breaking news
cricket news
-
విండీస్‌ను గెలిపించిన హోప్
న్యూ చండీగఢ్: బ్యాటింగ్‌లో భారీ స్కోరు చేసినా... ప్రత్యర్థిని నిలువరించడంలో బౌలర్లు విఫలమవడంతో... వెస్టిండీస్‌తో చివరి వన్డేలో భారత్ పరాజయం పాలైంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శనివారం జరిగిన పోరులో వెస్టిండీస్ 5 వికెట్ల తేడాతో టీమిండియాపై విజయం సాధించింది. గత రెండు మ్యాచ్‌ల్లో గెలిచిన శుబ్‌మన్ గిల్ సారథ్యంలోని టీమిండియా 2–1తో సిరీస్ కైవసం చేసుకుంది. శనివారం పరుగుల వరద పారిన పోరులో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 351 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (87 బంతుల్లో 129 నాటౌట్; 10 ఫోర్లు, 6 సిక్స్‌లు) అజేయ సెంచరీతో చెలరేగి వన్డేల్లో తన అత్యుత్తమ వ్యక్తిగత స్కోరు నమోదు చేసుకోగా... ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మ (85 బంతుల్లో 92; 10 ఫోర్లు, 3 సిక్స్‌లు) త్రుటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. రుతురాజ్ గైక్వాడ్ (57; 1 ఫోర్, 4 సిక్స్‌లు) అర్ధశతకం సాధించాడు. గత మ్యాచ్‌లో రికార్డు డబుల్ సెంచరీ సాధించిన భారత సారథి శుబ్‌మన్ గిల్ ఒక పరుగుకే అవుట్ కాగా... స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి (0) ‘గోల్డెన్ డకౌట్’గా వెనుదిరిగాడు. వీరిద్దరూ వరుస బంతుల్లో అవుట్ కావడంతో 4 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన జట్టును రోహిత్ ఆదుకున్నాడు. మూడో వికెట్‌కు గైక్వాడ్‌తో కలిసి 137 పరుగులు జోడించాడు. ఇక ఈ సిరీస్‌లో తొలిసారి బ్యాటింగ్ చేసే అవకాశం దక్కించుకున్న కేఎల్ రాహుల్ తన క్లాసిక్ గేమ్‌తో కట్టిపడేశాడు. విండీస్ బౌలర్లలో జైడెన్ సీల్స్ 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో వెస్టిండీస్ 48.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 352 పరుగులు చేసింది. విండీస్‌కు వన్డేల్లో ఇదే అతిపెద్ద లక్ష్యఛేదన. కెప్టెన్ షై హోప్ (143 బంతుల్లో 162 నాటౌట్; 17 ఫోర్లు, 3 సిక్స్‌లు) అసాధారణంగా ఆడి చివరి వరకు అజేయంగా నిలిచి జట్టును గెలిపించాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు సొంతం చేసుకున్నాడు. అమిర్ జంగూ (67; 5 ఫోర్లు, 1 సిక్స్), కీమో పాల్ (44) హోప్‌కు సహకరించారు. భారత బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. సిరాజ్, బ్రార్, కుల్దీప్, నమన్ ధీర్ తలా ఒక వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ వన్డే అరంగేట్రం చేసిన అన్షుల్ కంబోజ్ 9 ఓవర్లలో 82 పరుగులచ్చి వికెట్ పడగొట్టలేకపోయాడు. గిల్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య మంగళవారం నుంచి టి20 సిరీస్ ప్రారంభంకానుంది. ఇదీ చదవండి: ముగిసిన ఆసియా గేమ్స్.. భారత్‌కు నాలుగో స్థానం -
ఒక్క సెంచరీతో విండీస్ కెప్టెన్ రికార్డుల వర్షం
చండీగఢ్ వేదికగా భారత్‌తో జరుగుతున్న చివరి వన్డేలో వెస్టిండీస్ టార్గెట్‌ను ఛేదించే పనిలో ఉంది. 352 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ ప్రస్తుతం 38 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. ఆ జట్టు కెప్టెన్ షెయ్ హోప్ అజేయ సెంచరీతో చెలరేగగా, కీమో పాల్ (31) అతడికి సహకరిస్తున్నాడు. ఈ నేపథ్యంలో షెయ్ హోప్ ఒక్క సెంచరీతో అనేక రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. 104 బంతుల్లో సెంచరీ మార్క్ చేరుకున్న షెయ్ హోప్ ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. కాగా వన్డేల్లో హోప్‌కు ఇది 21వ సెంచరీ. ఇక భారత గడ్డపై టీమిండియాపై అత్యధిక సెంచరీలు బాదిన బ్యాటర్లలో హోప్ చోటు సంపాదించాడు.👉తాజాగా చేసిన సెంచరీ హోప్‌కు నాలుగోది కాగా 14 ఇన్నింగ్స్‌ల్లో ఈ సెంచరీలు చేశాడు. కివీస్ బ్యాటర్ డారిల్ మిచెల్ కూడా నాలుగు సెంచరీలు చేసినప్పటికీ 8 ఇన్నింగ్స్‌ల్లోనే దీనిని అందుకున్నాడు. ఒక దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ 11 ఇన్నింగ్స్‌ల్లో ఐదు సెంచరీలు బాదాడు.👉ఓవరాల్‌గా టీమిండియాపై షెయ్ హోప్ ఐదు సెంచరీలు చేశాడు. ఈ క్రమంలో భారత్‌పై వన్డేల్లో అత్యధిక సెంచరీలు బాదిన క్రికెటర్‌గా హోప్ తొలి స్థానంలో నిలిచాడు. హోప్ కంటే ముందు క్రిస్ గేల్ (4 సెంచరీలు) ఈ ఫీట్ సాధించాడు.👉వన్డేల్లో 21సెంచరీల మార్క్‌ను అందుకునే క్రమంలో హోప్‌కు 152 ఇన్నింగ్స్‌లు అవసరమయ్యాయి. ఈ క్రమంలో అత్యంత తక్కువ ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్ సాధించిన బ్యాటర్‌గా డికాక్, వార్నర్‌లతో కలిసి సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నాడు. ఇక 21 సెంచరీలు చేసేందుకు హషీమ్ ఆమ్లా 116 ఇన్నింగ్స్‌లు తీసుకొని తొలి స్థానంలో ఉండగా, కోహ్లి (138 ఇన్నింగ్స్‌లు) రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. డివిలియర్స్ (183 ఇన్నింగ్స్‌లు), రోహిత్ శర్మ (186 ఇన్నింగ్స్‌లు) నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు.👉వన్డేల్లో కెప్టెన్ కమ్ వికెట్ కీపర్‌గా ఎక్కువ సెంచరీలు సాధించిన బ్యాటర్‌గా షెయ్ హోప్ (8 సెంచరీలు) తొలి స్థానంలో నిలిచాడు. ఇక ఎంఎస్ ధోని (6 సెంచరీలు), ఏబీ డివిలియర్స్ (4 సెంచరీలు) తర్వాతి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు.ఇదీ చదవండి: ద్రవిడ్ రికార్డు బద్దలు కొట్టిన కేఎల్ రాహుల్ -
ద్రవిడ్ రికార్డు బద్దలు కొట్టిన కేఎల్ రాహుల్
వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ (87 బంతుల్లో 129 నాటౌట్) అజేయ సెంచరీతో మెరిసిన సంగతి తెలిసిందే. ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి సెంచరీతో చెలరేగిన రాహుల్ కెరీర్లో తొమ్మిదో సెంచరీ సాధించాడు. తద్వారా కేఎల్ రాహుల్ భారత దిగ్గజం రాహుల్ ద్రవిడ్ రికార్డును బద్దలుకొట్టాడు. కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్‌కు ముందు, వెస్టిండీస్‌పై భారత వికెట్ కీపర్ బ్యాటర్ చేసిన అత్యధిక వన్డే స్కోరు ద్రవిడ్ పేరిట ఉండేది. ద్రవిడ్ 124 బంతుల్లో 109 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. మరోసారి ఇదే వెస్టిండీస్‌పై 124 బంతుల్లో 103 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇక వీరిద్దరి తర్వాత ఎంఎస్ ధోని (130 బంతుల్లో 95 పరుగులు), సమీర్ దిఘే (96 బంతుల్లో 94 నాటౌట్) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఓవరాల్‌గా వెస్టిండీస్‌పై వన్డేల్లో అత్యధిక వన్డే స్కోర్లు సాధించిన వికెట్ కీపర్లలో జాస్ బట్లర్ అగ్రస్థానంలో నిలిచాడు. 2019లో బట్లర్ 77 బంతుల్లోనే 150 పరుగులు సాధించాడు. ఏబీ డివిలియర్స్ (44 బంతులల్ఓ 149 పరుగులు) రెండో స్థానంలో ఉండగా, బ్రెండన్ టేలర్ (124 బంతుల్లో 138 పరుగులు) మూడో స్థానంలో ఉన్నాడు. ఇక కేఎల్ రాహుల్ (87 బంతుల్లో 129 నాటౌట్) నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. పాకిస్తాన్ బ్యాటర్ కమ్రాన్ అక్మల్ (125 బంతుల్లో 124 పరుగులు) ఐదో స్థానంలో ఉన్నాడు.దీంతోపాటు కేఎల్ రాహుల్ మరో మైలురాయిని చేరుకున్నాడు. వెస్టిండీస్‌పై వన్డేల్లో సెంచరీ సాధించిన రెండో భారత వికెట్ కీపర్‌గా రాహుల్ నిలిచాడు. ద్రవిడ్ తొలి క్రికెటర్‌గా ఉన్నాడు. ఈ ఇద్దరు కర్ణాటక రాష్ట్రానికి చెందినవారు కావడం విశేషం. అలాగే అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లు కలిపి కేఎల్ రాహుల్ 10వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. కాగా ఈ మైలురాయిని అందుకున్న 15వ భారత బ్యాటర్‌గా నిలిచాడు.ఇక మ్యాచ్ విషయానికొస్తే 352 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ 32 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. షెయ్ హోప్ (96), కీమో పాల్ (5) క్రీజులో ఉన్నారు. అంతకముందు రూథర్‌ఫోర్డ్ (23), అమీర్ జాంగో (67) అర్థసెంచరీ చేసి ఔటయ్యారు.చదవండి: వన్డే చరిత్రలోనే భారత బౌలర్ అత్యంత చెత్త రికార్డు -
వన్డే చరిత్రలోనే భారత బౌలర్ అత్యంత చెత్త రికార్డు
న్యూ చండీగఢ్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న చివరి వన్డేలో టీమిండియా బౌలర్ గుర్నూర్ బ్రార్ వన్డే క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు నమోదు చేశాడు. వరుసగా మూడు వన్డేలు కలిపి అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్ల జాబితాలో గుర్నూర్ బ్రార్ చోటు సంపాదించాడు. విండీస్‌తో వన్డే సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు ఆడిన గుర్నూర్ ఇప్పటివరకు 253 పరుగులు ఇచ్చుకున్నాడు. తద్వారా అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్‌గా గుర్నూర్ తొలి స్థానంలో నిలిచాడు. గుర్నూర్ తర్వాత కెవిన్ ఒబ్రియాన్ (2015లో) 246 పరుగులు సమర్పించుకొని రెండో స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత వరుసగా షాహిన్ అఫ్రిది (245 పరుగులు, 2019లో), మసకద్జ (244 పరుగులు, 2010లో), ఆడమ్ జంపా (240 పరుగులు, 2023లో), అల్జారీ జోసెఫ్ (240 పరుగులు, 2026లో), భువనేశ్వర్ కుమార్ (239 పరుగులు, 2015లో) ఉన్నారు.ఇక మ్యాచ్ విషయానికొస్తే.. 352 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ నిలకడగా ఆడుతోంది.ప్రస్తుతం వికెట్ నష్టానికి 147 పరుగులు చేసింది. షెయ్ హోప్ (61), అమీర్ జాంగో (66) క్రీజులో ఉన్నారు. అంతకముందు భారత్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 351 పరుగుల భారీ స్కోరు చేసింది. కేఎల్ రాహుల్ (129 నాటౌట్) అజేయ సెంచరీతో మెరవగా, రోహిత్ శర్మ (92) అర్థసెంచరీతో రాణించాడు.ఇదీ చదవండి: వన్డే క్రికెట్లో టీమిండియా సరికొత్త రికార్డు -
వన్డే క్రికెట్లో టీమిండియా సరికొత్త రికార్డు
వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా భారీ స్కోరు చేసింది. కేఎల్ రాహుల్ (129 నాటౌట్) విధ్వంసకర సెంచరీకి తోడు రోహిత్ శర్మ (92) రాణించడంతో భారత జట్టు 351 పరుగుల భారీ స్కోరు చేసింది. ఈ నేపథ్యంలో వన్డే క్రికెట్లో టీమిండియా అరుదైన రికార్డు నెలకొల్పింది. వన్డే చరిత్రలో టీమిండియా 350 ప్లస్ స్కోరు సాధించడం ఇది 45వ సారి. సౌతాఫ్రికా 36 సార్లు 350 ప్లస్ స్కోర్లు సాధించి రెండో స్థానంలో ఉండగా, తొలి స్థానంలో ఉన్న భారత్‌కు.. రెండో ప్లేస్‌లో ఉన్న దక్షిణాఫ్రికాకు మధ్య 11 వ్యత్యాసముంది. దీంతో భారత జట్టు ఎవరికీ అందనంత ఎత్తులో కొనసాగుతుంది. ఇక భారత్, ఆస్ట్రేలియా తర్వాత ఆస్ట్రేలియా 31సార్లు 350 ప్లస్ స్కోర్లు చేయగా, ఇంగ్లండ్ 29 సార్లు, న్యూజిలాండ్ 18 సార్లు చొప్పున వన్డేల్లో 350 ప్లస్ స్కోరు చేశాయి.దీంతోపాటు టీమిండియా మరో రికార్డు కూడా సాధించింది. విండీస్‌తో వన్డే సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు కలిపి 45 సిక్సర్లు కొట్టారు. తద్వారా ఒక ద్వైపాక్షిక సిరీస్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన జట్ల జాబితాలో టీమిండియా ఇంగ్లండ్‌తో కలిపి సంయుక్తంగా మూడో స్థానంలో కొనసాగుతుంది. భారత్, ఇంగ్లండ్ కంటే ముందు ఆస్ట్రేలియా (66 సిక్సర్లు వర్సెస్ టీమిండియా, 2013లో), వెస్టిండీస్ (66 సిక్సర్లు వర్సెస్ ఇంగ్లండ్, 2019లో) సంయుక్తంగా తొలి స్థానంలో కొనసాగుతున్నాయి. ఇక సౌతాఫ్రికా (55 సిక్సర్లు వర్సెస్ ఆస్ట్రేలియా, 2023లో) రెండో స్థానంలో కొనసాగుతుంది.ఇదీ చదవండి: రాహుల్ సెంచరీ, దంచికొట్టిన రోహిత్.. విండీస్ టార్గెట్ 352 రన్స్ -
రాహుల్ సెంచరీ, దంచికొట్టిన రోహిత్.. విండీస్ టార్గెట్ 352 రన్స్
న్యూ చండీగఢ్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న చివరి వన్డేలో కేఎల్ రాహుల్ అజేయ సెంచరీతో మెరిశాడు. 80 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకున్న కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, ఆరు సిక్సర్లు ఉన్నాయి. దీంతో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 351 పరుగుల భారీ స్కోరు చేసింది. కేఎల్ రాహుల్ (87 బంతుల్లో 129 నాటౌట్, 10 ఫోర్లు, ఆరు సిక్సర్లు) విధ్వంసం సృష్టించగా, అంతకముందు ఓపెనర్ రోహిత్ శర్మ (92) తృటిలో సెంచరీ చేజార్చుకోగా, రుతురాజ్ గైక్వాడ్ (57) అర్థసెంచరీతో రాణించారు. చివర్లో నమన్ ధీర్ (30) హోంగ్రౌండ్లో ఆకట్టుకున్నాడు. వెస్టిండీస్ బౌలర్లలో జైడన్ సీల్స్ మూడు వికెట్లు తీయగా, కీమో పాల్ రెండు వికెట్లు పడగొట్టాడు. కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (1), విరాట్ కోహ్లి గోల్డెన్ డక్ కావడంతో టీమిండియా ఆరంభంలోనే 4 పరుగుల వద్ద రెండు వికెట్లు కోల్పోయింది.ఈ దశలో రోహిత్ శర్మ, రుతురాజ్‌లు కలిసి మూడో వికెట్‌కు 137 పరుగుల సెంచరీ భాగస్వామ్యంతో ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. అయితే 8 పరుగుల దూరంలో సెంచరీ చేజార్చుకోగా, హాఫ్ సెంచరీ చేసిన వెంటనే రుతురాజ్ కూడా వెనుదిరగడంతో భారత్ స్కోరు డౌన్ అయింది. ఈ దశలో వికెట్ కీపర్ కేఎల్ రాహుల్.. లోయర్ ఆర్డర్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించాడు. అతడికి నమన్ ధీర్ కూడా చక్కగా సహకరించాడు. ముఖ్యంగా చివరి ఓవర్లో రాహుల్ విశ్వరూపం ప్రదర్శించాడు. రెండు సిక్సర్లు, ఒక ఫోర్‌తో చెలరేగిన రాహుల్ జట్టు స్కోరును 350 పరుగుల మార్క్‌ను దాటించాడు. Smiles, cheers, and celebrations all around 🥳🎥 Scenes to cherish for KL Rahul and #TeamIndia 🤩Updates ▶️ https://t.co/PhSJSbvW7C#INDvWI | @mflone_ | @klrahul pic.twitter.com/wFTPDqLlvt— BCCI (@BCCI) October 3, 2026ఇదీ చదవండి: Asian Games: భారత పురుషుల హాకీ జట్టుకు స్వర్ణం -
ఆసియా గేమ్స్‌లో స్వర్ణం.. సుందర్‌కు భారీ నజరానా
ఆసియా గేమ్స్ 2026లో స్వర్ణ పతకం సాధించిన టీమిండియా జట్టులో సభ్యుడిగా ఉన్న వాషింగ్టన్ సుందర్‌కు తమిళనాడు ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. స్వర్ణ పతకం గెలుచుకున్న సుందర్‌కు రూ. 75 లక్షల రివార్డు ప్రకటించినట్లు తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ తెలిపారు. తమిళనాడు స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ (ఎస్‌డీఏటీ) ద్వారా సుందర్‌కు ప్రోత్సాహకాన్ని అందించనున్నారు. ఇక పాకిస్తాన్‌తో జరిగిన ఫైనల్లో వాషింగ్టన సుందర్ మంచి ప్రదర్శన కనబరిచాడు. 4 ఓవర్లు బౌలింగ్ వేసిన సుందర్ కేవలం 29 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. లక్ష్యానికి 19 దూరంలో పాకిస్తాన్ నిలిచిపోవడం వెనుక సుందర్ కీలకపాత్ర వహించాడు. తద్వారా భారత్ స్వర్ణ పతకం కైవసం చేసుకోగా.. పాక్ రజతానికే పరిమితమైంది. 2023లో రుతురాజ్ సారథ్యంలోనూ టీమిండియా గోల్డ్ మెడల్ అందుకున్న సంగతి తెలిసిందే.సీఎం విజయ్ స్పందిస్తూ.. "జపాన్‌లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ విభాగంలో స్వర్ణ పతకం సాధించి చారిత్రక ఘనత సాధించిన టీమిండియాకు, జట్టులో సభ్యుడైన తమిళనాడుకు చెందిన క్రికెటర్ వాషింగ్టన్ సుందర్‌కు నా హృదయపూర్వక అభినందనలు. సుందర్ సాధించిన ఈ ఘనతను ప్రశంసిస్తూ, తమిళనాడు ప్రభుత్వం తరఫున ₹75 లక్షల ప్రతిష్టాత్మక నగదు బహుమతిని అందజేయడం జరుగుతుంది. ఆయన విజయం యువతరానికి కొత్త స్ఫూర్తిని, ఆత్మవిశ్వాసాన్ని అందిస్తుంది. దేశం తరఫున సుందర్ క్రికెట్ మ్యాచ్‌లలో రాణించి, మరెన్నో మైలురాళ్లను సాధించాలని నేను ఆకాంక్షిస్తున్నాను." అని చెప్పుకొచ్చారు.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ (61), తిలక్ వర్మ (51 నాటౌట్) అర్థసెంచరీలు చేయగా, శివమ్ దూబే (27), ఇషాన్ కిషన్ (20) రాణించారు. పాక్ బౌలర్లలో అహ్మద్ దనియాల్, అరాఫత్ మిన్హస్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం పాకిస్తాన్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 192 పరుగులకు పరిమితమైంది. హసన్ నవాజ్ (96) తృటిలో సెంచరీ చేజార్చుకోగా, సయీమ్ అయూబ్ (29) పర్వాలేదనిపించాడు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్, సుందర్, శివమ్ దూబే తలా రెండు వికెట్లు తీశారు.ஜப்பானில் நடைபெற்றுவரும் 20-வது ஆசிய விளையாட்டுப் போட்டிகளில், ஆடவர் கிரிக்கெட் பிரிவில் தங்கப் பதக்கம் வென்று சாதனை படைத்துள்ள இந்திய ஆடவர் அணிக்கும், அவ்வணியில் இடம்பெற்றுள்ள தமிழ்நாட்டைச் சேர்ந்த கிரிக்கெட் வீரர் வாஷிங்டன் சுந்தர் அவர்களுக்கும் எனது மனமார்ந்த வாழ்த்துகளையும்,… pic.twitter.com/dZqIKrHujI— CMOTamilNadu (@CMOTamilnadu) October 3, 2026ఇదీ చదవండి: విరాట్ కోహ్లి చెత్త రికార్డు -
IND Vs WI: విరాట్ కోహ్లి చెత్త రికార్డు
న్యూ చండీగఢ్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న చివరి వన్డేలో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి నిరాశపరిచాడు. తొలి బంతికే ఔటయ్యి గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేరాడు. జైడన్ సీల్స్ వేసిన అద్భుత బంతిని ఆడడంలో అంచనా తప్పిన కోహ్లి క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. గోల్డెన్ డకౌట్ నేపథ్యంలో కోహ్లి ఒక చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. వన్డేల్లో కోహ్లికి ఇది నాలుగో గోల్డెన్ డకౌట్ కాగా, అందులో మూడుసార్లు వెస్టిండీస్‌పైనే తాను ఆడిన ఇన్నింగ్స్ తొలి బంతికే వెనుదిరగడం గమనార్హం.వన్డేల్లో కోహ్లి గోల్డెన్ డకౌట్లు..2011లో నార్త్‌సౌండ్ వేదికగా జరిగిన వన్డేలో డారెన్ సామీ బౌలింగ్‌లో తొలిసారి గోల్డెన్ డక్2013లో ధర్మశాల వేదికగా ఇంగ్లండ్‌తో వన్డేలో టిమ్ బ్రెస్నన్ బౌలింగ్‌లో రెండోసారి గోల్డెన్ డక్2019లో విశాఖపట్నం వేదికగా కీరన్ పొలార్డ్ బౌలింగ్‌లో మూడోసారి గోల్డెన్ డక్తాజాగా చండీగఢ్ వేదికగా విండీస్ బౌలర్ జైడన్ సీల్స్ బౌలింగ్‌లో నాలుగోసారి గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. అయితే వెస్టిండీస్‌తో వన్డేల్లో మూడుసార్లు గోల్డెన్‌డక్ అయిన కోహ్లి.. ఇదే విండీస్‌పై వన్డేల్లో 2,429 పరుగులు చేయగా.. అందులో 10 సెంచరీలు ఉండడం విశేషం.మరో చెత్త రికార్డు కూడాగోల్డెన్ డక్స్‌తో పాటు కోహ్లి మరో చెత్త రికార్డు కూడా మూటగట్టుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో మూడు ఫార్మాట్లు ( వన్డే, టెస్టు, టీ20) కలిపి కోహ్లి ఇప్పటివరకు 41 సార్లు డకౌట్ అవ్వగా, భారత్ తరఫున అత్యధికసార్లు డకౌట్ అయిన రెండో బ్యాటర్‌గా కోహ్లి నిలిచాడు. ఈ జాబితాలో జహీర్ ఖాన్ (43 సార్లు) తొలి స్థానంలో ఉండగా, ఇషాంత్ శర్మ (40 సార్లు) మూడో స్థానంలో ఉన్నాడు. ఇక వన్డేల్లో 19 సార్లు డకౌట్ అయిన కోహ్లి.. టెస్టుల్లో 15 సార్లు, టీ20ల్లో ఏడుసార్లు డకౌట్‌గా వెనుదిరిగాడు.కలిసిరాని అక్టోబర్..అక్టోబర్ నెల కోహ్లికి కలిసి రాలేదని చెప్పొచ్చు. గత మూడేళ్లలో కోహ్లి అక్టోబర్ నెలలోనే నాలుగుసార్లు డకౌట్ అవ్వడం గమనార్హం. 2024 అక్టోబర్‌లో తొలిసారి న్యూజిలాండ్‌తో టెస్టు మ్యాచ్‌లో డకౌట్ అయిన కోహ్లి.. 2025 అక్టోబర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో కోహ్లి రెండుసార్లు డకౌట్ అయ్యాడు. తాజాగా అక్టోబర్‌లోనే మరోసారి కోహ్లి డకౌట్‌గా వెనుదిరగడం విశేషం.ఇదీ చదవండి: అమన్ చేతిలో వరల్డ్ చాంపియన్ చిత్తు; భారత్ ఖాతాలో 20వ స్వర్ణం -
పాక్‌తో టీ20 సిరీస్.. లంక జట్టు ప్రకటన; స్టార్ బ్యాటర్‌కు ఉద్వాసన
పాకిస్తాన్‌తో జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు శుక్రవారం లంక క్రికెట్ బోర్డు 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. గాయంతో ఇంగ్లండ్‌తో సిరీస్‌కు దూరమైన రెగ్యులర్ కెప్టెన్ కుశాల్ మెండిస్ తిరిగి రాగా.. మాజీ కెప్టెన్ దాసున్ షనక చోటు దక్కించు కున్నాడు. ఇటీవలే కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో బౌలర్లను ఊచకోత కోసిన షనకతో పాటు కుశాల్ రాక లంక జట్టును బలోపేతం చేసింది. ఇక ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న చరిత అసలంకతో పాటు బౌలర్ దిల్షాన్ మధుశంక, తరిందు రత్నాయకే, ఆల్‌రౌండర్ జనిత్ లియానగేలకు ఉద్వాసన పలికింది. ఇక దుష్మంత చమీర ఫిట్నెస్ నిరూపించుకోవాల్సి ఉంటుంది. గాయంతో సిరీస్‌కు దూరమైన వనిందు హసరంగ స్థానంలో స్పిన్నర్ విజయకాంత్ వియస్కాంత్ జట్టులోకి తీసుకుంది. సినెత్ జయవర్ధనను కూడా బ్యాకప్ ఓపెనర్‌గా ఎంపిక చేసింది. అక్టోబర్ 9 నుంచి 13 వరకు ఇరుజట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. మూడు మ్యాచ్‌లకు రావల్పిండి వేదిక కానుంది.టీ20 సిరీస్‌కు లంక జట్టు:కుశాల్ మెండిస్ (కెప్టెన్), కమిల్ మిశ్ర, సినెత్ జయవర్ధన, లాహిరు ఉదర, సహన్ అరాచిగే, కమిందు మెండిస్, దాసున్ షనక, చమిందు విక్రమసింఘే, దునిత్ వెల్లాలగే, మహీశ్ తీక్షణ, విజయకాంత్ వియస్కాంత్, బినుర ఫెర్నాండో, నువాన్ తుషార, ఈషాన్ మలింగ, దుష్మంత చమీర (ఫిట్నెస్ ఆధారంగా).ఇదీ చదవండి: Asian Games: అచ్చొచ్చిన శుక్రవారం.. ఒకేరోజు ఆరు స్వర్ణాలు -
విండీస్‌తో మూడో వన్డే.. టార్గెట్ 'క్లీన్‌స్వీప్'!
భారత్, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్‌లో పరుగుల వరద పారుతోంది. తొలి వన్డేలో ఇరుజట్లు కలిపి 500కు పైగా పరుగులు చేస్తే, రెండో వన్డేలో ఏకంగా 800కు పైగా పరుగులు సాధించాయి. బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్న ప్లాట్పిచ్లపై ఇరుజట్ల బ్యాటర్లు చెలరేగారు. ఇప్పటికే సిరీస్‌లో ఏడు శతకాలు నమోదయ్యాయి. నిర్జీవం లేని పిచ్‌లపై మ్యాచ్‌లు ఆడడంపై కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. బ్యాట్, బాల్ మధ్య సమన్వయం లేదని స్వయంగా భారత హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్ బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం, ఈ నేపథ్యంలో శనివారం జరగనున్న మూడో వన్డేకు బ్యాట్‌కు, బంతికి సమన్వయం కుదిరేలా పిచ్‌ను రూపొందించినట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలో ఇప్పటికే 2-0తో సిరీస్‌ను సొంతం చేసుకున్న టీమిండియా టార్గెట్ క్లీన్‌స్వీప్ దిశగా అడుగులు వేస్తుంది. ఇప్పటికే సిరీస్ సొంతం కావడంతో మొదట జట్టులో మార్పులు చేయాలని భావించింది. కానీ చివరి నిమిషంలో టీమిండియా మేనేజ్మెంట్ దానిని ఉపసంహరించుకున్నట్లు తెలుస్తోంది. "టార్గెట్ క్వీన్‌స్వీప్" అని భావిస్తున్న టీమిండియా ఒకటి లేదా రెండు మార్పులు మాత్రమే చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ప్రసిధ్ క్రిష్ణ స్థానంలో సిరాజ్ ఆడే అవకాశముండగా, నితీశ్‌కుమార్ రెడ్డి కూడా జట్టులోకి వచ్చే చాన్స్ లేకపోలేదు. ఇది మినహా తొలి రెండు వన్డేలకు ఆడిన జట్టునే దాదాపు ఆడించాలని చూస్తోంది.భారత జట్టుకు ప్రధాన సమస్యగా మారిన అంశం బౌలింగ్ విభాగమే. మధ్య ఓవర్లలో వికెట్లు తీయడంలో బౌలర్లు ఇబ్బంది పడుతున్నారు. కుల్దీప్ యాదవ్‌కు సహకారం లభించడం లేదు. రవీంద్ర జడేజా కూడా గత ఎనిమిది మ్యాచ్‌ల్లో కేవలం మూడు వికెట్లే తీయడంతో విమర్శలు ఎదుర్కొంటున్నాడు.మరోవైపు.. సిరీస్ కోల్పోయినప్పటికీ వెస్టిండీస్ బ్యాటర్లు అద్భుతంగా రాణిస్తున్నారు. గువాహటి మ్యాచ్‌లో విండీస్ 405 పరుగులు చేసి గట్టి పోటీనిచ్చింది. జాన్ క్యాంప్‌బెల్, హోప్, అమీర్ జాంగూ శతకాలతో రాణించారు. ముల్లంపూర్లో తొలిసారిగా పురుషుల వన్డే మ్యాచ్ జరుగుతుండటంతో, ఇక్కడి పిచ్ బౌలర్లకు కొంతైనా సహకరిస్తుందని ఆశిస్తున్నారు. ఇప్పటికే సిరీస్ కోల్పోయిన వెస్టిండీస్ జట్టు, ఈ ఆఖరి మ్యాచ్‌లోనైనా విజయం సాధించి పరువు నిలబెట్టుకోవాలని పట్టుదలగా ఉంది.భారత జట్టు అంచనా:శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రుతురాజ్ గైక్వాడ్, కెఎల్ రాహుల్ (వికెట్‌కీపర్), నమన్ ధీర్, రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, గుర్నూర్ బ్రార్.ఇదీ చదవండి: ఎస్ఆర్హెచ్ను వీడనున్న అభిషేక్ శర్మ! -
ఎస్ఆర్హెచ్ను వీడనున్న అభిషేక్ శర్మ!
ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు మాజీ చాంపియన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) జట్టుకు ఊహించని షాక్ తగిలేలా ఉంది. ఆ జట్టు విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ జట్టును ఎస్ఆర్హెచ్ను వీడనున్నట్లు ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఐపీఎల్ 2027 రిటెన్షన్స్ కంటే ముందే అభిషేక్ జట్టును వీడాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీలతో అభిషేక్ శర్మ సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ కూడా రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ వార్తల్లో నిజం లేదని ఎస్ఆర్హెచ్ సీఈవో షణ్ముగం ఖండించారు. అభిషేక్ శర్మను తాము వదులుకోవడానికి సిద్ధంగా లేమని, అనవసరంగా పుకార్లు పుట్టించొద్దని, ఇది ఎంతమాత్రం నిజం కాదని షణ్ముగం పేర్కొన్నాడు. 2026 ఐపీఎల్ సీజన్లో ఆరంభ మ్యాచ్‌లకు రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ దూరమవ్వడంతో అతడి స్థానంలో ఇషాన్ కిషన్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించడం అభిషేక్‌కు నచ్చలేదట. తనకు కెప్టెన్సీ అప్పగిస్తారని భావించినప్పటికీ, ఎస్ఆర్హెచ్ యాజమాన్యం మాత్రం ఇషాన్‌కు అప్పగించడంపై అభిషేక్ గుర్రుగా ఉన్నాడు. అయితే ఈ వార్తల్లో నిజం లేదనిపిస్తున్నప్పటికీ, ఒకవేళ అభిషేక్ శర్మ వచ్చే సీజన్ నాటికి జట్టును వీడితే మాత్రం అది ఎస్ఆర్హెచ్కు పెద్ద దెబ్బే అని చెప్పొచ్చు. ఓపెనింగ్ స్థానంలో వచ్చి ఎన్నో భీకరమైన ఇన్నింగ్స్‌లు ఆడిన అభిషేక్ శర్మ జట్టు సాధించిన చాలా విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఇక 2022 నుంచి అభిషేక్ శర్మ ఎస్ఆర్హెచ్తోనే ప్రయాణం సాగిస్తున్నాడు. 2024లో ఎస్ఆర్హెచ్ ఫైనల్ చేరడంలో అభిషేక్ శర్మ కీలకపాత్ర వహించాడు. ఆ సీజన్లో 16 మ్యాచ్‌లాడిన అభిషేక్ 484 పరుగులు సాధించాడు. 2025 సీజన్లో 40 బంతుల్లోనే సెంచరీ సాధించిన అభిషేక్ ఐపీఎల్లో తన తొలి సెంచరీ మార్క్‌ను చేరుకున్నాడు. ఓవరాల్‌గా ఐపీఎల్లో 92 మ్యాచ్‌లాడిన అభిషేక్ శర్మ 2,379 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు, 13 అర్థసెంచరీలు ఉన్నాయి. ఇక టీమిండియా తరఫున ప్రస్తుతం ఆసియా గేమ్స్‌లో పాల్గొంటున్న అభిషేక్ శర్మ రేపు పాకిస్తాన్‌తో జరగనున్న ఫైనల్ పోరు కోసం సిద్ధమవుతున్నాడు. ఇదీ చదవండి: ఓటమి తప్పించిన భారత బ్యాటర్.. ఆసీస్‌పై సిరీస్ కైవసం -
ఓటమి తప్పించిన భారత బ్యాటర్.. ఆసీస్‌పై సిరీస్ కైవసం
పాండిచ్చేరి వేదికగా ఆస్ట్రేలియా-ఎతో జరిగిన రెండో అనధికారిక టెస్టును భారత-ఎ జట్టు డ్రాగా ముగించింది. నాలుగోరోజు ఆటకు చివరి రోజు కావడంతో, రోజు ముగిసే సమయానికి 365 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు 9 వికెట్ల నష్టానికి 310 పరుగులు చేసింది. దీంతో ఆస్ట్రేలియా విజయానికి ఒక్క వికెట్ దూరంలో ఆగిపోయింది. తొలి అనధికారిక టెస్టును గెలిచిన భారత్ 1-0తో సిరీస్‌ను సొంతం చేసుకుంది. భారత్‌ను ఓటమి నుంచి తప్పించిన షామ్స్ ములాని రెండు టెస్టులు కలిపి 55 పరుగులతో పాటు 10 వికెట్లు తీసి ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు సొంతం చేసుకున్నాడు.మ్యాచ్‌లో భారత్ ఓటమి ఖాయమనున్న దశలో షామ్స్ ములానీ (131 బంతుల్లో 29) ఆపద్బాంధవుడి పాత్రను పోషించి జట్టును ఓటమి నుంచి తప్పించగా, నచికేత్ భూతే (20 నాటౌట్) అతడికి సహకరించాడు. చివర్లో ఆస్ట్రేలియా బౌలర్లను మార్చి ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినప్పటికీ లాభం లేకపోయింది. చివరి ఓవర్ వరకు విజయం కోసం ప్రయత్నించిన ఆసీస్‌కు శామ్స్ ములాని, నచికేత్ భూతేలు కొరకరాని కొయ్యలుగా మారి వారి గెలుపును అడ్డుకున్నారు. అంతకముందు యశ్ రాథోడ్ (80), తుషార్ దేశ్‌పాండే (52) అర్థసెంచరీలతో రాణించి భారత ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. ఆస్ట్రేలియా బౌలర్లలో లియామ్ స్కాట్ 5 వికెట్లతో చెలరేగగా.. లియామ్ హాచర్, టాడ్ ముర్ఫీ, కోరె రొచ్చిసియోలి, నాథన్ మెక్‌స్వీనీ తలా ఒక వికెట్ తీశారు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 358 పరుగులకు ఆలౌట్ కాగా.. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 167 పరుగులకే కుప్పకూలడంతో ఆసీస్‌కు 191 పరుగుల ఆధిక్యం లభించింది. ఆసీస్ తమ రెండో ఇన్నింగ్స్‌ను 173 పరుగుల వద్ద డిక్లేర్ చేసి భారత్ ఎదుట 365 పరుగుల టార్గెట్‌ను ఉంచింది. ఇరుజట్ల మధ్య అనధికారిక వన్డే సిరీస్ అక్టోబర్ 6 నుంచి జరగనుంది. ఈ నేపథ్యంలో తొలి అనధికారిక వన్డేకు పాండిచ్చేరి వేదిక కానుంది.ఇదీ చదవండి: రేపు పాక్‌తో ఫైనల్.. అందరి కళ్లు ఆ ముగ్గురిపైనే! -
రేపు పాక్‌తో ఫైనల్.. అందరి కళ్లు ఆ ముగ్గురిపైనే!
ఆసియా గేమ్స్‌లో భాగంగా రేపు జరగనున్న ఫైనల్లో భారత్, పాకిస్తాన్‌లు స్వర్ణ పతక పోరు కోసం అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఆట పరంగా చూస్తే పాకిస్తాన్ కంటే భారత్ అన్నింటిలో మెరుగ్గా కనిపిస్తుంది. వరుసగా రెండోసారి స్వర్ణం చేజేక్కించుకోవాలని టీమిండియా భావిస్తుండగా, టీమిండియాకు పసిడి కలను దూరం చేయాలనే పట్టుదలతో పాక్ బరిలోకి దిగుతోంది. ఐసీసీ సహా మేజర్ టోర్నీల్లో ఎక్కడ చూసుకున్నా పాకిస్తాన్‌పై భారత్‌దే స్పష్టమైన ఆధిపత్యం. ముఖ్యంగా ఐసీసీ ఈవెంట్లలో టీమిండియాను పాక్ ఓడించిన సందర్భాలు వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. గతేడాది ఆసియా కప్ ఫైనల్ సందర్భాగా ఈ రెండు జట్లు ఫైనల్లో తలపడగా, టీమిండియా విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఈసారి భారత్‌ను ఓడించి సొంతం చేసుకోవాలన్న పాకిస్తాన్ గోల్డ్ కలను భగ్నం చేయగల ముగ్గురు భారత స్టార్ల గురించి ఒకసారి చర్చిద్దాం.అభిషేక్ శర్మ..ఏడాది క్రితమే తొలిసారి పాకిస్తాన్‌తో ఆడిన అభిషేక్ శర్మ ఆ జట్టుకు భయాన్ని పుట్టించాడు. పాక్‌పై ఆడిన గత రెండు మ్యాచ్‌ల్లో అతడు తక్కువ స్కోరుకే వెనుదిరిగినప్పటికీ, ఉన్నంతసేపు పాక్ బౌలర్లను దంచికొట్టాడు. ఈ నేపథ్యంలో రేపు జరగనున్న ఫైనల్లో అభిషేక్ శర్మ వీరవిహారం చేస్తే మాత్రం పాక్‌కు కష్టాలు తప్పవు. పాక్‌తో నాలుగు మ్యాచ్‌లు ఆడిన అభిషేక్ శర్మ 177.41 స్ట్రైక్‌రేట్‌తో 110 పరుగులు చేశాడు. గతేడాది సెప్టెంబర్‌లో దుబాయ్ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ శర్మ 39 బంతుల్లోనే 74 పరుగులు చేసి పాక్ విధించిన భారీ టార్గెట్‌ను భారత్ సునాయాసంగా ఛేదించడంలో సహాయపడ్డాడు. అయితే గత రెండు ఇన్నింగ్స్‌ల్లో మాత్రం వరుసగా ఐదు, సున్నా స్కోర్లకే పరిమితమైనప్పటికీ, మ్యాచ్‌లో నిలదొక్కుకుంటే మాత్రం అభిషేక్ శర్మ డేంజర్ ఇన్నింగ్స్ ఆడగలడు.జస్ప్రీత్ బుమ్రా..పాకిస్తాన్‌పై బౌలింగ్‌లో టీమిండియా స్టార్ జస్ప్రీత్ బుమ్రాకు మంచి రికార్డు ఉంది. 2023-24 మధ్య కాలంలో జరిగిన రెండు వేర్వేరు ప్రపంచకప్పుల్లో బుమ్రా 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డులు సొంతం చేసకున్నాడు. అంతేకాదు ఈ ఏడాది ఆరంభంలో శ్రీలంకలో జరిగిన టీ20 ప్రపంచకప్ 2026లో కూడా పాక్‌తో మ్యాచ్‌లో బుమ్రా తాను వేసిన తొలి రెండు ఓవర్లలోనే పాక్ పతనాన్ని శాసించాడు. ఇప్పటివరకు బుమ్రా పాకిస్తాన్‌పై 8 మ్యాచ్‌ల్లో 11 వికెట్లు తీశాడు. తాను ఆడిన 8 మ్యాచ్‌ల్లో రెండుసార్లు మాత్రమే వికెట్ తీయడంలో విఫలమైన బుమ్రా, మిగిలిన ఆరు సందర్భాల్లో మాత్రం టీమిండియా విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించాడు.తిలక్‌వర్మ..టీమిండియా వైస్ కెప్టెన్ తిలక్ వర్మకు పాకిస్తాన్‌పై అమోఘమైన రికార్డు ఉంది. గతేడాది జరిగిన ఆసియా కప్ ఫైనల్లో బ్యాటింగ్‌కు కష్టంగా ఉన్న పిచ్‌పై తిలక్ వర్మ (53 బంతుల్లో 69 నాటౌట్) అజేయ ఇన్నింగ్స్ ఆడి భారత్‌ను గెలిపించాడు. అంతేకాదు ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌లోనూ తిలక్ వర్మ 25 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఆ మ్యాచ్‌లో టీమిండియా 61 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. ఇప్పటివరకు పాకిస్తాన్‌పై 4 మ్యాచ్‌లు ఆడిన తిలక్ వర్మ 155 పరుగులు చేశాడు.ఇదీ చదవండి: Asian Games 2026: రెజ్లింగ్‌లో భారత్‌కు తొలి స్వర్ణం -
వన్డే చరిత్రలో తొలిసారి; ఒకే మ్యాచ్‌లో ఐదుగురు బ్యాటర్లు శతకాలు
గౌహతి వేదికగా భారత్, వెస్టిండీస్ మధ్య జరిగిన రెండో వన్డేలో ఇరుజట్ల బ్యాటర్లు రికార్డులను ఊచకోత కోశారు. కేవలం రికార్డుల కోసమే ఆడుతున్నారా అనేంతలా బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. తొలుత భారత బౌలర్లను విండీస్ చితక్కొట్టింది. ఆకాశమే హద్దుగా చెలరేగి ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించారు. ఈ క్రమంలో ఆ జట్టు నుంచి ముగ్గురు బ్యాటర్లు.. క్యాంప్‌బెల్, షెయ్ హోప్, అమీర్ జంగాలు శతకాలతో చెలరేగారు. అసలే సొంతగడ్డపై ఆడుతున్న టీమిండియా.. భారీ లక్ష్య ఛేదన కళ్ల ముందు కనిపిస్తున్నప్పటికీ, విండీస్ బౌలర్లను ఊచకోత కోశారు. ఈ క్రమంలో ఓపెనర్లు శుబ్‌మన్ గిల్, రోహిత్ శర్మలు విధ్వంసకర సెంచరీలతో చెలరేగారు. అయితే గిల్ ఒక అడుగు ముందుకేసి తన సెంచరీని కాస్త డబుల్ సెంచరీగా మలిచాడు. ఈ నేపథ్యంలోనే వన్డే క్రికెట్ చరిత్రలోనే ఒక అద్భుతం చోటుచేసుకుంది. ఒకే వన్డే మ్యాచ్‌లో ఐదుగురు బ్యాటర్లు సెంచరీలు చేయడం ఇదే తొలిసారి. టెస్టుల్లో ఇలాంటి ఫీట్లు సర్వ సాధారణం. అయితే అంతర్జాతీయంగా వన్డేల్లో మాత్రం ఇలా ఒకే మ్యాచ్‌లో ఐదుగురు బ్యాటర్లు సెంచరీలు చేయడం మాత్రం ఇదే తొలిసారి. ఓవరాల్‌గా లిస్ట్-ఎ క్రికెట్లో మాత్రం రెండోసారి. తొలిసారి 2025లో రాజ్‌కోట్ వేదికగా బరోడా, హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఐదుగురు బ్యాటర్లు శతకాలతో మెరిశారు.ఇదీ చదవండి: గిల్ డబుల్ సెంచరీ, రోహిత్ సెంచరీ.. టీమిండియా రికార్డు ఛేదన -
గిల్ ప్రపంచ రికార్డు.. వన్డే చరిత్రలోనే ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ
వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీతో చెలరేగాడు. 117 బంతుల్లో డబుల్ సెంచరీ సాధించిన గిల్ ఇన్నింగ్స్‌లో 24 ఫోర్లు, 7 సిక్సర్లు ఉన్నాయి. కాగా వన్డే క్రికెట్ చరిత్రలో గిల్‌దే వేగవంతమైన డబుల్ సెంచరీ. ఇప్పటివరకు ఈ రికార్డు ఇషాన్ కిషన్ (126 బంతులు) పేరిట ఉండేది. తాజాగా ఇషాన్‌ను అధిగమించిన గిల్ నెంబర్‌వన్ స్థానాన్ని ఆక్రమించాడు. ఇక మ్యాక్స్‌వెల్ (128 బంతులు) మూడో స్థానంలో, పాతుమ్ నిసాంక (136 బంతులు), క్రిస్ గేల్ (138 బంతులు), వీరేంద్ర సెహ్వాగ్ (140 బంతులు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. మ్యాచ్‌లో 63 బంతుల్లోనే సెంచరీ సాధించిన గిల్.. మరో వంద పరుగులు చేయడానికి కేవలం 40 బంతులే తీసుకోవడం విశేషం. కాగా గిల్‌కు వన్డేల్లో ఇది రెండో డబుల్ సెంచరీ కావడం విశేషం. గతంలో 2023లో న్యూజిలాండ్‌పై 149 బంతుల్లో 208 పరుగులు సాధించాడు.ఈ క్రమంలో గిల్ ఒక అరుదైన ఫీట్ సాధించాడు. చేజింగ్‌లో ఒక జట్టు తరఫున డబుల్ సెంచరీ బాదిన రెండో క్రికెటర్‌గా గిల్ రికార్డులకెక్కాడు. ఇంతకముందు 2023 వన్డే ప్రపంచకప్ సమయంలో ఆసీస్ విధ్వంసకర బ్యాటర్ గ్లెన్ మాక్స్వెల్ అఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 292 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 128 బంతుల్లో 201 పరుగుల అజేయ ఇన్నింగ్స్‌తో అలరించాడు. ఇక టీమిండియా తరఫున వన్డేల్లో రెండు డబుల్ సెంచరీలు సాధించిన జాబితాలోనూ గిల్ చోటు సంపాదించాడు. భారత్ తరఫున రోహిత్ శర్మ మూడు డబుల్ సెంచరీలు, సెహ్వాగ్ రెండు డబుల్‌సెంచరీలు సాధించారు. తాజాగా గిల్ కూడా రోహిత్, సెహ్వాగ్ సరసన చేరాడు. అయితే వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు సాధించిన రికార్డు మాత్రం ఇప్పటికీ రోహిత్ పేరిటే ఉంది.𝗠𝗔𝗝𝗘𝗦𝗧𝗜𝗖. 𝗠𝗔𝗥𝗩𝗘𝗟𝗢𝗨𝗦. 𝗠𝗔𝗚𝗡𝗜𝗙𝗜𝗖𝗘𝗡𝗧 🫡Shubman Gill becomes just the 2️⃣nd Indian to score multiple ODI double hundreds 👏👏Updates ▶️ https://t.co/6XCYRtZLAi#TeamIndia | #INDvWI | @mflone_ | @ShubmanGill pic.twitter.com/e6MCoUfNbV— BCCI (@BCCI) September 30, 2026ఇదీ చదవండి: వన్డే చరిత్రలో తొలి బ్యాటర్‌గా.. అందనంత ఎత్తులో రోహిత్ శర్మ -
వన్డే చరిత్రలో తొలి బ్యాటర్‌గా.. అందనంత ఎత్తులో రోహిత్ శర్మ
టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ వన్డే క్రికెట్లో మరో అరుదైన ఫీట్ సాధించాడు. స్వదేశంలో వన్డే క్రికెట్లో 200 సిక్సర్లు పూర్తి చేసుకున్న తొలి బ్యాటర్‌గా రోహిత్ శర్మ రికార్డులకెక్కాడు. రెండో స్థానంలో క్రిస్ గేల్ (147 సిక్సర్లు) కొనసాగుతున్నాడు. మూడో స్థానంలో మార్టిన్ గుప్టిల్ (132 సిక్సర్లు), బ్రెండన్ మెక్కల్లమ్ (126 సిక్సర్లు), ఎంఎస్ ధోని (123 సిక్సర్లు) వరుసగా నాలుగు, ఐదు, ఆరు స్థానాల్లో ఉన్నారు. పైన చెప్పుకున్న క్రికెటర్లలో రోహిత్ మినహా మిగతావారంతా ఎప్పుడో రిటైర్ అయ్యారు. దీంతో రోహిత్ 200 సిక్సర్ల రికార్డుతో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. ఓవరాల్‌గా చూసుకున్నా రోహిత్ శర్మ వన్డేల్లో 376 సిక్సర్లతో తొలి స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. ముగ్గురు బ్యాటర్లు సెంచరీలతో విరుచుకుపడడంతో వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 405 పరుగులు చేసింది. అమిర్ జాంగో (77 బంతుల్లో 114; 13 ఫోర్లు, 3 సిక్సర్లు), జాన్ క్యాంప్‌బెల్ (68 బంతుల్లో 101; 9 ఫోర్లు, 5 సిక్సర్లు), కెప్టెన్ షెయ్ హోప్ (94 బంతుల్లో 104; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) వీరోచిత శతకాలు సాధించి భారీ స్కోరుకు బాటలు వేశారు. ప్రతిగా భారత్ కూడా ధీటుగా స్పందిస్తోంది. ప్రస్తుతం 28 ఓవర్లలో వికెట్ నష్టానికి 282 పరుగులు చేసింది. గిల్ (164), కోహ్లి (2) క్రీజులో ఉన్నారు. అంతకముందు రోహిత్ శర్మ (101) సెంచరీ చేసి ఔటయ్యాడు.ఇదీ చదవండి: విండీస్‌తో రెండో వన్డే.. చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ -
విండీస్‌తో రెండో వన్డే.. చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ
గౌహతి వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ రికార్డుల మీద రికార్డులు కొల్లగొడుతున్నాడు. 73 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రోహిత్ వన్డేల్లో 12వేల పరుగుల మార్క్‌ను అందుకున్నాడు. ఈ మార్క్ చేరుకునేందుకు రోహిత్‌కు 282 ఇన్నింగ్స్‌లు అవసరమయ్యాయి.తద్వారా 12వేల పరుగులు పూర్తి చేసేందుకు తక్కువ ఇన్నింగ్స్‌లు తీసుకున్న రెండో బ్యాటర్‌గా రోహిత్ శర్మ నిలిచాడు. రోహిత్ కంటే కోహ్లి (242 ఇన్నింగ్స్‌లు) ముందున్నాడు. ఇక సచిన్ టెండూల్కర్ (300 ఇన్నింగ్స్‌లు), పాంటింగ్ (314 ఇన్నింగ్స్‌లు), సంగ్కకర (336 ఇన్నింగ్స్‌లు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.ఇక వన్డే క్రికెట్లో 12వేల పరుగులు పూర్తి చేసుకున్న మూడో భారత బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ మాత్రమే భారత్ తరఫున ఈ మైలురాయిని చేరుకున్నారు. 2007లో వన్డే అరంగేట్రం చేసిన రోహిత్ శర్మ ఇప్పటివరకు 289 మ్యాచ్‌లు ఆడాడు. 1️⃣2️⃣,0️⃣0️⃣0️⃣ and he keeps going strong 💪🙌#TeamIndia great Rohit Sharma becomes the 3️⃣rd Indian to get to this 𝗠𝗔𝗝𝗢𝗥 𝗠𝗜𝗟𝗘𝗦𝗧𝗢𝗡𝗘 🫡Updates ▶️ https://t.co/6XCYRtZLAi#INDvWI | @mflone_ | @ImRo45 pic.twitter.com/Ov3O2Y34Jz— BCCI (@BCCI) September 30, 2026 -
డెబ్యూ బౌలర్‌కు పీడకలను మిగిల్చిన విండీస్ బ్యాటర్లు
గౌహతి వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో వన్డే ద్వారా అంతర్జాతీయ వన్డేల్లో అరంగేట్రం చేసిన అకీబ్ నబీ చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. అరంగేట్రం మ్యాచ్‌లోనే అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్‌గా అకీబ్ నబీ రికార్డులకెక్కాడు. 1975లో లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన వన్డేలో కర్సన్ గార్వి 11 ఓవర్లు వేసి 83 పరుగులు సమర్పించుకున్నాడు. తాజాగా అకీబ్ నబీ 51 ఏళ్ల తర్వాత ఆ చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.గుర్నూర్ బ్రార్ చెత్త రికార్డుటీమిండియా బౌలర్ గుర్నూర్ బ్రార్ చెత్త రికార్డు నమోదు చేశాడు. మ్యాచ్‌లో 10 ఓవర్లు బౌలింగ్ వేసిన గుర్నూర్ బ్రార్ 96 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు. ఈ నేపథ్యంలో ప్రత్యర్థి జట్టుకు అత్యధిక పరుగులు సమర్పించుకున్న భారత బౌలర్ల జాబితాలో గుర్నూర్ చోటు దక్కించుకున్నాడు. ఈ జాబితాలో భువనేశ్వర్ కుమార్ (106 పరుగులు వర్సెస్ సౌతాఫ్రికా, 2015లో), వినయ్ కుమార్ (102 పరుగులు వర్సెస్ ఆస్ట్రేలియా, 2013లో), గుర్నూర్ బ్రార్ (97 పరుగులు వర్సెస్ ఇంగ్లండ్, 2026), గుర్నూర్ బ్రార్ (96 పరుగులు వర్సెస్ వెస్టిండీస్, 2026), భువనేశ్వర్ కుమార్ (92 పరుగులు వర్సెస్ న్యూజిలాండ్, 2017) వరుసగా తొలి ఐదు స్థానాల్లో ఉన్నారు. మరో విశేషమేమిటంటే.. గుర్నూర్ బ్రార్ ఏడాదిలో రెండుసార్లు ప్రత్యర్థి జట్టుకు అత్యధిక పరుగులు సమర్పించుకున్న చెత్త బౌలర్‌గా నిలిచాడు. ఇదీ చదవండి: వన్డే క్రికెట్లో కుల్దీప్ యాదవ్ అరుదైన ఫీట్ -
వన్డే క్రికెట్లో కుల్దీప్ యాదవ్ అరుదైన ఫీట్
టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ వన్డే కెరీర్లో మరో అరుదైన మైలురాయిని అందుకున్నాడు. కీమో పాల్‌ను ఔట్ చేయడం ద్వారా కుల్దీప్ యాదవ్ వన్డేల్లో 200 వికెట్ల మార్క్‌ను చేరుకున్నాడు. భారత క్రికెట్లో ఇప్పటివరకు తొమ్మిది మంది బౌలర్లు మాత్రమే ఈ సంఖ్యను వారిలో స్పిన్ బౌలర్లలో అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్, రవీంద్ర జడేజా మాత్రమే ఈ ఘనత సాధించారు. తాజాగా కుల్దీప్ యాదవ్ వీరి సరసన చేరాడు.కుల్దీప్ ఇప్పటివరకు 123 వన్డేల్లో 200 వికెట్లు పడగొట్టాడు. అతడి బౌలింగ్ సగటు 26.70గా ఉంది. కెరీర్లో 10 సార్లు నాలుగు వికెట్ల ప్రదర్శన చేశాడు. రెండు సందర్భాల్లో 5 వికెట్ల ఘనత సాధించాడు. అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు 6/25గా ఉన్నాయి. భారత వన్డే క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో కుల్దీప్ ప్రస్తుతం తొమ్మిదో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో అనిల్ కుంబ్లే అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. స్పిన్నర్లలో కుంబ్లే 269 వన్డేల్లో 334 వికెట్లు సాధించగా, హర్భజన్ సింగ్ 265 వికెట్లతో రెండో స్థానంలో ఉండగా, రవీంద్ర జడేజా 232 వికెట్లతో తర్వాతి స్థానంలో ఉన్నాడు. ఓవరాల్ జాబితాలో కుంబ్లే తర్వాత శ్రీనాథ్ (315 వికెట్లు), అగార్కర్ (288 వికెట్లు), జహీర్ ఖాన్ (269 వికెట్లు), హర్భజన్ సింగ్ (265 వికెట్లు), కపిల్ దేవ్ (253 వికెట్లు), జడేజా (232 వికెట్లు), షమీ (206 వికెట్లు) ఉన్నారు.ఈ నేపథ్యంలో కుల్దీప్ యాదవ్ మరో రికార్డు కూడా అందుకున్నాడు. అతి తక్కువ వన్డేల్లో 200 వికెట్ల మార్క్ చేరుకున్న రెండో బౌలర్‌గా నిలిచాడు. కుల్దీప్ 123 వన్డేల్లో ఈ ఫీట్ అందుకోగా, షమీ 104 వన్డేల్లో 200 వికెట్ల మార్క్ చేరుకొని తొలి స్థానంలో ఉన్నాడు. అజిత్ అగార్కర్ 133 వన్డేల్లో, జహార్ ఖాన్ 144 వన్డేల్లో 200 వికెట్ల మార్క్‌ను చేరుకున్నారు.ఇదీ చదవండి: శతకాలతో విండీస్ బ్యాటర్ల విధ్వంసం.. భారత్ టార్గెట్ 406 రన్స్ -
శతకాలతో విండీస్ బ్యాటర్ల విధ్వంసం.. భారత్ టార్గెట్ 406 రన్స్
గౌహతి వేదికగా టీమిండియాతో జరుగుతున్న రెండో వన్డేలో వెస్టిండీస్ భారీ స్కోరు సాధించింది. ముగ్గురు బ్యాటర్లు సెంచరీలతో విరుచుకుపడడంతో వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 405 పరుగులు చేసింది. అమిర్ జాంగో (77 బంతుల్లో 114; 13 ఫోర్లు, 3 సిక్సర్లు), జాన్ క్యాంప్‌బెల్ (68 బంతుల్లో 101; 9 ఫోర్లు, 5 సిక్సర్లు), కెప్టెన్ షెయ్ హోప్ (94 బంతుల్లో 104; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) వీరోచిత శతకాలు సాధించి భారీ స్కోరుకు బాటలు వేశారు.చివర్లో రోస్టన్ చేజ్ (25 బంతుల్లో 29 నాటౌట్) ధాటిగా ఆడడంతో వెస్టిండీస్ 400 పరుగుల మార్క్‌ను దాటింది. భారత బౌలర్లలో అందరూ దారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. కుల్దీప్ యాదవ్, గుర్నూర్ బ్రార్, రవీంద్ర జడేజాలు తలా రెండు వికెట్లు పడగొట్టారు.ఇది రెండోసారి..ఇక వన్డేల్లో భారత్‌తో మ్యాచ్‌లో ప్రత్యర్థి జట్టు తరఫున ముగ్గురు శతకాలు సాధించడం ఇది రెండోసారి మాత్రమే. గతంలో 2015లో ముంబై వేదికగా భారత్‌తో జరిగిన ఐదో వన్డేలో సౌతాఫ్రికా బ్యాటర్లు క్వింటన్ డికాక్ (109), డుప్లెసిస్ (133), డివిలియర్స్ (119) శతకాలతో చెలరేగారు. తాజా వన్డేలో విండీస్ తరఫున క్యాంప్‌బెల్, హోప్, అమీర్ జాంగోలు సెంచరీలు సాధించిన సంగతి తెలిసిందే. ఇక వన్డే క్రికెట్ చరిత్రలో సౌతాఫ్రికా ఈ ఫీట్‌ను మూడుసార్లు నమోదు చేయడం విశేషం.405- ఇక వెస్టిండీస్‌కు వన్డేల్లో ఇదే అత్యధిక స్కోరు. గతంలో 389 పరుగులే ఆ జట్టుకు అత్యుత్తమం. 2019లో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో విండీస్ 389 పరుగులు చేసింది. 2025లో ఐర్లాండ్‌తో వన్డేలో 385 పరుగులు చేసింది.ఇదీ చదవండి: వెస్టిండీస్ కెప్టెన్ ప్రపంచ రికార్డు -
సెంచరీతో చెలరేగిన వెస్టిండీస్ కెప్టెన్
హరారే వేదికగా జింబాబ్వే వుమెన్‌తో జరుగుతున్న మూడో వన్డేలో వెస్టిండీస్ జట్టు కెప్టెన్ హేలీ మాథ్యూస్ సెంచరీతో మెరిసింది. దీంతో వెస్టిండీస్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది. హేలీ మాథ్యూస్ (113 బంతుల్లో 118; 18 ఫోర్లు, ఒక సిక్సర్) సెంచరీ చేయగా, వికెట్ కీపర్ షిమెయిన్ క్యాంప్బెల్లె (119 బంతుల్లో 96) సెంచరీ చేజార్చుకుంది. మిగిలిన బ్యాటర్లలో జన్నిలియా గ్లాస్కో (26 నాటౌట్), జహారా క్లాక్స్టన్ (11 నాటౌట్) చివర్లో మెరిశారు. జింబాబ్వే బౌలర్లలో నొమ్వెలో సిబండ, బిజా చెరో 2 వికెట్లు తీశారు. కాగా విండీస్ కెప్టెన్‌కు ఇది 14వ సెంచరీ కాగా, అంతర్జాతీయంగా 17వ సెంచరీ కావడం విశేషం. సూపర్ ఫామ్‌లో ఉన్న హేలీ మాథ్యూస్ ఆరంభం నుంచే జింబాబ్వే బౌలర్లపై విరుచుకుపడింది. ఆమెకు తోడు షిమెయిన్ క్యాంప్బెల్లె కూడా జింబాబ్వే బౌలర్లను ఒక ఆట ఆడుకుంది. ఈ ఇద్దరు కలిసి రెండో వికెట్‌కు 160 పరుగులు జోడించారు. ఇక ఇదే సిరీస్‌లో తొలి వన్డేలో హేలీ మాథ్యూస్ 156 బంతుల్లో 182 పరుగుల భారీ ఇన్నింగ్స్‌తో మెరిసిన సంగతి తెలిసిందే. దీంతో తొలి వన్డేలో విజయం సాధించిన విండీస్‌కు రెండో వన్డేలో మాత్రం జింబాబ్వే షాక్ ఇచ్చింది. ఆ మ్యాచ్‌లో జింబాబ్వే 4 వికెట్ల తేడాతో గెలుపొంది సిరీస్‌ను 1-1తో సమం చేసింది. A captain's knock from Hayley Matthews in the ODI series decider as she brings up another ton in Harare 💯👏📸: @windiescricket 📝: https://t.co/6rI12PWvYw pic.twitter.com/CdUAp3mTrc— ICC (@ICC) September 30, 2026ఇదీ చదవండి: IND Vs WI: చరిత్ర సృష్టించిన విండీస్ ఓపెనర్ -
IND Vs WI: చరిత్ర సృష్టించిన విండీస్ ఓపెనర్
గౌహతి వేదికగా టీమిండియాతో జరుగుతున్న రెండో వన్డేలో వెస్టిండీస్ ఓపెనర్ జాన్ క్యాంప్‌బెల్ విధ్వంసకర సెంచరీతో చరిత్ర సృష్టించాడు. 65 బంతుల్లోనే శతకం మార్క్ అందుకున్న క్యాంప్‌బెల్ విండీస్ తరఫున భారత్‌పై వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీ సాధించిన తొలి బ్యాటర్‌గా నిలిచాడు. గతంలో 1999లో సింగపూర్ వేదికగా జరిగిన వన్డేలో రికార్డో పావెల్ 72 బంతుల్లో శతకం సాధించగా, 2002లో విజయవాడ వేదికగా జరిగిన మ్యాచ్‌లో మార్లోన్ శామ్యూల్స్ 73 బంతుల్లో, 2018లో గౌహతి వేదికగా షిమ్రోన్ హెట్‌మైర్ 74 బంతుల్లో సెంచరీ మార్క్‌ను అందుకున్నారు. అంతేకాదు వన్డే క్రికెట్లో వెస్టిండీస్ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీ సాధించిన బ్యాటర్ల జాబితాలోనూ క్యాంప్‌బెల్ చోటు దక్కించుకున్నాడు. 65 బంతుల్లో సెంచరీ బాదిన క్యాంప్‌బెల్ జాబితాలో ఐదో స్థానంలో నిలిచాడు. తొలి స్థానంలో బ్రియాన్ లారా (45 బంతుల్లోనే) కొనసాగుతున్నాడు.వన్డేల్లో విండీస్ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీలు (బంతుల వారీగా)45 – బ్రియాన్ లారా వర్సెస్ బంగ్లాదేశ్, ఢాకా, 199955 – క్రిస్ గేల్ వర్సెస్ ఇంగ్లండ్, సెయింట్ జార్జెస్, 201961 – ఎవిన్ లూయిస్ వర్సెస్ శ్రీలంక, క్యాండీ, 202463 – నికోలస్ పూరన్ వర్సెస్ నెదర్లాండ్స్, హరారే, 202365 – జాన్ క్యాంప్‌బెల్ వర్సెస్ భారత్, గౌహతి, 202666 – షెయ్ హోప్ వర్సెస్ న్యూజిలాండ్, నేపియర్, 2025అయితే సెంచరీ బాదిన మరుసటి ఓవర్లోనే బ్రార్ బౌలింగ్‌లో షాట్‌కు యత్నించిన క్యాంప్‌బెల్.. నమన్ధిర్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. తొలి వన్డేలో ఓటమి చవిచూసిన వెస్టిండీస్ రెండో వన్డేను దూకుడుగా ఆరంభించింది. ముఖ్యంగా క్యాంప్‌బెల్ భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అతడి ధాటికి వెస్టిండీస్ 25 ఓవర్లలోనే 200 పరుగుల మార్క్ చేరువకు వచ్చింది. మరో ఓపెనర్ కీస్ కార్టీ 9 పరుగులకే వెనుదిరగ్గా, కెప్టెన్ షెయ్ హోప్ అర్థసెంచరీతో మెరిశాడు. ప్రస్తుతం వెస్టిండీస్ 25 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది.ఇదీ చదవండి: భారత స్పిన్నర్ ఆరు వికెట్ల ప్రదర్శన.. ఆసీస్ 176 ఆలౌట్ -
భారత స్పిన్నర్ ఆరు వికెట్ల ప్రదర్శన.. ఆసీస్ 176 ఆలౌట్
ధర్మశాల వేదికగా ఇండియా వుమెన్-ఎ జట్టుతో జరుగుతున్న ఏకైక అనధికారిక టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా-ఎ జట్టు 176 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 188 పరుగుల భారీ ఆధిక్యం లభించినట్లయింది. ఆసీస్ బ్యాటర్లలో కెప్టెన్ రాచెల్ ట్రెనామన్ (44) టాప్ స్కోరర్‌గా నిలవగా, వికెట్ కీపర్ తాహిలా విల్సన్ (35) పరుగులతో పర్వాలేదనిపించింది. భారత బౌలర్లలో స్పిన్నర్ వైష్ణవి శర్మ ఆరు వికెట్లతో చెలరేగగా, శుచి ఉపాధ్యాయ్, నికీ ప్రసాద్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అంతకముందు భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 364 పరుగులకు ఆలౌటైంది. తనీశా సింగ్ (92), నికీ ప్రసాద్ (91) సెంచరీలు మిస్ చేసుకోగా, ఓపెనర్ శుభా సతీష్ (59) అర్థసెంచరీ సాధించింది. లిల్లీ మిల్స్ నాలుగు వికెట్లు తీసింది.అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ వికెట్ నష్టపోకుండా 14 పరుగులు చేసింది. శుభా సతీశ్ (11), ప్రియా పూనియా (2) క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని ప్రస్తుతం భారత్ 202 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది.𝐀 𝐦𝐚𝐬𝐬𝐢𝐯𝐞 𝟏𝟖𝟖-𝐫𝐮𝐧 𝐟𝐢𝐫𝐬𝐭-𝐢𝐧𝐧𝐢𝐧𝐠𝐬 𝐥𝐞𝐚𝐝 𝐟𝐨𝐫 𝐈𝐧𝐝𝐢𝐚 𝐀 👏𝐈𝐧𝐝𝐢𝐚 𝐀: 𝟑𝟔𝟒/𝟏𝟎 (𝟏𝟎𝟑.𝟑)Tanisha Singh - 92 (166)Niki Prasad - 91 (112)Lilly Mills - 4/98 (32.3)𝐀𝐮𝐬𝐭𝐫𝐚𝐥𝐢𝐚 𝐀: 𝟏𝟕𝟔/𝟏𝟎 (𝟔𝟑.𝟒)Rachel Trenaman - 44 (88)… pic.twitter.com/s0Jona9ayS— Female Cricket (@imfemalecricket) September 30, 2026ఇదీ చదవండి: వెస్టిండీస్ ఓపెనర్ విధ్వంసం.. ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ -
'నా బ్యాట్లు ఎవరో దొబ్బేశారు.. మర్యాదగా ఇచ్చేయండి!'
