గిఫ్ట్‌గా 24 క్యారెట్ల బంగారు బిస్కెట్లు..! ఎక్కడంటే.. | 24 Carat Gold Biscuits For Grooms Family At Saudi Arabia Goes Viral | Sakshi
Sakshi News home page

గిఫ్ట్‌గా 24 క్యారెట్ల బంగారు బిస్కెట్లు..! ఎక్కడంటే..

Feb 12 2026 5:19 PM | Updated on Feb 12 2026 5:37 PM

24 Carat Gold Biscuits For Grooms Family At Saudi Arabia Goes Viral

బంగారం ధర ఏ రేంజ్‌లో ఉందంటే..కొనాలనే ఆలోచన కూడా మనసులోకి రావడం లేదు. అంతగా భయపెడుతున్నాయ్‌ దాని ధరలు. అలాంటిది ఇక్కడొక పెళ్లి వేడుకలో ఏకంగా 24 క్యారెట్ల బంగారు బిస్కెట్లను గిఫ్ట్‌గా అందిస్తున్నారు. ఎంత ధనవంతులైనా..బంగారం గిఫ్ట్‌గా ఇవ్వడమా..?! అని సందేహం వస్తుంది కదా..!. కానీ ఇది నమ్మక తప్పని నిజం. 

ఈ విచిత్ర ఘటన సౌదీ అరేబియాలో చోటు చేసుకుంది. ఒక వివాహంలో వధువు కుటుంబం వరుడి కుటంబానికి బంగారు బిస్కెట్లను బహుమతిగా ఇస్తోంది. అవి కూడా 24 క్యారెట్ల బంగారు బిస్కెట్లను ఏదో చాక్లెట్లను పంచినట్లుగా ఇస్తున్న తీరు చూస్తే మతిపోతుంది. విలాసవంతమైన పెళ్లిళ్లు ఎన్నో చూసుంటాం గానీ..ఇలా బంగారు బిస్కెట్లను బహుమతులుగా ఇవ్వడg ఇదే తొలిసారేమో కాబోలు. 

అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. 33 సెకన్ల ఆ వీడియో క్లిప్‌లో ఒక వ్యక్తి ఒక బాక్స్‌ నిండుగా బంగారు బిస్కెట్లను తీసుకొచ్చి ..అక్కడున్న మగవాళ్ల ముందు పెట్టడం..వాళ్లు తీసుకోవడం స్పష్టంగా కనిపిస్తుంది. అయితే నెటిజన్లు అవి బంగారం కాదని వాదిస్తున్నారు. 

మరికొందరు దీనిని దుబారా లేదా తమ ఐశ్వర్యాన్ని ప్రదర్శించుకోవడంగా విమర్శిస్తే..చాలామంది మాత్రం..బంగారు రేకుతో చుట్టబడిన లగ్జరీ చాక్లెట్లని, మధ్యప్రాచ్యంలోని కొన్ని ప్రాంతాలలో, ముఖ్యంగా వివాహాలు, పండుగ సమావేశాల ఇలాంటి చాక్లెట్లని పంచడం ఆచారమని పేర్కొనడం గమనార్హం. అలాగే ఆరేబియాలో గోల్డ్‌ రేకుతో చుట్టబడిన పాచీ వంటి లగ్జరీ చాక్లెట్‌ బ్రాండ్‌లు బాగా ఫేమస్‌ కూడా. దాంతో చాలామంది అవి బంగారం కాదని తేల్చి చేప్పేస్తుండటం గమనార్హం.

 

(చదవండి: ఆ పెంగ్విన్‌ని చూసి కన్నీళ్లొచ్చేశాయ్‌..! ఆలుమగలకు అసలైన అర్థం..)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement