శీతాకాల పార్లమెంట్‌ సమావేశాలు..అఖిలపక్ష సమావేశం భేటీ | All Party Meet Ahead Winter Parliament Sessions | Sakshi
Sakshi News home page

శీతాకాల పార్లమెంట్‌ సమావేశాలు..అఖిలపక్ష సమావేశం భేటీ

Nov 30 2025 11:29 AM | Updated on Nov 30 2025 12:38 PM

All Party Meet Ahead Winter Parliament Sessions

ఢిల్లీ:  రేపటి నుంచి శీతాకాల పార్లమెంట్‌ సమావేశాల్లో ఈరోజు(ఆదివారం, నవంబర్‌ 30 వతేదీ) అఖిలపక్షం సమావేశమైంది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ రిజిజు  లోక్‌సభ, రాజ్యసభ సమావేశాలు సజావుగా సాగేందుకు సహకారం అందించాలని ప్రభుత్వం రాజకీయ పక్షాల నేతలను కోరనుంది. అధ్యక్షతన ఉదయం 11 గంటలకు పార్లమెంట్‌ అనెక్స్‌లో జరిగే ఈ సమావేశానికి పలు పార్టీల నేతలు హాజరయ్యారు. 

బీజేపీ నుంచి రాజ్‌నాథ్‌ సింగ్‌, జేపీ నడ్డా హాజరుకాగా, కాంగ్రెస్‌ నుంచి గౌరవ్‌ గొగాయ్‌, జై రాం రమేష్‌, ప్రమోద్‌ తివారీలు హాజరయ్యారు. వైఎస్సార్‌సీపీ నుంచి ఎంపీ మిథున్ రెడ్డి హాజరయ్యారు. 

ప్రతిపక్ష పార్టీలు ఉభయ సభల కార్యకలాపాల్లో పూర్తిగా పాల్గొని సహకరించాలని, శక్తివంతమైన పార్లమెంటరీ వ్యవస్థను నిర్మించడంలో సహాయపడాలని కిరణ్‌ రిజిజు శనివారం విజ్ఞప్తి చేశారు. సోమవారం ప్రారంభమయ్యే సమావేశాలు డిసెంబర్‌ 19వ తేదీ వరకు కొనసాగుతాయి. సమావేశాల్లో అణుశక్తి, ఉన్నత విద్య, కార్పొరేట్‌ చట్టం, సెక్యూరిటీల మార్కెట్‌కు సంబంధించిన 10 కీలక బిల్లులను కూడా ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. 

మరోపక్క తొమ్మిది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని తీవ్రంగా వ్యతిరేకించేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. ఓటరు సవరణ ప్రక్రియను తృణమూల్‌ కాంగ్రెస్‌ తీవ్రంగా తప్పుబడుతోంది. కేంద్రం నిధుల విడుదలలో తమపట్ల వివక్షతో ఉందని తమిళనాడు ప్రభుత్వం విమర్శలు గుప్పిస్తోంది. ఢిల్లీ కాలుష్యంపై కాంగ్రెస్, ఆప్‌లు పార్లమెంట్‌లో చర్చించాలని డిమాండ్‌ చేస్తున్నాయి. 

 

 

Advertisement
 
Advertisement
Advertisement