ఈ రాశి వారు సన్నిహితుల నుండి శుభవార్తలు వింటారు.. ధనలబ్ధి పొందుతారు | Rasi Phalalu: Daily Horoscope On 07-02-2026 In Telugu | Sakshi
Sakshi News home page

TodaHoroscope In Telugu: ఈ రాశి వారు సన్నిహితుల నుండి శుభవార్తలు వింటారు.. ధనలబ్ధి పొందుతారు

Feb 7 2026 12:29 AM | Updated on Feb 7 2026 12:29 AM

Rasi Phalalu: Daily Horoscope On 07-02-2026 In Telugu

గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘ మాసం, తిథి: బ.షష్ఠి రా.3.57 వరకు, తదుపరి సప్తమి, నక్షత్రం: చిత్త రా.3.48 వరకు, తదుపరి స్వాతి, వర్జ్యం: ఉ.10.41 నుండి 12.24 వరకు, దుర్ముహూర్తం: ఉ.6.34 నుండి 8.07 వరకు, అమృత ఘడియలు: రా.8.56 నుండి 10.38 వరకు.

సూర్యోదయం :    6.35
సూర్యాస్తమయం     :  5.54
రాహుకాలం : ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం :  ప.1.30 నుండి 3.00 వరకు 

మేషం: పనులు సకాలంలో పూర్తి. సంఘంలో గౌరవం. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. ధనలాభం. నూతన విద్యావకాశాలు లభిస్తాయి. వ్యాపారవృద్ధి. ఉద్యోగులకు హోదాలు.

వృషభం: రుణాలు చేస్తారు. దూరప్రయాణాలు. ఆరోగ్యభంగం. బంధువులతో తగాదాలు. పనుల్లో ప్రతిబంధకాలు. మిత్రుల నుండి ఒత్తిడులు.  వ్యయప్రయాసలు. వృత్తి, వ్యాపారాలు నిరాశ.

మిథునం: ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. పనులు వాయిదా వేస్తారు. ఉద్యోగయత్నాలు మందగిస్తాయి. కష్టపడ్డా ఫలితం కనిపించదు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.

కర్కాటకం: పలుకుబడి పెరుగుతుంది. భూలాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు ఊహించని మార్పులు. ఆలయాలు సందర్శిస్తారు..

సింహం: మిత్రులతో కలహాలు. రుణయత్నాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో సమస్యలు. అనారోగ్యం. విద్యార్థులకు నిరాశ. వృత్తి, వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటుంది.

కన్య: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. ఆస్తిలాభం. పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి. సోదరులతో సఖ్యత. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు పదోన్నతులు.

తుల: సన్నిహితులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగులకు మార్పులు.

వృశ్చికం: శుభవార్తలు వింటారు. బంధువులను కలుసుకుంటారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. కొన్ని వివాదాల పరిష్కారమవుతాయి. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి.

ధనుస్సు: ఇంటర్వ్యూలు రాగలవు. ఆస్తివిషయంలో ఒప్పందాలు. ఆర్థిక లాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు హోదాలు.

మకరం: రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో సమస్యలు.. అనారోగ్యం. మిత్రులతో కలహాలు. నిరుద్యోగుల యత్నాలు మందగిస్తాయి. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

కుంభం: పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. కుటుంబంలో చికాకులు. ఆధ్యాత్మిక చింతన. ఇంటాబయటా సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

మీనం: దూరపు బంధువుల కలయిక. విందువినోదాలు. స్థిరాస్తి వృద్ధి. కీలక నిర్ణయాలు. ఆలయాలు సందర్శిస్తారు. నూతన ఉద్యోగయోగం. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement