breaking news
Sports
-
CWG 2026: భారత్‌కు మరో పతకం ఖాయం చేసిన సాక్షి
కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్‌కు మరో పతకం ఖరారైంది. ఇప్పటికే 12 పతకాలతో (2 స్వర్ణాలు, 7 రజతాలు, 3 కాంస్యాలు) పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉన్న భారత్ మరో పతకం ఖాయం చేసుకొని పట్టికలో మరింత మెరుగైన స్థానానికి వెళ్లే దిశగా సాగుతోంది.మహిళల బాక్సింగ్ 51 కేజీల విభాగంలో సాక్షి చౌదరి ఈ పతకాన్ని ఖాయం చేసింది. క్వార్టర్ఫైనల్లో ఉత్తర ఐర్లాండ్‌కు చెందిన కైట్లిన్ ఫ్రయర్స్‌ను 5-0 తేడాతో చిత్తు చేసి సెమీఫైనల్‌కు దూసుకెళ్లడంతో ఆమెకు కనీసం కాంస్య పతకం ఖరారైంది.ఈ బౌట్లో ఆరంభం నుంచే పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన సాక్షి మూడు రౌండ్లలోనూ ఏకగ్రీవంగా 5-0 స్కోరుతో విజయం సాధించింది. వేగవంతమైన కదలికలు, కచ్చితమైన పంచ్‌లతో ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా మ్యాచ్‌ను తన ఆధీనంలో ఉంచుకుంది.ఫైనల్ బెర్త్ కోసం శుక్రవారం జరిగే సెమీఫైనల్లో కెనడాకు చెందిన అంబర్-జేన్ వాల్‌తో సాక్షి తలపడనుంది. అంతకుముందు ప్రీక్వార్టర్ఫైనల్లో బోట్స్వానాకు చెందిన లెథాబో మొడుకనెలెపై విజయం సాధించి సాక్షి క్వార్టర్‌ఫైనల్‌కు అర్హత సాధించింది.ఇదిలా ఉంటే, ఈ పోటీల్లో భారత బాక్సర్ల పోరు కొనసాగనుంది. మహిళల 70 కేజీల విభాగంలో అరుంధతి చౌదరి న్యూజిలాండ్‌కు చెందిన మోర్గాన్ హెండర్సన్‌తో క్వార్టర్ఫైనల్లో పోటీ పడనుండగా.. పురుషుల 60 కేజీల విభాగంలో సచిన్ సివాచ్ బోట్స్వానాకు చెందిన ట్రెజర్ మోరెమితో.. 80 కేజీల విభాగంలో అంకుష్ యాదవ్ సీషెల్స్‌కు చెందిన జేడ్ మికాక్తో, 90 కేజీల విభాగంలో నరేందర్ బెర్వాల్ సమోవాకు చెందిన మైఖేల్ సెకోతో క్వార్టర్‌ఫైనల్ బరిలోకి దిగనున్నారు. -
వైభవ్ కాదు!.. ఈ యువ ఆటగాడికి భారీ డిమాండ్!
ఐపీఎల్ ఫ్రాంఛైజీలు ఇప్పటికే 2027 సీజన్ కోసం కసరత్తు మొదలుపెట్టేశాయి. ముఖ్యంగా మినీ వేలం నేపథ్యంలో ట్రేడ్ విండో ఓపెన్ కావడంతో తమకు కావాల్సిన ఆటగాళ్లను చేర్చుకునే విధంగా చర్చలు మొదలుపెట్టాయి. ఇందులో భాగంగా టీమిండియా స్టార్ హార్దిక్ పాండ్యా పేరు హైలైట్ అవుతోంది.హార్దిక్ కోసం దాదాపు ఎనిమిది ఫ్రాంఛైజీలు ముంబై ఇండియన్స్‌తో బేరానికి దిగినట్లు తెలుస్తోంది. ఇందులో చెన్నై సూపర్ కింగ్స్ కూడా ఒకటి. అయితే, ఆటగాళ్ల మార్పిడిలో భాగంగా చెన్నై జట్టులోని ఓ యువ ఆటగాడి కోసం ముంబై పట్టుబడుతున్నట్లు సమాచారం.కెప్టెన్‌గా భారత్‌కు అండర్-19 ప్రపంచకప్ అందించిన ఆయుశ్ మాత్రేను దక్కించుకోవాలని ముంబై పట్టుదలగా ఉన్నట్లు తెలుస్తోంది. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. ముంబైతో పాటు సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంఛైజీలు కూడా ఈ యువ ఓపెనర్ కోసం గాలం వేసినట్లు తెలుస్తోంది.గుజరాత్ టైటాన్స్.. ఆయుశ్ కోసం వాషింగ్టన్ సుందర్‌ను చెన్నైకి ఆఫర్ చేయగా.. లక్నో షాబాజ్ అహ్మద్‌ను ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఢిల్లీ అశుతోశ్ శర్మ లేదంటే టి. నటరాజన్ ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నట్లు సమాచారం. మరోవైపు.. సన్‌రైజర్స్ ఆయుశ్ కోసం సలీల్ అరోరాను త్యాగం చేసేందుకు సిద్ధమైందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.ఇదిలా ఉంటే.. చెన్నై హార్దిక్‌కు బదులుగా ముంబైకి శివం దూబే, డెవాల్డ్ బ్రెవిస్‌ను ఇస్తామని.. చెప్పగా ముంబై మాత్రం ఆయుశ్‌ను కూడా అడిగినట్లు తెలుస్తోంది. అయితే, చెన్నై జట్టు మాత్రం ఆయుశ్‌ను తమ దీర్ఘకాలిక ఆస్తిగా భావిస్తూ ముంబైతో పాటు.. ఇతర ఫ్రాంఛైజీల ఆఫర్లను తిరస్కరించినట్లు తమిళ మీడియా పేర్కొంది. ఇక హార్దిక్‌కు ఇచ్చినందుకు మూల్యంగా దూబే, బ్రెవిస్‌లతో పాటు అదనంగా రూ. 10 కోట్లు ఇచ్చేందుకు చెన్నై ఫ్రాంఛైజీ సుముఖంగా ఉన్నట్లు సమాచారం.ఆయుశ్‌కు అంత డిమాండ్ ఉందా?దేశీ క్రికెట్లో ముంబైకి ఆడుతున్న ఆయుశ్ మాత్రే 2025లో ఐపీఎల్లో చెన్నై తరఫున అరంగేట్రం చేశాడు. గతేడాది ఏడు ఇన్నింగ్స్‌లో కలిపి 240 పరుగులు సాధించాడు. ఇక తాజా ఎడిషన్‌లోనూ ఆరు ఇన్నింగ్స్‌లో కలిపి 201 పరుగులు చేశాడు.అయితే, దురదృష్టవశాత్తూ గాయపడి టోర్నీ మధ్యలోనే జట్టుకు దూరమయ్యాడు ఆయుశ్. ఇప్పటి వరకు చెన్నై తరఫున మొత్తంగా 13 మ్యాచ్‌లలో కలిపి 441 పరుగులు చేసిన 19 ఏళ్ల ఆయుశ్.. స్ట్రైక్‌రేటు 177కు పైగానే ఉంది. రాజస్తాన్ రాయల్స్ చిచ్చరపిడుగు, టీమిండియా నయా సంచలనం వైభవ్ సూర్యవంశీ మాదిరి దూకుడుగా ఆడగల సత్తా ఆయుశ్‌కు ఉంది. -
చరిత్ర సృష్టించా.. నా రక్తం ధారపోశాను.. కానీ ఇప్పుడు!
బ్రెజిల్ ఫుట్‌బాల్ సూపర్‌స్టార్ నెయ్మార్ జూనియర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాను జాతీయ జట్టు కోసం రక్తం ధారపోశానని.. అయితే, ఇకపై ఆ పనిచేయలేనంటూ భావోద్వేగానికి గురయ్యాడు. తాను ఇప్పటికే అంతర్జాతీయ కెరీర్‌కు స్వస్తి పలికేశానంటూ రిటైర్మెంట్ గురించి పునరుద్ఘాటించాడు.గత కొన్నాళ్లుగా గాయాలతో సావాసం చేసిన నెయ్మార్.. ఫిఫా ప్రపంచకప్-2026 టోర్నీతో బ్రెజిట్ జట్టు తరఫున పునరాగమనం చేశాడు. అయితే, ఈ మెగా ఈవెంట్లో రౌండ్ 16లో నార్వే చేతిలో 2-1 గోల్ తేడాతో ఓడి బ్రెజిల్ నిష్క్రమించింది. ఈ మ్యాచ్‌లో నెయ్మార్ ఒక గోల్ కొట్టాడు. ఓటమి అనంతరం మాట్లాడుతూ.. బ్రెజిల్ తరఫున తనకు ఇదే చివరి మ్యాచ్ అని రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు.తాజాగా ఇదే విషయం గురించి మరోసారి ప్రస్తావన రాగా.. ‘‘జాతీయ జట్టుతో నా బంధం ముగిసిపోయింది. బ్రెజిల్ తరఫున నేను చరిత్ర సృష్టించాను. అందుకు ఎంతో సంతోషంగా ఉంది. నా జట్టు కోసం రక్తం ధారపోశాను. నా జీవితాన్ని, సర్వస్వాన్ని అర్పించాను.యెల్లో జెర్సీ ధరించడం కోసం ఎన్నో పోరాటాలు చేయాల్సి వచ్చింది. కానీ ఇకముందు ఆ పని చేయాల్సిన అవసరం లేదు’’ అని నెయ్మార్ గోల్.కామ్‌తో పేర్కొన్నాడు. కాగా ప్రపంచకప్ తర్వాత క్లబ్ కెరీర్ మీద దృష్టి సారించిన నెయ్మార్.. సారథిగా సాంటోస్ జట్టును ముందుకు నడిపిస్తున్నాడు.ఈ క్రమంలో తాజా మ్యాచ్‌లో భాగంగా యూనివర్సిడాడ్ సెంట్రల్‌పై సాంటోస్ 4-2 గోల్ తేడాతో విజయం సాధించింది. తద్వారా కోపా సదమెరికానా రౌండ్ 16కు అర్హత సాధించింది. అనంతరం నెయ్మార్ మాట్లాడుతూ.. తన అంతర్జాతీయ రిటైర్మెంట్ విషయాన్ని పునరుద్ఘాటించాడు.కాగా బ్రెజిల్ తరఫున 130 మ్యాచ్‌లు ఆడిన నెయ్మార్.. 80 గోల్స్ సాధించాడు. తద్వారా బ్రెజిల్ తరఫున అత్యధిక గోల్స్ కొట్టిన ఫుట్‌బాలర్‌గా 34 ఏళ్ల నెయ్మార్ చరిత్రకెక్కాడు. అంతేకాదు పదహారేళ్ల అంతర్జాతీయ కెరీర్లో 59 అసిస్ట్‌లు కూడా అందించాడు. నెయ్మార్ ఘనతలుఅమెరికాతో ఫ్రెండ్లీ మ్యాచ్ సందర్భంగా 2010లో నెయ్మార్ అరంగేట్రం చేశాడు. ఫిఫా ప్రపంచకప్ 2014, 2018, 2022, 2026 ఎడిషన్లలో బ్రెజిల్‌కు ప్రాతినిథ్యం వహించాడు. ఫిఫా కాన్ఫెడరేషన్స్ కప్-2013 విజేత. 2012 ఒలింపిక్స్‌లో రజతం గెలిచిన జట్టులో సభ్యుడు. 2016 ఒలింపిక్స్‌లో కెప్టెన్‌గా బ్రెజిల్‌కు స్వర్ణం అందించాడు.Neymar has officially announced that he will retire from international football. 😢He was visibly emotional walking off of a World Cup pitch for the final time. ❤️(🎥: @liberta___depre)pic.twitter.com/GcMIjvmpYt— theScore (@theScore) July 5, 2026 -
IND vs SL: అతడిని ఎలా ఎంపిక చేశారు: డివిలియర్స్
శ్రీలంకతో టీమిండియా టెస్టు సిరీస్ నేపథ్యంలో సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిలియర్స్ కీలక వ్యాఖ్యలు చేశాడు. లంకతో టెస్టులకు రిషభ్ పంత్‌ను ఎంపిక చేయడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందన్నాడు. కాగా ఆగష్టు 15 నుంచి 27 వరకు భారత జట్టు శ్రీలంకలో పర్యటించనుంది.ఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య రెండు టెస్టు మ్యాచ్‌లు జరుగుతాయి. ఇందుకు గాలె, కొలంబో వేదికలు. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) మంగళవారం తమ జట్టును ప్రకటించింది. శుబ్‌మన్ గిల్ కెప్టెన్సీలోని ఈ జట్టులో తొలిసారి సారాంశ్ జైన్ చోటు దక్కించుకున్నాడు.పంత్‌తో పాటు జురెల్..ఇదిలా ఉంటే.. రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా కూడా టెస్టుల్లో పునరాగమనం చేశారు. వికెట్ కీపర్ బ్యాటర్లు కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, ధ్రువ్ జురెల్ కూడా ఈ జట్టులో ఉన్నారు. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా బ్యాటింగ్ దిగ్గజం డివిలియర్స్ తన యూట్యూబ్ చానెల్లో మాట్లాడుతూ పంత్ ఎంపికను ప్రశ్నించాడు.అతడిని ఎలా ఎంపిక చేశారు?ఈ మేరకు.. ‘‘శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు ఎంపిక చేసిన భారత జట్టులో పంత్ ఉండటం నన్ను ఆశ్చర్యపరిచింది. అతడి ఫిట్నెస్ ఎలా ఉందో తెలిసిందే. అంతేకాదు.. అతడికి జట్టు తరఫున రాణించాలన్న కోరిక కూడా ఉందో లేదో చెప్పలేము.ఐపీఎల్లో అతడు ఆత్మవిశ్వాసంతో కనిపించలేదు. బాగా కుంగిపోయినట్లు అనిపించింది. అయితే, దేశం తరఫున ఆడినప్పుడు పంత్ అత్యుత్తమ ప్రదర్శన ఇస్తాడని నమ్ముతున్నా. శ్రీలంకలో అతడు దూకుడుగా, తనదైన శైలిలో రాణిస్తాడనే ఆశిస్తున్నా’’ అని డివిలియర్స్ పేర్కొన్నాడు.జడ్డూ రీఎంట్రీ సంతోషంఅదే విధంగా.. ‘‘రవీంద్ర జడేజా జట్టులోకి తిరిగి రావడం సంతోషంగా ఉంది. ఇటీవలి కాలంలో అతడు జట్టులో ఎప్పుడు ఉంటాడో, ఎప్పుడు తీసేస్తారో తెలుసుకోవడం కాస్త కష్టంగానే ఉంది.ఇక బుమ్రా పూర్తి ఫిట్‌గా మారితే జట్టుకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అతడు జట్టులో ఉన్నాడంటే ప్రత్యర్థులకు వణుకే. బుమ్రా ఒక క్లాస్ ప్లేయర్’’ అని డివిలియర్స్ కొనియాడాడు. కాగా టీమిండియా చివరగా స్వదేశంలో అఫ్గానిస్తాన్‌తో ఏకైక టెస్టు ఆడింది.ఐపీఎల్లో పంత్ విఫలంఈ మ్యాచ్ నుంచి జడేజా, బుమ్రాలకు సెలక్టర్లు విశ్రాంతినిచ్చారు. ఇక ఈ మ్యాచ్‌లో రిషభ్ పంత్ 104 బంతులు ఎదుర్కొని 81 పరుగులు సాధించాడు. ఇందులో పదమూడు ఫోర్లు ఉండటం విశేషం. అయితే, అంతకుముందు ఐపీఎల్-2026లో మాత్రం పంత్ పూర్తిగా నిరాశపరిచాడు.లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్, బ్యాటర్‌గా పంత్ విఫలమయ్యాడు. కేవలం 312 పరుగులు చేసిన పంత్ సారథ్యంలో లక్నో ఈసారి పాయింట్ల పట్టికలో అట్టడుగున పదో స్థానంలో నిలిచింది. గతేడాది 269 పరుగులు చేసిన పంత్ జట్టును ఏడో స్థానంలో నిలిపాడు. ఈ పరిణామాల నేపథ్యలో 2027 సీజన్‌కు ముందే పంత్ లక్నోను వీడి ఢిల్లీ క్యాపిటల్స్‌లో చేరాడు.శ్రీలంకతో టెస్టులకు భారత జట్టుశుబ్‌మన్ గిల్ (కెప్టెన్), కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్, సాయి సుదర్శన్, ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, దేవదత్ పడిక్కల్, సారాంశ్ జైన్. -
అగ్రపీఠంపై గిల్.. వైభవ్ భారీ జంప్
తాజా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో భారత క్రికెటర్ల హవా కొనసాగింది. టీ20 బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఏకంగా 230 స్థానాలు ఎగబాకి కెరీర్లోనే అత్యుత్తమమైన 48వ ర్యాంక్‌కు చేరుకోగా, వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మళ్లీ ప్రపంచ నంబర్-1 బ్యాటర్‌గా నిలిచాడు.జింబాబ్వేతో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 151 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్‌గా నిలిచిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ తాజా ర్యాంకింగ్స్‌లో భారీగా లాభపడ్డాడు. ప్రస్తుతం అతను 536 రేటింగ్ పాయింట్లతో 48వ స్థానంలో కొనసాగుతున్నాడు.అదే సిరీస్‌లో అద్భుత ప్రదర్శన చేసిన ఇషాన్ కిషన్ 916 రేటింగ్ పాయింట్లతో టీ20 బ్యాటర్ల జాబితాలో అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఈ క్రమంలో సూర్యకుమార్ యాదవ్ (912 కెరీర్ బెస్ట్), విరాట్ కోహ్లీ (909 కెరీర్ బెస్ట్) వంటి భారత దిగ్గజాల కెరీర్ రేటింగ్లను కూడా అధిగమించాడు. టీ20 చరిత్రలో అత్యధిక బ్యాటింగ్ రేటింగ్‌ల జాబితాలో అభిషేక్ శర్మ (931), డేవిడ్ మలాన్ (919) తర్వాత ఇషాన్ కిషన్ (916 కెరీర్ బెస్ట్) మూడో స్థానంలో ఉన్నాడు.ఇతర భారత ఆటగాళ్లలో తిలక్ వర్మ రెండు స్థానాలు మెరుగుపరుచుకుని ఆరో ర్యాంక్‌కు చేరుకోగా, శ్రేయస్ అయ్యర్ ఏడు స్థానాలు ఎగబాకి 24వ స్థానంలో నిలిచాడు. బౌలర్ల జాబితాలో రవి బిష్ణోయ్ 31 స్థానాలు ఎగబాకి 41వ ర్యాంక్‌ను దక్కించుకున్నాడు.మరోవైపు, వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో డారిల్ మిచెల్ అగ్రస్థానాన్ని కోల్పోవడంతో శుభ్‌మన్ గిల్ తిరిగి ప్రపంచ నంబర్-1 బ్యాటర్‌గా అవతరించాడు. ఈ ఏడాది జనవరి నుంచి అగ్రస్థానంలో కొనసాగిన మిచెల్‌ను వెనక్కి నెట్టి గిల్ మళ్లీ అగ్రపీఠాన్ని అధిరోహించాడు. -
మంధాన ఒంటరి పోరాటం.. సూపర్ జెయింట్స్ ఉత్కంఠ విజయం
మహిళల హండ్రెడ్ టోర్నమెంట్లో భారత స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన (88 నాటౌట్) అద్భుత ఇన్నింగ్స్‌తో తన జట్టు మాంచెస్టర్ సూపర్ జెయింట్స్‌కు ఉత్కంఠభరిత విజయాన్నందించింది. సన్‌రైజర్స్ లీడ్స్ నిర్దేశించిన 143 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వీరోచిత ఇన్నింగ్స్ ఆడింది. ఫలితంగా సూపర్ జెయింట్స్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది.లక్ష్య ఛేదనలో మెగ్ లానింగ్ (24), మంధాన కలిసి తొలి వికెట్‌కు 41 పరుగులు జోడించి శుభారంభం అందించారు. అయితే ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయిన జట్టు 61/1 నుంచి 71/5కు పడిపోవడంతో ఓటమి ముంగిట నిలిచింది.ఈ క్లిష్ట పరిస్థితుల్లో మంధాన ఒంటరి పోరాటం చేసింది. గ్రేస్ స్క్రివెన్స్తో 27 పరుగులు, కేథ్రిన్ బ్రైస్‌తో 48 పరుగుల కీలక భాగస్వామ్యాలు నెలకొల్పి జట్టును విజయపథంలో నడిపించింది. రెండు సార్లు లభించిన క్యాచ్ అవకాశాలను ప్రత్యర్థి జట్టు చేజార్చుకోవడంతో మంధాన హండ్రెడ్ లీగ్‌లో తన అత్యధిక వ్యక్తిగత స్కోరును నమోదు చేసింది.చివరి 25 బంతుల్లో 44 పరుగులు అవసరమైన సమయంలో దూకుడు పెంచిన మంధాన వరుస సిక్సర్లతో మ్యాచ్‌ను మలుపు తిప్పింది. చివరి ఓవర్లో అవసరమైన ఎనిమిది పరుగులను రెండు భారీ సిక్సర్లతో పూర్తి చేసి జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించింది.అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ లీడ్స్ నిర్ణీత 100 బంతుల్లో నాలుగు వికెట్లకు 142 పరుగులు చేసింది. అన్నాబెల్ సదర్లాండ్ 35, లిచ్‌ఫీల్డ్ 31, బ్రయోనీ స్మిత్ 26 పరుగులతో రాణించగా, చివర్లో కెప్టెన్ డానియెల్ గిబ్సన్ ఆరు బంతుల్లోనే 18 పరుగులు చేసి జట్టుకు మంచి స్కోర్ అందించింది.ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచిన మంధాన మాట్లాడుతూ, డ్రాప్ క్యాచ్ రూపంలో కొంత అదృష్టం కలిసి వచ్చినా మ్యాచ్‌ను విజయవంతంగా ముగించగలిగినందుకు సంతోషంగా ఉందని తెలిపింది. ఇలాంటి విజయాలు జట్టుకు ఎంతో ఆత్మవిశ్వాసాన్ని ఇస్తాయని పేర్కొంది. -
PAK vs WI: విధి రాసిన విజయం..! గ్యారీ సోబర్స్‌కు విండీస్ ఘన నివాళి
సొంత గడ్డపై పాకిస్తాన్‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను వెస్టిండీస్ విజయంతో ఆరంభించింది. ట్రినిడాడ్ వేదికగా జరిగిన తొలి టెస్టులో పాకిస్తాన్‌ను 90 పరుగుల తేడాతో విండీస్ చిత్తు చేసింది. ఈ అద్బుత విజయాన్ని లెజెండరీ ఆల్‌రౌండర్, దివంగత సర్ గార్ఫీల్డ్ సోబర్స్‌కు విండీస్ కెప్టెన్ రోస్టన్ చేజ్ అంకితమిచ్చాడు.యాదృచ్ఛికంగా సోబర్స్ 90వ పుట్టిన రోజు నాడే విండీస్ ఈ మ్యాచ్ గెలవడం గమనార్హం. అంతేకాకుండా కరేబియన్ జట్టు సరిగ్గా 90 పరుగుల తేడాతో విజయం సాధించడం ఇంకా హైలెట్. కాగా గ్యారీ సోబర్స్ జులై 17న అనారోగ్యం కారణంగా తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే."వెస్టిండీస్ సీనియర్ పురుషుల క్రికెట్ జట్టు తరఫున ఈ విజయాన్ని దివంగత దిగ్గజం సర్ గార్ఫీల్డ్ సోబర్స్‌కు అంకితం ఇస్తున్నాం. ఆయన క్రికెట్ ప్రపంచంలో మకుటం లేని మహారాజు. మా జట్టులోని ప్రతి ఒక్కరికీ ఆయనే ఆదర్శం. తన సుదీర్ఘ కెరీర్లో సోబర్స్ సాధించనిది లేదు. ఈ రోజు ఆయన 90వ బర్త్‌డే. సరిగ్గా మేము కూడా 90 పరుగుల తేడాతో గెలిచాం.ఇది ఆయన కోసం రాసిపెట్టినట్లే అనిపిస్తోంది. సోబర్స్‌ను గౌరవించుకోవడానికి ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలని ముందే నిర్ణయించుకున్నాం. ఆయన పై నుంచి చూస్తూ సంతోషపడుతుంటారు అనుకుంటున్నా. గార్ఫీల్డ్ సోబర్స్ సర్... వెస్టిండీస్ క్రికెట్‌కు మీరు చేసిన సేవలకు ధన్యవాదాలు. మిమ్మల్ని గర్వపడేలా చేశామని ఆశిస్తున్నాం. మీ ఆత్మకు శాంతి కలగాలి" అని డ్రెస్సింగ్ రూమ్‌లో మాట్లాడుతూ చేజ్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు.For the Legend With Love 🖤Historic win for the team on Sir Garry’s 90th. #WIvPAK pic.twitter.com/2yLXAkXQ6a— Windies Cricket (@windiescricket) July 28, 2026 -
రూ. 2,00,000 కోట్లు!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఆధ్వర్యంలో 2008లో మొదలైన ఈ టీ20 లీగ్.. దినదినాభివృద్ధి చెందుతోంది. బీసీసీఐ, ఫ్రాంఛైజీలు, ఆటగాళ్లపై కాసుల వర్షం కురిపిస్తూ.. ప్రపంచంలోనే రిచెస్ట్ లీగ్‌గా కొనసాగుతోంది.సుమారుగా రూ. 2,00,000 కోట్లు!ఈ నేపథ్యంలో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు హోలియాన్ లోకీ తాజాగా వెలువరించిన నివేదిక ఐపీఎల్ సత్తా ఏమిటో మరోసారి చాటిచెప్పింది. ఐపీఎల్-2026 బ్రాండ్ వాల్యూ స్టడీలో భాగంగా.. ఐపీఎల్ బిజినెస్ ఎంటర్ప్రైజ్ విలువలో 11.4 శాతం పెరుగుదల నమోదైందని.. మొత్తం విలువ 20.6 బిలియన్ డాలర్ల (భారత కరెన్సీలో సుమారు రూ. 1,97,024 కోట్లు)కు చేరిందని సదరు కథనం పేర్కొంది.రికార్డు ధరకుఅదే విధంగా లీగ్ బ్రాండ్ వాల్యూలో 10.3 శాతం పెరుగుదల కనిపించిందని.. ఇది 4.3 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 41,106 కోట్లు)కు చేరిందని కథనం తెలిపింది. కాగా 2026లో రెండు ఫ్రాంఛైజీల యాజమాన్యాలు చేతులు మారిన సంగతి తెలిసిందే. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB)ని బ్లాక్‌స్టోన్, బోల్ట్ వెంటర్స్, ఆదిత్య బిర్లా గ్రూప్, టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూపు రికార్డు స్థాయిలో 1.78 బిలియన్ డాలర్లకు సొంతం చేసుకున్నాయి.ఇక రాజస్తాన్ రాయల్స్ ఫ్రాంఛైజీని మిట్టల్ కుటుంబం, ఆదార్ పూనావాలా సంయుక్తంగా 1.65 బిలియన్ డాలర్ల మొత్తానికి దక్కించుకున్నారు. ఈ క్రమంలోనే ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ ఒక్కసారిగా ఎగిసినట్లు సదరు కథనం వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఐపీఎల్‌కు రోజురోజుకీ పెరుగుతున్న ఆదరణ కారణంగానే ఈ మేర బ్రాండ్ వాల్యూ పెరిగిందని హోలియాన్ లోకీ ఫైనాన్షియల్, వాల్యువేషన్ అడ్వైజరీ బిజినెస్ డైరెక్టర్ హర్ష్ తలికోటి తెలిపారు.నంబర్ వన్‌గా ఆర్సీబీఐపీఎల్ 2025, 2026లో వరుసగా రెండుసార్లు చాంపియన్‌గా నిలిచిన ఆర్సీబీ బ్రాండ్ వాల్యూ అమాంతంగా పెరిగింది. ఐపీఎల్‌లోనే అత్యంత విలువైన ఫ్రాంఛైజీగా ఆర్సీబీ అవతరించింది. అంతేకాదు బ్రాండ్ వాల్యూలో 300.0 మిలియన్ డాలర్ల మార్కు దాటిన తొలి క్రికెట్ జట్టుగా ఆర్సీబీ నిలిచింది. ఫ్రాంఛైజీ విజయాలు, అపారమైన అభిమానగణం ఇందుకు ప్రధాన కారణం.మిగిలిన స్థానాలు ఇలాఇక ముంబై ఇండియన్స్ బ్రాండ్ వాల్యూ 264 మిలియన్ డాలర్లకు చేరగా.. ఆర్సీబీ తర్వాతి స్థానాన్ని ముంబై ఆక్రమించింది. కోల్‌కతా నైట్ రైడర్స్ బ్రాండ్ వాల్యూ 245 మిలియన్ డాలర్లకు చేరింది. ఐపీఎల్-2024లో జట్టు విజేతగా నిలవడం ఇందులో కీలక పాత్ర పోషించింది. మరోవైపు.. చెన్నై సూపర్ కింగ్స్ బ్రాండ్ వాల్యూ 244 మిలియన్ డాలర్లకు చేరింది. తద్వారా ఆర్సీబీ, ముంబై, కోల్‌కతా తర్వాత నాలుగో స్థానంలో చెన్నై జట్టు నిలిచింది.అదే విధంగా ఆ తర్వాతి స్థానాల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (బ్రాండ్ వాల్యూ 168 మిలియన్ డాలర్లు), రాజస్తాన్ రాయల్స్ (161 మిలియన్ డాలర్లు), పంజాబ్ కింగ్స్ (158 మిలియన్ డాలర్లు), గుజరాత్ టైటాన్స్ (157 మిలియన్ డాలర్లు), ఢిల్లీ క్యాపిటల్స్ (156 మిలియన్ డాలర్లు), లక్నో సూపర్ జెయింట్స్ (122 మిలియన్ డాలర్లు) నిలిచాయి.చదవండి: అర్జున్ టెండుల్కర్‌కు షాక్! -
శ్రీలంకతో తొలి టెస్ట్.. భారత తుది జట్టు ఇదే? అతడి అరంగేట్రం ఫిక్స్?
శ్రీలంకతో జరగనున్న రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. అయితే ఈ సిరీస్‌కు 33 ఏళ్ల ఆఫ్ స్పిన్నర్ సారాన్ష్ జైన్‌ను ఎంపిక చేసి సెలక్టర్లు అందరని ఆశ్చర్యపరిచారు. వాషింగ్టన్ సుందర్ ఫిట్‌గా లేకపోవడంతో జైన్‌కు తొలిసారి భారత టెస్ట్ జట్టులో చోటు దక్కింది.కాగా ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అతడికి అద్భుతమైన రికార్డు ఉంది. ఇప్పటివరకు 54 ఫస్ట్‌క్లాస్ క్రికెట్ మ్యాచ్‌లు ఆడిన సారాన్ష్ 27.30 సగటుతో 188 వికెట్లు పడగొట్టాడు. మరోవైపు అఫ్గాన్‌తో ఏకైక టెస్ట్‌కు దూరంగా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా తిరిగి జట్టులోకి వచ్చాడు. అదేవిధంగా జస్ప్రీత్ బుమ్రా, సాయిసుదర్శన్‌లను ఎంపిక చేసినప్పటికి సిరీస్ ఆరంభానికి ముందు వారు తమ ఫిట్నెస్ను నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆగస్టు 15 నుంచి లంకతో జరగబోయో తొలి టెస్టుకు టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌ను భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ అంచనా వేశాడు. అన్‌క్యాప్డ్స్ ఆటగాడు సారాన్ష్ జైన్ అరంగేట్రం చేసే అవకాశముందని అశ్విన్ తెలిపాడు."ప్లేయింగ్ ఎలెవన్‌లో రవీంద్ర జడేజా కచ్చితంగా ఉంటాడు. అదేవిధంగా అఫ్గానిస్తాన్‌తో ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో ఏడు వికెట్లు తీసిన మానవ్ సుతార్‌ను కూడా తుది జట్టులో కొనసాగిస్తారు. వీరిద్దరితో పాటు కుల్దీప్ యాదవ్‌కు కూడా అవకాశమివ్వాలి. దీంతో జట్టులో ముగ్గురు స్పిన్నర్లు ఉంటారు. శ్రీలంక పిచ్‌లు ఎక్కువగా స్పిన్‌కు అనుకూలంగా ఉంటాయి. కాబట్టి సారాన్ష్ జైన్‌ను కూడా ఆడిస్తే బెటర్. అతడిని ఏడో స్ధానంలో బ్యాటింగ్ పంపాలి. ఎప్పటిలాగే ఓపెనర్లగా కేఎల్ రాహుల్, యశస్వి జైశ్వాల్ ఉంటారు. మూడువ స్థానంలో దేవదత్ పడిక్కల్ లేదా సాయి సుదర్శన్‌కు ఛాన్స్ దక్కనుంది. సాయి ఫిట్నెస్ సాధిస్తే దాదాపుగా అతడే తుది జట్టులో ఉంటాడు. నాలుగు, ఐదు స్ధానాల్లో వరుసగా శుబ్‌మన్ గిల్, రిషబ్ పంత్ బ్యాటింగ్‌కు వస్తారు. ఆరో స్ధానంలో జడేజాను పంపాలి. ఇక చివరగా ఫాస్ట్ బౌలర్ల కోటాలో బుమ్రా, మహ్మద్ సిరాజ్‌లను తీసుకోవాలి. బుమ్రా ఫిట్‌గా లేకపోతే ప్రసిద్ద్ కృష్ణకు ఛాన్స్ ఇవ్వాలని" తన య్యూటూబ్ ఛానల్లో పేర్కొన్నాడు.అశ్విన్ అంచనా వేసిన భారత తుది జట్టుశుభ్‌మన్ గిల్ (కెప్టెన్), కెఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సాయి సుదర్శన్*, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్, జస్ప్రీత్ బుమ్రా*, సిరాజ్, సరాన్ష్ జైన్.శ్రీలంకతో టెస్టులకు భారత జట్టు: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), కెఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సాయి సుదర్శన్*, ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్, జస్ప్రీత్ బుమ్రా*, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, దేవదత్ పడిక్కల్, సరాన్ష్ జైన్. -
అర్జున్ టెండుల్కర్‌కు షాక్?!
టీమిండియా బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ తనయుడిగానే కాకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు అర్జున్ టెండుల్కర్ చాన్నాళ్ల నుంచే ప్రయత్నాలు చేస్తున్నాడు. దేశీ క్రికెట్లో తొలుత సొంత జట్టు ముంబైకి ప్రాతినిథ్యం వహించాడు ఈ ఆల్‌రౌండర్.ముంబై నుంచి గోవాకు...అయితే, ముంబై జట్టులో పోటీ ఎక్కువగా ఉండటంతో 26 ఏళ్ల అర్జున్‌కు తగినన్ని అవకాశాలు రాలేదు. దీంతో 2022లో గోవా జట్టుకు మారిపోయాడు. ఆ జట్టు తరఫున మెరుగ్గానే రాణించాడు. అయితే, ఈ ఏడాది అతడు గోవా జట్టును వీడనున్నాడనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.ఒమన్ పర్యటనకుతాజాగా గోవా క్రికెట్ జట్టుకు సంబంధించి బయటకు వచ్చిన ఓ అప్డేట్ ఇందుకు కారణం. కాగా రంజీ ట్రోఫీ 2026-27 షెడ్యూల్ ఇప్పటికే విడుదలైన సంగతి తెలిసిందే. అక్టోబరు నుంచి ఈ రెడ్‌బాల్ దేశీ టోర్నీ మొదలుకానుండగా.. గోవా తమ ప్రమాణాలు పెంచుకునే క్రమంలో ఒమన్‌కు వెళ్లనుంది.పదిరోజుల పాటు ఒమన్‌లో తమ క్రికెట్ జట్టు ప్రాక్టీస్ చేసేందుకు వీలుగా గోవా అసోసియేషన్ ప్రణాళిక రచించినట్లు సమాచారం. స్పోర్ట్స్‌స్టార్ కథనం ప్రకారం.. ఆగష్టు 8- 18 మధ్య గోవా జట్టు ఒమన్‌లో గడుపనుంది. ఇందులో భాగంగా ఒమన్ సీనియర్ క్రికెట్ జట్టుతో మూడు వన్డేలతో పాటు రెండు టీ20 మ్యాచ్‌లు ఆడనున్నట్లు సమాచారం.హెడ్‌కోచ్‌గా దినేశ్ మోంగియాఈ పర్యటనలో టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ దినేశ్ మోంగియా గోవా జట్టు హెడ్‌కోచ్‌గా వ్యవహరించనున్నాడు. మిలాప్ మేవాడా బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE)లో చేరడంతో.. మోంగియా గోవా హెడ్‌కోచ్‌గా అతడి స్థానాన్ని భర్తీ చేశాడు.అర్జున్ టెండుల్కర్‌కు షాకిచ్చారా?.. తప్పుకొన్నాడా?!అయితే, పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అర్జున్ టెండుల్కర్ మాత్రం జట్టుతో పాటు ఈ టూర్‌కు వెళ్లడం లేదని తెలుస్తోంది. గోవా తరఫున కొనసాగేందుకు అతడు సుముఖంగా లేనట్లు వార్తలు వస్తున్నాయి. తాజా ఎడిషన్‌లోనే అర్జున్ గోవా జట్టును వీడేందుకు సిద్ధమైనట్లు ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఒమన్ టూర్‌ను సైతం అతడు రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ విషయంపై అటు గోవా క్రికెట్ గానీ.. ఇటు అర్జున్ టెండుల్కర్ గానీ స్పందించలేదు. కాగా గత రంజీ ఎడిషన్‌లో గోవా ఎలైట్ గ్రూప్-బిలో భాగంగా ఆడిన ఏడు మ్యాచ్‌లలో కేవలం ఒకటి మాత్రమే గెలిచింది. చదవండి: పాకిస్తాన్ ఫైనల్ రేసు నుంచి అవుట్! -
మిచెల్ మార్ష్ మాస్ ఇన్నింగ్స్.. సన్‌రైజర్స్ రికార్డు విజయం
ది హండ్రెడ్-2026లో వరుస విజయాలతో దూసుకుపోతున్న మాంచెస్టర్ సూపర్ జెయింట్స్‌కు సన్‌రైజర్స్ లీడ్స్ షాకిచ్చింది. బుధవారం హెడ్డింగ్లీ వేదికగా జరిగిన పదో మ్యాచ్‌లో మాంచెస్టర్‌ను 8 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ నిర్ణీత 100 బంతుల్లో 3 వికెట్ల నష్టానికి 181 పరుగుల భారీ స్కోరు సాధించింది.ఓపెనర్లు టిమ్ సీఫెర్ట్ (16 బంతుల్లో 28), ఐడెన్ మార్క్రమ్ (23 బంతుల్లో 32) మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ఆ తర్వాత జోస్ బట్లర్ (33 బంతుల్లో 63 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), హెన్రిచ్ క్లాసెన్ (27 బంతుల్లో 53; 2 సిక్సర్లు) విధ్వంసం సృష్టించారు. వీరిద్దరూ లీడ్స్ మైదానంలో బౌండరీల వర్షం కురిపించారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు కేవలం 47 బంతుల్లోనే 105 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.మార్ష్ విధ్వంసం..అనంతరం 181 పరుగుల లక్ష్యాన్ని సన్‌రైజర్స్ లీడ్స్ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి మరో 12 బంతులు మిగిలి ఉండగానే ఊదిపడేసింది. ఈ భారీ లక్ష్య చేధనలో ఓపెనర్ మిచెల్ మార్ష్ విధ్వంసం సృష్టించాడు. ఈ ఆసీస్ కెప్టెన్ మాంచెస్టర్ బౌలర్లను ఉతికారేశాడు.కేవలం 26 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లతో 63 పరుగులు చేశాడు. అతడితో పాటు కెప్టెన్ జాక్ క్రాలీ(56 నాటౌట్), హ్యారీ బ్రూక్(17 బంతుల్లో 42) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. మాంచెస్టర్ బౌలర్లలో టంగ్, బాకర్ తలా వికెట్ సాధించారు. కాగా ఇది పురుషుల హండ్రెడ్‌లో మూడవ అత్యధిక విజయవంతమైన ఛేజ్ కావడం విశేషం.చదవండి: WTC 2025-26: పాక్‌కు భారీ షాక్.. ఫైనల్ రేసు నుంచి అవుట్! మరి భారత్? -
పాక్‌కు భారీ షాక్.. ఫైనల్ రేసు నుంచి అవుట్! మరి భారత్?
టెస్ట్ క్రికెట్లో పాకిస్తాన్ ఓటముల పరంపర కొనసాగుతోంది. ట్రినిడాడ్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో పాక్ 90 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. 211 పరుగుల లక్ష్య చేధనలో పాకిస్తాన్ కేవలం 120 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ బాబర్ ఆజం(58 నాటౌట్) మినహా మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు.ఈ ఓటమితో పర్యాటక జట్టు రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో 1-0 తేడాతో వెనకబడింది. సిరీస్‌లో వెనకబడడమే కాకుండా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్(2025-27) పాయింట్ల పట్టికలోనూ ఆఖరి స్దానానికి పాక్ పడిపోయింది. ఈ సైకిల్లో పాకిస్తాన్‌కు ఇది వరుసగా నాలుగో ఓటమి. వారి పాయింట్ల శాతం (PCT) 8.33% నుంచి 6.67%కి దిగజారింది. దీంతో వచ్చే ఏడాది జరగనున్న డబ్ల్యూటీసీ ఫైనల్‌కు అర్హత సాధించే అవకాశాలను పాకిస్తాన్ దాదాపు కోల్పోయినట్లే. పాక్ జట్టుకు ప్రస్తుత సైకిల్లో ఇంకా నాలుగు టెస్ట్‌లు మాత్రమే ఉన్నాయి. ఈ మ్యాచ్‌లు అన్ని గెలిచినా పాక్ ఫైనల్ అర్హత సాధించడం కష్టమే అనే చెప్పాలి. ఈ భారీ విజయంతో వెస్టిండీస్ తమ పాయింట్ల శాతాన్ని (PCT) 15% నుంచి 22.73%కి మెరుగుపరుచుకుంది.కానీ పాయింట్ల పట్టికలో ఎలాంటి మార్పు రాలేదు. ఈ సైకిల్లో ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌లలో 2 విజయాలు, 7 ఓటములతో కరేబియన్ జట్టు 8వ స్థానంలోనే కొనసాగుతోంది. ఇక పట్టికలో ఆస్ట్రేలియా (87.50)అగ్రస్దానంలో ఉండగా.. సౌతాఫ్రికా(75.00) రెండో స్ధానంలో కొనసాగుతోంది. ఇక భారత్(48.15) ఐదో స్ధానంలో నిలిచింది.భారత్ ఫైనల్ చేరాలంటే?ఈ సైకిల్లో శుబ్‌మన్ గిల్ సారథ్యంలోని టీమిండియా ఇంకా 9 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. శ్రీలంకతో రెండు, న్యూజిలాండ్‌తో రెండు, ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల సిరీస్‌లో తలపడనుంది. ఒక్క మ్యాచులోనూ ఓడిపోకుండా.. కనీసం ఏడింట్లో గెలిస్తే ఫైనల్‌కు చేరే అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. ఆసీస్, కివీస్ వంటి బలమైన జట్లను ఓడించాలంటే భారత్ సమిష్టిగా రాణించక తప్పదు. ఆగస్టు 15 నుంచి భారత్-శ్రీలంక మధ్య రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది.చదవండి: WI vs PAK 1st Test: పాకిస్తాన్ ఘోర ఓటమి.. 120 పరుగులకే ఆలౌట్ -
పాకిస్తాన్ ఘోర ఓటమి.. 120 పరుగులకే ఆలౌట్
కెప్టెన్లు మారినా పాకిస్తాన్ క్రికెట్ జట్టు రాత మాత్రం మారడం లేదు. పాక్ టెస్టు పగ్గాలను తిరిగి చేపట్టిన తొలి మ్యాచ్‌లోనే బాబర్ ఆజంకు తీవ్ర నిరాశ ఎదురైంది. ట్రినిడాడ్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మొదటి టెస్ట్‌లో 90 పరుగుల తేడాతో పాకిస్తాన్ ఘోర ఓటమిని చవిచూసింది. వెస్టిండీస్ నిర్ధేశించిన 211 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చేధించలేక బాబర్ సేన చతికల పడింది. కరేబియన్ జట్టు బౌలర్లు చెలరేగడంతో పాక్ కేవలం 120 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ బాబర్ ఆజం(58 నాటౌట్) ఒక్కడే ఒంటరి పోరాటం చేయగా.. మిగతా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. 8 మంది బ్యాటర్లు సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యాడు. విండీస్ పేసర్ జేడెన్ సీల్స్ 5 వికెట్లు పడగొట్టి పాక్ పతనాన్ని శాసించాడు. అతడితో పాటు కీమర్ రోచ్, గ్రీవ్స్ తలా రెండు వికెట్లు సాధించారు. నాలుగో రోజు ఆటలో 93/7 ఓవర్‌నైట్ స్కోరుతో ఇన్నింగ్స్ కొనసాగించిన విండీస్‌ను టెయిలాండర్లు, షమార్ జోసెఫ్(38), కెమర్ రోచ్‌లు(18) ఆదుకున్నారు. వీరిద్దరూ 8వ వికెట్‌కు విలువైన 61 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. చివరికి విండీస్ రెండో ఇన్నింగ్స్‌లో 238 పరుగులకు ఆలౌటై పాక్ ముందు ఫైటింగ్ టార్గెట్‌ను ఉంచింది. ఈ స్వల్ప లక్ష్యాన్ని కూడా చేధించలేక పర్యాటక జట్టు ఘోర పరాభవం పాలైంది. కాగా పాక్ బౌలర్లలో మహమ్మద్ అబ్బాస్ ఐదు వికెట్లతో సత్తాచాటాడు. అంతకుముందు వెస్టిండీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 311 పరుగులు చేయగా.. అనంతరం 282 పరుగులకు ఆలౌటైంది. మొదటి ఇన్నింగ్స్‌లో పాక్ మాజీ కెప్టెన్ షాన్ మసూద్(109) సెంచరీతో కదం తొక్కాడు. కానీ రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం మసూద్ విఫలమయ్యాడు. ఇక ఈ ఓటమితో పాక్ జట్టు (6.66% పీసీటీ) డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఆఖరి స్దానానికి పడిపోయింది. -
టీమిండియాకు కొత్త కోచ్.. ఎవరీ శుభదీప్ ఘోష్?
భారత సీనియర్ క్రికెట్ జట్టు అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డస్కటే, ఫీల్డింగ్ కోచ్ టి. దిలీప్ కాంట్రాక్ట్ ముగిసింది. ఈ ఇద్దరికీ ఎలాంటి పొడిగింపు ఇవ్వడంలేదని బోర్డు కార్యదర్శి దేవజిత్ సైకియా మంగళవారం వెల్లడించారు. టెన్ డస్కటే తిరిగి ఐపీఎల్ ఫ్రాంచైజీ కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్)తో జతకట్టనున్నట్లు సమాచారం. కోల్‌కతా జట్టుతో డస్కటేకు సుదీర్ఘ అనుబంధం ఉంది. 2012, 2014లో ఐపీఎల్ టైటిల్స్ గెలిచిన కేకేఆర్ జట్టులో ప్లేయర్‌గా ఉన్న అతడు... 2022 నుంచి 2024 వరకు ఆ జట్టు ఫీల్డింగ్ కోచ్‌గా పనిచేశాడు. అదే సమయంలో గంభీర్ కేకేఆర్ మెంటార్‌గా పనిచేయడంతో ఆ తర్వాత భారత జట్టు శిక్షణ బృందంలో సైతం అతడికి చోటు దక్కింది. టీమిండియా చాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్, టి20 ప్రపంచకప్ గెలిచిన సమయంలో డస్కటే భారత కోచింగ్ స్టాఫ్‌లో భాగంగా ఉన్నాడు. అయితే రెండేళ్లుగా టీమిండియాతో కలిసి పనిచేసినప్పటికీ అతడికి నిర్దిష్టమైన బాధ్యతలు అప్పగించలేదు. ఈ క్రమంలోనే బోర్డు అతడి కాంట్రాక్ట్‌ను పొడిగించలేదు.కొత్త ఫీల్డింగ్ కోచ్‌గా శుభదీప్ ఇక దిలీప్ స్ధానంలో కొత్త ఫీల్డింగ్ కోచ్‌గా మాజీ దేశవాళీ క్రికెటర్ శుభదీప్ ఘోష్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. శుభదీప్నకు కోచ్‌గా అపారమైన అనుభవం ఉంది. అతడు డొమాస్టిక్ క్రికెట్లో అస్సాం, రైల్వేస్ జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. ఆల్‌రౌండర్ అయిన ఘోష్ ఫస్ట్-క్లాస్, లిస్ట్-ఎ క్రికెట్ రెండింటిలోనూ చెరో 17 మ్యాచ్‌లు ఆడాడు.ఘోష్ తన చివరి ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌ను 2004లో ఆడగా, తర్వాతి ఏడాది తన లిస్ట్-ఎ కెరీర్‌కు ముగింపు పలికాడు. అనంతరం కోచ్‌గా తన ప్రయణాన్ని ప్రారంభించాడు. శుభదీప్ ఘోష్ గత 15 ఏళ్లుగా నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA) కోచింగ్ విభాగంలో కీలక సభ్యుడిగా పనిచేస్తున్నారు. 2021లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన భారత మహిళల జాతీయ జట్టుకు ఫీల్డింగ్ కోచ్‌గా ఘోష్ వ్యవహరించాడు.అంతేకాకుండా అండర్-19 ప్రపంచకప్(20244)లో భారత యువ జట్టుకు కూడా ఫీల్డింగ్ కోచ్‌గా అతడు సేవలు అందించారు. పలు పర్యటనలలో భారత్-ఎ జట్టు కోచింగ్ స్టాప్‌లో సైతం అతడు భాగమయ్యాడు. ఐపీఎల్-2014 సీజన్లో విజేతగా నిలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ఫీల్డింగ్ కోచ్‌గా కూడా ఘోష్ పనిచేశాడు.కాగా గత కొంతకాలంగా భారత సీనియర్ జట్టు ఫీల్డింగ్ ప్రమాణాలు దారుణంగా పడిపోయాయి. ఇప్పుడు అనుభవజ్ఞుడైన ఘోష్ రాకతో టీమిండియా ఫీల్డింగ్‌లో పూర్వ వైభవం సాధిస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.చదవండి: CG 2026: వర్షంలోనూ తగ్గని జోరు.. ఆఖరి క్షణాల్లో అద్భుతం -
CG 2026: వర్షంలోనూ తగ్గని జోరు.. ఆఖరి క్షణాల్లో అద్భుతం
గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్-2026లో భారత అథ్లెట్స్ పతకాల పంట పండిస్తున్నారు. తాజాగా భారత లాంగ్ డిస్టెన్స్ రన్నర్ గుల్వీర్ సింగ్ చారిత్రాత్మక విజయం సాధించాడు. పురుషుల 10,000 మీటర్ల పరుగు పందెంలో అతడు రజత పతకాన్ని సొంతం చేసుకున్నాడు. దీంతో కామన్వెల్త్ క్రీడల్లో ఈ విభాగంలో పతకం గెలుచుకున్న తొలి భారత పురుష అథ్లెట్‌గా రికార్డులకెక్కాడు.ఆఖరి క్షణాల్లో అద్భుతంఉత్కంఠభరితంగా సాగిన ఈ రేసులో 28 ఏళ్ల గుల్వీర్ ఆఖరి క్షణాల్లో అద్భుతం చేశాడు. చివరి ల్యాప్‌లో అనూహ్యమైన వేగంతో ముందుకు దూసుకెళ్లిన గుల్వీర్.. 27 నిమిషాల 49.78 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని రెండో స్థానంలో నిలిచాడు. ఆస్ట్రేలియాకు చెందిన కై రాబిన్సన్ (27:48.93) స్వర్ణ పతకం సాధించగా.. ఐల్ ఆఫ్ మ్యాన్‌కు చెందిన డేవిడ్ ముల్లార్కే కాంస్య పతకం ఒడిసి పట్టాడు.వర్షంలోనూ తగ్గని జోరుకాగా స్కాట్స్టౌన్ స్టేడియంలో ఈ పరుగు పందం తీవ్ర ప్రతికూల వాతావరణంలో జరిగింది. రేసు సమయంలో భారీ వర్షం కురిసింది. నీటితో ట్రాక్ తడిసిపోయింది. అయినప్పటికి గుల్వీర్ తన పట్టుదలను వీడలేదు. మొదటి నుంచీ అగ్రస్థానంలో ఉన్న అథ్లెట్ల గుంపుతోనే సాగుతూ టాప్-2లో నిలిచాడు. అయితే ఈ విభాగంలో ఎప్పుడూ ఆధిపత్యం చెలాయించే కెన్యా, ఉగాండా అథ్లెట్లకు ఈసారి పతకాలు దక్కకపోవడం విశేషం. 1986 కామన్వెల్త్ గేమ్స్ తర్వాత పురుషుల 10,000 మీటర్ల విభాగంలో ఒక్క ఆఫ్రికన్ అథ్లెట్ కూడా పతకం గెలవకపోవడం ఇదే మొదటిసారి. కాగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన గుల్వీర్ సింగ్ ప్రస్తుతం ఇండియన్ ఆర్మీలోని గ్రెనేడియర్స్ రెజిమెంట్‌లో నాయిబ్ సుబేదార్‌గా పనిచేస్తున్నాడు. మరోవైపు భారత వెయిట్ లిఫ్టర్ హర్జిందర్ కౌర్ సైతం సత్తాచాటింది. మహిళల 69 కేజీల విభాగంలో మొత్తం 227 కేజీల (స్నాచ్‌లో 101 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 126 కేజీలు) బరువును ఎత్తి సిల్వర్ మెడల్ సొంతం చేసుకుంది. దీంతో ఈ క్రీడల్లో భారత పతకాలు సంఖ్య 12కు చేరింది. -
33 ఏళ్ల వయసులో... స్వప్నం సాకారం
ఐపీఎల్లో నాలుగు మ్యాచ్‌ల్లో మెరిస్తే చాలు... భారత జట్టులో చోటు ఖాయమే అని యువత భావిస్తున్న ప్రస్తుత తరుణంలో... ఓ ఆటగాడు దశాబ్ద కాలంగా టీమిండియా పిలుపు కోసం ఎదురు చూశాడంటే నమ్మగలరా! అప్పుడెప్పుడో పుష్కర కాలం క్రితం ఆడిన తొలి రంజీ మ్యాచ్‌లోనే ఐదు వికెట్లు పడగొట్టి అదుర్స్ అనిపించుకున్న ఆ ప్లేయర్‌కు 12 ఏళ్ల తర్వాత భారత టెస్టు జట్టులో చోటు దక్కింది.దేశవాళీల్లో నిలకడగా రాణించినప్పటికీ... టీమిండియాలో ఉన్న పోటీ, జట్టు కూర్పు కారణంగా అవకాశం దక్కించుకోలేకపోయిన మధ్యప్రదేశ్ స్పిన్ ఆల్‌రౌండర్ సారాంశ్ జైన్... ఎట్టకేలకు 33 ఏళ్ల వయసులో భారత జట్టు నుంచి పిలుపు అందుకున్నాడు. శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు ఎంపికైన నేపథ్యంలో సారాంశ్ ప్రస్థానాన్ని ఓసారి పరిశీలిస్తే... – సాక్షి, క్రీడావిభాగంధనాధన్ క్రికెట్ క్రేజ్‌లోనూ... సుదీర్ఘ ఫార్మాట్‌కే అధిక ప్రాధాన్యత ఇచ్చిన సారాంశ్ జైన్ నిరీక్షణ ఫలించింది. బ్యాట్ చేత పట్టినప్పటి నుంచి కన్న కల... ఇన్నాళ్ల తర్వాత నిజమైంది. 33 ఏళ్ల వయసులో ఈ ఆఫ్‌స్పిన్నర్ జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. ప్రస్తుత పోటీ క్రికెట్లో 33 ఏళ్ల వయసు అంటే కెరీర్ చరమాంకానికి వచ్చేసినట్లే! అలాంటిది ఈ వయసులో అతడు తొలిసారి భారత జట్టుకు ఎంపికవడం ఆశ్చర్యమే. అయితే ఇన్నాళ్లలో ఎన్నోసార్లు సెలక్టర్ల దృష్టికి వచ్చినా... వేర్వేరు కారణాల వల్ల టీమిండియాకు ఎంపిక కాలేకపోయిన ఈ మధ్యప్రదేశ్ ఆఫ్ స్పిన్నర్ శ్రీలంకతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం ప్రకటించిన భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు.సుదీర్ఘ కాలగా రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా జాతీయ జట్టు తరఫున మెరుగైన ప్రదర్శన కనబరుస్తుండటంతో ఇతర స్పిన్నర్లకు పెద్దగా అవకాశాలు రాకపోగా... ఇప్పుడు వాషింగ్టన్ సుందర్ గాయంతో లంక పర్యటనకు దూరమవడంతో సారాంశ్‌ను ఎంపిక చేశారు. కుడిచేతి వాటం ఆఫ్‌స్పిన్నర్ అయిన ఈ మధ్యప్రదేశ్ ప్లేయర్... లోయర్ ఆర్డర్లో ఎడంచేతి వాటం బ్యాటింగ్‌తోనూ ఆకట్టుకోగలడు. సుదీర్ఘ కాలంగా మధ్యప్రదేశ్ రంజీ జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్న సారాంశ్... 2022లో ఆ జట్టు చాంపియన్‌గా నిలవడంతో ప్రధానపాత్ర పోషించాడు. ఇతర ఆటగాళ్లంతా ఐపీఎల్ వంటి అతిపెద్ద లీగ్‌పై దృష్టి పెడుతున్న సమయంలోనూ సారాంశ్... దేశవాళీలకే తొలి ప్రాధాన్యతనిచ్చి తన ప్రత్యేకత చాటుకున్నాడు. అతడి కఠోర శ్రమ, అకుంఠిత దీక్షకు ఇప్పుడు ఫలితం దక్కినట్లయింది. ఆశ్విన్ అభిమాని...చిన్నప్పటి నుంచి తండ్రి వద్దే కోచింగ్ తీసుకున్న సారాంశ్... ఆ తర్వాత భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను అభిమానించడం ప్రారంభించాడు. అశ్విన్ వీడియోలను పరిశీలిస్తూ బౌలింగ్‌లో వైవిధ్యం పెంపొందించుకునేందుకు ప్రయత్నిస్తుంటాడు. జాతీయ జట్టు తరఫున ఆడే అవకాశం వస్తే... ‘ఎలాంటి ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా ఆడు’ అని తండ్రి చెప్పిన మాటలను పాటించేందుకు సారాంశ్ సిద్ధమవుతున్నాడు. ‘నేను మధ్యప్రదేశ్ తరఫున రంజీ ట్రోఫీలో ఆడాను. అయితే అందరు ఆటగాళ్లలాగే దేశానికి ప్రాతినిధ్యం వహించాలనే కల నెరవేర్చుకోలేకపోయాను. కానీ ఇప్పుడు ఇన్నాళ్లకు నా కుమారుడికి ఆ అవకాశం వచ్చింది. సారాంశ్‌తో పాటు ఎంతో మంది రంజీ ప్లేయర్లకు నేను ప్రత్యేక శిక్షణ ఇచ్చా. వాళ్లందరిలో ఒక ప్రత్యేకత ఉంది. నా దగ్గర ట్రయినింగ్ పొందిన వాళ్లంతా తక్కువ మాట్లాడుతారు, ఎక్కువ కష్టపడతారు’ అని సుబోధ్ వివరించారు. మరి 33 ఏళ్ల వయసులో జాతీయ జట్టుకు ఎంపికైన సారాంశ్ అరంగేట్రం అవకాశం వస్తే అదరగొట్టాలని మనమూ ఆశిద్దాం!క్యాన్సర్‌ను దాచిపెట్టి...2014లో సారాంశ్ ఇండోర్ క్లబ్ తరఫున ఆస్ట్రేలియాలో మ్యాచ్‌లు ఆడుతున్న సమయంలో సుబోధ్ క్యాన్సన్ బారిన పడ్డారు. మ్యాచ్ అనంతరం తండ్రితో మాట్లాడాలనుకున్న ప్రతిసారీ బిజీగా ఉన్నారనే సమాధానం దక్కేది. అయితే పర్యటన ముగించుకొని తిరిగి వచ్చిన తర్వాత తండ్రికి నోటి క్యాన్సర్ వచ్చిందనే వార్త సారాంశ్‌కు తెలిసింది. దీంతో అతడు పూర్తిగా నీరుగారిపోయాడు. ‘అప్పుడు నా నోరు బాగా వాచిపోయింది. దాంతో మాట్లాడే పరిస్థితుల్లో లేను. ఒక చిన్న చీటీ తీసుకొని నువ్వు మెరుగైన ప్రదర్శన చేస్తే నేను త్వరగా కోలుకుంటా (బేటా, తూ జిత్నా అచ్ఛా కరేగా... మై ఉత్నీ జల్దీ ఠీక్ హో జావుంగా) అని రాసిచ్చా. దాన్ని సారాంశ్ తూచా తప్పకుండా పాటించాడు. బరిలోకి దిగిన ప్రతిసారీ 100 శాతం కష్ట పడుతూ మెరుగైన ఫలితాలు సాధించాడు. మంగళవారం భారత జట్టు ప్రకటన సమయంలో అతడు ఆలయానికి వెళ్లాడు. గుడి నుంచి బయటకు రాగానే జాతీయ జట్టుకు ఎంపికైన విషయం తెలిసి చాలా సంతోషించాడు. సుదీర్ఘ కాలంగా అతడు పడ్డ శ్రమకు ఇన్నాళ్లకు ఫలితం దక్కింది’ అని సారాంశ్ తండ్రి సుబోధ్ తెలిపారు.తండ్రి కూడా రంజీ ప్లేయర్...సారాంశ్ తండ్రి సుబోధ్ జైన్ రంజీ ప్లేయర్. మధ్యప్రదేశ్ జట్టు తరఫున 9 రంజీ మ్యాచ్‌లాడిన సుబోధ్ 23 వికెట్లు పడగొట్టారు. అయితే అప్పుడున్న పరిస్థితుల్లో స్పిన్నర్ల మధ్య విపరీతమైన పోటీ కారణంగా భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాలనుకున్న ఆయన కల నెరవేరలేదు. తాను సాధించలేకపోయింది... తన కుమారుడైనా సాధించాలని సుబోధ్ ఎంతో తపించారు. సారాంశ్‌కు చిన్నప్పటి నుంచే సుబోధ్ కఠిన శిక్షణ ఇచ్చారు. ‘మాటల కన్నా చేతలు మిన్న’ అని బలంగా నమ్మే సుబోద్... తన కుమారుడిని కూడా అదే విధంగా తీర్చిదిద్దారు. సారాంశ్‌కు పన్నెండేళ్లు వచ్చేసరికి అతడిలో ఏదో ప్రత్యేకత ఉందని సుబోధ్ గుర్తించారు. దీంతో అతడిని మరింత సానబెట్టి రంజీ స్థాయికి చేర్చారు. ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు రెండు టైటిల్స్ అందించిన రజత్ పాటీదార్‌తో కలిసి సుదీర్ఘ కాలం ఆడిన సారాంశ్ జైన్... పరిమిత ఓవర్ల కంటే సుదీర్ఘ ఫార్మాట్‌పైనే ఎక్కువ దృష్టి పెట్టాడు. -
జిదాన్ వచ్చేశాడు
పారిస్: ఫ్రాన్స్ ఫుట్‌బాల్ జట్టుకు కొత్త హెడ్ కోచ్ వచ్చాడు. 1998 ప్రపంచకప్, 2000 యూరో చాంపియన్‌షిప్ విజేత జట్టు సభ్యుడు, స్టార్ ప్లేయర్ జినెదిన్ జిదాన్‌ను ఫ్రాన్స్ జట్టు హెడ్ కోచ్‌గా నియమించారు. ప్రపంచ ఫుట్‌బాల్‌లో అత్యంత గొప్ప ఆటగాళ్లలో ఒకడిగా... ఆ తర్వాత విజయవంతమైన కోచ్‌గా గుర్తింపు సాధించిన జిదాన్... 2030 వరకు ఫ్రాన్స్ కోచ్‌గా వ్యవహరించనున్నాడు. 14 ఏళ్లుగా ఫ్రాన్స్ కోచ్‌గా వ్యవహరించిన దీదీర్ డెషాంప్స్ పదవీకాలం ఇటీవలి ప్రపంచకప్‌తో ముగిసింది. దీంతో అతడి స్థానంలో 54 ఏళ్ల జిదాన్‌ను ఎంపిక చేసినట్లు ఫ్రెంచ్ ఫుట్‌బాల్ సమాఖ్య మంగళవారం ప్రకటించింది. డెషాంప్స్ కోచింగ్‌లో ఫ్రాన్స్ జట్టు 2018లో వరల్డ్‌కప్ చాంపియన్‌గా నిలిచింది. 2022 ఫైనల్లో అర్జెంటీనా చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచిన ఫ్రాన్స్... తాజా వరల్డ్‌కప్‌లో నాలుగో స్థానం దక్కించుకుంది. ‘చాలా ఉత్సుకతతో ఉన్నా. ఫ్రాన్స్ జట్టు మిమ్మల్ని కలలు కనేలా చేస్తుంది. మా జట్టులో అసాధారణమైన ప్లేయర్లు ఉన్నారు. ఈ అవకాశం కోసం ఐదేళ్లుగా ఎదురుచూస్తున్నా. అందుకే చాలా భావోద్వేగంగా ఉంది. నేను ఎప్పుడూ ఈ జట్టుకు అభిమానినే. రియల్ మాడ్రిడ్ తర్వాత ఫ్రాన్స్ జట్టుకు మాత్రమే కోచ్‌గా పనిచేయాలనుకున్నా. అందుకే చాలా ఇతర అవకాశాలను వదులుకున్నా. ఇన్నాళ్లు ఫ్రాన్స్ కోచ్‌గా వ్యవహరించిన డెషాంప్స్ జట్టును అత్యుత్తమంగా తీర్చిదిద్దారు. దాన్ని కొనసాగించేందుకు శాయశక్తులా కృషి చేస్తా’ అని జిదాన్ పేర్కొన్నాడు. జిదాన్ శిక్షణలో ఫ్రాన్స్ జట్టు మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుతుందని ఫ్రెంచ్ ఫుట్‌బాల్ సమాఖ్య అధ్యక్షుడు ఫిలిప్ డయల్‌లో ఆశాభావం వ్యక్తం చేశారు. జిదాన్ కోచింగ్‌లో ఫ్రాన్స్ జట్టు సెపె్టంబర్ 25న టర్కీతో తొలి మ్యాచ్ ఆడనుంది. అక్టోబర్ 2న స్వదేశంలో ఇటలీతో ఫ్రాన్స్ తలపడనుంది.‘రెడ్‌కార్డ్’తో కెరీర్ ముగింపుప్రపంచవ్యాప్తంగా ఫ్రాన్స్ జట్టుకు అభిమానులను సాధించి పెట్టడంలో జిదాన్ ప్రధాన పాత్ర పోషించాడు. 1998 ప్రపంచకప్‌లో జిదాన్ ప్రదర్శనను ఫుట్‌బాల్ అభిమానులు ఎప్పటికీ మరవలేరు. డిఫెండింగ్ చాంపియన్ బ్రెజిల్‌తో జరిగిన వరల్డ్‌కప్ ఫైనల్లో జిదాన్ రెండు ‘హెడర్’ గోల్స్‌తో ఫ్రాన్స్‌ను ఒంటిచేత్తో టైటిల్ కట్టబెట్టాడు. ఆ తర్వాత రెండేళ్లకు ఫ్రాన్స్‌కు యూరో కప్ అందించడంలోనూ అతడి పాత్ర కీలకం. 2004లో కెరీర్‌కు వీడ్కోలు పలికిన జిదాన్... ఆ తర్వాత అందరి అభ్యర్ధన మేరకు తిరిగి జట్టు పగ్గాలు అందుకున్నాడు. అతడి సారథ్యంలో ఫ్రాన్స్ జట్టు 2006 ప్రపంచకప్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. అయితే తుదిపోరులో ఇటలీ ఆటగాడు మార్కో మాటెరాజీ స్లెడ్జింగ్‌కు పాల్పడటంతో అతడి ఛాతీపై తలతో గుద్దినందుకు గానూ జిదాన్ ‘రెడ్ కార్డ్’కు గురయ్యాడు. ఆ మ్యాచ్‌తోనే అతడి కెరీర్ ముగియగా... ఫైనల్ ‘షూటౌట్’లో ఫ్రాన్స్ పరాజయం పాలైంది. ఓవరాల్‌గా 12 ఏళ్ల కెరీర్లో జాతీయ జట్టు తరఫున 108 మ్యాచ్‌లాడిన జిదాన్ 31 గోల్స్ చేశాడు. రిటైర్మెంట్ అనంతరం కోచ్ అవతారమెత్తిన అతడు... 2016–2021 మధ్య రియల్ మాడ్రిడ్ క్లబ్‌ను అజేయ శక్తిగా తీర్చిదిద్దాడు. -
అటు అజయ్... ఇటు సర్వేశ్
కామన్వెల్త్ క్రీడల్లో భారత్ పతకాల వేట కొనసాగుతోంది. వెయిట్‌లిఫ్టింగ్‌లో ఆంధ్రప్రదేశ్ అబ్బాయి వల్లూరి అజయ్ బాబు రజతం అందించగా... హైజంప్‌లో తొలిసారి రజతాన్ని అందించిన ఘనతను సర్వేశ్ కుశారే సొంతం చేసుకున్నాడు. పారా అథ్లెట్లు కూడా తమ వంతుగా రెండు పతకాలను భారత్ ఖాతాలో చేర్చారు. షాట్‌పుట్‌లో షర్మిల స్వర్ణంతో, శిల్ప కాంస్యంతో మెరిశారు.గ్లాస్గో: కామన్వెల్త్ క్రీడల్లో భారత వెయిట్‌లిఫ్టర్లు తమపై పెట్టుకున్న అంచనాలకు అనుగుణంగా రాణిస్తున్నారు. ఈ క్రీడాంశం ద్వారా భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. పురుషుల 79 కేజీల కేటగిరీలో ఆంధ్రప్రదేశ్ లిఫ్టర్ వల్లూరి అజయ్ బాబు మొత్తం 330 కేజీల బరువెత్తి రజతం గెలుచుకున్నాడు. స్నాచ్‌లో 149 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 181 కేజీల బరువెత్తిన అజయ్‌కు రెండో స్థానం దక్కింది. మలేసియాకు చెందిన హిదాయత్ (331 కేజీలు) స్వర్ణం సాధించగా, క్రిస్ ముర్రే (ఇంగ్లండ్; 325 కేజీలు) కాంస్యం గెలిచాడు. పురుషుల హైజంప్‌లో సర్వేశ్ కుశారే రజతాన్ని సొంతం చేసుకున్నాడు. 2.25 మీటర్ల ఎత్తుకు ఎగిరిన సర్వేశ్ రెండో స్థానంలో నిలిచాడు. జమైకా అథ్లెట్ రొమైన్బెక్ఫోర్డ్ (2.25 మీటర్లు) స్వర్ణం దక్కించుకోగా... కిమాని జాక్ (ఇంగ్లండ్; 2.20 మీటర్లు) కాంస్యం సాధించాడు. సర్వేశ్, బెక్‌ఫోర్డ్ ఇద్దరూ 2.25 మీటర్ల ఎత్తే ఎగిరినా... కౌంట్‌బ్యాక్‌లో జమైకా అథ్లెట్ పైచేయి సాధించాడు. సర్వేశ్‌తో పోలిస్తే బెక్‌ఫోర్డ్ విఫల ప్రయత్నాల సంఖ్య తక్కువ కావడమే అందుకు కారణం. కామన్వెల్త్ క్రీడల్లో భారత్‌కు ఇది తొలి రజతం కావడం విశేషం. హైజంప్‌లో ఇప్పటి వరకు తేజస్విన్ శంకర్ (2022 బర్మింగ్‌హామ్) గెలుచుకున్న కాంస్యమే భారత్‌కు ఏకైక పతకం కాగా... ఇప్పుడు సర్వేశ్ దానిని సవరించాడు. మరో భారత హైజంపర్ ఆదర్శ్రామ్ (2.15 మీటర్లు) ఐదో స్థానంతో ముగించాడు. మరోవైపు బాక్సింగ్‌లో మూడు పతకాలు ఖాయమయ్యాయి. మహిళల విభాగంలో ప్రీతి (54 కేజీలు), ప్రియ (60 కేజీలు), పురుషుల విభాగంలో జాదుమణి సింగ్ (55 కేజీలు) సెమీఫైనల్‌కు చేరుకొని కనీసం కాంస్య పతకాలు ఖరారు చేసుకున్నారు. మరో బాక్సర్ పర్విన్ 2–3తో సాషా హెకీ (ఇంగ్లండ్) చేతిలో ఓడిపోయింది. మహిళల వెయిట్‌లిఫ్టింగ్ 63 కేజీల విభాగంలో నిరుపమా దేవి విఫలమైంది. స్నాచ్‌లో 93 కేజీలు బరువెత్తిన నిరుపమా క్లీన్ అండ్ జెర్క్ మూడు ప్రయత్నాల్లోనూ ఫౌల్ చేసింది. పారా స్విమ్మింగ్ పురుషుల 50 మీటర్ల ఫ్రీస్టయిల్ ఫైనల్లో భారత స్విమ్మర్ రవి బుడిగిన (ఆంధ్రప్రదేశ్; 25.68 సెకన్లు) 6వ స్థానంలో నిలిచాడు.స్వర్ణ, కాంస్యాలు మనవే...కామన్వెల్త్ పారా క్రీడల అథ్లెటిక్స్ పోటీల చరిత్రలో భారత్ తొలిసారి స్వర్ణం గెలుచుకుంది. మహిళల షాట్‌పుట్ (ఎఫ్57)లో హరియాణకు చెందిన షర్మిల ధన్కర్ పసిడి సొంతం చేసుకుంది. ఆమె తన మూడో ప్రయత్నంలో ఇనుప గుండును 9.81 మీటర్ల దూరం విసిరింది. భారత్‌కే చెందిన కంచుగరకొప్పలు శిల్పా శైలా (కర్ణాటక) కాంస్యం సొంతం చేసుకుంది. ఆమె గుండును 7.26 మీటర్లు విసిరింది. గృహ హింసకు గురై... హరియాణాలోని చిత్రోలికి చెందిన 40 ఏళ్ల షర్మిల గృహ హింస బాధితురాలు. రెండేళ్ల వయసులోనే పోలియో బారిన పడిన ఆమెకు చిన్నతనంలోనే పెళ్లయింది. అయితే వివాహానంతరం ఆమె తీవ్ర హింసకు గురైంది. దీనిని తట్టుకోలేక చివరకు ఆ బంధం నుంచి తప్పుకున్న ఆమె మరో పెళ్లి చేసుకుంది. భర్త అజిత్ సింగ్ ఆమెకు అండగా నిలుస్తూ అన్ని విధాలా ప్రోత్సహించాడు. దాంతో ఆరేళ్ల క్రితం ఆమె పారా అథ్లెట్ కెరీర్ మొదలైంది. ఏడాదిలోపే జాతీయ టైటిల్ గెలుచుకోవడంతో పాటు పారా షాట్‌పుట్, పారా డిస్కర్త్రోలో భారత అత్యుత్తమ అథ్లెట్లలో ఒకరిగా ఎదిగింది. ఇంటర్నేషల్ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించిన షర్మిల 2022 కామన్వెల్త్ క్రీడల్లో నాలుగో స్థానంలో నిలిచింది.ఒక్కో మెట్టు ఎదుగుతూ... ప్రతిష్టాత్మక డైమండ్ లీగ్ ఈవెంట్లో టాప్–3లో నిలిచిన నాలుగో భారత ఆటగాడి గా సర్వేశ్ గుర్తింపు పొందాడు. గతంలో జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా, లాంగ్‌జంపర్ మురళీ శ్రీశంకర్, డిస్కస్ త్రోయర్ వికాస్ గౌడ మాత్రమే ఈ జాబితాలో ఉన్నారు. ఇటీవల మొనాకోలో జరిగిన పోటీల్లో సర్వేశ్ ఈ ఘనత సాధించాడు. ఆలస్యంగా ఆటలోకి అడుగుపెట్టి సత్తా చాటిన అరుదైన అథ్లెట్‌గా సర్వేశ్ అందరి దృష్టిలో పడ్డాడు. మహారాష్ట్రలోని నాసిక్‌కు చెందిన సర్వేశ్ తండ్రి ఉల్లిగడ్డలు పండించే రైతు. 20 ఏళ్ల వయసులో తొలిసారి జాతీయ జూనియర్ చాంపియన్‌షిప్‌లో అతను పాల్గొన్నాడు. జాతీయ సీనియర్ పోటీల్లో వరుసగా రెండేళ్లు ఇండియన్ ఓపెన్‌లో స్వర్ణం గెలిచిన అతను గత నెలలో ఇంటర్ స్టేట్ చాంపియన్‌షిప్‌లో 2.31 మీటర్ల ఎత్తు ఎగిరి కొత్త జాతీయ రికార్డు నెలకొల్పాడు. 2025 వరల్డ్ చాంపియన్ షిప్లో ఆరో స్థానంలో నిలిచిన సర్వేశ్...ఈ పోటీల్లో ఫైనల్స్‌కు అర్హత సాధించిన తొలి భారత హైజంపర్గా నిలిచాడు. -
నాన్నకు ప్రేమతో...
ఆ అబ్బాయికి అప్పటికి ఆరేళ్ల వయసు... తన తండ్రి సాధించిన ఘనత ఏమిటో అతనికేమీ తెలేదు... కానీ తర్వాతి రోజుల్లో అదే అతనికి స్ఫూర్తిగా నిలిచింది. ఎంత వద్దనుకున్నా మనసు వెయిట్‌లిఫ్టింగ్ వైపు మళ్లింది. చివరకు తండ్రి బాటలో పతకాల వేట మొదలు పెట్టిన ఆ కుర్రాడు ఇప్పుడు తన నాన్న ఘనతను పునరావృతం చేశాడు. సరిగ్గా చెప్పాలంటే తండ్రికంటే మరో అడుగు ముందుకు వేశాడు. కామన్వెల్త్ క్రీడల్లో కాంస్యం, రజతం గెలిచిన తండ్రీకొడుకుల గాథ ఇది. 2010 ఢిల్లీ కామన్వెల్త్ క్రీడల వెయిట్‌లిఫ్టింగ్‌లో వల్లూరి శ్రీనివాసరావు పతకధారి కాగా....16 ఏళ్ల తర్వాత వల్లూరి అజయ్ బాబు మెడల్ సొంతం చేసుకొని సగర్వంగా నిలిచాడు. శ్రీనివాసరావు 2010 క్రీడల్లో 56 కేజీల వెయిట్‌లిఫ్టింగ్‌లో కాంస్యం గెలుచుకున్నాడు. ఆర్మీలో ఉద్యోగిగా ఉన్న ఆయన తన ఆరేళ్ల అబ్బాయిని కూడా తనతో పాటు పుణేలోని శిక్షణా కేంద్రానికి తరచుగా తీసుకువెళ్లేవాడు. తండ్రి మాట ప్రకారం ఆరంభంలో ఆటల వైపు కాకుండా చదువు పైనే అజయ్ దృష్టి పెట్టాడు. కానీ ఇంట్లో కనిపిస్తున్న కామన్వెల్త్ క్రీడల పతకం అతడిని పదే పదే వెయిట్‌లిఫ్టింగ్ వైపు మళ్లించింది. దాంతో సహజంగానే శ్రీనివాసరావు తొలి కోచ్‌గా మారి ఆటలో ఓనమాలు నేర్పించాడు. ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా కొండవెలగాడ స్వస్థలం కాగా, శిక్షణ కోసం అజయ్ విజయవాడకు చేరుకున్నాడు. ఆ తర్వాత ఆర్మీ స్పోర్ట్స్ ఇన్స్టిట్యూట్లో అవకాశం లభించడంతో అతని కెరీర్ మారిపోయింది. ఈ క్రమంలో జాతీయ జూనియర్ చాంపియన్‌గా నిలవడంతో అతను మరింత పైకి ఎదిగాడు. కీలక సమయాల్లో తండ్రి అండగా నిలుస్తూ అందించిన ప్రోత్సాహం అజయ్‌ను సరైన దిశలో నడిపించింది. రెండేళ్ల క్రితం మోచేతికి గాయమై శస్త్ర చికిత్స జరిగినప్పుడు మళ్లీ కోలుకొని వెయిట్‌లిఫ్టింగ్‌పై దృష్టి పెట్టేందుకు నాన్న ఇచ్చిన చేయూతే ఫలితాలు అందించింది. గత ఏడాది కామన్వెల్త్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలుచుకోవడంతోనే ఈ మెగా ఈవెంట్లో అజయ్‌పై అంచనాలు ఏర్పడ్డాయి. తండ్రితో పోలిక కూడా మొదలైంది. గ్లాస్గోకు వెళ్లే ముందు స్వర్ణం సాధిస్తానని అతను తండ్రికి మాటిచ్చాడు. అయితే పసిడి దక్కకపోయినా వెండి పతక విలువేమీ తక్కువ కాదు. ప్రస్తుతం 21 ఏళ్ల వయసే ఉన్న అజయ్‌కు మున్ముందు మరిన్ని పెద్ద విజయాలు సాధించగల సత్తా ఉందని ఈ ప్రదర్శన నిరూపించింది. -
సారాంశ్‌కు స్వాగతం
న్యూఢిల్లీ: సుదీర్ఘ నిరీక్షణకు ఫలితం దక్కింది. దశాబ్ద కాలానికి పైగా దేశవాళీల్లో నిలకడగా రాణిస్తున్న ఆఫ్‌స్పిన్నర్ సారాంశ్ జైన్‌కు ఎట్టకేలకు భారత టెస్టు జట్టు నుంచి పిలుపు వచ్చింది. వచ్చే నెల శ్రీలంకతో జరగనున్న రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు 33 ఏళ్ల సారాంశ్ ఎంపికయ్యాడు. తొలి టెస్టు ఆగస్టు 15 నుంచి 19 వరకు గాలెలో... రెండో టెస్టు కొలంబోలో ఆగస్టు 23 నుంచి 27 వరకు జరుగుతాయి. ఈ సిరీస్ కోసం బీసీసీఐ సీనియర్ సెలక్షన్ కమిటీ మంగళవారం శుబ్‌మన్ గిల్ సారథ్యంలో 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. గాయాలతో ఇబ్బంది పడుతున్న స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, సాయి సుదర్శన్‌ను కూడా ఈ సిరీస్‌కు ఎంపిక చేశారు. అయితే పర్యటన ప్రారంభానికి ముందు ఈ ఇద్దరూ ఫిట్నెస్ నిరూపించుకోవాల్సి ఉంది. స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ అందుబాటులో లేకపోవడంతో అతడి స్థానాన్ని సారాంశ్‌తో భర్తీ చేశారు. మధ్యప్రదేశ్ జట్టు రంజీ ట్రోఫీ నెగ్గడంలో కీలక పాత్ర పోషించిన ఈ ఆల్‌రౌండర్... ఇటీవల శ్రీలంక ‘ఎ’తో జరిగిన అనధికారిక టెస్టు సిరీస్‌లో భారత్ ‘ఎ’ జట్టు తరఫున మెరుగైన ప్రదర్శన కనబర్చాడు. జట్టులో ఉన్న రవీంద్ర జడేజా, మానవ్ సుతార్, కుల్దీప్ యాదవ్ ముగ్గురూ లెఫ్టార్మ్ స్పిన్నర్లు కావడంతో... వైవిధ్యం కోసం కుడిచేతి వాటం స్పిన్నర్ సారాంశ్‌ను ఎంపిక చేశారు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 54 మ్యాచ్‌లు ఆడిన సారాంశ్ 27.30 సగటుతో 188 వికెట్లు పడగొట్టాడు.భారత టెస్టు జట్టు: శుబ్‌మన్ గిల్ (కెప్టెన్ ), కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, రిషభ్‌పంత్, సాయి సుదర్శన్, ధ్రువ్ జురేల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్, బుమ్రా, సిరాజ్, ప్రసిధ్, గుర్నూర్ బ్రార్, దేవదత్ పడిక్కల్, సారాంశ్ జైన్. -
టీమిండియాకు గుడ్‌బై చెప్పిన గంభీర్ స్నేహితుడు
భారత క్రికెట్ జట్టు సహాయక సిబ్బందిలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డష్కటే, ఫీల్డింగ్ కోచ్ టీ. దిలీప్‌ల కాంట్రాక్టులను పొడిగించకూడదని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిర్ణయించింది.ఇటీవల ముగిసిన ఇంగ్లండ్, ఐర్లాండ్ పర్యటనల సమయంలోనే ఇద్దరి కాంట్రాక్టు గడువు పూర్తయిందని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా వెల్లడించారు. వారి ఒప్పందాలను ఇకపై కొనసాగించడం లేదని తెలిపారు.గౌతమ్ గంభీర్ కోచింగ్ బృందంలో భాగంగా 2024లో భారత జట్టుతో చేరిన డష్కటే రెండేళ్ల పాటు సేవలందించారు. అయితే కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలనే ఉద్దేశంతో ఆయన ఎక్కువ కాలం జట్టుతో ప్రయాణించే బాధ్యతను కొనసాగించేందుకు ఆసక్తి చూపలేదని సమాచారం.భారత జట్టు నుంచి వైదొలిగిన అనంతరం డష్కటే తిరిగి ఐపీఎల్ ఫ్రాంచైజీ కోల్‌కతా నైట్ రైడర్స్ కోచింగ్ బృందంలో చేరే అవకాశం ఉంది. డష్కటే గంభీర్‌కు ఆప్త మిత్రుడు. వీరిద్దరికి ఐపీఎల్లో కేకేఆర్‌కు ఆడిన రోజుల్లో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి వీరు స్నేహం కొనసాగించారు. డష్కటే టీమిండియా కోచ్ కావడానికి గంభీరే ప్రధాన కారకుడు.మరోవైపు, ఫీల్డింగ్ కోచ్ టీ. దిలీప్ స్థానంలో కొత్త వ్యక్తిని నియమించే ప్రక్రియను బీసీసీఐ ప్రారంభించింది. శ్రీలంక పర్యటనకు ముందే కొత్త ఫీల్డింగ్ కోచ్‌ను ఖరారు చేయాలని బోర్డు భావిస్తోంది.ఫీల్డింగ్ కోచ్ పదవికి సుభదీప్ ఘోష్ పేరు ముందంజలో ఉన్నట్లు సమాచారం. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌కు చెందిన కొంతమంది కోచ్‌లు, మాజీ క్రికెటర్ల పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. -
టీమిండియాను గడగడలాడించిన బౌలర్‌కు వన్డే అవకాశం
త్వరలో స్వదేశంలో ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగబోయే ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో తొలి మూడు మ్యాచ్‌ల కోసం 14 మంది సభ్యుల ఐర్లాండ్ జట్టును ఇవాళ ప్రకటించారు. ఈ జట్టులో ఇటీవల భారత టీ20 జట్టుపై సంచలన ప్రదర్శనలు చేసిన జై మూండ్రాకు చోటు దక్కింది. మూండ్రాకు ఇదే తొలి వన్డే అవకాశం.గాయం కారణంగా భారత్‌తో జరిగిన టీ20 సిరీస్‌కు దూరమైన కెప్టెన్ పాల్ స్టిర్లింగ్ పూర్తిగా కోలుకుని మళ్లీ జట్టులో చేరాడు. అతడే ఈ సిరీస్‌లో ఐర్లాండ్‌కు నాయకత్వం వహించనున్నాడు. 24 ఏళ్ల మీడియం పేసర్ బైరన్ మెక్‌డోనఫ్ తొలిసారి ఐర్లాండ్ జాతీయ జట్టులో చోటు సంపాదించాడు. గాయాలు, రికవరీ కారణంగా ఈ కింది ఆటగాళ్లు ఎంపికకు అందుబాటులో లేరు.* జోష్ లిటిల్* మ్యాట్ హోలార్డ్* క్రెయిగ్ యంగ్* బ్యారీ మెక్‌కార్తీ* జోర్డాన్ నీల్* డేవిడ్ డెలానీచివరి రెండు వన్డేల జట్టును ఆటగాళ్ల ఫిట్నెస్ను బట్టి తర్వాత ప్రకటిస్తారు.తొలి మూడు వన్డేలకు ఐర్లాండ్ జట్టు..* పాల్ స్టిర్లింగ్ (కెప్టెన్)* మార్క్ అదైర్* ఆండ్రూ బాల్బిర్నీ* బెన్ కాలిట్జ్* కర్టిస్ క్యాంఫర్* కేడ్ కార్మైకెల్* జార్జ్ డాక్రెల్* గావిన్ హోయ్* ఆండ్రూ మెక్‌బ్రైన్* లియమ్ మెక్‌కార్తీ* బైరన్ మెక్‌డోనఫ్* జై మూండ్రా* హ్యారీ టెక్టర్* లోర్కన్ టకర్కాగా, ఐర్లాండ్-ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆగస్ట్ 5, 7, 10, 12, 14 తేదీల్లో జరుగనుంది. తొలి రెండు వన్డేలు బ్రీడీ వేదికగా జరుగనుండగా.. చివరి మూడు వన్డేలకు బెల్ఫాస్ట్ ఆతిథ్యమివ్వనుంది. -
రియాలిటీ షోలో టీమిండియా కోచ్
టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ ప్రముఖ హిందీ రియాలిటీ షో 'ఖత్రోన్ కే ఖిలాడీ'లో ప్రత్యేక అతిథిగా కనిపించనున్నాడు. అయితే, ఆయన పోటీదారుగా కాకుండా షోలోని ప్రత్యేక స్టంట్‌లో భాగమవుతాడు. షో హోస్ట్ రోహిత్ శెట్టి పరిచయం చేయనున్న ఈ స్టంట్‌లో మోర్కెల్ తన వేగవంతమైన బౌలింగ్‌తో పోటీదారులకు సవాల్ విసరనున్నాడు.* గంటకు సుమారు 150 కిలోమీటర్ల వేగంతో బంతులు వేస్తాడు.* పోటీదారులు బ్యాట్‌తో కాకుండా భద్రతా పరికరాలు ధరించి తమ శరీరంతోనే బంతులను అడ్డుకోవాలి.* వారి వెనుక ఉన్న గోడను, వికెట్లను మోర్కెల్ బంతులు తాకకుండా కాపాడుకోవాల్సి ఉంటుంది.* విజయవంతంగా బంతులను అడ్డుకుంటే ఆ స్టంట్‌లో విజేతలుగా నిలుస్తారు.ఎప్పుడు ప్రసారం..?* షో ప్రారంభం: ఆగస్టు 1* ప్రసారం: ప్రతి శనివారం, ఆదివారం రాత్రి 9 గంటలకు* టీవీ: కలర్స్ టీవీ* ఓటీటీ: జియోహాట్స్టార్కోచింగ్ బాధ్యతలకు ఆటంకం ఉండదు..!ఈ ఎపిసోడ్ ముందుగానే చిత్రీకరించబడినందున మోర్కెల్ భారత జట్టుతో కలిసి శ్రీలంక పర్యటనకు సమయానికి చేరుకోనున్నాడు. ఈ షో వల్ల ఆయన కోచింగ్ బాధ్యతలపై ఎలాంటి ప్రభావం ఉండదని సమాచారం.కాగా, రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం భారత జట్టు వచ్చే నెలలో శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. ఈ సిరీస్‌కు టీమిండియా బౌలింగ్ కోచ్‌గా కొనసాగనున్నాడు. ఈ సిరీస్ కోసం భారత జట్టును ఇవాళే ప్రకటించారు. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ ఆగస్ట్ 15న గాలే వేదికగా, రెండో టెస్ట్ మ్యాచ్ ఆగస్ట్ 23న కొలొంబో వేదికగా జరుగనున్నాయి. -
ఫ్రాన్స్ హెడ్ కోచ్‌గా జిదాన్
దిగ్గజ ఫుట్‌బాలర్ జినెదిన్ జిదాన్‌ను ఫ్రాన్స్ ఫుట్‌బాల్ సమాఖ్య (FFF) తమ జాతీయ జట్టు కొత్త హెడ్ కోచ్‌గా ప్రకటించింది. 14 ఏళ్ల పాటు జట్టును నడిపించిన డిడియర్ డెషాంప్స్ 2026 ప్రపంచకప్ సెమీఫైనల్లో స్పెయిన్ చేతిలో ఓటమి అనంతరం పదవి నుంచి తప్పుకున్నాడు.54 ఏళ్ల జిదాన్ 2021లో రియల్ మాడ్రిడ్‌ను విడిచిన తర్వాత మళ్లీ కోచింగ్ బాధ్యతలు చేపట్టలేదు. ఇప్పుడు 2030 ప్రపంచకప్ అర్హత పోటీల వరకు కొనసాగే ఒప్పందంపై ఫ్రాన్స్ జట్టుకు కోచ్‌గా నియమితుడయ్యాడు.కొత్త బాధ్యతపై జిదాన్ మాట్లాడుతూ.. "ఫ్రాన్స్ జాతీయ జట్టుకు కోచ్‌గా నియమితుడవడం నాకు ఎంతో గర్వకారణం. ఈ జట్టుకు నాయకత్వం వహించడం గొప్ప బాధ్యత. అత్యున్నత లక్ష్యాలతో ముందుకు సాగుతాను" అని అన్నాడు.డెషాంప్స్ నాయకత్వంలో ఫ్రాన్స్:* 2018 ఫిఫా ప్రపంచకప్ విజేత* 2022 ప్రపంచకప్ రన్నరప్* మొత్తం మూడు ప్రధాన టోర్నీల ఫైనల్స్‌కు చేరింది.జిదాన్ కోచ్‌గా సాధించిన విజయాలు:రియల్ మాడ్రిడ్‌కు కోచ్‌గా:* 3 వరుస UEFA ఛాంపియన్స్ లీగ్ టైటిళ్లు (2016, 2017, 2018)* 2 లా లిగా టైటిళ్లు* అనేక అంతర్జాతీయ ట్రోఫీలుఛాంపియన్స్ లీగ్ యుగంలో వరుసగా మూడు సార్లు ట్రోఫీ గెలిచిన తొలి కోచ్‌లలో జిదాన్ ఒకరు.ఆటగాడిగా జిదాన్..* 1998 ప్రపంచకప్ విజేత* యూరో 2000 ఛాంపియన్* 1998 బాలన్ డి'ఓర్ విజేత1998 ప్రపంచకప్ ఫైనల్లో బ్రెజిల్‌పై రెండు హెడర్లతో ఫ్రాన్స్‌కు తొలి ప్రపంచకప్‌ను అందించాడు. 2006 ప్రపంచకప్ ఫైనల్లో ఇటలీ ఆటగాడు మార్కో మెటరాజీకి హెడ్‌బట్ చేయడంతో రెడ్ కార్డ్ అందుకోవడం కూడా ఫుట్‌బాల్ చరిత్రలో గుర్తుండిపోయే సంఘటనల్లో ఒకటిగా నిలిచింది.తొలి మ్యాచ్ఫ్రాన్స్ హెడ్ కోచ్‌గా జిదాన్ తన తొలి అధికారిక మ్యాచ్‌ను సెప్టెంబర్ 25న టర్కీతో జరిగే UEFA నేషన్స్ లీగ్ మ్యాచ్ ద్వారా ఆరంభించనున్నాడు. ఫ్రాన్స్ అభిమానులు అతడి నాయకత్వంలో జట్టు మళ్లీ ప్రపంచ ఫుట్‌బాల్‌లో అగ్రస్థానానికి చేరుతుందనే ఆశతో ఉన్నారు. -
మరోసారి పాక్ చిత్తు.. సిరీస్ శ్రీలంక వశం
శ్రీలంక మహిళల జట్టుతో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను పర్యాటక పాకిస్తాన్ జట్టు 1-2 తేడాతో కోల్పోయింది. హంబన్‌తోట వేదికగా ఇవాళ (జులై 28) జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో ఆతిథ్య జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, సిరీస్‌ను కైవసం చేసుకుంది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 40 ఓవర్లలో 187 పరుగులకే చాపచుట్టేయగా.. శ్రీలంక 37.2 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ సిరీస్ తొలి మ్యాచ్ పాక్ గెలవగా.. రెండు, మూడు మ్యాచ్‌లను గెలిచిన శ్రీలంక సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఇరు జట్ల మధ్య జులై 31, ఆగస్ట్ 2, 4 తేదీల్లో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరుగనుంది.చెలరేగిన లంక బౌలర్లుటాస్ ఓడి తొలుత బౌలింగ్ చేసిన శ్రీలంక పాక్‌ను స్వల్ప స్కోర్‌కే మట్టికరిపించింది. చేతన విముక్తి (3-36), కెప్టెన్ చమారీ (3-27), కవిష దిల్హరి (3-27) చెలరేగి బౌలింగ్ చేశారు. పాక ఇన్నింగ్స్‌లో 41 పరుగులు చేసిన ఫాతిమా సనా టాప్ స్కోరర్‌గా నిలిచింది. మిగతా ప్లేయర్లలో గుల్ ఫెరోజా (40), మునీబా అలీ (34), నజిహా అల్వి (30) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో లంక బ్యాటర్లు కూడా సత్తా చాటారు. చమారీ ఆటపట్టు (52), హాసిని పెరీరా (50 నాటౌట్), హర్షిత సమరవిక్రమ (71 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించి, తమ జట్టును విజయతీరాలకు చేర్చారు. వీరి ఇన్నింగ్స్‌లో విష్మి గౌతమ్ (12) మాత్రమే తక్కువ స్కోర్‌కు ఔటైంది. -
వైభవ్‌కు బ్రాడ్‌మన్‌తో పోలిక
భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై మాజీ భారత బ్యాటర్ రాబిన్ ఉతప్ప సంచలన వ్యాఖ్యలు చేశాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే ఐపీఎల్ 2026లో మెరిసి, భారత్ తరఫున అరంగేట్రం చేసిన వైభవ్‌ను ఉతప్ప ఏకంగా దిగ్గజం సర్ డాన్ బ్రాడ్‌మన్‌తో పోల్చాడు. సొంత యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడుతూ ఉతప్ప ఇలా అన్నాడు."వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ టెక్నిక్ డాన్ బ్రాడ్‌మన్‌ను గుర్తు చేస్తుంది. బ్రాడ్‌మన్ చాలా అరుదుగా ఎల్బీడబ్ల్యూ అయ్యేవాడు. వైభవ్ కూడా అదే తరహా టెక్నిక్‌తో ఆడుతున్నాడు"పోలికకు కారణంబ్రాడ్మన్ తన టెస్ట్ కెరీర్లో కేవలం నాలుగు సార్లు మాత్రమే LBW అయ్యాడు. వైభవ్ ఇప్పటివరకు ఐపీఎల్, అంతర్జాతీయ క్రికెట్ కలిపి ఒక్కసారి మాత్రమే LBWగా ఔటయ్యాడు. అతని ఓపెన్ స్టాన్స్, హై బ్యాక్‌లిఫ్ట్ కారణంగా బంతి లైన్లోకి త్వరగా రావడం వల్ల LBW అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయని ఉతప్ప అభిప్రాయపడ్డాడు.జింబాబ్వే సిరీస్‌లో అదరగొట్టిన వైభవ్ఇంగ్లండ్ పర్యటనలో విఫలమైన వైభవ్.. జింబాబ్వేతో జరిగిన మూడు టీ20ల్లో అద్భుతంగా ఆడాడు. 3 ఇన్నింగ్స్‌ల్లో 2 అర్ద సెంచరీల సాయంతో 151 పరుగులు చేసి, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కూడా గెలుచుకున్నాడు.పోలికలపై జాగ్రత్త అవసరంఇదిలా ఉంటే, వైభవ్‌ను ఇప్పుడే డాన్ బ్రాడ్‌మన్ వంటి దిగ్గజాలతో పోల్చడం సరైంది కాదని పలువురు మాజీ క్రికెటర్లు భావిస్తున్నారు. అతను ఇప్పుడే అంతర్జాతీయ కెరీర్ ప్రారంభించాడు. ఇలాంటి పోలికలు యువ ఆటగాడిపై అనవసరమైన అంచనాలు, ఒత్తిడిని పెంచే అవకాశం ఉంది.ప్రస్తుతం వైభవ్ అసాధారణ ప్రతిభను చూపిస్తున్నా, అతని నిజమైన స్థాయిని నిర్ణయించడానికి ఇంకా అనేక సంవత్సరాల అంతర్జాతీయ క్రికెట్ అవసరం. -
వెయిట్‌లిఫ్టర్ వల్లూరి అజయ్‌కు వైఎస్ జగన్ అభినందనలు
తాడేపల్లి ; కామన్వెల్త్ గేమ్స్-2026 వెయిట్‌లిఫ్టింగ్‌లో ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాకు చెందిన 21 ఏళ్ల వల్లూరి అజయ బాబు పురుషుల వెయిట్‌లిఫ్టింగ్ కేటగిరీలో రజత పతకం సాధించడంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తండ్రి వారసత్వాన్ని అజయ్ విజయవంతంగా కొనసాగించటం నిజంగా ప్రశంసనీయమన్నారు వైఎస్ జగన్. ఈ మేరకు ట్వీట్ చేశారు.‘మీ అద్భుతమైన ప్రదర్శన ఆంధ్రప్రదేశ్‌కు మరియు యావత్ దేశానికి గర్వకారణంగా నిలిచింది. భవిష్యత్తులో మీరు మరిన్ని విజయాలు సాధించాలాని కోరుకుంటున్నా. రానున్న రోజుల్లో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నా’ అని అభినందనలు తెలియజేశారు. Heartiest congratulations, Valluri Ajaya Babu, on winning the silver medal in the Men's 79 kg weightlifting event at the 2026 Commonwealth Games! Hats off to you for carrying forward the incredible legacy of your father, Valluri Srinivasa Rao Garu.Your outstanding performance… pic.twitter.com/1O8Ip66ZhY— YS Jagan Mohan Reddy (@ysjagan) July 28, 2026 కాగా, వెయిట్‌లిఫ్టింగ్ స్నాచ్ కేటగిరీలో 149 కేజీలు ఎత్తిన అజయ బాబు క్లీన్ అండ్ జెర్క్ కేటగిరీలో 181 కేజీల బరువును ఎత్తాడు. మొత్తంగా రెండు విభాగాలు కలిపి 330 కేజీలు ఎత్తిన అజయ బాబు రెండో స్థానంలో నిలిచాడు. దాంతో రజతం ఒడిసిపట్టుకున్నాడు వల్లూరి అజయ బాబు. తండ్రిని మించిన తనయుడు.. తెలుగు కుర్రాడికి రజతం -
పాక్ ప్లేయర్ చారిత్రక శతకం
వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో పాకిస్తాన్ తాజా మాజీ కెప్టెన్ షాన్ మసూద్ అద్భుత శతకంతో సత్తా చాటాడు. మూడో రోజు మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన మసూద్ 163 బంతుల్లో 11 ఫోర్ల సాయంతో సెంచరీ పూర్తి చేశాడు. ఈ శతకం అతని టెస్ట్ కెరీర్లో 7వది. వెస్టిండీస్‌పై తొలి టెస్ట్ సెంచరీ.చారిత్రక శతకంటరౌబాలోని బ్రియాన్ లారా క్రికెట్ అకాడమీలో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ ఇది. ఈ వేదికపై టెస్ట్ సెంచరీ చేసిన తొలి బ్యాటర్‌గా షాన్ మసూద్ చరిత్ర సృష్టించాడు. 2025 జనవరిలో దక్షిణాఫ్రికాపై శతకం తర్వాత దాదాపు 18 నెలల విరామం అనంతరం మసూద్ చేసిన సెంచరీ ఇది.బ్యాట్‌తో సమాధానంఇటీవల పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) షాన్ మసూద్‌ను టెస్ట్ కెప్టెన్సీ నుంచి తప్పించి, ఆ స్థానంలో బాబర్ ఆజంను మళ్లీ కెప్టెన్‌గా నియమించింది. కెప్టెన్సీ కోల్పోయిన వెంటనే మసూద్ బ్యాట్‌తో తన సామర్థ్యాన్ని మరోసారి నిరూపించుకున్నాడు.కెప్టెన్సీ ఎందుకు తొలగించారంటే..?2023లో టెస్ట్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన మసూద్ నాయకత్వంలో పాకిస్తాన్ జట్టు ఆశించిన ఫలితాలు సాధించలేదు.* ఆస్ట్రేలియాలో టెస్ట్ సిరీస్ ఓటమి* దక్షిణాఫ్రికాలో టెస్ట్ సిరీస్ ఓటమి* బంగ్లాదేశ్ చేతిలో స్వదేశంలో, వారి దేశంలో టెస్ట్ సిరీస్ పరాజయాలుఈ ఫలితాల నేపథ్యంలో నాయకత్వంలో మార్పు అవసరమని భావించిన PCB, మసూద్‌ను తప్పించి బాబర్ ఆజంను మళ్లీ టెస్ట్ కెప్టెన్‌గా నియమించింది.మ్యాచ్ విషయానికొస్తే.. హోరాహోరీగా సాగుతున్న ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 311 పరుగులు చేయగా.. జస్టిన్ గ్రీవ్స్ (11-6-27-5) దెబ్బకు పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 282 పరుగులకే చాపచుట్టేసింది. మసూద్ (109) సెంచరీ చేయడంతో పాక్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది.స్వల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన విండీస్, పాక్ బౌలర్లు మూకుమ్మడిగా చెలరేగడంతో 126 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 155 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. కాగా, రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం పాక్ జట్టు విండీస్‌లో పర్యటిస్తుంది. -
బాబర్ ఆజం వరల్డ్ రికార్డు
పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం టెస్ట్ కెప్టెన్‌గా తిరిగి బాధ్యతలు చేపట్టిన తొలి మ్యాచ్‌లోనే ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 23 పరుగులు చేసిన అతడు.. అంతర్జాతీయ క్రికెట్లో మూడు ఫార్మాట్లలోనూ 4500కిపైగా పరుగులు చేసిన తొలి క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ ఘనతను ఇప్పటివరకు ప్రపంచ క్రికెట్లో మరే ఆటగాడు సాధించలేదు.బాబర్ మూడు ఫార్మాట్లలో పరుగులు* టెస్టులు: 4504 పరుగులు* వన్డేలు: 6626 పరుగులు* టీ20 అంతర్జాతీయాలు: 4596 పరుగులుఅంతర్జాతీయ కెరీర్ గణాంకాలు2015లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన బాబర్, అప్పటి నుంచి అన్ని ఫార్మాట్లలో కలిపి 15726 పరుగులు చేశాడు. ఈ కాలంలో అతని కంటే ఎక్కువ పరుగులు చేసిన వారు కేవలం ఇద్దరే.* జో రూట్: 18575 పరుగులు* విరాట్ కోహ్లీ: 18303 పరుగులు* బాబర్ ఆజం: 15726 పరుగులుఇటీవలి ఫామ్ ఆందోళనకరంవ్యక్తిగత రికార్డు సాధించినప్పటికీ, బాబర్ ఇటీవలి కాలంలో టెస్టుల్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాడు.2023 ప్రారంభం నుంచి టెస్టుల్లో: * 32 ఇన్నింగ్స్ * 859 పరుగులు * సగటు: 26.84 * ఒక్క సెంచరీ కూడా లేదు.వన్డేలు, టీ20ల్లో కూడా పరుగులు చేసినప్పటికీ, అతని స్ట్రైక్‌రేట్‌పై విమర్శలు వస్తున్నాయి.విండీస్-పాక్ తొలి టెస్ట్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగుతోంది. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 311 పరుగులు చేయగా.. జస్టిన్ గ్రీవ్స్ (11-6-27-5) దెబ్బకు పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 282 పరుగులకే చాపచుట్టేసింది. తాజా మాజీ కెప్టెన్ షాన్ మసూద్ (109) సెంచరీ చేయడంతో పాక్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది.స్వల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన విండీస్, పాక్ బౌలర్లు మూకుమ్మడిగా చెలరేగడంతో 126 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 155 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. కాగా, రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం పాక్ జట్టు విండీస్‌లో పర్యటిస్తుంది. -
టెన్నిస్‌లో అద్భుతం.. సబలెంకాతో జత కట్టనున్న జకోవిచ్
టెన్నిస్ ఆటలో ఒక అద్భుతం చోటుచేసుకుంది. సెర్బియా దిగ్గజం, 24 సార్లు గ్రాండ్‌స్లామ్ చాంపియన్, మాజీ నంబర్‌వన్ నొవాక్ జకోవిచ్.. మహిళల ప్రపంచ నంబర్‌వన్ అరీనా సబలెంకాతో కలిసి యూఎస్ ఓపెన్ మిక్సడ్ డబుల్స్‌లో జత కట్టనున్నాడు. వీరితో పాటు టోర్నీలో బరిలోకి దిగనున్న 16 జట్ల జాబితాను ప్రకటించారు. గతేడాది యూఎస్ ఓపెన్‌కు ముందే టోర్నీని సమూలంగా మార్చారు. పురుషుల, మహిళల విభాగంలో అగ్రశ్రేణి సింగిల్స్ ఆటగాళ్లు మిక్స్డ్ డబుల్స్‌లో జతకట్టి ఆడితే ఒక మిలియన్ డాలర్ల ప్రైజ్‌మనీ అదనంగా ఇస్తామని యూఎస్ ఓపెన్ టెన్నిస్ అసోసియేషన్ (యూఎస్‌టీఏ) గతేడాదే ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఈసారి జకోవిచ్, సబలెంకా కలిసి యూఎస్ ఓపెన్ మిక్సడ్ డబుల్స్‌లో బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. ఈ ఇద్దరితో పాటు 2025లో రన్నరప్‌గా నిలిచిన ఇగా స్వియాటెక్, కాస్పర్ రూడ్ జంటతో పాటు ఎలెనా రైబాకినా-టేలర్ ఫ్రిట్జ్ , నవోమి ఒసాకా-కీ నిషికోరి, జెస్సికా పెగులా-జాక్ డ్రేపర్ మరోసారి బరిలోకి దిగుతున్నారు . ప్రధాన డ్రా ఆగస్టు 25-26 తేదీల్లో రెండు రోజుల పాటు జరుగుతుంది. ఆర్థర్ ఆషే స్టేడియం, లూయిస్ ఆర్మ్‌స్ట్రాంగ్ స్టేడియంలో అన్ని మ్యాచ్‌లు నిర్వహిస్తారు. ఆగస్టు 17 వరకు జట్లు నమోదు చేసుకోవచ్చు. ఆరోజు వరకు అత్యుత్తమ సంయుక్త సింగిల్స్ ర్యాంకింగ్‌లు కలిగిన ఆరు జంటలు ఆటోమేటిక్‌గా మెయిన్ డ్రాలోకి ప్రవేశిస్తాయి. ఈ లెక్కన టాప్-10లో ఉన్న జకోవిచ్, సబలెంకా జోడి నేరుగా మెయిన్ డ్రాలో ప్రవేశించనుంది. దీంతో పాటు ఎనిమిది జట్లకు యూఎస్‌టీఏ వైల్డ్ కార్డ్‌లను ఇస్తుంది. మరో రెండు జట్లు ఆగస్టు 24న జరిగే క్వాలిఫైయింగ్ టోర్నమెంట్ ద్వారా ఫైనల్స్‌కు చేరుకుంటాయి. అయితే గతేడాది మిక్సడ్ డబుల్స్ చాంపియన్లుగా నిలిచిన సారా ఎర్రాని, ఆండ్రీ వవస్సోరిలు సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో టాప్-20లో లేకపోవడంతో ఈ జంట మరోసారి వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ఇవ్వనుంది. ఎనిమిది జట్లతో కూడిన క్వాలిఫైయింగ్ టోర్నమెంట్‌ను కూడా చేర్చారు, ఇందులో ఆరు జట్లకు నేరుగా ప్రవేశం, రెండు జట్లకు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉంటాయి. సెమీఫైనల్స్ వరకు, మ్యాచ్‌ల ఫార్మాట్ బెస్ట్-ఆఫ్-త్రీ-సెట్స్ పద్ధతిలో ఉంటుంది. ఇందులో సెట్లు నాలుగు గేమ్‌లకు, 4-ఆల్ వద్ద టైబ్రేకర్లు, మూడవ సెట్‌కు బదులుగా 10-పాయింట్ల మ్యాచ్ టైబ్రేక్ ఉంటాయి. ఫైనల్ స్టాండర్డ్ స్కోరింగ్ పద్ధతిలో ఉంటుంది, ఇందులో సెట్లు ఆరు గేమ్‌లకు, 6-ఆల్ వద్ద టైబ్రేకర్, అవసరమైతే 10-పాయింట్ల మ్యాచ్ టైబ్రేకర్ ఉంటాయి. Novak Djokovic and Aryna Sabalenka are set to play together in the upcoming US Open mixed doubles 🎾🤝 pic.twitter.com/NVnakqmwGT— BBC Sport (@BBCSport) July 27, 2026Read: సుందర్ స్థానంలో జట్టులోకి.. ఎవరీ సారాన్ష్ జైన్? -
జెమీమా విధ్వంసం.. పరుగు తేడాతో థ్రిల్లింగ్ విజయం
హండ్రెడ్ వుమెన్స్ కాంపిటీషన్ 2026లో సదరన్ బ్రేవ్ వుమెన్ జట్టు హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసింది. భారత బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ విధ్వంసం సృష్టించగా, సదరన్ బ్రేవ్స్ పరుగు తేడాతో ఎంఐ లండన్ జట్టుపై థ్రిల్లింగ్ విజయాన్ని అందుకుంది. మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సదరన్ బ్రేవ్ వుమెన్ 100 బంతుల్లో 7 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. జెమీమా రోడ్రిగ్స్ (22 బంతుల్లో 32, 3 ఫోర్లు), లారా వోల్వర్ట్ (30 బంతుల్లో 35, 4 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడగా, ఓపెనర్ మయియా బౌచర్ (33 బంతుల్లో 31) రాణించింది. ఎంఐ లండన్ బౌలర్లలో హేలీ మాథ్యూస్ 4 వికెట్లు పడగొట్టగా, తారా నొర్రిస్, అమేలియా కెర్, నికోలా కేరీ తలా ఒక వికెట్ తీశారు. అనంతరం ఛేదనలో ఎంఐ లండన్ వుమెన్ జట్టు 100 బంతుల్లో 3 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసి విజయానికి ఒక్క పరుగు దూరంలో నిలిచిపోయింది. Photo Credit: Hundred Twitterఓపెనర్ డానీ వాట్హెడ్జ్ (42 బంతుల్లో 52 నాటౌట్) అజేయంగా నిలిచినప్పటికీ జట్టును గెలిపించలేకపోయింది. మరో ఓపెనర్హేలీ మాథ్యూస్ (28 బంతుల్లో 32) పర్వాలేదనిపించింది. సదరన్ బౌలర్లలో సోఫీ మోలినెక్స్, ఇస్సీ వాంగ్, సారా గ్లెన్ తలా ఒక వికెట్ తీశారు. కీలక ఇన్నింగ్స్‌తో జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించిన జెమీమా రోడ్రిగ్స్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సొంతం చేసుకుంది.Photo Credit: Hundred Twitterహ్యాట్రిక్ పరాజయంఇక పురుషుల హండ్రెడ్ టోర్నీలో మాత్రం సదరన్ బ్రేవ్ జట్టు హ్యాట్రిక్ పరాజయాన్ని మూటగట్టుకుంది. సదరన్ బ్రేవ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎంఐ లండన్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సదరన్ బ్రేవ్ 100 బంతుల్లో 9 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. ఓపెనర్ జేక్ స్మిత్ (26 బంతుల్లో 49) పరుగు తేడాతో అర్ధసెంచరీ మిస్ చేసుకోగా, ట్రిస్టన్ స్టబ్స్ (31 బంతుల్లో 38) రాణించాడు. బౌల్ట్, టామ్ కరన్, రిచర్డ్ గ్లెసన్, సామ్ కరన్‌లు తలా రెండు వికెట్లు తీశారు. అనంతరం ఎంఐ లండన్ 100 బంతుల్లో 7 వికెట్లు కోల్పోయి 130 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. ఓపెనర్ విల్ జాక్స్ (41 బంతుల్లో 54) కీలక ఇన్నింగ్స్ ఆడి విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు. సామ్ కరన్ (30), రూథర్‌ఫోర్డ్ (21) ఆఖర్లో ధాటిగా ఆడారు. మార్కస్ స్టోయినిస్ 3 వికెట్లు తీయగా, ఆదిల్ రషీద్, నికిల్ చౌదరీ చెరొక వికెట్ పడగొట్టారు.విల్ జాక్స్ (Photo Credit: Hundred Twitter) The timing and placement from Jemimah Rodrigues 🤌#CricketTwitter pic.twitter.com/sdfSEc0UJP— Female Cricket (@imfemalecricket) July 27, 2026Read: సుందర్ స్థానంలో జట్టులోకి.. ఎవరీ సారాన్ష్ జైన్? -
సుందర్ స్థానంలో జట్టులోకి.. ఎవరీ సారాన్ష్ జైన్?
టీమిండియా తరఫున సారాన్ష్ జైన్ రూపంలో దేశవాళీ సీనియర్ క్రికెటర్ అంతర్జాతీయంగా అరంగేట్రం చేయనున్నాడు. శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు గాయపడిన వాషింగ్టన్ సుందర్ స్థానంలో మధ్యప్రదేశ్ ఆల్‌రౌండర్ సారాన్ష్ జైన్‌ను బీసీసీఐ ఎంపిక చేసింది. రైట్ ఆర్మ్ ఆఫ్ బ్రేక్ బౌలర్ అయిన సారాన్ష్ జైన్ లోయర్ ఆర్డర్లో బ్యాటర్‌గా పరుగులు సాధించడంలో సమర్థుడు. దీంతో లంకతో సిరీస్‌లో సారాన్ష్ ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వయసు కూడా దీనికి మరో ప్రధాన కారణం. 33 ఏళ్ల వయసులో జాతీయ జట్టుకు ఎంపికైన సారాన్ష్ 2014లో మధ్యప్రదేశ్ తరఫున ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. అప్పటి నుంచి మధ్యప్రదేశ్‌కు ప్రధాన ఆటగాడిగా మారిపోయిన సారాన్ష్ ఆ తర్వాత సెంట్రల్ జోన్‌తో పాటు రెస్టాఫ్ ఇండియాకు కూడా ప్రాతినిధ్యం వహించాడు. తండ్రి కూడా క్రికెటరే.. స్పిన్ బౌలర్ అయిన సారాన్ష్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 181 వికెట్లతో పాటు 2,223 పరుగులు సాధించాడు. సారాన్ష్ జైన్ తండ్రి సుబోధ్ జైన్ కూడా క్రికెటరే. మధ్యప్రదేశ్ తరఫున రంజీ ట్రోఫీలో ఆడారు. రైట్ ఆర్మ్ ఆఫ్‌బ్రేక్ బౌలర్ అయిన సుబోధ్ జైన్ తొమ్మిది మ్యాచ్‌ల్లో మధ్యప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహించారు. ఇక సారాన్ష్ జైన్ దేశవాళీ సీనియర్ కోచ్ చంద్రకాంత్ పండిట్ వద్ద శిక్షణ పొంది ఆటలో మరింత రాటుదేలాడు. 2022లో తొలిసారి రంజీ ట్రోఫీ గెలిచిన మధ్యప్రదేశ్ జట్టులో సారాన్ష్ జైన్ సభ్యుడిగా ఉన్నాడు. చెన్నై వేదికగా ముంబైతో జరిగిన రంజీ ఫైనల్లో తొలి ఇన్నింగ్స్‌లో కీలక హాఫ్ సెంచరీ చేయడంతో పాటు రెండు వికెట్లు తీసి విజయంలో కీలకపాత్ర పోషించాడు. లంక-ఏపై రాణించి సెలెక్టర్ల దృష్టిలో..ఇటీవలే శ్రీలంక-ఏతో జరిగిన రెండో అనధికారిక టెస్టులో సారాన్ష్ జైన్ రాణించాడు. బ్యాట్‌తో 70 పరుగులు చేయడంతో పాటు బౌలింగ్‌లో ఆరు వికెట్లు తీసి జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు. ఈ ప్రదర్శనతోనే సెలెక్టర్ల దృష్టిలో పడిన సారాన్ష్ జైన్ తాజాగా సుందర్ స్థానంలో లంకతో సిరీస్‌కు ఎంపికయ్యాడు. వేలంలో అన్సోల్డ్ఇక ఐపీఎల్ 2024 నుంచి 2026 వరకు సారాన్ష్ జైన్ తన పేరును రిజిస్టర్ చేసుకున్నప్పటికీ వేలంలో అతడిని ఎవరు కొనుగోలు చేయకపోవడంతో అన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు. ఈ మధ్యకాలంలో ఐపీఎల్ ద్వారా కాకుండా దేశవాలీ క్రికెట్లో రాణించి జాతీయ జట్టులో చోటు దక్కించుకున్న అరుదైన క్రికెటర్ల జాబితాలో సారాన్ష్ జైన్ పేరును లిఖించుకున్నాడు.Saransh Jain has earned his maiden Test call-up 👏Take a look at the new off-spinner, who set the stage on fire with his stunning 5/49 in the Duleep Trophy final. 👌 pic.twitter.com/VIlTxFDhAy— BCCI Domestic (@BCCIdomestic) July 28, 2026Read: కోచ్ మార్పుకు డిమాండ్.. గంభీర్, లక్ష్మణ్ మధ్య తేడా అదే! -
కోచ్ మార్పుకు డిమాండ్.. గంభీర్, లక్ష్మణ్ మధ్య తేడా అదే!
