ఢిల్లీలో ఆందోళన కలిగిస్తున్న క్యాన్సర్ కేసులు | Adenocarcinoma on the Rise in Polluted Delhi | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో ఆందోళన కలిగిస్తున్న క్యాన్సర్ కేసులు

Nov 30 2025 4:29 PM | Updated on Dec 1 2025 2:45 PM

Adenocarcinoma on the Rise in Polluted Delhi

దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. గాలి నాణ్యతలు పలు మార్లు తీవ్ర ప్రమాదకర స్థాయికి చేరుకున్నప్పటికీ కేంద్రం తీసుకునే చర్యలు ఫలించడం లేదు. అయితే ఈ నేపథ్యంలో అడెనోకార్సినోమా అనే ఉపిరితిత్తుల క్యాన్సర్ రకం కేసులు ఢిల్లీ వాసులలో అధికంగా నమోదవుతున్నాయి. ధూమపానం అలవాటు లేని వారిలోనూ ఈ కేసులు అధికంగా నమోదవడం ఆందోళనకు గురిచేస్తోంది.

ఢిల్లీ నగరం చాలాకాలంగా  గాలి నాణ్యత లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది. అధిక సంఖ్యలో వాహనాలతో పాటు పరిసర ప్రాంతాలలో పంటవ్యర్థాలు కాల్చివేయడం తదితర చర్యలతో అక్కడ తీవ్రమైన గాలి కాలుష్యం ఏర్పడుతుంది. ప్రభుత్వాలు దాని నివారణకు ఎన్ని చర్యలు చేపట్టిన పెద్దగా ప్రయోజనం లేకుండా పోతుంది. ఈ నేపథ్యంలో ఇటివల అక్కడ నమోదవుతున్న లంగ్ క్యాన్సర్ కేసులు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. సాధారణంగా సిగరెట్ ఇతరాత్ర దురలావాట్ల ద్వారా అధికంగా సంభవించే  లంగ్ క్యాన్సర్ కేసులు  ధూమపానం అలవాటు లేని వారిలోనూ అధికంగా నమోదవుతున్నాయి.

ఇటీవల నిర్వహించిన ఒక సర్వేలో 1998లో లంగ్ క్యాన్సర్ కేసులు 90 శాతం దాదాపు సిగరెట్ అలవాటు ఉన్నవారికే వచ్చేవని తెలిపాయి. అదే 2018లో క్యాన్సర్ కేసులు నమోదైన వారిలో దాదాపు 60 నుంచి 70శాతం మంది ధూమపానం అలవాటు లేని వారని తెలిపింది. ఈ గడిచిన దశాబ్దాల కాలంలో గాలినాణ్యత పూర్తిగా క్షీణించడంతోనే ఈ విధంగా క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయని తెలిపారు.

2025లో ది లాన్సెంట్ జరిపిన అధ్యయనం ప్రకారం  అడినోకాన్సిరోమా అనే క్యాన్సర్ రకం గాలిలో నాణ్యత క్షీణించడం వల్లే అధికంగా ఏర్పడుతాయని స్టడీ తెలిపింది. అయితే సిగరెట్ అలావాటు లేని వారిలోనూ  ఈరకం క్యాన్సర్ కేసులు అక్కడ అధికంగా వెలుగు చూస్తున్నాయి. దీంతో ఢిల్లీలోని గాలి కాలుష్యమే ఈ క్యాన్సర్‌కు ప్రధాన కారణమని డాక్టర్లు అంచనా వేస్తున్నారు. 

యువకులు, మహిళలలో ఈ రకం కేసులు అధికంగా నమోదవుతున్నాయి. దానికి తోడూ ఢిల్లీలో గాలి నాణ్యత రోజురోజుకూ క్షీణిస్తుండడంతో ఈక్యాన్సర్ కేసులపై ప్రజలకు అవగాహాన కల్పించి  ప్రభుత్వం తగిన నివారణ చర్యలు తీసుకోవాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఢిల్లీలో గాలి కాలుష్య నివారణపై ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఇటీవలే సుప్రీంకోర్టు సైతం వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. 

Advertisement
 
Advertisement
Advertisement