breaking news
Nagarkurnool
-
నిబంధనల మేరకు వాహన రిజిస్ట్రేషన్లు
కందనూలు: ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిబంధనల మేరకు వాహన రిజిస్ట్రేషన్లు చేయాలని కలెక్టర్ హేమంత కేశవ్‌పాటిల్ అన్నారు. మంగళవారం నాగర్‌కర్నూల్ మండలంలోని మల్కాపూర్ గేట్ సమీపంలో ఉన్న జిల్లా రవాణా శాఖ కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని వివిధ విభాగాలను సందర్శించి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. రికార్డులు, సిబ్బంది హాజరు పట్టికలను పరిశీలించారు. కార్యాలయానికి వచ్చే ప్రజలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం సేవలు అందుతున్నాయా లేదా అనే అంశాలను పరిశీలించారు. సిబ్బంది విధులకు సకాలంలో హాజరై, సమయపాలన పాటించాలని సూచించారు. కార్యాలయానికి వచ్చే ప్రజలను అనవసరంగా వేచి ఉండేలా చేయకుండా, వారి దరఖాస్తులను నిబంధనల ప్రకారం నిర్ణీత సమయంలో పరిశీలించి పరిష్కరించాలని ఆదేశించారు. విధి నిర్వహణలో జాప్యం, నిర్లక్ష్యానికి తావులేకుండా ప్రతి అధికారి, సిబ్బంది తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. ఈ క్రమంలో డ్రైవింగ్ లైసెన్స్ కోసం కార్యాలయానికి వచ్చిన ఓ దరఖాస్తుదారుడితో కలెక్టర్ నేరుగా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్న తేదీ, దరఖాస్తు ప్రక్రియలో ఎదురవుతున్న ఇబ్బందులు, రుసుంల చెల్లింపు తదితర అంశాలపై ఆరా తీశారు. ఆన్లైన్లో నిర్దేశించిన దరఖాస్తు రుసుం మాత్రమే వసూలు చేస్తున్నారా.. అదనంగా ఎలాంటి డబ్బులు చెల్లించాల్సి వస్తుందా.. దరఖాస్తు చేసుకుని ఎన్ని రోజులు అయింది.. దరఖాస్తు ప్రక్రియలో అధికారులు లేదా సిబ్బంది నుంచి ఏమైనా ఇబ్బందులు పెడుతున్నారా.. అని వాకబు చేశారు. ప్రజలకు అందించే సేవల్లో పారదర్శకత పాటించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. -
నయనానందం.. గణనాథుడి నిమజ్జనోత్సవం
గణేశ్ మహరాజ్‌కీ జై.. గణపతి బప్పా మోరియా.. అంటూ భక్తుల నినాదాలు.. డీజే చప్పుళ్లు, మహిళల కోలాటాలు, యువతీ, యువకుల నృత్యాల మధ్య గణనాథుల నిమజ్జనోత్సవం నయనానందంగా సాగింది. తొమ్మిది రోజులపాటు భక్తుల చేత విశేష పూజలందుకున్న గణనాథుడు గంగమ్మ ఒడికి చేరుకున్నాడు. జిల్లాకేంద్రంలోని ఆయా వీధుల్లో ప్రతిష్టించిన భారీ గణనాథులను మంగళవారం రాత్రి నిమజ్జనం చేశారు. పోలీసులు భక్తులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్‌ను దారి మల్లిస్తూ మండపాల వద్ద బందోబస్తు నిర్వహించారు. ఇదిలా ఉండగా.. చారకొండ మండలంలోని జూపల్లిలో యువసేన యూత్ ఆధ్వర్యంలో ఎలాంటి హంగు, ఆర్బాటాలు లేకుండా ఎద్దుల బండిపై గణనాథుడిని ఊరేగించి నిమజ్జనం నిర్వహించడం ఆకట్టుకుంది. – కందనూలు/ చారకొండ నిమజ్జనానికి పక్కాగా ఏర్పాట్లు కల్వకుర్తి టౌన్: వినాయక విగ్రహాల నిమజ్జనం జరగనున్న పట్టణంలోని సిలార్పల్లి ఈదుల చెరువును కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ మంగళవారం సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. నిమజ్జన సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. చెరువు వద్ద భద్రత, బారికేడ్లు, విద్యుత్ దీపాలు, పారిశుద్ధ్యం, తాగునీరు, రహదారి సౌకర్యాలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అలాగే ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టి, భక్తులకు అసౌకర్యం కలగకుండా చూడాలని, ఇందుకోసం పోలీసు, మున్సిపల్, రెవెన్యూ తదితర శాఖలు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. కలెక్టర్ వెంట మున్సిపల్ వైస్‌చైర్మన్ షానవాజ్ ఖాన్, కమిషనర్ మహమూద్ షేక్, తహసీల్దార్ ఇబ్రహీం, సీఐ భీమ్‌కుమార్ తదితరులున్నారు. -
జూరాల వద్ద ఉద్రిక్తత
● ఎక్కడికక్కడ వివిధ పార్టీల నాయకుల ఆందోళనలు ● భారీగా పోలీసుల మోహరింపు.. ముందస్తు అరెస్టులు పీజేపీ క్యాంపు వద్ద సీపీఎం.. సాగునీరు వెంటనే వదలాలని సీపీఎం ఆధ్వర్యంలో రైతులకు మద్దతుగా మంగళవారం ఆందోళన చేపట్టారు. తమ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ జూరాలకు రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుపడిందని.. భూత్పూర్ వద్ద అరెస్ట్ చేసి ఠాణాకు తరలించడం ఏమిటని ప్రశ్నించారు. రైతు, ప్రజా ప్రభుత్వమని పత్రికా ప్రకటనలు ఇస్తున్న కాంగ్రెస్.. సాగునీరు ఇవ్వడంతో విఫలమైందని ఆరోపించారు. ఆయకట్టు రైతులకు కనీసం వారాబందీ విధానంలోనైనా సాగునీరు ఇవ్వాలని.. అప్పటి వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని చెప్పడంతో పోలీసులు కలుగజేసుకొని బలవంతంగా పోలీస్ వాహనంలో ఎక్కించి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. గద్వాల క్రైం/ అమరచింత/ ధరూరు: సాగునీటి కోసం రైతులు చేస్తున్న ఆందోళనలతో మంగళవారం జూరాల జలాశయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆరు రోజులుగా జూరాల కాల్వలకు సాగునీరు నిలిపివేయడంతో పంటలు కాపాడుకునేందుకు ఆయకట్టు రైతులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ మంగళవారం జూరాల ప్రాజెక్టు సందర్శనతోపాటు రైతులతో ముఖాముఖి నిర్వహించేందుకు వస్తున్నారనే సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రాజెక్టు వద్ద ప్రత్యేక పోలీసు బలగాలను మోహరించడమే కాకుండా బీజేపీ, సీపీఎం నాయకులను ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకొని పోలీస్స్టేషన్లకు తరలించారు. పోలీసుల కళ్లుగప్పి ప్రాజెక్టుకు చేరుకున్న పలువురిని బలవంతంగా అరెస్టు చేసి పోలీస్ వాహనాల్లో కొత్తకోట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సమాంతర కాల్వ వద్ద బీజేపీ.. రైతులకు సాగునీరు ఇవ్వాలంటూ బీజేపీ నాయకులు జూరాల సమాంతర కాల్వకు చేరుకున్నారు. నందిమళ్ల క్యాంపు వద్ద బారీకేడ్లు ఏర్పాటుచేసి పహారా కాస్తున్న పోలీసులకు సమాంతర కాల్వ వద్దకు బీజేపీ నాయకులు చేరుకున్నారనే సమాచారంతో అక్కడికి వచ్చి ప్రాజెక్టుపైకి రాకుండా అడ్డుకున్నారు. దీంతో బీజేపీ నాయకులు మాట్లాడుతూ.. సాగునీరు వదలాలని కోరుతున్న రైతులపై ప్రభుత్వం పోలీసు బలగాలతో దాడులు చేయించడం దారుణమన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి పాలనలో రైతులు ఆగమయ్యారని, వ్యవసాయం అంటేనే భయపడే పరిస్థితికి చేరుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సాగునీరు వదిలే వరకు ఇక్కడి నుంచి కదలమని బైఠాయించడంతో పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. -
నేడు హరీశ్‌రావు రాక
కొల్లాపూర్: బీఆర్ఎస్ నేత, మాజీమంత్రి హరీశ్‌రావు బుధవారం కొల్లాపూర్ మండలంలోని సింగోటం గ్రామానికి రానున్నారు. కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి తండ్రి లక్ష్మారెడ్డి మృతి చెందడంతో హర్షవర్ధన్‌రెడ్డిని పరామర్శించేందుకు ఆయన సింగోటం వస్తున్నట్లు బీఆర్ఎస్ నాయకులు తెలిపారు. మెస్ డిపాడిట్ చార్జీలు తగ్గించాలి కొల్లాపూర్: పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని పీజీ కళాశాలల్లో పెంచిన మెస్ డిపాజిట్ చార్జీలను వెంటనే తగ్గించాలని కోరుతూ కొల్లాపూర్‌లో పీజీ కళాశాల విద్యార్థులు మంగళవారం ప్రిన్సిపల్ అశోక్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ కొల్లాపూర్ పీజీ కళాశాలలో ఇప్పటి వరకు మెస్ డిపాజిట్ చార్జి ఏడాదికి రూ.10 వేలు మాత్రమే ఉండేదన్నారు. అయితే ఇటీవల యూనివర్సిటీ అధికారులు మెస్ డిపాజిట్ చార్జీలు అబ్బాయిలకు రూ.18,100, అమ్మాయిలకు రూ.16,100కు పెంచారని, దీనివల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. మెస్ డిపాజిట్ చార్జీల పెంపు కారణంగా కొల్లాపూర్ పీజీ కళాశాలలో అడ్మిషన్ల సంఖ్య తగ్గే అవకాశం ఉందన్నారు. యూనివర్సిటీ ఉన్నతాధికారులు స్పందించి విద్యార్థులకు ఇబ్బంది లేకుండా మెస్ డిపాజిట్ చార్జీలు నిర్ణయించాలని కోరారు. 27న పాదయాత్ర చారకొండ: డిండి లిప్టు ఇరిగేషన్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 27న ఉమ్మడి జిల్లా పెండింగ్ ప్రాజెక్టుల సాధన జేఏసీ ఆధ్వర్యంలో ఉల్పర నుంచి కల్వకుర్తి వరకు పాదయాత్ర చేపడుతున్నట్లు జేఏసీ చైర్మన్ రాజేందర్‌రెడ్డి, కన్వీనర్ రాఘవచారి తెలిపారు. మండలంలోని ఎర్రవల్లిలో డీఎల్ఐకి వ్యతిరేకంగా, ముంపు గ్రామాలను మినహాయించాలని కోరుతూ చేపట్టిన రిలే నిరసన దీక్షలు 295వ రోజుకు చేరాయి. ఈ మేరకు మంగళవారం పెండింగ్ ప్రాజెక్టుల సాధన జేఏసీ దీక్షలకు మద్దతు తెలిపి మాట్లాడారు. డీఎల్ఐ రద్దు చేసే వరకు పోరాటం కొనసాగుతుందన్నారు. పాదయాత్రకు పాలమూరు అధ్యయన వేదిక రాష్ట్ర కన్వీనర్ హరగోపాల్, ఎమ్మెల్సీ కోదండరాం హాజరవుతారని వెల్లడించారు. అదేరోజు సాయంత్రం కల్వకుర్తిలో బహిరంగ సభ నిర్వహిస్తామని, రైతులు, మేధావులు, నాయకులు, ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. తాగునీటి సరఫరాలో ఇబ్బందులు రానీయొద్దు కందనూలు: మండలంలోని గుడిపల్లి పరిధి గౌరిదేవిపల్లిలో ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ పంపుహౌస్‌ను ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి మంగళవారం పరిశీలించారు. అనంతరం అధికారులతో నీటి సరఫరాలో సమస్యలపై సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో తక్కువ నీటి సరఫరా ఎందుకు జరుగుతోందనే అంశంపై డీఈ సుదర్శన్, ఏఈ శోభన్‌తో తెలుసుకున్నారు. నీటి సరఫరాలో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలు, పైప్‌లైన్ పరిస్థితి, నీటి పంపింగ్ సామర్థ్యం, సరఫరాలో అంతరాయాలకు గల కారణాలపై ఆరాతీశారు. ప్రజలకు తాగునీటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలను వెంటనే చేపట్టాలని అధికారులను ఆదేశించారు. -
సర్ నో రెస్పాన్స్
అచ్చంపేట: జిల్లాలో సర్ నోటీసులు జారీ అవుతున్నా విచారణ ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదు. నోటీసులు అందుకున్నవారు నిర్దేశిత తేదీల్లో హియరింగ్‌కు హాజరు కావాలని ముందుస్తు సమాచారం ఇచ్చిన రావడం లేదు. కేటాయించిన తేదీలు గడిచిపోవడం.. రీషెడ్యూల్ చేయాల్సి రావడం వంటి పరిణామాలతో పెండింగ్ కేసులు పెరుగుతున్నాయి. ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా అన్‌మ్యాపింగ్, అనామలీస్ ఓటర్లందరికీ నిర్ణీత గడువులోగా నోటీసులు జారీ చేసి, హియరింగ్ నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ పదేపదే వీడియో కాన్ఫరెన్స్‌లో చెబుతున్నా నత్తనడకన సాగుతుంది. జిల్లాలో నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కొల్లాపూర్, కల్వకుర్తి నియోజకవర్గాల్లో మొత్తం 1,81,295 మందికి సర్ నోటీసులు జనరేట్ కాగా.. 1,79,572 అందజేయగా.. 1,723 నోటీసులు ఇవ్వాల్సి ఉంది. మరోవైపు హియరింగ్ తేదీల్లో గైర్హాజరు కావడంతో 1,32,833 నోటీసులు ల్యాప్స్ అయ్యాయి. నిర్దేశిత గడువులోగా ఎంతమంది విచారణకు హాజరవుతారు.. ఎంతమంది గైర్హాజరవుతారనేది కీలకంగా మారింది. హియరింగ్ హాజరుకాక ల్యాప్స్ అయినవి 1,32,833 హాజరు పెంచడమే కీలకం నోటీసులు జారీ చేయడంపైనే అధికార యంత్రాంగం దృష్టి సారిస్తోంది. నోటీసు అందుకున్న వారు నిర్ణీత తేదీన విచారణకు హాజరై తమ వాదనలు, ఆధారాలు సమర్పించినప్పుడే ప్రక్రియ ముందుకు సాగుతుంది. ఈ నేపథ్యంలో హియరింగ్ తేదీ, సమయం, వేదికపై స్పష్టమైన సమాచారం అందించడం, గైర్హాజరైన వారికి వెంటనే తదుపరి తేదీ కేటాయించడం, పెండింగ్ కేసులపై ప్రత్యేక పర్యవేక్షణ అవసరమని అంటున్నారు. లేకపోతే ఒకే కేసు పదేపదే తేదీలు కేటాయించే పరిస్థితి ఏర్పడి.. ఇప్పటికే ఉన్న పెండింగ్ తేదీలు మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. సద్వినియోగం చేసుకోవాలి జిల్లాలో సర్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. పారదర్శక ఓటర్ల జాబితా తయారీలో భాగంగానే నోటీసుల జారీ మొదలు హియరింగ్, క్లెయిమ్స్, అభ్యంతరాలు స్వీకరిస్తున్నాం. ఈఆర్వోలకు అందిన ఫారం–6, 7, 8 దరఖాస్తులను వేగవంతంగా విచారణ చేసేలా చర్యలు తీసుకుంటాం. పెండింగ్ నోటీసులను ఎలాంటి జాప్యం లేకుండా త్వరితగతిన పరిష్కరించడంతోపాటు నోటీసుల జారీ పూర్తి పాదర్శకంగా పాటించాలి. – హేమంత కేశవ్ పాటిల్, కలెక్టర్ జిల్లాలో విచారణకు హాజరు కాని ఓటర్లు నోటీసులు అందినా స్పందించని ప్రజలు బీఎల్ఓలపై పెరుగుతున్న ఒత్తిడి సిబ్బంది పరిమిత సంఖ్యలో ఉండటంతో వెనుదిరుగుతున్న వైనం జిల్లాలో చర్చనీయాంశంగా మారిన ప్రక్రియ ఇంకా ఇవ్వాల్సినవి 1,723 -
ఉమ్మడి జిల్లాలో ఎస్జీఎఫ్ జోష్
● రాష్ట్రస్థాయి టోర్నీలకు ఐదు జిల్లాలకు కేటాయింపులు ● అండర్–14, 17, 19 విభాగాల్లో పోటీలు ● సెలక్షన్స్ అనంతరం టోర్నీల నిర్వహణ మహబూబ్‌నగర్ క్రీడలు: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్) క్రీడా సందడి మొదలుకానుంది. ఇప్పటికే మండలస్థాయి పోటీలు ముగింపు దశకు చేరుకోగా.. త్వరలో జిల్లాస్థాయి, ఉమ్మడి జిల్లా సెలక్షన్స్ నిర్వహించనున్నారు. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లాలోని మహబూబ్‌నగర్, వనపర్తి, నారాయణపేట, నాగర్‌కర్నూల్, జోగుళాంబ గద్వాల జిల్లాలకు వివిధ క్రీడల్లో రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్ టోర్నీలు కేటాయించారు. గత నెలలో జిల్లా ఎస్జీఎఫ్ కార్యదర్శులు పంపిన ప్రతిపాదనల ఆధారంగా మంగళవారం టోర్నీలను కేటాయించారు. ఉమ్మడి జిల్లా సెలక్షన్స్ అనంతరం ఆయా పోటీలు నిర్వహించనున్నారు. ● మహబూబ్‌నగర్ జిల్లాలో అండర్–19 బాల, బాలికల వాలీబాల్, అండర్–17 బాల, బాలికల హ్యాండ్‌బాల్, అండర్–19 బాలుర క్రికెట్, అండర్–19 బాల, బాలికల నెట్‌బాల్ పోటీలు జరగనున్నాయి. ● వనపర్తి జిల్లాలో అండర్–19 బాలికల హాకీ, అండర్–19 బాల, బాలికల హ్యాండ్‌బాల్ టోర్నీలు కేటాయించారు. ● నారాయణపేట జిల్లాలో అండర్–14 బాల, బాలికల రెజ్లింగ్ (ఫ్రీస్టైల్), అండర్–14, 17 బాల, బాలికల బీచ్‌వాలీబాల్ పోటీలు నిర్వహించనున్నారు. ● నాగర్‌కర్నూల్ జిల్లాలో అండర్–17 బాల, బాలికల చెస్, అండర్–17 బాల, బాలికల కబడ్డీతో పాటు అండర్–14, 17, 19 బాల, బాలికల మల్కంబ్ పోటీలు జరగనున్నాయి. ● జోగుళాంబ గద్వాల జిల్లాలో అండర్–14 బాల, బాలికల చెస్, అండర్–17 బాలుర క్రికెట్, అండర్–17 బాల, బాలికల సెపక్తక్రా, అండర్–17 బాలుర హాకీ, అండర్–14 బాల, బాలికల తైక్వాండో పోటీలు కేటాయించారు. విజయవంతంగా నిర్వహిస్తాం.... జిల్లాకు ఈ ఏడాది నాలుగు రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ టోర్నీలు కేటాయించడం సంతోషంగా ఉంది. పీడీలు, పీఈటీలు, క్రీడాసంఘాల సహకారంతో రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్ టోర్నీలను విజయవంతంగా నిర్వహిస్తాం. టోర్నీల్లో పాల్గొనే క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని విధాల సౌకర్యాలు సమకూరుస్తాం. – వేణుగోపాల్, ఎస్జీఎఫ్ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి, మహబూబ్‌నగర్ -
పాంపాండ్ల నిర్మాణంపై దృష్టిసారించాలి
తాడూరు: ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొంటున్నందున గ్రామాల్లో పాంపాండ్ల నిర్మాణంపై దృష్టిసారించాలని గ్రామీణ అభివృద్ధి శాఖ జాయింట్ కమిషనర్ శేషుకుమార్ అన్నారు. మంగళవారం ఆయన మండల కేంద్రంతోపాటు మేడిపూర్, యంగంపల్లి గ్రామాల్లో కొనసాగుతున్న వీబీజీ రాంజీ పనులను మంగళవారం ఆకస్మికంగా పరిశీలించారు. అనంతరం కూలీలతో మాట్లాడుతూ పనులకు రావాల్సిన ఆవశ్యకతను సిబ్బందికి, పనులను నిర్వహించే అంశాలకు సంబంధించి వివిధ సూచనలు చేశారు. ముఖ్యంగా భూగర్భ జలాలను పెంచే విధంగా పనులను చేపట్టాలని సూచించారు. అనంతరం మండల కేంద్రంలోని కేజీబీవీని సందర్శించి విద్యార్థులకు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ శోభారాణి, ఏపీఓ చంద్రసిద్ధార్థ, ఆయా గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. -
జోరుగా వానలు
జిల్లాకేంద్రంలో 41.3 మి.మీ.,ల వర్షపాతం నమోదు కల్వకుర్తి టౌన్: జిల్లాలో రెండురోజులుగా కురుస్తున్న వర్షాలతో ప్రజలకు ఎండల తీవ్రత నుంచి కాస్త ఉపశమనం లభించింది. కొంతకాలంగా మండుతున్న ఎండలు, ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు వాతావరణం చల్లబడటంతో ఊరట కలిగింది. మరోవైపు వర్షాలు పంటలకు ప్రయోజనం చేకూర్చాయి. వర్షాభావ పరిస్థితులతో నీటి కోసం ఎదురుచూస్తున్న పంటలకు తాజా వర్షాలు కొంతమేర ప్రాణం పోశాయి. ముఖ్యంగా వర్షాధార పంట లు సాగు చేస్తు న్న రైతులకు ఈ వానలు ఆశలు కల్పించాయి. అయితే కొన్ని ప్రాంతా ల్లో లో తట్టు రహదారులపై నీరు నిలవడంతో ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షాలు మరికొంతకాలం కొనసాగితే పంటలకు మరింత మేలు జరుగుతుందని రైతులు ఆశిస్తున్నారు. జిల్లాలో నమోదైన వర్షపాతం వివరాలు (మి.మీ.,) మండలం వర్షపాతం నాగర్‌కర్నూల్ 41.3 వెల్దండ 37.3 తిమ్మాజిపేట 30.5 వంగూరు 19.2 ఉప్పునుంతల 17.5 అచ్చంపేట 16.3 బిజినేపల్లి 13.8 కొల్లాపూర్ 11.0 -
గిరిజన ప్రజావాణికి 39 వినతులు
మన్ననూర్: ఐటీడీఏ కార్యాలయ ఆవరణలో సబ్ కలెక్టర్, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి సలోని ఛాబ్రా సమక్షంలో చెంచుల సమస్య పరిష్కారం దిశగా మంగళవారం గిరిజన ప్రజావాణి నిర్వహించారు. ఈ సందర్భంగా ఐటీడీఏ పరిధిలోని వివిధ మండలాలు, జిల్లాలకు చెందిన ఆదివాసీ చెంచులు హాజరై వ్యక్తిగత, ఆయా గ్రామాలు, గూడేలలోని సమస్యలు పరిష్కరించాలని 39 వినతిపత్రాలు అందజేశారు. అనంతరం సబ్ కలెక్టర్ మాట్లాడుతూ చెంచులకు సంబంధించి విద్య, వైద్యం, ఉపాధి, పక్కా ఇళ్లు, వ్యవసాయ భూములు, తాగునీరు, రహదారులు వంటి సమస్యలపై వినతులు ప్రధానంగా వచ్చాయన్నారు. ముఖ్యంగా నల్లమల పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న ఆదివాసీ చెంచులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించడం జరిగిందన్నారు. వాటిపై సంబంధిత అధికారులతో చర్చించి పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. ఐటీడీఏ ఆధ్వర్యంలో ప్రజావాణి నిర్వహిస్తూ.. తమ సమస్యలు అధికారులకు నేరుగా చెప్పుకొనే అవకాశం కల్పించినందుకు చెంచులు కృతజ్ఞతలు తెలిపారు. -
ప్రజావాణి ఫిర్యాదులు వేగంగా పరిష్కరించాలి
కందనూలు: ప్రజావాణిలో ప్రజల నుంచి స్వీకరించిన ఫిర్యాదులు, వినతులను అధికారులు సత్వరం పరిష్కరించాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్లు చెన్నయ్య, దేవసహాయంతో కలిసి కలెక్టర్ ప్రజల నుంచి 58 అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సీఎం ప్రజావాణి ద్వారా జిల్లాకు అందుతున్న ప్రజా వినతులను అత్యంత ప్రాధాన్యతతో పరిశీలించి, సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం కార్యాలయాల చుట్టూ తిరగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదే అన్నారు. కార్యక్రమంలో డీఆర్ఓ పాండు, కలెక్టరేట్ ఏఓ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. పోలీస్ గ్రీవెన్స్‌కు 13.. ప్రజలు నిర్భయంగా మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా నేరుగా తమ సమస్యలపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఎస్పీ సంగ్రామ్ సింగ్జీ పాటిల్ అన్నారు. ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ సెల్లో బాధితుల నుంచి 13 ఫిర్యాదులు స్వీకరించారు. ఇందులో 7 భూమి పంచాయితీ, 5 తగు న్యాయం చేయాలని, 1 భార్యాభర్తల గొడవలపై ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఆయా ఫిర్యాదుల పరిష్కారం కోసం సంబంధిత స్టేషన్లకు పంపినట్లు ఎస్పీ చెప్పారు. సింగోటం ఆలయఈఓగా జయపాల్‌రెడ్డి కొల్లాపూర్ రూరల్: మండలంలోని సింగోటం శ్రీలక్ష్మీనర్సింహస్వామి ఆలయ ఈఓగా జనుంపల్లి జయపాల్‌రెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. పాలెం వేంకటేశ్వరస్వామి ఆలయ ఈఓగా పనిచేస్తున్న ఆయనను దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ సింగోటం ఆలయ అదనపు బాధ్యతలు ఇచ్చినట్లు ఈఓ జయపాల్‌రెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు సింగోటం ఆలయ ఈఓగా ఉన్న రంగారావు పదోన్నతిపై వెళ్లారు. ఈ సందర్భంగా సోమవారం బాధ్యతలు చేపట్టిన ఈఓకు ప్రధాన అర్చకులు సంపత్‌కుమార్‌శర్మ, సింగోటం సర్పంచ్ యాదన్నగౌడ్, జూనియర్ అసిస్టెంట్ చంద్రశేఖర్, సిబ్బంది రాజు, బాలపీరు, కిష్టయ్య, భాస్కర్ అభినందనలు తెలిపారు. -
మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డికి పరామర్శ
కొల్లాపూర్: కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డిని పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పరామర్శించారు. సోమవారం నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి సింగోటంలోని వ్యవసాయ క్షేత్రంలో హర్షవర్ధన్‌రెడ్డిని కలిసి.. ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అనంతరం ఆయన తండ్రి లక్ష్మారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళుర్పించారు. అలాగే కల్వకుర్తి మార్కెట్ కమిటీ మాజీ చైర్పర్సన్ విజితారెడ్డి, తెలంగాణ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి అశోక్‌నాయక్ హర్షవర్ధన్‌రెడ్డిని పరామర్శించారు. -
సబ్సిడీ విత్తనాలు పక్కదారి పట్టిస్తే చర్యలు
కల్వకుర్తి రూరల్: రైతుల ప్రయోజనం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక భారాన్ని భరించి రైతులకు సబ్సిడీ వేరుశనగ విత్తనాలు సరఫరా చేస్తుందని, అయితే కొంతమంది రైతులు సబ్సిడీ విత్తనాలను ప్రైవేటు వ్యాపారులకు అమ్ముతున్నారని, విత్తనాలు పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు తప్పవని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి హెచ్చరించారు. సోమవారం పట్టణంలోని రైతువేదిక ఆవరణలో నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్, ఆయిల్ సీడ్స్ పథకంలో భాగంగా 1,380 మంది రైతులకు 1,180 క్వింటాళ్ల వేరుశనగ సబ్సిడీ విత్తనాలను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు. ఇదిలా ఉండగా.. కొంతమంది రైతులు కల్వకుర్తి ప్రాంతంలో విద్యుత్ కోతలు లేకుండా 24 గంటలు రైతులకు సరఫరా చేయాలని వినతిపత్రం అందించారు. స్పందించిన ఎమ్మెల్యే విద్యుత్ సరఫరా 12 గంటలు మాత్రమే వస్తుందని ప్రపంచవ్యాప్తంగా ఎల్‌నినో ప్రభావంతో సమస్యలు ఉన్నాయని చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ బాలాజీసింగ్, ఆత్మ రెవెన్యూ డివిజన్ అధ్యక్షుడు సుదర్శన్‌రెడ్డి, విజయ్‌కుమార్‌రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ షానావాజ్ ఖాన్, మార్కెట్ డైరెక్టర్ రమాకాంత్‌రెడ్డి, నాయకులు సుదర్శన్‌రెడ్డి, బాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సర్ ప్రక్రియ వేగవంతం చేయాలి
కందనూలు: జిల్లాలో సర్ ప్రక్రియలో భాగంగా నోటీసుల జారీ, హియరింగ్, క్లెయిమ్స్, అభ్యంతరాల పరిష్కారానికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు రాజకీయ పార్టీల ప్రతినిధులతోపాటు మీడియాకు వెల్లడిస్తూనే ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ హేమంత కేశవ్‌పాటిల్ అన్నారు. సోమవారం రాష్ట్ర ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి అన్ని జిల్లాల అధికారులతో నిర్వహించిన వీసీలో కలెక్టర్‌తోపాటు అదనపు కలెక్టర్లు చెన్నయ్య, సలోని ఛాబ్రా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో నోటీసుల జారీ, పెండింగ్‌లో ఉన్న నోటీసులు, హియరింగ్‌ల నిర్వహణ, ఫారం–6, 7, 8 దరఖాస్తుల పరిష్కారం తదితర అంశాలపై వివరాలు తెలుసుకున్నారు. పెండింగ్ నోటీసులను ఎలాంటి జాప్యం లేకుండా త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. బీఎల్ఓలు, బీఎల్ఏల సహాయంతో ఓటర్లకు నోటీసులు సక్రమంగా అందేలా చూడాలని, నోటీసుల జారీలో పూర్తి పారదర్శకత పాటించాలని చెప్పారు. విదేశాల్లో ఉన్నవారికి నోటీసులు జారీ అయిన సందర్భంలో నిబంధనల ప్రకారం వారి కుటుంబ సభ్యులకు నోటీసులు అందజేసి, వివరాలను నమోదు చేయాలన్నారు. అనంతరం జిల్లాలో సర్ ప్రక్రియకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల అధికారి సూచనలు, మార్గదర్శకాలను పక్కాగా అమలు చేస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. ● జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ (ఎఫ్ఆర్ఎస్)లో తప్పనిసరిగా నమోదు కావాలని కలెక్టర్ చెప్పారు. మండల, డివిజన్, క్లస్టర్, గ్రామ స్థాయిల్లో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగిని ఎఫ్ఆర్ఎస్ పరిధిలోకి తీసుకురావాలని, సిబ్బంది నమోదు ప్రక్రియను ఈ నెలలోపు పూర్తి చేయాలని ఆదేశించారు. ● సాగునీటి ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ, అటవీ భూముల పరిహారం, పునరావాసం– పునరావాస పునరుద్ధరణ (ఆర్అండ్ఆర్) పనులను వేగవంతం చేయాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. సోమవారం జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీసీలో మంత్రి పొన్నం ప్రభాకర్, సీఎస్ సంజయ్‌జాజుతో కలిసి మంత్రి ఉత్తమ్ మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లాలో భూ సేకరణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వివరించారు. -
ముమ్మరంగా మాసోత్సవ్
ఇంటింటికి తిరుగుతూ.. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకునేలా అంగన్వాడీ సిబ్బందితో ప్రతి ఇంటికి పోషణ సందేశం చేరవేసేందుకు కార్యాచరణ రూపొందించారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం ప్రతి ఐసీడీఎస్ ప్రాజెక్టుకు ప్రత్యేకంగా నిధులు విడుదల చేసింది. ఈ నిధులతో గ్రామస్థాయి నుంచి జిల్లా, రాష్ట్రస్థాయి వరకు పోషణపై చైతన్య కార్యక్రమాలు, ఆరోగ్య పరీక్షలకు క్యాంపులు నిర్వహించాల్సి ఉంటుంది. జంక్ ఫుడ్ వినియోగాన్ని తగ్గించడం, చక్కెర, ఉప్పు, నూనె వాడకంపై ప్రజల్లో అవగాహన పెంచేలా ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు చేపడుతారు. వోకల్ ఫర్ లోకల్ నినాదంతో గ్రామీణ స్థాయిలో ఉత్పత్తుల వినియోగాన్ని ప్రోత్సహించి.. ఆత్మ నిర్భరతను పెంచే కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రత్యేక కార్యక్రమాలు.. పోషణ మాసంలో భాగంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని పిల్లల ఎత్తు, బరువు, కొలతలు సేకరించడం, గర్భిణుల బరువు, భుజం కొలతలు తీసుకోవడం, పోషకాహారంపై అవగాహన కల్పించి రోగ నిరోధక శక్తి పెంచడం వంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. తక్కువ బరువు ఉన్న పిల్లలకు వైద్య పరీక్షలు, మందులు, ఉడికించిన కోడిగుడ్డు, మురుకులు, బాలామృతం ప్లస్ పంపిణీ చేయడంతోపాటు తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. పండ్లు, ఆకుకూరలు, ప్రదర్శన, చేతులను శుభ్రంగా కడుక్కునే విధానాన్ని వివరించడంతోపాటు అంగన్వాడీ కేంద్రాల్లో కిచెన్ గార్డెన్ల ఏర్పాటు, సీ విటమిన్ అధికంగా ఉండే పండ్లతోటల పెంపకం, ఆరోగ్యం కోసం యోగాసనాలపై అవగాహన కల్పిస్తారు. అచ్చంపేట/ కందనూలు: అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పోషకాహార విలువలపై పోషక మాసోత్సవాలు నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు వివిధ రకాల కార్యక్రమాల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో మహిళల ఆరోగ్యం, పోషకాహారాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహాకారంతో ఈ నెల 9న ప్రారంభమై ఈ కార్యక్రమం అక్టోబర్ 8వ తేదీ వరకు కొనసాగనుంది. గర్భిణుల ఆరోగ్య రక్షణ, రక్తహీనత నివారణ, పిల్లల ఎదుగుదల, పర్యవేక్షణ, పరిశుభ్రత వంటి అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. జిల్లాలో 20 మండలాలు ఉండగా.. నాగర్‌కర్నూల్, అచ్చంపేట, బల్మూర్, కొల్లాపూర్, కల్వకుర్తి ఐదు ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో 1,131 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. ఆయా కేంద్రాల్లో గర్భిణులు 4,483 మంది, బాలింతలు 2,813 మంది, ఆరేళ్లలోపు చిన్నారులు 40,607 మంది ఉన్నారు. 60 డిగ్రీల కోణంలో.. గర్భిణులు, బాలింతలు, కిశోర బాలికలు, చిన్నారుల భజం చుట్టు కొలతల విధానాన్ని అనురిస్తున్నారు. భుజం వృద్ధి ద్వారా గర్భిణులతోపాటు వారి గర్భంలో ఉన్న శిశువు పెరుగుదల, చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని తెలుసుకుంటున్నారు. నిర్వాహకులకు ఇందుకోసం కొలతల టేపులు సైతం అందించారు. గర్భిణులు, పిల్లల ఎడమ భుజాన్ని 60 డిగ్రీల కోణంలో వంచి తర్వాత ఎడమ చేతి చివర భాగం వరకు ఎంత పొడవు ఉందో గుర్తిస్తున్నారు. అందులో సగం భాగాన్ని గుర్తించి అక్కడ చుట్టూ కొలత తీసుకుంటున్నారు. తద్వారా ఆరోగ్య పరిస్థితిని బేరీజు వేసి పోషకాహార లోపాన్ని గుర్తిస్తారు. కిశోర బాలికల్లోనూ ఇదే విధానం అనుసరించి కొనసాగిస్తారు. ఈ నెల 9 నుంచి పోషకాహారంపై విస్తృత ప్రచారం పౌష్టికాహార లోపాన్ని నివారించేందుకు నెలరోజులపాటు కార్యక్రమం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహణ సంపూర్ణ ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తున్న టీచర్లు ఆరోగ్య పరీక్షలకు క్యాంపులు సైతం ఏర్పాటు -
రణరంగం..!
భారీగా పోలీసుల మోహరింపు జూరాల ప్రాజెక్టుకు చేరుకొనే ప్రధాన రహదారులపై పోలీసులు బారీకేడ్లు ఏర్పాటు చేశారు. అమరచింత మండలం మస్తీపురం, కిష్టంపల్లి, నందిమళ్ల ఎక్స్రోడ్లతోపాటు ఆత్మకూర్ మండలం మూలమళ్ల శివారు వద్ద బారీకేడ్లు ఏర్పాటు చేసి భారీగా పోలీసులను మోహరింపజేశారు. దీంతో ప్రాజెక్టు రహదారిపై నుంచి ఇతర గ్రామాలకు వెళ్లే వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ● డీఎస్పీ పర్యవేక్షణలో ఇద్దరు సీఐలు, 10 మంది ఎస్ఐలు పోలీసులు, స్పెషల్ బెటాలియన్‌తో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. పరిస్థితులను సమీక్షించడానికి వనపర్తి ఎస్పీ సునీతరెడ్డి జూరాల ఎడమ కాల్వ వద్దకు చేరుకున్నారు. సీఐ శివకుమార్‌ను అడిగి ఎస్పీ వివరాలు తెలుసుకున్నారు. అమరచింత/ గద్వాల క్రైం/ధరూరు: రోజురోజుకూ జూరాల ప్రాజెక్టు వద్ద జల వివాదం ముదురుతోంది. ఆయకట్టుకు సాగునీరు విడుదల చేయాలని రైతులు రెండు, మూడు రోజులుగా నిరసనలు, ధర్నాలు చేస్తుండగా.. వీరికి వివిధ పార్టీల నాయకులు తోడు కావడంతో ఆందోళనలు తీవ్రరూపం దాలుస్తున్నాయి. ఈ క్రమంలో సోమవారం బీఆర్ఎస్ ఇచ్చిన పిలుపుమేరకు ఆయకట్టు రైతులు, వివిధ ప్రాంతాల నాయకులు పెద్దఎత్తున జూరాల ప్రాజెక్టుకు చేరుకున్నారు. బీఆర్ఎస్ మాజీమంత్రులు లక్ష్మారెడ్డి, నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌లను హౌస్ అరెస్టు చేయగా.. పోలీసుల నుంచి తప్పించుకుని జూరాల ప్రాజెక్టుకు చేరుకున్న మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డిని నందిమళ్ల క్యాంపు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆందోళనకు వచ్చిన రైతులు ఒక్కసారిగా పోలీసులపై విరుచుకుపడటంతో తోపులాటలు చోటుచేసుకొని రణరంగాన్ని తలపించింది. పోలీసులు మాజీ ఎమ్మెల్యేను జీపులో ఎక్కించుకుని వెళ్తుండగా రైతులు, బీఆర్ఎస్ నాయకులు రహదారికి అడ్డంగా రాళ్లు, ముళ్లకంచె వేయడంతో పోలీసులు స్వల్ప లాఠీచార్జి చేసి.. చిట్టెంను కొత్తకోట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పోలీసులతో రైతుల వాగ్వాదం.. ఆత్మకూర్, అమరచింత మండలాల నుంచి వచ్చిన రైతులతో నందిమళ్ల క్యాంపు కాలనీ కిక్కిరిసిపోయింది. పంటలకు సాగునీరు ఇస్తే ఇక్కడికి ఎందుకు వస్తామని, మీతో గొడవెందుకు పెట్టుకుంటామంటూ జూరాల ఆయకట్టు రైతులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో నాలుగు గంటల పాటు రైతులు, పోలీసు మధ్య తీవ్రస్థాయిలో వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో పోలీసుల కళ్లుగప్పి జూరాల సమాంతర కాల్వ వరకు రైతులు చేరుకోవడంతో అక్కడే ఉన్న మరికొందరు పోలీసు బలగాలు వారిని అడ్డుకోగా తోపులాటలు జరిగాయి. ఉదయం 6 గంటల నుంచే ప్రాజెక్టుపై ట్రాఫిక్ ఆంక్షలను పెట్టడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జూరాల వద్ద ముదురుతున్న సాగునీటి వివాదం బీఆర్ఎస్ పిలుపుతో తరలివచ్చిన అన్నదాతలు ఎక్కడికక్కడే బీఆర్ఎస్ నాయకుల అరెస్టు రైతులు, పోలీసుల మధ్య తోపులాట.. ఉద్రిక్తం ప్రాజెక్టు వెళ్లే దారుల చుట్టూ పోలీసుల పహారా -
ప్రైవేట్ వైద్యుల నిర్లక్ష్యంతో శిశువు మృతి
కందనూలు: ప్రైవేటు వైద్యుల నిర్లక్ష్యంతో తల్లికడుపులోనే శిశువు మృతిచెందిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం..జిల్లా కేంద్రంలోని శ్రీపురం రోడ్డులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో తాడూరు మండలం ఇంద్రకల్ గ్రామానికి చెందిన జగన్‌తో కలిసి భార్య పార్వతి మూడో కాన్పునకు ఆస్పత్రిలో వైద్యం తీసుకుంటుంది. ప్రసవ సమయం దగ్గర పడటంతో టిఫా స్కానింగ్, ఇతర వైద్యపరీక్షలు నిర్వహించి రిపోర్టుల ఆధారంగా అంతా బాగానే ఉందని వైద్యులు, నర్సు తెలిపారు. అయితే ఆదివారం ఆస్పత్రిలో చేరిన పార్వతి.. సోమవారం ఉదయం ఆపరేషన్ అనంతరం గర్భంలోనే శిశువు మృతిచెందినట్లు వైద్యులు తెలిపారని కుటుంబ సభ్యుల ఆవేదన వ్యక్తం చేశారు. గర్భిణికి డయాబెటిస్ ఉన్న విషయం ముందుగానే తెలిసినా.. సరైన వైద్యం అందించలేదని, వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ బాబు మృతిచెందాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు అంతటి కాశన్న ఆధ్వర్యంలో ఆస్పత్రి ఎదుట ఆందోళన చేశారు. ప్రైవేటు ఆస్పత్రులపై అధికారుల పర్యవేక్షణ పెంచాలని, ఈ ఘటనపై అధికారులు పూర్తిస్థాయి విచారణ జరపి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. -
‘కురుమూర్తి’ ఘాట్ రోడ్డును.. అందుబాటులోకి తెస్తాం
దేవరకద్ర/ చిన్నచింతకుంట: కురుమూర్తిస్వామి ఆలయం వద్ద చేపట్టిన ఎలివేటెడ్ కారిడార్ ఘాట్ రోడ్డు నిర్మాణం త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువస్తామని రాష్ట్ర ఆర్అండ్బీ, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఆదివారం దేవరకద్ర మండలం మీనుగోనిపల్లి వద్ద నియోజకవర్గంలో రూ.153 కోట్లతో చేపడుతున్న పలు రహదారులకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితోపాటు రాష్ట్ర పశు సంవర్ధక, మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి, కలెక్టర్ ఖుష్బూగుప్తా, ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి, ఎస్పీ జానకితో కలిసి భూమిపూజ చేశారు. అనంతరం కురుమూర్తిస్వామి ఆలయం వద్ద కొనసాగుతున్న ఘాట్ రోడ్డు నిర్మాణం పనుల రోడ్డు మ్యాపును పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ కురుమూర్తిస్వామి ఆలయం వద్ద భక్తుల సౌకర్యార్థం రూ.110 కోట్లతో ఎలివేటెడ్ కారిడార్ ఘాట్ రోడ్డు నిర్మాణం చేపట్టామని, ఈ పనులను త్వరితగతిన పూర్తి చేసి 2027 జూలై నాటికి అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి -
కృష్ణా.. తోడేస్తుండ్రు
అచ్చంపేట: ఇటు తెలంగాణ, అటు ఏపీ రాష్ట్రాల్లో లక్షలాది ఎకరాలకు సాగునీరు, కోట్లాది మందికి తాగునీటిని అందించడంతో నిరంతర విద్యుత్ సరఫరాకు దోహదపడే శ్రీశైలం జలాశయంలో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ఈ ఏడాది ఎల్‌నివో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడమే ఇందుకు కారణం. ఎగువ నుంచి ఆశించిన స్థాయిలో వరద ప్రవాహం లేకపోవడంతోపాటు.. వచ్చిన కొద్దిపాటి నీటిని రెండు తెలుగు రాష్ట్రాలు విచ్చలవిడిగా తోడేస్తుండటంతో నీటి నిల్వలు డెడ్ స్టోరేజ్ దశకు చేరుకుంటున్నాయి. ప్రస్తుతం నిండా నీటితో కళకళలాడిన జలాశయం.. నీటిమట్టం వేగంగా క్షీణించి 861.10 అడుగులకు చేరింది. ప్రస్తుతం ఎగువనున్న ఆల్మటి, నారాయణపూర్, జూరాల ప్రాజెక్టుల నుంచి వరద ప్రవాహం లేకపోవడంతో శ్రీశైలంలో ఎండీడీఎల్ 834 అడుగుల చేరువలోకి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో తాగునీటికే ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. 2002– 03 సంవత్సరం నుంచి కృష్ణానదికి అతి తక్కువ నీటి ప్రవాహాలు వచ్చిన నాలుగో సందర్భం ఇప్పుడు మళ్లీ వచ్చింది. శ్రీశైలం జలాశయంలో ప్రస్తుత నీటిమట్టం ఇలా.. సంవత్సరం వచ్చిన వరద (టీఎంసీలు) 2002– 03 221.781 2003– 04 157.047 2012– 13 243.852 2015– 16 73.600 2023– 24 140.840 2026– 27 215.11 (సెప్టెంబరు 17 వరకు) 10 టీఎంసీలు వాడుకున్నాం.. శ్రీశైలానికి వరదలు వచ్చిన సమయంలో ఈ ఏడాది ఇప్పటి వరకు తాగు, సాగునీటి అవసరాల కోసం 10 టీఎంసీల నీటిని ఎత్తిపోశాం. మూడు మోటార్ల ద్వారా రోజుకు 800 నుంచి 2,400 క్యూసెక్కుల నీటిని ఎల్లూరు, జొన్నలబొగుడ, గుడిపల్లి రిజర్వాయర్లకు తరలించాం. రిజర్వాయర్లతోపాటు డిస్ట్రిబ్యూటరీ కాల్వల ద్వారా నీటిని విడుదల చేస్తున్నాం. – అమర్‌సింగ్, ఈఈ, సాగునీటి పారుదలశాఖ విచ్చలవిడిగా వాడకం.. కృష్ణానది పరివాహకంలో కురిసిన వర్షాలతో మహారాష్ట్రలోని ఉజ్జయిని, కర్ణాటకలోని ఆల్మటి, నారాయణపూర్ జలాశయాలు నిండిన తర్వాత విడుదల చేసిన నీళ్లు గత జూలై చివరి నాటికి జూరాల మీదుగా శ్రీశైలానికి చేరుకున్నాయి. దీంతో వానాకాలం ప్రారంభానికి ముందు శ్రీశైలంలో 39 టీఎంసీల నీరు నిల్వ ఉండగా.. ఆగస్టు 12 నాటికి ఎగువ నుంచి 185.5 టీఎంసీల నీరు వచ్చింది. దీంతో శ్రీశైలంలో 215.11 టీఎంసీల నీరు చేరగా.. తెలంగాణ కేఎల్ఐ, ఏపీ పోతిరెడ్డిపాడు, మల్యాల నుంచి హంద్రీనీవా సుజల స్రవంతి (హెచ్ఎన్ఎస్), వెలుగోడు, ముచ్చుమర్రి పథకాలకు వాడుకుంటోంది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలు శ్రీశైలం నుంచి ఇప్పటి వరకు 145 టీఎంసీల నీటిని వాడుకున్నట్లు శ్రీశైలం గేజింగ్ అధికారుల లెక్కలు చెబుతున్నాయి. మరోవైపు రెండు రాష్ట్రాలు పోటాపోటీగా విద్యుదుత్పత్తి ద్వారా పెద్దఎత్తున నీటిని దిగువనున్న నాగార్జునసాగర్‌కు విడుదల చేశాయి. తెలంగాణ శ్రీశైలం ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రం ద్వారా తెలంగాణ జెన్కో 446.13 మి.యూ., ఏపీ 72.62 మి.యూ., విద్యుదుత్పత్తి చేసింది. నీటి కేటాయింపులు లేకుండానే రెండు రాష్ట్రాలు నీళ్లు వాడుకుంటున్నాయి. ప్రస్తుతానికి వచ్చిన వరదలతో కాస్త ఉపశమనం పొందినా భవిష్యత్ పరిస్థితులపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. శ్రీశైలంలో అతి తక్కువ నీటిమట్టం ప్రస్తుతం జలాశయంలో 861.10 అడుగుల 109.5400 టీఎంసీల నీరు డేంజర్ బెల్స్.. ఎండీడీఎల్‌కు కేవలం 79.5400 అడుగులే ఇలాగే కొనసాగితే సాగు, తాగునీటిపై తీవ్ర ప్రభావం వచ్చే జూన్ వరకు తాగునీటికే ప్రాధాన్యం అంటున్న ప్రభుత్వం -
గిరిజనులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి
కొల్లాపూర్: ఎన్నికలకు ముందు చేవెళ్ల సభలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన గిరిజన డిక్లరేషన్ అమలుచేయాలని తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం.ధర్మానాయక్ డిమాండ్ చేశారు. కొల్లాపూర్‌లో ఆదివారం నిర్వహించిన సంఘం రెండో జిల్లా మహాసభలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గిరిజనులకు ఇచ్చిన హామీలను అమలుచేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని ఆరోపించారు. గిరిజన రైతులకు వెంటనే కరువు ప్యాకేజీని ప్రకటించడంతో పాటు ప్రైవేటు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. మైదాన ప్రాంతాల్లో కూడా గిరిజన ఐటీడీఏలను ఏర్పాటు చేయాలన్నారు. కార్పొరేట్ శక్తులకు అటవీ ప్రాంతాలను అప్పజెప్పేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్రిస్తున్నాయని.. దీన్ని గిరిజనులు తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటించారు. జిల్లా అధ్యక్షుడిగా కె.రవినాయక్, ప్రధాన కార్యదర్శిగా ఎస్.అశోక్‌నాయక్, ఉపాధ్యక్షులుగా శ్రీనునాయక్, లక్పతి నాయక్, సహాయ కార్యదర్శులుగా శివ ప్రచండ, తిరుపతి నాయక్, రాజగోపాల్, ఎల్.వెంకటేశ్, వి.గోపాల్, పత్యానాయక్, మల్లేష్, దశరథం, కె.శంకర్‌నాయక్, గౌరవాధ్యక్షుడిగా ఎల్.దేశ్యానాయక్, గౌరవ సలహాదారుగా ఆర్.పాండునాయక్‌తో పాటు కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. -
కరువు జిల్లాగాప్రకటించాలి : సీపీఎం
కల్వకుర్తి రూరల్: తీవ్ర వర్షాభావం పరిస్థితులతో పంటలు ఎండిపోతున్నాయని.. నాగర్‌కర్నూల్‌ను కరువు జిల్లాగా ప్రకటించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్ధం పర్వతాలు డిమాండ్ చేశారు. ఆదివారం కల్వకుర్తి పట్టణంలోని సీపీఎం కార్యాలయంలో ఏర్పాటుచేసిన పార్టీ డివిజన్ సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. వర్షాలు లేక రైతులు దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం జిల్లాకు రూ. 500కోట్ల కరువు సాయం కేటాయించాలని కోరారు. వ్యవసాయానికి నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయడంతో పాటు పెండింగ్ ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కరువు సహాయక చర్యలు చేపట్టడంతో పాటు ఎండిపోయిన పంటలను సర్వే చేసి, బ్యాంకు రుణాలను మాఫీ చేయాలని కోరారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు బి.ఆంజనేయులు, సి.ఆంజనేయులు, ఏపీ మల్లయ్య, పరశురాములు, బాలస్వామి, తారాసింగ్, శివరాములు, చెన్నయ్య ఉన్నారు. విద్యాభివృద్ధికి కృషి చేయాలి తెలకపల్లి: ప్రతి మండలంలో మూడు తెలంగాణ పబ్లిక్ పాఠశాలలను ఏర్పాటు చేయాలని బీసీటీఏ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు భాస్కర్, ప్రధాన కార్యదర్శి వెంకటయ్య, ఉపాధ్యక్షులు సుబ్బయ్య, మధుసూదన్, కృష్ణప్రసాద్ అన్నారు. ఆదివారం వారు మాట్లాడుతూ ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ పాఠశాలలను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లోని పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్య, ఆంగ్లభాష నైపుణ్యాలు, ఇతర ఆధునిక విద్య సదుపాయాలు అందించాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులు కల్పించాలన్నారు. సమాజ సేవలో భాగస్వాములు కావాలి కందనూలు: యువత సమాజ సేవలో భాగస్వాములు కావాలని అడిషనల్ ఎస్పీ వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో కొల్లాపూర్ ఎక్స్‌రోడ్ అసోసియేషన్, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరానికి ఆయన హాజరై మాట్లాడారు. రక్తదానంతో ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడవచ్చన్నారు. యువత రక్తదానంపై మరింత అవగాహన పెంచుకొని స్వచ్ఛందంగా ముందుకు రావాలన్నారు. కొల్లాపూర్ ఎక్స్‌రోడ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది వినాయక మండపం వద్ద రక్తదాన శిబిరం, నిత్యాన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. శిబిరంలో మొత్తం 38 యూనిట్ల రక్తాన్ని సేకరించినట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ సాయిబాబు, సభ్యులు రమేశ్‌రెడ్డి, అసోసియేషన్ ప్రతినిధులు శివశంకర్‌రెడ్డి, వ రుణ్, సందీప్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, అరుణ్ సాయి, నర్సింహ, అమరేందర్‌రెడ్డి పాల్గొన్నారు. మైసమ్మ జాతరకు తగ్గిన భక్తులు పెద్దకొత్తపల్లి: మండలంలోని నాయినిపల్లి మైసమ్మ జాతరకు ఆదివారం భక్తులు తక్కువ సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. తెల్లవారుజామున కురిసిన వర్షానికి రైతులు, వ్యవసాయ కూలీలు వ్యవసాయ పనుల్లో నిమగ్నం కావడంతో భక్తులు తక్కువగా వచ్చారు. దీంతోపాటు వినాయకుడి నిమజ్జనాలు కూడా ఉండటంతో కేవలం 3 వేల మంది భక్తులు మాత్రమే అమ్మవారిని దర్శించుకొని, మొక్కులు తీర్చుకున్నట్లు ఎండోమెంట్ అధికారులు పేర్కొన్నారు. భక్తుల సంఖ్య తక్కువగా ఉండటంతో ఆర్టీసీ బస్సులు ప్రయాణికులు లేక ఖాళీగా వెళ్లడం, జాతరలో ఏర్పాటు చేసిన గుడారాలకు గిరాకీ లేకపోవడంతో దుకాణాలు వెలవెల పోయాయి. -
మా మాటలు వక్రీకరించడం సరికాదు
కందనూలు: బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ తమ మాటలను వక్రీకరించి మాట్లాడటం తగదని అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి, తాను అసెంబ్లీలో నియోజకవర్గ అంశాలపై జీరో అవర్‌లో మాట్లాడటం జరిగిందన్నారు. అయితే అచ్చంపేట నియోజకవర్గంలో మిషన్ భగీరథ నీరు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తాను మాట్లాడినట్లు.. రైతుల పంటలకు కరెంటు ఇవ్వాలని ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డి అన్నారని ఇటీవల పెబ్బేరులో కేటీఆర్ మాట్లాడటం సరైంది కాదన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో మిషన్ భగీరథ పేరుతో రూ.వేల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. ప్రజలను తప్పుదోవ పట్టించే రాజకీయ విమర్శలు కాకుండా.. బీఆర్ఎస్ పాలనలో ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేకపోయారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారం లేకపోయేసరికి ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో మాట్లాడుతున్న మాటలను ప్రజలందరూ గమనిస్తున్నారని.. సమయం వచ్చినప్పుడు వారు తగిన బుద్ధి చెబుతారన్నారు. సమావేశంలో మున్సిపల్ చెర్మన్ తీగల సునేంద్ర, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు జక్కరాజు, అధికార ప్రతినిధి కృష్ణారెడ్డి, కల్వకుర్తి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు విజయకుమార్‌రెడ్డి, వంకేశ్వరం నిరంజన్ ఉన్నారు. -
జల జగడం!
పటిష్ట బందోబస్తు.. జూరాల ప్రాజెక్టు ప్రధాన ఎడమ కాల్వ హెడ్ రెగ్యులేటరీ వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు ముందస్తుగా పోలీసు బలగాలతో పహారా నిర్వహిస్తున్నారు. రైతులు ఆందోళనకు వస్తే వారిని నివారించేందుకు వీలుగా బలగాలను సిద్ధంగా ఉంచారు. ప్రస్తుతం రైతుల ధర్నాలతో జూరాల ప్రాజెక్టు ధర్నా చౌక్‌గా మారింది. అమరచింత: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు కాల్వలకు సాగునీటి సరఫరా నిలిపివేయడంతో అటు ఆయకట్టు రైతులు, ఇటు ప్రాజెక్టు అధికారుల మధ్య జల జగడం మొదలైంది. ఆయకట్టుకు నీటిని విడుదల చేయాలంటూ ప్రాజెక్టుపై నాలుగు రోజులుగా రైతులు ఆందోళనలు చేస్తున్నా.. ప్రాజెక్టు అధికారులు మాత్రం సాగునీరు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇరువర్గాల మధ్య మాటల యుద్ధంతో పాటు ప్రాజెక్టుపై ఆందోళన కార్యక్రమాలు ఊపందుకున్నాయి. రైతులు ఏకంగా అధికారుల ఎదుటే ప్రధాన ఎడమ కాల్వ హెడ్ రెగ్యులేటరీ షట్టర్ల తాళాలు పగులగొట్టి కాల్వకు సాగునీటిని విడుదల చేయడంతో సమస్య తీవ్రమైంది. పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో ప్రభుత్వం ప్రధాన ఎడమకాల్వ హెడ్ రెగ్యులేటరీ వద్ద పోలీసు బెటాలియన్‌తో పహార ఏర్పాటు చేసి, కాల్వకు సాగునీటి సరఫరాను నిలిపివేసింది. వారాబందీ విధానంలో సాగునీరు అందిస్తారని ఆశించిన రైతుల ఆశలను ప్రాజెక్టు అధికారులు పూర్తిగా తుడిచేయడంతో పెట్టిన పెట్టుబడి కూడా చేతికందదని రైతులు ఆందోళనలను తీవ్రతరం చేసేందుకు సిద్ధమయ్యారు. రైతులకు మద్దతుగా రాజకీయ పార్టీలు.. రైతుల ఆందోళనకు బీజేపీ, సీపీఎం నాయకులు మద్దతు పలుకుతూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నాయి. వానాకాలం ఆరంభంలోనే ఆయకట్టుకు క్రాప్ హాలిడే ఎందుకు ప్రకటించలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఆరుతడి పంటలు సాగుచేయాలంటూ గ్రామాల్లో సమావేశాలు నిర్వహించి, అవగాహన కల్పించిన ప్రాజెక్టు అధికారులు.. ఇప్పుడు ఆయకట్టుకు ఎందుకు సాగునీరు వదలడం లేదని నిలదీస్తున్నారు. జూరాల కాల్వలకు నీటి విడుదలపై స్పష్టత కరువు ఆందోళనలు, రాస్తారోకోలతో వేడెక్కిన వివాదం తాగునీటికే ప్రాధాన్యమంటున్న ప్రభుత్వం -
పాలమూరుకు తప్పని సాగునీటి గోస
కోస్గి: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్లయి రెండు ప్రభుత్వాలు ఏర్పడినా.. ఉమ్మడి పాలమూరు జిల్లాలో నేటికీ సాగునీటి గోస తప్పలేదని తెలంగాణ రక్షణసేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. రాష్ట్ర ప్రజలకు ఉచిత విద్య, వైద్యం, ఉపాధి, వ్యవసాయం, సామాజిక న్యాయం అందించడమే ప్రధాన లక్ష్యమనే నినాదంతో ఆదివారం కోస్గిలో నిర్వహించిన పాంచజన్య సంకల్ప సభలో ఆమె మాట్లాడారు. గతంలో కొడంగల్ గడ్డపైకి వచ్చి చంద్రబాబు సీఎం అయ్యారు.. రేవంత్‌రెడ్డి వచ్చి సీఎం అయ్యారు.. తాను సైతం కొడంగల్ ప్రజల ఆశీర్వాదంతో కోస్గికి వచ్చానని.. టీఆర్ఎస్కు అధికారమిచ్చి సీఎం చేయాలని కోరారు. తాను పార్టీ పెట్టడం గిట్టని కొందరు బీఆర్ఎస్ వదిలిన బాణం అని, మరికొందరు రేవంత్ వదిలిన బాణమని, తలకాయలేని మరికొందరు బీజేపీ వదిలిన బాణమంటూ విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాను ఎవరు వదిలిన బాణం కాదని.. నేటికీ విద్య, వైద్యానికి నోచుకోని బహుజనులు వదిలిన బాణన్నని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా సీఎం రేవంత్‌రెడ్డి తప్పించుకు తిరుగుతున్నారని.. సీఎం సొంత నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్లకు కమీషన్లు వసూలు చేస్తున్నారని, ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి గెలిచిన 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇసుక, మట్టి దందాల్లో బిజీగా ఉన్నారని ఆరోపించారు. అందరూ ఆశీర్వదిస్తే తెలంగాణలో సైతం మాతృస్వామ్య పాలన చేపడతామని చెప్పారు. కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి రాజ ప్రభాకర్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ● నేను బహుజనుల బాణాన్ని.. ● కోస్గి పాంచజన్య సంకల్పసభలో టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కవిత -
బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు
కందనూలు: బాధితులకు సకాలంలో న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి రమాకాంత్ అన్నారు. శనివారం జిల్లా కోర్టు కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా ప్రధాన న్యాయమూర్తి రమాకాంత్, ఎస్పీ సంగ్రామ్ సింగ్జీ పాటిల్‌తో కలిసి కోర్టు కోఆర్డినేషన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లావ్యాప్తంగా ఉన్న వివిధ పోలీస్స్టేషన్లలో నమోదైన కేసులు, కోర్టులో విచారణలో ఉన్న కేసుల పురోగతి, కోర్టు వ్యవహారాలపై చర్చించారు. అనంతరం ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ మహిళలపై అక్రమాలు, సైబర్ నేరాలు తీవ్రమైన నేరాల్లో శాసీ్త్రయ ఫోరెన్సిక్ సాక్ష్యాధారాలతో నిర్ణీత గడువులోగా కోర్టులో చార్జిషీట్ సమర్పించాలని, తద్వారా నేరస్తులకు తగిన శిక్ష పడేలా పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, కోర్టు లైజన్ ఆఫీసర్లు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన విచారణ పూర్తి చేసి బాధితులకు సకాలంలో న్యాయం అందేలా అధికారులు, సిబ్బంది కృషి చేయాలని, నిందితులపై ఉన్న నాన్ బెయిలబుల్ వారెంట్లను వేగంగా అమలు చేసి, సమయానికి కోర్టులో హాజరుపరచాలని ఆదేశించారు. సమావేశంలో ఏఎస్పీ వెంకటేశ్వర్లు, డీఎస్పీలు శ్రీనివాసులు, సాయి వెంకట్‌రెడ్డి, సీఐలు అశోక్‌రెడ్డి, శంకర్, ఎస్ఐలు వెంకట్‌రెడ్డి, రమేష్, రాములు, అభిషేక్‌రెడ్డి, కోర్టు డ్యూటీ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. భాషా నైపుణ్యాలు పెంపొందించాలి కందనూలు: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు విద్యాబోధనతోపాటు వ్యక్తిత్వ వికాసం, మానవీయ విలువలను పెంపొందించేలా ఉపాధ్యాయులు కృషిచేయాలని ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఉపాధ్యాయ పండిత పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన హిందీ దినోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులకు పాఠ్యాంశాలను బోధించడంతోపాటు వారిలో మంచి ఆలోచనా విధానం, క్రమశిక్షణ, నైతిక విలువలు, సామాజిక బాధ్యతను పెంపొందించేలా ఉపాధ్యాయులు మార్గనిర్దేశం చేయాలన్నారు. విద్యార్థుల్లో భాషపై ఆసక్తి, అభిరుచి పెంపొందించేలా బోధనా పద్ధతులను మరింత సరళంగా, ఆకర్షణీయంగా రూపొందించాలని సూచించారు. కేవలం మార్కుల సాధనకే విద్య పరిమితం కాకుండా.. మంచి విలువలు, బాధ్యతాయుతమైన ఆలోచన, సామాజిక స్పృహ కలిగిన పౌరులుగా విద్యార్థులను తీర్చిదిద్దాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సునేంద్ర, మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు, డీఈఓ రమేష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. శనేశ్వరుడికి పూజలు కందనూలు: బిజినేపల్లి మండలంలోని నందివడ్డేమాన్ గ్రామంలో వెలసిన శనేశ్వరస్వామికి భక్తులచేత శని గ్రహదోష నివారణకు స్వామివారికి తిలతైలాభిషేక పూజలు నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు గవ్వమఠం విశ్వనాథశాస్త్రి తెలిపారు. ప్రతిఒక్కరు జన్మ, గోచార రీత్యా శనిగ్రహ దోష నివారణకు స్వామివారిని శక్తిమేరకు పూజించాలన్నారు. అనంతరం భక్తులకు వేద ఆశీర్వచనం. తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆలయ ఆలయ చైర్మన్ గోపాల్‌రావు, సర్పంచ్ సుగుణమ్మ తదితరులు పాల్గొన్నారు. -
శాసీ్త్రయ విధానాలతో అధిక లాభాలు
● కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ ● పాలెం కృషి విజ్ఞాన కేంద్రంలో కిసాన్ మేళా విజయవంతం కందనూలు: సాంకేతికతను అందిపుచ్చుకొని శాసీ్త్రయ విధానంలో పంటలు సాగు చేస్తే ఖర్చులు తగ్గి.. అధిక లాభాలు ఆర్జించవచ్చని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అన్నారు. శనివారం పాలెంలోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం కృషి విజ్ఞాన కేంద్రంలో జిల్లా వ్యవసాయ శాఖ, వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ ఆత్మ ఆధ్వర్యంలో నిర్వహించిన కిసాన్ మేళా, రైతు, శాస్త్రవేత్తల సమావేశంలో వ్యవసాయ ప్రదర్శనను రాష్ట్ర రైతు కమిషన్ సభ్యుడు ఏవీఎన్ రెడ్డితో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వ్యవసాయ ప్రదర్శనను వారు పరిశీలించారు. వివిధ పంటల సాగు విధానాలు, ఆధునిక వ్యవసాయ పద్ధతులు, నూతన సాంకేతిక పరిజ్ఞానం, వ్యవసాయ యంత్ర పరికరాలు, పంటల సంరక్షణ చర్యలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం రైతులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ భూమి స్వభావం, నీటి లభ్యత, వాతావరణ పరిస్థితులు, మార్కెట్ అవసరాలకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. పంటల సాగుకు ముందు తప్పనిసరిగా నేల పరీక్షలు చేయించుకొని భూసారానికి అనుగుణంగా ఎరువులను వినియోగించాలని చెప్పారు. ప్రస్తుతం జిల్లాలో నెలకొన్న తీవ్రమైన వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రానున్న రబీ సీజన్లో రైతులు వరి సాగుకు దూరంగా ఉండాలని సూచించారు. తక్కువ నీటితో సాగు చేసే పంటలు, పంటల వైవిధ్యీకరణపై వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తల సలహాలు తీసుకోవాలని కోరారు. అవసరానికి మించి రసాయన ఎరువులు, పురుగు మందులు వినియోగించడం వల్ల సాగు ఖర్చులు పెరగడంతోపాటు నేల సారవంతం దెబ్బతినే అవకాశం ఉందన్నారు. శాసీ్త్రయ పద్ధతుల్లో ఎరువులు, పురుగు మందులను వినియోగిస్తూ సమగ్ర సస్యరక్షణ విధానాలను పాటించాలన్నారు. వ్యవసాయంలో యాంత్రీకరణకు ప్రాధాన్యత ఇవ్వడంతోపాటు సూక్ష్మ సాగునీటి, ఆధునిక నీటి యాజమాన్య పద్ధతులు, సేంద్రియ, ప్రకృతి వ్యవసాయ విధానాలపై రైతులు అవగాహన పెంపొందించుకోవాలని, వాతావరణ మార్పులకు అనుగుణంగా పంటలు ఎంపిక చేసుకోవాలని సూచించారు. రైతులు కేవలం పంటల ఉత్పత్తిపైనే కాకుండా నాణ్యత, నిల్వ, ప్రాసెసింగ్, మార్కెటింగ్ అంశాలపై కూడా దృష్టిసారించాలని చెప్పారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను సాగు చేయడం, రైతు సమూహాలుగా ఏర్పడి ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకోవడం, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చని వివరించారు. -
మా నీళ్లు మాకే..
● పీఆర్ఎల్ఐ నుంచి డిండికి నీరు తరలించొద్దు.. ● ఈ లిఫ్ట్‌ను ఒప్పుకొనేది లేదు.. మలి దశ తెలంగాణ ఉద్యమస్ఫూర్తితో పోరాటం ● ఉమ్మడి జిల్లా పెండింగ్ ప్రాజెక్ట్‌ల సాధన జేఏసీ చైర్మన్ రాజేందర్‌రెడ్డి ● జేఏసీ ఆధ్వర్యంలో ఉల్పర నుంచి గొట్టిముక్కల వరకు రిజర్వాయర్ల సందర్శన సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉమ్మడి జిల్లాకు అన్యాయం చేస్తే.. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పాలమూరు రైతుల పట్ల వివక్ష చూపుతోంది. నల్లగొండ లీడర్లు చెప్పిన మాటలు విని ఈ ప్రాంతానికి అన్యాయం చేస్తున్నారు. డిండి లిఫ్ట్ ఇరిగేషన్‌ను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోం.. పాలమూరు నీటిని తరలించే కుట్రను ఇక సహించేది లేదు.. మా నీళ్లు మాకే కావాలి. ఈ మేరకు తెలంగాణ మలిదశ ఉద్యమ స్ఫూర్తితో పోరాడుతాం.’ అని ఉమ్మడి జిల్లా పెండింగ్ ప్రాజెక్ట్‌ల సాధన జేఏసీ చైర్మన్ రాజేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. యూఎంపీపీఎస్ జేఏసీ ప్రతినిధులు శనివారం మీడియాతో కలిసి డిండి లిఫ్ట్ ఇరిగేషన్లో భాగమైన ఉల్పర నుంచి గొట్టిముక్కల రిజర్వాయర్ వరకు జరుగుతున్న పనులను సందర్శించారు. అనంతరం చారకొండ వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజేందర్‌రెడ్డి మాట్లాడారు.జూరాల ప్రాజెక్ట్ నుంచి పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్‌కు నీటిని తీసుకొని ఉంటే సమస్య ఉండేది కాదన్నారు. శ్రీశైలం సోర్స్ ఆధారంగా కేసీఆర్ డిజైన్ మార్పు చేయడంతోనే సమస్య ఉత్పన్నమైందన్నారు. తొమ్మిదన్నరేళ్లు అధికారంలో ఉండి ప్రాజెక్ట్ పూర్తి చేయలేదని.. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ ప్రాజెక్ట్ పట్ల నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. అంతేకాదు ఈ జిల్లాలో ఒక్క పెండింగ్ ప్రాజెక్ట్ కూడా పూర్తి చేయకుండా.. డిండి ప్రాజెక్ట్ పనులు యుద్ధప్రాతిపదికన చేపట్టడం అన్యాయమని.. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా రైతాంగానికి నష్టం వాటిల్లే డిండి లిఫ్ట్ ఇరిగేషన్‌ను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకొనేది లేదన్నారు. సొంత జిల్లాకు చెందిన సీఎం రేవంత్‌రెడ్డి దీనిపై స్పందించాలన్నారు. ఏపీలోని రాయలసీమలో చేపట్టిన పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నిర్మాణంతో పాలమూరుకు ఎంత అన్యాయం జరిగిందో.. నల్లగొండ జిల్లా కోసం చేపడుతున్న డిండి లిఫ్ట్ వల్ల కూడా జిల్లాకు అంతే అన్యాయం జరుగుతుందని పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవాచారి తెలిపారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు సాగు నీటి రంగంలో అన్యాయం చేశారని 2023 ఎన్నికల్లో ఇక్కడి ప్రజలు బీఆర్ఎస్ను ఓడించి.. ఉమ్మడి జిల్లా నుంచి 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపించారన్నారు. కానీ ఈ ఎమ్మెల్యేలు డిండిపై, పాలమూరు రైతాంగానికి కృష్ణా జలాలను అందించే విషయంలో పట్టింపులేని ధోరణితో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో డిండికి నీటి తరలింపుపై అడ్డుకున్నామని వివరించారు. అప్పటి నాయకుడు, ఇప్పటి మంత్రి జూపల్లి, కాంగ్రెస్ నేతలు డిండిని వ్యతిరేకిస్తూ లేఖ రాశారని గుర్తు చేశారు. ఇప్పుడు వారే నల్లగొండ లీడర్ల చేతిలో దాసోహమయ్యారని.. మీరు రాజీనామా చేస్తే ప్రభుత్వం కూలిపోతుందని.. ఈ బలం ఉన్నా ఇక్కడి రైతుల పక్షాన ఎందుకు పోరాటం చేయడం లేదని ప్రశ్నించారు. మంత్రి జూపల్లి ఇప్పటికై నా డిండి ప్రాజెక్ట్‌పై ఆయన వైఖరిని తెలియజేయాలన్నారు. -
ఇందిరమ్మ పాలన ఇదేనా?
● బీఆర్ఎస్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ రైతులకు ఆపత్కాలంలో సాయంగా ఉండేలా.. కేసీఆర్ రూపొందించిన రైతుబీమా పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నీరుగారుస్తోందని, ఇప్పటికింకా ఇన్స్యూరెన్స్ సంస్థలకు చెల్లించాల్సిన రూ.1,700 కోట్లు చెల్లించకుండా కాలయాపన చేస్తుండటంతో బీమా వర్తించడం లేదన్నారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే ఆగమవుతారని 2023 జనరల్ ఎన్నికల్లో కేసీఆర్ ప్రతి ప్రచార సభలో చెప్పినా వినకుండా ప్రజలు ఓట్లు వేశారని.. దీంతో మళ్లీ విద్యుత్ కోతలు, యూరియా కష్టాలు, పెట్టుబడి సాయం కోసం ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. కాంగ్రెస్ పాలకులు నిషే ధిత భూముల జాబితాలో రాష్ట్రవ్యాప్తంగా లక్ష ఎకరాలను చేర్చి ప్రజలు, రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని.. ఒక్క పెబ్బేరు మండలంలోనే సుమారు వెయ్యి ఎకరాలను ఉద్దేశపూర్వకంగా చేర్చారని ఆరోపించారు. వనపర్తి: రైతులు సాగునీటి కోసం అరిగోసపడేలా.. యూరియా కోసం క్యూలైన్లో నిలబడేలా.. పెట్టుబడి సాయం ఎగొట్టి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మునుపటి కాంగ్రెస్ పాలన తీసుకొచ్చారని.. ఇదేనా ఇందిరమ్మ పాలనా అని బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు ప్రశ్నించారు. కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి తండ్రి మరణవార్త తెలుసుకొని శనివారం పరామర్శించేందుకు వచ్చిన ఆయన తిరుగు ప్రయాణంలో పెబ్బేరు మండలం గుమ్మడం, పెబ్బేరులోని విద్యుత్ సబ్స్టేషన్లను సందర్శించి విద్యుత్ సరఫరా లాగ్‌బుక్‌ను పరిశీలించారు. అనంతరం పెబ్బేరులోని సుభాష్ చౌరస్తాలో నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో మాట్లాడుతూ.. వ్యవసాయానికి కేవలం ఐదారు గంటలు మాత్రమే సరఫరా ఇస్తున్నట్లు, రోజుకు పదిసార్ల కంటే ఎక్కువ కోతలు విధిస్తున్నట్లు రైతులు, లాగ్‌బుక్‌లో నమోదు చేసిన వివరాలతో స్పష్టమవుతోందన్నారు. తన రాజకీయ గురువు చంద్రబాబు కోసం వరద జలాలను వదిలేసి.. సకాలంలో మోటార్లు ఆన్ చేయలేదని, దీంతో ఆంధ్రాకు సాగునీరు.. తెలంగాణ ప్రాంత రైతులకు కరువును మిగిల్చారని ఆరోపించారు. ఆంధ్రా పాలకులు ముందుచూపుతో ఇప్పటికే వెలుగొండ, పొతిరెడ్డిపాడు నుంచి నీళ్లు తరలించుకొని రిజర్వాయర్లు నీటితో నింపుకొంటున్నారన్నారు. మోటార్లు రెండ్రోజులు నడిస్తే వారం పాటు బంద్ చేసే కాంగ్రెస్ పాలకులకు రైతులపై ప్రేమ ఎలా ఉన్నట్లు అవుతుందని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉత్పన్నమైన కరవు కాంగ్రెస్ పాలకుల పుణ్యమేనని.. ముందస్తు ఆలోచనతో కృష్ణా జలాలను మొదటిరోజు నుంచి ఒడిసిపట్టుకుని నిల్వ చేసుకొని ఉంటే ప్రస్తుతం పంటలకు కావాల్సిన సాగునీరు అందుబాటులో ఉండటంతో పాటు భూగర్భ జలాలు అడుగంటేవి కావన్నారు. -
కారిడార్‌పై ఆశలు..
● బ్రాహ్మణపల్లి– పాతాళగంగ 45.19 కి.మీ., ఎలివేటేడ్ కారిడార్ ● క్షేత్రస్థాయి పరిశీలన చేసిన వైల్డ్‌లైఫ్, ఎన్హెచ్ఏఐ బృందం ● నిర్మాణ పర్యవేక్షణ బాధ్యత మోర్త్ నుంచి జాతీయ రహదారికి బదలాయింపు బ్రాహ్మణపల్లి– పాతాళగంగ ఎలివేటెడ్ కారిడార్ ఆరు లేన్ల నిర్మాణం కోసం కొత్త డీపీఆర్ సిద్ధం చేస్తున్నారు. అమ్రాబాద్, పదర మండలాలతోపాటు మద్దిమడుగు వచ్చిపోయే యాత్రికుల సౌకర్యం కోసం మన్ననూర్ దగ్గర ఎక్కి దిగ్గేందుకు ర్యాంపులు ఏర్పాటు చేయాలని కోరారు. హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లే యాత్రికులకు రెండు గంటల సమయం తగ్గుతుంది. – వంశీకృష్ణ, ఎమ్మెల్యే, అచ్చంపేట అచ్చంపేట: నల్లమల అభయారణ్యం మీదుగా ప్రతిపాదిత ఎలివేటెడ్ కారిడార్‌కు వడివడిగా అడుగులు పడుతున్నాయి. కారిడార్ నిర్మాణం ఆరు వరుసలుగా ఏర్పాటు చేయాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపించామని, దీనికి కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సూచనప్రాయంగా అంగీకరించారని ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎంపీ మల్లురవి నల్లమల పర్యటనలో వెల్లడించడంతో కారిడార్‌పై ఆశలు చిగురిస్తున్నాయి. నల్లమల గుండా జాతీయ రహదారి–765 ఉండటంతో వాహనాల రాకపోకల వల్ల వన్యప్రాణులు స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితి నెలకొంది. తరుచుగా వాహనాల కిందపడి పదుల సంఖ్యలో మృత్యువాత పడుతున్న ఘటనలను దృష్టిలో ఉంచుకుని కారిడార్ నిర్మాణమే సరైన మార్గం అని అటవీశాఖ సైతం ఒక అంచనాకు వచ్చినట్లు సమాచారం. ఈ మేరకు అటవీశాఖ, వన్యప్రాణి బోర్డు (వైల్డ్‌లైఫ్) ఈ కారిడార్ నిర్మాణానికి అనుకూలంగా ఉన్నట్లు తెలిసింది. కారిడార్ నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడంతో జాతీయ వన్యప్రాణి బోర్డు (వైల్డ్‌లైఫ్), ఎన్హెచ్ఏఐ అధికారుల బృందం క్షేత్రస్థాయిలో పర్యటించింది. నాలుగు లేదా ఆరు వరుసలు ఈ ప్రాజెక్టును కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ (మోర్త్) నుంచి జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ)కు బదలాయించింది. దీంతో బ్రాహ్మణపల్లి (మన్ననూర్)– పాతాళగంగ(శ్రీశైలం) మధ్య 54.91 కి.మీ., ఎలివేటెడ్ కారిడార్‌కు చకచకా అడుగులు పడుతున్నాయి. మొదటగా రెండు లేన్లుగా నిర్మించాలని భావించినా.. భవిష్యత్ అవసరాల దృష్ట్యా నాలుగు లేదా ఆరు లేన్లుగా నిర్మించాలని కేంద్రం భావిస్తోంది. ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తే ఆశించిన స్థాయిలో ఆర్థిక సామర్థ్యం ఉండదని గతంలో కేంద్రం తెలియజేయగా.. ప్రాజెక్టు నిర్మాణాల విషయంలో ఆర్థిక సామర్థ్యం చూడకూడదన్న అభిప్రాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో కారిడార్ నిర్మాణంలో 33 శాతం వాటా భరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి స్పష్టం చేసింది. అలాగే నిర్మాణ రంగంపై విధించే జీఎస్టీ కూడా రద్దు చేస్తామని ప్రకటించారు. ఈ కారిడార్ నిర్మాణంతో శ్రీశైలం పుణ్యక్షేత్రానికి మార్గం సుగమం కావడంతోపాటు ఏపీ వెళ్లేందుకు ఎంతగానో దోహదపడుతుంది. -
ఆయిల్‌పాంపై ఆసక్తి
● రికార్డు స్థాయిలో టన్ను ధర రూ.23,783 ● రెండేళ్లలో రూ.9 వేలకుపైగా పెరుగుదల ● జిల్లాలోని ఐదు ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాల ఏర్పాటు ● ధరల స్థిరీకరణ, ప్రభుత్వ ప్రోత్సాహంతో రైతులు ముందుకు.. కొల్లాపూర్: జిల్లాలో ఆయిల్‌పాం తోటల పెంపకంపై రైతుల్లో ఆసక్తి పెరుగుతోంది. అందుబాటులో కొనుగోలు కేంద్రాలు ఉండడం, పంటకు గిట్టుబాటు ధరలు లభిస్తుండడంతో పామాయిల్ సాగుపై రైతులు మక్కువ చూపుతున్నారు. గడిచిన రెండేళ్ల కాలంలో ఆయిల్‌పాం గెలలు టన్ను ధర రూ.9 వేలకుపైగా పెరగడం.. ధరల పెరుగుదల స్థిరంగా కొనసాగుతుండడంతో తోటలు రైతులకు లాభాలు తెచ్చిపెడుతున్నాయి. దీంతో పండ్ల తోటలకు బదులుగా ఆయిల్‌పాం తోటల పెంపకంపై రైతులు దృష్టి సారిస్తున్నారు. పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభం.. ఎన్ఎంఈఓ– ఓపీ పథకం కింద 2019–20 సంవత్సరంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి ఆయిల్‌పాం తోటల సాగుకు శ్రీకారం చుట్టారు. చెట్లు నాటిన నాలుగేళ్ల నుంచి దిగుబడి ప్రారంభమవుతుంది. మొదటి ఏడాది నాగర్‌కర్నూల్ జిల్లాలోని పలు ప్రాంతాల రైతులను ఒప్పించి 221 ఎకరాల్లో తోటలు నాటించారు. క్రమంగా సాగు విస్తీర్ణం పెంచుతూ వస్తున్నారు. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా 10,215 ఎకరాల్లో ఆయిల్‌పాం తోటల సాగు జరుగుతోంది. ప్రభుత్వ ప్రోత్సాహకాలు.. ఆయిల్‌పాం తోటల సాగుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నేషనల్ మిషన్ ఫర్ ఎడిబుల్ ఆయిల్– ఆయిల్‌పాం ప్లాంటేషన్ స్కీం ప్రవేశపెట్టి, సబ్సిడీ అందిస్తోంది. ఈ స్కీం ద్వారా డ్రిప్ సౌకర్యంతోపాటు సాగుకు ప్రోత్సాహకాలు అందిస్తున్నారు. ఒక్కో ఎకరాకు మొత్తంగా రూ.50,918 సబ్సిడీ లభిస్తోంది. రూ.193 విలువ చేసే ఆయిల్‌పాం మొక్కను ప్రభుత్వం సబ్సిడీపై రూ.20కే అందిస్తోంది. ఎకరాకు దాదాపు 50 నుంచి 57 మొక్కలు నాటవచ్చు. సన్నకారు రైతులకు 90 శాతం, పెద్దకారు రైతులకు 80 శాతం సబ్సిడీపై డ్రిప్ సౌకర్యం కల్పిస్తున్నారు. ఆయిల్‌పాం చెట్లు ఐదు నుంచి పదేళ్లలోపు 6 టన్నుల వరకు, పదేళ్లు దాటిన చెట్ల నుంచి ఏడాదికి 10 టన్నుల వరకు పంట వస్తుంది. ఏడాదంతా పంట దిగుబడి వస్తూనే ఉంటుంది. ఈ పంటను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. స్థానికంగానే కొనుగోలు.. జిల్లాలో రైతులు పండించిన పంటను ప్రీయూనిక్ సంస్థనే కొనుగోలు చేస్తోంది. ఇందుకోసం జిల్లావ్యాప్తంగా పెద్దకొత్తపల్లి, నాగర్‌కర్నూల్, బిజినేపల్లి, కల్వకుర్తి, ఉప్పునుంతలలో ఐదు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాలు రైతులకు అందుబాటులో ఉండడంతో పంట అమ్మకాలకు ఎలాంటి ఇబ్బందులు లేవు. దీంతో ఆయిల్‌పాం సాగుకు రైతులు పెద్దసంఖ్యలో దరఖాస్తు చేసుకుంటున్నారు. సంవత్సరం సాగు విస్తీర్ణం రైతులు 2021– 22 221 57 2022– 23 3,057 760 2023– 24 2,605 724 2024– 25 1,180 346 2025– 26 1,062 301 2026– 27 2,090 611 ఆయిల్‌పాం సాగు రైతులకు లాభదాయకంగా మారింది. గత రెండేళ్లలో ఆయిల్‌పాం గెలలు టన్ను ధర రూ.9 వేల వరకు పెరిగింది. ధరల్లో ఎలాంటి ఒడిదొడుకులు లేవు. ధరల స్థిరీకరణ అనేది రైతులకు మేలు చేసే అంశం. చాలామంది రైతులు ఆయిల్‌పాం సాగు కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. క్రమసంఖ్య ప్రకారం రైతులకు సబ్సిడీపై మొక్కలు, డ్రిప్ పరికరాలు ఇస్తున్నాం. పంట అమ్మకాల్లో ఏమైనా ఇబ్బందులు ఎదురైతే మా దృష్టికి తీసుకురావాలి. – లక్ష్మణ్, ఉద్యానవన అధికారి, కొల్లాపూర్ ఆయిల్‌పాం పంట ధరలు క్రమంగా పెరుగుతూనే స్థిరంగా ఉంటున్నాయి. ఇది రైతులకు లబ్ధిచేకూర్చే అంశం. 2023 ఆగస్టు వరకు ఆయిల్‌పాం టన్ను ధర రూ.14 వేలు మాత్రమే ఉండేది. అదే ఏడాది సెప్టెంబర్‌లో రూ.17 వేలు, అక్టోబర్‌లో రూ.19 వేలు, నవంబర్‌లో రూ.20 వేలకు ధర పెరుగుతూ వచ్చింది. 2024 మార్చి నుంచి టన్ను ధర రూ.20,871, 2025 సెప్టెంబర్ నుంచి టన్ను ధర రూ.23,783 ప్రకారం కొనుగోళ్లు జరుగుతున్నాయి. ధరల పెరుగుదలతోపాటు స్థిరీకరణ కారణంగా రైతులకు ఆయిల్‌పాం సాగు లాభదాయకంగా మారింది. -
గంగమ్మ ఒడికి చేరేదెలా?
రాజోళి: విఘ్నాధిపతి.. తొలిపూజలు స్వీకరించే నాథుడు.. గణపయ్యకు చవితి పూజలను ప్రజలు ఘనంగానే నిర్వహించారు. స్వామి రాకను కాంక్షిస్తూ.. ఊరేగింపుగా అంగరంగ వైభవంగా కొలువుదీర్చారు. శక్తి మేరకు కొలిచిన భక్తజనులకు గణపయ్యను నిమజ్జనం పంపడం పెద్ద సమస్యగా మారింది. గతంలో వినాయక నిమజ్జనం అంటే స్థానికంగా చెరువులు, వాగులు, నదుల్లో పుష్కలంగా నీరు ఉండేది. కానీ, ఈసారి ఎల్‌నినో ప్రభావంతో వర్షాల జాడే లేకపోవడంతో చెరువులు, కుంటలు, వాగులు నీటి జాడే లేకపోగా.. జీవనదులు కృష్ణా, తుంగభద్ర సైతం ఒట్టిపోయి కనిపిస్తున్నాయి. దీంతో గణనాథుడిని గంగమ్మ ఒడికి చేర్చడం ఎలా అన్న ప్రశ్న నిర్వాహకులను కలవరపెడుతోంది. కాగా.. అధికారులు మాత్రం జిల్లాలోని బీచుపల్లి వద్దే పెద్ద వినాయకుల నిమజ్జనానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అడుగంటిన తుంగభద్ర.. జిల్లాలో కృష్ణా, తుంగభద్ర నదులు ఉండగా.. వీటి నుంచి ఎత్తిపోతల ద్వారా ఎన్నో చెరువులు, కుంటలు జలకళ సంతరించుకుంటాయి. అయితే ఉమ్మడి జిల్లాతోపాటు హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుంచి గణనాథుడిని నిమజ్జనం చేసేందుకు తుంగభద్ర, కృష్ణానదులకే వస్తారు. ఏటా బీచుపల్లి వద్ద వేలాది సంఖ్యలో భక్తులు వస్తుంటారు. అయితే ఈ ఏడాది ఎల్‌నినో కారణంగా వర్షాలు కురవని కారణంగా నదిలో నీరు లేకపోవడంతో నిమజ్జనంకు వచ్చే వారు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సింది వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. కృష్ణా బేసిన్లో కురిసిన అరకొర వర్షాలతో వస్తున్న వరదతో జిల్లా పరిధిలోని కృష్ణానదిలో కొద్ది మేర నీరు ఉండగా.. తుంగభద్ర నదిలో మాత్రం పూర్తిగా ఒట్టిపోయింది. ప్రధానంగా నిమజ్జనం చేసే ప్రదేశాల్లో కూడా వినాయక విగ్రహాలు నీటిలో మునిగే స్థాయిలో కూడా నీరు లేకపోవడం గమనార్హం. వర్షాభావ పరిస్థితులతో చెరువుల్లో కానరాని నీటి జాడ నడిగడ్డలో ఎండుదశకు చేరుకున్న రెండు జీవనదులు నెర్రెలు బారి 10 అడుగుల కనిష్టానికి నీటిమట్టం అయినప్పటికీ కృష్ణానదికే తరలింపు? -
అభివృద్ధి వైపు అడుగులు
నాగర్‌కర్నూల్● ప్రతి పేద వారికి సంక్షేమ, అభివృద్ధి పథకాలు ● ఆరుగ్యారంటీల అమలుకు కృతనిశ్చయంతో కృషి ● జిల్లాలో విద్యాభివృద్ధికి పెద్దపీట ● రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్య అత్యవసరమైతే అవస్థలే..! మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రి ఐసీయూ విభాగంలో సరిపడా పడకలు లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. శుక్రవారం శ్రీ 18 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026–8లో uకందనూలు: రాష్ట్రంలో సృష్టిస్తున్న సంపదను సమానత్వం, సామాజిక న్యాయం ప్రాతిపదికగా సమస్త ప్రజానీకానికి అందించాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అడుగులు వేస్తోందని రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్య అన్నారు. గురువారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజాపాలన దినోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్, ఎస్పీ సంగ్రామ్ సింగ్జీ పాటిల్, ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్‌రెడ్డితో కలిసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సకల జనుల సంక్షేమానికి పాటుపడుతుందన్నారు. ప్రణాళికాబద్ధమైన విధానాలు, ఆర్థిక క్రమశిక్షణ, ప్రజల సహకారంతో అన్ని రంగాల్లో మనం కలిసి పయనిద్దామన్నారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారంటీలను అమలు చేసేందుకు కంకణం కట్టుకుందన్నారు. కేఎల్ఐలో భాగంగా అచ్చంపేట, ఉప్పునుంతల మండలాల్లో 15 వేల ఎకరాలకు సాగునీరు అందించడానికి పులిజాల నుంచి చంద్రసాగర్ చెరువు వరకు 15 కి.మీ., బ్రాంచ్ కెనాల్ నిర్మాణానికి రూ.107.20 కోట్లకు పరిపాలన అనుమతులు ఇవ్వడం జరిగిందని రాజయ్య వెల్లడించారు. అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ స్టేజీ–1కు గాను తెలకపల్లి, ఉప్పునుంతల, లింగాల, బల్మూరు, అచ్చంపేట మండలాల్లోని 61 గ్రామాల్లో 57,200 ఎకరాలకు నీరందించడానికి రూ.1,534 కోట్ల అంచనాలతో పరిపాలన అనుమతులు పొంది అగ్రిమెంట్ పూర్తిచేయడం జరిగిందన్నారు. భూ సేకరణ సర్వే పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణమ్మ నీటిని తరలించి 12.30 లక్షల ఎకరాలకు సాగునీరు, హైదరాబాద్‌తోపాటు వందలాది పల్లెలకు తాగునీరు అందించే పథకం చేపట్టామన్నారు. తెలంగాణ రైతులు దేశానికే ఆదర్శంగా ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త ప్రణాళిక రూపొందిస్తోంది. రైతుల సంక్షేమం, వ్యవసాయ పురోగతికి అవసరమైన కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తుంది. ఒక జీవన విధానం, సంస్కృతిగా సాగుతున్న మనం వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలని, రైతును అగ్రభాగాన నిలపాలనే చిత్తశుద్ధితో, రైతులు అప్పులబారిన పడకుండా ప్రభుత్వం దేశంలో ఎక్కడాలేని విధంగా రైతులకు పెట్టుబడి సాయం ఎకరాకు రూ.6 వేల చొప్పున అందజేస్తుందన్నారు. ఇందులో భాగంగా 2026–27 వానాకాలం సీజన్‌కు గాను 3.8 లక్షల మంది రైతుల ఖాతాలో రూ.422.56 కోట్లు జమ చేశామన్నారు. అలాగే రైతు బీమా పరిహారం రైతు కుటుంబాలకు జీవనోపాధి కల్పించి కుటుంబ పెద్ద లేని లోటు తీరుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం సన్నరకం వడ్లకు అదనంగా రూ.500 బోనస్ చెల్లించడం చెల్లిస్తుందన్నారు. జాతీయ జెండాకు సెల్యూట్ చేస్తున్న రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, చిత్రంలో కలెక్టర్ హేమంత కేశవ్‌పాటిల్, ఎస్పీ సంగ్రామ్ సింగ్జీ పాటిల్, ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డి తదితరులు అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని అలరించాయి. జెడ్పీహెచ్ఎస్ తూడుకుర్తి, కేజీబీవీ పెంట్లవెల్లి, కేకేరెడ్డి పాఠశాల తెలకపల్లి విద్యార్థులు చేసిన జానపద నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. అనంతరం ప్రతిభచాటిన విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు చెన్నయ్య, దేవసహాయం, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన 48 గంటల్లోనే మహాలక్ష్మి పథకాన్ని అమలు చేసిందన్నారు. ఈ పథకం ద్వారా జిల్లాలో ఇప్పటికే దాదాపు 10.56 కోట్ల మంది మహిళలు ఈ పథకాన్ని వినియోగించుకొని.. దాదాపు రూ.499.85 కోట్లు ఆదా చేసుకున్నారని పేర్కొన్నారు. రూ.500లకే గ్యాస్ సిలిండర్ పంపిణీ చేసే పథకం ద్వారా 1.18 లక్ష మంది వినియోగదారులు రూ.16.95 కోట్ల సబ్సిడీ ద్వారా లబ్ధి పొందుతున్నారు. గృహ జ్యోతి పథకం ద్వారా జిల్లాలో 200 యూనిట్లలోపు విద్యుత్ వాడే 1.15 లక్షల మంది వినియోగదారులకు రూ.77.62 కోట్ల సబ్సిడీతో జీరో బిల్లులు జారీ చేశామన్నారు. కులగణన, మీసేవ ద్వారా వచ్చిన 43,422 కొత్త దరఖాస్తులను గ్రామసభలో ఆమోదించుకొని 41,323 కొత్త రేషన్ కార్డులను మంజూరు చేశామన్నారు. మిగిలిన దరఖాస్తులు పరిశీలనలో ఉండగా.. 1.9 లక్షల కుటుంబ సభ్యులను పాత కార్డులలో అదనంగా చేర్చామన్నారు. ఆరోగ్య శ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచామని చెప్పారు. జిల్లాలో ఇప్పటి వరకు 44,115 మంది ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యసేవలకు గాను ప్రభుత్వం దాదాపు రూ.117.59 కోట్లు వెచ్చిందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో జిల్లాకు మొదటి విడతలో 11,922 ఇళ్లు మంజూరవగా.. 9,809 మంది లబ్ధిదారులకు మంజూరు చేశామన్నారు. ఇందులో 5,269 ఇళ్లు ప్రగతిలో ఉండగా.. 2,361 ఇళ్లు పూర్తయ్యాయని, ఇందుకోసం రూ .197.24 కోట్లు లబ్ధిదారులకు చెల్లించినట్లు చెప్పారు. జిల్లాలో నూతనంగా 74 ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీప్రైమరీ తరగతులు ప్రారంభించగా.. 1,981 విద్యార్థులు చేరారన్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా అనుబంధ పోషకాహారం, పూర్వ ప్రాథమిక విద్య, రోగ నిరోధక సేవలు, ఆరోగ్య తనిఖీలు, రెఫరల్, పోషకాహారం, ఆరోగ్య విద్య వంటి సేవలు అందిస్తున్నామన్నారు. జిల్లాలోని 1,132 అంగన్వాడీ కేంద్రాల ద్వారా 4,337 మంది గర్భిణులు, 2,785 మంది బాలింతలు, 38969 మంది చిన్నారులు ఆరోగ్యలక్ష్మి పథకం కింద లబ్ధి పొందుతున్నారని వెల్లడించారు. -
ఎక్కడికెళ్లాలో తెలుస్తలేదు..
ప్రతిఏటా తుంగభద్ర నదిలోనే నిమజ్జనం చేసేవాళ్లం. ఈసారి కూడా అక్కడే చేయాలనుకున్నాం. కానీ, తుంగభద్ర నదిలో నీరు లేదు. అక్కడక్కడ ఉన్న కొద్దిపాటి నీటిలో వినాయకుడిని వేసినా విగ్రహం కూడా మునిగిపోయే పరిస్థితి కనిపించడం లేదు. బీచుపల్లికి వెళ్లాలంటే అక్కడికి ఎక్కువ మొత్తంలో విగ్రహాలు నిమజ్జనంకు వచ్చే అవకాశం ఉంది. దీంతో మా సభ్యులు ఆలోచనలో పడ్డారు. – అశోక్, శాంతినగర్ ఈసారి వర్షాభావ పరిస్థితుల కారణంగా, నదిలో నీరు లేదని గ్రహించాం. మీడియాలో వస్తున్న కథనాలు చూసి.. మట్టి గణపతిని తయారు చేసి, పూజలు నిర్వహించాం. ఈ గణపతినే ఒకచోట నీటితో కరిగించి, అందులో మొక్క నాటి, గ్రామంలో అందరికీ గణపతి నిమజ్జనం గుర్తుగా మొక్కను అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. దీనివల్ల పర్యావరణ పరిరక్షణతోపాటు నిమజ్జనం ఇబ్బందులు తప్పుతాయి. – జాని, అమరవాయి నిమజ్జనం సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా.. జిల్లాలో నిమజ్జనంకు కేటాయించిన ప్రదేశాల్లో ఏర్పాట్లు చేశాం. విగ్రహాలు ఎక్కువగా వచ్చినప్పటికీ.. ట్రాఫిక్ ఇతర ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటాం. గ్రామాల్లో కొన్నిచోట్ల నీటి వనరులు ఉన్నాయి. వారు అక్కడే నిమజ్జనం చేసుకోవచ్చు. నిమజ్జనం చేసే సందర్భంలో తప్పనిసరిగా స్వీయ జాగ్రత్తలు కూడా చాలా అవసరం. – శ్రీనివాసరావు, ఎస్పీ -
ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి కృషి చేయాలి
● రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య కందనూలు: ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి కృషిచేయాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. గురువారం జిల్లాకు వచ్చిన ఆయనకు కలెక్టరేట్లో కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్, ఎస్పీ సంగ్రామ్ సింగ్జీ పాటిల్ పూలమొక్కలు అందించి స్వాగతం పలికారు. అనంతరం పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. ఈ సందర్భంగా వీసీ హాల్లో ల్యాండ్, సర్వీస్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులతోపాటు జిల్లాలో ఎస్సీ, ఎస్టీల సమస్యలు, న్యాయపరమైన అంశాలపై కలెక్టర్, ఎస్పీతో కలిసి బక్కి వెంకటయ్య సమీక్ష నిర్వహించి మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, విద్య, ఉపాధి పథకాలపై గ్రామస్థాయిలో విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. విద్యార్థులకు అందుబాటులో ఉన్న విద్యావకాశాలు, పబ్లిక్ స్కూళ్లలో సీట్లు, విదేశీ విద్యకు అందించే ఆర్థిక సహాయం, భూమి ఆధారిత పథకాలు తదితర వివరాలను అర్హులైన వారికి తెలియజేసి వాటిని సద్వినియోగం చేసుకునేలా అధికారులు సహకరించాలని సూచించారు. ప్రతినెలా చివరి వారంలో నిర్వహించే సివిల్ రైట్స్ డే సమావేశాలకు పోలీస్, రెవెన్యూ అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించారు. అలాగే ప్రతి మూడు నెలలకు ఒకసారి జిల్లాస్థాయి సమావేశం నిర్వహించి ఎస్సీ, ఎస్టీల సమస్యల పరిష్కారంపై పురోగతిని సమీక్షించాలని చెప్పారు. అన్ని ప్రభుత్వ శాఖల్లో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల రోస్టర్ విధానం, రిజర్వేషన్ రిజిస్టర్లను నిబంధనల ప్రకారం నిర్వహించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికకు కేటాయించిన నిధులను ఆయా వర్గాల సంక్షేమం, అభివృద్ధికి మాత్రమే వినియోగించాలని స్పష్టం చేశారు. నిధులను ఇతర అవసరాలకు మళ్లించకుండా నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ప్రజల నుంచి వచ్చే ప్రతి దరఖాస్తును సానుకూలంగా పరిశీలించి, సమస్యలను సాధ్యమైనంత వరకు జిల్లా స్థాయిలోనే పరిష్కరించాలని చెప్పారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎస్సీ, ఎస్టీ ప్రజలకు మెరుగైన వసతులు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా జిల్లా యంత్రాంగం కృషిచేస్తుందన్నారు. జిల్లా ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు చైర్మన్ పలు అంశాలపై నివేదికను అందజేశారు. సమావేశంలో ఎస్సీ కమిషన్ సభ్యులు లక్ష్మీనారాయణ, నేనావత్ రాంబాబునాయక్, అచ్చంపేట సబ్ కలెక్టర్ సలోని ఛాబ్రా, అదనపు కలెక్టర్లు చెన్నయ్య, దేవసహాయం, జిల్లా ఎస్సీ అభివృద్ది అధికారి ఉమాపతి, గిరిజన సంక్షేమ అధికారి కోటాజి తదితరులు పాల్గొన్నారు. -
కొల్లాపూర్ గడ్డపై ఉద్యమవీరులు..
ఉద్యమకారుల పురిటిగడ్డ కొల్లాపూర్. ఈ ప్రాంతంతో కుటంబ బంధుత్వం ఉన్న సురవరం ప్రతాపరెడ్డి 1938లో ఆంధ్రమహాసభ జిల్లా కార్యవర్గ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 1942లో ఆయన జిల్లా నేతలతో కలిసి కమ్యూనిస్టు పార్టీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. తెలంగాణ విమోచనం కోసం కొల్లాపూర్‌కు చెందిన అనంత రాంచంద్రారెడ్డి, సీఆర్ శర్మ, చక్కెర కిష్టయ్య, కందాళ లక్ష్మణాచారి, చిన్నలింగారెడ్డి, పెద్దలింగారెడ్డి, మాసయ్య, తప్పెట బుగ్గన్న, ఎరుకలి మంగమ్మ, కొండ్రావుపల్లి సాయన్నగౌడ్, జవాయిపల్లికి చెందిన కటికనేని గోపాలరావు, సింగోటం గ్రామానికి చెందిన డి.కిష్టన్న వంటి నేతలను సంఘటితం చేసి కమ్యూనిస్టు పార్టీ విస్తరణకు కృషిచేశారు. చాలామంది నాయకులు కర్నూలు జిల్లాలో తుపాకీ వినియోగం వంటి సాయుధ శిక్షణ పొందారు. దీంతో నక్సలిజం వ్యాప్తికి కృషిచేస్తున్నారనే అభియోగంతో లక్ష్మణాచారి, కిష్టన్నతో పాటు కొందరు నాయకులను నిజాం సైన్యం అరెస్టు చేసి వరంగల్ జైలుకు తరలించింది. జైలు నుంచి తప్పించుకున్న లక్ష్మణాచారి, సురవరం వెంకట్రామిరెడ్డితో కలిసి కొల్లాపూర్ చేరుకుని గెరిల్లా పోరాటాలకు శ్రీకారం చుట్టారు. పెద్దకొత్తపల్లి పోలీస్‌స్టేషన్‌పై దాడిచేసి, 12 తుపాకులను ఎత్తుకెళ్లిపోయారు. దాడిలో పాల్గొన్న నల్లగొండ జిల్లాకు చెందిన ఆదిరెడ్డి సంగెమ్మ, కల్వకోలుకు చెందిన మిద్దె పుల్లయ్య, ఎరుకలి ముప్పయ్య, చంద్రయ్య, నక్కలపల్లికి చెందిన కిష్టారెడ్డి, కోడేరుకు చెందిన మల్లయ్యతో పాటు బుచ్చిలింగం, గొల్ల బల్రాం, బాల్‌లింగం, లక్ష్మయ్య, మీర్జాపర్హతుల్లాబేగ్ వంటి నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. అనంతర కాలంలో నక్కలపల్లిలో పెద్దకిష్టారెడ్డి అనే వ్యక్తి చనిపోయినట్లుగా నిజాం సైన్యం గుర్తుతెలియని శవాన్ని తీసుకొచ్చి ముఖాన్ని ధ్వంసం చేశారు. కిష్టారెడ్డిని కమ్యూనిస్టులే హత్యచేశారంటూ వారిని అరెస్టు చేసేందుకు, ప్రజా ఉద్యమం నుంచి వారిని దూరం చేసేందుకు కుట్ర పన్నారు. తర్వాత కొద్దికాలానికి కిష్టారెడ్డి బతికే ఉన్నట్లు తెలిసింది. నక్కలపల్లి కుట్ర కేసును ఇప్పటికీ కమ్యూనిస్టు నాయకులు తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడినప్పుడు ఉదహరిస్తుంటారు. కటికనేని గోపాలరావు సీఆర్ శర్మ కె.లక్ష్మణాచారి గొల్ల బల్రాం -
ప్రజాపాలన దినోత్సవానికి ఏర్పాట్లు పూర్తి
నాగర్‌కర్నూల్: కలెక్టరేట్లో గురువారం తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ తెలిపారు. బుధవారం ప్రజాపాలన దినోత్సవ ఏర్పాట్లను ముమ్మరంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజాపాలన దినోత్సవానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్య హాజరై ఉదయం 10 గంటలకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నట్లు తెలిపారు. కలెక్టరేట్లో జరిగే వేడుకలకు అన్నిశాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు హాజరై విజయవంతం చేయాలని కోరారు. పకడ్బందీగా భూముల రీసర్వే పెద్దకొత్తపల్లి: భూముల రీ సర్వేను పకడ్బందీగా చేపట్టాలని అదనపు కలెక్టర్ దేవసహాయం అన్నారు. బుధవారం పెద్దకొత్తపల్లి మండలం అదిరాలలో భూముల రీ సర్వేను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గ్రామంలో ఇప్పటివరకు చేపట్టిన సర్వే వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూముల రీసర్వేలో రైతుల పొలాల హద్దులు నిర్ణయించడం ద్వారా భూతగాదాలు లేకుండా ఉంటాయన్నారు. సర్వేకు రైతులు పూర్తిస్థాయిలో సహకరించాలని కోరారు. అదనపు కలెక్టర్ వెంట తహసీల్దార్ శ్రీనివాసులు, డివిజనల్ సర్వేయర్ గిరిధర్, మండల సర్వేయర్ బాబునాయక్, సర్పంచ్ కరుణాకర్‌రెడ్డి ఉన్నారు. పనిభారం తగ్గించండి కల్వకుర్తి రూరల్: ఆర్టీసీ ఉద్యోగులపై పెంచిన పనిభారాన్ని తగ్గించాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఎస్‌డబ్ల్యూఎఫ్ ఆధ్వర్యంలో కల్వకుర్తి డిపో ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా డిపో కార్యదర్శి రాజబాబు మాట్లాడుతూ.. ఆర్టీసీ ఉద్యోగులపై పనిభారం పెరగడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. కొందరికి కనీసం సెలవులు కూడా దొరకడం లేదన్నారు. ఆర్టీసీ ఉద్యోగులపై పనిభారం తగ్గించాలని డిమాండ్ చేశారు. అంతకుముందు సంఘం వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా డిపో అధ్యక్షుడు నాగయ్య జెండా విష్కరించారు. కార్యక్రమంలో రామచంద్రయ్య, పరిపూర్ణం, సర్ధార్ సింగ్, రాజగోపాల్, శ్రీనివాసులు, దేవయ్య పాల్గొన్నారు. కార్మిక పోరాటాలపై నిర్బంధం సరికాదు కందనూలు: కార్మికవర్గ పోరాటాలపై ప్రభుత్వం నిర్బంధాలు, అక్రమ అరెస్టులకు పాల్పడటం సరైంది కాదని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు అన్నారు. సీఐటీయూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం జిల్లా కేంద్రంలోని గాంధీ పార్కులో చేపట్టిన ఒకరోజు నిరాహార దీక్షలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అక్రమ అరెస్టులు ఉండవని.. సామరస్య పూర్వకంగా చర్చల ద్వారా సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చి మోసం చేశారన్నారు. కార్మికులు తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని పోరాడుతుంటే, కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ అరెస్టులతో భయభ్రాంతులకు గురిచేస్తోందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ధర్నా చౌక్ తీసేసిందని.. ప్రస్తుత ప్రభుత్వం కనీసం ధర్నా ప్రాంతానికి వెళ్లకుండా ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తుందని ఆయన మండిపడ్డారు. కార్యక్రమంలో సీఐటీయూ నా యకులు రామయ్య, పర్వతాలు పాల్గొన్నారు. -
వందనం
నాగర్కర్నూల్వీరులారా..నిజాం సర్కార్‌కు ఎదురొడ్డి పోరాడిన నల్లమల బిడ్డలు ● మన్ననూర్‌లో కాలపానీ జైలు ఏర్పాటు ● నిజాం వ్యతిరేక పోరాటయోధులపై చిత్రహింసలు ● తొలి బూటకపు ఎన్కౌంటర్ అయిన సీఆర్ శర్మ ● పడింత్ నరేంద్రజీ ఏడాదిన్నర పాటు జైలు జీవితం ● రాణి రంగమ్మ వంటి పోరాటయోధులకు కొల్లాపూర్‌లో ఆశ్రయం .. కంపెనీలతో కాలుష్యం కృష్ణా సరిహద్దులోని కర్ణాటకలో వెలిసిన ఫ్యాక్టరీల నుంచి వచ్చే దుర్వాసనతో ప్రజలు శ్వాసకోశ ఇబ్బందులకు గురవుతున్నారు. గురువారం శ్రీ 17 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026–8లో u -
చార్జీల మోత వద్దు..
