Narayanpet
-
కేంద్రాల్లోని ధాన్యాన్ని మిల్లులకు తరలించాలి
● కలెక్టర్ సీహెచ్ ప్రియాంక దామరగిద్ద: కొనుగోలు కేంద్రాల్లో నిల్వ చేసిన వరి ధాన్యాన్ని వెంటనే లారీల్లో కేటాయించిన రైస్‌మిల్లులకు తరలించాలని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక ఆదేశించారు. ఆదివారం మండలంలోని బాపన్‌పల్లిలో కొనసాగుతున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేసి నిర్వాహకులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సన్నరకం ధాన్యం ఎప్పడికప్పుడు తరలిస్తున్నారని.. దొడ్డురకం ధాన్యాన్ని తరలించేందుకు లారీలు సకాలంలో రాకపోవడంతో నిల్వ చేసినట్లు వివరించారు. కేంద్రంలో ఇప్పటి వరకు ఎన్ని బస్తాల ధాన్యం కొనుగోలు చేశారు.. ఎంతమంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమయ్యాయని ఆరా తీశారు. అకాల వర్షాలు కురుస్తున్నందున ధాన్యాన్ని కేటాయించిన రైస్‌మిల్లులకు తరలించి రైతులకు డబ్బులు త్వరగా అందేలా చర్యలు తీసుకోవాలని ఐకేపీ సిబ్బందిని ఆదేశించారు. -
వేతనం పెంచాలి..
పదేళ్లుకు పైగా చాలీచాలని వేతనంతో పనిచేస్తున్నాం. జిల్లాలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల పర్యవేక్షణ చేపడుతున్నాం. ఆంధ్రప్రదేశ్‌లో మాదిరిగా రాష్ట్రంలోనూ పనికి తగిన వేతనం ఇవ్వాలి. ఖాళీగా ఉన్న సీఆర్పీల పోస్టులను భర్తీ చేసి పని భారం తగ్గించాలి. ముఖ్యంగా ఉద్యోగ భద్రత కల్పిస్తూ రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తించి ఆదుకోవాలి. – ఆరీఫ్ అహ్మద్, సీఆర్పీ, నారాయణపేట సీఆర్పీలను క్రమబద్ధీకరించాలి.. ఏళ్లుగా పనిచేస్తున్న ఎస్ఎస్ఏ ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరిస్తూ వారిని క్రమబద్ధీకరించాలి. కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేస్తామని గత ప్రభుత్వం ఇచ్చిన హామీ ఏళ్లు గడుస్తున్నా నెరవేరడం లేదు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి పదేళ్లు దాటినా అలాగే కొనసాగించడం సరికాదు. సీఆర్పీలకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ పనికి తగిన వేతనం చెల్లించాలి. – శేర్ కృష్ణారెడ్డి, రాష్ట్ర అదనపు కార్యదర్శి, తపస్, నారాయణపేట ● -
‘సేంద్రియ’ ప్రోత్సాహం
జీలుగ, జనుము విత్తనాలకు 50 శాతం రాయితీ ● సిద్ధం చేసిన రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ● ఉమ్మడి జిల్లా రైతుల కోసం 9,200 క్వింటాళ్లు ● ఇప్పటికే నారాయణపేట, మహబూబ్‌నగర్ జిల్లాలకు సరఫరా ● పంట విత్తనాలకు రాయితీ లేనట్టే.. వనపర్తి: రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి భూ సారాన్ని పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చిరొట్ట ఎరువుల విత్తనాలను 50 శాతం రాయితీపై రైతులకు అందజేస్తోంది. కొన్నేళ్లుగా వానాకాలం సీజన్లో రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ రైతుల అభ్యర్థనల మేరకు పాలమూరు జిల్లాలో జనుము, జీలుగ విత్తనాలను సిద్ధం చేసి పీఏసీఎస్‌లు, రైతు ఆగ్రో కేంద్రాలు, హాకా సెంటర్లతో పాటు వివిధ కేంద్రాల్లో విక్రయిస్తోంది. రైతులు పచ్చిరొట్ట ఎరువుల వాడకాన్ని ఏటా పెంచుతూ వస్తున్నారు. ప్రస్తుత వానాకాలం సీజన్లో జిల్లాల వారీగా వ్యవసాయశాఖ అధికారులు ఇచ్చిన ఇండెంట్ ప్రకారం వనపర్తిలోని తెలంగాణ రాష్ట్ర విత్తనశుద్ధి కేంద్రంలో 9,200 క్వింటాళ్ల జీలుగ, జనుము విత్తనాలను సిద్ధం చేసి ఉంచారు. ఇప్పటికే నారాయణపేట, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని పలు పీఏసీఎస్ కేంద్రాలకు వీటిని సరఫరా చేసినట్లు అధికారులు వెల్లడించారు. ● గత ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయంగా రైతుబంధు పథకాన్ని అమలులోకి తీసుకొచ్చి విత్తనాలు, వ్యవసాయ యంత్రాలపై ఇచ్చే రాయితీని ఎత్తివేసింది. కొంతకాలంగా రైతులకు పెట్టుబడి సాయం సక్రమంగా అందడం లేదు. విత్తనాలపై రాయితీ లేక, పెట్టుబడి సాయం సకాలంలో అందక రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేవలం పచ్చిరొట్ట ఎరువుల విత్తనాలపై 50 శాతం రాయితీని వర్తింపజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. ● పచ్చిరొట్ట ఎరువుల్లో జీలుగ, జనుము, పిల్లిపెసర ఉండగా.. పాలమూరు రైతులు కేవలం జీలుగ, జనుముకే ఆసక్తి చూపుతున్నారు. దీంతో వనపర్తిలోని తెలంగాణ రాష్ట్ర విత్తన శుద్ధి కేంద్రంలో ఆయా విత్తనాలను ప్రాసెసింగ్ చేసి సిద్ధం చేసి ఉంచారు. జీలుగ విత్తనాలు 30 కిలోల బస్తా అందుబాటులో ఉండగా.. పూర్తి ధర రూ.4,905. యాభై శాతం రాయితీతో రైతులు పొందవచ్చు. అలాగే జనుము విత్తనాలు 40 కిలోల బస్తాలు అందుబాటులో ఉన్నాయి. పూర్తి ధర రూ.6,220 కాగా.. యాభై శాతం రాయితీతో రూ.3,110కే రైతులకు సరఫరా అందిస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యవసాయశాఖ అధికారుల అంచనాల ప్రకారం జీలుగ విత్తనాలు 8,500 క్వింటాళ్లు.. జనుము విత్తనాలు 700 క్వింటాళ్లు సిద్ధం చేసి ఉంచారు. మిగతా విత్తనాలు పూర్తి ధరకే.. జిల్లాలో వానాకాలం, యాసంగిలో సాగుచేసే వరి, వేరుశనగ, కంది, పెసర, మొక్కజొన్న, మినుములు, పత్తి, మిరప తదితర ఆహార ధాన్యాల విత్తనాలపై ప్రభుత్వం కొంతకాలంగా రాయితీని ఎత్తివేసింది. ఉమ్మడి జిల్లాకు కావాల్సిన సుమారు 50 వేల క్వింటాళ్ల వరి (సన్నా, దొడ్డురకం) విత్తనాలను విత్తనాభివృద్ధి సంస్థ సిద్ధం చేసి ఉంచింది. మరో 15 రోజుల తర్వాత పీఏసీఎస్‌లు, రైతు ఆగ్రో కేంద్రాల ద్వారా వరి, కంది విత్తనాలు రైతులకు విక్రయిస్తారు. వరి 25 కిలోల బస్తాలు, కంది 4 కిలోల బస్తాలు రైతులకు అందుబాటులో ఉంటాయి. రెండు పర్యాయాలు వానాకాలంలో మెట్ట పంటల సాగు తగ్గిపోవటంతో జిల్లాకేంద్రంలోని తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ వారి విత్తనశుద్ధి కర్మాగారంలో కేవలం వరి, కంది విత్తనాలను మాత్రమే ప్రాసెసింగ్ చేస్తోంది. విత్తనాలు సిద్ధం.. ఉమ్మడి పాలమూరులోని ఐదు జిల్లాల రైతులకు వ్యవసాయ అధికారుల సిఫారస్ మేరకు జనుము, జీలుగ, ఆహార ధాన్యాల విత్తనాలు సిద్ధం చేసి ఉంచాం. ఇప్పటికే నారాయణపేట, మహబూబ్‌నగర్ జిల్లాలకు 1,050 క్వింటాళ్ల పచ్చిరొట్ట ఎరువు విత్తనాలు పంపిణీ చేశాం. వర్షాలు ప్రారంభం కాగానే వరి, కంది తదితర ఆహార ధాన్యాల విత్తనాలను సైతం పీఏసీఎస్, రైతు ఆగ్రో కేంద్రాలు, హాకా సెంటర్లలో అందుబాటులో ఉంచుతాం. – ఆదినారాయణరెడ్డి, రీజియన్ మేనేజర్, విత్తన శుద్ధికర్మాగారం, మహబూబ్‌నగర్ -
వేతన వెతలు!
నారాయణపేట రూరల్: విద్యా విధానంలో మార్పులొస్తున్నాయి.. కొత్త పద్ధతుల అమలు కొనసాగుతోంది.. కాని పర్యవేక్షణకు నియమించిన సీఆర్పీల అవస్థలు మాత్రం తీరడం లేదు. సమాన పనికి సమాన వేతనం అమలు మాత్రం అందని ద్రాక్షగా మారింది. వ్యవస్థ ప్రారంభమైన సమయంలో నియామక ప్రక్రియ చేపట్టగా.. మధ్యలో మానేసిన వారి స్థానంలో కొత్త నియామకాలు చేపట్టకపోవడంతో అదనపు భారంతో సతమతమవుతున్నారు. 2021 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఎస్ఎస్ఏ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామంటూ అసెంబ్లీలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీతో పాటు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న నేటి సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన ప్రకటనతో తమకు ఎప్పుడు న్యాయం జరుగుతుందా అని ఆశగా ఎదరుచూస్తున్నారు. రెండేల్ల కిందట డిమాండ్ల సాధనకు సీఆర్పీలు హైదరాబాద్‌లో ధర్నా సైతం చేపట్టారు. నియామకం ఇలా.. ఉపాధ్యాయులు, అధికారులకు మధ్య వారధులుగా ఉంటూ పాఠశాలలు, క్లస్టర్ ఇన్‌చార్జ్‌లు, ఎంఈఓలకు అనుసంధానంగా పని చేయడానికి సీఆర్పీలను నియమించారు. ఎనిమిదేళ్లకు కిందట ప్రభుత్వ ఉపాధ్యాయులకు రాతపరీక్ష నిర్వహించి ప్రతి మండలానికి ముగ్గురు చొప్పున ఎమ్మార్పీలను ఎంపిక చేసి వారి ద్వారా ఎమ్మార్సీ కార్యాలయ పనులు, పాఠశాల పర్యవేక్షణ బాధ్యతలు చేయించేవారు. అయితే ఉపాధ్యాయులు పాఠశాలలు వదిలి కార్యాలయానికి రావడంతో విద్యార్థులు నష్టపోతారనే ఉద్దేశంతో పాటు విద్యాహక్కు చట్టం ప్రకారం టీచర్లను అత్యవసర పరిస్థితులు, జనాభా లెక్కలు, ఎన్నికల విధులకు మాత్రమే వినియోగించాల్సి ఉండటంతో ఈ వ్యవస్థను రద్దు చేసి తిరిగి పాఠశాలలకు పంపించారు. 2011లో కొత్త విధానాన్ని తీసుకొని వచ్చి డిగ్రీ, బీఈడీ పూర్తి చేసిన అర్హత గల అభ్యర్థులను 2012లో రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా సర్వశిక్ష అభియాన్ కింద కాంట్రాక్టు విధానాంలో కార్యాలయ పనులకు ఒక్కో ఎంఐఎస్ కో–ఆర్డినేటర్, కంప్యూటర్ ఆపరేటర్లను, మండలంలోని పాఠశాలలను విభజించి క్లస్టర్లుగా మార్చి ఒక్కో క్లస్టర్‌కు ఒక్కో సీఆర్పీని నియమించారు. సీఆర్పీలు 28విద్యార్థులు 1.06 లక్షలు విధుల నిర్వహణ.. సీఆర్పీలు తరుచూ పాఠశాలలకు వెళ్లి అవసరమైన సమాచారం సేకరించాల్సి ఉంటుంది. కాంప్లెక్స్ హెచ్ఎంకు సహకరిస్తూ యూడైస్, చైల్డ్ ఇన్ఫో పూర్తి చేయాలి. ప్రతి నెలకు సంబంధించిన డైరీ రాస్తూ ఎస్టీపీఎస్ టీచర్లు లీవ్ పెడితే స్కూల్‌కు వెళ్లి పిల్లలకు పాఠాలు బోధించాలి. ఇక ప్రతి నెల కాంప్లెక్స్ సమావేశం నిర్వహించాలి. దీనికితోడు సర్వేలు, బడిబయటి పిల్లల గుర్తింపు, పాఠశాల వివరాలు, అక్కడి సమస్యలతో పాటు మ్యాప్ తయారు చేయాల్సి ఉంటుంది. రవాణా సౌకర్యం లేని స్కూల్ గుర్తించాలి, మధ్యాహ్న భోజనం పరిశీలనతో పాటు క్లస్టర్ పరిధిలోని పాఠశాలలల్లో నిర్వహించే ఎస్ఎంసీ సమావేశాలకు హాజరుకావాలి. వారి నుంచి వచ్చిన వినతులు అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి. ప్రతి పాఠశాలను నెలలో రెండుసార్లు సందర్శించి టీచర్ల పనితీరును గుర్తించాలి. ఏటా ఉపాధ్యాయ ఖాళీలు గుర్తించాలి. వివిధ రకాల మేళాలు, పోటీలు నిర్వహించాలి.. కేజీబీవీలను సైతం సందర్శించాలి. ఉమ్మడి రాష్ట్రంలో సీఆర్పీల వ్యవస్థ ప్రారంభమైంది. అప్పట్లో అరకొర వేతనంతోనే విధులు నిర్వర్తించగా.. క్రమంగా రూ.15 వేలకు చేరింది. మూడేళ్ల కిందట బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.19,500కు పెంచింది. కాని ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో వీరితో పాటు విధుల్లో చేరిన సీఆర్పీలకు రూ.28,500 అక్కడి ప్రభుత్వం చెల్లిస్తుంది. విధులు, బాధ్యతలు సమానంగా ఉన్నా.. వేతనంలో చాలా వ్యత్యాసం ఉంది. విద్యాహక్కు చట్టం ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని ఉన్నప్పటికీ అమలు కావడం లేదు. జిల్లాలో ఇలా.. మండలాలు 13 పాఠశాలలు 640క్లస్టర్లు 33 చాలీచాలని జీతాలతో సీఆర్పీల అవస్థలు భర్తీకాని ఖాళీలు.. అదనపు పనిభారంతో సతమతం ప్రభుత్వాలు మారినా నెరవేరని హామీ సమాన పనికి.. సమాన వేతనం అందని ద్రాక్షేనా? -
‘స్నేహ’ సంఘాలు..
15 నుంచి 18 ఏళ్లలోపు కిశోర బాలికలతో ఏర్పాటు –8లో uప్రభుత్వం కిశోర బాలికలపై ప్రత్యేక దృష్టి సారించి ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించింది. అందుకు అనుగుణంగా వివిధ శాఖలను సమన్వయం చేసుకుంటూ గ్రామాల్లో స్నేహ సంఘాలతో పాటు కొత్త సంఘాలు ఏర్పాటు చేస్తున్నాం. ఆయా సంఘాల సభ్యులకు వేసవి శిబిరాలు ఏర్పాటుచేసి ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. మొత్తం 13 సెషన్లకుగాను ప్రస్తుతం 5 సెషన్లు పూర్తయ్యాయి. జూన్ 10 వరకు శిబిరాలు కొనసాగుతాయి. – ఎన్.వెంకట్రాములు, డీఆర్డీఓ -
సెలవుల్లో విహరిద్దాం.. కనులారా వీక్షిద్దాం
పాలమూరులో పర్యాటక కేంద్రాలు, పుణ్యక్షేత్రాలు ఏ ప్రాంత అభివృద్ధిలోనైనా పర్యాటక కేంద్రాలు ప్రముఖ పాత్ర వహిస్తాయి. పర్యాటక రంగం ద్వారా వచ్చే ఆదాయాలు, పర్యాటక క్షేత్రాల ద్వారా వచ్చే పేరు ప్రతిష్టలు, తద్వారా ప్రపంచస్థాయిలో ఆ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు నిస్తాయి. ఈ మధ్య కాలంలో దేశ, ప్రపంచ పర్యాటకుల దృష్టిని ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని పలు పర్యాటక క్షేత్రాలు, స్థలాలు అమితంగా ఆకర్షిస్తున్నాయి. ఇప్పటికే వేసవి సెలువు సగం పూర్తయ్యాయి. మరో నాలుగు వారాల్లో విద్యాసంస్థలు ప్రారంభంకానున్నాయి. అంతలోపు ఈ సెలవుల్లో ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా కుటుంబసమేతంగా పర్యాటక ప్రాంతాలు, పుణ్యక్షేత్రాలు సందర్శించేందుకు మంచి సమయం. రెండు, మూడు రోజుల సమయం కేటాయించి అనుకున్న ప్రాంతాల్లో పర్యటించొచ్చు. ఉమ్మడి జిల్లాలో చూడదగ్గ ప్రాంతాలపై ప్రత్యేక కథనం.. – స్టేషన్ మహబూబ్‌నగర్ – వివరాలు 8లో.. -
విద్యార్థులు అన్నిరంగాల్లో రాణించాలి
నారాయణపేట రూరల్: విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక తదితర రంగాల్లో రాణించాలని జిల్లా విద్యాధికారి గోవిందరాజు కోరారు. విద్యా వారోత్సవాల్లో భాగంగా శనివారం బాలకేంద్రంలో నిర్వహించిన కళా వైభవం ఆర్ట్ కల్చరల్ డే కార్యమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కృషి, పట్టుదల, ఓర్పు, లక్ష్యంతో దేనినైనా సాధించవచ్చని, కష్టంగా కాకుండా ఇష్టంతో అనుకున్న పనిని సులభంగా పూర్తి చేయవచ్చని సూచించారు. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు సంస్కృతి, సాంప్రదాయ కళలు దోహదపడతాయని, చిన్నారులు వేసవి సెలవులు వృథా చేయకుండా బాలకేంద్రంలో తమకు నచ్చిన కళలు నేర్చుకోవాలని కోరారు. అంతకుముందు నృత్యం, పాటలు, డ్రాయింగ్, క్రాఫ్ట్ పోటీల్లో గెలుపొందిన విజేతలకు జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో సెక్టోరియల్ అధికారులు రాజేంద్రకుమార్, విద్యాసాగర్, నాగార్జున్‌రెడ్డి, యాదయ్యశెట్టి, బాలకేంద్రం సూపరింటెండెంట్ మహిపాల్‌రెడ్డి, సిబ్బంది వసంత్‌కుమార్, సంగ నర్సింహులు, జ్ఞానమృత, శ్రీకాంత్, సాయినాథ్ పాల్గొన్నారు. -
అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి
నారాయణపేట: జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచి రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2న ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని వీసీ హాల్లో ఎస్ఈలు, ఈఈలు, డీఈలు, ఏఈలతో పనుల పురోగతిపై సమీక్షించారు. వైద్య కళాశాల, ఎంసీహెచ్, నర్సింగ్ కళాశాల నిర్మాణ పనులు ఎంతవరకు వచ్చాయని అధికారులను అడిగి తెలుసుకున్నారు. వైద్య కళాశాల వద్ద ఒక్క బోరు పడకపోవడంతో సమీపంలోని ఒక రైతు పొలానికి చెందిన ప్రైవేట్ బోర్ నుంచి నీటిని క్యూరింగ్‌కు వినియోగిస్తున్నట్లు అధికారులు వివరించారు. ప్రభుత్వ భవన నిర్మాణాలు ఎక్కడ జరిగినా తప్పకుండా ఇంకుడు గుంతలు నిర్మించాలని సూచించారు. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో జనరేటర్‌ను వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు. మండలాల్లోని కస్తూర్బాల్లో మరమ్మతులు ఎలా జరుగుతున్నాయని ఆరా తీశారు. పీఎంశ్రీ పాఠశాలల్లో సైనన్స్ ల్యాబ్స్ నిర్మాణాలు పాఠశాలల పునః ప్రారంభం నాటికి పూర్తి చేయాలన్నారు. మక్తల్‌లోని వంద పడకల ఆస్పత్రి పనులు కొనసాగుతున్నాయని.. అకాడమిక్ బ్లాక్ నిర్మాణం పూర్తయిందని అధికారులు తెలుపగా పనుల్లో వేగం పెంచాలని కోరారు. మక్తల్‌లోని జూనియర్ కళాశాల అదనపు గదుల నిర్మాణం, మద్దూరు ఎస్సీ బాలుర వసతిగృహ మరమ్మతు పనుల గుర్తించి ప్రస్తావించారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో ఏవైనా మరమ్మతులుంటే వేసవి సెలవుల్లో పూర్తి చేయాలని స్పష్టం చేశారు. జిల్లాకేంద్రం సమీపంలో సమీకృత చేనేత భవన నిర్మాణం పూర్తయిందని అధికారులు తెలుపగా.. జూన్ 2న ప్రారంభానికి సిద్ధం చేయాలన్నారు. జిల్లాకేంద్రంలోని మూడు ఓవర్‌హెడ్ ట్యాంకుల నిర్మాణాలు ఆగస్టు వరకు పూర్తి చేయాలని సూచించారు. మక్తల్‌లో సంగంబండ రిజర్వాయర్ నుంచి తాగునీటి సరఫరాకు ప్రత్యామ్నాయ పథకాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు తయారు చేస్తున్నట్లు మిషన్ భగీరథ ఈఈలు శ్రీనివాసరావు, రంగారావు తెలిపారు. మన్యంకొండ నుంచి జిల్లాకు రోజుకు ఎన్ని లీటర్ల నీటి సరఫరా జరుగుతుందో నివేదిక ఇవ్వాలని కోరారు. ఆర్అండ్బీ పరిధిలో కొనసాగుతున్న రోడ్లు, కలెక్టరేట్ భవన నిర్మాణ పనులపై ఆ శాఖ అధికారులతో చర్చించారు. జిల్లా మహిళా సమాఖ్య భవనాన్ని జూన్ 2న ప్రారంభానికి సిద్ధం చేయాలని, గుండుమాల్, కొత్తపల్లి మండలాల సమీకృత భవన సముదాయాల నిర్మాణాలు, కడా నిధులతో చేపట్టిన పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. వచ్చే సమావేశానికి ఎన్ని పనులు పూర్తి చేశారో? ఎన్ని పర్యటనలు చేశారో నివేదికలతో రావాలని ఏఈలను ఆదేశించారు. అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో విధిగా ప్రొటోకాల్ పాటించాలని కలెక్టర్ సూచించారు. సమావేశంలో టీజీఎంఐడీసీ ఈఈ వేణుగోపాల్, పీఆర్ ఈఈ అశోక్, ఆర్అండ్బీ ఎస్ఈ వెంకటరమణ పాల్గొన్నారు. విద్యతో ఉజ్వల భవిష్యత్.. నారాయణపేట రూరల్: విద్య భవిష్యత్‌ను తీర్చిదిద్దే మహత్తర శక్తి అని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక అన్నారు. ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళికలో భాగంగా శనివారం విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యా విజయోత్సవాల ముగింపు కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. చిన్నతనం నుంచే చదువుపై ఏకాగ్రత పెంచుకొని అన్నిరకాల పోటీ పరీక్షల్లో చక్కటి ప్రతిభ కనబర్చాలన్నారు. ఉత్తమ ఫలితాలు సాధించడంతో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పుట్టిన ఊరికి మంచి పేరు వస్తుందని తెలిపారు. సమయాన్ని వృథా చేయకుండా కొత్త విషయాలు తెలుసుకునేందుకు ప్రయత్నించాలని సూచించారు. సెల్‌ఫోన్ వినియోగాన్ని తగ్గిస్తే మంచిదన్నారు. పది విద్యార్థులు 98 శాతం ఉత్తీర్ణత సాధించడం ఆనందంగా ఉందని.. ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు చేసిన కృషి అభినందనీయమన్నారు. అనంతరం 560 మార్కులకు పైగా సాధించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, 100 శాతం ఉత్తీర్ణత సాధించిన పాఠశాల ప్రధానోపాధ్యాయులకు ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు అందజేశారు. మార్కెట్ కమిటీ చైర్మన్ సదాశివరెడ్డి, మున్సిపల్ వైస్‌చైర్మన్ మంజుల, డీఈవో గోవిందరాజు, సెక్టోరియల్ అధికారులు రాజేంద్రకుమార్, నాగార్జునరెడ్డి, విద్యాసాగర్, శశికుమార్ పాల్గొన్నారు. -
పల్లెల్లో పబ్లిక్ స్కూల్స్
ఉమ్మడి జిల్లాలో 13 పాఠశాలల ఏర్పాటుకు ప్రతిపాదనలు ● అంతర్జాతీయ ప్రమాణాలతో టీపీఎస్‌ల నిర్మాణానికి చర్యలు ● ఒకే చోట నర్సరీ టు ఇంటర్ విద్య ● వచ్చే విద్యా సంవత్సరం నుంచే ప్రారంభం అచ్చంపేట: పేద విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికో తెలంగాణ పబ్లిక్ స్కూల్ (టీపీఎస్) ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఎంపిక చేసిన పాఠశాలల్లో నర్సరీ నుంచి ఇంటర్ వరకు విద్య అందించేందుకు చర్యలు చేపట్టింది. ఈ మేరకు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 13 తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను ప్రారంభించేందుకు అధికారులు ప్రతిపాదనలు పంపారు. ఇప్పటికే అచ్చంపేట నియోజకవర్గంలోని వంగూరు, పొల్కంపల్లి పాఠశాలలను పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపికచేసి.. ఆయా హంగులన్నీ సమకూర్చడంతో టీపీఎస్‌కు మంచి స్పందన వచ్చింది. ఒక్కో టీపీఎస్‌కు రూ.15 కోట్లు.. వచ్చే ఏడాది నుంచే ఎంపికచేసిన పాఠశాల ల్లో తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు ప్రారంభం కా నున్నాయి. ఒక్కో టీపీ ఎస్‌కు సమారు రూ.15 కోట్లు ఖర్చు చేయనున్నారు. 1,000 నుంచి 1,500 మంది విద్యార్థులకు నర్సరీ నుంచి 12వ తరగతి (ఇంటర్) వరకు ఒకే చోట విద్య అందుబాటులోకి రా నుంది. ప్రైవేటు స్కూళ్ల కు ఽధీటుగా డిజిటల్ క్లాస్‌రూమ్‌లు, ల్యాబ్ లు, లైబ్రరీలు, క్రీడా సామగ్రి, కొరత లేకుండా టీచర్లు, పూర్తిస్థాయిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్, మినరల్ వాటర్, కిచెన్‌షెడ్, డైనింగ్ హాల్, అదనపు తరగతి గదులు, క్రీడా ప్రాంగణం తదితర అధునాతన సౌకర్యాలు కల్పించనున్నారు. దూర ప్రాంతాల పాఠశాలలను విలీనం చేస్తే.. విద్యార్థుల కోసం ప్రభుత్వ స్కూల్ బస్సు ఏర్పాటు చేయనున్నారు. టీపీఎస్‌ల ఏర్పాటుతో గ్రామీణ విద్యార్థులకు మెరుగైన విద్య అందనుంది. ఇప్పటికే ప్రైవేటు పాఠశాలల వైపు మొగ్గుచూపుతున్న తల్లి దండ్రులు.. ఇప్పడు ప్రభుత్వ పాఠశాలలపై విశ్వా సం పెంచుకునే పరిస్థితి ఏర్పడుతుంది. తద్వారా అడ్మిషన్ల సంఖ్య రెట్టింపయ్యే అవకాశం ఉంది. ఆదర్శంగా వంగూరు టీపీఎస్.. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో విజయవంతంగా అమలవుతున్న వంగూరు తెలంగాణ పబ్లిక్ స్కూల్ నమూనాను అనుసరించడం ద్వారా నూతన టీపీఎస్‌లకు ఒక స్థిరమైన ప్రమాణం లభిస్తోంది. ఆధునిక తరగతి గదులు, డిజిటల్ బోధన, ఆంగ్ల మాధ్యమం అమలు, నైపుణ్యాభివృద్ధి ప్రధానంగా ఉన్నాయి. అదే విధానాన్ని ఉమ్మడి జిల్లాలో అమలుచేస్తే విద్యార్థుల సామర్థ్యాలు పెరగడంతో పాటు పోటీ పరీక్షల్లో కూడా మెరుగైన ఫలితాలు సాధించే అవకాశాలు పెరుగుతాయి. సెమీ రెసిడెన్షియల్స్‌గా.. తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు సెమీ రెసిడెన్షియల్ పాఠశాలలుగా పనిచేయనున్నాయి. ఒకే గ్రామంలో వేర్వేరు చోట్ల ఉన్న బడులు, జూనియర్ కళాశాలలను ఒకే ప్రాంగణంలోకి తీసుకురానున్నారు. విద్యార్థులు నర్సరీ నుంచి పదో తరగతి లేదా ఇంటర్ వరకు చదువుకోవచ్చు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్ అందిస్తారు. తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల విస్తరణ చర్యలు రాష్ట్ర విద్యారంగంలో ఒక పెద్ద సంస్కరణగా నిలిచే అవకాశముంది. పాఠశాలల ఎంపికను సాధారణ పరిపాలనా నిర్ణయంగా కాకుండా.. డేటా ఆధారంగా చేపట్టారు. యూడైస్ ఆధారంగా విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశాలపై బేరీజు వేశారు. మండలస్థాయి నుంచి పాఠశాలల్లో మౌలిక వసతులు, విద్యార్థులు సంఖ్య, భవనాల స్థితి, ఉపాధ్యాయుల లభ్యత వంటి అంశాలను సేకరించారు. జిల్లా యంత్రాంగం సమన్వయంతో ప్రతిపాదనలను విశ్లేషించి.. దీర్ఘకాలిక అవసరాలను దృష్టిలో ఉంచుకొని పాఠశాలల ఎంపిక చేపట్టారు. -
ఇసుక రవాణాకు ఆన్లైన్ అనుమతులు
నారాయణపేట: జిల్లాలో ఇసుక లభ్యత గల పది రీచ్‌ల నుంచి మన ఇసుక.. మన వాహనం ద్వారా ఆన్లైన్ అనుమతులు ఇవ్వాలని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో జరిగిన డీఎల్ఎస్సీ (డిస్ట్రిక్ లెవెల్ సాండ్ కమిటీ) సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గోటూరు, సమస్తాపూర్, నాగిరెడ్డిపల్లి, ఓబులాపురం 1, 2, దాసర్‌దొడ్డి, వడ్వాట్, అడవి సత్యారం, అమ్మపల్లి రీచ్‌ల నుంచి ఇసుక రవాణాకు అనుమతులు ఇవ్వాలన్నారు. రీచ్‌ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని.. బుకింగ్ అయిన వెంటనే త్వరగా తరలించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కాగా గత వారం కలెక్టర్ ఆదేశాల మేరకు భూగర్భ జల వనరులు, రెవెన్యూ, నీటిపారుదల, గనులు, భూగర్భజల విభాగాల అధికారులు సంయుక్తంగా ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు ఇసుక ఉన్న ప్రాంతాలను తనిఖీ చేసి నివేదికను సమర్పించారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను, కలెక్టరేట్ ఏఓ శ్రీధర్, మైనింగ్ ఏడీ గోవిందరాజు, రాయల్టీ ఇన్స్పెక్టర్ ప్రతాప్‌రెడ్డి, ఆయా మండలాల తహసీల్దార్లు పాల్గొన్నారు. కొనసాగుతున్న ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు నారాయణపేట ఎడ్యుకేషన్: జిల్లావ్యాప్తంగా శుక్రవారం మూడోరోజు ఇంటర్మీడియట్ విద్యార్థులకు గణితం–ఏ, వృక్షశాస్త్రం, పొలిటికల్ సైన్స్ పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు డీఐఈఓ సుదర్శన్ రావు తెలిపారు. ఉదయం జరిగిన ప్రథమ సంవత్సరం పరీక్షలకు 1,838 మంది విద్యార్ధులకుగాను 1,767 మంది హాజరుకాగా 71 మంది గైర్హాజరయ్యారన్నారు. అదేవిధంగా మధ్యాహ్నం జరిగిన ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 500 మంది విద్యార్థులకుగాను 475 మంది హాజరుకాగా 25 మంది విద్యార్ధులు రాయలేదని చెప్పారు. నేడు జాబ్ మేళా నారాయణపేట రూరల్: పట్టణంలోని సీఎన్ఆర్ మెమోరియల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్లేస్మెంట్ సెల్ ఆధ్వర్యంలో పుస్కల్ అగ్రోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సహకారంతో శనివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 వరకు క్యాంపస్ ఇంటర్వ్యూ, ప్రత్యేక నియామక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ మెర్సీ వసంత, ప్రోగ్రాం ఇన్చార్జ్ షేక్ సుజత్ అలీ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రాంత విద్యార్థులు, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా కార్య క్రమం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. మొ త్తం 60 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని, ఎంపికై న అభ్యర్థులు సేల్స్, మార్కెటింగ్ విభాగంలో పని చేయాల్సి ఉంటుందన్నారు. ఇంటర్, డిగ్రీ చదివి మార్కెటింగ్ రంగంలో అనుభవం ఉన్న వారు హాజరుకావాలని కోరారు. మక్తల్, అయిజ, జహీరాబాద్, ప్రజ్ఞాపూర్ ప్రాంతాల్లో పని చేయాల్సి ఉంటుందని.. నెలకు రూ.15 వేల వేతనంతో పాటు టీఏ, డీఏ చెల్లిస్తారని, పనితీరు ఆధారంగా ఇన్సెంటివ్‌లు ఉంటాయని పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావాలని కోరారు. -
సాగు.. సతమతం
రైతులకు భారంగా మారుతున్న వ్యవసాయం పెరుగుతున్న పెట్టుబడులు.. కూలీలు, పొలం దున్నేందుకు వినియోగించే యంత్రాల అద్దెలు, నాలుగేళ్లుగా పెరుగుతున్న కాంప్లెక్స్ ఎరువుల ధరలతో రైతులకు పెట్టుబడులు తడిసి మోపెడవుతున్నాయి. వరి, పత్తికి ఎరువుల వినియోగం అధికంగా ఉండటంతో వాటిని అసరా చేసుకొని కంపెనీలు ధరలను పెంచుతుండటంతో రైతు పరిస్థితి దయనీయంగా మారిందని చెప్పవచ్చు. కేంద్రం ఎరువుల ధరలను నియంత్రించకపోవడంతో ఆ భారమంతా రైతులపై పడుతుండటంతో ఆందోళన చెందుతున్నారు. నారాయణపేట: కేంద్ర ప్రభుత్వం 2026–27 వానాకాలంలో 14 పంటల కనీస మద్దతు ధరలను పెంచి రైతులకు శుభవార్త వినిపించింది. వ్యవసాయ వ్యయాలు, ధరల కమిషన్ సిఫారస్ మేరకు కేంద్రం ఏటా కనీస మద్దతు ధరలను పెంచుతూనే వస్తోంది. దీంతో ఓ వైపు అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నా.. మరోవైపు పెరుగుతున్న ఎరువుల ధరలతో ఆందోళన చెందుతున్నారు. తగ్గుతున్న దిగుబడులు.. జిల్లాలో ఏటా పత్తి సాగు పెరుగుతూ వస్తోంది. ఈ ఏడాది సైతం 1.60 లక్షల ఎకరాల్లో పత్తి సాగయ్యే అవకాశం ఉంది. ఎకరాకు 8 నుంచి 12 క్వింటాళ్ల వరకు దిగుబడి రావాల్సి ఉండగా.. అతివృష్టి, అనావృష్టి కారణంగా మూడేళ్లుగా 5 నుంచి 8 క్వింటాళ్లకు పడిపోయింది. ప్రభుత్వం కనీస మద్దతు ధరకు సకాలంలో కొనుగోలు చేయకపోతే మరింత నష్టపోయే ప్రమాదం ఉంది. అలాగే ఎరువుల ధరలు సైతం ఏటా పెరుగుతుండటం రైతులకు మరింత భారంగా మారిందని చెప్పవచ్చు. సకాలంలో తెరుచుకోని కేంద్రాలు.. ఏటా వరి మినహా మిగిలిన కంది, పెసర, పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం కోతల ఆరంభంలో కాకుండా సీజన్ ముగుస్తున్న సమయంలో ప్రారంభిస్తూ చేతులు దులుపుకొంటోంది. వరి, పత్తి కేంద్రాలు ఏటా.. కంది, పెసర, మొక్కజొన్న కేంద్రాలు అడపా దడపా ప్రారంభిస్తుండగా, మిగతా 9 పంటల కొనుగోలు కేంద్రాలు తెరుచుకున్న దాఖలాలు లేవనే చెప్పవచ్చు. ● ఈ నెలఖరున రోహిణి కార్తెప్రారంభం కానుండటంతో వానాకాలం సాగు పనులు ఊపందుకోనున్నాయి. పంటలకు వివిధ పోషకాలు అందించేందుకు రైతులు యూరియా, డీఏపీతో పాటు ఇతర కాంప్లెక్స్ ఎరువులను వినియోగిస్తుంటారు. అయితే భారీగా పెరిగిన ఎరువుల ధరలతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఎకరా సాగుకు అదనంగా రూ.8 వేల వరకు అదనపు భారం పడనుందని రైతులు చెబుతున్నారు. గతేడాది నుంచి బస్తాకు రూ.50 నుంచి రూ.300 వరకు పెరగడంతో లబోదిబోమంటున్నారు. పాశ్చాత్య దేశాల్లో జరుగుతున్న యుద్ధంతో కాంప్లెక్స్ ఎరువుల ధరలు భారీగా పెరిగాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాంప్లెక్స్ ఎరువుల ధరలు (రూ.లలో..) ఎరువు 2023 2024 2025 2026 డీఏపీ 1,250 1,300 1,350 1,350 ఎంఓపీ 1,400 1,535 1,800 1950 యూరియా 242 242 266.50 266.50 20–20–0–13 1,175 1,270 1,450 1,800 12–36–16 1,350 1,470 1,720 1800 14–35–14 1,450 1,700 1,850 2,350 16–16–16 1,250 1,470 1,600 1700 10–26–26 1,375 1,470 1,900 2,350 28–28–0 1650 1700 1,800 2,350 15–15–15 1450 1500 1,600 1,950 ఏటా పెరుగుతున్న పెట్టుబడులు వరి మినహా సకాలంలో ప్రారంభం కాని ఇతర పంటల కొనుగోలు కేంద్రాలు పత్తి విస్తీర్ణం పెరుగుతున్నా.. తగ్గుతున్న దిగుబడులు ఆందోళనలో అన్నదాతలు -
పాలమూరు కోసం పోరు..
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఉమ్మడి పాలమూరు, నల్లగొండ జిల్లాల్లో సుమారు 12 లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేసే పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి చేసి.. సాగు నీరందించాలనే డిమాండ్‌తో బీఆర్ఎస్ ఉద్యమ బాట పట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు కార్యాచరణ ప్రణాళిక రూపకల్పనకు ఆ పార్టీ ముఖ్య నేతలైన మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డి, లక్ష్మారెడ్డి తదితరులు కసరత్తు మొదలుపెట్టారు. తొలి దశలో పాలమూరు ప్రాజెక్ట్‌తో పాటు రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై పోరు సాగించేలా పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. ఒకవైపు భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) సంస్థాగత బలోపేతంలో భాగంగా సభ్యత్వ నమోదు చేపట్టడంతో పాటు మరోవైపు ప్రజా సమస్యలపై గళం వినిపించేలా సమాయత్తమవుతుండడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. జూన్ మొదటి వారంలో... చివరి దశలో మిగిలిన ప్రతిష్టాత్మక పాలమూరు ప్రాజెక్ట్ పనులను పూర్తి చేసేలా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే సంకల్పంతో ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు ముందుకు సాగుతున్నారు. ఉమ్మడి పాలమూరులోని 14 నియోజకవర్గాలకు చెందిన ఆ పార్టీ ముఖ్య నాయకులు హైదరాబాద్‌లో ఇటీవల పలుమార్లు సమావేశమై చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా తొలుత పాలమూరు ప్రాజెక్ట్ కోసం పాదయాత్ర చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లాలోని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ నివాసంలో ఆయనతో పాటు మాజీ మంత్రులు నిరంజన్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డి, హర్షవర్దన్‌రెడ్డి, చిట్టెం రాంమోహన్‌రెడ్డి, ఎమ్మెల్సీలు సురభి వాణీదేవి, నవీన్‌కుమార్‌రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తదితర నేతలు మరోమారు సమావేశమై చర్చించిన అనంతరం వచ్చే నెలలో పాదయాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించారు. వారి మాటలను బట్టి జూన్ మొదటి వారంలోపు లేదంటే రెండో వారం ప్రారంభంలో యాత్రకు శ్రీకారం చుట్టనున్నట్లు సమాచారం. విద్య, వైద్యం తదితర రంగాల వారీగా సైతం.. పాదయాత్ర అనంతరం జిల్లాకేంద్రాలు, తదితర ముఖ్య ప్రాంతాల వారీగా వ్యవసాయం, విద్య, వైద్యం వంటి వివిధ రంగాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై బీఆర్ఎస్ నేతలు రోజు వారీగా పోరు కొనసాగించనున్నట్లు సమాచారం. సామాజిక వర్గాల వారీగా సైతం భేటీలు నిర్వహించి.. వారి సమస్యల పరిష్కారం దిశగా గళమెత్తేలా నేతలు తగిన కార్యాచరణను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. బీఆర్ఎస్ హయాంలో అమలైన పథకాలు, అభివృద్ధి పనులు, ప్రజలకు చేకూరిన మేలు వివరిస్తూ.. కాంగ్రెస్ ప్రభుత్వంలో పథకాల అమలులో లోపాలు, అభివృద్ధి పనుల తీరుపై ఎండగట్టే కార్యాచరణతో గులాబీ దళం ప్రత్యేక కసరత్తు చేపట్టినట్లు తెలుస్తోంది. తొలి రోజు కేటీఆర్.. చివరి రోజు కేసీఆర్ పాదయాత్ర షెడ్యూల్ త్వరలో విడుదల చేస్తామని బీఆర్ఎస్ నేతలు ప్రకటించారు. యాత్ర ప్రారంభమయ్యే తొలి రోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరుకానున్నట్లు సమాచారం. పాదయాత్ర మధ్య మధ్యలో మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావుతో పాటు పలువురు ముఖ్య నాయకులు పాల్గొనేలా షెడ్యూల్ రూపొందిస్తున్నారు. రోజు వారీగా కిలోమీటర్ల వారీగా కొనసాగనున్న యాత్రకు సంబంధించి ఆయా ప్రాంతాల్లో రైతులతో మాటామంతి, కార్నర్ మీటింగ్‌లు, బస చేసే ప్రదేశాల్లో సమావేశాలు నిర్వహించేలా నేతలు ప్రణాళిక తయారు చేస్తున్నారు. చివరి రోజు ప్రజలతో భారీ బహిరంగసభకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. ఈ సభకు బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరుకానుండగా.. పెద్ద ఎత్తున జనసమీకరణ చేసేలా ఉమ్మడి జిల్లాలోని ఆయా సెగ్మెంట్ల నాయకులతో ముఖ్య నేతలు ముందస్తుగా సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. బీఆర్ఎస్ నేతల ఉద్యమ కార్యాచరణ జూన్‌లో పాదయాత్రకు సన్నాహాలు నార్లాపూర్ నుంచి ఉదండాపూర్ వరకు.. తొలి రోజు కేటీఆర్, మధ్యలో హరీశ్‌రావు హాజరు చివరి రోజు భారీ బహిరంగ సభ ‘గులాబీ’ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ రాక నార్లాపూర్ లేదంటే ఉదండాపూర్ నుంచి.. పాలమూరు ప్రాజెక్ట్‌కు సంబంధించి తొలి దశలో నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలోని నార్లాపూర్, వనపర్తి జిల్లాలో ఏదుల, నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలో వట్టెం, మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలంలో కర్వెన, జడ్చర్ల మండలంలో ఉదండాపూర్ రిజర్వయర్లను నిర్మిస్తున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ నార్లాపూర్‌లో మొదటి పంప్ మోటార్ స్విచ్ ఆన్ చేసి నీటిని విడుదల చేసిన విషయం తెలిసిందే. అక్కడి నుంచే బీఆర్ఎస్ నేతలు పాదయాత్ర ప్రారంభించే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ లెక్కన ఉదండాపూర్‌లో యాత్ర ముగియనున్నట్లు తెలుస్తోంది. అయితే ఉదండాపూర్లోనే పాదయాత్ర ప్రారంభించి.. నార్లాపూర్‌లో ముగించే అవకాశం సైతం ఉన్నట్లు పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. -
పెట్రోల్ మంట.. డీజిల్ సెగ
నారాయణపేట/పాలమూరు: అనుకున్నట్లే.. సామాన్యుడిపై పెట్రో, డీజిల్ బాంబు పడింది. పశ్చిమాసియాలో కొనసాగతోన్న యుద్ధ సంక్షోభం నేపథ్యంలో అంతర్జాతీయంగా ముడు చమురు ధరలు పెరిగాయి. దేశవ్యాప్తంగా చముర కొరత వల్ల పెట్రోల్, డీజిల్‌పై లీటర్‌కు రూ.3 పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. పెంచిన ధరలు శుక్రవారం ఉదయం 6 గంటల నుంచే అమల్లోకి వచ్చాయి. కొత్త ధరల ప్రకారం మహబూబ్‌నగర్‌లో పెట్రోల్ లీటర్ రూ.108.41 ఉండగా.. ప్రస్తుతం రూ.111.80కి పెరిగింది. డీజిల్ రూ.96.59లు ఉండగా... ప్రస్తుతం రూ.99.85కి పెరిగింది. ఈ లెక్క ప్రకారం పెట్రోల్ రూ.3.39, డీజిల్ 3.26 చొప్పున పెరిగాయి. ధరల పెంపు సామాన్యుడిపై తీవ్ర భారం పడే అవకాశం ఉంది. నిత్యవసర ధరలు కూడా పెరుగుతాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రోజుకు సగటున 15 లక్షల లీటర్ల పెట్రోల్, 70 లక్షల లీటర్ల డీజిల్‌ను వినియోగిస్తున్నారు. 44వ నంబర్‌జాతీయ రహదారిపై ఉన్న బంకుల్లో పెట్రోల్, డీజిల్ విక్రయాలు ఎక్కువగా జరుగుతాయి. పెరిగిన ధరలతో ప్రతిరోజూ వాహనదారులపై దాదాపు రూ.3 కోట్ల వరకు అదనపు భారం పడనుంది. వాహనదారుల జేబుకు చిల్లు పాలమూరులో పెట్రోల్‌పై రూ.3.39, డీజిల్‌పై 3.26 పెంపు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రతిరోజూ రూ.3కోట్ల అదనపు భారం -
ప్రజలను మోసం చేయడమే..
ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడమంటే ప్రజలను మోసం చేయడమే. ముందే పెంచితే బీజేపీకి ప్రజలు వ్యతిరేకమవుతారని తర్వాత ధరలు పెంచింది. ఎన్నికల ముందు ఒకటి.. తర్వాత ఒక నిర్ణయం తీసుకోవడం బీజేపీకి అలవాటే. రాబోయే రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారు. – పట్నం నరేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, కొడంగల్ పన్ను తగ్గించాలి.. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో సామాన్యులపై పెనుభారం పడుతుంది. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయి. ప్రజల ఆర్థిక స్థితిగతులను క్షేత్రస్థాయిలో పరిశీలించి పెట్రోల్, డీజీల్ ధరల పెంపును నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పన్నులను ఈ సమయంలో తగ్గించాలి. ప్రజాపాలన అందిస్తున్నామని చెప్పుకొంటున్న తెలంగాణ సర్కార్ వెంటనే రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్‌పై విధించే వ్యాట్‌ను రూ.మూడు తగ్గిస్తే ప్రజలకు ఊరట కలుగుతుంది. – ఎస్.రాజేందర్‌రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే -
మద్దతు ధర పెంచాలి..
పెరిగిన పెట్రోల్, డీజిల్, విత్తనాలు, ఎరువులు, కూలీల ధరలకు అనుగుణంగా రైతులకు గిట్టుబాటు కలిగేలా ప్రభుత్వం కనీస మద్దతు ధరలు పెంచాలి. పెట్టుబడులు పెరుగుతున్న రీతిలో మద్దతు ధరలు పెరగకపోవడంతో రైతులు నష్టాల బాట పడుతున్నారు. ప్రభుత్వ చెల్లించే మద్దతు ధరలతో రైతులకు ఆశించిన లాభాలు అందడం లేదు. – మోనపురం మహేశ్, రైతు, కాన్కుర్తి ఎరువుల ధరలు నియంత్రించాలి రసాయన ఎరువులు, పురుగు మందుల ధరలను కంపెనీలు ఏటా పెంచుతూనే ఉన్నాయి. వాటిని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి. నకిలీ విత్తనాలు, మందులు, ఎరువులపై దృష్టి సారించాలి. పెట్టుబడులు భారీగా పెరుగుతున్నా.. మద్దతు ధరలు మాత్రం నామమాత్రంగా పెంచి ప్రభుత్వం చేతులు దులుపుకోంటుంది. రాష్ట్ర ప్రభుత్వం సన్నరకం వరిపై బోనస్ ఇవ్వడం లేదు. – అంజిలయ్యగౌడ్, జిల్లా కార్యదర్శి, తెలంగాణ రైతు సంఘం, నారాయణపేట వచ్చే సీజన్‌కు మద్దతు ధరలు.. కేంద్ర ప్రభుత్వం పెంచిన కనీస మద్దతు ధరలు వచ్చే వానాకాలం పంటలకు వర్తిస్తాయి. రైతులకు అండగా నిలిచేందుకు ఏటా కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న కనీస మద్దతు ధరలు ఎంతో లాభసాటిగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం సన్నరకం వరి క్వింటాకు రూ.500 బోనస్ చెల్లిస్తుండటంతో రైతులకు మరింత లాభం చేకూరుతుంది. – జాన్ సుధాకర్, జిల్లా వ్యవసాయ అధికారి● -
వేసవి శిబిరానికి క్రీడాసామగ్రి అందజేత
నారాయణపేట ఎడ్యుకేషన్: జిల్లాకేంద్రంలోని మినీ స్టేడియంలో కొనసాగుతున్న ఉచిత వేసవి క్రికెట్ శిబిరానికి హైదరాబాద్, మహబూబ్‌నగర్ క్రికెట్ అసోసియేషన్లు సంయుక్తంగా రూ.లక్ష విలువైన క్రీడాసామగ్రిని శుక్రవారం అందించింది. ఉమ్మడి పాలమూరు జిల్లా క్రికెట్ అసోషియేషన్ కార్యదర్శి రాజశేఖర్, అడిషనల్ ఎస్పీ రియాజ్ ఉల్హక్ నిర్వాహకులకు సామగ్రి అందజేసి మాట్లాడారు. క్రీడాకారుల కోసం జంబో కిట్, నెట్స్, బాల్స్, ఫిట్‌నెస్‌కు సంబంధించిన వస్తువులు అందించామని, క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వేసవి శిబిరంలో మెళకువలు నేర్చుకొని రాష్ట్ర, జాతీయస్థాయిలో రాణించి తల్లిదండ్రులు, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఉమ్మడి జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు సురేష్, ఇన్చార్జ్ రమణ, కోచ్ అజయ్, ట్రాఫిక్ ఎస్సై కృష్ణ చైతన్య పాల్గొన్నారు. -
నియోజకవర్గ అభివృద్ధికి కృషి
మక్తల్: నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసేందుకు తనవంతు కృషి చేస్తానని రాష్ట్ర పశుసంవర్ధఽకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. శుక్రవారం పట్టణంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నియోజకవర్గంలోని 19 రహదారుల నిర్మాణానికి రూ.68 కోట్లు మంజూరు చేశారని చెప్పారు. ఆత్మకూర్–గద్వాల హైలెవల్ వంతెన నిర్మాణ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయని వివరంచారు. కొల్పూర్ కుర్తికొండ దగ్గర మినీ జూరాల బ్రిడ్జి కం బ్యారేజ్ నిర్మాణానికి రూ.800 కోట్ల మంజూరుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. హిందూపూర్ దగ్గర ఽథర్మల్ పవర్‌స్టేషన్‌కు సైతం త్వరలో గ్రీన్‌సిగ్నల్ రానుందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వెటర్నరీ ట్రైనింగ్ సెంటర్ అనంతపురంలో ఉండేదని.. సీఎం చొరవతో మక్తల్‌కు మంజూరు చేయించినట్లు వివరించారు. అలాగే మక్తల్‌కు డిగ్రీ కళాశాల, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, కోర్టు భవన నిర్మాణాలకు నిధులు విడుదలయ్యాయని చెప్పారు. పట్టణానికి 220 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ తీసుకొస్తామని వెల్లడించారు. కాంగ్రెస్ హయంలోనే 150 పడకలు ఆస్పత్రి నిర్మాణం చేపట్టి త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు. సమావేశంలో మార్కెట్ వైస్ చైర్మన్ గణేష్‌కుమార్, కో–ఆప్షన్ సభ్యుడు లక్ష్మణ్, సురేష్, రవికుమార్, సాగర్, రాజప్పగౌడ్, యజ్ఞేశ్వర్‌రెడ్డి, పరమేష తదితరులు పాల్గొన్నారు. ● స్థానిక పుర కార్యాలయంలోని సమావేశ మందిరంలో శుక్రవారం చైర్పర్సన్ వాకిటి మానస అధ్యక్షతన సాధారణ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి వాకిటి శ్రీహరి హాజరయ్యారు. ముందుగా 6వ వార్డు కౌన్సిలర్ చందాపూర్ సత్యమ్మతో కమిషనర్ రాజయ్య ప్రమాణం చేయించారు. అనంతరం జరిగిన సమావేశంలో పురపాలికలోని 1, 2, 4, 6 వార్డుల్లో తాగునీరు, విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని మంత్రికి కౌన్సిలర్లు విన్నవించారు. అండర్‌గ్రౌండ్, డ్రెయినేజీ నిర్మాణాలు చేపట్టాలని కోరారు. పుర అభివృద్ధికి కృషి చేస్తానని మంత్రి తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ ఫణింద్రారెడ్డి, వైస్ చైర్మన్ శైవి రెడ్డి, ఏఈఈ నాగశివ, కౌన్సిలర్లు ఆల్కూరి పావని, మహేష్, శ్రీవిద్య, సరిత, అనిత, రహీం పటేల్, వెంకటేశ్వర్లు, రాజశేఖర్‌రెడ్డి, పీకే నర్సింహ, కృష్ణ, సత్యమ్మ పాల్గొన్నారు. -
శాంతిభద్రతల పరిరక్షణకు పటిష్ట చర్యలు
నారాయణపేట: జిల్లాలో శాంతిభద్రతలు పరిరక్షించడంతో పాటు గోవుల అక్రమ రవాణాను అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ఎస్పీ వినీత్ ఆదేశించారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని సమావేశ మందిరంలో పోలీసు, రెవెన్యూ, పశు వైద్యాధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి జిల్లావ్యాప్తంగా అమలు చేయాల్సిన భద్రతా చర్యలు, చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు, పశువుల అక్రమ రవాణాపై నిఘా తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. బక్రీద్‌ను ప్రజలందరూ శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. జిల్లాలో ఎక్కడైనా గోవులను అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా పరిధిలోని సరిహద్దు చెక్‌పోస్టుల్లో పోలీసు సిబ్బందితో పాటు వెటర్నరీ డాక్టర్లు నిరంతరం అందుబాటులో ఉండి తనిఖీలు చేపట్టాలని సూచించారు. ముఖ్యంగా మక్తల్, మద్దూర్, కోస్గి సంతలు జరిగే ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలన్నారు. పశువుల రవాణా సమయంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం సరైన అనుమతి పత్రాలు, ఫిట్ ఫర్ ట్రానన్స్‌పోర్ట్ సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. అక్రమ రవాణాలో పట్టుబడిన ఆవులు, లేగ దూడలను తాత్కాలిక గోశాలల్లో ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే సామాజిక మాధ్యమల్లో అసత్య ప్రచారాలు, రెచ్చగొట్టే పోస్టులు, వదంతులు వ్యాప్తిచేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. ప్రజలు ఎలాంటి అపోహలకు లోనుకాకుండా పోలీసులకు సహకరించాలని కోరారు. జిల్లాలో ఎక్కడైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే సమీప పోలీస్‌స్టేషన్‌లో లేదా డయల్ 100కు సమాచారం ఇవ్వాలని సూచించారు. ప్రతి పోలీస్‌స్టేషన్ పరిధిలో రాత్రి పెట్రోలింగ్ నిర్వహించాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు ఎస్పీ రియాజ్ హుల్‌హక్, ఆర్డీఓ రమేష్, డీఎస్పీలు నల్లపు లింగయ్య, మహేష్, సీఐలు శివశంకర్, సైదులు, రాంలాల్, భగవంత్‌రెడ్డి పాల్గొన్నారు. -
ధరల పెంపు పెను భారం..
పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో రవాణా చార్జీలు, నిత్యావసర సరుకుల ధరలు, వ్యవసాయంపై ప్రభావం చూపుతాయి. రైతులు, మధ్యతరగతి కుటుంబాలు, చిన్న వ్యాపారులతో పాటు ప్రతి కుటుంబంపై ఆర్థిక భారం పడుతుంది. మన్మోహన్సింగ్ ప్రభుత్వ హయంలో ఒక్క రూపాయి పెంచితే బీజేపీ రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపట్టేది. ఏకంగా ఒకేసారి రూ.3 పెంచడం సరైంది కాదు. కేంద్ర ప్రభుత్వం వెంటనే తగ్గించకపోతే నిరసన సెగలు తప్పవు. – కె.ప్రశాంత్‌కుమార్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు, నారాయణపేట ఆర్థిక ఒత్తిడి.. ఐదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తయిన వెంటనే పె ట్రోల్, డీజిల్ ధరల పెంపు అనేది ప్రజల్లో ఎన్నికలయ్యే వరకు ధరలు ని యంత్రించి తర్వాత భారాన్ని మోపుతున్నారనే అభిప్రాయం ఏర్పడుతోంది. సామాన్య ప్రజలు ఇప్పటికే పెరుగుతున్న జీవన వ్యయం, నిరుద్యోగం, వ్యవసాయ ఖర్చులతో ఇబ్బందులు పడుతున్న సమయంలో ఇంధన ధరల పెంపు ఆర్థిక ఒత్తిడిని కలిగిస్తోంది. – జి.శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు, టీఆర్ఎస్, నారాయణపేట -
ధాన్యం నిల్వలకు అవసరమైన ఏర్పాట్లు
కోస్గి రూరల్/కొత్తపల్లి: రైతుల నుంచి కొనుగోలు చేసిన వరి ధాన్యం నిల్వ చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు వేగంగా సమకూర్చుకోవాలని అదనపు కలెక్టర్ శ్రీను ఆదేశించారు. గురువారం ఆయన మద్దూర్, దమ్‌గాన్‌పూర్ కోస్గి, చెన్నారం, గుండుమాల్‌లోని వరి కొనుగోలు కేంద్రాలను, జాదరావుపల్లిలోని రైస్‌మిల్, కోస్గిలోని వెంకటసాయి రైస్‌మిల్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దామరగిద్ద, మద్దూర్, కొత్తపల్లి, గుండుమాల్, కోస్గిలో ఏర్పాటుచేసిన కోనుగోలు కేంద్రాల నుంచి రోజు 15 వేల బస్తాల ధాన్యం రైస్‌మిల్లులకు వస్తుందని.. అవసరమైన స్థలం, హమాలీలను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. ఇప్పటి వరకు 100 మంది హమాలీలు ఉండగా.. కేవలం 15 లారీలను మాత్రమే దించుకుంటున్నారని చెప్పారు. వారం రోజుల్లో ధాన్యం అధికంగా వస్తుందని.. తరలింపులో జాప్యం కాకుండా ఇతర ప్రాంతాల నుంచి హమాలీలను పిలిపించుకోవాలని సూచించారు. అకాల వర్షాలకు ధాన్యం తడవకుండా తగిన ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ఆయన వెంట తహసీల్దార్ శ్రీనివాసులు, వ్యవసాయ అధికారి రామకృష్ణ తదితరులు ఉన్నారు. బాధ్యతలు చేపట్టిన ఆర్డీఓ నారాయణపేట: రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీఓ)గా ఎల్.రమేష్ గురువారం స్థానిక ఆర్డీ ఓ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు కలెక్టర్ సీహెచ్ ప్రియాంకను మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్క అందజేశారు. జిల్లాలోని అన్ని శాఖల అధికారులతో సమన్వయంతో పనిచేస్తూ అభివృద్ధికి కృషి చేయాలని కలెక్టర్ ఆర్డీవోకు సూచించారు. ప్రకృతి వ్యవసాయంతో సంపూర్ణ ఆరోగ్యం నారాయణపేట రూరల్: మంచి ఆహారం తీసు కున్నప్పుడే సంపూర్ణ ఆరోగ్యంగా ఉండగలమని జిల్లా వైద్యాధికారి డా. జయచంద్రమోహన్ అన్నారు. గురువారం మండలంలోని కోటకొండలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో గ్రామభారతి, సత్యదర్శనం ఫౌండేషన్ సహకారంతో జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.ప్రకృతి వ్యవసాయంతో నేల, నీరు కలుషితం కాకుండా కాపాడవచ్చని, అనారోగ్య సమస్యలు తలెత్తకుండా చూసుకోవచ్చని సూచించారు. ఈ పథకంలో సేంద్రియ వ్యవసాయంపై ఆసక్తి ఉన్న 125 మంది రైతులను గుర్తించి శిక్షణ ఇచ్చామన్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆర్గానిక్ సర్టిఫికేషన్ అందిస్తుందని, మార్కెట్లో ఆయా పంటలకు డిమాండ్ పెరుగుతుందని తెలిపారు. కుటుంబ అవసరాలకు సరిపడా కూరగాయలు, వరి, జొన్న, కంది, పెసర తదితర వాటిని సేంద్రియ విధానంలో పండించాలని కోరారు. సర్పంచ్ వెంకట్రాములుగౌడ్, ఉప సర్పంచ్ చెన్నప్ప యాదవ్, మండల వ్యవసాయ అధికారి దినకర్, ఏఈఓ అనిల్, ఫౌండేషన్ సభ్యులు సత్యనారాయణ, సఖి, సువర్ణ, జ్యోతి, రైతులు ప్రభంజన్‌రావు, రామకృష్ణ, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానం నారాయణపేట: హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో 2026–27 విద్యాసంవత్సరం 1వ తరగతి ప్రవేశాలకు అర్హులైన ఎస్సీ విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి అబ్దుల్ ఖలీల్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికై న బాల బాలికలకు హైదరాబాద్‌లోని రామంత పూర్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ప్రవేశాలు ఉంటాయని పేర్కొన్నారు. కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాల వారికి రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల వారికి రూ.2 లక్షలు మించరాదన్నారు. 1.6.2019 నుంచి 31.5. 2020లోపు జన్మించిన వారు అర్హులని, జిల్లాకు ఒక సీటు మాత్రమే కేటాయించినట్లు పేర్కొన్నారు. జూన్ ఒకటిన కలెక్టరేట్లో కలెక్టర్ ఆధ్వర్యంలో లక్కీడిప్ ద్వారా ఒకరికి అడ్మిషన్ కల్పిస్తామని చెప్పారు. దరఖాస్తు గడువు ఈ నెల 28తో ముగుస్తుందని.. మీ–సేవ ద్వారా పొందిన జనన, కుల, ఆదాయం, స్థానిక తదితర ధ్రువపత్రాలను దరఖాస్తుకు జత పర్చాలని తెలిపారు. -
నెరవేరని లక్ష్యం..!
గ్రామాల్లో అందని టీ–ఫైబర్ సేవలు ● పరికరాలు అందినా.. ఫలితం శూన్యం ● పైలెట్ ప్రాజెక్టు మద్దూర్‌లోనూ అందని సేవలు ● నిరుపయోగంగా కంప్యూటర్లు, సామగ్రి నర్వ: గ్రామపంచాయతీల్లో ఆన్లైన్ సేవలు విస్తరించేందుకు గత ప్రభుత్వం చర్యలు చేపట్టినా నేటికీ వినియోగంలోకి రాలేదు. నెట్ కనెక్షన్ ఇవ్వకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. దీంతో జిల్లాలోని అన్ని మండలాల్లో చాలాచోట్ల ఇప్పటికే అందించిన కంప్యూటర్లు, ఇతర పరికరాలు హైస్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యం లేక నిరుపయోగంగా మారాయి. పైపులు వేసినా.. గ్రామపంచాయతీల్లో ఆన్లైన్ సేవలందించేందుకు గత ప్రభుత్వం టీ–ఫైబర్ సంస్థకు బాధ్యతలు అప్పగించింది. ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రత్యేక రూటర్, ఏసీలు, ఆన్లైన్ యూపీఎస్, బ్యాటరీలతో డిస్ట్రిబ్యూషన్ సర్వర్లు ఏర్పాటు చేసి ఇక్కడి నుంచి గ్రామాలకు నెట్ అందించాలని నిర్ణయించింది. మిషన్ భగీరథ పనులు కొనసాగుతున్న సమయంలో తాగునీటి పైపులైన్‌తో పాటు నెట్ కేబుల్ పైప్‌లు కూడా వేశారు. కానీ సేవలు మాత్రం ఇప్పటి వరకు ప్రారంభం కాలేదు. కాగిత రహిత పాలనకు.. టీ–ఫైబర్ సేవలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే ఉపయోగకరంగా ఉంటుంది. ఒక కనెక్షన్‌తో ఇంట్లో ఫోన్, టీవీలకు ఇంటర్నెట్ అందుతుంది. విద్యార్థులు ఆన్లైన్ తరగతులు వినొచ్చు. ఆన్‌లైన్‌కి సంబంధించి చాలా పనులు ఇంట్లో నుంచే చేసుకోవచ్చు. పంచాయతీ కార్యదర్శులు గ్రామాల్లో చేపడుతున్న అభివృద్ధి పనుల వివరాలు, ఆదాయ, వ్యయాలను ఆన్లైన్లో పొందుపర్చవచ్చు. మొత్తంగా కాగిత రహిత, పారదర్శక పాలన అందుతుంది. కాగా ప్రస్తుతం రైతువేదికలు, పాఠశాలల్లో మాత్రం టీ–ఫైబర్ సేవలు అందుతున్నాయి. విద్యార్థుల అవస్థలు.. పైలెట్ మండలం మద్దూర్ పాఠశాలలో ఏర్పాటు చేసిన టీ–ఫైబర్ లైన్‌తో పాటు హైస్పీడ్ ఇంటర్నెట్ యంత్రాలు అమర్చడం వద్ద రేడియషన్తో విద్యార్థులు అవస్థలు పడ్డారు. తరగతి గదుల్లో ఏర్పాటు చేసిన యంత్రాల శబ్ధంతో శబ్ధ కాలుష్యం ఏర్పడిందని ఆరోపించారు. దీంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో సేవలందకపోవడంతో ప్రైవేట్ ఇంటర్నెట్తో పాఠాలు బోధిస్తున్నామని ఉపాధ్యాయులు చెబుతున్నారు. టీ–ఫైబర్ సేవలు జిల్లా అంతటా విస్తరించేందుకు తగిన చర్యలు చేపడతాం. హైస్పీడ్ ఇంటర్నెట్ను గ్రామపంచాయతీలు, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో అందించేందుకు అవసరమైన పరికరాల ఏర్పాటుపై కలెక్టర్‌కు నివేదించాం. ప్రభుత్వ ఆదేశాలు రాగానే పనులు ప్రారంభిస్తాం. – రవిశంకర్, జిల్లా మేనేజర్, టీ–ఫైబర్ గతేడాది రాష్ట్రంలో పైలెట్ ప్రాజెక్టుగా మద్దూర్ మండలాన్ని ఎంపిక చేశారు. ఈ మండలంలోని 49 గ్రామపంచాయతీల్లో టీ–ఫైబర్ సేవలందించాలని చర్యలు చేపట్టారు. మండల కేంద్రంలో పనులు పూర్తిచేసి గ్రామపంచాయతీలు, ప్రభుత్వ బడుల్లో టీ–ఫైబర్ సేవల కోసం విద్యుత్ పరికరాలు, ఇంటర్నెట్ యంత్రాలను అమర్చారు. ఇంతవరకు బాగానే ఉన్నా పరికరాలకు విద్యుత్ కనెక్షన్ ఇచ్చినప్పటికీ అందుబాటులోకి తీసుకరాకపోవడంతో మండల కేంద్రంలో కూడా పూర్తిస్థాయిలో సేవలు అందడం లేదు. ప్రారంభంలో మండల కేంద్రంలోని ఇళ్లకు సిటీ కేబుల్ నెట్‌వర్క్‌కు అనుసంధానం చేయడంతో కొన్నిరోజులు ఉచితంగా అందించారు. అనంతరం రూ.300 రుసుం వసూలు చేశారు. అయినప్పటికీ అంతరాయంతో పూర్తిస్థాయిలో సేవలు అందడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. -
పథకాల అమలు పారదర్శకంగా ఉండాలి
● కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల ప్రారంభాలకు ఎంపీని ఆహ్వానించరా? ● రేషన్ దుకాణాల్లో ప్రధాని ఫొటో ఉండాల్సిందే.. ● జింకల సమస్యను పరిష్కరించండి ● ‘దిశ’ సమావేశంలో ఎంపీ డీకే అరుణనారాయణపేట: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను రాజకీయాలకు అతీతంగా సక్రమంగా, పారదర్శకంగా అమలు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఎంపీ డీకే అరుణ కోరారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కలెక్టర్ సీహెచ్ ప్రియాంకతో కలిసి జిల్లా అభివృద్ధి, సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) మూడో సమావేశాన్ని ఎంపీ అధ్యక్షతన నిర్వహించారు. 45 ప్రభుత్వ శాఖల పరిధిలో కేంద్ర, రాష్ట్ర నిధులతో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై అధికారులతో ఎంపీ సుదీర్ఘంగా చర్చించారు. ప్రొటోకాల్ పాటించరా..? కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టే అభివృద్ధి పనులకు మంత్రులు, ఎమ్మెల్యేలతోనే శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయిస్తారా.. కేంద్రంలో తాము అధికారంలో ఉన్నా ఎంపీగా ఎందుకు సమాచారం ఇవ్వడం లేదు.. ప్రొటోకాల్ పాటించకపోవడంలో ఆంతర్యామేమిటని ప్రశ్నించారు. కేంద్రం నుంచి ఏ శాఖకు నిధులు మంజూరైనా, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఉన్నా కచ్చితంగా తన సమయం తీసుకొని చేయా లని అధికారులను ఆదేశించారు. ఏమైనా ఇబ్బందు లుంటే తనకు చెప్పాలంటూ చురకలంటించారు. ● ధన్వాడలో డిగ్రీ కళాశాల భూమిపూజ ఎవరిని అడిగి చేశారని సంబంధిత అధికారులను ప్రశ్నించారు. కళాశాల నిర్మించాల్సిన స్థలం ఆక్రమణకు గురైందని.. తక్కువ స్థలంలో నిర్మించాలని చూస్తున్నారనే ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఒకరిద్దరి సంతోషం కోసం కళాశాల నిర్మించడం తప్పని హితవు పలికారు. తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చూడాలి.. మిషన్ భగీరథ పథకం ద్వారా అన్ని గ్రామాలకు తాగునీటి సరఫరా జరుగుతుందా లేదా? వేసవిలో ఎక్కడైనా సమస్య ఏర్పడితే వెంటనే పరిష్కరించాలని మిషన్ భగీరథ ఈఈని ఎంపీ ఆదేశించారు. కేంద్రం ప్రభుత్వం ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తున్నా.. రేషన్ దుకాణాల్లో మాత్రం కేవలం సీఎం రేవంత్‌రెడ్డి ఫొటో మాత్రమే పెడుతున్నారని.. ప్రధాని మోదీ ఫొటో ఎందుకు లేదని జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారిని నిలదీశారు. ఇకపై ప్రతి దుకాణంలో సీఎంతో పాటు పీఎం ఫొటో ఉండాల్సిందేనని తేల్చి చెప్పారు. ఉజ్వల పథకం కింద దరఖాస్తు చేసు కున్న వారికి సిలీండర్లు ఇవ్వాలని సూచించారు. రూ.300 రాయితీ అందుతుందా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఊట్కూర్, మక్తల్ ప్రాంతాల్లో ని పంట పొలాల్లో జింకల సంచారం అధికంగా ఉందని.. సమస్యకు వీలైనంత త్వరగా పరిష్కారం చూపాలని ఎంపీ అధికారులను ఆదేశించారు. జిల్లాలో చేనేత సహకార సంఘాల ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారని ఎంపీ ప్రశ్నించగా.. ఓటరు జాబితా తయారు చేస్తున్నామని, త్వరలోనే నిర్వహించే ఏర్పాట్లు జరుగుతున్నాయని చేనేత, జౌళిశాఖ అధికారి బాబు తెలిపారు. పథకాలన్నీ ప్రజలకు చేరాల్సిందే.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాల అమలులో లోటుపాట్లు ఉంటే సరి చేసుకొని జిల్లా అభివృద్ధిలో అధికారులు భాగస్వాములు కావాలని కోరారు. ● గత సమావేశంలోని అంశాలు.. ఆయా శాఖ లు తీసుకున్న చర్యల నివేదికపై చర్చించారు. తొ లుత డీపీఓ సుధాకర్‌రెడ్డి నివేదిక చదివి వినిపించారు. జిల్లాలో 272 గ్రామపంచాయతీలకుగాను 201 జీపీలకు సొంత భవనాలున్నాయని తెలిపా రు. స్పందించిన ఎంపీ ఇప్పటికీ సొంత భవనాలు లేకపోవడం ఏమిటన్నారు. గతంలో చాలామంది సర్పంచులు చేసిన పనులకు నేటికీ బిల్లు లు రాక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ● డీఎంఅండ్‌హెచ్‌ఓ డా. జయచంద్రమోహన్ మాట్లాడుతూ.. ఆయుష్మాన్ భారత్ కింద జిల్లాలో 2,533 మంది రూ.10 లక్షలలోపు లబ్ధి పొందారన్నారు. పీహెచ్‌సీల్లో వైద్యులు ఉన్నారా లేదా అని ఎంపీ ఆరా తీశారు. వ్యవసాయశాఖ అమలు చేస్తున్న పథకాలను డీఏఓ జాన్ సుధాకర్ వివరించారు. వ్యవసాయ యాంత్రీకరణ పథకం పారదర్శకంగా జరగాలని ఎంపీ సూచించారు. పీఎం సూర్యఘర్ కింద 134 దరఖాస్తులు వచ్చినట్టు విద్యుత్‌శాఖ ఎస్ఈ నవీన్ తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో కేంద్రం వాటా ఉంటుందని.. పార్టీలకు అతీతంగా మంజూరు చేయాలని హౌసింగ్ పీడీ శంకర్‌నాయక్‌ను ఎంపీ ఆదేశించారు. జిల్లాలో 19 పీఎంశ్రీ స్కూళ్లు ఉన్నాయని డీఈఓ గోవిందరాజులు తెలిపారు. జిల్లాలో ఎన్ని అంగన్వాడీ టీచ ర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఐసీడీఎస్ సూపర్వైజర్ను ఎంపీ ప్రశ్నించగా 33 టీచర్, 203 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయని వివరించారు. కోటకొండ–కోయిలకొండ మధ్యలో రహదారి పను లు ఎందుకు నిలిచిపోయాయని, ఎన్‌హెచ్ విస్తరణకు ప్రతిపాదనలు ఉన్నాయా అని ఎంపీ అధికారులను ప్రశ్నించారు. బ్యాంకర్లు రైతులకు సకాలంలో రుణాలు ఇవ్వాలని, మిగతా లక్షా్యాలను పూర్తి చేయాలని ఎల్డీఎంకు ఆమె సూచించారు. ●జిల్లాకేంద్ర మున్సిపాలిటీలో రూ. 27.66 కోట్లతో చేపట్టిన వాటర్ ట్యాంకుల నిర్మాణం ఎంతవరకు వచ్చిందని ఎంపీ అరుణ ప్రజా ఆరోగ్యశాఖ అధికారిని ప్రశ్నించారు. జిల్లాకేంద్రంలోని ఎర్రగుట్ట, టీవీటవర్ వద్ద 10 లక్షల లీటర్ల సామర్థ్యంతో రెండు పెద్ద ట్యాంకుల నిర్మాణాలు ప్రారంభమయ్యాయని, అలాగే 5 లక్షల లీటర్ల ట్యాంకు నిర్మాణం ప్రారంభం అవుతోందని అధికారి వివరించారు. ● చివరగా కలెక్టర్ సీహెచ్ ప్రియాంక మాట్లా డుతూ.. దిశ సమావేశంలో శాఖల వారీగా చర్చించిన అంశాలపై అధికారులు తగిన చర్యలు తీసు కోవాలని, అమలు చేస్తున్న కార్యక్రమాలు లక్ష్యం మేరకు సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. ఆయా శాఖలు చేపట్టే పనులు ప్రారంభించినప్పుడు ప్రొటోకాల్ తప్పక పాటించాలని ఆదేశించారు. స మావేశంలో పుర చైర్పర్సన్ కొండా శ్వేతా, మార్కెట్ కమిటీ చైర్మన్ సదాశివరెడ్డి, దిశ కమిటీ సభ్యులు, అన్ని శాఖల జిల్లా అధికారులు, ఎస్ఈలు, డీఈలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. -
‘హైలెవల్’.. ముమ్మరం
రూ.123 కోట్లతో వంతెన నిర్మాణం ● జూరాల– కొత్తపల్లి మధ్య కృష్ణానదిలో కొనసాగుతున్న పిల్లర్ల పనులు ● తాత్కాలిక రహదారిపై వాహనాల రాకపోకలు ● గద్వాల, ఆత్మకూర్ మధ్య తగ్గనున్న దూరం కొనసాగుతున్న పిల్లర్ల పనులు గద్వాల జిల్లా పరిధిలోని కొత్త పల్లి వైపు ముందుగా పిల్లర్ల నిర్మాణాలు చేపడుతున్నాం. ఇదివరకే మూడు పిల్లర్ల పనులు చేపట్టాం. వరద నీరు వచ్చేలోగా కొత్తపల్లి వైపు నిర్మాణాలు పూర్తి చేసేలా ముందుకెళ్తున్నాం. జూరాల వైపు వరద వచ్చినా పనులు చేపట్టేందుకు అవకాశం ఉంది. ఏడాదిన్నరలోగా పనులు పూర్తి చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నాం. – దేశ్యానాయక్, ఈఈ, ఆర్అండ్బీ, వనపర్తి ఆనందంగా ఉంది.. గద్వాల మండలం కొత్తపల్లి సమీపంలో కృష్ణానదిపై వంతెన నిర్మిస్తారని చిన్నతనం నుంచి వింటున్నాం. ప్రస్తుతం మా గ్రామం మీదుగా రాకపోకలు కొనసాగుతుండటంతో ఆనందంగా ఉంది. ఎన్నో ఏళ్లనాటి కల సాకారం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి రుణపడి ఉంటాం. –మహేశ్వర్‌రెడ్డి, మాజీ సర్పంచ్, కొత్తపల్లి, గద్వాల మంత్రి కృషి ఫలితంతోనే.. ఆత్మకూర్ మండలంలోని జూరాల గ్రామం వద్ద కృష్ణానదిపై వంతెన నిర్మాణానికి మంత్రి వాకిటి శ్రీహరి ఎంతో శ్రమించారు. కొందరు అ డ్డంకులు సృష్టించినా సీఎంను ఒప్పించి రూ.123 కోట్లు మంజూరు చేయించి పనులు ప్రారంభించారు. –పరమేష్, కాంగ్రెస్‌పార్టీ మండల అధ్యక్షుడు, ఆత్మకూర్ ఆత్మకూర్: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు దిగువన హైలెవల్ వంతెన నిర్మాణానికి ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఈ ప్రాంత ప్రజల కల సాకారం కాబోతుంది. వంతెన పనులు ప్రారంభం కావడంతో సర్వ త్రా హర్షం వ్యక్తమవుతోంది. వంతెన నిర్మాణంతో గద్వాల,ఆత్మకూర్ ప్రాంతాల మధ్య దూరం త గ్గనుంది. జూరాల, కొత్తపల్లి గ్రామాల మధ్య కృష్ణానదిలో భారీ పిల్లర్ల నిర్మాణాలు కొనసాగుతున్నా యి. ఇదివరకే తాత్కాలిక రహదారి ఏర్పాటు చేయడంతో వాహనాల రాకపోకలు కొనసాగుతున్నా యి. ఆత్మకూర్ మండలం జూరాల గ్రామం వద్ద రూ.123 కోట్లతో వంతెన నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గతేడాది డిసెంబర్ 1న శంకుస్థాపన చేయగా.. వెంటనే తాత్కాలిక రహదారి నిర్మాణ చేపట్టి వినియోగంలోకి తీసుకొచ్చారు. వివాదాలు.. అడ్డంకులు... హైలెవల్ వంతెన పనులను ప్రారంభించిన నాటి నుంచి వివాదాలు కొనసాగుతున్నాయి. ప్రాజెక్టు భద్ర తలో భాగంగా వంతెన నిర్మాణం డ్యాం వద్ద చేప ట్టాలని ఎంపీ డీకే అరుణ పట్టుబట్టారు. ఇరిగేషన్శా ఖ సమీక్షలో సైతం మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డ్యాం వద్దనే వంతెన నిర్మాణం చేపట్టనున్నట్లు వెల్లడించడంతో పెద్దఎత్తున ఆందోళనలు కొనసాగాయి. ఎంపీ అ భివృద్ధిని అడ్డుకుంటున్నారని కాంగ్రెస్ నాయకులు వి మర్శలు గుప్పిస్తూ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఇరిగేషన్ నిధులతో డ్యాం సేఫ్టీ వంతెన నిర్మించాలని, ఆర్అండ్బీ నిధులతో కొత్తపల్లి–జూరాల వంతెన నిర్మించాలని, అభివృద్ధిని అడ్డుకోవడం లేదని ఎంపీ స్పష్టం చేశారు. ఈ విషయమై కాంగ్రెస్, బీజేపీ నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. పోటాపోటీగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఆత్మకూర్ నుంచి జూరాల మీదుగా గద్వాలకు వెళ్లేందుకు 32 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంది. గద్వాల మండలం కొత్తపల్లి, ఆత్మకూర్ మండలం జూరాల గ్రామం వద్ద కృష్ణానదిపై వంతెన నిర్మిస్తే కేవలం పది కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. 22 కిలోమీటర్ల దూరం తగ్గనుంది. ప్రస్తుతం నిర్మించిన తాత్కాలిక రహదారిపై ప్రయాణిస్తున్న రెండు జిల్లాల ప్రయాణికులు దూరభారం తగ్గడంతో సమయంతో పాటు డబ్బులు ఆదా అవుతున్నాయని అంటున్నారు. అలాగే గద్వాల నుంచి హైదరాబాద్‌కు వెళ్లాలంటే ఎర్రవల్లి చౌరస్తా మీదుగా హైవే మీద ప్రయాణం చేయాల్సి ఉంది. వంతెన నిర్మాణం పూర్తయితే గద్వాల నుంచి ఆత్మకూర్ మీదుగా తక్కువ వ్యవధిలో కొత్తకోట హైవేకు చేరుకోవచ్చు. దీంతో 40 కిలోమీటర్ల దూరం తగ్గనున్నట్లు అంచనాలు ఉన్నాయి. అలాగే ఎమ్మిగనూరు, ఆదోని, బళ్లారి, మంత్రాలయం వెళ్లే వారికి దూరం తగ్గే అవకాశం ఉంది. వ్యాపార పరంగా ఆత్మకూర్, జూరాల, కొత్తపల్లి ప్రాంతాలు అభివృద్ధి చెందనున్నాయి. తగ్గనున్న దూరం.. -
18 నెలల్లో పూర్తి...
జూరాల, కొత్తపల్లి మధ్యన కృష్ణానదిపై వంతెన నిర్మాణానికి ప్రభుత్వం రూ.123 కోట్లు కేటాయించింది. దీంతో ఆర్‌అండ్‌బీశాఖ ఆధ్వర్యంలో టెండర్ల ప్రక్రియ పూర్తిచేశారు. మెస్సర్స్ అనూషా ప్రాజెక్టు వారు పనులు దక్కించుకున్నారు. ముఖ్యమంత్రి పనులను లాంఛనంగా ప్రారంభించగా.. మంత్రి వాకిటి శ్రీహరి త్వరితగతిన పూర్తిచేసే విధంగా సంబంధిత కాంట్రాక్టు కంపెనీ, ఆర్అండ్బీ అధికారులతో మాట్లాడుతున్నారు. మొత్తం 18 పిల్లర్లతో ఏడాదిన్నరలోగా పనులు పూర్తిచేసే విధంగా పకడ్బందీ కార్యాచరణతో ముందుకెళ్తున్నట్లు ఆర్అండ్బీ అధికారులు పేర్కొంటున్నారు. కొత్తపల్లి వైపు పిల్లర్ల నిర్మాణం -
ప్రైవేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు
నారాయణపేట రూరల్: ప్రైవేట్ పాఠశాలలకు దీ టుగా సర్కారు బడుల్లో వసతులు కల్పిస్తున్నామని జిల్లా విద్యాధికారి గోవిందరాజు అన్నారు. ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళికలో భాగంగా గురువారం మండలంలోని జాజాపూర్ జెడ్పీ ఉన్నత పాఠశాల లో నిర్వహించిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మా ట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో అన్నిరకాల సౌకర్యాలు కల్పిస్తున్నామని.. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు బోధన అందిస్తుండటంతో మెరుగైన ఫలితాలు సాధిస్తున్నామని చెప్పారు. పాఠ్య పుస్తకాలు, రాత పుస్తకాలు, యూనిఫామ్, నాణ్యమైన మధ్యా హ్న భోజనంతో పాటు అన్నిరకాల క్రీడలు, సాంకేతిక పరిజ్ఞానానికి కంప్యూటర్ బోధన అందిస్తున్నామని చెప్పారు. ప్రైవేట్‌కు వెళ్లి డబ్బులు వృథా చేసుకోవడం మానుకోవా లని సూచించారు. అంతకుముందు గ్రామ వీధుల్లో బడిబాట ర్యాలీ నిర్వహించారు. పదోతరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను శాలువాలతో సన్మానించి అభినందించారు. కార్యక్రమంలో స ర్పంచ్ సంగీత, ఉప సర్పంచ్ లక్ష్మణ్, సెక్టోరియల్ అధికారులు రాజేంద్రకుమార్, యాదయ్య శెట్టి, డీఎస్ఓ భానుప్రకాష్, జీహెచ్ఎం భారతి, తపస్ జిల్లా అధ్యక్షుడు నర్సింహ, ఏఏసీ చైర్మన్ మణెమ్మ, కాంగ్రెస్ నాయకులు రవీందర్‌రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
పది తప్పిన వారికి తర్ఫీదు
–8లో uనారాయణపేట రూరల్: ఇటీవల విడుదలైన పదోతరగతి పరీక్షా ఫలితాల్లో జిల్లా గతేడాది కంటే మెరుగుపడింది. అధికారుల ప్రత్యేక దృష్టి కారణంగా ఉత్తీర్ణత శాతం పెరిగింది. ఇదే ఉత్సాహంతో ఫెయి ల్ అయిన విద్యార్థులను సప్లిమెంటరీ పరీక్షల్లో గట్టెక్కించేందుకు ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో విద్యాశాఖ ప్రత్యేక తరగతులు నిర్వహిస్తోంది. జూన్ 5 నుంచి 12వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం సమయసారణి విడుదచేసింది. అందుకు అనుగు ణంగా ఈ నెల 12 నుంచి జూన్ 3 వరకు రోజు సబ్జె క్టుల వారీగా ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. వేసవి నేపథ్యంలో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 వరకు తరగతులు కొనసాగుతున్నాయి. జిల్లాలో ఇలా.. జిల్లావ్యాప్తంగా 8,319 మంది విద్యార్థులు పదోతరగతి పరీక్షలు రాయగా.. 8,138 మంది ఉత్తీర్ణులయ్యారు. 181 మంది విద్యార్థులు ఫెయిలయ్యారు. వీరిలో చాలామంది ఒక్కో సబ్జెక్టులోనే తప్పినట్లు అధికారులు చెబుతున్నారు. అత్యధికంగా సైన్స్‌లో 84 మంది, అదేవిధంగా ఇంగ్లిష్‌లో 69 మంది, తెలుగులో 62 మంది, గణితంలో 61 మంది, సాంఘికశాస్త్రంలో 20 మంది, హిందీలో 15 మంది మాత్రమే ఉత్తీర్ణులు కాలేకపోయారు. ● సప్లిమెంటరీ పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేయడానికి జిల్లాలోని నాలుగు ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు కొనసాగుతున్నాయి. జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ గ్రౌండ్ స్కూల్, మరికల్, మక్తల్, గుండుమల్ జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో తరగతులు కొనసాగుతున్నాయి. ఫెయిల్ ఆయన విద్యార్థులు సమీపంలోని కేంద్రాలకు రావాల్సి ఉంటుంది. ఫెయిల్ అయిన విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండటంతో ఎక్కువ కేంద్రాలు ఏర్పాటు చేయలేదని తెలుస్తోంది. రోజు ఉదయం 8 వరకు కేంద్రాలకు చేరుకోవడం కష్టంగా ఉందని దూర ప్రాంత విద్యార్థులు చెబుతున్నారు. ప్రత్యేక నిధులు మంజూరు.. ప్రత్యేక తరగతుల నిర్వహణకు ప్రభుత్వం నిధులు విడుదల చేయనుంది. అవసరమైన స్టేషనరీ, అల్పాహారం, రవాణాతో పాటు ఇతర ఖర్చులకు ప్రతి విద్యార్థికి రూ.1,100 చొప్పున వినియోగించాలని సూచించింది. ఈ ప్రకారం జిల్లాకు 181 మంది విద్యార్థులకుగాను రూ.99,100 రానున్నాయి. చెల్లింపులు నగదు రూపంలో కాకుండా ఆన్లైన్ ద్వారానే చెల్లించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అదేవిధంగా కేంద్రంలో విద్యార్థులకు అవసరమైన తాగునీరు, మరుగుదొడ్లు, గదుల్లో ఫ్యాన్లు ఏర్పాటు చేశారు. మండలాల వారీగా ఫెయిలైన విద్యార్థులు.. మక్తల్ 37, మరికల్37, మద్దూరు, 35, కోస్గి 29, నారాయణపేట18, ధన్వాడ 9, ఉట్కూరు 5, దామరగిద్ద 5, మాగనూర్ 3, కృష్ణా 2.పదోతరగతి పరీక్షల్లో తక్కువ మార్కులు, ఫెయిల్ అయిన విద్యార్థులు జవాబు పత్నాల పునః పరిశీలనకు విద్యాశాఖ అవకాశం కల్పించింది. మార్కుల లెక్కింపుతో పాటు సమాధాన పత్రాలు పొందడానికి గురువారం వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. రూ.500 చెల్లిస్తే రీ కౌంటింగ్.. రూ.వెయ్యి చెల్లిస్తే రీ వెరిఫికేషన్ చేస్తారు. వీటిని పాఠశాలల ప్రధానోపాధ్యాయుల ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. సంబంధిత పత్రాలు, జవాబు పత్రాలు విద్యార్థి సెల్‌ఫోన్‌కు పంపిస్తారు. ఫెయిలైనవిద్యార్థులపై ప్రత్యేక దృష్టి జూన్ 3 వరకు ప్రత్యేక తరగతుల నిర్వహణ జిల్లాలోని నాలుగు పాఠశాలల్లో.. పర్యవేక్షిస్తున్న అధికారులు -
పాలిసెట్‌కు 92.08 శాతం హాజరు
నారాయణపేటఎడ్యుకేషన్/కోస్గి రూరల్:జిల్లాలో బు ధవారం జరిగిన పాలిసెట్ (పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) ప్రశాంత వాతావరణంలో ముగిసిందని కో–ఆర్డినేటర్ ఎం.శ్రీనివాసులు తెలిపారు. నా రాయణపేటలో 3, కోస్గిలో 2 పరీక్ష కేంద్రాలు ఏర్పా టు చేశామని..మొత్తం 1,330 మంది విద్యార్థులకుగా ను 1, 225 మంది విద్యార్ధులు పరీక్ష రాయగా, 105 మంది గైర్హాజరైనట్లు వివరించారు. మొత్తంగా 92.08 శాతం హాజరు నమోదైందని చెప్పారు. కోస్గిలోని ప్ర భుత్వ ఇంజినీరింగ్ కళాశాల పరీక్ష కేంద్రంలో 300 మంది విద్యార్థులకుగాను 285 మంది, ప్రభుత్వ జూనియర్ కళాశాల కేంద్రంలో 173 మందికిగాను 159 మంది హాజరయ్యారని చెప్పారు. అలాగే జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల కేంద్రంలో 240 మందికిగాను 223 మంది, బ్రిలియంట్ స్కూల్ కేంద్రంలో 217 మందికిగాను 199 మంది, చిట్టెం నర్సిరెడ్డి స్మారక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 400 మందికిగా ను 374 మంది విద్యార్థులు పరీక్ష రాసినట్లు వివరించారు. -
పైసలిస్తేనే పని..