టీమిండియా పేస్ బౌలర్ దీపక్ చాహర్‌కు చేదు అనుభవం ఎదురైంది. అతడికి ఎంతో ఇష్టమైన ఖరీదైన క్రికెట్ బ్యాట్లు చోరీకి గురయ్యాయి. ఈ విషయాన్ని స్వయంగా చాహర్ సోషల్ మీడియా వేదికగా పంచుకోగా, ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. బ్యాట్లు పోయాయనే బాధలో ఉన్నప్పటికీ, ఆ విషయాన్ని అతడు వ్యంగ్యంగా వెల్లడించిన తీరు నెటిజన్లను ఆకట్టుకుంటోంది.వివరాల్లోకి వెళితే, ప్రాక్టీస్ గ్రౌండ్లో ఉంచిన దీపక్ చాహర్ బ్యాట్లు అపహరణకు గురయ్యాయి. సుమారు రూ.1.5 లక్షల విలువైన మూడు ప్లేయర్-ఎడిషన్ బ్యాట్లు కనిపించకుండా పోయాయని అతడె వెల్లడించాడు. తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన వీడియోలో ఈ ఘటన గురించి వివరిస్తూనే సదరు దొంగకు తనదైన శైలిలో విజ్ఞప్తి చేశాడు."ఆ బ్యాట్లను దొంగిలించిన వ్యక్తికి బహుశా వాటి అసలు విలువ తెలియకపోవచ్చు. వాటితో అతను టెన్నిస్ బాల్ క్రికెట్ ఆడతాడో లేక మరెవరికైనా విక్రయిస్తాడో తెలీదు. అదేదో నేరుగా నా దగ్గరికే వచ్చి డబ్బులు అడిగి ఉంటే ఇచ్చేవాడిని కదా. ఇప్పుడు నేను ఏం చేయాలి? పోలీసులకు ఫిర్యాదు చేయాలా? లేక యోగి గారి దగ్గరికో, మోదీ గారి దగ్గరికో వెళ్లాలా? లేదంటే ఆ దేవుడిని వేడుకోవాలా? అదీ కాదంటే మరో రెండు, మూడు బ్యాట్లు పంపమని తయారీ కంపెనీని అడగాలా?" అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు. ప్రస్తుతం అతడి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Three player-edition bats belonging to cricketer Deepak Chahar have reportedly been stolen from the Chahar Academy Ground in Shastripuram, Agra.The three bats are worth around ₹1.5 lakh.@deepak_chahar9 shared a video informing fans about the incident.Requesting… pic.twitter.com/z5LR8XfX5p— Abhishek Arjun Singh (@AbhishekArjun05) September 29, 2026ఇదీ చదవండి: సచిన్‌కు సాధ్యం కాలేదు.. దిగ్గజం రికార్డుపై కన్నేసిన కోహ్లి -
సచిన్‌కు సాధ్యం కాలేదు.. దిగ్గజం రికార్డుపై కన్నేసిన కోహ్లి
తిరువనంతపురం వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో విరాట్ కోహ్లీ 55వ వన్డే శతకాన్ని నమోదు చేశాడు. విండీస్‌పై 139 పరుగుల అజేయ ఇన్నింగ్స్‌తో భారత్‌కు ఘన విజయాన్ని అందించాడు. తద్వారా అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకున్న కోహ్లి.. భారత దిగ్గజం సునీల్ గావస్కర్ రికార్డును కూడా సమం చేయడం విశేషం. ఈ రికార్డు ఆలస్యంగా వెలుగు చూసినప్పటికీ, ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది.వెస్టిండీస్‌పై అద్భుత రికార్డు కలిగిన సునీల్ గావస్కర్.. ఆ జట్టుపై అత్యధిక శతకాలు నమోదు చేసిన భారత క్రికెటర్‌గా నిలిచాడు. గావస్కర్ వెస్టిండీస్‌పై 38 మ్యాచ్‌ల్లో 13 శతకాలు సాధించాడు. అయితే కోహ్లి 78 మ్యాచ్‌ల్లో ఈ ఫీట్‌ను సాధించాడు. విండీస్‌తో తొలి వన్డేలో సెంచరీ చేసిన కోహ్లి 13వ శతకంతో గవాస్కర్ రికార్డును సమం చేశాడు. రేపు విండీస్‌తో రెండో వన్డే జరగనున్న నేపథ్యంలో గౌహతి వేదికగా కోహ్లి మరో సెంచరీ చేస్తే విండీస్‌పై అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్‌గా నిలవనున్నాడు. అసలే గౌహతిలో తాను ఆడిన రెండు వన్డేల్లోనూ సెంచరీలు బాదిన కోహ్లికి ఇప్పుడున్న ఫామ్ దృష్ట్యా అది పెద్ద కష్టం కాకపోవచ్చు.అయితే గావస్కర్ ఈ 13 శతకాలను టెస్టులోనే నమోదు చేయగా, కోహ్లి మాత్రం వన్డేల్లో 11, టెస్టుల్లో రెండు సెంచరీలు చేశాడు. అయితే భారత లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ మాత్రం వెస్టిండీస్‌పై తన కెరీర్లో ఏడు శతకాలు మాత్రమే చేశాడు. ఇందులో మూడు టెస్టుల్లో వస్తే, మరో నాలుగు వన్డే క్రికెట్లో సాధించాడు.ఇదీ చదవండి: గౌహతిలో రో-కోల ట్రాక్ రికార్డు అదుర్స్.. విండీస్‌కు చుక్కలే! -
గౌహతిలో రో-కోల ట్రాక్ రికార్డు అదుర్స్.. విండీస్‌కు చుక్కలే!
వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లో భాగంగా రేపు గౌహతిలోని బర్సాపరా వేదికగా టీమిండియా రెండో వన్డే మ్యాచ్ ఆడనుంది. తిరువనంతపురం వేదికగా జరిగిన తొలి వన్డేలో విండీస్‌ను ఉతికారేసిన భారత్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. రెండో వన్డేలోను గెలిచి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను సొంతం చేసుకోవాలని టీమిండియా భావిస్తోంది. మరోవైపు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు తమ చివరి అంకంలో మంచి ఫామ్‌ను ప్రదర్శిస్తూ బ్యాటింగ్ కొనసాగిస్తున్నారు. తొలి వన్డేలో రోహిత్ తక్కువ పరుగులే చేసినప్పటికీ, ఉన్నంతసేపు షాట్లతో అలరించాడు. ఇక కోహ్లి మాత్రం మరోసారి తనలోని చేజింగ్ మాస్టర్‌ను బయటికి తీస్తూ అజేయ సెంచరీతో జట్టును గెలిపించడంలో కీలకపాత్ర పోషించాడు. మునుపెన్నడూ లేని విధంగా కోహ్లి తన బ్యాటింగ్‌లో వేగం పెంచడం విశేషం.వీరోచిత శతకాలు..ఇక బర్సాపరా స్టేడియంలోనూ ఈ ఇద్దరు సీనియర్లకు మంచి ట్రాక్ రికార్డు ఉంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు ఈ స్టేడియంలో చెరో రెండు వన్డే మ్యాచ్‌లు ఆడారు. కోహ్లి ఆడిన రెండు వన్డేల్లోనూ సెంచరీలు బాదగా, రోహిత్ శర్మ ఒక మ్యాచ్‌లో అజేయ సెంచరీ చేయడంతో పాటు మరో మ్యాచ్‌లో అర్థశతకం బాదాడు. Photo Credit: BCCI Twitterతొలుత 2018లో వెస్టిండీస్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఓపెనర్‌గా వచ్చి 117 బంతుల్లోనే 152 పరుగులు అజేయ ఇన్నింగ్స్‌తో మెరవగా, కోహ్లి 140 పరుగులు సాధించాడు. వీరిద్దరి మెరుపులతో విండీస్ విధించిన 323 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 42.1 ఓవర్లలోనే ఛేదించింది. అలా తొలిసారి గౌహతి వేదికగా టీమిండియా ఆడిన మ్యాచ్‌లో రో-కోలిద్దరు సెంచరీలతో చెలరేగడం విశేషం.కోహ్లి సెంచరీ.. రోహిత్ అర్థసెంచరీఇక రెండోసారి టీమిండియా బర్సాపరా స్టేడియంలో 2023లో శ్రీలంకతో వన్డే మ్యాచ్ ఆడింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 373 పరుగుల భారీ స్కోరు చేసింది. కోహ్లి (87 బంతుల్లో 113) సెంచరీ బాదగా, రోహిత్ శర్మ (67 బంతుల్లో 83) మెరుపు అర్థసెంచరీ సాధించాడు. గిల్ (70) రాణించాడు. Photo Credit: BCCI Twitterఅనంతరం శ్రీలంక 8 వికెట్ల నష్టానికి 306 పరుగులకే పరిమితం కావడంతో భారత్ 67 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. కెప్టెన్ దాసున్ షనక (88 బంతుల్లో 108 నాటౌట్) అజేయ సెంచరీ, పాతుమ్ నిసాంక (72) పరుగులు చేసినప్పటికీ జట్టును ఓటమి నుంచి రక్షించలేకపోయారు. అలా రెండోసారి కూడా రో-కో ద్వయం అదుర్స్ అనిపించింది.ఇలా గౌహతిలోని బర్సాపరా స్టేడియంలో టీమిండియా ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ భారీ ఇన్నింగ్స్‌లు ఆడిన రో-కో ద్వయం రేపటి వన్డేలో మరోసారి చెలరేగితే మాత్రం విండీస్‌కు చుక్కలే అని చెప్పొచ్చు. కోహ్లి ఇప్పటికే సెంచరీతో తన ఉద్దేశాన్ని చాటి చెప్పగా, రోహిత్ భారీ ఇన్నింగ్స్‌తో అలరించాలనే పట్టుదలతో ఉన్నాడు. ఈ స్టేడియంలో విండీస్ ఒకే ఒక్క మ్యాచ్ ఆడినప్పటికీ, టీమిండియానే విజయం సాధించింది.ఇదీ చదవండి: ఆసీస్‌ను చితకొట్టిన భారత బ్యాటర్లు.. తొలిరోజు ముగిసిన ఆట -
ఆసీస్‌ను చితకొట్టిన భారత బ్యాటర్లు.. తొలిరోజు ముగిసిన ఆట
ధర్మశాల వేదికగా ఆస్ట్రేలియా-ఎ వుమెన్‌తో జరుగుతున్న ఏకైక అనధికారిక టెస్టు మ్యాచ్‌లో భారత జట్టు పట్టు బిగించింది. తొలిరోజు ఆట ముగిసే సమయానికి 100 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 351 పరుగులు చేసింది. తనిషా సింగ్ (166 బంతుల్లో 92) సెంచరీ చేజార్చుకోగా, నికీ ప్రసాద్ (78 నాటౌట్), శుచి ఉపాధ్యాయ్ క్రీజులో ఉన్నారు. అంతకముందు ఓపెనర్ శుభా సతీశ్ (59), అర్థసెంచరీ సాధించగా, ప్రియా పూనియా (46), అనుష్క శర్మ (44) రాణించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో లిల్లీ మిల్స్, చార్లీ నాట్ చెరో 3 వికెట్లు తీయగా, టెస్ ఫ్లింటాఫ్, మిల్లీ ఇల్లింగ్‌వర్త్, ఫ్రాంకీ నిక్లిన్ తలా ఒక వికెట్ తీశారు. 120 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయిన క్రమంలో అనుష్క శర్మతో కలిసి తనిశా సింగ్ ఐదో వికెట్‌కు 82 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. అనంతరం అనుష్క ఔటైనప్పటికీ, క్రీజులోకి వచ్చిన నికీ ప్రసాద్ ఆరంభం నుంచే ధాటిగా ఆడింది. సెంచరీ వైపు పరిగెడుతున్న తనిశా సింగ్‌ను టెస్ ఫ్లింటాఫ్ ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేర్చింది. అయితే నికీ ప్రసాద్ మాత్రం మరో ఎండ్‌లో ధాటిగా ఆడుతూ స్కోరును పెంచే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలోనే భారత్ స్కోరు 350 మార్క్‌ను దాటింది.𝐈𝐧𝐝𝐢𝐚 𝐀 𝐫𝐞𝐚𝐜𝐡 𝟑𝟓𝟏/𝟗 𝐚𝐭 𝐬𝐭𝐮𝐦𝐩𝐬 𝐨𝐧 𝐃𝐚𝐲 𝟏! 💪Tanisha Singh (92), Niki Prasad (78* ) and Shubha Satheesh (59) anchored India's innings 🏏Lilly Mills (3/94) and Charli Knott (3/82) led Australia A's bowling 👏 #CricketTwitter pic.twitter.com/Os0sDsSCzb— Female Cricket (@imfemalecricket) September 29, 2026ఇదీ చదవండి: భారత్ ఖాతాలో మరో స్వర్ణం.. అద్భుతం చేసిన అథ్లెట్లు -
'బతికుండగానే చంపేశారు'.. పాక్ క్రికెటర్ ఆవేదన!
పాకిస్తాన్ యువ క్రికెటర్ అజమ్ ఖాన్ మృతి చెందినట్లు సోషల్ మీడియాలో వార్తలు రావడం కలకలం రేపింది. అయితే అజమ్ ఖాన్ మరణ వార్తలో నిజం లేదన్న విషయం కాసేపటికే నిరూపితమైంది. ఎందుకంటే తన మరణవార్తపై అజమ్ ఖాన్ స్వయంగా లైవ్ వీడియోను రిలీజ్ చేశాడు. 'బతికుండగానే నన్ను చంపేశారుగా' అని తన స్నేహితులతో నవ్వుతూ పేర్కొన్న వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.ఆ తర్వాత తాను చనిపోయినట్లు వచ్చిన ఫేక్ వార్తకు సంబంధించిన వీడియోను అజమ్ ఖాన్ పంచుకున్నాడు. ఆ వీడియోలో ఒక మహిళా న్యూస్ యాంకర్ వార్తలు చదువుతూ..'యువ క్రికెటర్ అజమ్ ఖాన్ అకాల మరణం చెందాడు. అతడి ఆత్మకు శాంతి చేకూరాలి' అని పేర్కొనడం కనిపించింది. దీనిపై అజమ్ ఖాన్ స్పందిస్తూ.. ‘నేను మరణించినట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదు. నేను క్షేమంగానే ఉన్నాను. ఒక ఫేక్ న్యూస్ ఎంత వేగంగా వ్యాప్తి చెందుతుందనడానికి నా చావు విషయం ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు’ అంటూ చమత్కరించాడు. ఇక 28 ఏళ్ల అజమ్ ఖాన్ పాక్ తరఫున 14 టీ20లు ఆడాడు. పాకిస్తాన్ తరఫున చివరిసారి 2024 టీ20 ప్రపంచకప్ ఆడాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్ 2026) తర్వాత అజమ్ ఖాన్ ప్రొఫెషనల్ క్రికెట్ ఆడలేదు. పీఎస్ఎల్లో డేవిడ్ వార్నర్ నేతృత్వంలోని కరాచీ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహించిన అజమ్ ఖాన్ అంతగా ఆకట్టుకోలేకపోయాడు. 8 ఇన్నింగ్స్‌లు కలిపి 236 పరుగులు చేశాడు. అయితే ఈ సీజన్లో అజమ్ ఖాన్ అత్యుత్తమ ప్రదర్శన రావల్పిండిపై వచ్చింది. ఆ మ్యాచ్‌లో అజమ్ ఖాన్ ఆరు సిక్సర్లు, ఐదు ఫోర్ల సహాయంతో 34 బంతుల్లోనే 74 పరుగులు సాధించాడు. ఇక 2021లో తొలిసారి జాతీయ జట్టుకు ఆడిన అజమ్ ఖాన్ మూడేళ్ల కాలంలో 14 టీ20 మ్యాచ్‌లు ఆడినప్పటికీ 13 ఇన్నింగ్స్‌లు కలిపి కేవలం 88 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో మూడుసార్లు డకౌటవ్వడం గమనార్హం.Azam Khan reacting to fake news about him. 😅 pic.twitter.com/U97XVd05P8— Salman. (@TsMeSalman1_) September 29, 2026ఇదీ చదవండి: భారత్, పాక్ మధ్య ఫైనల్!.. వర్షంతో మ్యాచ్ రద్దయితే ఎలా? -
భారత్, పాక్ మధ్య ఫైనల్!.. వర్షంతో మ్యాచ్ రద్దయితే ఎలా?
ఆసియా గేమ్స్‌లో పురుషుల క్రికెట్ విభాగంలో క్వారర్ ఫైనల్ మ్యాచ్‌లన్నీ వరుసగా వర్షార్పణమయ్యాయి. భారత్ వర్సెస్ అఫ్గానిస్తాన్, నేపాల్ వర్సెస్ శ్రీలంక, పాకిస్తాన్ వర్సెస్ హాంకాంగ్, బంగ్లాదేశ్ వర్సెస్ మలేషియా మధ్య జరగాల్సిన క్వార్టర్ ఫైనల్స్ వర్షంతో రద్దయ్యాయి. దీంతో ర్యాంకుల ఆధారంగా భారత్, శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లు సెమీస్‌కు అర్హత సాధించాయి. గురువారం జరగనున్న సెమీఫైనల్స్‌లో పాకిస్తాన్‌తో బంగ్లాదేశ్, భారత్‌తో శ్రీలంక తలపడనున్నాయి. జపాన్‌లోని కొరోగొ అథ్లెటిక్ పార్క్ ఆతిథ్యమిమ్వనున్న మ్యాచ్‌లకు కూడా 60 శాతం వర్షం ముప్పు పొంచి ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ సెమీస్ మ్యాచ్‌లు కూడా వర్షంతో రద్దయితే.. మెరుగైన ర్యాంక్ కారణంగా భారత్, పాకిస్తాన్ ఫైనల్లో అడుగుపెట్టనున్నాయి. శనివారం జరగనున్న ఫైనల్ మ్యాచ్ కూడా వర్షంతో రద్దయితే అప్పుడు పరిస్థితి ఏంటి.. ఏ జట్టుకు ఏ పతకం ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది. వర్షంతో ఫైనల్ రద్దయితే సాధారణంగా రెండు జట్లలో మెరుగైన ర్యాంకులో ఉన్న జట్టుకు స్వర్ణ పతకం దక్కుతుంది. ఈ లెక్కన వన్డేల్లో నంబర్‌వన్ ర్యాంకులో కొనసాగుతున్న టీమిండియాకు మరోమారు స్వర్ణం.. పాక్‌కు రజతం దక్కుతుందని అంతా భావిస్తున్నారు. 2023లో జరిగిన హాంగ్జౌ ఆసియా గేమ్స్‌లో ఫైనల్ వర్షార్పణం కావడంతో భారత్ పసిడి, ఆఫ్గన్ రజతం గెలుచుకున్నాయి. కానీ ఈసారి గేమ్స్‌లో మాత్రం చిన్న ట్విస్ట్ దాగుంది. ఒకవేళ క్రికెట్ ఫైనల్ మ్యాచ్ వర్షంతో రద్దయితే మాత్రం భారత్‌తో పాటు పాకిస్తాన్ కూడా స్వర్ణం పతకం అందుకోనుంది. వర్షం అంతరాయంతో మ్యాచ్ రద్దయితే, మెరుగైన ర్యాంకులో ఉన్న జట్టుకు స్వర్ణం అందిస్తే, మరో జట్టుకు అన్యాయం జరిగినట్లవుతుందనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆసియా గేమ్స్ నిర్వాహకులు వెల్లడించారు. ఒకవేళ ఇది జరిగితే మాత్రం భారత్, పాకిస్తాన్‌లు ఒకే వేదికపై పడిసి పతకం అందుకోనుండడం చారిత్రక ఘట్టంగా మిగిలిపోనుంది. ఇదే ఆసియా గేమ్స్‌లో ఇప్పటికే భారత మహిళల జట్టు స్వర్ణం సాధించిన సంగతి తెలిసిందే. హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని టీమిండియా ఫైనల్లో శ్రీలంకను 147 పరుగుల తేడాతో చిత్తు చేసి స్వర్ణం దక్కించుకుంది.ఇదీ చదవండి: దిగ్గజాల విషయంలో తమిళనాడు క్రికెట్ కీలక నిర్ణయం -
దిగ్గజాల విషయంలో తమిళనాడు క్రికెట్ కీలక నిర్ణయం
తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ (టీసీఎన్ఏ) కీలక నిర్ణయం తీసుకుంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలోని 'ఎ' స్టాండ్‌కు భారత దిగ్గజ క్రికెటర్లు ఎస్ వెంకట్రాఘవన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్, రవిచంద్రన్ అశ్విన్‌ల పేర్లను పెట్టి వారిని గౌరవించనుంది. చెన్నైలో జరగనున్న చారిత్రాత్మక బీబీఎల్ (బిగ్‌బాష్ లీగ్) మ్యాచ్‌కు ముందు ఈ ముగ్గురికి ప్రత్యేక సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు టీసీఎన్ఏ పేర్కొంది. ఇక ఆస్ట్రేలియాకు చెందిన 2027 బిగ్‌బాష్ లీగ్ ప్రీమియర్ టీ20 లీగ్ ప్రారంభ మ్యాచ్‌కు చెపాక్ స్టేడియం వేదిక కానున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది డిసెంబర్ 12న మెల్బోర్న్ రెనెగేడ్స్, పెర్త్ స్కార్చర్స్ మధ్య మ్యాచ్ చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరగనుంది. కాగా పైన పేర్కొన్న ముగ్గురు దిగ్గజాలు తమిళనాడు జట్టుకు ప్రాతినిధ్యం వహించడంతో పాటు భారత జట్టుకు కూడా ఆడారు. మాజీ క్రికెటర్లు క్రిష్ శ్రీకాంత్, అశ్విన్‌ల కంటే సీనియర్ అయిన ఎస్ వెంకటరాఘవన్ 1963 నుంచి 1985 మధ్య టీమిండియాకు ప్రాతినిధ్యం వహించారు. 22 ఏళ్ల కెరీర్లో వెంకట్రాఘవన్ 57 టెస్టులాడి 156 వికెట్లు పడగొట్టారు. అంతేకాదు, 1975, 1979లో జరిగిన తొలి రెండు వన్డే ప్రపంచకప్‌లకు ఎస్.వెంకటరాఘవన్ భారత కెప్టెన్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే.ఇక క్రిష్ణమాచారి శ్రీకాంత్ గురించి పరిచయం అవసరం లేదు. 66 ఏళ్ల శ్రీకాంత్ 80వ దశకం ఆరంభంలో తన విధ్వంసకర బ్యాటింగ్‌తో భారత క్రికెట్లో సరికొత్త విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాడు. 1983 వన్డే ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడైన క్రిష్ణమచారి శ్రీకాంత్ 1981 నుంచి 1992 వరకు భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఆయన టీమిండియా తరఫున 43 టెస్టులు, 146 వన్డేలు ఆడాడు. 2011 వన్డే ప్రపంచకప్‌ను టీమిండియా గెలిచిన సందర్భంలో శ్రీకాంత్ బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా వ్యవహరించాడు.ఇక అశ్విన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈతరం బౌలర్లలో బెస్ట్ స్పిన్నర్‌గా పేరు పొందిన అశ్విన్ ముఖ్యంగా టెస్టుల్లో టీమిండియాకు చాలా మ్యాచ్‌ల్లో ఆపద్బాంధవుడి పాత్రను పోషించాడు. టెస్టు క్రికెట్లో 537 వికెట్లు తీసిన అశ్విన్ టెస్టుల్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో కుంబ్లే తర్వాత రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.దేశంలోని ప్రఖ్యాత స్టేడియాల్లోని స్టాండ్లకు భారత క్రికెటర్ల పేర్లు పెట్టడం జరిగింది. ఇప్పటికే సునీల్ గావస్కర్, సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోని, రోహిత్ శర్మ, కోహ్లి సహా 17 మంది క్రికెటర్ల పేర్ల మీద స్టాండ్ లేదా పెవిలియన్ ఉంది. తాజాగా ఈ జాబితాలోకి వెంకటరాఘవన్, శ్రీకాంత్, అశ్విన్ కూడా చేరారు. ఇక చిదంబరం స్టేడియంలో క్రికెటర్ల పేరిట ఒక స్టాండ్‌కు నామకరణం చేయడం చరిత్రలో ఇదే మొదటిసారి. ప్రస్తుతం తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి పేరు మీద మాత్రమే స్టేడియంలోని ఒక స్టాండ్‌కు పేరు పెట్టడం జరిగింది.ఇదీ చదవండి: చరిత్ర సృష్టించిన టీమిండియా బౌలర్.. సరికొత్త రికార్డు -
రేపు క్వార్టర్ ఫైనల్; జట్టును వీడిన స్టార్ బ్యాటర్.. బంగ్లాకు షాక్!
ఆసియా క్రీడల్లో మలేషియాతో క్వార్టర్ ఫైనల్ నేపథ్యంలో బంగ్లాదేశ్‌కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు కీలక బ్యాటర్ నజ్ముల్ హసన్ శాంటో అనారోగ్యం కారణంగా జట్టును వీడాడు. జ్వరంతో బాధపడుతున్న నజ్ముల్ రేపు స్వదేశానికి తిరిగి రానున్నట్లు బంగ్లాదేశ్ ఒలింపిక్ అసోసియేషన్ (బీవోఏ) వెల్లడించింది. అక్టోబర్ 9 నుంచి అఫ్గానిస్తాన్ జట్టుతో బంగ్లాదేశ్ ఏకైక టెస్టు మ్యాచ్ ఆడనుంది. ఈ నేపథ్యంలో టెస్టు కెప్టెన్ అయిన నజ్ముల్ అనారోగ్యంతో ఆసియా క్రీడల్లో పాల్గొనడం రిస్క్ అని భావించి అతడిని వెనక్కి రావాలని ఆదేశించినట్లు బంగ్లా క్రికెట్‌బోర్డు తెలిపింది. ఇక ర్యాంకింగ్ ఆధారంగా నేరుగా క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించిన బంగ్లాదేశ్ మంగళవారం మలేషియాతో తలపడనుంది. జపాన్ పిచ్‌లను దృష్టిలో పెట్టుకొని బౌలింగ్‌కు ప్రాధాన్యతనివ్వనున్నట్లు కెప్టెన్ లిటన్ దాస్ అభిప్రాయపడ్డాడు. వర్షం అంతరాయంతో సరైన ప్రాక్టీస్ లేకుండానే బంగ్లాదేశ్ రేపటి మ్యాచ్‌లో బరిలోకి దిగనుంది. ఇప్పటికే భారత్, అఫ్గానిస్తాన్; పాకిస్తాన్, హాంకాంగ్‌ల మధ్య జరగాల్సిన క్వార్టర్ ఫైనల్స్ రద్దు కావడంతో మెరుగైన ర్యాంక్ ఆధారంగా దాయాది జట్లు సెమీస్‌కు అర్హత సాధించాయి. మరో క్వార్టర్ ఫైనల్లో నేపాల్, శ్రీలంక తలపడనున్నాయి. ఒకవేళ మలేషియాతో జరగాల్సిన క్వార్టర్ ఫైనల్ రద్దయితే సెమీస్‌లో అడుగుపెట్టనున్న బంగ్లాదేశ్ అక్కడ పాకిస్తాన్‌తో ఆడనుంది. నేపాల్, శ్రీలంక మధ్య విజేతతో భారత్ మరో సెమీఫైనల్ ఆడనుంది.ఇదీ చదవండి: జావెలిన్ త్రోలో భారత్‌కు రెండు పతకాలు; స్వర్ణం అతడిదే! -
ఆసీస్‌తో తొలి టెస్టు.. భారత ఓపెనర్ డబుల్ సెంచరీ
రాజ్‌కోట్ వేదికగా ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో జరుగుతున్న తొలి అనధికారిక టెస్టులో భారత జట్టు యువ ఓపెనర్ లక్ష్య రాజేశ్ రాయ్‌చందని డబుల్ సెంచరీతో మెరిశాడు. ఫలితంగా రెండోరోజు ఆట ముగిసే సమయానికి భారత అండర్-19 జట్టు 92 ఓవర్లు ముగిసేసరికి 8 వికెట్ల నష్టానికి 430 పరుగులు చేసింది.లక్ష్య రాజేశ్ (256 బంతుల్లో 210 నాటౌట్), మోహిత్ ఉల్వా (58 నాటౌట్) అజేయ అర్థసెంచరీతో క్రీజులో ఉన్నారు. భారత్ ఇప్పటివరకు 213 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. అయితే మ్యాచ్‌లో ఒకపక్క వికెట్లు పడుతున్నప్పటికీ ఏకాగ్రతను కోల్పోకుండా బ్యాటింగ్ కొనసాగించిన లక్ష్య రాజేశ్ చూస్తుండగానే సెంచరీని అద్భుత ద్విశతకంగా మలిచాడు. 247 బంతుల్లో డబుల్ సెంచరీ మార్క్ సాధించిన లక్ష్య రాజేశ్ ఇన్నింగ్స్‌లో 20 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. కెప్టెన్ యశ్బర్ధన్ (54) ఔటైన తర్వాత భారత్ వెనువెంటనే రెండు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో లోయర్ ఆర్డర్లో మానవ్ కృష్ణ (25), అయాన్ అక్రమ్ (26) వికెట్ల పతనాన్ని అడ్డుకోవడంతో భారత్ ఆధిక్యం పెరగడంలో సహకరించారు. వీరిద్దరు వెనుదిరిగిన తర్వాత క్రీజులోకి వచ్చిన మోహిత్ ఉల్వా అజేయ అర్థసెంచరీతో మెరవడమే గాక, లక్ష్య రాజేశ్‌కు అండగా నిలబడి, డబుల్ సెంచరీ చేసేందుకు సహయపడ్డాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో కాసీ బార్టన్ 3 వికెట్లు తీయగా, స్పెన్సర్ గ్రీన్, కొన్నోర్ గ్రేగరి చెరో 2 వికెట్లు పడగొట్టారు. అంతకముందు ఆస్ట్రేలియా అండర్-19 జట్టు 217 పరుగులకు ఆలౌట్ అయింది.ఇదీ చదవండి: Asian Games: జ్యోతి సురేఖకు షాకిచ్చిన 14 ఏళ్ల సంచలనం -
అప్పుడు పతకం అందిస్తే.. ఇప్పుడు ఇంటికి సాగనంపింది!
జపాన్‌లోని నగోయా వేదికగా జరుగుతున్న ఆసియా గేమ్స్‌లో అఫ్గానిస్తాన్‌ను దురదృష్టం వెంటాడిందని చెప్పొచ్చు. నేపాల్ చేతిలో అనూహ్య ఓటమి చవిచూసిన అఫ్గానిస్తాన్ క్వార్టర్స్‌లో టీమిండియాపై గెలిచి సెమీస్ చేరాలని భావించింది. కానీ ఆఫ్గన్ పాలిట వరుణుడు విలన్‌గా మారాడు. వర్షం అంతరాయం కారణంగా ఆట సాధ్యం కాకపోవడంతో డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన టీమిండియా సీడింగ్, టాప్ ర్యాంక్ ఆధారంగా సెమీస్‌లో అడుగుపెట్టగా, పదో ర్యాంకులో ఉన్న అఫ్గానిస్తాన్ టోర్నీ నుంచి నిష్క్రమించింది.కట్‌చేస్తే.. మూడేళ్ల క్రితం, హాంగ్జౌ ఆసియా గేమ్స్‌లో అఫ్గానిస్తాన్ రజతం సాధించిన సంగతి తెలిసిందే. నాడు వర్షం కారణంగా ఫైనల్ మ్యాచ్ రద్దవ్వడంతో అఫ్గానిస్తాన్ రజతం సాధించగా, వరుస విజయాలతో టాప్ లేపిన రుతురాజ్ గైక్వాడ్ నేతృత్వంలోని టీమిండియా స్వర్ణం ఎగరేసుకుపోయింది. పైన రెండింటిని గమనించి చూస్తే.. అఫ్గానిస్తాన్, టీమిండియాలతో పాటు వర్షం ఇక్కడ కామన్‌గా కనిపిస్తోంది.నాటి ఆసియా గేమ్స్ ఫైనల్లో ఏ వర్షమైతే మ్యాచ్‌కు అడ్డుపడి, అఫ్గానిస్తాన్‌కు పతకం అందించిందో.. ఇవాళ అదే వర్షం ఆ జట్టును సగర్వంగా ఇంటికి సాగనంపడంలో విజయవంతమైంది. ఈ రెండు సందర్భాల్లోనూ టీమిండియానే ప్రత్యర్థి కావడం ఇక్కడ యాదృశ్చికం. అలా అఫ్గానిస్తాన్ హార్ట్‌బ్రేక్ అవ్వడానికి వర్షం పరోక్షంగా కారణమయ్యింది.ఇదీ చదవండి: Asian Games Cricket: సెమీఫైనల్‌కు టీమిండియా -
132 రన్స్‌కే శ్రీలంక ఆలౌట్.. ఇంగ్లండ్‌దే వన్డే సిరీస్
ఇంగ్లండ్ పర్యటనలో టీ20 సిరీస్‌లో వైట్‌వాష్‌కు గురైన శ్రీలంక, తాజాగా వన్డే సిరీస్‌ను కూడా ఆతిథ్య జట్టుకు కోల్పోయింది. లండన్ వేదికగా ఆదివారం జరిగిన చివరి వన్డేలో శ్రీలంకపై ఇంగ్లండ్ 223 పరుగుల భారీ తేడాతో విజయాన్ని అందుకుంది. ఇంగ్లండ్ విధించిన 356 పరుగుల టార్గెట్‌ను ఛేదించే క్రమంలో శ్రీలంక 29.1 ఓవర్లలో 132 పరుగులకే కుప్పకూలింది. ఈ నేపథ్యంలో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను ఇంగ్లండ్ 2-1తో సొంతం చేసుకుంది.లంక బ్యాటర్లలో కెప్టెన్ కుసాల్ మెండిస్ (35), జనిత్ లియానగె (19) పర్వాలేదనిపించారు. ఇంగ్లండ బౌలర్లలో లియామ్ డాసన్ 3 వికెట్లు తీయగా, గస్ అకిన్సన్ రెండు, సొన్ని బేకర్, రూట్, ఓవర్టన్ తలా ఒక వికెట్ తీశారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 355 పరుగుల భారీ స్కోరు చేసింది. టామ్ బాంటన్ (126) సెంచరీ చేయగా, బ్రూక్ (77), జోర్డాన్ కాక్స్ (76) అర్థసెంచరీలతో రాణించారు. మిగతావారిలో విల్ జాక్స్ (25), జేమీ ఓవర్టన్ (21) పరుగులు చేశారు. లంక బౌలర్లలో అసితా ఫెర్నాండో మూడు, సచిందు రెండు వికెట్లు తీశారు. మొదటి 25 ఓవర్లలో 108 పరుగులు మాత్రమే చేసిన ఇంగ్లండ్ మిగతా 25 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 247 పరుగులు సాధించడం విశేషం. తొలి 25 ఓవర్లకు ఓవర్‌కు 4.32 రన్‌రేట్‌తో పరుగులు సాధించిన ఇంగ్లండ్ ఆ తర్వాతి 25 ఓవర్లలో 9.88 రన్‌రేట్‌తో పరుగులు రాబట్టింది. సెంచరీతో చెలరేగిన టామ్ బాంటన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’, సిరీస్‌లో 9 వికెట్లు తీసిన విల్ జాక్స్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు లభించింది.ఇదీ చదవండి: విరాట్ కోహ్లి ప్రపంచ రికార్డు -
కోహ్లి, గిల్ శతకాల మోత.. తొలి వన్డేలో భారత్ ఘన విజయం
తిరువనంతపురం వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. వెస్టిండీస్ విధించిన 296 పరుగుల లక్ష్యాన్ని భారత్ 41.4 ఓవర్లలోనే కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. విరాట్ కోహ్లి (88 బంతుల్లో 139 నాటౌట్, 10 ఫోర్లు, 9 సిక్సర్లు), కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (108 బంతుల్లో 110 పరుగులు, 13 ఫోర్లు, ఒక సిక్సర్) సెంచరీలతో చెలరేగడంతో భారత్ సునాయాస విజయాన్ని సాధించింది. రోహిత్ శర్మ 32 పరుగులు చేశాడు. విండీస్ బౌలర్లలో అల్జారీ జోసెఫ్, రోస్టన్ చేజ్ చెరొక వికెట్ పడగొట్టారు. అజేయ సెంచరీతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన విరాట్ కోహ్లికి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది. విండీస్‌పై విజయంతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భారత్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇరుజట్ల మధ్య రెండో వన్డే సెప్టెంబర్ 30న గౌహతి వేదికగా జరగనుంది.అంతకముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 295 పరుగుల భారీ స్కోర్ సాధించింది. విండీస్ ఓపెనర్ జస్టిన్ గ్రీవ్స్(101) సెంచరీతో కదం తొక్కగా.. జాన్ క్యాంప్‌బెల్(62), అమీర్ జాంగో(58) అర్ధ శతకాలతో రాణించారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లు పడగొట్టగా, ప్రసిద్ద్ కృష్ణ రెండు వికెట్లు తీశాడు.🔙 to 🔙 to seal the deal 👊#TeamIndia with a clinical chase in just 4️⃣1️⃣.4️⃣ overs to win by 8️⃣ wickets 👏👏Scorecard ▶️ https://t.co/O2cs86p4gq#INDvWI | @mflone_ pic.twitter.com/SUj4bbE9rh— BCCI (@BCCI) September 27, 2026ఇదీ చదవండి: సిక్సర్‌తో సెంచరీ పూర్తి చేసిన కోహ్లి -
సిక్సర్‌తో సెంచరీ పూర్తి చేసిన కోహ్లి.. ఆ రికార్డు పదిలం
తిరువనంతపురం వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి వన్డేలో రన్ మెషిన్ విరాట్ కోహ్లి సెంచరీతో దుమ్మురేపాడు. 74 బంతుల్లో శతకం మార్క్ అందుకున్న కోహ్లి ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, ఆరు సిక్సర్లు ఉన్నాయి. అయితే గుదకేశ్ మోతీ బౌలింగ్‌లో 94 పరుగుల వద్ద ఉన్నప్పుడు భారీ సిక్సర్ బాదిన కోహ్లి సెంచరీ పూర్తి చేయడం విశేషం. కాగా కోహ్లికి వన్డేల్లో ఇది 55వ సెంచరీ.ఈ క్రమంలో కోహ్లి మరో రికార్డును అందుకున్నాడు. లిస్ట్-ఏ క్రికెట్లో 59 సెంచరీలు చేసిన కోహ్లికి విండీస్‌పై సాధించిన సెంచరీ 60వది. ఈ క్రమంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 60 సెంచరీల రికార్డును సమం చేశాడు. అంతేకాదు 109 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద స్వదేశంలో వన్డేల్లో సచిన్ సాధించిన (6,796) పరుగుల రికార్డును కోహ్లి అధిగమించాడు. ఇక తిరువనంతపురం వేదికగా జరిగిన గతంలో జరిగిన రెండు వన్డేల్లోనూ కోహ్లి నాటౌట్‌గా నిలిచాడు. తాజాగా వెస్టిండీస్‌తో వన్డేలో (139 పరుగులు నాటౌట్) మరోసారి అజేయంగా నిలిచి ఆ రికార్డును పదిలంగా ఉంచుకున్నాడు. ఇదే స్టేడియంలో 2023లో శ్రీలంకతో జరిగిన వన్డేలో 166 పరుగుల అజేయ ఇన్నింగ్స్ కోహ్లి కెరీర్లో ఒక బెస్ట్ ఇన్నింగ్స్ అనడంలో ఎలాంటి సందేహం లేదు.The bat raise, the roar, the milestone 👏👏A Virat Kohli show in Thiruvananthapuram 🍿Updates ▶️ https://t.co/O2cs86p4gq#TeamIndia | #INDvWI | @mflone_ | @imVkohli pic.twitter.com/7pW58tYKeJ— BCCI (@BCCI) September 27, 2026ఇదీ చదవండి: కోహ్లి, గిల్ శతకాల మోత.. తొలి వన్డేలో భారత్ ఘన విజయం -
విరాట్ కోహ్లి ప్రపంచ రికార్డు
తిరువనంతపురం వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో టీమిండియా రన్‌మెషిన్ విరాట్ కోహ్లి మరో మైలురాయిని చేరుకున్నాడు. 61 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కోహ్లి వన్డేల్లో 15వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. 15 వేల పరుగులు పూర్తి చేసేందుకు కోహ్లికి 303 ఇన్నింగ్స్‌లు అవసరమయ్యాయి. తద్వారా అంతర్జాతీయ వన్డేల్లో అత్యంత వేగంగా 15వేల రన్స్ పూర్తి చేసిన తొలి క్రికెటర్‌గా కోహ్లి నిలిచాడు. గతంలో ఈ రికార్డు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ (377 ఇన్నింగ్స్‌లు) పేరిట ఉంది. ఈ నేపథ్యంలో 15వేల పరుగుల మైలురాయి చేరుకునే క్రమంలో సచిన్ రికార్డును బద్దలు కొట్టిన కోహ్లి ప్రపంచ రికార్డు సాధించాడు. అయితే వన్డే క్రికెట్లో అత్యధిక పరుగుల రికార్డు మాత్రం ఇప్పటికీ సచిన్ (18,426) పేరిటే ఉంది. సచిన్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా, కోహ్లి అతడిని అనుసరిస్తున్నాడు. లంక దిగ్గజ బ్యాటర్ కుమార సంగక్కర (14,234 పరుగులు) మూడో స్థానంలో, రికీ పాంటింగ్ (13,704 పరుగులు) నాలుగు, సనత్ జయసూర్య (13,430 పరుగులు) ఐదో స్థానంలో కొనసాగుతున్నారు.కాగా సచిన్ 34 ఏళ్ల 66 రోజుల వయసులో సచిన్ 15వేల పరుగులు పూర్తి చేస్తే, కోహ్లి 37 ఏళ్ల 326 రోజుల వయసులో 15వేల మార్క్ అందుకున్నాడు. అయితే ఇన్నింగ్సల్ పరంగా చూసుకుంటే సచిన్‌కు 377 ఇన్నింగ్స్‌లు అవసరమవ్వగా, కోహ్లి కేవలం 303 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఫీట్ సాధించాడు. ఇక బంతుల పరంగా సచిన్ 17,528 బంతులు అవసరమవ్వగా.. కోహ్లికి 15,950 బంతులు అవసరమయ్యాయి.Moment for the history books 📖The magical feeling of scaling Mt. 1⃣5⃣0⃣0⃣0⃣ ODI runs, ft. Virat Kohli 🏔️Updates ▶️ https://t.co/O2cs86p4gq#TeamIndia | #INDvWI | @mflone_ | @imVkohli pic.twitter.com/sbqA6KtBsr— BCCI (@BCCI) September 27, 2026 Fastest to 1⃣5⃣0⃣0⃣0⃣ ODI runs ✅Congratulations to Virat Kohli on becoming the second player to achieve the feat after Sachin Tendulkar 👏👏Updates ▶️ https://t.co/O2cs86p4gq#TeamIndia | #INDvWI | @mflone_ | @imVkohli pic.twitter.com/CMhAIOXQhR— BCCI (@BCCI) September 27, 2026ఇదీ చదవండి: ఐదు వికెట్లతో చెలరేగిన భారత బౌలర్.. ఆసీస్ 217 ఆలౌట్ -
ఐదు వికెట్లతో చెలరేగిన భారత బౌలర్.. ఆసీస్ 217 ఆలౌట్
రాజ్‌కోట్ వేదికగా ఆస్ట్రేలియా-అండర్ 19 జట్టుతో జరుగుతున్న తొలి అనధికారిక టెస్టులో తొలిరోజు భారత యువ జట్టు ఆధిపత్యం ప్రదర్శించింది. మొదటిరోజు ఆట ముగిసే సమయానికి భారత అండర్-19 జట్టు వికెట్ నష్టపోకుండా 8 పరుగులు చేసింది. లక్ష్యరాజేశ్, సాగర్ వీకే క్రీజులో ఉన్నారు. అంతకముందు ఆస్ట్రేలియా భారత బౌలర్ల ధాటికి తొలి ఇన్నింగ్స్‌లో 217 పరుగులకు ఆలౌటైంది. మిడిలార్డర్లో బ్లేక్ కాటిల్ (102) సెంచరీ చేయగా, జెడ్ హొలిక్ (59) అర్థసెంచరీ సాధించగా, మిగతావారిలో ఎవరు పెద్దగా రాణించలేదు. భారత బౌలర్లలో ఇషాన్ ఓం 5 వికెట్లతో ఆసీస్ వెన్ను విరవగా, మోహిత్ ఉల్వా మూడు, కెప్టెన్ యశ్‌బర్దన్ చౌహాన్ రెండు వికెట్లు తీశారు.A five-wicket haul for Ishan Om as India U-19 restricts Australia to 217 in the first innings. @sportstarweb pic.twitter.com/uzkhggtOVx— Shayan Acharya (@ShayanAcharya) September 27, 2026ఇదీ చదవండి: ఈ దశాబ్దంలోనే రూట్ అత్యంత చెత్త రికార్డు! -
ఈ దశాబ్దంలోనే రూట్ అత్యంత చెత్త రికార్డు!
టీమిండియాతో వెస్టిండీస్, సౌతాఫ్రికాతో ఆస్ట్రేలియా.. ఇక శ్రీలంకతో ఇంగ్లండ్‌లు వన్డే మ్యాచ్‌లు ఆడుతుండడంతో 'సూపర్ సండే' కాస్త 'సూపర్ వన్డే'లుగా మారిపోయింది. ఈ విషయం పక్కనబెడితే.. శ్రీలంకతో జరుగుతున్న మూడో వన్డేలో ఇంగ్లండ్ కూడా భారీ స్కోరు దిశగా సాగుతోంది. అయితే జట్టు సీనియర్ ఆటగాడు జో రూట్ మాత్రం అత్యంత చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. మ్యాచ్‌లో 37 బంతుల్లో 18 పరుగులు చేసిన రూట్ జనిత్ లియనాగె బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. ఇన్నింగ్స్ 16వ ఓవర్ తొలి బంతిని షాట్ ఆడే ప్రయత్నంలో బంతి మిస్సయ్యి అతడి ప్యాడ్లకు తాకింది. లంక ఆటగాళ్లు అప్పీల్ చేసినప్పటికీ, అంపైర్ నాటౌట్ ఇచ్చాడు. అయితే రివ్యూకు వెళ్లిన శ్రీలంక ఫలితం సాధించింది. రిప్లేలో బంతి ప్యాడ్లను తాకుతూ ఆఫ్ స్టంప్‌ను ఎగురగొడుతున్నట్లుగా చూపించింది. దీంతో రూట్ ఎల్బీగా పెవిలియన్ చేరాడు. ఈ క్రమంలోనే ఎల్బీడబ్ల్యూల విషయంలో రూట్ చెత్త రికార్డు అందుకున్నాడు. ఈ ఏడాది క్యాలెండర్ ఇయర్లో అంతర్జాతీయ క్రికెట్లో రూట్ 12 సార్లు ఎల్బీగా వెనుదిరిగాడు. తద్వారా ఒకే క్యాలెండర్ ఇయర్లో అత్యధిక సార్లు ఎల్బీగా వెనుదిరిగిన రెండో ఇంగ్లండ్ క్రికెటర్‌గా రూట్ నిలిచాడు. గతంలో 2007లో ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ పాల్ కొలింగ్‌వుడ్ ఆ ఏడాదిలో 14 సార్లు ఎల్బీగా వెనుదిరిగి తొలి స్థానంలో ఉన్నాడు. ఓవరాల్ జాబితాలో చెత్త రికార్డు సాధించిన ఆరో క్రికెటర్‌గా రూట్ ఉన్నాడు. సౌతాఫ్రికాకు చెందిన ఆండ్రూ హడ్సన్ (1994), న్యూజిలాండ్ ప్లేయర్ క్రిస్ హారిస్ (2002), బంగ్లాదేశ్ క్రికెటర్ ఖలీల్ మసూద్ (2003), సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమీ స్మిత్ (2006) తలో 12 సార్లు ఎల్బీగా వెనుదిరిగారు. అయితే పైన చెప్పుకున్న క్రికెటర్లంతా 2010 టైమ్‌లైన్ కంటే ముందే ఆయా సందర్భాల్లో ఈ చెత్త ఫీట్‌ను సాధించారు. అయితే గడిచిన దశాబ్ద కాలంలో మాత్రం రూట్ మాత్రమే ఒక క్యాలెండర్ ఇయర్లో ఇన్నిసార్లు ఎల్బీగా వెనుదిరగడం గమనార్హం. ఇంగ్లండ్ భారీ స్కోరు..ఇక మ్యాచ్‌లో ఇంగ్లండ్ 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 355 పరుగుల భారీ స్కోరు చేసింది. టామ్ బాంటన్ (126) సెంచరీ చేయగా, బ్రూక్ (77), జోర్డాన్ కాక్స్ (76) అర్థసెంచరీలతో రాణించారు. మిగతావారిలో విల్ జాక్స్ (25), జేమీ ఓవర్టన్ (21) పరుగులు చేశారు. లంక బౌలర్లలో అసితా ఫెర్నాండో మూడు, సచిందు రెండు వికెట్లు తీశారు. మొదటి 25 ఓవర్లలో 108 పరుగులు మాత్రమే చేసిన ఇంగ్లండ్ మిగతా 25 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 247 పరుగులు సాధించడం విశేషం. తొలి 25 ఓవర్లకు ఓవర్‌కు 4.32 రన్‌రేట్‌తో పరుగులు సాధించిన ఇంగ్లండ్ ఆ తర్వాతి 25 ఓవర్లలో 9.88 రన్‌రేట్‌తో పరుగులు రాబట్టింది.ఇదీ చదవండి: మిల్లర్ ప్రపంచ రికార్డు.. బవుమా సెంచరీ; సౌతాఫ్రికా భారీ స్కోరు -
విండీస్ ఓపెనర్ సెంచరీ.. టీమిండియా టార్గెట్ 296 రన్స్
తిరువనంతపురం వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి వన్డేలో వెస్టిండీస్ గౌరవప్రదమైన స్కోరు సాధించింది. విండీస్ ఓపెనర్ జస్టిన్ గ్రీవ్స్ సెంచరీతో విరుచుకుపడడంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 295 పరుగులు చేసింది. గ్రీవ్స్ (108 బంతుల్లో 101, 12 ఫోర్లు) శతకానికి తోడు మరో ఓపెనర్ జాన్ కాంప్‌బెల్ (62) అర్థశతకం సాధించాడు. వీరిద్దరు తొలి వికెట్‌కు 135 పరుగులు జోడించి జట్టుకు శుబారంభం అందించారు. ఈ దశలో భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తన బౌలింగ్‌తో విండీస్ బ్యాటర్లను హడలెత్తించాడు. 19 ఓవర్లు ముగిసేసరికి ఒక్క వికెట్ కూడా కోల్పోని విండీస్ ఆ తర్వాత కుల్దీప్ మాయజాలంతో వరుసగా వికెట్లను చేజార్చుకుంది. జస్టిన్ గ్రీవ్స్, జువెల్ ఆండ్రూలను రెండు వరుస బంతుల్లో ఔట్ చేసిన కుల్దీప్ టీమిండియాకు బ్రేక్ ఇచ్చాడు. ఈ దశలో మిడిలార్డర్లో అమిర్ జాంగో (43 బంతుల్లో 58 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్‌కు తోడు ఆఖర్లో రోస్టన్ చేజ్ (24) పరుగులు చేయడంతో విండీస్ 290 పరుగుల మార్క్‌ను దాటగలిగింది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 4 వికెట్లు తీయడంతో పాటు పొదుపుగా బౌలింగ్ చేయగా, ప్రసిధ్ క్రిష్ణ రెండు వికెట్లు పడగొట్టాడు.అంతకముందు విండీస్‌తో తొలి వన్డే ద్వారా టీమిండియా తరఫున కొత్త ఆటగాడు అరంగేట్రం చేశాడు. పంజాబ్‌కు చెందిన 26 ఏళ్ల విధ్వంసకర బ్యాటర్ నమన్ ధిర్ ఈ మ్యాచ్‌తో తన అంతర్జాతీయ కెరీర్‌ను ప్రారంభించనున్నాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోగా.. గిల్ చేతుల మీదుగా నమన్ ధిర్ క్యాప్ అందుకున్నాడు.ఇదీ చదవండి: మిల్లర్ ప్రపంచ రికార్డు.. బవుమా సెంచరీ; సౌతాఫ్రికా భారీ స్కోరు -
మిల్లర్ ప్రపంచ రికార్డు.. బవుమా సెంచరీ; సౌతాఫ్రికా భారీ స్కోరు
జోహన్నెస్‌బర్గ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో సౌతాఫ్రికా బ్యాటర్లు రికార్డుల మీద రికార్డులు సాధిస్తున్నారు. ఇప్పటికే కెప్టెన్ టెంబా బవుమా సెంచరీతో చెలరేగగా.. తాజాగా ఆ జట్టు విధ్వంసకర బ్యాటర్ డేవిడ్ మిల్లర్ ఏకంగా ప్రపంచ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఆస్ట్రేలియాపై వన్డేల్లో అత్యంత తక్కువ బంతుల్లో సెంచరీ చేసిన రెండో బ్యాటర్‌గా మిల్లర్ రికార్డులకెక్కాడు. గతంలో హెన్రిచ్ క్లాసెన్ (2023లో 57 బంతుల్లో) సెంచరీ చేసి తొలి స్థానంలో ఉండగా.. 2016లో 69 బంతుల్లో సెంచరీ సాధించిన మిల్లర్ తాజా మ్యాచ్‌లో 73 బంతుల్లో శతకం మార్క్‌ను చేరుకోవడం విశేషం. వీరిద్దరి తర్వాత డికాక్ (74 బంతుల్లో), మార్కరమ్ (74 బంతుల్లో) సెంచరీలు సాధించారు.👉ఇక వన్డేల్లో ఆస్ట్రేలియాపై అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్ల జాబితాలోనూ మిల్లర్ చోటు దక్కించుకున్నాడు. ఇప్పటివరకు తాజా దానితో కలిపి నాలుగు సెంచరీలు చేసిన మిల్లర్ రెండో స్థానంలో ఉండగా, డుప్లెసిస్ (5 సెంచరీలు) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. వీరిద్దరి తర్వాత డికాక్, హర్షలే గిబ్స్ చెరో 3 సెంచరీలతో కొనసాగుతున్నారు.👉వన్డేల్లో ఐదు లేదా ఆ తర్వాతి స్థానాల్లో బ్యాటింగ్‌కు వచ్చి సెంచరీలు చేసిన బ్యాటర్ల జాబితాలో మిల్లర్ (8 సెంచరీలు) జోస్ బట్లర్‌తో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. వీరిద్దరి తర్వాత ధోని, యువరాజ్లు చెరో ఏడు సెంచరీలతో తర్వాతి స్థానంలో ఉన్నారు.👉 ఆస్ట్రేలియాతో ఒక వన్డే మ్యాచ్‌లో ఇద్దరు సౌతాఫ్రికా బ్యాటర్లు సెంచరీలు చేయడం ఇది మూడోసారి. మిల్లర్‌కు మాత్రం ఇది రెండోసారి. గతంలో 2014లో ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో డుప్లెసిస్ (106), డివిలియర్స్ (136 నాటౌట్) తొలిసారి ఈ ఫీట్ సాధించారు. 2018లో హోబర్ట్ వేదికగా డుప్లెసిస్ (125), మిల్లర్ (139) శతకాలు బాదారు. తాజాగా బవుమా, మిల్లర్లు మరోసారి ఆస్ట్రేలియాపై ఒకే మ్యాచ్‌లో శతకాలతో విరుచుకుపడ్డారు.ఇక మ్యాచ్ విషయానికొస్తే.. కెప్టెన్ బవుమా, మిల్లర్ సెంచరీలతో విధ్వంసం సృష్టించడంతో సౌతాఫ్రికా 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 365 పరుగుల భారీ స్కోరు చేసింది. మిల్లర్ (93 బంతుల్లో 142; 12 ఫోర్లు, 9 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగగా, బవుమా (116 బంతుల్లో 103) క్లాస్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. వీరిద్దరు మినహా మిగతావాళ్లలో పెద్దగా ఎవరు ఆడలేదు. చివర్లో డాన్ జాన్ (27 నాటౌట్), మార్కో జాన్సెన్ (19) మెరుపులతో సౌతాఫ్రికా 350 పరుగుల మార్క్‌ను దాటింది. ఆసీస్ బౌలర్లలో జాక్ ఎడ్వర్డ్స్ ఐదు వికెట్లు తీయగా, హాజిల్‌వుడ్ 3 వికెట్లు పడగొట్టాడు.ఇదీ చదవండి: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. నిర్వాహకులను ఏకిపారేసిన పీవీ సింధు -
ఏడాది తర్వాత బరిలోకి.. కుమ్ముతాడనుకుంటే ఇలా బుక్కయ్యాడు!
ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో సౌతాఫ్రికా ఓపెనర్ ఐడెన్ మార్కరమ్ చెత్త రికార్డును మూట గట్టుకున్నాడు. దాదాపు ఏడాది తర్వాత వన్డే మ్యాచ్ ఆడుతున్న మార్కరమ్ తొలి బంతికే ఔటయ్యి గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. తద్వారా ఏడాది తర్వాత ఎంతో ఆశతో బరిలోకి దిగిన మార్కరమ్కు ఆస్ట్రేలియా పీడకలను మిగిల్చింది. విషయంలోకి వెళితే టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌ను మార్కరమ్, డికాక్ ఆరంభించారు. హాజిల్‌వుడ్ ఇన్నింగ్స్ తొలి బంతిని ఔట్‌సైడ్ ఆఫ్ వేశాడు. మార్కరమ్ దానిని టచ్ చేసే క్రమంలో కవర్స్ దిశగా ఆడాడు. అక్కడే ఉన్న కూపర్ కన్నోలి సూపర్ వన్ హ్యాండ్ క్యాచ్ తీసుకోవడంతో మార్కరమ్ గోల్డెన్ డక్ అయ్యాడు.ఈ క్రమంలో సౌతాఫ్రికా తరఫున వన్డేల్లో తొలి బంతికే వెనుదిరిగిన నాలుగో బ్యాటర్‌గా మార్కరమ్ నిలిచాడు. గతంలో హర్షలే గిబ్స్ రెండుసార్లు, హషీమ్ ఆమ్లా రెండు సార్లు, జానేమన్ మలన్ ఒకసారి ఈ చెత్త రికార్డును నమోదు చేశారు. తాజాగా వీరి సరసన మార్కరమ్ చేరాడు. గిబ్స్ 2002లో న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో జేమ్స్ ఫ్రాంక్లిన్ బౌలింగ్‌లో ఒకసారి.. అదే ఏడాది పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో అక్రమ్ బౌలింగ్‌లో మరోసారి గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. ఇక హషీమ్ ఆమ్లా 2011లో ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో బొలింగర్ బౌలింగ్‌లో; 2013లో పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో మహమ్మద్ ఇర్ఫాన్ బౌలింగ్‌లో తొలి బంతికే ఔటయ్యాడు. 2020లో ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో జానేమన్ మలన్ గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. మ్యాచ్ విషయానికొస్తే ప్రస్తుతం సౌతాఫ్రికా 28 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. డేవిడ్ మిల్లర్ (45), బవుమా (74) క్రీజులో ఉన్నారు. తొలి వన్డేలో గెలిచిన సౌతాఫ్రికా మూడు వన్డేల సిరీస్‌లో ప్రస్తుతం 1-0తో ఆధిక్యంలో నిలిచింది.WHAT A CATCH BY COOPER CONNOLLY 🤯🔥 pic.twitter.com/cfK8zlWyio— Johns. (@CricCrazyJohns) September 27, 2026ఇదీ చదవండి: టీమిండియా ప్లేయర్‌కు తీవ్ర గాయం.. స్ట్రెచ్చర్‌పై మైదానం బయటకు! -
'కోహ్లితో నాకేంటి?.. నా ఆటయితే పూర్తి కాలేదు'
వెస్టిండీస్‌తో తొలి వన్డే నేపథ్యంలో టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ తన భవితవ్యంపై మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 2027 వన్డే ప్రపంచకప్ తన చివరి టోర్నీ అని కోహ్లి సంకేతాలు ఇచ్చిన నేపథ్యంలో హిట్‌మ్యాన్ రిటైర్మెంట్పై కూడా ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. తన రిటైర్మెంట్పై వస్తున్న ఊహాగానాలకు చెక్ పెడుతూ తనదైన శైలిలో బదులిచ్చాడు. తన ఆట ఇంకా పూర్తి కాలేదని, ఆడుతున్నంత కాలం తన ముందు ఏదో ఒక లక్ష్యం ఉంటుందని రోహిత్ చెప్పుకొచ్చాడు. కోహ్లిది వ్యక్తిగత నిర్ణయమని, అతడితో తనకు పని లేదని రోహిత్ పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఇంకా రోహిత్ మాట్లాడుతూ.. "నేను చేయాల్సిన పని పూర్తి అయిందనే ఆలోచన ఎప్పుడూ నా మనసులోకి రాదు. క్రికెట్ ఆడుతున్నంత కాలం నేను సాధించేందుకు ఏదో ఒకటి ఉంటుంది. ప్రస్తుతం నేను ప్రపంచ కప్ కోసం ఎదురుచూస్తున్నా. ప్రపంచ కప్ అయినా.. ఏదైనా ఐసీసీ టోర్నీ అయినా దానికి ప్రత్యేకమైన సవాలు ఉంటుంది. వేర్వేరు ప్రత్యర్థులతో, వివిధ మైదానాల్లో ఆడాల్సి ఉంటుంది. అందుకు తగ్గట్టుగా మనం సిద్ధం కావాలి. భిన్నంగా ఆలోచించాలి. అదే ఈ టోర్నీల్లోని అసలైన సవాలు" అని రోహిత్ వివరించాడు.2027 వన్డే ప్రపంచకప్‌ను భారత్‌కు అందించడమే లక్ష్యంగా రోహిత్ కొనసాగుతున్నాడు. అందుకే టెస్టులు, టీ20లకు వీడ్కోలు పలికిన రోహిత్ అప్పటినుంచి వన్డే ఫార్మాట్లోనే కొనసాగుతూ వస్తున్నాడు. 2023 వన్డే ప్రపంచకప్‌లో తన కెప్టెన్సీలో సొంతగడ్డపై టీమిండియాను ఫైనల్ చేర్చినప్పటికీ, తుదిమెట్టుపై బోల్తా కొట్టాడు. అయితే రెండు టీ20 ప్రపంచకప్‌లు (2007, 2024) గెలిచిన టీమిండియా జట్టులో సభ్యుడైన రోహిత్.. వన్డే ప్రపంచకప్ గెలవాలన్న తన చిరకాల కలను నెరవేర్చుకునే పనిలో ఉన్నాడు. తన ఫామ్‌పై సందేహాలు వచ్చిన ప్రతీసారి రోహిత్ బ్యాట్‌తోనే సమాధానం చెప్పాడు. ఆఖరిసారి ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో ఆడిన రోహిత్ శర్మ మూడో వన్డేలో శతకంతో మెరిశాడు. తాజాగా వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లో ఆ జట్టు బౌలర్ల భరతం పట్టేందుకు సిద్ధమవుతున్నాడు.ఇదీ చదవండి: గమ్మత్తుగా ఒమన్ క్రికెట్ టీం.. తొమ్మిది మందికి ఒకే ఇంటిపేరు -
గమ్మత్తుగా ఒమన్ క్రికెట్ టీం.. తొమ్మిది మందికి ఒకే ఇంటిపేరు
ఆసియా క్రీడల్లో పాల్గొంటున్న ఒమన్ క్రికెట్ జట్టు సరికొత్త ఫీట్ నమోదు చేసింది. ఆట పరంగా పెద్దగా ఆకట్టుకోలేకపోయినప్పటికీ, జట్టు కూర్పు పరంగా మాత్రం ఒక గమ్మత్తైన విషయం బయటికి వచ్చింది. ఒమన్ జట్టులో తొమ్మిది మంది ఆటగాళ్లకు ఒకే ఇంటిపేరు ఉండడం ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం. ఒమన్ తుది జట్టులోని పదకొండు మందిలో ఒకే ఇంటిపేరున్న ఏడుగురు ఆటగాళ్లు మ్యాచ్‌లో ఆడడం మరో విశేషం.శుక్రవారం హాంకాంగ్‌తో జరిగిన మ్యాచ్ కోసం.. సుఫ్యాన్ మహమూద్ కెప్టెన్‌గా వ్యవహరించిన జట్టులో మహమ్మద్ అల్ బలూషి, షుఐబ్ అల్ బలూషి, జుబైర్ అల్ బలూషి, వహీద్ అల్ బలూషి, ఈసా అల్ బలూషి, నవీద్ అల్ బలూషి, ఫారిస్ అల్ బలూషి మ్యాచ్ ఆడారు. వీరితో పాటు బెంచ్‌పై ఉన్న వసీం, ఖైస్ల ఇంటిపేరు కూడా అల్ బలూషినే కావడం గమనార్హం.ఒమన్ జట్టు తరఫున అల్ బలూషి పేరున్న నలుగురు ఓపెనింగ్ నుంచి నాలుగో స్థానం వరకు బ్యాటింగ్‌కు రావడం విశేషం. మహమ్మద్ అల్ బలూషి, ఐబ్ అల్ బలూషి ఓపెనర్లుగా రాగా.. జుబైద్ అల్ బలూషి, వహీద్ అల్ బలూషి మూడు, నాలుగు స్థానాల్లో వచ్చారు. క్రికెట్ చరిత్రలో ఇలా ఒకే ఇంటిపేరున్న నలుగురు ఆటగాళ్లు వరుసగా తొలి నాలుగు స్థానాల్లో బ్యాటింగ్‌కు రావడం ఇదే మొదటిసారి.మ్యాచ్ విషయానికొస్తే తొలుత బ్యాటింగ్ చేసిన హాంకాంగ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. ముహమ్మద్ హఫీజ్ (33), బాబర్ హయత్ (23) రాణించారు. ఒమన్ బౌలర్లలో మొహమ్మద్ అల్ బలూషి 3 వికెట్లు తీశాడు. అనంతరం ఒమన్ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 80 పరుగులకే పరిమితమైంది. సుఫ్యాన్ మెహ్మూద్ (26) టాప్ స్కోరర్. ఆయుశ్ శుక్లా మూడు వికెట్లతో రాణించాడు.ఇదీ చదవండి: కలిసొచ్చిన శనివారం.. 30 పతకాల మార్క్ దాటిన భారత్ -
విండీస్‌తో తొలి వన్డే.. రోహిత్‌ను ఊరిస్తున్న ప్రపంచ రికార్డు
వెస్టిండీస్‌తో తొలి వన్డే సందర్భంగా టీమిండియా సీనియర్ బ్యాటర్ రోహిత్ శర్మను ప్రపంచ రికార్డు ఊరిస్తోంది. రేపు తిరువనం తపురంలోని గ్రీన్‌ఫీల్డ్ స్టేడియం వేదికగా ఇరుజట్ల మధ్య తొలి వన్డే మ్యాచ్ జరగనుంది. శుక్రవారం జరిగిన టీమిండియా ఇంట్రాస్వ్కాడ్ మ్యాచ్‌లో సూపర్ ఫామ్ కనబరిచిన రోహిత్ అదే ఆటను విండీస్‌తో తొలి వన్డేలోనూ ప్రదర్శించాలని పట్టుదలతో ఉన్నాడు. రోహిత్ శర్మ ప్రస్తుతం వన్డే క్రికెట్లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన జాబితాలో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు రోహిత్ 288 వన్డే మ్యాచ్‌లాడి 11,895 పరుగులు సాధించాడు. ఇందులో 34 సెంచరీలు, 62 హాఫ్ సెంచరీలున్నాయి. వన్డేల్లో 12వేల పరుగుల మైలురాయిని అందుకునేందుకు రోహిత్‌కు మరో 105 పరుగులు అవసరం. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ సందర్భంగా ఆఖరి వన్డేలో సూపర్‌సెంచరీతో మెరిసిన హిట్‌మ్యాన్.. బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండే తిరువనంతపురంలోనూ శతకం సాధించాలని భావిస్తున్నాడు. రోహిత్ ఫామ్‌లో ఉంటే ఇదేమీ పెద్ద విషయం కాదు. తొలి వన్డేలో ఈ మైలురాయిని అందుకోలేనప్పటికీ, వన్డే సిరీస్ ముగిసేలోపే 12వేల మార్కును చేరుకోవడం ఖాయం.దీంతో పాటు రోహిత్ శర్మను మరో రికార్డు కూడా ఊరిస్తోంది. అదేంటంటే, మరో 135 పరుగులు చేస్తే వన్డేల్లో ఓపెనర్‌గా 10వేల పరుగుల మార్క్‌ను అందుకుంటాడు. తద్వారా వన్డేల్లో ఓపెనర్‌గా పదివేల పరుగుల మార్క్ అందుకున్న నాలుగో బ్యాటర్‌గా, భారత్ తరఫున రెండో బ్యాటర్‌గా నిలవనున్నాడు. సచిన్ టెండూల్కర్ ఈ ఫీట్ సాధించిన తొలి భారత ప్లేయర్‌గా కొనసాగుతున్నాడు.ఇక వెస్టిండీస్‌పై కూడా వన్డేల్లో రోహిత్ శర్మకు మంచి రికార్డే ఉంది. ఇప్పటివరకు విండీస్‌తో 37 వన్డేలు ఆడిన రోహిత్ 1,613 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, 12 హాఫ్ సెంచరీలున్నాయి.ఇదీ చదవండి: ఓటమి బాధలో ఉన్న ఆసీస్‌కు షాక్.. స్వదేశానికి స్టార్ ఆటగాడు! -
ఓటమి బాధలో ఉన్న ఆసీస్‌కు షాక్.. స్వదేశానికి స్టార్ ఆటగాడు!
సౌతాఫ్రికా పర్యటనను ఓటమితో ఆరంభించిన ఆస్ట్రేలియా జట్టుకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆటగాడు, వికెట్ కీపర్ జోష్ ఇంగ్లిస్ గాయంతో వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. డర్బన్ వేదికగా జరిగిన తొలి వన్డేలో కీపింగ్ చేస్తున్న సమయంలో ఇంగ్లిస్ కుడిచేయి చూపుడువేలికి బంతి బలంగా తగిలింది. చికిత్స అనంతరం ఇంగ్లిస్ బ్యాటింగ్‌కు వచ్చినప్పటికీ తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. మ్యాచ్ అనంతరం ఇంగ్లిస్ గాయాన్ని పరిశీలించగా, చూపుడువేలిలో చీలిక వచ్చినట్లు తేలింది. దీంతో ఇంగ్లిస్‌ను చికిత్స కోసం స్వదేశానికి తిరిగిరావాలని క్రికెట్ ఆస్ట్రేలియా ఒక ప్రకటనలో తెలిపింది. పెర్త్‌లో ఇంగ్లిస్ చేతి వేలి గాయానికి ట్రీట్మెంట్ తీసుకోనున్నాడు. వన్డే సిరీస్‌కు దూరమైన జోష్ ఇంగ్లిస్ మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు అందుబాటులో ఉంటాడా లేదా అనేది అతడు కోలుకోవడంపైనే ఆధారపడి ఉంటుందని క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది.అయితే మిగిలిన మ్యాచ్‌లకు ఇంగ్లిస్ స్థానంలో ఇప్పటివరకు ఏ ఆటగాడిని ఎంపిక చేయలేదని తెలుస్తోంది. దీంతో రేపు జోహన్నెస్‌బర్గ్ వేదికగా జరగనున్న రెండో వన్డేలో అలెక్స్ కేరీ కీపింగ్ బాధ్యతలు తీసుకోనున్నాడు. డర్బన్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియా 67 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. రేపు జోహన్నెస్‌బర్గ్ వేదికగా జరగనున్న రెండో వన్డేలోనూ విజయం సాధించి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకోవాలని సఫారీలు భావిస్తుండగా, రెండో వన్డేలో గెలిచి సిరీస్‌ను సమం చేయాలని ఆసీస్ భావిస్తోంది. దీంతో మ్యాచ్ హోరాహోరీగా సాగే అవకాశం లేకపోలేదు.తొలి వన్డేకు దూరంగా ఉన్న రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ రెండో వన్డేలో ఆడే అవకాశముంది. అయితే మిచెల్ స్టార్క్, హాజిల్‌వుడ్ రెండో వన్డేకు విశ్రాంతి తీసుకునే చాన్స్ ఉంది. వచ్చే ఏడాది డబ్ల్యూటీసీ ఫైనల్ నేపథ్యంలోనే ఆసీస్ జట్టు ప్రధాన బౌలర్లను కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే క్రికెట్ ఆస్ట్రేలియా ఇలా ప్లాన్ చేసింది.ఇక మూడో వన్డే సెప్టెంబర్ 30న జరగనుంది. ఆ తర్వాత ఇరుజట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ అక్టోబర్ 9 నుంచి ప్రారంభం కానుంది. డర్బన్ వేదికగా అక్టోబర్ 9 నుంచి 13 వరకు తొలి టెస్టు, అక్టోబర్ 18 నుంచి 22 వరకు గెహ్రా వేదికగా రెండో టెస్టు, అక్టోబర్ 27 నుంచి 31 వరకు కేప్‌టౌన్ వేదికగా చివరి టెస్టు మ్యాచ్ జరగనుంది.ఇదీ చదవండి: రేపు తొలి వన్డే.. విండీస్‌కు అచ్చిరాని వేదిక; గత రికార్డులు ఇలా! -
రేపు తొలి వన్డే.. విండీస్‌కు అచ్చిరాని వేదిక; గత రికార్డులు ఇలా!
తిరువనంతపురం వేదికగా రేపు భారత్, వెస్టిండీస్ మధ్య తొలి వన్డే జరగనుంది. ఇప్పటికే ఇరుజట్లు తమ ప్రాక్టీస్‌ను ముమ్మరం చేశాయి. టీమిండియా రెండుగా చీలిపోయి 50 ఓవర్ల ఇంట్రాస్వ్కాడ్ మ్యాచ్ కూడా ఆడేశాయి. ఈ మ్యాచ్‌లో కోహ్లి, రోహిత్, నితీశ్‌కుమార్ రెడ్డి, జడేజా తమ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నారు. అటు వెస్టిండీస్ కూడా టీమిండియాను వారి సొంతగడ్డపైనే ఓడించి నంబర్‌వన్ ర్యాంకు నుంచి పడగొట్టేందుకు సిద్ధమైనట్లు పేర్కొంది. అంతేకాదు 24 ఏళ్ల తర్వాత భారత్‌పై వన్డే సిరీస్ గెలిచే అవకాశం తమకు లభించిందని, దీనిని సద్వినియోగం చేసుకుంటామని విండీస్ హెడ్‌కోచ్ డారెన్ సామీ ప్రగల్భాలు పలికాడు. టీమిండియాను ఓడించి చూపిస్తామని సవాల్ చేయడం గమనార్హం.గత రికార్డులు ఇలా..ఈ విషయం పక్కనబెడితే, అసలు టీమిండియా గడ్డపై వెస్టిండీస్ వన్డే రికార్డు ఎలా ఉంది? విజయాలెన్నీ? ఓటములెన్నీ అనేది ఒకసారి పరిశీలిద్దాం. 1983 నుంచి 2022 వరకు చూసుకుంటే భారత్‌లో వెస్టిండీస్ 61 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 28 విజయాలు, 32 ఓటములు చవిచూసింది. ఒక మ్యాచ్ టైగా ముగిసింది.అత్యధిక స్కోరెంతంటే?ఇక భారత గడ్డపై వన్డేల్లో వెస్టిండీస్ చేసిన అత్యధిక స్కోరు 333 పరుగులు. 1983 డిసెంబర్ 7న జంషెడ్పూర్ వేదికగా జరిగిన వన్డేలో ఈ స్కోరు సాధించింది. ఆ మ్యాచ్‌లో భారత్ 229 పరుగులకే పరిమితం కావడంతో విండీస్ జట్టు 104 పరుగుల తేడాతో విజయం సాధించింది. చివరగా 2014లో కొచ్చి వేదికగా జరిగిన వన్డేలో భారత్‌పై విండీస్ 321 పరుగులు చేసింది.అత్యల్ప స్కోరెంతంటే?ఇక భారత గడ్డపై విండీస్ అత్యల్ప స్కోరు 80గా ఉంది. 2006 చాంపియన్స్ ట్రోఫీలో శ్రీలంకతో మ్యాచ్‌లో వెస్టిండీస్ 80 పరుగులకు ఆలౌటైంది. ఇక భారత్‌పై విండీస్ అత్యల్ప స్కోరు 104గా ఉంది. 2018లో ఇదే తిరువనంతపురం వేదికగా జరిగిన వన్డేలో విండీస్ 104 పరుగులకు ఆలౌటైంది. ఆ మ్యాచ్‌లో భారత్ 211 బంతులు మిగిలి ఉండగానే టార్గెట్‌ను ఛేదించి విజయాన్ని అందుకుంది. తిరువనంతపురం వేదిక అంటేనే విండీస్‌కు హడల్ అని చెప్పొచ్చు.చివరిసారి క్లీన్‌స్వీప్..2021-22లో వెస్టిండీస్ జట్టు భారత్‌లో పర్యటించింది. మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 3-0తో విండీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. కోవిడ్ కారణంగా మూడు మ్యాచ్‌లకు అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియం వేదికగా నిలిచింది. మ్యాచ్‌లన్నీ క్లోజ్ డోర్స్‌లోనే (ప్రేక్షకులు లేకుండా) జరిగాయి. తొలి వన్డేను ఆరు వికెట్ల తేడాతో నెగ్గిన టీమిండియా, రెండో వన్డేను 44 పరుగుల తేడాతో గెలిచింది. ఇక చివరి వన్డేలో 96 పరుగుల తేడాతో విజయం సాధించింది. నాలుగేళ్ల తర్వాత మళ్లీ వన్డే సిరీస్ ఆడేందుకు భారత గడ్డపై అడుగుపెట్టిన వెస్టిండీస్ ఈసారి ఎలాంటి ప్రదర్శన చేస్తుందనేది చూడాలి. ఇక వెస్టిండీస్ భారత గడ్డపై చివరిసారి 2002లో వన్డే సిరీస్‌ను గెలుచుకుంది. అప్పటినుంచి ఇప్పటిదాకా వెస్టిండీస్ రిక్త హస్తాలతోనే వెనుదిరిగింది.ఇదీ చదవండి: ఇరాన్‌ను చిత్తు చేసిన భారత్.. ఆసియా గేమ్స్‌లో నాలుగో స్వర్ణం -
Asian Games 2026: బుల్లెట్ ట్రైన్లో టీమిండియా ప్రయాణం
ఆసియా గేమ్స్‌లో పాల్గొనేందుకు టీమిండియా గతవారమే జపాన్‌లో అడుగుపెట్టింది. అయితే జపాన్‌తో చారిత్రక మ్యాచ్ అనంతరం రాజధాని టోక్యోలో గడిపిన టీమిండియా బృందం శనివారం ఆసియా గేమ్స్ జరుగుతున్న నగోయాకు చేరుకుంది. ఈ నేపథ్యంలో టోక్యో నుంచి నగోయాకు టీమిండియా బుల్లెట్ ట్రైన్లో ప్రయాణించడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనికి సంబంధించిన ఫొటోలను బీసీసీఐ తన ఎక్స్‌లో పంచుకుంది. స్వదేశంలో వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ కారణంగా హెడ్‌కోచ్ గంభీర్ భారత్‌లోనే ఉండిపోవడంతో, శ్రేయస్ అయ్యర్ టీంకు మెంటార్ కమ్ కోచ్‌గా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ వ్యవహరించనున్నాడు. అనంతరం శ్రేయస్ నేతృత్వంలోని జట్టు గ్రూప్ ఫొటోకు ఫోజిచ్చింది. PC: BCCI Twitterభారత్‌కు సీడింగ్, ఐసీసీ ర్యాంకింగ్ ఆధారంగా ఆసియా గేమ్స్‌లో నేరుగా క్వార్టర్‌ఫైనల్ బెర్త్ లభించిన విషయం తెలిసిందే. సోమవారం జరిగే రెండో క్వార్టర్ ఫైనల్లో ఆఫ్ఘనిస్తాన్‌తో టీమిండియా తలపడనుంది. 2023 ఆసియా గేమ్స్‌లో రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలోని టీమిండియా స్వర్ణ పతకం సాధించిన సంగతి తెలిసిందే.PC: BCCI Twitterకాగా ఈసారి క్రీడలకు మాత్రం డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ ఫుల్ మెంబర్స్ జట్టుతో బరిలోకి దిగింది. శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని భారత జట్టులో అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, శివమ్ దూబే, తిలక్ వర్మ, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్ తదితర స్టార్లు ఉన్నారు.All set for the #AsianGames 2026 challenge 🇮🇳Drop a 💙 if you are ready to cheer for #TeamIndia 👇@WeAreTeamIndia | @Media_SAI pic.twitter.com/qypPk87QQM— BCCI (@BCCI) September 26, 2026ఇదీ చదవండి: టీమిండియా తరఫున అదే చివరిది: విరాట్ కోహ్లి -
ఏషియన్ గేమ్స్ క్రికెట్.. మిగిలిన రెండు బెర్త్లూ ఖరారు
ఏషియన్ గేమ్స్ 2026 పురుషుల క్రికెట్లో నాలుగు క్వార్టర్ ఫైనల్ బెర్త్‌లు ఖరారయ్యాయి. గ్రూప్ దశ మ్యాచ్‌ల తర్వాత నేపాల్, ఆఫ్ఘనిస్తాన్, మలేషియా, హాంగ్‌కాంగ్ చైనా జట్లు ఫైనల్-8కు చేరుకున్నాయి. సీడింగ్, ఐసీసీ ర్యాంకింగ్ ఆధారంగా భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్ జట్లకు నేరుగా క్వార్టర్‌ఫైనల్ బెర్త్‌లు లభించిన విషయం తెలిసిందే.తాజాగా మలేషియా, ఒమన్ మధ్య జరగాల్సిన చివరి గ్రూప్-బి మ్యాచ్ వర్షం కారణంగా పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడంతో గ్రూప్ టాపర్‌గా నిలిచిన మలేషియా, సెకెండ్ టాపర్ అయిన హాంగ్‌కాంగ్ చైనా క్వార్టర్స్‌కు చేరుకున్నాయి. ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయిన ఒమన్ టోర్నీ నుంచి నిష్క్రమించింది.అంతకుముందే గ్రూప్-ఏ నుంచి నేపాల్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు క్వార్టర్స్‌కు చేరుకున్నాయి. జపాన్, నేపాల్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో ఈ రెండు జట్లు క్వార్టర్ ఫైనల్ బెర్త్‌లు దక్కించుకున్నాయి. టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా గెలవని జపాన్ టోర్నీ నుంచి నిష్క్రమించింది.క్వార్టర్స్‌లో ఎవరెవరు..?గ్రూప్-ఏ టాపర్‌గా నిలిచిన నేపాల్ సెప్టెంబర్ 29న జరిగే మూడో క్వార్టర్ ఫైనల్లో శ్రీలంకను ఢీకొంటుంది. అదే గ్రూప్‌లో రెండో స్థానంలో నిలిచిన ఆఫ్ఘనిస్తాన్ సెప్టెంబర్ 28న జరిగే రెండో క్వార్టర్ ఫైనల్లో భారత జట్టుతో తలపడనుంది.గ్రూప్-బి టాపర్‌గా నిలిచిన మలేషియా సెప్టెంబర్ 29న జరిగే నాలుగో క్వార్టర్ ఫైనల్లో బంగ్లాదేశ్‌తో తలపడుతుంది. రెండో స్థానంలో నిలిచిన హాంగ్‌కాంగ్ చైనా సెప్టెంబర్ 28న జరిగే తొలి క్వార్టర్ ఫైనల్లో పాకిస్తాన్‌ను ఢీకొంటుంది.ఇదీ చదవండి: ఏషియన్ గేమ్స్‌లో భారత్‌కు మరో గోల్డ్ -
బ్యాటర్ల విధ్వంసం.. భారత్ సంచలన విజయం; సిరీస్ కైవసం
మొహాలీ వేదికగా ఆస్ట్రేలియా-ఎ వుమెన్‌తో జరిగిన మూడో అనధికారిక వన్డేలో భారత-ఎ జట్టు 4 వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. 363 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఇండియా-ఎ జట్టు 48.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఫలితంగా మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. భారత బ్యాటర్లలో మిన్నూ మాని (56 బంతుల్లో 88 నాటౌట్; 12 ఫోర్లు, 3 సిక్సర్లు) అజేయ అర్థసెంచరీతో జట్టును గెలిపించగా, నిక్కీ ప్రసాద్ (76), కెప్టెన్ అనుష్క శర్మ (58), తనీషా సింగ్ (60) అర్థశతకాలతో రెచ్చిపోయారు. జట్టులో నలుగురు బ్యాటర్లు అర్థశతకాలు చేసి తమ విలువైన భాగస్వామ్యాలతో జట్టును విజయపథంలో నడిపించారు. ఆసీస్ బౌలర్లలో చార్లీ నాట్, లిల్లీ మిల్స్ చెరో 2 వికెట్లు పడగొట్టారు.అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా వుమెన్ చార్లీ నాట్ (70 బంతుల్లో 109; 12 ఫోర్లు, 5 సిక్సర్లు) సెంచరీతో విధ్వంసం సృష్టించగా, కౌర్ట్నీ వెబ్ (92 బంతుల్లో 95) రాణించడంతో ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 362 పరుగులు చేసింది. భారత బౌలర్లలో వైష్ణవి శర్మ, నికీ ప్రసాద్ చెరో 4 వికెట్లు పడగొట్టారు.ఇదీ చదవండి: రెండుగా చీలిన భారత్; దంచేసిన కోహ్లి, రోహిత్.. గిల్ ప్లాఫ్ షో! -
రెండుగా చీలిన భారత్; దంచేసిన కోహ్లి, రోహిత్.. గిల్ ప్లాఫ్ షో!
వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ నేపథ్యంలో ఆదివారం తిరువనంతపురం వేదికగా టీమిండియా తొలి వన్డే ఆడనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రాక్టీస్ ఆరంభించిన భారత జట్టు శుక్రవారం రెండు జట్లుగా విడిపోయి ఇంట్రా స్వ్కాడ్ మ్యాచ్ ఆడాయి. ఇండియా-ఏ జట్టులో గిల్, కోహ్లి, జడేజా, రుతురాజ్, కేఎల్ రాహుల్ బ్యాటింగ్ చేయగా, ఇండియా-బి జట్టులో రోహిత్ శర్మ, జైస్వాల్, ధ్రువ్ జురెల్, నితీశ్‌కుమార్ రెడ్డి, నమన్ ధిర్లు బ్యాటింగ్ చేశారు. ఇరుజట్లు 50 ఓవర్ల మ్యాచ్ ఆడాయి. ఈ మ్యాచ్‌లో ఇండియా-ఏ జట్టు విజయం సాధించింది. సీనియర్లు కోహ్లి, రోహిత్‌లు బ్యాటింగ్‌లో అదరగొట్టగా, కెప్టెన్ గిల్ ప్లాఫ్ అయ్యాడు. మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా-ఎ 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 319 పరుగులు చేసింది. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి 88 బంతుల్లో 91 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. రవీంద్ర జడేజా 39 బంతుల్లో 45 పరుగులతో అజేయంగా నిలిచాడు. రుతురాజ్ గైక్వాడ్ 38 బంతుల్లో 42 పరుగులు చేయగా.. కేఎల్ రాహుల్ 29 బంతుల్లో 36 పరుగులతో రాణించాడు. కానీ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ మాత్రం 8 బంతుల్లో 7 పరుగులే చేసి పెవిలియన్ చేరాడు.అనంతరం 320 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా-బి 50 ఓవర్లలో 7 వికెట్లకు 309 పరుగులు చేసింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ 68 బంతుల్లో 72 పరుగులతో ఆకట్టుకోగా.. రోహిత్ శర్మ 59 బంతుల్లో 64 పరుగులు చేశాడు. వీరిద్దరూ జట్టుకు మంచి ఆరంభాన్ని అందించారు. మిడిలార్డర్లో నితీష్ కుమార్ రెడ్డి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 57 బంతుల్లో 61 పరుగులు చేసి జట్టు స్కోరును ముందుకు తీసుకెళ్లాడు. నమన్ ధిర్ 28 బంతుల్లో 31 పరుగులు చేశాడు. అలా చివరికి ఇండియా-బి 309 పరుగులకే పరిమితమై ఓటమి చవిచూసింది. మొత్తం మీద ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ ద్వారా కోహ్లి, రోహిత్ తమ బ్యాటింగ్‌తో అలరించారు.తొలి వన్డే తిరువనంతపురం వేదికగా జరుగనుండగా, రెండో మ్యాచ్ గౌహతి వేదికగా సెప్టెంబర్ 30న ఉంటుంది. అక్టోబర్ 3వ తేదీన న్యూ ఛండీఘర్ వేదికగా చివరి మ్యాచ్ జరగుంది. ఈ వన్డే సిరీస్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఇద్దరూ బరిలోకి దిగనున్నారు. అక్టోబర్ 6వ తేదీ నుంచి ఇరుజట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ షురూ కానుంది.ఇదీ చదవండి: విండీస్‌తో తొలి వన్డే.. భారత తుదిజట్టు అంచనా! -
విండీస్‌తో తొలి వన్డే.. భారత తుదిజట్టు అంచనా!
తిరువనంతపురం వేదికగా ఆదివారం భారత్, వెస్టిండీస్ మధ్య తొలి వన్డే జరగనుంది. ఈ నేపథ్యంలో భారత తుది జట్టులో ఎవరు ఉంటారు, ఎవరు ఉండరనే దానిపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఆసియా గేమ్స్‌లో పాల్గొనేందుకు శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని భారత జట్టు జపాన్‌కు రాగా, విండీస్‌తో వన్డే సిరీస్‌కు రోహిత్, కోహ్లి, జడేజా సిద్ధమయ్యారు. వీరితో పాటు కెప్టెన్ గిల్, వైస్‌కెప్టెన్ కేఎల్ రాహుల్ ఆడనున్నారు. ఈ నేపథ్యంలో విండీస్‌తో తొలి వన్డేకు తుదిజట్టు ఎలా ఉండబోతుందనేది ఒకసారి పరిశీలిద్దాం.తుదిజట్టులో యశస్వి జైస్వాల్, నమన్ ధీర్, ధ్రువ్ జురెల్‌లకు అవకాశం దక్కడం కష్టమే. శ్రేయస్ అయ్యర్ స్థానంలో భారత జట్టులోకి వచ్చిన రుతురాజ్ గైక్వాడ్ మాత్రం ఆడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇక ఓపెనర్లుగా రోహిత్ శర్మ, గిల్ రానున్నారు. వన్‌డౌన్‌లో కోహ్లి, ఆ తర్వాత రుతురాజ్ గైక్వాడ్ వచ్చే అవకాశముంది. ఇక ఐదో స్థానంలో వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ రానున్నాడు. ఆల్రౌండర్లుగా జడేజా, నితీశ్‌కుమార్ రెడ్డి ఆడే అవకాశముంది. జట్టులో ప్రధాన స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్ ఉండవచ్చు. ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో ప్రసిద్ధ కృష్ణ మహమ్మద్ సిరాజ్, గుర్నూర్ బ్రార్‌లు ఆడే అవకాశముంది. ఈ సిరీస్ కోసం ఎంపిక చేసిన ఫాస్ట్ బౌలర్ ఆకిబ్ నబీ, నమన్ ధిర్ బెంచ్‌కు పరిమితం కానున్నారు.భారత తుది జట్టు అంచనా:రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, రుతురాజ్ గైక్వాడ్, కేఎల్ రాహుల్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, ప్రసిధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్, గుర్నూర్ బ్రార్.ఇదీ చదవండి: భారత్‌తో తొలి వన్డే.. విండీస్ హెడ్‌కోచ్ సంచలన వ్యాఖ్యలు -
భారత్‌తో తొలి వన్డే.. విండీస్ హెడ్‌కోచ్ సంచలన వ్యాఖ్యలు
టీమిండియాతో వన్డే సిరీస్ నేపథ్యంలో వెస్టిండీస్ కోచ్ డారెన్ సామీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఐసీసీ ట్రోఫీలు సాధించాలంటే ముందు టీమిండియాను చావుదెబ్బ కొట్టాలని పేర్కొన్నాడు. డారెన్ సామీ మాట్లాడుతూ.. ‘భారత్‌లో ద్వైపాక్షిక సిరీస్ గెలిచి 24 ఏళ్లవుతుంది. ఈసారి మాకు వారిపై సిరీస్ గెలిచేందుకు మంచి అవకాశముంది. ఇందుకు మమ్మల్ని మేము సవాల్ చేసుకొని అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తాం. పరిమిత ఓవర్ల క్రికెట్లో ఐసీసీ ట్రోఫీలు గెలవాలంటే భారత్ వంటి పెద్ద జట్లను అడ్డుకునే రీతిలో మా ఆటతీరు ఉండాలి. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో క్వాలిఫయర్స్ ఉంటాయి. దక్షిణాఫ్రికా వేదికగా జరగనున్న వరల్డ్‌కప్‌లో మేం ఆడేందుకు అర్హత సాధిస్తామన్న నమ్మకం మాకుంది. ఈసారి జట్టులో టాప్ క్లాస్ ప్లేయర్లు ఉన్నారు. షెయ్ హోప్‌తో పాటు అమీర్ జంగూ, రూథర్‌ఫోర్డ్, అల్జారీ జోసెఫ్ లాంటి క్రికెటర్లతో జట్టు పటిష్టంగా కనిపిస్తుంది. వన్డేల్లో ప్రపంచ నంబర్‌వన్‌గా ఉన్న టీమిండియాను ఈసారి వన్డే సిరీస్‌లో నేలమట్టం చేసి ట్రోఫీతో ఇంటికి వెళతాం. ఐపీఎల్ వల్ల మా ప్లేయర్లకు భారత గడ్డపై మంచి అనుభవముంది.’ అని తెలిపాడు. భారత్‌తో తొలి వన్డేకు రోజు సమయం మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో విండీస్ కోచ్ చేసిన వ్యాఖ్యలు హాట్‌టాఫిక్‌గా మారాయి.2002లో చివరిసారి..భారత గడ్డపై వెస్టిండీస్ చివరిసారి 2002లో వన్డే సిరీస్ గెలిచింది. ఆ జట్టుకు కార్ల్ హూపర్ కెప్టెన్‌గా ఉండగా, టీమిండియాకు సౌరవ్ గంగూలీ నేతృత్వం వహించాడు. ఆనాడు రెండు జట్ల మధ్య ఏడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరగ్గా వెస్టిండీస్ 4-3 తేడాతో భారత్‌ను ఓడించింది. ఆ తర్వాత చాలాసార్లు భారత పర్యటనకు వచ్చినప్పటికీ విండీస్ రిక్త హస్తాలతోనే వెనుదిరిగింది.టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆదివారం ప్రారంభం కానుంది. తొలి వన్డే తిరువనంతపురం వేదికగా జరుగనుండగా, రెండో మ్యాచ్ గౌహతి వేదికగా సెప్టెంబర్ 30న ఉంటుంది. అక్టోబర్ 3వ తేదీన న్యూ ఛండీఘర్ వేదికగా చివరి మ్యాచ్ జరగుంది. ఈ వన్డే సిరీస్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఇద్దరూ బరిలోకి దిగనున్నారు. అక్టోబర్ 6వ తేదీ నుంచి ఇరుజట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ షురూ కానుంది.ఇదీ చదవండి: 10వేల మీటర్ల రేసులో గుల్వీర్ చరిత్ర.. పోల్‌వాల్ట్‌లో తొలి పతకం -
సెంచరీ బాదిన ఆసీస్ బ్యాటర్.. భారత్ ముంగిట భారీ లక్ష్యం
మొహలీ వేదికగా ఇండియా-ఎ వుమెన్‌తో జరుగుతున్న అనధికారిక మూడో వన్డేలో ఆస్ట్రేలియా వుమెన్ భారీ స్కోరు సాధించింది. చార్లీ నాట్ (70 బంతుల్లో 109; 12 ఫోర్లు, 5 సిక్సర్లు) సెంచరీతో విధ్వంసం సృష్టించగా, కౌర్ట్నీ వెబ్ (92 బంతుల్లో 95) రాణించడంతో ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 362 పరుగులు చేసింది. మిగతా బ్యాటర్లలో కెప్టెన్ తాహిలా విల్సన్ (38), రాచెల్ త్రినెమన్ (29) పర్వాలేదనిపించారు. చివర్లో హేలీ సిల్వర్ హోమ్స్ (8 బంతుల్లో 19 పరుగులు) మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో ఆస్ట్రేలియా 360 పరుగుల మార్క్‌ను దాటింది. భారత బౌలర్లలో వైష్ణవి శర్మ, నికీ ప్రసాద్ చెరో 4 వికెట్లు పడగొట్టారు.కాగా మూడో వికెట్‌కు చార్లీ నాట్, కౌర్ట్నీ వెబ్ 116 బంతుల్లో 166 పరుగులు జోడించి ఆసీస్ భారీ స్కోరు సాధించడంలో సహాయపడ్డారు. కాగా ఇరుజట్లు చెరో వన్డే గెలిచి 1-1తో సమంగా ఉన్నాయి. -
విండీస్‌తో వన్డే సిరీస్.. పూనకాలు లోడింగ్ అంటున్న కోహ్లి!
స్వదేశంలో వెస్టిండీస్‌తో టీమిండియా మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడనున్న సంగతి తెలిసిందే. ఆదివారం తిరువనంతపురం వేదికగా రెండు జట్ల మధ్య తొలి వన్డే మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ ఆడేందుకు ఇప్పటికే ఇరుజట్లు కేరళకు చేరుకొని ప్రాక్టీస్ ఆరంభించాయి. వెస్టిండీస్‌పై గెలిచి ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ ఓటమిని మరిచిపోవాలని టీమిండియా చూస్తుండగా, సొంతగడ్డపై భారత్‌కు షాకివ్వాలనే యోచనలో విండీస్ ఉంది. రెండు జట్లు పేపర్‌పై బలంగా కనిపిస్తుండడంతో హోరాహోరీ పోరు తప్పదనిపిస్తోంది. ఇదిలా ఉంటే, విండీస్‌తో సిరీస్ అనగానే టీమిండియా రన్‌మెషిన్ విరాట్ కోహ్లి చెలరేగిపోతుంటాడు. గత గణాంకాలు కూడా ఇదే స్పష్టం చేస్తున్నాయి. 2018లో వెస్టిండీస్ భారత్ పర్యటనకు వచ్చింది. ఈ సిరీస్‌కు టీమిండియా కెప్టెన్‌గా కోహ్లి వ్యవహరించాడు. 2018లో ఆకాశమే హద్దుగా..ఆనాటి సిరీస్‌ను భారత్ 3-1తో (ఒక మ్యాచ్ టై) గెలుచుకుంది. అయితే ఆ సిరీస్‌లో కోహ్లి ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఆడిన ఐదు వన్డేల్లో కోహ్లి 453 పరుగులు సాధించి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇందులో మూడు సెంచరీలు ఉండడం విశేషం. ఈ మూడు సెంచరీలు మూడు వరుస మ్యాచ్‌ల్లో రావడం విశేషం. గౌహతి వేదికగా జరిగిన తొలి వన్డేలో కోహ్లి (107 బంతుల్లో 140 నాటౌట్) విజృంభించడంతో భారత్ సునాయాస విజయం సాధించింది.ఇక రెండో వన్డేలో కోహ్లి 129 బంతుల్లో 157 పరుగులు సాధించాడు. ఈ మ్యాచ్ టైగా ముగియడం గమనార్హం. ఇక మూడో వన్డేలో మరోసారి సెంచరీతో చెలరేగిన కోహ్లి 119 బంతుల్లో 107 పరుగులు చేశాడు. మూడు వరుస వన్డేల్లో శతకాలు సాధించిన తొలి బ్యాటర్‌గానూ కోహ్లి అప్పట్లో రికార్డులకెక్కాడు.బాబర్ ఆజం మాత్రమే..ఆ తర్వాత రోహిత్ శర్మ 2019 వన్డే ప్రపంచకప్‌లో వరుసగా మూడు సెంచరీలు సాధించి కోహ్లి సరసన చేరాడు. ఇక కోహ్లి తర్వాత వెస్టిండీస్‌పై వరుసగా మూడు వన్డేల్లో సెంచరీలు బాదిన క్రికెటర్‌గా పాకిస్తాన్ బాబర్ ఆజం ఉన్నాడు. ఓవరాల్‌గా చూసుకున్నా కోహ్లికి విండీస్‌పై ఘనమైన రికార్డు ఉంది. వన్డే క్రికెట్లో కోహ్లి 41 ఇన్నింగ్స్‌ల్లో 97 స్ట్రైక్‌రేట్‌తో 2,261 పరుగులు సాధించాడు. ఇందులో 9 సెంచరీలు, 11 అర్ధ సెంచరీలు ఉన్నాయి.ఇక కెప్టెన్‌గా ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లో అత్యధిక పరుగులు సాధించిన జాబితాలోనూ కోహ్లి తొలి స్థానంలో ఉన్నాడు. 2018లో సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌లో కోహ్లి 558 పరుగులు సాధించాడు. రెండో స్థానంలో ఆసీస్ కెప్టెన్ జార్జ్ బెయిలీ (478 పరుగులు, భారత్‌పై 2013లో) ఉన్నాడు. ఇక మూడో స్థానంలో మరోసారి కోహ్లి (453 పరుగులు వర్సెస్ వెస్టిండీస్‌పై) ఉన్నాడు. ఇక వెస్టిండీస్‌తో ద్వైపాక్షిక వన్డే సిరీస్‌ల్లో కోహ్లి మినహా ఏ బ్యాటర్ కూడా 400 పరుగుల మార్క్‌ను దాటలేకపోవడం గమనార్హం.తిరువనంతపురంలో జరగబోయే తొలి వన్డే మ్యాచ్ కోసం ఇప్పటికే కోహ్లీ అక్కడికి చేరుకుని నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. తన సహచరుడు రోహిత్ శర్మతో కలిసి కోహ్లి తిరిగి జట్టులోకి రావడంతో, ఈ సిరీస్ భారత్ గడ్డపై అభిమానులకు అసలైన 'మాస్ వినోదాన్ని' అందించడం ఖాయంగా కనిపిస్తోంది.ఇదీ చదవండి: టేబుల్ టెన్నిస్‌లో కాంస్యం.. అథ్లెటిక్స్‌లో 9 పతకాలు ఖాయం! -
24 ఏళ్ల తర్వాత సౌతాఫ్రికా స్పిన్నర్ అరుదైన ఫీట్
సౌతాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహరాజ్ వన్డే క్రికెట్లో అరుదైన ఫీట్ సాధించాడు. సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో దక్షిణాఫ్రికా 67 పరుగుల తేడాతో విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో కేశవ్ మహరాజ్ నాలుగు వికెట్ల హాల్ నమోదు చేశాడు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాపై వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన సౌతాఫ్రికా స్పిన్నర్‌గా కేశవ్ మహరాజ్ (22 వికెట్లు).. పాట్ సిమ్కాక్స్తో కలిసి సంయుక్తంగా తొలి స్థానంలో నిలిచాడు. అంతేకాదు కేశవ్ మహరాజ్‌కు వన్డేల్లో ఇది ఐదో నాలుగు వికెట్ల హాల్ కాగా, ఓవరాల్‌గా అత్యధిక సార్లు నాలుగు వికెట్ల హాల్ నమోదు చేసిన రెండో స్పిన్నర్‌గా నిలిచాడు. తొలి స్థానంలో ఇమ్రాన్ తాహిర్ (10 సార్లు) కొనసాగుతున్నాడు. ఇక ఆస్ట్రేలియాపై వన్డేల్లో కేశవ్ మహరాజ్ సాధించిన (4/20) వికెట్ల ప్రదర్శన సౌతాఫ్రికా తరఫున రెండో అత్యుత్తమం. 2002లో కేప్‌టౌన్ వేదికగా ఆసీస్‌పై నికీ బోజే (5/12) వికెట్ల ప్రదర్శన తొలి అత్యుత్తమంగా ఉంది. ఇక సొంతగడ్డపై ఆస్ట్రేలియాపై సౌతాఫ్రికాకు ఇది వరుసగా నాలుగో విజయం కాగా, ఈ నాలుగుసార్లు సఫారీలు తొలుత బ్యాటింగ్ చేయడం విశేషం.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 297 పరుగులు చేసింది. మాథ్యూ బ్రీట్జ్కే (106 బంతుల్లో 112) శతకం సాధించగా, మార్కో జాన్సన్ (75) రాణించాడు. ఆసీస్ బౌలర్లలో నాథన్ ఎల్లిస్ మూడు వికెట్లు తీశాడు. అనంతరం ఛేదన ప్రారంభించిన ఆస్ట్రేలియా 41.2 ఓవర్లలో 230 పరుగులకే కుప్పకూలింది. మిచెల్ మార్ష్ (60) అర్థసెంచరీతో రాణించగా, మాట్ రెన్షా (44) పర్వాలేదనిపించాడు. కేశవ్ మహరాజ్ నాలుగు వికెట్లు తీయగా, కార్బిన్ బోస్క్, జోర్న్ ఫోర్టిన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.ఇదీ చదవండి: Asian Games 2026: సాత్విక్-చిరాగ్ జోడీకి షాక్ -
ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్‌గా ఆర్సీబీ టైటిల్ విన్నర్
మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) 2027 సీజన్‌కు ముందు ముంబై ఇండియన్స్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ మహిళల జట్టుకు కొత్త హెడ్ కోచ్‌గా ఆస్ట్రేలియాకు చెందిన ల్యూక్ విలియమ్స్‌ను నియమించింది. ఇప్పటివరకు కోచ్‌గా వ్యవహరించిన లిసా కైట్లీ స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టనున్నాడు. కైట్లీ కేవలం ఒక్క సీజన్ తర్వాతే పదవి నుంచి తప్పుకోవడం గమనార్హం.46 ఏళ్ల ల్యూక్ విలియమ్స్‌కు కోచింగ్‌లో మంచి అనుభవం ఉంది. 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మహిళల జట్టుకు కోచ్‌గా వ్యవహరించి డబ్ల్యూపీఎల్ టైటిల్‌ను అందించాడు. అడిలైడ్ స్ట్రైకర్స్‌కు కూడా కోచ్‌గా వ్యవహరించిన ఆయన.. 2022-23 సీజన్లో ఆ జట్టుకు తొలి ఉమెన్స్ బిగ్ బాష్ లీగ్ (WBBL) టైటిల్ అందించాడు. 2025 నుంచి ఇంగ్లండ్ మహిళల జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా కూడా సేవలందించాడు.ముంబైని మళ్లీ ఛాంపియన్‌గా నిలపడమే లక్ష్యంరెండుసార్లు డబ్ల్యూపీఎల్ టైటిల్ గెలిచిన ముంబై ఇండియన్స్‌కు 2026 సీజన్ నిరాశ మిగిల్చింది. హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని జట్టు కేవలం మూడు విజయాలతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి పరిమితమైంది. దీంతో కొత్త కోచ్ మార్గదర్శకత్వంలో తిరిగి విజయాల బాట పట్టాలని ముంబై భావిస్తోంది.ఇదీ చదవండి: ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ రికార్డు బ్రేకింగ్ ప్రదర్శన -
చహల్ 'ఆఖరి రాగం'
భారత క్రికెట్‌కు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతోంది. టీమిండియా వెటరన్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ రిటైర్మెంట్ తీసుకోబోతున్నాడా అని అభిమానులు చర్చించుకుంటున్నారు. ఇందుకు చహల్ తాజాగా సోషల్‌మీడియాలో చేసిన ఓ పోస్ట్ కారణం.The Last Dance 🤙 pic.twitter.com/Z27l4tZQQf— Yuzvendra Chahal (@yuzi_chahal) September 23, 2026లండన్‌లోని ప్రఖ్యాత లార్డ్స్ మైదానం నుంచి సెప్టెంబర్ 23న కొన్ని ఫొటోలను షేర్ చేసిన చహల్.. వాటికి 'ది లాస్ట్ డ్యాన్స్' (ఆఖరి రాగం) అనే క్యాప్షన్ జోడించాడు. దీంతో చహల్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకబోతున్నాడంటూ అభిమానులు గుసగుసలాడుకుంటున్నారు.అయితే, ఈ విషయమై చహల్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అతడి పోస్ట్ వెనుక అసలు ఉద్దేశం ఏమిటన్నది కూడా స్పష్టం కాలేదు.అయితే చహల్ చేసిన 'ది లాస్ట్ డ్యాన్స్' పోస్ట్‌పై మాత్రం అభిమానులు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు అతడు అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాడని అనుమానం వ్యక్తం చేస్తుండగా.. మరికొందరు కౌంటీ క్రికెట్ నుంచి మాత్రమే తప్పుకోబోతున్నాడని అనుకుంటున్నారు. చహల్ ప్రస్తుతం నార్తాంప్టన్‌షైర్ తరఫున కౌంటీ క్రికెట్ ఆడుతున్నాడు. కౌంటీ ఛాంపియన్షిప్ సీజన్ ముగింపు దశకు చేరుకోవడంతో చహల్ ఈ పోస్ట్ చేసి ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.కాగా, చహల్ టీమిండియా తరఫున చివరిసారిగా 2023 జనవరి 24న న్యూజిలాండ్‌తో వన్డే మ్యాచ్ ఆడాడు. అదే ఏడాది ఆగస్టు 13న వెస్టిండీస్‌తో టీ20 మ్యాచ్ ఆడాడు. అప్పటి నుంచి చహల్ వివిధ వేదికలపై రాణిస్తున్నా టీమిండియాలో చోటు దక్కడం లేదు. ప్రస్తుతం టీమిండియాలో స్పిన్నర్ల బెర్త్‌ల కోసం తీవ్రమైన పోటీ ఉంది. ఒక్కో బెర్త్ కోసం పదుల సంఖ్యలో పోటీపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో 35 ఏళ్ల చహల్ టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వడం కష్టమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదీ చదవండి: ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ రికార్డు బ్రేకింగ్ ప్రదర్శన -
మితిమీరిన క్రికెట్.. జనాలకు బోర్ కొట్టదా..?
