టీ20 వరల్డ్‌కప్ 2026లో భాగంగా నమీబియాతో నేడు (ఫిబ్రవరి 12) జరిగిన టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. 210 పరుగుల లక్ష్య చేదనకు దిగిన నమీబియా జట్టు 116 పరుగులకే ఆలౌట్‌గా నిలిచింది. దీంతో 93 పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది.
నమీబియా బ్యాటర్లలో లౌరెన్ స్టీన్‌క్యాంప్ 29 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, జాన్ ఫ్రైలింక్ 22 పరుగులు సాధించాడు. మిగితా బ్యాట్స్‌మెన్స్ తక్కువ స్కోర్‌కే వెనుదిరగడంతో నమీబియా జట్టు 116 పరుగుల వద్ద ఆలౌట్ అయింది.
భారత బౌలర్లలో వరుణ్ చకరవర్తి 3 వికెట్లు తీయగా, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ చెరో 2 వికెట్లు తీశారు. అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, శివమ్ దూబేలకు తలో వికెట్టు దక్కింది. బ్యాటింగ్‌లో 52 పరుగులతో రాణించిన హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో కూడా రెండు వికెట్లు తీయడంతో 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది.
తొలుత టాస్ ఓడి నమీబియా ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన భారత్ భారీ స్కోర్ చేసింది. ఇషాన్ కిషన్ (24 బంతుల్లో 61; 6 ఫోర్లు, 5 సిక్సర్లు), హార్దిక్ పాండ్యా (28 బంతుల్లో 52; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. ఇషాన్, హార్దిక్ క్రీజ్‌లో ఉన్నంత సేపు భారత్ ఇంకా భారీ స్కోర్ సాధిస్తుందని అంతా అనుకున్నారు. అయితే చివర్లో భారత బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టడంతో 209 పరుగులకే పరిమితం కావాల్సి వచ్చింది.
తుది జట్లు..
భారత్: సంజు శాంసన్, ఇషాన్ కిషన్(w), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(c), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చకరవర్తి, జస్ప్రీత్ బుమ్రా
నమీబియా: లౌరెన్ స్టీన్‌క్యాంప్, జాన్ ఫ్రైలింక్, జాన్ నికోల్ లాఫ్టీ-ఈటన్, గెర్హార్డ్ ఎరాస్మస్(సి), జేజే స్మిట్, జేన్ గ్రీన్(w), రూబెన్ ట్రంపెల్‌మాన్, మలన్ క్రుగర్, బెర్నార్డ్ స్కోల్ట్జ్, బెన్ షికోంగో, మాక్స్ హీంగో


