తమిళనాడులోని ఒక ఆలయ ఉత్సవానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భక్తులు ఆలయాల్లో మొక్కులు చెల్లించుకుంటారు. కానుకలు సమర్పిస్తారు ఇది కామన్. అలాగే వివిధ ఆలయాల్లో అందించే ప్రసాదాన్ని అత్యంత భక్తితో స్వీకరిస్తారు. ఇది ఇంకా సాధారణం. కానీ ఒక పూజారి భక్తులకు నాణేలను 'ప్రసాదం'గా పంపిణీ చేయడం చర్చకు దారితీసింది. దేవుడికి సమర్పించిన కానుకలనే ఇలా భక్తులకు తిరిగి పంచుతారట. దీనికి సంబంధించిన వీడియో హల్‌చల్ చేస్తోంది.
@ramdevkar07 అనే యూజర్ ఎక్స్ (ట్విటర్)లో షేర్ చేసిన ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. దీనికి, "విరాళాలు స్వీకరించడానికి బదులుగా ప్రసాదంగా డబ్బు ఇస్తున్న తమిళనాడు ఆలయం వైరల్ అవుతోంది" అనే క్యాప్షన్ తో ఈ వీడియో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో, ఒక పూజారి భక్తులకు ప్రసాదంలా నాణేలను పంచుతుండటం విశేషం. డొనేషన్లు తీసుకోవడానికి బదులు డబ్బును ప్రసాదంగా ఇస్తున్న ఆలయం అంటూ ఈ వీడియో వైరల్ అయ్యింది. అయితే,ఆ పూజారి నోట్లో సిగరెట్ (చుట్ట) ఉండటం నెటిజన్లను ఆశ్చర్యపోతున్నారు. మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు.
తమిళనాడులోని కల్పవృక్ష స్వామి ఆలయం; ఇక్కడ భక్తులకు ఆలయ కానుకల సొమ్మునే ప్రసాదంగా అందజేస్తారు. సనాతన హిందూ ధర్మానికి జై! అంటూ మరో వీడియో కూడా ఎక్స్‌లో చక్కర్లు కొడుతోంది.
Tamil Nadu temple goes viral for giving money as prasad instead of taking donations. pic.twitter.com/8Uud7gNVXv
— ʀᴀᴍ (@ramdevkar07) May 12, 2026
ఇలాంటి ఆలయం నిజంగా ఉందా
తమిళనాడులోని శ్రీ వరం తారుమ్ మాలిగైపరై కరుప్పసామి ఆలయంలో ఒక ఉత్సవం సందర్భంగా ఈ ఘటన జరిగింది. అక్కడ భక్తులకు ఇచ్చే ఈ నాణేలను స్థానికంగా "పిడి కాసు" (Pidi Kasu) అని పిలుస్తారు. ఇది ఆ ప్రాంతంలోని కొన్ని జానపద సంప్రదాయాలలో భాగంగా ఇలా నాణేలను పంపిణీ చేయడం ఆనవాయితీ. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో కరుప్పసామిని గ్రామ దేవతగా, శక్తివంతమైన రక్షకుడిగా (కావల్ దైవం) కొలుస్తారు. ఇక్కడి సంప్రదాయం ప్రకారం దేశవాళీ చుట్టలు, మద్యం వంటివి నైవేద్యంగా సమర్పించడం చాలాకాలంగా వస్తున్న ఆచారం. గ్రామ సరిహద్దుల్లో ఉండే ఈ ఆలయాల్లో జరిగే ఆచారాలు కూడా భిన్నంగా ఉంటాయి.
ఇదీ చదవండి: నో వీసా, నో సిటిజన్‌షిప్ : స్కాట్లాండ్‌లో సంచలనం ఎవరీ మణివణ్ణన్?
నెటిజన్ల స్పందన
ఈ వీడియోపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి గుళ్లో నోట్లో సిగరెట్ పెట్టుకోవడం ఏంటి? ఇది అసహ్యంగా ఉంది, ఇలాంటి వాటిని ఆపేయాలని కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదో రకమైన బిజినెస్ అని, పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు వసూలు చేసే ఎత్తుగడ అని మరికొందరు విమర్శించారు.
ये तमिलनाडु की कलूपा स्वामी मंदिर है,यहां भक्त को मंदिर के चढ़ावा पैसे भी प्रसाद रूपी दिया जाता है..जय सत्य सनातन हिंदू धर्म 🙏 ॐ#सनातन_धर्म #तमिलनाडु pic.twitter.com/disGZjbrbd
— Govind Jha (@Govind_Jha24) May 13, 2026
అయితే ఇక్కడి స్థానిక సంప్రదాయాల గురించి తెలిసిన వారు మాత్రం సానుకూలంగా స్పందించారు. ఇది కరుప్పసామి ఆలయం, అక్కడ చుట్టలు సమర్పించడం ఆచారం. ఆయన గ్రామ రక్షకుడు, ఆయన ఆచారాలు ఇలాగే ఉంటాయంటూ వివరణ ఇచ్చారు. మొత్తానికి, ఈ వీడియో దక్షిణ భారత జానపద సంప్రదాయాలు ఆధునిక సామాజిక విలువల మధ్య చర్చను రేకెత్తించింది.
ఇదీ చదవండి : పెళ్లైన నాలుగు రోజులకే దారుణం : బంగారు గొలుసు కోసం