క్రికెట్.. ఈ క్రీడ భారతీయులకు ఓ ఎమోషన్. టీమిండియా మ్యాచ్ ఉందంటే చాలు, జనాలు పనులు పక్కనపెట్టి మరీ టీవీలకు అతుక్కుపోతారు. వీలైతే నేరుగా మ్యాచ్ చూసేందుకు స్టేడియాలకు క్యూ కడతారు. భారత్ గెలిస్తే పండుగ చేసుకుంటారు. ఓడితే నిరాశ చెందుతారు. గెలిచినా, ఓడినా గల్లీ నుంచి ఢిల్లీ దాకా డిబేట్లు పెడుతుంటారు. అయితే ప్రస్తుతం ఈ డిబేట్లలో ఓ ఆసక్తికర అంశం చేరింది. అదే.. 'మితిమీరిన క్రికెట్'.ఇటీవలికాలంలో భారత క్రికెట్ జట్లు విపరీతంగా మ్యాచ్‌లు ఆడేస్తున్నాయి. ఆ స్థాయి, ఈ విభాగం అని ప్రతి రోజూ ఏదో ఒక మ్యాచ్ జరుగుతూనే ఉంటుంది. తాజాగా ఒకే రోజు మూడు వేర్వేరు విభాగాలు, స్థాయిలకు సంబంధించి ఏకంగా మూడు మ్యాచ్‌లు జరిగాయి. భారత-ఏ జట్టు, భారత మహిళల-ఏ జట్టు, భారత అండర్-19 జట్టు.. ఇలా మూడు జట్లు ఒకే రోజు, ఒకే ప్రత్యర్దితో (ఆస్ట్రేలియా) మ్యాచ్‌లు ఆడాయి.ఇది చూసి అభిమానులు తెగ తికమకపడ్డారు. ఎక్కడ ఏ జట్టు ఆడుతుందో అర్దం కాక జట్టు పీక్కున్నారు. ఒక్కప్పుడు భారత క్రికెట్ జట్టు మ్యాచ్ ఆడుతుందంటే ఓ క్లారిటీ ఉండేది. కానీ, ప్రస్తుతం పరిస్థితి అలా లేదు. ఏ ఆటగాడు ఏ జట్టులో ఉంటాడో ఎవరికీ తెలీదు.పురుషుల క్రికెట్ వరకు తీసుకుంటే.. భారత్‌కు ఒక్క జట్టు చాలా తక్కువైపోతుంది. అందుకే టీ20లకు ఒకటి, వన్డేలకు ఒకటి, టెస్ట్‌లకు మరో జట్టు ఉంటుంది. ఇవి కాకుండా భారత-ఏ జట్టు, భారత అండర్ 19, 23 విభాగాల జట్లు.. ఇలా విభాగానికి ఓ జట్టు ఉంది. ఈ జట్లన్నీ ఏడాది పొడవునా ఏదో ఒక మ్యాచ్ ఆడుతూనే ఉంటాయి. ఇవి కావని దేశవాలీ క్రికెట్, ఐపీఎల్, స్థానిక లీగ్‌లతో ఆటగాళ్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇక్కడి వరకు సమస్య ఆటగాళ్ల వరకే ఉంది. మితిమీరిన క్రికెట్ వల్ల ఇప్పుడు, అభిమానులూ ఇబ్బంది పడుతున్నారు. ఆడేందుకు ఆటగాళ్లకు అలసట రాకపోయినా, చూసేందుకు మాత్రం అభిమానులకు బోర్ కొడుతుంది.ఈ పరిస్థితి కేవలం భారత క్రికెట్ వరకు మాత్రమే. ప్రపంచవ్యాప్త క్రికెట్‌ను తీసుకుంటే పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఏడాది పొడవునా అంతర్జాతీయ మ్యాచ్‌లు, దేశవాలీ మ్యాచ్‌లు, ప్రైవేట్ టీ20 లీగ్‌లతో ఆటగాళ్లకు, అభిమానులకు క్షణం తీరిక లేకుండా పోతుంది. ఈ మితిమీరిన క్రికెట్ ఆడేందుకు ఎలా ఉన్నా, చూసేందుకు మాత్రం ఎబ్బేట్టుగా మారిపోతుంది.ఈ పరిస్థితి వల్ల కొందరు అభిమానులు క్రికెట్ చూడటమే మానేశారు. ప్రస్తుతం క్రికెట్ బోర్ కొట్టే దశ నుంచి విరక్తి వచ్చే దశకు రూపాంతరం చెందుతుంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే అతి త్వరలో జనాలు క్రికెట్‌ను పూర్తిగా విస్మరించే ప్రమాదం ఉంది. కాబట్టి అంతర్జాతీయ షెడ్యూల్, ప్రైవేట్ లీగ్‌ల సంఖ్య తగ్గించి, మ్యాచ్‌లను పరిమితం చేస్తే క్రికెట్ బ్రతుకుతుంది. ఇప్పటికే ఆటలో నాణ్యత తగ్గిపోయి చాలామంది క్రికెట్ చూడటం మానేశారు. ఇదే కొనసాగితే మిగతా జనాలు కూడా కాలక్రమేనా ఆటకు దూరమవుతారు.ఇదీ చదవండి: టీమిండియాను ఫాలో అవ్వండి.. పాక్ జట్టుకు సూచన -
సౌతాఫ్రికాతో సిరీస్.. పాట్ కమిన్స్ కీలక నిర్ణయం!
సౌతాఫ్రికాలో పర్యటించనున్న ఆస్ట్రేలియా మల్టీ ఫార్మాట్ సిరీస్ (మొదట మూడు వన్డేలు, తర్వాత మూడు టెస్టులు) ఆడనుంది. ఈ నేపథ్యంలో రేపు డర్బన్ వేదికగా సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య తొలి వన్డే మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌కు ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. టెస్టు చాంపియన్‌షిప్ నేపథ్యంలో ఇప్పటికే జింబాబ్వేతో వన్డే సిరీస్‌కు దూరంగా ఉన్న కమిన్స్ సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌లోనూ కేవలం ఒక్క వన్డేకు మాత్రమే అందుబాటులో ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు ఇప్పటికే క్రికెట్ ఆస్ట్రేలియాకు తన నిర్ణయాన్ని వెల్లడించగా, బోర్డు కూడా అతడి విజ్ఞప్తిని అంగీకరించింది. వచ్చే ఏడాది వన్డే వరల్డ్‌కప్ కంటే ముందు టెస్టు చాంపియన్‌షిప్ జరగనుంది. డబ్ల్యూటీసీ పాయింట్ల పరంగా ఆస్ట్రేలియా టాప్ స్థానంలో కొనసాగుతోంది. ఈ మేరకు వచ్చే డబ్ల్యూటీసీ ఫైనల్ ఆస్ట్రేలియా ఆడనుండడంతో దీనిని కమిన్స్ సీరియస్‌గా తీసుకున్నాడు. కమిన్స్‌తో పాటు మరో ఇద్దరు సీనియర్ బౌలర్లు మిచెల్ స్టార్క్, జోష్ హాజిల్‌వుడ్‌లు కూడా సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండడం లేదు. వీళ్లిద్దరు మొదటి వన్డేతో పాటు మూడో వన్డే ఆడాలని నిర్ణయించుకున్నారు. అయితే కమిన్స్ మాత్రం కేవలం రెండో వన్డేకు మాత్రమే అందుబాటులో ఉండనున్నాడు. ఒకవేళ కమిన్స్ అందుబాటులో లేకపోతే మిచెల్‌మార్ష్ సారథ్య బాధ్యతలు తీసుకునే అవకాశముంది.ఇక సౌతాఫ్రికా టూర్లో ఆస్ట్రేలియా తొలుత గురువారం తొలి వన్డే, సెప్టెంబర్ 27న రెండో వన్డే, సెప్టెంబర్ 30న మూడో వన్డే ఆడనుంది. ఆ తర్వాత క్రికెట్ సౌతాఫ్రికా ఎలెవెన్‌తో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనున్న ఆస్ట్రేలియా అక్టోబర్ 9 నుంచి 13 మధ్య తొలి టెస్టు, అక్టోబర్ 18 నుంచి 22 మధ్య రెండో టెస్టు, అక్టోబర్ 26 నుంచి 30 మధ్య మూడో టెస్టు ఆడనుంది. -
IND vs AUS: ద్రవిడ్ కుమారుడిపై వేటు!.. ఆసీస్ 254 ఆలౌట్
రాజ్‌కోట్ వేదికగా ఇండియా అండర్-19 జట్టుతో జరుగుతున్న మూడో అనధికారిక వన్డేలో ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 254 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ బ్యాటర్లలో జెడ్ హొలిక్ (87) టాప్ స్కోరర్‌గా నిలవగా, నీల్ పటేల్ (51) అర్థసెంచరీ సాధించాడు. భారత బౌలర్లలో మనల్ చౌహాన్, మోహిత్ ఉల్వా చెరో 3 వికెట్లు పడగొట్టగా, కావ్యా పటేల్, ఆర్యన్ సవ్సానీ చెరొక వికెట్ తీశారు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పటికే తొలి రెండు మ్యాచ్‌లు గెలిచిన భారత అండర్-19 జట్టు 2-0తో సిరీస్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.ద్రవిడ్ కుమారుడిపై వేటు!కాగా ఈ మ్యాచ్‌కు ద్రవిడ్ కుమారుడు అన్వయ్ ద్రవిడ్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. తొలి వన్డేలో 38 పరుగులు చేసిన అన్వయ్ రెండో వన్డేలో మాత్రం 9 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. దీంతో మూడో వన్డేకు అన్వయ్‌ను పక్కనబెట్టిన జట్టు మేనేజ్మెంట్ అతడి స్థానంలో రజత్ బగేల్‌ను జట్టులోకి తీసుకొచ్చింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పటికే రెండు మ్యాచ్‌లు గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకున్న భారత యువజట్టు చివరి వన్డేలో ప్రయోగాలకు తెరలేపింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో తన బౌలింగ్‌తో ఆకట్టుకున్న తెలుగు కుర్రాడు చిగురుపాటి వెంకటతో పాటు రెండో వన్డేలో భారీ సెంచరీ చేసిన యశ్‌బర్దన్ కూడా బెంచ్‌కే పరిమితమయ్యాడు.అదరగొడుతున్న సెహ్వాగ్ కుమారుడుఇక ద్రవిడ్ కుమారుడు అన్వయ్ లంక పర్యటనలో ఆకట్టుకున్నాడు. 17 ఏళ్ల అన్వయ్ రెండు మ్యాచ్‌ల్లో వరుసగా 14, 87 పరుగులు సాధించాడు. ఇక అండర్-19 జట్టులో ద్రవిడ్ కుమారుడు ఒక్కడే కాదు, మాజీ విధ్వంసకర ఆటగాడు సెహ్వాగ్ తనయుడు ఆర్యవీర్ సెహ్వాగ్ కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో జరిగి తొలి వన్డేలో 26 బంతుల్లో 28 పరుగులు, రెండో వన్డేలో 48 బంతుల్లో 47 పరుగులు సాధించాడు. అంతేకాదు బౌలింగ్‌లోనూ ఆర్యవీర్ తన ప్రతిభను ప్రదర్శిస్తూ రెండో వన్డేలో రెండు కీలక వికెట్లు తీసి విజయంలో తన వంతు పాత్రను పోషించాడు.ఇదీ చదవండి: ఆసీస్‌పై కుషాగ్ర సెంచరీ.. ఇండియా-ఏ 334 ఆలౌట్ -
ఆసీస్‌పై కుషాగ్ర సెంచరీ.. ఇండియా-ఏ 334 ఆలౌట్
పుదుచ్చేరి వేదికగా ఆస్ట్రేలియా-ఎతో జరుగుతున్న అనధికారిక టెస్టులో ఇండియా-ఎ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 334 పరుగులకు ఆలౌటైంది. ఇండియా-ఎ బ్యాటర్లలో కుమార్ కుషాగ్ర (240 బంతుల్లో 113) సెంచరీతో కదం తొక్కగా, తనుశ్ కొటియన్ (69), సాయి సుదర్శన్ (57) అర్థసెంచరీలు సాధించారు. ఆస్ట్రేలియా-ఎ బౌలర్లలో కోరీ రోచిచియోలి 4 వికెట్లు తీయగా, టాడ్ ముర్ఫీ 3 వికెట్లు పడగొట్టాడు. కాగా 97 పరుగులకే ఐదు కీలక వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులోకి వచ్చిన తనుశ్ కొటియన్, కుమార్ కుషాగ్రలు ఆరో వికెట్‌కు 138 పరుగులు జోడించడంతో ఇండియా-ఎ ఇన్నింగ్స్ కుదుటపడింది. ఈ ఇద్దరు ఆచితూచి ఆడుతూనే వీలు చిక్కినప్పుడల్లా బంతులను బౌండరీలకు తరలించడంతో భారత్ స్కోరుబోర్డు పరుగులు పెట్టింది. అర్థసెంచరీ చేసిన తర్వాత తనుశ్ వెనుదిరిగినప్పటికీ, కుమార్ కుషాగ్ర టెయిలెండర్లతో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. చివర్లో అన్షుల్ కంబోజ్ (23) ఆకట్టుకోవడంతో ఇండియా-ఎ జట్టు 300 పరుగుల మార్క్‌ను దాటగలిగింది.ఇదీ చదవండి: క్రికెట్ చరిత్రలో వింత ఘటన.. ఆసీస్ బ్యాటర్‌కు చేదు అనుభవం! -
క్రికెట్ చరిత్రలో వింత ఘటన.. ఆసీస్ బ్యాటర్‌కు చేదు అనుభవం!
ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న వన్డే కప్‌లో భాగంగా సౌత్ ఆస్ట్రేలియా, తస్మానియా మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. సౌత్ ఆస్ట్రేలియా బ్యాటర్ జేక్ వెదరాల్డ్ కష్టపడి బౌండరీ కొట్టినప్పటికీ అంపైర్ ఫోర్ ఇచ్చేందుకు నిరాకరించాడు. ఇన్నింగ్స్ 15వ ఓవర్లో ఇది చోటుచేసుకుంది. ఓవర్లో ఐదో బంతిని వేసేందుకు తస్మానియా బౌలర్ రాఫ్ మెక్‌మిలన్ సిద్ధమయ్యాడు. అయితే బంతి అనూహ్యంగా అతడి చేతిలో నుంచి స్లిప్ అయి లెగ్‌సైడ్ దిశలో పిచ్ అవతల పడింది. బంతిని అంపైర్ అప్పటికే నోబాల్ కమ్ డెడ్‌బాల్‌గా పరిగణించాడు. అయితే జాక్ వెదరాల్డ్ మాత్రం సరదాగా బంతిని డీప్ మిడ్ వికెట్ మీదుగా బౌండరీ తరలించాడు. వెదరాల్డ్ కొట్టిన ఫోర్‌ను కౌంట్ చేయని అంపైర్ అతడికి అనుకూలంగా ఫ్రీ హిట్ మాత్రం ఇచ్చాడు. రాఫ్ మెక్‌మిలన్ వేసిన ఫ్రీ హిట్‌ను వెదరాల్డ్ లాంగాన్ మీదుగా భారీ సిక్సర్ తరలించాడు. మరి అంపైర్ దానిని నోబాల్ కమ్ డెడ్‌బాల్‌గా ఎందుకు పరిగణించారనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఎంసీసీ చట్టం ప్రకారం బంతి పిచ్ అవతల బౌన్స్ కావడంతో నోబాల్ ఇవ్వడం జరిగింది. అసలు పిచ్‌పై బంతి పడకపోవడంతో డెడ్‌బాల్‌గా కూడా పరిగణించారు. ఇక ఎంసీసీలోని 21 చట్టం ప్రకారం నోబాల్ వేస్తే ఫ్రీహిట్ ఇవ్వాల్సి ఉంటుందన్న సంగతి తెలిసిందే.మ్యాచ్ విషయానికొస్తే తొలుత బ్యాటింగ్ చేసిన సౌత్ ఆస్ట్రేలియా భారీ స్కోరు చేసింది. మాథ్యూ గైక్స్ (97 నాటౌట్), జేక్ వెదరాల్డ్ (92), జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ (88) భారీ అర్థసెంచరీలతో రాణించడంతో 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 383 పరుగులు చేసింది. తస్మానియా బౌలర్లలో మాథ్యూ కున్మెన్, మిచెల్ ఓవన్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. భారీ లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన తస్మానియా జట్టు 19 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. టిమ్ వార్డ్ (52), జోర్డాన్ సిల్క్ (48) క్రీజులో ఉన్నారు.Cricket really is a silly game #OneDayCup pic.twitter.com/l3Z7TjBCz9— cricket.com.au (@cricketcomau) September 23, 2026ఇదీ చదవండి: విండీస్‌తో తొలి వన్డే.. జట్టుతో కలవనున్న రో-కో ద్వయం -
విండీస్‌తో తొలి వన్డే.. జట్టుతో కలవనున్న రో-కో ద్వయం
టీమిండియా సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఇవాళ కేరళంలో అడుగుపెట్టనున్నారు. వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లో భాగంగా తొలి వన్డే సెప్టెంబర్ 27న తిరువనంతపురం వేదికగా జరగనుంది. ఈ నేపథ్యంలో గిల్ సారథ్యంలోని టీమిండియా బృందం ఇప్పటికే కేరళకు చేరుకోగా.. ఇవాళ కోహ్లి, రోహిత్‌లు జట్టుతో జాయిన్ అవనున్నారు. టెస్టులు, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన రో-కో ద్వయం 2027 వన్డే ప్రపంచకప్ నేపథ్యంలో కేవలం వన్డే ఫార్మాట్లో మాత్రమే కొనసాగుతున్నారు. ఇటీవలే ఇంగ్లండ్‌కు వన్డే సిరీస్ కోల్పోయినప్పటికీ రో-కో మాత్రం తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా హిట్‌మ్యాన్ ఇంగ్లండ్‌తో మూడో వన్డేలో చారిత్రక సెంచరీతో మెరిశాడు. ఇక వన్డే ప్రపంచకప్‌కు సరిగ్గా ఏడాది సమయం మాత్రమే ఉండడంతో రో-కో ద్వయంపై అందరి దృష్టి నెలకొని ఉంది. ఆసియా క్రీడల కోసం శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలో ఒక బృందం ఇప్పటికే జపాన్‌కు చేరుకోవడంతో జట్టులో మార్పులు అనివార్యమయ్యాయి. అకిబ్ నబీ, నమన్ ధిర్లను విండీస్‌తో వన్డే సిరీస్‌కు ఎంపిక చేశారు. ఇక మరో సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా కూడా ఆరు నెలల తర్వాత మళ్లీ వన్డే మ్యాచ్ ఆడనుండడం విశేషం.మరోవైపు ఆసియా క్రీడల్లో ఆడేందుకు ఇప్పటికే శ్రేయస్ అయ్యర్ టీం జపాన్‌లో అడుగుపెట్టింది. జపాన్‌తో ఏకైక టీ20 మ్యాచ్ ఆడి అతికష్టం మీద గెలిచిన టీమిండియా ఇప్పుడు ఆసియా క్రీడల్లో వరుసగా రెండో స్వర్ణం గెలవాలని ఆశిస్తోంది. కానీ జపాన్‌తో ఆడిన మ్యాచ్‌లో 5 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైనప్పటికీ, పిచ్ మాత్రం భారత్‌కు అనుకూలంగా లేదన్న విషయం స్పష్టమైంది. దీంతో ఈసారి భారత్‌కు స్వర్ణం సాధిస్తుందా లేదా అనేది చూడాలి.ఇదీ చదవండి: ‘అంతా తొండి.. అందుకే కరచాలనం చేయలేదు’ -
స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు.. ‘నన్ను ఇరికించే ప్రయత్నం’
ఢిల్లీ ప్రీమియర్ లీగ్ (డీపీఎల్-2026)లో ఫిక్సింగ్ కలకలం రేగింది. సెంట్రల్ ఢిల్లీ కింగ్స్ ఆటగాడు వంశ్ బేడీ స్పాట్ ఫిక్సింగ్ ఉచ్చులో చిక్కుకున్నట్లు సమాచారం. అయితే బేడీ ఈ విషయాన్ని వెంటనే యాంటీ కరప్షన్ వింగ్ దృష్టికి తీసుకెళ్లడంతో విషయంలో వెలుగులోకి వచ్చింది.తనపై వచ్చిన ఫిక్సింగ్ ఆరోపణలను వంశ్ బేడీ ఇన్స్టాగ్రామ్ వేదికగా ఖండించాడు. ‘‘నేను స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు సోషల్ మీడియాతో పాటు కొన్ని వెబ్సైట్లు నా పరువుకు భంగం కలిగించే విధంగా తప్పుడు కథనాలు రాశాయి. సీఎస్కే ఆటగాడికి సంబంధించిన మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై తెహెల్కా స్టింగ్ ఆపరేషన్‌లో మాజీ రంజీ క్రికెటర్ రచిత్ భాటియా ప్రస్తావించిన వ్యక్తి నేను కాదని, ఆ ఫిక్సింగ్ కుంభకోణంతో నాకు ఎలాంటి సంబంధం లేదు. అనవసరంగా నాపై ఫిక్సింగ్ ఆరోపణలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలనుకుంటున్నా. దీనికి బాధ్యులైన వారిపై నా న్యాయ బృందం తగిన సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకోనుంది. అటువంటి తప్పుడు, పరువు నష్టం కలిగించే కంటెంట్‌ను సృష్టించడం లేదా పంచుకోవడం మానుకోవాలని ప్రతి ఒక్కరినీ విజ్ఞప్తి చేస్తున్నా’’ అని చెప్పుకొచ్చాడు.ఇదే విషయమై డీడీసీఏ కార్యదర్శి అశోక్ శర్మ మాట్లాడుతూ.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ ఆటగాడు బేడీని సంప్రదించినట్లు సమాచారం. ఆ ఆటగాడు అక్కడే ఓ టీ20 లీగ్ లో కూడా ఆడుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ వ్యవహారంపై డీడీసీఏ ఇప్పుడు బీసీసీఐని ఆశ్రయించింది. తదుపరి ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై బీసీసీఐ సలహా కోరింది. ఇటీవల వెలుగులోకి వచ్చిన ఓ స్టింగ్ ఆపరేషన్‌లో వచ్చిన ఫిక్సింగ్ ఆరోపణల నేపథ్యంలో ఈ లేఖ రాసినట్లు డీడీసీఏ తెలిపింది. బీసీసీఐ మార్గదర్శకత్వం కోసం వేచి చూస్తున్నట్లు అశోక్ శర్మ వెల్లడించారు.ఇక ఢిల్లీ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్లో సెంట్రల్ ఢిల్లీ కింగ్స్ రన్నరప్‌గా నిలిచింది. ఫైనల్లో సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్స్ చేతిలో ఓడింది. వంశ్ బేడీ గతంలో పురాణి ఢిల్లీ 6 తరఫున కూడా ఆడాడు. అతనికి ఐపీఎల్లో చెన్నె సూపర్ కింగ్స్ కూడా అవకాశం లభించింది.ఇదీ చదవండి: టీమిండియాతో టీ20 సిరీస్.. న్యూజిలాండ్ జట్టు ప్రకటన -
టీమిండియాతో టీ20 సిరీస్.. న్యూజిలాండ్ జట్టు ప్రకటన
అక్టోబర్‌లో టీమిండియా న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో టీమిండియా ఐదు టీ20లు, ఐదు వన్డేలు, రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 22 నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానున్న వేళ బుధవారం న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు 16 మందితో కూడిన జట్టును ప్రకటించింది. మిచెల్ సాంట్నర్ నేతృత్వంలోని జట్టులో టీ20 స్పెషలిస్ట్‌లైన టిమ్ సీఫెర్ట్, ఫిన్ అలెన్‌లు చోటు దక్కించుకోగా, గాయంతో రచిన్ రవీంద్ర టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు. అతడు వన్డే సిరీస్‌కు అందుబాటులో ఉండే అవకాశముంది. ఇక ఏడాది గ్యాప్ తర్వాత ఆడమ్ మిల్నే తిరిగి జట్టులోకి వచ్చాడు. స్పిన్ ఆల్‌రౌండర్ మైకెల్ బ్రాస్‌వెల్ కూడా రీఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇదే విషయమై బ్లాక్‌క్యాప్స్ కోచ్ వాల్టర్ మాట్లాడుతూ.. "భారత్‌తో టీ20 సిరీస్ కావడంతో ఫుల్ స్ట్రెంత్తో బరిలోకి దిగుతున్నాం. అన్ని విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తున్నాం. ఎంతైనా వాళ్లు టీ20 వరల్డ్ చాంపియన్స్" అని పేర్కొన్నాడు. ఇక అక్టోబర్ 22న మొదలుకానున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తొలి మ్యాచ్ అక్టోబర్ 22న , రెండో టీ20 అక్టోబర్ 24న, మూడో టీ20 అక్టోబర్ 27న, నాలుగో టీ20 అక్టోబర్ 30న, ఐదో టీ20 నవంబర్ 1న జరగనున్నాయి. ఆ తర్వాత ఐదు వన్డే మ్యాచ్‌ల సిరీస్ నవంబర్ 4 నుంచి నవంబర్ 15 మధ్య జరగనుంది. ఇక చివరగా రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు నవంబర్ 19 నుంచి 23 వరకు, రెండో టెస్టు నవంబర్ 27 నుంచి డిసెంబర్ 1 వరకు జరగనున్నాయి.న్యూజిలాండ్ జట్టు: మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), ఫిన్ అలెన్, మైఖేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్మన్, డెవాన్ కాన్వే, జాకబ్ డఫీ, లాకీ ఫెర్గూసన్, జాక్ ఫౌల్క్స్, మాట్ హెన్రీ, బెవాన్ జాకబ్స్, కైల్ జామిసన్, ఆడమ్ మిల్నే, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, టిమ్ సీఫెర్ట్, నాథన్ స్మిత్.ఇదీ చదవండి: విల్ జాక్స్ అరుదైన ఫీట్.. తొలి వన్డేలో చిత్తుగా ఓడిన లంక -
ప్రొఫెషనల్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన సౌతాఫ్రికా ప్లేయర్
సౌతాఫ్రికా మాజీ బ్యాటర్ కొలిన్ ఇంగ్రామ్ ప్రొఫెషనల్ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 41 ఏళ్ల ఇంగ్రామ్ తన 22 ఏళ్ల సుదీర్ఘ క్రికెట్ కెరీర్‌కు ముగింపు పలుకుతున్నట్లు సెప్టెంబర్ 22న సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. అయితే, క్రికెట్‌కు పూర్తిగా దూరం కావడం లేదని, కోచ్‌గా కొత్త బాధ్యతలు చేపట్టనున్నట్లు వెల్లడించాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన 13 ఏళ్ల తర్వాత ఇంగ్రామ్ ప్రొఫెషనల్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పడం విశేషం.జాతీయ జట్టు తరఫున ఇంగ్రామ్ కెరీర్ అంత ఆశాజనకంగా సాగకపోయినా, దేశవాలీ క్రికెట్లో మాత్రం అదరగొట్టాడు. ఇంగ్లండ్ కౌంటీ జట్టు గ్లామోర్గన్ తరఫున 11 ఏళ్ల పాటు కెరీర్ కొనసాగించిన అతడు.. మొత్తం 22 ఏళ్ల ఫస్ట్ క్లాస్ కెరీర్లో 10 వేలకుపైగా పరుగులు చేశాడు. సుదీర్ఘ కాలం ఆటగాడిగా ప్రాతినిథ్యం వహించిన గ్లామోర్గన్ క్లబ్‌కే ఇంగ్రామ్ ఇకపై కోచింగ్ బాధ్యతలు చేపట్టనున్నాడు.ఇంగ్రామ్ సౌతాఫ్రికా, ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్‌తో పాటు ఐపీఎల్, పాకిస్తాన్ సూపర్ లీగ్, బిగ్‌బాష్ లీగ్, సౌతాఫ్రికా టీ20 లీగ్‌ల్లోనూ ఆడాడు. 2010లో జింబాబ్వేతో జరిగిన వన్డే మ్యాచ్‌లో సెంచరీతో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన ఇంగ్రామ్.. తన రెండో వన్డే సెంచరీని పాకిస్థాన్‌పై సాధించాడు.ఆ తర్వాత 2013లో పాకిస్థాన్‌పైనే మరో శతకం బాదాడు. దక్షిణాఫ్రికా తరఫున తొమ్మిది టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన అతడు.. 2012లో భారత్‌తో జరిగిన ఏకైక టీ20లో 78 పరుగులు సాధించాడు. అదే అతడి చివరి టీ20 అంతర్జాతీయ మ్యాచ్. మొత్తంగా తన అంతర్జాతీయ కెరీర్లో 31 వన్డేలు, 9 టీ20లు ఆడిన ఇంగ్రామ్ 3 సెంచరీలు, 4 అర్ద సెంచరీల సాయంతో 1053 పరుగులు చేశాడు.ఇదీ చదవండి: కాసేపట్లో లంకతో తొలి వన్డే.. ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ గుడ్‌బై -
విల్ జాక్స్ అరుదైన ఫీట్.. తొలి వన్డేలో చిత్తుగా ఓడిన లంక
చెస్టర్-లీ-స్ట్రీట్ వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో ఇంగ్లండ్ 89 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. విల్ జాక్స్ ఆల్‌రౌండ్ ప్రదర్శన (46 నాటౌట్, 5/22) చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. తద్వారా విల్‌జాక్స్ అరుదైన ఫీట్ సాధించాడు. ఇంగ్లండ్ తరఫున వన్డేల్లో ఐదు వికెట్లు తీయడంతో పాటు 40కి పైగా పరుగులు చేసిన నాలుగో ఆటగాడిగా విల్ జాక్స్ నిలిచాడు. గతంలో గ్రేమీ హిక్ (జింబాబ్వేపై 5/33 & 80, 2000లో), రోనీ ఇరానీ (భారత్‌పై 5/26 & 53, 2002లో), పాల్ కొలింగ్‌వుడ్ (బంగ్లాదేశ్‌పై 6/31 & 112*, 2005లో) విల్ జాక్స్ కంటే ముందున్నారు. ఇక శ్రీలంకతో వన్డేల్లో చూసుకుంటే ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన ఆరో ఇంగ్లండ్ బౌలర్‌గా విల్‌జాక్స్ నిలిచాడు. గతంలో క్రిస్ వోక్స్ (6-47), క్రిస్ జోర్డాన్ (5-29), మార్క్ ఎల్హమ్ (5-32), విక్ మార్క్స్ (5-39), సామ్ కరన్ (5-48) ఈ ఫీట్ సాధించారు.మ్యాచ్ విషయానికొస్తే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ 48.1 ఓవర్లలో 265 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ హ్యారీ బ్రూక్ (67) అర్థసెంచరీ చేయగా, విల్ జాక్స్ (46 నాటౌట్), జో రూట్ (44) రాణించారు. శ్రీలంక బౌలర్లలో సచిందు, అసితా ఫెర్నాండో చెరో 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు 37 ఓవర్లలో 176 పరుగులకే కుప్పకూలింది. దునిత్ వెల్లలాగె (45), కుసాల్ మెండిస్ (42) మినహా మిగతావాళ్లు విఫలమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో విల్ జాక్స్ 5 వికెట్లతో చెలరేగగా, జేమీ ఓవర్టన్ 2 వికెట్లు తీశాడు. ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిచిన విల్ జాక్స్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సొంతం చేసుకున్నాడు. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో ఇంగ్లండ్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇరుజట్ల మధ్య రెండో వన్డే రేపు లీడ్స్ వేదికగా జరగనుంది.ఇదీ చదవండి: డెబ్యూ మ్యాచ్‌లో అదరగొట్టిన లంక బౌలర్.. ఇంగ్లండ్ ఆలౌట్ -
డెబ్యూ మ్యాచ్‌లో అదరగొట్టిన లంక బౌలర్.. ఇంగ్లండ్ ఆలౌట్
చెస్టర్-లీ-స్ట్రీట్ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి వన్డేలో ఇంగ్లండ్ గౌరవప్రదమైన స్కోరు సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లు ఆడకుండానే 48.1 ఓవర్లలో 265 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ హ్యారీ బ్రూక్ (67) అర్థసెంచరీతో రాణించగా, విల్ జాక్స్ (46 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడగా, జో రూట్ (44) రాణించాడు.లంక బౌలర్లలో డెబ్యూ ఆటగాడు సచిందు కొలంబగె, అసితా ఫెర్నాండో చెరో 3 వికెట్లు పడగొట్టగా, దునిత్ వెల్లలాగె, చమీర, మదుషంక తలా ఒక వికెట్ తీశారు. కాగా అరంగేట్రం మ్యాచ్‌లోనే సచిందు తన బౌలింగ్‌తో అదరగొట్టాడు. జో రూట్, బట్లర్ (31), జేమీ ఓవర్టన్ (8) వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ముఖ్యంగా జో రూట్‌ను అర్థసెంచరీ చేయకుండా అడ్డుపడిన సచిందు ఒక అరుదైన ఫీట్ సాధించాడు. 2018లో లంక బౌలర్ చేతిలో ఫిఫ్టీ చేయకుండా వెనుదిరిగిన రూట్.. మళ్లీ 8 ఏళ్ల తర్వాత హాఫ్ సెంచరీ చేయకుండా ఔటయ్యాడు. ఈ గ్యాప్‌లో లంకతో ఆడిన ప్రతీ మ్యాచ్‌లో రూట్ కనీసం అర్థశతకం సాధించడం ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం.ఇదీ చదవండి: ఐసీసీ ర్యాంకింగ్స్‌లో దుమ్మురేపిన షఫాలీ వర్మ -
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో దుమ్మురేపిన షఫాలీ వర్మ
ఆసియా గేమ్స్‌లో మహిళల క్రికెట్ విభాగంలో ఫైనల్లో శ్రీలంకను మట్టికరిపించిన భారత్ స్వర్ణం కైవసం చేసుకుంది. సెమీస్‌లో బంగ్లాదేశ్‌లో అజేయ సెంచరీతో మెరిసిన షఫాలీ.. ఫైనల్లోనూ 48 పరుగులతో ఆకట్టుకుంది. ఇక క్వార్టర్స్‌లోనూ 40 పరుగుల సుడిగాలి ఇన్నింగ్స్‌తో అలరించిన షఫాలీ తాజాగా ఐసీసీ మహిళల టీ20 ర్యాంకింగ్స్‌లోనూ రఫ్పాడించింది. బ్యాటింగ్ విభాగంలో రెండు స్థానాలు ఎగబాకిన షఫాలీ వర్మ నాలుగో స్థానంలో నిలిచింది. ఇక ఓపెనర్ స్మృతి మంధాన ఒక స్థానం దిగజారి ఆరో స్థానంలో నిలవగా, హర్మన్‌ప్రీత్ కౌర్ పదో స్థానాన్ని నిలబెట్టుకుంది. బౌలింగ్ విభాగంలో శ్రీచరణి, దీప్తి శర్మలు తొలి రెండు స్థానాలను నిలబెట్టుకున్నారు. మిగతా ప్లేయర్ల విషయానికొస్తే.. క్రాంతి గౌడ్ 15 స్థానాలు ఎగబాకి 57వ స్థానంలో నిలవగా, నందనీ శర్మ 22 స్థానాలు ఎగబాకి 72వ స్థానంలో నిలిచింది.మ్యాచ్ విషయానికొస్తే.. మంగళవారం జరిగిన ఫైనల్లో శ్రీలంకను 147 పరుగుల తేడాతో చిత్తు చేసిన భారత్.. వరుసగా రెండో సారి బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. తుది పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 216 పరుగుల భారీ స్కోర్ సాధించింది. స్మృతి మంధాన (79), రిచా ఘోష్ (49 నాటౌట్) రాణించాడు. అనంతరం భారీ లక్ష్య చేధనలో శ్రీలంక 69 పరుగులకే కుప్పకూలింది. ఇక కాంస్య పతక పోరులో బంగ్లాదేశ్‌పై పాకిస్తాన్ విజయం సాధించింది.ఇదీ చదవండి: శ్రీలంకతో తొలి వన్డే.. రూట్ ప్రపంచ రికార్డు -
శ్రీలంకతో తొలి వన్డే.. రూట్ ప్రపంచ రికార్డు
చెస్టర్-లీ-స్ట్రీట్ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్‌లో ఇంగ్లండ్ సీనియర్ బ్యాటర్ జో రూట్ మరో రికార్డు సాధించాడు. మ్యాచ్‌లో 52 బంతుల్లో 44 పరుగులు సాధించిన రూట్ అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లు కలిపి 23 వేల పరుగుల మార్క్ అందుకున్న ఎనిమిదో బ్యాటర్‌గా నిలిచాడు.అయితే తక్కువ ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించిన రెండో బ్యాటర్‌గా రూట్ రికార్డులకెక్కాడు. 521 ఇన్నింగ్స్‌ల్లో రూట్ 23వేల పరుగుల మార్క్‌ను అందుకోగా, కోహ్లి 490 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్ సాధించి తొలి స్థానంలో ఉన్నాడు. ఇక సచిన్ టెండూల్కర్ (522 ఇన్నింగ్స్‌లు), మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఆ తర్వాత రికీ పాంటింగ్ (544 ఇన్నింగ్స్‌లు), జాక్ కలిస్ (551 ఇన్నింగ్స్‌లు), కుమార సంగక్కర (568 ఇన్నింగ్స్‌లు) వరుసగా నాలుగు, ఐదు, ఆరు స్థానాల్లో కొనసాగుతున్నారు. రాహుల్ ద్రవిడ్ (576 ఇన్నింగ్స్‌లు), జయవర్దనే (645 ఇన్నింగ్స్‌లు) ఏడు, ఎనిమిది స్థానాల్లో ఉన్నారు. రూట్ 20 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఈ మైలురాయిని చేరుకున్నాడు.ఇక ఓవరాల్‌గా రూట్ ఇప్పటివరకు 169 టెస్టుల్లో 14, 278 పరుగులు (41 సెంచరీలు), 193 వన్డేల్లో 7,849 పరుగులు (20 సెంచరీలు), 32 టీ20ల్లో 893 పరుగులు సాధించాడు. టెస్టు క్రికెట్లో ఇంగ్లండ్ తరఫున ఆల్‌టైమ్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. ఇక ఓవరాల్ జాబితాలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలోనూ రూట్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ మధ్య కాలంలో రూట్ సూపర్ ఫామ్ కనబరుస్తున్నాడు. 2026లో 20 ఇన్నింగ్స్‌ల్లో 1020 పరుగులు సాధించిన రూట్ ఖాతాలో రెండు సెంచరీలు, ఎనిమిది హాప్ సెంచరీలున్నాయి. ఇక మ్యాచ్ విషయానికొస్తే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ 30 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. కెప్టెన్ బ్రూక్ (58), జోస్ బట్లర్ (22) క్రీజులో ఉన్నారు.ఇదీ చదవండి: ‘శ్రీ చరణి ఒక అద్భుతం.. భారత జట్టుకు అభినందనలు’ -
‘శ్రీ చరణి ఒక అద్భుతం.. భారత జట్టుకు అభినందనలు’
ఆసియా క్రీడల్లో స్వర్ణంతో మెరిసిన భారత మహిళల క్రికెట్ జట్టును వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి 'ఎక్స్' వేదికగా అభినందించారు. ఈ మేరకు వైఎస్ జగన్ స్పందిస్తూ.. ‘‘ఆసియా గేమ్స్-2026 లో స్వర్ణ పతకం సాధించిన భారత మహిళల క్రికెట్ జట్టుకు నా హృదయపూర్వక అభినందనలు. టోర్నమెంట్ అంతటా జట్టు కనబరిచిన అద్భుతమైన ప్రదర్శన యావత్ దేశానికి గర్వకారణం. ఈ అద్భుత విజయానికి కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌కు, జట్టులోని ప్రతి క్రీడాకారిణికి అభినందనలు. జట్టు విజయంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన శ్రీ చరణి పోషించిన పాత్రను గుర్తించడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది. ఆమె విజయ ప్రస్థానం మన రాష్ట్రంలోని యువతులకు ఎంతగానో స్ఫూర్తినిస్తుందని నమ్ముతున్నాను.’’ అని చెప్పుకొచ్చారు.మహిళల క్రికెట్ పోటీల విజేతగా భారత్ నిలిచింది. మంగళవారం జరిగిన ఫైనల్లో శ్రీలంకను 147 పరుగుల తేడాతో చిత్తు చేసిన భారత్.. వరుసగా రెండో సారి బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. తుది పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 216 పరుగుల భారీ స్కోర్ సాధించింది. స్మృతి మంధాన (79), రిచా ఘోష్ (49 నాటౌట్) రాణించారు. అనంతరం భారీ లక్ష్య చేధనలో శ్రీలంక 69 పరుగులకే కుప్పకూలింది. దీప్తి శర్మ 3 వికెట్లు తీయగా, శ్రీచరణి, శ్రేయాంక, షఫాలీ వర్మ తలా రెండు వికెట్లు పడగొట్టారు. My heartiest congratulations to the Indian women’s cricket team on winning the gold medal at the #AsianGames2026. The team’s dominant performance throughout has made the entire nation proud. Congratulations to captain Harmanpreet Kaur and every player of the team for this… pic.twitter.com/FSjiOZjNs7— YS Jagan Mohan Reddy (@ysjagan) September 22, 2026ఇదీ చదవండి: వరుస విజయాలు.. దుమ్ములేపుతున్న భారత హాకీ జట్లు -
జపాన్‌పై విజయం.. తక్కువ మార్జిన్‌తో భారత్ గట్టెక్కిన సందర్భాలు!
టీ20 క్రికెట్లో భారత్, జపాన్ మధ్య సానో అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన చారిత్రక టీ20 మ్యాచ్ ఉత్కంఠ పోరుకు వేదికగా మారింది. వర్షం అంతరాయంతో 5 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో భారత్ కేవలం 2 పరుగుల తేడాతో గట్టెక్కింది. ఈ నేపథ్యంలో టీమిండియా గతంలో అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ల్లో తక్కువ పరుగుల తేడాతో మ్యాచ్‌లు గెలిచిన సందర్భాలు ఒకసారి పరిశీలిద్దాం.సౌతాఫ్రికాపై పరుగు తేడాతో2012 ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో కొలంబో వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. సురేశ్ రైనా (45), రోహిత్ (25) రాణించారు. Photo Credit: BCCI Twitterఅనంతరం సౌతాఫ్రికా 19.5 ఓవర్లలో 151 పరుగులకు ఆలౌట్ కావడంతో భారత్ ఒక్క పరుగు తేడాతో గెలిచింది. జహీర్ ఖాన్, బాలాజీ చెరో 3 వికెట్లు తీయగా, యువరాజ్ సింగ్ ( 21 పరుగులు, రెండు వికెట్లు) ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిచి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.ముచ్చెమటలు పట్టించిన బంగ్లాదేశ్Photo Credit: BCCI Twitter2016 టీ20 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌పై టీమిండియా ఒక్క పరుగు తేడాతో గెలిచింది. తొలుత భారత్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. రైనా (30), కోహ్లి (24), ధావన్ (23) రాణించారు. అనంతరం బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. అశ్విన్, జడేజా, పాండ్యాలు కట్టుదిట్టంగా బంతులేయడంతో టీమిండియా ఒక్క పరుగుతో గట్టెక్కింది.లంకపై 2 పరుగుల తేడాతో..Photo Credit: BCCI Twitter2023లో భారత పర్యటనకు వచ్చిన శ్రీలంక ముంబై వేదికగా జరిగిన తొలి టీ20లో రెండు పరుగుల తేడాతో ఓటమిపాలైంది. తొలుత టీమిండియా 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. దీపక్ హుడా (41 నాటౌట్) రాణించాడు. అనంతరం లంక 20 ఓవర్లలో 160 పరుగులకు కుప్పకూలింది. శివమ్ మావి 4 వికెట్లు పడగొట్టాడు.జింబాబ్వేపై 3 పరుగుల తేడాతో..Photo Credit: BCCI Twitter2016లో జింబాబ్వే పర్యటనకు వెళ్లిన టీమిండియా మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో చివరి మ్యాచ్‌లో ఆతిథ్య జట్టుపై 3 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత టీమిండియా 6 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేయగా, ఆ తర్వాత జింబాబ్వే 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 135 పరుగులకే పరిమితమైంది. కేదార్ జాదవ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గెలుచుకున్నాడు.చుక్కలు చూపించిన ఐర్లాండ్Photo Credit: BCCI Twitter2022లో ఐర్లాండ్ పర్యటనకు వెళ్లిన టీమిండియా 2-0తో టీ20 సిరీస్‌ను గెలుచుకుంది. అయితే రెండో టీ20లో ఐర్లాండ్ మాత్రం టీమిండియాను దాదాపు ఓడించినంత పని చేసింది. దీపక్ హుడా (57 బంతుల్లో 104) సెంచరీకి తోడు సంజూ శాంసన్ (77) మెరుపులు తోడవ్వడంతో టీమిండియా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. అనంతరం ఐర్లాండ్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 221 పరుగులు చేసింది. ఆండ్రూ బాల్బరిన్ (60), పాల్ స్టిర్లింగ్ (40) రాణించడంతో ఐర్లాండ్ గెలుపు దిశగా పయనించింది. కానీ చివర్లో ఒత్తిడితో విజయానికి నాలుగు పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది.ఇదీ చదవండి: ఆఖర్లో హైడ్రామా.. వైడ్ ఇచ్చుంటే భారత్ కొంపమునిగేదే! -
కాసేపట్లో లంకతో తొలి వన్డే.. ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ గుడ్‌బై
ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ మార్క్ వుడ్ మంగళవారం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. తరచూ గాయాలతో ఇబ్బంది పడుతుండడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు 36 ఏళ్ల మార్క్‌వుడ్ తెలిపాడు. తన రిటైర్మెంట్ విషయాన్ని మార్క్‌వుడ్ స్వయంగా ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. గతేడాది నవంబర్‌లో ఆస్ట్రేలియాతో యాషెస్ సిరీస్ సందర్భంగా గాయపడిన మార్క్‌వుడ్ మళ్లీ ఇంగ్లండ్ తరఫున బరిలోకి దిగలేదు. అప్పటి నుంచి ఒక గాయం తర్వాత మరో గాయం తిరగబెట్టడంతో దాదాపు 9 నెలలుగా అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమయ్యాడు. దీంతో వయసు రీత్యా రిటైర్మెంట్కు ఇదే సరైన సమయమని మార్క్‌వుడ్ ఇన్‌స్టా వేదికగా తెలిపాడు. ‘‘అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలకడంపై ఆశ్చర్యమేమీ లేదు. దాదాపు ఏడాది కాలంగా ఆటకు దూరంగా ఉన్నాను. ఈసీబీతో నా కాంట్రాక్ట్ కూడా ముగిసింది. అందుకే నా వీడ్కోలుకు సమయం ఆసన్నమైందని భావిస్తున్నా. కమ్‌బ్యాక్ ఇవ్వాలని ఎంతో ప్రయత్నించాను. గాయాల నుంచి కోలుకున్నప్పటికీ మెడికల్ అడ్వైజ్ ప్రకారం టెస్టు, వన్డే క్రికెట్ ఫార్మాట్లో ఆడడం కష్టతరమని అర్థమైంది. అందుకే రిటైర్మెంట్పై ఒక నిర్ణయానికి వచ్చాను. ఇంతకాలం నాకు అండగా నిలబడిన ఇంగ్లండ్ క్రికెట్ బోర్డుకు ప్రత్యేక ధన్యవాదాలు" అని చెప్పుకొచ్చాడు.ఇంగ్లండ్‌కు 2015 నుంచి 2025 మధ్య కాలంలో ప్రాతినిధ్యం వహించిన మార్క్‌వుడ్ 38 టెస్టుల్లో 811 పరుగులు చేయడంతో పాటు 119 వికెట్లు తీశాడు. 70 వన్డేల్లో 80 వికెట్లు, 38 టీ20ల్లో 54 వికెట్లు పడగొట్టాడు. స్వదేశంలో శ్రీలంకతో సిరీస్ ఆడుతున్న ఇంగ్లండ్ ఇప్పటికే టీ20 సిరీస్‌ను వైట్‌వాష్ చేసింది. ఇవాళ సాయంత్రం శ్రీలంకతో తొలి వన్డే ఆడనుంది. ఈ నేపథ్యంలో మార్క్‌వుడ్ రిటైర్మెంట్ ఆసక్తి కలిగించింది.ఇదీ చదవండి: IND vs JPN: నరాలు తెగే ఉత్కంఠ.. ఆఖరికి రెండు పరుగుల తేడాతో -
ఇంగ్లండ్ హెడ్ కోచ్‌గా జొనాథన్ ట్రాట్
ఇంగ్లండ్ మాజీ బ్యాటర్ జొనాథన్ ట్రాట్‌కు కీలక బాధ్యతలు అప్పగించింది ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ECB). రాబోయే శీతాకాల సీజన్‌కు ఇంగ్లండ్ లయన్స్ జట్టు హెడ్ కోచ్‌గా అతడిని నియమించింది. ఈ విషయాన్ని ఈసీబీ సోమవారం (సెప్టెంబర్ 21) అధికారికంగా ప్రకటించింది.ట్రాట్ దీనికి ముందు ఆఫ్ఘనిస్తాన్ జాతీయ జట్టు హెడ్ కోచ్‌గా పని చేశాడు. 2026 టీ20 ప్రపంచకప్‌లో ఆఫ్ఘనిస్తాన్ ప్రస్థానం ముగిసిన అనంతరం ఆ జట్టు హెడ్ కోచ్ పదవి నుంచి తప్పుకున్నాడు. 2022లో ఆఫ్ఘనిస్తాన్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన ట్రాట్.. నాలుగేళ్ల పాటు ఆ జట్టుకు సేవలందించాడు. అతడి కోచింగ్‌లోనే ఆఫ్ఘనిస్టాన్ తొలిసారి (2024 టీ20 ప్రపంచకప్) సెమీఫైనల్‌కు చేరి చరిత్ర సృష్టించింది.అంతకుముందు ట్రాట్ ఇంగ్లండ్ జాతీయ జట్టు అసిస్టెంట్ కోచ్‌గా పనిచేశాడు. ఇటీవల శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌లోనూ ఇంగ్లండ్ లయన్స్‌కు తాత్కాలిక హెడ్ కోచ్‌గా వ్యవహరించాడు. ఈ సిరీస్‌ను ఇంగ్లండ్ లయన్స్ 2-0తో కైవసం చేసుకుంది. తాజాగా అతడికి పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించారు. రాబోయే శీతాకాల సీజన్లో ఇంగ్లండ్ లయన్స్ జట్టు వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, శ్రీలంక దేశాల్లో పర్యటించనుంది.45 ఏళ్ల ట్రాట్ ఇంగ్లండ్ తరఫున 52 టెస్టులు, 68 వన్డేలు, 7 టీ20 మ్యాచ్‌లు ఆడి దాదాపు 7000 పరుగులు చేశాడు. ఇందులో 13 సెంచరీలు, 42 అర్ద సెంచరీలు ఉన్నాయి. ఇదీ చదవండి: సీఎస్కే హెడ్‌కోచ్‌గా జహీర్ ఖాన్ -
అతడికి కెప్టెన్సీ.. అప్పటినుంచే బీసీసీఐతో విబేధాలు!
భారత క్రికెట్లో ప్రధాన సెలెక్టర్ అజిత్ అగార్కర్ పదవీకాలం ముగింపు దశకు చేరుకున్న నేపథ్యంలో బీసీసీఐ నిర్ణయాలపై మరోసారి చర్చ మొదలైంది. అగార్కర్ సెలెక్షన్ కమిటీ చైర్మన్‌గా వచ్చిన తర్వాత వైట్‌బాల్ క్రికెట్లో టీమిండియా వరుసగా మూడు ఐసీసీ ట్రోఫీలు సొంతం చేసుకుంది. ఆయన హయాంలో సానుకూల అంశాలు చాలానే ఉన్నప్పటికీ, రోహిత్ శర్మ కెప్టెన్సీ తొలగింపు మొదలు అనేక వివాదాలతో అగర్కార్ పదవికి మచ్చను తెచ్చిపెట్టేలా చేశాయి. 2027 ప్రపంచ కప్ కోసం రోహిత్‌ను జట్టులో ఉంచడానికి అతను సుముఖంగా లేనప్పటికీ, బోర్డు మాత్రం ఆ ఆటగాడికి మద్దతు ఇచ్చింది. అయితే నిజానికి అగార్కర్ పదవీకాలం ప్రారంభమైన నాటి నుంచే బీసీసీఐతో సమస్యలు మొదలయ్యాయని ‘ది టెలిగ్రాఫ్’ తమ నివేదికలో పేర్కొంది.‘ది టెలిగ్రాఫ్’ కథనం ప్రకారం.. 2023లో అజిత్ అగార్కర్ చీఫ్ సెలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరిగిన రెండో సమావేశంలోనే ఓ కీలక నిర్ణయం విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అదే ఏడాది ఆగస్టులో ఐర్లాండ్‌తో జరగాల్సిన టీ20 సిరీస్ కోసం భారత జట్టును ఎంపిక చేసే సమయంలో కెప్టెన్సీ అంశం చర్చకు వచ్చినట్లు ఆ నివేదిక పేర్కొంది. ఆ సమయంలో రుతురాజ్ గైక్వాడ్‌ను భారత టీ20 జట్టుకు కెప్టెన్‌గా నియమించాలని అగార్కర్ భావించినట్లు కథనం తెలిపింది. అనంతరం జరిగిన 2023 ఆసియా క్రీడల్లో భారత జట్టుకు గైక్వాడ్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. యువ ఆటగాడికి నాయకత్వ అనుభవం అందించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం ఉపయోగపడేదనే అభిప్రాయం కూడా వ్యక్తమైంది.అయితే బీసీసీఐ మాత్రం జస్ప్రీత్ బుమ్రాను కెప్టెన్‌గా ఎంపిక చేయాలని భావించినట్లు నివేదిక పేర్కొంది. గాయం కారణంగా కొంతకాలం క్రికెట్‌కు దూరంగా ఉన్న బుమ్రా.. ఐర్లాండ్ సిరీస్‌తో తిరిగి అంతర్జాతీయ క్రికెట్లోకి వచ్చాడు. అతడికి ఇది పునరాగమన సిరీస్ కావడంతో బోర్డు నిర్ణయం ఆసక్తికరంగా మారింది. బుమ్రా పనిభారాన్ని దృష్టిలో ఉంచుకుని రుతురాజ్‌కు కెప్టెన్సీ ఇవ్వాలని అగార్కర్ కోరుకున్నట్లు నివేదికలో పేర్కొన్నప్పటికీ.. బుమ్రాకు నాయకత్వం వహించాలనే ఆసక్తి ఉండటంతో బీసీసీఐ అతడినే కెప్టెన్‌గా ఎంపిక చేసిందని కథనం తెలిపింది. ఇక అగార్కర్ చీఫ్ సెలెక్టర్ పదవి నుంచి వైదొలిగిన తర్వాత అతడి స్థానంలో ఎవరు రానున్నారనేది బీసీసీఐ ఇంకా చెప్పనప్పటికీ, భారత మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.ఇదీ చదవండి: లంకతో తొలి వన్డే.. ఇంగ్లండ్ తుది జట్టులో విధ్వంస వీరుడు! -
లంకతో తొలి వన్డే.. ఇంగ్లండ్ తుది జట్టులో విధ్వంస వీరుడు!
శ్రీలంకను టీ20 సిరీస్‌లో వైట్‌వాష్ చేసిన ఇంగ్లండ్ జట్టు వన్డే సిరీస్‌కు రెడీ అవుతుంది. మంగళవారం డుర్హమ్ వేదికగా ఇరుజట్ల మధ్య తొలి వన్డే మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో సోమవారం ఇంగ్లండ్ తొలి వన్డేకు తుది జట్టును ప్రకటించింది. టీ20 సిరీస్‌లో ఆదిల్ రషీద్ (2 వికెట్లు) తీశాడు. అయితే తాను బౌలింగ్ చేసే చేతికి చిన్న గాయం కావడంతో తొలి వన్డేకు దూరమయ్యాడు. గాయంతో బాధపడుతున్నందున అతడి స్థానంలో 22 ఏళ్ల ఆల్‌రౌండర్ రెహాన్ అహ్మద్‌ను ఎంపిక చేసింది. ఆదిల్ రషీద్‌తో పాటు సొన్ని బేకర్, హెన్రీ క్రొకోంబె కూడా బెంచ్‌కే పరిమితమయ్యే అవకాశముంది. ఇక టీ20ల్లో మిడిలార్డర్లో బ్యాటింగ్‌కు వచ్చిన టామ్ బాంటన్ వన్డేల్లో తొలిసారి ఓపెనింగ్ స్థానంలో రానున్నాడు. ఏడు వన్డేలాడిన టామ్ బాంటన్ 172 పరుగులు సాధించాడు. ఈ విధ్వంసకర బ్యాటర్ లంకతో రెండో టీ20లో 24 బంతుల్లో 52 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.ఇంగ్లండ్ స్వదేశంలో టీమిండియాతో జరిగిన వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో నెగ్గింది. ఆ తర్వాత శ్రీలంకను మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో క్లీన్‌స్వీప్ చేసింది. ఇప్పుడు వన్డేల్లోనూ అదే తరహా జోరు ప్రదర్శించాలని బ్రూక్ సేన భావిస్తోంది. వన్డే ర్యాంకింగ్స్‌లో శ్రీలంక కంటే ఒక స్థానం తక్కువగా ఉన్న ఇంగ్లండ్ (ఏడో స్థానం) సిరీస్ గెలిచి లంకను వెనక్కి నెట్టాలని చూస్తోంది.ఇంగ్లండ్ జట్టు:టామ్ బాంటన్, బెన్ డకెట్, జో రూట్, హ్యారీ బ్రూక్ (కెప్టెన్), జోస్ బట్లర్, విల్ జాక్స్, రెహాన్ అహ్మద్, జేమీ ఓవర్టన్, గస్ అట్కిన్సన్, జోఫ్రా ఆర్చర్, జోష్ టంగ్.ఇదీ చదవండి: జపాన్ జట్టులో బీహార్ క్రికెటర్.. ‘వైభవ్ నా ఫేవరెట్ ప్లేయర్’ -
జపాన్ జట్టులో బీహార్ క్రికెటర్.. ‘వైభవ్ నా ఫేవరెట్ ప్లేయర్’
జపాన్, టీమిండియా మధ్య చారిత్రక టీ20 మ్యాచ్‌కు అంతా సిద్ధమైంది. రేపు జపాన్‌లోని సానో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో జపాన్ జట్టులో భారత్‌కు చెందిన బీహార్ క్రికెటర్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాడు. వైభవ్ సూర్యవంశీ తన ఫేవరెట్ అని పేర్కొన్న అభిషేక్ ఆనంద్.. తన బీహారీ సోదరులైన వైభవ్, ఇషాన్ కిషన్‌ను కలిసేందుకు ఎదురుచూస్తున్నట్లు మనసులో మాటను బయటపెట్టాడు.అభిషేక్ మాట్లాడుతూ.."ప్రస్తుతం అందరి ఫేవరెట్ వైభవ్ సూర్యవంశీ. అయితే భారత జట్టులోని ఆటగాళ్లందరూ గొప్పవారే. కానీ, నా బీహారీ సోదరులైన ఇషాన్ కిషన్, వైభవ్‌లను కలిసే అవకాశం వస్తే అస్సలు వదులుకోను. భారత జట్టుకు ఆతిథ్యం ఇవ్వడానికి మేం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. ఈ మ్యాచ్ జరగడం చాలా సంతోషంగా ఉంది. భవిష్యత్తులో మేం కూడా రాణించాలంటే భారత్-జపాన్ మధ్య బంధం మరింత బలంగా ఉండాలని కోరుకుంటున్నాను" అని వెల్లడించాడు.జాబ్ కోసం జపాన్ వచ్చి..అభిషేక్ ఆనంద్ కథ ఎంతో స్ఫూర్తిదాయకం. క్రికెట్‌పై ప్రేమ ఉన్నప్పటికీ, భవిష్యత్తు కోసం అతను ఉద్యోగ మార్గాన్ని ఎంచుకున్నాడు. బీహార్‌లో పుట్టి పెరిగిన అభిషేక్ ఐఐటీ కాన్పూర్‌లో చదివాడు. అనంతరం క్యాంపస్ ప్లేస్మెంట్లో అతనికి ప్రముఖ కంపెనీ 'యాక్సెంచర్ జపాన్' నుంచి భారీ ప్యాకేజీతో ఉద్యోగావకాశం వెతుక్కుంటూ వచ్చింది. యాక్సెంచర్ ఇంటర్వ్యూ పూర్తయ్యాకా ఆఫర్‌ను స్వీకరించాలా? వద్దా? అని నిర్ణయించుకోవడానికి కంపెనీ యాజమాన్యం అతడికి కేవలం 2 గంటల సమయం మాత్రమే ఇచ్చారు.అయితే మరోవైపు క్రికెట్‌పై మక్కువ పెంచుకున్న అభిషేక్ ఆనంద్..తనకు నచ్చిన జాబ్ వదులుకోవడం ఇష్టంలేదు. ఆ సమయంలో జపాన్‌లో క్రికెట్ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవడానికి ఇంటర్నెట్లో వెతికాడు. అదృష్టవశాత్తూ, సరిగ్గా అదే ఏడాది జపాన్ జట్టు ఈస్ట్ ఆసియా-పసిఫిక్ వరల్డ్ కప్ క్వాలిఫయర్‌కు అర్హత సాధించినట్లు వార్తలు కనిపించాయి. ఆ వార్తను చూశాక జపాన్‌లో కూడా క్రికెట్‌కు భవిష్యత్తు ఉంటుందని అభిషేక్ ఒక భావనకు వచ్చాడు. రెండు గంటల సుదీర్ఘ పరిశోధన తర్వాత యాక్సెంచర్ ఆఫర్‌ను అంగీకరించి జపాన్‌కు వచ్చాడు.జపాన్‌కు వచ్చిన తర్వాత అభిషేక్ యాక్సెంచర్‌లో జాబ్ చేస్తూనే క్రికెటర్‌గా రాణించాడు. 'టోక్యో ఫాల్కన్ క్రికెట్ క్లబ్' తరఫున ఆడటం ప్రారంభించాడు. తొలి మూడేళ్లలో నిలకడగా రాణించడంతో అతనికి జపాన్ జాతీయ జట్టు నుంచి పిలుపు వచ్చింది. 11 మ్యాచ్‌లాడి 564 పరుగులు సాధించాడు. అలా ఉద్యోగం కోసం పరాయి దేశానికి వచ్చి, తన కలల క్రీడలో జాతీయ స్థాయికి ఎదిగాడు. ఇప్పుడు అదే దేశంలో తన సొంత రాష్ట్రానికి చెందిన ఆటగాళ్లను కలవాలని ఆశిస్తున్నాడు. ఇరుదేశాల మధ్య దౌత్యసంబంధాలకు సంబంధించి 75 ఏండ్లు పూర్తయిన సందర్భంగా జపాన్, టీమిండియా ప్రత్యేక మ్యాచ్ ఆడనున్నాయి. ఇప్పటికే చారిత్రక మ్యాచ్ ఆడేందుకు టీమిండియా జపాన్‌లో అడుగుపెట్టింది.Abhishek Anand, 28.Rohtas, Bihar → IIT Kanpur (Chemistry, captained the college team) → Tokyo job → Japan T20Is.T20I debut: vs Cook Islands, May 9, 202518 T20Is | 275 runs | HS 55 | 1 wicketHow he got thereCampus placement (Accenture Japan). Interview line: he wanted to… pic.twitter.com/VtRxH3Vp5m— Cricket Hub (@Anurag9793) September 21, 2026 🚨 A Bihari will play for Japan against India at the Asian Games! 🇯🇵🇮🇳Meet Abhishek Anand from Rohtas, Bihar. He moved from India to Japan for work, started playing local cricket and eventually earned a place in Japan’s national team.He says, “I look like a Japanese player… pic.twitter.com/sM2HQCzDBi— Elysium (@CricketElysium) September 19, 2026ఇదీ చదవండి: సీఎస్కే హెడ్‌కోచ్‌గా జహీర్ ఖాన్ -
సీఎస్కే హెడ్‌కోచ్‌గా జహీర్ ఖాన్
చెన్నై సూపర్‌కింగ్స్ (సీఎస్కే) హెడ్‌కోచ్‌గా భారత మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్ ఎంపికయ్యాడు. ఐపీఎల్ 2026 సీజన్ తర్వాత కోచ్ పదవి నుంచి తప్పుకున్న స్టీఫెన్ ప్లెమింగ్ స్థానంలో జహీర్ ఖాన్ బాధ్యతలు తీసుకోనున్నాడు. అయితే జహీర్ ఖాన్ సీఎస్కే కోచ్‌గా వస్తాడని ఎవరూ ఊహించలేదు. ఇయాన్ మోర్గాన్ సహా ఇతర మాజీ క్రికెటర్ల పేర్లు తెరమీదకు వచ్చినప్పటికీ, జహీర్ ఖాన్ పేరు మాత్రం వినిపించలేదు. ఈ నేపథ్యంలోనే సీఎస్కే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ జహీర్ ఖాన్‌ను హెడ్‌కోచ్‌గా ఎంపిక చేస్తూ ఆ జట్టు అభిమానులకు ఊహించని షాక్ ఇచ్చింది. సీఎస్కే ‘ఎక్స్’ వేదికగా.. ‘లెఫ్ట్ ఆర్మ్ టేకింగ్ ఓవర్.. సీఎస్కే హెడ్‌కోచ్‌గా జహీర్ ఖాన్‌కు స్వాగతం’ అని ట్వీట్ చేసింది.జహీర్ ఖాన్‌కు హెడ్ కోచ్‌గా ఇదే తొలి బాధ్యత కావడం విశేషం. గతంలో ఆయన ముంబై ఇండియన్స్ జట్టుకు 2018 నుంచి 2022 వరకు డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా పనిచేశాడు. ఆ తర్వాత 2024 ఆగస్టు నుంచి 2025 సెప్టెంబర్ వరకు లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌కు మెంటార్‌గా వ్యవహరించాడు. 2017లో అనిల్ కుంబ్లే భారత జట్టు హెడ్ కోచ్‌గా ఉన్న సమయంలో జహీర్‌ను తొలుత టీమిండియా బౌలింగ్ కోచ్‌గా ఎంపిక చేశారు. అయితే అదే ఏడాది రవిశాస్త్రి హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టడంతో జహీర్ పాత్రలో మార్పు చేశారు. బౌలింగ్ కన్సల్టెంట్‌గా ఆయన సేవలు అందించాడు.Left Arm “Taking” Over! 💫🦁Welcoming Zaheer Khan as the Head Coach of Chennai Super Kings!#WhistlePodu #Yellove 🦁💛— Chennai Super Kings (@ChennaiIPL) September 21, 2026 🚨 ZAHEER KHAN HAS BEEN APPOINTED AS THE NEW HEAD COACH OF CSK. 🚨 pic.twitter.com/zm2OBdM6OM— Mufaddal Vohra (@mufaddal_vohra) September 21, 2026ఇదీ చదవండి: జెన్‌జీతో కలిసి డ్యాన్స్.. దుమ్మురేపిన జడేజా భార్య -
జెన్‌జీతో కలిసి డ్యాన్స్.. దుమ్మురేపిన జడేజా భార్య
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా భార్య, గుజరాత్ మంత్రి రివాబా జడేజా జెన్‌జీతో కలిసి డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విషయంలోకి వెళితే.. ఇటీవలే భారత ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజును పురస్కరించుకొని జామ్‌నగర్‌లోని డీకేవీ కళాశాలలో 'ఆశీర్వాద్ నో దివ్డో' పేరుతో భజన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి రివాబా జడేజా శ్రీకృష్ణుని భక్తిలో లీనమయ్యారు. రివాబాతో కలిసి జెన్ జెడ్ యువత కూడా కృష్ణ తన్మయత్వంలో మునిగిపోయి భజన చేస్తూ డ్యాన్సులు చేయడం ఆకట్టుకుంది. ఎప్పుడూ హుందాగా నడుచుకునే రివాబా భక్తి పారవశ్యంలో మునిగిపోయి నృత్యం చేయడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కార్యక్రమంలో భాగంగా రివాబా గాయకుడితో కలిసి వేదికపైకి వచ్చారు. గాయకుడితో కలిస పాట పాడుతూ అడుగులు కలిపారు. ఆమె భక్తి ప్రదర్శన ఆ కార్యక్రమానికే హైలైట్‌గా నిలిచింది. దీంతో కార్యక్రమానికి వచ్చిన యువత కూడా రివాబాతో కలిసి చిందేస్తూ ఉత్సాహంగా చప్పట్లు కొడుతూ కృష్ణ తన్మయత్వంలో మునిగిపోయారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఇన్చార్జి ధన్సుఖ్ భండేరి, మేయర్ మోనికాబెన్ వ్యాస్, బీజేపీ కార్పొరేటర్లు, మహిళా నాయకులు, పార్టీ కార్యకర్తలు హాజరయ్యారు. ఇక రవీంద్ర జడేజా ఇటీవలే శ్రీలంకతో టెస్టు సిరీస్‌లో పాల్గొన్నాడు. ఆ టెస్టు సిరీస్‌ను టీమిండియా 1-0తో కైవసం చేసుకుంది. సిరీస్‌లో జడేజా రెండు మ్యాచ్‌లు కలిపి 8 వికెట్లు తీయడంతో పాటు బ్యాట్‌తో మూడు ఇన్నింగ్స్‌లు కలిపి 65 పరుగులు చేశాడు.🔥 RIVABA JADEJA — ROYAL GRACE, CLASS & CONFIDENCE! 👑🇮🇳She can have 100 Mahua Moitras and Priyanka Vadras for breakfast! 😎🔥Gujarat’s Education Minister, Rivaba Jadeja @Rivaba4BJP , comes from a royal family and carries herself with elegance, humility, and dignity.✅ No…— Akshay Kumar (@akshay_vicky) September 21, 2026ఇదీ చదవండి: జపాన్‌తో చారిత్రక మ్యాచ్.. చిక్కుల్లో భారత క్రికెటర్ -
జపాన్‌తో చారిత్రక మ్యాచ్.. చిక్కుల్లో భారత క్రికెటర్!