● రెవెన్యూ, పోలీస్, విద్యుత్, పంచాయతీ తదితర అన్ని శాఖల్లోనూ డబ్బులిస్తేనే పనులు ● ఉమ్మడి జిల్లాలో వరుసగా ఏసీబీ అధికారులకు పట్టుబడుతున్న వైనం ● ఈ ఏడాదిలో ఇప్పటికే ఐదుగురు చిక్కారుఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా అవినీతిపై ఏసీబీకి వస్తున్న ఫిర్యాదులు పెరుగుతున్నాయి. సమాచారం వచ్చిన వెంటనే స్పందించి తక్షణమే దాడులు చేపడుతున్నాం. ఎవరైనా ప్రభుత్వ అధికారులు లంచం అడిగితే ప్రజలు నేరుగా ఏసీబీ అధికారులకు సమాచారం అందించండి. టోల్‌ఫ్రీ నంబర్ 1064కు ఫోన్ చేసి సమాచారం అందించవచ్చు. – సీహెచ్ బాలకృష్ణ, డీఎస్పీ, ఏసీబీ, మహబూబ్‌నగర్ ●సాక్షి, నాగర్‌కర్నూల్: ఉమ్మడి జిల్లాలో ఏసీబీ అధికారులకు పట్టుబడుతున్న లంచావతారుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రభుత్వశాఖల్లో కొంత మంది అధికారులు లంచం ఇవ్వనిదే పని చేయడం లేదు. పలు కీలక శాఖల్లో కొంతమంది అధికారులు తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నారు. తరచుగా ఏసీబీ దాడుల్లో అధికారులు పట్టుబడుతున్నా.. పలువురు అధికారులు తమ లంచగొండితనాన్ని మాత్రం వీడటం లేదు. తాజాగా బర్త్ సర్టిఫికెట్ల కోసం లంచం తీసుకుంటూ నారాయణపేట ఆర్డీఓ రామచందర్ ఏసీబీకి చిక్కడం ఈ పరిస్థితికి అద్దం పడుతోంది. చేయి తడిపితేనే పని.. ప్రభుత్వ కార్యాలయాల్లో కొంత మంది అధికారులు చేయి తడపనిదే పని చేయడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చాలా సందర్బాల్లో బాధితులు ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావడం లేదు. బర్త్ సర్టిఫికెట్ నుంచి మొదలుకొని కీలకమైన భూ రిజిస్ట్రేషన్ల వరకు ప్రతిదానికీ ఎంతో కొంత సమర్పించుకోనిదే పని కావడం లేదు. పలువురు బాధితులు చైతన్యంతో ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయాల్సిందే తప్ప సంబంధిత శాఖలో పర్యవేక్షణ, విజిలెన్స్ గాడి తప్పిందన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ శాఖల్లో ప్రధానంగా రెవెన్యూ, పోలీస్, విద్యుత్, మైనింగ్, రిజిస్ట్రేషన్లు తదితర శాఖలకు సంబంధించి ఎక్కువగా ఫిర్యాదులు అందుతుండగా, ఈ మధ్యకాలంలో ఇతరశాఖల నుంచి సైతం ఫిర్యాదులు పెరుగుతున్నాయి. పౌరసరఫరా శాఖలో మిల్లర్ల నుంచి పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడుతుండటంతో ఆ శాఖలో ఫిర్యాదులు అధికమయ్యాయి. మున్సిపాలిటీలు, తహసీల్దార్ కార్యాలయాల్లో ఔట్సోర్సింగ్ సిబ్బందిని నియమించుకుని వారి ద్వారా అధికంగా అవినీతికి పాల్పడుతున్నట్టు ఫిర్యాదులు అందుతున్నాయి. ఔట్సోర్సింగ్ సిబ్బందిని ముందుపెట్టి పైస్థాయి అధికారులు నేరుగా చిక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఏసీబీ వలలో చిక్కి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడుతున్న లంచావతారుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గతేడాది ఉమ్మడి జిల్లాలో మొత్తం 14 మంది పట్టుబడ్డారు. ఈ ఏడాదిలో నాలుగు నెలల్లోనే ఇప్పటివరకు ఐదుగురు ఏసీబీకి పట్టుబడటం గమనార్హం. రెవెన్యూ, పోలీస్, విద్యుత్, పంచాయతీ శాఖల్లో అవినీతి అధికారులపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండల ఎస్ఐ హరిప్రసాద్ రెడ్డి మార్చి 20న ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఓ ఇసుక ట్రాక్టర్‌కు మైనింగ్ అధికారులు రూ.60 వేలు ఫైన్ వేశారు. ట్రాక్టర్‌ను స్టేషన్ నుంచి విడిపించేందుకు ఎస్ఐ రూ.30 వేలు లంచం డిమాండ్ చేయగా, బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. అధికారులు దాడి చేయగా ఎస్ఐ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. అవినీతి అధికారి ఏసీబీకి చిక్కడంతో గ్రామస్తులు రోడ్డుపై టపాసులు కాల్చి సంబరాలు చేసుకోవడం గమనార్హం. ఉమ్మడి జిల్లాలో ఇటీవల ఏసీబీ అధికారులకు ఏకంగా ఆర్డీఓ స్థాయి అధికారి లంచం తీసుకుంటూ పట్టుబడటం సంచలనం కలిగించింది. బర్త్ సర్టిఫికెట్ జారీ కోసం రూ.25 వేలు లంచం తీసుకుంటూ ఏప్రిల్ 21న నారాయణపేట ఆర్డీఓ రామచందర్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఐదుగురు వ్యక్తులకు చెందిన బర్త్ సర్టిఫికెట్లు జారీ కోసం ఒక్కొక్కరి నుంచి రూ.5 వేల చొప్పున లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. బర్త్ సర్టిఫికెట్ జారీకి సైతం లంచం తీసుకుంటూ ఏకంగా ఆర్డీఓ అధికారే పట్టుబడటం ప్రభుత్వ శాఖల్లో వేళ్లూనుకుని ఉన్న అవినీతి బాగోతాన్ని బయటపెట్టింది. -
ఇసుక అక్రమంగా తవ్వితే చర్యలు
మాగనూర్: ఇసుక అక్రమ తవ్వకాలు చేపడితే కఠిన చర్యలు తప్పవని రెవెన్యూ అధనపు కలెక్టర్ శ్రీను హెచ్చరించారు. బుధవారం ఆయన మండలంలోని వర్కూర్, మాగనూర్, దాసర్పల్లి ఇసుక రీచ్‌లను తనిఖీ చేసి మాట్లాడారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా యంత్రాలతో ఇసుక తవ్వకాలు జరిపితే చర్యలు తీసు కుంటామన్నారు. అనుమతి పొందిన పరిధిలోనే మాన్యువల్‌గా తవ్వకాలు జరిగేలా మైనింగ్ అధి కారులతో పాటు పోలీసు, రెవెన్యూ, సాండ్ కమి టీ, ఇతర శాఖల అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా జరిగినట్లు గుర్తిస్తే పోలీసులు కేసునమోదు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఆయన వెంట మాగనూర్ ఇన్చార్జ్ తహసీల్దార్ పుష్పలతరెడ్డి, ఆర్ఐ బాలరాజు, ఆయా శాఖల అధికారులు ఉన్నారు. -
ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి
నర్వ:జిల్లాలో వరి, మొక్కజొన్న కొనుగోళ్లను వేగ వంతం చేయాలని రాష్ట్ర పశుసంవర్ధకశాఖమంత్రి వాకిటి శ్రీహరి అధికారులను ఆదేశించారు. బుధవారం మండల కేంద్రంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. గన్నీ బ్యాగులు ఇవ్వ డం లేదని, మొక్కజొన్న కొనుగోళ్లలో లారీలు రాక పోవడంతో పాటు గోదాములు కేటాయించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని రైతులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్ శ్రీలతతో మంత్రి ఫోన్లో మాట్లాడి కొనుగోళ్ల ప్ర క్రియ వేగవంతం చేసి రైతుల ఇబ్బందులు తొలగించాలని ఆదేశించారు. ధాన్యం తరలించేందుకు లారీలను సమకూర్చాలన్నారు. అనంతరం కేంద్రానికి వచ్చిన మంత్రిని పీఏసీఎస్ చైర్మన్ రాయికోడ్ శ్రీనివాస్‌రెడ్డి, సీఈఓ ఉదయ్‌కుమార్ శాలువాలతో సన్మానించారు. మంత్రి వెంట కాంగ్రెస్‌పార్టీ మండల అధ్యక్షుడు బీసం చెన్నయ్యసాగర్, ఆత్మకూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ డి.కృష్ణారెడ్డి, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, శరణప్ప, వివేకవర్ధన్‌రెడ్డి, కల్వల్ సర్పంచ్ చెన్నప్ప, జనార్ధన్‌రెడ్డి, రామకృష్ణ, సద్దల ఆంజనేయరెడ్డి ఉన్నారు. ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతు కేంద్రం ప్రారంభం మక్తల్:మండలంలోని జక్లేర్ స్టేజీ సమీపంలో విద్యు త్ ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతు కేంద్రాన్ని బుధవారం తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నర్వ, ఊట్కూర్ మండలాల ట్రా న్స్ ఫార్మర్ల మరమ్మతుకు ఇక్కడ కేంద్రం ఏర్పాటు చేశామని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరా రు. కార్యక్రమంలో ఎస్ఈ నవీన్‌కుమార్, ఏడీఏలు విజయభాస్కర్, గంగాధర్, ఏఈలు రామకృష్ణ, అశోక్, మార్కెట్ వైస్ చైర్మన్ గణేష్‌కుమార్, మాధవరావు, నర్సింహ, భరత్, శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు. -
ఎర్ర కంది క్వింటా రూ.7,290
నారాయణపేట: స్థానిక వ్యవసాయ మార్కెట్‌యార్డులో ఎర్ర కంది క్వింటా సరాసరిగా రూ.7,290 ధర పలికింది. వరి హంసరకం గరిష్టంగా రూ.1,829, కనిష్టంగా రూ.1,500, వరి సోనారకం గరిష్టంగా రూ.2,496, కనిష్టంగా రూ.1,639 ధరలు లభించాయి. ప్రారంభమైన ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు నారాయణపేట ఎడ్యుకేషన్: జిల్లాలో ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. మొదటిరోజు ప్రథమ సంవత్సరం విద్యార్ధులు 574 మందికిగాను 541 మంది పరీక్షకు హాజరుకాగా, 33 మంది గైర్హాజరయ్యారు. జనరల్ విభాగంలో 532 మందికిగాను 503 మంది, ఒకేషనల్ విభాగంలో 42 మందికిగాను 38 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. అదేవిధంగా మధ్యాహ్నం జరిగిన ద్వితీయ సంవత్సరం పరీక్షకు 111 మంది విద్యార్థులకుగాను 101 మంది హాజరయ్యారు. జనరల్ విభాగంలో 104 మంది విద్యార్ధులకుగాను 96 మంది, ఒకేషనల్ విభాగంలో ఏడుగురికిగాను ఐదుగురు పరీక్షలు రా సినట్లు డీఐఈఓ సుదర్శన్‌రావు వివరించారు. డీఈసీ స్క్వాడ్ బృందం కోస్గి, మక్తల్, నారాయణపేట, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం ధన్వాడ, నారాయణపేట, సిట్టింగ్ స్క్వాడ్ బృందం మద్దూర్, ధన్వాడ కేంద్రాలను తనిఖీ చేసింది. ‘బండి భగీరథ కేసులో నిజాలు నిగ్గు తేల్చాలి’ నారాయణపేట ఎడ్యుకేషన్: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథపై నమోదైన కేసులో అధికారులు నిజాల్ని నిగ్గు తేల్చాలని బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణ సంఘం సభ్యుడు నాగురావు నామాజీ డిమాండ్ చేశారు. బుధవారం జిల్లాకేంద్రంలోని ప్రెస్‌క్లబ్‌లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సత్య యాదవ్, మీడియా ఇన్చార్జ్ కిరణ్‌తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను లక్ష్యంగా చేసుకొని ఆయనను బద్నాం చేయడానికే కేసు కుట్ర పన్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకులు కేసును మసిపూసి మారెడుకాయ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. తన కుమారుడిపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని బండి సంజయ్ బహిరంగంగా ప్రకటించడం దయన నిజాయితీకి నిదర్శనమని తెలిపారు. ఇలా చెప్పే ధైర్యం విపక్షాలకు ఉందా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వం కాదని, పోలీసులు కేంద్రం పరిఽధిలో లేరని.. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం నిష్పక్షపాతంగా విచారణ జరిపితే నిజాలు బయటకు వస్తాయని వివరించారు. బడి మనదే.. బాధ్యత మనదే : డీఈఓ మక్తల్: ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్‌కు స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధులే పునాదిలాంటివారని జిల్లా విద్యాధికారి గోవిందరాజు అన్నారు. మండల కేంద్రంలో బుధవారం జిల్లాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సర్పంచులు, కౌన్సిలర్ల అవగాహన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. గుడి ఎంత పవిత్రమైందో.. బడి కూడా అంతే పవిత్రమైందన్నారు. గ్రామానికి సర్పంచ్ ప్రథమ పౌరుడు మాత్రమే కాదని, ఆ ఊరి పిల్లల భవిష్యత్ తీర్చిదిద్దే సంరక్షకుడని తెలిపారు. పాఠశాలల్లో మౌళిక వసతుల కల్పనలో సర్పంచులు కీలక పాత్ర పోషించాలని కోరారు. ఈ సందర్భంగా సర్పంచులు అడిగిన ప్రశ్నలకు అధికారులు సమాధానాలు ఇచ్చారు. ఉపాధ్యాయులు, పాఠశాలకు అన్నివిధాలుగా సహకరిస్తే గ్రామం అభివృద్ధి చెందుతుందన్నారు. కార్యక్రమంలో ఎంఈఓలు నిజామొద్దీన్, ఖాజా అమృద్దీన్, గణేష్‌సింగ్, జనార్దన్‌రెడ్డి, రాఘవేందర్, మాధవి, రాంరెడ్డి, శివవంకర్, అశోక్, వీరేష్, శేఖర్, శివరాజ్, అమీన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నిలకడగా ఉల్లి ధరలు దేవరకద్ర: పట్టణంలోని వ్యవసాయ మార్కెట్లో బుధవారం జరిగిన వేలంలో ఉల్లి ధరలు నిలకడగా ఉన్నాయి. కొన్ని వారాలుగా రూ.వెయ్యి దాటని ఉల్లి ధర గత వారం కొంతమేర పెరిగింది. ఉదయం మార్కెట్లో స్థానిక వ్యాపారులతోపాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వ్యాపారులు వేలంలో పాల్గొన్నారు. క్వింటా ఉల్లి గరిష్టంగా రూ.1,500, కనిష్టంగా రూ.వెయ్యి వరకు పలికింది. 50 కిలోల బస్తాను గరిష్టంగా రూ.750, కనిష్టంగా రూ.500 వరకు విక్రయించారు. ఉల్లి నాణ్యతగా ఉండడంతో వినియోగదారులు పెద్దఎత్తున ఉల్లిని కొనుగోలు చేశారు. -
బడిబయట పిల్లలు ఉండొద్దు
● గ్రామస్థాయిలో సర్పంచుల పాత్ర కీలకం ● వందశాతం సాధిస్తే సన్మానం ● కలెక్టర్ సీహెచ్ ప్రియాంక నారాయణపేట: బడిబయట (డ్రాఫ్ అవుట్) పిల్లలు లేని జిల్లాగా తీర్చిదిద్దేందుకు అందరం సమష్టిగా కృషి చేద్దామని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక కోరారు. ప్రజాపాలన.. ప్రగతిప్రణాళికలో భాగంగా బుధవారం జిల్లాకేంద్రం సమీపంలోని వృత్తి నైపుణ్య శిక్షణా కేంద్రంలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నారాయణపేట, కొడంగల్ నియోజకవర్గంలోని సర్పంచులు, కౌన్సిలర్లకు విద్యాశాఖలో అమలవుతున్న కార్యక్రమాలపై అవగాహన సదస్సు నిర్వహించగా.. కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం విద్యకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని, కేటాయిస్తున్న నిధులను సద్వినియోగం చేసుకొని ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి యత్నించాలన్నారు. జిల్లాలోని ప్రతి గ్రామంలో బడిఈడు పిల్లలందరూ పాఠశాలలోనే ఉండాలని, డ్రాప్ అవుట్ జీరో చేయాలని, అందుకు సర్పంచులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన సర్పంచులకు తమ గ్రామానికి ఏం అవసరమో ఇప్పటి వరకే తెలిసి ఉంటుందని.. ప్రభుత్వ పాఠశాలలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ఏయే పథకాలు అమలవుతున్నాయి, అందులో తమ పాత్ర ఏమిటనేది అవగాహన కలిగి ఉండాలని సూచించారు. సర్పంచ్‌లలో ఎక్కువ మంది మహిళలు ఉండటం ఓ మహిళగా తనకు ఎంతో ఆనందంగా ఉందని, అందరికీ అభినందనలు తెలియజేస్తున్నామని చెప్పారు. వందశాతం సాధిస్తే సన్మానం.. ప్రస్తుతం జిల్లాలో ఎంతమంది పిల్లలు బడికి వెళ్తున్నారు? ఇంకా ఎంత మంది పాఠశాలకు వెళ్లకుండా ఉన్నారనే వివరాల నివేదికను విద్యాశాఖ రూపొందిస్తుందని చెప్పారు. ఏ గ్రామంలో అయితే వందశాతం పిల్లలు బడికి వెళ్తున్నారో గుర్తించి ఆయా గ్రామాల సర్పంచులకు ప్రభుత్వం ద్వారా సన్మానం చేయించేందుకు కృషి చేస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు. అంతేగాకుండా సర్పంచులు తమ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలను ప్రతి వారం సందర్శించాలని, విద్యార్థులతో కలిసి భోజనం చేయాలని, అలా చేస్తే వంట ఏజెన్సీ నిర్వాహకులకు భయం ఉంటుందని, నాణ్యత ప్రమాణాలు పాటిస్తారని చెప్పారు. అంగన్వాడీలు, పాఠశాలల సమస్యలను తన దృష్టికి తీసుకొస్తే పరిష్కరించేందుకు సిద్ధంగా ఉంటామని భరోసానిచ్చారు. కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి గోవిందరాజు, పుర చైర్పర్సన్ కొండా శ్వేతా, వైస్ చైర్పర్సన్ మంజుల, మద్దూరు పుర చైర్పర్సన్ సరస్వతి, ఆయా మండలాల ఎంఈఓలు, సెక్టోరియల్ అధికారులు రాజేందర్‌కుమార్, నాగార్జునరెడ్డి, విద్యాసాగర్, డీపీఆర్వో రషీద్, తపస్ నాయకులు షేర్ కృష్ణారెడ్డి, నర్సింహ, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు యాదగిరి జనార్దన్‌రెడ్డి, విద్యాశాఖ కార్యాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. జిల్లాలో ఓటరు మ్యాపింగ్ (ఎస్ఐఆర్) ప్రక్రియకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక కోరారు. బు ధవారం సాయంత్రం కలెక్టరేట్లోని వీసీ హాల్ లో ఎస్ఐఆర్పై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 2002లో ఉన్న ఓటర్లకు, ఇప్పుడున్న ఓటర్లతో లింక్ చేయడమే మ్యాపింగ్ ప్రక్రియని.. జిల్లాలోని మండలాలతో పోలిస్తే నారాయణపేటలో ప్రక్రియ చాలా వెనుకబడి ఉందని తెలిపారు. రాజకీయ పార్టీల ప్రతినిధు లు తమ బీఎల్ఏల ద్వారా బీఎల్వోలకు సహ కారం అందిస్తే ప్రక్రియ వేగంగా పూర్తవుతుందన్నారు. ప్రస్తుతం జిల్లాలో 82 శాతం మ్యాపింగ్ పూర్తయిందని.. కనీసం 95 శాతం కావాలని కోరారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు ఫణీంద్రారెడ్డి, శ్రీను, ఎస్డీసీ రాజేందర్‌గౌడ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సత్యయాదవ్, బీఆర్ఎస్ నా యకుడు సుదర్శన్‌రెడ్డి, కాంగ్రెస్‌పార్టీ పట్టణ అధ్యక్షుడు సలీం, ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ ఖదీర్, సి–సెక్షన్ అధికారులు పాల్గొన్నారు. -
నాసిరకంగా ఎత్తిపోతల పనులు : బీఆర్ఎస్
మక్తల్: మక్తల్–నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకం పనుల్లో నాణ్యత లేదని.. కాంట్రాక్టర్లు సక్రమంగా చేయడం లేదని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం పుర కేంద్రంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. కొందరు భూ నిర్వాసితులకు డబ్బులు రాలేదని.. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల నిర్వహణ సరిగాలేక 80 శాతం మంది రైతులు బయటి మార్కెట్లో విక్రయించి నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నర్సింహగౌడ్, పార్టీ పట్టణ అధ్యక్షుడు చిన్నహన్మంతు, బీఆర్ఎస్ నాయకులు నర్సింహారెడ్డి, అన్వర్ తదితరులు పాల్గొన్నారు. -
ఆలసందలు క్వింటా రూ.4,500
నారాయణపేట: స్థానిక వ్యవసాయ మార్కెట్‌యార్డులో మంగళవారం ఆలసందలు క్వింటా సరాసరిగా రూ.4,500 ధర పలికాయి. అదేవిధంగా వరి హంసరకం రూ.1,650, వరి సోనారకం గరిష్టంగా రూ.2,462, కనిష్టంగా రూ.1,555 ధరలు లభించాయి. ఆయిల్‌పాం సాగుతో అధిక ప్రయోజనం దామరగిద్ద: ఆయిల్‌పాం సాగుతో అధిక ప్రయోజనం పొందవచ్చని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమలశాఖ అధికారి సాయిబాబా సూచించారు. మంగళవారం మండల కేంద్రంలోని రైతువేదికలో ఆయిల్‌పాం సాగుపై నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. దీర్ఘకాలిక లాభదాయకమైన పంట అని.. ప్రభుత్వ ప్రోత్సాహంతో తక్కువ పెట్టుబడితో సాగు చేయవచ్చని సూచించారు. సాంప్రదాయ పంటల కంటే అధిక ఆదాయం లభిస్తుందని తెలిపారు. ఆయిల్‌పాం సాగులో తీసుకోవాల్సిన సస్యరక్షణ చర్యలను కోస్గి ఉద్యాన అధికారి హర్షవర్ధన్‌రెడ్డి వివరించారు. తెలంగాణ ఆయిల్‌ఫెడ్ జిల్లా మేనేజర్ వెంకటేశ్ మార్కెట్ సౌకర్యాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో హెచ్ఈఓ వినోద్‌కుమార్, సర్పంచ్ కన్కిరెడ్డి, శరణ్‌నాయక్, సంగారెడ్డి, ఎఫ్ఓ ప్రియ, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు, రైతులు పాల్గొన్నారు. -
ఓటరు మ్యాపింగ్‌కు సహకరించండి
నారాయణపేట: పట్టణంలో 90 శాతానికి పైగా ఓటరు మ్యాపింగ్ పూర్తయ్యేలా బూత్ లెవెల్ అధికారులకు కౌన్సిలర్లు, బూత్ లెవెల్ ఏజెంట్లు, రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని ఇన్చార్జ్ ఆర్డీఓ రాజేందర్‌గౌడ్ కోరారు. మంగళవారం పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయ సమావేశ మందిరంలో పుర పరిధిలోని కౌన్సిలర్లు, బీఎల్వోలు, సూపర్వైజర్లతో ఓటరు నమోదు అధికారి, రెవెన్యూ డివిజనల్ అధికారి సమావేశమయ్యారు. త్వరలో నిర్వహించనున్న ఐఆర్ కార్యక్రమానికి సంబంధించి ప్రస్తుతం కొనసాగుతున్న ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియపై అవగాహన కల్పించారు. పట్టణ పరిధిలోని 40 పోలింగ్ కేంద్రాల్లో ఓటరు మ్యాపింగ్ శాతం చాలా తక్కువగా ఉందన్నారు. బీఎల్వోలు వేగవంతంగా ఓటరు మ్యాపింగ్ పూర్తి చేయాలని ఆదేశించారు. -
నేటి నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు
నారాయణపేట రూరల్: జిల్లాలో బుధవారం నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్ల మెంటరీ పరీక్షలకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. గతంలో మాదిరిగా ఒక నిమిషం నిబంధన లేకపోవడం, పరీక్ష సమయానికి ఐదు నిమిషాల గ్రేస్ టైమ్ ఇచ్చారు. జిల్లాలో 3,671 మంది విద్యార్థులు పరీక్షలు రాయనుండగా.. వారిలో 3,408 జనరల్, 263 మంది ఒకేషనల్ విద్యార్థులు ఉన్నారు. మొదటి సంవత్సరం జనరల్‌లో 2,318 మంది, ఒకేషనల్‌లో 195 మంది.. అదేవిధంగా సెకండ్ ఇయర్లో జనరల్ 1,090 మంది, ఒకేషనల్‌లో 68 మంది విద్యార్థులు ఉన్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు ఫస్ట్ ఇయర్, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు సెకండ్ ఇయర్ పరీక్షలు జరుగుతాయి. సిబ్బంది కేటాయింపు ఇలా.. జిల్లావ్యాప్తంగా 9 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా.. విద్యార్థుల సంఖ్య ఆధారంగా నారాయణపేటలో 3, మక్తల్‌లో 2, కోస్గి 2. ధన్వాడ, మద్దూర్‌లో ఒక్కో కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. పరీక్షల నిర్వహణకు 9 మంది సీఎస్‌లు, 9 మంది డీఓలు, ముగ్గురు అడిషన ల్ సూపరింటెండెంట్లు, ఒక కస్టోడియన్, ఒక ఫ్లయింగ్, ఒక సిట్టింగ్ స్కాడ్ బృందాలను ఏర్పాటు చేశారు. ప్రతి 20 మందికి ఒకరు చొప్పున ఇన్విజిలేటర్లు నియమించారు. కేంద్రాల్లో విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా కనీస సౌకర్యాలు కల్పించారు. తగిన మందులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచి వైద్యసిబ్బందిని నియమించారు. పరీక్ష కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్ అమలులో ఉండనుంది. -
డీజీపీని కలిసిన మంత్రి
నారాయణపేట: రాష్ట్ర డీజీపీగా నియమితులైన సీవీ ఆనంద్‌ను మంగళవారం మినిస్టర్స్ క్వార్టర్స్‌లో రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి, డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం శివకుమార్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. బాధ్యతలు చేపట్టిన మక్తల్ పుర కమిషనర్ మక్తల్: స్థానిక పురపాలిక కమిషనర్‌గా రాజయ్య మంగళవారం పుర కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. ఈయన వడ్డేపల్లి నుంచి బదిలీపై ఇక్కడకు వచ్చారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ వాకిటి మానస, కౌన్సిలర్లు అనిత, వెంకటేష్, రహీం పటేల్, నాలప్ప, మహేందర్‌రెడ్డి, అధికారి నాగశివ ఆయనకు పూలమొక్క అందజేసి శాలువాతో సన్మానించారు. పట్టణ ప్రజలు, పాలకవర్గం సహకారంతో పుర అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా రాజయ్య తెలిపారు. ప్రత్యేక తరగతులు సద్వినియోగం చేసుకోవాలి మరికల్: పదోతరగతి ఫెయిల్ అయిన విద్యా ర్థుల కోసం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామని.. సద్వినియోగం చేసుకోవాలని జిల్లా విద్యాధికారి గోవిందరాజు కోరారు. మంగళవారం మరికల్ పీఎంశ్రీ బాలుర ఉన్నత పాఠశాలలో ప్రత్యేక తరగతులను ఆయన ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులు ఉత్తీర్ణత సాధించాలనే లక్ష్యంతోనే ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఉత్తీర్ణత సాధనకు కృషి.. నారాయణపేట రూరల్: జిల్లాకేంద్రంలోని గ్రౌండ్ స్కూల్లో పదోతరగతి వార్షిక పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు నిర్వహిస్తున్న రెమెడియన్ తరగతులను మంగళవారం జిల్లా విద్యాధికారి గోవిందరాజు పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి సప్లిమెంటరీ పరీక్షల్లో తప్పకుండా ఉత్తీర్ణత సాధించాలని సూచించారు. సందేహాలు ఉంటే ఉపాధ్యాయులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే జూన్‌లో ప్రారంభమయ్యే ఇంటర్ తరగతులకు హాజరయ్యే అవకాశం ఉంటుందని చెప్పారు. హెచ్ఎం దత్తూరావు, కిషోర్ పాల్గొన్నారు. పాలిసెట్ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి కోస్గి రూరల్: జిల్లాలో బుధవారం నిర్వహించే పాలిసెట్ (పాలిటెక్నిక్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్) నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసులు మంగళవారం తెలిపారు. జిల్లాకేంద్రంలో 3, కోస్గిలో 2 కేంద్రాలు ఏర్పాటు చేశామని.. మొత్తం 1,330 మంది విద్యార్థులు హాజరుకానున్నారని చెప్పారు. పరీక్ష ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు కొనసాగుతుందని.. విద్యార్థులు గంట ముందుగా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. నిమిషం ఆలస్యమైనా అనుమతించమని.. హాల్‌టికెట్, ఆధార్‌కార్డు, పెన్సిల్, పెన్ను వెంట తెచ్చుకోవాలని, ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి లేదన్నారు. నిల్వ వివరాలు విధిగా నమోదు చేయాలి కొత్తపల్లి (మద్దూరు): దుకాణదారులు ఎరువు లు, పురుగు మందులు, విత్తనాల నిల్వ వివరాలను రికార్డులు, ఈ–పాస్ యంత్రంలో విధిగా నమోదు చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి జాన్ సుధాకర్ సూచించారు. మంగళవారం ఆయన మద్దూరులోని శ్రీనివాస, వరలక్ష్మి ఎరువుల దుకాణాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతులకు విక్రయించే ఎరువులు, పురుగు మందులు, విత్తనాలకు విధిగా బిల్లు అందించాలని, నకిలీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. వానాకాలం సాగుకు కావాల్సిన ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచాలన్నారు. -
ధాన్యం తరలింపు వేగవంతం
● కలెక్టర్ సీహెచ్ ప్రియాంక నారాయణపేట/కొత్తపల్లి: కొనుగోలు కేంద్రాల్లో తూకం పూర్తయిన ధాన్యం బస్తాలను వెంటనే లారీల్లో రైస్‌మిల్లులు, గోదాంలకు తరలించి త్వరగా దించుకునేలా చూడాలని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక ఆదేశించారు. మంగళవారం ఆమె ఎస్పీ డా. వినీత్‌కుమార్‌తో కలిసి మద్దూరు, పల్లెగడ్డతండా, దోరేపల్లి, గుండుమాల్, అమ్లికుంట కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇంతవరకు ఎన్ని బస్తాల ధాన్యం కొనుగోలు చేశారు, ఇంకా ఎంత ధాన్యం విక్రయానికి వస్తుంది, ప్రస్తుతం కేంద్రంలో ఎన్ని బస్తాలు ఉన్నాయని మద్దూరు కేంద్రం నిర్వాహకుడితో మాట్లాడి ఆరా తీశారు. ఇప్పటి వరకు 13 వేల బస్తాల ధాన్యం కొనుగోలు చేశామని.. మరో 10 వేల బస్తాలు విక్రయానికి వచ్చే అవకాశం ఉందని, కేంద్రంలో 5 వేల బస్తాలున్నాయని, లారీల కొరత కారణంగా లోడింగ్ నిలిచిందని కలెక్టర్‌కు వివరించారు. వెంటనే డీటీఓ మేనకాగాంధీకి ఫోన్ చేసి మద్దూరు, గుండుమాల్, కోస్గి పరిధిలోని కేంద్రాల్లోని ధాన్యం తరలింపునకు వాహనాలను సమకూర్చాలని ఆదేశించారు. పల్లెగడ్డతండా కేంద్రంలో ధాన్యం కుప్పలను చూసి తేమశాతం, ప్యాడీ క్లీనర్‌ను పరిశీలించారు. ధాన్యం తరలింపునకు 4 లారీలు కావాలని నిర్వాహకులు కోరగా.. బుధవారం సాయంత్రం వరకు ధాన్యం తరలించాలని పౌరసరఫరాలశాఖ అధికారి సైదులును ఆదేశించారు. దోరేపల్లి కొనుగోలు కేంద్రంలో ధాన్యం బస్తాల తుకాన్ని పరిశీలించారు. నిల్వ ఉన్న బస్తాలను అవసరమైతే ట్రాక్టర్లతో మిల్లులకు తరలించాలని సూచించారు. కేంద్రంలో తాగునీటి వసతి కల్పించాలన్నారు. గుండుమాల్ కేంద్రానికి వెళ్లి ఎంతమంది రైతుల ఖాతాలో డబ్బులు జమయ్యాయని నిర్వాహకుడిని ప్రశ్నించగా 70 మందికి చెల్లించినట్లు తెలిపారు. ట్యాబ్‌ఎంట్రీ ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని, టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలన్నారు. అనంతరం కోస్గి మండలం కడెంపల్లిలో ఉన్న మహాలక్ష్మి రైస్‌మిల్లును సందర్శించి యజమానితో మాట్లాడారు. కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన ధాన్యం బస్తాలను వెంటనే దించుకొని లారీలను తిరిగి పంపించాలని సూచించారు. అవసరమైతే హమాలీల సంఖ్య పెంచుకోవాలన్నారు. వ్యవసాయ, రెవెన్యూ, ఆర్టీఓ, పోలీసు శాఖల సమన్వయంతో కొనుగోళ్లు సజావుగా జరిగేలా చూడాలని, రెండ్రోజుల పాటు అధికారులు మండలాల్లోనే అందుబాటులో ఉండాలని ఆదేశించారు. చివరగా గుండుమాల్ మండలం అమిన్కుంట కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. కొనుగోలు చేసిన 1,500 బస్తాలు తరలింపునకు వాహనాలు రావడం లేదని, దారి ఇరుకుగా ఉన్నందున లారీలు రావడం కష్టమని, ట్రాక్టర్ల ద్వారా మిల్లులకు తరలించాలని రైతులు కలెక్టర్‌ను కోరారు. బుధవారం సాయంత్రం వరకు ధాన్యం తరలించాలని.. దగ్గరుండి చూసుకోవాలని తహసీల్దార్, వెహికల్ ఇన్స్పెక్టర్ను ఆదేశించారు. కలెక్టర్ వెంట పౌరసరఫరాలశాఖ జిల్లా మేనేజర్ సైదులు, డీసీఓ హరిప్రసాద్, తహసీల్దార్లు మహేష్, భాస్కర్, బక్క శ్రీనివాస్, సీఐ సైదులు, ఏఓలు ఉన్నారు. కలెక్టరేట్లోని ప్రజావాణి మందిరంలో ఏర్పాటు చేసిన రెడ్‌క్రాస్ సొసైటీ నెలరోజుల ప్రత్యేక సభ్య త్వ నమోదు కేంద్రాన్ని మంగళవారం కలెక్టర్ సీహెచ్ ప్రియాంక ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ చట్టబద్ధంగా ఏర్పడ్డ స్వచ్ఛంద సేవాసంస్థ అని, విపత్తుల సమయంలో సేవలందిస్తుందని, అధికసంఖ్యలో సభ్యత్వం తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో పుర వైస్ ఛైర్పర్సన్ మంజుల, జిల్లా రెడ్‌క్రాస్ చైర్మన్ కె.సుదర్శన్‌రెడ్డి, రాష్ట్ర రెడ్‌క్రాస్ సభ్యుడు ఆత్మరామ్, జిల్లా జూనియర్, యూత్ రెడ్‌క్రాస్ కన్వీనర్లు జొన్నల సుభాష్, నందు పటేల్, రెడ్‌క్రాస్ పాట్రన్ జీఆర్ రెడ్డి, సభ్యులు ఉమేష్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
ఇళ్ల గణన షురూ..!
–8లో uనారాయణపేట: జనగణన–2027లో కీలకమైన గృహ జాబితా సేకరణ ప్రక్రియ జిల్లావ్యాప్తంగా సోమవారం నుంచి కొనసాగుతోంది. జనగణన రెండు దశల్లో జరగనుండగా.. తొలివిడత ఈ నెల 11 నుంచి జూన్ 9 వరకు ఇళ్ల గణన చేపడతారు. రెండోవిడత వచ్చే ఏడాది ఫిబ్రవరిలో డిజిటల్ విధానంలో జనాభా లెక్కిస్తారు. ఇందుకోసం 1,054 మంది ఎన్యూమరేటర్లు, 178 మంది సూపర్వైజర్లు, ఛార్జ్ అధికారులకు నాలుగు విడతల్లో శిక్షణనిచ్చారు. ఈ ఏడాది స్వీయగణనకు అవకాశం ఇవ్వగా.. జిల్లావ్యాప్తంగా 11,244 మంది గృహ యజమానులు తమ వివరాలను వెబ్సైట్లో నమోదు చేసుకోగా, ఆశించిన స్థాయిలో స్పందన రాలేదని చెప్పవచ్చు. ● జిల్లాలోని 13 మండలాల్లో ఉన్న 250 గ్రామపంచాయతీలు, నాలుగు పురపాలికల్లోని 1,09,902 ఇళ్లకు గణకులు వెళ్లి వివరాల సేకరణలో నిమగ్నమయ్యారు. 2027 నాటికి 1,26,052 గృహాలు ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తూ ఆ దిశగా గణన చేపట్టారు. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో 5,62,148 మంది ఉండగా.. 2027లో 6,64,350 మంది ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. గడప గడపకు నంబర్ల కేటాయింపు.. తొలిసారిగా మొబైల్ యాప్‌లో జనగణన వివరాలు నమోదు చేస్తున్నారు. ఒక్కో ఎన్యూమరేటర్‌కు సుమారు 200 ఇళ్లు కేటాయించారు. మొదటి మూడురోజులు వీరు ఇళ్లను మ్యాపింగ్ చేయడంతో పాటు నంబర్లను కేటాయించే పనిలో నిమగ్నమయ్యారు. ఇంటి గోడ లేదా తలుపునకు సీఎన్, ఇంటి నంబరు, బ్లాక్ సంఖ్య రాస్తున్నారు. దీంతో ఎన్ని ఇళ్లు ఉన్నాయనేది తెలుస్తుంది. ఇంటి నిర్మాణ స్వభావం, కుటుంబ సభ్యులు, తాగునీరు, విద్యుత్, శౌచాలయాలు తదితర 33 రకాల వివరాలను హెచ్ఎల్ఓ యాప్‌లో నమోదు చేస్తారు. ఆయా వీధుల్లో ఉన్న ఆలయాలు, మసీదులు, చర్చిలు, రహదారులు, ప్రధాన స్థలాలనూ పొందుపరుస్తారు. స్వీయగణనకు ఈ నెల 10 వరకు ప్రభుత్వం అవకాశం కల్పించగా.. జిల్లాలో కేవలం 11,244 మంది మాత్రమే తమ వివరాలు నమోదు చేసుకున్నారు. జిల్లా అధికారులు స్వీయగణనపై నెలరోజుల పాటు ప్రజలకు అవగాహన కల్పించినా.. ఆశించిన స్పందన రాకపోవడం కొసమెరుపు. రెండు దశల్లో.. జనగణన ప్రక్రియను రెండు ప్రధాన దశలుగా విభజించారు. మొదటి దశలో ప్రతి భవనం, ఇంటిని గుర్తిస్తారు. ఆస్పత్రులు, పాఠశాలలు, దేవాలయాలు, అద్దె ఇళ్లు, చివరకు గుడిసెలను వదలకుండా లెక్కిస్తారు. ఎన్యూమరేటర్లు జూన్ 9 వరకు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రతి భవనానికి మార్కింగ్ చేస్తారు. 2027, ఫిబ్రవరిలో రెండోదశ ప్రారంభమవుతుంది. ఈ దశలో ప్రతి వ్యక్తికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరించనున్నారు. ప్రతి కుటుంబం ఈ ప్రక్రియలో భాగస్వాములు కావాలని, డిజిటల్ డేటా సేకరణ ద్వారా భవిష్యత్‌లో సంక్షేమ పథకాల అమలు మరింత పారదర్శకంగా మారుతుందని అధికారులు చెబుతున్నారు. మండలం జీపీలు/ గృహాలు హెచ్‌ఎల్‌బీలు 2011 2025–26 వార్డులు జనాభా జనాభా అంచనా.. మక్తల్ 39 9988 87 52,590 62,706 దామరగిద్ద 27 10,400 101 55,151 66,571 ఊట్కూర్ 27 10,452 94 54,533 64,412 నారాయణపేట 26 11,333 113 58,881 69,375 మాగనూర్ 20 4753 45 24,192 29,574 నర్వ 20 6221 54 31,536 33,536 మద్దూర్ 17 6275 70 31,482 38,168 కోస్గి 16 4142 41 19,559 22,648 కృష్ణా 14 4629 43 23,765 26,520 మరికల్ 14 7506 64 37,650 43,764 కొత్తపల్లి 11 3620 38 19176 23,249 గుండుమాల్ 10 3980 47 19932 23,080 ధన్వాడ 9 7417 79 37,770 47,775 నారాయణపేట 24 7,914 73 41,752 49,193 మక్తల్ 16 4276 43 19,438 22,595 కోస్గి 16 4366 37 21,215 24,565 మద్దూర్ 16 2630 25 13,526 16,399 జనగణనపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రచార రథాన్ని విస్తృతంగా గ్రామాలు, నగరాల్లో తిప్పుతున్నారు. ఈ రథాన్ని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక కలెక్టరేట్లో ప్రారంభించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జనగణన–2027ను పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించేలా అధికార యంత్రాంగం పనిచేస్తుంది. సర్వేలో మొదటి మూ డురోజులు సంబంధిత ప్రాంతం మ్యాప్, ప్ర ధాన ల్యాండ్‌మార్క్ (గుర్తు చిహ్నాలు), డిజిట ల్ ఎంట్రీ భవనాల గణన, గృహాలసంఖ్యను యాప్‌లో నమోదు చేస్తారు. ఎన్యూమరేటర్ల లాగిన్ నుంచి సూపర్వైజర్ లాగిన్‌కు వస్తా యి. తర్వాత జనగణన పోర్టల్‌కు వస్తాయి. వాటిని కలెక్టర్ లాగిన్ చేసుకొని జనగణన పూర్తి వివరాలను ప్రభుత్వానికి నివేదిస్తారు. – ఖఘువాహన్, సీపీఓ, నారాయణపేట ఇంటింటికి నంబర్ల కేటాయింపు జూన్ 9 వరకు వివరాల సేకరణ స్వీయగణనకు స్పందన అంతంతే.. జిల్లాలో నివాస గృహాలు 1,09,902.. హౌజ్ లిస్టింగ్ బ్లాక్‌లు 1,054 ఎన్యూమరేటర్లు 1,054.. సూపర్వైజర్లు 178 మంది -
ఆధునిక పద్ధతిలో సాగు చేపట్టాలి..
