార్ సంఖ్య, మొబైల్ సంఖ్య నమోదు చేసి ఫోన్‌కు వచ్చే ఓటీపీ ద్వారా ధ్రువీకరించాలి.ఆ తర్వాత మీ పీపీఓ సంఖ్య, పెన్షన్ మంజూరు చేసిన అధికారి, బ్యాంక్ పేరు, ఖాతా సంఖ్య వివరాలను సమర్పించాలి.పునర్నియామకం (Re-employed), పునర్వివాహం (Remarried) ఆప్షన్లను సరిగ్గా ఎంచుకొని నిబంధనలను అంగీకరిస్తూ Aadhaar Face RD యాప్‌కు కెమెరా యాక్సెస్ అనుమతి ఇవ్వాలి.కెమెరా ద్వారా మీ ముఖాన్ని స్కాన్ (Face Scan) చేయడంతో డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ ప్రక్రియ విజయవంతంగా పూర్తవుతుంది.ఉచితంగా ఇంటివద్దే సేవలుసాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించలేని వృద్ధుల కోసం ఈపీఎఫ్ఓ ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ భాగస్వామ్యంతో ఉచిత డోర్‌స్టెప్ సేవను ప్రవేశపెట్టింది. పెన్షనర్లు టోల్ ఫ్రీ నంబర్ 155299 లేదా 1800 889 7711 కు ఫోన్ చేసి అపాయింట్మెంట్ షెడ్యూల్ చేస్తే ఐపీపీబీ డాక్ సేవక్ నేరుగా ఇంటికే వచ్చి జీవన్ ప్రమాణ్ పత్రాన్ని ఉచితంగా నమోదు చేస్తారు. పెన్షన్ సజావుగా అందాలంటే గడువు ముగియక ముందే జీవన్ ప్రమాణ్ పత్రాన్ని సమర్పించాలి.ఇదీ చదవండి: మళ్లీ టాప్ గేర్‌లోకి పసిడి.. నేటి ధరలు ఇలా.. -
కియోసాకికి కోపమొచ్చింది.. ‘పందులకు ఎంత చెప్పినా వేస్టే’
ప్రపంచ ప్రఖ్యాత వ్యక్తిగత ఆర్థిక నిపుణుడు, 'రిచ్ డాడ్ పూర్ డాడ్' రచయిత రాబర్ట్ కియోసాకి మరోసారి డబ్బు, ఆర్థిక విద్యపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సామాజిక మాధ్యమం ఎక్స్ (X)వేదికగా చేసిన తాజా పోస్టులో, "నేర్చుకోవాలనే ఆసక్తి లేని వారికి బోధించడానికి ప్రయత్నించడం సమయ వృథా" అని పేర్కొన్నారు."పందికి పాటలు నేర్పొద్దు. అది మీ సమయాన్ని వృథా చేయడమే కాకుండా, పందిని కూడా చిరాకు పెడుతుంది" అనే సామెతను ఉదహరిస్తూ, జీవితంలో తాను నేర్చుకున్న అత్యంత కఠినమైన పాఠాల్లో ఇదొకటని కియోసాకి చెప్పారు. తాను ఎక్కువ మందికి డబ్బు గురించి అవగాహన కల్పించి, వారిని ఆర్థికంగా బలంగా, స్వేచ్ఛగా చూడాలనుకున్నప్పటికీ, చాలామంది తన సలహాలను అంగీకరించరని వెల్లడించారు.డబ్బు అనేది వ్యక్తిగతం, భావోద్వేగాలతో కూడుకున్నది, కుటుంబ విలువలు, సంస్కృతితో ముడిపడి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల్లో పెరిగిన వారిలో డబ్బుపై స్థిరమైన అభిప్రాయాలు ఎక్కువగా ఉంటాయని, అలాంటి సందర్భాల్లో తన సలహాలు వారికి ఇబ్బందిగా అనిపిస్తాయని వ్యాఖ్యానించారు."నేర్చుకోవాలనే ఆసక్తి లేని వారికి బోధించకూడదనే విషయాన్ని అర్థం చేసుకోవడానికి నాకు చాలా సమయం పట్టింది. అయితే నా పోస్టులను చదువుతూ, డబ్బు గురించి మరింత తెలుసుకోవాలనుకునే ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు" అని కియోసాకి తెలిపారు.అలాగే, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ముందు మరింత అల్లకల్లోల పరిస్థితులు ఉన్నాయని ఆయన హెచ్చరించారు. చైనా ఎదుగుదల, అమెరికా ఆర్థిక పరిస్థితి, కృత్రిమ మేధ (AI) కారణంగా భారీ స్థాయిలో ఉద్యోగాల కోతలు వంటి పరిణామాలు రాబోయే రోజుల్లో ఆర్థిక రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. అందుకే ఆర్థిక విజ్ఞానం పెంపొందించుకోవడం ఇప్పటి పరిస్థితుల్లో మరింత అవసరమని ఆయన తన పోస్టులో సూచించారు.“Don’t teach pigs to sing. It wastes your time…. and annoys the pig.”I would guess most of us, you, me, we…want to help our fellow human beings….if we could.Yet sometimes our help is rejected because “it annoys the pig.”This lesson has been one of the hardest lessons…— Robert Kiyosaki (@theRealKiyosaki) July 19, 2026 -
మీ పిల్లలను విదేశాలకు పంపుతున్నారా?
నేటి ఆధునిక ప్రపంచంలో తమ పిల్లలకు విదేశాలలో అత్యున్నత విద్యను అందించాలని తల్లిదండ్రులు కలలు కంటున్నారు. అయితే, సరైన ఆర్థిక ప్రణాళిక లేకపోవడం, తొందరపాటు నిర్ణయాల వల్ల చాలా కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నాయి. విదేశీ విద్య కోసం భారీగా ఖర్చు చేసే క్రమంలో తల్లిదండ్రులు సాధారణంగా చేసే ఐదు ప్రధాన ఆర్థిక తప్పిదాలను, వాటిని ఎలా అధిగమించాలో విశ్లేషించే ప్రత్యేక కథనం ఇది.ట్యూషన్ ఫీజును మాత్రమే పరిగణనలోకి తీసుకోవడంచాలా మంది తల్లిదండ్రులు కేవలం యూనివర్సిటీ ట్యూషన్ ఫీజును మాత్రమే ప్రధాన వ్యయంగా భావిస్తారు. కానీ నివాస వసతి, హెల్త్ ఇన్సూరెన్స్, వీసా ఛార్జీలు, ప్రయాణ ఖర్చులు, రోజువారీ జీవన వ్యయాలను అంచనా వేయడంలో విఫలమవుతుంటారు. విదేశీ మారకద్రవ్య రేట్ల హెచ్చుతగ్గుల వల్ల కూడా ఖర్చులు పెరుగుతాయి. అందుకే మొత్తం బడ్జెట్‌పై కనీసం 10 నుంచి 15 శాతం బఫర్ అమౌంట్‌ను ముందే సిద్ధం చేసుకోవడం సురక్షితం.రిటైర్మెంట్ ఫండ్స్ దారి మళ్లించడంపిల్లల విదేశీ చదువుల కోసం దశాబ్దాలుగా కూడబెట్టిన తమ రిటైర్మెంట్ నిధిని లేదా పీఎఫ్ సొమ్మును పూర్తిగా ఖర్చు చేయడం అతిపెద్ద తప్పు. ఇది మీ వృద్ధాప్య భద్రతను ప్రమాదంలో పడేస్తుంది. దీనికి బదులుగా విద్యా రుణాలు తీసుకోవడం ఉత్తమమైన మార్గం. చదువు పూర్తయ్యాక పిల్లలే ఆ లోన్ చెల్లించేలా బాధ్యత అప్పగించవచ్చు.వడ్డీ రేట్లను మాత్రమే చూసి లోన్ ఎంచుకోవడంఎడ్యుకేషన్ లోన్ తీసుకునేటప్పుడు కేవలం ప్రకటిత వడ్డీ రేటు (Headline Interest Rate) మాత్రమే చూసి మోసపోకూడదు. లోన్ ప్రాసెసింగ్ ఫీజులు, ప్రీ-పేమెంట్ పెనాల్టీలు, మొరటోరియం కాల పరిమితి వంటి నిబంధనలను పరిశీలించాలి. ప్రభుత్వ రంగ బ్యాంకులు సాధారణంగా స్థిరమైన తక్కువ ఫీజులు వసూలు చేస్తే ప్రైవేట్ లెండర్లు 0.8-1% వరకు ప్రాసెసింగ్ ఫీజులు వేస్తుంటారు.ఎల్ఆర్ఎస్, టీసీఎస్ నిబంధనలపై అవగాహన లోపంభారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) నిబంధనల ప్రకారం.. లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్) కింద ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా 2.5 లక్షల యూఎస్ డాలర్ల వరకు విదేశాలకు పంపవచ్చు. అయితే సొంత నిధుల నుంచి రూ.7 లక్షల కంటే ఎక్కువ మొత్తాన్ని పంపితే 5 శాతం టీసీఎస్ (ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్) వర్తిస్తుంది. అదే ఎడ్యుకేషన్ లోన్ ద్వారా పంపితే ఈ పన్ను రేటు 0.5 శాతానికి తగ్గుతుంది. ఈ పన్ను వెసులుబాటును గమనించకపోతే భారీగా నష్టపోవాల్సి వస్తుంది.కెరీర్ అవకాశాలను నిర్లక్ష్యం చేయడంకోర్సు ఎంపికలో మార్కెట్ డిమాండ్, సదరు యూనివర్సిటీకి గల అంతర్జాతీయ గుర్తింపును పరిశీలించాలి. చదువు పూర్తయిన వెంటనే అక్కడ ఉద్యోగ అవకాశాలు లేకపోతే తీసుకున్న భారీ అప్పును తీర్చడం పిల్లలకు, తల్లిదండ్రులకు పెను భారంగా మారుతుంది.ఇదీ చదవండి: హోమ్ లోన్ కడుతూ అద్దె ఇంట్లో ఉంటున్నారా? -
చనిపోయిన వారి రిటర్నులు ఎలా వేయాలంటే..
కుటుంబ సభ్యుల్లో తల్లిదండ్రులు, అన్నదమ్ములు, దగ్గరవాళ్లు చనిపోతే వారి తరఫున వారసులు ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయాలి. దాఖలు చేయాల్సిన బాధ్యత కేవలం వారసులపైనే ఉంటుంది. చాలా మంది ఇటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కాక సతమతమవుతుంటారు. రిటర్ను వేయాలా, మానేయాలా? పన్ను చెల్లించాలా .. రిఫండు కోసం ఏం చేయాలి .. పాన్ని సరెండర్ చేయాలా .. ఆదాయపు పన్ను శాఖ వారికి ఎలా తెలియజేయాలి .. రిటర్ను వేస్తే ఎలా వేయాలి.. మొదలైన విషయాలు ఈ వారం తెలుసుకుందాం. మీరు ప్రత్యేకంగా డిపార్టుమెంటు వారికి తెలియజేయాల్సిన అవసరం లేదు. అలాగే ’పాన్’ సరెండర్ చేయనవసరం లేదు. కానీ, ఆ పాన్ని వాడకండి. దుర్వినియోగం చేయకండి. అధికార ప్రత్యుత్తరాలలో తప్ప ఎక్కడా ఆ నంబరును ’కోట్’ చేయకండి. అన్ని డాక్యుమెంట్లు.. అంటే.. డెత్ సర్టిఫికెట్లు, పోయినవారి పాన్ కార్డు, పాత సంవత్సరాల రిటర్నులు, బ్యాంకు పాస్‌బుక్‌లు, క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, వారి ఫారం 26ఏఎస్, ఏఐఎస్, టీఐఎస్ మొదలైన కాగితాలను భద్రపరచండి. వారసులు ఒకరే ఉంటే సరే సరి. ఇద్దరు, లేదా అంతకన్నా ఎక్కువ మంది ఉంటే అందరూ కలిసి ఒకరినే ఎంచుకోండి. మనస్పర్థలు, గొడవలు అనవసరం. కేవలం ఒకరే ముందుకు రండి. అలా ముందుకు వచ్చిన వారు, లేదా అందరూ కలిసి ఎంచుకున్న వారు..అన్ని కాగితాలతో రెడీగా ఉండండి. కాగితాల ప్రకారం వారసత్వం సరి్టఫికెట్లో మీ పేరు స్పష్టంగా ఉండాలి. తప్పులు ఉండకూడదు. (ఈ సరి్టఫికెట్ ఎలా తెచ్చుకోవాలో ఈ కాలమ్‌లో ప్రస్తావించడం లేదు). మీ ఐడెంటిటీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్, మీకున్న సంబంధం – చుట్టరికం, వీటన్నింటితో పాటు మరణించిన వారి డెత్ సరి్టఫికెట్, అన్నీ పెట్టి, వారసత్వపు సరి్టఫికెట్‌తో పాటు, ఐటీ పోర్టల్‌లో లాగిన్ అయి మిమ్మల్ని మీరు ’రిప్రజెంటేటివ్ అసెసీ’గా నమోదు చేసుకోండి. నమోదు ప్రక్రియలో భాగంగా అన్ని కాగితాలు సబ్మిట్ చేశాక, డిపార్టుమెంటు వారి నుంచి ముందస్తు అనుమతి అవసరం. వాళ్లు చాలా త్వరగా మిమ్మల్ని ’గుర్తిస్తారు’. అలా గుర్తింపు పొందాకా..ఇక మిగతాదంతా షరా మామూలే. పాత పాటే. ఆ సంవత్సరం మొదటి నుంచి, ఏ తేదీనాడు ఆ బంధువు పోయారో, ఆ తేదీ వరకు ఆ వ్యక్తికి సంబంధించిన ఆదాయమే రిటర్నుల్లో వేయాలి. ఏ రకమైన ఆదాయమైనా, ఆ తేదీ వరకే లెక్కించాలి. ఒకవేళ అప్పటికే టీడీఎస్ ఉంటే, ఆ ఆదాయం మీద పన్నుభారం లెక్కించి పన్ను భారం చెల్లించాలి. టీడీఎస్ మిగిలితే రిఫండు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఆ తేదీ తరువాతవి, వారసుల అకౌంటులోకి వస్తాయి. వాటితో పాటు మీ సొంత ఆదాయం కలిపి మీరు రిటర్ను దాఖలు చేయాలి. ఎలాగూ చనిపోయిన వారి అకౌంట్ క్లోజ్ అయిపోతుంది కాబట్టి, వారసుల బ్యాంకు అకౌంటు వివరాలు పొందుపరచవచ్చు. వారసులు అన్ని జాగ్రత్తలు తీసుకుని రిటర్ను దాఖలు చేయండి. కరెక్ట్ ఫారంను ఎంచుకోండి. రిఫండు పెద్ద మొత్తం ఉన్నా.. లేక పన్ను భారం ఎక్కువగా అనిపించినా .. వృత్తి నిపుణుల సహాయ సహకారాలు తీసుకోండి. -
హోమ్ లోన్ కడుతూ అద్దె ఇంట్లో ఉంటున్నారా?
సొంత ఇల్లు అనేది సగటు భారతీయుడి జీవితకాల స్వప్నం. అయితే, ప్రస్తుత ఉపాధి అవకాశాలు, మారుతున్న ఆర్థిక సమీకరణాల నేపథ్యంలో చాలా మంది ఉద్యోగులు ఒకవైపు హోమ్ లోన్ ఈఎంఐలు చెల్లిస్తూనే మరోవైపు ఉద్యోగరీత్యా వేరే ప్రాంతాల్లో అద్దె ఇళ్లలో నివసిస్తున్నారు. ఇలాంటి వారిపై ఆర్థిక భారం పడుతుందనేది నిజమే అయినప్పటికీ, భారత ఆదాయపు పన్ను చట్టాల ప్రకారం ఈ ద్వంద్వ వ్యయాలపై డబుల్ టాక్స్ బ్రేక్ (రెట్టింపు పన్ను మినహాయింపు) పొందే అవకాశం ఉంది. ఆదాయపు పన్ను శాఖ నిబంధనల పరిధిలో దీనికి సంబంధించిన వివరాలు కింద చూద్దాం.ఒకేసారి రెండు మినహాయింపులు ఎలా సాధ్యం?పన్ను చెల్లింపుదారులు పాత పన్ను విధానాన్ని ఎంచుకున్నప్పుడు మాత్రమే ఈ రెండు ప్రయోజనాలను ఏకకాలంలో క్లెయిమ్ చేయడానికి అర్హులవుతారు. కొత్త పన్ను విధానంలో ఈ మినహాయింపులు వర్తించవు. చట్టబద్ధంగా కింది సెక్షన్ల కింద పన్ను మినహాయింపు పొందవచ్చు.1. హెచ్ఆర్ఏ (సెక్షన్ 10(13A)): ఉద్యోగి తన జీతంలో భాగంగా పొందే హౌస్ రెంట్ అలవెన్స్‌పై తను నివసిస్తున్న ఇంటికి చెల్లించే అద్దె ఆధారంగా పన్ను మినహాయింపు లభిస్తుంది.2. హోమ్ లోన్ వడ్డీ (సెక్షన్ 24(b)): సొంత నివాసం కోసం తీసుకున్న గృహ రుణంపై చెల్లించే వార్షిక వడ్డీపై గరిష్టంగా రూ.2,00,000 వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది.3. అసలు చెల్లింపు (సెక్షన్ 80సీ): హోమ్ లోన్ ఈఎంఐలోని అసలు (Principal) భాగంపై గరిష్టంగా రూ.1,50,000 వరకు అదనపు మినహాయింపు పొందవచ్చు.ఎలాంటి సందర్భాల్లో అర్హత సాధించవచ్చంటే..వేర్వేరు నగరాల్లో ఉండటం: ఉద్యోగి ఒక నగరంలో (ఉదాహరణకు హైదరాబాద్) హోమ్ లోన్ ద్వారా ఇల్లు కొనుగోలు చేసి ఉద్యోగ రీత్యా మరో నగరంలో (ఉదాహరణకు బెంగళూరు) అద్దెకు ఉంటుంటే ఎలాంటి ఇబ్బందీ లేకుండా రెండింటినీ క్లెయిమ్ చేయవచ్చు.ఒకే నగరంలో నివాసం: సొంత ఇల్లు, ఆఫీసు ఉన్న నగరం ఒకటే అయినప్పటికీ.. సొంత ఇల్లు ఆఫీసుకు చాలా దూరంగా ఉండటం వల్ల నిత్యం ప్రయాణించడం సాధ్యం కాక ఆఫీస్ దగ్గర అద్దెకు ఉంటున్నట్లయితే ఈ రెండు మినహాయింపులూ వర్తిస్తాయి. అయితే, ఐటీ అధికారుల పరిశీలనలో దీనికి సరైన కారణం, ఆధారాలు చూపించాల్సి ఉంటుంది.నిర్మాణంలో ఉన్న ఇల్లు: కొనుగోలు చేసిన ఇల్లు ఇంకా నిర్మాణంలో ఉండి, అద్దె ఇంట్లో ఉంటున్నట్లయితే.. హెచ్ఆర్ఏ పూర్తిగా క్లెయిమ్ చేయవచ్చు. అయితే లోన్ వడ్డీని ఇల్లు పూర్తయ్యాక ఐదు సమాన విడతల్లో మాత్రమే క్లెయిమ్ చేయాలి.తీసుకోవాల్సిన జాగ్రత్తలుపన్ను లబ్ధి పొందే క్రమంలో పన్ను చెల్లింపుదారులు పక్కా ఆధారాలను కలిగి ఉండాలి. ఐటీ శాఖ నిఘా పెరిగిన నేపథ్యంలో చెల్లుబాటు అయ్యే అద్దె ఒప్పందం, అద్దె రశీదులు ఉండాలి. వార్షిక అద్దె రూ.1 లక్ష దాటితే యజమాని పాన్ నంబర్ సమర్పించడం తప్పనిసరి. అలాగే బ్యాంకు ద్వారా అద్దె చెల్లింపులు జరపడం సురక్షితం. హోమ్ లోన్ వడ్డీ, అసలు వివరాల కోసం రుణదాత (బ్యాంకు) నుంచి పొందిన ఇంట్రెస్ట్ సర్టిఫికెట్‌ను మీ సంస్థకు సకాలంలో సమర్పించాల్సి ఉంటుంది.ఇదీ చదవండి: వాడకుండా ఉన్న క్రెడిట్ కార్డ్‌ను క్లోజ్ చేస్తున్నారా? -
కోటి సంపాదించకుండానే కోటీశ్వరులు కావచ్చా?
ఎక్కువ జీతం వస్తేనే ధనవంతులు అవుతామని చాలా మంది భావిస్తారు. కానీ అధిక ఆదాయం కంటే ఆర్థిక క్రమశిక్షణ, ఖర్చుల నియంత్రణ, దీర్ఘకాలిక పెట్టుబడులే నిజమైన సంపదకు పునాది అని బెంగళూరుకు చెందిన చార్టర్డ్ అకౌంటెంట్ (సీఏ) మీనాల్ గోయెల్ పేర్కొన్నారు. లింక్డ్ఇన్లో ఆమె పంచుకున్న అభిప్రాయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీశాయి.మాజీ డెలాయిట్, కేపీఎంజీ ఉద్యోగి అయిన గోయెల్ తన కెరీర్ ప్రారంభంలో వార్షికంగా రూ.1 కోటి సంపాదిస్తేనే తాను ధనవంతురాలినని భావించేదాన్నని చెప్పారు. అయితే అనుభవం పెరిగే కొద్దీ, ఎక్కువ సంపాదించడం ఒక్కటే సంపదకు ప్రమాణం కాదని, సంపాదించిన డబ్బులో ఎంత మిగుల్చగలుగుతున్నామన్నదే అసలు కీలకమని గ్రహించినట్లు వెల్లడించారు.జీతం పెరిగినా.. పొదుపు పెరుగుతుందా?గోయెల్ అభిప్రాయం ప్రకారం, ఆదాయం పెరిగే కొద్దీ ఖర్చులు కూడా అదే వేగంతో పెరగడం చాలా మందిలో కనిపించే ప్రధాన సమస్య. దీనినే ఆర్థిక నిపుణులు "లైఫ్‌స్టైల్ ఇన్ఫ్లేషన్" లేదా "లైఫ్‌స్టైల్ క్రీప్" అని పిలుస్తారు.జీతం పెరిగిన వెంటనే అధిక అద్దె ఉన్న ఇళ్లకు మారడం, ఖరీదైన కార్లను ఈఎంఐలపై కొనుగోలు చేయడం, తరచూ బయట భోజనం చేయడం, విలాసవంతమైన జీవనశైలిని అలవాటు చేసుకోవడం వల్ల అదనంగా వచ్చిన ఆదాయం పూర్తిగా ఖర్చైపోతుందని ఆమె వివరించారు. దీంతో ఆదాయం ఎక్కువైనా, నికర సంపద మాత్రం ఆశించినంతగా పెరగదని పేర్కొన్నారు.ఎక్కువ జీతం... తక్కువ పొదుపుతన పోస్టులో గోయెల్ ఒక ఆసక్తికరమైన ఉదాహరణను ప్రస్తావించారు. సంవత్సరానికి రూ.50 లక్షలు సంపాదించే కొంతమంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు, ఏడాదికి రూ.12 లక్షల జీతం పొందే ప్రభుత్వ ఉద్యోగుల కంటే తక్కువ మొత్తాన్ని పొదుపు చేస్తున్న సందర్భాలు ఉన్నాయని తెలిపారు. కారణం ఆదాయం కాదు.. ఖర్చుల నియంత్రణలో ఉన్న తేడా అని ఆమె అభిప్రాయపడ్డారు.కోటీశ్వరులు కావాలంటే కోటి జీతం కావాలా?వార్షికంగా రూ.1 కోటి జీతం ఉంటేనే కోటీశ్వరులు కావచ్చనే అభిప్రాయం సరైంది కాదని గోయెల్ స్పష్టం చేశారు. క్రమం తప్పకుండా పొదుపు చేయడం, పెట్టుబడులు కొనసాగించడం, ప్రతి జీతం పెరుగుదలలో కొంత భాగాన్ని ముందుగా పెట్టుబడులకు కేటాయించడం ద్వారా సాధారణ ఉద్యోగి కూడా దీర్ఘకాలంలో రూ.1 కోటి ఆస్తిని సృష్టించగలడని ఆమె అభిప్రాయపడ్డారు.ఆమె ప్రకారం, సుమారు 10% వార్షిక జీతం పెరుగుదలతో పాటు దీర్ఘకాలంలో సగటున 12–15% పెట్టుబడి రాబడిని సాధించగలిగితే, పదేళ్ల వ్యవధిలో కోటి రూపాయల పెట్టుబడి విలువను చేరుకోవడం సాధ్యమవుతుందని చెప్పారు. అయితే ఇది మార్కెట్ పరిస్థితులు, పెట్టుబడి విధానం, కాలవ్యవధి వంటి అంశాలపై ఆధారపడి ఉంటుందని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.ఆర్థిక స్వేచ్ఛ అంటే ఇదే..రూ.1 కోటి పెట్టుబడి దీర్ఘకాలంలో స్థిరమైన ఆదాయాన్ని అందించే ఆస్తిగా మారితే, అది నెలవారీ అవసరాల్లో పెద్ద భాగాన్ని భర్తీ చేసే అవకాశం ఉంటుందని గోయెల్ పేర్కొన్నారు. అదే నిజమైన ఆర్థిక స్వేచ్ఛకు తొలి అడుగు అని ఆమె అభిప్రాయపడ్డారు.పర్సనల్ ఫైనాన్స్ నిపుణులు కూడా గోయెల్ అభిప్రాయానికి మద్దతు ఇస్తున్నారు. ఆదాయం పెరిగిన ప్రతిసారి ఖర్చులు పెంచడం కంటే, ముందుగా ఎస్ఐపీ (SIP), పీఎఫ్, ఎన్పీఎస్ లేదా ఇతర దీర్ఘకాలిక పెట్టుబడుల్లో వాటాను పెంచాలని సూచిస్తున్నారు. సాధారణంగా అత్యవసర నిధి, తగిన బీమా, క్రమబద్ధమైన పెట్టుబడులు, అవసరం లేని రుణాలకు దూరంగా ఉండటం ద్వారా దీర్ఘకాలంలో గణనీయమైన సంపదను నిర్మించవచ్చని వారు చెబుతున్నారు.ధనవంతులుఏ కావడం అనేది కేవలం భారీ జీతంతో వచ్చే విషయం కాదు. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులను నియంత్రించడం, క్రమశిక్షణతో పొదుపు చేయడం, నిరంతర పెట్టుబడులు కొనసాగించడం, దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళికను పాటించడమే నిజమైన సంపద సృష్టికి మార్గమని గోయెల్ సందేశం స్పష్టం చేస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ అంశంపై విస్తృత చర్చ కొనసాగుతోంది. -
ఈపీఎఫ్ క్లెయిమ్ రిజెక్ట్ అయిందా?
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) నుంచి తమ సొంత ఈపీఎఫ్ నిధులను విత్‌డ్రా లేదా బదిలీ చేసుకోవాలని భావించే చందాదారుల క్లెయిమ్ కొన్నిసార్లు రిజెక్ట్ అవుతోంది. ఆన్లైన్ ప్రక్రియలు సులభతరం అయినప్పటికీ సాంకేతిక, రికార్డుల లోపాల వల్ల క్లెయిమ్‌లు తిరస్కరిస్తున్నట్లు అధికారిక డేటా స్పష్టం చేస్తోంది. ఈపీఎఫ్ క్లెయిమ్ తిరస్కరణకు దారితీసే సాధారణ కారణాలు, వాటిని అధిగమించే మార్గాలు కింద చూద్దాం.1. వ్యక్తిగత వివరాల వ్యత్యాసంఆధార్ కార్డు, ప్యాన్ కార్డు, ఈపీఎఫ్ఓ డేటాబేస్‌లో ఉన్న మీ పేరు, తండ్రి పేరు లేదా పుట్టిన తేదీల్లో చిన్న అక్షర దోషం ఉన్నా క్లెయిమ్ వెంటనే తిరస్కరణకు గురవుతుంది.పరిష్కారం: మీ యజమాని(ఎంప్లాయర్) సహకారంతో జాయింట్ డిక్లరేషన్ ఫారమ్ సమర్పించి వివరాలను సరిచేసుకోవాలి.2. బ్యాంక్ వివరాలు, ఐఎఫ్ఎస్సీ కోడ్ మారడంఇటీవలి కాలంలో కొన్ని బ్యాంకుల విలీనం కారణంగా పాత ఐఎఫ్ఎస్సీ కోడ్లు చెల్లకుండా పోయాయి. అలాగే ఈపీఎఫ్ఓ పోర్టల్‌లో ఇచ్చిన బ్యాంక్ ఖాతా సంఖ్య లేదా పేరు తప్పుగా ఉన్నా క్లెయిమ్ క్యాన్సిల్ అవుతుంది.పరిష్కారం: యూఏన్ మెంబర్ పోర్టల్‌లోకి లాగిన్ అయి లేటెస్ట్ ఐఎఫ్ఎస్సీ, సరైన బ్యాంక్ ఖాతా వివరాలను అప్డేట్ చేయాలి.3. కంపెనీని వీడిన తేదీ అప్డేట్ చేయకపోవడంఉద్యోగి పాత సంస్థను వీడిన తేదీని యజమాని పోర్టల్‌లో నమోదు చేయకపోతే ఆ ఉద్యోగి ఇంకా అక్కడే పని చేస్తున్నట్లు ఈపీఎఫ్ఓ భావిస్తుంది. దీనివల్ల ఫైనల్ సెటిల్మెంట్ క్లెయిమ్ నిలిచిపోతుంది.పరిష్కారం: ఉద్యోగం వదిలేసిన రెండు నెలల తర్వాత మెంబర్ పోర్టల్‌లో ‘మార్కెట్ ఎగ్జిట్’ ఆప్షన్ ద్వారా ఉద్యోగి స్వయంగా ఈ తేదీని అప్డేట్ చేసుకోవచ్చు.4. కేవైసీ పూర్తి కాకపోవడంయూఏన్ ఖాతాతో ఆధార్, ప్యాన్ కార్డులు లింక్ కాకపోవడం లేదా వెరిఫై కాకపోవడం క్లెయిమ్ రిజెక్షన్‌కు ప్రధాన కారణం. ఐదేళ్ల సర్వీస్ కంటే తక్కువ ఉండి ప్యాన్ లింక్ చేయకపోతే టీడీఎస్ వర్తిస్తుంది.పరిష్కారం: మీ ఆధార్‌ను యూఏన్‌తో సీడింగ్ చేసి కేవైసీని పూర్తి చేయాలి.5. ఒకటి కంటే ఎక్కువ యూఏన్ నంబర్లు ఉండటంవేర్వేరు కంపెనీల్లో పనిచేసినప్పుడు వేర్వేరు యూఏన్ నంబర్లు సృష్టించి ఉంటాయి. పాత నిధులను కొత్త ఖాతాలోకి బదిలీ చేయకుండా (మెర్జ్ చేయకుండా) నేరుగా విత్‌డ్రా చేయడానికి ప్రయత్నిస్తే క్లెయిమ్ రిజెక్ట్ అవుతుంది.పరిష్కారం: మీ పాత పీఎఫ్ ఖాతాలను ప్రస్తుతమున్న యాక్టివ్ యూఏన్ నంబర్‌కు బదిలీ చేయాలి.6. ఈపీఎస్ పెన్షన్ అర్హత సమస్యలుపదవీ విరమణ నిధులు క్లెయిమ్ చేసేటప్పుడు ఫారమ్ 19 (ఈపీఎఫ్ విత్‌డ్రా), ఫారమ్ 10C (పెన్షన్ విత్‌డ్రా)లలో తప్పుడు వివరాలు ఇవ్వడం వల్ల క్లెయిమ్ తిరస్కరణకు గురవుతుంది.పరిష్కారం: సర్వీస్ కాలపరిమితిని బట్టి సరైన ఫారమ్‌లను ఎంచుకోవాలి.7. నిబంధనల ఉల్లంఘన, అసంపూర్ణ డాక్యుమెంటేషన్ప్రీ-మెచ్యూర్ లేదా అడ్వాన్స్ విత్‌డ్రా (ఉదాహరణకు అనారోగ్యం, వివాహం, ఇల్లు కొనుగోలు) కొరకు దరఖాస్తు చేసేటప్పుడు నిర్దేశిత కనీస సర్వీస్ కాలపరిమితి లేకపోవడం లేదా స్పష్టత లేని క్యాన్సిల్డ్ చెక్కులను అప్లోడ్ చేయడం వల్ల క్లెయిమ్స్ రిజెక్ట్ అవుతాయి.పరిష్కారం: అప్లోడ్ చేసే డాక్యుమెంట్లు, పాస్‌బుక్ లేదా చెక్కులపై మీ పేరు, ఖాతా సంఖ్య స్పష్టంగా కనిపించేలా చూసుకోవాలి.ఇదీ చదవండి: హైదరాబాద్‌లో దిగొచ్చిన బంగారం ధర! -
విడాకులు వచ్చినా భరణం ఆగదు! అయితే..
వైవాహిక వివాదాల్లో చిక్కుకున్న మహిళల ఆర్థిక భద్రతకు భరోసా కల్పిస్తూ దేశ అత్యున్నత న్యాయస్థానాల స్ఫూర్తితో ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేస్తూ డిక్రీ(తుది తీర్పు ప్రకటన) ఇచ్చినంత మాత్రాన భార్యకు అందుతున్న తాత్కాలిక భరణం ఆటోమేటిక్‌గా నిలిచిపోదని స్పష్టం చేసింది. ఒకవేళ ఆ విడాకుల తీర్పును సవాలు చేస్తూ పైకోర్టులో అప్పీల్ పెండింగ్‌లో ఉంటే సదరు న్యాయపరమైన ప్రక్రియను కేసు కొనసాగింపుగానే పరిగణిస్తారు. కాబట్టి అప్పీల్ తేలే వరకు భర్త భరణం చెల్లించాల్సిందేనని ధర్మాసనం తేల్చిచెప్పింది.హిందూ వివాహ చట్టం, 1955లోని సెక్షన్ 24 కింద మంజూరయ్యే తాత్కాలిక భరణం ఉద్దేశాన్ని ఈ తీర్పు పునరుద్ఘాటించింది. ఫ్యామిలీ కోర్టు భర్తకు అనుకూలంగా విడాకులు ఇచ్చిన నేపథ్యంలో అప్పీల్ దాఖలు చేసిన ఒక మహిళ కేసు విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. విడాకుల తీర్పు రాగానే భరణం ఆపేయాలన్న భర్త వాదనను న్యాయస్థానం పూర్తిగా తోసిపుచ్చింది. ట్రయల్ కోర్టు తీర్పు ఇచ్చినంత మాత్రాన వివాదం ముగిసిపోయినట్లు కాదని చెప్పింది. అప్పీలేట్ పరిహారాలన్నీ పూర్తయ్యే వరకు ఆ కేసు పెండింగ్‌లోనే ఉంటుందని పేర్కొంది.నిర్ణయం వెనుక కారణాలున్యాయస్థానం తన తీర్పులో రెండు ముఖ్యమైన అంశాలను ప్రస్తావించింది. మొదటిది, ఉన్నత చదువులు (ఎంబీఏ వంటి అర్హతలు) ఉండి గతంలో ఉద్యోగ అనుభవం ఉన్నంత మాత్రాన మహిళకు సొంతంగా జీవనోపాధి ఉన్నట్లు భావించలేం. కేవలం సంపాదించగల సామర్థ్యం ఉండటం వేరు, నిజంగా సంపాదిస్తూ ఉండటం వేరు అని ధర్మాసనం స్పష్టం చేసింది. రెండోది, అప్పీల్ పెండింగ్‌లో ఉన్న సమయంలో భరణం నిలిపివేస్తే ఆర్థికంగా ఆధారపడిన జీవిత భాగస్వామి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుందని, ఇది సెక్షన్ 24 ప్రధాన ఉద్దేశాన్నే దెబ్బతీస్తుందని చెప్పింది.సుప్రీంకోర్టు గతంలో జగదీష్ సింగ్ వర్సెస్ మాధురి దేవి కేసులో ఇచ్చిన తీర్పులను ఉటంకిస్తూ అప్పీల్ అనేది అసలు విచారణకు పొడిగింపు మాత్రమేనని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ క్రమంలో సదరు భర్త జీతం నుంచి ప్రతి నెలా 30 శాతం మొత్తాన్ని నేరుగా భార్య ఖాతాకు బదిలీ చేయాలని కోర్టు ఆదేశించింది.ఇదీ చదవండి: వాడకుండా ఉన్న క్రెడిట్ కార్డ్‌ను క్లోజ్ చేస్తున్నారా? -
రూ.5 కోట్లు ఉంటే రిటైర్ అయిపోవచ్చా?
నేటి కార్పొరేట్ యుగంలో, ముఖ్యంగా యువ ఉద్యోగుల్లో ‘ఫైర్’ (FIRE - Financial Independence, Retire Early) అనే ట్రెండ్ నడుస్తోంది. ముప్పై లేదా నలభై ఏళ్లకే కోట్లలో కార్పస్ (ఆర్థిక నిధి) కూడబెట్టి ఉద్యోగానికి గుడ్-బై చెప్పేయాలనేది చాలామంది కల. అయితే ముందస్తు పదవీ విరమణ అనేది కేవలం ఒక నిర్దిష్ట బ్యాంక్ బ్యాలెన్స్ లేదా మ్యాజిక్ నంబర్‌ను చేరుకోవడం మాత్రమే కాదు. ఆ అంకెను వెతుక్కుంటూ వెళ్లే ముందు ప్రతి ఒక్కరూ కొన్ని ప్రశ్నలకు సమాధానం వేసుకోవడం తప్పనిసరి.ఆర్థిక నిధి వెనుక అసలు లెక్కలుచాలామంది రూ.5 కోట్లు లేదా రూ.10 కోట్లు ఉంటే రిటైర్ అయిపోవచ్చని లెక్కలు వేస్తుంటారు. కానీ భవిష్యత్తులో వచ్చే ద్రవ్యోల్బణం, పెరుగుతున్న వైద్య ఖర్చులను వారు పరిగణనలోకి తీసుకోరు. ఈ రోజు ఉన్న కోటి రూపాయల విలువ మరో ఇరవై ఏళ్ల తర్వాత చాలా తగ్గిపోతుంది. అందుకే మీ వార్షిక ఖర్చులకు కనీసం 30-40 రెట్లు ఎక్కువ నిధిని సమకూర్చుకోవడంతో పాటు రిటైర్మెంట్ తర్వాత కూడా ఆ డబ్బు ద్రవ్యోల్బణాన్ని అధిగమించేలా ఎక్కడ పెట్టుబడి పెట్టాలనే స్పష్టత ఉండాలి.ఉద్యోగం మానేశాక ఏం చేస్తారు?ఆర్థిక స్వతంత్రత రాగానే ఉద్యోగం వదిలేయడం సులువే. కానీ ఆ తర్వాత సుదీర్ఘమైన రోజులను ఎలా గడుపుతారనేదే ప్రశ్న. కేవలం విరామం కోసం రిటైర్ అయితే కొద్ది రోజులకే తీవ్రమైన ఒంటరితనం, మానసిక అసంతృప్తి ఆవరించే ప్రమాదం ఉంది. మీ అభిరుచులు, సామాజిక సేవ లేదా మీకు నచ్చిన చిన్న వ్యాపారం ఏదైనా ప్లాన్ చేసుకున్నారా? ముందస్తు పదవీ విరమణ అనేది పని నుంచి పారిపోవడం కాకూడదు. మీకు నచ్చిన పనిని నచ్చినట్లు చేసుకునే స్వేచ్ఛ కావాలి.ఆరోగ్య బీమా ఉందా?కార్పొరేట్ ఉద్యోగాల్లో ఉన్నంత కాలం హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ చూసుకుంటుంది. కానీ ముందస్తు రిటైర్మెంట్ తీసుకున్నాక సొంతంగా నాణ్యమైన ఆరోగ్య బీమా పాలసీ ఉండాలి. వయసు పెరిగే కొద్దీ ప్రీమియంలు పెరుగుతాయి. కాబట్టి వైద్య ఖర్చుల కోసం ప్రత్యేకంగా ఒక అత్యవసర నిధి సిద్ధంగా ఉంచుకోవాలి.ముందస్తు పదవీ విరమణ అనేది కేవలం ఒక ఆర్థిక లక్ష్యం కాదు, అది ఒక సంపూర్ణ జీవనశైలి మార్పు. కేవలం ఒక అంకె వెంట పడకుండా.. మానసిక సన్నద్ధత, సమగ్రమైన ఆర్థిక ప్రణాళిక, స్పష్టమైన భవిష్యత్ లక్ష్యాలు ఉన్నప్పుడే మీ ‘సెకండ్ ఇన్నింగ్స్’ విజయవంతం అవుతుంది. నిపుణుల సలహాతోనే ఈ దిశగా అడుగులు వేయడం ఉత్తమం.ఇదీ చదవండి: వాడకుండా ఉన్న క్రెడిట్ కార్డ్‌ను క్లోజ్ చేస్తున్నారా? -
వాడకుండా ఉన్న క్రెడిట్ కార్డ్‌ను క్లోజ్ చేస్తున్నారా?
ఈ రోజుల్లో ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులు కలిగి ఉండటం సాధారణం. వివిధ ఆఫర్లు, క్యాష్‌బ్యాక్‌లకు ఆకర్షితులై చాలామంది అవసరానికి మించి కార్డులు తీసుకుంటారు. అయితే, కొంతకాలం తర్వాత వాటిలో కొన్నింటిని అస్సలు వాడకుండా పక్కనపెట్టేస్తుంటారు. ‘ఎలాగూ వాడటం లేదు కదా, క్లోజ్ చేసేద్దాం’ అని అనుకుంటే.. ఒక్క నిమిషం ఆగండి! మీ నిర్ణయం వల్ల మీ క్రెడిట్ స్కోర్ పడిపోయే ప్రమాదం ఉంది. దీనికి సంబంధించిన విషయాలు చూద్దాం.మీ సిబిల్ స్కోర్‌ను దెబ్బతీసే ప్రధాన అంశాలుమీకు ఉన్న మొత్తం క్రెడిట్ లిమిట్లో ఎంత శాతం వాడుతున్నారనేదే క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో (సీయూఆర్). ఇది ఎప్పుడూ 30 శాతం కంటే తక్కువగా ఉండాలి. ఒక కార్డును క్లోజ్ చేయడం వల్ల మీ మొత్తం అందుబాటులో ఉన్న క్రెడిట్ లిమిట్ తగ్గిపోతుంది. దీనివల్ల మీరు చేసే ఖర్చు మారకపోయినా మీ సీయూఆర్ శాతం ఒక్కసారిగా పెరిగిపోతుంది. ఇది మీ స్కోర్ పడిపోవడానికి ప్రధాన కారణమవుతుంది. బ్యాంకులు మీకు లోన్ ఇచ్చే ముందు మీరు ఎంత కాలంగా క్రెడిట్‌ను బాధ్యతాయుతంగా వాడుతున్నారనే హిస్టరీని చూస్తాయి. మీ దగ్గర ఉన్న కార్డులలో అత్యంత పాత కార్డును క్లోజ్ చేస్తే క్రెడిట్ హిస్టరీ సగటు డ్యూరేషన్ తగ్గిపోతుంది.ఆర్బీఐ నిబంధనలు ఏం చెబుతున్నాయి?మీ క్రెడిట్ కార్డును వరుసగా 12 నెలల పాటు అసలు వాడకపోతే బ్యాంకులు ఆ కార్డును క్లోజ్ చేసే అధికారం కలిగి ఉంటాయి. అయితే, అలా చేసే ముందు ఖాతాదారునికి తప్పనిసరిగా నోటీసు ఇవ్వాలి. ఖాతాదారుడు అన్ని బకాయిలు చెల్లించి కార్డ్ క్లోజర్ కోసం దరఖాస్తు చేసుకున్న ఏడు పని దినాల్లో బ్యాంక్ ఆ ఖాతాను మూసివేయాలి. ఒకవేళ బ్యాంక్ గడువు దాటి ఆలస్యం చేస్తే ఆ తర్వాత ప్రతి రోజు ఆలస్యానికి రూ.500 చొప్పున బ్యాంకు సదరు కస్టమర్‌కు నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది.సురక్షితమైన కార్డ్ క్లోజర్ విధానంకార్డుపై ఉన్న అవుట్‌స్టాండింగ్ బకాయిలు, ఈఎంఐలను పూర్తిగా క్లియర్ చేయండి.ఖాతా మూసివేసే ముందే మీ రివార్డ్ పాయింట్లను పూర్తిగా వాడేసుకోండి.ఓటీటీ, ఇన్సూరెన్స్ వంటి వాటికి ఇచ్చిన ఆటో డెబిట్ ఆప్షన్లను రద్దు చేయండి.కార్డు విజయవంతంగా క్లోజ్ అయిన తర్వాత బ్యాంక్ నుంచి అధికారిక కన్ఫర్మేషన్ లేదా ‘నో డ్యూస్ సర్టిఫికేట్’ తప్పక తీసుకోండి.ఒకవేళ మీరు క్లోజ్ చేయాలనుకుంటున్న కార్డుకు ఎలాంటి వార్షిక రుసుము లేకపోతే దానిని అలాగే ఉంచడం మంచిది. నెలకు లేదా రెండు నెలలకు ఒకసారి చిన్న మొత్తంలో వాడుతూ యాక్టివ్‌గా ఉంచితే అది మీ క్రెడిట్ లిమిట్‌ను పెంచి తద్వారా మీ సిబిల్ స్కోర్‌ను మరింత పెంచడానికి సహాయపడుతుంది.ఇదీ చదవండి: IRCTC వెబ్సైట్ కొత్త అవతారం.. అదిరిపోయే ఫీచర్లు -
రూ.11 వేల కోట్ల కంపెనీ సీఈవో.. అయినా ‘నో లోన్’!
కోట్ల రూపాయల ఆస్తులు, వేల కోట్ల విలువైన కంపెనీ, మంచి సిబిల్ స్కోర్... ఇవన్నీ ఉన్నా బ్యాంకులు హోమ్‌లోన్ ఇవ్వడానికి వెనకడుగు వేస్తాయా? తాజాగా వైరల్ అయిన ఒక ఘటన అవుననే సమాధానమే చెబుతోంది. ఫిన్‌టెక్ సంస్థ ‘రెయిజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్’ వ్యవస్థాపకుడు, సీఈఓ ప్రవీణ్ జాధవ్ తన హోమ్‌లోన్ దరఖాస్తును బ్యాంకు తిరస్కరించిందని ‘ఎక్స్’లో వెల్లడించారు. కారణం మాత్రం ఆయన ఆదాయం లేదా సిబిల్ స్కోర్ కాదు.. 'హై రిస్క్ కేటగిరీ'లో ఉండటమే.ఈ ఘటనతో చాలామందిలో ఒక సందేహం మొదలైంది. అసలు బ్యాంకులు ఎవరిని హైరిస్క్‌గా పరిగణిస్తాయి? మంచి ఆదాయం, అద్భుతమైన క్రెడిట్ హిస్టరీ ఉన్నా ఎందుకు రుణం నిరాకరిస్తాయి?హోమ్‌లోన్ ఇవ్వడానికి బ్యాంకులు ఏమేమి చూస్తాయి?చాలామంది సిబిల్ స్కోర్ బాగుంటే చాలు అనుకుంటారు. కానీ వాస్తవానికి బ్యాంకులు అనేక అంశాలను పరిశీలిస్తాయి.క్రెడిట్ స్కోర్, రీపేమెంట్ చరిత్రనెలవారీ ఆదాయం, ఉద్యోగ స్థిరత్వంఇప్పటికే ఉన్న రుణాల భారంఆదాయానికి సంబంధించి ఈఎంఐ నిష్పత్తివృత్తి, వ్యాపారం స్వభావంకేవైసీ, ఆదాయ పత్రాలుఅంతర్గత రిస్క్ పాలసీలుఅంటే సిబిల్ స్కోర్ ఒక ముఖ్యమైన అంశమే కానీ, అది ఒక్కటే ప్రమాణం కాదు.హైరిస్క్ కేటగిరీ అంటే ఏమిటి?ప్రతి బ్యాంకుకు సొంత రిస్క్ అసెస్మెంట్ మోడల్ ఉంటుంది. అందులో కొందరు కస్టమర్లను హైరిస్క్‌గా గుర్తించవచ్చు. అందులో ప్రధానంగా..స్టార్టప్‌లు లేదా అధిక రిస్క్ రంగాల్లో వ్యాపారం చేసే వారుఆదాయం స్థిరంగా లేకపోవడంస్వయం ఉపాధి పొందుతున్న వ్యక్తులునియంత్రణ సంస్థల పర్యవేక్షణలో ఉండే రంగాల్లో పనిచేసేవారుఅధిక మొత్తంలో పెట్టుబడులు, షేర్ మార్కెట్ లేదా ఫిన్‌టెక్ కార్యకలాపాల్లో ఉండటంబ్యాంకు అంతర్గత రిస్క్ పాలసీల ప్రకారం ప్రత్యేక కేటగిరీలోకి రావడంఈ కారణాల్లో ఏదైనా ఉంటే, సిబిల్ స్కోర్ బాగున్నా బ్యాంకు అదనపు జాగ్రత్తలు తీసుకోవచ్చు.సీఈఓ అయినా ఎందుకు లోన్ రాలేదు?ప్రవీణ్ జాధవ్ వెల్లడించిన సమాచారం ప్రకారం, తన క్రెడిట్ హిస్టరీ బాగానే ఉన్నప్పటికీ, బ్యాంకు ఆయనను హైరిస్క్ కస్టమర్‌గా వర్గీకరించిందని తెలిపింది. ఫిన్‌టెక్ రంగానికి చెందిన వ్యక్తి కావడం లేదా బ్యాంకు అంతర్గత రిస్క్ మోడల్లో ఆయన ప్రొఫైల్‌కు అధిక రిస్క్ స్కోర్ రావడం వంటి కారణాలు ఉండొచ్చు.బ్యాంకులు లోన్ రిజెక్ట్ చేసే సాధారణ కారణాలుతక్కువ క్రెడిట్ స్కోర్EMI భారం ఎక్కువగా ఉండటంఆదాయానికి సరిపడా రీపేమెంట్ సామర్థ్యం లేకపోవడంపత్రాల్లో వ్యత్యాసాలుఉద్యోగం లేదా వ్యాపారంలో స్థిరత్వం లేకపోవడంఆస్తి పత్రాలకు సంబంధించిన సమస్యలుబ్యాంకు అంతర్గత రిస్క్ విధానాలకు సరిపోకపోవడంలోన్ రిజెక్ట్ అయితే ఏం చేయాలి?లోన్ తిరస్కరణ అంటే జీవితాంతం రుణం రాదని కాదు. ముందుగా రిజెక్షన్‌కు గల కారణాన్ని తెలుసుకోవాలి. క్రెడిట్ రిపోర్ట్‌లో పొరపాట్లు ఉంటే సరిచేయాలి. EMI భారం తగ్గించుకోవాలి. అవసరమైతే సహ-దరఖాస్తుదారుని (Co-applicant) చేర్చాలి. మరో బ్యాంకు లేదా హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలో దరఖాస్తు చేయవచ్చు.ఈ ఘటన ఒక విషయాన్ని స్పష్టం చేస్తోంది. హోమ్‌లోన్ మంజూరులో సిబిల్ స్కోర్ మాత్రమే కాదు, బ్యాంకు అంతర్గత రిస్క్ అంచనా కూడా కీలక పాత్ర పోషిస్తుంది. వ్యక్తి ఎంత పెద్ద కంపెనీకి సీఈఓ అయినా, ఎంత ఆదాయం సంపాదిస్తున్నా.. బ్యాంకు రిస్క్ పాలసీలకు సరిపోకపోతే రుణం తిరస్కరించే అవకాశం ఉంటుంది. అందుకే హోమ్‌లోన్‌కు దరఖాస్తు చేసే ముందు క్రెడిట్ స్కోర్‌తో పాటు మొత్తం ఆర్థిక ప్రొఫైల్‌ను బలోపేతం చేసుకోవడం అవసరం. -
కోట్లు ఉన్నా కొరత భావనేనా?
ఆర్థికంగా ఎంత సంపాదించినా, సమాజంలో ఉన్నత స్థానాలకు చేరుకున్నా.. నేటికీ చాలా మంది ధనిక భారతీయ తల్లిదండ్రులు తమ పాత ‘పేదరిక మనస్తత్వం’ (పావర్టీ మైండ్‌సెట్) నుంచి బయటపడలేకపోతున్నారు. గతంలో తాము పడ్డ కష్టాలను, ఆనాటి పరిస్థితులను నేటి పిల్లలపై బలవంతంగా రుద్దడం, ఆ కష్టాలను గొప్పగా కీర్తించడం వల్ల పిల్లల సృజనాత్మకత, భవిష్యత్తు ఎదుగుదల తీవ్రంగా దెబ్బతింటున్నాయని సామాజిక మాధ్యమాల్లో ఒక సరికొత్త చర్చ రేకెత్తింది. ఎక్స్ వేదికగా శంతను అనే యూజర్ పంచుకున్న ఒక సుదీర్ఘమైన పోస్ట్ ప్రస్తుతం చర్చనీయాంశమైంది. మిలియనీర్లుగా ఎదిగినప్పటికీ వారి ఆలోచనా విధానంలో మాత్రం ఇంకా పేదరిక మనస్తత్వం అలాగే ఉండిపోయిందని విశ్లేషించారు.కష్టాలను కీర్తించడం ఆపండిమన దేశంలో చాలా మంది తల్లిదండ్రులు తాము చిన్నప్పుడు ఎంత కష్టపడ్డారో, ఎలా చదువుకున్నారోనని పదే పదే చెబుతుంటారు. ‘మేము ఆ రోజుల్లో ఐదు కిలోమీటర్లు నడిచి వెళ్లాం. ఒక్క పూటే తిని చదువుకున్నాం’ అంటూ గత కాలపు కష్టాలను ఒక గొప్ప విషయంగా చెబుతుంటారు. అయితే, ఈ రోజుల్లో అలాంటి వనరుల కొరత లేకపోయినా.. పిల్లలకు ఆధునిక వసతులను అందుబాటులో ఉంచకుండా వారిని కూడా అదే రీతిలో ఇబ్బంది పెట్టాలని చూడటం ఏమాత్రం సమర్థనీయం కాదని శంతను పేర్కొన్నారు.పెట్టుబడి పెట్టేందుకు వెనుకడుగుఈ మనస్తత్వానికి సంబంధించి ఆయన కొన్ని ప్రధాన అంశాలను ఎత్తిచూపారు. ‘వ్యాపారాల కోసం కోట్లాది రూపాయల టర్నోవర్ చేసే తల్లిదండ్రులు సైతం పిల్లల ఉత్పాదకతను (Productivity) పెంచే కొన్ని వందల రూపాయల విలువైన పెయిడ్ సాఫ్ట్వేర్ యాప్‌లు లేదా ఆన్లైన్ టూల్స్ కొనుగోలు చేయడానికి వెనుకాడుతుంటారు. సంపద ఉన్నప్పటికీ ఖరీదైన ఆరోగ్యకరమైన ఆహారం లేదా సమతుల్య పోషకాహారం తీసుకోవడానికి బదులు.. పాత పద్ధతులనే పాటిస్తూ డయాబెటిస్, విటమిన్ లోపాలు వంటి అనారోగ్య సమస్యలను కొనితెచ్చుకుంటున్నారు. గమ్యస్థానాన్ని త్వరగా చేరుకోవడానికి విమాన ప్రయాణం చేసే స్తోమత ఉన్నా డబ్బు ఆదా చేయాలనే ఉద్దేశంతో గంటల కొద్దీ రైలు ప్రయాణాలకే మొగ్గు చూపుతారు. సమయం కంటే డబ్బే ముఖ్యం అనుకునే ఈ ధోరణి పిల్లల విలువైన సమయాన్ని వృధా చేస్తోంది’ అని శంతను చెప్పారు.పిల్లల ఆత్మవిశ్వాసంపై దెబ్బఈ ‘పేదరిక మనస్తత్వం’ అనేది కేవలం డబ్బు దాచుకోవడానికి మాత్రమే పరిమితం కాకుండా పిల్లల ఆలోచనా పరిధిని కూడా కుంచించుకుపోయేలా చేస్తోంది. ఆర్థిక భద్రత ఉన్నప్పటికీ నిరంతరం అభద్రతా భావంతో బతకడం వల్ల పిల్లలు కొత్త ప్రయోగాలు చేయడానికి, స్టార్టప్‌లు ప్రారంభించడానికి లేదా రిస్క్ తీసుకోవడానికి భయపడుతున్నారు.మారుతున్న కాలంతో పాటు తల్లిదండ్రుల ఆలోచనలు కూడా మారాలి. కష్టం విలువను పిల్లలకు నేర్పించడం అవసరమే, కానీ దానిని మానసిక వేధింపుగా మార్చకూడదు. ఆర్థిక విజయాలు సాధించినప్పుడు ఆ విజయాల ఫలాలను తదుపరి తరానికి అందించి వారిని గ్లోబల్ లీడర్లుగా తీర్చిదిద్దాలే తప్ప.. గత కాలపు ఇబ్బందులను వారిపై రుద్ది వారి రెక్కలను కత్తిరించకూడదని నిపుణులు చెబుతున్నారు.ఇదీ చదవండి: బ్రాండ్ రేస్‌లో దేశీయ దిగ్గజాలు! -
8వ పే కమిషన్.. కనీస వేతనం రూ.54000 కానుందా?
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు నిరీక్షిస్తున్న 8వ వేతన సంఘం సంప్రదింపుల ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. దేశవ్యాప్తంగా దాదాపు 55 లక్షల మంది క్రియాశీల ఉద్యోగులు, 69 లక్షల మంది పెన్షనర్ల ఆర్థిక స్థితిగతులను శాసించే ఈ వేతన సవరణలో ‘ఫిట్మెంట్ ఫ్యాక్టర్’ అత్యంత కీలకమైన అంశంగా మారింది. నేరుగా హెచ్ఆర్ఏ (ఇంటి అద్దె భత్యం)పై ఫిట్మెంట్ ఫ్యాక్టర్ సూత్రం వర్తించనప్పటికీ ఇది ప్రాథమిక వేతనాన్ని పెంచుతుంది. కాబట్టి, దాని ఆధారంగా లెక్కించే హెచ్ఆర్ఏ కూడా పెరగనుంది.ప్రస్తుతం ఉద్యోగ సంఘాలు ఫిట్మెంట్ ఫ్యాక్టర్‌ను గణనీయంగా పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికారిక చర్చలు, తాజా విశ్లేషణల ప్రకారం, ప్రభుత్వం నిర్ణయించే వివిధ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ సినారియోల (2, 2.5, 3) ఆధారంగా ఉద్యోగుల కనీస జీతాలు, హెచ్ఆర్ఏలు ఏ విధంగా మారుతాయో పరిశీలించాల్సి ఉంది.ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఆధారంగా బేసిక్ పే అంచనాలుప్రస్తుతం 7వ వేతన సంఘం కింద కనీస బేసిక్ పే రూ.18,000గా ఉంది. ఒకవేళ ప్రభుత్వం కన్జర్వేటివ్ పద్ధతిలో ఫిట్మెంట్ ఫ్యాక్టర్‌ను 2.0గా నిర్ణయిస్తే కనీస ప్రాథమిక వేతనం రూ.36,000 అవుతుంది.ఒకవేళ మధ్యస్థంగా 2.5గా ఖరారు చేస్తే అది రూ.45,000 కు చేరుతుంది.ఉద్యోగ సంఘాల డిమాండ్లకు అనుగుణంగా గరిష్టంగా దీనిని 3.0కు పెంచితే కనీస వేతనం ఏకంగా రూ.54,000కు పెరిగే అవకాశం ఉంది. ఈ మల్టిప్లైయర్ పెరిగే కొద్దీ ఉద్యోగుల టేక్ హోమ్ శాలరీ ఊహించని రీతిలో పెరుగుతుంది.హెచ్ఆర్ఏపై ప్రభావంప్రస్తుతం నగరాల జనాభాను బట్టి X, Y, Z కేటగిరీలుగా వర్గీకరించి హెచ్ఆర్ఏ రేట్లను ఇస్తున్నారు. నేషనల్ కౌన్సిల్ (ఎన్సీ-జేసీఎం) వంటి వివిధ ఉద్యోగ సంఘాలు పెరిగిన జీవన వ్యయానికి అనుగుణంగా X కేటగిరీ నగరాలకు 36-40% వరకు హెచ్ఆర్ఏ రేట్లను సవరించాలని పట్టుబడుతున్నాయి. ఒకవేళ ప్రస్తుతం ఉన్న హెచ్ఆర్ఏ శాతాలనే ప్రామాణికంగా తీసుకున్నా కొత్త బేసిక్ పే కారణంగా చేతికి వచ్చే మొత్తం మారుతుంది.ఉదాహరణకు లెవెల్-1 ఉద్యోగికి వివిధ సినారియోలలో హెచ్ఆర్ఏ మార్పులు ఇలా ఉండవచ్చు..1. ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2.0: బేసిక్ పే రూ.36,000 అవుతుంది. దీనిపై మెట్రో నగరాల్లో (X కేటగిరీ) లభించే హెచ్ఆర్ఏ సుమారు రూ.10,800 వరకు ఉంటుంది.2. ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2.5: బేసిక్ పే రూ.45,000 అవుతుంది. దీనిపై అదే నగరంలో హెచ్ఆర్ఏ రూ.13,500 కు చేరుకుంటుంది.3. ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 3.0: బేసిక్ పే రూ.54,000కు పెరుగుతుంది. అప్పుడు హెచ్ఆర్ఏ ఏకంగా రూ.16,200 దాటుతుంది.ఇదే సూత్రం లెవెల్-1 నుంచి లెవెల్-13 వరకు ఉన్న అన్ని శ్రేణుల ఉద్యోగులకు వర్తిస్తుంది. ఉన్నత స్థాయి అధికారుల వేతనాలు ఈ నిష్పత్తిలో లక్షల్లో పెరగనున్నాయి. రాబోయే కేంద్ర క్యాబినెట్ సమావేశాల్లో దీనిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికారిక వర్గాల సమాచారం. తుది నిర్ణయం వెలువడే వరకు ఉద్యోగ, పెన్షనర్ల వర్గాల్లో ఈ ఉత్కంఠ కొనసాగుతూనే ఉంటుంది.ఇదీ చదవండి: బంగారం ధరల్లో స్పల్ప ఊరట -
ఇప్పటికే లోన్ ఉండి రెండో లోన్ కోసం చూస్తున్నారా?
మారిన ఆర్థిక అవసరాలు, మారుతున్న జీవనశైలి కారణంగా ప్రస్తుత రోజుల్లో ఒకటి కంటే ఎక్కువ లోన్స్ తీసుకోవడం సాధారణం అయిపోయింది. ఇప్పటికే ఒక హోమ్ లోన్ లేదా కార్ లోన్ కోసం ప్రతినెలా ఈఎంఐ చెల్లిస్తున్న వారు అత్యవసర పరిస్థితుల్లో మరో కొత్త రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చా? ఇప్పటికే చెల్లిస్తున్న ఈఎంఐలు ఉంటే కొత్త లోన్ మంజూరు అవుతుందా? అనే సందేహాలు చాలామందిలో ఉంటాయి. అయితే, ఆర్థిక నిపుణుల విశ్లేషణల ప్రకారం, ఇప్పటికే రుణాలు ఉన్నప్పటికీ కొన్ని నిర్దిష్ట అర్హతలు, నిబంధనలను బట్టి బ్యాంకులు మరో లోన్ ఇచ్చేందుకు మొగ్గు చూపుతాయి. ఆ వివరాలు కింద చూద్దాం.‘ఎఫ్ఓఐఆర్’ నిష్పత్తిబ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు కొత్త రుణం ఇచ్చేటప్పుడు ‘ఫిక్స్డ్ ఆబ్లిగేషన్ టు ఇన్కమ్ రేషియో’ (ఎఫ్ఓఐఆర్) లేదా డెట్-టు-ఇన్కమ్ రేషియోని లెక్కిస్తాయి. మీ మొత్తం నెలవారీ ఆదాయంలో ఇప్పటికే ఉన్న ఈఎంఐలు, ఇతర స్థిర ఖర్చులు ఎంత శాతం ఉంటున్నాయో ఇది తెలియజేస్తుంది. సాధారణంగా బ్యాంకులు ఈ రేషియో 40% నుంచి 50% లోపు ఉండాలని కోరుకుంటాయి. అంటే, మీ జీతం రూ.1,00,000 అనుకుంటే, మీ ప్రస్తుత ఈఎంఐలు రూ.40,000 లోపు ఉంటే, మిగిలిన డిస్పోజబుల్ ఆదాయాన్ని (మిగిలిన జీతాన్ని) బట్టి కొత్త లోన్ పొందేందుకు మీకు అర్హత లభిస్తుంది.సిబిల్ స్కోరు, క్రెడిట్ హిస్టరీఇప్పటికే లోన్ ఉన్నప్పటికీ మీ పాత ఈఎంఐలను ప్రతి నెలా గడువు లోపు ఎలాంటి డిఫాల్ట్స్ లేకుండా క్రమశిక్షణతో చెల్లిస్తుంటే మీ సిబిల్ స్కోరు బలంగా (750 కంటే ఎక్కువ) ఉంటుంది. ఇది మీ ఆర్థిక బాధ్యతను సూచిస్తుంది. ఇలాంటి క్లీన్ రీపేమెంట్ హిస్టరీ ఉన్న కస్టమర్లకు కొత్త లోన్ ఇవ్వడానికి బ్యాంకులు పెద్దగా వెనుకాడవు.టాప్-అప్ లోన్స్ఒకవేళ మీరు కొత్తగా వేరే బ్యాంకులో లోన్ దరఖాస్తు చేసుకోకుండా ఇప్పటికే ఉన్న హోమ్ లోన్ లేదా పర్సనల్ లోన్‌పై టాప్-అప్ రుణం కోసం ప్రయత్నిస్తే అనుమతి సులభంగా లభిస్తుంది. దీనివల్ల డాక్యుమెంటేషన్ ప్రక్రియ వేగంగా పూర్తి కావడమే కాకుండా వడ్డీ రేట్లు కూడా సాధారణ పర్సనల్ లోన్ కంటే తక్కువగా ఉండే అవకాశం ఉంది.లోన్ కాలపరిమితిని పెంచుకోవడంమీ నెలవారీ ఈఎంఐ భారాన్ని తగ్గించుకోవడానికి ప్రస్తుత లోన్ కాలపరిమితిని పొడిగించుకోవచ్చు. దీనివల్ల ప్రతినెలా కట్టే ఈఎంఐ మొత్తం తగ్గి మీ ఎఫ్ఓఐఆర్ మెరుగవుతుంది. ఫలితంగా కొత్త లోన్ అర్హత పెరిగే ఆస్కారం ఉంటుంది.అత్యవసర సమయాల్లోనే..ఒకటి కంటే ఎక్కువ రుణాలు తీసుకోవడం వల్ల ఆర్థిక వెసులుబాటు లభించినప్పటికీ మీ మొత్తం ఆదాయంలో 50 శాతం కంటే ఎక్కువ భాగం ఈఎంఐలకే పోకుండా చూసుకోవడం ముఖ్యం. ఆదాయ వనరులు స్థిరంగా ఉన్నప్పుడు, అత్యవసర సమయాల్లో మాత్రమే క్రెడిట్ పరిమితులను సద్వినియోగం చేసుకోవడం ఉత్తమమైన ఆర్థిక క్రమశిక్షణ అని గుర్తుంచుకోవాలి.ఇదీ చదవండి: ఏఐ ఎందుకో వెనుకబడింది? -
అప్పుల వసూళ్లకూ రూల్స్ ఉన్నాయి!
సమకాలీన ఆర్థిక వ్యవస్థలో వ్యక్తిగత అవసరాల కోసమో, వ్యాపార విస్తరణ కోసమో బ్యాంకులు లేదా నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల (ఎన్బీఎఫ్సీ) నుంచి రుణాలు తీసుకోవడం సాధారణం. అయితే, కొన్ని అనివార్య కారణాల వల్ల సకాలంలో ఈఎంఐలు చెల్లించలేనప్పుడు రికవరీ ఏజెంట్ల నుంచి ఎదురయ్యే వేధింపులు రుణగ్రహీతలను తీవ్ర మానసిక క్షోభకు గురిచేస్తున్నాయి. రుణాన్ని తిరిగి వసూలు చేసుకునే హక్కు ఆర్థిక సంస్థలకు ఉన్నప్పటికీ దానికి చట్టపరమైన పరిమితులు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిర్దేశించిన నిబంధనలు ఉన్నాయి. రుణగ్రహీతలు తమ హక్కుల పట్ల అవగాహన కలిగి ఉండటం ప్రస్తుత తరుణంలో ఎంతో అవసరం.ఆర్బీఐ నిబంధనలు ఏం చెబుతున్నాయి?రికవరీ ఏజెంట్లు రుణగ్రహీతలకు ఫోన్ చేయాలన్నా లేదా వారి ఇంటికి/కార్యాలయానికి వెళ్లాలన్నా ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల లోపు మాత్రమే వెళ్లాలి. అంతకుమించి ఇతర సమయాల్లో ఫోన్లు చేయడం లేదా ఇళ్లపైకి వెళ్లడం ఆర్బీఐ నిబంధనల ప్రకారం ఉల్లంఘనే అవుతుంది.రుణగ్రహీతలను శారీరకంగానో, మానసికంగానో వేధించడం, దూషించడం, బెదిరింపులకు గురిచేయడం పూర్తిగా నిషిద్ధం. సామాజికంగా వారి ప్రతిష్టకు భంగం కలిగించేలా ప్రవర్తించకూడదు.ఒక వ్యక్తి తీసుకున్న రుణం తాలూకు వివరాలను వారి కుటుంబ సభ్యులకు, స్నేహితులకు లేదా సహోద్యోగులకు వెల్లడించి వారిని ఇబ్బంది పెట్టే హక్కు రికవరీ ఏజెంట్లకు లేదు.రుణగ్రహీతను కలిసే ఏజెంట్ కచ్చితంగా సదరు బ్యాంక్ లేదా ఫైనాన్స్ సంస్థ జారీ చేసిన అధికారిక గుర్తింపు కార్డు, అథరైజేషన్ లెటర్‌ను కలిగి ఉండాలి.వేధింపులు ఎదురైతే రుణగ్రహీతలు ఏం చేయాలి?ఏజెంట్లు అసభ్యంగా మాట్లాడినా, బెదిరించినా ఆ ఫోన్ కాల్స్‌ను రికార్డ్ చేయడం లేదా వారి ప్రవర్తనను వీడియో తీయడం వంటి ఆధారాలను భద్రపరుచుకోవాలి. ఇవి భవిష్యత్తులో ఫిర్యాదు చేయడానికి బలాన్ని ఇస్తాయి.రికవరీ ఏజెంట్ల ప్రవర్తనపై మొదట సదరు రుణం ఇచ్చిన బ్యాంక్ లేదా ఫైనాన్స్ సంస్థ ‘గ్రీవెన్స్ రీడ్రెస్సల్ అధికారి’కి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయాలి.బ్యాంక్‌కు ఫిర్యాదు చేసిన 30 రోజుల్లోగా సరైన స్పందన రాకపోయినా లేదా వారు ఇచ్చిన పరిష్కారం సంతృప్తికరంగా లేకపోయినా రుణగ్రహీతలు నేరుగా ఆర్బీఐ ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్‌మన్‌ను ఆశ్రయించవచ్చు.ఆన్లైన్ (cms.rbi.org.in) ద్వారా కూడా సులభంగా ఫిర్యాదు నమోదు చేయవచ్చు. నిబంధనలు ఉల్లంఘించినట్లు రుజువైతే సదరు ఆర్థిక సంస్థలపై ఆర్బీఐ జరిమానాలు విధిస్తుంది.తీవ్రమైన బెదిరింపులు, శారీరక దాడి లేదా వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించే చర్యలు ఎదురైనప్పుడు స్థానిక పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసే హక్కు రుణగ్రహీతకు ఉంటుంది.చివరగా..రుణం తీసుకున్నప్పుడు దానిని తిరిగి చెల్లించాల్సిన నైతిక, చట్టపరమైన బాధ్యత రుణగ్రహీతపై కచ్చితంగా ఉంటుందని గుర్తుంచుకోవాలి. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు బ్యాంకులను సంప్రదించి లోన్ రీస్ట్రక్చరింగ్ లేదా వాయిదాల పొడిగింపు వంటి ప్రత్యామ్నాయాలను కోరవచ్చు. అయితే, కేవలం డిఫాల్టర్ అయినంత మాత్రాన ఒక వ్యక్తి తన ఆత్మగౌరవాన్ని, ప్రాథమిక హక్కులను కోల్పోతాడని అర్థం కాదు. చట్టం పరిధిలోనే రికవరీ ప్రక్రియ జరగాలి. ఆర్థిక క్రమశిక్షణ ఎంత ముఖ్యమో, మన హక్కుల పట్ల అవగాహన కలిగి ఉండటం కూడా అంతే ముఖ్యం.ఇదీ చదవండి: ఏఐ ఎందుకో వెనుకబడింది? -
విదేశీ ప్రయాణానికి సిబిల్ స్కోరు అడ్డొస్తుందా?
విదేశాలకు వెళ్లాలనేది చాలా మంది కల. అయితే వీసా ప్రక్రియ అనగానే డాక్యుమెంట్లు, ఇంటర్వ్యూలు, ముఖ్యంగా బ్యాంక్ బ్యాలెన్స్ వివరాల చుట్టూ ఎన్నో అనుమానాలు, భయాలు రేకెత్తుతుంటాయి. ఈ మధ్యకాలంలో చాలా మందిలో ఒక కొత్త సందేహం మొదలైంది. ‘నా సిబిల్ స్కోరు తక్కువగా ఉంది. దీనివల్ల నా వీసా రిజెక్ట్ అవుతుందా?’ అనే అనుమానం చాలా మందిలో ఉంది. నిపుణులు తెలుపుతున్న వివరాల ప్రకారం.. దీనికి సంబంధించిన అంశాలు కింద చూద్దాం.ఇమిగ్రేషన్ అధికారులకు ‘సిబిల్’తో పని ఉందా?మనం బ్యాంకుల నుంచి లోన్లు తీసుకోవాలన్నా, క్రెడిట్ కార్డులు కావాలన్నా సిబిల్ స్కోరు కీలకం. కానీ, విదేశీ రాయబార కార్యాలయాలు (ఎంబసీ) లేదా ఇమిగ్రేషన్ అధికారులు మీ వీసా దరఖాస్తును పరిశీలించేటప్పుడు మీ సిబిల్ రిపోర్టును లాగిన్ చేసి చూడరని గమనించాలి. భారతదేశంలో కానీ, అంతర్జాతీయంగా కానీ వీసా మంజూరు ప్రక్రియలో సిబిల్ స్కోరును ఒక ప్రామాణిక అర్హతగా ఎక్కడా చేర్చలేదు. అమెరికా, యూకే, కెనడా లేదా యూరప్ దేశాల వీసా నిబంధనల్లో సిబిల్ స్కోరు కనీసం ఇంత ఉండాలనే రూల్ ఎక్కడా లేదు.వీసా ఆఫీసర్లు అసలు ఏం చూస్తారు?విదేశీ రాయబార కార్యాలయాలు మీ క్రెడిట్ స్కోరును కాకుండా, మీ ఆర్థిక స్థిరత్వాన్ని, స్వదేశంతో ఉన్న అనుబంధాన్ని నిశితంగా పరిశీలిస్తాయి. వారి ప్రధాన ఉద్దేశాలు ఇవే..మీరు వెళ్తున్న దేశంలో ఖర్చులను మీరే భరించగలరా? (దీని కోసం గత 6 నెలల బ్యాంక్ స్టేట్మెంట్లు, ఐటీఆర్ కాపీలు, శాలరీ స్లిప్స్ చూస్తారు).మీ పర్యటన ముగిసిన తర్వాత తిరిగి మీ సొంత దేశానికి వచ్చేస్తారా లేదా అక్కడే ఉండిపోతారా? (దీని కోసం మీ ఉద్యోగ వివరాలు, వ్యాపారాలు, లేదా ఇక్కడున్న ఆస్తుల పత్రాలను తనిఖీ చేస్తారు).జాతీయ భద్రత, పౌరసత్వం లేదా అత్యంత సున్నితమైన బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ జరిగే కొన్ని అరుదైన సందర్భాల్లో మినహా సాధారణ ట్రావెల్, స్టూడెంట్ లేదా బిజినెస్ వీసాల కోసం క్రెడిట్ స్కోరును స్క్రూటినీ చేయరు.క్రెడిట్ స్కోరు ఎప్పుడు ప్రభావం చూపుతుంది?డైరెక్ట్‌గా సిబిల్ స్కోరు అవసరం లేకపోయినా పరోక్షంగా కొన్ని సందర్భాల్లో ఇది మీకు అవసరపడవచ్చు.మీరు విదేశాల్లో చదువుకోవడానికి స్టూడెంట్ వీసా అప్లై చేస్తుండవచ్చు. దానికి ఫండ్స్ చూపించడానికి బ్యాంక్ లోన్ తీసుకోవాల్సి వస్తే బ్యాంకులు మీ సిబిల్ స్కోరు ఆధారంగానే లోన్ ఇస్తాయి. లోన్ శాంక్షన్ అయితేనే వీసాకు అవసరమైన ఫండ్స్ ప్రూఫ్ దొరుకుతుంది.మంచి క్రెడిట్ స్కోరు (750 కంటే ఎక్కువ) ఉన్నవారి బ్యాంక్ స్టేట్మెంట్లు సాధారణంగా క్లీన్‌గా ఉంటాయి. అనవసరపు బకాయిలు, బౌన్స్ అయిన ఈఎంఐలు లేకపోవడం వల్ల బ్యాంక్ అకౌంట్ హెల్తీగా కనిపిస్తుంది. వీసా అధికారులు మీ బ్యాంక్ స్టేట్మెంట్ను క్షుణ్ణంగా చూస్తారు కాబట్టి, క్లీన్ ఫైనాన్షియల్ హిస్టరీ మీకు ప్లస్ అవుతుంది.వీసా దరఖాస్తుదారులు చేయాల్సింది ఇదే..అప్పటికప్పుడు బంధువుల దగ్గరో, స్నేహితుల దగ్గరో పెద్ద మొత్తంలో డబ్బులు అకౌంట్లో వేయిస్తే వీసా అధికారులు అనుమానిస్తారు.మీ ఉద్యోగ నియామక పత్రం, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, గత 2-3 ఏళ్ల ఐటీ రిటర్న్స్ ఫైల్స్ అన్నీ పక్కాగా సిద్ధం చేసుకోండి.ఇంటర్వ్యూలో అడిగే ప్రశ్నలకు ఎక్కడా తడబడకుండా మీ ప్రయాణ ఉద్దేశాన్ని స్పష్టంగా వివరించండి.మీ సిబిల్ స్కోరు 600 ఉన్నా, 800 ఉన్నా వీసా ఆఫీసర్‌కు అనవసరం. వారికి కావలసిందల్లా మీ దగ్గర ప్రయాణానికి తగినన్ని డబ్బులు ఉన్నాయా, మీరు చట్టబద్ధంగా ప్రయాణిస్తున్నారా, మీ పర్యటన ముగిశాక క్షేమంగా దేశం తిరిగి వస్తారా లేదా అనేది మాత్రమే. కాబట్టి అనవసరపు భయాలు వీడి, డాక్యుమెంటేషన్‌ను పక్కాగా సిద్ధం చేసుకోండి.ఇదీ చదవండి: బంగారం కొనాలా? వద్దా? -
ఈక్విటీ ఫండ్స్‌లోకి మళ్లీ పెట్టుబడుల జోరు
న్యూఢిల్లీ: భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం, దేశీయంగా స్థూల ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉండటం తదితర అంశాల ఊతంతో జూన్‌లో ఈక్విటీ ఆధారిత మ్యూచువల్ ఫండ్ స్కీముల్లో మదుపరులు భారీగా ఇన్వెస్ట్ చేశారు. ఈ ఏడాది మే నెలలో నమోదైన రూ.22,908 కోట్లతో పోలిస్తే 26.5% అధికంగా రూ. 28,973 కోట్లు వచ్చాయి. నెలవారీ సిప్‌లు రూ. 30,954 కోట్ల నుంచి రూ.31,781 కోట్లకు ఎగిశాయి. దీనితో ఈ ఏడాది ప్రథమార్ధంలో ఈక్విటీ స్కీముల్లోకి రూ.1.81 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్లయింది.2025 ప్రథమార్ధంలో నమోదైన రూ.1.61 లక్షల కోట్లతో పోలిస్తే ఇది 12% అధికం. మ్యూచువల్ ఫండ్స్ సంస్థల సమాఖ్య యాంఫీ విడుదల చేసిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. వీటి ప్రకారం జూన్‌లో ఫండ్స్ నుంచి ఉపసంహరణలు రూ.64,131 కోట్ల నుంచి రూ.52,949 కోట్లకు తగ్గాయి. పరిశ్రమ నిర్వహణలోని ఆస్తుల పరిమాణం మే నెలలో రూ. 81.6 లక్షల కోట్లుగా ఉండగా జూన్ ఆఖరు నాటికి రూ. 82,.22 లక్షల కోట్లకు పెరిగింది.మార్కెట్ సెంటిమెంటు మెరుగుపడటం, స్థూల ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయన్న ఆశావహ అంచనాలు నెలకొనడం, రిటైల్ ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టడాన్ని కొనసాగించడంలాంటి అంశాలు ఇందుకు దోహదపడినట్లు మారి్నంగ్‌స్టార్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ ఇండియా సీనియర్ అనలిస్ట్ నేహల్ మేష్రామ్ తెలిపారు. జూన్‌లో పెట్టుబడులు పెరగడాన్ని చూస్తే, మే నెలలో అమ్మకాలను తాత్కాలిక ధోరణిగా, వ్యూహాత్మక లాభాల స్వీకరణగా భావించవచ్చని పేర్కొన్నారు.యాంఫీ నివేదికలో మరిన్ని విశేషాలుఈక్విటీ కేటగిరీకి సంబంధించి మిడ్ క్యాప్ ఫండ్స్‌లోకి అత్యధికంగా రూ.6,090 కోట్లు, స్మాల్ క్యాప్స్‌లోకి రూ.5,602 కోట్లు, ఫ్లెక్సీ క్యాప్స్‌లోకి రూ.5,231 కోట్లు, లార్జ్ క్యాప్స్‌లోకి రూ.2,067 కోట్లు వచ్చాయి. డివిడెండ్ ఈల్డ్ ఫండ్స్, ఈక్విటీ ఆధారిత సేవింగ్స్ స్కీముల్లో (ఈఎల్ఎస్ఎస్) పెట్టుబడులను ఇన్వెస్టర్లు కొంత ఉపసంహరించుకున్నారు. గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్)లో నికరంగా రూ.3,443 కోట్లు ఇన్వె స్ట్ చేశారు. మేలో ఈ ఫండ్స్ నుంచి ఇన్వెస్టర్లు రూ.725 కోట్లు వెనక్కి తీసుకున్నా రు. ఈ ఏడాది ప్రథమార్ధంలో గోల్డ్ ఈటీఎఫ్‌లలోకి రూ.37,319 కోట్లు వచ్చాయి. -
ఈసారి బంగారం, వెండి కాదు! కియోసాకి కొత్త సూచన
ప్రపంచ ఆర్థిక మార్కెట్లలో కొనసాగుతున్న అనిశ్చితి, బంగారం ధరల్లో తీవ్ర ఒడిదుడుకుల నేపథ్యంలో ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ రచయిత రాబర్ట్ కియోసాకి మరోసారి చర్చనీయాంశంగా మారారు. అయితే ఈసారి ఆయన ఇన్వెస్టర్లకు బిట్‌కాయిన్, బంగారం లేదా వెండి కొనాలని కాకుండా.. ఒక పుస్తకం తప్పనిసరిగా చదవాలని సూచించడం విశేషం.ఇటీవల సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో చేసిన పోస్టులో మిక్కీ ఎం. మైనీ రచించిన 'ది ఎంట్రోపీ ట్రాప్' (The Entropy Trap) పుస్తకాన్ని ప్రస్తుత కాలంలో తప్పనిసరిగా చదవాల్సిన గ్రంథంగా పేర్కొన్నారు. ఈ పుస్తకానికి ప్రముఖ ఆర్థికవేత్త ‘జిమ్ రికార్డ్స్’ ముందుమాట రాశారని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో రాబోయే నిర్మాణాత్మక మార్పులను అర్థం చేసుకోవడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని కియోసాకి అభిప్రాయపడ్డారు.'నమ్మకంపై ఆధారపడిన ఆస్తులకు ప్రమాదం'ఈ పుస్తకం ప్రధానంగా "నమ్మకంపై ఆధారపడిన ఆస్తులు" (Trust-based Assets) భవిష్యత్తులో ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశాలపై చర్చిస్తుందని కియోసాకి తెలిపారు. అమెరికా ప్రభుత్వ బాండ్లు, ఈటీఎఫ్‌లు (ETFs), మ్యూచువల్ ఫండ్లు వంటి పెట్టుబడి సాధనాలు పూర్తిగా వ్యవస్థపై విశ్వాసంపై ఆధారపడి ఉన్నాయని, ఆ విశ్వాసం దెబ్బతింటే వాటి విలువ కూడా తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఇవి కియోసాకి వ్యక్తిగత అభిప్రాయాలేనని, వాటికి స్వతంత్ర ఆర్థిక ఆధారాలు లేవని గుర్తుంచుకోవాలి.'నేటి ధనవంతులే రేపటి పేదలు కావచ్చు'పాత ఆర్థిక నియమాలను మాత్రమే నమ్ముతూ పెట్టుబడులు పెట్టేవారు భవిష్యత్తులో నష్టపోయే ప్రమాదం ఉందని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో జరుగుతున్న మార్పులను ముందుగానే అర్థం చేసుకునే వారే రేపటి సంపన్నులవుతారని కియోసాకి తన పోస్టులో పేర్కొన్నారు. "సమాచారమే అసలు సంపద" అనే సందేశాన్ని ఆయన మరోసారి నొక్కిచెప్పారు.కొద్ది రోజుల క్రితమే బంగారం ధరలపై తన స్వల్పకాలిక అంచనా తప్పిందని కియోసాకి బహిరంగంగా అంగీకరించారు. బంగారం ఇంకా పడిపోతోందని, మార్కెట్లలో ఇలాంటి హెచ్చుతగ్గులు సహజమేనని పేర్కొన్నారు. అయినప్పటికీ, వచ్చే ఐదేళ్లలో బంగారం ఔన్స్‌కు 35,000 డాలర్ల స్థాయికి చేరుతుందన్న తన దీర్ఘకాలిక అంచనాను మాత్రం మార్చలేదు.VIB: Very Important BOOK.Best most important new book for this time in history became available on Amazon last week.WHY: is book so important.?A: Because book explains why today’s Rich will become tomorrows poor.WHY: Because the informed will be tommorrow’s ULTRA…— Robert Kiyosaki (@theRealKiyosaki) July 7, 2026 -
పసిడి రుణాలు టాప్
కోల్‌కతా: దేశీయంగా పసిడి రుణాలకు డిమాండ్ గణనీయంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో, సెక్యూరిటైజేషన్ మార్కెట్లో వాహన రుణాల విభాగాన్ని బంగారం రుణాల విభాగం అధిగమించింది. క్రిసిల్ రేటింగ్స్ నివేదికలో ఇది వెల్లడైంది.క్యూ1లో సెక్యూరిటైజేషన్ పరిమాణంలో గోల్డ్ లోన్స్ వాటా 31 శాతంగా ఉండగా, వాహన రుణాల వాటా 26 శాతంగా నమోదైంది. మార్టిగేజ్ ఆధారిత సెక్యూరిటైజేషన్ పరిమాణం 12 శాతంగా, బిజినెస్ లోన్ సెక్యూరిటైజేషన్ 10 శాతంగా, మైక్రోఫైనాన్స్ రుణాలు 14 శాతంగా రికార్డయ్యాయి. ఆర్థిక సంస్థలు తామిచ్చిన రుణాలను పూలింగ్ చేసి ఇతర ఇన్వెస్టర్లకు విక్రయించి, తదుపరి మరిన్ని రుణాలివ్వడానికి అవసరమైన నిధులను సమకూర్చుకోవడాన్ని సెక్యూరిటైజేషన్‌గా వ్యవహరిస్తారు.ఇలాంటి ఇష్యూలు ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో 22 శాతం పెరిగి రూ. 60,000 కోట్లకు చేరినట్లు క్రిసిల్ రేటింగ్స్ పేర్కొంది. ఇందులో 98 శాతం ఇష్యూలను నాన్–బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలే (ఎన్బీఎఫ్సీ) జారీ చేశాయి. గతంలో ఇందుకు భిన్నంగా సింహభాగం వాటా బ్యాంకులది ఉండేది. -
స్మాల్క్యాప్ల కొత్త ర్యాలీ.. మారుతున్న మార్కెట్ సైకిల్స్!
మెజారిటీ రిటైల్ ఇన్వెస్టర్లకు పెట్టుబడుల విషయంలో ఇటీవలి రాబడులే ప్రామాణికం. ఏ విభాగం ర్యాలీ చేస్తుంటే, అటు వైపే దూకుడుగా వెళుతుంటారు. కానీ, ఏ ఒక్క విభాగం కూడా నాన్‌స్టాప్‌గా అన్ని వేళలా ర్యాలీ చేయదన్న వాస్తవం ఎంత మందికి తెలుసు..?ఏడాది పాటు రాబడుల్లేక విసిగించిన స్మాల్‌క్యాప్ ఫండ్స్, మళ్లీ ఇటీవలి కాలంలో ర్యాలీతో అదరగొడుతున్నాయి. లార్జ్‌క్యాప్ కంటే అధిక రాబడులతో మురిపిస్తున్నాయి. ఏడాది కాలంలో 20 శాతానికి పైనే రాబడులు ఇచ్చిన స్మాల్క్యాఫ్ పథకాలు ఎన్నో. ఈ కాలంలో లార్జ్క్యాఫ్ ఫండ్స్ సానుకూల రాబడులతో సరిపెట్టాయి. ఇలా ఏడాది, రెండేళ్లు లేదా మూడేళ్ల కాల రాబడులను ఆధారంగా చేసుకుని పెట్టుబడులను మార్చుకుంటూ వెళ్లడం మంచి ధోరణి కాదన్నది నిపుణుల హెచ్చరిక.ఎందుకంటే ప్రతి కొన్నేళ్లకొకసారి లార్జ్‌క్యాప్, మిడ్‌క్యాప్-స్మాల్‌క్యాప్ మధ్య పనితీరులో ఈ మార్పులు సహజం. తమ పెట్టుబడుల లక్ష్యం, కాల వ్యవధి, ఎంత మేర రిస్క్ తీసుకోగలరు? వీటి ఆధారంగానే కేటాయింపులు ఉండేలా చూసుకోవాలి. అప్పుడే అనుకున్న ఫలితాలు సాధించగలరు. స్మాల్‌క్యాప్స్ ర్యాలీకి కారణాలు?2020 నుంచి 2024 మధ్యకాలంలో (కరోనా సమయంలో మార్కెట్ పతనం తర్వాత నుంచి) స్మాల్‌క్యాప్ స్టాక్స్ బ్రహ్మాండమైన ర్యాలీ చేశాయి. దీంతో వాటి విలువలు అసాధారణ స్థాయికి (గరిష్ట స్థాయికి) చేరిపోయాయి.ఫలితంగా 2025లో వీటిల్లో దిద్దుబాటు ఎక్కువగా కనిపించింది. ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను విక్రయించి లాభాలు తీసుకునేందుకు ఆసక్తి చూపించారు.ఈ పరిణామాలతో 2025లో చాలా స్మాల్‌క్యాప్ ఫండ్స్‌లో రాబడులు కాదు కదా నష్టాలు దర్శనమిచ్చాయి. కొన్నింటిలో లాభాలు నమోదైనా, అవి ఒక అంకెను మించలేదు.ఇన్వెస్టర్ల అమ్మకాలతో వీటి విలువలు ఆకర్షణీయ స్థాయిలకు దిగొ చ్చాయి. అప్పటివరకు ఉన్న అసాధారణ విలువలు ఆవిరయ్యాయి.దీర్ఘకాలం కోసం పెట్టుబడులు పెట్టేవారు, సంస్థాగత ఇన్వెస్టర్లు క్రమంగా స్మాల్ స్టాక్స్‌లో కొనుగోళ్లు మొదలుపెట్టారు.చిన్న, మధ్యస్థాయి విభాగంలో కొన్ని రంగాల కంపెనీలు ఈ కాలంలోనూ పటిష్ట పనితీరుతో బలంగా నిలిచాయి. ముఖ్యంగా తయారీ, రక్షణ, క్యాపిటల్ గూడ్స్, రైల్వే, ఈఎంఎస్, ఇండ్రస్టియల్స్ కంపెనీల్లో మ్యూచువల్ ఫండ్స్ తమ పెట్టుబడులను పెంచుకున్నాయి.ఇక ప్రతి నెలా సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో స్మాల్, మిడ్‌క్యాప్ స్టాక్స్ పథకాల్లోకి రూ.6–7 వేల కోట్లకు పైనే పెట్టుబడులు వచ్చాయి. దీంతో ఫండ్ మేనేజర్లు కరెక్షన్ సమయంలో నాణ్యమైన కంపెనీల్లో వాటాలు పెంచుకున్నారు.దీర్ఘకాలంలో ఇలా స్టాక్స్ విలువలు గరిష్టాలకు చేరడం, తర్వాత దిద్దుబాటుకు లోను కావడం.. అక్కడి నుంచి మళ్లీ ర్యాలీబాట పట్టడం ప్రతి 2–5 ఏళ్లకు ఒకసారి తప్పకుండా కనిపిస్తుంటుంది. అందుకే దీర్ఘకాలం కోసం పెట్టుబడులు పెట్టేటప్పుడు ప్రతి విభాగానికి నిర్ణీత మొత్తాన్ని కేటాయించుకుని, స్థిరంగా కొనసాగించడం సంపద సృష్టికి కీలకం.ఐదేళ్లలో ఏం జరిగింది➤2020: కరోనా వైరస్ రాకతో రేపు ఏం జరుగుతోందన్న భయంతో అమ్మకాలు వెల్లువెత్తాయి. దీంతో బ్యాలెన్స్ షీట్ల పరంగా సున్నితంగా ఉండే స్మాల్‌క్యాప్ కంపెనీల షేర్ల ధరలు 40–80 శాతం మధ్య పడిపోయాయి. ➤2021: కరోనా విపత్తు నుంచి ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించేందుకు కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ ఎన్నో ఉద్దీపన చర్యలను ప్రకటించాయి. దీంతో ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకున్నాయి. ఎలా పడ్డాయో అదే మాదిరి స్టాక్స్ మళ్లీ రికవరీ చూశాయి. దీంతో స్మాల్‌క్యాప్ ఫండ్స్ ఏడాది కాలంలోనే 50–80% రాబడులను అందించాయి. ➤2022: లిక్విడిటీ మితిమీరిపోవడంతో ఆర్బీఐ కీలక రేట్ల పెంపును మొదలు పెట్టింది. దీంతో లార్జ్‌క్యాప్ కంపెనీలు మెరుగైన ప్రదర్శన చేశాయి. లిక్విడిటీ తగ్గితే చిన్న కంపెనీలకు ఆకర్షణ తగ్గుతుంది.➤2023-24: తయారీ, మూలధన వ్యయాల బూమ్ మొదలైంది.రక్షణ, రైల్వే, ప్రభుత్వరంగ సంస్థలు, ఈఎంఎస్, ఇన్ఫ్రా స్టాక్స్ మంచి ర్యాలీ చేశాయి.మరోసారి స్మాల్‌క్యాప్ స్టాక్స్ లైమ్‌లైట్‌లోకి వచ్చాయి.ఇవన్నీ చూసి స్మాల్‌క్యాప్ ఫండ్స్‌లోకి పెట్టుబడుల రాక కూడా గణనీయంగా పెరిగిపోయింది.స్మాల్‌క్యాప్ స్టాక్స్ పెరిగిపోవడంతో వాటి విలువలపై ఆందోళన మొదలైంది. నిపుణుల హెచ్చరికలు రావడం మొదలైంది.దీంతో దిద్దుబాటు చోటుచేసుకుంది. స్మాల్‌క్యాప్ స్టాక్స్ పడిపోవడం చూసి రిటైల్ ఇన్వెస్టర్లు ఆందోళన చెందారు. ఇది అమ్మకాలను మరింత పెంచింది.➤2026: ఆకర్షణీయమైన స్థాయిల నుంచి స్మాల్‌క్యాప్ స్టాక్స్‌లో రికవరీ మొదలైంది. పశ్చిమాసియా ఘర్షణలు తగ్గడం కలిసొచ్చింది.లార్జ్‌క్యాప్ కంటే స్మాల్‌క్యాప్ వైపే ఇన్వెస్టర్ల మొగ్గు కనిపించింది. దీంతో వాటి రాబడులు మెరుగయ్యాయి.ఇటీవలి మూడు నెలల కాలంలో వీటి రాబడులు సానుకూలంగా ఉండడం గమనించొచ్చు.ఇన్వెస్టర్ల కర్తవ్యం..2020: లార్జ్‌క్యాప్స్ ఆకర్షణీయం2021–24: స్మాల్‌క్యాప్స్ ర్యాలీ2025: వీటిల్లో దిద్దుబాటు2026: తిరిగి స్మాల్‌క్యాప్స్‌లో రికవరీఅందుకే ఇన్వెస్టర్లు ఏడాది కాలం పనితీరు ఆధారంగా ఫండ్స్‌ను ఎంపిక చేసుకోవడం సరికాదు.వివిధ మార్కెట్ సైకిల్స్‌లో స్థిరమైన పనితీరు, పోర్ట్‌ఫోలియో నాణ్యత, ఫండ్ మేనేజర్‌కు ఉన్న ట్రాక్ రికార్డు (పనితీరు చరిత్ర), రిస్క్, పెట్టుబడుల కాల వ్యవధి ఆధారంగా ఫండ్స్‌ను ఎంపిక చేసుకోవాలి. 7–10 ఏళ్ల కాలం అంతకుమించిన లక్ష్యాల కోసం సిప్ రూపంలో మెరుగైన స్మాల్‌క్యాప్ ఫండ్స్‌లో పెట్టుబడులతో సంపద సృష్టి సాధ్యమే.కొంచెం రాబడి తక్కువ అయినా ఫర్వాలేదు స్థిరత్వం కావాలని కోరుకునే వారు, లార్జ్‌క్యాప్ లేదా ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్ వెంట వెళ్లొచ్చు.లార్జ్‌క్యాప్‌లో బలహీనత ఎందుకు?లార్జ్‌క్యాప్ ఫండ్స్ ప్రధానంగా నిఫ్టీ 50, సెన్సెక్స్ కంపెనీల్లోనే పెట్టుబడులు పెడతాయి.ఈ ప్రధాన సూచీల్లో ఐటీ, బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ, ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీలకు వెయిటేజీ ఎక్కువగా ఉంది.ఏఐ రాకతో ఐటీ కంపెనీల భవిష్యత్‌పై అనిశ్చితి నెలకొంది. పశ్చిమాసియా సంక్షోభంతో ఆయిల్ అండ్ గ్యాస్ స్టాక్స్ వైపు ఇన్వెస్టర్లు ముఖం చాటేశారు.వీటిల్లో చాలా స్టాక్స్‌లో సంస్థాగత ఇన్వెస్టర్ల ప్రాతినిధ్యం ఇప్పటికే గణనీయంగా ఉంది. ఈ పరిణామాలతో లార్జ్‌క్యాప్ ఫండ్స్ రాబడులు పరిమితంగానే ఉన్నాయి.వచ్చే రెండేళ్లలో.. ఆదాయాల్లో అదే జోరు..కంపెనీల ఆదాయాలు, నిర్వహణ లాభాలు ఇక ముందూ బలంగానే వృద్ధి చెందితే స్మాల్‌క్యాప్ ఫండ్స్ మెరుగైన ప్రదర్శన కొనసాగుతుంది.రాబడులు మాత్రం 2021–24 మధ్య కాలంలో వచ్చినంత స్థాయిలో ఉండవు. మోస్తరు డబుల్ డిజిట్ రాబడులు (12–16 శాతం) ఉండొచ్చన్నది నిపుణుల అంచనా.అంతర్జాతీయంగా అనిశ్చితులు పెరిగితే..యూఎస్‌లో వడ్డీ రేట్లు గరిష్టాల్లో కొనసాగడం, ఇక్కడి నుంచి ఇంకా పెరుగుతూ వెళ్లడం, భౌగోళిక రాజకీయ ఘర్షణలు, వృద్ధి బలహీనత కొనసాగితే స్మాల్‌క్యాప్‌నకు సానుకూలం కాదు.ఇన్వెస్టర్లు స్మాల్‌క్యాప్ నుంచి భద్రత కోసం లార్జ్‌క్యాప్ స్టాక్స్ వైపు మళ్లొచ్చు. అనిశ్చితుల్లో సంస్థాగత ఇన్వెస్టర్లు బ్లూచిప్ కంపెనీలకే ప్రాధాన్యం ఇస్తుంటారు. దాంతో లార్జ్‌క్యాప్ ఫండ్స్‌లో ర్యాలీ చూడొచ్చు.ఎంపిక చేసిన కంపెనీల్లో ర్యాలీ..ఇలాంటి పరిస్థితుల్లో ఫండ్ మేనేజర్లు ఎంపిక చేసిన కంపెనీలకే పెట్టుబడుల పరంగా ప్రాధాన్యం ఇస్తుంటారు.బలమైన క్యాష్ ఫ్లో, తక్కువ రుణ భారం, ఆదాయం, లాభాల్లో స్థిరమైన వృద్ధి, వ్యాల్యుయేషన్స్ సహేతుక స్థాయిలో ఉన్న వాటివైపు మొగ్గుచూపిస్తారు.దీంతో స్మాల్క్యాప్లోనే కొన్ని ఫండ్స్ మెరుగైన రాబడులు ఇస్తే, కొన్ని ఢీలాపడొచ్చు. -
ITR ఫైలింగ్‌కు మూడు మార్గాలు!
ఈ నెలాఖరులోపల మీరందరూ మీ మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్నులు దాఖలు చేయాలి. అంటే గడువు తేదీ 2026 జూలై 31. ఆన్లైన్లో వేయాలంటే ఆ రోజు అర్ధరాత్రి 12 గంటల లోపల ఫైల్ చేయాలి.గతంలో ఎన్నోసార్లు రిటర్ను వేయడానికి కావాల్సిన సమాచారం గురించి, కాగితాలు-డాక్యుమెంట్ల ఆవశ్యకత గురించి మనం తెలుసుకున్నాం. రంగంలోకి దిగే ముందు మీకు మూడు ఆప్షన్లు ఉంటాయి. అవేంటంటే..మొదటిది.. మీ రిటర్ను మీరే దాఖలు చేసుకోవచ్చు. మీ కేసు ట్యాక్స్ ఆడిట్ కాకపోతే మీ వ్యవహారాలకు ఎటువంటి ఆడిట్ అక్కర్లేదు. ఆడిట్ రిపోర్టు ప్రశ్న ఉండదు. పాత చట్టం ప్రకారం ఫారం 16, 16ఏ, ఫారం 26ఏఎస్ .. మొదలైన క్యాపిటల్ గెయిన్స్ స్టేట్మెంట్, ఇతర సర్టిఫికెట్లు, రెడీగా పెట్టుకోండి. కరెక్ట్ ఫారం ఎంచుకోండి. లాగిన్ అవ్వండి. ఇది ప్రీ-ఫిల్డ్ ఫారం. మీరు ఓపెన్ చేయగానే ‘సమాచారం’ అప్పటికే నింపి ఉంటుంది. అది కరెక్ట్ అయితే ఓకే.. లేదా విభేదించి కరెక్టు సమాచారం నింపుతూ వెళ్లండి. రిటర్న్ ఫైలింగ్ సాఫీగా జరిగిపోవచ్చు. మీకు ఖర్చులేమీ ఉండవు. అంతా మీ చేతిలోనే.. ఫారం 1 వరకు ఫర్వాలేదు.రెండోది. ఇన్‌కంట్యాక్స్ ప్రాక్టీషనర్ల దగ్గరికి వెళ్తే వారు మీ తరఫున పోర్టల్‌లోకి వెళ్లి, లాగిన్ చేసి, మీరు చేయవలసినవన్నీ చకచకా చేసేస్తారు. ఫీజులు తక్కువగా ఉంటాయి. ఫారం 1, ఫారం 2 వరకు బాగానే ఫైలింగ్ చేస్తారు.మూడో కేటగిరీ.. వృత్తి నిపుణులు.. అంటే.. సీఏలు, కాస్ట్ అకౌంటెంట్లు, కొంత మంది కంపెనీ సెక్రటరీలు, సీనియర్ లాయర్లు.. వీరు కూడా మీ తరఫున మీ ఆదాయపు పన్ను రిటర్నులు వేస్తారు. వీరికి సబ్జెక్టు మీద పట్టు, ప్రతిభా పాటవాలు, అనుభవం, అవగాహన విశ్లేషణ సామర్థ్యాలు విశేషంగా ఉంటాయి. ఉన్న నాలుగు అంకెలను నాలుగు కాలమ్‌లలో వేసి, మమ అనిపించి ఒక అక్నాలెడ్జ్మెంట్ తేవడమనేది రిటర్ను వేయడం కాదు.. ఓ కాగితాన్ని డిపార్ట్మెంటు వారికి ఇచ్చి ‘అయ్యింది’ అని చేతులు దులుపుకోవడం కాదు.ముందుగా ఆదాయం ఏమిటో తెలుసుకోవాలి. ప్రతి రశీదు/జమ ఆదాయం కిందికి రాదు. దాన్ని విశ్లేషణ చేయాలి. ఉదాహరణకు: వచ్చిన రసీదు వ్యాపారపరమా – ఇతర సోర్స్ ద్వారా వచ్చిందా? పాత చట్టం ప్రకారం 26ఏఎస్‌లో ప్రతి అంశం, ఏఐఎస్‌లోని ప్రతి అంశం, వీటిని మీ మీ ఆదాయంతో చెక్ చేయాలి. ఒకదానితో ఒకటి సమన్వయం చేయాలి. అప్పు అని నిర్ధారించినా దాని గత చరిత్ర తోడి, నిజానిజాలు తేల్చాలి. పన్నుకి గురి కాని రశీదు, జమ కావొచ్చు. ఉదాహరణకు ప్రావిడెంట్ ఫండ్ క్రెడిట్, జీతాల ఎరియర్స్ అయితే గత సంవత్సరాలు వెనక్కి వెళ్లి, పాత ఆదాయం ఎంత, ఎరియర్స్ ఎంత .. మారిన ఆదాయం ఎంత, పన్ను భారం ఎంత.. చివరికి రిలీఫ్ ఎంత అనేది తేల్చాలి.రెండు.. మూడు లేదా.. అంతకు మించి ఇంటి ప్రాపర్టీలు ఉంటే పెద్ద చిట్టా తయారవుతుంది. ప్రతి ప్రాపర్టీ విషయంలో అంశాలు ఒకే విధంగా ఉండవు. అన్నింటినీ క్రోడీకరించి, సమీకరించాలి. అలాగే క్యాపిటల్ గెయిన్స్.. కొన్న ధర, ఇంప్రూవ్మెంట్ ధర ప్రతీ ఏటా మారే ఇండెక్స్ రేటు.. వ్యవహారంలో మొత్తం నగదు లేకుండా జాగ్రత్త పడటం.. స్టాంప్ పేపర్లు దస్తావేజులు, టైటిల్, ఈ-సీల్, బ్యాంకు లోన్ డాక్యుమెంట్లు.. ఇలా సవాలక్ష.. వీటన్నింటిని విశ్లేషించాలి.విదేశీ ఆస్తులు.. విదేశీ ఆదాయం..ఉద్యోగస్తులకు ఇచ్చే షేర్లు, ఆప్షన్లు, ఎసాప్లు, వాటి అమ్మకం, విలువ, లాభం.. ఇతర అంశాలు ఇవన్నీ తెలుసుకుని, తేల్చి, రిటర్ను వేసిన తర్వాత నోటీసులు రావచ్చు. నోటీసులు, జవాబులు, దిద్దుబాటు, సర్దుబాటు.. అధికారులతో మాట్లాడి లేదా ఆన్లైన్లో సంప్రదించి సరైన జవాబు ఇవ్వడం, నొప్పించక ఒప్పించి, మెప్పించే ప్రయత్నం .. ఇలా ఎన్నో అంశాలు మీరు దృష్టిలో పెట్టుకోవాలి. స్క్రూటినీ దాకా బండి వెళ్లొచ్చు. వీటికి డాక్యుమెంట్లు ముఖ్యం. చట్టం తెలిసి ఉండాలి. అధికారులను కలిసి మాట్లాడాలి.అయితే, వృత్తి నిపుణుల సర్వీసులు పొందడానికి ఎక్కువ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఒక పద్ధతి ప్రకారం.. అంటే ప్రాసెస్ ప్రకారం వెళ్లండి. కప్పదాట్లు ఉండవు. షార్ట్కట్లు, లాంగ్జంప్లు.. హై జంపులు ఉండవు. అన్ని వ్యవహారాల్లోలాగే కాగితాల్లోని అంకెల మేరకే అడుగువేస్తారు. ఆ సర్వీసుల్లో కన్సల్టెన్సీ, ముందు జాగ్రత్తగా ట్యాక్స్ ప్లానింగ్ ఆలోచనలు, సలహాలు ఇలా ఎన్నో ఉంటాయి.. ఏది చేసినా చట్టప్రకారం చేస్తారు. ఏ చర్య అయినా చట్టానికి లోబడే ఉంటుంది. వడ్డీలు లేకుండా, పెనాల్టీలు లేకుండా ముందు జాగ్రత్త తీసుకుంటారు. ఇప్పుడు మీ ఇష్టం. నిర్ణయం మీదే. ఎలా చేసినా.. చట్టప్రకారంగానే ఉండాలని గుర్తుంచుకోవాలి.ట్యాక్సేషన్ నిపుణులు: డా. కందాళ సత్యనారాయణ మూర్తి & కె.వి.ఎన్ లావణ్య -
ఇంటి రుణానికి తొందరగా ఇడుపు కాయితం!.. ఇదో మార్గం
ఇంటి రుణం తీసుకోవడం చాలా మంది జీవితాల్లో అతిపెద్ద ఆర్థిక బాధ్యతల్లో ఒకటి. 15 నుంచి 30 ఏళ్ల వరకు కొనసాగే ఈఎంఐలు కుటుంబ బడ్జెట్‌పై గణనీయమైన ప్రభావం చూపుతాయి. అయితే రుణాన్ని ముందుగానే తీర్చేందుకు ప్రీపేమెంట్లు చేయడం మాత్రమే మార్గం కాదు. ప్రస్తుతం అనేక బ్యాంకులు అందిస్తున్న ‘ఓవర్‌డ్రాఫ్ట్ (OD) లింక్డ్ హోమ్ లోన్’ సదుపాయం కూడా వడ్డీ భారం తగ్గించడంలో సహాయపడుతోంది.ఇలా పని చేస్తుంది..ఈ విధానంలో గృహ రుణాన్ని ఒక పొదుపు లేదా కరెంట్ ఖాతాతో అనుసంధానిస్తారు. రుణగ్రహీత తన వద్ద ఉన్న అదనపు నిధులను ఆ ఖాతాలో ఉంచితే, బ్యాంకు వడ్డీని మొత్తం బకాయి రుణంపై కాకుండా నికర బకాయి మొత్తంపై లెక్కిస్తుంది. ఉదాహరణకు రూ.40 లక్షల రుణ బకాయిపై లింక్డ్ ఖాతాలో రూ.5 లక్షలు ఉంటే, వడ్డీని రూ.35 లక్షలపైనే లెక్కించే అవకాశం ఉంటుంది. దీంతో ప్రతి ఈఎంఐలో వడ్డీ భాగం తగ్గి, అసలు రుణం చెల్లింపునకు ఎక్కువ మొత్తం వెళ్తుంది.ఈ సదుపాయంలోని ప్రధాన ఆకర్షణ ఏమిటంటే, ప్రీపేమెంట్ చేసినట్లుగా డబ్బు శాశ్వతంగా లాక్ అయిపోదు. అత్యవసర పరిస్థితుల్లో లేదా ఇతర అవసరాల కోసం ఆ అదనపు నిధులను తిరిగి ఉపసంహరించుకునే వెసులుబాటు ఉంటుంది. అందువల్ల వ్యాపారులు, ఫ్రీలాన్సర్లు, బోనస్‌లు లేదా ప్రోత్సాహకాలు పొందే ఉద్యోగులు ఈ విధానాన్ని ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారు.అందరికీ సరిపోతుందా?నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఓవర్‌డ్రాఫ్ట్ హోమ్ లోన్ వల్ల కేవలం వడ్డీ పొదుపు మాత్రమే కాదు, రుణ కాలపరిమితి కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అసలు రుణ మొత్తం వేగంగా తగ్గుతుంది. అయితే ఇది ప్రతి ఒక్కరికీ సరిపోదు. నెలాఖరుకు మిగులు నిధులు లేకుండా మొత్తం ఆదాయాన్ని ఖర్చు చేసే వారికి ఈ ఫీచర్ పెద్దగా ఉపయోగపడదు.అయితే రుణగ్రహీతలు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. కొన్ని బ్యాంకులు ఓవర్‌డ్రాఫ్ట్ హోమ్ లోన్లపై సాధారణ గృహ రుణాలతో పోలిస్తే స్వల్పంగా ఎక్కువ వడ్డీ రేట్లు వసూలు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సదుపాయాన్ని ఎంచుకునే ముందు వడ్డీ రేట్లు, ఛార్జీలు, ఉపసంహరణ నిబంధనలు, దీర్ఘకాలిక ప్రయోజనాలను సమగ్రంగా పరిశీలించడం అవసరం.మొత్తానికి, అత్యవసర నిధులను అందుబాటులో ఉంచుకుంటూనే గృహ రుణంపై వడ్డీ భారాన్ని తగ్గించాలని భావించే వారికి ఓవర్‌డ్రాఫ్ట్ లింక్డ్ హోమ్ లోన్ ఒక తెలివైన ఆర్థిక సాధనంగా మారవచ్చు. -
‘రిచ్ డాడ్’ జీవితాన్ని మార్చిన భారతీయ గురువు
ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా చదివే వర్సనల్ ఫైనాన్స్ పుస్తకాలలో ఒకటైన ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ రచయిత రాబర్ట్ కియోసాకి మరోసారి తన ఆలోచనలతో చర్చనీయాంశంగా మారారు. డబ్బు సంపాదించడమే జీవిత పరమావధి కాదని, ప్రతి వ్యక్తి తన జీవితం అసలు ఉద్దేశాన్ని గుర్తించి దాని కోసం పనిచేయాలని ఆయన సూచించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో చేసిన పోస్టు వైరల్‌గా మారింది.కొన్నేళ్ల క్రితం ఓ భారతీయ గురువు చెప్పిన మాట తన జీవితాన్ని పూర్తిగా మార్చిందని కియోసాకి వెల్లడించారు. "మీ శరీరం లక్ష్యం.. మీ ఆత్మ లక్ష్యాన్ని నెరవేర్చడమే" అనే ఆ బోధ అప్పట్లో తనకు పూర్తిగా అర్థం కాలేదని, ఆ సమయంలో తాను కేవలం డబ్బు సంపాదించడంలోనే నిమగ్నమై ఉన్నానని పేర్కొన్నారు. అయితే కాలక్రమేణా తన నిజమైన లక్ష్యం బోధించడమేనని గ్రహించినట్లు చెప్పారు.విద్యార్థి దశలో చదువులో అంతగా రాణించకపోయినా, సాంప్రదాయ విద్యా విధానం తనకు నచ్చకపోయినా, ప్రజలకు ఆర్థిక విజ్ఞానాన్ని అందించడం తన జీవిత ధ్యేయంగా మారిందని కియోసాకి వివరించారు. పాఠశాలల్లో డబ్బు నిర్వహణ గురించి సరైన అవగాహన కల్పించడం లేదనే నమ్మకంతో ఐదు దశాబ్దాల క్రితమే తయారీ రంగాన్ని విడిచి, తన "రిచ్ డాడ్" నుంచి నేర్చుకున్న ఆర్థిక పాఠాలను ప్రజలకు బోధించడం ప్రారంభించానని చెప్పారు. అదే నిర్ణయం తన జీవితాన్ని మార్చిందని పేర్కొన్నారు.చాలామంది జీవితమంతా ఉద్యోగం, సంపాదన, ఆర్థిక ఒత్తిళ్లలోనే గడిపేస్తున్నారని, అందువల్ల తమ అసలు జీవిత లక్ష్యాన్ని గుర్తించలేకపోతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. "మానవాళికి సేవ చేయడానికి నా హృదయం ఏమి చేయాలనుకుంటోంది?" అనే ప్రశ్న ప్రతి ఒక్కరూ తమను తాము వేసుకోవాలని, ఫలితం లేదా డబ్బు గురించి ఆలోచించకుండా ఆ దిశగా అడుగులు వేయాలని సూచించారు. ఆయన ప్రకారం, నిజమైన లక్ష్యంతో చేసే పని చివరికి ఆర్థిక విజయాన్నీ తీసుకువస్తుంది.ప్రారంభంలో తాను ఉచితంగా ఆర్థిక విద్య అందించానని, "పొదుపుదారులు ఓడిపోతారు", "సరైన రుణం సంపదను సృష్టించగలదు" వంటి తన అభిప్రాయాలపై తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నానని కియోసాకి గుర్తు చేశారు. అయినప్పటికీ అదే ప్రయత్నం తర్వాత ప్రపంచవ్యాప్తంగా కోట్ల డాలర్ల వ్యాపారంగా ఎదిగిందని తెలిపారు.అమెరికా పౌరహక్కుల ఉద్యమ నేత మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ మాటలను కూడా కియోసాకి ప్రస్తావించారు. విమర్శలు, వ్యతిరేకత ఎదురైనా తన లక్ష్యాన్ని వదిలిపెట్టని కింగ్‌ను ఉదాహరణగా చూపిస్తూ, చివరగా "మీ ఆత్మ అసలు లక్ష్యం ఏమిటి?" అంటూ తన ఫాలోవర్లకు ప్రశ్న వేశారు.What is your life’s mission?Years ago, I was listening to an Indian Guru who said:“Your body’s mission is to fulfill your spirit’s mission.” His words shook me. At the time my body was busy making money.It took me a long time to figure out what was my spirit’s mission?…— Robert Kiyosaki (@theRealKiyosaki) July 1, 2026 -
‘కొత్త EPF స్కీమ్’ అమల్లోకి.. ఏమి మారిందంటే..
‘సామాజిక భద్రత కోడ్-2020’ అమలులో భాగంగా ‘ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) స్కీమ్-2026’ను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నోటిఫై చేసింది. జూన్ 29న గెజిట్‌లో ప్రచురితమైన ఈ కొత్త నిబంధనలు అదే తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో దాదాపు ఏడు దశాబ్దాలుగా అమల్లో ఉన్న ‘ఈపీఎఫ్ స్కీమ్-1952’ స్థానంలో కొత్త వ్యవస్థ అమల్లోకి వచ్చింది. అయితే ఉద్యోగుల పీఎఫ్ ఖాతాలు, కంట్రిబ్యూషన్ రేట్లు, యూఏఎన్ వంటి కీలక అంశాల్లో ఎలాంటి మార్పులు చేయకుండా, పరిపాలనను మరింత డిజిటల్, పారదర్శకంగా మార్చడంపైనే ప్రభుత్వం దృష్టి పెట్టింది.కంట్రిబ్యూషన్‌లో మార్పు లేదుకొత్త ఈపీఎఫ్ స్కీమ్ అమల్లోకి వచ్చినప్పటికీ ఉద్యోగి, యజమాని(కంపెనీ) చెల్లించే తప్పనిసరి పీఎఫ్ చందా యథాతథంగానే ఉంటుంది. ఉద్యోగి వేతనంలో 12 శాతం, యజమాని నుంచి మరో 12 శాతం చొప్పున పీఎఫ్ ఖాతాలో జమ అవుతుంది. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నోటిఫై చేసిన కొన్ని సంస్థలకు ప్రస్తుతం అమల్లో ఉన్న 10 శాతం కంట్రిబ్యూషన్ విధానమే కొనసాగుతుంది. అలాగే ప్రస్తుతం అమల్లో ఉన్న రూ.15,000 వేతన పరిమితి (వేజ్ సీలింగ్)లో కూడా ఎలాంటి మార్పు చేయలేదు.వాలంటరీ పీఎఫ్‌కు కొనసాగింపుచట్టబద్ధంగా నిర్దేశించిన పీఎఫ్ చందాకు అదనంగా ఉద్యోగులు స్వచ్ఛందంగా ‘వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్’ (VPF)లో మరింత మొత్తం జమ చేసే అవకాశం కొనసాగుతుంది. దీంతో ఎక్కువ పొదుపు చేయాలనుకునే ఉద్యోగులకు కొత్త స్కీమ్ కూడా అదే వెసులుబాటు కల్పించింది.పాక్షిక ఉపసంహరణలపై స్పష్టతవైద్య చికిత్స, ఉన్నత విద్య, వివాహం, గృహ నిర్మాణం, ఇతర అత్యవసర అవసరాల కోసం పీఎఫ్ నుంచి పాక్షికంగా డబ్బు ఉపసంహరించుకునే నిబంధనలను కొత్త స్కీమ్ మరింత స్పష్టంగా పేర్కొంది. అయితే కనీస బ్యాలెన్స్, సభ్యత్వ కాలం వంటి నిర్దిష్ట అర్హతలను పాటించాల్సి ఉంటుంది.డిజిటల్ సేవలకు పెద్దపీటఈపీఎఫ్ నిర్వహణలో డిజిటల్ వ్యవస్థను మరింత బలోపేతం చేయడం కొత్త స్కీమ్ ప్రధాన లక్ష్యంగా ఉంది. ఇకపై ఎలక్ట్రానిక్ ఫైలింగ్స్, ఆన్లైన్ క్లెయిమ్స్, ఈ-పాస్‌బుక్, యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) ఆధారిత సేవలకు ప్రాధాన్యం పెరుగుతుంది. దీంతో క్లెయిమ్‌ల పరిష్కారం వేగవంతం కావడంతో పాటు పారదర్శకత కూడా మెరుగవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.కేంద్రానికి ప్రత్యేక అధికారంమహమ్మారులు, అంటువ్యాధులు లేదా జాతీయ విపత్తుల వంటి అసాధారణ పరిస్థితుల్లో ఈపీఎఫ్ చందా రేటును తాత్కాలికంగా తగ్గించడం లేదా వాయిదా వేయడానికి కేంద్ర ప్రభుత్వానికి కొత్త స్కీమ్ ప్రత్యేక అధికారం కల్పించింది. అవసరమైన సందర్భాల్లో ఉద్యోగులు, సంస్థలకు ఉపశమనం కల్పించడమే దీని ఉద్దేశమని ప్రభుత్వం తెలిపింది.పీఎఫ్ ట్రస్టులకు కఠిన నిబంధనలుసొంతంగా ‘ఎగ్జెంప్టెడ్ పీఎఫ్ ట్రస్టులు’ నిర్వహించే కంపెనీలపై కొత్త స్కీమ్ మరింత కఠినమైన పాలనా నిబంధనలను అమలు చేసింది. ట్రస్టీల అర్హతలు, ఎలక్ట్రానిక్ అకౌంటింగ్, వార్షిక ఆడిట్లు, ఆన్లైన్ డిస్క్లోజర్లు వంటి అంశాలను తప్పనిసరి చేసింది. దీంతో సభ్యుల నిధుల నిర్వహణలో జవాబుదారీతనం పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.ప్రస్తుత సభ్యులకు ఎలాంటి ఇబ్బంది లేదుఇప్పటికే ఈపీఎఫ్ సభ్యులుగా ఉన్నవారంతా ఆటోమేటిక్‌గా ‘ఈపీఎఫ్ స్కీమ్-2026’ పరిధిలోకి వస్తారు. వారి పీఎఫ్ బ్యాలెన్స్, ఇప్పటికే కూడబెట్టుకున్న నిధులు, సభ్యత్వంపై ఎలాంటి ప్రభావం ఉండదు. కొత్తగా అర్హత పొందే ఉద్యోగులు కూడా ఇదే స్కీమ్ కింద నమోదు అవుతారు.యూఏఎన్ యథాతథంప్రతి సభ్యుడికి కేటాయించే ‘యూనివర్సల్ అకౌంట్ నంబర్’ (UAN)లో ఎలాంటి మార్పు లేదు. ఉద్యోగులు సంస్థలు మారినా అదే యూఏఎన్ కొనసాగుతుంది. దీంతో పీఎఫ్ ఖాతా బదిలీలు, సేవా నిరంతరత సులభంగా కొనసాగుతాయి.ఇదీ చదవండి: SBI యోనో యాప్‌లో కొత్తగా ఏఐ ఫీచర్లుకొత్త ఈపీఎఫ్ స్కీమ్ వల్ల ఉద్యోగుల నెలవారీ పీఎఫ్ కట్, వడ్డీ రేటు లేదా ఇప్పటికే కూడబెట్టుకున్న పీఎఫ్ నిధులపై తక్షణ ప్రభావం ఉండదు. ఈ మార్పుల ప్రధాన ఉద్దేశం ‘సామాజిక భద్రత కోడ్-2020’కు అనుగుణంగా ఈపీఎఫ్ వ్యవస్థను ఆధునికీకరించడం, డిజిటల్ సేవలను విస్తరించడం, పరిపాలనను మరింత సమర్థవంతంగా మార్చడం మాత్రమే.ఇది చదివారా? ఆధార్, క్రెడిట్ కార్డులు.. జూలై 1 నుంచి కీలక మార్పులు -
SBI యోనో యాప్‌లో కొత్తగా ఏఐ ఫీచర్లు
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తమ 71వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా రిటైల్, బిజినెస్ కస్టమర్ల కోసం పలు ఏఐ ఆధారిత డిజిటల్ ఆవిష్కరణలను ప్రవేశపెట్టింది. యోనో ప్లాట్‌ఫాంలో సేవలను మరింతగా విస్తరించింది. కొత్త కస్టమర్లు ఇప్పుడు 3–ఇన్–1 డిజిటల్ ఆన్‌బోర్డింగ్ ప్రక్రియ ద్వారా పొదుపు ఖాతాతో పాటు ఎస్బీఐక్యాప్ సెక్యూరిటీస్‌లో డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతా కూడా తెరవచ్చు.అర్హత కలిగిన కస్టమర్లు తమ సేవింగ్స్ అకౌంటును కార్పొరేట్ శాలరీ అకౌంటుగా మార్చుకోవచ్చు. అలాగే వ్యాపార వర్గాల కోసం ట్రేడ్ ఫైనాన్స్ సాధనాలన్నింటిని యోనో బిజినెస్‌లో అనుసంధించడం ద్వారా ఈ–ట్రేడ్ సేవలను విస్తరించినట్లు బ్యాంకు తెలిపింది. యోనో బిజినెస్ వెబ్, మొబైల్ ప్లాట్‌ఫాంలలో ఇరవై నాలుగ్గంటలూ అందుబాటులో ఉండేలా ఏజెంటిక్ ఏఐ ఆధారిత వర్చువల్ అసిస్టెంట్ ’యోనో జీ’ని బ్యాంకు ప్రవేశపెట్టింది.కృత్రిమ మేథ, డిజిటల్ ఆవిష్కరణలు, డేటా ఆధారిత విశ్లేషణలతో కస్టమర్లకు మరింత మెరుగైన సేవలందించాలన్న తమ లక్ష్యానికి ఇవి నిదర్శనమని ఎస్బీఐ చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి తెలిపారు. ఎస్బీఐకి 53 కోట్ల పైగా కస్టమర్లు ఉండగా, వారిలో 10 కోట్ల మంది యోనో యూజర్లు ఉన్నారు. -
కాలంతో ప్రయాణం.. క్రమశిక్షణతో లాభం!
షేర్ మార్కెట్లో అసాధారణ లాభాల కోసం వెంపర్లాడటం కంటే క్రమశిక్షణతో కూడిన సాధారణ పెట్టుబడి సూత్రాలను పాటించడమే సంపద సృష్టికి అసలైన రహస్యమని ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ జెరోధా సహ వ్యవస్థాపకుడు నితిన్ కామత్ స్పష్టం చేశారు. చాలా మంది పెట్టుబడిదారులు విస్మరించే ఈ సరళమైన ఆర్థిక సూత్రాన్ని ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా పంచుకున్నారు. ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి సంక్లిష్టమైన వ్యూహాలు లేదా నిరంతరం స్టాక్స్ మార్చడం వంటివి అవసరం లేదన్నారు. దీర్ఘకాలిక ప్రణాళికే ఉత్తమ ఫలితాలను ఇస్తుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో, ఆయన పంచుకున్న కొన్ని అంశాలను కింద చూద్దాం.నితిన్ కామత్ పెట్టుబడి ఫార్ములా..మీ ఆర్థిక లక్ష్యం, కాలపరిమితిని బట్టి ఈక్విటీ, డెట్, గోల్డ్ వంటి విభాగాల్లో సరైన నిష్పత్తిలో పెట్టుబడి పెట్టాలి.విడివిడిగా స్టాక్స్ ఎంచుకుంటూ రిస్క్ తీసుకునే బదులు తక్కువ ఖర్చుతో కూడిన ఇండెక్స్ ఫండ్స్ లేదా ఈటీఎఫ్‌లను ఎంచుకోవడం ఉత్తమం.మార్కెట్ హెచ్చుతగ్గులను పట్టించుకోకుండా క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టాలి.ఆదాయం పెరిగే కొద్దీ పెట్టుబడి పెట్టే మొత్తాన్ని కూడా క్రమంగా పెంచుకుంటూ పోవాలి.నిర్ణీత కాల వ్యవధిలో మీ పోర్ట్‌ఫోలియోను రీబ్యాలెన్స్ చేసుకోవడం ముఖ్యం.ఇది వినడానికి చాలా సరళంగా అనిపించవచ్చు, కానీ ఆచరణలో పెట్టడం అంత సులభం కాదు. చాలా మంది ఇక్కడే విఫలమవుతుంటారని నితిన్ కామత్ అన్నారు.ఇన్వెస్టర్ల గందరగోళం.. మార్కెట్ సంక్లిష్టతసాధారణ ఇన్వెస్టర్లు పోర్ట్‌ఫోలియో నిర్మాణంలో ఎదుర్కొనే ప్రధాన సవాళ్లను కామత్ ప్రస్తావించారు.ఈక్విటీల్లో ఎంత ఉంచాలి?డెట్ (రుణం) విభాగంలో ఎంత పెట్టుబడి పెట్టాలి?బంగారం ఎంత శాతం ఉండాలి?లక్ష్యాలు దగ్గరపడుతున్నప్పుడు ఆస్తి కేటాయింపులను ఎలా మార్చాలి?ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఇన్వెస్టర్లను వేధిస్తుంటాయి. వీటికి తోడు మార్కెట్లో వందలాది మ్యూచువల్ ఫండ్లు, ఈటీఎఫ్‌లు అందుబాటులో ఉండటంతో గందరగోళం మరింత పెరుగుతుంది. ఈ సంక్లిష్టత కారణంగానే చాలా మంది రిటైల్ ఇన్వెస్టర్లు మార్కెట్ వైపు రాకుండా తక్కువ రిటర్న్స్ ఇచ్చే ఫిక్స్డ్ డిపాజిట్లు, సాంప్రదాయక బీమా పథకాల వైపు మొగ్గు చూపుతున్నారని ఆయన విశ్లేషించారు.పరిష్కారంగా లైఫ్ సైకిల్ ఫండ్స్ఈ సవాళ్లకు, గందరగోళానికి చెక్ పెట్టేందుకు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) ఇటీవల భారతదేశంలో ‘లైఫ్ సైకిల్ ఫండ్స్’ను ప్రవేశపెట్టింది. రిటైల్ ఇన్వెస్టర్ల పెట్టుబడి నిర్ణయాలను ఆటోమేట్ చేయడం ద్వారా ఈ ఫండ్స్ మెరుగైన పరిష్కారాన్ని అందిస్తాయని కామత్ అభిప్రాయపడ్డారు.ఇవి ఎలా పనిచేస్తాయి?ఇన్వెస్టర్లు తమ ఆర్థిక లక్ష్యానికి (ఉదాహరణకు రిటైర్మెంట్ లేదా పిల్లల చదువు) సరిపోయే కాలపరిమితి గల ఫండ్‌ను ఎంచుకుంటే సరిపోతుంది. మిగతా బాధ్యత అంతా ఆ ఫండే చూసుకుంటుంది. ప్రారంభంలో (వయసు లేదా కాలపరిమితి ఎక్కువగా ఉన్నప్పుడు) ఈక్విటీల్లో ఎక్కువ పెట్టుబడి పెడుతూ లక్ష్యం దగ్గరపడే కొద్దీ రిస్క్ తగ్గించడం కోసం క్రమంగా డెట్ (రుణ) విభాగానికి పెట్టుబడులను మళ్లిస్తుంది. ఈ విధానం వల్ల ఇన్వెస్టర్ల వయస్సు, రిస్క్ ప్రొఫైల్‌కు అనుగుణంగా పోర్ట్‌ఫోలియో రీబ్యాలెన్స్ అవుతుంది. -
కరుగుతోన్న పసిడి కాంతులకు కారణాలు ఇవే..
గడిచిన కొన్ని నెలలుగా రికార్డు స్థాయిలకు చేరుకుంటూ సామాన్యులకు చుక్కలు చూపించిన పసిడి ధరలు, ఇటీవల అనూహ్యంగా కిందికి దిగివస్తున్నాయి. ఈ రోజు (జూన్ 30, 2026) హైదరాబాద్‌తో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో 24 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములకు సుమారు రూ.1,40,000 మార్కు వద్ద ట్రేడ్ అవుతుండగా, 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర సుమారు రూ.1,29,000 స్థాయికి దిగివచ్చింది. గత వారంతో పోలిస్తే ఇది భారీ పతనమనే చెప్పాలి. ఈ ఆకస్మిక మార్పునకు గల ఆర్థిక కారణాలు, అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, భవిష్యత్తులో బంగారంపై రాబడులు అందుకోవడానికి అనుసరించాల్సిన వ్యూహాలపై విశ్లేషణాత్మక కథనం మీకోసం.ధరలు తగ్గడానికి ప్రధాన కారణాలుపసిడి మార్కెట్ ఒడిదుడుకులను గమనిస్తే ప్రస్తుతం మూడు ప్రధానాంశాలు ఈ పతనానికి కారణమవుతున్నట్లు స్పష్టమవుతోంది.1. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వైఖరిఅమెరికా కేంద్రీయ బ్యాంక్ (యూఎస్ ఫెడరల్ రిజర్వ్) వడ్డీ రేట్లను తగ్గిస్తుందని ఈ ఏడాది ఆరంభంలో అంచనా వేసినప్పటికీ తాజా పాలసీ సమావేశంలో వడ్డీ రేట్ల తగ్గింపును 2027కు వాయిదా వేసింది. అంతేకాకుండా, ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి వడ్డీ రేట్ల పెంపు ఉండొచ్చనే సంకేతాలు ఇచ్చింది. వడ్డీ రేట్లు పెరిగితే బాండ్లు, ఇతర స్థిర ఆదాయ వనరులపై రాబడి పెరుగుతుంది. దీంతో వడ్డీ లేదా డివిడెండ్ ఇవ్వని బంగారం వైపు నుంచి ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు.2. బలపడుతున్న అమెరికన్ డాలర్, బాండ్ ఈల్డ్స్ఫెడ్ నిర్ణయాలతో అంతర్జాతీయ మార్కెట్లో యూఎస్ డాలర్ ఇండెక్స్ ఏడాది కాలంలోనే గరిష్ట స్థాయికి చేరుకుంది. సాధారణంగా డాలర్ బలపడితే ఇతర కరెన్సీలలో బంగారం కొనడం ఖరీదైనదిగా మారుతుంది. తద్వారా డిమాండ్ తగ్గి ధరలు క్షీణిస్తాయి. గ్లోబల్ గోల్డ్ ఈటీఎఫ్‌ల నుంచి, ముఖ్యంగా ఆసియా మార్కెట్ల నుంచి పెట్టుబడులు వెనక్కి వెళ్లడం దీనికి అద్దం పడుతోంది.3. పశ్చిమాసియాలో సడలిన ఉద్రిక్తతలుగత కొద్ది నెలల్లో బంగారం ధరలు భారీగా పెరగడానికి రష్యా-ఉక్రెయిన్, పశ్చిమాసియా (ఇరాన్-అమెరికా/ఇజ్రాయెల్) సంక్షోభాలు ప్రధాన కారణం. అయితే ఇటీవల ఇరాన్, అమెరికాల మధ్య శాంతి చర్చల సరళి, కీలకమైన హార్ముజ్ జలసంధి పాక్షికంగా తెరచుకోవడం వంటి పరిణామాల వల్ల గ్లోబల్ మార్కెట్లో ముడిచమురు ధరలు దాదాపు 30% తగ్గాయి. దాంతో అంతర్జాతీయ ఒడిదొడుకులు తగ్గి సురక్షిత పెట్టుబడిగా బంగారానికి ఉన్న డిమాండ్ ప్రీమియం ఒక్కసారిగా ఆవిరైపోయింది.భవిష్యత్తులో ఇన్వెస్ట్మెంట్ మార్గాలుప్రస్తుత ధరల తగ్గుదల అనేది దీర్ఘకాలిక ఇన్వెస్టర్లకు ఒక అవకాశంగా ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. ఎందుకంటే కేంద్ర బ్యాంకుల వద్ద డీ-డాలరైజేషన్ (డాలర్‌పై ఆధారపడటం తగ్గించడం) ప్రక్రియలో భాగంగా బంగారాన్ని నిల్వ చేసుకునే ధోరణి ఇంకా కొనసాగుతోంది. అయితే కేవలం భౌతిక బంగారం (నగలు) రూపంలో కాకుండా కొన్ని మార్గాల్లో పెట్టుబడి పెడితే మెరుగైన రాబడులు సాధించవచ్చు.గోల్డ్ ఈటీఎఫ్‌లు: స్టాక్ మార్కెట్ ద్వారా డిజిటల్ రూపంలో బంగారం కొనుగోలు చేయడానికి ఇది ఉత్తమ మార్గం. ఇందులో ఎలాంటి మేకింగ్ ఛార్జీలు, తరుగు ఉండవు. మనకు నచ్చినప్పుడు కరెంట్ మార్కెట్ ధరకే విక్రయించుకోవచ్చు. లాకర్ ఖర్చులు, దొంగతనం భయాలు ఉండవు.సవరీన్ గోల్డ్ బాండ్లు: ప్రభుత్వం/ఆర్బీఐ జారీ చేసే ఈ బాండ్లు దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు వరం. దీని ద్వారా బంగారం ధర పెరిగితే వచ్చే లాభంతో పాటు, ఏటా స్థిర వడ్డీ (అదనపు ఆదాయం) లభిస్తుంది. అంతేకాకుండా గడువు ముగిసిన తర్వాత వచ్చే లాభాలపై ఎలాంటి క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ ఉండదు. అయితే, ప్రస్తుతానికి ఈ బాండ్లను ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపేసింది.డిజిటల్ గోల్డ్: మొబైల్ వాలెట్లు, సర్టిఫైడ్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా కేవలం రూ.100తో కూడా పెట్టుబడిని ప్రారంభించవచ్చు. క్రమానుగత పెట్టుబడి విధానం ద్వారా ప్రతి నెలా కొద్దికొద్దిగా బంగారం జమ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది.భౌతిక బంగారం (కాయిన్స్/బిస్కెట్లు): ఒకవేళ ఫిజికల్ గోల్డ్ కావాలనుకుంటే నగల రూపంలో కాకుండా 24 క్యారెట్ల హాల్‌మార్క్ ఉన్న కాయిన్స్ లేదా బిస్కెట్లు కొనడం మేలు. దీనివల్ల రీసేల్ (తిరిగి అమ్మే) సమయంలో పూర్తి విలువ లభిస్తుంది.మీ మొత్తం ఇన్వెస్ట్మెంట్ పోర్ట్‌ఫోలియోలో బంగారానికి 10% నుంచి 15% వరకు మాత్రమే పరిమితం చేయడం మంచిది. మార్కెట్ ఒడిదుడుకులను తట్టుకోవడానికి ఒకేసారి కాకుండా ప్రస్తుత ధరల పతనాన్ని ఆసరాగా చేసుకుని విడతల వారీగా పెట్టుబడులు పెట్టడం ద్వారా భవిష్యత్తులో స్థిరమైన, సురక్షితమైన రాబడులను అందుకోవచ్చు.ఇదీ చదవండి: బిగ్ రిలీఫ్.. బంగారం ధరలు ఢమాల్! -
ఇన్వెస్టర్లకు కొత్త అవకాశాలు.. ఇవిగో కొత్త ఫండ్స్!
పెట్టుబడుల్లో వైవిధ్యం కోరుకునే ఇన్వెస్టర్ల కోసం హెచ్డీఎఫ్సీ, జేఎం ఫైనాన్షియల్ కొత్త మ్యూచువల్ ఫండ్లను అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఆటో రంగంతో పాటు మల్టీ అసెట్ విభాగంలో పెట్టుబడులకు ఇవి అవకాశం కల్పిస్తున్నాయి.హెచ్డీఎఫ్సీ నిఫ్టీ ఆటో ఇండెక్స్ ఫండ్: దేశ ఎకానమీకి, తయారీ రంగ వృద్ధికి, ఉపాధి కల్పనకు, ఎగుమతులకు ఆటోమొబైల్ పరిశ్రమ దన్నుగా ఉంటోంది. ఆటోమొబైల్, ఆటో విడిభాగాల రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉపయోగపడేలా హెచ్డీఎఫ్సీ మ్యూచువల్ ఫండ్ తాజాగా నిఫ్టీ ఆటో ఇండెక్స్ ఫండ్ ప్రారంభించింది. ఇది జూలై 3 వరకు అందుబాటులో ఉంటుంది. ఇందులో కనీసం రూ. 100 నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు.నిఫ్టీ ఆటో ఇండెక్స్ (టీఆర్ఐ)లోని దిగ్గజ ప్యాసింజర్ వెహికల్స్, ద్విచక్ర వాహనాలు, వాణిజ్య వాహనాలు, ఆటో విడిభాగాల తయారీ సంస్థల స్టాక్స్‌లో ఇది ఇన్వెస్ట్ చేస్తుంది. నిఫ్టీ500 నుంచి ఎంపిక చేసిన 15 స్టాక్స్ ఈ సూచీలో ఉంటాయి.జేఎం మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్: ఆర్థిక సేవల సంస్థ జేఎం ఫైనాన్షియల్ అసెట్ మేనేజ్మెంట్ తాజాగా మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్‌ని ఆవిష్కరించింది. ఈ న్యూ ఫండ్ ఆఫర్ జూలై 8న ముగుస్తుంది. ఇది ఈక్విటీలు, ఈక్విటీ సంబంధ సాధనాలు, డెట్..మనీ మార్కెట్ సెక్యూరిటీలు, పసిడి–వెండి సంబంధ సాధనాలు, ఇతరత్రా ఎక్స్చేంజ్ ట్రేడెడ్ కమోడిటీ డెరివేటివ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తుంది. తద్వారా ఒకే ఫండ్ ద్వారా పెట్టుబడుల్లో వైవిధ్యాన్ని పాటించేందుకు ఉపయోగపడుతుంది. -
అప్పు తిరిగి చెల్లించినా ‘సోర్స్’ ఉండాల్సిందే..
నేను తెలంగాణ ప్రభుత్వోద్యోగిని. నా ఆదాయం రూ.5 లక్షలు. రిటర్ను వేశాను. రిటర్న్ ప్రాసెస్ అయిపోయింది. గత సంవత్సరం మా బాబాయి వ్యాపారం కోసం బంగారం మీద రూ.15,00,000 లోన్ తీసుకున్నాను. ఈ సంవత్సరం మా బాబాయి ఆ మొత్తాన్ని రిటర్న్ చేస్తే, నేను లోన్ తీర్చివేస్తాను. ఈ వ్యవహారంలోని పన్ను చిక్కులు, ఇతర చిక్కులు తెలపండి. – రమేష్ రెడ్డి, ఈ–మెయిల్ ద్వారామీరు ప్రభుత్వోద్యోగి. మీ సంవత్సరాదాయం రూ. 5,00,000. ఇతరత్రా ఎటువంటి ఆదాయం లేదంటున్నారు. దీనికి సంబంధించిన రిటర్ను వేశారు. అది ప్రాసెస్ అయ్యింది. ఇదే సంవత్సరం బంగారం తాకట్టు పెట్టి రూ.15,00,000 లోన్ తీసుకుని, ఆ మొత్తాన్ని మీ బాబాయికి ఇచ్చారు. ఇందులో రెండు వ్యవహారాలు ఉన్నాయి. మీరు లోన్ తీసుకోవడం మొదటిదయితే, రెండోది మీరు మీ బాబాయిగారికి అప్పు ఇవ్వడం. ఈ రెండూ బ్యాంకు ద్వారా జరిగాయని అనుకుంటున్నాం. లోన్ వచ్చినప్పుడు మీ బ్యాంకు అకౌంటులో జమ, ఆ తర్వాత మీరు మీ బాబాయికి ఇచ్చినప్పుడు ఖర్చు/డెబిట్. ఈ మేరకు కాగితాలు/డాక్యుమెంట్లు, సంతకాలు, పద్దులు ఉన్నాయి కదా! (బదులుగా రెండు నగదు వ్యవహారాలయితే మాత్రం ఎంతో ముప్పు ఉంది. నగదు తీసుకోవడం, నగదు ఇవ్వడం రెండూ తప్పే. పెనాల్టీలు పడతాయి). ఇంతవరకు ఎటువంటి భయం లేదు. ఆ తర్వాత సంవత్సరం మీ బాబాయి మీకు చెక్కు ద్వారా ఇచ్చి, ఆ మొత్తం మీ బ్యాంకు అకౌంట్లో క్రెడిట్ అయ్యి, అటుపైన మీరు అదే మొత్తాన్ని బంగారం కంపెనీకి అప్పు తీర్చినట్లయితే, మీ అకౌంటులో డెబిట్/ఖర్చు కనబడాలి. ఇలాగే జరిగితే, ఆ మేరకు కాగితాలు, డాక్యుమెంట్లు, సంతకాలు, పద్దులు, అవసరం అయితే కాగితాల ద్వారా వివరణ, కన్ఫర్మేషన్ ఉంటే ఎటువంటి భయం లేదు. ‘లోన్’ని ఆదాయంగా పరిగణించరు. జమని ‘లోన్’గా కాగితాల ద్వారా, థర్డ్ పార్టీ కన్ఫర్మేషన్ ద్వారా ధ్రువీకరించాలి. అలా చేస్తే ఈ వ్యవహారంలో జమల్ని ఆదాయంగా పరిగణించరు. అప్పుడు ఎటువంటి సంకోచం లేకుండా దాన్ని ఆదాయంగా పరిగణించనవసరం లేదు. అయితే, ఒక ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. ఈ లావాదేవీలలో వడ్డీ ఉందా లేదా అని. వడ్డీ ఉంటే మీ ఆదాయంలో ఆ వడ్డీని ఆదాయంగా పరిగణిస్తారు. వడ్డీ లేకపోతే మీరిద్దరూ రాతపూర్వకంగా ధ్రువీకరించాలి. నేను రాష్ట్ర ప్రభుత్వంలో రిటైర్ అయ్యాను. పెన్షన్ వస్తుంది. నా భర్త లేనందున వారి పెన్షన్ నా ఆదాయంలో ‘ఫ్యామిలీ పెన్షన్’గా వస్తుంది. నా భర్త పెన్షన్, పన్ను భారం మొదలైన వ్యవహారాలన్నీ నా పాన్ నంబరు మీద నడుస్తున్నాయి. 2020–21 ఆర్థిక సంవత్సరం నా భర్తకు వచ్చిన ఎరియర్స్ పన్నుకి గురి కావడం వల్ల పన్ను రికవరీ చేసి ఆ మేరకు చెల్లించి నాకు ఫారం 16 ఇచ్చారు. అప్పుడు ఆ పన్ను చెల్లింపులు నా అకౌంటులో కనిపించడం లేదని, వడ్డీతో సహా చెల్లించాలని నోటీసులు పంపారు. –కె. శారద, బెంగళూరుఇటువంటివి ఈ మధ్య చాలా జరుగుతున్నాయి. పన్ను రికవరీలు జరిగి, గవర్నమెంటు ఖజానాకు చెల్లించినప్పటికీ ఆ మేరకు ఫారం 16లో సర్టిఫై అయినప్పటికీ, ఈ పద్దులు డిపార్టుమెంటు వారి దగ్గర వారు నిర్వహిస్తున్న 26ఏఎస్‌లో కనబడకపోతే/ఎంటర్ అవ్వకపోతే డిపార్టుమెంటు వారు పట్టించుకోరు. 26ఏఎస్‌లో కనిపించకపోతే ‘మనం చెల్లించలేదని’ వారి వాదన. అందుకే ఇటువంటి నోటీసులు పంపిస్తారు. ఇటువంటి నోటీసులు రాగానే ముందుగా నోటీసులో డిమాండ్ అంశాన్ని/భారాన్ని ఒప్పుకోకండి. ‘డూ యూ ఎగ్రీ’ అన్న ప్రశ్నకు ‘నో’ అని చెప్పండి.ఇప్పుడు మీ భర్తగారు రిటైర్ అయిన సంస్థకు వెళ్లి సమాచారం సేకరించండి. ఫారం 16 అడగండి. అందులో అన్ని వివరణలు ఉంటాయి. ఎంత ఎరియర్స్ వచ్చాయి, పన్ను ఎంత, అది ఎలా చెల్లించారు, ఏ బ్యాంకు ద్వారా చెల్లించారు, లాన్ నంబరు, ఏ తేదీనాడు చెల్లించారు.. ఈ వివరణలతో ఫారం 16ని సేకరించి, డిపార్టుమెంటు వారి పోర్టల్‌కి వెళ్లి వివరంగా జవాబు ఇవ్వండి. డిమాండ్ నోటీసుని ఉపసంహరించమని అడగండి. డిపార్టుమెంటు వారు అవసరమైతే మిమ్మల్ని సంబంధిత అధికారులను కలవమని చెప్పవచ్చు.. లేదా వారికి నేరుగా కాగితాలను సబ్మిట్ చేయమని చెప్పవచ్చు. దీనితో మీ సమస్యలు సమసిపోవచ్చు. ఇంకా డిమాండు విత్‌డ్రా కాకపోతే ‘గ్రీవెన్స్ సెల్’కి రిపోర్ట్ చేయొచ్చు. అప్పుడు ఫారం 16 కాపీని అప్లోడ్ చేయొచ్చు. కాస్త సమయం పడుతుంది. అందాకా మీకు టెన్షన్ ఉండొచ్చు. కానీ ఫారం 16లోని అంశాలు కరెక్టుగా ఉన్నంత వరకు ఎటువంటి పొరపాటు జరగదు. జాప్యం ఉండొచ్చేమో .. తప్పు జరగదు. అందుకనే ఒక సలహా. ఇన్‌కం ట్యాక్స్ రిటర్నులకు సంబంధించిన అన్ని వివరాలు, కాగితాలు, చలాన్లు మొదలైన వాటన్నింటిని ఎప్పుడూ భద్రపర్చుకోవాలి. -
ఆధార్, క్రెడిట్ కార్డులు.. జూలై 1 నుంచి కీలక మార్పులు
వచ్చే జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా పలు కీలక ఆర్థిక మార్పులు అమల్లోకి రానున్నాయి. ఇవి ఆదాయపు పన్ను చెల్లింపుదారులు, ఆధార్ కార్డుదారులు, క్రెడిట్ కార్డు వినియోగదారులు, పాస్‌పోర్ట్ దరఖాస్తుదారులు, బ్యాంకు ఖాతాదారులపై ప్రత్యక్ష ప్రభావం చూపనున్నాయి. ముఖ్యంగా ఆధార్‌లో ఈమెయిల్ అప్డేట్కు ఉచిత అవకాశం, క్రెడిట్ కార్డుల రివార్డ్ పాయింట్లు, లాంజ్ యాక్సెస్ నిబంధనల్లో మార్పులు, పాస్‌పోర్ట్ ఫీజుల పెంపు, బ్యాంకుల మిస్-సెల్లింగ్‌పై ఆర్బీఐ కొత్త నిబంధనలు అమల్లోకి వస్తున్నాయి.ఐటీఆర్ దాఖలుకు జూలై 31 చివరి తేదీ2025-26 ఆర్థిక సంవత్సరానికి (అసెస్మెంట్ ఇయర్ 2026-27) సంబంధించిన ఐటీఆర్-1, ఐటీఆర్-2 రిటర్నులు దాఖలు చేయడానికి జూలై 31, 2026 చివరి గడువు. గడువు దాటితే ఆలస్య రుసుములు, కొన్ని పన్ను విధానాలను ఎంచుకునే అవకాశాలపై పరిమితులు, అర్హత ఉన్న నష్టాలను తదుపరి సంవత్సరాలకు క్యారీ ఫార్వర్డ్ చేయడంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.ఆధార్‌లో ఈమెయిల్ అప్డేట్యూఐడీఏఐ కీలక నిర్ణయం తీసుకుంది. జూలై 1 నుంచి డిసెంబర్ 31 వరకు ఆధార్ మొబైల్ యాప్ ద్వారా నమోదిత ఈమెయిల్ చిరునామాను అప్డేట్ చేసుకునే సేవను పూర్తిగా ఉచితంగా అందించనుంది. దీని కోసం ఇప్పటి వరకు రూ.75 రుసుము ఉండేది. అయితే ఈ రాయితీ కేవలం అధికారిక ఆధార్ మొబైల్ యాప్ ద్వారా చేసే అప్డేట్లకే వర్తిస్తుంది.ఎస్బీఐ కార్డుల రివార్డ్ నిబంధనల్లో మార్పులుఫోన్పే ఎస్బీఐ క్రెడిట్ కార్డు PURPLE, SELECT BLACK కార్డులకు సంబంధించిన రివార్డ్ పాయింట్ల విధానంలో మార్పులు అమల్లోకి రానున్నాయి. రివార్డ్ పాయింట్లు పొందే లావాదేవీలపై కొత్త పరిమితులు విధించడంతో పాటు, పాయింట్లు లభించని లావాదేవీల జాబితాను కూడా విస్తరించారు.హెచ్డీఎఫ్సీ లాంజ్ యాక్సెస్హెచ్డీఎఫ్సీ బ్యాంకు క్రెడిట్ కార్డుదారులు ప్రతి క్యాలెండర్ త్రైమాసికంలో మూడు ఉచిత దేశీయ విమానాశ్రయ లాంజ్ సందర్శనలను పొందాలంటే, అంతకుముందు త్రైమాసికంలో కనీసం రూ.60,000 ఖర్చు చేసి ఉండాలి. ఉదాహరణకు జూలై-సెప్టెంబర్ త్రైమాసికానికి లాంజ్ సదుపాయం పొందాలంటే ఏప్రిల్-జూన్ మధ్య ఈ ఖర్చు పూర్తిచేయాల్సి ఉంటుంది.పాస్‌పోర్ట్ ఫీజుల పెంపుజూలై 1 నుంచి సాధారణ, తత్కాల్ పాస్‌పోర్ట్‌ల ఫీజులు పెరుగుతున్నాయి. తాజా నోటిఫికేషన్ ప్రకారం 36 పేజీల సాధారణ పాస్‌పోర్ట్ ఫీజు రూ.1,500 నుంచి రూ.2,500కు, తత్కాల్ ఫీజు రూ.3,500 నుంచి రూ.5,000కు పెరిగింది. ఇతర కేటగిరీల ఫీజులను కూడా కేంద్ర ప్రభుత్వం సవరించింది.బ్యాంకుల మిస్-సెల్లింగ్‌పై ఆర్బీఐ కఠిన చర్యలుబ్యాంకులు ఆర్థిక ఉత్పత్తులను తప్పుదోవ పట్టిస్తూ విక్రయించే ఘటనలను అరికట్టేందుకు రిజర్వ్ బ్యాంక్ కొత్త ఫ్రేమ్‌వర్క్‌ను అమల్లోకి తెస్తోంది. ఈ నిబంధనల ప్రకారం మిస్-సెల్లింగ్‌కు గురైన వినియోగదారులు పూర్తి రీఫండ్‌తో పాటు జరిగిన నష్టానికి తగిన పరిహారం పొందే హక్కు కలిగి ఉంటారు. బ్యాంకులు ఉత్పత్తుల విక్రయంలో మరింత పారదర్శకత పాటించాల్సి ఉంటుంది. ఈ నిబంధనలు కూడా జూలై 1 నుంచే అమల్లోకి వస్తాయి. -
డెడ్‌లైన్ అలర్ట్: ఈ-కేవైసీ, ఐటీ రిటర్న్.. ఇంకా..
జూన్ నెల ముగింపునకు వచ్చేసింది. జూన్ 30 పలు కీలక విషయాలకు గడువు తేదీ. ఎల్పీజీ సబ్సిడీ పొందుతున్న లబ్ధిదారుల ఈ-కేవైసీ నుంచి ఆదాయపు పన్ను శాఖ పరిశీలన (స్క్రూటినీ) నోటీసుల వరకు, అలాగే త్రైమాసిక ముగింపు నేపథ్యంలో వ్యాపారాల జీఎస్టీ, టీడీఎస్ సంబంధిత సన్నాహాల వరకు పలు ముఖ్యమైన గడువులు ఈ నెలాఖరుతో ముగియనున్నాయి. వీటిని నిర్లక్ష్యం చేస్తే ఆర్థిక నష్టాలు లేదా పరిపాలనా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.ఎల్పీజీ సబ్సిడీ నిలిచిపోయే అవకాశంప్రధాన మంత్రి ఉజ్వల యోజన (PMUY) లబ్ధిదారులు ప్రతి సంవత్సరం ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ ఈ-కేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది. అలాగే ఇప్పటివరకు ధ్రువీకరణ పూర్తి చేయని ఇతర ఎల్పీజీ సబ్సిడీ లబ్ధిదారులు కూడా జూన్ 30లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలి. లేనిపక్షంలో వారి బ్యాంకు ఖాతాల్లోకి సబ్సిడీ జమ కావడం తాత్కాలికంగా నిలిచిపోవచ్చు. అయితే గ్యాస్ సిలిండర్ బుకింగ్‌పై ఎలాంటి ప్రభావం ఉండదు. పూర్తి ధర చెల్లించి సిలిండర్ పొందవచ్చు. ఇప్పటికే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఈ-కేవైసీ పూర్తి చేసిన లేదా సబ్సిడీకి అర్హులు కాని వినియోగదారులు మళ్లీ ఈ ప్రక్రియ చేయాల్సిన అవసరం లేదు.ఐటీఆర్ స్క్రూటినీ నోటీసులకు కీలకం2025-26 ఆర్థిక సంవత్సరానికి దాఖలైన ఆదాయపు పన్ను రిటర్నులపై సెక్షన్ 143(2) కింద స్క్రూటినీ నోటీసులు జారీ చేయడానికి ఆదాయపు పన్ను శాఖకు జూన్ 30 చివరి గడువు. ఇది పన్ను చెల్లింపుదారులు రిటర్న్ దాఖలు చేయాల్సిన గడువు కాదు. కేవలం ఇప్పటికే దాఖలైన రిటర్నులను పరిశీలనకు ఎంపిక చేస్తే నోటీసులు పంపేందుకు శాఖకు ఉన్న చట్టబద్ధమైన చివరి తేదీ మాత్రమే. రిటర్నులో చూపిన వివరాలు, ఫారం 26AS, AIS, TIS, బ్యాంకు లావాదేవీలు లేదా అధిక విలువ గల ఆర్థిక లావాదేవీల మధ్య వ్యత్యాసాలు కనిపిస్తే స్క్రూటినీకి ఎంపికయ్యే అవకాశం ఉంటుంది. ఇటీవల కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి (CBDT) కూడా జూన్ 30నే ఈ గడువుగా స్పష్టం చేసింది.వ్యాపారాలకు త్రైమాసిక ముగింపుజూన్ 30తో 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్) ముగియనుంది. దీంతో కంపెనీలు, వ్యాపార సంస్థలు తమ ఖాతాల పుస్తకాలు, టీడీఎస్, టీసీఎస్ నమోదులు, జీఎస్టీ రికార్డులు, ఇతర చట్టబద్ధమైన లెక్కలను నవీకరించుకోవాల్సి ఉంటుంది. తద్వారా జూలైలో దాఖలు చేయాల్సిన జీఎస్టీ రిటర్నులు, టీడీఎస్/టీసీఎస్ స్టేట్మెంట్లను సకాలంలో సమర్పించేందుకు వీలు కలుగుతుంది.ఈ గడువులను చివరి నిమిషానికి వాయిదా వేయకుండా ముందుగానే పూర్తి చేస్తే అనవసరమైన జరిమానాలు, సబ్సిడీ జాప్యాలు, పన్ను సంబంధిత ఇబ్బందులను నివారించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. -
రూ.20 లక్షల కారు కొనడంపై ChatGPT క్లారిటీ
ఒక వ్యక్తి వార్షిక ఆదాయం రూ.30 లక్షలు ఉంటే, రూ.20 లక్షల విలువైన కారును కొనుగోలు చేయడం ఆర్థికంగా సౌకర్యవంతమేనా? ఒకవేళ కొనాలంటే మొత్తం డబ్బు ఒకేసారి చెల్లించడం మంచిదా?, లేక లోన్ తీసుకుని కొనడం మంచిదా? అనే ప్రశ్నలకు చాట్‌జీపీటీ వివరంగా సమాధానం ఇచ్చింది.బెంగళూరుకు చెందిన 35 ఏళ్ల ఉద్యోగి తన పూర్తి ఆర్థిక వివరాలను చాట్‌జీపీటీకు అందించాడు. అతనికి సంవత్సరానికి రూ.30 లక్షల జీతం, అయితే నెలకు రూ.1.9 లక్షలు చేతికి వచ్చే ఆదాయం. కాగా అతనికి రూ.15 లక్షల పెట్టుబడులు, రూ.5 లక్షల ఎమర్జెన్సీ ఫండ్, రూ.10 లక్షల ఈపీఎఫ్ ఉన్నాయి. ప్రస్తుతం రూ.40 లక్షల హోమ్ లోన్ ఉండగా, ప్రతి నెల రూ.40 వేల ఈఎంఐ, మరో రూ.40 వేల సిప్ పెట్టుబడులు కూడా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం అతని వద్ద ఎనిమిదేళ్ల పాత హ్యాచ్‌బ్యాక్ కారు ఉంది.ఈ నేపథ్యంలో రూ.20 లక్షల ఆన్‌రోడ్ ధర ఉన్న కొత్త SUV కొనుగోలు చేయాలనుకుంటున్నట్లు పేర్కొంటూ, రెండు ఎంపికలను చాట్‌జీపీటీ ముందుంచాడు. మొదటిది, మొత్తం రూ.20 లక్షలను పొదుపు నుంచి తీసుకుని ఒకేసారి చెల్లించి కారు కొనడం. రెండోది, రూ.5 లక్షలు డౌన్ పేమెంట్ చేసి మిగిలిన మొత్తాన్ని ఐదేళ్ల కార్ లోన్ ద్వారా చెల్లించడం.ఈ రెండు ఎంపికలను విశ్లేషించిన చాట్‌జీపీటీ, కారు కొనుగోలు మాత్రమే కాకుండా, ఐదు సంవత్సరాలు, పది సంవత్సరాల పాటు కారును మెయింటెన్స్ కోసం అయ్యే మొత్తం ఖర్చును కూడా అంచనా వేసింది. ఇందులో కొనుగోలు ధర, రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, సర్వీసింగ్, రిపేర్లు, ఇంధనం, టైర్లు, పార్కింగ్, లోన్ వడ్డీ వంటి అన్ని ఖర్చులను పరిగణనలోకి తీసుకుంది.చాట్‌జీపీటీ అంచనా ప్రకారం, మొత్తం డబ్బు చెల్లించి కారు కొనుగోలు చేస్తే ఐదేళ్లలో మొత్తం యాజమాన్య వ్యయం సుమారు రూ.28 నుంచి రూ.31 లక్షల మధ్య ఉండొచ్చు. అదే రూ.5 లక్షల డౌన్ పేమెంట్‌తో లోన్ తీసుకుంటే వడ్డీ కారణంగా ఈ ఖర్చు రూ.31 నుంచి రూ.33 లక్షల వరకు పెరగొచ్చు.పది సంవత్సరాల వ్యవధిలో నగదు చెల్లించి కొనుగోలు చేసిన కారుకు మొత్తం ఖర్చు సుమారు రూ.42 నుంచి రూ.46 లక్షలు, లోన్ తీసుకుని కొనుగోలు చేసిన కారుకు రూ.45 నుంచి రూ.49 లక్షలు అవుతుందని చాట్‌జీపీటీ అంచనా వేసింది. ఈ ఖర్చులో అత్యధిక భాగం కారు విలువ తగ్గడం, ఇంధనం, ఇన్సూరెన్స్, నిర్వహణ ఖర్చులు ఉంటాయని వెల్లడించింది.అయితే.. తుది నిర్ణయంలో చాట్‌జీపీటీ ఆసక్తికరమైన సూచన చేసింది. మొత్తం రూ.20 లక్షలను ఒకేసారి చెల్లించడం వల్ల వడ్డీ భారం ఉండదు. కానీ అలా చేస్తే ఇప్పటికే ఉన్న పెట్టుబడులు దాదాపు ఖాళీ అవుతాయి. దీంతో అత్యవసర పరిస్థితుల్లో అవసరమైన డబ్బు అందుబాటులో ఉండదు. అలాగే పెట్టుబడులు భవిష్యత్తులో ఇచ్చే వృద్ధి ప్రయోజనాన్ని కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది.కాబట్టి.. రూ.5 లక్షల డౌన్ పేమెంట్ చేసి, మిగిలిన మొత్తాన్ని ఐదేళ్లకు లోన్ తీసుకోవడం మంచి నిర్ణయం అని చాట్‌జీపీటీ పేర్కొంది. ఇలా చేయడం వల్ల కొంత వడ్డీ చెల్లించాల్సి వచ్చినప్పటికీ, చేతిలో నగదు నిల్వ ఉంటుంది. పెట్టుబడులు కొనసాగుతాయి. దీర్ఘకాలంలో ఆర్థిక భద్రత కూడా మెరుగ్గా ఉంటుందని పేర్కొంది.ఇదీ చదవండి: జూన్ 30 తర్వాత పాత నోట్ల రద్దు?: స్పందించిన బ్యాంక్ -
12 కోట్లు దాటిన క్రెడిట్ కార్డులు..
దేశంలో డిజిటల్ చెల్లింపుల వినియోగం వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో క్రెడిట్ కార్డుల సంఖ్య మరో కీలక మైలురాయిని చేరుకుంది. 2026 మే నాటికి దేశంలో క్రియాశీల (యాక్టివ్) క్రెడిట్ కార్డుల సంఖ్య 12.04 కోట్లకు చేరుకుంది. ఇది గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 8.3 శాతం అధికం. మే నెలలోనే నికరంగా 10.17 లక్షల కొత్త క్రెడిట్ కార్డులు జారీ కావడం విశేషం. ఇది ఏడాది ప్రాతిపదికన 33.7 శాతం, ఏప్రిల్‌తో పోలిస్తే 26.9 శాతం పెరుగుదలను సూచిస్తోందని ఆర్బీఐ గణాంకాలు వెల్లడించాయి.క్రెడిట్ కార్డుల వినియోగం కూడా స్థిరంగా కొనసాగుతోంది. మే నెలలో మొత్తం కార్డు లావాదేవీల విలువ రూ.2.02 లక్షల కోట్లకు చేరుకుంది. ఇది గత ఏడాదితో పోలిస్తే 6.3 శాతం అధికం. అయితే ఆర్థిక సంవత్సరం ముగింపు కారణంగా మార్చిలో నమోదైన రికార్డు స్థాయి రూ.2.19 లక్షల కోట్ల ఖర్చుతో పోలిస్తే ఇంకా తక్కువగానే ఉంది. ఏప్రిల్‌లో నమోదైన రూ.1.97 లక్షల కోట్లతో పోలిస్తే మాత్రం స్వల్పంగా మెరుగుదల కనిపించింది. ఒక్కో క్రెడిట్ కార్డుపై సగటు నెలవారీ వ్యయం రూ.16,778గా నమోదైంది.కొత్త కార్డుల జారీలో ఎస్బీఐ కార్డ్స్ అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వరుసగా రెండో, మూడో స్థానాల్లో ఉన్నాయి. ఇదే సమయంలో ఫెడరల్ బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ వంటి మధ్యస్థాయి బ్యాంకులు కూడా కార్డు జారీలో వేగంగా విస్తరిస్తున్నాయి. మరోవైపు కొన్ని బ్యాంకులు అసురక్షిత రుణాల రిస్క్‌ను దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తగా ముందుకు సాగుతున్నాయి.విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, దేశంలో డిజిటల్ చెల్లింపులు, ఈ-కామర్స్ విస్తరణతో క్రెడిట్ కార్డుల వినియోగదారుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ, ఖర్చుల వృద్ధి గతంతో పోలిస్తే కొంత మితంగా సాగుతోంది. దీంతో బ్యాంకులు మార్కెట్ వాటాను పెంచుకోవడమే కాకుండా, లాభదాయకతను కాపాడుకోవడం, బకాయిలు పెరగకుండా రిస్క్ మేనేజ్మెంట్పై మరింత దృష్టి సారిస్తున్నాయి. -
బంగారం మరింత కొనే సమయం వచ్చిందా?
ప్రముఖ ఇన్వెస్టర్, ప్రపంచ ప్రఖ్యాత ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) బంగారం ధరలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బంగారం ధరలు వరుసగా తగ్గుముఖం పడుతుండటం మంచి వార్తేనని ఆయన తన ఎక్స్ (X) ఖాతాలో పేర్కొన్నారు. అయితే తాను ప్రస్తుతం మరింత బంగారం కొనుగోలు చేసే సమయం వచ్చిందా లేదా అన్నది తెలుసుకోవడానికి సాంకేతిక చార్టులను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు.ధరలు తగ్గుతున్నాయనే కారణంతోనే పెట్టుబడి పెట్టడం సరైన నిర్ణయం కాదని కియోసాకి అభిప్రాయపడ్డారు. ఒక ఇంటి ధర తగ్గితే కేవలం తక్కువ ధర చూసి కొనుగోలు చేయరని, ఆ ఇంటి చుట్టుపక్కల ప్రాంతం ఎలా అభివృద్ధి చెందుతోందో కూడా పరిశీలిస్తామని ఉదాహరణగా వివరించారు. అదే విధంగా బంగారం ధరలు ఎందుకు తగ్గుతున్నాయి? ఆర్థిక వ్యవస్థలో ఏమి జరుగుతోంది? అనే అంశాలను తెలుసుకోవడం ముఖ్యమని పేర్కొన్నారు.ఆర్థిక పరిస్థితులు బలహీనపడుతున్నాయని భావిస్తే తాను బంగారం కొనుగోలుకు దూరంగా ఉండవచ్చని, కానీ ఆర్థిక వ్యవస్థ మెరుగుదల దిశగా సాగుతోందని సంకేతాలు కనిపిస్తే తక్కువ ధరల వద్ద బంగారాన్ని కొనుగోలు చేసే అవకాశాన్ని పరిశీలిస్తానని చెప్పారు. ప్రస్తుతం తన వద్ద ఉన్న బంగారంలో చాలా భాగాన్ని 2000 ప్రాంతంలో ఔన్స్‌కు సుమారు 300 డాలర్ల ధర వద్ద కొనుగోలు చేశానని కియోసాకి గుర్తుచేశారు.మార్కెట్ ధోరణి (ట్రెండ్)ను గమనించడం పెట్టుబడిదారులకు అత్యంత కీలకమని, ధరల కంటే వాటి వెనుక ఉన్న ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకోవడమే విజయవంతమైన పెట్టుబడులకు మూలమని ఆయన తన పోస్ట్‌లో సూచించారు.GREAT NEWS: Gold continues to drop in price. Watching technical charts to know when to buy more.TREND is your FRIEND!!!!! Repeating past lesson.Price is like knowing the price of a house is going down.What I want to know what is happening in the neighborhood?If…— Robert Kiyosaki (@theRealKiyosaki) June 24, 2026 -
ఇంట్లోని బంగారం కొండంత అండ!
ముంబై: ఇళ్లల్లో ఉన్న బంగారం క్రమంగా బ్యాంక్‌లు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల ఖజానాల్లోకి చేరుతోంది. పసిడిని నిరుపయోగంగా ఉంచకుండా, దానిపై రుణాలు తీసుకునే ధోరణి ఇటీవలి కాలంలో విస్తృతమవుతోంది. కుటుంబాల ఆర్థిక అవసరాల్లో బంగారం కొండంత అండనిస్తోంది. ఫలితంగా బ్యాంక్‌లు, ఎన్బీఎఫ్సీలు, ప్రత్యేక పసిడి రుణ సంస్థల మధ్య పోటీ మరింత పెరిగింది. డేటా విశ్లేషణ, క్రెడిట్ సమాచార సంస్థ ‘ఎక్స్పీరియన్’ విడుదల చేసిన నివేదిను పరిశీలించినప్పుడు పలు ఆసక్తికర విషయాలు తెలిశాయి. పసిడి రుణాలకు ఆమోదం పెరుగుతోంది. విశ్వసనీయమైన రుణ సాధనంగా వినియోగదారులు చూస్తున్నారు. ఫలితంగా గడిచిన రెండేళ్లలో రుణాల కోసం తనఖా పెట్టిన పసిడి విలువ గణనీయంగా పెరిగింది. 2024–25లో 69 శాతం పెరిగితే, 2025–26లో 84 శాతం వృద్ధి చెందింది. 2023 మార్చి నాటికి రూ.6.3 లక్షల కోట్ల రుణాలు పసిడి తనఖాపై మంజూరు కాగా (గోల్డ్ లోన్ పోర్ట్‌ఫోలియో), 2026 మార్చి నాటికి ఈ మొత్తం రూ.19.4 లక్షల కోట్లకు చేరింది. ముఖ్యంగా బంగారం ధర భారీగా పెరిగిపోవడం తెలిసిందే. దీంతో తమ వద్దనున్న పసిడిపై మరింత మొత్తం రుణంగా పొందే వెసులుబాటు లభించింది. దీంతో సగటు పసిడి రుణం గత మూడేళ్లలో రూ.98వేల నుంచి రూ.1.96 లక్షలకు ఎగిసింది. 2025–26 చివరి త్రైమాసికంలో కొత్త రుణాల్లో 75 శాతం పాత రుణ గ్రహీతలు పొందినవే ఉన్నాయి. రుణాల వృద్ధికి, అందరికీ ఆర్థిక సేవల చేరువలో పసిడి ముఖ్యపాత్ర పోషిస్తోందని ఎక్స్పీరియన్ నివేదిక పేర్కొంది. ఇక ఇప్పటి వరకు బంగారం రుణాల వృద్ధిలో దక్షిణాది రాష్ట్రాలు కీలక పాత్ర పోషించగా, ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ మార్కెట్ విస్తృతమవుతోంది. అయితే, ఇప్పటికీ దక్షిణాది రాష్ట్రాల వాటాయే అధికంగా ఉంది. 2025–26లో ఉత్తరప్రదేశ్‌లో పసిడి రుణాలు 138 శాతం పెరగ్గా, పశ్చిమ బెంగాల్లో 112 శాతం, రాజస్థాన్‌లో 105 శాతం, మహారాష్ట్రలో 102 శాతం చొప్పున పసిడి రుణాలు గత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి చెందాయి. ప్రాధాన్య రంగానికి సంబంధించి పసిడి రుణాలు (పీఎస్జీఎల్) సమ్మిళిత వృద్ధిలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. మొత్తం పసిడి రుణాల్లో వీటికి సంబంధించినవే 23 శాతానికి చేరాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాల్లోని వ్యాపార సంస్థలు, వ్యవసాయంపై ఆధారపడిన కుటుంబాలు, రుణ సదుపాయం అంతగా అందుబాటులో లేని వర్గాలకు పసిడి రుణాలు అండగా నిలుస్తున్నాయి. ఈ వర్గాలు ఇళ్లల్లోని బంగారంతో తమ నిధుల అవసరాలను (వ్యాపారం, కుటుంబ అవసరాలు, సాగు కోసం) తీర్చుకుంటున్నాయి. బంగారం రుణ గ్రహీతల్లో ఇతర రుణ సాధనాల వినియోగం కూడా పెరుగుతోంది. 2021 డిసెంబర్ నాటికి ఈ తరహా కస్టమర్లు 10 శాతంగా ఉంటే, 2025 డిసెంబర్ నాటికి 17 శాతానికి పెరిగారు. పసిడి రుణాల్లో ఎగవేతలు కూడా చాలా తక్కువగా ఉంటుండడం విశేషం. 90 రోజులకు పైగా చెల్లింపుల్లేని రుణాలు 2023 మార్చి నాటికి ఉన్న 0.4 శాతం నుంచి 2026 మార్చి నాటికి 0.2 శాతానికి తగ్గాయి. గొప్ప ఆర్థిక సాధనం.. ‘‘కుటుంబాల వద్ద పసిడి నిల్వలు గణనీయంగా ఉన్నాయి. దీంతో పసిడి రుణాలు వేగంగా పెరుగుతున్నాయి. దీంతో సంప్రదాయంగా నిల్వ ఉంచుకునే ఆస్తి కాస్తా రుణ సాధనంగా మారిపోయింది. ఎన్నో వ్యక్తిగత, జీవన అవసరాలను తీర్చడం ద్వారా ఆర్థిక సేవల చేరువలో పసిడి గొప్ప పాత్ర పోషిస్తోంది’’అని ఎక్స్పీరియన్ ఇండియా ఎండీ మనీష్‌జైన్ పేర్కొన్నారు. పోటాపోటీ పసిడి రుణాలకు డిమాండ్ అనూహ్యంగా పెరుగుతుండడంతో ఈ మార్కెట్లో వాటా కోసం ప్రభుత్వరంగ బ్యాంక్‌లు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీలు), ప్రత్యేక పసిడి రుణ సంస్థలు మధ్య పోటీ తీవ్రతరమైంది. ఇంతకాలం ఈ విభాగంలో ప్రభుత్వ బ్యాంక్‌లదే ఆధిపత్యం ఉండేది. ఇప్పుడు ఎన్బీఎఫ్సీలు, గోల్డ్ ఎన్‌బీఎఫ్‌సీల నుంచి వాటికి గట్టి పోటీ ఎదురవుతోందని ఎక్స్పీరియన్ నివేదిక వెల్లడించింది. పంపిణీ విభాగం బలంగా ఉండడం, కస్టమర్లు సైతం నాన్ బ్యాంక్ గోల్డ్ లోన్ సంస్థలవైపే మొగ్గు చూపిస్తుండడం వాటికి జోష్‌నిస్తోంది.ప్రభుత్వరంగ బ్యాంకుల వాటా 2025–26 క్యూ4లో (2026 జనవరి–మార్చి) 37 శాతానికి తగ్గింది. సరిగ్గా అంతక్రితం ఆర్థిక సంవత్సరం (2024–25) క్యూ4లో ఇది 45 శాతంగా ఉంటే, అంతక్రితం త్రైమాసికంలోనూ (2025 డిసెంబర్ క్వార్టర్) 53% ఉండడం గమనార్హం. ఇక ఇదే కాలంలో పసిడి రుణాల్లో ఎన్‌బీఎఫ్‌సీల వాటా 33% నుంచి 44 శాతానికి పెరిగింది. ప్రాధాన్యరంగ పసిడి రుణాల్లో మాత్రం 88% వాటా ప్రభుత్వరంగ బ్యాంకుల చేతుల్లోనే ఉంది. -
డాలర్ డిపాజిట్లపై వడ్డీ రేట్ల పెంపు
న్యూఢిల్లీ: ప్రవాస భారతీయుల నుంచి డాలర్లను ఆకర్షించే దిశగా కొత్త ఎఫ్సీఎన్ఆర్ (బి) డిపాజిట్లపై బ్యాంకులకు ఆర్బీఐ డాలర్–రూపీ ఫారెక్స్ స్వాప్ సదుపాయాన్ని ప్రకటించిన నేపథ్యంలో బ్యాంకులు సదరు ఖాతాలపై రేట్లను సవరించాయి. ఈ డిపాజిట్లపై బంధన్ బ్యాంక్ ఆకర్షణీయ వడ్డీ రేట్లను ప్రకటించింది. 3 నుంచి 5 ఏళ్ల వ్యవధికి 1 మిలియన్ డాలర్లకు పైగా డిపాజిట్లపై 7.1 శాతం వడ్డీ రేటు ఉంటుందని బ్యాంకు తెలిపింది. 1 మిలియన్ డాలర్ల వరకు డిపాజిట్లపై 7 శాతం ఉంటుందని పేర్కొంది. రూపాయి క్షీణతపరమైన రిసు్కలను అధిగమించి మెరుగైన రాబడులను అందుకునేలా ఎన్ఆర్ఐ కస్టమర్లకు ఇది సహాయకరంగా ఉంటుందని బ్యాంక్ ఈడీ రాజీందర్ కుమార్ బబ్బర్ తెలిపారు.మరోవైపు, బ్యాంక్ ఆఫ్ బరోడా .. తమ లెజెండ్ ఎఫ్సీఎన్ఆర్ (బి) డిపాజిట్ స్కీము కింద డాలర్ డిపాజిట్లపై 6.25 శాతం వరకు, బ్రిటీష్ పౌండ్ స్టెర్లింగ్ .. ఆస్ట్రేలియన్ డాలర్‌పై 4.75 శాతం, యూరో డిపాజిట్లపై 3.75 శాతం, కెనడియన్ డాలర్ డిపాజిట్లపై 5.15 శాతం వడ్డీ రేట్లను ప్రకటించింది. ఇవి మూడు నుంచి ఐదేళ్ల కాలవ్యవధికి వర్తిస్తాయి. అటు ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కూడా ఈ డిపాజిట్లపై వడ్డీ రేటును 7.13 శాతం వరకు పెంచినట్లు తెలిపింది. ఇక సౌత్ ఇండియన్ బ్యాంక్ ఎఫ్సీఎన్ఆర్ (బి) డిపాజిట్లపై 6.50 శాతం వరకు వడ్డీ రేట్లు ఇస్తున్నట్లు వెల్లడించింది.సాధారణంగా ఈ విధానంలో ప్రవాస భారతీయులు డాలర్ల మారకంలో ఎఫ్సీఎన్ఆర్ (బి) ఖాతాలో డిపాజిట్ చేస్తారు. ఆ డాలర్లను సదరు బ్యాంకు నిర్దిష్ట రిఫరెన్స్ రేటుకు ఆర్బీఐకి విక్రయించి, రూపాయి మారకంలో నిధులు సమకూర్చుకుంటుంది. మెచ్యూరిటీ సమయంలో మళ్లీ అదే రేటుకి ఆర్బీఐ నుంచి డాలర్లను తిరిగి కొనుగోలు చేస్తుంది. ఈ క్రమంలో రూపాయి బలహీనపడితే బ్యాంకు నష్టపోకుండా ఆర్బీఐ ఆ రిసు్కను భరిస్తుంది. -
‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ ఇద్దరు నాన్నల ఆశీర్వాదం!
ప్రసిద్ధ ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ పుస్తక రచయిత, ప్రముఖ ఇన్వెస్టర్ రాబర్ట్ కియోసాకి ఫాదర్స్ డే సందర్భంగా భావోద్వేగపూరిత సందేశాన్ని పంచుకున్నారు. తాను ఎప్పుడూ తండ్రి కాలేకపోయినా, జీవితంలో ఇద్దరు తండ్రుల ఆశీర్వాదం పొందానని పేర్కొన్నారు. ఒకరు తన "పూర్ డాడ్", మరొకరు "రిచ్ డాడ్" అని తెలిపారు.వారి నుంచి నేర్చుకున్న జీవిత పాఠాలే తన ఆలోచనా విధానాన్ని మార్చాయని, ఆ అనుభవాలను ప్రపంచానికి "రిచ్ డాడ్ పూర్ డాడ్" పుస్తకం ద్వారా అందించగలిగానని కియోసాకి చెప్పారు. ఆ పాఠాలు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది జీవితాలను సుసంపన్నం చేశాయని ఆయన పేర్కొన్నారు."తండ్రిగా ఉండటం జీవితంలో అత్యంత ముఖ్యమైన బాధ్యత. మీరు తండ్రి అయినా కాకపోయినా, ఈ రోజు మీ నాన్నకు కృతజ్ఞతలు చెప్పండి" అని కియోసాకి తన సోషల్ మీడియా పోస్టులో పిలుపునిచ్చారు. కుటుంబ విలువలు, తల్లిదండ్రుల మార్గదర్శకత్వం జీవిత విజయాల్లో కీలక పాత్ర పోషిస్తాయని ఆయన సందేశం ద్వారా గుర్తు చేశారు.HAPPY FATHER’S DAY TO ALL FATHERS💥Being a father is your most important job.I have never been a father, yet I was blessed with having two fathers, my poor dad and my rich dad.By telling the story of their lessons to me, millions of lives have been changed….enriched,…— Robert Kiyosaki (@theRealKiyosaki) June 21, 2026 -
బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డెన్ గోల్ స్కీమ్
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) కొత్తగా ‘గోల్డెన్ గోల్ డిపాజిట్ స్కీమ్’ని ప్రవేశపెట్టింది. దీని కింద 555 రోజుల కాలవ్యవధి డిపాజిట్లపై వార్షికంగా 7.40 శాతం వరకు వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తోంది. సాధారణ పౌరులకు 6.75 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.25 శాతం, సూపర్ సీనియర్ సిటిజన్లకు 7.35 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. రూ. 3 కోట్ల లోపు రిటైల్ టర్మ్ డిపాజిట్లకు ఇవి వర్తిస్తాయి.కోటక్ ఇన్ఫినిటీ లాంగ్ షార్ట్ సిఫ్.. కోటక్ మ్యూచువల్ ఫండ్ కొత్తగా స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (సిఫ్) విభాగంలో ఇని్ఫనిటీ లాంగ్ షార్ట్ ఫండ్‌ని ఆవిష్కరించింది. ఈ న్యూ ఫండ్ ఆఫర్ జూన్ 29తో ముగుస్తుంది. సంప్రదాయ మ్యూచువల్ ఫండ్స్, అధునాతన పీఎంఎస్, ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ (ఏఐఎఫ్)కి మధ్య అంతరాన్ని భర్తీ చేసేలా సిఫ్ కేటగిరీ ఫండ్స్ ఉంటాయి.ఇన్ఫినిటీ హైబ్రిడ్ లాంగ్–షార్ట్ ఫండ్.. ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తూ, నిర్దిష్ట డెరివేటివ్ వ్యూహాలను ఉపయోగిస్తూ, ఆర్బిట్రేజ్ అవకాశాలను అందిపుచ్చుకుంటూ మెరుగైన రాబడులను అందించే విధంగా ఉంటుందని ఫండ్ మేనేజర్ కల్పేష్ జైన్ తెలిపారు. ఒడిదుడుకుల పరిస్థితుల్లో నష్టాల రిస్కులను తగ్గిస్తూ, మార్కెట్ వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకోవడం లక్ష్యంగా ఇది పని చేస్తుందని వివరించారు. -
Income Tax: నోటీసుకి బదులివ్వండి..
ప్ర. ఆదాయపు పన్ను శాఖ నుంచి ఈ మెయిల్ ద్వారా నాకు నోటీసు వచ్చింది. ఆ నోటీసు మీద ఫిర్యాదు చేయవచ్చా. నేను నోటీసుకి బదులుగా జవాబు నా మెయిల్ ద్వారా ఇవ్వాలా? ఇక ఏదైనా మార్గం ఉందా? – బీవీ రమణ, ఈ–మెయిల్ ద్వారాజ. ఆదాయపు పన్ను శాఖ వారు అసెస్సీలకు డైరెక్టుగా వారి వారి రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడీలకు నోటీసులివ్వొచ్చు. అలాగే రిజిస్టర్డ్ ఎస్ఎంఎస్లకు మెసేజీలు ఇవ్వొచ్చు. మీరు మీ మెయిల్ బాక్స్ ఓపెన్ చేస్తే ఈమెయిల్ నోటీసు కనిపిస్తుంది. అలాగే సెల్‌ఫోన్ ఓపెన్ చేస్తే మెసేజీలు వస్తాయి. కనిపిస్తాయి. సులువుగా చదువుకోవచ్చు. అయితే ఈ రోజుల్లో ఎన్నో ఫేక్ మెయిల్స్ వస్తున్నాయి. జనాల్లో ఒక భయం, దిగులు ఏర్పడుతున్నాయి.మీరు నోటీసుకు జవాబు ఇచ్చేటప్పుడు అసలు ఆ నోటీసు నిజమైనదా కాదా.. డిపార్టుమెంటు వారి నుంచి అధికారికంగా వచ్చిందా కాదా అనేది చెక్ చేసుకోవచ్చు. అలా చేసుకోవడానికి మీ పాన్, కాగితం రూపంలో వచ్చిన వివరాలు.. అంటే.. నోటీసు, అసెస్మెంట్ సంవత్సరం వివరాలు, నోటీసు జారీ చేసిన తేదీ, మీ మొబైల్ నంబరు వివరాలు కావాలి. వారు పంపించే డాక్యుమెంట్ మీద నంబరు ఒక ప్రత్యేకమైన నంబరు ఉంటుంది.. దీన్నే డీఐఎన్ అంటారు.. అంటే డాక్యుమెంట్ ఐడెంటిఫికేషన్ నంబరు. కంప్యూటర్ సిస్టం ద్వారా ఈ నంబరుని జనరేట్ చేస్తారు.ఉత్తరాల్లో, నోటీసుల్లో, ఉత్తర్వుల్లో ఇతర ఏ ప్రత్యుత్తరమైనా ఈ నంబరు ఉండి తీరాలి. వెంటనే నిర్ధారించండి. అది ఎలాగంటే వెంటనే ఈ–ఫైలింగ్ పోర్టల్‌కి వెళ్లి ‘ఆథెంటికేట్’ విండోకి వెళ్లండి. ఇలా చెక్ చేసుకోవడానికి మీరు లాగిన్ అవ్వక్కర్లేదు. పాస్వర్డ్ అక్కర్లేదు. ఇంకొక ఉపశమనం లేదా సడలింపు ఇచ్చారు. రిజిస్టర్డ్ మొబైల్ నంబరు రాయండి. అది లేని పక్షంలో ఇతరత్రా ఏ నంబరు అయినా ఇవ్వొచ్చు. అయితే, మీరు ఏ నంబర్ ఇస్తారో, ఆ నంబరుకే ఓటీపీ వస్తుంది.ఈ ప్రాసెస్ ద్వారా నోటీసు నిజమా కాదా తెలుస్తుంది. నోటీసులో డీఐఎన్ కనబడకపోయినా/ లేకపోయినా/రాయకపోయినా, చింతించవద్దు. అలాంటి కాగితాలకు జవాబివ్వక్కర్లేదు. నంబరు లేని డాక్యుమెంటు, మీ చేతిలో ఉన్నా మీకు వచ్చినట్లు కాదు. నోటీసు సిసలైనదే అయితే.. అప్పుడు ఏం చేయాలంటే, పోర్టల్‌లో లాగిన్ అవ్వండి. ‘ఈ–ప్రాసెసింగ్’ సెక్షన్‌కి వెళ్లండి. అక్కడ సెంట్రల్ ప్రాసెసింగ్ సెంటర్ (దీన్నే సీపీసీ అని అంటారు. ఇది బెంగళూరులో ఉంది) పోర్టల్‌కి వెళ్లి ‘పెండింగ్ యాక్షన్స్’ విండోలోకి వెళ్లండి. మీకొచి్చన నోటీసు కనిపిస్తుంది. మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. 🔹మీరు నోటీసుని పట్టించుకోండి. అలక్ష్యం, నిర్లక్ష్యం తగదు. 🔹డీఐఎన్ ఉందా లేదా చెక్ చేయండి. 🔹నోటీసుని చదవండి 🔹ఏ సెక్షన్ ప్రకారం జారీ చేశారో తెలుసుకోండి 🔹అర్థం చేసుకుని, జవాబుకు ప్రిపేరవ్వండి 🔹అది నిజమనిపిస్తే ఒప్పుకోండి 🔹అది తప్పనిపిస్తే ఒప్పుకోకండి 🔹ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా సరైన వివరణ ఇవ్వండి. వివరణతో పాటు డాక్యుమెంట్లు జతపరచండి. 🔹సకాలంలో జవాబు ఇవ్వండి 🔹సకాలంలో ఇవ్వలేని పరిస్థితి ఉంటే, అదనంగా గడువు అడగండి. 🔹మీకు ఏదైనా వివరణ కావాలన్నా, ఉదాహరణగా వాళ్ల ఉత్తర్వులు, అసెస్మెంట్ ఆర్డర్ల కాపీలు అడగండి. 🔹డిమాండు చెల్లించవలసిందన్న నోటీసు రాగానే మీరు భయపడి పన్ను చెల్లించనక్కర్లేదు. కొంత మంది డిపార్టుమెంటుతో ఎందుకొచి్చన తిప్పలని, చిన్న చిన్న మొత్తాల విషయంలో ఎటువంటి సంశయం లేకుండా ఒప్పుకుని ఆ డిమాండుని చెల్లిస్తారు. అదొక ఆలోచనా విధానం. 🔹 ఒప్పుకోకపోతే వివరణ, కాగితాలు ఇవ్వండి 🔹మీరు చెప్పేది నిజమైతే, డిపార్టుమెంటు వారు వారి తప్పుని సరిదిద్దుకుంటారు. డిమాండుని విత్‌డ్రా చేసుకుంటారు. ఉత్తర్వులను మారుస్తారు.చివరగా..: ఆదాయం లెక్కల్లో మారవచ్చు.. పన్ను లెక్కింపుల్లో తప్పు రావొచ్చు.. డాక్యుమెంట్లు.. ముఖ్యంగా పన్ను చెల్లింపులు అప్డేట్ కాకపోవచ్చు.. ఎన్నో కారణాలు ఉంటాయి. అసెస్మెంట్ ఆర్డరులో ప్రతి అంశం చదవండి. అర్థం చేసుకోండి. నోటీసులు ఇచ్చినందుకు ఫిర్యాదులు చేయరాదు. అడిగే హక్కు వారికి.. చెప్పే బాధ్యత మనకు ఉంది. -
మ్యూచువల్ ఫండ్: రోజుకు రూ.10 సిప్
రోజువారీగా చిన్న మొత్తాల్లో ఇన్వెస్ట్ చేసే వీలు కల్పిస్తూ యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ ప్రత్యేకంగా ‘రోజానా సిప్’ని ప్రవేశపెట్టింది. దీని కింద సంస్థ వెబ్సైట్ ద్వారా ఒక్కో స్కీములో రోజుకు అత్యంత తక్కువగా రూ.10 నుంచి సిప్ విధానంలో పెట్టుబడి పెట్టొచ్చు. కనీసం రెండు స్కీములను ఎంచుకోవాల్సి ఉంటుంది.వీలును బట్టి తర్వాత 10 స్కీముల వరకు వీటిని పెంచుకోవచ్చు. యాక్సిస్ మల్టీక్యాప్ ఫండ్, స్మాల్ క్యాప్ ఫండ్, వేల్యూ ఫండ్ మొదలైనవి ఇన్వెస్టర్లకు అందుబాటులో ఉంటాయి. మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడాన్ని మదుపరులకు మరింత చేరువ చేసేందుకు ఇది ఉపయోగపడుతుందని సంస్థ డిజిటల్ బిజినెస్ హెడ్ బొనిఫేస్ నొరోన్హా తెలిపారు.పరిమిత పొదుపు, పెట్టుడులపై అవగాహన లేమి, మార్కెట్ హెచ్చుతగ్గులపై భయంలాంటివి ఉండే కొత్త ఇన్వెస్టర్ల సమస్యలను పరిష్కరించేలా దీన్ని రూపొందించినట్లు వివరించారు. -
సొంతిల్లా... అద్దె ఇల్లా?
సొంతిల్లా... అద్దె ఇల్లా? ఏది బెటర్? ఈ ప్రశ్నకు ఏ సమాధానం చెప్పినా కరెక్టే. కాకపోతే... అది చెప్పిన వారి దృష్టి కోణంలో మాత్రమే. ఒకరు ఇదే కరెక్ట్... అని చెప్పినంత మాత్రాన అందరికీ అదే కరెక్ట్ అనిపించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇల్లు అవసరాలు... అనేది ఆలోచించే కోణం... సామాజిక– ఆర్థిక స్థాయి... మానసిక తృప్తిపై ఆధారపడి ఉంటుంది. అందుకని ఒకరికి సొంతిల్లు కరెక్టనిపించవచ్చు. మరొకరికి అదే ఈఎంఐలో సగం పెట్టి అదే ఇంట్లో అద్దెకు ఉండొచ్చు కదా? మిగిలిన ఈఎంఐ మొత్తంతో దీర్ఘకాలంలో సంపద సృష్టించవచ్చు కదా? అని అనిపించవచ్చు. రెండూ కరెక్టే. అందుకే ఎవరి పరిస్థితులు, అవసరాలను బట్టి వారు నిర్ణయించుకోవాల్సిందే. మరి ఆ అవసరాలు, పరిస్థితులను గుర్తించేదెలా? ఇదే ఈ వారం ‘వెల్త్ స్టోరీ’.. – సాక్షి, వెల్త్ డెస్క్ఇంటిని కొనటమనేది కేవలం ఆర్థిక నిర్ణయం కాదు. ఒక గుర్తింపు కోసం, భద్రత కోసం భావోద్వేగాలతో ముడిపడి తీసుకునే నిర్ణయమది. ‘ఆ రమణను చూశావా? ఎంత అందమైన ఇల్లు కట్టుకున్నాడో! చాలా ఖర్చు పెట్టాడట, గట్టిగానే సంపాదించి ఉంటాడు’... అనే గుర్తింపు చాలా మందికి కిక్కునిస్తుంది. జీవితంలో తాము సాధించిన ఘనతల్లో సొంతింటిని ఒకటిగా చూస్తుంటారు. సరైన ప్రాంతంలో ఇల్లు సమకూర్చుకుంటే, సొంతింటి కల సాకారానికితోడు కాలక్రమంలో దాని విలువ కూడా గణనీయంగా పెరుగుతుందన్నది ఒక ఆలోచన. నెలవారీ ఆదాయం నుంచి కొంత అద్దెకు కేటాయించి, మిగిలిన నిధిని సంపద సృష్టి కోసం పెట్టుబడిగా మార్చుకోవచ్చన్నదీ నిజమే. ప్రాపర్టీ కంటే ఈక్విటీలు అధిక రాబడులు ఇచ్చినట్టు చరిత్ర చెబుతోంది. పూర్వపు రోజులతో పోలిస్తే ఇపుడు చిన్న పట్టణాల నుంచి నగరాల వరకు చాలా చోట్ల ఇళ్ల స్థలాలు కొనలేనంత ఖరీదైపోయాయి. సామాన్య, మధ్య తరగతి వాసులకు అందనంత ఎత్తుకు వాటి ధరలు చేరాయి. పైగా ఇంటిపై అద్దె రూపంలో వచ్చే రాబడి ఈఎంఐతో పోలిస్తే చాలా తక్కువ. ఇలా ఎన్నో అంశాలను చూడాల్సి ఉంటుంది.సొంతింటికి వెళితే.. 🔹 భాగ్యనగరంలో ఫ్లాట్ కొనాలంటే కనీసం రూ.కోటి పైనే పెట్టాలి. 🔹 రుణంతో ముందుకు వెళ్లేట్టు అయితే 20 శాతం డౌన్ పేమెంట్ (రూ.20 లక్షలు)ను కొనుగోలుదారుడు రెడీ చేసుకోవాలి. 🔹 స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీలు 6 శాతం కోసం మరో రూ. 6 లక్షలు. మొత్తంగా రూ.26 లక్షలు కావాలి. 🔹 మిగిలిన రూ.80 లక్షలను బ్యాంక్ రుణంగా ఇస్తుంది. 20 ఏళ్ల కాలానికి 8 శాతం రేటు ప్రకారం చూస్తే నెలవారీ ఈఎంఐ రూ.66,915. 🔹 20 ఏళ్లలో రూ.80 లక్షల రుణానికి చెల్లించుకోవాల్సిన మొత్తం రూ.1.61 కోట్లు. ఆరంభంలో రూ.26 లక్షలు కలిపితే రూ.1.87 కోట్లు అవుతుంది. 🔹 ఇంటికి మరమ్మతులు, ప్రాపర్టీ ట్యాక్స్ తదితర ఖర్చులు అదనం. 🔹 రూ.కోటి ఇంటి కోసం దాదాపు రెట్టింపు చెల్లించాల్సి వస్తుంది. కిరాయి ఇంటికి వెళితే..? 🔹 నగరాల్లో నివాస గృహాలపై రెంటల్ ఈల్డ్స్ 2–3 శాతం మించడం లేదు. 🔹 రూ.కోటి ఇంటిపై 2.5 శాతం రాబడి ప్రకారం ఏడాదికి అద్దె రూ.2.5 లక్షలు. 🔹 ఏటా 5 శాతం పెరుగుతూ (పెరిగే ధరలకు అనుగుణంగా) వెళితే 20 ఏళ్లలో రూ.82.7 లక్షలను అద్దె రూపంలో చెల్లించాల్సి వస్తుంది. 🔹 సొంతంగా ఇల్లు సమకూర్చుకుంటే అయ్యే రూ.1.87 కోట్లలో సగానికంటే తక్కువే. 🔹 మరి మిగిలిన సగానికే ఇల్లు సొంతం అవుతోంది కదా? అని వాదించొచ్చు. ఇందులో నిజం కొంతే. కాంపౌండింగ్ మ్యాజిక్ 🔹 ఇంటిని రుణంపై తీసుకుంటే నెలవారీ రూ.66,915 ఈఎంఐ చెల్లించాలి. 🔹 అదే అద్దెకు తీసుకుంటే రూ.20,883 కిరాయి చెల్లిస్తే సరిపోతుంది. 🔹 అంటే రూ.46,082 మిగిలినట్టు. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) ద్వారా ఈ మొత్తాన్ని ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే? 🔹 12 శాతం వార్షిక రాబడి ప్రకారం చూసినా (ఇంతకంటే ఎక్కువే రావచ్చు) 20 ఏళ్లలో రూ.5.98 కోట్ల సంపద సృష్టి సాధ్యం. 🔹 మరి కొనుగోలు చేసిన ఇంటి విలువ కూడా 20 ఏళ్లలో రూ.6 కోట్లకు చేరుకుంటుందా? కచ్చితంగా చెప్పలేం. నిజానికి ఈక్విటీల్లోనే అధిక రాబడులున్నాయి మరి. 🔹 కొన్ని ప్రాంతాల్లో, కొన్ని కేసుల్లో ప్రాపర్టీ విలువ కూడా ఇదే స్థాయిలో పెరిగిన నిదర్శనాలూ ఉన్నాయి.అటా.. ఇటా..? 🔹 సంపదను సృష్టించుకోవాలన్నది లక్ష్యం అయితే అద్దె ఇంటికి వెళ్లి, సిప్ వేసుకోవడం బెటర్. మెరుగైన రాబడులను ఇచ్చే సాధనాల్లో దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్ చేసి కోరుకున్నంత సమకూర్చుకోవచ్చు. 🔹 ఒకవేళ అద్దెకు ఉండి, మిగిలే ఆదాయాన్ని సిప్ చేసేంత క్రమశిక్షణ లేని వారికి ఇంటి కొనుగోలే సరైన నిర్ణయం. 🔹 తరచూ ప్రాంతాలు మారుతుంటే లేదా పనిచేసే చోటుకు సమీపంలో ఉండాలనుకునుంటే రెంటెడ్ హోమ్ అనుకూలం. 🔹 ఇంటికి ఈఎంఐ పెద్ద మొత్తంలోనే ఉంటుంది. పిల్లల ఉన్నత విద్య, వివాహాలు, తమ విశ్రాంత జీవన అవసరాల కోసం కూడా పెట్టుబడి మిగులు ఉండేలా చూసుకోవాలి. సొంతిల్లు ఎప్పుడు? కొన్ని సందర్భాల్లో ఇంటిపై పెట్టుబడి సిరులు కురిపిస్తుందనడంలో సందేహం లేదు. 🔹 ధరలు ఏటా 10 శాతం మించి పెరిగే చోట ఇంటిపై పెట్టుబడి కాసులు కురిపిస్తుంది. 🔹 గృహ రుణాలు కనిష్ట స్థాయిలకు చేరిన సందర్భంలోనూ ఇంటికి ఈఎంఐ రూపంలో చెల్లింపులు తగ్గుగాయి. 🔹 దీర్ఘకాలం పాటు స్థిర నివాసం కోరుకుంటే ముందడుగు వేయొచ్చు. 🔹 గృహ రుణం చెల్లింపులపై పన్ను మినహాయింపు ప్రయోజనాలను (పాత పన్ను విధానంలో రూ.2 లక్షల వరకు వడ్డీపై) పూర్తి స్థాయిలో వినియోగించుకున్నా ఆ మేరకు దీర్ఘకాలంలో చాలా ఆదా అవుతుంది. 🔹 ఎక్కువ మంది ఇంటి కొనుగోలుకే ఎందుకు మొగ్గు చూపుతారంటే? సొంతిల్లు కలిగి ఉండాలన్న అభిలాషే అని చెప్పొచ్చు. తమకు నచ్చిన ఇంట్లో శాశ్వతంగా ఉండిపోవచ్చు. ఉన్నట్టుండి ఖాళీ చేయనక్కర్లేదు. ఏటా అద్దె పెంచనక్కర్లేదు. సామాజిక గుర్తింపు ఇలా ఎన్నో భావోద్వేగ అంశాలు ఆ దిశగా నడిపిస్తుంటాయి. 🔹 సొంతిల్లును సంపద సృష్టి కంటే నివాస యోగ్య సాధనంగానే చూడాలి. భావోద్వేగాల కంటే ఆర్థిక భద్రతకే ప్రాధాన్యం ఎక్కువ. నోట్: ఏటా కనీసం 10 శాతానికి పైన పెరుగుతూ వెళితేనే సొంతిల్లు మెరుగైన నిర్ణయమని స్పష్టమవుతోంది. -
‘బంగారం, వెండి.. పడిపోతున్నాయ్’
ప్రసిద్ధ ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ పుస్తక రచయిత, ప్రముఖ ఇన్వెస్టర్ రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) మరోసారి బంగారం, వెండి, క్రిప్టో ఆస్తులపై ఆశావహ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం బంగారం, వెండి ధరలు పడిపోతున్నప్పటికీ తాను విక్రయించడం లేదని, సరైన సమయంలో కొనుగోలు చేసేందుకు వేచి చూస్తున్నానని తెలిపారు. ధరల ఆధారంగా కాకుండా ఆస్తులు ఉన్న ఆర్థిక, రాజకీయ పరిస్థితులను బట్టి పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.తాజాగా సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్టులో కియోసాకి, అమెరికాతోపాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సమస్యలను రాజకీయ, బ్యాంకింగ్ నాయకత్వం సమర్థంగా పరిష్కరించడం లేదని అభిప్రాయపడ్డారు. దీంతో భవిష్యత్తులో బంగారం, వెండి, బిట్ కాయిన్, ఇథీరియమ్ వంటి ఆస్తుల విలువలు మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.సాంకేతిక చార్టులను పరిశీలిస్తున్నానని, బంగారం, వెండి ధరలు భారీ ర్యాలీకి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తున్నాయని కియోసాకి చెప్పారు. అయితే తన అభిప్రాయాలను గుడ్డిగా నమ్మవద్దని, ప్రతి ఒక్కరూ స్వయంగా పరిస్థితులను విశ్లేషించి నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. రాబోయే కాలం ఆసక్తికరంగా ఉండబోతోందని, తెలివిగా వ్యవహరించే ఇన్వెస్టర్లు మరింత సంపద సృష్టించుకోగలరని ఆయన వ్యాఖ్యానించారు.Gold and silver prices are falling. Q: Am I buying or selling?A: One mistake I have made (and I’ve made many) is letting price determine reasons to buy or sell any asset.I have learned to understand the “context” or the environment the asset is in….not the price.For…— Robert Kiyosaki (@theRealKiyosaki) June 20, 2026 -
బ్యాంకు కస్టమర్లకు అలర్ట్: వరుస సెలవులు
వచ్చే వారం దేశంలోని పలు రాష్ట్రాల్లో బ్యాంకు వినియోగదారులు ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మోహర్రం సందర్భంగా జూన్ 25, 26 తేదీల్లో రాష్ట్రాలవారీగా బ్యాంకులకు సెలవులు ఉండగా, అనంతరం నాలుగో శనివారం (జూన్ 27), ఆదివారం (జూన్ 28) రావడంతో అనేక ప్రాంతాల్లో వరుసగా నాలుగు రోజులపాటు బ్యాంకు శాఖలు మూతపడనున్నాయి.ఆర్బీఐ సెలవుల క్యాలెండర్ ప్రకారం మోహర్రం సందర్భంగా సెలవుల తేదీలు రాష్ట్రానికోలా మారే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ ఆర్బీఐ పరిధిలోని బ్యాంకులకు జూన్ 25న సెలవు ఉండగా, తెలంగాణ సహా దేశంలోని చాలా ప్రధాన నగరాల్లో జూన్ 26న మోహర్రం సెలవు వర్తించనుంది.జూన్ 26న హైదరాబాద్, ముంబై, న్యూఢిల్లీ, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, భోపాల్, లక్నో, పాట్నా, రాంచీ తదితర నగరాల్లో బ్యాంకు శాఖలు పనిచేయవు. జూన్ 27 నాలుగో శనివారం, జూన్ 28 ఆదివారం కావడంతో దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు మూసి ఉంటాయి. ఆర్బీఐ నిబంధనల ప్రకారం ప్రతి నెల రెండో, నాలుగో శనివారాలు, అన్ని ఆదివారాలు బ్యాంకులకు సాధారణ సెలవులు ఉంటాయి.బ్యాంకు శాఖలు మూసివున్నప్పటికీ డిజిటల్ సేవలకు అంతరాయం ఉండదు. యూపీఐ, ఐఎంపీఎస్, నెట్‌బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, ఏటీఎంల ద్వారా నగదు ఉపసంహరణ, నిధుల బదిలీ, బిల్లు చెల్లింపులు వంటి సేవలు 24 గంటలూ అందుబాటులో ఉంటాయి. అలాగే ఎన్ఈఎఫ్టీ, ఆర్టీజీఎస్ సేవలు కూడా సెలవు రోజుల్లో కొనసాగుతాయి. అయితే నిర్వహణ పనుల కారణంగా కొన్ని సందర్భాల్లో తాత్కాలిక అంతరాయాలు ఏర్పడే అవకాశం ఉండటంతో వినియోగదారులు ముందుగానే ముఖ్యమైన లావాదేవీలు పూర్తి చేసుకోవడం మంచిది. -
ఈపీఎఫ్ సభ్యులకు త్వరలో డబుల్ ధమాకా!
దేశంలోని 7 కోట్లకు పైగా ఈపీఎఫ్ (ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్) సభ్యులకు త్వరలో రెండు కీలక ప్రయోజనాలు అందుబాటులోకి రానున్నాయి. ఒకటి 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ డిపాజిట్లపై వడ్డీ జమ, రెండోది ఈపీఎఫ్ సభ్యులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఏటీఎం, యూపీఐ ద్వారా పీఎఫ్ విత్‌డ్రా సదుపాయం.8.25 శాతం వడ్డీ 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ డిపాజిట్లపై 8.25 శాతం వడ్డీ రేటును కొనసాగించాలని ఈపీఎఫ్ఓ (EPFO) సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సిఫారసు చేయగా, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం అనంతరం ఈ నెలాఖరులోగా సభ్యుల ఖాతాల్లో వడ్డీ జమయ్యే అవకాశముందని సమాచారం. దీంతో వరుసగా మూడో ఏడాది కూడా సభ్యులకు 8.25 శాతం వడ్డీ లభించనుంది.ఈపీఎఫ్ ఏటీఎం/యూపీఐ విత్డ్రాఇదే సమయంలో ఈపీఎఫ్ఓ తన సేవలను పూర్తిగా డిజిటల్ దిశగా మార్చే ‘ఈపీఎఫ్ఓ 3.0’ కార్యక్రమాన్ని వేగవంతం చేస్తోంది. ఈ కొత్త వ్యవస్థ అమల్లోకి వచ్చిన తర్వాత సభ్యులు పేపర్‌లెస్ విధానంలో పీఎఫ్ క్లెయిమ్‌లు దాఖలు చేయడం, ఖాతాల బదిలీలు చేయడం, అలాగే అర్హత ఉన్న మొత్తాన్ని యూపీఐ లేదా యూపీఐ-సపోర్టెడ్ ఏటీఎంల ద్వారా నేరుగా తమ బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేసుకునే అవకాశం పొందనున్నారు. ఈ సదుపాయం కోసం అవసరమైన సాంకేతిక పరీక్షలు పూర్తయ్యాయని కేంద్ర కార్మికశాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా ఇటీవల వెల్లడించారు. అయితే దేశవ్యాప్తంగా ఈ సేవలు ప్రారంభించే ఖచ్చితమైన తేదీని ఇంకా ప్రకటించలేదు.ప్రతిపాదిత విధానాల ప్రకారం సభ్యుల పీఎఫ్ నిధుల్లో కొంత భాగాన్ని రిటైర్మెంట్ భద్రత కోసం కొనసాగిస్తూ, అర్హత ఉన్న మొత్తంలో 50 నుంచి 75 శాతం వరకు యూపీఐ లేదా ఏటీఎం ద్వారా ఉపసంహరించుకునే అవకాశం కల్పించే దిశగా ఈపీఎఫ్ఓ పనిచేస్తోంది. అయితే ఈ నిబంధనలు ఇంకా పూర్తి స్థాయిలో అమల్లోకి రాలేదని, అధికారిక మార్గదర్శకాలు వెలువడిన తర్వాతే తుది వివరాలు స్పష్టమవుతాయని అధికారులు చెబుతున్నారు.ఇక సభ్యుల సౌకర్యార్థం ఆటో-సెటిల్మెంట్ క్లెయిమ్ పరిమితిని ఇప్పటికే రూ.5 లక్షలకు పెంచిన ఈపీఎఫ్ఓ, వైద్యం, విద్య, గృహ నిర్మాణం, వివాహం వంటి అవసరాలకు సంబంధించిన క్లెయిమ్‌లను సాధ్యమైనంత వేగంగా పరిష్కరించే చర్యలు చేపట్టింది. భవిష్యత్తులో ఉమాంగ్ యాప్‌లో ఫేస్ ఆథెంటికేషన్, వాట్సాప్ ఆధారిత సేవలు, తక్షణ పాస్‌బుక్ యాక్సెస్, ఆన్లైన్ వివరాల సవరణ వంటి సదుపాయాలు కూడా మరింత విస్తృతంగా అందుబాటులోకి రానున్నాయి. -
బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేశాడంతే.. రూ.5 కోట్లు జాక్‌పాట్!
సాధారణంగా అందరికీ బ్యాంకు అకౌంట్లు ఉంటాయి. ఒకటో తారీఖున అలా జీతం పడగానే మొత్తం ఖర్చయిపోతుంది.. నెలాఖరుకు వచ్చేసరికి ఖాతా ఖాళీ అవుతుంది. ఇదీ సగటు జీవుడి బ్యాంక్ ఖాతా చిత్రం. నెల చివర్లో తమ ఆర్థిక దుస్థితిని తెలియజేసేందుకు కొందరు ఖాళీ అయిన తమ బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్‌ను స్క్రీన్ షాట్లు తీసి సరదాగా స్టేటస్లు కూడా పెట్టుకుంటుంటారు. అయితే ఇలా బ్యాంక్ అకౌంట్‌తోనే జాక్‌పాట్ కొట్టడం గురించి ఎప్పుడైనా విన్నారా?అబుదాబిలో నివసిస్తున్న భారత సంతతికి చెందిన 34 ఏళ్ల షాజీర్ వెంగా అనూహ్యంగా రూ.5 కోట్లకు పైగా నగదు బహుమతిని గెలుచుకుని వార్తల్లో నిలిచాడు. యూఏఈకి చెందిన షార్జా ఇస్లామిక్ బ్యాంక్ (Sharjah Islamic Bank) నిర్వహిస్తున్న ‘ఎస్ఐబీ మిలియనీర్’ సేవింగ్స్ రివార్డ్స్ ప్రచారంలో ఆయనకు 20 లక్షల దిర్హమ్లు (సుమారు రూ.5.15 కోట్లు) గ్రాండ్ ప్రైజ్‌గా లభించింది. షాజీర్ బ్యాంకులో సేవింగ్స్ ఖాతా తెరిచి ఇంకా రెండు నెలలు కూడా పూర్తికాకముందే ఈ భారీ బహుమతి అతని ఖాతాలో పడటం విశేషం.బ్యాంకు వెల్లడించిన వివరాల ప్రకారం.. షాజీర్ ఎస్ఐబీ డిజిటల్ యాప్ ద్వారా సేవింగ్స్ ఖాతా ప్రారంభించాడు. అనంతరం జూన్ 2026 డ్రాలో అతని పేరు గ్రాండ్ ప్రైజ్‌కు ఎంపికైంది. అదే డ్రాలో యూఏఈకి చెందిన మోజా అల్‌షంసీ లగ్జరీ బీఎండబ్ల్యూ ఎక్స్ఎం కారును గెలుచుకోగా, మరో 40 మంది నగదు బహుమతులు అందుకున్నారు.దీనిపై స్పందించిన షాజీర్.. “ఎస్ఐబీ మిలియనీర్ ప్రచారం గురించి ముందే తెలుసు. ఏదో ఒకరోజు నేను కూడా విజేతగా నిలుస్తానని ఆశించేవాడిని. కానీ ఇంత త్వరగా అదృష్టం వరిస్తుందని ఊహించలేదు. ఈ 20 లక్షల దిర్హమ్లు నా జీవితాన్నే మార్చేస్తాయి. భవిష్యత్తు కోసం పెట్టుబడులు పెట్టడమే కాకుండా, భారత్‌లో ఉన్న నా కుటుంబాన్ని యూఏఈకి తీసుకురావాలనే కలను సాకారం చేస్తాయి” అని పేర్కొన్నాడు.కస్టమర్లలో పొదుపు అలవాటును ప్రోత్సహించేందుకు షార్జా ఇస్లామిక్ బ్యాంక్ 2025లో ‘ఎస్ఐబీ మిలియనీర్’ ప్రచారాన్ని ప్రారంభించింది. అర్హత కలిగిన సేవింగ్స్ లేదా డిపాజిట్ ఖాతాల్లో ప్రతి 10,000 దిర్హమ్ల బ్యాలెన్స్‌కు ఒక డ్రా ఎంట్రీ లభిస్తుంది. ఏడాది పొడవునా కోట్ల రూపాయల విలువైన నగదు బహుమతులు, లగ్జరీ వాహనాలు ఈ పథకం ద్వారా అందజేస్తున్నారు. బ్యాంకు అధికారుల ప్రకారం, రాబోయే డ్రాల్లో కూడా ఒక్కోటి 10 లక్షల దిర్హమ్ల విలువైన రెండు ప్రధాన నగదు బహుమతులు ప్రకటించనున్నారు.Congratulations to the winners of SIB Millionaire Draw!Mr. Shajeer Venga won the Grand Cash Prize of AED 2 Million, and Mrs. Moza Butti won a BMW XM.We also congratulate forty other winners who received valuable cash prizes.Start your journey towards achieving a million… pic.twitter.com/osCjwVraHs— Sharjah Islamic Bank (@shjislamicbank) June 16, 2026 -
ఏటీఎం నుంచి మనీ విత్‌డ్రా.. EPFOనుంచి కీలక అప్డేట్ వచ్చేసింది
ఈపీఎఫ్‌వో సభ్యులకు శుభవార్త. త్వరలోనే ఏటీఎం సెంటర్ల ద్వారా, అలాగే యూపీఐ యాప్‌ల ద్వారా పీఎఫ్ విత్‌డ్రా చేసుకునే అవకాశం అందుబాటులోకి రానుంది. జాతీయ మీడియా కథనాల ప్రకారం, ఈ నెలాఖరులో లేదా వచ్చే నెల ప్రారంభంలో ఈ సౌకర్యం అమలు కానుంది. ఇటీవల కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ కూడా ఒక కార్యక్రమంలో ఈ విషయాన్ని వెల్లడించారు. అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది.ఈపీఎఫ్‌వో 3.0లో సభ్యులు తమ ఈపీఎఫ్ బ్యాలెన్స్‌లో 75 శాతం వరకు తక్షణ ఉపసంహరణ చేసుకునే అవకాశం ఉంటుంది. ఏటీఎం లేదా యూపీఐ ద్వారా రోజుకు రూ.10,000 వరకు ఉపసంహరించుకోవచ్చు. రూ.5 లక్షల వరకు క్లెయిమ్‌లు ఆటోమేటిక్‌గా మూడు రోజుల్లో ఆమోదం పొందుతాయి. ఇంతకు ముందు ఈ ప్రక్రియకు 7నుంచి 20 రోజుల సమయం పట్టేది. ఇప్పుడు ఏఐ ఆధారిత సిస్టమ్ ద్వారా వేగంగా క్లెయిమ్‌లు సెటిల్ అవుతాయి. అత్యవసర పరిస్థితుల్లో ఉద్యోగులకు తక్షణ ఆర్థిక సహాయం అందించడమే దీని లక్ష్యం.ఉద్యోగం మారినప్పుడు పీఎఫ్ మొత్తాన్ని కొత్త ఖాతాకు మార్చుకోవడానికి ఇంతకు ముందు ఫారమ్ 13 నింపాల్సి వచ్చేది. ఇకపై ఈ ప్రక్రియ పూర్తిగా ఆటోమేటిక్‌గా జరుగుతుంది. ఉద్యోగి కొత్త సంస్థలో చేరిన వెంటనే పీఎఫ్ ఖాతా ఆటోమేటిక్‌గా ట్రాన్స్ఫర్ అవుతుంది. అదే విధంగా, సభ్యులు తమ పేరు, పుట్టిన తేదీ, ఇతర వ్యక్తిగత వివరాలను ఆధార్ ఆధారంగా స్వయంగా సరిచేసుకోవచ్చు. ఇంతకు ముందు ఈ మార్పులకు ఉద్యోగి,యజమాని ఇద్దరూ కలిసి జాయింట్ డిక్లరేషన్ ఇవ్వాల్సి వచ్చేది.ఈ కొత్త సౌకర్యాలతో ఉద్యోగులకు పేపర్‌వర్క్ తగ్గుతుంది, క్లెయిమ్ సెటిల్మెంట్ వేగవంతమవుతుంది, పీఎఫ్ ట్రాన్స్ఫర్ సులభతరం అవుతుంది. పెన్షన్ చెల్లింపుల్లో కూడా పారదర్శకత పెరుగుతుంది. అయితే, అన్ని ఫీచర్లు దశలవారీగా అమలు అవుతున్నాయి. ప్రస్తుతం యూపీఐ ఆధారిత ఉపసంహరణలు కొంతమంది సభ్యులకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.పెన్షన్ ఉపసంహరణకు సంబంధించి కొత్త నియమాలు కూడా అమలులోకి వచ్చాయి. ఉదాహరణకు, 36 నెలల నిరుద్యోగం తర్వాత మాత్రమే పెన్షన్ ఉపసంహరణ చేసుకోవచ్చు. ఈపీఎఫ్‌వో 3.0తో ఉద్యోగులకు అత్యవసర పరిస్థితుల్లో తక్షణ ఆర్థిక సహాయం, వేగవంతమైన సేవలు, మరింత పారదర్శకత లభించనున్నాయి. -
బంగారాన్ని మించిన ఆస్తులున్నాయ్: కియోసాకి
ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం, అప్పులు, ఫెడరల్ రిజర్వ్ విధానాలపై చర్చలు జరుగుతున్న వేళ, ప్రముఖ ఆర్థిక వ్యాఖ్యాత, ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి తన ఫేస్బుక్ పోస్ట్ ద్వారా మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. కియోసాకి అభిప్రాయం ప్రకారం, అమెరికా ప్రభుత్వం ప్రస్తుతం 37 ట్రిలియన్ డాలర్ల అప్పు భారంతో ఉంది. కొత్త ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ ద్రవ్యోల్బణాన్ని మరింత వేడెక్కనివ్వడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో, సాధారణంగా బ్యాంకుల్లో డిపాజిట్లు, సీడీలు, ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడులు పెట్టే "పూర్ సేవర్స్" తమ డబ్బు విలువను నిశ్శబ్దంగా కోల్పోతారని ఆయన హెచ్చరించారు. "గోల్డ్ ఒక మంచి రక్షణ. 1970లలో అది విలువను నిలబెట్టుకుంది. కానీ అది కేవలం నీటిని నిల్వ చేసే సీసా లాంటిది. లీక్ కాకుండా కాపాడుతుంది. కానీ నిజమైన ధనవంతులు ద్రవ్యోల్బణం వల్ల లాభపడే ఆస్తులను ఎంచుకుంటారు" అని కియోసాకి వ్యాఖ్యానించారు. ఆయన ప్రకారం, గోల్డ్ మాత్రమే కాదు, చరిత్రలో ద్రవ్యోల్బణం వల్ల మరింత పెరిగిన మూడు ప్రత్యేక ఆస్తులు ఉన్నాయని, వాటిని త్వరలోనే వెల్లడిస్తానని తెలిపారు. -
ఎన్నారైల బ్యాంక్ డిపాజిట్లపై ఆర్బీఐ కీలక నిర్ణయం
భారత ఆర్థిక వ్యవస్థకు విదేశీ మారకద్రవ్య ప్రవాహాలను పెంచే దిశగా భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నారైలు (NRIs), ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా (OCIs) నుంచి అధిక మొత్తంలో డిపాజిట్లను ఆకర్షించేందుకు ఎంపిక చేసిన నాన్-రెసిడెంట్ ఎక్స్టర్నల్ (NRE), ఫారిన్ కరెన్సీ నాన్-రెసిడెంట్ [FCNR(B)] డిపాజిట్లపై అమలులో ఉన్న వడ్డీ రేటు పరిమితులను తాత్కాలికంగా తొలగించింది. ఈ సడలింపు 2026 సెప్టెంబర్ 30 వరకు అమల్లో ఉంటుంది.ఆర్బీఐ తాజా మార్గదర్శకాల ప్రకారం.. మూడు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలపరిమితి గల తాజా ఎన్ఆర్ఈ డిపాజిట్లపై బ్యాంకులు తమ అవసరాలకు అనుగుణంగా అధిక వడ్డీ రేట్లు ప్రకటించవచ్చు. అలాగే మూడు నుంచి ఐదు సంవత్సరాల కాలపరిమితి గల కొత్త ఎఫ్‌సీఎన్‌ఆర్‌బీ డిపాజిట్లపై కూడా ఇప్పటివరకు ఉన్న వడ్డీ పరిమితులు వర్తించవు. ఈ సడలింపు కొత్తగా సమీకరించే డిపాజిట్లకే కాకుండా, మెచ్యూరిటీ అనంతరం పునరుద్ధరించే అర్హత గల డిపాజిట్లకు కూడా వర్తిస్తుంది.ఇప్పటి వరకు ఎన్ఆర్ఈ డిపాజిట్లపై వడ్డీ రేట్లు సమాన కాలపరిమితి గల దేశీయ రూపాయి టర్మ్ డిపాజిట్ల కంటే ఎక్కువగా ఉండకూడదనే నిబంధన అమల్లో ఉండేది. అలాగే ఎఫ్‌సీఎన్‌ఆర్‌బీ డిపాజిట్లపై కూడా నిర్దిష్ట పరిమితులు ఉండేవి. ఇప్పుడు ఆ పరిమితులు తొలగించడంతో బ్యాంకులు ఎన్నారై డిపాజిట్ల కోసం మరింత పోటీగా వడ్డీ రేట్లు ప్రకటించే అవకాశం ఏర్పడింది.ఇటీవల అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితి, ముడి చమురు ధరల పెరుగుదల, విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి వంటి అంశాల నేపథ్యంలో విదేశీ కరెన్సీ ప్రవాహాలను పెంచేందుకు ఆర్బీఐ చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగానే ఈ నెల ప్రారంభంలో మూడు నుంచి ఐదు సంవత్సరాల కాలపరిమితి గల తాజా ఎఫ్‌సీఎన్‌ఆర్‌బీ డిపాజిట్లకు సంబంధించిన పూర్తి హెడ్జింగ్ వ్యయాన్ని తానే భరిస్తామని కూడా ప్రకటించింది. అంతేకాకుండా ఈ డిపాజిట్లను సీఆర్ఆర్, ఎస్ఎల్ఆర్ నిబంధనల నుంచి కూడా తాత్కాలికంగా మినహాయించింది.మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం.. ఇప్పటికే పలు బ్యాంకులు అమెరికన్ డాలర్ ఆధారిత ఎఫ్‌సీఎన్‌ఆర్‌బీ డిపాజిట్లపై 6 శాతం నుంచి 7 శాతం వరకు వడ్డీ రేట్లను ప్రకటించాయి. చిన్న, మధ్య తరహా బ్యాంకులు డిపాజిట్ల కోసం మరింత ఆకర్షణీయమైన రేట్లు ప్రకటించే అవకాశముందని బ్యాంకింగ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే, ఎన్ఆర్వో ఖాతాల నుంచి ఎన్ఆర్ఈ ఖాతాలకు బదిలీ చేసిన నిధులకు ఈ ప్రత్యేక మినహాయింపు వర్తించదని ఆర్బీఐ స్పష్టం చేసింది. -
భారీగా క్రెడిట్ కార్డు అప్పులు.. కియోసాకి అలర్ట్
ప్రపంచ ప్రసిద్ధ పర్సనల్ పైనాన్స్ పుస్తకం ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) రచయిత రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) అమెరికన్ల పెరుగుతున్న క్రెడిట్ కార్డు అప్పులపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన తన ఫేస్బుక్ ఖాతాలో చేసిన పోస్టులో వినియోగపు అలవాట్లు ఎలా ఆర్థిక భారంగా మారుతున్నాయో వివరించారు.ప్రస్తుతం అమెరికన్లు క్రెడిట్ కార్డులపై 1.28 ట్రిలియన్ డాలర్లు (సుమారు రూ.120 లక్షల కోట్లు) అప్పుల్లో ఉన్నారన్న కియోసాకి, ఈ భారీ అప్పులకు అనవసర ఖర్చులే ప్రధాన కారణమని అభిప్రాయపడ్డారు.అమెరికన్లు చేసిన ఖర్చుల జాబితాను ప్రస్తావిస్తూ ఆయన కొన్ని ఉదాహరణలు కూడా ఇచ్చారు. ఖరీదైన రెస్టారెంట్లలో విందులు, వాడకపోయినా స్ట్రీమింగ్ సర్వీసుల సబ్స్క్రిప్షన్లను కొనసాగించడం, అనవసరంగా దుస్తులు కొనుగోలు చేయడం, విహారయాత్రల కోసం అప్పులు చేయడం, గుర్తింపులేని ఆన్లైన్ షాపింగ్ ఆర్డర్లు, ఉపయోగించని జిమ్ సభ్యత్వాలు వంటి ఖర్చులు ప్రజలను అప్పుల ఊబిలోకి నెడుతున్నాయని ఆయన పేర్కొన్నారు.అలాగే కొత్త గ్యాడ్జెట్లు, అప్గ్రేడ్లు, వివిధ సబ్స్క్రిప్షన్లు, సౌకర్యాల కోసం చెల్లించే అదనపు రుసుములు కొనుగోలు సమయంలో అవసరమైనవిగా అనిపించినప్పటికీ, తర్వాత అవే ఆర్థిక భారంగా మారుతాయని కియోసాకి హెచ్చరించారు.తన ప్రసిద్ధ పుస్తకం ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’లో ఉపయోగించిన “డూడాడ్స్ (Doodads)” అనే పదాన్ని గుర్తుచేస్తూ, అవసరం లేని వస్తువులు మనల్ని ధనవంతుల్లా భావింపజేసినా, వాస్తవానికి పేదరికం వైపు నెడతాయని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం సగటు అమెరికన్ వ్యక్తి సుమారు 7,900 డాలర్లు (దాదాపు రూ.6.8 లక్షలు) క్రెడిట్ కార్డు అప్పుతో ఉన్నారని, దానిపై 24 శాతం వడ్డీ చెల్లిస్తూ మినిమమ్ డ్యూలతో నెట్టుకొస్తున్నారని కియోసాకి తెలిపారు. ఇలాంటి అప్పులపై వడ్డీ చక్రవడ్డీలా పెరుగుతూ ఆర్థిక స్వేచ్ఛను దూరం చేస్తుందని ఆయన హెచ్చరించారు.అందరూ తమ ఖర్చుల అలవాట్లను పరిశీలించుకోవాలని, అవసరం లేని వ్యయాలను తగ్గించి నిజమైన సంపద సృష్టి వైపు అడుగులు వేయాలని ఆయన సూచించారు. ఈ నేపథ్యంలో ఖర్చులను నియంత్రించి ఆర్థిక స్థిరత్వం సాధించేందుకు తాను ఒక ఉచిత మార్గదర్శకాన్ని సిద్ధం చేశానని తన పోస్టులో పేర్కొన్నారు. -
Income Tax: ‘ఇన్‌కం స్టేట్మెంట్’ ఇలా తయారు చేయండి..
2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయడానికి గడువు తేదీ 2026 జూలై 31. అంటే.. వచ్చే నెలాఖరులోపలే. ఈ రోజు నాటికి ఫారం 1,2 అలాగే ఫారం 4 దాఖలు చేయడానికి అన్ని యుటిలిటీలు రెడీగా ఉన్నాయి. రిటర్నులు దాఖలు అవుతున్నాయి. అయితే, 1 గానీ 2 గానీ 4 గానీ ముందుగా మీరు ‘ఇన్‌కం స్టేట్మెంట్’ చేసుకోవాలి. ఈ స్టేట్మెంట్ తయారు చేసుకోవడం చాలా సులువైన పని. ఇంకేం.. రంగంలోకి దూకండి. ఆదాయంపరంగా ఆలోచిస్తే, మీరు మీ ఆదాయం ఏయే ‘సోర్స్’ ద్వారా వస్తుందో ఒక పట్టిక/జాబితా చేయండి. ఉదాహరణకి 🔸 జీతం/వేతనం 🔸 పెన్షన్ 🔸 కొన్ని నెలలు జీతం, మిగతా నెలలు పెన్షన్ 🔸 యాన్యుటీలు 🔸 ప్రతి నెలా వచ్చే ఇంటద్దెలు. మీ సౌలభ్యం కోసం మీరు మీరు అద్దెకిచ్చిన ప్రాపర్టీల జాబితా తయారు చేసుకోండి. క్రమసంఖ్య, ఇంటి నంబరు, ప్లాట్ నంబరు, లొకేషన్, ఊరి పేరు, పట్నం పేరు మొదలైన వివరాలు ఉండాలి. ఈ ప్రాపర్టీలకు సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్లను పరిశీలించి చూడండి. ఓనర్షిప్.. సింగిలా/జాయింటా? వాడుకలో మాది మాది అని అంటాం, ఎప్పుడు కొన్న ప్రాపర్టీ అనేది వివరాలు గుర్తుండవు. అప్పట్లో బ్యాంకర్లు (ఇప్పుడూ అనుకోండి) అప్పు ఎక్కువ రావడానికి మీ జీవిత భాగస్వామిని/కుటుంబ సభ్యులను కో–అప్లికెంటుగా ఇరికిస్తారు లేక మీరే ట్యాక్స్ ప్లానింగ్కని ఇద్దరూ కలిసి జాయింటుగా రాస్తారు. ఇవన్నీ ఓనర్షిప్కి పనికి వస్తాయి. తర్వాత చెల్లించిన మున్సిపల్ ట్యాక్స్ చెల్లింపులు, బ్యాంకులు, జమలు, నగదు వసూళ్లు, అద్దెలోకి వస్తాయి. 🔸ప్రతినెల మీ బ్యాంకు ఖాతాలో జమయ్యే వడ్డీలు. 🔸 మీ చేతికి నెల నెలా రాకపోయినా మీ ఎఫ్డీఆర్కి క్రెడిట్ అయ్యేవి, మెచ్యూరిటీ రోజు నాటికి మొత్తం అసలు, వడ్డీ జమ అవుతాయి. కానీ మీరు సంవత్సరానికి వచ్చిన వడ్డీనే తీసుకోవచ్చు. 🔸 జమ అయ్యే వడ్డీలు, అలాగే జమ కానివి, నగదు రూపేణా వచ్చేవి. 🔸 డివిడెండ్లు, బ్యాంకులో జమ అవుతాయి. 🔸 ఇతర ఆదాయాలు 🔸 వ్యవసాయ ఆదాయాలు. బ్యాంకు అకౌంట్ స్టేట్మెంటు/పాస్‌బుక్‌లో ప్రతి జమ, ఎందుకొచి్చందో విశ్లేషించండి. వివరించండి. 🔸 ముందుగా విత్‌డ్రా చేసి, ఖర్చులు పోను, మిగిలిన మొత్తాన్ని బ్యాంకులో డిపాజిట్ చేశారనుకోండి.. అది మీ ఆదాయం కాదు. 🔸 మీకు ఎవరైనా అప్పు తీర్చి ఉంటే, ఆ మొత్తాన్ని బ్యాంకులో జమ చేస్తే, అది ‘ఆదాయం’ కాదు. కానీ ఇలాంటి వ్యవహారాలు ‘శల్యపరీక్ష’కు గురవుతాయి. 🔸 ఆస్తులు, షేర్లు, సెక్యూరిటీలు, బంగారం, ఆభరణాల్లాంటి విలువైన వస్తువులను అమ్మగా వచి్చన డిపాజిట్లు. వీటి మీద క్యాపిటల్ గెయిన్స్ పడే అవకాశం ఉంది. విశ్లేషణ, వివరణ చేసుకోండి. 🔸 పీఎఫ్ విత్‌డ్రాయల్స్, ఎల్ఐసీ పాలసీ మెచ్యూరిటీ మొత్తం, ఎన్ఎస్సీల మెచ్యూరిటీ, చిట్‌ఫండ్‌లో చేరి పాట పాడగా వచ్చిన మొత్తం, పూర్తి విశ్లేషణ, సమగ్రంగా వివరణ అవసరం 🔸 మీరు వ్యాపారస్తులైతే ప్రత్యేకంగా అకౌంట్స్ నిర్వహించండి. వ్యాపారపు కరెంటు ఖాతా నుంచి మీ ఎస్బీ అకౌంటుకు చేసిన జమలు.. అవి సొంత వాడకాలా... జీతమా లేక అప్పు తీర్చడమా.. విశ్లేషించుకోండి. 🔸 వీలున్నంత వరకు కరెంటు ఖాతా, మరియు ఎస్బీ అకౌంటును విడివిడిగా నిర్వహిస్తూ, రెండింటి మధ్య వ్యవహారాలు, తక్కువగా ఉండేలా చూసుకోండి. అనివార్యమైతే, సరిగ్గా విశ్లేషణ, వివరణ రెడీగా పెట్టుకోండి. 🔸 ఏ జమ పడినా వివరణ ఉంచుకోండి. చివరిగా, మీ అన్ని బ్యాంకు అకౌంట్లు విశ్లేషించండి. వివరాలు పొందుపర్చండి. జీతం నిమిత్తం 12 జమలు ఉండాలి. తక్కువ, ఎక్కువ అయితే, ఆరా తీయండి. అద్దె జమలు 12 రసీదులకు తగ్గినా, ఎక్కువయినా ఆరా తీయండి. అద్దె విషయంలో అడ్వాన్స్‌లను జాగ్రత్తగా సర్దుబాటు చేయండి. 2026 మార్చి 31 తర్వాత కూడా 2025–26కి సంబంధించిన వ్యవహారాలు జమ కావొచ్చు. అలాగే, ఏప్రిల్ 2025లో 2024–25కి సంబంధించినవి జమ కావొ చ్చు. ఇప్పుడు మీ చేతిలో ‘జమలు’ ఉన్నాయి. వాటి సాయంతో ‘స్టేట్మెంట్’ చేయడానికి ఉపక్రమించండి. -
పీఎఫ్ డబ్బులు రూ.2.5 కోట్లు వెనక్కివ్వాలని నోటీసు..
రిటైర్మెంట్ అనంతరం మెరుగైన జీవనం కోసం ఉద్యోగులు తమ సర్వీసు కాలమంతా పీఎఫ్ సొమ్మును పొదుపు చేసుకుంటారు. పదవీ విరమణ తర్వాత వచ్చే భారీ మొత్తంతో ఆర్థిక ఇబ్బందులు లేకుండా జీవనం కొనసాగుతుందని భావిస్తారు. అయితే ఇలాగే పొదుపు చేసుకున్న పీఎఫ్ సొమ్మును అందుకున్న ఓ ఉద్యోగిని ఆ సొమ్మును తిరిగి ఇచ్చేయాలని ఈపీఎఫ్‌వో నోటీసు ఇచ్చింది. దీనికిపై ఆ ఉద్యోగి కోర్టుకు వెళ్లగా ఏం జరిగిందంటే..పదవీ విరమణ పొందిన ఉద్యోగికి చెల్లించిన ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) మొత్తాన్ని తిరిగి చెల్లించాలని ఈపీఎఫ్‌వో (EPFO) కోరడం చట్టబద్ధం కాదని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. ఉద్యోగికి చెల్లించిన పీఎఫ్‌లో ఏవైనా నిబంధనల ఉల్లంఘనలు జరిగి ఉంటే, వాటికి బాధ్యత యజమాని సంస్థ లేదా దాని పీఎఫ్ ట్రస్ట్‌దేనని, ఉద్యోగిదికాదని కోర్టు తేల్చిచెప్పింది.జస్టిస్ నగేష్ భీమాపాక 2025లో దాఖలైన రిట్ పిటిషన్ నెం. 6276పై ఈ తీర్పు ఇచ్చారు. రిటైర్డ్ ఉద్యోగి జె.వి. నృపేందర్ రావుకు ఈపీఎఫ్‌వో జారీ చేసిన రికవరీ నోటీసును కోర్టు రద్దు చేసింది. అయితే సదురు కంపెనీపై అవసరమైతే చట్టపరమైన చర్యలు తీసుకునే స్వేచ్ఛను ఈపీఎఫ్‌వోకు ఇచ్చింది.రూ.2.5 కోట్ల చెల్లింపుతో మొదలైన వివాదంజె.వి. నృపేందర్ రావు పనిచేసిన సంస్థకు సొంత పీఎఫ్ ట్రస్ట్ ఉండేది. ఈ ట్రస్ట్‌కు 1981 నుంచే ‘ఎగ్జెంప్టెడ్ ఎస్టాబ్లిష్మెంట్’ హోదా ఉండేది. అయితే సంస్థ 2023 మార్చి 1 నుంచి ఆ హోదాను సరెండర్ చేసింది. అనంతరం 2023 జూలై 21న రావుకు రూ.2.50 కోట్ల పీఎఫ్ బకాయిలు చెల్లించింది. మరో రూ.70 లక్షలు యెస్ బ్యాంక్ బాండ్లలో నిలిచిపోవడంతో తర్వాత చెల్లిస్తామని తెలిపింది.సంస్థ పీఎఫ్ ట్రస్ట్ నిధుల్లో భాగంగా యెస్ బ్యాంక్ బాండ్లలో పెట్టుబడులు పెట్టింది. రిజర్వ్ బ్యాంక్ ఆదేశాలు, సుప్రీంకోర్టు చర్యల కారణంగా ఆ బాండ్లు నిలిచిపోవడంతో కొంత మొత్తం విడుదల కాలేదు. దీంతో ఉద్యోగికి విడతల వారీగా చెల్లింపులు జరిగాయి.ఈపీఎఫ్‌వో రికవరీ నోటీసుఎగ్జెంప్షన్ హోదా సరెండర్ చేసిన తర్వాత పీఎఫ్ ట్రస్ట్ ఉద్యోగికి నేరుగా చెల్లింపులు చేయడం నిబంధనలకు విరుద్ధమని ఈపీఎఫ్‌వో అభిప్రాయపడింది. ఉద్యోగి అందుకున్న రూ.2.5 కోట్లను 12 శాతం వడ్డీతో తిరిగి చెల్లించాలని దీంతో 2025 ఫిబ్రవరి 17న నోటీసు జారీ చేసింది. ఈ మొత్తాన్ని ఏడు రోజుల్లో చెల్లించాలని ఆదేశించింది.కోర్టు ఏమంది?ఈపీఎఫ్ చట్టం ఉద్యోగుల సంక్షేమం కోసం రూపొందించిన సామాజిక భద్రత చట్టమని హైకోర్టు పేర్కొంది. ఎగ్జెంప్షన్ సరెండర్ తర్వాత పీఎఫ్ నిధులను ఈపీఎఫ్‌వోకు బదిలీ చేసే బాధ్యత పూర్తిగా యజమాన్య సంస్థ, దాని ట్రస్ట్‌పైనే ఉంటుందని స్పష్టం చేసింది. ఉద్యోగి తనకు చట్టబద్ధంగా రావలసిన మొత్తాన్ని స్వీకరించినందుకు అతనిపై రికవరీ చర్యలు తీసుకోవడం సరైంది కాదని వ్యాఖ్యానించింది.అంతేకాకుండా ఉద్యోగిపై మోసం, తప్పుడు సమాచారం లేదా కుమ్మక్కు ఆరోపణలు ఏవీ లేవని కోర్టు గమనించింది. అలాంటి పరిస్థితుల్లో ఉద్యోగి నుంచి డబ్బు వసూలు చేయడానికి చట్టంలో స్పష్టమైన నిబంధన లేదని పేర్కొంది. రికవరీ నోటీసు జారీ చేసే ముందు ఉద్యోగికి షోకాజ్ నోటీసు ఇవ్వకపోవడం, వ్యక్తిగత విచారణకు అవకాశం కల్పించకపోవడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని కోర్టు అభిప్రాయపడింది. అందువల్ల ఈపీఎఫ్‌వో జారీ చేసిన నోటీసును రద్దు చేసింది.అయితే పీఎఫ్ ట్రస్ట్ నిబంధనలను ఉల్లంఘించిందా? లేదా? అన్న అంశంపై హైకోర్టు ఎలాంటి తుది అభిప్రాయం వ్యక్తం చేయలేదు. అవసరమైతే ఈపీఎఫ్ చట్టం ప్రకారం సంస్థ లేదా దాని ట్రస్ట్‌పై తగిన చర్యలు తీసుకోవచ్చని ఈపీఎఫ్‌వోకు స్వేచ్ఛ ఇచ్చింది.సొంత పీఎఫ్ ట్రస్ట్ అంటే ఏమిటి?సాధారణంగా ఉద్యోగుల పీఎఫ్ చందాలు నేరుగా ఈపీఎఫ్‌వోకు వెళ్తాయి. కానీ కొన్ని సంస్థలు అనుమతి తీసుకుని తమ సొంత పీఎఫ్ ట్రస్ట్ ఏర్పాటు చేసుకుంటాయి. ఉద్యోగుల, యజమాని చందాలను ఈ ట్రస్ట్ నిర్వహిస్తుంది. -
గృహలక్ష్మి ఇప్పుడు... ఇన్వెస్ట్మెంట్ మహాలక్ష్మి
ఒకప్పుడు భారతీయ మహిళల ఆర్థిక ప్రపంచం.. బంగారు నగలు,పోస్టాఫీస్ సేవింగ్స్, చిట్ఫండ్లు, ఫిక్స్డ్ డిపాజిట్ల వరకే పరిమితమై ఉండేది. కుటుంబ భవిష్యత్తు కోసం భాగస్వామితో కలిసి అంతో ఇంతో పొదుపు చేసేవారు, సంపద పెంచాలి, పెంచుకోవాలి అనే తపన తక్కువగానే ఉండేది. కానీ ఇప్పుడు దేశవ్యాప్తంగా దృశ్యం పూర్తిగా మారుతోంది. భర్త సంపాదించి ఇచ్చినా, తాను స్వయంగా కష్టపడి సంపాదించినా వచ్చే ప్రతి రూపాయిలో రిటైర్మెంట్ కలలు, విదేశీ యాత్రల లక్ష్యాలు, ఆర్థిక స్వాతంత్య్రఆశయాలు కూడా చేరుతున్నాయి. భారత మహిళలు సేవింగ్స్ నుంచి ఇన్వెస్టింగ్‌కి మారడం లేదు... సేవింగ్స్‌కే కొత్త అర్థం చెబుతున్నారు. – సాక్షి, వెల్త్ డెస్క్అమ్మమ్మ తరం బంగారం దాచింది. అమ్మ తరం ఫిక్స్డ్ డిపాజిట్లు వేసింది.ఇప్పుడు కూతురు తరం షేర్లు, ఈక్విటీలు, సిప్(సిస్టమేటిక్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్)లలో పెట్టుబడులు పెడుతోంది. మూడు తరాలు... మూడు ఆర్థిక తత్వాలు. కానీ లక్ష్యం మాత్రం ఒక్కటే ... భవిష్యత్తు భద్రత. అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే కొత్త తరం మహిళలు డబ్బును కేవలం దాచడం కాదు... దాచిన దానితో తిరిగి డబ్బు సంపాదించడం కూడా నేర్చుకుంటున్నారు. అందుకే భారత మహిళల చేతుల్లో ఇప్పుడు కేవలం నగల పెట్టెలు కాదు, మొబైల్ ఫోన్లలో మ్యూచువల్ ఫండ్ పోర్ట్‌ఫోలియోలు కూడా కనిపిస్తున్నాయి. మహిళలు కేవలం పొదుపుదారులుగానే కాకుండా, సమర్థవంతమైన ఇన్వెస్టర్లుగా ఎదుగుతున్నారు. సంప్రదాయ బంగారంతో పాటు మ్యూచువల్ ఫండ్లు,సిప్‌లు, ఈక్విటీ ఆధారిత పెట్టుబడులు, రిటైర్మెంట్ కార్పస్ నిర్మాణం దిశగా దూసుకెళ్తున్నారు.ఈ మార్పు కేవలం వ్యక్తిగత పెట్టుబడి ధోరణి కాదు. భారత ఆర్థిక వ్యవస్థలో మహిళల భాగస్వామ్యాన్ని తిరిగి నిర్వచిస్తున్న నిశ్శబ్ద విప్లవం.సంఖ్యల్లో మహిళల ఆర్థిక దూకుడు మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ వెలువరించిన గణాంకాలు మహిళల భాగస్వామ్యం ఎంత వేగంగా పెరుగుతోందో స్పష్టంగా చూపిస్తున్నాయి. 🔸 దేశీ పెట్టుబడుల్లో మహిళా మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్ల వాటా 25 శాతం దాటింది. 🔸 వ్యక్తిగత మ్యూచువల్ ఫండ్ ఏయూఎంలో వాటా 33 శాతం పైగా ఉంది. 🔸 మహిళల నిర్వహణలో ఉన్న మ్యూచువల్ ఫండ్స్ ఆస్తులు రూ.11.3 లక్షల కోట్లు 🔸 మొత్తం మ్యూచువల్ ఫండ్స్ ఇన్ఫ్లోలలో వాటా 35 శాతం 🔸 35 ఏళ్లలోపు పెట్టుబడులు ప్రారంభించిన మహిళలు 80శాతం ఈ గణాంకాలు ఒక కీలక విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.నేటి తరం మహిళలు ఇప్పుడు కేవలం డబ్బు దాచడం కాదు... డబ్బుతో పని చేయించడం నేర్చుకుంటున్నారు.బంగారం నుంచి సిప్ లకు కాదు... బంగారంతో పాటు సిప్‌లకు మహిళలు బంగారాన్ని కొనడం పూర్తిగా మానేశారా అంటే లేదనే చెప్పాలి. వాస్తవానికి వారు సంప్రదాయ పెట్టుబడులను ఆధునిక ఆరి్ధక సాధనాలతో కలిపి సరికొత్త సమతుల్య పోర్ట్‌ఫోలియోలను నిర్మిస్తున్నారు. బంగారం అంతో ఇంతో తరచూ కొనడం ఇప్పటికీ వారికి కుటుంబ సంప్రదాయమే. ఆనందం కలిగించే విషయమే. బంగారం అత్యవసర సమయాల్లో లిక్విడిటీ అందిస్తుంది. పిల్లల ఉన్నత చదువులు, వివాహ అవసరాలకు, అనారోగ్య పరమైన ఖర్చుల విషయంలో భద్రతనిస్తుంది. అయితే దీర్ఘకాలిక సంపద పెరగాలంటే కాంపౌండింగ్ శక్తి అవసరమని కొత్త తరం మహిళలు గ్రహిస్తున్నారు. అందుకే ప్రతి నెలా సిప్ల రూపంలో క్రమశిక్షణతో పెట్టుబడులు పెడుతున్నారు.నేటి మహిళల కొత్త పెట్టుబడి సూత్రం..భద్రతకు బంగారం... సంపదకు సిప్ అనే మార్పునకు మూడు కారణాలున్నాయి.🔸 పెరిగిన ఆదాయాలు. కుటుంబంలో పెరుగుతున్న నిర్ణయాధికారం. ఐటీ, బ్యాంకింగ్, ఆతిథ్యం, ఆరోగ్యరంగం, కార్పొరేట్ సేవలు, స్టార్టప్‌లు, ఫ్రీలాన్సింగ్ రంగాల్లో ఉద్యోగాలు చేసే మహిళల సంఖ్య భారీగా పెరిగింది. దీంతో కుటుంబ ఆదాయం పెరుగుతోంది. మహిళలు కూడా కుటుంబ ఆర్థిక నిర్ణయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఒకప్పుడు తండ్రి లేదా భర్త తీసుకునే పెట్టుబడి నిర్ణయాలను ఇప్పుడు మహిళలే చొరవచూపి స్వయంగా తీసుకుంటున్నారు.🔸 డిజిటల్ విప్లవం షేర్లు, మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టాలంటే ఒకప్పుడు బ్రోకర్లు,బ్యాంక్ శాఖల చుట్టూ తిరగాల్సి వచ్చేది. అనేక దరఖాస్తు ఫారాలు నింపాల్సి ఉండేది.నేడు స్మార్ట్‌ఫోన్ ద్వారా బ్యాంకుఖాతా, ఆధార్, పాన్ కార్డు ఉంటే చాలు స్మార్ట్ ఫోన్ ద్వారా డీమ్యాట్ అకౌంట్లు తెరిచే అవకాశం పెరిగింది. కేవలం పది నిమిషాల్లో సిప్ ఖాతాలు ప్రారంభించగలుగుతున్నారు. ఈ సాంకేతిక విప్లవమే లక్షలాది మహిళలను ఆర్థిక మార్కెట్లకు దగ్గర చేసింది.🔸 లక్ష్యాల కోసం పెట్టుబడులు గత తరాలు పిల్లల చదువు,పెళ్లిళ్ల అవసరాల కోసం మాత్రమే పొదుపు గురించి ఆలోచించేవి. కానీ నేటి ఆధునిక తరం మహిళలు మాత్రం వ్యక్తిగత రిటైర్మెంట్, విదేశీ విహార యాత్రలు, సొంత వ్యాపారాలు ప్రారంభించేందుకు, ఎమెర్జన్సీ అవసరాలకు ఇలా అనేక ప్రత్యేక లక్ష్యాలతో పెట్టుబడుల వైపు దూసుకెళుతున్నారు.మెరుగైన ఇన్వెస్టర్లుగా మహిళలు?గణాంకాలను పరిశీలిస్తే పెట్టుబడుల ప్రపంచంలో ఒక ఆసక్తికరమైన వాస్తవం వెలుగులోకి వస్తోంది. పురుషుల్లాగా మహిళలు వెంటవెంటనే కొనుగోలుఅమ్మకాలు జరపడంలేదు. ఏదో కారణంతో తరచూ పడిపోయే స్టాక్ మార్కెట్లో భయపడి పెట్టుబడులు ఉపసంహరించుకోవడంలేదు. దీర్ఘకాలిక లక్ష్యాలపై దృష్టి పెట్టి క్రమశిక్షణతో కొనసాగుతున్నారు.మహిళా ఇన్వెస్టర్ల ప్రత్యేకత🔸 సిప్‌లను నిరంతరంగా కొనసాగించడం 🔸 దీర్ఘకాలిక దృష్టి 🔸 తక్కువ రిస్‌్కతో సమతుల్య పెట్టుబడులు 🔸 భావోద్వేగ నిర్ణయాలకు దూరంగా ఉండటం 🔸 లక్ష్యంతో పెట్టుబడి ప్రణాళికలు వేయడం ఈ కారణాల వల్ల మహిళల పోర్ట్‌ఫోలియోలు దీర్ఘకాలంలో మెరుగైన ఫలితాలు ఇస్తున్నాయని పరిశ్రమ విశ్లేషకులు చెబుతున్నారు.చిన్న పట్టణాల్లోనూ పెద్ద మార్పుమహిళల పెట్టుబడుల విప్లవం కేవలం దేశంలోని మెట్రో నగరాలకే పరిమితం కాలేదు. విజయవాడ, రాజమండ్రి, గుంటూరు, వరంగల్, నిజామాబాద్, కరీంనగర్ వంటి టైర్2 (ద్వితీయ శ్రేణి) , టైర్3 తృతీయ శ్రేణి నగరాల్లో కూడా మహిళలు భారీగా సిప్ పెట్టుబడులు ప్రారంభిస్తున్నారు.ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి వచి్చన ఫైనాన్షియల్ కంటెంట్, యూట్యూబ్ ఛానళ్లు, డిజిటల్ ఫిన్‌టెక్ యాప్‌లు కూడా ఈ పెట్టుబడి విప్లవానికి ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి.ఆర్థిక స్వాతంత్య్రం అంటే జీతం కాదు... ఆస్తులుఆర్థిక స్వాతంత్య్రమంటే జీతం సంపాదించడం మాత్రమే కాదు.దాన్ని సంపదగా మార్చడమని నేటి మహిళలు కొత్త నిర్వచనం చెబుతున్నారు. ఆమె దృష్టిలో నిజమైన ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే 🔸 తన పేరుమీద ఆస్తులు ఉండటం ళీ ఎమర్జెన్సీ ఫండ్ ఉండటం 🔸 తన రిటైర్మెంట్ కోసం ప్రత్యేక కార్పస్ నిర్మించుకోవడం 🔸 జీవితంలోని అనిశ్చిత పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కోవడం 🔸 ప్రతి మహిళ పర్సనల్ ఫైనాన్స్ చెక్‌లిస్ట్ తయారుచేసుకోవాలితనను తాను ఇలా ప్రశ్నించుకోవాలి 🔸 నా పేరుమీద పెట్టుబడులు ఉన్నాయా? 🔸 బంగారం, ఫిక్స్డ్ డిపాజిట్లకు మించి ఈక్విటీ లు, మ్యూచువల్ ఫండ్సులో ఇన్వెస్ట్చేస్తున్నానా? 🔸 రిటైర్మెంట్కు ప్రత్యేక కార్పస్ ఫండ్ ఉందా? 🔸 ప్రతి ఏడాది సిప్ మొత్తాన్ని పెంచుతున్నానా? 🔸 ఏదైనా కారణంతో ఒక సంవత్సరం ఆదాయం ఆగిపోతే ఆర్థికంగా నిలబడగలనా? చివరగా... భారత మహిళలు బంగారాన్ని వదిలేయడం లేదు. కానీ బంగారం ఒక్కటే భవిష్యత్తు కాదని అర్థం చేసుకుంటున్నారు. భద్రత కోసం బంగారం, స్థిరత్వం కోసం ఫిక్స్డ్ డిపాజిట్లు, సంపద సృష్టి కోసం మ్యూచువల్ ఫండ్లు అనే సమతుల్య పెట్టుబడి విధానాన్ని అవలంబిస్తున్నారు. నేటి మహిళల పెట్టుబడి నిర్ణయాలు రేపటి భారత ఆర్థిక వ్యవస్థకు బలమైన పునాది వేయబోతున్నాయి. కుటుంబ పొదుపులను సంపదగా, సంపదను ఆర్థిక స్వాతంత్య్రంగా మార్చుతున్న ఈ నిశ్శబ్ద విప్లవమే రాబోయే దశాబ్దంలో భారత వృద్ధికి కొత్త ఇంధనంగా మారనుంది. ఇంటి బడ్జెట్‌ను చూసుకునే మహిళ.. ఇప్పుడు దేశ సంపద నిర్మాణంలోనూ కీలక భాగస్వామి అవుతోంది. -
అడ్వాన్స్ ట్యాక్స్ డెడ్‌లైన్ రేపే..