టీమిండియా యువ క్రికెటర్ విప్రజ్ నిగమ్ చిక్కుల్లో పడ్డాడు. ప్రస్తుతం ఆసియా గేమ్స్ ఆడేందుకు విప్రజ్ టీమిండియాతో పాటు జపాన్ చేరుకున్నాడు. జపాన్‌తో టీమిండియా ఆడే చారిత్రక మ్యాచ్‌కు కూడా విప్రజ్ ఎంపికయ్యాడు. ఈ చారిత్రక మ్యాచ్ ఆడేందుకు సిద్ధమవుతున్న తరుణంలో విప్రజ్ నిగమ్‌పై వచ్చిన తాజా ఆరోపణలు అతడిని ఇబ్బందుల్లోకి నెట్టేశాయి. విషయంలోకి వెళితే.. విప్రజ్ ఇంట్లో లేని సమయంలో ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకిలో ఉన్న అతడి నివాసానికి సోమవారం ఒక యువతి వెళ్లడం కలకలం రేపింది. ఆ సమయంలో విప్రజ్ తల్లి ఇంట్లోనే ఉన్నారు. విప్రజ్ ఇంటి ముందు కూర్చొని తనకు న్యాయం చేయాలంటూ నిరసనకు దిగడం సంచలనం కలిగించింది. అయితే ముందస్తు సమాచారం లేకుండా ఆమె ఇంటికి వచ్చి దాదాపు రెండు నుంచి మూడు గంటలపాటు నిరీక్షించడం చర్చనీయాం శంగా మారింది. కాగా గతంలో విప్రజ్ నిగమ్ ఒక యువతిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అసలేం జరిగింది?నవంబర్ 8, 2025న విప్రజ్ నిగమ్.. హైదరాబాద్‌కు చెందిన ఒక యువతి తనను వేధిస్తోందని, ఫోన్ చేసి రకరకాలుగా బెదిరింపులకు పాల్పడుతుందని ఆరోపిస్తూ బారాబంకి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే విప్రజ్ తనపై కేసు పెట్టిన కొద్ది రోజులకే ఆ యువతి కూడా తిరగబడింది. గౌతమ్‌బుద్ధ నగర్ ఎక్స్‌ప్రెస్‌వే పోలీస్ స్టేషన్లో విప్రజ్ తనను లైంగిక వేధింపులకు గురి చేశాడంటూ రివర్స్ కేసు దాఖలు చేసింది.ఆ యువతి తన ఫిర్యాదులో.. తాము ఇంటర్నెట్ ద్వారా 2025 మే నెలలో పరిచయం అయ్యామని, ఆ తర్వాత పెళ్లి చేసుకుంటానని నమ్మించి జూలై 29న నోయిడాలోని ఒక హోటల్‌కు తీసుకెళ్లి తనపై అత్యాచారం చేశాడని ఆరోపించింది. అంతేకాకుండా తనపై భౌతిక దాడి కూడా చేశాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తులో ఉంది. తాజాగా సదరు యువతి విప్రజ్ ఇంట్లో లేని సమయంలో అతడి ఇంటి ముందు బైఠాయించి న్యాయం చేయాలని నిరసనకు దిగడం సంచలనం కలిగించింది. ప్రస్తుతం ఆసియా గేమ్స్ ఆడేందుకు జపాన్ వెళ్లిన విప్రజ్ నిగమ్‌ను తాజా వివాదం అతడిని మరింత ఇబ్బందుల్లోకి నెట్టేసింది. ఈ పరిణామం అతడి కెరీర్‌పై ఎలాంటి ప్రభావం చూపిస్తుందనేది చూడాల్సి ఉంది.ఇదీ చదవండి: దుమ్మురేపిన యశ్.. ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం -
మ్యాక్స్‌వెల్ ఆల్‌రౌండ్ షో
యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్ (ETPL) 2026లో ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ టోర్నీలో బెల్ఫాస్ట్ జట్టుకు నాయకత్వం వహిస్తున్న అతడు, ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఇరగదీస్తున్నాడు. తాజాగా అమ్‌స్టర్‌డామ్ ఫ్లేమ్స్తో జరిగిన క్వాలిఫయర్ మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగి, తన జట్టును ఫైనల్‌కు తీసుకెళ్లాడు.ఈ మ్యాచ్‌లో తొలుత బంతితో అదరగొట్టిన అతడు.. ఆతర్వాత బ్యాటింగ్‌లోనూ చెలరేగిపోయాడు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన అమ్‌స్టర్‌డామ్‌ను మ్యాక్స్‌వెల్ తన స్పిన్ మాయాజాలంతో (4-0-18-4) 133 పరుగులకే కుప్పకూల్చాడు. అతడికి మాథ్యూ హంఫ్రేస్ (4-0-22-3) సహకరించాడు. అమ్‌స్టర్‌డామ్ ఇన్నింగ్స్‌లో స్టీవ్ స్మిత్ (45) ఒక్కడే చెప్పుకోదగ్గ స్కోర్ చేశాడు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని బెల్ఫాస్ట్ 18.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆఖర్లో మ్యాక్స్‌వెల్ సుడిగాలి ఇన్నింగ్స్ (8 బంతుల్లో 21 నాటౌట్; 3 సిక్సర్లు) ఆడి తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. అతడికి లోర్కన్ టక్కర్ (34 నాటౌట్), డెవాన్ కాన్వే (35) సహకరించారు. ఇవాళ జరిగే తుదిపోరులో బెల్ఫాస్ట్ వోల్వ్స్.. ఎడిన్బర్గ్ క్యాజిల్ రాకర్స్‌తో తలపడనుంది. ఇదీ చదవండి: టీమిండియాతో సిరీస్‌కు వెస్టిండీస్ జట్ల ప్రకటన -
బట్లర్ రికార్డుల మోత.. టీ20ల్లో నంబర్‌వన్‌గా ఇంగ్లండ్
శ్రీలంకను క్లీన్‌స్వీప్ చేసిన ఇంగ్లండ్ తాజాగా ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ స్థానాన్ని అధిరోహించింది. ఈ నేపథ్యంలో ఇప్పటిదాకా నంబర్‌వన్ ర్యాంకులో ఉన్న టీమిండియా రెండో స్థానానికి పడిపోయింది. ఇరుజట్ల మధ్య పాయింట్ల రేటింగ్ మధ్య వ్యత్యాసం లేకపోయినప్పటికీ, మ్యాచ్ పరంగా టీమిండియా (61)తో పోలిస్తే ఇంగ్లండ్ 41 మ్యాచ్‌లు ఆడింది. ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, సౌతాఫ్రికాలు వరుసగా మూడు, నాలుగు, స్థానాల్లో కొనసాగుతున్నాయి.👉ఇక మ్యాచ్‌లో అజేయ అర్థసెంచరీతో జట్టును గెలిపించిన జోస్ బట్లర్ అరుదైన ఫీట్ సాధించాడు. టీ20ల్లో అత్యధిక అర్థసెంచరీలు సాధించిన బ్యాటర్ల జాబితాలో బట్లర్ నాలుగో స్థానానికి చేరుకున్నాడు. తాజా అర్థసెంచరీతో బట్లర్ ఖాతాలో 32 హాఫ్ సెంచరీలున్నాయి. బట్లర్ కంటే ముందు బాబర్ ఆజం (42 అర్థసెంచరీలు), విరాట్ కోహ్లి (39 అర్థసెంచరీలు), రోహిత్ శర్మ (37 అర్థసెంచరీలు) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు.👉ఇక మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా బట్లర్ నిలిచాడు. లంకతో టీ20 సిరీస్‌లో బట్లర్ 171 పరుగులు సాధించాడు. సౌతాఫ్రికాపై 173 పరుగులతో డేవిడ్ మలన్.. బట్లర్ కంటే ముందున్నాడు. ఇక కెప్టెన్ హ్యారీ బ్రూక్ (170 పరుగులు) మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.👉ఇక మ్యాచ్ విషయానికొస్తే శనివారం జరిగిన చివరి టీ20లో ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో లంకపై విజయం సాధించింది. ఫలితంగా ఇంగ్లండ్ 3-0తో సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 18.5 ఓవర్లలో 124 పరుగులకు ఆలౌటైంది. పాతుమ్ నిస్సాంక (36), కమిందు మెండిస్ (35) పర్వాలేదనిపించారు. ఇంగ్లండ్ బౌలర్లలో సొన్ని బేకర్, జోఫ్రా ఆర్చర్, విల్ జాక్స్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం ఇంగ్లండ్ 9.4 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. ఓపెనర్ జాస్ బట్లర్ (32 బంతుల్లో 62 నాటౌట్) అజేయ అర్థసెంచరీతో విధ్వంసం సృష్టించగా, కెప్టెన్ హ్యారీ బ్రూక్ (33) రాణించాడు. లంక బౌలర్లలో తరిందు రత్నాయకే ఒక వికెట్ తీశాడు. ఇరుజట్ల మధ్య తొలి వన్డే మ్యాచ్ మంగళవారం జరగనుంది.ఇదీ చదవండి: బట్లర్ విధ్వంసం.. ఇంగ్లండ్ చేతిలో శ్రీలంక వైట్‌వాష్ -
బట్లర్ విధ్వంసం.. ఇంగ్లండ్ చేతిలో శ్రీలంక వైట్‌వాష్
ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో శ్రీలంక వైట్‌వాష్‌కు గురైంది. మాంచెస్టర్ వేదికగా శనివారం జరిగిన చివరి టీ20లో ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో లంకపై విజయం సాధించింది. ఫలితంగా ఇంగ్లండ్ 3-0తో సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 18.5 ఓవర్లలో 124 పరుగులకు ఆలౌటైంది. పాతుమ్ నిస్సాంక (36), కమిందు మెండిస్ (35) పర్వాలేదనిపించారు. ఇంగ్లండ్ బౌలర్లలో సొన్ని బేకర్, జోఫ్రా ఆర్చర్, విల్ జాక్స్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం ఇంగ్లండ్ 9.4 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. ఓపెనర్ జాస్ బట్లర్ (32 బంతుల్లో 62 నాటౌట్) అజేయ అర్థసెంచరీతో విధ్వంసం సృష్టించగా, కెప్టెన్ హ్యారీ బ్రూక్ (33) రాణించాడు. లంక బౌలర్లలో తరిందు రత్నాయకే ఒక వికెట్ తీశాడు. మ్యాచ్‌లో రెండు వికెట్లు తీసిన సొన్ని బేకర్‌కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు, మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 170 పరుగులు చేసిన హ్యారీ బ్రూక్ 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' అవార్డు కైవసం చేసుకున్నాడు. హ్యారీ బ్రూక్‌కు కెప్టెన్‌గా 26 మ్యాచ్‌ల్లో ఇది 23వ విజయం కావడం విశేషం. ఇరుజట్ల మధ్య తొలి వన్డే మ్యాచ్ మంగళవారం జరగనుంది.ఇదీ చదవండి: టీమిండియా చీఫ్ సెలెక్టర్ రేసులో ఊహించని వ్యక్తి.. ఎవరంటే? -
హెట్‌మైర్ శతకం వృధా
కరీబియన్ ప్రీమియర్ లీగ్ 2026 తుది అంకానికి చేరింది. ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్, జమైకా కింగ్స్‌మన్ జట్లు సెప్టెంబర్ 20న టైటిల్ కోసం పోరాడతాయి. ఇవాళ జరిగిన క్వాలిఫయర్-2లో గయానా అమెజాన్ వారియర్స్‌పై గెలిచి జమైకా కింగ్స్‌మన్ ఫైనల్‌కు చేరింది.ఈ మ్యాచ్‌లో వారియర్స్ భారీ స్కోర్ చేసినా, దాన్ని కాపాడుకోలేకపోయింది. దీంతో వారియర్స్ తరఫున షిమ్రోన్ హెట్‌మైర్ అజేయ మెరుపు శతకం (45 బంతుల్లో 4 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 102 నాటౌట్) వృధా అయ్యింది. కింగ్స్మన్ను వారి కెప్టెన్ రోవ్‌మన్ పావెల్ సుడిగాలి ఇన్నింగ్స్ (17 బంతుల్లో 40 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) ఆడి గెలిపించారు.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వారియర్స్, హెట్‌మైర్ చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్యాన్ని కింగ్స్‌మన్ సునాయాసంగా ఛేదించింది. ఆ జట్టు తరఫున ప్రతి ఒక్కరు రాణించారు. కీసీ కార్తీ 56, మాజ్ సదాకత్ 41, కిర్క్ మెకెంజీ 34, సైమ్ అయూబ్ 23, రోవ్‌మన్ పావెల్ 40 పరుగులు చేశారు. ఇదీ చదవండి: పాక్ ప్లేయర్ హ్యాట్రిక్ -
టీ20 క్రికెట్లో షఫాలీ వర్మ అరుదైన ఫీట్
భారత మహిళా క్రికెటర్ షఫాలీ వర్మ టీ20 క్రికెట్లో అరుదైన రికార్డు సాధించింది. ఒక క్యాలండర్ ఇయర్లో అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్ల జాబితాలో షఫాలీ వర్మ రెండో స్థానంలో నిలిచింది. 2026లో షఫాలీ వర్మ 26 సిక్సర్లు కొట్టింది. అయితే ఈ జాబితాలో శ్రీలంక కెప్టెన్ చమేరీ ఆటపట్టు (32 సిక్సర్లు, 2024 ఏడాదిలో) తొలి స్థానంలో కొనసాగుతోంది. హర్మన్‌ప్రీత్ కౌర్ (2018లో 25 సిక్సర్లు), సోఫీ డివైన్ (2018లో 21 సిక్సర్లు, 2020లో 21 సిక్సర్లు) మూడు, నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నారు.మహిళల టీ20 క్రికెట్లో బంతుల పరంగా భారత్ 90 బంతులు మిగిలి ఉండగానే జపాన్ విజయం సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. తొలి స్థానంలో జింబాబ్వే మహిళల జట్టు (108 బంతులు వర్సెస్ ఎస్వాటిని), ఐర్లాండ్ మహిళలు (104 బంతులు వర్సెస్ ఫ్రాన్స్ ), జింబాబ్వే మహిళలు (98 బంతులు వర్సెస్ నైజిరీయా) రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నాయి.ఇక మ్యాచ్ విషయానికొస్తే తొలుత బ్యాటింగ్ చేసిన జపాన్ మహిళల జట్టు 19.5 ఓవర్లలో 57 పరుగులకు ఆలౌటైంది. అయకా కాటో స్టాఫోర్డ్ (25) టాప్ స్కోరర్. భారత బౌలర్లలో శ్రీ చరణి 4 వికెట్లతో చెలరేగగా, షఫాలీ వర్మ 2, శ్రేయాంక పాటిల్, దీప్తి శర్మ చెరో వికెట్ పడగొట్టారు. అనంతరం భారత్ 5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 59 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. షఫాలీ వర్మ (15 బంతుల్లో 40 నాటౌట్) దనాధన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకోగా, రిచా ఘోష్ (12 నాటౌట్) ఆకట్టుకుంది. జపాన్ బౌలర్లలో నొనొహా యుమొటొ, అయ్కా కాటో చెరొక వికెట్ తీశారు.𝙎𝙝𝙪𝙧𝙪 𝙝𝙤𝙩𝙚 𝙝𝙞 𝙠𝙝𝙖𝙩𝙖𝙢 😅 Japan were bowled out for 58, and India wrapped it up in just 4.6 overs - with Shafali Verma putting the finishing touch with a six✨Catch India vs Japan at the Asian Games, LIVE NOW on Sony Sports Network & Sony LIV.… pic.twitter.com/nTfQ1rVlx5— Sony Sports Network (@SonySportsNetwk) September 18, 2026ఇదీ చదవండి: ఉత్తర కొరియా వల్ల 1,399 భూకంపాలు! -
‘అభిషేక్ ఒక అద్భుతం.. వాళ్ల ఆటతీరు ప్రశంసనీయం’
అఫ్గానిస్తాన్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 3-0తో టీమిండియా క్లీన్‌స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. గురువారం జరిగిన చివరి టీ20లో భారత్ 127 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. మ్యాచ్ అనంతరం కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ స్పందిస్తూ అభిషేక్ శర్మపై ప్రశంసలు కురిపించాడు. ‘‘నిజానికి ఇది సులభమైన వికెట్ కాదు. కానీ అభిషేక్ ఆడిన తీరు కంటికి ఇంపుగా ఉంది. అతడొక అద్భుతం. అతడు శతకం సాధించడం చాలా ఆనందం కలిగించింది. అఫ్గానిస్తాన్ సిరీస్ కోల్పోయినప్పటికీ వాళ్లు మా మనసులు గెలిచారు. ఈ సిరీస్‌కు వాళ్లు ఆతిథ్యం ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా గౌరవం ఉంటుంది. ఓడినప్పటికీ ఆఫ్గన్ జట్టు ప్రదర్శన కూడా ప్రశంసనీయం. టాస్కు ముందే ఆఫ్గన్ కెప్టెన్ ఇబ్రహీం జద్రాన్‌తో క్లుప్తంగా మాట్లాడిన తర్వాతే మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాం. మ్యాచ్‌లో మాకు అద్భుతమైన ఆరంభం లభించింది. అభిషేక్ విధ్వంసానికి తోడు శాంసన్ రాణించడంతో 200లకు పైగా రన్స్‌ను స్కోరుబోర్డుపై చేర్చగలిగాం. అక్షర్ పటేల్ కీలక సమయంలో రాణిండంలో సిద్ధహస్తుడు. గతంలో చాలా సందర్భాల్లో జట్టును గెలిపించాడు. ఇప్పుడు కూడా అదే చేశాడు. క్లిష్ట పరిస్థితుల్లో ఎలా బౌలింగ్ చేయాలనేది అతడికి బాగా తెలుసు. మొదటి నుండి నిలకడగా రాణిస్తున్నాడు. కాబట్టి అతడికి నా ప్రత్యేక అభినందనలు.’’ అని పేర్కొన్నాడు.ఇదీ చదవండి: బట్లర్ ప్రపంచ రికార్డు.. రెండో టీ20లో ఇంగ్లండ్ విజయం -
బట్లర్ ప్రపంచ రికార్డు.. రెండో టీ20లో ఇంగ్లండ్ విజయం
కార్డిఫ్ వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో ఇంగ్లండ్ బ్యాటర్ జోస్ బట్లర్ ప్రపంచ రికార్డు సాధించాడు. టీ20 క్రికెట్లో 15వేల పరుగులు చేసిన తొలి ప్లేయర్‌గా బట్లర్ నిలిచాడు. కీరన్ పొలార్డ్ (14,999 రన్స్) రెండో స్థానంలో, అలెక్స్ హేల్స్ (14, 581 పరుగులు) మూడో స్థానంలో ఉన్నాడు. దీంతో పాటు బట్లర్ మరో రికార్డును కూడా తన పేరిట లిఖించుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో బట్లర్ రెండో స్థానానికి చేరుకున్నాడు. మ్యాచ్‌లో 30 పరుగులు సాధించిన బట్లర్ 162 ఇన్నింగ్స్‌ల్లో 4,322 పరుగులు చేశాడు.మ్యాచ్ విషయానికొస్తే ఇంగ్లండ్ 6 వికెట్ల తేడాతో శ్రీలంకపై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 145 పరుగులకు పరిమితమైంది. ఓపెనర్ పాతుమ్ నిస్సాంక (37) టాప్ స్కోరర్‌గా నిలవగా, చరిత్ అసలంక (31) పర్వాలేదనిపించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో లియామ్ డాసన్ 3 వికెట్లు తీయగా, జేమీ ఓవర్టన్, జోఫ్రా ఆర్చర్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. PC: ECB Twitterఅనంతరం బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 12.1 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేసి గెలుపొందింది. టామ్ బాంటన్ (24 బంతుల్లో 52 నాటౌట్) అజేయ అర్థసెంచరీతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించగా, జోస్ బట్లర్ (30), కెప్టెన్ హ్యారీ బ్రూక్ (23) రాణించారు. లంక బౌలర్లలో చమీర, హసరంగ, మలింగ, రత్నాయకే తలా ఒక వికెట్ తీశారు. ఫలితంగా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో సిరీస్ కైవసం చేసుకున్న ఇంగ్లండ్ క్లీన్‌స్వీప్‌పై దృష్టి సారించగా, లంక మాత్రం చివరి మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలని చూస్తోంది. ఇరుజట్ల మధ్య మూడో టీ20 రేపు మాంచెస్టర్ వేదికగా జరగనుంది. టీ20ల్లో శ్రీలంకపై ఇంగ్లండ్‌కు ఇది వరుసగా 14వ విజయం కాగా, కెప్టెన్‌గా బ్రూక్‌కు 25 మ్యాచ్‌ల్లో 22వ విజయం కావడం విశేషం.ఇదీ చదవండి: విదేశీ విద్యార్థులకు షాకిచ్చిన ఆస్ట్రేలియా ప్రభుత్వం! -
'వచ్చామా.. కసితీరా కొట్టామా.. వెళ్లామా; ఇదే నా స్టైల్'
అఫ్గానిస్తాన్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో భారత ఓపెనర్ అభిషేక్ శర్మ 30 బంతుల్లోనే సెంచరీ సాధించి పలు రికార్డులు బద్దలుకొట్టాడు. భారత్ తరఫున అత్యంత వేగవంతమైన సెంచరీ రికార్డును అభిషేక్ తన పేరిట లిఖించుకున్నాడు. ఇప్పటివరకు ఆ రికార్డు రోహిత్ శర్మ (35 బంతులు) పేరిట ఉండేది. ఇక మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను టీమిండియా 3-0తో ఆఫ్గన్‌ను క్లీన్‌స్వీప్ చేసింది.ఇక మూడో టీ20 మ్యాచ్‌లో టీమిండియా 127 పరుగుల భారీ తేడాతో అఫ్గానిస్తాన్‌ను మట్టికరిపించింది. మ్యాచ్ విజయం అనంతరం 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'తో పాటు ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు అందుకున్న అభిషేక్ శర్మ తన ప్రదర్శనపై స్పందించాడు. రికార్డులు తనకు ముఖ్యం కాదని, మ్యాచ్‌లో బరిలోకి దిగితే వచ్చామా.. కసితీరా కొట్టామా.. వెళ్లామా అన్నట్లుగా తన బ్యాటింగ్ స్టైల్ ఉంటుందని అభిషేక్ తెలిపాడు.Photo Credit: BCCI Twitter"ముందుగా ఇవాళ మ్యాచ్ చూసేందుకు వచ్చిన ప్రేక్షకుల్లో ఎవరిదైనా పుట్టినరోజు ఉంటే వారికి నా ప్రత్యేక శుభాకాంక్షలు. నేను సాధించిన సెంచరీ వారికి గిఫ్ట్ అని భావిస్తున్నా. ఇక రెండు సంవత్సరాల క్రితం, మేము ఒక నిర్దిష్ట ప్రణాళికతో ఆడి అన్ని జట్లపై ఆధిపత్యం చెలాయించాలని నిర్ణయించుకున్న విషయం నాకు బాగా గుర్తుంది. ఆ ప్రణాళిక ఒక సంవత్సరం పాటు చక్కగానే పనిచేసింది. ఈలోగా రెండు (ఇంగ్లండ్, ఐర్లాండ్) సిరీస్‌లు మాకు ప్రతికూల ఫలితాలను ఇచ్చాయి. కానీ ఒకటి రెండు చెడ్డ సిరీస్‌లు మా బ్యాటింగ్‌ను నిర్వచించలేవు. ఆడుతుంది చిన్న జట్టుతోనే, పెద్ద జట్టుతోనా అనేది పక్కనబెట్టి జట్టు విజయం కోసం మేమంతా సమిష్టి ప్రదర్శన చేశాము. ఇక నా విషయానికొస్తే ప్రతీ సిరీస్‌కు ముందు నేను అనుసరించే ప్రక్రియపైనే ఇదంతా ఆధారపడి ఉంటుందని భావిస్తున్నా. ఎవరితో ఆడుతున్నాను, బౌలర్లు ఎవరు అనే విషయాలు నాకు ప్రత్యేకం. కాబట్టి వ్యక్తిగతంగా ఒక బ్యాటర్‌గా నా దృష్టి ఎప్పుడూ బ్యాటింగ్ పవర్ ప్లేపైనే ఉంటుంది. Photo Credit: BCCI Twitterమైదానంలో దూకుడుగా ఆడాలంటే ముందుగా సరైన ప్రిపరేషన్ అవసరం. అదే నా విజయానికి కారణం. ఆఫ్గన్‌తో టీ20 సిరీస్‌లో బ్యాటింగ్‌కు సంబంధించి పెద్దగా ప్రణాళికలంటూ ఏమీ లేవు. ఆది నుంచి వారిపై ఆధిపత్యం ప్రదర్శిస్తే జట్టుకు భారీ స్కోరు ఇవ్వగలననే అంశాన్ని మాత్రమే మైండ్‌లో పెట్టుకొని ఆడుతూ వచ్చాను. రికార్డుల గురించి పెద్దగా పట్టించుకోను. జట్టుకు అవసరమైనప్పుడు బాధ్యతాయుతంగా ఆడి పని పూర్తి చేయడంపైనే దృష్టి సారిస్తాను. కెప్టెన్, కోచ్ నుంచి మద్దతు ఉండడం వల్లే ఇదంతా సాధ్యమైంది." అని చెప్పుకొచ్చాడు. ఇక అభిషేక్ శర్మ అఫ్గానిస్తాన్‌తో మూడు మ్యాచ్‌లు ఆడి 269 స్ట్రైక్‌రేట్‌తో 229 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ, అర్థసెంచరీ ఉన్నాయి.ABHISHEK SHARMA SPEAKS: 🗣️“Personally me as a batter, it's always been about the process - How I'm gonna utilize the power play.” pic.twitter.com/IjTqcFZ8lR— Maina Singh (@Maina_Singhx77) September 17, 2026ఇదీ చదవండి: మూడో టీ20లో టీమిండియా విజయం.. ఆఫ్గన్ క్లీన్‌స్వీప్ -
మూడో టీ20లో టీమిండియా విజయం.. ఆఫ్గన్ క్లీన్‌స్వీప్
స్వదేశంలో అఫ్గానిస్తాన్‌తో జరిగిన టీ20 సిరీస్‌ను టీమిండియా 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. ఢిల్లీ వేదికగా గురువారం జరిగిన చివరి టీ20 మ్యాచ్‌లో టీమిండియా 127 పరుగుల తేడాతో అఫ్గానిస్తాన్‌పై విజయం సాధించింది. 222 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గానిస్తాన్ భారత బౌలర్ల ధాటికి 14.1 ఓవర్లలో 94 పరుగులకు కుప్పకూలింది. కెప్టెన్ ఇబ్రహీం జద్రన్ (25) మినహా మిగతావాళ్లు బ్యాటింగ్‌లో దారుణంగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో నితీశ్ కుమార్ రెడ్డి, రవి బిష్ణోయి చెరో 3 వికెట్లు తీయగా, అక్షర్ పటేల్ 2 వికెట్లు, యశ్ ఠాకూర్, బుమ్రాలు తలా ఒక వికెట్ పడగొట్టారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ (34 బంతుల్లో 108; 9 ఫోర్లు, 11 సిక్సర్లు) శతకంతో విధ్వంసం సృష్టించగా.. సంజూ శాంసన్ (35 బంతుల్లో 50) అర్థసెంచరీ సాధించాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (29) రాణించాడు. అఫ్గానిస్తాన్ బౌలర్లలో అజ్మతుల్లా ఒమర్జయ్ 2 వికెట్లు తీయగా.. రషీద్ ఖాన్, అబ్దుల్లా అహ్మద్‌జయ్ చెరొక వికెట్ తీశారు. అరుణ్‌జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన మూడు మ్యాచ్‌ల్లోనూ టీమిండియానే విజయం సాధించి ఆఫ్గన్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. శతకంతో చెలరేగిన ఓపెనర్ అభిషేక్ శర్మకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది.As clinical and commanding as it gets 🇮🇳#TeamIndia with a massive 1️⃣2️⃣7️⃣-run victory to clinch the Friendship Cup 3️⃣-0️⃣ 🏆Scorecard ▶️ https://t.co/Zixki4RhPt#AFGvIND pic.twitter.com/ZDY4ZzdaxY— BCCI (@BCCI) September 17, 2026ఇదీ చదవండి: అభిషేక్ ఫాస్టెస్ట్ సెంచరీ.. టీమిండియా భారీ స్కోర్ -
విండీస్ గడ్డపై చరిత్ర సృష్టించిన పాక్ ప్లేయర్
పాకిస్తాన్ యువ ఓపెనర్ మాజ్ సదాకత్ విండీస్ గడ్డపై చరిత్ర సృష్టించాడు. కరీబియన్ ప్రీమియర్ లీగ్ 2026లో జమైకా కింగ్స్మన్కు ఆడుతున్న ఈ 21 ఏళ్ల పాక్ ఓపెనర్.. బార్బడోస్ ట్రైడెండ్స్తో ఇవాళ జరిగిన మ్యాచ్‌లో కేవలం 44 బంతుల్లోనే శతక్కొట్టాడు. తద్వారా కరీబియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడిగా (21 ఏళ్ల 124 రోజులు) సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఈ రికార్డు విండీస్ విధ్వంసకర బ్యాటర్ షిమ్రోన్ హెట్‌మైర్ పేరిట ఉండేది. హెట్‌మైర్ 21 ఏళ్ల 235 రోజుల వయసులో సీపీఎల్ సెంచరీ చేశాడు.మ్యాచ్ విషయానికొస్తే.. మాజ్ సదాకత్ సుడిగాలి శతకంతో (49 బంతుల్లో 112; 9 ఫోర్లు, 8 సిక్సర్లు) విరుచుకుపడటంతో అతడి జట్టు జమైకా కింగ్స్‌మన్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి క్వాలిఫయర్-2కు చేరింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ట్రైడెంట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేయగా.. జమైకా కింగ్స్‌మన్ కేవలం 14.1 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ట్రైడెంట్స్ ఇన్నింగ్స్‌లో క్వింటన్ డికాక్ (71), క్రిస్ గ్రీన్ (57 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించగా.. కింగ్స్‌మన్ తరఫున మాజ్ సదాకత్ సోలో ఫైట్ చేశాడు. సదాకత్‌కు టీ20ల్లో ఇది తొలి సెంచరీ. ఇతను త్వరలో జరుగబోయే ఏషియన్ గేమ్స్‌లో పాక్ తరఫున బరిలోకి దిగనున్నాడు. సదాకత్ ఇప్పటివరకు పాక్ తరఫున 6 వన్డేలు ఆడి ఓ అర్ద సెంచరీ సాయంతో 134 పరుగులు చేశాడు. ఇదీ చదవండి: చచ్చీ చెడి సెమీస్‌కు చేరిన పాక్ -
మహ్మద్ నబీ అరుదైన రికార్డు
ఆఫ్ఘనిస్తాన్ వెటరన్ ఆల్‌రౌండర్ మహ్మద్ నబీ అరుదైన రికార్డు సాధించాడు. టీ20 అంతర్జాతీయాల్లో 2500 పరుగులు, 100 ప్లస్ వికెట్లు తీసిన నాలుగో ఆల్‌రౌండర్‌గా నిలిచాడు. భారత్‌తో నిన్న జరిగిన రెండో టీ20లో నబీ ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో 14 బంతుల్లో 20 పరుగులు చేసిన నబీ, 2500 పరుగులు పూర్తి చేశాడు.నబీకి (2501, 111) ముందు బంగ్లా ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ (2551 పరుగులు, 149 వికెట్లు), జింబాబ్వే ఆల్‌రౌండర్ సికందర్ రజా (3244, 114), మలేషియా ఆల్‌రౌండర్ విరన్‌దీప్ సింగ్ (3402, 126) ఈ ఘనత సాధించారు.ఈ మ్యాచ్‌తో నబీ మరో ఘనత కూడా సాధించాడు. భారత గడ్డపై టీ20 అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన మూడో అత్యంత వయసైన (41 సంవత్సరాల 257 రోజులు) క్రికెటర్‌గా నిలిచాడు. ఈ రికార్డుకు సంబంధించి హాంకాంగ్‌కు చెందిన ర్యాన్ క్యాంప్‌బెల్ (44 సంవత్సరాల 34 రోజుల వయసులో) అగ్రస్థానంలో ఉండగా.. ఇటలీకి చెందిన వేన్ మాడ్సెన్ (42 సంవత్సరాల 38 రోజులు) రెండో స్థానంలో ఉన్నాడు.మ్యాచ్ విషయానికొస్తే.. భారత్ ఆఫ్ఘనిస్తాన్పై 7 వికెట్ల తేడాతో గెలుపొంది, 3 మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 159 పరగులు చేయగా.. భారత్ కేవలం 14.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.ఇదీ చదవండి: రోహిత్ శర్మను అధిగమించిన బట్లర్.. మిగిలింది అతనొక్కడే..! -
వైభవ్ ఆడడంపై శ్రేయస్ కీలక వ్యాఖ్యలు
ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన రెండో టీ20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో అఫ్గానిస్తాన్‌పై ఘన విజయాన్ని అందుకుంది. అఫ్గానిస్తాన్ విధించిన 160 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 14.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి అందుకుంది. సంజూ శాంసన్ (57) అర్థసెంచరీతో రాణించగా, అభిషేక్ శర్మ (39), ఇషాన్ కిషన్ (34 నాటౌట్) రాణించారు. చివర్లో తిలక్ వర్మ (15 నాటౌట్) జట్టును గెలిపించాడు. రషీద్ ఖాన్ 3 వికెట్లు తీశాడు. ఈ నేపథ్యంలో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే భారత్ 2-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. కాగా మ్యాచ్ అనంతరం కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాట్లాడాడు. తనపై వచ్చిన విమర్శలకు సంజూ శాంసన్ నోటితోనే సమాధానం చెప్పాడని పేర్కొన్నాడు. బౌలర్ల సమిష్టి ప్రదర్శన ఈ విజయాన్ని అందించిందని తెలిపాడు.తొలి మ్యాచ్ ఆటతీరును దృష్టిలో ఉంచుకుని ఈ మ్యాచ్‌లో భారీ విజయాన్ని ఆశించామని.. దానికి తగ్గట్టుగానే భారత ప్లేయర్లు అద్భుతంగా రాణించారని తెలిపాడు. మైదానంలో ప్లేయర్లు చూపిన పట్టుదల, ప్లాన్ అమలు తీరు తమకు అనుకూలంగా ఫలితాన్ని ఇచ్చిందన్నాడు. మొదట్లో కొన్ని విషయాలను జీర్ణించుకోవడం కష్టంగా అనిపించినప్పటికీ, క్రీడా ప్రయాణం అనేది ఒక రోలర్ కోస్టర్ రైడ్ లాంటిదని పేర్కొన్నాడు. ఏ పరిస్థితిలోనైనా కూల్ గా ఉండటం చాలా ముఖ్యమని, గతాన్ని ఆలోచించకుండా ప్రస్తుత క్షణాన్ని ఆస్వాదించడం అలవాటు చేసుకున్నానని చెప్పాడు. ఒత్తిడిని ఎంతగా ఆస్వాదిస్తే పరిస్థితులు అంతగా అనుకూలంగా మారుతాయని తాను గతంలో కూడా చెప్పిన విషయాన్ని గుర్తు చేశాడు.ఇక సిరీస్ ఇప్పటికే 2-0తో కైవసం కావడంతో చివరి, మూడో టీ20 మ్యాచ్‌లో తుది జట్టులో మార్పులు చేసే అవకాశం ఉందనే సంకేతాలు ఇచ్చాడు. దీంతో తొలి రెండు మ్యాచ్‌లకు బెంచ్‌కే పరిమితమైన వైభవ్ సూర్యవంశీ మూడో టీ20లో ఆడే అవకాశముంది. అందరినీ ఇక్కడి పిచ్ వాతావరణానికి అలవాటు చేయడం, మైదానంలో తగినంత ప్రాక్టీస్ కల్పించడం ముఖ్యమని అభిప్రాయపడ్డాడు. అందువల్ల ఇప్పటివరకు బెంచ్ కే పరిమితమైన ఆటగాళ్లకు మూడో మ్యాచ్ లో అవకాశాలు ఇచ్చే ఆలోచనలో ఉన్నామని.. జట్టు కాంబినేషన్లో కూడా కొన్ని చిన్నపాటి మార్పులు చేసే అవకాశం ఉందని శ్రేయస్ అయ్యర్ స్పష్టం చేశాడు.ఇదీ చదవండి: శతకంతో చెలరేగిన బ్రూక్.. లంకపై ఇంగ్లండ్ విజయం -
శతకంతో చెలరేగిన బ్రూక్.. లంకపై ఇంగ్లండ్ విజయం
సౌతాంప్టన్ వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో ఇంగ్లండ్ 119 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. కెప్టెన్ హ్యారీ బ్రూక్ విధ్వంసకర సెంచరీకి తోడు బౌలర్లు చెలరేగడంతో ఇంగ్లండ్ ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. హ్యారీబ్రూక్ (49 బంతుల్లో 114 నాటౌట్, 10 ఫోర్లు, 6 సిక్సర్లు) శతకంతో చెలరేగగా, ఓపెనర్ జాస్ బట్లర్ (44 బంతుల్లో 80; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్థశతకంతో రాణించాడు. లంక బౌలర్లలో చమీరా, దునిత్ వెల్లలగె, ఇషాన్ మలింగ, వనిందు హసరంగ తలా ఒక వికెట్ తీశారు. అనంతరం భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన శ్రీలంక జట్టు 19 ఓవర్లలో 135 పరుగులకు ఆలౌటైంది. దునిత్ వెల్లలగె (33) టాప్ స్కోరర్‌గా నిలవగా, దాసున్ షనక (24) ప్రభావం చూపించలేకపోయాడు. ఇంగ్లండ్ బౌలర్లలో సొన్ని బేకర్ 3 వికెట్లు తీయగా, లియామ్ డాసన్, జేమీ ఓవర్టన్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. 42 బంతుల్లో సెంచరీ సాధించిన బ్రూక్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇరుజట్ల మధ్య రెండో టీ20 రేపు మాంచెస్టర్ వేదికగా జరగనుంది.ఇదీ చదవండి: షేక్ హసీనా సన్నిహితులకు మరణశిక్ష!ఇషాన్ కిషన్ ప్రపంచ రికార్డు -
ఇషాన్ కిషన్ ప్రపంచ రికార్డు
టీమిండియా వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ అఫ్గానిస్తాన్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో ప్రపంచ రికార్డు సాధించాడు. ఒక క్యాలెండర్ ఇయర్లో భారత్ తరఫున టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో ఇషాన్ కిషన్ రెండో స్థానంలో నిలిచాడు. 2026 ఏడాదిలో ఇషాన్ కిషన్ 173.2 స్ట్రైక్‌రేట్‌తో 892 పరుగులు సాధించాడు. తొలి స్థానంలో సూర్యకుమార్ యాదవ్ (2022లో 187.43 స్ట్రైక్‌రేట్‌తో 1164 పరుగులు) కొనసాగుతున్నాడు. ఇక 2025లో అభిషేక్ శర్మ 193.46 స్ట్రైక్‌రేట్‌తో 859 పరుగులు సాధించి మూడో స్థానంలో ఉన్నాడు. ఈ ముగ్గురి తర్వాత విరాట్ కోహ్లి (2022లో 781 పరుగులు), సూర్యకుమార్ యాదవ్ (2023లో 733 పరుగులు) నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు.ఇక మ్యాచ్ విషయానికొస్తే.. రెండో టీ20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. అఫ్గానిస్తాన్ విధించిన 160 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 14.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి అందుకుంది. సంజూ శాంసన్ (57) అర్థసెంచరీతో రాణించగా, అభిషేక్ శర్మ (39), ఇషాన్ కిషన్ (34 నాటౌట్) రాణించారు. చివర్లో తిలక్ వర్మ (15 నాటౌట్) జట్టును గెలిపించాడు. రషీద్ ఖాన్ 3 వికెట్లు తీశాడు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. కెప్టెన్ ఇబ్రహీం జద్రన్ (37) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో నితీశ్‌కుమార్ రెడ్డి మూడు వికెట్లు తీయగా, అర్ష్‌దీప్ సింగ్ 2 వికెట్లు, బుమ్రా, అక్షర్ పటేల్, బిష్ణోయిలు తలా ఒక వికెట్ పడగొట్టారు. ఇరుజట్ల మధ్య చివరి టీ20 గురువారం ఇదే స్టేడియం వేదికగా జరగనుంది.Most runs for India in a calendar year in T20Is :1164 - Suryakumar Yadav in 2022 (SR: 187.43)892 - Ishan Kishan in 2026 (SR: 173.2)*WHAT A COMEBACK FOR ISHAN KISHAN 🔥 pic.twitter.com/8Cds0c4w5a— Vipin Tiwari (@Vipintiwari952) September 15, 2026ఇదీ చదవండి: యూపీఐ చార్జీలు.. ఏటా 84 వేల కోట్ల ఆదాయం!శాంసన్ మెరుపులు.. రెండో టీ20లో టీమిండియా ఘన విజయం -
శాంసన్ మెరుపులు.. రెండో టీ20లో టీమిండియా ఘన విజయం
ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన రెండో టీ20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో అఫ్గానిస్తాన్‌పై ఘన విజయాన్ని అందుకుంది. అఫ్గానిస్తాన్ విధించిన 160 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 14.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి అందుకుంది. ఓపెనర్ సంజూ శాంసన్ (57) అర్థసెంచరీ చేయగా, మరో ఓపెనర్ అభిషేక్ శర్మ (39) రాణించాడు. చివర్లో వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ (34 నాటౌట్), తిలక్ వర్మ (15 నాటౌట్) అజేయంగా నిలిచి జట్టును గెలిపించారు. ఆఫ్గన్ బౌలర్లలో రషీద్ ఖాన్ 3 వికెట్లు తీశాడు. ఈ నేపథ్యంలో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే భారత్ 2-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. కెప్టెన్ ఇబ్రహీం జద్రన్ (37) టాప్ స్కోరర్‌గా నిలవగా, డార్విష్ రసూలీ (26), రషీద్ ఖాన్ (28) పర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో నితీశ్‌కుమార్ రెడ్డి మూడు వికెట్లు తీయగా, అర్ష్‌దీప్ సింగ్ 2 వికెట్లు, బుమ్రా, అక్షర్ పటేల్, బిష్ణోయిలు తలా ఒక వికెట్ పడగొట్టారు. ఇరుజట్ల మధ్య చివరి టీ20 గురువారం ఇదే స్టేడియం వేదికగా జరగనుంది.Series victory sealed 🔒Superb from start to finish as #TeamIndia make it 2️⃣-0️⃣ in the Friendship Cup 🇮🇳👏Scorecard ▶️ https://t.co/96e4nhbYLf#AFGvIND pic.twitter.com/zvWVii5nBC— BCCI (@BCCI) September 15, 2026ఇదీ చదవండి: రెన్షా శతకం, ఇల్లిస్ విజృంభణ.. తొలి వన్డే ఆసీస్‌దే..! -
ఆసీస్‌పై 5 వికెట్ల ప్రదర్శన.. రికార్డులు కొల్లగొట్టిన జింబాబ్వే బౌలర్
ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో జింబాబ్వే యువ పేసర్ న్యూమన్ న్యామ్హురి సంచలనం సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో అతడు ఐదు వికెట్ల ప్రదర్శనతో చెలరేగాడు. తద్వారా ఆస్ట్రేలియాపై వన్డేల్లో ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన తొలి జింబాబ్వే పేసర్‌గా రికార్డు నెలకొల్పాడు.అలాగే ఆస్ట్రేలియాపై వన్డేల్లో ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన రెండో జింబాబ్వే బౌలర్‌గా నిలిచాడు. అంతకుముందు స్పిన్నర్ ర్యాన్ బర్ల్ ఈ ఘనత సాధించాడు.మరో ఘనతన్యామ్హురి తాజా ప్రదర్శనతో మరో ఘనత కూడా సాధించాడు. వన్డేల్లో ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన అత్యంత పిన్న వయస్కుడైన (20 ఏళ్ల 239 రోజులు) జింబాబ్వే బౌలర్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌కు ముందు ఈ రికార్డు ల్యూక్ జోంగ్వే (20 ఏళ్ల 330 రోజులు) పేరిట ఉండేది.ఆస్ట్రేలియాపై వన్డేల్లో ఐదు వికెట్లు తీసిన అత్యంత పిన్న వయస్కుల జాబితాలో న్యామ్హురి మూడో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో పాకిస్తాన్ దిగ్గజం వసీం అక్రమ్ (18 ఏళ్ల 266 రోజులు) అగ్రస్థానంలో ఉండగా.. అదే దేశానికి చెందిన సక్లైన్ ముష్తాక్ (19 ఏళ్ల 352 రోజులు) రెండో స్థానంలో ఉన్నాడు.మ్యాచ్ విషయానికొస్తే.. న్యామ్హురి ఐదేయడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 294 పరుగులకే పరిమితమైంది. న్యామ్హురి వరుస విరామాల్లో వికెట్లు తీయడంతో ఆసీస్ 300కు పైగా స్కోర్ చేయలేకపోయింది. న్యామ్హురి తన స్పెల్‌లో కీలక వికెట్లు పడగొట్టాడు. మిచెల్ మార్ష్, జోష్ ఇంగ్లిస్, జేవియర్ బార్ట్లెట్, ఆలివర్ పీక్లతో పాటు సెంచరీ సాధించిన మ్యాట్ రెన్షాను (109) ఔట్ చేశాడు.రెన్షాతో పాటు ఆసీస్ ఇన్నింగ్స్‌లో కూపర్ కన్నోల్లీ (51) కూడా రాణించాడు. కెప్టెన్ మిచెల్ మార్ష్ (36), ఒలివర్ పీక్ (30), అలెక్స్ క్యారీ (27) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. ట్రవిస్ హెడ్ (4), జోష్ ఇంగ్లిస్ (4), జేవియర్ బార్ట్లెట్ (5) నిరాశపరిచారు. కాగా, మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం వరల్డ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా జింబాబ్వేలో పర్యటిస్తుంది.ఇదీ చదవండి: సచిన్ వరల్డ్ రికార్డును బద్దలు కొట్టిన జింబాబ్వే ప్లేయర్ -
వైభవ్ సూర్యవంశీ రోజుకు ఎంత సంపాదిస్తాడో తెలిస్తే షాకవ్వాల్సిందే..!
15 ఏళ్ల వయసులోనే ప్రపంచ క్రికెట్లో పెను సంచలనంగా మారిన టీమిండియా చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ.. డబ్బు సంపాదనలోనూ సంచలనాలు సృష్టిస్తున్నాడు. నివేదికల ప్రకారం వైభవ్ ఒక్క రోజు బ్రాండ్ ఎండార్స్మెంట్ షూట్‌కు సుమారు రూ.1.5 కోట్ల నుంచి రూ.2 కోట్ల వరకు ఛార్జ్ చేస్తున్నాడు. ఈ విషయాన్ని AMP Sports & Entertainment వ్యవస్థాపకుడు, CEO ఇంద్రనీల్ దాస్ స్వయంగా చెప్పాడు.రాబోయే రెండు మూడేళ్లలో వైభవ్ బ్రాండ్ విలువ మరింత పెరిగి, ప్రస్తుతం తీసుకుంటున్న ఫీజుకు రెట్టింపు అవుతుందని ఆయన అంచనా వేశాడు.సచిన్‌తో పోలికబ్రాండ్ విలువలో వైభవ్‌ను మార్కెట్ నిపుణులు దిగ్గజ బ్యాటర్ సచిన్ టెండూల్కర్‌తో పోలుస్తున్నారు. Houlihan Lokey IPL Valuation Study 2026 ప్రకారం, వైభవ్‌కు ఉన్న ఆకర్షణ సచిన్ స్థాయికి దగ్గరగా ఉంది. భయమెరుగని బ్యాటింగ్ శైలి వైభవ్ క్రేజ్‌ను మరింత పెంచుతుంది. కొందరు క్రికెటేతర అభిమానులు కేవలం వైభవ్ బ్యాటింగ్ చూసేందుకే స్టేడియాలకు తరలి వస్తున్నారు.13 ఏళ్లకే కోటీశ్వరుడువైభవ్ 13 ఏళ్ల వయసులోనే ఐపీఎల్లో అడుగుపెట్టి అతి పిన్న వయస్కుడైన కోటీశ్వరుడిగా నిలిచాడు. ఐపీఎల్ 2025కు ముందు రాజస్థాన్ రాయల్స్ అతడిని జట్టులోకి తీసుకుంది. తొలి సీజన్లో ఏడు మ్యాచ్‌లు ఆడిన వైభవ్, 206 స్ట్రైక్‌రేట్‌తో 252 పరుగులు చేశాడు. ఇందులో ఓ సునామీ శతకం కూడా ఉంది.రెండో సీజన్లో మరింత విధ్వంసంతన రెండో ఐపీఎల్ సీజన్లో (2026) వైభవ్ మరింత రెచ్చిపోయాడు. ఏకంగా 776 పరుగులతో టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గానిలిచాడు. అతడి స్ట్రైక్‌రేట్ ఏకంగా 237.31గా ఉంది.టీమిండియాలోనూ చోటుఐపీఎల్లో అద్బుత ప్రదర్శనల తర్వాత బీసీసీఐ కూడా వైభవ్‌పై నమ్మకం ఉంచింది. యూకే పర్యటనకు అతడిని ఎంపిక చేసింది. ఇప్పటివరకు 6 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడిన వైభవ్, ఐపీఎల్ తరహా ప్రదర్శనలు చేయనప్పటికీ.. ఓ మోస్తరు ప్రదర్శనలతో పర్వాలేదనిపించాడు. ఇదీ చదవండి: మావాడు ఇప్పటికే వైభవ్ పనిపట్టాడు.. ఇంకేం భయం?: జపాన్ కెప్టెన్ -
మయాంక్ మాయాజాలం.. పంజాబ్ టీ20 లీగ్ విజేతగా అమృత్సర్
షేర్-ఎ-పంజాబ్ టీ20 లీగ్ 2026 విజేతగా అమృత్సర్ సూర్మాస్ నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో లూధియానా లయన్స్‌పై 8 వికెట్ల తేడాతో గెలుపొంది టైటిల్‌ను కైవసం చేసుకుంది.టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న అమృత్సర్.. లూధియానా బ్యాటర్లను కట్టడి చేసింది. సూర్మాస్ బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీయడంతో లూధియానా భారీ స్కోరు చేయలేకపోయింది. ఒక దశలో లూధియానా జట్టు 86 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయింది.మయాంక్ మాయాజాలంఅమృత్సర్ బౌలర్లలో లెగ్ స్పిన్నర్ మయాంక్ మార్కండే అద్భుతంగా బౌలింగ్ చేశాడు. నాలుగు ఓవర్లలో కేవలం 17 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. అతడితో పాటు మిగతా బౌలర్లు కూడా క్రమశిక్షణతో బౌలింగ్ చేయడంతో లూధియానా జట్టు 20 ఓవర్లలో 142 పరుగులకే ఆలౌటైంది.లూధియానా ఇన్నింగ్స్‌లో అభిజిత్ గార్గ్ (37), హరీశ్ కుమార్ (22), మాధవ్ సింగ్ (21) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు.అనంతరం 143 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని అమృత్సర్ సునాయాసంగా ఛేదించింది. ఓపెనర్ సహజ్ ధవన్ (63) అజేయ అర్ద సెంచరీతో ఆ జట్టును విజయతీరాలకు చేర్చాడు. అతడికి రాహుల్ కుమార్ (42 నాటౌట్), కెప్టెన్ నమన్ ధిర్ (29) సహకరించారు. టోర్నీ ఆధ్యాంతం అద్భుతంగా రాణించిన నమన్ ధిర్కు (10 మ్యాచ్‌ల్లో 655 పరుగులు, 2 సెంచరీలు) ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అవార్డు లభించింది. చదవండి: ట్రిపుల్ సెంచరీతో కదంతొక్కిన పాక్ టీ20 కెప్టెన్ -
మహిళా ఆసియా కప్-2026 ఫైనల్లో భారత్ గెలుపు.. ట్రోఫీ వేళ ట్విస్ట్!
