breaking news
tamil nadu
-
1200 కోట్లతో సచివాలయం, అసెంబ్లీ.. సీఎం విజయ్ సముద్రం చూసేందుకేనా!?
సాక్షి,చెన్నై: వందేళ్లు గుర్తుండిపోయేలా రూ.1,200 కోట్ల అంచనా వ్యయంతో, 20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త సచివాలయ-శాసనసభ సముదాయాన్ని నిర్మించాలని సీఎం విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే చెన్నైలోని మెరీనా బీచ్ సమీపంలోని పట్టినాపక్కంలో తలపెట్టిన ఈ ప్రాజెక్ట్‌పై రాజకీయ దుమారం రేగింది. ఈ ప్రతిపాదనను డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.తీర ప్రాంతంలో నివసించే మత్స్యకారుల ఇళ్లను, వారి జీవనోపాధిని ఈ ప్రతిపాదిత ప్రాజెక్ట్ దెబ్బతీస్తుందని స్టాలిన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్ట్‌ను వ్యతిరేకిస్తున్న మత్స్యకార సంఘాలకు డీఎంకే పూర్తి మద్దతు ఇస్తుందని, ప్రభుత్వం తన ఉత్తర్వులను వెనక్కి తీసుకోకపోతే తాము కూడా ప్రత్యక్ష నిరసనల్లో పాల్గొంటామని స్పష్టం చేశారు.జ్యోతిష్యుల సలహా మేరకేనా?ఇప్పటికే రద్దీగా ఉండే ప్రాంతంలో కొత్త సచివాలయం అవసరం ఏముందని స్టాలిన్ ప్రభుత్వాన్ని నిలదీశారు. గతంలో డీఎంకే ప్రభుత్వం సచివాలయాన్ని నిర్మించిన ఒమాందూరార్ ఎస్టేట్ వంటి ప్రత్యామ్నాయ స్థలాలు చాలానే ఉన్నాయని గుర్తుచేశారు. అయితే, ముఖ్యమంత్రి కార్యాలయం సముద్రం వైపు ఉండాలని జ్యోతిష్యులు సలహా ఇవ్వడం వల్లే ప్రభుత్వం పట్టినాపక్కం ప్రాంతాన్ని ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయని ఆరోపించారు. ఇలాంటి సముదాయాలు సీఎం పనిచేయడానికి ఉద్దేశించినవే కానీ, సముద్రం వైపు చూస్తూ కూర్చోవడానికి కాదు అంటూ ఆయన ఎద్దేవా చేశారు.ట్రాఫిక్,పర్యావరణ సమస్యలు ప్రతిపాదిత స్థలం చుట్టూ అనేక పాఠశాలలు ఉన్నాయని, ఇప్పటికే అక్కడ తీవ్రమైన ట్రాఫిక్ రద్దీ ఉందని స్టాలిన్ పేర్కొన్నారు. అక్కడ భారీ ప్రభుత్వ సముదాయం వస్తే విద్యార్థులకు, స్థానికులకు నరకం చూపుతుందన్నారు. మరోవైపు ప్రభుత్వానికి బయటి నుంచి మద్దతు ఇస్తున్న సీపీఐ(ఎం) కూడా తీర ప్రాంత పర్యావరణ ముప్పును ప్రస్తావిస్తూ ఈ ప్రాజెక్ట్‌ను వ్యతిరేకించింది. మిత్రపక్షాల మాటను కూడా లెక్కచేయకుండా టీవీకే ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటోందని స్టాలిన్ మండిపడ్డారు.ప్రభుత్వం క్లారిటీ ఈ విమర్శలపై ప్రభుత్వం తరఫున పీడబ్ల్యూడీ మంత్రి ఆధవ్ అర్జున స్పందిస్తూ.. ప్రస్తుతం సచివాలయ సముదాయానికి సంబంధించి సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక రూపొందించాలని మాత్రమే ఆదేశించామని, దీనిపై ఇప్పటివరకు ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు.ఇదీ చదవండి : సీఎం విజయ్ ‘ప్రధాని’ కలలు?.. చురకలంటించిన కాంగ్రెస్! -
విజయ్ ఫ్యాన్స్ ట్రోలింగ్.. అజిత్ సీరియస్?!
తమిళ సినీ పరిశ్రమలో విజయ్–అజిత్ ఫ్యాన్ వార్‌కు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అయితే ఇటీవల లండన్‌లో ఈ ఇద్దరు స్టార్ హీరోలు కలిసిన దృశ్యాలు అభిమానుల్లో కొత్త ఉత్సాహం నింపాయి. ఓ కారు రేసు సందర్భంగా విజయ్, అజిత్ ఆప్యాయంగా పలకరించుకోవడంతో.. ఇక ఫ్యాన్ వార్‌కు తెరపడుతుందేమోనని చాలామంది భావించారు. కానీ పట్టుమని పది రోజులు కూడా గడవకముందే మరో ఆసక్తికర పరిణామం తెరపైకి వచ్చింది.అజిత్ అభిమానులు ఏకంగా రాజకీయ పార్టీని ప్రారంభించారు. కల్లకురిచ్చి జిల్లా ఉలుందూరుపేట సమీపంలోని ఎలవనాసూర్కోటైలో సెప్టెంబర్ 20న ‘తమిళగ మక్కల్ కళగం’ పేరుతో పార్టీని ప్రకటించి జెండాను ఆవిష్కరించారు. తమిళనాడు వ్యాప్తంగా అజిత్ అభిమానులను ఒకే వేదికపైకి తీసుకురావడమే తమ ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. అంతేకాదు.. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవిని ఖాళీగా ఉంచారు. అజిత్ రాజకీయాల్లోకి వస్తే ఆ బాధ్యతను ఆయనకే అప్పగించాలన్న ఉద్దేశంతోనే ఈ పదవిని ఖాళీగా ఉంచినట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఇతర పదవులకు మాత్రం తమ ప్రతినిధులను నియమించారు. అయితే ఈ పార్టీకి అజిత్‌కు నేరుగా సంబంధం లేదని, ఆయన స్వయంగా పార్టీని ప్రారంభించలేదని నిర్వాహకులే స్పష్టం చేశారు. కానీ, ఆయన కచ్చితంగా రాజకీయాల్లోకి రావాల్సిందేనంటూ ఓ పిలుపు మాత్రం ఇచ్చారు."தமிழக மக்கள் கழகம்" என்ற புதிய அரசியல் கட்சியை துவங்கிய அஜித் ரசிகர்கள்... ”அஜித் சாரும் வரவேண்டும்...” என அழைப்பு விடுத்து ரசிகர்கள் பேட்டி#AjithKumar | #Fans | #Ulundurpet | #TNPolitics | #PuthiyathalaimuraiTV pic.twitter.com/z4gyZCQcVh— PttvOnlinenews (@PttvNewsX) September 20, 2026విజయ్ ఫ్యాన్స్ ఆట మొదలు..అజిత్ అభిమానులు పార్టీ విషయంలో అంత స్పష్టమైన ప్రకటన చేసినా.. విజయ్ అభిమానులు ఊరుకోవడం లేదు. ‘పట్టుమని నలుగురు కూడా లేరు కదరా!’ అంటూ ఆటాడుకుంటున్నారు. పైగా కొత్త పార్టీ జెండా కూడా విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం(టీవీకే) జెండాను పోలి ఉందంటూ మీమ్స్, ట్రోలింగ్‌తో స్పందిస్తున్నారు. ‘టీవీకేను కాపీ చేశారంటూ’ కామెంట్లు పెడుతున్నారు. అయితే ఈ పరిణామం అజిత్ అభిమానులకు కోపం తెప్పిస్తోంది.అప్పుడే వచ్చి ఉండేవాడు కదా!తమిళనాట అజిత్ పొలిటికల్ ఎంట్రీ గురించి డిస్కషన్ ఏనాడో క్లోజ్ అయ్యింది. సినీ కెరీర్లో ఉన్నప్పుడు అజిత్ కుమార్‌కు, తమిళనాడు మాజీ సీఎం జయలలితతో వ్యక్తిగతంగా మంచి అనుబంధం ఉండేది. జయలలిత తనను సొంత కొడుకులా అభిమానించేవారని అజిత్ గతంలో స్వయంగా చెప్పేవారు. అజిత్–షాలిని వివాహానికి జయలలిత హాజరై వారిని ఆశీర్వదించారు. ఆ తర్వాత కూడా అజిత్, షాలిని ఆమెను పోయెస్ గార్డెన్ నివాసానికి వెళ్లి తరచూ కలిసేవారు. ఒకానొకటైంలో అజిత్ అభిమానులు ఆయన్ని అమ్మకు వారసుడిగా ప్రచారం చేసుకున్నారు కూడా. అది అన్నాడీఎంకే నుంచి అభ్యంతరాలకు దారి తీసింది.అయితే.. అజిత్ మాత్రం రాజకీయాలకు దూరంగానే ఉన్నారు. జయలలిత మరణించిన సమయంలో షూటింగ్లో ఉన్న ఆయన.. ఆ తర్వాత కుటుంబంతో కలిసి ఆమె సమాధి వద్ద నివాళులర్పించారు. అజిత్‌కు రాజకీయాలపై ఆసక్తి లేదన్న విషయం అభిమానులకు కూడా తెలుసు. అయినా ఆయన అభిమానులు మాత్రం ప్రత్యేకంగా పార్టీ పెట్టి.. ఆయన కోసం కీలక పదవిని ఖాళీగా ఉంచడం చర్చనీయాంశమైంది.డ్యామేజ్ కంట్రోల్లో అజిత్?!అజిత్ ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారు. తాజా రేసింగ్‌లో ఆయనకు ఐదో స్థానం వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో అభిమానుల నిర్వాకం ఆయనకు కాస్త ఆలస్యంగా తెలిసినట్లు తెలుస్తోంది. పైగా విజయ్ ఫ్యాన్స్ ట్రోలింగ్ చేస్తుండడంపైనా ఆయన తన సన్నిహితుల వద్ద అసంతృప్తి వ్యక్తం చేసినట్లు ప్రచారం జరుగుతోంది.అజిత్‌కు సోషల్ మీడియా అకౌంట్లు లేవు. ఏది ఉన్నా ఆయన మేనేజర్ సురేష్ చంద్ర అఫీషియల్‌గా ప్రకటిస్తుంటారు. దీంతో ఇవాళో, రేపో ఆయన నుంచి అధికారిక ప్రకటన వెలువడొచ్చనే ప్రచారం తమిళనాట కొనసాగుతోంది.విజయ్ రాజకీయాల్లోకి వచ్చాక..తమిళనాడులో సినీ తారల రాజకీయ ప్రవేశం కొత్త విషయం కాదు. అయితే విజయ్ రాజకీయాల్లోకి వచ్చి తమిళగ వెట్రి కళగం ఏర్పాటు చేసి ఏకంగా సీఎం కావడం.. అక్కడి సీని వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. విజయ్ను ఫాలో అవుతూ మరికొందరు అదే బాట పట్టడం డీఎంకే-అన్నాడీఎంకేలకు అసహనం తెప్పిస్తోంది. సినిమావాళ్లు తమిళ రాజకీయాలను నాశనం చేస్తున్నారంటూ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి ఈ రెండు పార్టీలు. ఈ తరుణంలో ఇప్పుడు అజిత్ అభిమానుల తాజా నిర్ణయంపై ఆసక్తి మరింత పెరిగింది. పార్టీ ప్రకటనతో ఫ్యాన్ వార్ మరో లెవల్‌కు వెళ్తుందా? లేక తన అభిమానుల దూకుడుకు అజిత్ స్వయంగా బ్రేకులు వేస్తారా? అభిమానుల తీరుపై గతంలోనే తన వైఖరిని స్పష్టం చేసిన అజిత్.. ఈసారి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నదే ఇప్పుడు అసలు ట్విస్ట్!.ఇదీ చదవండి: జెన్జీల కోసం ఏం చేయబోతున్నారంటే.. -
క్లాస్ పీకిన సుప్రీంకోర్టు.. వెనక్కి తగ్గని విజయ్ సర్కార్
హిందీ భాష విషయంలో తమ వైఖరిని మార్చుకోవాలంటూ సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలోనూ తమిళనాడు ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రంలో జవహర్ నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు భూమి కేటాయించబోమని పాఠశాల విద్యాశాఖ మంత్రి ఎ. రాజ్‌మోహన్ స్పష్టం చేశారు. అలాగే తమిళనాడు రెండు భాషల విధానానికే కట్టుబడి ఉంటుందని తెలిపారు.నవోదయ పాఠశాలల్లో మూడు భాషల విధానం అమలవుతుండటం, అందులో హిందీ ఉండటంపై తమిళనాడు విజయ్ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలో ప్రతి జిల్లాలో కచ్చితంగా భూములు ఇవ్వాలన్న సుప్రీం కోర్టు గత ఆదేశాలను సమీక్షించాలంటూ పిటిషన్ వేసింది. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం.. మైండ్ సెట్ మార్చుకోవాలంటూ తమిళనాడు ప్రభుత్వానికి చురకలు అంటించింది. అయితే హిందీకి తాము వ్యతిరేకం కాదని, తమిళానికి ప్రాధాన్యం ఇవ్వాలన్నదే తమ విధానమని మంత్రి రాజ్‌మోహన్ అంటున్నారు. సుప్రీంకోర్టు వ్యాఖ్యలు తుది తీర్పు కాదని, కేసు ఇంకా విచారణలోనే ఉందని పేర్కొన్నారు. మరోవైపు ఈ వ్యవహారంపై న్యాయనిపుణులతో సీఎం విజయ్ చర్చిస్తున్నట్లు సమాచారం.నవోదయ పాఠశాలల కోసం ప్రతి జిల్లాలో భూమిని గుర్తించాలంటూ గతంలో ఇచ్చిన ఆదేశాన్ని సుప్రీంకోర్టు సెప్టెంబర్ 17న వెనక్కి తీసుకోలేదు. మరో మూడు నెలల గడువు ఇచ్చింది. కేంద్రం, రాష్ట్రం చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించింది. విచారణ సందర్భంగా జస్టిస్ బీవీ నాగరత్న నేతృత్వంలోని ధర్మాసనం.. తమిళనాడు హిందీపై తన ‘మైండ్‌సెట్’ మార్చుకోవాలని, రాష్ట్రంలో హిందీ బోధించకూడదనే వైఖరి ఉండకూడదని వ్యాఖ్యానించింది.ఈ పరిణామాల మధ్య తమిళనాడు ప్రతిపక్ష నేత, డీఎంకే నాయకుడు ఉదయనిధి స్టాలిన్ కూడా ప్రభుత్వ వైఖరికి మద్దతు తెలిపారు. రాష్ట్రానికి నవోదయ పాఠశాలలు అవసరం లేదని, ఇప్పటికే మోడల్, రెసిడెన్షియల్ పాఠశాలలు ఉన్నాయని పేర్కొన్నారు. అవసరమైతే ప్రత్యేక అసెంబ్లీ సమావేశం నిర్వహించి నవోదయ పాఠశాలలకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని సూచించారు. అదే సమయంలో హిందీకి తాము వ్యతిరేకం కాదని, హిందీని బలవంతంగా అమలు చేయడాన్నే వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు.దీంతో తమిళనాడులో అధికార టీవీకే ప్రభుత్వం, ప్రధాన ప్రతిపక్షం డీఎంకే.. రాజకీయంగా పరస్పరం విభేదిస్తున్నప్పటికీ భాషా విధానం విషయంలో ఒకే వైఖరితో ముందుకు సాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సుప్రీంకోర్టు సూచనలు, రాష్ట్ర ప్రభుత్వ పట్టుదల మధ్య ఈ వివాదం తదుపరి విచారణలో ఎలాంటి మలుపు తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.ఇదీ చదవండి: బెంగాల్లో బీజేపీ సర్కార్.. మరీ ఇంత ఘోరమా? -
హిందీ భాషకు మేం వ్యతిరేకం కాదు.. సుప్రీంకోర్టు వ్యాఖ్యల వేళ ఉదయనిధి కౌంటర్
చెన్నై: హిందీని బలవంతంగా రుద్దడాన్ని వ్యతిరేకించడం అంటే ఆ భాషకు వ్యతిరేకం కావడం కాదని తమిళనాడు ప్రతిపక్ష నేత, డీఎంకే నాయకుడు ఉదయనిధి స్టాలిన్ స్పష్టం చేశారు. తాము దేశం నుంచి విడిగా వ్యవహరించడం లేదని, రాష్ట్ర భాషా ప్రత్యేకతను కాపాడుకుంటున్నామని చెప్పారు. హిందీ నేర్చుకోవడానికీ దేశభక్తికీ ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. రాష్ట్రాలు తమకు అనుగుణమైన భాషా విధానాలను అనుసరించేందుకు అవకాశం కల్పించడం దేశ సమైక్యతను మరింత బలోపేతం చేస్తుందని అన్నారు.నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు భూమిని గుర్తించే అంశంపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు తమిళనాడు తన వైఖరిని పునఃపరిశీలించాలని సూచించిన నేపథ్యంలో ఉదయనిధి ఈ వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు గడ్డపై హిందీ నేర్పించకూడదనే ధోరణి ఉండకూడదు అని జస్టిస్ బి.వి. నాగరత్న వ్యాఖ్యానించారు. కేంద్రం, రాష్ట్రం చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని ధర్మాసనం సూచించింది. నవోదయ విద్యాలయాలు విద్యార్థులకు మరో విద్యా అవకాశాన్ని కల్పిస్తాయని పేర్కొంటూ.. పాఠశాలల ఏర్పాటుకు భూమిని గుర్తించేందుకు తమిళనాడుకు మరో మూడు నెలల గడువు ఇచ్చింది. తదుపరి విచారణను డిసెంబర్ 14కు వాయిదా వేసింది.ఈ నేపథ్యంలో ఉదయనిధి రెండు పేజీల ప్రకటన విడుదల చేశారు. తమిళనాడు హిందీకి వ్యతిరేకం కాదని, హిందీని బలవంతంగా రుద్దడాన్నే వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. తమిళనాడు రెండు భాషల విధానంతోనే విద్య, ఉపాధి, శాస్త్ర సాంకేతిక రంగాల్లో పురోగతి సాధిస్తోందని పేర్కొన్నారు. హిందీ తెలియకపోయినా తమిళులు వివిధ రంగాల్లో ఉన్నత స్థాయికి ఎదిగారని, ఇస్రోలోనూ పలువురు కీలక పదవుల్లో ఉన్నారని ఉదాహరించారు. తమిళనాడులో ఇప్పటికే పేద, వెనుకబడిన విద్యార్థులకు విద్య అందించే పాఠశాలలు ఉన్నందున నవోదయ విద్యాలయాల అవసరం లేదని ఉదయనిధి తెలిపారు. మూడు భాషల విధానం అమలయ్యే నవోదయ పాఠశాలలను రాష్ట్రంలో ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకించాలని కోరారు. ఈ అంశంపై ప్రత్యేక అసెంబ్లీ సమావేశం నిర్వహించి వ్యతిరేక తీర్మానం చేయాలని పిలుపునిచ్చారు.ఇదే సమయంలో సమగ్ర శిక్షా పథకం కింద తమిళనాడుకు రావాల్సిన రూ.3,548 కోట్లను మూడు భాషల విధానాన్ని అంగీకరించలేదనే కారణంతో కేంద్రం నిలిపివేసిందని ఉదయనిధి ఆరోపించారు. రాష్ట్రం రెండు భాషల విధానాన్ని కొనసాగిస్తున్నందుకు విద్యా నిధులను నిలిపివేయడం సరికాదని అన్నారు.ఇదీ చదవండి: తమిళనాట ట్విస్ట్.. విజయ్‌కు కొత్త టెన్షన్! -
టీవీకేకు తలపోటు.. తమిళనాట మరో ట్విస్ట్!
తమిళనాడు రాజకీయాల్లో టీవీకే-కాంగ్రెస్ పొత్తు మరో కొత్త మలుపు తీసుకుంది. విజయ్, రాహుల్ గాంధీ మధ్య ప్రధాని అభ్యర్థిత్వంపై మొదలైన చర్చ ఇప్పుడు కాంగ్రెస్ నేతల మధ్యే మాటల యుద్ధానికి దారితీసింది. రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా పొత్తు భాగస్వాములు అంగీకరించాల్సిందేనని మాజీ టీఎన్‌సీసీ అధ్యక్షుడు సెల్వపెరుంతగై స్పష్టం చేయగా.. అసలు రాహుల్‌కు వ్యతిరేకంగా టీవీకే ఎలాంటి అధికారిక నిర్ణయం తీసుకోలేదని కాంగ్రెస్ నేత ప్రవీణ్ చక్రవర్తి కౌంటర్ ఇచ్చారు. దీంతో పొత్తులో అంతా సవ్యంగానే ఉందా? లేక ప్రధాని అభ్యర్థి అంశం అసలు పంచాయితీగా మారిందా? అన్న చర్చ మొదలైంది.తమిళనాడులో టీవీకే-కాంగ్రెస్ పొత్తు అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. 2029 లోక్‌సభ ఎన్నికల ప్రధాని అభ్యర్థిత్వంపై రెండు పార్టీల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న వేళ.. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకునే పార్టీలు రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా అంగీకరించాలని సెల్వపెరుంతగై వ్యాఖ్యానించారు. రాహుల్ ప్రధాని అభ్యర్థి అయితే.. పొత్తు భాగస్వాములు దాన్ని అంగీకరించాలని, అలా లేనప్పుడు అలాంటి పొత్తు అవసరం ఏమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్ తమ నేతను ప్రధాని అభ్యర్థిగా బహిరంగంగా, స్పష్టంగా అంగీకరించే పార్టీలతోనే పొత్తు పెట్టుకోవడం సముచితమని పేర్కొన్నారు.‘పొత్తులో ఎలాంటి సమస్య లేదు’సెల్వపెరుంతగై వ్యాఖ్యలపై ప్రవీణ్ చక్రవర్తి స్పందిస్తూ.. పొత్తులో ఎలాంటి గందరగోళం లేదని అన్నారు. టీవీకే అధికారికంగా రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా ఎలాంటి ప్రకటన చేయలేదని చెప్పారు. ఇటీవల జరిగిన కూటమి సమావేశంలో అన్ని భాగస్వామ్య పార్టీలు కలిసి చర్చించాయని, ముఖ్యమంత్రి విజయ్ కూడా సమావేశంలో ఉన్నారని తెలిపారు. అందరూ కలిసి మాట్లాడుకున్నారని, పొత్తు బలంగానే ఉందని పేర్కొన్నారు.‘నవ్వుతూ మాట్లాడితే ఒప్పందమా?’ప్రవీణ్ వ్యాఖ్యలకు సెల్వపెరుంతగై సోషల్ మీడియా వేదికగా మళ్లీ స్పందించారు. నాయకులు కలిసి నవ్వుతూ మాట్లాడుకోవడాన్ని ప్రధాని అభ్యర్థిత్వంపై అంగీకారంగా ఎలా పరిగణిస్తారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి విజయ్ లేదా టీవీకేలోని కీలక నేతల్లో ఎవరైనా రాహుల్ గాంధీయే ప్రధాని అభ్యర్థి అని స్పష్టంగా చెప్పారా? అని నిలదీశారు. అలా చెప్పి హామీ ఇచ్చి ఉంటే తనకు తెలియజేయాలని కోరారు.ఇదిలా ఉండగా.. ఇటీవల టీవీకేకు చెందిన కొందరు నేతలు 2029 లోక్‌సభ ఎన్నికల్లో విజయ్ను ప్రధాని అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేస్తూ వ్యాఖ్యలు చేయడంతో ఈ అంశం తెరపైకి వచ్చింది. దీనికి భిన్నంగా కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీని తమ ప్రధాని అభ్యర్థిగా ప్రస్తావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పొత్తులోని రెండు వర్గాల మధ్య అభిప్రాయ భేదాలు బహిరంగమయ్యాయి. ప్రస్తుతం టీవీకే-కాంగ్రెస్ పొత్తులో అసలు పరీక్ష సీట్ల సర్దుబాటు కాదు.. ప్రధాని అభ్యర్థిత్వంపై ఏకాభిప్రాయం అనే చర్చ మొదలైంది.అసలు చిక్కు టీవీకేకే..ఈ వ్యవహారంలో టీవీకే ముందున్నది కీలకమైన ప్రశ్న. విజయ్ను ప్రధాని అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేస్తున్న సొంత నేతల వ్యాఖ్యలకు బ్రేక్ వేయాలా? లేక రాహుల్ గాంధీ పేరుపై కాంగ్రెస్ కోరుతున్న స్పష్టత ఇవ్వాలా? అన్నది ఆ పార్టీ తేల్చుకోవాల్సి ఉంది. విజయ్ పేరుపై పట్టుబడితే కాంగ్రెస్‌తో పొత్తులో విభేదాలు మరింత బహిర్గతమయ్యే అవకాశం ఉంది. రాహుల్ అభ్యర్థిత్వానికి అంగీకారం తెలిపితే విజయ్ను ప్రధాని ముఖంగా ముందుకు తెస్తున్న నేతలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఒకవైపు పొత్తు.. మరోవైపు ప్రధాని పీఠంపై ఆశలు.. ఈ రెండింటి మధ్య టీవీకే ఎలాంటి వైఖరి తీసుకుంటుందన్నదే ఇప్పుడు అసలు ఉత్కంఠ. విజయ్ మౌనం వీడి స్పష్టత ఇస్తారా? లేక ఈ పంచాయితీని కూటమి నేతలకే వదిలేస్తారా? అన్నది చూడాలి.ఇదీ చదవండి: సీఎం రెండో పెళ్లిపై బిగ్ ట్విస్ట్.. -
‘మీ మైండ్ సెట్ మార్చుకోండి’.. విజయ్ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: తమిళనాడలో జవహర్ నవోదయ విద్యాలయాల ఏర్పాటుపై జరుగుతున్న న్యాయపోరాటంలో సుప్రీంకోర్టు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. తమిళనాడ గడ్డపై హిందీ బోధించకూడదనే ధోరణి కుదరదని, రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.జవహర్ నవోదయ పాఠశాలల ఏర్పాటుకు ప్రతి జిల్లాలో భూమిని కేటాయించాలంటూ డిసెంబర్ 15, 2025న ఇచ్చిన ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని కోరుతూ తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఆగర్టిన్ జార్జ్ మాసిహ్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.ఈ సందర్భంగా ధర్మాసనం మాట్లాడుతూ.. కేంద్ర నిధులతో నడిచే నవోదయ పాఠశాలల ఏర్పాటును రాష్ట్రంలోని విద్యా వ్యవస్థకు ముప్పుగా భావించవద్దని సూచించింది. మీరు మీ ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలి. తమిళనాడ నేలపై హిందీ నేర్పించబడదు అనడం సరికాదు" అని జస్టిస్ నాగరత్న వ్యాఖ్యానించారు. అలాగే కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర చర్చల ద్వారా ఈ భేదాభిప్రాయాలను పరిష్కరించుకోవాలని కోర్టు హితవు పలికింది.నవోదయ పాఠశాలల ఏర్పాటు కోసం ప్రతి జిల్లాలో భూమిని గుర్తించాలన్న డిసెంబర్ 2025 నాటి ఆదేశాలను వెనక్కి తీసుకునేందుకు కోర్టు నిరాకరించింది. అయితే, ఈ ఆదేశాలను అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి మరో మూడు నెలల సమయం మంజూరు చేసింది.తమిళనాడులో అమల్లో ఉన్న ద్విభాషా విధానానికి, నవోదయ పాఠశాలలు పాటించే త్రిభాషా విధానానికి (హిందీతో కలిపి) మధ్య ఉన్న వివాదంపై విచారణ జరిగింది.రాష్ట్ర ప్రభుత్వ తరఫున సీనియర్ న్యాయవాది జైదీప్ గుప్తా వాదనలు వినిపిస్తూ.. తమ రాష్ట్ర విద్యా విధానానికి, రాజ్యాంగ అధికారాలకు విరుద్ధంగా కేంద్రం హిందీని రుద్దాలని చూస్తోందని తెలిపారు. తమిళం రెండవ భాషగా ఉండాలనే అంశాన్ని పరిశీలించవచ్చని ధర్మాసనం పేర్కొంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శులు ఈ అంశంపై చర్చలు జరపాలని సూచించిన కోర్టు, ఈ కేసుకు సంబంధించిన తదుపరి విచారణను డిసెంబర్ 14వ తేదీకి వాయిదా వేసింది. -
దర్గా సాక్షిగా హిందూ జంట పెళ్లి.. ముస్లిం పెద్దల అక్షింతలు
మతాల మధ్య చిచ్చు పెట్టి తమ ప్రయోజనాలు చూసుకునే ప్రయత్నాలు ఎక్కడో జరుగుతుండొచ్చు. కానీ సామాన్యులు మాత్రం ప్రేమ, ఆప్యాయత, పరస్పర గౌరవానికే పెద్దపీట వేస్తున్నారు. తమిళనాడులోని నాగూర్ నుంచి ఇప్పుడు అలాంటి మానవీయతను చాటే ఓ అందమైన దృశ్యం వెలుగులోకి వచ్చింది. నాగపట్నం జిల్లాలోని నాగూర్ ఆండవర్ దర్గాకు ఆదివారం ఉదయం వధూవరుల కుటుంబ సభ్యులు, బంధువులు చేరుకున్నారు. అనంతరం దర్గా ప్రాంగణంలోని సన్నిధి వద్ద హిందూ సంప్రదాయం ప్రకారం వివాహ వేడుక నిర్వహించారు. వరుడు వధువు మెడలో తాళి కట్టగా.. అక్కడే ఉన్న దర్గా నిర్వాహకులు, ముస్లిం పెద్దలు, ఇరు కుటుంబాల సభ్యులు వధూవరులపై అక్షతలు చల్లి ఆశీర్వదించారు.ముస్లిం పెద్దల ఆశీర్వాదం..నాగూర్ దర్గా చైర్మన్, వారసత్వ ట్రస్టీ మొహమ్మద్ ఖలీఫా సాహిబ్ కూడా ఈ వేడుకలో పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించారు. నాగపట్నం జిల్లా చాలా కాలంగా మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోందని ఆయన పేర్కొన్నారు. నాగూర్ దర్గాలో వివిధ మతాలకు చెందిన ప్రజలు రావడం, తమ ప్రత్యేక సందర్భాలను జరుపుకోవడం కొత్తేమీ కాదన్నారు.VIDEO | Nagapattinam: Hindu wedding held at Nagore Dargah, with people from both Hindu and Muslim communities attending the ceremony. pic.twitter.com/D2f4vQ83PH— Press Trust of India (@PTI_News) September 15, 2026వధూవరుల వివాహానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతున్నాయి. దర్గా నిర్వాహకులు హిందూ జంటను ఆశీర్వదిస్తున్న దృశ్యాలు నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. నాగూర్ దర్గా భిన్న మతాల ప్రజలు కలిసి మెలిసి ఉండే సంప్రదాయానికి మరోసారి వేదికగా నిలిచిందంటూ పలువురు స్పందిస్తున్నారు. ఇలాంటి ఘటనలను భవిష్యత్ తరాలకు కూడా చూపించాల్సిన అవసరం ఉందని ఖలీఫా సాహిబ్ అభిప్రాయపడ్డారు. ఓవైపు పలువురి అభ్యంతరాలు.. మరోవైపు మతం ఏదైనా ఒకరి సంతోషంలో మరొకరు భాగస్వాములు కావచ్చనే సందేశాన్ని ఈ వివాహ వేడుక చాటిందనే కామెంట్లు నెట్టింట కనిపిస్తున్నాయి. ఇదీ చదవండి: నాగ్‌పూర్ హిట్ అండ్ రన్ కేసులో బిగ్ ట్విస్ట్ -
భద్రతా కారణాలతో విజయ్ లండన్ కార్యక్రమం రద్దు
తమిళనాడు ముఖ్యమంత్రి, సినీ నటుడు విజయ్ కోసం లండన్‌లో భారీగా తరలివచ్చిన అభిమానులకు నిరాశ ఎదురైంది. లండన్‌లోని ప్రముఖ ‘ది షార్డ్’ భవనం వద్ద విజయ్ పాల్గొనాల్సిన కార్యక్రమాన్ని భద్రతా కారణాలతో అధికారులు రద్దు చేశారు. వందలాది మంది అభిమానులు గంటల తరబడి వేచి చూసిన అనంతరం ఈ ప్రకటన వెలువడింది.విజయ్ ప్రస్తుతం తమిళనాడుకు పెట్టుబడులు ఆకర్షించే లక్ష్యంతో అధికారిక పర్యటనలో భాగంగా యూకేలో ఉన్నారు. ఆయనను చూసేందుకు అభిమానులు మంగళవారం ‘ది షార్డ్’ వెలుపల పెద్ద సంఖ్యలో గుమిగూడారు. పలువురు అభిమానులు చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చి గంటల తరబడి అక్కడే నిరీక్షించారు. అయితే భారీగా జనసమీకరణ జరగడంతో ప్రజల భద్రతకు ముప్పు ఏర్పడే అవకాశం ఉందని లండన్ మెట్రోపాలిటన్ పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు.‘అనుమతి రాలేదు.. కార్యక్రమం రద్దు’భద్రతా కారణాలతో కార్యక్రమానికి అవసరమైన అనుమతి లభించలేదని విజయ్ బృందం ప్రకటించింది. లౌడ్‌స్పీకర్ ద్వారా అభిమానులకు సమాచారం అందిస్తూ.. ప్రజల భద్రత దృష్ట్యా కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు తెలిపింది. దీంతో విజయ్ను ప్రత్యక్షంగా చూసేందుకు వచ్చిన అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. కొందరు అభిమానులు గంటల తరబడి ఎదురు చూసినట్లు పీటీఐ తెలిపింది.VIDEO | UK: Vijay fan greeting event in London called off due to 'health and safety' reasons after large number of people gather to see Tamil Nadu CM.Announcement was made by the authorities outside CM Vijay's hotel at the Shard in London on Tuesday.(Full video available on… pic.twitter.com/l4GDVUL6Fk— Press Trust of India (@PTI_News) September 15, 2026తలా-దళపతి.. విమర్శలకు టీవీకే కౌంటర్ఇదిలా ఉండగా.. విజయ్ లండన్ పర్యటనపై డీఎంకే విమర్శలు గుప్పించింది. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి లండన్ వెళ్లినట్లు చెబుతున్న విజయ్.. తన స్నేహితుడు, నటుడు అజిత్ కుమార్ పాల్గొన్న కార్ రేసును వీక్షించడంపై డీఎంకే నేతలు ప్రశ్నలు లేవనెత్తారు. పెట్టుబడుల పర్యటన పేరుతో వెళ్లి రేసు కార్యక్రమానికి హాజరయ్యారని విమర్శించారు. దీనిపై టీవీకే నేతలు స్పందిస్తూ.. విజయ్ అధికారిక పర్యటనలో ఉన్నప్పటికీ అజిత్‌ను కలవడంలో తప్పేముందని ప్రశ్నించారు. అంతేకాకుండా అంతర్జాతీయ రేసింగ్‌లో అజిత్‌కు ఉన్న గుర్తింపును తమిళనాడు బ్రాండ్ ప్రమోషన్‌కు ఉపయోగించుకోవచ్చని పేర్కొన్నారు.పెట్టుబడుల కోసం విజయ్ యూకే పర్యటనఇదిలా ఉండగా విజయ్ యూకే పర్యటన ప్రధానంగా తమిళనాడుకు భారీ పెట్టుబడులను తీసుకురావడంపైనే సాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి బృందంతో కలిసి ఆయన పలువురు పారిశ్రామికవేత్తలు, సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ పర్యటనలో సుమారు రూ.12,300 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన పలు అవగాహన ఒప్పందాలు (MoUs) కుదిరినట్లు తమిళనాడు ప్రభుత్వం తెలిపింది. వీటి ద్వారా రాష్ట్రంలో 9,400కు పైగా హై-వాల్యూ ఉద్యోగాలు ఏర్పడే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. తమిళనాడును ఆసియాలో అధునాతన తయారీ, సాంకేతిక రంగాలకు కీలక కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ పెట్టుబడుల కార్యక్రమాన్ని చేపట్టినట్లు ప్రభుత్వం వెల్లడించింది. విజయ్ తన యూకే పర్యటనను ముగించుకుని బుధవారం భారత్‌కు తిరిగి రానున్నట్లు సమాచారం.ఇదీ చదవండి: విజయ్‌పై అనుచిత కామెంట్ల ఎపిసోడ్లో బిగ్ ట్విస్ట్ -
రూ. 12,300 కోట్ల సీఎం విజయ్ డీల్ : 9 వేల ఉద్యోగాలు
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ యునైటెడ్ కింగ్డమ్ (యూకే) పర్యటనలో భాగంగా నాలుగు కీలక పెట్టుబడి ఒప్పందాలపై సంతకం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ సమాచారం ప్రకారం, ఈ ఒప్పందాల విలువ దాదాపు రూ. 12,300 కోట్లు కాగా, దీనివల్ల సుమారు 9,000 ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని అంచనా. టీవీకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లోనే రూ. 1 లక్ష కోట్లకు పైగా విలువైన పెట్టుబడి అవగాహన ఒప్పందాలపై సంతకాలు జరిగాయని ప్రభుత్వం వెల్లడించింది. ఇందులో భాగంగా చెన్నైలో 'గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్' (GCC) ఏర్పాటు కోసం ఎర్నస్ట్ & యంగ్ (Ernst & Young) ద్వారా ఒక బ్రిటిష్ కంపెనీతో రూ. 1,000 కోట్ల ఒప్పందంపై కూడా విజయ్ సంతకం చేశారు. వీటిలో అతిపెద్ద ఒప్పందం 'సంవర్ధన మదర్సన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్'తో జరిగింది. ఈ ఒప్పందంగా రూ. 11,000 కోట్ల పెట్టుబడితో కుదిరింది. దీని ద్వారా డిజైన్, ఇంజనీరింగ్, తయారీ, అసెంబ్లీ రంగాల్లో దాదాపు 7వేల ఉద్యోగాలు వస్తాయి.గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (చెన్నై): బ్రిటన్ కంపెనీతో ఎర్నెస్ట్ అండ్ యంగ్ (Ernst & Young) ద్వారా రూ. 1,000 కోట్ల ఒప్పందం కుదిరింది. దీని ద్వారా 2,000 ఉన్నత స్థాయి ఉద్యోగాలు లభించనున్నాయి సిగ్మా టెక్నాలజీ గ్రూప్: స్వీడన్‌కు చెందిన ఈ సంస్థ చెన్నై, తిరుచిరాపల్లిలో తమ కేంద్రాలను విస్తరించడానికి ఒప్పందం కుదుర్చుకుంది. దీని వల్ల 600 ఉద్యోగాలు రానున్నాయి. విల్సన్ పవర్ సొల్యూషన్స్: తిరువల్లూరు జిల్లాలో రూ. 300 కోట్ల పెట్టుబడితో మరో ఒప్పందం కుదిరింది. దీని ద్వారా దాదాపు 400 ఉద్యోగాలు లభిస్తాయి.ఫోకస్ రంగాలు: అధునాతన తయారీ (అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్), ఆటోమొబైల్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్, ఎలక్ట్రానిక్స్, మరియు గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించింది. యూకే పర్యటనలో మోటార్ స్పోర్ట్స్ మరో ముఖ్యమైన అంశం తమిళనాడులో ప్రపంచ స్థాయి మోటార్ స్పోర్ట్స్ నగరాన్ని అభివృద్ధి చేయడం, రేసింగ్‌కు సంబంధించిన తయారీ మరియు అనుబంధ పరిశ్రమలలో అవకాశాలను సృష్టించడం వంటి ప్రభుత్వ ప్రణాళికలతో కూడా ఈ పర్యటనకు సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది.ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి విజయ్ సిల్వర్‌స్టోన్ రేసింగ్ సర్క్యూట్‌ను సందర్శించి, ప్రముఖ నటుడు, రేసర్ అజిత్ కుమార్ పాల్గొన్న రేసును జెండా ఊపి ప్రారంభించారు. తమిళనాడులో ప్రపంచ స్థాయి మోటార్ స్పోర్ట్స్ సిటీని అభివృద్ధి చేయాలనే ప్రభుత్వ ప్రణాళికలో ఇది భాగం. ఇదీ చదవండి: బిర్యానీ గణేశుడు : షాపు యజమానికి భారీ షాక్ప్రతిపక్షం విమర్శలు- టీవీకే స్పందనఅయితే, ఈ పెట్టుబడుల ప్రోత్సాహం పారదర్శకత లోపించిందని ప్రతిపక్షాల నుంచి విమర్శలను కూడా రేకెత్తించింది. విజయ్ పర్యటన వివరాలు, సమావేశాలపై పారదర్శకత కొరవడిందంటూ ప్రతిపక్షాల నుంచి విమర్శలు వ్యక్తమైన నేపథ్యంలో టీవీకే స్పందించింది . దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోటీ పడుతున్న నేపథ్యంలో (పోటీ ఫెడరలిజం), ఎంఓయూలు కుదిరిన వెంటనే వివరాలను అధికారికంగా వెల్లడిస్తామని తెలిపింది.సెప్టెంబర్ 16 వరకు యూకేలోనే ఉండనున్న విజయ్ మరిన్ని ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉంది. -
బిర్యానీ గణేశుడు : షాపు యజమానికి భారీ షాక్
దేశవ్యాప్తంగా బొజ్జ గణపయ్య వేడుకలు ఘనంగా జరుగుతుండగా, తమిళనాడులోని తిరునెల్వేలిలో ఒక బిర్యానీ దుకాణం యజమానికి భారీ షాక్ తగిలింది. గణేశుడిని అవమానించాడనే ఆరోపణల కింద పోలీసులు అరెస్ట్ చేశారు. ఏమైంది అంటే.. తమిళనాడులోని పలు నగరాల్లో వినాయక విగ్రహాలను ప్రతిష్టించి ప్రత్యేక ప్రార్థనలతో వాతావరణం సందడిగా ఉంది. ఇంత కోలాహలం మధ్య తిరునెల్వేలిలోని బిర్యానీ దుకాణం యజమాని 30 ఏళ్ల జయంత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దుకాణం బయటగణపతి బిర్యానీ తింటున్నట్లుగా ఒకబ్యానర్ ఏర్పాటు చేసిశాడు.ఇదే వివాదానికి దారి తీసింది. మతపరమైన మనోభావాలను దెబ్బతీశాడంటూ 42 ఏళ్ల సెల్వరాజ్ అనే వ్యక్తి ఈ ఫిర్యాదు చేశారు. దీంతో ఈ పరిణామం చోటు చేసుకుంది.తమిళనాడులో వాడవాడలా వినాయక చతుర్థి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. చెన్నైలోని కపాలీశ్వరర్ ఆలయంలో ఉదయం గణపతి హోమంతో వేడుకలు ప్రారంభమయ్యాయి. నర్తన వినాయకర్ విగ్రహానికి ప్రత్యేక అభిషేకం నిర్వహించి, బంగారు కవచంతో అలంకరించారు.మధురై మీనాక్షి సుందరేశ్వరర్ ఆలయంలో 7 అడుగుల ఎత్తైన ముక్కురుణి వినాయకుడికి ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తుల కోసం భారీ ముక్కురుణి కొడకట్టై (కుడుములు) తయారు చేశారు. తిరుచిరాపల్లిలో రాక్‌ఫోర్ట్ పై ఉన్న ఈ ఆలయంలో 417 మెట్లు ఎక్కి వేలాది మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. 25 కేజీల కుడుము నైవేద్యంతో 14 రోజుల పెరువిళా వేడుకలు ప్రారంభమయ్యాయి.అంతేకాదు తిరువన్నామలైలో 51,000 రుద్రాక్షలతో తయారు చేసిన గణేశ విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.మధురైలో దర్భ గడ్డితో తయారు చేసిన వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. కోయంబత్తూర్‌లో కోయంబత్తూర్‌లో రూ. 5 లక్షల విలువైన 500 రూపాయల నోట్లతో కూడిన దండతో విగ్రహాన్ని అలంకరించగా, చెన్నైలోని టి.నగర్లో కరెన్సీ నాణేలతో చేసిన విగ్రహం అందరినీ ఆకట్టుకుంది.కాగా తమిళనాడు వ్యాప్తంగా నిమజ్జన ఊరేగింపులు సెప్టెంబర్ 19, 20 తేదీల్లో జరగనున్నాయి. ఇందుకోసం పెద్ద ఎత్తున పోలీసు బలగాలను వినియోగించనున్నారు. పర్యావరణ నిబంధనల దృష్ట్యా పట్టినాబాక్కం, నీలంకరై బీచ్లలోని సాంప్రదాయ నిమజ్జన ప్రాంతాలపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. -
‘ఇదేం స్ట్రాటజీ సోదరా?’.. దోస్తీ అంటూనే విజయ్‌తో కుస్తీ!
తమిళనాడులో రాజకీయ సమీకరణాలు ఆసక్తికర మలుపు తిరిగాయి. విజయ్ ఏర్పాటు చేయబోయే సెక్యులర్ కూటమికి దూరంగా ఉంటామని వామపక్ష పార్టీలు స్పష్టం చేశాయి. అంతేకాదు.. 120 రోజుల విజయ్ పాలనపై తీవ్ర విమర్శలకు సిద్ధపడినట్లు బహిరంగంగా ప్రకటించాయి. ఇది చాలదన్నట్లు త్వరలో జరగబోయే ఉప ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించాయి. ఇవన్నీ డీఎంకేకు లాభం చేకూర్చే నిర్ణయాలేనని, ప్రతిపక్షానికి మళ్లీ అవి దగ్గరవుతున్నాయా? అనే చర్చా జోరందుకుంది.తమిళనాడులో అక్టోబర్ 6న జరగనున్న రెండు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో సీపీఐ, సీపీఎం కలిసి పోటీ చేయాలని నిర్ణయించాయి. మదురాంతకంలో సీపీఎం, ధారాపురంలో సీపీఐ అభ్యర్థులను బరిలోకి దించనున్నాయి. సెప్టెంబర్ 15న అభ్యర్థులను ప్రకటించనున్నారు. ఈ ఎన్నికల్లో టీవీకే నేతృత్వంలోని కూటమితో పాటు డీఎంకే, అన్నాడీఎంకే–బీజేపీ కూటమి, నామ్ తమిళర్ కట్చి ఇప్పటికే రంగంలో ఉన్నాయి. వామపక్షాల తాజా నిర్ణయంతో పోరు ఐదు కోణాల్లో సాగనుంది. అయితే ఈ పోటీ వల్ల ప్రభుత్వానికి ఎలాంటి ముప్పు లేదని.. విజయ్ ప్రభుత్వానికి తమ మద్దతు కొనసాగుతుందని స్పష్టం చేశాయి. దీంతో బయటి నుంచే సపోర్ట్ చేస్తున్న వామపక్షాలు.. ఉప ఎన్నికల వేళ మాత్రం అదే ప్రభుత్వ అభ్యర్థులకు ఎదురుగా బరిలోకి దిగుతున్నాయి. అయితే ఈ నిర్ణయం డీఎంకేకు లాభం చేకూర్చేందుకు కాదని లెఫ్ట్ పార్టీలు స్పష్టం చేశాయి. టీవీకే ఏర్పాటు చేయబోయే కొత్త కూటమిలో మేం చేరబోం. మూడు ప్రధాన కూటములకూ వ్యతిరేకంగా మేం పోటీ చేస్తున్నాం. అంతే తప్పా ఏ పార్టీకో లాభం చేకూర్చేందుకు మేం పోటీ చేయడం లేదు అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఎం. వీరపాండియన్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి. షణ్ముగం తేల్చిచెప్పారు. బయట మద్దతు.. లోపల విమర్శలు2026 అసెంబ్లీ ఎన్నికల తర్వాత మెజార్టీకి కొంత దూరంలో నిలిచిన విజయ్ ప్రభుత్వానికి సీపీఐ, సీపీఎం బయట నుంచి మద్దతు ప్రకటించాయి. ప్రజల తీర్పును గౌరవించడం, గవర్నర్ పాలనకు అవకాశం లేకుండా చూడటం, పరోక్షంగా బీజేపీ పాలన రాకుండా అడ్డుకోవడమే తమ మద్దతు ఉద్దేశమని అప్పట్లో వామపక్షాలు తెలిపాయి. అయితే కేబినెట్లో మాత్రం చేరలేదు. అలాగే టీవీకే అధికారిక కూటమిలోనూ భాగం కాలేదు.ఇప్పుడు ఉప ఎన్నికల్లో మాత్రం టీవీకే అభ్యర్థులపై పోటీకి దిగుతున్నాయి. దీంతో ‘ప్రభుత్వానికి మద్దతు.. అభ్యర్థులకు వ్యతిరేకం’ అనే వామపక్షాల వైఖరి రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. దీనిపై విమర్శలు వచ్చినా.. ఉప ఎన్నికలు ప్రభుత్వం మార్పు కోసం జరిగేవి కావని షణ్ముగం స్పష్టం చేశారు. ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేయడం తమ రాజకీయ నిర్ణయమని తెలిపారు.120 రోజుల పాలనపై ప్రచారంలోనే కౌంటర్ఉప ఎన్నికల ప్రచారాన్ని విజయ్ ప్రభుత్వంపై విమర్శలకు వేదికగా చేసుకుంటామని సీపీఎం ప్రకటించడం గమనార్హం. ప్రభుత్వ తొలి 120 రోజుల పాలన, ఆర్థిక విధానాలు, పరిపాలనా చర్యలు, అసెంబ్లీ పనితీరుపై తమ అభిప్రాయాలను ప్రజలకు వివరిస్తామని షణ్ముగం చెప్పారు. ముఖ్యంగా ‘నియో లిబరల్’ ఆర్థిక విధానాలపై తమ అభ్యంతరాలను ప్రచారంలో ప్రస్తావిస్తామన్నారు. అలాగే రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంపై ప్రభుత్వం చేస్తున్న ప్రకటనల్లో పారదర్శకత ఉండాలని వామపక్షాలు ఇప్పటికే డిమాండ్ చేశాయి. విదేశీ పెట్టుబడులతో పాటు స్థానిక సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరాయి.సచివాలయం విషయంలోనూ విభేదాలుచెన్నైలోని పట్టినప్పాక్కంలో కొత్త సచివాలయం, అసెంబ్లీ సముదాయం నిర్మించాలన్న ప్రభుత్వ ప్రతిపాదనపైనా వామపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నిర్ణయంపై మత్స్యకారుల జీవనోపాధి, పర్యావరణం, ట్రాఫిక్ తదితర అంశాలను ప్రస్తావిస్తూ ప్రత్యామ్నాయ స్థలాన్ని పరిశీలించాలని కోరాయి. అసెంబ్లీలో డీఎంకే అధినేత స్టాలిన్‌పై విజయ్ చేసిన వ్యాఖ్యలు, చేతి సైగలపైనా సీపీఎం గతంలో తీవ్రంగా స్పందించింది. సభను వ్యక్తిగత విమర్శలకు వేదికగా మార్చొద్దని షణ్ముగం సూచించారు.‘ఇది ప్రజలపై రుద్దిన ఎన్నిక’మదురాంతకం, ధారాపురం ఉప ఎన్నికలు ఎందుకు వచ్చాయన్న దానిపైనా వామపక్షాలు టీవీకేపై విమర్శలు గుప్పిస్తున్నాయి. 2026 ఎన్నికల్లో ఈ రెండు స్థానాల నుంచి అన్నాడీఎంకే తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు కే. మరగతం కుమారవేల్, పి. సత్యబామలు ఆ తర్వాత రాజీనామా చేసి టీవీకేలో చేరారు. ఇప్పుడు అదే స్థానాల నుంచి టీవీకే అభ్యర్థులుగా బరిలోకి దిగుతున్నారు.ఎన్నికైన కొద్ది రోజులకే ఎమ్మెల్యేలు పార్టీ మారి రాజీనామా చేయడం ప్రజల తీర్పును అవమానించడమేనని సీపీఎం విమర్శించింది. ఈ పరిణామాల వల్లే ఉప ఎన్నికలు వచ్చాయని.. ఇవి సహజంగా వచ్చిన ఎన్నికలు కావని, ప్రజలపై రుద్దిన ఎన్నికలని షణ్ముగం వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేల పార్టీ మార్పు వెనుక ‘హార్స్ ట్రేడింగ్’ జరిగి ఉండొచ్చన్న అనుమానాన్ని కూడా వ్యక్తం చేశారు.రెండు సీట్లలో గెలిస్తే అసెంబ్లీలో ప్రజా సమస్యలపై తమ గొంతును మరింత బలంగా వినిపించవచ్చన్నది వామపక్షాల లెక్క. అందుకే ప్రభుత్వం విషయంలో విజయ్‌కు మద్దతు కొనసాగిస్తూనే.. ఎన్నికల విషయంలో మాత్రం టీవీకేను ఢీకొట్టాలని నిర్ణయించాయి. అంటే.. ప్రభుత్వం నిలబడేందుకు దోస్తీ.. తమ రాజకీయ బలం చాటుకునేందుకు కుస్తీ! ఇదే ఇప్పుడు తమిళనాడు ఉప ఎన్నికల్లో లెఫ్ట్ అనుసరిస్తున్న ‘ఇదేం స్ట్రాటజీ సోదరా?’ అనే ప్రశ్నకు అసలు సమాధానం.ఇదీ చదవండి: బిహార్‌లో బీజేపీకి ఝలక్ -
విజయ్ యూకే పర్యటనపై డీఎంకే విమర్శలు.. టీవీకే కౌంటర్
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ యూకే పర్యటనపై డీఎంకే విమర్శలు చేసింది. తన స్నేహితుడు, సినీ హీరో అజిత్ కారు రేసును చూడటానికే విజయ్ లండన్ వెళ్లారని ఆరోపించింది. ఈ విమర్శలపై టీవీకే స్పందించింది. స్నేహితుడిని కలవడం తప్పేమీ కాదని స్పష్టం చేసింది. బ్రిటన్‌లోని సిల్వర్‌స్టోన్‌లో జరిగిన మిషెలిన్ లే మాన్స్ కప్ రేసును ప్రారంభించేందుకు విజయ్ సంప్రదాయ ఆకుపచ్చ జెండాను ఊపారు. అజిత్ కుమార్ 2026 ఛాంపియన్‌షిప్‌లో పాల్గొననున్నారు.“తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ లండన్‌లో ఉన్నారు. మనకు రైతుల సమస్య ఉంది, మత్స్యకారుల సమస్య ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు పెట్టుబడులను ఆకర్షించేందుకు ఎలాంటి తొందర లేదు” అని డీఎంకే ఎమ్మెల్యే మార్కండేయన్ అన్నారు. తమిళనాడుకు విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం, చెన్నై సమీపంలో ప్రతిపాదించిన మోటార్ స్పోర్ట్స్ సిటీ కోసం ప్రపంచస్థాయి క్రీడా సదుపాయాలను పరిశీలించడం కోసం విజయ్ బ్రిటన్‌లో అధికారిక పర్యటన చేస్తున్నారు.“వీళ్లకు ప్రచారం చేసుకోవడం, గొప్పగా చూపించుకోవడంపైనే ఆసక్తి ఉంది. కానీ మన ముఖ్యమంత్రి పని చేస్తున్నారు. మీరు పర్యటనలో ఉన్నప్పుడు మీ స్నేహితుడిని కలవడం తప్పేమీ కాదు. వాళ్లు అజిత్ గురించి మాట్లాడుతున్నారని నాకు తెలుసు. అజిత్ తమిళనాడులోనే కాదు, రేసింగ్ రంగంలో కూడా ఒక స్టార్” అని టీవీకే అధికార ప్రతినిధి అమెరికై వి. నారాయణన్ అన్నారు. “ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి అజిత్ లాంటి వ్యక్తిని వెళ్లి కలిస్తే, అది తమిళనాడు బ్రాండ్ విలువను పెంచుతుంది. వాళ్లు మనపై అసూయతో ఉన్నారు. అందుకే ఇవన్నీ చేస్తున్నారు. ఈ చిన్న, అర్థంలేని మాటలతో మన దృష్టి మళ్లించుకోవాల్సిన అవసరం లేదు” అని ఆయన అన్నారు.విజయ్ బ్రిటన్ పర్యటనతమిళనాడు బలమైన ఆటోమొబైల్, విద్యుత్ వాహనాల తయారీ రంగాన్ని ఉపయోగించుకుని ప్రపంచస్థాయి మోటార్ స్పోర్ట్స్ సిటీని అభివృద్ధి చేయాలనే ప్రతిష్ఠాత్మక ప్రణాళికను ముందుకు తీసుకెళ్తున్న సమయంలో విజయ్ బ్రిటన్ పర్యటన సాగుతోంది. ప్రభుత్వం ప్రకారం, మోటార్ స్పోర్ట్స్ మౌలిక సదుపాయాలు, క్రీడా పర్యాటకం, ఈ రంగంతో అనుసంధానమైన ప్రత్యేక ఆటోమొబైల్ పరిశ్రమల అభివృద్ధికి ఉన్న అవకాశాలను పరిశీలించేందుకు ఈ పర్యటన ఉపయోగపడుతుంది.విజయ్-అజిత్ కలయికసిల్వర్స్టోన్ రేసింగ్ సర్క్యూట్లో విజయ్ తన స్నేహితుడు అజిత్ కుమార్ వైపు పరుగెత్తుకుంటూ వెళ్లి ఆలింగనం చేసుకున్న దృశ్యం కనిపించింది. మిషెలిన్ లే మాన్స్ కప్‌లో సిల్వర్‌స్టోన్ రౌండ్‌కు ముందు అజిత్ కుమార్ స్వయంగా ముఖ్యమంత్రి విజయ్‌కు వేదిక వద్ద స్వాగతం పలికారు.@actorvijay in action! 🎥Watch the full race LIVE and FREE on FIAWEC+ https://t.co/DYCHBX6lvB pic.twitter.com/12EgOUsYGy— Le Mans Cup (@LeMansCup) September 12, 2026 Ajith Kumar and Thalapathy Vijay looking effortlessly iconic together. What a moment. pic.twitter.com/camn5fuGhw— The XO Show ™ (@latenightxoshow) September 13, 2026 -
కొత్త కమిషనర్‌గా కేతరిన్ శరణ్య బాధ్యతలు
తమిళనాడు: వేలూరు కార్పొరేషన్‌ను హరిత నగరంగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని నూతనంగా బాధ్యతలు చేపట్టిన కేతరిన్ శరణ్య అన్నారు. వేలూరు కమిషనర్‌గా పనిచేస్తున్న సుల్తానాను చెన్నైకి బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అదే స్థానంలో సీనియర్ ఐఏఎస్ అధికారిగా పనిచేస్తున్న కేతరిన్ శరణ్యను నియమించారు. దీంతో శనివారం ఉదయం ఆమె వేలూరులో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ వేలూరు కార్పొరేషన్‌లోని సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించేందుకు అధిక ప్రాదాన్యత ఇస్తామన్నారు. అదే వి«ధంగా ప్రజల దాహర్తిని తీర్చేందుకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామన్నారు. కాగా కమిషనర్ కేతరీన్ శరణ్య వేలూరు ఎస్పీ శివరామన్ సతీమణి కావడం గమనార్హం. చదవండి: ఒకే జిల్లాలో ఐఏఎస్, ఐపీఎస్ దంపతులు -
టీవీకే సర్కార్‌కు డీఎంకే షాక్.. విజయ్ ప్లాన్‌కు బ్రేక్ తప్పదా?
చెన్నై: తమిళనాడులో మరోసారి అధికార టీవీకే, డీఎంకే మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తమిళనాడులో కొత్త సచివాలయం, అసెంబ్లీ భవన సముదాయం నిర్మాణం విషయం రాజకీయ రగడకు కారణమవుతోంది. చెన్నైలోని పటినపాక్కంలో 25.55 ఎకరాల్లో రూ.1,200 కోట్ల అంచనా వ్యయంతో ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టును డీఎంకే వ్యతిరేకించింది. అక్కడ సచివాలయం నిర్మిస్తే మత్స్యకారుల జీవనోపాధి దెబ్బతింటుందని ఆ పార్టీ ఎంపీ విల్సన్ స్పష్టం చేశారు. ఈ ప్రాంతంలో నిర్మాణాన్ని అనుమతించబోమని తేల్చిచెప్పారు.అయితే కొత్త స్థలం కోసం వెతకడం కంటే.. ఇప్పటికే ఉన్న ఓమందూరార్ ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి భవనాన్నే తిరిగి సచివాలయంగా మార్చాలని డీఎంకే సూచిస్తోంది. మాజీ సీఎం ఎం. కరుణానిధి హయాంలో ఈ భవనాన్ని సచివాలయం కోసమే నిర్మించారని, పెద్దగా మార్పులు చేయకుండానే చిన్నపాటి మరమ్మతులతో తిరిగి ఉపయోగించుకోవచ్చని విల్సన్ పేర్కొన్నారు. కరుణానిధి ప్రభుత్వం నిర్మించిన ఈ భవనాన్ని అనంతరం జయలలిత ప్రభుత్వం ఆస్పత్రిగా మార్చింది.12 గ్రామాల ఆందోళన..మరోవైపు పటినపాక్కంలో ప్రతిపాదిత నిర్మాణంపై స్థానిక మత్స్యకారుల నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సమీపంలోని 12 మత్స్యకార గ్రామాలకు చెందిన కుటుంబాలు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. పడవలు నిలపడం, వలలు బాగుచేయడం, చేపలు ఆరబెట్టడం, మార్కెట్లు నిర్వహించడం కోసం ఈ ప్రాంతాన్ని ఉపయోగిస్తున్నామని వారు చెబుతున్నారు. సచివాలయ నిర్మాణం జరిగితే సముద్రానికి తమ రాకపోకలు పరిమితం కావడంతో పాటు భవిష్యత్తులో జీవనోపాధి కోల్పోయే పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈ అంశంపై డీఎంకే మాత్రమే కాకుండా ఇతర పార్టీల నుంచి కూడా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి. షణ్ముగం పనులను నిలిపివేసి, స్థల ఎంపికపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని కోరారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఎం. వీరపాండియన్ తీరప్రాంత పర్యావరణం, వరదలు, తుపాన్ల ముప్పును ప్రస్తావించారు. పీఎంకే అధ్యక్షుడు అన్బుమణి రామదాస్ కూడా కొత్త సచివాలయం వల్ల ట్రాఫిక్ సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొంటూ.. చెన్నై వెలుపల ప్రత్యేక పరిపాలనా నగరాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు.దీంతో రూ.1,200 కోట్ల కొత్త సచివాలయ ప్రాజెక్టు ఇప్పుడు స్థల వివాదంలో చిక్కుకుంది. మత్స్యకారుల అభ్యంతరాలు, ప్రతిపక్షాల డిమాండ్ల నేపథ్యంలో ప్రభుత్వం పటినపాక్కం ప్రతిపాదనపైనే ముందుకెళ్తుందా? లేక ఇప్పటికే ఉన్న ఓమందూరార్ భవనాన్ని తిరిగి సచివాలయంగా మార్చే ప్రత్యామ్నాయాన్ని పరిశీలిస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది.ఇదీ చదవండి: తన డ్యాన్స్ వీడియోపై కేరళం సీఎం విస్మయం -
పెళ్లి చేసుకుంటానని నమ్మించి...
సాక్షి, చెన్నై: పరిచయం పెంచుకుని యువతిని మాయ మాటలతో నమ్మించాడు. పెళ్లి చేసుకుంటానని తీయని కబుర్లుచెప్పి గదికి తీసుకెళ్లి శీతలపానీయంలో మత్తు మందు కలిపి లైంగికదాడికి తెగబడ్డాడు. వీడియో చిత్రీకరించి పిలిచినప్పుడల్లా రావాలని బ్లాక్మెయిల్ చేశాడు. ఈ ఘటన తమిళనాడులోని తిరుప్పూర్‌లో శుక్రవారం జరిగింది. సేకరించిన వివరాల ప్రకారం.. ఒడిశాకు చెందిన 25 ఏళ్ల యువతి తిరుప్పూర్ జిల్లా మొదలిపాలయంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో కుట్టుపని చేస్తోంది. అదే ప్రాంతంలో పనిచేస్తున్న బిహార్‌కు చెందిన వికాష్ కుమార్ యాదవ్ ఆమెను పరిచయం చేసుకున్నాడు. మాయమాటలతో నమ్మించాడు. పెళ్లి చేసుకుంటానని ఆశలు రేపాడు. ఈ పరిస్థితులలో పని ముగించుకుని శుక్రవారం సాయంత్రం తన కోసం వచ్చిన యువతిని వికాష్ కుమార్ తన గదికి తీసుకెళ్లాడు. ఆమెకు తెలియకుండా శీతల పానీయంలో మత్తుమందు కలిపి ఇచ్చాడు. అది తాగిన యువతి స్పృహ కోల్పోవడంతో ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ దృశ్యాలను తన సెల్ఫోన్లో వీడియోగా చిత్రీకరించి, ఫోటోలూ తీశాడు. స్పృహలోకి వచ్చిన తర్వాత యువతి ఆందోళన చెంది తనను పెళ్లి చేసుకోవాలని వేడుకోవడంతో తనకు అప్పటికే పెళ్లయినట్టు చెప్పాడు. తను తీసిన చిత్రాలను ఆమెకు చూపి ఇక, తాను పిలిచినప్పుడల్లా రావాలని హెచ్చరించి పంపాడు. ఎవరికైనా చెబితే ఆ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేసి పరువు తీస్తానని బెదిరించాడు. అంతే కాకుండా ఆ వీడియోను తన బంధువు ఒకరికి అతడు పంపించి పైశాచికానందం పొందాడు. దీంతో ఆ యువతి తిరుప్పూర్ పోలీసులను శనివారం ఆశ్రయించింది. కాంగేయం ఆల్ ఉమెన్ పోలీసులు తక్షణం రంగంలోకి దిగి వికాష్కుమార్యాదవ్ను అరెస్టు చేశారు. అతడి ఫోన్‌ను పరిశీలించగా అందులో ఆయువతితో గడిపిన వీడియోలతో పాటుగా మరికొన్ని అశ్లీల వీడియోలు బయటపడ్డాయి. నిందితుడు మరెవరినైనా ఈ తరహాలో వేధించాడా? అన్న అనుమానంతో విచారణ జరుపుతున్నారు. -
విజయ్ సర్కార్‌కు తొలి పరీక్ష.. అన్నాడీఎంకే కంచుకోటల్లో బిగ్ ఫైట్!
తమిళనాడు రాజకీయాల్లో వేడి పెరిగింది.. విజయ్ ప్రభుత్వానికి తొలి పరీక్ష ఎదురైంది. టీవీకే అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి బైపోల్ బరిలోకి దిగింది. ఇప్పటి వరకు అన్నాడీఎంకేకు కంచుకోటలుగా ఉన్న రెండు నియోజకవర్గాల్లో టీవీకే.. మాజీ అన్నాడీఎంకే ఎమ్మెల్యేలనే తమ అభ్యర్థులుగా ప్రకటించింది. దీంతో విజయ్ వర్సెస్ స్టాలిన్ పోరుకు.. అన్నాడీఎంకే కౌంటర్‌తో ముక్కోణపు యుద్ధం మొదలైంది. అక్టోబర్ 6న జరగనున్న ఈ రెండు ఉపఎన్నికలు ఎవరి బలమెంతో తేల్చడమే కాదు.. విజయ్ కొత్త ప్రభుత్వానికి ప్రజల్లో ఉన్న ఆదరణకు తొలి సంకేతంగా మారే అవకాశముంది.అక్టోబర్ 6న తమిళనాడులో జరగనున్న రెండు అసెంబ్లీ ఉపఎన్నికలకు టీవీకే అధినేత, సీఎం విజయ్ అభ్యర్థులను ప్రకటించారు. మదురాంతకం నుంచి మాజీ అన్నాడీఎంకే ఎమ్మెల్యే కె. మరగతం కుమారవేల్, ధారాపురం నుంచి మాజీ ఎమ్మెల్యే పి. సత్యబామను బరిలోకి దింపారు. ఇద్దరూ ఏప్రిల్ 23 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే తరఫున గెలిచి, ఆ తర్వాత ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి టీవీకేలో చేరడంతో ఈ రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి.త్రిముఖ పోరు తప్పదా?ఈ రెండు నియోజకవర్గాలు అన్నాడీఎంకేకు బలమైన స్థానాలుగా పరిగణిస్తుండటంతో.. ఇప్పుడు అక్కడ టీవీకే, డీఎంకేతో పాటు అన్నాడీఎంకే కూడా బరిలోకి దిగడంతో త్రిముఖ పోరు నెలకొంది. మదురాంతకంలో డీఎంకే తరఫున మాజీ ఎమ్మెల్యే ఐ. పరందామన్, ధారాపురంలో ఎస్. సుగన్య పోటీ చేస్తున్నారు. అన్నాడీఎంకే మదురాంతకంలో మాజీ ఎమ్మెల్యే కనిత సంపత్, ధారాపురంలో కె. బానుమతిని అభ్యర్థులుగా ప్రకటించింది. అయితే ఈ ఉపఎన్నికలు విజయ్ ప్రభుత్వానికి కీలక పరీక్షగా మారనున్నాయి. ఏప్రిల్ ఎన్నికల్లో అధికారాన్ని కైవసం చేసుకున్న తర్వాత టీవీకే ఎదుర్కొంటున్న తొలి ఎన్నికల పోరు ఇదే కావడంతో.. ఈ రెండు ఫలితాలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే విజయ్ ఈ ఉపఎన్నికలను కాంగ్రెస్, ఎండీఎంకేతో కూడిన ‘సెక్యులర్ సోషల్ జస్టిస్ విక్టరీ ఫ్రంట్’ కూటమి పేరుతో ఎదుర్కోనున్నట్లు ప్రకటించారు.డీఎంకే, అన్నాడీఎంకే ఫుల్ ఫోకస్..తమకు ఇప్పటికే ఉన్న వ్యక్తిగత ఓటు బ్యాంకు, నియోజకవర్గాల్లో పరిచయం ఉన్న నాయకత్వం కలిసి పనిచేస్తుందని టీవీకే అంచనా వేస్తోంది. మదురాంతకం అభ్యర్థి మరగతం కుమారవేల్ కూడా విజయంపై ధీమా వ్యక్తం చేశారు. విజయ్ ప్రభుత్వం వంద రోజుల పాలనలో సాధించిన అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లి విజయం సాధిస్తామని చెప్పారు. మరోవైపు.. అన్నాడీఎంకే తన బలమైన స్థానాలను తిరిగి నిలబెట్టుకోవాలని చూస్తుండగా, అధికార టీవీకేను నిలువరించేందుకు డీఎంకే కూడా గట్టిగానే పోరాడుతోంది. టీవీకే ఎదుగుదలను అడ్డుకోవడమే డీఎంకేకి ప్రధాన రాజకీయ సవాల్‌గా కనిపిస్తోంది. ఇందులో భాగంగా మదురాంతకం, ధారాపురం రెండింటిలోనూ డీఎంకే అభ్యర్థులను ముందుగానే ప్రకటించి పోరుకు తెరతీసింది. ఇదిలా ఉండగా.. మదురాంతకంలో 2026 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే మూడో స్థానంలో నిలిచింది. ఇప్పుడు అదే స్థానంలో బలాన్ని పెంచుకోవడం స్టాలిన్ పార్టీకి పెద్ద సవాల్‌గా ఉంది. ఇక, విజయ్ ప్రభుత్వానికి ఈ రెండు బైపోల్స్ తొలి రాజకీయ పరీక్షగా మారాయి. రెండు స్థానాలకు సంబంధించి అక్టోబర్ 6న పోలింగ్ జరగనుండగా అక్టోబర్ 9న ఓట్ల లెక్కింపు జరగనుంది.ఇదీ చదవండి: తమిళనాట సంచలనం.. స్టాలిన్‌కు పళని బిగ్ ఆఫర్ -
విజయ్‌పై టీటీవీ దినకరన్ సంచలన వ్యాఖ్యలు
చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో ‘దవడ’ వివాదం ఇంకా సద్దుమణగలేదు. ఎంకే స్టాలిన్ దవడ గాయాన్ని సీఎం విజయ్ ఎగతాళి చేశారంటూ రచ్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఏఎంఎంకే అధినేత టీటీవీ దినకరన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయ్ సినిమాల్లోనే హీరో.. నిజ జీవితంలో పెద్ద విలన్” అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. డీఎంకే నేతల కంటే తీవ్రంగా స్పందించిన దినకరన్.. విజయ్ను స్వార్థపరుడిగా అభివర్ణించారు. తన సొంత ప్రయోజనాల కోసం ఎవరినైనా బలి చేస్తారంటూ మండిపడ్డారు.విజయ్ పార్టీ టీవీకే అధికారంలో వచ్చిన తర్వాత తమిళనాడు రాజకీయ వాతావరణం వ్యక్తిగత విమర్శలకు కేంద్ర బిందువుగా మారింది. ప్రతిపక్షాలు, ముఖ్యంగా ఎంకే స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్.. నటి త్రిషతో విజయ్‌కు ఉన్న సంబంధాన్ని అడ్డం పెట్టుకుని ఆయన్ని కార్నర్ చేయడానికి ప్రయత్నించగా.. ముఖ్యమంత్రి మాత్రం డీఎంకే చీఫ్‌కు 1976లో జైలు శిక్ష అనుభవిస్తున్న సమయంలో తగిలిన దవడ గాయాన్ని ఎగతాళి చేశారనే ఆరోపణలు వచ్చాయి.సెప్టెంబర్ 7న తమిళనాడు అసెంబ్లీ వేదికగా ప్రతిపక్ష డీఎంకే అవినీతిపై ఆయన విమర్శలు గుప్పిస్తూ ఇచ్చిన బాడీ లాంగ్వేజ్ సైగ.. రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేగింది. అసెంబ్లీ సమావేశంలో డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ గతంలో ఎమర్జెన్సీ కాలంలో ఎదుర్కొన్న ఇబ్బందులు, నిర్బంధం గురించి ప్రస్తావిస్తున్న సమయంలో విజయ్ తన దవడను తాకుతూ ఒక రకమైన సైగ చేశారు. విజయ్ చేసిన ఈ బాడీ లాంగ్వేజ్ సైగ.. ఎమర్జెన్సీ (1975-77) కాలంలో ‘మీసా’ చట్టం కింద అరెస్టై, పోలీస్ కస్టడీలో దాడికి గురై దవడ గాయపడిన ఎంకే స్టాలిన్‌ను అపహాస్యం చేసేలా ఉందని డీఎంకే పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.విజయ్‌పై విమర్శలు గుప్పించిన ఎంకే స్టాలిన్.. అదే సమయంలో తన దవడకు గాయం ఎలా జరిగిందో వివరించారు. 1975-77 మధ్య అమలైన ఎమర్జెన్సీ సమయంలో కరుణానిధి నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వం రద్దయిన తర్వాత 1976లో తాను అరెస్టయిన విషయాన్ని స్టాలిన్ గుర్తుచేసుకున్నారు. జైలులో మేము ఎన్నో రకాల వేధింపులు ఎదుర్కొన్నాం. మమ్మల్ని కుష్ఠు రోగులతో కలిసి ఉంచారు. పది మందిని ఒక చిన్న గదిలో బంధించారు. ఆ గదిలో ఒకే ఒక మూత్రశాల ఉండేది. చుట్టూ దుర్వాసన ఉన్నప్పటికీ అక్కడే నిద్రించాల్సి వచ్చేదంటూ స్టాలిన్ తెలిపారు.పోలీసులు రాత్రిళ్లు మమ్మల్ని నిద్రపోనివ్వలేదు. లాఠీలతో కొట్టేవారు. జీవిత ఖైదు అనుభవిస్తున్న ఖైదీలతో కూడా మమ్మల్ని కొట్టించారు. నాతో పాటు జైలులో ఉన్న ఎంపీ చిట్టిబాబు అక్కడే మరణించారు. ఆ దాడిలో నా దవడ ఎముక విరిగింది” అని చెప్పారు. విజయ్ తాను ఆ హావభావం చేయలేదన్న వివరణను స్టాలిన్ తోసిపుచ్చారు.ఇదీ చదవండి: తమిళనాడులో భగ్గుమన్న ‘దవడ’ రాజకీయం -
తమిళనాడులో సంచలనం.. స్టాలిన్‌కు పళనిస్వామి బంపరాఫర్!
చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. తమిళనాడులో కొత్త సమీకరణాలపై ఉత్కంఠ పెరుగుతోంది. సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకేకు చెక్ పెట్టేందుకు ప్రత్యర్థి డీఎంకేతో చేతులు కలిపేందుకు తాము సిద్ధమంటూ అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ సీఎం ఎడప్పాడి కె. పళనిస్వామి (ఈపీఎస్) సంచలన వ్యాఖ్యలు చేశారు. టీవీకేకు వ్యతిరేకంగా తమ కూటమిలోకి ఇతర పార్టీలు వస్తే స్వాగతిస్తామని చెప్పిన ఆయన.. ‘డీఎంకే వస్తుందా?’ అంటూ ఆ పార్టీకి నేరుగా సవాల్ విసిరారు.టీవీకేకు వ్యతిరేకంగా కూటమి ఏర్పడుతోందా అని మీడియా ప్రశ్నించగా.. తాము కూడా టీవీకేకు వ్యతిరేకమేనని ఈపీఎస్ స్పష్టం చేశారు. తమ కూటమి ఇప్పటికే ఉన్న విధంగానే కొనసాగుతుందని, ఇతర పార్టీలు చేరాలనుకుంటే ఆహ్వానిస్తామని చెప్పారు. అదే సమయంలో ‘డీఎంకే వస్తుందా?’ అంటూ ప్రశ్నించడం తమిళనాడు రాజకీయాల్లో చర్చకు దారితీసింది. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో టీవీకే నేతృత్వంలోని కూటమి, డీఎంకే నేతృత్వంలోని ఫ్రంట్, అన్నాడీఎంకే నేతృత్వంలోని కూటమి మధ్య పోటీ మరింత ఆసక్తికరంగా మారే పరిస్థితి కనిపిస్తోంది.మరోవైపు విజయ్ ప్రభుత్వంపై ఈపీఎస్ తీవ్ర విమర్శలు చేశారు. అవినీతి, ధరల పెరుగుదల, శాంతిభద్రతలు, డ్రగ్స్ సమస్య, రైతుల ఇబ్బందులను ప్రభుత్వం పరిష్కరించడంలో విఫలమైందని ఆరోపించారు. అసెంబ్లీలో ప్రతిపక్షాలు లేవనెత్తుతున్న ప్రశ్నలకు సీఎం విజయ్ నేరుగా సమాధానం ఇవ్వడం లేదని విమర్శించారు.ఇప్పటికే అసెంబ్లీ వేదికగా విజయ్, డీఎంకే మధ్య మాటల యుద్ధం తీవ్రంగా సాగుతోంది. మాజీ డీఎంకే ప్రభుత్వంపై విజయ్ అవినీతి ఆరోపణలు చేయడంతో డీఎంకే సభ్యులు నిరసనకు దిగారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈపీఎస్ డీఎంకేతో కలిసి టీవీకేకు వ్యతిరేకంగా పోరాటానికి సిద్ధమంటూ సంకేతాలు ఇవ్వడం తమిళనాడు రాజకీయాల్లో కొత్త చర్చకు తెరతీసింది. ఇక, విజయ్ కూటమి బలం పెంచుకుంటున్న వేళ.. పాత ప్రత్యర్థులైన డీఎంకే-అన్నాడీఎంకే ఒకే వేదికపైకి వస్తాయా? ఈపీఎస్ వ్యాఖ్యలు నిజంగా పొత్తుకు సంకేతాలా? అన్నది ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.ఇదీ చదవండి: తమ్ముడు విజయ్.. నువ్వుచెప్పింది కరెక్టే: స్టాలిన్ -
ఒకే జిల్లాలో ఐఏఎస్, ఐపీఎస్ దంపతులు
సాక్షి, చెన్నై : తమిళనాడు ఐఏఎస్ అధికారుల బదిలీల్లో భాగం ఒక ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఒకే జిల్లాలో భార్యాభర్తలిద్దరూ కీలకమైన ఐఏఎస్, ఐపీఎస్ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తమిళనాడు ప్రభుత్వం 14 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ఇందులో భాగంగా సిప్కాట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఐఏఎస్ అధికారిణి కేథరీన్ శరణ్యను వేలూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా నియమించారు. ఈమె బుధవారం బాధ్యతలు స్వీకరించారు. కాగా, కేథరీన్ శరణ్య భర్త శివరామన్ ఇప్పటికే వెలూరు జిల్లా జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ)గా పనిచేస్తున్నారు. ఫిబ్రవరిలో ఆయన వెల్లూరు ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. ఇప్పుడు ఆయన భార్య కూడా అదే జిల్లాకు కార్పొరేషన్ కమిషనర్‌గా రావడం విశేషం. తొలి మహిళా కమిషనర్ రికార్డు 2008లో వెల్లూరు మున్సిపాలిటీని కార్పొరేషన్‌గా హోదా పెంచిన తర్వాత, మున్సిపల్ కార్పొరేషన్‌కు కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరిస్తున్న తొలి మహిళా అధికారిగా కేథరీన్ శరణ్య రికార్డు సృష్టించారు. చదవండి: ఐఏఎస్, ఐపీఎస్‌లుగా రైతు బిడ్డలు -
విజయ్ కూటమికి కొత్త పేరు.. వాళ్లు దూరం.. తమిళనాట కొత్త లెక్కలు!
తమిళనాడు రాజకీయాల్లో కొత్త కూటమి ఆవిర్భవించింది. అధికారంలో ఉన్న తమిళగ వెట్రి కళగం (టీవీకే) నేతృత్వంలోని కూటమికి ‘సెక్యులర్ సోషల్ జస్టిస్ విక్టరీ అలయన్స్’గా పేరు ఖరారైంది. ముఖ్యమంత్రి, టీవీకే అధినేత విజయ్ అధ్యక్షతన బుధవారం చెన్నైలోని పనైయూర్లో జరిగిన సమన్వయ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.సెక్యులర్ సోషల్ జస్టిస్ విక్టరీ కూటమిలో టీవీకేతో పాటు కాంగ్రెస్, వీసీకే, ఎండీఎంకే, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఉన్నాయి. కూటమి పేరులోనే మత సామరస్యం, సామాజిక న్యాయం, విజయ్ రాజకీయ గుర్తింపు కనిపించేలా రూపొందించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కూటమి నాయకత్వం విజయ్‌దే అని నేతలు స్పష్టం చేశారు.వీసీకే నేత ఎస్ఎస్ బాలాజీ మాట్లాడుతూ.. ఈ పేరు విజయ్ ఆలోచన నుంచి వచ్చిందని తెలిపారు. బీజేపీ, ‘ఫాసిస్టు శక్తులకు’ వ్యతిరేకంగా కూటమి పనిచేస్తుందనే విషయాన్ని పేరు స్పష్టం చేస్తుందని చెప్పారు. టీవీకే బీజేపీ పట్ల మెతక వైఖరి అవలంబిస్తోందన్న విమర్శలకు కూడా దీనితో స్పష్టత వస్తుందని వ్యాఖ్యానించారు.కాంగ్రెస్‌తో విభేదాల్లేవ్..ఇటీవల ‘విజయ్ ఫర్ పీఎం’ అంటూ టీవీకే వర్గాల్లో వినిపిస్తున్న నినాదాలపై కాంగ్రెస్‌లో అసంతృప్తి వ్యక్తమైన నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది. అయితే టీఎన్‌సీసీ అధ్యక్షుడు బి.మాణిక్కం ఠాగూర్ మాత్రం టీవీకే, కాంగ్రెస్ మధ్య ఎలాంటి అభిప్రాయ భేదాలు లేవని చెప్పారు. సరైన సమయంలో కూటమి ప్రధానమంత్రి అభ్యర్థికి మద్దతు ఇస్తామని తెలిపారు. విజయ్ను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలనే డిమాండ్లు పెరగడం కాంగ్రెస్‌కు ఇబ్బందికరంగా మారిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.కూటమి జాతీయ స్థాయిలో ఇండియా బ్లాక్‌లో చేరుతుందా? అనే ప్రశ్నకు వీసీకే నేత బాలాజీ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. టీవీకేకు ప్రస్తుతం ఎంపీలు లేరని, పార్లమెంట్లో ప్రాతినిధ్యం వచ్చిన తర్వాత ఇండియా కూటమిలో చేరే అంశం ఉంటుందని చెప్పారు. దీంతో రాష్ట్ర రాజకీయాలకే పరిమితం కాకుండా భవిష్యత్తులో జాతీయ రాజకీయాల వైపు కూడా విజయ్ అడుగులు వేయనున్నారా? అన్న చర్చ మొదలైంది.వామపక్షాలు మాత్రం దూరం..కూటమి ఏర్పాటులో మరో కీలక అంశం వామపక్ష పార్టీల గైర్హాజరు. సీపీఐ, సీపీఎం నేతలు సమావేశానికి హాజరు కాలేదు. ప్రభుత్వం ఏర్పాటు సమయంలో టీవీకేకు వామపక్షాలు మద్దతు ఇచ్చినప్పటికీ.. తాజా కూటమి సమావేశానికి మాత్రం దూరంగా ఉన్నాయి. అయితే టీవీకే నేత ఆధవ్ అర్జునా కమ్యూనిస్టు పార్టీలు త్వరలోనే కూటమిలో చేరతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.ఇదిలా ఉంటే, కూటమి తన రాజకీయ ప్రయాణాన్ని రాబోయే ఉప ఎన్నికలతో ప్రారంభించనుంది. అభ్యర్థుల ప్రకటన త్వరలో ఉంటుందని నాయకులు తెలిపారు. కూటమి భవిష్యత్ నిర్మాణం, కామన్ మినిమమ్ ప్రోగ్రామ్, స్టీరింగ్ కమిటీ వంటి అంశాలపైనా సమావేశంలో చర్చించారు.టీవీకే 2026 అసెంబ్లీ ఎన్నికల అనంతరం అతిపెద్ద పార్టీగా అవతరించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం తమిళనాడు రాజకీయాల్లో కీలక మలుపుగా మారింది. ఇప్పుడు కాంగ్రెస్, వీసీకే, ఎండీఎంకే, ఐయూఎంఎల్‌తో కలిసి అధికార కూటమికి అధికారిక రూపం ఇచ్చింది. మరోవైపు డీఎంకే నేతృత్వంలోని కూటమి, అన్నాడీఎంకే నేతృత్వంలోని కూటములకు ప్రత్యామ్నాయంగా ఈ కొత్త ఫ్రంట్ నిలవనుంది. రాబోయే ఉప ఎన్నికల్లో ఈ మూడు శక్తుల మధ్య పోటీకి ఇది వేదిక కానుంది. అయితే విజయ్ నేతృత్వంలోని ఈ కూటమి ఎన్నికల కూటమిగానే కొనసాగుతుందా? లేదంటే తమిళనాడు రాజకీయాల్లో దీర్ఘకాలిక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతుందా? అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.ఇదీ చదవండి: గెట్ రెడీ ఫర్ సీబీఐ రైడ్స్! -
తమిళనాడులో భగ్గుమన్న ‘దవడ’ రాజకీయం
సాక్షి,చెన్నై: తమిళనాడు సీఎం విజయ్ తన ప్రజారంజక పరిపాలనతో దూసుకుపోతున్నారు. ప్రజాభిష్టమైన నిర్ణయాలతో ప్రశంసలు అందుకుంటూ ప్రతిపక్షాలకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. ఒకవైపు తన ధారాళమైన వాగ్ధాటితో టీవీకే శ్రేణుల్లో జోష్ నింపుతుండగా.. మరోవైపు తన హావభావాలతో ఎమర్జెన్సీ రోజుల్ని గుర్తుచేస్తూ ప్రత్యర్థులను ఇరుకున పెడుతున్నారు. తాజాగా సెప్టెంబర్ 7న తమిళనాడు అసెంబ్లీ వేదికగా ప్రతిపక్ష డీఎంకే అవినీతిపై ఆయన విమర్శలు గుప్పిస్తూ ఇచ్చిన ఓ ‘ఫోజు’ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారానికి దారి తీసింది.అసెంబ్లీ సమావేశంలో డీఎంకే అధినేత, ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్ గతంలో ఎమర్జెన్సీ కాలంలో ఎదుర్కొన్న ఇబ్బందులు, నిర్బంధం గురించి ప్రస్తావిస్తున్న సమయంలో విజయ్ తన దవడను తాకుతూ ఒక రకమైన సైగ చేశారు. విజయ్ చేసిన ఈ బాడీ లాంగ్వేజ్ సైగ.. ఎమర్జెన్సీ (1975-77) కాలంలో ‘మీసా’ చట్టం కింద అరెస్టై, పోలీస్ కస్టడీలో దాడికి గురై దవడ గాయపడిన ఎంకే స్టాలిన్‌ను అపహాస్యం చేసేలా ఉందని డీఎంకే పార్టీ తీవ్రంగా మండిపడింది. స్టాలిన్ ముఖంపై ఉన్న ఆ మచ్చ కేవలం ఒక గాయం కాదని, ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడిన ఒక యోధుడి త్యాగానికి ప్రతీక అని డీఎంకే నేతలు అభివర్ణించారు.1976 జనవరి 31న నాటి సీఎం కరుణానిధి ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం బర్తరఫ్ చేసింది. ఆ సమయంలో యువ డీఎంకే నేతగా ఉన్న ఎంకే స్టాలిన్‌ను అరెస్ట్ చేసి చెన్నై సెంట్రల్ జైలుకు తరలించారు. జైలులో ఆయన అధికారుల దాడికి గురయ్యారని, ఆ దెబ్బల వల్లే ఆయన దవడ గాయపడిందని డీఎంకే వర్గాలు చెబుతుంటాయి. అప్పటి నుంచి ఆ సంఘటన స్టాలిన్ రాజకీయ జీవితంలో ఒక కీలకమైన మైలురాయిగా నిలిచింది.ఈ వివాదం పెద్దది కావడంతో సీఎం విజయ్ స్పందించారు. అసెంబ్లీలో తాను చేసిన ఆ సైగ ఎవరినీ కించపరిచేలా ఉద్దేశపూర్వకంగా చేసింది కాదని, ప్రసంగంలో భాగంగా సాధారణంగా వచ్చిందే తప్ప అందులో ఎలాంటి దుర్బుద్ధి లేదని ఆయన ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు. ఎవరినీ నొప్పించాలనే ఉద్దేశం తనకు లేదని ఆయన పేర్కొన్నారు. అయినప్పటికీ, ఈ అంశంపై అసెంబ్లీలో అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం జరగడం, డీఎంకే సభ్యులు నిరసన తెలపడం తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.మీసా చట్టం అంటేమీసా (MISA - Maintenance of Internal Security Act) దేశంలో అత్యంత వివాదాస్పదమైన చట్టం. దీన్ని భారత పార్లమెంటు 1971లో ఆమోదించింది. దేశంలో అంతర్గత భద్రతను కాపాడటం, శాంతిభద్రతలకు భంగం కలిగించే వారిని కట్టడి చేయడం ఈ చట్టం ఉద్దేశం అని అప్పట్లో ప్రభుత్వం పేర్కొంది. 1975 నుండి 1977 వరకు దేశంలో ఇందిరా గాంధీ ప్రభుత్వం విధించిన అత్యవసర పరిస్థితి కాలంలో ఈ చట్టాన్ని అత్యంత దారుణంగా దుర్వినియోగం చేశారు.ఈ చట్టం కింద ఎవరినైనా సరే, ఎలాంటి వారెంట్ లేకుండా, విచారణ లేకుండా, కోర్టులో ప్రవేశపెట్టకుండా నెలల తరబడి లేదా సంవత్సరాల తరబడి జైల్లో నిర్బంధించవచ్చు. అరెస్టుకు అసలు కారణం కూడా చెప్పాల్సిన అవసరం ఉండేది కాదు. దీనిపై కోర్టులను ఆశ్రయించే హక్కు కూడా అప్పట్లో ఉండేది కాదు.ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటంలో భాగంగా అప్పట్లో అటల్ బిహారీ వాజ్‌పేయి, ఎల్కే అద్వానీ, జార్జ్ ఫెర్నాండెజ్ వంటి జాతీయ స్థాయి నాయకులతో పాటు, తమిళనాడులో ఎంకే స్టాలిన్ వంటి యువ రాజకీయ నాయకులు కూడా ఈ మీసా చట్టం కిందనే అరెస్టయి జైలు శిక్ష అనుభవించారు -
25 ఎకరాల్లో కొత్త సచివాలయం.. రూ.1,200 కోట్లతో నిర్మాణం
సాక్షి, చెన్నై: చెన్నై మెరీనా తీరంలోని పట్టినంబాక్కంలో 25 ఎకరాల విస్తీర్ణంలో బ్రహ్మాండ సచివాలయం, అసెంబ్లీ భవన్ రూపుదిద్దుకోనున్నది. ఇందుకు సంబంధించిన కసరత్తులు మొదలయ్యాయి. బ్రిటిష్ కాలంలో నిర్మించిన చారిత్రాత్మక సెయింట్ జార్జ్ కోట భవనంలో ప్రస్తుతం తమిళనాడు ప్రభుత్వ సచివాలయం, శాసనసభ కొనసాగుతున్నాయి. అక్కడ తీవ్రమైన వాహనాల రద్దీ, పార్కింగ్ ఇబ్బందులు ప్రజల రద్దీ పెరిగిన నేపథ్యంలో చెన్నై పట్టినంబాక్కంలో కొత్త సచివాలయాన్ని నిర్మించడానికి సన్నాహాలు శరవేగంగా జరుగుతున్నాయి. బ్రహ్మాండ భవనంగా.. రూ.1,200 కోట్ల అంచనా వ్యయంతో 25 ఎకరాల విస్తీర్ణంలో ఈ కొత్త సచివాలయం, శాసనసభ సముదాయాన్ని నిర్మించనున్నారు. ఇందులో ప్రధాన భవనాన్ని 20 లక్షల చదరపు అడుగుల వైశాల్యంతో, 15 అంతస్తుల ఎత్తులో అత్యంత అధునాతనంగా రూపొందించనున్నారు. గిండిలోని హైవేస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, నందంబాక్కం ఫిన్‌టెక్ సిటీ ఎదురుగా ఉన్న భూములను పరిశీలించిన అనంతరం,పట్టినంబాక్కంలోని 25 ఎకరాల భూమిని ఈ నిర్మాణాలకు ప్రభుత్వం ఆమోదించింది. శాంతోమ్ ప్రధాన రహదారిని అనుసంధానించే ఈ స్థలం తమిళనాడు హౌసింగ్ బోర్డు పరిధిలోకి వస్తుంది. ఇక్కడ చదరపు అడుగు మార్కెట్ మార్గదర్శక విలువ రూ.22,000 కాగా, మొత్తం భూమి అంచనా విలువ సుమారు రూ.2,047 కోట్లుగాపరిగణించి ఉన్నారు. అనుమతుల మంజూరు మైలాపూర్, పట్టినం బాక్కం పరిధిలోని 21.37 ఎకరాల హౌసింగ్ బోర్డ్ భూమిని ప్రజా ప్రయోజనాల సచివాలయ నిర్మాణానికి ఉపయోగించేందుకు తమిళనాడు హౌసింగ్ బోర్డు అనుమతి ఇచ్చింది. అలాగే మిగిలిన భూమి, రోడ్ల వినియోగానికి చెన్నై కార్పొరేషన్ కమిషనర్, రెవెన్యూ శాఖలు కూడా ఆమోదం తెలిపాయి. 1958లో సేకరించిన ఈ స్థలంలో గతంలో నిర్మించి ప్రస్తుతం శిథిలావస్థకు చేరిన క్వార్టర్స్ భవనాలను కూల్చివేసి స్థలాన్ని ఖాళీ చేసే ప్రక్రియను హౌసింగ్ బోర్డు వేగవంతం చేయడానికి నిర్ణయించింది. చదవండి: మద్యం ప్రియులకు గుడ్‌న్యూస్.. బాటిల్‌పై రూ.10 తగ్గింపు -
విజయ్ వ్యాఖ్యలతో అసెంబ్లీలో తీవ్ర దుమారం
ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ చేసిన ఆరోపణలు తమిళనాడు అసెంబ్లీలో తీవ్ర దుమారం రేపాయి. గత డీఎంకే ప్రభుత్వంలో అవినీతి జరిగిందంటూ విజయ్ ఆరోపణలు చేయడంతో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ ఆరోపణలపై డీఎంకే సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో మంగళవారం సభలో గందరగోళం నెలకొంది.డీఎంకే హయాంలో లోన్ ఈఎంఐ తరహాలో లంచాలు తీసుకున్నారంటూ నిన్న సీఎం విజయ్ ఆరోపించారు. పార్టీ ఫండ్ పేరుతో కాంట్రాక్టర్ల నుంచి డబ్బులు వసూలు చేశారని చెబుతూ.. ఈడీ పత్రాలు, సర్కారియా కమిషన్ నివేదికను ప్రస్తావించారు. అంతేకాదు మాజీ సీఎం ఎం.కే. స్టాలిన్, ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్, మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ తదితరుల పేర్లను కూడా విజయ్ ప్రస్తావించారు. మంగళవారం సభ ప్రారంభమైన వెంటనే డీఎంకే విప్ ఈవీ వేలు.. ఈ అంశాన్ని లేవనెత్తారు. సీఎం విజయ్ తన ప్రసంగంలో ప్రస్తావించిన ఈడీ పత్రాలు, సర్కారియా కమిషన్ నివేదికకు సంబంధించిన వ్యాఖ్యలను సభా రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్‌ను కోరారు. అయితే విజయ్ ప్రస్తావించిన అంశాలు ఇప్పటికే ప్రజలకు అందుబాటులో ఉన్న అధికారిక పత్రాల్లో ఉన్నవేనని స్పీకర్ జేసీడీ ప్రభాకర్ స్పష్టం చేశారు. అందువల్ల వాటిని రికార్డుల నుంచి తొలగించాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పారు.డీఎంకే డిమాండ్‌ను న్యాయశాఖ మంత్రి ఆర్.ఎన్. నిర్మల్‌కుమార్ కూడా వ్యతిరేకించారు. విజయ్ చేసిన వ్యాఖ్యలు సర్కారియా కమిషన్ నివేదిక, ఈడీ అధికారిక పత్రాల ఆధారంగానే ఉన్నాయని పేర్కొన్నారు. గత డీఎంకే ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలను ఆయన సమర్థించారు. దీంతో డీఎంకే సభ్యులు మరింత ఆందోళనకు దిగారు. తమకు సమాధానం చెప్పే అవకాశం ఇవ్వాలని కోరుతూ స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి నినాదాలు చేశారు. సభలో నినాదాలు కొనసాగుతుండటంతో సభా నాయకుడు కేఏ సెంగొట్టయ్యన్ జోక్యం చేసుకున్నారు. స్పీకర్ నిర్ణయం తర్వాత కూడా డీఎంకే సభ్యులు సభా కార్యక్రమాలను అడ్డుకుంటున్నారని, అసెంబ్లీ నిబంధనల ప్రకారం వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. సభ్యులు తమ స్థానాలకు తిరిగి వెళ్లాలని స్పీకర్ హెచ్చరించారు. ఒక నిమిషంలోపు సీట్లలో కూర్చుంటే కేఎన్ నెహ్రూ లేదా ఈవీ వేళుకు మాట్లాడే అవకాశం ఇస్తానని చెప్పారు. అయినప్పటికీ డీఎంకే సభ్యులు వెనక్కి తగ్గలేదు.సభలో గందరగోళం.. అలాగే అనుమతి లేకుండా పోస్టర్లను సభలోకి తీసుకురావడంపైనా స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఆదేశాలను పట్టించుకోకుండా నిరసన కొనసాగించడంతో.. చివరకు మార్షల్స్‌ను రంగంలోకి దించారు. స్పీకర్ ఆదేశాలతో మార్షల్స్ డీఎంకే సభ్యులను సభ నుంచి బయటకు తీసుకెళ్లారు. కొందరు సభ్యులు ప్రతిఘటించడంతో వారిని మార్షల్స్ బలవంతంగా ఎత్తుకుని బయటకు తీసుకెళ్లిన దృశ్యాలు కూడా కనిపించాయి.குழப்பவாதிகள் கூண்டோடு வெளியேற்றப்பட்டனர்‼️#TVK #Vijay pic.twitter.com/7saYzn4m3c— Vivek Rangasamy (@VivekRangasamy) September 8, 2026మరోవైపు, విజయ్ గత ప్రభుత్వంలోని అవినీతి అంశాలను ప్రస్తావించడంపై ఉదయనిధి స్టాలిన్ తీవ్రంగా స్పందించారు. ప్రస్తుత ప్రభుత్వ పనితీరు, ప్రజా సమస్యలపై సమాధానం చెప్పకుండా సీఎం గతాన్ని తవ్వుతున్నారని విమర్శించారు. విజయ్ చేసిన ఆరోపణలు కోర్టులో నిరూపితం కానివేనని పేర్కొంటూ.. ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. -
మద్యం ప్రియులకు గుడ్‌న్యూస్.. బాటిల్‌పై రూ.10 తగ్గింపు
గత వారం నుండి తమిళనాడు వ్యాప్తంగా ఉన్న టాస్మాక్ దుకాణాలు ప్రతి బాటిల్‌పై అదనంగా రూ. 10 వసూలు చేయకుండా పరిమితం చేశారు. అయితే, ప్రభుత్వ ఉత్తర్వును ఉల్లంఘించి మద్యం ప్రియుల నుండి రూ. 10 వసూలు చేసినందుకు కొందరిని తాత్కాలికంగా ఉద్యోగాల నుండి తొలగిస్తున్నారు. ప్రభుత్వ చర్యతో ప్రజల్లో మద్యం ఆదరణ పెరగడంతో, టాస్మాక్ దుకాణాల వద్ద రద్దీ కూడా పెరిగింది.రాత్రి 8 గంటలకు జనం అదుపు తప్పుతున్నారు. రాత్రి 10 గంటలకు కూడా జనం గుమిగూడటంతో దుకాణాలను మూయలేని పరిస్థితి ఏర్పడి సమస్య తలెత్తుతోంది. అందువల్ల, పోలీసు భద్రతతో మాత్రమే దుకాణాలను మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. చెన్నైలోని టాస్మాక్ దుకాణాలలో సాయంత్రం 6 గంటల తర్వాత రద్దీ పెరుగుతుంది. ఈనేపథ్యంలో చాలా దుకాణాలకు పోలీసు భద్రత కల్పిస్తున్నారు. రద్దీని నివారించడానికి మద్యం దుకాణాల వద్ద బారికేడ్లను ఏర్పాటు చేశారు. గతంలో మద్యం కొనుగోలు చేయడానికి వినియోగదారులు వరుసలో నిలబడి, సరిగ్గా చిల్లర చెల్లించాలని కోరుతూ ఒక నోటీసు బోర్డును కూడా ఏర్పాటు చేశారు. తాజాగా టాస్మాక్ ఉద్యోగులు గరిష్ట ధర కంటే ఎక్కువ వసూలు చేయడం కొనసాగిస్తే, వారిని తాత్కాలికంగా సస్పెండ్ చేస్తామని, అదే తప్పును రెండోసారి చేస్తే శాశ్వతంగా ఉద్యోగాల నుండి తొలగిస్తామని ప్రభుత్వం మరోసారి హెచ్చరించింది. -
ఎమ్మెల్యేల భత్యాల పెంపు
సాక్షి, చెన్నై: తమిళనాడు శాసనసభ సభ్యులు తమ నియోజకవర్గాల్లో ప్రజా సేవలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు వీలుగా వారి వివిధ రకాల నెలసరి భత్యాలను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీని నిమిత్తం 1981 నాటి చట్టానికి సవరణలు చేస్తూ అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టారు. ఈ అలవెన్సుల పెంపు వలన రాష్ట్ర ∙నిధి నుండి ఏటా రూ. 43.28 కోట్లు అదనపు ఖర్చు కానుందని ఆర్థిక నివేదికలో ప్రకటించారు. ఎమ్మెల్యేలకు ప్రస్తుతం ఇస్తున్న నెలసరి వాహన భత్యాన్ని రూ. 25వేల నుండి రూ. 75,వేలకు పెంచారు. తాజాగా రూ. 50 వేలు పెరిగింది. ఎమ్మెల్యేలకు సహాయకుడిగా ఉండే వ్యక్తి ఖర్చుల కోసం కొత్తగా నెలకు రూ. 25,000 అలవెన్స్ అందించనున్నారు. శాసనసభ సభ్యుల ఇతర నెలసరి అలవెన్సులను రూ. 1,000 నుండి రూ. 5,000 వరకు పెరనిగాయి. వ్యక్తిగత ఖర్చుల నిమిత్తం నెలకు రూ. 5,000 కొత్త భత్యం అందించనున్నారు. శాసనసభ్యులు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సంక్షేమ విధులు సజావుగా పూర్తి చేయడానికే ఈ భత్యాల పెంపు దోహదపడుతుందని నివేదికలో పేర్కొన్నారు. కాగా, వ్యాపారుల ఫిర్యాదులకు తగిన పరిష్కారం దిశగా రూ. 3 లక్షలతో కొత్త వెబ్ సైట్ రూపకల్పన చేయనున్నామని రెవెన్యూ శాఖ మంత్రి లోకేష్ తమిళ్ సెల్వన్ అసెంబ్లీలో ప్రకటించారు. చతవండి: పవిత్రగౌడ బ్యారక్ మార్పు! -
మెట్రో రైళ్లలో ‘గర్ల్‌ఫ్రెండ్’ యాడ్‌పై కలకలం
చెన్నై మెట్రోలో ప్రదర్శించిన ఫిక్స్డ్ డిపాజిట్ ప్రకటనపై వివాదం చెలరేగింది. మహిళలను వస్తువులుగా చూపించేలా ఈ ప్రకటన ఉందని ద్రవిడ మున్నేట్ర కళగం ఎంపీ తమిళచ్చి తంగపాండియన్ విమర్శించారు. ఈ ప్రకటనను తమిళనాడు రవాణా ఉద్యోగుల తిరువల్లువర్ సహకార రుణ సంఘం (థెకోస్) రూపొందించింది. తమిళనాడు రవాణా ఉద్యోగులకు విశ్వసనీయ సేవలు అందించే సంస్థగా ఇది తనను తాను పేర్కొంటుంది.మెట్రోలో ఏర్పాటు చేసిన పోస్టర్‌పై “గర్ల్‌ఫ్రెండ్ 0% వడ్డీ ఇవ్వవచ్చు.. కానీ, మా ఎఫ్డీ 14.40% వడ్డీ ఇస్తుంది” అని రాశారు. ఫిక్స్డ్ డిపాజిట్ల ద్వారా ఖాతాదారులకు లభించే రాబడిని తెలియజేయడమే ఈ ప్రకటన ఉద్దేశం. ఈ ప్రకటనపై తమిళచ్చి తంగపాండియన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజలు పెద్ద సంఖ్యలో ప్రయాణించే ప్రజా రవాణా వ్యవస్థలో ఇలాంటి ప్రకటనను నిలిపివేయాలని చెన్నై మెట్రో రైల్ యాజమాన్యాన్ని కోరారు.“చెన్నై మెట్రో రైలులో ప్రదర్శించిన ఈ ప్రకటన మహిళలను కించపరుస్తూ, వారిని వస్తువులుగా చూపిస్తోంది. ఇది దిగ్భ్రాంతికరం. బహిరంగ ప్రదేశాల్లో ప్రకటనలు ఇచ్చేటప్పుడు మహిళల గౌరవాన్ని పరిగణనలోకి తీసుకోవడం అవసరం” అని తంగపాండియన్ ఎక్స్‌లో పేర్కొన్నారు. ఈ ప్రకటనను వెంటనే తొలగించాలని ఆమె డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి తప్పిదాలు జరగకుండా ప్రకటనల పరిశీలన నిబంధనలను కఠినతరం చేయాలని అధికారులను కోరారు.ఈ ప్రకటనపై ప్రతిపక్ష నేతల నుంచి విమర్శలు కూడా వచ్చాయి. ప్రకటనను ఆమోదించిన వారిపై నేరుగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అన్నాడీఎంకే అధికార ప్రతినిధి కోవై సత్యన్ డిమాండ్ చేశారు.சென்னை மெட்ரோ இரயிலுக்குள் இடம்பெற்றுள்ள ஒரு விளம்பரம் பெண்களை இழிவுபடுத்தும் வகையிலும், அவர்களை ஒரு பொருளாகச் சித்தரிக்கும் வகையிலும் குறிப்பிடப்பட்டிருப்பது அதிர்ச்சியளிக்கிறது.பொது இடங்களில் பெண்களின் கண்ணியத்தைக் கருத்தில் கொண்டு விளம்பரங்கள் இடம்பெறுவதை உறுதி செய்ய… pic.twitter.com/8bKvka4nD6— தமிழச்சி (@ThamizhachiTh) September 6, 2026 -
టీవీకే నేత దారుణ హత్య, ప్రతిపక్ష నేత స్టాలిన్ విమర్శలు
సాక్షి, చెన్నై: అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య అసెంబ్లీలో దుమారం కొనసాగుతుండగా, మరోవైపు టీవీకే పార్టీలో విషాదం చోటు చేసుకుంది. సెప్టెంబర్ 5న రాత్రి పార్టీకి చెందిన కణ్ణన్ దారుణ హత్యకు గురయ్యారు. ఈ హత్యకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు వైరల్‌గా మారాయి. పాత కక్షలతో ఒక ముఠా అతడిని కిరాతకంగా పొడిచి చంపినట్లు పోలీసులు తెలిపారు. ఈ హత్య కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.కార్ రెంటల్ వ్యాపారం చేసే కణ్ణన్, సెప్టెంబర్ 5న తన స్నేహితులతో ఉన్న సమయంలో ద్విచక్ర వాహనాలపై వచ్చిన ఒక ముఠా ఆయనపై దాడి చేసింది. కత్తిపోట్లతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. శాస్త్రి నగర్ పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి భరణి, రాకేష్, నరేష్, మణికంఠన్, హరిహరన్ అనే ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు.Chennai - TVK functionary S. Kannan was chased and hacked to death by a gang in the Adyar–Besant Nagar area on Saturday night. Police have arrested five men. Kannan was standing near Ellaiamman Koil Street when attackers on two-wheelers surrounded him. He tried to flee, but the… pic.twitter.com/O45DiOOz2b— NextMinute News (@nextminutenews7) September 7, 2026ఇదీ చదవండి: విషాదం : మరికొన్ని గంటల్లో లైవ్, దుబాయ్‌లో సింగర్ హఠాన్మరణం ప్రతీకార హత్యకణ్ణన్పై క్రిమినల్ కేసులతో పాటు, హిస్టరీ షీటర్‌గా రికార్డుల్లో ఉన్నట్లు పోలీసుల తెలిపారు. గతంలో 2009లో భరణి బాబాయి శివను, 2014లో భరణి తండ్రి వేలును కణ్ణన్ బృందం హత్య చేసినట్లు విచారణలో తేలింది. ఆ పాత కక్షలను మనసులో ఉంచుకునే భరణి, అతడి అనుచరులు ఈ హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దాడిని అడ్డుకోవడంలో విఫలమైనందుకు తమిళనాడు డీజీపీ ఆదేశాల మేరకు అడయార్ డిప్యూటీ కమిషనర్ కార్తికేయన్‌తో పాటు శాస్త్రి నగర్ ఇన్స్పెక్టర్ రోహిణిలను వేకెన్సీ రిజర్వ్‌లోకి బదిలీ చేశారు.நாளை மாண்புமிகு முதலமைச்சர் காவல்துறை மானியக் கோரிக்கை விவாதம் மீது பதிலுரை அளிப்பதற்கு முன்பாக அவரது கட்சிப் பிரமுகர் ஒருவரே தலைநகரில் கொலைக்கு ஆளாகியுள்ளார்.அதுவும், தனது உயிருக்குப் பாதுகாப்பு வேண்டி ஆளும் த.வெ.க.வில் இணைந்த சரித்திரப் பதிவேடு குற்றவாளி சாலையில் ஓட ஓட…— Udhay (@Udhaystalin) September 6, 2026మరోవైపు ఈ ఘటనపై ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ ప్రభుత్వంపై మండిపడ్డారు. రక్షణ కోసం అధికార పార్టీలో చేరిన వ్యక్తే వీధిలో దారుణహత్యకు గురయ్యాడని, రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితికి ఇది అద్దం పడుతోందని ఎక్స్‌లో విమర్శలు గుప్పించారు.ఇదీ చదవండి: రూ. 1,470 కోట్ల లాటరీ, సగం దానమిచ్చేసిన టీచరమ్మ! -
త్రిష వివాదం పై స్టాలిన్ కి ఇచ్చి పడేసిన విజయ్
-
విజయ్ వర్సెస్ డీఎంకే.. తమిళనాడు అసెంబ్లీలో రచ్చ రచ్చ
తమిళనాడు అసెంబ్లీ సమావేశాలు సోమవారం తీవ్ర గందరగోళం మధ్య సాగాయి. రాష్ట్రంలో వరుస హత్యలు, శాంతిభద్రతల పరిస్థితిపై అధికార టీవీకే ప్రభుత్వాన్ని ప్రధాన ప్రతిపక్షం నిలదీయడంతో సభలో వాగ్వాదం, నినాదాలు, నిరసనలు చోటుచేసుకున్నాయి. దీనికి ముఖ్యమంత్రి విజయ్ ఘాటుగా బదులిస్తూ.. నేరస్తులు ఏ పార్టీకి చెందినవారైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఇదే సమయంలో డీఎంకేపై అవినీతి ఆరోపణలు చేస్తూ.. ‘పార్టీ ఫండ్స్’ పేరుతో కాంట్రాక్టర్ల నుంచి లంచాలు వసూలు చేశారని ఆరోపించడం సభలో మరింత వేడి పెంచింది.సభ ప్రారంభమైన వెంటనే డీఎంకే సభ్యులు రాష్ట్రంలో పెరుగుతున్న హత్యలను ప్రస్తావిస్తూ నినాదాలు చేశారు. శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని, వరుసగా హత్యలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ దీనిపై చర్చకు అనుమతించాలని స్పీకర్‌ను ప్రతిపక్ష నేత ఉదయ్‌నిధి స్టాలిన్ కోరారు. ఈ అంశంపై అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేందుకు డీఎంకే సభ్యులు ప్రయత్నించడంతో సభలో ఉద్రిక్తత మొదలైంది.దీనిపై ముఖ్యమంత్రి విజయ్ స్పందిస్తూ.. తమ ప్రభుత్వం నేరాల విషయంలో రాజకీయాలకు అతీతంగా వ్యవహరిస్తుందని చెప్పారు. పోలీసులు మంచివారికి మిత్రులుగా, నేరస్తులకు శత్రువులుగా ఉండాలన్నదే తమ విధానమని స్పష్టం చేశారు. నేరస్తుడు ఏ పార్టీకి చెందినవాడైనా చట్టం ముందు సమానమేనని తెలిపారు.‘పోలీసులు పవర్ సెంటర్ కాకూడదు’పోలీసు వ్యవస్థ ప్రజలను భయపెట్టే పవర్‌సెంటర్‌గా మారకూడదని విజయ్ అన్నారు. ప్రజలకు రక్షణ కల్పించడమే పోలీసుల ప్రధాన బాధ్యతగా ఉండాలని చెప్పారు. గత మూడు నెలల్లో జరిగిన నేరాలను ఒకేసారి జరిగిన ఘటనలుగా చూడటం సరికాదని, వాటిలో అనేకం పాత కక్షలు, ప్రతీకారాల కారణంగా జరిగినవేనని వివరించారు.డ్రగ్స్ నియంత్రణకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. కోయంబత్తూరులో జరిగిన ఓ కాలేజీ విద్యార్థి హత్య కేసులో 36 మందిని అరెస్టు చేసినట్లు చెప్పారు. రాష్ట్రంలోని 37 జిల్లాల్లో యాంటీ డ్రగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేశామని, చెన్నైలో మూడు నెలల్లో ఎన్డీపీఎస్ చట్టం కింద 330 కేసులు నమోదు చేసి 556 మందిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు.డీఎంకేపై విజయ్ సంచలన ఆరోపణలుశాంతిభద్రతల అంశంతో మొదలైన అసెంబ్లీ రచ్చ.. ఆ తర్వాత అవినీతి ఆరోపణలతో మరింత ముదిరింది. తమపై అవినీతి ఆరోపణలకు ఆధారాలు చూపించాలని విపక్షాలు పదేపదే డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో.. విజయ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పత్రాన్ని ప్రస్తావించారు.గత డీఎంకే ప్రభుత్వ హయాంలో కాంట్రాక్టర్ల నుంచి కాంట్రాక్టు విలువలో 7.5 శాతం నుంచి 10 శాతం వరకు ‘పార్టీ ఫండ్స్’ పేరుతో వసూలు చేశారని** ఆయన ఆరోపించారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, వాటర్ సప్లై (MAWS) శాఖ పరిధిలో ప్రభుత్వ పనులు చేపట్టే కాంట్రాక్టర్ల నుంచి ఈ మొత్తాలను లంచాల రూపంలో వసూలు చేశారని ఈడీ పత్రంలో పేర్కొన్నట్లు విజయ్ సభలో చదివి వినిపించారు.‘లంచాలు.. లోన్ ఈఎంఐల్లా వసూలు’ఈ క్రమంలో పురుషోత్తం అనే వ్యక్తి పేరును ప్రస్తావించిన విజయ్.. ఆయన నుంచి రూ.29 లక్షలు లంచంగా వసూలు చేసినట్లు ఈడీ నివేదికలో ఉందన్నారు. అయితే ఆ మొత్తం ఒక్కసారిగా తీసుకోలేదని.. లోన్ ఈఎంఐలు చెల్లించినట్టుగా విడతల వారీగా వసూలు చేశారని విజయ్ ఆరోపించారు. అంతేకాదు.. ఈడీ పత్రంలో పేర్కొన్నట్లు ‘పార్టీ ఫండ్స్’కు ప్రత్యక్ష లబ్ధిదారులుగా అప్పటి ముఖ్యమంత్రి, ప్రస్తుత డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్, అప్పటి ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్, రవి ప్రసాద్‌తో పాటు మరికొందరి పేర్లు ఉన్నాయని విజయ్ పేర్కొన్నారు. ఈ ఆరోపణలు తనవి కావని, ఈడీ పత్రంలో ఉన్నవేనని ఆయన స్పష్టం చేశారు.సర్కారియా కమిషన్ నివేదిక ప్రస్తావనడీఎంకేపై అవినీతి ఆరోపణలకు చారిత్రక నేపథ్యం ఉందని చెప్పేందుకు విజయ్ సర్కారియా కమిషన్ నివేదికను కూడా ప్రస్తావించారు. వీరాణం నీటి సరఫరా పథకానికి సంబంధించిన వ్యవహారంలో ‘పార్టీ ఫండ్’ పేరుతో 2.5 శాతం డిమాండ్ చేశారన్న ఆరోపణలు కమిషన్ నివేదికలో ఉన్నాయని చెప్పారు. అప్పట్లో టెండర్ విలువ రూ.16 కోట్లుగా ఉందని తెలిపారు.2001లో మాజీ ముఖ్యమంత్రి జయలలిత, మాజీ మంత్రి పొన్నయ్యన్ కూడా ఈ అంశాన్ని లేవనెత్తారని విజయ్ గుర్తుచేశారు. ‘కొంచెం లోతుగా పరిశీలిస్తే మరెన్నో విషయాలు బయటకు వచ్చాయి’ అంటూ డీఎంకేపై విమర్శలు గుప్పించారు.చివరకు వాకౌట్..విజయ్ వ్యాఖ్యలపై డీఎంకే సభ్యులు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ప్రసంగానికి అడ్డుపడుతూ.. నినాదాలు చేశారు. పలువురు డీఎంకే ఎమ్మెల్యేలు స్పీకర్ జేసీడీ ప్రభాకర్ పోడియం చుట్టూ చేరడంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. కొందరు సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం సభ నుంచి వాకౌట్ చేశారు.ఇదీ చదవండి: డీ బాస్ ఫ్యాన్స్‌కు షాకిచ్చిన కాంగ్రెస్ నేత -
5 నిమిషాల్లో అమ్ముడైన దీపావళి రైలు టిక్కెట్లు
దీపావళి పండుగను నవంబర్ 8వ తేదీన జరుపుకుంటారు. ఈ సందర్భంగా, నవంబర్ 5వ తేదీన తమ స్వస్థలాలకు వెళ్లే వారి కోసం రైళ్లుకు ఆదివారం బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. ఆదివారం తెల్లవారుజామున బుకింగ్ కోసం రైల్వే స్టేషన్ల వద్ద భారీగా జనం గుమిగూడారు. ఉదయం 8 గంటలకు బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. ప్రారంభమైన 5 నిమిషాల్లోనే టిక్కెట్లన్నీ అమ్ముడయ్యాయి. కన్యాకుమారి ఎక్స్‌ప్రెస్‌లోని 2వ తరగతి స్లీపర్ కంపార్ట్మెంట్ కోసం వెయిటింగ్ లిస్ట్‌లో 33 మంది ఉన్నారు. ఏసీ క్లాసులలో పరిమిత సంఖ్యలో సీట్లు ఉన్నాయి.గురువాయూర్ రైలు టిక్కెట్లన్నీ అమ్ముడయ్యాయి. తూత్తుకుడి ఎక్స్‌ప్రెస్ వెయిటింగ్ లిస్ట్ కూడా క్లియర్ చేయబడింది.అనంతపురి, నెల్లై, పుదుచ్చేరి వెళ్లే రైళ్లలో కూడా వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నాయి. నెల్లై, నాగర్‌కోయిల్‌కు వెళ్లే వందే భారత్ రైళ్ల బుకింగ్‌లు కూడా ముగిశాయి. పర్యాటకులకు అత్యంత రద్దీగా ఉండే రోజులు దీపావళి. ఈక్రమంలో దీపావళి టిక్కెట్లను మొబైల్ ఫోన్లో కూడా అధికసంఖ్యలో బుకింగ్ చేసుకోవటం తో 5 నిమిషాల్లో హాట్ కేక్ లా అమ్ముడైపోయాయి. నవంబర్ 6వ తేదీ వెళ్లే వారు సోమవారం బుక్ చేసుకోవాలని ప్రారంభమవుతాయి, నవంబర్ 7వ తేదీకి బుకింగ్‌లు మరుసటి రోజు ప్రారంభమవుతాయని రైల్వేఅధికారులు వెల్లడించారు. -తమిళనాడు చదవండి: మిమ్మల్ని క్షమించేది లేదు -
త్రిషపై వ్యాఖ్యల ఎఫెక్ట్.. విజయ్ సీరియస్ వార్నింగ్
తమిళనాడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి విజయ్ చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి. మహిళలను కించపరిచేలా మాట్లాడితే ఎంతటి వారైనా చట్టం నుంచి తప్పించుకోలేరని ఆయన తేల్చిచెప్పారు. ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ పేరు ప్రస్తావించకుండానే.. ‘మహిళలను అవమానిస్తే చట్టం తన పని తాను చేసుకుపోతుంది’ అంటూ విజయ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం కొనసాగుతున్న త్రిష వివాదానికి మరింత వేడి పెంచాయి. ఉదయనిధి పేరును నేరుగా ప్రస్తావించకపోయినా.. ఆయన వ్యాఖ్యలు తాజా వివాదాన్ని ఉద్దేశించేలా ఉండటం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.తమిళనాడు అసెంబ్లీ వేదికగా సీఎం విజయ్..‘భావ ప్రకటనా స్వేచ్ఛను ఎలా ఉపయోగిస్తున్నామో మనం ఆలోచించాలి. మన ప్రజలను, మహిళలను కించపరిచేలా మాట్లాడకూడదు. మన ఇళ్లలో మహిళలు తల్లులు, సోదరీమణులుగా ఉన్నారు. మహిళలను అవమానిస్తే చట్టం చర్యలు తీసుకుంటుంది’ అని అన్నారు.రాజకీయ విమర్శ వేరు.. అయితే విజయ్ మాత్రం రాజకీయ విమర్శలకు భావ ప్రకటనా స్వేచ్ఛ ఉన్నప్పటికీ.. మహిళలను అవమానించే వ్యాఖ్యలకు ఆ స్వేచ్ఛను అడ్డుపెట్టుకోలేమని స్పష్టం చేశారు. గతంలో అసెంబ్లీలో మాజీ సీఎం జయలలిత ఎదుర్కొన్న అవమానాలను కూడా ఆయన ప్రస్తావించారు. ఇదే సందర్భంగా రాష్ట్రంలో శాంతిభద్రతల అంశంపైనా విజయ్ మాట్లాడారు. పోలీసులు కేవలం నేరస్తులను అరెస్టు చేయడానికే పరిమితం కాకూడదని, నేరాలు జరగకుండా ముందే అడ్డుకోవడమే అసలు లక్ష్యమని చెప్పారు. చట్టాన్ని పాటించే వారికి పోలీసులు స్నేహితులుగా.. ఉల్లంఘించే వారికి శత్రువులుగా ఉండాలని పేర్కొన్నారు.TN Assembly: “If anyone talks in a derogatory manner about women, stern action is assured.”- TN CM Vijay, recalls 'humiliation' of former CM Jayalalithaa in the Assembly pic.twitter.com/c7Y6bD1kCo— News Arena India (@NewsArenaIndia) September 7, 2026పోలీసులకు హెచ్చరికలు.. తమ ప్రభుత్వంలో మహిళలు, చిన్నారులపై నేరాలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని విజయ్ తెలిపారు. నేరం జరిగిన తర్వాత చర్యలు తీసుకోవడం కంటే.. నేరాలను ముందుగానే నిరోధించేందుకు పోలీసులు పనిచేయాలని ఆదేశించినట్లు చెప్పారు. సైబర్ నేరాలపై కూడా ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందన్నారు. అవినీతిపై కూడా విజయ్ కఠిన వైఖరి ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగులు లంచాలు, అవినీతికి దూరంగా ఉండాలని హెచ్చరిస్తూ.. తమ ప్రభుత్వం అవినీతిపై జీరో టాలరెన్స్ విధానాన్ని అనుసరిస్తుందని స్పష్టం చేశారు. పోలీసులపై ఆరోపణలు వచ్చినా వారిని కాపాడే ప్రసక్తి లేదని, లాకప్‌లో జరిగే నేరాలపై పారదర్శక దర్యాప్తు చేపడతామని తెలిపారు.దీంతో త్రిష వివాదం నేపథ్యంలో విజయ్ చేసిన తాజా వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయాల్లో కొత్త చర్చకు తెరతీశాయి. పేర్లు ప్రస్తావించకుండా విజయ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి అన్నదానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. అయితే, ఆగస్టు 3న తంజావూరులో జరిగిన కావేరీ నిరసన కార్యక్రమంలో ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతున్న సమయంలో కొందరు త్రిష పేరును నినాదించారు. ఆ సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ద్వంద్వార్థంగా ఉన్నాయని విమర్శలు వెల్లువెత్తాయి. కాగా, తాను ఎలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయలేదని, తన వ్యాఖ్యలు కావేరీ సమస్యకు మాత్రమే సంబంధించినవని ఉదయనిధి వివరణ ఇచ్చారు. ఈ వ్యవహారంలో ఆగస్టు 4న పోలీసులు ఉదయనిధిని అరెస్టు చేసి తంజావూరుకు తీసుకెళ్లారు. అనంతరం అదే రోజు స్టేషన్ బెయిల్‌పై విడుదల చేశారు. తనపై కేసు నమోదు చేయడాన్ని రాజకీయ కక్ష సాధింపుగా ఆయన అభివర్ణించారు. -
ఆ పక్కకు ఉండలేక.. ఈ పక్కకు రాలేక!
టీవీకే 2029లో లోక్‌సభ ఎన్నికల్లో ఇలాగే తమిళగ వెట్రి కళగం (టీవీకే)లో ఆ పార్టీ వ్యవస్థాపకుడు, ముఖ్యమంత్రి విజయ్ను ప్రధాని అభ్యర్థిగా ముందుకు తెస్తే రాహుల్ గాంధీ, కాంగ్రెస్‌కు ‘ఇక్కడా కాదు.. అక్కడా కాదు’ అనే పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉందని రాజకీయ వ్యూహకర్త అమితాబ్ తివారీ విశ్లేషించారు. అంటే, రాహుల్ గాంధీ మధ్యలో ఇరుక్కుపోయే పరిస్థితి వస్తుంది. విజయ్ 2029లో ప్రధాని అభ్యర్థిగా ముందుకు వస్తే, రాహుల్ గాంధీకి ప్రతిపక్షాల తరఫున ప్రధాన నాయకుడిగా తన స్థానాన్ని బలంగా నిలబెట్టుకోవడం కష్టమయ్యే పరిస్థితి రావచ్చు. విజయ్ ఎదుగుదల వల్ల రాహుల్‌కు ప్రధాని రేసులో స్పష్టమైన ఆధిపత్యం లేకుండా, రాజకీయంగా మధ్యలో ఇరుక్కునే పరిస్థితి రావచ్చు. 2029 ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రిగా విజయ్ పనితీరు, టీవీకేకు లభించే ప్రజాదరణ, కాంగ్రెస్‌తో కొనసాగించే పొత్తు ఈ సమీకరణాలను ప్రభావితం చేసే కీలక అంశాలుగా మారనున్నాయి.తమిళనాడులో అధికారంలో ఉన్న విజయ్ను 2029 లోక్‌సభ ఎన్నికల్లో ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలన్న డిమాండ్ ఇప్పటికే బహిరంగ చర్చకు వచ్చిన విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల సమయంలో మొదలైన ఈ ప్రచారం ఇప్పుడు జాతీయ స్థాయికి విస్తరిస్తోంది. ఇది తమిళనాడులో టీవీకే మిత్రపక్షంగా ఉన్న కాంగ్రెస్‌లో అసౌకర్యానికి కారణమవుతున్నట్లు సమాచారం.విజయ్ను ప్రధాని అభ్యర్థిగా ప్రతిపాదించడం కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీని 2029 ఎన్నికల్లో ప్రతిపక్షాల ప్రధానమంత్రి అభ్యర్థిగా నిలబెట్టేందుకు చేస్తున్న ప్రయత్నానికి నేరుగా సవాల్‌గా మారే అవకాశం ఉంది. ఈ అంశంపై చర్చించేందుకు టీవీకే తన మిత్రపక్షాలతో సెప్టెంబర్ 9న సమావేశం నిర్వహించనుంది.దక్షిణాది నుంచి ప్రధాని రావాలి టీవీకే ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేసుకున్న సమయంలో ఆ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు విజయ్ను జాతీయ రాజకీయాల కోణంలో ప్రస్తావించడం ప్రారంభించారు. మంత్రి ఆధవ్ అర్జున దేశానికి దక్షిణాది నుంచి ప్రధాని రావాలని తమిళనాడు అసెంబ్లీలో వ్యాఖ్యానించారు. మరో మంత్రి జగదీశ్వరి.. విజయ్ ఏదో ఒక రోజు ప్రధాని అవుతారని అన్నారు. ఎమ్మెల్యే కనిమొళి అయితే 2029 లోక్‌సభ ఎన్నికలకు విజయే టీవీకే ప్రధాని అభ్యర్థి అని ప్రకటించారు. “ఎవరు ప్రధాని కావాలో ఢిల్లీ నిర్ణయించదు. తమిళనాడు నిర్ణయిస్తుంది” అని ఆమె అన్నారు. రాహుల్ గాంధీ కూడా విజయ్ ప్రధానమంత్రి కావడానికి మద్దతు ఇస్తారని ఆమె పేర్కొన్నారు.తాజా ఇండియా టుడే సీ ఓటర్ ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వేలో తదుపరి ప్రధానమంత్రిగా విజయ్‌కు 9 శాతం మద్దతు లభించింది. నరేంద్ర మోదీ 48.7 శాతంతో ముందుండగా, రాహుల్ గాంధీ 27.1 శాతంతో రెండో స్థానంలో ఉన్నారు. రాజకీయ విశ్లేషకుడు రషీద్ కిద్వాయ్ మాత్రం 543 స్థానాల లోక్‌సభలో ప్రభుత్వ ఏర్పాటుకు కనీసం 272 మంది సభ్యుల మద్దతు అవసరమని, ప్రస్తుతం విజయ్ను ప్రధాని అభ్యర్థిగా చూడటం తొందరపాటు, అత్యాశతో కూడిన లక్ష్యమని అన్నారు.కాంగ్రెస్ నేతలు మాత్రం విజయ్ ప్రధాని ప్రచారాన్ని తేలికగా తీసుకుంటున్నారు. తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు బి. మాణికం ఠాగూర్ దీన్ని అభిమాన సంఘం తరహా ఆలోచనగా అభివర్ణించారు. కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం మాట్లాడుతూ ప్రధాని కావాలంటే 272 మంది ఎంపీల మద్దతు అవసరమని అన్నారు.ఇదీ చదవండి: మళ్లీ భగ్గుమన్న కంగనా రనౌత్.. దిమ్మతిరిగిపోయేలా కౌంటర్ -
రూ. 6వేలతో మొదలై, రూ.1400 కోట్ల సామ్రాజ్యాన్ని సృష్టించాడు
G R Balasubramaniam success journey తమిళనాడులోని ఒక చిన్న గ్రామంలో పుట్టాడు. తండ్రి చిన్న రైతు , వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించే వ్యాపారి. ఆరుగురు పిల్లలున్న కుటుంబంలో కడుపు నిండా తిండి తినడానికి ఎన్నో కష్టాలు. అందుకే 13 ఏళ్ల వయసులో బడి మానేసి బెంగళూరులో పనికి కుదిరాడు. కట్ చేస్తే..రూ. 1400 కోట్లకు పైగా టర్నోవర్ సాధించే స్థాయికి ఎదిగిన 'జి.ఆర్.బి డెయిరీ ఫుడ్స్' (GRB Dairy Foods) ఫౌండర్ అయ్యాడు. బెంగళూరులోని ఒక చిన్న వెన్న వ్యాపారంగా మొదలైన రూ. 1400 కోట్లకు పైగా ఆదాయం కలిగిన ప్యాకేజ్డ్-ఫుడ్స్ కంపెనీగా ఎదిగింది. ఎంతో స్ఫూర్తిదాయక మైన జీఆర్ బాలసుబ్రహ్మణ్యమ్ విజయప్రస్థానం గురించి తెలుసుకుందాం ఈ కథనంలో.కుగ్రామం నుంచి ప్రారంభమైతమిళనాడులోని పళని సమీపంలోని చిన్న కరాట్టుపట్టి అనే కుగ్రామంలో పుట్టారు బాలసుబ్రహ్మణ్యం. ఆ ఊరి జనాభా కేవలం 300 మంది. సరైన విద్యుత్, రవాణా, నీటి సదుపాయాలు లేవు. తండ్రి పప్పుధాన్యాలు , ఇతర వ్యవసాయ ఉత్పత్తులను కూడా వ్యాపారం చేసేవారు. ఆయన సైకిల్‌పై ఊరూరా తిరుగుతూ, పంటను కొని సమీప పట్టణాలలో అమ్మేవారు. ఆ ఆదాయంతో ఎనిమిది మంది సభ్యులున్నకుటుంబాన్ని పోషించాల్సి ఉండేది. దీంతో 8వ తరగతి చదువుతున్న సమయంలోనే, కుటుంబానికి అండగా ఉండేందుకు బెంగళూరుకు బయలుదేరాడు. అక్కడ అక్క బావలకు చేస్తున్న వ్యాపారానికి తోడుగా నిలిచాడు. దాదాపు అతనికి 13 ఏళ్ల వయసున్నప్పుడు ఇంటింటికీ తిరిగి వెన్న అమ్మడం మొదలుపెట్టాడు. అలా 14 ఏళ్ల పాటు వెన్న వ్యాపారంలో మెళకువలను నేర్చుకున్నాడు. గ్రామాల నుంచి వెన్న సేకరించడం, ఇళ్లకు సరఫరా చేయడం, ఖాతాలు నిర్వహించడం, నెయ్యి తయారీ ప్రక్రియలను క్షుణ్ణంగా నేర్చుకున్నాడు. 1984లో 28 ఏళ్ల వయసులో ఉద్యోగాన్ని వదిలేశారు. సొంతంగా ఏదైనా చేయాలన్నా కుటుంబం ఆర్థికంగా సహాయపడే స్థితిలో లేదు, పైగా సరైన విద్యార్హతలు లేదా వృత్తిపరమైన అర్హతలు లేకపోవడంతో సాధారణ ఉద్యోగం దొరకడం కూడా కష్టంగా ఉండేది. తన వద్ద ఉన్న కేవలం రూ. 6,000 పొదుపు మొత్తంతో వ్యాపారాన్ని ప్రారంభించాలని ఆలోచన. ఇందులో రూ. 3,000 అద్దెకే పోయాయి. ఎలాంటి బ్యాంక్ రుణాలు లేకుండానే పరిచయస్తులతో ఒక 'చిట్ ఫండ్' సంస్థను ప్రారంభించారు. ఆయన బావగారు గతంలో ఇలాంటి పథకాన్ని నిర్వహించేవారు, కాబట్టి బాలసుబ్రహ్మణ్యంకు ఆ విధానంపై అవగాహన ఉండేది.అలా రెండో నెలలోనే రూ. 50,000 చేతికి వచ్చింది. ఆ డబ్బుతో మొదటిసారి వెన్నను కొనుగోలు చేసి, నెలకు 75 కిలోల చొప్పున డోర్-టు-డోర్ డెలివరీ చేయడం ప్రారంభించారు. అయితే ఈ సమయంతో తాను సరఫరా చేసిన వెన్న త్వరగా పాడైపోతుందని, హోటళ్లు/స్వీట్ షాపులు దీనిని నెయ్యిగా మార్చు కోవడంలో ఇబ్బంది పడుతున్నారని గుర్తించారు. అందుకే వెన్న అమ్మడం కంటే, తానే నెయ్యి కాచి, నాణ్యమైన నెయ్యిని తయారుచేసి ప్యాక్ చేసి అమ్మడం లాభదాయకమని భావించాడు. పెద్ద పెద్ద డైరీ బ్రాండ్లు మార్కెట్‌ను శాసిస్తున్న 80వ దశకంలో డెయిరీ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చి పెద్ద సాహసమే చేశాడు. ఏడాదిలోనే వారి నెల ఆదాయం రూ. 25వేలకి పెరిగింది. షాపును అద్దెకు తీసుకుని, సిబ్బందిని నియమించుకున్నారు.ఇదీ చదవండి: వామ్మో, టూటీ ఫ్రూటీ ఇలా తయారుచేస్తారా? వైరల్ వీడియోతొలి ఫ్యాక్టరీ1991లో బెంగళూరులో తొలి ఫ్యాక్టరీని ప్రారంభించారు. తరువాత దిండిగల్, హోసూరు (1999)లలో ప్లాంట్లను ఏర్పాటు చేశారు. మెల్లిగా తన వ్యాపారాన్ని తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ సహా దక్షిణ భారతదేశం అంతటా విస్తరించారు. వ్యాపారం వృద్ధి చెందుతున్న క్రమంలో కేవలం డెయిరీ ఉత్పత్తులకే పరిమితం కాకుండా మసాలా మిక్స్‌లు, ఇన్స్టంట్ మిక్స్‌లు, స్వీట్లు, స్నాక్స్, ఐస్‌క్రీమ్‌ల వ్యాపారంలోకి కూడా అడుగుపెట్టారు.బయటినుంచి ఎలాంటి భారీ పెట్టుబడులు లేకుండానే కేవలం తాను సాధించిన లాభాలను తిరిగి వ్యాపారంలో పెట్టుబడి పెడుతూ సంస్థ లాభాలను భారీ స్థాయిలో పెంచుకుంటూ వచ్చారు. అనేక దశాబ్దాల పాటు, జీఆర్బీ ఒక ప్రైవేట్ యాజమాన్యం లోని, చాలా వరకు సొంత నిధులతోనే నడిచే వ్యాపారంగా కొనసాగింది. రూ. వెయ్యి కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ2014లో రూ. 4.25 కోట్ల నికర లాభాన్ని ఆర్జించిన సంస్థ 2021 నాటికి రూ. 76.67 కోట్ల లాభాన్ని కళ్ల జూసింది. 2024నాటి రూ. 1,011.12 కోట్ల రాబడితో వెయ్యి కోట్ల క్లబ్లో చేరింది. 2025 నాటికి రాబడి రూ. 1,084.47 కోట్లకు చేరగా, నికర లాభం రూ. 75.45 కోట్లుగా నమోదైంది. పట్టుదల, ఆత్మవిశ్వాసంతో 'GRB డైరీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్' బ్రాండ్ 40కి పైగా దేశాల్లో విస్తరించి, ప్రస్తుతం రూ.1,400 కోట్లకు పైగా టర్నోవర్‌ను సాధించింది.ఎంబీఏలు ఐఐటీలు లాంటి చదువు లేకపోయినా, వ్యాపారంలో సంపాదించిన ఆచరణాత్మక అనుభవం, మార్కెట్ అవసరాలను గుర్తించే చాకచక్యంతో జీఆర్ బాలసుబ్రహ్మణ్యం GRB బ్రాండ్‌ను భారతదేశంలోనే అగ్రగామి ప్యాకేజ్డ్ ఫుడ్ కంపెనీలలో ఒకటిగా నిలపడం విశేషం. ఉత్పత్తి నాణ్యత విషయంలో రాజీ పడటం కంటే వ్యాపారాన్ని వదులుకోవడానికే ఆయన మొగ్గు చూపేవారు. ఇది కేవలం ఒక విధానం కాదు, ఆయన దృఢమైన నమ్మకం.,500 మందికి పైగా ఉద్యోగులకు నాయకత్వం వహిస్తున్నారు. పట్టుదలతో, నిబద్ధత ఉంటే విజయతీరాలకు చేరడం సాధ్యమేనని నిరూపించి , తనలాంటి ఎంతోమందికి ప్రేరణగా నిలిచారు. -
నగ్న పూజ చేస్తే కోరికలన్ని నెరవేరుతాయని!
కెనడాకు చెందిన 37 ఏళ్ల శ్రీలంక తమిళ మహిళను మోసం చేసి, వీడియో కాల్ ద్వారా నగ్న పూజలు చేయించిన ఘటన చెన్నైలో వెలుగు చూసింది. ఈ కేసులో టీవీ ఛానళ్లలో కనిపించే గిరి అనే కిళి చిలుక జ్యోతిష్యుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. చెన్నై కోడంబాక్కంలో నివసిస్తూ, టీవీలో వచ్చే చిలుక జ్యోతిష్య కార్యక్రమాలను చూసి బాధితురాలు సంప్రదించింది. ఆమెకు నమ్మకం కలిగించేలా మాట్లాడిన జ్యోతిష్యుడు, ఒక ప్రత్యేక నగ్న పూజ చేస్తే ఆమె కోరికలన్ని నెరవేరుతాయని నమ్మబలికాడు. దానికి అంగీకరించిన సదరు మహిళకు వీడియో కాల్ చేసి, బట్టలు విప్పించి తను కూడా నగ్నంగా ఉంటూ ఈ పూజల కోసం మొదట రూ.20 వేలు తీసుకున్నాడు. ఆ తర్వాత, వీడియో కాల్ మొత్తాన్ని రికార్డ్ చేశానని, తనకు ఇంకా ఎక్కువ డబ్బులు ఇవ్వకపోతే ఆ అశ్లీల దశ్యాలను ఇంటర్నెట్లో లీక్ చేస్తానని సదరు మహిళను బెదిరించడం ప్రారంభించాడు. దీంతో దిగ్భ్రాంతికి గురైన బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు నిందితుడి ఫోన్ నంబర్ ఆధారంగా అతను తెన్కాసి జిల్లాకు చెందిన ఇసక్కి ముత్తు అని, కుట్రాలం పరిసరాల్లో దాక్కున్నట్లు గుర్తించి అరెస్ట్ చేశారు. ఇలాగే మరికొంతమంది మహిళలను కూడా మోసం చేశాడా అనే కోణంలో విచారణ చేస్తున్నారు. -తమిళనాడుచదవండి: లైంగిక దాడిని అడ్డుకున్న కుక్కలు! -
లైంగిక దాడిని అడ్డుకున్న కుక్కలు!