పన్ను చెల్లింపుదారులకు కీలక గడువు సమీపించింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి (FY 2026-27) సంబంధించిన తొలి అడ్వాన్స్ ట్యాక్స్ (ముందస్తు పన్ను) వాయిదాను (advance tax deadline 2026) జూన్ 15లోగా చెల్లించాలని ఆదాయపు పన్ను శాఖ సూచిస్తోంది. ఈసారి ప్రత్యేకత ఏమిటంటే.. 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త ఆదాయపు పన్ను చట్టం-2025 ప్రకారం తొలి అడ్వాన్స్ ట్యాక్స్ వాయిదా ఇదే.అడ్వాన్స్ ట్యాక్స్ విధానం ద్వారా ప్రభుత్వం "సంపాదించిన కొద్దీ పన్ను చెల్లింపు" (Pay-as-you-earn) వ్యవస్థను అమలు చేస్తోంది. ఏడాది చివర్లో ఒకేసారి పన్ను చెల్లించకుండా, అంచనా పన్నును నాలుగు విడతల్లో చెల్లించే అవకాశం ఉంటుంది.అడ్వాన్స్ ట్యాక్స్ తప్పనిసరి ఎవరికి?టీడీఎస్ (TDS), టీసీఎస్ (TCS) మినహాయింపుల తర్వాత కూడా వార్షిక పన్ను బాధ్యత రూ.10,000 దాటితే అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిబంధన కింది వర్గాలకు వర్తిస్తుంది:🔹 జీతభత్యాలు పొందే ఉద్యోగులు🔹 ఫ్రీలాన్సర్లు, కన్సల్టెంట్లు🔹 స్వయం ఉపాధి నిపుణులు🔹 వ్యాపారులు🔹 అద్దె ఆదాయం పొందేవారు🔹 వడ్డీ ఆదాయం లేదా పెట్టుబడి లాభాలు పొందేవారుఅంటే జీతం నుంచి టీడీఎస్ కట్ అవుతున్నప్పటికీ, అదనంగా అద్దె, ఫిక్స్డ్ డిపాజిట్లు, షేర్లు లేదా ఇతర పెట్టుబడుల ద్వారా ఆదాయం వస్తే అడ్వాన్స్ ట్యాక్స్ బాధ్యత ఏర్పడే అవకాశం ఉంది.సీనియర్ సిటిజన్లకు మినహాయింపు60 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న రెసిడెంట్ సీనియర్ సిటిజన్లు వ్యాపారం లేదా వృత్తి ద్వారా ఆదాయం పొందకపోతే అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే వ్యాపార ఆదాయం ఉంటే ఈ మినహాయింపు వర్తించదు.తొలి వాయిదాలో ఎంత చెల్లించాలి?సాధారణ పన్ను చెల్లింపుదారులు తమ అంచనా వార్షిక పన్ను బాధ్యతలో కనీసం 15 శాతం మొత్తాన్ని జూన్ 15లోగా చెల్లించాలి. అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లింపుల షెడ్యూల్ ఇలా ఉంటుంది:🔹జూన్ 15: మొత్తం పన్నులో 15%🔹సెప్టెంబర్ 15: మొత్తం పన్నులో 45%🔹డిసెంబర్ 15: మొత్తం పన్నులో 75%🔹మార్చి 15: మొత్తం పన్నులో 100%ఆన్లైన్లో ఎలా చెల్లించాలి?ఆదాయపు పన్ను శాఖ ఈ-ఫైలింగ్ పోర్టల్ ద్వారా అడ్వాన్స్ ట్యాక్స్ సులభంగా చెల్లించవచ్చు. ప్రక్రియ ఇలా ఉంటుంది:🔹ఆదాయపు పన్ను ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో లాగిన్ అవ్వాలి.🔹e-File → e-Pay Tax ఆప్షన్‌ను క్లిక్ చేయాలి.🔹New Payment ఎంచుకోవాలి.🔹Income Tax కేటగిరీలో Advance Tax ఆప్షన్‌ను సెలెక్ట్ చేయాలి.🔹సంబంధిత అసెస్మెంట్ ఇయర్ (AY) ఎంచుకోవాలి.🔹Minor Head 100 (Advance Tax) ఎంపిక చేయాలి.🔹చెల్లించాల్సిన మొత్తం నమోదు చేసి పేమెంట్ పూర్తి చేయాలి.గడువు దాటితే జరిమానా తప్పదుఅడ్వాన్స్ ట్యాక్స్ సకాలంలో చెల్లించకపోతే వడ్డీ భారం పడుతుంది. కొత్త ఆదాయపు పన్ను చట్టం-2025లో సెక్షన్ నంబర్లు మారినప్పటికీ, నిబంధనల సారాంశం దాదాపు యథాతథంగా ఉంది. పాత చట్టంలోని సెక్షన్లు 234B, 234Cలకు సమానమైన నిబంధనలు కొత్త చట్టంలో వర్తిస్తున్నాయి.🔹 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి మొత్తం పన్నులో 90% కన్నా తక్కువ చెల్లిస్తే నెలకు 1% వడ్డీ విధిస్తారు.🔹 వాయిదా వారీగా చెల్లించాల్సిన మొత్తాన్ని గడువులోపు చెల్లించకపోయినా నెలకు 1% వడ్డీ వర్తిస్తుంది. -
‘ఆ బంగారం, వెండి.. నకిలీ ఆస్తులు’
ప్రముఖ పర్సనల్ ఫైనాన్స్ పుస్తకం ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Robert Kiyosaki) రచయిత, ఇన్వెస్టర్ రాబర్ట్ కియోసాకి ( Robert Kiyosaki) ఒక ప్రసిద్ధ పెట్టుబడి సూత్రాన్ని విమర్శించారు. చాలామంది ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను ‘డైవర్సిఫికేషన్’ చేశామని భావిస్తుంటారని, వాస్తవానికి వారు ‘డీ-వర్స్-ఇఫికేషన్’ (పరిస్థితిని మరింత దిగజార్చే ప్రక్రియ) చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్టులో కియోసాకి.. బంగారం, వెండి, బిట్‌కాయిన్, స్టాక్స్, బాండ్లు, రియల్ ఎస్టేట్, చమురు వంటి విభిన్న ఆస్తుల్లో పెట్టుబడులు పెట్టినప్పటికీ అవన్నీ ఈటీఎఫ్‌లు, ఆర్ఈఐటీలు లేదా ఇతర ఆర్థిక సాధనాల రూపంలో ఉంటే అవి చివరికి ఒకే “పేపర్ అసెట్” వర్గానికి చెందినవేనని అన్నారు. అలాంటి పెట్టుబడులు నిజమైన డైవర్సిఫికేషన్ కాదని, కేవలం తాము పెట్టుబడులను వైవిధ్యీకరించామని ఇన్వెస్టర్లు భావించే పరిస్థితి మాత్రమేనని వివరించారు.తాను మాత్రం నేరుగా యాజమాన్యం, నియంత్రణ, కస్టడీ తన చేతుల్లో ఉండే “రియల్ అసెట్స్”ను ఇష్టపడతానని కియోసాకి పేర్కొన్నారు. బంగారం, వెండి, రియల్ ఎస్టేట్ లేదా ఇతర భౌతిక ఆస్తులను నేరుగా కలిగి ఉండటం కోసం కొంత ఎక్కువ ఖర్చు, సమయం వెచ్చించాల్సి వచ్చినా, వాటి గురించి మరింత అధ్యయనం చేసే అవకాశం లభిస్తుందని రాసుకొచ్చారు.“ఇది నా వ్యక్తిగత పెట్టుబడి విధానం. కొంతమంది దీనిని నా జాగ్రత్త లేదా అనుమాన స్వభావంగా చూడొచ్చు. కానీ నా ఎంపిక ఇదే. మీ ఎంపిక ఏమిటి? డైవర్సిఫికేషన్నా? లేక డీ-వర్స్-ఇఫికేషన్నా?” అంటూ పెట్టుబడిదారులను కియోసాకి ప్రశ్నించారు. ఆయన వ్యాఖ్యలు ఇన్వెస్టర్లలో ఈటీఎఫ్‌లు, డెరివేటివ్ ఉత్పత్తులు, భౌతిక ఆస్తులపై మరోసారి చర్చకు దారితీశాయి.DEWORSE-IFIED is not Diversified.Many people are “De-Worsified” not “Diversified.”“De-Worse-ified” means they think they are diversified, but they have all their “diversified” assets, such as gold, silver, Bitcoin, stocks, bonds, real estate, and oil, in one asset class….the…— Robert Kiyosaki (@theRealKiyosaki) June 9, 2026 -
బంగారం.. భలే లాభం! ఆర్బీఐ గుడ్‌న్యూస్
బంగారంలో పెట్టుబడి పెట్టిన వారికి సావరిన్ గోల్డ్ బాండ్లు (SGB) మరోసారి భారీ లాభాలను అందించాయి. 2019-20 సిరీస్–VII కింద జారీ చేసిన ఎస్‌జీబీల ముందస్తు రిడెంప్షన్ (Premature Redemption) ధరను భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) గ్రాముకు రూ.15,275గా నిర్ణయించింది.ఆర్బీఐ ఈ బాండ్లను 2019 డిసెంబర్ 10న గ్రాముకు రూ.3,745 ధరతో జారీ చేసింది. అప్పుడు వీటిని కొనుగోలుచేసినవారికి ఐదేళ్లలో సుమారు 308 శాతం లాభం లభించినట్లైంది. అంటే గ్రాముకు రూ.11,530 లాభం అన్నమాట. అలాగే ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేసిన గ్రాముకు రూ.50 తగ్గింపు కూడా ఆర్బీఐ ఇచ్చింది. దీంతో ఆన్లైన్లో కొన్నవారికి ఈ లాభం 313 శాతానికి పైగా చేరింది.రూ.లక్షకు రూ.4 లక్షలు!ఈ సిరీస్‌లో రూ.1 లక్ష పెట్టుబడి పెట్టిన పెట్టుబడిదారుల పెట్టుబడి విలువ ప్రస్తుతం రూ.4.08 లక్షలకు పైగా పెరిగినట్లు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. దీనికి అదనంగా బాండ్ జారీ ధరపై సంవత్సరానికి 2.5 శాతం స్థిర వడ్డీని కూడా అర్ధవార్షికంగా పొందారు. అంటే మొత్తం రాబడి ఇంకా ఎక్కువే.రిడెంప్షన్ ధర ఎలా నిర్ణయించారు?ఎస్జీబీ రిడెంప్షన్ ధరను ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) ప్రకటించే 999 స్వచ్ఛత బంగారం ముగింపు ధరల ఆధారంగా నిర్ణయిస్తారు. జూన్ 5, 8, 9 తేదీల ముగింపు ధరల సగటు ఆధారంగా ఈ విడతకు గ్రాముకు రూ.15,275 ధరను ఖరారు చేసినట్లు ఆర్బీఐ తెలిపింది.ఐదేళ్ల తర్వాతే ముందస్తు నిష్క్రమణసావరిన్ గోల్డ్ బాండ్ల అసలు గడువు ఎనిమిదేళ్లు. అయితే జారీ తేదీ నుంచి ఐదో సంవత్సరం పూర్తైన తర్వాత వడ్డీ చెల్లింపు తేదీల్లో ముందస్తుగా బాండ్లను రిడీమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలా ఈ సిరీస్‌కు జూన్ 10, 2026 తేదీని అర్హత కలిగిన రిడెంప్షన్ తేదీగా ఆర్బీఐ ప్రకటించింది.పన్ను ప్రయోజనాలు ఏమిటి?వ్యక్తిగత పెట్టుబడిదారులు ఎస్జీబీలను ఆర్బీఐ వద్ద రిడీమ్ చేసుకున్నప్పుడు లభించే మూలధన లాభాలపై గతంలో పన్ను మినహాయింపు ఉండేది. అయితే 2026 బడ్జెట్ తర్వాత పన్ను నిబంధనల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. అయినప్పటికీ వడ్డీ ఆదాయం మాత్రమే ఆదాయపు పన్నుకు లోబడి ఉంటుంది. బాండ్ల బదిలీ ద్వారా వచ్చే దీర్ఘకాలిక మూలధన లాభాలకు ఇండెక్సేషన్ ప్రయోజనాలు వర్తిస్తాయి.ఏమిటీ ఎస్జీబీ పథకం?భౌతిక బంగారం కొనుగోలు అవసరం లేకుండా బంగారం ధరల పెరుగుదల ప్రయోజనం పొందేందుకు కేంద్ర ప్రభుత్వం 2015లో ఈ పథకాన్ని ప్రారంభించింది. బంగారం ధరల పెరుగుదలతో పాటు 2.5 శాతం వార్షిక వడ్డీ కూడా లభించడం ఈ పథకాన్ని ప్రత్యేకంగా నిలిపింది. దేశంలో భౌతిక బంగారం దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం, గృహ పొదుపులను ఆర్థిక ఆస్తులుగా మలచడం ఈ పథకం ప్రధాన లక్ష్యాలు.అయితే ప్రభుత్వం 2023 చివరి నుంచి కొత్త సావరిన్ గోల్డ్ బాండ్ల జారీని నిలిపివేసింది. నిర్వహణ వ్యయాలు పెరగడం, గోల్డ్ ఈటీఎఫ్‌లు, డిజిటల్ గోల్డ్ వంటి ప్రత్యామ్నాయాల ప్రాచుర్యం పెరగడం ఇందుకు ప్రధాన కారణాలుగా పేర్కొంది. అయితే ఇప్పటికే జారీ చేసిన బాండ్లు చెల్లుబాటులోనే ఉంటాయి. పెట్టుబడిదారులు వాటిని మెచ్యూరిటీ వరకు కొనసాగించవచ్చు లేదా అర్హత వచ్చినప్పుడు ముందస్తు రిడెంప్షన్‌ను ఎంచుకోవచ్చు.ఇదీ చదవండి: ఈజీగా ‘EPF 100% విత్‌డ్రా’.. కొత్తగా మారిందిదే.. -
కాలం కరిగేలోపే.. కలల నిధిని గెలిచేద్దాం!
ఇంట్లో పిల్లలు పసిప్రాయంలో పాఠశాల మెట్లు ఎక్కడం, చూస్తూ చూస్తూనే స్కూల్ విద్య పూర్తి అవ్వడం వేగంగా జరిగిపోతాయి. అప్పటివరకు కేవలం పాఠశాల ఫీజులకే పరిమితమైన తల్లిదండ్రుల ఆలోచనలు.. ఒక్కసారిగా కాలేజీ ఫీజులు, వృత్తిపరమైన కోర్సులు లేదా విదేశీ విద్య వైపు మళ్లుతాయి. అప్పుడే ఆర్థిక వాస్తవికత తెలిసొస్తుంది.సమస్య ఏమిటంటే, విద్యా రంగంలో ద్రవ్యోల్బణం నిశ్శబ్దంగా, వేగంగా పెరుగుతుంది. భారతదేశంలో ఐఐటీ, ఐఐఎం లేదా మెడిసిన్ వంటి ప్రొఫెషనల్ కోర్సుల ఖర్చులే ఇప్పుడు రూ.లక్షల్లో ఉన్నాయి. ఇక ట్యూషన్ ఫీజు, వసతి, జీవన ప్రమాణాలను లెక్కిస్తే విదేశీ విద్య రూ.కోట్లలోకి చేరుతోంది. పిల్లలకు 17 లేదా 18 ఏళ్లు వచ్చేసరికి సరైన ఆర్థిక ప్రణాళిక లేకపోతే ఆ తప్పును సరిదిద్దుకోవడానికి సమయం అసలు మిగలదు.ఇక్కడే మ్యూచువల్ ఫండ్స్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) ఒక ఆయుధంగా మారుతుంది. విద్యా ప్రణాళిక విషయానికి వస్తే జీవితంలో ఆలస్యంగా పెద్ద మొత్తాలను పెట్టుబడి పెట్టడం కంటే చిన్న మొత్తంతోనైనా ముందుగా ప్రారంభించడం అత్యంత కీలకమైన అంశం.కాంపౌండింగ్ చేసే అద్భుతంచాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల ఉన్నత చదువుల కోసం రూ.1 కోటి విద్యా నిధిని నిర్మించాలంటే చాలా పెద్ద మొత్తంలో లేదా అగ్రెసివ్‌గా పెట్టుబడి పెట్టాలని భావిస్తారు. కానీ ఆర్థిక సూత్రాల ప్రకారం పెద్ద మొత్తంతో మొదలుపెట్టడం కంటే ముందస్తుగా ప్రారంభించడమే చాలా ముఖ్యం. పిల్లలకు 3 లేదా 4 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే పెట్టుబడి ప్రారంభించే తల్లిదండ్రులకు ఆ డబ్బు వృద్ధి చెందడానికి ఒక దశాబ్దానికి పైగా సమయం దొరుకుతుంది. తక్కువ నెలవారీ సిప్ మొత్తాలు కూడా కాలక్రమేణా పెద్ద నిధిగా మారడానికి సుదీర్ఘ సమయం తోడ్పడుతుంది.ఉదాహరణకు, డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ప్రారంభించే సిప్‌కు 12 నుంచి 15 సంవత్సరాల కాలపరిమితి లభిస్తే రాబడిపై అదనపు రాబడి వచ్చి చేరుతుంది. మొదటి కొన్ని సంవత్సరాలు ఈ వృద్ధి పెద్దగా కనిపించకపోవచ్చు. కానీ కాంపౌండింగ్ అసలు విశ్వరూపం తరువాతి సంవత్సరాల్లో, ముఖ్యంగా ఫండ్ సైజ్ పెద్దదవుతున్న కొద్దీ స్పష్టంగా కనిపిస్తుంది.వాయిదా వేస్తే పెను భారంప్రస్తుత కాలంలో స్కూలు ఫీజులు, హోమ్ లోన్లు, రోజువారీ నిత్యావసరాలు, మారుతున్న జీవనశైలి ఖర్చుల వల్ల తల్లిదండ్రులు తరచుగా దీర్ఘకాలిక పెట్టుబడులను వాయిదా వేస్తుంటారు. ‘ముందు ఈ ఖర్చులు చూసుకుందాం, పెట్టుబడి తర్వాత చేయవచ్చు’ అనుకోవడం చాలా పెద్ద పొరపాటు.ఆదాయానికి తగ్గట్లుగా అడుగులుతల్లిదండ్రుల కెరీర్ ప్రారంభంలో లేదా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఆదాయం తక్కువగా ఉండటం సహజం. అందుకే పెద్ద మొత్తంలో సిప్‌లు ప్రారంభించడానికి తల్లిదండ్రులు వెనుకాడతారు. ఈ సమస్యకు స్టెప్-అప్ సిప్ అద్భుతమైన పరిష్కారం.ఒకేసారి పెద్ద మొత్తంతో కాకుండా ప్రస్తుతం మీ బడ్జెట్‌కు అనుకూలమైన మొత్తంతో (ఉదాహరణకు రూ.5,000) ప్రారంభించవచ్చు.ఏటా మీ జీతం లేదా ఆదాయం పెరిగే కొద్దీ ఈ సిప్ మొత్తాన్ని క్రమంగా (ఉదాహరణకు 10% చొప్పున) పెంచుకుంటూ పోవచ్చు.ఈ క్రమంలో రూ.5,000 కాస్తా కాలక్రమేణా రూ.8,000, రూ.12,000గా మారుతుంది. ఇది మీ ప్రస్తుత ఆర్థిక బడ్జెట్‌కు ఎలాంటి అంతరాయం కలిగించదు.దీర్ఘకాలంలో ఈ చిన్న క్రమబద్ధమైన పెంపు మీ తుది నిధిని ఊహించని రీతిలో పెంచుతుంది. ఎందుకంటే అదనంగా జతచేసే ప్రతి రూపాయికి కూడా కాంపౌండింగ్ సంవత్సరాల తరబడి వర్తిస్తుంది.దీర్ఘకాలంలో వరంవిద్యా లక్ష్యాలు అనేవి సాధారణంగా 12 నుంచి 15 సంవత్సరాల సుదీర్ఘ కాలపరిమితితో కూడుకున్నవి. పెట్టుబడి కాలపరిమితి పెరిగే కొద్దీ మార్కెట్ స్వల్పకాలిక హెచ్చుతగ్గులు లేదా అస్థిరత కలిగించే ప్రమాదం చాలా వరకు తగ్గిపోతుంది. నిజానికి మార్కెట్లు పతనమైనప్పుడు సిప్‌లను కొనసాగించడం వల్ల దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు ఒక పెద్ద ప్రయోజనం చేకూరుతుంది. తక్కువ ధరలకే ఎక్కువ మ్యూచువల్ ఫండ్ యూనిట్లు లభిస్తాయి. కానీ, మార్కెట్ పడిపోయిన ప్రతిసారీ భయపడి పెట్టుబడులు ఆపేసే తల్లిదండ్రులు కాంపౌండింగ్ ప్రక్రియకు స్వయంగా బ్రేకులు వేసుకున్న వారవుతారు.స్థిరత్వమే ముఖ్యంఆర్థిక మార్కెట్లలో అత్యంత విజయవంతమైన పోర్ట్‌ఫోలియోలు మార్కెట్‌ను కచ్చితంగా అంచనా వేయడం వల్ల నిర్మితం కాలేదు. కేవలం పెట్టుబడిదారులు చూపిన స్థిరత్వం వల్లే సాధ్యపడ్డాయి. మంచి కాలం, చెడు కాలం, మార్కెట్ క్రాష్‌లు, ప్రపంచ ఆర్థిక అనిశ్చితులు, మారుతున్న జీవిత పరిస్థితులన్నింటినీ తట్టుకుని ఎవరైతే తమ నెలవారీ సిప్‌లను కొనసాగించారో వారే విజేతలుగా నిలిచారని గుర్తుంచుకోవాలి.ఇదీ చదవండి: ఒక్కసారిగా తిరగబడిన బంగారం ధరలు -
HDFC బ్యాంక్ అలర్ట్: EMI కస్టమర్లకు షాక్!
దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకుల్లో ఒకటైన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (HDFC Bank) తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ (MCLR)ను పలు కాలపరిమితులపై 5 నుంచి 10 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది. కొత్త రేట్లు జూన్ 8, 2026 నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో ఎంసీఎల్ఆర్ ఆధారిత గృహ, వ్యక్తిగత, వాహన రుణాలు తీసుకున్న కొందరు కస్టమర్లకు భవిష్యత్తులో ఈఎంఐలు (EMI) పెరిగే అవకాశం ఉంది.ఆర్బీఐ రెపో రేటు స్థిరంగానే.. అయినా పెంపు ఎందుకు?గత వారం జరిగిన ద్రవ్య విధాన సమీక్షలో ఆర్బీఐ రెపో రేటును 5.25 శాతం వద్ద యథాతథంగా కొనసాగించింది. అయితే బ్యాంకుల నిధుల సమీకరణ వ్యయం, డిపాజిట్ ఖర్చులు, మార్కెట్ పరిస్థితులు వంటి అంశాల ఆధారంగా ఎంసీఎల్ఆర్ను బ్యాంకులు స్వతంత్రంగా నిర్ణయిస్తాయి. అందుకే రెపో రేటులో మార్పు లేకపోయినా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తన అంతర్గత బెంచ్‌మార్క్ రేట్లను సవరించింది.ఏయే కాలపరిమితుల్లో ఎంత పెరిగింది?సవరించిన ఎంసీఎల్ఆర్ రేట్ల ప్రకారం ఓవర్‌నైట్ రేటు 8.05 శాతం నుంచి 8.10 శాతానికి పెరిగింది. మూడు నెలల ఎంసీఎల్ఆర్ 8.15 శాతం నుంచి 8.20 శాతానికి, ఆరు నెలల ఎంసీఎల్ఆర్ 8.30 శాతం నుంచి 8.35 శాతానికి చేరింది.రిటైల్ రుణాలకు కీలక బెంచ్‌మార్క్‌గా భావించే ఒక సంవత్సరం ఎంసీఎల్ఆర్ 8.35 శాతం నుంచి 8.40 శాతానికి పెరిగింది. రెండేళ్ల ఎంసీఎల్ఆర్లో అత్యధికంగా 10 బేసిస్ పాయింట్ల పెంపు చోటుచేసుకుని 8.45 శాతం నుంచి 8.55 శాతానికి చేరగా, మూడేళ్ల ఎంసీఎల్ఆర్ 8.60 శాతం నుంచి 8.65 శాతానికి పెరిగింది. ఒక నెల ఎంసీఎల్ఆర్ మాత్రం 8.05 శాతం వద్ద యథాతథంగా కొనసాగింది.తాజా ఎంసీఎల్ఆర్ రేట్లు🔹 ఓవర్‌నైట్ – 8.10%🔹 1 నెల – 8.05%🔹 3 నెలలు – 8.20%🔹 6 నెలలు – 8.35%🔹 1 సంవత్సరం – 8.40%🔹 2 సంవత్సరాలు – 8.55%🔹 3 సంవత్సరాలు – 8.65%ఈఎంఐలు వెంటనే పెరుగుతాయా?అలా ఏం లేదు. ఎంసీఎల్ఆర్కు అనుసంధానమైన రుణాల్లో వడ్డీ రేటు ప్రతి నెల, త్రైమాసికం లేదా వార్షిక రీసెట్ తేదీకి అనుగుణంగా మారుతుంది. కాబట్టి మీ రుణ ఖాతాకు తదుపరి రీసెట్ తేదీ వచ్చినప్పుడు మాత్రమే కొత్త ఎంసీఎల్ఆర్ ప్రభావం కనిపిస్తుంది. ఈఎంఐ పెరగవచ్చు లేదా రుణ కాలపరిమితి పొడిగించవచ్చు. ఇది రుణ ఒప్పంద నిబంధనలపై ఆధారపడి ఉంటుంది.అసలేమిటీ ఎంసీఎల్ఆర్?ఎంసీఎల్ఆర్ (మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్) అనేది బ్యాంకు రుణాలను ఇవ్వగల కనీస వడ్డీ రేటు. 2016లో ఆర్బీఐ ఈ విధానాన్ని ప్రవేశపెట్టింది. బ్యాంకు నిధుల వ్యయం, నిర్వహణ ఖర్చులు, నగదు నిల్వల వ్యయం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని దీనిని నిర్ణయిస్తారు. అనేక పాత గృహ, వ్యక్తిగత, వాహన రుణాలు ఇప్పటికీ ఎంసీఎల్ఆర్ ఆధారంగానే కొనసాగుతున్నాయి.బేస్ రేట్, బీపీఎల్ఆర్ యథాతథంహెచ్డీఎఫ్సీ బ్యాంక్ బేస్ రేట్ ప్రస్తుతం 8.80 శాతంగా కొనసాగుతోంది. అలాగే బెంచ్‌మార్క్ ప్రైమ్ లెండింగ్ రేట్ (BPLR) 17.30 శాతంగా ఉంది. ఈ రేట్లు డిసెంబర్ 26, 2025 నుంచి అమల్లో ఉన్నాయి.రుణగ్రహీతలు ఏం చేయాలి?మీ హోమ్ లోన్ లేదా ఇతర రుణం ఎంసీఎల్ఆర్ ఆధారితమా, లేక EBLR/రెపో-లింక్డ్ విధానంలో ఉందా అనేది ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది. ఎంసీఎల్ఆర్ ఆధారిత రుణాలు ఉన్నవారు తమ తదుపరి రీసెట్ తేదీని పరిశీలించి ఈఎంఐపై పడే ప్రభావాన్ని ముందుగానే అంచనా వేసుకోవచ్చు. రెపో-లింక్డ్ రుణాలపై ఈ తాజా ఎంసీఎల్ఆర్ పెంపు ప్రత్యక్ష ప్రభావం చూపదు. -
ఈజీగా ‘EPF 100% విత్‌డ్రా’.. కొత్తగా మారిందిదే..
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) తన సభ్యులకు మరింత సౌలభ్యం కల్పించే కీలక మార్పులు ఇటీవల తీసుకొచ్చింది. ముఖ్యంగా ప్రత్యేక పరిస్థితుల్లో ఈపీఎఫ్ ఖాతాలోని మొత్తం సొమ్మును (100 శాతం) ఉపసంహరించుకునే ప్రక్రియను సరళతరం చేసింది. అర్హత ఉన్న సభ్యులు నిర్దిష్ట అత్యవసర పరిస్థితుల్లో నిధులను ఉపసంహరించుకునేందుకు ప్రత్యేక కారణాలను వివరించాల్సిన అవసరం కూడా లేదు.గత అక్టోబర్‌లో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌కు అనుగుణంగా ఈ మార్పులు అమల్లోకి వచ్చాయి. గతంలో ఉపసంహరణ కోసం కారణాలను స్పష్టంగా పేర్కొనడంతో పాటు సంబంధిత ఆధారాలను సమర్పించాల్సి వచ్చేది. దీంతో అనేక క్లెయిమ్‌లు సాంకేతిక కారణాలతో తిరస్కరణకు గురయ్యేవి. కొత్త విధానంతో ఈ సమస్యలు తగ్గే అవకాశం ఉందని ఈపీఎఫ్ఓ భావిస్తోంది.గతంలో ఎలా ఉండేదంటే..గతంలో ఈపీఎఫ్ సభ్యులు ప్రకృతి వైపరీత్యాలు, మహమ్మారి, సంస్థ లాక్అవుట్, దీర్ఘకాల నిరుద్యోగం వంటి ప్రత్యేక పరిస్థితుల్లో తమ ఈపీఎఫ్ నిధులను పూర్తిగా ఉపసంహరణకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండేది. అయితే ఇందుకు నిర్దిష్ట కారణాన్ని పేర్కొనడం, అవసరమైన ధ్రువీకరణ పత్రాలు సమర్పించడం తప్పనిసరి. కొన్ని సందర్భాల్లో పేర్కొన్న కారణం ఈపీఎఫ్ఓ ఆమోదించిన కేటగిరీల్లో లేకపోవడంతో క్లెయిమ్‌లు తిరస్కరణకు గురయ్యేవి.ఏ పరిస్థితుల్లో 100% ఉపసంహరణ?ఈపీఎఫ్ఓ నిబంధనల ప్రకారం కింది ప్రత్యేక పరిస్థితుల్లో పూర్తి మొత్తాన్ని ఉపసంహరించుకునే అవకాశం ఉంటుంది. అవి..🔸 సమ్మె, లాక్అవుట్ లేదా సంస్థ మూసివేత కారణంగా 15 రోజులకుపైగా వేతనం లేకుండా ఉండటం.🔸 రెండు నెలలకు పైగా జీతాలు అందకపోవడం.🔸 ఉద్యోగం నుంచి తొలగింపు లేదా డిశ్చార్జ్‌కు సంబంధించిన కేసు కోర్టులో పెండింగ్‌లో ఉండటం.🔸 సంస్థ ఆరు నెలలకు పైగా మూతపడటం వల్ల ఉద్యోగి నిరుద్యోగిగా మారడం.🔸 సభ్యుడు లేదా కుటుంబ సభ్యుల వైద్య చికిత్స కోసం అత్యవసర నిధుల అవసరం ఏర్పడటం.కొత్త నిబంధనలో ప్రత్యేకత ఇదే..కొత్తగా తీసుకొచ్చిన వెసులుబాటుతో అత్యవసర పరిస్థితుల్లో 100 శాతం ఈపీఎఫ్ ఉపసంహరణ కోసం దరఖాస్తు చేసే సమయంలో కారణాన్ని ప్రత్యేకంగా పేర్కొనాల్సిన అవసరం ఉండదు. సభ్యుడు సంబంధిత కేటగిరీ కింద క్లెయిమ్ సమర్పిస్తే సరిపోతుంది. దీనివల్ల క్లెయిమ్‌ల పరిశీలన వేగవంతం కావడంతో పాటు తిరస్కరణలు, ఫిర్యాదులు తగ్గుతాయని అధికారులు చెబుతున్నారు.సాధారణ పరిస్థితుల్లో 75% వరకు మాత్రమేఅయితే ప్రతి సభ్యుడు ఎప్పుడైనా తన మొత్తం ఈపీఎఫ్ బ్యాలెన్స్‌ను తీసుకోలేడు. సాధారణ పరిస్థితుల్లో అర్హత కలిగిన మొత్తంలో గరిష్ఠంగా 75 శాతం వరకు మాత్రమే ఉపసంహరణకు అనుమతి ఉంటుంది. 100 శాతం ఉపసంహరణ మాత్రం ప్రత్యేక పరిస్థితుల్లోనే వర్తిస్తుంది.డిజిటల్ సేవలకు ప్రాధాన్యంగత రెండేళ్లుగా ఈపీఎఫ్ఓ సేవలను పూర్తిగా డిజిటలైజ్ చేసే దిశగా చర్యలు తీసుకుంటోంది. యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) ఆధారంగా ఆన్లైన్ క్లెయిమ్‌లు, ఆటో సెటిల్మెంట్, బ్యాంక్ ఖాతా ధ్రువీకరణ వంటి సేవలను వేగవంతం చేసింది. దీంతో చాలా క్లెయిమ్‌లు కొద్ది రోజుల్లోనే పరిష్కారం అవుతున్నాయి. -
డాలర్లలో పెట్టుబడి.. కొత్త మ్యూచువల్ ఫండ్
ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీ (ఐఎఫ్ఎస్సీఏ) నియంత్రణలో ఉండే మార్సెలస్ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్–గిఫ్ట్ ఐఎఫ్ఎస్సీ తాజాగా గ్లోబల్ ఈక్విటీస్ ఫండ్‌ని ఆవిష్కరించింది. భారతీయ ఇన్వెస్టర్లు.. గ్లోబల్ వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఈ న్యూ ఫండ్ ఆఫర్ జూన్ 8న ప్రారంభమై జూన్ 19న ముగుస్తుంది.కనీసం 5,000 డాలర్లు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఈ ఫండ్ ప్రధానంగా డిఫెన్స్–ఏరోస్పేస్, విద్యుదుత్పత్తి, లగ్జరీ కన్జంప్షన్ తదితర ట్రెండ్స్‌కి అనుగుణంగా ఉన్న సంస్థల్లో ఇన్వెస్ట్ చేస్తుంది. పెట్టుబడులను విదేశీ కరెన్సీలో రిడీమ్ చేసుకోవచ్చు. పాన్, ఆధార్ వివరాలతో ఇన్వెస్ట్ చేయొచ్చు. గిఫ్ట్ సిటీలో విడిగా బ్యాంకు ఖాతా అవసరం లేదు. -
లగ్జరీ ఇల్లు, కారు.. ఏవి ధనవంతుల ఆస్తులు?
పాపులర్ పర్సనల్ ఫైనాన్స్ పుస్తకం రిచ్ ‘డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) రచయిత, ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ గురూ రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) ఆస్తులు (Assets), అప్పులు (Liabilities) మధ్య తేడాను అర్థం చేసుకోవడమే నిజమైన సంపదకు తొలి మెట్టు అని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన తాజాగా ఫేస్బుక్లో చేసిన పోస్టు విస్తృత చర్చకు దారి తీసింది.చాలామంది ఖర్చుతో కూడుకున్న వస్తువులను సంపదగా భావిస్తారని, అయితే అధిక ధర ఉన్నంత మాత్రాన అది ఆదాయం తెచ్చిపెట్టే ఆస్తి కాదని కియోసాకి వివరించారు. ప్రతి నెలా మన జేబులోకి డబ్బు వస్తే అది ఆస్తి, జేబులో నుంచి డబ్బు వెళ్తే అది అప్పు అని ఆయన సరళమైన నిర్వచనం ఇచ్చారు.ఈ సందర్భంగా ఖరీదైన ఇల్లు, విలాసవంతమైన కారు వంటి వాటిని ఉదాహరణగా చూపించారు. ఇంటికి గృహ రుణం, పన్నులు, బీమా, నిర్వహణ ఖర్చులు ఉంటాయని, కారు కొనుగోలు చేసిన వెంటనే విలువ తగ్గడం ప్రారంభమవుతుందని తెలిపారు. అందువల్ల ఇవి ఎక్కువగా అప్పుల కిందకే వస్తాయని పేర్కొన్నారు.మరోవైపు అద్దె ఆదాయం వచ్చే రియల్ ఎస్టేట్, డివిడెండ్లు చెల్లించే షేర్లు, లాభాలు ఆర్జించే వ్యాపారాలు, రాయల్టీలు తెచ్చిపెట్టే మేధో సంపత్తి హక్కులు, డిజిటల్ ఉత్పత్తులు వంటి వాటిని నిజమైన ఆస్తులుగా అభివర్ణించారు. ఇవి నిరంతరం నగదు ప్రవాహాన్ని సృష్టించి యజమానికి ఆదాయం అందిస్తాయని చెప్పారు.సంపన్నులు ముందుగా ఆస్తులను కొనుగోలు చేస్తారని, మధ్యతరగతి ప్రజలు ముందుగా అప్పులను పెంచుకుని తర్వాత ఆర్థిక స్వేచ్ఛ ఎందుకు రాలేదని ఆశ్చర్యపడుతుంటారని కియోసాకి వ్యాఖ్యానించారు. పాఠశాలలు, ఆర్థిక వ్యవహారాలపై సలహాలు ఇచ్చే అనేక మంది కూడా ఈ మౌలిక సూత్రాన్ని బోధించడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.అమెరికన్ డ్రీమ్ అంటే పెద్ద ఇల్లు కాదని, ఆర్థిక స్వేచ్ఛేనని కియోసాకి పేర్కొన్నారు. ప్రతి నెలా ఆదాయం తెచ్చిపెట్టే ఆస్తులను సృష్టించుకోవడం ద్వారానే నిజమైన స్వేచ్ఛ సాధ్యమవుతుందని తన పోస్టులో స్పష్టం చేశారు. -
గ్యాస్ ధరలు హైదరాబాద్‌లోనే ఎక్కువ.. ఎందుకు?
దేశవ్యాప్తంగా వంట గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగాయి. ఈ పెంపు దేశమంతా ఒకేలా ఉన్నప్పటికీ, గ్యాస్ సిలిండర్ల ధరలు ఒక్కో రాష్ట్రంలో, నగరంలో ఒక్కోలా ఉంటున్నాయి. ఈ గ్యాస్ సిలిండర్లను సరఫరా చేస్తున్న కంపెనీలు దేశవ్యాప్తంగా ఒకటే అయినప్పటికీ, తుది రిటైల్ ధర ఎందుకు భిన్నంగా ఉంటుంది అన్న సందేహం చాలా మందికి ఉంటుంది. ఈ ధరల వ్యత్యాసానికి కారణాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం..దేశవ్యాప్తంగా గృహ వినియోగ ఎల్పీజీ (14.2 కిలోల) సిలిండర్ ధరలు మరోసారి పెరిగాయి. జూన్ 7 నుంచి అమల్లోకి వచ్చిన తాజా సవరణతో ఒక్కో సిలిండర్‌పై రూ.29 పెరిగింది. గత మూడు నెలల్లో ఇది రెండో పెంపు కావడం గమనార్హం. మార్చిలో రూ.60 పెరిగిన తర్వాత ఇప్పుడు మరోసారి ధరలు పెరగడంతో కుటుంబాలపై అదనపు భారం పడనుంది.ప్రధాన నగరాల్లో తాజా ధరలునగరం14.2 కిలోల ఎల్పీజీ ధరన్యూఢిల్లీరూ.942ముంబైరూ.941.50కోల్‌కతారూ.968చెన్నైరూ.957.50హైదరాబాద్రూ.994బెంగళూరురూ.915.50తాజా పెంపుతో దేశంలోని ప్రధాన నగరాల మధ్య దాదాపు రూ.80 వరకు ధరల వ్యత్యాసం కనిపిస్తోంది. హైదరాబాద్‌లో సిలిండర్ ధర రూ.994గా ఉండగా, బెంగళూరులో అదే సిలిండర్ రూ.915.50కే లభిస్తోంది.ఒకే దేశంలో.. ఒకే గ్యాస్.. ధరలు ఎందుకు వేరు?ఎల్పీజీని సరఫరా చేస్తున్న కంపెనీలు దేశవ్యాప్తంగా ఒకటే అయినప్పటికీ, తుది రిటైల్ ధర రాష్ట్రాల వారీగా మారుతుంది. దీనికి ప్రధాన కారణాలు ఇవే.రాష్ట్ర పన్నుల ప్రభావంప్రతి రాష్ట్రం ఎల్పీజీపై వేర్వేరు స్థాయిలో వ్యాట్, స్థానిక పన్నులు లేదా సెస్సులు విధిస్తుంది. ఈ పన్నుల రేట్లు మారడంతో వినియోగదారుడు చెల్లించే ధరలో తేడా వస్తుంది.రవాణా ఖర్చులుఎల్పీజీ బాట్లింగ్ ప్లాంట్లు, నిల్వ కేంద్రాల నుంచి సిలిండర్లను నగరాలకు తరలించడానికి అయ్యే రవాణా వ్యయం కూడా ధరను ప్రభావితం చేస్తుంది. సరఫరా కేంద్రాలకు దూరంగా ఉన్న ప్రాంతాల్లో ఈ ఖర్చు ఎక్కువగా ఉంటుంది.పంపిణీ వ్యయండీలర్ల కమిషన్, స్థానిక పంపిణీ ఖర్చులు, లాజిస్టిక్స్ వ్యయాలు ప్రాంతాల వారీగా మారుతుంటాయి. దీంతో తుది ధరలో స్వల్ప తేడాలు కనిపిస్తాయి.పెంపు వెనుక కారణాలుఅంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరల పెరుగుదల, మధ్యప్రాచ్య భౌగోళిక ఉద్రిక్తతలు, దిగుమతి వ్యయాల పెరుగుదల కారణంగా ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలపై భారం పెరిగిందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. తాజా పెంపునకు ముందు ప్రతి గృహ సిలిండర్‌పై వందల రూపాయల మేర నష్టాన్ని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు భరిస్తున్నట్లు నివేదికలు పేర్కొన్నాయి.హైదరాబాద్‌లో ఎందుకు అత్యధిక ధర?తెలంగాణలో స్థానిక పన్నులు, రవాణా, పంపిణీ వ్యయాల ప్రభావంతో హైదరాబాద్‌లో ధర దేశంలోని అనేక మెట్రో నగరాల కంటే ఎక్కువగా ఉంది. దీంతో ప్రస్తుతం ప్రధాన నగరాల్లో హైదరాబాద్ అత్యంత ఖరీదైన గృహ ఎల్పీజీ మార్కెట్లలో ఒకటిగా నిలిచింది.వినియోగదారులపై అదనపు భారంమార్చి నుంచి ఇప్పటివరకు గృహ ఎల్పీజీ సిలిండర్ ధర మొత్తం రూ.89 పెరిగింది. దీంతో నెలకు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సిలిండర్లు వినియోగించే కుటుంబాల ఖర్చులు మరింత పెరగనున్నాయి. ముఖ్యంగా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాల గృహ బడ్జెట్‌పై ఈ పెంపు ప్రభావం చూపే అవకాశం ఉంది.ఇదీ చదవండి: ఎల్పీజీ సిలిండర్లు.. ఎన్ని రంగులో.. -
EPF 8.25% వడ్డీ ఎప్పుడు జమ అవుతుంది.. ఎలా చెక్ చేసుకోవాలి?
దేశంలోని కోట్లాది ఉద్యోగులకు ఊరటనిస్తూ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ డిపాజిట్లపై వడ్డీ రేటును 8.25 శాతంగా కొనసాగించింది. గత మార్చిలో జరిగిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోగా, ఇది వరుసగా మూడో ఏడాది కూడా అదే స్థాయిలో కొనసాగుతున్న వడ్డీ రేటుగా నిలిచింది. అయితే ఇది ఎప్పుడు జమవుతుందని ఉద్యోగులు ఆతృతగా ఎదురుగా చూస్తున్నారు.వడ్డీ జమ ఎప్పుడు?వడ్డీ రేటును సీబీటీ సిఫారసు చేసినప్పటికీ, అది ఖాతాల్లో జమ కావాలంటే కేంద్ర ప్రభుత్వం అధికారిక ఆమోదం ఇవ్వాల్సి ఉంటుంది. ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాతే ఈపీఎఫ్ఓ సభ్యుల ఖాతాల్లో వడ్డీని జమ చేస్తుంది. ప్రస్తుతం ఈపీఎఫ్ఓ ఖచ్చితమైన తేదీని ప్రకటించలేదు. గత అనుభవాలను బట్టి చూస్తే జూన్ నుంచి సెప్టెంబర్ మధ్యలో వడ్డీ జమయ్యే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.ఆలస్యమైనా నష్టం ఉండదువడ్డీ ఖాతాలో ఆలస్యంగా కనిపిస్తే తమకు నష్టం జరుగుతుందేమోనని చాలామంది సభ్యులు ఆందోళన చెందుతుంటారు. అయితే ఈపీఎఫ్ పథకం నిబంధనల ప్రకారం సభ్యుల అర్హత కలిగిన నిల్వలపై వడ్డీని నిరంతరం లెక్కిస్తారు. ఖాతాలో ఎంట్రీ ఆలస్యంగా నమోదైనా, చెల్లించాల్సిన పూర్తి వడ్డీ మొత్తాన్ని సభ్యులకు జమ చేస్తారు. అందువల్ల పరిపాలనా ఆలస్యం వల్ల ఖాతాదారులు ఎలాంటి ఆర్థిక నష్టాన్ని ఎదుర్కోరు.పాస్‌బుక్‌లో ఈ ఎంట్రీ కనిపిస్తే వడ్డీ పడ్డట్టే..వడ్డీ జమ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఈపీఎఫ్ పాస్‌బుక్‌లో “Int. Updated up to 31/03/2026” అనే ఎంట్రీ కనిపిస్తుంది. ఆ తర్వాత సభ్యులు తమ తాజా బ్యాలెన్స్‌ను పరిశీలించవచ్చు.బ్యాలెన్స్ చెక్ చేసుకునే మార్గాలుఈపీఎఫ్ సభ్యులు తమ ఖాతాలో వడ్డీ జమైందో లేదో కింది మార్గాల ద్వారా తెలుసుకోవచ్చు.🔸 ఉమంగ్ (UMANG) యాప్🔸 ఈపీఎఫ్ఓ సభ్యుల ఈ-సేవా పోర్టల్🔸 యూఏఎన్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్ నుంచి 9966044425కు మిస్డ్ కాల్🔸 7738299899కు UAN EPFOHO ENG (లేదా భాష కోడ్‌తో) ఎస్ఎంఎస్ పంపడంఅయితే ఈ సేవలను వినియోగించాలంటే యూఏఎన్ యాక్టివ్‌గా ఉండటంతో పాటు ఆధార్, పాన్, బ్యాంక్ ఖాతా వివరాలు లింక్ అయి ఉండాలి.స్థిరమైన రాబడితో ఉద్యోగులకు భరోసాప్రస్తుతం బ్యాంకు డిపాజిట్లు, బాండ్ ఈల్డ్‌లు ఒత్తిడిలో ఉన్న నేపథ్యంలో 8.25 శాతం ఈపీఎఫ్ వడ్డీ రేటు ఉద్యోగుల పదవీ విరమణ పొదుపులకు ఆకర్షణీయమైన రాబడిని అందిస్తోందని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం ఆమోదం ఇచ్చిన వెంటనే వడ్డీ జమ ప్రక్రియ వేగవంతమయ్యే అవకాశం ఉంది. -
గోల్డ్ ఈటీఎఫ్ పెట్టుబడులపై ఆంక్షలు
న్యూఢిల్లీ: గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్ల(ఈటీఎఫ్‌లు)లో భారీ పెట్టుబడులపై హెచ్డీఎఫ్సీ మ్యూచువల్ ఫండ్ తాత్కాలికంగా పరిమితి విధించింది. వీటితోపాటు గోల్డ్ ఈటీఎఫ్ ఫండ్ ఆఫ్ ఫండ్(ఎఫ్‌వోఎఫ్) పెట్టుబడులకూ పరిమితి ఏర్పాటు చేసింది. ఇందుకు ఆర్థికపరమైన, మార్కెట్ సంబంధిత పరిస్థితులను ప్రస్తావిస్తోంది. వెరసి పసిడి ఈటీఎఫ్ పెట్టుబడులపై పరిమితులు విధించిన తొలి ఫండ్‌గా హెచ్డీఎఫ్సీ ఎంఎఫ్ నిలిచింది.ఈ నెల 8 నుంచి హెచ్డీఎఫ్సీ గోల్డ్ ఈటీఎఫ్‌లలో భారీ పెట్టుబడుల ఇన్వెస్టర్ల ప్రత్యక్ష సబ్ర్స్కిప్షన్ లావాదేవీలను అనుమతించబోమని ఒక నోట్లో స్పష్టం చేసింది. కనీసం రూ. 25 కోట్లు ప్రత్యక్షంగా ఇన్వెస్ట్‌చేసే పెట్టుబడిదారులకు తాజా పరిమితులు వర్తించనున్నట్లు తెలియజేసింది. ఒక నెలలో హెచ్డీఎఫ్సీ గోల్డ్ ఈటీఎఫ్ ఎఫ్‌వోఎఫ్‌లో రూ. 10 లక్షలవరకూ పెట్టుబడిని మాత్రమే ప్రాసెస్ చేయనున్నట్లు వెల్లడించింది. -
ఇలా అయితే ఏటీఎం సేవలు నిలిచిపోతాయ్..