జింబాబ్వేపై టీ20 సిరీస్ విజయం తర్వాత టీమిండియా కోచ్ మార్పు అంశం సోమవారం పెద్ద ప్రకంపనలే సృష్టించింది. గంభీర్‌ను తీసేసి అతడి స్థానంలో వీవీఎస్ లక్ష్మణ్‌కు పూర్తిస్థాయి హెడ్‌కోచ్ బాధ్యతలు అప్పగించాలని సోషల్ మీడియా వేదికగా అభిమానులు డిమాండ్ చేశారు. రోజంతా ఇదే అంశంపై సోషల్ మీడియాలో వాడీవేడి చర్చ కూడా జరిగింది. ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల్లో వరుస సిరీస్ ఓటములు టీమిండియాను తీవ్రంగా దెబ్బకొట్టాయి. దీంతో జింబాబ్వే పర్యటనకు ప్రధాన కోచ్ గంభీర్‌కు విశ్రాంతినిచ్చి అతడి స్థానంలో వీవీఎస్ లక్ష్మణ్‌ను తాత్కాలిక కోచ్‌గా జట్టుతో పాటు పంపించారు. జింబాబ్వే చిన్నజట్టే అయినప్పటికీ, లక్ష్మణ్ కోచింగ్ విధానం టీమిండియా ఆటగాళ్లకు బాగా వంటబట్టింది. అందుకే శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని టీమిండియా 3-0తో జింబాబ్వేను క్లీన్‌స్వీప్ చేసింది. ఈ విజయం ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల్లో ఎదురైన పరాభవాలను మర్చిపోయేట్లు చేసింది. బుమ్రా, సంజూ శాంసన్, అక్షర్ పటేల్ వంటి ఆటగాళ్లు లేకపోయినప్పటికీ, జింబాబ్వే గడ్డపై మన యువ జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. దీని వెనుక వీవీఎస్ లక్ష్మణ్ వ్యూహాలు, ఆలోచనలు ఉన్నాయనడంలో సందేహం లేదు. ఒక నాలుగు అంశాలు గంభీర్, లక్ష్మణ్ మధ్య ఉన్న కోచింగ్ తేడాలను స్పష్టంగా చూపిస్తోంది.స్థిరమైన ఓపెనింగ్ జోడిఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియా తరఫున అభిషేక్, సంజూ శాంసన్ ఓపెనర్లుగా వచ్చారు. వైభవ్ ఈ సిరీస్‌లకు ఎంపికైనప్పటికీ బెంచ్‌కే పరిమితమయ్యాడు. అయితే జింబాబ్వే పర్యటనకు సంజూ శాంసన్‌కు విశ్రాంతినిచ్చి, అతడి స్థానంలో ప్రబ్సిమ్రన్ను ఎంపిక చేశారు. అయితే ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల్లో విశేషంగా రాణించిన అభిషేక్ శర్మ జింబాబ్వే పర్యటనలో మాత్రం దారుణంగా విఫలమయ్యాడు.ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఒక్కదాంట్లో కూడా తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. మరోవైపు తనకు వచ్చిన అవకాశాన్ని వైభవ్ రెండు చేతులా ఒడిసిపట్టాడు. రెండు అర్ధసెంచరీలు సహా 155 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ ఎగరేసుకుపోయాడు. అయితే జింబాబ్వేతో టీ20 సిరీస్‌లో కోచ్‌గా లక్ష్మణ్ తన వ్యూహాన్ని విజయవంతంగా అమలు చేశాడు. అభిషేక్ విఫలమైనప్పటికీ అతడికి అవకాశాలు ఇచ్చి స్థిరమైన ఓపెనింగ్ జోడిని కొనసాగించాడు.ముగ్గురు పేసర్లతో బరిలోకియూకే పర్యటనలో కోచ్ గౌతమ్ గంభీర్ బౌలర్లను ఉపయోగించిన తీరు విమర్శలకు దారి తీసింది. పేస్‌కు అనుకూలించే ఇంగ్లండ్ పిచ్‌లపై అనవసర ప్రయోగాలకు పోయి స్పిన్-ఆల్‌రౌండర్ల కలయికపై ఎక్కువగా ఆధారపడి గంభీర్ చేతులు కాల్చుకున్నాడు. ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో ఒక మ్యాచ్‌లో మొత్తం ఐదుగురిలో ఒకే ఒక పేసర్‌ను ఆడించడం గమనార్హం. ఇక వన్డే సిరీస్‌లోనూ గంభీర్ వ్యూహాలు పనిచేయలేదు. బౌలర్లంతా ధారాళంగా పరుగులు ఇచ్చుకున్నారు. అయితే జింబాబ్వే పర్యటనలో మాత్రం లక్ష్మణ్ గంభీర్‌కు విరుద్ధంగా వ్యవహరించాడు. టీ20 సిరీస్‌లో ముగ్గురు స్పెషలిస్ట్ పేసర్లతో ఆడాలని నిర్ణయించిన లక్ష్మణ్.. మయాంక్ యాదవ్, ప్రిన్స్ యాదవ్‌లతో పాటు అశోక్ శర్మ, యశ్ ఠాకూర్ సేవలు వినియోగించుకొని అద్భుత ఫలితాలు రాబట్టాడు. దాదాపు రెండేళ్ల తర్వాత జట్టులోకి వచ్చిన మయాంక్ యాదవ్‌పై నమ్మకముంచిన లక్ష్మణ్ అవకాశాలిచ్చాడు. దీంతో మయాంక్ తన బౌలింగ్‌తో అదరగొట్టాడు.ఆల్‌రౌండర్ల వినియోగంఇంగ్లండ్ పర్యటనలో టీ20 సిరీస్‌లో వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, శివమ్ దూబే, హర్షిత్ రానాలకు గంభీర్ తుది 11 మందిలో చోటిచ్చాడు. దీని ఫలితంగా మిడిలార్డర్లో బ్యాటింగ్ లోపించడంతో పాటు, తన నాలుగు ఓవర్ల కోటాను నమ్మకంగా పూర్తి చేయగల స్పెషలిస్ట్ బౌలర్ కొరత కూడా ఏర్పడింది. కానీ లక్ష్మణ్ మాత్రం కేవలం ఒక్క ఆల్‌రౌండర్‌కే చోటు కల్పించాడు. తొలి రెండు టీ20ల్లో శివమ్ దూబేను ఆడిపించిన లక్ష్మణ్ చివరి టీ20 మ్యాచ్‌కు సూర్యాంశ్ షెడ్గేను చాన్స్ ఇచ్చాడు. ఇలా చేయడం వల్ల జట్టులో ఒక పూర్తిస్థాయి బ్యాటర్‌కు అవకాశం కల్పించడంతో పాటు ఒక స్పిన్నర్‌కు అవకాశం కల్పించినట్లయింది. రింకూ సింగ్ ఫినిషర్‌గా, రవి బిష్ణోయ్ స్పిన్నర్‌గా తమ పాత్రను సమర్థంగా పోషించారు.ఆటగాళ్లపై నమ్మకంజింబాబ్వేలో భారత్ 3-0తో టీ20 సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన సమయంలో అభిషేక్, వైభవ్ సూర్యవంశీ, రవి బిష్ణోయ్ వంటి ఆటగాళ్లు ఫామ్‌తో ఇబ్బంది పడుతున్నప్పటికీ తాత్కాలిక కోచ్‌గా లక్ష్మణ్ వారికి అండగా నిలిచాడు. కండరాల గాయానికి గురైన వరుణ్ చక్రవర్తి స్థానంలో, చివరి నిమిషంలో బిష్ణోయ్‌ను జట్టులోకి తీసుకున్నారు. ముఖ్యంగా, ఇంగ్లాండ్‌తో జరిగిన ఒక క్లిష్టమైన టీ20 మ్యాచ్‌లో బిష్ణోయ్ అధిక ఎకానమీ రేటుతో ఇబ్బంది పడ్డాడు.అయినప్పటికీ జింబాబ్వేతో టీ20 సిరీస్‌లో రవి బిష్ణోయ్‌ను ప్రధాన స్పిన్నర్‌గా ఆడించి ఫుంజుకోవడానికి తోడ్పడ్డాడు. ఈ సిరీస్‌లో రవి బిష్ణోయ్ మొత్తంలో 5.667 సగటు ఎకానమీతో 3 మ్యాచ్‌ల్లో 3 వికెట్లు పడగొట్టాడు.చదవండి: శ్రీలంకతో టెస్టు సిరీస్.. భారత జట్టు ప్రకటన -
బంగారు స్ఫూర్తి... మీరాబాయి చాను
గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్–2026లో భారత వెయిట్‌లిఫ్టింగ్ స్టార్ మీరాబాయి చాను స్వర్ణ పతకం సాధించడం దేశవ్యాప్తంగా క్రీడాకారుల్లో నూతనోత్సాహం నింపింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి వెయిట్‌లిఫ్టింగ్‌లో రాణించాలని కలలు కంటున్న యువ క్రీడాకారుల్లో ఈ విజయం ఆత్మవిశ్వాసం నింపుతోంది.సరైన శిక్షణ, కఠోరసాధన, లక్ష్యంపై ఏకాగ్రత ఉంటే అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించడం సాధ్యమేనని ఆమె నిరూపించారు. ఆమె విజయం ఉమ్మడి జిల్లా వెయిట్ లిఫ్టర్లకు స్ఫూర్తిగా నిలుస్తోందని జిల్లా వెయిట్ లిఫ్టింగ్ సంఘం ప్రతినిధులు, క్రీడాకారులు పేర్కొన్నారు. కఠోర శ్రమ, క్రమశిక్షణ, లక్ష్యసాధనతో ప్రపంచ వేదికపై విజయాలు సాధించవచ్చని మీరాబాయి మరోసారి నిరూపించారని కొనియాడారు. - కరీంనగర్మహిళా క్రీడాకారిణులకు గొప్ప ప్రేరణమీరాబాయి చాను విజయం మహిళా క్రీడాకారిణులకు గొప్ప ప్రేరణ. కష్టపడి సాధన చేస్తే ఏ లక్ష్యాన్నైనా చేరుకోవచ్చని ఆమె నిరూపించారు. ఆమె విజయాన్ని ఆదర్శంగా తీసుకుని మరింత పట్టుదలతో శిక్షణ కొనసాగిస్తాను. ఒకరోజు భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాలనేది నా కల.– ఎం సాయిదుర్గ, జాతీయ వెయిట్లిఫ్టర్జాతీయస్థాయిలో రాణిస్తామీరాబాయి చాను గోల్డ్ మెడల్ సాధించడం ఎంతో ఆనందంగా ఉంది. ఆమె విజయాన్ని చూసిన తర్వాత మా సాధనపై మరింత నమ్మకం పెరిగింది. కోచ్‌ల సూచనలతో కష్టపడి సాధన చేసి జాతీయస్థాయిలో రాణించాలని లక్ష్యంగా పెట్టుకున్నా. భవిష్యత్‌లో అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని పతకం సాధించాలనుకుంటున్నా – ఎన్ సాత్విక, స్టేట్ లెవల్ వెయిట్లిఫ్టర్ఆత్మవిశ్వాసం పెంపుమీరాబాయి చాను లాంటి చాంపియన్లు మార్గదర్శకులు. ఆమె క్రమశిక్షణ, అంకితభావం ప్రతీ క్రీడాకారుడు నేర్చుకోవాలి. ఆమె సాధించిన విజయం మాలో ఆత్మవిశ్వాసం పెంచింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి అంతర్జాతీయ స్థాయి వెయిట్ లిఫ్టర్లు రావాలనే సంకల్పంతో సాధన చేస్తున్నాం.– డి.శృతి, జాతీయ వెయిట్లిఫ్టర్అన్ని విధాలా ప్రోత్సాహంజిల్లాలోని ప్రతి వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చానును ఆదర్శంగా తీసుకుని క్రమశిక్షణతో సాధన చేస్తే అంతర్జాతీయ విజయాలు సాధించడం అసాధ్యం కాదు. ప్రతిభావంతులైన క్రీడాకారులకు సంఘం తరఫున అన్ని విధాలా ప్రోత్సాహం అందిస్తాం.– అంతటి శంకరయ్య, జిల్లా వెయిట్ లిఫ్టింగ్ సంఘం అధ్యక్షుడు -
శ్రీలంకతో టెస్టు సిరీస్.. భారత జట్టు ప్రకటన
శ్రీలంకతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు బీసీసీఐ మంగళవారం భారత జట్టును ప్రకటించింది. అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ మంగళవారం 15 మందితో కూడిన జట్టు వివరాలను వెల్లడించింది. లంకతో జరగనున్న టెస్టు సిరీస్‌కు శుబ్‌మన్ గిల్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా, కేఎల్ రాహుల్ అతడికి డిప్యుటీగా ఉండనున్నాడు. ఇక ఏడాది తర్వాత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా టెస్టుల్లో రీఎంట్రీ ఇవ్వనుండగా, సారాన్ష్ జైన్ తొలిసారి భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఇక బుమ్రా, సాయి సుదర్శన్‌లను ఎంపిక చేసినప్పటికీ సిరీస్ మొదలయ్యే సమయానికి ఫిట్నెస్ నిరూపించుకోవాల్సి ఉంటుందని బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు ఆగస్టు 15 నుంచి 19 మధ్య గాలే వేదికగా, ఆగస్టు 23 నుంచి 27 వరకు కొలంబో వేదికగా రెండో టెస్టు జరగనుంది. అయితే టెస్టు సిరీస్‌కు ముందు టీమిండియా ఆగస్టు 7 నుంచి కొలంబో వేదికగా నాలుగు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది.ఇంగ్లండ్‌తో సిరీస్ సందర్భంగా గాయానికి గురైన ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ లంకతో టెస్టు సిరీస్‌కు ఎంపికవుతాడని భావించినప్పటికీ, అతడి పేరును పరిగణలోకి తీసుకోలేదు. మరో ఆల్‌రౌండర్ నితీశ్ రానాతో పాటు పేసర్ హర్షిత్ రానాలు కూడా గాయాల నుంచి ఇంకా కోలుకోకపోవడంతో లంక టూర్‌కు దూరమైనట్లు బీసీసీఐ ప్రకటించింది.టెస్టు మ్యాచ్ సిరీస్:ఆగస్టు 15-19 వరకు: తొలి టెస్టు, గాలేఆగస్టు 23-27 వరకు: రెండో టెస్టు, కొలంబోభారత జట్టు: శుభమన్ గిల్ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్ (వికెట్‌కీపర్), సాయి సుదర్శన్*, ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్, జస్ప్రీత్ బుమ్రా*, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, దేవదత్ పడిక్కల్, సారాన్ష్ జైన్. 🚨 News 🚨#TeamIndia's squad for the 2⃣-match Test Series against Sri Lanka announced Note: Washington Sundar was not available for selection for the first Test. More Details ▶️ https://t.co/Vk0Xd8Axmq #SLvIND pic.twitter.com/NuCcKBohMj— BCCI (@BCCI) July 28, 2026చదవండి: టెస్టు క్రికెట్ చరిత్రలో తొలిసారి.. విండీస్ బౌలర్ ప్రపంచ రికార్డు -
టెస్టు క్రికెట్ చరిత్రలో తొలిసారి.. విండీస్ బౌలర్ ప్రపంచ రికార్డు
వెస్టిండీస్ క్రికెటర్ జస్టిన్ గ్రీవ్స్ టెస్టు క్రికెట్లో అరుదైన రికార్డు సాధించాడు. పాకిస్తాన్‌తో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో బౌలింగ్‌లో ఒక్క పరుగు ఇవ్వకుండా 5 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా జస్టిన్ గ్రీవ్స్ రికార్డులకెక్కాడు. గ్రీవ్స్ తన తొలి ఆరు ఓవర్లలో 27 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. అయితే మలి విడత బౌలింగ్‌కు వచ్చిన గ్రీవ్స్ తాను వేసిన వరుస 5 ఓవర్లలో ఓవర్‌కు ఒక్కో వికెట్ చొప్పున ఐదు వికెట్లు తీశాడు. ఈ క్రమంలోనే ఆ ఐదు ఓవర్లలో ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా మెయిడెన్లు నమోదు చేయడం విశేషం. టెస్టు క్రికెట్ చరిత్రలో 5 వికెట్లు తీసే క్రమంలో ఒక్క పరుగు ఇవ్వకుండా ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్‌గా జస్టిన్ గ్రీవ్స్ నిలిచాడు. ఒక దశలో మ్యాచ్ పాకిస్తాన్‌వైపు మొaగ్గు చూపిందని అంతా భావించగా, రెండో స్పెల్ బౌలింగ్‌కు వచ్చిన జస్టిన్ గ్రీవ్స్ తన అద్భుత బౌలింగ్‌తో మ్యాచ్‌ను పూర్తిగా తిప్పేశాడు. మూడో రోజు ఆట ప్రారంభంలో 3 వికెట్ల నష్టానికి 244 పరుగులతో మంచి పట్టు సాధించిన పాకిస్తాన్‌కు గ్రీవ్స్ చుక్కలు చూపించాడు. తన వరుస ఐదు ఓవర్లలో పాక్ బ్యాటర్లు షాన్ మసూద్, మహ్మద్ రిజ్వాన్, అలీ ఉస్మాన్, ఆమిర్ జమాల్, మహ్మద్ అబ్బాస్‌లను పెవిలియన్ చేర్చాడు. జస్టిన్ గ్రీవ్స్‌కు టెస్టుల్లో ఇదే తొలి ఐదు వికెట్లు ప్రదర్శన కావడం విశేషం. గ్రీవ్స్ దెబ్బకు భారీ స్కోరు చేస్తుందనుకున్న పాకిస్తాన్ 282 పరుగులకు ఆలౌటైంది. మూడు వికెట్ల నష్టానికి 244 పరుగులతో పటిష్టంగా కనిపించిన పాక్ తన చివరి ఏడు వికెట్లను 38 పరుగులతో చేజార్చుకోవడం విశేషం. మూడోరోజు ఆట ముగిసే సమయానికి వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. కీమర్ రోచ్ (5), షమర్ జోసెఫ్ (22) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం విండీస్ 155 పరుగుల ఆధిక్యంలో ఉంది. బౌలింగ్‌కు బాగా అనుకూలిస్తున్న పిచ్‌పై విజయం ఎవరిదనేది ఆసక్తిగా మారింది. 🚨Justin Greaves claims his maiden five-wicket haul in Test cricket. 🇼🇸Figures: 11 overs, 5/27- Pakistan: 267/9 (72 overs), trail by 44 runs. pic.twitter.com/eiZDyVLSiz— Talha Nawaz (@TalhaDigital007) July 27, 2026An unbelievable spell of fast bowling from West Indies seamer Justin Greaves that netted five consecutive wicket maidens in the first #WTC27 Test 💥More 👉 https://t.co/7XajvpaQ4g pic.twitter.com/aM1vcGFKDq— ICC (@ICC) July 28, 2026Read: రేపు టెస్టు జట్టు ప్రకటన.. బుమ్రా ఆడకపోతే అతడికే చాన్స్! -
తండ్రిని మించిన తనయుడు.. తెలుగు కుర్రాడికి రజతం
కామన్వెల్త్ గేమ్స్-2026 వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత అథ్లెట్లు తమ జోరును ప్రదర్శిస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాకు చెందిన 21 ఏళ్ల వల్లూరి అజయ బాబు పురుషుల వెయిట్‌లిఫ్టింగ్ కేటగిరీలో రజతం ఒడిసిపట్టాడు. ముందుగా స్నాచ్ కేటగిరీలో 149 కేజీలు ఎత్తిన అజయ బాబు క్లీన్ అండ్ జెర్క్ కేటగిరీలో 181 కేజీల బరువును ఎత్తాడు. మొత్తంగా రెండు విభాగాలు కలిపి 330 కేజీలు ఎత్తిన అజయ బాబు రెండో స్థానంలో నిలిచాడు. మలేషియాకు చెందిన ఎర్రీ హిదయత్ ముహమ్మద్ 331 కేజీలు (స్నాచ్ 147 కేజీలు+ క్లీన్ అండ్ జెర్క్‌లో 184 కేజీలు) ఎత్తి ఒక్క కేజీ బరువు తేడాతో స్వర్ణం కైవసం చేసుకున్నాడు. ఇంగ్లండ్ వెయిట్‌లిఫ్టర్ క్రిస్ ముర్రే 325 కేజీల బరువు ఎత్తి కాంస్యం ఒడిసిపట్టాడు. వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత్‌కు ఇది ఆరో పతకం కావడం విశేషం. Photo Credit: IOA Twitterతొలి ప్రయత్నంలో హిదయత్ క్లీన్ అండ్ జెర్క్ కేటగిరీలో 181 కేజీలు ఎత్తగా, ఆ వెంటనే అజయ బాబు కూడా 181 కేజీలు ఎత్తడంతో 330 కేజీల వద్ద సమంగా నిలిచారు. అయితే రెండో ప్రయత్నంలో హిదయత్ 184 కేజీల బరువు ఎత్తగా, అజయ బాబు విఫలమయ్యాడు. దీంతో ఒక్క కేజీ బరువు తేడాతో అజయ బాబు తృటిలో స్వర్ణం చేజార్చుకున్నాడు. ఇక స్నాచ్ విభాగంలో మాత్రం అజయ బాబు 149 కేజీలు ఎత్తగా, హిదయత్ మాత్రం 147 కేజీలకే పరిమితమయ్యాడు.2010లో తండ్రికి కాంస్యంఇక అజయ బాబు తండ్రి వల్లూరి శ్రీనివాసరావు కూడా వెయిట్‌లిఫ్టరే కావడం విశేషం. 2010లో ఢిల్లీలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో శ్రీనివాసరావు పురుషుల 56 కేజీల విభాగంలో కాంస్య పతకం ఒడిసిపట్టాడు. తాజాగా వల్లూరి అజయ బాబు 2026 కామన్వెల్త్ గేమ్స్‌లో రజతం సాధించి తండ్రిని మించిన తనయుడిగా గుర్తింపు పొందాడు. Photo Credit: IOA Twitterవిజయనగరం జిల్లాకు చెందిన అజయ బాబు వెయిట్‌లిఫ్టింగ్‌లో రోజురోజుకు తన ప్రదర్శనను మెరుగుపరుచుకుంటున్నాడు. 2025 కామన్వెల్త్ చాంపియన్‌షిప్‌లో ఇదే 79 కేజీల విభాగంలో అజయ బాబు స్వర్ణం సాధించాడు. అహ్మదాబాద్ వేదికగా జరిగిన చాంపియన్‌షిప్ పోటీల్లో అజయ బాబు 335 కేజీలు ( స్నాచ్‌లో 152 కేజీలు+ క్లీన్ అండ్ జెర్క్‌లో 183 కేజీలు) బరువు ఎత్తి పర్సనల్ బెస్ట్ నమోదు చేశాడు. ఈ ప్రదర్శన అతడిని నేరుగా కామన్వెల్త్ గేమ్స్‌కు అర్హత సాధించేందుకు ఉపయోగపడింది. 2024 కామన్వెల్త్ చాంపియన్‌షిప్‌లోనూ అజయ బాబు డబుల్ స్వర్ణాలతో మెరిశాడు. జూనియర్, సీనియర్ కేటగిరీల్లో 81 కేజీల విభాగంలో అజయ బాబు ఈ ఫీట్ సాధించాడు. #CWG2026 | "It is a mix of happiness and sadness, as I missed out on the gold," says Indian weightlifter Valluri Ajaya Babu after winning silver in the men's 79kg event at the 2026 Commonwealth Games in Glasgow with a total lift of 330kg(Source: ANI) pic.twitter.com/TrdIiENBLL— WION (@WIONews) July 28, 2026Sheer strength on show! 🥈Many congratulations to Khelo India athlete Valluri Ajaya Babu on winning the Silver Medal in the Men's 79kg Weightlifting. With a total lift of 330kg, he also set a Commonwealth Games record in the Snatch. A memorable performance and another proud… pic.twitter.com/GMCQPQtIvm— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) July 28, 2026 -
పతకాల జోరు.. డబుల్ డిజిట్ దాటిన భారత్
గ్లాస్కో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌లో భారత అథ్లెట్లు జోరును ప్రదర్శిస్తున్నారు. సోమవారం రాత్రి మరో నాలుగు పతకాలు భారత్ ఖాతాలో చేరడంతో ఆ సంఖ్య పదికి చేరుకుంది. పురుషుల వెయిట్‌లిఫ్టింగ్‌లో వల్లూరు అజయ బాబు 79 కేజీల విభాగంలో రజతం సాధించగా, పురుషుల హైజంప్ విభాగంలో సర్వేశ్ కుషారే రజతం సాధించాడు. ఇక పారా అథ్లెటిక్స్‌లో షాట్‌పుట్ ఎఫ్-57 కేటగిరీలో షర్మిలా ధంకర్ స్వర్ణం సాధించగా, శిల్ప కాంస్యం ఒడిసిపట్టింది. ముఖ్యంగా పారా షాట్ ఫుట్ F57 విభాగంలో భారత స్టార్ అథ్లెట్ షర్మిలా ధనకర్ తన శక్తిసామర్థ్యాలను ప్రదర్శించి బంగారు పతకాన్ని ముద్దాడారు. మరోవైపు పురుషుల హైజంప్ విభాగంలో సర్వేశ్ కుష్వారే సంచలన ప్రదర్శనతో రజత పతకాన్ని కైవసం చేసుకున్నారు. ఈ చారిత్రాత్మక విజయంతో కామన్వెల్త్ క్రీడల చరిత్రలోనే హైజంప్ విభాగంలో పతకం సాధించిన తొలి భారతీయుడిగా సర్వేశ్ తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నారు.వీరితో పాటు వెయిట్ లిఫ్టింగ్ 79 కేజీల విభాగంలో అజయ బాబు వెండి పతకాన్ని సొంతం చేసుకున్నారు. ఒకే రోజున అటు పారా అథ్లె టిక్స్, ఇటు ట్రాక్ అండ్ ఫీల్డ్, వెయిట్రిఫ్టింగ్ విభాగాల్లో వరుస పతకాలు వరించడంతో భారత క్రీడాభిమానులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఐదో రోజులు ముగిసేసరికి భారత్ రెండు స్వర్ణాలు, 5 రజతాలు, 3 కాంస్యాలు కలిపి మొత్తం 10 పతకాలతో పట్టికలో ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది. An exciting end to Day 4 🇮🇳Team India’s Medal Tally Grew to 10! 🙌🥇 Sharmila Dhankar struck gold in Women’s Shot Put F57🥈 Sarvesh Anil Kushare soared to silver in Men’s High Jump🥈 Valluri Ajaya Babu bagged a silver in Men’s 79kg Weightlifting 🥉 Bindyarani Devi… pic.twitter.com/pNUMnAPLo1— Team India (@WeAreTeamIndia) July 27, 2026Heartiest congratulations to Sharmila on scripting history by winning the Gold medal in the Women's Shot Put F57 event at #CWG2026.Becoming India's first-ever Commonwealth Games Gold medallist in Para Athletics is a truly remarkable achievement. Your unwavering determination,… pic.twitter.com/vuUedWlwuF— Sunil Singhi (@SunilSinghiIND) July 28, 2026Silver for Sarvesh! 🥈 Sarvesh Kushare clears 2.25m to clinch the Silver Medal in the Men's High Jump at Glasgow 2026.👏Watch the Commonwealth Games Glasgow 2026 LIVE & EXCLUSIVE on Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #SonyLIV #Glasgow2026… pic.twitter.com/3e62CEPb5M— Sony Sports Network (@SonySportsNetwk) July 27, 2026Read: తండ్రిని మించిన తనయుడు.. తెలుగు కుర్రాడికి రజతం -
భారత టీటీ జట్ల శుభారంభం
న్యూఢిల్లీ: కామన్వెల్త్ టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్‌షిప్‌లో ఆతిథ్య భారత పురుషుల, మహిళల జట్లు శుభారంభం చేశాయి. భారత పురుషుల జట్టు 3–0తో జింబాబ్వే జట్టుపై... భారత మహిళల జట్టు 3–0తో మాల్దీవులు జట్టుపై విజయం సాధించాయి. జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో భారత నంబర్‌వన్ మానవ్ ఠక్కర్ 11–3, 11–2, 11–6తో తయెందా ముమ్వుమాపై, హర్మిత్ దేశాయ్ 11–5, 11–4, 11–5తో తపివా ముసరువాపై, పాయస్ జైన్ 11–3, 11–3, 11–8తో విక్రమ్ సింగ్‌పై గెలిచారు. భారత మహిళల జట్టు తరఫున సుతీర్థ ముఖర్జీ, యశస్విని, స్వస్తిక విజయం అందుకున్నారు. సుతీర్థ 11–4, 11–2, 11–5తో ఫతీమత్ ధీమా అలీపై, యశస్విని 11–2, 11–5, 11–7తో ఐశాత్ రఫా నాజిమ్పై, స్వస్తిక 11–3, 11–5, 11–2తో మిష్కా ఇబ్రహీంపై గెలుపొందారు. ఏడేళ్ల విరామం తర్వాత నిర్వహిస్తున్న కామన్వెల్త్ టీటీ చాంపియన్‌షిప్‌లో పురుషుల, మహిళల టీమ్ విభాగాలతోపాటు సింగిల్స్, డబుల్స్, మిక్స్డ్ డబుల్స్‌లో భారత క్రీడాకారులే డిఫెండింగ్ చాంపియన్స్‌గా ఉండటం విశేషం. -
కబడ్డీ నుంచి వెయిట్‌లిఫ్టింగ్ వైపు...
రాజా ముత్తుపండి స్వస్థలం తమిళనాడు రాష్ట్రం కోవిల్పట్టి సమీపంలోని శంకరలింగాపురం. తండ్రి ముత్తుపండి రోజూవారీ లేబర్ కాగా, తల్లి పెచ్చియమ్మాల్ ఒక అగ్గి పెట్టెల ఫ్యాక్టరీలో పని చేస్తుంది. చిన్నప్పటి నుంచి రాజా, అతని సోదరుడు సురేశ్ కబడ్డీ బాగా ఆడేవారు. సాయంత్రం ఫిట్నెస్ కోసం స్థానికంగా ఉండే జిమ్‌కు కూడా వారిద్దరు వెళ్లేవారు. రాజా శారీరక సామర్థ్యం, అతని పట్టుదల చూసిన కోచ్ అతడిని భవిష్యత్ బాగుంటుందంటూ వెయిట్‌లిఫ్టింగ్ వైపు మళ్లించాడు. ఇక్కడ అతను కఠోర శ్రమతో లిఫ్టింగ్‌లో ప్రతిభను ప్రదర్శించాడు. ఈ క్రమంలో మైలదుత్తురైలో ఉన్న స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) హాస్టల్లో అతనికి సీటు లభించింది. ఆపై తగిన శిక్షణ, కోచ్‌ల మార్గనిర్దేశనంలో రాజా ఆట మెరుగైంది. 2017 యూత్/జూనియర్ కామన్వెల్త్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ, రజతాలతో తొలిసారి రాజాకు గుర్తింపు దక్కింది. 2024లో జాతీయ రికార్డు నెలకొల్పిన అతను గత ఏడాది కామన్వెల్త్ చాంపియన్‌షిప్‌లో రజతం గెలిచాడు. గత ఏడాది వరల్డ్ చాంపియన్‌షిప్‌లో తన అత్యుత్తమ ప్రదర్శన (299 కేజీలు) నమోదు చేశాడు. 2018 కామన్వెల్త్ క్రీడల్లో ఆరో స్థానంలో నిలిచిన రాజా... 2022 కామన్వెల్త్ క్రీడలకు ముందు కాలికి అనూహ్య గాయంతో పోటీల నుంచి తప్పుకున్నాడు. ఇప్పుడు మూడో ప్రయత్నంలో అతనికి మెడల్ దక్కింది. రాజాకు తమిళనాడు ప్రభుత్వం రూ.30 లక్షల ప్రోత్సాహక బహుమతిని ప్రకటించింది. -
రజత రాజా... వెండి జ్ఞానేశ్వరి
గ్లాస్గో: కామన్వెల్త్ క్రీడల్లో భారత్ ఖాతాలో మరో మూడు పతకాలు చేరాయి. భారత వెయిట్‌లిఫ్టర్లు ఈ మూడు పతకాలు అందించారు. పురుషుల విభాగంలో రాజా ముత్తుపండి, మహిళల విభాగంలో జ్ఞానేశ్వరి యాదవ్‌లకు రజతాలు లభించగా... మణిపూర్ ప్లేయర్ బింద్యారాణి దేవి కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ప్రస్తుతం భారత్ ఒక స్వర్ణం, 3 రజతాలు, 2 కాంస్యాలతో కలిపి ఆరు పతకాలతో ఎనిమిదో స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా 42 పతకాలతో (18 స్వర్ణాలు, 9 రజతాలు, 15 కాంస్యాలు) అగ్రస్థానంలో కొనసాగుతోంది. మహిళల 53 కేజీల కేటగిరీలో జ్ఞానేశ్వరి యాదవ్ రజత పతకం గెలుచుకుంది. స్నాచ్‌లో 88 కేజీలు, క్లీన్ అండ్ జర్క్‌లో 111 కేజీల బరువెత్తి (మొత్తం 199 కేజీలు) ఆమె రెండో స్థానంలో నిలిచింది. నైజీరియాకు చెందిన ఒనోమ్ ఒమొలొలా దీదీ మొత్తం 206 కేజీలు (93+113) స్వర్ణం సాధించి కొత్త కామన్వెల్త్ గేమ్స్ రికార్డు నెలకొల్పగా... రెబెకా గ్రోక్స్ (కెనడా–178 కేజీలు) కాంస్యం అందుకుంది. స్నాచ్‌లో వరుసగా 82, 85, 88 కేజీల బరువుతో తన ప్రదర్శనను మెరుగుపర్చుకున్న జ్ఞానేశ్వరి...క్లీన్ అండ్ జర్క్‌లో కూడా వరుసగా మూడు ప్రయత్నాల్లో 103, 107, 111 కేజీల బరువును ఎత్తింది. వెయిట్‌లిఫ్టింగ్ పురుషుల విభాగంలో భారత్‌కు రాజా ముత్తుపండి రజతంతో మెరిశాడు. పురుషుల 65 కేజీల విభాగంలో రాజా రెండో స్థానంలో నిలిచాడు. స్నాచ్‌లో 126 కేజీలు, క్లీన్ అండ్ జర్క్‌లో 160 కేజీలు కలిపి మొత్తంగా 286 కేజీల బరువు ఎత్తిన రాజాకు రజతం లభించింది. ఈ ఈవెంట్లో అజ్నిల్ బిన్ బిదిన్ ముహమ్మద్ (మలేసియా) కామన్వెల్త్ రికార్డు 299 కేజీలు (133+166)తో స్వర్ణం గెలుచుకోగా, మోరియా బారు (పవువా న్యూ గినియా; 282 కేజీలు)కు కాంస్యం లభించింది. ఈసారి కాంస్యం.. మహిళల 58 కేజీల కేటగిరీలో బింద్యారాణి దేవి సొరొఖైబమ్కు కాంస్య పతకం దక్కింది. 2022 బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ క్రీడల్లో రజతం గెలుచుకున్న ఆమె ఈసారి అంతకంటే మెరుగైన ప్రదర్శన ఇవ్వాలని బరిలోకి దిగినా... కాంస్యానికే పరిమితమైంది. ఒకదశలో స్వర్ణం దిశగా సాగుతున్నట్లు అనిపించినా... చివర్లో ఆమె తడబడింది. ఓవరాల్‌గా 199 కేజీలు (స్నాచ్‌లో 87 + క్లీన్ అండ్ జర్క్‌లో 112) బరువు ఎత్తిన బింద్యారాణి మూడో స్థానంతో ముగించింది. ఈ పోటీల్లో రఫియతు లవాల్ (నైజీరియా; 229 కేజీలు) కామన్వెల్త్ క్రీడల్లో రికార్డు ప్రదర్శనతో స్వర్ణం గెలుచుకోగా... ఆన్ సోఫీ (కెనడా; 215 కేజీలు)కు రజతం దక్కింది. బింద్యారాణి గతంలో కామన్వెల్త్ చాంపియన్‌షిప్ పోటీల్లో ఒక స్వర్ణం, 2 రజతాలు సాధించింది.పోలీస్ ఖాతాలో పతకం... ఛత్తీస్‌గఢ్‌లోని రాజ్‌నంద్‌గావ్‌కు చెందిన 23 ఏళ్ల జ్ఞానేశ్వరి అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (ఏఎస్ఐ)గా పని చేస్తోంది. చిన్న వయసులో ముందు పవర్‌లిఫ్టింగ్‌పై ఆసక్తి చూపించిన ఆమెను వెయిట్‌లిఫ్టింగ్ మరింతగా ఆకర్షించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక క్రీడాభివృద్ధి కార్యక్రమంలో భాగంగా జ్ఞానేశ్వరి వెలుగులోకి వచ్చింది. ఎల్రక్టీషియన్ అయిన తండ్రి దీపక్ యాదవ్ ఎన్నో ఆర్థిక సమస్యలు ఎదురైనా... కూతురిని ఆమె లక్ష్యం దిశగా ప్రోత్సహించడంలో ఎప్పుడూ వెనుకాడలేదు. జూనియర్ స్థాయిలో పలు విజయాలతో గుర్తింపు దక్కించుకున్న ఆమె... పాటియాలాలోనే ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ (ఎన్ఐఎస్)లో శిక్షణ పొందుతోంది. గత ఏడాది ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 5వ స్థానంలో నిలిచిన జ్ఞానేశ్వరి ఇటీవలే ఆసియా చాంపియన్‌షిప్‌లో కాంస్యం గెలుచుకుంది. ఈ కామన్వెల్త్ క్రీడల కోసం గ్లాస్గోలోని పరిస్థితులకు అలవాటు పడేందుకు కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో బర్మింగ్‌హామ్‌లోని వార్లీ వెయిట్‌లిఫ్టింగ్ క్లబ్లో ప్రత్యేకంగా సిద్ధమై ఫలితం సాధించింది.ఫైనల్లో సాజన్ ప్రకాశ్ స్విమ్మింగ్ పురుషుల 200 మీటర్ల బటర్‌ఫ్లయ్ ఈవెంట్లో భారత స్టార్ సాజన్ ప్రకాశ్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. కేరళకు చెందిన ‘డబుల్ ఒలింపియన్’ సాజన్ హీట్–2లో 1ని:58.59 సెకన్లలో గమ్యానికి చేరి రెండో స్థానంలో నిలిచాడు. ఓవరాల్‌గా ఆరో ఫాస్టెస్ట్ స్విమ్మర్‌గా సాజన్ ఫైనల్లో చోటు సంపాదించాడు. క్వార్టర్స్‌లో అంకుశ్, సచిన్ పురుషుల బాక్సింగ్ ఈవెంట్లో భారత బాక్సర్లు అంకుశ్, సచిన్ సివాచ్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. పతకాలు ఖరారు చేసుకోవడానికి విజయం దూరంలో నిలిచారు. 80 కేజీల ప్రిక్వార్టర్ ఫైనల్లో అంకుశ్ 5:0తో జాన్ జలాన్ (అంటిగ్వా అండ్ బార్బుడా)పై గెలుపొందగా... 60 కేజీల ప్రిక్వార్టర్ ఫైనల్లో సచిన్ 4:1తో విలియమ్ హెవిట్ (ఇంగ్లండ్)ను ఓడించాడు.నిరాశపరిచిన సమంత మహిళల జిమ్నాస్టిక్స్ వాల్ట్ ఫైనల్లో భారత జిమ్నాస్ట్ ప్రొతీస్థా సమంత నిరాశ పరిచింది. సమంత 12.883 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచింది. లియా మోనిక (కెనడా; 14.000 పాయింట్లు) స్వర్ణం, అబిగెయిల్ మార్టీన్ (ఇంగ్లండ్; 13.799 పాయింట్లు) రజతం, రోపెర్ (వేల్స్; 13.433 పాయింట్లు) కాంస్యం నెగ్గారు.లాంగ్‌జంప్ ఫైనల్లో శ్రీశంకర్అథ్లెటిక్స్ ఫీల్డ్ ఈవెంట్ లాంగ్‌జంప్‌లో భారత్ నుంచి ఇద్దరు ఫైనల్లోకి అడుగు పెట్టారు. 2022 బర్మింగ్‌హామ్ గేమ్స్‌లో రజతం నెగ్గిన శ్రీశంకర్తోపాటు లోకేశ్ సత్యనాథన్ ఫైనల్లోకి ప్రవేశించారు. క్వాలిఫయింగ్‌లో శ్రీశంకర్ 8.01 మీటర్ల దూరం గెంతి నేరుగా ఫైనల్‌కు చేరాడు. క్వాలిఫయింగ్ ప్రమాణం 8 మీటర్ల కావడంతో శ్రీశంకర్ నేరుగా ఫైనల్‌కు అర్హత సాధించాడు. లోకేశ్ 7.77 మీటర్ల దూరం గెంతి ఓవరాల్‌గా ఏడో స్థానంలో నిలిచి ఫైనల్ బెర్త్‌ను దక్కించుకున్నాడు. మరోవైపు పురుషుల 110 మీటర్ల హర్డిల్స్‌లో తేజస్ శిర్సే కూడా ఫైనల్లోకి ప్రవేశించాడు. హీట్ రేసును తేజస్ 13.76 సెకన్లలో ముగించి ఓవరాల్‌గా ఆరో స్థానంలో నిలిచి ఫైనల్‌కు చేరుకున్నాడు. పురుషుల 100 మీటర్ల విభాగంలో జాతీయ చాంపియన్ గురీందర్వీర్ సింగ్ సెమీఫైనల్‌కు అర్హత సాధించలేకపోయాడు. గురీందర్వీర్ 10.39 సెకన్లలో గమ్యానికి చేరి ఓవరాల్‌గా 28వ స్థానంలో నిలిచాడు. -
సరికొత్త టోర్నమెంట్‌ను ప్రకటించిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు
దక్షిణాఫ్రికా, జింబాబ్వే వేదికలుగా జరగనున్న వన్డే ప్రపంచకప్-2027 టోర్నీ దృష్ట్యా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఓ కీలక నిర్ణయం తీసుకుంది. వైట్ బాల్ క్రికెట్లో యువ, అనుభవజ్ఞులైన ఆటగాళ్లకు విస్తృత అవకాశాలు కల్పించేందుకు ప్రతిష్టాత్మకంగా 'నేషనల్ ఛాంపియన్స్ కప్ 2026' అనే సరికొత్త టోర్నమెంట్‌ను పీసీబీ తీసుకొచ్చింది.సోమవారం ఈ లీగ్ ప్రారంభ ఎడిషన్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను పీసీబీ విడుదల చేసింది. షెడ్యూల్‌తో పాటు పాల్గోనే మొత్తం నాలుగు జట్లను కూడా ప్రకటించారు. ఈ టోర్నీ ఆగస్టు 11 నుంచి ఆగస్టు 18 వరకు కేవలం వారం రోజుల పాటు జరగనుంది. మొత్తం మ్యాచ్‌లన్నింటికి ముల్తాన్ క్రికెట్ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది.ఈ ఈవెంట్ లీగ్ దశ రౌండ్-రాబిన్ ఫార్మాట్లో ఫార్మాట్లో నిర్వహించనున్నారు. ప్రతీ జట్టు మిగతా జట్లతో ఒకసారి తలపడనుంది. లీగ్ దశ ముగిసేసరికి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన రెండు జట్లు ఆగస్టు 18న జరిగే గ్రాండ్ ఫైనల్లో తాడోపేడో తెల్చుకోనున్నాయి. కాగా ఈ లిస్ట్-ఎ క్రికెట్ టోర్నమెంట్లో పాకిస్తాన్ అగ్రశ్రేణి ఆటగాళ్లు షాహీన్ షా అఫ్రిది, షాదాబ్ ఖాన్, సైమ్ అయూబ్, సాహిబ్జాదా ఫర్హాన్ పాల్గోనున్నారు. వీరు నలుగురు కెప్టెన్లగా వ్యవహరించనున్నారు.జట్ల వివరాలు:పాకిస్థాన్ గ్రీన్: షాదాబ్ ఖాన్ (కెప్టెన్), ఫహీమ్ అష్రఫ్, ఫఖర్ జమాన్, ఫర్హాన్ యూసుఫ్, మెహ్రాన్ ముంతాజ్, మహమ్మద్ హస్నైన్, మహమ్మద్ సల్మాన్ మీర్జా, నసీమ్ షా, ఉమైర్ బిన్ యూసుఫ్, సాద్ బైగ్ (వికెట్ కీపర్), సమీర్ మిన్హాస్.పాకిస్థాన్ వైట్స్: సైమ్ అయూబ్ (కెప్టెన్), ఆకిఫ్ జావేద్, అలీ రజా, హ్యారీస్ రౌఫ్, హసన్ నవాజ్, ఖుష్దిల్ షా, మొహ్సిన్ రియాజ్, మహమ్మద్ వసీమ్ జూనియర్, సాద్ మసూద్, షెహ్జాబ్ ఖాన్, ఉస్మాన్ ఖాన్ (వికెట్ కీపర్).పాకిస్థాన్ బ్లూస్: సాహిబ్జాదా ఫర్హాన్ (కెప్టెన్), అహ్మద్ దానియల్, అరఫాత్ మిన్హాస్, హసన్ అలీ, హుస్సేన్ తలాత్, జహాన్ దాద్ ఖాన్, రోహైల్ నజీర్ (వికెట్ కీపర్), షామిల్ హుస్సేన్, సుఫియాన్ మోకిమ్, తైమూర్ ఖాన్ (వికెట్ కీపర్), తయ్యాబ్ తాహిర్.పాకిస్థాన్ గోల్డ్: షాహీన్ షా అఫ్రీది (కెప్టెన్), అబ్దుల్ సమద్, అబ్దుల్ సుభాన్, ఫైసల్ అక్రమ్, హైదర్ అలీ, కమ్రాన్ గులామ్, మాజ్ సదాకత్, మహమ్మద్ నవాజ్, ముహమ్మద్ అఖ్లాక్ (వికెట్ కీపర్), ముహమ్మద్ ఇమ్రాన్, సాద్ ఖాన్. -
భారత్ ఖాతాలో మరో పతకం.. వెయిట్‌లిఫ్టర్ జ్ఞానేశ్వరికి రజతం
గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్-2026లో భారత వెయిట్‌లిఫ్టర్లు తమ సత్తా చాటుతున్నారు. తాజాగా మహిళల 53 కేజీల విభాగంలో వెయిట్‌లిఫ్టర్ జ్ఞానేశ్వరి యాదవ్ అద్భుత ప్రదర్శనతో రజత పతకం సొంతం చేసుకుంది.ఈ ఈవెంట్ ఆరంభం నుంచే జ్ఞానేశ్వరి అదరగొట్టింది. తొలుత స్నాచ్ విభాగంలో తన మూడో ప్రయత్నంలో 88 కేజీలను ఎత్తి రెండో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత క్లీన్ అండ్ జెర్క్ విభాగంలో కూడా తన జోరును కొనసాగించింది. మొదటి ప్రయత్నంలో 103 కేజీలు, రెండో ప్రయత్నంలో 107 కేజీలు ఎత్తగా.. మూడో ప్రయత్నంలో ఏకంగా 111 కేజీలు లిఫ్ట్ చేసింది. జ్ఞానేశ్వరి మొత్తం 199 కేజీలు (స్నాచ్ 88 కేజీలు + క్లీన్ అండ్ జెర్క్ 111 కేజీలు) లిఫ్ట్ చేసి రెండో స్దానంలో నిలిచి రజతం కైవసం చేసుకుంది. మొత్తం 206 కేజీలు (93 కేజీలు + 113 కేజీలు) ఎత్తిన నైజీరియా అథ్లెట్ ఒనోమే దిదిద్కు స్వర్ణ పతకం దక్కింది. -
నేపాల్ పేసర్ చారిత్రక ఘనత
నేపాల్ పేస్ బౌలర్ కరణ్ కేసీ వన్డే క్రికెట్లో అరుదైన ఘనత సాధించాడు. ఈ ఫార్మాట్లో 100 వికెట్లు పూర్తి చేసిన తొలి నేపాల్ పేసర్‌గా, సందీప్ లామిచ్ఛానే తర్వాత రెండో నేపాల్ బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు.ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచకప్ లీగ్-2లో భాగంగా నమీబియాతో జరుగుతున్న మ్యాచ్‌లో కరణ్ ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో కరణ్ 10 ఓవర్లలో కేవలం 29 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ఈ ఇన్నింగ్స్‌లో రెండో వికెట్‌తో అతను 100 వికెట్ల మైలురాయిని తాకాడు.2018లో నెదర్లాండ్స్‌పై వన్డే అరంగేట్రం చేసిన కరణ్.. 72 ఇన్నింగ్స్‌ల్లో 103 వికెట్లు తీశాడు. బ్యాటింగ్ సామర్థ్యం కూడా కలిగిన కరణ్, ఈ ఫార్మాట్లో ఓ హాఫ్ సెంచరీ సాయంతో 700 పరుగులు కూడా చేశాడు. 34 ఏళ్ల కరణ్ టీ20 ఫార్మాట్లోనూ సత్తా చాటుతే 112 వికెట్లు తీశాడు.నమీబియా-నేపాల్ మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. జాన్ ఫ్రైలింక్ (100) సెంచరీతో సత్తా చాటగా.. స్టీన్‌క్యాంప్ (59) అర్ద సెంచరీతో రాణించాడు. వీరిద్దరూ క్రీజ్‌లో ఉండగా.. నమీబియా భారీ స్కోర్ సాధించేలా కనిపించింది. అయితే కరణ్ (10-2-29-5) అద్భుత స్పెల్‌తో వారి ఆశలు అడియాశలు చేశాడు. -
'అతడిని పక్కన పెట్టాల్సిన టైమ్ వచ్చేసింది'
జింబాబ్వేతో మూడు టీ20ల సిరీస్‌ను 3-0 తేడాతో టీమిండియా క్లీన్ స్వీప్ చేసింది. ఈ సిరీస్‌లో యువ ఆటగాళ్లతో కూడిన భారత జట్టు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించినప్పటికీ... స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ పేలవ ఫామ్ మాత్రం మేనెజ్మెంట్ను తీవ్ర కలవరపెడుతోంది. ఇంగ్లండ్ టూర్లో ఆశించిన స్థాయిలో రాణించలేపోయిన అభిషేక్.. జింబాబ్వే గడ్డపై అంతకంటే దారుణమైన ప్రదర్శన కనబరిచాడు. మూడు మ్యాచ్‌లలోనూ సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యాడు. ఈ ఎస్ఆర్హెచ్ స్టార్ ఓపెనర్ మూడు మ్యాచ్‌ల్లో కలిపి కేవలం 11 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో భారత మాజీ చీఫ్ సెలెక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ కీలక వ్యాఖ్యలు చేశాడు. అభిషేక్ శర్మ బదులుగా సంజూ శాంసన్‌కు అవకాశమివ్వాలని శ్రీకాంత్ సూచించాడు.కాగా టీ20 వరల్డ్‌కప్-2026 హీరో శాంసన్‌ను జింబాబ్వే పర్యటన నుంచి సెలక్టర్లు తప్పించారు. యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీకి అతడి స్ధానంలో అవకాశమిచ్చారు. అంతకుముందు ఇంగ్లండ్ టూర్లోనూ మూడు మ్యాచ్‌లకు సంజూను తుది జట్టు నుంచి పక్కన పెట్టారు. అయితే ఆసియా గేమ్స్‌కు ఎంపిక చేసిన భారత జట్టులో మాత్రం ఈ కేరళ ఆటగాడు ఉన్నాడు. అయితే వైభవ్ సూర్యవంశీ మెరుగ్గా రాణించడంతో ఆసియా గేమ్స్ నుంచి కూడా శాంసన్‌ను తప్పించే అవకాశముంది."అభిషేక్ శర్మ బలహీనతను ప్రత్యర్ధి జట్లు పసిగట్టేశాయి. వన్డే వరల్డ్‌కప్ నుంచి అతడి ప్రదర్శనలు అంతంతమాత్రమే గానే ఉన్నాయి. అతడి విషయంలో సెలక్టర్లు కఠిన నిర్ణయం తీసుకోక తప్పుదు. అభిషేక్ శర్మ స్ధానంలో సంజూ శాంసన్‌కు అవకాశమివ్వాలి. అతడికి కచ్చితంగా సెలక్టర్ల నుంచి పిలుపు వస్తుందని నమ్ముతున్నాను. అదేవిధంగా జింబాబ్వే పర్యటనలో లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచిన యువ పేసర్ మయాంక్ యాదవ్‌పై శ్రీకాంత్ ప్రశంసల వర్షం కురిపించాడు. మయాంక్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 6.5 ఏకానమీ రేటుతో 5 వికెట్లు పడగొట్టాడు. -
రాజీనామా డిమాండ్ల మధ్య 'గంభీర'మైన పోస్ట్
టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సోషల్ మీడియాలో చేసిన ఓ క్రిప్టిక్ పోస్ట్ చర్చనీయాంశమైంది. ఇటీవల భారత జట్టు వరుస సిరీస్‌ల్లో నిరాశపరిచిన తర్వాత కొందరు అభిమానులు గంభీర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.ఇటీవల కేంద్ర మాజీ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో కొందరు నెటిజన్లు దానిని గంభీర్ పరిస్థితితో పోలుస్తూ మీమ్స్‌ను వైరల్ చేశారు.ఈ పరిస్థితి మధ్య గంభీర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో "Jab desh ka sabse Gambhir insaan muskura de…" అంటూ నవ్వుతున్న ఎమోజీలతో కూడిన పోస్ట్‌ను పంచుకున్నారు. ఈ పోస్ట్‌ను ఆయనపై వస్తున్న విమర్శలకు పరోక్ష సమాధానంగా పలువురు అభిమానులు భావిస్తున్నారు. అయితే గంభీర్ మాత్రం తన పోస్టులో ఎక్కడా రాజీనామా డిమాండ్లు లేదా విమర్శలను ప్రస్తావించలేదు.గంభీర్ మార్గదర్శకత్వంలోని భారత జట్టు ఇటీవల ఐర్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌ను 0-2తో, ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌ను 0-4తో, వన్డే సిరీస్‌ను 1-2తో కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ వరుస పరాజయాల తర్వాత గంభీర్‌పై విమర్శలు తారాస్థాయికి చేరాయి.మరోవైపు, గంభీర్ విశ్రాంతిలో ఉండగా వీవీఎస్ లక్ష్మణ్ తాత్కాలిక కోచ్‌గా జట్టుతో కలిసి జింబాబ్వే పర్యటనకు వెళ్లాడు. శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలోని భారత జట్టు అక్కడ 3-0తో సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయడంతో, లక్ష్మణ్‌ను శాశ్వత ప్రధాన కోచ్‌గా నియమించాలనే డిమాండ్లు తీవ్రమయ్యాయి.అయితే గంభీర్ కోచ్‌గా ఉన్న కాలంలో భారత్ 2025 ఛాంపియన్స్ ట్రోఫీ, 2026 టీ20 ప్రపంచకప్‌లను గెలుచుకున్న విషయాన్ని కూడా అభిమానులు గుర్తుంచుకోవాలని పలువురు మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు. ఆయన పదవిపై బీసీసీఐ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. -
ముంబైలో ఫ్లాట్ కొన్న విరుష్క జోడీ.. ఎన్ని కోట్లంటే?
టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి- బాలీవుడ్ నటి అనుష్క శర్మ దంపతులు మరోసారి వార్తల్లో నిలిచారు. ఈ జంట ముంబైలోని వర్సోవా ప్రాంతంలో ఓ లగ్జరీ అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేశారు. రియల్ ఎస్టేట్ ప్లాట్‌ఫారమ్ జాప్కీ.కామ్ ప్రకారం.. ఈ ఫ్లాట్ కొనుగోలు చేసేందుకు విరుష్క జోడీ రూ. 18.29 కోట్లు చెల్లించినట్లు తెలుస్తోంది. ఈ ఫ్లాట్ సుమారు 2,644 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ప్లాట్‌తో పాటు మూడు కార్ పార్కింగ్ స్లాట్లు కేటాయించబడ్డాయి. దీనికి సంబంధించి జూలై 21న రిజిస్ట్రేషన్ జరిగినట్లు సమాచారం. దీని కోసం కోహ్లీ దంపతులు రూ.1.09 కోట్ల స్టాంప్ డ్యూటీతో పాటు రూ. 30,000 రిజిస్ట్రేషన్ ఛార్జీలు చెల్లించారు. కాగా ముంబైలోని వర్లీలో ఇప్పటికే వీరికి లగ్జరీ అపార్ట్మెంట్ ఉన్న విషయం తెలిసిందే. అయితే కోహ్లి ఫ్యామిలీ ఎక్కువగా లండన్‌లో ఉంటుంది. అక్కడ కూడా విలాసవంతమైన ఇంటిని కోహ్లి కొనుగోలు చేశాడు.చివరగా ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో భారత తరపున బరిలోకి దిగిన కింగ్ కోహ్లి.. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. సెప్టెంబర్ 27న వెస్టిండీస్‌తో జరగనున్న వన్డేలో కోహ్లి తిరిగి భారత జెర్సీలో కనిపించనున్నాడు. -
టీమిండియా ఓపెనర్‌తో మృణాల్ ఠాకూర్ డేటింగ్..?
బాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్, భారత యువ క్రికెటర్ యశస్వి జైస్వాల్ డేటింగ్ చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. ముంబైలోని బాంద్రా వెస్ట్‌లో ఉన్న బూజీ కేఫే వద్ద వీరిద్దరూ కనిపించిన వీడియో వైరల్ కావడంతో ఈ ఊహాగానాలు మొదలయ్యాయి.Yashasvi Jaiswal dating Mrunal Thakur?😳 pic.twitter.com/dnr4FNSaEc— Wickets Hitting (@offpacedelivery) July 26, 2026ఆ వీడియోలో యశస్వి జైస్వాల్ కేఫే నుంచి బయటకు వస్తుండగా, మృణాల్ ఠాకూర్ లోపల ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే అందులో ఇద్దరూ కలిసి కనిపించలేదు. వారిద్దరి మధ్య ఎలాంటి సన్నిహిత సంబంధాన్ని సూచించే దృశ్యాలు కూడా వీడియోలో లేవు.ఇప్పటివ వరకు మృణాల్ గానీ, జైస్వాల్ గానీ ఈ ప్రచారంపై స్పందించలేదు. అలాగే వారు ప్రేమలో ఉన్నారని నిర్ధారించే ఆధారాలు కూడా లేవు. ఈ భేటీ వ్యక్తిగతమా, వృత్తిపరమైనదా లేదా ప్రకటన చిత్రీకరణకు సంబంధించినదా అన్నది స్పష్టంగా తెలియరాలేదు.మరోవైపు సోషల్ మీడియాలో వీరిద్దరి వయస్సు తేడాపైనా చర్చ జరుగుతోంది. మృణాల్‌కు ప్రస్తుతం 33 ఏళ్లు, జైస్వాల్‌కు 24. వీరి మధ్య సుమారు 9 ఏళ్లు తేడా ఉంది.ఇదిలా ఉంటే, గతంలో మృణాల్ ఠాకూర్ పేరు నటుడు ధనుష్‌తో ముడిపెడుతూ పలు కథనాలు వెలువడ్డాయి. అయితే ఆ వార్తలను ఆమె పూర్తిగా ఖండించింది. -
చారిత్రత్మక టెస్ట్ సిరీస్‌కు బంగ్లా జట్టు ప్రకటన
బంగ్లాదేశ్ పురుషల క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడేందుకు సిద్దమవుతోంది. ఈ క్రమంలో ఆగస్టు 13 నుంచి డార్విన్ వేదికగా జరగనున్న తొలి టెస్టు కోసం 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును బంగ్లా క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ జట్టు కెప్టెన్‌గా నజ్ముల్ హుస్సేన్ శాంటో సారథ్యం వహించనున్నాడు. బంగ్లాదేశ్ జట్టు 2003 తర్వాత ఆస్ట్రేలియాలో ఓ టెస్టు సిరీస్ ఆడనుండడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇక ఈ సిరీస్ వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ 2025-26లో భాగంగా జరగనుంది. కాబట్టి ఈ సిరీస్‌కు ఇరు జట్లకు కీలకం కానుంది. కాగా ఆల్‌రౌండర్ సౌమ్య సర్కార్‌కు చాన్నాళ్ల తర్వాత బంగ్లా టెస్ట్ జట్టులో చోటు దక్కింది. సర్కార్ చివరగా 2021లో బంగ్లా తరపున టెస్టుల్లో ఆడాడు. అదేవిధంగా సీనియర్ బ్యాటర్లు ముష్ఫికర్ రహీమ్, మోమినుల్ హక్ జట్టులో చోటు దక్కించుకున్నారు.పేస్ బౌలింగ్ విభాగంలో టాస్కిన్ అహ్మద్, హసన్ మహమూద్, ఖాలెద్ అహ్మద్, ఎబాదత్ హుస్సేన్ వంటి ఫాస్ట్ బౌలర్లను సెలక్టర్లు ఎంపిక చేశారు. వీరితో పాటు అన్క్యాప్డ్ పేసర్ ముష్ఫిక్ హసన్‌కు కూడా తొలిసారి జట్టులో స్థానం లభించింది.ఇక ఈ సిరీస్ కోసం ఇప్పటికే ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు తమ జట్టు ప్రకటించింది. ఈ జట్టుకు ప్యాట్ కమిన్స్ సారథ్యం వహించనున్నాడు. కాగా ప్రస్తుతం డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా 87.5% పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, బంగ్లాదేశ్ 58.33% పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది.తొలి టెస్టుకు బంగ్లాదేశ్ జట్టు:నజ్ముల్ హుస్సేన్ శాంటో (కెప్టెన్), సౌమ్య సర్కార్, షాద్మన్ ఇస్లామ్, తాంజిద్ హసన్, మోమినుల్ హక్, ముష్ఫికర్ రహీమ్, అమిత్ హసన్, జాకర్ అలీ అనిక్, మెహిదీ హసన్ మిరాజ్ (వైస్ కెప్టెన్), తైజుల్ ఇస్లామ్, తస్కిన్ అహ్మద్, హసన్ మహమూద్, సయ్యద్ ఖాలెద్ అహ్మద్, ఎబాదత్ హుస్సేన్ చౌదరి, ముష్ఫిక్ హసన్. -
కామన్వెల్త్ హీరోకు సీఎం విజయ్ భారీ నజరానా
స్కాట్లాండ్లోని గ్లాస్గోలో జరుగుతున్న 2026 కామన్వెల్త్ గేమ్స్‌లో పతకం సాధించిన తమిళనాడు వెయిట్‌లిఫ్టర్ రాజా ముత్తుపాండికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ భారీ నజరానా ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.30 లక్షల నగదు బహుమతి అందజేస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా సీఎం విజయ్ ముత్తుపాండిని అభినందించారు. ఆయన సాధించిన విజయం తమిళనాడుకు గర్వకారణమని అన్నారు. ముత్తుపాండి విజయం యువ క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తుందని, భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ విజయాలు సాధించి రాష్ట్రం, దేశానికి మరింత పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ముత్తుపాండి తమిళనాడులోని కోవిల్పట్టికి చెందినవారు.కాగా, ముత్తుపాండి కామన్వెల్త్ క్రీడల పురుషుల 65 కిలోల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో రజత పతకం సాధించాడు.స్నాచ్ విభాగంలో తొలి ప్రయత్నంలో 126 కిలోలు ఎత్తడంలో విఫలమైన ముత్తుపాండి, రెండో ప్రయత్నంలో అదే బరువును విజయవంతంగా ఎత్తాడు. అనంతరం 129 కిలోల ప్రయత్నం విఫలమైనప్పటికీ, 126 కిలోలతో ఆ విభాగాన్ని ముగించాడు.క్లీన్ అండ్ జర్క్‌లో కూడా తొలి ప్రయత్నంలో 158 కిలోలు ఎత్తలేకపోయిన ముత్తుపాండి, రెండో ప్రయత్నంలో 160 కిలోలు విజయవంతంగా ఎత్తి మొత్తం 286 కిలోల లిఫ్ట్‌తో రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు. -
కేసుల ఎఫెక్ట్.. జట్టు మారిన ఆర్సీబీ బౌలర్
ఆర్సీబీ ఫాస్ట్ బౌలర్ యశ్ దయాల్ 2026-27 దేశవాళీ సీజన్‌కు ముందు ఉత్తరప్రదేశ్ జట్టును వీడి ఛత్తీస్‌గఢ్‌కు మారాడు. అతనిపై కొనసాగుతున్న చట్టపరమైన కేసుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఛత్తీస్‌గఢ్ జట్టు ప్రీ-సీజన్ శిక్షణ శిబిరంలో దయాల్ చేరి సాధన ప్రారంభించాడు.ESPNcricinfo కథనం ప్రకారం, ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (UPCA) నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (NOC) ప్రక్రియ కొనసాగుతోంది. కొత్త ప్రధాన కోచ్ అమయ్ ఖురాసియా ఆధ్వర్యంలో కర్ణాటకలోని ఆలూర్‌లో జరుగుతున్న శిక్షణ శిబిరంలో దయాల్ పాల్గొంటున్నాడు.కేసుల నేపథ్యంలో జట్టు మార్పుయశ్ దయాల్‌పై ప్రస్తుతం రెండు క్రిమినల్ కేసులు కొనసాగుతున్నాయి. ఓ మహిళను వివాహం చేసుకుంటానని నమ్మించి లైంగికంగా వేధించాడనే ఆరోపణలపై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 69 కింద ఘాజియాబాద్‌లో కేసు నమోదైంది. ఈ కేసులో అలహాబాద్ హైకోర్టు అతడికి తాత్కాలిక అరెస్టు రక్షణ కల్పించింది. మరోవైపు జైపూర్‌లో నమోదైన POCSO కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ప్రత్యేక న్యాయస్థానం తిరస్కరించింది.ఈ కేసుల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ క్రికెట్ వ్యవస్థ నుంచి దూరమైన దయాల్, కొత్త అవకాశాల కోసం ఛత్తీస్‌గఢ్‌కు మారినట్లు సమాచారం.ఐపీఎల్‌లోనూ అవకాశం దక్కలేదు2025 ఐపీఎల్ ఫైనల్ తర్వాత యశ్ దయాల్ పోటీ క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) అతడిని ఐపీఎల్ 2026కు రిటైన్ చేసినప్పటికీ, వ్యక్తిగత న్యాయపరమైన పరిస్థితుల కారణంగా జట్టులో అవకాశం ఇవ్వలేదు.దేశవాళీ కెరీర్‌పై దృష్టిఛత్తీస్గఢ్ జట్టులో భారత స్పిన్నర్ జయంత్ యాదవ్, అనుభవజ్ఞుడు ధర్మేంద్రసింహ్ జడేజా వంటి ఆటగాళ్లతో కలిసి యశ్ దయాల్ సాధన చేస్తున్నాడు. న్యాయపరమైన విచారణలు కొనసాగుతున్నప్పటికీ, దేశవాళీ క్రికెట్లో మరోసారి తన కెరీర్‌ను గాడిలో పెట్టేందుకు అతడు ప్రయత్నిస్తున్నాడు. -
నా కల నెరవేరింది.. వారి వల్లే ఇదంతా: వైభవ్ సూర్యవంశీ
తన అరంగేట్ర సిరీస్‌లో విఫలమైన టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ.. జింబాబ్వే పర్యటనలో ఇరగదీశాడు. ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో రెండు హాఫ్ సెంచరీలతో సహా మొత్తంగా 151 పరుగులు చేసి లీడింగ్ రన్‌స్కోరర్‌గా నిలిచాడు. హరారే వేదికగా జరిగిన నామమాత్రపు మూడో టీ20లోనూ వైభవ్ సత్తాచాటాడు.49 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్‌లతో 81 పరుగులు చేశాడు. దీంతో సూర్యవంశీకి ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్‌తో పాటు ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్ అవార్డు కూడా దక్కింది. తద్వారా అంతర్జాతీయ క్రికెట్లో ఈ రెండు అవార్డులను గెలుచుకున్న అత్యంత పిన్న వయస్కుడిగా సూర్యవంశీ నిలిచాడు. ఈ నేపథ్యంలో తనకు సపోర్ట్‌గా నిలిచిన టీమ్ మేనెజ్మెంట్కు వైభవ్ ధన్యవాదాలు తెలిపాడు."నా కల నెరవేరింది. మొదటిసారిగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు గెలుచుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ సిరీస్ కోసం తీవ్రంగా శ్రమించాను. హరారే వచ్చిన తర్వాత మేము మూడు రోజుల పాటు ప్రాక్టీస్ చేశాం. ఇంతకుముందు ఇదే వేదికపై అండర్-19 ప్రపంచకప్ మ్యాచ్‌లు ఆడాను. ఈ గ్రౌండ్లో ఆడడం నాకు చాలా ఇష్టం. అదేవిధంగా కెప్టెన్, కోచ్‌లు, సహచర ఆటగాళ్లందరూ నాకు పూర్తి మద్దతు ఇచ్చారు. వారి వల్లే నేను ఇక్కడ మెరుగైన ప్రదర్శన చేయగలిగాను. టీ20 క్రికెట్లో మొదట నుంచి ఎలా ఆడుతున్నానో.. ఇక్కడ కూడా అదే కొనసాగించాను.జట్టుకు మంచి ఆరంభాన్ని ఇవ్వడమే నా ప్రధాన లక్ష్యం. ఒకసారి కుదురుకున్నాక, ఇన్నింగ్స్‌ను భారీ స్కోరుగా మలచడానికి ప్రయత్నించాను. సిరీస్ అంతటా ఇదే ప్లాన్‌తో ముందడుగు వేశాను" అని పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో వైభవ్ పేర్కొన్నాడు. ఈ రాజస్తాన్ చిచ్చరపిడుగు మళ్లీ జపాన్ వేదికగా జరగనున్న ఆసియా క్రీడల్లో భారత్ తరపున బరిలోకి దిగనున్నాడు. -
షూటింగ్ వరల్డ్ కప్‌లో భారత్ హవా.. ఈషా సింగ్‌కు స్వర్ణం, మనుకు కాంస్యం
హ్యాంగ్జౌ వేదికగా జరుగుతున్న ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ కప్‌లో భారత షూటర్లు సత్తాచాటారు. మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఈషా సింగ్ స్వర్ణం సాధించగా, మను భాకర్ కాంస్యం గెలుచుకున్నారు. ఈ ఈవెంట్లో ఇద్దరు భారత షూటర్లు ఒకేసారి పోడియంపై నిలవడం విశేషం.అయితే ఉత్కంఠ భరితంగా సాగిన ఫైనల్లో హైదరాబాద్ షూటర్ ఈషా సింగ్ ఆధిపత్యం ప్రదర్శించి, 40 హిట్స్‌తో అగ్రస్థానంలో నిలిచి స్వర్ణాన్ని సొంతం చేసుకుంది. మరోవైపు తీవ్ర పోటీ నడుమ షూట్-ఆఫ్‌ను దాటుకుని వచ్చిన మను బాకర్ 28 హిట్స్‌తో మూడో స్థానంలో నిలిచి కాంస్యాన్ని సొంతం చేసుకుంది.అంతకుముందు జరిగిన క్వాలిఫికేషన్ రౌండ్లోనూ భారత షూటర్లు తమ ఆధిపత్యాన్ని చాటారు. మను బాకర్ 586-20x స్కోరుతో క్వాలిఫయింగ్ చార్ట్‌లో అగ్రస్థానంలో నిలవగా, ఈషా సింగ్ 585-18x స్కోరుతో రెండో స్థానంలో నిలిచి ఎనిమిది మందితో కూడిన ఫైనల్‌కు అర్హత సాధించారు. కానీ ఫైనల్లో మాత్రం 21 ఏళ్ల ఇషా.. మనును వెనక్కి నెట్టి పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది. -
రేపు టెస్టు జట్టు ప్రకటన.. బుమ్రా ఆడకపోతే అతడికే చాన్స్!
జింబాబ్వేతో టీ20 సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసిన టీమిండియా తర్వాతి సిరీస్ శ్రీలంకతో ఆడనుంది. లంక పర్యటనలో ఈసారి వైట్‌బాల్ సిరీస్‌కు బదులుగా సంప్రదాయ టెస్టు సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌కు భారత్ జట్టును మంగళవారం ప్రకటించనుంది. ఏడాది కాలంగా టెస్టు క్రికెట్‌కు దూరంగా ఉన్న జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజాలు తిరిగి టెస్టుల్లో ఆడనున్నారనేది ఆసక్తిగా మారింది. అయితే లంకతో టెస్టు సిరీస్‌కు స్పీడస్టర్ జస్ప్రీత్ బుమ్రా దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో బుమ్రా ఒకవేళ లంకతో టెస్టు సిరీస్‌కు దూరమైతే అతడి స్థానంలో ఎవరిని ఎంపిక చేయాలన్నది బీసీసీఐ ఆలోచిస్తుంది. ఈ నేపథ్యంలో ఇటీవల లంక-ఏ జట్టుతో జరిగిన అనధికారిక టెస్టులో 10 వికెట్లు పడగొట్టి అద్భుత ప్రదర్శన చేసిన గుర్నూర్ బ్రార్ ఎంపికలో ముందు వరుసలో ఉన్నాడు. స్వదేశంలో ఆఫ్గన్‌తో జరిగిన ఏకైక టెస్టుకు ఎంపికైనప్పటికీ గుర్నూర్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. అయితే అఫ్గానిస్తాన్‌తో జరిగిన వన్డే సిరీస్ ద్వారా గుర్నూర్ అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. అయితే టెస్టు క్రికెట్లో మాత్రం ఇంకా ఎంట్రీ ఇవ్వని గుర్నూర్, లంకతో సిరీస్‌లో బుమ్రా స్థానంలో ఆడే అవకాశాలున్నాయి. బుమ్రా దూరమైతే మాత్రం సిరాజ్, ప్రసిధ్ భారత పేస్ బౌలింగ్ దళాన్ని నడిపించనున్నారు.ఇంగ్లండ్‌తో లార్డ్స్ వేదికగా రెండో వన్డే సమయంలో మోకాలి గాయంతో బాధపడ్డాడు. దీంతో చివరి వన్డేకు దూరమయ్యాడు. జూలై 24న బుమ్రాకు నిర్వహించిన పరీక్షల్లో అతడి మోకాలు వాపు ఉందని తేలింది. దీంతో తదుపరి పరీక్షల కోసం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌కు వెళ్లనున్నట్లు సమాచారం. ఈ లెక్కన బుమ్రా తన ఫిట్నెస్ను నిరూపించుకోవడంలో విఫలమైతే లంకతో సిరీస్‌కు అతడు దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే హర్షిత్ రానా, నితీశ్ కుమార్‌రెడ్డి, వాషింగ్టన్ సుందర్‌లు కూడా గాయాలతో బాధపడుతూ లంకతో టెస్టు సిరీస్ ఆడడం అనుమానంగా మారింది. టీమిండియా 2017లో చివరిసారి లంకలో టెస్టు సిరీస్ ఆడింది. అప్పటి సిరీస్‌లో కోహ్లి, అశ్విన్‌తో పాటు పుజారా ఆడారు. ఈ సిరీస్‌లో ఆతిథ్య లంక జట్టును వైట్‌వాష్ చేసింది. తాజాగా గిల్ నేతృత్వంలోని టీమిండియా లంక గడ్డపై సరికొత్త సవాల్‌కు సిద్ధమయింది.Read: ‘అగార్కర్ వింటున్నావా? వైభవ్‌ను రోహిత్‌కు జతగా పంపాలి’ -
చరిత్ర సృష్టించిన శ్రేయస్ అయ్యర్
జింబాబ్వేతో జరిగిన మూడో టీ20లో భారత్ 35 పరుగుల తేడాతో విజయం సాధించి మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. ఈ విజయంతో భారత టీ20 జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ చరిత్ర సృష్టించాడు.మూడు లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్‌ల ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లో జింబాబ్వేపై 3-0తో క్లీన్‌స్వీప్ చేసిన తొలి భారత కెప్టెన్‌గా రికార్డు నెలకొల్పాడు. తద్వారా ప్రపంచంలో ఈ ఘనత సాధించిన మూడో జట్టుగా భారత్ నిలిచింది. అంతకుముందు పాకిస్తాన్, అఫ్ఘనిస్తాన్ మాత్రమే జింబాబ్వేపై మూడు లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేశాయి.జింబాబ్వేపై టీ20 సిరీస్ క్లీన్‌స్వీప్‌లు* పాకిస్తాన్ – 3-0 (2020)* ఆఫ్ఘనిస్తాన్– 3-0 (2021)* ఆఫ్ఘనిస్తాన్ – 3-0 (2022)* ఆఫ్ఘనిస్తాన్ – 3-0 (2025)* **భారత్** – 3-0 (2026)ధోనికి కూడా సాధ్యపడలేదు..!2010లో సురేశ్ రైనా నేతృత్వంలో భారత్ జింబాబ్వేపై 2-0తో సిరీస్ గెలిచినా, అది రెండు మ్యాచ్‌ల సిరీస్ మాత్రమే. 2015లో అజింక్య రహానే సిరీస్‌ను 1-1తో సమం చేయగా, 2016లో ఎంఎస్ ధోని నాయకత్వంలో భారత్ 2-1తో విజయం సాధించింది.2024లో శుభ్‌మన్ గిల్ సారథ్యంలో భారత్ 4-1తో సిరీస్ గెలిచింది. అయితే మూడు లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసిన తొలి భారత కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్రలో నిలిచాడు.ఊరటనిచ్చిన విజయంటీ20 ప్రపంచకప్ విజేత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్థానంలో బాధ్యతలు చేపట్టిన శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ ఆరంభం నిరాశాజనకంగా సాగింది. ఐర్లాండ్‌తో 0-2, ఇంగ్లండ్‌తో 0-4 తేడాతో వరుస సిరీస్‌ల్లో భారత్ పరాజయం పాలైంది. తొలి ఏడు మ్యాచ్‌ల్లో (ఒకటి ఫలితం లేకుండా) ఆరు ఓటములు ఎదుర్కొన్న భారత కెప్టెన్‌గా అయ్యర్ అవాంఛిత రికార్డు నమోదు చేశాడు.అయితే జింబాబ్వేపై 3-0 సిరీస్ విజయం శ్రేయస్ అయ్యర్‌కు, అలాగే భారత జట్టుకు ఆత్మవిశ్వాసాన్ని పెంచే ఫలితంగా నిలిచింది. రానున్న కఠిన సిరీస్‌లలో ఇదే జోరును కొనసాగించాలని భారత జట్టు లక్ష్యంగా పెట్టుకుంది. -
‘అగార్కర్ వింటున్నావా? వైభవ్‌ను రోహిత్‌కు జతగా పంపాలి’
వన్డే ప్రపంచకప్ 2027 దృష్ట్యా టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని వన్డేల్లో కూడా ఆడిస్తే బాగుంటుందని మాజీ క్రికెటర్ ఫరూఖ్ ఇంజినీర్ అభిప్రాయపడ్డాడు. ఓపెనింగ్‌లో రోహిత్‌కు జతగా వైభవ్‌ను పంపించి కెప్టెన్ శుబ్‌మన్ గిల్ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌కు ట్యాగ్ చేస్తూ తన సందేశాన్ని వెల్లడించాడు. దీనివల్ల మిడిలార్డర్ కూడా బలంగా మారుతుందని ఫరూఖ్ వెల్లడించాడు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫరూఖ్ ఇంజినీర్ మాట్లాడుతూ.. 'గిల్ క్లాస్ ప్లేయర్. ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయగల సత్తా అతడికి ఉంది. అయితే ఆరంభంలోనే దూకుడుగా ఆడే స్వభావం గిల్‌కు లేదు. అయితే వైభవ్ సూర్యవంశీ లెఫ్ట్ హ్యాండర్ కావడంతో పాటు రోహిత్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించగలడు. వైభవ్ ధాటిగా ఆడుతున్నాడంటే ఒక ఎండ్‌లో రోహిత్ క్రీజులో నిలబడేందుకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తాడు. వైభవ్ ఉన్నంతసేపు రోహిత్ తన బ్యాట్‌కు పని చెప్పాల్సిన అవసరం తక్కువగా ఉంటుంది. ఇక క్లాస్ బ్యాటర్ అయిన గిల్‌కు నాలుగో స్థానం సరైనది. కోహ్లి ఎలాగూ మూడో స్థానంలో వస్తాడు. ఐదు, ఆరు స్థానాల్లో శ్రేయస్, రాహుల్ వస్తారు. అయితే వైభవ్‌ను వయసుతో ముడిపెడుతూ వన్డేల్లో అవకాశాలు ఇవ్వడం లేదు. నా వరకు 15 ఏళ్ల వయసు అనేది వన్డే క్రికెట్లో ఎంట్రీకి అర్హతే. అయితే కొందరు మాత్రం వైభవ్‌ను టీ20ల్లోనే ఆడించాలని, వన్డేల్లో ఇప్పుడే అవసరం లేదని అంటున్నారు. కానీ ఒక బ్యాటర్‌కు ఏ ఫార్మాట్ అయినా పరుగులు చేయడమే ప్రధానం. ఆరంభంలో ఒకటి రెండు మ్యాచ్‌లు విఫలమైనప్పటికీ, కుదురుకుంటే ఎంత ప్రమాదకారో ఇప్పటికే వైభవ్ రుచి చూపించాడు. అతడు ఆడితే ఓడినవాటి కంటే గెలిచే మ్యాచ్‌లే ఎక్కువగా ఉంటాయి. నా దృష్టిలో సర్ వీవీ రిచర్డ్స్ గొప్ప బ్యాటర్. అతడంత గొప్ప బ్యాటర్‌ను నేను చూడలేదు. ఇప్పుడు సూర్యవంశీ కూడా అలానే కనిపిస్తున్నాడు. రాబోయే కాలంలో వైభవ్ కచ్చితంగా భారతదేశ భవిష్యత్తు ఆశాకిరణంగా మారనున్నాడు.'అని ఫరూఖ్ ఇంజినీర్ చెప్పుకొచ్చాడు.ఐర్లాండ్, ఇంగ్లండ్‌తో సిరీస్‌ల్లో అంతగా ఆకట్టుకోని వైభవ్ సూర్యవంశీ జింబాబ్వేతో టీ20 సిరీస్‌లో మాత్రం అదరగొట్టాడు. మూడు మ్యాచ్‌లు కలిపి 151 పరుగులు సాధించిన వైభవ్ ఖాతాలో రెండు అర్ధసెంచరీలున్నాయి. తన ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌తో పాటు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ కూడా సొంతం చేసుకున్నాడు.Read: కసి మీదున్న సూర్యకుమార్.. 3 గంటల్లో వెయ్యి బంతులా! -
పాక్‌తో తొలి టెస్ట్.. హోప్ సెంచరీ మిస్
స్వదేశంలో పాకిస్తాన్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో వెస్టిండీస్ గౌరవప్రదమైన స్కోర్ చేసింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసి తొలి ఇన్నింగ్స్‌లో 311 పరుగులకే ఆలౌటైంది. స్టార్ ప్లేయర్ షాయ్ హోప్ (92) తృటిలో సెంచరీ మిస్ అయ్యాడు. మరో బ్యాటర్ కవెమ్ హాడ్జ్ (84) కూడా సెంచరీకి చేరువలో ఔటయ్యాడు. వీరిద్దరు రాణించడంతో విండీస్ ఈ స్కోరైనా చేయగలిగింది.మిగతా ప్లేయర్లలో తేజ్‌నరైన్ చంద్రపాల్ 21, బ్రాండన్ కింగ్ 12, ఆమిర్ జాంగూ 21, జస్టిన్ గ్రీవ్స్ 15, కెప్టెన్ రోస్టన్ ఛేజ్ 10, కీమర్ రోచ్ 3, షమార్ జోసఫ్ 23, జేడన్ సీల్స్ డకౌట్, జోమెల్ వార్రికన్ 1 (నాటౌట్) చేశారు. పాక్ బౌలర్లలో మొహమ్మద్ అలీ 4 వికెట్లతో సత్తా చాటగా.. మొహమ్మద్ అబ్బాస్ 3, ఖుర్రమ్ షెహజాద్ 2, ఆమిర్ జమాల్ ఓ వికెట్ పడగొట్టాడు.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన పాక్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. వన్‌డౌన్ బ్యాటర్, తాజా మాజీ కెప్టెన్ షాన్ మసూద్ అజేయ అర్ద సెంచరీతో (88) సత్తా చాటగా.. ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ (63) అర్ద సెంచరీతో రాణించాడు. కెప్టెన్ బాబర్ ఆజం 23 పరుగులకు ఔట్ కాగా.. మరో ఓపెనర్ అజాన్ అవైస్ డకౌటయ్యాడు. షాన్ మసూద్‌తో పాటు సల్మాన్ అఘా (0) క్రీజ్‌లో ఉన్నారు. విండీస్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు పాక్ ఇంకా 112 పరుగులు వెనుకపడి ఉంది. విండీస్ బౌలర్లలో రోచ్, సీల్స్, షమార్ తలో వికెట్ తీశారు. కాగా, రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం పాకిస్తాన్ జట్టు వెస్టిండీస్‌లో పర్యటిస్తుంది. -
ట్విన్ బ్రదర్స్ పోరు.. సీఎస్కే బౌలర్‌కు చుక్కెదురు
ఇంగ్లండ్ వేదికగా జరిగే హండ్రెడ్‌లో ట్విన్ బ్రదర్స్ పోరు అభిమానులను అలరించింది. 2026 ఎడిషన్‌లో భాగంగా ట్రెంట్ రాకెట్స్, లండన్ స్పిరిట్ మధ్య జరిగిన మ్యాచ్‌లో కవల సోదరులు క్రెయిగ్ ఓవర్టన్, జేమీ ఓవర్టన్ తలపడ్డారు. ఈ పోరులో ట్రెంట్ రాకెట్స్ ఆల్‌రౌండర్ క్రెయిగ్ ఓవర్టన్ పైచేయి సాధించాడు.చివరి ఐదు బంతుల్లో 10 పరుగులు అవసరమైన సమయంలో తన కవల సోదరుడు జేమీ ఓవర్టన్ (లండన్ స్పిరిట్) బౌలింగ్‌ను ధాటిగా ఎదుర్కొని ట్రెంట్ రాకెట్స్‌కు నాలుగు వికెట్ల తేడాతో విజయాన్ని అందించాడు. జేమీ ఓవర్టన్ ఐపీఎల్ 2026లో సీఎస్కే ప్రాతినిథ్యం వహించిన విషయం తెలిసిందే.159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ట్రెంట్ రాకెట్స్‌కు బెన్ డకెట్ 47 బంతుల్లో 75 పరుగులతో అద్భుత ఆరంభం అందించాడు. చివర్లో క్రెయిగ్ ఓవర్టన్ కేవలం 6 బంతుల్లో అజేయంగా 20 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. జేమీ వేసిన చివరి ఓవర్లో సిక్సర్‌తో పాటు రెండు వరుస డబుల్స్ సాధించి మ్యాచ్‌ను ముగించాడు.అంతకుముందు లండన్ స్పిరిట్ 100 బంతుల్లో 159/9 స్కోరు చేసింది. డెవాల్డ్ బ్రెవిస్ 24 బంతుల్లో 39 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, కెప్టెన్ లియామ్ లివింగ్‌స్టోన్ 33 పరుగులు చేశాడు. క్రెయిగ్ ఓవర్టన్ బౌలింగ్‌లోనూ సత్తా చాటి రెండు వికెట్లు తీశాడు.బట్లర్ విధ్వంసంమరో మ్యాచ్‌లో ఇంగ్లండ్ స్టార్ జోస్ బట్లర్ మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగడంతో మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ ఘన విజయం సాధించింది. బర్మింగ్‌హామ్ ఫీనిక్స్‌పై 87 పరుగుల తేడాతో గెలిచి వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది.బట్లర్ 50 బంతుల్లో 90 పరుగులు చేసి జట్టుకు 187/5 భారీ స్కోరు అందించాడు. అతని ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. చివర్లో టామ్ మూర్స్ 17 బంతుల్లో అజేయంగా 39 పరుగులు జోడించాడు.188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బర్మింగ్‌హామ్ ఫీనిక్స్ కేవలం 100 పరుగులకే ఆలౌటైంది. లియామ్ డాసన్ 3/15తో రాణించగా, జోష్ టంగ్, సోనీ బేకర్, నూర్ అహ్మద్ తలో రెండు వికెట్లు పడగొట్టి ఫీనిక్స్ బ్యాటింగ్‌ను కుప్పకూల్చారు. కెప్టెన్ డొనోవన్ ఫెరెరా చేసిన 23 పరుగులే ఆ జట్టులో అత్యధిక స్కోరు. -
కసి మీదున్న సూర్యకుమార్.. 3 గంటల్లో వెయ్యి బంతులా!
టీమిండియా టీ20 స్పెషలిస్ట్, మాజీ కెప్టెన్ సూర్యకుమార్ కసిగా కనిపిస్తున్నాడు. పేలవ ఫామ్‌తో జట్టులో చోటు కోల్పోయిన సూర్యకుమార్ రీఎంట్రీ కోసం తెగ కష్టపడుతున్నాడు. ఈ క్రమంలో ఆదివారం ముంబైలోని వాసూ పరన్జేప్ క్రికెట్ అకాడమీలో సూర్యకుమార్ మూడు గంటల పాటు నెట్స్‌లో సాధన చేశాడు. దాదాపు 3 గంటల పాటు వెయ్యి బంతులు ఎదుర్కొన్న సూర్యకుమార్ వినూత్న షాట్లు ఆడి అలరించాడు. మళ్లీ టీమిండియాలో ఎప్పుడెప్పుడు అడుగుపెడదామా అన్నంతగా సూర్యలో కసి కనిపిస్తుంది. నెట్స్‌లో చెమటోడ్చిన వీడియోను ఎక్స్‌లో పంచుకున్న సూర్య.. ‘సండే ఫన్డే. క్విక్ రన్. 3 గంటల పాటు వెయ్యి బంతులు ఆడాను. మంచి ఫీల్ వచ్చింది’ అని క్యాప్షన్ జత చేశాడు. తాజాగా శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో టీమిండియా 3-0తో జింబాబ్వేను క్లీన్‌స్వీప్ చేసింది. ఇక 35 ఏళ్ల సూర్యకుమార్ టీమిండియా కెప్టెన్‌గా 2026 టీ20 ప్రపంచకప్‌ను అందుకున్నాడు. అయితే బ్యాటర్‌గా విఫలమవుతూ వచ్చిన సూర్యకుమార్ ఐపీఎల్‌లోనూ పేలవ ప్రదర్శన కనబరిచాడు. దీంతో టీ20 కెప్టెన్సీ పదవిని కోల్పోయిన సూర్యకుమార్‌కు జట్టులోనూ చోటు ప్రశ్నార్థకంగా మారింది. అయితే సూర్య టీమిండియాలో చోటు కోల్పోయిన తర్వాత మహారాజ ట్రోఫీలో తన బ్యాటింగ్‌తో అదరగొట్టాడు. అప్పటినుంచి టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వాలని ఉవ్విళ్లూరుతున్న సూర్యకుమార్ కఠోర సాధన కొనసాగిస్తున్నాడు. Sunday was fun. Quick run 🏃🏾 Batted around 1000 balls for 3 hours. Felt good 💪 pic.twitter.com/x6wH9Ebpmv— Surya Kumar Yadav (@surya_14kumar) July 26, 2026Read: మీరాబాయి స్వర్ణ పతకం వెనుక కన్నీటిగాథ! -
మీరాబాయి స్వర్ణం వెనుక దాగున్న కన్నీటిగాథ!
కామన్వెల్త్ గేమ్స్‌లో భారత మహిళా వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను 48 కేజీల విభాగంలో స్వర్ణంతో మెరిసి ఔరా అనిపించింది. 48 కేజీల కేటగిరీలో మీరాబాయి స్నాచ్‌లో 85 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్ కేటగ2ఇరీలో 105 కేజీలు.. మొత్తంగా 190 కేజీల బరువు ఎత్తి దేశానికి తొలి స్వర్ణంప పతకం అందించింది. మీరాబాయికి కామన్వెల్త్ గేమ్స్‌లో వరుసగా మూడో పతకం. 2018 గోల్డ్‌కోస్ట్, 2022 బర్మింగ్హమ్ క్రీడల్లోనూ మీరాబాయి పతకాలు సాధించింది. తాజాగా గ్లాస్కో వేదికపై వెయిట్‌లిఫ్టింగ్‌లో స్వర్ణం గెలిచిన మీరాబాయి ఫోడియంపై నిలబడ్డ సమయంలో జాతీయ గీతం ఆలపిస్తూ కన్నీటిపర్యంతమవ్వడం వైరల్‌గా మారింది. విజయం తర్వాత మీరాబాయి చాను మాట్లాడుతూ.. ‘వరుసగా మూడోసారి భారత్‌కు స్వర్ణ పతకాన్ని అందించినందుకు చాలా ఆనందంగా ఉంది. బరువును నియంత్రణలో ఉంచుకునేందుకు గత రెండు రోజులుగా ఆహారం ఏమీ తీసుకోలేదు. పసిడి పతకం గెలవడంతో నాపై ఉన్న ఒత్తిడి అంతా పోయింది. నేను చాలా సంతోషంగా, అలాగే చాలా ఉద్వేగంగా ఉన్నాను. కామన్వెల్త్ గేమ్స్‌లో ఇవాళ పతకం గెలవడం వెనుక ఎన్నో త్యాగాలు చేయడంతో పాటు, ఒత్తిడిని, గాయాలను అధిగమించాను. నేను కామన్వెల్త్ గేమ్స్‌లో రికార్డు నెలకొల్పుతానని అనుకోలేదు. కేవలం నా కోచ్ అప్పగించిన బాధ్యతను పూర్తి చేయడంపై మాత్రమే దృష్టి సారించాను. కష్టకాలంలో నా తల్లితో పాటు కోచ్ విజయ్ శర్మ అండగా నిలిచారు. కుటుంబం, స్నేహితుల నుంచి నాపై చాలా ఒత్తిడి ఉండేది. భారత్‌కు మూడో స్వర్ణం అందించినందుకు మాత్రం చాలా సంతోషంగా ఉంది. ఈ క్రీడల్లో నేను పెద్దగా శ్రమ పెట్టకూడదని అనుకున్నాను, కానీ నా మొదటి ప్రయత్నంలో విఫలమయ్యాను. నేను చెరో రెండు లిఫ్టులు చేస్తానని కోచ్, నేను భావించాము.’ అని మీరాబాయి వ్యాఖ్యానించింది. 2024 పారిస్ ఒలింపిక్స్‌లో రజతం, ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్ సాధించిన మీరాబాయి తాజాగా కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించడం ద్వారా కొత్త చరిత్ర లిఖించింది. INDIAN NATIONAL ANTHEM IN GLASGOW 🇮🇳- Mirabai Chanu got emotional after winning the Gold Medal for India in Weightlifting! 🏋️♀️🥺 pic.twitter.com/UfNeFHXg1a— The Khel India (@TheKhelIndia) July 26, 2026 मीराबाई चानू ने CWG 2026 में जीता गोल्ड मेडल CWG गेम्स में चानू की गोल्डन हैट्रिकMirabai Chanu #MirabaiChanu || #GoldMedal #BreakingNews #CWG #mirabaichanu pic.twitter.com/GDCUum3jqY— Ravi Pandey🇮🇳 (@ravipandey2643) July 26, 2026Read: పాక్ బాక్సర్‌ను చిత్తు చేసి పతకం రేసులో జాదుమణి -
పాక్ బాక్సర్‌ను చిత్తు చేసి పతకం రేసులో జాదుమణి
కామన్వెల్త్ గేమ్స్ 2026లో బాక్సింగ్ విభాగంలో భారత బాక్సర్ జాదుమణి పతకం ఆశలు రేపుతున్నాడు. క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టిన జాదుమణి పతకానికి అడుగుదూరంలో నిలిచాడు. పురుషుల బాక్సింగ్‌లో భారత బాక్సర్ జాదుమణి సింగ్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో జాదుమణి 5-0తో పాకిస్తాన్ బాక్సర్ సుమామా రెహమాన్‌ను మట్టికరిపించాడు. మ్యాచ్ గెలిచిన అనంతరం జాదుమణి ఈ విజయాన్ని కార్గిల్ వీరులకు అంకితమిస్తున్నట్లు తెలిపాడు. "నా విజయాన్ని కార్గిల్ వీరులకు అంకితం చేస్తున్నాను. పాకిస్థాన్‌పై గెలవడం చాలా గొప్పగా అనిపించింది. క్వార్టర్ ఫైనల్స్‌లో మరింత మెరుగ్గా రాణించి భారత్‌కు స్వర్ణం సాధించిపెడతాను''అని జాదుమణి పేర్కొన్నాడు. తొలి రౌండ్లో బై లభించిన జాదుమణి రెండో రౌండ్లో స్కాట్లాండ్కు చెందిన ఆరోన్ కల్లెన్పై 5-0తో అజేయ విజయాన్ని అందుకున్నాడు. ఇక ప్రిక్వార్టర్స్‌లో పాకిస్తానీ బాక్సర్‌పై విరుచుకుపడిన జాదుమణి 5-0తో ఏకగ్రీవ విజయాన్ని సాధించి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాడు. ఇక జాదుమణి మంగళవారం క్వార్టర్స్ ఫైట్‌లో తలపడనున్నాడు. క్వార్టర్ ఫైనల్లో గెలిచి సెమీస్‌లోకి ప్రవేశిస్తే అతనికి కనీసం కాంస్య పతకం ఖాయమవుతుంది. ఎందుకంటే కామన్వెల్త్ గేమ్స్ బాక్సింగ్‌లో సెమీఫైనల్లో ఓడిపోయిన ఇద్దరికీ కాంస్య పతకాలు లభిస్తాయి.ఇక మహిళల బాక్సింగ్ 54 కేజీల విభాగంలో భారత బాక్సర్ ప్రీతి క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రీతి పంచ్‌ల ధాటికి ఆమె ప్రత్యర్థి దెబోరా మావ్ (కెన్యా) రెండో రౌండ్లోనే చేతులెత్తేసింది. ఇక స్విమ్మింగ్‌లో భారత ఫ్రీస్టయిల్ రిలే జట్టు ఫైనల్‌కు చేరింది. 4X200 ఫ్రీస్టయిల్ రిలే హీట్‌లో దక్షణ్, అనీశ్ గౌడ, ఆర్యన్ నెహ్రా, శ్రీహరి నటరాజ్లతో కూడిన భారత జట్టు 7ని:39.48 సెకన్లలో లక్ష్యానికి చేరి మూడో స్థానంలో నిలిచి ఫైనల్లోకి ప్రవేశించింది. పురుషుల జిమ్నాస్టిక్స్ ఆల్ అరౌండ్ ఫైనల్లో భారత ప్లేయర్ తపన్ మొహంతి 70.100 పాయింట్లతో 15వ స్థానంలో నిలిచాడు. లాన్ బౌల్స్‌లో మహిళల పెయిర్ ఈవెంట్లో రూపా రాణి–పింకీ సింగ్ (భారత్) జోడీ, పురుషుల సింగిల్స్‌లో పుతుల్ సోనోవాల్ (భారత్) పరాజయాలు చవిచూసి ముందంజ వేయడంలో విఫలమయ్యారు. 🚨 INDIA’S JADUMANI SINGH THRASHED PAKISTANI BOXER 5-0 AT COMMONWEALTH GAMES 2026 🇮🇳🔥Jadumani Singh Mandengbam said - "I dedicate my win to the Kargil heroes. I felt great winning against Pakistan."Another day, Another humiliation for Pakistan 😅pic.twitter.com/1REqzhnEoe— Ajay Jadeja (@AjayJadeja171) July 27, 2026 -
'గంభీర్ వద్దు; లక్ష్మణ్ ముద్దు'.. బీసీసీఐకి ఆటగాళ్ల విజ్ఞప్తి!
భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ టీమిండియా హెడ్‌కోచ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆ పదవిలో ఉన్న గంభీర్ కోచ్‌గా వరుస వైఫల్యాలు చవిచూస్తున్న వేళ.. తాత్కాలిక కోచ్‌గా లక్ష్మణ్ అదరగొట్టడంతో కోచ్ మార్పు చేయాలని కొందరు టీమిండియా ఆటగాళ్లు బీసీసీఐ వద్ద వాపోయినట్లు సమాచారం. టీమిండియా హెడ్‌కోచ్‌గా గౌతమ్ గంభీర్‌ను తొలగించి, అతడి స్థానంలో మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్‌కు పూర్తి స్థాయి కోచ్ బాధ్యతలు అప్పగించాలని పేర్కొన్నట్లు తెలుస్తోంది. తాజాగా వరుస వైఫల్యాలతో జింబాబ్వే టూర్‌కు గంభీర్‌కు విశ్రాంతి ఇవ్వడంతో వీవీఎస్ లక్ష్మణ్‌ను తాత్కాలిక కోచ్‌గా జట్టుతో పంపించారు. గంభీర్ కోచ్‌గా ఉన్న సమయంలో ఐర్లాండ్, ఇంగ్లండ్ సిరీస్‌ల్లో వరుస ఓటములు చవిచూసిన కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ జింబాబ్వే గడ్డపై తొలి విజయాన్ని అందుకున్నాడు. అంతేకాదు లక్ష్మణ్ రాకతోనే శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా తొలి సిరీస్ విజయాన్ని అందుకున్నాడు. జింబాబ్వే చిన్న జట్టే అయినప్పటికీ, వారిపై సాధించిన ఏకపక్ష విజయాలు మాత్రం టీమిండియా దూకుడును చూపెట్టింది. దీంతో కెప్టెన్‌తో పాటు పలువురు ఆటగాళ్లు గంభీర్‌ను తొలగించి లక్ష్మణ్‌ను కోచ్‌గా ఎంపిక చేయాలని బీసీసీఐకి విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. ఒకవేళ బీసీసీఐ గంభీర్ స్థానంలో లక్ష్మణ్‌కు హెడ్‌కోచ్ పదవి కట్టబెడితే, దానిని స్వీకరించడానికి లక్ష్మణ్ సిద్ధంగా ఉన్నాడా లేడా అనేది తెలియాల్సి ఉంది.ఇక టీమిండియా తాత్కాలిక కోచ్‌గా లక్ష్మణ్ ట్రాక్ రికార్డు అద్భుతంగా ఉంది. అతడి కోచింగ్‌లో టీమిండియా 2022లో వరుసగా ఐర్లాండ్‌పై 2-0తో, జింబాబ్వేపై 3-0తో, న్యూజిలాండ్‌పై 1-0తో టీ20 సిరీస్‌లు గెలుచుకుంది. అయితే న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌ను కోల్పోయినప్పటికీ, మళ్లీ 2024లో జింబాబ్వేపై 4-1 తేడాతో, సౌతాఫ్రికాపై 3-1 తేడాతో టీ20 సిరీస్‌లు గెలుచుకుంది. తాజాగా జింబాబ్వేతో టీ20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన టీమిండియాకు వీవీఎస్ లక్ష్మణ్ లక్కీ కోచ్‌గా మారిపోయాడు. మరి టీమిండియా కోచ్ మార్పు తధ్యమేనా! 🚨 BREAKING NEWS 🚨🚨 INDIA PLAYERS REPORTEDLY WANT VVS LAXMAN AS PERMANENT HEAD COACH 🚨According to reports, several Indian team players have reportedly requested the BCCI to consider appointing VVS Laxman as the permanent head coach. The reports claim some players believe… pic.twitter.com/uiwSTwNi38— Muffatball vikrant (@Vikrant_1589) July 26, 2026చదవండి: ‘అసాధారణమే కానీ మెరుగుపడాలి’.. వైభవ్‌కు చురకలు! -
‘అసాధారణమే కానీ మెరుగుపడాలి’.. వైభవ్‌కు చురకలు!
జింబాబ్వేతో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను టీమిండియా 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. ఆదివారం జరిగిన మూడో టీ20లో భారత్ 35 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ 49 బంతుల్లో 81 పరుగుల మెరపు ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. సిరీస్‌లో రెండు అర్ధసెంచరీలు సాధించిన వైభవ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌తో పాటు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు కూడా ఎగరేసుకుపోయాడు. ఈ నేపథ్యంలోనే జింబాబ్వే టూర్‌కు గంభీర్ స్థానంలో కోచ్‌గా వ్యవహరించిన వీవీఎస్ లక్ష్మణ్ వైభవ్ సూర్యవంశీపై ప్రశంసలు కురిపించాడు. 15 ఏళ్ల వయసులోనే అద్భుతాలు చేస్తున్న వైభవ్‌కు ఎంతో భవిష్యత్తు ఉందని పేర్కొన్నాడు. చిన్న వయసులో అసాధారణ ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న వైభవ్ ఫిట్నెస్ విషయంలో మాత్రం మరింత కష్టపడాలని యాజమాన్యం కోరుకుంటుందని లక్ష్మణ్ పేర్కొన్నాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం లక్ష్మణ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడాడు. 'వైభవ్ గురించి మాకు బాగా తెలుసు. సుమారు రెండున్నరేళ్ల క్రితం, 2024 అండర్-19 ప్రపంచకప్‌నకు ముందే అతని ప్రతిభను గుర్తించాం. విజయవాడలో జరిగిన క్వాడ్రాంగులర్ సిరీస్‌లో ఇండియా-బి తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో వైభవ్ ఒకడిగా ఉన్నాడు. అప్పటి నుంచి బీసీసీఐ ఆధ్వర్యంలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ) క్యాంపుల్లో వైభవ్ నిరంతరం శిక్షణ పొందుతున్నాడు. అంతేకాదు అండర్-19 ప్రపంచకప్‌లోనూ వైభవ్ సూర్యవంశీ టాప్ స్కోరర్‌గానూ నిలిచాడు. వైభవ్‌లో వచ్చిన పరిణతి, అవగాహన అసాధారణంగా పెరిగాయి. అందుకే కఠిన పరిస్థితులను సైతం తట్టుకుని, ఒత్తిడిలో మేటి ఆటగాళ్లపై రాణించగలుగుతున్నాడు. అయితే, అతను మెరుగుపరుచుకోవాల్సిన ముఖ్యమైన అంశం అతని ఫిట్నెస్. అతని వయసు కేవలం 15 ఏళ్లేనని కూడా మనం గుర్తుంచుకోవాలి. ఆఖరి మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడినా, మైదానంలోనే ఉండాలని అతను కోరుకున్నాడు. కానీ, మా ఫిజియో సూచన మేరకు అతన్ని బయటకు పంపించాల్సి వచ్చింది. జట్టు కోసం ప్రతీ విషయంలోనూ ది బెస్ట్ అందించాలనే తపన అతనిలో ఉంది' అని లక్ష్మణ్ పేర్కొన్నాడు. ये #VaibhavSooryavanshi के बारे में बात कर रहे है।“वैभव हर कीर्तिमान पार करेगा”इनका नाम VVS Laxman हैं जिन्हें तब की Mighty आस्ट्रेलियाई खिलाड़ी और मीडिया "Very Very special "Laxman" बोला करती थी।जिसने 134 टेस्ट मैच खेला है और कभी टीम इंडिया के मशहूर fab-4 का हिस्सा थे।…— Uday Yadav (@USY_79) July 27, 2026 -
‘వెండి’ కెరటం.. మోచేయి విరిగినా పట్టువదలని విక్రమార్కుడు!
కామన్వెల్త్ గేమ్స్‌లో వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత్‌కు మూడో పతకం వచ్చిన సంగతి తెలిసిందే. ఆదివారం రాత్రి పురుషుల 65 కేజీల విభాగంలో జరిగిన ఫైనల్లో రాజా ముత్తుపాండి రజతం గెలుచుకున్నాడు. 26 ఏళ్ల రాజా ముత్తుపాండి స్నాచ్ విభాగంలో 126 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్ కేటగిరీలో 160 కేజీలు ఎత్తి మొత్తంగా 286 కేజీల బరువు ఎత్తి వెండిని కొల్లగొట్టాడు. పెద్దగా అంచనాలు లేకుండా బరిలోకి దిగి పతకం కొల్లగొట్టిన రాజా ముత్తుపాండి ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయాడు. మరి ఎవరీ రాజా ముత్తుపాండి? అతడి నేపథ్యం ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం.తొలి ప్రయత్నంలోనే స్వర్ణం..జనవరి 12, 2000న జన్మించిన రాజా ముత్తుపాండి, ఇండియన్ రైల్వేస్‌కు వెయిట్‌లిఫ్టర్‌గా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 2017లో కామన్వెల్త్ యూత్/జూనియర్ ఛాంపియన్‌షిప్‌లలో స్వర్ణ, రజత పతకాలతో రాజా ముత్తుపాండి తన ప్రస్థానాన్ని ప్రారంభించాడు. ఆ తర్వాత 2019, 2022లో జాతీయ టైటిళ్లను గెలుచుకున్న ముత్తుపాండి వెయిట్‌లిఫ్టింగ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించాడు. మోచేతికి తీవ్రగాయం..అయితే కెరీర్ పీక్ దశలో ఉన్నప్పుడే 2019లో రాజా ముత్తుపాండి మోచేతి గాయానికి గురయ్యాడు. మోచేతి లిగ్మెంట్‌లో చీలిక రావడంతో బరువులు ఎత్తొద్దని డాక్టర్లు చెప్పడంతో రాజా ముత్తుపాండి కెరీర్ ముగిసినట్లేనని అంతా భావించారు. కానీ రెండేళ్ల పాటు ఆటకు దూరంగా ఉన్న రాజా ముత్తుపాండి పట్టువదలని విక్రమార్కుడిలా మోచేతి గాయం నుంచి కోలుకొని తన ప్రస్థానాన్ని మళ్లీ మొదటి నుంచే మొదలుపెట్టాడు. ఈ క్రమంలో రాజా ముత్తుపాండి 2024లో రాజా 61 కేజీల విభాగంలో 289 కేజీల బరువు ఎత్తి జాతీయ రికార్డు బద్దలు కొట్టాడు. ఇక 2025లో అహ్మదాబాద్‌లో జరిగిన కామన్వెల్త్ ఛాంపియన్‌షిప్‌లో (296 కేజీల బరువు ఎత్తి) రజతం గెలుచుకున్నాడు. నార్వేలోని ఫోర్డేలో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లలో 65 కేజీల విభాగంలో తొమ్మిదవ స్థానంలో నిలిచిన రాజా ముత్తుపాండి 299 కేజీల (130 కేజీల స్నాచ్ + 169 కేజీల క్లీన్ అండ్ జర్క్) బరువు ఎత్తి వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శనను నమోదు చేశాడు. తద్వారా 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌కు భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించేందుకు రాజా ముత్తుపాండి ఉవ్విళ్లూరుతున్నాడు. ఇదే ఏడాది సీనియర్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో 302 కేజీల బరువు ఎత్తిన రాజా ముత్తుపాండి జాతీయ టైటిల్‌ను కూడా సొంతం చేసుకున్నాడు. Proud Moment for Indian Weightlifting!Many congratulations to Raja Muthupandi for clinching Silver in Men's 65kg Weightlifting. #Cheer4Bharat #CWG2026 pic.twitter.com/qjldVR9ja5— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) July 27, 2026CWG 2026: On winning the silver medal in the men's 65kg weightlifting event at the Commonwealth Games 2026, Muthupandi Raja says, "I did not perform well enough to win the gold, and it was not my best compared to how I had been performing in training. Still, I am happy to have… pic.twitter.com/OEuklfSq3h— IANS (@ians_india) July 26, 2026 -
CWG 2026: వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత్‌కు మరో పతకం
కామన్వెల్త్ గేమ్స్‌లో భారత వెయిట్ లిఫ్టర్లు అదరగొడుతున్నారు. ఈ విభాగం నుంచి ఇప్పటికే రెండు పతకాలు రాగా, తాజగా మూడో పతకం వచ్చి చేరింది. ఆదివారం రాత్రి పురుషుల 65 కేజీల విభాగంలో జరిగిన ఫైనల్లో రాజా ముత్తుపాండి రజతం గెలుచుకున్నాడు. 26 ఏళ్ల రాజా ముత్తుపాండి స్నాచ్ విభాగంలో 126 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్ కేటగిరీలో 160 కేజీలు ఎత్తి మొత్తంగా 286 కేజీల బరువు ఎత్తి వెండిని కొల్లగొట్టాడు. మలేషియాకు చెందిన అజ్నిల్ బిన్ బిదిన్ 299 కేజీల (133+166) బరువు ఎత్తి వరుసగా మూడో సారి స్వర్ణం గెలుచుకోవగా, పపువా న్యూ గినియాకు చెందిన మోరియా బారు 282 కేజీల (125+157 ) బరువు ఎత్తి కాంస్యం కైవసం చేసుకున్నాడు. వెయిట్‌లిఫ్టింగ్‌లో ఇప్పటికే మీరాబాయి చాను స్వర్ణం గెలుచుకోగా, 60 కేజీల విభాగంలో రిషికాంత్ సింగ్ రజతం సాధించాడు. ఓవరాల్‌గా స్వర్ణం, రెండు రజతం, ఒక కాంస్యంతో మొత్తం నాలుగు పతకాలు వచ్చి చేరాయి. Another lift. Another medal. 🥈 Raja Muthupandi muscles his way to Commonwealth Games silver in the Men's 65kg event. 🏋️♂️ Watch the Commonwealth Games 2026 TODAY, 2 PM onwards, LIVE & EXCLUSIVE on Sony Sports Network TV channels and Sony LIV#SonySportsNetwork #SonyLIV… pic.twitter.com/SUTs7cv1mH— Sony Sports Network (@SonySportsNetwk) July 26, 2026 #WATCH | Scotland | Glasgow Commonwealth Games 2026 | On winning the silver medal in men's 65kg weightlifting final, Indian weightlifter Raja Muthupandi says, "... I am certainly disappointed because my coach had placed his trust in me, believing we would put in the full effort… pic.twitter.com/hRcmht7xnc— ANI (@ANI) July 26, 2026 -
శ్రీజ, సత్యన్లపై భారీ అంచనాలు
న్యూఢిల్లీ: ఒకవైపు గ్లాస్గో వేదికగా కామన్వెల్త్ క్రీడలు కొనసాగుతుండగా... మరోవైపు భారత్ వేదికగా నేటి నుంచి 22వ కామన్వెల్త్ టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్‌షిప్ ప్రారంభం కానుంది. స్వదేశంలో జరగనున్న ఈ టోర్నమెంట్లో పలువురు భారత స్టార్లు బరిలోకి దిగనున్నారు. పురుషుల టీమ్ విభాగంలో సత్యన్ జ్ఞానశేఖరన్, హరీ్మత్ దేశాయ్, మానవ్ ఠక్కర్, మనుశ్ షా, పాయస్ జైన్‌లతో భారత జట్టు పటిష్టంగా కనిపిస్తోంది. వచ్చే నెల 2 వరకు కొనసాగనున్న ఈ చాంపియన్‌షిప్‌లో భారత ప్యాడ్లర్లకు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ ప్లేయర్ల నుంచి ప్రధాన పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. మహిళల విభాగంలో హైదరాబాద్ ప్లేయర్ ఆకుల శ్రీజపై భారీ అంచనాలు ఉన్నాయి. స్టార్ ప్లేయర్ మనికా బాత్రా ఈ టోర్నీకి ఎంపిక కాకపోగా... శ్రీజతో పాటు సుతీర్థ ముఖర్జీ, యశస్విని, సిండ్రెల్లా దాస్, స్వస్తిక ఘోష్ బరిలోకి దిగనున్నారు. మహిళల విభాగంలో టాప్ సీడ్ సింగపూర్, కెనడా, మలేసియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా జట్ల నుంచి భారత ప్యాడ్లర్లకు ప్రధాన పోటీ ఎదురుకానుంది. ఓవరాల్‌గా ఈ టోర్నీలో 23 పురుషుల, 18 మహిళల జట్లు పాల్గొననున్నాయి. టోర్నీ మొత్తం ప్రైజ్‌మనీ 1.10 లక్షల డాలర్లు (1.06 కోట్లు) కాగా... కామన్వెల్త్ టేబుల్ టెన్నిస్ సమాఖ్య ఆధ్వర్యంలో దశలవారీగా పోటీలు జరగనున్నాయి. -
సుందర్ సందేహమే!
న్యూఢిల్లీ: వచ్చే నెలలో శ్రీలంకలో పర్యటించనున్న భారత టెస్టు జట్టును మంగళవారం ఎంపిక చేయనున్నారు. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఇందుకు కసరత్తులు చేస్తోంది. అయితే స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయాలు సెలక్షన్ కమిటీని ఇబ్బంది పెడుతున్నాయి. గాయం కారణంగా ఇంగ్లండ్‌తో చివరి వన్డేకు దూరమైన బుమ్రా... సుదీర్ఘ ఫార్మాట్లో బరిలోకి దిగడంపై సందేహాలున్నాయి. అతడు పూర్తి ఫిట్నెస్ సాధించాడా లేదా అనేది తేలాల్సి ఉంది. మరోవైపు వాషింగ్టన్ సుందర్ కూడా తొలి టెస్టు వరకు కోలుకునే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఈ పర్యటనలో భాగంగా భారత జట్టు... శ్రీలంకతో రెండు టెస్టులు ఆడనుంది. ఆగస్టు 15 నుంచి 19 వరకు గాలెలో తొలి టెస్టు జరగనుండగా... 23 నుంచి 27 వరకు కొలంబోలో రెండో టెస్టు నిర్వహించనున్నారు. పేస్ ఆల్‌రౌండర్లు నితీశ్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా కండరాల గాయాలతో ఇబ్బంది పడుతుండగా... వీరిద్దరు లంక పర్యటనకు వరకు కోలుకునే అవకాశం లేదని బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ (సీఓఈ) వెల్లడించింది. ‘సుందర్ రెండో టెస్టు వరకు ఫిట్నెస్ సాధించే అవకాశం ఉంది. దీంతో సెలక్టర్లు అతడిని కేవలం ఒక్క టెస్టుకే పరిగణించవచ్చు. అది కూడా ఫిట్నెస్ సాధిస్తేనే. రవీంద్ర జడేజా, మానవ్ సుతార్, కుల్దీప్యాదవ్తో పాటు... నాలుగో స్పిన్నర్‌గా హర్‡్ష దూబేకు అవకాశం దక్కొచ్చు’ అని బీసీసీఐ అధికారి తెలిపారు. శ్రీలంక ‘ఎ’ జట్టుతో సిరీస్‌లో భారత్ ‘ఎ’ తరఫున ఆకట్టుకున్న ఆఫ్ స్పిన్నర్ సారాంశ్ జైన్‌ను కూడా పరిగణనలోకి తీసుకునే అవకాశం లేకపోలేదు. లోయర్ ఆర్డర్లో చక్కటి బ్యాటింగ్ చేయగల సామర్థ్యం సారాంశ్ సొంతం. జీషాన్ అన్సారీ, విప్రాజ్ నిగమ్‌ను కూడా పరిశీలించవచ్చు. బుమ్రా అందుబాటులో లేకుంటే... మొహమ్మద్ సిరాజ్, గుర్నూర్ బ్రార్, ప్రసిధ్ కృష్ణ పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు. ఇంగ్లండ్ పర్యటనలో ఆకట్టుకున్న ఆకాశ్‌దీప్ కోలుకునేందుకు మరింత సమయం పట్టనుంది. హార్దిక్ ఆగస్టు తర్వాతే... మరోవైపు స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా వచ్చే నెల తర్వాతే సెలక్టర్ల పరిధిలోకి వచ్చే అవకాశాలున్నాయి. ప్రస్తుతం బెంగళూరుకు మకాం మార్చిన పాండ్యా పూర్తి ఫిట్నెస్ సాధించేందుకు తీవ్ర కసరత్తులు చేస్తున్నాడు. ‘వన్డే, టి20 ఫార్మాట్లు ఆడేందుకు హార్దిక్ సిద్ధమవుతున్నాడు. ఈ నెలాఖరులోగా అతడు ఫిట్నెస్ సాధించే అవకాశం ఉంది. వచ్చే నెలలో అతడు సెలక్షన్‌కు అందుబాటులో ఉండనున్నాడు. ప్రస్తుతం బెంగళూరు సీఓఈలో అతడి సాధన సాగుతోంది. అటు ఫిట్నెస్ మెరుగు పరుచుకోవడానికి కృషి చేస్తూనే... పూర్తి స్థాయిలో బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు’ అని బీసీసీఐ అధికారి తెలిపారు. -
టర్కీ ఓపెన్ విజేత సాయి నచికేత్
సాక్షి, హైదరాబాద్: టర్కీష్ ఓపెన్ జూనియర్ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నీలో హైదరాబాద్ ప్లేయర్ భట్రాజు సాయి నచికేత్ మెరిశాడు. ఇస్తాంబుల్ లో ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో సాయి నచికేత్ పురుషుల అండర్–19 సింగిల్స్ విభాగంలో చాంపియన్‌గా అవతరించాడు. ఫైనల్లో నచికేత్ 39 నిమిషాల్లో 21–11, 23–21తో టాప్ సీడ్ మెహెమెత్ కాన్ టొరెమిస్ (టరీ్క)పై గెలుపొందాడు. సెమీఫైనల్లో నచికేత్ 27 నిమిషాల్లో 21–13, 21–19తో మూడో సీడ్ ఆమెర్ మొహమ్మద్ (సౌదీ అరేబియా)పై, క్వార్టర్ ఫైనల్లో 47 నిమిషాల్లో 21–18, 21–23, 21–9తో ఐదో సీడ్ అమీర్ అలీ అహ్మద్లూ (ఇరాన్)పై నెగ్గాడు. నాలుగో సీడ్‌గా బరిలోకి దిగిన నచికేత్‌కు తొలి రౌండ్లో ‘బై’ లభించింది. రెండో రౌండ్లో నచికేత్ 21–8, 21–9తో అహ్మెత్ అర్దా కాయా (టర్కీ)పై, మూడో రౌండ్లో 21–17, 21–13తో సలీహ్ మెర్ట్ కాలిమ్లి (టర్కీ)పై విజయం సాధించాడు. రెండు వారాల వ్యవధిలో సాయి నచికేత్కిది రెండో సింగిల్స్ టైటిల్ కావడం విశేషం. గతవారం అతను ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ జూనియర్ టోర్నీలోనూ చాంపియన్‌గా నిలిచాడు. ‘అర్జున అవార్డు’ గ్రహీత, అంతర్జాతీయ మాజీ షట్లర్ చేతన్ ఆనంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో నచికేత్ శిక్షణ తీసుకుంటున్నాడు. ‘వరుసగా రెండు అంతర్జాతీయ టోర్నీల్లో టైటిల్స్ సాధించడం అంత సులువు కాదు. నచిచేత్ విజయాలకు నేను గరి్వస్తున్నాను. అతనికిది ఆరంభం మాత్రమే. భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధిస్తాడు’ అని నచికేత్ కోచ్ చేతన్ ఆనంద్ అన్నాడు. -
ఆశాకిరణం అనాహత్
స్క్వాష్ అంటే ఈజిప్ట్... ఈజిప్ట్ అంటే స్క్వాష్... ఈ ‘రాకెట్ క్రీడ’లో ఈజిప్ట్ క్రీడాకారులు రాకెట్ వేగంతో అత్యున్నత శిఖరానికి చేరుకున్నారు. కారణాలు ఏమైతేనేం కొన్నేళ్లుగా అంతర్జాతీయ స్క్వాష్‌లో ఈజిప్ట్ ప్లేయర్లు సాధిస్తున్న విజయాలు అసాధారణం. ప్రపంచ చాంపియన్‌షిప్ మొదలుకొని... ప్రొఫెషనల్ టూర్లో... అంతర్జాతీయ టోర్నీల్లో ఈజిప్ట్ క్రీడాకారులే టైటిల్స్ సొంతం చేసుకుంటున్నారు. సీనియర్లు ఓడిపోతే జూనియర్లు... జూనియర్లు కాకపోతే ద్వితీయశ్రేణి ఆటగాళ్లు... కేటగిరీ మారినా... టోర్నీ స్థాయి మారినా... చివరకు టైటిల్స్ ఈజిప్ట్ ఖాతాలోకే వెళ్లడం సాధారణమైపోయింది. కెనడాలోని ఒంటారియోలో శనివారం ముగిసిన ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్‌లోనూ ఈజిప్ట్ క్రీడాకారులు టైటిల్స్ ఎగురేసుకుపోవడం ఖాయమనుకున్నారు. కానీ ఈజిప్ట్ జైత్రయాత్రకు భారత ‘నయా రాకెట్’ అనాహత్ సింగ్ అడ్డుకట్ట వేసింది. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఈజిప్ట్ క్రీడాకారిణులను ఓడించి మహిళల సింగిల్స్ విభాగంలో కొత్త జగజ్జేతగా అవతరించింది. అనాహత్ దెబ్బకు...గత 16 ఏళ్లుగా వరుసగా ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్ మహిళల సింగిల్స్ విభాగంలో టైటిల్ నెగ్గిన ఈజిప్ట్ క్రీడాకారిణులు ఈసారి రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకున్నారు. –సాక్షి క్రీడా విభాగం మరో రెండేళ్లలో జరిగే లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌లో స్క్వాష్ క్రీడ తొలిసారి మెడల్ ఈవెంట్‌గా అరంగేట్రం చేయనుంది. అంతా అనుకున్నట్లు జరిగితే భారత్ తొలి ప్రయత్నంలోనే స్క్వాష్‌లో పతకం సాధించే అవకాశం ఉంది. ఇంత నమ్మకం ఎందుకంటే... భారత రైజింగ్ సాŠట్ర్ అనాహత్ సింగ్ అసాధారణ ప్రదర్శన గమనించాక అంచనాలు అమాంతం పెరిగాయి. నాలుగేళ్లుగా అంతర్జాతీయ సర్క్యూట్లో నిలకడగా రాణిస్తున్న అనాహత్ తాజాగా ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్‌లో విజేతగా అవతరించింది. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ స్క్వాష్ ప్లేయర్‌గా కొత్త చరిత్ర సృష్టించింది. 2005లో జోష్నా చినప్ప ఫైనల్‌కు చేరినా... తుది పోరులో ఓడిపోయి రజత పతకంతో సరిపెట్టుకుంది. అనాహత్ మాత్రం ఫైనల్ చేరిన తొలి ప్రయత్నంలోనే జగజ్జేతగా నిలిచింది. గత ఏడాది ఇదే ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్‌లో సెమీఫైనల్లో ఓడిపోయి కాంస్య పతకంతో సంతృప్తి పడ్డ అనాహత్ ఈసారి మాత్రం అదరగొట్టింది. చాంపియన్‌గా నిలిచిన క్రమంలో ఆమె వరుసగా క్వార్టర్ ఫైనల్, సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్‌ల్లో ముగ్గురు ఈజిప్ట్ క్రీడాకారిణులను ఓడించడం విశేషం. ఈ ఏడాది తర్వాత 18 ఏళ్ల అనాహత్ జూనియర్ సర్క్యూట్లో పాల్గొనే అవకాశం లేదు. ప్రస్తుతం ప్రపంచ సీనియర్ మహిళల సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో అనాహత్ 20వ స్థానంలో ఉంది. వచ్చే రెండేళ్లలలో ఆమె ర్యాంక్ మరింత మెరుగయ్యే అవకాశముంది. లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌లో పురుషుల సింగిల్స్‌లో 16 మంది... మహిళల సింగిల్స్‌లో 16 మంది పోటీపడతారు. ఐదు బెర్త్‌లను రీజినల్ గేమ్స్ (ఆసియా, ఆఫ్రికా, పాన్ అమెరికా, యూరోపియన్, ఓసియానియా/కరీబియన్ ప్లే ఆఫ్స్) ద్వారా భర్తీ చేస్తారు. సెపె్టంబర్లో జపాన్ వేదికగా జరిగే ఆసియా క్రీడల్లో అనాహత్ సింగ్ స్వర్ణం సాధిస్తే నేరుగా లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తుంది. ఒలింపిక్స్‌లో ఒక దేశం నుంచి గరిష్టంగా ఇద్దరికి మాత్రమే పోటీపడే వీలుంది. ఈ నేపథ్యంలో ఈజిప్ట్ నుంచి ఇద్దరు మాత్రమే అర్హత సాధిస్తారు. ఫలితంగా అనాహత్ లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తే పతకం రేసులో కూడా నిలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. భారత స్టార్ షట్లర్ పీవీ సింధు స్ఫూర్తితో ఐదేళ్ల ప్రాయంలో బ్యాడ్మింటన్ రాకెట్ పట్టిన అనాహత్... ఆ తర్వాత తన సోదరి అమీరా ప్రేరణతో స్క్వాష్ వైపు మళ్లింది. 2019లో బ్రిటిష్ ఓపెన్‌లో అండర్–11 సింగిల్స్‌లో విజేతగా నిలిచి వెలుగులోకి వచి్చన అనాహత్ ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. తన ఆటకు పదును పెంచుకుంటూ పోయింది. ఢిల్లీకి చెందిన అనాహత్ మూడుసార్లు ఆసియా జూనియర్ చాంపియన్‌గా నిలిచింది. 2022 ఆసియా క్రీడల్లో మిక్స్డ్ డబుల్స్, టీమ్ ఈవెంట్లో కాంస్య పతకాలు గెలిచింది. 2025 ఆసియా సీనియర్ చాంపియన్‌షిప్‌లో మిక్స్డ్ డబుల్స్, మహిళల డబుల్స్ విభాగాల్లో బంగారు పతకాలు సాధించింది. ‘ఈ విజయం నాకు సర్వస్వం లాంటిది. అంతా కలలా అనిపిస్తోంది. ఈ టోర్నీ నాకు శాపంలా అనిపించింది. ఎందుకంటే గత నాలుగేళ్లుగా ఈ మెగా ఈవెంట్లో క్వార్టర్ ఫైనల్ లేదా సెమీఫైనల్ దాటి ముందుకెళ్లలేకపోయాను. అయితే ఈసారి అన్నీ అధిగమించి టైటిల్ అందుకున్నాను. ఈ గెలుపు ఇంకా ప్రత్యేకంగా మారింది. ఎందుకంటే జూనియర్ విభాగంలో నాకిదే చివరి సంవత్సరం. ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్ టైటిల్ గెలిచేందుకు నా ముందున్న చివరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నా. ఒత్తిడి పెంచుకుంటే నా ఆటతీరు దారుణంగా ఉంటుందని తెలుసు. అందుకే ఈసారి ఎలాంటి ఒత్తిడి పెట్టుకోకుండా ప్రతి పాయింట్‌ను ఆస్వాదించాలని బరిలోకి దిగాను. అనుకున్నది సాధించాను’– అనాహత్ సింగ్ -
"సవాళ్లకు మేం సిద్ధం".. శ్రేయస్ అయ్యర్ కీలక వ్యాఖ్యలు
ఆదివారం హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన నామమాత్రపు మూడో టీ20లోనూ భారత్ అదరగొట్టింది. ఈ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టును 35 పరుగుల తేడాతో టీమిండియా చిత్తు చేసింది. దీంతో మూడు టీ20ల సిరీస్‌ను 3-0 తేడాతో మెన్ బ్లూ క్లీన్ స్వీప్ చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ(81) హాఫ్ సెంచరీతో మెరిశాడు. అనంతరం బౌలింగ్‌లో మయాంక్ యాదవ్ మూడు వికెట్లతో సత్తాచాటాడు. ఈ అద్భుత విజయంపై మ్యాచ్ అనంతరం కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ స్పందించాడు. తమ ఆటగాళ్లపై అయ్యర్ ప్రశంసల వర్షం కురిపించాడు.'ఈ సిరీస్‌లో మా ఆటగాళ్లు ఫియర్లెస్ క్రికెట్ ఆడారు. మూడు మ్యాచ్‌లలోనూ మేము అన్ని విభాగాల్లో మెరుగైన ప్రదర్శన చేశాము. కెప్టెన్‌గా ఇది నాకు మొదటి సిరీస్ విజయం. అందుకే ఇది నాకు చాలా ప్రత్యేకమైనది మరోసారి చెబుతున్నాను.జట్టులోని చాలామంది ఆటగాళ్లకు ఐపీఎల్ ఆడిన అనుభవం ఉంది. వారు మైదానంలో స్వేచ్ఛగా ఆడేలా చూడటమే నా బాధ్యత. రాబోయే రోజుల్లో మాకు మరిన్ని కఠిన సవాళ్లు ఎదురుకానున్నాయి.అయితే జట్టు సభ్యులు ఇదే తరహా ధైర్యాన్ని, పట్టుదలను మైదానంలో చూపిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చు. ఫలితాల గురించి ఎక్కువగా ఆలోచించుకుండా సానుకూల దృక్పథంతో ముందుకు సాగడమే మా సిద్దాంతం అని పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో అయ్యర్ పేర్కొన్నాడు. -
Commonwealth Games: మీరాబాయి చానుకు గోల్డ్ మెడల్
గ్లాస్గోలో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్-2026లో భారత్ ఖాతాలో తొలి స్వర్ణ పతకం చేరింది. మహిళల 48 కేజీల వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో భారత వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను గోల్డ్‌మెడల్ కైవసం చేసుకుంది. కామన్వెల్త్ గేమ్స్‌లో మీరాబాయికి ఇది వరుసగా మూడో బంగారు పతకం కావడం విశేషం. ఇంతకుముందు 2018 గోల్డ్ కోస్ట్, 2022 బర్మింగ్‌హామ్‌లోనూ ఆమె స్వర్ణ పతకం కొల్లగొట్టింది. కామన్వెల్త్ గేమ్స్‌లో హ్యాట్రిక్ గోల్డ్ మెడల్స్ గెలిచిన తొలి భారత మహిళా వెయిట్‌లిఫ్టర్‌గా మీరా చరిత్ర సృష్టించింది.మీరాబాయి సరికొత్త రికార్డుమీరాబాయి స్నాచ్ విభాగంలో తన తొలి ప్రయత్నంలో 82 కేజీలు ఎత్తడంలో విఫలమైంది. కానీ రెండో సారి ఆ బరువును విజయవంతంగా లిఫ్ట్ చేసింది. ఆ తర్వాత తన మూడో ప్రయత్నంలో ఏకంగా 85 కేజీల భారాన్ని ఎత్తి అందరిని ఆశ్చర్యపరిచింది. అనంతరం క్లీన్ అండ్ జెర్క్ విభాగంలో కూడా తొలి ప్రయత్నంలో విఫలమైంది.రెండో ప్రయత్నంలో 105 కేజీల బరువును అత్యంత సునాయాసంగా ఎత్తి కామన్వెల్త్ గేమ్స్‌లో సరికొత్త రికార్డు సాధించింది. 31 ఏళ్ల మీరాబాయి చాను ఓవరాల్‌గా 190 కేజీల భారాన్ని బంగారు పతకాన్న కైవసం చేసుకుంది. కామన్వెల్త్ గేమ్స్‌లో అత్యధిక వెయిట్ లిఫ్ట్ చేసిన మహిళా లిప్టర్‌గా మీరా నిలిచింది.Mirabai Chanu sets a new Commonwealth record, snatching 85 kg / 187 lbs!#Mirabaichanu #commonwealthgames #weightliftingpic.twitter.com/dGykrz997s— Female In Sports (@femalesports_in) July 26, 2026 -
హరారేలో 'వైభవం'.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం
హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన మూడో టీ20లో 35 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. దీంతో మూడు టీ20ల సిరీస్‌ను 3-0 తేడాతో టీమిండియా క్లీన్ స్వీప్ చేసింది. ఈ నామమాత్రపు మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది.యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరో హాఫ్ సెంచరీతో సత్తాచాటాడు. 49 బంతులు ఎదుర్కొన్న సూర్యవంశీ.. 8 ఫోర్లు, 4 సిక్స్‌లతో 81 పరుగులు చేశాడు. అతడితో పాటు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(27), రింకూ సింగ్(25), ఇషాన్ కిషన్(29) రాణించారు. జింబాబ్వే బౌలర్లలో బ్రాడ్ ఎవాన్స్ రెండు, సికిందర్ రజా, ముజార్బానీ, మాధవీరే తలా వికెట్ పడగొట్టారు.బర్ల్ ఒంటరి పోరాటంఅనంతరం 193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 157 పరుగులు మాత్రమే చేయగల్గింది. జింబాబ్వే బ్యాటర్లలో ర్యాన్ బర్ల్(54 నాటౌట్) ఒంటరి పోరాటం చేశాడు. భారత బౌలర్లలో మయాంక్ యాదవ్ మూడు వికెట్లు పడగొట్టగా.. యశ్ ఠాకూర్ రెండు, అశోక్ శర్మ, రవి బిష్ణోయ్ తలా వికెట్ సాధించారు.చదవండి: IND vs ZIM: అభిషేక్ శర్మ చెత్త రికార్డు.. భారత టీ20 క్రికెట్ చరిత్రలోనే -
చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్‌గా
జింబాబ్వే పర్యటనలో టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. హరారే వేదికగా జరిగిన మూడో టీ20లో వైభవ్ హాఫ్ సెంచరీతో సత్తాచాటాడు. ఓ దశలో తొలి అంతర్జాతీయ సెంచరీ చేసేలా కనిపించిన సూర్యవంశీ.. భారీ షాట్‌కు ప్రయత్నించి 81 పరుగుల వద్ద ఔటయ్యాడు. అతడి ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 4 భారీ సిక్సర్లు ఉన్నాయి. ఈ సిరీస్‌లో అతడికి ఇది రెండో హాఫ్ సెంచరీ కావడం గమనార్హం. తద్వారా ఈ చిచ్చర పిడుగు ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో 16 ఏళ్ల వయస్సు నిండకముందే ఒకటి కంటే ఎక్కువ అర్ధశతకాలు నమోదు చేసిన తొలి ప్లేయర్‌గా వైభవ్ వరల్డ్ రికార్డు సృష్టించాడు.కాగా తొలి టీ20లో వైభవ్ కేవలం 19 బంతుల్లోనే 50 పరుగులు సాధించి, టీ20 క్రికెట్లో హాఫ్ సెంచరీ చేసిన అతి పిన్న వయష్కుడిగా నిలిచాడు. అదేవిధంగా ఓవరాల్‌గా టీ20 క్రికెట్లో ఈ ఏడాది ఇప్పటివరకు ఏకంగా 86 సిక్సర్లు బాదాడు. ప్రపంచంలో ఏ ఇతర ఆటగాడు కూడా ఈ ఏడాది ఇన్ని సిక్సర్లు కొట్టలేదు. ఒక క్యాలెండర్ ఇయర్లో భారత్ తరఫున అత్యధిక టీ20 సిక్సర్లు (108 సిక్సర్లు - 2025లో) కొట్టిన రికార్డు అభిషేక్ శర్మ పేరిట ఉంది. రాబోయే నెలల్లో వైభవ్ ఈ రికార్డును దాటేసే అవకాశముంది.That was Hugeeeeee by Vaibhav Sooryavanshi 💥🤯🤯😯 pic.twitter.com/Y8pxze9nyg— TheFakeFakeer (@TheFakeFakeer) July 26, 2026 -
అభిషేక్ శర్మ చెత్త రికార్డు.. భారత టీ20 క్రికెట్ చరిత్రలోనే
జింబాబ్వే పర్యటనలో టీమిండియా వరుస విజయాలతో దూసుకుపోతున్నప్పటికీ.. యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ఫామ్ మాత్రం జట్టు మేనెజ్మెంట్ను తీవ్ర కలవరపెడుతోంది. హరారే వేదికగా జరిగిన నామమాత్రపు మూడో టీ20లోనూ అభిషేక్ విఫలమయ్యాడు. కేవలం రెండు పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. మరోసారి జింబాబ్వే పేసర్ బ్లెస్సింగ్ ముజార్బానీ బౌలింగ్‌లో అభిషేక్ దొరికిపోయాడు. ఈ సిరీస్‌లోని ప్రతీ మ్యాచ్‌లోనూ అతడు సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యాడు. ఈ సిరీస్‌లోని 3 ఇన్నింగ్స్‌లలో కలిపి అభిషేక్ చేసింది కేవలం 11 పరుగులు మాత్రమే. దీంతో ఈ ఎస్ఆర్హెచ్ స్టార్ బ్యాటర్ ఓ చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో అతి తక్కువ పరుగులు చేసిన భారత (టాప్-7) బ్యాటర్‌గా అభిషేక్ శర్మ ఘోర రికార్డును మూటగట్టుకున్నాడు.ఇంతకుముందు ఈ చెత్త రికార్డు టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పేరిట ఉండేది. 2019లో వెస్టిండీస్‌పై మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో అయ్యర్ 14 పరుగులు చేశాడు. తాజా ఇన్నింగ్స్‌తో అయ్యర్‌ను అభిషేక్ దాటేశాడు.3-మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో అతి తక్కువ పరుగులు చేసిన భారత ఆటగాళ్లు:అభిషేక్ శర్మ – 11 పరుగులు (విత్ జింబాబ్వే, 2026)శ్రేయస్ అయ్యర్ – 14 పరుగులు (వెస్టిండీస్, 2019)హార్దిక్ పాండ్యా – 15 పరుగులు (న్యూజిలాండ్, 2017)కేఎల్ రాహుల్ – 15 పరుగులు (ఇంగ్లాండ్, 2021)దినేష్ కార్తీక్ – 17 పరుగులు (ఆస్ట్రేలియా, 2022)చదవండి: 'వరల్డ్‌కప్ గెలవాలంటే అతడిని జట్టులోకి తీసుకోండి' -
అదరగొట్టిన వైభవ్ సూర్యవంశీ.. సెంచరీ చేస్తాడనుకుంటే?