రైతులు ఆధునిక పద్ధతుల్లో పంటలు సాగు చేస్తే భూ ములు సారవంతంగా మా రడమే కాకుండా అధిక దిగుబడులు పొందవచ్చు. వానాకాలం పంటల సాగు లో మెళకువలు, పంట మార్పిడి, సాగు పద్ధతు లు తదితర అంశాలపై శాస్త్రవేత్తలు అవగాహన కల్పిస్తున్నారు. జిల్లాలో ప్రధాన పంటల సాగులో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడులు పొందడం తదితర అంశాల గురించి వివరిస్తున్నారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి. – జాన్ సుధాకర్, జిల్లా వ్యవసాయ అధికారి ● -
సీఎం చేతుల మీదుగా అవార్డు
పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం ఊట్కూర్: పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అ న్నారు. సోమవారం మండలంలోని పులిమామిడి లో ఆశాబీ, సత్తార్ నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశానికి ఆయన హాజరై దంపతులకు కొత్త దుస్తులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం పేదల సంక్షేమానికి అనేక పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తోందన్నారు. పేదల సొంతింటి కల సాకారం చేసేందుకు ఇందిరమ్మ ఇంటి పథకాన్ని అమలు చేస్తూ రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తుందని వివరించారు. అలాగే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రైతులు పండించిన సన్నరకం వరి ధాన్యానికి గిట్టుబాటు ధరతో పాటు క్వింటాకు రూ.500 బోనస్ చెల్లిస్తుందని వివరించారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు నిరంతరం కొనసాగుతుందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ త్రివేణి చెన్నప్ప, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు లక్ష్మారెడ్డి, నాయకులు సూరయ్యగౌడ్, యజ్ఞేశ్వర్‌రెడ్డి, నరేష్, గజలప్ప, బాలరాజు, శ్రీను పాల్గొన్నారు. -
నీటి సరఫరా మెరుగుపర్చాలి
ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ అర్జీలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ప్రియాంక అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని ప్రజావాణి మందిరంలో నిర్వహించిన కార్యక్రమానికి అదనపు కలెక్టర్‌తో కలిసి పాల్గొని జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులతో వినతులు స్వీకరించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయా అర్జీలను సంబంధిత అధికారులకు పంపించి పరిష్కరించాలని ఆదేశించారు. అర్జీలను పెండింగ్‌లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిశీలన చేస్తూ సత్వరమే పరిష్కరించాలని కోరారు. కాగా ప్రజావాణికి 41 ఫిర్యాదులు వచ్చాయి. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫణీంద్రారెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. నారాయణపేట: జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి, వైద్య కళాశాలలో నెలకొన్న తాగునీటి సమస్య పరిష్కారానికి మిషన్ భగీరథ నీటి సరఫరాను మరింత పెంచి ఇవ్వాలని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో వైద్య కళాశాల ప్రిన్సిపాల్, హెచ్ఓడీలతో వైద్య కళాశాల, జిల్లా ఆస్పతి నీటిసమస్యపై చర్చించారు. ప్రస్తుతం ఆస్పత్రికి అందుతున్న నీటి సరఫరాతో పాటు అదనంగా సరఫరా చేయాలని కలెక్టర్ మిషన్ భగీరథ గ్రిడ్ ఈఈ శ్రీనివాస్‌ను ఆదేశించారు. నాలుగైదు రోజుల్లో ఆస్పత్రికి అదనంగా నీటిని సరఫరా చేస్తామని ఈఈ తెలిపారు. వైద్య కళాశాల ప్రిన్సిపాల్ సంపత్‌కుమార్, జిల్లా ఆస్పత్రి హెచ్ఓడీ శ్రీనివాసులు పాల్గొన్నారు. ఎస్ఐఆర్ మ్యాపింగ్ ప్రక్రియ వేగవంతం.. జిల్లాలో ఎస్ఐఆర్ మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక వివరించారు. సోమ వారం తెలంగాణ చీఫ్ ఎలక్ట్రోరల్ అధికారి సుదర్శన్‌రెడ్డి హైదరాబాద్ నుంచి ఓటరు జాబితా స్పెష ల్ ఇంటెన్సివ్ రివిజన్‌పై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్‌న్స్‌కు కలెక్టరేట్ నుంచి ఆమె హాజరై జిల్లా వివరాలు వెల్లడించారు. నిజమైన ఓటరు ఓటు హక్కు కోల్పోకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. వివిధ రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించడం, బీఎల్వోల పనితీరు నిరంతరం పర్యవేక్షిస్తూ లక్ష్యాలకు అనుగుణంగా మ్యాపింగ్ పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. అవసరమైన డేటా ఎంట్రీ ఆపరేటర్లను నియమిస్తున్నామని, రాజకీయ పార్టీలతో సమన్వయం చేసుకుంటూ పారదర్శకంగా ప్రక్రియ చేపడుతున్నామని తెలిపారు. ప్రతి ఓటరు పేరు సక్రమంగా మ్యాపింగ్ అయ్యేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. వీసీలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫణీంద్రారెడ్డి, ఇన్చార్జ్ ఆర్డీఓ రాజేందర్‌గౌడ్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. రెడ్‌క్రాస్ సభ్యత్వాలు నమోదు చేయాలి.. జిల్లాలో రెడ్‌క్రాస్ సభ్యత్వాలు నమోదు చేయాలని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక ఆదేశించారు. సోమ వారం కలెక్టరేట్లోని ప్రజావాణి మందిరంలో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ సేవలను జిల్లా అధ్యక్షుడు సుదర్శన్‌రెడ్డి కలెక్టర్‌కు వివరించారు. అనంతరం మాట్లాడుతూ.. గవర్నర్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక అధికారి నాయకత్వంలో సేవలందిస్తున్నందున ప్రతి ఒక్కరూ సభ్యత్వం తీసుకొని సేవలందించాలన్నారు. జూనియర్ రెడ్‌క్రాస్, యూత్ రెడ్‌క్రాస్ విభాగాలు విద్యాసంస్థల్లో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తాయని.. సభ్యత్వం తీసుకొని ప్రజాసేవకు సిద్ధంగా ఉండాలని కోరారు. -
సాగుకు ప్రోత్సాహం
జిల్లాలో కొనసాగుతున్న రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు ● 9 మండలాలు.. 40 గ్రామాల్లో రైతు అవగాహన సదస్సులు ● వానాకాలం సాగుకు సూచనలు ● ఆధునిక వ్యవసాయం వైపు అడుగులు –8లో uమరికల్: ఆధునిక పద్ధతులను అనుసరిస్తూ వానాకాలం పంటల సాగుకు రైతులను సిద్ధం చేసేందుకు ప్రభుత్వం రైతు ముంగిట్లో వ్యవసాయ శాస్త్రవేత్తలు అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వానాకాలంలో సాగు చేసే పంటలపై రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించేందుకు ప్రొ. జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో శాస్త్రవేత్తలు రైతు ముంగిటకు వచ్చేందుకు ప్రణాళికలు రూపొందించారు. జిల్లా రైతులు ఎక్కువగా వరి, కంది, పెసర, ఆముదం, పత్తి, పచ్చజొన్న సాగు చేస్తారు. నేటికీ అనేకమంది రైతులు పాత పద్ధతులు ఆచరిస్తున్నారు. దీంతో పెట్టుబడి పెరగడంతో పాటు దిగుబడులు తగ్గడం, పొలాలు సారం కోల్పోయి చౌడు నేలలుగా తయారవడంతో రైతులు తీవ్ర నష్టాన్ని చవిచూస్తున్నారు. రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి సేంద్రియ వ్యవసాయం వైపు అడుగులు వేసేందుకు శాస్త్రవేత్తలు కొత్త ప్రణాళికలు రూపొందించారు. ఐదు బృందాలుగా శాస్త్రవేత్తలు.. రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించేందుకు వ్యవసాయ శాస్త్రవేత్త డా. టి.రాజేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో శాస్త్రవేత్తలు ఐదు బృందాలుగా ఏర్పడ్డారు. జిల్లాలోని కోస్గి, మాగనూరు, నారాయణపేట, మద్దూరు, కృష్ణా, మక్తల్, ధన్వాడ, మరికల్, ఊట్కూర్ మండలాల్లోని 40 గ్రామాల్లో గత నెల 27 నుంచి ఈ నెల 23 వరకు సాగు పద్ధతులపై రైతులకు శాస్త్రవేత్తలు అవగాహన కల్పిస్తున్నారు. ఈ ప్రాంత రైతులు వర్షాకాలం సాగులో ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకొని మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా ఏ పంటలు సాగుచేయాలి, మేలైన రకాలు, విత్తనాల లభ్యత, ఎరువుల వినియోగం, యూరియా ఎక్కువగా వాడితే తలెత్తే సమస్యలు, సంక్రమించే తెగుళ్లు తదితర అంశాలపై శాస్త్రవేత్తలు పొలాల దగ్గరకు వచ్చి సూచనలు చేస్తున్నారు. రైతుల సంఖ్య 1.92 లక్షలు సాగు విస్తీర్ణం 4.34 లక్షల ఎకరాలు వరి 1.90 లక్షల ఎకరాలు పతి 1.80 లక్షల ఎకరాలు కంది 60 వేల ఎకరాలు ఆముదం రెండు వేలు పెసర వెయ్యి ఎకరాలు పచ్చజొన్న వెయ్యి ఎకరాలు -
‘బండి సంజయ్‌ను మంత్రివర్గం నుంచి తొలగించాలి’
నారాయణపేట: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు ఘటన తమను తీవ్రంగా కలిచివేసిందని.. అధికారం న్యాయానికి అడ్డుకాకూడదని వెంటనే భగీరథ్‌ను అరెస్టు చేయడంతో పాటు కేంద్ర మంత్రివర్గం నుంచి బండి సంజయ్‌ను బర్తరఫ్ చేయాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం జిల్లాకేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన సాయి భగీరథ్‌ను అరెస్టు చేయడంలో రాష్ట్ర పోలీసు యంత్రాంగం ఎందుకు వెనకడగు వేస్తోందని ప్రశ్నించారు. అసలు నిందితుడు దేశంలో ఉన్నాడా లేక దాటించాలనుకుంటారా అనే సందేహాలు నెలకొంటున్నాయన్నారు. 8వ తేదీన ఫిర్యాదు చేస్తే ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని, ప్రధాని హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో 3 రోజుల తర్వాత పోక్సో కేసు నమోదు చేయడంపై పలు అనూమానాలకు తావిస్తోందని తెలిపారు. బండి సంజయ్ నైతిక బాధ్యత వహిస్తూ స్వయంగా తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి పరిధిలోనే హోంశాఖ ఉందని.. పారదర్శకంగా, నిష్పక్షపాతంగా డీఐజీతో విచారణ జరిపించి బాధిత బాలికకు, ఆ కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. చట్టానికి ఎవరూ అతీతులు కారని నిరూపించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో కొత్తపార్టీ పెట్టిన ఓ మహిళ అధినేత రాష్ట్రంలో ప్రజలందరికి తాను అమ్మాలాంటి దానినని బహిరంగా సభలో చెప్పిందని.. మరి ఈరోజు ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. బాధిత కుటుంబానికి న్యాయం జరగకపోతే మహిళలతో కలిసి ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు విజయ్‌సాగర్, సుదర్శన్‌రెడ్డి, బుల్లెట్ రాజు, కౌన్సిలర్ భరత్ పాల్గొన్నారు.రాష్ట్రస్థాయి కిక్ బాక్సింగ్‌లో జిల్లా విద్యార్థుల ప్రతిభనారాయణపేట ఎడ్యుకేషన్: రంగారెడ్డి జిల్లా కాటేదాన్‌లోని ఇండోర్ స్టేడియంలో ఈ నెల 9, 10న జరిగిన తెలంగాణ రాష్ట్రస్థాయి కిక్‌బాక్సింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో జిల్లా విద్యార్థులు చక్కటి ప్రతిభ కనబర్చి పతకాలు సాధించినట్లు కిక్ బాక్సింగ్ అసోసియేషన్ జిల్లా ప్రధానకార్యదర్శి పోలేపల్లి నవీన్‌కుమార్ తెలిపారు. 42 పాయింట్ ఫైట్ క్యాడెట్ విభాగంలో నర్వ మండలానికి చెందిన ఆర్య విశ్వకరణ్ కాంస్యం, 67 కిక్ సీనియర్ పురుషుల విభాగంలో నారాయణపేటకు చెందిన కగడ సోనల్ రజతం, అదేవిధంగా 67 కిక్ సీనియర్ విభాగంలో దామరగిద్ద మండలానికి చెందిన సాయిరాం రాథోడ్ కాంస్య పతకం సాధించినట్లు వివరించారు. -
సూచనలు ఇస్తాను..
నవాబ్‌పేట పీహెచ్సీలో రెండేళ్లుగా నర్సుగా పని చేస్తున్నాను. పీహెచ్‌సీకి వచ్చే వారిలో చాలామంది వైద్యంపై ఎలాంటి అవగాహన లేకుండా వస్తుంటారు. అలాంటి వారికి సమస్య తెలుసుకుని చికిత్స అందిస్తుంటాను. మారుమూల పల్లెల నుంచి రాత్రివేళలో పలు రకాల సమస్యలతో వస్తుంటారు. వారందరికి కావాల్సిన ప్రాథమిక చికిత్స అందిస్తుంటాను. ఇక ఈ పీహెచ్సీలో కాన్పులు అధికంగా అవుతుంటాయి. గర్భిణులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. ప్రసవం తర్వాత ఎలాంటి ఆహారం తీసుకువాలనే విషయంపై సూచనలు ఇస్తాను. – పుష్పలత, నర్సు, నవాబ్‌పేట -
నేడు ప్రపంచ నర్సుల దినోత్సవం
● ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రులు, పీహెచ్‌సీల్లో కీలక విధుల నిర్వహణ ● నిస్వార్థ సేవలతో ఎంతోమంది ప్రాణాలు రక్షిస్తున్న వైనం ఒక తల్లి బిడ్డకు జన్మనిస్తే.. నర్సు తనదైన సేవ చేసి పునర్జన్మ ప్రసాదిస్తోంది. ఒంట్లో ఏమాత్రం అనారోగ్యం అనిపించినా డాక్టర్ అని పరుగులు పెడతామే కానీ.. అక్కడ మనకు నిజమైన సేవలందించేది నర్సులే. ఆస్పత్రిలో అడ్మిట్ అయిన రోగి త్వరగా కోలుకోవడంలో నర్సుల పాత్ర చాలా కీలకం. 24 గంటల పాటు రోగులకు అందుబాటులో ఉంటూ సమయానికి ఇంజెక్షన్లు, ట్యాబ్లెట్స్ అందించడమే కాకుండా అవసరమైన చికిత్సతో పాటు పరీక్షలు చేస్తూ ప్రాణాలు రక్షిస్తారు. తాము సేవ చేసే వ్యక్తి ఎవరో.. వారి వ్యక్తిత్వమేమిటో.. పేదవాడా.. డబ్బున్నవాడా.. అని పట్టించుకోకుండా సేవలందించే ఆత్మబంధువులు. ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు పీహెచ్‌సీల్లో విధులు నిర్వహిస్తూ.. ఎంతో మందికి ప్రసవాలు చేస్తూ, వేల సంఖ్యలో రోగులకు పలు రకాల చికిత్సలు అందిస్తూ నిస్వార్థ సేవ చేస్తున్నారు. మంగళవారం ప్రపంచ నర్సుల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.. – పాలమూరు నాగర్‌కర్నూల్ జనరల్ ఆస్పత్రిలో గ్రేడ్, హెడ్ నర్సులతో పాటు జీఎన్ఎంలు 327 మంది, అచ్చంపేట, కొల్లాపూర్ ఏరియా ఆస్పత్రుల్లో 42 మంది, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో 76 మంది, పీహెచ్‌సీల్లో 32 మంది, ప్రైవేట్ ఆస్పత్రుల్లో 400 మంది నర్సులు ఉన్నారు. ఇక ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో 160 మంది, రెండు ప్రైవేట్ కళాశాలల్లో 300 మంది విద్యార్థులు నర్సింగ్ అభ్యసిస్తున్నారు. పాలమూరు ప్రభుత్వ నర్సింగ్ కళాశాల జనరల్ ఆస్పత్రిలోని ఎంసీహెచ్ బ్లాక్‌లో కొనసాగుతుంది. ఈ కళాశాలలో ఫస్టియర్ నుంచి ఫోర్త్ ఇయర్ వరకు తగరతులు ఉండగా మొత్తం 231 మంది విద్యార్థులు నర్సింగ్ అభ్యసిస్తున్నారు. ఫస్టియర్‌లో 59, సెకండియర్‌లో 58, థర్డ్ ఇయర్లో 57, ఫోర్త్ ఇయర్లో 57 మంది ఉన్నారు. నర్సింగ్ కళాశాలకు సొంత భవనం లేకపోవడంతో తరగతుల నిర్వహణ, వసతి గృహానికి సమస్యగా మారింది. ఇటీవల మెడికల్ కళాశాల సమీపంలో ఐదు ఎకరాల్లో శాశ్వత కళాశాల భవనం, హాస్టళ్లు నిర్మించాలని భూమి చదును చేశారు. దాదాపు రూ.40 కోట్లతో కళాశాల భవనం రెండు అంతస్తులు, హాస్టళ్లు రెండు అంతస్తులు, క్రీడా స్థలాలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు రూపొందించారు. అలాగే నారాయణపేట జిల్లాలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో 120 మంది విద్యార్థులు నర్సింగ్ అభ్యసిస్తున్నారు.గద్వాల జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో 11 మంది స్టాఫ్ నర్సులు, 72 మంది జీఎన్ఎమ్లు, అలంపూర్ ఏరియా ఆస్పత్రిలో 27 మంది నర్సులు, ఇతర ఆస్పత్రుల్లో 156 మంది నర్సులు ఉన్నారు. గద్వాల నర్సింగ్ కళాశాలలో 320 మంది విద్యార్థులు నర్సింగ్ అభ్యసిస్తున్నారు. వనపర్తి జిల్లా ఆస్పత్రితో పాటు పీహెచ్‌సీలు, ఇతర ఆస్పత్రుల్లో మొత్తం 326 మంది నర్సింగ్ ఆఫీసర్లు, స్టాఫ్ నర్సులు, ఎన్‌హెచ్‌ఎంలు ఉన్నారు. జిల్లాకేంద్రంలో 214 మంది విద్యార్థులు నర్సింగ్ కోర్సు చేస్తున్నారు. -
ఎత్తిపోతల పనుల్లో వేగం పెంచాలి
● రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి మక్తల్: మక్తల్–నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకం పనుల్లో వేగం పెంచాలని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఆదేశించారు. ఆదివారం మండలంలోని కాట్రేవ్‌పల్లి, మంతన్‌గోడ్ శివారులో కొనసాగుతున్న ఎత్తిపోతల కాల్వ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. అనంతరం సంబంధిత అధికారులతో మాట్లాడుతూ.. పనుల్లో పురోగతి కనిపించాలని, ప్రతి వారం పరిశీలిస్తానని, సమన్వయంతో పని చేయాలని కోరారు. కొడంగల్‌లో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పనులు దగ్గరుండి చేయించాలని ఆదేశించారని చెప్పారు. త్వరలో కోల్పూరు దగ్గర మినీ జూరాల నిర్మాణానికి ప్రభుత్వం కృషి చేస్తుందని.. రైతులు రెండు పంటలు సాగు చేసుకునేందుకు అవకాశాలు ఉంటాయని వివరించారు. ఆయన వెంట జెడ్పీటీసీ మాజీ సభ్యుడు లక్ష్మారెడ్డి, ఏఈఈ నాగశివ, వైస్ చైర్మన్ గణేష్‌కుమార్, గొల్లపల్లి సర్పంచ్ సూర్యకుమార్, రహీం పటేల్, మహేష్, శంషోద్దీన్, అమరేందర్‌రెడ్డి, వాకిటి హన్మంతు, గోవర్ధన్, రవికుమార్ ఉన్నారు. వంతెన పనులు వేగవంతం చేయాలి.. నర్వ: కల్వాల్–సీపూర్ మధ్యన వాగుపై వంతెన నిర్మాణ పనులు వేగవంతం చేయాలని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి డా. వాకిటి శ్రీహరి కోరారు. ఆదివారం మధ్యాహ్నం వంతెన నిర్మాణ పనులను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయా గ్రామాల ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని రూ.6.70 కోట్లతో వంతెన నిర్మాణం చేపడుతున్నామని.. పనులు వేగంగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్, అధికారులను ఆదేశించారు. వర్షాకాలం రాకముందే పూర్తిచేస్తే రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. రెండు గ్రామాల నాయకులు ముందుండి పనులు పూర్తి చేయించుకోవాలని సూచించారు. ఇది ప్రజా ప్రభుత్వమని.. ప్రజల కోసం నిరంతరం పని చేస్తుందని చెప్పారు. ఇళ్లు లేని అర్హులైన ప్రతి లబ్ధిదారుకు ఇందిరమ్మ ఇంటిని అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఆయన వెంట కాంగ్రెస్‌పార్టీ మండల అధ్యక్షులు బీసం చెన్నయ్యసాగర్, మక్తల్ అధ్యక్షులు గణేష్, లక్ష్మణ్, మండల నాయకులు కల్వాల్ జగదీశ్వర్‌రెడ్డి, కల్వాల్, సీపూర్ సర్పంచులు చెన్నయ్య, చంద్రశేఖర్, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, అశోక్‌గౌడ్, రామకృష్ణ తదితరులు ఉన్నారు. -
అభివృద్ధి వైపు.. పీయూ
యూనివర్సిటీలో రూ.113 కోట్లతో కొనసాగుతున్న పనులు యూనివర్సిటీలో మొత్తం 13 కోర్సుల్లో విద్యార్థులు చదువుతున్నారు. అయితే పూర్తిస్థాయిలో సీట్లు సరిపోకపోవడంతో విద్యార్థి అడ్రస్ నుంచి ఉన్న దూరం ఆధారంగా సీట్ల కేటాయింపులు చేస్తున్నారు. వీటికి తోడు లా, ఇంజినీరింగ్ కళాశాలలు కూడా కొత్తగా రావడంతో ఇక్కడ అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు ప్రస్తుతం ఉన్న పాత బాలబాలికల హాస్టళ్లలోనే వసతి కల్పిస్తున్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి రెండు కళాశాలలకు సంబంధించిన విద్యార్థుల సంఖ్య రెట్టింపు కానుండటంతో పీయూలో ఒకేసారి నాలుగు హాస్టళ్లు నిర్మిస్తున్నారు. రెండు హాస్టళ్లు యూనివర్సిటీ ద్వారానే నిర్మిస్తుండగా ఒక బాలిక, ఒక బాలుర హాస్టల్స్‌ను ఎస్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఉన్న హాస్టళ్లకు వీటితో సీట్లు రెట్టింపు కానున్నాయి. పీయూలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు ఇలా.. నిధులు (రూ.కోట్లలో..) -
ప్రకృతి ప్రకోపం.. రైతన్నకు శాపం
ప్రకృతి ప్రకోపం.. ప్రభుత్వ నిర్లక్ష్యం.. వెరసీ అన్నదాతలకు శాపంగా మారుతోంది. ఆరుగాలం శ్రమించి పండించిన పంటలను సకాలంలో కొనుగోలు చేయకపోవడంతో మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం.. అకస్మాత్తుగా కురిసిన అకాల వర్షానికి నీటిపాలైంది. నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని నెల్లికొండ మార్కెట్ యార్డులో విక్రయానికి తీసుకువచ్చిన మొక్కజొన్న ఆదివారం కురిసిన అకాల వర్షానికి తడిసిపోయింది. సాయంత్రం సమయంలో ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురవడంతో మార్కెట్ యార్డులో రైతులు ఆరబోసిన మొక్కజొన్న వర్షపు నీటిలో కొట్టుకుపోవడంతో రైతులు ధాన్యాన్ని కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడ్డారు. మార్కెట్ యార్డుకు తీసుకువచ్చిన మొక్కజొన్న పంటను ప్రభుత్వం త్వరగా కొనుగోలు చేయకపోవడంతో ఈ దుస్థితి దాపురించిందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. – నాగర్‌కర్నూల్ క్రైం -
సెల్ఫోన్లను సద్వినియోగం చేసుకోవాలి
మహమ్మదాబాద్: ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించేందుకు అంగన్వాడీలకు స్మార్ట్ఫోన్లు తప్పకుండా అవసరమని పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి తెలిపారు. ఆదివారం మహమ్మదాబాద్ మండలం నంచర్లగేట్ వద్ద ఆడిటోరియంలో గండేడ్, మహమ్మదాబాద్ మండలాలకు చెందిన 20 మంది అంగన్వాడీలకు స్మార్ట్ఫోన్లను అందించారు. అనంతరం మాట్లాడుతూ అంగన్వాడీలు ఎలా వినియోగించాలో అధికారులు తెలియజేయాలన్నారు. మదర్స్‌డే సందర్భంగా కేక్ కట్‌చేసి మహిళలకు పంచిపెట్టారు. అమ్మ గొప్పతనం మాటల్లో చెప్పలేనిదని, అమ్మ నేర్పిన పాఠాలతోనే తండ్రి, గురువులు ఆదరిస్తారని తెలిపారు. కార్యక్రమంలో ఆయా మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కేఎం నారాయణ, జితేందర్‌రెడ్డి, సీడీపీఓ రాధిక, ఐసీడీఎస్ సూపర్వైజర్లు అలవేలు, మల్లమ్మ, పద్మ, సర్పంచ్‌లు పాల్గొన్నారు. -
ఎప్‌సెట్ కేంద్రం తనిఖీ
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: జేపీఎన్సీ కళాశాలలో జరుగుతున్న ఎప్‌సెట్ పరీక్ష కేంద్రాన్ని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి, పాలమూరు యూనివర్సిటీ వీసీ శ్రీనివాస్ ఆదివారం తనిఖీ చేశారు. పరీక్ష కేంద్రంలో విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాలు, పరీక్షల నిర్వహణపై పకడ్బందీ చర్యలపై అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు రెండు సెషన్స్‌లో పరీక్షలు నిర్వహిస్తుండగా మొత్తం 360 మంది విద్యార్థులకు 345 మంది హాజరయ్యారు. వారి వెంట కళాశాల పరీక్షల నిర్వహణ అధికారి కోటాల సందీప్ పాల్గొన్నారు. -
పండుగలు శాంతియుతంగా జరుపుకోవాలి
పాన్‌గల్: పండుగలు శాంతియుతంగా జరుపుకొంటూ అందరికీ ఆదర్శంగా నిలవాలని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కోరారు. ఆదివారం మండలంలోని మాందాపూర్‌లో వీరభద్రుడి ఉత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న అంతర్రాష్ట్ర బండలాగుడు పోటీలను వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు రోజువారి పనులతో పాటు కొంత సమయం దైవ భక్తికి కేటాయించాలన్నారు. చదువుతోనే సమాజంలో మంచి గుర్తింపు, గౌరవం లభిస్తుందని.. తమ పిల్లలను బాగా చదివించాలని సూచించారు. అంతకుముందు మంత్రి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. పోటీలకు ఆర్థిక తోడ్పాటునందించిన మంత్రిని ఆలయ కమిటీ సభ్యులు శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోవర్ధన్‌సాగర్, సర్పంచ్ సుగుణమ్మ, ఉప సర్పంచ్ శ్యాంసుందర్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌లు కృష్ణయ్యసాగర్, జయరాములుసాగర్, కమిటీ సభ్యులు కుపేందర్‌రెడ్డి, పరమేష్, మహేష్, నర్సింహరాజు, భగవంతు పాల్గొన్నారు. అర్హులందరికీ సంక్షేమ ఫలాలు.. ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో ఆర్భాటాలకు పోయి అప్పుల పాలు కావద్దని మంత్రి జూపల్లి లబ్ధిదారులకు సూచించారు. గ్రామంలో సర్పంచ్ సుగుణమ్మ ఇంటి గృహ ప్రవేశం చేసి మాట్లాడారు. ప్రభుత్వం అందించే రూ.5 లక్షలతో నిబంధనల మేరకు ఇంటిని నిర్మించుకోవాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందుతాయని చెప్పారు. రాష్ట్ర ఎకై ్సజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు -
కో–ఆప్షన్ ఎన్నిక ఎప్పుడో..?
● పట్టువీడని ఆశావహులు.. బీజేపీలో మల్లగుల్లాలు ● తుది నిర్ణయం ఎంపీ డీకే అరుణదే! ● కమలంలో ముసలానికి తెరపడేనా? నారాయణపేట: స్థానిక పురపాలికలో నేటికీ కో–ఆప్షన్ ఎన్నిక పూర్తి కాలేదు. పుర ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు 11 మంది విజయం సాధించి, మరో స్వతంత్ర అభ్యర్థిని పార్టీలో చేర్చుకొని ఎంపీ డీకే అరుణ ఎక్స్ఆఫీషియా ఓటుతో చైర్‌పర్సన్‌గా కొండ శ్వేతా, వైస్ చైర్‌పర్సన్‌గా జి.మంజుల ఎన్నికై న విషయం పాఠకులకు విధితమే. కో–ఆప్షన్ సభ్యుల ఎన్నిక నల్లెరుమీద నడకే అని అందరూ ఊహించినా.. పార్టీ నుంచి ఆరుగురు ఆశావహులు పోటాపోటీగా నామినేషన్లు వేశారు. నామినేషన్లు దాఖలు చేసి నెల గడుస్తున్నా.. ఇంతవరకు ఎన్నిక పూర్తి కాలేదు. పార్టీ బడానేతలు వ్యూహంతో నామినేషన్లు వేయించినా.. ఎన్నుకోవడంలో అంతర్గత కలహాలతో ఒక అడుగు ముందుకు.. మరో అడుగు వెనక్కి వేస్తుండటంతో పార్టీ శ్రేణులు ఒకింత నిరుత్సాహానికి గురవుతున్నాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఎన్నికయ్యేది ఎవరో..? 1వ వార్డు మాజీ కౌన్సిలర్ అనూషా, 14వ వార్డు మాజీ కౌన్సిలర్ సిద్ది విశాలాక్షి, 4వ వార్డు మాజీ కౌన్సిలర్ జయశ్రీ,, మాజీ కౌన్సిలర్ లక్ష్మి, రుక్సానా బేగం, సలావుద్దీన్ పోటీ పడుతున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో 1వ వార్డు, 4వ వార్డులో తాము సిట్టింగ్ స్థానాలను త్యాగం చేశామని.. అవకాశం ఇవ్వాలంటూ అనూషా, జయశ్రీ అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. ముస్లిం మైనార్టీ కోటాలో.. తన వార్డులోని సలావుద్ధీన్కు అవకాశం ఇవ్వాలంటూ ఓ వార్డు కౌన్సిలర్ పట్టుబడుతుండగా.. మరో మైనార్టీ నాయకుడు తన సతీమణికి ఇవ్వాలని కోరుతున్నారు. మైనార్టీ కోటాలోనూ పోటీ తప్పడం లేదని తెలుస్తోంది. పార్టీ కోసం పనిచేసిన వారికి ఇవ్వకుండా.. ఎన్నికల ముందు వచ్చిన వారికి ఇస్తే మేమేందుకు ఉన్నట్లు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. జిల్లాలో నాలుగు పురపాలికలుండగా.. మూడింట్లో చైర్పర్సన్, వైస్ చైర్మన్, కో–ఆప్షన్ ఎన్నిక సజావుగా సాగింది. కాని స్థానిక పురపాలికలో బీజేపీ గ్రూపు రాజకీయాలతో కో–ఆప్షన్ ఎన్నికలో మల్లగుల్లాలు పడుతున్నారు. ఆశావహులు ఆరుగురిలో నలుగురిని ఎంపిక చేసేందుకు పార్టీ రాష్ట్ర, జిల్లా నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. తుది ‘ఆప్షన్’ ఎంపీదే..! పేట పుర చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నిక తర్వాత పాలకవర్గంపై ఎంపీ డీకే అరుణ కాస్త అసంతృప్తిగానే ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ రాష్ట్ర నేతలు పుర పాలకవర్గ ఎన్నికలో చూపిన చొరవ కో–ఆప్షన్ ఎన్నికపై చూపకుండా ఎంపీదే తుది నిర్ణయమని చెప్పడంలో ఆంతర్యామేమిటని శ్రేణులు బహిరంగంగానే ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. నాలుగోవార్డు మాజీ కౌన్సిలర్ జయశ్రీకి అవకాశం ఇవ్వాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు సత్యయాదవ్ కోరినట్లు సమాచారం. మిగతా మూడు ఎవరికై నా ఇవ్వాలని విన్నవించినట్లు తెలుస్తోంది. ఎంపీకి సైతం ఇదే విషయాన్ని తెలియజేసేందుకు పార్టీ పెద్దలు నిర్ణయించినట్లు తెలుస్తోంది. పేట పురపాలికలో తెగని పంచాయితీ పుర ఎన్నికల నుంచి పార్టీలో ఆధిపత్య పోరు, అంతర్గత కలహాలు కొనసాగుతున్నాయని శ్రేణులు బహిరంగంగానే చర్చించుకుంటున్నాయి. కంచుకోటాగా ఉన్న పేటలో బీజేపీ శ్రేణుల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. బడా నేత చెప్పిందే వేదంగా ఇన్నాళ్లు కొనసాగింది.. కానీ ఇప్పుడు ఏమైందంటూ ఒకింత చర్చ కొనసాగుతోంది. ఆ బడా నేత నిర్ణయాన్ని ఎవరూ కాదనరు.. కో–ఆప్షన్ అభ్యర్థులను ఎంపిక చేయడంలో ఎందుకు నిర్ణయం తీసుకోవడం లేదని అంతర్మథనంలో కమలం శ్రేణులు పడ్డాయి. ఎంపీ డీకే అరుణ చొరవ తీసుకొని తెర దించాలని పార్టీ శ్రేణులు కోరుతున్నాయి. -
రాష్ట్రస్థాయిలో సత్తా చాటిన క్రీడాకారులు
ఽనారాయణపేట ఎడ్యుకేషన్: హన్మకొండలో జరిగిన రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌లో జిల్లాకు చెందిన క్రీడాకారులు సత్తా చాటారు. అండర్–16 జావెలిన్ త్రో విభాగంలో సందీప్ బంగారు, అండర్–20 హైజంప్‌లో జనార్దన్ సిల్వర్, అదేవిధంగా జావెలిన్ త్రోలో రాధిక బంగారు పతకం సాధించారని జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధానకార్యదర్శి రమణ తెలిపారు. సత్తా చాటిన క్రీడాకారులను సన్మానించి ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఖేలో ఇండియా అథ్లెటిక్ కోచ్ హారికదేవి, కోచ్ జగదీ ష్, వెంకటేష్ శెట్టి తదితరులు పాల్గొన్నారు. పౌర్ణమికి రెండు పతకాలు.. మిడ్జిల్: హనుమకొండలో ఆదివారం ముగిసిన రాష్ట్రస్థాయి మూడో అథ్లెటిక్స్ పోటీల్లో మిడ్జిల్ మండలంలోని మల్లాపూర్ గ్రామానికి చెందిన పౌర్ణమి అద్భుత ప్రతిభ చాటి ఓ స్వర్ణపతకంతో పాటు ఓ కాంస్య పతకం సాధించింది. డిస్కస్‌త్రో ఈవెంట్లో 29.69 మీటర్లు విసిరి స్వర్ణం సొంతం చేసుకుంది. అలాగే షాట్‌పుట్ లో 8.49 మీటర్లు విసిరి మూడో స్థానంతో కాంస్య పతకం పొందింది. ఈ సందర్భంగా పౌర్ణ మికి గ్రామస్తులు అభినందనలు తెలిపారు. కొత్త కోర్సుల్లో చేరండి మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: మహబూబ్‌నగర్‌లోని ఎంవీఎస్ డిగ్రీ కళాశాలలో ఇటీవలి తీసుకువచ్చిన కొత్త కోర్సుల్లో విద్యార్థులు చేరాలని కళాశాల ప్రిన్సిపాల్ పద్మావతి పేర్కొన్నారు.కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. కళాశాలలో ఇటీవల బీకాంలో బీఎఫ్ఎస్ఐ, బీబీఏలో రీటైల్ ఆపరేషన్స్, పబ్లిక్ పాలసీ అండ్ గవర్నెన్స్, హెల్త్‌కేర్ మేనేజ్మెంట్ వంటి కోర్సులు ఉన్నాయన్నారు. వీటి ద్వారా విద్యార్థులకు త్వరితగతిన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని, డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఇంటర్న్‌షిప్ ఉంటుందని, వివిధ కంపెనీల్లో పని చేయడం ద్వారా అనుభవంతో పాటు వేతనం కూడా పొందవచ్చని వివరించారు. ఎంవీఎస్ కళాశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు అర్హత గల అధ్యాపకులు, పూర్తిస్థాయిలో వసతులు, ఎన్ఎసీసీ వంటి సదుపాయాలు ఉన్నాయన్నారు. వివిధ కోర్సులకు సంబంధించి దోస్తు అడ్మిషన్లలో మొదటి ఆప్షన్‌గా ఎంవీఎస్ కళాశాలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అధ్యాపకులు రవీందర్, సత్యనారాయణ, మంజూల, సూర్యనారాయణ, సుభాషిణి తదితరులు పాల్గొన్నారు. -
పేదలకో న్యాయం.. పెద్దలకు మరో న్యాయమా?
మాగనూర్: నిరుపేదలు సొంత ఇంటి నిర్మాణానికి ట్రాక్టర్లలో ఇసుక తరలిస్తే పట్టుకుని కేసులు నమోదు చేసే పోలీసులు, రెవెన్యూ అధికారులకు సెలవు దినాల్లో పెద్ద పెద్ద యంత్రాలతో వాగులను లూటీ చేస్తున్న పెద్దలు కనిపించడం లేదని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి మండిపడ్డారు. శనివారం మాగనూర్ సమీపంలోని పెద్దవాగులో ఓ కంపెనీ యంత్రాలతో ఇసుక తవ్వకాలు చేసేందుకు ప్రయత్నిస్తుండగా..ఆయన వాగు వద్ద కు చేరుకొని నిరసన వ్యక్తంచేశారు. అనంతరం ఆ యన విలేకర్లతో మాట్లాడుతూ.. ఈ విషయంపై సంబంధిత అధికారులతో ఫోన్లో సంప్రదించగా.. ఇసుక తరలింపునకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని చెప్పినట్లు తెలిపారు. అయితే సెలవు దినా ల్లో ఇసుకను అక్రమంగా తరలించేందుకు చేస్తున్న ప్రయత్నాలు అధికారులకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఇసుక తవ్వేందుకు వాగులోకి తీసుకొచ్చిన యంత్రాన్ని పోలీస్‌స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేయాలని.. లేనిచో మండల ప్రజలతో కలిసి ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ వెంకట్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు మారెప్ప, అవిడప్ప, అశోక్‌గౌడ్, గజపతి, బాబు, వెంకటేశ్, నవీన్ పాల్గొన్నారు. -
నేడు మాతృ దినోత్సవం
నిస్వార్థ ప్రేమకు రూపం అమ్మ నిస్వార్థ ప్రేమకు రూపం అమ్మ. పదాలు తెలియని పెదవులకు అమృత వ్యాఖ్యం అమ్మ. అమ్మ ప్రేమకు అవధులు.. అమ్మ త్యాగానికి హద్దులు లేవు. అమృతం ఆయుష్సు పోస్తుందో లేదో తెలియదు కానీ, అమ్మ మాత్రం తన ఆయుష్షును సైతం బిడ్డకే అందిస్తుంది. నిండు నూరేళ్లు ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటుంది. నవమాసాలు కడుపులో కదలాడే తన బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. ప్రసవ సమయంలో నరకం అనుభవిస్తూనే తన బిడ్డ క్షేమం కోసం పరితపిస్తుంది. తన పిల్లలే లోకంగా జీవించే ఆ తల్లి రుణం తీర్చుకోవడం కష్టమే. అమ్మ మన రేపటి భవిష్యత్ కోసం నిరంతరం శ్రమించే గొప్ప శ్రామికురాలు. ఈ తల్లుల దినోత్సవం జిల్లా ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుతూ అమ్మలకు మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. – ఖుష్బూ గుప్తా, కలెక్టర్, మహబూబ్‌నగర్ -
సోషల్ మీడియా యుగంలో.. అమ్మ పాత్ర పెద్ద టాస్క్
ప్రస్తుత సోషల్ మీడియా యుంగంలో ఉద్యోగిగా ఉండే ఒక తల్లి పాత్ర అత్యంత ముఖ్యమని.. రెండువైపులా సమన్వయం చేసుకుంటూ జీవితంలో రాణించాల్సి ఉంటుందని చెబుతున్నారు మహబూబ్‌నగర్ ఎస్పీ డి.జానకి. మాకు ఒక కూతురు పేరు సంవేద్య చదువు కోసం హైదరాబాద్‌లో ఉంటుంది. వృత్తిరీత్యా ఎస్పీ కావడం వల్ల 24 గంటల బిజీగా (మహబూబ్‌నగర్ నగరంలో) ఉంటాను. ఆడపిల్లలు ఉన్న తల్లి మరింత అప్రమత్తంగా ఉంటూ వారికి అందుబాటులో ఉండటం చాలా అవసరం. ఎస్పీగా ఎంత బిజీగా ఉన్నా ప్రతిరోజు ఫోన్ మాట్లాడటానికి కొంత సమయం కేటాయిస్తాను. తన ఆరోగ్యంతోపాటు పాఠశాల విషయాలు, వ్యక్తిగత అంశాలు అన్నింటిని తెలుసుకుంటాను. సెలవులు వస్తే ఆమె ఇక్కడికి రావడం, లేదా వారంలో ఒకరోజు నేను అక్కడికి వెళ్లడం చేస్తాను. ఉద్యోగరీత్యా ప్రస్తుతం పాపకు కొంత దూరంగా ఉండాల్సి వస్తోంది. నేను నాన్ వెజ్ వంటలు చేయను.. కానీ, మా పాపకు చికెన్ ఫ్రై అంటే చాలా ఇష్టం.. తనకు ఇష్టమైన చికెన్ ఫ్రై ఎంతో ఇష్టంగా చేసి పెడతాను. ఉద్యోగం వేరు.. తల్లి బాధ్యత వేరు.. ఈ రెండింటికి న్యాయం చేయాల్సిన బాధ్యత నాపై ఉంటుంది. పిల్లలు ఒక వయసుకు వచ్చే వరకు వారికి తల్లితోడు ఎంతో అవసరం. – డి.జానకి, ఎస్పీ, మహబూబ్‌నగర్ -
సనాతన ధర్మానికి దేవాలయాలే పునాదులు
ఊట్కూర్: సనాతన ధర్మానికి దేవాలయాలే పునాదులని వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆదిత్య పరాశ్రీ అన్నారు. శనివారం బిజ్వార్లో ఆంజనేయస్వామి విగ్రహ పునఃప్రతిష్ఠ, ద్వజస్తంభం ప్రతిష్ఠ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పురాతనమైన ఆలయాన్ని అభివృద్ధి పర్చడం సంతోషకరమన్నారు. పిల్లల్లో చిన్నప్పటి నుండే సంస్కృతిక సాంప్రదాయాల పట్ల అవగాహన కలిపించాల్సిన బాద్యత తల్లిదండ్రులపై ఉందని ఆయన అన్నారు. ఆలయాలకు వెళ్లడం వల్ల మానసిక ప్రశాంతత అలవడుతుందన్నారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ ఆంజనేయులు, బిజేపి రాష్ట్ర నాయకులు కొండయ్య, భక్తులు చాకలి వెంకటప్ప, కృష్ణయ్య, సుధాకర్‌రెడ్డి, హనిమిరెడ్డి, ఆంజనేయులుగౌడ్, భూపాల్‌రెడ్డి, రామలింగంగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
తల్లీ..వందనం
త్యాగానికి ప్రతి రూపమే..నిజమైన స్వరూపం ● విధి నిర్వహణతో పాటు తల్లిగా పిల్లల బాధ్యత ● పోలీస్, రెవెన్యూ, ఐటీ రంగాల్లో రాణిస్తూ.. ఆదర్శంగా నిలుస్తున్న తల్లులు ● నిత్యం డ్యూటీ చేస్తూనే కుటుంబానికి ప్రత్యేకంగా సమయం కేటాయింపు ● మున్సిపాలిటీల్లో తాగునీటి కొరతతో ప్రజల అవస్థలు ● రోజు విడిచి రోజు మిషన్ భగీరథ నీటి సరఫరా ● పట్టణ శివారు ప్రాంతాలు, విలీన గ్రామాల్లో పరిస్థితి మరీ దారుణం ● పట్టించుకోని పాలకులు.. కన్నెత్తి చూడని అధికారులు ‘ఢిల్లీకి రాజు అయినా.. ఒక తల్లికి కొడుకే..’ ఈ సూక్తినే స్మరించుకుంటున్నారు ఉమ్మడి పాలమూరులోని పలువురు ఉన్నతాధికారులు. ఐఏఎస్, ఐపీఎస్‌తో పాటు వివిధ రంగాల్లో ఉన్నత స్థాయిలో ఉన్నా.. దీని వెనక తమ తల్లుల పాత్ర ఎంతో ఉందని.. ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు. నిత్య స్ఫూర్తి ప్రదాత.. గొప్ప శ్రామికురాలు.. నిస్వార్థ ప్రేమ, త్యాగానికి ప్రతిరూపం అంటూ కీర్తిస్తున్నారు. విధి నిర్వహణలో బిజీగా ఉన్నా.. తల్లిగా అమ్మగా పిల్లల బాధ్యతను సమర్థవంతంగా పోషిస్తున్నారు. ఆదివారం ప్రపంచ మాతృ దినోత్సవం సందర్భంగా ఉమ్మడి జిల్లాలోని పలువురు ఉన్నత ఉద్యోగుల అభిప్రాయాలతో ప్రత్యేక కథనాలు... – సాక్షి, నాగర్‌కర్నూల్/ పాలమూరు/గద్వాల/ జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్) ఉదయం లేస్తే ఉరుకుల పరుగుల జీవితం.. క్షణం తీరిక లేని జీవన శైలి. నేటి సమాజంలో అమ్మపాత్ర కత్తి మీద సాములాంటింది. నిమిషం వృథా చేయకుండా సమయాన్ని సద్వినియోగం చేయాలి. లేదంటే పిల్లలకు తిప్పలు తప్పవు. ఆధునిక అమ్మల జీవన శైలిలో వేగం విపరీతంగా పెరిగింది. ఇంటి బాధ్యతంతా అమ్మదే. పిల్లల కోసం తాను చదువు నేర్చుకొని హోంవర్క్ చేయించడం, స్కూటీలు, కార్లు నేర్చుకొని నడపాల్సి వస్తోంది. బిజీ షెడ్యూల్లో కూడా రోజు హోంవర్క్ చేయించడం, సందేహాలు తీర్చడం ఆమె పనే. అమ్మ ఉదయం ఏ ఐదు గంటలకో నిద్ర లేచి ఇంటి పనులు చకచక పూర్తి చేసుకుని పిల్లలను నిద్రలేపుతోంది. తొమ్మిదింటికల్లా బడికి పంపి.. అమ్మ ఉద్యోగానికి పరుగులు తీయాలి. మళ్లీ ఇంటికొచ్చాక రాత్రి కాగానే పిల్లలు అడిగిన రుచులన్నీ వండి పెట్టడానికి విసుక్కోదు. ఒక సర్వే ప్రకారం ప్రతి తల్లి ఉదయం నుంచి రాత్రి వరకు 26 రకాల సవాళ్లు ఎదుర్కొంటుందని తేలింది. ఉదయం 6 గంటలకే దినచర్య మొదలు.. మేము భార్యభర్తలు ఇద్దరం ఉద్యోగులు కావడం వల్ల చాలా బిజీగా ఉంటాం. నా దినచర్య ప్రతి రోజు ఉదయం 6 గంటలకు మొదలవుతుందని చెబుతుంది జనరల్ ఆస్పత్రి ఆర్ఎంఓ డాక్టర్ శిరీష. ప్రతి రోజు ఉదయం 6 గంటలకు నిద్రలేచిన తర్వాత పిల్లలకు వంట చేసి 7.30 గంటలకు పిల్లలను నిద్రలేపుతా. వారిని పాఠశాలకు రెడీ చేసి పంపిస్తా. ఆ తర్వాత నేనుకూడా రెడీ అయి ఆస్పత్రికి వెళ్లాల్సి ఉంటుంది. పిల్లలు చిన్నవారు కావడం వల్ల ప్రస్తుతం కొంత ఇబ్బందిగా ఉంటుంది. ఒకవైపు పిల్లల మంచి చెడులు.. మరోవైపు ఉద్యోగం, కెరీర్ చూసుకోవడం పెద్ద టాస్క్‌గా మారింది. అయినా అన్నింటిని బ్యాలెన్స్‌గా చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. – డాక్టర్ శిరీష, ఆర్ఎంఓ జనరల్ ఆస్పత్రి పిల్లలతో ఆర్ఎంఓ డాక్టర్ శిరీష పిల్లలతో ఫ్రెండ్లీగా ఉంటాను.. పోలీస్ విధి నిర్వహణలో బాధ్యతలు నిర్వర్తిస్తూనే పిల్లలతో ప్రత్యేకంగా సమయం కేటాయిస్తాను. ఒకవైపు విధులు, మరోవైపు కుటుంబ బాధ్యతలు నిర్వర్తించేందుకు సమయాన్ని బ్యాలెన్స్ చేసుకుంటాను. సమాజంలో ప్రస్తుత పరిస్థితులను వారికి అర్థమయ్యేలా చెబుతూ వారితో ఫ్రెండ్లీగా ఉంటాను. డ్యూటీలో బిజీగా ఉంటున్నా పిల్లలు అర్థంచేసుకుని సర్దుకుంటున్నారు. తల్లులందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు – విజయలక్ష్మి, ఏఎస్ఐ, షీ టీం ఇన్చార్జి, నాగర్‌కర్నూల్ ఒక వైపు ఉద్యోగం.. మరోవైపు తల్లి పాత్ర ఎకై ్సజ్ శాఖలో ఉద్యోగం అంటేనే హడావుడి. బిజీబిజీగా ఉండాల్సి ఉంటుంది. ఇక ప్రత్యేక రైడ్ చేయాలంటే అర్ధరాత్రి ఇంట్లో నుంచి వెళ్లాల్సి వస్తుందని.. అలాంటి సమయంలో పిల్లల రక్షణ చూసుకుంటునే మరోవైపు విధులు నిర్వహించాల్సి వస్తుంటుందని మహబూబ్‌నగర్ టౌన్ ఎకై ్సజ్ ఎస్ఐ సుష్మ చెప్పుకొచ్చారు. తనకు నాలుగేళ్ల కొడుకు అకీరానందన్, ఏడేళ్ల కొడుకు రోహన్ష్ ఉన్నారని ఒకవైపు వీరి బాధ్యత చూస్తూ మరో వైపు ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. ‘ నావిధుల్లో భాగంగా ఒక్కసారి నేను బయటకు వెళ్తే మళ్లీ ఎప్పుడూ వస్తానో తెలియదు. దీంతో వారికి 24 గంటలకు కావాల్సిన ఆహారం ముందే రెడీ చేసి పెట్టాల్సి వస్తోంది. సాయంత్రం చేయాల్సిన పనులు కూడా ఉదయం చేసి వెళ్తాను. వారి యోగక్షేమాలను నిత్యం వీడియోకాల్ ద్వారా పర్యవేక్షణ చేస్తుంటాను. భర్త సాఫ్ట్వేర్ కావడంతో ఆయన కూడా వృత్తిరీత్య చాలా బిజీ ఉంటారు. దీంతో పిల్లల బాధ్యత, సంరక్షణ చూసుకోవడంలో ఒక తల్లిగా రెండు పాత్రలు పోషించాలి. దీనికి అనుగుణంగా ఒక ప్లానింగ్ ప్రకారం రోజువారీ కార్యక్రమాలు రెడీ చేసుకుంటాను. సెలవుల్లో పిల్లలకు ప్రత్యేక సమయం ఇచ్చి వారితో గడుపుతా.’ అని సుష్మ పేర్కొన్నారు. కన్నీటి కష్టాలు! నారాయణపేట: వేసవి వచ్చిందంటే చాలు.. జిల్లా ప్రజలు తాగునీటి కష్టాలతో సతమతం కావాల్సిందే. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో మిషన్ భగీరథ నీటిని అందిస్తున్నామని అధికారులు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం రోజు విడిచి రోజు నీరందుతోంది. అది కూడా అరగంట నుంచి ముప్పావుగంట మాత్రమే సరఫరా చేస్తుండటంతో జనానికి ఏమాత్రం సరిపోవడం లేదు. తాగునీటి కష్టాలతో జిల్లా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లా కేంద్రంలో తప్పని తంటాలు.. దినదినాభివృద్ధి చెందుతున్న పట్టణాల్లో జిల్లాకేంద్రమైన నారాయణపేట ఒకటి. పట్టణం శరవేగంగా విస్తరిస్తున్నప్పటికీ ఇక్కడి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడటం లేదు. ముఖ్యంగా వేసవి వచ్చిందంటే చాలు తీవ్ర తాగునీటి ఎద్దడి ఏర్పడుతుంది. ఈ ఏడాది నీటి సమస్యను అధిగమించేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపడుతున్నా.. ప్రజలు ఫిల్టర్ వాటర్‌పైనే ఆధారపడాల్సి వస్తోంది. మిషన్ భగీరథ పైపులైన్ నిర్మాణానికి అమృత్ 2.0 వస్తుందంటూ అధికారులు సమాధానం ఇస్తూ దాటవేస్తున్నారు. ప్రధానంగా జిల్లా కేంద్రంలోని బీసీ కాలనీ, ప్రతిభ కాలనీ, పళ్ల ఏరి యా, జంగిడిగడ్డ, గాయత్రి నగర్, శాసన్‌పల్లి రో డ్డు, మడి ఏరియాలతో పాటు పట్టణ శివారులోని కొత్త కాలనీలో సైతం మిషన్ భగీరథ నీటి సరఫరా అంతంతమాత్రమేనని జనం వాపోతున్నారు. విలీన గ్రామాల్లోనూ.. కోస్గి, మక్తల్, మద్దూర్ మున్సిపాలిటీల్లోని వీలిన గ్రామాల్లో తాగునీటి సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వేసవి కారణంగా బోరుబావుల్లో భూగర్భజలాలు అడుగంటిపోయాయి. పేరుకు మాత్రమే మిషన్ భగీరథ నీరు వస్తుందని.. అది కూడా రోజు విడిచి రోజు ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి నెలకొందని జనం వాపోతున్నారు. మక్తల్, మద్దూర్, కోస్గి పట్టణాల్లో సైతం మిషన్ భగీరథ నీటి సరఫరా అంతంతమాత్రంగానే ఉంది. మక్తల్‌లో అరగంటే.. మక్తల్ మున్సిపాలిటీలో మిషన్ భగీరథ నీటిని రెండు, మూడు రోజులకు ఒకసారి సరఫరా చేస్తుండగా.. వచ్చేది కూడా అరగంట మాత్రమే. దీంతో తాగునీటి కష్టాలతో సతమతమవుతున్నామని జనం వాపోతున్నారు. పక్కనే కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతున్నా.. మిషన్ భగీరథ నీటి కోసం ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన చెందుతున్నారు. ●మా కాలనీలో మూ డు రోజులకు ఒక సారి మిషన్ భగీరథ నీ రు సరఫరా చేస్తున్నారు. అధికారులు స్పందించి సరఫరా సక్రమంగా చేయాలని కోరుతున్నాం. వేసవిలో నీటి ఎద్దడిని తీవ్రంగా ఎదుర్కోవాల్సి వస్తుంది. మంత్రి స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని వేడుకుంటున్నాం. – పార్వతమ్మ, మక్తల్ -
మా అమ్మ వల్లే ఈ స్థాయిలో..