సాక్షి, చెన్నై : మద్యం, గంజాయి మత్తులో ఒక బాలుడి నుంచి మానసిక వైకల్యంతో బాధపడుతున్న మహిళను వీధి కుక్కలు కాపాడిన ఘటన కోయంబత్తూరులోని తుడియలూరు వద్ద అశోకపురంలో వెలుగుచూసింది. ఓ దుకాణంలో అగ్నిప్రమాదానికి సంబంధించి సీసీ కెమెరా ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలిస్తున్న సమయంలో ఈ సంచలన విషయం బయటపడింది. దీంతో ఆ కెమెరా దృశ్యాల ఆధారంగా ఆ బాలుడిని అరెస్టు చేశారు. వివరాలు.. అశోకపురం జీజీఓ కాలనీలోని ఒక దుకాణానికి గురువారం గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో తుడియలూరు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. స్థానికంగా ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌ను తనిఖీ చేశారు. ఇందులో ఓ దృశ్యం పోలీసుల్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అశోకపురం ఫ్లైఓవర్ వద్ద ఒంటరిగా తిరుగుతూ ఉండే ఒక మానసిక వైకల్యంతో బాధపడే మహిళపై మద్యం, గంజాయి మత్తులో ఉన్న బాలుడు లైంగిక దాడికి ప్రయత్నించాడు. Street Dog in Tamil Nadu’s Coimbatore have become unlikely heroes after they intervened and saved a mentally ill woman from an alleged sexual assault attempt by a minor boy. 🐕#TamilNadu #India #Dog pic.twitter.com/LOE5ny0Q6m— মৃত্যুঞ্জয়/姆里蒂尤恩贾伊/Mrityunjay 🇮🇳 (@VloggerCalcutta) September 4, 2026 బాధితురాలు కేకలు వేసినా అర్ధరాత్రి వేళ ఎవరూ పట్టించుకోలేదు. అదే సమయంలో అక్కడే ఉన్న వీధి కుక్కలు తక్షణమే స్పందించాయి. ఆ బాలుడిని చుట్టుముట్టి దాడి చేశాయి. అతడి కాళ్లను కరుస్తూ అడ్డుకున్నాయి. కుక్కల దాడితో భయపడిన బాలుడు అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఫుటేజ్ ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు, గణేష్ నగర్‌కు చెందిన 16 ఏళ్ల బాలుడిని శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. అనంతరం బాలల అబ్జర్వేషన్ హోమ్‌కు తరలించారు. చదవండి: ప్రియుడికి సర్ప్రైజ్ ఇచ్చి.. ఆపై కటకటాల్లోకి! -
త్వరలోనే కేబినెట్లో భారీ మార్పులు?
సాక్షి, చెన్నై: శాసనసభ సమావేశాలు ముగిసిన వెంటనే తమిళనాడు ప్రభుత్వం తమ మంత్రివర్గంలో భారీ మార్పులు, చేర్పులు చేపట్టేందుకు సిద్ధమవుతోంది. కొన్ని నెలలుగా మంత్రుల పరిపాలనా సామర్థ్యం, పనితీరుపై చేయించిన సర్వేలు, అంతర్గత విచారణ ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆశించిన స్థాయిలో రాణించని వారికి, వివాదాల్లో చిక్కుకున్న వారికి పదవుల నుంచి ఉద్వాసన పలికి , సమర్థులైన కొత్తవారికి కీలక శాఖలు అప్పగించేందుకు సీఎం విజయ్ ప్రణాళికలు రచిస్తున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. పారిశ్రామిక అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణలో మరింత వేగం పెంచేందుకు పరిశ్రమల శాఖనుఅధవ్ అర్జునకు అప్పగించే అవకాశం ఉన్నట్టు చర్చ జరుగుతోంది. అలాగే, పాఠశాల విద్యా శాఖను అనుభవడైన సెంగోట్టయాన్‌కు అప్పగించవచ్చని భావిస్తున్నారు.మంత్రి రాజ్ మోహన్‌కు ఇతర ముఖ్య బాధ్యతలు కేటాయించనున్నట్లు సమాచారం. అలాగే, పరిశ్రమల మంత్రి కీర్తనకు మానవ వనరుల అభివృద్ధిశౠఖను అప్పగించే యోచనతో పాటుగా మరి కొందరి స్థానాలు కదిలించే దిశగా టీవీకే నాయకత్వం ఉన్నట్టు చర్చ జరుగుతోంది. అలాగే కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రులు విశ్వనాథన్, రాజేష్ కుమార్ శాఖల్లో సైతం మార్పులు ఉంటాయని తెలుస్తోంది. చదవండి: యోగి సర్కార్‌కు కొత్త టెన్షన్.. అఖిలేష్-సీజేపీ భేటీపై రాజకీయ దుమారం! -
తమిళనాట బిగ్ ట్విస్ట్.. కాంగ్రెస్‌కు విజయ్ మరో షాక్!
చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో అప్పుడే అధికార కూటమికి ‘2029 ఎన్నికల’ సెగ తగులుతోంది. ప్రభుత్వం ఏర్పడి కొన్ని నెలలు కూడా పూర్తికాకముందే.. ‘ప్రధాని అభ్యర్థి ఎవరు?’ అన్న ప్రశ్న టీవీకే-కాంగ్రెస్ మధ్య చిచ్చు రేపుతోంది. ఒకవైపు సీఎం, టీవీకే అధినేత విజయ్ను 2029 ప్రధాని అభ్యర్థిగా తెరపైకి తెస్తున్న ఆయన పార్టీ నేతలు.. మరోవైపు రాహుల్ గాంధీనే ప్రతిపక్ష కూటమి ప్రధాని ముఖంగా కాంగ్రెస్ పట్టుబడుతోంది. దీంతో ఇరు పార్టీల మధ్య రాజకీయ ఉత్కంఠ రోజురోజుకూ పెరుగుతోంది.ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 9న టీవీకే మిత్రపక్షాలతో కీలక సమావేశం నిర్వహించనుండటం తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. సీపీఎం, సీపీఐ, ఎండీఎంకే నేతలను టీవీకే మంత్రులు సమావేశానికి ఆహ్వానిస్తున్నారు. ఈ భేటీలో రాజకీయ ఫ్రంట్ ఏర్పాటుతో పాటు కూటమి భవిష్యత్ వ్యూహంపై చర్చ జరిగే అవకాశం ఉంది. మరోవైపు.. ఈ సమావేశానికి కాంగ్రెస్‌కు ఆహ్వానం లేకపోవడం మరింత ఉత్కంఠకు తెరలేపింది.అసలు కథ మొదలైంది ఇక్కడే..టీవీకేకి చెందిన పలువురు నేతలు వరుసగా ‘విజయ్ ఫర్ పీఎం’ నినాదాన్ని తెరపైకి తీసుకురావడంతో వివాదం మొదలైంది. విజయ్ జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని, 2029లో ప్రధాని అభ్యర్థిగా ఆయనను ముందుకు తీసుకురావాలని పార్టీ నేతలు బహిరంగంగా మాట్లాడుతున్నారు. అంతేకాదు.. విజయ్‌కు రాహుల్ గాంధీ మద్దతు ఇస్తారని కూడా కొందరు టీవీకే నేతలు వ్యాఖ్యానించడం కాంగ్రెస్‌లో మరింత అసహనానికి కారణమైంది.కాంగ్రెస్ వార్నింగ్.. రాహుల్ మా ఛాయిస్!టీవీకేనేతల వ్యాఖ్యలకు కాంగ్రెస్ కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తోంది. 2029లో రాహుల్ గాంధీనే తమ ప్రధాని అభ్యర్థి అని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేస్తున్నారు. విజయ్ను ప్రధాని అభ్యర్థిగా ప్రచారం చేస్తున్నది పార్టీ విధానం కాదని.. కొందరు కొత్తగా వచ్చిన నేతల అభిమాన భావజాలం మాత్రమేనని కాంగ్రెస్ నేతలు కొట్టిపారేస్తున్నారు. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. ఒకే ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న రెండు పార్టీలు.. జాతీయ స్థాయిలో మాత్రం ఇద్దరు వేర్వేరు నేతలను ప్రధాని కుర్చీ కోసం ముందుకు తెస్తున్నాయి. అయితే, ఈ వివాదం మాటలకే పరిమితం కాలేదు. కాంగ్రెస్ మంత్రి ఎస్. రాజేశ్ కుమార్.. రాహుల్ గాంధీని 2029 ప్రధాని అభ్యర్థిగా టీవీకే అంగీకరించకపోతే కాంగ్రెస్‌కు చెందిన మంత్రులు పదవుల్లో కొనసాగడం కష్టమవుతుందని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు కూటమిలోని అంతర్గత ఉద్రిక్తతను మరింత బయటపెట్టాయి.మరోవైపు.. కాంగ్రెస్ నేతలు మాత్రం కూటమిలో ఎలాంటి విభేదాలు లేవని చెబుతున్నారు. కాగా, ముఖ్యమంత్రి విజయ్ మాత్రం ఈ వివాదంపై ఇప్పటివరకు పెద్దగా స్పందించకుండా మౌనం పాటిస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఇప్పుడంతా సెప్టెంబర్ 9 సమావేశంపైనే ఉత్కంఠ నెలకొంది. టీవీకే ఇప్పటికే మిత్రపక్షాలతో చర్చలు మొదలుపెట్టింది. ఈ సమావేశంలో కూటమి నిర్మాణం, రాజకీయ ఫ్రంట్‌కు పేరు, సమన్వయ వ్యవస్థ వంటి అంశాలతో పాటు విజయ్-రాహుల్ వివాదానికి ఏదైనా పరిష్కారం దొరుకుతుందా? అన్నది కీలకంగా మారింది.ఇదీ చదవండి: మంచి స్కూల్స్ అడగటం ప్రభుత్వ వ్యతిరేకమా: సీజేపీ -
దివ్యాంగ మహిళపై లైంగిక దాడికి యత్నం : తరిమి కొట్టిన వీధి కుక్కలు!
సాక్షి, చెన్నై: తమిళనాడులోని కోయంబత్తూర్‌లో దిగ్భ్రాంతికర సంఘటన చోటు చేసుకుంది. మానసిక వికలాంగురాలైన మహిళను లైంగిక దాడి నుంచి వీధి కుక్కలు కాపాడిన వైనం నెట్టింట వైరల్‌గా మారింది. తమిళనాడులోని కోయంబత్తూరులో గురువారం తెల్లవారు జామున ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.నివేదికల ప్రకారం, రోడ్డు పక్కన నిద్రిస్తున్న మానసిక దివ్యాంగురాలైన మహిళపై ఓ యువకుడు లైంగిక దాడికి యత్నించాడు. తుడియలూర్ ప్రాంతంలోని జాతీయ రహదారిపై ఉన్న రైల్వే వంతెన కింద ఈ ఘటన జరిగింది. నిందితుడు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తూ, రోడ్డు పక్కన పడి ఉన్న ఆ మహిళను గమనించాడు. చుట్టుపక్కల ఎవరూ లేరని నిర్ధారించు కున్నాక, అతను ఆమెపై దాడికి యత్నించాడు. మానసిక వైకల్యంతో వీధుల్లో నివసించే ఆ మహిళ భయపడి, సహాయం కోసం కేకలు వేసింది. అయితే ఎవరూ రాలేదు. నిందితుడు ఆమెపై దాడిచేస్తున్నపుడు ఆమె ప్రతిఘటించడానికి ప్రయత్నించింది. కానీ చుట్టుపక్కల ఎవరూ లేరనేధైర్యంతో అతను తన పట్టువీడలేదు. అయితే, రోడ్డుపై ఉన్న రెండు వీధి కుక్కలు ఈ విషయాన్ని గమనించి గట్టిగా అరవడం ప్రారంభిచాయి. మొరుగుతూనే అతని పైకి లంఘించాయి. అయినా ఆమెను వదలకపోవడంతో, కుక్కలు అతనిపై ఎటాక్ చేసి మరీ అక్కడి నుంచి తరిమికొట్టాయి. ఈ దాడికి సంబంధించిన CCTV దృశ్యాలు బయటకు రావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత, లైంగిక దాడికి ప్రయత్నించిన ఆరోపణపై పోలీసులు భూపతి అనే వ్యక్తిని అరెస్టు చేశారు. ఘటన జరిగిన సమయంలో అతను మద్యం మత్తులో ఉన్నాడని పోలీసులు తెలిపారు. మరోవైపు నిస్పహాయురాలైన మహిళను కాపాడిన ఈ వీడియో చూసిన నెటిజన్లు వీధికుక్కల విశ్వాసాన్ని కొనియాడు తున్నారు. கோவை துடியலூர் அருகே நள்ளிரவில் மனநலம் பாதிக்கப்பட்ட பெண்ணை பாலியல் துன்புறுத்தல் செய் முயன்ற இளைஞரைகடித்து விரட்டி விட்ட நாய்கள்.#kovai #tnpolice #womensafety #Chanakyaa Stay informed with the latest news through Chanakyaa via https://t.co/fKuhMnLnfy pic.twitter.com/RUPEDRI7Ty— சாணக்யா (@ChanakyaaTv) September 4, 2026ఇదీ చదవండి: వామ్మో, టూటీ ఫ్రూటీ ఇలా తయారుచేస్తారా? వైరల్ వీడియో -
తమిళనాడులో కొత్త శాసనసభ, సచివాలయం
సాక్షి, చెన్నై: తమిళనాడులో కొత్త శాసనసభ, సచివాలయ భవన సముదాయాన్ని నిర్మించాలని విజయ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రూ.1,200 కోట్లను కేటాయించాలని నిర్ణయించినట్లు తమిళనాడు సీఎం విజయ్ ప్రకటించారు. ఈ నిర్మాణాలు వందేళ్ల పాటు ఉపయోగపడేలా తీర్చిదిద్దుతామని గురువారం అసెంబ్లీలో ఆయన ప్రకటించారు. అలాగే, ప్రస్తుతం ఉన్న సెయింట్ జార్జ్ కోట భవనాలను రాబోయే తరాల కోసం వారసత్వ చిహ్నలుగా భద్రపరుస్తామని చెప్పారు. ఒలింపిక్ సిటీ, మోటార్ స్పోర్ట్స్ సిటీలకు కూడా రూపకల్పన చేస్తున్నట్లు తెలిపారు. -
రూ. 1,200 కోట్లతో వందేళ్లు నిలిచేలా కొత్త సెక్రటేరియట్
సాక్షి, చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ సంచలన నిర్ణయాలతో దూసుకు పోతున్నారు. తాజాగా చెన్నైలో కొత్త శాసనసభ - సచివాలయ (Assembly-cum-Secretariat) భవన సముదాయాన్ని నిర్మించనున్నట్లు గురువారం అసెంబ్లీలో ప్రకటించారు. ఈ నిర్మాణం రాబోయే 100 సంవత్సరాల వరకు ఉపయోగ పడేలా ఉంటుందని ఆయన తెలిపారు.అసెంబ్లీలో రూల్ 110 కింద అనేక ప్రకటనలు చేస్తూ, తమిళనాడు ఒలింపిక్ సిటీని, చెన్నైలో మోటార్ స్పోర్ట్స్ సిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని సీఎం ప్రకటించారు. రాష్ట్ర మౌలిక సదుపాయాలను ప్రపంచ స్థాయికి పెంచడానికి ముఖ్యమంత్రి మూడు ప్రధాన అభివృద్ధి కార్యక్రమాలను ప్రకటించారు.ఇదీ చదవండి: నెలకు రూ. 14 లక్షలు : ఏం వ్యాపారమో తెలిస్తే షాకవుతారుప్రస్తుతం ఫోర్ట్ సెయింట్ జార్జ్ (Fort St George) కాంప్లెక్స్ తమిళనాడు ప్రభుత్వ శాసనసభ , సచివాలయంగా పనిచేస్తోంది. సీఎం విజయ్ ఆధ్వర్యంలో రానున్న కొత్త సెక్రటేరియట్ అంచనా వ్యయం రూ. 1,200 కోట్లుగా భావిస్తున్నారు. 20 లక్షల చదరపు అడుగులవిస్తీర్ణంలో ఇది రూపుదిద్దుకోనుంది. కొత్త కాంప్లెక్స్ నిర్మాణం కోసం ప్రభుత్వం పట్టణపాక్కం, నందంబాక్కం, కోయంబేడు మరియు గిండిలోని హైవేస్ డిపార్ట్మెంట్ ఆఫీస్ ప్రాంగణాలను ఎంపిక చేసింది. గతంలో మాజీ ముఖ్యమంత్రులు జయలలిత, ఎం. కరుణానిధి కూడా అసెంబ్లీ, సచివాలయాలను వేరే చోటికి మార్చాలని ప్రతిపాదించినప్పటికీ, దశాబ్దాలుగా ఫోర్ట్ సెయింట్ జార్జ్ ప్రాంగణమే పాలనా కేంద్రంగా కొనసాగుతోంది.ఇదీ చదవండి: వారెవ్వా.. డ్రాగన్ ఫ్రూట్‌సాగుతో నెలకు రూ. 4 లక్షలు -
స్టాలిన్ ఆశలకు బ్రేక్.. టీవీకే బాబుకు రిలీఫ్
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌కు మద్రాస్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కొలత్తూరు అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంలు, వీవీప్యాట్ ధ్రువీకరణలో అవకతవకలు జరిగాయంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు గురువారం కొట్టివేసింది. ఈ పిటిషన్ అసలు విచారణకే అర్హమైనది కాదని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కొలత్తూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన స్టాలిన్‌ను తమిళగ వెట్రి కజగం (టీవీకే) అభ్యర్థి వీఎస్ బాబు ఓడించారు. బాబుకు 82,997 ఓట్లు (45.09 శాతం) రాగా.. స్టాలిన్‌కు 74,202 ఓట్లు (40.32 శాతం) వచ్చాయి. దీంతో బాబు 8,795 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. స్టాలిన్ రెండో స్థానంలో నిలిచారు. అయితే మే 4న ఫలితాలు వెలువడగా.. మే 7నే 14 ఈవీఎంల బర్న్ట్ మెమరీ, మైక్రోకంట్రోలర్‌ను పరిశీలించాలని ఎన్నికల సంఘానికి స్టాలిన్ దరఖాస్తు చేశారు. కానీ, ఈ 14 ఈవీఎంలు నియోజకవర్గంలోని మొత్తం 286 యంత్రాల్లో 5 శాతం. అయితే ఈ పరిశీలన జూలై 29న మాత్రమే జరిగింది. పరిశీలన సమయంలో రెండు ఈవీఎంలు పనిచేయడం ఆగిపోయాయని, మరో యంత్రానికి సంబంధించిన బ్యాలెట్, కంట్రోల్ యూనిట్లపై అడ్రస్ ట్యాగ్లు సరిగ్గా లేకపోవడంతో పాటు సీల్ విషయంలోనూ లోపాలు ఉన్నాయని స్టాలిన్ ఆరోపించారు. ఒక కంట్రోల్ యూనిట్ తన పేరున్న బ్యాలెట్ యూనిట్‌ను గుర్తించలేదని కూడా ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.అన్ని వీవీప్యాట్ లెక్కింపు కోరుతూ..కొలత్తూరు నియోజకవర్గంలోని మొత్తం 286 ఈవీఎంలను పరిశీలించడంతో పాటు 100 శాతం వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాలని స్టాలిన్ కోర్టును కోరారు. ఈవీఎంల పరిశీలనలో బయటపడిన లోపాల నేపథ్యంలో ఎన్నికల ఫలితాలపై అనుమానాలు వ్యక్తం చేస్తూ.. వీఎస్ బాబు ఎన్నికను చెల్లనిదిగా ప్రకటించాలని, తనను విజేతగా ప్రకటించాలని కూడా అభ్యర్థించారు.ఆలస్యంగా ఈవీఎంల పరిశీలన?స్టాలిన్ తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ కీలక వాదన చేశారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే మే 7న ఈవీఎంల పరిశీలనకు దరఖాస్తు చేసినప్పటికీ.. ఎన్నికల సంఘం జూలై 29న పరిశీలన చేపట్టిందన్నారు. అప్పటికి ఎన్నికల పిటిషన్ దాఖలు చేసేందుకు నిర్దేశించిన 45 రోజుల గడువు ముగిసిపోయిందని తెలిపారు. ఈ నేపథ్యంలో పరిశీలనలో లోపాలు బయటపడిన తర్వాత స్టాలిన్ ఎన్నికల పిటిషన్ ఎలా దాఖలు చేయగలరని ప్రశ్నించారు.ఈసీ అభ్యంతరం ఇదే..అయితే స్టాలిన్ పిటిషన్‌ను విచారించడానికి వీల్లేదని ఎన్నికల సంఘం వాదించింది. ఈసీ తరఫున సీనియర్ న్యాయవాది దామా శేషాద్రి నాయుడు వాదనలు వినిపించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 329(బి) ప్రకారం ఎన్నికల ఫలితాలను సవాలు చేయాలంటే ఎన్నికల పిటిషన్ ద్వారానే వెళ్లాలని పేర్కొంది. ఆర్టికల్ 226 కింద దాఖలు చేసిన రిట్ పిటిషన్ ద్వారా ఆ ప్రక్రియను పక్కదారి పట్టించలేరని తెలిపింది.ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న చీఫ్ జస్టిస్ ఎస్ఏ ధర్మాధికారి, జస్టిస్ జి. అరుల్ మురుగన్‌తో కూడిన ధర్మాసనం స్టాలిన్ దాఖలు చేసిన పిటిషన్ ‘నాట్ మెయింటెయినబుల్’ అని పేర్కొంటూ కొట్టివేసింది. దీంతో కొలత్తూరు ఎన్నికల ఫలితాలను ఈవీఎంల ఆధారంగా సవాలు చేసిన స్టాలిన్ ప్రయత్నానికి ప్రస్తుతానికి బ్రేక్ పడింది.ఇదీ చదవండి: అలా.. విడాకులిచ్చేయాల్సి వచ్చింది! -
ధనుష్ పార్టీకిలోకి TVK మంత్రి..?
-
అలా కేసులు పెట్టడం అమానవీయం.. విజయ్ ఫైర్
ప్రజాస్వామ్యంలో తమ హక్కుల కోసం ఎవరైనా శాంతియుతంగా ఆందోళనలు, నిరసనలు చేపట్టవచ్చని తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ స్పష్టం చేశారు. అయితే అవి హింసాత్మకంగా మారకుండా, ప్రజలకో.. ప్రభుత్వ ఆస్తులకో నష్టం కలిగించకుండా ఉండాలని పేర్కొన్నారు. ఈ క్రమంలో బుధవారం అసెంబ్లీ సాక్షిగా ఓ కీలక ప్రకటన చేశారు.గత డీఎంకే ప్రభుత్వంలో రైతులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని సీఎం విజయ్ ఆరోపించారు. ఈ క్రమంలోనే వాళ్లు ధర్నాలు చేపడితే కేసులు పెట్టారని.. అది అమానవీయమని మండిపడ్డారాయన. ఆయా కేసులు ఐదేళ్ల తర్వాత కూడా ఇంకా పెండింగ్‌లో ఉండడంతో ఇబ్బందులు పడుతున్నారని సభలో తెలియజేశారు. ఈ నేపథ్యంలో రైతులు, టీచర్లపై నమోదైన కేసులన్నింటినీ ఉపసంహరించుకోవాలని తమ ప్రభుత్వం నిర్ణయించినట్లు ప్రకటించారు. దీంతో 2021 మే నుంచి 2026 వరకు ఆందోళనలకు సంబంధించి నమోదైన కేసులన్నీ రద్దు కానున్నాయి.రైతులపై కేసులెందుకు?రాష్ట్రానికి.. దేశానికి రైతులే వెన్నెముక అని విజయ్ పేర్కొన్నారు. వివిధ అభివృద్ధి, పారిశ్రామిక ప్రాజెక్టులకు వ్యతిరేకంగా రైతులు, స్థానికులు చేపట్టిన ఆందోళనల సందర్భంగా కేసులు నమోదయ్యాయని తెలిపారు. ముఖ్యంగా సిప్కాట్ పారిశ్రామిక ప్రాజెక్టులకు వ్యతిరేకంగా జరిగిన నిరసనలు, పరందూర్ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయానికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం సందర్భంగా రైతులపై కేసులు నమోదయ్యాయని చెప్పారు. విజయ్ ప్రకటన చేసిన సమయంలో ప్రతిపక్ష నేత ఉదయ్‌నిధి స్టాలిన్ సభలోనే ఉండడం గమనార్హం.డీఎంకే హయాంలో పరందూర్ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణ ప్రతిపాదన తెర మీదకు వచ్చింది. ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా స్థానిక రైతులు, గ్రామస్తులు సుదీర్ఘంగా ఆందోళనలు చేశారు. ఈ తరుణంలో.. విమానాశ్రయాన్ని రద్దు చేస్తూ విజయ్ ప్రభుత్వం ఇటీవలే నిర్ణయం తీసుకుంది. టీచర్లపైనా..ఉపాధ్యాయులు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో ఆందోళనలు చేసినప్పటికీ వారిపైనా కేసులు పెట్టారని సీఎం విజయ్ తెలిపారు. ఆ కేసులు ఇప్పటికీ పెండింగ్‌లో ఉండటంతో ఉద్యోగులు, వారి కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని చెప్పారు. నిరసన తెలిపే హక్కు ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ ఉందని, ఆ హక్కును వినియోగించుకున్నందుకు కేసులతో వేధించడం సరికాదని వ్యాఖ్యానించారు.ఎన్ని కేసులు?అయితే డీఎంకే హయాంలో రైతులు, ఉపాధ్యాయులపై వివిధ ఆందోళనలకు సంబంధించి ఎన్ని కేసులు నమోదయ్యాయనే పూర్తి సంఖ్యను విజయ్ ప్రభుత్వం ఈ ప్రకటనలో వెల్లడించలేదు. అయితే గతంలో తమిళనాడులో వివిధ ఉద్యమాలకు సంబంధించిన పెండింగ్ కేసులపై ప్రభుత్వాలు దశలవారీగా నిర్ణయాలు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. అయితే విజయ్ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై ప్రతిపక్ష డీఎంకే స్పందించాల్సి ఉంది. ఆ ఇబ్బందుల్ని అర్థం చేసుకున్నాంగత డీఎంకే ప్రభుత్వ హయాంలో ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపిన వారిని అమానవీయంగా వ్యవహరించారని విజయ్ ఆరోపించారు. కేసులు పెండింగ్‌లో ఉండటం వల్ల ఉద్యోగాలు, విదేశీ ప్రయాణాలు, ఇతర వ్యక్తిగత వ్యవహారాల్లో ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఉంటుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బాధితులకు ఉపశమనం కల్పించేందుకే కేసుల ఉపసంహరణ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.ఇదిలా ఉండగా, ఇటీవలే యాంటీ-నీట్ ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులపై నమోదైన కేసులన్నింటినీ ఉపసంహరించుకోవాలని విజయ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఆగస్టు 2న పాఠశాల విద్యాశాఖ మంత్రి రాజ్‌మోహన్ ఈ విషయాన్ని అసెంబ్లీలో ప్రకటించారు. ఇప్పుడు డీఎంకే హయాంలో రైతులు, టీచర్లపై నమోదైన కేసులను కొట్టేయాలని నిర్ణయించడం గమనార్హం.ఇదీ చదవండి: కాంగ్రెస్ ప్లాన్‌బీ.. వాళ్లకు బంపర్ ఆఫర్ -
సబ్‌స్క్రైబ్ చేస్తే తిరుమల లడ్డూ ఉచితం
-
విజయ్‌తో విభేదాల్లేవు.. ఆయనే ప్రధాని అభ్యర్థి!
తమిళనాడు రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వాములైన తమిళగ వెట్రి కళగం (టీవీకే), కాంగ్రెస్ మధ్య విభేదాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. టీవీకే అధినేత, తమిళనాడు సీఎం విజయ్ను ప్రధాని అభ్యర్థిగా ప్రచారం చేయడాన్ని కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అయితే టీవీకే మాత్రం ఈ విషయంలో వెనక్కి తగ్గడం లేదు. ఆ ప్రచారాన్ని మరింత ఉధృతం చేస్తూ హస్తం పార్టీకి అసహనం తెప్పిస్తోంది. ఆ వెంటనే అసెంబ్లీలో సీటింగ్ మార్పు.. ఇరు పార్టీల మధ్య గ్యాప్‌నకు కారణమనే చర్చా నడిచింది. ఈ క్రమంలో తమిళనాడు కాంగ్రెస్ నేతలు కీలక వ్యాఖ్యలు చేశారు.తమిళనాడు అసెంబ్లీలో కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత తరహై కత్బర్ట్(Tharahai Cuthbert) మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని అభ్యర్థిగా రాహుల్‌గాంధీని విజయ్ కూడా అంగీకరించారని ఆమె పేర్కొన్నారు. ‘‘సీఎం రాహుల్‌గాంధీనే ప్రధాని అభ్యర్థిగా ఎంచుకున్నారు. ఆయన కూడా అదే విధంగా ముందుకు వెళ్తున్నారు’’ అని తెలిపారు.‘కాంగ్రెస్ ఎవరికీ బానిస కాదు’టీవీకేకు కాంగ్రెస్ లోబడి పనిచేయడం లేదని తరహై కత్బర్ట్ స్పష్టం చేశారు. తమిళనాడులో తమ పార్టీ స్వతంత్రంగా విస్తరిస్తోందని, కాంగ్రెస్ ప్రజాస్వామ్యబద్ధమైన స్వతంత్ర పార్టీ అని పేర్కొన్నారు. కూటమిలో ఉన్నప్పటికీ పార్టీ స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పారు.అందుకే సీటు మారాల్సి వచ్చిందిఇదిలా ఉండగా.. అసెంబ్లీలో తన సీటు మార్పుపైనా కత్బర్ట్ వివరణ ఇచ్చారు. అంతకు ముందు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీవీకే ఎమ్మెల్యేలతోనే కూర్చున్నారు. తాజా తాజా వివాదం నేపథ్యంలో వాళ్లు కావాలనే సీటు మారి విపక్ష సభ్యులతో కూర్చున్నారనే ఊహాగానాలు వినిపించాయి. అయితే కాంగ్రెస్ శాసనసభాపక్ష నేతగా కొత్త బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలోనే తనకు ముందు వరుసలో సీటు కేటాయించారని, దీనికి ఎలాంటి రాజకీయ కారణం లేదని కత్బర్ట్ స్పష్టం చేశారు. ఇక ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో ‘శుద్ధీకరణ’ వివాదానికి సంబంధించి రాహుల్‌గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదవడాన్ని కూడా కత్బర్ట్ ప్రస్తావించారు. రాహుల్‌కు పెరుగుతున్న ప్రజాదరణను చూసి బీజేపీ ఆందోళన చెందుతోందని ఆరోపించారు. 2029లో రాహుల్‌గాంధీ ప్రధానమంత్రి అవుతారని ఆమె ధీమా వ్యక్తం చేశారు.ఇటీవల ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వేలో ప్రధాని పదవికి విజయ్ మూడో స్థానంలో నిలిచిన నేపథ్యంలో టీవీకే కార్యకర్తలు ఆయనను ప్రధాని అభ్యర్థిగా ప్రచారం చేయడం మొదలుపెట్టారు. దీనిపై కాంగ్రెస్ నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.‘విజయ్ను ప్రధాని అభ్యర్థిగా చేస్తే బయటకొస్తాం’అంతకు ముందు.. విజయ్ను ప్రధాని అభ్యర్థిగా టీవీకే ముందుకు తీసుకెళ్తే కాంగ్రెస్ మంత్రులు తమిళనాడు ప్రభుత్వాన్ని వీడతారని ఆ పార్టీకి చెందిన మంత్రి ఎస్. రాజేశ్ కుమార్ హెచ్చరించారు. ఆగస్టు 30న మార్తాండంలో జరిగిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 2029 ఎన్నికలకు రాహుల్‌గాంధీని ప్రధాని అభ్యర్థిగా టీవీకే అంగీకరించకపోతే తాను, మరో కాంగ్రెస్ మంత్రి విశ్వనాథన్ వెంటనే తమ పదవులకు రాజీనామా చేసి విజయ్ కేబినెట్ నుంచి బయటకు వస్తామని ప్రకటించారు.విజయ్–రాహుల్ మధ్య సాన్నిహిత్యంమరోవైపు విజయ్, రాహుల్‌గాంధీ మధ్య మంచి సంబంధాలున్నాయని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. కరూర్ ఘటన తర్వాత విజయ్‌కు రాహుల్ ఫోన్ చేసి సంఘీభావం తెలపడాన్ని గుర్తు చేశారు. అలాగే ఈ ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే సంచలన అరంగేట్రం చేసింది. దశాబ్దాలుగా రాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్న డీఎంకే, అన్నాడీఎంకే ఆధిపత్యానికి సవాల్ విసిరింది. విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాహుల్‌గాంధీని ఆహ్వానించగా.. వేదికపై ఆయనను తన ‘సోదరుడు’గా విజయ్ అభివర్ణించారు. టీవీకే ప్రభుత్వానికి రాహుల్‌గాంధీ కూడా మద్దతు ప్రకటించారు.మొత్తంగా.. విజయ్ నాయకత్వంలోని తమిళనాడు ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామ్యం కొనసాగుతున్నప్పటికీ, 2029 ప్రధాని అభ్యర్థిత్వం అంశం మాత్రం కూటమిలో కొత్త చర్చకు దారితీస్తోంది. ప్రస్తుతానికి ఇరు పార్టీల నేతలు విభేదాలు లేవని చెబుతున్నా.. విజయ్ పేరును ప్రధాని అభ్యర్థిగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు, రాహుల్‌గాంధీకి కాంగ్రెస్ మద్దతు నేపథ్యంలో భవిష్యత్తులో ఈ అంశం కూటమి మధ్య విభేదాలకు కారణమయ్యే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ఇదీ చదవండి: కాంగ్రెస్ చెప్పిన ఆ గుంటనక్క ఎవరు? -
తమిళనాడు ఆలయాల్లో ‘నో ఫోన్’.. నేటి నుంచే అమలు
చెన్నై: తమిళనాడులోని ప్రముఖ ఆలయాల్లో ఇకపై సెల్‌ఫోన్ మోగదు.. కెమెరా క్లిక్మనదు. ఆలయాల పవిత్రత, ప్రశాంత వాతావరణాన్ని కాపాడేందుకు ఆలయ ప్రాంగణాల్లోకి మొబైల్ ఫోన్లను తీసుకెళ్లడంపై నిషేధం అమల్లోకి వచ్చింది. నేటి (సెప్టెంబర్ 1) నుంచి రాష్ట్రంలో తొలి దశలో 52 ప్రధాన ఆలయాల్లో ఈ నిబంధనను అమలు చేస్తున్నారు.ఆలయాల్లో సెల్ఫీలు, ఫొటోలు, వీడియోలు, సోషల్ మీడియా రీల్స్ చిత్రీకరణకు అడ్డుకట్ట వేయడమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశంగా అధికారులు చెబుతున్నారు. దేవతామూర్తులతో పాటు వీఐపీలు, ప్రముఖులు, సినీ తారల ఫొటోలు, వీడియోలు తీయడానికీ అనుమతి ఉండదు. భక్తులు తమ మొబైల్ ఫోన్లను ఆలయాల ప్రవేశ ద్వారాల వద్ద ఏర్పాటు చేసిన డిపాజిట్ కేంద్రాల్లో భద్రపరచుకోవాలి. ఒక్కో ఫోన్‌కు రూ.5 ఫీజు వసూలు చేసి రసీదు ఇవ్వాలని అధికారులు ఆదేశించారు. దర్శనం అనంతరం రసీదు చూపించి తమ ఫోన్లను తిరిగి తీసుకోవచ్చు.ఈ నిర్ణయానికి 2022లో మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు కూడా ఆధారంగా ఉన్నాయి. ఆలయాల పవిత్రత, భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆలయ ప్రాంగణాల్లో మొబైల్ ఫోన్లు, కెమెరాల వినియోగాన్ని నియంత్రించవచ్చని కోర్టు పేర్కొంది. దీంతో ఇకపై తమిళనాడులోని ప్రముఖ ఆలయాలకు వెళ్లే భక్తులు ‘ముందు దర్శనం.. ఆ తర్వాతే ఫోన్’ అన్న నిబంధనను పాటించాల్సి ఉంటుంది. -
రూ. 15 లక్షల కారు, 70 తులాల గోల్డ్ : అయినా కట్నదాహానికి టీచర్ భువనేశ్వరి ఆహుతి
సాక్షి, చెన్నై: చెన్నైలోని కోవిలంబక్కమ్లో మరో వరకట్న మరణం విషాదాన్ని నింపింది. ఉన్నత విద్యావంతురాలు, ఉద్యోగం, పెళ్లి సమయంలో భారీగా కట్నకానుకలు ముట్టజెప్పినప్పటికీ అత్తింటివారి ఆశ తీరలేదు. వేధింపులను తట్టుకోలేక పెళ్లైన రెండేళ్లకే ఏడాదిన్నర పసిగుడ్డును అనాథను చేసి, ఆమె ఉసురు తీసుకుంది.మృతురాల్ని చెన్నైలోని కోవిలంబాక్కంలో ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న భువనేశ్వరి (27)గా గుర్తించారు. M.Sc. B.Ed. పూర్తి చేసి ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. ఆమెకు ఒక సంవత్సరం వయసున్న కుమారుడు ఉన్నాడు. భారీగా కట్నం, అయినా తీరని దాహంభువనేశ్వరికి 2024 సెప్టెంబర్‌లో వివాహమైంది. పెళ్లి సమయంలో ఆమె కుటుంబ సభ్యులు రూ. 15 లక్షల విలువైన కారు, 50 సవర్ల బంగారం ఇచ్చారు. అదనంగా వరుడికి మరో 20 సవర్ల బంగారం సమర్పించారు. పెళ్లయిన రెండేళ్లలోపే అదనపు కట్నం కోసం భర్త, అతని కుటుంబ సభ్యులు భువనేశ్వరిని శారీరకంగా, మానసికంగా వేధించడం ప్రారంభించారు. ఇటీవల కుమారుడి మొదటి పుట్టినరోజు సందర్భంగా ఆమె తల్లిదండ్రులు బాబుకు బంగారు గొలుసు కానుకగా ఇచ్చారు. ఈ విషయంలో దంపతుల మధ్య తీవ్ర వివాదం చెలరేగింది.ఇదీ చదవండి: 12 ఏళ్లు ఆర్మీకి సేవలు : గుడ్‌బై చెప్పిన ‘నేషనల్ క్రష్’పెళ్లి అయింది మొదలు భర్త , అత్తమామలు నిరంతర కట్న వేధించేవారనీ, వాటిని భరించలేక తమ బిడ్డ ప్రాణాలు తీసుకుందని తండ్రి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. వివాహమైన ఏడేళ్లలోపు అనుమానాస్పద మృతి కావడంతో వరకట్న మరణంగా కేసు నమోదు చేశారు. దీనిపై RDO (రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్) విచారణకు ఆదేశించారు.ఇదీ చదవండి: నెవ్వర్ బిఫోర్ : లగ్జరీ ఈవీలపై శ్రీమంతుల మోజు -
‘విజయ్ ఫర్ పీఎం’.. గుంటనక్క కథతో కాంగ్రెస్ సెటైర్!
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ పేరుతో మరో కొత్త చర్చ మొదలైంది. 2029లో ప్రధానమంత్రి అభ్యర్థిగా విజయ్ను ప్రొజెక్ట్ చేస్తూ ఆయన పార్టీ టీవీకే వర్గాలు కొంత కాలంగా ప్రచారం చేస్తున్నాయి. తాజాగా ఇండియా టుడే–సీవోటర్ ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వేలో ప్రధాని పదవికి విజయ్ మూడో స్థానంలో నిలవడం ఈ ప్రచారానికి మరింత ఊతమిచ్చింది. ఈ తరుణంలో.. అక్కడి ప్రతిపక్ష డీఎంకేతో పాటు టీవీకే మిత్రపక్షం కాంగ్రెస్ కూడా వ్యంగ్యాస్త్రాలు సంధిస్తోంది.రాజకీయ ఉద్దండులను తోసేసి మరీ.. నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ తర్వాత ప్రధాని రేసులో విజయ్ ఉన్నారన్నది ఇండియాటుడే సర్వేలో వెల్లడైంది. అంతేకాదు సమర్థవంతమైన ప్రతిపక్ష నేతగానూ ఆయనకు అర్హత ఉందంటూ రాహుల్ గాంధీ తర్వాతి ప్లేస్‌ను కట్టబెట్టారు. దీంతో విజయ్‌కు జాతీయ స్థాయిలో ఆదరణ ఉందని.. రాబోయే రోజుల్లో పక్కా దేశానికి ప్రధాని అవుతారంటూ టీవీకే హడావిడి చేస్తోంది. అయితే ఈ ప్రచారంపై డీఎంకే నేత ఆర్ఎస్ భారతి స్పందిస్తూ ఆయన పార్టీ కార్యకర్తలు కోరుకుంటే విజయ్ పీఎం ఏంటి.. ఏకంగా ఐక్యరాజ్యసమితి అధిపతి అవుతారని సెటైర్ వేశారు.“వారి ఊహలకు హద్దుల్లేవు.. ఏదైనా ఊహించుకోనివ్వండి” అంటూ ఆర్ఎస్ భారతి కామెంట్ చేశారు. విజయ్ను ప్రధాని అభ్యర్థిగా ప్రచారం చేస్తే.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధాని కావాలనే ఆ పార్టీ ఆశయం ఏమైపోతుందో అంటూ ఇంకో చురక అంటించారు.కాంగ్రెస్ గుంటనక్క కథ.. ఇండియా టుడే సర్వే, టీవీకే చేస్తున్న ప్రచారంపై కాంగ్రెస్ పార్టీ ఎంపీ మాణిక్కం ఠాగూర్ కూడా పరోక్షంగా స్పందించినట్లు ఆయన తాజా ట్వీట్‌తో స్పష్టమవుతోంది. ‘ది ఫాక్స్ ఫేక్ పోల్’ పేరుతో ఓ నక్క కథను ఎక్స్‌లో పంచుకున్న ఆయన.. సర్వేలో ఎంతమందిని ప్రశ్నించారు? ఎక్కడ నిర్వహించారు? ఏ ప్రశ్నలు అడిగారు? ఫలితాలను ఎలా లెక్కించారు? వంటి అంశాలను ప్రస్తావించారు. “ప్రతి సంఖ్య నిజాన్ని చెప్పదు.. ప్రతి సర్వే ప్రజల గొంతుక కాదు” అంటూ తేల్చేశారు. ఆయన చెప్పిన కథలో ఏముందంటే..ఒక అడవిలో సింహం, ఏనుగు మంచి స్నేహితులు. అడవికి సంబంధించి ఏ నిర్ణయమైనా ఇద్దరూ కలిసే తీసుకుంటారు. వారి స్నేహాన్ని చూసి ఈర్ష్యపడిన గుంటనక్క.. కొందరిని మాత్రమే అడిగి ఓ సర్వే నిర్వహిస్తుంది. ఆ సర్వే పేరుతో సింహానికి ఏనుగుపై, ఏనుగుకు సింహంపై అనుమానాలు కలిగించి వాళ్లను విడగొట్టాలని చూస్తుంది. చివరకు ఓ చీమ.. ముందుకు వచ్చి నక్కను అందరి ముందే నిలదీస్తుంది. సర్వేలో ఎంతమందిని అడిగారు? ఎక్కడ నిర్వహించారు? ఏ ప్రశ్నలు వేశారు? ఫలితాలను ఎలా లెక్కించారు? అని ప్రశ్నించడంతో నక్క నీళ్లునములుతూ కనిపిస్తుంది. అలా ఏనుగు-సింహం స్నేహం చెడిపోకుండా కాపాడుతుంది. படித்ததில் பிடித்த ஒரு குட்டி கதை …நரியின் போலி கருத்துக்கணிப்புஒரு காட்டில் சிங்கமும் யானையும் நெருங்கிய நண்பர்களாக இருந்தனர்.காட்டில் எந்தப் பெரிய முடிவாக இருந்தாலும், இருவரும் ஒன்றாக ஆலோசனை செய்வார்கள்.ஒருநாள், அந்த நட்பைப் பார்த்து பொறாமைப்பட்ட நரி, ஒரு…— Manickam Tagore .B🇮🇳மாணிக்கம் தாகூர்.ப (@manickamtagore) August 30, 2026ఇండియాటుడే చానెల్ ఈ మధ్యే తమిళంలోనూ అడుగు పెట్టింది. అది సీఎం విజయ్ చేతుల మీదుగానే ప్రారంభం కావడం గమనార్హం.విజయ్‌కు మూడో స్థానంఆగస్టు 28న వెలువడిన తాజా ఇండియా టుడే–సీవోటర్ ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వేలో ప్రధాని పదవికి ప్రజల ఎంపికలో విజయ్ మూడో స్థానంలో నిలిచారు. ఈ సర్వేలో 25,184 మందిని నేరుగా ప్రశ్నించారు. వీటితో పాటు గత ఆరు నెలల్లో నిర్వహించిన మరో 91,795 ఇంటర్వ్యూల డేటాను కూడా విశ్లేషణలో ఉపయోగించారు. మొత్తం 9.2% మంది విజయ్ తదుపరి ప్రధాని కావడానికి అనుకూలంగా ఓటేశారు. ప్రధాని నరేంద్ర మోదీకి 48.7%, రాహుల్ గాంధీకి 27.1% మద్దతు లభించింది. దీంతో 2029 లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా టీవీకే వర్గాల్లో ‘విజయ్ ఫర్ పీఎం’ నినాదం మరింత బలంగా వినిపిస్తోంది. తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో విజయ్ను ప్రధాని చేయాలంటూ పోస్టర్లు కూడా వెలిశాయి. ఈ తరుణంలో మిత్రపక్షం కాంగ్రెస్ నుంచే కౌంటర్లు రావడం తమిళనాట చర్చనీయాంశంగా మారింది.ఇదీ చదవండి: సెప్టెంబర్ 17న తమిళ రాజకీయాల్లో బిగ్ బాంబ్? -
స్టాలిన్ బిగ్ ప్లాన్.. సెప్టెంబర్ 17పై నేతల్లో టెన్షన్!
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పరాజయం డీఎంకేలో భారీ సంస్థాగత మార్పులకు దారితీస్తోంది. ఓటమికి కారణాలను విశ్లేషించిన కమిటీ నివేదిక ఆధారంగా పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం ఎం.కె. స్టాలిన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. 77 జిల్లాలను ఏకంగా 110 జిల్లాలుగా విభజించి.. పార్టీలో సీనియర్ల ఆధిపత్యాన్ని తగ్గిస్తూ కొత్త నాయకత్వానికి అవకాశం కల్పించే దిశగా అడుగులు వేస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.ప్రతీ రెండు అసెంబ్లీ నియోజకవర్గాలను ఒక జిల్లాగా ఏర్పాటు చేయడంతో.. కొత్త జిల్లాలకు తాత్కాలిక ఇన్చార్జులను నియమించేందుకు కసరత్తు వేగం పుంజుకుంది. ఇప్పటికే ఉన్న జిల్లా కార్యదర్శులు కార్యవర్గ సమావేశాలు నిర్వహించి 15 రోజుల్లో అధిష్టానానికి సిఫార్సులు పంపాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఎవరికి ప్రమోషన్.. ఎవరికి షాక్? అన్న ఉత్కంఠ డీఎంకేలో నెలకొంది.సీనియర్లకు చెక్.. కొత్తవారికి ఛాన్స్?వయోపరిమితి కారణంగా 15 మందికి పైగా సీనియర్ నేతలకు జిల్లా స్థాయిలో అవకాశం దక్కకపోవచ్చని తెలుస్తోంది. మరికొందరు మాజీ మంత్రులు, కీలక నేతల అధికారాలను కూడా పరిమితం చేసే యోచనలో స్టాలిన్ ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా చెన్నై, మదురై జిల్లాల్లో పార్టీ పనితీరుపై జరిగిన సమీక్షల నేపథ్యంలో కొందరు సీనియర్ నేతలకు షాక్ తప్పదనే ప్రచారం జరుగుతోంది. చెన్నైలో మాజీ మంత్రులు పీకే శేఖర్‌బాబు, ఎం. సుబ్రమణ్యం, మాజీ ఎమ్మెల్యే మైలై వేలు, మాధవరం సుదర్శనం వంటి నేతల విషయంలో మార్పులు ఉండొచ్చనే చర్చ సాగుతోంది. మరోవైపు యువనేత ఉదయనిధి స్టాలిన్‌కు సన్నిహితులుగా భావించే కొందరికి కొత్త బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.సెప్టెంబర్ 17న అసలు సీన్!కొత్తగా ఏర్పాటు చేసిన 110 జిల్లాల ఇన్చార్జులను సెప్టెంబర్ 17న జరిగే డీఎంకే ముప్పెరుం విళా వేదికగా స్టాలిన్ పార్టీ శ్రేణులకు పరిచయం చేయనున్నట్లు సమాచారం. దీంతో ఆ రోజున డీఎంకేలో భారీ స్థాయిలో సంస్థాగత మార్పులకు తెరలేవచ్చన్న అంచనాలు నెలకొన్నాయి. ఎన్నికల ఓటమి నుంచి పాఠాలు నేర్చుకున్న స్టాలిన్.. ఇప్పుడు పార్టీని కింది స్థాయి నుంచి రీబిల్డ్ చేయడంపై ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. అయితే ఈ ప్రక్షాళనలో సీనియర్లకు ఎంతమేర షాక్.. కొత్త నాయకత్వానికి ఎంతమేర ఛాన్స్ దక్కుతుందన్నదే ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. -
ఎంతో కష్టపడి నీట్లో సక్సెస్..అంతలోనే విషాదం
సాక్షి, చెన్నై: పరీక్షల ఒత్తిడి కారణంగా మరో విద్యార్థిని జీవితం అర్థాంతరంగా ముగిసిసోయింది. తమిళనాడులోని తిరునెల్వేలికి చెందిన శ్రుతి లయ (21) అనే మెడికల్ ఆశావాది (NEET-UG అభ్యర్థి) నీట్ మొదటి విడత కౌన్సెలింగ్‌లో సీటు రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది.వైద్యురాలు కావాలనే లక్ష్యంతో వరుసగా ప్రయత్నించినప్పటికీ ఫలితం దక్కకపోవడంతో ఈ దారుణానికి ఒడిగట్టినట్టు తెలుస్తోంది.ఐటీ ఉద్యోగి కుమార్తె అయిన శ్రుతి లయ 2023లో పాఠశాల విద్యను పూర్తిచేసి, వైద్యురాలు కావాలనే కోరికతో నీట్ (NEET) కోచింగ్ సెంటర్లో చేరింది. గత ఏడాది NEET-UG పరీక్ష రాసినప్పటికీ వైద్య సీటు రాకపోవడంతో ఈ సంవత్సరం మళ్లీ తీవ్రంగా శ్రమించి నీట్-యుజి (NEET-UG) పరీక్షలో అర్హత సాధించింది. అయితే, ఇటీవల విడుదలైన మొదటి విడత కౌన్సెలింగ్ జాబితాలో తన పేరు లేకపోవడంతో తీవ్ర నిరాశకు గురైంది.ఇదీ చదవండి: Nepal Flash Floods 1600 మందిని కాపాడిన ఒకే ఒక్కడు!ఫలితం తెలిసిన రోజు రాత్రి నిద్రపోవడానికి వెళ్లిన ఆమె, మరుసటి రోజు ఉదయం కనిపించలేదు. కుటుంబ సభ్యులు గాలించగా ఇంటికి సమీపంలో ఉన్న ఒక షెడ్డులో ఉరివేసుకుని కనిపించింది. స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.ఇదీ చదవండి: యూపీలో సీనియర్ ఐఏఎస్ అధికారిణి రాజీనామా కలకలం -
విజయ్ సంచలన నిర్ణయం.. స్టాలిన్ భద్రత భారీగా కుదింపు
చెన్నై రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ సీఎం, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌కు భద్రత కుదించారు. ఇప్పటివరకు కొనసాగుతున్న Z+ భద్రతను Z కేటగిరీకి తగ్గిస్తూ విజయ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో స్టాలిన్‌కు భద్రత కల్పించే సిబ్బంది సంఖ్య కూడా 58 నుంచి 33కి తగ్గనుంది. ఇంటెలిజెన్స్ నివేదికలు, ముప్పు అంచనాల ఆధారంగా భద్రతా సమీక్ష అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే మాజీ సీఎం భద్రత తగ్గింపు తమిళనాడు రాజకీయ వర్గాల్లో ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.కాగా, భద్రతా విభాగం నిర్వహించిన క్రమబద్ధమైన సమీక్ష అనంతరం ఈ నిర్ణయం వెలువడింది. తమిళనాడులో వీఐపీలు, వీవీఐపీలకు కల్పించే భద్రతను సాధారణంగా ప్రతి ఆరు నెలలకు ఒకసారి సమీక్షిస్తారు. ఇంటెలిజెన్స్ నివేదికలు, ముప్పు తీవ్రత, సంబంధిత వ్యక్తి ప్రజల్లో తిరిగే పరిస్థితి, ప్రయాణాల తీరు, భద్రత అవసరాలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని భద్రతా కేటగిరీని కొనసాగించాలా? పెంచాలా? తగ్గించాలా? అన్నది నిర్ణయిస్తారు.58 నుంచి 33కు భద్రతా సిబ్బంది..Z+ భద్రతలో స్టాలిన్‌కు రోజువారీ రొటేషన్ పద్ధతిలో సుమారు 58 మంది సిబ్బంది భద్రత కల్పిస్తున్నట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి. తాజా నిర్ణయంతో ఈ సంఖ్య 33కు తగ్గనున్నట్లు సమాచారం. అయితే కొన్ని నివేదికల్లో కొత్త Z కేటగిరీ కింద విధుల్లో ఉండే సిబ్బంది సంఖ్యను వేరుగా పేర్కొన్నారు. భద్రత పూర్తిగా తొలగించడం మాత్రం జరగలేదు. స్టాలిన్ కాన్వాయ్‌లో ముందు, మధ్య, వెనుక భాగాల్లో భద్రతా బృందాలను కొనసాగించనున్నారు. పైలట్, ఎస్కార్ట్, బ్యాకప్, క్లోజ్ ప్రొటెక్షన్ వాహనాలతో ఆయనకు రక్షణ కొనసాగుతుందని అధికారులు తెలిపారు.🚨 SECURITY COVER FOR M.K. STALIN REDUCEDDMK leader M.K. Stalin’s Z-category security has been withdrawn. He will now receive escort security as a former Chief Minister, with four police personnel led by an SI assigned to his security.#MKStalin #DMK #Stalin #SecurityCover… pic.twitter.com/b44TG81S9p— Chennai Memes (@memeschennai) August 30, 2026సమీక్ష తర్వాతే నిర్ణయం..స్టాలిన్ భద్రతపై రాష్ట్ర సచివాలయంలోని కోర్ సెల్ సెక్యూరిటీ వింగ్ సమీక్ష నిర్వహించింది. ప్రధాన కార్యదర్శి సాయి కుమార్, హోంశాఖ కార్యదర్శి కె. మణివాసన్, డీజీపీ మహేశ్ కుమార్ అగర్వాల్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్, స్టాలిన్ ప్రస్తుత భద్రతా అవసరాలను పరిశీలించిన అనంతరం భద్రతా కేటగిరీని తగ్గించాలని నిర్ణయించినట్లు అధికారులు చెబుతున్నారు. అధికారుల ప్రకారం ఇది భద్రతను పూర్తిగా ఉపసంహరించుకోవడం కాదని.. ముప్పు అంచనాకు అనుగుణంగా భద్రతా బందోబస్తును పునర్వ్యవస్థీకరించడమేనని స్పష్టం చేశారు. తాజా ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా అవసరమైతే భవిష్యత్తులో భద్రతను మళ్లీ పెంచే అవకాశం కూడా ఉంటుంది.చదవండి: ‘థమన్‌కు 10 లక్షలా?.. కోర్టులో విజయ్ మాస్ కౌంటర్!రాజకీయంగా ఆసక్తికరంగా మారిన నిర్ణయంఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకేకు గట్టి ఎదురుదెబ్బ తగిలిన నేపథ్యంలో స్టాలిన్ భద్రత కుదించడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. అయితే భద్రత తగ్గింపునకు ఎన్నికల ఫలితాలతో ఎలాంటి సంబంధం లేదని, ఇది పూర్తిగా ప్రొఫెషనల్ థ్రెట్ అసెస్మెంట్ ఆధారంగా తీసుకున్న నిర్ణయమని అధికారులు పేర్కొంటున్నారు. అంతేకాదు, స్టాలిన్ ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పటికీ డీఎంకే అధ్యక్షుడిగా తమిళనాడులో కీలక రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్నారు. అందువల్ల ఆయన భద్రతా కేటగిరీ మార్పు రాజకీయ వర్గాల్లో మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. -
‘థమన్‌కు 10 లక్షలా?.. కోర్టులో విజయ్ మాస్ కౌంటర్!
తమిళనాడు రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. టీవీకే అధినేత, సీఎం విజయ్ ఎన్నికల పిటిషన్‌పై మద్రాస్ హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. టీవీకే ఎన్నికల ప్రచార గీతం కోసం సంగీత దర్శకుడు థమన్‌కు రూ.10 లక్షలు చెల్లించారన్న ఆరోపణకు ఎలాంటి ఆధారాలు లేవని విజయ్ స్పష్టం చేశారు. వాస్తవంగా ఆ మొత్తం చెల్లించినట్లు నిరూపించే ఒప్పందం, ఇన్వాయిస్, రసీదు, కోట్, చెల్లింపు తేదీ, చెల్లించిన వ్యక్తి, తీసుకున్న వ్యక్తి వంటి వివరాలేవీ పిటిషన్లో లేవన్నారు.కాగా, పెరంబూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో విజయ్‌పై పోటీ చేసి ఓడిపోయిన డీఎంకే అభ్యర్థి ఆర్.డి. శేఖర్ కోర్టులో ఎన్నికల పిటిషన్ దాఖలు చేశారు. సీఎం విజయ్ ప్రచార గీతం ‘తని ఒరువన్ వెడిచు వరాన్.. విసిల్లు ఒన్ను అడిచు వరాన్’ రూపొందించేందుకు థమన్‌కు రూ.10 లక్షలు చెల్లించినట్లు అందులో ఆరోపించారు. దీనిపై విజయ్ మరో పిటిషన్ దాఖలు చేశారు. తనపై ఆరోపణలు నిజం కాదన్నారు. ఈ మొత్తం చెల్లించినట్లు నిరూపించే ఒప్పందం, ఇన్వాయిస్, రసీదు, చెల్లింపు వివరాలు ఏవీ పిటిషన్లో లేవని విజయ్ కోర్టుకు తెలిపారు. థమన్ రూ.10 లక్షలు తీసుకుని ఉంటారని పిటిషనర్ కేవలం ‘తెలుసుకున్న సమాచారం’గా పేర్కొన్నారని.. అది వాస్తవ చెల్లింపునకు ఆధారం కాదని విజయ్ వాదించారు. అందువల్ల ఈ ఆరోపణ ఊహాజనితమైనదేనని పేర్కొన్నారు.రూ.40 లక్షల ఎన్నికల ఖర్చు?అలాగే, ఎన్నికల ప్రచారంలో చట్టబద్ధమైన రూ.40 లక్షల వ్యయ పరిమితిని మించారని చేసిన ఆరోపణలను కూడా విజయ్ తిప్పికొట్టారు. వాస్తవంగా ఖర్చు చేసినట్లు నిరూపించే ప్రాథమిక ఆధారాలు లేకుండా కేవలం అంచనా మొత్తాలను కలిపి చూపించారని తెలిపారు. ఇదే సమయంలో ఎన్నికల ప్రచారానికి విదేశాల నుంచి నిధులు అందాయన్న ఆరోపణలోనూ ఎవరు డబ్బు ఇచ్చారు? ఎంత ఇచ్చారు? అనే వివరాలు లేవని విజయ్ పేర్కొన్నారు. విదేశాల్లో ఉన్న వ్యక్తి సోషల్ మీడియా ఖాతా నిర్వహిస్తున్నంత మాత్రాన విదేశీ నిధులు అందినట్లు భావించలేమన్నారు.చదవండి: సీఎం విజయ్ ఆకస్మిక పర్యటన.. నేరుగా ఖైదీలతో53,715 ఓట్ల భారీ మెజారిటీ..తన పిల్లలకు ఇచ్చిన రుణాలు, వాటిని ఆదాయపు పన్ను రిటర్నుల్లో చూపించారా లేదా అనే అంశాలు ఎన్నికల ఫలితాలను ఎలా ప్రభావితం చేశాయో కూడా పిటిషనర్ వివరించలేదని విజయ్ తెలిపారు. పెరంబూర్‌లో విజయ్‌కు 1,20,365 ఓట్లు రాగా.. ఆర్.డి. శేఖర్‌కు 66,650 ఓట్లు వచ్చాయి. అంటే విజయ్ 53,715 ఓట్ల భారీ ఆధిక్యంతో గెలిచారు. ఎన్నికల ప్రచారంలో తాను ప్రార్థనా స్థలాలకు వెళ్లడం మాత్రమే అవినీతి ఎన్నికల పద్ధతిగా పరిగణించలేమని విజయ్ స్పష్టం చేశారు. మతపరమైన విజ్ఞప్తి చేశారంటే.. ఏం మాట్లాడారు? ఎవరిని ఉద్దేశించి మాట్లాడారు? ఏ సందేశం ఇచ్చారు? వంటి పూర్తి వివరాలు పిటిషన్లో ఉండాలని, కానీ అవేవీ లేవని హైకోర్టుకు తెలిపారు. -
ఆనంద్.. సన్నాఫ్ ట్రాక్టర్ డ్రైవర్
అనగనగా ఒక ట్రాక్టర్ డ్రైవర్ కొడుకు. అతడు కాలేజీలో అన్ని సబ్జెక్ట్‌ల్లో ఫెయిలయ్యాడు. కట్ చేస్తే... ఆ కుర్రాడు ఎనిమిది వందల కోట్ల రూపాయల విలువ చేసే స్పేస్ టెక్ కంపెనీకి అధిపతి’... ఇది వినగానే... ‘ఏ సినిమా కథ ఇది?’ అని అడుగుతారు చాలామంది. ఇది సినిమా కథ కాదు. తమిళనాడుకు చెందిన ఆనంద్ మేఘలింగం కథ. ఎంతోమందికి స్ఫూర్తినిస్తోన్న నిజ జీవిత కథ...ఆనంద్ చదువు నల్లేరు మీద నడక కాదు. ఎన్నో కష్టాలు ఎదురొచ్చాయి. ఇక కాలేజీ జీవితమైతే మరింత కష్టంగా సాగింది. ఇంజినీరింగ్‌లో మొదటి సెమిస్టర్లో అన్ని సబ్జెక్ట్‌ల్లోనూ ఫెయిలయ్యాడు!ఆ తరువాత ఒక ప్రైవేట్ కాలేజీలో ఏరోనాటికల్ ఇంజినీరింగ్‌లో చేరాడు. ఆ సబ్జెక్ట్ అతడి జీవిత గమనాన్ని మార్చింది. ఏరోనాటికల్కు సంబంధించి ఎన్నో పోటీల్లో పాల్గొని బహుమతులు గెలుచుకోవడంతో ఆనంద్‌లో ఆత్మవిశ్వాసం పెరిగింది.‘నా భవిష్యత్ ఏరోస్పేస్ రంగం’ అని గట్టిగా అనుకున్నాడు ఆనంద్. ఆ తరువాత కాలంలో ‘స్పేస్‌జోన్ ఇండియా’ పేరుతో స్టార్టప్ ప్రారంభించాడు. ప్రైవేట్ అంతరిక్ష యాత్రలు, పునర్వినియోగ రాకెట్ సాంకేతికతపై పనిచేసే స్టార్టప్ ఇది. నాన్నకు ప్రేమతో...తండ్రిని తన కంపెనీకి కో–ఫౌండర్‌ను చేసి, అతనికి 50 శాతం వాటా ఇచ్చాడు ఆనంద్.‘భారతదేశపు మొట్ట మొదటి హైబ్రీడ్ రాకెట్ డైరెక్టర్’గా తనను తాను సగర్వంగా పరిచయం చేసుకునే ఆనంద్ మేఘలింగం గతంలోకి వెళితే...సాధారణ వ్యవసాయ కుటుంబంలో పుట్టాడు. కుటుంబాన్ని పోషించడానికి తండ్రి ట్రాక్టర్ నడిపేవాడు. కొడుకు బాగా చదివి పెద్ద స్థాయికి వెళ్లాలని అందరు తండ్రులలాగే అతడు కూడా ఆశించాడు. కంప్యూటర్ సైన్స్ కోర్సులో చేరడం వల్ల తన భవిష్యత్ బాగుంటుందని ఆనంద్ ఆశించాడు. కాని తరువాత రోజుల్లో అతడికి ఆ సబ్జెక్ట్ ఆసక్తిగా అనిపించలేదు. ఆసక్తి లేకపోవడం వల్ల సబ్జెక్ట్ బొత్తిగా అర్థం కాలేదు.పరీక్షలలో సున్నాలు హాయ్ చెప్పడం మొదలు పెట్టాయి. ఆనంద్ చదువుకు తాత్కాలికంగా గుడ్‌బై చె΄్పాడు. అలా అని నిరాశపడుతూ కూర్చోలేదు.నెక్ట్స్ ఏమిటి!‘ఇప్పుడు నేను ఏం చేయాలి?’ లోతుగా ఆలోచించాడు ఆనంద్. ‘ఆసక్తి ఉంటే ఎంత కఠినమైన సబ్జెక్ట్ అయినా చాలా సులువుగా అర్థమవుతుంది’ అనే మాట అతడికి గుర్తుకు వచ్చింది. ఆనంద్‌కు విమానయానం, అంతరిక్ష విషయాలు అంటే ఆసక్తి. ఆ ఆసక్తితోనే ఏరోనాటికల్ ఇంజినీరింగ్‌ను ఎంచుకున్నాడు. ‘భారత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ’ నుండి కోర్సును విజయవంతంగా పూర్తి చేసుకొని గోల్డ్‌మెడలిస్ట్ అయ్యాడు.తొలి అడుగు... రూమీ–1మన అంతరిక్ష రంగంలోకి ఇప్పుడిప్పుడే ప్రైవేట్ కంపెనీల అడుగులు పడుతున్నాయి. ఈ క్రమంలో తన ‘స్పేస్‌జోన్ ఇండియా’ స్టార్టప్‌తో ఆ రంగంలోకి అడుగు పెట్టాడు ఆనంద్. ‘రూమీ–1’ పేరుతో తొలి ప్రాజెక్ట్ మొదలైంది. పరిమిత నిధులు, సాంకేతిక సమస్యల వల్ల ప్రాజెక్ట్ మొదట్లో నత్తనడక నడిచింది. ఎన్నో అడ్డంకులను దాటుకొని తమిళనాడులోని తిరువిదన్దైలో ప్రయోగం జరిగింది. ఇగ్నిషన్ బటన్ నొక్కిన తరువాత నాలుగు సెకన్ల పాటు అత్యంత ఉత్కంఠతతో వేచి చూశాడు ఆనంద్.‘నా జీవితంలో ఆ నాలుగు సెకన్లు నాలుగు యుగాలతో సమానం. అవి అత్యంత సుదీర్ఘమైన క్షణాలు!’ అని ఆనాటి ఉద్విగ్న స్థితిని గుర్తు చేసుకుంటాడు ఆనంద్. తన కలలను మోసుకెళుతున్నట్లుగా ‘రూమీ–1’ మొబైల్ లాంచ్ ప్లాట్‌ఫామ్ నుంచి నింగిలోకి దూసుకెళ్లింది. మూడు క్యూబ్శాట్లు, 50 పికో ఉపగ్రహాలను మోసుకెళ్తూ అంతరిక్షంలోకి ప్రవేశించి ఆనంద్ కలలను నిజం చేసింది. ఆనంద్‌కు ఇది ఒక సాంకేతిక విజయం మాత్రమే కాదు. అంతకంటే చాలా ఎక్కువ! అతని అలుపెరుగని ప్రయాణానికి లభించిన అతి పెద్ద బహుమానం!‘మా లక్ష్యం కేవలం రాకెట్లను ప్రయోగించడం మాత్రమే కాదు. బలమైన, సురక్షితమైన సాంకేతికతను నిర్మించే సత్తా మన దేశానికి ఉందని నిరూపించడమే మాఅసలైన లక్ష్యం’ అంటున్నాడు ఆనంద్ మేఘలింగం.భవిష్యత్ లక్ష్యంచేదు అనుభవాలు, ఎదురు దెబ్బలు అనేవి ఆనంద్‌కు స్వదేశంలోనే కాదు విదేశాల్లో కూడా ఎదురయ్యాయి. ఏరోస్పేస్ పరిశోధనలో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో యూఎస్ విసా కోసం అతడు చేసుకున్న దరఖాస్తు తిరస్కారానికి గురైంది. అలా అని నిరాశపడలేదు. ఆగిపోలేదు. కొన్ని సంవత్సరాల తర్వాత యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ ద్వారా ఒక అంతర్జాతీయ కార్యక్రమానికి ఎంపికయ్యాడు. ఈ కార్యక్రమం కోసం ప్రపంచవ్యాప్తంగా ఎంపిక చేసిన 23 మందిలో ఆనంద్ ఒకరు. నాసా నేతృత్వంలో జరిగిన కార్యక్రమాలలో శిక్షణ తీసుకున్నాడు. అక్కడి శాస్త్రవేత్తలు, ఏరోస్పేస్ నిపుణులు, సైనిక అధికారులు, స్పేస్‌ఫోర్స్ సిబ్బందితో మాట్లాడి ఎన్నో కొత్త విషయాలు తెలుసుకున్నాడు. దీని ద్వారా ఏరోస్పేస్ సాంకేతికతకు సంబంధించిన విషయాలపై మంచి అవగాహన వచ్చింది. ‘అంతరిక్షానికి సంబంధించి అమెరికా ఉపయోగిస్తున్న సాంకేతికత అసాధారణమైనది’ అంటాడు ఆనంద్. తన ‘స్పేస్‌జోన్ ఇండియా’ ద్వారా అలాంటి అరుదైన సాంకేతికతను సృష్టించాలని కలలు కంటున్నాడు ఆనంద్. ‘కలలు విజయానికి తొలి మెట్టు’ అనే అబ్దుల్ కలామ్ మాట మనకు తెలిసిందే కదా! -
సునామీలా వరద.. ఆ పరమశివుడే కాపాడాడేమో!
కొండలపై నుంచి సునామీలా దూసుకొచ్చిన వరద.. క్షణాల్లోనే అంతా తుడిచిపెట్టేసింది. చుట్టూ బురద, రాళ్లు, శిథిలాలు.. ఎటు చూసినా మృత్యువే కనిపించింది. ఇంత విషాదంలో కొందరి ప్రాణాలు మాత్రం అద్భుతంగా దక్కాయి. తాము చూసిన భయానక దృశ్యాలను ఇప్పుడు గుర్తుచేసుకుంటున్నారు. ‘పర్వతాలపై నుంచి సునామీ పడుతున్నట్లుగా అనిపించింది’ అంటూ వారు చెప్పిన మాటలు ఆ విపత్తు తీవ్రతను కళ్లకు కడుతున్నాయి.కైలాస మానస సరోవర యాత్రకు బయలుదేరిన తమిళనాడు యాత్రికులకు నేపాల్‌లో ఊహించని భయానక అనుభవం ఎదురైంది. ఆగస్టు 26న రసువాగఢి ప్రాంతంలో ఒక్కసారిగా కొండలపై నుంచి నీరు, బురద, రాళ్లు సునామీలా దూసుకొచ్చాయి. క్షణాల్లోనే రహదారులు, భవనాలు కొట్టుకుపోవడంతో 21 మంది యాత్రికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. చివరకు సురక్షితంగా బయటపడి శుక్రవారం స్వదేశానికి చేరుకున్నారు.తమ బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో ఒక్కసారిగా నదీ తీరంలో భారీగా పొగలాంటిది కనిపించిందని యాత్రికులు ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. తొలుత ఏదైనా పేలుడు జరిగిందని భావించామని.. అంతలోనే కొండపై నుంచి నీరు, మట్టి, ఇసుక, రాళ్లతో కూడిన భారీ ప్రవాహం దూసుకొచ్చిందని చెప్పారు. ‘పర్వతాలపై నుంచి సునామీ పడుతున్నట్లుగా అనిపించింది’ అంటూ తమ భయానక అనుభవాన్ని గుర్తుచేసుకున్నారు.వరద ప్రవాహం బస్సులకు చేరువవుతుండటంతో డ్రైవర్ వైపు నుంచి బయటకు వచ్చి సమీపంలోని కొండపైకి ఎక్కారు. కొందరు మహిళలు పైకి ఎక్కేందుకు ఇబ్బంది పడటంతో.. చీర సాయంతో ఒకరినొకరు పైకి లాగుకున్నారు. దాదాపు రెండున్నర గంటలపాటు నానా అవస్థలు పడి చివరకు ఓ రెస్క్యూ కేంద్రానికి చేరుకున్నారు.ఆ పరమశివుడి ప్రతిరూపం..తమను స్వయంగా ఆ శివుడే కాపాడాడని కొందరు యాత్రికులు నమ్ముతున్నారు. వరద ప్రవాహం తమవైపు దూసుకొస్తున్న సమయంలో సమీపంలోని కొండపై మట్టి, బురదతో శివుడి ముఖం ఆకారంలో ఓ రూపం కనిపించిందని వారు భావోద్వేగంగా చెబుతున్నారు. కైలాసానికి వెళ్లి శివుడి ఆశీస్సులు పొందాలనుకున్న తమను.. ఈ విపత్తు నుంచి కూడా ఆయనే కాపాడాడని చెప్పారు. నేపాల్ సైన్యానికి కృతజ్ఞతలువిపత్తులో చిక్కుకున్న యాత్రికులను నేపాల్ సైన్యం, స్థానిక అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అనంతరం వారిని ఖాట్మాండుకు తీసుకెళ్లి.. అక్కడి నుంచి న్యూఢిల్లీ మీదుగా చెన్నైకి తరలించారు. ఢిల్లీలో విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ యాత్రికులను కలుసుకుని వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.ఇంకా వందలాది మంది ఆచూకీ లేదుఇదిలా ఉండగా.. నేపాల్, టిబెట్ ప్రాంతాలను కుదిపేసిన ఆకస్మిక వరదలు, కొండచరియల విరిగిపడటంతో మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. నేపాల్ విపత్తు నిర్వహణ సంస్థ తాజా లెక్కల ప్రకారం మృతుల సంఖ్య 700కు దగ్గర్లో చేరగా.. 2,426 మంది గల్లంతైనట్లు తాజా లెక్కలు చెబుతున్నాయి. మరోవైపు ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం చర్యలు కొనసాగిస్తోంది. నేపాల్‌కు ఆహారం, మందులు, దుప్పట్లు, సోలార్ ల్యాంపులు తదితర సహాయక సామగ్రిని కూడా భారత్ పంపుతోంది.“We saw Lord Shiva’s face on the mountain as the water came hurtling towards us.”A group of 60 pilgrims from Tamil Nadu were travelling in three buses on the Kailash Mansarovar pilgrimage. The whereabouts of around 40 travelling in two of those buses remain unknown.The 21… pic.twitter.com/qmnWUhcF0Z— Rahul Kanwal (@rahulkanwal) August 28, 2026ఇదీ చదవండి: యుగాంతం వచ్చేసిందా? అన్నట్లు.. -
TOXIC సినిమాపై అన్నామలై ఘాటు విమర్శలు
-
యశ్ ‘టాక్సిక్’కు అన్నామలై రివ్యూ
కన్నడ స్టార్ యశ్ నటించిన భారీ యాక్షన్ గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘టాక్సిక్’ విడుదలైన తొలి రోజే భారీ వసూళ్లు సాధించింది. అయితే కంటెంట్ కారణంగా పూర్తిగా నెగెటివ్ రివ్యూలతో ట్రోలింగ్‌ను ఎదుర్కొంటోంది. మరోవైపు సినిమా వివాదంలో చిక్కుకుంది. సినిమాలో మహిళలను అతిగా చూపించారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా బీజేపీ మాజీ నేత, ‘వీ ది లీడర్స్’ వ్యవస్థాపకుడు కె. అన్నామలై ఈ అంశంపై తీవ్రంగా స్పందించారు. సినిమాకు సెన్సార్ బోర్డు ఇచ్చిన అనుమతిపైనా ప్రశ్నలు సంధించారు.సినిమాల్లో మహిళల చిత్రీకరణ విషయంలో సెన్సార్ నిబంధనలను మరింత కఠినతరం చేయాల్సిన అవసరం ఉందని అన్నామలై అన్నారు. ప్రముఖ హీరోలు నటించే సినిమాల విషయంలోనూ ఏ సన్నివేశాలు అనుమతించాలి? ఏవి అనుమతించకూడదనే అంశంపై సెన్సార్ బోర్డు కఠిన నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.పిల్లలపై ప్రభావం:‘టాక్సిక్’కు తొలి రోజే రూ.104 కోట్ల వసూళ్లు వచ్చాయని ప్రస్తావించిన అన్నామలై.. ఇలాంటి సినిమాలు పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. ‘‘మహిళలను ఒక నిర్దిష్ట కోణంలో చూపిస్తున్నారు. పిల్లలు ఇలాంటి చిత్రాలను పదేపదే చూస్తే.. సమాజంలో మహిళల పట్ల వారి దృక్పథం ఎలా మారుతుంది?’’ అంటూ ప్రశ్నించారు.మహిళల భద్రత, గౌరవం కోసం తాము పట్టణాలు, కళాశాలలకు వెళ్లి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. అలాంటి సమయంలో మహిళలను సమస్యాత్మకంగా చూపించే సన్నివేశాలతో ఉన్న సినిమాకు సెన్సార్ బోర్డు అనుమతి ఇవ్వడం తనకు ఆందోళన కలిగిస్తోందన్నారు. సినిమాల్లో మహిళలకు తగిన గౌరవం దక్కుతోందా? అని ప్రశ్నించారు.యశ్ రియాక్షన్‘టాక్సిక్’పై మహిళల చిత్రీకరణకు సంబంధించి ఇప్పటికే విమర్శలు రావడంతో.. హైదరాబాద్‌లో జరిగిన సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్లో యశ్ స్పందించారు. ట్రైలర్లో కనిపించిన కొన్ని సన్నివేశాలను చూసి సినిమా మొత్తాన్ని అంచనా వేయొద్దని అన్నారు. దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ మహిళా పాత్రలను బలంగా తీర్చిదిద్దారని చెప్పారు.‘‘ప్రతి మహిళ, ప్రతి అమ్మాయి ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొని.. తన అభిప్రాయాలను, ఆలోచనలను వ్యక్తం చేసి.. సమాజంలో విజయం సాధించగలదనే విషయాన్ని ఈ సినిమా చూపిస్తుంది’’ అని యశ్ పేర్కొన్నారు. సినిమాలో మహిళలకు ప్రత్యేకమైన స్వరం ఉందని, ట్రైలర్ ద్వారా ఏర్పడిన అభిప్రాయం కంటే సినిమా భిన్నంగా ఉంటుందని చెప్పారు. అమ్మాయిలంతా థియేటర్లకు వచ్చి సినిమా చూడాలని, ఆస్వాదించాలని కోరారు.భారీ అంచనాలతో ‘టాక్సిక్’‘టాక్సిక్’కు గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహించారు. కేవీఎన్ ప్రొడక్షన్స్, యశ్‌కు చెందిన మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించాయి. కన్నడ, ఇంగ్లిష్ భాషల్లో రూపొందిన ఈ పీరియడ్ గ్యాంగ్‌స్టర్ డ్రామాలో యశ్ ద్విపాత్రాభినయం చేశారు. నయనతార, తారా సుతారియా, కియారా అద్వానీ, హ్యూమా ఖురేషీ, రుక్మిణి వసంత్ కీలక పాత్రల్లో నటించారు.ఇదీ చదవండి: నీతులు చెప్పే చైనాకు.. బాన్కియావో ఘోరకలి గుర్తుందా? -
విజయ్ మరో సంచలనం.. మోదీ, రాహుల్ తర్వాత ప్లేస్!
తమిళనాడు రాజకీయాల్లో సంచలనంగా ఎదిగిన సినీ నటుడు, తమిళగ వెట్రి కళగం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి సి.జోసెఫ్ విజయ్ జాతీయ రాజకీయాల్లోనూ తన ప్రభావాన్ని చాటుకుంటున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తర్వాత.. తదుపరి ప్రధానమంత్రి అభ్యర్థిగా విజయ్ మూడో స్థానంలో నిలిచారు. ఇండియా టుడే–సీ ఓటర్ నిర్వహించిన తాజా ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ (MOTN) సర్వేలో ఈ ఆసక్తికరమైన ఫలితం వెల్లడైంది.ప్రధాని పదవికి తదుపరి ఎంపికగా ఎవరిని కోరుకుంటున్నారని ప్రశ్నించగా.. నరేంద్ర మోదీకి 48.7 శాతం మంది, రాహుల్ గాంధీకి 27.1 శాతం మంది మద్దతు తెలిపారు. అనూహ్యంగా విజయ్‌కు ఏకంగా 9.2 శాతం మంది మద్దతు పలికారు. దీంతో ఆయన మూడో స్థానాన్ని దక్కించుకున్నారు. రాజకీయాల్లోకి అడుగుపెట్టి రెండేళ్లు కూడా పూర్తికాకముందే జాతీయ స్థాయిలో ప్రధాని అభ్యర్థిగా విజయ్ పేరు వినిపించడం చర్చనీయాంశంగా మారింది.విజయ్ తర్వాత పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ 2 శాతంతో, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ 1.7 శాతంతో, కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే 1.3 శాతంతో, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ 1.2 శాతంతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు.ఆ రకంగానూ విజయ్‌కు ఆదరణేప్రధాని ఎంపిక ప్రశ్నతో పాటు.. ప్రస్తుత ప్రతిపక్ష నేతల్లో కూటమికి నాయకత్వం వహించేందుకు ఎవరు సమర్థులని అడిగినప్పుడు కూడా విజయ్ మంచి స్థానంలో నిలిచారు. ఈ విభాగంలో రాహుల్ గాంధీ 29 శాతంతో అగ్రస్థానంలో ఉండగా.. విజయ్ 12.2 శాతంతో రెండో స్థానంలో నిలిచారు. మమతా బెనర్జీ 8.5 శాతం, కేజ్రీవాల్ 7.5 శాతం, అఖిలేశ్ యాదవ్ 6.9 శాతంతో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.రెండేళ్లలోనే సీఎం.. ఇప్పుడేమోవిజయ్ 2024లో టీవీకేను స్థాపించి ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆ తర్వాత రెండేళ్లలోనే జరిగిన తొలి ఎన్నికల్లో టీవీకే విజయం సాధించి తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ వెంటనే పార్టీ విస్తరణ కోసం ఇతర రాష్ట్రాలపైనా దృష్టి సారించారు. తొలి ఏడాది పాలన కూడా పూర్తికాకముందే జాతీయ స్థాయిలో ఆయన పేరు ప్రధాని అభ్యర్థుల జాబితాలో వినిపించడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.ఇటీవల టీవీకే నేతలు కూడా విజయ్ను జాతీయ రాజకీయాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నాలను బహిరంగంగానే ప్రారంభించారు. 2029 లోక్‌సభ ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని విజయ్ను ప్రధాని అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేసే సంకేతాలు ఇస్తున్నారు.‘దక్షిణం నుంచి ప్రధాని రావాలి’విజయ్ ప్రధాని అభ్యర్థిత్వంపై టీవీకే నేతల వ్యాఖ్యలు కూడా ఇటీవల జోరందుకున్నాయి. ఆగస్టు 18న తమిళనాడు అసెంబ్లీలో మాట్లాడిన టీవీకే మంత్రి శరత్‌కుమార్.. విజయ్ భవిష్యత్ ప్రధాని అంటూ బహిరంగంగా వ్యాఖ్యానించారు.అంతకుముందు టీవీకే నేత, తమిళనాడు ప్రజా పనుల శాఖ మంత్రి ఆధవ్ అర్జున కూడా దక్షిణ భారతదేశం నుంచి ప్రధానమంత్రి రావాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో దేశానికి దక్షిణాది నుంచి ప్రధాని రావడం ఖాయమని, అలాంటి నాయకుడు తమిళనాడు నుంచి ఎదగాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో తాజాగా వెలువడిన ఇండియాటుడే సర్వే ఫలితాలు టీవీకే వర్గాల్లో మరింత ఉత్సాహాన్ని నింపే అవకాశం ఉంది.25 వేల మందితో తాజా సర్వేఇండియా టుడే గ్రూప్ దాదాపు రెండు దశాబ్దాలుగా నిర్వహిస్తున్న మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో భాగంగా తాజా సర్వేను సీ ఓటర్ నిర్వహించింది. జూలై 1 నుంచి ఆగస్టు 25 వరకు 25,184 మందిని నేరుగా ప్రశ్నించారు. దీనికి అదనంగా గత ఆరు నెలల్లో సీ ఓటర్ నిర్వహించిన సాధారణ ట్రాకింగ్ సర్వేలలోని 91,795 ఇంటర్వ్యూలను కూడా పరిగణనలోకి తీసుకున్నారు.అయితే 2029 లోక్‌సభ ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం ఉంది. సర్వేలో వ్యక్తమైన ప్రజాదరణను దేశవ్యాప్తంగా ఓట్లుగా, కూటమిగా మార్చుకోవడం విజయ్‌కు పెద్ద సవాలే. అయినప్పటికీ.. తమిళనాడు రాజకీయాలకే పరిమితమైన నాయకుడిగా కాకుండా, జాతీయ స్థాయిలో ప్రధాని రేసులో పేరు వినిపించే స్థాయికి విజయ్ చేరుకోవడం మాత్రం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.ఇదీ చదవండి: దటీజ్ విజయ్.. తమిళనాడు అసెంబ్లీలో సరికొత్త సంప్రదాయం -
అసెంబ్లీలో సీఎం విజయ్ కొత్త రూల్.. ప్రతిపక్షాల అభ్యంతరం
తమిళనాడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ గురువారం ఆసక్తికరంగా వ్యవహరించారు. సాధారణంగా స్పీకర్ కుర్చీకి సమీపంలో సీఎం కోసం కేటాయించిన ప్రత్యేక సీటులో కూర్చునే ఆయన.. తొలిసారి ఆ స్థానాన్ని వదిలి మంత్రుల వరుసలోకి వెళ్లి కూర్చున్నారు. దీంతో అసెంబ్లీలో ఈ పరిణామం చర్చనీయాంశంగా మారింది. విజయ్ తీరుపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి.స్పీకర్ జేసీడీ ప్రభాకర్ కుడివైపున ముఖ్యమంత్రి కోసం ప్రత్యేకంగా కేటాయించిన సీటు ఉంటుంది. ఆయన పక్కనే మంత్రులు వారి సీనియారిటీ ఆధారంగా కూర్చుంటారు. అయితే గురువారం మధ్యాహ్నం సమావేశాల సందర్భంగా విజయ్ తన సీటు నుంచి లేచి.. సభా నాయకుడు, మంత్రి కేఏ సెంగొట్టయ్యన్, మరో మంత్రి ఆధవ్ అర్జున మధ్యలో కూర్చున్నారు. ఈ పరిణామంపై ప్రతిపక్షాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. విజయ్ ఇష్టానుసారం వ్యవహరించడం తగదని.. పాలనకంటూ కొన్ని మార్గదర్శకాలు ఉంటాయని.. వాటిని ఆయన పాటించాలని సూచించాయి. అయితే సహచర మంత్రులతో మాట్లాడేందుకే ఆయన ఇలా స్థానాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. CM Vijay is in some discussion with Minister KAS pic.twitter.com/CynRjQChQB— Actor Vijay FC (@ActorVijayFC) August 27, 2026సాధారణంగా మంత్రులు లేదంటే ఎమ్మెల్యేలు తమ సహచరులతో మాట్లాడేందుకు కొద్దిసేపు సీట్లు మారడం కనిపిస్తుంటుంది. కానీ ముఖ్యమంత్రి తనకు కేటాయించిన అధికారిక సీటును వదిలి మంత్రుల కోసం ఉద్దేశించిన సీటులో కూర్చోవడం మాత్రం తమిళనాడు అసెంబ్లీ చరిత్రలో ఇదే తొలిసారి అని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.ఇదిలా ఉండగా.. సభలో అధికారుల గైర్హాజరుపై ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ ప్రశ్నించారు. కీలక అంశాలపై ఎమ్మెల్యేలు చర్చిస్తున్న సమయంలో సంబంధిత శాఖల కార్యదర్శులు అసెంబ్లీలోనే ఉండేలా చూడాలని స్పీకర్‌ను కోరారు. గతంలో కరూర్ తొక్కిసలాట ఘటనపై చర్చ జరిగినప్పుడు అప్పటి సీఎం ఎంకే స్టాలిన్‌తో పాటు చీఫ్ సెక్రటరీ, శాఖల కార్యదర్శులు సభలో ఉన్నారని గుర్తుచేశారు. ప్రస్తుతం సీఎం, ఉన్నతాధికారులు సభలో కనిపించడం లేదని విమర్శించారు.దీనిపై మంత్రి ఆధవ్ అర్జున స్పందిస్తూ.. అధికారులు పక్కనే ఉన్న ‘వార్ రూమ్’లో ఉండి, సభ్యుల ప్రసంగాలను నోట్ చేసుకుంటున్నారని తెలిపారు. అయితే ఉదయనిధి సూచనతో ఏకీభవించిన స్పీకర్.. అసెంబ్లీ సమావేశాల సమయంలో సీనియర్ అధికారులు సభలోనే ఉండేలా ఆదేశిస్తామని చెప్పారు. అంతకుముందు పలు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం విజయ్.. ఆ తర్వాత అసెంబ్లీకి హాజరయ్యారు.ఇదీ చదవండి: రాఖీ పండుగను రాజకీయం కోసం వాడేసుకుంటున్నారా? -
యాక్షన్ ప్లాన్ ఏది?.. నేపాల్‌లో తమిళ యాత్రికుల మిస్సింగ్
నేపాల్–టిబెట్ సరిహద్దులో సంభవించిన భారీ ఆకస్మిక వరదలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. మృతుల సంఖ్య పెరుగుతుండగా.. అక్కడికి వెళ్లిన భారతీయ యాత్రికుల ఆచూకీ తెలియక కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా కైలాస్ మానస సరోవర్ యాత్రకు వెళ్లిన తమిళ యాత్రికుల పరిస్థితిపై ఆ రాష్ట్రంలో ఆందోళన నెలకొంది.కుంభకోణానికి చెందిన సూపర్ ట్రావెల్ ఏజెన్సీ ద్వారా మొత్తం 57 మంది తమిళ యాత్రికులు మానస సరోవర్ యాత్రకు వెళ్లినట్లు ఇప్పటికే అక్కడి అధికారులు ప్రకటించారు. వీరిలో 20 మంది సురక్షితంగా ఉన్నట్లు సమాచారం అందగా.. మరో 37 మంది ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉంది. అయితే టీవీకే సర్కార్ ఈ మధ్యాహ్నాం దాకా ఎలాంటి హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయకపోవడంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి.ఏం చర్యలు తీసుకున్నారు?ఈ వ్యవహారంపై తమిళనాడు టీవీకే ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు నిలదీశాయి. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ.. నేపాల్‌లో చిక్కుకున్న తమిళ యాత్రికుల కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలపై ప్రశ్నించారు. “ఎంతమంది యాత్రికులు గల్లంతయ్యారు? ప్రభుత్వ హెల్ప్‌లైన్‌కు ఎన్ని కాల్స్ వచ్చాయి? ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టారు?” అని ప్రభుత్వాన్ని నిలదీశారు.అన్నాడీఎంకే నేత ఎడప్పాడి కె. పళనిస్వామి కూడా ఆ 57 మంది తమిళ యాత్రికులను సురక్షితంగా తీసుకురావాలని డిమాండ్ చేశారు. మరోవైపు టీవీకే మిత్రపక్షం కాంగ్రెస్ పార్టీ.. నేపాల్‌లో చిక్కుకున్న యాత్రికుల రక్షణ కోసం ప్రత్యేక హెలికాప్టర్ పంపాలని కోరింది.LoP Udhayanidhi Stalin in Tamil Nadu Assembly on Nepal floods: "Many Tamils who went missing in Nepal are still unreachable. How many calls were received on the Government helpline? What action has been taken? - Udhayanidhi questions.""All 57 Tamils must be rescued and brought… https://t.co/wENvCSTZUl— ANI (@ANI) August 27, 202657 కాదు.. 106 మందితమిళనాడు మంత్రి రాజ్‌మోహన్ అసెంబ్లీలో మాట్లాడుతూ.. పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని, అక్కడి అధికార యంత్రాగంతో ఎప్పటికప్పుడు సమన్వయం జరుపుతున్నామని తెలిపారు. కుంభకోణం ట్రావెల్ ఏజెన్సీ ద్వారా 57 మంది వెళ్లగా.. చెన్నైకి చెందిన మరో ట్రావెల్ ఏజెన్సీ ద్వారా మరో 49 మంది యాత్రికులు మానస సరోవర్ యాత్రకు వెళ్లినట్లు సమాచారం ఉందన్నారు. వారి వివరాలను కూడా సేకరిస్తున్నట్లు తెలిపారు.చివరి ఫోన్ కాల్.. నో రెస్పాన్స్తమ కుటుంబ సభ్యుల నుంచి చివరిసారిగా వచ్చిన ఫోన్ కాల్ తర్వాత యాత్రికుల బంధువుల్లో ఆందోళన మరింత పెరిగింది. విష్ణు రామస్వామి అనే వ్యక్తి మాట్లాడుతూ.. తన తల్లి, ఇద్దరు సోదరీమణులు యాత్రలో ఉన్నారని తెలిపారు. “ఆగస్టు 23న వారు బయలుదేరారు. ఢిల్లీ, ఖాట్మండు చేరుకున్న తర్వాత ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం ఫోన్ చేసేవారు. ఆగస్టు 26 ఉదయం 6.15 గంటలకు చివరిసారి మాట్లాడారు. తాము క్షేమంగానే ఉన్నామని చెప్పారు. ఆ తర్వాత ఫోన్ సంబంధాలు తెగిపోయాయి” అని ఆందోళన వ్యక్తం చేశారు.విజయ్ అత్యవసర సమావేశంఅసెంబ్లీలో నేపాల్ వరదల మిస్సింగ్‌పై ఆందోళనలు వ్యక్తం అయ్యాక.. ముఖ్యమంత్రి విజయ్ ఎమర్జెన్సీ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఉన్నతాధికారులతో మాట్లాడిన ఆయన.. అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.Nepal tragedy - Cm instructions Chief Minster of Tamil Nadu conducted a review meeting to oversee the relief measures post the Nepal tragedy CM has instructed Thiru Ashish Kumar, IAS, Resident Commissioner,TN House, New Delhi along with a team to proceed to Kathmandu to… pic.twitter.com/EqYLS4YzyF— Vignesh Theni (@Vignesh_twitz) August 27, 2026ఆచూకీ కోసం ప్రయత్నాలునేపాల్–టిబెట్ సరిహద్దు ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గల్లంతైన భారతీయుల వివరాలను సేకరించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నేపాల్ అధికారులతో సమన్వయం చేస్తున్నాయి. చాలామంది యాత్రికుల బృందాలు వరదల కంటే ముందే ఆ ప్రాంతాన్ని దాటినట్లు సమాచారం అందుతోంది. దీంతో యాత్రికుల సురక్షిత తరలింపుపై కుటుంబాలు ఆశగా ఎదురుచూస్తున్నాయి.ఇదీ చదవండి: విపత్తుల నేపాల్.. ఆ ట్రాక్ రికార్డు అంత ఘోరం మరి! -
కర్ణాటకకు అన్నాడీఎంకే నేత వార్నింగ్.. ఆయన జైలుకే అంటూ..
చెన్నై: మేకేదాటు ప్రాజెక్టు విషయంలో కర్ణాటక, తమిళనాడు నేతల మధ్య రాజకీయ మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా ఈ ప్రాజెక్ట్ విషయమై కర్ణాటక కాంగ్రెస్ నేతలపై అన్నాడీఎంకే నేత కోవై సత్యన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలను రెచ్చగొట్టేలా కర్ణాటక నేతలు పదేపదే వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. సుప్రీంకోర్టు ఆదేశాలను పక్కన పెట్టి మేకేదాటు ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే అది కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని హెచ్చరించారు. దీంతో, రెండు రాష్ట్రాల నేతల మధ్య మరోసారి పొలిటికల్ వార్ మొదలైంది.కర్ణాటక సీఎం డీకే శివకుమార్, మంత్రి చెలువరాయస్వామి మేకేదాటు ప్రాజెక్టుపై చేసిన తాజా వ్యాఖ్యలపై సత్యన్ స్పందించారు. కాంగ్రెస్ నేతలు ఈ అంశాన్ని రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకోవడం తీవ్రంగా ఖండించాల్సిన విషయమన్నారు. మేకేదాటుపై కాంగ్రెస్ నేతలు పదేపదే చేస్తున్న వ్యాఖ్యలు ఖండించదగినవి. రాజకీయ భవిష్యత్తు కోసం ప్రజలను రెచ్చగొట్టడం మంచిది కాదు అంటూ సత్యన్ విమర్శలు కురిపించారు. కావేరీ జల వివాదంపై సుప్రీంకోర్టు తీర్పు స్పష్టంగా ఉందని, రాజకీయ నాయకులు చట్టాన్ని, కోర్టు ఆదేశాలను గౌరవించాలని ఆయన పేర్కొన్నారు. మేకేదాటు ప్రాజెక్టుపై కర్ణాటక ఏకపక్షంగా ముందుకు వెళ్లే అవకాశం లేదని స్పష్టం చేశారు.జైలుకు వెళ్తారా.. ఇదే సమయంలో కేదాటు ప్రాజెక్టు విషయంలో కర్ణాటక ప్రభుత్వం ముందుకు వెళ్తే అడ్డుకుంటామని హెచ్చరిస్తూ సత్యన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘తీర్పు తమిళనాడుకు అనుకూలంగా ఉంది. మీరు మేకేదాటులో ఒక్క రాయి కూడా కదపలేరు. ఇదే నిజం’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, ప్రాజెక్టు నిర్మాణానికి ఒక్క ఇటుక కూడా పెట్టలేరని సవాల్ విసిరారు. మంత్రి చెలువరాయస్వామిపై మరింత ఘాటుగా స్పందించిన సత్యన్.. మేకేదాటు విషయంలో కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తే జైలుకెళ్లాల్సి వస్తుందని హెచ్చరించారు. పరప్పన అగ్రహార జైలుకెళ్లాలా? తీహార్ జైలుకెళ్లాలా? ఎక్కడ ఉండాలో ఆయనే ఎంచుకోవచ్చు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.కావేరీ వివాదం.. మేకేదాటు ప్రాజెక్టు అంశం మరోసారి తమిళనాడు-కర్ణాటక రాజకీయాల్లో వేడి పెంచుతోంది. కావేరీ నదిపై ప్రతిపాదించిన ఈ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ప్రాజెక్టును కర్ణాటక ముందుకు తీసుకెళ్లాలని చూస్తుండగా.. తమిళనాడు మాత్రం మొదటి నుంచీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. మేకేదాటు ప్రాజెక్టు అమలైతే తమిళనాడుకు దక్కాల్సిన కావేరీ జలాల వాటాపై ప్రభావం పడే అవకాశం ఉందన్నది తమిళనాడు వాదన. దీంతో ఈ అంశం రెండు రాష్ట్రాల మధ్య చాలాకాలంగా రాజకీయ, న్యాయపరమైన వివాదానికి కేంద్రంగా ఉంది.చదవండి: బీజేపీ పార్లమెంటరీ బోర్డులో భారీ మార్పులు! -
ఒక ఫేక్ వీడియో.. ఇద్దరి ఆత్మగౌరవ పోరాటం!
ఒక నల్లటి పొట్టి డ్రెస్.. ఒక 15 సెకన్ల వీడియో.. ఇద్దరు మహిళల జీవితాలను సవాలు చేసింది. వారిలో ఒకరు తమిళనాడు ఎంగెస్ట్ ఉమన్ మినిస్టర్. మరొకరు మలేషియా సాధారణ యువతి. ఆ సాధారణ యువతిని ‘పొట్టి డ్రస్సు వేసుకున్న మంత్రి’గా చూపి ట్రోల్ చేసిన ప్రత్యర్థులకు వారిద్దరూ కలిసి ఇచ్చిన సమాధానం ప్రతి మహిళకు స్ఫూర్తిదాయకం.సమాజంలో మహిళ ఎంత ఉన్నత స్థానానికి ఎదిగినా, లేదా తన ప్రపంచంలో తను ప్రశాంతంగా బతుకుతున్నా ఆమెను తక్కువ చేసి చూపించడానికి కొందరు వాడే పాత ఆయుధం... ఆమె వేసుకునే బట్టలు. తాజాగా తమిళనాడుకు చెందిన యువ మహిళా మంత్రి ఎస్.కీర్తన, మలేషియాకు చెందిన వినోషా రవి విషయంలో ఇదే జరిగింది. ఒక చిన్న తప్పుడు వీడియో ఇద్దరు మహిళల జీవితాలను ఎలా ప్రభావితం చేసింది? వారు దాన్ని భయంతో కాకుండా ధైర్యంతో ఎలా ఎదుర్కొన్నారు? అసలేం జరిగింది? గత 48 గంటలుగా సామాజిక మాధ్యమాల్లో ఒక వీడియో విపరీతంగా హల్చల్ చేస్తోంది. ఒక నల్లటి పొట్టి దుస్తులు వేసుకున్న మహిళ కారు దిగుతున్న దృశ్యం అది. ఆ వీడియోలో ఉన్నది తమిళనాడు పారిశ్రామిక శాఖ మంత్రి ఎస్. కీర్తన అంటూ కొందరు రాజకీయ ప్రత్యర్థులు ట్రోలింగ్ ప్రారంభించారు. ‘ఇలాంటి బట్టలతో పెట్టుబడులు తెస్తారా?’ అంటూ వెటకారం చేశారు. కానీ అసలు నిజం ఏమిటంటే... ఆ వీడియోలో ఉన్నది మంత్రి కీర్తన కాదు. ఆ వీడియోలో ఉన్న వ్యక్తి మలేషియాకు చెందిన వినోషా రవి అనే సాధారణ మహిళ. వినోషా చెప్పిన దాని ప్రకారం, ఆ వీడియోను ఎవరో గుర్తుతెలియని వ్యక్తి ఆమెకు తెలియకుండా తీసి ఇంటర్నెట్లో పెట్టి, దానికి తమిళనాడు మంత్రి పేరును తగిలించి తప్పుడు ప్రచారం చేశారు. ఒక అమాయకురాలి ప్రైవసీని దొంగిలించి, దాన్ని రాజకీయ ఆయుధంగా మార్చారు.‘నేనే అయితే తప్పేంటి?’...అయితే ఈ వివాదాన్ని ఆ ఇద్దరు మహిళలు ధైర్యంగా ఎదుర్కొన్నారు. ముందుగా మలేషియా నుంచి వినోషా రవి జాతీయ మీడియాతో మాట్లాడుతూ ‘మా కొలీగ్ ఆ వీడియో పంపితే జోక్ అనుకున్నా. కానీ ఆ తర్వాత అది సీరియస్ అయ్యింది. నా ఇన్‌బాక్స్ నిండా బూతులు, వల్గర్ కామెంట్స్, బెదిరింపులు. ఈ ఘటన జరిగినప్పటి నుంచి నేను బయటకు వెళ్లాలన్నా, ఆఫీస్‌కి వెళ్లాలన్నా భయపడుతున్నాను. అయినా నేను నా డ్రెస్సింగ్ స్టైల్ మార్చుకోను’ అని తేల్చి చెప్పారు. ఈ పై ఆమె మలేషియా పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు తమిళనాడు మంత్రి కీర్తన చాలా దీటుగా స్పందించారు.ఆగాలంటే ఏం చేయాలి? ఇలా బట్టల ఆధారంగా జరిగే మానసిక దాడులు ఆగాలంటే ముందుగా సమాజంలో మార్పు రావాలి. ఒక మహిళ క్యారెక్టర్‌ను ఆమె వేసుకునే దుస్తులను బట్టి జడ్జ్ చేసే వికృతమైన ఆలోచనా విధానాన్ని వీడాలి. ఇక ఇలాంటి వేధింపులు ఎదురైనప్పుడు మహిళలు అస్సలు భయపడకూడదు. కీర్తన, వినోషాలాగే గొంతు విప్పి ధైర్యంగా ప్రశ్నించాలి. నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్ (1930) ద్వారా ఫిర్యాదు చేయాలి. మౌనంగా ఉంటే ట్రోలర్లు మరింత రెచ్చిపోతారు.ఈ సంఘటన ఇంటర్నెట్ వాడుతున్న ప్రతి మహిళా సైబర్ భద్రత ముప్పుకు ఒక ఉదాహరణ. అయినా సరే ఒకరి వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవించకుండా, కేవలం కొన్ని వ్యూస్ కోసం ఒకరి జీవితాన్ని రోడ్డున పడేసే సైబర్ బూచీలకు చెంపదెబ్బ లాంటి సమాధానం ఇచ్చారు ఈ ఇద్దరు మహిళలు. మహిళల ప్రతిభను చూడాలే తప్ప, వారు వేసుకునే బట్టలను కాదు అనే సత్యాన్ని సమాజం ఎప్పుడు గ్రహిస్తుందో మరి!‘ఆ వీడియోలో ఉన్నది నేను కాదు. కానీ ఒకవేళ నేనే అయినా అందులో తప్పేముంది? ఒక మహిళ ఏం వేసుకోవాలో మీరు డిసైడ్ చేస్తారా? ఇది పురుషాధిక్య సమాజపు సంకుచిత, కురచ ఆలోచన’ అంటూ ఎదురుదాడి చేశారు. అంతేకాదు, తన పోలికల వల్ల అనవసరంగా వివాదంలోకి లాగబడిన వినోషా రవికి క్షమాపణలు చెప్పారు. ‘నన్ను క్షమించు సోదరి. నువ్వు ఆ దుస్తుల్లో చాలా అందంగా ఉన్నావు. నీకు నచ్చినట్లుగా నువ్వు జీవించు’ అంటూ ఆమెకు అండగా నిలిచారు. ఇది రాజకీయాలకు అతీతమైన సిస్టర్ హుడ్.ఈ ఘటనపై డిఎంకె ఎంపీ కనిమొళి కూడా స్పందిస్తూ ‘ఇది దుష్ట రాజకీయం. మహిళలను ఇలా టార్గెట్ చేయడం ఆపండి’ అంటూ కీర్తనకు మద్దతు పలకడం విశేషం. కీర్తన గతంలో ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ కోసం సూట్ వేసుకుని వీడియో చేస్తే కూడా ట్రోల్ చేశారు. అంటే చీర కట్టినా, సూట్ వేసినా, షార్ట్ డ్రెస్ వేసినా.. దాడి మాత్రం ఆడవారిపైనే. -
పాల వ్యాపారితో వివాహేతర సంబంధం..
తమిళనాడు: ఆవడి సమీపం కర్లబాక్కం యాదవర్ వీధికు చెందిన లతా(45). ఈమె కర్లబాక్కం పంచాయతీలో క్లీనర్‌గా పని చేస్తోంది. ఈమె భర్త, సుబ్రమణి 8 సంవత్సరాల క్రితం మృతి చెందాడు. వీరికి పిల్లలు లేరు. దీంతో ఆమె తన ఇంట్లో ఒంటరిగా నివసిస్తూ వచ్చింది. ఈనెల 20వ తేదీ లత పనికి వెళ్లి వచ్చిన తర్వాత ఆమె ఇంటి నుండి బయటకు రాలేదు. ఆమె ఇంటి తలుపు బయటి నుండి తాళం వేసి ఉంది. ఈ స్థితిలో, మంగళవారం లత ఇంట్లో నుండి దుర్వాసన వచ్చింది. దీంతో ఇరుగుపొరుగు వారు ముక్తపుదుపేట్టై పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించారు. పోలీస్ ఇన్స్పెక్టర్ సెల్వి తాళం పగలగొట్టి లోపలికి వెళ్లారు. ఆ సమయంలో, పడకగదిలో లత తలకు గాయాలతో, కుళ్లిపోయిన స్థితిలో విగతజీవిగా కనిపించింది. ఆమె ధరించిన ఆభరణాలు గానీ, ఇంట్లోని వస్తువులు గానీ ఏవీ దొంగిలించబడలేదు. అనంతరం, పోలీసులు లత మృతదేహాన్ని స్వా«దీనం చేసుకుని, పోస్ట్‌మార్టం కోసం చెన్నైలోని కిల్పాకం ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి పంపించారు. అవడి ముక్త పుదుపేట్టై పోలీసులు అనుమానాస్పద మరణం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.విచారణ లో అదే ప్రాంతానికి చెందిన మునివేల్ (65) అనే పాల వ్యాపారితో లతకు అక్రమ సంబంధం ఉన్నట్లు వెల్లడైంది. దీంతో, పోలీసులు మునివేల్‌ను అరెస్టు చేసి విచారణ జరిపారు. విచారణ సమయంలో, తానే లతను చంపానని అతను చెప్పాడు. చాలా కాలంగా లతతో తనకు అక్రమ సంబంధం ఉందని చెప్పాడు. లత కొన్ని రోజులుగా చాలా మంది పురుషులతో సంబంధం పెట్టుకోవడంతో కొట్టి చంపినట్లు తెలిపాడు. దీంతో మునివేల్‌ను పుళల్ జైలుకు తరలించారు. చదవండి: యువతి గదిలో కెమెరా పెట్టిన ఇంటి యజమాని -
కేరళలో దూసుకుపోతున్న TVK దేవన్ కు CM విజయ్ బంపర్ ఆఫర్
-
సీనియర్లకు టెట్ నుంచి శాశ్వత మినహాయింపు
సాక్షి, చెన్నై: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి సర్కార్ షాకిచ్చిన వేళ.. పక్క రాష్ట్రం తమిళనాడు మాత్రం ప్రభుత్వ ఉపాధ్యాయులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. సీనియర్ టీచర్లకు(2010 కంటే ముందు) టెట్ పరీక్ష నుంచి మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు ఓ తీర్మానాన్ని మంగళవారం విజయ్ సర్కార్ అసెంబ్లీలో ప్రవేశపెట్టింది.సీనియర్ టీచర్లకు ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) నుంచి మినహాయింపునకు సంబంధించిన తీర్మానాన్ని పాఠశాల విద్యాశాఖ మంత్రి ఏ. రాజ్‌మోహన్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. 2010 ఆగస్టు 23కు ముందు నియమితులైన ఉపాధ్యాయులను టెట్ నుంచి పూర్తిగా, శాశ్వతంగా మినహాయించాలని అందులో కోరారాయన. ఈ ప్రతిపాదన ద్వారా సీనియర్ ఉపాధ్యాయుల ఉద్యోగ భద్రత, పదోన్నతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని విజయ్ ప్రభుత్వం భావిస్తోందని తెలిపారు.3.28 లక్షల మందికి ప్రయోజనం2010 ఆగస్టు 23కు ముందు ప్రభుత్వ పాఠశాలల్లో నియమితులైన సుమారు 3,28,701 మంది ఉపాధ్యాయులు ప్రస్తుతం టెట్ నిబంధన పరిధిలోకి వస్తున్నారని మంత్రి తెలిపారు. వీరిలో చాలామంది ఇప్పటికే 15 నుంచి 20 ఏళ్లుగా ఎలాంటి విరామం లేకుండా సేవలందిస్తున్నారని పేర్కొన్నారు. ఇన్నేళ్ల అనుభవం ఉన్న ఉపాధ్యాయులు ఇప్పుడు తప్పనిసరిగా కొత్త పరీక్ష రాయాల్సి రావడం వారి ఉద్యోగ భద్రత, జీవనోపాధిపై ప్రభావం చూపుతుందని వివరించారు.Minister Rajmohan has moved a resolution urging the Central Government to exempt teachers who joined service before 2010 from the Teacher Eligibility Test (TET). pic.twitter.com/p4PiMcJFmL— Vignesh Theni (@Vignesh_twitz) August 25, 2026కేంద్రాన్ని కోరిన తమిళనాడుసీనియర్ టీచర్లకు ఉపాధ్యాయులకు టెట్ నుంచి శాశ్వత మినహాయింపు కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని అసెంబ్లీ తీర్మానం ద్వారా కోరుతున్నట్లు రాజ్‌మోహన్ తెలిపారు. ఇందుకోసం 2009 విద్యాహక్కు చట్టంలోని సెక్షన్ 23ను సవరించాలని, నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (NCTE) మార్గదర్శకాల్లో అవసరమైన మార్పులు చేయాలని విజ్ఞప్తి చేశారు.ప్రమోషన్లకు ఇబ్బంది లేకుండా..టెట్ నిబంధన కారణంగా ఇప్పటికే సేవలందిస్తున్న ఉపాధ్యాయులకు ఉద్యోగ ప్రయోజనాలు, ముఖ్యంగా పదోన్నతులు నిలిచిపోకుండా చూడాలని తమిళనాడు ప్రభుత్వం కోరుతోంది. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులను కొత్తగా పరీక్ష రాయాల్సిన పరిస్థితి నుంచి తప్పించడం ద్వారా వారి సర్వీస్ ప్రయోజనాలను కాపాడాలని విజయ్ ప్రభుత్వం భావిస్తోంది.ఏపీలో ఇదే అంశంపై కొంతకాలంగా ఉపాధ్యాయులు ఆందోళన చేపట్టారు. కనీసం మినహాయింపులు ఇవ్వాలని కోరుతున్నారు. అవేవీ పట్టించుకోకుండా ఇన్ సర్వీస్ టీచర్ల టెట్ నోటిఫికేషన్ జారీ చేసింది కూటమి ప్రభుత్వం. ఈ తరుణంలో 2010కు ముందు నియమితులైన ఉపాధ్యాయుల విషయంలో టెట్ నుంచి శాశ్వత మినహాయింపు ఇవ్వాలన్న తమిళనాడు అసెంబ్లీ తీర్మానం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కేంద్రం, NCTE స్పందన ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది.ఇదీ చదవండి: ఆరెస్సెస్ స్కెచ్.. జెన్‌జీ టార్గెట్ -
పరందూర్ ఎయిర్ పోర్ట్ రద్దుతో కొత్త ట్విస్ట్.. చెన్నైకి మరో విమానాశ్రయం ఎక్కడ..?
-
తమిళనాడుకు సుప్రీంకోర్టు షాక్
సాక్షి, ఢిల్లీ: కావేరీ నదీ జలాల విడుదల వివాదంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. నీటి వాటా విడుదలలో ఏవైనా అభ్యంతరాలు లేదా ఫిర్యాదులు ఉంటే వాటిని కావేరీ జలాల నిర్వహణ సంస్థ (CWMA) ముందే లేవనెత్తాలని తమిళనాడు ప్రభుత్వానికి స్పష్టం చేసింది. కర్ణాటక నుంచి తమకు రావాల్సిన అదనపు నిష్పత్తి నీటి వాటాను విడుదల చేసేలా ఆదేశించాలని కోరుతూ తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం విచారించింది.వివరాల్లోకి వెళితే.. కావేరీ నీటి నియంత్రణ కమిటీ (CWRC) ఆగస్టు 12 నుండి 15 రోజుల పాటు ప్రతిరోజూ తమిళనాడుకు 12,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని కర్ణాటకను ఆదేశించింది. ఈ నిర్ణయాన్ని కావేరీ జలాల నిర్వహణ సంస్థ (CWMA) కూడా సమర్థించింది. అయితే వాటా న్యాయపరంగా తమకు దక్కడం లేదని తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తమిళనాడు తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది సి.ఎస్. వైద్యనాథన్ వాదనలు వినిపిస్తూ, తమకు దక్కాల్సిన సరైన నిష్పత్తిలో నీరు అందడం లేదని ధర్మాసనానికి తెలిపారు. దురదృష్టవశాత్తూ క్షేత్రస్థాయిలో నీటి విడుదల సక్రమంగా జరగడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం ఈ అంశాన్ని సంబంధిత అథారిటీ (CWMA) సమావేశంలోనే లేవనెత్తాలని సుప్రీంకోర్టు సూచించింది.గత విచారణలో కర్ణాటక ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది శ్యామ్ దివాన్ సమర్పించిన నీటి విడుదల వివరాల చార్ట్‌ను ధర్మాసనం ప్రస్తావించింది. ఆ చార్ట్ ప్రకారం CWMA ఆదేశాల మేరకే తమిళనాడుకు నీటిని విడుదల చేసినట్లు కనిపిస్తోందని బెంచ్ వ్యాఖ్యానించింది. దీనిపై వైద్యనాథన్ స్పందిస్తూ, నిష్పత్తి ప్రకారం నీటిని విడుదల చేయడానికి CWMA దిశా నిర్దేశం చేయడం లేదని, దీనివల్ల తమిళనాడులోని రైతులకు తాము ఒక్క చుక్క నీటిని కూడా విడుదల చేయలేకపోతున్నామని, కానీ కర్ణాటక మాత్రం తమ రైతులకు నీటిని ఇచ్చుకుంటోందని వాదించారు. దీంతో సుప్రీంకోర్టు ఈ కేసు తదుపరి విచారణను ఆగస్టు 31కి వాయిదా వేస్తూ, ఆ రోజు నాటికి తాజా పరిస్థితిపై నివేదిక (అప్డేటెడ్ స్టేటస్) సమర్పించాలని ఇరు రాష్ట్రాలను ఆదేశించింది.అంతకుముందు ఆగస్టు 17న జరిగిన విచారణలో కూడా CWMA ఆదేశాలను కర్ణాటక తప్పనిసరిగా పాటించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.తమిళనాడు ప్రభుత్వం కోర్టుకు తెలిపిన వివరాల ప్రకారం, వర్షపాతం తక్కువగా ఉన్న ఈ సంవత్సరంలో తమకు రావలసిన న్యాయమైన వాటా దక్కడం లేదు. CWRC కేటాయించిన పరిమాణం కంటే, పొరుగున ఉన్న కర్ణాటక విడుదల చేసిన నీటి పరిమాణం చాలా తక్కువగా ఉందని తమిళనాడు తన పిటిషన్లో పేర్కొంది.జూలై 28న జరిగిన CWRC సమావేశంలో జూలై 29 నుండి 15 రోజుల పాటు రోజుకు 3,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని కర్ణాటకను ఆదేశించినప్పటికీ, జూలై 29 నుండి ఆగస్టు 2 వరకు బిలిగుండ్లు వద్ద కేవలం 158 నుండి 550 క్యూసెక్కుల లోపే నీరు అందిందని తమిళనాడు ప్రభుత్వం తెలిపింది.తమిళనాడు ప్రభుత్వం విడుదల చేసిన పత్రికా ప్రకటన ప్రకారం.. ఆగస్టు 3 నాటికి కర్ణాటకలోని కేఆర్ఎస్, కబిని, హారంగి, హేమవతి జలాశయాలలో మొత్తం నీటి నిల్వ 77.537 టీఎంసీలుగా ఉంది. కాబట్టి తమిళనాడుకు చెందాల్సిన వాటాను నిష్పత్తి ప్రకారం విడుదల చేయడానికి కర్ణాటకకు ఎటువంటి ఇబ్బంది లేదని స్పష్టం చేసింది.కర్ణాటకలోని కేఆర్ఎస్, కబిని డ్యామ్‌ల క్యాచ్మెంట్ ఏరియాలలో ఇటీవల కురిసిన వర్షాల కారణంగా, బిలిగుండ్లు వద్ద తమిళనాడుకు అందాల్సిన నిష్పత్తి నీరు 26.954 టీఎంసీలుగా ఉండాలని పేర్కొంది. దీనితో పోలిస్తే కావేరీ జలాల నిర్వహణ సంస్థ (CWMA) కేటాయించిన 4.536 టీఎంసీలు చాలా తక్కువని తమిళనాడు ఆరోపించింది. మొత్తంగా కర్ణాటక ప్రభుత్వం తమిళనాడుకు ఇవ్వాల్సిన 26.954 టీఎంసీల న్యాయమైన వాటాను పంచుకోవడంలో విఫలమైందని తమిళనాడు ప్రభుత్వం తన అధికారిక ప్రకటనలో వెల్లడించింది. -
పరందూర్ ఎయిర్పోర్ట్ రద్దు.. రైతులకే మా మద్దతు.. CM విజయ్ సంచలన నిర్ణయం
-
మాట నిలబెట్టుకున్న తమిళనాడు సీఎం విజయ్
మేనిఫెస్టో పేరిట అడ్డగోలు హామీలు ఇవ్వడం.. అధికారంలోకి వచ్చాక వాటిని ఎగ్గొట్టడం.. కొందరికి అలవాటే!. ముఖ్యంగా ఇప్పుడున్న కొన్ని ప్రభుత్వాలు ప్రజలను అలా మోసం చేస్తున్నవే. అయితే అధికారంలోకి వచ్చిన వంద రోజులు పూర్తి కాగా.. ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ పోతున్నారు పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి జోసెఫ్ సి విజయ్.తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ సోమవారం కీలక ప్రకటన చేశారు. పరందూర్ గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ప్రాజెక్ట్‌పై కీలక నిర్ణయం వెల్లడించారు. చెన్నై సమీపంలో ప్రతిపాదించిన ఈ విమానాశ్రయ నిర్మాణాన్ని నిలిపివేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రాజెక్ట్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న రైతులు, స్థానికులకు అండగా ఉంటానని మరోసారి స్పష్టం చేశారు.‘‘పరందూర్ ఎయిర్పోర్ట్ ప్రాజెక్ట్‌ను రద్దు చేస్తున్నాం. ప్రతిపాదిత విమానాశ్రయానికి వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రజలకు నా మద్దతు ఎప్పుడూ ఉంటుంది’’ అని విజయ్ తెలిపారు. వీటితో పాటు ఎన్నికల హామీలైన మూడు ఉచిత సిలిండర్ల పథకం పొంగల్ నుంచి ప్రారంభిస్తామని, అక్టోబర్ 2 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం(డీలక్స్ బస్సులకూ వర్తింపజేస్తూ) పథకం మొదలుపెడతామని.. అలాగే మిగతా మేనిఫెస్టో హామీలపైనా స్పష్టత ఇచ్చారు. 🚨Chief Minister Vijay announces that the TVK government will abandon the proposed Parandur airport project. RIP TN Economy...🙏🙂 pic.twitter.com/ga7qbFvT64— Chennai Updates (@UpdatesChennai) August 24, 2026రైతుల ఆందోళనకు అండగా..చెన్నైకి దాదాపు 70 కిలోమీటర్ల దూరంలోని కాంచీపురం జిల్లాలోని పరందూర్‌లో కొత్త అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించాలని గత ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే ఈ ప్రాజెక్ట్ వల్ల బహుళ పంటలు పండే వ్యవసాయ భూములు, నీటి వనరులు దెబ్బతింటాయని స్థానిక రైతులు, పర్యావరణ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు.టీవీకే అధినేతగా ఉన్నప్పటి నుంచే విజయ్ ఈ ప్రాజెక్ట్‌ను వ్యతిరేకించారు. 2024 అక్టోబర్‌లో విక్రవాండి సభలోనే ఈ అంశంపై స్పందించిన ఆయన.. పారిశ్రామిక అభివృద్ధికి విమానాశ్రయాలు అవసరమే అయినా, రైతుల ప్రయోజనాలను పణంగా పెట్టి నిర్మాణాలు చేపట్టకూడదని వ్యాఖ్యానించారు. అధికారంలోకి వస్తే ప్రజల హామీని నెరవేరుస్తానని చెప్పిన విజయ్.. తాజాగా ఆ దిశగా నిర్ణయం తీసుకున్నారు.డీఎంకే హయాంలోనే ప్రతిపాదనపరందూర్ ఎయిర్‌పోర్ట్‌కు 2025 ఏప్రిల్‌లో కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సూత్రప్రాయ అనుమతి ఇచ్చింది. అయితే అప్పటి డీఎంకే ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్లింది. టీవీకే అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపాదిత స్థలాన్ని పునఃసమీక్షించాలని నిర్ణయించింది. ప్రత్యామ్నాయ ప్రాంతాలను పరిశీలించి.. నీటి వనరులు, సారవంతమైన భూములను కాపాడేలా చర్యలు తీసుకుంటామని పార్టీ నేతలు వెల్లడించారు.విజయ్ ప్రకటనపై డీఎంకే కౌంటర్అయితే విజయ్ నిర్ణయంపై డీఎంకే తీవ్రంగా స్పందించింది. గతంలో తమ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్ట్‌పై అనుమానాలు వ్యక్తం చేయడం సరికాదని ఆ పార్టీ నేతలు పేర్కొన్నారు. డీఎంకే సీనియర్ నేత దురైమురుగన్ మాట్లాడుతూ.. ‘‘ప్రాజెక్ట్‌కు సంబంధించిన మా ఫైళ్లను బయటపెట్టేందుకు విజయ్‌కు అనుమతి ఇస్తున్నాం. వారం రోజుల్లో వాటిని బయటపెట్టకపోతే.. అసెంబ్లీలో ప్రివిలేజ్ మోషన్ తీసుకొచ్చే అంశాన్ని పరిశీలిస్తాం’’ అని అన్నారు.ఎన్నికల ముందు పరందూర్ ఎయిర్‌పోర్ట్‌కు వ్యతిరేకంగా గళమెత్తిన విజయ్.. అధికారంలోకి వచ్చిన తర్వాత అదే నిర్ణయాన్ని అమలు చేయడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. రైతులు, పర్యావరణ పరిరక్షణ అంశాలను ముందుకు తెస్తూ తీసుకున్న ఈ నిర్ణయం.. తమిళనాడు రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది.ఇదీ చదవండి: మిడ్డిలో విజయ్ ఎమ్మెల్యే??.. కీర్తన రియాక్షన్ ఇదే -
సీఎం విజయ్ కీలక నిర్ణయం.. తమిళనాడు ప్రజలకు గుడ్‌న్యూస్
చెన్నై: తమిళనాడులో విజయ్ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలుపై ఫోకస్ పెంచుతోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ప్రతి కుటుంబానికి ఏడాదికి మూడు ఉచిత ఎల్పీజీ సిలిండర్లు, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం వంటి నిర్ణయాలపై సీఎం విజయ్ ప్రకటన చేశారు. పొంగల్ నుంచి ‘అన్నపూర్ణ సూపర్-6’ పథకం అమలు చేయనున్నట్టు సీఎం విజయ్ చెప్పుకొచ్చారు.తమిళనాడులో విజయ్ ప్రభుత్వం పథకాల హామీల అమలుపై స్పీడ్ పెంచింది. ‘అన్నపూర్ణ సూపర్-6’ పథకాన్ని వచ్చే పొంగల్ నుంచి ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకం కింద కుటుంబాలకు ఏడాదికి మూడు ఉచిత ఎల్పీజీ సిలిండర్లు అందించే ప్రతిపాదన గతంలో వెల్లడైంది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని సుమారు 1.30 కోట్ల కుటుంబాలకు ప్రయోజనం చేకూరనుంది. ప్రభుత్వ ఖజానాపై ఏడాదికి దాదాపు రూ.4,000 కోట్ల భారం పడుతుందని అంచనా. ఏటా రూ.2.5 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలకు ఏడాదికి మూడు ఎల్పీజీ సిలిండర్ల ఖర్చును ప్రభుత్వం భరించనుంది.అలాగే, ఇప్పటికే సాధారణ ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం అమల్లో ఉంది. కాగా, అక్టోబర్ 2 నుంచి మహిళలకు మరిన్ని బస్సు సర్వీసుల్లో ఉచిత ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా డీలక్స్ సర్వీసులను కూడా ఉచిత ప్రయాణ పరిధిలోకి తీసుకురానున్నారు. ‘వెట్రి పయణం’ పథకం పరిధిని విస్తరిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు ట్రాన్స్‌జెండర్ వ్యక్తులకు కూడా ప్రభుత్వ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు విజయ్ అసెంబ్లీలో ప్రకటించారు.సమాజంలోని అన్ని వర్గాలకు సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఒకవైపు పేద కుటుంబాలకు గ్యాస్ భారం తగ్గిస్తూ.. మరోవైపు మహిళలకు బస్సు ప్రయాణాన్ని మరింత సులభతరం చేస్తూ.. ట్రాన్స్జెండర్లకు ఉచిత ప్రయాణం కల్పిస్తూ విజయ్ ప్రభుత్వం అసెంబ్లీలో సంక్షేమ పథకాల వరుస ప్రకటనలు చేయడం తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.ఎన్నికల హామీలు ఒక్కొక్కటిగా అమలు చేసే దిశగా తమిళనాడు ప్రభుత్వం అడుగులు వేస్తుండటంతో.. మహిళలకు బస్సు ప్రయాణం, కుటుంబాలకు వంటగ్యాస్ ప్రయోజనాలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కీలక అంశాలుగా మారుతున్నాయి. -
వీడియో నాది కాదు.. నా దుస్తుల గురించి మీకెందుకు?: కీర్తన కౌంటర్
చెన్నై: రాజకీయాల్లో ప్రత్యర్థులపై విమర్శలు సాధారణమే.. కానీ ఇప్పుడు తమిళనాడులో దుస్తుల చుట్టూ రాజకీయ టర్న్ తీసుకుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోపై టీవీకే మంత్రి ఎస్. కీర్తన ఘాటుగా స్పందించారు. వీడియోలో కనిపిస్తున్న మహిళ తాను కాదని క్లారిటీ ఇచ్చిన ఆమె.. “ఒకవేళ ఆ మహిళ నేనే అయినా.. నా దుస్తుల గురించి మీకెందుకు?” అంటూ ప్రత్యర్థులకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.ఇంతకీ ఏం జరిగిందంటే.. వైరల్ అవుతున్న వీడియోలో ఓ కారులో నుంచి దిగుతున్న మహిళను కీర్తనగా పేర్కొంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. దీనిపై స్పందించిన మంత్రి.. ఆ వీడియోలో ఉన్నది తాను కాదని స్పష్టం చేశారు. అంతేకాదు, మహిళల దుస్తులు, రూపం, వ్యక్తిగత ఎంపికలను రాజకీయ చర్చగా మార్చడం వెనుక ఉన్న ఆలోచనా ధోరణిపై మండిపడ్డారు. ‘మా విధానాలను, మా పాలనను, మా పనితీరును ప్రశ్నించలేకపోతే.. వ్యక్తిగత జీవితాలపై కథలు అల్లుతారా?’ అంటూ కీర్తన రాజకీయ ప్రత్యర్థులపై విరుచుకుపడ్డారు. మహిళలను వారి పని, సామర్థ్యం కంటే దుస్తులు, రూపంతో కొలవడం వెనుక తిరోగమన భావజాలం ఉందని విమర్శించారు.Fake News About Minister Keerthana ❌🗣️#tvk #tvkfortn #tvkvijay #ministerissue pic.twitter.com/69AzolwJMA— 𝕋𝕍𝕂 𝕀𝕋 𝕎𝕀ℕ𝔾 (@TVKITWINGG) August 23, 2026ఇక్కడితో ఆగకుండా.. డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్‌ను పరోక్షంగా టార్గెట్ చేస్తూ కీర్తన చేసిన వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయాల్లో మరింత హీట్ పెంచాయి. మహిళలపై గతంలో అవమానకర వ్యాఖ్యలు చేసిన నాయకుడి అనుచరుల నుంచి ఇలాంటి ప్రచారాలు రావడంలో ఆశ్చర్యం లేదంటూ ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో.. వైరల్ వీడియోలోని మహిళను కూడా కీర్తన ప్రస్తావించారు. తనతో పోలిక ఉండటంతో అనవసరంగా వివాదంలోకి లాగినందుకు ఆమెకు క్షమాపణలు చెప్పారు. “నీలా నువ్వు జీవించు.. నీకు నచ్చినట్లుగా ఉండటం ఆపొద్దు” అంటూ ఆమెకు మంత్రి మద్దతు తెలిపారు.చదవండి: బీహార్‌లో పొలిటికల్ ట్విస్ట్.. సీఎం రేసులోకి నితీష్ వారసుడు?ఇదిలా ఉండగా.. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో శివకాశి నుంచి గెలిచిన కీర్తన.. విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వంలో కీలక మంత్రిగా కొనసాగుతున్నారు. దీంతో ఈ వ్యవహారం కేవలం సోషల్ మీడియా వైరల్ వీడియోకే పరిమితం కాకుండా టీవీకే వర్సెస్ ప్రత్యర్థి పార్టీల మధ్య మరో రాజకీయ మాటల యుద్ధానికి దారితీసే అవకాశం కనిపిస్తోంది. వీడియో ఎవరిదన్న దానికంటే.. మహిళల వ్యక్తిగత జీవితాలనే రాజకీయ ఆయుధంగా ఎందుకు మారుస్తున్నారన్నదే ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో కీర్తన లేవనెత్తిన అసలు ప్రశ్న.இது நானா..? எனக்கே ஆச்சரியமா இருக்கு...! இணையதளத்தில் வைரலாகும் பெண்ணின் வீடியோ.... அமைச்சர் கீர்த்தனா விளக்கம்#Sivakasi | #MinisterKeerthana | #ViralVideo | #PolimerNews pic.twitter.com/oyhQVaXyEZ— Polimer News (@polimernews) August 24, 2026 -
ఓటమి దెబ్బకు డీఎంకేలో ఊహించని విధంగా భారీ మార్పులు
న్యూఢిల్లీ: ఏప్రిల్‌లో జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే ఓడిపోయిన నేపథ్యంలో శనివారం ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) తన పార్టీ సంస్థాగత వ్యవస్థలో భారీ మార్పులను ప్రకటించింది. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అధ్యక్షతన డీఎంకే కార్యవర్గం చెన్నైలోని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం అన్నా అరివాలయంలో సమావేశమై, పార్టీ వ్యవస్థను పూర్తిగా పునర్వ్యవస్థీకరించే లక్ష్యంతో 9 కీలక తీర్మానాలను ఆమోదించింది.సమావేశంలో మాట్లాడిన స్టాలిన్, మార్పులు కఠినంగా ఉంటాయని, కొందరు వాటిని అంగీకరించడం కష్టంగా కూడా ఉండవచ్చని అంగీకరించారు. “మన పార్టీ పదవుల్లో ఉన్నవారి పనితీరు కూడా మన ఓటమికి ఒక కారణం. ముందుగా మన తప్పులను అంగీకరించాలి. పార్టీ సంస్థాగత వ్యవస్థలో పలు మార్పులు చేయబోతున్నాం. అవి కచ్చితంగా కఠినంగా ఉంటాయి. కొందరికి వాటిని అంగీకరించడం కష్టంగా కూడా ఉండవచ్చు. ఇకపై బాధ్యతలకు అనుగుణంగా వివిధ సంస్థాగత పదవులకు వయో పరిమితులు, పదవీకాల పరిమితులను ప్రవేశపెట్టబోతున్నాం. కొత్తవారికి ఎక్కువ సంఖ్యలో సంస్థాగత బాధ్యతలు అప్పగించబోతున్నాం. పార్టీని పునర్వ్యవస్థీకరించడం ద్వారానే రాజకీయ విజయాన్ని తిరిగి సాధించగలం. సంస్థాగత సంస్కరణలను వీలైనంత త్వరగా చేపట్టాలి” అని స్టాలిన్ తెలిపారు.కొత్త ప్రణాళిక ఏంటి? కొత్త ప్రణాళిక ప్రకారం.. డీఎంకే నాయకత్వం కఠినమైన వయో పరిమితులను, అన్ని పదవులకు తప్పనిసరిగా 2 పర్యాయాల పదవీకాల పరిమితిని ప్రవేశపెట్టింది. సంస్థాగత జిల్లాల సంఖ్యను కూడా భారీగా పెంచనుంది. పార్టీ కార్యకలాపాలను మరింత వృత్తిపరంగా నిర్వహించడం, తరాల మార్పును సులభతరం చేయడం ఈ చర్యల లక్ష్యం.డీఎంకే సంస్థాగత జిల్లాల సంఖ్యను 78 నుంచి 110కు పెంచనుంది. ప్రతి జిల్లా సుమారుగా 2 అసెంబ్లీ నియోజకవర్గాలను కలిగి ఉండేలా ఏర్పాటు చేయనున్నారు. దీని ద్వారా స్థానిక స్థాయి పరిపాలనను మరింత బలోపేతం చేయనున్నారు. స్టాలిన్ 110 పునర్వ్యవస్థీకరించిన జిల్లాల సరిహద్దుల పటాలను అధికారికంగా విడుదల చేసిన తర్వాత, మార్పులను అమలు చేసేందుకు పార్టీ ప్రధాన కార్యాలయం పర్యవేక్షణలో జిల్లా కార్యవర్గాలు 15 రోజుల్లో సమావేశం కావాల్సి ఉంటుంది.కోయంబత్తూరు, తాంబరం వంటి ప్రధాన పట్టణ ప్రాంతాల్లో ఉన్న ప్రత్యేక నగర కార్యదర్శి పదవిని కూడా రద్దు చేశారు. ఇకపై ఓటర్ల సంఖ్య ఆధారంగా పట్టణ ప్రాంతాలను పునర్విభజించనున్నారు. చెన్నై కార్పొరేషన్ పరిధిలోని కమిటీల్లో సగటున 40,000 మంది ఓటర్లు, ఇతర కార్పొరేషన్లలోని కమిటీల్లో సగటున 30,000 మంది ఓటర్లు ఉండేలా ఏర్పాటు చేయనున్నారు.ఇదీ చదవండి: కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ నోటీసుకు చిన్నారెడ్డి సమాధానం ఇదే.. -
బిడ్డకు మేనమామ ఉంగరం : బిడ్డింగ్ దక్కించుకున్న జ్యుయల్లర్స్ ఇవే!
సాక్షి, చెన్నై: ప్రభుత్వ ఆసుపత్రులలో పుట్టిన నవజాత శిశువులకు 1 గ్రాము బంగారు ఉంగరాలను అందించే తల్లి మేనమామ బంగారు ఉంగరం పథకం (Thaimaman Thanga Mothiram Scheme) కొనుగోలు ప్రక్రియను తమిళనాడు ప్రభుత్వం ఖరారు చేసింది. మాజీ ముఖ్యమంత్రి సీఎన్ అన్నాదురై జయంతి సందర్భంగా సెప్టెంబర్ 15న ఈ పథకాన్ని ప్రారంభించనున్న నేపథ్యంలో తమిళనాడు మెడికల్ సర్వీసెస్ కార్పొరేషన్ (టీఎన్ఎంఎస్సీ) 70:30 నిష్పత్తిలో జాయ్ అలుక్కాస్, కల్యాణ్ జ్యువెలర్స్‌కు 1,28,499 బంగారు ఉంగరాలు సరఫరా చేసేందుకు వర్క్ ఆర్డర్లను జారీ చేసింది.అసెంబ్లీ ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ ప్రకటించిన ఈ పథకం ప్రకారం జూన్ 22 నుంచి ప్రభుత్వ ఆస్పత్రులలో పుట్టిన శిశువులకు ఈ పథం వర్తిస్తుంది. ఈ మేరకు జ్యుయల్లరీ సంస్థలకు 70:30 నిష్పత్తిలో వర్క్ ఆర్డర్లు జారీ అయ్యాయి. జూన్ నుండి సెప్టెంబర్ నాలుగు నెలల వరకు ఉన్న లబ్ధిదారుల కోసం మొదటి విడతలో జూన్ నుండి లబ్ధిదారులకు 1,28,499 బంగారు ఉంగరాలను ఈ రెండు సంస్థలు సరఫరా చేస్తాయి.టెండర్ ప్రక్రియలో జాయ్ అలుక్కాస్ సంస్థ 1 గ్రాము బంగారు ధర మినహాయించి, తయారీ, రవాణా, ఇన్సూరెన్స్, BIS హాల్‌మార్కింగ్ చార్జీల కోసం కేవలం 0.01 (1 పైసా) అత్యల్ప ధరగా బిడ్ దాఖలు చేసింది. తమిళనాడు పారదర్శక టెండర్ల చట్టం ప్రకారం, కళ్యాణ్ జువెలర్స్ కూడా అతి తక్కువ ధరకు అంగీకరించడంతో 30శాతం వాటా దక్కించుకుంది. ఇదీ చదవండి: రూ. 150 కోట్ల అవినీతి : బార్ కౌన్సిల్ ఛైర్మన్‌పై సంచలన ఆరోపణలు కాగా తమిళ సంస్కృతిలో పుట్టిన బిడ్డకు మేనమామ బంగారు ఉంగరం తొడగడం ఒక పవిత్రమైన ఆచారంగా భావిస్తారు. ఈ సెంటిమెంట్‌ను గౌరవిస్తూ,మగ లేదా ఆడ అనే లింగ బేధం లేకుండా, అలాగే ఎన్నో కాన్పు అనే పరిమితి లేకుండా పుట్టిన ప్రతి బిడ్డకు ఈ ఉంగరాన్ని అందిస్తారు.ఈ పథకం కోసం తమిళనాడు ప్రభుత్వం ఏటా రూ. 755.83 కోట్లు కేటాయించింది.ప్రభుత్వ వైద్య విధానంపై ప్రజలకు నమ్మకాన్ని పెంచడం , ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పులను ప్రోత్సహించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని సీఎం విజయ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదీ చదవండి: దారుణం బిల్‌పై బాడీ షేమింగ్ వివాదం : స్పందించిన కెఫే -
ఆసై దోసై అప్పళం వడై..