● ‘నగదు వద్దు.. డిజిటల్ ముద్దు’ అంటూ చెప్పి ఇప్పుడు భారం వేయొద్దు ● యూపీఐ చార్జీల వడ్డనపై వినియోగదారులు, వ్యాపారుల్లో భిన్నాభిప్రాయాలు ● ఎండీఆర్ అమలుతో ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వానికి రూ.20 కోట్లకుపైగా ఆదాయం ●అక్టోబర్ 15 నుంచి అమల్లోకి రానున్న ఈ విధానం అన్ని రకాల వ్యాపారులపై ప్రభావం చూపనుంది. యూపీఐ లావాదేవీలపై విధించే ఛార్జీలు సగటు వ్యాపారిపై తెలియకుండానే పడే అదనపు ఆర్థిక భారం. ముఖ్యంగా మెడికల్ దుకాణాల్లో తీవ్ర పోటీ ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇది వ్యాపారులపై మరింత ప్రభావం చూపుతుంది. వినియోగదారులపై భారం పడకుండా, ప్రతి నెలా మా లాభాల్లోంచే ఈ ఖర్చును భరించాల్సి రావచ్చు. ఈ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత ఎదురయ్యే సమస్యలు, ఆర్థిక భారం ఏ స్థాయిలో ఉంటాయో స్పష్టమవుతుంది. – దేవరశెట్టి రమేష్, మెడికల్ షాపు నిర్వాహకుడు, మహబూబ్‌నగర్ గద్వాల: డిజిటల్ చెల్లింపులకు అలవాటుపడిన సామాన్యులపై యూపీఐ చార్జీల భారం పడనుంది. రూ.2 వేల వరకు యూపీఐ లావాదేవీలకు ఎలాంటి ఎండీఆర్ (మర్చంట్ డిస్కౌంట్ రేట్) ఉండదు. ఆపై జరిగే కొన్ని రకాల చెల్లింపులపై కనిష్టంగా రూ.12 నుంచి గరిష్టంగా రూ.300 వరకు చార్జీలు విధించనున్నారు. అక్టోబర్ 15 నుంచి అమల్లోకి రానున్న ఈ విధానంపై జనంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలో వివిధ రకాల లావాదేవీలు నెలకు సుమారు రూ.2,500–3,000 కోట్ల మేర జరుగుతున్నట్లు అంచనా. వీటిపై ఎస్ఎస్టీ, సీఎస్టీ తదితర పన్నుల రూపంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఇప్పటికే రూ.200–300 కోట్ల వరకు ఆదాయం సమకూరుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కొత్తగా యూపీఐ చెల్లింపులపై ఎండీఆర్ అమలుతో ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వానికి రూ.20 కోట్లకుపైగా అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాల అంచనా. అయితే కొత్త చార్జీలపై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. డిజిటల్ చెల్లింపులు సులభతరం కావడంతో నగదు అవసరం తగ్గిందని కొందరు చెబుతుండగా, అదనపు చార్జీల నేపథ్యంలో మళ్లీ నగదు చెల్లింపుల వైపు మళ్లే అవకాశం ఉందని మరికొందరు అంటున్నారు. యూపీఐ పేమెంట్స్‌పై విధించిన నిబంధనలతో వినియోగదారులపై వ్యక్తిగతంగా భారం పడదని చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో సమస్యలు తప్పక తలెత్తుతాయి. వ్యాపారులు వినియోగదారులపైనే భారం మోపుతారు. ప్రభుత్వం చెప్పిన విధంగా ఉండదు. ఇప్పటివరకు సులువుగా ఉన్న డిజిటల్ పేమెంట్స్ రాబోయే రోజుల్లో ఆచితూచి చేయాల్సి వస్తుంది. – దూద్యానాయక్, కల్వకుర్తి వినియోగదారులపైనే భారం.. రోజు 20 నుంచి 25 వరకు యూపీఐ పేమెంట్స్ ద్వారా ప్రజలు కొనుగోలు చేస్తుంటారు. యూపీఐ పేమెంట్ రూ.2వేల వరకు మాత్రమే మినహాయింపుతో వినియోగదారుడు నష్టపోయే అవకాశం ఉంది. అంతకంటే ఎక్కువ పేమెంట్ చేసినప్పుడు వినియోగదారుడిపైనే భారం వేస్తారు. కేంద్ర ప్రభుత్వం పునరాలోచించాలి. – సురేశ్‌బాబు, సురభి సూపర్‌మార్కెట్, నాగర్‌కర్నూల్ -
సాగునీరు అందించాలని రైతుల ఆందోళన
కందనూలు: ఎంజీకేఎల్ కాల్వ పరిధిలో సాగుచేసిన పంటలకు నీరందించాలని డిమాండ్ చేస్తూ బుధవారం పలు గ్రామాల రైతులు జిల్లా కేంద్రంలోని ఇరిగేషన్‌శాఖ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. డీ–26 కాల్వ ఎగువన సాగునీరు అందక పంటలు ఎండుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదంటూ కార్యాలయంలో బైఠాయించి నిరసన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. తాడూరు మండలం గుంతకోడూరు, తుమ్మలసూగూర్ నుంచి నడిగడ్డ వరకు 26 కి.మీ. ఎంజీకేఎల్ఐ డీ–26 కాల్వ ఉందన్నారు. అయితే 5 కి.మీ. వరకు మాత్రమే నీరు పారుతున్నాయని.. ఎగువ ప్రాంతానికి నీరు రావడం లేదన్నారు. దీంతో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కాల్వ పరిధిలో 18వేల ఎకరాల విస్తీర్ణం వరకు పంట పొలాలు ఉన్నాయని తెలిపారు. అధికారులు స్పందించి పూర్తి ఆయకట్టుకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయంపై ‘సాక్షి’ ఇరిగేషన్ ఈఈని ఫోన్లో సంప్రదించగా.. రైతులు తమ కార్యాలయానికి వచ్చినప్పుడు తాను క్షేత్రస్థాయికి వెళ్లినట్లు తెలిపారు. రైతులతో ఫోన్లో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నామని.. సాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
ప్రజాపాలన దినోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు
నాగర్‌కర్నూల్: ప్రజాపాలన దినోత్సవానికి పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్లు చెన్నయ్య, దేవసహాయం అధికారులకు సూచించారు. ఈ నెల 17న నిర్వహించే ప్రజాపాలన దినోత్సవ ఏర్పాట్లపై మంగళవారం కలెక్టరేట్లోని వీసీ హాల్లో సమీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కలెక్టరేట్ సముదాయంలో నిర్వహించనున్న ప్రజాపాలన దినోత్సవానికి అన్నిశాఖల అధికారులు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. జాతీయ జెండా ఆవిష్కరణకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేయాలని, సభావేదిక అలంకరణ, ప్రొటోకాల్ ప్రకారం వీఐపీలు, ప్రజాప్రతినిధులు, ప్రజలు, విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని సూచించారు. సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ, ఆహ్వాన పత్రికల పంపిణీ వంటి అంశాల్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో ఏఎస్పీ వెంకటేశ్వర్లు, డీఆర్వో పాండు, కలెక్టరేట్ ఏవో చంద్రశేఖర్ ఉన్నారు. -
సంగమేశ్వర ఆలయంపై వినాయకుడి ప్రతిమ
కొల్లాపూర్: శ్రీశైలం బ్యాక్‌వాటర్ వేగంగా తగ్గుతుండడంతో నది నీటిలో మునిగిపోయిన సంగమేశ్వర ఆలయ గోపురం తేలింది. అయితే మళ్లీ కృష్ణానదికి వరదలు పోటెత్తి, ఆలయం ఇంకా కొన్ని నెలలపాటు నీటిలో మునిగి ఉంటేనే తెలుగు రాష్ట్రాలకు మంచిదనే సంకల్పంతో ఆలయ గోపురంపై వినాయకుడు, శివపార్వతుల విగ్రహాలను ఏర్పాటు చేశారు. విగ్రహాలకు అర్చకులు రఘురామశర్మ పూజలు నిర్వహించారు. కృష్ణానదికి వరదలు వచ్చి ఆలయ గోపురం, వినాయక విగ్రహం నది నీటిలో మునగాలని భగవంతున్ని కోరినట్లు తెలిపారు. శ్రీశైలం డ్యాంలో మరో ఆరు నెలలపాటు నీళ్లు నిండుగా ఉంటేనే ఇరు రాష్ట్రాల ప్రజలకు సాగు, తాగునీటికి ఇబ్బందులుండవని వివరించారు. -
విద్యుత్ సమస్యల పరిష్కారానికే ప్రజాబాట
కల్వకుర్తిరూరల్: విద్యుత్ సమస్యల పరిష్కారం కోసమే ప్రజాబాట కార్యక్రమం చేపట్టినట్లు ఆ శాఖ సీఈ బాలస్వామి చెప్పారు. మంగళవారం కల్వకుర్తి పట్టణంలో నిర్వహించిన ప్రజాబాట కార్యక్రమంలో ఆయన పాల్గొని విద్యుత్ వినియోగారుల సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావంతో విద్యుత్ రంగంపై తీవ్ర ఒత్తిడి పెరిగిందన్నారు. దేశవ్యాప్తంగా పోలిస్తే తెలంగాణలో మెరుగైన విద్యుత్ సరఫరా కొనసాగుతుందని చెప్పారు. గృహ అవసరాలకు 24 గంటలు, వ్యవసాయ రంగానికి 12 గంటలపాటు నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నట్లు తెలిపారు. విద్యుత్ సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. అనంతరం తాండ్రా విద్యుత్ సబ్‌స్టేషన్‌ను సీఈ పరిశీలించారు. ఇటీవల విద్యుత్ కోతలను నిరసిస్తూ రైతులు జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టిన నేపథ్యంలో ఆయన విద్యుత్ సరఫరా పరిస్థితిపై ఆరా తీశారు. ప్రభుత్వం నిర్దేశించిన విదంగా విద్యుత్ సరఫరా చేయాలని.. రైతులకు ఎలాంటి సమస్య లేకుండా చూడాలని స్థానిక అధికారులను ఆదేశించారు. ఆయన వెంట ఎస్ఈ నర్సింహారెడ్డి, డీఈ సుధాకర్, ఏడీఈ శంకరయ్య, ఏఈ జానకీరామ్ ఉన్నారు. -
నచ్చితే నజరానా.. ప్రశ్నిస్తే పనిష్మెంట్!
పాలన సూపర్ అంటే చాలు.. నజరానాగా కీలక పోస్టుల్లో నియామకం.. మీ వెనుకే ఉంటాం అంటే అందలం.. ప్రశ్నిస్తే మాత్రం పనిష్మెంట్.. ..పాలమూరు యూనివర్సిటీలో బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థుల్లో ఇటీవల జరుగుతున్న చర్చ ఇది. విశ్వవిద్యాలయ పరిపాలనలో ముఖ్య భూమిక వహిస్తున్న వారు సీనియర్లు, రెగ్యులర్ అధ్యాపకులపై వివక్ష ప్రదర్శిస్తూ.. అనుభవం లేకున్నా తమ అనుకూల వర్గానికి కీలక పోస్టులు కట్టబెట్టడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఫలితంగా అధ్యాపకులు, సిబ్బంది రెండు (రెగ్యులర్, కాంట్రాక్ట్) గ్రూప్‌లుగా చీలిపోగా.. అంతర్గత వార్ ముదిరినట్లు సమాచారం. పాలకుల ఏకపక్ష వైఖరి, అసమర్థ నిర్ణయాలతో పీయూలో పాలనగాడి తప్పిందనే విమర్శల నేపథ్యంలో ప్రత్యేక కథనం.. – సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ ఆరుగురు ప్రొఫెసర్లలో ఒక్కరికే.. పాలమూరు యూనివర్సిటీలో అకడమిక్, అడ్మినిస్ట్రేషన్ పరంగా ఆరుగురు ప్రొఫెసర్లు పిండి పవన్‌కుమార్, కిషోర్‌కుమార్, నూర్జహాన్, జైపాల్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, చంద్రకిరణ్‌కు అనుభవం ఉంది. వీరిలో ప్రొఫెసర్ చంద్రకిరణ్‌కు తప్ప.. మిగతా ఐదుగురు సీనియర్లకు ఏ రకమైన కీలక బాధ్యతలు ఇవ్వకుండా మొండిచేయి చూపడం చర్చనీయాంశంగా మారింది. గతంలో రిజిస్ట్రార్‌గా సుదీర్ఘ అనుభవం ఉన్న ప్రొఫెసర్ మధుసూదన్‌రెడ్డికి పీజీ కళాశాల ప్రిన్సిపాల్‌తో పాటు వీసీ ఓఎస్డీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఒక్కరికి 2, 3 బాధ్యతలు.. యూనివర్సిటీ పరిధిలోని ఎనిమిది ప్రిన్సిపాల్ పోస్టు ల్లో ఏకంగా ఐదింటిని కాంట్రాక్ట్ అధ్యాపకులతో భర్తీ చేయడం.. ఒక్కరికి రెండు, మూడు పోస్టుల చొప్పున ఇవ్వడం.. ప్రొఫెసర్ హోదాలో ఉ న్న సీనియర్లను కీలక బాధ్యతల నుంచి తప్పించడం, నామమాత్రపు పోస్టుల్లో నియమించడం విమర్శల కు తావిస్తోంది. రెగ్యులర్ పోస్టుల్లో పనిచేస్తున్న వారి ని కాదని.. కాంట్రాక్ట్ అధ్యాపకులకు ప్రాధాన్యమివ్వడంపై విద్యార్థుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అప్పటి నుంచే దూరం.. వీసీగా శ్రీనివాస్ బాధ్యతలు తీసుకున్న తర్వాత రిజిస్ట్రార్‌గా చెన్నప్పను నియమించారు. ఆయన కొన్ని నెలలకే ఆ బాధ్యత నుంచి తప్పుకొన్నారు. ఈ క్రమంలో ఓయూ ప్రొఫెసర్‌గా ఉన్న రమేష్‌బాబును తీసుకొచ్చి రిజిస్ట్రార్‌గా నియమించారు. ఇది యూనివర్సిటీలోని రెగ్యులర్ అధ్యాపకులను మనస్తాపానికి గురిచేసినట్లు సమాచారం. పీయూలో సీనియర్లుగా ఉండి, గతంలో రిజిస్ట్రార్‌గా పనిచేసిన అనుభవం ఉన్న వారిని సైతం పక్కనబెట్టడంతో ఆ రోజు నుంచే పలువురు వీసీతోపాటు రిజిస్ట్రార్‌కు దూరంగా ఉంటున్నట్లు సమాచారం. కాగా, ఒకే సామాజిక వర్గానికి చెందిన వారిని దగ్గర ఉంచుకుని పీయూ పాలనా యంత్రాంగం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని నాన్–టీచింగ్, దిగువ స్థాయి ఉద్యోగుల్లో చర్చ జరుగుతోంది. వీసీ, రిజిస్ట్రార్ తీరుపై విమర్శలు.. పీయూలో చోటుచేసుకుంటున్న పరిణామాల క్రమంలో వైస్ చాన్స్‌లర్, రిజిస్ట్రార్ వ్యవహారశైలిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానంగా రెగ్యులర్ అధ్యాపకులు వారిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. తమకు అనుకూలంగా ఉన్న వారితో ఒకలా, లేని వారితో మరోలా వ్యవహరిస్తున్నారని.. చాలా సమయం వీసీ చాంబర్ ఎదుట నిలబెట్టడం వంటివి చేస్తున్నారని కొందరు రెగ్యులర్ ప్రొఫెసర్లు బాధను వెళ్లగక్కారు. నచ్చకుంటే అన్నింటా తలదూర్చడమే కాకుండా అగౌరవ పరుస్తున్నారని వాపోయారు. గట్టిగా ప్రశ్నిస్తే పీజీ సెంటర్లకు బదిలీ చేస్తామని సైతం బెదిరిస్తున్నట్లు అధ్యాపక వర్గాల్లో చర్చ జరుగుతోంది. పాలమూరు యూనివర్సిటీలో ఇష్టారాజ్యంగా పాలన సీనియర్లు, రెగ్యులర్ అధ్యాపకులపై వివక్ష 8 ప్రిన్సిపాల్ పోస్టుల్లో ఐదింట కాంట్రాక్ట్ లెక్చరర్లే.. ఆరుగురు ప్రొఫెసర్లలో ఒక్కరికే కీలక బాధ్యతలు అనుభవం ఉన్నా.. మిగతా వారికి మొండిచేయి అందరికీ ప్రాధాన్యం ఇస్తాం పోస్టుల కేటాయింపులో రెగ్యులర్ వారితో పాటు అందరికీ ప్రాధాన్యత ఇస్తాం. ఎవరు ఎక్కువ తక్కువ కాదు. భవిష్య త్లో భర్తీ చేసే పోస్టుల్లో రెగ్యులర్ వారికి మరిన్ని పోస్టులు కల్పిస్తాం. ప్రస్తుతం పోస్టులు కేటాయించిన వారు పూర్తిస్థాయిలో పనిచేస్తే యూనివర్సిటీ మరింత అభివృద్ధి చెందుతుంది. కాంట్రాక్టు సిబ్బందికి అదనంగా ఉన్న బాధ్యతలను తగ్గిస్తాం. – రమేష్‌బాబు, పీయూ రిజిస్ట్రార్ అధికారాలు కేంద్రీకృతం కావద్దు పీయూలో వివిధ పోస్టులు ఒకే చోట కేంద్రీకరణ కావద్దు. కాంట్రాక్టు అధ్యాపకులకు ప్రాధాన్యత ఇస్తూ రెగ్యులర్, సీనియర్లు, అనుభవం ఉన్న వారి సేవలను యూనివర్సిటీలో వినియోగించుకోవాలి. కానీ ఒక్కరికే, రెండు, మూడు పోస్టులు ఇస్తే ఎలా అడ్మినిస్ట్రేషన్ కొనసాగుతుంది. అందరికీ ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. – రాము, ఎస్ఎఫ్ఐ అధ్యక్షుడు, పీయూ -
పీఎంశ్రీ పాఠశాలల పనుల్లో వేగం పెంచండి
కందనూలు/తాడూరు: పీఎంశ్రీ పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనుల్లో వేగం పెంచి, త్వరగా పూర్తిచేయాలని ఆర్జేడీ సోమిరెడ్డి ఆదేశించారు. మంగళవారం తాడూరు మండలం మేడిపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పాఠశాలకు పీఎంశ్రీ పథకం కింద కేటాయించిన నిధుల వినియోగం, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల వివరాలను తెలుసుకున్నారు. పాఠశాలలో తరగతి గదులు, బడి తోట, విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం, ప్రహరీ, తాగునీరు తదితర సౌకర్యాలను పరిశీలించారు. హిందీ దివస్ సందర్భంగా విద్యార్థులు రూపొందించిన శబ్దావళి, చిత్రలేఖనాలను ఆయన పరిశీలించి.. పలు సూచనలు చేశారు. అనంతరం జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో డీఈఓ రమేశ్‌కుమార్‌తో కలిసి జిల్లాలోని పీఎంశ్రీ పాఠశాలల హెచ్ఎంలతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆర్జేడీ మాట్లాడుతూ.. పీఎంశ్రీ పాఠశాలలను ఆదర్శవంతమైన విద్యాసంస్థలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అందిస్తున్న నిధులను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పాఠశాలల్లో విద్యార్థులకు ఆహ్లాదకరమైన, సురక్షితమైన వాతావరణాన్ని కల్పించడంతో పాటు బడి తోటలు, గ్రంథాలయాలు, ప్రయోగశాలలు, క్రీడా సౌకర్యాలను సమర్థవంతంగా వినియోగంలోకి తీసుకురావాలని తెలిపారు. సమావేశంలో సెక్టోరియల్ అధికారులు కిరణ్‌కుమార్, నూరుద్దీన్ ఉన్నారు. -
కృత్రిమ తేనెతో చెంచులకు జీవనోపాధి
మన్ననూర్: కృత్రిమ తేనె (శరణబీస్)తో చెంచులకు ప్రత్యామ్నాయ జీవనోపాధి లభిస్తుందని సబ్ కలెక్టర్, ఐటీడీఏ పీఓ సలోని చాప్రా అన్నారు. మంగళవారం నల్లమల అటవీ లోతట్టు ప్రాంతంలోని మల్లాపూర్ పెంటలో హంబుల్ బీ, సెర్ఫ్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన శరణబీస్ ప్రాజెక్టును ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు నిర్వాహణ తీరు, ప్రయోజనాలు తదితర అంశాలను చెంచులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పీఓ మాట్లాడుతూ.. ఐటీడీఏ ద్వారా పూర్తి ప్రోత్సాహం, సహకారం అందిస్తామని.. శరణబీస్ ప్రాజెక్టును మరింత అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. కాగా, పెంటలో ప్రభుత్వం మంజూరుచేసిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు చేసుకునేందుకు అనుమతులు ఇప్పించాలని చెంచులు కోరారు. పెంట సమీపంలో సారవంతమైన వ్యవసాయ భూములు ఉన్నాయని.. వ్యవసాయానికి అవసరమైన ఎద్దులు, ఇతర పనిముట్లు ఇప్పించాలని, తాగునీటి సమస్య పరిష్కరించాలని, గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని పీఓకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఏపీఎం సైదులు, సీసీ రామకృష్ణ పాల్గొన్నారు. -
కేఎల్‌ఐకి పాలమూరు నీరు
నాగర్‌కర్నూల్: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం (పీఆర్ఎల్ఐ) నీటిని కేఎల్ఐ ఆయకట్టుకు అనుసంధానించే మరో మార్గం అందుబాటులో ఉంది. నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి కేఎల్ఐ పరిధిలోని ఎల్లూరు రిజర్వాయర్‌కు నీటిని మళ్లించేలా గతంలోనే ఏర్పాటు చేసిన ఇంటర్‌లింక్ స్లూయిస్ ఇందుకు ఉపయోగపడనుంది. నార్లాపూర్–ఎల్లూరు రిజర్వాయర్లను జంట జలాశయాలుగా పరిగణించేలా ఈ అనుసంధానం ఏర్పాటు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం దీన్ని వినియోగంలోకి తీసుకొస్తే పీఆర్ఎల్ఐ ద్వారా నార్లాపూర్లోకి వచ్చే నీటిని ఎల్లూరుకు మళ్లించి.. అక్కడి నుంచి కేఎల్ఐ పరిధిలోని ఇతర రిజర్వాయర్లకు ఎత్తిపోసే అవకాశం ఉంది. పీఆర్ఎల్ఐలో ఒక పంపును రోజంతా నడిపితే సుమారు 0.3 టీఎంసీ నీటిని నార్లాపూర్ రిజర్వాయర్‌లోకి ఎత్తిపోసే అవకాశం ఉంది. నార్లాపూర్ రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం 6.4 టీఎంసీలు. ప్రస్తుతం ఇందులో సుమారు 4 టీఎంసీల నీరు ఉన్నట్లు అంచనా. రిజర్వాయర్‌లోకి మరింత నీటిని తీసుకొచ్చే అవకాశం ఉండటంతో.. అవసరమైనప్పుడు ఇంటర్‌లింక్ ద్వారా ఎల్లూరుకు తరలించవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. ఎల్లూరు రిజర్వాయర్ సామర్థ్యం 0.35 టీఎంసీలు. నార్లాపూర్ నుంచి స్లూయిస్ ద్వారా నీటిని ఎల్లూరులోకి విడుదల చేసి.. అక్కడి నుంచి సింగోటం, జొన్నలబొగడ, గుడిపల్లి రిజర్వాయర్లకు ఎత్తిపోసే అవకాశం ఉంది. గుడిపల్లి నుంచి కేఎల్ఐ కాల్వల ద్వారా ఆయకట్టుకు నీటిని విడుదల చేయవచ్చు. నార్లాపూర్ నుంచి ఎల్లూరు రిజర్వాయర్‌కు మళ్లించే అవకాశం ఇంటర్‌లింక్ స్లూయిస్‌తో రోజు 800 క్యూసెక్కుల వరకు తరలింపునకు వీలు కేఎల్ఐ పరిధిలో పెరగనున్న నీటి లభ్యత.. ఆయకట్టుకు ప్రయోజనం -
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని.. భర్త దారుణహత్య
కందనూలు: వరుసకు మరిది అయ్యే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళ.. తమ బంధానికి అడ్డొస్తున్నాడని భర్తను హత్య చేయించిన ఉదంతం తెలంగాణలోని నాగర్‌కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులు ఆదివారం వెల్లడించారు. నాగర్‌కర్నూల్ మండలం గగ్గలపల్లికి చెందిన మహమ్మద్ కరీం (43), సలీమాబేగం నాగర్‌కర్నూల్‌లో నివాసం ఉంటున్నారు. సలీమాబేగం తనకు మరిది వరుసైన నాగపూర్ గ్రామానికి చెందిన గౌస్‌పాషాతో రెండేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. దీన్ని గుర్తించిన కరీం తన భార్యను మందలించగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో 9న వాట్సాప్ కాల్లో రాత్రికి కరీంను చంపుతానని సలీమాబేగంకు గౌస్‌పాష చెప్పాడు. పదునైన కత్తి, చేతి గ్లౌజులు తీసుకొని రాత్రి 2.30 గంటల సమయంలో గౌస్‌పాష.. కరీం ఇంటికి వెళ్లి నిద్రలేపాడు. నిద్రమత్తులో ఉన్న కరీం డోర్ తీయగా కత్తితో గౌస్‌పాష అతనిపై దాడి చేసి చంపి పరారయ్యాడు. -
డిండి ప్రాజెక్టు పనులు నిలిపివేయాలి
కందనూలు: డిండి ప్రాజెక్టు పనులను నిలిపివేయాలని ఉమ్మడి పాలమూరు జిల్లా పెండింగ్ ప్రాజెక్టుల సాధన జేఏసీ డిమాండ్ చేసింది. శనివారం జిల్లాకేంద్రంలోని గాంధీ పార్కులో జేఏసీ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు శ్యాంప్రసాద్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన జల సాధన సత్యాగ్రహ దీక్షకు రైతులు, మేధావులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజేందర్‌రెడ్డి, రాఘవాచారి మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలోని అధికార, ప్రతిపక్ష ప్రజాప్రతినిధులకు పాలమూరు ప్రాజెక్టులు, రైతుల సమస్యలు గుర్తుకురావడం లేదా అని ప్రశ్నించారు. నల్లగొండకు నీటి తరలింపు పేరుతో పాలమూరు రైతులకు అన్యాయం జరుగుతున్నా ఎందుకు మౌనం వహిస్తున్నారని నిలదీశారు. డిండి ప్రాజెక్టుతో పాలమూరు రైతులు, గ్రామాలు నష్టపోయే పరిస్థితిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, డిండి ప్రాజెక్టు పనులను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఎర్రవల్లి, గోకారం, ఉల్పర, అజిలాపూర్ గ్రామాలను ముంపునకు గురిచేసే చర్యలను నిలిపివేయాలని కోరారు. జల సాధన సత్యాగ్రహ దీక్షకు తెలంగాణ ఉద్యమ నేత, ఎమ్మెల్సీ కోదండరాం ఫోన్లో సంఘీభావం తెలిపారు. పాలమూరు జిల్లా రైతాంగం నీటి హక్కుల కోసం పెండింగ్ ప్రాజెక్టుల సాధన జేఏసీ ఆధ్వర్యంలో చేస్తున్న పోరాటం న్యాయమైనదని ఆయన పేర్కొన్నారు. రైతుల హక్కులు, పాలమూరు ప్రాంతానికి న్యాయం జరిగేలా విధాన మండలిలో మాట్లాడుతానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నాయకులు శశిధర్‌రెడ్డి, లక్ష్మణ్‌గౌడ్, సదానందం, జంగయ్య, చెన్నకిష్టయ్య, బెక్కెం జనార్దన్, తిమ్మప్ప, శ్రీనివాస్‌నాయక్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
నాగర్‌కర్నూల్
విలీన దినోత్సవం.. తెలంగాణ విలీన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. ఆదివారం శ్రీ 13 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026–8లో uగణేష్ మండపాల వద్ద డీజేలు పెట్టొద్దు : ఎస్పీ కందనూలు: గణేష్ మండపాలు, శోభాయాత్రలో డీజేలు పెట్టొద్దని ఎస్పీ సంగ్రామ్ సింగ్జీ పాటిల్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉత్సవ కమిటీ నిర్వాహకులు ముందస్తుగా సంబంధిత పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించి, మండపం వివరాలు, వేడుకలు నిర్వహించే తేదీలు, నిమజ్జన వాహనాలు, నిమజ్జన మార్గానికి సంబంధించిన వివరాలను పోలీస్ పోర్టల్‌లో నమోదు చేయాలన్నారు. పిల్లలు, వృద్ధులు, గర్భిణులు, గుండె సంబంధిత సమస్యలు ఉన్న వారిని దృష్టిలో ఉంచుకొని మండపాలు, శోభాయాత్రలో డీజేలను ఉపయోగించరాదని చెప్పారు. రాత్రివేళల్లో మండపం వద్ద కనీసం ఇద్దరు వ్యక్తులు తప్పనిసరిగా ఉండాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, నిర్వాహకుల పేర్లు, ఫోన్ నంబర్లను అందుబాటులో ఉంచాలని చెప్పారు. మండపాలకు విద్యుత్ కనెక్షన్లు సంబంధిత అధికారుల సమన్వయంతో తీసుకోవాలని, మద్యం తాగిన వ్యక్తులను శోభాయాత్రలో పాల్గొనకుండా చూడాలని, సామాజిక మాధ్యమాల్లో వచ్చే రెచ్చగొట్టే పోస్టులు, వ్యాఖ్యలు చేయరాదని, ఎవరైనా అలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శోభాయాత్ర సమయంలో అసాంఘిక శక్తులు, నేర చరిత్ర కలిగిన వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉంటూ.. ప్రశాంతమైన, సురక్షితమైన వేడుకలు జరుపుకోవాలని సూచించారు. పక్కాగా సర్ ప్రక్రియ ఉప్పునుంతల: ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమం (సర్)లో మిస్ మ్యాచ్, మిస్ మ్యాపింగ్ అయిన ఓటర్లకు తప్పనిసరిగా నోటీసులు అందజేసి వారి నుంచి విధిగా సరైన ఆధారాలు సేకరించాలని సబ్ కలెక్టర్ సలోని ఛాబ్రా సూచించారు. శనివారం ఉప్పునుంతలలో నిర్వహించిన సర్ ప్రక్రియను ఆమె పరిశీలించారు. ఓటర్లకు నోటీసుల జారీ, ఓటర్ల హియరింగ్, ఫారాల స్వీకరణ, అప్లోడింగ్ ప్రక్రియ వివరాలను డిప్యూటీ తహసీల్దార్ రమేష్‌నాయక్‌ను అడిగి తెలుసుకున్నారు. సూపర్వైజర్లు, బీఎల్ఓలు, బీఎల్ఏలకు పలు సూచనలు చేశారు. ఓటర్లు సమర్పిస్తున్న ఆధారాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు. అడవుల్లోకి గొర్రెల కాపరులు వెళ్లొద్దు కొల్లాపూర్ రూరల్: కొల్లాపూర్ రేంజ్ అంటవీ ప్రాంతంలోని ముక్కిడిగుండం, నార్లాపూర్, మొలచింతలపల్లి గ్రామాల పరిసర ప్రాంత గొర్రెల కాపరులు అడవుల్లోకి వెళ్లరాదని, ఈ ప్రాంతంలో గొర్రెలు మేపడం, అడవిలో నిద్రించడం పూర్తిగా నిషేధించడం జరిగిందని రేంజర్ వాణికుమారి అన్నారు. శనివారం ఆమె అటవీ శాఖ కార్యాలయంలో మాట్లాడుతూ జూలై నుంచి సెప్టెంబర్ వరకు వన్యప్రాణుల సంతానోత్పత్తి కావడంతో ఈ సమయంలో పులులు, ఇతర వన్యప్రాణులు సహజ ఆవాసాలు, సంతానోత్పత్తికి ఆటంకం కలిగించే అవకాశం ఉందన్నారు. వన్యప్రాణుల సంరక్షణను దృష్టిలో ఉంచుకొని నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ మార్గదర్శకాలు, అటవీశాఖ ఆదేశాల మేరకు సిబ్బంది నిరంతరం గస్తీ నిర్వహిస్తూ కెమెరాల ద్వారా పర్యవేక్షణ చేపట్టడం జరుగుతుందన్నారు. గొర్రెల కాపరులు అనుమతి లేకుండా అటవీలోకి ప్రవేశించరాదని, నిబంధనలు అతిక్రమిస్తే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రస్థాయి యోగా పోటీల్లో 4 పతకాలు మహబూబ్‌నగర్ క్రీడలు: కరీంనగర్లో శనివారం జరిగిన రాష్ట్రస్థాయి యోగా పోటీల్లో ఉమ్మడి జిల్లా క్రీడాకారులు నాలుగు కాంస్య పతకాలు సాధించారు. 8–10 ఏళ్ల విభాగంలో రిత్విక్‌రెడ్డి, 10–12 ఏళ్ల విభాగంలో దౌసిక్ శ్రీప్రసాద్, 14–16 ఏళ్ల విభాగంలో ఎం.శివతేజ, 16–18 ఏళ్ల విభాగంలో సీహెచ్.అఖిల్ మూడోస్థానంలో నిలిచి కాంస్య పతకాలు గెలిచారు. అదే విధంగా 12–14 ఏళ్ల బాలుర విభాగంలో జయచంద్ర నాలుగోస్థానం, బాలికల విభాగంలో ఎం.రూప ఐదోస్థానం, 16–8 ఏళ్ల బాలుర విభాగంలో ఎన్.మధు ఆరో స్థానంలో నిలిచారు. పతకాలు సాధించిన విద్యార్థులను ఉమ్మడి జిల్లా యోగా అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ఆనంద్‌కుమార్‌గౌడ్, టి.చంద్రశేఖర్, చైర్మన్ శాంతికుమార్, కార్యనిర్వాహక కార్యనిర్వాహక చైర్మన్ కె.రాములు అభినందించారు. ప్రసాదాల విక్రయ వేలం రూ.61 లక్షలు చిన్నచింతకుంట: కురుమూర్తి స్వామి ఆలయంలో లడ్డు, పులిహోర ప్రసాదాల విక్రయ హక్కులు రూ.61.01 లక్షలకు వేలం పలికింది. స్వామివారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శనివారం ఆలయ ప్రాంగణంలో ప్రసాదాల విక్రయానికి బహిరంగ, సీల్డ్ కవర్ వేలం నిర్వహించారు. ఈ వేలంలో హన్వాడ మండలం కాకర్లపాడుకు చెందిన వెంకటయ్య రూ.61,00,111కు లడ్డు, పులిహోర విక్రయ హక్కులను దక్కించుకున్నారు. అదేవిధంగా విద్యుత్ అలంకరణ పనులను అమరచింతకు చెందిన ప్రవీణ్ రూ.3,49,999కు, రంగులు వేసే పనులను తిర్మలాపురానికి చెందిన ప్రవీణ్ రూ.3.65 లక్షలకు దక్కించుకున్నారు. అచ్చంపేట: నల్లమల గిత్తగా పేరొందిన తూర్పు పొడ జాతి పశువులకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఒంగోలు గిత్తకు ప్రత్యేక గుర్తింపు ఉండగా.. తెలంగాణలో నల్లమల ప్రాంతంలోని మన్ననూర్ గిత్తకు ప్రత్యేక హోదాకు నోచుకోలేకపోతోంది. రాష్ట్రానికి గర్వకారణమైన ఈ జాతికి అరుదైన గౌరవం ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ ప్రాంత పశువుకు గౌరవం కల్పించేందుకు అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ 2025 మే నెలలో అమ్రాబాద్ మండలం మాచారం వచ్చిన సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి సైతం తీసుకెళ్లారు. నల్లమల ప్రాంతంలో మేలుజాతి పొడ పశువులు ●నైపుణ్యం కలిగిన పశువులు.. మన్ననూర్ గిత్తగా గుర్తింపు రావడం సంతోషంగా ఉంది. వ్యవసాయ పనుల్లో ఈ పశువులు మంచి నైపుణ్యం ప్రదర్శిస్తాయి. ఎంత కష్టమైన పనులైనా చేస్తాయి. 35 ఏళ్లుగా పశువుల వ్యాపారం చేస్తున్నా. ఈ ప్రాంత రైతుల నుంచి దూడలు కొనుగోలు చేసి ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లి అమ్ముతా. వివిధ కారణాలతో పశుజాతి తగ్గడంతో వ్యాపారం కూడా తగ్గింది. నల్లమల పశువులకు నాటు పశువులుగా గుర్తింపు ఉంది. – హన్మంతు, పశువుల వ్యాపారి, తూర్పు పొడజాతి గోవు సంఘం అధ్యక్షుడు ) ప్రభుత్వ ప్రోత్సాహం అవసరం.. నాకు 50 వరకు పశువులు ఉన్నాయి. వాటిలో చాలా వరకు పొడ జాతి పశువులు ఉన్నాయి. ఈ పశు సంతతిని పెంచేందుకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. నల్లమల రైతులకు పశుపోషణ భారంగా మారింది. పశుగ్రాసం, నీటి కొరత ప్రధాన కారణంగా మారాయి. రాష్ట్ర ప్రభుత్వం పశు జాతిని సంరక్షించేందుకు పునరావాస, పశుగ్రాసం పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేయాలి. ఈ పశువుల వల్ల నల్లమల అడవికి ఎలాంటి నష్టం ఉండదు. అడవిలో మేపుకొనేందుకు అనుమతి ఇవ్వాలి. – శివాజీ గెలువయ్య, మన్ననూర్, అమ్రాబాద్ మండలం ప్రత్యేక హోదా కల్పిస్తాం.. నల్లమల పొడజాతి మన్ననూర్ గిత్తకు ప్రత్యేక హోదా కల్పిస్తాం. ప్రత్యేకమైన మచ్చలపై పరిశోధన చేయిస్తాం. ఇక్కడ సంతానోత్పత్తి కేంద్రం ఏర్పాటు చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లాం. నల్లమల పశువులకు మంచి డిమాండ్ ఉంది. ఈ జాతి పశువులను సంరక్షించేందుకు ప్రభుత్వ పరంగా చొరవ తీసుకుని నల్లమలకు గుర్తింపు తెస్తాం. – వంశీకృష్ణ, ఎమ్మెల్యే, అచ్చంపేట నల్లమల లోతట్టు అటవీ ప్రాంతంలోని చెంచుపెంటల్లో ఉండే మేలుజాతి పశువులకు వందేళ్లకుపైగా చరిత్ర ఉంది. అమ్రాబాద్, పదర మండలాల పరిధిలోని మద్దిమడుగు, ఇప్పలపల్లి, మారడుగు, ఉడిమిళ్ల, చిట్లంకుంట, వంకేశ్వరం, పదర, లక్ష్మాపూర్, తిర్మలాపూర్, ఉప్పునుంతల, మాధవానిపల్లి, అమ్రాబాద్, మన్ననూర్, వటువర్లపల్లి, దోమలపెంట గ్రామాలతోపాటు మల్లాపూర్, అప్పాపూర్, ఈర్లపెంట, మేడిమొల్కల, ఆగర్లపెంట, పుల్లాయిపల్లి, సంగండిగుండాలు చెంచుపెంటల్లో ఈ పశుజాతి ఉంది. ఈ గ్రామాల రైతులు వ్యవసాయంతోపాటు పశుపోషణ ప్రధాన వృత్తిగా ఎంచుకుని పనిచేస్తున్నారు. వ్యవసాయ అనుబంధమైన పశు పోషణలో ఈ ప్రాంత రైతులు ప్రగతి సాధిస్తున్నారు. నల్లమల తూర్పు పశు సంపదకు తెలంగాణతోపాటు ఆంధ్ర, రాయలసీమ, కర్ణాటక రాష్ట్రంలో మంచి డిమాండ్ ఉంది. కర్నూలు, గుంటూరు, నెల్లూరు, అనంతపూర్, రాయచూర్‌తోపాటు కోస్గి, కొడంగల్ రైతులు దశాబ్దాల కాలంగా మేలుజాతి కోడెలను కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. వ్యాపారులు ఈ ప్రాంతంలో ఉంటూ పశువులను పరిశీలించి నచ్చిన వాటిని కొనుగోలు చేసేవారు. ప్రతిఏటా దీపావళి తర్వాత జరిగే కురుమూర్తి జాతరలోనూ నల్లమల పశువులను అమ్ముతారు. అటవీ ప్రాంతంలో రాళ్లు, రప్పలు, ఎత్తైన గుట్టలు, లోయ ప్రాంతంలోనూ నడిచే శక్తి ఉంటుంది. కాళ్ల గిట్టలు గుర్రం గిట్టలను పోలి బలంగా ఉండటంతో బాగా నడుస్తాయి. అటవీ మేతతో దృఢంగా ఉండడం, 20– 25 ఏళ్లపాటు వ్యవసాయ పనులు చేసే సామర్థ్యం కలిగి ఉండటం వల్ల వీటిపై ఆసక్తి చూపుతారు. రోగ నిరోధక శక్తి కలిగి ఉండి పాలు సైతం బాగా ఇస్తాయి. అటవీ సిబ్బందికి రక్షణ సామగ్రి అందజేత మన్ననూర్: అమ్రాబాద్ ఫారెస్టు డివిజన్‌తోపాటు జిల్లా పరిధిలో విధులు నిర్వహిస్తున్న అటవీ శాఖలోని 170 మంది ఫ్రంట్‌లైన్ సిబ్బందికి మన్ననూరు రైతువేదిక ప్రాంగణంలో డీఎఫ్ఓ రేవంత్‌చంద్ర శనివారం రక్షణ సామగ్రి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అటవీ, వన్యప్రాణుల సంరక్షణ కోసం ముందుండి విధులు నిర్వహిస్తున్న బేస్‌క్యాంపు, యానిమల్ ట్రాకర్స్, పేపర్ పికర్స్, ఫైర్ వాచర్ల భద్రత, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ష్యూస్, జాకెట్లు అందజేశామని చెప్పారు. హైదరాబాద్‌కు చెందిన యూఎస్టీ సాఫ్ట్వేర్ కంపెనీ, సీఎస్ఆర్ సంస్థల సహకారంతో సిబ్బందికి అందజేసిన ఈ కిట్లు పెట్రోలింగ్ వన్యప్రాణుల పర్యవేక్షణ, అటవీ సంరక్షణ, అక్రమ కలప నియంత్రణ తదితర విధులు నిర్వహించే సిబ్బందికి ప్రత్యేకించి అన్ని సమయాల్లో కూడా ఉపయోగకరంగా ఉంటాయని చెప్పారు. కార్యక్రమంలో ఎఫ్డీఓ చంద్ర ప్రకాష్ సింఘాల్, ఆయా సంస్థల ప్రతినిధులు మదన్‌రెడ్డి, విశాల్, శ్రీనాథ్, సందీప్, అంకిత్‌కుమార్, ఎఫ్ఆర్ఓలు సవిత, వీరేష్, ఎఫ్ఎస్ఓ సురేందర్ తదితరులు పాల్గొన్నారు. స్వీయ ఆలోచనలతో.. ఇన్స్పైర్ మనక్–2026 విద్యా సంవత్సరంలో భాగంగా 6 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు తమ స్వీయ ఆలోచనలతో రూపొందించిన పరికరాలు, యంత్రాలు, పర్యావరణ పరిరక్షణ, వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, రవాణా, నీటి సంరక్షణ, ఇంధన పొదుపు, వ్యర్థాల నిర్వహణతోపాటు ప్రజలు దైనందిన జీవితానికి ఉపయోగపడే కొత్త ఆలోచనలను ఈ కార్యక్రమం ద్వారా నామినేట్ చేసుకునే అవకాశం ఉంది. లోతట్టు అభయారణ్యంలో.. 2016 డిసెంబర్ 27న అమ్రాబాద్ మండలం లక్ష్మాపూర్(బికె)లో ఈ ప్రాంత రైతులు, తెలంగాణ జీవవైవిధ్య సంస్థతోపాటు వాన్సన్ స్వచ్ఛంద సంస్థ తూర్పుజాతి పశు ప్రదర్శన ఏర్పాటు చేసింది. అదేవిధంగా పశు పెంపకందారుల సంఘం ఏర్పాటు చేశారు. ఆ రోజు నల్లమల అటవీ ప్రాంతంలోని పశుజాతికి మన్ననూర్ గిత్తగా నామకరణం చేశారు. అంతర్జాతీయ గుర్తింపు తీసుకొస్తామని అప్పటి సీఎం కేసీఆర్ ప్రకటించారు. గతంలో ఒక్కో రైతుకు 100 నుంచి 300 వరకు పశువులు ఉండేవి. 50 వేలకుపైగా పశువులు ఉన్న ఈ ప్రాంతంలో ప్రస్తుతం 20 వేలకు తగ్గిపోయింది. ఇది వరకు నల్లమల అటవీ ప్రాంతంలో స్వేచ్ఛగా పశువులను మేపుకొనే వారు. అటవీశాఖ నిబంధనలు, అభ్యంతాల వల్ల పశుగ్రాసం కొరత ఏర్పడింది. పశు పోషణ భారంగా మారి చాలామంది ఆ వృత్తిని వదులుకుంటున్నారు. కోడె దూడలకు డిమాండ్ జిల్లాలో ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తులు 450 ప్రైవేట్ పాఠశాల నుంచి 2 ప్రాజెక్టులు మాత్రమే నమోదు ప్రతి పాఠశాల నుంచి 5 చొప్పున రావాలని సూచన క్షేత్రస్థాయిలో చొరవ తీసుకోని ఉపాధ్యాయులు ఈ నెల 15తో ముగియనున్న గడువు -
లోక్‌అదాలత్‌లో 6,985 కేసులు పరిష్కారం
నాగర్‌కర్నూల్: రాజీమార్గమే రాజమార్గం అని జిల్లా ప్రధాన న్యాయమూర్తి రమాకాంత్ అన్నారు. శనివారం జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా జిల్లాకేంద్రంలోని జిల్లా కోర్టులో ఏర్పాటు చేసిన లోక్ అదాలత్‌లో ఆయన మాట్లాడారు. జిల్లాలోని అన్ని కోర్టుల ప్రాంగణాల్లో లోక్ అదాలత్ నిర్వహించామన్నారు. ఈ లోక్ అదాలత్‌లో భూ తగాదా, రాజీ చేసుకోదగిన క్రిమినల్ కేసులు, చెక్‌బౌన్స్, కుటుంబ కేసులు, మోటారు వాహనాల ఆక్సిడెంట్ కేసులు, బ్యాంకు కేసులు తదితర పెండింగ్ కేసులకు సంబంధించి జిల్లావ్యాప్తంగా 6,985 కేసులు పరిష్కారం అయ్యాయని చెప్పారు. రాజీ మార్గమే రాజమార్గం ద్వారా సత్వర పరిష్కారంతో అప్పీల్ లేని తీర్పును పొంది సమయాన్ని, డబ్బును ఆదా చేసుకోవచ్చన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ గ్రామీణ బ్యాంకుకు సంబంధించిన క్రాప్‌లోన్ ప్రీ లిటిగేషన్ కేసు రూ.3 లక్షలు ఉన్నటువంటి కేసును రూ.90 వేలకు రాజీ ద్వారా పరిష్కరించబడిందన్నారు. కార్యక్రమంలో జిల్లా పోక్సో స్పెషల్ జడ్జి నసీమా సుల్తానా, లీగల్ సర్వీసెస్ సెక్రెటరీ నిహారిక, గోపిక నాగశ్రావ్య, శృతిదూత, జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రవికాంత్‌రావు, కక్షిదారులు పాల్గొన్నారు. -
ఉప సర్పంచ్ చెక్ పవర్ రద్దు చేయాలి
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): ఉప సర్పంచ్‌లకు ఉన్న చెక్ పవర్‌ను రద్దు చేయాలని సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సత్యనారాయణరెడ్డి డిమాండ్ చేశారు. శనివారం పీఆర్ శాఖ మంత్రి సీతక్కను కలిసి సంఘం నాయకులు వినతిపత్రం అందజేశారు. పెండింగ్ గౌరవ వేతనాలు, పంచాయతీ నిధులు విడుదల చేయాలని, విద్యుత్ బిల్లులను ప్రభుత్వమే చెల్లించాలని కోరారు. 15వ ఆర్థిక సంఘం నిధులు, మ్యాచింగ్ గ్రాంట్లు విడుదల చేయాలని, ఇందిరమ్మ కమిటీలతో సర్పంచ్ల అధికారాలను తగ్గించే జీఓను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బత్తుల వెంకట్రాములుగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
ముందుకు రాని ప్రైవేట్ పాఠశాలలు..
ప్రస్తుత కాలంలో ర్యాంకులే పరమావధిగా వ్యవహరిస్తున్న ప్రైవేటు పాఠశాలలు విద్యార్థుల సృజనాత్మకతను బయటకు తీయడానికి మాత్రం అలసత్వం వహిస్తున్నారు. ఎందుకంటే వాటితో ప్రైవేటు యాజమాన్యాలకు ఎలాంటి లాభం ఉండదు కాబట్టి. ప్రభుత్వ పాఠశాలలో కొంత మెరుగ్గా ఉన్నా.. ప్రైవేటు పాఠశాలల్లో మాత్రం పరిస్థితి దయనీయంగా ఉంది. ఇప్పటి వరకు జిల్లావ్యాప్తంగా ప్రైవేట్ పాఠశాలల నుంచి రెండు ప్రాజెక్టులు మాత్రమే ఆన్లైన్లో నమోదు చేశారు. విద్యాశాఖ అధికారులు ఎన్నిసార్లు వారికి తెలియజేసినా ముందుకు రాకపోవడం గమనార్హం. కందనూలు: చిన్నారుల ఆలోచనలకు సరికొత్త రూపం ఇవ్వడానికి.. నూతన ఆవిష్కరణల్లో వారిని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రతిఏటా ఇన్స్పైర్ మనక్ నిర్వహిస్తోంది. ప్రస్తుత పోటీ ప్రపంచంలో పాఠ్య పుస్తకాల పరిజ్ఞానమే కాకుండా.. సృజనాత్మక ఆలోచనలు, సమస్యలకు శాసీ్త్రయ పరిష్కారాలను కనుగొనే సామర్థ్యం విద్యార్థులకు ఎంతో అవసరం. ఇలాంటి సృజనాత్మకతతో కూడిన భావాలను వెలికితీసి.. జాతీయ స్థాయిలో గుర్తింపు కల్పించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇన్స్పైర్ మనక్‌కు స్పందన కరువైంది. జూలై 1న ఆన్లైన్ ప్రక్రియ ప్రారంభమై రెండు నెలలు గడుస్తుండగా.. జిల్లాలో వెయ్యి దరఖాస్తులకు గాను 450 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. నగదు ప్రోత్సాహం కల్పించినా నామినేషన్లు అంతంత మాత్రంగానే వచ్చాయి. ఈ నెల 15 నాటికి గడువు ముగియనుండటంతో ఏ మేరకు దరఖాస్తులు పెరుగుతాయో వేచిచూడాలి. రూ.10 వేల చొప్పున ప్రోత్సాహకం.. నామినేషన్ ఇన్‌స్పైర్‌లో ప్రతిభ కనపరిచిన విద్యార్థికి రూ.10 వేల చొప్పున ప్రోత్సాహకం ఇస్తారు. విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లోనే నేరుగా జమచేస్తారు. తొలుత జిల్లాస్థాయిలో ఆ తర్వాత ఎంపికై తే వారికి రాష్ట్రస్థాయిలో అందులో ఎంపికై తే జాతీయ స్థాయి వరకు విద్యార్థులు తమలోని వైజ్ఞానిక ప్రతిభను ప్రదర్శించే వీలు కలుగుతుంది. విద్యార్థులను ప్రోత్సహించి ఇన్‌స్పైర్‌కు నామి నేషన్లు నమోదు చేయించడంలో సంబంధిత పాఠ శాలల ఉపాధ్యాయులు నిర్లక్ష్యం వహిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లా సైన్స్ అధికారు లు కూడా సంబంధిత ఉపాధ్యాయులకు అవ గాహన కల్పించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ప్రతి పాఠశాల నుంచి 5.. జిల్లావ్యాప్తంగా 124 ప్రాథమికోన్నత, 130 ఉన్నత, ప్రైవేటులో 83 ప్రాథమికోన్నత, 80 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. అయితే అన్ని యాజమాన్యాల పరిధిలోని విద్యాలయాల్లో చదువుకునే విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనడానికి అర్హులు. ప్రతి పాఠశాల నుంచి కనీసం ఐదు మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. వన్‌టైం రిజిస్ట్రేషన్‌లో భాగంగా విద్యాలయాలు వివరాలు పొందుపర్చాలి. చర్యలు తీసుకుంటున్నాం.. జిల్లా నుంచి అధిక మొత్తంలో దరఖాస్తులు పంపేలా చర్యలు తీసుకుంటున్నాం. అన్ని పాఠశాలల ఉపాధ్యాయులతో మాట్లాడుతున్నాం. ఎంఈఓలు, పాఠశాలల హెచ్ఎంల సహకారంతో వీలైనంత ఎక్కువ దరఖాస్తులు చేయించేలా ప్రయత్నిస్తున్నాం. – శైలజ, జిల్లా సైన్స్ అధికారి -
ఈదమ్మగుడి బాట ఆక్రమణ తొలగించాలి
కొల్లాపూర్: పట్టణంలోని శివాలయం నుంచి ఈదమ్మగుడికి వెళ్లే బాట పంచాయితీ ఉద్రిక్తతకు దారితీసింది. నెల రోజులుగా ఈ బాట విషయంలో రెండు వర్గాల మధ్య వివాదం రేగుతోంది. గతంలో ఉన్న బాటను ఆక్రమించి ఓ వర్గం శ్మశాన వాటిక కోసం కంచె ఏర్పాటు చేస్తున్నారని మరోవర్గం సంఘాలు, రైతు నాయకులు ఆరోపిస్తుండగా.. సర్వే నక్ష ప్రకారమే తాము హద్దులు ఏర్పాటు చేసుకున్నామని మరోవర్గం నాయకులు చెబుతున్నారు. ఈ క్రమంలో శనివారం బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు ఎల్లేని సుధాకర్‌రావు తన అనుచరులతో కలిసి రహదారిని పరిశీలించారు. మరోవర్గం ఏర్పాటు చేసిన సరిహద్దు రాళ్లను తొలగించి, 50 ఫీట్ల వెడల్పుతో రహదారి కోసం సిమెంట్ స్తంభాలు నాటారు. కొల్లాపూర్‌లో అందరూ సోదరభావంతో మెలుగుతున్నారని.. ఉద్దేశపూర్వకంగా ఓ కౌన్సిలర్ రెండు వర్గాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పోలీసులు అక్కడికి చేరుకొని త్వరలోనే ఇరవర్గాల నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి సమస్య పరిష్కరిస్తామని చెప్పడం నాయకులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాగా.. మధ్యాహ్న సమయంలో సీఐ శంకర్‌నాయక్ పోలీసు, మున్సిపల్ సిబ్బందితో రహదారి కోసం నాటిన సిమెంట్ స్తంభాలు తొలగించేందుకు వచ్చారనే సమాచారంతో బీజేపీ నాయకులు మళ్లీ అక్కడికి వచ్చారు. తాము నాటిన సిమెంట్ కడ్డీలు తొలగిస్తే.. ఆందోళన చేస్తామని హెచ్చరించడంతో పోలీసులు, మున్సిపల్ సిబ్బంది అక్కడి నుంచి వెళ్లిపోయారు. -
సమస్యలు పరిష్కరించాలని రైస్ మిల్లర్ల ధర్నా
కందనూలు: రైస్ మిల్లర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నాగర్‌కర్నూల్ జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు అనంతప్రతాపరెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జిల్లాలోని రైస్ మిల్లులను రక్షించాలని, మిల్లర్లపై జరుగుతున్న దాడులను వెంటనే నిలిపివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఓటీఆర్ సమస్యను తక్షణమే పరిష్కరించాలని, మిల్లింగ్ చార్జీలను పెంచాలని కోరారు. మిల్లర్లపై విధిస్తున్న 25 శాతం పెనాల్టీ, 12 శాతం వడ్డీని మాఫీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నాయకులు హకీం రాజేష్, ప్రధానకార్యదర్శి రవికుమార్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. -
కమ్యూనిస్టుల పోరాటాలతోనే భూస్వాముల నుంచి విముక్తి
కొల్లాపూర్: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారసత్వాన్ని కొందరు చోరీ చేసేందుకు ప్రయత్నించడం దారుణమని.. కమ్యూనిస్టుల పోరాటాలతోనే భూస్వాముల నుంచి పేదలకు విముక్తి లభించిందని సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ఎండీ ఫయాజ్ అన్నారు. శుక్రవారం కొల్లాపూర్‌లో సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతాంగ పోరాటయోధుడు సీఆర్ శర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి.. ఆయన కుటుంబ సభ్యులను శాలువాలతో సత్కరించారు. అనంతరం ఫయాజ్ మాట్లాడుతూ.. రైతాంగ పోరాటంలో క్రియాశీలకంగా వ్యవహరించిన కొల్లాపూర్వాసి సీఆర్ శర్మను రజాకార్లు హత్యచేశారన్నారు. కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో కొనసాగిన సాయుధ రైతాంగ పోరాటం దేశంలోని పెత్తందారులు, భూస్వాముల గుండెల్లో గుబులు పుట్టించిందన్నారు. నాటినుంచి నేటివరకు పేద వర్గాల పక్షాన సీపీఐ పోరాటం చేస్తోందని వివరించారు. అమరుల త్యాగాలను వృథా కానివ్వబోమన్నారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు కేశవులుగౌడ్, పెబ్బేటి విజయుడు, తన్నీరు నర్సింహ, ఇందిరమ్మ, ఆర్.చంద్రమోళి, మల్లయ్య, గుర్రపు కురుమయ్య, యూసూఫ్, లక్ష్మీనారాయణ, రాధాకృష్ణ, జంగం శివుడు, కృష్ణ, సాయిలు, బాలస్వామి పాల్గొన్నారు. -
మరో ఏడాది ఆగాల్సిందే!