దేశవ్యాప్తంగా ఏటీఎం సేవలు నగదు కొరత సమస్యను ఎదుర్కొనే ప్రమాదం ఉందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఏటీఎం ఇండస్ట్రీ (CATMi) ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్(IBA)ను హెచ్చరించింది. ఏటీఎంలలో నింపాల్సిన నగదు అందుబాటులో లేకపోవడం వల్ల సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉందని పేర్కొంది. ముఖ్యంగా ప్రత్యక్ష నగదు బదిలీ (DBT) లబ్ధిదారులు, గ్రామీణ, సెమీ-అర్బన్ ప్రాంతాల్లో నగదుపై ఆధారపడే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.అవసరానికి తగ్గ నగదు అందడం లేదుసీఏటీఎంఐ ఐబీఏకు రాసిన లేఖ ప్రకారం, అనేక రాష్ట్రాల్లో బ్యాంకు శాఖలు, కరెన్సీ చెస్టుల నుంచి ఏటీఎంలలో లోడ్ చేయడానికి అవసరమైన నగదును పొందడంలో సభ్య సంస్థలు నిరంతరం ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. మార్చి, ఏప్రిల్ నెలల్లో ఏటీఎంలకు రూ.94,000 కోట్ల నగదు అవసరమవగా, మార్చిలో కేవలం రూ.61,000 కోట్లు, ఏప్రిల్‌లో రూ.54,000 కోట్లు మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. దీంతో అవసరమైన నగదులో వరుసగా 64 శాతం, 57 శాతం మాత్రమే నెరవేరిందని తెలిపింది. ఈ అంశాన్ని రిజర్వ్ బ్యాంక్ కరెన్సీ మేనేజ్మెంట్ విభాగం దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు ‘బిజినెస్ స్టాండర్డ్’ కథనం పేర్కొంది.నగదు ఉంది.. కానీ ఏటీఎంలకు చేరడం లేదుఆసక్తికరమైన విషయం ఏమిటంటే దేశంలో చలామణిలో ఉన్న కరెన్సీ (Currency in Circulation) రికార్డు స్థాయిలో ఉంది. మే 22 నాటికి చలామణిలో ఉన్న నగదు రూ.42.54 లక్షల కోట్లకు చేరింది. అయినప్పటికీ ఏటీఎంలకు అవసరమైన నగదు సరఫరాలో లోటు కనిపిస్తోంది. దీంతో సమస్య నగదు కొరత కంటే పంపిణీ, లాజిస్టిక్స్, నగదు నిర్వహణ వ్యవస్థల్లోనే ఎక్కువగా ఉన్నట్లు పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.పెరుగుతున్న ఖర్చులు.. ఆపరేటర్ల ఆందోళనఏటీఎం పరిశ్రమ ప్రస్తుతం మరో సవాలును కూడా ఎదుర్కొంటోంది. పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావంతో ఇంధన ధరలు పెరగడం, పలు రాష్ట్రాల్లో కనీస వేతనాల పెంపు కారణంగా నగదు రవాణా, భద్రత, నిర్వహణ వ్యయాలు గణనీయంగా పెరిగాయి. నగదు రవాణా సంస్థలు, ఏటీఎం రీప్లెనిష్మెంట్ కంపెనీలు బ్యాంకుల నుంచి అధిక ఛార్జీలను కోరుతున్నాయి. ఖర్చులు 15-20 శాతం వరకు పెరిగినట్లు పరిశ్రమ అంచనా వేస్తోంది.తగ్గుతున్న ఏటీఎం లావాదేవీలుడిజిటల్ చెల్లింపుల విస్తరణతో ఏటీఎంల వినియోగం క్రమంగా తగ్గుతోంది. ఆర్బీఐ తాజా గణాంకాల ప్రకారం, 2025లో ఇదే కాలంలో 498.37 మిలియన్లుగా ఉన్న ఏటీఎం లావాదేవీలు 2026 మే నాటికి 446.50 మిలియన్లలకు పడిపోయాయి. ఏడాదిలో సుమారు 10.4 శాతం తగ్గుదల నమోదైంది. అయితే నగదు చలామణి మాత్రం పెరుగుతూనే ఉండటం విశేషం. ఇది ప్రజలు అత్యవసర అవసరాల కోసం నగదును నిల్వ ఉంచుతున్నారనే సంకేతంగా ఎస్బీఐ పరిశోధన నివేదిక పేర్కొంది.ఫీజుల పెంపు ప్రభావంగత ఏడాది నుంచి ఉచిత పరిమితిని దాటిన ఏటీఎం లావాదేవీలపై వసూలు చేసే ఛార్జీని రూ.21 నుంచి రూ.23కు పెంచారు. అలాగే ఇంటర్చేంజ్ ఫీజును రూ.17 నుంచి రూ.19కు పెంచినా, పెరిగిన నిర్వహణ ఖర్చులను అది భర్తీ చేయలేకపోతోందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఏటీఎం ఆపరేటర్ల లాభదాయకతపై ఒత్తిడి పెరుగుతోంది.ప్రజలపై ప్రభావం ఎంత?ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఏటీఎంలు మూతపడే పరిస్థితి లేదని బ్యాంకింగ్ వర్గాలు స్పష్టం చేస్తున్నప్పటికీ, నగదు సరఫరా సమస్య కొనసాగితే కొన్ని ప్రాంతాల్లో తరచూ "క్యాష్ అవుట్" పరిస్థితులు కనిపించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో డీబీటీ లబ్ధిదారులు, రోజువారీ నగదు లావాదేవీలపై ఆధారపడే వర్గాలు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశముంది. అందువల్ల నగదు పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయడం, ఏటీఎం రీప్లెనిష్మెంట్ ప్రక్రియను మరింత సమర్థవంతంగా మార్చడం అత్యవసరంగా మారింది. -
RBI నిర్ణయం.. బ్యాంకు EMIలపై ఇదే ప్రభావం..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక వడ్డీరేట్లపై తన విధాన నిర్ణయాన్ని ప్రకటించింది. కీలక రెపో రేటును 5.25 శాతంగానే కొనసాగించాలని ఆర్బీఐ నిర్ణయించింది. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలోని మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) జూన్ 3 నుంచి జూన్5 మధ్య 2027 ఆర్థిక సంవత్సరానికి రెండవ ద్వైమాసిక విధాన సమావేశాన్ని నిర్వహించింది. అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ, ఆర్థిక, వాణిజ్య అనిశ్చితులు.. రూపాయి అస్థిరతలు, ద్రవ్యోల్బణం పెరుగుతున్న తరుణంలో ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ కీలక రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు.ఏమిటీ రెపో రేటు?ఆర్బీఐ తీసుకునే అత్యంత నిశితంగా పరిశీలించే నిర్ణయాలలో ఒకటి పాలసీ రెపో రేటు. ఇది మీరు ఇల్లు, కారు, వ్యక్తిగత రుణాలపై చెల్లించే వడ్డీ రేటును, ఫిక్స్డ్ డిపాజిట్లపై మీరు సంపాదించే రాబడిని, మీ మార్కెట్ పెట్టుబడుల పనితీరును కూడా నేరుగా ప్రభావితం చేస్తుంది. రెపో రేటు అనేది సెంట్రల్ బ్యాంక్ (ఆర్బీఐ) వాణిజ్య బ్యాంకులకు రుణాలు అందించే రేటు. అంటే మీ బ్యాంకు ఉదాహరణకు హెచ్డీఎఫ్సీ బ్యాంకుకు ఫండ్ అవసరమైనప్పుడల్లా ఈ రెపో రేటుతో ఆర్బీఐ నుండి రుణం తీసుకుంటుంది.హెచ్డీఎఫ్సీ బ్యాంకు అధిక వడ్డీకి రుణం తీసుకుంటే కస్టమర్లకు కూడా అధిక వడ్డీకి రుణం ఇస్తారు. రెపో రేటు ఎంత ఎక్కువగా ఉంటే, మీరు తీసుకునే రుణంపై మీరు ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. అది ఎంత తక్కువగా ఉంటే, మీ రుణంపై చెల్లించాల్సి వడ్డీ అంత తగ్గుతుందన్నమాట.ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు, నియంత్రణలోకి తీసుకురావాల్సిన అవసరం ఉన్నప్పుడు రెపో రేటును పెంచే అంశాన్ని ఆర్బీఐ పరిగణించవచ్చు. అధిక వడ్డీ రేట్లు రుణాలను మరింత ఖరీదైనవిగా మారుస్తాయి. ఇది ఆర్థిక వ్యవస్థలో డబ్బు ప్రవాహాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. డిమాండ్‌ను తగ్గిస్తుంది. మరోవైపు, ఆర్బీఐ ఆర్థిక కార్యకలాపాలను పెంచాలనుకున్నప్పుడు రెపో రేటును తగ్గిస్తుంది. తక్కువ వడ్డీ రేట్లు రుణాలు, ఖర్చులను ప్రోత్సహిస్తాయి. ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యతను పెంచుతాయి. జీడీపీ వృద్ధికి మద్దతు ఇస్తాయి.ఈఎంఐలపై ప్రభావంప్రస్తుతం, ఆర్బీఐ పాలసీ రెపో రేటును 5.25 శాతంగా ఉంచింది. కాబట్టి ప్రస్తుతానికి చెల్లించాల్సిన లోన్ ఈఎంఐలలో ఎలాంటి మార్పు ఉండదు. అదే ఒక వేళ మార్పులు చేసి ఉంటే ఎలా ఉండేదో ఉదాహరణతో చూద్దాం..మీకు 8.25% ఫ్లోటింగ్ వడ్డీ రేటుతో 20 సంవత్సరాల కాలపరిమితితో రూ.50 లక్షల గృహ రుణం ఉందనుకోండి. ఈ రేటుతో, మీ నెలవారీ ఈఎంఐ రూ. 42,603కు వస్తుంది. ఇప్పుడు, ఆర్బీఐ రెపో రేటును 5.25% నుండి 5 శాతానికి తగ్గించి ఉంటే మీ బ్యాంక్ మొత్తం 0.25% తగ్గింపును పాస్ చేస్తే, మీ గృహ రుణ వడ్డీ రేటు 8 శాతానికి పడిపోతుంది. ఫలితంగా మీ ఈఎంఐ రూ.41,822కు తగ్గేది. అంటే నెలకు రూ.781 మేర తగ్గేదన్న మాట.అదే ఆర్బీఐ రెపో రేటును 5.25 శాతం నుంచి 5.5 శాతానికి పెంచి ఉంటే, మీ బ్యాంకు మొత్తం 0.25 శాతం వడ్డీ రేటును కస్టమర్లకు బదిలీ చేస్తే, మీ గృహ రుణ వడ్డీ రేటు 8.5 శాతానికి పెరుగుతుంది. ఫలితంగా, మీ చెల్లించాల్సిన ఈఎంఐ రూ.43,391కు పెరుగుతుంది. అంటే మీరు ప్రతి నెలా అదనంగా రూ.788 చెల్లించాల్సి వచ్చేది. -
కనీసం రూ.52,600 జీతం ఇవ్వాలి..
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల పునఃసమీక్ష కోసం ఏర్పాటైన 8వ కేంద్ర వేతన సంఘం (8th CPC) ముందు భారతీయ రైల్వే సాంకేతిక పర్యవేక్షకుల సంఘం (IRTSA) కీలక డిమాండ్లను ఉంచింది. రైల్వేలోని జూనియర్ ఇంజనీర్లు (JE), సీనియర్ సెక్షన్ ఇంజనీర్లు (SSE) సహా టెక్నికల్ సూపర్వైజర్ల బాధ్యతలు, ప్రమాదభరిత విధులు, సాంకేతిక నైపుణ్యాలను దృష్టిలో ఉంచుకుని కనీస ప్రాథమిక వేతనాన్ని ప్రస్తుత స్థాయి కంటే గణనీయంగా పెంచి రూ.52,600గా నిర్ణయించాలని సంఘం కోరింది.గత నెల హైదరాబాద్‌లో 8వ వేతన సంఘం ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఐఆర్టీఎస్ఏ సమగ్ర మెమోరాండం సమర్పించింది. సంఘం ప్రధాన కార్యదర్శి కె.వి. రమేష్ నేతృత్వంలోని బృందం రైల్వే టెక్నికల్ సిబ్బంది ఎదుర్కొంటున్న కెరీర్ స్తబ్దత, పదోన్నతుల కొరత, వేతన అసమానతలు, భత్యాల సమస్యలను సంఘం దృష్టికి తీసుకెళ్లింది.రైల్వే టిక్నికల్ సిబ్బంది డిమాండ్లు ఇవీ..సంఘం ప్రతిపాదనల ప్రకారం, మొత్తం ఉద్యోగులందరికీ ఒకే ఫిట్మెంట్ ఫ్యాక్టర్ వర్తింపజేయకుండా పోస్టు స్థాయి, బాధ్యతల ఆధారంగా వేర్వేరు ఫిట్మెంట్ ఫ్యాక్టర్లను అమలు చేయాలి. లెవల్-1 ఉద్యోగులకు 2.92, లెవల్-6 నుంచి 8 వరకు ఉన్న సాంకేతిక సిబ్బందికి 3.50, లెవల్-9 నుంచి 12 వరకు ఉన్న మధ్యస్థాయి అధికారులకు 3.80 ఫిట్మెంట్ ఫ్యాక్టర్‌ను అమలు చేయాలని సూచించింది.అలాగే సీనియర్ సెక్షన్ ఇంజనీర్లకు గ్రూప్-బి గెజిటెడ్ హోదా కల్పించాలని, రైల్వేలో గ్రూప్-బి పోస్టుల సంఖ్యను పెంచాలని, సాంకేతిక సిబ్బందికి ప్రత్యేక రిస్క్, హార్డ్‌షిప్ అలవెన్సులు ఇవ్వాలని సంఘం డిమాండ్ చేసింది. నైట్ డ్యూటీ అలవెన్స్, ఓవర్‌టైమ్ అలవెన్స్, పీసీఓ అలవెన్స్ వంటి అంశాలపై కూడా పునఃసమీక్ష జరపాలని కోరింది.ప్రస్తుతం 8వ వేతన సంఘం దేశవ్యాప్తంగా ఉద్యోగ సంఘాలు, పెన్షనర్ల సంస్థలు, వివిధ శాఖల ప్రతినిధుల అభిప్రాయాలను సేకరిస్తోంది. కేంద్ర ప్రభుత్వం 2025లో 8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేయగా, సంఘం తన సిఫార్సులను 18 నెలల్లో సమర్పించే అవకాశం ఉంది. తుది నిర్ణయం కేంద్ర ప్రభుత్వానిదే కావడంతో, ఉద్యోగ సంఘాల డిమాండ్లన్నీ యథాతథంగా అమలవుతాయా లేదా అనేది నివేదిక అనంతరం స్పష్టత రానుంది. -
కాంబోడియాలో యూపీఐ చెల్లింపులు
న్యూఢిల్లీ: దేశీ ఏకీకృత చెల్లింపుల విధానం (యూపీఐ) తాజాగా కాంబోడియాలో కూడా అందుబాటులోకి వచ్చింది. ఇందుకోసం ఎన్పీసీఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ సంస్థ కాంబోడియాకి చెందిన ఎక్లెడా బ్యాంకుతో ఒప్పందం కుదుర్చుకుంది.దీని ప్రకారం తొలి దశలో ఆ దేశంలో 45 లక్షల వ్యాపారులకు భారతీయ పర్యాటకులు క్యూఆర్ ఆధారంగా చెల్లింపులు చే యొచ్చు. తదుపరి దశలో కాంబోడియా పర్యాటకులు భారత్‌లో కూడా ఈ విధానంలో చెల్లింపులు జరిపే వెసులుబాటును వినియోగంలోకి తెస్తారు. ప్రస్తుతం సింగపూర్, ఫ్రాన్స్, నేపాల్ తదితర 8 దేశాల్లో యూపీఐకి అందుబాటులో ఉంది. -
ధనవంతుల రహస్యం చెప్పిన కియోసాకి
ప్రపంచ ప్రఖ్యాత పర్సనల్ ఫైనాన్స్ పుస్తకం ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) రచయిత రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) మరోసారి బంగారం, వెండిపై తన మద్దతును వ్యక్తం చేశారు. సంపదను కాపాడుకోవాలంటే బంగారం వంటి వాస్తవ ఆస్తుల్లో పెట్టుబడులు పెట్టాలని ఆయన సూచించారు.తాజాగా ఫేస్బుక్లో చేసిన పోస్టులో, చాలామంది బంగారం కొంటే డబ్బు సంపాదించవచ్చని భావిస్తారని, కానీ ధనవంతులు ఆ ఉద్దేశంతో బంగారం కొనరని పేర్కొన్నారు. డాలర్‌పై నమ్మకం లేకపోవడమే బంగారం కొనడానికి ప్రధాన కారణమని ఆయన అన్నారు. తన వయోజన జీవితమంతా బంగారం, వెండి నిల్వ చేసుకుంటూ వచ్చానని, వాటి ధరలు భారీగా పెరుగుతాయని ఆశించి కాదు, డాలర్ విలువ కాలక్రమేణా తగ్గుతుందనే అవగాహనతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని వివరించారు.ప్రభుత్వాలు కొత్త కరెన్సీని ముద్రించిన ప్రతిసారీ నగదు కొనుగోలు శక్తి తగ్గిపోతుందని కియోసాకి అభిప్రాయపడ్డారు. బంగారం లాభాలను హామీ ఇవ్వదని, కానీ సంపదను రక్షించే సాధనంగా పనిచేస్తుందని చెప్పారు. కోట్లాది రూపాయలు అవసరం లేదని, ఒక వెండి నాణెం లేదా చిన్న పరిమాణంలో బంగారం కొనుగోలు చేయడం ద్వారా కూడా సంపద రక్షణను ప్రారంభించవచ్చని సూచించారు.అయితే ఎక్కువ మంది ప్రజలు సోషల్ మీడియాలో సమయం గడపడం, తదుపరి స్టాక్ టిప్ కోసం ఎదురు చూడడం లేదా ప్రభుత్వమే తమను కాపాడుతుందని ఆశించడం చేస్తారని ఆయన వ్యాఖ్యానించారు. నిజమైన డబ్బు బంగారం, వెండి వంటి విలువైన లోహాలేనని, కాగితపు కరెన్సీ కేవలం నకిలీ డబ్బు లాంటిదేనని ఆయన పేర్కొన్నారు.వేల ఏళ్లుగా బంగారం, వెండి సంపద నిల్వ సాధనాలుగా కొనసాగుతున్నాయని, కానీ అమెరికా డాలర్ 1971 నుంచి క్రమంగా విలువ కోల్పోతోందని కియోసాకి అన్నారు. ప్రభుత్వాలపై నమ్మకం ఉంచాలా, లేక బంగారంపై విశ్వాసం పెంచుకోవాలా అనేది ప్రతి వ్యక్తి తీసుకోవాల్సిన నిర్ణయమని తన పోస్టులో పేర్కొన్నారు. -
వైవిధ్యంతో కూడిన పెట్టుబడులు
ఈక్విటీల్లో చక్కని వైవిధ్యంతో ఇన్వెస్ట్ చేసుకోవాలని భావించే వారికి మల్టీ క్యాప్ ఫండ్స్ మంచి ఆప్షన్. పెట్టుబడులకు స్థిరత్వం కోసం లార్జ్‌క్యాప్, అధిక రాబడుల కోసం మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ మధ్య పెట్టుబడులను విస్తరించడం ద్వారా దీర్ఘకాలంలో ఇన్వెస్టర్లకు మెరుగైన రాబడులను అందించేవే మల్టీక్యాప్ ఫండ్స్. ఇన్వెస్టర్లు తమ అంతటగా లార్జ్‌క్యాప్, మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ విభాగాల్లో మెరుగైన పథకాలను ఎంపిక చేసుకుని ఇన్వెస్ట్ చేయడం కంటే మంచి మల్టీక్యాప్ను ఎంపిక చేసుకోవడమే చక్కని ఆప్షన్ అవుతుంది. కనీసం ఐదు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలానికి.. మధ్యస్థం నుంచి అధిక రిస్క్ తీసుకోగలిగితే ఇన్వెస్టర్లకు మల్టీ క్యాప్ ఫండ్స్ అనుకూలం. రాబడులు.. ఈ పథకం 2023 జనవరి 30న ప్రారంభం కాగా, నాటి నుంచి ఏటా 23.4 శాతం చొప్పున రాబడిని (పాయింట్ టు పాయింట్) అందించింది. ఇదే కాలంలో మల్టీక్యాప్ ఫండ్స్ విభాగం సగటు వార్షిక రాబడి 18.3 శాతంగానే ఉంది. ఇది మెరుగైన పనితీరును తెలియజేస్తోంది. రోలింగ్ రాబడులు (వివిధ దశల్లో పెట్టుబడులు) సైతం మూడేళ్ల కాలంలో 23 శాతం చొప్పున ఉన్నాయి. మూడేళ్ల సిప్ పనితీరును గమనిస్తే ఏటా 12.8 శాతం చొప్పున రాబడి నమోదైంది. మార్కెట్లో ఎన్నో అనిశ్చితులు నెలకొన్నప్పటికీ గడిచిన ఏడాది కాల రాబడి 6.45 శాతంగా నమోదైంది. పెట్టుబడుల విధానం.. మల్టీక్యాప్ ఫండ్స్ అన్నవి లార్జ్‌క్యాప్, మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తాయి. ఈ పథకంలో వైవిధ్యానికి ప్రాధాన్యం ఎక్కువ. ప్రస్తుతం ఈ పథకంలో 96 స్టాక్స్ ఉండడం దీన్నే సూచిస్తోంది. పోర్ట్‌ఫోలియోలోని టాప్–10 కంపెనీల్లో పెట్టుబడులు 23.19 శాతం మించలేదు. ఇది కూడా రిస్క్ వైవిధ్యంలో భాగమే. సెబీ నిబంధనల ప్రకారం అయితే మల్టీక్యాప్ ఫండ్స్ కనీసం 25 శాతాన్ని లార్జ్‌క్యాప్ కంపెనీల్లో, 25 శాతాన్ని మిడ్‌క్యాప్ కంపెనీల్లో, 25 శాతం స్మాల్‌క్యాప్ కంపెన్లీలో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. మిగిలిన 25 శాతం నిధులను మార్కెట్ పరిస్థితుల ఆధారంగా ఫండ్ మేనేజర్ తన విచక్షణ మేరకు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. మార్కెట్ పరిస్థితులను బట్టి వివిధ రకాల స్టాక్స్ వేర్వేరు సమయాల్లో రాణిస్తాయి. ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటున్న తరుణంలో లార్జ్‌క్యాప్ కంటే మిడ్, స్మాల్ క్యాప్ కంపెనీలు బాగా రాణిస్తాయి. అదే మార్కెట్ పతనమవుతున్నప్పుడు లార్జ్‌క్యాప్‌లో నష్టాలు పరిమితంగా ఉంటాయి. మల్టీ క్యాప్ ఫండ్స్ వల్ల అన్ని కాలాల్లోనూ లాభపడే అవకాశం ఉంటుంది. ఈ పథకానికి వ్యాల్యూరీసెర్చ్ సంస్థ 5 స్టార్ రేటింగ్ ఇచ్చింది. పోర్ట్‌ఫోలియో ఈ పథకం నిర్వహణలో రూ.5,500 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. గత పనితీరు భవిష్యత్ రాబడికి హామీ కాదన్న విషయం గుర్తుంచుకోవాలి. కేవలం ఆ పథకం భవిష్యత్ పనితీరు ఎలా ఉంటుందో అవగాహనకు డేటా పనికొస్తుంది. ఇందులో 43.67 శాతం లార్జ్‌క్యాప్ కంపెనీలకు కేటాయించగా, మిడ్‌క్యాప్ కంపెనీల్లో 27.96 శాతం, స్మాల్‌క్యాప్ కంపెనీలకు 28.37 శాతం చొప్పున కేటాయించింది. రంగాల వారీ పెట్టుబడులను పరిశీలిస్తే.. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్సియల్ రంగ కంపెనీల్లో 24.91 శాతం, ఇండ్రస్టియల్స్ కంపెనీల్లో 17.13 శాతం, కన్జ్యూమర్ డిస్క్రీషినరీ కంపెనీల్లో 11.18 శాతం చొప్పున ఇన్వెస్ట్ చేసింది. మెటీరియల్స్ కంపెనీల్లో 9.73 శాతం పెట్టుబడులు ఉన్నాయి. -
ఇన్వెస్టర్స్ అలర్ట్: ఇవిగో ‘న్యూ ఫండ్ ఆఫర్స్’
ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ అసెట్ మేనేజ్మెంట్ కొత్తగా స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (సిఫ్) కేటగిరీలో రెండు ఫండ్స్‌ని ఆవిష్కరించింది. ఐసిఫ్ యాక్టివ్ అసెట్ అలొకేటర్ లాంగ్–షార్ట్ ఫండ్, ఐసిఫ్ ఈక్విటీ లాంగ్–షార్ట్ ఫండ్ వీటిలో ఉన్నాయి. ఈ రెండు ఫండ్ ఆఫర్లు జూన్ 02 వరకు అందుబాటులో ఉంటాయి. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా లాంగ్–షార్ట్ పొజిషన్లు తీసుకోవడం, డెరివేటివ్స్ ద్వారా రిస్క్‌లను అదుపులో ఉంచడంలాంటి విధానాలతో మెరుగైన రాబడులు అందించేందుకు ఈ వ్యూహాలు పని చేస్తాయని సంస్థ ఈడీ శంకరన్ నరేన్ తెలిపారు.మొదటిది ఈక్విటీ, డెట్, కమోడిటీస్ డెరివేటివ్స్, ఇన్విట్స్ మొదలైన వాటికి నిధులు కేటాయిస్తుంది. రెండోది వివిధ మార్కెట్ క్యాప్స్‌వ్యాప్తంగా ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తుంది. డెరివేటివ్స్ వ్యూహాన్ని కూడా పాటిస్తూ మెరుగైన రాబడులు అందించడంపై దృష్టి పెడుతుంది. ఈ తరహా సిఫ్లో తొలిసారి ఇన్వెస్ట్ చేస్తున్నవారు కనీసం రూ. 10 లక్షలు, ఇప్పటికే ఇన్వెస్ట్ చేసిన వారు రూ. 10,000 నుంచి వీటిలో పెట్టుబడులు పెట్టొచ్చు. కోటక్ ఎంఎఫ్ నిఫ్టీ ఫండ్ కోటక్ మహీంద్రా మ్యూచువల్ ఫండ్ తాజాగా నిఫ్టీ ఆల్ఫా లో–వోలటైలిటీ 30 ఇండెక్స్ ఫండ్‌ని ప్రవేశపెట్టింది. ఇది జూన్ 12తో ముగుస్తుంది. ధరల పరంగా తీవ్ర హెచ్చుతగ్గులకు లోను కాకుండా విస్తృత మార్కెట్‌కి మించి రాణించగలిగే అవకాశాలున్న 30 సంస్థలు ఈ ఇండెక్స్‌లో ఉంటాయి. పరిస్థితులను బట్టి ఈ స్టాక్స్‌లో మార్పులు, చేర్పులు చేస్తుంటారు. దీర్ఘకాలిక పెట్టుబడి లక్ష్యాలు గల ఇన్వెస్టర్లు దీన్ని పరిశీలించవచ్చని సంస్థ ఎండీ నీలేష్ షా తెలిపారు. మహీంద్రా మాన్యులైఫ్ ‘ఎంపవర్ సిఫ్’ సిఫ్ కేటగిరి కింద మహీంద్రా మాన్యులైఫై మ్యుచువల్ ఫండ్ కొత్తగా ‘ఎంపవర్ సిఫ్’ని ఆవిష్కరించింది. ఈ తరహా ఫండ్స్‌లో లాంగ్–షార్ట్ పొజిషనింగ్, డెరివేటివ్స్ ఆధారిత వ్యూహాలు కూడా అమలు చేస్తారని సంస్థ తెలిపింది. మారుతున్న ఇన్వెస్టర్ల ఆకాంక్షలు, లక్ష్యాలకు అనుగుణంగా మరింత మెరుగైన రాబడులను అందించేందుకు ఇవి ఉపయోగపడతాయని సంస్థ ఎండీ ఆంథోని హెరెడియా తెలిపారు. ఎంపవర్ సిఫ్ కింద ఈక్విటీ, హైబ్రిడ్, ఫిక్సిడ్ ఇన్రం కేటరిగీలవ్యాప్తంగా వివిధ వ్యూహాలను ప్రవేశపెట్టనున్నట్లు వివరించారు. -
‘బ్యాంకులకూ బంగారంపైనే నమ్మకం’
ప్రపంచవ్యాప్తంగా బంగారం ప్రాధాన్యం మరింత పెరుగుతోందని ప్రముఖ ఇన్వెస్టర్, ప్రసిద్ధ ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో (ట్విట్టర్) చేసిన తాజా పోస్టు ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షిస్తోంది.గత ఏడాదిలో బంగారం ధరలు సుమారు 65 శాతం పెరిగాయని, అదే సమయంలో బ్యాంకు పొదుపు ఖాతాలపై కేవలం 4 శాతం వార్షిక వడ్డీ మాత్రమే లభిస్తోందని కియోసాకి గుర్తు చేశారు. అంతేకాకుండా ప్రపంచంలోని అనేక సెంట్రల్ బ్యాంకులు అమెరికా ట్రెజరీ బాండ్లను విక్రయించి, వాటి స్థానంలో బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.“ఈ పరిణామాలను గమనిస్తే పరిస్థితి ఏ దిశగా వెళ్తోందో అర్థం చేసుకోవచ్చు” అంటూ కియోసాకి తన పోస్టులో వ్యాఖ్యానించారు. డాలర్ ఆధారిత ఆస్తుల కంటే బంగారం వంటి భౌతిక ఆస్తులపై విశ్వాసం పెరుగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.కియోసాకి గత కొంతకాలంగా బంగారం, వెండి, బిట్కాయిన్లకు మద్దతు తెలుపుతూ వస్తున్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పెరుగుతున్న అనిశ్చితి నేపథ్యంలో పెట్టుబడిదారులు తమ సంపదను రక్షించుకునేందుకు ప్రత్యామ్నాయ ఆస్తులను పరిశీలించాలని ఆయన తరచూ సూచిస్తున్నారు.FYI:Gold up 65% in 1 year.Savings pay 4% a year.Central banks dumping US Treasuries for gold.Get the picture?— Robert Kiyosaki (@theRealKiyosaki) June 1, 2026 -
Income Tax: ఐటీఆర్ ఫారం 2 రెడీగా ఉంది..
గత వారం నుంచి ఆదాయపు పన్ను వారి ఈ–ఫైలింగ్ పోర్టల్‌లో ఫారాలను ఎనేబుల్ చేస్తున్నారు. మనం గతంలో ఫారం 1, ఫారం 4 గురించి తెలుసుకున్నాం. లేటెస్టుగా ఫారం 2 రెడీగా ఉంది. వివరాల్లోకి వెళ్దాం.ఈ ఫారం ఎవరు దాఖలు చేయాలి? వ్యక్తులు, హిందూ ఉమ్మడి కుటుంబాలు మాత్రమే ఐటీఆర్ ఫారం 2ను వేయగలరు. ఇతరులెవ్వరూ ఈ ఫారం ద్వారా తమ ఆదాయాలను డిక్లేర్ చేయకూడదు. ఐటీఆర్ ఫారం 1 వేయకూడనివారు (వేయలేకపోవడం కాదు.. వేయడానికి అర్హత లేని వారు), అలాగే బిజినెస్ / వృత్తిపై లాభనష్టాలు ఉండని వారు మాత్రమే ఈ ఫారం దాఖలు చేయడానికి అర్హులు.ఏయే ఆదాయాలున్నవారు వేయొచ్చు.. ß మూలధన లాభాలు (దీర్ఘకాలిక, స్వల్పకాలిక) ß ఒక ఇంటి ఆస్తి మీద, ఎక్కువ ఆస్తుల మీద ఆదాయం ఉన్నవారు ß విదేశీ ఆస్తుల మీద ఆదాయం ß విదేశాల నుంచి ఆదాయం ß జీతాలు / పెన్షన్ ß ఇతర ఆదాయాలు, లాటరీలు, గుర్రపు పందాలు, గ్యాంబ్లింగ్ వగైరా ఆదాయాలు ఉన్నవారు ß వ్యవసాయం మీద ఆదాయం రూ. 5,000 దాటినవారు ß మొత్తం ఆదాయం పరిమితి రూ. 50,00,000 దాటినవారు ß డైరెక్టర్స్ ß అన్‌లిస్టెడ్ ఈక్విటీ వాటాల్లో ఇన్వెస్ట్ చేసినవారుఏ ఆదాయం ఉన్నవారు వేయకూడదు.. వ్యక్తులు కానీ / హిందు ఉమ్మడి కుటుంబాలకు వ్యాపారం మీద / వృత్తి మీద ఆదాయం ఉన్నవారు ఫారం 2 వేయకూడదు.గడువు తేదీ ఎప్పుడు ఈ ఫారం దాఖలు చేయడానికి గడువు తేదీ 2026 జూలై 31.తెలుసుకోవాల్సిన, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ ఫారం ఆన్లైన్లో గానీ ఆఫ్‌లైన్‌లో గానీ వేసుకోవచ్చు. ఈ కింద చెప్పబోయే విషయాల్లో పాత చట్టంలో పేర్కొన్న పేరు, ఫారాలను వాడుతున్నాం. 🔸 యజమాని జారీ చేసిన ఫారం 16 🔸 వివిధ డిడక్టర్లు జారీ చేసిన ఫారం 16ఏ 🔸 టీడీఎస్ వెరిఫికేషన్ కోసం ఫారం 26ఏఎస్ 🔸 ఇంటద్దె రశీదులు, ఒక్కొక్కప్పుడు యజమాని తీసుకోకపోయినా / పరిగణించకపోయినా మీరు డైరెక్టుగా క్లెయిమ్ చేయొచ్చు 🔸 బ్యాంకు పాస్‌బుక్స్ లేదా బ్యాంకు వాళ్లు ఇచి్చన స్టేట్మెంట్లు 🔸 ఫిక్స్డ్ డిపాజిట్ల రశీదులు 🔸 క్యాపిటల్ గెయిన్స్ – దీర్ఘకాలికమైనవైతే ఆస్తుల అన్ని వివరాలు, కాగితాలు, రశీదులు మొదలైనవి 🔸 క్యాపిటల్ గెయిన్స్ స్వల్పకాలికమైనా, ఆస్తులకు సంబంధించిన వివరాలు, కాగితాలు, రశీదులు 🔸 షేర్లు, మ్యూచువల్ ఫండ్స్‌కి సంబంధించి బ్రోకింగ్ సంస్థలు / ఏజెన్సీలు జారీ చేసిన స్టేట్మెంట్లు, సర్టిఫికెట్లు మొదలైనవి 🔸 పాత పద్ధతిలో పన్నుభారం లెక్కించే విధానం ఎంపికలో 80సి, జీ, డి, జీజీ ఇలాంటి మినహాయింపులకు సంబంధించి కాగితాలు, నంబర్లు, వివరాల విషయంలో దయచేసి చాలా జాగ్రత్త వహించండి. షరా: కాగితాలు జతపర్చుకోనక్కర్లేదు, కానీ భద్రపరచాలి. వాటిలోని వివరాలు తెలియజేయాలి.కొత్త మార్పులు ప్రత్యేకించి 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను రిటర్నుల్లో సమాచారపరంగా వచ్చిన మార్పులు ఏమిటంటే, స్పల్పకాలిక క్యాపిటల్ గెయిన్స్ 15 శాతం కొన్ని, 10 శాతం కొన్ని ఉండేవి. కానీ ఇప్పుడు అన్నింటికీ ఒకే రేటు. తికమక ఉండదు. రివైజ్ రిటర్నుకి సంబంధించిన ఫీజు వివరాలు ఇవ్వాలి. 80సీ, 80డీ మొదలైన వాటి విషయాల్లో ప్రత్యేకంగా 80జీజీసీ వ్యవహారపు వివరాలు/ రిఫరెన్సు, పాన్ నంబరు ఇవ్వాలి. రిప్రజెంటేటివ్ అసెసీ వివరాల్లో పేరు, మెయిల్ ఐడీ, ఫోన్ నంబర్లు తెలియజేస్తే చాలు. -
‘బంగారం, వెండి.. అలా కొన్నారంటే నష్టమే’
ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడైన ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) అమెరికా ప్రభుత్వ బాండ్ల భద్రతపై సందేహాలు వ్యక్తం చేశారు. ఆర్థిక ప్రణాళికకర్తలు అమెరికా బాండ్లు సురక్షితమైన పెట్టుబడులని చెబుతున్నప్పటికీ, అలాంటి అభిప్రాయాలను గుడ్డిగా నమ్మవద్దని ఆయన సూచించారు.సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్టులో, “మూర్ఖత్వం నుంచి వచ్చే ఏ పెట్టుబడీ పూర్తిగా సురక్షితం కాదు” అని వ్యాఖ్యానించారు. బంగారం, వెండి, బిట్‌కాయిన్ వంటి ఆస్తులు కూడా కేవలం ప్రచారం లేదా హైప్ ఆధారంగా కొనుగోలు చేస్తే నష్టాలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు.ప్రస్తుతం జపాన్, చైనా వంటి ప్రధాన అమెరికా బాండ్ హోల్డర్లు తమ వద్ద ఉన్న బాండ్లను విక్రయించి బంగారం, వెండి కొనుగోలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. మార్కెట్లలో నగదు ప్రవాహం ఏ దిశగా వెళ్తుందో గమనించడం మదుపరులకు ముఖ్యమని సూచించారు.అంతేకాకుండా, ఎవరికైనా అత్యంత విలువైన ఆస్తి వారి మెదడేనని, సరైన అవగాహనతో నిర్ణయాలు తీసుకోవాలని కియోసాకి అభిప్రాయపడ్డారు. పెట్టుబడులు పెట్టే ముందు మార్కెట్ పరిస్థితులను జాగ్రత్తగా విశ్లేషించాలని ఆయన సూచించారు. Don’t drink financial planners Kool- Aide when they tell you US Bonds are safe. There is nothing safe….from stupidity. Remember even gold, silver, and Bitcoin can cost you money if purchased on hype.Best watch the cash flowing. Today many major US Bond holders, like…— Robert Kiyosaki (@theRealKiyosaki) May 30, 2026 -
మధ్యవర్తుల ద్వారానే బీమా.. ఎందుకు?
దేశీయంగా ఇన్సూరెన్స్ కంపెనీలకు, కస్టమర్లకు మధ్య ప్రత్యక్ష సంబంధాలు ఉండటం లేదని కన్సల్టింగ్ సంస్థ ప్రాక్సిస్ గ్లోబల్ అలయన్స్ ఒక నివేదికలో పేర్కొంది. దాదాపు 80 శాతం పాలసీల కొనుగోళ్లు బీమా కంపెనీల వెబ్సైట్ల ద్వారా కాకుండా మధ్యవర్తుల ద్వారానే జరుగుతున్నాయని తెలిపింది. ఫలితంగా కస్టమర్లను సమకూర్చుకోవడం కంటే ఏజెంట్లను అందిపుచ్చుకునేందుకే కంపెనీలు పోటీపడుతున్నాయని వివరించింది. అన్ని లావాదేవీలు మధ్యవర్తులద్వారానే జరుగుతుండటం వల్ల కస్టమర్లు కూడా వారికే ఎక్కువగా విశ్వసనీయంగా ఉంటున్నారని పేర్కొంది. ఫలితంగా కంపెనీలకి కస్టమర్లకు మధ్య ప్రత్యక్షంగా సంబంధాలు ఉండటం లేదని రిపోర్టు తెలిపింది.సాధారణంగా బీమా కంపెనీలకు పాలసీల విక్రయాలపై నష్టాలే తప్ప లాభం ఉండటం లేదని వివరించింది. అండర్‌రైటింగ్ రూపంలో వచ్చే నిధుల కంటే షేర్ మార్కెట్లలోనో, ప్రభుత్వ బాండ్లలోనో ఇన్వెస్ట్ చేయడం ద్వారా వచ్చే ఆదాయాలతోనే కంపెనీలు మనుగడ సాగిస్తున్నట్లు ప్రాక్సిస్ తెలిపింది. దీర్ఘకాలికంగా నిలదొక్కుకోవాలంటే బీమా కంపెనీలు తమ పద్ధతులను మార్చుకోవాల్సి ఉంటుందని వివరించింది. ఏజెంట్లపై ఆధారపడటం తగ్గించి, నేరుగా కస్టమర్లకే పాలసీలను విక్రయించే పద్ధతిని పెంచుకోవాలని సూచించింది.కస్టమర్లు కూడా కంపెనీల నుంచే నేరుగా పాలసీలను కొనుగోలు చేసేందుకు సిద్ధంగానే ఉండొచ్చని, కాకపోతే కంపెనీలు తక్కువ ధరకు, సరళతరమైన పాలసీలను అందించాల్సి ఉంటుందని ప్రాక్సిస్ తెలిపింది. అలాగే క్లెయిమ్స్‌ను సత్వరం సెటిల్ చేయాల్సి ఉంటుందని పేర్కొంది. రాబోయే రోజుల్లో కొంగొత్త నిబంధనలు, బీమా సుగమ్‌లాంటి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల వల్ల కస్టమర్లతో కంపెనీలు నేరుగా కనెక్ట్ అయ్యేందుకు అవకాశాలు పెరుగుతాయని వివరించింది. సొంతంగా కస్టమర్లను నిలుపుకోగలిగే కంపెనీలే భవిష్యత్తులో రాణించగలవని ప్రాక్సిస్ తెలిపింది. చదవండి: ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ లాభం రెట్టింపు -
బ్యాంకులకు వెళ్లేవాళ్లకు అలర్ట్: 11 రోజులు సెలవులు!
బ్యాంకులు ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో భాగంగా మారిపోయాయి. ప్రతిఒక్కరూ ఏదో ఒక పని మీద బ్యాంకు బ్రాంచిలకు వెళ్తుంటారు. ఈ క్రమంలో బ్యాంకులు ఏ రోజుల్లో పనిచేస్తాయి.. ఎప్పుడెప్పుడు సెలవులు ఉంటాయి.. అనే విషయాలను తెలుసుకోవడం అవసరం. దేశవ్యాప్తంగా బ్యాంకులకు జూన్ నెలలో గత నెలలతో పోలిస్తే తక్కువ సంఖ్యలోనే సెలవులు ఉండనున్నాయి. అయితే రాష్ట్రాల వారీగా కొన్ని ప్రాంతీయ పండుగలు, ప్రత్యేక సందర్భాల కారణంగా బ్యాంకులు మూసివేస్తున్నందున ఖాతాదారులు తమ బ్యాంకింగ్ పనులను ముందుగానే ప్లాన్ చేసుకోవడం మంచిది.భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) విడుదల చేసిన సెలవుల క్యాలెండర్ ప్రకారం దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో జూన్ నెలలో మొత్తం 11 రోజులు బ్యాంకులు పనిచేయవు. వీటిలో నాలుగు ఆదివారాలు, రెండు శనివారాలు ఉండగా, మిగిలిన రోజులు రాష్ట్రాల వారీగా అమలయ్యే ప్రత్యేక సెలవులు.మొహర్రం ప్రధాన సెలవుజూన్ 26న మొహర్రం (అషూరా) సందర్భంగా దేశంలోని చాలా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో బ్యాంకులు మూసిఉంటాయి. ఇది జూన్ నెలలో దేశవ్యాప్తంగా ప్రభావం చూపే ప్రధాన సెలవుగా భావించవచ్చు. అయితే ఆంధ్రప్రదేశ్‌లో మొహర్రం సెలవు జూన్ 25న ఉండగా, ఇతర చాలా రాష్ట్రాల్లో జూన్ 26న అమలులో ఉంటుంది.జూన్‌లో బ్యాంకు సెలవులుజూన్ 7 - ఆదివారంజూన్ 13 - రెండో శనివారంజూన్ 14 - ఆదివారంజూన్ 15 – మిజోరాంలో వైఎంఏ దినోత్సవం, ఒడిశాలో రాజ సంక్రాంతి సందర్భంగా సెలవుజూన్ 21 - ఆదివారంజూన్ 25 – ఆంధ్రప్రదేశ్‌లో మొహర్రం సెలవుజూన్ 26 – మొహర్రం/అషూరా సందర్భంగా దేశంలోని పలు రాష్ట్రాల్లో సెలవుజూన్ 27 - నాలుగో శనివారంజూన్ 28 - ఆదివారంజూన్ 29 – హిమాచల్ ప్రదేశ్‌లో సంత్ గురు కబీర్ జయంతిజూన్ 30 – మిజోరాంలో రెమ్నా నీ శాంతి దినోత్సవంఅందుబాటులో ఆన్లైన్ సేవలుబ్యాంకు శాఖలు మూసిఉన్నప్పటికీ, ఆన్లైన్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ సేవలు, ఏటీఎంలు యథావిధిగా అందుబాటులో ఉంటాయి. అయితే నగదు డిపాజిట్లు, చెక్ క్లియరెన్స్, పాస్‌బుక్ అప్డేట్లు, ఖాతా సంబంధిత సేవలు వంటి బ్రాంచ్ ఆధారిత పనులు సెలవు రోజుల్లో అందుబాటులో ఉండకపోవచ్చు.అనేక సెలవులు రాష్ట్రాల వారీగా మారుతుండటంతో ఖాతాదారులు తమ ప్రాంతీయ బ్యాంకు శాఖల సెలవుల జాబితాను ముందుగానే పరిశీలించడం మంచిది. ఏవైనా అత్యవసర బ్యాంకింగ్ పనులు ఉంటే సెలవుల తేదీలను దృష్టిలో ఉంచుకుని ముందుగానే పూర్తి చేసుకోవాలని ఆర్బీఐ సూచిస్తోంది.