జింబాబ్వే గడ్డపై టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అదరగొట్టాడు. హరారే వేదికగా జరుగుతున్న నామమాత్రపు మూడో టీ20లో సూర్యవంశీ హాఫ్ సెంచరీతో మెరిశాడు. తన శైలికి విరుద్దంగా బ్యాటింగ్ చేసిన వైభవ్.. 31 బంతుల్లో తన రెండో హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.అర్ధశతకం పూర్తి చేసుకున్న తర్వాత వైభవ్ తన బ్యాటింగ్‌లో దూకుడు పెంచాడు. దీంతో అతడు తొలి అంతర్జాతీయ సెంచరీ సాధిస్తాడని భావించారు. కానీ స్పిన్నర్ మాధవిరే బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి ఔటయ్యాడు.దీంతో అతడి ఇన్నింగ్స్‌కు తెరపడింది. మొత్తంగా 49 బంతులు ఎదుర్కొన్న సూర్యవంశీ.. 8 ఫోర్లు, 4 సిక్స్‌లతో 81 పరుగులు చేశాడు. కాగా తొలి టీ20లో వైభవ్ మెరుపు హాఫ్ సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. -
కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు మరో పతకం
గ్లాస్కో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్-2026లో భారత్ ఖాతాలో రెండో పతకం చేరింది. పురుషల వెయిట్‌లిఫ్టింగ్ 60 కేజీల విభాగంలో భారత వెయిట్‌లిఫ్టర్ చనంబమ్ రిషికాంత్ సింగ్ రజత పతకం సాధించాడు. ఈ ఈవెంట్లో రిషికాంతకు ప్రధాన పోటీదారుడిగా నిలిచిన మలేషియా అథ్లెట్ అనిక్ కస్దాన్కు గోల్డ్‌మెడల్ దక్కింది.కాగా తొలుత స్నాచ్ విభాగంలో రిషికాంత, అనిక్ కస్దాన్లు ఇద్దరూ అత్యధికంగా 121 కేజీల బరువును ఎత్తి ఇద్దరూ అగ్రస్ధానంలో నిలిచారు. క్లీన్ అండ్ జెర్క్‌లో మాత్రం కస్దాన్ అద్భుత ప్రదర్శన చేశాడు. రిషికాంత తన అత్యుత్తమ ప్రయత్నంలో 143 కేజీలు మాత్రమే ఎత్తగా, కస్దాన్ 152 కేజీల బరువును ఎత్తి అందరిని ఆశ్చర్యపరిచాడు. కస్దాన్ మొత్తం 273 కేజీల (121kg+152kg) బరువు ఎత్తి అగ్రస్ధానంలో నిలవగా.. రిషికాంత మొత్తం 264 కేజీల (121kg+143kg) రెండో స్ధానంలో నిలిచాడు. కెన్యాకు చెందిన జోషువా అముంగా మబోయా 260 కేజీల మొత్తం స్కోరుతో కాంస్య పతకం సొంతం చేసుకున్నాడు. -
మూడో టీ20లో జింబాబ్వే చిత్తు.. సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన భారత్
India vs Zimbabwe 3rd T20 live updates and highlights: హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన మూడో టీ20లో 35 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. దీంతో మూడు టీ20ల సిరీస్‌ను 3-0 తేడాతో టీమిండియా క్లీన్ స్వీప్ చేసింది. 193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 157 పరుగులు మాత్రమే చేయగల్గింది. జింబాబ్వే బ్యాటర్లలో ర్యాన్ బర్ల్(54 నాటౌట్) ఒంటరి పోరాటం చేశాడు. భారత బౌలర్లలో మయాంక్ యాదవ్ మూడు వికెట్లు పడగొట్టగా.. యశ్ ఠాకూర్ రెండు, అశోక్ శర్మ, రవి బిష్ణోయ్ తలా వికెట్ సాధించారు. అంతకముందు బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ(81) మరో హాఫ్ సెంచరీతో సత్తాచాటాడు. జింబాబ్వే ఆరో వికెట్ డౌన్‌జింబాబ్వే ఆరో వికెట్ కోల్పోయింది. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసిన మరుమణి.. అశోక్ శర్మ బౌలింగ్‌లో ఔటయ్యాడు.జింబాబ్వే ఐదో వికెట్ డౌన్‌జింబాబ్వే ఐదో వికెట్ కోల్పోయింది. 28 పరుగులు చేసిన మాధవీరే.. మయాంక్ యాదవ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.స్పీడ్ పెంచిన జింబాబ్వే బ్యాటర్లు15 ఓవర్లు ముగిసే సరికి జింబాబ్వే 4 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. క్రీజులో మాధవీరే(28), ర్యాన్ బర్ల్(40) ఉన్నారు. ఆతిథ్య జట్టు విజయానికి 30 బంతుల్లో 71 పరుగులు కావాలి.జింబాబ్వే నాలుగో వికెట్ డౌన్‌జింబాబ్వే నాలుగో వికెట్ కోల్పోయింది. 20 పరుగులు చేసిన బెన్ కుర్రాన్.. బిష్ణోయ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 10 ఓవర్లకు జింబాబ్వే స్కోర్: 77/4జింబాబ్వే మూడో వికెట్ డౌన్యశ్ ఠాకూర్ వేసిన నాలుగో ఓవర్లో జింబాబ్వే వరుస బంతుల్లో రెండు వికెట్లు కోల్పోయింది. డియాన్ మైర్స్(19), సికిందర్(0) వెంటవెంటనే ఔటయ్యారు. 5 ఓవర్లకు జింబాబ్వే స్కోర్: 40/3జింబాబ్వే తొలి వికెట్ డౌన్193 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వేకు భారీ షాక్ తగిలింది. ఇన్నింగ్స్ తొలి బంతికే మయాంక్ యాదవ్ బౌలింగ్‌లో బెన్నెట్ ఔటయ్యాడుజింబాబ్వే టార్గెట్ ఎంతంటే?హరారే వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న నామమాత్రపు మూడో టీ20లో భారత బ్యాటర్లు దుమ్ములేపారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ మరో హాఫ్ సెంచరీతో సత్తాచాటాడు. 49 బంతులు ఎదుర్కొన్న సూర్యవంశీ.. 8 ఫోర్లు, 4 సిక్స్‌లతో 81 పరుగులు చేశాడు. అతడితో పాటు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(27), రింకూ సింగ్(25), ఇషాన్ కిషన్(29) రాణించారు. జింబాబ్వే బౌలర్లలో బ్రాడ్ ఎవాన్స్ రెండు, సికిందర్ రజా, ముజార్బానీ, మాధవీరే తలా వికెట్ పడగొట్టారు.భారత్ నాలుగో వికెట్ డౌన్భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. 27 పరుగులు చేసిన శ్రేయస్ అయ్యర్.. బ్రాడ్ ఎవాన్స్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 18 ఓవర్లకు భారత్ స్కోర్: 172/4వైభవ్ అవుట్వైభవ్ సూర్యవంశీ రూపంలో భారత్ మూడో వికెట్ కోల్పోయింది. 49 బంతులు ఎదుర్కొన్న సూర్యవంశీ.. 8 ఫోర్లు, 4 సిక్స్‌లతో 81 పరుగులు చేశాడు.ఇషాన్ కిషన్ అవుట్ఇషాన్ కిషన్ రూపంలో టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. 29 పరుగులు చేసిన కిషన్.. రజా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు.వైభవ్ ఫిప్టీవైభవ్ సూర్యవంశీ అర్ధ శతకాన్ని పూర్తి చేశాడు. వైభవ్ 31 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. 10 ఓవర్లు ముగిసే సరికి భారత్ 95 పరుగలు చేసింది. క్రీజులో వైభవ్‌తో పాటు ఇషాన్ కిషన్(29) ఉన్నాడు.దూకుడుగా ఆడుతున్న వైభవ్భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ(18 బంతుల్లో 31) దూకుడుగా ఆడుతున్నాడు. 6 ఓవర్లకు టీమిండియా స్కోర్: 60/1అభిషేక్ అవుట్జింబాబ్వే పర్యటనలో అభిషేక్ శర్మ పేలవ ఫామ్ కొనసాగుతోంది. హరారే వేదికగా జరుగుతున్న మూడో టీ20లో 2 పరుగులు చేసి ఔటయ్యాడు.హరారే వేదికగా నామమాత్రపు మూడో టీ20లో భారత్-జింబాబ్వే జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ చివరి టీ20లో భారత్ మూడు మార్పులతో బరిలోకి దిగింది.ప్రిన్స్ యాదవ్, శివమ్ దూబేల స్ధానంలో అశోక్ శర్మ, సూర్యన్ష్ షెడ్గేలు తుది జట్టులోకి వచ్చారు. జింబాబ్వే కూడా ఓ మార్పు చేసింది. రిచర్డ్ నగరావా స్ధానంలో వెల్లింగ్టన్ మసకద్జాకు అవకాశమిచ్చారు.తుది జట్లుజింబాబ్వే: బ్రియాన్ బెన్నెట్, బెన్ కర్రాన్, డియోన్ మైయర్స్, సికందర్ రజా(కెప్టెన్), ర్యాన్ బర్ల్, వెస్లీ మాధేవెరే, తడివానాషే మారుమణి(వికెట్ కీపర్), బ్రాడ్ ఎవాన్స్, న్యూమాన్ న్యామ్హురి, వెల్లింగ్టన్ మసకద్జా, బ్లెస్సింగ్ ముజరబానీభారత్: వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), తిలక్ వర్మ, రింకూ సింగ్, సూర్యాంశ్ షెడ్గే, రవి బిష్ణోయ్, యశ్ ఠాకూర్, మయాంక్ యాదవ్, అశోక్ శర్మ -
'వరల్డ్‌కప్ గెలవాలంటే అతడిని జట్టులోకి తీసుకోండి'
దక్షిణాఫ్రికా, జింబాబ్వే వేదికలగా జరగనున్న వన్డే ప్రపంచకప్-2026 కోసం టీమిండియా తమ సన్నహకాలను ప్రారంభించింది. ఈ మెగా టోర్నీ కోసం పటిష్టమైన జట్టును సిద్దం చేయాలని బీసీసీఐ భావిస్తోంది. ఈ నేపథ్యంలో భారత దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సెలక్టర్లకు కీలక సూచనలు చేశాడు.వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్‌ను వరల్డ్‌కప్‌కు ఎంపిక చేయాలని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. భువనేశ్వర్ గత నాలుగేళ్లగా జాతీయ జట్టుకు దూరంగా ఉన్నాడు. ఈ రైట్ ఆర్మ్ పేసర్ ప్రస్తుతం ఐపీఎల్‌తో పాటు దేశవాళీ టీ20 క్రికెట్ లీగ్స్‌లో మాత్రమే ఆడుతున్నాడు. అయితే భువీలో ఏ మాత్రం జోరు తగ్గలేదు.ఫిట్‌గా ఉండి తన స్వింగ్ బౌలింగ్‌తో ప్రత్యర్ధులను ముప్పుతిప్పలు పెడుతున్నాడు. వరుసగా రెండు ఐపీఎల్ సీజన్లలోనూ ఆర్సీబీ తరపున అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. దీంతో అతడిని తిరిగి జట్టులోకి తీసుకోవాలని చాలా మంది మాజీలు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే అశ్విన్ కూడా భువీ తిరిగి పునరాగమనం చేస్తే చూడాలని ఉందని అన్నాడు."భువనేశ్వర్ కుమార్ రీఎంట్రీ గురుంచి సెలక్షన్ కమిటీ ఆలోచించాలి. ప్రస్తుతం భారత జట్టు ఫాస్ట్ బౌలింగ్ విభాగం అంత పటిష్టంగా లేదు. కాబట్టి జట్టుకు భువీ అవసరముందని అనిపిస్తోంది. అయితే మహ్మద్ షమీని జట్టులోకి తీసుకోవాలని కొంతమంది సలహా ఇస్తున్నారు.కానీ షమీకి, భువీకి ఒక తేడా ఉంది. భువనేశ్వర్ వరుసగా రెండు సీజన్ల పాటు ఐపీఎల్ ఆడినప్పటికి పూర్తిగా ఫిట్‌గా ఉన్నాడు. కానీ షమీ మాత్రం ఫిట్నెస్ పరంగా కాస్త ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. అంతేకాకుండా భువనేశ్వర్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఆర్సీబీ వరుసగా రెండు టైటిల్స్ గెలవడంలో అతడు కీలక పాత్ర పోషించాడు. అయితే వెంటనే అతడిని జట్టులోకి తీసుకోమని నేను చెప్పడం లేదు. కానీ ఓ అవకాశమిచ్చి ఇచ్చి చూడండి. అక్కడ రాణించగలిగితే అతడిని జట్టులో కొనసాగించండి. అతడు పవర్‌ప్లేతో పాటు డెత్ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేయగలడు. లోయార్డర్‌లో బ్యాట్‌తో రాణించే సత్తా కూడా భువీకి ఉంది" అని అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు. -
టీమిండియాలోకి కొత్తగా ఎనిమిది మంది
భారత క్రికెట్ జట్టు 2026లో యువ ప్రతిభను ప్రోత్సహించే దిశగా అన్ని ఫార్మాట్లలో కొత్త ఆటగాళ్లకు అవకాశం కల్పించింది. టెస్టుల్లో మానవ్ సుతార్ అరంగేట్రం చేయగా, వన్డేల్లో హర్ష్ దుబే, గుర్నూర్ బ్రార్, ప్రిన్స్ యాదవ్ భారత జెర్సీ ధరించారు. టీ20ల్లో ప్రిన్స్ యాదవ్, సూర్యాంశ్ షెడ్గే, వైభవ్ సూర్యవంశీ, అశోక్ శర్మ, యశ్ ఠాకూర్ అంతర్జాతీయ క్రికెట్లో తొలి అడుగు వేశారు. కొత్త ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వడం ద్వారా రాబోయే ఐసీసీ టోర్నీలు, 2028 ఒలింపిక్స్ వంటి ప్రధాన ఈవెంట్ల కోసం బలమైన బెంచ్ స్ట్రెంగ్త్‌ను సిద్ధం చేయాలని భారత జట్టు యాజమాన్యం భావిస్తోంది.2026లో భారత్ తరఫున అరంగేట్రం చేసిన ఆటగాళ్లు:టెస్టులు: * మానవ్ సుతార్ – ఆఫ్ఘనిస్తాన్‌తో, ముల్లాన్పూర్వన్డేలు:* హర్ష్ దుబే – ఆఫ్ఘనిస్తాన్‌తో, ధర్మశాల* గుర్నూర్ బ్రార్ – ఆఫ్ఘనిస్తాన్‌తో, ధర్మశాల* ప్రిన్స్ యాదవ్ – ఆఫ్ఘనిస్తాన్‌తో, లక్నోటీ20లు:* ప్రిన్స్ యాదవ్ – ఐర్లాండ్‌తో, బెల్ఫాస్ట్* సూర్యాంశ్ షెడ్గే – ఐర్లాండ్‌తో, బెల్ఫాస్ట్* వైభవ్ సూర్యవంశీ – ఇంగ్లండ్‌తో, మాంచెస్టర్* అశోక్ శర్మ – జింబాబ్వేతో, హరారే* యశ్ ఠాకూర్ – జింబాబ్వేతో, హరారేఈ ఏడాది అరంగేట్రం చేసిన ఈ ఎనిమిది మందిలో వైభవ్ సూర్యవంశీపై అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అందుకు తగ్గట్టుగా అతను సత్తా చాటకపోయినా, ఓ మోస్తరు ప్రదర్శనతో పర్వాలేదనిపించాడు. తాజాగా జింబాబ్వేతో జరిగిన తొలి టీ20లో అతను 18 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. బౌలర్ల విషయానికొస్తే..ప్రిన్స్ యాదవ్ (6 టీ20ల్లో 9 వికెట్లు), గుర్నూర్ బ్రార్ (6 మ్యాచ్‌ల్లో 11 వికెట్లు) సత్తా చాటారు. వచ్చే ఏడాది వన్డే వరల్డ్‌కప్ దృష్ట్యా ఈ ఏడాది మరికొంత మంది ఆటగాళ్లు అరంగేట్రం చేసే అవకాశం ఉంది. -
IND vs SL: టీమిండియాకు భారీ షాక్!
ఆగస్టు 15 నుంచి శ్రీలంకతో మొదలయ్యే 2 టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌కు ముందు టీమిండియాకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా లంక పర్యటనకు దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్‌తో జరిగిన రెండో వన్డే సందర్భంగా బుమ్రా మెకాలి గాయానికి గురయ్యాడు.దీంతో లార్డ్స్ వేదికగా జరిగిన చివరి వన్డేకు జస్ప్రీత్ దూరమయ్యాడు. అయితే బుమ్రా ఇంకా తన గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదని ప్రముఖ స్పోర్ట్స్ రిపోర్టర్ అభిషేక్ త్రిపాఠి వెల్లడించాడు. బీసీసీఐ మెడికల్ టీమ్ అతడికి జూలై 30 వరకు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని సూచించిందంట. ఆ తర్వాత బుమ్రా బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE) కు చేరుకుని రికవరీ ప్రక్రియను పూర్తి చేయనున్నాడు. అక్కడ వైద్యుల నుంచి గ్రీన్ సిగ్నల్ లభించిన తర్వాతే అతడి ఎంపికపై సెలక్టర్లు నిర్ణయం తీసుకోనున్నారు. ఏదేమైనప్పటికి బుమ్రా పూర్తిగా కోలుకోవడానికి దాదాపు మూడు నుంచి నాలుగు వారాల సమయం పట్టనుంది. ఈ క్రమంలోనే లంకతో టెస్టు సిరీస్‌కు బుమ్రా దూరమయ్యే అవకాశముంది. ఒకవేళ ఇదే నిజమైతే భారత్‌కు భారీ షాక్ అనే చెప్పాలి.ఎందుకంటే లంకతో టెస్ట్ సిరీస్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025-27 సైకిల్లో జరిగింది. ఈ సిరీస్ టీమిండియాకు చాలా కీలకం. డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో ఉండాలంటే భారత్ కచ్చితంగా గెలవాల్సిందే. ఇక ఈ సిరీస్‌కు బుమ్రాతో పాటు నితీష్ కుమార్ రెడ్డి కూడా దూరం కానున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. మరోవైపు ఇంగ్లండ్ పర్యటనలో గాయపడ్డ వాషింగ్టన్ సుందర్ వేగంగా కోలుకుంటున్నట్లు తెలుస్తోంది. అతడు తొలి టెస్ట్‌కు కాకపోయిన రెండో టెస్టులోనైన ఆడే అవకాశముంది. -
నితీశ్ కుమార్ రెడ్డికి సంబంధించి బిగ్ న్యూస్..!
టీమిండియా పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డికి సంబంధించి ఓ బిగ్ న్యూస్ అందుతుంది. త్వరలో శ్రీలంకతో జరిగే రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు అతను దూరమయ్యే అవకాశమున్నట్లు నివేదికలు వెల్లడించాయి.నితీశ్ ప్రస్తుతం ఎడమ క్వాడ్రిసెప్స్ (తొడ కండరాల) గాయం నుంచి కోలుకుంటున్నాడు. పునరావాసంలో మంచి పురోగతి సాధిస్తున్నప్పటికీ, దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్ట్యా బీసీసీఐ అతడిని టెస్టు క్రికెట్లో తొందరగా బరిలోకి దించకూడదని భావిస్తున్నట్లు సమాచారం.ఇటీవల ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన తొలి వన్డే సందర్భంగా బౌలింగ్ చేస్తూ నితీశ్ అసౌకర్యానికి గురయ్యాడు. దీంతో రెండో వన్డేకు విశ్రాంతి ఇచ్చిన జట్టు యాజమాన్యం, మూడో వన్డేలో మళ్లీ ఆడించగా గాయం మరింత తీవ్రతరమైంది.క్రిక్‌బజ్ కథనం ప్రకారం, నితీశ్ ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో పునరావాసం పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో శ్రీలంక టెస్టు సిరీస్‌కు అతడిని ఎంపిక చేసే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని నివేదిక పేర్కొంది.అయితే, నితీశ్ కుమార్ రెడ్డి గైర్హాజరుపై బీసీసీఐ నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రస్తుతం ఇది మీడియా కథనాల ఆధారంగా వచ్చిన సమాచారం మాత్రమే.కాగా, రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం భారత జట్టు శ్రీలంకలో పర్యటింనుంది. తొలి టెస్ట్ గాలే వేదికగా ఆగస్ట్ 15 నుంచి ప్రారంభం కానుండగా.. రెండో టెస్ట్ ఆగస్ట్ 23 నుంచి కొలొంబో వేదికగా జరుగనుంది. ఈ సిరీస్ కోసం భారత జట్టును త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. -
సిక్సర్లతో షెపర్డ్ విధ్వంసం.. గయానాకు భారీ విజయం!
వెస్టిండీస్ హార్డ్ హిట్టర్ రొమారియో షెపర్డ్ గ్లోబల్ టీ20 లీగ్‌లో విధ్వంసం సృష్టించాడు. ఆరు సిక్సర్లతో షెపర్డ్ (21 బంతుల్లో 52 నాటౌట్) గయానా అమెజాన్ వారియర్స్‌ను ఒంటిచేత్తో విజయాన్ని అందించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన డెసర్ట్ వైపర్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. రిలీ రోసౌ (48 బంతుల్లో 61) అర్ధసెంచరీ సాధించగా, కైల్ మేయర్స్ (18 బంతుల్లో 35), బెవన్ జాకబ్స్ (30) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. చివర్లో వృత్యా అరవింద్ (11 బంతుల్లో 28 నాటౌట్) ధాటిగా ఆడడంతో డెసర్ట్ వైపర్స్ 200 పరుగుల మార్క్‌ను దాటింది. అనంతరం గయానా అమెజాన్ వారియర్స్ 19.3 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 206 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. మొహమ్మద్ నబీ (29 బంతుల్లో 40 నాటౌట్) యాంకర్ రోల్ పోషించాడు. ఓపెనర్లు రహమనుల్లా గుర్బాజ్ (15 బంతుల్లో 31), క్వింటిన్ సాంప్సన్ (17 బంతుల్లో 35) తొలి వికెట్‌కు 55 పరుగులు జోడించారు. మధ్యలో వికెట్లు కోల్పోయిన గయానా ఇబ్బందుల్లో పడింది. ఈ దశలో నబీకి జత కలిసిన షెపర్డ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. బౌండరీలు, సిక్సర్ల వర్షంతో స్టేడియాన్ని హోరెత్తించాడు. 21 బంతుల్లో ఫిఫ్టీ మార్క్ అందుకున్న షెపర్డ్ చివర్లో ఔటైనా డ్వేన్ ప్రిటోరియస్ (9 బంతుల్లో 17 నాటౌట్)తో కలిసి నబీ జట్టును విజయతీరాలకు చేర్చాడు. డెసర్ట్ వైపర్స్ బౌలర్లలో షాదాబ్ ఖాన్ మూడు వికెట్లు తీయగా, కారీ పియర్రే, విటెల్ లాస్ చెరో 2 వికెట్లు తీశారు.Runs - 52.Fours - 2.Sixes - 6.Strike rate - 247.61ROMARIO SHEPHERD SMASHED FIFTY OF JUST 21 BALLS.🥶🙇♂️#GSL | #Cricket pic.twitter.com/0bg3vaT4tZ— Rana Ahmad. (@AhmadRana056) July 26, 2026Read: కామన్వెల్త్ గేమ్స్‌లో అపశ్రుతి.. జిమ్నాస్టిక్స్‌లో భయానక దృశ్యం! -
IPL 2027: హార్దిక్ కోసం సీఎస్కే భారీ ఆఫర్..?
ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ట్రేడ్ చర్చలు జోరుగా సాగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో హార్దిక్‌ను తమ జట్టులోకి తీసుకురావడానికి చెన్నై సూపర్ కింగ్స్ (CSK) భారీ ప్రతిపాదన చేసినట్లు జాతీయ మీడియా కథనం వెల్లడించింది.ఆ కథనం ప్రకారం.. హార్దిక్‌కు బదులుగా ముంబై ఇండియన్స్ యువ బ్యాటర్ ఆయుష్ మాత్రేతో పాటు నగదు ఇవ్వాలని సీఎస్కేను కోరినట్లు సమాచారం. అయితే మాత్రేను విడిచిపెట్టేందుకు సీఎస్కే ఆసక్తి చూపకపోవడంతో ప్రత్యామ్నాయ ప్రతిపాదనను ముందుంచినట్లు తెలుస్తోంది.ఇందులో భాగంగా శివమ్ దూబే, డెవాల్డ్ బ్రెవిస్, అలాగే రూ.10 కోట్ల నగదు ఇవ్వడానికి సీఎస్కే సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఒప్పందం కుదిరితే హార్దిక్ పాండ్యా ట్రేడ్ విలువ మొత్తం రూ.20 కోట్లకు పైగా ఉండే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది.అయితే ఇప్పటివరకు ఈ ట్రేడ్‌పై ముంబై ఇండియన్స్ లేదా చెన్నై సూపర్ కింగ్స్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రస్తుతం ఈ సమాచారం కేవలం మీడియా కథనాలు, ఊహాగానాలకే పరిమితమైంది.ఒకవేళ ఈ చర్చలు విఫలమైతే కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) కూడా హార్దిక్ పాండ్యా కోసం రంగంలోకి దిగే అవకాశముందని నివేదిక పేర్కొంది.కాగా, హార్దిక్ పాండ్యా గత రెండు సీజన్ల ముందే గుజరాత్ టైటాన్స్ నుంచి ముంబై ఇండియన్స్‌లోకి రీఎంట్రీ ఇచ్చాడు. హార్దిక్ ముంబై ఇండియన్స్ పగ్గాలు చేపట్టాక, ఆ జట్టు దారుణంగా విఫలమయ్యింది. అప్పటివరకు గుజరాత్‌ను విజయపథాన నడిపించిన హార్దిక్ ముంబై ఇండియన్స్‌కు రాగానే ప్రభావహీనుడిగా మారిపోయాడు. అంతకుముందు ముంబై ఇండియన్స్ తరఫున సాధారణ ఆటగాడిగా చెలరేగిన హర్దిక్ కెప్టెన్‌గా చాలా నిరాశపరిచాడు. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ యాజమాన్యం హార్దిక్ ప్రదర్శనపై ఆసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అతడి ట్రేడ్ డీల్ జరుగుతున్న సమాచారం. -
పాక్‌తో తొలి టెస్ట్.. హాడ్జ్ అజేయ అర్ధశతకం
టరౌబాలోని బ్రియాన్ లారా క్రికెట్ అకాడమీ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న తొలి టెస్టులో వెస్టిండీస్ ఓ మోస్తరు ప్రదర్శన చేసింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. తేజ్‌నరైన్ చంద్రపాల్ (21), బ్రాండన్ కింగ్ (12), ఆమిర్ జాంగూ (21) ఔట్ కాగా.. కవెమ్ హాడ్జ్ (83) అజేయ అర్ద శతకంతో బ్యాటింగ్ కొనసాగిస్తున్నాడు. అతడికి జతగా షాయ్ హోప్ (39) క్రీజ్‌లో ఉన్నాడు. పాక్ బౌలర్లలో మొహమ్మద్ అబ్బాస్ 2, ఆమిర్ జమాల్ ఓ వికెట్ తీశారు.వర్షం కారణంగా ఆటకు అంతరాయం కలగడంతో తొలి రోజు కేవలం 67 ఓవర్లు మాత్రమే సాధ్యమయ్యాయి. హాడ్జ్ అజేయ అర్ధశతకంతో జట్టును బలమైన స్థితిలో నిలిపాడు.ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. పాక్ పేసర్లు మొహమ్మద్ అబ్బాస్, ఖుర్రం షెహ్జాద్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. 13 పరుగుల వద్ద బ్రాండన్ కింగ్ వికెట్‌ను అబ్బాస్ పడగొట్టాడు.అనంతరం వర్షం కారణంగా దాదాపు రెండు గంటల ఆట నిలిచిపోయింది. ఆట పునఃప్రారంభమైన తర్వాత హాడ్జ్ ఓపికగా ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. ఈ దశలో తేజ్‌నరైన్ చందర్‌పాల్‌ను ఆమిర్ జమాల్ ఔట్ చేశాడు. కొద్ది సేపటికి ఆమిర్ జాంగూను అబ్బాస్ పెవిలియన్‌కు పంపాడు.అనంతరం షాయ్ హోప్‌తో కలిసి హాడ్జ్ నాలుగో వికెట్‌కు అజేయంగా 88 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. రెండో రోజు కూడా వర్షం ప్రభావం ఉండే అవకాశం ఉండటంతో వెస్టిండీస్ ఏ విధమైన బ్యాటింగ్ వ్యూహాన్ని అనుసరిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.కాగా, రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం పాక్ జట్టు వెస్టిండీస్‌లో పర్యటిస్తుంది. రెండో టెస్ట్ పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా ఆగస్ట్ 2 నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌కు ముందు పాక్ వెస్టిండీస్ సెలెక్ట్ ఎలెవెన్‌తో ఓ నాలుగు రోజుల వార్మప్ మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్ పాక్‌కు మంచి బ్యాటింగ్ ప్రాక్టీస్ ఇచ్చింది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో పాక్ బ్యాటర్లు అజాన్ అవైస్, బాబర్ ఆజం సెంచరీలు చేశారు. -
కామన్వెల్త్ గేమ్స్‌లో అపశ్రుతి.. జిమ్నాస్టిక్స్‌లో భయానక దృశ్యం!
కామన్వెల్త్ గేమ్స్‌లో అపశ్రుతి చోటుచేసుకుంది. జిమ్నాస్టిక్స్ ఫైనల్ ఈవెంట్ సందర్భంగా ఇంగ్లండ్ జిమ్నాస్ట్ గాబ్రియెల్ లాంగ్టన్ హారిజంటల్ బార్‌పై పట్టు కోల్పోయి తలకిందులుగా మ్యాట్‌పైకి జారిపడ్డాడు. దీంతో అతడి మెడకు, తలకు తీవ్ర గాయాలయ్యాయి. సపోర్ట్ స్టాఫ్ వచ్చి లాంగ్టన్కు అత్యవసర చికిత్స అందించారు. Photo Credit: CWG 2026 Twitterఆ తర్వాత లాంగ్టన్ లేవడానికి ఇబ్బంది పడడంతో స్ట్రెచర్‌పై ఆసుపత్రికి తరలించారు. లాంగ్టన్ కిందపడడంతో కాసేపు భయానక వాతావరణం నెలకొనడంతో పోటీలు నిలిపివేశారు. ఇప్పటికే గాయంతో ఆరుసార్లు ఒలింపిక్ విజేత మాక్స్ విట్లాక్ దూరమవ్వడంతో అతడి స్థానంలో లాంగ్టన్కు అవకాశమిచ్చారు.వరుసగా నాలుగో కామన్వెల్త్ గేమ్స్ పురుషుల టీం టైటిల్ కోసం ఇంగ్లండ్ ప్రయత్నిస్తున్న సమయంలో చివరి రౌండ్లో లాంగ్టన్ గాయపడడం ఇంగ్లండ్‌ను దెబ్బతీసింది. ఆ తర్వాత లాంగ్టన్ లేకుండానే పోటీలు పూర్తి చేసిన ఇంగ్లండ్ రెండో స్థానంలో నిలిచి వెండి పతకం గెలుచుకోగా, కెనడా, ఆస్ట్రేలియా జట్లు స్వర్ణ, కాంస్య పతకాలు కైవసం చేసుకున్నాయి. Photo Credit: CWG 2026 Twitterఇక గాబ్రియెల్ లాంగ్టన్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని ఇంగ్లండ్ టీమ్ ప్రకటించింది. అతడి పరిస్థితి మెరుగ్గానే ఉందని, కోలుకోవడానికి కాస్త సమయం పడుతుందని తెలిపింది. లాంగ్టన్ గాయాలతో పోటీకి దూరమైనప్పటికీ, తన జట్టు సిల్వర్ మెడల్ సాధించడంతో సభ్యులతో కలిసి సెలబ్రేట్ చేసుకోవాలని ఆశిస్తున్నట్లు ఇంగ్లం్ టీమ్ వెల్లడించింది. 🚨NEWS: English gymnast Gabriel Langton has been rushed to hospital after suffering a major fall during the Commonwealth Games pic.twitter.com/bXsMusO5fF— Basil the Great (@BasilTheGreat) July 25, 2026చదవండి: ఆటలోనే కాదు ఆ విషయంలోనూ మెస్సీ కింగే! -
ఆటలోనే కాదు ఆ విషయంలోనూ మెస్సీ కింగే!
అర్జెంటీనా సూపర్‌స్టార్ లియోనల్ మెస్సీ అరుదైన ఫీట్ సాధించాడు. మైదానంలో తన ఆటతో కోట్లలో అభిమానులను సొంతం చేసుకున్న మెస్సీ తాజాగా తన జెర్సీ విషయంలోనూ కింగ్ అని నిరూపించుకున్నాడు. 2026 ఫిఫా ప్రపంచకప్ సమయంలో మెస్సీ 10వ నంబర్ జెర్సీలు అత్యధికంగా అమ్ముడయ్యాయని ఫిఫా అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇక ఫిఫా 2026లో మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా రన్నరప్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఫైనల్లో స్పెయిన్ 1-0 తేడాతో అర్జెంటీనాపై గెలిచి 16 ఏళ్ల తర్వాత రెండోసారి ఫిఫా ప్రపంచకప్‌ను అందుకుంది. ఫిఫా ప్రపంచకప్‌లో మెస్సీ అన్నీ తానై అర్జెంటీనాను నడిపించాడు. 8 మ్యాచ్‌లాడిన మెస్సీ 8 గోల్స్‌తో పాటు నాలుగు అసిస్ట్‌లు చేసి టోర్నీలో అత్యధిక గోల్స్ కొట్టిన రెండో ఆటగాడిగా నిలిచి సిల్వర్ బూట్ కైవసం చేసుకున్నాడు. అంతేకాదు ఏడు వరుస ఫిఫా ప్రపంచకప్పుల్లో గోల్ కొట్టిన తొలి ఆటగాడిగాను మెస్సీ రికార్డులకెక్కాడు. 2022లో అర్జెంటీనాను చాంపియన్‌గా నిలిపిన మెస్సీ ఈసారి కూడా అదే రిపీట్ చేయాలని భావించాడు. కానీ ఫైనల్లో స్పెయిన్ చేతిలో చతికిలపడిన అర్జెంటీనా రన్నరప్‌కే పరిమితమైంది. 39 ఏళ్ల మెస్సీ మరో ఫిఫా ప్రపంచకప్ (2030) ఆడేది అనుమానమే. 🚨 FIFA has officially announced that Lionel Messi's jersey was the best-selling jersey of the 2026 FIFA World Cup! 👕🐐🇦🇷 pic.twitter.com/nnLVWtVK7L— FC Barcelona Fans Nation (@fcbfn_live) July 25, 2026Read: హార్దిక్ పాండ్యా విషయంలో బీసీసీఐ మాస్టర్‌ప్లాన్! -
విరాట్ రికార్డు బద్దలు కొట్టిన ఇషాన్
జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో భారత వికెట్‌కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ ఓ అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో 44 బంతుల్లో 81 పరుగులు (9 ఫోర్లు, 2 సిక్సర్లు) చేసిన అతను.. ఓ క్యాలెండర్ ఇయర్లో అత్యధిక అంతర్జాతీయ టీ20 పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లిని అధిగమించాడు. తాజా ఇన్నింగ్స్‌తో ఈ ఏడాది ఇషాన్ టీ20 పరుగుల సంఖ్య 783 పరుగులకు చేరగా.. 2022లో విరాట్ 781 పరుగులు చేశాడు. ఈ జాబితాలో పాక్ ఆటగాడు మహ్మద్ రిజ్వాన్ (2021లో 1326 పరుగులు) టాప్ ప్లేస్‌లో ఉన్నాడు. భారత్ తరఫున మాజీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (2022లో 1164 పరుగులు) అగ్రస్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్న ఇషాన్ ఈ ఏడాది స్కై రికార్డును కూడా బద్దలు కొట్టే అవకాశం ఉంది. మరో 381 పరుగులు చేస్తే స్కై రికార్డు.. మరో 543 పరుగులు చేస్తే మహ్మద్ రిజ్వాన్‌ను కూడా అధిగమించి ప్రపంచ రికార్డు నెలకొల్పవచ్చు.భారత్‌కు ఈ ఏడాది ఇంకా వెస్టిండీస్, న్యూజిలాండ్, శ్రీలంకలతో టీ20 సిరీస్‌లు ఉండటంతో పాటు ఆసియా క్రీడల్లో కూడా ఆడే అవకాశం ఉంది. దీంతో ఇషాన్ కిషన్‌కు ఈ రికార్డులను బద్దలు కొట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయి.ఓ క్యాలెండర్ ఇయర్లో అత్యధిక టీ20 అంతర్జాతీయ పరుగులు చేసిన ఆటగాళ్లు:* 1326 – మహ్మద్ రిజ్వాన్ (2021)* 1164 – సూర్యకుమార్ యాదవ్ (2022)* 996 – మహ్మద్ రిజ్వాన్ (2022)* 939 – బాబర్ ఆజమ్ (2021)* 936 – బ్రియాన్ బెన్నెట్ (2025)* 859 – అభిషేక్ శర్మ (2025)* 783 – ఇషాన్ కిషన్ (2026)* 781 – విరాట్ కోహ్లీ (2022)మ్యాచ్ విషయానికొస్తే.. ఇషాన్ రికార్డు ఇన్నింగ్స్ కారణంగా తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ భారీ స్కోరు (219-5) సాధించింది. అనంతరం అభిషేక్ మూడు, యశ్ ఠాకూర్, ప్రిన్స్ యాదవ్ చెరో రెండు వికెట్లు తీయడంతో జింబాబ్వే 129 పరుగులకే ఆలౌటై, 90 పరుగుల భారీ తేడాతో పరాజయంపాలైంది. ఫలితంగా భారత్ మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్ టీమిండియానే గెలిచింది. నామమాత్రపు మూడో టీ20 ఇవాళే (జులై 26) జరుగనుంది. భారత టీ20 జట్టు కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌కు ఇది తొలి సిరీస్ విజయం. -
హార్దిక్ పాండ్యా విషయంలో బీసీసీఐ మాస్టర్‌ప్లాన్!
టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా విషయంలో బీసీసీఐ మాస్టర్ ప్లాన్ వేసింది. 2027 వన్డే వరల్డ్‌కప్ వరకు పాండ్యా పూర్తి ఫిట్నెస్ సాధించాలనే ఉద్దేశంతో అప్పటివరకు జరగనున్న ద్వైపాక్షిక సిరీస్‌లకు అతడిని ఎంపిక చేయబోమని బీసీసీఐ పేర్కొనడం ఆసక్తి కలిగించింది. ఐపీఎల్ 2026 సీజన్ చివర్లో గాయం బారిన పడ్డ పాండ్యా కోలుకొని ఫిట్నెస్ సాధించిన పాండ్యాను మొదట అఫ్గానిస్తాన్‌తో వన్డే సిరీస్‌కు ఎంపిక చేశారు. కానీ ఇదే సమయంలో పాండ్యాకు తొడ కండరాల్లో గాయం తిరగబెట్టడంతో ఆఫ్గన్‌తో పాటు ఇంగ్లండ్ సిరీస్‌కు కూడా దూరమయ్యాడు. ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ శిబిరంలోనే చికిత్స తీసుకుంటున్న పాండ్యా పూర్తిగా కోలుకునే పనిలో ఉన్నాడు. రేవ్ స్పోర్ట్స్ నివేదిక ప్రకారం.. ప్రస్తుతం పాండ్యా తన ఫిట్‌నెస్‌పైనే పూర్తి దృష్టి సారించాడని తెలుస్తోంది. అందుకే పూర్తిగా కోలుకున్నా ఇప్పుడే టీమిండియాలోకి రాకూడదనే ఉద్దేశంతో పాండ్యా 'పర్ఫార్మెన్స్ బ్లాక్' పేరిట దీర్ఘకాలిక ఫిట్నెస్ టార్గెట్ చేసుకొని దానిని అనుసరిస్తున్నట్లు సమాచారం. 32 ఏళ్ల వయసున్న పాండ్యా ఇప్పటికే తన ప్రోగ్రామ్‌లో గరిష్ట ఫిట్నెస్ను సాధించేందుకు దగ్గర్లో ఉన్నాడని, అత్యుత్తమ ప్రదర్శనను కనబరచడానికి తీవ్రంగా కృషి చేస్తున్నట్లు సమాచారం. బీసీసీఐ కూడా పాండ్యాను 2027 వన్డే వరల్డ్‌కప్ వరకు జాగ్రత్తగా కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఆచితూచి వ్యవహరిస్తునట్లు తెలుస్తోంది. అందుకే వన్డే ప్రపంచకప్‌లోపు జరిగే ద్వైపాక్షిక సిరీస్‌ల్లో పాండ్యాను ఎక్కువగా ఆడించే అవకాశం లేదనిపిస్తోంది. ఒకవేళ సెలెక్ట్ చేసినా అది 50 ఓవర్ల ఫార్మాట్ మాత్రమే అతడికి ప్రాధాన్యమివ్వనున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే 2027 వన్డే ప్రపంచకప్‌లో ఆల్‌రౌండర్‌గా పాండ్యా కీలకం కానున్నాడని బీసీసీఐ బలంగా నమ్ముతోంది. అందుకే ప్రపంచకప్ సమీపిస్తుందనగా, అప్పుడు జరిగే వన్డే సిరీస్‌లకు పాండ్యాను ఎంపిక చేయాలని చూస్తోంది. ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్ దారుణ ప్రదర్శనతో హార్దిక్ పాండ్యాను ఆ ఫ్రాంచైజీ విడుదల చేయనుంది. దీంతో ట్రేడింగ్‌లో పాండ్యా కేకేఆర్ లేదా చెన్నై జట్లకు వెళ్లే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి.Read: ‘వైభవ్ నా తమ్ముడు.. నేనిచ్చే సలహా అదొక్కటే’ -
చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ
భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో ఓ అరుదైన రికార్డు సాధించాడు. బ్యాట్‌తో మరోసారి నిరాశపరిచినప్పటికీ, బంతితో అద్భుత ప్రదర్శన (3-17) చేసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ ప్రదర్శనతో అతను అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన భారత ఓపెనింగ్ బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. మూడు ఫార్మాట్లలో భారత ఓపెనర్ల అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు:* టెస్టులు: వినూ మాంకడ్ – 8/52 (పాకిస్థాన్‌పై, 1952)* వన్డేలు: రవి శాస్త్రి – 5/15 (ఆస్ట్రేలియాపై, 1991)* టీ20లు: అభిషేక్ శర్మ – 3/17 (జింబాబ్వేపై, 2026)అభిషేక్‌కు తోడుగా యశ్ ఠాకూర్, ప్రిన్స్ యాదవ్ చెరో రెండు వికెట్లు తీయడంతో జింబాబ్వే 220 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కేవలం 129 పరుగులకే ఆలౌటై, 90 పరుగుల భారీ తేడాతో పరాజయంపాలైంది. ఫలితంగా భారత్ మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్ టీమిండియానే గెలిచింది. నామమాత్రపు మూడో టీ20 ఇవాళే (జులై 26) జరుగనుంది. భారత టీ20 జట్టు కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌కు ఇది తొలి సిరీస్ విజయం.బ్యాట్‌తో తడబడుతున్న అభిషేక్అభిషేక్ ఈ మ్యాచ్‌లో బంతితో రాణించినా, గత కొన్ని ఇన్నింగ్స్‌లుగా బ్యాట్‌తో తడబడుతున్నాడు. చివరిగా ఇంగ్లండ్‌తో తొలి టీ20లో అర్ద సెంచరీ చేసిన అతడు.. ఆతర్వాత వరుసగా 43, 10, 16, 3, 1 పరుగుకు ఔటయ్యాడు.నిన్నటి రెండో టీ20లో ఓ మోస్తరు స్టార్ట్ లభించినప్పటికీ సద్వినియోగం చేసుకోలేక వికెట్ పారేసుకున్నాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతడు 8 బంతుల్లో 2 ఫోర్ల సాయంతో 8 పరుగులు చేసి బ్లెస్సింగ్ ముజరబానీ బౌలింగ్‌లో ర్యాన్ బర్ల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. -
రోహిత్ శర్మ రికార్డును సమం చేసిన సికందర్ రజా
జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా ఓ అవాంఛిత విషయంలో టీమిండియా డాషింగ్ బ్యాటర్ రోహిత్, పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం రికార్డును సమం చేశాడు. నిన్న (జులై 25) భారత్‌తో జరిగిన రెండో టీ20లో డకౌట్ కావడంతో టీ20 అంతర్జాతీయ క్రికెట్లో కెప్టెన్‌గా అత్యధిక డక్స్ నమోదు చేసిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్, బాబర్ సరసన చేరాడు.కెప్టెన్‌గా రజాకు ఇది ఆరో డక్. రోహిత్, బాబర్ కూడా కెప్టెన్లుగా ఇన్నే డక్స్ నమోదు చేశారు. దీంతో వీరు ముగ్గురు అత్యధిక డక్స్ నమోదు చేసిన ఐసీసీ ఫుల్‌టైమ్ సభ్య దేశాల కెప్టెన్ల జాబితాలో సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచారు. ఈ జాబితాలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ ఎనిమిది డక్స్‌తో అగ్రస్థానంలో ఉన్నాడు.టీ20ల్లో కెప్టెన్‌గా అత్యధిక డక్స్ (పూర్తి సభ్య దేశాలు):* 8 – ఆరోన్ ఫించ్ (ఆస్ట్రేలియా)* 6 – రోహిత్ శర్మ (భారత్)* 6 – బాబర్ ఆజం (పాకిస్థాన్)* 6 – సికందర్ రజా (జింబాబ్వే)అంతేకాకుండా, ఈ డక్‌తో రజా టీ20ల్లో జింబాబ్వే తరఫున 10 డక్స్ నమోదు చేసి, ఆ జట్టు తరఫున అత్యధిక డక్స్ సాధించిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానానికి చేరాడు. రెజిస్ చకాబ్వా 11 డక్స్‌తో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.భారత్‌తో రెండో టీ20 విషయానికొస్తే.. జింబాబ్వేపై భారత్ 90 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి, మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. దీనికి ముందు తొలి టీ20లోనూ టీమిండియా విజయం సాధించింది. భారత టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌కు ఇది తొలి సిరీస్ విజయం. మిగిలిన నామమాత్రపు మూడో టీ20 ఇవాళ (జులై 26) అదే వేదికగా జరుగనుంది. -
‘వైభవ్ నా తమ్ముడు.. నేనిచ్చే సలహా అదొక్కటే’
జింబాబ్వే పర్యటనలో తొలి టీ20లో మెరుపు అర్ధసెంచరీతో ఆకట్టుకున్న వైభవ్ సూర్యవంశీ రెండో టీ20లో మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. 9 బంతుల్లో 20 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే పాకెట్ డైనమైట్ ఇషాన్ కిషన్ (44 బంతుల్లో 81), తిలక్ వర్మ (29 బంతుల్లో 60 నాటౌట్) సంచలన ఇన్నింగ్స్‌లతో టీమిండియా రెండో టీ20లో 90 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఇక మ్యాచ్ ముగిసిన అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఇషాన్ కిషన్ వైభవ్ సూర్యవంశీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా మేనేజ్మెంట్తో పాటు సీనియర్ ప్లేయర్లు వైభవ్‌కు ఎలాంటి సలహాలు ఇస్తుందని ఇషాన్ కిషన్‌ను అడిగారు. దీనిపై ఇషాన్ స్పందిస్తూ.. సోషల్ మీడియా, ఇతర విషయాలను పట్టించుకోకుండా కేవలం తన ఆటపై దృష్టి పెట్టాలని మాత్రమే వైభవ్‌కు ఒక అన్నలా సలహా ఇస్తుంటానని పేర్కొన్నాడు. వైభవ్‌కు ఎంతో భవిష్యత్తు ఉన్న కారణంగా అతడిని కాపాడుకునేందుకు భారత జట్టు ఒక స్పష్టమైన వ్యూహాన్ని, ప్రణాళికలను రచించిందని ఇషాన్ కిషన్ తెలిపాడు.ఇషాన్ మాట్లాడుతూ.. ‘వైభవ్ నిజానికి చాలా తెలివైనవాడు. తాను ఏం చేస్తున్నాడో, ఎలా బ్యాటింగ్ చేయాలో, మైదానం బయట ఎలా ప్రవర్తించాలో, మైదానంలో ఎలా ఉండాలో అతనికి బాగా తెలుసు. అదే సమయంలో, అతను వచ్చిన నేపథ్యం వల్ల కావొచ్చు కొంత పరధ్యానం ఉండొచ్చు. మన స్నేహితుల వల్ల కూడా కొంత డిస్టర్బెన్స్ ఉండొచ్చు. నేను కూడా అదే నేపథ్యం నుంచి వచ్చాను కాబట్టి నాకు తెలుసు. క్రికెట్ ఆడుతూ దేశానికి ప్రాతినిధ్యం వహించేటప్పుడు దేనిపై దృష్టి పెట్టాలన్న దానిపై క్లియర్‌గా ఉన్నాను. నేను మాత్రమే కాదు, వైభవ్‌తో పాటు అభిషేక్, అక్షర్ భాయ్, ఇంకా అతనితో మాట్లాడే చాలా మంది ఆటగాళ్లు ఇదే దృష్టితో వ్యవహరిస్తారు. ప్రస్తుతం వైభవ్ సోషల్ మీడియాలో ఏం జరుగుతోందన్నది, బయటి గోల ఏంటనేది, పరుగులు చేయడంలో విఫలమైనప్పుడు తనపై వచ్చే విమర్శలను పక్కనబెట్టి కేవలం క్రికెట్ గురించే ఆలోచించేలా చూసుకుంటాము. వైభవ్‌ది చిన్న వయసు కాబట్టి తప్పుడు కారణల వల్ల పరధ్యానంలోకి వెళ్లకూడదని కోరుకుంటాం. సహచరులుగా మేమంతా వైభవ్‌ను ఒక తమ్ముడిలానే చూసుకుంటాం. వైభవ్ గనుక క్రీజులో నిలదొక్కుకుంటే పవర్ ప్లేలోనే 80-90 పరుగులు రాబట్టగలడు, అతనొక్కడే ఒంటిచేత్తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేయగలడు’ అని ఇషాన్ చెప్పుకొచ్చాడు. 🚨 ISHAN KISHAN ON VAIBHAV SOORYAVANSHI 🇮🇳"We're all trying to guide Vaibhav like an elder brother so he avoids the mistakes we made early in our careers. Axar, Abhishek and the whole group are doing their best to help him."#IshanKishan #VaibhavSooryavanshi #TeamIndia…— KUMAR (@MyCric101) July 25, 2026Read: హండ్రెడ్‌లో జేమిమా విధ్వంసం.. ఒంటిచేత్తో జట్టుకు విజయం -
హండ్రెడ్‌లో జేమిమా విధ్వంసం.. ఒంటిచేత్తో జట్టుకు విజయం
హండ్రెడ్ వుమెన్స్ కాంపిటీషన్లో భారత బ్యాటర్లు అదరగొడుతున్నారు. తాజాగా సదరన్ బ్రేవ్ జట్టు ప్లేయర్ జేమిమా రోడ్రిగ్స్ అజేయ ఇన్నింగ్స్ ఆడి ఒంటిచేత్తో జట్టును గెలిపించింది. విషయంలోకి వెళితే శనివారం డబుల్ హెడర్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ లీడ్స్, సదరన్ బ్రేవ్స్ తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ లీడ్స్ 100 బంతుల్లో 116 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ బ్రియాని స్మిత్ (48), అనాబెల్ సదర్లాండ్ (22), దీప్తి శర్మ (23) రాణించారు. సదరన్ బ్రేవ్ బౌలర్లలో ఇస్సీ వాంగ్ మూడు వికెట్లు తీయగా, టిల్లీ కొలెమన్ 2 వికెట్లు పడగొట్టింది. అనంతరం సదరన్ బ్రేవ్స్ 96 బంతుల్లో 5 వికెట్లు కోల్పోయి 117 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. జేమిమా రోడ్రిగ్స్ (34 బంతుల్లో 42 నాటౌట్, 4 ఫోర్లు) చివరి వరకు నిలిచి జట్టును గెలిపించింది. సన్‌రైజర్స్ లీడ్స్ బౌలర్లలో కాసిడి మెక్‌కార్తీ 2 వికెట్లు తీయగా, జెస్ జొనాసన్, అనాబెల్ సదర్లాండ్, డానియెల్లె గిబ్సన్ తలా ఒక వికెట్ తీశారు. మరో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ లండన్‌పై వెల్ష్ ఫైర్ జట్టు 60 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన వెల్ష్ ఫైర్ వుమెన్స్ 100 బంతుల్లో 4 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. సోఫి డివైన్ (52) అర్ధసెంచరీ సాధించగా, జార్జియా వోల్ (42), జార్జియా వర్హెమ్ (43 నాటౌట్) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. అనంతరం ఛేదనలో ముంబై ఇండియన్స్ లండన్ 92 బంతుల్లో 117 పరుగులకు కుప్పకూలింది. చినెల్లి హెన్రీ (30) టాప్ స్కోరర్‌గా నిలిచింది. గ్రేస్ పాట్స్ 3 వికెట్లు పడగొట్టింది. Ice in her veins! Jemimah Rodrigues closes out the chase 💫She delivers a memorable victory under pressure!#TheHundred 2026 👉 Sunrisers Leeds v Southern Brave pic.twitter.com/6YyTj5DWuM— Star Sports (@StarSportsIndia) July 25, 2026"Stay calm, stick to our plans, keep it simple and enjoy cricket" 🏏Hear from the Match Hero Jemimah Rodrigues after her fantastic knock to help Southern Brave beat Sunrisers Leeds 💯 pic.twitter.com/5aXY4eGnZ9— Sky Sports Cricket (@SkyCricket) July 25, 2026చదవండి: ధర్మేంద్ర ప్రధాన్ ఎఫెక్ట్.. గంభీర్ రాజీమానాకు డిమాండ్! -
ధర్మేంద్ర ప్రధాన్ ఎఫెక్ట్.. గంభీర్ రాజీమానాకు డిమాండ్!