దుబాయ్: మహిళల ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంకపై 72 పరుగుల తేడాతో విజయం సాధించిన భారత మహిళల జట్టు.. ట్రోఫీ అందుకునే సమయంలో మాత్రం వేదిక వద్దకు రాలేదు. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడు, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చీఫ్ మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకునేందుకు భారత జట్టు నిరాకరించినట్లు సమాచారం. దీంతో గతేడాది పురుషుల ఆసియా కప్ ఫైనల్లో చోటుచేసుకున్న పరిస్థితే మరోసారి కనిపించింది.అయితే, హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు మ్యాచ్ అనంతరం ఎప్పటిలాగే సంబరాలు చేసుకుంది. ప్రసార సంస్థకు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చింది. సాధారణంగా మ్యాచ్ ముగిసిన 15–20 నిమిషాల్లో బహుమతుల ప్రదాన కార్యక్రమం ప్రారంభమవుతుంది. అయితే ఈసారి గంటకుపైగా ఆలస్యమైంది. ఈ సమయంలో బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ఆటగాళ్లతో మైదానం పక్కన మాట్లాడారు. డ్రెస్సింగ్ రూమ్‌లోనే జట్టు సభ్యులకు పతకాలు అందజేసినట్లు సమాచారం.ఏసీసీ అధ్యక్షుడి హోదాలో మొహ్సిన్ నఖ్వీ ట్రోఫీని అందజేసేందుకు స్టేడియానికి వచ్చినట్లు పాకిస్థాన్ మీడియా కథనాలు పేర్కొన్నాయి. రన్నరప్‌గా నిలిచిన శ్రీలంక కెప్టెన్ చమరి ఆటపత్తుకు ఆయన బహుమతి చెక్కును అందజేశారు. అయితే భారత జట్టు, కోచ్, అధికారులు ట్రోఫీ ప్రధాన వేదిక వద్ద కనిపించలేదు. దీంతో భారత జట్టు ట్రోఫీని తీసుకోకపోతే దానిని మరోసారి ఏసీసీ కార్యాలయానికి తీసుకెళ్లే అవకాశం ఉందని పాకిస్థాన్ మీడియా పేర్కొంది.గతేడాది పురుషుల ఆసియా కప్ ఫైనల్లోనూ ఇదే తరహా పరిణామం చోటుచేసుకుంది. భారత్ టైటిల్ గెలిచిన తర్వాత మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ అందుకునేందుకు భారత జట్టు నిరాకరించింది. మరో ఏసీసీ లేదా ఐసీసీ అధికారి చేతుల మీదుగా ట్రోఫీ అందజేయాలని కోరింది. అయితే నఖ్వీ అందుకు అంగీకరించకపోవడంతో అప్పట్లో బహుమతి ప్రదాన కార్యక్రమం వద్ద ప్రతిష్టంభన ఏర్పడింది. చివరకు ఆయన ట్రోఫీని తీసుకుని ఏసీసీ కార్యాలయానికి వెళ్లారు.పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్–పాకిస్థాన్ సంబంధాలు ఉద్రిక్తంగా ఉన్న సమయంలో గతేడాది ఆసియా కప్‌లో భారత జట్టు పాకిస్థాన్‌తో మ్యాచ్‌ల సందర్భంగా సంప్రదాయ హ్యాండ్‌షేక్‌కు దూరంగా ఉంది. ఈ నేపథ్యంలోనే నఖ్వీ నుంచి ట్రోఫీ తీసుకోవడాన్ని భారత జట్టు వ్యతిరేకించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. నఖ్వీ పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల మంత్రిగా చేసిన గత వ్యాఖ్యలు కూడా దీనికి కారణమని కథనాలు పేర్కొన్నాయి. తాజాగా మహిళల ఆసియా కప్ ఫైనల్లోనూ దాదాపు అదే పరిస్థితి కనిపించడంతో ట్రోఫీ ప్రదానంపై మరోసారి చర్చ మొదలైంది.ఇదీ చదవండి: పోలాండ్ సరిహద్దుకు 2 కి.మీ. దూరంలో రష్యా డ్రోన్ దాడి -
ఆఫ్ఘన్‌తో తొలి టీ20.. తీవ్ర ఉత్కంఠ
భారత్-ఆఫ్ఘనిస్తాన్ మధ్య రేపు న్యూఢిల్లీ వేదికగా తొలి టీ20 జరుగనున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌కు ముందు క్రికెట్ అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. రేపటి మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది . దీంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.ఢిల్లీలో గత రెండు వారాలుగా అడపాదడపా వర్షాలు కురుస్తున్నాయి. అక్యూ వెదర్ అంచనాల ప్రకారం రేపు వర్షం పడే అవకాశం 64 శాతంగా ఉంది. ముఖ్యంగా మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో భారీ వర్ష సూచన ఉంది. మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.అక్యూ వెదర్ నివేదిక ప్రకారం మ్యాచ్ పూర్తిగా రద్దయ్యే ప్రమాదం లేకపోయినా, ఓవర్ల కోత తప్పకపోవచ్చని తెలుస్తోంది.శ్రేయస్‌కు తొలి పరీక్షఈ సిరీస్ శ్రేయస్ అయ్యర్‌కు ప్రత్యేకమైనది. భారత టీ20 కెప్టెన్‌గా భారత్‌లో అతడికి ఇదే తొలి సిరీస్. ఇప్పటికే ఇంగ్లండ్, జింబాబ్వే పర్యటనల్లో టీమిండియాకు నాయకత్వం వహించిన అయ్యర్.. తొలిసారి స్వదేశంలో భారత జట్టును నడిపించనున్నాడు. ఆఫ్ఘనిస్తాన్ అధికారికంగా ఆతిథ్య జట్టు అయినప్పటికీ, మ్యాచ్‌లు భారత్‌లో జరుగుతున్న విషయం తెలిసిందే.మిశ్రమ ఫలితాలుఇటీవల టీ20 క్రికెట్లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. యూకే పర్యటనలో భాగంగా ఐర్లాండ్‌తో జరిగిన రెండు టీ20ల సిరీస్‌ను 0-2తో కోల్పోయిన టీమిండియా, ఆతర్వాత ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను కూడా 0-4తో కోల్పోయింది. అయితే జింబాబ్వేతో జరిగిన మూడు టీ20ల సిరీస్‌లో భారత్ అద్భుతంగా పుంజుకొని, 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది.ఇదీ చదవండి: ఇషాన్ గాయంపై అప్డేట్ ఇచ్చిన శ్రేయస్ -
టీమిండియా షెడ్యూల్లో మార్పులు
2026 ఏషియన్ గేమ్స్‌లో భారత పురుషుల క్రికెట్ జట్టు మ్యాచ్‌ల సమయాల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. పురుషుల నాకౌట్ మ్యాచ్‌ల్లో కొన్ని మ్యాచ్‌లను అరగంట ముందుకు మార్చారు. రివైజ్డ్ షెడ్యూల్ ప్రకారం, మధ్యాహ్నం జరగాల్సిన మ్యాచ్‌లు ఇకపై స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభమవుతాయి. గతంలో ఈ మ్యాచ్‌లు మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండింది. మహిళల క్రికెట్ మ్యాచ్‌ల సమయాల్లో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు.సెప్టెంబర్ 28న తొలి మ్యాచ్ఐచి-నగోయా (జపాన్) వేదికగా జరిగే ఏషియన్ గేమ్స్‌లో భారత పురుషుల జట్టుకు నేరుగా క్వార్టర్ ఫైనల్ బెర్త్ లభించింది. సెప్టెంబర్ 28న జరిగే రెండో క్వార్టర్ ఫైనల్లో భారత్ బరిలోకి దిగనుంది.ఈ మ్యాచ్ జపాన్ స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభమవుతుంది. భారత్ కంటే జపాన్ 3 గంటల 30 నిమిషాలు ముందుండటంతో.. భారత కాలమానం ప్రకారం మ్యాచ్ రాత్రి 10 గంటలకు మొదలవుతుంది.అలాగే అక్టోబర్ 1న జరిగే రెండో సెమీఫైనల్, అక్టోబర్ 3న జరిగే గోల్డ్ మెడల్ మ్యాచ్ కూడా మధ్యాహ్నం 1.30 గంటలకే ప్రారంభం కానున్నాయి. భారత్ సెమీఫైనల్‌కు చేరితే ఆ మ్యాచ్ కూడా భారత కాలమానం ప్రకారం రాత్రి 10 గంటలకు ప్రారంభమవుతుంది.జపాన్‌లో ముందుగానే చీకటి పడటమే కారణంమ్యాచ్ల సమయాలను మార్చడానికి ప్రధాన కారణం జపాన్‌లో త్వరగా చీకటి పడటమేనని సమాచారం. మ్యాచ్‌లు జరిగే వేదికలో ఫ్లడ్‌లైట్లు లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.పురుషుల మ్యాచ్‌లు సాధారణంగా ఎక్కువ సమయం తీసుకునే అవకాశం ఉండటంతో.. చీకటి పడేలోపు మ్యాచ్‌లను పూర్తి చేసేందుకు ఈ మేరకు నిర్ణయించినట్లు సమాచారం.ముందుగా మరో మ్యాచ్ఏషియన్ గేమ్స్‌లో తమ తొలి అధికారిక పోటీకి ముందు భారత్ ఆతిథ్య జట్టు జపాన్‌తో ఓ టీ20 మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ సెప్టెంబర్ 22న సానో ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం ఉదయం 9.30 గంటలకు ప్రారంభమవుతుంది.ఇదీ చదవండి: ఇషాన్ గాయంపై అప్డేట్ ఇచ్చిన శ్రేయస్ -
ఇంగ్లండ్‌దే మూడో టెస్టు.. పాకిస్తాన్ క్లీన్‌స్వీప్
ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో పాకిస్తాన్ వైట్‌వాష్‌కు గురైంది. బర్మింగ్హమ్ వేదికగా జరిగిన మూడో టెస్టులో పాకిస్తాన్‌పై 8 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ ఘన విజయాన్ని అందుకుంది. 130 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఇంగ్లండ్ 24.2 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్లిద్దరు డకౌట్ అయినప్పటికీ, జోర్డాన్ కాక్స్ (59 నాటౌట్), కెప్టెన్ జో రూట్ (62 నాటౌట్) అజేయ అర్థసెంచరీలు సాధించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు.పాక్ బౌలర్లలో మహ్మద్ అబ్బాస్ రెండు వికెట్లు పడగొట్టాడు. అంతకముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 453 పరుగులకు ఆలౌట్ అయింది. హ్యారీ బ్రూక్ (75), జేమీ స్మిత్ (69), డాన్ లారెన్స్ (65), ఎమిలో గే (60), ఓలీ రాబిన్సన్ (50) అర్థసెంచరీలు సాధించారు. అయితే ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 133 పరుగులకే కుప్పకూలింది. జోష్ టంగ్ 4 వికెట్లు తీయగా, రాబిన్సన్, జోఫ్రా ఆర్చర్లు చెరో 3 వికెట్లు పడగొట్టారు. ఫాలోఆన్ ఆడిన పాకిస్తాన్ రెండో ఇన్నింగ్స్‌లో 449 పరుగులకు ఆలౌటైంది. షాన్ మసూద్ (95), బాబర్ ఆజం (76), రజాఉల్లాహ్ (81), అజన్ అవైస్ (59) అర్థసెంచరీలు సాధించారు. డాన్ లారెన్స్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలుచుకున్నాడు.సంక్షిప్త స్కోర్లుపాకిస్తాన్ 133 & 449ఇంగ్లండ్ 453 & 130/2👉టెస్టుల్లో ఇంగ్లండ్ చేతిలో పాకిస్తాన్ వైట్‌వాష్‌కు గురవ్వడం ఇది రెండోసారి. 2022-23లో పాక్ గడ్డపై జరిగిన మూడు టెస్టుల సిరీస్‌ను కూడా ఇంగ్లండ్ 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. ఇక ఇంగ్లండ్‌కు టెస్టుల్లో ప్రత్యర్థిపై ఇది 15వ క్లీన్‌స్వీప్. అదే సమయంలో పాకిస్తాన్ టెస్టుల్లో వైట్‌వాష్‌కు గురవ్వడం ఇది పదకొండోసారి.👉ఇంగ్లండ్ గడ్డపై ఒక మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో ఒక్క సెంచరీ నమోదు కాకపోవడం ఇది రెండోసారి కాగా, గతంలో 1888 యాషెస్ సిరీస్‌లోనూ ఒక్క సెంచరీ నమోదు కాలేదు. ఇక ఓవరాల్‌గా టెస్టు క్రికెట్లో ఒక టెస్టు సిరీస్‌లో ఒక్క సెంచరీ కూడా నమోదు కాకపోవడం ఇది ఎనిమిదోసారి.3-0 SERIES SWEEP! 💪 pic.twitter.com/TTCM4ZHvWb— England Cricket (@englandcricket) September 12, 2026ఇదీ చదవండి: #80s Trend: టీమిండియా క్రికెటర్లకు బీసీసీఐ సర్ప్రైజ్! -
#80s Trend: టీమిండియా క్రికెటర్లకు బీసీసీఐ సర్ప్రైజ్!
భారత్‌ను ప్రస్తుతం ‘80s’ ట్రెండ్ షేక్ చేస్తోంది. ఇన్స్టాగ్రామ్, ట్విటర్, ఫేస్బుక్, వాట్సాప్ ఇలా ఏ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ చూసుకున్నా ‘80s’ ట్రెండ్ పిచ్చ వైరల్‌గా మారిపోయింది. సెలెబ్రిటీల నుంచి సామాన్యుల దాకా తమకు నచ్చిన ఫొటోను చాట్ జీపీటీకి ఇచ్చి ప్రాంప్ట్ సహాయంతో ‘80s’ ట్రెండ్ ఫొటోలను సృష్టించి స్టేటస్‌లుగా పెట్టేస్తున్నారు. ఇప్పుడు ఇదే ‘80s’ ట్రెండ్ టీమిండియా క్రికెట్‌కు కూడా పాకింది. తాజాగా బీసీసీఐ తన అధికారిక ఎక్స్ ఖాతాలో టీమిండియా క్రికెటర్ల 80s ట్రెండ్ ఫొటోలను పంచుకుంది. అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్ నేపథ్యంలో రేపటి నుంచి తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్న టీమిండియా క్రికెటర్లకు వారి ‘80s’ ఫొటోలను చూపించింది. దీనిపై ఒక్కో క్రికెటర్ ఒక్కోలా రియాక్ట్ అవ్వడం కనిపించింది. Photo Credit: BCCI Twitterముఖ్యంగా అక్షర్ పటేల్, ఇషాన్ కిషన్, అభిషేక్ వర్మ, వైభవ్ సూర్యవంశీ, అర్షదీప్ సింగ్‌లు తమ ‘80s’ ఫొటోలు చూసుకొని తెగ మురిసిపోయారు. అభిషేక్ శర్మ అయితే అచ్చం హాలీవుడ్ హీరోని తలపించే విధంగా ఉన్నాడంటూ ఇషాన్ కిషన్ ఆటపట్టించడం విశేషం. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్. బుమ్రా, సంజూ శాంసన్ ఇలా అందరు క్రికెటర్లు తమ ఫొటోలను గుర్తుపట్టగా.. రవి బిష్ణోయి, యష్ ఠాకూర్లు మాత్రం తమ ఫొటోలను పోల్చుకోలేకపోయారు. Photo Credit: BCCI Twitterమొదట శివమ్ దూబే తన ఫొటో బదులు యశ్ ఠాకూర్‌ను చూపించాడు. అయితే వెంటనే తన ఫొటోను చూపిస్తూ.. ఇందాకా చూపించింది యశ్ ఠాకూర్‌ది అని పేర్కొన్నాడు. ఇక బుమ్రా మాత్రం తన ఫొటోను చూసుకోవడానికి ఇష్టపడలేదు. 2 నిమిషాల 40 సెకన్ల నిడివి ఉన్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను తెగ ఊపేస్తోంది. వీలైతే మీరు ఒక లుక్కేయండి.Photo Credit: BCCI Twitterఇక రేపు (ఆదివారం) భారత్, అఫ్గానిస్తాన్‌ల మధ్య తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. జట్టు కూర్పు ఇప్పటికే ఒక అంచనాకు వచ్చినప్పటికీ, ఓపెనింగ్ విషయంలోనే మేనేజ్మెంట్ ఎటూ తేల్చుకోలేకపోతుంది. ఓపెనింగ్‌లో వైభవ్ లేదా శాంసన్‌లలో ఎవరిని ఆడిస్తారనేది చూడాలి. విశ్వసనీయ సమాచారం మేరకు వైభవ్‌ను బెంచ్‌కు పరిమితం చేసి శాంసన్‌కు అవకాశమివ్వనున్నట్లు తెలుస్తోంది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో అన్ని మ్యాచ్‌లకు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక కానుంది.Vintage vibes. Priceless reactions. 😂🎥 #TeamIndia takes on the 1980s trend 😉 - By @RajalArora #AFGvIND pic.twitter.com/nSaClHHdyn— BCCI (@BCCI) September 12, 2026ఇదీ చదవండి: ఆసియా గేమ్స్‌కు కొత్త రంగు జెర్సీలో టీమిండియా! -
ఆసియా గేమ్స్‌కు కొత్త రంగు జెర్సీలో టీమిండియా!
సెప్టెంబర్ 19 నుంచి అధికారికంగా మొదలుకానున్న ఆసియా క్రీడలకు టీమిండియా కొత్త జెర్సీతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. సంప్రదాయ నీలం రంగు (Blue) జెర్సీకి బదులు నారింజ రంగు (Orange) జెర్సీ ధరించి టీమిండియా మ్యాచ్‌లు ఆడనున్నట్లు సమాచారం. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన విడుదల కానప్పటికీ, ఆసియా క్రీడలకు మాత్రం టీమిండియా జెర్సీలో మార్పు ఖాయమన్న విషయం స్పష్టమవుతోంది. అయితే ఇటీవలే భారత హాకీ జట్టు మాత్రం కాషాయ రంగు జెర్సీ నుంచి బ్లూ జెర్సీలోకి మారిన సంగతి తెలిసిందే. రాబోయే ఆసియా క్రీడలకు కూడా మన హాకీ జట్టు ఆటగాళ్లు నీలం రంగు జెర్సీలతోనే బరిలోకి దిగనున్నట్లు ఇప్పటికే హాకీ ఇండియా స్పష్టం చేసింది. ఇప్పటికే వైభవ్ సూర్యవంశీ, సంజూ శాంసన్‌లు కాషాయ రంగు జెర్సీ ధరించిన ఫొటోలు (ఏఐ) సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇందులో నిజమెంత అనేది పక్కనబెడితే.. అభిమానులు మాత్రం నారింజ రంగు వద్దని, అచ్చొచ్చిన నీలం రంగు జెర్సీతోనే ఆసియా గేమ్స్‌లో పాల్గొనాలని కామెంట్లు చేశారు. కొందరు మాత్రం నారింజ, నీలం రంగులు కలిసిన జెర్సీని ధరిస్తే బాగుంటుందని సలహాలు ఇస్తున్నారు.ఇక జపాన్‌లోని నగోయా వేదికగా సెప్టెంబర్ 10 నుంచే ఆసియా గేమ్స్ ప్రారంభమైనప్పటికీ అధికారికంగా మాత్రం సెప్టెంబర్ 19 నుంచి మొదలుకానున్నాయి. మొత్తం 43 క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించనున్నారు. ఇక పురుషుల క్రికెట్ సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 3 మధ్య, మహిళల క్రికెట్ సెప్టెంబర్ 17 నుంచి 22 వరకు జరగనున్నాయి. టాప్-10లో ఉండడంతో భారత్, శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్ నేరుగా క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లు ఆడనున్నాయి. భారత్ తమ తొలి మ్యాచ్‌ను సెప్టెంబర్ 28న ఆడనుంది. ఇక మహిళల క్రికెట్లో మాత్రం నేరుగా క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లు జరగనుండగా, సెప్టెంబర్ 18న జరగనున్న క్వార్టర్ ఫైనల్లో జపాన్‌తో భారత్ తలపడనుంది.🚨 NEW JERSEY FOR TEAM INDIA IN ASIAN GAMES 2026 !🧡🇮🇳- According to reports, Team India are set to move away from their iconic blue jersey and feature a new orange kit at the upcoming Asian Games. [News Arena] pic.twitter.com/3NpG2VXkDT— lndian Sports Network (@IS_Netwrk29) September 12, 2026చదవండి: యూఏఈ క్రికెటర్‌పై నేపాల్ ఆటగాళ్ల దౌర్జన్యం! -
యూఏఈ క్రికెటర్‌పై నేపాల్ ఆటగాళ్ల దౌర్జన్యం!
ఏసీసీ మెన్స్ ప్రీమియర్ కప్‌లో నేపాల్, యూఏఈ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ రసాభాసగా మారింది. ఆటగాళ్ల మధ్య జరిగిన మాటల యుద్ధం ఘర్షణకు దారి తీసింది. కౌలలంపూర్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో యూఏఈ 314 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తున్న క్రమంలో ఇది చోటుచేసుకుంది. విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స్ ఆరో ఓవర్ సందీప్ లమిచానే వేశాడు. అయితే ఓవర్ ప్రారంభానికి ముందే నాటకీయ పరిణామం చోటుచేసుకుంది. స్ట్రైక్‌లో ఉన్న తనిష్ సూరిని ఉద్దేశించి వికెట్ల వెనుక కీపింగ్ చేస్తున్న ఆసిఫ్ షేక్ చికాకు తెప్పించేలా వ్యాఖ్యలు చేయడం స్టంప్ మైక్‌లో రికార్డయింది. దీంతో చిర్రెత్తుకొచ్చిన తనిష్ సూరి ఆసిఫ్ షేక్‌తో మాటల యుద్ధానికి దిగాడు. ఇది గమనించిన సందీప్ లమిచానే ఒక్కసారిగా తనిష్ సూరివైపు దూసుకొచ్చాడు.అప్పటికే అక్కడికి చేరుకున్న మాజీ కెప్టెన్ రోహిత్ పౌడెల్, అర్జున్ కుమాల్లు తనిష్‌ను పక్కకు నెట్టేశారు. చూస్తుండగానే గొడవ పెద్దది కావడంతో తనిష్ లెగ్ అంపైర్‌కు ఫిర్యాదు చేశాడు. దీంతో అంపైర్లు విశ్వనాథన్ కాళిదాస్, తబారక్ దార్ జోక్యం చేసుకొని ఆటగాళ్లకు సర్దిచెప్పారు. దీంతో వివాదం ముగిసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఇక మ్యాచ్ విషయానికొస్తే 44 పరుగుల తేడాతో యూఏఈని చిత్తు చేసిన నేపాల్ టైటిల్‌ను గెలుచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 313 పరుగులు చేసింది. వికెట్ కీపర్ ఆసిఫ్ షేక్ (102) సెంచరీతో మెరవగా, గుల్సన్ ఝా (52) అర్థసెంచరీ సాధించాడు. యూఏఈ బౌలర్లలో ఇబ్రార్ అహ్మద్ 4 వికెట్లు తీయగా, కుజైమా తన్వీర్ రెండు వికెట్లు పడగొట్టాడు.అనంతరం బ్యాటింగ్ చేసిన యూఏఈ జట్టు 49.1 ఓవర్లలో 269 పరుగులకు ఆలౌటైంది. రాహుల్ చోప్రా (100 నాటౌట్) సెంచరీ చేయగా, షోయబ్ ఖాన్ (52) హాఫ్ సెంచరీ సాధించాడు. నేపాల్ బౌలర్లలో కరన్ కేసీ 3 వికెట్లు తీయగా, లలిత్ రజ్బన్షీ రెండు వికెట్లు పడగొట్టాడు.🚨 This is the El Clásico of Associate Nations, baby! 🥶 Another heated argument between Nepal and UAE in the final of the ACC Men’s Premier Cup 2026! pic.twitter.com/Rd0QAPca78— Sports Janta Party (@SportJantaParty) September 12, 2026 ఇదీ చదవండి: ఫుట్‌బాల్ చరిత్రలో విచిత్రమైన గోల్ అంటే ఇదే! -
ఏసీసీ ప్రీమియర్ కప్ విజేతగా నేపాల్
ఏసీసీ పురుషుల ప్రీమియర్ కప్ 2026 విజేతగా నేపాల్ జట్టు అవతరించింది. కౌలాలంపూర్ వేదికగా జరిగిన ఫైనల్లో ఈ జట్టు యూఏఈపై 44 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి, 2027 ఆసియా కప్‌కు అర్హత సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్, ఓపెనర్ ఆసిఫ్ షేక్ (102) సెంచరీతో సత్తా చాటడంతో నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 313 పరుగులు చేసింది.నేపాల్ ఇన్నింగ్స్‌లో గుల్సన్ ఝా (52) అర్ద సెంచరీతో రాణించగా.. మరో ఓపెనర్ అర్జున్ కుమాల్ (43), రోహిత్ పౌడెల్ (40) కూడా ఓ మోస్తరు స్కోర్లతో పర్వాలేదనిపించారు. యూఏఈ బౌలర్లలో ఇబ్రార్ అహ్మద్ 4 వికెట్లతో రాణించగా.. ఖుజైమా తన్వీర్ 2, హైదర్ అలీ, అదీబ్ ఉస్మానీ తలో వికెట్ తీశారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనలో యూఏఈ పెద్దగా పోరాడలేకపోయింది. 49.1 ఓవర్లలో 269 పరుగులకే ఆలౌటైంది. మిడిలార్డర్ బ్యాటర్ రాహుల్ చోప్రా చివరి వరకు క్రీజ్‌లో నిలబడి సెంచరీ (100 నాటౌట్) పూర్తి చేసుకున్నాడు. మధ్యలో రాహుల్ సోహైబ్ ఖాన్ (52), ఖుజైమా తన్వీర్ (15)తో కలిసి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పి గెలుపుపై ఆశలు రేకెత్తించాడు. అయితే వీరితో పాటు ఆతర్వాత వచ్చిన ఆటగాళ్లు కూడా తర్వాత పెవిలియన్ బాట పట్టడంతో యూఏఈ ఓటమిపాలైంది. ఈ జట్టు పతనంలో నేపాల్ బౌలర్లంతా తలో చేయి వేశారు. కరణ్ 3 వికెట్లతో సత్తా చాటగా.. లలిత్ రాజ్బంషి 2, సందీప్ లామిచ్చేన్, దీపేంద్ర సింగ్, రోహిత్ పౌడెల్, గుల్సన్ ఝా, బషీర్ అహ్మద్ తలో వికెట్ తీశారు.కాగా, ఈ టోర్నీలో యూఏఈ, నేపాల్‌తో పాటు ఒమన్, కువైట్, ఖతార్, సింగపూర్, హాంగ్‌కాంగ్, మలేషియా, సౌదీ అరేబియా, బహ్రెయిన్ జటుల పోటీ పడ్డాయి. ఈ టోర్నీ తొలి ఎడిషన్ 2023లో జరగ్గా, అప్పుడు కూడా నేపాలే విజేతగా అవతరించింది. 2024 ఎడిషన్‌లో యూఏఈ ఛాంపియన్‌గా నిలిచింది.ఇదీ చదవండి: క్రికెటర్ శ్రీశాంత్ ఇంట తీవ్ర విషాదం -
రేపు ఫైనల్.. ఎనిమిదో టైటిల్‌పై కన్నేసిన భారత్
మహిళల ఆసియా కప్ టోర్నీ చివరి అంకానికి చేరుకుంది. ఆదివారం జరగనున్న ప్రతిష్టాత్మక ఫైనల్లో భారత్, శ్రీలంక జట్లు తలపడనున్నాయి. రికార్డుస్థాయిలో ఇప్పటివరకు ఏడుసార్లు ఆసియా కప్‌ను కైవసం చేసుకున్న భారత మహిళల జట్టు ఎనిమిదోసారి టైటిల్‌ను అందుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. ఓపెనర్ షెఫాలీ వర్మ (168 పరుగులు, రెండు ఫిఫ్టీలు) భీకర ఫామ్‌లో ఉండగా, ఓపెనర్ స్మృతి మంధాన (154 పరుగులు) కూడా మంచి ఫామ్‌లో ఉంది. ఆమె ఖాతాలో ఒక సెంచరీ కూడా ఉండడం విశేషం. అయితే వీరిద్దరు మినహా మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించకపోవడం జట్టుకు మైనస్ అని చెప్పొచ్చు. ఇక బౌలింగ్‌లో ఆల్‌రౌండర్ దీప్తి శర్మ (11 వికెట్లు) లంక కెప్టెన్ చమేరీ ఆటపట్టుతో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో కొనసాగుతండగా, తెలుగుతేజం శ్రీచరణి కూడా 8 వికెట్లతో సూపర్ ఫామ్‌లో ఉంది. ఈ నలుగురికి తోడు కెప్టెన్ హర్మన్‌ప్రీత్, ప్రేమ రావత్ కూడా రాణిస్తే జట్టుకు తిరుగుండదు. మరోవైపు లంక బ్యాటింగ్‌లో హర్షితా సమరవిక్రమ (4 ఇన్నింగ్స్‌లు కలిపి 89 పరుగులు), నిలక్షిక సిల్వ (4 ఇన్నింగ్స్‌లో 86 పరుగులు)తో పాటు కవిషా దిల్హరీ కీలకం కానున్నారు. పాక్‌తో సెమీస్‌లో 33 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన లంక ఫైనల్‌కు చేరడం కష్టమే అనిపించింది. ఈ దశలో హర్షితా, కవిషా, నిలక్షికలు సాధికారిక బ్యాటింగ్‌తో జట్టును గెలిపించారు.2024 సీజన్ మహిళల ఆసియా కప్‌ను శ్రీలంక కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆనాటి ఫైనల్లో భారత జట్టును 8 వికెట్ల తేడాతో చిత్తు చేసిన శ్రీలంక టైటిల్‌ను అందుకుంది. భారత్ విధించిన 166 పరుగుల లక్ష్యాన్ని శ్రీలంక కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ చమేరీ ఆటపట్టు (61), హర్షిత సమరవిక్రమ (69 నాటౌట్) 87 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి జట్టును గెలిపించారు. ఈసారి ఫైనల్ కూడా శ్రీలంకతో జరగనున్న నేపథ్యంలో హర్మన్‌సేన 2024 నాటి ఫైనల్‌కు బదులు తీర్చుకోవడంతో పాటు ఎనిమిదోసారి ఆసియాకప్‌ను కైవసం చూసుకుంటుందేమో చూడాలి. ముఖాముఖి పోరులో ఇరుజట్లు ఇప్పటివరకు 29 సార్లు తలపడితే.. ఇందులో 23 సార్లు భారత్ గెలిస్తే, ఐదుసార్లు లంక విజయాన్ని అందుకుంది. మరో మ్యాచ్ ఫలితం రాలేదు.Read: అల్కరాజ్ను ఓడించినోడు ఫైనల్‌కు; 23 ఏళ్ల రికార్డు బద్దలయ్యేనా? -
కీలక పదవి కోసం బీసీసీఐకి దొరకని అభ్యర్ది.. ఏడాదిగా గాలింపు
ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డు అయిన బీసీసీఐకి ఓ కీలక పదవి కోసం సరైన వ్యక్తి దొరకడం లేదు. బెంగళూరు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో హెడ్-స్పోర్ట్స్ సైన్స్ అండ్ మెడిసిన్ పోస్ట్ కోసం భారత క్రికెట్ బోర్డు ఏడాదిగా అభ్యర్ది కోసం గాలిస్తూనే ఉంది. తాజాగా బోర్డు మరోసారి సదరు పోస్ట్ కోసం దరఖాస్తులు ఆహ్వానించింది.నితిన్ పటేల్ 2025 మార్చిలో రాజీనామా చేసినప్పటికీ నుంచి ఈ పదవి ఖాళీగా ఉంది. అతడు దాదాపు మూడేళ్లు సేవలు అందించిన తర్వాత బాధ్యతల నుంచి తప్పుకున్నాడు.నితిన్ పటేల్ గతంలో జస్ప్రీత్ బుమ్రా, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, మహ్మద్ షమీల రిహాబిలిటేషన్‌ను పర్యవేక్షించి 2023 వన్డే ప్రపంచకప్‌కు వారు సిద్ధం కావడంలో కీలక పాత్ర పోషించాడు.అర్హతలుఈ పోస్టుకు దరఖాస్తు చేసుకునే వ్యక్తికి స్పోర్ట్స్ సైన్స్ లేదా సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ ఉండాలి. డాక్టరేట్ ఉంటే అదనపు అర్హతగా పరిగణిస్తారు.అలాగే ప్రొఫెషనల్ లేదా ఒలింపిక్ క్రీడల్లో మల్టీ డిసిప్లినరీ పనితీరు బృందాలను నిర్వహించిన కనీసం ఐదేళ్ల వ్యూహాత్మక నాయకత్వ అనుభవం ఉండాలి. అభ్యర్థి వయసు 60 ఏళ్లలోపు ఉండాలి.దరఖాస్తుదారులు సెప్టెంబర్ 30 సాయంత్రం 5 గంటల్లోపు ఆన్లైన్లో అప్లై చేయాలి. ఎంపికైన అభ్యర్థులను వ్యక్తిగత ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఈ అధికారి నేరుగా CoE హెడ్, మాజీ భారత బ్యాటర్ వీవీఎస్ లక్ష్మణ్‌కు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.చదవండి: మరో 3 రోజుల్లో సిరీస్.. అంతలోనే టీమిండియా కీలక సభ్యుడి రాజీనామా! -
'అతడో క్రికెట్ పిచ్చోడు; ద్రవిడ్ యజమానిలా ఫీలవుతున్నాడు'
భారత దిగ్గజ క్రికెటర్, మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్ ప్రస్తుతం యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్ (ఈటీపీఎల్)లో డబ్లిన్ గార్డియన్స్‌కు యజమానిగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ జట్టుకు కెప్టెన్‌గా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఉండగా, విక్రమ్ రాథోర్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ద్రవిడ్ గురించి కోచ్ విక్రమ్ రాథోర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గతంలో బ్యాటర్‌గా, కోచ్‌గా సేవలందించిన రాహుల్ ద్రవిడ్ ఇప్పుడు ఒక జట్టుకు యజమానిలా ఫీలవుతున్నట్లు పేర్కొన్నాడు. ఆయన మాట్లాడుతూ.. "రాహుల్ యజమానిలా ప్రవర్తిస్తున్నాడు. అంటే నా ఉద్దేశంలో ఒక జట్టు యజమానిగా ఏ విషయంలోనూ ఎక్కువగా జోక్యం చేసుకోవడం లేదు. ఒక రకంగా ఇది మంచి విషయమే. కానీ అవతలి వైపు హుందాగా నడుచుకునే వ్యక్తి ఉండడం మాకు గొప్ప విషయం. ఎందుకంటే కోచ్‌గా తగినంత సమయాన్ని ఆస్వాదించాడు. కాబట్టి జట్లు ఎలా ఆడుతాయో, ఫలితాలు ఎలా వస్తాయో అతడికి బాగా తెలుసు. టోర్నీ ప్రారంభం నుంచి ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో ఒక్కటీ గెలవనప్పటికీ మమ్మల్ని తప్పుబట్టకుండా సహకరిస్తూ మద్దతుగా నిలుస్తూ వచ్చాడు. రాహుల్ లాంటి వ్యక్తి నుంచి ఏదైతే ఆశిస్తామే అదే చేస్తున్నారు." అని పేర్కొన్నాడు. Photo Credit: Twitterఅశ్విన్ వల్ల సులువైంది..ఇక కెప్టెన్‌గా అశ్విన్ ఉండడంపై కూడా విక్రమ్ రాథోర్ స్పందించాడు. "అశ్విన్ విషయానికొస్తే అతడికి క్రికెట్ గురించి మంచి పరిజ్ఞానముంది. అతడో క్రికెట్ పిచ్చోడని చెప్పొచ్చు. ప్రపంచవ్యాప్తంగా జరిగే అన్నీ క్రికెట్ మ్యాచ్‌లనూ చూస్తాడు. వివిధ దేశాల ఆటగాళ్ల గురించి అతడికి ఉన్న పరిజ్ఞానం అద్భుతం.కొన్ని సందర్భాల్లో పిచ్ పరిస్థితులు, ఆటగాళ్ల గురించి అశ్విన్‌కు ఇంత తెలుసా అని ఆశ్చర్యపోతుంటాను. అతడి లాంటి వ్యక్తి జట్టులో ఉండటం మాకు ఎంతో ఉపయోగకరం. నా కెరీర్లో ఎక్కువ సమయం భారత క్రికెట్లోనే గడిచింది. అందుకే ఇక్కడి పరిస్థితులు, ఆటగాళ్లు నాకు కొత్త. కానీ అశ్విన్ ఉండటం వల్ల నా పని చాలా సులువైంది" అని తెలిపాడు.ఇక ఈటీపీఎల్ విషయానికి వస్తే, ఇందులో పాల్గొంటున్న భారత క్రికెటర్లలో అశ్విన్ ఒక్కడే కాకుండా అజింక్య రహానే, విజయ్ శంకర్ కూడా వేర్వేరు జట్లలో భాగంగా ఉన్నారు. ఈ టీ20 లీగ్ ఆగస్టు 26న ప్రారంభమైంది. టోర్నీ ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 20న జరగనుంది.VIDEO | Former India player and batting coach Vikram Rathour has predicted a stable future for the European T20 Premier League.Rathour is head coach of the Dublin Guardians franchise in the ongoing ETPL. R Ashwin is captain of the side.“I always believe that for any league to… pic.twitter.com/hCPY4QclTu— Press Trust of India (@PTI_News) September 10, 2026చదవండి: కివీస్ టూర్లో టీమిండియా తురుపుముక్క అతడే! -
కివీస్ టూర్లో టీమిండియా తురుపుముక్క అతడే!
అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్, ఆసియా గేమ్స్ అనంతరం టీమిండియా అక్టోబర్-నవంబర్‌లో న్యూజిలాండ్‌లో పర్యటించనుంది. ఈ టూర్లో టీమిండియా రెండు టెస్టులతో పాటు ఐదు టీ20లు, ఐదు వన్డే మ్యాచ్‌లు ఆడనుంది. దాదాపు ఆరేళ్ల తర్వాత కివీస్ గడ్డపై సుదీర్ఘ సిరీస్ ఆడేందుకు రానున్న నేపథ్యంలో న్యూజిలాండ్ మాజీ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నవంబర్ 19 నుంచి మొదలుకానున్న టెస్టు సిరీస్‌లో టీమిండియా తరఫున కేఎల్ రాహుల్ కీలక బ్యాటర్ కానున్నాడని బౌల్ట్ జోస్యం చెప్పాడు. అతడి బ్యాటింగ్ స్టైల్ కివీస్ పిచ్‌లకు అనుగుణంగా ఉంటుందని, అందుకే కివీస్ టూర్లో భారత్ తురుపుముక్క అతడే అవుతాడని పేర్కొన్నాడు.బౌల్ట్ మాట్లాడుతూ.. "న్యూజిలాండ్‌లో టెస్టు క్రికెట్ ఆడేందుకు భారత్ వచ్చిన ప్రతీసారి ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది. అయితే భారత్ ఎప్పుడూ ఫిబ్రవరి-మార్చి నెలల్లోనే న్యూజిలాండ్ పర్యటనకు వచ్చేది. కానీ ఈసారి భిన్నంగా అక్టోబర్-నవంబర్‌లో మా దేశంలో పర్యటించనుంది. ఆ సమయంలో దేశంలో వాతావరణం చల్లగా ఉండడంతో బ్యాటర్లకు పరిస్థితులు క్లిష్టంగా మారుతాయి. ఇది బ్యాటర్లకు మరింత సవాల్‌గా మారనుంది. నవంబర్‌లో టెస్టు సిరీస్ మొదలుకానుండంతో, అప్పటికే వాతావరణం పూర్తిగా చల్లగా ఉంటుంది. ఇది బౌలర్లకు అనుకూలంగా మారి వికెట్‌కు సహకరించవచ్చు. అయితే గెలుపోటములు పక్కనబెడితే ఈ సిరీస్ మాత్రం అభిమానులకు ఒక మంచి ఫీస్ట్‌ను అందించనుంది అని ఖచ్చితంగా చెప్పగలను" అని చెప్పుకొచ్చాడు.ఇక గతంలో బౌల్ట్, టిమ్ సౌథీ చాలా సంవత్సరాలు న్యూజిలాండ్ తరఫున కొత్త బంతితో ప్రత్యర్థులపై విరుచుకుపడ్డారు. ఈసారి కైల్ జేమీసన్, మాట్ హెన్రీ, నాథన్ స్మిత్, విలియం ఓ రూర్కీ రూపంలో కివీస్ బౌలింగ్ లైనప్ బలంగా కనిపిస్తుంది. ఇక న్యూజిలాండ్‌లో భారత పర్యటన అక్టోబర్ 22 నుంచి ప్రారంభం కానుంది. తొలుత ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా అక్టోబర్ 22 నుంచి నవంబర్ 1 మధ్య ఐదు టీ20 మ్యాచ్‌లు, నవంబర్ 4 నుంచి 15 మధ్య ఐదు వన్డేలు, నవంబర్ 19 నుంచి 23 మధ్య తొలి టెస్టు, నవంబర్ 27 నుంచి డిసెంబర్ 1 వరకు రెండో టెస్టు జరగనుంది.Read: ‘నిజంగా ఆ క్యాచ్ పట్టి ఉంటే తల పగిలేది’ -
అరంగేట్రంలోనే పాక్ పేసర్ చెత్త రికార్డు
పాకిస్తాన్ యువ పేసర్ రజావుల్లా టెస్ట్ అరంగేట్రంలోనే చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌తో సుదీర్ఘ ఫార్మాట్లోకి ఎంట్రీ ఇచ్చిన అతడు.. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 23 ఓవర్లలో 4 వికెట్లు తీసి, 6.40 ఎకానమీతో ఏకంగా 148 పరుగులు సమర్పించుకున్నాడు.తద్వారా పాకిస్తాన్ తరఫున టెస్ట్ అరంగేట్రంలో అత్యధిక ఎకానమీతో పరుగులు సమర్పించుకున్న బౌలర్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో జాహిద్ మహ్మూద్ అగ్రస్థానంలో ఉన్నాడు. జాహిద్ 2022లో ఇంగ్లండ్‌పై తన టెస్ట్ అరంగేట్రం చేసి, ఆ మ్యాచ్‌లో ఏకంగా 7.3 ఎకానమీతో పరుగులు సమర్పించుకున్నాడు. ఓవరాల్‌గా చూసినా టెస్ట్ అరంగేట్రంలో ఇదే అత్యంత చెత్త ఎకానమీగా రికార్డుగా ఉంది.రజావుల్లా పరుగులు ధారాళంగా సమర్పించుకొని, చెత్త రికార్డును మూటగట్టుకున్నా, తన అద్భుతమైన బౌలింగ్‌తో అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో అతడు ఎమిలియో గే, జో రూట్, జేమీ స్మిత్, రాబిన్సన్ లాంటి కీలక బ్యాటర్లను ఔట్ చేశాడు. అలాగే క్రమం తప్పకుండా 145 కిమీకు పైగా వేగంతో బంతులు సంధించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ మ్యాచ్‌కు ముందు కేవలం 8 టెస్ట్‌లే ఆడినప్పటికీ, అనుభవజ్ఞుడిలా బౌలింగ్ చేశాడు. రజావుల్లా వేగం చూసి అభిమానులు పాకిస్తాన్ దిగ్గజం వకార్ యూనిస్‌ను గుర్తు చేసుకున్నారు.కాగా, రజావుల్లా తొలుత ఇంగ్లండ్ సిరీస్ కోసం ప్రకటించిన జట్టులో లేడు. పాక్ మేనేజ్మెంట్ ఏడుగురు ఆటగాళ్లను స్వదేశానికి పిలిపించుకోగా.. వారికి ప్రత్యామ్నాయంగా ప్రకటించిన ఆటగాళ్లలో అతడు ఉన్నాడు. అప్పటికే తన వేగంతో సెలెక్టర్ల దృష్టిని ఆకర్శించిన రజావుల్లా, జట్టుకు ఎంపికైన తొలిసారే తుది జట్టులో ఆడే అవకాశాన్ని దక్కించుకున్నాడు.ఇక మ్యాచ్ విషయానికొస్తే.. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను ఇప్పటికే 0-2తో కోల్పోయిన పాక్, మరో ఓటమి దిశగా పయనిస్తుంది. తొలి ఇన్నింగ్స్‌లో ఆ జట్టు 133 పరుగులకే కుప్పకూలగా.. ఇంగ్లండ్ 453 పరుగులు స్కోర్ చేసి భారీ ఆధిక్యం సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో సైతం ఖాతా తెరవకుండానే రెండు వికెట్లు కోల్పోయిన పాక్ జట్టును అజాన్ అవైస్ (43 నాటౌట్), షాన్ మసూద్ (50 నాటౌట్) ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఆ జట్టు స్కోర్ 100-2గా ఉంది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 220 పరుగులు వెనుకపడి ఉంది.చదవండి: కోహ్లి స్థానంలో బాబర్..! -
'డీఆర్ఎస్ ఏముందిలే బ్రో.. కాబోయే కెప్టెన్‌వి నువ్వు’
ఇషాన్ కిషన్ సారథ్యంలోని ఈస్ట్‌జోన్ జట్టు 13 ఏళ్ల తర్వాత దులీప్ ట్రోఫీని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. కెప్టెన్‌గా మాత్రమే గాక బ్యాటర్‌గానూ అదరగొట్టిన ఇషాన్ రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 350కి పైగా పరుగులు సాధించి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు అందుకున్నాడు. మరోవైపు సెమీస్‌లో (తొలి ఇన్నింగ్స్‌లో 92 రన్స్, రెండో ఇన్నింగ్స్‌లో 40 పరుగులు) కీలక ఇన్నింగ్స్ ఆడిన వైభవ్ సూర్యవంశీ ఫైనల్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. కానీ తనకిచ్చిన వైస్ కెప్టెన్సీ బాధ్యతలను మాత్రం వైభవ్ సమర్థంగా నిర్వహించాడు. మ్యాచ్‌లో ఇషాన్ కిషన్‌కు తలలో నాలుకలా కొనసాగుతూ వచ్చిన వైభవ్ తన కెప్టెన్ డీఆర్ఎస్ నిర్ణయాలు తీసుకోవడంలో కీలకపాత్ర పోషించాడు. అంతేకాదు సెమీస్‌లో ఇషాన్ గాయంతో కొన్ని ఓవర్ల పాటు మైదానంలోకి రాలేదు. ఆ సమయంలో వైభవ్ స్టాండిన్ కెప్టెన్‌గానూ అదరగొట్టాడు. అతడు తీసుకున్న డీఆర్ఎస్ ఫలితాలు అనుకూలంగా రావడంతో తొలి విజయం సాధించాడు. ఈ నేపథ్యంలో ఫైనల్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఈస్ట్‌జోన్ డగౌట్ వద్ద ఇషాన్ కిషన్.. వైభవ్ సూర్యవంశీని ఆకాశానికెత్తిన వీడియోను బీసీసీఐ కాస్త ఆలస్యంగా విడుదల చేసింది. ఈ వీడియోలో వైభవ్‌ను ఇషాన్ కిషన్ సరదాగా ఆటపట్టించాడు. వైభవ్ ఇంటర్వ్యూ ఇస్తున్న సమయంలో అక్కడికి వచ్చిన ఇషాన్ తన సమక్షంలో వైభవ్ మాట్లాడాలంటూ నవ్వుతూ పేర్కొన్నాడు.ఇషాన్ మాట్లాడుతూ.."డీఆర్ఎస్ విషయంలోనూ ప్రతి చోటా క్రెడిట్ అంతా వైభవ్‌కే దక్కింది. నిజానికి రివ్యూ తీసుకోవాలని నేను నిర్ణయించుకున్నా. కానీ దగ్గరికి వచ్చి చాలా కాన్ఫిడెంట్‌గా ‘రివ్యూ లే లో భాయ్’ అంటూ చెప్పాడు. అంతే.. ఇంటర్నెట్ అంతా ‘వైభవ్, వైభవ్..’ అంటూ ప్రశంసలు. కెప్టెన్‌గా డీఆర్ఎస్ తీసుకునేది నేను.. క్రెడిట్ అంతా ఈ చిచ్చర పిడుగుకే వచ్చింది" అంటూ ఇషాన్ సరదాగా వైభవ్‌ను ట్రోల్ చేశాడు.దీనికి వైభవ్ సూర్యవంశీ కూడా ఇషాన్‌కు స్టన్నింగ్ రిప్లై ఇచ్చాడు. "మీరు ఉన్నప్పుడు రివ్యూ తీసుకోమని చెప్పింది నేనే.. కానీ గాయంతో పెవిలియన్‌లో ఉన్నప్పుడు డీఆర్ఎస్ తీసుకున్నది ఎవరు? అది కూడా చెప్పండి" అంటూ వైభవ్ చురక వేశాడు. వైభవ్ సమాధానాన్ని ఇషాన్ అలా చూస్తూ ఉండిపోయాడు.‘అవును.. అప్పుడు కూడా వైభవే రివ్యూలు తీసుకున్నాడు. సక్సెస్ అయ్యాడు. అతడిలో కెప్టెన్ అయ్యే లక్షణాలు చాలా ఉన్నాయి. భవిష్యత్తులో వైభవ్ కెప్టెన్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. చూద్దాం అతడి కెరీర్ ఎలా సాగుతుందో. వైభవ్ జట్టులో ఉండటం వల్ల చాలా వరకు ఒత్తిడి తగ్గుతుంది. జట్టులోని ప్రతి ఒక్కరినీ.. అది జూనియర్ అయినా, సీనియర్ అయినా.. జాగ్రత్తగా చూసుకుంటాడు. ఓహ్.. జూనియర్ అంటే నువ్వు ఒక్కడివే కదా! సారీ.. సారీ’ అంటూ ఇషాన్ మరోసారి సరదాగా వ్యాఖ్యానించాడు.Ishan Kishan with Vaibhav Sooryavanshi. 😂❤️ pic.twitter.com/hAB688xia1— Mufaddal Vohra (@mufaddal_vohra) September 11, 2026Read: ‘వైభవ్.. నువ్వు నా కెరీర్‌కు కూడా సాటి రాలేవు’ -
‘వైభవ్.. నువ్వు నా కెరీర్‌కు కూడా సాటి రాలేవు’
ఇషాన్ కిషన్ సారథ్యంలోని ఈస్ట్‌జోన్ జట్టు 13 ఏళ్ల తర్వాత దులీప్ ట్రోఫీని గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఫైనల్లో సౌత్‌జోన్‌పై తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో ఈస్ట్‌జోన్ టైటిల్‌ను అందుకుంది. ఈస్ట్‌జోన్ టైటిల్ గెలవడంలో జట్టులోని ప్రతీ ఆటగాడిది కీలకపాత్రే అని చెప్పొచ్చు. ఓపెనర్‌గా వైభవ్ సూర్యవంశీ ధనాదన్ ఆటతీరు, అభిమన్యు ఈశ్వరన్ క్లాస్, కెప్టెన్ ఇషాన్ కిషన్ మాస్ డబుల్‌సెంచరీ, కుమార్ కుషాగ్ర సెంచరీ.. ఇక బౌలింగ్‌లో ముకేశ్‌కుమార్, మహ్మద్ షమీ.. ఇలా జట్టు మొత్తం సమిష్టి ప్రదర్శన చేయడంతోనే ఈస్ట్‌జోన్ దులీప్ ట్రోఫీని దక్కించుకుంది. మ్యాచ్ ముగిసిన అనంతరం వైభవ్ సూర్యవంశీపై టీమిండియా సీనియర్ బౌలర్ మహ్మద్ షమీ ప్రశంసలు కురిపించాడు. కనీసం నా కెరీర్ వయసుకు కూడా సాటి రాని వైభవ్ ఇవాళ స్టార్ ఆటగాడిగా మారిపోయాడని షమీ పేర్కొన్నాడు. షమీ మాట్లాడుతూ.."నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. మా జట్టులో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఉన్నాడు. నిజం చెప్పాలంటే వైభవ్ వయసు అక్షరాలా నా కెరీర్‌తో వయసుతో సమానం. అతడిలో టీనేజ్ అమాయకత్వం అలాగే ఉంది. అందరితో సరదగా జోకులు వేయడానికి ఇష్టపడతాడు. 15 ఏళ్ల వయసులో ఒక కుర్రాడు ఏం చేస్తాడో వైభవ్ అదే చేస్తున్నాడు. కానీ పరిణితితో కూడిన దృక్పథాన్ని అలవరచుకున్నాడు. ఏ విషయాన్నైనా త్వరగా గ్రహించగల శక్తి అతడి సొంతం. వైభవ్ లాంటి యువకులు ఇప్పటికే చాలా పరిణితి చెంది ఉంటారు. క్రికెట్ ఆడే స్థాయి, ఐపీఎల్, ఇతర ఒత్తిడుల కారణంగా ఎంతో పరిణితి వస్తోంది. వైభవ్ విషయంలో అది ఎప్పుడో రుజువయ్యింది. కాబట్టి అలాంటి వాళ్లకు ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వాల్సిన అవసరం లేదు." అని చెప్పుకొచ్చాడు.2011లో జన్మించిన వైభవ్ వయసుతోనే షమీ కెరీర్ వయసు సమానం కావడం విశేషం. 2011లో షమీ తొలిసారి దేశవాళీలో సీనియర్ జట్టు తరఫున అరంగేట్రం చేశాడు. ఇక 13 ఏళ్ల వయసులో ఐపీఎల్లో ఆడే అవకాశం ఎంతమంది ఆటగాళ్లకు లభిస్తుంది? కానీ వైభవ్ ఆ అవకాశాన్ని పొందడమే కాదు, తనని తాను నిరూపించుకున్నాడు. ఐపీఎల్ 2025 సీజన్లో ఏడు మ్యాచ్‌లు ఆడి, 206.56 స్ట్రైక్ రేట్‌తో 252 పరుగులు సాధించాడు. ఇక ఐపీఎల్ 2026 సీజన్లో వైభవ్ సూర్యవంశీ అత్యధిక పరుగులు (776 పరుగులు) చేసి ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు. తన ఆటతో వైభవ్ రాజస్తాన్ రాయల్స్‌ను ఒంటిచేత్తో ప్లేఆఫ్స్ చేర్చడం విశేషం.షమీ, వైభవ్ కీలకపాత్రఈస్ట్జోన్ దులీప్ ట్రోఫీని ఎగరేసుకుపోవడంలో షమీ, వైభవ్ సూర్యవంశీలు కీలకపాత్ర పోషించారు. నార్త్ ఈస్ట్‌జోన్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో విఫలమైనప్పటికీ, సెంట్రల్ జోన్‌తో జరిగిన సెమీస్‌లో వైభవ్ సూర్యవంశీ (92, 40 పరుగులు) అదరగొట్టాడు. ఇక ఫైనల్లో 44 పరుగులు చేసి జట్టుకు మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. మరోవైపు, క్వార్టర్ ఫైనల్స్‌లో షమీ పొదుపుగా బౌలింగ్ చేయగా, సెమీస్‌లో 5 వికెట్లు పడగొట్టి సెంట్రల్ జోన్ బ్యాటింగ్ లైనప్‌ను దెబ్బతీశాడు. ఇక ఫైనల్స్‌లో, అతను ఫ్లాట్ పిచ్‌పై రవిచంద్రన్ స్మరణ్ వంటి కీలక వికెట్‌తో సహా మరో 2 వికెట్లు పడగొట్టాడు.Read: ఫైనల్లో సబలెంకా; పగోడికి కూడా ఈ కష్టం రాకూడదు! -
భారత్-ఆఫ్ఘనిస్తాన్ తొలి టీ20 వాయిదా..?
భారత్-ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరగాల్సిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు అనుకోని సమస్య ఎదురైంది. సిరీస్‌లోని తొలి మ్యాచ్ వాయిదా పడే అవకాశం ఉందని సమాచారం. సెప్టెంబర్ 13న ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగాల్సిన ఈ మ్యాచ్‌ను, భద్రతా కారణాల దృష్ట్యా ఒక రోజు వెనక్కి జరిపే అంశాన్ని నిర్వాహకులు పరిశీలిస్తున్నారు.తొలి టీ20 షెడ్యూలైన సెప్టెంబర్ 13నే ఢిల్లీలో బ్రిక్స్ సదస్సు (BRICS Summit) జరుగనుంది. ఈ సదస్సు నేపథ్యంలో ఢిల్లీలో భద్రతా బలగాల మోహరింపు, వీఐపీ రాకపోకలు, ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. కాబట్టి ఆటగాళ్ల భద్రతా ఏర్పాట్లలో సమస్య ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఈ కారణంగానే మ్యాచ్‌ను ఒక రోజు వాయిదా వేసి సెప్టెంబర్ 14న నిర్వహించాలని నిర్వహకులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.అయితే దీనిపై ఇంకా తుది నిర్ణయం వెలువడలేదు. సంబంధిత అధికారుల నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.ఇదిలా ఉంటే, తొలి టీ20తో పాటు భారత్-ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ మొత్తం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలోనే జరుగనుంది. తొలి టీ20 మినహా మిగతా మ్యాచ్‌ల నిర్వహణకు ఎలాంటి అభ్యంతరాలు ఉండకపోవచ్చు. ఒకవేళ తొలి మ్యాచ్‌ను వాయిదా వేయాల్సి వస్తే.. మిగతా మ్యాచ్‌ల షెడ్యూల్‌పై కూడా ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మూడు టీ20లు సెప్టెంబర్ 13, 15, 17 తేదీల్లో జరగాల్సి ఉన్నాయి. చదవండి: ఫిన్ అలెన్‌కు జాక్‌పాట్.. అత్యంత ఖరీదైన ఆటగాడు -
దంచికొట్టిన డుప్లెసిస్.. లేటు వయసులోనూ ఇరగదీస్తున్నాడు..!
యూరపియన్ టీ20 ప్రీమియర్ లీగ్ ఆరంభ ఎడిషన్‌లో (2026) సౌతాఫ్రికా మాజీ ఆటగాడు ఫాఫ్ డుప్లెసిస్ (42) చెలరేగిపోతున్నాడు. ఈ టోర్నీలో రోట్టర్‌డామ్ డాకర్స్కు సారథ్యం వహిస్తున్న అతడు.. ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో 4 అర్ద సెంచరీల సాయంతో 300కు పైగా పరుగులు చేశాడు. తద్వారా ఈ టోర్నీలో 300 పరుగుల మార్కును దాటిన తొలి ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పాడు.గ్లాస్గో కాస్మిక్‌తో ఇవాళ జరుగుతున్న మ్యాచ్‌లో డుప్లెసిస్ మరోసారి రెచ్చిపోయాడు. కేవలం 42 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 71 పరుగులు చేశాడు. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన అతడి జట్టు 19 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. డుప్లెసిస్‌తో పాటు ఓపెనింగ్ చేసిన రస్సీ వాన్ డర్ డస్సెన్ డకౌట్ కాగా.. మైఖేల్ లెవిట్ 19, విక్రమ్‌జిత్ సింగ్ 33, హెన్రిచ్ క్లాసెన్ 30 (నాటౌట్), డేవిడ్ వీస్ 8 (నాటౌట్) పరుగులు చేశారు. ఆఖర్లో క్లాసెన్ బ్యాట్ ఝులిపించాడు (3 సిక్సర్లు). కాస్మిక్ బౌలర్లలో తైమాల్ మిల్స్ 2, డేవిడ్సన్, లివింగ్‌స్టోన్ తలో వికెట్ తీశారు. వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ను తలో 19 ఓవర్లకు కుదించారు.కాగా, ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రోట్టర్‌డామ్ డాకర్స్ నాలుగు, గ్లాస్గో కాస్మిక్ చివరి స్థానంలో ఉన్నాయి. ఎడిన్బర్గ్ కాసిల్ రాకర్స్ టాప్ ప్లేస్‌లో ఉండగా.. ఆమ్స్టర్డామ్ ఫ్లేమ్స్, బెల్ఫాస్ట్ వోల్వ్స్, డబ్లిన్ గార్డియన్స్ రెండు, మూడు, ఐదు స్థానాల్లో ఉన్నాయి. చదవండి: ఫిన్ అలెన్‌కు జాక్‌పాట్.. అత్యంత ఖరీదైన ఆటగాడు -
584 పరుగుల ఆధిక్యం.. టైటిల్‌కు అడుగు దూరంలో ఈస్ట్‌జోన్!
దులీప్ ట్రోఫీని అందుకునేందుకు ఈస్ట్‌జోన్ జట్టు అడుగుదూరంలో నిలిచింది. సౌత్‌జోన్‌తో జరుగుతున్న ఫైనల్లో నాలుగోరోజు ఆట ముగిసే సమయానికి ఈస్ట్‌జోన్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 51 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. కుమార్ కుషాగ్ర (34), ఖురేషీ (26) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం ఈస్ట్‌జోన్ 584 పరుగుల భారీ ఆధిక్యంలో కొనసాగుతోంది. గురువారం ఆటకు చివరి రోజు కావడంతో ఈస్ట్‌జోన్ గెలుపు లాంఛనమే. ఐదోరోజు ఉదయం సెషన్లో వేగంగా బ్యాటింగ్ చేసి సౌత్‌జోన్ ముంగిట 650 పరుగుల లక్ష్యాన్ని టార్గెట్‌గా ఉంచే అవకాశముంది. ఇంత టార్గెట్ ఛేదించడం అసాధ్యం కాబట్టి మ్యాచ్ డ్రా అవనుంది. దీంతో నిబంధనల ప్రకారం తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం సాధించిన ఈస్ట్‌జోన్ విజేతగా నిలవనుంది. దీంతో 13 ఏళ్ల తర్వాత దులీప్ ట్రోఫీలో ఫైనల్ చేరిన ఈస్ట్‌జోన్ చాంపియన్‌గా నిలిచేందుకు అడుగుదూరంలో ఉంది.Photo Credit: BCCI Twitterతొలి ఇన్నింగ్స్ మాదిరే రెండో ఇన్నింగ్స్‌ను వేగంగా ఆరంభించిన ఈస్ట్‌జోన్‌కు ఓపెనర్లు వైభవ్ (8), అభిమన్యు ఈశ్వరన్ (3) శుభారంభం అందించలేకపోయారు. అయితే మిడిలార్డర్లో శిఖర్ మోహన్ (52), కెప్టెన్ ఇషాన్ కిషన్ (80), కుమార్ కుషాగ్ర (34) రాణించడంతో ఈస్ట్‌జోన్ 200 పరుగుల మార్క్‌ను దాటింది. సౌత్‌జోన్ బౌలర్లలో సిరాజ్, త్రిపురానా విజయ్, నిదీష్, షేక్ రషీద్‌లు తలా ఒక వికెట్ తీశారు. అంతకముందు సౌత్‌జోన్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 336 పరుగులకు ఆలౌటైంది. తిలక్ వర్మ (99) సెంచరీ చేజార్చుకోగా, పడిక్కల్ (62), సీవీ మిలింద్ (43) పర్వాలేదనిపించారు. ముఖేశ్‌కుమార్ 3 వికెట్లు తీయగా, షమీ, ఖురేషీ, శికర్ మోహన్‌లు తలా 2 వికెట్లు పడగొట్టారు.MD Nidheesh breaks the partnership 👏He gets the crucial wicket of East Zone captain Ishan Kishan who played yet another superb knock of 80(98) 🙌Scorecard ▶️ https://t.co/BhTkGWeeoD#DuleepTrophy | #EZvSZ pic.twitter.com/j9C01OLgmB— BCCI Domestic (@BCCIdomestic) September 9, 2026Read: షాకింగ్.. కోహ్లిపై ఆధారపడిన పాక్ మహిళా ప్లేయర్లు! -
షాకింగ్.. కోహ్లిపై ఆధారపడిన పాక్ మహిళా ప్లేయర్లు!