ప్రతి ఇంటిలో మనం మరచి΄ోయిన ఒక నిధి ఉంటుంది. కొద్దిమందికి ఆ నిధి అకస్మాత్తుగా గుర్తుకు వచ్చి వెలుగులోకి తెస్తారు. ఆ వెలుగులు పిల్లల ప్రపంచంలోకి వస్తే ఎంత బాగుంటుంది? ఎంత బాగుంటాయో చెబుతున్నాయి అమ్మ చెప్పిన కథలు. ‘ఫోక్‌టేల్స్ ఫ్రమ్ తమిళనాడు’ పేరుతో వచ్చిన పుస్తకం సోషల్ మీడియాలో ఎట్రాక్షన్‌గా మారింది. ‘నాకు కూడా మా అమ్మ చెప్పిన కథలు గుర్తుకు వస్తున్నాయి’ అంటూ కలం పడుతున్నారు నెటిజనులలో కొందరు...చిన్నప్పుడు తల్లి తనకు చెప్పిన జానపద కథలను ఈతరం పిల్లలకు ‘ఫోక్ టేల్స్ ఫ్రమ్ తమిళనాడు’ పేరుతో చేరువ చేస్తున్నారు నారాయణ్.అమ్మ చెప్పిన ఆ కథలు ఎలా ఉంటాయి?ఏనుగు పక్కింటి అబ్బాయిలా పిల్లలతో ఫ్రెండ్లీగా మాట్లాడుతుంది.పులి గాండ్రిస్తూనే ‘హాయ్’ చెబుతుంది.గర్జిస్తూనే సింహం మన యోగక్షేమాలు అడుగుతుంది.ఒక్కటా రెండా... ఎన్నెన్ని చిత్రవిచిత్రాలో! ఈ పుస్తకంలో 21 కథలు పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తాయి. నైతిక విలువలు అంటే ఏమిటో చెప్పకనే చెబుతాయి. తెల్లగుర్రంపై ఎక్కించి మేఘాలపై స్వారీ చేయిస్తాయి.పనిదొంగ పక్షులుఅనగనగా ఒక కోడి. ఆ కోడి పిండి కలిపి చపాతీలు చేస్తుండగా, దాని పొరుగున ఉన్న కాకి, పిచ్చుక, బాతు, చిలకలాంటివి కోడికి సహాయం చేయకుండా ఏవో సాకులు చెప్పి తప్పించుకుంటాయి.అయితే, వేడి వేడి చపాతీలు రెడీ అయిన వెంటనే...‘మాకు కూడా’ అంటూ ఆత్రుతగా కోడి చుట్టూ చేరతాయి. అప్పుడు కోడి నోటి నుండి...‘ఆసై దోసై అప్పళం వడై’ అనే పాట వినిపిస్తుంది. పిల్లలకు తెగ నవ్వొస్తుంది.ఇక ‘కా...కా’ కథ విషయానికి వస్తే, ఒక సోమరి కాకి తన ఆహారాన్ని వెదుక్కోవడానికి బద్దకించి, పిచ్చుకల నుండి దొంగిలిస్తుంటుంది. ఆహారాన్ని దొంగిలించడంలో అపారమైన తెలివితేటలు చూపే కాకి అత్యంత సులువుగా ఉచ్చులో పడుతుంటుంది. తన మూర్ఖత్వాన్ని చాటుకుంటుంది.పాటల కథలు!అమ్మ చెప్పిన కథలలో పాటలు, కవితలు ఉండడం మరో విశేషం. చందమామను పిలిచే పాట ‘నిల నిల ఓడి వా’ ను పిల్లలు గట్టిగా పాడుకుంటారు. ఈ కథలు పిల్లలకు తమిళ సాంస్కృతిక విశేషాలు, ఆహారపు అలవాట్ల గురించి కూడా తెలియజేస్తాయి.‘మా అమ్మ చెప్పే కథలు వింటూ పెరిగాను. ఈ కథలను నేను మరెక్కడా వినలేదు. తన ముందుతరాల నుండి అమ్మకవి వారసత్వ సంపదగా వచ్చాయి. సంగీతంపై నాకు అవగాహన ఉన్నప్పటికీ అమ్మకు ఉన్నంత లోతైన అవగాహన లేదు. తాను కథ చెప్పే విధానానికి సంగీతం బలం అయింది. కథలను మరింత ఆసక్తికరంగా వినేలా చేసింది’ అంటారు నారాయణ్.కథాచిత్ర ప్రపంచంఅందమైన కథలకు, అద్భుతమైన చిత్రాలు తోడైతే పిల్లలకు ఎంత సంతోషం కలిగిసాయో ఈ పుస్తకంలోని కనువిందు చేసే కలర్ పెయింట్స్ సాక్ష్యం. జానపద కథలు పుస్తకరూపంలోకి వచ్చినప్పుడు ఎన్నో రకాల మార్పులకు గురవుతుంటాయి.‘అసలు మార్పులు అవసరమా?’ అనే ప్రశ్నకు నారాయణ్ ఇచ్చే జవాబు...‘అవసరమే లేదు’ ఎందుకంటే జానపద కథలు ఊహల ద్వారానే పాఠకులతో అనుసంధానం అవుతాయి.‘కొన్ని విషయాలు శాశ్వతమైనవి. ఊహాలోకంలో విహరించాలనే మన ప్రేమ కూడా అందులో ఒకటి. ప్రతీదాన్ని సమకాలీకరించాల్సిన అవసరం లేదు. జానపద కథలు యథాతథ రూపంలోనే బాగుంటాయి’ అంటున్నారు నారాయణ్.- సృజనఇవి చదవండి: పిల్లల్లో హింసాత్మక ఆలోచనలకు అసలు కారణాలేంటో తెలుసా? -
నిఖితకు ఏం జరిగింది?.. కాంచీపురం వర్సిటీలో కలకలం
తమిళనాడులోని కాంచీపురం జిల్లాలో ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని మృతి తీవ్ర కలకలం రేపింది. ఆంధప్రదేశ్ తిరుపతికి చెందిన 20 ఏళ్ల నిఖిత అనుమానాస్పద రీతిలో విగతజీవిగా కనిపించింది. రెండ్రోజులుగా బయట కనిపించని ఆమె.. హాస్టల్ గదిలో బలవన్మరణానికి పాల్పడి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. అయితే.. ఆమె మరణానికి కారుకులైన వాళ్లను కఠినంగా శిక్షించాలని విద్యార్థులు ధర్నాకు దిగడంతో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. పోలీసుల వివరాల ప్రకారం.. కాంచీపురం ఎనతూర్లోని శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయంలో తిరుపతికి చెందిన నిఖిత ఈసీఈ మూడో సంవత్సరం చదువుతోంది. గత కొన్నిరోజులుగా ఆమె ఎవరితోనూ మాట్లాడడం లేదు. రెండు రోజులుగా తరగతులకు హాజరు కాలేదు. హాస్టల్ గదిలోనే ఉంటోంది. గురువారం రాత్రి ఆమె గది నుంచి దుర్వాసన రావడంతో తోటి విద్యార్థులు హాస్టల్ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో వార్డెన్, ఇతర సిబ్బంది గది తలుపులు తెరిచి చూడగా.. నిఖిత విగతజీవిగా కనిపించింది. సమాచారం అందుకున్న పొన్నేరికరై పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం చెంగల్పట్టు ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు.విద్యార్థుల ఆందోళనవిద్యార్థిని మృతితో వర్సిటీ ప్రాంగణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రెండు రోజులుగా నిఖిత తరగతులకు రాలేదని.. ఇటు హాస్టల్ యాజమాన్యం కూడా ఆమెను పట్టించుకోలేదని విద్యార్థులు ఆరోపించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం రాత్రి 50 మందికి పైగా విద్యార్థులు వర్సిటీ గేటు వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు.“నిఖిత మృతికి కారకులను శిక్షించాలి” అంటూ నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని విద్యార్థులతో మాట్లాడారు. కాలేజీ యాజమాన్యంతోనూ ప్రాథమిక చర్చలు జరిపారు. పోలీసుల హామీతో విద్యార్థులు ఆందోళన విరమించి శాంతియుతంగా అక్కడి నుంచి వెళ్లిపోయారు. వ్యక్తిగత కారణాలతోనే?ఘటనా స్థలంలో పోలీసులు ఓ లేఖను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కుటుంబ సంబంధిత కారణాలతోనే నిఖిత తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు ఆ లేఖలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. అయితే పూర్తి వివరాలు పోస్టుమార్టం నివేదిక, తదుపరి దర్యాప్తులో వెల్లడవుతాయని తెలిపారు. ప్రస్తుతం నిఖిత మృతికి దారితీసిన పరిస్థితులపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com -
ఎమ్మెల్యేలకు అత్యంత ఖరీదైన కార్లు!
సాక్షి, చెన్నై: తమిళనాడులోని శాసన సభ్యులకు ప్రభుత్వం తరఫున కొత్త వాహనాలను కేటాయించేందుకు కసరత్తు వేగవంతమైంది. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.20 లక్షల నుంచి రూ.34 లక్షల విలువైన కార్లను అందించనున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. దీనికి సంబంధించిన మోడల్ కార్లను సచివాలయ ప్రాంగణానికి తీసుకువచ్చి అధికారులు పరిశీలిస్తున్నారు ఎమ్మెల్యేలందరికీ ప్రభుత్వం తరఫున ఉచిత కార్లను అందజేస్తామని అసెంబ్లీలో సీఎం విజయ్ తెలిపిన విషయం తెలిసిందే. ఇంధనం, వాహన నిర్వహణ, వ్యక్తిగత సహాయకుడి నియామకం వంటి వాటి ఖర్చులకు నెలకు రూ.లక్ష అందజేయనున్నట్టు ప్రకటించారు. ముఖ్యమంత్రి ప్రకటన అమల్లో భాగంగా వివిధ ప్రముఖ ప్రైవేట్ వాహన తయారీ సంస్థలకు చెందిన 6 రకాల మోడల్ కార్లను (మహీంద్రా స్కార్పియో, ఎక్స్‌యూవీ తదితరాలు) అధికారులు పరిశీలన కోసం చెన్నైలోని సచివాలయ ప్రాంగణానికి తీసుకువచ్చారు. ఈ కార్లను టెస్ట్ డ్రైవ్ చేసి, అత్యంత అనుకూలమైన మోడల్‌ను ఎంపిక చేయనున్నారు. 234 కార్ల కొనుగోలుకు ప్రణాళిక రూపకల్పన చేసి ఉన్నా, డీఎంకే సభ్యులు 59 మంది తమకు కార్లు వద్దని ప్రకటించడం గమనార్హం. దీంతో ఎన్ని కార్లు కొనుగోలు చేస్తారో? అన్న చర్చ ఊపందుకుంది. ఒక్కో కారు ఖరీదు కనిష్టంగా రూ.20 లక్షల నుంచి గరిష్టంగా రూ.34 లక్షల వరకు ఉండే అవకాశం ఉన్నట్టు సమాచారం. -
సెటైర్ల సంగ్రామం.. ఉదయనిధి వర్సెస్ టీవీకే
తమిళనాడు అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం వాడీవేడిగా సాగాయి. అధికార టీవీకే ప్రభుత్వం, ప్రతిపక్ష డీఎంకే మధ్య రాజకీయ విమర్శలు వ్యక్తిగత ఆరోపణల స్థాయికి చేరాయి. ఒకానొక టైంలో ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్, మంత్రి సీటీఆర్ నిర్మల్ కుమార్ మధ్య చోటుచేసుకున్న మాటల యుద్ధం సభలో తీవ్ర చర్చకు దారితీసింది. ఒకరిపై ఒకరు వ్యంగ్య వ్యాఖ్యలు చేసుకోవడంతో స్పీకర్ జోక్యం చేసుకుని ఆ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాల్సి వచ్చింది.శాసనసభలో టీవీకే సర్కార్‌పై ఉదయ్‌నిధి స్టాలిన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎమ్మెల్యేలకు కార్లు గిఫ్ట్ ఇచ్చే ప్రకటన చేశాక.. టీవీకే ఎమ్మెల్యే సింధు ముఖ్యమంత్రి విజయ్ను ప్రశంసిస్తూ ఎంజీఆర్ చిత్రంలోని పాట పాడడంపై ఉదయనిధి స్పందించారు. ‘‘మనం అసెంబ్లీకి వచ్చామా? లేదంటే సూపర్ సింగర్ కార్యక్రమానికి వచ్చామా? అనే సందేహం వస్తోంది’’ అంటూ ఎద్దేవా చేశారు. అలాగే ఎమ్మెల్యేలకు కారు అనేది అనవసరమైన ఖర్చు అని, తమ 59 మంది డీఎంకే ఎమ్మెల్యేలకు అవి అక్కర్లేదంటూ సీఎం విజయ్ ప్రకటనను తిరస్కరించారు.అలాగే అసెంబ్లీ సమావేశాల్ని లైవ్ ప్రసారం చేయకపోవడంపైనా ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. అలాగే రికార్డుల నుంచి కొన్ని వ్యాఖ్యలను తొలగించినా.. అవి సోషల్ మీడియాలో రీల్స్ రూపంలో వైరల్ అవుతున్నాయని స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో విజయ్ సర్కార్‌కు ఆయన ఓ సవాల్ సైతం విసిరారు.సినిమా డైలాగులొద్దు..ఇటీవల సీఎం విజయ్.. గత డీఎంకే ప్రభుత్వానికి సంబంధించిన అవినీతి ఫైళ్లు తన వద్ద ఉన్నాయని అన్నారు. ఆ వ్యాఖ్యలను ఉదయనిధి ప్రస్తావిస్తూ.. ‘‘ఆ ఫైళ్లను బయటపెట్టండి. సినిమా పంచ్ డైలాగులు వద్దు’’ అంటూ విజయ్‌కు సవాల్ విసిరారు. ‘‘ఆధారాలు ఉంటే విడుదల చేయండి. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోండి. డీఎంకే ఎలాంటి బెదిరింపులకు భయపడదు’’ అని అన్నారు.Leader of the Opposition and DMK leader Udhayanidhi Stalin announced in the Tamil Nadu Assembly that all 59 DMK MLAs will not accept the newly announced government-provided cars. He said such expenditure is unnecessary when Tamil Nadu is facing a heavy debt burden.… pic.twitter.com/RsyYpEEHMB— IndiaToday (@IndiaToday) August 21, 2026నిర్మల్ వ్యాఖ్యలతో దుమారం.. సభలో మంత్రి సీటీఆర్ నిర్మల్ కుమార్ ఉదయనిధి స్టాలిన్‌ను ప్రస్తావిస్తూ తొలుత ‘‘గౌరవనీయ కరూర్ ఎమ్మెల్యే’’ అని అన్నారు. వెంటనే దాన్ని సరిదిద్దుతూ ‘‘కోయంబత్తూరు సౌత్ ఎమ్మెల్యే’’ అని పేర్కొన్నారు. ఆ వ్యాఖ్యలతో సీఎం విజయ్ సహా ఎమ్మెల్యేల్లో కొందరు నవ్వుకున్నారు. కరూర్‌కు గతంలో.. ప్రస్తుతం కోయంబత్తూరు సౌత్ ఎమ్మెల్యేగా ఉంది బాలాజీ సెంథిల్. అవినీతి ఆరోపణల్లో ఆయన అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘కరూర్ గ్యాంగ్’ను డీఎంకే అధిష్టానం రక్షిస్తుందంటూ ప్రత్యర్థులు ఎద్దేవా చేస్తుంటారు. నిర్మల్ కుమార్ ఆ కోణంలోనే అలా మాట్లాడి ఉంటారని అంతా భావిస్తున్నారు.అయితే నిర్మల్ స్పందించిన ఉదయనిధి వ్యంగ్యంగా.. ‘‘గౌరవనీయ సంఘీ మంత్రి’’ అంటూ వ్యాఖ్యానించి, ఆ వెంటనే ‘‘విద్యుత్ మంత్రి’’ అని సరిదిద్దుకున్నారు. ఈ వ్యాఖ్యలపై టీవీకే సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. నిర్మల్ కుమార్ గతంలో.. బీజేపీకి పని చేశారు. ఆ తర్వాత అన్నాడీఎంకేలో చేరి.. కిందటి ఏడాది టీవీకే కండువా కప్పుకున్నారు. బహుశా ఈ కోణంలోనే ఉదయనిధి పంచ్ వేశారు.అయితే.. ఈ సెటైర్ల సంగ్రామం ఇక్కడే ఆగిపోలేదు. నిర్మల్ కుమార్ మరోసారి లేచి.. ‘‘సాధారణంగా ఎవరైనా బాత్రూమ్లో 5 నుంచి 10 నిమిషాలు ఉంటారు. కానీ మూడు గంటలు బాత్రూమ్లో ఉన్న గౌరవనీయ మంత్రి’’ అంటూ వ్యాఖ్యానించారు. దీంతో డీఎంకే సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.செந்தில் பாலாஜிய "கரூர் கம்பெனி"னு சொன்னா @Udhaystalin ஏன் இவ்ளோ கோவம் வருது... FYI, DVAC'ல "கரூர் Gang"னு mention ஆகி இருக்கு.. அதுக்கும் தனக்கும் சம்பந்தம் இருக்குனு அவரே ஒதுக்குகிறாரா LoP...??@CTR_Nirmalkumar Mass 🔥🔥🔥#TVK #TVKGovt #DMK #UdhaynidhiStalin #TNAssembly… pic.twitter.com/qwlRXxVIlh— Gomathi Sivam (@GomatiSivam) August 21, 2026 one of a kind blud 👺 pic.twitter.com/cXBx1qoHvX— Fayas.naxiim🐿️ (@_faaaz) August 21, 2026 కావేరీ నీటి వివాదం సమయంలో.. నటి త్రిష మీద ఉదయనిధి స్టాలిన్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో.. ఉదయనిధిని అరెస్టు చేసేందుకు పోలీసులు వెళ్లినప్పుడు ఆయన భార్య కిరుతిగా ‘‘ఆయన బాత్రూమ్లో ఉన్నారు.. కొంత సమయం ఇవ్వండి’’ అని చెప్పిన వీడియోలు అప్పట్లో వైరల్ అయ్యాయి. ఉదయనిధిపై నెట్టింట ట్రోలింగ్ కూడా నడిచింది. ఆ ఘటనను ఉద్దేశించే నిర్మల్ కుమార్ ఈ వ్యాఖ్య చేసినట్లు తెలుస్తోంది. Everyone attacking Udhay 🤣🤣😹🤣 pic.twitter.com/BD7yHgmrAV— Pokkiri_Victor (@Pokkiri_Victor) August 21, 2026దీనిపై ఉదయనిధి కూడా స్పందిస్తూ.. ‘‘బాత్రూమ్లో ఎవరు, ఎంతసేపు ఉంటారో లెక్కించే ప్రత్యేక శాఖను తమిళనాడులో ఏర్పాటు చేశారా?’’ అంటూ వ్యంగ్యంగా ప్రశ్నించారు. వ్యక్తిగత వ్యాఖ్యలతో సభ తప్పుదోవ పడుతుందని గుర్తించిన స్పీకర్ జేసీడీ ప్రభాకర్.. ఇరు పక్షాలను సముదాయించి ఆ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించారు.మరి బంగ్లా ఎందుకో?అయితే.. ఉదయనిధి వ్యాఖ్యలకు టీవీకే కీలక నేత, మంత్రి ఆధవ్ అర్జునా కౌంటర్ ఇచ్చారు. సీఎం విజయ్ ఎమ్మెల్యేలందరినీ సమానంగా చూడాలనే ఉద్దేశంతోనే కార్ల ప్రకటన చేశారని స్పష్టం చేశారు. చిన్న పార్టీలకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని, నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో పర్యటించేందుకు వాహనం అవసరమని పేర్కొన్నారు. ఇది విలాసం కాదని, ప్రాథమిక అవసరమని అన్నారు.‘‘ఇప్పటికే కారు ఉన్న ఎమ్మెల్యేలు ప్రభుత్వ వాహనానికి దరఖాస్తు చేయరు. టీవీకే విధానం స్పష్టంగా ఉంది. అందరికీ ఒకే విధమైన అవకాశం కల్పించాలన్నదే ముఖ్యమంత్రి ఉద్దేశం’’ అని ఆధవ్ అర్జునా తెలిపారు.అదే సమయంలో ఉదయనిధిపై వ్యక్తిగత విమర్శలు చేశారు. ‘‘కారు వద్దంటున్న ప్రతిపక్ష నేత.. ఇప్పటికే మూడు బంగ్లాలు ఉన్నప్పటికీ ప్రభుత్వ క్వార్టర్స్‌లో ఎందుకు ఉంటున్నారు?’’ అంటూ ప్రశ్నించారు. ఎమ్మెల్యేలకు వాహనాల కేటాయింపు అనేది ప్రోటోకాల్‌లో భాగమని స్పష్టం చేశారు.🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣 pic.twitter.com/CiVO6eKlpC— Pokkiri_Victor (@Pokkiri_Victor) August 21, 2026ఇదీ చదవండి: విజయ్ సరెండర్.. డీఎంకే చేతికి చిక్కిన అస్త్రం! -
డీలిమిటేషన్‌పై బిగ్ ట్విస్ట్.. ప్రత్యేక పార్లమెంట్ భేటీకి కేంద్రం కసరత్తు?
సాక్షి, ఢిల్లీ: డీలిమిటేషన్ బిల్లు కోసం పార్లమెంట్‌ను మరోసారి కొలువుదీర్చేందుకు కేంద్రం సిద్ధమవుతోందా? వర్షాకాల సమావేశాలు ముగిసినా.. పార్లమెంట్‌ను ఇప్పటివరకు ప్రొరోగ్ చేయకపోవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. దీంతో అవసరమైతే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేసి డీలిమిటేషన్ బిల్లును ముందుకు తీసుకురావచ్చన్న ప్రచారం ఊపందుకుంది.ఇప్పటికే డీలిమిటేషన్ అంశంపై కేంద్రం తన వైఖరిని స్పష్టం చేసింది. 543 నుంచి లోక్‌సభ స్థానాల సంఖ్య పెరిగినా.. దక్షిణాది రాష్ట్రాలకు నష్టం ఉండదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా గతంలో చెప్పారు. దక్షిణాది రాష్ట్రాల ప్రస్తుత 129 స్థానాలకు గాను కొత్తగా 195కు పెరుగుతాయని, మొత్తం లోక్‌సభలో వాటి వాటా దాదాపు 24 శాతంగానే ఉంటుందని ఆయన వివరించారు.తమిళనాట ట్విస్ట్.. ఇక తాజాగా దక్షిణాది ముఖ్యమంత్రుల సమావేశంలోనూ డీలిమిటేషన్ అంశం చర్చకు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. తమిళనాడు సీఎం విజయ్.. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాది రాజకీయ ప్రాతినిధ్యంపై ప్రభావం పడొచ్చన్న ఆందోళన వ్యక్తం చేశారు. అదే సమయంలో దక్షిణాది వాటా తగ్గకుండా కేంద్రం హామీ ఇవ్వాలని కోరారు. అయితే విజయ్ వైఖరిలో మార్పు వచ్చిందన్న ప్రచారం ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. గతంలో డీలిమిటేషన్‌ను తీవ్రంగా వ్యతిరేకించిన ఆయన.. ఇప్పుడు “దక్షిణాది ప్రాతినిధ్యం తగ్గకపోతే?” అన్న కోణంలో మాట్లాడటం చర్చకు దారితీసింది. ఈ మార్పును విపక్షాలు, ముఖ్యంగా డీఎంకే, రాజకీయంగా ప్రశ్నిస్తోంది.ఇది కూడా చదవండి: డీకే ఎదుట విజయ్ సరెండర్.. డీఎంకేకు చిక్కిన అస్త్రంమరోవైపు డీఎంకే వైఖరి కూడా కీలకంగా మారింది. దక్షిణాది రాష్ట్రాల లోక్‌సభ వాటా తగ్గకుండా ఉంటే డీలిమిటేషన్‌ను పూర్తిగా వ్యతిరేకించాల్సిన అవసరం లేదనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం మాత్రం ప్రస్తుత 543 స్థానాల సంఖ్యను, తమిళనాడుకు ఉన్న 39 స్థానాలను మరో 25 ఏళ్లపాటు కొనసాగించాలన్న డిమాండ్‌ను తాజాగా వెల్లడించారు.ప్రత్యేక సమావేశాలపై చర్చ..ఇక అసలు ఆసక్తి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలపైనే! వర్షాకాల సమావేశాలు ఆగస్టు 13తో ముగిశాయి. అయినప్పటికీ పార్లమెంట్‌ను ఇంకా ప్రొరోగ్ చేయకపోవడంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో కేంద్రం వ్యూహాత్మకంగా ప్రత్యేక సమావేశాలకు మార్గం సిద్ధం చేస్తోందా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే ప్రత్యేక సమావేశాలు ఖరారయ్యాయని కేంద్రం అధికారికంగా ప్రకటించలేదు. మొత్తంగా చూస్తే.. డీలిమిటేషన్ బిల్లు, దక్షిణాది ప్రాతినిధ్యం, మహిళా రిజర్వేషన్, లోక్‌సభ స్థానాల పెంపు.. ఈ నాలుగు అంశాలు మరోసారి జాతీయ రాజకీయాలను వేడెక్కించే అవకాశముంది. అమిత్ షా దక్షిణాది రాష్ట్రాలకు నష్టం ఉండదని చెబుతుంటే.. దక్షిణాది నేతలు మాత్రం “సంఖ్య పెరిగినా.. రాజకీయ వాటా తగ్గకూడదు” అన్న హామీ కోరుతున్నారు. మరి ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు జరుగుతాయా? వస్తే డీలిమిటేషన్ బిల్లు టేబుల్‌పైకి వస్తుందా? అదే ఇప్పుడు ఢిల్లీ పొలిటికల్ సర్కిల్లో అసలు ప్రశ్న! -
డీకే ఎదుట విజయ్ సరెండర్.. డీఎంకే చేతికి చిక్కిన అస్త్రం
కావేరి నీళ్ల వివాదం మరోసారి దక్షిణాది రాజకీయాల్లో కాక రేపుతోంది. కర్ణాటక-తమిళనాడు మధ్య నీళ్ల పంచాయితీకి కేంద్రంగా మారిన మేకేదాటు డ్యామ్ అంశం.. ఇప్పుడు తమిళనాడు సీఎం విజయ్ను చుట్టుముడుతోంది. మహాబలిపురంలో జరిగిన దక్షిణాది ముఖ్యమంత్రుల సమావేశంలో కర్ణాటక సీఎం డీకే శివకుమార్ మేకేదాటు ప్రాజెక్టుకు గట్టిగా బ్యాటింగ్ చేస్తే.. అదే వేదికపై ఉన్న విజయ్ మాత్రం ప్రాజెక్టు పేరెత్తకుండానే ‘చట్టబద్ధమైన నీటి వాటా’ అంటూ జాగ్రత్తగా మాట్లాడారు. దీంతో అసలు విజయ్ స్టాండ్ ఏంటి? అన్న ప్రశ్నను డీఎంకే తెరపైకి తీసుకొచ్చింది.‘కర్ణాటక సీఎం మేకేదాటుకు అనుకూలంగా బహిరంగంగా మాట్లాడుతుంటే.. తమిళనాడు సీఎం ఎందుకు మౌనంగా ఉన్నారు?’ ఇదే ఇప్పుడు డీఎంకే ప్రధాన అస్త్రం. డీఎంకే ఎంపీ దయానిధి మారన్ విజయ్‌పై నేరుగా విమర్శలు గుప్పించారు. తమిళనాడు నీటి హక్కుల విషయంలో సీఎం మౌనం.. రాష్ట్ర ప్రయోజనాలతో రాజీ పడటమే అంటూ ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం మొదలుపెట్టింది డీఎంకే.విజయ్ మౌనం.. డీఎంకేకు రాజకీయ అస్త్రం!మేకేదాటు డ్యామ్ అనేది కేవలం ఒక ప్రాజెక్టు కాదు.. తమిళనాడు రాజకీయాల్లో కావేరి సెంటిమెంట్‌తో ముడిపడిన అంశం. రైతుల ప్రయోజనాలు, నీటి హక్కులు, కర్ణాటకతో పోరాటం.. ఈ మూడు అంశాల చుట్టూనే డీఎంకే తన రాజకీయ దాడిని పదును పెడుతోంది. గతంలోనూ మేకేదాటు విషయంలో విజయ్ వైఖరిని డీఎంకే తప్పుబట్టింది. ఇప్పుడు మరోసారి అదే అంశాన్ని పట్టుకుని ‘తమిళనాడు హక్కుల కోసం ఎవరు గట్టిగా నిలబడుతున్నారు?’ అనే ప్రశ్నను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చూస్తోంది.అయితే విజయ్ మాత్రం మరో వ్యూహాన్ని ఎంచుకున్నట్టు కనిపిస్తోంది. మేకేదాటు పేరును నేరుగా ప్రస్తావించకుండా.. ఎగువ రాష్ట్రం చేపట్టే ఎలాంటి చర్యలూ దిగువ రాష్ట్రానికి దక్కాల్సిన నీటి వాటాను ప్రభావితం చేయకూడదని, అన్నీ చట్టపరమైన పరిధిలోనే జరగాలని స్పష్టం చేశారు. అంటే.. డీఎంకే కోరుతున్నట్టుగా కర్ణాటకపై నేరుగా రాజకీయ యుద్ధం చేయకుండా.. చట్టం, హక్కులు, నీటి వాటా అనే మూడు అంశాల చుట్టూ తన వైఖరిని పరిమితం చేశారు.అసలు మేకేదాటు గేమ్ ఏంటి?కర్ణాటక ప్రతిపాదిస్తున్న మేకేదాటు ప్రాజెక్టుతో బెంగళూరుకు తాగునీరు, విద్యుత్ ఉత్పత్తి వంటి ప్రయోజనాలు కలుగుతాయని ఆ రాష్ట్రం చెబుతోంది. ప్రతిపాదిత రిజర్వాయర్‌లో 5 టీఎంసీలను తాగునీటి అవసరాలకు కేటాయిస్తామని, మిగిలిన నీరు తమిళనాడుకు వెళ్తుందని డీకే శివకుమార్ అంటున్నారు. కాగా, తమిళనాడుకు ఒక్క చుక్క కూడా నష్టం చేయం అన్నది కర్ణాటక వాదన. కానీ తమిళనాడు అనుమానం మాత్రం అక్కడే మొదలవుతోంది. నీరు ఎప్పుడు విడుదల చేస్తారు? ఎంత విడుదల చేస్తారు? కరువు వచ్చినప్పుడు కర్ణాటక తన రిజర్వాయర్లలో నీటిని నిల్వ చేసుకుంటే.. దిగువన ఉన్న తమిళనాడు పరిస్థితి ఏంటి?. అదే మేకేదాటు వివాదానికి అసలు కేంద్రబిందువు.కావేరిపై ఇప్పటికే టెన్షన్!ప్రస్తుత వర్షాభావ పరిస్థితులు, రిజర్వాయర్లలో నీటి నిల్వలపై ఒత్తిడి నేపథ్యంలో.. తమిళనాడుకు రోజుకు 3,500 క్యూసెక్కుల నీటిని 15 రోజుల పాటు విడుదల చేయాలని కావేరి వాటర్ రెగ్యులేషన్ కమిటీ ఆదేశించింది. ఈ ఆదేశాలపై కర్ణాటకలో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. అటు తమిళనాడు మాత్రం ఆదేశాల అమలుపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీంతో, నీటి వాటాల విషయంలో రెండు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. -
విజయ్-త్రిష బంధంపై నటి సంజన కీలక వ్యాఖ్యలు
విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత హీరోయిన్ త్రిష పేరు తరచూ వార్తల్లో నిలుస్తోంది. తాజాగా తమిళనాడులో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమంలో సీఎం విజయ్‌కు త్రిష సెల్యూట్ చేయడం రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై తాజాగా నటి సంజన స్పందించారు. విజయ్ పాలనపై మాట్లాడే ధైర్యం లేకే కొందరు వ్యక్తిగత అంశాలను తెరపైకి తెస్తున్నారని ఆమె విమర్శించారు.విజయ్ చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను సంజన ప్రశంసించారు. ప్రజా సమస్యలపై ఆయన వేగంగా స్పందిస్తూ.. తన పాలనతో ఇతర రాష్ట్రాల ప్రజలను సైతం ఆకర్షిస్తున్నారని పేర్కొన్నారు. విజయ్ పరిపాలనలో లోపాలు చూపించలేకే కొందరు వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని అన్నారు.‘విజయ్ రాష్ట్రాన్ని సమర్థంగా పరిపాలిస్తున్నారు కాబట్టి.. ఆయనపై ఆరోపణలు చేయలేకపోతున్నారు. వృత్తిపరంగా ఎలాంటి లోపాలు కనిపించనప్పుడు వ్యక్తిగత ఎజెండాను వెతకడానికి ప్రయత్నిస్తారు. వారి వ్యక్తిగత జీవితాన్ని లక్ష్యంగా చేసుకుని కించపరచాలని చూస్తారు. విజయ్ విషయంలో ఇప్పుడు ఇదే జరుగుతోంది. మహిళలను లక్ష్యంగా చేసుకునే ఇలాంటి రాజకీయాలు ఎప్పటికీ ఆమోదయోగ్యం కాదు’ అని సంజన వ్యాఖ్యానించారు.ఇక త్రిష గురించి మాట్లాడుతూ.. ఆమె ఎంతో గొప్ప నటి అని సంజన అన్నారు. సమాజంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు, గౌరవాన్ని సంపాదించుకున్నారని ప్రశంసించారు. విజయ్, త్రిష మధ్య ఉన్న బంధం పూర్తిగా వారి వ్యక్తిగత విషయమని స్పష్టం చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఇద్దరి సాన్నిహిత్యాన్ని చూసి వారి బంధం గురించి ఓ నిర్ణయానికి రావడం సరికాదని అభిప్రాయపడ్డారు. విజయ్ సీఎం అయిన తర్వాత త్రిష పేరు ఆయనతో ముడిపెట్టి సోషల్ మీడియాలో, రాజకీయ వర్గాల్లో చర్చలు జరుగుతున్న నేపథ్యంలో.. సంజన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం ఆసక్తికరంగా మారాయి. -
తమిళనాడు ఎమ్మెల్యేలకు విజయ్ గుడ్ న్యూస్!
-
విజయ్ సర్కార్ యూటర్న్.. వివాదాస్పద ఉత్తర్వులు వెనక్కి
తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులకు సంబంధించిన వివాదాస్పద జీవోను.. బుధవారం వెనక్కి తీసుకుంది. లెఫ్ట్ పార్టీలతో పాటు కాక్రోచ్ జనతా పార్టీ నిర్వహించే నిరసనలు, ఆందోళనల్లో విద్యార్థులు, యువత పాల్గొనకుండా చర్యలు తీసుకోవాలంటూ అంతకు ముందు జారీ చేసిన జీవోలో దుమారం రేపింది. ఆగస్టు 14న విజయ్ ప్రభుత్వం పాఠశాల విద్య, ఉన్నత విద్యాశాఖలకు ఓ ఉత్తర్వు జారీ చేసింది. అందులో.. లెఫ్ట్ పార్టీలతో పాటు సీపీజే నిర్వహించే నిరసనలు, ఆందోళనల్లో పాల్గొనాలనే ఆసక్తికి విద్యార్థులు, యువత ‘లోనుకాకుండా’ చర్యలు తీసుకోవాలని పాఠశాలలు, కళాశాలలకు సూచించింది. ఇందుకోసం పాఠశాల విద్య, ఉన్నత విద్యాశాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించింది. అంతేకాదు.. తీసుకున్న చర్యలపై ఆగస్టు 20లోగా ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని కూడా స్పష్టం చేసింది.దేశవ్యాప్తంగా విద్యార్థి ఆందోళనలుఇటీవల పరీక్షలు, విద్యా సంబంధిత అంశాలపై దేశవ్యాప్తంగా జెన్‌జెడ్, జెన్ఆల్ఫా విద్యార్థుల నిరసనలు పెరుగుతున్నాయి. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సీపీజే ఆధ్వర్యంలో జరిగిన విద్యార్థి ఉద్యమం కూడా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అటు యువత పోరాటాలకు మద్దతుగా మాట్లాడిన సీఎం విజయ్.. మొన్న స్వాతంత్ర్య దినోత్సవంలోనూ వణక్కం జెన్‌జీ అంటూ ప్రసంగించారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు, యువత నిరసనల్లో పాల్గొనకుండా అడ్డుకోవాలంటూ తమిళనాడు ప్రభుత్వం అంతకు ఒక్కరోజు ముందు ఈ ఉత్తర్వులు జారీ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.సీజేపీ తీవ్ర అభ్యంతరం.. ఆగ్రహంఈ ఉత్తర్వులపై సీజేపీ తీవ్రంగా స్పందించింది. పార్టీ జాతీయ సహ కన్వీనర్ సౌరవ్ దాస్.. విజయ్ ప్రభుత్వ నిర్ణయాన్ని రాజ్యాంగ విరుద్ధమైనదిగా అభివర్ణించారు. విద్యార్థులు, యువత తమ ప్రజాస్వామ్య హక్కులను వినియోగించుకోకుండా అడ్డుకోవడం అర్థరహితమైన, అహేతుకమైన చర్య అని విమర్శించారు. అయితే బీజేపీ మాత్రం ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించింది. సీజేపీ, లెఫ్ట్ పార్టీలను ‘అరాచకానికి ఏజెంట్లు’గా బీజేపీ నేత వినోజ్ పి. సెల్వం అభివర్ణించారు.విజయ్ ప్రభుత్వానికి లెఫ్ట్ మద్దతు..మరో ఆసక్తికర అంశం ఏమిటంటే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన బలం కోసం విజయ్ నేతృత్వంలోని టీవీకేకు జూన్‌లో లెఫ్ట్ పార్టీలు బేషరతుగా బయటి నుంచి మద్దతు ప్రకటించాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీకి దూరంగా నిలిచింది. దీంతో కాంగ్రెస్, వీసీకే వంటి చిన్న పార్టీల మద్దతుతో ప్రభుత్వం బలపరీక్షను ఎదుర్కొంది.ఇలాంటి పరిస్థితుల్లో తన ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన లెఫ్ట్ పార్టీల ఆందోళనలకూ విద్యార్థులు దూరంగా ఉండాలంటూ ఆదేశాలు జారీ చేయడం రాజకీయంగానూ చర్చకు దారితీసింది. ఈ ఉత్తర్వులపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో ప్రభుత్వం యూటర్న్ తీసుకుంది.విద్యార్థులు, యువత నిరసనల్లో పాల్గొనే హక్కు, వారిని రాజకీయ ఆందోళనలకు దూరంగా ఉంచే ప్రయత్నాలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న వేళ.. వివాదాస్పద ఉత్తర్వులను విజయ్ ప్రభుత్వం ఉపసంహరించుకోవడం తాజా రాజకీయ పరిణామంగా మారింది.ఇటు సీపీజే పేరుపైనా వివాదంఇదిలా ఉండగా.. తమిళనాడులో కాక్రోచ్ జనతా పార్టీ పేరు పైనా వివాదం నడుస్తోంది. ఆ పేరుతో ఓ ప్రాంతీయ రాజకీయ పార్టీని నమోదు చేయాలని న్యాయవాది సి. బ్రహ్మ బాలసుబ్రమణియం నేతృత్వంలోని బృందం జూన్‌లో ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. అయితే ఆ సంస్థ.. అభిజిత్ దీప్కేకు చెందిన సీపీజేకు భిన్నమైనదని బ్రహ్మ బాలసుబ్రమణియం వాదిస్తున్నారు. అయితే సీజేపీ మాత్రం దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. -
క్లీన్ గవర్నెన్స్.. విజయ్ సంచలన నిర్ణయాలు
వరస సంచలన నిర్ణయాలతో తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారారు. తాజాగా.. రాష్ట్రంలోని 234 మంది ఎమ్మెల్యేలకూ కొత్త ప్రభుత్వ కార్లు అందించనున్నట్లు అసెంబ్లీలో వెల్లడించారు. చట్ట సభ్యుల్లో చాలామంది కొత్తవాళ్లని.. పైగా వాళ్లంతా సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చారని.. అందుకే ఈ నిర్ణయమని ప్రకటించారాయన. అంతేకాకుండా.. మరికొన్ని సంక్షేమ ప్రకటనలు సైతం చేశారు.ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉండాలంటే నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించాల్సి ఉంటుందని సీఎం విజయ్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలందరికీ ప్రభుత్వ వాహనాలను సమకూర్చనున్నట్లు చెప్పారు. ముఖ్యంగా ప్రస్తుత అసెంబ్లీలో తొలిసారి ఎన్నికైన పలువురు ఎమ్మెల్యేలు సాధారణ కుటుంబ నేపథ్యాల నుంచి వచ్చినవారని.. వారికి ప్రజా సేవ చేసేందుకు అవసరమైన రవాణా సదుపాయం ఉండాలని సీఎం వివరించారు. దీంతో పాటు కారు డ్రైవర్ జీతం, ఇంధనం, నిర్వహణ ఖర్చుల కోసం నెలకు రూ.75 వేల భత్యం ఇవ్వనున్నట్లు తెలిపారు. అదనంగా మరో రూ.25 వేలుఅంతేకాకుండా ఎమ్మెల్యే కార్యాలయంలో అధికారిక పనుల కోసం సహాయకుడిని నియమించుకునేందుకు నెలకు రూ.25 వేల గ్రాంట్ ఇవ్వనున్నారు. ఈ నిర్ణయం వీసీకే ఎమ్మెల్యే జోతిమణి చేసిన విజ్ఞప్తి నేపథ్యంలో వెలువడింది. ఎమ్మెల్యేలకు అవసరమైన లాజిస్టికల్ సపోర్ట్ లేకుండా సమర్థంగా పనిచేయడం కష్టమని ఆమె అసెంబ్లీలో ప్రస్తావించారు.‘క్లీన్ గవర్నెన్స్’ కోసమే..ఎమ్మెల్యేలకు ప్రభుత్వ వాహనాలు, ఇతర సదుపాయాలు కల్పించడం వల్ల నియోజకవర్గ పర్యటనలు సులభమవడంతో పాటు ప్రజల సమస్యలపై వేగంగా స్పందించే అవకాశం ఉంటుందని విజయ్ ప్రభుత్వం చెబుతోంది. అధికారిక పనులకు అవసరమైన సదుపాయాలు కల్పించడం ద్వారా పారదర్శకంగా, అవినీతికి తావులేకుండా పాలన సాగించవచ్చన్నది ప్రభుత్వ వాదన.అయితే ఎమ్మెల్యేలకు వాహనాలు, భత్యాలపై విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. 234 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన వాహనాలు, నిర్వహణ, డ్రైవర్, సహాయకుల ఖర్చులు రాష్ట్ర ఖజానాపై అదనపు భారం అవుతాయని ప్రతిపక్షం ప్రశ్నిస్తోంది. గత ప్రభుత్వాలు ఆర్థిక పరిమితుల కారణంగా ఇలాంటి డిమాండ్లను పక్కన పెట్టాయని ఓ డీఎంకే ఎమ్మెల్యే సభలోనే ప్రస్తావించారు.వైద్య విద్యకు రూ.351 కోట్లుఎమ్మెల్యేల సదుపాయాల ప్రకటనతో పాటు వైద్య రంగంలోనూ విజయ్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు ప్రకటించింది. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో విద్యార్థుల ప్రవేశ సామర్థ్యాన్ని పెంచేందుకు రూ.351 కోట్లు కేటాయించనున్నట్లు తెలిపింది. దీని ద్వారా మొత్తం 6,098 అదనపు సీట్లు అందుబాటులోకి రానున్నాయి.వీటిలో బీఎస్సీ నర్సింగ్‌లో 660, నర్సింగ్ కళాశాలలు, పాఠశాలల్లో 1,925, 12 పారామెడికల్ కోర్సుల్లో 2,778, వైద్య కోర్సుల్లో 735 అదనపు సీట్లు ఉన్నాయి. అంతేకాకుండా రాష్ట్రంలో ఏడు కొత్త ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలు ఏర్పాటు చేయనున్నారు.పెరంబలూరులో ఆసుపత్రిపెరంబలూరులో రూ.300 కోట్ల అంచనా వ్యయంతో 400 పడకల మల్టీస్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అత్యాధునిక వైద్య సేవలను అందించేలా ఈ ఆసుపత్రిని అభివృద్ధి చేయనున్నారు.ఆరోగ్య బీమా పరిమితి రూ.25 లక్షలకుముఖ్యమంత్రి సమగ్ర ఆరోగ్య బీమా పథకం కింద ప్రస్తుతం ఉన్న వార్షిక చికిత్స పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.25 లక్షలకు పెంచే ప్రతిపాదనను కూడా ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఖరీదైన వైద్య చికిత్సలు అవసరమైన కుటుంబాలకు మరింత ఆర్థిక భరోసా లభించే అవకాశం ఉంది.అదే సమయంలో ట్రాన్స్‌జెండర్ వ్యక్తులకు అదనపు వైద్య, శస్త్రచికిత్స సేవలను కూడా పథకం పరిధిలోకి తీసుకురానున్నారు. చెన్నై స్టాన్లీతో పాటు తిరునెల్వేలి, తూత్తుకుడి, చెంగల్పట్టు, తిరువారూర్, కరూర్, కన్యాకుమారి ఆసుపత్రుల్లో ఈ సేవలను అందించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.జీతం ఫ్లస్..తమిళనాడు ఎమ్మెల్యేలకు ఒకప్పుడు రూ.55 వేల నెలవారీ వేతనం ఉండేది. 2017లో అప్పటి ప్రభుత్వం అలవెన్సులన్నీ కలిపి రూ.1.05 లక్షలకు పెంచింది. ఇందులో ప్రాథమిక వేతనం రూ.30 వేలు, నియోజకవర్గ అలవెన్స్ రూ.25 వేలు, టెలిఫోన్ అలవెన్స్ రూ.7,500, ఇతర అలవెన్సులు ఉన్నాయి. ఇక ముఖ్యమంత్రికి వేతనం సుమారు రూ.2.05 లక్షల దాకా ఉంది. విజయ్ సర్కార్ ఇప్పుడు ఆ వేతనానికి అదనంగా.. కారు+డ్రైవర్+పీఏ జీతం కోసం లక్ష అదనంగా చెల్లించనుంది. -
సిగ్గులేని ప్రదర్శన అంటూ విజయ్-త్రిషపై షాకింగ్ కామెంట్స్
చెన్నై: స్వాతంత్య్ర వేడుకలో ముందు వరుసలో కూర్చున్న నటి త్రిషపై డీఎంకే అధికార పత్రిక మురసొలి తీవ్ర విమర్శలు గుప్పిస్తూ ఓ కథనం రాసింది. విజయ్-త్రిష పరస్పరం సెల్యూట్ చేసుకోవడం గురించి విమర్శించింది. ‘‘సిగ్గులేని ప్రదర్శన’’ అంటూ మండిపడింది. డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ సన్నిహిత స్నేహితురాలు త్రిషపై ద్వంద్వార్థ వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్న కొన్ని రోజులకే, ఆ పార్టీ అధికార పత్రిక సీఎంపై పరోక్షంగా ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.తీవ్ర పదజాలంతో రాసిన సంపాదకీయంలో.. ‘‘శనివారం ఫోర్ట్ సెయింట్ జార్జ్‌లో జరిగిన వేడుకల్లో ఒక నటిని ముందు వరుసలో కూర్చోబెట్టి, ఆమెతో పరస్పరం సెల్యూట్ చేసుకున్నారు’’ అంటూ ఆ పత్రిక విజయ్ను తీవ్రంగా విమర్శించింది. విజయ్ ప్రవర్తనను మర్యాదకు విరుద్ధమని అభివర్ణించింది. విజయ్ గౌరవం గాలిలో.. “స్వాతంత్య్ర దినోత్సవం రోజున ముఖ్యమంత్రి విజయ్ గౌరవం గాలిలో కలిసిపోయింది. ఎలాంటి సిగ్గు, సంకోచం లేకుండా ఆయన ఒక నటిని ముందు వరుసలో కూర్చోబెట్టి, ఆమెతో పదేపదే అటూ ఇటూ సెల్యూట్ చేసుకున్నారు. ఆయనకు ఓటు వేసినవారు కూడా జీర్ణించుకోలేని దృశ్యం ఇది” అని పేర్కొంది.తమిళనాడు ప్రభుత్వం నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో విజయ్ తల్లిదండ్రుల పక్కనే త్రిష ముందు వరుసలో కూర్చున్నారు. పసుపు రంగు చీర ధరించిన ఆమె, విజయ్ జాతీయ జెండాను ఎగురవేస్తున్న సమయంలో, వేడుకల కార్యక్రమాలను పరిశీలిస్తున్న సమయంలో ఆయనకు సెల్యూట్ చేస్తూ కనిపించారు.ప్రధాన అధికారిక కార్యక్రమాల్లో ఆమె పాల్గొనడం అందరి దృష్టిని ఆకర్షించింది. అంతకుముందు మే నెలలో విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కూడా ఆమె హాజరయ్యారు. ఆ సమయంలో ఆమె తీవ్ర భావోద్వేగానికి గురైనట్లు కనిపించారు.విజయ్‌తో ఈ నటి స్నేహం చాలాకాలంగా ఊహాగానాలు, గాసిప్‌కు కారణమవుతోంది. ముఖ్యంగా ఆయన వైవాహిక జీవితంలో బహిరంగంగా చర్చకు వచ్చిన విభేదాల నేపథ్యంలో ఈ అంశంపై మరింత చర్చ జరిగింది. -
‘రెస్పెక్ట్’ రచ్చ.. క్షమాపణలు చెప్పిన సీఎం విజయ్
తమిళనాడు అసెంబ్లీలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. డీఎంకే వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధిని కేవలం పేరుతో సంబోధించడంపై తీవ్ర గందరగోళం నెలకొంది. అయితే పరిస్థితి చేజారిపోకుండా ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ రంగంలోకి దిగారు. తనదైన స్టైల్లో ఆ వివాదానికి ముగింపు పలికారు.అసెంబ్లీలో ఆరోగ్య, రెవెన్యూ శాఖల పద్దులపై చర్చ జరుగుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గత ఎన్నికల్లో చోటుచేసుకున్న నగదు పంపిణీ, ఓటుకు నోటు తరహా రాజకీయాలను ప్రస్తావిస్తూ మంత్రి రంజిత్ కుమార్ డీఎంకేపై తీవ్ర విమర్శలు చేశారు. గతంలో ఎన్నికల సమయంలో ఓటర్లకు డబ్బులు పంచేవారని, తన కాంచీపురం నియోజకవర్గంలో ఒక్కో ఓటుకు రూ.1,500 వరకు పంపిణీ చేసిన సందర్భాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.ఈ సందర్భంగా గతంలో అమలైన ఎన్నికల వ్యూహాలను ప్రస్తావిస్తూ.. డీఎంకే వ్యవస్థాపక నేతల్లో ఒకరైన, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధిని మంత్రి కేవలం పేరుతోనే సంబోధించారు. సాధారణంగా తమిళనాడు అసెంబ్లీలో కరుణానిధిని ‘కలైంజర్’, ‘మాజీ ముఖ్యమంత్రి’ వంటి గౌరవప్రదమైన సంబోధనలతో ప్రస్తావించే సంప్రదాయం ఉంది. దీంతో డీఎంకే సభ్యులు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు.. @TVKVijayHQ : அவர் சார்பா நான் மன்னிப்பு கேட்டுக்கொள்கிறேன் ! 🥺❤️#TNAssembly pic.twitter.com/ZUEf9gWWUJ— Prakash Vijay (@PrakazVijay_Of) August 17, 2026మంత్రి ఆర్వీ రంజిత్ కుమార్ తన ప్రసంగంలో కరుణానిధిని ఎలాంటి గౌరవప్రదమైన బిరుదు లేకుండా పేరుతో ప్రస్తావించడంతో డీఎంకే సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి కేకేఎస్ఎస్ఆర్ రామచంద్రన్ నేతృత్వంలో డీఎంకే సభ్యులు నినాదాలతో నిరసన వ్యక్తం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో సీఎం సి. జోసెఫ్ విజయ్ స్వయంగా జోక్యం చేసుకున్నారు. కరుణానిధిని ఆ విధంగా సంబోధించడం సరైనది కాదని అంగీకరించిన ఆయన.. ‘‘ఆయన తరఫున నేను క్షమాపణలు చెబుతున్నాను’’ అని ప్రకటించారు. సీఎం జోక్యంతో వివాదం సద్దుమణిగింది. అనంతరం మంత్రి మళ్లీ తన ప్రసంగాన్ని కొనసాగించారు. అయితే మంత్రి బదులు సీఎం విజయ్ క్షమాపణలు చెప్పడాన్ని ఓ వర్గం అభినందిస్తుండగా.. ఆ క్షమాపణ ఏదో మంత్రితో చెప్పిచ్చి ఉంటే బాగుండేదని ఇంకొందరు అభిప్రాయపడుతున్నారు. -
తమిళనాడుకు కావేరి నీళ్లివ్వండి
సాక్షి బెంగళూరు: అసలే వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొంటున్న కర్ణాటకకు మరో షాక్ తగిలింది. తమిళనాడుకు నీటిని వదలాలని, ఈ మేరకు కావేరి నీటి నిర్వహణ ప్రాధికార సంస్థ (సీడబ్ల్యూఆర్సీ) ఆదేశాలను పాటించాల్సిందేనని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తెలిపింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ప్రతి రోజూ 12 వేల క్యూసెక్కులు తమిళనాడుకు వదలాల్సి ఉంది. తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తులు జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ఆధ్వర్యంలోని ద్విసభ్య ధర్మాసనం విచారించింది. సీడబ్ల్యూఆర్సీ ఆదేశాలను పాటించాలని చెబుతూ తదుపరి విచారణను ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది. అంతేకాకుండా ప్రస్తుత స్థితిగతులపై నివేదిక సమర్పించాలని కూడా సూచన చేసింది. కొంత సమయం పడుతుంది : కర్ణాటక కర్ణాటక నుంచి ప్రతిరోజూ 12 వేల క్యూసెక్కులు విడుదల చేయాలని సీడబ్ల్యూఆర్సీ సూచించినట్లు సుప్రీంకోర్టు దృష్టికి తమిళనాడు తీసుకొచి్చంది. సీడబ్ల్యూఆర్సీ ఆదేశాలను కర్ణాటక పూర్తిగా పాటించడం లేదని ఆరోపించింది. దీనిపై బిళిగుండ్లు వద్ద నీటి పరిమాణం బాగా తగ్గిపోయిందని, తమిళనాడు కోరుతున్నట్లు 12 వేల క్యూసెక్కులు విడుదల చేసేందుకు కొంత సమయం పడుతుందని కర్ణాటక ప్రభుత్వం తెలిపింది. కావేరి పరీవాహక ప్రాంతంలో వర్షాలు లేక, రిజర్వాయర్లలో ఆశించిన మేర నీటి నిల్వలు లేవని పేర్కొంది. అయినా సీడబ్ల్యూఆర్సీ ఆదేశాలను పాటించేందుకు కర్ణాటక ప్రయత్నిస్తోందని వాదించింది. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం సీడబ్ల్యూఆర్సీ ఆదేశాల మేరకు ప్రతిరోజూ 12 వేల క్యూసెక్కులు తమిళనాడుకు విడుదల చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈనెల 24కు వాయిదా వేసింది. -
పిల్లల గుండెల్లో పిచ్చుక గూళ్లు
నిద్ర లేచి పిచుకల కిచకిచలు వింటూ కాఫీ తాగడం ఒకప్పటి ముచ్చట. నేటి హైరైజ్ అపార్ట్మెంట్లు, గ్లాస్ బిల్డింగులు, సెల్ టవర్ల రేడియేషన్ మధ్య పిచుకలు బెదిరి దూరం జరిగిపోయాయి. తమిళనాడు తన తప్పు తెలుసుకొని విద్యాశాఖను, అక్కడి ‘కూడుగల్ ట్రస్ట్’ను కలిపి ‘ప్రభుత్వ స్కూళ్ల ద్వారా పిచుకల సంరక్షణ’ అనే విప్లవానికి తెరలేపింది. పిచుక గూళ్లు తయారు చేయడం నేర్చుకున్న పిల్లలు చెన్నై, కోయంబత్తూరుల్లో ఉంచిన గూళ్ల వల్ల పిచుకలు తిరిగి వచ్చాయి. మరి మనకు వద్దా పిచుకల సందడి?పిల్లలు పెద్దలను చాలా విషయాల్లో సరి చేస్తున్నారు. పెద్దలు వదిలిపెట్టిన బాధ్యతలను తీసుకుంటున్నారు. ఇప్పుడు తమిళనాడు స్కూలు పిల్లలు అదే దారిలో ఉన్నారు. పర్యావరణ, సంరక్షణ బరువును కూడా వారి చిన్ని భుజాలకు ఎత్తుకుంటున్నారు.చెట్టు, పుట్ట, మట్టి, మొలక, పిట్ట, పిచుక... అన్నీ బాగుంటేనే మనం కూడా బాగుంటామని వారికి తెలుసు. అందుకే తమిళనాడు ప్రభుత్వం, ఆ రాష్ట్రానికి చెందిన స్వచ్ఛంద సంస్థ ‘కూడుగళ్’ ట్రస్ట్ కలిసి ‘పిల్లలూ... పిచుకలు గూళ్లు లేక అవి ఊళ్లు వదిలి వెళుతున్నాయి. బతకలేకపోతున్నాయి. మీరే గూళ్లు తయారు చేసి వేళ్లాడగట్టండి’ అనంటే అలాగే అని రంగంలో దిగారు.దేశంలోనే మొదటిసారి ఒక రాష్ట్ర ప్రభుత్వం, పర్యావరణ ప్రేమికులు కలిసి పిల్లలను పిచుకుల కేర్టేకర్లుగా మార్చిన విశేషం ఇది. ఆ ఆలోచన ఫలించింది. కిచకిచలు వినిపిస్తున్నాయి. అవి తుర్రున ఎగురుతున్నాయి. ఇళ్ల కిటికీల్లో వాలి హాయ్ చెబుతున్నాయి.ఇంటికొక గూడుపిచుకలు బతకాలంటే ఇంటికొక గూడు ఉండాలి. కనీసం స్కూల్లో ఉన్న ప్రతి స్టూడెంట్ తన ఇంటి దగ్గర ఒక గూడు వేళ్లాడగడితే? ఇదీ ఆలోచన. అందుకే తమిళనాడులోని చెన్నై, కోయంబత్తూర్, ఈరోడ్, కృష్ణగిరి, రాణిపేట్ వంటి 10 జిల్లాల్లోని 50 ప్రభుత్వ పాఠశాలలను ఎంపిక చేసి, ఈ సీజన్లో స్కూళ్లు తెరిచాక పిచుకగూళ్ల వర్క్‌షాప్స్ నిర్వహిస్తున్నారు. పిల్లలకు చెక్కతో పిచుకల గూళ్లు తయారు చేయడం నేర్పిస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ కేవలం పక్షులకు ఇళ్లు ఇవ్వడంతోనే ఆగిపోదు. పిల్లలు ఆ గూళ్లను తమ ఇళ్లవద్ద అమర్చిన తర్వాత వాటికి రోజువారీ ఆహారం, నీరు కూడా ఇవ్వాలి. రోజూ ఉదయం, సాయంత్రం గూటి పక్కన సజ్జలు, రాగులు, వరి గింజలు వంటి ధాన్యాలు వేయడం, చిన్న పాత్రలో మంచినీరు అమర్చడం పిల్లల దినచర్యలో భాగం చేసుకోవాలి. ఇలా గూడుతో పాటు కూడు కూడా దొరకడంతో గత ఐదేళ్లలో తమిళనాడులో 15,000 గూళ్లను పంపిణీ చేసిన జిల్లాల్లో పిచుకల జనాభా ఏకంగా 25 శాతం పెరిగింది. వచ్చే నెలలో పిచుకలను గుర్తించేందుకు ప్రత్యేక మొబైల్ యాప్‌ను లాంచ్ చేయబోతున్నారు. దీని సాయంతో పిల్లలే స్వయంగా ‘పిచుకల గణన’ (Sparrow Census) చేయనున్నారు.బడి నుంచి ప్రకృతిమన విద్యావ్యవస్థలో మార్కులు, ర్యాంకుల గోల ఎక్కువైపోయింది. పిల్లలకు పుస్తకాల్లో పర్యావరణం గురించి పాఠాలు ఉంటాయి కానీ ప్రాక్టికల్ అవగాహన సున్నా. తమిళనాడు చేస్తున్న ఈ ప్రయోగం కేవలం పిచుకలను కాపాడటం మాత్రమే కాదు... గూడును తయారు చేయించి, ఒక ప్రాణికి రోజూ అన్నం పెట్టే బాధ్యతను ఇవ్వడం ద్వారా పిల్లల్లో ‘కరుణ’, ‘సృజనాత్మకత’, ‘బాధ్యత’ అనే గుణాలను నాటుతున్నారు. ఇలా చేయడం వల్ల ప్రకృతిపై పిల్లవాడికి ఓనర్షిప్ వస్తుంది. పెద్దయ్యాక వాడు పర్యావరణాన్ని నాశనం చేసే పనులు చేయడు. చెట్లను నరకడానికి ఒప్పుకోడు. కాబట్టి మనం ఎయిర్ కండిషన్స్డ్ గదుల్లో కూర్చుని పర్యావరణ ఉపన్యాసాలు ఇవ్వడం కంటే స్కూల్ లెవెల్లోనే ఇలాంటి ‘డు ఇట్ యువర్ సెల్ఫ్’ ప్రాజెక్టులు పెట్టడం వల్ల సమాజంలో శాశ్వత మార్పు వస్తుంది.తెలుగు రాష్ట్రాల్లో ?హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, వరంగల్ లాంటి నగరాల్లో ఈ రోజు పరిస్థితి ఏంటి? ఇక్కడ కూడా పిచుకలు కనుమరుగైపోతున్నాయి. ప్రతి ఇల్లూ కాంక్రీట్ డబ్బాగా మారిపోవడంతో పిచుకలకు ఆశ్రయం లేకుండా పోయింది. పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో పిచుకలు కీలకపాత్ర పోషిస్తాయి. అవి పంటలను నాశనం చేసే చిన్న చిన్న పురుగులను, దోమల లార్వాలను తిని రైతులకు, ప్రజలకు స్నేహితుడిగా మారతాయి. పిచుకలు లేకపోతే పురుగులు పెరుగుతాయి. మన హైదరాబాద్‌లో కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఇలాంటి హ్యాబిటాట్ బాక్సులను పంపిణీ చేస్తూ నగరంలో పిచుకలను రప్పించే ప్రయత్నం చేస్తున్నాయి. మరి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు ఇలాంటి ప్రాజెక్టులను అధికారికంగా పాఠశాలల్లో ఎందుకు ప్రవేశపెట్టకూడదు? మన విద్యాశాఖలు ఇలాంటి ఎన్విరాన్ మెంట్ ప్రాజెక్టులను సిలబస్‌లో భాగంగా మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది.మనకూ కావాలి పిచుకలు.. .గృహిణులు, విద్యార్థులు ఏం చేయాలి? పెద్ద పెద్ద బడ్జెట్లు, ప్రభుత్వ నిధుల కోసమే ఎదురు చూడనక్కర్లేదు. చిన్న అడుగు వేయవచ్చు. మీ ఇంటి బాల్కనీల్లో, కిటికీల పక్కన అట్టపెట్టెలు లేదా పాత కొబ్బరి చిప్పలతో గూళ్లను ఏర్పాటు చేయవచ్చు. వాటిల్లో కొద్దిగా బియ్యం గింజలు, సజ్జలు వేసి, ఒక చిన్న గిన్నెలో నీళ్లు పెడితే చాలు.. పిచుకలు మళ్లీ మీ ఇంటిని వెతుక్కుంటూ వస్తాయి. ఇక విద్యార్థులు తమ స్మార్ట్ఫోన్లలో గేమ్స్ ఆడటం పక్కన పెట్టి ఇళ్ల చుట్టుపక్కల ఉన్న పక్షులను గమనించడం, వాటికి దాణా వేయడం అలవాటు చేసుకోవాలి. రేపటి తరానికి కేవలం డిజిటల్ స్క్రీన్లపై పిచుక బొమ్మలను చూపించడం కాకుండా వాటి నిజమైన కిచకిచలను బహుమతిగా ఇవ్వాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. మన ఇళ్లలో, మన మనసుల్లో పిచుకల కోసం కొంచెం స్థలాన్ని కేటాయిద్దాం! -
కర్ణాటక ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో షాక్.. విజయ్‌కు గుడ్‌న్యూస్
ఢిల్లీ: కావేరి జలాల విషయంలో కర్ణాటక ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తమిళనాడుకు కావేరి నీటిని విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కావేరి జల నిర్వహణ అథారిటీ ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో తమిళనాడుకు 12 రోజుల పాటు రోజుకు 12 వేల క్యూసెక్కుల చొప్పున కావేరి నీటిని విడుదల చేయాలని కర్ణాటకను ఆదేశించినట్లు సమాచారం.కావేరి నీటి విడుదలపై కర్ణాటక, తమిళనాడు మధ్య మరోసారి వివాదం నెలకొన్న నేపథ్యంలో సుప్రీంకోర్టు తాజా ఆదేశాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. నీటి లభ్యత, రాష్ట్ర రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని నీటి విడుదలపై కర్ణాటక అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ.. కావేరి అథారిటీ నిర్ణయాలను అమలు చేయాల్సిందేనని కోర్టు స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో కర్ణాటక నుంచి తమిళనాడుకు కావేరి జలాల విడుదలపై తదుపరి పరిణామాలపై ఉత్కంఠ నెలకొంది.అసలు కథ ఇదే.. కావేరి జలాల విషయంలో కర్ణాటక, తమిళనాడు మధ్య మరోసారి వివాదం ముదిరింది. సుప్రీంకోర్టు తాజాగా కావేరి జల నిర్వహణ అథారిటీ ఆదేశాలను కర్ణాటక అమలు చేయాలని స్పష్టం చేయడంతో ఈ అంశం మరోసారి చర్చనీయాంశమైంది. అసలు కావేరి నీటి విషయంలో ఈ రెండు రాష్ట్రాల మధ్య ఇంతటి వివాదం ఎందుకు? ఈ నీటి పంచాయితీ ఎక్కడ మొదలైంది?..బ్రిటిష్ కాలం నుంచే వివాదం.. కావేరి నది కర్ణాటకలోని కొడగు ప్రాంతంలో పుట్టి.. కర్ణాటక, తమిళనాడు మీదుగా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ నదిపై ఆధారపడి రెండు రాష్ట్రాల్లోనూ లక్షలాది మంది రైతులు వ్యవసాయం చేస్తున్నారు. దీంతో కావేరి నీటి పంపకం రెండు రాష్ట్రాలకూ అత్యంత కీలకంగా మారింది. కావేరి నీటి పంపకంపై కర్ణాటక, తమిళనాడు మధ్య వివాదం దశాబ్దాలుగా కొనసాగుతోంది. బ్రిటిష్ కాలం నాటి 1892, 1924 ఒప్పందాల నుంచే నీటి వినియోగంపై విభేదాలు ఉన్నాయి. ఎగువ ప్రాంతంలో ఉన్న కర్ణాటకలో కొత్త ప్రాజెక్టులు, సాగు విస్తరణతో దిగువన ఉన్న తమిళనాడుకు నీటి లభ్యత తగ్గుతోందని ఆ రాష్ట్రం చాలాకాలంగా వాదిస్తోంది.1986లో తమిళనాడు కేంద్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించడంతో వివాదం అధికారికంగా అంతర్రాష్ట్ర జల వివాదంగా ముందుకు వచ్చింది. 1990లో కావేరి జల వివాదాల ట్రైబ్యునల్ ఏర్పాటైంది. 2007లో ట్రైబ్యునల్ తుది తీర్పు ఇచ్చింది. ఆ తర్వాత కూడా నాలుగు రాష్ట్రాలు, పుదుచ్చేరి మధ్య నీటి పంపకంపై న్యాయపోరాటం కొనసాగింది. 2018లో సుప్రీంకోర్టు ట్రైబ్యునల్ అవార్డులో కొన్ని మార్పులు చేస్తూ తుది తీర్పు ఇచ్చింది. అనంతరం కేంద్రం కావేరి వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ, సంబంధిత వ్యవస్థలను ఏర్పాటు చేసింది. కావేరి నీటి విడుదలపై నిర్ణయాలు తీసుకోవడంలో ఈ సంస్థలు కీలకంగా మారాయి.కర్ణాటక అభ్యంతరం.. అయితే కావేరి నీటి పంపకం వర్షపాతంపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. కర్ణాటకలో వర్షాలు తక్కువగా ఉండి జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గినప్పుడు తమిళనాడుకు నీటిని విడుదల చేయడం తమ రైతులకు ఇబ్బందిగా మారుతుందని కర్ణాటక చెబుతోంది. మరోవైపు కావేరి డెల్టాలో పంటలకు నీరు అవసరమని, తమకు కేటాయించిన వాటాను కర్ణాటక విడుదల చేయాల్సిందేనని తమిళనాడు వాదిస్తోంది. తాజా వివాదంలో కర్ణాటక నుంచి తమిళనాడుకు రోజుకు 12 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలన్న ఆదేశాలపై కర్ణాటక అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై తమిళనాడు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తాజాగా కావేరి జల నిర్వహణ అథారిటీ ఆదేశాలను కర్ణాటక పాటించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.కావేరి వివాదం కేవలం నీటి పంపకానికి సంబంధించిన అంశం మాత్రమే కాదు. రెండు రాష్ట్రాల రైతుల జీవనాధారం, ప్రాంతీయ భావోద్వేగాలు, రాజకీయాలు ఈ అంశంతో ముడిపడి ఉన్నాయి. కర్ణాటకలో నీరు విడుదల చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలు జరిగితే.. తమిళనాడులో తమకు రావాల్సిన నీటిని కర్ణాటక అడ్డుకుంటోందనే ఆగ్రహం వ్యక్తమవుతోంది. అందుకే ప్రతి ఏడాది వర్షాలు, జలాశయాల్లో నీటి నిల్వలు, పంటల అవసరాలు మారినప్పుడల్లా కావేరి వివాదం మళ్లీ తెరపైకి వస్తూనే ఉంటుంది. తాజా సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో కర్ణాటక-తమిళనాడు మధ్య కావేరి నీటి పంచాయితీ మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. -
విజయ్ మంచివారే.. ఆయనపై ఆ నమ్మకం ఉంది: అన్నామలై
తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. టీవీకే ప్రభుత్వం, ముఖ్యమంత్రి జోసెఫ్ సి విజయ్‌పై, బీజేపీ మాజీ నేత కె. అన్నామలై కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం విజయ్ చాలా మంచివారని, ఆయన అవినీతికి వ్యతిరేకంగా ఉన్నారని ప్రశంసింస్తూనే.. అదే సమయంలో మంత్రులు, అధికారుల పనితీరుపై ఓ కన్నేసి ఉంచాలని సీఎంకు సలహా ఇచ్చారు.బీజేపీకి గుడ్‌బై చెప్పిన తర్వాత.. సొంత రాజకీయ వేదిక దిశగా అన్నామలై అడుగులు వేస్తున్నారు. ‘వీ ద లీడర్స్’ పేరుతో ప్రారంభించిన ఉద్యమాన్ని భవిష్యత్‌లో రాజకీయ పార్టీగా మార్చే ఆలోచనలో ఉన్నట్లు ఆయన ఇప్పటికే ప్రకటించారు. ప్రస్తుతం ఈ వేదిక ద్వారా కార్యకర్తలు, వాలంటీర్లను సమీకరించే పనిలో ఉన్నారు. అయితే తాజాగా ‘వీ ద లీడర్స్’ (WTL) సంస్థ ఆధ్వర్యంలో చెన్నైలో జరిగిన కార్యక్రమంలో అన్నామలై మాట్లాడుతూ.. సీఎం విజయ్ చాలా మంచివారని, ఆయన అవినీతికి వ్యతిరేకంగా ఉన్నారని తాను బలంగా నమ్ముతున్నానని చెప్పారు. అయితే కొందరు మంత్రులు కాంట్రాక్టర్ల నుంచి కమిషన్లు డిమాండ్ చేస్తున్నారంటూ ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారానికి సంబంధించి తన వద్ద ఆడియో ఆధారాలు కూడా ఉన్నాయని ప్రకటించారు.‘2 నుంచి 4 శాతం కమిషన్ అడుగుతున్నారు’కొంతమంది మంత్రులు గత ఎన్నికల్లో ఖర్చు చేసిన డబ్బును తిరిగి రాబట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నామలై ఆరోపించారు. ‘‘ఓట్లు కొనడానికి డబ్బు ఖర్చు చేశాం.. ఇప్పుడు టెండర్లలో 2 శాతం, 3 శాతం, 4 శాతం ఇవ్వాలని అడుగుతున్నారంటూ’’ ఆయన వ్యాఖ్యలు చేశారు. ఈ అంశాన్ని ఇప్పుడే పెద్ద వివాదంగా మార్చడం లేదని.. ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసిన తర్వాత దీనిపై మరింతగా మాట్లాడతానని అన్నామలై తెలిపారు. ‘‘సీఎం విజయ్ మంత్రులు, అధికారులపై నియంత్రణ ఉంచాలి. లేదంటే పాలన దారి తప్పే అవకాశం ఉంది’’ అని హెచ్చరించారు. అయితే ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రుల పేర్లను మాత్రం వెల్లడించలేదు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి కనీసం ఏడాది సమయం ఇవ్వాలని చెప్పిన ఆయన.. అదే సమయంలో మంత్రులు, అధికారుల పనితీరుపై సీఎం విజయ్ ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని సూచించారు. ప్రభుత్వం అవినీతి రహిత పాలన అందించాలంటే తరచూ సమీక్షలు నిర్వహించాలని కోరారు.విజయ్ సర్కార్‌కు ఏడాది సమయంకొత్తగా ఏర్పడిన టీవీకే ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నించడం సరికాదని అన్నామలై అభిప్రాయపడ్డారు. తమిళనాడులో రాజకీయ మార్పు జరిగిందని, ప్రజలు కొత్త ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారని అన్నారు. 234 మంది ఎమ్మెల్యేల్లో ఎక్కువ మంది తొలిసారి అసెంబ్లీకి వచ్చారని పేర్కొంటూ.. వారికి కనీసం ఏడాది సమయం ఇవ్వాలని సూచించారు. ‘‘వాళ్లు సరిగ్గా పనిచేస్తే అభినందిస్తాం.. తప్పులు చేస్తే మొదట ప్రశ్నించేది మేమే’’ అని అన్నామలై అన్నారు. ప్రభుత్వం తీసుకునే మంచి నిర్ణయాలను కూడా తాము స్వాగతిస్తామని తెలిపారు.ఆ ప్రచారాన్ని ఖండిస్తూ.. తాను బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నానన్న విమర్శలను అన్నామలై ఖండించారు. కేంద్ర హోంశాఖ నుంచి ఢిల్లీకి రావాలని ఆహ్వానం వచ్చినా.. తమిళనాడులోనే ఉండి ప్రజల కోసం పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. తన రాజకీయ ప్రయాణం రాష్ట్ర ప్రయోజనాలకే అంకితమని చెప్పారు. కావేరీ జలాల అంశంలోనూ తమిళనాడు ప్రయోజనాలకే కట్టుబడి ఉంటానని అన్నామలై తెలిపారు. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఉన్న సమయంలోనూ మేకెదాటు ప్రాజెక్టును వ్యతిరేకించానని గుర్తుచేశారు. కావేరీ వివాదానికి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూర్చోబెట్టి పరిష్కారం చూపాలని కేంద్రాన్ని కోరారు.అన్నామలై వ్యాఖ్యలు ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఒకవైపు కొత్త ప్రభుత్వానికి సమయం ఇవ్వాలని చెబుతూనే.. మరోవైపు అవినీతి ఆరోపణలు చేయడం ద్వారా విజయ్ ప్రభుత్వంపై పరోక్ష ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రానున్న రోజుల్లో టీవీకే ప్రభుత్వం ఈ ఆరోపణలకు ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. -
తమిళుల కాల్చివేతపై భగ్గుమన్న విజయ్ సర్కార్
సాక్షి, చెన్నై: కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లాలో ఘోరం చోటు చేసుకుంది. వేటగాళ్లనే అనుమానంతో అటవీ శాఖ అధికారులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మరణించారు. అయితే ఆ ముగ్గురు తమిళులు కావడంతో ఇరు రాష్ట్రాల మధ్య అగ్గి రాజుకుంది. వాళ్లు వేటగాళ్లు కాదని.. రైతులు అని తమిళనాడు ప్రభుత్వం వాదిస్తోంది. ఘటనను తీవ్రంగా ఖండించిన తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్.. కర్ణాటక అటవీ శాఖ వివరణపై తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు. కావేరీ వన్యప్రాణి అభయారణ్యం పరిధిలో ఆగస్టు 15 తెల్లవారుజామున జరిగిన కాల్పుల్లో ఆంటోనీ సామి, జాన్ రోజ్ పీటర్, కుమార్ అనే ముగ్గురు తమిళులు మృతి చెందారు. వీరు చామరాజనగర్ జిల్లా హనూర్ తాలూకాలోని గ్రామాలకు చెందిన వారిగా గుర్తించారు. ఈ ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తీవ్రంగా స్పందించారు. తమిళులపై జరిగిన ఈ ఘటనను ఖండించిన ఆయన.. కర్ణాటక అటవీ శాఖ చెబుతున్న వివరణ ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు. ఘటనపై సమగ్ర, ఉన్నత స్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు.మృతుల కుటుంబాలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సీఎం విజయ్, డీకే శివకుమార్ సర్కార్‌ను కోరారు. బాధిత కుటుంబాలకు కర్ణాటక ప్రభుత్వం అవసరమైన సహాయం అందించాలని డిమాండ్ చేశారు. పూర్తి నిజాలు బయటకు రావాలని.. వాస్తవాలు వెలుగులోకి రావాలంటే పారదర్శక విచారణ అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.స్టాలిన్ ఆగ్రహంఈ ఘటనపై డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముగ్గురు తమిళ రైతుల కాల్చివేత ఘటన దిగ్భ్రాంతికరమని పేర్కొన్న ఆయన.. దీనిపై న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. "ఘటనను కప్పిపుచ్చే ప్రయత్నాలు జరగకూడదు. కాల్పులకు బాధ్యులైన వారిపై హత్య కేసు నమోదు చేసి పారదర్శకంగా, నిష్పక్షపాతంగా విచారణ జరపాలి" అని స్టాలిన్ అన్నారు. మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వడంతో పాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే ఈ ఘటనపై స్పందించడంలో ఆలస్యం చేయకుండా కర్ణాటక ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని కోరారు.ఆత్మరక్షణలో భాగంగానే కాల్పులు: కర్ణాటక అధికారులుమరోవైపు కర్ణాటక అటవీ అధికారులు మాత్రం ముగ్గురు వ్యక్తులు అడవిలోకి వన్యప్రాణుల వేట కోసం వచ్చారని తెలిపారు. అటవీ సిబ్బందిని ఎదుర్కొన్న సమయంలో వారు కాల్పులు జరపడంతో.. ఆత్మరక్షణలో భాగంగా ఎదురుకాల్పులు జరిపామని వెల్లడించారు. ఘటనాస్థలం నుంచి తుపాకులు, వేటకు ఉపయోగించిన వస్తువులు, అడవి జంతువుల మాంసంతో ఉన్న సంచులను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.‘వేట ఆరోపణల్లో నిజం లేదు’.. ప్రతిపక్షాల ఆగ్రహంఅయితే తమిళనాడులోని పలు రాజకీయ పార్టీలు కర్ణాటక అధికారుల వాదనలను ప్రశ్నిస్తున్నాయి. ముగ్గురు వ్యక్తులు నిజంగానే వేటకు పాల్పడ్డారా? కాల్పులు అనివార్యమా? అనే అంశాలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. పీఎంకే నేత అన్బుమణి రామదాస్ ఈ ఘటనపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.కోటి పరిహారం అందించాలని కోరారు. సీపీఎం, సీపీఐ నేతలు కూడా కాల్పుల్లో పాల్గొన్న అటవీ అధికారులపై చర్యలు తీసుకోవాలని, కేసును హత్య కేసుగా నమోదు చేయాలని డిమాండ్ చేశారు.విచారణకు ఆదేశించిన కర్ణాటక ప్రభుత్వంఘటనపై కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మేజిస్ట్రేట్ విచారణకు ఆదేశించారు. అటవీ శాఖ అధికారులు ఇచ్చిన సమాచారాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు. మృతుల కుటుంబాలకు పరిహారం అందిస్తామని చెప్పారు. కాల్పులు ఆత్మరక్షణలో భాగమా? లేదంటే ఉద్దేశపూర్వక చర్యా? అనేది విచారణలో తేలనుంది.కావేరీ జలాలు.. మేకెదాటు విషయంలో ఇప్పటికే ఇరు రాష్ట్రాల మధ్య వివాదం నడుస్తోంది. ఇవాళ సుప్రీం కోర్టులో తమిళనాడు వేసిన పిటిషన్(నీటి విడుదల కోసం..) విచారణ కూడా జరగనుంది. ఈ నేపథ్యంలో.. ఇప్పుడు ముగ్గురు తమిళుల మృతితో ఇటు రాజకీయంగానూ ఘర్షణలు మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది. -
‘వణక్కం జెన్‌జీ’.. సీఎంగా విజయ్ ఫస్ట్ ఇండిపెండెన్స్ డే (ఫొటోలు)
-
పాల ప్యాకెట్ల కింద లిక్కర్ బాటిల్స్!.. క్లాస్‌రూంలోనే దావత్!!
యువతను మత్తు పదార్థాల బారినుంచి దూరం చేయడమే లక్ష్యంగా తమిళనాడులో విజయ్ ప్రభుత్వం చర్యలు చేపడుతున్న సమయంలో.. అదే రాష్ట్రంలో ఓ గవర్నమెంట్ స్కూల్లో ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది. క్లాస్‌రూంలో.. అదీ అమ్మాయిలు మద్యం సేవిస్తున్న వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన విజయ్ సర్కార్ తీవ్ర చర్యలకు ఉపక్రమించింది. కన్యాకుమారి జిల్లాలో ఓ ప్రభుత్వ పాఠశాలలో చోటుచేసుకున్న ఘటన కలకలం రేపింది. తరగతి గది సమీపంలో ఇద్దరు విద్యార్థినులు మద్యం సేవిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికారులు విచారణకు ఆదేశించారు. ఈ పాఠశాలలో నీట్, జేఈఈ వంటి పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ఆ తరగతులు ముగిసిన తర్వాత కొందరు విద్యార్థులు పాఠశాలలోనే ఉండగా ఈ ఘటన జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.విజయ్ ప్రభుత్వం యువతలో పెరుగుతున్న మత్తు పదార్థాల వినియోగాన్ని అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతోంది. జిల్లా స్థాయిలో నిఘా వ్యవస్థలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో.. తుక్కలై ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థినులు మద్యం సేవిస్తున్న వీడియో వెలుగులోకి రావడం చర్చనీయాంశంగా మారింది.వైరల్ వీడియోతో కదిలిన యంత్రాంగంమద్యం సేవిస్తున్న దృశ్యాలను మరో విద్యార్థి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసినట్లు తెలుస్తోంది. వీడియో వైరల్ కావడంతో కన్యాకుమారి జిల్లా యంత్రాంగం వెంటనే స్పందించింది. విద్యార్థినులు ఎవరు? పాఠశాల ప్రాంగణంలోకి మద్యం ఎలా వచ్చింది? పర్యవేక్షణలో లోపం జరిగిందా? అనే అంశాలపై అధికారులు విచారణ చేపట్టారు. ఈ వ్యవహారంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ప్రమీలా ఎవాంజెలిన్ను మరో పాఠశాలకు బదిలీ చేశారు. విద్యాశాఖ అధికారులు కూడా ప్రత్యేకంగా దర్యాప్తు చేస్తున్నారు.రాజ్‌కుమార్ అరెస్ట్విద్యార్థినులకు మద్యం అందించింది ఎవరు అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. తొలుత తోటి విద్యార్థులపై అనుమానం వ్యక్తమైనప్పటికీ.. వారి ప్రమేయం లేదని తేలినట్లు పోలీసులు తెలిపారు. తర్వాత తక్కలై ప్రాంతానికి చెందిన 40 ఏళ్ల రాజ్‌కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడు పాలు సరఫరా చేసే వ్యక్తిగా పనిచేస్తున్నట్లు తెలిసింది. ఓ విద్యార్థినికి పరిచయస్తుడైన రాజ్‌కుమార్.. ఆమె కోరడంతో మద్యం కొనిచ్చినట్లు విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు.కౌన్సెలింగ్‌కు ఆదేశాలుఘటన అనంతరం విద్యార్థినుల తల్లిదండ్రులను పిలిపించిన అధికారులు వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. విద్యార్థినులకు కూడా మానసిక నిపుణుల ద్వారా కౌన్సెలింగ్ అందించాలని సూచించారు. మరోవైపు.. విద్యాసంస్థల్లో మత్తు పదార్థాల నియంత్రణ, పర్యవేక్షణ మరింత కఠినతరం చేయాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. యువతను మత్తుకు దూరంగా ఉంచేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల మధ్య ఇలాంటి ఘటనలు మరింత అప్రమత్తత అవసరాన్ని గుర్తు చేస్తున్నాయి. -
సీఎం విజయ్ స్పీచ్.. జెన్‌జీ, కులం, మతంపై కీలక వ్యాఖ్యలు..
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రిగా టీవీకే అధినేత విజయ్ తన తొలి స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో రాజకీయ సందేశంతో గట్టిగా గళం విప్పారు. కులం, మతం పేరుతో ప్రజలను విభజించే సంకెళ్లను తెంచినప్పుడే నిజమైన స్వేచ్ఛ సాధించినట్లని, అవినీతి నుంచి రాష్ట్రానికి విముక్తి కల్పించడం కూడా మరో రకమైన స్వాతంత్ర్యమేనని ఆయన వ్యాఖ్యానించారు. దీంతో, ఆయన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.చెన్నైలోని ఫోర్ట్ సెయింట్ జార్జ్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ముఖ్యమంత్రి విజయ్ మాట్లాడుతూ.. ‘ప్రజలు తమను బానిసలుగా ఉంచుతున్నారని గుర్తించినప్పుడే ఐక్యంగా మారతారని అన్నారు. అప్పుడు కులం, మతం వంటి సంకెళ్లు తెగిపోతాయని, మహాత్మా గాంధీ నాయకత్వంలోని స్వాతంత్ర్య పోరాటంలోనూ ఇదే స్ఫూర్తి కనిపించిందని పేర్కొన్నారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన స్వాతంత్ర్య సమరయోధులకు నివాళులర్పించిన విజయ్.. ఆ పోరాట స్ఫూర్తి నేటి సమాజానికి కూడా మార్గదర్శకంగా ఉండాలని అన్నారు. “తమిళనాడును అవినీతి నుంచి విముక్తి చేయడం కూడా ఒక రకమైన స్వాతంత్ర్యమే” అంటూ అధికారులను అవినీతి రహిత పాలన కోసం పనిచేయాలని కోరారు.CM Vijay - Thank the Tamil people across the world & Gen Z youth ...🔥‼️ pic.twitter.com/eJ8Ww4pqGE— Hari (@hari_noty) August 15, 2026 కేంద్ర ప్రభుత్వంతో పరిపాలనా అంశాల్లో కలిసి పనిచేస్తామని, అయితే తమిళనాడు ప్రయోజనాల విషయంలో ఎలాంటి రాజీ ఉండదని విజయ్ స్పష్టం చేశారు. ప్రజలకు మేలు చేసే గత ప్రభుత్వాల సంక్షేమ పథకాలను కూడా కొనసాగిస్తామని తెలిపారు. 2036 నాటికి తమిళనాడును 1.5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ప్రకటించారు. ఓటు వేయడంతో ప్రజల బాధ్యత పూర్తికాదని, ప్రభుత్వ పనితీరులో ప్రజలు నిరంతరం భాగస్వాములు కావాలని కోరారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమిళులు, జెన్-జీ యువత కూడా రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.ఇదిలా ఉండగా, నటి త్రిష కృష్ణన్ కూడా చెన్నైలో జరిగిన వేడుకలకు హాజరయ్యారు. స్వాత్రంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఆమె ముందు వరుసలో కూర్చున్నారు. విజయ్ తల్లిదండ్రుల పక్కన కూర్చుని, అనంతరం పరేడ్ సమయంలో విజయ్‌కు సెల్యూట్ చేసిన దృశ్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.CM Vijay, salute to Trisha ...👀🔥‼️ pic.twitter.com/Y1RZi0LoHr— Hari (@hari_noty) August 15, 2026 -
త్రిష పెళ్లి ఎందుకు ఆగిపోయింది? 2015లో అసలేం జరిగింది?
హీరోయిన్ త్రిష పెళ్లిపై ఎప్పటికప్పుడు రూమర్లు వస్తూనే ఉంటాయి. దశాబ్ద కాలంగా ఆమె పెళ్లిపై ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ రూమర్ల సంగతి పక్కనపెడితే, ఆమె జీవితంలో పెళ్లికి సంబంధించిన కీలక పరిణామం 2015లో జరిగింది. చెన్నైకి చెందిన వ్యాపారవేత్త వరుణ్‌తో త్రిషకు 2014లో నిశ్చితార్థం జరిగింది. ఈ విషయాన్ని 2015 జనవరిలో త్రిష స్వయంగా వెల్లడించారు. అయితే తరువాత ఏం జరిగిందో తెలియదు కానీ కొన్ని నెలలకే జరగాల్సిన వివాహం రద్దయింది.ఆ వ్యాపారవేత్త పెళ్లి తర్వాత త్రిష సినిమాలకు దూరంగా ఉండాలనే షరతు కారణంగానే నిశ్చితార్థం రద్దయిందనే ప్రచారం అప్పట్లో జరిగింది. అనంతరం తాను సింగిల్‌గా, సంతోషంగా ఉన్నాననే సందేశాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. అనంతరం కొంతకాలానికి ఓ ఇంటర్వూలో మాట్లాడుతూ.. నేను పెళ్లి చేసుకోవాలనుకున్న వ్యక్తి, నన్ను సినిమాల్లో నటించడం ఆపమని అడిగారు. దాంతో సినిమాలకు బదులుగా, నా నిశ్చితార్థానికి ముగింపు పలకాలని నిర్ణయించుకున్నాను. నేను కేవలం గర్భవతి అయినప్పుడు మాత్రమే విరామం తీసుకుంటాను. ఒకవేళ నాకు ప్రధాన పాత్రలు ఆఫర్ చేయకపోతే, నా ఇమేజ్‌కు సరిపోయే పాత్రలు చేస్తాను కానీ చిత్ర పరిశ్రమకు మాత్రం దూరం కాను. నా చివరి శ్వాస వరకు సినిమాల్లో నటిస్తూనే ఉండాలన్నదే నా కోరిక అని త్రిష తన అభిప్రాయాన్ని తెలిపారు. ఆ తర్వాత టాలీవుడ్ నటుడు రానా సహా పలువురు హీరోలు, ప్రముఖులతో త్రిషకు సంబంధాలు ఉన్నాయంటూ ఎన్నో రూమర్లు వచ్చాయి. కానీ ఆమె వాటిని ఖండిస్తూ తన కెరీర్‌పై దృష్టి పెట్టారు. ఇటీవలి కాలంలో త్రిషతో తమిళ నటుడు, ప్రస్తుత తమిళనాడు సీఎం విజయ్ పేర్లను కలిపి పలు కథనాలు ప్రచారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై కొందరు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు చేసిన వ్యాఖ్యలు కూడా తీవ్ర చర్చకు దారితీశాయి. వీటిలో కొన్ని వ్యాఖ్యలు హద్దులు దాటుతున్నప్పటికీ త్రిష మాత్రం సంయమనం పాటిస్తూ, తనదైన శైలిలో స్పందిస్తున్నారు. -
సీఎం విజయ్‌కు హైకోర్టు కీలక ఆదేశం
సాక్షి, చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌కు మద్రాస్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తన ఎన్నికల విజయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను కొట్టివేయాలని కోరుతూ దాఖలు చేయదలచిన మధ్యంతర పిటిషన్లను ఆగస్టు 25వ తేదీ లోపునే దాఖలు చేయాలని స్పష్టం చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నైలోని పెరంబూర్ నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి విజయ్ విజయం సాధించినట్లు ప్రకటించడాన్ని సవాలు చేస్తూ డీఎంకే అభ్యర్థి ఆర్.డి శేఖర్, అలాగే ఓటర్లు దినేష్, లక్ష్మీ నరసింహన్ మద్రాసు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఇదే తరహాలో తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గం నుంచి డీఎంకే అభ్యర్థి ఇనిగో ఇరుదయరాజ్ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసుల్లో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని గతంలోనే హైకోర్టు ముఖ్యమంత్రి విజయ్ను ఆదేశించింది. పిటిషన్లు జస్టిస్ వి.లక్ష్మీనారాయణన్ ఎదుట విచారణకు వచ్చాయి. సీఎం విజయ్ తరఫు న్యాయవాదులు జి.మాసిలామణి, శ్రీనాథ్ శ్రీదేవన్ కోర్టులో వాదనలు వినిపిస్తూ.. సీఎం విజయ్‌కు వ్యతిరేకంగా దాఖలైన ఈ ఎన్నికల పిటిషన్లను ప్రాథమిక దశలోనే కొట్టివేయాలని కోరుతూ తాము ప్రత్యేక పిటిషన్ దాఖలు చేయాలనుకుంటున్నామని, ఇందుకోసం 4 వారాల సమయం కావాలని అభ్యరి్థంచారు. నాలుగు వారాల గడువు ఇచ్చేందుకు నిరాకరించిన జస్టిస్ వి.లక్ష్మీనారాయణన్ ఆగస్టు 25 లోపు పిటిషన్లు దాఖలు చేయాలని ఆదేశించారు. తదుపరి విచారణను ఆగస్టు 25కు వాయిదా వేశారు. తమిళనాడు మంత్రి ఆధవ్ అర్జున సాధించిన ఎన్నికల విజయాన్ని సవాలు చేస్తూ దాఖలైన ఎన్నికల పిటిషన్ విచారణను కూడా న్యాయమూర్తి ఆగస్టు 25వ తేదీకి వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
మరోసారి అగ్గి రాజేసిన టీవీకే మంత్రి
న్యూఢిల్లీ: దక్షిణాది ప్రాతినిధ్యం, రాజకీయ ఆధిపత్యంపై కొత్త రాజకీయ చర్చ మొదలైంది. టీవీకే నేత, తమిళనాడు మంత్రి అడు అర్జున అసెంబ్లీలో మాట్లాడుతూ.. భవిష్యత్తులో తమిళనాడు సహా దక్షిణాదికి కూడా ప్రధాన మంత్రిని ఇవ్వగల సంఖ్యా బలం ఉండాలని అన్నారు. లోక్‌సభ ప్రాతినిధ్యం విషయంలో పలు ఉత్తరాది రాష్ట్రాలకు ఉన్న సంఖ్యా ఆధిక్యాన్ని ప్రస్తావించారు. ఉత్తర భారతానికి చెందిన 5 లేదా 6 రాష్ట్రాలు కలిస్తే ప్రధాన మంత్రి ఎవరు కావాలో నిర్ణయించేంత మంది ఎంపీలు ఉంటారని చెప్పారు.ఈ పరిస్థితి మారాలని, దక్షిణ రాష్ట్రాలు కూడా ప్రధాన మంత్రిని ఇవ్వగల స్థితిలో ఉండాలని ఆయన అన్నారు. “బహుశా తమిళనాడు తన సొంత ప్రధాన మంత్రిని ఇవ్వగలదు” అని అర్జున అన్నారు. కేంద్ర ప్రభుత్వంలో తమిళనాడుకు చెందిన నాయకుడు అగ్రస్థానంలో ఉంటే, పార్లమెంట్లో తమిళనాడు స్వరం మరింత బలంగా వినిపిస్తుందని ఆయన చెప్పారు.ప్రతిపాదిత డీలిమిటేషన్ ప్రక్రియపై కొనసాగుతున్న చర్చల నేపథ్యంలో అర్జున వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. ముఖ్యంగా దక్షిణ రాష్ట్రాల రాజకీయ ప్రాతినిధ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ ఈ వ్యాఖ్యలు వచ్చాయి.దేశ రాజకీయ నాయకత్వాన్ని నిర్ణయించే విషయంలో దక్షిణ ప్రాంతం నష్టపోయే స్థితిలో కొనసాగకూడదని అర్జున అన్నారు. జాతీయ రాజకీయాల్లో దక్షిణ రాష్ట్రాల రాజకీయ ప్రాధాన్యంపై దశాబ్దాలుగా దక్షిణ పార్టీల నుంచి, ముఖ్యంగా డీఎంకే నుంచి వస్తున్న వాదనలను ఆయన వ్యాఖ్యలు మరోసారి ముందుకు తెచ్చాయి.జనాభా ఆధారంగా లోక్‌సభ స్థానాల పునర్విభజన జరిగితే ప్రస్తుతం ఉన్న రాజకీయ ప్రాతినిధ్యంలో మార్పులు రావచ్చనే భయంతో దక్షిణ రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న వేళ, డీలిమిటేషన్ చర్చ మళ్లీ ప్రాధాన్యం సంతరించుకుంది.ఎస్పీ మద్దతు, బీజేపీపై విమర్శలుఅర్జున వ్యాఖ్యలపై స్పందించిన సమాజ్‌వాదీ పార్టీ ప్రతినిధి మనోజ్ యాదవ్.. ఈ వ్యాఖ్యలు కీలకమని అన్నారు. ప్రతిపక్షం డీలిమిటేషన్‌పై వ్యక్తం చేస్తున్న ఆందోళనలను అధికారంలో ఉన్నవారు సీరియస్‌గా పరిగణించాలని చెప్పారు. “ఇది పెద్ద వ్యాఖ్య. అధికారంలో ఉన్నవారు దీనిపై ఆలోచించాలి” అని యాదవ్ అన్నారు.డీలిమిటేషన్‌పై ప్రతిపక్షం ఆందోళనలు ప్రధానంగా దక్షిణ రాష్ట్రాలపై పడే ప్రభావానికి సంబంధించినవేనని ఆయన చెప్పారు. ప్రభుత్వం డీలిమిటేషన్ ప్రతిపాదనను తీసుకువస్తున్న తీరు దక్షిణ రాష్ట్రాల రాజకీయ ప్రాతినిధ్యంపై ప్రతికూల ప్రభావం చూపవచ్చని యాదవ్ అభిప్రాయపడ్డారు.బీజేపీ.. దేశాన్ని రాజకీయంగా విభజించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. “ప్రతి ఒక్కరికీ అవకాశం రావాలి” అని యాదవ్ అన్నారు. బీజేపీ రెండు సార్లు ప్రధాన మంత్రులను ఎంపిక చేసిందని, కానీ దక్షిణ భారతానికి చెందిన నాయకుడిని అత్యున్నత పదవికి ఎంపిక చేయలేదని చెప్పారు. -
త్రిషపై మరోసారి కామెంట్ల దుమారం.. ఈ సారి అన్నాడీఎంకే నేత
చెన్నై: తమిళనాడులో రాజకీయ పోరులో మరోసారి సినీనటి త్రిష ప్రస్తావన వచ్చింది. తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే అధినేత విజయ్ను లక్ష్యంగా చేసుకుంటూ త్రిషపై వ్యాఖ్యలు చేసి అన్నాడీఎంకే నేత ఆర్బీ ఉదయకుమార్ మరో వివాదానికి తెరతీశారు.ఆగస్టు 8న తూత్తుకుడిలో జరిగిన అన్నాడీఎంకే కార్యక్రమంలో మాట్లాడిన ఉదయకుమార్.. తమిళనాడు ఉప ముఖ్యమంత్రిగా త్రిషను ఎప్పుడు నియమిస్తారంటూ ప్రశ్నించారు. “విజయ్‌కు ‘ప్రియమైన’ త్రిషను తమిళనాడు ఉప ముఖ్యమంత్రిగా ఎప్పుడు నియమిస్తారో చూడాలని తమిళనాడు ఎదురుచూస్తోంది” అని కార్యక్రమంలో అన్నారు.ఉదయకుమార్ జయలలిత పేరవై సమావేశంలో అన్నాడీఎంకే కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతున్న సమయంలో ఈ వ్యాఖ్యలు చేసినట్టు సమాచారం. కావేరి జలాల అంశాన్ని తమిళనాడు ప్రభుత్వం నిర్వహించిన తీరును, కావేరి జలాల నిర్వహణ అథారిటీ ఆదేశాల మేరకు కర్ణాటక నుంచి నీటి విడుదల చేయించడంలో విఫలమైన విషయాన్ని ఆయన విమర్శిస్తున్నారు.త్రిష అభిమానుల నుంచి ఈ వ్యాఖ్యలపై విమర్శలు వచ్చాయి. ఉదయకుమార్ వ్యాఖ్యలను ఖండిస్తూ త్రిష అభిమాన సంఘం మదురై అంతటా పోస్టర్లు ఏర్పాటు చేసింది. కొన్ని రోజుల క్రితం తమిళనాడు ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ కూడా త్రిషపై చేసినట్టు ఆరోపణలు వచ్చిన ద్వంద్వార్థ వ్యాఖ్యల కారణంగా విమర్శలు ఎదుర్కొన్నారు.గత వారం కావేరి నిరసన కార్యక్రమంలో మాట్లాడుతున్న సమయంలో జనంలో కొందరు “త్రిష, త్రిష” అంటూ నినాదాలు చేసినట్టు సమాచారం. దానికి స్పందించిన ఉదయనిధి ద్వంద్వార్థ వ్యాఖ్య చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. అనంతరం తాను కావేరి జలాల గురించే మాట్లాడుతున్నానని చెప్పారు.ఆ వ్యాఖ్యల తర్వాత టీవీకే మహిళా విభాగం తంజావూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రతిపక్ష నేత త్రిషను లక్ష్యంగా చేసుకుని ద్వంద్వార్థ వ్యాఖ్య చేశారని ఫిర్యాదులో పేర్కొంది. అనంతరం ఉదయనిధిని ప్రశ్నించిన తర్వాత అరెస్టు చేసి, కోర్టు విడుదల చేసింది. తాను అభ్యంతరకర వ్యాఖ్యలు చేయలేదని ఆయన ఖండించారు. ఉదయనిధి వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని, అవి ఏ వ్యక్తిని ఉద్దేశించి చేసినవి కావని, ప్రభుత్వ పనితీరును ఉద్దేశించిందేనని డీఎంకే తెలిపింది.ఇంతకుముందూ విజయ్‌కు సంబంధించిన రాజకీయ వ్యాఖ్యల్లో త్రిష ప్రస్తావన వచ్చింది. ఈ ఏడాది ప్రారంభంలో తమిళనాడు బీజేపీ నేత నైనార్ నాగేంద్రన్, రాజకీయాల్లోకి రావాలంటే విజయ్ ముందుగా “త్రిష ఇంటి నుంచి బయటకు రావాలి” అని వ్యాఖ్యానించారు. ఆ సమయంలో త్రిష న్యాయ బృందం ఆ వ్యాఖ్యలపై ప్రతి స్పందించింది. -
డ్రగ్ ఫ్రీ తమిళనాడు' కోసం సీఎం విజయ్ కీలక అడుగు
-
విజయ్ సర్కార్ కీలక తీర్మానం.. బీజేపీ వాకౌట్
చెన్నై: టీవీకే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నీట్‌కు వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీలో తీర్మానం చేసింది. దీంతో సభ నుంచి బీజేపీలు ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. నీట్ కారణంగా విద్యార్థుల దృష్టి స్కూల్ చదువు నుంచి కోచింగ్లపైకి మళ్లుతోందని మంత్రి అరుణ్‌రాజ్ అన్నారు. భారీ ఫీజులు వసూలు చేసే కోచింగ్ సెంటర్లను నీట్ ప్రోత్సహిస్తోందంటూ మంత్రి ఆరోపించారు.నీట్ అనేది సామాజిక న్యాయం, సమానత్వం, రాష్ట్ర హక్కులకు విరుద్ధంగా ఉందని మంత్రి అరుణ్‌రాజ్ పేర్కొన్నారు. పేపర్ లీక్‌లు, విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడం వంటి అంశాలను అరుణ్‌రాజ్ ప్రస్తావించారు. సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన విజయ్.. టీవీకేను బలమైన రాజకీయ శక్తిగా నిలబెట్టేందుకు అడుగులు వేస్తున్నారు. యువత, విద్యార్థులు, రాష్ట్ర హక్కులు వంటి అంశాలను ప్రధాన అజెండాగా విజయ్ సర్కార్ ముందుకెళ్తుంది. నీట్ వ్యతిరేకతను బలంగా వినిపించడం ద్వారా విద్యార్థుల్లో, యువ ఓటర్లలో తన పార్టీకి స్థానం పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు.కాగా, డ్రగ్ రహిత తమిళనాడు కార్యక్రమంలో సీఎం విజయ్ పాల్గొన్నారు. డ్రగ్స్ వినియోగానికి వ్యతిరేకంగా ఆయన ప్రతిజ్ఞ చేశారు. విద్యార్థులతో కలిసి డ్రగ్ ఫ్రీ ఫ్లైడ్జ్ చేసిన సీఎం విజయ్.. డ్రగ్స్ వాడొద్దు.. సన్నిహితులు వాడుతుంటే ఊరుకోవద్దు.. డ్రగ్స్ ఫ్రీ తమిళనాడు కోసం అంతా కృషి చేద్దామంటూ పిలుపునిచ్చారు. -
భాష ముఖ్యం బిగిలూ!
తమిళనాడులో భాషా రాజకీయం మరోసారి తెరపైకి వచ్చింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆర్థిక మంత్రి ఎన్. మేరీ విల్సన్ చేసిన ప్రసంగం ఇప్పుడు తీవ్ర రాజకీయ వివాదానికి కారణమైంది. మంత్రి తమిళ ఉచ్చారణ, వ్యాకరణంపై డీఎంకే అభ్యంతరం వ్యక్తం చేయగా.. బీజేపీ కూడా రంగంలోకి దిగి తమిళ భాషను గౌరవించాలని డిమాండ్ చేసింది. దీంతో ‘భాషా ప్రేమ’ వర్సెస్ ‘వ్యక్తిగత శైలి’ అనే చర్చ మొదలైంది.ఆగస్టు 5న తమిళనాడు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా ఆర్థిక మంత్రి మేరీ విల్సన్ తమిళంలో ప్రసంగించారు. అయితే ఆయన ప్రసంగంలో పలుచోట్ల వ్యాకరణ, ఉచ్చారణ లోపాలు కనిపించాయని డీఎంకే ఎమ్మెల్యే టీ.ఎం. రాజేంద్రన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. “భవిష్యత్తులో అవకాశం వచ్చినప్పుడు ఆర్థిక మంత్రి స్వచ్ఛమైన తమిళంలో మాట్లాడాలి” అని తాజాగా జరిగిన చర్చలో ఆయన సూచించారు. ఒక రాష్ట్ర ఆర్థిక మంత్రి బడ్జెట్ వంటి కీలక ప్రసంగం చేస్తున్నప్పుడు భాషపై మరింత శ్రద్ధ అవసరమని పేర్కొన్నారు.‘నా తమిళం.. నా స్టైల్’డీఎంకే ఎమ్మెల్యే వ్యాఖ్యలపై మంత్రి మేరీ విల్సన్ తీవ్రంగా స్పందించారు. తన మాట్లాడే విధానాన్ని ప్రశ్నించడం సరికాదని అన్నారు. “నా తమిళం గురించి నాకు సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది నా ప్రత్యేక శైలి. నేను ఇలాగే మాట్లాడగలను. అంగీకరించినా, అంగీకరించకపోయినా ఇదే నా శైలి. మీ కోసం నేను మార్చుకోలేను” అంటూ మంత్రి ఘాటుగా బదులిచ్చారు.వివాదం పెరగడంతో అసెంబ్లీ స్పీకర్ జోక్యం చేసుకుని సభ్యులు ఈ అంశాన్ని తేలికగా తీసుకోవాలని సూచించారు. ప్రజలు అర్థం చేసుకునేలా మంత్రి ప్రసంగించారని, భాషపై చర్చను సానుకూలంగా చూడాలని కోరారు.మతం ప్రస్తావనతో మరింత వేడితనపై వచ్చిన విమర్శలకు స్పందిస్తూ మంత్రి విల్సన్ తన మత విశ్వాసాలను ప్రస్తావించారు. “క్రైస్తవం నాకు ప్రేమ, సానుభూతి అనే ఒకే భాషను నేర్పింది. నేను బైబిల్ నుంచి దాన్ని నేర్చుకున్నాను. నేను పుట్టుకతో క్రైస్తవుడిని” అని వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలు కూడా రాజకీయ చర్చకు దారితీశాయి. భాషా వివాదంలోకి మత ప్రస్తావన రావడంపై పలువురు స్పందించారు.‘తప్పులను అంగీకరించాలి’: డీఎంకేడీఎంకే సీనియర్ నేత టీ.కే.ఎస్. ఇళంగోవన్ మంత్రి తీరుపై విమర్శలు చేశారు. “బడ్జెట్ చదివే సమయంలో అనేక చోట్ల తమిళంలో తప్పులు జరిగాయి. దాన్ని అంగీకరించకుండా సమర్థించుకోవడం సరికాదు. ఆర్థిక మంత్రి భాషను సరిగ్గా చదవగలగాలి” అని అన్నారు.తమిళంను అవమానించొద్దు: బీజేపీఈ వివాదంలో బీజేపీ కూడా జోక్యం చేసుకుంది. తమిళ భాషను తక్కువ చేసి మాట్లాడే వ్యాఖ్యలను అంగీకరించబోమని స్పష్టం చేసింది. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ మాట్లాడుతూ.. “మతం ఏదైనా కావచ్చు. కానీ భావోద్వేగం, గుర్తింపు పరంగా మనమంతా తమిళులమే. మీ మతాన్ని గౌరవించడంలో తప్పులేదు. కానీ తమిళ భాషను కించపరిచే వ్యాఖ్యలను అంగీకరించలేం. మంత్రి బహిరంగంగా క్షమాపణ చెప్పాలి” అని డిమాండ్ చేశారు.విజయ్ సూచనతమిళ భాషపై రేగిన వివాదంపై విజయ్ స్పందించినట్లు తెలుస్తోంది. మంత్రి విల్సన్ తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన.. “తమిళం మన అస్తిత్వం.. దాని గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిదీ. భాష విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి” అంటూ సూచించినట్లు సమాచారం.భాషా గౌరవమా? వ్యక్తిగత స్వేచ్ఛా?ఈ వివాదం ఇప్పుడు తమిళనాడులో పెద్ద చర్చకు దారితీసింది. ఒక వర్గం “తమిళం ప్రపంచంలోని పురాతన భాషల్లో ఒకటి.. దాన్ని సరిగ్గా మాట్లాడటం ప్రతి ఒక్కరి బాధ్యత” అంటుండగా.. మరోవర్గం “భాషలో చిన్న తప్పుల కంటే ప్రజలకు అర్థమయ్యేలా పాలన అందించడం ముఖ్యం” అని వాదిస్తోంది. -
భర్తను చంపేందుకు భార్య భారీ స్కెచ్..!
తమిళనాడు: మాదక ద్రవ్యాలతో భర్తను హత్య చేసేందుకు యత్నించిన భార్యను పోలిసులు అరెస్టు చేశారు. కల్లకురిచి జిల్లాలోని చిన్నసేలం గ్రామానికి చెందిన రాజీవ్ గాంధీ(40) వ్యవసాయ కూలీ. ఇతను తన భార్య కనగ, పిల్లలతో కలిసి నివసిస్తున్నాడు. ఈ నేపథ్యంలో, గత 6వ తేదీ సాయంత్రం సుమారు 5 గంటలకు రాజీవ్ గాంధీ తన ఇంటి ముందు నిలబడి ఉండగా, పొలం బయట రోడ్డు నుండి బైకు పై వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో అతని మెడపైనా, నడుముపైనా పొడిచారు. కేకలు విని ఇరుగుపొరుగు వారు వచ్చారు. వారు రావడం చూసిన, ఆ గుర్తుతెలియని వ్యక్తులు బైకు పై పారిపోయారు .దీని తరువాత, రాజీవ్ గాందీని రక్షించి కల్లకురిచి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ ఆయనకు ఇంటెన్సివ్ ట్రీట్మెంట్ అందిస్తున్నారు.ఈ విషయమై చిన్నసేలం పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు కోసం రెండు ప్రత్యేక బందాలను ఏర్పాటు చేశారు. అందులో, రాజీవ్ గాంధీ భార్య కనక, ఆమె వివాహితర ప్రియుడు, మాజీ పంచాయత్ అధ్యక్షుడు ధనపాల్ (53), ఇద్దరు అనుచరులతో కలిసి రాజీవ్ గాందీని హత్య చేయడానికి యత్నించినట్లు వెల్లడైంది. దీంతో చిన్నసేలం పోలీసులు ఆ గ్రూపు మాజీ నాయకుడు ధనపాల్, కనక, కిరాయి హంతకులైన పాల్ రాజ్ (24), కార్తీక్‌తో సహా మరో నలుగురి పై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. -
CM విజయ్ సంచలనం అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం
-
విజయ్, పీకే, అన్నామలై.. భారత రాజకీయాల్లో కొత్త గేమ్?
కులం.. మతం.. కేడర్ బలం.. దశాబ్దాలుగా భారత ఎన్నికల రాజకీయాలను నడిపించిన ప్రధాన శక్తులు ఇవే. కానీ ఇప్పుడు ఆ లెక్కలు మారుతున్నాయా? బ్రాండ్.. యువత.. టెక్నాలజీ.. సోషల్ మీడియా.. ప్రజలతో డైరెక్ట్ కనెక్ట్ ఆధారంగా కొత్త రాజకీయ శక్తిని నిర్మించే ప్రయత్నాలు ఊపందుకుంటున్నాయి. పాత రాజకీయ వ్యవస్థకు భిన్నంగా సొంతంగా బలం కూడగట్టుకుని.. కొత్త ఓటు బ్యాంకును తయారు చేసుకునే ప్రయోగాలు ఆసక్తి రేపుతున్నాయి.ఈ మారుతున్న రాజకీయ గేమ్‌లో మూడు పేర్లు ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారాయి. అవే తమిళనాడు సీఎం విజయ్, ప్రశాంత్ కిశోర్, తమిళనాడుకు చెందిన అన్నామలై. ముగ్గురి దారులు వేరు.. నేపథ్యాలు వేరు.. కానీ టార్గెట్ ఒక్కటే.. తమకంటూ కొత్త రాజకీయ మోడల్‌ను నిర్మించడం. మరి భారత రాజకీయాల్లో కొత్త గేమ్ నిజంగానే మొదలైందా?సీఎం విజయ్.. తమిళనాడులో విజయ్ ప్రయోగం మరింత వేగంగా సాగింది. సినీ స్టార్‌డమ్‌ను రాజకీయ బ్రాండ్‌గా మార్చేందుకు తమిళగ వెట్రి కజగం ఏర్పాటు చేశారు. డీఎంకే, అన్నాడీఎంకే వంటి దశాబ్దాల చరిత్ర ఉన్న పార్టీల మధ్య కొత్త రాజకీయ శక్తిగా ఎదిగారు. యువత, ఉద్యోగాలు, విద్య, సంక్షేమం వంటి అంశాలతో ముందుకు వెళ్లారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే 108 సీట్లు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించిందని కథనం పేర్కొంటోంది. విజయ్ సీఎం కావడంతో ఒక స్టార్ తన వ్యక్తిగత బ్రాండ్‌ను రాజకీయ అధికారంగా మార్చగలడా? అన్న ప్రశ్నకు కొత్త సమాధానం కనిపించింది.పీకే.. ఇతర పార్టీలను గెలిపించిన ఎన్నికల వ్యూహకర్తగా పేరున్న ప్రశాంత్ కిశోర్.. చివరకు తనకంటూ జన సూరాజ్ పార్టీని నిర్మించారు. 2025 బీహార్ ఎన్నికల్లో పార్టీ ఘోరంగా విఫలమైనా వెనక్కి తగ్గలేదు. ఆ తర్వాత బంకీపూర్ ఉపఎన్నికలో విజయం సాధించడం ద్వారా ఓటమి తర్వాత కూడా కొత్త పార్టీని తిరిగి నిలబెట్టుకోవచ్చని చూపించారు. ఒక్క గెలుపుతో బీహార్ రాజకీయాలను మార్చేశారని చెప్పలేం.. కానీ కొత్త రాజకీయ స్టార్టప్ ఫెయిల్ అయితే అంతే సంగతులు కాదనే సంకేతం మాత్రం ఇచ్చారు.అన్నామలై.. అన్నామలై ప్రయోగం మరో రకం. బీజేపీలో పనిచేసి ఆ పార్టీ తమిళనాడు అధ్యక్షుడిగా ఎదిగిన ఆయన.. చివరకు ఆ వ్యవస్థ నుంచి బయటకు వచ్చి ‘వీ ది లీడర్స్’ పేరుతో కొత్త రాజకీయ ఉద్యమాన్ని ప్రారంభించారు. వెంటనే ఎన్నికల బరిలోకి దిగకుండా.. ముందుగా సంస్థను నిర్మించడం, సభ్యత్వాన్ని పెంచడం, నాయకత్వాన్ని తయారు చేయడంపై దృష్టి పెట్టారు. అంటే ఎన్నికల ముందు పార్టీ కాదు.. పార్టీ కోసం ముందే సంస్థ అనే మోడల్‌ను పరీక్షిస్తున్నారు.ఈ ముగ్గురిలో కామన్ పాయింట్ ఏంటంటే.. తమ బ్రాండ్, తమ ఆలోచన, తమ నెట్‌వర్క్‌తో కొత్త రాజకీయ స్థావరాన్ని నిర్మించాలనుకుంటున్నారు. అయితే కులం, మతం, ప్రాంతీయ సమీకరణాలు భారత రాజకీయాల్లో ఇంకా బలంగానే ఉన్నాయి. దశాబ్దాలుగా గ్రామస్థాయిలో పనిచేస్తున్న సంప్రదాయ పార్టీల కేడర్‌ను సోషల్ మీడియా ఒక్కరోజులో భర్తీ చేయలేదు. అలాగే నాయకుడి వ్యక్తిగత బ్రాండ్‌పై ఆధారపడిన పార్టీకి.. ఆ బ్రాండ్ బలహీనపడితే ఏం జరుగుతుందన్నది మరో పెద్ద ప్రశ్న.కొత్త గేమ్ మొదలైందా?అందుకే పీకే, విజయ్, అన్నామలై ప్రయోగాలను ఇప్పుడే విజయవంతమైన కొత్త మోడల్‌గా తేల్చలేం. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం. భారత రాజకీయాల ‘గేమ్’లో కొత్త ప్లేయర్లు రంగంలోకి దిగారు. ఇక అసలు ప్రశ్న ఒక్కటే.. కులం.. కుటుంబం.. కేడర్ చుట్టూ తిరిగిన పాత రాజకీయాలకు ఇది ప్రత్యామ్నాయమా? లేక కొత్త బ్రాండ్‌తో అదే పాత రాజకీయాలకే మరో రూపమా?. మూడు ప్రయోగాలు. భారత రాజకీయాల్లో కొత్త గేమ్ మొదలైందా? అనే చర్చ నడుస్తోంది. -
విజయ్ బిగ్ ప్లాన్.. షాకిచ్చిన ప్రత్యర్థులు! వాట్ నెక్స్ట్?
తమిళనాడు గొంతును ఢిల్లీ వరకు వినిపించేందుకు ముఖ్యమంత్రి విజయ్ చేసిన ప్రయత్నానికి అనూహ్య ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్ని పార్టీలను ఒకే వేదికపైకి తీసుకురావాలని ఆయన ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి ప్రధాన రాజకీయ ప్రత్యర్థులైన డీఎంకే, అన్నాడీఎంకే దూరంగా ఉండాలని నిర్ణయించాయి. దీంతో తమిళనాడులో ఐక్య పోరాటానికి విజయ్ చేసిన ప్రయత్నం ప్రారంభంలోనే రాజకీయ విభేదాలను ఎదుర్కొంటోంది.కేంద్రం ప్రతిపాదిస్తున్న నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్)పై చర్చించేందుకు తమిళనాడు ఎంపీలతో ముఖ్యమంత్రి విజయ్ సమావేశం ఏర్పాటు చేశారు. లోక్‌సభ, రాజ్యసభ సభ్యులందరినీ ఆహ్వానిస్తూ.. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో పార్టీ భేదాలను పక్కన పెట్టి ఒకే నిర్ణయంతో ముందుకు వెళ్లాలని ఆయన ప్రయత్నించారు.డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాతినిధ్యం తగ్గే అవకాశం ఉందన్న ఆందోళన నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది. కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు తమిళనాడు నుంచి ఏకాభిప్రాయంతో కూడిన వైఖరిని రూపొందించాలన్నది విజయ్ లక్ష్యంగా కనిపించింది. అయితే..డీఎంకే, అన్నాడీఎంకే బహిష్కరణవిజయ్ ప్రయత్నాలకు మొదటి దశలోనే అడ్డంకి ఎదురైంది. తమిళనాడులో కీలక రాజకీయ శక్తులైన డీఎంకే, అన్నాడీఎంకే ఈ సమావేశానికి హాజరు కావడం లేదని ప్రకటించాయి. రాష్ట్రంలో అత్యధిక లోక్‌సభ సభ్యులను కలిగి ఉన్న డీఎంకే గైర్హాజరు కావడం విజయ్ సమావేశానికి పెద్ద లోటుగా మారింది. అన్నాడీఎంకే కూడా దూరం కావడంతో తమిళనాడులోని ప్రధాన పార్టీల మధ్య డీలిమిటేషన్‌పై ఏకాభిప్రాయం ఇంకా కుదరలేదని స్పష్టమైంది.డీలిమిటేషన్ ఎందుకు వివాదం?కేంద్రం ప్రతిపాదిస్తున్న డీలిమిటేషన్ ప్రక్రియలో 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకుని లోక్‌సభ నియోజకవర్గాలను పునర్విభజించే అవకాశం ఉంది. ప్రస్తుతం 543గా ఉన్న లోక్‌సభ స్థానాల సంఖ్యను సుమారు 850 వరకు పెంచే ప్రతిపాదనపై చర్చ జరుగుతోంది. అయితే దక్షిణాది రాష్ట్రాలు దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. జనాభా నియంత్రణలో ముందున్న తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి రాష్ట్రాలకు ఈ విధానం నష్టం చేస్తుందని వాటి వాదన. జనాభా ఎక్కువగా ఉన్న ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువ స్థానాలు పెరుగుతాయని.. దక్షిణాది రాష్ట్రాల పార్లమెంట్ ప్రాతినిధ్యం తగ్గుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.తమిళనాడు భయం ఇదే..ప్రస్తుతం తమిళనాడుకు లోక్‌సభలో 39 స్థానాలు ఉన్నాయి. జనాభా ప్రాతిపదికన కొత్త లెక్కలు అమలు చేస్తే రాష్ట్రం జాతీయ రాజకీయాల్లో తన ప్రభావాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని పార్టీలు చెబుతున్నాయి. కేవలం ఎంపీ స్థానాలే కాకుండా.. కేంద్ర నిధుల కేటాయింపులు, పన్నుల పంపిణీ వంటి అంశాల్లోనూ దక్షిణాది రాష్ట్రాల మాట బలహీనపడే అవకాశం ఉందన్నది వాటి ప్రధాన వాదన.డీఎంకే వైఖరిపై స్పష్టతఇటీవల డీలిమిటేషన్ అంశంలో డీఎంకే వైఖరి మారిందన్న ప్రచారం జరిగింది. దీనిపై ఆ పార్టీ నేత ఉదయనిధి స్టాలిన్ స్పందిస్తూ.. డీఎంకే మొదటి నుంచీ డీలిమిటేషన్‌ను వ్యతిరేకిస్తోందని, భవిష్యత్‌లోనూ అదే వైఖరితో ఉంటుందని స్పష్టం చేశారు. 1971 జనాభా లెక్కలనే ప్రాతిపదికగా కొనసాగించాలని, అన్ని రాష్ట్రాలకు సమానంగా స్థానాలు పెంచాలని డీఎంకే డిమాండ్ చేస్తోంది. రాష్ట్రాల వారీగా కొత్తగా ఎన్ని స్థానాలు వస్తాయో ముందుగానే ప్రకటించాలని కోరుతోంది.విజయ్‌కు బిగ్ టెస్ట్ఇటీవలే రాజకీయాల్లో కొత్త శక్తిగా ఎదుగుతున్న విజయ్‌కు డీలిమిటేషన్ అంశం కీలక పరీక్షగా మారింది. రాష్ట్ర ప్రయోజనాల పేరుతో అన్ని పార్టీలను కలుపుకోవాలన్న ఆయన ప్రయత్నం ప్రశంసలు అందుకున్నప్పటికీ.. ప్రధాన పార్టీల గైర్హాజరు ఆయన ముందున్న రాజకీయ సవాళ్లను బయటపెట్టింది. డీలిమిటేషన్‌పై తమిళనాడు తరఫున ఒకే గొంతుక వినిపించాలని విజయ్ ప్రయత్నిస్తున్న వేళ.. డీఎంకే, అన్నాడీఎంకే దూరంగా ఉండటం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. ఢిల్లీలో తమిళనాడు గళం ఎంత బలంగా వినిపిస్తుందన్నది ఇకపై జరిగే రాజకీయ పరిణామాలపై ఆధారపడి ఉంటుంది. -
విజయ్ విడాకుల కేసులో ట్విస్ట్.. ట్రెండింగ్‌లో ఫ్యామిలీ ఫోటోలు
-
నో డివోర్స్ సీఎం విజయ్ కి బిగ్ రిలీఫ్
-
డీలిమిటేషన్ బిల్లుకు మద్దతుపై DMK రియాక్షన్..
-
నో చీప్ పాలిటిక్స్.. ఉదయ్‌నిధికి విజయ్ స్ట్రాంగ్ కౌంటర్
కావేరి జల వివాదం, కర్ణాటక ప్రతిపాదిస్తున్న మేకెదాటు ఆనకట్ట అంశంపై తమిళనాడు అసెంబ్లీలో మాటల యుద్ధం జరిగింది. ఈ అంశంపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని ప్రతిపక్షాలు పట్టుబడుతుండగా.. ఆ అవసరం లేదంటూ ముఖ్యమంత్రి విజయ్ తేల్చేశారు. అలాగే కావేరి వివాదంపై కర్ణాటకతో చర్చలకు తానే ప్రతిపాదించానని క్లారిటీ ఇచ్చారు. ఈ క్రమంలోనే ప్రతిపక్ష నేత ఉదయ్‌నిధి స్టాలిన్‌కు ‘చీప్ పాలిటిక్స్’ అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.తమిళనాడు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా శుక్రవారం.. అసెంబ్లీలో ప్రతిపక్షాల విమర్శలకు విజయ్ సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా మేకెదాటు అంశాన్ని రాజకీయాలకు వాడుకోవద్దని ప్రతిపక్షాలకు సూచించారు. “మేకెదాటు ఆనకట్ట విషయంలో చౌకబారు రాజకీయాలు(చీప్ పాలిటిక్స్) చేయాలని నేను అనుకోవడం లేదు. కావేరి జలాల విషయంలో మా వైఖరిని ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ ద్వారా తెలియజేశాం. నది జలాల హక్కులు, మేకెదాటు అంశంలో మా ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడదు” అని విజయ్ అన్నారు.అఖిలపక్షం నిర్వహించాల్సిన అవసరం లేదని.. కావేరి జలాల విషయంలో తమ ప్రభుత్వం రాష్ట్ర హక్కులను కాపాడేందుకు చివరి వరకు పోరాడుతుందని, ఎలాంటి రాజీకి వెళ్లబోమని కుండబద్ధలు కొట్టారు. అలాగే తమిళనాడు ప్రజల ప్రయోజనాల కోసం ఎలాంటి అవమానాన్నైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాను అని పేర్కొన్నారు. క్రెడిట్ కోసం పాకులాడం..గతంలో ఎవరు ఏం చేశారన్న విషయాలను ప్రస్తావిస్తూ రాజకీయ లబ్ధి పొందాలని తాము భావించడం లేదని సీఎం చెప్పారు. “ఎవరు క్రెడిట్ తీసుకుంటారు? ఎవరికీ రాజకీయ ప్రయోజనం కలుగుతుంది? అనే దానిపై మాకు ఆసక్తి లేదు. కావేరి సమస్య పరిష్కారానికి ఏం చేయాలో మాకు తెలుసు. ఈ అంశాన్ని న్యాయపరమైన మార్గాల్లోనే ముందుకు తీసుకెళ్తాం” అని ఆయన స్పష్టం చేశారు.VIDEO | Cauvery is our lifeline, I do not want to play politics around it; wrote to PM on Mekedatu issue, we will protect state's rights, says CM Vijay speaking in Tamil Nadu Assembly.#CMVijay #TamilNaduAssembly #CauveryWater(Source: Third Party)(Full video available on PTI… pic.twitter.com/XCQrzRohHa— Press Trust of India (@PTI_News) August 7, 2026అఖిలపక్ష భేటీకి ఉదయనిధి డిమాండ్అయితే మేకెదాటు ప్రాజెక్టుపై ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ డిమాండ్ చేశారు. కర్ణాటక కావేరి నదిపై మేకెదాటు ఆనకట్ట నిర్మాణానికి ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో.. తమిళనాడు ప్రభుత్వం అన్ని పార్టీలను కలుపుకొని కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని ఆయన కోరారు. అసెంబ్లీలో ఉదయనిధి మాట్లాడుతూ.. ఇది రాజకీయ అంశం కాదని, రైతుల జీవనాధారానికి సంబంధించిన సమస్య అని పేర్కొన్నారు.“అఖిలపక్ష సమావేశం ఎందుకు నిర్వహించడం లేదు? మేము అధికారంలో ఉన్నప్పుడు ప్రధానికి లేఖ రాసినందుకు ప్రస్తుత సీఎం విమర్శించారు. ఇప్పుడు ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారో చెప్పాలి. ఇది ప్రజల జీవనాధారానికి సంబంధించిన విషయం” అని ఉదయనిధి అన్నారు. కావేరి అంశంపై ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.పేపర్ కౌంటర్కురువై (కావేరి డెల్టాలో వేసే ప్రత్యేక వరి సాగు) పంట సేకరణకు, కరువు నష్టపరిహారానికి మధ్య తేడా కూడా తెలియదా? కేవలం పేపర్లు చదివితే సరిపోదు.. రైతుల దగ్గరకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకోవాలి అంటూ సీఎం విజయ్‌కు చురకలు అంటించారు. అయితే.. దీనికి ఆ తర్వాత మాట్లాడిన విజయ్ కౌంటర్ ఇచ్చారు. కేవలం ఒక విషయం గురించి మాట్లాడటం కాదు.. మొత్తం వాస్తవాలు తెలుసుకోవాలి. ముందు వెనకా మొత్తం పేపర్లు చదివి ఉంటే అసలు పరిస్థితి ఏమిటో అర్థమయ్యేది అంటూ ఆయన బదులిచ్చారు.முன்ன பின்ன பேப்பர் படிச்சிருந்தா தான தெரியும்!! 😭😅🤭#CmJosephVijay #CmVijay #Tnassembly pic.twitter.com/BpWGhqatF0— Meena 🐿️❤️ (@hsmeenatchi26) August 7, 2026సీఎం కర్ణాటక పర్యటనపై గందరగోళంమేకెదాటు వివాదంపై తమిళనాడు సీఎం విజయ్ కర్ణాటకకు వెళ్లి చర్చలు జరుపుతారన్న వార్తలు కూడా రాజకీయంగా చర్చకు దారితీశాయి. అయితే దీనిపై ప్రభుత్వంలోని కొందరు మంత్రులు భిన్నమైన ప్రకటనలు చేసినట్లు ఉదయనిధి అసెంబ్లీలో ప్రస్తావించారు. “వ్యవసాయ మంత్రి సీఎం కర్ణాటక వెళ్తారని చెప్పారు. మరోవైపు ఇద్దరు మంత్రులు అలాంటి పర్యటన లేదని చెప్పారు. కర్ణాటక నేతలు కూడా తమిళనాడు సీఎం రావడం తమకు ఇష్టం లేదని, నీళ్లు విడుదల చేయడానికి సిద్ధంగా లేమని చెబుతున్నారు” అని ఉదయనిధి అన్నారు.డెల్టా రైతుల పరిస్థితిపై ఉదయనిధి ఆందోళనకావేరి నీటి కొరత ప్రభావం డెల్టా జిల్లాల రైతులపై పడుతోందని ఉదయనిధి పేర్కొన్నారు. సీఎం విజయ్ స్వయంగా డెల్టా ప్రాంత రైతులను కలుసుకుని వారి సమస్యలు వినాలని కోరారు. గత ప్రభుత్వం హయాంలో 6.8 లక్షల ఎకరాల్లో సాగు జరిగితే.. ప్రస్తుత ప్రభుత్వంలో కేవలం 1.5 లక్షల ఎకరాల్లోనే సాగు జరిగిందని ఆయన ఆరోపించారు.డీలిమిటేషన్ అంశంపైనా విజయ్ దూకుడుఇదిలా ఉండగా.. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) అంశంపై కూడా సీఎం విజయ్ దృష్టి సారించారు. ఈ అంశంపై తమిళనాడు ఎంపీలతో శనివారం సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. కేంద్రం ప్రతిపాదిస్తున్న డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గే అవకాశం ఉందన్న ఆందోళనల నేపథ్యంలో.. రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణకు అన్ని పార్టీలతో కలిసి చర్చించేందుకు విజయ్ ముందుకు వచ్చారు.కాగా, డీలిమిటేషన్‌ను మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నామని డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ స్పష్టం చేశారు. జనాభా ఆధారంగా సీట్ల పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని తమిళనాడు పార్టీలు వాదిస్తున్నాయి. ఈ అంశంలో రాష్ట్ర ప్రయోజనాలపై ఏకాభిప్రాయం సాధించేందుకు విజయ్ ప్రయత్నాలు ఆసక్తికరంగా మారాయి.ఉదయనిధి అరెస్టు.. కావేరి వివాదం మరింత వేడిఇదిలా ఉండగా.. కావేరి వివాదం నేపథ్యంలో సీఎం విజయ్, నటి త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో ఉదయనిధి స్టాలిన్ అరెస్టు కావడం కూడా రాజకీయ వివాదానికి దారితీసింది. తన వ్యాఖ్యలు వ్యక్తిగతంగా ఎవరినీ ఉద్దేశించినవి కాదని, కావేరి నది పరిరక్షణ కోసమే మాట్లాడానని ఉదయనిధి స్పష్టం చేశారు. తనను అరెస్టు చేయడం కావేరి, మేకెదాటు అంశాలపై ప్రశ్నలు లేవనెత్తకుండా చేసేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నమని ఆయన ఆరోపించారు.మేకెదాటు ప్రాజెక్టుపై పాత వివాదంకర్ణాటక కావేరి నదిపై మేకెదాటు వద్ద భారీ జలాశయం నిర్మించాలని ప్రతిపాదిస్తోంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే తమిళనాడుకు రావాల్సిన నీటి ప్రవాహంపై ప్రభావం పడుతుందని తమిళనాడు వాదిస్తోంది. ఈ అంశంపై రెండు రాష్ట్రాల మధ్య చాలాకాలంగా వివాదం కొనసాగుతోంది. తాజా పరిణామాలతో కావేరి జల వివాదం మరోసారి తమిళనాడు రాజకీయాల్లో ప్రధాన అంశంగా మారింది. సీఎం విజయ్ అఖిలపక్ష భేటీకి నిరాకరించడం, ఉదయనిధి ప్రభుత్వం తీరుపై ప్రశ్నలు లేవనెత్తడంతో అసెంబ్లీలో రాజకీయ వేడి మరింత పెరిగింది. -
తొలి బడ్జెట్ ప్రవేశపెట్టిన విజయ్ ప్రభుత్వం
-
తొలి బడ్జెట్ ప్రవేశపెట్టిన విజయ్ సర్కార్
చెన్నై: తమిళనాడులో కొత్త రాజకీయ శకానికి తెరలేపుతూ.. ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) ప్రభుత్వం తన తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి ఎన్. మరియా విల్సన్ బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు, మహిళా సాధికారత, విద్య, యువత ఉపాధి, ఆరోగ్యం, క్రీడలకు పెద్దపీట వేస్తూ బడ్జెట్ రూపొందించారు.ప్రజా సంక్షేమమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్న ఆర్థిక మంత్రి విల్సన్.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను గాడిలో పెట్టడంతో పాటు పారదర్శక పాలనకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ఆ సమయంలో సీఎం విజయ్‌పై ఆయన ప్రశంసలు గుప్పించారు.మహిళలకు బంగారం.. పెళ్లి కానుకTVK ఎన్నికల హామీల్లో కీలకమైన ‘అన్నన్ సీర్ తిట్టం’ పథకానికి బడ్జెట్లో రూ.812 కోట్లు కేటాయించారు. ఈ పథకం కింద అర్హులైన మహిళలకు వివాహ సమయంలో 8 గ్రాముల (ఒక సవరన్) బంగారు నాణెం, పట్టు చీర అందించనున్నారు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించే లక్ష్యంతో ‘తై మామన్ తంగా మోదిరం తిట్టం’ పథకాన్ని ప్రకటించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో జన్మించే ప్రతి శిశువుకు ఒక గ్రాము బంగారు ఉంగరం అందించనున్నారు. ఈ పథకానికి రూ.560 కోట్లు కేటాయించారు.విద్యకు భారీ కేటాయింపులువిద్యారంగానికి బడ్జెట్లో అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. పాఠశాల విద్యాశాఖకు రూ.44,527 కోట్లు, ఉన్నత విద్యాశాఖకు రూ.8,393 కోట్లు కేటాయించారు. కళాశాల విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు అందించే ‘వెట్రి ల్యాప్‌టాప్ పథకం’ కోసం రూ.2 వేల కోట్లు కేటాయించారు. డిజిటల్ విద్యను బలోపేతం చేయడమే ఈ పథకం లక్ష్యమని ప్రభుత్వం తెలిపింది.ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణకు ‘పళ్లి నిరైవు తిట్టం’ కింద రూ.300 కోట్లు కేటాయించారు. మొత్తం 3,734 ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే ‘సూపర్ క్లీన్.. సూపర్ క్యాంపస్’ పథకం కింద తొలిదశలో 10 వేల పాఠశాలల్లో పరిశుభ్రత, తాగునీరు, మరుగుదొడ్ల నిర్వహణ, భద్రత కోసం రూ.139 కోట్లు కేటాయించారు.విద్యార్థులకు సైకిళ్లు.. కొత్త హాస్టళ్లు11వ తరగతి విద్యార్థులకు హెల్మెట్, వాటర్ బాటిల్‌తో కూడిన సైకిళ్లు అందించే ‘పుతియా పయనం.. పుతియా వేగం’ పథకానికి రూ.277 కోట్లు కేటాయించారు. దీని ద్వారా 5.3 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కలగనుంది. విద్యార్థుల వసతి సదుపాయాల కోసం తమిళనాడు స్టూడెంట్ హాస్టల్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. TN-SUDAR పథకం కింద 200 ఆధునిక హాస్టళ్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.యువతకు స్కిల్ ట్రైనింగ్ఉద్యోగ అవకాశాలు పెంచేందుకు ‘వెట్రి స్కిల్ ట్రైనింగ్ స్కీమ్’ను ప్రకటించారు. 13 లక్షల మంది యువతకు పరిశ్రమలకు అనుగుణమైన నైపుణ్య శిక్షణ అందించనున్నారు. తొలి దశలో 20 వేల మంది యువతకు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల సహకారంతో ఇంటర్న్‌షిప్ అవకాశాలు కల్పించనున్నారు. ఇందుకోసం రూ.150 కోట్లు కేటాయించారు. ఇంజినీరింగ్, పాలిటెక్నిక్, ఐటీఐ విద్యార్థులు, అధ్యాపకులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) శిక్షణ అందించే ప్రణాళికను కూడా ప్రభుత్వం ప్రకటించింది.క్రీడలకు ప్రోత్సాహంక్రీడారంగ అభివృద్ధికి పెద్దపీట వేస్తూ రాష్ట్రవ్యాప్తంగా 10 ఒలింపిక్ సెంటర్స్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇందుకోసం రూ.50 కోట్లు కేటాయించారు. తమిళనాడు క్రీడాకారులను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దడమే లక్ష్యమని ప్రభుత్వం పేర్కొంది.ఆరోగ్య రంగానికి రూ.23 వేల కోట్లకు పైగావైద్యం, ప్రజారోగ్య శాఖకు రూ.23,353 కోట్ల నిధులు కేటాయించారు. గర్భిణుల కోసం ‘తై కేర్’ పేరుతో ప్రత్యేక సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ప్రసవ సమయం దగ్గర పడిన మహిళలకు ఉచిత భోజనం, వైద్య సహాయం, ఆరోగ్య పర్యవేక్షణ అందించనున్నారు. వృద్ధుల కోసం దశలవారీగా 1,000 మొబైల్ జెరియాట్రిక్ ట్రీట్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. ప్రతి కేంద్రంలో వైద్యుడు, నర్సు, ఫిజియోథెరపిస్ట్ సేవలు అందుబాటులో ఉంటాయి.NEETపై మరోసారి వ్యతిరేకతబడ్జెట్ ప్రసంగంలో NEET పరీక్షపై TVK ప్రభుత్వం తన వైఖరిని మరోసారి స్పష్టం చేసింది. వైద్య ప్రవేశాలను 12వ తరగతి మార్కుల ఆధారంగా పాత విధానంలోనే నిర్వహించేలా NEETను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.కేజీ నుంచి లా వరకు కొత్త ప్రకటనలుమదురైలో 300 మంది విద్యార్థుల సామర్థ్యంతో ప్రత్యేక ప్రభుత్వ లా కాలేజీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఐదు కొత్త ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లు (ITI) ఏర్పాటు చేయడానికి రూ.90 కోట్లు కేటాయించారు. అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థుల కోసం ‘అన్నల్ అంబేద్కర్ ఓవర్సీస్ హయ్యర్ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్’ పథకం కింద ఒక్కో విద్యార్థికి గరిష్ఠంగా రూ.36 లక్షల వరకు సాయం అందించనున్నారు.పారదర్శక పాలనపై ఫోకస్గత ప్రభుత్వ పాలనలో టెండర్ల కేటాయింపుల్లో కొందరు వ్యక్తులు, వర్గాలకు ప్రయోజనం కలిగించే ‘కట్’ విధానం ఉండేదని ఆర్థిక మంత్రి విమర్శించారు. అలాంటి విధానాలకు ముగింపు పలికి.. టెండర్ల ప్రక్రియలో పారదర్శకత తీసుకొచ్చామని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు పన్ను, పన్నేతర ఆదాయాలను పెంచే చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. గత ఐదేళ్లలో తమిళనాడు అప్పులు పెరిగాయని, వాటిని నియంత్రిస్తూ అభివృద్ధి కొనసాగిస్తామని తెలిపారు.ఇతర హైలైట్స్* EV ఛార్జింగ్ స్టేషన్ల కోసం రూ.50 కోట్లు కేటాయింపు* ఐదేళ్లలో 20 వేల పబ్లిక్ EV ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు లక్ష్యం* మైనారిటీ సంక్షేమం కోసం రూ.1,700 కోట్లు* హజ్ యాత్ర సబ్సిడీని రూ.25 వేల నుంచి రూ.35 వేలకు పెంపు* సామాజిక న్యాయ శాఖకు రూ.3,937 కోట్లు* దివ్యాంగుల సంక్షేమ శాఖకు రూ.1,485 కోట్లు* డ్రగ్ ఫ్రీ తమిళనాడు కార్యక్రమం కోసం ప్రత్యేక చర్యలుమొత్తంగా.. విజయ్ సర్కార్ తొలి బడ్జెట్ ఎన్నికల హామీల అమలు, సంక్షేమ పథకాల విస్తరణ, యువత-మహిళల సాధికారత, డిజిటల్ విద్య, పారదర్శక పాలన చుట్టూ తిరిగింది. తొలి బడ్జెట్‌తోనే తమ ప్రభుత్వ ప్రాధాన్యతలను ప్రజలకు స్పష్టం చేసే ప్రయత్నం చేసింది. -
ఆయన ప్రచారం చేస్తే నీ డిపాజిట్ గల్లంతే!