నీట్ లీకేజీ వ్యవహారంలో దేశవ్యాప్తంగా యువతరం భగ్గుమనడంతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శనివారం తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ తలపెట్టిన ఉద్యమానికి యువతరం పెద్ద ఎత్తున మద్దతు తెలపడంతో చివరకు కేంద్రం తలవంచాల్సి వచ్చింది. ఈ క్రమంలో భారత జట్టు హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్‌పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ వస్తున్నాయి. నీట్ లీకేజీ వ్యవహారంలో తన బాధ్యతల్లో విఫలమైన ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేసినట్లే.. గంభీర్ కూడా టీమిండియా వరుస వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ హెడ్‌కోచ్ పదవికి రాజీనామా చేయాల్సిందేనని క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తూ డిమాండ్ చేయడం ఆసక్తి కనిపించింది. విద్యార్థులు చేసిన ఆందోళనలతో ధర్మేంద్ర ప్రధాన్ దిగొచ్చినట్లే.. గంభీర్ కూడా తమ నిరసనలకు దిగిరావాలని, లేకుంటే రోడ్లపైకి వచ్చి నిరసన తెలపాల్సి వస్తుందని హెచ్చరించడం గమనార్హం. గంభీర్ ఇలాగే కోచ్‌గా కొనసాగితే మాత్రం 2027 వన్డే ప్రపంచకప్‌లో భారత్ ఓటమి ఖాయమని కొందరు జోస్యం చెబుతున్నారు. వరుసగా విఫలమవుతున్నప్పటికీ హర్షిత్ రానా, సుందర్ లాంటి క్రికెటర్లకు తరచూ అవకాశాలు ఇస్తున్నాడని, సీనియర్లకు అవకాశాలు తగ్గేలా చేయడంలో గంభీర్‌దే కీలకపాత్ర అని విమర్శిస్తున్నారు. అయితే ఇటీవలే గంభీర్ హెడ్‌కోచ్‌గా ఐర్లాండ్ చేతిలో 2-0తో, ఇంగ్లండ్ చేతిలో 4-0తో ఓడిన టీమిండియా ఆ తర్వాత వన్డే సిరీస్‌ను కూడా 2-1తో కోల్పోయింది. దీంతో ప్రస్తుతం జింబాబ్వే టూర్‌కు గంభీర్‌కు విశ్రాంతినిచ్చి అతడి స్థానంలో వీవీఎస్ లక్ష్మణ్‌ను మెంటార్‌గా జట్టుతో పంపించారు. కోచ్ మారగానే టీమిండియా టీ20 సిరీస్‌ను గెలుచుకోవడంతో పాటు, తాజాగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఎఫెక్ట్ కూడా గంభీర్‌ను ట్రోల్స్‌కు గురయ్యేలా చేసింది. అయితే కొంతమంది గంభీర్ మద్దతుదారులు మాత్రం అతడి కోచింగ్ సారథ్యంలోనే టీమిండియా 2026 టీ20 ప్రపంచకప్‌తో పాటు ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ గెలిచిందన్న విషయం మరువకూడదని కామెంట్లు చేశారు. మొత్తంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఎఫెక్ట్‌తో క్రికెట్ అభిమానుల నుంచి గంభీర్‌కు సెగ తగిలినట్లయింది. ఇదంతా కేవలం సోషల్ మీడియాలో ఫన్నీ ట్రోల్స్ మాత్రమే కావడంతో బీసీసీఐ పెద్దగా పట్టించుకోలేదు. 2027 వన్డే ప్రపంచకప్ వరకు గంభీర్ టీమిండియా హెడ్‌కోచ్‌గా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. Education Minister Dharmendra Pradhan resigned. pic.twitter.com/Ne2s3DMB50— TukTuk Academy (@TukTuk_Academy) July 25, 2026🚨 FAN PROTESTS GROW AGAINST GAMBHIR 🚨Growing frustration over Team India's recent performances has sparked fresh online campaigns and fan protests demanding Gautam Gambhir step down as head coach! 🇮🇳🏏🔥 pic.twitter.com/KlXfpDb364— CreaseBuzz (@CreaseBuzz) July 25, 2026Ab resignation aa gaya hai toh asli protest shuru karein?#CJP #dharmendrapradharesign pic.twitter.com/GmC7Ze5S5e— Tigerexch.ai (@Tigerexch_ai) July 25, 2026 -
సిరీస్ విజయం.. టీ20ల్లో నంబర్‌వన్‌గా టీమిండియా
ఇంగ్లండ్, ఐర్లాండ్ చేతిలో టీ20 సిరీస్‌లు కోల్పోయిన టీమిండియా నెంబర్‌వన్ ర్యాంకును కూడా కోల్పోయింది. తాజాగా జింబాబ్వేతో జరుగుతున్న టీ20 సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది. పనిలో పనిగా మరోసారి పొట్టి ఫార్మాట్లో అగ్రపీఠాన్ని అందుకుంది. 60 మ్యాచ్‌లాడిన టీమిండియా 268 పాయింట్లతో తొలి స్థానంలో ఉండగా, రెండో స్థానంలో ఇంగ్లండ్ (268 పాయింట్లు) ఉండగా, 260 పాయింట్లతో ఆస్ట్రేలియా మూడో స్థానంలో నిలిచింది. ఇంగ్లండ్, భారత్ మధ్య పాయింట్ల మధ్య వ్యత్యాసం లేకున్నప్పటికీ భారత్ ఎక్కువ మ్యాచ్‌లు ఆడడంతో నంబర్‌వన్ స్థానాన్నితిరిగి హస్తగతం చేసుకుంది. మూడో టీ20లోనూ గెలిచి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేస్తే మాత్రం టీమిండియా నంబర్‌వన్ ర్యాంకు మరింత పటిష్టం కానుంది.శనివారం జరిగిన రెండో మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని టీమిండియా 90 పరుగుల తేడాతో ఆతిథ్య జింబాబ్వేను చిత్తు చేసింది. తద్వారా మరో మ్యాచ్ మిగిలుండగానే 2–0తో సిరీస్ పట్టేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణిత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఇషాన్ కిషన్ (44 బంతుల్లో 81; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు), హైదరాబాదీ తిలక్ వర్మ (29 బంతుల్లో 60 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధశతకాలతో మెరిశారు.అనంతరం భారీ లక్ష్యఛేదనలో జింబాబ్వే 17.5 ఓవర్లలో 129 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్ (19 బంతుల్లో 32; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) టాప్ స్కోరర్ కాగా... తక్కినవాళ్లంతా విఫలమయ్యారు. భారత బౌలర్లలో అభిషేక్ శర్మ 3 వికెట్లు పడగొట్టగా... అరంగేట్ర పేసర్ యశ్ ఠాకూర్, ప్రిన్స్ యాదవ్ చెరో రెండు వికెట్లు తీశారు. ఇరు జట్ల మధ్య నామమాత్రమైన మూడో టి20 నేడు ఇక్కడే జరగనుంది. చదవండి: ఫైనల్‌కు దూసుకెళ్లిన అనాహత్.. 21 ఏళ్ల రికార్డు బద్దలు -
చరిత్ర సృష్టించిన అనాహత్.. తొలి ప్లేయర్‌గా రికార్డు
ఒంటారియో (కెనడా): భారత రైజింగ్ స్టార్ అనాహత్ సింగ్... ప్రపంచ స్క్వాష్ జూనియర్ చాంపియన్‌షిప్ టైటిల్ కైవసం చేసుకుంది. ఫైనల్లో టాప్ సీడ్ అనాహత్ 11–3, 11–7, 11–9తో రుఖయ్య సలీమ్ (ఈజిప్ట్)పై గెలిచింది. తద్వారా భారత్ నుంచి తొలి ప్రపంచ స్క్వాష్ జూనియర్ చాంపియన్‌గా అవతరించింది. 2005లో జోష్నా చినప్ప ఈ టోర్నీలో రన్నరప్‌గా నిలిచింది. గతేడాది కైరోలో జరిగిన ఈ టోర్నమెంట్లో కాంస్యం నెగ్గిన అనాహత్... ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్‌లో రెండు పతకాలు గెలిచిన తొలి భారతీయ ప్లేయర్‌గానూ రికార్డుల్లోకెక్కింది. ఈ నేపథ్యంలో చాంపియన్‌గా నిలిచిన అనాహత్‌కు పలువురు కేంద్ర మంత్రులు అభినందనలు తెలిపారు. BIG BIG BIGGG NEWS 🔥🔥🔥🔥ANAHAT SINGH IS WORLD JUNIOR CHAMPION 🏆 🇮🇳THE QUEEN FROM INDIA IS AT THE TOP OF WORLD TODAY!Anahat defeated Ruqayya Salem 🇪🇬 3-0 to become the first Indian to win the Junior Squash World Championship 🏆 First Non Egyptian player to win Jr World… pic.twitter.com/eA0rouqE2f— SPORTS ARENA🇮🇳 (@SportsArena1234) July 25, 2026Read: సిరీస్ విజయం.. టీ20ల్లో నంబర్‌వన్‌గా టీమిండియా -
ఝండూ పవర్
గ్లాస్గో: పారా పవర్‌లిఫ్టింగ్‌లో కాంస్య పతకంతో బోణీ చేస్తూ కామన్వెల్త్ క్రీడల పతకాల జాబితాలో భారత్ కూడా చేరింది. పురుషుల హెవీ వెయిట్ కేటగిరీలో భారత్‌కు చెందిన ఝండూ కుమార్ కాంస్యం (130.9 పాయింట్లు) సొంతం చేసుకున్నాడు. ఈ పోటిల్లో భారత్‌కు ఇదే తొలి పతకం తన రెండో ప్రయత్నంలో 190 కేజీల బరువెత్తి ఝండూ కుమార్ మూడో స్థానంలో నిలిచాడు. మొదటి ప్రయత్నంలో 181 కేజీల బరువెత్తిన అతను రెండో ప్రయత్నంలో దానిని మరింత మెరుగుపర్చుకున్నాడు. చివరి ప్రయత్నంలో 196 కేజీల కోసం ప్రయత్నించినా అతను విఫలమయ్యాడు. ఈ ఈవెంట్లో రిలువాన్ ఇద్రీస్ (208 కేజీలు; నైజీరియా) స్వర్ణం గెలుచుకోగా, మాథ్యూ హార్డింగ్ (199 కేజీలు; ఇంగ్లండ్)కు రజతం దక్కింది. ఇదే విభాగంలో పోటీ పడిన మరో ఆరుగురు భారత పవర్‌లిఫ్టర్లు పతకం సాధించడంలో విఫలమయ్యారు. పారా పవర్ లిఫ్టింగ్ పురుషుల లైట్ వెయిట్ విభాగంలో భారత్ లిఫ్టర్ అశోక్ కుమార్ నాలుగో స్థానంలో నిలిచి పతకం చేజార్చుకున్నాడు. ఇతర ఫలితాలు→ భారత బాక్సర్ సచిన్ సివాచ్ (62 కేజీలు) 4–1తో అహ్మదీ (కెనడా)పై గెలిచి ప్రిక్వార్టర్స్‌కు చేరుకున్నాడు. → మహిళల బౌల్స్ పెయిర్ ఈవెంట్లో భారత జోడి రూపా రాణి – పింకీ సింగ్ ‘టైబ్రేకర్’లో టోంగాపై గెలిచింది. → పురుషుల స్విమ్మింగ్ (400 మీ. ఫ్రీస్టయిల్)లో భారత స్విమ్మర్లు ఫైనల్‌కు అర్హత సాధించడంలో విఫలమయ్యారు. దక్షణ్ శశికుమార్ 15వ, ఆర్యన్ 6వ స్థానంతో ముగించారు. → మహిళల 3X3 వీల్ చెయిర్ బాస్కెట్‌బాల్ ఈవెంట్ తొలి మ్యాచ్‌లో భారత్ 1–16 తేడాలో వేల్స్ చేతుల్లో చిత్తుగా ఓడింది. → పురుషుల బౌల్స్ ఈవెంట్ సింగిల్స్‌లో భారత ఆటగాడు పుతుల్ సోనోవాల్ 4–8, 8–9 స్కోరుతో ఇజ్జత్ జుల్కెప్లె (మలేసియా) చేతిలో ఓడాడు. దక్షిణాఫ్రికా స్విమ్మర్ చాడ్ లి క్లోజ్ ఖాతాలో 19వ కామన్వెల్త్ పతకం చేరింది. తద్వారా ఈ పోటీల్లో అత్యధిక పతకాలు సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. గతంలో ఈ రికార్డు షూటర్లు ఫిల్ ఆడమ్స్, గౌల్ట్ (18 పతకాలు) పేరిట ఉంది.అవమాన కుమార్!!! అతని అసలు పేరు అవినాశ్ కుమార్. అయితే ఐదేళ్ల వయసులో పోలియోబారిన పడి నడుం కిందిభాగం చచ్చుబడిపోయింది. ‘నువ్వు తండ్రికి భారంగా పుట్టావు. అతడి పరువు తీశావు’ అంటూ కొందరు బంధువులు ఝండ్ (అవమానం) అంటూ పిలవడం మొదలుపెట్టారు. చిన్నప్పుడు రికార్డుల్లో కూడా ఇదే పేరు నమోదు కావడంతో చివరకు అసలు పేరు పోయి అతను ఝండూ కుమార్‌గా మారాడు! స్వస్థలం బిహార్ రాష్ట్రంలోని నలంద జిల్లా హర్నౌత్. తండ్రి కూరగాయలు అమ్మగా వచ్చే ఆదాయంతో జీవనం సాగే పరిస్థితుల్లో అతను చిన్నప్పటి నుంచి ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్నాడు. అయితే కఠోర శ్రమతో, పట్టుదలతో వాటిని అధిగమించాడు. కుటుంబ పోషణకు తాను కూడా కూరగాయాలు అమ్మాడు. ఉదయం 4 గంటలకే 20 కిలోమీటర్ల దూరం ప్రయాణించి హోల్‌సేల్ మార్కెట్లో కూరగాయలు తెచ్చుకొని హర్నౌత్లో ఫుట్‌పాత్‌పై అమ్మడం అతని రోజూవారీ దినచర్య. 4 గంటల వరకు అమ్మకం ముగించి ఆ తర్వాత జిమ్‌కు వెళ్లడం, ప్రాక్టీస్ చేయడంతోనే పవర్‌లిఫ్టింగ్‌లో అతను రాటుదేలాడు. కాళ్లు లేకపోయినా శారీరక సౌష్టవం పెంచుకోగలననే నమ్మకంతో తన ట్రైసైకిల్‌ను దాదాపు కిలోమీటర్ తోసుకుంటూ జిమ్‌కు వెళ్లి ఝండూ సాధన చేశాడు. అయితే ఆర్థిక సమస్యలు మరింత పెరగడంతో బ్యాటరీ ఈ–రిక్షా నడిపి కొంత ఆదాయం పొందే ప్రయత్నం చేశాడు. గాందీనగర్‌లోని స్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా సెంటర్లో అవకాశం లభించడంతో అతని జీవితం మారింది. ఏడాది క్రితం 205 కిలోల బరువెత్తి కొత్త జాతీయ రికార్డు సాధించిన ఝండూ ఆ తర్వాత 206 కేజీలతో దానిని సవరించాడు. ప్రపంచ కప్‌లో కాంస్యం, ఆసియా ఓషియానియా చాంపియన్‌షిప్‌లో కాంస్యం సాధించిన ఝండూ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఐదో స్థానంలో నిలిచాడు. -
సిరీస్ మనదే
హరారే: స్థాయికి తగ్గ ప్రదర్శనతో సత్తా చాటిన భారత క్రికెట్ జట్టు... జింబాబ్వేపై టి20 సిరీస్ కైవసం చేసుకుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శనివారం జరిగిన రెండో మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని టీమిండియా 90 పరుగుల తేడాతో ఆతిథ్య జింబాబ్వేను చిత్తు చేసింది. తద్వారా మరో మ్యాచ్ మిగిలుండగానే 2–0తో సిరీస్ పట్టేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణిత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఇషాన్ కిషన్ (44 బంతుల్లో 81; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు), హైదరాబాదీ తిలక్ వర్మ (29 బంతుల్లో 60 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధశతకాలతో మెరిశారు. గత మ్యాచ్‌లో రికార్డు అర్ధ శతకం నమోదు చేసిన 15 ఏళ్ల ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ (9 బంతుల్లో 20; 3 ఫోర్లు, 1 సిక్స్) ఎక్కువసేపు నిలవలేకపోయాడు. అనంతరం భారీ లక్ష్యఛేదనలో జింబాబ్వే 17.5 ఓవర్లలో 129 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్ (19 బంతుల్లో 32; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) టాప్ స్కోరర్ కాగా... తక్కినవాళ్లంతా విఫలమయ్యారు. భారత బౌలర్లలో అభిషేక్ శర్మ 3 వికెట్లు పడగొట్టగా... అరంగేట్ర పేసర్ యశ్ ఠాకూర్, ప్రిన్స్ యాదవ్ చెరో రెండు వికెట్లు తీశారు. ఇరు జట్ల మధ్య నామమాత్రమైన మూడో టి20 నేడు ఇక్కడే జరగనుంది. వైభవ్ ఆరంభ మెరుపులు... ఐర్లాండ్–ఇంగ్లండ్ పర్యటనలో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన భారత బ్యాటింగ్ ఆర్డర్... ఈ మ్యాచ్‌లో దంచికొట్టింది. తొలి ఓవర్లో రెండు ఫోర్లు కొట్టిన అభిషేక్ శర్మ (8) ఎక్కువసేపు నిలవలేకపోగా... ఇన్నింగ్స్ మూడో ఓవర్లో సూర్యవంశీ వరుసగా 4, 6, 4, 4 బాదాడు. అయితే అదే ఊపులో మరో భారీ షాట్ ఆడేందుకు ప్రయతి్నంచి అవుటయ్యాడు. మంచి టచ్‌లో కనిపించిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (25; 4 ఫోర్లు) భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోగా... 10 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా 95/3తో నిలిచింది. అక్కడి నుంచి ఇషాన్, తిలక్ ఇన్నింగ్స్‌ను నడిపించారు. మంచి బంతులను గౌరవించిన ఈ జోడీ... చెత్త బంతులపై విరుచుకుపడింది. ఈ క్రమంలో ఇషాన్ 31 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకోగా... ఇన్నింగ్స్ 13వ ఓవర్లో తిలక్ హ్యాట్రిక్ ఫోర్లతో హోరెత్తించాడు. మరుసటి ఓవర్లో ఇషాన్ 4, 4, 6 కొట్టడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. వీరిద్దరూ నిలకడగా రాణించడంతో మధ్య ఓవర్లలో భారత్ మెరుగైన స్కోరు చేసింది. ధాటిగా ఆడిన తిలక్ 23 బంతుల్లోనే హాఫ్‌సెంచరీ మార్క్ దాటాడు. తిప్పేసిన అభిషేక్... లక్ష్యఛేదనలో ఏ దశలోనూ జింబాబ్వే పోటీలో కనిపించలేదు. ఓపెనర్ బెన్నెట్ క్రీజులో ఉన్నంతసేపు భారీ షాట్లు ఆడగా... అతడిని తొలి అంతర్జాతీయ టి20 ఆడుతున్న యశ్ ఠాకూర్ అవుట్ చేశాడు. ఆ వెంటనే బెన్ కరెన్ (1) పెవిలియన్ చేరగా... మైయర్స్ (12),సికందర్ రజా (0) విఫలమయ్యారు. దీంతో జింబాబ్వే 49 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. బర్ల్ (20; 2 ఫోర్లు), మరుమని (24; 1 ఫోర్, 1 సిక్స్), ఇవాన్స్ (19; 1 ఫోర్, 2 సిక్స్‌లు) తలాకొన్ని పరుగులు చేశారు. పిచ్ స్పిన్‌కు అనుకూలిస్తుండటంతో... భారత సారథి శ్రేయస్ బంతిని పార్ట్‌టైమ్ స్పిన్నర్లు అభిషేక్ శర్మ, తిలక్ వర్మకు అందించాడు. వారిద్దరూ లోయర్ ఆర్డర్ పనిపట్టడంతో జింబాబ్వే ఆలౌటైంది.స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: వైభవ్ (సి) ముజరబాని (బి) ఎన్గరవా 20; అభిషేక్ (సి) బర్ల్ (బి) ముజరబాని 8; ఇషాన్ (సి) బెన్నెట్ (బి) న్యూమన్ 81; శ్రేయస్ (సి) ఇవాన్స్ (బి) బెన్నెట్ 25; తిలక్ (నాటౌట్) 60; రింకూ (సి) బర్ల్ (బి) ఇవాన్స్ 12; శివమ్ దూబే (నాటౌట్) 6; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 219. వికెట్ల పతనం: 1–10, 2–29, 3–95, 4–189, 5–213. బౌలింగ్: సికందర్ రజా 4–0–47–0; ముజరబాని 4–0–36–1; ఎన్గరవా 3–0–43–1; ఇవాన్స్ 4–0–44–1; న్యూమన్ 3–0–25–1; బెన్నెట్ 2–0–22–1. జింబాబ్వే ఇన్నింగ్స్: బెన్నెట్ (సి) ఇషాన్ (బి) యశ్ 32; కరన్ (సి) శివమ్ దూబే (బి) ప్రిన్స్ 1; మైయర్స్ (బి) రవి బిష్ణోయ్ 12; బర్ల్ (సి) రింకూ (బి) తిలక్ 20; సికందర్ రజా (సి) ఇషాన్ (బి) ప్రిన్స్ 0; మదెవెరె (సి) శ్రేయస్ (బి) శివమ్ దూబే 2; మరుమని (బి) యశ్ 24; ఇవాన్స్ (బి) అభిషేక్ 19; న్యూమన్ (బి) అభిషేక్ 3; ఎన్గరవా (సి) రింకూ (బి) అభిషేక్ 1; ముజరబాని (నాటౌట్) 7; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (17.5 ఓవర్లలో ఆలౌట్) 129. వికెట్ల పతనం: 1–34, 2–34, 3–48, 4–49, 5–65, 6–82, 7–105, 8–119, 9–121, 10–129. బౌలింగ్: మయాంక్ 3–0–25–0; యశ్ ఠాకూర్ 4–0–30–2; ప్రిన్స్ 1.2–0–10–2; రవి బిష్ణోయ్ 4–0–20–1; శివమ్ దూబే 1.4–0–13–1; తిలక్ వర్మ 1–0–9–1; అభిషేక్ 2.5–0–17–3. -
వారిద్దరూ అద్భుతం.. గతం మాకు అవసరం లేదు: శ్రేయస్ అయ్యర్
హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో 90 పరుగుల తేడాతో భారత్ భారీ విజయాన్ని అందుకుంది. దీంతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 2-0 తేడాతో టీమిండియా కైవసం చేసింది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది. తొలుత బ్యాటింగ్‌లో 219 పరుగుల భారీ స్కోర్ సాధించిన మెన్ ఇన్ బ్లూ.. అనంతరం బౌలింగ్‌లో ప్రత్యర్ధి జట్టును 129 పరుగులకే కట్టడి చేసింది. ఈ విజయంపై మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ శ్రేయస్ స్పందించాడు. భారత జట్టు కెప్టెన్‌గా తొలి టీ20 సిరీస్ విజయాన్ని అందుకోవడం సంతోషంగా ఉందని అయ్యర్ చెప్పుకొచ్చాడు."ఏకపక్ష విజయం సాధించడం చాలా ఆనందంగా ఉంది. జట్టులోని ప్రతి ఒక్క ఆటగాడు అత్యుత్తమ ప్రదర్శన కనబరచడం వల్లే ఈ అద్భుత విజయం సాధ్యమైంది. తొలుత బ్యాటింగ్‌లో ఇషాన్ కిషన్, తిలక్ వర్మ అసాధరణ ప్రదర్శన కనబరిచారు. వారిద్దరూ ఆడిన కొన్ని షాట్లు చూడటానికి ఎంతో ముచ్చటగా ఉన్నాయి. ఈ పిచ్‌పై మొదట్లో 180 నుండి 200 పరుగులు చేస్తే మంచి స్కోర్ అని భావించాం. కానీ వారిద్దరి అద్భుత ఇన్నింగ్స్ వల్ల మేము ఏకంగా 219 పరుగులు సాధించాం. ఆ తర్వాత మా బౌలర్లు వారి పని వారు చేసుకుపోయారు. సరైన లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేసి ప్రత్యర్ధి జట్టును 129 పరుగులకే కట్టడి చేశారు. మ్యాచ్ ఆరంభం నుంచే ఆతిథ్య జట్టుపై ఆధిపత్యం చెలాయించాం. టీ20 ఫార్మాట్లో ఫియర్ లెస్ క్రికెట్ ఆడడం చాలా ముఖ్యం. గతంలో ఏం జరిగింది అనే దాన్ని పక్కన పెట్టి, ప్రస్తుతం గురుంచి ఆలోచిస్తూ ముందుకు సాగడమే మా సిద్దాంతం. ప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకోవాడనికి ప్రయత్నించాలి. ఆదివారం కూడా మాకు మరో మ్యాచ్ ఉంది. ఈ మ్యాచ్‌లో కూడా గెలిచి సిరీస్‌ను విజయంతో ముగించేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాం" అని పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో శ్రేయస్ పేర్కొన్నాడు. -
రెండో టీ20లో జింబాబ్వే చిత్తు.. సిరీస్ టీమిండియాదే
హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో 90 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో మరో మ్యాచ్ మిగిలుండగానే మూడు టీ20ల సిరీస్‌ను 2-0తో టీమిండియా సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. భారత ఇన్నింగ్స్‌లో ఇషాన్ కిషన్(44 బంతుల్లో 9 ఫోర్లు,2 సిక్స్‌లతో 1), తిలక్ వర్మ(29 బంతుల్లో 60 నాటౌట్) హాఫ్ సెంచరీలతో సత్తాచాటారు. జింబాబ్వే బౌలర్లలో ముజార్బానీ, నగరవా, బెన్నెట్, న్యూమన్ న్యాముహురి తలా వికెట్ సాధించారు.అదరగొట్టిన అభిషేక్అనంతరం 220 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే 17.5 ఓవర్లలో 129 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో పార్ట్‌టైమ్ స్పిన్నర్ అభిషేక్ శర్మ మూడు వికెట్లతో సత్తాచాటగా.. ప్రిన్స్ యాదవ్, యశ్ ఠాకూర్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. వీరితో పాటు రవి బిష్ణోయ్, దూబే, తిలక్‌కు ఒక్కో వికెట్ దక్కింది. జింబాబ్వే బ్యాటర్లలో బెన్నెట్(32) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. మిగితా ప్లేయర్లంతా దారుణంగా విఫలమయ్యారు. కాగా భారత కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌కు ఇదే తొలి సిరీస్ విజయం కావడం గమనార్హం. కాగా జింబాబ్వే టూర్‌కు ముందు ఐర్లాండ్, ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లను భారత్ కోల్పోయిన సంగతి తెలిసిందే. -
జిడ్డు బ్యాటింగ్ అంటూ విమర్శలు.. కట్ చేస్తే! బౌండరీలతో విధ్వంసం
టీమిండియా సూపర్ స్టార్ తిలక్ వర్మ తన ఫామ్‌పై విమర్శలు చేస్తున్న వారికి బ్యాట్‌తోనే సమాధనమిచ్చాడు. శనివారం హరారే వేదికగా జింబాబ్వేతో రెండో టీ20లో తిలక్ విధ్వసంకర హాఫ్ సెంచరీతో సత్తాచాటాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన తిలక్.. ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఈ హైదరాబాదీ మైదానం నలుమూలల బౌండరీలు బాదుతూ అభిమానులను అలరించాడు.ఈ క్రమంలో తిలక్ కేవలం 23 బంతుల్లో తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. అతడికి ఇది 9వ టీ20 హాఫ్ సెంచరీ. మొత్తంగా భారత వైస్ కెప్టెన్ 29 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 60 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడితో పాటు వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. 44 బంతుల్లో కిషన్ 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 81 పరుగులు చేశాడు. ఫలితంగా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. కాగా ఇటీవల కాలంలో తిలక్ ఆట తీరుపై చాలా మంది మాజీలు విమర్శలు గుప్పించారు. చాలా తక్కువ స్ట్రైక్‌రేట్‌తో ఆడుతున్నాడని, జట్టు నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. వీటిపై స్పందిచిన తిలక్.. మ్యాచ్ పరిస్థితులకు అనుగుణంగానే తన ఆటతీరు ఉంటుందని స్పష్టం చేశాడు. ఇప్పుడు మరోసారి తనలోని హిట్టర్‌ను తిలక్ బయటపెట్టాడు. తనకు దూకుడుగా ఆడడంతో పాటు సమయస్పూర్తితో కూడా ఆడడం తెలుసు అని తిలక్ చాటి చెప్పాడు.చదవండి: భారత్ తరపున అరంగేట్రం.. ఎవరీ యశ్ ఠాకూర్ -
భారత్ తరపున అరంగేట్రం.. ఎవరీ యశ్ ఠాకూర్?
టీమిండియా తరపున మరో యువ ఆటగాడు అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టాడు. హరారా వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న రెండో టీ20లో పేసర్ యశ్ ఠాకూర్ భారత్ తరపున డెబ్యూ చేశాడు. తొలి టీ20 ఆడిన అశోక్ శర్మను పక్కన పెట్టి యశ్‌కు తుది జట్టులో చోటు కల్పించారు. దీంతో ఎవరీ యశ్ ఠాకూర్ నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు.ఎవరీ యశ్ ఠాకూర్?27 ఏళ్ల యశ్ ఠాకూర్ 1998లో కోల్‌కతాలో జన్మించాడు. కానీ ఈ రైట్ ఆర్మ్ పేసర్ దేశవాళీ క్రికెట్లో విదర్భ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అతడు ఇప్పటికే రంజీలతో పాటు లిస్ట్-ఎ క్రికెట్, టీ20ల్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. భారత్ 'ఎ' జట్టు తరపున కూడా అతడు తన మార్క్ చూపించాడు. ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అంతకుమందు లక్నో సూపర్ జెయింట్స్ జట్టులో భాగంగా ఉన్నాడు.ఈ ఏడాది సీజన్‌కు ముందు అతడిని రూ. 1.60 లక్షలకు పంజాబ్ సొంతం చేసుకుంది. టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాను తన ఆదర్శంగా తీసుకున్న యశ్ ఠాకూర్.. డెత్ ఓవర్లలో పొదుపుగా బౌలింగ్ చేస్తూ వికెట్లు తీయడంలో దిట్ట. ఈ క్రమంలోనే అతడికి భారత్ తరపున అత్యున్నత స్ధాయిలో ఆడే అవకాశం దక్కింది. ఈ విదర్భ పేసర్ టీ20(48 మ్యాచ్‌లు )లలో ఇప్పటి వరకు 69, లిస్ట్-ఏ క్రికెట్(37 మ్యాచ్‌లు)లో 54, ఫస్ట్ క్లాస్ క్రికెట్(22 మ్యాచ్‌లు)లో 67 వికెట్లు పడగొట్టాడు.తుది జట్లుభారత్: వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), తిలక్ వర్మ, రింకూ సింగ్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, ప్రిన్స్ యాదవ్, యశ్ ఠాకూర్, మయాంక్ యాదవ్జింబాబ్వే: బ్రియాన్ బెన్నెట్, బెన్ కర్రాన్, డియోన్ మైయర్స్, సికందర్ రజా(కెప్టెన్), ర్యాన్ బర్ల్, వెస్లీ మాధేవెరే, తడివానాషే మారుమణి(వికెట్ కీపర్), బ్రాడ్ ఎవాన్స్, న్యూమాన్ న్యామ్హురి, రిచర్డ్ నగరవ, బ్లెస్సింగ్ ముజారబానీ -
టీమిండియా మాజీ క్రికెటర్‌పై చీటింగ్ కేసు
టీమిండియా మాజీ క్రికెటర్ రాజేశ్ చౌహాన్‌పై చీటింగ్ కేసు నమోదైంది. ఓ వ్యక్తిని రూ. 15 లక్షలకు పైగా మోసం చేసినట్టు ఆరోపణలు రావడంతో ఒడిశా పోలీసులు కేసు నమోదు చేశారు. ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ జిల్లా స్థానిక కోర్టు ఆదేశాల మేరకు జులై 24న మోహన్ నగర్ పోలీస్ స్టేషన్లో బీఎన్ఎస్ సెక్షన్ 316(2) (నమ్మకద్రోహం) కింద కేసు నమోదైంది.ఆరోపణ ఏంటంటే..?మాజీ భారత, మధ్యప్రదేశ్ ఆఫ్ స్పిన్నర్ రాజేష్ చౌహాన్, జిందాల్ స్టీల్ కంపెనీతో ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టు కుదిర్చిస్తానని దింకర్ విశ్వమిత్ర అనే వ్యక్తికి హామీ ఇచ్చి రూ. 15.1 లక్షలు వసూలు చేసినట్టు ఆరోపణ. ఈ మేరకు ఫిర్యాదుదారు కోర్టును ఆశ్రయించగా, పోలీస్ దర్యాప్తునకు ఆదేశాలు జారీ అయ్యాయి.ఫిర్యాదుదారు తెలిపిన వివరాల ప్రకారం, ట్రాన్స్పోర్ట్ వ్యాపారంలో భాగస్వామిగా పెట్టుబడి పెడితే మంచి లాభాలు వస్తాయని చౌహాన్ హామీ ఇచ్చారు. దీంతో 2021 జులైలో చౌహాన్ సంస్థ 'గోవింద్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ'తో విశ్వమిత్ర ఒప్పందం కుదుర్చుకున్నారు. మొదట చెక్కు రూపంలో రూ. 2.51 లక్షలు, అనంతరం మిగిలిన రూ. 12 లక్షలను సంస్థ బ్యాంకు ఖాతాలోకి బదిలీ చేశారు.అయితే పెట్టుబడి అనంతరం చౌహాన్ నుంచి సరైన స్పందన రాకపోవడంతో ఫిర్యాదుదారు నేరుగా జిందాల్ స్టీల్ లిమిటెడ్‌ను సంప్రదించగా, చౌహాన్‌కు కానీ, గోవింద్ ట్రాన్స్పోర్ట్ కంపెనీకి కానీ ఎలాంటి కాంట్రాక్టు ఇవ్వలేదని తేలింది. దీంతో తాను మోసపోయినట్లు ఫిర్యాదుదారు కోర్టును ఆశ్రయించారు.చౌహాన్ స్పందనఈ వ్యవహారంపై గతంలో పీటీఐతో మాట్లాడిన చౌహాన్, ఇది వ్యాపార వివాదం మాత్రమేనని పేర్కొన్నారు. "ఫిర్యాదుదారుకు చెందిన కొంత మొత్తాన్ని ఇప్పటికే తిరిగి చెల్లించాం. వ్యక్తిగత కారణాల వల్ల మిగిలిన మొత్తం చెల్లింపులో ఆలస్యం జరిగింది" అని ఆయన వివరణ ఇచ్చారు.క్రికెట్ కెరీర్బిహార్లో జన్మించిన రాజేష్ చౌహాన్ 1988/89 నుంచి 2000/01 వరకు మధ్యప్రదేశ్ తరఫున దేశవాళీ క్రికెట్ ఆడారు. 1993లో ఈడెన్ గార్డెన్స్‌లో శ్రీలంకపై అంతర్జాతీయ అరంగేట్రం చేశారు. ఐదేళ్ల అంతర్జాతీయ కెరీర్లో 21 టెస్టులు, 35 వన్డేలు ఆడి 76 వికెట్లు పడగొట్టారు. దేశవాళీ క్రికెట్లో దాదాపు 100 ఫస్ట్-క్లాస్, అంతే సంఖ్యలో లిస్ట్-ఏ మ్యాచ్‌లు ఆడి 400కు పైగా వికెట్లు తీశారు. 2000/01లో క్రికెట్ కెరీర్‌కు వీడ్కోలు పలికిన తర్వాత, 59 ఏళ్ల చౌహాన్ వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. -
సెంచరీలతో కదంతొక్కిన లంక ప్లేయర్లు.. చిత్తుగా ఓడిన పాక్
3 మ్యాచ్‌ల వన్డే, టీ20 సిరీస్‌ల కోసం శ్రీలంకలో పర్యటిస్తున్న పాకిస్తాన్ మహిళల క్రికెట్ జట్టు తొలి ఓటమి చవిచూసింది. వన్డే సిరీస్‌లో భాగంగా జరిగిన రెండో మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు చేతిలో 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది.హంబన్‌తోట వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. సిద్రా అమీన్ (100) అజేయ శతకంతో సత్తా చాటడంతో నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 273 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ఏమాత్రం తడబడని శ్రీలంక విష్మి గుణరత్నే (123), హర్షిత సమరవిక్రమ (100 నాటౌట్) సెంచరీలతో కదంతొక్కడంతో 46.5 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది.పాక్ ఇన్నింగ్స్‌లో సిద్రా సెంచరీతో సత్తా చాటగా.. మునీబా అలీ (45), అయేషా జాఫర్ (49), కెప్టెన్ ఫాతిమా సనా (25) విలువైన ఇన్నింగ్స్‌లు ఆడారు. శ్రీలంక తరఫున విష్మి గుణరేత్న ఔటయ్యాక.. హర్షితకు కవిష దిల్హరి (40 నాటౌట్) సహకరించింది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక గెలవడంతో సిరీస్ 1-1 వద్ద కొనసాగుతోంది. తొలి వన్డేలో శ్రీలంకపై పాక్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ సిరీస్‌లోని నిర్ణయాత్మక మూడో వన్డే ఇదే హంబన్‌తోట వేదికగా జులై 28న జరుగనుంది. -
మళ్లీ తస్సుమన్న అభిషేక్.. వైభవ్ ధాటిగా ఆడినా..!
టీమిండియా డాషింగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ వైఫల్యాల పరంపర కొనసాగుతోంది. వరుసగా ఐదో మ్యాచ్‌లో అతడు నిరాశపరిచాడు. చివరిగా ఇంగ్లండ్‌తో తొలి టీ20లో అర్ద సెంచరీ చేసిన అతడు.. ఆతర్వాత వరుసగా 43, 10, 16, 3, 1 పరుగుకు ఔటయ్యాడు.ఇవాళ (జులై 25) జింబాబ్వేతో జరుగుతున్న రెండో టీ20లో ఓ మోస్తరు స్టార్ట్ లభించినప్పటికీ సద్వినియోగం చేసుకోలేక వికెట్ పారేసుకున్నాడు. 8 బంతుల్లో 2 ఫోర్ల సాయంతో 8 పరుగులు చేసి బ్లెస్సింగ్ ముజరబానీ బౌలింగ్‌లో ర్యాన్ బర్ల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.అభిషేక్ త్వరగా ఔట్ కావడంతో రెండో టీ20లో భారత్ ఆదిలోనే ఒత్తిడిలో పడినట్లైంది. అతడు ఔటైన వెంటనే మరో ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ కూడా ఔటయ్యాడు. తొలి మ్యాచ్ ఫామ్‌ను కొనసాగించిన వైభవ్ భారీ ఇన్నింగ్స్ ఆడతాడని భావిస్తే.. 9 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్ సాయంతో 20 పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టాడు.టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ 29 పరుగులకే ఓపెనర్లిద్దరి వికెట్లు కోల్పోవడంతో కష్టాల్లో పడింది. ఇషాన్ కిషన్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ క్రీజ్‌లో ఉన్నారు.కాగా, ఈ మ్యాచ్ కోసం భారత్ రెండు మార్పులు చేసింది. అశోక్ కుమార్ స్థానంలో యశ్ ఠాకూర్ తుది జట్టులోకి వచ్చాడు. యశ్ ఠాకూర్‌కు ఇది తొలి టీ20 మ్యాచ్. కెప్టెన్ అయ్యాక వరుసగా ఏడు టాస్‌లు గెలిచిన శ్రేయస్ ఎట్టకేలకు ఎనిమిదో మ్యాచ్‌లో టాస్ ఓడాడు. 3 మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్ తొలి మ్యాచ్ గెలిచి 1-0 ఆధిక్యంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. -
IND vs ZIM: జింబాబ్వేపై భారత్ ఘన విజయం
Ind vs Zim 2nd T20 live updates: హరారే వేదికగా జరిగిన రెండో టీ20లో జింబాబ్వేను 90 పరుగుల తేడాతో భారత్ చిత్తు చేసింది. దీంతో మూడు టీ20ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0 తేడాతో టీమిండియా సొంతం చేసుకుంది. 220 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే 17.5 ఓవర్లలో 129 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో పార్ట్‌టైమ్ స్పిన్నర్ అభిషేక్ శర్మ మూడు వికెట్లతో సత్తాచాటగా.. ప్రిన్స్ యాదవ్, యశ్ ఠాకూర్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. వీరితో పాటు రవి బిష్ణోయ్, దూబే, తిలక్‌కు ఒక్కో వికెట్ దక్కింది.జింబాబ్వే ఏడో వికెట్ డౌన్‌జింబాబ్వే ఏడో వికెట్ కోల్పోయింది. 19 పరుగులు చేసిన బ్రాడ్ ఎవాన్స్.. అభిషేక్ శర్మ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. జింబాబ్వే ఆరో వికెట్ డౌన్‌జింబాబ్వే ఆరో వికెట్ కోల్పోయింది. 20 పరుగులు చేసిన రియాన్ బర్ల్.. తిలక్ వర్మ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 12 ఓవర్లకు జింబాబ్వే స్కోర్: 90/6జింబాబ్వే ఐదో వికెట్ డౌన్‌జింబాబ్వే ఐదో వికెట్ కోల్పోయింది. 2 పరుగులు చేసిన మాధవీరే.. దూబే బౌలింగ్‌లో ఔటయ్యాడు.జింబాబ్వే నాలుగో వికెట్ డౌన్‌జింబాబ్వే నాలుగో వికెట్ కోల్పోయింది. ప్రిన్స్ యాదవ్ బౌలింగ్‌లో కెప్టెన్ సికందర్ రజా వికెట్ల ముందు దొరికిపోయాడు. ఆతిథ్య జట్టు 54 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.జింబాబ్వే మూడో వికెట్ డౌన్‌జింబాబ్వే మూడో వికెట్ కోల్పోయింది. 12 పరుగులు చేసిన డియోన్ మైర్స్.. రవి బిష్ణోయ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు.జింబాబ్వే రెండో వికెట్ డౌన్‌జింబాబ్వే రెండో వికెట్ కోల్పోయింది. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసిన బెన్ కుర్రాన్.. ప్రిన్స్ యాదవ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.జింబాబ్వే తొలి వికెట్ డౌన్‌జింబాబ్వే తొలి వికెట్ కోల్పోయింది. 19 బంతుల్లో 32 పరుగులు చేసిన బ్రియాన్ బెన్నెట్.. యశ్ ఠాకూర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.దూకుడుగా ఆడుతున్న జింబాబ్వే220 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే దూకుడుగా ఆడుతోంది. 3 ఓవర్లు ముగిసే సరికి జింబాబ్వే వికెట్ నష్టపోకుండా 23 పరుగులు చేసింది. క్రీజులో బెన్నెట్(22), బెన్ కుర్రాన్(1) తలా వికెట్ సాధించారు.జింబాబ్వే టార్గెట్ 220 పరుగులుహరారే వేదికగా జరుగుతున్న రెండో టీ20లో భారత బ్యాటర్లు సత్తాచాటారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. భారత ఇన్నింగ్స్‌లో ఇషాన్ కిషన్(44 బంతుల్లో 9 ఫోర్లు,2 సిక్స్‌లతో 1), తిలక్ వర్మ(29 బంతుల్లో 60 నాటౌట్) హాఫ్ సెంచరీలతో సత్తాచాటారు. యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ కేవలం 9 బంతుల్లోనే 3 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 20 పరుగులు చేసి ఔటయ్యాడు. జింబాబ్వే బౌలర్లలో ముజార్బానీ, నగరవా, బెన్నెట్, న్యూమన్ న్యాముహురి తలా వికెట్ సాధించారు.ఇషాన్ కిషన్ అవుట్ఇషాన్ కిషన్ రూపంలో భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. 81 పరుగులు చేసిన కిషన్.. న్యూమన్ న్యాముహురి బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి రింకూ సింగ్ వచ్చాడు. 18 ఓవర్లకు భారత్ స్కోర్: 195/5తిలక్ వర్మ ఫిప్టీతిలక్ వర్మ చెలరేగి ఆడుతున్నాడు. ఈ హైదరాబాదీ కేవలం 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. 17 ఓవర్లకు భారత్ స్కోర్: 188/3భారీ స్కోర్ దిశగా భారత్16 ఓవర్లు ముగిసే సరికి భారత్ 3 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. క్రీజులో ఇషాన్ కిషన్(75), తిలక్ వర్మ(40) ఉన్నారు.ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీఇషాన్ కిషన్ ఎట్టకేలకు తన ఫామ్‌ను అందుకున్నాడు. జింబాబ్వేతో జరుగుతున్న రెండో టీ20లో కిషన్ హాఫ్ సెంచరీతో సత్తాచాటాడు. 51 పరుగులతో కిషన్ తన బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు.టీమిండియా మూడో వికెట్ డౌన్టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. 25 పరుగులు చేసిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్.. బెన్నెట్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 10 ఓవర్లకు భారత్ స్కోర్: 95/3నిలకడగా ఆడుతున్న శ్రేయస్, కిషన్8 ఓవర్లు ముగిసే సరికి భారత్ రెండు వికెట్ల నష్టానికి 53 పరుగులు చేసింది. క్రీజులో శ్రేయస్ అయ్యర్(14), ఇషాన్ కిషన్(26) ఉన్నారు.భారత్ రెండో వికెట్ డౌన్.. వైభవ్ ఔట్వైభవ్ సూర్యవంశీ రూపంలో టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. కేవలం 9 బంతుల్లోనే 20 పరుగులు చేసిన వైభవ్.. నగరావ బౌలింగ్‌లో ఔటయ్యాడు.తొలి వికెట్ కోల్పోయిన భారత్1.5వ ఓవర్- 10 పరుగుల వద్ద భారత్ తొలి వికెట్ కోల్పోయింది. ముజరబానీ బౌలింగ్‌లో ర్యాన్ బర్ల్‌కు క్యాచ్ ఇచ్చి అభిషేక్ శర్మ (8) ఔటయ్యాడు. హరారే వేదికగా రెండో టీ20లో జింబాబ్వే-భారత్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రజా తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు.ఈ మ్యాచ్‌తో టీమిండియా తరపున యువ పేసర్ యాశ్ ఠాకూర్ అరంగేట్రం చేశాడు. అశోక్ శర్మ స్ధానంలో యశ్ ఠాకూర్‌కు అవకాశమిచ్చారు. జింబాబ్వే మాత్రం తమ తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు.తుది జట్లుభారత్: వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), తిలక్ వర్మ, రింకూ సింగ్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, ప్రిన్స్ యాదవ్, యశ్ ఠాకూర్, మయాంక్ యాదవ్జింబాబ్వే: బ్రియాన్ బెన్నెట్, బెన్ కర్రాన్, డియోన్ మైయర్స్, సికందర్ రజా(కెప్టెన్), ర్యాన్ బర్ల్, వెస్లీ మాధేవెరే, తడివానాషే మారుమణి(వికెట్ కీపర్), బ్రాడ్ ఎవాన్స్, న్యూమాన్ న్యామ్హురి, రిచర్డ్ నగరవ, బ్లెస్సింగ్ ముజారబానీ -
వారిద్దరూ జట్టులో ఎందుకు? గంభీర్‌పై మాజీ క్రికెటర్ ఫైర్
టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై భారత మాజీ చీఫ్ సెలెక్టర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ మరోసారి ఘూటు వ్యాఖ్యలు చేశారు. కోచ్‌గా గంభీర్ తీసుకుంటున్న నిర్ణయాలను ఆయన తప్పుబట్టారు. శివం దూబే, హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డి వంటి ఆటగాళ్లను మేనెజ్మెంట్ ఆల్రౌండర్లుగా పరిగణించడం పట్ల శ్రీకాంత్ అసహనం వ్యక్తం చేశారు. "శివమ్ దూబే, హర్షిత్ రాణాలను ఆల్రౌండర్లుగా పరిగణించలేం. ఒకవేళ వారిద్దరిని ఆల్‌రౌండర్లు అంటే నేను కూడా గొప్ప ఆల్‌రౌండర్ అని చెప్పుకోవచ్చు. హార్దిక్ పాండ్యా ఒక్కడే అసలైన ఆల్‌రౌండర్. నితీష్ కుమార్ రెడ్డి హాఫ్ ఆల్‌రౌండర్. అతడు 7వ స్థానంలో బ్యాటింగ్ చేస్తూ కొన్ని ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేయగలడు. ఇప్పటికైనా మేనెజ్మెంట్ సరైన ఆల్రౌండర్లను జట్టులోకి తీసుకోవాలని" శ్రీకాంత్ పేర్కొన్నారు. అదేవిధంగా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ కచ్చితంగా వన్డే ప్రపంచకప్ జట్టులో ఉండాలని ఆయన సూచించారు.కాగా యూకే పర్యటనలో భారత జట్టు వరుసగా మూడు సిరీస్‌లు కోల్పోవడంతో గంభీర్‌పై తీవ్రస్ధాయిలో విమర్శలు వచ్చాయి. బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లోనూ టీమిండియా విఫలమైంది. జట్టులో హార్దిక్ పాండ్యా లేని లోటు స్పష్టంగా కనిపించింది. శివమ్ దూబే ఉన్నప్పటికి ఆశించిన స్ధాయిలో రాణించలేకపోయాడు.చదవండి: AFG vs IRE: అఫ్గానిస్తాన్ జట్టు ప్రకటన.. స్టార్ ప్లేయర్ వేటు -
వైభవ్ సూర్యవంశీపై బీసీసీఐ సంచలన ప్రణాళిక
టీమిండియా బ్యాటింగ్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై బీసీసీఐ సంచలన ప్రణాళిక రచిస్తున్నట్లు తెలుస్తోంది. వైభవ్‌ను భవిష్యత్తులో ఆల్‌రౌండర్‌గా తీర్చిదిద్దాలని భారత క్రికెట్ బోర్డు యోచిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు భారత స్టాండ్-ఇన్ బౌలింగ్ కోచ్ సునీల్ జోషి ఇటీవల మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు.15 ఏళ్ల వైభవ్ ఐపీఎల్ 2026లో రికార్డు స్థాయి ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు. అనంతరం ఇంగ్లండ్‌తో సిరీస్‌లో సీనియర్ జట్టు తరఫున అరంగేట్రం చేసినప్పటికీ, ఆశించిన ప్రభావం చూపలేకపోయాడు. అయితే జింబాబ్వేతో జరిగిన తొలి టీ20లో కేవలం 18 బంతుల్లోనే అర్ధసెంచరీ నమోదు చేసి, తన సత్తా మరోసారి రుజువు చేసుకున్నాడు.బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌పైనా దృష్టివైభవ్లో బౌలింగ్ సామర్థ్యం కూడా ఉందని, సమయం లభించిన ప్రతిసారీ బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో అతనితో ప్రత్యేకంగా పని చేస్తామని జోషి తెలిపారు. బౌలింగ్‌లో మెరుగుదల కనిపించిన వెంటనే దానిపై పూర్తి దృష్టి సారిస్తామని ఆయన స్పష్టం చేశారు.అయితే ప్రస్తుతానికి బ్యాటింగ్‌పైనే ప్రధానంగా దృష్టి పెట్టాలని, హరారే మైదానం వైభవ్‌కు కలిసొచ్చే ప్రాంతమని, గతంలో అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లోనూ ఇక్కడ మెరుగైన ప్రదర్శన కనబరిచారని జోషి గుర్తుచేశారు.కాగా, జోషి చేసిన ఈ వ్యాఖ్యలను బట్టి చూస్తే.. వైభవ్‌ను తొందరపడి అంతర్జాతీయ స్థాయిలో బౌలర్‌గా వినియోగించే ఆలోచనలో లేదని, దశలవారీగా పార్ట్‌టైమ్ ఆల్‌రౌండర్‌గా తీర్చిదిద్దాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.బౌలింగ్ అనుభవంవైభవ్ ఎడమచేతి ఆఫ్ స్పిన్నర్‌గా పార్ట్‌టైమ్ బౌలింగ్ చేస్తాడు. డొమెస్టిక్ క్రికెట్లో అతని బౌలింగ్ అనుభవం పరిమితం. ఫస్ట్-క్లాస్ క్రికెట్లో అతని ఖాతాలో కేవలం రెండు వికెట్లు మాత్రమే ఉన్నాయి. లిస్ట్-ఏ క్రికెట్లో మూడు ఇన్నింగ్స్‌లు బౌలింగ్ చేసి 56 పరుగులు ఇచ్చాడు. టీ20ల్లో రెండు మ్యాచ్‌ల్లో బౌలింగ్ చేసినప్పటికీ ఒక్క వికెట్ కూడా దక్కలేదు. ఐపీఎల్లో ఇప్పటివరకు ఒక్కసారి కూడా బౌలింగ్ చేసిన దాఖలాలు లేవు.మొత్తంగా బౌలింగ్‌లో దాదాపు అనుభవం లేని వైభవ్‌ను సరైన శిక్షణతో తీర్చిదిద్దగలిగితే, భారత జట్టు కూర్పుకు మరింత వైవిధ్యం చేకూరే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో ఆల్రౌండర్లకు పెరుగుతున్న ప్రాధాన్యం దృష్ట్యా ఈ నిర్ణయం ఆశ్చర్యకరం కాదని కథనాలు పేర్కొంటున్నాయి.నేడే రెండో టీ20భారత్-జింబాబ్వే మధ్య జరుగుతున్న సిరీస్‌లో రెండో టీ20 నేడు (జులై 25, శనివారం) హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరగనుంది.ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం సాయంత్రం 4:30 గంటలకు ప్రారంభం కానుంది. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్ తొలి టీ20 గెలిచి 1-0 ఆధిక్యంలో కొనసాగుతోంది. -
అఫ్గానిస్తాన్ జట్టు ప్రకటన.. స్టార్ ప్లేయర్ వేటు
ఐర్లాండ్‌తో జరగనున్న ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు (ACB) 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ప్రకటించింది. ఈ సిరీస్‌తో రహమత్ షా అఫ్గానిస్తాన్ కెప్టెన్‌గా తన ప్రయణాన్ని ప్రారంభించనున్నాడు. హస్మతుల్లా షాహిది కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో ఆ బాధ్యతలను రహమత్‌కు ఏసీబీ అప్పగించింది. ఇక గత నెలలో భారత్‌లో జరిగిన వన్డే సిరీస్‌కు దూరమైన సీనియర్ ఫాస్ట్ బౌలర్ ఫజల్హాక్ ఫరూఖీ తిరిగి జట్టులోకి వచ్చాడు. అయితే స్టార్ ఆల్‌రౌండర్ మహ్మద్ నబీపై మాత్రం అఫ్గాన్ సెలక్షన్ కమిటీ వేటు వేసింది. అతడి స్దానంలో యామిన్ అహ్మద్‌జాయ్‌కి పిలుపునిచ్చారు. అహ్మద్జాయ్ చివరగా అక్టోబర్ 2025లో అఫ్గాన్ తరపున ఆడాడు. ఈ జట్టులో అజ్మతుల్లా ఓమర్జాయ్, రషీద్ ఖాన్ వంటి సీనియర్ ప్లేయర్లు ఉన్నారు. ఈ సిరీస్ వచ్చే నెలలో ఆగస్టు 5 నుండి ఆగస్టు 14 మధ్య జరగనుంది. వన్డే ప్రపంచకప్-2027 సన్నాహకాల్లో భాగంగా ఈ సిరీస్ జరగనుంది. అఫ్గానిస్తాన్ గత నెలలో భారత్‌లో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో 0-3తో ఘోర పరాజయాన్ని చవిచూసింది. అయితే అంతకుముందు అబుదాబిలో బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో మాత్రం 3-0 తేడాతో అఫ్గాన్ విజయం సాధించింది.చదవండి: IND vs ZIM: ‘అతడొక సంచలనం.. బౌలింగ్ కూడా చేయిస్తాం’ -
ఫైనల్‌కు దూసుకెళ్లిన అనాహత్.. 21 ఏళ్ల రికార్డు బద్దలు
ప్రపంచ స్క్వాష్ జూనియర్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ అనాహత్ సింగ్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో అనాహత్ 3-1 (11-3, 8-11, 11-4, 11-6) తేడాతో మూడో సీడ్ బార్బ్ సమెహ్ (ఈజిప్ట్)పై విజయాన్ని అందుకుంది. తద్వారా 21 ఏళ్ల తర్వాత ప్రపంచ స్క్వాష్ జూనియర్ చాంపియన్‌షిప్ ఫైనల్ చేరిన రెండో క్రీడాకారిణిగా అనాహత్ సింగ్ రికార్డులకెక్కింది. 2005లో జోష్నా చినప్ప ఈ టోర్నీలో ఫైనల్ చేరిన తొలి క్రీడాకారిణిగా నిలిచింది. ఫైనల్ బెర్తు ఖరారు చేసుకున్న అనాహత్ ప్రపంచ స్క్వాష్ చాంపియన్‌షిప్‌లో వరుసగా రెండో ఏడాది కూడా పతకాన్ని ఖరారు చేసుకుంది. తద్వారా ఈ చాంపియన్‌షిప్ చరిత్రలో రెండు పతకాలు నెగ్గిన తొలి భారతీయ స్క్వాష్ ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పనుంది. గతేడాది కైరోలో జరిగిన ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్‌లో అనాహత్ సెమీఫైనల్లో ఓడిపోయి కాంస్యాన్ని సాధించింది. మ్యాచ్ విషయానికొస్తే నాలుగు గేమ్‌ల పాటు జరిగిన మ్యాచ్‌లో అనాహత్ తొలి గేమ్‌ను 11-3తో గెలుచుకోగా, రెండో గేమ్‌ను మాత్రం ప్రత్యర్థికి కోల్పోయింది. అయితే ఆ తర్వాత వరుసగా మూడు, నాలుగు గేముల్లో విజృంభించిన అనాహత్ గేమ్‌లతో పాటు మ్యాచ్‌ను కూడా కైవసం చేసుకుంది. మ్యాచ్ విజయం అనంతరం అనాహత్ మాట్లాడుతూ.. ‘ఈ ప్రదర్శన పట్ల చాలా సంతోషంగా ఉన్నా. బ్రిటీష్ జూనియర్ ఓపెన్‌లో ఇదే బార్బ్‌ను ఎదుర్కొన్నా, అప్పుడు పరిస్థితులు నాకు కఠినంగా ఉన్నాయి. కానీ ఈసారి ఆ తప్పిదం చేయకూడదని మొదటి నుంచి గెలుపు కోసమే ప్రయత్నించాను. అయితే క్వార్టర్స్‌లో నమోదు చేసిన ప్రదర్శనను ఇక్కడ పునరావృతం చేయడంలో విఫలమైనప్పటికీ సెమీస్‌లో విజయం నాకు సంతృప్తినిచ్చింది. ఫైనల్లో అడుగుపెట్టడం ద్వారా నా తల్లిదండ్రులను, కోచ్‌లను హ్యాపీ చేయగలిగాను. కానీ ఫైనల్ గెలిస్తేనే నాకు ముగింపు’ అని చెప్పుకొచ్చింది. ANAHAT SINGH STORMS INTO THE FINALS OF JUNIOR WORLD C’SHIP 🏆🤩India’s Anahat defeated Barb Sameh of Egypt 🇪🇬 3-1 (11-3, 8-11, 11-4, 11-6) in the Semi Final!She became the second ever Indian to reach into the World Junior C’ship Final ✅WELL DONE! 🔥 pic.twitter.com/2wEfv2sDAK— The Khel India (@TheKhelIndia) July 25, 2026Read: రెండో టీ20కి భారత తుదిజట్టు అంచనా.. అతడిపై వేటు! -
పాక్‌ను చిత్తుగా ఓడించిన భారత్
ఎఫ్ఐహెచ్ యూత్ హాకీ5స్ ఆసియా చాంపియన్‌షిప్‌లో భారత సబ్‌జూనియర్ బాలుర జట్టు చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై 7-3 తేడాతో ఘన విజయం సాధించింది. ఇదే రోజు ఆతిథ్య ఒమాన్‌ను 10-1తో చిత్తు చేసి వరుస విజయాలతో అదరగొట్టింది.పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో రోమిత్ పాల్, కరణ్ గౌతమ్, కెప్టెన్ కేతన్ కుష్వాహా తొలి అర్ధభాగంలోనే గోల్స్ చేసి భారత్‌కు 3-0 ఆధిక్యం అందించారు. అనంతరం ప్రహ్లాద్ రాజ్‌భర్, షారుఖ్ అలీ, రాహుల్ యాదవ్, కేతన్ కుష్వాహా మరోసారి గోల్స్ చేయడంతో భారత్ సునాయాసంగా విజయం సాధించింది.అంతకుముందు ఒమాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కేతన్ కుష్వాహా నాలుగు గోల్స్‌తో మెరవగా, షారుఖ్ అలీ, కరణ్ గౌతమ్, ప్రహ్లాద్ రాజ్‌భర్ తలో రెండు గోల్స్ చేసి భారత్‌కు 10-1 తేడాతో భారీ విజయాన్ని అందించారు.మరోవైపు బాలికల ఎలైట్ పూల్ మ్యాచ్‌లో భారత సబ్‌జూనియర్ జట్టు చైనాతో పోరాడినా 3-6 తేడాతో ఓటమి పాలైంది. తొలి అర్ధభాగం ముగిసే సమయానికి స్కోరు 3-3తో సమంగా ఉన్నప్పటికీ, రెండో అర్ధభాగంలో చైనా ఆధిపత్యం చెలాయించి విజయాన్ని అందుకుంది.ఈ టోర్నీ ద్వారా ప్రారంభ ఎఫ్ఐహెచ్ యూత్ హాకీ5స్ ప్రపంచకప్‌కు ఆసియా జట్ల ఎంపిక కూడా జరగనుంది. -
‘వైభవ్ సూర్యవంశీతో బౌలింగ్ కూడా చేయిస్తాం’
విధ్వంసకర బ్యాటింగ్‌కు పెట్టింది పేరు టీమిండియా చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ. ఒక్కసారి క్రీజులో కుదురుకోవాలే గానీ ప్రత్యర్థి జట్టు బౌలర్లకు పదిహేనేళ్ల ఈ పిల్లాడు చుక్కలు చూపిస్తాడు. అయితే, ఇంగ్లండ్‌తో అరంగేట్రంలో విఫలమైనా.. తాజాగా జింబాబ్వే పర్యటనలో మాత్రం ఈ లెఫ్టాండర్ బ్యాటర్ శుభారంభం అందుకున్నాడు.మెరుపు అర్ద శతకంహరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా గురువారం నాటి తొలి టీ20లో వైభవ్ పందమ్మిది బంతుల్లోనే అర్ధ శతకం బాదాడు. తద్వారా జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి తన విలువను చాటుకున్నాడు. ఈ నేపథ్యంలో టీమిండియా తాత్కాలిక బౌలింగ్ కోచ్ సునిల్ జోషి వైభవ్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు.అతడొక సంచలన బ్యాటర్భారత్- జింబాబ్వే మధ్య శనివారం రెండో టీ20 నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతూ.. ‘‘అతడొక సంచలన బ్యాటర్. తొలి మ్యాచ్‌లో అతడు అదరగొట్టాడు. హరారే స్పోర్ట్స్ క్లబ్ అంటే పూనకాలు వస్తాయి. నాలుగు నెలల క్రితం ఇక్కడే అండర్-19 వరల్డ్‌కప్ ఫైనల్లో ఇంగ్లండ్‌పై వైభవ్ భారీ శతకం (80 బంతుల్లో 175) బాదాడు.జింబాబ్వేతో తొలి టీ20లోనూ మెరుపులు మెరిపించాడు. వైభవ్ ప్రస్తుతం తన బ్యాటింగ్ విషయంలో ఎంతో సౌకర్యంగా కనిపిస్తున్నాడు. ఒకవేళ అతడు బౌలింగ్ చేయాల్సిన టైమ్ వస్తే బెంగళూరులోని సెంటర్ ఫర్ ఎక్సలెన్స్‌లో నేను అతడితో సాధన చేయిస్తాను.వైభవ్‌తో బౌలింగ్ కూడా చేయిస్తాంఅతడు బౌలింగ్‌లోనూ మెరిశాడంటే.. కచ్చితంగా మేము అతడి సేవలను ఉపయోగించుకునే అంశంపై తప్పక దృష్టి సారిస్తాం’’ అని సునిల్ జోషి తెలిపాడు. కాగా జింబాబ్వేతో తొలి టీ20లో ఏడు వికెట్ల తేడాతో గెలిచిన టీమిండియా 1-0తో ఆధిక్యంలో ఉంది. ఇరుజట్ల మధ్య శని, ఆది వారాల్లో మిగిలిన రెండు టీ20 మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఇందుకు కూడా హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదిక. దీంతో కళ్లన్నీ మరోసారి వైభవ్ సూర్యవంశీ మీదే కేంద్రీకృతమై ఉన్నాయి. చదవండి: తెలివితక్కువోడు తప్పిస్తే.. తానేంటో నిరూపించాడు! -
కామన్వెల్త్ క్రీడల్లో సరికొత్త చరిత్ర
దక్షిణాఫ్రికా స్టార్ స్విమ్మర్ చాడ్ లే క్లోస్ (Chad le Clos) కామన్వెల్త్ గేమ్స్‌లో చరిత్ర సృష్టించాడు. ఈ క్రీడల్లో అత్యధిక పతకాలు సాధించిన పురుష అథ్లెట్‌గా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. గ్లాస్గో వేదికగా జరుగుతున్న ప్రస్తుత ఎడిషన్‌లో (commonwealth Games 2026) ఈ ఘనత సాధించాడు.పురుషుల 4×100 మీటర్ల ఫ్రీస్టైల్ రిలేలో కాంస్య పతకం గెలవడంతో అతడు తన ఖాతాలో 19వ కామన్వెల్త్ పతకాన్ని నమోదు చేసుకున్నాడు. ఈ పతకంతో ఆస్ట్రేలియా షూటర్ ఫిల్ అడమ్స్, ఇంగ్లండ్ షూటర్ మిక్ గాల్ట్ పేరిట ఉన్న 18 పతకాల రికార్డును అధిగమించాడు.34 ఏళ్ల క్లోస్ ఇప్పటివరకు కామన్వెల్త్ గేమ్స్‌లో 7 స్వర్ణాలు, 4 రజతాలు, 8 కాంస్యాలు సహా మొత్తం 19 పతకాలు సాధించాడు. 2010లో న్యూఢిల్లీ కామన్వెల్త్ గేమ్స్‌తో అరంగేట్రం చేసిన అతడు అప్పుడే ఐదు పతకాలు గెలిచి సంచలనం సృష్టించాడు. రికార్డు పతకం సాధించిన అనంతరం క్లోస్ భావోద్వేగానికి గురయ్యాడు.ప్రస్తుత ఎడిషన్‌లో క్లోస్ పోటీలు ఇంకా ముగియలేదు. అతడు 50 మీటర్లు, 100 మీటర్ల బటర్‌ఫ్లై ఈవెంట్లలో బరిలోకి దిగాల్సి ఉంది. ఇప్పటికే ఒలింపిక్స్‌లో నాలుగు పతకాలు, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లలో 16 టైటిళ్లు గెలిచిన ఈ స్టార్ స్విమ్మర్.. 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌లోనూ పాల్గొనాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. -
IND vs ZIM: అతడు కోచ్‌గా ఉన్నాడంటే.. అన్నీ వైట్వాష్లే!
భారత టీ20 కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టిన తర్వాత శ్రేయస్ అయ్యర్‌కు తొలి ప్రయత్నంలోనే చేదు అనుభవం ఎదురైంది. యూకే పర్యటనలో భాగంగా అతడి సారథ్యంలో పసికూన ఐర్లాండ్ చేతిలో టీమిండియా 2-0తో వైట్‌వాష్‌కు గురైంది.అనంతరం ఇంగ్లండ్ గడ్డ మీద 4-0తో క్లీన్‌స్వీప్ అయింది. ఈ సిరీస్‌లో ఓ మ్యాచ్ వర్షం వల్ల రద్దైపోయింది. దీంతో కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలి ఏడు మ్యాచ్‌లలోనూ శ్రేయస్ అయ్యర్‌కు గెలుపన్నదే లేకుండా పోయింది. ఈ క్రమంలో జింబాబ్వే గడ్డ మీద తొలి మ్యాచ్ సందర్భంగా ఎట్టకేలకు శ్రేయస్ సేన విజయాల ఖాతా తెరిచింది.సమిష్టిగా రాణించి ఆతిథ్య జింబాబ్వే జట్టుపై ఏడు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. తద్వారా వరుస పరాభవాల తర్వాత శ్రేయస్ తొలిసారి గెలుపు రుచిచూశాడు. అయితే, జింబాబ్వేపై విజయాన్ని కూడా ఇంతలా సెలబ్రేట్ చేసుకోవాల్సిన పనిలేదంటూ కొంతమంది సోషల్ మీడియా వేదికగా విమర్శించారు.మిగిలిపోయిందైనా.. అది విందు భోజనం లాంటిదే!ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ సదగోపన్ రమేశ్ శ్రేయస్ అయ్యర్‌కు మద్దతుగా నిలిచాడు. ‘‘జింబాబ్వే మీద విజయాన్ని గొప్పగా భావించవద్దని చాలా మంది అంటున్నారు. అయితే.. టీ20 ప్రపంచకప్ చాంపియన్‌గా నిలిచిన తర్వాత టీమిండియా టీ20మ్యాచ్‌లో విజయం కోసం చకోర పక్షిలా ఎదురుచూసింది.చాన్నాళ్ల ఆకలి తర్వాత దక్కిన గెలుపు ఇది. కాబట్టి ఇది మిగిలిపోయిందే అయినా.. పెళ్లి భోజనం లాంటిదే. శ్రేయస్ అయ్యర్‌కు కాస్త ఊరట లభించింది. అతడి కెప్టెన్సీ ఆరంభంలోనే టీమిండియా ఘోర పరాజయాలు చవిచూసింది.కాబట్టి ఇప్పుడు జింబాబ్వే మీద గెలిచినా సరే.. అది విజయమే. ఇప్పుడు ఇదే అతడికి బూస్ట్’’ అని సదగోపన్ రమేశ్ పేర్కొన్నాడు. అదే విధంగా.. జింబాబ్వే టూర్లో గౌతం గంభీర్‌కు బదులు తాత్కాలిక హెడ్‌కోచ్‌గా వ్యవహరిస్తున్న వీవీఎస్ లక్ష్మణ్‌పై రమేశ్ ప్రశంసలు కురిపించాడు.వీవీఎస్ లక్ష్మణ్‌పై ప్రశంసలు‘‘ఈ విజయంలో వీవీఎస్ లక్ష్మణ్‌దే సింహభాగం. అతడు ఎప్పుడు కోచ్‌గా వ్యవహరించినా సరే.. అప్పుడు టీమిండియా తప్పక విజయాలు సాధిస్తుంది. అతడి మార్గదర్శనంలో టీమిండియా ప్రత్యర్థులను దాదాపుగా అన్ని సిరీస్‌లలోనూ వైట్‌వాష్ చేసింది.టీమిండియా వైట్‌వాష్‌లకు గురైన తర్వాత కూడా అతడు ఇలాంటి ఫలితాలు రాబట్టాడు. వరుస పరాజయాల తర్వాత ఇప్పుడు జింబాబ్వేతో తొలి మ్యాచ్‌లోనూ టీమిండియా గెలిచింది’’ అని రమేశ్ వీవీఎస్ లక్ష్మణ్‌ను ప్రశంసించాడు. కాగా జింబాబ్వేతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా గురువారం నాటి తొలి టీ20లో ఏడు వికెట్ల తేడాతో గెలిచి.. 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇరుజట్ల మధ్య శని, ఆది వారాల్లో మిగిలిన రెండు మ్యాచ్‌లు జరుగుతాయి. ఇందుకు హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదిక.చదవండి: తెలివితక్కువోడు తప్పిస్తే.. తానేంటో నిరూపించాడు! -
జింబాబ్వేతో రెండో టీ20.. అభిషేక్‌పై వేటు పడనుందా!