‘పాలమూరు–రంగారెడ్డి’ నీటికోసం తప్పని నిరీక్షణ ● నార్లాపూర్– ఏదుల మధ్య పూర్తి కాని కాల్వ పనులు ● దాదాపు 8 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తొలగింపునకు చర్యలు ● డిసెంబర్ నాటికి లక్ష్యం నిర్దేశం.. మార్చి వరకు కొనసాగే అవకాశం ● ఆ మట్టి తొలిగిస్తేనే ఏదుల రిజర్వాయర్‌కు సాఫీగా నీరు నార్లాపూర్– ఏదుల రిజర్వాయర్ మధ్య ఓపెన్ కాల్వలో కుడికిళ్ల, తిర్నాంపల్లి వద్ద ఉన్న రాయిని తొలిగింపు పనులు వేగవంతం చేశాం. డిసెంబర్ చివరిలోగా తొలిగింపు పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు సూచించాం. రాయి బ్లాస్టింగ్ చేసి లోతు నుంచి బయటకు రాళ్లు తీసుకెళ్లడం కొంత ఇబ్బందిగా ఉంది. కాల్వలో హార్డ్ రాక్ తొలిగిస్తే నార్లాపూర్ నుంచి ఏదుల రిజర్వాయర్‌కు నీళ్లు తరలించవచ్చు. ఏదుల నుంచి వట్టెం రిజర్వాయర్‌కు అక్కడి నుంచి కర్వెనకు ఎత్తిపోయడానికి పంపుసెట్లు బిగింపు సైతం పూర్తి అయ్యింది. అన్ని పనులు పూర్తయ్యి.. శ్రీశైలం ప్రాజెక్ట్‌లో నీళ్లు ఉంటే రిజర్వాయర్‌లోకి తరలించవచ్చు. – పార్థసారధి, ఇరిగేషన్ ఎస్ఈ నాగర్‌కర్నూల్: బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పనులు కొనసా..గుతూనే ఉన్నాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పనులు వేగవంతం చేయడంలో నిర్లక్ష్యం చేసిందనే విమర్శలున్నాయి. గతేడాది మే నెలలో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పర్యటించి 2025 డిసెంబర్ నాటికి పనులు పూర్తి చేయాలని ఆదేశించినా.. ఇంకా చాలా వరకు పనులు పెండింగ్‌లోనే ఉన్నాయి. దీంతో ఈ ఏడాది రెండు పంపుసెట్లు ప్రారంభించినా.. కేవలం నార్లాపూర్ రిజర్వాయర్‌లోకి రెండు టీఎంసీలు ఎత్తిపోసి నిలిపివేశారు. ఏదుల రిజర్వాయర్‌కు నీటిని సరఫరా చేయడానికి ఓపెన్ కాల్వ పనులు అసంపూర్తిగా ఉండటమే ఇందుకు కారణం. కుడికిళ్ల, తిర్నాంపల్లి వద్ద దాదాపు 8 లక్షల క్యూబిక్ మీటర్ల గట్టి రాయి ఉండటంతో నీరు వదలడానికి వీలు కాలేదని, ప్రస్తుతం రాయి తొలగింపు పనులు కొనసాగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. -
పకడ్బందీగా పోషణ మాసోత్సవాలు
కందనూలు: పోషణ మాసోత్సవాలను పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ దేవసహాయం అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో జిల్లా మహిళా శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో పోషణ్ అభియాన్ – పోషణ మాసం కార్యక్రమాలపై వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. పోషణ మాసోత్సవాల్లో గర్భిణులు, బాలింతలు, చిన్నారులు, కిషోర బాలికలకు సమతుల్య ఆహారం, పోషకాహారం, ఆరోగ్య పరిరక్షణపై అవగాహన పెంచాలని సూచించారు. పోషకాహార లోపాన్ని నివారించేందుకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న సేవలను మరింత సమర్థవంతంగా ప్రజలకు చేరువ చేయాలని సూచించారు. పిల్లల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు తొలి దశ నుంచే సరైన పోషకాహారం అందించడం ఎంతో కీలకమన్నారు. పోషణ మాసం కార్యక్రమాలను కేవలం సంక్షేమశాఖకు మాత్రమే పరిమితం చేయకుండా.. వైద్యారోగ్యశాఖ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, విద్య, మున్సిపల్ తదితర శాఖలు పరస్పర సమన్వయంతో నిర్వహించాలని ఆయన సూచించారు. ప్రతి అంగన్వాడీ కేంద్రం పరిధిలో కార్యక్రమాల నిర్వహణకు ముందస్తు కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. అనంతరం ప్రతిజ్ఞ చేయించారు. సమావేశంలో జిల్లా సంక్షేమశాఖ అధికారి పాండు, డీఈఓ రమేశ్‌కుమార్, డీఆర్డీఓ చిన్న ఓబులేషు, జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ అధికారి కోటయ్య, డీపీఓ శ్రీరాములు, జిల్లా సాంఘిక సంక్షేమశాఖ అధికారి ఉమాపతి, వైద్యారోగ్యశాఖ అధికారి రవి నాయక్, డీవైఎస్ఓ సీతారాంనాయక్ ఉన్నారు. -
‘సర్’.. అస్పష్టత!
● నోటీసుల జారీ నుంచి విచారణ వరకు గందరగోళం ● సామాన్య ఓటర్లకు తప్పని తిప్పలు ● నేటి నుంచి రెండో విడత మెగా హియరింగ్ ● ఆధార్‌తో పాటు మరో పత్రం సమర్పించాల్సిందే.. జిల్లాలోని నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కొల్లాపూర్, కల్వకుర్తి నియోజకవర్గాల్లో ఇటీవల విడుదల చేసిన ముసాయిదా జాబితా ప్రకారం 8,35,482 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 1,65,552 మంది ఓటర్ల వివరాలు అనామలీస్ కేటగిరీలో ఉన్నాయి. మరో 15,563 మంది అన్‌మ్యాపింగ్ ఓటర్లు ఉన్నారు. ఈ రెండు కేటగిరీల ఓటర్లు మొత్తం 1,81,115 మందికి నోటీసులు జారీ చేస్తున్నారు. ఇప్పటికే 90 శాతానికి పైగా నోటీసులు జారీ పూర్తయ్యాయి. ప్రతి ఓటరు వివరాలను బీఎల్ఓల నుంచి రిటర్నింగ్ అధికారి, ఎన్నికల సిబ్బంది, జిల్లా ఎన్నికల అధికారి వరకు పరిశీలన చేయాల్సి ఉంది. ఇందుకోసం మెగా హియరింగ్ నిర్వహణలో అధికారులు నిమగ్నమయ్యారు. కాగా, అన్మ్యాప్డ్ ఓటర్లు, వివరాలు సరిగ్గా లేని ఓటర్ల జాబితాను ఈ నెల 8న ఎన్నికల సంఘం విడుదల చేసింది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) వెబ్సైట్ https://-cŠ-obèlte langana.nic.in లో ఈ జాబితాను అందుబాటులో ఉంచారు. అచ్చంపేట: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో ఓటర్లకు తిప్పలు తప్పడం లేదు. అనామలీస్, అన్మ్యాప్డ్ ఓటర్లు నోటీసుల జారీ నుంచి విచారణ వరకు గందరగోళ పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. జిల్లాలో 1,81,115 మంది ఓటర్ల వివరాలు సరిగ్గా లేవు. వారందరికీ నోటీసులను జారీ చేస్తున్నారు. జిల్లా నుంచి విద్య, ఉద్యోగ, ఉపాధి తదితర కారణాలతో వేర్వేరు చోట్లకు వలసలు వెళ్లారు. అయినా చాలా మంది ఓటు హక్కు స్థానికంగానే కొనసాగుతోంది. ఓటరు మ్యాపింగ్ సమయంలో పేరు, తల్లిదండ్రుల పేర్లు, అడ్రస్, వయసు, లింగం వివరాల్లో తప్పిదాలు దొర్లాయి. వీరు ఆన్లైన్లో వివరాలను ఆప్‌లోడ్ చేసే క్రమంలో యాప్ తీసుకోవడం లేదు. దీంతో నోటీసులు అందుకున్న ఓటర్లంరూ తప్పనిసరిగా స్పందించాల్సి ఉంది. సరైన రుజువు చూపిస్తేనే తుది జాబితాలో చోటు దక్కుతుంది. అయితే చాలా మంది ఓటర్లకు నోటీసులు అందుతున్నా బీఎల్వోలు, అధికారుల వద్దకు హియరింగ్ కోసం నిర్ణీత సమయంలో రావడం లేదు. ఇప్పటికే ఈ నెల 5, 6 తేదీల్లో మొదటి విడత మెగా హియరింగ్ పూర్తయింది. 12, 13 తేదీల్లో రెండో విడత మెగా హియరింగ్ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు.. ఓటర్ల నమోదు, తొలగింపు, వివరాల సేకరణకు సంబంధించి ఫారం–6, 7, 8 దరఖాస్తులపై అవగాహన కల్పించేందుకు ఈ నెల 12, 13 తేదీల్లో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఓటర్లకు నోటీసుల జనరేషన్, విచారణ పురోగతిని రాజకీయ పార్టీల ప్రతినిధులకు వివరించనున్నారు. అర్హత కలిగిన ప్రతి ఓటరు పేరు తుది ఓటర్ల జాబితాలో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. అదే సమయంలో అర్హత లేని, మరణించిన, ఇతర కారణాలతో తొలగించాల్సిన పేర్లను నిబంధనల ప్రకారం పరిశీలన చేయనున్నారు. -
చట్టాలపై అవగాహన తప్పనిసరి
కందనూలు: విద్యార్థులకు చట్టాలపై తప్పనిసరిగా అవగాహన ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి నిహారిక అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని జ్యోతిరావుపూలే గురుకుల పాఠశాలలో విద్యార్థులకు చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు బోధించే పాఠ్యాంశాలను అవగతం చేసుకోవడంతో పాటు సమాజంలో జరుగుతున్న అంశాలపై విద్యార్థులు చైతన్యం కావాలని సూచించారు. జీవితంలో ప్రతి ఒక్కరు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని ముందుకెళ్లాలని తెలిపారు. కార్యక్రమంలో గురుకుల ప్రిన్సిపల్ నవనీత, న్యాయవాది శ్రీరామ్ ఆర్య పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత కందనూలు: మట్టి వినాయకులను పూజించి.. పర్యావరాణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆర్డీఓ అర్చన అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, తెలంగాణ నేషనల్ గ్రీన్ క్రాప్స్, కళాశాల ఎకో క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులు మట్టి వినాయకులు తయారు చేసి, సుమారు 60 గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాలలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆర్డీఓ మాట్లాడుతూ.. విద్యార్థులు పర్యావరణ పరిరక్షణపై చైతన్యం కలిగించే కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. విద్యార్థి దశ నుంచే ఇలాంటి ఆలోచనలను గ్రామస్థాయికి తీసుకెళ్లాలని సూచించారు. అనంతరం విద్యార్థులు తయారు చేసిన మట్టి వినాయకులను పలువురికి పంపిణీ చేశారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ మదన్మోహన్, అధ్యాపకులు అంజయ్య, వనిత, ఉమాదేవి, కోదండరాములు, రామకృష్ణ పాల్గొన్నారు. పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్ అచ్చంపేట/కందనూలు: అచ్చంపేట మండలం బొమ్మనపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి వి.రమేశ్‌బాబును సస్పెన్షన్ చేస్తూ శుక్రవారం కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఒకే వ్యక్తికి రెండు వేర్వేరు తేదీలతో మరణ ధ్రువపత్రాల జారీ చేయడంపై అచ్చంపేట డివిజనల్ పంచాయతీ అధికారి విచారించి, నివేదిక సమర్పించగా... ఈ మేరకు కలెక్టర్ చర్యలు తీసుకున్నట్లు డీపీఓ శ్రీరాములు తెలిపారు. 2024 ఆగస్టు 1 నుంచి విధులు నిర్వహిస్తున్న రమేశ్‌బాబు.. మరణించిన వ్యక్తి వివరాలను రెండు పర్యాయాలు వేర్వేరు తేదీలతో ఆన్లైన్ రికార్డుల్లో నమోదు చేసి.. మరణ ధ్రువపత్రాల జారీ రిజిస్టర్లో మాత్రం ఒకసారి మాత్రమే నమోదు చేసినట్లు విచారణలో వెల్లడైంది. గ్రామ పంచాయతీ చట్టబద్ధ రికార్డులను సక్రమంగా నిర్వహించకపోవడం, అధికారాలను దుర్వినియోగం చేయడం, విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని సస్పెన్షన్ చేసినట్లు డీపీఓ తెలిపారు. తగ్గిన లడ్డు పరిణామం.. కేసు నమోదు చిన్నచింతకుంట: మండలంలోని అమ్మాపురం కురుమూర్తిస్వామి ఆలయంలో భక్తులకు అందించే లడ్డు ప్రసాదం తయారీ కేంద్రంలో శుక్రవారం తూనికల అధికారులు తనిఖీలు నిర్వహించారు. లడ్డు పరిమాణం తక్కువగా ఉందని నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా తూనికల జిల్లా అధికారి రవీందర్ మాట్లాడుతూ లడ్డూల తయారీలో అవకతవకలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. కురుమూర్తిస్వామి ఆలయం వద్ద భక్తులకు అందించే లడ్డు పరిమాణం 100 గ్రాములకు గాను 80 గ్రాములు మాత్రమే ఉన్నట్లు గుర్తించామన్నారు. ఈ మేరకు నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు. -
సమసమాజ స్థాపనకు పూలే కృషి మరవలేనిది
నాగర్‌కర్నూల్ రూరల్: సమసమాజ స్థాపనకు మహాత్మా జ్యోతిరావుపూలే చేసిన కృషి మరవలేదని మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, సి.లక్ష్మారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. శుక్రవారం నాగర్‌కర్నూల్ మండలం వనపట్లలో గ్రామ సర్పంచ్ వాసుదేవుడు, తెలంగాణ వికాస సమితి రాష్ట్ర అధ్యక్షుడు వనపట్ల సుబ్బయ్య ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డితో కలిసి జ్యోతిరావు పూలే విగ్రహ ఏర్పాటుకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సమస్త సమస్యలకు విద్యతోనే పరిష్కారం లభిస్తుందని నమ్మి, అన్ని వర్గాల కోసం పాఠశాలలు, హాస్టళ్లను నిర్మించి విద్యాభివృద్ధి కోసం ఎనలేని కృషి చేసిన మహనీయుడు జ్యోతిరావుపూలే అని కొనియాడారు. ఆయన విగ్రహాన్ని స్థాపించుకోవడం భారత విద్యాజ్యోతిని నిలబెట్టుకోవడమేనని అన్నారు. కార్యక్రమంలో మణ్యపురెడ్డి, శ్రీశైలం యాదవ్, రాములు, పాండు, బాబురావు, తిరుపతయ్య, శంకర్‌రెడ్డి, నర్సింహ, కృష్ణయ్య, స్వామి జావుల బాలయ్య పాల్గొన్నారు. -
అన్ని పోలింగ్ కేంద్రాల్లో..
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు ఎస్ఐఆర్–2026 క్లెయిమ్స్, అభ్యంతరాల ప్రక్రియలో భాగంగా ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తాం. మొదటి దశ హియరింగ్ ముగిసింది. రెండో దశ 12, 13 తేదీల్లో ఎస్ఐఆర్ స్పెషల్ క్యాంపెయిన్ జిల్లాలోని ప్రతి పోలింగ్ కేంద్రంలో నిర్వహిస్తున్నాం. ప్రత్యేక ప్రచార కార్యక్రమం సందర్భంగా ఓటర్లు, దరఖాస్తుదారులు తమ పేర్లు ముసాయిదా ఓటరు జాబితాలో ఉన్నాయో లేదో పరిశీలించుకోవచ్చు. అవసరమైన మార్పులు, చేర్పులు, తొలగింపుల కోసం ఫారం–6, 7, 8 ద్వారా క్లెయిమ్స్ సమర్పించవచ్చు. – హేమంత కేశవ్ పాటిల్, కలెక్టర్ -
పారదర్శకంగా సర్ ప్రక్రియ
నాగర్‌కర్నూల్: జిల్లాలో సర్ ప్రక్రియను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, పకడ్బందీగా చేపడుతున్నట్లు కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అన్నారు. గురువారం కలెక్టరేట్లోని వీసీ హాల్లో అదనపు కలెక్టర్ చెన్నయ్యతో కలిసి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సర్ ప్రక్రియపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్ ప్రక్రియకు సంబంధించి కేంద్ర ఎన్నికల కమిషన్ గడువు పొడిగించిందన్నారు. సవరించిన షెడ్యూల్ ప్రకారం క్లెయిమ్స్, అభ్యంతరాల స్వీకరణకు అక్టోబర్ 7, తుది ఓటర్ల జాబితా నవంబర్ 9న ప్రచురించనున్నట్లు వెల్లడించారు. గడువు పొడిగించినందున రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికారులతో కలిసి మరింత సమన్వయంతో పనిచేసి సర్ ప్రక్రియను నిర్ణీత సమయంలో పూర్తిచేసేలా చొరవ తీసుకోవాలని చెప్పారు. జిల్లాలో ఇప్పటి వరకు 1,15,824 నోటీసులు జారీ చేయగా, కేవలం 329 నోటీసులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని, హియరింగ్‌కు హాజరు కావాల్సిన 47,236 మందిలో ఇప్పటివరకు సుమారు 40 శాతం మందికి విచారణ పూర్తయిందని పేర్కొన్నారు. విచారణకు హాజరుకాని సుమారు 25 వేల మందికి మరో అవకాశం కల్పిస్తున్నామని, ఈ నెల 20లోగా అన్నింటినీ పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో కలెక్టరేట్ ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ రవికుమార్, ఎన్నికల డీటీ కల్పన తదితరులు పాల్గొన్నారు. ఐలమ్మ పోరాటం చిరస్మరణీయం కందనూలు: చాకలి ఐలమ్మ పోరాటం చిరస్మరణీయమని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అన్నారు. ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకొని కలెక్టరేట్లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చాకలి ఐలమ్మ సామాజిక న్యాయం, ఆత్మగౌరవం, అణగారిన వర్గాల హక్కుల కోసం ధైర్యంగా పోరాడిన మహనీయురాలు అని, అన్యాయం, దోపిడి, అణచివేతకు వ్యతిరేకంగా ఆమె ప్రదర్శించిన తెగువ, పోరాట పటిమ, ఆత్మవిశ్వాసం సమాజానికి ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని కొనియాడారు. ప్రభుత్వం బీసీ వర్గాల సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ వివిధ సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ దేవసహాయం, బీసీ సంక్షేమ శాఖ అధికారి ఇందిర, గిరిజన సంక్షేమ శాఖ అధికారి కోటయ్య, బీసీ సంక్షేమ సహాయ అధికారి శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. -
రేపు ఉమ్మడి జిల్లా ఖోఖో క్రీడాకారులు ఎంపికలు
మహబూబ్‌నగర్ క్రీడలు: జడ్చర్ల మండలంలోని పెద్ద ఆదిరాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈనెల 12వ తేదీన ఉదయం 10 గంటలకు రాష్ట్రస్థాయి ఖేలో ఇండియాలో పాల్గొనే ఉమ్మడి జిల్లా ఖోఖో క్రీడాకారుల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి జిల్లా ఖోఖో సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ఉబేదుల్లా కొత్వాల్, జీఏ విలియం గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎంపికల్లో పాల్గొనే క్రీడాకారులు 01.01.2008 తర్వాత జన్మించిన వారై ఉండాలని పేర్కొన్నారు. క్రీడాకారులు జనన ధ్రువీకరణ పత్రం, పదోతరగతి మెమో, ఆధార్‌కార్డుతో ఎంపికలకు హాజరుకావాలని, మిగతా వివరాల కోసం 99853 75737 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు. ఎంపికయ్యే క్రీడాకారులు సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో ఈనెల 16న (బాలురు), 17న (బాలికలు) జరిగే రాష్ట్రస్థాయి సెలక్షన్స్‌లో పాల్గొనాల్సి ఉంటుందని పేర్కొన్నారు. -
వేరుశనగ బ్రీడర్ విత్తనాలతో దిగుబడులు
ఉప్పునుంతల: మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం (పీఏసీఎస్)ను గురువారం పాలెం వ్యవసాయ శాస్త్రవేత్తలతోపాటు వివిధ రాష్ట్రాలకు చెందిన వ్యవసాయ శాస్త్రవేత్తల బృందం సందర్శించింది. పీఏసీఎస్ ఎఫ్‌పీఓ ఆధ్వర్యంలో ఇటీవల రూ.2.50 కోట్లతో ఏర్పాటు చేసిన వేరుశనగ డికార్డికేటర్‌ను శాస్త్రవేత్తల బృందం పరిశీలించి.. వేరుశనగ పంట సాగుపై ఆరాతీశారు. మండలంలో ఎంపిక చేసిన ప్రగతిశీల రైతులకు వేరుశనగ బ్రీడర్ విత్తనాలను ఇచ్చి వారు పండించిన పంటను పాలెం వ్యవసాయ పరిశోధన కేంద్రం వారు కొనుగోలు చేస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. పంట సాగులో రైతులు పాటించాల్సిన యాజమాన్య పద్ధతులు, సలహాలు, సూచనలు ఎప్పటికప్పుడు రైతులకు అందిస్తామని వివరించారు. వేరుశనగ పంట సాగులో రైతుల సందేహాలను శాస్త్రవేత్తలు నివృత్తి చేశారు. శాస్త్రవేత్తల బృందంలో ఐసీఏఆర్ గుజరాత్ శాస్త్రవేత్త డాక్టర్ రుకంసింగ్ తోమర్, కర్ణాటక వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త మమతశ్రీ, తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త రాజమోహన్, పాలెం వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు శిశిభూషన్, శోభ రాథోడ్ ఉన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ నరేందర్‌రెడ్డి, సర్పంచ్ శ్రీనివాసులు, సీఈఓ రవీందర్రావు, కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు లక్ష్మీనారాయణ, రైతులు పాల్గొన్నారు. -
గిరిజన నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలి
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: గిరిజన నిరుద్యోగ యువత కోసం బ్యాక్లాగ్ పోస్టుల్లో ఉన్న ఖాళీలన్నీ వెంటనే భర్తీ చేయాలని గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం.ధర్మనాయక్ కోరారు. గురువారం జిల్లా గిరిజన సంఘం కార్యాలయంలో జరిగిన మహాసభలో ఆయన మాట్లాడారు. ఏటా విద్యార్థులు విద్యను ముగించుకుని బయటకు వస్తున్నా ఉపాధి అవకాశాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. చివరకు ఉపాధిహామీ పథకంలో తల్లిదండ్రులతో కాలిసి పనికి వెళ్లాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. అనేక ప్రైవేట్ కంపెనీలు వెలుస్తున్నా రిజర్వేషన్లు లేకపోవడంతో స్థానికంగా ఉపాధి దొరకక ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లాల్సి వస్తోందన్నారు. ప్రైవేట్ రంగంలోనూ స్థానికంగా రిజర్వేషన్లు వర్తింపజేయాలన్నారు. సంఘం జిల్లా అధ్యక్షుడు భీమ్లా, నాయకులు మెగావత్ దీప్లానాయక్, చందర్‌నాయక్, ముడావత్ మణికంఠ, కుమార్, పవన్, మోహన్, ఈశ్వర్, చందర్ పాల్గొన్నారు. -
అత్యంత కచ్చితత్వంతో గ్రామాల రీ సర్వే
మన్ననూర్: ప్రభుత్వ ఆదేశాల మేరకు అమ్రాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో నిర్వహిస్తున్న గ్రామాల రీ సర్వే పనులను అదనపు కలెక్టర్ ఎండీ ఖలీల్‌పాషా గురువారం ఆకస్మికంగా క్షేత్ర స్థాయిలో పరిశీంచారు. సర్వేలో భాగంగా మాచారం గ్రామంలో సర్వేయర్ నిర్మల సమక్షంలో నిర్వహిస్తున్న రీ సర్వే బృందం సభ్యులతో ఆయన సమావేశమై సర్వే పనుల పురోగతి గురించి అడిగి తెలుసుకున్నారు. పనుల్లో కచ్చితత్వంతోపాటు ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా చేపట్టాలని సూచించారు. సర్వే నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేశారు. కార్యక్రమంలో అమ్రాబాద్ తహసీల్దార్ వెంకటేశ్వర్‌రెడ్డి, గ్రామ సర్పంచ్ పుష్ప, నాయకులు రేణయ్య, జగన్, బాలస్వామి, పద్మ, రామాంజనేయులు, రాజలింగం, జైపాల్, బాలకిష్టయ్య, ముత్యాలు తదితరులు పాల్గొన్నారు. -
గుడ్డెందొడ్డి @ 15 టీఎంసీలు
● ఈ నెలాఖరుకు డీపీఆర్ రూపొందించేలా చర్యలు ● ముమ్మరంగా కొనసాగుతున్న సర్వే సవరణ పనులు ● తాజాగా భూ సేకరణ కోసం రూ.169 కోట్లు విడుదల ● ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టులకు తీరనున్న సాగునీటి కష్టాలు గుడ్డెందొడ్డి రిజర్వాయర్ సామర్థ్యం 15 టీఎంసీలకు పెంచేందుకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో రూ.165 కోట్లు విడుదల చేయగా.. రూ.15 కోట్లతో ఇన్వెస్టిగేషన్, డీపీఆర్ తయారీ, మిగిలిన రూ.150 కోట్లతో భూసేకరణ చేపట్టనున్నాం. డీపీఆర్ తుది నివేదిక ప్రభుత్వానికి సమర్పించిన అనంతరం క్షేత్రస్థాయిలో భూ సేకరణ ప్రక్రియను వేగవంతంగా చేసి నిర్మాణ పనులు చేపడుతాం. – కేశవరావు, ఎస్ఈ, జూరాల గద్వాల: ఉమ్మడి జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల కింద 9 లక్షల ఎకరాలు ఆయకట్టు ఉంది. ఏటా వానాకాలం ఖరీఫ్ సీజన్లో ఆయా ప్రాజెక్టుల కింద సాగయ్యే ఆయకట్టుకు ఎలాంటి నీటి ఇబ్బందులు తలెత్తవు. కానీ, ఇదే ప్రాజెక్టుల కింద యాసంగి సీజన్లో మాత్రం నీటి కష్టాలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో నెట్టెంపాడు ప్రాజెక్టు పరిధిలోని గుడ్డెందొడ్డి రిజర్వాయర్ సామర్థ్యాన్ని 15 టీఎంసీలకు పెంచేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇందుకు సంబంధించిన సర్వే పనులు ముమ్మరంగా కొనసాగుతుండగా.. ఈ నెలాఖరుకు డీపీఆర్ సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపనున్నారు. తాజాగా భూ సేకరణకు సంబంధించి ప్రభుత్వం రూ.169 కోట్లు విడుదల చేయడంతో ఆయా పనులు మరింత ఊపందుకోనున్నాయి. 120 రోజులపాటు వరద.. గుడ్డెందొడ్డి రిజర్వాయర్ ప్రస్తుత సామర్థ్యం 1.19 టీఎంసీలు కాగా.. 15 టీఎంసీలకు పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో జూరాల ప్రాజెక్టుకు వరద వచ్చే సమయంలో ప్రతిరోజు అర టీఎంసీ నీటిని ఎత్తిపోసేలా అధికారులు డిజైన్ చేస్తున్నారు. జూరాలకు వానాకాలంలో సుమారు 120 రోజులపాటు వరద వస్తుంది. అయితే ఇక్కడ రోజుకు అర టీఎంసీ ఎత్తిపోయడం వల్ల కేవలం 30 రోజుల్లోనే రిజర్వాయర్‌కు పూర్తిస్థాయి సామర్థ్యంతో నీటిని నింపుకొనే వెసులుబాట లభిస్తుంది. తొలి ప్రాజెక్టు జూరాలే.. కృష్ణా బేసిన్లో తెలంగాణ– ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనే తొలి ప్రాజెక్టు ఇందిరా ప్రియదర్శిని జూరాల. వానాకాలంలో కృష్ణానదికి పెద్దఎత్తున వరద రావడం, ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టులకు నీటిని ఎత్తిపోసుకోవడం వంటివి సాధారణంగా జరుగుతున్న ప్రక్రియ. అయినప్పటికీ ఏటా వేలాది టీఎంసీల నీరు సముద్రంలో కలిసిపోతుంది. ఫలితంగా రబీ సీజన్లో ఆయకట్టుకు సాగునీటి కష్టాలతోపాటు వేసవిలో తాగునీటికి సైతం ఇబ్బందులు తలెత్తుతాయి. ఈ నేపథ్యంలో నెట్టెంపాడు ప్రాజెక్టు పరిధిలో గుడ్డెందొడ్డి రిజర్వాయర్ సామర్థ్యాన్ని 1.19 నుంచి 15 టీఎంసీలకు పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి సర్వే పనులు సైతం పనులు మొదలయ్యాయి. ప్రభుత్వ నిబంధనల మేరకు.. గుడ్డెందొడ్డి రిజర్వాయర్‌ను 15 టీఎంసీలకు పెంచినందున ఇందుకు సంబంధించి 1,100 ఎకరాల భూ సేకరణకు ప్రభుత్వం రూ.165 కోట్లు విడుదల చేసింది. ముందుగా రిజర్వాయర్ కింద ముంపునకు గురయ్యే భూములను గుర్తించి సర్వే చేపడుతారు. ఆ వెంటనే గ్రామసభ నిర్వహించి రైతుల వద్ద ఆమోదయోగ్యమైన ఒప్పందం చేసుకుంటారు. అనంతరం ప్రభుత్వ నిర్ణయించిన ధర మేరకు పరిహారాన్ని రైతులకు చెల్లిస్తారు. సర్వే, డీపీఆర్ రూపకల్పనకు వెచ్చించే నిధులు రూ.15 కోట్లు కృష్ణా బేసిన్ పరిధిలో నెట్టెంపాడు ప్రాజెక్టు కింద 2 లక్షలు, భీమా 2 లక్షలు, కల్వకుర్తి 3.65 లక్షలు, కోయిల్‌సాగర్ 30 వేలు, జూరాల 1.09 లక్షల ఎకరాలు కలుపుకొని మొత్తం 9 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. అయితే ఏటా సుమారు 6.50– 7 లక్షల ఎకరాల వరకు సాగవుతుంది. ఇందులో 7 లక్షల ఎకరాల ఆయకట్టుకు ఖరీఫ్ సీజన్లో సాగునీటికి ఎలాంటి ఢోకా లేదు. కానీ, యాసంగి సీజన్లో మాత్రం అన్ని ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు సాగునీటి కష్టాలు ఎదురవుతున్నాయి. కొన్ని సందర్భాల్లో ఏకంగా ప్రాజెక్టుల కింద క్రాప్ హాలిడే సైతం ప్రకటించే పరిస్థితి నెలకొంటుంది. ఇందుకు ఈసారి రబీలో జూరాల కింద ఎడమ కాల్వ పరిధిలోని క్రాప్ హాలిడే ప్రకటించడమే నిదర్శనం. -
భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
కల్వకుర్తి రూరల్: భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాములు అన్నారు. గురువారం పట్టణంలోని తిలక్నగర్కాలనీలో తెలంగాణ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ భవనంలో సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం రాష్ట్ర అధ్యక్షుడు రామ్మోహన్రావు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 27 లక్షల మంది నిర్మాణ రంగంలో కార్మికులుగా పనిచేస్తున్నారని, వీరి కోసం ఏర్పాటు చేసిన సంక్షేమ బోర్డు నిధులను పాలక ప్రభుత్వాలు దుర్వినియోగం చేస్తున్నాయన్నారు. హెల్త్ టెస్ట్‌ల పేరుతో రూ.450 కోట్లు, ట్రెయినింగ్ సెంటర్ పేరుతో మరో రూ.300 కోట్లు, కార్మికుల పిల్లలకు ఐటీ ఉద్యోగాల పేరుతో దుర్వినియోగం చేశారని ఆరోపించారు. భవన నిర్మాణ కార్మికుల కష్టాలను పట్టించుకోకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని మండిపడ్డారు. 60 ఏళ్లు నిండిన భవన కార్మికులకు రూ.9 వేల పింఛన్ ఇవ్వాలని, వారి పిల్లల చదువులకు స్కాలర్షిప్ మంజూరు చేయాలని, ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆయా సమస్యల పరిష్కారం కోసం వచ్చేనెల 25న నిర్వహించే చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు, జిల్లా కార్యదర్శి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
ఎయిడ్స్‌పై అవగాహన తప్పనిసరి
కందనూలు: ఎయిడ్స్‌పై ప్రతిఒక్కరూ అవగాహన తప్పనిసరిగా ఉండాలని డీఎంహెచ్ఓ కృష్ణ అన్నారు. గురువారం జిల్లాకేంద్రంలోని ఆయన కార్యాలయంలో నాగర్‌కర్నూల్, గద్వాల, వనపర్తి జిల్లాల ఐసీటీసీ కౌన్సిలర్లు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులతో జాతీయ ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమం అమలుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ ప్రతి గర్భవతికి హెచ్ఐవీ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలని, పాజిటివ్ వచ్చిన వారికి క్రమం తప్పకుండా ఏఆర్టీ మందుల వాడకంపై అవగాహన కల్పించాలని చెప్పారు. తల్లి నుంచి పుట్టబోయే బిడ్డకు హెచ్ఐవీ సోకకుండా సిబ్బంది కృషిచేయాలని సూచించారు. హైరిస్క్ గ్రూపులైన ఆటో, లారీ, ట్రక్ డ్రైవర్లు, ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కుటుంబాలకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, వ్యక్తిగతంగా కౌన్సెలింగ్ ఇవ్వాలని, అవసరమైన వారికి హెచ్ఐవీ స్క్రీనింగ్ పరీక్షలు చేయాలని ఆదేశించారు. శాంతియుతంగా జరుపుకోవాలి కందనూలు: జిల్లాలో వినాయక చవితి ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలని డీఎస్పీ శ్రీనివాస్ అన్నారు. గురువారం సాయంత్రం జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో వినాయక మండపాల నిర్వాహకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వినాయక నవరాత్రి ఉత్సవాలను ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా శాంతియుతంగా జరుపుకోవాలని సూచించారు. నిర్వాహకులు వినాయకుడిని ఏర్పాటు చేసుకోవడానికి తప్పనిసరిగా పర్మిషన్ తీసుకోవాలని, ఎక్కడా కూడా శాంతిభద్రతలకు విఘాతం కలిగించరాదని, ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ సునేంద్ర, కమిషనర్ నాగిరెడ్డి, ఎస్ఐ వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు. ఈవీఎం గోదాం తనిఖీ కందనూలు: కలెక్టరేట్ సమీపంలోని ఈవీఎం గోదాంను కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ గురువారం త్రైమాసిక తనిఖీలో భాగంగా పరిశీలించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో గోడౌన్ సీల్‌ను తీసి.. అక్కడ భద్రపరిచిన బ్యాలెట్, కంట్రోల్ యూనిట్లు, ఇతర ఎన్నికల సామగ్రితోపాటు భద్రతా ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఈవీఎంలు, ఎన్నికల సామగ్రి భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. ఈవీఎంలు, ఎన్నికల సామగ్రి భద్రతకు నిర్దేశిత మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. -
స్పీకర్‌కు సంఘీభావం తెలిపిన ఎంపీ, ఎమ్మెల్యే
కల్వకుర్తి రూరల్: రాష్ట్ర శాసనసభలో బుధవారం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను రాష్ట్ర ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో కలిసి నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి సంఘీభావం తెలిపారు. ఇటీవల ఎమ్మెల్సీ తాతా మధు స్పీకర్‌నుద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యలపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. శాసనసభ ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రతీక అని.. సభా మర్యాద, గౌరవ సంప్రదాయాలను ప్రతి ఒక్కరు పాటించాల్సిన అవసరం ఉందని వారన్నారు. విద్యార్థి దశ కీలకం కందనూలు: ఉజ్వల భవిష్యత్ నిర్మాణానికి విద్యార్థి దశ అత్యంత కీలకమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి నిహారిక అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని సైన్స్ డిగ్రీ కళాశాలలో ఏర్పాటుచేసిన అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. విద్యార్థులు, యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలన్నారు. ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యాన్ని నిర్దేశించుకుని చదువుకోవాలని సూచించారు. మాదకద్రవ్యాలకు బానిసగా మారితే భవిష్యత్ నాశనం కావడంతో పాటు కుటుంబం సైతం నిర్వీర్యమవుతుందని తెలిపారు. అలాగే సైబర్ నేరాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని వి ద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ మదన్మోహన్, సైబర్ క్రైం ఎ స్ఐ గిరిమోహన్, శ్రీరామ్ ఆర్య పాల్గొన్నారు. సద్వినియోగం చేసుకోవాలి కందనూలు: న్యాయ సంబంధిత సమస్యల పరిష్కారానికి ఈ నెల 12న నిర్వహించే జాతీయ మెగా లోక్‌అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ డా.సంగ్రామ్ సింగ్జీ పాటిల్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో నమోదైన డిటెక్టివ్ డిపార్ట్మెంట్ (ఈఈ) కేసులు, పెట్టి, ట్రాఫిక్ చలానాలు, మైనర్ క్రిమినల్ కేసులు, సివిల్ వివాదాలను రాజీ మార్గం ద్వారా సులభంగా పరిష్కారం పొందవచ్చని పేర్కొన్నారు. 12న జిల్లాస్థాయి అథ్లెట్ల ఎంపికలు కల్వకుర్తి రూరల్: పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో ఈ నెల 12న జిల్లాస్థాయి అథ్లెట్ల ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి స్వాములు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 26, 27 తేదీల్లో హనుమకొండలో నిర్వహించే 12వ తెలంగాణ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ నిమిత్తం అండర్–14, 16, 18, 20 విభాగాల్లో ఎంపికలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. క్రీడాకారుల ప్రతిభను గుర్తించి, ఖేలో ఇండియా యూత్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌కు అర్హత కలిగిన అండర్–18 క్రీడాకారులను ఎంపికచేసే ప్రక్రియలో భాగంగా ఈ సెలక్షన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పోటీల్లో పాల్గొనే సంబంధిత ధ్రువపత్రాలతో హాజరు కావాలని సూచించారు. మరిన్ని వివరాలకు 98664 69054 నంబర్‌కు సంప్రదించాలని ఆయన తెలిపారు. ఎన్ఎస్యూఐకు కొత్త సారథులు స్టేషన్ మహబూబ్‌నగర్: నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్యూఐ) జిల్లాలకు కొత్త అధ్యక్షులను నియమించింది. ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు యాదవల్లి వెంకటస్వామి ఈ మేరకు బుధవారం నియామక ఉత్తర్వులు జారీ చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా ఽఅధ్యక్షుడిగా ఎ.శేఖర్, నాగర్‌కర్నూల్ జిల్లా అధ్యక్షుడిగా నల్లవెల్లి యశ్వంత్, వనపర్తి జిల్లా అధ్యక్షుడిగా బి.శ్రీకాంత్, గద్వాల జిల్లా అధ్యక్షుడిగా అవినాష్ యాదవ్, నారాయణపేట జిల్లా అధ్యక్షుడిగా ఎండీ అఫ్రోజ్‌ను నియమించారు. ఎన్ఎస్యూఐను క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడుసూచించారు. ● ఐదు జిల్లాలకు అధ్యక్షుల నియామకం -
కరెంటు కోతలపై రైతుల ఆందోళన
కల్వకుర్తి రూరల్: కరెంటు కోతలతో పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళనకు దిగారు. కల్వకుర్తి మండలంలోని మార్చాల, ఎలికట్ట గ్రామాల రైతులు బుధవారం స్థానిక ఏడీఈ కార్యాలయాన్ని ముట్టడించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా చేస్తున్నామని చెబుతున్నప్పటికీ 8 గంటలు కూడా కరెంటు సరఫరా కావడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటికే వర్షాలు లేక పంటలు దెబ్బతిన్నాయని.. బోరుమోటార్ల కింద సాగుచేస్తున్న కొద్దిపాటి పంటలు కూడా విద్యుత్ కోతలతో ఎండిపోతున్నాయని వాపోయారు. ప్రభుత్వం వెంటనే విద్యుత్ కోతలను నియంత్రించి, సాగుచేసిన పంటలను కాపాడాలని డిమాండ్ చేశారు. అనంతరం ఏడీఈ శ్రీనివాస్‌కు వినతిపత్రం అందజేశారు. -
విద్యారంగాన్ని భ్రష్టు పట్టించిన రేవంత్ సర్కార్
కందనూలు: విద్యార్థులకు స్కాలర్షిప్లు అందక మధ్యలోనే చదువు మానేసి ఇబ్బందులు పడుతుంటే ముఖ్యమంత్రి నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో చేపట్టిన విద్యార్థి యువజన నిరుద్యోగ పోరుబాట ధర్నాలో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డితో కలిసి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. విద్యార్థులకు స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకుండా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ద్రోహం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో విద్యారంగాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని.. చదువుకున్న వ్యక్తి వద్ద విద్యాశాఖ ఉంటే ఆ శాఖకు, ఆ వ్యవస్థకు న్యాయం జరిగేదన్నారు. ఎన్నికలకు ముందు విద్యార్థులకు స్కూటీలు ఇస్తామని హామీ ఇచ్చి మూడేళ్లు కావొస్తున్నా.. ముగ్గురికి కూడా స్కూటీలు ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్న సమయంలో గురుకులాలను దేశంలోనే నంబర్ వన్‌గా తీర్చిదిద్ది.. పేదల జీవితాల్లో విద్యాజ్యోతిని వెలిగించారని గుర్తుచేశారు. ● విద్యార్థి యువజన పోరుబాట ధర్నాలో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి డీఎస్పీపై తీవ్ర విమర్శలు చేశారు. ధర్నా కార్యక్రమానికి విద్యార్థులు రాకుండా డీఎస్పీ ఆయా కళాశాలల యాజమాన్యాలకు ఫోన్‌చేసి అడ్డుకున్నారని ఆరోపించారు. డీఎస్పీ తన పదవికి రాజీనామా చేసి, ఎమ్మెల్యేకు పీఏగా ఉండి, ఇంటి పనులు చేసుకో అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్వీ నాయకులు పాల్గొన్నారు. -
ప్రత్యేక అవసరాల పిల్లలు అన్ని రంగాల్లో రాణించాలి
కందనూలు: ప్రత్యేక అవసరాలు కలిగిన బాలబాలికలు అన్ని రంగాల్లో రాణించేలా ప్రోత్సహించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని డీఈఓ రమేశ్‌కుమార్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్హాల్లో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల సంరక్షణ, విద్య, ప్రభుత్వాలు అందించే సదుపాయాలు, వసతులపై తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక అవసరాలు కలిగిన బాలబాలికలకు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను తల్లిదండ్రులు పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని సూచించారు. జిల్లాలో వివిధ రకాల వైకల్యాలు కలిగిన 2,514 మంది పిల్లలకు విద్య అందించేందుకు 20మంది ఐఆర్పీలు, 55 మంది ప్రత్యేక ఉపాధ్యాయులు సేవలు అందిస్తున్నారని డీఈఓ వివరించారు. అంతకు ముందు జిల్లా కేంద్రంలోని సంజయ్‌నగర్ ప్రాథమిక పాఠశాల, ఉయ్యాలవాడలోని ప్రాథమికోన్నత పాఠశాలల్లో డీఈఓ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. విద్యార్థుల హాజరుశాతాన్ని పరిశీలించడంతో పాటు ఉపాధ్యాయుల పనితీరుపై ఆరా తీశారు. తరగతుల వారీగా విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరీక్షించారు. కార్యక్రమంలో ఏఎంఓ కిరణ్ కుమార్, ఏఎస్ఓ మాధవరెడ్డి, డీఎస్ఓ శైలజ, జీసీడీఓ నిర్మల, ఎంఈఓ కుర్మయ్య పాల్గొన్నారు. -
ట్రాక్ డబుల్.. స్పీడ్ డబుల్..
● చురుగ్గా సాగుతున్న రెండోట్రాక్ పనులు ● మహబూబ్‌నగర్–మన్యంకొండ మధ్య పనులు పూర్తి.. ● 90 కి.మీ. వేగానికి అనుమతి స్టేషన్ మహబూబ్‌నగర్: ఉమ్మడి పాలమూరు జిల్లాలో రైల్వే రంగానికి మహర్దశ రానుంది. ఇప్పటికే మహబూబ్‌నగర్–సికింద్రాబాద్ మధ్య డబ్లింగ్ లైన్ అందుబాటులోకి రాగా.. తాజాగా మహబూబ్‌నగర్–డోన్ (ద్రోణాచలం) మధ్య రెండో రైల్వే లైన్ పనులు వేగంగా సాగుతున్నాయి. మొత్తం 185 కిలోమీటర్ల మేర చేపట్టిన ఈ పనులు పూర్తయితే హైదరాబాద్–డోన్ మార్గంలో రైళ్ల రాకపోకలకు మరింత వెసులుబాటు కలగనుంది. ప్రయాణ సమయం తగ్గడంతో పాటు రైళ్ల సంఖ్య పెంచేందుకు అవకాశం ఏర్పడనుంది. మన్యంకొండ వరకు పూర్తి మహబూబ్‌నగర్–మన్యంకొండ స్టేషన్ల మధ్య రెండో ట్రాక్ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్ 18న రైల్వే సేఫ్టీ కమిషనర్ మాధవి ఈ మార్గాన్ని సమగ్రంగా తనిఖీ చేసి స్పీడ్ ట్రయల్ నిర్వహించారు. ప్రత్యేక మోటార్ ట్రాలీపై అధికారులతో కలిసి ప్రయాణిస్తూ ట్రాక్, సిగ్నలింగ్ వ్యవస్థ, వంతెనలు తదితరాలను పరిశీలించారు. కొత్త లైన్‌పై రైళ్ల స్థిరత్వం, భద్రత, సాఫీ ప్రయాణాన్ని పరీక్షించారు. అనంతరం ఈ సెక్షన్లో గంటకు 90 కిలోమీటర్ల వేగంతో రైళ్లు నడిపేందుకు అనుమతి లభించింది. ప్రస్తుతం ఈ మార్గంలో రైళ్ల రాకపోకలు కొనసాగుతున్నాయి. దేవరకద్ర వైపు పనులు మన్యంకొండ–దేవరకద్ర మధ్య రెండో ట్రాక్ పనులు కొనసాగుతున్నాయి. దశల వారీగా డబ్లింగ్ పనులను పూర్తి చేసేందుకు రైల్వే అధికారులు చర్యలు చేపడుతున్నారు. మహబూబ్‌నగర్ నుంచి డోన్ వరకు మొత్తం మార్గం పూర్తయితే ఈ ప్రాంత రైల్వే కనెక్టివిటీ మరింత మెరుగుపడనుంది. మహబూబ్‌నగర్–డోన్ డబ్లింగ్ లైన్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే హైదరాబాద్–డోన్ మార్గంలో రైళ్ల రద్దీ తగ్గే అవకాశం ఉంది. ఒకే ట్రాక్‌పై ఎదురెదురుగా రైళ్ల రాకపోకల కారణంగా ఎదురయ్యే ఆలస్యాలు తగ్గడంతో పాటు అదనపు రైళ్లను నడిపేందుకు అవకాశం ఏర్పడుతుంది. ప్రయాణ సమయం కూడా తగ్గే వీలుండటంతో ప్రయాణికులకు మరింత సౌకర్యం కలగనుంది. సరుకు రవాణా వేగవంతమై.. ఈ ప్రాంతం నుంచి ఇతర ప్రాంతాలకు వాణిజ్య రవాణా కూడా మెరుగుపడే అవకాశం ఉంది. మేడ్చల్–ముద్ఖేడ్, మహబూబ్‌నగర్–డోన్ సెక్షన్లలో విద్యుత్ ట్రాక్షన్ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ చర్యలు చేపడుతోంది. ముద్ఖేడ్ నుంచి డోన్ వరకు విద్యుదీకరణ పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం ఉన్న 12.5 వాట్ల సామర్థ్యాన్ని 25 వాట్లకు పెంచేందుకు ఆమోదం లభించింది. దీంతో విద్యుత్ వ్యవస్థలో లోపాలను అధిగమించి నిరంతర విద్యుత్ సరఫరాతో రైళ్లను మరింత సమర్థవంతంగా నడిపేందుకు వీలవుతుంది. ప్యాసింజర్, సరుకు రవాణా రైళ్ల రాకపోకలు కూడా సులభతరం కానున్నాయి. -
నేటి యువతకు ఆదర్శం..
కాళోజీ జీవితాన్ని యువత ఆదర్శంగా తీసుకోవాలని ఏఎస్పీ వెంకటేశ్వర్లు అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ.. తెలంగాణ భాషా సంస్కృతులు, ప్రజా చైతన్యానికి కాళోజీ అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. అన్యాయాలపై తన కలం ద్వారా ప్రజలను చైతన్యపరిచిన యోధుడని పేర్కొన్నారు. నేటి తరం యువత, ప్రజాప్రతినిధులు, అధికారులు కాళోజీ జీవితాన్ని, ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఏవో కృష్ణయ్య, ఆర్ఐ జగన్, ఎస్ఐలు రమేశ్, రాంలాల్, ఆర్ఎస్ఐ ప్రశాంత్, గౌస్ పాషా, శివాజీ పాల్గొన్నారు. -
ఫుట్‌పాత్‌లు ఏవీ..?
అచ్చంపేట: జిల్లాలోని నాలుగు మున్సిపల్ పట్టణాలు రోజురోజుకూ విస్తరిస్తున్నాయి. వాహనాల రద్దీ సైతం పెరిగింది. అయితే వాహనాలు నిలిపేందుకు స్థలం, పాదచారులు నడిచేందుకు ఫుట్‌పాత్‌లు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రోడ్లపైనే వాహనాలు నిలుపాల్సి వస్తోంది. ఫుట్‌పాత్‌లు లేక రోడ్ల మీదే నడవాల్సిన పరిస్థితి ప్రజలకు దాపురించింది. మున్సిపాటిల్లో అనుమతి లేకుండా ఇళ్ల నిర్మాణం చేపట్టినా, సెట్‌బ్యాక్ లేకున్నా సంబంధిత అధికారులకు ఏమాత్రం పట్టడం లేదు. ఫిర్యాదుల వస్తే తప్ప కార్యాలయం నుంచి బయటకు కదలడం లేదనే విమర్శలు ఉన్నాయి. అనుమతులు ఒకలా.. నిర్మాణాలు మరోలా.. జిల్లాలోని మున్సిపాలిటీల్లో వ్యాపారాలు పెరిగాయి. దీంతో ఎలాంటి సదుపాయాలు లేకుండా వ్యాపార దుకాణాలను నిర్మించుకుని యజమానులు అద్దెకు ఇచ్చుకుంటున్నారు. చాలా భవనాలు సెట్‌బ్యాక్ లేకుండా రోడ్లు, డ్రైయినేజీలపై కప్పులు వేసి నిర్మించారు. అయితే మున్సిపాలిటీల అనుమతులు ఒకలాగా ప్లానింగ్ తీసుకుని, నిర్మాణాలు మాత్రం మరోలా చేపట్టారు. పాదచారులు నడవాల్సిన ఫుట్‌పాత్‌లు సైతం అక్రమణలకు గురవుతున్నా అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు. షట్టర్ల ముందు షెడ్లు.. అచ్చంపేట పట్టణంలోని రోడ్ల వెంట షెట్టర్లను అద్దెకు తీసుకున్న వారు వాటిని అనుసరించి.. మరో షట్టర్ అంతా రేకుల షెడ్డు వేసి వ్యాపార కార్యకలాపాలు సాగిస్తున్నారు. దీంతో రోడ్లపై ట్రాఫిక్, పార్కింగ్ సమస్య తలెత్తుతోంది. వాణిజ్య సమూదాయాలు అధికంగా ఉన్న నాగర్‌కర్నూల్ రోడ్డులోని ఎస్బీఐ ఏరియా, ఆర్టీసీ బస్టాండ్, రాజీవ్ చౌరస్తా, అంబేడ్కర్ చౌరస్తా, ప్రభుత్వ ఆస్పత్రి, నెహ్రూ చౌరస్తా, మల్లంకుంట, సాయిరాం థియేటర్, ఉప్పునుంతల రోడ్డు, లింగాల రోడ్డు ప్రాంతాల్లో ట్రాఫిక్, ఫుట్‌పాత్ సమస్య అధికంగా ఉంది. షాపింగ్‌మాల్స్, దుకాణదారులు పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేయకపోవడంతో వాహనాలు నిలిపేందుకు ఇబ్బందిగా మారింది. ఇప్పటికై నా అధికారులు స్పందించి అక్రమణలు తొలగించేలా చర్యలు చేపట్టాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. ఫుట్‌పాత్‌లపై వ్యాపారాల నిర్వహణ ఇబ్బందుల్లో పాదచారులు వాహనాల పార్కింగ్‌కు సైతం తిప్పలే ప్రధాన రోడ్లపై ట్రాఫిక్ సమస్య తీర్చేందుకు అనుమతి లేని సెల్లార్ల యాజమానులతో పాటు రోడ్ల అక్రమణదారులకు నోటీసులను జారీ చేస్తాం. వ్యాపార, వాణిజ్య దుకాణాల వద్ద పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తాం. పోలీస్‌శాఖ సమన్వయంతో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటాం. వాహనదారులు సైతం ప్రధాన రోడ్లు, చౌరస్తాల్లో ఎక్కడ పడితే అక్కడ వాహనాలు నిలుపకూడదు. – డి.మురళి మున్సిపల్ కమిషనర్ కొందరు దుకాణదారులు తమ వ్యాపారాలను ఫుట్‌పాత్‌లపై నిర్వహించడమే కాకుండా.. దుకాణం ఎదుట ఉన్న ప్రాంతాన్ని సైతం చిరువ్యాపారులకు అద్దెకు ఇస్తున్నారు. వారి నుంచి రోజువారీగా అద్దెను వసూలు చేస్తూ.. ప్రతినెలా రూ.వేలల్లో సొమ్ము చేసుకుంటున్నారు. చిరువ్యాపారులు రోడ్లు, ఫుట్‌పాత్‌లపైనే వ్యాపారాలు నిర్వహిస్తుండటంతో పాదచారులు, వాహనదారులు ఇబ్బందులకు గురువుతున్నారు. గతంలో ఫుట్‌పాత్‌లను అక్రమించి వ్యాపారాలు చేసిన వారిపై ప్రత్యేక డ్రైవ్‌లు సైతం నిర్వహించారు. కాలక్రామేణ చూసీచూడనట్టుగా వ్యవహరిస్తుండటంతో పట్టణాల్లో ప్రధాన రహదారుల వెంట ఈ దందా యథేచ్ఛగా సాగుతుండగా.. ప్రశ్ని ంచే అధికారే కనిపించకపోవడం విడ్డూరం. -
పర్యాటక అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక
నాగర్‌కర్నూల్/తిమ్మాజిపేట: జిల్లాలో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు మూడేళ్ల సమగ్ర కార్యాచరణ రూపొందించి.. పకడ్బందీగా అమలు చేయనున్నట్లు కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అన్నారు. బుధవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర పర్యాటకశాఖ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి వాణీప్రసాద్ అన్ని జిల్లాల కలెక్టర్లతో పర్యాటక అభివృద్ధి కార్యక్రమాలు, జ్ఞాన భారతం మిషన్ అమలుపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ నుంచి వీసీలో పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాకు సహజ, చారిత్రక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక పర్యాటక రంగాల్లో అపారమైన అవకాశాలు ఉన్నాయన్నారు. నల్లమల అటవీ ప్రాంతం, ఇతర ముఖ్యమైన పర్యాటక ప్రాంతాలను సమగ్రంగా గుర్తించి.. వాటి ప్రాధాన్యత ఆధారంగా చేపట్టాల్సిన అభివృద్ధి పనులను నిర్దేశిస్తామన్నారు. జిల్లాలోని పర్యాటక ప్రాంతాలకు ఎక్కువ సంఖ్యలో సందర్శకులు వచ్చేలా ప్రచార కార్యక్రమాలను విస్తృతం చేయడంతో పాటు ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ చెప్పారు. జ్ఞాన భారతం మిషన్‌లో భాగంగా జిల్లాలోని చారిత్రక ప్రదేశాలు, దేవాలయాలు, ఇతర ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న ప్రాచీన గ్రంథాలను సంరక్షించడంతో పాటు డిజిటలైజ్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. తద్వారా వాటిని భవిష్యత్ తరాలకు అందుబాటులో ఉండటంతో పాటు చారిత్రక, సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఇందుకు ఆయా రంగాల్లో నైపుణ్యం కలిగిన పండితులు, భాషా నిపుణుల సేవలను వినియోగించుకోవాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. వీసీలో అదనపు కలెక్టర్ దేవసహాయం, డీఎఫ్ఓ రేవంత్‌చంద్ర, జిల్లా పర్యాటకశాఖ అధికారి నర్సింహ, డీపీఓ శ్రీరాములు, డీవైఎస్ఓ సీతారాం పాల్గొన్నారు. ● తిమ్మాజిపేట మండలంలోని ఇండియన్ మేడ్ లిక్కర్ డిపోను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డిపోలో మద్యం నిల్వలు, సరఫరా విధానం, భద్రతా చర్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఏయే ప్రాంతాల నుంచి డిపోకు మద్యం సరఫరా అవుతోంది.. ఇక్కడి నుంచి ఏయే జిల్లాలు, ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారనే వివరాలను అధికారులతో తెలుసుకున్నారు. మద్యం సరఫరా వ్యవస్థలో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా నిబంధనల ప్రకారం నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. అదే విధంగా నకిలీ మద్యం సరఫరాను అరికట్టేందుకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు. డిపోలో మద్యం నిల్వలు భద్రంగా ఉండేలా అవసరమైన భద్రతా ప్రమాణాలను పాటించాలని.. అగ్నిప్రమాదాలు తదితర ప్రమాదాల నివారణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. కాగా, డిపోలో 75వేల బీరు కాటన్లు, 62వేల లిక్కర్ కాటన్లు అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. కలెక్టర్ వెంట ఎకై ్సజ్ సూపరింటెండెంట్ వేణుగోపాల్‌రెడ్డి, డిపో మేనేజర్ మల్లికార్జున్, స్టోర్ ఆఫీసర్ మధు, తహసీల్దార్ జయంతి ఉన్నారు. -
పబ్లిక్ స్కూల్స్‌కు నిధుల వరద
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి వసతులు.. నర్సరీ నుంచి ఇంటర్ వరకు ఒకే క్యాంపస్‌లో విద్య.. పేద, మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం తెలంగాణ పబ్లిక్ స్కూల్స్‌కు శ్రీకారం చుడుతోంది. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రభుత్వ పాఠశాలల్లోనే ఎంపిక చేసిన వాటిని పబ్లిక్ స్కూల్స్‌గా అప్‌గ్రేడ్ చేయనుంది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. తొలిదశలో 8 నియోజకవర్గాల్లోని పాఠశాలలకు ప్రభుత్వం రూ.87 కోట్ల నిధులు విడుదల చేసింది. ఈ మేరకు పరిపాలనాపరమైన ఉత్తర్వులు జారీ చేస్తూ జీఓ నంబర్ 164ను విడుదల చేసింది. నియోజకవర్గానికి ఒకటి చొప్పున తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ పాఠశాలల వారీగా విడుదలైన నిధుల వివరాలు (రూ.కోట్లలో) ఉమ్మడి జిల్లాలో 8 పాఠశాలలకు రూ.87 కోట్ల నిధులు నర్సరీ నుంచి ఇంటర్ వరకు ఒకే క్యాంపస్‌లో విద్య తరగతి గదులు, ల్యాబ్స్, గ్రౌండ్, మరుగుదొడ్లతో ఆధునిక వసతులు -
పోలీస్ గ్రీవెన్స్‌కు 11 అర్జీలు
కందనూలు: ప్రజలు నిర్భయంగా మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా నేరుగా తమ సమస్యలపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఎస్పీ సంగ్రామ్‌సింగ్ జీ పాటిల్ అన్నారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్లో బాధితుల నుంచి ఎస్పీ 11 ఫిర్యాదులు స్వీకరించారు. ఇందులో 5 భూమికి సంబంధించినవి, ఒకటి భార్యభర్తల గొడవ, 5 తగు న్యాయం చేయాలని కోరుతూ ఫిర్యాదులు అందించారని చెప్పారు. ఫిర్యాదుల పరిష్కారం కోసం సంబంధిత స్టేషన్లకు పంపినట్లు ఎస్పీ చెప్పారు. దరఖాస్తుల ఆహ్వానం కందనూలు: జిల్లాలోని ఐదు ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయాల పరిధిలోని అంగన్వాడీ టీచర్ల పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా సంక్షేమశాఖ అధికారి పాండునాయక్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన మహిళా అభ్యర్థులు http://wdcw.tg.nic.in అనే వెబ్సైట్ ద్వారా సెప్టెంబర్ 8 నుంచి 21వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కనులపండువగా జములమ్మ ఎదుర్కోళ్ల ఉత్సవం గద్వాల న్యూటౌన్: నడిగడ్డ ఇలవేల్పు జములమ్మ అమ్మవారి కల్యాణ మహోత్సవాలు సోమవారం కనులపండువగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ధ్వజారోణం, గణపతి పూజ చేశారు. సాయంత్రం చేపట్టిన ఎదుర్కోళ్ల ఉత్సవం వైభవంగా సాగింది. అమ్మవారిని, స్వామివారి ఉత్సవమూర్తులను అలంకరించి, జమ్మిచేడులోని ఆంజనేయస్వామి ఆలయంలో సాంప్రదాయబద్ధంగా ఎదుర్కోళ్లు నిర్వహించారు. అక్కడి నుంచి ఉత్సవమూర్తులను పల్లకీలో ఊరేగిస్తు ఆలయానికి తీసుకొచ్చారు. పోతురాజుల విన్యాసాలు, కళాకారుల నృత్యాలతో సందడి నెలకొంది. ఆలయ ఈఓ పురందర్‌కుమార్, మాజీ చైర్మన్లు సతీష్, వెంకట్రాములు ప్రత్యేక పూజలు చేశారు. నేడు కల్యాణ మహోత్సవం ఏటా శ్రావణ మాసంలో చివరి మంగళవారం అంగరంగ వైభవంగా అమ్మవారి కల్యాణ మహోత్సవం నిర్వహిస్తారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆలయాన్ని సర్వాంగ సుందరంగా రకరకాల పుష్పాలు, విద్యుద్దీపాలతో అలంకరించారు. భారీ కల్యాణ వేదిక, భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు ప్రత్యేక క్యూలైన్ ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 12:15 గంటలకు జరిగే కల్యాణోత్సవానికి ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి దంపతులు ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు తీసుకురానున్నారు. మున్సిపల్ చైర్మన్ తుమ్మల జయలక్ష్మితో పాటు జిల్లాలోని ప్రముఖులు హాజరవుతారని నిర్వాహకులు తెలిపారు. 4 యూనిట్లలో విద్యుదుత్పత్తి ఆత్మకూర్: ప్రియదర్శిని జూరాల జలాశయం దిగువ, ఎగువ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి కొనసాగుతోంది. సోమవారం ఎగువన 2 యూనిట్ల నుంచి 78 మెగావాట్లు, 102.277 మి.యూ., దిగువన 2 యూనిట్ల నుంచి 80 మెగావాట్లు, 88.880 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి చేపట్టినట్లు ఎస్ఈ శ్రీధర్ తెలిపారు. ఇప్పటి వరకు ఎగువ, దిగువ జల విద్యుత్ కేంద్రాల్లో 191.157 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి విజయవంతంగా పూర్తి చేసినట్లు వివరించారు. -
ఉపాధ్యాయులే భావితరాలకు దిశానిరే ్దశకులు
కందనూలు: సమాజానికి ఉత్తమ పౌరులను అందించడంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని కలెక్టర్ హేమంత కేశవ్‌పాటీల్ అన్నారు. విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధించడంతోనే ఉపాధ్యాయుల బాధ్యత ముగిసి పోదని, వారి వ్యక్తిత్వ వికాసానికి మార్గనిర్ధేశం చేసి, జీవితంలో ఉన్నత లక్ష్యాలను సాధించేలా ప్రోత్సహించాల్సిన బాధ్యత కూడా ఉంటుందన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో 70 మంది జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులను కలెక్టర్ సన్మానించారు. అంతకుముందు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి రమేష్‌కుమార్, సెక్టోరియల్ అధికారులు కిరణ్‌కుమార్, నూరుద్దీన్, కురుమయ్య, రాజశేఖర్ రావు తదితరులు పాల్గొన్నారు. -
ఎగ్గొట్టిన హామీలపై చర్చకు ఎమ్మెల్యే సిద్ధమా?