తమిళనాడు రాజకీయాల్లో మాటల తూటాలు పేలుతున్నాయి. నటి త్రిషపై వ్యాఖ్యల వివాదంలో కేసు, అటుపై నాటకీయ పరిణామాల నడుమ అరెస్టైన ప్రతిపక్ష నేత ఉదయ్‌నిధి స్టాలిన్.. హైకోర్టు ఊరటతో గత రాత్రి విడుదలయ్యారు. ఆ రిలీజ్ అయిన వెంటనే ఆయన టీవీకే అధినేత విజయ్‌పై ‘జోకర్ సర్కార్’ అంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. తంజావూర్ పీఎస్‌లో అసభ్యకర వ్యాఖ్యల కేసులో విచారణ అనంతరం గత రాత్రి ఉదయ్‌నిధి రిలీజ్ అయ్యారు. ఆ సమయంలో డీఎంకే శ్రేణులు ఆయనకు భారీగా స్వాగతం పలికాయి. ఆపై ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనపై తీసుకున్న చర్యలను “సర్కస్ ప్రభుత్వం” వ్యవహారంగా అభివర్ణించారు. పోలీసులు తనను ఉగ్రవాదిలా తీసుకెళ్లారని ఆరోపించారు. తన అరెస్టు అసలు సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నమని ఉదయ్‌నిధి అన్నారు. కావేరీ జలాల అంశాన్ని ప్రస్తావిస్తూ.. టీవీకే ప్రభుత్వం రైతుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని విమర్శించారు. మేకేదాటు డ్యామ్, కావేరీ నీటి వివాదంపై ప్రభుత్వ వైఖరిని ప్రశ్నించారు.అంతేకాకుండా టీవీకే అధినేత విజయ్ను, విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. విజయ్ను డమ్మీ సీఎంగా అభివర్ణించాడు. అంతేకాదు.. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని, తాను ఎలాంటి డబుల్‌మీనింగ్ డైలాగు కొట్టలేదని.. సింగిల్ మీనింగ్‌తోనే మాట్లాడానని అన్నారు. మహిళలను కించపరిచే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు. ఈ కేసుపై చట్టపరంగా పోరాడతానని తెలిపారు. టీవీకే ఘాటు కౌంటర్ఉదయ్నిధి వ్యాఖ్యలకు టీవీకే ఘాటు కౌంటర్ ఇచ్చింది. ఆ పార్టీ నేత ఆధవ్ అర్జున ఆ వ్యాఖ్యలను ఖండించారు. తమ ప్రభుత్వం రాజకీయ కక్షతో వ్యవహరించడం లేదని స్పష్టం చేశారు. విజయ్ ప్రజల మద్దతుతో రాజకీయాల్లోకి వచ్చారని, డీఎంకేను తాము ప్రత్యర్థిగా కూడా చూడటం లేదని వ్యాఖ్యానించారు.“మా నాయకుడిని విమర్శించాలంటే అర్హత ఉండాలి. ఉదయ్‌నిధి స్టాలిన్‌కి దమ్ముంటే.. తన తాత, తండ్రి రాజకీయ వారసత్వాన్ని పక్కన పెట్టి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయాలి. ఆ నియోజకవర్గంలో విజయ్ ఒక్కసారి ప్రచారం చేసినా చాలు.. ఉదయ్‌నిధికి డిపాజిట్ కూడా దక్కదు” అంటూ ఆధవ్ అర్జున సవాల్ విసిరారు.త్రిష వ్యాఖ్యలతో మొదలైన వివాదంకావేరీ జల వివాదంపై తంజావూరులో జరిగిన ఓ కార్యక్రమంలో ఉదయ్‌నిధి స్టాలిన్ ప్రసంగిస్తుండగా.. ప్రేక్షకుల నుంచి త్రిష పేరు వినిపించింది. దీనికి ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. ఆ వ్యాఖ్యల్లో ద్వంద్వార్థం ఉందని టీవీకే ఆరోపించింది.రాజకీయాల్లో మహిళల గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉందని టీవీకే విమర్శించింది. ఉదయ్‌నిధి క్షమాపణలు చెప్పేంత వరకు ఊరుకోబోమని అంటోంది. అయితే తన వ్యాఖ్యలకు వక్రీకరణ జరిగిందని, ఎవరి మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశం లేదని ఉదయ్‌నిధి వివరణ ఇచ్చారు. డీఎంకే కూడా విజయ్ ప్రభుత్వ చర్యలను తీవ్రంగా ఖండిస్తోంది. ప్రస్తుతం ఈ వివాదం డీఎంకే–టీవీకే మధ్య రాజకీయ పోరుగా మారింది. ఇవాళ్టి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఏం జరగబోతోందా? అనే ఉత్కంఠను రేకెత్తిస్తోంది. -
ఉదయనిధి స్టాలిన్ విడుదల
చెన్నై: తమిళనాడు ప్రతిపక్ష నాయకుడు, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ విడుదలయ్యారు. తంజావూరులోని సెంగిపట్టి పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వస్తుండగా పార్టీ కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం ఉదయనిధి స్టాలిన్ సెంగిపట్టి పోలీస్ స్టేషన్ వద్ద నుంచి వెళ్లిపోయారు. నటి త్రిషపై పలు వ్యాఖ్యలు చేసినట్లు ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ కేసులో పోలీసులు ఈరోజు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ప్రముఖ నటి త్రిషను ఉద్దేశించి ఉదయనిధి స్టాలిన్‌ను "డబుల్ మీనింగ్" వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులోనే ఆయనను విచారించిన తర్వాత పోలీసులు విడుదల చేశారు. ఆయనను తంజావూరుకు తీసుకెళ్లి గంటకుపైగా పోలీసులు విచారించారు.ఈరోజు అంతకుముందు మద్రాస్ హైకోర్టు.. దర్యాప్తునకు అవసరమైనప్పుడు ఉదయనిధి స్టాలిన్ పూర్తిగా సహకరించాలని ఆదేశించింది. విచారణ పూర్తైన వెంటనే ఆయనను విడుదల చేయాలని పోలీసులకు సూచించింది.కోర్టు విచారణ సమయంలో తంజావూరు పోలీసుల తరఫున హాజరైన అడ్వకేట్ జనరల్ విజయ్ నారాయణ్, ఉదయనిధి స్టాలిన్‌ను తంజావూరుకు తీసుకెళ్లినప్పటికీ న్యాయస్థానపు కస్టడీకి పంపే ఉద్దేశం పోలీసులకు లేదని తెలిపారు. ఆయనను ప్రశ్నించి, స్టేషన్ బెయిల్‌పై విడుదల చేయాలనే రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశమని చెప్పారు. -
ట్రెండింగ్‌లో ఉదయ్‌నిధి.. భార్య కృతికా, పిల్లలను చూశారా? (ఫొటోలు)
-
ఉదయ్‌నిధి బాత్రూంలో ఉన్నారు.. కాస్త ఆగండి
డీఎంకే నేత, తమిళనాడు ప్రతిపక్ష నేత ఉదయ్‌నిధి స్టాలిన్ అరెస్టు రాష్ట్ర రాజకీయాల్లో మరింత వేడి పెంచింది. ఆయనను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు చెన్నైలోని నివాసానికి వెళ్లిన సమయంలో చోటుచేసుకున్న ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పోలీసులను కాస్త ఆగాలంటూ ఉదయ్‌నిధి భార్య కృతికా విజ్ఞప్తి చేసిన దృశ్యాలు చర్చకు దారితీశాయి.తంజావూరులో కావేరీ నీటి వివాదంపై జరిగిన డీఎంకే నిరసన కార్యక్రమంలో ఉదయ్‌నిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై వివాదం చెలరేగింది. ఆయన వ్యాఖ్యలు మహిళలను కించపరిచేలా ఉన్నాయని.. సీఎం విజయ్ను అవమానించేలా ఉన్నాయని ఫిర్యాదులు రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయ్‌నిధిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ఆయన నివాసానికి చేరుకున్నారు.వైరల్‌గా మారిన వీడియోలో.. పోలీసులు ఉదయ్‌నిధిని కలిసేందుకు ఆయన ఇంట్లో వేచి ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ సమయంలో కృతికా ఉదయ్‌నిధి, డీఎంకే నేత మా. సుబ్రమణియన్ పోలీసులతో మాట్లాడుతున్న దృశ్యాలు రికార్డయ్యాయి. “ఆయన టాయిలెట్లో ఉన్నారు. కాస్త సమయం ఇవ్వండి” అంటూ కృతికా పోలీసులను కోరారు. మరికొన్ని నిమిషాలు ఆగాలని విజ్ఞప్తి చేశారు.On Cam: Moments Before Udhayanidhi Stalin Arrest- TIMES NOW accesses the sequence of events- On Cam: Udhayanidhi's wife argues with policemen@dharannniii & @DEKAMEGHNA breaks down the details. pic.twitter.com/WMdaMW0r99— TIMES NOW (@TimesNow) August 4, 2026 VIDEO CREDITS:TimesNowదీనికి స్పందించిన ఓ పోలీసు అధికారి.. తాము చట్టపరమైన విధులు నిర్వహించేందుకు వచ్చామని, ఎక్కువ సమయం వేచి ఉండలేమని పేర్కొన్నారు. “ఎంతసేపు వేచి ఉండాలి? ఇది మా విధి. మేం చట్టాన్ని ఉల్లంఘించడం లేదు” అంటూ ఆయన చెప్పినట్లు వీడియోలో వినిపిస్తోంది.మా. సుబ్రమణియన్ కూడా పోలీసులను మరికొంత సమయం ఇవ్వాలని కోరారు. ఉదయ్‌నిధి సిద్ధమయ్యే వరకు వేచి ఉండాలని, న్యాయవాది కూడా వస్తారని చెప్పారు. అలాగే ఉదయ్‌నిధిని తంజావూరుకు తీసుకెళ్లాల్సి ఉందని.. దాదాపు ఎనిమిది గంటల ప్రయాణం ఉంటుందని, బయలుదేరే ముందు కొంత సమయం ఇవ్వాలని మంత్రి కోరినట్లు తెలుస్తోంది. అయితే పోలీసులు మాత్రం అనంతంగా వేచి ఉండలేమని స్పష్టం చేశారు. చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిందేనని తెలిపారు.கைது செய்து தஞ்சாவூர் அழைத்து செல்லப்படும் எதிர்க்கட்சி தலைவர்.. ஜன்னல் ஓரத்தில் பெரும் யோசனையோடு அமர்ந்து செல்லும் உதயநிதிDMK | Udhayanidhi Arrest | Udhayanidhi Speech | #NewsTamil24x7 #UdhayanidhiStalin #PoliceArrest pic.twitter.com/6afl9S9XCo— News Tamil 24x7 (@NewsTamilTV24x7) August 4, 2026ఏ కేసులో అరెస్ట్?కావేరీ నీటి సమస్యపై తంజావూరులో జరిగిన డీఎంకే నిరసనలో ఉదయ్‌నిధి చేసిన ఓ వ్యాఖ్య వివాదానికి కారణమైంది. నిరసన సమయంలో కొందరు కార్యకర్తలు నటి త్రిష పేరును ప్రస్తావించగా.. ఉదయ్‌నిధి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ వ్యవహారంలో పోలీసులు పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మహిళ గౌరవాన్ని కించపరిచేలా వ్యవహరించడం, ఉద్దేశపూర్వక అవమానం, బెదిరింపులు, కుట్ర తదితర ఆరోపణలతో పాటు తమిళనాడు మహిళల వేధింపుల నిరోధక చట్టం, ఐటీ చట్టంలోని సెక్షన్లను కూడా చేర్చినట్లు సమాచారం.రాజకీయంగా ముదిరిన వివాదంఉదయ్నిధి అరెస్టు వ్యవహారం తమిళనాడు రాజకీయాల్లో కొత్త దుమారానికి దారితీసింది. అధికార టీవీకే, బీజేపీ నేతలు ఉదయ్‌నిధిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు డీఎంకే మాత్రం ఈ కేసును రాజకీయ కక్ష సాధింపుగా అభివర్ణిస్తోంది. కావేరీ సమస్య నుంచి దృష్టి మళ్లించేందుకే ఈ వివాదాన్ని పెద్దదిగా చేస్తున్నారని డీఎంకే వర్గాలు ఆరోపిస్తున్నాయి. -
ఉదయ్నిధికే మా మద్దతు: ప్రేమలత విజయ్‌కాంత్
తమిళనాట ఉదయ్‌నిధి స్టాలిన్ వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. సీఎం విజయ్, నటి త్రిషలను ఉద్దేశించి అసభ్యకరంగా మాట్లాడారంటూ కేసు నమోదు చేసి ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఓవైపు పలువురు ఉదయ్‌నిధి వ్యాఖ్యల్ని తప్పుబడుతుంటే.. డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత విజయ్‌కాంత్ మాత్రం ఆ అరెస్ట్‌ను ఖండించారు.డీఎంకే నేత, ప్రతిపక్ష నేత ఉదయ్‌నిధి స్టాలిన్‌పై పోలీసు చర్యల నేపథ్యంలో మంగళవారం డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత విజయకాంత్ మీడియా ఎదుట కీలక వ్యాఖ్యలు చేశారు. ఉదయ్‌నిధి చేసిన వ్యాఖ్యల్లో తప్పేమీ లేదని పేర్కొంటూ.. ఆయనకు తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు. అదే సమయంలో రాజకీయ భిన్నాభిప్రాయాలను అరెస్టులతో అణచివేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని ప్రభుత్వాన్ని విమర్శించారు.ప్రజాస్వామ్యంలో అభిప్రాయాలు వ్యక్తం చేయడం ప్రతి ఒక్కరి హక్కు అని ప్రేమలత విజయకాంత్ అన్నారు. ఒకరి వ్యాఖ్యలను మరో పార్టీ రాజకీయంగా ఎదుర్కోవాలే తప్ప.. అరెస్టులు పరిష్కారం కాదని పేర్కొన్నారు. స్వతంత్ర భారతంలో రాజకీయ వ్యాఖ్యలపై అరెస్టులు చేయడం ప్రజల్లో అసంతృప్తిని, ప్రజాస్వామ్యంపై అనుమానాలను పెంచుతుందని వ్యాఖ్యానించారు.“ఉదయ్‌నిధి మాట్లాడిన దాంట్లో తప్పు లేదు”ఉదయ్‌నిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను సమర్థించిన ప్రేమలత.. ఆయన మాటల్లో తప్పేమీ లేదని అన్నారు. రాజకీయ వేదికలపై ప్రతిపక్ష నేతలకు తమ అభిప్రాయాలను చెప్పే హక్కు ఉందని స్పష్టం చేశారు. “ఉదయ్‌నిధికి మా మద్దతు ఎప్పుడూ ఉంటుంది. ఆయన మాట్లాడిన దాంట్లో తప్పు లేదు. అందులో అభ్యంతరకరం ఏంటో అర్థం కావడం లేదు” అంటూ ఆమె వ్యాఖ్యానించారు.నీటి కోసం మేం పోరాడుతుంటే..ఇదే సమయంలో తమిళనాడులోని రాజకీయ పోరాటాలపై కూడా ప్రేమలత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజల సమస్యలపై, ముఖ్యంగా కావేరీ జలాల సమస్యల పరిష్కారం కోసం తాము పోరాటం చేస్తున్నామని పేర్కొన్నారు. మరోవైపు నటుడు విజయ్ రాజకీయ పోరాటం చేస్తున్న తీరును ప్రస్తావిస్తూ.. “మేం నీటి కోసం పోరాడుతుంటే.. నటి కోసం విజయ్ పోరాడుతున్నారు” అంటూ వ్యాఖ్యానించారు.అక్రమ అరెస్టులతో పోరాటాన్ని ఆపలేరురాజకీయ ప్రత్యర్థుల గొంతు నొక్కేందుకు అరెస్టులను ఉపయోగించడం సరైన విధానం కాదని ప్రేమలత విమర్శించారు. ప్రజాస్వామ్యంలో అధికార పక్షానికి ఉన్న హక్కులే ప్రతిపక్షాలకు కూడా ఉంటాయని అన్నారు.అధికార పార్టీ, ముఖ్యమంత్రి తమ అభిప్రాయాలను రాజకీయ వేదికలపై వ్యక్తం చేయవచ్చని.. అదే విధంగా ప్రతిపక్షాలు కూడా తమ వైఖరిని ప్రజల ముందుకు తీసుకెళ్లే హక్కు కలిగి ఉంటాయని పేర్కొన్నారు. రాజకీయ విమర్శలను ఎదుర్కోవాల్సింది రాజకీయంగానే కానీ.. అరెస్టులతో కాదని స్పష్టం చేశారు.చట్టం అందరికీ సమానంగా ఉండాలిఇటీవల రాణిపేటలో జర్నలిస్టులపై జరిగిన దాడి విషయంలో పోలీసులు వెంటనే చర్యలు తీసుకోలేదన్న ఆరోపణలను ప్రస్తావించిన ప్రేమలత.. ప్రతిపక్ష నేతల వ్యాఖ్యలపై మాత్రం తక్షణ చర్యలు తీసుకోవడం చట్ట అమలులో సమానత్వంపై ప్రశ్నలు లేవనెత్తుతోందని అన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ముందు ప్రతిపక్ష నేతపై అరెస్టు చర్యలు చేపట్టడం ప్రజాస్వామ్య సంప్రదాయాలకు తగదని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను గౌరవించాలని కోరారు. మొత్తంగా.. ఉదయ్‌నిధి స్టాలిన్ విషయంలో ప్రేమలత విజయకాంత్ చేసిన వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపాయి. -
ఉదయనిధి స్టాలిన్ డబుల్ మీనింగ్ వ్యాఖ్యలు TVK ఫైర్
-
ఉదయ్‌నిధి స్టాలిన్ అరెస్ట్
తమిళనాడు ప్రతిపక్ష నేత ఉదయ్‌నిధి స్టాలిన్ అరెస్ట్ అయ్యారు. సీఎం విజయ్, నటి త్రిషను ఉద్దేశించి అసభ్యకరంగా మాట్లాడారంటూ తమిళగ వెట్రి కగళం పార్టీ ఫిర్యాదు చేయంతో ఆయనపై కేసు నమోదు అయ్యింది. ఈ నేపథ్యంలో టీవీకే నిరసనల నడుమ పోలీసులు ఆయన నివాసం వద్ద భారీగా మోహరించగా.. ఆ తర్వాత ఆయన్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఈ మధ్యాహ్నం మద్రాస్ హైకోర్టు విచారణ జరపనుంది.మంగళవారం ఉదయం ఉదయనిధి నివాసం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అరెస్ట్ తర్వాత ఆయన్ని తరలించే క్రమంలో డీఎంకే శ్రేణులు పోలీసులకు అడ్డు పడ్డాయి. వాహనాన్ని అడ్డుకుని వాగ్వాదానికి దిగాయి. అయినప్పటికి పోలీసులు ఆయన్ని అక్కడి నుంచి బలవంతంగా తీసుకెళ్లారు. ఆ సమయంలో ఉదయ్‌నిధి స్టాలిన్ మీడియాతో మాట్లాడారు. నేను తప్పుగా ఏం మాట్లాడలేదు. ఎవరి పేరును నేను ప్రస్తావించలేదు. ఈ కేసును న్యాయపరంగా తేల్చుకుంటా అని ఆయన అన్నారు. విచారణ నిమిత్తం ఆయన్ని తరలించినట్లు తెలుస్తోంది.ఏం జరిగిందంటే.. సోమవారం తంజావూరులో కావేరీ జలాల అంశంపై జరిగిన డీఎంకే కార్యక్రమంలో ఉదయ్‌నిధి స్టాలిన్ ప్రసంగిస్తున్న సమయంలో.. కొందరు కార్యకర్తలు సినీ నటి త్రిష పేరుతో నినాదాలు చేశారు. దీనికి స్పందించిన ఉదయ్‌నిధి.. కావేరీ జలాలు మన దగ్గరకు వచ్చినా రాకపోయినా, ‘నీళ్లు’ మాత్రం అక్కడికి వెళ్తాయి అంటూ వ్యాఖ్యానించారు. అయితే ఆ వ్యాఖ్యలు ముఖ్యమంత్రి విజయ్, నటి త్రిషలను ఉద్దేశించి డబుల్ మీనింగ్‌గా చేసిన వ్యాఖ్యలేనని టీవీకే ఆరోపిస్తోంది. Udhayanidhi Stalin has landed in controversy after making an alleged double-meaning remark during a Cauvery protest speech when the crowd began chanting "Trisha"The video has gone viral, ruling TVK calls the comment "disgusting" and BJP demands his arrest over the remark. DMK… pic.twitter.com/Ay4S0i9HCv— Nabila Jamal (@nabilajamal_) August 3, 2026కేసు నమోదు.. హైకోర్టులో పిటిషన్ఉదయ్నిధి వ్యాఖ్యల నేపథ్యంలో తంజావూర్ పీఎస్‌లో టీవీకే ఫిర్యాదు చేసింది. సీఎం విజయ్ను అవమానించారంటూ ఫిర్యాదులో పేర్కొంది. దీంతో ఆయనపై ఆరు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఆయన మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ మధ్యాహ్నం విచారణకు రావాల్సి ఉంది. ఈలోపే ఆయన్ని అరెస్ట్ చేయడం గమనార్హం.“బహిరంగ క్షమాపణలు చెప్పాలి”.. ఉదయ్‌నిధి వ్యాఖ్యలపై టీవీకే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. మహిళలను అవమానించే వ్యాఖ్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని పార్టీ నేతలు స్పష్టం చేశారు. క్షమాఫలు చెప్పే దాకా ఉదయ్‌నిధి స్టాలిన్‌ను వదలబోమని అంటున్నారు.ఉదయ్‌నిధి ఇంటి వద్ద భారీ భద్రత.. ఆ వెంటనే అరెస్ట్టీవీకే నిరసనల నేపథ్యంలో చెన్నైలోని ఉదయ్‌నిధి స్టాలిన్ నివాసం వద్ద పోలీసులు ముందస్తుగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భద్రతను పెంచారు. ఆ సమయంలో డీఎంకే కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో హైడ్రామా నెలకొంది. అయితే ఆ తర్వాతే ఉదయ్‌నిధిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది. మహిళా కమిషన్‌కు ఫిర్యాదు.. ఈ వ్యవహారంపై మహిళా కమిషన్ (NCW)ను టీవీకే ఆశ్రయించింది. పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పళా సెల్వకుమార్ ఫిర్యాదు చేస్తూ.. ఉదయ్‌నిధి ప్రసంగానికి సంబంధించిన వీడియోలను పరిశీలించి చర్యలు తీసుకోవాలని కోరారు. ఉదయ్‌నిధి నుంచి వివరణ కోరాలని, బహిరంగ క్షమాపణలు చెప్పేలా ఆదేశించాలని మహిళా కమిషన్‌ను విజ్ఞప్తి చేశారు. అలాగే సంబంధిత చట్టాల కింద చర్యలు తీసుకునేలా పోలీసులకు సూచించాలని కోరినట్లు టీవీకే వెల్లడించింది.బీజేపీ సైతం డీఎంకేపై ఫైర్ఆ వ్యాఖ్యలు మహిళను(త్రిష) కించపరిచేలా ఉన్నాయని, రాజకీయ నాయకుల స్థాయికి తగవనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వివాదంపై తమిళనాడు బీజేపీ కూడా స్పందించింది. ఉదయ్‌నిధి వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని ఆరోపిస్తూ ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ప్రజా జీవితంలో ఉన్న నేతలు మహిళల పట్ల మరింత బాధ్యతగా వ్యవహరించాలని బీజేపీ నేతలు పేర్కొన్నారు.రాజకీయ పోరుకు కొత్త అస్త్రంఇప్పటికే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే, డీఎంకే మధ్య రాజకీయ పోరు కొనసాగుతోంది. ఈ క్రమంలో త్రిష ప్రస్తావన వివాదం మరింత రాజకీయ రంగు పులుముకుంది. టీవీకే ఈ అంశాన్ని మహిళా గౌరవానికి సంబంధించిన అంశంగా తీసుకుని ముందుకు వెళ్తుండగా.. డీఎంకే లేదా ఉదయ్‌నిధి స్టాలిన్ నుంచి ఇంకా అధికారిక స్పందన రావాల్సి ఉంది. -
సీఎం విజయ్‌కు బిగ్ షాక్.. ఉదయనిధి సంచలన ఆరోపణలు..
చెన్నై: తమిళనాడులో అధికార టీవీకే ప్రభుత్వంపై మాజీ మంత్రి, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ప్రజల జీవనాధారమైన కావేరి జలాల అంశంలో ముఖ్యమంత్రి విజయ్ మౌనం పాటిస్తున్నారని ఆరోపించారు. కావేరి వివాదంపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఏమిటో ప్రజలకు స్పష్టంగా చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉందని అన్నారు.తాజాగా మీడియాతో మాట్లాడిన ఉదయనిధి స్టాలిన్.. రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన కీలక అంశాల్లో ప్రభుత్వం ఆశించిన స్థాయిలో స్పందించడం లేదని విమర్శించారు. ముఖ్యంగా కావేరి జలాల అంశం తమిళనాడు రైతుల జీవనాధారానికి సంబంధించిన సమస్య అయినప్పటికీ, ముఖ్యమంత్రి విజయ్ ఇప్పటివరకు దీనిపై స్పష్టమైన ప్రకటన చేయలేదని ఆరోపించారు.‘కావేరి వివాదంపై ముఖ్యమంత్రి విజయ్ ఎందుకు నోరు విప్పడం లేదు? రాష్ట్ర హక్కుల కోసం మాట్లాడాల్సిన సమయంలో ప్రభుత్వం మౌనం పాటిస్తోంది’ అని ఉదయనిధి ప్రశ్నించారు. ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాల్సిన సమయంలో సోషల్ మీడియా ప్రచారానికే పరిమితమైందని కూడా ఆయన విమర్శించారు. ‘ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు అందరూ రీల్స్ చేయడంలోనే బిజీగా ఉన్నారు. పాలన కంటే ప్రచారానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు’ అంటూ ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వంపై కూడా టీవీకే ప్రభుత్వం ప్రశ్నలు లేవనెత్తడం లేదని ఉదయనిధి ఆరోపించారు. "బీజేపీని ముఖ్యమంత్రి విజయ్ ఒక్క మాట కూడా అనడం లేదు. రాష్ట్ర హక్కుల విషయంలో కేంద్రాన్ని నిలదీయాల్సిన సమయంలో మౌనం ఎందుకు పాటిస్తున్నారు?" అని ప్రశ్నించారు.ఇదిలా ఉండగా.. కావేరి జలాల అంశం దశాబ్దాలుగా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య వివాదానికి కేంద్ర బిందువుగా ఉంది. ప్రతి ఏడాది వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు నీటి విడుదల అంశంపై ఇరు రాష్ట్రాల మధ్య విభేదాలు తలెత్తుతుంటాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని బలమైన వైఖరి తీసుకోవాలని ఉదయనిధి స్టాలిన్ సూచించారు. రాష్ట్ర హక్కులను పరిరక్షించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్న ఆయన.. కావేరి వివాదంపై సీఎం విజయ్ తన వైఖరిని ప్రజల ముందుంచాలని డిమాండ్ చేశారు. ప్రజల సమస్యలపై దృష్టి సారించి, రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వంతో గట్టిగా మాట్లాడాల్సిన అవసరం ఉందన్నారు. ఉదయనిధి చేసిన ఈ వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయాల్లో మరోసారి అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారితీశాయి. కావేరి జలాల అంశంపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్నది ఇప్పుడు రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. -
కావేరీ కత్తి.. విజయ్‌కు తొలి పరీక్ష!
తమిళనాడు రాజకీయాల్లో కావేరీ జల వివాదం మరోసారి వేడి పుట్టిస్తోంది. కొత్తగా అధికారంలోకి వచ్చిన తమిళగ వెట్రి కజగం (టీవీకే) ప్రభుత్వానికి ఇది తొలి పెద్ద రాజకీయ సవాల్‌గా మారింది. ముఖ్యమంత్రి సి.జోసెఫ్ విజయ్ ముందు ఇప్పుడు రెండు సవాళ్లు ఉన్నాయి.. ఒకటి కర్ణాటకతో నీటి హక్కుల పోరాటాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి? రెండోది.. రాష్ట్రంలో ప్రతిపక్షాల రాజకీయ ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలి?కావేరీ అంశం తమిళనాడులో కేవలం నీటి సమస్య మాత్రమే కాదు.. ఇది రైతుల జీవనాధారం, ప్రాంతీయ హక్కులు, రాజకీయ ప్రతిష్ఠతో ముడిపడిన సున్నితమైన అంశం. అందుకే ఈ విషయంలో ఏ ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని ప్రతిపక్షాలు నిశితంగా గమనిస్తుంటాయి.అఖిలపక్ష సమావేశం కోసం డీఎంకే ఒత్తిడికావేరీ వివాదంపై ప్రభుత్వం వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డీఎంకే సహా ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. కర్ణాటక ప్రభుత్వం మేకెదాటు డ్యామ్ అంశంపై అఖిలపక్ష సమావేశం నిర్వహించిన నేపథ్యంలో.. తమిళనాడు ప్రభుత్వం కూడా అన్ని పార్టీలను కలుపుకుని వ్యూహం రూపొందించాలని ప్రతిపక్షాలు కోరుతున్నాయి.డీఎంకే వాదన ప్రకారం.. కావేరీ వంటి కీలక అంశాల్లో రాజకీయ భేదాలు పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్ని పార్టీలు ఒకే వేదికపైకి రావాలి. ముఖ్యమంత్రి విజయ్ అఖిలపక్ష సమావేశాన్ని ఎందుకు ఏర్పాటు చేయడం లేదని డీఎంకే ప్రశ్నిస్తోంది.‘ఇప్పటికే అసెంబ్లీలో తీర్మానం చేశాం’అయితే టీవీకే ప్రభుత్వం మాత్రం ప్రతిపక్షాల డిమాండ్‌ను అంగీకరించడం లేదు. టీవీకే సీనియర్ నేత, మంత్రి సీటీఆర్ నిర్మల్‌కుమార్ మాట్లాడుతూ.. కావేరీ అంశంపై ఇప్పటికే తమిళనాడు అసెంబ్లీలో చర్చ జరిగిందని, అన్ని పార్టీల మద్దతుతో తీర్మానం కూడా ఆమోదించామని తెలిపారు. అసెంబ్లీలో ఏకాభిప్రాయం వచ్చిన తర్వాత మళ్లీ అఖిలపక్ష సమావేశం నిర్వహించాల్సిన అవసరం లేదని ఆయన వాదిస్తున్నారు. ప్రతిపక్షాలు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ విమర్శలకే ప్రాధాన్యం ఇస్తున్నాయని టీవీకే ఆరోపిస్తోంది.చర్చల నుంచి రాజకీయ విమర్శల దిశగా.. కావేరీ సమస్యను చర్చల ద్వారా పరిష్కరించేందుకు ప్రయత్నించిన విజయ్ ప్రభుత్వ వైఖరిలో ఇప్పుడు రాజకీయ దూకుడు కూడా కనిపిస్తోంది. విజయ్ కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో నేరుగా చర్చలు జరిపేందుకు ప్రయత్నించిన కొద్ది రోజులకే.. మంత్రి ఆర్. నిర్మల్‌కుమార్ కర్ణాటక సీఎంపై తీవ్ర విమర్శలు చేశారు. డీకే శివకుమార్ కర్ణాటక ప్రయోజనాల కంటే డీఎంకే నాయకత్వం ప్రభావంతో వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. “ఆయన సొంత పార్టీ నేతగా కాకుండా డీఎంకేతో సన్నిహితంగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది” అంటూ విమర్శలు చేశారు.అయితే కావేరీ వంటి సున్నితమైన అంశంలో ఇలాంటి రాజకీయ ఆరోపణలు ఇరు రాష్ట్రాల మధ్య సంబంధాలను మరింత వేడెక్కించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.విజయ్ వ్యూహం వెనుక..అనుభవం ఉన్న డీఎంకే, అన్నాడీఎంకే ప్రభుత్వాలు గతంలో కావేరీ వివాదం తీవ్రంగా మారిన ప్రతిసారి అఖిలపక్ష సమావేశాలను ఆశ్రయించాయి. అయితే విజయ్ ప్రభుత్వం మాత్రం మరో మార్గాన్ని ఎంచుకుంటోంది. సమస్యను నేరుగా చర్చల ద్వారా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సంకేతాలు ఇస్తోంది.కర్ణాటక ముఖ్యమంత్రితో భేటీ కోసం బెంగళూరు వెళ్లాలని విజయ్ భావించినట్లు సమాచారం. అయితే కర్ణాటకలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఆ పర్యటన వాయిదా పడింది. ఇక్కడే విజయ్‌కు అసలు పరీక్ష మొదలవుతుంది.రాజకీయ అనుభవం ఉన్న పార్టీల మాదిరిగా ఉద్యమాల మార్గాన్ని ఎంచుకోవాలా? లేక చర్చల ద్వారా పరిష్కారం సాధించే ప్రయత్నం చేయాలా? అనే విషయంలో ఆయన నిర్ణయం కీలకం కానుంది.కావేరీ నీటి వివాదం దశాబ్దాలుగా తమిళనాడు-కర్ణాటక మధ్య కొనసాగుతున్న సమస్య. ఇది మరీ ముఖ్యంగా తమిళ రాజకీయాల్లో ఎప్పుడూ భావోద్వేగ అంశమే. డెల్టా ప్రాంత రైతులకు కావేరీ నీరు అత్యంత కీలకం. నీటి విడుదలలో ఆలస్యం జరిగిన ప్రతిసారి తమిళనాడులో రైతుల ఆందోళనలు, రాజకీయ నిరసనలు తీవ్ర స్థాయికి చేరుతాయి. అందుకే ఈ అంశంలో ఏ ప్రభుత్వం బలహీనంగా కనిపించినా ప్రతిపక్షాలకు అది రాజకీయ ఆయుధంగా మారుతుంది.డీఎంకే ఆందోళనతో మరింత వేడికావేరీ నీటి సమస్య, రైతుల అంశంపై టీవీకే ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని డీఎంకే ఆగస్టు 3న తంజావూరులో భారీ నిరసనకు సిద్ధమవుతోంది. ఈ ఆందోళన ద్వారా విజయ్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని డీఎంకే భావిస్తోంది. మరోవైపు టీవీకే మాత్రం తమ ప్రభుత్వం తమిళనాడు హక్కుల విషయంలో రాజీ పడదని చెబుతోంది.విజయ్ ముందు రెండు మార్గాలుప్రస్తుతం కావేరీ వివాదం విజయ్ రాజకీయ నాయకత్వానికి తొలి పెద్ద పరీక్షగా మారింది. ఒకవైపు ప్రతిపక్షాల ఒత్తిడి.. మరోవైపు కర్ణాటకతో సున్నితమైన జల వివాదం.. ఇంకోవైపు రైతుల అంచనాలు.. ఈ మూడు అంశాలను సమతుల్యం చేయాల్సిన పరిస్థితి ముఖ్యమంత్రి విజయ్‌కు ఎదురైంది. కావేరీ విషయంలో విజయ్ తీసుకునే నిర్ణయం కేవలం ఒక నీటి వివాదానికి పరిష్కారం చూపడమే కాదు.. ఆయన పరిపాలనా శైలి, రాజకీయ పరిపక్వతకు కూడా తొలి కొలమానంగా మారనుంది. -
మళ్లీ కావేరీ వివాదం
ఎంతో సున్నితమైన నదీజలాల సమస్యను ప్రభుత్వాలు దశాబ్దాల తరబడి అపరిష్కృతంగా వదిలేయటంవల్ల అది కాస్తా మరింత జటిలమవుతోంది. రాష్ట్రాలమధ్యా, రాష్ట్రాల్లో ప్రాంతాలమధ్యా తరచు తలెత్తుతున్న జలవివాదాలు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. ఎప్పటిలాగే కర్ణాటక, తమిళనాడుల మధ్య తాజాగా కావేరీ నదీజలాల పంపకం విషయంలో చిచ్చు రేగింది. రోజూ 3,500 క్యూసెక్కుల చొప్పున తమిళనాడుకు 4.5 టీఎంసీల నీటిని విడుదల చేయాలని కావేరీ నీటి యాజమాన్య ప్రాధికార సంస్థ (సీడబ్ల్యూఎంఏ) కర్ణాటకకు ఇటీవల ఇచ్చిన ఆదేశాలు తాజా వివాదానికి మూలం. ఈ విషయంలో ఏం చేయాలన్న అంశంపై ఈ ఆదివారం కర్ణాటక ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటుచేసింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి రావాలనుకుంటున్న బీజేపీ ఈ సమస్యపై అప్పుడే ఉద్యమం కూడా ప్రారంభించింది. కన్నడ సంఘాలు వచ్చే 13న రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ విషయంలో చర్చించేందుకు తమ రాష్ట్రానికి సోమవారం రావాల్సిన తమిళనాడు సీఎం విజయ్ను ‘ప్రస్తుత పరిస్థితుల రీత్యా’ వాయిదా వేసుకోవాలని కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అభ్యర్థించారు.రాజ్యాంగంలోని 262వ అధికరణం నదీజలాల వినియోగం, పంపిణీ, నియంత్రణ వంటి అంశాల్లో రాష్ట్రాల మధ్య వివాదాలు రాజుకున్నప్పుడూ, ఫిర్యాదులొచ్చినప్పుడూ వాటి పరిష్కారం కోసం తగిన యంత్రాంగాన్ని ఏర్పాటుచేసే అధికారాన్ని పార్లమెంటుకు ఇచ్చింది. దీని ఆధారంగానే కేంద్రం 1956లో నదీజలాల వివాదాల చట్టాన్ని, నదీజలాల బోర్డు చట్టాన్ని తీసుకొచ్చింది. బోర్డు అయితే ఏర్పాటు కాలేదుగానీ... నదీ వివాదాల చట్టంకింద అయిదు ట్రిబ్యునల్స్ ఏర్పడ్డాయి. చిత్రమేమంటే ప్రజా ప్రభు త్వాలు లేని కాలంలోనే... అంటే బ్రిటిష్ వలసపాలకుల హయాంలోనే నదీజలాల ఒప్పందాలు కుదిరాయి. 1924లో అప్పటి మైసూర్ సంస్థానం, మద్రాస్ ప్రెసిడెన్సీలమధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం మైసూర్ కృష్ణరాజ సాగర్ డ్యామ్‌నూ, మద్రాస్ మెట్టూర్ డ్యామ్‌నూ నిర్మించుకోవటానికి అవగాహన కుదిరింది. అప్పట్లో కావేరీ జలాల్లో దాదాపు 75 శాతం వాటా మద్రాస్ ప్రెసిడెన్సీకే కేటాయించారు. ఈ ఒప్పందం కాలపరిమితి యాభైయ్యేళ్ల అనంతరం 1974లో ముగిసిపోగా అప్పటికే కర్ణాటకలో నదీజలాల కేటాయింపు విషయంలో తమకు అన్యాయం జరిగిందనే భావన బలంగా నాటుకుంది. ఎగువభాగంలో ఉండటం కారణంగా కర్ణాటక తమ నీటి అవసరాలకు తగ్గట్టు కొత్త ప్రాజెక్టుల నిర్మాణం కూడా చేపట్టింది. వర్షాలు సమృద్ధిగా పడినంతకాలం నదీ జలాల వివాదాలు వచ్చే అవకాశం లేదు. రుతుపవనాలు విఫలమై వర్షాభావ పరిస్థితులు ఏర్పడినా, కరవు కాటేసినా ఘర్షణలు బయల్దేరతాయి. కావేరీ బేసిన్‌లోని ఆనకట్టలు నిండనప్పుడు తాము బెంగళూరు నగరానికీ, రైతులకూ అవసరమైన నీరు వినియోగించుకోవటంలో తప్పేమిటన్నది కర్ణాటక ప్రశ్న. ఇటు తమవైపు పంటలన్నీ ఎండిపోతున్నాయనీ, న్యాయంగా తమ వాటా నీరు విడుదల చేయాలనీ తమిళనాడు అంటున్నది. అసలే ఈ ఏడాది ‘సూపర్ ఎల్‌నినో’ ప్రభావంతో వర్షాలు సరిగా లేవు. ఇలాంటి పరిస్థితుల్లో సహజంగానే వివాదాలు తలెత్తుతాయి. పుదుచ్చేరి కూడా ఈ కావేరీ జలాల వివాదంలో ఉంటుంది. పడమటి కనుమల్లో పుట్టి గోవా దగ్గర అరేబియా సముద్రంలో కలిసే మహాదాయి విషయంలోనూ కర్ణాటక, గోవాల మధ్య ఇలాంటి వివాదాలే తలెత్తుతుంటాయి. ప్రపంచ పునరుత్పాదక జలవనరుల్లో మన దేశం వాటా కేవలం 4 శాతం మాత్రమే. కనుక నీటి కోసం పోటీ తప్పదు. సమస్య తలెత్తినప్పుడల్లా తాత్కాలిక పరిష్కారంతో ప్రయత్నించి, గండం గడించిందనుకోవటం తప్ప శాశ్వత పరిష్కార దిశగా ఎవరూ ఆలోచించటం లేదు. ఘర్షణ పడే రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వ్యవహరిద్దా మనుకోవటం లేదు. విపక్షాలనుంచి ఒత్తిళ్లు తప్పవు మరి. నదుల్లో నీరు నిండుకున్న ప్పుడు నీరందక పంటలు ఎండిపోతాయి. దృఢంగా పోరాడి ఆ నష్టాన్ని తగ్గించుకోవటంపైనే వివాదం తలెత్తిన రాష్ట్రాల రైతులు దృష్టి పెడతారు. కావేరీ వివాదం సామరస్య పూర్వకంగా పరిష్కారమయ్యే దిశగా రెండు రాష్ట్రాలూ చిత్తశుద్ధితో కృషిచేయాలి. ఇప్పుడిప్పుడే వరుణుడు కరుణిస్తున్న దాఖలా కనబడుతోంది. కనుక ఈ వివాదం త్వరలో సమసిపోతుందని ఆశించాలి. -
హాలీవుడ్ స్టార్ ముందు భారత గౌరవాన్ని నిలబెట్టిన శివాజీ గణేశన్!
దిగ్గజ నటుడు శివాజీ గణేశన్ నటించిన అనేక చిత్రాలు.. స్వాతంత్య్రం అనంతర భారత నేపథ్యంతో తెరకెక్కాయి. మారుతున్న సమాజం ఎదుర్కొన్న పోరాటాలను ఆ చిత్రాలు చూపించాయి. రాజ్ కపూర్ నటించిన ఆవారా (1951) మాదిరిగానే, శివాజీ తొలి చిత్రం పరాశక్తి (1952) కూడా ఆర్థిక ఇబ్బందులు, భారతదేశంలోని పెద్ద నగరాలకు వలస వచ్చిన కార్మిక వర్గం ఎదుర్కొన్న కష్టాలను చిత్రీకరించింది. సత్యజిత్ రే తీసిన కొన్ని చిత్రాలు, ముఖ్యంగా ది అపు ట్రిలజీ, కూడా ఇలాంటి అంశాలను కలిగి ఉన్నాయి.ఆసక్తికర విషయం ఏమిటంటే, 1960లలో స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్, అమెరికన్ ఎంబసీ సంయుక్తంగా నిర్వహించిన పర్యటనలో భాగంగా శివాజీ గణేశన్ హాలీవుడ్‌ను సందర్శించినప్పుడు, ఆయన మార్లన్ బ్రాండోతో చేసిన సంభాషణలో ప్రధాన అంశం భారత్‌లో పేదరికమే. ఈ విషయాన్ని శివాజీ కుమారుడు రామ్‌కుమార్ గణేశన్ ఇటీవల ట్రూలీ రామ్‌తో జరిగిన చర్చలో వెల్లడించారు.రామ్‌కుమార్ మాట్లాడుతూ.. సత్యజిత్ రే తీసిన కొన్ని చిత్రాలు చూసిన తర్వాత భారత్‌లో కనిపించిన పేదరిక స్థాయిపై బ్రాండో మాట్లాడారని చెప్పారు. దీనికి ప్రతిగా, రే తన దేశంలోని పేదరికంపై అవగాహన పెంచేందుకు ఆ చిత్రాలు తీశారని, పశ్చిమ దేశాలకు వాటిని మార్కెట్ చేయాలనే ఉద్దేశం కాదని శివాజీ వివరించారని చెప్పారు. అంతేకాదు, తాను ధరించిన సూట్‌ను చూపిస్తూ భారత్‌లో అందరూ పేదలు కాదని ఆయన స్పష్టం చేశారని తెలిపారు."మా నాన్న ఆయనతో ఇలా చెప్పారు. 'మిస్టర్ బ్రాండో, నేను ధరించిన సూట్ చూశారా? ఇది $500 విలువైన సూట్. భారత్‌లో అందరూ పేదలు కాదు. ఇలాంటి సూట్లు కొనగలిగే వారు కూడా ఉన్నారు. పేదలు ఉన్నట్టే అలాంటి వారు కూడా ఉన్నారు'" అని అన్నారు.ఆసక్తికరంగా, శివాజీ గణేశన్, సత్యజిత్ రే ఒక చలనచిత్రోత్సవంలో కలుసుకున్న విషయం తనకు 20 ఏళ్ల క్రితం వరకూ తెలియదని కూడా రామ్‌కుమార్ చెప్పారు. అలాగే, పేదరికంపై శివాజీ గణేశన్ అభిప్రాయం బ్రాండో ఆలోచనా విధానాన్ని ప్రభావితం చేసి ఉండొచ్చని ఆయన సూచించారు. దాని ఫలితంగానే 1973లో ది గాడ్‌ఫాదర్ చిత్రానికి వచ్చిన ఉత్తమ నటుడు ఆస్కార్‌ను తన తరఫున తిరస్కరించేలా స్థానిక అమెరికన్ ఉద్యమకారిణి సచీన్ లిటిల్ఫెదర్ను అకాడమీ అవార్డుల వేదికపైకి పంపి నిరసన తెలిపి ఉండొచ్చని అన్నారు. -
రోజుకు 300 కూలీ చేసుకునే నాకు 3 కోట్ల జీఎస్టీ నోటీసా?!
తమిళనాడులోని తిరుపత్తూరు జిల్లా జోలార్‌పేట సమీపంలోని పుదూరు పడవేట్టమ్మన్ ఆలయ వీధికి చెందిన రుక్మిణి అనే వృద్ధురాలు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGA) కింద కూలీ పనులు చేస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటోంది.మంగళవారం నాడు ఆమె సందకోడియూరులోని తన బ్యాంకు ఖాతా నుంచి ఉపాధి హామీ కూలీ డబ్బులను డ్రా చేసుకోవడానికి వెళ్లింది. అయితే, అక్కడ ఆమెకు తీవ్ర దిగ్భ్రాంతి కలిగించే విషయం తెలిసింది. ఆంబూరులోని ఆదాయపు పన్నుల (Income Tax) శాఖ కార్యాలయం నుంచి ఆమె పేరిట ఒక నోటీసు వచ్చింది.ఆ నోటీసులో.. ఆమె "ఆర్ఎం ట్రేడర్స్" (RM Traders) అనే వ్యాపార సంస్థను నడుపుతున్నారని, దానికి సంబంధించి రూ. 2.79 కోట్ల మేర జీఎస్టీ (GST) చెల్లించాల్సి ఉందని పేర్కొన్నారు. అంతేకాకుండా, ఇప్పటికే ఈ విషయమై సంబంధిత బ్యాంకుకు సూచనలు పంపామని, అందువల్ల ఆమె బ్యాంకు ఖాతాను పూర్తిగా సీజ్ (Freeze) చేసినట్లు అధికారుల నుంచి సమాచారం ఇచ్చారు.రెక్కాడితే గానీ డొక్కాడని పేదరికంలో ఉన్న తనకు కోట్లలో పన్ను బకాయిలు ఉన్నాయని, ఖాతా సీజ్ చేశారని తెలిసి ఆ వృద్ధురాలు అవాక్కై కన్నీరు మున్నీరైంది. తన వివరాలను, పత్రాలను ఎవరో దుర్వినియోగం చేసి ఈ మోసానికి పాల్పడి ఉంటారని భావిస్తూ, దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి న్యాయం పోరాటం చేస్తానని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. -
బస్సు ప్రయాణికులకు బిగ్ అలర్ట్..!
సాక్షి, తమిళనాడు: ప్రభుత్వ బస్సుల్లో ప్రయాణించే వారు సెల్ఫోన్లలో పెద్ద శబ్దంతో పాటలు వినడం, వీడియోలు చూడడంపై నిషేధం విధించారు. అంతేకాకుండా ప్రయాణికులు బ్లూటూత్, ఇయర్ ఫోన్ లేదా హెడ్ ఫోన్లను ఉపయోగించాలని సూచించారు. తమిళనాడు ప్రభుత్వ బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులు తోటి ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రశాంతంగా, సురక్షితంగా ప్రయాణించేలా తమిళనాడు రవాణా శాఖ కొత్త నిబంధనలను, ప్రయాణ మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ విషయమై రవాణా శాఖ ప్రభుత్వ కార్యదర్శి నిర్మల్‌రాజ్, చైన్నె మహానగర రవాణా సంస్థ, ప్రభుత్వ ఎక్స్‌ప్రెస్ రవాణా సంస్థ, అన్ని రీజినల్ ప్రభుత్వ రవాణా సంస్థల మేనేజింగ్ డైరెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేశారు. -
సినిమాల్లో నటించే ప్రసక్తే లేదని చెప్పేశా : త్రిష
ఇండియన్ సినిమాలోనే నటి త్రిష ఒక సంచలనం. హీరోయిన్గా రెండు దశాబ్దాలకు పైగా పయనం, ఎన్నో విజయాలు. కొన్ని అపజయాలు. వ్యక్తిగతంగానూ సంతోషంతో పాటు చేధు అనుభవాలు ఎదుర్కొన్నారు. అయితే చేదు అనుభవాలను ధైర్యంగా ఎదురొడ్డి నిలిచారు. ఎంతటి వారికైనా జీవితంలో ఎత్తుపల్లాలు సహజం అనడానికి త్రిష ఒక చిన్న ఉదాహరణ. నటి సిమ్రాన్ కథానాయకిగా నటించిన జోడీ చిత్రంతో ఆమె స్నేహితురాలిగా ఒకటి రెండు సన్నివవేశాల్లో మెరిసిన ఈ బ్యూటీ ఆ తరువాత హీరోయిన్ స్థాయికి ఎదిగి ఇప్పటి వరకు అగ్ర కథానాయకిగా రాణిస్తున్నారు. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో నటిస్తూ భారతీయ సీనీ చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.గత ఏడాది ఆమె నటించిన చిత్రాల్లో గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రం ఒక్కటే విజయం సాధించింది. దీంతో కెరీర్ పరంగా కొంచెం ఒడిదుకులను ఎదుర్కొన్నా.. ఈ ఏడాది ఆరంభంలోనే కరుప్పు చిత్రంతో మంచి విజయాన్ని అందుకొని మళ్లీ ఫామ్‌లోకి వచ్చారు. 44 ఏళ్ల వయసులోనూ 20 ఏళ్ల యువతిలా ఉంటూ ప్రశంసలు అందుకుంటున్నారు.ఇక పోతే తెలుగులో చిరంజీవికి జంటగా నటించిన విశ్వంభర చిత్రం త్వరోనే తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవల ఒక భేటీలో త్రిష పేర్కొంటూ ఆరంభంలో మిస్ చెన్నై కీరిటాన్నిగెలుకున్న తాను మోడలింగ్ రంగంలోకి ఎంట్రి ఇచ్చానన్నారు. అప్పట్లో చాలా మంది సినీ రంగంలోకిప్రవేశిస్తారా అని అడగ్గా..ఎప్పటికీ అలా చేయనని అని దృఢంగా చెప్పానన్నారు. సినిమా అంటే తెలిసీ తెలియని వయసు అది అని నటి త్రిష పేర్కొన్నారు. ఈ సంచనల నటి ఆరంభంలో చెప్పినట్లుగా సినిమాకు దూరంగా ఉండి ఉంటే ఇండియన్ సినిమా ఒక మంచి నటిని కోల్పోయేది అని నెటిజన్స్ కామెంట్ చేస్తుననారు. -
గుండు కొట్టించుకుంటే 15 వేలు..!
తమిళనాడు: సేలం జిల్లాలోని ఆత్తూరు సమీపంలో ఉన్న పుదుకోతమ్మడి గ్రామానికి చెందిన 30 ఏళ్ల మహిళకు ఆదివారం రాత్రి సుమారు 8 గంటలకు ఆమె సెల్ ఫోన్‌కు ఒక కాల్ వచ్చింది. అవతలి వ్యక్తి ఆత్తూరు తాలూకా కార్యాలయం నుండి తహసీల్దార్ అని చెప్పుకుంటూ, ఆ మహిళ పేరు, కుటుంబ సభ్యుల పేర్లు కూడా అడిగారు. కరోనా వంటి కొత్త వ్యాధులు నిరంతరం వ్యాపిస్తున్నాయి. ఈ వ్యాధి జుట్టు ద్వారా వ్యాపిస్తుంది. ఈ నేపథ్యంలో విదేశాలలో ప్రజలు గుండు చేయించుకోవడం ద్వారా ఈ వ్యాధి బారి నుండి తప్పించుకుంటున్నారు. ఈ విధంగా గుండు చేయించుకుంటే, వారికి ఈ వ్యాధి సోకదు. ప్రభుత్వం కూడా రూ. 15 వేల వరకు ప్రోత్సాహకాలు అందిస్తుందని చెప్పాడు. దీనిని నమ్మి 20 మంది గుండు కొట్టించుకునేందుకు సిద్ధమయ్యారు. ముగ్గురు మహిళలు గుండు చేయించుకున్న తర్వాత.. అజ్ఞాత వ్యక్తి ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో మోసమని గ్రహించి మిగిలిన వారు గుండు చేయించుకోకుండా జాగ్రత్తపడ్డారు. కాగా కొత్త పద్ధతిలో మహిళలను మోసం చేస్తున్న ముఠాను గుర్తించి, చర్యలు తీసుకోవాలని ఆ ప్రాంతవాసులు పోలీసులను కోరారు. తమిళనాడులో విక్రమార్కుడు గుండు సీన్ రిపీట్గుండు చేయించుకుంటే రూ.15 వేలు ఇస్తామని ఫోన్ చేసిన అజ్ఞాత వ్యక్తి, నమ్మి గుండు చేయించుకున్న మహిళలుఆకతాయిల పని అని తెలిసి వాపోయిన బాధితులుతమిళనాడులోని సేలం జిల్లా పుదుకొత్తంబాడిలో తహసీల్దార్ కార్యాలయం నుంచి ఫోన్ చేస్తున్నామని, మీ… pic.twitter.com/zcggDhinxs— Telugu Scribe (@TeluguScribe) July 29, 2026 -
2031 నాటికి రాజకీయాల్లోకి ధనుష్?
సాక్షి, చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో ఇప్పటికే నటుడు విజయ్ సీఎంగా ప్రభుత్వాన్ని నడిపిస్తూ తనదైన మార్కు చూపిస్తూ కొత్త అధ్యాయాన్ని ప్రారంభించగా, ఇప్పుడు తమిళ సినీ రంగంలో మరో స్టార్ హీరో ధనుష్ కూడా భవిష్యత్తులో రాజకీయాల్లోకి అడుగుపెడతారనే ప్రచారం జోరందుకుంది. తమిళనాడు వ్యాప్తంగా తన అభిమాన సంఘాలకు ప్రత్యేకమైన జెండా,చిహా్నలను (తెలుపు, ఎరుపు రంగు నక్షత్రం) కేటాయించడం, జిల్లాల వారీగా సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించడం అభిమానుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. 2031 నాటికి ధనుష్ సొంతంగా రాజకీయ పార్టీని స్థాపించే అవకాశాలు ఉన్నాయని ఆయన అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు నిదర్శనంగా తిరువళ్లూరులో జరిగిన కార్యక్రమం మారింది. ధనుష్ వ్యాఖ్యల చర్చ తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా పరిధిలో నిర్వహించిన నిధుల సేకరణ, రక్తదాన శిబిరం , విద్యా సహాయ వితరణ కార్యక్రమంలో నటుడు ధనుష్ పాల్గొని అభిమానులను ఉద్దేశించి ప్రసంగించారు. 2002 నుంచి 24 సంవత్సరాలుగా తనకు అండగా నిలిచారని అభిమానులను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు.అభిమానులు తనకు విస్తృతమైన కుటుంబం. జీవితంలో ఎవరు ఎప్పుడు వెన్నుపోటు పొడుస్తారో చెప్పలేం, అందుకే మానసికంగా, శారీరకంగా బలంగా ఉండండి అని వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అభిమానులకు పలు ఉపదేశాలు ఇస్తూనే ఆయన జాతీయ అవార్డుల గురించి స్పందించి ఉండటం తాజాగా చర్చకు దారి తీసింది. కాగా, ధనుష్ చూపిన బాటలోనే నడుస్తామని, తమ నాయకుడు ధనుష్ చెప్పినట్లుగా సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నామని, ఆయన మార్గదర్శకత్వంలో తమిళనాడు అంతటా పర్యటించి, ప్రజలకు సేవ చేస్తామని, . 2031 నాటికి ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి తమిళనాడులో మంచి మార్పు తీసుకువస్తారని ఆశిస్తున్నామని అభిమానులు వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం. -
కబడ్డీ నుంచి వెయిట్‌లిఫ్టింగ్ వైపు...
రాజా ముత్తుపండి స్వస్థలం తమిళనాడు రాష్ట్రం కోవిల్పట్టి సమీపంలోని శంకరలింగాపురం. తండ్రి ముత్తుపండి రోజూవారీ లేబర్ కాగా, తల్లి పెచ్చియమ్మాల్ ఒక అగ్గి పెట్టెల ఫ్యాక్టరీలో పని చేస్తుంది. చిన్నప్పటి నుంచి రాజా, అతని సోదరుడు సురేశ్ కబడ్డీ బాగా ఆడేవారు. సాయంత్రం ఫిట్నెస్ కోసం స్థానికంగా ఉండే జిమ్‌కు కూడా వారిద్దరు వెళ్లేవారు. రాజా శారీరక సామర్థ్యం, అతని పట్టుదల చూసిన కోచ్ అతడిని భవిష్యత్ బాగుంటుందంటూ వెయిట్‌లిఫ్టింగ్ వైపు మళ్లించాడు. ఇక్కడ అతను కఠోర శ్రమతో లిఫ్టింగ్‌లో ప్రతిభను ప్రదర్శించాడు. ఈ క్రమంలో మైలదుత్తురైలో ఉన్న స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) హాస్టల్లో అతనికి సీటు లభించింది. ఆపై తగిన శిక్షణ, కోచ్‌ల మార్గనిర్దేశనంలో రాజా ఆట మెరుగైంది. 2017 యూత్/జూనియర్ కామన్వెల్త్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ, రజతాలతో తొలిసారి రాజాకు గుర్తింపు దక్కింది. 2024లో జాతీయ రికార్డు నెలకొల్పిన అతను గత ఏడాది కామన్వెల్త్ చాంపియన్‌షిప్‌లో రజతం గెలిచాడు. గత ఏడాది వరల్డ్ చాంపియన్‌షిప్‌లో తన అత్యుత్తమ ప్రదర్శన (299 కేజీలు) నమోదు చేశాడు. 2018 కామన్వెల్త్ క్రీడల్లో ఆరో స్థానంలో నిలిచిన రాజా... 2022 కామన్వెల్త్ క్రీడలకు ముందు కాలికి అనూహ్య గాయంతో పోటీల నుంచి తప్పుకున్నాడు. ఇప్పుడు మూడో ప్రయత్నంలో అతనికి మెడల్ దక్కింది. రాజాకు తమిళనాడు ప్రభుత్వం రూ.30 లక్షల ప్రోత్సాహక బహుమతిని ప్రకటించింది. -
పాపం ధనుష్.. ఆ మాటలకే ఇన్ని తిట్లా?
సినీ పరిశ్రమకు, రాజకీయాలకు మధ్య అనుబంధం తమిళనాట కొత్తేమీ కాదు. తెరపై భారీ అభిమాన గణాన్ని సంపాదించుకున్న పలువురు నటులు.. ఆ తర్వాత ప్రజా జీవితంలోకి అడుగుపెట్టిన ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా ఇటీవలి కాలంలో నటుడు విజయ్ రాజకీయ అరంగేట్రం దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారి తీసింది. అభిమాన సంఘాలను సేవా కార్యక్రమాల వేదికగా మార్చుకుని.. ఆ తర్వాత రాజకీయ పార్టీని ప్రకటించిన విజయ్ ప్రయాణం ఇప్పుడు మరికొందరు సినీ ప్రముఖుల భవిష్యత్తుపైనా ఆసక్తి పెంచింది.ఈ క్రమంలోనే మరో స్టార్ హీరో ధనుష్ పేరు తెరపైకి వచ్చింది. ఇటీవల ఓ కార్యక్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు.. అభిమానుల్లో, నెటిజన్లలో కొత్త చర్చకు కారణమయ్యాయి. అయితే ధనుష్ అసలు రాజకీయాల గురించి ఎలాంటి ప్రకటన చేయకపోయినా.. ఆయన మాటలను కొందరు పొలిటికల్ యాంగిల్లో విశ్లేషిస్తున్నారు. తన అభిమానులను ఉద్దేశించి ధనుష్ మాట్లాడుతూ.. కేవలం సినిమా వేడుకలు, అభిమానుల సమావేశాలకే పరిమితం కాకుండా.. సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.“ఒకచోట ఇంతమంది కలవడం వెనుక ఎంతో శక్తి ఉంది. ఆ శక్తికి ఒక లక్ష్యం ఉండాలి. ఆడియో లాంచ్‌లు, మీటింగ్స్‌కే పరిమితం కాకుండా.. మీ చుట్టూ ఉన్న ప్రజలకు సహాయం చేయండి. మీ ప్రాంతంలోని కుటుంబాలకు అండగా నిలవండి. మీపై నేను మరింత గర్వపడేలా చేయండి” అంటూ ధనుష్ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.ఇక్కడి నుంచే అసలు చర్చ మొదలైంది. “ఇది కేవలం అభిమానులకు ఇచ్చిన సామాజిక సందేశమా? లేదంటే భవిష్యత్ రాజకీయ ప్రయాణానికి సంకేతమా?” అని చర్చ మొదలుపెట్టారు. అయితే ఈ చర్చకు మరో కారణం విజయ్ రాజకీయ ప్రయాణమే. విజయ్ కూడా గతంలో తన అభిమాన సంఘాల ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించి.. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. దీంతో ధనుష్ కూడా అదే దారిలో వెళ్తున్నారా? అంటూ కొందరు పోల్చడం మొదలుపెట్టారు.ఇటు విజయ్ అభిమానులు మాత్రం ఈ ప్రచారాన్ని తప్పుబడుతున్నారు. “విజయ్ బాటను కాపీ చేస్తున్నారా?” అంటూ కొందరు సోషల్ మీడియాలో ధనుష్‌ను ట్రోల్ చేస్తున్నారు. ఇదే సమయంలో ధనుష్‌ను ఆయన మాజీ మామ, సూపర్‌స్టార్ రజినీకాంత్‌తో పోలుస్తూ కూడా కొన్ని కామెంట్లు వస్తున్నాయి. రజినీకాంత్ రాజకీయాల్లోకి వస్తారని ఏళ్ల తరబడి ఊహాగానాలు వచ్చినప్పటికీ.. చివరకు ఆయన వెనక్కి వెళ్లిపోయారు. విజయ్ గెలుపు సమయంలోనూ అభినందించకుండా ‘అసూయ’ను ప్రదర్శించారనే విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో “రజినీకాంత్ వల్లే కాలేదు.. ఇంక ధనుష్ ఏం చేస్తారు?” అంటూ కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.అయితే ధనుష్ అభిమానులు మాత్రం సేవా కార్యక్రమాల వైపు మళ్లించడం మాత్రమే రాజకీయ ఎంట్రీకి సంకేతం కాదని, ప్రతి హీరో వ్యాఖ్యలను రాజకీయాలతో ముడిపెట్టడం సరికాదంటున్నారు. రాజకీయ ప్రవేశంపై ధనుష్ ఇప్పటిదాకా ఎలాంటి సంకేతం ఇవ్వలేదు. ఆయన వ్యాఖ్యలు అభిమానులను బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరిన సందేశంగానే కనిపిస్తున్నాయి. కానీ తమిళనాడులో సినీ హీరోలకు ఉన్న ప్రజాదరణ, అభిమాన సంఘాల ప్రభావం కారణంగా ఇలాంటి చిన్న వ్యాఖ్యలు కూడా పెద్ద రాజకీయ చర్చలకు దారి తీస్తున్నాయి. -
డీఎంకేకు బిగ్ షాక్.. లొంగిపోయిన సెంథిల్ బాలాజీ
సాక్షి, చెన్నై: తమిళనాడులో టీవీకే ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర పన్నారనే ఆరోపణల కేసులో మాజీ మంత్రి, డీఎంకే ఎమ్మెల్యే సెంథిల్ బాలాజీ శుక్రవారం కోర్టులో లొంగిపోయారు. ఈ నెల 8న ఈ కేసులో ఆయనకు ముందస్తు బెయిల్ లభించినప్పటికీ.. కోర్టు విధించిన షరతులు, విచారణ ప్రక్రియలో భాగంగా ఆయన న్యాయమూర్తి ముందు హాజరయ్యారు.ఈ కేసులో సెంథిల్ బాలాజీ, ఆయన సోదరుడు అశోక్ కుమార్‌కు ఈ నెల 8న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జి.కె.ఇళందిరైయన్ షరతులతో కూడిన ముందస్తు బెయిల్ ఇచ్చారు. 15 రోజుల్లోగా చెన్నై ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టులో లొంగిపోయి రూ.25 వేల సొంత పూచీకత్తులు, ఇద్దరి ష్యూరిటీలను సమర్పించాలని ఆదేశించారు.ఈ ఆదేశాల మేరకు శుక్రవారం ఉదయం 10:30 గంటలకు సెంథిల్ బాలాజీ ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టులో లొంగిపోయి పూచీకత్తు పత్రాలను సమర్పించారు. దీంతో ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి కార్తికేయన్ బెయిల్ మంజూరు చేసి, శనివారం నుంచి విచారణాధికారి ముందు హాజరై సంతకం చేయడానికి అనుమతించారు. అశోక్ కుమార్ మరో కేసు నిమిత్తం కరూర్‌లో ఉండడంతో, ఆయన సోమవారం కోర్టులో లొంగిపోనున్నట్లు సమాచారం. -
కర్ణాటకకు సీఎం విజయ్.. డీకేతో సమావేశం
సాక్షి, చెన్నై/బనశంకరి: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఆగస్టు 3న కర్ణాటకలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కర్ణాటక సీఎం డీకే శివకుమార్‌తో సమావేశమై కావేరి జలాల పంపిణీతో పాటు మేకెదాటు డ్యామ్ నిర్మాణం అంశాలపై చర్చించనున్నారు.ఈ విషయాన్ని తమిళనాడు వ్యవసాయ శాఖ మంత్రి వినోద్ కుంభకోణంలో శుక్రవారం వెల్లడించారు. కర్ణాటక ప్రభుత్వం కావేరి నీటిని విడుదల చేయకపోవడంతో మెట్టూరు జలాశయం పూర్తిగా ఎండిపోయిందని, దీంతో తమిళనాడులోని డెల్టా జిల్లాల్లో వరి సాగు తీవ్రంగా దెబ్బతిన్నట్లు ఆయన తెలిపారు. అలాగే, కావేరి నదిపై మేకెదాటు వద్ద కర్ణాటక ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న డ్యామ్ నిర్మాణాన్ని తమిళనాడు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించదని మంత్రి స్పష్టం చేశారు.కావేరి జల వివాదం నేపథ్యంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం కీలకంగా మారింది. ఈ భేటీలో నీటి విడుదల, రైతుల ప్రయోజనాలు, మేకెదాటు ప్రాజెక్టుపై ఇరు రాష్ట్రాల అభిప్రాయాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. -
రౌడీ కోతిని పట్టుకునేందుకు అటవీ అధికారులు క్యాంపు
విల్లుపురం: ఒకే ఒక్క కోతి.. దాదాపు మూడు నెలల నుంచి ఆకస్మికంగా దాడులు చేస్తూ గ్రామస్తులను భయభ్రాంతులకు గురి చేస్తోంది. చిన్నారులపై దాడులు చేస్తోంది. ఇటీవల ఓ బాలిక చెవి కొరికేసింది. గ్రామస్తుల అభ్యర్థన మేరకు అటవీ అధికారులు రంగంలోకి దిగారు. ఆ రౌడీ వానరాన్ని బంధించేందుకు గ్రామంలోనే ఏకంగా క్యాంపు ఏర్పాటు చేసుకున్నారు. పలు చోట్ల బోన్లను అమర్చారు. అవసరమైతే మత్తిచ్చి పట్టుకునేందుకు ట్రాంక్విలైజర్ల బృందాన్ని కూడా సిద్ధం చేసుకున్నారు. ఒకట్రెండు రోజుల్లోనే ఆ వానరం చిక్కడం ఖాయమని ధీమాతో చెబుతున్నారు. తమిళనాడులోని విల్లుపురం జిల్లా మరుతెరి గ్రామంలో ఓ వానరం చిన్నారులు, ఆ దారిని వెళ్లే వారిని లక్ష్యంగా చేసుకుని దాడి చేస్తోంది. ఈ నెల 21వ తేదీన 8వ తరగతి చదివే బాలికపై పడి, చెవి కొరికేసింది. ఈ ఘటనపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో అటవీ అధికారులు రంగప్రవేశం చేశారు. ఆ వానరం ఒంటరిగానే సంచరిస్తోందని, ఏదైనా సర్కస్ కంపెనీకి చెందనది అయి ఉంటుందని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
సాఫ్ట్వేర్ ఉద్యోగిని శాలిని ఆత్మహత్య
తమిళనాడు: పూందమల్లిలో భర్తతో గొడవపడిన అనంతరం వీడియో పోస్ట్ చేసి ఓ వివాహిత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వివరాలు.. పూందమల్లిలోని ఓ అపార్ట్మెంట్లో నివసిస్తున్న సెల్వన్ (36) భార్య శాలిని (33). వీరు ప్రేమించుకుని 8 సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నారు. వీరికి 5 సంవత్సరాల కుమార్తె ఉంది. ఆమె భర్త ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అదేవిధంగా, అతని భార్య కూడా ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేస్తు వచ్చింది.ఈ స్థితిలో, బుధవారం శాలిని బిడ్డను కొట్టింది. బిడ్డను ఎందుకు కొడుతున్నావని అడిగి, సెల్వన్ తన భార్య శాలినిపై విచ్చలవిడిగా దాడి చేసి జిమ్‌కు వెళ్లాడు. అతను ఇంటికి తిరిగి వచ్చినప్పుడు, ఇంటి తలుపు లోపలి భాగం తాళం వేసి ఉంది. ఎంత తట్టిన చాలా సేపటి వరకు తలుపు తెరవకపోవడంతో, తలుపు పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా శాలిని ఉరి వేసుకుని ఉండటం చూసి దిగ్భ్రాంతికి గురయ్యాడు. ఈ విషయం గురించి పూందమల్లి పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, మృతురాలు శాలిని మృతదేహాన్ని స్వా«దీనం చేసుకుని, పోస్ట్‌మార్టం కోసం చెన్నైలోని కిల్పాక్లో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి పంపించారు. అంతేకాకుండా, పూందమల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో తేలిందేమిటంటే, ఆత్మహత్య చేసుకునే ముందు శాలిని, తన భర్త తనను కొట్టి, తిడుతు వేధిస్తున్నాడని వీడియోను రికార్డ్ చేసి, దానిని తన బంధువులకు, స్నేహితులకు పంపింది. దీంతో పోలీసులు భర్తను అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటన పూందమల్లి ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని కలిగించింది. -
విజయ్ బ్రో.. వెరీ రాంగ్ బ్రో!