హరారే వేదికగా ఇవాళ జింబాబ్వేతో రెండో టీ20 మ్యాచ్‌కు సిద్ధమైన టీమిండియా సిరీస్ విజయంపై కన్నేసింది. తొలి టీ20 మ్యాచ్‌లో బౌలర్ల సమిష్టి ప్రదర్శనకు తోడు వైభవ్ సూర్యవంశీ విధ్వంసం తోడవ్వడంతో టీమిండియా సునాయాస విజయాన్ని అందుకొని మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. మరోసారి అదే వేదికలో మ్యాచ్ ఆడుతుండడంతో, రెండో టీ20లోనూ దాదాపు అదే జట్టుతో బరిలోకి దిగే అవకాశముంది. అయితే ఓపెనింగ్‌లో లెఫ్ట్, రైట్ కాంబినేషన్ అనుకుంటే మాత్రం తొలి టీ20లో ఒక్క పరుగు మాత్రమే చేసిన అభిషేక్ శర్మను తప్పించి అతడి స్థానంలో ప్రబ్సిమ్రన్ను ఆడించే అవకాశముంది.ఇది మినహా జట్టులో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. మూడో స్థానంలో హార్డ్ హిట్టర్ ఇషాన్ కిషన్ రానుండగా, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు రానున్నాడు. ఆ తర్వాత మిడిలార్డర్లో తిలక్ వర్మ, రింకూ సింగ్ బాధ్యతలు తీసుకోనున్నారు. ఫినిషర్‌గా శివమ్ దూబే తన పాత్రకు న్యాయం చేస్తున్నాడు.ఇక బౌలింగ్ విషయానికొస్తే రెండేళ్ల తర్వాత టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన మయాంక్ తాను ఆడిన తొలి మ్యాచ్‌లోనే ప్రభావం చూపించాడు. మయాంక్ యాదవ్‌తో పాటు ప్రిన్స్ యాదవ్, అశోక్ శర్మలతో పేస్ బౌలింగ్ లైనప్ బలంగా ఉంది. ఇక స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా రవి బిష్ణోయి మరోసారి కీలకంగా మారనున్నాడు. టీమిండియా ఆరుగురు స్పెషలిస్ట్ బ్యాటర్లు, నలుగురు బౌలర్లు, ఒక ఆల్‌రౌండర్ కాంబినేషన్‌తో రెండో టీ20లో బరిలోకి దిగనుంది.భారత తుదిజట్టు అంచనా: వైభవ్ సూర్యవంశీ, ప్రబ్సిమ్రాన్ సింగ్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, రింకూ సింగ్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, ప్రిన్స్ యాదవ్, అశోక్ శర్మ, మయాంక్ యాదవ్. -
అక్కడే మేం గెలిచాం.. ఆసీస్ సిరీస్‌పై బంగ్లా కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఆస్ట్రేలియాతో జరుగబోయే రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు ముందు బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ శాంటో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ సిరీస్ కోసం క్రికెట్ ఆస్ట్రేలియా తమ అత్యుత్తమ జట్టును ప్రకటించడం బంగ్లాదేశ్ క్రికెట్‌కు గౌరవకరమైన విషయమని పేర్కొన్నాడు. ఈ సిరీస్‌ను ఆస్ట్రేలియా ఏమాత్రం తేలికగా తీసుకోవడం లేదని అభిప్రాయపడ్డాడు."గతంలో మా జట్టుతో ఆడేటప్పుడు ప్రత్యర్థులు తరచూ ప్రయోగాలు చేసేవారు. కానీ ఈసారి ఆస్ట్రేలియా పూర్తి బలంతో కూడిన జట్టును పంపడం మా జట్టు సాధించిన గుర్తింపుగా భావిస్తున్నాను. ఇది ప్రపంచ స్థాయి జట్టుతో మా సామర్థ్యాన్ని నిరూపించుకునే గొప్ప అవకాశం" అని శాంటో అన్నాడు.ఆస్ట్రేలియా జట్టులో స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్, ట్రావిస్ హెడ్, మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్, స్కాట్ బోలాండ్, నాథన్ లియాన్, కామెరూన్ గ్రీన్, బో వెబ్‌స్టర్ వంటి స్టార్ ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారు.అయితే సిరీస్‌కు ముందు బంగ్లాదేశ్‌కు గాయాల సమస్యలు వెంటాడుతున్నాయి. వికెట్‌కీపర్ బ్యాటర్ లిట్టన్ దాస్ ఇంకా కాఫ్ గాయం నుంచి కోలుకోలేదు. అలాగే ఫాస్ట్ బౌలర్లు నహీద్ రానా (సైడ్ స్ట్రెయిన్), షోరిఫుల్ ఇస్లాం (హామ్‌స్ట్రింగ్ గాయం) కూడా ఫిట్నెస్ సమస్యలతో బాధపడుతున్నారు.మరో పేసర్ ఎబాదోత్ హొస్సేన్ ఇటీవలే జన్మించిన తన బిడ్డతో ఉండేందుకు ఈ సిరీస్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. అయితే అవసరమైతే తిరిగి జట్టుతో చేరే అవకాశముందని సమాచారం.తొలి టెస్ట్ డార్విన్ వేదికగా ఆగస్టు 13-17 వరకు, రెండో టెస్ట్ మెక్కే వేదికగా ఆగస్టు 22-26 మధ్య జరగనుంది. దీనికి ముందు పర్యాటక బంగ్లాదేశ్ క్రికెట్ ఆస్ట్రేలియా ఎలెవెన్‌తో ఓ మూడు రోజుల వార్మప్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ ఆగస్టు 6-8 వరకు డార్విన్ వేదికగా జరుగనుంది. -
ఇంగ్లండ్ గడ్డ మీద సత్తా చాటిన టీమిండియా స్టార్
టీమిండియా స్టార్ క్రికెటర్ కుల్దీప్ యాదవ్ ఇంగ్లండ్ గడ్డ మీద సత్తా చాటాడు. దేశీ వన్డే కప్ మ్యాచ్‌లో రెండు వికెట్లు పడగొట్టి.. యార్క్‌షైర్ విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. కాగా అఫ్గానిస్తాన్‌తో స్వదేశంలో చివరగా వన్డే సిరీస్‌లో పాల్గొన్నాడు కుల్దీప్.మేనేజ్మెంట్ తీరుపై విమర్శలుఅయితే, మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ఈ చైనామన్ స్పిన్నర్‌కు ఒకే ఒక్క మ్యాచ్ ఆడే అవకాశం వచ్చింది. ఆ తర్వాత ఇంగ్లండ్ పర్యటనకు ఎంపికైనా ఒక్క వన్డేలోనూ ఆడించకుండా.. కుల్దీప్ను బెంచ్‌కే పరిమితం చేసింది యాజమాన్యం. ఈ నేపథ్యంలో టీమిండియా మేనేజ్మెంట్ తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి.ముఖ్యంగా లార్డ్స్‌లో చివరిదైన, నిర్ణయాత్మక మూడో వన్డేలో కుల్దీప్ యాదవ్‌ను ఆడిస్తే ఫలితం వేరేలా ఉండేదన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ తమ పార్ట్ టైమ్ స్పిన్నర్ల సేవల్ని ఉపయోగించుకుని గెలుపొంది.. సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది.ఒకే ఓవర్లో రెండు వికెట్లతో సత్తాఇదిలా ఉంటే.. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో ఆడే అవకాశం పొందలేని కుల్దీప్ యాదవ్.. ఆ వెంటనే కౌంటీ ఫ్రాంఛైజీ యార్క్‌షైర్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ క్రమంలో రాయల్ వన్డే కప్-2026లో భాగంగా శుక్రవారం గ్లామోర్గాన్‌తో యార్క్‌షైర్ తరఫున కుల్దీప్ అరంగేట్రం చేశాడు.ఈ మ్యాచ్‌లో ఒకే ఓవర్లో రెండు వికెట్లతో సత్తా చాటాడు కుల్దీప్. మొత్తంగా పది ఓవర్ల కోటా పూర్తి చేసిన ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్ మొదటి తొమ్మిది ఓవర్లలో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. అయితే, తన ఆఖరి ఓవర్లో అలెక్స్ హోర్టాన్, జేమీ మెక్‌రాయ్ వికెట్లు తీశాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 10 ఓవర్లలో 39 పరుగులే ఇచ్చి రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.యార్క్‌షైర్ విజయంఇక యార్క్‌షైర్‌కు చెందిన మీడియం పేసర్ బెంజమిన్ క్లిఫ్ కేవలం 29 పరుగులే ఇచ్చి నాలుగు వికెట్లతో చెలరేగాడు. ఫలితంగా గ్లామోర్గాన్ 186 పరుగులకే పరిమితం కాగా.. లక్ష్య ఛేదనలో యార్క్‌షైర్ రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది.మరోవైపు.. నార్తాంప్టన్ తరఫున కెంట్ జట్టుపై టీమిండియా వెటరన్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ కూడా రెండు వికెట్లు తీశాడు. అయితే, ఈ మ్యాచ్‌లో నార్తాంప్టన్ ఐదు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.చదవండి: తెలివితక్కువోడు తప్పిస్తే.. తానేంటో నిరూపించుకున్నాడు! -
భారత్‌లో పర్యటించనున్న బ్రెజిల్ ఫుట్‌బాల్ జట్టు..?
భారత్‌లో ఫుట్‌బాల్ అభిమానులకు శుభవార్త అందే అవకాశం కనిపిస్తోంది. ఐదు సార్లు ప్రపంచ ఛాంపియన్ బ్రెజిల్ జాతీయ ఫుట్‌బాల్ జట్టు ఈ ఏడాది అక్టోబర్‌లో భారత్‌లో ఓ అంతర్జాతీయ స్నేహపూర్వక మ్యాచ్ ఆడే దిశగా చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.బ్రెజిల్ ఫుట్‌బాల్ సమాఖ్య (CBF) ఇప్పటికే సెప్టెంబర్ 25న టౌన్స్‌విల్లే, సెప్టెంబర్ 29న బ్రిస్బేన్‌లో ఆస్ట్రేలియాతో రెండు మ్యాచ్‌లు ఖరారు చేసింది. వీటికి అదనంగా అక్టోబర్ తొలి వారంలో భారత్‌లో మరో ఫ్రెండ్లీ మ్యాచ్ నిర్వహించే అంశంపై చర్చలు కొనసాగుతున్నాయని ESPN Brasil వెల్లడించింది. ఈ మ్యాచ్‌కు ప్రత్యర్థి జట్టును ఇంకా ఖరారు చేయలేదు.ఈ మ్యాచ్‌కు కోల్‌కతా వేదికగా ఎంపికయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు నివేదిక పేర్కొంది. 2026 ఫిఫా ప్రపంచకప్ సందర్భంగా అమెరికాలో జరిగిన చర్చల తర్వాత ఈ ప్రణాళిక రూపుదిద్దుకుందని సమాచారం.ప్రపంచకప్ సమయంలో కోల్‌కతాలో వేలాది మంది అభిమానులు బ్రెజిల్ జెర్సీలు ధరించి సందడి చేయడం.. నెయ్మార్, వినీసియస్ జూనియర్ చిత్రాలతో నగరం కళకళలాడడం CBF దృష్టిని ఆకర్షించిందని తెలుస్తోంది.అన్ని చర్చలు విజయవంతంగా పూర్తైతే, తుది ఒప్పందంపై సంతకాలు జరిగి బ్రెజిల్ జట్టు భారత్‌లో అడుగుపెట్టే అవకాశం ఉంది. దీంతో భారత ఫుట్‌బాల్ అభిమానులకు ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజాలను ప్రత్యక్షంగా చూసే అరుదైన అవకాశం లభించనుంది. -
30 ఏళ్లకే వీడ్కోలు.. ఊహించని ట్విస్ట్‌తో మాజీ చాంప్ రీఎంట్రీ!
మాజీ యూఎస్ ఓపెన్ చాంపియన్, ఆస్ట్రియా మాజీ టెన్నిస్ ప్లేయర్ డొమినిక్ థీమ్ మళ్లీ గ్రౌండ్లో అడుగుపెట్టనున్నాడు. కెరీర్ పీక్ దశలో ఉన్నప్పుడే 30 ఏళ్ల వయసులో థీమ్ అనూహ్యంగా టెన్నిస్‌కు గుడ్‌బై చెప్పి క్రీడా ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేశాడు. అయితే రెండేళ్ల తర్వాత మాజీ చాంపియన్ రీఎంట్రీ ఇస్తున్నప్పటికీ ఇక్కడే ఊహించని ట్విస్ట్ ఒకటి దాగుంది. అదేంటంటే థీమ్ ఈసారి టెన్నిస్ ప్లేయర్‌గా కాకుండా ఫుట్‌బాలర్‌గా అడుగుపెట్టనుండడమే!Photo Credit: Twitterఆస్ట్రియా ఫుట్‌బాల్ లీగ్‌లో డొమినిక్ థీమ్ మ్యాచ్‌లు ఆడేందుకు సిద్ధమయ్యాడు. పలు నివేదికలు అందించిన సమాచారం మేరకు డొమినిక్ థీమ్ ఇప్పటికే ఆస్ట్రియాకు చెందిన అమెచ్యూర్ ఫుట్‌బాల్ క్లబ్ అయిన బాడెనర్ ఏసీ తరఫున తన పేరును రిజిస్టర్ చేయించుకున్నట్లు తెలుస్తోంది. టెన్నిస్‌కు రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత తన హోమ్టౌన్ క్లబ్ ఎస్సీ లిచ్టెన్వర్త్ (బాడెనర్ క్లబ్లో జాయిన్ కాకముందు) తరఫున పది మ్యాచ్‌లు ఆడిన డొమినిక్ థీమ్ ఒక గోల్ కూడా చేయడం విశేషం. టెన్నిస్‌లో స్టార్ ఆటగాడి హోదా పొందినప్పటికీ, ఫుట్‌బాల్‌లో మాత్రం ఒక సాధారణ ప్లేయర్‌గా కొనసాగుతున్నాడు. అందుకే అతడు ప్రాతినిధ్యం వహిస్తున్న ఫుట్‌బాల్ క్లబ్ కూడా ఇప్పటికీ డ్రెసింగ్ రూమ్‌లో ప్రత్యేక లాకర్ లేదా ఇతర సదుపాయాలు ఇవ్వలేదు.Photo Credit: Twitterవరుస గాయాలతో వీడ్కోలు..2020 యూఎస్ ఓపెన్ చాంపియన్‌గా నిలిచిన డొమినిక్ థీమ్ 2024లో టెన్నిస్‌కు వీడ్కోలు పలికాడు. అప్పటికీ 30 ఏళ్ల వయసు మాత్రమే ఉన్న డొమినిక్ థీమ్ అనూహ్యంగీ వీడ్కోలు పలకడం వెనుక వరుస గాయాలు అతడిని ఇబ్బంది పెట్టడమే. 2020లో యూఎస్ ఓపెన్ గెలిచిన తర్వాత 2021లో ఏడుసార్లు మణికట్టు గాయానికి గురవ్వడంతో రెండేళ్ల పాటు ఆటకు దూరమవ్వాల్సి వచ్చింది. Photo Credit: Twitterకెరీర్లో పీక్ ఫామ్‌లో ఉన్న సమయంలో వరుస గాయాలకు తోడు 2024లో యూఎస్ ఓపెన్‌లో తొలి రౌండ్లోనే డొమినిక్ థీమ్ ఇంటిబాట పట్టాడు. దీంతో టెన్నిస్‌కు వీడ్కోలు పలకాలని ఆరోజే నిర్ణయం తీసుకున్నాడు. ఇక వియన్నా ఓపెన్‌లో తొలి రౌండ్లో ఇటలీకి చెందిన లూసియానో దార్దేరి చేతిలో రెండు సెట్లలోనే డొమినిక్ థీమ్ పరాజయం చవిచూశాడు. టెన్నిస్‌లో థీమ్‌కు ఇదే ఆఖరి మ్యాచ్ కావడం విశేషం. 30 ఏళ్ల వయసులో పీక్ ఫామ్‌లో ఉన్నప్పుడు వరుస గాయాలు ఇబ్బంది పెట్టడంతో టెన్నిస్‌ను వదిలేసిన డొమినిక్ థీమ్ రెండేళ్ల తర్వాత సరికొత్తగా మారి ఫుట్‌బాల్ ఆటలో అడుగుపెడుతున్నాడు. మరి ఫుట్‌బాల్‌లో డొమినిక్ థీమ్ మెరుస్తాడా లేదా అన్నది చూడాలి.చదవండి: ‘హ్యాండ్‌షేక్’ వివాదం.. రెండు నెలల తర్వాత నోరు విప్పిన హెడ్! -
తెలివితక్కువోడు తప్పిస్తే.. తానేంటో నిరూపించాడు!
జింబాబ్వే గడ్డపై టీమిండియా చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ సత్తా చాటాడు. ఆతిథ్య జట్టుతో తొలి టీ20 మ్యాచ్‌లో కేవలం పందొమ్మిది బంతుల్లోనే అర్ధ శతకంతో విధ్వంసం సృష్టించాడు. జింబాబ్వే బౌలర్లను ఉతికారేస్తూ పరుగులు పిండుకున్నాడు. తద్వారా జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.ఇంగ్లండ్ గడ్డ మీద అరంగేట్రంఈ నేపథ్యంలో భారత మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ వైభవ్ సూర్యవంశీపై ప్రశంసలు కురిపించాడు. అదే సమయంలో టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. కాగా భారత అండర్-19, ఐపీఎల్లో సత్తా చాటిన వైభవ్.. పదిహేనేళ్ల వయసులోనే టీమిండియాకు ఎంపికైన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌లో వైభవ్‌తో అరంగేట్రం చేయిస్తారనుకుంటే.. మేనేజ్మెంట్ అక్కడ ఈ పిల్లాడికి అవకాశం ఇవ్వలేదు. అయితే, ఐర్లాండ్‌తో రెండు టీ20లు, ఇంగ్లండ్‌తో తొలి టీ20 మ్యాచ్‌లో విఫలమైన తర్వాత సంజూ శాంసన్‌ను తప్పించి.. అతడి స్థానంలో వైభవ్ సూర్యవంశీని ఆడించారు.మూడు మ్యాచ్‌లలో విఫలం ఇంగ్లండ్‌తో రెండో టీ20 సందర్భంగా అరంగేట్రం చేసిన వైభవ్ సూర్యవంశీ.. వరుసగా మూడు మ్యాచ్‌లలో 14, 13, 15 పరుగులు చేసి విఫలమయ్యాడు. దీంతో ఐదో టీ20 నుంచి ఈ లెఫ్టాండర్ బ్యాటర్‌ను తప్పించి మళ్లీ సంజూనే ఆడించారు. అయితే, జింజాబ్వే పర్యటనకు ఎంపికైన జట్టులో సంజూ లేకపోవడంతో.. వైభవ్‌కు ఓపెనర్‌గా అవకాశం దక్కింది.ఈ క్రమంలో జింబాబ్వేతో హరారే వేదికగా గురువారం నాటి తొలి టీ20లో వైభవ్ సూర్యవంశీ మెరుపు ఫిఫ్టీతో అలరించాడు. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ ఒక్క పరుగుకే వెనుదిరిగినా.. ఈ బిహారీ పిల్లాడు దూకుడుగా ఆడి జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించాడు.తెలివితక్కువ వాడు తప్పిస్తే.. తానేంటో చూపించాడు!ఈ పరిణామాల నేపథ్యంలో క్రిష్ణమాచారి శ్రీకాంత్ మాట్లాడుతూ వైభవ్‌ను ప్రశంసిస్తూ.. గంభీర్‌ను విమర్శించాడు. ‘‘సూర్యవంశీ అద్భుతమైన షాట్లతో అలరించాడు. షాట్ సెలక్షన్లో ఒక్క పొరపాటు కూడా చేయలేదు. ఈ పిల్లాడు చాలా ప్రత్యేమని అందుకే అంటాను.అయినా ఇంగ్లండ్‌తో మూడు మ్యాచ్‌లలో విఫలం కాగానే.. గౌతం గంభీర్ తెలివితక్కువతనంతో అతడిని జట్టు నుంచి ఎలా తప్పిస్తాడు?.. గంభీర్ నిర్ణయం వల్ల ఆ పిల్లాడి ఆత్మవిశ్వాసం దెబ్బతినదా?అయితే, అందరిలా అతడు కుంగిపోలేదు. ఇంగ్లండ్‌తో సిరీస్ ముగిసిన వెంటనే.. ఇంటికి వెళ్లకుండా తన ఐపీఎల్ జట్టు రాజస్తాన్ రాయల్స్ క్యాంపునకు వెళ్లాడు. అక్కడ తన బ్యాటింగ్‌లో.. ముఖ్యంగా షార్ట్ బాల్ ఆడటంలో ఎదురైన సవాళ్లకు పరిష్కారం కనుగొనేలా తీవ్రంగా ప్రాక్టీస్ చేశాడు.అంకిత భావానికి సెల్యూట్నిజంగా వైభవ్ అంకిత భావానికి సెల్యూట్. తన బ్యాటింగ్ లోపాల్ని సరిచేసుకుని జింబాబ్వేలో సత్తా చాటాడు. తాను ఎందుకు స్పెషలో మరోసారి ఈ ప్రపంచానికి చాటిచెప్పాలనుకున్నాడు. చేసి చూపించాడు’’ అని క్రిష్ణమాచారి శ్రీకాంత్ పేర్కొన్నాడు. కాగా జింబాబ్వే పర్యటన నుంచి గంభీర్ విరామం తీసుకోగా.. వీవీఎస్ లక్ష్మణ్ టీమిండియా తాత్కాలిక హెడ్‌కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇక ఆతిథ్య జట్టుతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి టీ20 గెలిచిన భారత్.. 1-0తో ముందంజలో ఉంది.చదవండి: బీసీసీఐ ఉపాధ్యక్షుడి కీలక వ్యాఖ్యలు -
‘హ్యాండ్‌షేక్’ వివాదం.. రెండు నెలల తర్వాత నోరు విప్పిన హెడ్!
ఐపీఎల్ 2026 సీజన్ సమయంలో విరాట్ కోహ్లి, ట్రావిస్ హెడ్ల మధ్య షేక్ హ్యాండ్ ఘటన ఎంత పెద్ద వివాదంగా మారిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజాగా ఐపీఎల్ ముగిసిన రెండు నెలల తర్వాత హెడ్ 'హ్యాండ్‌షేక్' వివాదం ఘటనపై మౌనం వీడాడు. ఈ సంఘటన తర్వాత హెడ్, కోహ్లి మధ్య బంధం పూర్తిగా చెడిపోయిందంటూ వార్తలు కూడా వచ్చాయి. తాజాగా ఈ పుకార్లపై హెడ్ స్పందిస్తూ.. 'మా మధ్య ప్యాచ్-అప్ (రాజీ) చేసుకోవడానికి ఏమీ లేదు. కోహ్లితో నా సంబంధాలు ఎప్పటిలాగే సాధారణంగా ఉన్నాయి. మైదానంలో ఏం జరిగిందో అది లీగ్ ప్రక్రియలో భాగమే తప్ప, మా మధ్య ఎలాంటి వివాదం లేదు' అని స్పష్టం చేశాడు. అయితే మైదానంలో జరిగే విషయాలను ఒక ప్రొఫెషనల్ క్రికెటర్‌గా స్వీకరిస్తానని, కానీ సోషల్ మీడియాలో తన కుటుంబాన్ని టార్గెట్ చేయడం బాధించిందని హెడ్ ఆవేదన వ్యక్తం చేశాడు.'ఇలాంటి ఘటనలు క్రీడా ప్రపంచంలో సహజమేనని నేను, జెస్సికా ముందే గ్రహించాం. కానీ కొంతమంది పనిగట్టుకొని నా కుటుంబంపై అసభ్యకర కామెంట్లు చేయడం కాస్త ఇబ్బందిగా అనిపించింది. జెస్సికా ఈ పరిస్థితిపై చాలా పరిణితితో వ్యవహరించడంతోనే సమస్య పెద్దది కాలేదు. మరో ఐపీఎల్ వచ్చేసరికి ఇలాంటి సంఘటనలు అందరూ మర్చిపోతారు. కానీ ఇలాంటి విషయాలను సీరియస్‌గా తీసుకుంటున్న కొందరు మాత్రం అదే పనిగా ఆటగాళ్ల కుటుంబాలను సోషల్ మీడియా వేదికగా టార్గెట్ చేసి వేధించడం నిజంగా బాధాకరం.' అని హెడ్ విచారం వ్యక్తం చేశాడు.ఆరోజు ఏం జరిగింది?ఐపీఎల్ 2026 సీజన్లో మే 22న జరిగిన ఆర్సీబీ-ఎస్ఆర్హెచ్ మ్యాచ్‌లో ఇది చోటుచేసుకుంది. ఆర్సీబీ ఇన్నింగ్స్ 4వ ఓవర్లో వెంకటేష్ అయ్యర్ భారీ షాట్లు ఆడుతుండగా.. కోహ్లి హెడ్ పట్ల చాలా ఆగ్రహంగా ఉన్నట్లు కనిపించాడు. నువ్వే వచ్చి బౌలింగ్ చేయ్యి అంటూ సైగలు చేయడం కెమెరాల్లో స్పష్టంగా కనిపించింది. హెడ్ మాత్రం చిరునవ్వుతో స్పందించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.మ్యాచ్ అనంతరం ఆటగాళ్లు పరస్పరం హ్యాండ్షేక్లు చేసుకుంటుండగా.. కోహ్లి హెడ్ పట్ల మరోసారి అవమానకరంగా ప్రవర్తించాడు. కమిన్స్, అభిషేక్ శర్మలతో మాట్లాడి.. హెడ్ వద్దకు వచ్చేసరికి మాత్రం ఎలాంటి స్పందన లేకుండా ముందుకు సాగిపోయాడు. కోహ్లి ఇలా చేయడం అభిమానుల దృష్టిని ఆకర్షించింది. ఈ ఘటన అప్పట్లో వైరల్ అయింది.Look behind the whole SRH coaching staff, including Daniel Vettori and Muttiah Muralitharan, were watching Virat Kohli and Travis Head, expecting some drama and ready to stop a fight. 😳But Kohli didn’t shake hands, and everyone started laughing. 😂 pic.twitter.com/9F9pHwiC8T— Jeet (@JeetN25) May 23, 2026#ViratKohli 🆚 #TravisHead 🥵🤯Tensions rise in high voltage clash🔥#TATAIPL Race to Playoffs 2026 👉 #SRHvRCB | LIVE NOW ➡️https://t.co/52qPTW2gSO pic.twitter.com/JOiWaxNW6T— Star Sports (@StarSportsIndia) May 22, 2026Read: పాక్‌తో సిరీస్‌కు ఎంపిక.. ఆడేందుకు విండీస్ ప్లేయర్ నిరాకరణ! -
అది వాళ్ల నిర్ణయం: బీసీసీఐ ఉపాధ్యక్షుడి కీలక వ్యాఖ్యలు
టీమిండియా దిగ్గజ బ్యాటర్ రోహిత్ శర్మను ఉద్దేశించి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇప్పట్లో రోహిత్ రిటైర్ అయ్యే ప్రసక్తే లేదని స్పష్టం చేశాడు. కాగా ఇప్పటికే అంతర్జాతీయ టీ20, టెస్టులకు వీడ్కోలు పలికిన హిట్‌మ్యాన్ వన్డేల్లో కొనసాగుతున్నాడు.బ్యాట్‌తోనే సమాధానంవన్డే ప్రపంచకప్-2027 ఆడటమే లక్ష్యంగా రోహిత్ శర్మ ఫిట్నెస్ను కూడా మెరుగుపరచుకుని ముందుకు సాగుతున్నాడు. అయితే, ఇటీవల ఇంగ్లండ్‌తో లార్డ్స్‌లో జరిగిన వన్డేనే హిట్‌మ్యాన్ కెరీర్లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ అనే ప్రచారం జరిగింది.అయితే, ఇవన్నీ వట్టి ఊహాగానాలే అని తేలింది. ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో మెరుపు శతకం (138)తో చెలరేగి విమర్శకులకు రోహిత్ బ్యాట్‌తోనే సమాధానం ఇచ్చాడు. అంతేకాదు.. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ తాను ఇప్పట్లో రిటైర్ కానని.. తాను ఆడినంత కాలం ఇలాంటి వదంతులు వస్తూనే ఉంటాయని పేర్కొన్నాడు.నిప్పు లేనిదే పొగ రాదుబీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా సైతం రోహిత్ రిటైర్మెంట్ వార్తల్ని కొట్టిపారేశాడు. కానీ.. భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ మాత్రం.. ‘‘నిప్పు లేనిదే పొగ రాదు.. ఏదో జరిగే ఉంటుంది’’ అని అభిమానుల్లో సందేహాలు రేకెత్తించాడు. ఈ నేపథ్యంలో బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తాజాగా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.సెలక్టర్లదే అంతిమ నిర్ణయంయూపీ టీ20 లీగ్ మినీ వేలం కార్యక్రమానికి హాజరైన రాజీవ్ శుక్లా విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘మా జట్టులో రోహిత్ అంతర్భాగం. అతడి ఆట కొనసాగుతుంది. మీడియా, సోషల్ మీడియాలో రోహిత్ గురించి వస్తున్న వార్తలకు అసలు అర్థమే లేదు.ఇప్పట్లో అతడు రిటైర్ అయ్యే ప్రసక్తే లేదు. ప్రతి ఒక్కరికి తమ సొంత అభిప్రాయాలు ఉంటాయి. అయితే, జట్టులో ఎవరు ఉండాలి.. ఎవరిని తప్పించాలి అనే విషయంలో సెలక్టర్లదే అంతిమ నిర్ణయం’’ అని పేర్కొన్నాడు.ఇక ఐర్లాండ్, ఇంగ్లండ్‌లలో టీమిండియా వరుసగా మూడు సిరీస్‌లు కోల్పోయిన నేపథ్యంలో రాజీవ్ శుక్లా స్పందిస్తూ.. ‘‘టీమిండియా ప్రస్తుతం బాగానే ఆడుతోంది. మ్యాచ్‌లు గెలుస్తోంది. కాబట్టి ఇప్పట్లో నాయకత్వ బృందంలో మార్పులు చేయాల్సిన అవసరం అయితే లేదు’’ అని కుండబద్దలు కొట్టాడు.వరుస పరాజయాల తర్వాత..కాగా టీ20 సిరీస్‌లలో పసికూన ఐర్లాండ్ చేతిలో 2-0, ఇంగ్లండ్ చేతిలో 4-0తో టీమిండియా క్లీన్‌స్వీప్ అయిన సంగతి తెలిసిందే. అదే విధంగా ఇంగ్లండ్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లోనూ 1-2తో ఓటమిపాలైంది. దీంతో టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, హెడ్‌కోచ్ గౌతం గంభీర్, వన్డే కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌పై విమర్శలు రాగా.. రాజీవ్ శుక్లా మాత్రం తమ నాయకత్వ బృందానికి మద్దతుగా నిలవడం విశేషం. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం జింబాబ్వే పర్యటనలో ఉన్న భారత టీ20 జట్టు.. తొలి మ్యాచ్‌లో విజయం సాధించి.. మూడు టీ20ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది.చదవండి: బంగ్లాదేశ్ అడ్డుపుల్ల.. అఫ్గాన్‌కు షాక్! -
పాక్‌తో సిరీస్‌కు ఎంపిక.. ఆడేందుకు విండీస్ ప్లేయర్ నిరాకరణ!
పాకిస్తాన్‌తో టెస్టు సిరీస్‌కు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు శుక్రవారం జట్టును ప్రకటించింది. అయితే వ్యక్తిగత కారణాల రీత్యా విండీస్ బౌలర్ అల్జారీ జోసెఫ్ పాక్‌తో సిరీస్‌కు దూరమైనట్లు విండీస్ క్రికెట్ బోర్డు తెలిపింది. కానీ ఇక్కడే ఊహించని ట్విస్ట్ ఒకటి ఉంది. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లు ఆడడం తనకు ఇష్టం లేదన్న కారణంగానే, జట్టులోకి ఎంపిక చేసినప్పటికీ అల్జారీ జోసెఫ్ ఆడేందుకు నిరాకరించాడని విండీస్ కోచ్ డారెన్ సామీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అల్జారీ వ్యక్తిగత కారణాలతో సిరీస్ నుంచి తప్పుకోలేదని, పాక్‌తో మ్యాచ్‌లు ఆడేందుకు అతడు నిరాకరించడంతో జట్టు నుంచి తప్పించాల్సి వచ్చిందని సామీ పేర్కొన్నాడు. జోసెఫ్ లేకపోవడం విండీస్‌కు పెద్ద లోటు అని, కానీ తమ జట్టు పాక్‌పై రాణిస్తుందని సామీ ధీమా వ్యక్తం చేశాడు. జట్టు ఎంపిక అనంతరం కోచ్ డారెన్ సామీ మీడియాతో మాట్లాడాడు. జోసెఫ్ వ్యవహారంపై అసంతృప్తి వ్యక్తం చేసిన సామీ మాట్లాడుతూ.. ‘అల్జారీ జోసెఫ్ పాక్‌తో ఆడేందుకు నిరాకరించిన విషయం నా పరిధిలో లేదు. సెంట్రల్ కాంట్రాక్ట్‌లో ఉన్నఒక ఆటగాడు ఇలా జట్టు ఎంపికను తిరస్కరించే విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నా లేదా పరిష్కారాలు కనుగొనాలన్నా అది బోర్డు డైరెక్టర్లకే వదిలేస్తున్నా’ అని ఘాటుగా వ్యాఖ్యానించాడు. 29 ఏళ్ల అల్జారీ జోసెఫ్ ఇటీవలే గాయం నుంచి కోలుకున్నాడు. శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌లో ఆడాడు. రెండు మ్యాచులలో 6 వికెట్లు తీశాడు. ఇప్పటివరకు అల్జారీ జోసెఫ్ వెస్టిండీస్ తరఫున 42 టెస్టులు ఆడాడు. ఇందులో ఏకంగా 130 వికెట్లు పడగొట్టాడు. 87 వన్డేల్లో 141, 45 టీ20లలో 62 వికెట్లు తీశాడు. మూడు ఫార్మాట్లలోనూ కీలక ప్లేయర్‌గా కొనసాగుతున్నాడు. వెస్టిండీస్, పాక్ మధ్య తొలి టెస్టు శనివారం ప్రారంభం కానుంది. రెండో టెస్టు ఆగస్టు 2 నుంచి జరుగుతుంది. -
బంగ్లాదేశ్ అడ్డుపుల్ల.. ఆఫ్గన్‌తో టీ20 సిరీస్ వాయిదా?
టీమిండియాతో ఢిల్లీ వేదికగా చారిత్రక టీ20 సిరీస్ ఆడాలని భావించిన అఫ్గానిస్తాన్‌కు ఊహించని ట్విస్ట్ ఎదురైంది. సెప్టెంబర్‌లో జరగాల్సిన టీ20 సిరీస్ వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదే సమయంలో బంగ్లాదేశ్ కూడా తమ దేశంలో టీమిండియాతో వైట్‌బాల్ టూర్ ప్లాన్ చేయనుండడమే వాయిదాకు కారణమని తెలుస్తోంది. అయితే దీనిపై ఇరు దేశాల క్రికెట్ బోర్డులు అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. మరోవైపు అఫ్గానిస్తాన్‌లో రాజకీయ అస్థిరత కారణంగానే ఆ జట్టు తమ మ్యాచ్‌లను యూఏఈ లేదా భారత్ వేదికగా ఆడాలని నిర్ణయిం చుకుంది. ఈ నేపథ్యంలోనే టీమిండియాతో టీ20 సిరీస్‌కు ప్లాన్ చేసింది. ఢిల్లీ వేదికగా ప్టెంబర్ 13, 15, 17 తేదీల్లో మ్యాచ్‌ల షెడ్యూల్ కూడా విడుదల చేసింది. ఈ సిరీస్‌కు అఫ్గానిస్తాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తుండగా, సొంతగడ్డపై టీమిండియా పర్యాటక జట్టుగా మ్యాచ్‌లు ఆడనుండడం విశేషం.బంగ్లాదేశ్ అడ్డుపుల్ల..కొన్నాళ్ల కిందట భారత్‌తో అంటీముట్టనట్లుగా వ్యవహరించిన బంగ్లాదేశ్ ఇప్పుడు మాత్రం మనతో సంబంధాలు తిరిగి బలోపేతం చేసుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగా సౌతాఫ్రికా వేదికగా జరిగిన 18వ బ్రిక్స్ సమావేశాల్లోనూ బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రెహమాన్ భారత్‌తో దౌత్య సంబంధాలను మెరుగుపరుచుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలోనే క్రికెట్‌తోనే ఆ బంధాన్ని తిరిగి మొదలుపెట్టాలని బంగ్లా ప్రభుత్వం భావిస్తోంది. అందుకే సెప్టెంబర్ 1 నుంచి 13 మధ్య టీమిండియా తమ గడ్డపై ఆరు మ్యాచ్‌ల వైట్ బాల్ సిరీస్ (మూడు వన్డేలు, మూడు టీ20లు) ఆడేలా ఇప్పటికే బీసీసీఐకి ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. ఒకవేళ భారత ప్రభుత్వం నుంచి క్లియరెన్స్ వస్తే బీసీసీఐ బంగ్లాదేశ్ టూర్‌కు పచ్చజెండా ఉపనుంది. ఒకవేళ బీసీసీఐ ఆమోదం పొందితే మాత్రం అదే సమయంలో జరగాల్సిన ఆఫ్గన్‌తో టీ20 సిరీస్ వెనక్కి వెళ్లే అవకాశాలున్నాయి. సెప్టెంబర్ 24 నుంచి ఆసియా గేమ్స్ ఉండడం, ఆ తర్వాత సెప్టెంబర్ 27 నుంచి వెస్టిండీస్‌తో సిరీస్ ఉండడంతో అఫ్గానిస్తాన్‌తో సిరీస్ నిర్వహణపై సందేహాలు నెలకొన్నాయి. ఈ లెక్కన విండీస్‌తో సిరీస్ ముగిసిన తర్వాత అంటే నవంబర్‌లో ఆఫ్గన్‌తో టీ20 సిరీస్ ఆడే అవకాశముంటుంది.రాజకీయ వివాదం..బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు భారత్ ఆశ్రయం ఇవ్వడం నుంచి ఇరుదేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. బంగ్లాలోని యువత భారత్‌పై విష ప్రచారాలు చేస్తూ మతోన్మాద చర్యలకు పాల్పడ్డారు. దీంతో భారత ప్రభుత్వం బంగ్లాదేశ్ చర్యలను సీరియస్‌గా తీసుకుంది. ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందే భారత ప్రభుత్వం ఆదేశాలతో కేకేఆర్ జట్టు బంగ్లా బౌలర్ ముస్తాఫిజుర్‌ను తొలగించింది. దీంతో ఇరుదేశాల క్రికెట్ బోర్డుల మధ్య అగ్గి రాజుకుంది. ఈ నేపథ్యంలోనే భద్రతా కారణాలను సాకుగా చూపుతూ భారత్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్ ఆడలేమంటూ బంగ్లాదేశ్ నిర్ణయం తీసుకుంది. దీనిపై అప్పట్లో తీవ్ర విమర్శలు వ్యక్తమయినప్పటికీ బంగ్లా తన వైఖరిని మార్చుకోలేదు. దీంతో ఆ టోర్నీకి బంగ్లాదేశ్ దూరంగా ఉండిపోయింది. అయితే బంగ్లాదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల తర్వాత తారిక్ రెహమాన్ అధికారం చేపట్టిన తర్వాత భారత్‌తో సంబంధాల పునరుద్ధరణకు ప్రయత్నించారు.ఈ నేపథ్యంలోనే క్రికెట్ ద్వారా భారత్‌తో సంబంధాలు మెరుగుపరుచుకోవాలని తారిక్ రెహమాన్ ప్రభుత్వం భావిస్తోంది. మరి భారత ప్రభుత్వం బంగ్లాదేశ్ టూర్లో పాల్గొనేందుకు బీసీసీఐకి అనుమతి ఇస్తుందో లేదో చూడాలి.Read: బీసీసీఐ కొత్త అవార్డు.. తొలి క్రికెటర్‌గా తిలక్ వర్మ రికార్డు -
బీసీసీఐ కొత్త అవార్డు.. తొలి క్రికెటర్‌గా తిలక్ వర్మ రికార్డు
జింబాబ్వేతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో భాగంగా తొలి టీ20లో విజయం ద్వారా టీమిండియా వరుస ఓటములకు చెక్ పెట్టింది. ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే కట్టడి చేసిన భారత్ ఆ తర్వాత వైభవ్ విధ్వంసంతో సునాయాసంగా లక్ష్యాన్ని అందుకుంది. ఇవాళ హరారే వేదికగా రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను ఒడిసిపట్టాలని చూస్తోంది. ఇదిలా ఉంటే, జింబాబ్వే సిరీస్‌కు హెడ్‌కోచ్ గంభీర్‌కు విశ్రాంతినిచ్చిన సంగతి తెలిసిందే. అతడి స్థానంలో మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్‌ను మెంటార్‌గా జట్టుతో పంపించారు. తొలి టీ20లో విజయం తర్వాత వీవీఎస్ లక్ష్మణ్ డ్రెస్సింగ్ రూమ్‌లో విన్నింగ్ సందేశాన్ని ఇచ్చాడు. ఈ క్రమంలో మైదానంలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లకు డ్రెస్సింగ్ రూమ్‌లో అవార్డులు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. Photo Credit: BCCI Twitterఅయితే బీసీసీఐ ఇటీవల ‘బెస్ట్ యాటిట్యూడ్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు ప్రవేశపెట్టింది. తాజాగా ఈ అవార్డును తిలక్ వర్మ అందుకున్నాడు. తిలక్‌వర్మకు అవార్డు ఇవ్వడంపై లక్ష్మణ్ వివరణ ఇచ్చాడు. ‘గ్రౌండ్‌తో పాటు మైదానం వెలుపల కూడా తన నైపుణ్యంతో అద్భుత వైఖరి ప్రదర్శించినందుకు తిలక్ వర్మకు ఈ అవార్డు ఇస్తున్నట్లు’ లక్ష్మణ్ తెలిపాడు. ఈ నేపథ్యంలో బెస్ట్ యాటిట్యూడ్ అవార్డు అందుకున్న తొలి భారత క్రికెటర్‌గా తిలక్ వర్మ నిలిచాడు. తిలక్ వర్మ మాట్లాడుతూ.. ‘జట్టుకు నా నుండి ఏమి అవసరమో అది చేయడానికి నేను ఎల్లప్పుడూ ప్రయత్నిస్తాను, దానికోసం నా వంతు ఉత్తమ ప్రదర్శన ఇస్తాను. మరో విషయమేమిటంటే, నేను మైదానం వెలుపల చేసే కఠోర శ్రమ మైదానంలో నన్ను మరింత మెరుగ్గా ఆడేలా చేస్తుంది. ఈ అవార్డు ఇచ్చినందుకు కృతజ్ఞతలు’ అని తిలక్ తెలిపాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. BCCI introduces a new 'Best Attitude of the Match' award, with Tilak Varma becoming its first-ever recipient following the 1st India vs Zimbabwe T20I at Harare!!! pic.twitter.com/FQv7VH5FDx— 𝓝𝓾𝓽𝓽𝔂𝓣𝓲𝓵𝓪𝓴 (@TilakVarmaaa) July 24, 2026Read: కాంస్యంతో మెరిసిన ‘రిక్షావోడు’ .. కామన్వెల్త్లో భారత్ బోణీ -
కాంస్యంతో మెరిసిన ‘రిక్షావోడు’ .. కామన్వెల్త్లో భారత్ బోణీ
గ్లాస్కో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ పతకాల బోణీ చేసింది. పురుషుల పారా పవర్‌లిఫ్టింగ్ హెవీవెయిట్ కేటగిరీలో ఝండు కుమార్ కాంస్యంతో మెరిశాడు. గ్రూప్-బి నుంచి బరిలోకి దిగిన ఝండు తన రెండో ప్రయత్నంలో 190 కేజీల బరువును ఎత్తి 130.9 పాయింట్లు స్కోరును సాధించాడు. ఇప్పటివరకు ఝండు కెరీర్లో అత్యుత్తమంగా ఉన్న 198 కేజీల బరువును అధిగమించనప్పటికీ తాజా కామన్వెల్త్ గేమ్స్‌లో మాత్రం కాంస్యాన్ని ఒడిసిపట్టాడు. మూడో ప్రయత్నంలో 196 కేజీల బరువు ఎత్తే ప్రయత్నంలో విఫలమయ్యాడు. అయినప్పటికీ తన కంటే ఎక్కువగా ఎవరు బరువు ఎత్తకపోవడంతో గ్రూప్-బి నుంచి తొలి స్థానంలో, ఓవరాల్‌గా మూడో స్థానంలో నిలిచి పతకం ఖాయం చేసుకున్నాడు. ఇక నైజీరియాకు చెందిన రిలువాన్ ఇద్రిస్ 208 కిలోల బరువు ఎత్తి 132.8 పాయింట్లు సాధించి పోడియంపై తొలి స్థానంలో నిలిచి బంగారు పతకం అందుకున్నాడు. ఇక 199 కిలోల బరువు ఎత్తిన ఇంగ్లండ్‌కు చెందిన మాథ్యూ హార్డింగ్ 131 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి వెండిని కైవసం చేసుకున్నాడు. ఇక కాంస్య పతకం గెలుచుకున్న అనంతరం ఝండు కుమార్ మాట్లాడాడు.‘నా ప్రదర్శన పట్ల సంతృప్తిగా ఉన్నా. భారత్‌కు ఇది చాలా ముఖ్యం. ఈ గేమ్స్‌లో నాదే దేశానికి తొలి పతకం కావడాన్ని మాటల్లో వర్ణించలేకపోతున్నా. జాతీయ జెండాను పోడియంపై చూసినప్పుడు గర్వంగా ఫీలయ్యాను. థాంక్యూ ఇండియా. నా ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. నేను పతకం గెలిచిన విషయాన్ని ముందుగా ఇంట్లో అమ్మానాన్నలకు చెప్తాను. అలాగే, చిన్నప్పటి నుంచి నాకు అండగా నిలిచిన నా స్నేహితుడు గౌతమ్ భయ్యాకు కూడా విషయాన్ని చెప్పాలి’ అంటూ ఎమోషనల్ అయ్యాడు. ఈ-రిక్షా నుంచి వెయిట్‌లిఫ్టర్ దాకాపేదరికం విజయకాంక్షను పెంచుతుందనే మాట పారా పవర్‌లిఫ్టర్ ఝండు కుమార్ సాధించిన ఘనత ద్వారా మరోసారి నిరూపితమైంది. హర్నౌత్‌కు చెందిన ఒక కూరగాయల వ్యాపారి కుమారుడైన ఝండు ఒక ఈ-రిక్షా డ్రైవర్‌గా తన జీవితాన్ని ప్రారంభించాడు. హర్నౌత్లోని ది రాక్ స్టార్ జిమ్ యజమాని గౌతమ్ సింగ్ రాకతో ఝండు జీవితం పూర్తిగా మారిపోయింది. ఇటీవల ముగిసిన ఖేలో ఇండియా పారా గేమ్స్ (కేఐపీజీ)లో స్వర్ణ పతకం గెలుచుకున్నాడు. మార్చి 23న జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలోని వెయిట్‌లిఫ్టింగ్ హాల్లో జరిగిన పురుషుల 72 కేజీల విభాగంలో, ఆ పవర్‌లిఫ్టర్ 206 కేజీల బరువును ఎత్తి తన సొంత జాతీయ రికార్డును బద్దలు కొట్టి అగ్రస్థానంలో నిలిచాడు. మార్చి 17-18 తేదీలలో నోయిడాలో జరిగిన పారా నేషనల్ ఛాంపియన్‌షిప్‌లో ఝండు 205 కేజీల బరువును ఎత్తి, సుధీర్ కుమార్ యొక్క 192 కేజీల జాతీయ రికార్డును బద్దలు కొట్టాడు.పుట్టుకతో పోలియో28 ఏళ్ల అతనికి పుట్టుకతోనే పోలియో సోకిన కాళ్లు ఉన్నాయి. అతని పారా స్పోర్ట్స్ ప్రయాణం 2017లో ప్రారంభమైంది. మొదట్లో, అతను షాట్‌పుట్, డిస్కస్ త్రోలో పోటీపడ్డాడు. ఆ సమయంలో, అతనికి పారా పవర్‌లిఫ్టింగ్ గురించి తెలియదు. F-55 కేటగిరీలో, ఝండు అనేక షాట్పుట్డి, డిస్కస్ త్రో ఈవెంట్లలో పాల్గొని విజయం సాధించాడు, కానీ అతని గమ్యం వేరే చోట ఉండటంతో, విధి అతన్ని ఆ దిశగా నడిపించింది.కష్టాలతో కూడిన ప్రయాణం తర్వాత, అతను గాంధీనగర్‌లోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI) నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్(NCOE)కి చేరుకున్నాడు. ప్రముఖ పారా కోచ్ రాజిందర్ సింగ్ రాహేలు మార్గదర్శకత్వంలో పవర్ వెయిట్‌లిఫ్టర్‌గా కెరీర్ ప్రారంభించాడు. డిసెంబర్ 2023లో, KIPG తొలి ఎడిషన్‌లో పవర్‌లిఫ్టింగ్ విభాగంలో ఝండు కుమార్ రజత పతకాన్ని గెలుచుకున్నాడు. 2028 లాస్ ఏంజెలెస్ పారా ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలవడమే తన లక్ష్యమని ఝండు కుమార్ పేర్కొన్నాడు.ప్రధాని మోదీ అభినందనలుకామన్వెల్త్ గేమ్స్‌లో దేశానికి తొలి పతకం అందించిన ఝండు కుమార్‌కు ప్రధాని నరేంద్ర మోదీ 'ఎక్స్' వేదికగా అభినందనలు తెలిపారు. 'కామన్వెల్త్ గేమ్స్‌లో పురుషుల హెవీవెయిట్ పారా పవర్‌లిఫ్టింగ్ ఈవెంట్లో కాంస్యం గెలిచిన ఝండు కుమార్‌కు అభినందనలు. అతడి అద్భుత ప్రదర్శనతో భారత్ పతకాల పట్టికను తెరవడం గొప్ప విషయం. అతడి విజయం అపారమైన శక్తికి, అతడి సంకల్పానికి, ఎన్నో ఏళ్ల తరబడి క్రమశిక్షణకు నిదర్శనం. తన జీవితంలో ఎదురైన ప్రతీ సవాల్‌ను అధిగమించి ఇవాళ అంతర్జాతీయ వేదికపై మువ్వన్నెల జెండాను ఎగురవేసి దేశానికి గర్వకారణంగా నిలిచి భారతీయులందరికి స్ఫూర్తిగా నిలిచాడు.' అని మోదీ కొనియాడారు. A spectacular performance by Jhandu Kumar, who has opened India’s medal tally at the #CWG2026 by winning a Bronze in the Men’s Heavyweight Para Powerlifting event! Congratulations to him. His achievement is a powerful reflection of immense strength, unwavering determination and… pic.twitter.com/kMdkU6RRAF— Narendra Modi (@narendramodi) July 25, 2026 🇮🇳 BRONZE FOR BHARAT! 🥉 Jhandu Kumar opens India’s #CWG2026 medal tally with a massive 190kg lift in Men’s Heavyweight Para Powerlifting. The entire nation is proud! 🇮🇳 #Cheer4Bharat pic.twitter.com/pyZSOZw0uI— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) July 24, 2026చదవండి: గోళీలాట మాదిరే లాన్ బౌల్స్.. కాని చిన్న ట్విస్ట్! -
సిరీస్‌పై భారత్ గురి
హరారే: శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో భారత జట్టు తొలి టి20 సిరీస్ సాధించేందుకు విజయం దూరంలో ఉంది. ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల్లో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత జట్టుకు ఒక్క గెలుపు కూడా దక్కలేదు. జింబాబ్వేతో మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో టీమిండియా అలవోక విజయం అందుకుంది. అదే జోరును రెండో మ్యాచ్‌లోనూ కొనసాగించాలని శ్రేయస్ అయ్యర్ బృందం పట్టుదలతో ఉంది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను 2–0తో సొంతం చేసుకుంటుంది. తొలి మ్యాచ్‌లో టీనేజ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ మెరుపు బ్యాటింగ్‌తో అర్ధ సెంచరీ సాధించాడు. ఓపెనర్ అభిషేక్ శర్మ విఫలమైనా... ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ నిలకడగా రాణించి భారత్‌కు 40 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని కట్టబెట్టారు. మరోవైపు జింబాబ్వే జట్టుకు బ్యాటర్లు ఆశించిన స్కోరును అందించలేకపోయారు. కెప్టెన్ సికందర్ రజాతోపాటు బెన్ కరన్, బ్రియాన్ బెనెట్, డియాన్ మైర్స్ తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. ర్యాన్ బుర్ల్, వెస్లీ మధెవెరె, మరుమని కాస్త పోరాడటంతో జింబాబ్వే స్కోరు 100 దాటగలిగింది. జింబాబ్వే బౌలర్లు ముజరబాని, ఎన్‌గరావా ఫర్వాలేదనిపించినా.. జింబాబ్వే నిర్దేశించిన లక్ష్యం తక్కువగా ఉండటంతో ఆ జట్టుకు ఓటమి తప్పలేదు. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌లో నిలవాలంటే అటు బ్యాటింగ్‌తోపాటు ఇటు బౌలింగ్‌లో జింబాబ్వే రాణించాల్సి ఉంటుంది. -
త్రుటిలో చేజారె...
గ్లాస్గో: కామన్వెల్త్ గేమ్స్ తొలి రోజు శుక్రవారం భారత్ పతకాల బోణీ కొట్టలేకపోయింది. పారా స్విమ్మింగ్ ఎస్13 (దృష్టిలోపం) కేటగిరీ పురుషుల 100 మీటర్ల ఫ్రీస్టయిల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ స్విమ్మర్ రవి వీర వెంకట భవాని కార్తీక్ బుడిగిన నాలుగో స్థానంలో నిలిచి త్రుటిలో కాంస్య పతకాన్ని చేజార్చుకున్నాడు. రవి 100 మీటర్ల లక్ష్యాన్ని 57.57 సెకన్లలో ముగించి నాలుగో స్థానాన్ని దక్కించుకున్నాడు. భారత్‌కే చెందిన మరో స్విమ్మర్ ఇమామ్ అలీ (1ని:03.73 సెకన్లు) ఏడో స్థానంలో నిలిచాడు. నాథన్ హెండ్రిక్స్ (దక్షిణాఫ్రికా; 54.54 సెకన్లు), స్టీఫెన్ క్లెగ్ (స్కాట్లాండ్; 55.16 సెకన్లు), మాథ్యూ రెడ్‌ఫెర్న్ (ఇంగ్లండ్; 56.86 సెకన్లు) వరుసగా స్వర్ణ, రజత, కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు. పారా పవర్‌లిఫ్టింగ్‌లోనూ భారత్‌కు నిరాశ ఎదురైంది. పురుషుల లైట్ వెయిట్ కేటగిరీలో భారత లిఫ్టర్లు అశోక్ (143.8 పాయింట్లు) నాలుగో స్థానంలో, పరమ్‌జీత్ కుమార్ (135.6 పాయింట్లు) ఆరో స్థానంలో నిలిచారు. మహిళల లైట్ వెయిట్ కేటగిరీలో భారత లిఫ్టర్ సుమన్ దేవి (88.4 పాయింట్లు)... హెవీ వెయిట్ కేటగిరీలో కస్తూరి రాజమణి చివరిదైన ఆరో స్థానంలో నిలిచారు. జాదుమణి శుభారంభం పురుషుల బాక్సింగ్ 55 కేజీల విభాగంలో భారత బాక్సర్ జాదుమణి సింగ్ శుభారంభం చేశాడు. ఆరోన్ కులెన్ (స్కాట్లాండ్)తో జరిగిన తొలి రౌండ్లో జాదుమణి 5:0 స్కోరుతో ఘనవిజయం సాధించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. పురుషుల స్విమ్మింగ్‌లో రెండుసార్లు ఒలింపిక్స్‌లో పాల్గొన్న శ్రీహరి నటరాజ్ 50 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ ఈవెంట్లో సెమీఫైనల్‌కు చేరుకున్నాడు. లాన్ బౌల్స్‌లో భారత మహిళల జట్టు పెయిర్స్ ఈవెంట్లో 2–0తో దక్షిణాఫ్రికా జట్టును ఓడించింది. పురుషుల సింగిల్స్‌లో పుతుల్ సోనోవాల్ టైబ్రేక్‌లో సెసిల్ అలెగ్జాండర్ (ఫాల్్కలాండ్ ఐలాండ్స్)పై గెలుపొందాడు. తొలి స్వర్ణం ఇంగ్లండ్ ఖాతాలో కామన్వెల్త్ గేమ్స్ తొలి స్వర్ణ పతకం ఇంగ్లండ్ ఖాతాలోకి వెళ్లింది. పురుషుల పారా పవర్‌లిఫ్టింగ్ లైట్ వెయిట్ కేటగిరీలో ఇంగ్లండ్ లిఫ్టర్ మార్క్ స్వాన్ విజేతగా నిలిచాడు. మార్క్ స్వాన్ 153.9 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి పసిడి పతకాన్ని సొంతం చేసుకున్నాడు. రొలాండ్ ఇజురికి (నైజీరియా) రజతం, బోనీ గుస్టిన్ (మలేసియా) కాంస్యం సాధించారు. మహిళల పారా పవర్‌లిఫ్టింగ్ లైట్ వెయిట్ కేటగిరీలో ఎస్తెర్ న్వొర్గో (నైజీరియా; 119 పాయింట్లు) స్వర్ణం, ఎస్తెర్ ఒయెమా (నైజీరియా; 115.5 పాయింట్లు) రజతం, ఒలీవియా (ఇంగ్లండ్; 106.6 పాయింట్లు) కాంస్యం గెల్చుకున్నారు. జూడో ప్లేయర్ తులికపై వేటుకామన్వెల్త్ గేమ్స్ జూడో క్రీడాంశంలో భారత్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. 2022 బర్మింగ్‌హామ్ గేమ్స్‌లో +78 కేజీల విభాగంలో రజత పతకం నెగ్గిన తులిక మాన్‌పై ఈసారి వేటు పడింది. డోపింగ్ నిబంధనలను ఆమె ఉల్లంఘించడంతో జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) తులికపై సస్పెన్షన్ విధించింది. నిబంధనల ప్రకారం క్రీడాకారులు ఏడాది కాలంలో కనీసం మూడుసార్లు తాము ఎక్కడెక్కడ ఉన్నామో అనే సమాచారం ‘నాడా’కు ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మూడుసార్లు విఫలమైతే వారిపై నిషేధం విధిస్తారు. 2024 పారిస్ ఒలింపిక్స్‌లోనూ పోటీపడ్డ తులిక ఏడాది కాలంలో తన ఆచూకీ వివరాలన ‘నాడా’కు సమర్పించకపోవడంతో ఆమెపై తాత్కాలిక నిషేధం విధించారు. కామన్వెల్త్ గేమ్స్ జూడో ఈవెంట్ ఈనెల 31న మొదలుకానుండగా... భారత జూడో ప్లేయర్లు ఈనెల 27న గ్లాస్గోకు బయలుదేరుతారు. పురుషుల 73 కేజీల విభాగంలో భారత జూడో ప్లేయర్ అరుణ్ కుమార్ డోపింగ్ పరీక్షలో విఫలమవ్వడంతో గురువారం జట్టు నుంచి అతడిని తొలగించారు. శుక్రవారం తులికపై వేటు పడటంతో భారత్ నుంచి 14 మందికి బదులుగా 12 మంది జూడో ప్లేయర్లు కామన్వెల్త్ గేమ్స్‌లో పోటీపడతారు. -
‘ఫిడే’ తాత్కాలిక అధ్యక్షుడిగా విశ్వనాథన్ ఆనంద్
న్యూఢిల్లీ: ఐదుసార్లు ప్రపంచ చాంపియన్, భారత దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్‌కు మరో గౌరవం లభించింది. ప్రస్తుతం అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) ఉపాధ్యక్షుడిగా ఉన్న ఆనంద్ ఇక నుంచి ‘ఫిడే’ తాత్కాలిక అధ్యక్షుడిగా వ్యవహరిస్తాడు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో యూరోపియన్ యూనియన్ ప్రస్తుతం ‘ఫిడే’ అధ్యక్షుడిగా ఉన్న అర్కాడీ డ్వార్కోవిక్పై ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షల కారణంగా తాను అధ్యక్షుడిగా కొనసాగితే ‘ఫిడే’ రోజువారీ కార్యకలాపాలకు ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో డ్వార్కోవిక్ ‘ఫిడే’ అధ్యక్ష బాధ్యతల నుంచి స్వచ్ఛందంగా వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. డ్వార్కోవిక్ నిర్ణయాన్ని ‘ఫిడే’ కౌన్సిల్ ఆమోదించడంతోపాటు ఆనంద్ తాత్కాలిక అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు సమ్మతించింది. డ్వార్కోవిక్పై ఆంక్షలు ఎత్తివేశాక మళ్లీ ఆయన ‘ఫిడే’ అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తారు. ఆనంద్ 2022 నుంచి ‘ఫిడే’ ఉపాధ్యక్షుడిగా ఉన్నాడు. -
భారత్‌కు రజతం
హాంగ్జౌ: ప్రపంచకప్ షూటింగ్ టోర్నీలో భారత్ పతకాల బోణీ కొట్టింది. శుక్రవారం జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో సంయం విజ్ భారత్‌కు రజత పతకాన్ని అందించింది. చండీగఢ్‌కు చెందిన 22 ఏళ్ల సంయం 243.4 పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానంలో నిలిచింది. యావో కియాన్జున్ (చైనా; 243.6 పాయింట్లు) స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకోగా... హనియె (ఇరాన్; 221 పాయింట్లు) కాంస్యం దక్కించుకుంది. భారత్‌కే చెందిన సురుచి సింగ్ 137.6 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచింది. -
సెమీస్‌లో అనాహత్
ఒంటారియో (కెనడా): ప్రపంచ స్క్వాష్ జూనియర్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ అనాహత్ సింగ్ వరుసగా రెండో ఏడాది పతకాన్ని ఖరారు చేసుకుంది. తద్వారా ఈ చాంపియన్‌షిప్ చరిత్రలో రెండు పతకాలు నెగ్గిన తొలి భారతీయ స్క్వాష్ ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పింది. తాజా ఈవెంట్లో టాప్ సీడ్ అనాహత్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. క్వార్టర్ ఫైనల్లో అనాహత్ 11–7, 11–5, 6–11, 11–9తో హబీబా రిజ్క్ (ఈజిప్ట్)పై గెలుపొందింది. సెమీఫైనల్లో మూడో సీడ్ బార్బ్ సమెహ్ (ఈజిప్ట్)తో అనాహత్ తలపడుతుంది. గత ఏడాది కైరోలో జరిగిన ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్‌లో అనాహత్ సెమీఫైనల్లో ఓడిపోయి కాంస్యాన్ని సాధించింది. అనాహత్ ఫైనల్ చేరితే 2005లో జోష్నా చినప్ప తర్వాత ఈ మెగా ఈవెంట్లో ఫైనల్‌కు చేరిన రెండో భారతీయ ప్లేయర్‌గా అనాహత్ గుర్తింపు పొందుతుంది. -
అసలు మనిషేనా? ఆ షాట్లు చూసి షాక్ అయ్యా!
టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్లో ఎట్టకేలకు తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన తొలి టీ20లో వైభవ్ విధ్వంసం సృష్టించాడు. 126 పరుగుల స్వల్ప లక్ష్య చేధనలో వైభవ్.. ప్రత్యర్ధి బౌలర్లను ఉతికారేశాడు. ఈ క్రమంలో కేవలం 18 బంతుల్లోనే తన మొట్టమొదటి హాఫ్ సెంచరీ మార్క్‌ను సూర్యవంశీ అందుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో హాఫ్ సెంచరీ సాధించి అత్యంత పిన్నవయష్కుడిగా అతడు రికార్డులకెక్కాడు. ఈ నేపథ్యంలో వైభవ్‌పై తన సహచర ఆటగాడు మయాంక్ యాదవ్ ప్రశంసల వర్షం కురిపించాడు. వైభవ్ అద్భుతమైన ఆటగాడని, ఐపీఎల్‌లోనే అతడి టాలెంట్ చూశాను అని మయాంక్ అన్నాడు. కాగా ఈ మ్యాచ్‌లో మయాంక్ యాదవ్ కూడా అసాధరణ ప్రదర్శన కనబరిచాడు. నాలుగు ఓవర్లలో 18 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ నిలిచాడు."వైభవ్ బ్యాటింగ్ గురుంచి ఎంత చెప్పుకొన్న తక్కువే. ఐపీఎల్లో వైభవ్‌కు బౌలింగ్ చేసినప్పుడు, అతడు ఆడిన షాట్లను చూసి ఆశ్చర్యపోయాను. ఇప్పుడు తనతో కలిసి ఒకే జట్టులో ఉండటం చాలా సంతోషంగా ఉంది. అతడు భవిష్యత్తులో కచ్చితంగా గొప్ప క్రికెటర్‌గా ఎదుగుతాడు.అతడిలో అద్భుతమైన టాలెంట్ ఉంది. ఐపీఎల్లో మా బౌలింగ్‌ను వైభవ్ ఉతికారేశాడు. ఈ తొలి ఇంటర్నేషనల్ హాఫ్ సెంచరీ అతడికి చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే తన అరంగేట్ర సిరీస్‌లో అతడు అంతగా రాణించలేకపోయాడు. కానీ ఇప్పుడు జాతీయ జట్టు తరపున తొలి అర్ధశతకాన్ని సాధించాడు. ఏ ఆటగాడికైనా ఇది స్పెషల్ మూమెంటే" అని మయాంక్ పేర్కొన్నాడు.చదవండి: ఇంగ్లండ్ తదుపరి టెస్ట్ కెప్టెన్ అతడే? -
చరిత్ర సృష్టించిన జోస్ బట్లర్.. క్రిస్ గేల్ రికార్డు బ్రేక్
ఇంగ్లండ్ మాజీ కెప్టెన్, మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ స్టార్ ఆటగాడు జోస్ బట్లర్ టీ20 క్రికెట్లో అరుదైన ఘనత సాధించాడు. టీ20 ఫార్మాట్( అంతర్జాతీయ క్రికెట్ + లీగ్ క్రికెట్)లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా బట్లర్ నిలిచాడు.'ది హండ్రెడ్ 2026' టోర్నీలో భాగంగా లార్డ్స్ వేదికగా లండన్ స్పిరిట్‌తో జరిగిన మ్యాచ్‌లో బట్లర్ 10 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఈ అరుదైన ఫీట్ నమోదు చేశాడు. ఇప్పటివరకు బట్లర్ టీ20ల్లో 14,572 పరుగులు చేశాడు. ఇంతకుముందు ఈ రికార్డు యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్(14,562) పేరిట ఉండేది.తాజా మ్యాచ్‌తో గిల్‌ను బట్లర్ వెనక్కి నెట్టాడు. ఈ జాబితాలో వెస్టిండీస్ మాజీ కెప్టెన్ కీరన్ పొలార్డ్(14,803 పరుగులు) అగ్రస్ధానంలో ఉన్నాడు. పొలార్డ్ కంటే బట్లర్ కేవలం 231 పరుగుల దూరంలో మాత్రమే ఉన్నాడు. రాబోయే మ్యాచ్‌ల్లో ఇదే జోరు కొనసాగిస్తే పొలార్డ్‌ను దాటేసి నంబర్-1 స్థానానికి చేరుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. లండన్ స్పిరిట్‌పై 7 పరుగుల తేడాతో మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ సంచలన విజయం సాధించింది. లుత బ్యాటింగ్ చేసిన మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ నిర్ణీత ఓవర్లలో 138 పరుగులకు ఆలౌటైంది. అనంతరం 139 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లండన్ స్పిరిట్‌ను మాంచెస్టర్ 131 పరుగులకే కట్టడి చేసింది.చదవండి: ఇంగ్లండ్ తదుపరి టెస్ట్ కెప్టెన్ అతడే? -
ఇంగ్లండ్ తదుపరి టెస్ట్ కెప్టెన్ అతడే?