మహిళల ఆసియా కప్ టోర్నీలో పాకిస్తాన్ జట్టు హాంకాంగ్‌పై విజయం సాధించడం ద్వారా సెమీస్ బెర్తును ఖరారు చేసుకుంది. అయితే పాక్ సెమీస్ బెర్తు కంటే పాక్ ప్లేయర్స్ ధరించి షూస్(Footwear)కు సంబంధించిన ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాను తెగ ఊపేస్తుంది. నష్రా సంధు, ఐమన్ ఫాతిమా కోహ్లి వన్8 బ్రాండ్ షూతో కనిపించినప్పటికీ, జట్టులో దాదాపు అందరు ప్లేయర్లు ఇదే బ్రాండ్ షూను ధరించినట్లు తెలుస్తోంది.పాక్ జట్టులో ప్రతీ మహిళా ప్లేయర్ ‘వన్8’ (one8) బ్రాండ్ షూనే ధరించారు. ఈ ‘వన్8’ ఫుట్‌వేర్ బ్రాండ్ మరెవరిదో కాదు. టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి ఇదే ‘వన్8’ షూకు సహ యజమానిగా ఉన్నాడు. ఇందులో ఆశ్చర్యపోవాల్సిన విషయం లేనప్పటికీ, పాక్ ఆటగాళ్లు తమ సొంత బ్రాండ్‌ను వదిలేసి టీమిండియా ఐకాన్ ప్లేయర్‌కు చెందిన బ్రాండ్‌తో అసోసియేట్ అవ్వడమే ఇక్కడ విశేషం. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో ట్యాగ్ చేసిన అభిమానులు.. ‘‘పాక్ ఆటగాళ్లకు సొంత బ్రాండ్ అనేది లేదు. తాము ధరించే షూస్‌పై కూడా భారత్ బ్రాండ్ స్పష్టంగా కనిపిస్తోంది. ఇదీ మన భారత్ బ్రాండ్.’’ అని కామెంట్లు చేయడం ఆసక్తి కలిగించింది.కోహ్లీతో అనుబంధం దృష్ట్యా ‘వన్8’ కంపెనీ షూస్‌తో పాటు దుస్తులు, ఇతర క్రీడా ఉత్పత్తులను అందించే స్పోర్ట్స్‌వేర్ బ్రాండ్‌గా విస్తరించింది. ఈ బ్రాండ్‌ను తన పోర్ట్‌ఫోలియోలో కలిగి ఉన్న అగిలిటాస్, వన్8ను కోహ్లీతో కలిసి స్థాపించిన స్పోర్ట్స్‌వేర్ లేబుల్గా అభివర్ణిస్తుంది. అంతేకాదు కోహ్లి ‘వన్8’ పార్టనర్ ‘అగిలిటాస్’లో పెట్టుబడిదారుడు కూడా. కోహ్లి ఈ కంపెనీలో 400 మిలియన్లు పెట్టుబడి పెట్టడం జరిగింది.సోమవారం జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్‌లో పాక్ 72 పరుగుల తేడాతో హాంకాంగ్ జట్టుపై ఘన విజయం సాధించింది. ముందుగా పాక్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. షావాల్ (47), ఆయేషా జఫర్ (26), ఫాతిమా సనా (24 నాటౌట్) రాణించారు. హాంకాంగ్ బౌలర్ జాయ్‌లీన్ కౌర్ 4 వికెట్లు పడగొట్టింది. అనంతరం హాంకాంగ్ 19 ఓవర్లలో 71 పరుగులకే కుప్పకూలింది. కేరీ చాన్ (30) టాప్ స్కోరర్‌గా నిలిచింది. నష్రా సంధు (4–0–7–6) ఆరు వికెట్లతో పాకిస్తాన్ తరఫున అంతర్జాతీయ టీ20ల్లో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన నమోదు చేసింది.Many players of Pakistan women team was wearing @one8world shoes in asia cup match.I have following questions 1. Products registered in india can't be exported to pak ,so did this deal happened in Dubai? Where matches are being played2.Aisi kya majburi thi @one8world pic.twitter.com/GkVdg3BfUG— varun (@mystic_varunn) September 7, 2026 देखिए पाकिस्तानी महिला क्रिकेटर ईमान फातिमा विराट कोहली के One8 ब्रांड के जूते पहने हुए हैं। 👀पाकिस्तानी खिलाड़ी भी वो अपने खुद के देश के ब्रांड्स से ज्यादा कोहली के ब्रांड पर भरोसा करती हैं।कुछ फैंस कह रहे हैं कि उसने ये जूते स्मृति के किट बैग से चुराए हैं🤣 pic.twitter.com/n5zMtQicDR— Indian🇮🇳 (@singh31919) September 9, 2026Read: ఏ బౌలర్‌ను వదల్లేదు.. భీకర ఫామ్‌లో ఇషాన్ కిషన్! -
ఏ బౌలర్‌ను వదల్లేదు.. భీకర ఫామ్‌లో ఇషాన్ కిషన్!
టీమిండియా వికెట్ కీపర్, ఈస్ట్‌జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్ భీకర ఫామ్‌లో ఉన్నాడు. సౌత్‌జోన్‌తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఇప్పటికే డబుల్ సెంచరీతో బీభత్సం సృష్టించిన ఇషాన్ కిషన్ రెండో ఇన్నింగ్స్‌లోనూ అదే జోరును ప్రదర్శిస్తున్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో వన్డే తరహా బ్యాటింగ్‌తో అలరించిన ఇషాన్ 98 బంతుల్లో 80 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడి ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. అతడికి తోడు శిఖర్ మోహన్ (52) అర్థసెంచరీతో చెలరేగాడు. 41 ఓవర్లు ముగిసేసరికి ఈస్ట్‌జోన్ 5 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. ఈస్ట్‌జోన్ ఇప్పటికే 533 పరుగుల భారీ ఆధిక్యంలో కొనసాగుతోంది.త్రిపురానాను దంచికొట్టాడు..ఫిఫ్టీ మార్క్ సాధించిన తర్వాత త్రిపురానా వేసిన ఇన్నింగ్స్ 25వ ఓవర్లో ఇషాన్ కిషన్ విధ్వంసం సృష్టించాడు. ఆ ఓవర్లో వరుసగా 4,6,6, 4 బాదడంతో పాటు సింగిల్ సహా మొత్తం 17 పరుగులు పిండుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ బాదే క్రమంలో ఏ బౌలర్‌ను విడిచిపెట్టని ఇషాన్ రెండో ఇన్నింగ్స్‌లోనూ అదే జోరును కనబరుస్తూ ప్రతీ బౌలర్‌ను చితక్కొడుతూ బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపించాడు. మ్యాచ్ విషయానికొస్తే.. తొలి ఇన్నింగ్స్‌లో 708 పరుగులకు ఆలౌటైన ఈస్ట్‌జోన్, ఆ తర్వాత సౌత్‌జోన్‌ను 336 పరుగులకే కట్టడి చేసి తొలి ఇన్నింగ్స్‌లో 372 పరుగుల ఆధిక్యం సాధించింది. మ్యాచ్ డ్రా అయ్యే అవకాశం ఉండడంతో నిబంధనల ప్రకారం తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించిన ఈస్ట్‌జోన్ దులీప్ ట్రోఫీ టైటిల్ అందుకోనుంది.4,6,6,4 BY ISHAN KISHAN - He smashing everyone in Duleep Trophy final 🥶 pic.twitter.com/lKPAA2awOY— Johns. (@CricCrazyJohns) September 9, 2026Read: ఆరేళ్లుగా ఎదురుచూపులు.. 50వేల టికెట్లు హాంఫట్! -
ఆరేళ్లుగా ఎదురుచూపులు.. 50వేల టికెట్లు హాంఫట్!
టీమిండియా జట్టు అక్టోబర్ చివర్లో న్యూజిలాండ్‌లో పర్యటించనుంది. అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య రెండు నెలల పాటు టీమిండియా ఐదు టీ20లు, ఐదు వన్డేలు, రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది. ఆరేళ్ల తర్వాత భారత్ న్యూజిలాండ్‌లో పర్యటించనుండడంతో ఇప్పటినుంచే టికెట్ల హడావిడి మొదలైంది. గత రెండు వారాల్లోనే 50వేల టికెట్లు అమ్ముడైనట్లు న్యూజిలాండ్ క్రికెట్ పేరేంటింగ్ బాడీ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది.మొదట క్రికెట్ నేషన్ సభ్యులు, స్కై కస్టమర్లు, ఏఎన్జెడ్ కస్టమర్ల కోసం రెండు వారాల ప్రీ సేల్ విండో ఇచ్చారు. ఆగస్టు 24న క్రికెట్ నేషన్ ప్రీ సేల్ మొదలైన 48 గంటల్లోనే 26 వేల టికెట్లు అమ్ముడయ్యాయని న్యూజిలాండ్ క్రికెట్ ప్రకటించింది. తర్వాత అభిమానుల కోసం కూడా టికెట్లను ఓపెన్ చేశారు. ముందుగానే సభ్యత్వం తీసుకున్న వారికి 15 శాతం డిస్కౌంట్ కూడా ఇచ్చారు. భారత్ సిరీస్ కోసం టికెట్లపై డిమాండ్ ఎక్కువగా ఉంటుందని అంచనా వేసిన బోర్డు, ఆగస్టులోనే అభిమానులను ప్రీ రిజిస్టర్ చేసుకోవాలని కోరింది. పబ్లిక్ టికెట్ సేల్స్ మొదలైన తర్వాత కూడా బుకింగ్స్ వేగంగా సాగుతున్నాయి.క్రైస్ట్‌చర్చ్‌లోని హాగ్లీ ఓవల్‌లో అక్టోబర్ 24న జరిగే రెండో టీ20కు ఇప్పటికే 75 శాతం టికెట్లు అమ్ముడయ్యాయి. ఈ మైదానంలో భారత్ రెండు టీ20లు ఆడనుంది. అక్టోబర్ 22, 24 తేదీల్లో ఆ మ్యాచ్‌లు జరగనున్నాయి. హాగ్లీ ఓవల్‌లో మ్యాచ్‌లకు ఎప్పుడూ కూడా భారీ స్థాయిలో ప్రేక్షకులు వస్తారని న్యూజిలాండ్ క్రికెట్ మార్కెటింగ్ హెడ్ టిమ్ ఎల్లిస్ చెప్పారు. కానీ ఒక మ్యాచ్‌కు ఇంత ముందుగానే మూడు వంతులకుపైగా టికెట్లు అమ్ముడవడం చాలా స్పెషల్ అని అన్నారు. సుమారు 9 వేల మంది సామర్థ్యం ఉన్న ఈ మైదానంలో నవంబర్ చివర్లో రెండో టెస్ట్ కూడా జరగనుంది.Photo Credit: Twitterరోహిత్, కోహ్లి క్రేజ్..కివీస్ గడ్డపై టీమిండియాకు ఇంత క్రేజ్ రావడానికి కారణం మాత్రం విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ అని చెప్పొచ్చు. ఎందుకంటే 2027 వన్డే ప్రపంచకప్ తర్వాత ఈ ఇద్దరు స్టార్ ప్లేయర్లు అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికే అవకాశమున్నట్లు ప్రచారం జరుగుతోంది. 2027 వన్డే ప్రపంచకప్ సౌతాఫ్రికాలో జరగనున్న నేపథ్యంలో, తమ అభిమాన క్రికెటర్లను చివరిసారి చూసుకోవాలని అభిమానులు టికెట్ల కోసం ఎగబడుతున్నట్లు తెలుస్తోంది. 🚨 50,000+ tickets already sold for New Zealand’s home summer of cricket 🇳🇿🏏The India series is driving the madness Christchurch’s 2nd T20I is already 75% sold, while Eden Park has opened its 6th tier for the first time since India’s 2019 tour.The demand for India in NZ is… pic.twitter.com/1i1xu2VHCp— Mid Wicket (@Thinkerr_11) September 9, 2026 Read: ఈస్ట్‌జోన్‌దే టైటిల్!.. చరిత్ర సృష్టించనున్న వైభవ్! -
ఈస్ట్‌జోన్‌దే టైటిల్!.. చరిత్ర సృష్టించనున్న వైభవ్!
దులీప్ ట్రోఫీని ఈసారి ఈస్ట్ జోన్ గెలుచుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఫైనల్లో సౌత్‌జోన్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 336 పరుగులకు ఆలౌట్ కావడంతో ఈస్ట్‌జోన్‌కు 372 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. మ్యాచ్‌కు ఒకరోజు మాత్రమే మిగిలి ఉండడంతో డ్రా అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. దీంతో నిబంధనల ప్రకారం తొలి ఇన్నింగ్స్‌లో ఏ జట్టు ఆధిక్యంలో నిలిస్తే వారికే దులీప్ ట్రోఫీ దక్కనుంది. ఈ లెక్కన తొలి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యం సాధించిన ఈస్ట్‌జోన్ 13 సంవత్సరాల తర్వాత టైటిల్ అందుకోనుంది. ఇదే సమయంలో జట్టులో సభ్యుడిగా ఉన్న వైభవ్ సూర్యవంశీ కూడా చరిత్ర సృష్టించనున్నాడు. వైభవ్ సూర్యవంశీ వయసు 15 ఏళ్లు కావడంతో, అత్యంత పిన్న వయస్సులో దులీప్ ట్రోఫీ నెగ్గిన జట్టలోని ఆటగాడిగా రికార్డులకెక్కనున్నాడు. ఇప్పటికే టోర్నీలో సెమీఫైనల్లో హాఫ్ సెంచరీ సాధించి అత్యంత పిన్నవయస్కుడిగా నిలిచిన వైభవ్, కప్‌ను ఈస్ట్‌జోన్ సొంతం చేసుకుంటే మాత్రం పైన చెప్పుకున్న ఘనత కూడా వైభవ్ ఖాతాలో చేరనుంది.డ్యాన్స్ చేసిన వైభవ్..ఇక మ్యాచ్‌లో సౌత్‌జోన్ ఇన్నింగ్స్ సందర్భంగా త్రిపురానా విజయ్ వికెట్ పడినప్పుడు వైభవ్ సూర్యవంశీ డ్యాన్స్ మూమెంట్ ఇవ్వడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 708 పరుగులు చేసిన ఈస్ట్‌జోన్‌కు పోటీ ఇచ్చే క్రమంలో సౌత్‌జోన్ తరఫున ఆ జట్టు కెప్టెన్ తిలక్ వర్మతో పాటు దేవదత్ పడిక్కల్, సీవీ మిలింద్ కాస్త ప్రతిఘటించారు. తాను ఒక ఎండ్‌లో పాతుకుపోయినప్పటికీ, మరో ఎండ్‌లో మాత్రం వరుసగా వికెట్లు పడడంతో వైభవ్ ఉబ్బితబ్బియయ్యాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన త్రిపురానా విజయ్ కెప్టెన్‌తో ఏర్పడిన సయన్వయ లోపంతో రనౌట్‌గా వెనుదిరిగాడు. ఖురేషీ వేసిన ఆఫ్‌స్టంప్ బంతిని తిలక్ వర్మ కట్‌షాట్ ఆడాడు. తనవైపు వచ్చిన బంతిని అభిజిత్ సర్కార్ వేగంగా అందుకొని అంతే వేగంతో వికెట్ కీపర్ ఇషాన్ వైపు విసిరాడు. అప్పటికే తిలక్ సింగిల్ తీయాలా వద్దా అనే డైలమాలోనే ముందుకు పరిగెత్తాడు. దీంతో కాస్త లేటుగా రనప్ అందుకున్న త్రిపురానా విజయ్ స్ట్రైక్ ఎండ్‌కు చేరేలోపే ఇషాన్ వికెట్లను గిరాటేయడంతో అతడు రనౌట్ అయ్యాడు. విజయానికి చేరువ కావడంతో సంతోషం పట్టలేని వైభవ్ చిన్న డ్యాన్స్ మూమెంట్ ఇవ్వడం కెమెరాలకు చిక్కింది. ఇక తొలి ఇన్నింగ్స్‌లో ఈస్ట్‌జోన్ 708 పరుగులకు ఆలౌటైంది. ఇషాన్ కిషన్ (270) డబుల్ సెంచరీ సాధించగా, కుమార్ కుషాగ్ర (101) సెంచరీ చేశాడు. అభిమన్యు ఈశ్వరన్ (72), శిఖర్ మోహన్ (85) అర్థసెంచరీలు సాధించారు. సౌత్‌జోన్ బౌలర్లలో త్రిపురానా విజయ్ 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం సౌత్‌జోన్ 107.3 ఓవర్లలో 336 పరుగులకు ఆలౌటైంది. తిలక్ వర్మ (99) ఒక్క పరుగు తేడాతో సెంచరీ మిస్ చేసుకోగా, పడిక్కల్ (62) అర్థసెంచరీ సాధించాడు. ఈస్ట్‌జోన్ బౌలర్లలో ముకేశ్ కుమార్ మూడు వికెట్లు తీయగా, షమీ, ఖురేషి, శిఖర్ మోహన్ తలా 2 వికెట్లు పడగొట్టారు.Excellent reflex catch and run out ⚡️Top-fielding efforts bring wickets for East Zone 👌South Zone are 322/8 Scorecard ▶️ https://t.co/BhTkGWeeoD#DuleepTrophy | #EZvSZ pic.twitter.com/FKDmQcDYG3— BCCI Domestic (@BCCIdomestic) September 9, 2026Read: ‘పూటుగా తాగి పీడకలనుకొని మరిచిపోతా’ -
ఆఫ్గన్‌తో టీ20 సిరీస్.. టీమిండియాకు బ్యాడ్‌న్యూస్!
స్వదేశంలో అఫ్గానిస్తాన్‌తో జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం బీసీసీఐ ఇప్పటికే టీమిండియా జట్టును ప్రకటించింది. 16 మందితో కూడిన జట్టులో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, నితీశ్ కుమార్ రెడ్డి, హర్షిత్ రానా, వాషింగ్టన్ సుందర్‌లను కూడా పరిగణలోకి తీసుకున్నారు. అయితే వారు ఫిట్నెస్ క్లియరెన్స్ ఇస్తేనే మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉంటుందన్న విషయం తెలిసిందే.సుందర్ ఒక్కడే.. హర్షిత్ డౌట్!ఆఫ్గన్‌తో టీ20 సిరీస్‌కు మరో మూడు రోజులు సమయం ఉన్న నేపథ్యంలో ఈ నలుగురి ఆటగాళ్లకు సంబంధించి ఫిట్‌నెస్‌పై కీలక అప్డేట్ వచ్చింది. వాషింగ్టన్ సుందర్ ఫిట్నెస్ క్లియరెన్స్ తీసుకొని టీ20 సిరీస్‌కు సిద్ధమవుతున్నట్లు సమాచారం. హర్షిత్ రానా ఫిట్‌గా ఉన్నట్లు సమాచారమున్నప్పటికీ అతడికి ఇంకా ఫిట్నెస్ క్లియరెన్స్ ఇవ్వలేదని తెలుస్తోంది. మరోవైపు బుమ్రా, నితీశ్‌రెడ్డిలు మాత్రం బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీవోఈ) మెడికల్ టీం నుంచి ఫిట్నెస్ క్లియరెన్స్ పొందాల్సి ఉంది."సుందర్ ఇప్పటికే బీసీసీఐ మెడికల్ టీం నుంచి క్లియరెన్స్ పొందాడు. సెప్టెంబర్ 4న నిర్వహించిన సిములేషన్ ఎక్సర్సైజ్లో సుందర్ క్లియరెన్స్ పొందాడు. ఆ తర్వాత సెప్టెంబర్ 7న బుమ్రా, నితీశ్‌రెడ్డి, హర్షిత్ రానాలు మ్యాచ్ సిములేషన్కు పంపించాము. అయితే సిములేషన్‌లో ఈ ముగ్గురికి సంబంధించిన రిజల్ట్‌లో తేడాలు ఉన్నట్లు గుర్తించాం. అందుకే ఇవాళ మరోసారి ఈ ముగ్గురిని సిములేషన్ ఎక్సర్సైజ్కు పంపాలని నిర్ణయించాం. ఆ తర్వాత ఈ ముగ్గురి ఫిట్నెస్ క్లియరెన్స్‌కు సంబంధించిన రిపోర్ట్ వివరాలను వెల్లడిస్తాం" అని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రతినిధుల బృందం తెలిపింది.బుమ్రా దూరం.. నితీశ్ కూడా!ఇప్పటివరకు ఉన్న సమాచారం మేరకు బుమ్రా అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. హర్షిత్ రానా మాత్రం ఫిట్నెస్ క్లియరెన్స్ సాధించడంతో ఆఫ్గన్‌తో టీ20 సిరీస్‌కు రెడీ అవుతున్నాడు. ఇక ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్‌రెడ్డి మాత్రం ఆఫ్గన్‌తో టీ20 సిరీస్ ఆడడని, అతడిని నేరుగా ఆసియా గేమ్స్‌లో ఆడేందుకు పంపించనున్నట్లు సీవోఈ మరో ప్రకటనలో తెలిపింది.ఇంగ్లండ్‌తో మూడో వన్డే సందర్భంగా మోకాలి గాయానికి గురైన బుమ్రా లంకతో టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు. ఇంగ్లండ్ సిరీస్‌కు ముందే హర్షిత్ రానా కూడా కండరాల గాయంతో రీహాబిలిటేషన్ సెంటర్‌కు వచ్చేశాడు. నితీశ్‌రెడ్డి కూడా కండరాల గాయంతోనే ఇంగ్లండ్‌తో పాటు లంక సిరీస్‌కు దూరమయ్యాడు. ఈ ముగ్గురితో పాటు పాండ్యా, వరుణ్ చక్రవర్తి కూడా గాయాల నుంచి కోలుకుంటున్నారు.🚨 UPDATE ON BUMRAH, NITISH & HARSHIT 🚨- Harshit Rana is fully fit and should be play in T20I series against Afghanistan.- Jasprit Bumrah is unlikely for T20i series against Afghanistan.- Nitish Kumar Reddy is doubtful for T20i series against Afghanistan & he is most… pic.twitter.com/pisBr2amZL— M A N U. (@Manu_1845) September 9, 2026చదవండి: IPL 2027: రూ.20 కోట్లు ఇస్తే హెడ్‌కోచ్‌గా వస్తా? -
మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌కు ప్రమోషన్
వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (డబ్ల్యూసీఎల్) మూడో సీజన్ కోసం ఆస్ట్రేలియా చాంపియన్స్ జట్టు తమ కెప్టెన్‌గా మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ను ఎంపిక చేసింది. కాగా ఈ జట్టుకు ఆసీస్ దిగ్గజం రికీ పాంటింగ్ యజమానిగా ఉన్నాడు. మూడో సీజన్లో తనతో పాటు పునీత్ సింగ్ కూడా జట్టు యజమానిగా వ్యవహరించనున్నట్లు పాంటింగ్ ఒక ప్రకటనలో పేర్కొన్నాడు. "మైదానంలోకి రీఎంట్రీ ఇవ్వడమే గాక గొప్ప ఆటగాళ్లతో కలిసి ఆడుతుండడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా. అంతేకాదు మా ఆటతీరుతో అభిమానులను అలరించబోతున్నామన్న విషయం సంతోషం కలిగిస్తుంది" అని వార్నర్ చెప్పుకొచ్చాడు. పాంటింగ్ మాట్లాడుతూ "ఆస్ట్రేలియన్ చాంపియన్స్ జట్టులో భాగం కావడం నాకు చాలా ఉత్సాహంగా ఉంది. పునీత్‌తో పాటు జట్టుతో కలిసి పనిచేయడం కోసం ఎదురుచూస్తున్నా. డేవిడ్ నాయకత్వంలో మా జట్టు అద్భుత ప్రదర్శన చేసి అభిమానులను అలరిస్తుందని ఆశిస్తున్నా" అని చెప్పుకొచ్చాడు. ఇక వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (డబ్ల్యూసీఎల్)టోర్నీ మూడో సీజన్ అక్టోబర్ 3న ప్రారంభం కానుంది. ఈ టోర్నీకి యూఏఈ ఆతిథ్యమివ్వనుంది. అయితే ఈ టోర్నీ యూకే వెలుపల జరగడం ఇదే తొలిసారి. లెజెండ్స్ క్రికెట్ లీగ్ మూడో సీజన్లో వార్నర్‌తో పాటు మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, ఏబీ డివిలియర్స్, డ్వేన్ బ్రావో, షాహిద్ అఫ్రిది, మోయిన్ అలీ, మహ్మదుల్లా సహా ఇతర క్రికెటర్లు ఆడనున్నారు. ఇక మూడో సీజన్‌కు బంగ్లాదేశ్ చాంపియన్లను చేర్చడం ద్వారా డబ్ల్యూసీఎల్ తన అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని విస్తరించింది. మొదటి సీజన్లో పాక్‌ను ఓడించి ఇండియా లెజెండ్స్ చాంపియన్‌గా నిలవగా, రెండో సీజన్లో సౌతాఫ్రికా లెజెండ్స్ టైటిల్ నెగ్గారు.Read: పాక్‌తో కయ్యానికి కాలు దువ్విన ఆఫ్గన్ క్రికెట్ బోర్డు! -
పాక్‌తో కయ్యానికి కాలు దువ్విన ఆఫ్గన్ క్రికెట్ బోర్డు!
పాకిస్తాన్, అఫ్గానిస్తాన్‌ల మధ్య శత్రుత్వం అంతకంతకూ పెరుగుతున్నట్లుగా అనిపిస్తోంది. తాజాగా టీమిండియాతో సిరీస్ నేపథ్యంలో అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు (ACB) ఒక ప్రచార వీడియోను రూపొందించిది. ఆ వీడియోల పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే), గిల్గిట్ బాల్టిస్తాన్లను భారతదేశ సరిహద్దులో భాగంగా చూపించింది. ఈ వీడియోను ఏసీబీ తన అధికారిక ఎక్స్ ఖాతాలో పంచుకుంది."మా దేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సిరీస్ ఇది. ఘనమైన చరిత్ర, సంస్కృతి, ఉమ్మడి అభిరుచి కలిగిన రెండు దేశాలను ఏకం చేసే సిరీస్ ఇది. ఇవి కేవలం మ్యాచ్‌లు కాదు. స్వదేశంలోని లక్షలాది మంది ప్రజల ఆశలు, గర్వాన్ని మోసుకుంటూ ఆఫ్గన్ జట్టు మైదానంలోకి అడుగుపెట్టనుంది."అని రాసుకొచ్చింది.ఇప్పటికే ఇరు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతినగా, తాజాగా ఆఫ్గన్ క్రికెట్ బోర్డు చేపట్టిన చర్య అగ్నికి ఆజ్యం పోసినట్లైంది. ఈ మ్యాప్‌పై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని పాకిస్థాన్ విదేశాంగ శాఖ దృష్టికి తీసుకెళ్లి ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే ఈ అంశంపై పాకిస్థాన్ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక చర్యలకు దిగలేదు. అంతర్జాతీయ స్థాయిలో మాత్రం ఈ విషయాన్ని లేవనెత్తేందుకు ఇస్లామాబాద్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.నిత్యం సరిహద్దు ఘర్షణలు, వైమానిక దాడులతో సహా ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న తరుణంలో ఈ తాజా వివాదం తలెత్తింది. దేశంలో జరుగుతున్న ఘోరమైన దాడులకు కారణమని పాకిస్తాన్ ఆరోపిస్తున్న తెహ్రిక్-ఎ-తాలిబన్ పాకిస్తాన్ (TTP)కు ఆఫ్ఘన్ తాలిబన్లు ఆశ్రయం కల్పిస్తున్నారని ఇస్లామాబాద్ పదేపదే ఆరోపిస్తోంది. సాంస్కృతిక, క్రీడా వేదికలతో సహా సాఫ్ట్ పవర్ ద్వారా ఇటువంటి ఘర్షణలు మరింతగా వ్యక్తమయ్యే అవకాశం ఉందని భారత్ తెలిపింది. ఇక భారత్, అఫ్గానిస్తాన్‌ల మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ సెప్టెంబర్ 13 నుంచి 17 మధ్య జరగనుంది. మ్యాచ్‌లన్నీ ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ స్టేడియం వేదికగా జరగనున్నాయి. తొలి వన్డే ఈ నెల 13న, రెండో టీ20 15న, మూడో టీ20 17న జరగనున్నాయి.A series the nation has been eagerly awaiting. 🤩A series that will once again bring together two nations with deep-rooted history, culture, and a shared passion for the game.🤜🤛These are more than just matches. They are encounters of passion, excitement, and significance,… pic.twitter.com/Q8h7MYX1yf— Afghanistan Cricket Board (@ACBofficials) September 6, 2026Read: నిప్పులు చెరిగిన షమీ.. సౌత్‌జోన్ కకావికలం -
నిప్పులు చెరిగిన షమీ.. సౌత్‌జోన్ కకావికలం
దులీప్ ట్రోఫీలో ఈస్ట్‌జోన్ తరఫున ఆడుతున్న టీమిండియా పేసర్ మహ్మద్ షమీ సౌత్‌జోన్‌తో ఫైనల్లోనూ చెలరేగుతున్నాడు. సెమీఫైనల్లో ఐదు వికెట్లు తీసిన షమీ ఫైనల్లో బంతులో నిప్పులు చెరిగాడు. 11 ఓవర్లు వేసిన షమీ 4 మెయిడెన్లు సహా 17 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు. ముఖేశ్ కుమార్ కంటే తక్కువ ఎకానమీతో బౌలింగ్ చేసిన షమీని ఎదుర్కోవడంలో సౌత్‌జోన్ బ్యాటర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం సౌత్‌జోన్ జట్టు 69 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. కెప్టెన్ తిలక్ వర్మ (37), శ్రేయస్ గోపాల్ (13) క్రీజులో ఉన్నారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఈస్ట్‌జోన్ జట్టు 163 ఓవర్లలో 708 పరుగులకు ఆలౌటైంది. ఇషాన్ కిషన్ (270) డబుల్ సెంచరీతో మెరవగా, కుమార్ కుశాగ్ర (101) సెంచరీతో రాణించగా, అభిమన్యు ఈశ్వరన్ (72), శిఖర్ మోహన్ (85) అర్థశతకాలతో రాణించారు. త్రిపురణ విజయ్ నాలుగు వికెట్లతో మెరిశాడు.ఇటీవలే షమీ ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 900 వికెట్ల మార్క్‌ను అందుకున్న సంగతి తెలిసిందే. 2023 వన్డే ప్రపంచకప్‌లో టోర్నీ లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచిన మహ్మద్ షమీ భారత్ తరఫున చివరిసారిగా 2025 చాంపియన్స్ ట్రోఫీలో ఆడాడు.చదవండి: చరిత్రలో తొలిసారి.. ఒకే జట్టుకు ఆడనున్న మెస్సీ, రొనాల్డో! -
రెచ్చిపోయిన కేకేఆర్ బ్యాటర్; 9 ఫోర్లు, 5 సిక్సర్లతో విధ్వంసం
షేర్-ఇ-పంజాబ్ టీ20 లీగ్‌లో మొహలీ కింగ్స్ వరుస విజయాలతో దుమ్మురేపుతుంది. ముఖ్యంగా ఆ జట్టు కెప్టెన్ రమన్‌దీప్ సింగ్ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. తాజాగా సోమవారం లుధియానా లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రమన్‌దీప్ విధ్వంసంతో మొహలీ కింగ్స్ 4 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన లుధియానా లయన్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. అర్జున్ రాజ్‌పుత్ (46 బంతుల్లో 78), అభిజిత్ గార్గ్ (48 బంతుల్లో 78) రాణించడంతో లుధియానా భారీ స్కోరు చేసింది. మొహాలీ కింగ్స్ బౌలర్లలో హర్‌ప్రీత్ బ్రార్ 3 వికెట్లు తీయగా, రమన్‌దీప్ సింగ్ 2, ఆయుశ్ గోయల్ ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం ఇన్నింగ్స్ ఆరంభించిన మొహాలీ కింగ్స్ సరిగ్గా 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 214 పరుగులు చేసి గెలుపొందింది. రమన్‌దీప్ (35 బంతుల్లో 85; 9 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసం సృష్టించగా, అన్మోల్ప్రీత్ సింగ్ (50) అర్థసెంచరీతో రాణించాడు. ఈ ఇద్దరు కలిసి మూడో వికెట్‌కు 41 బంతుల్లోనే 86 పరుగులు జోడించడంతో మొహాలీ విజయం దిశగా పరిగెత్తింది. బౌలింగ్‌లో రెండు వికెట్లు, బ్యాటింగ్‌లో 85 పరుగుల సుడిగాలి ఇన్నింగ్స్‌తో మెరిసిన రమన్‌దీప్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సొంతం చేసుకున్నాడు. ఆరు మ్యాచ్‌ల్లో మొహలీ కింగ్స్‌కు ఇది నాలుగో విజయం కాగా, పట్టికలో తొలి స్థానంలో కొనసాగుతోంది. 5 మ్యాచ్‌ల్లో మూడు ఓటములతో లుధియానా ఐదో స్థానంలో కొనసాగుతోంది.ఇక రమణ్‌దీప్ విషయానికి వస్తే.. టీమిండియా తరపున కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. 2024లో సౌతాఫ్రికా టూర్లో ఆడిన రమణ్‌దీప్‌కు తర్వాత భారత జట్టులో చోటు దక్కలేదు. ఇండియా-ఎ టీమ్‌లో మాత్రం అతడు కీలక సభ్యునిగా ఉన్నాడు. ఇప్పుడు ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్స్‌లో మరింత మెరుగ్గా రాణించి సీనియర్ జట్టులోకి ఎంట్రీ ఇవ్వాలని ఈ పంజాబ్ ఆల్‌రౌండర్ భావిస్తున్నాడు.85(34) with the bat.🌟2/31 (4) with the ball.🤛Ramandeep Singh owned the game from start to finish. A true all-round Masterclass. 💜🔥 pic.twitter.com/s0HyFEbJcS— Rokte Amar KKR (@Rokte_Amarr_KKR) September 7, 2026Read: కసితీరా బాదిన అభిషేక్.. గిల్‌పై ప్రతీకారం! -
అతడు పోతేనే పాక్ క్రికెట్ బాగుపడుతుంది: ఆసీస్ దిగ్గజం
ఆస్ట్రేలియా చేతిలో టెస్టు సిరీస్ ఓటమి నుంచి వరుస ఉదంతాలు పాకిస్తాన్ క్రికెట్ జట్టును ఊపిరి సలపకుండా చేస్తున్నాయి. ఇప్పటికే మ్యాచ్ ఫిక్సింగ్, కోచ్‌లతో విభేదాలు, ముందస్తు సమాచారం లేకుండా ఆటగాళ్లను తొలగించడం వంటి వివాదాలతో సతమతమవుతున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కు ఆస్ట్రేలియా దిగ్గజ బౌలర్ జాసన్ గిలెస్పీ రూపంలో కొత్త తలనొప్పి మొదలైంది. పాకిస్తాన్ టెస్టు జట్టుకు గిలెస్పీ కొంతకాలం కోచ్‌గా సేవలందించిన సంగతి తెలిసిందే. తాను కోచ్‌గా ఉన్న సమయంలో పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు పూర్వ వైభవం తీసుకురావాలని భావించినప్పటికీ, చీఫ్ సెలెక్టర్‌గా అకీబ్ జావెద్ రాకతో పరిస్థితి పూర్తిగా మారిపోయిందని గిలెస్పీ పేర్కొన్నాడు. పాక్ క్రికెట్ బోర్డు నుంచి నష్ట పరిహారం కింద తనకు వేల డాలర్లు రావాల్సి ఉందని వెల్లడించాడు. పాడ్‌కాస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గిలెస్పీ మాట్లాడుతూ.. ‘‘అకిబ్ జావేద్ నియామకం పరిస్థితిని పూర్తిగా మార్చేసింది. అప్పటినుంచే పాకిస్తాన్ క్రికెట్‌తో నాకున్న అనుబంధం చెడిపో సాగింది. పాక్ జట్టు ఇప్పుడీ స్థితిలో ఉందంటే దానికి అకిబ్ జావెద్ కారణం. టెస్టు కోచ్‌గా ఎంపికైనప్పుడు జట్టుకు పూర్వవైభవం తీసుకురావాలని కలలు కన్నాను. కానీ అకిబ్ జావెద్ రాకతో టెస్టు జట్టు కోచ్‌గా ఆటగాళ్లను, సిబ్బందిని పర్యవేక్షించడం, ఎంపికలో పాత్ర పోషించడం.. ఇలా అన్నింటిలోనూ ఏ మాత్రం ప్రాధాన్యత లేని స్థితికి పడిపోయాను. అతడితో అనుభవం నన్ను పూర్తిగా నిరుత్సాహపరిచింది. కోచింగ్‌పైనే విరక్తి కలిగించింది. మానసికంగానూ నాపై ప్రభావం చూపించింది. అసలు ఇంకా క్రీడలో ఎందుకు కొనసాగాలన్న పరిస్థితి ఎదురైంది. కోచ్‌గా వచ్చిన తర్వాత నాకు లాభం కంటే నష్టమే ఎక్కువ జరిగింది. చీఫ్ సెలెక్టర్‌గా ఎంపికైన అకిబ్ జావెద్ నన్ను అవమానించాడు. నా స్థాయిని పూర్తిగా తగ్గించాడు. అకిబ్కు చైర్మన్ మోసిన్ నఖ్వీతో పాటు బోర్డు మద్దతు ఉంది. అందుకే అతడిని ఎవరు ఏమీ చేయలేరని ధీమాగా ఉన్నాడు. అయితే నష్టపరిహారం కింద నాకు ఇవ్వాల్సిన వేల డాలర్లను ఇప్పటివరకు చెల్లించలేదు. అయితే ఈ విషయాన్ని నేను విడిచిపెట్టదలచుకోలేదు. ఈ విషయంలో ఎవరికీ తలవంచే ప్రసక్తే లేదు. తెర ముందు పీసీబీ కనిపిస్తున్నప్పటికీ, తెర వెనుక మాత్రం అకిబ్ జావెద్ ఒక నియంత పాత్రను పోషిస్తున్నాడు. అకిబ్ జావెద్ ఉన్నంతకాలం పాకిస్తాన్ క్రికెట్ మరింత దారుణంగా తయారవుతుందే తప్ప ముందుకు వెళ్లదు. అసలు చైర్మన్, బోర్డులోని సభ్యులు, చీఫ్ సెలెక్టర్ తమ డెస్కుల వద్ద కూర్చుని కెప్టెన్‌ను ఎన్నుకోవడం అర్థరహితం. అకిబ్ జావెద్ వెళ్లిపోతేనే పాక్ క్రికెట్ మళ్లీ గాడిన పడుతుంది. అప్పటివరకు ఇంతే’’ అని ముగించాడు.Jason Gillespie brutally COOKS Pakistan selector Aaqib Javed"Aaqib is still chairman of selectors. He's kept his job. He's had a crack at Gary Kirsten and I, blaming us for where Pakistan cricket is where it is. Gary and I haven't even been there for two years.""Yet, he has… pic.twitter.com/kIEWfzPvQk— Brutal Truth (@sarkarstix) September 8, 2026చదవండి: కసితీరా బాదిన అభిషేక్.. గిల్‌పై ప్రతీకారం! -
కసితీరా బాదిన అభిషేక్.. గిల్‌పై ప్రతీకారం!
భారత వన్డే కెప్టెన్ శుబ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ టీమిండియా తరఫున ఓపెనింగ్ చేయడంతో పాటు డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం చూశాం. కానీ ప్రస్తుతం ఈ ఇద్దరు పంజాబ్ క్రికెట్ లీగ్‌లో ప్రత్యర్థులుగా మారిపోయారు. షేర్-ఇ- పంజాబ్ టీ20లీగ్‌లో అభిషేక్ శర్మ అమృత్సర్ సూర్మన్స్కు కెప్టెన్‌గా ఉండగా, గిల్ ఫజిల్కా ఫాల్కన్స్‌కు నాయకత్వం వహిస్తున్నాడు. సోమవారం రాత్రి ఈ రెండు జట్లు తలపడగా, అభిషేక్ శర్మ బౌలింగ్‌ను గిల్ చితక్కొట్టాడు. ఇన్నింగ్స్ 10వ ఓవర్లో అభిషేక్ శర్మ బౌలింగ్‌కు రాగా, అప్పటికే గిల్ 28 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఇక అభిషేక్ బౌలింగ్‌లో తొలి బంతికి సిక్సర్ కొట్టిన గిల్, మూడో బంతిని బౌండరీ, ఐదో బంతిని సిక్సర్‌గా మలిచాడు. దీంతో ఓవర్లో వైడ్ సహా 16 పరుగులు వచ్చాయి. చివరి బంతికి కూడా సిక్సర్ కొట్టి అభిషేక్‌కు సెండాఫ్ ఇవ్వాలనుకున్నప్పటికీ, సీన్ రివర్స్ అయింది. అభిషేక్ వేసిన ఆఖరి బంతిని భారీ షాట్ ఆడే ప్రయత్నంలో గిల్ గాల్లోకి లేపగా, బౌండరీ లైన్ వద్ద ఉన్న నమన్ ధిర్ క్యాచ్ అందుకున్నాడు. దీంతో గిల్ (35 బంతుల్లో 67) ఇన్నింగ్స్‌కు తెరపడింది. గిల్‌తో పాటు ప్రాన్షు ప్రతాప్ (40), సన్వీర్ సింగ్ (40) రాణించడంతో ఫజిల్కా ఫాల్కన్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. అనంతరం అమృత్సర్ ఇన్నింగ్స్ సమయంలో తన వంతు రావడంతో అభిషేక్ రెచ్చిపోయాడు. సహజ్ ధావన్‌తో కలిసి ఓపెనింగ్ ఆరంభించిన అభిషేక్ (15 బంతుల్లోనే 49; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసం సృష్టించాడు. ఈ దెబ్బకు అమృత్సర్ సూర్మన్స్ 6 ఓవర్లలో 79 పరుగులు చేసింది. అభిషేక్ ఔటైనప్పటికీ, రాహుల్ కుమార్ (35 బంతుల్లో 53 నాటౌట్) అజేయంగా నిలిచి జట్టుకు విజయాన్ని అందించాడు. మ్యాచ్‌లో గిల్ (67 పరుగులు) టాప్ స్కోరర్‌గా నిలిచినప్పటికీ, అభిషేక్ (49) సుడిగాలి ఇన్నింగ్స్‌తో టీమిండియా కెప్టెన్‌ను డామినేట్ చేశాడు. ఈ విజయంతో అమృత్సర్ సూర్మన్స్ తమ సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది.Abhishek Sharma doing what he does best in the latest round of Sher-E-Punjab T20 League 🔥🔥 pic.twitter.com/UoxZsJxbOn— Cricbuzz (@cricbuzz) September 8, 2026SHUBMAN GILL vs ABHISHEK SHARMA 😍- Incredible battle at Sher-E-Punjab T20 league, The quality of the league. pic.twitter.com/LrTXT8cXgt— Johns. (@CricCrazyJohns) September 8, 2026Read: తిలక్ వర్మ జట్టు నుంచి తీసేస్తే.. శతక్కొట్టి ఘాటు కౌంటర్! -
సీపీఎల్‌లో నబీ విధ్వంసం.. ఆ జట్టుకు వరుస విజయాలు!
కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) 2026లో అఫ్గానిస్తాన్ సీనియర్ ఆల్‌రౌండర్ మహ్మద్ నబీ చెలరేగుతున్నాడు. టీమిండియాతో టీ20 సిరీస్ నేపథ్యంలో నబీ తన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. లీగ్‌లో భాగంగా మహ్మద్ నబీ గయానా అమెజాన్ వారియర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. సోమవారం సెంట్కిట్స్ అండ్ నేవిస్ పాట్రియాట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గయానా వారియర్స్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్‌లో మహ్మద్ నబీ ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిచి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సొంతం చేసుకున్నాడు. తొలుత బౌలింగ్‌లో 17 పరుగులిచ్చి 4 వికెట్లు తీయడంతో పాటు, ఆ తర్వాత బ్యాటింగ్‌లో 25 పరుగులు నాటౌట్‌గా నిలిచి జట్టును గెలిపించాడు. ఇదే మ్యాచ్‌లో మరో ఆఫ్గన్ ఆటగాడు రహ్మనుల్లా గుర్బాజ్ (39) కూడా కీలక ఇన్నింగ్స్‌తో మెరిశాడు. తొలుత బ్యాటింగ్ చేసిన సెంట్ కిట్స్ అండ్ నేవీ పాట్రియాట్స్ 19.2 ఓవర్లలో 128 పరుగులకు ఆలౌటైంది. అలిక్ అథనజే (52) అర్థసెంచరీ సాధించగా, కైల్ మేయర్స్, దాసున్ షనక చెరో 20 పరుగులు చేసి పర్వాలేదనిపించారు. అనంతరం గయానా వారియర్స్ 18.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. గుర్బాజ్, నబీలతో పాటు షెయ్ హోప్ (38 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. సెంట్కిట్స్ బౌలర్లలో నవిన్ బిడాయిసె 2 వికెట్లు తీశాడు.రికార్డు బద్దలయ్యేనా?ఈ సీజన్లో గయానా అమెజాన్ వారియర్స్‌కు ఇది వరుసగా ఆరో విజయం కావడం విశేషం. 2019 సీపీఎల్ సీజన్లోనూ గయనా అమెజాన్ వారియర్స్ ఫైనల్లో బార్బడోస్ చేతుల్లో ఓటమికి ముందు వరుసగా 11 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. మరి తాజా సీజన్లో గయానా జట్టు ఆ రికార్డును బ్రేక్ చేయడంతో పాటు టైటిల్ కొల్లగొడుతుందేమో చూడాలి.41 year old Mohammed Nabi picked 4/17 in the CPL. 🤯 pic.twitter.com/TXshweqawc— Mufaddal Vohra (@mufaddal_vohra) September 7, 2026చదవండి: ఓడించాలని కంకణం.. తొలి టీ20కి ఆఫ్గన్ తుది జట్టు ఇదే! -
ఓడించాలని కంకణం.. తొలి టీ20కి ఆఫ్గన్ తుది జట్టు ఇదే!
టీమిండియాతో టీ20 సిరీస్‌ను అఫ్గానిస్తాన్ చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. పసికూనలం కాదని ఇప్పటికే నిరూపించుకున్న అఫ్గానిస్తాన్ టీమిండియాతో సిరీస్‌కు బలమైన జట్టుతో బరిలోకి దిగాలని చూస్తోంది. ఈ మేరకు తమ వద్ద ఉన్న బలమైన బ్యాటింగ్, బౌలింగ్ అస్త్రాలను టీమిండియాపై ప్రయోగించేందుకు సిద్ధమవుతోంది. మూడు మ్యాచ్‌ల సిరీస్ కోసం ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు బలమైన జట్టును ఎంపిక చేసింది. ఆదివారం (సెప్టెంబర్ 13న) ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా తొలి టీ20 మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో ఆ జట్టు తుది కూర్పు ఎలా ఉంటుందనేది ఒకసారి పరిశీలిద్దాం.ఓపెనర్లుగా ఆ ఇద్దరే..తొలి టీ20లో ఆఫ్ఘనిస్తాన్ తరఫున అనుభవజ్ఞుడైన వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ రహ్మనుల్లా గుర్బాజ్, కెప్టెన్ ఇబ్రహీం జద్రన్లు ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశం ఉంది. తమ జట్టుకు పటిష్టమైన ఆరంభాన్ని అందించే బాధ్యతను ఈ ఇద్దరు అనుభవజ్ఞులు తీసుకోనున్నారు. మరోవైపు రహ్మనుల్లా గుర్బాజ్‌కు ఐపీఎల్లో ఆడిన అనుభవం ఉండడంతో అతని నుంచి భారీ ఇన్నింగ్స్‌లు వచ్చే అవకాశం లేకపోలేదు. కెప్టెన్ ఇబ్రహీం జద్రన్ కూడా మంచి ఫామ్‌లో ఉండడం ఆ జట్టుకు సానుకూలాంశం. ఇక వన్‌డౌన్‌లో దర్విష్ రసూలీ బ్యాటింగ్ చేసే అవకాశముంది. కొంతకాలంగా టీ20ల్లో ఆఫ్గన్‌కు కీలక బ్యాటర్‌గా మారిన రసూలీ 28 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉంది. ఇందులో నాలుగు హాఫ్‌సెంచరీలు ఉన్నాయి.మిడిలార్డర్ ఇలా..సాదిఖుల్లా అటల్‌ను బ్యాటింగ్ ఆర్డర్లో నాలుగో స్థానంలో పంపవచ్చు. అటల్ 29 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో నాలుగు అర్ధ సెంచరీలు సాధించాడు. బ్యాటింగ్ ఆల్‌రౌండర్ అయిన గుల్బదిన్ నైబ్ ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు రావొచ్చు. 2024 టీ20 సిరీస్‌లో నైబ్ తన బ్యాట్‌తో భారత జట్టును ఇబ్బంది పెట్టాడు. ఈసారి కూడా అదే ప్రదర్శనను పునరావృతం చేయాలనే పట్టుదలతో ఉన్నాడు. అజ్మతుల్లా ఉమర్జయ్ ఆరో స్థానంలో, సీనియర్ ఆల్‌రౌండర్ మహ్మద్ నబీ ఏడో స్థానంలో రానున్నారు. ఈ ఇద్దరు అనుభవజ్ఞులు తమ ఫినిషింగ్ టచ్‌తో భారత బౌలర్లను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. ఇక జట్టు ఐకాన్ ప్లేయర్ రషీద్ ఖాన్‌తో పాటు నూర్ అహ్మద్ కూడా బ్యాటింగ్ చేయగల సత్తా ఉన్నవాళ్లే.బౌలింగ్ దళం..అఫ్గానిస్తాన్‌కు స్పిన్ బౌలింగ్ ప్రధాన ఆయుధం. ముజీబ్ ఉర్ రహ్మాన్, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్ త్రయం భారత్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టవచ్చు. తొలి టీ20కి ఈ ముగ్గురు అందుబాటులో ఉండడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక జట్టులో ఏకైక స్పెషలిస్ట్ ఫాస్ట్ బౌలర్‌గా ఫజల్ ఫరూఖీ ఉండవచ్చు. అతడికి తోడుగా అజ్మతుల్లా, గుల్బదిన్ నైబ్‌లు కూడా బౌలింగ్‌తో ముప్పతిప్పలు పెట్టొచ్చు. ఆల్‌రౌండర్ మహ్మద్ నబీ తన ఆఫ్ స్పిన్‌తో ఇబ్బందిపెట్టగల సత్తా ఉన్నవాడే. మొత్తం మీద అఫ్గానిస్తాన్ జట్టు పేపర్‌పై మాత్రం బలంగా కనిపిస్తోంది. ఇటీవలే కాలంలో ఓటములను అంత త్వరగా ఒప్పుకోని అఫ్గానిస్తాన్ జట్టు సొంతగడ్డపై దుర్భేద్యంగా కనిపిస్తున్న టీమిండియాను ఏ మేరకు నిలువరించగలదనేది చూడాలి.తొలి టీ20కి అఫ్ఘనిస్తాన్ తుది జట్టు అంచనా:రహ్మనుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), ఇబ్రహీం జద్రన్ (కెప్టెన్), దర్విష్ రసూలీ, సెదిఖుల్లా అటల్, గుల్బాదిన్ నైబ్, అజ్మతుల్లా ఉమర్జయ్, మహ్మద్ నబీ, ముజీబ్ ఉర్ రహ్మాన్, రషీద్ ఖాన్, ఫజల్ ఫరూకీ, నూర్ అహ్మద్.Read: రెస్ట్ తీసుకోమన్నా వినలేదు; నొప్పిని భరిస్తూనే డబుల్ సెంచరీ -
కెవిన్ పీటర్సన్‌కు కీలక బాధ్యతలు
ఇంగ్లండ్ క్రికెట్‌కు సంబంధించి ఆ జట్టు మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్‌కు కీలక బాధ్యతలు దక్కాయి. 2027 వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని ఇంగ్లండ్ పురుషుల వైట్‌బాల్ జట్లకు అతడిని స్పెషలిస్ట్ మెంటర్‌గా నియమించారు. వచ్చే ఏడాది జరిగే మెగా టోర్నీ వరకు ఆయన జట్టుతో కలిసి పనిచేయనున్నారు.పీటర్సన్‌కు తొలి అసైన్మెంట్ ఆస్ట్రేలియా పర్యటన కానుంది. ఆ తర్వాత దక్షిణాఫ్రికా పర్యటనలోనూ జట్టుతో పనిచేస్తారు. అనంతరం పాకిస్తాన్, న్యూజిలాండ్‌తో జరిగే స్వదేశీ సిరీస్‌లకు కూడా అందుబాటులో ఉంటారు. కేపీ తన బ్యాటింగ్ అనుభవంతో ఆటగాళ్లకు సూచనలను అందిస్తారు.2027 వన్డే ప్రపంచకప్ దక్షిణాఫ్రికాలో జరగనుంది. జింబాబ్వే, నమీబియా సహ ఆతిథ్య దేశాలుగా వ్యవహరించనున్నాయి. పీటర్సన్ జన్మస్థలం దక్షిణాఫ్రికానే కావడం ఈ నియామకానికి ప్రాధాన్యత తీసుకొచ్చింది.బ్రెండన్ మెకల్లమ్ నేతృత్వంలోని ఇంగ్లండ్ వైట్‌బాల్ కోచింగ్ బృందంలో పీటర్సన్ భాగం కానున్నారు. ఈ బృందంలో మార్కస్ ట్రెస్కోథిక్, టిమ్ సౌథీ, సారా టేలర్, జీతన్ పటేల్ కూడా ఉన్నారు. గతంలో ఐపీఎల్ ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్‌కు మెంటర్‌గా పనిచేసిన అనుభవం పీటర్సన్‌కు ఉంది.కాగా, పీటర్సన్ 2014లో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పారు. 12 ఏళ్ల తర్వాత అతడు మళ్లీ ఇంగ్లండ్ సెటప్‌లోకి రానున్నాడు. చదవండి: 250 రిటైర్డ్ హర్ట్.. చరిత్రలో మూడో బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ -
రెస్ట్ తీసుకోమన్నా వినలేదు; నొప్పిని భరిస్తూనే డబుల్ సెంచరీ
చెన్నై చిదంబరం స్టేడియం వేదికగా జరుగుతున్న దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్‌జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీతో అదరగొట్టాడు. ఇషాన్ 128 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్నప్పుడు నిదీశ్ వేసిన బంతి పొత్తి కడుపు కింద భాగంలో బలంగా తాకింది. బంతి బలంగా తాకడంతో నొప్పితో విలవిల్లాడిపోయిన ఇషాన్ స్క్వేర్ లెగ్ రీజియన్ దిశగా పరిగెత్తి అక్కడే కూర్చుండిపోయాడు. ఫిజియో వచ్చి ఇషాన్ గాయాన్ని పర్యవేక్షించాడు. అదే సమయంలో ఫిజియోతో వచ్చిన డాక్టర్ ‘రెస్ట్ తీసుకో’ అని సలహా ఇచ్చాడు. కానీ ఇషాన్ మాత్రం తాను బ్యాటింగ్ కంటిన్యూ చేస్తానని చెప్పాడు. ఆ తర్వాత నొప్పిని భరిస్తూనే బ్యాటింగ్ చేసిన ఇషాన్ డబుల్ సెంచరీ మార్క్ కూడా అందుకున్నాడు. 270 బంతుల్లో డబుల్ సెంచరీ సాధించిన మరో 30 బంతుల్లో 250 మార్క్‌ను చేరుకున్నాడు. ఆ తర్వాత నొప్పి తిరగబెట్టడంతో ఇషాన్ చాలా ఇబ్బంది పడ్డాడు. ఫిజియో వచ్చి ఇషాన్‌తో మాట్లాడాడు. ఆ వెంటనే ఇషాన్ కిషన్ రిటైర్డ్ హర్ట్‌గా మైదానం వీడాడు. మరి మిగతా మ్యాచ్‌కు ఇషాన్ కిషన్ అందుబాటులో ఉంటాడా? ఉండడా అనే ప్రశ్న అభిమానులను తొలిచేస్తుంది. ఏది ఏమైనా డాక్టర్ రెస్ట్ తీసుకోమని చెప్పినా వినకుండా పట్టువదలని విక్రమార్కుడిలా ఇషాన్ బ్యాటింగ్ కొనసాగించి అందరి మన్ననలు పొందాడు.అయితే స్కోరు కార్డుపై మాత్రం ఇషాన్ రిటైర్డ్ హర్ట్ అయినట్లు ప్రదర్శించడంతో అతడు మళ్లీ బ్యాటింగ్‌కు వచ్చే అవకాశముంది. ఇప్పటికే ఈస్ట్‌జోన్ 650 పరుగుల మార్క్‌ను దాటడంతో తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసే అవకాశం లేకపోలేదు. 13 ఏళ్ల తర్వాత ఈస్ట్ జోన్ దులీప్ ట్రోఫీ ఫైనల్‌కు చేరడం గమనార్హం. ఇషాన్ కిషన్ కెప్టెన్సీలో ఈస్ట్‌జోన్ తాజాగా టైటిల్ గెలుచుకునే అవకాశం ఉంది. ఇప్పటికే ఈస్ట్‌జోన్ 650 పరుగుల మార్క్‌ను దాటడంతో సౌత్‌జోన్ అంత స్కోరు చేయాలన్నా రెండు రోజులు పడుతుంది. ఇప్పటికే రెండు రోజుల ఆట ముగియడం, మరో మూడు రోజులు ఉండడంతో మ్యాచ్ డ్రా అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఈ లెక్కన తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కారణంగా ఈస్ట్ జోన్ ఛాంపియన్‌గా నిలిచే అవకాశం ఉంది.Ishan Kishan brings up his 2️⃣0️⃣0️⃣ in style 💯💯 🙌What a magnificent knock from the East Zone captain so far 👏👏Scorecard ▶️ https://t.co/KQf5Km69nk#DuleepTrophy | #SZvEZ pic.twitter.com/2NaE6qG4VK— BCCI Domestic (@BCCIdomestic) September 7, 2026Doctor: rest loIshan: century laga deta hu 💀🙏Ishan Kishan during a Duleep Trophy match, sarcastically noting an apparent injury with "oops🤕" before adding he recovered quickly and is batting well. pic.twitter.com/5eZraPJVix— CricketIndian_🚩🇮🇳 (@CricketIndian_) September 7, 2026 That moment when Ishan Kishan reached 2️⃣5️⃣0️⃣ 👏👏Scorecard ▶️ https://t.co/KQf5Km69nk#DuleepTrophy | #SZvEZ pic.twitter.com/6YJYiwNtjV— BCCI Domestic (@BCCIdomestic) September 7, 2026చదవండి: భారత్‌తో టీ20 సిరీస్ ముంగిట చెలరేగిన ఆఫ్గన్ బౌలర్ -
భారత్‌తో టీ20 సిరీస్ ముంగిట చెలరేగిన ఆఫ్గన్ బౌలర్
కరీబియన్ ప్రీమియర్ లీగ్ 2026లో అఫ్గానిస్తాన్ స్పిన్నర్ ముజీబ్-ఉర్-రహ్మాన్ బౌలింగ్‌లో చెలరేగడంతో బార్బడోస్ ట్రైడెంట్స్ 8 వికెట్ల తేడాతో సెయింట్ లూసియా కింగ్స్‌పై విజయాన్ని అందుకుంది. సెప్టెంబర్ 13 నుంచి అఫ్గానిస్తాన్ జట్టు టీమిండియాతో టీ20 సిరీస్ ఆడనున్న నేపథ్యంలో ముజీబ్ ఉర్ రహ్మాన్ ఫామ్‌లోకి రావడం ఆ జట్టు బలాన్ని పెంచడంతో తనతో జాగ్రత్తగా ఉండాలని భారత బ్యాటర్లకు హెచ్చరికలు పంపాడు. మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన సెయింట్ లూసియా కింగ్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 138 పరుగుల సాధారణ స్కోరు చేసింది. కమిల్ పూరన్ (37) టాప్ స్కోరర్‌గా నిలవగా, రోస్టన్ చేజ్ (34) పర్వాలేదనిపించాడు. బార్బడోస్ బౌలర్లలో ముజీబ్ ఉర్ రహ్మాన్ 3 వికెట్లు తీయగా, డానియల్ సామ్స్ రెండు వికెట్లు పడగొట్టాడు.అనంతరం బ్యాటింగ్ చేసిన బార్బడోస్ ట్రడెంట్స్ 17.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 139 పరుగులు చేసి గెలుపొందింది. క్వింటన్ డికాక్ (47 నాటౌట్), రివాల్డో క్లార్క్ (36 నాటౌట్) అజేయంగా నిలిచి జట్టును గెలిపించగా, ఓపెనర్లు జాకరీ కార్టర్ (32), బ్రాండన్ కింగ్ (22) రాణించారు. సెయింట్ లూసియా బౌలర్లలో రోస్టన్ చేజ్, జాషువా బిషప్‌లు చెరొక వికెట్ తీశారు. మూడు వికెట్లతో మెరిసిన ముజీబ్ ఉర్ రహ్మాన్‌కు "ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్" అవార్డు దక్కింది.ఇక అఫ్గానిస్తాన్, టీమిండియా మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ సెప్టెంబర్ 13 నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 13న తొలి టీ20, 15న రెండో టీ20, 17న మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. మ్యాచ్‌లన్నీ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరగనున్నాయి.Two for the price of one! ☝️ Mujeeb ur Rahman gets two in the over!🇧🇧 x 🇱🇨#CPL26 #BTvSLK #CricketPlayedLouder #BiggestPartyInSport #OmegaXL pic.twitter.com/Mv9ufmSPgq— CPL T20 (@CPL) September 7, 2026Read: క్వార్టర్స్ చేరిన అల్కరాజ్కు ఊహించని షాక్! -
ఆ ఒక్కటి జింబాబ్వే కొంపముంచింది; ట్రై సిరీస్ విజేత సౌతాఫ్రికా
జింబాబ్వే, నమీబియాలతో జరిగిన ట్రై సిరీస్‌ను సౌతాఫ్రికా సొంతం చేసుకుంది. ఆదివారం విండ్‌హొక్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో సౌతాఫ్రికా 48 పరుగుల తేడాతో జింబాబ్వేపై విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. ఓపెనర్ జోర్డాన్ హెర్మన్ (29 బంతుల్లో 53), డెవాల్డ్ బ్రెవిస్ (32), కన్నోర్ ఎస్తర్‌హుజిన్ (32) రాణించారు. జింబాబ్వే బౌలర్లలో న్యూమన్ నైమూరి, బ్రాడ్ ఎవన్స్ చెరో 2 వికెట్లు తీయగా, సికందర్ రజా ఒక వికెట్ తీశాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 18 ఓవర్లలో 157 పరుగులకు ఆలౌటైంది. బ్రాడ్ ఎవన్స్ (31 బంతుల్లో 56 నాటౌట్) అజేయ అర్థసెంచరీ సాధించినప్పటికీ మిగతా బ్యాటర్లు విఫలం కావడం జింబాబ్వే కొంపముంచింది. సౌతాఫ్రికా బౌలర్లలో డాన్ జాసెన్, బోర్న్ ఫోర్టున్ చెరో 3 వికెట్లు తీయగా, ఈథన్ బోస్క్ 2 వికెట్లు పడగొట్టాడు. మెరుపు అర్థసెంచరీ సాదించిన జోర్డాన్ హెర్మన్ "ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్" అవార్డు సొంతం చేసుకున్నాడు. ఐదు మ్యాచ్‌ల్లో 226 పరుగులు చేసిన డెవాల్డ్ బ్రెవిస్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు ఎగరేసుకుపోయాడు.🚨 MATCH RESULT 🚨#TheProteas seal a commanding 48 run victory over Zimbabwe to clinch the T20I Tri-Series title in Namibia! 🇿🇦🏆A statement finish from South Africa as they get their hands on the trophy! 💪#Unbreakable pic.twitter.com/6c1TqCqSDe— Proteas Men (@ProteasMenCSA) September 6, 2026Read: సంజూను కూరలో కరివేపాకులా తీసేశాడు! -
సంజూను కూరలో కరివేపాకులా తీసేశాడు!
