హ్యుందాయ్ మోటార్ కంపెనీ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC)తో కొత్త ఒప్పందం కుదుర్చుకుంది. 2026-2027 మధ్యలో జరిగే అన్ని ఐసీసీ పురుషులు మరియు మహిళల క్రికెట్ టోర్నమెంట్‌లకు ప్రీమియర్ పార్ట్‌నర్‌గా వ్యవహరించనుంది. ఈ ఒప్పందంలోకి 2027 పురుషుల వన్డే వరల్డ్‌కప్ సహా మొత్తం ఆరు ఐసీసీ ప్రధాన టోర్నీలు వస్తాయి.
ఈ ఒప్పందంతో హ్యుందాయ్‌కు లభించే ప్రత్యేక హక్కులు..
- మ్యాచ్‌డే కాయిన్ టాస్‌లో భాగస్వామ్యం
- స్టేడియంలో ప్రత్యేక బ్రాండింగ్
- అభిమానుల కోసం ప్రత్యేక అనుభవాలు (fan zones, vehicle showcases, digital engagement)
ఐసీసీతో ఒప్పందం ఖరారయ్యాక హ్యుందాయ్ సీఈవో జోస్ మునోజ్ మాట్లాడుతూ.. క్రికెట్ మరియు హ్యుందాయ్ రెండూ నిరంతరం మెరుగుపడే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా రెండు బిలియన్ అభిమానులతో కనెక్ట్ కావడం గర్వకారణం. ముఖ్యంగా భారత్‌లో క్రికెట్ జీవనశైలి. ఈ భాగస్వామ్యం మా కస్టమర్లతో సంబంధాన్ని మరింత బలపరుస్తుందని అన్నారు.
హ్యుందాయ్ ఇండియా సీఈవో డెసిగ్నేట్ తరుణ్ గార్గ్ మాట్లాడుతూ.. ఈ భాగస్వామ్యం భారత మార్కెట్ ప్రాధాన్యతను ప్రతిబింబిస్తుంది. దేశవ్యాప్తంగా అన్ని మూలలా కమ్యూనికేషన్ స్ట్రాటజీతో అభిమానులను చేరుకుంటామని అన్నాడు.
ఐసీసీ అధ్యక్షుడు జై షా మాట్లాడుతూ.. ప్రపంచంలో క్రికెట్ అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడ. ఐసీసీ ఈవెంట్స్‌లో అభిమానులను డిజిటల్, స్టేడియం అనుభవాల ద్వారా ఆకర్షించడానికి హ్యుందాయ్ భాగస్వామ్యం గొప్ప అవకాశమని అన్నాడు.
కాగా, హ్యుందాయ్ మోటర్ ఐసీసీతో జతకట్టడం ఇది మొదటిసారి కాదు. 2011–2015 మధ్యలో కూడా ప్రీమియర్ పార్ట్‌నర్‌గా వ్యవహరించింది.