ఇంగ్లండ్ టెస్ట్ జట్టు కెప్టెన్సీ బాధ్యతలను సీనియర్ బ్యాటర్ జో రూట్ మరోసారి చేపట్టే అవకాశముంది. న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్ తర్వాత ఇంగ్లండ్ మాజీ కెప్టెన్, స్టార్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో తమ టెస్టు జట్టు పగ్గాలను సీనియర్ బ్యాటర్ జోరూట్‌కు మరోసారి అప్పగించేందుకు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు సిద్దమైనట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఆస్ట్రేలియాతో జరగబోయే ప్రతిష్టాత్మక యాషెస్ హోమ్ సిరీస్ వరకు రూట్‌ను పూర్తిస్థాయి కెప్టెన్‌గా కొనసాగించాలని ఈసీబీ భావిస్తున్నట్లు'ది అథ్లెటిక్' తమ కథనంలో పేర్కొంది. అతడి డిప్యూటీగా హ్యారీ బ్రూక్ వ్యవహరించనున్నాడు.కివీస్‌తో జరిగిన రెండో టెస్టులో కూడా ఇంగ్లండ్ కెప్టెన్‌గా రూట్ బాధ్యతలు నిర్వర్తించాడు. అయితే ఈ మ్యాచ్‌లో ఇంగ్లీష్ ఇంగ్లీష్ 253 పరుగుల తేడాతో ఘోర ఓటమిని చూసింది. ఈ మ్యాచ్ ఫలితం పక్కన పెడితే జో రూట్‌కు కెప్టెన్‌గా అపారమైన అనుభవం ఉంది.రూట్ గతంలో 2017 ఫిబ్రవరి నుంచి 2022 ఏప్రిల్ వరకు సుదీర్ఘకాలం పాటు ఇంగ్లండ్ టెస్టు జట్టుకు సారథ్యం వహించారు. రూట్ మొత్తం 65 టెస్టుల్లో ఇంగ్లాండ్‌ను నడిపించగా.. అందులో 27 విజయాలు, 27 ఓటములు ఉన్నాయి. ఇంగ్లండ్ టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అత్యధిక మ్యాచ్‌ల్లో గెలిపించిన కెప్టెన్‌గా, అలాగే అత్యధిక మ్యాచ్‌ల్లో ఓడిపోయిన కెప్టెన్‌గా రెండూ రూట్ పేరిటే ఉండటం గమనార్హం. ఆటగాడిగా రూట్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో రూట్ (14,114*) రెండో స్ధానంలో ఉన్నాడు. అగ్రస్ధానంలో ఉన్న సచిన్ టెండూల్కర్ (15,921 పరుగులు) కంటే రూట్ కేవలం 1,808 పరుగుల దూరంలో ఉన్నాడు.కాగా కివీస్‌తో సిరీస్ అనంతరం బ్రెండన్ మెక్‌కల్లమ్‌ను కూడా టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి ఈసీబీ తప్పించింది. అతడి స్దానంలో మాజీ ఓపెనర్ మార్కస్ ట్రెస్కోథిక్ తాత్కాలిక హెడ్ కోచ్‌గా వ్యవహరించనున్నాడు. ఇంగ్లండ్ తమ తదుపరి సిరీస్‌లో స్వదేశంలో మూడు టెస్ట్‌లు ఆడనుంది. -
‘అదొక పెద్ద రిస్క్.. అయినా ఆ జట్టును వీడాను’
టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. రాజస్తాన్ రాయల్స్‌ను వీడటం అతి పెద్ద రిస్క్ అని తెలిసినప్పటికీ.. తన నిర్ణయానికే కట్టుబడి ఉన్నానన్నాడు. తన భార్య, కుటుంబంతో ఈ విషయం గురించి సుదీర్ఘంగా చర్చించానని.. అయితే, జట్టును వీడటమే సరైందని అనిపించిందన్నాడు.ట్రేడింగ్ ద్వారా కాగా ఐపీఎల్-2026 ఆరంభానికి ముందు సంజూ రాజస్తాన్‌ను వీడిన సంగతి తెలిసిందే. కెప్టెన్‌గా రాయల్స్‌ను 2022లో ఫైనల్‌కు చేర్చిన సంజూ.. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో జట్టును వీడేందుకు సిద్ధమయ్యాడని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ సంజూను పొందేందుకు రాజస్తాన్‌కు రవీంద్ర జడేజా, సామ్ కరన్‌ను రాజస్తాన్‌కు ట్రేడ్ చేసింది.సంజూ ధర రూ. 18 కోట్లకు సమానంగా చెల్లించి అతడిని సీఎస్కే ట్రేడ్ చేసుకుంది. అయితే, టీ20 ప్రపంచకప్-2026 హీరోగా నిలిచిన సంజూ.. చెన్నై జట్టు తరఫున ఐపీఎల్-2026 ఆరంభంలో మాత్రం తేలిపోయాడు. ఆ తర్వాత సెంచరీలతో సత్తా చాటి ఫామ్‌లోకి వచ్చాడు.అతి పెద్ద రిస్క్ అని తెలుసుతాజాగా ఈ విషయాల గురించి సంజూ శాంసన్ జియోస్టార్‌తో మాట్లాడాడు. ‘‘రాజస్తాన్ రాయల్స్‌ను వీడటం అతి పెద్ద రిస్క్ అని తెలుసు. అయితే, ఒక్కసారి మన మనసులోని మాటను ఫ్రాంఛైజీకి చెప్పిన తర్వాత మళ్లీ వెనక్కి తీసుకోవడం కుదరదు. నేను ఆ జట్టును వీడటానికి రెండు కారణాలు ఉన్నాయి.ముందుగా.. అంటే 2025లోనే నేను రాజస్తాన్‌ను వీడాలని నిర్ణయించుకున్నాను. ఈ విషయం గురించి నా భార్య, కుటుంబంతో దాదాపు మూడు వారాల పాటు చర్చించాను. వాళ్లు కూడా రిస్క్ ఎందుకు అన్నారు.నాకు ఆత్మవిశ్వాసం ఎక్కువఅయితే, నేను మాత్రం ఆఖరికి ఇదే సరైన నిర్ణయం అని భావించాను. ఇక రెండో కారణం.. నాకు ఆత్మవిశ్వాసం ఎక్కువ. మళ్లీ సున్నా నుంచి మొదలుపెట్టడానికి కూడా నేను సిద్ధంగానే ఉంటాను. చాలా మంది నా బ్యాటింగ్ స్టైల్.. చెన్నైలోని స్లో చెపాక్ వికెట్‌కు సరిపోదని చెప్పారు. అయినా సరే నేను ఆ జట్టులో చేరేందుకు మొగ్గుచూపాను. ‘ఇప్పుడు నీకు 30 ఏళ్లు.. ఏదైతే అది అయింది’ అని నా మనసుకు సర్దిచెప్పుకొన్నాను. నాకు అక్కడ కొత్త శక్తి లభించినట్లయింది. అయితే, ఆరంభంలో నేను తడబడ్డా. మూడు మ్యాచ్‌లలో విఫలమయ్యాను. జట్టు కూడా ఓడిపోయింది. వరల్డ్‌కప్‌లో సత్తా చాటిన తర్వాత ఇలా జరగడం పూర్తిగా నిరాశపరిచింది. మేనేజ్మెంట్తో పాటు మహీ భాయ్ కూడా!అయితే, ఆ పరిస్థితుల్లో మేనేజ్మెంట్ నాకు మద్దతుగా నిలిచింది. సహచర ఆటగాళ్లు కూడా ముందులానే నన్ను గౌరవించారు. నాపై నమ్మకం ఉంచారు. మహి భాయ్ (మహేంద్ర సింగ్ ధోని) కూడా నాకు అండగా నిలిచాడు. నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచాడు’’ అని సంజూ శాంసన్ భావోద్వేగానికి లోనయ్యాడు.చదవండి: నేనింకా పిల్లాడినే.. ఆ అర్హత లేదు: వైభవ్ -
CWG 2026: భారత్‌కు షాక్.. స్టార్ జుడో ప్లేయర్‌పై వేటు
గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌లో భారత పారా స్విమ్మర్స్ అదరగొట్టారు. ఈతగాళ్లు కార్తీక్ బుడిగిన, అలీ ఇమామ్‌లు ఫైనల్ రౌండ్‌కు అర్హత సాధించారు. పురుషుల 100 మీటర్ల ఫ్రీస్టైల్ S13 విభాగంలో హీట్స్ రేసులో కార్తీక్ 57.10 సెకన్ల సమయంలో మూడో స్థానంలో నిలవగా.. అలీ ఇమామ్ 1:05.32 సెకన్ల టైమింగ్‌తో చివరి క్వాలిఫైయింగ్ స్థానాన్ని దక్కించుకుని ఫైనల్లో అడుగుపెట్టారు. మరోవైపు 50 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ హీట్స్ లో శ్రీహరి నటరాజ్ సెమీస్‌కు దూసుకెళ్లాడు. శనివారం జరగనున్న సెమీఫైనల్స్‌లో శ్రీహరి పాల్గోనున్నాడు.భారత్‌కు షాక్భారత్కు మరో భారీ షాక్ తగిలింది. స్టార్ జుడుకో తులికా మాన్ కామన్వెల్త్ గేమ్స్‌కు దూరమైంది. డోపింగ్ నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (NADA) ఆమెపై తాత్కాలిక సస్పెన్షన్ విధించింది. గతేడాది నుంచి ఆమె డోపింగ్ టెస్ట్‌లకు హాజరు కాకపోవడంతో నాడా ఈ నిర్ణయం తీసుకుంది. కాగా బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్-2022లో తులిక సిల్వర్ మెడల్ సాధించింది. ఇక ఇది ఇలా ఉండగా మరో భారత జుడో ప్లేయర్ అరుణ్ కుమార్ కామన్వెల్త్ క్రీడలకు దూరమయ్యాడు. నిషిద్ధ ఉత్ప్రేరకాలు వాడినట్లు తేలడంతో అతడిపై నాడా నిషేధం విధించింది. -
భేష్.. గెలిచారు!.. మరి మీ ఐదో బౌలర్ ఎవరు?
టీమిండియా టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ ఎట్టకేలకు విజయాల ఖాతా తెరిచాడు. అతడి నాయకత్వంలో జింబాబ్వేతో తొలి టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో వరుసగా ఏడు మ్యాచ్‌ల తర్వాత శ్రేయస్ అయ్యర్ తొలిసారి గెలుపు రుచిచూశాడు.హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా గురువారం నాటి టీ20లో టాస్ గెలిచిన టీమిండియా.. జింబాబ్వేను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. భారత బౌలర్లు రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయిన జింబాబ్వే.. 125 పరుగులకే పరిమితమైంది.ఏడు వికెట్ల తేడాతోఅనంతరం లక్ష్య ఛేదనకు దిగిన భారత్ మూడు వికెట్లు నష్టపోయి 13.2 ఓవర్లలోనే పని పూర్తి చేసింది. తద్వారా ఏడు వికెట్ల తేడాతో జయభేరి మోగించి మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే, ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించినప్పటికీ తుదిజట్టు కూర్పుపై టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.మరి మీ ఐదో బౌలర్ ఎవరు?‘‘జట్టులో కేవలం నలుగురు బౌలర్లు.. పేసర్లు ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్, అశోక్ శర్మ.. స్పిన్నర్ రవి బిష్ణోయి మాత్రమే ఉన్నారు. మరి మీ ఐదో బౌలర్ ఎవరు?.. దీనికి జవాబు శివం దూబే అంటారేమో!.. మరి ఆరో బౌలర్?.. ఎవరూ లేరు.ఆరో బౌలర్ లేకుండానే టీమిండియా బరిలోకి దిగింది. నిజానికి శివం దూబే ఆల్‌రౌండర్ కదా!.. అతడు ఈసారి బంతితో కాస్త మెరుగ్గానే రాణించాడు. నాలుగు ఓవర్ల బౌలింగ్‌లో 32 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. నిజంగా ఇది పెద్ద విషయమేమంచి క్యాచ్ కూడా పట్టాడు. ఏదేమైనా నాలుగు ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తి చేయించడం ద్వారా యాజమాన్యం అతడిపై పూర్తి విశ్వాసం కనబరిచింది. నిజంగా ఇది పెద్ద విషయమే.సరైన నిర్ణయంఇక మయాంక్ యాదవ్‌తో బౌలింగ్ ఎటాక్ ఆరంభించి కెప్టెన్ శ్రేయస్ మంచి పని చేశాడు. అశోక్ శర్మను కూడా ముందుగానే పంపించడం సరైన నిర్ణయం. ఏదేమైనా వీళ్లిద్దరిని జట్టులో చూడటం ఎంతో బాగుంది. ముఖ్యంగా మయాంక్ గాయం నుంచి కోలుకుని రెండేళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చి సత్తా చాటాడు. నిలకడగా బౌలింగ్ చేశాడు’’ అని కామెంటేటర్ ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు. కాగా యూకే పర్యటనతో భారత టీ20 జట్టు కెప్టెన్‌గా శ్రేయస్ ప్రయాణం మొదలుపెట్టాడు. ఇందులో భాగంగా తొలుత ఐర్లాండ్ చేతిలో 2-0, ఇంగ్లండ్ చేతిలో 4-0తో టీమిండియా వైట్‌వాష్ అయింది.చదవండి: పిల్లాడినే.. నాకు ఆ అర్హత లేదు: వైభవ్ -
వెస్టిండీస్‌కు భారీ షాక్.. ఎగిరి గంతేస్తున్న పాకిస్తాన్!
స్వదేశంలో పాకిస్తాన్‌తో జరగనున్న రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ జట్టుకు రోస్టన్ ఛేజ్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా, జోమెల్ వారియోకన్ వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు.దేశవాళీ క్రికెట్లో అద్భుత ప్రదర్శన చేస్తున్న లెఫ్ట్ ఆర్మ్ ఆర్థడాక్స్ స్పిన్నర్ జోషువా బిషప్ తొలిసారిగా విండీస్ టెస్ట్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. 26 ఏళ్ల బిషప్ గడిచిన మూడు వెస్టిండీస్ ఛాంపియన్షిప్ సీజన్లలో ఏకంగా 91 వికెట్లు పడగొట్టి సత్తాచాటాడు. ఈ క్రమంలోనే అతడికి సెలక్టర్లు పిలుపునిచ్చారు.గడిచిన మూడు వెస్టిండీస్ ఛాంపియన్షిప్ సీజన్లలో ఈయన 91 వికెట్లు తీసి అత్యుత్తమ బౌలర్‌గా నిలిచాడు. డొమెస్టిక్ క్రికెట్లో అద్భుత ప్రదర్శన చేసిన లెఫ్ట్ ఆర్మ్ ఆర్థడాక్స్ స్పిన్నర్ జోషువా బిషప్ తొలిసారిగా విండీస్ టెస్టు జట్టులోకి పిలుపు అందుకున్నాడు. అదేవిధంగా న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో తొడకండరాల గాయానికి గురైన ఓపెనర్ జాన్ కాంప్‌బెల్.. పాక్‌తో టెస్ట్‌లకు దూరమయ్యాడు.అతడి స్ధానంలో లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ కిర్క్ మెకెంజీకి సెలక్టర్లు అవకాశమిచ్చారు. మరోవైపు స్టార్ పేసర్ అల్జారీ జోసెఫ్ వ్యక్తిగత కారణాలతో ఈ సిరీస్‌కు దూరమయ్యాడు. ఇది నిజంగా కరేబియన్ జట్టుకు గట్టి ఎదురు దెబ్బే అనే చెప్పాలి. జోషఫ్ వంటి స్టార్ బౌలర్ జట్టులో లేకపోవడంతో విండీస్ గడ్డపై పాక్ బ్యాటర్లు పండగ చేసుకోనున్నారు.కాగా ఆల్‌రౌండర్ కిమో పాల్ తిరిగి జట్టులోకి వచ్చాడు. కేమర్ రోచ్, జేడెన్ సీల్స్, షమర్ జోసెఫ్‌లు ఫాస్ట్ బౌలర్లగా ఉన్నారు. ఈ సిరీస్‌లోని మొదటి టెస్టు మ్యాచ్ జూలై 25 నుంచి 29 వరకు టారోబాలోని 'బ్రియన్ లారా క్రికెట్ అకాడమీ' మైదానంలో జరగనుంది. ఈ వేదికపై అంతర్జాతీయ టెస్టు మ్యాచ్ జరగనుండడం ఇదే తొలిసారి కావడం విశేషం. -
డీఎస్పీలుగా భారత క్రికెటర్లు
టీమిండియా ఫాస్ట్ బౌలర్లు ముఖేష్ కుమార్, ఆకాష్ దీప్‌లకు అరుదైన గౌరవం దక్కింది. ఈ ఇద్దరు క్రికెటర్లను బీహార్ ప్రభుత్వం డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) హోదాతో సత్కరించింది. పాట్నాలోని 'ఎనర్జీ ఆడిటోరియం'లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో బీహార్ ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరి వీరిద్దరికీ నియామక పత్రాలను అందజేశారు.ఈ సందర్భంగా వారిద్దరూ అంతర్జాతీయ స్ధాయిలో బీహార్‌కు పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చారని సమ్రాట్ చౌదరి కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రులు విజయ్ కుమార్ చౌదరి, బిజేంద్ర ప్రసాద్ యాదవ్, క్రీడా శాఖ మంత్రి శ్రేయసి సింగ్‌లు కూడా పాల్గొన్నారు. కాగా ముకేష్, ఆకాష్ దీప్ బీహార్‌లో జన్మించినప్పటికి దేశవాళీ క్రికెట్లో మాత్రం బెంగాల్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నారు.ముఖేష్ కుమార్ 2023లో వెస్టిండీస్ పర్యటనలో భాగంగా టీమిండియా తరపున అరంగేట్రం చేశాడు. ఇదే టూర్లో మొత్తం మూడు ఫార్మాట్లలోనూ డెబ్యూ చేశాడు. అయితే అతడు నిలకడగా రాణించకపోవడంతో జాతీయ జట్టులో చోటు కోల్పోయాడు. కానీ దేశవాళీ క్రికెట్‌తో పాటు ఐపీఎల్లో మాత్రం ఫర్వాలేదన్పిస్తున్నాడు. అతడు ఐపీఎల్-2026లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున 10 మ్యాచ్‌లు ఆడి 6 వికెట్లు పడగొట్టాడు. ఇక ఆకాష్దీప్ విషయానికి వస్తే.. అతడు భారత టెస్ట్ జట్టులో కీలక సభ్యునిగా ఉన్నాడు. అయితే ప్రస్తుతం వెన్ను గాయంతో బాధపడతుండంతో ఆకాష్ పోటీ క్రికెట్ దూరం కానున్నాడు. ఈ గాయం కారణంగా ఐపీఎల్-2026 నుంచి కూడా అతడు వైదొలిగాడు.క్రీడకారులకు అండగా బీహార్కాగా గత కాలంగా బీహార్ ప్రభుత్వం క్రీడకారులకు అండగా ఉంటుంది. ఇప్పటివరకు క్రీడా కోటా కింద దాదాపు 180 మంది అథ్లెట్లకు వేర్వేరు ప్రభుత్వ శాఖలలో ఉద్యోగాలు కల్పించింది. సమ్రాట్ చౌదరి సర్కార్ ఈ ఏడాది 637 మందికి స్కాలర్‌షిప్‌లతో పాటు 'సక్షమ్' పథకం కింద ₹3 లక్షలు, 'ఉత్కర్ష్' పథకం కింద ₹5 లక్షల నుండి ₹20 లక్షల వరకు ఆర్థిక సాయం అందించనున్నారు. -
సిక్సర్లతో జట్టును గెలిపించిన భారత బ్యాటర్!
హండ్రెడ్ కాంపిటీషన్ 2026లో భారత మహిళా బ్యాటర్లు రెచ్చిపోతున్నారు. తాజాగా భారత వికెట్‌కీపర్ రిచా ఘోష్ రెండు భారీ సిక్సర్లతో తన జట్టును విజయతీరాలకు చేర్చడం మ్యాచ్‌లో హైలైట్‌గా నిలిచింది. 81 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మాంచెస్టర్ రిచా ( 5 బంతుల్లో 15 నాటౌట్, రెండు సిక్సర్లు) ధాటికి 59 బంతుల్లోనే ఛేదించి 7 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. మిగిలినవారిలో పేజ్ స్కోఫీల్డ్ (15 బంతుల్లో 22 నాటౌట్), మెగ్ లానింగ్ (24 బంతుల్లో 21) రాణించారు. అంతకముందు లండన్ స్పిరిట్ వుమెన్ 91 బంతుల్లో 80 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ చార్లెట్ డీన్ (14), చారిస్ పవెలి (13) పర్వాలేదనిపించారు. మాంచెస్టర్ బౌలర్లలో రియానా మెక్‌డొనాల్డ్ 4 వికెట్లతో సత్తా చాటింది.ఇక పురుషుల క్రికెట్లో మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ ఏడు పరుగుల తేడాతో లండన్ స్పిరిట్‌పై విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన మాంచెస్టర్ 100 బంతుల్లో 9 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. టిమ్ సిఫెర్ట్ (45 బంతుల్లో 67) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం లండన్ నైట్స్ 100 బంతుల్లో 6 వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసింది. లివింగ్ స్టోన్ (40 బంతుల్లో 69 నాటౌట్) అజేయంగా నిలిచినప్పటికీ జట్టును గెలిపించకలేకపోయాడు. Power-hitting at its finest! 💥#RichaGhosh dispatches two massive sixes to power Manchester Super Giants to a comfortable win over London Spirit! 🔥#TheHundred 2026 👉 London Spirit vs Manchester Super Giants | LIVE NOW! pic.twitter.com/dMeQaYE6Ol— Star Sports (@StarSportsIndia) July 23, 2026Read: ప్లాన్ అదిరింది.. మెస్సీ రిటైర్మెంట్ అప్పుడే! -
ప్లాన్ అదిరింది.. మెస్సీ రిటైర్మెంట్ అప్పుడే!
అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ రిటైర్మెంట్పై ఒక స్పష్టత వచ్చింది. అర్జెంటీనా జట్టులో స్థిరత్వం వచ్చే వరకు తాను జట్టులో కొనసాగుతానని, ఆ తర్వాత కెరీర్‌కు వీడ్కోలు పలకనున్నట్లు మెస్సీ తన అభిప్రాయాన్ని అర్జెంటీనా ఫుట్‌బాల్ అసోసియేషన్ (ఏఎఫ్ఏ)కు వెల్లడించినట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి. దీంతో 2030 ఫిఫా ప్రపంచకప్‌కు తాను అందుబాటులో ఉండనని మెస్సీనే పరోక్షంగా సంకేతాలు ఇచ్చేశాడు. రాబోయే నాలుగేళ్లలో మెస్సీతో పాటు జట్టులో ఉన్న సీనియర్ ఆటగాళ్లంతా కెరీర్‌కు గుడ్‌బై చెప్పే యోచనలో ఉన్నారు. దీంతో జట్టులో సీనియర్లంతా ఒకేసారి రిటైర్ అయితే ఆ ప్రభావం యువ ఆటగాళ్లపై ఎక్కువగా ఉంటుందని అర్జెంటీనా ఫుట్‌బాల్ తెలిపింది. అందుకోసం మెస్సీని కొంతకాలం పాటు జట్టుతో కొనసాగాలని అతడితో తెలిపినట్లు సమాచారం. దీనికి మెస్సీ కూడా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇక మెస్సీ వీడ్కోలు మ్యాచ్‌ను కూడా ఘనంగా ప్లాన్ చేసినట్లు అర్జెంటీనా ఫుట్‌బాల్ అసోసియేషన్ ఒక ప్రకటనలో పేర్కొంది. త్వరలోనే ఆ వివరాలు బయటికి వెల్లడిస్తామని అర్జెంటీనా ఫుట్‌బాల్ తెలిపింది.ఇక 2026 ఫిఫా ప్రపంచకప్‌లో మెస్సీ 39 ఏళ్ల వయసులోనూ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. 8 గోల్స్ చేయడంతో పాటు 4 అసిస్ట్‌లతో టోర్నీలో రెండో అత్యధిక గోల్ స్కోరర్‌గా నిలిచి సిల్వర్ బూట్ అందుకున్నాడు. 10వ నంబర్ జెర్సీతో బరిలోకి దిగిన మెస్సీ అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో రికార్డుల మీద రికార్డులు సృష్టించాడు. ఫిఫా చరిత్రలో అత్యధిక గోల్స్ కొట్టిన ఆటగాడిగా మెస్సీ (21 గోల్స్) రెండో స్థానంలో నిలిచాడు. తొలి స్థానంలో ఎంబాపె (ఫ్రాన్స్, 22 గోల్స్) ఉన్నాడు. ఇక రెండు దశాబ్దాల కెరీర్లో 2014 ఫిఫా ఫైనల్లో అర్జెంటీనా ఓటమి తర్వాత మెస్సీ ఆటకు వీడ్కోలు పలకాలనుకున్నాడు. కానీ చిన్న వయసు కావడంతో ఆలోచనను విరమించుకున్న మెస్సీ ఆ తర్వాత అర్జెంటీనాకు అద్భుత విజయాలు అందించాడు. 2021 కోపా అమెరికా కప్‌తో పాటు 2022 ఫిఫా ప్రపంచకప్‌ను అందించి అర్జెంటీనా ఖాతాలో మూడో ఫిఫా టైటిల్‌ను చేర్చాడు. 2024 కోపా అమెరికా కప్‌ను మరోసారి గెలిచిన అర్జెంటీనా 2026 ఫిఫాలో ఫైనల్ చేరినప్పటికీ తుదిమెట్టుపై బోల్తా కొట్టింది. -
‘అతడి కెప్టెన్సీలో నాకు పూర్తి స్వేచ్ఛ’
దాదాపు రెండేళ్ల తర్వాత టీమిండియాలో పునరాగమనం చేశాడు మయాంక్ యాదవ్. ఐపీఎల్లో సత్తా చాటిన ఈ ‘ఫాస్టెస్ట్’ బౌలర్.. 2024లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఆ తర్వాత గాయాల కారణంగా కనుమరుగైపోయాడు. తాజాగా జింబాబ్వేతో టీ20 సిరీస్ సందర్భగా మయాంక్ రీఎంట్రీ ఇచ్చాడు.హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా గురువారం నాటి మ్యాచ్‌లో పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు రెండు వికెట్లు కూల్చి సత్తా చాటాడు. తొలి బంతికే జింబాబ్వే ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్‌ను డకౌట్ చేసిన మయాంక్.. వన్‌డౌన్ బ్యాటర్ డియోన్ మైర్స్ (6)ను కూడా అవుట్ చేశాడు. నాలుగు ఓవర్ల కోటాలో 24 ఏళ్ల ఈ రైటార్మ్ ఫాస్ట్ బౌలర్.. 18 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు.Aate hi kaam shuru kar diye 🔥💪Watch it LIVE only on FanCode! 🇮🇳 👇https://t.co/q6VBxaRJz3#ZIMvIND #RokoNahiThoko #MayankYadav pic.twitter.com/Pg9RugnnTR— FanCode (@FanCode) July 23, 2026గొప్పగా అనిపించిందితద్వారా టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించి.. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు. ఈ నేపథ్యంలో మయాంక్ యాదవ్ స్పందిస్తూ.. ‘‘రెండేళ్లు జట్టుగా దూరంగా ఉండటం నా జీవితంలో అత్యంత కష్టకాలం. అప్పుడు నాకు 22-23 ఏళ్ల మధ్య వయసు. అంత చిన్నవయసులోనే గాయాల వల్ల సుదీర్ఘకాలం ఆటకు దూరం కావడం తీవ్ర ప్రభావం చూపింది.అయితే, దేశానికి ఆడటం గొప్ప విషయం. అదే స్ఫూర్తిగా ముందుకు సాగి సవాళ్లను అధిగమించాను. జింబాబ్వేలో పిచ్‌లు ఫాస్ట్ బౌలర్లకు సహకరిస్తాయని విన్నాను. నేను హరారేలో ఆడటం ఇదే మొదటిసారి. గొప్పగా అనిపించింది. జట్టు విజయానికి నా వంతు సహకారం అందించాను’’ అని హర్షం వ్యక్తం చేశాడు.అతడి కెప్టెన్సీలో నాకు పూర్తి స్వేచ్ఛఅదే విధంగా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌పై మయాంక్ యాదవ్ ప్రశంసలు కురిపించాడు. ‘‘అతడి కెప్టెన్సీలో ఆడటం ఇదే తొలిసారి. మ్యాచ్‌కు ముందు మేము ఎక్కువగా మాట్లాడుకోలేదు కూడా!.. అయితే, మ్యాచ్ సమయంలో బౌలర్లపై అతడు పూర్తి నమ్మకం ఉంచాడు.నాకు నచ్చినట్లుగా బౌలింగ్ చేయమని చెప్పాడు. అతడూ కొన్ని సలహాలు ఇచ్చాడు. సారథి ఇచ్చిన ధైర్యంతో నేను ముందుకు సాగాను. అతడి కెప్టెన్సీలో నాకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు అనిపించింది’’ అని మయాంక్ యాదవ్ చెప్పుకొచ్చాడు. కాగా బంగ్లాదేశ్‌తో 2024 నాటి టీ20 సిరీస్ సందర్భంగా అరంగేట్రం చేసిన మయాంక్ యాదవ్.. ఇప్పటికి నాలుగు మ్యాచ్‌లు ఆడి ఆరు వికెట్లు పడగొట్టాడు.చదవండి: నేనింకా పిల్లాడినే.. క్రెడిట్ నాకు ఇవ్వొద్దు: వైభవ్ -
సొంతగడ్డపై పర్యాటక జట్టుగా టీమిండియా!
టీమిండియా విచిత్ర పరిస్థితిని ఎదుర్కోనుంది. సొంతగడ్డ మీదే పర్యాటక జట్టుగా మ్యాచ్‌లు ఆడనుంది. అవును.. మీరు చదివింది కరెక్టే!.. ఇంతకీ సంగతి ఏమిటంటే.. అఫ్గానిస్తాన్‌కు స్వదేశంలో క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహించే పరిస్థితులు లేవు.ఇప్పటికే పలు మ్యాచ్‌లు ఈ నేపథ్యంలో భారత్ అఫ్గాన్ క్రికెట్ బోర్డు (ACB)కు అండగా నిలుస్తోంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సహకారంతో ఏసీబీ భారత్‌లో ఆతిథ్య దేశంగా తమ మ్యాచ్‌లు నిర్వహించుకుంటోంది. డెహ్రాడూన్, గ్రేటర్ నోయిడా, లక్నోలను తమ హోంగ్రౌండ్లుగా గతంలో ఎంచుకుంది. అంతేకాదు.. న్యూజిలాండ్‌తో ఏకైక టెస్టుకు కూడా షెడ్యూల్‌ను ఖరారు చేసుకుంది. అయితే, ఒక్క బంతి పడకుండానే ఈ మ్యాచ్ రద్దై పోయింది. తాజాగా టీమిండియాకే భారత్‌లో ఆతిథ్యం ఇచ్చేందుకు అఫ్గాన్ సిద్ధమైనట్లు తెలుస్తోంది.ఢిల్లీలో అఫ్గాన్- భారత్ సిరీస్టీమిండియా- శ్రీలంక టెస్టు సిరీస్ ... ఆసియా క్రీడలు-2026 మధ్య విరామంలో టీమిండియా- అఫ్గానిస్తాన్ టీ20 సిరీస్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఆగష్టు 27 నుంచి భారత్- శ్రీలంక టెస్టు సిరీస్ మొదలుకానుండగా.. ఆసియా క్రీడలకు సెప్టెంబరు 24న తెర లేవనుంది.ఈ క్రమంలో సెప్టెంబరు 13 నుంచి టీమిండియాతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడేందుకు అఫ్గాన్ బోర్డు ప్రణాళిక రచించినట్లు సమాచారం. ఇందుకు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక అని తెలుస్తోంది. ఈ మేరకు ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫో కథనం వెలువరించింది.గెలుపు బోణీఇదిలా ఉంటే.. ఇటీవలే అఫ్గాన్ జట్టు భారత్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఆతిథ్య టీమిండియాతో ఏకైక టెస్టులో ఓడిపోయిన అఫ్గాన్.. మూడు వన్డేల సిరీస్‌లో 0-3తో క్లీన్‌స్వీప్ అయింది. ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్-2026లో చాంపియన్‌గా నిలిచిన తర్వాత విదేశీ పర్యటనలో భాగంగా తొలిసారి టీ20 సిరీస్ ఆడిన టీమిండియాకు చేదు అనుభవం ఎదురైంది.పసికూన ఐర్లాండ్ చేతిలో 2-0తో వైట్‌వాష్ అయిన శ్రేయస్ సేన.. ఆ తర్వాత ఇంగ్లండ్ చేతిలో 4-0తో క్లీన్‌స్వీప్ అయింది. తాజాగా జింబాబ్వే గడ్డ మీద గురువారం నాటి తొలి టీ20లో గెలిచి ఎట్టకేలకు.. ఏడు మ్యాచ్‌ల తర్వాత తొలి విజయం సాధించింది.చదవండి: విజయానికి క్రెడిట్ నాకు ఇవ్వొద్దు.. ఆ అర్హత లేదు: వైభవ్ -
‘నేనింకా పిల్లాడినే.. అందుకు అర్హుడిని కాను’
జింబాబ్వేతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో టీమిండియా శుభారంభం చేసింది. తొలి టీ20 మ్యాచ్‌లో బౌలర్లు రాణించగా, ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ మెరుపు ఫిఫ్టీ సాధించడంతో టీమిండియా సునాయాస విజయాన్ని అందుకుంది. అయితే మ్యాచ్ విజయంలో తన పాత్రేమి లేదని, నిజానికి బౌలర్లే మ్యాచ్ విన్నర్లంటూ వైభవ్ పేర్కొన్నాడు. తానింకా నేర్చుకునే దశలోనే ఉన్నానని.. గెలుపునకు అర్హుడిని కాదని వెల్లడించాడు.మ్యాచ్ విజయం తర్వాత బీసీసీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వైభవ్ మాట్లాడుతూ.. ‘కెరీర్ ప్రారంభంలో ఇలాంటి ఇన్నింగ్స్ ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం పెంచుతుంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా గొప్పగా బ్యాటింగ్ చేయడానికే ప్రయత్నిస్తాను. జట్టు కోసం ఎప్పుడూ నా బెస్ట్ ఇచ్చేందుకే కష్టపడుతుంటా. జింబాబ్వేపై విజయంలో నేను క్రెడిట్ తీసుకోలేను. దానికి నేను అర్హుడిని కాను. నేనింకా నేర్చుకునే దశలోనే ఉన్నా’ అని వైభవ్ చెప్పుకొచ్చాడు. ఇక మ్యాచ్‌లో ఫిఫ్టీ అనంతరం చేతి వేళ్లలో 'A' అక్షరం చూపిస్తూ సెలబ్రేషన్ చేసుకోవడంపై కూడా వైభవ్ వివరణ ఇచ్చాడు. ''A' అనేది మా అమ్మ పేరులో (Aarti Suryavanshi) మొదటి అక్షరం. నా హాఫ్ సెంచరీ సెలబ్రేషన్‌ను అందుకే A సంకేతంతో చూపించాను. నా కెరీర్లో సాధించిన తొలి అంతర్జాతీయ అర్ధసెంచరీని నా కుటుంబానికి, కోచ్‌లతో పాటు నా జర్నీలో సహకరించిన ప్రతీ ఒక్కరికి ఈ ఇన్నింగ్స్‌ను అంకితమి స్తున్నా.' అని వెల్లడించాడు. హరారే వేదికగా జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 125 పరుగులకు పరిమితమైంది. అనంతరం భారత్ 13.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 126 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. వైభవ్ 19 బంతుల్లో ఫిఫ్టీ సాధించగా, ఇషాన్ కిషన్ 35 పరుగులు చేశాడు. ఆఖర్లో శ్రేయస్ అయ్యర్ (28 నాటౌట్) జట్టును గెలిపించాడు. ఇరుజట్ల మధ్య రెండో టీ20 శనివారం జరగనుంది.Read: అతడికి 2 నెలలే డెడ్‌లైన్.. రోహిత్, కోహ్లికి మంచి రోజులు! -
AUS vs ENG: భారత్‌లో యాషెస్ టెస్టు మ్యాచ్!
క్రికెట్లో అత్యంత ప్రాచీన, ప్రతిష్టాత్మక, చరిత్రాత్మక సిరీస్‌లలో యాషెస్ టెస్టు సిరీస్ ఒకటి. ఇంగ్లండ్- ఆస్ట్రేలియా మధ్య జరిగే ఈ పోరు 1882లో మొదలైంది. నాటి నుంచి ప్రతి రెండేళ్లకొకసారి ఇరుజట్ల మధ్య ఈ సిరీస్‌ను నిర్వహిస్తున్నారు.ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్ (FTP)లో భాగంగా జరిగే ఈ సిరీస్‌కు ఆసీస్, ఇంగ్లండ్ చెరోసారి ఆతిథ్యం ఇవ్వడం పరిపాటి. అయితే, ఈ చారిత్రక సిరీస్‌లో భాగంగా ఒక మ్యాచ్‌ను భారత గడ్డపై నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా (CA) సంకేతాలు ఇచ్చింది.బీసీసీఐతో అనుబంధంఆసీస్ క్రికెట్ బోర్డు సీఈఓ టాడ్ గ్రీన్బర్గ్ ఈ విషయం గురించి బీబీసీ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. ‘‘ఇంగ్లండ్, వేల్స్ క్రికెట్ బోర్డుతో మా బంధం బలమైనది. అదే విధంగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)తోనూ మాకు సత్సంబంధాలు ఉన్నాయి.ఇండియాలో యాషెస్ మ్యాచ్ నిర్వహించేందుకు అవకాశాలు ఉన్నాయి. అయితే, ఇప్పుడే దీని గురించి మేమేమీ ప్రణాళికలు రచించడం లేదు. కానీ ఈ అంశం అయితే మా పరిశీలనలో ఉంది. ఆసీస్- ఇంగ్లండ్- ఇండియా మధ్య టెస్టు క్రికెట్‌కు ఎంతో ఆదరణ ఉంది.ప్రపంచవ్యాప్తంగా ఈ మూడు జట్ల మ్యాచ్‌లకు అభిమానులు ఉన్నారు. వారిని అలరించడం కోసం.. టెస్టు క్రికెట్ అభివృద్ధి కోసం మేము ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటాము’’ అని గ్రీన్బర్గ్ స్పష్టం చేశారు.డిసెంబరులో బీబీఎల్ మ్యాచ్ఆసీస్ టీ20 లీగ్ బిగ్ బాష్ లీగ్ (BBL) తాజా ఎడిషన్ ఆరంభ మ్యాచ్‌ను భారత్‌లో నిర్వహిస్తామని క్రికెట్ ఆస్ట్రేలియా ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో మెల్బోర్న్ రెనెగేడ్స్- పెర్త్ స్కార్చర్స్ మధ్య డిసెంబరు 12, 2026న ఈ మ్యాచ్ జరుగనుంది.యాషెస్ 2027 షెడ్యూల్ ప్రకటనఅదే విధంగా.. ఐపీఎల్లో కొన్ని మ్యాచ్‌లను ఆస్ట్రేలియాలో నిర్వహించేందుకు బీసీసీఐ కూడా సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. యాషెస్ 2027 షెడ్యూల్‌ను ఈసీబీ ఇటీవలే ప్రకటించింది. జూన్ 18- ఆగష్టు 2 వరకు ఈ సిరీస్ జరుగుతుంది.ట్రెంట్ బ్రిడ్జ్, లార్డ్స్, ఎడ్జ్‌బాస్టన్, సౌతాంప్టన్, ది ఓవల్ మైదానాలు ఇందుకు వేదికలు. ఇక క్రికెట్ ఆస్ట్రేలియాకు 2029-2030 సైకిల్లో ఆతిథ్య హక్కులు వస్తాయి. కాబట్టి అప్పటికి భారత్‌లో ఒక మ్యాచ్ నిర్వహించినా ఆశ్చర్యం లేదు.చదవండి: వైభవ్ మెరుపులు -
అతడికి 2 నెలలే డెడ్‌లైన్.. రోహిత్, కోహ్లికి మంచి రోజులు!
టీమిండియా చీఫ్ సెలెక్టర్ పదవిలో కొనసాగుతున్న మాజీ క్రికెటర్ అజిత్ అగార్కర్ పదవీకాలం ఈ సెప్టెంబర్‌తో ముగియనున్నట్లు తెలుస్తోంది. కాగా వన్డే ప్రపంచకప్ వరకు తనను సెలెక్టర్‌గా కొనసాగేందుకు అవకాశమివ్వాలని అగార్కర్ చేసిన అభ్యర్థనను బీసీసీఐ పట్టించుకోనట్లుగా అనిపిస్తోంది. సెలెక్టర్‌గా ఎంపికైన తర్వాత టీమిండియా ఐసీసీ టైటిల్స్ సాధించినప్పటికీ అగార్కర్ విషయంలో మాత్రం విమర్శలే వ్యక్తమయ్యాయి. అందుకే అగార్కర్‌ను సెలెక్టర్‌గా కొనసాగించేందుకు బీసీసీఐ ఇష్టపడడం లేదని తెలుస్తోంది. దీంతో అతడి స్థానంలో కొత్త సెలెక్టర్ కోసం వెతుకులాటను ప్రారంభించినట్లు సమాచారం. ఇక అగార్కర్ సెలెక్టర్ పదవి నుంచి దిగిపోతే మాత్రం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలకు వన్డే వరల్డ్‌కప్ 2027 ఆడేందుకు మార్గం సుగమం అవుతుందని కొందరు తమ అభిప్రాయం వ్యక్తం చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే మాత్రం సెప్టెంబర్ తర్వాత టీమిండియాకు కొత్త సెలెక్టర్‌ను చూసే అవకాశాలున్నాయి. సెప్టెంబర్ తర్వాత నుంచి జరగనున్న సిరీస్‌లకు కొత్త సెలెక్టర్ నేతృత్వంలోనే జట్టు ఎంపిక జరగనుంది. ఇక అజిత్ అగార్కర్ 2023లో టీమిండియా చీఫ్ సెలక్టర్‌గా బాధ్యతలు చేపట్టాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు జట్టులో పలు కీలక మార్పులు చేస్తూ వస్తున్నాడు. Photo Credit: BCCI Twitterఅగార్కర్ పదవీకాలంలో టీమిండియా నాలుగు ఐసీసీ టోర్నీలు ఆడింది. 2023 వన్డే ప్రపంచ కప్, టీ20 ప్రపంచ కప్ 2024, చాంపియన్స్ ట్రోఫీ 2025, టీ20 ప్రపంచ కప్ 2026.. వీటిల్లో మూడు టైటిళ్లు భారత జట్టు సొంతం చేసుకోవడం విశేషం. అయినప్పటికీ సెలెక్టర్‌గా అగార్కర్‌పై మాత్రం విమర్శలే రావడం గమనార్హం. జట్టు సెలక్షన్ విషయంలో అగార్కర్ తీసుకున్న పలు నిర్ణయాలు తీవ్ర వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. సూర్యకుమార్ యాదవ్‌ను టీ20 జట్టుకు కెప్టెన్ చేయడం, హార్దిక్ పాండ్యకు ప్రాధాన్యత ఇవ్వడం వంటివి అప్పట్లో తీవ్ర విమర్శలకు తావిచ్చాయి. వన్డే కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మను తప్పించడంపై అభిమానులు బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరు ఎన్ని మాటలు అన్నా.. తన నిర్ణయాలను మాత్రం అగార్కర్ బహిరంగంగానే సమర్థించుకుంటూ వచ్చాడు. సెలక్షన్ అనేది కేవలం ప్లేయర్ల గణాంకాలపై ఆధారపడదని, జట్టుకు సరిపోయే కాంబినేషన్, ఆటగాళ్ల పాత్రలు, వ్యూహాలు కీలకమని అగార్కర్ ప్యానెల్ నిరూపించింది. టీ20 ప్రపంచకప్‌తో పాటు ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన కారణంగా 2025లోనే అగార్కర్ సెలెక్టర్ పదవీకాలన్ని మరో ఏడాది పొడిగించిన బీసీసీఐ మరోసారి అతడి పదవీకాలాన్న పొడిగించేందుకు సముఖత వ్యక్తం చేయడం లేదు.చదవండి: Asian Games: క్రికెట్ ‘డ్రా’ విడుదల.. భారత్, పాక్ మ్యాచ్ ఎప్పుడంటే? -
Asian Games: క్రికెట్ ‘డ్రా’ విడుదల.. భారత్, పాక్ మ్యాచ్ ఎప్పుడంటే?
ప్రతిష్టాత్మక 2026 ఆసియా గేమ్స్‌కు సంబంధించి క్రికెట్ షెడ్యూల్ విడుదలైంది. ఏకకాలంలో పురుషుల, మహిళల క్రికెట్‌మ్యాచ్‌ల షెడ్యూల్‌ను ప్రకటించారు. రెండు విభాగాల్లో టెస్టు సభ్యత్వం కలిగిన నాలుగు దేశాలు (భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్) నేరుగా క్వార్టర్ ఫైనల్స్‌కు అర్హత సాధించాయి. కాగా ఆసియా గేమ్స్ జపాన్ వేదికగా సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జరగనున్నాయి.అయితే క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న భారత్, పాకిస్తాన్ మ్యాచ్ అటు పురుషుల.. ఇటు మహిళల క్రికెట్లో ఫైనల్ లేదా సెమీస్‌లోనే తలపడే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మహిళల విభాగంలో క్వార్టర్ ఫైనల్లో భారత్ తమ మ్యాచ్‌ను జపాన్‌తో ఆడనుంది. ఇక పురుషుల క్రికెట్లో మాత్రం టీమిండియా పాక్‌తో నేరుగా సెమీస్ లేదా ఫైనల్ పోరులో తలపడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.పురుషుల క్రికెట్లో ఇలా..పురుషుల టోర్నీ విషయానికొస్తే టెస్టు సభ్యత్వం కలిగిన భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్‌లు నేరుగా క్వార్టర్ ఫైనల్స్ ఆడనున్నాయి. క్వార్టర్స్‌లో మిగిలిన నాలుగు స్థానాల కోసం ఆరుజట్ల మధ్య లీగ్ దశ మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. ఈ లీగ్ దశలో గ్రూప్-ఏ నుంచి అఫ్గానిస్తాన్, జపాన్, నేపాల్ ఉండగా; గ్రూప్-బి నుంచి చైనా, మలేషియా, ఓమన్ ఉన్నాయి. లీగ్ దశలో రెండు గ్రూప్‌ల్లో నుంచి టాప్-2లో నిలిచిన జట్లు క్వార్టర్స్ చేరుకోనున్నాయి. క్వార్టర్స్‌లో గెలిచిన నాలుగు జట్లు సెమీస్‌లో తలపడనున్నాయి. సెమీస్‌లో గెలిచిన జట్లు స్వర్ణం కోసం ఫైనల్ మ్యాచ్ ఆడనుండగా, ఓడిన జట్లు కాంస్య పతక పోరు కోసం తలపడనున్నాయి. టెస్టు సభ్యత్వం కలిగినప్పటికీ అఫ్గానిస్తాన్ ప్రిలిమినరీ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది.గ్రూప్-ఏ: అఫ్గానిస్తాన్, జపాన్, నేపాల్గ్రూప్-బి నుంచి చైనా, మలేషియా, ఒమన్జపాన్తో హర్మన్ సేన అమీతుమీ..మహిళల విభాగంలోనూ ఇవే జట్లు పోటీలో ఉన్నప్పటికీ ఇక్కడ మాత్రం నేరుగా క్వార్టర్ ఫైనల్మ్యాచ్లే నిర్వహించనున్నారు. క్వార్టర్ ఫైనల్లో భారత్‌తో జపాన్, థాయ్‌లాండ్‌తో పాకిస్తాన్, చైనాతో బంగ్లాదేవ్, శ్రీలంకతో మలేషియా అమీతుమీ తేల్చుకోనున్నాయి. క్వార్టర్స్‌లో గెలిచిన జట్లు సెమీస్‌లో అడుగుపెట్టనున్నాయి. సెమీస్‌లో గెలిచిన జట్ల మధ్య స్వర్ణ పతక పోరు జరగనుంది.మహిళల క్రికెట్లో క్వార్టర్స్ షెడ్యూల్భారత్ vs జపాన్బంగ్లాదేశ్ vs చైనాశ్రీలంక vs మలేషియాపాకిస్తాన్ vs థాయిలాండ్సెమీ-ఫైనల్స్భారత్/జపాన్ vs బంగ్లాదేశ్/చైనాశ్రీలంక/మలేషియా vs పాకిస్తాన్/థాయిలాండ్2022లో డబుల్ స్వర్ణాలు..2022 హాంగ్జౌ ఆసియా గేమ్స్‌లో భారత పురుషుల, మహిళల జట్లు స్వర్ణ పతకాలు కైవసం చేసుకున్నాయి. ఆనాడు టీమిండియా పురుషుల కెప్టెన్‌గా రుతురాజ్ వ్యవహరించాడు. వర్షంతో ఫలితం రాకపోవడంతో అత్యధిక విజయాలు సాధించిన భారత్‌కు గోల్డ్ మెడల్ ఇవ్వగా, అఫ్గానిస్తాన్ వెండిని గెలుచుకుంది. ఇక హర్మన్‌ప్రీత్ సారథ్యంలోని మహిళల జట్టు ఫైనల్లో శ్రీలంకను ఓడించి బంగారు పతకాన్ని అందుకుంది. ఈ గేమ్స్‌లో పాకిస్తాన్ రెండు విభాగాల్లోనూ నాలుగో స్థానానికే పరిమితం కావడం గమనార్హం.Read: గోళీలాట మాదిరే లాన్ బౌల్స్.. కాని చిన్న ట్విస్ట్! -
గోళీలాట మాదిరే లాన్ బౌల్స్.. కాని చిన్న ట్విస్ట్!
ప్రపంచంలో మనకు తెలియని ఆటలు ఎన్నో ఉన్నాయి. క్రికెట్, ఫుట్‌బాల్, బాస్కెట్ బాల్, వాలీబాల్, టెన్నిస్, బ్యాడ్మింటన్.. ఇవన్నీ ప్రపంచ క్రీడలుగా విశిష్టతను పొందాయి. కానీ ఒలింపిక్స్ లేదా కామన్వెల్త్ గేమ్స్ జరిగినప్పుడు మాత్రం మనకు తెలియని కొత్త గేమ్స్ కూడా పరిచయమవుతాయి. అలా పరిచయం అయిందే లాన్ బౌల్స్ క్రీడ. 2022 కామన్వెల్త్ గేమ్స్‌లో లాన్ బౌల్స్‌లో భారత్ ఒక స్వర్ణంతో పాటు మరో రజతం గెలవడం ద్వారా మన దేశంలో ఈ ఆట తొలిసారి వెలుగులోకి వచ్చింది. ఈ ఆట చూడ్డానికి చిన్నప్పుడు మనం ఆడే గోళీలాట మాదిరే ఉంటుంది. కానీ గోళీలాటకు కాస్త భిన్నంగా లాన్ బౌల్స్ ఆట ఉంటుంది.లాన్ బౌల్స్ అనేది ఇంచుమించుగా బౌలింగ్ క్రీడ మాదిరి ఉంటుంది. ఒక ఎండ్ నుంచి రౌండ్ గా ఉన్న బంతులను మరో ఎండ్ లో ఉన్న టార్గెట్ మీదకు వదలాలి. ఎవరిదైతే టార్గెట్ కు దగ్గరగా చేరుకుంటుందో వారిని విజేతగా ప్రకటిస్తారు. ఇక్కడ టార్గెట్ ను జాక్ గా పిలుస్తారు. ఉదాహరణకు ’బి‘ టీం కంటే కూాడా ’ఎ‘ టీమ్ టార్గెట్ కు సమీపంగా రెండు బాల్స్ ను విసిరితే అప్పుడు ఎ టీంకు రెండు పాయింట్లు లభిస్తాయి. అంటే టార్గెట్ కు ఏ టీంవి ఎక్కువ దగ్గరగా ఉంటే అన్ని పాయింట్స్ ఇస్తారన్నమాట. రూల్స్ ఇలా..ఈ ఆటను సింగిల్స్, డబుల్స్ తో పాటు ముగ్గురు/ నలుగురితో కూడిన జట్టుగానూ ఆడొచ్చు. టీమ్ ఈవెంట్లలో తొలుత బంతిని విసిరే బౌలర్ ను 'లీడ్' అని పిలుస్తారు. ఇక చివర్లో రోల్ చేసే ప్లేయర్‌ను 'స్కిప్' అంటారు. ఇరు జట్లు లేదా ఇద్దరు ప్లేయర్లు తమ బౌల్స్‌ను రోల్ చేయడం పూర్తయిన తర్వాత.. పాయింట్లను లెక్కిస్తారు. జాక్ కు బౌల్ దగ్గరగా వెళ్లడం లేదా తాకడమే ఈ ఆట లక్ష్యం. సింగిల్స్ విభాగంలో ఎవరైతే తొలుత 21 పాయింట్లకు చేరుతారో వారిని విజేతగా ప్రకటిస్తారు. ఇక టీమ్ ఈవెంట్స్‌లో మాత్రం రౌండ్లన్నీ పూర్తయ్యాకనే విజేత ఎవరనేది తేలుస్తారు. జాకు బంతి తగిలిందా? ఎంత దూరంలో నిలిచింది అనేదే ఇక్కడ ప్రధానం. దాని ఆధారంగానే పాయింట్లను నిర్ణయిస్తారు.ఇక లాన్ బౌల్స్ గేమ్‌లో భారత్ శుభారంభం చేసింది. లాన్ బౌల్స్ మహిళల పెయిర్స్ ఈవెంట్లో భారత్ తొలి రౌండ్లో విజయం సాధించింది. హోరాహోరీగా సాగిన పోరులో భారత జోడీ రూపా రాణి–పింకీ ‘టైబ్రేక్’లో మాల్టాను ఓడించింది. పురుషుల సింగిల్స్‌లో భారత ప్లేయర్ పుతుల్ సోనోవాల్ 5–4, 3–7, 1–0తో ‘టైబ్రేక్’లో 2023 ప్రపంచ చాంపియన్ రియాన్ బెస్టెర్ (కెనడా)పై సంచలన విజయం సాధించాడు. Winning Start for Team India at CWG 2026!🇮🇳🔥Pinki Singh & Rupa Rani Tirkey defeated Malta in a thrilling tie-breaker in the women's pairs lawn bowls event.pic.twitter.com/EiffSZLrXn— Sports Apna 🇮🇳 (@sportsapna1) July 23, 2026Read: విద్యార్థుల నిరసన.. నాన్న మాటలు గుర్తు చేసుకున్న సచిన్ -
ఒక్క వీడియో కాల్‌తో కష్టాల్లో యువ క్రికెటర్..!
డేటింగ్యాప్లో పరిచయమైన మహారాష్ట్ర క్రికెట్ జట్టు యువక్రికెటర్‌ను ప్రేరేపించి అర్ధనగ్నంగా మార్చి వీడియో రికార్డు చేసిన యువతి డబ్బు కోసం బ్లాక్మెయిల్ చేసింది. యువక్రికెటర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈశాన్య విభాగ సెన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈనెల 17వ తేదీన కణ్ణూరు వద్ద పంచతార హోటల్లో ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. బెంగళూరులో క్రికెట్ మ్యాచ్ ఏర్పాటు చేసిన నేపథ్యంలో యువక్రికెటర్ మహారాష్ట్ర నుంచి నగరానికి చేరుకుని హోటల్లో ఉన్నాడు. డేటింగ్ యాప్‌లో పేరు నమోదు చేసుకున్న క్రికెటర్‌కు 17వ తేదీ రాత్రి గుర్తు తెలియని యువతి నుంచి మెసేజ్ వచ్చింది. వాట్సాప్‌కాల్‌లో మాట్లాడాలని తెలిపి నెంబర్ షేర్ చేసింది. అనంతరం ఇద్దరు వాట్సాప్ వీడియో కాల్లో మాట్లాడుకున్నారు. ఆ సమయంలో యువతి ఒంటిపై దుస్తులు తీసేసింది. క్రికెటర్ కూడా దుస్తులు తీసి అర్ధనగ్నంగా ఉండగా వీడియో రికార్డ్ చేసింది. కొద్దిసేపటి తరువాత క్రికెటర్‌కు ఫోన్ చేసి నగ్న వీడియో స్క్రీన్షాట్లు పంపించి డబ్బు ఇవ్వాలని బెదిరించింది. కంగారు పడిన క్రికెటర్ రూ.1,500 ఆన్లైన్లో షేర్ చేశారు. ఇంకా ఎక్కువ డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. -
కామన్వెల్త్ గేమ్స్ ప్రారంభం.. లాన్ బౌల్స్‌లో భారత్ శుభారంభం
గ్లాస్కో వేదికగా కామన్వెల్త్ గేమ్స్ గురువారం అర్ధరాత్రి అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. భారత్ తరఫున వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను, లవ్లీనా బొర్గొహైన్ ఫ్లాగ్ బేరర్స్‌గా వ్యవహరించారు. మువ్వన్నెల జెండాను చేతపట్టి వీరిద్దరు ముందు నడవగా, వారిని భారత జట్టు అనుసరించింది. ఇక గేమ్స్ ప్రారంభానికి ముందే బాక్సర్ లవ్లీనా భారత్‌కు పతకం ఖాయం చేయగా, లాన్ బౌల్స్ గేమ్‌లో భారత్ శుభారంభం చేసింది.లాన్ బౌల్స్ మహిళల పెయిర్స్ ఈవెంట్లో భారత్ తొలి రౌండ్లో విజయం సాధించింది. హోరాహోరీగా సాగిన పోరులో భారత జోడీ రూపా రాణి–పింకీ ‘టైబ్రేక్’లో మాల్టాను ఓడించింది. తొలి సెట్‌ను భారత్ 7–1, రెండో సెట్‌ను మాల్టా 4–3తో గెలుచుకోవడంతో టైబ్రేక్ అనివార్యమైంది. చివరి బౌల్లో రాణించి పింకీ జట్టును గెలిపించింది. పురుషుల సింగిల్స్‌లో భారత ప్లేయర్ పుతుల్ సోనోవాల్ 5–4, 3–7, 1–0తో ‘టైబ్రేక్’లో 2023 ప్రపంచ చాంపియన్ రియాన్ బెస్టెర్ (కెనడా)పై సంచలన విజయం సాధించాడు. డోపింగ్‌లో పట్టుబడిన భారత ప్లేయర్లు డోపింగ్‌లో పట్టుబడటంతో భారత జూడో క్రీడాకారుడు అరుణ్ కుమార్ కామన్వెల్త్ క్రీడలకు దూరమయ్యాడు. 73 కేజీల విభాగంలో అతను బరిలోకి దిగాల్సి ఉంది. అయితే ఇటీవల నిర్వహించిన డోపింగ్ పరీక్షలో అతను నిషేధిత ఉత్రే్పరకం వాడాడని తేలడంతో జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) అరుణ్‌పై తాత్కాలిక నిషేధం విధించింది. దాంతో గ్లాస్గోకు వెళ్లాల్సిన భారత టీమ్ నుంచి అతడిని తప్పించారు. ఇక వెయిట్‌లిఫ్టింగ్‌లో పలువురు ఆటగాళ్లు డోపింగ్ నిబంధనలు ఉల్లఘించడంతో భారత్‌కు కేటాయించిన కోటాను 16 నుంచి 11కు తగ్గిస్తూ కామన్వెల్త్ క్రీడల నిర్వాహక మండలి నిర్ణయం తీసుకుంది. అజిత్ (71 కేజీలు), సాయిరాజ్ పరదేశి (88 కేజీలు), హర్చరణ్ సింగ్ (110 కేజీలు), వంశితా వర్మ (86 కేజీలు) డోపింగ్ నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలింది. A proud moment for India! Led by Flag Bearer Mirabai Chanu and Ceremonial Baton Bearer Lovlina Borgohain, #TeamIndia proudly marches into the Opening Ceremony as the Commonwealth Games 2026 officially begin. Pic credit: @PTUshaOfficial#Cheer4Bharat #CWG2026… pic.twitter.com/w41GmdsmB2— Doordarshan Sports (@ddsportschannel) July 24, 2026 -
విద్యార్థుల నిరసన.. నాన్న మాటలు గుర్తు చేసుకున్న సచిన్
నీట్ పేపర్ లీక్‌పై దేశవ్యాప్తంగా ఆగ్రహం రాజుకుంటోంది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) చేపట్టిన నిరసన తీవ్రరూపం దాల్చింది. ఢిల్లీ నుంచి కాకుండా దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి విద్యార్థులు పెద్ద సంఖ్యలో జంతర్‌మంతర్‌కు తరలివస్తూ ఆందోళనలకు మద్దతు తెలుపుతున్నారు. ఈ క్రమంలో ఢిల్లీ పోలీసులు లాఠాచార్జీ చేసినప్పటికీ విద్యార్థులు ఏమాత్రం బెదరకుండా తమ నిరసనను వ్యక్తం చేస్తూనే ఉన్నారు. విద్యార్థుల ఆందోళనకు ప్రముఖుల మద్దతు కూడా పెరుగుతూ వస్తోంది . తాజాగా భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ విద్యార్థుల నిరసనలకు మద్దతు పలికాడు. ఎంతో కష్టపడి చదివినా ఫలితం దక్కనప్పుడు విద్యార్థులు ఆవేదన చెందడం అర్థం చేసుకోదగిన అంశమేనని పేర్కొన్నాడు. విద్యార్థులు మరోసారి ఇలా నిరాశకు లోనవ్వకుండా చూసే బాధ్యత సమాజంపై ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు సచిన్ గురువారం రాత్రి ‘ఎక్స్’లో పోస్టు చేశాడు. స్వతహాగా తన తండ్రి ప్రొఫెసర్ కావడంతో చిన్నప్పుడే తనకు నూరి పోసిన మాటలను సచిన్ మరోసారి గుర్తుచేసుకున్నాడు. ‘ఓటములు ఎదురైనా పర్వాలేదు, కానీ మోసం మాత్రం చేయకూడదు. విజయం కోసం ఎప్పుడూ అడ్డదారులు తొక్కవద్దని మా నాన్న నాకు చెప్పేవారు. సమాజంలో పెద్దలుగా, మన సంస్కృతిని సరైన మార్గంలో తీర్చిదిద్దాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. తమ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కలేదని విద్యార్థులు నిరాశ చెందడం సహజం. భవిష్యత్తులో వారికి మళ్లీ ఇలాంటి చేదు అనుభవాలు ఎదురుకాకుండా మనమందరం సమష్టిగా కృషి చేయాలి. జైహింద్’ అని సచిన్ టెండూల్కర్ ఎక్స్‌లో రాసుకొచ్చాడు.కేవలం ఫలితాలకే ప్రాధాన్యమిచ్చే సమాజం, ప్రతిభ కంటే అక్రమ మార్గాలనే ఎక్కువగా ఆశ్రయిస్తుందని అని సచిన్ అభిప్రాయపడ్డాడు. యువత ఆకాంక్షలను పరిరక్షించే దిశగా త్వరలోనే సరైన పరిష్కారాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశాడు.సచిన్‌తో పాటు భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్‌తో పాటు కోహ్లి, శుబ్‌మన్ గిల్ కూడా తమ సోషల్ మీడియా వేదికగా విద్యార్థులు చేస్తున్న శాంతియుత నిరసనలకు మద్దతు ప్రకటించారు. ఇదిలాఉంటే నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై అటు పార్లమెంట్ కూడా అట్టుడుకుతోంది. పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. మరోవైపు కాక్రోచ్ జనతాపార్టీ తమ ఆందోళనలను మరింత ఉధృతం చేసింది. pic.twitter.com/3a8WRHhWIK— Sachin Tendulkar (@sachin_rt) July 23, 2026


