మన్యంకొండ హుండీ ఆదాయం రూ.37.64 లక్షలు
మహబూబ్‌నగర్ రూరల్: మన్యంకొండ శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం హుండీ ఆదాయం రూ.37,64,907 ఆదాయం వచ్చింది. ఇటీవలి బ్రహ్మోత్సవాల సందర్భంగా గురువారం ఈ హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఈ లెక్కింపు సాయంత్రం 7 గంటలకు సాగింది. కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ అళహరి మధుసూదన్‌కుమార్, ఈఓ శ్రీనివాసరాజు, సూపరింటెండెంట్ నిత్యానందచారి, ఇన్‌స్పెక్టర్ వీణ, ఐడీబీఐ మేనేజర్ మల్లిఖార్జున్, సత్యసాయి సమితి, మహిళా మండలి సభ్యులు పాల్గొన్నారు.