అచ్చంపేట: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులైనా ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మొండిచేయి చూపుతోందని నాగర్‌కర్నూల్ మాజీ ఎమ్మెల్యే, అచ్చంపేట సమన్వయకర్త మర్రి జనార్దన్‌రెడ్డి ఆరోపించారు. సోమవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియం నుంచి అంబేడ్కర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సబ్‌స్టేషన్ ఎదుట నిరసన చేపట్టి అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మర్రి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో మూడు అమలు చేసి, 30 హామీలను ఎగ్గొట్టిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎగ్గొట్టిన హామీలపై చర్చకు సిద్ధమని ఎమ్మెల్యే వంశీకృష్ణకు ఆయన సవాల్ విసిరారు. అచ్చంపేట కోసం ఒక ప్రాజెక్టునైనా సాధించారా అని ప్రశ్నించారు. నల్లమల ముద్దుబిడ్డనని పదేపదే చెప్పుకునే సీఎం రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే నియోజకవర్గానికి ఏం తీసుకొచ్చారో, ఏం అభివృద్ధి చేశారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. కొడంగల్, కొండారెడ్డిపల్లి ప్రాంతాలకు ఎన్ని నిధులు ఇచ్చారు? అచ్చంపేటకు ఎన్ని నిధులు కేటాయించారని శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. తెలంగాణ సాధించిన కేసీఆర్ విలువలు కలిగిన నాయకుడని, ఆయనపై ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటని విమర్శించారు. అచ్చంపేటలో కౌంట్‌డౌన్.. అచ్చంపేటలో అధికార కాంగ్రెస్ పార్టీకి కౌంట్‌డౌన్ మొదలైందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు శ్రీకాంత్ బీమా అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శించారు. కార్యక్రమంలో పోకల మనోహర్, తులిసీరాం, నరసింహ గౌడ్, రమేష్‌రావు, అమీనోద్దీన్, మన్నుప్రసాద్ పాల్గొన్నారు. -
అమ్మకే అక్షరమాల.. నాన్నకు?
మహిళలను 100 శాతం అక్షరాస్యులుగా చేస్తాం.. మహిళా సంఘాల్లో చదువు రాని సభ్యులకు.. అదే సంఘాల్లో చదువుకున్న మహిళలతో బోధన అందించేలా ‘అమ్మకు అక్షరమాల’ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం. ప్రతి మార్చి, ఆగస్టు నెలల్లో రెండుసార్లు పరీక్షలు నిర్వహిస్తున్నాం. మహిళలను 100 శాతం అక్షరాస్యులుగా మార్చేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. – శ్రీనివాస్, వయోజన విద్య, ఉమ్మడి జిల్లా అధికారి మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: చదువు వ్యక్తి జీవితాన్ని మార్చే శక్తివంతమైన సాధనం. అక్షరాస్యతతో సమాజంపై అవగాహన పెరగడంతో పాటు హక్కులు, బాధ్యతలపై చైతన్యం వస్తుంది. అయినా ఉమ్మడి పాలమూరు జిల్లాలో నిరక్షరాస్యత సమస్య పూర్తిగా తొలగలేదు. వయోజనులను అక్షరాస్యులుగా మార్చేందుకు గతంలో ‘సాక్షర భారత్’ వంటి కార్యక్రమాలు అమలు చేసినా.. ప్రస్తుతం అవి అంతగా కనిపించడం లేదు. ‘అమ్మకు అక్షరమాల’ పేరుతో కొత్త కార్యక్రమాన్ని అమలు చేస్తున్న ప్రభుత్వం.. ప్రధానంగా మహిళా సంఘాల సభ్యులకే అక్షరాలు నేర్పించడంపై దృష్టి సారిస్తోంది. దీంతో నిరక్షరాస్యులుగా ఉన్న పురుషుల పరిస్థితి ఏంటన్న ప్రశ్న తలెత్తుతోంది. మంగళవారం అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. ప్రస్తుతం ‘అమ్మకు అక్షరమాల’ వయోజనులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు గత ఏడాది నుంచి ప్రభుత్వం ‘అమ్మకు అక్షరమాల’ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. సెర్ప్, డీఆర్డీఏ ఆధ్వర్యంలో పనిచేస్తున్న మహిళా సంఘాల్లో 7 నుంచి 10వ తరగతి వరకు చదువుకున్న సభ్యులను గుర్తించి.. చదువు రాని ఇతర సభ్యులకు బోధించేలా కార్యక్రమాన్ని రూపొందించారు. ఇలా ఒక మహిళ మరో మహిళకు చదువు చెప్పే విధానంలో అక్షరాస్యతను పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ అసెస్మెంట్ టెస్ట్ (ఎఫ్‌ఎల్‌ఎన్‌ఏటీ)ను ప్రతి మార్చి, ఆగస్టు నెలల్లో నిర్వహించనున్నారు. పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారికి మూడో తరగతి ఉత్తీర్ణతకు సమానమైన ధ్రువీకరణ పత్రం అందజేస్తున్నారు. ఈ విద్యా సంవత్సరంలో ఉమ్మడి జిల్లాలో 1,63,607 మంది మహిళా సంఘాల సభ్యులను అక్షరాస్యులుగా మార్చేందుకు లక్ష్యంగా పెట్టుకున్నారు. 7.78 లక్షల మంది నిరక్షరాస్యులు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో మొత్తం 7,78,142 మంది నిరక్షరాస్యులు ఉన్నారు. ఇందులో 2,99,907 మంది పురుషులు, 4,78,235 మంది మహిళలు ఉన్నారు. అంటే పురుషుల కంటే మహిళా నిరక్షరాస్యుల సంఖ్య 1,78,328 అధికం. జిల్లా వారీగా చూస్తే గద్వాల జిల్లాలో అత్యధికంగా 70,619 మంది పురుషులు నిరక్షరాస్యులుగా ఉన్నారు. నారాయణపేటలో అత్యల్పంగా 37,461 మంది ఉన్నారు. అయితే ‘అమ్మకు అక్షరమాల’ కార్యక్రమం మహిళా సంఘాల సభ్యులకే పరిమితం కావడంతో.. నిరక్షరాస్యులుగా ఉన్న పురుషులను అక్షరాస్యులుగా మార్చేందుకు ప్రత్యేక కార్యాచరణ లేకపోవడం గమనార్హం. సమాజంలో నిరక్షరాస్యత పూర్తిగా నిర్మూలించాలంటే మహిళలతో పాటు పురుషులపైనా సమానంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఉమ్మడి జిల్లాలో పూర్తిగా తొలగని నిరక్షరాస్యత ‘సాక్షర భారత్’కు బదులు ‘అమ్మకు అక్షరమాల’ మహిళా సంఘాల సభ్యులకే పరిమితమైన అక్షరాస్యత కార్యక్రమం ఉమ్మడి జిల్లాలో 7.78 లక్షల మంది నిరక్షరాస్యులు.. ఇందులో 2.99 లక్షల మంది పురుషులు నేడు అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం పర్యవేక్షణలోనూ ఇబ్బందులు మహిళా సంఘాల సభ్యులకు అక్షరాస్యత బోధన, పర్యవేక్షణ బాధ్యతలను డీఆర్డీఏ ఆధ్వర్యంలోని సిబ్బందే చూస్తున్నారు. గ్రామస్థాయిలో వీఓఏలు కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తుండగా.. మండల స్థాయిలో ఏపీఎంలు, క్లస్టర్ స్థాయిలో క్లస్టర్ కోఆర్డినేటర్లు పర్యవేక్షిస్తున్నారు. మహిళా సంఘాల కార్యకలాపాలతో పాటు అక్షరాస్యత కార్యక్రమాన్ని కూడా వీరే చూడాల్సి రావడంతో పర్యవేక్షణపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి జిల్లాకు ఒకే కోఆర్డినేటర్ ఉండటంతో ఐదు జిల్లాల కార్యక్రమాలను పర్యవేక్షించడం కష్టంగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ప్రతి గ్రామంలో వయోజన విద్యా కేంద్రాలు, ప్రత్యేక బోధనా సిబ్బంది ఉండేవారు. ప్రస్తుతం ప్రత్యేక వ్యవస్థ లేకపోవడం, పరిమిత నిధులతో కార్యక్రమాలు కొనసాగుతుండటంతో ఆశించిన స్థాయిలో ఫలితాలు రావడం లేదనే విమర్శలు ఉన్నాయి. -
పేదలకు కార్పొరేట్ స్థాయి విద్య
తెలంగాణ పబ్లిక్ స్కూల్స్‌తో ప్రభుత్వ విద్యాస్వరూపం మారుతుంది. ఒకే క్యాంపస్‌లో ఎల్కేజీ నుంచి ఇంటర్ వరకు అన్ని వసతులతో విద్య అందించే అవకాశం ఉంటుంది. తరగతి గదులు, ల్యాబ్స్, క్రీడా మైదానం, బస్సు తదితర సౌకర్యాలు కల్పించనున్నారు. నారాయణపేట జిల్లాలో మక్తల్, కోటకొండ జెడ్పీహెచ్ఎస్లను పబ్లిక్ స్కూల్స్‌గా అభివృద్ధి చేయనున్నారు. ఒక్కో పాఠశాలకు సుమారు రూ.10 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య అందించేందుకు ఇది మంచి అవకాశం. – గోవిందరాజులు, డీఈఓ, నారాయణపేట ● -
వరుణదేవా.. దయ ఉంచు..
వర్షాలు సమృద్ధిగా కురవాలని వేడకుంటూ మంగళవారం వెల్దండ మండల కేంద్రంలో గ్రామస్తులు శివుడి గుట్టపై ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలోని ప్రధాన వీధుల గుండా భజనలు చేస్తూ ముందుకు సాగారు. గ్రామ దేవతలకు, శివుడికి అభిషేకాలు చేశారు. అనంతరం వరదపాశం పోశారు. యాదవ కులస్తులతో వరదపాశం తినిపించారు. కార్యక్రమంలో సర్పంచ్ యాదమ్మ, వెంటయ్యగౌడు, ఉపసర్పంచ్ శ్రీనువాసులు, నాయకులు చిందం కృష్ణయ్య, వార్డు సభ్యులు తదితరులు ఉన్నారు. – వెల్దండ -
1.15 లక్షల మందికి ‘సర్’ నోటీసులు
కందనూలు: జిల్లాలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియను ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం పకడ్బందీగా నిర్వహిస్తున్నామని కలెక్టర్ హేమంత కేశవ్‌పాటీల్ తెలిపారు. హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్‌రెడ్డి సోమవారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సర్ ప్రక్రియపై సమీక్షించారు. నాగర్‌కర్నూల్ కలెక్టరేట్ నుంచి అచ్చంపేట సబ్ కలెక్టర్ సలోని చాబ్రా, అదనపు కలెక్టర్ చెన్నయ్య, ఆర్డీఓలతో కలిసి కలెక్టర్ హేమంత కేశవ్‌పాటీల్ వీసీకి హాజరయ్యారు. నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కొల్లాపూర్, కల్వకుర్తి నియోజకవర్గాల పరిధిలో మొత్తం 1,15,824 మంది ఓటర్లకు నోటీసుల జనరేషన్ చేయగా.. ఇప్పటి వరకు 1,13,996 మంది ఓటర్లకు నోటీసులు అందించామన్నారు. నోటీసులు అందుకున్న ఓటర్ల నుంచి ఎన్నికల సంఘం నిర్దేశించిన 11 రకాల ధ్రువపత్రాలను స్వీకరించి, పరిశీలించి వెబ్సైట్లు అప్లోడ్ చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఇప్పటి వరకు 32,553 మంది ఓటర్లకు హియరింగ్ నిర్వహించామన్నారు. సమావేశంలో ఆర్డీఓలు అర్చ న, బన్సీలాల్, కలెక్టరేట్ ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. వరి కొనుగోళ్లపై ముందస్తు ఏర్పాట్లు నాగర్‌కర్నూల్: వానాకాలం ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు లేకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని కలెక్టరు హేమంత్ కేశవ్ పాటీల్ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో అచ్చంపేట సబ్ కలెక్టర్ సలోనిచోప్రా, అదనపు కలెక్టర్ చెన్నయ్యతో కలిసి వానాకాలం వరి కొనుగోళ్లపై ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వానాకాలం వరి కొనుగోళ్లకు సంబంధించి జిల్లాలో అవసరమైన ప్రాంతాలను గుర్తించి కేంద్రా లు ఏర్పాటు చేయడంతో పాటు, తూకం యంత్రా లు, గన్నీ సంచులు, టార్ఫాలిన్లు, ధాన్యం నిల్వకు అవసరమైన ఇతర ఏర్పాట్లు, రవాణాకు అవసరమైన వాహనాలు సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. రీసర్వే పకడ్బందీగా చేయాలి నాగర్‌కర్నూల్ రూరల్: భూముల రీసర్వే ప్రక్రియలో ఎలాంటి లోపాలకు తావు లేకుండా పకడ్బందీగా, నిర్ధేశిత గడువులో పూర్తి చేయాలని కలెక్టర్ హేమంత్ కేశవపాటిల్ అధికారులను ఆదేశించారు. మండలంలోని వెంకటాపూర్‌లో కొనసాగుతున్న భూముల రీసర్వే ప్రక్రియను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సర్వే సమయంలో భూముల విస్తీర్ణం, సర్వే నంబర్లు, సరిహద్దులు, గ్రామ కంఠం తదితర వివరాలను క్షణ్ణంగా పరిశీలించి, సంబంధిత రికార్డులతో సరిపోల్చాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ తబితారాణి, సర్వే లాండ్ రికార్డు గిరిధర్, సర్వేయర్ పాల్గొన్నారు. -
అచ్చంపేటను అగ్రగామిగా నిలపడమే లక్ష్యం
అచ్చంపేట రూరల్: సీఎం రేవంత్‌రెడ్డి సహకారంతో అచ్చంపేటను రాష్ట్ర స్థాయిలో అగ్రగామిగా నిలుపుతానని ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 1000 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎమ్మెల్యే ఆధ్వర్యంలో మండలంలోని హాజీపూ ర్ చౌరస్తా నుంచి అచ్చంపేట వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్యే మాట్లాడుతూ.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పాలన గుర్తుచేస్తూ రేవంత్‌రెడ్డి సంక్షేమ ఫలాలు అందిస్తున్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్, బీజేపీ బాకీ కార్డు చేత పట్టుకుని ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ప్రజా ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రభు త్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ ఫలాలు ప్రతిపక్ష నాయకుల కంటికి కనపడుతలేవా..? అని ప్రశ్నించారు. వెయ్యి రోజుల పాలనలో ఇందిరమ్మ ఇళ్లు, సన్నబియ్యం, కొత్త రేషన్ కార్డులు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత వి ద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్ వంటి పథకాలతో ప్రజలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. -
పాతాళానికి జలమట్టాలు
కేఎల్ఐ నీటితో.. స్థానికంగా ఆశించిన వర్షాలు లేకపోయినా ఇటీవల కేఎల్ఐ సాగునీరు విడుదల చేయడంతో రైతులు వరి సాగు చేశారు. కాల్వనీరు ఆగిపోతే వరి సాగు చేతికొచ్చేది కష్టమే. మరోపక్క రైతులు వేరుశనగ సాగు చేసేందుకు దుక్కులు సిద్ధం చేశారు. నైరుతి రుతుపవనాలకు మిగిలింది సెప్టెంబర్ నెలే. ఈ నెల సైతం వర్షాలు కష్టమేనని వాతావరణ శాఖ స్పష్టం చేస్తోంది. ఈ క్రమంలో రైతులు పంట సాగు విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. వర్షపాతంలో భారీ వ్యత్యాసం వర్షపాతంలో మండలాల మధ్య భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. పెద్దకొత్తపల్లి మండలంలో సాధారణ వర్షపాతం 348.1 మి.మీ. కాగా కేవలం 139.7 మి.మీ. నమోదై 60 శాతం లోటు ఏర్పడింది. కొల్లాపూర్‌లో 52, పదరలో 51, పెంట్లవెల్లిలో 51, అమ్రాబాద్‌లో 39 శాతం లోటు ఉంది. కల్వకుర్తి, తిమ్మాజిపేట, వెల్దండ, బిజినేపల్లి మండలాల్లో గణనీయమైన లోటు నమోదైంది. నాగర్‌కర్నూల్: ఎల్‌నినో ప్రభావం జిల్లాను తీవ్రంగా వేధిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా నైరుతి రుతుపవనాలు ముఖం చాటేశాయి. వర్షాకాలం ముగింపు దశకు చేరుకున్నా లోటు వర్షపాతమే నమోదైంది. దీంతో చెరువులు, కుంటలు, వాగుల్లోకి ఆశించిన స్థాయిలో నీరు చేరకపోవడంతో భూగర్భ జలాల రీచార్జి కూడా మందగించింది. ఫలితంగా బోర్లు, బావులపైనే ఆధారపడి సాగు చేస్తున్న రైతులకు రానున్న రోజుల్లో నీటి లభ్యతపై ఆందోళన మొదలైంది. ఇప్పటికే వర్షాలపై ఆధారపడి సాగుచేసిన పత్తి, జొన్న, కంది పంటలు వాడుముఖం పట్టాయి. కొన్ని చోట్ల పూర్తిగా ఎండిపోతున్నాయి. స్ప్రింక్లర్ల సహాయంతో కొందరు రైతులు నీరుపారిస్తూ పంట దక్కించుకునేందుకు భగీరథ ప్రయత్నం చేస్తున్నారు. 239.6 మి.మీ. వర్షపాతమే.. ●జిల్లాలో సాధారణం కంటే 28 శాతం తక్కువ వర్షపాతం, భూగర్భ జలమట్టం 7.17 మీటర్ల లోతుకు.. గతేడాదితో పోలిస్తే 3.72 మీటర్ల క్షీణత పెద్దకొత్తపల్లిలో 60 శాతం వర్షపాతం లోటు అమ్రాబాద్‌లో 12.05 మీటర్ల లోతుకు నీరు ఆందోళనలో అన్నదాత -
రింగ్‌లో పంచ్.. మెడలో మెడల్స్!
● పంచ్ పవర్‌తో పతకాలు సాధిస్తున్న నలుగురు బాక్సర్లు ● బాక్సింగ్‌లో సత్తా చాటుతున్న ఉమ్మడి జిల్లా క్రీడాకారులు బాక్సింగ్ రింగ్‌లో ఉమ్మడి పాలమూరు జిల్లా క్రీడాకారులు పంచ్ పవర్ చూపించారు. హైదరాబాద్‌లో శని, ఆదివారం జరిగిన రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీల్లో నలుగురు క్రీడాకారులు సత్తాచాటి పతకాలు సాధించారు. పెబ్బేర్ మండలం శాగాపూర్‌కు చెందిన శ్రీలేఖ స్వర్ణ పతకం సాధించి దక్షిణ భారత చాంపియన్‌షిప్‌కు ఎంపిక కాగా.. మహబూబ్‌నగర్‌కు చెందిన ఎం.రాజు, నాగర్‌కర్నూల్ జిల్లా శశికాంత్ రజత పతకాలు, గండేడ్‌కు చెందిన జె.రాకేష్ కాంస్య పతకం సాధించారు. వరుస విజయాలతో జిల్లాలో బాక్సింగ్‌పై ఆసక్తి పెరుగుతోంది. శ్రీలేఖ.. స్వర్ణ పంచ్ వనపర్తి జిల్లా పెబ్బేర్ మండలం శాగాపూర్‌కు చెందిన శ్రీలేఖ ఏడేళ్లుగా బాక్సింగ్‌లో శిక్షణ పొందుతూ అంచెలంచెలుగా ఎదుగుతోంది. ఇప్పటికే ఐదుసార్లు జాతీయస్థాయి పోటీల్లో రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించింది. తొమ్మిదిసార్లు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని ఏడు స్వర్ణాలు, రెండు కాంస్య పతకాలు సాధించింది. జిల్లాస్థాయిలో మూడు స్వర్ణాలు, ఒక రజతం ఆమె ఖాతాలో ఉన్నాయి. హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో 48–51 కిలోల విభాగంలో స్వర్ణ పతకం సాధించిన శ్రీలేఖ.. ఈనెల 16 నుంచి 19 వరకు బెంగళూరులో జరిగే ఎలైట్ పురుషుల, మహిళల సౌత్ ఇండియా బాక్సింగ్ చాంపియన్‌షిప్‌కు ఎంపికై ంది. భవిష్యత్‌లో ఒలింపిక్స్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహించడమే తన లక్ష్యమని చెబుతోంది. – మహబూబ్‌నగర్ క్రీడలు -
కాంగ్రెస్ ముందస్తు కార్యాచరణ..
మహబూబ్‌నగర్–హైదరాబాద్–రంగారెడ్డి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో ఇప్పటివరకు నాలుగు పర్యాయాలు ఎన్నికలు జరిగాయి. 2007, 2009లో ఎమ్మెల్సీగా ప్రొఫెసర్ నాగేశ్వర్ (స్వతంత్ర అభ్యర్థి), 2015లో రాంచందర్‌రావు (బీజేపీ), 2021లో సురభి వాణీదేవి (బీఆర్ఎస్ అప్పటి టీఆర్ఎస్) గెలుపొందారు. ఇప్పటివరకు ఈ స్థానానికి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పరాభవమే ఎదురైంది. ప్రస్తుతం అధికారంలో ఉండడంతో ఈ స్థానంలో విజయమే లక్ష్యంగా ఆ పార్టీ పెద్దలు పక్కా ప్రణాళికలతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ముందుస్తు కార్యాచరణతో బలమైన అభ్యర్థిని ఎంపిక చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. -
ఎస్ఐఆర్ ప్రక్రియ పారదర్శకంగా సాగాలి
బల్మూర్/అమ్రాబాద్/మన్ననూరు/లింగాల: ఎస్ఐఆర్ నోటీసుల ప్రక్రియను పూర్తి పారదర్శకతతో, నిబంధనల ప్రకారం నిర్వహించాలని సబ్ కలెక్టర్ సలోనిచోప్రా అధికారులను ఆదేశించారు. ఆదివారం బల్మూర్ మండల కేంద్రంతో పాటులోని అనంతవరం, అమ్రాబాద్ మండల కేంద్రంతో పాటు మన్ననూర్, లింగాల మండల కేంద్రంలో పర్యటించిన అదనపు కలెక్టర్ ఎస్ఐఆర్ నోటీసుల ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులు, బీఎల్ఓలతో ప్రక్రియకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా ఫామ్–6 లో వచ్చిన దరఖాస్తుల సంఖ్య, వాటి పరిశీలన తీరుపై ఆరా తీశారు. ఇప్పటి వరకు పూర్తైన ప్రక్రియ శాతాన్ని పరిశీలించారు. అర్హత కలిగిన దరఖాస్తుదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. నోటీసుల జారీ, దరఖాస్తుల పరిశీలన తదితర ప్రక్రియలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో బీఎల్ఓలు మరింత అప్రమత్తంగా పనిచేయాలని సూచించారు. ప్రతి దరఖాస్తును నిష్పక్షపాతంగా పరిశీలించి రికార్డులను సక్రమంగా నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్లు శ్రీకాంత్, వెంకటేశ్వర్‌రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్లు రాములు, కృష్ణాజీ, ఎస్ఐఆర్ సూపర్వైజర్ అఖిల్, ఏఆర్ఐ అనిల్, జీపీఓ భాస్కర్, బీఎల్ఓలు యశోద, రాణి, మాసమ్మ, మంజుల తదితరులు పాల్గొన్నారు. -
పోచమ్మ విగ్రహ ప్రతిష్ఠాపన
ఉప్పునుంతల: మండలంలోని కొరటికల్‌లో నూతనంగా నిర్మించిన ఆలయంలో పోచమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపన ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ఆదివారం అమ్మవారి విగ్రహాన్ని ఊరేగించారు. అనంతరం భూషణ అయ్యవార్ల ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో జలాభిషేకం, గణపతి హోమం, నవగ్రహ హోమంతోపాటు ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవాల్లో గ్రామానికి చెందిన టీ–శాట్ సీఈఓ బోధనపల్లి వేణుగోపాల్‌రెడ్డి దంపతులు పాల్గొన్నారు. సోమవారం పోచమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపన ఉంటుందని నిర్వాహకులు పేర్కొన్నారు. బుధవారం అమ్మవారికి బోనాలు నిర్వహించనునట్లు తెలిపారు. -
చెంచుల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యం
కొల్లాపూర్/పెద్దకొత్తపల్లి: చెంచు కుటుంబాలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడంతో పాటు పునరావస కాలనీలో సురక్షితమైన జీవన పరిస్థితులు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి అన్నారు. నల్లమల టైగర్ రిజర్వ్ ఫారెస్టు పరిధిలోని మూడు గ్రామాలకు చెందిన 257 చెంచు కుటుంబాల పునరావాసం కోసం పెద్దకొత్తపల్లి మండలంలోని బాచారంలో రూ.4.50 కోట్లతో ఆర్అండ్ఆర్ కాలనీ నిర్మాణ పనులకు శనివారం వారు కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. రూ.15.87 కోట్లతో.. పెద్దకొత్తపల్లి మండలంలోని బండరావిపాకుల వద్ద పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి జెడ్పీ రోడ్డు వరకు నక్కలపల్లి, వెంకటచెర్ల మీదుగా 6.95 కి.మీ. రహదారి నిర్మాణానికి రూ.5.7 కోట్లు, పాన్‌గల్ మండలం పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి బండపల్లి మీదుగా జమ్మాపూర్ వరకు 4.40 కి.మీ. రహదారి నిర్మాణానికి రూ.3.60 కోట్లు, వీపనగండ్ల మండలం కొర్లకుంట ఎక్స్ రోడ్డు నుంచి తూముకుంట–బొల్లారం ఎక్స్ రోడ్డు వరకు 8 కి.మీ. రోడ్డు నిర్మాణాన్ని రూ.6.56 కోట్లతో చేపట్టనున్నారు. పెంట్లవెల్లి పీడబ్ల్యూడీ రోడ్ సింగోటం, చింతలపల్లి, ఎన్మన్‌బెట్ల గ్రామాల వరకు నిర్మించనున్న హ్యామ్ రోడ్లకు, మాచినేనిపల్లి శివారులో 5.68 కోట్ల వ్యయంతో మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న సోలార్ పవర్‌ప్లాంట్ పనులకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం మహిళా సంఘాలకు రూ.175 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాల చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో ఎస్పీ డా.సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, జిల్లా అటవీ శాఖ అధికారి రేంత్చంద్ర, ఎఫ్డీఓ చంద్రప్రకాశ్ సింగల్, అదనపు కలెక్టర్ దేవసహయం, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఉచిత ప్రయాణం ఇవ్వడంపై ఓర్వలేకపోతున్నారు.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని అమలు చేశామని పంచాయతీరాజ్, సీ్త్ర, శిశుసంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడాన్ని బీఆర్ఎస్ నేతలు ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. ఉచిత బస్సుల్లో ప్రయాణిస్తే మహిళలు చెడిపోతున్నారంటూ ఆ పార్టీ నేతలు మాట్లాడుతున్నారని, మహిళలను ఇప్పటికీ వంటింటికే పరిమితం చేయాలనుకుంటున్నారని ఆరోపించారు. త్వరలో ‘ప్రభాతభేరి’ రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్య పరిరక్షణతో పాటు తెలంగాణ సంస్కృతిని కాపాడేందుకు త్వరలో ‘ప్రభాతభేరి’ పేరుతో కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. పార్టీకి నష్టం కలిగిస్తే చర్యలు కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి నష్టం కలిగేలా ఎంత పెద్ద నాయకుడు మాట్లాడినా చర్యలు తప్పవని, ఇందుకు కొండా సురేఖ, చిన్నారెడ్డి ఉదంతాలే నిదర్శనమని టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్, ఎంపీ మల్లురవి అన్నారు. సురేఖ, చిన్నారెడ్డి అంశంలో తాము ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించామని, వారికి నోటీసులు ఇచ్చాం. వివరణలు తీసుకున్నాం. వాటిపై పీసీసీ, క్రమశిక్షణ నివేదికలు ఏఐసీసీకి అందజేశాం. తర్వాతే వారిపై చర్యలు తీసుకున్నామని వివరించారు. సభలో జూపల్లి అరుణ్, ఇందిరా శోభన్, హన్మంతునాయక్, కళ్యాణ్‌రావు, విద్యాసాగర్‌రావు, రెడ్డి జ్యోతిసత్యం, షేక్ రహీంపాష, పసుపుల నర్సింహ, దండు నర్సింహ తదితరులు ఉన్నారు. బాచారంలో చెంకు కుటుంబాల పునరావాసం నిర్మాణాలకు భూమిపూజ మహిళలకు రూ.175 కోట్ల రుణాల చెక్కులు అందజేత కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు సీతక్క, జూపల్లి కృష్ణారావు -
జాతీయ లోక్‌అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి
కందనూలు: జిల్లాలో సెప్టెంబర్ 12న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయమూర్తి రమాకాంత్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని కోర్టు హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. లోక్ అదాలత్ ద్వారా భూతగాదా కేసులు, రాజీ చేసుకోదగిన క్రిమినల్, చెక్ బౌన్స్, కుటుంబం, మోటారు వాహనాల ప్రమాదాలు, బ్యాంకు తదితర పెండింగ్ కేసులను పరిష్కరించుకోవచ్చన్నారు. లోక్ అదాలత్ ద్వారా సత్వర పరిష్కారంతో అప్పీల్ లేని తీర్పును పొంది సమయాన్ని, డబ్బును ఆదా చేసుకోవాలని సూచించారు. అనంతరం లోక్ అదాలత్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. సమావేశంలో జిల్లా అదనపు న్యాయమూర్తి నసీం సుల్తానా, జిల్లా లీగల్‌సెల్ అథారిటీ నిహారిక, గోపిక నాగశ్రావ్య, శృతిదూత పాల్గొన్నారు. విధుల్లో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవు ఉప్పునుంతల: విధులల్లో నిర్లక్ష్యం చేసే డాక్టర్లు, సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి (డీఎంఆండ్‌హెచ్‌ఓ) డాక్టర్ కృష్ణ హెచ్చరించారు. శనివారం మధ్యాహ్నం స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్‌సీ)ను ఆయన తనిఖీ చేశారు. డాక్టర్లు, సిబ్బంది హాజరు రిజిస్టర్లు, ఇతర రికార్డులను పరిశీలించారు. ఆస్పత్రిలో డాక్టర్లు, సిబ్బంది అందుబాటులో ఉండటం లేదని తరచుగా ఫిర్యాదులు వస్తున్నాయని, మరోసారి ఇలాగే కొనసాగితే తగిన చర్యలు తీసుకుంటామన్నారు. డాక్టర్లు, సిబ్బంది విధులపై నిర్లక్ష్యం చేస్తున్నారని, అన్ని పరికరాలు ఉన్నా రోగులకు అవసరమైన పరీక్షలు చేయడం లేదని సర్పంచు సీహెచ్ శ్రీనివాసులు డీఎంఅండ్‌హెచ్‌ఓ దృష్టికి తెచ్చారు. సీహెచ్‌సీలో ఉన్న అన్ని రకాల టెస్టులను చేయాలని డాక్టర్లకు డీఎంహెచ్ఓ ఆదేశించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ తారాసింగ్, సీహెచ్‌సీ సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్, డాక్టర్లు స్వప్న, బిక్కులాల్, జాన్సీ, శ్రీకాంత్, మోతీలాల్, సిబ్బది పాల్గొన్నారు. నల్లమల అందాలు తిలకించిన అడిషనల్ డీజీ కొల్లాపూర్: రాష్ట్ర అడిషనల్ డీజీ అభిలాష బిస్తీ శనివారం కొల్లాపూర్‌లో పర్యటించారు. ఆమె సోమశిలలో కృష్ణానది అందాలను తిలకించి సోమేశ్వర ఆలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం కొల్లాపూర్ పట్టణం సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో ఏర్పాటుచేసిన ఏకో పార్కును, వ్యూ పాయింట్‌ను తిలకించారు. వ్యూ పాయింట్ పర్యాటకులను ఆకర్షించే విధంగా ఉందన్నారు. ఆమె వెంట అటవీ ఉద్యోగులు నవీన్, నిరంజన్, గోపాల్, అక్బర్ తదితరులు ఉన్నారు. ఐటీడీఏ పీఓగా అదనపు కలెక్టర్ సలోనిచోప్రా మన్ననూర్: స్థానికంగా నిర్వహణలో ఉన్న సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) ప్రాజెక్టు అధికారి (పీఓ)గా నాగర్‌కర్నూల్ జిల్లా అదనపు కలెక్టర్ సలోనిచోప్రా బాధ్యతలు స్వీకరించారు. శనివారం కార్యాలయానికి విచ్చేసిన ఆమెకు ఐటీడీఏ ఏఓ జాఫర్ హుసేన్తో పాటు కార్యాలయం సిబ్బంది పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పీఓగా బాధ్యతలు తీసుకున్న ఛాబ్రా పెండింగ్‌లో ఉన్న కొన్ని ఫైళ్లపై సంతకం చేశారు. సాంకేతిక పరిజ్జానాన్ని అందిపుచ్చుకోవాలి అచ్చంపేట రూరల్: విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని సబ్ కలెక్టర్ సలోనిచోప్రా అన్నారు. శనివారం పట్టణంలోని ఏయూపీఎస్లో సామాజిక సేవా కార్యకర్త సాదె రాజు సహకారంతో ఏర్పాటు చేసిన ఏఐ క్లా స్రూం, ఆర్ఓ ప్లాంట్‌ను ఆమె ప్రారంభించారు. -
రేవంత్ సర్కార్‌కు గుణపాఠం తప్పదు
కందనూలు: వ్యవసాయానికి కరెంటు కట్ చేసి రైతులను కష్టాలకు గురి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డికి అధికారాన్ని కట్ చేసేందుకు అన్నదాతలు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి జోస్యం చెప్పారు. శనివారం జిల్లా కేంద్రంలో కరెంటు కోతలపై మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఓ ఫంక్షన్ హాల్ నుంచి సబ్‌స్టేషన్ వరకు రైతులు, ట్రాక్టర్లతో భారీ నిరసన ర్యాలీని చేపట్టారు. అనంతరం హౌసింగ్ బోర్డ్ కాలనీ వద్ద గల సబ్‌స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రైతుల పాలిట శనిగా కాంగ్రెస్ సర్కార్ మారిందని దుయ్యబట్టారు. కృష్ణా, గోదావరి నదుల్లో సమృద్ధిగా నీరు ఉన్నా.. నీటిని ఎత్తిపోయడానికి చేసిన నిర్లక్ష్యమే నేడు తెలంగాణ రైతుల కొంప ముంచిందని ఆందోళన వ్యక్తం చేశారు. వర్షాభావ పరిస్థితులతో తీవ్ర కరువు వస్తుందని శాస్త్రవేత్తలు, ప్రతిపక్షాలు ముందే హెచ్చరించినా కాంగ్రెస్ సర్కార్ మొద్దు నిద్ర పోతుందని మండిడ్డారు. కేఎల్ఐ మోటార్ల ప్రారంభంలో జాప్యం.. ఎగువ కర్ణాటకలో కురిసిన భారీ వర్షాలతో కృష్ణానదికి ప్రతిరోజు 1.50 లక్షల క్యూసెక్కుల వరద వస్తున్న క్రమంలో కల్వకుర్తి ఎత్తిపోతల మోటార్లను ప్రారంభించాలని ఎంత చెప్పినా వినలేదు మాజీ మంత్రి ఆరోపించారు. కేఎల్ఐ ద్వారా 200 రోజులు మోటార్లు నడిపినా 40 టీఎంసీల నీరు ఎత్తిపోయడం సాధ్యం కాదని, కానీ ఆంధ్ర ప్రాజెక్టులకు హెడ్ రెగ్యులేటర్ ద్వారా ప్రతిరోజు 10 టీఎంసీల మేర నీటిని తరలించకుపోతుంటే రేవంత్ సర్కార్ కళ్లప్పగించి చూశారని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 6 గ్యారంటీలు 420 హామీల్లో ఒక్కటి సక్రమంగా నెరవేర్చక ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 420 సీఎంగా నిలిచారని ఆరోపించారు. అనంతరం విద్యుత్ శాఖ ఏఈకి వినతిపత్రం ఇచ్చారు. -
ముమ్మరంగా ఎలివేటెడ్ కారిడార్
జాతర మైదానంలోని విద్యుత్ సబ్‌స్టేషన్ నుంచి గుట్టపై ఉన్న ప్రధాన ఆలయం వరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తున్నారు. ఇందుకోసం 20 పిల్లర్లు ఏర్పాటు చేయాల్సి ఉండగా.. ఇప్పటికే 10 పిల్లర్లకు ఫౌండేషన్ పనులు పూర్తయ్యాయి. పిల్లర్ల నిర్మాణానికి కాంక్రీట్ పనులు కొనసాగుతున్నాయి. అమ్మాపురం సమీపం నుంచి కురుమూర్తి గుట్ట వెనుక భాగం మీదుగా ప్రధాన ఆలయం వరకు చేపడుతున్న ఘాట్‌రోడ్డు పనులు కూడా తుది దశకు చేరుకున్నాయి. రహదారిని చదును చేసి కంకర పరచారు. బీటీ వేసేందుకు సిద్ధం చేస్తున్నారు. -
పారదర్శకంగా ఎంపిక చేశాం..
ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపికకు సంబంధించి ఎక్కడా లోపం జరగలేదు. ప్రతి విషయంలో పారదర్శకత పాటించాం. అన్ని విషయాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతే అవార్డులు ఎంపిక చేశాం. – రమేష్‌కుమార్, డీఈఓ, నాగర్‌కర్నూల్ ఆన్లైన్ విధానంలో కాకుండా క్షేత్ర స్థాయిలో పరిశీలించి, ఉపాధ్యాయుల అభ్యసన సామర్థ్యాలను బట్టి అవార్డుకు ఎంపిక చేస్తే బాగుంటుంది. ఆన్లైన్ విధానం, సంఘాల జోక్యం లేకుండా నిజమైన ఉపాధ్యాయుడుకి న్యాయం జరగాలి. – సుబ్బయ్య, బీసీటీఏ జిల్లా ఉపాధ్యక్షుడు -
రూ.110 కోట్లతో రూపురేఖల మార్పు
కురుమూర్తి ఆలయ అభివృద్ధిలో భాగంగా రూ.110 కోట్లతో పలు పనులు చేపడుతున్నారు. ప్రధాన ఆలయం వద్ద మహామండపం, జాతర మైదానంలో కల్యాణ మండపం, విడిది సత్రాలు, అన్నదాన సత్రాలు తదితర నిర్మాణాలు చేపట్టనున్నారు. ఇప్పటికే రాజగోపురం వద్ద రేకుల షెడ్డు, కోనేరు సమీపంలో విడిది సత్రం, డ్రెయినేజీ పనులు పూర్తయ్యాయి. మెట్ల కష్టాలకు చెక్ కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలతో పాటు ప్రతి అమావాస్య, శని, సోమవారాల్లో భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివస్తారు. అయితే వృద్ధులు, దివ్యాంగులు కొండపైకి మెట్లు ఎక్కలేక రాజగోపురం వద్ద నుంచే స్వామివారిని దర్శించుకుని వెనుదిరిగే పరిస్థితి ఉంది. ఘాట్‌రోడ్డు అందుబాటులోకి వస్తే వాహనాల్లోనే ప్రధాన ఆలయం వరకు చేరుకునే అవకాశం కలగనుంది. దీంతో భక్తుల ఇబ్బందులు గణనీయంగా తగ్గనున్నాయి. -
యథేచ్ఛగా ఆక్రమణ.. నిర్మాణాలు!
కల్వకుర్తి టౌన్: పట్టణంలో ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ ప్రశ్నార్థకంగా మారుతోంది. ప్రజా అవసరాల కోసం కేటాయించిన మున్సిపల్ స్థలాలు, జాతీయ రహదారి ఆస్తులు, బఫర్జోన్ల విషయంలో నిబంధనలు అమలవుతున్నాయా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దేవరకొండ రోడ్డులోని ఓ వెంచర్ పరిధిలో ఇంటి నిర్మాణం పేరుతో జాతీయ రహదారి వెంట ఉన్న రక్షణ గ్రిల్ తొలగించడంతో పాటు కోల్‌బావి బఫర్‌జోన్ వద్ద రక్షణ గోడ కూల్చివేయడం, రోడ్డు స్థలంలో బేస్మెంట్ వేసి రేకుల షెడ్డు నిర్మించినట్లు ప్రత్యక్షంగా కనిపిస్తున్నా అధికారులు చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారు. ప్రజాస్థలంలో ఆక్రమణలు.. కల్వకుర్తి మేజర్ గ్రామపంచాయతీగా ఉన్న సమయంలో సర్వే నంబర్ 99/3లో వెంచర్ ఏర్పాటు చేసి మొత్తం 38 ప్లాట్లు వేశారు. నిబంధనల ప్రకారం వెంచర్లో 10 శాతం స్థలాన్ని, సుమారు 757 గజాలను గ్రామపంచాయతీ అవసరాల కోసం కేటాయించినట్లు రికార్డులు, స్థానికులు చెబుతున్నారు. కల్వకుర్తి మున్సిపాలిటీగా మారిన తర్వాత ఈ భూమి మున్సిపాలిటీకి చెందినదేనని అప్పటి కమిషనర్ సాబేర్‌అలీ అక్కడ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. కానీ అదే స్థలానికి కొత్త లేఔట్ రూపొందించి, కొత్త బై నంబర్లు కేటాయించి ప్రైవేటు వ్యక్తుల పేర్లతో చూపించారనే ఆరోపణలు ఉన్నాయి. ఒక ప్లాట్‌కు 160 గజాల స్థలం ఉండగా.. సంబంధిత డాక్యుమెంట్లో మాత్రం 225 గజాలు చూపించారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో అదనంగా చూపిన 65 గజాలు ఎక్కడి నుంచి వచ్చిందనే ప్రశ్న తలెత్తుతోంది. మొత్తం 757 గజాల్లో ప్రస్తుతం సుమారు 200 గజాల వరకు మాత్రమే ఖాళీగా ఉందని స్థానికులు చెబుతున్నారు. జాతీయ రహదారి గ్రిల్‌ను తొలగించి చేపడుతున్న ఇంటి నిర్మాణం ఈ ఫొటోలో కనిపిస్తున్న షెడ్డు మున్సి పాలిటీ స్థలంలో ఏర్పాటు చేసింది. షెడ్డు నిర్మాణం చేసి, పక్కనే ఉన్న కోల్‌బావి కాల్వ బఫర్ జోన్ గోడ కూల్చి చదును చేసినా టౌన్‌ప్లానింగ్ అధికారులకు కనపడలేదు. జాతీయ రహదారి గ్రిల్ తొలగించి కోల్‌బావి బఫర్‌జోన్ గోడ ధ్వంసం మున్సిపల్ రోడ్డు స్థలంలో షెడ్డు నిర్మాణం సామాన్యుడికి మాత్రం ఎక్కడా లేని నిబంధనలు.. ప్రభుత్వ ఆస్తులపై అధికారుల ఉదాసీనత జాతీయ రహదారి వెంట ఏర్పాటు చేసిన గ్రిల్‌ను తొలగించడం పెద్ద తప్పిదం. గ్రిల్ తొలగించినట్లు నిర్ధారణ అయితే సంబంధిత వ్యక్తికి నోటీసులు జారీ చేసి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటాం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు చేపడతాం. – కౌశిక్, ఏఈఈ, ఎన్‌హెచ్ దేవరకొండ రోడ్డులో నిర్మిస్తున్న ఇంటిలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడితే చర్యలు తీసుకుంటాం. మరోసారి స్థలాన్ని పరిశీలించి ఏవైనా ఉల్లంఘనలు ఉన్నట్లు తేలితే వెంటనే నోటీసులు జారీ చేస్తాం. నిబంధనలకు విరుద్ధమైన నిర్మాణాలు వెంటనే తొలగిస్తాం. – తనూజ, టౌన్‌ప్లానర్, కల్వకుర్తి మున్సిపాలిటీ మున్సిపాలిటీలోని ఈ భూమి వివాదం ఏళ్లుగా కొనసాగుతోంది. లోకాయుక్తలో కేసు నం.4291/2013/ఆ1 నమోదై ఉండగా.. హైకోర్టులో 38268/2022, 33952/2023 కేసులు ఉన్నట్లు పేర్కొంటున్నారు. భూమి హక్కులు, యాజమాన్యం, ప్రజాస్థల పరిరక్షణకు సంబంధించిన అంశాలు న్యాయస్థానాల పరిధిలో ఉండటంతో కోర్టు ఆదేశాలకు అనుగుణంగానే అధికారులు తదుపరి చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో మున్సిపాలిటీ అధికారులు సైతం తమ ఆస్తి హక్కులు, ప్రజా స్థల పరిరక్షణకు సంబంధించి హైకోర్టును ఆశ్రయించినట్లు సమాచారం. సామాన్యుడు ఇంటి నిర్మాణంలో చిన్నపాటి నిబంధన ఉల్లంఘించినా నోటీసులు, జరిమానాలు, అవసరమైతే కూల్చివేత చర్యలు తీసుకునే అధికారులు.. ప్రభుత్వ ఆస్తుల విషయంలో మాత్రం ఎందుకు అదేస్థాయిలో స్పందించడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. -
ఆహ్లాదకర వాతావరణంలో..
దాతల సహకారంతో... తెలకపల్లి మండలంలోని తాళ్లపల్లి ప్రాథమిక పాఠశాలకు 2024లో బదిలీలో భాగంగా హెచ్ఎం మల్లేష్ వచ్చినప్పుడు 38 మంది విద్యార్థులు, ఒక ఉపాధ్యాయుడు ఉన్నాడు. గ్రామస్తుల సహకారంతో ఏటా విద్యార్థుల పెంచుతున్నారు. బోధనలో వినూత్న పద్ధతులు అవలంభిస్తూ.. పాఠశాల విద్యార్థుల గురుకుల పాఠశాలలకు ఎంపికయ్యేలా తీర్చిదిద్దుతున్నారు. గ్రామస్తులు రూ.50 వేలు, తన సొంత డబ్బులు రూ.48 వేలతో పాఠశాల గోడలకు దేశనాయకుల చిత్రాలు, బోధనోపకరణాలకు వెచ్చించారు. ప్రస్తుతం పాఠశాలలో ముగ్గురు టీచర్లు, 66 మంది విద్యార్థులు.. పచ్చని చెట్ల మధ్య ఆహ్లాదకర వాతావరణంలో పాఠశాల కొనసాగుతోంది. ఐతోల్ ప్రాథమిక పాఠశాలశిథిలావస్థలో ఉన్న బడిని తన ఆలోచన, గ్రామపెద్దలు కంకణాల కృష్ణారెడ్డి, వారి సోదరులు, అందుగుల నాగేందర్రావు, వీరారెడ్డి, రమేష్‌గౌడ్ సహకారంతో రూ.25 లక్షలు వెచ్చించి నూతన పాఠశాలగా తీర్చిదిద్దారు తాడూరు మండలంలోని ఐతోల్ ప్రాథమిక పాఠశాల హెచ్ఎం వీరేష్. తాను పాఠశాలకు వచ్చినప్పుడు 22 మంది విద్యార్థులతో కొనసాగిన బడిని ప్రస్తుతం 44 మందితో విద్యాబోధన జరుగుతుంది. విద్యార్థులకు బోధనోపకరణాలు ఉపయోగిస్తూ వారిని తన ఆలోచనకు అనుగుణంగా తీర్చిదిద్దుతూ.. ప్రసంశలు అందుకుంటున్నారు. -
అభివృద్ధి పనుల్లో నాణ్యతకు పెద్దపీట
కోస్గి/కోస్గి రూరల్: అభివృద్ధి పనుల్లో నాణ్యతకు పెద్దపీట వేస్తూ జాప్యం చేయకుండా వేగవంతంగా పూర్తిచేయాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి అన్నారు. నిర్దేశిత నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని, నిబంధనలు పాటించని కాంట్రాక్టర్లపై కఠినచర్యలు తీసుకోవాలని చెప్పారు. శుక్రవారం సీఎం తన సొంత నియోజకవర్గంలో పర్యటించి.. అభివృద్ధి పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా నారాయణపేట జిల్లా మద్దూరుకు మధ్యాహ్నం 2.53 గంటలకు చేరుకున్న ముఖ్యమంత్రికి కలెక్టర్ సీహెచ్ ప్రియాంక పట్టణ శివారులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో దోరెపల్లి రోడ్డులో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్ద పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. అక్కడి నుంచి కాన్వాయ్‌లో బయలుదేరిన సీఎం ముందుగా రూ.6.10 కోట్లతో నిర్మిస్తున్న ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవన నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా భవన నిర్మాణ నమూనా చిత్రపటాన్ని పరిశీలించడంతోపాటు భవన నిర్మాణానికి కేటాయించిన స్థలం, నిర్మాణ విస్తీర్ణం, తరగతి గదులు, ప్రయోగశాలల వివరాలతోపాటు 4 ఎకరాల స్థలంలో 13,670 చదరపు అడుగుల విస్తీర్ణంలో మూడు అంతస్థుల భవనం నిర్మిస్తున్నట్లు ఈడబ్ల్యూఐడీసీ ఎండీ గణపతిరెడ్డి సీఎంకు వివరించారు. కళాశాల భవనం పక్కన ప్రధాన రహదారి వైపు ఉన్న అదనపు భూమిని సర్వే చేయించాలని, అది పట్టా భూమి అయితే కొనుగోలు చేసి కళాశాలకు విశాలమైన ప్రాంగణం, ప్రహరీ నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ప్రియాంకకు సూచించారు. రానున్న మార్చిలోగా కళాశాల భవన నిర్మాణ పనులు పూర్తిచేసి.. వచ్చే విద్యా సంవత్సరంలో విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. అక్కడి నుంచి చింతల్‌దిండి రోడ్డులో రూ.30 కోట్ల నిధులతో నిర్మిస్తున్న సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల, కళాశాలల భవన నిర్మాణ పనులను పరిశీలించారు. గురుకుల పాఠశాల, కళాశాలలకు స్థలం ఇచ్చిన దాతలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కలెక్టర్‌ను ఆదేశించారు. ముఖ్యమంత్రి మద్దూరు పర్యటన సందర్భంగా పట్టణంలో అభిమానులు, నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. కార్యక్రమంలో ముఖ్యమంత్రి సెక్రెటరీ శ్రీధర్, తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి, అదనపు కలెక్టర్ శ్రీను, కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డి, డీఆర్ఓ రాజేశ్వరి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ విజయ్‌కుమార్, మద్దూర్ మున్సిపల్ చైర్పర్సన్ సరస్వతి, వైస్ చైర్పర్సన్ భాగ్యశ్రీ, కోస్గి మార్కెట్ కమిటీ చైర్మన్ భీములు, పీఏసీఎస్ అధ్యక్షుడు నర్సింహులు, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు రఘుపతిరెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు బాలయ్య, మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అభివాదం చేస్తున్న సీఎం రేవంత్రెడ్డిపర్యటన సాగింది ఇలా.. 2.53 గంటలకు మద్దూరు మున్సిపల్ శివారులో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ దగ్గర సీఎం రేవంత్‌రెడ్డితో పాటు తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి వచ్చారు. 2.56 గంటలకు పేట కలెక్టర్ ప్రియాంక ముఖ్యమంత్రికి పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. 3.00 గంటలకు సీఎం కాన్వాయ్‌లో డిగ్రీ కళాశాలకు చేరుకున్నారు. అక్కడ ఎస్పీ డాక్టర్ వినీత్ ముఖ్యమంత్రికి పుష్పగుచ్ఛం అందించారు. అనంతరం సీఎం భవన నిర్మాణ పనులను పరీశీలించారు. 3.25 గంటలకు స్థానిక పాత బస్టాండ్ ఆంజనేయస్వామి ఆలయం మీదుగా సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల, కళాశాలకు చేరుకున్నారు. అక్కడ సమీప కాలనీలోని మహిళలతో మాట్లాడారు. 3.45 గంటలకు గురుకుల కళాశాల నుంచి బయలుదేరి.. నారాయణపేట– కోస్గి ప్రధాన రహదారిపై ఇరువైపులా నిల్చున్న ప్రజలకు కారు డోర్లో నిలబడి అభివాదం చేస్తూ హెలీప్యాడ్‌కు చేరుకున్నారు. 4.00 గంటలకు సీఎం, తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి, కడా చైర్మన్ వెంకట్‌రెడ్డి హెలిక్యాప్టర్‌లో కూర్చున్నారు. 4.08 గంటలకు వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలంలోని గోకఫసల్బాద్కు హెలిక్యాప్టర్ బయలుదేరి వెళ్లింది. నిబంధనలు పాటించని కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు డిగ్రీ కళాశాల భవనాన్ని మార్చిలోగా పూర్తిచేయాలి మద్దూరులో అభివృద్ధి పనులు పరిశీలించిన సీఎం రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గంలో 1.15 గంటలు ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు -
విద్యార్థుల సంఖ్య పెంచి..
అమ్రాబాద్ మండలం జంగంరెడ్డిపల్లి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు భరత్‌గౌడ్ కృషితో గతంలో 25 మంది విద్యార్థులు ఉండగా.. ప్రస్తుతం 39 మంది చదువుకుంటున్నారు. డ్రాపౌట్ ఎక్కువ ఉన్న ఈ పాఠశాలలో తల్లిదండ్రులను చైతన్యవంతం చేసి విద్యార్థుల సంఖ్య పెంచేలా కృషిచేశారు. తెలుగు మీడియం అయినప్పటికీ విద్యార్థులకు ఆంగ్ల బోధన చేస్తుండటంతో కొంతమంది తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలలు చదివిస్తున్న తమ పిల్లలను స్థానిక పాఠశాలలో చేర్పించారు. అలాగే పాఠశాల నిధులతో తరగతి గదుల్లో ఫ్యాన్లు, విద్యార్థులకు బెంచీలు ఏర్పాటు చేయడమే కాకుండా గోడలపై తెలుగు, ఆంగ్లం పదాలు రాయించారు. -
నేడు జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం
విద్యార్థుల ఆకలి తీరుస్తూ.. ● ప్రభుత్వ పాఠశాల, విద్యార్థుల అభివృద్ధికి కృషిచేస్తున్న ఉపాధ్యాయులు ● వినూత్నంగా బోధనతో విద్యార్థుల భవిష్యత్‌కు బంగారు బాటలు ● నూతన ఆవిష్కరణలు, సైన్స్ వైపు మరల్చేందుకు కృషి ● జిల్లాలోని ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డుల ప్రదానం కోడేరు మండలంలోని రాజాపూర్ జెడ్పీహెచ్ఎస్ జీవశాస్త్ర ఉపాధ్యాయుడు నాగిళ్ల శ్రీశైలం. పాఠశాల విద్యలో 26 ఏళ్లుగా విద్యను బోధిస్తూ తరగతి గదిలో జ్ఞాన ప్రసారం కాదు జ్ఞాన నిర్మాణం జరగాలనే ఆలోచనతో.. విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేందుకు అవసరమైన బోధనాభ్యసన సామగ్రిని రూపొందించారు. వీటి ఆధారంగా గత రెండేళ్లుగా విద్యార్థులకు ప్రదర్శన చేస్తూ జిల్లాలో రెండుసార్లు మొదటి స్థానంలో నిలిచారు. బోధన బొమ్మలాటలో భాగంగా లింగ సమానత్వంపై ప్రదర్శన చేసి రాష్ట్రంలో జిల్లాకు రెండో బహుమతి సాధించారు. దీక్ష పోర్టల్‌లో ఈ కాంటెంట్ క్రియేటర్‌గా ప్రాథమిక స్థాయి పరిసరాల విజ్ఞానంలో విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేందుకు రూపొందించిన వీడియోలు ప్రస్తుత ప్రభుత్వ పాఠ్య పుస్తకాల్లో క్యూఆర్ కోడ్ రూపంలో అందుబోటులో ఉన్నాయి. వంగూరు మండలంలోని తుమ్మలపల్లి ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులకు రెండేళ్లుగా ఉదయం అల్పాహారం, సాయంత్రం స్నాక్స్ అందిస్తూ.. విద్యార్థుల ఆకలి తీరుస్తున్నారు ఉపాధ్యాయుడు కోటేశ్వర్రావు. ఈయన 2024లో పాఠశాలకు బదిలీపై వచ్చినప్పుడు 32 మంది విద్యార్థులు ఉండగా.. హెచ్ఎం సైదులు, ఉపాధ్యాయులు సునీత, కవితతో కలిసి పాఠశాల అభ్యున్నతికి పాటుపడుతూ 78 మంది విద్యార్థులను చేర్పించారు. అలాగే గ్రామ యువకులు, దాతల సహాయంతో పాఠశాలలో విద్యావలంటీర్‌ను ఏర్పాటు చేసి సాయంత్రం 5.30 గంటల వరకు స్టడీ అవర్స్ నిర్వహిస్తూ బోధన అందిస్తున్నారు. గతేడాది జిల్లాస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికై స్ఫూర్తిగా నిలిచారు. – కందనూలు/ అచ్చంపేట -
ఇందిరమ్మ కుట్టు మిషన్లు
● వందశాతం సబ్సిడీపై రూ.12 వేల విలువైన ఆటోమేటిక్ మిషన్లు ● 18 నుంచి 55 ఏళ్లలోపు బీసీ మహిళలు అర్హులు ● జిల్లాలో ఇప్పటికే 2,492 మంది దరఖాస్తు ● ఈ నెల 15 వరకు గడువు అచ్చంపేట: నిరుద్యోగ బీసీ మహిళలకు స్వయం ఉపాధి కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. టైలరింగ్‌లో నైపుణ్యం కలిగిన వారు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ఇంటింటా ఇందిరమ్మ పథకం పేరుతో ఉచితంగా ఆటోమేటిక్ కుట్టమిషన్ల అందించాలని నిర్ణయించింది. మహిళలకు టైలరింగ్ రంగంలో వ్యాపార అవకాశాలు కల్పించి పారిశ్రామికవేత్తలుగా రాణించేందుకు అవకాశాలు కల్పిస్తోంది. ఇందులో భాగంగా అర్హులైన మహిళల నుంచి దరఖాస్తులను ఆన్లైన్లో స్వీకరించేందుకు షెడ్యూల్ ప్రకటించింది. ఈ క్రమంలో జిల్లాలోని వెనుకబడిన తరగతుల మహిళలకు ఇందిరమ్మ కుట్టుమిషన్ పథకం ద్వారా మరింత ప్రయోజనం కలగనుంది. ప్రభుత్వం తొలి విడతగా రూ.12 వేల విలువైన ఆటోమేటిక్ కుట్టు మిషన్లు పంపిణీ చేయనుంది. నియోజకవర్గానికి వెయ్యి.. రాష్ట్ర ప్రభుత్వం మహిళల సాధికారత, ఆర్థికాభివృద్ధికి ఇందిరా మహిళా శక్తి ద్వారా సంక్షేమ పథకాలు, అవకాశాలు కల్పిస్తోంది. ఈ క్రమంలోనే బీసీ సామాజిక వర్గంలోని మహిళలకు స్వయం ఉపాధి కల్పించే దిశగా 100 శాతం సబ్సిడీతో ఉచితంగా ప్రభుత్వం ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టుమిషన్ పథకాన్ని ప్రకటించింది. ప్రభుత్వం తొలి విడతగా పైలెట్ ప్రాజెక్టు కింద నియోజకవర్గానికి వెయ్యి కుట్టు మిషన్లు వందశాతం సబ్సిడీతో అందించాలని నిర్ణయించింది. జిల్లాలో నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 20 మండలాలు ఉన్నాయి. ప్రభుత్వం అందించే కుట్టు మిషన్ తీసుకోవడానికి మహిళలు ఉత్సాహంగా ఉన్నారు. ఒక్కో కుట్టు మిషన్ విలువ రూ.12 వేల వరకు ఉంటుంది. జిల్లాకు 4 వేల వరకు ఆటోమేటిక్ కుట్టుమిషన్లు మహిళలకు అందించనుండడంతో మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉంది. భవిష్యత్‌లో పథకాన్ని విస్తరించి ప్రతీ ఒక్కొరికి అందించేలా రూపకల్పన చేస్తున్నారు. వారు అనర్హులు.. 18 నుంచి 55 ఏళ్ల వయసు కలిగి ఉండి.. తప్పనిసరిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళలై ఉండాలి. మహిళలు ఆన్లైన్ ద్వారా ఈ నెల 15 వరకు దరఖాస్తులు చేసుకునే అవకాశం కల్పించారు. మహిళలు కుటుంబ వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్ష లు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలకు మించకూడదు. ఒక కుటుంబం నుంచి ఒక రేషన్ కార్డుపై ఒకరికి మాత్రమే ఉచిత కుట్టుమిషన్ పథకాన్ని వర్తింపజేస్తారు. అర్హులైన వారు http//tgobmms@ogg.gov.in పోర్టల్‌లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి. ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలకు అనుగుణంగా, కలెక్టర్ ఆధ్వర్యంలో బీసీ సంక్షేమశాఖ అధికారులు లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. 2023– 24లో బీసీ స్వయం ఉపాధి పథకం ద్వారా లబ్ధిపొందిన వారిని అనర్హులుగా పేర్కొన్నారు. పేదలు, నిరాశ్రయులు, వితంతువులు, ఒంటరి మహిళలు, అనాథలతోపాటు మేర, మేరు సామాజిక వర్గానికి చెందిన వారికి సైతం ప్రాధాన్యం ఉంటుంది. కనీస విద్యార్హత ఉండాలి.. ఇందిరమ్మ ఉచిత కుట్టు మిషన్ లబ్ధి పొందాలంటే మహిళలకు కనీస విద్యార్హత ఉండాలి. దరఖాస్తులు ఎక్కువ వస్తే ప్రభుత్వ నిబంధనల మేరకు కనీస విద్యార్హత 5వ తరగతిగా నిర్ణయించారు. అర్హులైన అభ్యర్థులు అధికారిక పోర్టల్‌లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆధార్, ఆదాయ ధ్రువీకరణ పత్రం, రేషన్ కార్డు, అర్హత పత్రాలను అప్లోడ్ చేసి.. పత్రాలను ఎంపీడీఓ, మున్సిపల్ కార్యాలయాల్లో అందజేయాలి. ఆన్లైన్లో వచ్చిన దరఖాస్తులను మండల, మున్సిపాలిటీ స్థాయి కమిటీల ద్వారా అర్హులను నిర్ణయిస్తారు. నిబంధనల మేరకే.. అర్హులైన నిరుద్యోగ బీసీ మహిళలు ఈ నెల 15 వరకు కుట్టు మిషన్ల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. జిల్లాలో ఇప్పటి వరకు 2,492 దరఖాస్తులు వచ్చాయి. ప్రభుత్వ నిబంధనల మేరకు అర్హులైన వారికి లబ్ధి చేకూర్చేలా చర్యలు తీసుకుంటాం. గతంలో లబ్ధిపొందిన వారు అనర్హులు. సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులు, అనాథలు, నిరుద్యోగ మహిళలకు ప్రాధాన్యం ఉంటుంది. – ఇందిర, జిల్లా బీసీ సంక్షేమ అధికారి -
నాగర్‌కర్నూల్
బుధవారం శ్రీ 2 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026రాఖీ వేళ.. ఆర్టీసీకి కాసుల వర్షం మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: ఈసారి రాఖీ పండుగతో ఆర్టీసీ మహబూబ్‌నగర్ రీజియన్‌కు రికార్డుస్థాయిలో ఆదాయం వచ్చింది. వరుసగా సెలవులు రావడంతో ప్రయాణికుల సౌకర్యార్థం గత నెల 27 నుంచి 31వ తేదీ వరకు 490 ప్రత్యేక బస్సులను నడిపారు. పండుగ వేళ వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా రీజియన్ పరిధిలోని పది డిపోల అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా ఆయా డిపోల నుంచి హైదరాబాద్ రూట్లో ఎక్కువ బస్సులను నడిపించారు. ఈ రూట్లోనే మహబూబ్‌నగర్ రీజియన్‌కు అధిక ఆదాయం వచ్చింది. ఆగస్టు 27న మహబూబ్‌నగర్ రీజియన్ పరిధిలో 5,21,227 మంది ప్రయాణికుల ద్వారా రూ.2,63,11,000 రాగా.. 28న 5,88,639 మంది ప్రయాణికుల ద్వారా రూ.3,43,32,000, 29న 5,97,940 మంది ప్రయాణికుల ద్వారా రూ.3,20,47,000 ఆదాయం వచ్చింది. అలాగే ఆగస్టు 30న 5,47,837 మంది ప్రయాణికుల ద్వారా రూ.3,12,03,000, ఆగస్టు 31న అత్యధికంగా 5,80,705 మంది ప్రయాణికుల ద్వారా రూ.3,65,37,000 సమకూరింది. ఐదు రోజులకు కలిపి మహబూబ్‌నగర్ రీజియన్‌కు మొత్తం రూ.16,04,31,000 వచ్చింది. డిపోల పరంగా చూస్తే మహబూబ్‌నగర్ అత్యధికంగా రూ.2,55,99,000, రెండో స్థానంలో వనపర్తి రూ.2,14,09,000 ఆదాయం పొందాయి. ఐదు రోజుల్లో రూ.16.04 కోట్ల రాబడి 28.36 లక్షల మంది ప్రయాణం.. 490 ప్రత్యేక బస్సులు ఒక్క 31వ తేదీనే రూ.3.65 కోట్ల ఆదాయం 5 రోజుల ఆదాయం వివరాలు.. అందరి సమష్టి కృషితో సాధించాం అన్ని డిపోల డ్రైవర్లు, కండక్టర్లు, సూపర్వైజర్లు, ఇతర ఉద్యోగుల సమష్టిగా అంకితభావంతో పనిచేయడంతోనే ఈ ఆదాయం సమకూరింది. ముఖ్యంగా మహిళా ఉద్యోగులు వరలక్ష్మి వ్రతం, రాఖీ పండుగలకు దూరంగా ఉండి విధులకు హాజరవడం గర్వకారణం. పండుగ రోజుల్లో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని బస్టాండ్లలో పర్యవేక్షణ నిర్వహించాం. – పి.సంతోష్‌కుమార్, ఆర్ఎం, మహబూబ్‌నగర్ -
నిరుపేదలకు ఉచిత న్యాయ సహాయం
కందనూలు: జైల్లు శిక్ష అనుభవిస్తూ.. ఆర్థిక స్థోమత లేని వారికి ఉచితంగా న్యాయ సహాయం అందిస్తామని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి నిహారిక అన్నారు. మంగళవారం ఆమె జిల్లాకేంద్రంలోని సబ్ జైలును సందర్శించి ఖైదీలతో మాట్లాడుతూ వారికి కల్పిస్తున్న వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. వంటశాల, ఆహార పదార్థాలను పరిశీలించి.. ఖైదీలకు మెనూ ప్రకారం ఆహారం అందిస్తున్నారా లేదా అని నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఎవరైనా న్యాయవాదిని పెట్టుకునే స్థోమత లేని వారికి తమ సంస్థ నుంచి ప్రభుత్వ న్యాయవాదిని ఉచితంగా నియమిస్తామని చెప్పారు. కార్యక్రమంలో శ్రీరామ్ ఆర్య, పవన శేషసాయి, భవానిబాయి, జైలు సిబ్బంది పాల్గొన్నారు. నేత్రదానంపై అవగాహన కందనూలు: నేత్రదానంపై ప్రతిఒక్కరు అవగాహన పెంచుకోవాలని డీఎంహెచ్ఓ కృష్ణ అన్నారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 41వ నేత్రదాన పక్షోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు నేత్రదాన ఆవశ్యకతపై వ్యాసరచన పోటీలు నిర్వహించి.. గెలుపొందిన విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ బహుమతులు అందజేశారు. అనంతరం డీఎంహెచ్ఓ మాట్లాడుతూ ఎవరైనా ఒక రు మరణించిన తర్వాత నేత్రదానం చేయడం వల్ల ఇద్దరికీ చూపు వస్తుందని, కావునా వ్యక్తి మరణించిన తర్వాత వారి కుటుంబ సభ్యులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి నేత్రదానం చేయాలని కోరారు. దృష్టిలోపం ఉన్న విద్యార్థులకు కళ్ల అద్దాలు అందజేశారు. నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే లక్ష్యం కల్వకుర్తి రూరల్: నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నానని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మంగళవారం కల్వకుర్తిలో పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టారు. దాదాపు రూ.కోటితో ఎల్లికల్ రోడ్డులో నిర్మించిన వంతెనను ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం సహాయ నిధి చెక్కులు, స్మార్ట్ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్‌లు, వీధి వ్యాపారులకు ప్రొసీడింగ్‌లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్హులైన ప్రతిఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేస్తామన్నారు. అనంతరం హైమాక్స్ లైట్లను ప్రారంభించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రత్నమాల, రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సభ్యుడు బాలాజీసింగ్, జిల్లెల్ల రాములు, మున్సిపల్ వైస్ చైర్మన్ షానావాజ్ఖాన్, తహసీల్దార్ ఇబ్రహీం, కమిషనర్ మహమ్ముద్షేక్, శ్రీకాంత్‌రెడ్డి, రమాకాంత్‌రెడ్డి, రాహుల్, బాల్‌రెడ్డి, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. -
సర్‌పై ప్రత్యేక ప్రచార రోజులు
నాగర్‌కర్నూల్: ప్రత్యేక ప్రచార రోజులను ఓటర్లు సద్వినియోగం చేసుకోవాలని, సర్ ప్రక్రియ పూర్తయ్యే వరకు ప్రతి బుధవారం రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహిస్తామని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని వీసీ హాల్లో అదనపు కలెక్టర్ చెన్నయ్యతో కలిసి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటర్ల జాబితా సవరణపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రత్యేక ఓటరు నమోదు, ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు, తొలగింపులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించుకునేందుకు ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ప్రత్యేక ప్రచార రోజులను ప్రతిఒక్క ఓటరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ నెల 16 వరకు ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమం నిర్వహించనున్నట్లు, ఈ నెల 5, 6, 12, 13 తేదీల్లో ప్రతి పోలింగ్ కేంద్రం పరిధిలో బూత్ లెవల్ అధికారులు అందుబాటులో ఉంటారని, కాబట్టి ఫారం–6 ద్వారా నూతన ఓటర్లుగా నమోదు, ఫారం–7, 8కు అభ్యంతరాలు, మార్పులు, చేర్పులు తదితర సమస్యలను పరిష్కరించుకోవచ్చన్నారు. ఎన్యూమరేషన్ ఫారాలు పొందని ఓటర్లు కూడా ఈ ప్రత్యేక ప్రచార రోజుల్లో ఫారం–6తోపాటు డిక్లరేషన్ ఫారాన్ని జత చేసి బీఎల్ఓలకు అందజేయాలని చెప్పారు. ఓటర్లకు అవసరమైన సహాయం అందించేందుకు బీఎల్ఓలు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. సర్‌లో భాగంగా నోటీసులు అందుకున్న ఓటర్లు హియరింగ్‌కు హాజరయ్యే సమయంలో ధ్రువపత్రాలను తప్పనిసరిగా వెంట తీసుకురావాలని, రీ–హియరింగ్‌కు ఒకసారి మాత్రమే అవకాశం ఉన్నందున, ఓటర్లు తమకు సంబంధించిన అన్ని ఆధారాలను ముందుగానే సిద్ధం చేసుకోవాలన్నారు. 2004 తర్వాత జన్మించిన వారు తమ తల్లిదండ్రులిద్దరికీ సంబంధించిన ధ్రువపత్రాలతోపాటు సంబంధిత ఓటరు ధ్రువపత్రాన్ని, 2004కు ముందు జన్మించిన వారు తమ ధ్రువపత్రాలతోపాటు తల్లి లేదా తండ్రి ఆధారాలను సమర్పించాలన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు దాదాపు లక్ష మంది ఓటర్లకు నోటీసులను అందజేశామని, నోటీసులు అందుకున్న ప్రతి ఓటరు నిర్ణీత సమయంలో హియరింగ్‌కు హాజరై, అవసరమైన ధ్రువపత్రాలను అందించి ఎన్నికల సిబ్బందికి సహకరించాలని కోరారు. సమావేశంలో కలెక్టరేట్ ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ రవికుమార్, ఎన్నికల డీటీ కల్పన తదితరులు పాల్గొన్నారు. -
జాక్‌పాట్ కొట్టి.. సర్కారుకు ఎగ్గొట్టి!
సర్కారు సీరియస్ 2022– 23 రబీ సీజన్లో తమకు అదనంగా సీఎమ్మార్ ధాన్యం కట్టబెట్టారని.. అకాల వర్షాలతో తడిచి పాడైందంటూ మిల్లర్లు ఇంకా బురిడీ కొట్టించే ప్రయత్నమే చేస్తున్నారు. ప్రభుత్వం డబ్బులు కట్టాల్సిందేనంటూ స్పష్టం చేసినప్పటికీ.. కొందరు మిల్లర్లు అదే ఎత్తుగడతో ముందుకు సాగుతుండడం పెద్దలకు మరింత ఆగ్రహం తెప్పించింది. అందుకే జిల్లాలు, మిల్లర్ల వారీగా చిట్టా తెప్పించుకొంటుండగా.. అసలు నిజాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే విజిలెన్స్ ఆకస్మిక దాడులు.. కేసుల నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని పలువురు మిల్లర్లు భయంతో హైదరాబాద్‌లోనే మకాం వేసి.. పైరవీలు మొదలుపెట్టారు. ముందస్తు బెయిల్ కోసం కొందరు ప్రయత్నిస్తుండగా.. తనిఖీలు ఆపాలని మరికొందరు మంత్రులు, పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారుల చుట్టూ తిరుగుతున్నట్లు సమాచారం. ఆ మిల్లుపై ఎనలేని ప్రేమ.. ఉమ్మడి జిల్లాలో విజిలెన్స్ బృందాలు ఇటీవల వరుసగా 14కిపైగా మిల్లులను జల్లెడ పట్టి దాదాపు రూ.245.10 కోట్ల అక్రమాలను బహిర్గతం చేశాయి. నవాబుపేట తీగలపల్లిలోని శ్రీ కనకదుర్గ పారాబాయిల్డ్ రైస్‌మిల్లు, మహబూబ్‌నగర్, వనపర్తి, ఖిల్లాఘనపురం, పెబ్బేరు, కొత్తకోట, కేటీదొడ్డి తదితర ప్రాంతాల్లో నిల్వ వ్యత్యాసాలను గుర్తించి కేసులు నమోదు చేశారు. అయితే హన్వాడ మండలం ఇబ్రహీంబాద్లోని శ్రీలక్ష్మీ బాలాజీ రైస్ మిల్లులో 2022–23 రబీకి సంబంధించి రూ.11.34 కోట్ల విలువైన 5,070 మె.ట., (1,26,772 బస్తాలు) ధాన్యం పక్కదారి పట్టినట్లు విజిలెన్స్ తనిఖీల్లో తేలగా.. సదరు మిల్లు నిర్వాహకుడిపై కేసు నమోదు చేయకపోవడం గమనార్హం. దీనిపై పౌరసరఫరాల శాఖకు చెందిన ఓ అధికారిని సంప్రదిస్తే ‘కేసు చేస్తే రికవరీ చేయలేం కదా’ అని చెప్పారు. మిగతా జిల్లాల్లో కేసులు చేశారు కదా అంటే నేరుగా సమాధానమివ్వకుండా దాటవేశారు. సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: రబీ సీజన్ 2022–23లో వేలం వేసిన సీఎమ్మార్ ధాన్యంలో అక్రమాలు నివ్వెరపరుస్తున్నాయి. ఉమ్మడి పాలమూరులో రూ.వెయ్యి కోట్లకు పైగా సర్కారు పెట్టుబడిని రైస్ మిల్లర్లు పక్కా పథకం ప్రకారమే అప్పనంగా కాజేశారు. రూ.కోట్లు విలువైన సీఎమ్మార్ ధాన్యాన్ని మిల్లర్లు పక్కదారి పట్టించినట్లు విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్, జిల్లా టాస్క్‌ఫోర్స్ బృందాల తనిఖీల్లో బట్టబయలు కాగా.. ఈ బాగోతం వెనుక ఎవరెవరున్నారనే దానిపై సర్కార్ దృష్టిపెట్టింది. ఈ దందాలో సూత్రధారులు, పాత్రదారులపై రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు గుట్టుచప్పుడు కాకుండా కూపీ లాగుతుండగా.. మరిన్ని కోణాలతోపాటు విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. మామూళ్లతో కట్టిపడేసి.. 2022– 23 రబీకి సంబంధించిన ధాన్యాన్ని ఆయా జిల్లాల్లో అసోసియేషన్ పేరిట మిల్లర్లందరూ కుమ్మకై ్క ప్రభుత్వానికి తిరిగి బియ్యం ఇవ్వకుండా పెద్దఎత్తున దారి మళ్లించారు. సివిల్ సప్లయ్ శాఖలోని పలువురు అధికారులు, సిబ్బందిని మామూళ్లతో మచ్చిక చేసుకొని.. దందా సాగించినట్లు తెలుస్తోంది. ముందుగా తమకు కేటాయించిన ధాన్యంలో కొంతమేర పాడై పోయేలా చేసిన మిల్లుల నిర్వాహకులు.. త్రిముఖ వ్యూహంతో నాటకాలకు తెరలేపారు. స్థిరాస్తుల కొనుగోలు.. మిల్లు షెడ్లో వేసిన నాణ్యమైన ధాన్యాన్ని మర ఆడించగా వచ్చిన బియ్యాన్ని మిల్లర్లు యథేచ్ఛగా బహిరంగ మార్కెట్లో విక్రయించి సొమ్ము చేసుకున్నారు. కొందరు ఇతర రాష్ట్రాలకు తరలించి ఏకమొత్తంలో రూ.కోట్లు కూడగట్టారు. ఆ సొమ్ముతో కొందరు స్థిరాస్తులు కొనుగోలు చేసినట్లు అధికారులు వారి చిట్టా తీసినట్లు తెలిసింది. 2022– 23 రబీ సీఎమ్మార్‌లో మిల్లర్ల నాటకాలు అసోసియేషన్ పేరిట కుమ్మకై ్క త్రిముఖ వ్యూహం.. కావాలని కొంత మేర ధాన్యం పాడైపోయేలా చేసి తొండాట నాణ్యతది మర ఆడించి యథేచ్ఛగా మార్కెట్లో విక్రయం అప్పనంగా సొమ్ము చేసుకుని.. నష్టమంటూ దొంగ కన్నీళ్లు -
పాంపాండ్ పనులు వేగవంతం చేయాలి
ఉప్పునుంతల: గ్రామైక్య మహిళా సంఘాలకు మంజూరు చేసిన వ్యవసాయ పొలాల్లో పాంపాండ్ (నీటి నిల్వ కుంట)ల పనులు వేగవంతం చేసి నిర్ధేశించి లక్ష్యం మేరకు పూర్తిచేయాలని డీఆర్డీఓ చిన్న ఓబులేసు అన్నారు. మంగళవారం మండలంలోని అయ్యవారిపల్లిలో ఈజీఎస్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఫాంపాండ్ పనులను డీఆర్డీఓ పరిశీలించారు. మండలంలో 15 గ్రామైక్య మహిళా సంఘాలకు ఒక్కో గ్రామైక్య సంఘానికి రెండేసి చొప్పున మంజూరైన 30 ఫాంపాండ్లను త్వరితగతిన పూర్తిచేయడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఎంపీడీఓ వరుణ్‌తేజ, ఈజీఎస్ ఏపీఓ పర్వతాలు, ఐకేపీ ఏపీఎం బాలచంద్రుడుకు సూచించారు. అలాగే కూలీల సంఖ్య పెంచాలని, ఇప్పటికీ ప్రారంభించని గ్రామైక్య మహిళా సంఘాల మహిళలకు పాంపాండ్ల వలన కలిగే ప్రయోజనాలను వివరిస్తూ అవగాహన కల్పించాలని ఆదేశించారు. కార్యక్రమంలో సర్పంచు జగత్‌రెడ్డి, ఈసీ కుర్మారెడ్డి, టీఏ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. -
కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి
కందనూలు: §ólÔèæ…ÌZ MóS…{§ýl {糿¶æ$™èlÓ… {糆-糄ýS ¯éĶæ$-MýS$-ÌSOò³ MýS„ýS Ý뫨…ç³# ^èlÆý‡ÅË$ Ð]l*¯]l$-Mø-ÐéÌS° Æ>çÙ‰ GOMð ÞgŒæ, ç³Æ>Å-r-MýSÔ>Q Ð]l$…{† þç³ÍÏ MýS–Úë~-Æ>Ð]l# A¯é²Æý‡$. E™èl¢Æ>-Q…-yŠæÌZ ÌZMŠS-çÜ¿ýæ {糆-糄ýS ¯ól™èl Æ>çßæ$-ÌŒæ-V>…-«©Oò³ ´ùÎçÜ$Ë$ MóSçÜ$ ¯]lÐðl*§ýl$ ^ólĶæ$-yé°² °Æý‡-íÜçÜ*¢ HI-ïÜïÜ, sîæï³-ïÜïÜ í³Ë$ç³# Ðól$Æý‡MýS$ Ð]l$…VýSâýæ-ÐéÆý‡… ÝëĶæ$…{™èl… hÌêÏ-MóS…-{§ýl…ÌZ° GÐðl$ÃÌôæÅ M>Å…ç³# M>Æ>Å-ÌSĶæ$… ¯]l$…_ A…»ôæ-yýlPÆŠ‡ ^úÆý‡Ýë¢ Ð]lÆý‡MýS$ °Æý‡-çܯ]l Æ>ÅÎ ¡íÜ.. A¯]l…-™èlÆý‡… «§ýlÆ>² °Æý‡Ó-íßæ…-^éÆý‡$. D çÜ…§ýl-Æý‡Â…V> «§ýlÆ>²¯]l$-§ólª-Õ…_ Ð]l$…{† þç³ÍÏ Ð]l*sêÏ-yýl$™èl* ️ÌZ-MŠS-çÜ¿ýæ {糆-糄ýS ¯ól™èl Æ>çßæ$ÌŒæ-V>…-«-©Oò³ A{MýS-Ð]l$…V> ¯]lÐðl*§ýl$ ^ólíܯ]l G‹œ-I-B-ÆŠ‡¯]l$ ¯]lÐðl*§ýl$ ^ólĶæ$-yýl…Oò³ B{VýSçßæ… Ð]lÅMýS¢… ^ólÔ>Æý‡$. ÉìlÎÏÌZ HI-ïÜïÜ A«§ýlÅ-„ýS$yýl$ Ð]l$ÍÏ-M>-Æý‡$j¯]l QÆó‡Y ´ëÌŸY¯]l² çÜ¿ê Ðól¨-MýS¯]l$ "Ô¶æ$¨®' ^ólĶæ$-yýl…Oò³ ½gôæï³ §ólÔèæ…ÌZ §ýlã™èl$-ÌS¯]l$ AÐ]l-Ð]l$-¯]lç³Ç^ól Ñ«§ýl…V> ¡Æý‡$ E…§ýl-¯é²Æý‡$. Ððl…r¯ól ½gôæï³ M>Æý‡Å-MýS-Æý‡¢-ÌSOò³ GïÜÞ, GïÜt A{sêíÜsîæ MóSçÜ$Ë$ ¯]lÐðl*§ýl$ ^ólĶæ*ÌS° yìlÐ]l*…yŠæ ^ólÔ>Æý‡$. {ç³fÌS çÜÐ]l$-çÜÅ-ÌSOò³ ´ùÆ>-yýl$-™èl$¯]l² Æ>çßæ$ÌŒæ-V>…-«-©Oò³ MóSçÜ$Ë$ ¯]lÐðl*§ýl$ ^ólĶæ$yýl… ÐéÇ Açßæ…-M>-Æ>°MìS °§ýl-Æý‡Ø-¯]l-Ð]l$-¯é²Æý‡$. M>Æý‡Å-{MýS-Ð]l$…ÌZ A^èla…õ³r GÐðl$ÃÌôæÅ, yîlïÜïÜ A«§ýlÅ„ýS$yýl$ Ð]l…Ö-MýS–çÙ~, Ð]l¬°Þç³ÌŒæ O^ðlÆý‡Ã¯ŒS çÜ$¯ól…{§ýl ™èl¨™èl-Æý‡$Ë$ ´ëÌŸY-¯é²Æý‡$. -
వద్దన్నా.. వినరే!
మా పొలం వరిపంట సాగుకే అనుకూలం. అంతేకాకుండా కేఎల్ఐ కాల్వకు సాగునీరు వచ్చింది. బోర్లలో సైతం నీరు ఉన్నాయి. అందుకే వద్దన్నా వరిసాగు వేశాను. సన్నరకాలకు బోనస్ ఇస్తామని ప్రభుత్వం చెప్పడం కూడా వరిసాగుకు మొగ్గు చూపాను. పంట పండించడం సులువుగా ఉంటుంది. – బాలస్వామి, రైతు, అల్లాపూర్ ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉందని.. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వరిసాగు వద్దని, ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలని జిల్లావ్యాప్తంగా ప్రచారం చేసినా రైతులు వినడంలేదు. లక్ష్యానికి 60 శాతానికి పైగా సాగు చేశారు. ఇక ప్రభుత్వం సన్న రకాలకు బోనస్ ఇస్తామని ప్రకటించడంతో రైతులు ఎక్కువగా మొగ్గు చూపారు. – చంద్రశేఖర్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి నాగర్‌కర్నూల్: ఎల్‌నినో ప్రభావంతో ఆరంభంలో వరిసాగు విషయంలో రైతులు ఆందోళన చెందారు. అధికారులు సైతం ఆరుతడి పంటలే వేసుకోవాలని సూచించారు. వర్షాలు కురవవని, భూగర్భజలాలు తగ్గిపోతాయని హెచ్చరించారు. కాల్వ నీరు వచ్చినా పూర్తిస్థాయిలో విడదల చేయడం కష్టమేనని ఎన్నిసార్లు చెప్పినా రైతులు చివరికి వరిసాగుకే మొగ్గుచూపారు. వ్యవసాయాధికారులు మొదట్లో జిల్లావ్యాప్తంగా వానాకాలం వరిసాగు 1.90 లక్షల ఎకరాలు లక్ష్యంగా నిర్దేశించగా.. ఈసారి సగం కూడా కష్టమేనని భావించారు. తీరా రైతులు 1,30,137.30 ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారని వ్యవసాయ శాఖ లెక్కలో తేలడంతో ఆశ్చర్యపోవడం వారి వంతైంది. 68 శాతం విస్తీర్ణంలో సాగుచేయగా.. ఇందులోనూ సన్నరకాలకే రైతులు ప్రాధాన్యత ఇవ్వడం గమనార్హం. ప్రభుత్వం వాటికే రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించడంతో దొడ్డు వడ్లకు బదులు సన్నరకమే ఎక్కువగా నాటారు. 1,10,616 ఎకరాల్లో సన్నాలు సాగు చేశారని వ్యవసాయ గణాంకాల్లో తేలింది. వరిసాగుతో మొత్తం 3,86,507.78 మె.ట., దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం వానాకాలంలో ప్రభుత్వం సూచించిన 7 రకాల సన్నాలు సాగుచేస్తేనే బోనస్ వస్తుంది. రైతులు టీ–అగ్రిసీడ్స్ పోర్టల్‌లో నమోదు చేసుకుంటేనే క్వింటాకు రూ.500 బోనస్ వారి ఖాతాల్లో జమవుతుంది. అందుకు ఈ నెల 10లోగా విత్తన వివరాల నమోదు చేయాలి. విత్తనాలు విక్రయించిన డీలర్లు రైతు పేరు, మొబైల్ నంబర్‌తో పాటు, విత్తన రకం..? ఎన్ని బస్తాలు..? కంపెనీ పేరు..? లాట్, బిల్ నంబర్ తదితర వివరాలన్నింటినీ ఆన్లైన్ పోర్టల్ నమోదు చేయాల్సి ఉంటుంది. ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో తీవ్ర వర్షాబావ పరిస్థితుల నెలకొన్నా ఎగువన కురిసిన వర్షాలతో వరద శ్రీశైలం ప్రాజెక్టులోకి రావడంతో రైతుల్లో ధైర్యం వచ్చింది. కేఎల్ఐ నీరు విడుదల చేయడంతో భయపడాల్సిన అవసరం లేదని నమ్మకంతో వరిసాగుకు మొగ్గుచూపారు. దీంతో వరిసాగుపై అధికారులు అంచనాలు తలకిందులైంది. 1.90లక్షల సాగుకు మందుగా లక్ష్యంగా పెట్టుకున్నా రైతులు ఆస్థాయిలో సాగు చేయకున్నా ప్రస్తుత పరిస్థితుల్లో 1.30లక్షల ఎకరాల్లో సాగు చేయడం ఆశ్చరం. శ్రీశైలం ప్రాజెక్టులో రోజురోజుకు నీరు తగ్గిపోతుంది. దీంతో కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వార సాగు నీరు పంట చేతికొచ్చేవరకు నీరు వస్తుందా అన్న అనుమానం తలెత్తుతుంది. నీరు రాకపోతే వరిసాగు పరిస్థితి అంతా అగమ్యగోచరంగా ఉంటుంది.వరిసాగు: 1,30,137.30 ఎకరాలు దిగుబడి అంచనా: 3,86,507.78 మెట్రిక్ టన్నులు సన్నాల దిగుబడి: 3,31,850.12 మెట్రిక్ టన్నులు ఆరంభంలో వెనకాడినా.. కేఎల్ఐ నీటి విడుదలతో ప్రాధాన్యం ప్రభుత్వం ఎంత హెచ్చరించినా 68శాతం పంట శ్రీశైలంలో రోజురోజుకూ తగ్గిపోతున్న నీటిమట్టం చివరికి చేతికొస్తుందో.. లేదోనని సందిగ్ధం -
అచ్చంపేట సబ్ కలెక్టర్‌గా సలోని ఛాబ్రా
అచ్చంపేట/ లింగాల: అచ్చంపేట సబ్ కలెక్టర్ కార్యాలయం (ఆర్డీఓ) నూతన సబ్ కలెక్టర్‌గా సలోని ఛాబ్రా గురువారం బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ ఆర్డీఓగా పనిచేసిన యాదగిరి బదిలీపై హైదరాబాద్ సీసీఎల్ఏకు వెళ్లారు. హర్యానా రాష్ట్రం గుర్‌గ్రామ్‌కు చెందిన ఆమె 2024లో ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. ప్రస్తుతం ఈమెను అచ్చంపేట సబ్ కలెక్టర్‌గా నియమించారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన సబ్ కలెక్టర్‌కు అచ్చంపేట తహసీల్దార్ సైదులుతోపాటు బల్మూర్, లింగాల, అమ్రాబాద్, ఉప్పునుంతల, పదర మండలాల తహసీల్దార్లు ఘనంగా సన్మానించి.. అభినందనలు తెలిపారు. చెంచుల ఇళ్ల స్థలాల పరిశీలన లింగాల మండలంలోని చెన్నంపల్లిలో చెంచులకు ఇచ్చిన ఇళ్ల స్థలాల భూమి వివాదాస్పదంగా మారడంతో సబ్ కలెక్టర్ సలోని ఛాబ్రా పరిశీలించారు. జిల్లాకేంద్రంలో జరిగిన ప్రజావాణిలో ఎర్రపెంట, చెన్నంపల్లి చెంచులు ఈ భూమిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు సబ్ కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. 2005లో సర్వే నం.436లో 4 ఎకరాల భూమిలో ఎర్రపెంట, చెన్నంపల్లికి చెందిన 72 మంది చెంచులకు ఇళ్ల స్థలాలు కేటాయించగా.. వారు పూర్తిస్థాయిలో నిర్మించుకోలేదు. దీంతో కాలానుగుణంగా స్థలం ఆక్రమణకు గురికావడం, కొందరు చెంచుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని కొనుగోలు చేశారు. ఈ మేరకు చెంచులతో వివరాలు తెలుసుకున్న సబ్ కలెక్టర్ నివేదికను కలెక్టర్‌కు అందజేస్తానని, చెంచులకు న్యాయం చేసేలా చూస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో తహసీల్దార్ వెంకటేష్, ఆర్ఐ ఇందిర, సర్పంచులు శ్రీశైలం, లలిత, నాయకులు గోవింద్, చిరంజీవి, చెంచులు పాల్గొన్నారు. -
వేటు.. దారెటు!
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: రాష్ట్ర కాంగ్రెస్‌లో తీవ్ర దుమారం రేపిన ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జిల్లెల చిన్నారెడ్డి ఎపిసోడ్‌పై ఎట్టకేలకు ఉత్కంఠ వీడింది. పార్టీ అధిష్టాన నిర్ణయం మేరకు ఆయనపై వేటు పడింది. ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్ష పదవి నుంచి చిన్నారెడ్డిని తప్పిస్తూ.. ఆయన స్థానంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ గద్వాల విజయలక్ష్మిని నియమిస్తున్నట్లు ప్రభుత్వ ప్రకటన సైతం వెలువడింది. గాంధీ కుటుంబానికి విధేయుడిగా, కరుడుగట్టిన కాంగ్రెస్ వాదిగా పేరున్న సీనియర్ నేతపై ఊహించని చర్యలు ఉమ్మడి పాలమూరు జిల్లాలో కలకలం సృష్టిస్తుండగా.. ఆయన దారెటు అనేది హాట్‌టాపిక్‌గా మారింది. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం.. చిన్నారెడ్డి 1980 నుంచి 1983 వరకు ఏపీ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1985లో వనపర్తి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలైనప్పటికీ 1989 ఎన్నికల్లో తిరిగి అదే నియోజకవర్గం నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1999–2004, 2004–2009, 2014–2018 కాలంలో ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో 2007 నుంచి 2009 వరకు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా సేవలందించారు. 2018లో వనపర్తి నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి ఓటమి పాలయ్యారు. 2021లో హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. టికెట్ చేజారడం నుంచి మొదలు.. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో వనపర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా చిన్నారెడ్డి పేరును కాంగ్రెస్ అధిష్టానం మొదట ప్రకటించింది. ఆ తర్వాత బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన మేఘారెడ్డికి టికెట్ కేటాయించడంతో చిన్నారెడ్డి పోటీ నుంచి విరమించుకున్నాడు. ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా మేఘారెడ్డి గెలుపొందగా.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు 2024లో చిన్నారెడ్డికి రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా నియమిస్తూ ప్రభుత్వం కేబినెట్ హోదా కల్పించింది. అయితే టికెట్ వచ్చినట్లే వచ్చి చేజారడంతో మనస్థాపానికి గురైన ఆయన పలుమార్లు అసహనం వ్యక్తం చేస్తూ వచ్చారు. అనివార్యత పరిస్థితుల్లోనేనా.. సీఎం రేవంత్‌రెడ్డిపై మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మితాపటేల్ చేసిన వ్యాఖ్యలు.. ఆ తర్వాత కొండా సురేఖ సైతం విమర్శలు గుప్పించడం రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్‌లో తీవ్ర దుమారం చెలరేగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆమైపె వేటు వేసే క్రమంలో చిన్నారెడ్డిపై చర్యలు తీసుకోవాల్సిన అనివార్యత ఏర్పడిందని కాంగ్రెస్‌తో పాటు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. చిన్నారెడ్డి వర్గీయుల్లో అయోమయం ప్రణాళిక సంఘం ఉపాధ్యక్ష పదవి నుంచి చిన్నారెడ్డిని తప్పించిన క్రమంలో ఆయన అనుచర వర్గంలో నిరాశ అలుముకుంది. ఆయన మాట్లాడింది పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలు కావని, దశాబ్దాలుగా జెండా మోసిన పాత కార్యకర్తల ఆవేదననే వెళ్లగక్కా రని వారు చెబుతున్నారు. 48ఏళ్ల క్రమశిక్షణకు పార్టీ ఇచ్చిన బహుమతి ఇదేనా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత రాజకీయ పరిణామాల క్రమంలో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు.. తమ భవిష్యత్ ఎలా ఉంటుందోననే ఆందోళన, అ యోమయం వారిలో నెలకొన్నట్లు తెలుస్తోంది. ముదిరిన విభేదాలు.. వనపర్తి నియోజకవర్గంలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల క్రమంలో మేఘారెడ్డి, చిన్నారెడ్డి మధ్య దూరం పెరుగుతూనే వచ్చింది. అటు ప్రభుత్వ, ఇటు పార్టీ పరంగా తనకు ప్రాధాన్యం దక్కడం లేదని పలుమార్లు చిన్నారెడ్డి అసంతృప్తి వెళ్లగక్కారు. కేబినెట్ హోదాలో తనకు కేటాయించిన గన్మెన్లు, ప్రభుత్వ వాహనాన్ని ఉపసంహరించుకున్నారు. తన అనుచరులను ఎమ్మెల్యే మేఘారెడ్డి ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు. మేఘారెడ్డి సైతం ఆయనపై ప్రతి విమర్శలు చేయడం.. ఇలా ఇద్దరి మధ్య క్రమక్రమంగా విభేదాలు మరింత ముదిరాయి. ఘాటు విమర్శలతో.. ఇటీవల గోపాల్‌పేటలో పార్టీ కార్యాలయ ప్రారంభం సందర్భంగా చిన్నారెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలు పార్టీలో తీవ్ర దుమారం రేపాయి. పార్టీలో చాలా తప్పులు జరుగుతున్నాయని, వాటిని భరిస్తూ వస్తున్నానని, లేకుంటే తాను మరో జీవన్‌రెడ్డిని అయ్యేవాడినని వ్యాఖ్యానించారు. సోనియాగాంధీ తనకు సీటు ఇచ్చినా ఇక్కడ డబ్బులకు లొంగి తనకు సీటు ఇవ్వకుండా అన్యాయం చేశారని ఆరోపించారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో అన్ని అనుభవించిన వారు ఇప్పుడు పార్టీలోకి వచ్చి మళ్లీ తనను అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 48 ఏళ్లు కాంగ్రెస్ కోసం కష్టపడి పనిచేశానన్నారు. ఈ వ్యాఖ్యలు నియోజవర్గంలోనే కాకుండా రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా చిన్నారెడ్డి తొలగింపు సీనియర్ నేతపై కాంగ్రెస్ అధిష్టానం ఊహించని చర్యలు ఉమ్మడి పాలమూరువ్యాప్తంగాహస్తం శ్రేణుల్లో కలకలం భవిష్యత్‌పై జిల్లెల అనుచరుల్లో అయోమయం -
నేడు మద్దూరులో సీఎం పర్యటన
● పలు అభివృద్ధి పనుల పరిశీలన ● ఏర్పాట్లను పర్యవేక్షించిన కలెక్టర్, ఎస్పీ నారాయణపేట/కోస్గి/కొత్తపల్లి: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుక్రవారం మద్దూర్ పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని నారాయణపేట కలెక్టర్ సీహెచ్ ప్రియాంక అధికారులను ఆదేశించారు. గురువారం మద్దూరు పోలీస్‌స్టేషన్‌లో నిర్వహించిన ఏఎస్ఎల్ సమావేశంలో ఆమె మాట్లాడారు. హెలిప్యాడ్ నుంచి సీఎం పర్యటించే మార్గంలో రహదారులు, పారిశుద్ధ్యం, విద్యుత్, వైద్యం, అగ్నిమాపక, బ్యారికేడింగ్ ఏర్పాట్లు పూర్తిచేయాలని సూచించారు. సీఎం రూట్లో రహదారి మరమ్మతులు వెంటనే పూర్తి చేయాలని, జనసందోహం, ట్రాఫిక్ నియంత్రణకు ముందస్తు చర్యలు చేపట్టాలని పోలీసులను ఆదేశించారు. అత్యవసర వైద్య సేవలు, తాగునీరు, ఆహార ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. సీఎం వాహనం వద్దకు ఎవరూ రాకూడదు సీఎం వాహనం సమీపానికి ప్రజలు, నాయకులు, ప్రజాప్రతినిధులు రాకుండా కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని ఎస్పీ డాక్టర్ వినీత్ ఆదేశించారు. యాక్సెస్ కంట్రోల్, ట్రాఫిక్ నియంత్రణను పటిష్టంగా అమలు చేయాలని సూచించారు. అంతకుముందు నారాయణపేట కలెక్టర్, ఎస్పీ మద్దూర్ సమీపంలోని హెలిప్యాడ్, డిగ్రీ కళాశాల, గురుకుల బాలికల పాఠశాల/కళాశాల భవన నిర్మాణ ప్రాంతాలను పరిశీలించారు. -
వణికిస్తున్న విషజ్వరాలు
అచ్చంపేట: జిల్లాలో మారిన వాతావరణ పరిస్థితులతో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. దీనికితోడు పల్లెలు, పట్టణాల్లో పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారి.. ఎక్కడికక్కడ మురుగు నిలిచి.. ఈగలు, దోమలు అధికమై జనాన్ని ఆస్పత్రుల బాట పట్టిస్తున్నాయి. దాదాపు ప్రతి ఇంటా ఒకరిద్దరు దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతున్నారు. ఇది పెద్ద ప్రమాదమేమి కానప్పటికీ నిర్లక్ష్యం చేస్తే ఆస్పత్రుల పాలయ్యే పరిస్థితి ఉంది. ప్రస్తుతం జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఓపీ ఎక్కువగా.. ఐపీ తక్కువగా ఉంటోంది. మందులతోనే పరిస్థితి అదుపులోకి వస్తుందని, నిర్లక్ష్యం చేసిన వారు ఇన్‌పేషెంట్‌గా చికిత్స పొందుతున్నారని వైద్యులు చెబుతున్నారు. వారం, పదిరోజులపాటు.. జలుబు, దగ్గుతో మొదలై వైరల్ ఫీవర్లుగా మారుతున్నాయి. సాధారంగా బాధితులకు తీవ్రమైన జ్వరంతోపాటు నొప్పులు, అలసట, బ్లడ్ ప్లేట్స్ తగ్గిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వారం, పది రోజులకు కానీ ఆరోగ్యం కుదుటపడటం లేదు. అయితే సరైన నిర్ధారణ లేకుండా చికిత్స తీసుకోవడం ప్రాణాలకే ప్రమాదకరం. కానీ, పల్లెలు, పట్టణాల్లో మాత్రం కొందరు ఆర్ఎంపీలు అర్హతకు మించి డెంగీ బాధితులకు వైద్యం అందిస్తున్నారు. డెంగీకి నిర్ధిష్టమైన యాంటీ వైరల్ ఔషధం లేదు. ఆర్ఎంపీలు మాత్రం అధిక డోస్ యాంటీ బయోటిక్స్ వినియోగిస్తున్నారు. నాగర్‌కర్నూల్ జనరల్ ఆస్పత్రి సహా జిల్లాలోని సీహెచ్‌సీలు, పీహెచ్‌సీలు బాధితులతో కిటకిటలాడుతున్నాయి. వైరల్ ఫీవర్లతో ఆస్పత్రులకు వస్తున్న వారి సంఖ్య అధికంగా ఉంటోంది. వైరల్ ఫీవర్, ఫ్లూ, శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల కేసులూ నమోదవుతున్నాయి. ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీ గ్రామీణ ప్రాంతాల్లో పెరుగుతున్న జ్వర పీడితులు ఎక్కువగా స్థానిక వైద్యుల వద్దే చికిత్స పొందుతున్నారు. డెంగీ, మలేరియా వంటి జ్వరాలు నిర్ధారణ కావడం లేదు. ఎలాంటి అనుమతులు లేని ల్యాబ్‌లు ఏర్పాటు చేసి టైఫాయిడ్, మలేరియా, డెంగీ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. క్లినిక్‌లు, మెడికల్ దుకాణాల్లో బెడ్లు ఏర్పాటు చేసి రోగులకు ప్రమాదరకరమైన యాంటీ బయాటిక్ ఇంజెక్షన్, సైలెన్లు ఎక్కిస్తూ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్తే నిర్వాహకులు అందిన కాడికి దండుకుంటున్నారు. రక్త పరీక్షలతోపాటు స్కానింగ్‌ల పేరిట రూ.వేలల్లో వసూలు చేస్తున్నారు. రక్తకణాలు కాస్త తక్కువగా ఉన్నా.. అడ్మిట్ కావాలని సూచిస్తూ.. మూడు, నాలుగైదు రోజులు చికిత్స అందించి రూ.20–30 వేలకు పైగా బిల్లు వేస్తున్నారు. జ్వరం వచ్చిందని ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లిన వ్యక్తికి రోజుకు రూ.2–4 వేలకు పైగానే ఖర్చు అవుతుండగా.. ఇందులో మందులు అదనం. ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీని అడ్డుకోవాలని ప్రజలు కోరుతుండగా.. వైద్య, ఆరోగ్యశాఖ అధికారుల చర్యలు శూన్యంగా ఉన్నాయి. అర్హతకు మించి వైద్యం చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. అధిష్టానానికి ఫిర్యాదుతో.. చిన్నారెడ్డి వ్యాఖ్యలను మేఘారెడ్డి ఖండించడంతోపాటు తాను డబ్బులు ఎవరికిచ్చి సీటు తెచ్చుకున్నానో చెప్పాలని డిమాండ్ చేశారు. అంతేకాదు.. దీనిపై టీపీసీసీ, క్రమశిక్షణ కమిటీ, సీఎం, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి, ఏఐసీసీకి ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. క్రమశిక్షణ కమిటీ సైతం చర్యలకు సిఫార్సు చేయడం.. సీరియస్‌గా పరిగణించిన పార్టీ అధిష్టానం సుమారు రెండు రోజులుగా ముఖ్య నేతలతో చర్చించి చిన్నారెడ్డిపై క్రమశిక్షణ చర్యలకు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎం ఆదేశాలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గురువారం ప్రణాళిక సంఘం ఉపాధ్యక్ష పదవి నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జలుబు, దగ్గు, గొంతునొప్పి, జ్వరంతో ఇబ్బందులు ఓపీలో పెరుగుతున్న రోగులు.. కిటకిటలాడుతున్న ఆస్పత్రులు టెస్టుల పేరుతో దండుకుంటున్న ప్రైవేటు ఆస్పత్రుల నిర్వాహకులు మరోవైపు స్థాయికి మించి వైద్యంతో ఆర్ఎంపీల చెలగాటం వైరల్ ఫీవర్లను నిర్లక్ష్యం చేయొద్దు. జ్వరం ముదిరితే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయ్యి.. ఇతర వ్యాధులకు దారి తీసి ప్రాణాంతకం కావొచ్చు. పిల్లల్లో ఈ స్థితి మరింత ప్రమాదకరం. సొంత వైద్యాలకు స్వస్తి చెప్పి.. వైద్యుల పర్యవేక్షణలోనే చికిత్స చేయించుకోవాలి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో నిష్ణాతులైన వైద్యుల ద్వారా వైరల్ ఫీవర్లకు నాణ్యమైన చికిత్స అందిస్తున్నాం. 24 గంటలపాటు వైద్యులు, ఓపీ, ఐపీ, మందులు అందుబాటులో ఉన్నాయి. – డాక్టర్ అమ్రీన్, సివిల్ అసిస్టెట్ సర్జన్, అచ్చంపేట -
ఎట్టకేలకు విచారణ!
నాగర్‌కర్నూలు/అచ్చంపేట: జిల్లాకేంద్రమైన నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీలో జరిగిన అవినీతి, అక్రమాలపై సమగ్ర విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. పురపాలికలో ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలకు సంబంధించిన నిధుల గోల్‌మాల్‌పై గతంలోనే ‘సాక్షి’లో ప్రత్యేక కథనం ప్రచురితమయ్యాయి. ఎట్టకేలకు ప్రభుత్వం విచారణకు ఆదేశించడంతో ‘సాక్షి’ కథనానికి మరింత బలం చేకూరింది. అయితే మున్సిపాలిటీలో జరిగిన అక్రమాల్లో ఎవరి ప్రమేయం ఎంత ఉందనే దానిపై అప్పట్లో సీడీఎంఏకు నివేదిక పంపించారు. బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా.. అప్పటి నుంచి దాచి ఉంచిన నివేదికను ప్రస్తుతం బయటకు తీయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 2021 జనవరి నుంచి 2024 నవంబర్ వరకు మున్సిపాలిటీలో పనిచేసిన ఔట్సోర్సింగ్ సిబ్బంది నెలవారీ వేతనాల చెల్లింపుల్లో సుమారు రూ.1,26,51,946 మేర దుర్వినియోగం చేసినట్లు వెల్లడైంది. అయితే నిధుల గోల్‌మాల్‌లో మున్సిపల్ మాజీ కమిషనర్ బి.నరేశ్‌బాబుతో పాటు మొత్తం 8 మంది అధికారులపై శాఖాపరమైన విచారణ చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే మున్సిపాలిటీలో నిధులు పక్కదారి పట్టిన విషయంలో 8మంది అధికారుల హస్తం ఉన్నట్లు రెండేళ్ల క్రితమే వెలుగు చూసింది. 2021 నుంచి 2024 మధ్యకాలంలో ఇక్కడ పనిచేసిన మున్సిపల్ కమిషనర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, ఇతర ఉద్యోగుల ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు. అప్పట్లో సమగ్ర విచారణ జరపకపోవడం.. ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ప్రస్తుతం ప్రభుత్వ ఆదేశాల మేరకు విచారణ చేపట్టి, బాధ్యులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో బి.నరేశ్‌బాబు (అప్పటి మున్సిపల్ కమిషనర్ (ప్రస్తుతం దేవరకద్ర మున్సిపల్ కమిషనర్) డి.శ్రీలత అప్పటి మాజీ జేఏవో (ప్రస్తుతం మల్కాజిగిరి జోనల్ ఆఫీస్ ఫైనాన్షియల్ అడ్వైజర్) జి.అన్వేష్ అప్పటి మున్సిపల్ కమిషనర్ (ప్రస్తుతం మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్) జి.యాదయ్య అప్పటి మున్సిపల్ కమిషనర్ (ఎఫ్ఏసీ) (ప్రస్తుతం కోస్గి మున్సిపల్ మేనేజర్) కె.జయంత్‌కుమార్‌రెడ్డి అప్పటి మున్సిపల్ కమిషనర్ (ప్రస్తుతం స్వచ్ఛంద పదవీ విరమణ పొందారు) ఎండీ అబ్దుల్ సలాం అప్పటి మేనేజర్ (ప్రస్తుతం ఎల్లంపేట మున్సిపాలిటీలో పనిచేస్తున్నారు) డి.మురళి అప్పటి శానిటరీ ఇన్స్పెక్టర్, (ప్రస్తుతం అచ్చంపేట మున్సిపల్ కమిషనర్‌గా పనిచేస్తున్నారు) కె.రాములు అప్పటి జూనియర్ అసిస్టెంట్ (పదవీ విరమణ పొందారు) వీరిలో ప్రధానంగా శానిటరీ ఇన్స్పెక్టర్, ఎఫ్ఏసీ కమిషన్ (మేనేజర్) ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. విచారణకు సంబంధించి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్శాఖ మూడు జీవోలను విడుదల చేసింది. గత జూలై 31న వెల్లువడిన జీవో నం. 742 ప్రకారం ఉమ్మడి విచారణ ద్వారా ఈ కేసులో ప్రమేయం ఉన్న మొత్తం 8 మంది ఉద్యోగులపై తెలంగాణ సివిల్ సర్వీసెస్ (సీసీఏ) నిబంధనల ప్రకారం 1991 రూల్ 24 కింద ఉమ్మడి శాఖాపరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించింది. ఈ వ్యవహారంలో ప్రభుత్వమే క్రమశిక్షణా అధికారిగా వ్యవహరిస్తుందని.. నిబంధనల ప్రకారం జరిమానాలు విధించే అధికారాన్ని కలిగి ఉంటుందని పేర్కొంది. ఇక గత జూలై 31న రెండో జీవో 743 ప్రకారం ఈ కేసులో నిబంధన 20 ప్రకారం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అడిషనల్ కమిషనర్ ఎ.మారుతి ప్రసాద్ విచారణాధికారిగా నియమించారు. ఆయన నెలరోజుల్లో నివేదిక ఇవ్వకపోవడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందని పేర్కొన్నారు. అదే రోజు మూడో జీవో 744 ప్రకారం క్రమశిక్షణ అధికారి తరఫున అభియోగాలను విచారణాధికారి ముందు ఉంచడానికి ప్రస్తుత నాగర్‌కర్నూల్ మున్సిపల్ కమిషనర్‌ను ప్రెజెంటింగ్ ఆఫీసర్‌గా నియమించారు. ఈ విషయంపై ప్రస్తుత కమిషనర్‌ను ఫోన్లో వివరణ కోరేందుకు ప్రయత్నించగా.. అందుబాటులోకి రాలేదు. నిధుల దుర్వినియోగంలో పాత్ర ఉందని భావిస్తున్న అప్పటి జూనియర్ అసిస్టెంట్ కె.రాములు రిటైర్డ్మెంట్ తర్వాత బెనిఫిట్స్ నిలిచిపోవడంతో హైకోర్టును ఆశ్రయించినట్లు తెలిసింది. ఎందుకు బెనిఫిట్స్ నిలపుదల చేశారో వివరణ ఇవ్వాలని హైకోర్టు సీడీఎంఏను కోరడంతో.. నిధుల గోల్మాల్ అంశం తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులు సిద్ధమయ్యారు. ఔట్సోర్సింగ్ సిబ్బంది వేతనాల్లో చేతివాటం సమగ్ర విచారణకు ఆదేశించిన ప్రభుత్వం 8మంది అధికారులపై ఆరోపణలు -
రాజ‘కీ’యం.. రసవత్తరం!
● సీనియర్ నేత చిన్నారెడ్డి ఎపిసోడ్‌పై కొనసాగుతున్న ఉత్కంఠ ● వెయ్యి రోజుల పాలనపై పార్టీల పోటాపోటీ కార్యక్రమాలు ● చేసిన అభివృద్ధి, సంక్షేమంపై కాంగ్రెస్ నేతల ప్రెస్మీట్లు ● పలు ప్రాంతాల్లో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ● దగా పాలన అంటూ రోడ్డెక్కిన బీఆర్ఎస్ నేతలు ● ఆసక్తి రేపుతున్న సీఎం రేవంత్‌రెడ్డి మద్దూరు పర్యటన సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఒకవైపు అధికార కాంగ్రెస్‌లో అంతర్గత పరిణామాలు, మరోవైపు వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంలో ఊపందుకున్న పోటాపోటీ రాజకీయాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ప్రజాపాలన పేరుతో కాంగ్రెస్ సంబరాలకు సిద్ధమవుతుంటే.. దగా పాలన అంటూ ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ ఆందోళన బాట పట్టింది. వారం రోజుల ఆందోళనలో భాగంగా తొలి రోజు బుధవారం ఆ పార్టీ నేతలు రోడ్డెక్కారు. ఈ రాజకీయ వేడి రాజుకున్న క్రమంలో ఈ నెల నాలుగో తేదీన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నారాయణపేట జిల్లా మద్దూరు మండల పర్యటన ఖరారు కావడం పాలమూరు వ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది. కలవని చేతులతో.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని జిల్లాల్లోని ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, నేతలు పలు ప్రాంతాల్లో ప్రెస్మీట్లు పెట్టి తమ ప్రభుత్వ పాలనలో చేసిన అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. మహబూబ్‌నగర్‌లో ఎమ్మెల్యే శ్రీనివాస్‌రెడ్డి అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ పనులకు శంకుస్థాపన చేశారు. వనపర్తి జిల్లాలో ఎమ్మెల్యే మేఘారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు శివసేనారెడ్డిలు విలేకరుల సమావేశం నిర్వహించి అభివృద్ధిని వివరించడంతో పాటు ఖిల్లాఘనపురం మండలంలో బైక్‌ర్యాలీ నిర్వహించారు. అయితే మిగతా జిల్లాల్లో వెయ్యి రోజుల పాలనపై కాంగ్రెస్ శ్రేణులు సంబరాలకు దూరంగా ఉన్నాయి. ఇందుకు డీసీసీ నేతలు, పార్టీకి చెందిన ముఖ్య ప్రజాప్రతినిధుల మధ్య అంతర్గత విభేదాలే కారణమనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. బీఆర్ఎస్ దూకుడు మంత్రంతో.. కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనను లక్ష్యంగా చేసుకుని ప్రతిపక్ష బీఆర్ఎస్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. ప్రజా పాలన కాదు.. ఇది దగా పాలన అంటూ వారం రోజుల పాటు ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు తొలిరోజు బుధవారం ఉమ్మడి పాలమూరులోని ఐదు జిల్లాకేంద్రాలతో పాటు పలు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున రోడ్డెక్కి ధర్నాలు, నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఇచ్చిన గ్యారెంటీలు, రైతులకు చేసిన వాగ్దానాలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని నేతలు భగ్గుమన్నారు. వారం పాటు ఆందోళన కార్యక్రమాలను విజయవంతంగా చేపట్టి.. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేలా దూకుడుగా వ్యవహరించాలని మండలాల వారీగా నాయకులు, అనుచరులతో భేటీ అయిన సందర్భంలో ముఖ్య నేతలు పిలుపునిచ్చినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాటలు, బీఆర్ఎస్ నిరసనల నడుమ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత జిల్లాలో పర్యటించనుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నెల నాలుగో తేదీన నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలో జరిగే పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు ఆయన హాజరుకానున్నారు. గిరిజన గురుకుల భవనాలు, డిగ్రీ కళాశాల, ఇతర మౌలిక వసతుల పనులను పర్యవేక్షించిన తర్వాత నిర్వహించే బహిరంగసభ ద్వారా ప్రతిపక్షాల ఆరోపణలకు ఎలాంటి సమాధానమిస్తారనేది ఆసక్తికరంగా మారింది. వనపర్తికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జిల్లెల చిన్నారెడ్డి ఎపిసోడ్‌పై ఉత్కంఠ కొనసాగుతోంది. 2023 ఎన్నికల సమయంలో మేఘారెడ్డి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌కు రావడం.. తొలుత చిన్నారెడ్డికి వనపర్తి టికెట్ కేటాయించిన కాంగ్రెస్, ఆ తర్వాత మేఘారెడ్డికి ఇవ్వడం ఇరువురి మధ్య విభేదాలకు దారితీసింది. అయితే చిన్నారెడ్డి గోపాల్పేట వేదిక చేసిన వ్యాఖ్యలు దుమారం రేపగా.. సీరియస్‌గా పరిగణించిన ఎమ్మెల్యే మేఘారెడ్డి ఆయనపై భగ్గుమన్నారు. చిన్నారెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని గాంధీభవన్, టీపీసీసీతోపాటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. పార్టీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సైతం ఆయనపై చర్యలు తీసుకోవాలని అధిష్టానానికి సిఫార్సు చేయగా.. పెండింగ్‌లోనే ఉంది. ప్రస్తుతం ఢిల్లీలో మంత్రి సురేఖ ఎపిసోడ్ నడుస్తుండగా.. ఆ తర్వాత చిన్నారెడ్డిని ఢిల్లీకి పిలవనున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆయనపై చర్యలకు సంబంధించి రాజకీయ వర్గాల్లో విభిన్న వాదనలు నడుస్తున్నాయి. -
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడి
కందనూలు: ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. విద్యార్థులు కార్యాలయం ఎదుట బైఠాయించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఏబీవీపీ జిల్లా కార్యదర్శి శాంతన్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఫీజు బకాయిలను విడుదల చేయకపోవడంతో పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వేలాది విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందన్నారు. ఫీజు బకాయిల పేరుతో కొన్ని కళాశాలల్లో విద్యార్థులు, వారి తల్లిదండ్రులపై ఒత్తిడి పెంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యార్థులకు పెండింగ్‌లో ఉన్న ఫీజు బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనిచో ప్రజాస్వామ్య పద్ధతిలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బంగారు బాబు, నగర కార్యదర్శి ప్రసాద్ కుమార్, సంయుక్త కార్యదర్శి శివ, తిమ్మాజిపేట మండల కన్వీనర్ వెంకటేశ్, మల్లేష్, జీవన్, మార్కండేయ, జగన్, జ్ఞానేశ్వర్, లోకేష్, కీర్తన, కృష్ణవేణి పాల్గొన్నారు. -
వైఎస్సార్ సేవలు చిరస్మరణీయం
కందనూలు: బడుగు బలహీన వర్గాలు, రైతుల సంక్షేమం కోసం దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అందించిన సేవలు చిరస్మరణీయమని ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డి అన్నారు. బుధవారం వైఎస్సాఆర్ వర్ధంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమమే పరమావధిగా పరిపాలన చేసి.. ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తాగు, సాగునీటి కొరత తీర్చిన ఘనత మహానేతకే దక్కుతుందని కొనియాడారు. వైఎస్సార్ తీసుకున్న చారిత్రక నిర్ణయాలు చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
ప్రజలకు జవాబుదారీగా పనిచేయాలి
అచ్చంపేట రూరల్: అధికారులు ప్రజలకు జవాబుదారీగా పనిచేయాలని అచ్చంపేట ఎమ్మెల్యే డా.చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. బుధవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పలు శాఖల అధికారులతో వేర్వేరుగా నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. అన్ని శాఖల అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటూ.. అర్హులైన వారికి సంక్షేమ ఫలాలు అందించాలన్నారు. గ్రామీణ స్థాయిలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని అన్నారు. ముఖ్యంగా రైతుల సంక్షేమం, సాగునీటి నిర్వహణ, ప్రభుత్వ పథకాల అమలుపై నిర్లక్ష్యం చేయొద్దన్నారు. ఎల్‌నినో కారణంగా నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితులు, సాగునీటి కొరతను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఎల్‌నినో ప్రభావంపై రైతులకు ముందస్తు అవగాహన కల్పించడంతో పాటు వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించాలని ఎమ్మెల్యే సూచించారు. -
ఆరు గ్యారంటీల పేరుతో మోసం చేసిన కాంగ్రెస్
కందనూలు: కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేసిందని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి ఆరోపించారు. బుధవారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక గాంధీజీ విగ్రహం నుంచి అంబేడ్కర్ చౌరస్తా వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం నిర్వహించిన ధర్నానుద్దేశించి ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అబద్దపు హామీలతో ప్రజలను నమ్మించి.. అధోగతి పాలుజేసిందన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజల సంక్షేమాన్ని పక్కనపెట్టి, ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తున్నారని ఆరోపించారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించి, కొట్లాట పెట్టారని.. మిగతా ఏ ఒక్క గ్యారంటీని కూడా సక్రమంగా అమలుచేసిన పాపాన పోవడం లేదని దుయ్యబట్టారు. రైతుభరోసా రూ. 15వేలు, చేయూత పింఛన్ పెంపు ఏమైందని ఆయన ప్రశ్నించారు. కృష్ణా, గోదావరి నదుల నుంచి ఏపీ ప్రభుత్వం నీటిని తరలిస్తుండగా.. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నీటిని ఎత్తిపోయడానికి ఎందుకు నిర్లక్ష్యం చేస్తుందన్నారు. రైతులకు సాగునీరు అందిస్తే ఎరువులు అడుగుతారని.. ఆ తర్వాత పంట మద్ధతు ధరకు కొనకపోతే బీఆర్ఎస్ వారు ధర్నాలు చేస్తారని.. పండించిన పంటకు బోనస్ ఇవ్వాల్సి ఉంటుందని ఉద్దేశపూర్వకంగానే సాగునీరు ఇవ్వడం లేదని ఆరోపించారు. ఆటో కార్మికులకు సైతం ప్రతినెలా రూ. 2వేలు ఇస్తామని చెప్పి మోసం చేశారని విమర్శించారు. 33 నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసం చేసిందేమీ లేదన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. -
సంచార జాతుల అభ్యున్నతికి కృషి
కందనూలు: సంచార జాతుల అభ్యున్నతికి ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా అధికారులు కృషి చేయాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ సూచించారు. సంచార జాతుల విముక్తి దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చెన్నయ్యతో కలిసి ఆయన మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. సంచార జాతుల చరిత్ర, వారు ఎదుర్కొన్న సామాజిక పరిస్థితులను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో వివిధ కారణాలతో సామాజికంగా వెనుకబడిన ఈ వర్గాల అభ్యున్నతికి ప్రత్యేక శ్రద్ధ అవసరమని కలెక్టర్ పేర్కొన్నారు. ముఖ్యంగా విద్యకు ప్రాధాన్యత కల్పించడం ద్వారా వారి పిల్లలకు మెరుగైన భవిష్యత్ అందించవచ్చన్నారు. యువతకు నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు ఆర్థిక స్వావలంబన సాధించేలా ప్రోత్సహించాలని సూచించారు. సంచార జాతుల ప్రతినిధులు, కుల సంఘాల నాయకులు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొస్తే.. వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపడతామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ సహాయ అధికారి శ్రీరాములు పాల్గొన్నారు. ఫిర్యాదుల పరిష్కారానికి సత్వర చర్యలు.. ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులు, వినతులను సంబంధిత అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి.. సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి 64 ఆర్జీలు స్వీకరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు చెన్నయ్య, దేవ సహాయం, డీఆర్వో పాండు, కలెక్టరేట్ ఏఓ చంద్రశేఖర్ పాల్గొన్నారు. -
ఉద్యోగుల పోరుబాట
కందనూలు: ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులు పోరుబాట పట్టారు. తమ హక్కుల సాధన, సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కొన్ని రోజులుగా ఆందోళనలు చేపడుతున్నారు. అందులో భాగంగా నాలుగు రోజుల క్రితం కలెక్టరేట్ వద్ద జిల్లా ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో మహాధర్నా చేపట్టారు. అయినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడంతో మంగళవారం పీఆర్టీయూ టీఎస్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో మహాధర్నా నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఎన్నికలకు మందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఉద్యోగ సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. తమ న్యాయమైన డిమాండ్లు నెరవేరేవరకు దశల వారీగా ఆందోళనలు నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించారు. జిల్లాలో గెజిటెడ్, నాన్ గెజిటెడ్ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లుసమస్యల పరిష్కారం కోసం పలు దఫాలుగా ఆందోళన ఉద్యోగ, ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని విజ్ఞప్తి నేడు పీఆర్టీయూ టీఎస్ ఆధ్వర్యంలో మహాధర్నా సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం ఆగదంటున్న ఉద్యోగులు ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న ఆరు డీఏలను విడుదల చేయాలి. పెన్షనర్లు, ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సంబంధించిన ఎంప్లాయిమెంట్ ఈహెచ్ఎస్ను సమర్థవంతంగా అమలు చేయాలి. సీపీఎస్‌ను రద్దుచేసి, ఓపీఎస్‌ను పునరుద్ధరించాలి. రెండవ పీఆర్సీని తక్షణమే అమలు చేయాలి. పెండింగ్‌లో ఉన్న అన్ని బిల్లులను క్లియర్ చేసేందుకు ప్రతినెలా రూ. 2వేల కోట్లు విడుదల చేసి, ఉద్యోగుల బకాయిలను త్వరగా చెల్లించాలి. రాష్ట్ర జేఏసీ పిలుపుమేరకు.. ఇటీవల పలుమార్లు ఉద్యోగుల సమస్యలపై రాష్ట్ర జేఏసీ బాధ్యులు సీఎం, డిప్యూటి సీఎంతో చర్చలు జరిపారు. అయినా ఫలితం లేకపోవడం, స్పష్టమైన హామీలు రాకపోవడంతో ప్రత్యక్ష ఆందోళనకు దిగారు. అందులో భాగంగా పలు దఫాలుగా నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. 4,625 -
రైల్వే హబ్‌గా తీర్చిదిద్దుతాం
● గద్వాలలో రూ.66కోట్లతో మరో ఓఆర్బీ నిర్మాణం ● జోగుళాంబ హాల్ట్‌లో రూ.45కోట్లతో హైలెవల్ బ్రిడ్జి ● కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి కిషన్‌రెడ్డి గద్వాల/ఉండవెల్లి/అలంపూర్ రూరల్: జోగుళాంబ గద్వాల జిల్లాను రైల్వే హబ్‌గా తీర్చిదిద్దుతున్నట్లు కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. సోమవారం గద్వాల రైల్వేస్టేషన్లో చేపట్టిన వివిధ రకాల అభివృద్ధి పనులను ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డిలతో కలిసి పరిశీలించారు. ముందుగా స్టేషన్ అభివృద్ధిపై ఏర్పాటుచేసిన చిత్రప్రదర్శనను తిలకించారు. అదే విధంగా జోగుళాంబ హాల్ట్‌లో రూ.6కోట్లతో చేపట్టిన నిర్మాణాలను ఎమ్మెల్యే విజయుడుతో కలిసి మంత్రి పరిశీలించారు. పనుల పురోగతిపై రైల్వే డీఆర్ఎం సంతోష్‌కుమార్ వర్మతో చర్చించారు. అలంపూర్ జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వరస్వామి క్షేత్రంలో మంత్రి కిషన్‌రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గద్వాల స్టేషన్లో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. గద్వాల సంస్థానం సంస్కృతి, చరిత్రను ప్రతిబింబించేలా రైల్వేస్టేషన్ తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు. ప్రయాణికులకు సౌకర్యవంతంగా మరో టికెట్ కౌంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. ఇక్కడి రైల్వేస్టేషన్ ప్రారంభమై వందేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో శతాబ్ధి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు. పదేళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 520 ఆర్ఓబీ, ఆర్యూబీ నిర్మాణాలను పూర్తిచేశామన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం రూ. 4,883కోట్లతో 118 ఆర్ఓబీ, ఆర్యూబీల పనులు చేపడుతున్నట్లు వివరించారు. గద్వాలలో రూ. 66కోట్లతో మరో ఆర్ఓబీ నిర్మాణానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. జోగుళాంబ హాల్ట్‌లో ప్రయాణికుల సౌకర్యార్థం రూ.45కోట్లతో హైలెవల్ బ్రిడ్జి నిర్మిస్తామన్నారు. పలు రాష్ట్రాల నుంచి అలంపూర్ క్షేత్రానికి భక్తులు వస్తున్న తరుణంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి సూచించారు. జోగుళాంబ హాల్ట్‌లో అన్ని రైళ్లను నిలిపే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. అలంపూర్ క్షేత్రంలో భక్తులకు అన్ని వసతులు కల్పించేందుకు కేంద్ర పర్యాటకశాఖ ద్వారా రూ. 37కోట్లు మంజూరు చేసినట్లు మంత్రి కిషన్‌రెడ్డి చెప్పారు. పర్యాటక అబివృద్ధి పనులపై ఎంపీ, కలెక్టర్‌తో త్వరలోనే సమీక్షిస్తామన్నారు. ● ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ.. విమానాశ్రయాన్ని తలపించేలా గద్వాల రైల్వేస్టేషన్ ఆధునికీకరణ పనులు కొనసాగుతున్నాయ న్నారు. గద్వాల–డోర్నకల్, మాచర్ల–గద్వాల రైల్వేలైన్ ఏర్పాటుకు ప్రయత్నిస్తామన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ ఎండీ గౌతమి, ఎస్పీ శ్రీనివాసరావు, అదనపు కలెక్టర్ మధుమోహన్, దేవాదాయశాఖ ఉమ్మడి జిల్లా సహాయ కార్యదర్శి శ్రీనివాసరాజు, ఈఓ పురేందర్‌కుమార్, ఏఎస్పీ శంకర్, ఆర్డీఓ శ్రీనివాసరావు, మున్సిపల్ చైర్పర్సన్ జయలక్ష్మి, వైస్‌చైర్మన్ శంకర్, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భరత్ ప్రసాద్ పాల్గొన్నారు. -
విద్యా నైపుణ్యాలు పెంపొందించాలి
చారకొండ: ఉపాధ్యాయులు విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించి.. వారిలో విద్యా నైపుణ్యాలను పెంపొందించేందుకు కృషి చేయాలని డీఈఓ రమేశ్‌కుమార్ సూచించారు. సోమవారం చారకొండ కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థినుల అభ్యసన సామర్థ్యాలను తరగతుల వారీగా పరిశీలించారు. విద్యార్థినులకు అందించే భోజనం నాణ్యతను పరిశీలించి.. వంట నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని.. ఆహారంలో నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. చదువులో వెనకబడిన విద్యార్థినులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఉపాధ్యాయులకు సూచించారు. ప్రభుత్వం కల్పిస్తున్న వసతులను విద్యార్థినులు సద్వినియోగం చేసుకొని చదువులో రాణించాలని తెలిపారు. డీఈఓ వెంట ఎస్ఓ మంజుల ఉన్నారు. -
అర్హులందరికీ సంక్షేమ ఫలాలు
తిమ్మాజిపేట: రాష్ట్ర ప్రభుత్వం అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తోందని ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి అన్నారు. సోమవారం తిమ్మాజిపేట రైతువేదికలో పలు గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో 10 ఏళ్లుగా కొత్త రేషన్ కార్డులు అందక పేదలు అవస్థలు పడ్డారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు ఇస్తున్నట్లు చెప్పారు. పేదల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని కొత్తగా ఇస్తున్న స్మార్ట్ రేషన్ కార్డు ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. సొంతిల్లు లేని పేదలందరికీ విడతల వారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామన్నారు. రెండో విడత గుడిసెలు, మట్టి ఇళ్లు, రేకుల ఇళ్లల్లో నివాసమున్న పేదలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. అనంతరం బుద్ధసముద్రంలో పోచమ్మ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. నేరళ్లపల్లి, మరికల్లో పలువురిని పరామర్శించి.. రూ. 10వేల చొప్పున ఆర్థికసాయం అందజేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ జయంతి, ఎంపీడీఓ శ్రీహరి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వివేక్‌రెడ్డి, నాయ కులు వెంకట్రామారెడ్డి, మల్లయ్యగౌడ్, నాగ సాయిలు, శ్రీనివాస్ బహదూర్, రవూఫ్, భాస్కర్‌రెడ్డి, లక్ష్మీనారా యణ, మాధవ్, గిరిజ, వెంకటయ్య పాల్గొన్నారు. -
బదిలీపై వెళ్తే.. బోధించేదెవరు?
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఒకవైపు డీఎస్సీ ద్వారా నియామకాలు సకాలంలో జరగకపోవడం.. మరోవైపు పదవీ విరమణ చేసిన వారి స్థానాల్లో పోస్టులు భర్తీ కాకపోవడంతో విద్యార్థులకు సబ్జెక్టుల వారీగా బోధన అందడం కష్టంగా మారుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో బడుల్లో బోధించాల్సిన స్కూల్ అసిస్టెంట్ స్థాయి ఉపాధ్యాయులను ఫారిన్ సర్వీస్, డీఈఓ కార్యాలయాలు, మానిటరింగ్ కమిటీలకు కేటాయిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఇప్పటికే 75 మందికిపైగా ఉపాధ్యాయులు ఫారిన్ సర్వీస్‌పై వివిధ విభాగాల్లో విధులు నిర్వహిస్తున్నారు. తాజాగా మహబూబ్‌నగర్ జిల్లాలోనే మరో 33 మందికి పైగా ఉపాధ్యాయులను ఫారిన్సర్వీస్పై పంపేందుకు ప్రక్రియ చేపట్టారు. ఇందులో బీఈడీ కళాశాలకు 10 మంది, డైట్ కళాశాలకు 12 మంది ఉండగా.. మిగిలిన వారు డీఈఓ కార్యాలయంలోని వివిధ విభాగాల్లో విధులు నిర్వహించనున్నారు. వీరితో పాటు పాఠశాలల పర్యవేక్షణ కోసం ఏర్పాటు చేసిన మానిటరింగ్ కమిటీల్లోనూ పెద్దసంఖ్యలో ఉపాధ్యాయులను కేటాయించారు. బీఈడీకి 10, డైట్‌కు 12 మంది ఉమ్మడి జిల్లాకు ఒకే ఒక్క బీఈడీ కళాశాల, ఒక డైట్ కళాశాల ఉంది. ఇందులో అధ్యాపకులు లేకపోవడంతో ప్రభుత్వ పాఠశాలల నుంచి ఉపాధ్యాయులను బదిలీ చేశారు. బీఈడీ కళాశాలలో ఉన్న ఏకై న రెగ్యులర్ పోస్టు గోవిందరాజులు నారాయణపేట ఇన్చార్జి డీఈఓగా విధులు నిర్వహిస్తున్నారు. ఇక డైట్ కళాశాలలో రెండు రెగ్యులర్ పోస్టులు ఉండగా ఇటీవల మహబూబ్‌నగర్ డీఈఓగా విధులు నిర్వహించిన రవీందర్ లంచం తీసుకుంటూ పట్టుబడి సస్పెన్షన్‌లో ఉన్నారు. మరో పోస్టులో ప్రస్తుత డైట్ కళాశాల ప్రిన్సిపాల్ మెరాజుల్లాఖాన్ విధులు నిర్వహిస్తున్నారు. ఇక రెండు కళాశాలల్లో పోస్టుల భర్తీకి సీబీటీ పరీక్ష నిర్వహించి ఈ నెల 6వ తేదీన బీఈడీ కళాశాలకు, 7వ తేదీన డైట్ కళాశాలకు ఇంటర్వ్యూ, డెమోలు నిర్వహించారు. బీఈడీ కళాశాలకు 10 మంది, డైట్ కళాశాలకు 12 మంది ఉపాధ్యాయులను ఎంపిక చేసి ఏడాది కాలానికి ఫారిన్ సర్వీస్‌పై విధులు కేటాయించనున్నారు. గతంలో తాత్కాలికంగా డిప్యూటేషన్‌పై పనిచేస్తున్న కొందరి డిప్యూటేషన్లు రద్దు చేసి.. తాజాగా ఎంపికై న వారికి అవకాశం కల్పించనున్నారు. బడుల్లో సబ్జెక్టు టీచర్ల కొరత.. అయినా ఇతర విధులకు కేటాయింపు బీఈడీ, డైట్ కళాశాలలకు 22 మంది.. డీఈఓ కార్యాలయాల్లో మరికొందరు ఉమ్మడి జిల్లాలో 75 మందికిపైగా ఫారిన్ సర్వీస్‌లో.. 81 మంది మానిటరింగ్ టీంల్లో.. అనుభవజ్ఞులైన స్కూల్ అసిస్టెంట్లను బోధనేతర విధులకు పంపడంపై విమర్శలు బడుల్లో సబ్జెక్టు టీచర్ల కొరత ఉపాధ్యాయుల కొరతతో ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో సబ్జెక్టుల వారీగా బోధనకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా ఉన్నత పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్ల కొరత ఉండగా.. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులను ఫారిన్ సర్వీస్, డీఈఓ కార్యాలయాలు, మానిటరింగ్ కమిటీలకు కేటాయించడంతో బోధనపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఉమ్మడి జిల్లాలో 200 మందికిపైగా ఉపాధ్యాయులు బోధనేతర విధుల్లో ఉండటంతో వారి స్థానాల్లో ఖాళీలను వెంటనే భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. లేకుంటే విద్యార్థులకు సబ్జెక్టు బోధనలో నష్టం జరిగే ప్రమాదం ఉంది. సర్దుబాటులో భాగంగా ఎస్జీటీలను ఉన్నత పాఠశాలలకు పంపే అవకాశం ఉన్నా.. సబ్జెక్టు నిపుణులైన స్కూల్ అసిస్టెంట్ల స్థానాన్ని తాత్కాలిక ఏర్పాట్లతో భర్తీ చేయడం ఎంతవరకు సాధ్యమన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఒక్క జిల్లాలోనే 33 మందికిపైగా.. మహబూబ్‌నగర్ జిల్లాలో 33 మందికిపైగా ఉపాధ్యాయులు ఫారిన్ సర్వీస్‌లో ఉండగా.. వీరిలో 22 మంది బీఈడీ, డైట్ కళాశాలల్లో, మిగతా వారు డీఈఓ కార్యాలయాల్లో విధులు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని ఇతర డీఈఓ కార్యాలయాల్లోనూ పలువురు ఉపాధ్యాయులు బోధనేతర విధుల్లో ఉన్నారు. ఇదిలా ఉండగా.. పాఠశాలల పర్యవేక్షణ, మధ్యాహ్న భోజనం, ప్రభుత్వ పథకాల అమలు తదితర అంశాల కోసం ఏర్పాటు చేసిన మానిటరింగ్ కమిటీల్లోనూ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 81 మంది ఉపాధ్యాయులను కేటాయించారు. మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్‌లో ఆరు చొప్పున, మిగతా జిల్లాల్లో ఐదు చొప్పున కమిటీలు ఏర్పాటు చేశారు. ఈ నెల 19 నుంచి వీరికి రాష్ట్రస్థాయిలో శిక్షణ ఇవ్వనున్నారు. బదిలీ చేశాం.. డైట్, బీఈడీ కళాశాలల్లో విధులు నిర్వహించేందుకు ఉపాధ్యాయులను ఫారిన్ సర్వీస్‌పై బదిలీ చేశాం. మానిటరింగ్ టీంలకు కూడా ఓడీ సౌకర్యంతో ఉపాధ్యాయులను కేటాయించాం. డీఈఓ కార్యాలయాల్లోనూ పలువురు ఉపాధ్యాయులు ఫారిన్ సర్వీస్‌పై విధులు నిర్వహిస్తున్నారు. వీరు వెళ్లిన పాఠశాలల్లో ఏర్పడిన ఖాళీలను త్వరలో చేపట్టనున్న సర్దుబాటు ప్రక్రియలో భర్తీ చేస్తాం. – విజయకుమారి, డీఈఓ, మహబూబ్‌నగర్ -
సాంకేతిక విద్యకు శ్రీకారం
కోస్గి: పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త సంస్కరణలను తీసుకొస్తుంది. ఇందులో భాగంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు కంప్యూటర్ బోధన అందించేందుకు చర్యలు చేపట్టింది. ఇప్పటికే కళాశాలలు, సైన్స్ ల్యాబ్‌ల నిర్వహణకు నిధులు మంజూరు చేసిన ప్రభుత్వం తాజాగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కంప్యూటర్ ల్యాబ్‌లను ఏర్పాటు చేసేందుకు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేసింది. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు కంప్యూటర్ పరిజ్ఞానాన్ని నేర్పించాలనే లక్ష్యంతో కంప్యూటర్ ల్యాబ్‌ల ఏర్పాటుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. మహబూబ్‌నగర్ : జిల్లాకేంద్రంలోని ఎంవీఎస్, బాలికల జూనియర్, జడ్చర్లలోని బాలుర, బాలికల జూనియర్ కళాశాలలు, దేవరకద్ర, బాలానగర్, కోయిల్‌కొండ జూనియర్ కళాశాలు. నారాయణపేట : మక్తల్, నారాయణపేట జూనియర్ కళాశాలలు నాగర్‌కర్నూల్ : కల్వకుర్తి, బిజినేపల్లి, నాగర్‌కర్నూల్ బాలుర కళాశాలలు వనపర్తి : ఆత్మకూర్, వనపర్తి బాలికల జూనియర్ కళాశాల. జోగుళాంబ గద్వాల : గట్టు, అయిజ, ధరూర్, గద్వాల బాలుర, గద్వాల బాలికల కళాశాల. మొదటి విడతలో ఉమ్మడి జిల్లాలో 19 కళాశాలలు ఎంపిక ల్యాబ్ కోసం ప్రత్యేక గది నిర్మాణం.. నిధులు మంజూరు ఈ విద్యా సంవత్సరం నుంచే అమలుకు ఆదేశాలు దశల వారీగా అన్ని కళాశాలల్లో అమలు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కంప్యూటర్ ల్యాబ్‌ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సమ గ్ర శిక్షా ద్వారా ప్రత్యేక నిధులు మంజూరు చేసింది. మొదటి విడత ఎంపికై న కళాశాలల్లో ప్రభుత్వ నిబంధనల మేరకు కంప్యూటర్ ల్యాబ్ గదుల నిర్మాణాలు వేగవంతంగా చేపట్టేందుకు తగిన చర్యలు తీసుకుంటాం. గ్రామీణప్రాంత విద్యార్థులకు కంప్యూటర్ విద్య అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకుసాగుతోంది. – సుదర్శన్‌రావు, జిల్లా ఇంటర్ విద్యాధికారి, నారాయణపేట అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో దశల వారీగా కంప్యూటర్ ల్యాబ్‌లు ఏర్పాటు చేయనున్నారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 59 ప్రభుత్వ జూనియర్ కళాశాలలుండగా.. మొదటి విడతలో 19 కళాశాలలను ఎంపిక చేశారు. ఎంపిక చేసిన ఒక్కో కళాశాలకు సమగ్ర శిక్షా ద్వారా రూ.25 లక్షల చొప్పున మొత్తం రూ.4.75 కోట్లు మంజూరు చేస్తూ ప్రాజెక్టు డైరెక్టర్ డా. నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిధులతో ఆయా కళాశాలల్లో ప్రత్యేక గదులు నిర్మించి కంప్యూటర్ ల్యాబ్‌గా వినియోగించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
ప్రజా సంక్షేమమే లక్ష్యం
అచ్చంపేట రూరల్: ప్రజా ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని ఎమ్మెల్యే డా.చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. ఆదివారం మండలంలోని ఐనోల్ గ్రామంలో మార్నింగ్ వాక్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా కాలనీల్లో ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి కృషి చేస్తానని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. అనంతరం గిరిజన బాలికల గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థినులకు అందిస్తున్న విద్య, వసతులు, భోజనం ఇతర సౌకర్యాలపై ఆరా తీశారు. విద్యార్థినులతో కలిసి అల్ఫాహారం తీసుకున్నారు. మత్తు.. భవిష్యత్‌కు గొడ్డలి పెట్టు కల్వకుర్తి రూరల్: మత్తు పదార్థాలు యువత భవిష్యత్‌కు గొడ్డలి పెట్టువంటివని.. డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాల నివారణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి కోరారు. ఆదివారం జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యువత మత్తు పదార్థాలు వినియోగించకుండా చైతన్యం చేసేందుకు నిర్వహించిన 2కే రన్‌ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి సమాజంలోని ప్రతి ఒక్కరు నడుం బిగించాలని పిలుపునిచ్చారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ.. సన్మార్గంలో పయనించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం మాదకద్రవ్యాల నిర్మూలనకు కఠిన చర్యలు చేపడుతుందని ఆయన వివరించారు. మరింత మంది ముందుకొచ్చి.. డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలపై ప్రజలను చైతన్యం చేయాల్సిన అవసరం ఉందన్నారు. కాగా, 2కె రన్లో విజేతలుగా నిలిచిన వారికి బంగారు పతకాలు, ప్రశంసాపత్రాలను ఎమ్మెల్యే ప్రదానం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బంగి రత్నమాల ఆనంద్‌కుమార్, మాజీ చైర్మన్ ఎడ్మ సత్యం, సంజీవ్ యాదవ్, జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు ముచ్చర్ల జనార్దన్‌రెడ్డి, పసుల రమాకాంత్‌రెడ్డి, కౌన్సిలర్లు, శ్రీకాంత్ రెడ్డి, పుస్తకాల రాహుల్, ఇంపాక్ట్ ఫౌండేషన్ సభ్యుడు బాలస్వామి పాల్గొన్నారు. -
ఉద్యోగుల పోరాటాలకు సంపూర్ణ మద్దతు
కందనూలు: ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల సాధన కోసం ప్రభుత్వ ఉద్యోగులు చేపట్టే పోరాటాలకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని బీఆర్ఎస్ నేత డా.నాగం శశిధర్‌రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు అనేక హామీలను ప్రకటించి.. అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క హామీని పూర్తిస్థాయిలో అమలు చేయడం లేదని ఆరోపించారు. ఒక్క ఉచిత బస్సు ప్రయాణం తప్ప.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. ఉద్యోగుల హెల్త్‌కార్డుల విషయంలో తాత్సారం చేయడం సరైంది కాదని అన్నారు. ఉద్యోగులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం మనుగడ సాధించలేదని గుర్తుచేశారు. ఇప్పటికై నా ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నాయకులు అర్థం రవి, బాలాగౌడ్, కౌన్సిలర్ అర్జునయ్య, భీముడు, సత్యం ఉన్నారు. దరఖాస్తుల ఆహ్వానం మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: గ్రూప్–1, 2 ,3, 4 పరీక్షలకు సిద్ధమయ్యే మైనార్టీ వర్గాలకు చెందిన డిగ్రీ పాసైన యువతకు జనరల్ స్టడీస్‌లో ఉచిత ఫౌండేషన్ శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా మైనార్టీల సంక్షేమ శాఖ అధికారి విష్ణునందన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. బీపీఎల్ కేటగిరీ కింద అర్హులైన ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, పార్సీలు, బౌద్ధులు మంగళవారం నుంచి 14 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. పూర్తి చేసిన దరఖాస్తులను తెలంగాణ మైనార్టీ స్టడీ సర్కిల్, ఇందిర ప్రియదర్శిని డిగ్రీ కళాశాల ప్రాంగణం, ఎంఏఎం క్యాంపస్, ఇంటర్మీడియట్ బోర్డు వెనుక, శ్రీబాలాజీ ఎన్క్లేవ్, నాంపల్లి, హైదరాబాద్ అనే చిరునామాకు పంపుకోవాలన్నారు. ఎంపికై న వంద మందికి అక్కడే సెప్టెంబర్ 15 నుంచి శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయని చెప్పారు. -
వాయిదాల పర్వం
● ఎంజీకేఎల్‌ఐలో ఐదేళ్ల క్రితం పాడైన పంపు మోటార్లు ● మూడేళ్ల క్రితమే రూ.16 కోట్ల నిధులు కేటాయింపు ● వివిధ రకాల కారణాలతో సమస్య పరిష్కరించని అధికారులు ● ఎల్లూరు పంప్‌హౌజ్‌లో మూడు పంపులతోనే ఎత్తిపోతలు –8లో uకొల్లాపూర్: నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాల్లోని లక్షలాది ఎకరాలకు సాగునీరు, ఉమ్మడి పాలమూరు– రంగారెడ్డి జిల్లాల్లోని పలు ప్రాంతాలకు తాగునీరు అందించే ఉద్దేశంతో మహాత్మగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల (ఎంజీకేఎల్ఐ) పథకం చేపట్టారు. ఇక్కడ ఏర్పాటు చేసిన 5 మోటార్ల ద్వారా ఏటా కృష్ణానదికి వరదలు వచ్చిన సమయంలో నీటిని ఎత్తిపోసి.. కాల్వల ద్వారా రిజర్వాయర్లు, చెరువులు నింపుతూ సాగు, తాగునీటిని అందించాల్సి ఉంటుంది. ఇంతటి ప్రాధాన్యం గల ఎత్తిపోతల పథకం అడుగడుగునా నిర్లక్ష్యానికి గురవుతోంది. గత ఐదేళ్ల క్రితం పాడైన రెండు మోటార్లు నేటికీ మరమ్మతుకు నోచుకోవడం లేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. వివిధ రకాల కారణాలు చెబుతూ అధికారులు కాలయాపన చేస్తుండటంతో.. మిగతా మూడు మోటార్లతోనే నిరంతరం నీటిని ఎత్తిపోయాల్సి వస్తుంది. ఫలితంగా ఎల్లూరు లిఫ్టులో పాడైన మోటార్లకు మరమ్మతు ఈ సీజన్లో కూడా చేపట్టని పరిస్థితులు నెలకొన్నాయి. పాడైపోయిన మోటార్లు.. కేఎల్ఐ ప్రాజెక్టు మొదటి లిఫ్టును ఎల్లూరు సమీపంలోని రేగుమాన్గడ్డ వద్ద నిర్మించారు. ఈ లిఫ్టులో 5 మోటార్లు ఉండగా.. నాలుగు మోటార్లతో నీటి పంపింగ్ చేపట్టి, ఒక మోటార్‌ను స్పేర్‌లో ఉంచుకునేలా ఏర్పాట్లు చేశారు. 2012 సెప్టెంబర్‌లో కేఎల్ఐ ప్రాజెక్టును అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి లాంఛనంగా ప్రారంభించి నీటిని విడుదల చేశారు. అదే నెలలో ఎయిర్ ఫ్రెషింగ్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో పంపు మోటార్లు పాడవగా.. వెంటనే వాటికి మరమ్మతు చేశారు. 2014 సెప్టెంబర్‌లో 5వ నంబర్ పంపు మోటార్‌లోకి నీళ్లు చేరి పాడైంది. తర్వాతి కాలంలో మరో పంపు మోటార్ కూడా మరమ్మతుకు గురైంది. మూడున్నరేళ్ల క్రితం నిధులు.. కొన్ని సంవత్సరాల కాలంగా మోటార్ల మరమ్మతు పనులు వాయిదా పడుతూ వస్తున్నాయి. మోటార్ల మరమ్మతు కోసం మూడున్నరేళ్ల క్రితం గత ప్రభుత్వం రూ.16 కోట్ల నిధులు కేటాయించింది. దీంతో కేఎల్ఐ ద్వారా నీటి లిఫ్టింగ్‌ను ఆపేసి మోటార్లకు మరమ్మతు చేపట్టేందుకు అప్పట్లో బీహెచ్ఈఎల్ కంపెనీకి చెందిన ఇంజినీర్లు సిద్ధమయ్యారు. అయితే మిషన్ భగీరథ స్కీంకు నీటి ఇబ్బందులు తలెత్తడంతో మరమ్మతు ఆపేసి మళ్లీ యథాతధంగా కేఎల్ఐ ద్వారా నీటి ఎత్తిపోతలు చేపట్టారు. నాటి నుంచి నేటి వరకు నిరాటంకంగా కేఎల్ఐ ద్వారా తాగు, సాగునీటి అవసరాల కోసం ఎత్తిపోతలు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో పాడైన మోటార్లకు మరమ్మతు చేపట్టడం సాధ్యం కావడం లేదు. పాడైన మోటార్లు 2 పాలమూరు ప్రాజెక్టు ద్వారా రెగ్యులర్‌గా నీటి ఎత్తిపోతలు కొనసాగితే కేఎల్ఐ ప్రాజెక్టుకు కొంత విరామం ఇవ్వాలనుకున్నాం. అయితే పలు కారణాలతో అది సాధ్యపడటం లేదు. తాగునీటి అవసరాల కోసం రెగ్యులర్‌గా కేఎల్ఐ ద్వారా నీటి పంపింగ్ కొనసాగిస్తున్నాం. పాడైన మోటార్ల మరమ్మతుకు ఇంకా కొంతకాలం ఆగక తప్పదు. – లోకిలాల్‌నాయక్, నీటిపారుదల శాఖ ఈఈ కేఎల్ఐ ప్రాజెక్టు డిజైన్‌లో అప్రోచ్ చానల్ నుంచి సర్జిపూల్‌లోకి నీళ్లు వెళ్లే ప్రాంతంలో హెడ్‌రెగ్యులేటరీ వ్యవస్థను ఏర్పాటు చేయలేదు. దీంతో నది నీళ్లు నేరుగా సర్జిపూల్‌లోకి చేరుకుంటాయి. వరదలు, నదీ ప్రవాహ ఉధృతి అధికంగా ఉన్న సమయంలో నీటి ఒడిదుడుకులు ఎదురవుతాయి. ఈ సమయంలో ఏర్పడే ఎయిర్ ఫ్రెషింగ్ లిఫ్టుపై ప్రభావం చూపుతోంది. ఈ కారణంతోనే 5వ నంబర్ మోటార్‌లోకి నీళ్లు చేరి పాడైంది. అదే సమయంలో పంప్‌హౌజ్‌లోని సిమెంట్ కాంక్రీట్ గోడలకు కూడా కొంతమేర పగుళ్లు వచ్చి నది నీళ్లు పంప్‌హౌజ్‌లోకి చేరాయి. వీటికి తాత్కాలిక మరమ్మతు చేపట్టి లిఫ్టును నిర్వహిస్తున్నారు. ఈ సమస్యలకు పూర్తిస్థాయిలో పరిష్కారం లభించాలంటే అప్రోచ్ చానల్ టన్నెల్ ప్రారంభంలో షెట్టర్ ఏర్పాటు చేయడమే మార్గమని ఇప్పటికే ఇంజినీరింగ్ అధికారులు గుర్తించారు. షట్టర్ ఏర్పాటు, మోటార్ల మరమ్మతు జరగాలంటే కేఎల్ఐ లిఫ్టునకు కనీసం 2, 3 నెలల విరామం ఇవ్వాలని, అది ఇప్పట్లో సాధ్యం కాదని అధికారులు చెబుతున్నారు. -
అలంపూర్ ఆలయాల అభివృద్ధికి కృషి
● కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి కిషన్‌రెడ్డి ● జోగుళాంబ క్షేత్రంలో మల్టీ మీడియా సౌండ్, లైట్ షో ప్రారంభం అలంపూర్ రూరల్: ప్రసాద్ స్కీంలో భాగంగా అలంపూర్ క్షేత్రంలో పలు అభివృద్ధి పనులు చేపట్టామని.. భవిష్యత్‌లో కూడా మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఆదివారం రాత్రి 8 జిల్లా పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి.. జోగుళాంబదేవి సన్నిధిలో మల్టీ మీడియా సౌండ్, లైట్ షోను ప్రారంభించారు. అంతకు ముందు ఎంపీలు మల్లు రవి డీకే అరుణ, ఎమ్మెల్యే విజయుడు, టూరిజంశాఖ అధికారులు మంత్రికి పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఆధ్యాత్మికంగా ఎంతో విశిష్టత కలిగిన అలంపూర్ ఆలయాలను పెద్దసంఖ్యలో భక్తులు దర్శించుకుంటారని, భక్తులు ప్రతిరోజు సాయంత్రం 25 నిమిషాల పాటు ఆలయ చరిత్రను తెలియజేసేలా మల్టీ మీడియా సౌండ్, లైట్‌షోను ప్రారంభించడం జరిగిందన్నారు. ఇదివరకు కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలోని సుమారు 15 పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి రూ.700 కోట్ల నిధులు కేటాయించినట్లు వెల్లడించారు. రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు వచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని గుర్తుచేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఎన్నో దర్శనీయ స్థలాలను అభివృద్ధి చేసేందుకు పెద్దఎత్తున నిధులు వెచ్చిస్తున్నామన్నారు. గోల్కొండ కోట, ఉస్మానియా కళాశాల వద్ద సౌండ్, లైట్ షో ఏర్పాటు చేశామన్నారు. అమృత్ భారత్ పథకంలో భాగంగా జోగుళాంబ రైల్వేస్టేషన్‌ను అభివృద్ధి చేశామని పేర్కొన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని అనేక ఆధ్యాత్మిక ప్రదేశాలను అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. రాష్ట్రంలోని చారిత్రక కట్టడాలు, పురాతన ఆలయాల పరిరక్షణకు స్వచ్ఛంద సంస్థలతో పాటు ప్రజలు కలిసిరావాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ● ఎంపీ మల్లురవి మాట్లాడుతూ.. అలంపూర్ ఆలయ విశిష్టతను తెలయజేస్తూ, మల్టీ మీడియా సౌండ్, లైట్ షో ప్రదర్శన ఏర్పాటు చేయడం ద్వారా పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. ఆలయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. అలాగే డోర్నకల్ నుంచి గద్వాలకు రైల్వేలైన్ ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ● ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ.. అలంపూర్ ఆలయాల వద్ద భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రసాద్ స్కీంలో అన్నదాన సత్రం, విశ్రాంతి గదులు ఫుడ్ కోర్టు, తదితర విభాగాలతో పాటు తుంగభద్ర నదిలో బోటు సౌకర్యం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అమృత్ పథకంలో భాగంగా చేపట్టిన జోగుళాంబ, గద్వాల రైల్వేస్టేషన్ల ఆధునికీకరణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్, టూరిజం అండ్ కల్చరల్శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ వాణి ప్రసాద్, తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ గౌతమి, కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, ఎస్పీ శ్రీనివాసరావు, అదనపు కలెక్టర్ నర్సింగ్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
అచ్చంపేట అభివృద్ధికి అహర్నిశలు కృషి
అచ్చంపేట రూరల్: అచ్చంపేట నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే డా.చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. శనివారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రూ. 24.50కోట్లతో మద్దిమడుగు ఆలయ అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చొరవతో రూ. 15 కోట్లు హరిత హోటల్‌కు మంజూరు చేశారన్నారు. సంత్ సేవాలాల్ విగ్రహ ఏర్పాటుకు రూ. 100కోట్లతో ప్రతిపాదనలు పంపగా.. మొదటి విడతలో రూ. 36కోట్లు మంజూరయ్యాయని.. త్వరలోనే జీఓ రానుందని చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా మద్దిమడుగు ప్రాంతానికి వచ్చి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని తెలిపారు. అదే విధంగా పదర, అమ్రాబాద్, బల్మూర్, లింగాల, ఉప్పునుంతల మండలాల్లో రాజీవ్ మినీ స్టేడియాల ఏర్పాటు కోసం రూ. 2కోట్ల చొప్పున మంజూరయ్యాయని పేర్కొన్నారు. అచ్చంపేటలోని రాజీవ్– ఎన్టీఆర్ మినీ స్టేడియానికి రూ. 8.50కోట్లు మంజూరు కాగా.. మరో రూ.6కోట్లు మంజూరు కానున్నాయని తెలిపారు. ఏడు ఎకరాల్లో ఏర్పాటు చేయబోయే వైఎస్సార్ పార్కు కోసం రూ. 4కోట్లు మంజూరైనట్లు చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రుల సహకారంతో అచ్చంపేట నియోజకవర్గ ప్రజలకు అన్ని వసతులు కల్పిస్తామన్నారు. క్రీడలు జీవితంలో భాగం కావాలి నాగర్‌కర్నూల్: క్రీడలు జీవితంలో భాగం కావాలని అదనపు కలెక్టర్ చెన్నయ్య అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ధ్యాన్‌చంద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పాఠశాల మైదానం నుంచి అంబేడ్కర్ చౌరస్తా వరకు విద్యార్థులచే ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. క్రీడాకారులు ధ్యాన్ చంద్ స్ఫూర్తితో క్రీడా పోటీల్లో రాణించాలని సూచించారు. క్రీడలతో మానసిక, శారీరక వికాసం పెంపొందుతాయని.. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలకు కొంత సమయం కేటాయించాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తీగల సురేంద్ర, డీవైఎస్ఓ సీతారామ్, డీఈఓ రమేశ్‌కుమార్, డీఐఈఓ వెంకటరమణ, డీఎస్పీ శ్రీనివాస్ పాల్గొన్నారు. -
పారదర్శకంగా నోటీసుల జారీ ప్రక్రియ
కందనూలు: ముసాయిదా ఓటర్ల జాబితా పరిశీలనలో భాగంగా నోటీసుల జారీ ప్రక్రియను పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ ఆదేశించారు. శనివారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి నిర్వహించిన వీసీలో పాల్గొన్న అనంతరం ఆయన జిల్లా అధికారులతో సమావేశమై మాట్లాడారు. బీఎల్ఓలు సదరు వ్యక్తులకు మాత్రమే నోటీసులను అందజేసేలా ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. నోటీసులు అందజేసిన అనంతరం సంబంధిత వ్యక్తి నుంచి అక్నాలెడ్జ్మెంట్ తీసుకోవడంతో పాటు ప్రక్రియకు సంబంధించిన వివరాలను సక్రమంగా నమోదు చేయాలన్నారు. నోటీసుల జారీ విషయంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. ఓటర్లు హియరింగ్ సమయంలో సమర్పించాల్సిన ధ్రువపత్రాల విషయంపై కూడా ముందుగానే స్పష్టత ఇవ్వాలన్నారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఏఈఆర్ఓలకు హియరింగ్ నిర్వహణపై ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. అనామలీస్, నోమ్యాపింగ్కు సంబంధించిన వివరాలను గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కూడా నిబంధనల మేరకు పంచుకోవాలని కలెక్టర్ తెలిపారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో పారదర్శకతకు ప్రాధాన్యత ఇస్తూ, సంబంధిత సమాచారాన్ని అందుబాటులో ఉంచాలని సూచించారు. ఒక చిరునామాలో నివసిస్తున్న వ్యక్తులను మరో చిరునామాలో చూపించడం, ఒక చిరునామాలో నివసించని వ్యక్తులను అదే చిరునామాలో ఉన్నట్లు నమోదు చేయడం వంటి అంశాలు వెలుగులోకి వస్తే, సమగ్రంగా విచారణ చేపట్టాలన్నారు. ఇలాంటి తప్పిదాలు సంబంధిత బీఎల్ఓల నిర్లక్ష్యం ద్వా రా జరిగినట్లు నిర్ధారణ అయితే, బాధ్యులపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వీసీలో అదనపు కలెక్టర్ చెన్నయ్య ఉన్నారు. వ్యవసాయంలో ఆధునిక సాంకేతికత వినియోగించాలి.. రైతుల ఆర్థికాభివృద్ధి, వ్యవసాయ ఉత్పాదకత పెంపే లక్ష్యంగా శాసీ్త్రయ వ్యవసాయ పద్ధతులు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అన్నారు. బిజినేపల్లి మండలం పాలెం వ్యవసాయ కృషి విజ్ఞాన కేంద్రాన్ని ఆయన సందర్శించి.. రైతులకు అందిస్తున్న సేవలు, శిక్షణ కార్యక్రమాలు, వ్యవసాయ సాంకేతికత ప్రదర్శనలతో పాటు ఇన్స్ట్రక్షనల్ ఫారంలో కొనసాగుతున్న వివిధ యూనిట్లను పరిశీలించారు. కేవీకే ద్వారా అందిస్తున్న సాంకేతిక సేవలు రైతుల వాస్తవ అవసరాలకు అనుగుణంగా, ఫలితాలు కనిపించే విధంగా ఉండాలని ఆయన సూచించారు. రైతులు కేవలం సంప్రదాయ పంటలపైనే ఆధారపడకుండా, మార్కెట్ డిమాండ్, నేల స్వభావం, నీటి లభ్యతకు అనుగుణంగా పంటల వైవిధ్యీకరణ చేపట్టేలా ప్రోత్సహించాలని తెలిపారు. కలెక్టర్ వెంట సీనియర్ సైంటిస్ట్ డా.శైలజ ఉన్నారు. -
ఆదర్శం.. చెంచుగూడెం
ప్రకృతి వ్యవసాయం వైపు గిరిపుత్రుల అడుగులు ● తోటల పెంపకం, కూరగాయల సాగుపై దృష్టి ● ఆధునిక పద్ధతులు, యంత్రాలతో వ్యవసాయంలో రాణింపు ● ప్రభుత్వ పథకాలు, ప్రోత్సాహకాలు అందిపుచ్చుకొని సత్ఫలితాలు ● మైదాన ప్రాంత రైతులకు స్ఫూర్తిగా నిలుస్తున్న నల్లమల చెంచులు –8లో u●మాకు ఎకరాన్నర భూమి ఉండగా.. అర ఎకరంలో బెండకాయ, గోకరికాయ, చిక్కుడుకాయలు పండిస్తున్నాం. రోజు విడిచిరోజు కూరగాయలు తెంపి విక్రయిస్తాం. సగటున రోజుకు రూ.2–3 వేల ఆదాయం వస్తుంది. కూరగాయల సాగుకు ఎరువులు కాకుండా ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండిస్తున్నాం. అటవీ ప్రాంతం దగ్గర ఉండటంతో తరుచుగా జంతువులు వస్తుంటాయి. వాటి నుంచి పంటలను రక్షించుకోవడానికి ప్రభుత్వం కంచె ఏర్పాటు చేస్తే బాగుంటుంది. – నిమ్మల సాలెమ్మ, చెంచుగూడెం, బల్మూర్ మండలం ఈ ఏడాది సరైన వర్షాలు లేకపోవడంతో వానాకాలం పంట వేయలేదు. యాసంగిలో వేరుశనగ పంట సాగు చేసేందుకు భూమి బీడుగా ఉంచాం. కాడెద్దులతో కూలీ పనికి వెళ్తున్నా. మా గూడెంలోని కుటుంబాలన్నీ వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నాయి. వ్యవసాయ పనులకు తోడు ఉపాధి హామీ పథకం పనులు కూడా చేస్తున్నాం. – ఉడుతనూరి నర్సింహ, రైతు, చెంచుగూడెం బల్మూర్ మండలం గతంలో మాకు అటవీ సంపదలే ఆసరాగా ఉండేవి. మా గూడెంలోని చెంచులందరూ ఇతర ప్రాంతాలకు వలస పోయేవాళ్లు. ఇప్పుడు వ లస పోకుండా ఇక్కడే బతుకుతున్నాం. ఇక్కడే ఉంటూ ఉపాధి పనులు, పత్తి తీ యడం, మేసీ్త్రల కింద కూలీ పనులకు వె ళ్తున్నాం. మా గూడెంలో సగం మందికి వ్యవసాయ భూమిలేదు. గతంలో ఇచ్చిన మాదిరిగా ప్రభుత్వం మాకు భూమి ఇవ్వాలి. – నిమ్మల విజయ్‌కుమార్, కూలీ, చెంచుగూడెం బల్మూర్ మండలం జనజీవన స్రవంతికి దూరంగా.. నల్లమల అడవిలో నివశిస్తూ.. దుర్భరమైన జీవితాలు గడిపిన చెంచులు.. అవకాశాలను అందిపుచ్చుకొని ప్రగతి పథంలో పయనిస్తున్నారు. ఒకానొక సందర్భంలో నాగరిక సవూజానికి దూరంగా ఉంటూ.. అటవీ ఉత్పత్తుల సేకరణ, వలసలే ప్రధాన వృత్తిగా కొనసాగిన చెంచుగూడెం చెంచులు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) వీరి కోసం ఖర్చు చేసిన నిధులు ప్రస్తుతం సత్ఫలితాలు ఇస్తున్నాయి. ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకొంటూ చెంచులు గణనీయమైన ప్రగతి సాధిస్తున్నారు. వ్యవసాయంలో మంచి నైపుణ్యం ప్రదర్శిస్తూ ఇతర వర్గాల రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. వరి, పత్తి, మినుములు, మొక్కజొన్న, జొన్న, వేరుశనగ వంటి సంప్రదాయ పంటలతోపాటు ఆయిల్‌పాం, మామిడి తోటలు, కూరగాయల తోటలతో ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఆర్థికాభివృద్ధి చెందుతున్నారు. – అచ్చంపేట/ బల్మూర్ చెంచులు వ్యవసాయ రంగంలో రాణించేందుకు 1996లో ఐటీడీఏ ఐపాడ్ పథకం కింద ఆర్థిక సహాయం అందించింది. అప్పట్లో బల్మూరు మండలంలోని చెంచుగూడెంలో 75 చెంచు కుటుంబాలు ఉండగా 32 కుంటుంబాలకు పండ్ల తోటల పెంపకానికి చేయూత అందించారు. ఒక్కొక్క రైతుకు రెండు ఎకరాల చొప్పున 64 ఎకరాల భూమిని కొనుగోలు చేసి ఇచ్చారు. మొదట ఏడు బోర్లు వేసి విద్యుత్ సౌకర్యం, పైపులైన్, ఎద్దులు ఇచ్చారు. ప్రస్తుతం 40 బోర్లు, మోటార్లు ఉన్నాయి. రైతులు ఆర్థికంగా ప్రగతి సాధించి సొంతంగా బోర్లు వేసుకుంటున్నారు. కొంతమంది చెంచులు మామిడి తోటలు తొలగించి కూరగాయలు, ఇతర ఆరుతడి పంటల సాగు చేస్తున్నారు. నల్లమలోని చెంచుపెంటల్లో 300లకుపైగా ఎకరాల్లో తోటలు పెంపకం ప్రోత్సహించగా చాలాచోట్ల ఈ పథకం విఫలం కాగా చెంచుగూడెం చెంచులు మాత్రం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో సత్ఫలితాలు సాధించారు. గూడెంలో సగం కుటుంబాలకు వ్యవసాయ భూమి లేకపోవడంతో ఉపాధి హామీ పనులతోపాటు ఇతర పనులు చేసుక ్డుంటూ జీవనం సాగిస్తున్నారు. గతంలో వలసలు వెళ్లిన ఈ గ్రామ చెంచులు ప్రస్తుతం ఇక్కడే ఉంటూ అందుబాటులో ఉన్న పనులు చేసుకుంటున్నారు. తక్కువ నీటితో లాభదాయక వ్యవసాయం చేసేందుకు చెంచు రైతులు వ్యవసాయ కుంట (పాంపాండ్)లు నిర్మించుకున్నారు. పైపులైన్లు, స్ప్రింక్లర్లు, డ్రిప్ ఇరిగేషన్ ఉపయోగించుకుంటూ తక్కువ నీటితో ఆయిల్‌పాం, మామిడి తోటలు, కూరగాయల సాగు చేపడుతున్నారు. మామిడితోటలు, ఆయిల్‌పాం తోటల్లో వేరుశనగ, మినుమలు, మొక్కజొన్న వంటి అంతర్ పంటలు సాగు చేస్తున్నారు. ఆఽదునిక వ్యవసాయ పద్ధతులను అవలంభిస్తూ సాంకేతిక పరిజ్ఞానంతో రైతులు పంటలు సాగు చేస్తున్నారు. ఐటీడీఏ, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయం నమూనా క్షేత్రం ఏర్పాటు చేశారు. రసాయన ఎరువుల వాడకం తగ్గించి సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం వల్ల రైతులు అనేక ప్రయోజనాలు పొందుతూ సాంకేతికతను వినియోగించుకుంటున్నారు. రసాయన ఎరువుల వినియోగంతో పంట పొలాల నిర్జీవంగా మారుతున్నాయనే కారణంగా ప్రకృతి, మానవాళికి కలిగే నష్టాలను వివరిస్తూ చెంచులను సేంద్రియ సాగు వైపు దృష్టి మళ్లించారు. వీరు పండించే ప్రకృతి సేద్య పంటలకు మార్కెట్లో అధిక డిమాండ్ ఉంది. సమీప గ్రామాల ప్రజలు ముందుగానే వీరు పండించే పంటలను కొనుగోలు చేస్తున్నారు. ఏటా రెండు పంటలు పండిస్తూ రైతులు ఆర్థికంగా ప్రయోజనం పొందుతున్నారు. చెంచులు తమకు ఉన్న ఎకరా, అర ఎకరా పొలంలోనే కూరగాయలు సాగు చేసి లాభాలు గడిస్తున్నారు. ప్రధానంగా గోంగూర, బెండకాయ, గోకరికాయ, చిక్కుడుకాయ వంటి కూరగాయలు పండిస్తూ నెలకు సుమారు రూ.30–50 వేల ఆదాయం పొందుతున్నారు. కూలీలతో పని లేకుండా కుటుంబ సభ్యులే కూరగాయలు మార్కెట్‌కు తరలించి విక్రయిస్తున్నారు. అప్పట్లో మా బాధలను గుర్తించిన ప్రభుత్వం మాకు భూములు ఇచ్చి మామిడితోటలు పెట్టించారు. తోట పెంపకానికి ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వడంతో ఇప్పుడు ఆ తోటను తొలగించి 3 ఎకరాల పొలంలో ఆయిల్‌పాం మొక్కలు నాటాం. మంచి ఫలితాలు వస్తాయని చెప్పడంతో దీని వైపు మొగ్గు చూపాం. మరో 2.5 ఎకరాల పొలం కౌలుకు తీసుకుని పత్తి పంట సాగు చేస్తున్నాం. వర్షాలు లేకపోవడంతో పత్తిపంటను స్ప్రింక్లర్లతో నీటిని తడుపుతున్నాం. పైపులైన్, డ్రిప్ ఇరిగేషన్‌తోపాటు వాడుతున్నాం. – కాట్రావత్ వరలక్ష్మి, మహిళా రైతు, చెంచుగూడెం, బల్మూర్ మండలం -
రేషన్.. పరేషాన్!
● పది రోజులుగా చౌకధర దుకాణాల మూత ● మూడు నెలల రేషన్ బియ్యం అందక లబ్ధిదారుల ఆందోళన కల్వకుర్తి రూరల్: మూడు నెలల రేషన్ బియ్యం తీసుకునేందుకు మరో రెండు రోజుల సమయం మాత్రమే ఉండటం.. చాలా వరకు చౌకధర దుకాణాలు మూతపడి కనిపిస్తుండటంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రతినెలా మొదటి తేదీలోపే రేషన్ షాపులకు బియ్యం సరఫరా చేయాల్సి ఉండగా.. ఈ నెల మాత్రం 5వ తేదీ తర్వాతే కల్వకుర్తి రెవెన్యూ డివిజన్లోని 132 షాపులకు బియ్యం సరఫరా జరిగింది. ఆ వెంటనే వినియోగదారులు రేషన్ షాపుల వద్ద క్యూ కట్టి బియ్యం తీసుకున్నారు. కొన్ని రోజులకే రేషన్ దుకాణాల్లో బియ్యం అయిపోవడం.. మళ్లీ సరఫరా కాకపోవడంతో మూతపడ్డాయి. పది రోజులుగా షాపులన్నీ మూసి కనిపిస్తుండటంతో బియ్యం తీసుకోని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో 98శాతం రేషన్ బియ్యం పంపిణీ పూర్తి చేశాం. ఈ నెల 31వ తేదీ నాటికి లబ్ధిదారులకు బియ్యం అందించాల్సి ఉంది. చౌకధర దుకాణాల్లో బియ్యం నిల్వలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటాం. – రాజేందర్, డీఎం, సివిల్ సప్లయ్‌శాఖ జిల్లాలో 558 చౌకధర దుకాణాలు.. జిల్లావ్యాప్తంగా 558 రేషన్ దుకాణాలు ఉండగా.. అత్యధికంగా కల్వకుర్తి రెవెన్యూ డివిజన్ పరిధిలోనే 132 దుకాణాలు ఉన్నాయి. ఆయా దుకాణాలకు 35వేల క్వింటాళ్ల బియ్యం రావాల్సి ఉండగా.. ఇప్పటివరకు 30వేల క్వింటాళ్లు మాత్రమే వచ్చాయి. మరో 5వేల క్వింటాళ్లు ఆదివారం నాటికి వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే కల్వకుర్తిలో లబ్ధిదారుల తాకిడి ఎక్కువగా ఉన్న రేషన్ దుకాణాల డీలర్లు శనివారం గోదాం ఇన్చార్జి శశిధర్రావును కలిసి బియ్యం సరఫరా చేయాలని విజ్ఞిప్తి చేశారు. బియ్యం లేకపోవడంతో వినియోగదారులకు సమాధానం చెప్పలేకపోతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. అయితే గడువులోగా రేషన్ దుకాణాలకు బియ్యం సరఫరా చేస్తేనే మిగిలిన లబ్ధిదారులకు పంపిణీ చేసే అవకాశం ఉంది. -
భీమా కాల్వలోపూడిక తొలగింపు
పాన్‌గల్: మండలంలోని బుసిరెడ్డిపల్లి గ్రామం బొల్లిగట్టు సమీపంలోని డిస్ట్రిబ్యూటరీ 23లో పేరుకుపోయిన పూడిక, జమ్ము తొలగింపు పనులను శనివారం యంత్రాలతో చేపట్టారు. శుక్రవారం మండల కేంద్రంలో మంత్రి జూపల్లి కృష్ణారావు నిర్వహించిన సమీక్షలో గ్రామానికి చెందిన పలువురు రైతులు సమస్యను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. కాల్వలో పేరుకపోయిన పూడిక తొలగింపు పనులు వెంటనే చేపట్టాలని మంత్రి సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. దీంతో శనివారం అధికారులు పనులు ప్రారంభించడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తూ మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. -
చారకొండలో హీరో శర్వానంద్
చారకొండ: నిత్యం సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉండే సినీ హీరో శర్వానంద్ నాగర్‌కర్నూల్ జిల్లా చారకొండ మండల తహసీల్దార్ కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు. మండలంలోని జూపల్లి రెవెన్యూ శివారులో జేపల్లి సమీపాన భూమిని కొనుగోలు చేసిన ఆయన శనివారం రిజిస్ట్రేషన్ నిమిత్తం చారకొండ తహసీల్దార్ కార్యాలయానికి వచ్చారు. భూమికి సంబంధించిన పత్రాలతో నిబంధనల మేరకు తహసీల్దార్ ఉమ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిచేశారు. సుమారు 25 ఎకరాల భూమి కొ నుగోలు చేసినట్లు తెలిసింది. చారకొండకు సినీ హీరో రావడంతో అభిమానులు పెద్దఎత్తున తహసీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. రాజీ మార్గంతో సమయం, డబ్బు ఆదా కందనూలు: లోక్‌అదాలత్ ద్వారా కేసుల సత్వర పరిష్కారంతో కక్షిదారులు అప్పీల్ లేని తీర్పును పొంది.. సమయం, డబ్బును ఆదా చేసుకోవచ్చని జిల్లా జడ్జి రమాకాంత్ అన్నారు. సెప్టెంబర్ 12న నిర్వహించనున్న లోక్‌అదాలత్‌పై శనివారం జిల్లా కోర్టు హాల్లో పోలీసు అధికారులతో ఏర్పాటుచేసిన సమావేశంలో న్యాయమూర్తి మాట్లాడారు. లోక్‌అదాలత్‌లో భూ తగాదాలు, రాజీ చేసుకోదగిన క్రిమినల్ కేసులు, చెక్‌బౌన్స్, కుటుంబ తగాదాలు, మోటారు వాహనాల ప్రమాద కేసులు, బ్యాంకు కేసులు తదితర పెండింగ్ కేసులను పరిష్కరించుకోవచ్చని తెలిపారు. తద్వారా అప్పీల్ లేని తీర్పును పొందవచ్చన్నారు. కక్షిదారులు పగలు, ప్రతీకారాలు పెంచుకోకుండా ఇరు వర్గాలు రాజీ చేసుకోవడం ద్వారా మానవ సంబంధాలు బలపడతాయని అన్నారు. సెప్టెంబర్ 12న జిల్లాలోని న్యాయస్థానాల్లో నిర్వహించే లోక్‌అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. లోక్‌అదాలత్‌లో వీలైనన్ని ఎక్కువ కేసులు పరిష్కారమయ్యేలా చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులకు సూచించారు. సమావేశంలో స్పెషల్ సెషన్స్ జడ్జి నసీమా సుల్లానా, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి నిహారిక, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్‌జడ్జి శృతిదూత, సెకండ్ అడిషనల్ జూనియర్ సివిల్‌జడ్జి శ్రీనిధి ఉన్నారు. కార్మికుల హక్కుల పరిరక్షణే ధ్యేయం కందనూలు/కల్వకుర్తి రూరల్: కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం కృషి చేస్తున్నట్లు ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి అశ్వత్థామరెడ్డి అన్నారు. శనివారం నాగర్‌కర్నూల్, కల్వకుర్తి ఆర్టీసీ డిపోల వద్ద నిర్వహించిన గేట్ మీటింగ్‌ల్లో ఆయన మాట్లాడారు. తమ సంఘం చేపట్టే కార్యక్రమాలు కార్మికుల సంక్షేమం, అభ్యున్నతి కోసమేనని అన్నారు. ప్రభుత్వం ఆర్టీసీ విలీన ప్రక్రియ చేపట్టడానికి సిద్ధంగా ఉందని.. అందులో కార్మికుల పాత్ర కీలకంగా ఉండేందుకు రాబోయే కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో టీఎంయూను గెలిపించాలని కోరారు. కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నించామని.. ఎన్నో విజయాలతో కార్మికులకు న్యాయం చేసిన విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆయన అన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు అంజయ్య మాట్లాడుతూ.. కొంతమంది అసత్య ప్రచారాలు చేస్తూ, కార్మికులను వంచించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. అలాంటి వారి మాటలు నమ్మొద్దని సూచించారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు జగదీశ్వర్, రవి, శంకర్, నాగయ్య, అహ్మద్ ఖాన్, వీఎస్ నారాయణ, మధు, బాబురావు, పెంటయ్య, చంద్రయ్య, శేషమ్మ, మల్లయ్య, సంతోష్‌రెడ్డి, మంజుల, ఆరిఫ్, సదానందం పాల్గొన్నారు. -
పతకాల పంట!
కుస్తీ పట్టుతోరెజ్లింగ్లో సత్తా చాటుతున్న పాలమూరు ఆడబిడ్డలు ● మట్టి బరిలో మొదలైన ప్రస్థానం.. జాతీయ వేదికపై పతకాల వేట ● అంతర్జాతీయస్థాయిలో బరిలోకి దూసుకెళ్లే లక్ష్యం.. ఒకప్పుడు కుస్తీ అంటే మగవాళ్ల క్రీడగానే చూసేవారు. కానీ ఇప్పుడు అదే మట్టిబరిలో పాలమూరు ఆడబిడ్డలు సవాల్ విసురుతున్నారు. తండాల నుంచి వచ్చిన ఈ బాలికలు.. చెమట చిందిస్తూ, పట్టుదలతో సాధన చేస్తూ జాతీయస్థాయిలో పతకాలు కొల్లగొడుతున్నారు. గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతూ ప్రత్యర్థులను మట్టికరిపిస్తున్నారు. నారాయణపేట జిల్లా ధన్వాడ మండలానికి చెందిన గీత, నాగలక్ష్మి, ప్రియమణి, బాలమణి, సీతామహాలక్ష్మి రెజ్లింగ్‌లో తమదైన ముద్ర వేస్తున్నారు. గీత వరల్డ్ చాంపియన్‌షిప్ ట్రయల్స్‌కు సిద్ధమవుతుండగా.. నాగలక్ష్మి ‘తెలంగాణ కేసరి’గా నిలిచింది. మిగిలిన క్రీడాకారిణులూ జాతీయస్థాయి పోటీల్లో రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తూ భవిష్యత్తులో భారత జట్టు తరఫున అంతర్జాతీయ బరిలో దిగాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. – మహబూబ్‌నగర్ క్రీడలు చికర్లగడ్డతండాకు చెందిన ప్రియమణి ధన్వాడ కేజీబీవీలో ఇంటర్ చదువుతోంది. కొన్నేళ్లుగా రెజ్లింగ్‌లో శిక్షణ పొందుతున్న ఆమె జాతీయస్థాయి పోటీల్లో రాష్ట్ర జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించింది. 2025లో మహారాష్ట్రలో జరిగిన అండర్–15 నేషనల్స్, ఉత్తరప్రదేశ్‌లో జరిగిన అండర్–17 ఎస్జీఎఫ్ఐ నేషనల్స్‌లో పాల్గొంది. ఈ ఏడాది మహారాష్ట్రలో జరిగిన సబ్ జూనియర్ నేషనల్స్‌లోనూ రాష్ట్ర జట్టు తరఫున బరిలోకి దిగింది. రెజ్లింగ్‌లో మరింత రాణించి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం సాధించడమే తన లక్ష్యమని ప్రియమణి చెబుతోంది. -
పాఠశాలల నిర్వహణకు నిధులు
● ఒక్కో ఎమ్మార్సీకి రూ.90 వేల చొప్పున.. ● గతేడాది కంటే రూ.10 వేలు అదనం ● పర్యవేక్షణ మరింత పటిష్టం చేస్తామంటున్న విద్యాశాఖ అధికారులు నర్వ: ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన బోధన, మౌలిక వసతుల కల్పన, అల్పాహారం, మధ్యాహ్న భోజనం వంటి సౌకర్యాలు సక్రమంగా అందేలా ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టనుంది. ఇందుకోసం క్షేత్రస్థాయిలో పాఠశాలల పర్యవేక్షణ పూర్తి బాధ్యతలను ఎంఈఓలు, క్లస్టర్ జీహెచ్ఎంలకు అప్పగించి బాధ్యతలను మరింత పెంచింది. వీటి నిరంతర పర్యవేక్షణకు అవసరమైన నిధులను అంచనా వేసి అందుకు అనుగణంగా మంజూరు చేసింది. కొన్ని రోజులుగా నిధుల మంజూరు లేకపోవడంతో పర్యవేక్షణ కాస్తా తగ్గిందన్న ఆరోపణల నేపథ్యంలో ఎట్టకేలకు 2026–27 వార్షిక సంవత్సరానికి ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రూ.1.59 కోట్లు మంజూరైనట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఎంఈలు, క్లస్టర్ జీహెచ్‌ఎంల పర్యవేక్షణ.. పాఠశాలల పర్యవేక్షణ ఎమ్మార్సీల ద్వారా చేపట్టాల్సి ఉంటుంది. ప్రతి ఎంఈఓ నెలలో 20 పాఠశాలలని పర్యవేక్షించాలి. ఇందుకోసం ఒక్కో ఎమ్మార్సీకి రూ.90 వేలు ఖర్చు చేయాల్సి ఉంది. ఇందుకుగాను ఉమ్మడి జిల్లాకు రూ.70.20 లక్షలు మంజూరయ్యాయి. టీఎల్ఎం నిర్వహణ, పుస్తకాలు, దినపత్రికలకు రూ.20 వేలు.. స్టేషనరీ, నెట్ సౌకర్యం, ఆజదార్కిట్ వినియోగానికి రూ.25 వేలు, విద్యుత్ బిల్లులు, మరుగుదొడ్ల నిర్వహణ, కంప్యూటర్ మరమ్మతులకు రూ.20 వేలు వెచ్చించాల్సి ఉంది. ఖర్చులు పారదర్శకంగా నిర్వహించాలని విద్యాశాఖ ఆదేశాల్లో పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాలో ఇలా.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 207 సీఆర్సీలు, 78 ఎంఆర్సీలు ఉన్నా యి. వీటి నిర్వహణకుగాను ప్రభుత్వం గతేడాది ఒక్కో సీఆర్సీకి రూ.33 వేలు అందించగా.. ఈ ఏడాది రూ.10 వేలు పెంచి రూ.43 వేల చొప్పున రూ.89.01 లక్షలు మంజూరు చేసింది. నిధుల వినియోగం ఇలా.. రోజు పాఠశాలల పరిశీలన, రిపోర్టుల తయారీ, రిజిస్టర్లు, సమావేశాల నిర్వహణ, నెట్ సౌకర్యం, స్టేషనరీ, దినపత్రికల ఖర్చులకు ఈ నిధులను వెచ్చించనున్నారు. నిర్వహణకు రూ.20 వేలు, టీఎల్‌ఎంకు రూ.10 వేలు, సమావేశాలకు రూ.3 వేలు, స్టేషనరీ, నెట్చార్జీల కోసం రూ.10 వేలు వెచ్చించాల్సి ఉంటుంది. జిల్లాలో పాఠశాలల పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ప్రభుత్వం తాజాగా నిధులు విడుదల చేసింది. జిల్లాలోని అన్ని మండలాల్లో ఎంఆర్సీలు, సీఆర్సీలకు మంజూరైన నిధులతో మరింత బాధ్యతాయుతంగా క్షేత్రస్థాయిలో పరిశీలన చేసేలా చర్యలు తీసుకుంటాం. ఒక్కో సీఆర్సీకి గతేడాది కంటే అదనంగా రూ.10 వేలు మంజూరయ్యాయి. క్లస్టర్ల వారీగా నిర్వహిస్తున్న కాంప్లెక్స్ సమావేశాలను పరిశీలించి బోధన నైపుణ్యాలు పెంచేలా సూచనలు అందిస్తున్నాం. – విద్యాసాగర్, ఏఎంఓ, నారాయణపేట -
గణిత సామర్థ్యాల పెంపునకు చర్యలు
కందనూలు: విద్యార్థుల్లో ప్రాథమిక భాషా, గణిత సామర్థ్యాల పెంపునకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డీఈఓ రమేష్‌కుమార్ అన్నారు. శుక్రవారం డీఈఓ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ఎఫ్ఎల్ఎన్ సెల్ఫీ పాయింట్లలో ఫొటో దిగి విద్యాశాఖ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో చదవడం, రాయడం, అర్థం చేసుకోవడం, ప్రాథమిక గణిత నైపుణ్యాలను బలోపేతం చేయడం ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం అన్నారు. రాష్ట్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు విద్యార్థుల్లో ప్రాథమిక స్థాయి అక్షరాస్యత, సంఖ్యా పరిజ్ఞానం పెంపొందించేందుకు ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమం అమలు చేస్తున్నట్లు వివరించారు. విద్యార్థులు తదుపరి తరగతుల్లో విద్యను సులభంగా అభ్యసించేందుకు ప్రాథమిక దశలోనే భాషా, గణిత సామర్థ్యాలు పటిష్టంగా ఉండటం ఎంతో అవసరమని, విద్యార్థుల వయస్సు, తరగతి స్థాయికి అనుగుణంగా నిర్దిష్ట అభ్యసన లక్ష్యాలను నిర్దేశించి, వాటిని సాధించేలా బోధనా ప్రక్రియ కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. విద్యార్థులు అక్షరాలను గుర్తించడం, పదాలను చదవడం, వాక్యాలను అర్థం చేసుకోవడం, తమ ఆలోచనలను వ్యక్తపరచడం వంటి భాషా సామర్థ్యాలతోపాటు సంఖ్యలను గుర్తించడం, లెక్కించడం, కూడిక, తీసివేత వంటి ప్రాథమిక గణిత నైపుణ్యాలు సాధించేలా ఉపాధ్యాయులు కృషిచేయాలన్నారు. ఎఫ్ఎల్ఎన్పై విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజల్లో మరింత అవగాహన పెంచేందుకు ప్రతి ప్రాథమిక పాఠశాల, కాంప్లెక్స్, మండల విద్యాశాఖ కార్యాలయం వద్ద ప్రత్యేకంగా సెల్ఫీ పాయింట్లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ఆదేశించినట్లు డీఈఓ చెప్పారు. -
శ్రీశైలంలో 873.4 అడుగుల నీటిమట్టం
అచ్చంపేట: శ్రీశైలం జలాశయంలో శుక్రవారం సాయంత్రం 6 గంటల సమయానికి 873.40 అడుగుల వద్ద 156.0124 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎగువనున్న ఆల్మటి, నారాయణపూర్, జూరాల ప్రాజెక్టుల నీటి ప్రవాహం లేదు. దీంతో గురువారం 159.3828 టీఎంసీలు ఉన్న నీటిమట్టం విద్యుదుత్పత్తి, సాగు, తాగునీటికి వినియోగించుకోవడంతో సుమారు 3 టీఎంసీల నీటిమట్టం తగ్గినట్లయింది. ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ నాగార్జునసాగర్‌కు 35,315 క్యూసెక్కులు నీరు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి హంద్రీ– నీవా సుజల స్రవంతి కాల్వ ద్వారా 3,050, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి 8 వేల క్యూసెక్కుల నీటిని ఏపీ ప్రభుత్వం తరలిస్తోంది. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా తెలంగాణ 2,400 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తోంది. కురుమూర్తిలో ఘనంగా పవిత్రోత్సవాలు చిన్నచింతకుంట: శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని అమ్మాపురంలోని కురుమూర్తిస్వామి ఆలయంలో శుక్రవారం పవిత్రోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఆలయ బ్రాహ్మణులు యజ్ఞ మండపంలో స్వామివారికి, అమ్మవారికి బ్రహ్మకలశం, అష్టోత్తర శతనామార్చన, కలశాభిషేకం తదితర పూజలను వేదమంత్రోచ్ఛరణల మధ్య నిర్వహించారు. అనంతరం పవిత్రారోపణ కార్యక్రమంలో భాగంగా పవిత్ర మాలలను ఆలయ చైర్మన్ బత్తుల బాలు యజ్ఞ మండపం నుంచి ప్రధాన ఆలయం వరకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. స్వామివారు, అమ్మవారు, ఆళ్వార్లు, ఉత్సవమూర్తులు, ద్వారపాలకులు, గరుడవాహనం, ధ్వజస్తంభం, బలిపీఠానికి పవిత్ర మాలలను సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. గోవింద నామస్మరణతో ఆలయం మార్మోగింది. భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. నేషనల్ ఫుట్‌బాల్ పోటీలకు రోహిత్ మహబూబ్‌నగర్ క్రీడలు: కర్ణాటక రాష్ట్రం బెంగళూర్‌లో జరగనున్న జాతీయస్థాయి జూనియర్ ఫుట్‌బాల్ బీసీ రాయ్ ట్రోఫీలో జిల్లాకు చెందిన రోహిత్ మేఘావత్ ఎంపికై నట్లు జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ఎన్పీ వెంకటేశ్, భానుకిరణ్ తెలిపారు. 20 రో జులుగా హైదరాబాద్‌లో నిర్వహించిన సన్నాహక శిబిరంలో జిల్లా క్రీడాకారుడు ఉత్తమ ప్రతిభ కనబరిచినట్లు పేర్కొన్నారు. -
పోలీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా చిన్నునాయక్
కందనూలు: జిల్లా పోలీస్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన ఎన్నికల్లో జిల్లా పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా చిన్నునాయక్ (హెడ్‌కానిస్టేబుల్) ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ సంగ్రామ్ సింగ్జీ పాటిల్‌ను నూతన కార్యవర్గం మర్యాదపూర్వకంగా కలవగా.. ఆయన శుభాకాంక్షలు తెలిపి మాట్లాడారు. పోలీస్ అసోసియేషన్ అనేది కేవలం ఒక సంఘం మాత్రమే కాదని, అది పోలీస్ అధికారులు, సిబ్బంది సంక్షేమం, పరస్పర సహకారం, వృత్తిపరమైన అభివృద్ధి, సేవానిరతిని మరింత బలోపేతం చేసే కీలక వేదిక అన్నారు. పోలీస్ శాఖలోని ప్రతిఒక్కరి సమస్యల పరిష్కారం, సంక్షేమానికి నూతన కార్యవర్గం బాధ్యతాయుతంగా కృషి చేయాలని, విధి నిర్వహణలో సిబ్బంది ఎదుర్కొంటున్న సవాళ్లను గుర్తించి అధికారులు, సిబ్బందికి మధ్య వారదిగా ఉంటూ ముందుకు సాగాలని సూచించారు. ఉపాధ్యక్షులుగా అశోక్‌రెడ్డి (సీఐ), రాములు (ఎస్ఐ), కార్యదర్శిగా మాధవరెడ్డి(ఎస్ఐ), సహ కార్యదర్శిగా రమేష్, కార్య నిర్వాహక కార్యదర్శిగా రాములు, కోశాధికారిగా శ్రీనివాసులు, సభ్యులుగా రవివర్మ, నాగరాజు, శారద, శ్రీనయ్య, కిషోర్‌రెడ్డి, హరిలాల్లను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ శంకర్, ఏఓ కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. -
దరఖాస్తుల ఆహ్వానం
కందనూలు: జిల్లాస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులకు గాను దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ రమేష్‌కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వచ్చేనెల 5న నిర్వహించనున్న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక ప్రక్రియ చేపడుతున్నట్లు వివరించారు. జిల్లాలోని ప్రభుత్వ, జెడ్పీ, మోడల్, కేజీబీవీల్లో పనిచేస్తున్న ప్రిన్సిపల్స్, హెచ్ఎంలు (15 ఏళ్లు), ఉపాధ్యాయులు (పదేళ్లు) బోధనా అనుభవం గలవారు ఈ అవార్డుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు అర్హులన్నారు. ఆసక్తి గలవారు తమ దరఖాస్తులను సెప్టెంబర్ 1లోగా డీఈఓ కార్యాలయంలో అందజేయాలని, పూర్తి వివరాల కోసం అకడమిక్ మానిటరింగ్ అధికారి కిరణ్‌కుమార్ (90101 92288)ను సంప్రదించాలని సూచించారు. రోడ్డు పనులు పూర్తిచేయాలి వెల్దండ: మండలంలోని కొట్ర గేట్ వద్ద రోడ్డు నిర్మాణ పనులను జిల్లా రవాణ భద్రత శాఖ అధికారి శ్రీధర్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం 22 కిలోమీటర్ల బీటీరోడ్ల నిర్మాణానికి రూ.65 కోట్ల నిధులు మంజూరు చేసిందన్నారు. కాంట్రాక్టర్లు సకాలంలో రోడ్డు పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. కొట్రతండా నుంచి కల్వకుర్తి నాలుగు వరుసల రోడ్డు, కొట్ర గేట్ నుంచి రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం ఖానాపూర్ వరకు చేపట్టిన రెండు వరుసల రహదారి, కల్వర్టుల నిర్మాణాలను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించి.. బీటీరోడ్డు నిర్మాణ పనులను నాణ్యతగా చేపట్టాలన్నారు. కాంట్రాక్టర్లు ఆలస్యం చేయకుండా సకాలంలో పూర్తి చేయాలన్నారు. రోడ్డు పనులు పూర్తయితే వాహనదారులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. కార్యక్రమంలో డీఈఈ వెంకటస్వామి, ఏఈలు సయ్యద్సోయద్దీన్, లక్ష్మీపతి తదితరులున్నారు. నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలి వెల్దండ: గ్రామాల్లో రైతులు, విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించాలని విద్యుత్‌శాఖ హైదరాబాద్ రూరల్ జోన్ ఇంజినీయర్ బాలస్వామి సిబ్బందిని ఆదేశించారు. గురువారం ప్రజాబాటలో భాగంగా జిల్లా ఎస్సీ నరసింహారెడ్డితో కలిసి ఆయన వెల్దండ మండల కేంద్రంలోని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా సిబ్బంది చూడాలన్నారు. ప్రభుత్వం రైతులకు నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేసేందుకు కాలనీలు పెరిగిన చోట కొత్త ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో ఏపీఈ శంకరయ్య, ఎస్ఏఓ పార్థసారథి, ఏఈ వెంకటేశ్వర్‌గౌడ్, సిబ్బంది అంకిత, లక్ష్మణ్‌నాయక్, యాదయ్య, లస్కర్, యాదగిరి, రామకృష్ణ , భాను, సికిందర్ తదితరులు ఉన్నారు. మూలవిగ్రహాల ఫొటోలు తీయడం నిషేధం అలంపూర్: అలంపూర్ క్షేత్రంలో వెలసిన మూలమూర్తుల ఫొటోలు, వీడియోలు తీయడం నిషేధించినట్లు ఆలయ ఈఓ దీప్తి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. బాలబ్రహ్మేశ్వరస్వామి, జోగుళాంబదేవి మూల విగ్రహాలతోపాటు అమ్మవారి ఆలయంలోని శ్రీచక్రం ఫొటోలు, వీడియోలు తీయరాదని చెప్పారు. ఇకపై ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాతోపాటు సోషల్ మీడియా, యూట్యూబ్, ఇన్‌స్ట్రాగాంలలో రీల్స్ రూపంలో పోస్టు చేయరాదని పేర్కొన్నారు. మీడియాతోపాటు భక్తులు, ప్రజలు, ఆలయ అర్చక, సిబ్బంది ఈ విషయాన్ని గమనించి దేవస్థానానికి సహకరించాలని ఆమె కోరారు. 30న కేంద్ర మంత్రి రాక ఉండవెల్లి: జోగుళాంబ ఆలయ సందర్శన, జోగుళాంబ హాల్ట్ పర్యవేక్షణకు గాను కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆదివారం విచ్చేస్తున్నట్లు మంత్రి కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది. ముందుగా ఆదివారం సాయంత్రం రోడ్డు మార్గంలో అలంపూర్ క్షేత్రాన్ని దర్శించుకుని అక్కడ ప్రసాద్ స్కీం నిధులతో ఏర్పాటు చేస్తున్న లేజర్ లైట్‌ను వీక్షించి హరిత హోటల్లో బస చేస్తారన్నారు. అనంతరం సోమవారం జోగుళాంబ హాల్ట్ రైల్వేస్టేషన్ పనులను పరిశీలించి, ప్రయాణికుల సౌకర్యాలపై ఆరా తీసి పర్యవేక్షిస్తారు. అనంతరం గద్వాలకు బయలుదేరి వెళ్తారు. -
ఎస్సీల అభివృద్ధికే నిధులు ఖర్చు చేయాలి
కందనూలు: ఎస్సీల అభివృద్ధికి కేటాయించిన నిధులను వారి కోసమే ఖర్చు చేయాలని ఎంపీ మల్లురవి అన్నారు. గురువారం కలెక్టరేట్లో కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అధ్యక్షతన నిర్వహించిన స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్‌పై సమీక్ష సమావేశానికి ఎంపీ హాజరై మాట్లాడారు. షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి కోసం ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులు కేవలం లెక్కల్లో కాకుండా.. వాటి ద్వారా ప్రజలకు ప్రత్యక్షంగా ప్రయోజనం కలిగేలా చూడాలన్నారు. ఎస్సీ వర్గాల సామాజిక, ఆర్థిక, విద్యాభివృద్ధితోపాటు మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న ఎస్సీ కుటుంబాలకు అవసరమైన ఆరోగ్యం, రహదారులు, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్య, మౌలిక సదుపాయాలు తదితర అంశాలను గుర్తించి, అందుబాటులో ఉన్న నిధులను సమర్థవంతంగా వినియోగించాలని చెప్పారు. ప్రతి శాఖకు మంజూరైన నిధులపై సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. నిధుల వినియోగానికి ముందుగానే కార్యాచరణ రూపొందించుకొని, అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేసి పనులను సకాలంలో ప్రారంభించాలని పేర్కొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాకు మంజూరైన నిధులను సకాలంలో, నిబంధనల మేరకు వినియోగించేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. -
అనుబంధాల వేడుక
ఆత్మీయుల కలయిక.. ఆనందంగా జరుపు కొంటాం.. సరిపోని బస్సులు రాఖీ పండుగ నేపథ్యంలో గురువారం మహబూబ్‌నగర్‌తోపాటు ఉమ్మడి జిల్లాలో బస్టాండ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. –9లో u●హిందూ సంప్రదాయంలో అనుబంధాలు, ఆప్యాయతలకు ఎక్కువగా ప్రాముఖ్యత ఇచ్చే రాఖీ పండుగ వచ్చిందంటే ఊరు, వాడ అంతా సందడే. చిన్నాపెద్ద తేడా లేకుండా ప్రతిఒక్కరూ జరుపుకొనే ఈ పండుగకు మార్కెట్లు, దుకాణాలు సందడిగా మారాయి. గత మూడు రోజుల నుంచే జిల్లాకేంద్రంలోని బస్టాండ్, అంబేడ్కర్ చౌరస్తా, నల్లవెల్లి రోడ్, శ్రీపురం చౌరస్తాలతోపాటు ప్రధాన పట్టణాలు, గ్రామాల్లోని దుకాణాల్లోనూ రాఖీల అమ్మకాల జోరు కొనసాగుతుంది. మారుతున్న కాలానికి, అభిరుచులకు అనుగుణంగా, దుకాణదారులు పలు ఆకృతుల్లో రాఖీలను అందుబాటులో ఉంచారు. ఆధునిక కాలంలోనూ ఆదరణ తగ్గని రాఖీ పండుగ ఎక్కడున్నా తమవారికి రాఖీలు పంపి.. సంబురం సోషల్ మీడియాలోనూ శుభాకాంక్షల వెల్లువ అప్యాయత, అనురాగాలను చాటే ‘రక్షా’నుబంధం చిన్నారులకు రాఖీ పండుగ అంటే మరీ సరదా. అక్క, చెల్లిని అడిగి మరీ రాఖీ కట్టించుకుంటారు. దీంతో చిన్నారుల అభిరుచికి తగ్గట్టుగా బాల గణేష్, భీమ్, బెన్‌టెన్, మిక్కీమౌస్ లాంటి బొమ్మల రాఖీలు ఉన్నాయి. రంగురంగుల లైట్లు వెలుగుతూ అందంగా కనిపించే రాఖీలు సైతం పిల్లల కోసం కొనుగోలు చేస్తుంటారు. సోదర, సోదరీమణులు ఉత్సాహంగా జరుపుకొనేదే రాఖీ పండుగ. మేము నలుగురం అక్కాచెల్లెళ్లం. ప్రతి ఏడాది అందరం కలిసి మా ఊరెళ్లి అన్నా, తమ్ముడికి రాఖీ కడుతాం. ఈ పండుగను కుటుంబ సభ్యులతో కలిసి ఎంతో ఆనందంగా జరుపుకొంటాం. – శాంతమ్మ, పెద్దకొత్తపల్లి ఈ ఏడాది రాఖీ గిరాఖీలు పెద్దగా లేవు. వర్షాలు పడక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొందరు కొనుగోలు చేయాలని ఆలోచన ఉన్నా.. ఆన్లైన్లో ఆర్డర్ పెడుతున్నారు. మొత్తంగా గతేడాది కంటే ఈసారి గిరాకీ బాగా తగ్గిందనే చెప్పాలి. – సురేందర్‌రావు, వ్యాపారి, నాగర్‌కర్నూల్ -
విద్య, వైద్యరంగాల్లో సమస్యలు పరిష్కరించాలి
అమరచింత: రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలలో అత్యంత ప్రధానమైన విద్య, వైద్యరంగాలను పూర్తిస్థాయిలో విస్మరించిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ అన్నారు. మండల కేంద్రంలోని సీపీఎం కార్యాలయంలో గురువారం విలేకరులతో మాట్లాడారు. విద్య, వైద్య రంగాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలంటూ ఈనెల 31న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు, మండల కేంద్రాల్లో సీపీఎం ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహించేందుకు శ్రీకారం చుట్టామన్నారు. వీటిపై ఇప్పటికే అన్ని జిల్లాల కార్యదర్శులకు సమాచారం అందించామన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చే యాలని, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని, పాఠశాలల్లో కనీస వసతులను ఏర్పా టు చేయాలని డిమాండ్ చేశారు. వైద్యరంగంలో ఖాళీ పోస్టులను భర్తీ చేయడంతోపాటు అన్నిరకాల సేవలను అందించాలన్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో విచ్చలవిడిగా వసూలు చేస్తున్న ఫీజుల నియంత్రణకు ప్రత్యేక చట్టం తేవాలని ప్రభుత్వానికి సూచించారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి సభ్యులు జీఎస్.గోపి, మండల కార్యదర్శివర్గ సభ్యులు వెంకటేష్, అజయ్, శంకర్ పాల్గొన్నారు. -
విత్తన వ్యాపారంలోకి పీఏసీఎస్‌లు
● ఉత్పత్తి నుంచి ప్రాసెసింగ్, మార్కెటింగ్ వరకు సంఘాలదే బాధ్యత ● రైతులకు నాణ్యమైన విత్తనాలు.. సంఘాలకు స్థిరమైన ఆదాయం ● ఐదు జిల్లాల్లో 9 పీఏసీఎస్‌లతో పైలట్ ప్రాజెక్టు మహబూబ్‌నగర్ (వ్యవసాయం): రైతులకు రుణాలు, ఎరువులు, విత్తనాల పంపిణీకే పరిమితమైన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (పీఏసీఎస్) ఇక విత్తనోత్పత్తి వ్యాపారంలోకి అడుగుపెట్టనున్నాయి. నాణ్యమైన విత్తనాల ఉత్పత్తితో పాటు ప్రాసెసింగ్, నిల్వ, మార్కెటింగ్ చేపట్టి ఆదాయాన్ని పెంచుకోనున్నాయి. స్థానికంగానే నాణ్యమైన విత్తనాలు లభించడంతో రైతులకూ ప్రయోజనం చేకూరనుంది. ఈ నేపథ్యంలో పీజేటీఎస్ఏయూ ఆధ్వర్యంలో గురువారం మహబూబ్‌నగర్ డీసీసీబీలో అవగాహన సదస్సు నిర్వహించారు. మహబూబ్‌నగర్, జోగుళాంబ గద్వాల, నారాయణపేట, వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లాలకు చెందిన 9 పీఏసీఎస్‌ల ప్రతినిధులు, సీఈఓలతో పాటు సుమారు 50 మంది రైతులు పాల్గొన్నారు. గ్వాలియర్ యూనివర్సిటీ మాజీ వీసీ ఎస్కే రావు మాట్లాడుతూ నాణ్యమైన విత్తనమే అధిక దిగుబడి, రైతుల ఆదాయానికి కీలకమన్నారు. పీఏసీఎస్‌లు విత్తనోత్పత్తిని లాభదాయక వ్యాపారంగా అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. పీజేటీఎస్ఏయూ ప్రాజెక్టు ప్రధాన పరిశోధకులు డాక్టర్ ఎంవీ నాగేష్ మాట్లాడుతూ విత్తన ఎంపిక నుంచి సాగు, నాణ్యత నియంత్రణ, ప్రాసెసింగ్, నిల్వ, పంపిణీ వరకు ప్రతి దశలో ప్రమాణాలు పాటించాలని తెలిపారు. ప్రాజెక్టు మేనేజర్ డాక్టర్ విద్యాధర్ మాట్లాడుతూ పీజేటీఎస్ఏయూ, నాబార్డు, సహకార శాఖ, పీఏసీఎస్‌లు, రైతుల సమన్వయంతో ప్రాజెక్టును విజయవంతం చేయవచ్చన్నారు. ఆర్‌ఏఆర్‌ఎస్ పాలెం ఏడీఆర్ డాక్టర్ ఎల్.కృష్ణ మాట్లాడుతూ విత్తనోత్పత్తికి అవసరమైన సాంకేతిక సహకారం అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో డీసీసీబీ సీఈఓ మహ్మద్ షఫీ ఉల్లా ఖాన్, నాబార్డు డీడీఎంలు షణ్ముఖచారి, మహేందర్, డీసీఓ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
400 ఏళ్ల ‘నూలు’ పండుగ
అచ్చంపేట: రాఖీ పండుగంటే సాధారణంగా అక్కాచెల్లెళ్లు, తమ సోదరులకు రాఖీలు కట్టి వేడుకగా చేసుకుంటారు. అయితే అచ్చంపేటలో పద్మశాలీలు మాత్రం వినూత్నంగా జరుపుకొంటారు. రాఖీ పండుగను నూలు పుట్టిన పండుగగా నిర్వహిస్తారు. ఇది 400 ఏళ్ల నుంచి వస్తున్న ఆనవాయితీ. పురాణాల్లో నూలు గురించి ఉంది. ఈ రోజు నూలు పుట్టిందని, నూలుతో తయారు చేసిన కంకణం కట్టుకొని చేపట్టే ప్రతి కార్యంలో సకల శుభాలు కలుగుతాయని పద్మశాలీల నమ్మకం. మార్కెట్లో ఎన్ని రకాల రాఖీలు వచ్చినా పద్మశాలీలు మాత్రం పత్తి నుంచి తయారు చేసిన నూలు కంకణాన్ని చేతికి కట్టుకోవడం ఆనవాయితీ. 46వ నూలు పూర్ణిమ సందర్భంగా గురువారం సాయంత్రం అచ్చంపేటలోని శ్రీరాంనగర్‌కాలనీకి చెందిన కోటకిశోర్ ఇంటి వద్ద ప్రత్యేక పూజల అనంతరం శివపార్వతులను అశ్వవాహనంపై విశేష అలంకరణతో పద్మశాలి మహిళా సంఘం ఆధ్వర్యంలో పురవీధుల గుండా అంగరంగ వైభవంగా ఊరేగించారు. మహిళలు కోలాటాలు, డప్పులు, మంగళవాయిద్యాలు, హారతులు, అడుగుల భజనలతో భక్త మార్కండేయ శివాలయం వరకు ఊరేగింపు కొనసాగింది. అనంతరం మార్కండేయ ఆలయంలో అఖండ భజనలు నిర్వహించారు. నూలు పూర్ణిమను సంప్రదాయబద్ధంగా, శుభసూచికగా భావించి జరుపుకొంటాం. ఎంతో నిష్టగా ఉండి నూలుతో కంకణం, జంధ్యం తయారు చేసి.. ధరిస్తాం. ఈ సంప్రదాయం భవిష్యత్ తరాలు కొనసాగించేలా చైతన్యం చేస్తున్నాం. అనాదిగా పద్మశాలీలు నూలు పుట్టిన దినాన్ని రాఖీ పౌర్ణమి నాడు జరుపుకోవడం ఆనవాయితీ. అచ్చంపేటలో 46 ఏళ్లుగా సామూహికంగా చేపడుతున్నాం. – కిశోర్, పద్మశాలి సంఘం అధ్యక్షుడు, అచ్చంపేట -
భక్తిశ్రద్ధలతో మిలాద్ ఉన్ నబీ
కందనూలు: మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకొని బుధవారం జిల్లావ్యాప్తంగా ముస్లింలు మిలాద్ ఉన్ నబీ వేడుకలను భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. ఈ సందర్భంగా మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేసిన అనంతరం భారీ ర్యాలీ నిర్వహించారు. జిల్లా కేంద్రంలో జామ మసీదు నుంచి పురవీధుల మీదుగా ర్యాలీ కొనసాగింది. జామియా నిజామియా అరబీ యూనివర్సిటీకి చెందిన మౌలానా ముఫ్తీ మొహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్ ఖాద్రి, ఖతీబ్ ముఫ్తీ గుల్జార్ అహ్మద్ మిస్బాహి మహమ్మద్ ఆధ్యాత్మిక బోధన చేశారు. ప్రతి ముస్లిం అల్లా సూచించిన మార్గంలో నడవాలని సూచించారు. కార్యక్రమంలో మసీదు కమిటీ సభ్యులు, ఫిక్రే రజా ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. -
పర్యాటక సందడి
● సోమశిలలో బోటు షికారికి పర్యాటకుల ఆసక్తి ● ఏడు రకాల బోట్లను అందుబాటులో ఉంచిన టూరిజంశాఖ ● బోటింగ్ సమయం : ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొల్లాపూర్: శ్రీశైలం జలాశయానికి వరద జలాలు రావడంతో కృష్ణానది కళకళలాడుతోంది. నదీ తీర ప్రాంతాల్లో కృష్ణమ్మ అందాలను తిలకించేందుకు, టూరిజంశాఖ ఏర్పాటుచేసిన బోట్లలో విహరించేందుకు పర్యాటకులు ఆసక్తి చూపుతున్నారు. అలాగే అటవీశాఖ ఆధ్వర్యంలో నల్లమల అటవీ ప్రాంతంలో నిర్మించిన సోమశిల వ్యూ పాయింట్‌ను తిలకించేందుకు బారులు తీరుతున్నారు. రెండు, మూడు వారాలుగా కృష్ణానదీ తీర ప్రాంతాల్లో పర్యాటకుల సందడి పెరిగింది. నదీ తీర ప్రాంతాల్లో ఇలా.. శ్రీశైలానికి వరద జలాల ప్రవాహం నిలకడగా కొనసాగుతుండటంతో సోమశిల వద్ద పర్యాటక బోట్ల సేవలను ఇటీవలే ప్రారంభించారు. ఏడు రకాల బోట్లు పర్యాటకులు విహరించేందుకు అందుబాటులో ఉన్నాయి. అయితే టికెట్ల బుకింగ్ కోసం ఆన్లైన్ సేవలను ఇంకా ప్రారంభించలేదు. ఆఫ్‌లైన్‌లోనే టికెట్ల విక్రయాలు సాగుతున్నాయి. హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులు నదిలో బోటింగ్‌కు ఆసక్తి చూపుతున్నారు. అదే విధంగా అమరగిరి, మంచాలకట్ట, మల్లేశ్వరం, జటప్రోల్ ప్రాంతాలను కూడా పర్యాటకులు తిలకిస్తున్నారు. అయితే ఆయా ప్రాంతాల్లో పర్యాటకులకు అవసరమైన సౌకర్యాలు లేకపోవడంతో కొంత ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొరవడిన నిఘా.. కొల్లాపూర్ నియోజకవర్గంలోని పర్యాటక ప్రాంతాల్లో నిఘా వ్యవస్థలను పటిష్టంగా ఏర్పాటుచేయాలని స్థానికులు కోరుతున్నారు. ఇటీవల సోమశిలలో కొందరు పర్యాటకులు అర్ధరాత్రి సమయంలో బోటింగ్ సిబ్బందిపై దాడి చేశారు. రాజకీయ నాయకుల జోక్యంతో దాడికి పాల్పడిన వారిపై నామమాత్రపు కేసులు నమోదుచేసి వదిలిపెట్టారు. దీంతో స్థానికులు భయందోళనకు గురవుతున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి దాడులు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారిని గుర్తించేందుకు పకడ్బందీ నిఘా వ్యవస్థను ఏర్పాటుచేయాలని కోరుతున్నారు. అమరగిరి, మంచాలకట్ట, మల్లేశ్వరం, జటప్రోల్ వంటి ప్రాంతాల్లో కూడా రక్షణ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. స్పీడ్ బోట్: ఒక్క ట్రిప్పు రూ.400 చార్జీ ఉంటుంది. నలుగురు వ్యక్తులు తిరగొచ్చు. అదనంగా మరో ఇద్దరికి అవకాశం ఉంటుంది. అదనపు వ్యక్తులు రూ.100 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. మినీ లాంచీ : ఇందులో 60మంది వరకు ప్రయాణించవచ్చు. పెద్దలకు రూ.100, పిల్లలకు రూ.50 చార్జీ వసూలు చేస్తున్నారు. జెట్స్కీ బోట్ : ఒక వ్యక్తి మాత్రమే దీనిపై రైడ్ చేయవచ్చు. టికెట్ చార్జీ రూ.500 ఉంటుంది. ఫనీయాక్ : ఇందులో ఐదుగురు ప్రయాణించవచ్చు. ఒక్కో వ్యక్తికి రూ.200 టికెట్ చార్జీ. పెడల్ బోట్ : ఇందులో నలుగురు ప్రయాణించవచ్చు. ఒక్కొక్కరికి రూ.100 చొప్పున వసూలు చేస్తున్నారు. కై యాక్ బోట్ : ఇందులో ఇద్దరు వ్యక్తులు మాత్రమే ప్రయాణిస్తారు. ఒక్కో వ్యక్తికి రూ.150 టికెట్ చార్జీ. స్వాన్బోట్ : ఇందులో ఇద్దరు వ్యక్తులు ప్రయాణించవచ్చు. ఒక్కో వ్యక్తికి రూ.150 టికెట్ చార్జీ. వ్యూ పాయింట్ తిలకించేందుకు ఒక్క ట్రిప్పు రూ.800 ధర నిర్ణయించారు. వాహనంలో 4 నుంచి 6 మంది వరకు వెళ్లొచ్చు. ప్రయాణ సమయం 40 నిమిషాలు. రెండు వాహనాలు అందుబాటులో ఉంటాయి. ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు వీక్షించవచ్చు. అటవీశాఖ ఆధ్వర్యంలో కొల్లాపూర్ సమీపంలో ఎకో పార్కు నిర్మించారు. అక్కడి నుంచి 3 కి.మీ. దూరంలో నల్లమల అడవిలో ఎత్తయిన కొండపై వ్యూ పాయింట్ ఏర్పాటుచేశారు. ఇక్కడినుంచి చూస్తే సోమశిల గ్రామంతో పాటు కృష్ణానది ప్రవాహం, నల్లమల పచ్చదనం కంటికి ఇంపుగా కనిపిస్తుంది. వ్యూ పాయింట్ సేవలను గతనెల 8న రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. నాటి నుంచి వ్యూ పాయింట్‌ను తిలకించేందుకు కూడా పర్యాటకులు వస్తున్నారు. వారి కోసం అటవీశాఖ అధికారులు రెండు వాహనాలను ఏర్పాటుచేశారు. టికెట్ బుకింగ్ ఆఫ్‌లైన్‌లోనే కొనసాగుతోంది. పర్యాటకులకు నల్లమల అందాలను చూపించేందుకు సోమశిల నుంచి అమరగిరి వరకు నూతనంగా మట్టిరోడ్డు నిర్మించారు. -
పాలకుల వైఫల్యంతో రైతులకు ఇబ్బందులు
నాగర్‌కర్నూల్: పాలకుల వైఫల్యంతో రైతులకు ఇబ్బందులు కలుగుతున్నాయని మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి విమర్శించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల ఉమ్మడి జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులను సందర్శించిన ముఖ్యమంత్రి, మంత్రులు వెంటనే రూ. 1,000 కోట్లు మంజూరు చేస్తామని ఇచ్చిన హామీని ఎందుకు నిలబెట్టుకోలేదని ప్రశ్నించారు. పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను నార్లాపూర్ వద్ద ప్రారంభిస్తే.. కేఎల్‌ఐకి ఇబ్బందులు ఏర్పడతాయని లేఖలు రాసినా పట్టించుకోకపోవడంతో ఐదు మోటార్లు ధ్వంసమయ్యాయన్నారు. సంవత్సరాలు గడుస్తున్నా వాటికి మరమ్మతు చేయించడంలో పూర్తిగా విఫలమయ్యారని అన్నారు. రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు కక్కుర్తి వల్లే ప్రభుత్వం కాల్వల సామర్థ్యం కుదించిందని.. నార్లాపూర్ నుంచి అండర్ గ్రౌండ్ పనులకు అనుమతులు కమీషన్ల వల్లే ఇచ్చారని ఆరోపించారు. వట్టెం రిజర్వాయర్ ద్వారా డిండి ప్రాజెక్టుకు నీటిని తరలించే అవకాశం ఉన్నా.. కమీషన్ల కోసం ఏదుల నుంచి నీటిని తరలించేందుకు నిధులను మంజూరు చేశారని విమర్శించారు. సాగునీటి పారుదలశాఖ మంత్రిగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఉండటంతో నల్లగొండ జిల్లాకు నీటిని తరలించేందుకు రూ. 1,800 కోట్లు మంజూరు చేశారని.. మరి ఈ ప్రాంత ఎమ్మెల్యేలు ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. ఉద్యమాల ద్వారానే ఉమ్మడి పాలమూరు ఆయకట్టుకు సాగునీరు అందుతుందని.. ఈ మేరకు రైతులను చైతన్యం చేసి పాలకుల వైఫల్యాలను ఎండగడతానని అన్నారు. సమావేశంలో నాయకులు నాగం శశిధర్‌రెడ్డి, అర్థం రవి, బాలాగౌడ్ ఉన్నారు.