తమిళనాడు రాజకీయాల్లో సినీ ప్రభావం కొత్త విషయం కాదు. కానీ.. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఓ నటుడిగా విజయ్‌కి ఉన్న క్రేజ్ తగ్గలేదు. తాజాగా ఆయన నటించిన ‘చివరి చిత్రం’ జన నాయగన్ విడుదల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. అదే సమయంలో.. ఈ కోలాహలం ఇటు రాజకీయ చర్చకూ దారితీసింది.‘జన నాయగన్’ విడుదల సందర్భంగా విజయ్ అభిమానుల నుంచి భావోద్వేగ దృశ్యాలు కనిపించాయి. అయితే ఆ అభిమానంలో పాలకులు సైతం పోటీ పడ్డారు. సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేందుకు తమిళనాడు మంత్రులు, అధికార పార్టీ నేతలు థియేటర్లకు తరలివెళ్లారు. అసెంబ్లీ స్పీకర్ నుంచి పలువురు మంత్రుల వరకు సినిమా వేడుకల్లో పాల్గొన్నారు. కొందరు అభిమానులతో కలిసి థియేటర్లలో సందడి చేయగా.. మరికొందరు సోషల్ మీడియాలో సినిమాకు ప్రచారం చేశారు.మంత్రి టీకే ప్రభు సినిమా స్టిక్కర్లను ఇళ్ల తలుపులు, ఆటోలకు అంటించిన వీడియోలు నెట్టింట చక్కర్లు కొట్టాయి. మరో మంత్రి సినిమా చూస్తూ భావోద్వేగానికి గురైన దృశ్యాలు కూడా వైరల్ అయ్యాయి. ఇదే ఇప్పుడు విమర్శలకు కారణమైంది. రాష్ట్రంలో కీలక సమస్యలు బోలెడన్ని పెండింగ్‌లో ఉన్నాయని.. పాలనపై దృష్టి పెట్టాల్సిన సమయంలో సినిమా వేడుకలకు ప్రాధాన్యం ఇవ్వడం సరైందేనా? అనే ప్రశ్నలు తెర మీదకు వచ్చాయి.నీట్ నుంచి రైతుల వరకు..నీట్‌పై అభ్యంతరాలతో మొదటి నుంచి కేంద్రం నుంచి పోరాడుతోంది తమిళనాడునే. అసలు ఆ పరీక్షను రద్ద చేయాలనే డిమాండ్ మొదలైంది కూడా అక్కడి నుంచే. అలాంటి రాష్ట్రంలో.. నీట్ వ్యతిరేక ఆందోళనలు కొనసాగుతున్నాయి. నీట్ రద్దు చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ విషయంలో తమది మొదటి నుంచి ఒకే మాట అని విజయ్ టీవీకే చెబుతోంది.అయితే నిరసనల్లో మాత్రం ఆ పార్టీకి చెందిన నేతలెవరూ కనిపించకపోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఢిల్లీలో ఆందోళనలు తారాస్థాయికి చేరుకున్న వేళ.. విజయ్ సినిమా వంకతో పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు కర్ణాటక మేకెదాటు ప్రాజెక్టు, కావేరీ నీటి విడుదల, డెల్టా రైతుల సమస్యలు కూడా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నాయి. ఇలాంటి సమయంలో ప్రభుత్వ యంత్రాంగం మొత్తం సినిమా విడుదల చుట్టూ తిరుగుతున్నట్లు కనిపించడం విమర్శలకు కారణమైంది.వెరీ రాంగ్ బ్రో.. ఇటీవల తమిళనాడులో వరుసగా కస్టడీ మరణాల ఆరోపణలు కలకలం రేపాయి. పోలీసుల వేధింపులతో నలుగురు మరణించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో పోలీసు దౌర్జన్యాలపై గళమెత్తిన విజయ్.. ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ అంశంపై మౌనం పాటిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.గతంలో కస్టడీ బాధిత కుటుంబాలను కలిసిన విజయ్.. పోలీసు సంస్కరణలు తీసుకురావాలని హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ దిశగా స్పష్టమైన చర్యలు కనిపించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.సినిమా హీరో కావొచ్చు, కానీ..విజయ్ రాజకీయ ప్రయాణం మొత్తం ప్రజా సమస్యల చుట్టూనే సాగింది. అవినీతి, పరిపాలనా లోపాలు, ప్రజల హక్కుల కోసం పోరాడతానని ఆయన ప్రకటించారు. అయితే ఇప్పుడు ఆయన ముందున్న అసలు పరీక్ష.. అభిమానుల సీఎంగా కాకుండా ప్రజల సీఎంగా నిరూపించుకోవడం. సినిమా విజయోత్సవాలు రాజకీయంగా నష్టం చేయకపోయినా.. ప్రజా సమస్యలపై స్పందన ఆలస్యమైతే ప్రతిపక్షాలకు అది ఆయుధంగా మారే అవకాశం ఉంది. ఇప్పటికైనా సినీ మత్తు వీడి రంగంలోకి దిగాలనే అభిప్రాయమై వ్యక్తమవుతోంది. View this post on Instagram A post shared by Chennai Live (@chennailive1048) -
సీఎం విజయ్‌తో సినిమా ట్రెండింగ్ లో మమితా బైజు (ఫొటోలు)
-
యంగ్ డైరెక్టర్ మూవీలో విక్రమ్?
తమిళసినిమా: సియాన్ విక్రమ్ కథలు ఎంపిక చేసుకున్నారంటే అందులో కచ్చితంగా కొత్తదనం ఉంటుందనే నమ్మకం ఆయన అభిమానుల్లో నెలకొంటుంది. విక్రం నటించిన చిత్రాలు కొన్ని నిరాశపరిచి ఉండవచ్చు కానీ ఆయన నటన మాత్రం ఎప్పుడు విమర్శలను ఎదుర్కొనలేదు. అంతగా పాత్రలో పరకాయ ప్రవేశం చేసి విక్రమ్ వీరధీర సూరన్ అంటే కమర్షియల్ హిట్ సాధించిన చిత్రం తర్వాత చిన్న బ్రేక్ తీసుకొని తాజాగా తన 63వ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఆనంద్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు వీరి కాంబినేషన్లో ఇంతకుముందు ఇరుముగన్ చిత్రం రూపొంది మంచి విజయాన్ని సాధించింది. కాగా తాజాగా విక్రమ్ తన కొత్త చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. యువ దర్శకుడు సుభాష్ కె రాజ్ చెప్పిన కథ విక్రమ్ కు బాగా నచ్చినట్లు సమాచారం. దర్శకుడు కథానాయకుడు ప్రదీప్ రంగనాథం శిష్యుడైన సుభాష్ కే రాజ్ ఇటీవల నటుడు అర్జున్ , అభిరామి ,ప్రీతి ముకుందన్ ప్రధాన పాత్రలు పోషించిన బ్లాస్ట్ చిత్రంతో దర్శకుడిగా పరిచయమ్యారు. ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం సంచల విజయాన్ని సాధించింది. నిజానికి బ్లాస్ట్ చిత్రంలో అర్జున్ పాత్రను విక్రమ్ పోషిఝచాల్సిఉంది. అనివార్య కారణాలవల్ల ఆయన నటించలేదు.దీంతో దర్శకుడు సుభాష్ కె రాజ్ తన తాజా చిత్రంపై దష్టి పెట్టినట్లు తెలిసింది. ఇందులో విక్రమ్‌ను నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం.. ఈ క్రేజీ కాంబినేషన్లో రూపొందనున్న చిత్రానికి సంబంధించిన చర్చలు ప్రస్తుతం జరుగుతున్నట్లు తెలిసింది. కాగా దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉందని సమాచారం. -
విజయ్.. ఒక దెబ్బకు రెండు పిట్టలు!
నీట్ వివాదం దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తున్న వేళ.. తమిళగ వెట్రి కళగం అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ మరోసారి తన వైఖరిని స్పష్టం చేశారు. నీట్ పరీక్షను పూర్తిగా రద్దు చేయాలన్నదే తమ పార్టీ విధానమని ప్రకటించారు. కేవలం పరీక్ష నిర్వహణలో లోపాలు, పేపర్ లీక్‌లు వంటి అంశాలను సరిదిద్దితే సరిపోదని.. జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష విధానాన్నే పునఃపరిశీలించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారాయన. అయితే ఈసారి ఆయన టార్గెట్ కేవలం నీట్ మాత్రమే కాదని అనిపిస్తోంది.ఢిల్లీలో నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్న సమయంలో టీవీకే కీలక ప్రకటన చేసింది. వైద్య విద్య ప్రవేశాలపై నిర్ణయాలు తీసుకునే పూర్తి అధికారం రాష్ట్రాలకు ఇవ్వాలని డిమాండ్ చేసింది. ప్రస్తుతం విద్య రాజ్యాంగంలోని ఉమ్మడి జాబితా (Concurrent List)లో ఉంది. అంటే కేంద్రం, రాష్ట్రాలు రెండూ దీనిపై చట్టాలు చేయవచ్చు. అయితే విద్యను రాష్ట్ర జాబితా (State List)లోకి మార్చాలని టీవీకే కోరుతోంది.ఒకవేళ దీనికి రాజ్యాంగపరమైన అడ్డంకులు ఉంటే.. మధ్యంతర పరిష్కారంగా రాష్ట్రాలకు మరిన్ని అధికారాలు కల్పించే ప్రత్యేక విధానం తీసుకురావాలని సూచించింది. TVK అభిప్రాయం ప్రకారం.. స్థానిక పరిస్థితులు, విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా వైద్య విద్య విధానాలను రాష్ట్రాలే రూపొందించుకునే అవకాశం ఉండాలి.కేంద్రంపై విమర్శ.. డీఎంకేపై కౌంటర్విజయ్ తాజా ప్రకటనలో రాజకీయ వ్యూహం స్పష్టంగా కనిపిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నీట్ విధానాన్ని వ్యతిరేకించడం ద్వారా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేసిన టీవీకే.. అదే సమయంలో తమిళనాడులో ప్రధాన ప్రత్యర్థి అయిన డీఎంకేపైనా ప్రశ్నలు సంధించింది.2021 అసెంబ్లీ ఎన్నికల సమయంలో డీఎంకే అధికారంలోకి వస్తే నీట్‌ను రద్దు చేస్తామని(చేయిస్తామని) హామీ ఇచ్చింది. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీ అమలు కాలేదని టీవీకే విమర్శించింది.“మేమే నీట్‌ను రద్దు చేస్తామని చెప్పి ప్రజలను మోసం చేసే రాజకీయాలు చేయం” అంటూ పరోక్షంగా డీఎంకేను టార్గెట్ చేసింది టీవీకే. ఒకే అంశంతో అటు కేంద్ర విధానాన్ని వ్యతిరేకిస్తూ.. ఇటు డీఎంకే హామీలను ప్రశ్నించే వ్యూహాన్ని విజయ్ అనుసరిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.పాత వివాదమే.. కొత్త రాజకీయ రంగుతమిళనాడులో ఈ అంశం కొత్తది కాదు. వైద్య విద్య ప్రవేశాల్లో జాతీయ స్థాయి పరీక్ష అవసరమా? లేదంటే రాష్ట్రాలకు అధికారం ఇవ్వాలా? అనే చర్చ చాలాకాలంగా కొనసాగుతోంది. నీట్‌ను వ్యతిరేకించేవాళ్లు.. గ్రామీణ ప్రాంతాలు, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఈ విధానం ప్రతికూలంగా మారుతోందని వాదిస్తున్నారు. కోచింగ్ వ్యవస్థకు ప్రాధాన్యం పెరిగి, సామాన్య కుటుంబాల విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెబుతున్నారు. మరోవైపు అనుకూల వర్గాలు మాత్రం దేశవ్యాప్తంగా వైద్య విద్య ప్రవేశాల్లో ఒకే ప్రమాణం ఉండేందుకు జాతీయ స్థాయి పరీక్ష అవసరమని వాదిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజా పేపర్ లీకేజీ వివాదం.. తమిళనాడు చర్చను మళ్లీ తెరపైకి తెచ్చింది.విజయ్‌కు రాజకీయంగా కీలకమా?సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన విజయ్.. టీవీకేను బలమైన రాజకీయ శక్తిగా నిలబెట్టే ప్రయత్నంలో ఉన్నారు. యువత, విద్యార్థులు, రాష్ట్ర హక్కులు వంటి అంశాలను ప్రధాన అజెండాగా తీసుకుంటున్నారు. తమిళనాడులో విద్య, సామాజిక న్యాయం అంశాలు ఎప్పటి నుంచో కీలక రాజకీయ అంశాలు. ఈ నేపథ్యంలో నీట్ వ్యతిరేకతను బలంగా వినిపించడం ద్వారా విద్యార్థుల్లో, యువ ఓటర్లలో తన పార్టీకి స్థానం పెంచుకునే ప్రయత్నంగా ఈ అడుగును చూస్తున్నారు.NEET రగడ.. పొలిటికల్ గేమ్‌గా మారుతుందా?ఇప్పటివరకు నీట్ వివాదం ప్రధానంగా పరీక్షా విధానం, లీక్‌లు, సంస్కరణల చుట్టూ తిరిగింది. కానీ తమిళనాడులో మాత్రం ఇది కేంద్ర-రాష్ట్ర సంబంధాలు, రాజకీయ ఆధిపత్య పోరుగా మారే అవకాశం కనిపిస్తోంది. విజయ్ తాజా వైఖరి చూస్తే.. నీట్ అంశాన్ని కేవలం విద్యా సమస్యగా కాకుండా రాజకీయ చర్చగా మార్చే ప్రయత్నం కనిపిస్తోందని విశ్లేషకులు అంటున్నారు. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా.. NEET వ్యతిరేకతతో కేంద్రంపై విమర్శలు, డీఎంకేపై ఎదురుదాడి.. రెండింటినీ ఒకేసారి సాధించే వ్యూహంతో విజయ్ ముందుకు సాగుతున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. -
ఆలయ ఆవరణలో త్రిష-విజయ్‌ల ఫ్లెక్సీ.. కేసు నమోదు
తమిళనాడులో ఫ్లెక్సీ కలకలం రేగింది. సేలం జిల్లా ఆత్తూర్‌లో ఏర్పాటు చేసిన ఓ ఆలయ ఉత్సవ బ్యానర్ వివాదానికి దారితీసింది. ఆ బ్యానర్లో ప్రముఖ నటి త్రిషను అమ్మవారి రూపంలో చిత్రించడం, ఆ పైన తమిళనాడు ముఖ్యమంత్రి, విజయ్ ఫొటోను కూడా ‘సిగ్నేచర్ ఫోజు’తో ఉంచడంపై స్థానికంగా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.పెరియా మారియమ్మన్ ఆలయ ఆడి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ బ్యానర్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ఫ్లెక్సీలో త్రిష అమ్మవారి గెటప్‌లో కూర్చున్నట్లు ఉంది. ఆ పైన విజయ్ అసెంబ్లీలో చేసిన సిగ్నేచర్ ఫోజుతో ఉన్నారు. ఆ పక్కనే ఇద్దరు అభిమానుల ఫొటోలు చెరో వైపు ఉన్నాయి. కొందరు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. సినీ నటిని దేవతా రూపంలో చూపించడం సరైంది కాదన్నారు. వివాద నేపథ్యంలో రాత్రికి రాత్రే బ్యానర్‌ను అక్కడి నుంచి తొలగించారు. ఆ ప్లేస్‌లో మరొకటి ఏర్పాటు చేశారు. అయితే అప్పటికే తమ దాకా విషయం రావడంతో పోలీసులు కూడా రంగంలోకి దిగి చర్యలు చేపట్టారు. అనుమతి లేకుండా బ్యానర్ ఏర్పాటు చేయడం, అందునా అభ్యంతరకరంగా ఉండడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. బ్యానర్ ఏర్పాటు చేసిన దుకాణ యజమాని గోకుల్, దానిని అమర్చిన చంద్రుపై చర్యలకు సిద్ధమయ్యారు. వాళ్లిద్దరూ పరారీలో ఉన్నట్లు సమాచారం. విజయ్-త్రిష ఫొటోలపై చర్చఇటీవల తమిళ సినీ, రాజకీయ వర్గాల్లో విజయ్, నటి త్రిష పేర్లు తరచూ చర్చల్లో నిలుస్తున్నాయి. ఎన్నికల ముందే వీళ్ల బంధం బయటపడడం, ఎన్నికల విజయంపై విజయ్‌కు త్రిష అభినందనలు తెలియజేయడం, ప్రమాణస్వీకారం నాడు చేసిన హడావిడి.. పుట్టినరోజు వేడుక జరపడం ఇలా ఉండగానే ఈ నేపథ్యంలో ఆలయ ఉత్సవ బ్యానర్లో ఇద్దరి ఫొటోలు కలిసి కనిపించడం మరోసారి ఆసక్తిని రేపింది. అదే సమయంలో ఆలయ ఉత్సవాల్లో సినీ ప్రముఖుల ఫొటోలను విచ్చలవిడగా వాడడం, అభిమానుల బ్యానర్ సంస్కృతిపై ఈ ఘటన మరోసారి చర్చకు దారితీసింది. -
జిమ్ ట్రైనర్‌పై అత్యాచారం.. నగ్న వీడియోలు, ఫొటోలు..!
తమిళనాడు: వేలూరు సత్‌వచ్చారిలో సుమారు 35 సంవత్సరాల వయస్సు గల యువతి జిమ్ శిక్షణ కేంద్రం నడుపుతున్నారు. ఇక్కడ సత్వచ్చారి సమీపంలోని అనైథెరిస్సా వీధికి చెందిన ఎబ్సిబా అనే మహిళ శిక్షణకు చేరింది. ఈమె వేలూరులోని ప్రవేటు ఆసుపత్రిలో పారిశుధ్య కార్మికురాలిగా పనిచేస్తుంది. ఆ సమయంలో జిమ్ యజమాని వద్ద ఎబ్సిబా బాగా పరిచయమయ్యారు. ఈ నేపద్యంలో ఎబ్సిబా తన కుమారుడికి జన్మదినోత్సవ వేడుకలు ఉన్నాయని మీరు తప్పకుండా తమ ఇంటికి రావాలని జిమ్ యజమానిని పిలిచింది. దీంతో గత సంవత్సరం జూన్ 20వ తేదిని జిమ్ యజమాని ఎబ్సిబా ఇంటికి వెల్లింది. ఆ సమయంలో ఎబ్సిబా ఆమె భర్త మణివణ్ణన్ కలిసి జిమ్ యజమానికి శీతల పానీయంలో మత్తు మందు కలిపి ఇచ్చారు. వీటిని తాగిన జిమ్ యజమాని స్పృహ తప్పి పడి పోయారు. ఆ సమయంలో మణివణ్ణన్ ఆ యువతిని అత్యాచారం చేసినట్లు తెలుస్తుంది. వీటిని ఎబ్సిబా వీడియో తీసింది. అనంతరం యువతిని నగ్నంగా చేసి వీడియో, ఫొటోలు తీశారు. వీటిని సోషియల్ మీడియాలో వదిలి పెడుతామని బెదిరించి జిమ్ యజమాని వద్ద గత ఆరు నెలలుగా రూ. 4 లక్షల 50 వేలు ఇంటి వస్తువులు, బంగారం తదితర వాటిని కాజేసినట్లు తెలుస్తుంది. దీంతో జిమ్ యజమాని వీటిపై వేలూరులోని మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు ఎబ్సిబా, ఆమె భర్త మణివణ్ణన్ను అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు. -
నంబర్-1గా తమిళనాడు
తమిళ భాషా, సంస్కృతి పరిరక్షణకు, తమిళుల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు టీవీకే ప్రభుత్వం చిత్తశుద్ధితో కట్టుబడి ఉందని సీఎం విజయ్ స్పష్టం చేశారు. తమిళనాడు దినోత్సవం సందర్భంగా ప్రజలతో కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో మరింత ముందుకు నడిపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. సాక్షి, చెన్నై: తమిళనాడు దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు సీఎం విజయ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ చారిత్రాత్మకమైన రోజున, తమిళనాడును భారతదేశంలోనే అన్ని రంగాలలో అగ్రగామి (నంబర్ వన్) రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు సీఎం విజయ్ తన సోషల్ మీడియా వేదికగా ఒక సుదీర్ఘ సందేశాన్ని పంచుకున్నారు. తమిళుల ప్రాచీనత, ఘనమైన చరిత్ర, సంస్కృతి , భాషా చైతన్యానికి గౌరవసూచకంగా రాష్ట్రానికి తమిళనాడు అని నామకరణం చేస్తూ నాటి శాసనసభలో తీర్మానం ఆమోదించిన చారిత్రాత్మక రోజు ఇదే అని వ్యాఖ్యలు చేశారు. ఈ పవిత్రమైన ’తమిళనాడు దినోత్సవం’ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమిళ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు అని పేర్కొన్నారు. రెండు ముఖ్యమైన రోజులు మద్రాసు రాష్ట్రం ఏర్పడిన నవంబర్ 1వ తేదీని, అలాగే పెరరిగ్నర్ అన్నాదురై నేతృత్వంలోని శాసనసభలో రాష్ట్రానికి తమిళనాడు అని పేరు మార్చాలనే చారిత్రాత్మక తీర్మానాన్ని ప్రతిపాదించి ఆమోదించిన జూలై 18వ తేదీ అంటూ ఈ రెండు రోజులను తమ ప్రభుత్వం అధికారికంగా జరుపుకోబోతోందని ప్రకటించడానికి సంతోషిస్తున్నానని సీఎం తెలిపారు. ‘సమానత్వం, సామాజిక న్యాయం వర్ధిల్లేలా.. విద్య, ఆధునిక సాంకేతికత, నైపుణ్యం కలిగిన మానవ వనరుల అభివృద్ధిలో రాణిస్తూ, శాస్త్రీయ భాషా సంపదకు పుట్టినిల్లుగా ఉన్న తమిళనాడును భారతదేశంలోనే అత్యున్నత రాష్ట్రంగా నిలబెట్టాలని అందరం ప్రతిజ్ఞ చేద్దాం అని పిలుపునిచ్చారు. చివరగా, తమిళ భాషా మాధుర్యం, తమిళుల ఉన్నత సంస్కృతి , మానవతా సంప్రదాయం రాబోయే తరాలకు సగర్వంగా వరి్ధల్లాలని ఆకాంక్షిస్తూ, తమిళనాడు రాష్ట్ర ఏర్పాటు కోసం , తమిళ గుర్తింపు కోసం కఠోర శ్రమ చేసిన అమరవీరులను, త్యాగధనులను ఈ సందర్భంగా స్మరించుకుంటూ సీఎం విజయ్ వారికి ఘన నివాళులరి్పంచారు. కాగా, మాజీ సీఎం ఎంకే స్టాలిన్ సైతం తమిళనాడు దినోత్సవాన్ని పురస్కరించుకుని లండన్ నుంచి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలుతెలియజేస్తూ, తన సందేశాన్ని పంపించారు. -
23 మంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన డ్రైవర్
చెన్నై నుంచి మదురై వెళ్తున్న ఓ ప్రైవేట్ స్లీపర్ బస్సుకు శనివారం తెల్లవారుజామున పెరంబలూరు సమీపంలోని జాతీయ రహదారిపై మంటలు అంటుకున్నాయి. మంటలు బస్సును పూర్తిగా చుట్టుముట్టడానికి కొన్ని నిమిషాల ముందే డ్రైవర్ ఇబ్రహీం (63) అప్రమత్తమై బస్సును ఆపాడు. దీంతో అందులో ఉన్న 23 మంది ప్రయాణికులు బయటకు రావడంతో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదు.ఆ ప్రైవేట్ బస్సు అర్ధరాత్రి సమయంలో చెన్నై నుంచి మదురై బయల్దేరింది. డ్రైవర్ ఇబ్రహీం మదురై జిల్లా మేలూరుకు చెందిన వ్యక్తి. చెన్నై-తిరుచ్చి జాతీయ రహదారిపై బస్సు ప్రయాణిస్తోంది. శనివారం ఉదయం 5.30 గంటల సమయంలో పెరంబలూరు జిల్లా మంగళమెడు సమీపంలోని అయన్ పెరైయూర్ గ్రామం వద్ద వెళ్తుండగా బస్సు ముందు భాగం నుంచి ఒక్కసారిగా పొగ రావడం మొదలైంది.నిద్రిస్తున్న ప్రయాణికులను లేపిన డ్రైవర్డ్రైవర్ ఇబ్రహీం వెంటనే పొగను గమనించి బస్సును రహదారి పక్కన ఆపాడు. ప్రమాదాన్ని గుర్తించి... నిద్రలో ఉన్న ప్రయాణికులను లేపి వెంటనే కిందికి దిగాలని చెప్పాడు. ఒక్కసారిగా ఉలిక్కిపడిన ప్రయాణికులు చేతికి దొరికిన సామాన్లు తీసుకుని బస్సు నుంచి బయటకు పరుగులు తీశారు.ప్రయాణికులు దిగుతున్న సమయంలోనే ముందు భాగం నుంచి మంటలు వేగంగా వ్యాపించాయి. కొద్ది సేపటికే బస్సు మొత్తం భారీ మంటల్లో చిక్కుకుంది. సమాచారం అందుకున్న మంగళమెడు పోలీసులు, జాతీయ రహదారి గస్తీ సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. వెప్పూర్, పెరంబలూరు అగ్నిమాపక కేంద్రాలకు సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బంది చేరుకునే సమయానికి బస్సు పూర్తిగా మంటల్లో చిక్కుకుంది.దాదాపు 15 మంది అగ్నిమాపక సిబ్బంది మంటలు మరింత వ్యాపించకుండా చేసి, ఉదయం 7 గంటల కల్లా అదుపులోకి తీసుకొచ్చారు. బస్సు పూర్తిగా దగ్ధమై ఇనుప చట్రం మాత్రమే మిగిలింది. ఆ ప్రాంతం మీదుగా వాహనాలు వెళ్లలేకపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పోలీసులు ఎదురువైపు లేన్‌లోకి వాహనాలను మళ్లించి అడ్డంకిని తొలగించారు. ఉదయం 7 గంటల సమయంలో ఎర్త్మూవర్ల సాయంతో బస్సును జాతీయ రహదారి నుంచి తొలగించారు.ప్రయాణికులకు ప్రత్యామ్నాయ రవాణా ఏర్పాటు చేయడంలో అధికారులు సాయం చేశారు. ప్రయాణికులు తమ సామాన్లు తీసుకుని తమ గమ్యస్థానాలకు బయల్దేరారు. జాతీయ రహదారిపై ప్రైవేట్ బస్సును ఒక్కసారిగా మంటలు చుట్టుముట్టడంతో ఆ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. మంగళమెడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అన్నా.. పురుగుల అన్నం పెడ్తున్నారు!
‘‘అన్నా.. హాస్టల్లో భోజనం సరిగ్గా ఉండదు.. అన్నంలో పురుగులు వస్తున్నాయ్’’ అంటూ పిల్లలు చెప్పిన మాటలకు తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ చలించిపోయారు. చెన్నైలోని సైదాపేటలో ఉన్న ఎంసీ రాజా సోషల్ జస్టిస్ స్టూడెంట్స్ హాస్టల్‌ను శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన.. విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా హాస్టల్‌కు చేరుకున్న విజయ్.. అక్కడి వసతులు, నిర్వహణ పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమకు ఎదురవుతున్న ఇబ్బందులను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఆహార నాణ్యత, పరిశుభ్రత లోపాలు, నీటి సమస్యలు, సిబ్బంది కొరత వంటి అంశాలను వివరించారు.ఫిర్యాదు చేస్తే కొద్దిరోజులే.. హాస్టల్లో అందించే భోజనం నాణ్యతపై విద్యార్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కొన్ని సందర్భాల్లో ఆహారంలో పురుగులు కనిపిస్తున్నాయని, భోజనం విషయంలో ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా శాశ్వత పరిష్కారం లభించడం లేదని వారు సీఎంకు తెలిపారు. గతంలో విద్యార్థుల ఆందోళనల తర్వాత కొంతకాలం ఆహారం నాణ్యత మెరుగుపడిందని, కానీ కొద్దిరోజులకే మళ్లీ పాత పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. వంటగదిలో పరిశుభ్రత పాటించడం లేదని, సిబ్బంది గ్లౌజులు, క్యాప్స్ వంటి రక్షణ పరికరాలు ఉపయోగించడం లేదని చెప్పారు.హాస్టల్స్ లో దయనీయ స్థితి..సీఎం విజయ్ వద్ద తమ గోడు వినిపించిన విద్యార్థులు అభివృద్ధిలో టాప్ 5 స్థానాల్లో ఉన్న తమిళనాడులో వాస్తవ పరిస్థితులు ఇవి..#CMVijay pic.twitter.com/JTgr31HMGW— UttarandhraNow (@UttarandhraNow) July 17, 2026వసతులపై విద్యార్థుల ఫిర్యాదులుహాస్టల్లో నీటి సరఫరా సమస్యలు, మరుగుదొడ్ల నిర్వహణ లోపాలు, సిబ్బంది కొరత, భద్రతా లోపాలపై కూడా విద్యార్థులు ముఖ్యమంత్రికి వివరించారు. పూర్తిస్థాయిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయలేదని, హాస్టల్లో భద్రతపై ఆందోళన ఉందని తెలిపారు. అలాగే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు అనుకూల వాతావరణం కల్పించాలని కోరారు.రాత్రి ఆలస్యంగా కోచింగ్ తరగతులు లేదా పనుల నుంచి వచ్చే విద్యార్థులకు గేట్లు మూసివేయడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని కొందరు విద్యార్థులు చెప్పారు. స్పోర్ట్స్ సదుపాయాలు, ఆధునిక జిమ్, లైబ్రరీలో మరిన్ని పుస్తకాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.సీఎం స్పందన.. అధికారులకు ఆదేశాలువిద్యార్థుల సమస్యలను ఓపికగా విన్న సీఎం విజయ్.. వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా భోజనం నాణ్యతపై వచ్చిన ఫిర్యాదులను తీవ్రంగా పరిగణించాలని, విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందేలా చూడాలని సూచించారు. హాస్టల్లోని వంటగది, మరుగుదొడ్లు, ఇతర సదుపాయాలను స్వయంగా పరిశీలించిన విజయ్.. సమస్యల పరిష్కారంపై అధికారులతో చర్చించారు. తదుపరి తనిఖీ నాటికి అన్ని లోపాలు సరిచేయాలని ఆదేశించినట్లు అధికారులు తెలిపారు.రూ.44.50 కోట్లతో నిర్మించిన హైటెక్ హాస్టల్సైదాపేటలోని ఈ 10 అంతస్తుల హాస్టల్‌ను గత డీఎంకే ప్రభుత్వ హయాంలో సుమారు రూ.44.50 కోట్లతో నిర్మించారు. ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలనే లక్ష్యంతో ఈ భవనాన్ని నిర్మించారు. లిఫ్ట్‌లు సహా పలు ఆధునిక సదుపాయాలు ఉన్నప్పటికీ.. నిర్వహణ లోపాలపై విద్యార్థుల నుంచి వరుసగా ఫిర్యాదులు రావడంతో సీఎం స్వయంగా తనిఖీ చేపట్టినట్లు సమాచారం.వరుసగా రెండో ఆకస్మిక తనిఖీముఖ్యమంత్రి విజయ్ ఇటీవల చెన్నైలోని ఎగ్మోర్ చిన్నారుల ఆసుపత్రిని కూడా ఆకస్మికంగా తనిఖీ చేశారు. తాజాగా విద్యార్థుల హాస్టల్‌ను సందర్శించడం ద్వారా ప్రభుత్వ వ్యవస్థలోని లోపాలను నేరుగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. “సమస్యలు చెప్పేందుకు ప్రజలు సీఎం వద్దకు వెళ్లడం కాదు.. సీఎం స్వయంగా ప్రజల దగ్గరకు వెళ్లడం” అనే విధంగా ఆయన తనిఖీలపై చర్చ జరుగుతోంది. -
‘ప్రాజెక్ట్ మేఘాలయ’ కలకలం.. విజయ్ ప్రభుత్వమే టార్గెట్?
చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న ‘ప్రాజెక్ట్ మేఘాలయ’ వ్యవహారం రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతోంది. అధికారంలో ఉన్న తమిళగ వెట్రి కళగం (టీవీకే) ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు పథకం రచించారనే ఆరోపణలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. అధికార పార్టీ ఎమ్మెల్యేకు భారీ మొత్తంలో డబ్బు ఆఫర్ చేసి పార్టీ విప్‌కు వ్యతిరేకంగా ఓటు వేయించే ప్రయత్నం జరిగిందని వచ్చిన ఆరోపణలతో ఈ వ్యవహారం ప్రాధాన్యం సంతరించుకుంది. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.ఈ వ్యవహారానికి కేంద్రబిందువుగా నిలిచింది టీవీకే ఎమ్మెల్యే ఎన్. ఎలైయరాజా చేసిన ఫిర్యాదు. తనను కొందరు వ్యక్తులు సంప్రదించి, అసెంబ్లీలో పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని కోరారని ఆయన ఆరోపించారు. అందుకు ప్రతిఫలంగా రూ.35 కోట్ల వరకు నగదు ఇస్తామని, భవిష్యత్తులో రాజకీయంగా కూడా పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎమ్మెల్యే ఆరోపణల ప్రకారం, ఈ మొత్తం ప్రణాళికను ‘ప్రాజెక్ట్ మేఘాలయ’ అనే కోడ్ పేరుతో నిర్వహించినట్లు తెలిపారు. అయితే ఈ పేరును ఎందుకు ఉపయోగించారు? దీనికి మేఘాలయ రాష్ట్రంతో ఏమైనా సంబంధం ఉందా? లేక ఇది కేవలం రహస్య కోడ్ నామమా? అనే విషయంపై ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి వివరణ వెలువడలేదు. దర్యాప్తు అధికారులు కూడా ఈ అంశంపై వ్యాఖ్యానించలేదు.ఎలైయరాజా ఫిర్యాదు అనంతరం తమిళనాడు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఫిర్యాదులో పేర్కొన్న వ్యక్తులను గుర్తించే పనితో పాటు, ఫోన్ కాల్ రికార్డులు, డిజిటల్ కమ్యూనికేషన్, ఆర్థిక లావాదేవీలు తదితర అంశాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ కేసులో యూట్యూబర్ తిరునావుక్కరసు, ఐపీడీఎస్ (IPDS) అభిప్రాయ సర్వే సంస్థతో అనుబంధం ఉన్న వ్యక్తి పేరు కూడా ప్రస్తావనకు రావడంతో దర్యాప్తు మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. కొందరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి.ఈ పరిణామాలపై అధికార టీవీకే పార్టీ తీవ్రంగా స్పందించింది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి, ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసి ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం జరిగిందని ఆరోపించింది. ప్రజాస్వామ్య వ్యవస్థను బలహీనపరిచే చర్యలను సహించబోమని పార్టీ నాయకులు పేర్కొన్నారు. కుట్రలో పాల్గొన్న వారందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.మాకేం సంబంధం?మరోవైపు ప్రతిపక్ష పార్టీలు ఈ ఆరోపణలను పూర్తిగా ఖండించాయి. ఈ వ్యవహారంతో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశాయి. ప్రభుత్వం రాజకీయంగా లబ్ధి పొందేందుకు నిరాధార ఆరోపణలు చేస్తోందని విమర్శించాయి. పూర్తి స్థాయి, నిష్పాక్షిక దర్యాప్తు జరిపి వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశాయి. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ఇటీవలి కాలంలో దేశంలోని పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాలను అస్థిరపరిచే ప్రయత్నాలపై ఆరోపణలు రావడంతో, తమిళనాడులో వెలుగులోకి వచ్చిన ఈ కేసు కూడా జాతీయ స్థాయిలో చర్చకు దారితీసింది. అయితే ఈ కేసులోని ఆరోపణలు నిజమా? లేదా రాజకీయ ఆరోపణలేనా? అన్నది దర్యాప్తు పూర్తయిన తర్వాతే స్పష్టమవుతుందని వారు అభిప్రాయపడుతున్నారు.ప్రస్తుతం ఈ వ్యవహారం దర్యాప్తు దశలో ఉంది. ఎమ్మెల్యే చేసిన ఆరోపణలు, రూ.35 కోట్ల లంచం ప్రతిపాదన, అలాగే ‘ప్రాజెక్ట్ మేఘాలయ’ పేరుతో ప్రభుత్వం అస్థిరపరిచే కుట్ర జరిగిందనే అంశాలు ఇంకా అధికారికంగా నిరూపితం కాలేదు. దర్యాప్తు సంస్థలు సేకరించే ఆధారాలు, విచారణలో వెలుగులోకి వచ్చే వివరాలు, తదుపరి న్యాయపరమైన ప్రక్రియల ఆధారంగానే ఈ కేసు వాస్తవ స్వరూపం బయటపడనుంది.జర్నలిస్టు విజయన్ను విచారించిన పోలీసులుదర్యాప్తులో భాగంగా ఓ చానల్‌కు చెందిన సీనియర్ జర్నలిస్టు విజయ్న్ను జూలై 15, 16 తేదీల్లో చెన్నై పోలీసులు విచారించారు. ప్రధాన నిందితుడు తిరునావుక్కరసుతో విజయన్‌కు ఫోన్ సందేశాలు, ఇతర కమ్యూనికేషన్ జరిగినట్లు ప్రాథమిక ఆధారాలు లభించాయని పోలీసులు తెలిపారు. విచారణ అనంతరం ఆయన మొబైల్ ఫోన్‌ను ఫోరెన్సిక్ పరీక్షల కోసం స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే జర్నలిస్టుపై నేరారోపణలు చేశామని పోలీసులు ప్రకటించలేదు. ఆయనతో జరిగిన సంప్రదింపుల స్వభావంపై మాత్రమే విచారణ సాగుతోందని తెలిపారు. -
సెకండ్ చాన్స్ ఉండదు.. మంత్రులకూ విజయ్ వార్నింగ్
తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ అవినీతిపై తన మంత్రులకు, ప్రభుత్వ యంత్రాంగానికి గట్టి హెచ్చరిక జారీ చేశారు. తన ప్రభుత్వంలో అవినీతి, లంచాలు, అధికార దుర్వినియోగానికి పాల్పడిన వారికి ఎలాంటి రెండో అవకాశం (Second Chance) ఉండదని గురువారం ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. ప్రజలకు పారదర్శక, జవాబుదారీతనంతో కూడిన పాలన అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొంటూ.. అవినీతిపై జీరో టాలరెన్స్ విధానాన్ని మరోసారి ప్రకటించారు.ఇటీవల అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న తన పార్టీ చెంగల్పట్టు ఈస్ట్ జిల్లా సంయుక్త కార్యదర్శి వీరసామిని విజయ్ పార్టీ నుంచి బహిష్కరించడం సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో లంచం తీసుకుంటున్నట్లు ఆరోపణలు వచ్చిన వీడియో వైరల్ కావడంతో.. రాజకీయ విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు అన్ని పదవుల నుంచి ఆయనను తొలగించారు. అనంతరం పోలీసులు కూడా ఆయనను అరెస్ట్ చేశారు. అయితే వీరసామి మాత్రం ఇదంతా ప్రతిపక్షాల కుట్ర అని ఆరోపిస్తున్నాడు. ఈ వ్యవహారంపై ప్రస్తుతం పోలీస్ విచారణ జరుగుతోంది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచే పారదర్శక పాలనకు ప్రాధాన్యం ఇస్తున్న విజయ్.. అవినీతిపై రాజీపడబోమనే సంకేతాన్ని వరుస చర్యల ద్వారా ఇస్తున్నారు. ప్రజల సహకారంతోనే అవినీతిని పూర్తిగా నిర్మూలించగలమని ఆయన పదేపదే చెబుతున్నారు. ఈ క్రమంలో.. మొన్న కరూర్‌లో ఇటీవల నిర్వహించిన ప్రజాసభలో మాట్లాడుతూ.. తన ప్రభుత్వంలో అవినీతి, లంచాలు, అధికార దుర్వినియోగానికి ఏమాత్రం తావుండబోదని తేల్చిచెప్పారు."ఎవరైనా లంచం అడిగితే నేరుగా 'ఇవ్వను' అని చెప్పండి. మీ వెంటే నేను ఉంటాను. అయినా ఒత్తిడి చేస్తే.. ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్న విజయ్ మా వెన్నంటి ఉన్నారని ధైర్యంగా చెప్పండి" అంటూ ప్రజలకు భరోసా ఇచ్చారు. అవినీతి, లంచాలు, అధికార దుర్వినియోగానికి పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని ఆ సందర్భంలో స్పష్టం చేశారాయన.ఇక అవినీతి నిర్మూలన కోసం విజయ్ ప్రభుత్వం ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులు లంచం డిమాండ్ చేస్తే వెంటనే ఫిర్యాదు చేసేందుకు 94981 80936 నంబర్‌తో ప్రత్యేక వాట్సాప్ హెల్ప్‌లైన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనితో పాటు డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ (DVAC) ఫిర్యాదు వ్యవస్థను మరింత బలోపేతం చేసింది.అంతేకాదు.. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, బోర్డులు, కార్పొరేషన్లలో "లంచం ఇవ్వడం, తీసుకోవడం రెండూ నేరాలే" అనే హెచ్చరిక బోర్డులు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అదే సందేశాన్ని అన్ని ప్రభుత్వ వెబ్సైట్లలోనూ ప్రదర్శించాలని, నేరుగా DVAC ఫిర్యాదు లింక్‌ను అందుబాటులో ఉంచాలని సూచించింది. ఈ చర్యల అమలును పర్యవేక్షించేందుకు ప్రత్యేక మానిటరింగ్ బృందాలను కూడా ఏర్పాటు చేసింది. తమిళనాడులో విజయ్ సర్కార్ చేపడుతున్న అవినీతి వ్యతిరేక చర్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. -
కుండంకుళం రియాక్టర్లో డేటా లీక్ కలకలం
భారత్‌లోని అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రాల్లో ఒకటైన కుండంకుళం న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌కు సంబంధించిన డేటా లీక్ వ్యవహారం కలకలం రేపుతోంది. హ్యాకర్లు ‘వరల్డ్ లీక్స్’ డార్క్‌వెబ్‌లో వేల సంఖ్యలో పత్రాలను విడుదల చేసినట్లు వెలుగులోకి రావడంతో సైబర్ భద్రతపై మరోసారి ఆందోళనలు మొదలయ్యాయి. అయితే ఈ ఘటన వల్ల ఏం జరగలేదని న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NPCIL) చెబుతోంది. కుండంకుళం ప్రాజెక్టుకు(KKNPP) సంబంధించిన దాదాపు 19 వేల ఫైల్స్ (సుమారు 14.3 జీబీ డేటా) డార్క్‌వెబ్‌లో ప్రత్యక్షమైనట్లు సమాచారం. వీటిలో ఇంజినీరింగ్ డాక్యుమెంట్లు, కొన్ని డిజైన్లు, సరఫరాదారుల వివరాలు, తనిఖీ నివేదికలు, పరికరాల సమాచారానికి సంబంధించిన పత్రాలు ఉన్నట్లు నివేదికలు పేర్కొన్నాయి. ఈ డేటా అంతా నేరుగా కుండంకుళం అణు కేంద్రం నుంచి దొంగిలించిందా? లేదంటే దానికి సంబంధించిన ఓ కాంట్రాక్టర్ వ్యవస్థ నుంచి బయటకు వచ్చిందా? అన్నదానిపై దర్యాప్తు కొనసాగుతోంది.థర్డ్ పార్టీ సర్వర్ నుంచే లీక్?ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఈ సైబర్ దాడి కుండంకుళం ప్లాంట్ ప్రధాన వ్యవస్థలపై కాకుండా.. ఓ థర్డ్ పార్టీ సర్వర్‌పై జరిగినట్లు తెలుస్తోంది. కుండంకుళం యూనిట్లు 3, 4 నిర్మాణ పనుల్లో భాగస్వామిగా ఉన్న రిలయన్స్ గ్రూప్ సంస్థకు చెందిన డేటా.. ఓ థర్డ్ పార్టీ డేటా సెంటర్ సర్వీస్ ప్రొవైడర్ యొట్టా డేటా సర్వీసెస్ (Yotta Data Services) సర్వర్‌లో ఉన్నట్లు సమాచారం. ఆ సర్వర్‌లో అనుమానాస్పద కార్యకలాపాలను గుర్తించినట్లు యొట్టా తెలిపింది. ఇటు రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా తమ డేటాలో “పాక్షిక ఉల్లంఘన (partial breach)” జరిగినట్లు అంగీకరించి.. ప్రభుత్వానికి సమాచారం ఇచ్చినట్లు తెలిపింది. ([Reuters][2])అణు వ్యవస్థలు భద్రంగానే!డేటా లీక్ వార్తలతో అణు భద్రతపై ఆందోళనలు వ్యక్తమైనప్పటికీ.. NPCIL కీలక వివరణ ఇచ్చింది. లీక్ అయినట్లు చెబుతున్న సమాచారం అణు భద్రత (nuclear safety), అణు రక్షణ (nuclear security) వ్యవస్థలకు సంబంధించినది కాదని స్పష్టం చేసింది. సాధారణ మౌలిక సదుపాయాలు, నిర్మాణ పనులకు సంబంధించిన సమాచారమే బయటకు వచ్చిందని పేర్కొంది. అంటే రియాక్టర్ నియంత్రణ వ్యవస్థలు, అణు ఇంధన నిర్వహణ వంటి అత్యంత కీలక విభాగాలు ప్రభావితం కాలేదని అధికారులు చెబుతున్నారు.హ్యాకర్ల లక్ష్యం ఏంటి?సైబర్ నిపుణుల ప్రకారం.. రాన్సమ్వేర్ దాడుల్లో హ్యాకర్లు సాధారణంగా సంస్థల నుంచి డేటాను దొంగిలించి.. డబ్బు డిమాండ్ చేయడం లేదంటే తమ సామర్థ్యాన్ని చూపించేందుకు సమాచారాన్ని బహిర్గతం చేయడం చేస్తుంటారు. అయితే కీలక మౌలిక సదుపాయాలకు సంబంధించిన ఏ చిన్న సమాచారం బయటకు వచ్చినా.. భవిష్యత్ భద్రతా అంచనాలపై ప్రభావం చూపే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థల రంగంలోకి..ఈ ఘటనపై కేంద్ర సైబర్ భద్రతా సంస్థలు, సంబంధిత విభాగాలు దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం. లీక్ అయిన డేటా అసలు ఏమిటి? ఎంత మేరకు సున్నితమైన సమాచారం బయటకు వెళ్లింది? హ్యాకర్లు ఎలా యాక్సెస్ పొందారు? అనే అంశాలపై పరిశీలన జరుగుతోంది. సైబర్ భద్రత కొత్త సవాల్?అణు విద్యుత్ కేంద్రాలు దేశ భద్రతలో అత్యంత కీలకమైన మౌలిక సదుపాయాలు. గతంలోనూ ప్రపంచవ్యాప్తంగా అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని సైబర్ దాడులు జరిగిన ఉదాహరణలు ఉన్నాయి. కుండంకుళం ఘటనలో రియాక్టర్ వ్యవస్థలు ప్రభావితం కాలేదని అధికారులు చెబుతున్నప్పటికీ.. కీలక రంగాల్లో పనిచేసే సంస్థలు, కాంట్రాక్టర్ల డేటా భద్రతపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తుతోంది.కుండంకుళం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ (KKNPP) తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లాలో ఉన్న భారతదేశంలోని అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రాల్లో ఒకటి. భారత్–రష్యా సహకారంతో నిర్మించిన ఈ ప్రాజెక్టులో రష్యా తయారీ VVER-1000 ప్రెషరైజ్డ్ వాటర్ రియాక్టర్లు ఉన్నాయి. ప్రస్తుతం రెండు యూనిట్లు వాణిజ్య విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాయి.. ఒక్కో యూనిట్ సామర్థ్యం 1,000 మెగావాట్లు కాగా మొత్తం సామర్థ్యం 2,000 మెగావాట్లు. దేశ దక్షిణ గ్రిడ్‌కు కీలక విద్యుత్ వనరుగా ఉన్న ఈ ప్లాంట్.. భవిష్యత్‌లో మరిన్ని యూనిట్ల విస్తరణకు కూడా ప్రణాళికలు కలిగి ఉంది. అణు భద్రత, కఠినమైన నియంత్రణ ప్రమాణాలతో పనిచేసే ఈ కేంద్రం భారత ఇంధన రంగంలో అత్యంత కీలకమైన మౌలిక సదుపాయాల్లో ఒకటిగా పరిగణించబడుతోంది.తాజా సైబర్ ఎటాక్‌తో అణు కేంద్రం సురక్షితమేనా? అనే ప్రశ్నకు అధికారులు భరోసా ఇస్తున్నా.. సైబర్ దాడుల ముప్పు మాత్రం పెరుగుతున్న సంకేతాలు ఈ ఘటనతో మరోసారి స్పష్టమయ్యాయి. -
విజయ్ దూకుడు.. అలాంటి అధికారులకు చెక్ పెట్టే కొత్త ప్లాన్!
తమిళనాడులో అవినీతికి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం కీలక చర్యలకు శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ కార్యాలయాల్లో లంచాల వ్యవహారాలను అరికట్టేందుకు ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించే వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని నిర్ణయించింది. లంచం అడిగే అధికారులు, ఉద్యోగులపై ప్రజలు నేరుగా సమాచారం అందించేలా కొత్త ఫోన్ నంబర్‌ను అందుబాటులోకి తీసుకురావడం చర్చనీయాంశంగా మారింది. లంచంపై సమాచారం ఇవ్వడానికి వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేసే సదుపాయాన్ని ప్రారంభించింది. ఇందుకోసం 9498180936 నంబర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.సీఎం విజయ్ కూడా తన పాలనలో అవినీతికి తావులేని ప్రభుత్వం అందిస్తామని, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయబోమని గతంలో స్పష్టం చేశారు. పారదర్శక పాలన, జవాబుదారీతనం తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలని పేర్కొన్నారు. ప్రభుత్వ సేవలు పొందేందుకు ప్రజలు లంచాలు చెల్లించాల్సిన పరిస్థితి ఉండకూడదని, అవినీతిపై కఠినంగా వ్యవహరిస్తామని సీఎం విజయ్ ప్రభుత్వం స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ప్రజల ఫిర్యాదుల ఆధారంగా తమిళనాడు అవినీతి నిరోధక శాఖ (DVAC) రంగంలోకి దిగి విచారణ చేపట్టనుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో ధ్రువపత్రాలు, అనుమతులు, సంక్షేమ పథకాలు, ఇతర సేవల కోసం కొందరు అధికారులు లంచాలు డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలు తరచూ వినిపిస్తుంటాయి. ఇలాంటి ఘటనలను అరికట్టేందుకు ప్రజల భాగస్వామ్యం అవసరమని ప్రభుత్వం భావిస్తోంది.లంచం అడిగిన సందర్భాల్లో బాధితులు ఆలస్యం చేయకుండా విజిలెన్స్ అధికారులకు సమాచారం అందించాలని సూచిస్తున్నారు. ఫిర్యాదుల ఆధారంగా అధికారులు నిఘా పెట్టి, అవసరమైతే ట్రాప్ ఆపరేషన్లు నిర్వహించే అవకాశం ఉంది. లంచం తీసుకుంటూ పట్టుబడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు. అవినీతి రహిత పాలన అందించడం తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యాల్లో ఒకటని సీఎం విజయ్ చెబుతున్న నేపథ్యంలో ఈ చర్యకు ప్రాధాన్యత ఏర్పడింది. ప్రభుత్వ వ్యవస్థలో పారదర్శకత పెంచడం, ప్రజలకు వేగంగా సేవలు అందించడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు. అయితే ఫిర్యాదుల వ్యవస్థను సమర్థవంతంగా అమలు చేయాలంటే వచ్చిన ప్రతి ఫిర్యాదుపై వేగంగా విచారణ, చర్యలు ఉండాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రజల నుంచి వచ్చే సమాచారంతో అవినీతిపై పోరాటం మరింత బలపడుతుందని అధికారులు భావిస్తున్నారు. -
దివ్యాంగుడి కస్టోడియల్ డెత్! విజయ్ సర్కార్ మౌనంపై ఆగ్రహం
తమిళనాడును మరో లాకప్‌డెత్ మరణం కుదిపేస్తోంది. దివ్యాంగుడైన శబరివర్మన్ పోలీసుల కస్టడీలో ఉండగా మృతి చెందడం వివాదాస్పదమైంది. అతని ఒంటిపై గాయాలున్నట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడికావడంతో.. కుటుంబ సభ్యులు పోలీసులు హింసించి చంపారనే ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఘటనపై హోంశాఖ నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి విజయ్ వివరణ ఇవ్వాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.నాగర్‌కోయిల్‌కు చెందిన శబరివర్మన్ దివ్యాంగుడు. గుట్కా, పాన్ మసాలా అక్రమ విక్రయాలకు పాల్పడ్డాడన్న ఆరోపణలతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఇదే కేసులో గతంలోనూ అతడిపై రెండు కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. జూలై 9న కోర్టు అతడిని జ్యుడీషియల్ కస్టడీకి తరలించింది. అయితే సోమవారం తెల్లవారుజామున జైల్లో శబరివర్మన్ మృతి చెందాడు.మృతదేహంపై గాయాలు.. జైల్లో ఏం జరిగింది?శబరివర్మన్ మృతదేహాన్ని చూసిన కుటుంబ సభ్యులు అతడి శరీరంపై గాయాలు ఉన్నాయని ఆరోపించారు. అనంతరం నిర్వహించిన పోస్టుమార్టంలో మొత్తం 19 గాయాలు గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో జైల్లో అతడిపై దాడి జరిగిందా? అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ ఘటనపై విచారణ చేపట్టిన అధికారులు జైలు సీసీటీవీ దృశ్యాలను పరిశీలించారు. ముగ్గురు జైలు వార్డర్లు, కొంతమంది ఖైదీలు శబరివర్మన్‌పై దాడి చేసినట్లు గుర్తించినట్లు చెబుతున్నారు. అనంతరం సంబంధిత జైలు సిబ్బందిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు వెల్లడించారు.డీఎంకే ఆగ్రహం.. సీఎం విజయ్‌కు ప్రశ్నలుశబరివర్మన్ మృతి రాజకీయ వివాదానికి దారితీసింది. డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ ఈ ఘటనపై స్పందిస్తూ.. అరెస్టు సమయంలో ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి జైలుకు వెళ్లిన తర్వాత గాయాలతో ఎలా మృతి చెందాడని ప్రశ్నించారు. దివ్యాంగుడన్న విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోకుండా దాడి చేశారన్న కుటుంబ సభ్యుల ఆరోపణలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పోలీసు శాఖ ముఖ్యమంత్రి వద్దే ఉన్నందున ఈ ఘటనకు బాధ్యత వహించాలని అన్నారు.అంతేకాదు.. ఇటీవల గుట్కా కేసులో ఓ టీవీకే నేత అరెస్టై అదే రోజు బెయిల్ పొందిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. సామాన్యులకు ఒక చట్టం, రాజకీయంగా పలుకుబడి ఉన్నవారికి మరో చట్టమా? అంటూ పోలీసుల తీరుపై విమర్శలు చేశారు. గతంలో లాకప్‌డెత్‌ల సమయంలో విజయ్ వ్యవహరించిన తీరుకు.. ఇప్పుడు అధికారంలో మౌనం వహించడం సరికాదని అంటున్నారు.తమిళనాడులో కస్టడీ మరణాలపై మళ్లీ చర్చశబరివర్మన్ ఘటనతో తమిళనాడులో కస్టడీ మరణాలపై మరోసారి చర్చ మొదలైంది. 2020లో తూత్తుకుడిలో జరిగిన జయరాజ్, బెన్నిక్స్ తండ్రీకొడుకుల కస్టడీ మరణం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అలాగే శివగంగైలో అజిత్ కుమార్, తిరుప్పూర్‌లో మారిముత్తు కస్టడీ మరణాల ఘటనలు కూడా తీవ్ర నిరసనలకు దారితీశాయి. ఇప్పుడు నాగర్‌కోయిల్ ఘటనలో దివ్యాంగుడి మృతి, మృతదేహంపై గాయాల అంశం మరోసారి పోలీసు వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. అయితే శబరివర్మన్ మృతికి దారితీసిన పూర్తి కారణాలు దర్యాప్తు పూర్తయిన తర్వాతే స్పష్టమయ్యే అవకాశం ఉంది. -
తమిళ ప్రభుత్వ ఆస్పత్రుల్లో వాట్సాప్ ద్వారా ఓపీ రిజిస్ట్రేషన్
చెన్నై: తమిళనాడులోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో వాట్సాప్ ద్వారా ఓపీ రిజిస్ట్రేషన్, అపాయింట్మెంట్ పొందే ఇంటిగ్రేటెడ్ డిజిటల్ వేదిక www.nalam.tn.gov.in ను సీఎం విజయ్ మంగళవారం ప్రారంభించారు. ప్రభుత్వ వైద్య శాలల్లో సేవలను సామాన్య ప్రజలకు మరింత చేరువ చేయడమే తమ లక్ష్యమని సీఎం తెలిపారు. 9619222999 వాట్సాప్ నంబర్‌కు ‘ ఏజీ‘ అంటూ మెసేజీ చేయడం ద్వారా సులభంగా బుక్ చేసుకోవచ్చు. ప్రస్తుతం www.nalam.tn. gov.in ను చెన్నై, చెంగల్పట్టు సహా 22 జిల్లాల్లో ప్రయోగా త్మకంగా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా ప్రభుత్వ ఆస్పత్రుల్లో సౌకర్యాల మెరుగు దలకు నేరుగా వైద్య పరికరాలను స్పాన్సర్ చేయవచ్చు, విరాళాలు అందించవచ్చు. -
రూ. 2 కోట్ల బంగారం పేస్ట్ : తమిళనాడు జంట అరెస్ట్
కొచ్చి: అంతర్జాతీయంగా, జాతీయంగా బంగారం ధరలు ఆకాశాన్ని చూస్తున్నాయి. దీంతో గోల్డ్‌ను దొడ్డిదారిన తరలించే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా దాదాపు రూ. 2 కోట్ల విలువైన బంగారాన్ని అక్రమంగా తరలించే ప్రయత్నాన్ని, కస్టమ్స్ అధికారులు అడ్డుకున్నారు. బంగారాన్ని పేస్ట్ రూపంలో ప్యాంటు నడుము పట్టీలలో దాచి తరలిస్తుండగా తమిళనాడుకు చెందిన ఒక జంటను అరెస్ట్ చేసినట్టు పోలీసులు మంగళవారం తెలిపారు.నిందితులను తమిళనాడులోని పుదుకోట్టై జిల్లాకు చెందిన రిఫ్నాస్ హమీద్ మహమ్మద్ షరీఫ్ (26) అతని భార్య జానోఫర్ కదర్ బీవి ఉమర్ ఫరూక్ (23)గా గుర్తించారు. వీరు జూలై 13న అబుదాబి నుండి ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం IX 418లో విమానాశ్రయానికి వచ్చారు. వారి కదలికలపై అనుమానం వచ్చిన కస్టమ్స్ అధికారులు గా ఈ జంటను అడ్డగించి, క్షుణ్ణంగా తనిఖీ చేశారు. దీంతో అసలు విషయం తెలిసి షాకయ్యారు. నడుము బెల్ట్‌లో దాచిన బంగారాన్ని వెలికితీశారు. అనంతరం సుమారు రూ. 1.94 కోట్ల విలువైన 1,353.92 గ్రాముల 24-క్యారెట్ బంగారం కలిగిన బంగారు పేస్ట్‌ను స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ చట్టంలోని నిబంధనల ప్రకారం ఇద్దరు ప్రయాణికులను అరెస్టు చేశారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది. ఇదీ చదవండి: చిన్నగొడవ, భర్తను మొబైల్‌తో కొట్టింది.. అంతే..!ఇదీ చదవండి: 82 ఏళ్ల వృద్ధుడి పెన్షన్ ఖాతాలో రూ. వందల కోట్లు, ఏం చేశాడో తెలుసా? -
వివాదాల నేపథ్యంలో.. విజయ్ సంచలన నిర్ణయం
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కీలక పరిపాలనా నిర్ణయం తీసుకున్నారు. సీనియర్ ఐపీఎస్ అధికారి ఏ. అరుణ్‌ను రాష్ట్ర విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ డైరెక్టరేట్ డైరెక్టర్ పదవి నుంచి తప్పించారు. నియామకం జరిగిన రెండు నెలలు కూడా పూర్తికాకముందే ఈ నిర్ణయం తీసుకోవడం రాష్ట్ర రాజకీయ, అధికార వర్గాల్లో చర్చనీయాంశమైంది.అరుణ్‌ను ఈ ఏడాది మే నెలలో విజయ్ ప్రభుత్వం విజిలెన్స్ చీఫ్‌గా నియమించింది. అయితే అప్పటి నుంచే ఆయన నియామకం వివాదాస్పదమైంది. అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో తమిళగ వెట్రి కళగం (టీవీకే) ఆయనను "డీఎంకే అనుకూల అధికారి" అంటూ విమర్శించింది. ఆ సమయంలో ఆయన గ్రేటర్ చెన్నై పోలీస్ కమిషనర్‌గా పనిచేస్తున్నారు.అసెంబ్లీ ఎన్నికల సమయంలో వివిధ రాజకీయ పార్టీల ఫిర్యాదుల నేపథ్యంలో ఎన్నికల సంఘం ఆయనను తప్పనిసరి నిరీక్షణ (Compulsory Wait)లో ఉంచిన విషయం కూడా అప్పట్లో చర్చనీయాంశమైంది. ఇక ఆయన విజిలెన్స్ చీఫ్‌గా నియామకంపై మద్రాస్ హైకోర్టు కూడా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అవినీతి నిరోధక సంస్థకు నాయకత్వం వహించే అధికారి నిష్కళంకమైన ప్రతిష్ఠ కలిగి ఉండాలని, "సీజర్ భార్యపై ఎలాంటి అనుమానం ఉండకూడదన్నట్లే, విజిలెన్స్ డైరెక్టర్‌పై కూడా ఎలాంటి అనుమానాలకు తావుండకూడదు" అని కోర్టు వ్యాఖ్యానించింది. (వివరణ: ప్రాచీన రోమ్ పాలకుడు జూలియస్ సీజర్ తన భార్యపై ఎలాంటి ఆధారాలు లేకపోయినా అనుమానాలు రావడంతో విడాకులు ఇచ్చి, "నా భార్యపై అనుమానం కూడా ఉండకూడదు" అన్నాడు. అప్పటి నుంచే "Caesar's wife must be above suspicion" అనే సామెత ప్రాచుర్యంలోకి వచ్చింది. మద్రాస్ హైకోర్టు ఈ సామెతనే ప్రస్తావించింది)..ఏ. అరుణ్ తమిళనాడు కేడర్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి. అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ADGP) హోదాలో ఉన్న ఆయన గతంలో చెన్నై నగర పోలీస్ కమిషనర్‌గా పనిచేశారు. పోలీస్ శాఖలో కీలక బాధ్యతలు నిర్వహించిన ఆయనను డీవీఏసీ వంటి అత్యంత కీలకమైన అవినీతి నిరోధక విభాగానికి అధిపతిగా నియమించడం అప్పట్లోనే చర్చకు దారితీసింది. ఇలాంటి సంస్థకు నాయకత్వం వహించే అధికారి ఎంపికలో పారదర్శకత, నిష్పాక్షికత అత్యంత కీలకమని న్యాయస్థానం అభిప్రాయపడింది... ఈ నేపథ్యంలో నియామకంపై వచ్చిన విమర్శలు, న్యాయస్థాన పరిశీలన మధ్య కేవలం రెండు నెలల్లోనే అరుణ్‌ను ఆ పదవి నుంచి తప్పిస్తూ విజయ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తమిళనాడులో ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.ఏడీజీపీ హోదాలో ఉన్న అరుణ్‌ను చెన్నైలోని తమిళనాడు పోలీస్ అకాడమీ డైరెక్టర్‌గా బదిలీ చేశారు. ఆయన స్థానంలో ప్రస్తుతం డీవీఏసీ(DVAC) లో ప్రత్యేక దర్యాప్తు విభాగం ఇన్స్పెక్టర్ జనరల్‌గా పనిచేస్తున్న సీ. మహేశ్వరి ఐపీఎస్‌కు విజిలెన్స్ డైరెక్టర్ బాధ్యతలను అదనంగా అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
ఏఎంఆర్ ముప్పు తప్పించే ఈవీఎం చికిత్సలు!
సాంప్రదాయ పశువైద్య విధానాలకు (ఎత్నోవెటర్నరీ మెడిసిన్–ఈవీఎం) శాస్త్రీయ గుర్తింపు తీసుకురావడంలో విజయం సాధించిన తమిళనాడుకు చెందిన వెటర్నరీ ప్రొఫెసర్ ఎన్. పుణ్యమూర్తి(69) ఇటీవలే పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. దేశంలో ఇప్పటి వరకు పద్మశ్రీ అందుకున్న ఐదుగురు వెటర్నేరియన్లలో ఒకరు. ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన ఆయనతో బుధవారం ‘సాక్షి’ ప్రత్యేకంగా ముచ్చటించింది. ఈ మూలికా వైద్యంతో యాంటీబయాటిక్స్ వాడకం తగ్గుతుంది. తద్వారా భవిష్యత్తులో యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ (ఏఎంఆర్) ముప్పును సమర్థవంతంగా అడ్డుకోవచ్చు అంటున్నారాయన. ముఖాముఖిలో కొన్ని ముఖ్యాంశాలు...→ ఎత్నోవెటర్నరీ మెడిసిన్(ఈవీఎం) చికిత్సలు అంటే?విశ్రాంత వెటర్నరీ ప్రొఫెసర్‌గా నాకున్న శాస్త్రీయ జ్ఞానం, పురాతన సిద్ధ వైద్య రీతిలోని సంప్రదాయం విజ్ఞానాన్ని మేళవించి పాతికేళ్లుగా ఈవీఎంలపై కృషి చేస్తున్నాను. ఇంటి పట్టున దొరికే సాధారణ మూలికలతో రైతులే పశువైద్యం చేసుకోవటానికి తోడ్పడేవే ఎత్నోవెటర్నరీ మెడిసిన్(ఈవీఎం) చికిత్సలు. → సాంప్రదాయ పశువైద్యానికి శాస్త్రీయత ఉందా?ప్రతిష్టాత్మక అంతర్జాతీయ జర్నల్ ‘మైక్రోబియల్ పాథోజెనిసిస్’లో ఈవీఎం చికిత్సలపై ఇటీవల ప్రచురితమైన తొలి వ్యాసం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. నాతో పాటు చాలా మంది శాస్త్రవేత్తలు, వివిధ ప్రభుత్వ పరిశోధన సంస్థలు సాధించిన విజయాలే ఇందుకు దోహదపడ్డాయి. ఉదాహరణకు.. పాడి పశువులకు వచ్చే ముఖ్య వ్యాధుల్లో పొదుగు వాపు ఒకటి. కలబంద ఆకులు 250 గ్రాములు, పసుపు 50 గ్రాములు, సున్నం 15 గ్రాముల మిశ్రమాన్ని వాడితే 85% పశువుల్లో 3–5 రోజుల్లోనే పొదుగువాపు తగ్గిపోతుంది. మొత్తం 34 పశు వ్యాధులకు ఇటువంటి నిర్థారిత ఈవిఎం చికిత్సలు ఉన్నాయి. సాధారణంగా శాస్త్రీయ పరిశోధనల్లో మొక్కల నుంచి ఒకే ఒక అణువును వేరు చేసి పరీక్షిస్తారు. కానీ, ఈ పరిశోధనలో మొదటిసారిగా ఈ మూడు పదార్థాల పూర్తి మిశ్రమాన్ని (హోల్ కాంబినేషన్‌ను) ఒక ‘ఫంక్షనల్ రెమెడీ’గా పరీక్షించి విజయం సాధించాం.→ మీ పరిశోధనలకు నిధులు ఎలా సమకూరాయి?ఎత్నోవెటర్నరీ మెడిసిన్ పద్ధతులు కేవలం అనుభవపూర్వకమైనవి మాత్రమే కావు, వాటి వెనుక బలమైన శాస్త్రీయ ఆధారం కూడా ఉందని మా పరిశోధనలు నిరూపించాయి. ప్రభుత్వాల నిధులతో గత 20 ఏళ్లుగా పరిశోధనలు జరుగుతున్నాయి. తమిళనాడు ప్రభుత్వం 2007లో మొదట రూ. 18 లక్షలు, తర్వాత రూ. 13.72 కోట్లు మంజూరు చేసింది. భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్) రూ. 80 లక్షలు, కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ రూ. 32 కోట్లు కేటాయించింది. → ఈవీఎం చికిత్సల క్షేత్రస్థాయి ఫలితాలెలా ఉన్నాయి?నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డ్ (ఎన్డీడీబీ) దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో పాడి రైతులతో అమలు చేయిస్తోంది. గుజరాత్‌లోని ‘సాబర్ మిల్క్ యూనియన్’లో ఈ చికిత్సలను ఎన్ డీడీబీ విజయవంతంగా పరీక్షించింది. 2017 నుంచి దీన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నారు. దాదాపు 3 లక్షలకు పైగా పాడి పశువుల చికిత్స ఫలితాలతో డిజిటల్ డేటాను ఎన్డీడీబీ సేకరించింది. పొదుగు వాపు వ్యాధి నివారణలో 85% పైగా అద్భుతమైన క్లినికల్ సక్సెస్ రేట్ నమోదైంది. కేవలం 3–5 రోజుల్లోనే పశువులు కోలుకున్నాయి. 34 రకాల పశువ్యాధుల నివారణకు ఎన్ డీడీబీ ఈ చికిత్సలను అనుసరిస్తోంది. → యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ కట్టడి అవుతుందా?పశువైద్యంలో యాంటీబయాటిక్స్ వాడకం పెరగటం వల్ల బ్యాక్టీరియా వాటిని తట్టుకునే శక్తిని (యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ –ఏఎంఆర్)ను పెంచుకుంటోంది. ఈ మూలికా వైద్యం వల్ల యాంటీబయాటిక్స్ వాడకం తగ్గి, భవిష్యత్తులో ఈ ముప్పును సమర్థవంతంగా అడ్డుకోవచ్చు. ‘స్టాండర్డ్ వెటర్నరీ ట్రీట్మెంట్ గైడ్‌లైన్స్ ’(ఎస్వీటీజీ)లో కూడా ఈవీఎం చికిత్సలను చేర్చారు. కేంద్ర పశుసంవర్ధక శాఖ, ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ భాగస్వామ్యంతో ఈ మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈవీఎం చికిత్స విధానాన్ని వెటర్నరీ విద్యార్థుల సిలబస్‌లో చేర్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.ఇంటర్వ్యూ:పంతంగి రాంబాబుసాక్షి సాగుబడి డెస్క్ -
తమిళనాడులో రెండు బస్సులు ఢీ.. ఆరుగురి మృతి
సాక్షి, చెన్నై: తమిళనాడులోని మదురై జిల్లా మేలూరు సమీపంలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రభుత్వ, ప్రైవేటు బస్సులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. మరో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. 20 మందికిపైగా స్వల్పంగా గాయపడ్డారు. ప్రమాదంపై తమిళనాడు సీఎం జోసఫ్ విజయ్ తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. మరణించిన ఆరుగురి కుటుంబాలకు రూ.3లక్షలు చొప్పున ఎక్స్‌గ్రేషియో ప్రకటించారు. తీవ్ర గాయాలతో ఐసీయూలో చికిత్స పొందుతున్న ఏడుగురికి రూ.లక్ష చొప్పున గాయపడిన మరో 15 మందికి రూ.50వేలు చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.


