శివగంగ జిల్లా: తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వచ్చిన రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 12 మంది మృతి చెందారు. శివగంగ జిల్లా తిరుపత్తూర్ దగ్గర ప్రమాదం చోటుచేసుకుంది. 40 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు. ఓ బస్సు తిరుప్పూర్ నుంచి కారైకుడికి వెళ్తుండగా.. మరో బస్సు కారైకుడి నుంచి దిండిగల్‌కు వస్తుండగా ప్రమాదం జరిగింది.


గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఫైర్ సిబ్బంది, అంబులెన్స్‌లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదంపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