కేరళ క్రికెట్ లీగ్ 2026లో టీమిండియా క్రికెటర్ సంజూ శాంసన్‌కు ఘోర అవమానం ఎదురైనట్లు తెలుస్తోంది. శనివారం టోర్నీ ఫైనల్ మ్యాచ్ ముగిసిన అనంతరం ప్రజంటేషన్ వేడుకలో శాంసన్‌తో చేతులు కలపడానికి భారత మాజీ క్రికెటర్ శ్రీశాంత్ నిరాకరించడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో నిజమెంత? ఏఐ వీడియోనా అనేది పక్కనబెడితే శ్రీశాంత్ చర్య మాత్రం హాట్‌టాపిక్‌గా మారిపోయింది.విషయంలోకి వెళితే.. ప్రజంటేషన్ సందర్భంగా అప్పటికే శాంసన్ వెళ్లి స్టేజీపై ట్రోఫీ పక్కనే నిల్చున్నాడు. ఈలోగా స్టేజీ మీదకు వచ్చిన శ్రీశాంత్ శాంసన్ వైపు కన్నెత్ని కూడా చూడలేదు. అటుపై శాంసన్ పక్కనే నిల్చున్న మిగతా అధికారులకు షేక్ హ్యాండ్ ఇచ్చాడు. కానీ శాంసన్‌తో షేక్ హ్యాండ్ కాదు కదా కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు. వీరిద్దరికి సంబంధించిన ఫొటోలు నెట్టింట క్షణాల్లో వైరలయ్యాయి. అయితే దీనిపై అటు శ్రీశాంత్ కానీ.. ఇటు సంజూ కానీ ఇప్పటివరకైతే స్పందించలేదు. అయితే అభిమానులు మాత్రం కామెంట్లతో రెచ్చిపోయారు. "సంజూ శాంసన్‌ను శ్రీశాంత్ కూరలో కరివేపాకులా తీసేశాడు.. ఇది దారుణ అవమానం" అని పేర్కొన్నారు.ఇక కేరళ క్రికెట్ లీగ్ 2026 టైటిల్‌ను త్రిసూర్ టైటాన్స్ ఎగరేసుకుపోయింది. శనివారం రాత్రి కాలికట్ గ్లోబల్స్టార్స్తో జరిగిన ఫైనల్లో త్రిసూర్ టైటాన్స్ 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన కాలికట్ గ్లోబల్‌స్టార్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. అఖిల్ స్కారియా (45), అశ్విన్ ఆనంద్ (40) రాణించారు. త్రిసూర్ బౌలర్లలో అబ్దుల్ రమీస్ 3 వికెట్లు తీయగా, ఆనంద్ జోసెఫ్, శరత్ ప్రసాద్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్ చేసిన త్రిసూర్ టైటాన్స్ 19.3 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. అహమ్మెద్ ఇమ్రాన్ (69) అర్థసెంచరీతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించగా, సంజీవ్ సతీషన్ (29) రాణించాడు. కాలికట్ బౌలర్లలో జోస్ పెరైల్, అఖిన్ సతార్, ఇన్బుల్ అఫ్తాబ్‌లు తలా రెండు వికెట్లు పడగొట్టారు. మహ్మద్ అజారుద్దీన్ (11 మ్యాచ్‌ల్లో 596 పరుగులు) టోర్నీ టాప్ స్కోరర్‌గా నిలవగా, నిఖిల్ మాలిక్ (11 మ్యాచ్‌ల్లో 18 వికెట్లు) లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. ప్రస్తుతం సంజూ శాంసన్ భారత జట్టులో టీ20, వన్డేల్లో కొనసాగుతున్నాడు. జింబాబ్వే, ఇంగ్లండ్ సిరీస్‌కు దూరంగా ఉన్న శాంసన్ అఫ్గానిస్తాన్‌తో సిరీస్‌కు ఎంపికయ్యాడు. సెప్టెంబర్ 13, 15, 17 తేదీల్లో ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరగనుంది.Any problems between Sreesanth and Sanju Samson?👀There seems to be some talk about a possible ego clash following Sreesanths recent interview.Only they know whats really happening🤷♂️#SanjuSamson @BCCI pic.twitter.com/ndNri2Tabm— Morvin Edward (@morvinedward) September 6, 2026చదవండి: 'అందని ద్రాక్ష పుల్లన'.. అతడి విషయంలో నిజమైంది! -
'అందని ద్రాక్ష పుల్లన'.. అతడి విషయంలో నిజమైంది!
దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్‌జోన్ జట్టు తరఫున ఆడుతున్న 31 ఏళ్ల అభిమన్యు ఈశ్వరన్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో చాలా సీనియర్ ఆటగాడు. 2019 దులీప్ ట్రోఫీ ఫైనల్లో సెంచరీ బాది వెలుగులోకి వచ్చాడు. ఆ తర్వాత ఇండియా-ఏ జట్టుకు కూడా ఎంపికయ్యాడు. ఆ తర్వాత ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో స్థిరమైన ప్రదర్శన కనబరిచినప్పటికీ ఇండియా-ఏ తరఫున మాత్రం పెద్దగా రాణించలేదు. దేశవాళీ టోర్నీలో ప్రదర్శన ఆధారంగా 2021 జనవరిలో అభిమన్యు ఈశ్వరన్ తొలిసారి జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. టీమిండియా టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నప్పటికీ తుది జట్టులో మాత్రం స్థానం లభించలేదు. అలా 2021 నుంచి 2026 దాకా టెస్టుల్లో అరంగేట్రం కోసం చకోర పక్షిలా ఎదురుచూస్తూనే వస్తున్నాడు అభిమన్యు ఈశ్వరన్. ఇక్కడ మరో విచిత్రమైన విషయమేంటంటే.. అభిమన్యు ఈశ్వరన్ తొలిసారి జాతీయ జట్టుకు ఎంపికైన 2021 నుంచి అతడి కళ్ల ముందే 11 మంది ఆటగాళ్లు టెస్టుల్లో అరంగేట్రం చేయడం గమనార్హం. ఒక రకంగా అభిమన్యు ఈశ్వరన్ టాలెంట్‌ను తొక్కసినట్లేననిపిస్తోంది. ఇప్పటివరకు అభిమన్యు ఈశ్వరన్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 197 ఇన్నింగ్స్‌ల్లో 8,545 పరుగులు సాధించాడు. ఇందులో 38 అర్థసెంచరీలు, 27 సెంచరీలు ఉన్నాయి. అందని ద్రాక్ష పుల్లన అంటే ఇదేనేమో!చెన్నై వేదికగా జరుగుతున్న తాజా దులీప్ ట్రోఫీ ఫైనల్లోనూ ఈస్ట్‌జోన్‌కు ఆడుతున్న అభిమన్యు ఈశ్వరన్ మరోసారి ఆకట్టుకున్నాడు. 120 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 85 పరుగులు సాధించాడు. ప్రస్తుతం తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఈస్ట్‌జోన్ జట్టు 79 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 385 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (111 నాటౌట్), కుమార్ కుషాగ్ర (63 నాటౌట్) క్రీజులో ఉన్నారు.Meet Abhimanyu Easwaran 🥲>31-year-old Abhimanyu Easwaran was born in Dehradun, Uttarakhand.>At the age of 10, he moved to Kolkata and started his cricket journey.>In the 2019 Duleep Trophy final, he smashed a brilliant century.>After that, he was named in the India A squad.… pic.twitter.com/ryHD2qxmTn— Sam (@cricsam02) September 6, 2026చదవండి: సెంచరీతో ఇరగదీసిన ఇషాన్ కిషన్.. తొలిరోజు ఈస్ట్‌జోన్‌దే -
కౌంటీల్లో చెలరేగుతున్నాడు; సెలెక్టర్లకు చెన్నై చిన్నోడి వార్నింగ్!
కౌంటీ క్రికెట్లో తమిళనాడు క్రికెటర్ సాయి కిషోర్ తన ప్రదర్శనతో అదరగొడుతున్నాడు. గ్లౌసెష్టర్‌షైర్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నై స్పిన్నర్ సాయి కిషోర్ అద్భుత బౌలింగ్‌తో తన జట్టును గెలిపించడంలో కీలక పాత్ర పోషించాడు. డెర్బీషైర్‌తో జరిగిన మ్యాచ్‌లో సాయి కిషోర్ 20 పరుగులకే ఐదు వికెట్లు పడగొట్టడంతో గ్లౌసెష్టర్‌షైర్ 213 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.ఓవరాల్‌గా ఏడు వికెట్లు తీసిన సాయి కిషోర్ (తొలి ఇన్నింగ్స్‌లో రెండు, రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు) డెర్బీషైర్ పాలిట సింహస్వప్నమయ్యాడు. అతడి ధాటికి 319 పరుగుల ఛేదనలో తడబడిన డెర్బీషైర్ 105 పరుగులకే కుప్పకూలింది. రెండో ఇన్నింగ్స్‌లో సాయి కిషోర్ 18 ఓవర్లు వేస్తే అందులో 12 మెయిడెన్ ఓవర్లు కావడం విశేషం.దేశవాళీలో ఇటీవలీ రంజీ ట్రోఫీలో నిలకడను ప్రదర్శించిన సాయి కిషోర్ కౌంటీ క్రికెట్లోనూ అదే జోరును చూపిస్తున్నాడు. తాజాగా తన ప్రదర్శనతో సాయి కిషోర్ బీసీసీఐ సెలెక్టర్లకు తన ఎంపిక గురించి హెచ్చరికలు పంపాడు. దేశవాళీ క్రికెట్లో అద్భుతమైన రికార్డు, ఎడమచేతి వాటం స్పిన్నర్‌గా ఉండటం, ఇంగ్లండ్ పరిస్థితుల్లోనూ రాణించే సామర్థ్యం.. ఇవన్నీ అతడికి కలిసొచ్చే అంశాలని చెప్పొచ్చు. సీనియర్ల వీడ్కోలుతో భారత టెస్టు జట్టు ప్రస్తుతం మార్పుల దశలో ఉంది. సీనియర్ ఆటగాళ్ల స్థానాలను భర్తీ చేసేందుకు యువ ప్లేయర్ల కోసం టీమ్ మేనేజ్మెంట్ చూస్తోంది. ఈ నేపథ్యంలో కోచ్ గౌతమ్ గంభీర్ ఆధ్వర్యంలో భారత టెస్టు జట్టు భవిష్యత్తు ప్రణాళికల్లో సాయి కిశోర్ కీలక ఎంపికగా మారే అవకాశం ఉంది. అతడి బౌలింగ్ శైలి కూడా గంభీర్ విధానాలకు తగినట్లుగా ఉండడం ఆసక్తికర విషయం. రాబోయే రోజుల్లో టీమిండియా న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలతో టెస్టు సిరీస్‌లు ఆడనుంది. మరి కౌంటీల్లో అద్భుత ప్రదర్శన చేస్తున్న సాయి కిషోర్ టీమిండియాకు ఎంపికవుతాడా లేదా అనేది చూడాలి.SAI KISHORE: 18-12-20-5 🤯🔥- One of the best spells in this County Championship, he is bowling his heart out. pic.twitter.com/qpY6gqe1IJ— Johns. (@CricCrazyJohns) September 6, 2026చదవండి: ‘మా అక్కలు ప్లాన్ చేస్తే మేము ఆచరిస్తాం’ -
‘మా అక్కలు ప్లాన్ చేస్తే మేము ఆచరిస్తాం’
మహిళల ఆసియా కప్ 2026లో భారత మహిళా క్రికెటర్ శ్రీ చరణి తన ప్రదర్శనతో అదరగొడుతుంది. శనివారం పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 ఓవర్లు వేసిన శ్రీ చరణి కేవలం ఏడు పరుగులు మాత్రమే ఇచ్చి మూడు కీలక వికెట్లు తీసింది. మ్యాచ్‌లో చేసిన ప్రదర్శనకు గానూ శ్రీ చరణి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కించుకుంది. అవార్డు తీసుకున్న అనంతరం శ్రీ చరణి మాట్లాడింది. ‘నా ప్రదర్శన పట్ల సంతృప్తిగా ఉన్నా. మహిళల క్రికెట్ ఆడుతూ దేశానికి సేవ చేయడం గొప్ప విషయంగా భావిస్తున్నా. అయితే ప్రతీ మ్యాచ్‌కు జట్టులోని స్పిన్నర్లమంతా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుంటాం. నాతో పాటు ప్రేమ రావత్, దీప్తి శర్మ, రాధా యాదవ్ కలిసి మ్యాచ్‌లో ఎలా బౌలింగ్ చేయాలనేది చర్చించుకుంటాం. దీప్తి, రాధా దీదీలు చెప్పే ప్రతి సలహాను మైదానంలో అమలు చేయడానికి ప్రయత్నిస్తాం. 50 వికెట్ల మార్క్‌కు ఒక్క వికెట్ దూరంలోఎ ఉన్నప్పటికీ, వాటిని నేను పట్టించుకోను. బౌలింగ్‌పైనే నా దృష్టంతా పెట్టాలనుకుంటున్నా. ఇక నాతో పాటు బౌలింగ్‌లో వికెట్లు తీసిన ప్రేమ రావత్‌కు కూడా మంచి భవిష్యత్తు ఉంది. ఆమెది సహజమైన ప్రతిభ. ఫీల్డింగ్, బ్యాటింగ్, బౌలింగ్ అన్నీ సమానంగా ఉంటాయి. బౌలర్లకు సహకరించే వికెట్‌పై సుమారు 120 పరుగులు అనేది మంచి స్కోరు కింద లెక్కే. ఇకపై కూడా నా ప్రదర్శనను ఇలాగే కొనసాగించాలనుకుంటున్నా’ అని చెప్పుకొచ్చింది.మ్యాచ్ విషయానికొస్తే పాకిస్తాన్‌పై భారత మహిళల జట్టు 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 18.1 ఓవర్లలో 55 పరుగులకు ఆలౌటైంది. మునీబా అలీ (13), షావల్ జుల్ఫికర్ (14) మినహా మిగతా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. శ్రీ చరణి, ప్రేమ రావత్‌లు చెరో 3 వికెట్లు తీయగా, దీప్తి శర్మ రెండు వికెట్లు పడగొట్టింది. అనంతరం భారత జట్టు 8.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 57 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. హర్మన్ ప్రీత్ (18 నాటౌట్), దీప్తి శర్మ (12 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చారు. పాక్ కెప్టెన్ ఫాతిమా సనా 3 వికెట్లు పడగొట్టింది.Read: ఏంటి వైస్ కెప్టెన్.. ఇంత స్లోగా ఆడుతున్నావ్? -
శ్రీ చరణి ప్రపంచ రికార్డు.. 55 పరుగులకే పాక్ ఆలౌట్
మహిళల ఆసియా కప్ టోర్నీలో తెలుగు క్రికెటర్ శ్రీ చరణి మరోసారి తన బౌలింగ్‌తో మెరిసింది. దుబాయ్ వేదికగా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీ చరణి (4-0-7-3) తన కెరీర్లోనే బెస్ట్ బౌలింగ్ ప్రదర్శన నమోదు చేసింది. తాను వేసిన తొలి ఓవర్లోనే శ్రీ చరణి రెండు వికెట్లు పడగొట్టింది. ఆ తర్వాత మరో వికెట్ తన ఖాతాలో వేసుకున్న శ్రీ చరణి ఒక అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకుంది. 2026 ఏడాదిలో భారత మహిళల క్రికెట్లో టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా శ్రీచరణి రికార్డులకెక్కింది. పాక్‌తో మ్యాచ్‌లో మూడు వికెట్లు తీయడం ద్వారా శ్రీ చరణి 34వ వికెట్‌ను ఖాతాలో వేసుకుంది. తద్వారా 2026 ఏడాదిలో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా శ్రీ చరణి నిలిచింది. రెండో స్థానంలో ఆల్‌రౌండర్ దీప్తి శర్మ 23 వికెట్లతో కొనసాగుతుండగా, నందని శర్మ 12 వికెట్లు, అరుంధతీ రెడ్డి 11 వికెట్లు, శ్రేయాంక పాటిల్ 9 వికెట్లతో వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో కొనసాగుతున్నారు. ఓవరాల్ జాబితాలో పూనమ్ రౌత్ 2018లో 35 వికెట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.కుప్పకూలిన పాక్ఇక మ్యాచ్ విషయానికొస్తే భారత బౌలర్ల ధాటికి పాకిస్తాన్ 18.1 ఓవర్లలో 55 పరుగులకే కుప్పకూలింది. షావల్ జుల్ఫికర్ (14), మునీబా అలీ (13) మినహా మిగతా 8 మంది బ్యాటర్లంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. భారత బౌలర్లలో శ్రీ చరణి, ప్రేమా రావత్‌లు చెరో 3 వికెట్ల తీసి పాకిస్తాన్ పతనాన్ని శాసించగా.. దీప్తి శర్మ రెండు వికెట్లు పడగొట్టింది.టాస్ గెలవడం ఒక్కటే పాకిస్తాన్‌కు ఊరట అని చెప్పొచ్చు. బ్యాటింగ్‌కు దిగిన కాసేపటికే పాక్‌కు భారత బౌలర్లు బొమ్మ చూపించారు. శ్రీ చరణి ఆరంభంలోనూ మూడు వికెట్లు తీసి ఒత్తిడిలోకి నెట్టేయగా, ఆ తర్వాత స్పిన్నర్ ప్రేమా రావత్ బాధ్యతలు తీసుకుంది. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో పాక్ బ్యాటర్లు పరుగులు చేయలేక నానా అవస్థలు పడ్డారు.Innings Break!An outstanding bowling performance from #TeamIndia! 🙌 🙌3️⃣ wickets each for Sree Charani & Prema Rawat2️⃣ wickets for Deepti Sharma1️⃣ wicket for Shafali VermaStay tuned for India's chase! ⌛️Scorecard ▶️ https://t.co/1WHHWPMe2o#WomensAsiaCup pic.twitter.com/e27WuNsSL0— BCCI Women (@BCCIWomen) September 5, 2026 Shree Charani strikes twice in her very first over! 💥 3 wickets in 3 overs.3-0-6-3.Match winning performance by Charani.#INDvPAK #ShreeCharani #Dubai #T20 #TeamIndia #PakistanCricket #AsiaCup #WomensCricket pic.twitter.com/PVEQQBZlf1— lightningspeed (@lightningspeedk) September 5, 2026Read: మానవ్ సుతార్ జోరు.. కౌంటీలో ఇరగదీస్తున్న భారత ఆటగాళ్లు -
మానవ్ సుతార్ జోరు.. కౌంటీలో ఇరగదీస్తున్న భారత ఆటగాళ్లు
టీమిండియా రైజింగ్ స్పిన్నర్ మానవ్ సుతార్ కౌంటీ చాంపియన్‌షిప్‌లోనూ అదరగొడుతున్నాడు. వార్విక్షైర్ తరఫున ఆడుతున్న మానవ్ సుతార్ తన స్పిన్ మ్యాజిక్‌తో హాంప్‌షైర్‌తో మ్యాచ్‌లో ఏడు వికెట్ల హాల్ (తొలి ఇన్నింగ్స్‌లో మూడు, రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు) నమోదు చేయడం విశేషం. మానవ్ సుతార్ విజృంభణ కారణంగా వార్విక్షైర్ ఇన్నింగ్స్ 129 పరుగుల తేడాతో హాంప్‌షైర్‌పై ఘన విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన వార్విక్షైర్ 398 పరుగులకు ఆలౌటైంది. అనంతరం హాంప్‌షైర్ తొలి ఇన్నింగ్స్‌లో 115, రెండో ఇన్నింగ్స్‌లో 154 పరుగులకు కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్‌లో 15 ఓవర్లు వేసిన మానవ్ సుతార్ 42 పరుగులిచ్చి మూడు వికెట్లు తీశాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో 23.3 ఓవర్లు వేసి 52 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. కౌంటీ ఆడడానికి ముందు శ్రీలంక పర్యటనలోనూ మానవ్ సుతార్ దుమ్మురేపాడు. రెండు టెస్టులు కలిపి 11 వికెట్లు పడగొట్టిన సుతార్ ఖాతాలో ఒక ఐదు వికెట్ల హాల్ ఉండడం విశేషం. రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ తర్వాత పలుచబడిన స్పిన్ విభాగంలో మానవ్ సుతార్ తన మ్యాజిక్‌తో భారత జట్టులో కొత్త ఆశలు రేపుతున్నాడు.ఇరగదీసిన చాహల్, అకిబ్ నబీఇక కౌంటీల్లో మానవ్ సుతార్‌తో పాటు మిగతా భారత బౌలర్లు కూడా తమ ప్రదర్శనతో అదరగొట్టారు. జమ్మూ కశ్మీర్ సంచలనం అకిబ్ నబీ కూడా అదిరిపోయే అరంగేట్రం చేశాడు. తొలిసారి కౌంటీల్లో ఆడుతున్న ఈ బారాముల్లా ఎక్స్‌ప్రెస్ సర్రే తరఫున రెండు కీలక వికెట్లు తీసి యార్క్‌షైర్‌పై విజయం సాధించడంలో ప్రధానపాత్ర పోషించాడు. మరో టీమిండియా సీనియర్ యజ్వేంద్ర చాహల్కూడా నార్తంప్టన్‌షైర్ తరఫున అద్భుత ప్రదర్శన చేశాడు. రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 9 వికెట్లు తీసిన చాహల్ ఒక ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల హాల్ నమోదు చేశాడు. లిస్ట్-ఏ క్రికెట్లోనూ చాహల్ అదరగొట్టాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో ఈ సీజన్లో చాహల్ 14 వికెట్లు తీశాడు.Manav Suthar vs Hampshire: 3/42 in the 1st inns4/52 in the 2nd innsOutstanding bowling touch in last few months for Indian spinner... 🔥pic.twitter.com/uTrBKhD1OS— CricketGully (@thecricketgully) September 5, 2026చదవండి: వైరలవుతున్న అల్కరాజ్ బనియన్ .. ఇదేం కర్మరా దేవుడా! -
పాకిస్తాన్‌తో మ్యాచ్.. చరిత్ర సృష్టించిన హర్మన్‌ప్రీత్
మహిళల ఆసియా కప్ టోర్నీ-2026లో భాగంగా దుబాయ్ వేదికగా చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ మొదలయ్యింది. టాస్ గెలిచిన పాకిస్తాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. థాయ్‌లాండ్, హాంకాంగ్‌లపై విజయాలతో భారత్ ఇప్పటికే సెమీస్‌కు చేరుకుంది. ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధించి అజేయంగా నిలవాలని టీమిండియా భావిస్తోంది. ఈ నేపథ్యంలో భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అరుదైన ఫీట్ సాధించింది. మహిళల టీ20 క్రికెట్లో అత్యధిక మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించిన జాబితాలో హర్మన్ తొలి స్థానంలో నిలిచింది. హర్మన్‌కు కెప్టెన్‌గా ఇది 150వ మ్యాచ్ కావడం విశేషం. పురుషుల, మహిళల క్రికెట్లో అత్యధిక మ్యాచ్‌ల్లో కెప్టెన్‌గా వ్యహరించిన రికార్డు హర్మన్ పేరిటే ఉంది. ఈ జాబితాలో చమేరీ ఆటపట్టు 121 మ్యాచ్‌లతో రెండో స్థానంలో ఉండగా, ఆస్ట్రేలియాకు చెందిన మెగ్ లానింగ్ (100 మ్యాచ్‌లు), హెథర్ నైట్ (96 మ్యాచ్‌లు, ఇంగ్లండ్) తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు. మ్యాచ్‌లో భారత్, పాకిస్తాన్ ఎలాంటి మార్పులు చేయలేదు. భారత మహిళలు (ప్లేయింగ్ XI): స్మృతి మంధాన, షఫాలీ వర్మ, ప్రతీకా రావల్, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), భారతీ ఫుల్మాలి, రిచా ఘోష్(వికెట్ కీపర్), దీప్తి శర్మ, ప్రేమ రావత్, నందనీ శర్మ, శ్రీ చరణి, క్రాంతి గౌడ్.పాకిస్థాన్ మహిళలు (ప్లేయింగ్ XI): మునీబా అలీ(వికెట్ కీపర్), షావాల్ జుల్ఫికర్, గుల్ ఫిరోజా, అయేషా జాఫర్, సదాఫ్ షమాస్, ఫాతిమా సనా(కెప్టెన్), ఉమ్-ఎ-హనీ, ఈమాన్ ఫాతిమా, తుబా హసన్, నష్రా సంధు, సాదియా ఇక్బాల్.🚨 𝗠𝗶𝗹𝗲𝘀𝘁𝗼𝗻𝗲 𝗠𝗼𝗺𝗲𝗻𝘁, 𝗠𝗼𝗻𝘂𝗺𝗲𝗻𝘁𝗮𝗹 𝗠𝗼𝗺𝗲𝗻𝘁 🚨Harmanpreet Kaur becomes the first cricketer to captain a side in 1️⃣5️⃣0️⃣ T20Is. 👏 👏Updates ▶️ https://t.co/1WHHWPMe2o#TeamIndia | #WomensAsiaCup | @ImHarmanpreet pic.twitter.com/WrdFlp7kcH— BCCI Women (@BCCIWomen) September 5, 2026 🚨 Toss and Playing XI Update #TeamIndia will bowl first and here's our line-up for the match 🔽Updates ▶️ https://t.co/1WHHWPMe2o#WomensAsiaCup pic.twitter.com/69Jmw9YgUu— BCCI Women (@BCCIWomen) September 5, 2026Read: వైరలవుతున్న అల్కరాజ్ బనియన్ .. ఇదేం కర్మరా దేవుడా! -
బంతి వేయడానికి 100 కి.మీ. పరిగెత్తిన ఇంగ్లండ్ బౌలర్
ఇంగ్లండ్ క్లబ్ క్రికెటర్, అథ్లెట్ సామ్ బోడోనో క్రికెట్ చరిత్రలోనే అత్యంత పొడవైన రన్-అప్ (Longest Bowling Run-up) తో తొలి బంతిని వేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కోసం ప్రయత్నించాడు. బంతి వేయడానికి ఏకంగా వంద కిలోమీటర్లు పరిగెత్తి రికార్డు సృష్టించాడు. విషయంలోకి వెళితే.. ఇంగ్లండ్ మాజీ ఆటగాడు ఆండ్రూ స్ట్రాస్ భార్య రూత్ క్యాన్సర్‌తో మరణించింది. ఆమె పేరిట ఆండ్రూ స్ట్రాస్ నడుపుతున్న రూత్ స్ట్రాస్ ఫౌండేషన్ ఫర్ క్యాన్సర్ చారిటీకి సామ్ బోడోవాన్ 6 వేల పౌండ్లు సేకరించి అందించాడు. ఈ క్రమంలో వ్యాలీ క్రికెట్ గ్రౌండ్లో బ్యాటింగ్ చేస్తున్న సామ్ బోడోవానో తండ్రికి తొలి బంతి వేసేందుకు సామ్ లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ నుంచి బౌలింగ్ రన్-అప్ ప్రారంభించాడు. 14 గంటల్లో 100 కిమీ దూరం (62 మైళ్లు) పరిగెత్తి బంతిని విసరడం విశేషం. ఈ నేపథ్యంలో క్రికెట్ చరిత్రలోనే అత్యంత పొడవైన రన్-అప్‌తో సామ్ బోడోవానో గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించాడు.గతంలో అత్యంత లాంగెస్ట్ రన్-అప్ టామ్ డున్ పేరిట ఉంది. 2024 ఆగస్టులో ఇతగాడు ఈస్ట్ లండన్‌లోని బెత్నెల్ గ్రీన్ నుంచి సౌత్ లండన్‌లోని వాండ్స్‌వార్త్ మధ్య 24 కిమీ దూరం (15 మైళ్లు) పరిగెతాడు. తాజాగా టామ్ రికార్డును సామ్ సవరించాడు. ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ ఆండ్రూ స్ట్రాస్ భార్య రూత్ 2019లో క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ ప్రాణాలు విడిచింది. అదే ఏడాది ఆమె గుర్తుగా ఆండ్రూ స్ట్రాస్ రూత్ స్ట్రాస్ట్ ఫౌండేషన్ ఏర్పాటు చేశాడు. ఇంగ్లండ్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన ఆండ్రూ స్ట్రాస్ 2003 నుంచి 2012 మధ్య అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు. ఇంగ్లండ్ గొప్ప బ్యాటర్లలో ఒకడిగా గుర్తింపు పొందిన స్ట్రాస్ 100 టెస్టుల్లో 7,037 పరుగులు, 127 వన్డేల్లో 4,205 పరుగులు సాధించాడు.Read: ‘ఆకలిగొన్న సింహంలా ఉన్నాడు.. అతడి రీఎంట్రీ ఆపలేరు’ -
‘ఆకలిగొన్న సింహంలా ఉన్నాడు.. అతడి రీఎంట్రీ ఆపలేరు’
టీమిండియా సీనియర్ ఆటగాడు మహ్మద్ షమీ జాతీయ జట్టులో చోటు కోల్పోయినప్పటికీ దేశవాళీ క్రికెట్లో మాత్రం అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు. దులీప్ ట్రోఫీలో 13 ఏళ్ల తర్వాత ఈస్ట్‌జోన్ ఫైనల్‌కు చేరడంలో షమీ కీలకపాత్ర పోషించాడు. బెంగళూరు వేదికగా సెంట్రల్ జోన్‌తో జరిగిన సెమీఫైనల్లో షమీ రెండు ఇన్నింగ్స్‌లు కలిపి ఐదు వికెట్లు పడగొట్టాడు. ఆదివారం నుంచి ఈస్ట్‌జోన్, సౌత్‌జోన్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఈస్ట్‌జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్ శనివారం సాయంత్రం మీడియా సమావేశంలో పాల్గొన్నాడు. ఆటగాడు బాగా రాణిస్తున్నాడంటే ఎంపికకు అతడి వయసుతో సంబంధముండదని తెలిపాడు. షమీ విషయంలోనూ అదే వర్తిస్తుందని, జట్టులో చోటు కోల్పోయినప్పటి నుంచి షమీ కసితో ఉన్నాడని, అతడిని టీమిండియాకు ఎంపిక చేయాల్సిన సమయం వచ్చిందని ఇషాన్ అభిప్రాయపడ్డాడు.Photo Credit: BCCI Twitterఇషాన్ మాట్లాడుతూ.. ‘‘అత్యుత్తమ ఆటగాళ్లలో షమీ ఒకడని నేను భావిస్తున్నాను. స్టార్‌గా వెలుగొందుతున్న షమీ బెంగాల్ తరఫున ఆడడం మొదలుపెట్టినప్పటి నుంచి మంచి ప్రదర్శన చేస్తున్నాడు. ప్రతీ మ్యాచ్‌లో వికెట్లు తీస్తూ కీలక బౌలర్‌గా మారిపోయాడు. ఒక బౌలర్‌గా టీమిండియాకు కూడా ఎంతో సేవ చేశాడు. వయసు అనేది ఒక సంఖ్య మాత్రమే అని నేను భావిస్తాను. కష్టపడుతున్న సమయంలో వయసును లెక్కలోకి తీసుకోకూడనేది నా అభిప్రాయం. షమీ భాయ్‌లో ఆ కసి నాకు స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో ఎలా ఆడాడు అనేదాన్ని పక్కనబెట్టి ఇప్పుడెలా ఆడుతున్నాడనే దానిపై బీసీసీఐ సెలెక్టర్లు దృష్టి సారించాల్సిన అవసరముంది. ప్రస్తుతం ఈస్ట్‌జోన్ జట్టుకు షమీ ఆడుతుండడం మా అదృష్టం. అతడు మా జట్టులో ఉండడం మాకు మరింత ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. 36 ఏళ్ల వయసులో ఎక్కువ ఓవర్లు వేస్తే అలసిపోయే బౌలర్లతో పోలిస్తే షమీ వేరుగా కనిపిస్తాడు. Photo Credit: BCCI Twitterనేను అడగకముందే జట్టుకు వికెట్ అవసరమైనప్పుడల్లా తాను బౌలింగ్ చేస్తానంటూ షమీ భాయ్ ముందుకు వచ్చేవాడు. ఒక కెప్టెన్‌గా అతడి కసిని చూస్తుంటే ముచ్చటగా అనిపిస్తుంది. టీమిండియాలోకి మళ్లీ రీఎంట్రీ ఇవ్వాలనే అతడి తాపత్రయం నా కళ్లకు స్పష్టంగా కనిపిస్తుంది. ఆకలిగొన్న సింహంలా కనిపిస్తున్నాడు. షమీ భాయ్ రీఎంట్రీని ఎవరూ ఆపలేరు.’ అని ఇషాన్ కిషన్ చెప్పుకొచ్చాడు. ఇక సౌత్‌జోన్ కెప్టెన్ తిలక్ వర్మ కూడా షమీపై ప్రసంశల జల్లు కురిపించాడు. షమీ లాంటి చాకచక్యమైన పేసర్‌ను ఎదుర్కోవడానికి తమ జట్టు సిద్ధంగా ఉందని తిలక్ వర్మ పేర్కొన్నాడు. షమీ భాయ్‌తో ఆడడం మాకు ఎప్పుడూ ఇష్టమే అని తిలక్ వెల్లడించాడు. ఇటీవలే షమీ ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 900 వికెట్ల మార్క్‌ను అందుకున్న సంగతి తెలిసిందే. 2023 వన్డే ప్రపంచకప్‌లో టోర్నీ లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచిన మహ్మద్ షమీ భారత్ తరఫున చివరిసారిగా 2025 చాంపియన్స్ ట్రోఫీలో ఆడాడు.Read: నాలుగేళ్ల తర్వాత బరిలో విలియమ్స్ సిస్టర్స్.. ఫలితం ఏంటంటే? -
రోహిత్ కొత్త అవతారం.. ‘రిటైర్మెంట్ తర్వాత చేసే పని ఇదేనా’
టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ కొత్త అవతారం ఎత్తాడు. సెప్టెంబర్ 19 నుంచి సోనీ ఎంటర్టైన్మెంట్, సోనీ లివ్‌లో ప్రత్యక్ష ప్రసారం కానున్న కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నాడు. రోహిత్ శర్మ హోస్ట్‌గా వ్యవహరించనున్న షో పేరు "ఫ్యామిలీ ఫుల్హౌస్ విత్ రోహిత్ శర్మ". ఈ షోలో మల్టీ జనరేషన్ టీమ్స్ పాల్గొననున్నాయి. ఇప్పటిదాకా మైదానంలో బ్యాట్ పట్టి అభిమానులను అలరించిన హిట్‌మ్యాన్ ఇకపై గ్రీన్ మ్యాట్‌పై షోకు విచ్చేసే కుటుంబాలు చెప్పే కథలను కెమెరా, లైటింగ్ మధ్య విననున్నాడు. స్వతహాగా మంచి మాటకారి అయిన రోహిత్‌ను షోకు హోస్ట్‌గా ఎంపిక చేయడంతోనే సోనీ ఎంటర్టైన్మెంట్ సగం విజయం సాధించేసింది. ఇక రోహిత్ తన కామెడీ టైమింగ్‌తో షోను ఎంత మేర నడిపిస్తాడనేది చూడాలి. ఇప్పటికే ప్రోగ్రామ్‌కు సంబంధించిన ప్రోమో కట్స్, అందులో రోహిత్ చేస్తున్న అల్లరి అభిమానులను పూర్తిగా ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ ఆటకు పూర్తిగా రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత చేయబోయే పని కూడా ఇదేనని అభిమానులు సరదాగా కామెంట్లు పెడుతున్నారు.ఇప్పటికే టెస్టులకు, టీ20లకు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ ప్రస్తుతం వన్డే ఫార్మాట్లో మాత్రమే కొనసాగుతున్నాడు. 2027 వన్డే వరల్డ్‌కప్ రోహిత్ శర్మకు చివరి టోర్నీ అయ్యే అవకాశం లేకపోలేదు. కాగా రోహిత్ రిటైర్మెంట్పై ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా రోహిత్ జట్టులో ఉంటాడని, అతడి గురించి అనవసర ఊహాగానాలు చేయడం ఆపేయాలని హితవు పలికాడు. ఇక రోహిత్ శర్మ టీమిండియా తరఫున తన చివరి వన్డే మ్యాచ్‌ను ఇంగ్లండ్‌తో ఆడాడు. లార్డ్స్ వేదికగా జరిగిన చివరి వన్డేలో రోహిత్ సెంచరీతో మెరిశాడు. ఓవరాల్‌గా ఇంగ్లండ్‌తో సిరీస్‌లో మూడు వన్డేలు కలిపి 175 పరుగులు చేశాడు.Garden Se Reporting Live, Jersey No. 45 😉Family Full House With Rohit Sharma!Shuru ho raha hai 19th September se, sirf #SonyEntertainmentTelevision aur Sony LIV par.#RohitSharma#FamilyFullHouse#ComingSoon #SonyTV@ImRo45 pic.twitter.com/DGWRp6Epzv— sonytv (@SonyTV) September 5, 2026చదవండి: భారత్‌తో మ్యాచ్.. విజయం మాదే! పాక్ ప్లేయర్ సంచలన కామెంట్స్ -
62 మంది క్రికెటర్లపై నిషేధం యోచనలో బీసీసీఐ!
ఆస్ట్రేలియాతో జరగబోయే సిరీస్ కోసం భారత అండర్-19 జట్టుకు ఎంపికైన కొన్ని వారాలకే, తన వయసును తప్పుగా చెప్పాడనే ఆరోపణలపై బెంగాల్ లెగ్ స్పిన్నర్ రోహిత్ యాదవ్‌పై బీసీసీఐ రెండేళ్ల నిషేధం విధించింది. అయితే ఇక్కడే ఊహించని ట్విస్ట్ బయటపడింది. రోహిత్ యాదవ్ ఒక్కడే కాదు దాదాపు 62 మంది యువ క్రికెటర్లు వయసుకు సంబంధించి తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించినట్లు తేలింది. ఈ 62 మంది క్రికెటర్ల వయసులో వ్యత్యాసాలున్నట్లు బయటపడడం సంచలనం కలిగిస్తోంది. పత్రాలు, వయస్సు సంబంధిత వ్యత్యాసాల కారణంగా, 2026-27, 2027-28 సీజన్లలో ఏ టోర్నమెంట్‌కైనా నమోదు లేదా బదిలీ చేసిన 62 మంది క్రికెటర్లను బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అనర్హులుగా ప్రకటించింది. వీరిలోనే ప్రస్తుతం రెండేళ్ల నిషేధం పడిన రోహిత్ యాదవ్ కూడా ఉన్నాడు.దీంతో బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (క్యాబ్) ఆ 62 మంది క్రికెటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని బీసీసీఐకి ఫిర్యాదు చేయడంతో పాటు తాను కఠిన చర్యలకు సిద్ధమవుతోంది. ఇక జాబితాలో రోహిత్ యాదవ్‌తో పాటు 2022 అండర్-19 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడైన రవికుమార్‌తో పాటు స్పిన్ ఆల్‌రౌండర్ విశాల్ భట్టి కూడా ఉన్నారు. అయితే బెంగాల్ అసోసియేషన్ రికార్డుల్లో రవి వయసు అసలుతో పోలిస్తే 45 నెలల వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించింది.రవితో పాటు ఇతర ఆటగాళ్లు కూడా వయసుకు సంబంధించి గణనీయమైన వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించినట్లు క్యాబ్ స్పష్టం చేసింది. ఇప్పటికే ఆ 62 మంది ఆటగాళ్లకు సంబంధించిన అన్ని వివరాలను బీసీసీఐకి అందజేసినట్లు క్యాబ్ తెలిపింది. ఈ మేరకు బీసీసీఐ తప్పుడు వయసు పత్రాలను చూపించిన 62 మంది యువ ఆటగాళ్లపై ఎలాంటి చర్యలు తీసుకోనుందనేది ఆసక్తిగా మారింది.ఇక ఉత్తర ప్రదేశ్‌కు చెందిన రోహిత్, జూలైలో జరిగిన అండర్-19 జట్టు శ్రీలంక పర్యటనలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించి, ఆరు వికెట్లు తీసి, చివరి టెస్టులో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. గత కొన్నేళ్లుగా తన పుట్టిన సంవత్సరానికి సంబంధించి రోహిత్ వేర్వేరు పత్రాల్లో వేర్వేరు వివరాలు సమర్పించినట్లు సమాచారం. బెంగాల్ అసోసియేషన్‌కు 2014లో ఇచ్చిన వివరాల్లో తాను జూలై 7, 2007లో జన్మించినట్లు అతడు పేర్కొన్నాడు. అందులో తన చిరునామాను ఉత్తరప్రదేశ్‌గా పేర్కొన్నాడు. అయితే, 2017లో ఆధార్ అప్డేట్ సందర్భంగా తాను 2006లో జన్మించినట్లు రోహిత్ యాదవ్ తెలిపాడు. ఆ తర్వాత 2020, 2021లో మరోసారి అప్డేట్ చేసుకోగా.. ఈసారి తాను 2009లో జన్మించినట్లు పేర్కొన్నాడు.చదవండి: కౌంటీల్లో తొలి వికెట్ సాధించిన కశ్మీర్ సంచలనం -
కౌంటీల్లో తొలి వికెట్ సాధించిన కశ్మీర్ సంచలనం
కౌంటీ చాంపియన్‌షిప్‌లో ఆడుతున్న జమ్మూ కశ్మీర్ సంచలనం అకిబ్ నబీ మెయిడెన్ వికెట్ సాధించాడు. సీజన్లో సర్రే తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న అకిబ్ నబీ భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను ఔట్ చేయడం ద్వారా కౌంటీల్లో తొలి వికెట్ పొందాడు. యార్క్‌షైర్‌తో మ్యాచ్ సందర్భంగా నబీ వేసిన బంతిని ఆడే క్రమంలో కుల్దీప్ స్లిప్‌లో ఆడి కార్డన్కు దొరికిపోయాడు. దీంతో అప్పటివరకు ఉన్న పార్టనర్షిప్ బ్రేక్ అవ్వడంతో పాటు 53 బంతుల తర్వాత వికెట్ లభించినట్లయింది. దీనికి సంబంధించిన వీడియోపై ఒక లుక్కేయంది.ఇక జమ్మూ కశ్మీర్‌లోని బారాముల్లాకు చెందిన అకిబ్ నబీ గత నెలలో శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు ఎంపికయ్యాడు. కానీ సిరీస్‌లో మ్యాచ్ ఆడే అవకాశం అతడికి రాలేదు. దీంతో సిరీస్ ముగిసిన వెంటనే కౌంటీల్లో ఆడేందుకు ఇంగ్లండ్ చేరుకున్నాడు. కెరీర్లో తొలిసారి కౌంటీ ఆడుతున్న అకిబ్ నబీ తన బౌలింగ్ మెరుపులను ఇంగ్లీష్ గడ్డపై ప్రత్యర్థులకు రుచి చూపించే పనిలో పడ్డాడు. న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్ ఉండడంతో కౌంటీల్లో సత్తా చాటి మరోసారి జట్టుకు ఎంపికవ్వాలని అకిబ్ నబీ భావిస్తున్నాడు. ఇక మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో ఒక వికెట్ తీసిన నబీ రెండో ఇన్నింగ్స్‌లో జేమ్స్ వార్టన్‌ను ఔట్ చేసి రెండో వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. మ్యాచ్‌లో సర్రే జట్టు విజయం దిశగా నడుస్తోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి సర్రే జట్టు వికెట్ నష్టపోకుండా 27 పరుగులు చేసింది.దేశవాళీలో సంచలన ప్రదర్శనఇక దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీలో జమ్మూ కశ్మీర్ తరఫున అకిబ్ నబీ వరుసగా రెండేళ్లు సంచల ప్రదర్శన నమోదు చేశాడు. 2025-26 రంజీ సీజన్లో అకిబ్ నబీ 60 వికెట్లు పడగొట్టి జమ్మూ కశ్మీర్ టైటిల్ అందుకోవడంలో కీలకపాత్ర పోషించాడు. తన పేస్ బౌలింగ్‌తో ప్రత్యర్థులకు చెమటలు పట్టించే అకిబ్ నబీ 43 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో 162 వికెట్లు పడగొట్టాడు. ఈ ప్రదర్శనతోనే అకిబ్ నబీ ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు రూ. 8.4 కోట్లకు అమ్ముడుపోయి రికార్డు సృష్టించాడు. కౌంటీ ముగిసిన తర్వాత అకిబ్ నబీ స్వదేశంలో ఆస్ట్రేలియా-ఎ జట్టుతో జరగనున్న రెండు అనధికారిక టెస్టు మ్యాచ్‌లు ఆడనున్నాడు. అంతేకాదు న్యూజిలాండ్‌తో జరగబోయే టెస్టు సిరీస్‌కు బీసీసీఐ మదిలో ఉన్న ఐదుగురు ఫాస్ట్ బౌలర్లలో అకిబ్ నబీ పేరు కూడా ఉండడం విశేషం.Auqib Nabi gets his first Surrey wicket as Kuldeep Yadav is caught at second slip by Ollie Pope. ✅Yorkshire 170/8 at the Kia Oval.🤎 | #CountyChampionship pic.twitter.com/VXVuEeI4mA— Surrey Cricket (@surreycricket) September 3, 2026Read: చివరి గ్రాండ్‌స్లామ్ ఆడిన ఫ్రెంచ్ ఐకాన్.. భార్య ఎవరో తెలిస్తే షాక్! -
భారత బౌలర్ దెబ్బకు స్టోక్స్ ఫ్యూజులు ఔట్!
టీమిండియాలో చోటు కోల్పోయిన లెగ్ స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ ప్రస్తుతం కౌంటీ చాంపియన్‌షిప్‌లో బిజీ అయ్యాడు. అకీబ్ నబీ, రాహుల్ చాహర్, కుల్దీప్ యాదవ్‌తో పాటు చాహల్ కౌంటీ క్రికెట్ ఆడుతున్నాడు. ఈ నేపథ్యంలో నార్తాంప్టన్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న చాహల్ డుర్హమ్‌తో మ్యాచ్‌లో నాలుగు వికెట్ల ప్రదర్శనతో మెరిశాడు. చాహల్ ఖాతాలో అలెక్స్ లీస్, బెన్ స్టోక్స్, కాసే అల్డ్రిడ్జ్, మాథ్యూ పాట్స్ ఉన్నారు.ఈ నాలుగింటిలో స్టోక్స్‌ను బురిడీ కొట్టించిన తీరు మ్యాచ్‌కే హైలైట్ అని చెప్పొచ్చు. చాహల్ వేసిన రిప్పర్ అనూహ్య టర్న్ తీసుకొని ఔట్‌సైడ్ వెళ్లి స్టంప్స్‌ను ఎగురగొట్టింది. చాహల్ వేసిన మ్యాజిక్ బంతికి స్టోక్స్ ఫ్యూజులు కదిలాయని చెప్పొచ్చు. ఏం జరిగింది అన్న తరహాలో స్టోక్స్ తల గోక్కుంటూ క్రీజు వీడడం కెమెరాలకు చిక్కింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఇటీవలే టీమిండియా బౌలర్ అర్షదీప్ సింగ్ ఎంపిక చేసిన ఐదుగురు భారత బెస్ట్ బౌలర్ల జాబితాలో చాహల్ చోటు దక్కించుకున్నాడు. బుమ్రా మిస్ అయిన జాబితాలో చాహల్ నాలుగోస్థానం పొందగా, వెటరన్ భువనేశ్వర్ కుమార్ తొలి స్థానం దక్కించుకోవడం విశేషం.మ్యాచ్ విషయానికొస్తే చాహల్ దెబ్బకు డుర్హమ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 205 పరుగులకు ఆలౌటైంది. డేవిడ్ బెడింగ్హమ్ (81) టాప్ స్కోరర్ కాగా, మయాంక్ అగర్వాల్ (36) పర్వాలేదనిపించాడు. చాహల్ 4 వికెట్లు తీశాడు. అనంతరం ఆటను ప్రారంభించిన నార్తంప్టన్ షైర్ జట్టు రెండో రోజు ఆట ముగిసే సమయానికి 7 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. లూయిస్ మెక్‌మనస్ (18), లూయిస్ కింబర్ (4) క్రీజులో ఉన్నారు. సైఫ్ జయీబ్ (52), జేమ్స్ సేల్స్ (69) అర్థసెంచరీలతో రాణించారు. బెన్ స్టోక్స్ మూడు వికెట్లు పడగొట్టాడు.46.3 | WHAT A BEAUTY 😵💫Yuzi Chahal with an absolute peach to dismiss Ben Stokes 🤯Durham 187/6.Watch live 👉 https://t.co/obDgNotzBX pic.twitter.com/0RKBVz0Gxq— Northamptonshire CCC (@NorthantsCCC) September 3, 2026Read: వైభవ్ సూర్యవంశీపై బీసీసీఐ ప్రత్యేక నిఘా! -
వైభవ్ సూర్యవంశీపై బీసీసీఐ ప్రత్యేక నిఘా!
టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై బీసీసీఐ ప్రత్యేక దృష్టి సారించనుంది. పిన్న వయసులోనే అంతర్జాతీయ క్రికెట్లో అరేంగట్రం చేసిన వైభవ్ సూర్యవంశీ కెరీర్ తొందరగా ముగియకూడదనే ఉద్దేశంతో ప్రత్యేక ప్రణాళికలు చేపట్టనుంది. వైభవ్‌ను చూస్తుంటే భవిష్యత్తు సచిన్‌లా కనిపిస్తున్న తరుణంలోనే అతడి కెరీర్ ఒక్క సిరీస్, ఏడాది లేదా రెండేళ్లకే పరిమితం కాకూడదని, అతడి కెరీర్ సుదీర్ఘంగా సాగాలని బీసీసీఐ భావిస్తోంది. వైభవ్‌తో పాటు ప్రతిభ చూపుతున్న యువ ఆటగాళ్లకు సరైన మార్గదర్శకత్వం, సహకారం అందించాలని ముంబైలో గురువారం నిర్వహించిన బీసీసీఐ కీలక సమావేశంలో నిర్ణయం తీసుకుంది. బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా మాట్లాడుతూ.. 15 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న ఆటగాడిని ఎంతో జాగ్రత్తగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. సచిన్ టెండూల్కర్‌లా వైభవ్ సూర్యవంశీ దేశానికి సుదీర్ఘకాలం సేవలందించే ఆటగాడిగా ఎదగాలని బీసీసీఐ కోరుకుంటోందని చెప్పారు. అతడి కెరీర్‌ను ప్రతి దశలోనూ నిశితంగా గమనిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా, టెస్టు, వన్డే కెప్టెన్ శుబ్‌మన్ గిల్, టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, సీవోఈ చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్ సహా పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.ఇటీవలే వైభవ్ 15 ఏళ్ల 157 రోజుల వయసులో దులీప్ ట్రోఫీ చరిత్రలో అత్యంత పిన్న వయసులో అర్ధశతకం చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 57 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు. జింబాబ్వేతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 151 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్‌గా నిలిచాడు. భారత్ ఆ సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది.ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్ ద్వారా భారత్ తరఫున అత్యంత పిన్న వయసులో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ఆటగాడిగా వైభవ్ నిలిచాడు. ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ తరఫున అతడు 776 పరుగులు చేశాడు. 237.30 స్ట్రైక్‌రేట్‌తో ఆడాడు. ఒక సెంచరీ, ఐదు అర్ధశతకాలు బాదాడు. 72 సిక్సర్లతో టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.చదవండి: హాంకాంగ్‌పై విజయం.. స్మృతి మంధాన కన్నీటిపర్యంతం! -
హాంకాంగ్‌పై విజయం.. స్మృతి మంధాన కన్నీటిపర్యంతం!
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన మహిళల ఆసియా కప్ టీ20 టోర్నీలో అదరగొడుతుంది. పసికూన హాంకాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో మంధన శతకంతో మెరిసింది. 64 బంతుల్లో 124 పరుగులు సాధించిన స్మృతి మంధాన మహిళల టీ20 క్రికెట్లో అనేక రికార్డులను తన పేరిట లిఖించుకుంది. సెంచరీతో భారత్ విజయంలో కీలకపాత్ర పోషించిన మంధాన ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్న అనంతరం కన్నీటిపర్యంతమైంది. అయితే ఈ కన్నీళ్లు సంతోషంతోనే తప్ప బాధతో వచ్చనవి కావని మంధాన మీడియాతో పేర్కొంది.అనంతరం మ్యాచ్‌లో మీరు చేసిన సెంచరీని ఎవరికి అంకితం చేస్తారని ప్రశ్న వేయగా.. ‘‘ఈ సెంచరీని అంకితం చేయడానికి నా మైండ్‌లో ఎవరు లేరు. కానీ ఈ శతకాన్ని మాత్రం కచ్చితంగా నా ఫ్యామిలీకే అంకితమిస్తాను. హాంకాంగ్‌తో తొలిసారి మ్యాచ్ ఆడుతున్నందున ఆ జట్టు గురించి మాకు ఎలాంటి అవగాహన లేదు. వాళ్ల బౌలింగ్‌కు సంబంధించిన వీడియో క్లిప్‌లను మ్యాచ్‌కు ముందు రోజు వీక్షించాము. Photo Credit: BCCI Twitterఒక తెలియని బౌలర్ మన ముందుకు వచ్చినప్పుడు వారి గురించి కాకుండా ఆటపై మాత్రమే దృష్టిపెడతాను. వస్తాను, బంతిని చూస్తాను, కొడతాను అన్న తరహాలోనే నా బ్యాటింగ్ కొనసాగుతుంది. అయితే పవర్ ప్లేలో కొన్ని ఫుల్‌టాస్ బంతులను వదిలేశాను. నిజానికి ఫుల్‌టాస్ బంతులు నా బలం కాదు.. బలహీనత. వాటిని వదిలేసినప్పుడు మనసులో కాస్త సంతోషపడ్డాను. ఎందుకంటే అప్పుడు వదిలేయకుంటే సెంచరీ వచ్చేది కాదేమో. Photo Credit: BCCI Twitterటాపార్డర్‌లో ఆడుతాం కాబట్టే బ్యాటర్‌కు సెంచరీ చేసే అవకాశం వస్తోంది. టీ20 క్రికెట్లో టాపార్డర్ మినహా మిగతా ఏ స్థానాల్లో బ్యాటింగ్‌కు వచ్చినా సెంచరీ చేయడం అరుదుగా జరుగుతుంది. ఈ సెంచరీతో నేను ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టానన్న విషయం నాకు తెలియదు. ఔటైన తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌లో ఆ రికార్డులేంటన్నివి చూశాను’’ అని స్మృతి మంధాన చెప్పుకొచ్చింది.మ్యాచ్ విషయానికొస్తే తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా వుమెన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. ఓపెనర్ స్మృతి మంధాన (64 బంతుల్లో 124) సెంచరీ సాధించింది. అనంతరం భారత బౌలర్ల ధాటికి హాంకాంగ్ వుమెన్స్ 16.2 ఓవర్లలో 56 పరుగులకు ఆలౌటయ్యారు. దీప్తి శర్మ మూడు వికెట్లు తీయగా, నందని శర్మ, శ్రీ చరణి, ప్రేమా రావత్‌లు తలా 2 వికెట్లు పడగొట్టారు. THE HISTORIC MOMENT FOR SMRITI MANDHANA. pic.twitter.com/v12EhZPgwY— Mufaddal Vohra (@mufaddal_vohra) September 3, 2026చదవండి: టీ20 క్రికెట్లో చరిత్ర తిరగరాసిన తెలుగు క్రికెటర్ -
టీ20 క్రికెట్లో చరిత్ర తిరగరాసిన తెలుగు క్రికెటర్
మహిళల ఆసియా కప్ టోర్నీలో భాగంగా భారత జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. ఇప్పటికే నమీబియా, హాంకాంగ్‌లపై గెలుపుతో హర్మన్ సేన సెమీస్‌కు దూసుకెళ్లింది. శనివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి అజేయంగా సెమీస్‌లో అడుగుపెట్టాలని భారత మహిళల జట్టు భావిస్తోంది. గురువారం రాత్రి హాంకాంగ్ వుమెన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు పలు రికార్డులను బద్దలుకొట్టింది. ఈ నేపథ్యంలోనే తెలుగు క్రికెటర్ శ్రీ చరణి అంతర్జాతీయ మహిళల టీ20 క్రికెట్లో ఒక అరుదైన ఫీట్ సాధించింది. ఒక క్యాలెండర్ ఇయర్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు పడగొట్టిన రెండో బౌలర్‌గా శ్రీ చరణి నిలిచింది. ఈ ఏడాది ఇప్పటివరకు శ్రీ చరణి 31 వికెట్లు పడగొట్టింది. Photo Credit: BCCI Twitterతద్వారా ఒక క్యాలెండర్ ఇయర్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో శ్రీ చరణి రెండో స్థానంలో నిలిచింది. తొలి స్థానంలో పూనమ్ యాదవ్ (2018లో 35 వికెట్లు), ఆల్‌రౌండర్ దీప్తి శర్మ (2024లో 30 వికెట్లు, 2022లో 29 వికెట్లు) మూడు, నాలుగు స్థానాలను ఆక్రమించింది. 2024లో రాధా యాదవ్ 29 వికెట్లు తీసి ఐదో స్థానంలో కొనసాగుతోంది. అయితే ఈ ఏడాది క్యాలెండర్ ఇయర్ ఇంకా ముగియకపోవడంతో శ్రీ చరణి అత్యధిక వికెట్లు పడగొట్టిన జాబితాలో త్వరలోనే టాప్ స్థానానికి చేరుకునే అవకాశముంది.Photo Credit: BCCI Twitter👉137- మహిళల టీ20 క్రికెట్లో పరుగుల పరంగా హాంకాంగ్‌పై భారత జట్టుకు రెండో అతి పెద్ద విషయం. గతంలో 2018 ఆసియా కప్‌లో మలేషియా వుమెన్స్‌పై 142 పరుగుల రికార్డు విజయాన్ని అందుకుంది.👉మహిళల ఆసియా కప్ టీ20 చరిత్రలో హాంకాంగ్‌పై భారత్ సాధించిన 137 పరుగుల విజయం నాలుగో అతిపెద్దది. తొలి స్థానంలో పాకిస్తాన్ వుమెన్స్ 147 పరుగుల తేడాతో మలేషియా వుమెన్స్‌పై విజయం సాధించగా, రెండో స్థానంలో శ్రీలంక వుమెన్స్ (144 పరుగులు వర్సెస్ మలేషియా) కొనసాగుతుండగా, ఇండియా వుమెన్ (142 పరుగులు వర్సెస్ మలేషియా) మూడో స్థానంలో కొనసాగుతున్నారు.మ్యాచ్ విషయానికొస్తే తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా వుమెన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. ఓపెనర్ స్మృతి మంధన (64 బంతుల్లో 124) సెంచరీ సాధించింది. అనంతరం భారత బౌలర్ల ధాటికి హాంకాంగ్ వుమెన్స్ 16.2 ఓవర్లలో 56 పరుగులకు ఆలౌటయ్యారు. దీప్తి శర్మ మూడు వికెట్లు తీయగా, నందని శర్మ, శ్రీ చరణి, ప్రేమా రావత్‌లు తలా 2 వికెట్లు పడగొట్టారు. చదవండి: లంక బ్యాటర్ శివతాండవం.. 39 బంతుల్లోనే సెంచరీ