మాది మధ్య తరగతి కుటుంబం. నా జీవితం ఎదుగుదలలో మా అమ్మ పాత్ర ఎంతో ఉంది. మా నాన్న సాయిబాబ, అమ్మ వెంటకసుబ్బమ్మ. మేము ముగ్గురం అన్నదమ్ములం. నేను రెండో సంతానం. మిగిలిన ఇద్దరిలో ఒకరు టీచర్ కాగా.. మరో సోదరుడు మున్సిపల్ ఆఫీసులో మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ముందు నుంచి మా అమ్మ మమ్మల్ని బాగా చదువుకోవాలని ప్రోత్సహించేవారు. బాగా చదువుకుని ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని చెబుతూ ఉండేది. ఈ క్రమంలోనే నేను గ్రూప్–1 సాధించాను. ఆ తర్వాత 2013లో ఐపీఎస్ కన్ఫర్మ్ అయ్యింది. ప్రస్తుతం నేను ఈ స్థాయిలో ఉన్నాను అంటే అది మా అమ్మ వల్లే. – టి.శ్రీనివాసరావు, ఎస్పీ, జోగుళాంబ గద్వాల -
కొల్పూర్ వద్ద బ్రిడ్జికమ్ బ్యారేజీ
మాగనూర్: మక్తల్ నియోజకవర్గ పరిధిలో మరో సాగునీటి ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి నేతృత్వంలో శరవేగంగా అడుగులు పడుతున్నాయి. మాగనూ ర్ మండలం కొల్పూర్, కర్ణాటక సరిహద్దులోని కొర్తికొండ వద్ద కృష్ణానదిపై రెండు రాష్ట్రాల సహకారంతో రూ. 750కోట్లతో బ్రిడ్జి కమ్ బ్యారేజీ నిర్మించేందుకు చర్యలు చేపట్టారు. ఈ మేరకు శనివారం కర్ణాటక రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి బోసురాజుతో రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కొల్పూర్ వద్ద కృష్ణానదిపై 8 మీటర్ల ఎత్తులో రూ. 750 కోట్లు వ్యయంతో కృష్ణానదిపై అతి త్వరలో బ్రిడ్జికమ్ బ్యారేజీ నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకు కర్ణాటక రూ.470 కోట్లు, తెలంగాణ రూ. 280కోట్లు వెచ్చించనున్నట్లు తెలిపారు. జూరాల ఎగువన కొల్పూర్ వద్ద ప్రాజెక్టు నిర్మించడంతో ఆ ప్రాంత రైతులకు రెండవ పంటకు సాగునీటి కష్టాలు దూరం కావడంతో పాటు మక్తల్ నియోజకవర్గవ్యాప్తంగా రెండు పంటలతో సస్యశ్యామలమయ్యేందుకు మార్గం సుగమవుతుందని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. అతి త్వరలో ప్రాజెక్టు పనులు ప్రారంభించి.. సాధ్యమైనంత త్వరగా పూర్తిచేస్తామని అన్నారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు. తెలంగాణ, కర్ణాటక సంయుక్తంగా నిర్మించాలని నిర్ణయం రూ. 750కోట్లు అవసరమని అంచనా కర్ణాటక మంత్రితో భేటీ అయిన రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి -
ధాన్యం సేకరణ ప్రక్రియ వేగవంతం
● ఫార్మర్ రిజిస్ట్రీపై ప్రత్యేక దృష్టిసారించాలి ● కలెక్టర్ సీహెచ్ ప్రియాంక నారాయణపేట: కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం సేకరణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ సీహెచ్ ప్రియాంక అన్నారు. శనివారం ధాన్యం కొనుగోలు, ఫార్మర్ రిజిస్ట్రీ, జనగణన, విద్యా వారోత్సవాల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు సంబంధిత ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం జిల్లా అధికారులతో కలెక్టర్ సమావేశమై మాట్లాడారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియ జిల్లాలో వందశాతం పూర్తయ్యేలా చూడాలన్నారు. సెల్ఫ్ ఎన్యూమరేషన్‌కు ఒక్కరోజే మిగిలి ఉందని.. ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగులు స్వీయ గణన చేసుకోవాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ నెల 11 నుంచి నిర్వహించే విద్యా వారోత్సవాలను విజయవంతం చేయాలన్నారు. సమావేశంలో జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి బాల్‌రాజ్, మేనేజర్ సైదులు, డీఏఓ జాన్ సుధాకర్, డీఈఓ గోవిందరాజులు, అధికారులు రాజేంద్ర ప్రసాద్, యాదయ్యశెట్టి ఉన్నారు. -
ఉపాధి.. లక్ష్యం చేరేనా?
జిల్లాకు 9.12 లక్షల పనిదినాల కేటాయింపు ● గతేడాది ఏప్రిల్ నుంచి నేటి వరకు 1.54 లక్షలు మాత్రమే పూర్తి ● ప్రతి పంచాయతీ నుంచి అదనంగా 150 మంది కూలీలు ● నెలాఖరుకు చేరుకునేలా అధికారుల చర్యలు 40 వేల వరకు పెంచడానికి.. యాసంగి వ్యవసాయ పనులు పూర్తి చేసుకున్న కూలీలు ఉపాధి పనులకు ఆసక్తి కనబరుస్తున్నారు. జిల్లాలో ప్రస్తుతం నిత్యం 20 వేల వరకు కూలీలు హాజరవుతుండగా.. ఆ సంఖ్యను 40 వేల వరకు పెంచడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఉపాధిహామీ పథకంలో ఏటా ఏప్రిల్ 1న కూలీల వేతనాలు పెరిగేవి. గతేడాది కూలీల దినసరి వేతనం రూ.300 నుంచి రూ.307కు పెంచారు. ఈసారి వీబీ జీ రాంజీ పథకం మార్గదర్శకాలు ఇంకా అమలులోకి రాలేదు. కూలీల దినసరి వేతనం గురించి కూడా కేంద్రం ఎక్కడా ప్రస్తావించ లేదు. కూలి పెరగకపోవడంతో కూలీలు నిరాశ చెందుతున్నారు. అయితే కొత్త పథకంలో ఒక్కో కుటుంబానికి ఏడాదికి 125 రోజుల పనిదినాలు కల్పిస్తామని చెప్పారు. పథకం మార్గదర్శకాలు వెలువడిన తర్వాత కూలీల వేతనాలు పెరిగే అవకాశం ఉంది. నర్వ: మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకాన్ని నెలాఖరు వరకు కొనసాగించేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన వీబీ జీ రాంబీ పథకం మార్గదర్శకాలు ఇంకా వెలువడలేదు. దీంతో పాత విధానాన్ని ఈ నెలలో కూడా కొనసాగించాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రస్తుతం కొనసాగుతున్న పనులనే వచ్చే నెల వరకు నిర్వహిస్తారు. కొత్త పథకం అమలులోకి వచ్చిన తర్వాత మార్గదర్శకాలు మారే అవకాశం ఉంది. కూలీల సంఖ్య పెంపునకు.. నెల రోజులు పనిదినాలు కేటాయించడంతో అందుకు తగినట్లుగా కూలీల సంఖ్యను కూడా పెంచుకోవడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాకు ఏప్రిల్‌లో కేటాయించిన పనిదినాల్లో ఇప్పటి వరకు 1.54 లక్షల పనిదినాలు పూర్తయ్యాయి. ఏప్రిల్, మే నెల మొత్తం కలుపుకొని 9.12 లక్షల పనిదినాలు లక్ష్యంగా ఇచ్చారు. ఈ లక్ష్యాన్ని అధిగమించాలంటే ప్రతి పంచాయతీ నుంచి అదనంగా 150 మంది కూలీలు పనులకు వచ్చేలా లక్ష్యం నిర్దేశించారు. దీంతో కూలీల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. -
పశుపోషణతో అదనపు ఆదాయం
నారాయణపేట: పశుపోషణతో సన్న, చిన్నకారు రైతులకు అదనపు ఆదాయంతో పాటు జీవనోపాధి లభిస్తుందని తెలంగాణ పశుసంవర్ధకశాఖ అదనపు సంచాలకుడు డా. బి.సుబ్బారాయుడు అన్నారు. జిల్లాకేంద్రంలోని పశువైద్యశాల, జిల్లా పశుసంవర్ధక అధికారి కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ఉచిత పశువైద్య శిబిరం ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రైతు, పశు సంరక్షణ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రైతులు దూడల సంరక్షణలో పాటించాల్సిన యాజమాన్య పద్ధతులు, పశుగ్రాస సాగుపై రైతులు దృష్టి సారించాలని, వేసవిలో ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. కౌన్సిలర్ కాకర్ల నారాయణమ్మ కుటుంబ పోషణకు పాడి పరిశ్రమను కొనసాగించడం ఆదర్శనీయమని గుర్తుచేస్తూ అభినందించారు. జిల్లా పశు వైద్యాధికారి డా. బి.ఈశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో చాలామంది గొర్రెల పెంపకం చేపడుతూ జీవనం సాగిస్తున్నారని, ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని పాడిపశువుల పెంపకంపై ఆసక్తి కనబర్చాలని సూచించారు. రైతుల సౌకర్యార్థం జిల్లాకేంద్రంలో పాల శీతలీకరణ కేంద్రం ఏర్పాటు చేస్తామని.. పాడి రైతులు, మహిళా సంఘాల సభ్యులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ ఆర్.శివారెడ్డి, పుర చైర్పర్సన్ కొండ శ్వేత, వైస్ చైర్పర్సన్ మంజుల, కౌన్సిలర్ సత్యమ్మ, బీకేఎస్ నాయకులు వెంకోబ, విశ్వనాథ్‌రెడ్డి, అనంతరెడ్డి, పశు వైద్యాధికారులు డా. బి.వెంకటేశ్వర్లు, డా. అనిరుధ్ ఆచార్య, డా. రాఘవేందర్‌గౌడ్, డా. రోహిత, డా. శ్రీనివాస్, సిబ్బంది గోపాలమిత్రులు పాల్గొన్నారు. -
జనగణన విజయవంతం చేయాలి
నారాయణపేట: జనగణనను విజయవంతం చేసేందుకు జిల్లా అధికార యంత్రాంగం కృషి చేయాలని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక ఆదేశించారు. జనగణన–2027కు సంబంధించి నిర్వహిస్తున్న స్వీయ గణన, ఇతర అంశాలపై శుక్రవారం హైదరాబాద్ నుంచి డైరెక్టర్ ఆఫ్ సెన్సెస్ భారతి హోళికేరి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెనన్స్ నిర్వహించి సమీక్షించారు. జిల్లా నుంచి కలెక్టర్ పాల్గొని వివరాలు వెల్లడించారు. జిల్లాలోని ఒక్కో గ్రామపంచాయతీ కార్యదర్శికి 100 మంది స్వీయ గణనలో పాల్గొనేలా లక్ష్యాన్ని నిర్దేశించినట్లు చెప్పారు. వీసీ అనంతరం కలెక్టర్ జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. చార్జ్ అధికారులు జనగణనకు సంబంధించి సూపర్వైజర్లు, ఎన్యూమరేటర్లతో శనివారం సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేయాలన్నారు. ఎన్యూమరేటర్లకు గణనకు అవసరమైన కిట్లు, గుర్తింపు కార్డులు అందజేయాలని సూచించారు. సెన్సెస్కు సంబంధించిన హ్యాండ్బుక్స్ను క్షుణ్ణంగా చదివి ఎలాంటి తప్పిదాలకు అవకాశం లేకుండా గణన చేపట్టాలన్నారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను, సీపీఓ ఖాఘావాహన్, ఏఓ శ్రీధర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ సీహెచ్ ప్రియాంక -
ర్యాష్ డ్రైవింగ్.. త్రిబుల్ రైడింగ్
ఉమ్మడి జిల్లా పరిధిలో.. ● మహబూబ్‌నగర్ ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జనవరి నుంచి ఇప్పటి వరకు 42 కేసులు నమోదు కాగా.. రూ.63 వేల జరిమానా విధించారు. ● గద్వాల జిల్లాలో కేసులు నమోదు కాలేదు. కానీ, మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడగా.. వారికి కౌన్సిలింగ్ ఇచ్చి తల్లిదండ్రులను మందలించారు. ఇప్పటి వరకు 60 మందికి పైగా మైనర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ● నారాయణపేట జిల్లాలో ఇప్పటి వరకు 102 కేసులు నమోదు కాగా.. రూ.51 వేల జరిమానా విధించారు. ● వనపర్తి జిల్లాలో మైనర్ డ్రైవింగ్‌కు సంబంధించి 3 కేసులు నమోదు కాగా.. రూ.1,500 జరిమానా విధించారు. ● నాగర్‌కర్నూల్ జిల్లాలో 48 కేసులు నమోదు కాగా.. రూ.60 వేల జరిమానా విధించారు. పోలీసులకు పట్టుబడితే.. ● పిల్లలు వాహనాలు నడుపుతూ రవాణా శాఖ, పోలీసులు తనిఖీలు చేసే సందర్భంలో పట్టుబడితే రూ.25 వేల వరకు జరిమానా విధించవచ్చు. ● మోటారు వాహన చట్టం, పోలీస్ శాఖ న్యాయ సంబంధిత సెక్షన్స్ కింద కేసు పెడితే వాహన యజమానికి కనీసం మూడు నెలల నుంచి పదేళ్ల వరకు జైలుశిక్ష పడుతుంది. ● బాలబాలికలు వాహనాలు నడిపిన సమయంలో ప్రమాదానికి గురైతే యజమానిపై కేసు నమోదు చేసి.. వాహనాన్ని సీజ్ చేస్తారు. ఇన్సూరెన్స్ కూడా వర్తించదు. కోర్టులో నేరం రుజువు అయితే కఠిన శిక్షలు పడే అవకాశం ఉంటుంది. ● మైనర్లు వాహనాలు నడిపిన సందర్భంలో సెక్షన్–181 ఆఫ్ ఎంవీఐ యాక్ట్‌తోపాటు రూ.1,500 జరిమానా విధిస్తారు. తనిఖీలు పెంచుతాం మైనర్ డ్రైవింగ్ కట్టడి కోసం ప్రత్యేక బృందాల ద్వారా తనిఖీలు పెంచుతాం. మైనర్లకు వాహనాలు ఇస్తే సదరు వాహన యజమానిపై సెక్షన్ 180 ప్రకారం కేసు నమోదవుతుంది. మైనర్లతో పాటు వారి తల్లిదండ్రులకు స్టేషన్‌కు పిలిపించి కౌన్సిలింగ్ ఇస్తున్నాం. తల్లిదండ్రులకు పిల్లలకు వాహనాలు ఇవ్వకుండా జాగ్రత్తగా ఉండాలి. బైపాస్‌లపై రాత్రివేళ రాష్ డ్రైవింగ్‌లపై కూడా దృష్టిపెడుతాం. – వెంకటేశ్వర్లు, డీఎస్పీ, మహబూబ్‌నగర్ మహబూబ్‌నగర్ క్రైం: ఉమ్మడి జిల్లాలో మైనర్లు, చిన్నారులకు ద్విచక్రవాహనాలు ఇచ్చే తల్లిదండ్రుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. మోటారు వాహన చట్టం ప్రకారం 18 ఏళ్లు నిండినవారు మాత్రమే వాహనాలు నడిపేందుకు అర్హులు. కానీ, ప్రస్తుతం పల్లెలు, పట్టణాలు, నగరాల్లో పదేళ్లు దాటిన వారికి సైతం తల్లిదండ్రులు వాహనాలు ఇస్తున్నారు. నియంత్రణ లేని పిల్లలు రోడ్లపై దూసుకుపోతూ ప్రమాదాలకు కారణమవుతూ కుటుంబ సభ్యులను క్షోభకు గురిచేస్తున్నారు. పోలీసుల తనిఖీల్లో పట్టుబడితే చట్ట ప్రకారం వారిపై కేసు నమోదు చేసి జరిమానా లేదా ఒకరోజు జువైనెల్ హోంకు తరలిస్తున్నారు. పిల్లలకు వాహనాలు ఇవ్వొద్దని పోలీసులు హెచ్చరిస్తునా తల్లిదండ్రుల్లో ఏమాత్రం మార్పు రావడం లేదు. వేసవి సెలవుల నేపథ్యంలో ప్రస్తుతం పాఠశాలలు, కళాశాలలకు వేసవి సెలవులు ఇచ్చిన క్రమంలో వారందరూ ఇళ్ల దగ్గర ఉంటారు. ఈ సమయంలో ఖాళీగా ఉన్న వారిలో చాలామంది చిన్నారులు ఇంట్లో ఉండే తల్లిదండ్రుల బైక్‌లు, స్కూటీలు తీసుకొని గల్లీలతోపాటు ప్రధాన రోడ్లపై త్రిబుల్ రైడింగ్, రాష్ డ్రైవింగ్‌లతో చక్కర్లు కొడుతున్నారు. ఈ క్రమంలో కొన్నిచోట్ల ప్రమాదాలు చోటుచేసుకోవడంతో గాయపడుతున్న ఘటనలు అనేకం. ఇక కొన్ని సందర్భాల్లో ప్రధాన రోడ్లపై మేజర్ రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రాణాలు సైతం కోల్పోతున్న ఘటనలు లేకపోలేదు. ఇలాంటి ప్రమాదాల కట్టడికి మొదటి అడుగు ఇంట్లో తల్లిదండ్రుల నుంచి పడాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత పోలీస్ శాఖ ప్రత్యేక డ్రైవ్‌లు ఏర్పాటు చేసి తల్లిదండ్రులతోపాటు పిల్లలకు కౌన్సిలింగ్ నిర్వహించాల్సిన అవసరం ఉంది. బైపాస్ రోడ్డుపై రేస్.. నగరంలో ఇటీవల నూతనంగా ఏర్పాటు చేసిన పాలకొండ బైపాస్‌పై రాత్రివేళలో టీనేజర్స్ రేసింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా చించోళి బైపాస్ రోడ్డుపై కూడా సాయంత్రం వేళ కొంతమంది యువకులు బైక్‌లతో అక్కడికి చేరుకుని పోటీలు పెట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇందులో ప్రధానంగా ఒక వర్గానికి చెందిన టీనేజర్స్ మరింత రెచ్చిపోయి బైక్‌లు రాష్‌గా.. వేగంగా నడుపుతూ గట్టిగా హారన్స్ కొడుతూ.. సైలెన్సర్ల నుంచి మంటలు వచ్చేలా నడుపుతున్నారు. కొందరు అయితే బైక్ స్టాండ్స్ రోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్తూ ఆనందిస్తున్నారు.ఉమ్మడి జిల్లాలో గణనీయంగా పెరిగిన మైనర్ల డ్రైవింగ్ వేసవి సెలవుల నేపథ్యంలో రోడ్లపై బైక్‌లపై టీనేజర్ల చక్కర్లు పాలమూరులో రెండు బైపాస్రోడ్లపై రేస్‌ల నిర్వహణ పూర్తిస్థాయిలో దృష్టిపెట్టని పోలీస్ శాఖ తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నా మార్పు రాని వైనం -
జనగణనపై అవగాహనకే వాకథాన్
నారాయణపేట: జనగణన–2027లో ప్రతి పౌరుడు స్వయంగా తమ కుటుంబ వివరాలు నమోదు చేసుకునేలా జిల్లా ప్రజలకు అవగాహన కల్పించేందుకు వాకథాన్ నిర్వహించినట్లు రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను తెలిపారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద జనగణన అవగాహన వాక్‌ను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజలు సెల్ఫ్ ఎన్యూమరేషన్‌ను 10వ తేదీ వరకు సెల్‌ఫోన్ లేదా వెబ్సైట్లో నమోదు చేసుకోవచ్చని సూచించారు. పూర్తయిన తర్వాత వచ్చిన యూనిక్ ఐడీని ఎన్యూమరేటర్లు ఇంటికి వచ్చినప్పుడు చూపిస్తే సరిపోతుందని చెప్పారు. ఎన్యూమరేటర్లు సేకరించిన వివరాలను ఆర్టీఐ చట్టం కింద కూడా ఎవరికీ ఇచ్చే అవకాశం ఉండదని.. వారు అడిగే ప్రశ్నలకు ప్రజలు సరైన సమాధానాలు చెప్పి సహకరించాలని, ప్రక్రియను విజయవంతం చేయాలని కోరారు. అవగాహన వాక్‌లో అధికారులు, సిబ్బంది, విద్యార్థులు, ప్రజలు ఉత్సాహంగా పాల్గొనడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో సీపీఓ ఖాగవాహన్, పుర చైర్పర్సన్ కొండా శ్వేతా, వైస్ చైర్పర్సన్ మంజుల, కౌన్సిలర్లు సత్య రఘుపాల్, కల్పన, సత్యమ్మ, గొల్ల రవి, డీవైఎస్ఓ వెంకటేష్ శెట్టి, పుర కమిషనర్ శంకర్, జిల్లా అధికారులు, తహసీల్దార్లు, సిబ్బంది, యువత, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. పేట డీఆర్డీఓగా ఎన్.వెంకట్రాములు నారాయణపేట: నారాయణపేట డీఆర్డీఓగా ఎన్.వెంకట్రాములును నియ మిస్తూ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి ఎం.దానకిషోర్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. కల్వకుర్తి ఎంపీడీఓగా విధులు నిర్వర్తిస్తున్న ఆయన పదోన్నతిపై జిల్లాకు రానున్నారు. ప్రస్తుతం డీఆర్డీఓగా విధులు నిర్వర్తిస్తున్న మొగులప్ప కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా జెడ్పీ సీఈఓగా బదిలీపై వెళ్లారు. క్రీడా పాఠశాలలకు విద్యార్థుల ఎంపిక నారాయణపేట: రాష్ట్రంలోని వివిధ క్రీడా పాఠశాలలకు జిల్లా నుంచి మంతన్‌గౌడ్ రంజిత్‌కుమార్, రత్నశ్రీ , బండి నిహారిక, ముష్టి కావేరి, సాయి మహన్విత ఎంపికై నట్లు జిల్లా యువజన క్రీడల అధికారి ఎస్.వెంకటేశ్ శెట్టి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికై న విద్యార్థులు ఈ నెల 13, 14 తేదీల్లో హకీంపేట స్పోర్ట్స్ స్కూల్లో నిర్వహించే ధ్రువపత్రాల పరిశీలనకు సకాలంలో హాజరుకావాలని పేర్కొన్నారు. పశువుల అక్రమ రవాణా నివారణకు పటిష్ట చర్యలు నారాయణపేట: పశువుల అక్రమ రవాణా నివారణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు డీఎస్పీ నల్లపు లింగయ్య తెలిపారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని పట్టణ పోలీస్‌స్టేషన్‌లో విశ్వహిందూ పరిషత్, భజరంగ్‌దళ్, గోరక్షకులు, వీజేవైఎం సభ్యులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు. బక్రీద్ సందర్భంగా ఎక్కడైనా గోవుల అక్రమ రవాణా జరిగితే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. నేరుగా వెళ్లి గోవులను తరలిస్తున్న వాహనాలను అడ్డుకోవడం, గొడవలకు దిగడం వంటి చర్యలకు పాల్పడవద్దని హెచ్చరించారు. ఎట్టి పరిస్థితుల్లో చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోకూడదని.. శాంతిభద్రతలకు భంగం వాటిల్లకుండా బాధ్యతగా వ్యవహరించాలన్నారు. పశువుల అక్రమ రవాణాలను అరికట్టేందుకు జిల్లా పరిధిలో 6 సరిహద్దు చెక్‌పోస్టులు, ఒక అంతర్ జిల్లా చెక్‌పోస్ట్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. శాంతియుత సమాజ నిర్మాణమే పోలీసుల ధ్యేయమని తెలిపారు. సమావేశంలో సీఐ శివశంకర్, టౌన్ ఎస్ఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ–2 గాయత్రి పాల్గొన్నారు. ఆలసందలు క్వింటా రూ.4,819 నారాయణపేట: స్థానిక వ్యవసాయ మార్కెట్‌యార్డులో శుక్రవారం ఆలసందలు క్వింటా సరాసరి రూ.4,819 ధర పలికింది. అదేవిధంగా వరి హంసరకం రూ.1,600, సోనారకం గరిష్టంగా రూ.2,326, కనిష్టంగా రూ.1,402 ధరలు లభించాయి. -
జిల్లాలో ఇలా..
గ్రామపంచాయతీలు 272 మండలాలు 13 హ్యాబిటేషన్లు 63 జాబ్‌కార్డులు 1,07831 కూలీల సంఖ్య 1,91,988 2026–27 పనిదినాల లక్ష్యం 9.12 లక్షలు (మే నెల వరకు) ఇప్పటి వరకు పూర్తయినవి 1,54,251 -
వేణుగోపాలస్వామి ఆలయ నిర్మాణానికి భూమిపూజ
కోస్గి రూరల్: పురకేంద్రంలోని వేణుగోపాలస్వామి ఆలయ పునః నిర్మాణానికి శుక్రవారం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి వికారాబాద్ జిల్లా కొడంగల్‌లో భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆలయాన్ని రూ.2 కోట్లతో సుందరంగా నిర్మించనున్నామన్నారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ.. నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు పార్టీలకతీతంగా కృషి చేయాలన్నారు. ఇప్పటికే నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకం భూ సేకరణ పూర్తయిందని, పనులు ఏడాదిన్నరలోగా పూర్తిచేసి ఈ ప్రాంత ప్రజలకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. లగచర్లలో 200 ఎకరాల్లో విద్యాహబ్, ఇండస్ట్రియల్ పార్క్, సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు పనులు వేగంగా కొనసాగుతున్నాయన్నారు. కృష్ణా–వికారాబాద్ రైల్వే లైన్ పనులకు 90 శాతం అనుమతులు లభించాయని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, పశుసంవర్దకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి, పరిగి ఎమ్మెల్యే రాంమోహన్‌రెడ్డి, తాండూర్ ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
భూసార పరీక్షలతో అధిక దిగుబడులు
నారాయణపేట రూరల్: రైతులు తప్పనిసరిగా భూసార పరీక్షలు చేయించుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి జాన్ సుధాకర్ సూచించారు. ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం మండలంలోని జాజాపూర్ రైతువేదికలో నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. భూసార పరీక్షల ఫలితాలు ఎరువుల వినియోగం, పంట దిగుబడి, నాణ్యత పెంపొందించుకునేందుకు ఉపకరిస్తాయని వివరించారు. సాగులో రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించాలని, సేంద్రియ పద్ధతిలో పంటలు పండించాలని సూచించారు. అనంతరం రైతులకు సాయిల్ హెల్త్ కార్డులను అందించి వాటి ప్రత్యేకతను వివరించారు. పోషకాల స్థితి తెలుసుకొని శాసీ్త్రయ సాగు పద్ధతులను అనుసరించడంతో పెట్టుబడులు తగ్గి లాభాలు పెరుగుతాయని చెప్పారు. అంతకుముందు సమస్యలు, పంటల పరిస్థితి, ప్రభుత్వ పథకాల అమలు తదితర అంశాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. అవసరమైన సలహాలు అందించారు. అనంతరం మార్కెట్ కమిటీ చైర్మన్ సదాశివరెడ్డి మాట్లాడుతూ.. రైతుల ప్రయోజనాలే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని అన్నారు. సబ్‌స్టేషన్‌కు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న బంజరు, సాగుకు అనుకూలం కాని భూములు, వ్యవసాయ పొలాలకు గ్రౌండ్ మౌంటైడ్ గ్రేడ్ కనెక్టివిటీ కింద సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి నిర్ణయించిన ధరకు ఉత్పత్తి అయ్యే విద్యుత్తును డిస్కం సంస్థలు కొనుగోలు చేస్తాయని, రైతులు లబ్ధి పొందాలని సూచించారు. కార్యక్రమంలో ఉద్యాన అధికారి సాయిబాబా, జిల్లా వైద్యాధికారి డా. జయచంద్రమోహన్, విద్యుత్‌శాఖ ఎస్ఈ నవీన్, మండల వ్యవసాయ అధికారి దినకర్, ఫీల్డ్ ఆఫీసర్ భాస్కర్, బీకేఎస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు. -
రెడ్‌క్రాస్.. సేవల్లో టాప్
పాలమూరు: అత్యవసర సమయంలో రక్తం కావాల్సిన వారికి ఓవైపు రక్తం సమకూర్చడంతో పాటు అనేక సేవా కార్యక్రమాల్లో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ముందుంటోంది. కొన్నేళ్లుగా పాలమూరు జిల్లాలో ఆరోగ్యం, అత్యవసర సహాయం, రక్తదానం వంటి సేవల్లో మేటిగా నిలుస్తోంది. ప్రకృతి విపత్తుల సమయంలో నిస్సహాయులకు చేయూత అందించడంతో పాటు గర్భిణులు, చిన్నారుల పోషణ వంటి వాటిపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. విద్యార్థుల్లో సేవాభావం, ఆరోగ్య అవగాహన పెంపు కోసం జూనియర్ రెడ్‌క్రాస్ వలంటీర్లను తయారు చేయడంతో.. జిల్లాలో జరిగే కురుమూర్తి, మన్యంకొండ ఇతర ముఖ్యమైన ఉత్సవాల్లో వలంటీర్లుగా సేవలు అందిస్తున్నారు. 6,130 యూనిట్ల రక్తసేకరణ రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఏడాది కాలంలోనే 114 రక్తదాన శిబిరాలు నిర్వహించి.. 6,130 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. రెడ్‌క్రాస్ బ్లడ్‌బ్యాంక్‌లో ఏర్పాటుచేసిన కోల్డ్ స్టోరేజ్‌లో అన్ని రకాల రక్త నిల్వలు అందుబాటులో ఉంటాయి. సర్జరీలు, రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారితో పాటు తలసేమియా బాధితులకు సైతం రక్తం అందిస్తున్నారు. ఎన్నో సేవా కార్యక్రమాలు.. పాలమూరులో గతేడాది కాలంలో 20 కంటి వైద్యశిబిరాలు నిర్వహించడంతో పాటు 156 మంది కళ్లు సేకరించారు. 23 మృతదేహాలను మెడికల్ కళాశాలకు వితరణ చేశారు.30 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను 258 మంది లబ్ధిదారులకు అందజేశారు. 17 ప్రాంతాల్లో సీపీఆర్‌పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. 2005లో మహబూబ్‌నగర్ ఏనుగొండలో అనాథ శరణాలయం ఏర్పాటు చేయగా.. 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదివే విద్యార్థులు 74 మంది ఉన్నారు. అదే విధంగా 9వ తరగతి నుంచి ఇంటర్ చదివే వారు 14మంది ఉండగా.. ముగ్గురు డిగ్రీ, ఒకరు ఇంజినీరింగ్, ఇద్దరు పాలిటెక్నిక్, ఇద్దరు నర్సింగ్ చేస్తున్నారు. ఢిల్లీలో జరిగిన జాతీయస్థాయి యోగా పోటీల్లో రెడ్‌క్రాస్ విద్యార్థులు పాల్గొన్నారు. 2018లో శాంతివనం.. రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో మరో అరుదైన సేవా కార్యక్రమం శాంతివనం పేరుతో మానసిక వికలాంగుల ఆశ్రమం నిర్వహిస్తున్నారు. ఆశ్రమంలో 25మంది వరకు ఉండగా.. ప్రత్యేక శిక్షణ పొందిన ముగ్గురు ఉపాధ్యాయులతో నిత్యం పాఠాలు భోదిస్తుంటారు. ఈ పాఠశాలలో చదువుతో పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. పేరు శిబిరాలు సేకరించిన రక్తం మహబూబ్‌నగర్ 114 6,130 నారాయణపేట 18 1,410 నాగర్‌కర్నూల్ 7 300 జోగుళాంబ గద్వాల 34 1,091 ఉమ్మడి జిల్లాలో రక్తసేకరణ ఇలా (యూనిట్లలో).. నేడు ప్రపంచ రెడ్‌క్రాస్ దినోత్సవం పేదలకు అండగా నిలుస్తున్న సొసైటీ అత్యవసర సమయాల్లో రక్తం కొరత లేకుండా శిబిరాల నిర్వహణ ఐదుగురు ఎంబీబీఎస్ విద్యార్థుల దత్తత అనాథ శరణాలయాల్లో 100మంది వరకు ఆశ్రయం ఐదుగురికి విద్యానిధి.. ఎంబీబీఎస్ చదువుతున్న ఐదుగురు నిరుపేద విద్యార్థులను రెడ్‌క్రాస్ సొసైటీ దత్తత తీసుకొని వారి చదువుకయ్యే ఖర్చు భరిస్తోంది. ఎంబీబీఎస్ పూర్తయ్యే వరకు వారికి సంబంధించిన అన్ని రకాల బాగోగులను చూస్తోంది. విద్యార్థిని గోపిక గాంధీ మెడికల్ కళాశాల, హరిత కాకతీయ మెడికల్ కళాశాల, ఊర్మిళ ఎస్వీఎస్, ఆకాంక్ష నల్లగొండ ప్రభుత్వ మెడికల్ కళాశాల, ముడావత్ లోకేష్ ఈఎస్ఐ మెడికల్ కళాశాల ముంబైలో చదువుతున్నాడు. ప్రతి ఒక్కరికీ కళాశాల ఫీజు, పుస్తకాలు, దుస్తులు, హాస్టల్ సౌకర్యాలకు అయ్యే ఖర్చు భరిస్తున్నారు. సేవలు మరింత విస్తృతం.. ఇండియన్ రెడ్‌క్రాస్‌తో అందిస్తున్న సేవలను మరింత విస్తృతం చేస్తాం. స్థానిక ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి సహకారంతో రూ.5 కోట్లతో మల్టీ సూపర్‌స్పెషాలిటీ డయాగ్నొస్టిక్ ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు పంపడం జరిగింది. ప్రస్తుతం ఎస్డీపీ మిషన్ కూడా అందుబాటులో ఉంది. ఒక యూనిట్‌కు రూ.10,500 ఖర్చు చేస్తున్నాం. ప్రైవేటులో అయితే రూ.18 వేల వరకు ఖర్చు అవుతుంది. ప్రస్తుతం మూడు అంబులెన్స్‌లు, ఒక మినీవ్యాన్ అందుబాటులో ఉంది. – నటరాజ్, రెడ్‌క్రాస్ సొసైటీ చైర్మన్ -
మరో రెండు కార్పొరేషన్ పదవులు
● సరిత, గట్టు తిమ్మప్పకు దక్కిన ‘చైర్మన్ గిరి’ గద్వాల:ఉమ్మడి పాలమూరులోని జోగుళాంబ గద్వాల జిల్లాకు మరో రెండు కార్పొరేషన్ పదవులు దక్కాయి. రాష్ట్ర ప్రభుత్వం బుధవారం పలు కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించింది. కొల్లె సరిత తిరుపతయ్యను తెలంగాణ షీప్ అండ్ గోట్ డెవలప్మెంట్ కో–ఆపరేషన్ కార్పొరేషన్ చైర్మన్‌గా, గట్టు తిమ్మప్పను వాల్మీకి బోయ కో–ఆపరేటివ్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు చైర్మన్‌గా నియమిస్తూ గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి కే శాట్ చైర్మన్‌గా శివసేనారెడ్డి, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్‌గా ఒబేదుల్లా కొత్వాల్ కొనసాగుతున్నారు. ● కొల్లె సరిత బీఆర్ఎస్ హయాంలో జోగుళాంబ గద్వాల జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఐదేళ్ల పాటు పనిచేశారు. 2023లో బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరారు. గద్వాల నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం సరిత కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇన్చార్జిగా కొనసాగుతున్నారు. ● గట్టు తిమ్మప్ప గద్వాల మాజీ ఎమ్మెల్యే గట్టు భీముడు సోదరుడు. టీడీపీలో రాజకీయ రంగప్రవేశం చేసిన ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉమ్మడి పాలమూరు జిల్లా డీసీసీబీ చైర్మన్‌గా పదవి నిర్వహించారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత బీఆర్ఎస్లో చేరిన ఆయన గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఓసారి గట్టు జెడ్పీటీసీగా గెలిచిన ఆయన వినియోగదారుల ఫోరం రాష్ట్ర చైర్మన్‌గా కూడా పనిచేశారు. -
భూ సేకరణ త్వరగా పూర్తిచేయాలి
నారాయణపేట: జిల్లాలో నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న భూ సేకరణ త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని వీసీ మందిరంలో నీటిపారుదల, రెవెన్యూ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మక్తల్–నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకం, భీమా–కోయిల్‌సాగర్, ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు, బుద్వేల్–నాచారం రింగ్‌రోడ్ భూ సేకరణ వేగవంతం చేయాలన్నారు. కోస్గి రహదారి విస్తరణలో కూడా ఏమైనా పనులు పెండింగ్ ఉంటే వెంటనే ముగించాలని ఆదేశించారు. ఆయా పనుల భూ సేకరణకు సంబంధించిన నష్ట పరిహారం వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను, ఎస్డీసీ, ఆర్డీఓ రాజేందర్‌గౌడ్, ఏఓ శ్రీధర్, నీటిపారుదలశాఖ సీఈ సత్యనారాయణరెడ్డి, ఎస్ఈ శ్రీధర్, తహసీల్దార్లు బక్క శ్రీనివాస్, సతీష్‌కుమార్, చింత రవి, తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు. ఈవీఎం గోదాం తనిఖీ.. త్రైమాసిక తనిఖీలో భాగంగా జిల్లాకేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న ఈవీఎం గోదాంను బుధవారం కలెక్టర్ సీహెచ్ ప్రియాంక తనిఖీ చేశారు. పరిసరాలు, భద్రతను పరిశీలించారు. ఆమె వెంట అదనపు కలెక్టర్లు ఫణీంద్రారెడ్డి, శ్రీను, ఆర్డీఓ రాజేందర్‌గౌడ్ ఉన్నారు. కలెక్టర్‌ను కలిసిన డీఎస్పీ.. ఇటీవల బాధ్యతలు చేపట్టిన కలెక్టర్ సీహెచ్ ప్రియాంకను బుధవారం కలెక్టరేట్లో డీఎస్పీ నల్లపు లింగయ్య మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్క అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. -
తక్షణ చర్యలు చేపట్టాలి..
మండలంతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో నెలకొన్న తాగునీటి ఎద్దడి తీర్చేందుకు పాలకులు, అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలి. ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయడంతో పాటు రామన్‌పాడు రిజర్వాయర్ నుంచి నిత్యం నీటి సరఫరా అయ్యేవిధంగా శాశ్వత చర్యలు చేపట్టాలి. రిజర్వాయర్‌లో నీటిమట్టం తగ్గిపోతుండటంతో పాలకులు, అధికారులే బాధ్యత వహించి ప్రజల తాగునీటి కష్టాలు తీర్చాలి. – రాజు, సీపీఎం నాయకుడు, ఆత్మకూర్ తాగునీటి కష్టాలు రానివ్వం.. వనపర్తి జిల్లాలోని తాగునీటి పథకాల నుంచి నిత్యం 7.66 కోట్ల లీటర్ల నీటిని సరఫరా చేస్తున్నాం. ప్రస్తుతం పథకాలకు నీటికొరత లేదు. ముందస్తుగా 1,150 బోరుబావులు, 450 చేతిపంపులతో పాటు ట్యాంకర్లను సిద్ధం చేసుకున్నాం. జిల్లా ప్రజలు తాగునీటి విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇబ్బందులు రానివ్వం. – అంజద్‌పాషా, ఈఈ, మిషన్ భగీరథ, వనపర్తి ● -
పదవీ కాలం ముగిసింది
● నేటినుంచి ప్రత్యేక అధికారి పాలనలో జడ్చర్ల పురపాలికం జడ్చర్ల టౌన్: జడ్చర్ల మున్సిపాలిటీలో గురువారం నుంచి ప్రత్యేక అధికారి పాలన ప్రారంభం కానుంది. పాలకవర్గ సభ్యులకు స్థానిక ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి శాలువాతో సత్కరించి అభినందించి వీడ్కోలు పలికారు. 2011 మార్చిలో అప్పటి గ్రామపంచాయతీ పాలకవర్గం గడువు ముగియటంతో ప్రత్యేక అధికారి పాలన ప్రారంభమైంది. అప్పటి నుంచి 2021 వరకు బాదేపల్లి ప్రత్యేక అధికారి పాలనలోనే కొనసాగింది. మధ్యలో జడ్చర్ల మేజర్ గ్రామపంచాయతీకి 2016లో ఎన్నికలు జరిగి ఐదేళ్ల పాటు సర్పంచ్, వార్డుసభ్యుల పాలన కొనసాగింది. బాదేపల్లి మాత్రం మార్చి, 2011 నుంచి మే, 2021 వరకు ప్రత్యేకాధికారి పాలనలోనే ఉండింది. గ్రహణం వీడి 2021 ఏప్రిల్‌లో ఎన్నికలు జరగగా.. మే 6న పాలక వర్గం ప్రమాణస్వీకారం చేసింది. ఐదేళ్ల గడువు ముగియటంతో ఇక ప్రత్యేక పాలన అనివార్యమైంది. ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో స్పష్టత కొరవడటంతో అప్పటి వరకు అధికారుల ఆధ్వర్యంలోనే మున్సిపాలిటీలో పాలన కొనసాగనుంది. ఘనంగా వీడ్కోలు.. పాలకవర్గానికి మున్సిపల్ కార్యాలయంలో బుధవారం సాయంత్రం ఘనంగా వీడ్కోలు పలికారు. మున్సిపల్ కమిషనర్ లక్ష్మారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి.. చైర్పర్సన్ పుష్పలత, వైస్ చైర్పర్సన్ పాలాది సారికతో పాటు వార్డు కౌన్సిలర్లను సత్కరించి మెమొంటోను అందజేశారు. -
‘రామన్‌పాడు’ తగ్గుముఖం
వైద్యశాఖలో అలజడి ● రిజర్వాయర్‌లో ఏడు మీటర్లుతగ్గిన నీటిమట్టం ● ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో మిషన్ భగీరథ అధికారులు ఆత్మకూర్: ఉమ్మడి జిల్లాలో ప్రజల తాగునీటి అవసరాలు తీరుస్తున్న రామన్‌పాడు రిజర్వాయర్‌లో రోజురోజుకు నీటిమట్టం తగ్గుముఖం పడుతోంది. ఇప్పటివరకు ఏడు మీటర్ల మేర నీటిమట్టం తగ్గింది. ఒకవేళ రిజర్వాయర్‌లో నీటిమట్టం పూర్తిగా తగ్గితే పాలమూరులోని అనేక గ్రామాలు తాగునీటి ఎద్దడి ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొననుంది. ప్రధానంగా మిషన్ భగీరథ పథకం ద్వారా నిత్యం వనపర్తి జిల్లాలోని 6.46 లక్షల మందికి 7.66 కోట్ల లీటర్ల నీటిని సరఫరా చేస్తున్నారు. వేసవి నేపథ్యంలో మే, జూన్ నెలల్లో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటూ బోరుబావులు, చేతిపంపులు, ట్యాంకర్లను అధికారులు సిద్ధం చేస్తున్నారు. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు అనుసంధానంగా రామన్‌పాడు రిజర్వాయర్‌ను నిర్మించారు. రిజర్వాయర్‌లోని నీటితో పాటు జూరాల ప్రధాన, సమాంతర కాల్వ ద్వారా నిత్యం తాగు, సాగునీటి సరఫరా కొనసాగుతోంది. గతంలో రామన్‌పాడు రిజర్వాయర్ నుంచి ఉమ్మడి జిల్లాలోని 500 గ్రామాలకు 30 ఎంఎల్డీ నీటిని సరఫరా చేస్తుండేవారు. ప్రస్తుతం శ్రీశైలం వెనుక జలాల నుంచి పలు పథకాలకు తాగునీరు సరఫరా అవుతుండటంతో రామన్‌పాడుపై భారం తగ్గింది. ప్రస్తుతం రెండు పథకాలకు 10.4 ఎంఎల్డీ నీటిని వినియోగిస్తున్నారు. రిజర్వాయర్‌లో 1022.06 అడుగుల నీటిమట్టం ఉండాల్సి ఉండగా.. బుధవారం 1020.09 అడుగులకు చేరింది. తాగునీటి పథకాలు.. శ్రీశైలం వెనుక జలాల నుంచి నాగర్‌కర్నూల్ జిల్లా గౌరిదేవిపల్లి 77 ఎంఎల్డీ తాగునీటి పథకం ద్వారా వనపర్తి జిల్లాలోని 8 గ్రామాలకు నీరు సరఫరా చేస్తున్నారు. అలాగే గోపాల్పేట 10 ఎంఎల్డీ పథకం ద్వారా 44 గ్రామాలు, బుగ్గపల్లి 75 ఎంఎల్డీ పథకం ద్వారా 87 గ్రామాలు, పాన్‌గల్ 5 ఎంఎల్డీ పథకం ద్వారా 19 గ్రామాలు, వీపనగండ్ల 4 ఎంఎల్డీ పథకం ద్వారా 20 గ్రామాలు, ఆత్మకూర్ 2.4 పథకం ద్వారా 12 గ్రామాలు, నందిమళ్ల సత్యసాయి 2 ఎంఎల్డీ పథకం ద్వారా 12 గ్రామాలు, కొల్లాపూర్ 31 ఎంఎల్డీ పథకం ద్వారా 58 గ్రామాలకు నిత్యం తాగునీటిని సరఫరా చేస్తున్నారు. పురపాలికలకు 27.6 ఎంఎల్డీ, గ్రామాలకు 48.435 ఎంఎల్డీ నీటిని అందిస్తున్నారు. వనపర్తి: జిల్లా వైద్య, ఆరోగ్యశాఖలో గందరగోళం సృష్టించిన ఉద్యోగుల నకిలీ ధ్రువపత్రాల వ్యవహారం చిలికి చిలికి గాలివానలా మారుతుందనే సంకేతాలు వెలువడుతున్నాయి. నకిలీ విద్యార్హత ధ్రువపత్రాలతో కాంట్రాక్టు ఉద్యోగాలు పొందారంటూ తరుచూ కలెక్టరేట్ ప్రజావాణికి ఫిర్యాదులు అందడంతో కలెక్టర్ స్పందించి విచారణకు ఆదేశించారు. విచారణ చేపట్టిన అధికారులు ఇద్దరు కాంట్రాక్టు ఉద్యోగులు నకిలీ ధ్రువపత్రాలతో కొన్ని నెలలుగా ఉద్యోగం చేస్తూ ప్రభుత్వాన్ని మోసం చేశారని, విధుల నుంచి తొలగిస్తున్నట్లు డీఎంహెచ్ఓ డా. సాయినాథ్‌రెడ్డి మీడియాకు వెల్లడించారు. కష్టపడి చదివి తెచ్చుకున్న విద్యార్హతను నకిలీగా చిత్రీకరించి ఉద్దేశపూర్వకంగా తన పరువుకు భంగం కలిగించారంటూ వారిలో ఒకరైన శిరీష డీఎంహెచ్‌ఓపై రూ.50 లక్షలకు పరువు నష్టం దావా వేశారు. ఇటీవల వనపర్తి కోర్టు ఈ దావాను స్వీకరించినట్లు తెలిసింది. 2026, జూన్ 12న కోర్టుకు హాజరుకావాలని తెలిపినట్లు సమాచారం. నకిలీ ధ్రువపత్రాలతో ఉద్యోగం పొంది ఉంటే తీసుకున్న వేతన రికవరీకి ఎందుకు ఉపక్రమించలేదని, యూనివర్సిటీ డిక్లరేషన్ కాపీ ఎందుకు బయటపెట్టడం లేదనే అంశాలు వైద్య, ఆరోగ్యశాఖలో సర్వత్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ విషయాన్ని డీఎంహెచ్ఓ డా. సాయినాథ్‌రెడ్డి వద్ద ప్రస్తావించగా.. అదంతా గడిచిపోయిన విషయమని, చట్టప్రకారం వెళ్తున్నామని, ఎక్కువగా మాట్లాడటం సరికాదని బదులిచ్చారు. సాగునీటి సరఫరా బంద్.. ఇదిలా ఉండగా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ప్రధాన ఎడమ కాల్వ ద్వారా నిత్యం 350 క్యూసెక్కుల సాగునీరు విడుదల చేస్తుండేవారు. ప్రాజెక్టులో నీటిమట్టం తగ్గిపోవడంతో ఉన్న నీటిని ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాలకు కేవలం తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగిస్తున్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు. పీజేపీ, మిషన్ భగీరథ అధికారులు సమన్వయంతో ముందుకెళ్తే తాగునీటి కష్టాలు తలెత్తవు. -
పేదల సొంతింటి కల సాకారం సంతోషకరం
● రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఊట్కూర్: రాష్ట్రంలోని నిరుపేదలు ఇందిరమ్మ ఇళ్ల పథకంలో సొంత ఇళ్లు నిర్మించుకొని గృహా ప్రవేశాలు చేయడం సంతోషంగా ఉందని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. బుధవారం మండలంలోని చిన్నపొర్లలో లబ్ధిదారు కొనింటి శంకరమ్మ, భీమప్ప గృహాప్రవేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రవేశపెట్టి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందజేస్తోందన్నారు. ఈ పథకంలో లక్షలాది మంది పేదలకు ఇళ్లు మంజూరు చేసినట్లు తెలిపారు. నిత్యం గృహప్రవేశాల్లో పాల్గొని లబ్ధిదారుల కళ్లల్లో ఆనందం చూడటం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. గత ప్రభుత్వం రెండు పడక గదుల ఇళ్ల పేరుతో కాలయాపన చేసిందని ఆరోపించారు. అనంతరం మల్లేపల్లి శివారులో రూ.2 కోట్లతో వంతెన నిర్మాణానికి భూమిపూజ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు గాండ్ల నిఖిత ప్రశాంత్, కతలప్ప, ఎంపీడీఓ కిశోర్, ఏఓ గణేశ్‌రెడ్డి, నాయకులు రవీందర్‌రెడ్డి, యగ్వేశ్వర్రెడ్డి, కోరం మహేశ్, ధర్మరాజు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
విద్యాశాఖ ముందుచూపు
సకాలంలో పాఠ్య పుస్తకాల పంపిణీకి సన్నద్ధం –8లో uజిల్లాకేంద్రంలోని సింగార్‌బేస్ పాఠశాల గోదాంలో పాఠ్య పుస్తకాలు భద్రపరుస్తున్న ఇన్చార్జ్ నారాయణపేట రూరల్: పాఠశాలలు తెరిచిన తొలిరోజే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుగుసాగుతోంది. గతంలో పాఠశాలలు ప్రారంభమై ఆరు నెలలు గడిచినా పూర్తిస్థాయిలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందించని విద్యాశాఖ అధికారులు రెండేళ్లుగా అందుకు భిన్నంగా సకాలంలో అందజేస్తోంది. గతంలో ఆంగ్ల మాధ్యమ పుస్తకాల కొరత తలెత్తగా.. ఈసారి దాన్నికూడా అధిగమించడానికి కృషి చేస్తున్నారు. 2026–27 విద్యాసంవత్సరానికి సంబంధించి అవసరమైన పుస్తకాల సంఖ్యను ముందుగానే గుర్తించి అందుకు 10 శాతం అధికంగా గత విద్యా సంవత్సరం మధ్యలోనే ముద్రణ ప్రారంభించారు. ఇప్పటికే జిల్లాకేంద్రంలోని స్టాక్ పాయింట్‌కు సగానికిపైగా పుస్తకాలు చేరాయి. జిల్లాలో 72,493 మంది విద్యార్థులు.. జిల్లాలో 513 ప్రభుత్వ, 11 కేజీబీవీ, 6 గురుకుల, రెండు ఎయిడెడ్ పాఠశాలల్లో 72,493 విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వీరికి 3,31,340 పుస్తకాలు అవసరమని అధికారులు ప్రణాళికలు రూపొందించారు. అయితే వాటిలో కొన్ని పాత పుస్తకాలు ఉండగా.. ఇప్పటి వరకు 2,85,950 పుస్తకాలను విడతల వారీగా పంపించగా.. వాటిని జిల్లాకేంద్రంలోని సింగార్‌బేస్ పాఠశాల గోదాంలో భద్రపర్చారు. దీంతో ఇప్పటి వరకు జిల్లాకు 86 శాతం పుస్తకాలు వచ్చినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. పంపిణీకి సన్నద్ధం.. జిల్లాలో తెలుగు, ఆంగ్లం, ఉర్దూ, కన్నడ మీడియం పాఠశాలలు ఉన్నాయి. ఆయా పాఠశాలల విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సకాలంలో పుస్తకాలు అందించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాకు ఇప్పటి వరకు 86 శాతం పుస్తకాలు రాగా.. మిగిలిన 14 శాతం పుస్తకాలు వారం రోజుల్లోగా తెప్పించి జూన్ 1 వరకు సంబంధిత ఎంఆర్సీలు, క్లస్టర్ పాయింట్లకు చేరుస్తారు. అక్కడి నుంచి పాఠశాలల ప్రధానోపాధ్యాయులు విద్యార్థుల సంఖ్య ఆధారంగా పాఠ్య పుస్తకాలు తీసుకెళ్తారు. గతంలో ఎదురైన ఇబ్బందులు పునరావృతం కాకుండా అధికార యంత్రాంగం పుస్తకాల పంపిణీకి అంతా సిద్ధం చేసింది. ఇప్పటికే 86 శాతం మేర గోదాంకు చేరిక అన్ని తరగతుల విద్యార్థులకు రాత పుస్తకాలు సైతం.. బడుల ప్రారంభం నాటికి విద్యార్థులకు అందజేస్తామంటున్న అధికారులు కాగితం ధర అమాంతం పెరగడంతో పేద, మధ్యతరగతి కుటుంబాలు వారి పిల్లలకు రాత పుస్తకాలు కొనిచ్చే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో వాటిని సైతం ఉచితంగా అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. గతేడాది నుంచి పాఠ్య పుస్తకాలతో పాటు రాత పుస్తకాలను (నోట్‌బుక్స్)ను అందిస్తోంది. ఈ ఏడాది కూడా విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా వాటి తయారీ సైతం ప్రారంభమైంది. జూన్‌లో పాఠశాలలు తెరిచే నాటికి సిద్ధం చేసి అందించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నారు. మొదటి రెండేళ్లు 6వ తరగతి నుంచి 10వ తరగతి వారికి మాత్రమే రాత పుస్తకాలు అందించగా.. గతేడాది నుంచి ప్రాథమిక తరగతులకు సైతం ఇవ్వడం ప్రారంభించారు. -
ముందస్తు ముద్రణతోనే..
గతంలో రెండు భాషల్లో పా ఠ్య పుస్తకాల ముద్రణకు ఆలస్యమయ్యేవి. ఈసారి విద్యార్థులకు ఇబ్బందులు కలగొద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం ముందస్తుగానే ముద్రణ ప్రా రంభించింది. జిల్లా గోదాంకు ఇప్పటికే 86 శా తం పుస్తకాలు పంపించారు. మరో 15 రోజుల్లో మిగతా పుస్తకాలు రానున్నాయి. జూన్ 1లోపు ఎంఆర్సీలు, క్లస్టర్ పాయింట్‌కు పంపి అక్కడి నుంచి పాఠశాలలకు సరఫరా చేస్తాం. రాత పుస్తకాలు సైతం త్వరలో రానున్నాయి. – డా. గోవిందరాజు, జిల్లా విద్యాధికారి ● -
భారీ వర్షం.. తడిసిన ధాన్యం
ఊట్కూర్: మండలంలోని పులిమామిడి, బిజ్వార్, అవుసలోనిపల్లి, పగిడిమారి, మల్లెపల్లి తదితర గ్రామాల్లో బుధవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. పులిమామిడిలోని వరి కొనుగోలు కేంద్రంలో సరైన ఏర్పాట్లు లేకపోవడంతో ధాన్యం తడిసి ముద్దయింది. ధాన్యాన్ని విక్రయించేందుకు కేంద్రానికి తీసుకొచ్చి ఆరబోయగా సాయంత్రం వర్షం కురవడంతో తడిసిందని.. నిర్వాహకులు ప్లాస్టిక్ కవర్లు, టార్పాలిన్లు అందుబాటులో ఉంచకపోవడంతో తడిసినట్లు రైతులు తెలిపారు. టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలనే నిబంధనలున్నా నిర్వాహకులు ఏమి పట్టనట్లు వ్యవహరిస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. ఊరు చివరన పొలాల్లో కేంద్రం ఏర్పాటు చేయడంతో ఇబ్బందులు పడాల్సి వస్తోందని వివరించారు. -
‘భూమికి భూమి ఇవ్వాలి’
కోస్గి రూరల్: నారాయణపేట–రేడియల్ రోడ్ నిర్మాణానికి ప్రభుత్వం చేపడుతున్న భూ సేకరణలో భూమికి బదులుగా భూమి ఇవ్వాలని పలువురు రైతులు ఆర్డీఓ రాజేందర్‌గౌడ్‌ను కోరారు. మంగళవారం మండలంలోని నాచారం, తోగాపూర్‌లో భూ సేకరణ గ్రామసభలు నిర్వహించి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. నాచారం గ్రామంలో 70 మంది రైతులకు చెందిన 26 ఎకరాలు, తోగాపూర్‌లో 150 మంది రైతులకు చెందిన 67 ఎకరాలు రోడ్డు నిర్మాణంలో కోల్పోతున్నారు. ఇందులో పలువురు రైతులు ఉన్న కాస్త భూమి కోల్పోతున్నామని.. భూమికి బదులుగా భూమి ఇవ్వాలని ఆర్డీఓను కోరారు. స్పందించిన ఆయన అలా ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పారు. రైతుల వినతులు, నష్ట పరిహారం వివరాలను కలెక్టర్‌కు నివేదిస్తామని తెలిపారు. త్వరలో కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగే సమావేశానికి రైతులను పిలుస్తామని.. మరోసారి చర్చించవచ్చని వివరించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ వార్ల విజయ్‌కుమార్, ఆర్ఐ సుభాష్, ఉప తహసీల్దార్ బాలరాజు, సర్వేయర్ అరుణ, సర్పంచ్‌లు రేణుక, శ్రీనివాస్, గ్రామస్తులు పాల్గొన్నారు. -
ప్రతి నెల జమచేయాలి..
ప్రతి నెల క్రమం తప్పకుండా పొదుపునకు సంబంధించి మూల వేతనంలో 8 శాతం డబ్బును బ్యాంకులో జమ చేస్తు న్నాం. కాని ప్రభు త్వం కేవలం రెండు నెలలకు సంబంధించిన డబ్బులు 16 శాతం ని ధులు మాత్రమే జమ చేసింది. ప్రభుత్వం ప్రతి నెల త్రిఫ్ట్ ఫండ్ వాటాధనాన్ని ఆర్డీ–2 ఖాతాలో జమచేయాలి. బకాయి ఉన్న 12 నెలల డబ్బులు వెంటనే చెల్లించాలి. – ఎంకంపల్లి శ్రీనివాసులు, నేత కార్మికుడు, అమరచింత నేత కార్మికుడు రూ. 1,200 అనుబంధ కార్మికుడు రూ. 800 చొప్పున ప్రతి నెల ఆర్డీ–1లో ఖాతాలో 14 నెలలుగా జమ చేస్తున్నారు. ప్రభు త్వం వీటికి సంబంధించిన ఇప్పటి వరకు కేవలం 2 నెలలకు సరిపడా నిధులు మాత్రమే జమ చేసింది. మిగిలిన నెలల డబ్బులు వెంటనే విడుదల చేసి నేత కార్మికులను ఆదుకోవాలి. లేనిపక్షంలో ఏడీ కార్యాల యం ఎదుట ఆందోళన చేపడతాం. – వగ్గు రామలింగం, నాయకుడు, చేనేత కార్మిక సంఘం, అమరచింత నేతన్నకు పొదుపు పథకానికి సంబంధించి కేవలం రెండు నెలలకు సరి పడా నిధులు మా త్రమే మంజూరయ్యా యి. మిగిలిన నెలల డబ్బులు మంజూరు చేయలేదు. నేతన్నలు జమ చేస్తున్న డబ్బుకు 16 శాతం ప్రభుత్వ వాటా గా చెల్లించాల్సి ఉంది. నిధులు మంజూరైన వెంటేనే ఆర్డీ–2 ఖాతాలో జమచేస్తాం. – పద్మ, డిప్యూటీ డైరెక్టర్, చేనేత, జౌళిశాఖ, గద్వాల ● -
నేతన్నకు పొదుపు జాడేది?
12 నెలలుగా జమకాని త్రిఫ్టు ఫండ్ అమరచింత: చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రభు త్వం ‘నేతన్నకు పొదుపు’ అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రతి నెల కార్మికుడు చెల్లించిన వాటాకు రెండింతల డబ్బును అందించేందుకు శ్రీకారం చుట్టింది. పథకం ప్రారంభంలో రెండు నెలల పాటు కార్మికుల వాటాతో పాటు ప్రభుత్వం రెండింతల డబ్బును కార్మికుల బ్యాంకు ఖాతాలో జమ చేసింది. ఆ తర్వాత పథకాన్ని మరుగునపడేయడంతో నేతన్నలు ఆందోళనకు గురవుతున్నారు. ● రెక్కడితేగాని డొక్కాడని చేనేత కార్మికులు పథకంలో భాగంగా నెల వేతనంలో ఎనిమిదో వంతు డబ్బును ఆర్డి–1 ఖాతాలో జమచేసేవారు. కార్మికులు జమచేసిన వెంటనే పట్టిక ఆధారంగా జౌళిశాఖ అధికారులు రెట్టింపు డబ్బును కార్మికులకు చెందిన ఆర్డి–2 బ్యాంకు ఖాతాలో జమచేసేవారు. ప్రస్తుతం కార్మికులు మాత్రమే ప్రతి నెల తమ మూల వేతనంలో 16 శాతం డబ్బును జమ చేస్తున్నా.. ప్రభుత్వం మాత్రం నేతన్నలకు చెల్లించాల్సిన డబ్బును మాత్రం చెల్లించలేకపోతోంది. ఉమ్మడి జిల్లాలో 3,310 జియో ట్యాగింగ్ మగ్గాలు ఉన్నాయని జౌళిశాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. మొత్తంగా 6,620 మంది కార్మికులను గుర్తించిన అధికారులు వారితో ప్రతినెల రూ.66.20 లక్షల చొప్పున రూ.7.94 కోట్లను జమ చేయిస్తూ వచ్చారు. కాని ప్రభుత్వం మాత్రం తన వాటాగా రూ.15.88 కోట్లకుగాను కేవలం రూ.2.64 కోట్లు మాత్రమే జమ చేసింది. మిగిలిన రూ.13.24 కోట్లను ఎప్పుడు మంజూరు చేస్తుందో.. వాటిని తమ ఖాతాల్లో ఎప్పుడు జమ చేస్తారోనని చేనేత కార్మికులు ఎదురు చూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. రెండేళ్ల కాల పరిమితితో ఉండే త్రిఫ్ట్ ఫండ్ పథకంలో జియోట్యాగింగ్ కలిగిన చేనేత కార్మికుడు వారి నెలసరి ఆదాయంలో 8 శాతం అంటే నెలకు రూ.1200 రూపాయలు, అనుబంధ కార్మికుడు నెలకు రూ.800 ఆర్డీ–1 బ్యాంకు ఖాతాలో ప్రతి నెల జమ చేస్తున్నారు. ప్రభుత్వం 16 శాతం అంటే చేనేత కార్మికుడికి నెలకు రూ.2,400 అనుబంధ కార్మికుడికి రూ.1,600 చొప్పున ఆర్డీ 2 ఖాతాలో జమ చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు కేవలం కొందరికి రెండు నెలల వరకు మాత్రమే డబ్బులు జమ చేశారు. దీంతో నేతన్నల్లో ఆందోళన నెలకొంది. ప్రతి నెల రాకపోవడంతో కొందరు కార్మికులు డబ్బు చెల్లించేందుకు వెనకడుగు వేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 3,310 జియో ట్యాగింగ్ మగ్గాలు.. 6,620 మంది కార్మికులు కార్మికుల వాటా రూ.7.94 కోట్లు చెల్లింపు ప్రభుత్వ వాటా రూ.15.88 కోట్లు.. రూ.2.64 కోట్లు మాత్రమే జమ ఉమ్మడి జిల్లాలోని జియోట్యాగ్ కలిగిన మగ్గాల ప్రధాన కార్మికులు, అనుబంధ కార్మికులు ప్రతి నెల రూ.2 వేల చొప్పున రూ.66.20 లక్షలు జమ చేస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి వరకు రూ.7.94 కోట్లు కార్మికులు జమ చేశారు. ప్రభుత్వ వాటా 16 శాతం అంటే రూ.15.88 కోట్లు జమ కావాల్సి ఉండగా.. రెండు నెలల డబ్బులు రూ.2.64 కోట్లు మాత్రమే జమయ్యాయి. ఇంకా ప్రభుత్వం నుంచి రూ.13.24 కోట్లు అందాల్సి ఉంది. -
భానుడు భగభగ..
మరికల్: జిల్లాలో ఎండలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. ప్రతి రోజు 43 డిగ్రీలకు పైగా ఉష్రోగ్రతలు నమోదు కావడంతో జనాలు రోడ్లపైకి రావాలంటేనే జంకుతున్నారు. పగటి పూట కర్ఫ్యూను తలపించేలా వీధులు మారుతున్నాయి. ఏటా రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో జనం భయభ్రాంతులకు గురవుతున్నారు. చిన్నారులు, వృద్ధులు సూర్య తాపానికి అల్లాడుతున్నారు. వృద్ధుల శక్తిస్థాయి, జీర్ణక్రియ, రోగ నిరోధక శక్తి వ్యవస్థపై వేసవి ప్రభావం తీవ్రంగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఈ ఏడాది జూన్ 15 వరకు అధిక ఉష్ణోగ్రతలుంటాయని భారత వాతావరణశాఖ హెచ్చరిస్తోంది. ముఖ్యంగా జిల్లాలో వడ గాలుల ప్రభావం అధికమయ్యే ప్రమాదం ఉందని పేర్కొంది. పనిచేసే కార్మికులు గంట లేదా రెండు గంటల పాటు విశ్రాంతి తీసుకుంటే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. అధికారుల చర్యలు శూన్యం.. జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నా.. అధికారులు మాత్రం పంచాయతీల ఆధ్వర్యంలో చలివేంద్రాలు, ఏఎన్ఎంల ద్వారా ఓఆర్ఎస్ ప్యాకెట్ల పంపిణీవంటి చర్యలకే పరిమితమవుతున్నారు. ఉపాధి పని ప్రదేశాల్లో చాలాచోట్ల టెంట్లు (నీడ సౌకర్యం) కానరావడం లేవు. అలాగే పీహెచ్‌సీల్లో వడదెబ్బ బాధితుల కోసం ప్రత్యేక వార్డులు, సౌకర్యాలు ఏర్పాటు చేయలేదు. ఉపాధి పథకం ద్వారా చలివేంద్రాలు ఏర్పాటు చేసుకునే వీలున్నా.. కొన్ని పంచాయతీలు పట్టించుకోవడం లేదు. తీసుకోవాల్సిన చర్యలు.. ● అన్ని రకాల ప్రభుత్వ ఆస్పత్రుల్లో వడదెబ్బ బారిన పడిన వారి కోసం ప్రత్యేకంగా ఏసీ లేదా కూలర్లతో కూడిన వార్డులు సిద్ధం చేయాలి. ● ప్రయాణ ప్రాంగణాలు, రైల్వేస్టేషన్లు, ప్రధాన కూడళ్లలో ఉచితంగా ఓఆర్ఎస్ పాకెట్లు, మంచినీరు అందించే కేంద్రాలు ఏర్పాటు చేయాలి. ● ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంల వద్ద జ్వరం, నీరసం, డీహైడ్రేషన్‌కు సంబంధించిన అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలి. ● రద్దీ ఎక్కువగా ఉండే ప్రధాన కూడళ్లలో రోడ్ల వేడిని తగ్గించడానికి వాటర్ ట్యాంకర్లతో నీటిని చల్లించాలి. ● ఉదయం 11 నుంచి సాయంత్రం 4 వరకు బహిరంగ ప్రదేశాల్లో శారీరక శ్రమతో కూడిన పనులు (భవన నిర్మాణాలు, రోడ్డు పనులు) కొనసాగకుండా ఆదేశాలివ్వాలి. ● ఉపాధి పనులు ఉదయం 6కు ప్రారంభించి 11 గంటలకల్లా ముగించేలా చూడాలి. ● ఎండ వేడిమి తట్టుకునేందుకు తేలికగా, మెత్తగా ఉండే తెలుపు, లేతరంగు నూలు దుస్తులు ధరించాలి. ● డీహైడ్రేషన్‌కు గురికాకుండా తరచూ నీరు, కొబ్బరి నీరు, రాగిజావా, మజ్జిగ తాగడం మంచిది. ● కాఫీ, టీలకు దూరంగా ఉండాలి. తేలికగా జీర్ణమయ్యే మసాలాలు లేని ఆహారం తీసుకోవాలి. తరచూ రక్తపోటు, మధుమేహ పరీక్షలు చేయించుకోవాలి. ఉష్ణోగ్రతలు పెరిగిన నేపథ్యంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి జాగ్రత్తలతో పాటు జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి. తీవ్రమైన అలసట, తలనొప్పి, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. – డా. రాఘవేందర్‌రెడ్డి, వైద్యుడు, మరికల్ పీహెచ్సీ జిల్లాలో 43 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు నిప్పుల కొలిమిని తలపిస్తున్న ఎండలు అల్లాడుతున్న చిన్నారులు, వృద్ధులు నిర్మానుష్యంగా మారిన రహదారులు -
కలెక్టర్‌ను కలిసిన ఎస్పీ
నారాయణపేట: జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో కలెక్టర్ సీహెచ్ ప్రియాంకను మంగళవారం ఎస్పీ డా. వినీత్ మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్క అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో శాంతిభద్రతలు, ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి కార్యక్రమాల అమలు తదితర అంశాలపై కలెక్టర్‌తో ఎస్పీ చర్చించారు. పరస్పర సహకారంతో జిల్లా అభివృద్ధికి కృషి చేద్దామని అభిప్రాయపడ్డారు. సైబర్ నేరగాళ్లతో అప్రమత్తంగా ఉండాలి.. ప్రస్తుత ఆధునిక సమాజంలో సాంకేతికత అభివృద్ధి చెందడంతో పాటు సైబర్ నేరాల సంఖ్య రోజురోజుకు పెరుగుతోందని, సైబర్ నేరగాళ్లు కొత్త పద్ధతులు ఉపయోగిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని ఎస్పీ డా. వినీత్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా ప్రజలు సైబర్ నేరగాళ్లతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బ్యాంకు అధికారులమంటూ ఓటీపీ, ఏటీఎం నంబర్లు చెప్పాలని అడుగుతుంటారని, కేవైసీ అప్డేట్, పార్సిల్ డెలివరీ, లాటరీ గెలిచారంటూ లింకులు పంపి క్లిక్ చేయించడంతో ఖాతా వివరాలు దోచుకుంటున్నారని వివరించారు. ఫేస్బుక్, వాట్సాప్ ఖాతాలను హ్యాక్‌చేసి ఫ్రెండ్స్‌ను డబ్బులు అడిగి మోసాలు చేస్తున్నారని.. తక్కువ ధరలతో ఫేక్ వెబ్సైట్లు సృష్టించి డబ్బులు తీసుకొని సరుకులు పంపడం లేదని వివరించారు. ఉద్యోగాలు ఇస్తామని చెప్పి రిజిస్ట్రేషన్ ఫీజులు, ట్రైనింగ్ పేరుతో డబ్బులు వసూలు చేస్తారని, తెలియని వీడియో కాల్స్ ద్వారా వ్యక్తిగత వివరాలు రికార్డుచేసి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతారని.. ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మోసానికి గురైతే వెంటనే గోల్డెన్ అవర్‌లో టోల్‌ఫ్రీ నంబర్ 1930 నంబర్‌కు కాల్ చేయాలన్నారు. జిల్లాలో సైబర్ నేరాలను కట్టడి చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలు అప్రమత్తంగా ఉండి పోలీసులకు సహకరించాలని కోరారు. -
కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి : బీజేపీ
నారాయణపేట: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పుర చైర్పర్సన్ కొండా శ్వేత కోరారు. అమృత్ 2.0 పథకంలో భాగంగా 17వ వార్డు పరిధిలో కొత్త పైప్‌లైన్ పనులను మంగళవారం వైస్ చైర్పర్సన్ మంజుల, కౌన్సిలర్ కల్పన, బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు రతంగ్‌పాండురెడ్డితో కలిసి పూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పురపాలికకు భారీగా నిధులు మంజూరు చేయించిన ఎంపీ డీకే అరుణకు పట్టణ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలిపారు. ప్రధాని మోదీ పాలనతో దేశంలో అభివృద్ధి పరుగులు పెడుతోందని.. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పుర పరిధిలో మంచినీటి పైపులైన్లు వేయడంతో పాటు కొత్త నీటిట్యాంకుల నిర్మాణం శరవేగంగా కొనసాగుతున్నాయన్నారు. తాజాగా వచ్చిన 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మోదీ సబ కా సాత్, సబ కా వికాస్, సబ్ కా విస్వాస్ అనే నినాదాన్ని నిజం చేశాయని, దేశంలో కుటుంబ పాలనకు కాలం చెల్లిందని చెప్పారు. కేంద్ర నాయకత్వం తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించిందని.. అధికారమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పని చేయాలని సూచించారు. ఈ నెల 10న హైదరాబాద్‌లో జరిగే నరేంద్రమోదీ బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు సత్యయాదవ్, మాజీ జిల్లా ప్రధానకార్యదర్శి రఘురామయ్యగౌడ్, మాజీ మున్సిపల్ వైస్‌చైర్మన్ నందూనామాజీ, పట్టణ అధ్యక్షుడు పోషల్ వినోద్ పాల్గొన్నారు. -
ప్రత్యామ్నాయ పంటలు సాగుచేయాలి
● ఆయిల్‌పాం సాగు విస్తీర్ణం పెంచాలి ● కలెక్టర్ సీహెచ్ ప్రియాంక ప్రదర్శనను తిలకిస్తున్న కలెక్టర్ సీహెచ్ ప్రియాంక నారాయణపేట: జిల్లా రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించేలా అధికారులు అవగాహన కల్పించాలని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక ఆదేశించారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా మంగళవారం జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో జిల్లా ఉ ద్యాన, పట్టు పరిశ్రమలశాఖ ఆధ్వర్యలో ఉద్యా న సాగు.. ఆయిల్‌పాం విస్తీర్ణం పెంపుపై నిర్వహించిన కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా రైతులు పండించిన కూరగాయలు, పండ్లు, ఆయిల్‌పాం గెలలు, వ్య వసాయానికి వినియోగించే వివిధ రకాల యంత్రాల ప్రదర్శనను ఆమె తిలకించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. వ్యవసాయ, ఉద్యానశాఖలు అందిస్తున్న రాయితీలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఖమ్మంలో రైతులు ఎక్కువ గా ఆయిల్‌పాం సాగు చేస్తారని, జిల్లాలో ఆసక్తి గల రైతులను అక్కడకు తీసుకెళ్లి క్షేత్రస్థాయిలో చూపించాలన్నారు. ప్రస్తుతం జిల్లాలో 206 ఎకరాల్లో ఆయిల్‌పాం తోటలున్నాయని.. 10 వేల ఎకరాలకు విస్తరిస్తే జిల్లాలోనే ఫ్యాక్టరీ ఏర్పాటుకు ప్రభుత్వానికి నివేదించే అవకాశం ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో పుర చైర్పర్సన్ కొండా శ్వేతా, వైస్ చైర్పర్సన్ మంజుల, మార్కెట్ కమిటీ చైర్మన్ సదాశివారెడ్డి, ఉద్యాన శాఖ అధికారి సాయిబాబా, డీఎంహెచ్ఓ డా. జయచంద్రమోహన్, మండలస్థాయి ఉద్యాన అధికారులు, రైతులు పాల్గొన్నారు. కొత్తపల్లి: పేదలకు నాణ్యమైన వైద్యసేవలు అందించాలని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక కోరారు. మంగళవారం మద్దూరులోని పీహెచ్‌సీని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని రిసెప్షన్, గైనిక్, పిడియాట్రిక్, ల్యాబ్, పురుషుల వార్డు, ఫార్మసీ, ఆపరేషన్ థియేటర్, ఇంజెక్షన్ గది, జనరల్ వార్డులను పరిశీలించారు. అనంతరం రోగులతో మా ట్లాడి వైద్యసేవలు సరిగా అందుతున్నాయ లేదా అనే అంశాలను ఆరా తీశారు. వేసవిలో వడదెబ్బ బారిన పడిన వారికి వెంటనే చికిత్స అందించేందుకు వైద్యులు అందుబాటులో ఉండాలన్నారు. ముఖ్యంగా చిన్నారులకు అందించే వైద్యంపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆమె వెంట వైద్యుడు డా. మల్లికార్జున్, పావని ఉన్నారు. -
ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల రాస్తారోకో
మహమ్మదాబాద్: రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయడంలేదని ఆగ్రహంతో సోమవారం రైతులు రోడ్డెక్కారు. వరిధాన్యం కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చి వారం రోజులు గడుస్తున్నా తూకం వేయడం లేదంటూ మండిపడ్డారు. మహమ్మదాబాద్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం జాతీయ రహదారిపై ధర్నా చేపట్టారు. ధాన్యం సేకరణలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. ఇంకా ఎన్నిరోజులు ఇలా పడిగాపులు కాయాలని ప్రశ్నించారు. రైతులు ఆందోళనకు బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గోపాల్, బీజేపీ నాయకుడు తిరుపతిరెడ్డి మద్దతు పలికి..రోడ్డుపై బైఠాయించారు. దీంతో ఏపీఎం నిమ్మల నిర్వాహకులతో మాట్లాడి తూకం వేయించడంతో రైతులు ఆందోళన విరమించారు. కాగా.. కొనుగోలు కేంద్రంలో ఓ మహిళా రైతుకు సంబంధించిన నాలుగు బస్తాల ధాన్యం చోరీకి గురికావడంతో ఆమె అధికారులకు ఫిర్యాదు చేశారు. -
ధాన్యం కొనుగోళ్లు వేగవంతం
నారాయణపేట: జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను తెలిపారు. సో మవారం హైదరాబాద్ నుంచి మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబు, వాకిటి శ్రీహరి, అట్లూరి లక్ష్మణ్ ధాన్యం కొనుగోళ్లపై వీడియో కాన్ఫరెనన్స్ నిర్వహించారు. జిల్లా నుంచి రెవెన్యూ అదనపు కలెక్టర్ పాల్గొని జిల్లా వివరాలు వెల్లడించారు. అకాల వర్షాలకు ధాన్యం తడవకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కలగకుండా తగిన సౌకర్యాలు కల్పిస్తున్నామని, ప్రభుత్వ ఆదేశాల మేరకు చివరి గింజ వరకు కొనుగోలు చేసే దిశగా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. అనంతరం కలెక్టరేట్ నుంచి సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, వరి, మొక్కజొన్న కొనుగోళ్లు పూర్తిస్థాయిలో నిర్వహించాలని ఆదేశించారు. ఇప్పటికే కేంద్రాలకు వరి ధాన్యం చేరుకుందని, కొనుగోళ్లు వేగవంతం చేయాలన్నారు. ధాన్యం సేకరించిన 24 గంటల్లో ట్యాబ్‌ఎంట్రీ పూర్తి చేయాలని, ఎక్కడైనా సమస్యలు తలెత్తితే వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ట్యాబ్ ఎంట్రీలు పూర్తయిన రైతులకు వారంలోనే రైతుల ఖాతాల్లో నగదు జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. వీసీలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రజావాణి వినతులు పరిష్కరించాలి.. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని ప్రజావాణి మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించి వారి సమస్యలు తెలుసుకొని పరిష్కారానికి సంబంధిత అధికారులకు సిఫారస్ చేశారు. అర్జీలను పెండింగ్‌లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజావాణికి మొత్తం 19 అర్జీలు వచ్చినట్లు కార్యాలయ సిబ్బంది తెలిపారు. -
సరిహద్దులో భద్రత పటిష్టం
నారాయణపేట: యాసంగి సీజన్ వరి ధాన్యం ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి అక్రమంగా రాకుండా నిరోధించేందుకు, బక్రీద్ పండుగ నేపథ్యంలో పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు సరిహద్దు ప్రాంతాల్లో జిల్లా పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో భద్రతను మరింత బలోపేతం చేస్తున్నామని.. చెక్‌పోస్టుల దగ్గర పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ డా. వినీత్ అన్నారు. సోమవారం మండలంలోని జలాల్పూర్ చెక్‌పోస్ట్ (కర్ణాటక సరిహద్దు)ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి విధులు నిర్వర్తిస్తున్న పోలీసు అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, పూర్తి వివరాలను రిజిస్టర్లో నమోదు చేయాలని ఆదేశించారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, అవసరమైతే వీడియో రికార్డింగ్‌తో తనిఖీలు కొనసాగించాలని సూచించారు. అదేవిధంగా సరిహద్దు మార్గాలన్నింటిపై నిరంతర నిఘా ఉండాలని, గ్రామీణ మార్గాలు సహా అన్ని ప్రవేశ దారుల్లో తనిఖీలు కట్టుదిట్టం చేయాలన్నారు. ఎండ తీవ్రత అధికంగా ఉన్నందున సిబ్బంది ఆరోగ్యంపై దృష్టి సారించాలని, తగినంత మంచినీరు తీసుకోవాలని, వేడి నుంచి రక్షణకు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు అక్రమ రవాణాపై కఠిన చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. జలాల్పూర్, కానుకుర్తి, చేగుంట, కృష్ణా వంతెన, సమస్తాపూర్, ఉజ్జెల్లి, లాల్‌కోటలో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన తనిఖీలు కొనసాగిస్తున్నామన్నారు. పునరావాసానికి పూర్తి సహకారం.. జనజీవన స్రవంతిలోకి వచ్చిన మాజీ మావోయిస్టుల పునరావాసానికి పూర్తి సహకారం అందిస్తామని ఎస్పీ డాక్టర్ వినీత్ భరోసానిచ్చారు. 2026, మార్చి 3న హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయంలో మాజీ డీజీపీ శివధర్‌రెడ్డి సమక్షంలో మక్తల్ మండలం జక్లేర్‌కు చెందిన అనిల్‌కుమార్ (భగత్‌సింగ్), గద్వాలకు చెందిన భవాని అలియాస్ సుగుణ దంపతులు లొంగిపోయి జనజీవన స్రవంతిలోకి వచ్చారు. సోమవారం వారు జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీ వారికి నెలకు సరిపడా నిత్యావసర సరుకులు, క్వింటాలు బియ్యం, వంట పాత్రలు అందజేశారు. ఉపాధిని ఎంచుకొని నెల తర్వాత మళ్లీ కలవాలని.. పునరావాసానికి పోలీస్‌శాఖ తరఫున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. మావోయిస్టు దళాన్ని విడిచి జనజీవన స్రవంతిలోకి రావడం మంచి నిర్ణయమని, అందరితో కలిసిమెలిసి జీవిస్తూ ప్రజలకు సేవ చేయాలని సూచించారు. బాల్యవివాహాలు, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు తమవంతు పాత్ర పోషించాలని కోరారు. అదనపు ఎస్పీ ఎండీ రియాజ్ హుల్‌హక్, ఎస్బీ ఎస్ఐ నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఎస్పీ డా. వినీత్ -
గడువులోగా నిర్మాణాలు పూర్తికావాలి
● కలెక్టర్ సీహెచ్ ప్రియాంక నారాయణపేట: రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుందని.. మంజూరైన ఇళ్లను నిర్ణీత గడువులోగా పూర్తి చేయించాల్సిన బాధ్యత ఏఈలపై ఉందని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక అన్నారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫణీంద్రారెడ్డితో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. మండలాల వారీగా మంజూరైన ఇళ్లు, సాధించిన పురోగతిపై హౌసింగ్ పీడీ శంకర్, ఏఈలతో చర్చించారు. మండలాల వారీగా ఇచ్చిన లక్ష్యాన్ని చేరుకోవాలని ఆదేశించారు. రోజూ క్షేత్రస్థాయిలో పర్యటించి పనులను పర్యవేక్షించాలని.. సర్పంచులతో సమన్వయం చేసుకొని లబ్ధిదారులు త్వరగా నిర్మించుకునేలా చూ డాలన్నారు. అవసరమైన వారికి సీ్త్రనిధి రుణాలు ఇప్పించి పూర్తి చేయించాలని.. జిల్లాకు ఇచ్చిన లక్ష్యాన్ని చేరుకునేందుకు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. వచ్చే సమావేశం వరకు ఇచ్చిన లక్ష్యం, ఎంత వరకు పూర్తి చేశారు.. ప్రారంభించని ఇళ్లు ఎన్ని.. కారణం ఏమి టి.. ఏం చేస్తే ప్రారంభమవుతాయనే వివరాల పూర్తి నివేదికతో హాజరుకావాలని స్పష్టం చేశారు. గన్నీబ్యాగుల కొరత లేకుండా చూడాలి.. మరికల్: కొనుగోలు కేంద్రాల్లో రైతులకు సరిపడా గన్నీబ్యాగులు అందుబాటులో ఉంచాలని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక నిర్వాహకులను ఆదేశించారు. సోమవారం మండలంలోని తీలేర్‌లో ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ధాన్యం ఆరబెట్టి 15 రోజులవుతున్నా.. గన్నీబ్యాగులు ఇవ్వడం లేదని, రాత్రింబవళ్లు పడిగాపులు పడుతున్నామని రైతులు వివరించారు. టార్పాలిన్లు లేకపోవడంతో ఇళ్ల నుంచి కవర్లు తీసుకొచ్చి ధాన్యంపై కప్పి వేస్తున్నామని తెలిపారు. నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్ టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని, ఇవ్వకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం ధాన్యం సేకరణ వివరాలను సీఈఓను అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట తహసీల్దార్ రాంకోటి, ఆర్ఐ సుధాకర్‌రెడ్డి, ఎంపీఓ పావని, సొసైటీ సిబ్బంది ఉన్నారు. -
జిల్లాలో వానాకాలం లక్ష్యం 4.66 లక్షల ఎకరాలు
● ఎరువులు 54,200 మెట్రిక్ టన్నులు ● విత్తనాలు 47,780 క్వింటాళ్లు ● పత్తి విత్తనాలు 3.60 లక్షల పాకెట్లు భూమిని దుక్కుతున్న రైతు నారాయణపేట: జిల్లా రైతులు వానాకాలం సాగుకు సిద్ధమవుతున్నారు. నేలల ఆధారంగా అధికారుల సలహాలు, సూచనలు పాటిస్తూ పంటలు పండించాలని వ్యవసాయశాఖ సూచిస్తోంది. జిల్లా రైతులు అధిక శాతం వర్షాధార పంటలపై ఆధారపడుతుండగా.. ఏటా వానాకాలంలో వరి, పత్తి, కంది, యాసంగిలో బోరుబావుల కింద వరి, వేరుశనగతో పాటు జొన్న సాగుకు ప్రాధాన్యం ఇస్తారు. ఈ ఏడాది వానాకాలంలో సాగు కానున్న పంట వివరాలు, అవసరమైన ఎరువులు, విత్తనాలతో సాగు ప్రణాళికను జిల్లా వ్యవసాయ అధికారి జాన్ సూధాకర్ పర్యవేక్షణలో మండల వ్యవసాయశాఖ అధికారులు, ఏఈఓలు సిద్ధం చేశారు. ఎక్కువ మంది రైతులు పత్తి, కంది, వరి సాగుకు మొగ్గు చూపుతున్నారని ప్రభుత్వానికి నివేదించారు. సాగుకు సన్నద్ధం.. జిల్లాలో 4.66 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు కానుండగా.. ఎరువులు 54,200 మెట్రిక్ టన్నులు, వివిధ రకాల విత్తనాలు 47,780 క్వింటాళ్లు, పత్తి విత్తనాలు 3.60 (450 గ్రాములు) లక్షల పాకెట్లు అవసరమని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదించారు. రైతులు తొలకరి వర్షాలకై ఎదురుచూస్తున్నారు. ఎక్కువ మంది రైతులు రోహిణి కార్తెలోనే పత్తి విత్తనాలు విత్తేందుకు ఆసక్తి కనబరుస్తారు. గతేడాది అకాల వర్షాలు, గులాబీ తెగులు సోకడంతో రైతులు నష్టపోయారు. ఈసారి పత్తి, కందికి డిమాండ్ ఉండటంతో ఆయా పంటల సాగుకే రైతులు మొగ్గుచూపే అవకాశం ఉంది. అదేవిధంగా వరి సాగుకు సైతం ఎక్కువగానే ఆసక్తి కనబరుస్తున్నారు. సాగు అంచనాలు ఇలా.. పంట సాగు విస్తీర్ణం కావాల్సిన విత్తనాలు (ఎకరాల్లో..) పత్తి 1.80 లక్షలు 3.60 లక్షల పాకెట్లు వరి 1.90 లక్షలు 47,500 క్వింటాళ్లు కంది 58 వేలు 200 క్వింటాళ్లు జొన్న 5 వేలు 180 క్వింటాళ్లు పెసర 5 వేలు 100 క్వింటాళ్లు యూరియా 18 వేల మె.ట. డీఏపీ 11 వేలు మె.ట. కాంప్లెక్స్ 23 వేల మె.ట. పొటాష్ 1,200 మె.ట. ఎస్ఎస్పీ వెయ్యి మె.ట. -
ఎట్టకేలకు మరమ్మతు
మరమ్మతు పూర్తి చేస్తాం.. జూరాల ప్రాజెక్టు గేట్లకు సంబంధించి ఇది వరకే విడుదలైన నిధులతో మరమ్మతు ప్రక్రియ చేపట్టాం. తాజాగా 42 గేట్లకు ఇనుప రోపులను పూర్తిస్థాయిలో కొత్తవి ఏర్పాటు చేసేందుకు రూ.4.30 కోట్లు విడుదలవగా.. వారం రోజుల కిందట టెండర్ ప్రక్రియ పూర్తయింది. ఈ వేసవిలో వీలైనంత మేరకు మరమ్మతు పూర్తి చేసి వచ్చే వానాకాలం నాటికి సిద్ధం చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. – రహీముద్దీన్, ఎస్ఈ, ఇరిగేషన్ శాఖ గద్వాల: ఉమ్మడి పాలమూరు జిల్లాకు సాగు, తాగునీటి పరంగా ఇందిరా ప్రియదర్శిని జూరాల ప్రాజె క్టు పెద్దన్న పాత్ర పోషిస్తుంది. ఇంతటి ప్రాధాన్యత కలిగిన జూరాల ప్రాజెక్టు గత 30 ఏళ్లుగా కనీస మరమ్మతు పనులకు నోచుకోలేదు. ఫలితంగా జూరాల కు ఉన్న 62 క్రస్టు గేట్లు మొదలుకొని.. ఇనుప రోపు లు, బకెట్ల నిర్మాణాలు వంటివి దెబ్బతిన్నాయి. ఫలితంగా కొన్నేళ్లుగా గేట్ల నిర్వహణలో అవాంతరాలు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే గతేడాది జూలైలో ప్రాజెక్టుకు వరద వచ్చిన సమయంలో అధికారులు గేట్లు ఓపెన్ చేసి నీటిని దిగువకు విడుదల చేశారు. అయితే 14 గేట్లకు సంబంధించిన ఇనుప రోపులు దెబ్బతిన్నాయి. ఇందులో కొన్ని గేట్లకు రెండువైపులా ఉన్న ఇనుప రోపులు తెగిపోగా.. 8 గేట్లకు సంబంధించి ఒకవైపు ఇనుప రోపులు తెగిపోయాయి. ఫలితంగా లీకేజీలు ఏర్పడి ప్రాజెక్టు ఉనికికే ముప్పు ఏర్పడింది. దీనిపై రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి జూరాలను సందర్శించి గేట్లకు పూర్తిస్థాయిలో మరమ్మతు చేపడుతామని నిధులు విడుదల చేశారు. ఈ క్రమంలో నూతనంగా 42 గేట్లకు సంబంధించి ప్రభుత్వం రూ.4.30 కోట్ల నిధులు మంజూరు చేసింది. నాలుగేళ్ల కిందట రూ.11 కోట్లు.. జూరాల ప్రాజెక్టు గేట్లు, ఇనుప రోపుల మరమ్మతు కోసం అధికారులు ఏటేటా ప్రతిపాదనలు పంపినా గడిచిన బీఆర్ఎస్ ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. ఆ తర్వాత నీటిపారుదల శాఖ అధికారులు రెండు కమిటీలను వేసి మరమ్మతుపై అధ్యయనం చేయించారు. పూర్తిస్థాయి మరమ్మతుకు రూ.12.50 కోట్లు అవసరమని ప్రతిపాదించగా.. 2022లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.11 కోట్ల నిధులు విడుదల చేసింది. అయితే టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ పనులు పూర్తిచేయడంలో నిర్లక్ష్యం వహిస్తూ పెండింగ్‌లో ఉంచారు. మంత్రి పర్యటనతో.. జూరాల గేట్లకు రోప్‌లు తెగిపోయి పెద్దఎత్తున లీకేజీలు ఏర్పడటంతో రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి జూరాలను సందర్శించారు. ఈ సందర్భంలోనే గేట్ల మరమ్మతు పూర్తిస్థాయిలో చేపడుతామని, అదేవిధంగా డ్యాంపై పరిమితికి మించి వాహనాలు లోడ్‌తో వెళ్లడం ప్రమాదమని గుర్తించినట్లు ప్రకటించారు. దీనికి ప్రత్యామ్నాయంగా మరో కొత్త బ్రిడ్జి నిర్మించేందుకు రూ.100 కోట్లు విడుదల చేస్తున్నట్లు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. అదేవిధంగా 42 గేట్లకు సంబంధించి ఇనుప రోపులను పూర్తిస్థాయిలో మార్చేందుకు ప్రభుత్వం రూ.4.30 కోట్లు మంజూరు చేసింది. టెండర్ ప్రక్రియ పూర్తి.. జూరాలలో 42 గేట్లకు సంబంధించి ఇనుప రోపులను పూర్తిస్థాయిలో మార్చేందుకు వారం క్రితం టెండర్ ప్రక్రియ పూర్తయింది. అయితే గతంలో విడుదలైన రూ.11 కోట్ల నిధులతో ఇది వరకే 10 గేట్లకు సంబంధించి ఇనుప రోపులను పూర్తిస్థాయిలో మార్చేందుకు చర్యలు చేపట్టారు. తాజాగా మరో 42 గేట్లకు సంబంధించిన ఇనుప రోపుల మరమ్మతుకు టెండర్ పూర్తికావడంతో ఈ వేసవిలోనే గేట్లకు సంబంధించి మరమ్మతు పూర్తిచేసేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. జూరాల డ్యాం గేట్ల మరమ్మతుకు రూ.4.30 కోట్లు మంజూరు తాజాగా 42 ఇనుప రోప్‌ల పునరుద్ధరణ ఇదివరకే 10 రోప్‌లకు కొనసాగుతున్న పనులు ఈ వేసవిలోనే పూర్తిచేసేలా అధికారుల చర్యలు -
పెసర క్వింటా రూ.7,616
నారాయణపేట: స్థానిక వ్యవసాయ మార్కెట్‌యార్డులో సోమవారం పెసర క్వింటా సరాసరి ధర రూ.7,616 పలికింది. అలాగే వరి సోనారకం గరిష్టంగా రూ.2,374, కనిష్టంగా రూ.1,555 ధర లభించింది. వేరుశనగ క్వింటా రూ.7,552 జడ్చర్ల/దేవరకద్ర: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్లో సోమవారం వేరుశనగ క్వింటా గరిష్టంగా రూ.7,552, కనిష్టంగా రూ.4,589 ధరలు లభించాయి. ఆముదాలు గరిష్టంగా రూ.6,259, కనిష్టంగా రూ.6,199, జొన్నలు గరిష్టంగా రూ. 5,777, కనిష్టంగా రూ.5,010, పొద్దుతిరుగుడు గరిష్టంగా రూ.5,992, కనిష్టంగా రూ.5,762, ధాన్యం ఆర్ఎన్ఆర్ గరిష్టంగా రూ.2,559, కనిష్టంగా రూ. 1,605, రాగులు గరిష్టంగా రూ.2,777, కనిష్టంగా రూ.2,410, మొక్కజొన్న గరిష్టంగా రూ.1,867, కనిష్టంగా రూ.1,600, మినుములు రూ.7,601 ధరలు లభించాయి. దేవరకద్ర మార్కెట్ ఆర్ఎన్ఆర్ గరిష్టంగా రూ.2,359, కనిష్టంగా రూ.2,001, హంస ధాన్యం గరిష్టంగా రూ.1,809, కనిష్టంగా రూ. 1,701గా ధరలు నమోదయ్యాయి. -
బాల్యవివాహాలు చేయడం చట్టరీత్యా నేరం
నారాయణపేట: జిల్లాలో బాల్యవివాహాలను పూర్తిగా అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి, కలిసికట్టుగా ముందుకు రావాలని ఎస్పీ డాక్టర్ వినీత్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. బాల్యవివాహాలు చట్టపరంగా నిషేధించబడినవని, 18 ఏళ్ల లోపు బాలికలు, 21 ఏళ్ల లోపు బాలురకు వివాహం చేయడం చట్ట ప్రకారం నేరమని స్పష్టం చేశారు. బాల్యవివాహాలు బాలల శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపడమే కాకుండా, వారి విద్యాభ్యాసానికి మధ్యలోనే ఆటంకం కలిగే ప్రమాదం ఉందన్నారు. ముఖ్యంగా బాలికల భవిష్యత్, ఆర్థిక స్వావలంబన, ఆరోగ్య భద్రతపై దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. సమాజంలో అజ్ఞానం, సంప్రదాయాల పేరుతో ఇలాంటి ఘటనలు జరుగుతుండటం ఆందోళనకరమన్నారు. తల్లిదండ్రులు, బంధువులు, గ్రామ పెద్దలు, స్థానిక నాయకులు చట్టాలపై అవగాహన పెంపొందించుకుని బాల్యవివాహాలను నిరోధించడంలో చురుకుగా వ్యవహరించాలని కోరారు. విద్యార్థులు తమ హక్కులపై అవగాహన కలిగి ఉండాలని, బాల్య వివాహాలు చేసేందుకు ప్రయత్నిస్తే వెంటనే అధికారులకు తెలియజేయాలని కోరారు. అంగన్వాడీ సిబ్బంది, ఆశా వర్కర్లు, పాఠశాల ఉపాధ్యాయులు, మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు కలిసి గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. బాల్యవివాహాల నిరోధానికి ప్రభుత్వ శాఖలన్నీ సమన్వయంతో పనిచేయాలన్నారు. విఠలాపూర్ వాసికి యువ కవి పురస్కారం దామరగిద్ద: ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్న విఠలాపూర్‌కు చెందిన మధు విశ్వపుత్రిక గజల్ ఫౌండేషన్ వారిచే ఆదివారం హైదరాబాద్‌లో యువ కవి పురస్కారాన్ని అందుకున్నాడు. సమాజంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రజలను చైతన్యపరిచే కవితలకు ఈ పురస్కారానికి ఎంపికై నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ ఉపాధ్యక్షురాలు లక్ష్మీపండిత్, కార్యదర్శి అనువాదకులు బిక్కి కృష్ణ, టీడీపీ జాతీయ అధ్యక్షుడు జనార్దన్‌రెడ్డి చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. కార్యక్రమంలో మైనింగ్ విభాగాధిపతి వీడీ రాజగోపాల్ అవార్డు ప్రదానంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనను సర్పంచ్ హన్మంతు, గ్రామస్తులు అభినందించారు. రేపు జిల్లా అథ్లెటిక్స్ క్రీడాకారుల ఎంపికలు మహబూబ్‌నగర్ క్రీడలు: వరంగల్‌లో ఈ నెల 10న జరిగే రాష్ట్రస్థాయి అంతర్ జిల్లాల అథ్లెటిక్స్, 17న హైదరాబాద్‌లో జరిగే రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొనే జిల్లా అథ్లెటిక్స్ క్రీడాకారుల ఎంపికలను మంగళవారం ఉదయం 9 గంటలకు స్థానిక మెయిన్ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా అథ్లెటిక్స్ సంఘం ప్రధాన కార్యదర్శి జి.శరత్చంద్ర ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల క్రీడాకారులు ఎస్సెస్సీ మెమో, జనన, కుల ధ్రువపత్రంతో స్టేడియం మైదానంలో రిపోర్టు చేయాలని సూచించారు. ప్రశాంతంగా ‘నీట్’ మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్/ మహబూబ్‌నగర్ క్రైం: జిల్లాలో నీట్–యూజీ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా జరిగింది. ఈ మేరకు విద్యార్థులను ఉదయం 11 నుంచి 1.30 గంటల వరకు కేంద్రాల్లోకి అనుమతించారు. దీంతో ఉదయం 8 గంటల నుంచే పరీక్ష కేంద్రాల వద్ద హడావుడి కనిపించింది. పరీక్షల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసిన అధికారులు విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి వెళ్లే క్రమంలో బాల బాలికలకు వేర్వేరుగా తనిఖీ చేసి పంపించారు. ఈ నేపథ్యంలో 11 గంటల తర్వాత పరీక్ష కేంద్రంలోకి వెళ్లని విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేయకుండా సాయంత్రం 5 గంటల వరకు ఉండాల్సి వచ్చింది. దీంతోపాటు జిల్లాకేంద్రంలోని ఎన్టీఆర్ మహిళా డిగ్రీ కళాశాలలో విద్యార్థులను 25 నిమిషాలు ఆలస్యంగా వదిలారు. ఈ కేంద్రంలో ఇద్దరు విద్యార్థులు తమ పేరు రిజిస్ట్రేషన్ చేసుకోకుండా పరీక్ష రాశారని, వారి పేరును రిజిస్ట్రేషన్ చేసి బయటికి వదిలేందుకు ఆలస్యమైందని విద్యార్థులు తెలిపారు. కాగా పరీక్షకు జిల్లావ్యాప్తంగా 12 కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 4,214 మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా 4,141 మంది హాజరుకాగా 73 మంది గైర్హాజరయ్యారు. -
శిక్షణ అదుర్స్..
నీట్, ఐఐటీ, క్లాట్ పరీక్షలకు ప్రత్యేక తరగతులు ● జిల్లాలో 4 కేజీబీవీల నుంచి.. ● ప్రతి సబ్జెట్‌కు 40 మంది విద్యార్థులు ఎంపిక ● ప్రభుత్వ నిర్ణయం కేజీబీవీ విద్యార్థినులకు వరం అమరచింత: కేజీబీవీల్లో ఇంటర్ చదువుతున్న విద్యార్థినులు నీట్, ఐఐటీ, క్లాట్ వంటి పోటీ పరీక్షల్లో సత్తా చాటేలా వారికి శిక్షణ ఇవ్వడానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టారు. ఇందుకోసం జిల్లాలోని 4 కేజీబీవీలను ఎంపిక చేసి ప్రతి కేజీబీవీ నుంచి టాప్ టెన్‌లో ఉన్న 10 మంది విద్యార్థినులను ఎంపిక చేస్తూ.. వేసవి సెలవులు వృథా కాకుండా పోటీ పరీక్షలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నారు. ప్రశాంతమైన వాతావరణంలో అన్ని వసతులను కల్పించి ఆయా సబ్జెట్లపై పట్టున్న సీఆర్టీల ద్వారా రోజువారి తరగతులను బోధించే విధంగా ప్రణాళికను రూపొందించి, అమలు చేస్తున్నారు. నిత్యం పర్యవేక్షణతో పాటు జిల్లా విద్యాధికారుల తనిఖీలు, జీసీడీఓ ఆకస్మిక తనిఖీలతో నాణ్యతతో కూడిన బోధన అందించడంతో విద్యార్థులు ఆయా పోటీ పరీక్షలపై పట్టు సాధించేందుకు సిద్ధమవుతున్నారు. మొదటి ప్రయత్నం.. కేజీబీవీలో ప్రస్తుతం ఇంటర్ ప్రథమ సంవత్సరం పూర్తి చేసిన ఎంపీసీ, బైపీసీ, ఈసీటీ చదువుతున్న వారికి నీట్, క్లాట్, ఐఐటీ పోటీ పరీక్షలకు హాజరయ్యేలా తొలి ప్రయత్నంగా రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన పాఠశాలలో విద్యార్థినులకు శిక్షణ ఇస్తున్నారు. వీటితో పాటు లైబ్రరీల్లో ఆయా సబ్జెక్టులకు సంబంధిచిన పుస్తకాలను సైతం అందుబాటులో ఉంచి ప్రతిరోజు ఉదయం, సాయంత్రం లైబ్రరీ స్టడీకి అవకాశం కల్పిస్తున్నారు. 3 చోట్ల శిక్షణ తరగతులు జిల్లాలోని చిన్నంబావి, శ్రీరంగాపురం, వనపర్తి, అమరచింత మండలాల్లోని కేజీబీవీల నుంచి ఒకొక్క సబ్జెట్ నుంచి 10 మంది విద్యార్థినులను ఎంపిక చేశారు. అమరచింత కేజీబీవీని నీట్ శిక్షణ కోసం ఎంపిక చేయగా.. ఐఐటీ శిక్షణ కోసం వనపర్తి కేజీబీవీ, క్లాట్ శిక్షణ కోసం గోపాల్పేట కేజీబీవీని ఎంపిక చేసి తరగతులు ప్రారంభించారు. నీట్ శిక్షణకు వచ్చిన విద్యార్థినులకు రోజువారీగా బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ విషయాలపై గంటన్నర పాటు శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ బాగుంది ప్రస్తుతం అమరచింతలోని కేజీబీవీలో బైపీసీ మొదటి సంవత్సరం పూర్తి చేశాను. నీట్ శిక్షణకు ఎంపియ్యా. నాకు డాక్టర్ కావాలనే కోరిక చిన్నప్పటి నుంచి ఉండేది. నేను చదువుకుంటున్న పాఠశాలలోనే నీట్‌పై ప్రత్యేక శిక్షణ ఇవ్వడం సంతోషంగా ఉంది. రోజువారీగా తరగతుల నిర్వహణతో పాటు వారాంతపు పరీక్షలు నిర్వహించి, ప్రోత్సహిస్తున్నారు. – దివ్యశ్రీ, కేజీబీవీ అమరచింత క్లాట్‌లో శిక్షణ పొందుతున్నా.. నేను సీఈసీ మొదటి సంవత్సరం పూర్తి చేశాను. ప్రభుత్వం కేజీబీవీల వి ద్యార్థునుల కోసం పోటీ పరీక్షలపై శిక్షణ తరగతులను నిర్వహిస్తుండటంతో క్లాట్‌పై శిక్షణ పొందడానికి గోపాల్పేట కేజీబీవీకి వచ్చా. విషయాల వారీగా బోధనతో పాటు సౌకర్యాలు బాగున్నాయి. – భవ్యశ్రీ, కేజీబీవీ, గోపాల్పేట నీట్లో ర్యాంకు సాధిస్తా.. అమరచింత కేజీబీవీలో నీట్‌పై శిక్షణ ఇస్తున్నారని ఎస్ఓ చెప్పడంతో ఇక్కడికి వచ్చాను. రోజువారి తరగతుల నిర్వహణ తీరు బాగుంది. సబ్జెక్టుల్లో అనుమానాలను ఎప్పటికప్పుడు నివృతి చేస్తున్నారు. మొదటి సారిగా ఇస్తున్న శిక్షణను ప్రేరణగా తీసుకుని వచ్చే సంవత్సరం మరింతగా రాణించి నీట్లో మంచి ర్యాంకు సాధిస్తా. – పల్లవి, కేజీబీవీ వనపర్తి డాక్టర్ కావాలనేది కల.. నీట్ శిక్షణపై పట్టు సాధించి పోటీ పరీక్షలో ర్యాంకు సాధించేందుకు శిక్షణ తోడ్పడనుంది. తల్లిదండ్రులను ఒప్పించి ఇక్కడికి శిక్షణకు వచ్చా. వసతులతో పాటు అవగాహన ఉన్న సీఆర్టీల ద్వారా శిక్షణ ఇప్పించడం బాగుంది. డాక్టర్ కావాలనే కల నేర్చుకుంటాను. – పూజ, బైపీసీ, చిన్నంబావి రోజు వారీగా.. జిల్లాలోని 4 కేజీబీల ద్వారా ఎంపిక చేసిన విద్యార్థినులకు మూడు కేజీబీవీల్లో ఒకొక్క పోటీ పరీక్షపై ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. ప్రతి రోజు ఆయా కేజీబీవీలకు వెళ్లి విద్యార్థినులకు అందుతున్న బోధన గురించి ఆరా తీస్తున్నాం. వచ్చే ఏడాది వరకు ఆయా సబ్జెట్‌ల్లో విద్యార్థినులకు శిక్షణ ఇచ్చి అనుకున్న ఫలితాలు సాధిస్తామనే నమ్మకం ఉంది. – శుభలక్ష్మి..జీసీడీఓ -
గన్నీ బ్యాగులు ఇవ్వలేదు..
ఏడెకరాల ధాన్యం ఆరపెట్టి 15 రోజులు అవుతుంది. ఇంత వరకు గన్నీ బ్యాగులు ఇవ్వలేదు. మా గ్రామానికి 10 వేల బస్తాలు వస్తే కొంతమంది రైతులకు మాత్రమే ఇచ్చారు. మిగతా రైతులు బస్తాలు అడిగిన ప్రతిసారి ధాన్యం తరలించేందుకు లారీలు వస్తలేవు.. అందుకే బస్తాలు ఇవ్వడం లేదని చెబుతున్నారు. అకాల వర్షాలు వచ్చి ఆరిన ధాన్యం తడిస్తే తమ బాధలను ఎవరికీ చెప్పుకోవాలి. తర్వగా గన్నీ బ్యాగులు అందజేసి ధాన్యం తీసుకెళ్లేందుకు చర్యలు తీసుకోవాలి. – విష్ణుకాంత్‌రెడ్డి, రైతు, పూసల్‌పహాడ్, మరికల్ ● -
ధాన్యం.. దైన్యం
ఆర్భాటానికే పరిమితమైన కొనుగోలు కేంద్రాల ప్రారంభం –8లో uఏఈఓలు, సిబ్బంది కొరత కారణంగా రైతులకు మూడు రోజులకోసారి టోకెన్లు జారీ చేస్తున్నారు. వారానికి ఒకసారి మాత్రమే గన్నీ బ్యాగులు కేంద్రాలకు వస్తుండగా.. అవి వచ్చినప్పుడే టోకెన్లు పొందిన రైతులు తీసుకోవాల్సి రావడం ఇబ్బందిగా మారింది. గన్నీ బ్యాగులు తీసుకున్న తర్వాత కూడా పలు కేంద్రాల్లో హమాలీల కొరత వేధిస్తోంది. ఒక బస్తా ధాన్యం నింపేందుకు రూ.25 వసూలు చేస్తుండడంతో రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. దాదాపుగా ప్రారంభమైన అన్ని కేంద్రాల్లో ధాన్యం తరలింపు ప్రధాన సమస్యగా మారింది. అధికారులు కొనుగోలు కేంద్రాలకు వెంటవెంటనే లారీలను పంపించకపోవడమూ కారణమవుతోంది. దీంతోపాటు మిల్లుల కేటాయింపుల్లో గందరగోళంతో లోడ్ అయిన వాహనాలు కేంద్రాల్లోనే ఉంటున్నాయి. దీంతో రైతులు రేయింబవళ్లు అక్కడే కాపలా ఉండాల్సి వస్తుంది. ప్రభుత్వం ఈసారి కేంద్రాల్లో కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఆన్లైన్లో మిల్లులకు కేటాయించే పద్ధతిని ప్రవేశపెట్టింది. ఈ విధానం అమలులో సమస్యలు తలెత్తడంతో క్రయవిక్రయాల్లో జాప్యం జరుగుతుండడంతో అధికారులు తిరిగి పాత విధానం ప్రకారమే రైతుల నుంచి ధాన్యం సేకరిస్తున్నారు. దీనిపై అస్పష్టతతో కొనుగోళ్లు ఊపందుకోవడం లేదని తెలుస్తోంది. గద్వాల జిల్లాలో మిల్లులకు గతంలో కేటాయించిన సీఎమ్మార్ ధాన్యం నిల్వలు పేరుకుపోయాయి. ఈ యాసంగి ధాన్యం నిల్వకు సరిపడా గోడౌన్లు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు అధికారులకు మిల్లర్లు వినతిపత్రం అందించారు. వనపర్తి జిల్లాలో డీఫాల్ట్ మిల్లర్లు అధికంగా ఉండడంతో కేంద్రాల్లో సేకరించిన ధాన్యాన్ని మిల్లులకు కేటాయించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. యాసంగి సాగుకు సంబంధించి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి. ఉమ్మడి పాలమూరులోని వనపర్తి, నాగర్‌కర్నూల్ మినహా మిగిలిన మూడు జిల్లాల్లో పూర్తిస్థాయిలో కొనుగోలు కేంద్రాలు అందుబాటులోకి వచ్చినా.. ఆర్భాటానికే పరిమితమయ్యాయి. సుమారు 15 రోజులు గడిచినప్పటికీ క్రయవిక్రయాల్లో వేగం పుంజుకోకపోవడంతో అసలు కొనుగోళ్లు చేస్తారా.. లేదా అనేది తెలియక రైతులు ఆందోళనలో కొట్టుమిట్టాడుతున్నారు. క్రయవిక్రయాల్లో రోజుల తరబడి జాప్యంతో వారిలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల వనపర్తి జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో అన్నదాతలు రాస్తారోకోకు దిగగా.. ఇలాంటి పరిస్థితులే పలు ప్రాంతాల్లో నెలకొన్నాయి. – సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ ఉమ్మడి పాలమూరులోని ఐదు జిల్లాల్లో యాసంగి ధాన్యం కొనుగోళ్లకు 1,018 సెంటర్లు కేటాయించారు. ఇప్పటి వరకు 877 మాత్రమే అందుబాటులోకి రాగా.. ఇందులో కనీసం రెండు శాతం మేర సెంటర్లలో కొనుగోళ్లు ప్రారంభం కాలేదు. మొత్తంగా 11,49,813 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్ధారించిన అధికార యంత్రాంగం.. ఇప్పటివరకు ప్రభుత్వ కేంద్రాల ద్వారా కేవలం 36,175 మెట్రిక్ టన్నులు సేకరించింది. అయితే ఉమ్మడి జిల్లాలో వరినాట్లు ఆలస్యంగా పడుతాయని.. కోతలు కూడా ఆలస్యమవుతాయని.. ఆయా ప్రాంతాల్లో అవసరాల మేరకు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని.. కొనుగోళ్లలో ఎక్కడా జాప్యం జరగడం లేదని అధికారులు చెబుతున్నారు. సన్నాలకే మొగ్గు.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా యాసంగిలో 8,33,679 ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. అయితే ప్రభుత్వం గ్రేడ్–1 సన్న వడ్లు క్వింటాల్‌కు మద్దతు ధర రూ.2,389, గ్రేడ్–2కు రూ.2,369 ఇస్తోంది. దీంతోపాటు సన్నాలకు బోనస్ కింద క్వింటాల్‌కు రూ.500 చొప్పున చెల్లిస్తోంది. ఈ నేపథ్యంలో రైతులు సన్నాల సాగుకే మొగ్గు చూపారు. 5,31,181 ఎకరాల్లో సన్న ధాన్యం సాగు చేయగా.. 3,02,498 ఎకరాల్లో రైతులు దొడ్డు రకం వరి సాగు చేశారు. అయితే సన్నాలను కొనేందుకు ప్రైవేట్ వ్యాపారులు ముందుకు వస్తున్నా.. దొడ్డు రకాల ధాన్యం కొనేందుకు ఇష్టపడడం లేదు. పలు ప్రాంతాల్లో మాత్రమే దళారులు దొడ్డు రకం వడ్లను క్వింటాకు రూ.2,200లోపు వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. ఫలితంగా రైతులు ప్రభుత్వ కేంద్రాల్లో రోజుల తరబడి నిరీక్షిస్తూ.. కొనుగోళ్ల కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. ఆశలు.. అడియాసలు ప్రస్తుతం ప్రభుత్వ కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లలో జాప్యంతో పలు ప్రాంతాల్లో రైతులు ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. పూర్తిగా ఆరబెట్టిన సన్న వడ్లు క్వింటాకు రూ.2,400 నుంచి రూ.2,450.. తేమ ఉంటే రూ.2,300 నుంచి రూ.2,350 వరకు వెచ్చించి దళారులు కొనుగోలు చేస్తున్నారు. వెంటనే డబ్బులు చెల్లిస్తుండడంతో రైతులు వారి వైపే మొగ్గుచూపుతున్నారు. అయితే బోనస్ ఆశతో సన్నాలు పండించిన రైతుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. బోనస్ చెల్లించాల్సి వస్తుందనే ప్రభుత్వం కావాలని కొనుగోలు చేయకుండా.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శిస్తున్నారు. కొ .కేం : కొనుగోలు కేంద్రాలుజిల్లాల వారీగా యాసంగి సాగు, కొనుగోలు కేంద్రాల వివరాలు.. జిల్లా సాగు మొత్తం ప్రారంభించిన కొనుగోలు లక్ష్యం ఇప్పటి వరకు (ఎకరాల్లో) కొ .కేం కొ .కేం (మె.టల్లో) కొన్నవి (మె.టల్లో) మహబూబ్‌నగర్ 2,01,883 174 174 2,30,000 4,495 వనపర్తి 2,06,348 408 287 3,75,000 5,000 నారాయణపేట 1,90,000 160 160 2,44,813 25,810 నాగర్‌కర్నూల్ 1,69,128 200 180 2,00,000 70 జో. గద్వాల 66,320 76 76 1,00,000 800 మొత్తం 8,33,679 1,018 877 11,49,813 36,175 సెంటర్లలో అస్తవ్యస్తంగా మారిన క్రయవిక్రయాలు రోజులకొద్దీ జాప్యంతో అన్నదాతల పడిగాపులు పలు ప్రాంతాల్లో రోడ్డెక్కుతున్న రైతులు దొడ్డు వరి సాగు చేసిన వారికి తప్పని ఎదురుచూపులు -
ఐదు రోజులుగా నిరీక్షిస్తున్నా..
కొనుగోలు కేంద్రానికి ఐదురోజుల క్రితం ధాన్యం తెచ్చినా ఇప్పటికీ కొంటలేరు. ఇక్కడ గతంలో ఐకేపీ వారు ఏర్పాటు చేయగా.. ఈసారి ఈసారి పీఏసీఎస్ చేస్తుందని చెబుతున్నా.. ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రమే ప్రారంభించ లేదు. ఇప్పటికే చాలామంది వరి ధాన్యాన్ని తీసుకొచ్చారు. సకాలంలో కొంటే డబ్బులు త్వరగా వస్తాయి. వర్షం వస్తే చేతికొచ్చిన ధాన్యం పాడవుతుంది. కొనుగోలు కేంద్రం వద్ద నీడ లేదు. తాగడానికి నీరు కూడా లేదు. – దండె రాములు, రైతు, వెన్నాచేడ్, గండేడ్ మండలం -
బాధిత కుటుంబాలకు బాసట
● కుటుంబ పెద్ద చనిపోతే రూ.20 వేల సాయం ● అర్హులు సద్వినియోగం చేసుకోవాలి ●● ఆహార భద్రత కార్డు ● మృతుడి ఆధార్ కార్డు ● మరణ ధ్రువీకరణ పత్రం ● మృతుడి వయస్సు నిర్ధారణ పత్రం ● ఆదాయ ద్రువీకరణ పత్రం ● కుటుంబ సభ్యుల ధ్రువీకరణ పత్రం ● దరఖాస్తుదారుడి బ్యాంకు ఖాతా పుస్తకం వీటన్నింటిని జతచేసి మీసేవా కేంద్రంలో దరఖాస్తు చేసుకున్న తర్వాత ఆ పత్రాలను స్థానిక సంస్థల కార్యాలయాల్లో అందించాలి. మరికల్: జాతీయ కుటుంబ ప్రయోజన పథకం (ఎన్ఎఫ్బీఎస్) అమలు విధానంలో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ఇప్పటి వరకు తహసీల్దార్ పరిధిలో ఉన్న ఈ పథకం బాధ్యతలను ఎంపీడీఓలకు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మరింత సులభంగా సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. అర్హులు ఇప్పటి నుంచి ఎంపీడీఓ కార్యాలయంలో దరఖాస్తు ఇస్తే విచారణ, పరిశీలన, ఆమోద ప్రక్రియ వేగవంతం కానుంది. పేద కుటుంబాల్లో సంపాదించే వ్యక్తి మరణిస్తే బాధిత కుటుంబ సభ్యులకు జాతీయ కుటుంబ ప్రయోజన పథకం ద్వారా ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుంది. గతంలో దరఖాస్తులను తహసీల్దార్లు విచారణ చేసి నివేదికలను కలెక్టర్లకు పంపితే నిధులు మంజూరు చేసేవారు. ఈ క్రమంలో జాప్యం చోటుచేసుకునేది. ప్రస్తుతం లబ్ధిపొందే విధానంలో మార్పులు చేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో ఎంపీడీఓలు, పుర, నగరపాలికల్లో కమిషనర్లకు అర్హులను గుర్తించే అధికారాన్ని అప్పగించారు. ఇందుకు నిర్ధిష్ట గడువు కూడా విధించటంతో దరఖాస్తులు త్వరగా పరిష్కారమయ్యే అవకాశాలున్నాయి. పది రోజుల్లో పరిశీలన బాధిత కుటుంబ సభ్యులు అన్ని పత్రాలు జతచేసి ఎంపీడీఓ, పుర, నగరపాలక సంస్థ కార్యాలయాల్లో అందించిన పది రోజుల వ్యవధిలో అధికారులు విచారణ పూర్తి చేసి ఉన్నతాధికారులకు నివేదికలు సమర్పించాలి. గతంలో రెవెన్యూ శాఖ పరిధిలో ఉండటంతో క్షేత్ర స్థాయి విచారణలో జాప్యం చోటు చేసుకునేది. సమస్యను గుర్తించిన ప్రభుత్వం తాజా మార్పునకు నిర్ణయించటంతో వేగంగా నిధులు మంజూరయ్యే అవకాశం ఉంది. జత చేయాల్సిన పత్రాలు కుటుంబాన్ని పోషించే 18 నుంచి 60 ఏళ్ల లోపు వ్యక్తి ఆకస్మికంగా మరణిస్తే వారు గ్రామాల్లో అయితే పంచాయతీ కార్యాలయాలు, పట్టణాల్లో పురపాలికల్లో దరఖాస్తు చేసుకోవాలి. సంబంధిత అధికారులు క్షేత్ర స్థాయిలో విచారణ చేపట్టి మంజూరుకు సిఫార్సు చేస్తే ఎవరి ప్రమేయం లేకుండా నిధులు నేరుగా బాధితుల బ్యాంకు ఖాతాల్లో జమవుతాయి. 2017, ఏప్రిల్ 13 తర్వాత మరిణించిన వారి కుటుంబ సభ్యులు దీనికి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. -
కనులపండువగా నర్సింహస్వామి రథోత్సవం
మాగనూర్: మండల కేంద్రంలో కొనసాగుతున్న శ్రీలక్ష్మీనర్సింహాస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం తెల్లవారుజామున రథోత్సవ వేడుకలు కనులపండువగా నిర్వహించారు. ముందుగా స్వామివారికి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం రథంలో ఉత్సవ విగ్రహాలను పల్లకీ ఉంచి, అర్చకుల వేదమంత్రాలు, భాజాభజంత్రీల మంగళ వాయిద్యాలతో భక్తులు రథం ముందుకు లాగారు. ఉత్సవాలను తిలకించేందుకు మహారాష్ట్ర, కర్ణాటక, హైదరాబాద్, సోలాపూర్ తదితర ప్రాంతాల నుంచి వేలాదిగా తరలివచ్చారు. మంత్రి వాకిటి శ్రీహరి హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అర్చకులు మంత్రికి తీర్థప్రసాదాలు అందించి, ఆశీర్వదించారు. పాల ఉట్ల ఉత్సవం.. సాయంత్రం పాల ఉట్ల ఉత్సవం నిర్వహించగా.. యువకులు ఉట్ల స్తంభాన్ని ఎక్కేందుకు పోటీ పడ్డారు. చివరికి గ్రామానికి చెందిన పాలట్ల బులిమేని నరేష్ ఉట్ల స్తంభంపైకి ఎక్కారు. జాతర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటలు జరగకుండా ఎస్ఐ పి.అశోక్‌బాబు ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్త్ ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఆల య కమిటీ సభ్యులు రమేష్‌గౌడ్, డబ్బ కృష్ణయ్య, భరత్‌కూమార్, గ్రామపెద్దలు వాకిటి శ్రీనివాస్, ఆనంద్‌గౌడ్, నరేష్, కృష్ణయ్య, సత్యప్ప, ఆనంద్, చక్రపాణిరెడ్డి, ఉజ్జెల్లి కృష్ణయ్య, వెంకటయ్య, చెన్నప్ప యువకులు తదితరులు పాల్గొన్నారు. -
అడవి ‘బయటికి’ బిడ్డలు
సాక్షి, నాగర్‌కర్నూల్: నల్లమల అటవీ ప్రాంతంలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ కోర్ ఏరియా పరిధిలో నివశిస్తున్న చెంచులు, గిరిజనులను అడవి నుంచి బయటకు తరలించేందుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. మొదటి విడతలో కొల్లంపెంట, తాటిగుండాల చెంచు పెంటల్లోని స్థానికులను అడవి బయటకు తరలించి పునరావాసం కల్పించాలని అధికారులు నిర్ణయించారు. రెండో విడతలో సార్లపల్లి, కుడిచింతల్‌బైల్, వటువర్లపల్లి గ్రామాల ప్రజల రీలొకేషన్ ప్రక్రియ చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించి ఆయా గ్రామాల ప్రజల నుంచి కుటుంబాల వారీగా ఎంవోయూ ఒప్పందాలను అటవీ అధికారులు పూర్తిచేస్తున్నారు. సంఘర్షణ నిర్మూలన కోసం.. అటవీ ప్రాంతంలోని పులులు, వన్యప్రాణులతో అక్కడే నివశిస్తున్న మనుషులకు మధ్య ఘర్షణ, దాడులను నివారించేందుకు, వన్యప్రాణుల సంరక్షణ కోసం నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (ఎన్టీసీఏ) పునరావాస ప్యాకేజీని అందిస్తోంది. ఇందులో భాగంగా నిర్వాసిత కుటుంబానికి రూ.15 లక్షల ఆర్థిక సహాయం లేదా 5 ఎకరాల భూమిని అందిస్తుంది. ఈ రెండింటిలో ఏదైనా ప్యాకేజీని ఎంచుకుని పరిహారం పొందవచ్చు. పునరావాస ప్యాకేజీ కోసం ఒప్పుకొంటున్న కుటుంబాలతో అటవీ అధికారులు ఎంవోయూ ఒప్పందాలను చేయిస్తున్నారు. ఇప్పటి వరకు సార్లపల్లి, కుడిచింతల్‌బైల్, కొల్లంపెంట, తాటిగుండాల గ్రామాల్లో మొత్తం 96 వరకు చెంచు కుటుంబాలు పునరావాస ప్రక్రియను అనుకూలంగా ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఆయా గ్రామాల్లోనూ కొంతమంది చెంచులు ఈ రీలొకేషన్ ప్రక్రియను వ్యతిరేకిస్తున్నారు. అయితే అధికారులు మాత్రం స్వచ్ఛందంగా ముందుకు వస్తేనే ప్రక్రియ చేపడతామని చెబుతున్నారు. పరిహారం అందితేనే రీలొకేషన్‌కు.. నిర్వాసితులకు ఎన్టీసీఏ తరపున పూర్తిస్థాయిలో ప్యాకేజీతోపాటు పునరావాసం కల్పించిన తర్వాతే తాము అడవిని వీడుతామని స్థానికులు స్పష్టం చేస్తున్నారు. ఏళ్లుగా అడవినే నమ్ముకున్న తాము బయటకు వెళ్లి బతికేందుకు అవసరమైన జీవనోపాధి కల్పించాలని, ఇందుకు భరోసా కల్పించాలని కోరుతున్నారు. రీలొకేషన్ ప్రక్రియలో భాగంగా చేపట్టాల్సిన పునరావాస ప్రక్రియ పూర్తయిన తర్వాతే తాము అడవి నుంచి బయటకు వెళ్తామని తేల్చి చెబుతున్నారు. స్పష్టత కరువు నల్లమల నుంచి చెంచులు, స్థానికుల తరలింపు ప్రక్రియలో పునరావాస ప్రక్రియ కీలకంగా మారనుంది. అడవి నుంచి బయటకు వెళ్లేందుకు అంగీకరించిన వారికి పూర్తిస్థాయిలో పునరావాసం కల్పించాల్సి ఉంది. ఇందుకోసం జిల్లాలోని పెద్దకొత్తపల్లి మండలం బాచారంలోని ఫారెస్ట్ భూముల్లో పునరావాస కాలనీలను ఏర్పాటు చేయనున్నారు. అయితే ఈ ప్రక్రియ ఎంతకాలంలో చేపడతారన్న దానిపై స్పష్టత కరువైంది. నల్లమలలో చెంచుపెంటల తరలింపు ప్రక్రియ వేగవంతం మొదటి విడతలో కొల్లంపెంట, తాటిగుండాల చెంచుపెంటలు మలివిడతలో సార్లపల్లి, కుడిచింతల్‌బైల్, వటవర్లపల్లి గ్రామాల రీలొకేషన్ స్వచ్ఛందంగా ముందుకొస్తున్న వారితో కొనసాగుతున్న ఒప్పందాలు పునరావాస ప్రక్రియే కీలకం.. పూర్తిస్థాయి పరిహారం అందించాలంటున్న స్థానికులు -
అహంకార ధోరణి వీడి ప్రజాసేవ చేయాలి
● కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ● కేసీఆర్‌కు పట్టిన గతే రేవంత్‌కు తప్పదు నారాయణపేట రూరల్: అహంకార ధోరణితో పాలన సాగించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పట్టిన గతే 2028 ఎన్నికల్లో ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డికి పడుతుందని కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి జోస్యం చెప్పారు. హైదరాబాద్‌లో ఈ నెల 10న ప్రధాని నరేంద్రమోదీ పాల్గొననున్న బహిరంగ సభకు సంబంధించి జిల్లా కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో శనివారం సన్నాహాక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ.. రాజకీయాల్లో మహిళా చైతన్యాన్ని పెంపొందించేందుకు బీజేపీ ప్రయత్నిస్తుంటే కాంగ్రెస్ అడ్డుకోవడం బాధాకరమన్నారు. 33 శాతం మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడానికి కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు కారణమని విమర్శించారు. నెహ్రూ కుటుంబంలోని మహిళలు కాంగ్రెస్ పార్టీని శాసించవచ్చు కానీ.. సాధారణ మహిళలు కనీసం ప్రజాప్రతినిధులుగా పనిచేయుటకు అనర్హులుగా చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు. కేంద్రం నిధులతోనే.. రాష్ట్రాభివృద్ధికి ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అధికంగా నిధులు మంజూరు చేస్తుంటే.. రాష్ట్ర పాలకులు అసెంబ్లీ వేదికగా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇప్పటికే 12 గ్రీన్ ఫీల్డ్, రూ.85 వేల కోట్ల రైల్వే లైన్, రెండు ఎయిర్‌పోర్టులు, యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ రైలు పొడిగిస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇవేమి కనపడవన్నారు. ఎలాంటి అనుభవం లేకుండా ముఖ్యమంత్రి కుర్చీపై కూర్చున్న రేవంత్‌రెడ్డికి పాలన ఎలా చేయాలో తెలియడం లేదని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌పై ఉన్న వ్యతిరేకతతోనే ప్రజలు కాంగ్రెస్‌కు పట్టం కట్టారు తప్పా.. అభిమానంతో కాదన్నారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు కొండా సత్యాయాదవ్, రాష్ట్ర నాయకులు నాగురావు నామాజీ, రతంగపాండురెడ్డి, కొండయ్య, మున్సిపల్ చైర్పర్సన్ శ్వేత, జిల్లా నాయకులు శ్రీనివాసులు, లక్ష్మీకాంత్, లహోటి, బలరాంరెడ్డి, తిరుపతిరెడ్డి, సాయిబన్న, వినోద్, కిరణ్ పాల్గొన్నారు. -
‘అర్హులకే సంక్షేమ పథకాలు అందాలి’
నారాయణపేట: అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి అర్హులందరికీ సంక్షేమ పథకాల్లో లబ్ధి చేకూర్చాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను సూచించారు. జిల్లా కేంద్రంలోని అంజనా గార్డెనన్స్‌లో శనివారం ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణలో భాగంగా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో కొత్తగా ఎన్నికై న 272 మంది సర్పంచులు, 72 మంది మున్సిపల్ కౌన్సిలర్లులో ప్రజా విశ్వాసాన్ని నిలబెట్టేలా పనిచేయాలని సూచించారు. జిల్లాలో మార్చి 6 నుంచి ఇప్పటి వరకు 10 అంశాలతో వివిధ కార్యక్రమాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఏప్రిల్ 2న జిల్లావ్యాప్తంగా అన్ని పంచాయతీలు, మున్సిపాలిటీల్లో గ్రామ, వార్డు సభలు నిర్వహించుకున్నామని, 12న మండల స్థాయిలో, శనివారం రోజు నియోజకవర్గ స్థాయిలో, ఈ నెల 26న జిల్లా స్థాయిలో, జూన్ 2న రాష్ట్రస్థాయిలో ప్రజాపాలన కార్యక్రమం ఉంటుందన్నారు. 160 కొనుగోలు కేంద్రాలు జిల్లాలో వరి ధాన్యం సేకరణకు 160 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని, రైతులు దళారులను ఆశ్రయించి తక్కువ ధరకు ధాన్యం అమ్ముకోవద్దని అదనపు కలెక్టర్ సూచించారు. ఈ నెల 11 నుంచి జూన్ 9 వరకు జనగణన కొనసాగుతుందని, ఎమ్యూనరేటర్లకు సమాచారం అందించి సహకరించాలని కోరారు. జిల్లాలో ఈ ఏడాది పదో తరగతి పరీక్షా ఫలితాలు మెరుగ్గా వచ్చాయని హర్షం వ్యక్తం చేశారు. మక్తల్ నియోజకవర్గంలోని గొల్లపల్లి శివారులో, నారాయణపేట మండలంలోని లింగంపల్లి వద్ద 20 ఎకరాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం పలువురు చేనేత కార్మికులకు చెక్కులు పంపిణీ చేశారు. అంతకుముందు నోడల్ అధికారి రాజేందర్‌గౌడ్ సీఎం రేవంత్‌రెడ్డి సందేశాన్ని ప్రజలకు చదివి వినిపించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ కొండా శ్వేత, వైస్ చైర్పర్సన్ మంజుల, మార్కెట్ కమిటీ చైర్మన్ సదాశివారెడ్డి, జెడ్పీ సీఈఓ శ్రీనివాస్‌రావు, ఆర్టీఓ మేఘా గాంధీ, సీపీఓ ఖాఘవాహన్, మున్సిపల్ కమిషనర్ శంకర్, తహసీల్దార్లు అమరేందర్ కృష్ణ, తిరుపతయ్య, సింధూజ, రాంకోటి తదితర అధికారులు పాల్గొన్నారు. -
జీవనోపాధి కావాలి..
ఏళ్లుగా అడవిని నమ్ము కుని బతుకుతున్నాం. ఇ ప్పుడు ఖాళీ చేయాలంటున్నారు. ప్రభుత్వం త రపున పరిహారం ఇస్తా మని చెబుతున్నారు. కానీ ఎప్పుడు జరుగుతుందన్నది చెప్పడం లేదు. ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయిలో పరిహారం అందించి రీలొకేషన్ చేపట్టాలి. – పోషప్ప, కుడిచింతల్‌బైల్, అమ్రాబాద్పరిహారం ఇస్తేనే వెళ్తాం.. అడవి నుంచి బయటకు వెళ్తే పరిహారం ఇస్తామని, జీవనోపాధి కల్పిస్తామని చెబుతున్నారు. పిల్లలకు చదువు, వైద్యం, కుటుంబాలకు ఆదాయంతో అభివృద్ధి చెందుతామని భావిస్తున్నాం. పరిహారం త్వరగా ఇచ్చిన తర్వాతే మమ్మల్ని బయటకు తరలించాలి. – మండ్ల అంజయ్య, తాటిగుండాలపెంట బలవంతం లేదు.. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ కోర్ ఏరియా పరిధిలో ఉన్న స్థానికులను అడవి నుంచి మైదాన ప్రాంతాలకు రీలొకేషన్ చేపట్టే ప్రక్రియ కొనసాగుతోంది. స్వచ్ఛందంగా ముందుకు వస్తున్న వారితోనే ఎంవోయూ చేసుకుంటున్నాం. ఎన్టీసీఏ తరపున అందించే ప్యాకేజీ వివరాలను వారికి వివరిస్తున్నాం. పూర్తిస్థాయిలో పరిహారం అందించాక పునరావాస ప్రక్రియ చేపడతాం. – రేవంత్‌చంద్ర, ఐఎఫ్ఎస్ అధికారి, డీఎఫ్ఓ -
3 నెలలకోసారి ఉద్యోగ మేళాలు
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: ప్రతి ఉమ్మడి జిల్లాలో మూడు నెలలకోసారి ఉద్యోగ మేళా నిర్వహిస్తామని రాష్ట్ర పశు సంవర్ధక, క్రీడలు, యువజన శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’లో భాగంగా శుక్రవారం నగరంలోని శిల్పారామంలో మెగా జాబ్‌మేళాను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. విద్యారంగం పటిష్టత, యువతకు ఉద్యోగావకాశాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందన్నారు. గురుకులాలు, వసతి గృహాల్లో మెరుగైన సౌకర్యాల కోసం మెస్, కాస్మొటిక్ చార్జీలను పెంచి విద్యార్థులకు నాణ్యమైన విద్యనందిస్తున్నామన్నారు. గత పదేళ్లుగా నిలిచిపోయిన ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులను పునఃప్రారంభించి సుమారు 25 వేల మందికి ప్రయోజనం కల్పించామన్నారు. పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతను అధిగమించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. యువతకు కేవలం ప్రభుత్వ ఉద్యోగాలకే పరిమితం కాకుండా ప్రైవేట్ రంగంలోనూ విస్తృత అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా జాబ్‌మేళాలు నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటికే 1.30 కోట్ల మంది యువత వివిధ ఉద్యోగాల కోసం ఆన్లైన్లో నమోదు చేసుకున్నారని, వారికి అవకాశాలు కల్పించేందుకు 2,200 ప్రైవేట్ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నామన్నారు. ముఖ్యంగా సెట్విన్, టాస్క్ ద్వారా నైపుణ్య శిక్షణ ఇప్పిస్తూ, యువతను ఉద్యోగ యోగ్యులుగా తీర్చిదిద్దుతున్నామన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నుంచి 24,680 మంది అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా ఈ జాబ్‌మేళాలో నమోదు చేసుకున్నారని చెప్పారు. ● ఉద్యోగార్థులకు డిగ్రీ సర్టిఫికెట్లు మాత్రమే కాకుండా ప్రొఫెషనల్ స్కిల్స్ కూడా అవసరమని మహబూబ్‌నగర్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ముఖ్యంగా టెక్నాలజీ పరిజ్ఞానం, ప్రాక్టికల్ అనుభవం ఉద్యోగ సాధనలో ఎంతో కీలకమని పేర్కొన్నారు. జిల్లాలో మహిళలకు ప్రత్యేక నైపుణ్య శిక్షణ ఇప్పిస్తున్నామని, కంప్యూటర్ కోడింగ్, ఫ్యాషన్ డిజైన్, బ్యూటీషియన్ కోర్సులను అందుబాటులోకి తెచ్చామన్నారు. ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ ప్రాజెక్టు ద్వారా భవిష్యత్‌లో పెద్దఎత్తున ఉద్యోగాలు లభిస్తాయన్నారు. ● 99 రోజుల కార్యాచరణలో భాగంగా పది థీమ్‌లను నిర్ణయించి కార్యక్రమాలు చేపడుతున్నామని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి అన్నారు. యూత్ సర్వీసెస్ థీమ్ కింద ఈ జాబ్‌మేళా నిర్వహించడం గొప్ప నిర్ణయమన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 70 వేల ఉద్యోగాలు కల్పించామని, ఈ మేళాలో 105 కంపెనీలు పాల్గొనడమే గాక 3,500 ఉద్యోగాలు అందుబాటులో ఉంచాయన్నారు. ఎంపికై న అభ్యర్థులకు ఈ నెల 23న ఆయా జిల్లాల కలెక్టర్ల ద్వారా నియామక పత్రాలు అందజేస్తారన్నారు. నియామక పత్రాల అందజేత ఇంటర్వ్యూలలో ఎంపికై న సుమారు పది మంది అభ్యర్థులకు మంత్రి వాకిటి శ్రీహరి నియామక పత్రాలు అందజేశారు. కాగా, వీరిలో దేవరకద్రకు చెందిన గాయత్రి, జడ్చర్లకు చెందిన చంద్రకాంత్‌కు ఏడాదికి రూ.3 లక్షల చొప్పున, నారాయణపేట వాసి విష్ణుమూర్తికి రూ.2.05 లక్షల చొప్పున ప్యాకేజీ లభించనుంది. కార్యక్రమంలో ఎమ్మెల్సీ, శాసన మండలిలో చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి, రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లాకొత్వాల్, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, వైస్ చైర్మన్, ఎండీ ఎ.సోని బాలాదేవి, టాస్క్ సీఈఓ నితిన్‌కుమార్‌రెడ్డి, కలెక్టర్ కుష్బూ గుప్తా, అదనపు కలెక్టర్లు హరిప్రియ, మధుసూదన్‌నాయక్, పరిశ్రమల శాఖ జీఎం యాదయ్య, డీవైఎస్ఓ రాజశేఖర్‌రెడ్డి, మూడా చైర్మన్ కె.లక్ష్మణ్‌యాదవ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ బెక్కరి అనిత, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర పశుసంవర్ధక, క్రీడలు, యువజన శాఖ మంత్రి వాకిటి శ్రీహరి మెగా జాబ్‌మేళాలో పాల్గొన్న 105 కంపెనీలు ఉమ్మడి జిల్లా నుంచి 3,450 మంది నిరుద్యోగుల హాజరు -
చెత్త‘శుద్ధి’ ఎక్కడ?
టన్నుల కొద్ది చెత్త సేకరిస్తున్నా.. నిర్వహణ కరువు ● తడి, పొడి చెత్తను వేరు చేయడంలో నిర్లక్ష్యం ● విలీన గ్రామాల్లో పరిస్థితి మరింత అధ్వానం ● పేట డంపింగ్‌యార్డులో షార్ట్ సర్క్యూట్‌తో దగ్ధమైన చెత్త –8లో uమక్తల్ పట్టణంలో డ్రెయినేజీలను శుభ్రం చేయ డం లేదు. చెత్తాచెదారం పేరుకుపోయి దుర్గంధం వెదజల్లుతోంది. దీంతో దోమల వ్యాప్తి పెరిగి ప్రజ లు రోగాల బారిన పడుతున్నారు. అధికారు లు మాత్రం తమకేమి పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. రోడ్లపైన చెత్తాచెదారం కుప్పలుగా ఉన్నా దాన్ని తొలగించే నాథుడే కరువయ్యా డు. అధికారులు చెత్త నిర్వహణ సక్రమంగా చేపట్టి ప్రజలకు ఉపశమనం కలిగించాలి. – కుర్వ వెంకటేష్, మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో ఇంటింటా సేకరిస్తున్న చెత్తను ఆటోలు, ట్రాక్టర్ల ద్వారా డంపింగ్‌యార్డుకు తరలిస్తున్నాం. విధి నిర్వ హణలో కార్మికులుఎలాంటి నిర్లక్ష్యం చేయడం లేదు. డ్రెయినేజీలు శుభ్రం చేసిన చెత్తాచెదారాన్ని ఎత్తి వాహనాల్లో డంపింగ్‌యార్డుకు తీసుకెళ్తున్నారు. ఎక్కడైనా చిన్న చిన్ని పొరబాట్లు జరిగితే వెంటనే పరిష్కరిస్తాం. – గోల్కొండ నరసయ్య, ఇన్చార్జి కమిషనర్, మక్తల్ నారాయణపేట: జిల్లాలోని ఏ మున్సిపాలిటీలో చూసిన చెత్త ‘శుద్ధి’పై అధికారుల అలసత్వం.. పాలకుల నిర్లక్ష్యం స్పష్టంగా కనపడుతోంది. మున్సిపల్ అధికారుల, సిబ్బంది పర్యవేక్షణ లేకపోవడంతో డంపింగ్ యార్డుల వద్ద చెత్త పేరుకుపోయి దుర్గంధభరితంగా మారుతున్నాయి. డంపింగ్ యార్డుల సమీపంలో ఉండే పంట పొలాలకు చెత్త కొట్టుకుపోవడం, దుర్గంధంతో అన్నదాతలకు తిప్పలు తప్పడం లేదు. పట్టణాల్లోని వివిధ కాలనీల్లో సేకరించిన చెత్తను ఆటో డ్రైవర్లు కొన్నిసార్లు రోడ్డుపైనే ఎక్కడపడితే అక్కడ పడేస్తున్న దాఖలాలు ఉన్నాయి. మక్తల్, కోస్గి, మద్దూర్ మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాల్లో వారానికి రెండుసార్లే చెత్త సేకరిస్తున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డంప్‌యార్డులు ఉన్నా.. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీ పరిధిలో చెత్తను వేసేందుకు డంప్‌యార్డులు ఉన్నా నిర్వహణ లోపం, నిధుల కొరతతో చెత్త శుద్ధి చేయడంలో అధికారులు ఒక అడుగు ముందుకు.. పది అడుగులు వెనక్కి వేస్తున్నారు. మున్సిపాలిటీలోని అన్ని వార్డులు, విలీనమైన గ్రామాల నుంచి తెచ్చిన తడి, పొడి చెత్తను వేరు చేసేందుకు నానా అవస్థలు పడుతున్నారు. అధికారుల పర్యవేక్షణ కరవు మున్సిపాలిటీలో చెత్తను రోడ్లపై, బహిరంగ ప్రదేశాల్లో వేస్తే రూ.5 వేల జరిమానా విధిస్తామని ప్రజలను హెచ్చరిస్తూ మున్సిపల్ అధికారులు ఫ్లెక్సీలు పెడుతున్నారు. కానీ చెత్త నిర్వహణపై మాత్రం కమిషనర్ ఎలాంటి సమీక్ష నిర్వహించడం లేదు. దీంతో చెత్తలో పందికొక్కులు, కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. పంచాయతీలో ఉన్నప్పుడు అన్ని సేవలు పొందిన విలీన గ్రామాల ప్రజలకు మున్సిపాలిటీగా మారడంతో కొత్తగా సమస్యలు వస్తున్నాయి. చెత్తతో రోగాలు వ్యాప్తి చెందుతాయని ఆందోళన చెందుతున్నారు. షార్ట్‌సర్క్యూట్‌తో.. జిల్లా కేంద్రంలోని డంపింగ్‌యార్డు సమీపంలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ వద్ద గత నెల 21న షార్ట్‌సర్క్యూట్ కారణంగా నిప్పురవ్వలు చెత్తపై పడడంతో మంటలు చెలరెగాయి. ఫైర్ ఇంజన్లు వచ్చి ఆర్పినా ఇంత వరకు చెత్త కుప్పల మంటలు పూర్తిగా ఆరలేదు. పొగలు వస్తూనే ఉన్నాయి. ఘటన జరిగిన రోజు అటువైపు వెళ్లిన మున్సిపల్ అధికారులు, పాలకులు మళ్లీ కన్నెత్తి చూడటం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. చెత్తను కాలిపోవడంతో పొగ వ్యాప్తి పెరిగింది. దీంతో పారిశుద్ధ్య కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురువుతున్నారు. రోడ్ల పక్కనే.. నారాయణపేట నుంచి పగిడిమారి పోయే రహదారిలో శ్మశాన వాటిక సమీపంలోని బ్రిడ్జి వద్ద రోడ్డు పక్కనే చెత్తను డంపు చేస్తుండడంతో పరిసరాలు దుర్గంధంగా మారాయి. దీంతో వాహనదారులు, ప్రయాణికులు ముక్కు మూసుకొని వెళ్లే పరిస్థితి దాపురించింది. డంపింగ్‌యార్డులో చెలరేగిన మంటలను పూర్తి స్థాయిలో ఆర్పేందుకు చర్యలు చేపట్టి.. పట్టణంలో సేకరించిన చెత్తను డంపింగ్‌యార్డుకు తరలించాలని ప్రజలు కోరుతున్నారు. మున్సిపాలిటీ మక్తల్ నారాయణపేట మద్దూర్ కోస్గి నివాస గృహాలు 6950 8280 3,889 6,466 దుకాణాలు 630 1280 566 435 రోజు చెత్త సేకరణ 4.5 టన్నులు 20 టన్నులు 0.3 టన్నులు 3.5 టన్నులు నెలకు చెత్త సేకరణ 130 టన్నులు 600 టన్నులు 9.5టన్నులు 105టన్నులు ఆటోలు 8 14 01 06 ట్రాక్టర్లు 2 06 03 02 పారిశుద్ధ్య కార్మికులు 41 84 35 70 -
‘ఇందిరమ్మ కలలను సాకారం చేద్దాం’
ఊట్కూర్: ఇందిరమ్మ కలలను సాకారం చేసేందుకు కృషి చేస్తానని యువజన క్రీడల మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. శుక్రవారం మండలంలోని ముగ్దుంపూర్‌లో ఇందిరమ్మ గృహ ప్రవేశ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మోనప్ప దంపతులను సన్మానించారు. అనంతరం మాట్లాడుతూ.. సొంతిల్లు లేని నిరుపేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తుందన్నారు. ప్రభుత్వం అందించే రూ.5 లక్షలతో ఎంతోమంది నిరుపేదలు ఇంటి నిర్మాణం పూర్తి చేసుకొని గృహప్రవేశాలు చేపట్టడం సంతోషకరంగా ఉందన్నారు. గత ప్రభుత్వం పదేళ్ల కాలంలో ఏ ఒక్కరికీ కూడా ఇళ్లను మంజూరు చేసిన పాపాన పోలేదని దుయ్యబట్టారు. గ్రామాల్లో ఇల్లు లేని వాళ్లే ఉందకూడదని, విడతల వారీగా అర్హులందరికీ ఇళ్లు మంజూరు చేద్దామని భరోసానిచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్ తిరుమలేష్, యజ్ఞేశ్వర్‌రెడ్డి, ఎల్కోటి జనార్దన్‌రెడ్డి, సూర్యప్రకాష్‌రెడ్డి, కోరం మహేష్‌రెడ్డి, రవికుమార్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. -
నీరు ఎక్కువగా తాగాలి..
ఎండల తీవ్రత కారణంగా వడదెబ్బ తగలకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించాలి. లవణాలతో కూడిన నీరు, పండ్ల రసాలు, కొబ్బరినీళ్లు అధికంగా తీసుకోవాలి. ఓఆర్ఎస్ పాకెట్లు అందుబాటులో ఉంచుకోవాలి. తప్పనిసరి పరిస్థితుల్లో ఎండలో బయటకు వెళ్లాల్సి వస్తే తాగునీటిని వెంట తీసుకెళ్లాలి. వంట గదులు చల్లగా ఉండేలా చూసుకోవాలి. ప్రతి 30 నిమిషాలకు అర లీటరు నీటిని తాగుతూ ఉండాలి. – డాక్టర్ స్వరూప్, జనరల్ మెడిసిన్, మహబూబ్‌నగర్ పాలమూరులో నిర్మానుష్యంగా మారిన రోడ్ -
భానుడి విలయతాండవం
పాలమూరు: రోజురోజుకూ భానుడు విలయతాండవం చేస్తున్నాడు. ఉమ్మడి పాలమూరు వ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో ప్రజలు ఎండ వేడిమిని తట్టుకోలేకపోతున్నారు. మార్చి రెండో వారం నుంచే వేసవి ఉష్ణోగ్రతల్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి. దీంతో మే నెలలో పరిస్థితి ఎలా ఉంటుందోనని జనం ఆందోళన చెందినట్లుగానే భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. గతేడాది మార్చి, ఏప్రిల్, మే నెలలతో పోలిస్తే ఈసారి ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. సాయంత్రం వరకు ఎండలు ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా.. అర్ధరాత్రి తర్వాత చల్ల గాలులు కొంత ఉపశమనం కలిగిస్తున్నాయి. మే నెల మొదటి వారం నుంచే ఎండల తీవ్రత పెరిగి అర్ధరాత్రి వరకు ఉక్కపోత పరిస్థితులు కొనసాగుతాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఏటా రెండు డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని పరిశోధకుల హెచ్చరించిన విధంగానే మార్పును ప్రజలు అనుభవించారు. ఊపిరాడనంత కష్టం వారం రోజులుగా ఎండల తీవ్రతకు ఊపిరి కూడా ఆడడం లేదని పలువురు వాపోతున్నారు. ఉమ్మడి పాలమూరు వ్యాప్తంగా దాదాపు ఎండ వేడిమి అధికంగా ఉంటోంది. ఇలాంటి పరి స్థితుల్లో వేడెక్కిన ఉపరితలాల నుంచి వెలువడే వా యువులు ఇక్కడే తిరుగుతుంటాయి. ఇందులో కర్బన వాయు వుల మోతాదు అధికంగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో పచ్చని చెట్ల కింద సేదతీరితేనే కొంత ఉపశమనం కలుగుతుందని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు. శరీర నియంత్రణ వ్యవస్థ దెబ్బతింటుంది. విపరీతమైన దాహాం, శరీరం వేడెక్కుతుంది. తలనొప్పి, కళ్లు తిరగడం, ఒళ్లు తూలడం, వాంతులు, కాళ్లు, కండరాలు పట్టేసి నొప్పిగా ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి జాగ్రత్తలు ఇలా.. వడదెబ్బ లక్షణాలున్న వెంటనే బాధితుడిని చల్లని ప్రదేశానికి చేర్చాలి. చల్లని నీరు ముఖంపై చిలకరించాలి కూలర్ లేదా ఏసీల వద్ద విశ్రాంతి తీసుకునేలా ఏర్పాటు చేయాలి. చల్లని నీరు లేదా ఐస్ ముక్కలతో నుదురు, శరీరంపై తుడవాలి. అరచేయి, కాళ్లకు రక్తప్రసరణ మెరుగుపడేలా రుద్దాలి. వీలైనంతా వేగంగా వైద్యులను సంప్రదించాలి. ఉమ్మడి పాలమూరులో తీవ్రమవుతున్న ఎండలు రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ఉక్కపోతతో చిన్నారులు, వృద్ధుల ఉక్కిరి బిక్కిరి ముందస్తు జాగ్రత్తలతోనే వడదెబ్బ నివారణ చల్లని చెట్లతో ఉపశమనం అంటున్న వైద్య నిపుణులు ఉమ్మడి జిల్లాలో ఎండల ప్రభావంతో ఏటా వడదెబ్బ మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే జిల్లాలో 20 మంది వరకు మృతిచెందారు. ఎండలో పనిచేసే వారు వడదెబ్బకు గురయ్యే అవ కాశం ఎక్కువగా ఉంటుంది. శరీర ఉష్ణోగ్రత 106 డిగ్రీల ఫారెన్ హీట్ దాటితే వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉంటుంది. కళ్లు తిరగడం, తీవ్రమైన తలనొప్పి, గుండె దడ, చెమట ఎక్కువగా రా వడం కిడ్నీలు దెబ్బతినడం, ఫిట్స్ రావడం తదితర లక్షణాలు బయ టపడతాయి. ఒక్కోసారి కోమాలోకి సైతం వెళ్లొచ్చు. శరీరంలో ప్రొటీన్ స్థాయిలు తగ్గి అవయవాలు పనిచేయడం ఆగిపోతాయి. కాబట్టి వీలైనంత వరకు శరీర ఉష్ణోగ్రత మాములు స్థితిలో ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులకు వేడిగాలులు తగిలినా వడదెబ్బ సోకే ప్రమాదం ఉంది. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున గర్భిణులు మరింత జాగ్రత్తగా ఉండాలి. శరీరం నిర్జలీకరణం కాకుండా ఎప్పటికప్పుడు ద్రవ పదార్థాలు అధికంగా తీసుకోవాలి. తాగునీటిలో ఉప్పు లేదా చక్కెర వేసుకొని తాగాలి. ఎండల తీవ్రతకు గర్భస్రావమయ్యే అవకాశాలు, తొమ్మిది నెలలు నిండిన వారికి కడుపులో బిడ్డ చనిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఎండల కారణంగా ఐదో నెల నుంచి గర్భంలో బిడ్డ కదలికలు తగ్గుతాయి. వేసవిలో గర్భిణులు బయటకు వెళ్లకపోవడం మంచిది. మాంసాహారం, మసాలా దినుసులు, నూనె పదార్థాలు అధికంగా వాడరాదు. బాలింతలు గదిలో ఫ్యాన్‌ను తక్కువ వేగంతో పెట్టుకోవాలి. కీరదోస, పుచ్చకాయ లాంటి తాజా పండ్లు తీసుకోవడం ఉత్తమం. – డాక్టర్ ప్రతిభ, సీ్త్ర వైద్యనిపుణురాలు మహబూబ్‌నగర్ -
సర్వే.. సాధ్యమేనా?
లైసెన్స్డ్ సర్వేయర్ల విధులు, జీతభత్యాలపై స్పష్టత కరువు –8లో uనర్వ: భూభారతి అమలులో భాగంగా భూ రికార్డుల ప్రక్షాళన, సర్వే వ్యవస్థ బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం పరీక్ష ద్వారా లైసెన్స్డ్ సర్వేయర్లను నియమించింది. శిక్షణ పొంది లైసెన్స్‌లు అందుకున్న సర్వేయర్లకు మండలాలు కేటాయించినా.. విధులు, జీతభత్యాలపై స్పష్టత లేకపోవడంతో అయోమయ పరిస్థితి నెలకొని చాలామంది ఉద్యోగాల్లో చేరడం లేదు. జిల్లాలో వేలాది భూ దరఖాస్తులు సర్వేతో ముడిపడి ఉండగా.. సర్వేయర్ల కొరతతో పరిష్కారం కావడం లేదు. జిల్లాలో 74 మంది.. జిల్లాలో 74 మంది సర్వేయర్లను ఎంపిక చేసి గతేడా ది డిసెంబర్లో మండలాలను కేటాయిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. రెండు నెలల కిందట హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా వారికి లైసెన్సులు అందజేశారు. కానీ చాలామంది సర్వేయర్లు విధుల్లో చేరకపోవడంతో వీరికి రెండేళ్లు గడువు ఇచ్చారు. రైతుల ఎదురుచూపులు.. సర్వేతో ముడిపడిన వేలాది దరఖాస్తులు తహసీల్దార్ కార్యాలయాల్లో పేరుకుపోయాయి. ఓ రైతుకు చెందిన భూమి మరోరైతు దున్నుకోవడం, ఎత్తిపోతల పథకాలు, సాగునీటి కాల్వల్లో భూమి కోల్పోకపోయినా తొలగించడం, భూమి ఉన్నా పట్టాదారు పాసు పుస్తకాల్లో నమోదు కాకపోవడం వంటి కారణాలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. సర్వే కోసం దరఖాస్తు చేసుకొని నెలల తరబడి తిరుగుతున్నా సర్వేయర్లు రావడం లేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్వేయర్లు విధుల్లో చేరితేనే దరఖాస్తులు త్వరగా పరిష్కారమవుతాయని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి లైసెన్స్డ్ సర్వేయర్లు విధుల్లో చేరేలా చూడాలని అన్నదాతలు కోరుతున్నారు. జిల్లాకు 74 మంది కేటాయింపు గతేడాది డిసెంబర్లో ఉత్తర్వులు జారీ విధుల్లో చేరేందుకు ఆసక్తి చూపని వైనం వేలాది భూ దరఖాస్తులు పెండింగ్ ఉద్యోగ భద్రత కల్పించకపోవడం. సర్వే కోసం రైతు చెల్లించిన రుసుంలో 70 శాతం కమీషన్ విడతల వారీగా చెల్లిస్తామనడం. కనీస వేతనం ప్రకటించకపోవడం. గ్రామంలో సర్వే పూర్తిచేస్తే రూ.20 వేలు చెల్లిస్తామని చెప్పడం. ఉద్యోగ భద్రత, విధులు, జీతభత్యాలపై స్పష్టత వస్తేనే ఉద్యోగాల్లో చేరుతామని సర్వేయర్లు చెబుతున్నారు. పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో సర్వేయర్లకు నెలకు రూ.24 వేలు చెల్లిస్తున్నారని.. తమకు కమీషన్ ఇస్తామని చెప్పడం సరికాదంటున్నారు. ల్యాప్‌టాప్, సర్వే కిట్లు అందజేయాలని డిమాండ్ చేస్తున్నారు. -
మే 2న నియోజకవర్గస్థాయి సమావేశం
నారాయణపేట: ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మే నెల 2న నియోజకవర్గస్థాయిలో ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నట్లు అదనపు కలెక్టర్లు ఫణీంద్రారెడ్డి, శ్రీను తెలిపారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో అధికారులతో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. జిల్లాకేంద్రంలోని అంజనా గార్డెన్‌న్స్‌లో శనివారం ఉదయం 9 గంటలకు నియోజకవర్గస్థాయి ప్రగతి ప్రణాళిక సభ ఉంటుందని.. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల పురోగతిని సమీక్షిస్తూ ప్రజల అభిప్రాయాలు, సూచనలు స్వీకరించేందుకు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, రైతు సంక్షేమ చర్యలు, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయరంగ ప్రగతి తదితర అంశాలపై చర్చ ఉంటుందని తెలిపారు. ప్రజలకు ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడం, స్థానిక సమస్యలను గుర్తించి పరిష్కార మార్గాలు సూచించడం కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని వివరించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు, మహిళా సంఘాల సభ్యులు, యువత, ప్రజలు అధికసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ప్రజల భాగస్వామ్యంతోనే అభివృద్ధి కార్యక్రమాలు సమర్థవంతంగా అమలవుతాయని పేర్కొన్నారు. -
మైనార్టీల సాధికారతే ప్రభుత్వ లక్ష్యం
నారాయణపేట: దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మైనార్టీల సంక్షేమానికి రూ.3,500 కోట్ల భారీ బడ్జెట్‌ను కేటాయించారని.. మైనార్టీల సంక్షేమం, సాధికారతకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్ అన్నారు. గురువారం జిల్లాకేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మైనార్టీ మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేసి మాట్లాడారు. పేటలో ఇప్పటికే 200 పైచిలుకు కుట్టుమిషన్లు పంపిణీ చేశామని.. మరో 350 మిషన్లను లబ్ధిదారులకు అందజేసినట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 204 టెమ్రిస్ పాఠశాలలు, కళాశాలలు విజయవంతంగా నడుస్తున్నాయని, పది, ఇంటర్మీడియట్ ఫలితాల్లో విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరుస్తున్నారని పేర్కొన్నారు. అదనంగా డిగ్రీ కళాశాలలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని తెలిపారు. పేదరిక నిర్మూలనకు చదువే ప్రధాన ఆయుధమని.. కార్పొరేషన్ ద్వారా అనేక కొత్త పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. దళారులు, బ్రోకర్ల ప్రమేయం లేకుండా లబ్ధిదారులకు నేరుగా సాయం అందేలా ఆన్లైన్ దరఖాస్తు విధానాన్ని అమలు చేస్తున్నామని, కలెక్టర్ అధ్యక్షతన కమిటీ పారదర్శకంగా ఎంపిక చేపడుతోందని వివరించారు. వితంతువులు, విడాకులు తీసుకున్న మహిళల కోసం ప్రత్యేక పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. వృత్తిదారులకు మద్దతుగా తుర్కా కోష ద్వారా రూ.12 కోట్లతో జనరేటర్లు పంపిణీ చేస్తామని వివరించారు. ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను మైనార్టీ వర్గాలు సద్వినియోగం చేసుకొని ఆర్థికాభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సదాశివారెడ్డి, మైనార్టీ అధికారి రషీద్, మైనార్టీ జిల్లా అధ్యక్షుడు మహమూద్ ఖురేషి, మైనార్టీ నాయకులు మహ్మద్ గౌస్, ఖాజాసాబ్, మహ్మద్ ఖాజా, మహ్మద్ రఫీ, కుతుబుద్దీన్, అబ్దుల్ ఖదీర్, సర్ఫరాజ్ అన్సారీ తదితరులు పాల్గొన్నారు. -
మెగా జాబ్‌మేళాకు పకడ్బందీ ఏర్పాట్లు
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా మెగా జాబ్‌మేళా శుక్రవారం జిల్లాకేంద్రంలోని శిల్పారామంలో నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఖుష్బూ గుప్తా తెలిపారు. గురువారం శిల్పారామంలో జాబ్‌మేళా ఏర్పాట్లను ఆమె పరిశీలించి మాట్లాడారు. జాబ్ మేళాలో హైదరాబాద్ నుంచి సుమారు 80 కంపెనీలు, జిల్లాలో స్థానికంగా ఉన్న 35 కంపెనీలు పాల్గొననున్నాయని వెల్లడించారు. వీరికోసం 120 స్టాళ్లను ఏర్పాటు చేశామని, ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సుమారు 10 వేల మంది నిరుద్యోగ యువతీ, యువకులు హాజరయ్యే అవకాశం ఉందన్నారు. ఈ మేరకు ఏర్పాట్లపై మున్సిపల్, యువజన సంక్షేమ క్రీడలు, పంచాయతీ శాఖ, విద్య, వైద్య, గ్రామీణాభివృద్ధి, మెప్మా, ఉపాధి కల్పన అధికారులకు సూచనలు చేశారు. మున్సిపల్, యువజన సంక్షేమ శాఖ అధికారులు సమన్వ యం చేసుకొని జాబ్ మేళాకు టెంట్లు, కుర్చీలు, టేబుళ్లు, తాగునీటి వసతి, మరుగుదొడ్లు, వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. అలాగే స్టేజీ, స్టాళ్లలో కావాల్సిన సౌకర్యాలను రెవెన్యూ, జిల్లా విద్యా శాఖ అధికారులు చూసుకోవాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మధుసూదన్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు. పలువురు మంత్రుల రాక.. మేళాలో మొత్తం 30 కౌంటర్ల ద్వారా రిజిస్ట్రేషన్లు నిర్వహిస్తారని, నమోదు అనంతరం అభ్యర్థులను హాల్లో కూర్చోబెట్టి, ప్రారంభోత్సవం తర్వాత వివిధ కంపెనీల స్టాళ్ల వద్ద ఇంటర్వ్యూలకు అనుమతి ఇస్తారన్నారు. ఎంపికై న అభ్యర్థులకు అక్కడే నియామక పత్రం అందజేస్తారన్నారు. అలాగే పోలీస్ శాఖ రద్దీ నియంత్రణకు చర్యలు తీసుకోవడంతోపాటు, శిల్పారామం వైపు వెళ్లే రహదారులపై ట్రాఫిక్ నియంత్రణకు తగిన సిబ్బందిని నియమించాలని సూచించారు. మేళాకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, పశు సంవర్ధక, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి హాజరు కానున్నట్లు వెల్లడించారు. -
ఉద్యోగ భద్రత కల్పించాలి..
లైసెన్స్డ్ సర్వేయర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి. మండలాలు కే టాయించి కమీషన్ ప్రా తిపదికన కాకుండా ప్రతి నెల ఫిక్స్డ్ వేత నం చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. సర్వే కిట్లతో పాటు ల్యాప్‌టాప్ అందించి, పీఎఫ్, ప్రమాదబీమా, ఇతర సౌకర్యాలు కల్పించాలి. – నర్సింహ, జిల్లా అధ్యక్షుడు, లైసెన్స్డ్ సర్వేయర్ల సంఘం గతేడాది జిల్లాలో ఎంపికై న లైసెన్స్డ్ సర్వేయర్లకు త్వరలో మండలాలు కేటాయిస్తాం. కేటాయించిన మండలంతో పాటు పక్క మండలాల విధులు నిర్వర్తించేలా కలెక్టర్ ద్వారా త్వరలో చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు జీతభత్యాలు, ఉద్యోగ భద్రత కల్పిస్తాం. – థాను, జిల్లా డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ ల్యాండ్స్ అండ్ సర్వే ● -
మహిళల స్వయం ఉపాధికి కృషి
మక్తల్: మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా కృషి చేస్తున్నామని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. గురువారం పట్టణంలోని సెట్విన్ కేంద్రాన్ని ఆయన సందర్శించి మాట్లాడారు. కేంద్రంలో మహిళలు కుట్టు, మగ్గం, కంప్యూటర్ తదితర విభాగాల్లో శిక్షణ పొందుతున్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో పెద్ద కంపెనీలను తీసుకొచ్చి నేరుగా ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల విద్యా ర్థులకు కేంద్రంలో తయారుచేసిన యూనిఫా మ్స్ అందిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా మంత్రిని నిర్వాహకులు శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా కో–ఆర్డినేటర్ విజయకుమార్, శిక్షకుడు తిమ్మప్ప, బీకేఆర్ ట్రస్ట్ చైర్మన్ బాలకృష్ణారెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యు డు లక్ష్మారెడ్డి, కౌన్సిలర్ శ్రీవిద్య, కో–ఆప్షన్ సభ్యుడు శంషోద్దీన్ తదితరులు పాల్గొన్నారు. నిర్వాసితులకు పరిహారం అందించాలి.. పేరపళ్ల, ఊట్కూర్ రిజర్వాయర్ల నిర్మాణంలో భూములు కోల్పోయిన తమకు నష్టపరిహారం చెల్లించాలంటూ గురువారం రైతులు వెంకట్రామారెడ్డి, జనార్దన్‌రెడ్డి, గోవిందరాజు, బాల్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి తదితరులు మంత్రి వాకిటి శ్రీహరికి వినతిపత్రం అందజేశారు. మూడురోజుల్లో పరిహారం ఇప్పించేందుకు కృషి చేస్తానని మంత్రి వారికి హామీ ఇచ్చారు. ఊట్కూర్: గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్ర పశువర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. గురువారం మండలంలోని చిన్నపొర్ల, పెద్దపొర్ల, పగిడిమారిలో వంతెనలు, సీసీ రహదారుల నిర్మాణాలకు భూమిపూజ.. పగిడిమారిలో గ్రామపంచాయతీ కార్యాలయ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ చింత రవి, ఎంపీడీఓ కార్తీక్, సర్పంచులు జాఫర్, కాశమ్మ, ప్రశాంత్‌కుమార్, నాయకులు యజ్ఞేశ్వర్‌రెడ్డి, కోరం మహేష్‌రెడ్డి, ఘని, విష్ణుమూర్తిగౌడ్ పాల్గొన్నారు. -
బాలికల చదువుపై శ్రద్ధ చూపాలి
మక్తల్: బాలికలు చదువు మధ్యలో మానేయకుండా ఉన్నత విద్యపై శ్రద్ధ చూపాలని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక అన్నారు. బుధవారం స్థానిక పుర కార్యాలయంలో మహిళ, శిశుసంక్షేమశాఖ ఆధ్వర్యంలో బాలికలకు నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై ఆన్లైన్ గేమింగ్, సైబర్ నేరాలు, చిన్నారులను మోసం చేయడం, ఇబ్బందులకు గురిచేయడం తదితర విషయాల గురించి వివరించారు. మెస్సేజ్ యాప్ ద్వా రా పిల్లలను ట్రాప్ చేస్తుంటారని.. తగిన జాగ్రత్తలు పాటించాలని సూ చించారు. చదువుకు మాత్రమే సెల్‌ఫోన్ వినియోగించాలని, చదువుతోనే జీవితా లు బాగు చేసుకోవాని తెలిపారు. కార్యక్రమంలో పుర చైర్పర్సన్ వాకిటి మానస, ఆర్డీఓ రాజేందర్‌గౌడ్, పుర కమిషనర్ నర్సయ్య, సీడీపీఓ సరోజినీ మట్ట, రమేశ్, సూపర్వైజర్ మల్లేశ్వరి, అమ్మక్క తదితరులు పాల్గొన్నారు. కొడంగల్ ఎత్తిపోతల పనుల పరిశీలన.. మక్తల్–కొడంగల్–నారాయణపేట ఎత్తిపోతల పనులను బుధవారం కలెక్టర్ ప్రియాంక పరిశీలించా రు. మ్యాప్ ను చూసి సంబంధిత అధికారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పనులు త్వరగా, నాణ్యతగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కాట్రెవ్‌పల్లి పంప్‌హౌజ్, మంతన్‌గోడ్ దగ్గర కొనసాగుతున్న పనులను పరిశీలించారు. అంతకుముందు భూత్పూర్ రిజర్వాయర్‌ను సందర్శించారు. అక్కడి రైతులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. -
బాలికలదే పైచేయి
–8లో uనారాయణపేట రూరల్: పదోతరగతి వార్షిక పరీక్షల ఫలితాల్లో బాలుర కంటే ఒక శాతం అధిక ఉత్తీర్ణత సాధించి బాలికలు పైచేయిగా నిలిచారు. ఐదేళ్లుగా పరిశీలిస్తే బాలుర కంటే బాలికలే అధికంగా ఉత్తీర్ణులవుతున్నారు. జిల్లా ఏర్పాటైన తొలి రెండేళ్లు కరోనాలో పోగా ఐదుసార్లు టెన్త్ పరీక్షలు జరిగాయి. 2022లో 80 శాతం ఉత్తీర్ణతతో 26వ స్థానంలో నిల వగా.. 2023లో 75 శాతం పాస్ పర్సెంటేజ్‌తో 31, 2024లో 93 శాతం ఉత్తీర్ణతతో 15వ స్థానం, 2025 లో ఉత్తీర్ణత శాతం 95.18కి పెరిగి 19వ స్థానం, ఈసారి మాత్రం ఏకంగా 97.82 శాతం ఉత్తీర్ణతతో ఐదు స్థానాలు మెరుగుపర్చుకుని 14వ స్థానం సాధించింది. 8,125 మంది విద్యార్థులు పాస్.. జిల్లావ్యాప్తంగా 8,306 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయగా.. 8,125 మంది ఉత్తీ ర్ణులు కావడంతో 97.82 శాతం నమోదైంది. బాలురు 3,971 మందికిగాను 3,860 మంది పాస్ కావడంతో 97.2 శాతం, బాలికలు 4,335 మందికిగాను 4,265 మంది పాస్ కావడంతో 98.34 శాతం ఉత్తీర్ణత నమోదైంది. అదేవిధంగా ఉత్తమ మార్కు ల సాధనలో సైతం 80 శాతం పాఠశాలల్లో బాలిక లో టాపర్లుగా నిలిచారు. జిల్లాలో టాప్ టెన్‌లోనూ అందరు అమ్మాయిలు ఉండటం విశేషం. జిల్లాలో మొత్తం 146 ఉన్నత పాఠశాలలు ఉండగా.. 74 పాఠశాలల్లో వందశాతం ఉత్తీర్ణత నమోదైంది. వీటిలో 27 ప్రభుత్వ, జెడ్పీ, ఎయిడెడ్ పాఠశాలలు, 6 కేజీబీవీలు, 6 సోషల్ వెల్ఫేర్, ఒక ట్రైబల్, ఒక మైనార్టీ, ఒక బీసీ వెల్ఫేర్ పాఠశాలతో పాటు 32 ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. జీరో ఉత్తీర్ణత శాతం పాఠశాలలు ఒక్కటి కూడా లేకపోవడం విశేషం. పదోతరగతి పరీక్ష ఫలితాల్లో 97 శాతం ఉత్తీర్ణత సాధించడం ఎంతో సంతృప్తి కలిగిస్తోంది. బాలికలు అత్యధికంగా ఉత్తీర్ణులు కావడం ఆనందంగా ఉంది. ఫెయిల్, గైర్హాజరైన విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలు రాసే అవకాశం ఉంది. ఫీజు చెల్లించి పరీక్షలకు హాజరుకావాలి. గతంలో కంటే అధికంగా ఉత్తీర్ణత శాతం సాధించడంతో పాటు అత్యధికంగా 500పైగా మార్కులు సాధించడం, జిల్లాలో సగానికి పైగా వందశాతం ఉత్తీర్ణత సాధించడం ఆనందం కలిగించింది. ఇందుకు కృషిచేసిన ఉపాధ్యాయులకు అభినందనలు. వచ్చే ఏడాది మెరుగైన ఫలితాల సాధనకు కృషిచేస్తాం. – డా. గోవిందరాజు, జిల్లా విద్యాధికారి ‘పది’ ఫలితాల్లో 97.82 శాతం ఉత్తీర్ణత 74 పాఠశాలల్లో వందశాతం విద్యార్థులు పాస్ రాష్ట్రస్థాయిలో 14వ స్థానంలో నిలిచిన జిల్లా -
ముందుకు.. వెనక్కి..
సాక్షి, నాగర్‌కర్నూల్: కృష్ణాతీరంలోని సుందర దృశ్యాలు, నల్లమల అడవి అందాలను ఆకాశం నుంచి వీక్షించేందుకు వీలుగా ప్రభుత్వం చేపట్టిన హెలీ టూరిజం కార్యక్రమానికి బ్రేక్ పడింది. రాష్ట్రంలోనే మొదటిసారిగా నల్లమల, సోమశిల ప్రాంతంలోనే హెలీ టూరిజానికి అడుగులు పడగా, ఈ కార్యక్రమం అమలుపై నీలినీడలు అలుముకున్నాయి. అసైన్డ్ భూముల వివాదంలో సంబంధిత భూనిర్వాసితులు హైకోర్టును ఆశ్రయించారు. హెలీప్యాడ్ నిర్మాణ పనులపై హైకోర్టు స్టే ఇవ్వడంతో పనులు నిలిచిపోయాయి. అయితే ప్రభుత్వం పర్యాటకాభివృద్ధి కోసం చేపట్టిన కీలకమైన ప్రాజెక్ట్‌లో భూసేకరణకు సంబంధించి రెవెన్యూ, పర్యాటక శాఖ అధికారుల పనితీరు, సమన్వయ లోపంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలోనే మొదటిసారిగా సోమశిలలో.. కృష్ణాతీరంలోని సుందరమైన ప్రదేశాలు, నదీ గర్భంలోని దీవులు, నల్లమల అడవి అందాలను విహంగ వీక్షణం చేసేందుకు వీలుగా ప్రభుత్వం హెలీటూరిజం ప్యాకేజీని రూపొందించింది. హైదరాబాద్ నుంచి సోమశిల వరకు హెలికాప్టర్లో చేరుకుని ఇక్కడి అందాలను ఆకాశం నుంచే వీక్షించేందుకు వీలుగా ఏర్పాట్లను ప్రారంభించింది. శ్రీశైలం మల్లికార్జున ఆలయంలో దర్శనం చేసుకుని తిరిగి హైదరాబాద్ పయనమయ్యేలా టూర్ ప్లాన్ చేపట్టింది. హెలికాప్టర్లో ఒకరోజు పర్యటనకు రూ.1.10 లక్షలు, రెండు రోజుల పాటు పర్యటించేందుకు 1.40 లక్షలను చార్జ్ చేయనున్నారు. రెండు రోజుల ప్యాకేజీలో ఒకరోజు శ్రీశైలంలో, మరొకరోజు సోమశిలలో స్టే చేసేందుకు అవకాశం ఉంటుంది. ఈ హెలీ టూరిజం ప్యాకేజీని బుక్ చేసుకునే సందర్శకులకు శ్రీశైలం మల్లికార్జున స్వామిని వీఐపీ తరహాలో దర్శించుకునేందుకు అవకాశం కల్పించడంతో పాటు విడిది, భోజన వసతి కల్పించనున్నారు. అయితే హెలీ టూరిజం కార్యక్రమానికి కీలకమైన హెలీప్యాడ్ నిర్మాణాన్ని సోమశిల గ్రామంలో చేపట్టారు. ఏప్రిల్ 9నే హెలీ టూరిజం ప్రారంభోత్సవానికి పర్యాటకశాఖ అధికారులు ఏర్పాట్లు సైతం పూర్తి చేశారు. అయితే ప్రారంభానికి ముందే బ్రేక్ పడటంతో హెలీ టూరిజం ప్రాజెక్ట్ ముందుకు సాగుతుందా, లేదా అన్న అనుమానాలు నెలకొన్నాయి. అమరగిరిలో ఊసేలేని కాటేజీల నిర్మాణం.. కృష్ణాతీరంలోని సోమశిలతో పాటు అమరగిరి సమీ పంలోని ద్వీపంలోనూ ప్రభుత్వం నూతనంగా కాటేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అమరగిరి ద్వీప ంలో 8 ఎకరాల విస్తీర్ణంలో వెల్నెస్, స్పిరిట్చువల్ ప్రాజెక్ట్ కోసం గతేడాది ఆగస్టులోనే పనులు ప్రారంభానికి శంకుస్థాపన చేశారు. మొత్తం రూ.45.84 కోట్ల వ్యయంతో వెల్నెస్ సెంటర్లో కాటేజీల నిర్మాణంతో పాటు కెఫెటేరియా, యోగా డెస్క్, స్పా సెంటర్, ఇండోర్ గేమ్స్, స్విమ్మింగ్‌పూల్, ల్యాండ్‌స్కేప్ గార్డెన్, వ్యూపాయింట్లు తదితర సౌకర్యాలు కల్పించేందుకు ప్రణాళికలు పూర్తి చేశారు. అయితే ఈ ప్రాజెక్ట్‌లోనూ కేటాయించిన స్థలం విషయంలో రెవెన్యూ, ఫారెస్ట్, పర్యాటక శాఖ అధికారులకు మధ్య సమన్వయం లేకపోవడంతో వెల్నెస్, రిట్రీట్ ప్రాజెక్ట్ అటకెక్కింది. అసైన్డ్ భూముల్లో ఏర్పాటుతో.. హెలీటూరిజం ప్రాజెక్ట్ కింద హెలీప్యాడ్ నిర్మాణానికి అధికారులు కృష్ణాతీరంలోని సోమశిల గ్రామాన్ని ఎంచుకున్నారు. కొల్లాపూర్ మండలంలోని సోమశిలలోని రైతుల అసైన్డ్ భూముల్లో హెలీప్యాడ్ నిర్మాణం చేపట్టడం వివాదాస్పదమైంది. గ్రామంలోని సర్వే నంబర్ 54లో సుమారు ఎకరం స్థలంలో హెలీప్యాడ్ నిర్మాణ పనులు ప్రారంభించారు. అయితే కనీస పరిహారం లేకుండా చట్టవిరుద్ధంగా హెలీప్యాడ్ పనులు చేపడుతున్నారని, నిర్వాసిత రైతులు దేవ సుంకన్న, పెంటయ్య, పుల్లయ్య, జాముడు, సాయన్న తదితరులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హెలీప్యాడ్ నిర్మాణ పనులను తక్షణమే నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేస్తూ కోర్టు విధించింది. ఈ క్రమంలో హెలీప్యాడ్ నిర్మాణ పనులతో పాటు హెలీటూరిజం ప్రాజెక్ట్ కొనసాగింపుపై సందిగ్ధం నెలకొంది. నల్లమల హెలీ టూరిజంపై నీలినీడలు హైదరాబాద్–సోమశిల హెలికాప్టర్ రైడ్ ప్రతిపాదనలు చేసిన ప్రభుత్వం ఈనెల 9నే ప్రారంభానికి సిద్ధమైన పర్యాటకశాఖ అధికారులు హైకోర్టు తీర్పుతో హెలిప్యాడ్ పనులకు బ్రేక్ హెలీ టూరిజం అమలుపై సందిగ్ధత -
ప్రైవేట్‌దే జోరు..!
కొనుగోలు కేంద్రాల్లో విక్రయానికి రైతుల అనాసక్తి● తేమశాతం, తాలు అంటూ జాప్యం ● అకాల వర్షాలతో ఆందోళనలో అన్నదాతలు ● ప్రైవేట్‌లో విక్రయించేందుకు ఆసక్తి చూపుతున్న వైనంనారాయణపేట: జిల్లాకేంద్రంలోని వ్యవసాయ మా ర్కెట్‌యార్డుకు ధాన్యపు రాశుల కళ వచ్చింది. యా సంగి కోతలు ఊపందుకోవడంతో రైతులతో కళకళాడుతుంది. జిల్లాలో ప్రభుత్వం 161 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినా ప్రైవేట్ వ్యా పారం జోరుగా సాగుతుంది. మంచిధరలు వచ్చేలా మార్కెట్లో వ్యాపారులు ప్రయత్నిస్తున్నారు. ● ఓ వైపు అకాల వర్షాలు.. మరోవైపు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో కొర్రీలతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికొచ్చాక ఎక్కడ తడిసిపోతుందోననే భయంతో రైతులు నేరుగా జిల్లాకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డుకు తరలిస్తున్నారు. ఇటు తెలంగాణ.. అటు కర్ణాటక సరిహద్దులోని పలు గ్రామాల నుంచి రైతులు వరి ధాన్యాన్ని విక్రయించేందుకు మార్కెట్‌కు తీసుకొస్తున్నారు. రెండ్రోజులుగా మార్కెట్‌యార్డుకు ధాన్యం పోటెత్తింది. వ్యాపారులు సైతం తేమ శాతం 17 ఉంటే క్వింటాకు రూ.2,440 వరకు చెల్లిస్తుండటంతో రైతులు ప్రైవేట్‌లో విక్రయించేందుకే మొగ్గు చూపుతున్నారు. జిల్లాలో వరి ధాన్యం సేకరణ ప్రక్రియ ప్రారంభమైంది. కొనుగోలు కేంద్రాల్లో నిర్వాహకులు ధాన్యం కొనుగోళ్లు చేపడుతున్నారు. ప్రతి కేంద్రం పరిధిలో చివరి గింజ వరకు సేకరించేందుకు ఏర్పాట్లు చేశాం. సేకరించిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు రైస్ మిల్లులు, గోదాంలకు తరలించేందుకు తగిన చర్యలు చేపట్టాం. – సైదులు, డీఎం, పౌరసరఫరాలసంస్థ -
ఎస్పీని కలిసిన వనపర్తి ఏఎస్పీ
నారాయణపేట: ఎస్పీ డా. వినీత్ వనపర్తి ఇన్చార్జ్ ఎస్పీగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మంగళవారం వనపర్తి జిల్లా అడిషనల్ ఎస్పీగా బాధ్య తలు చేపట్టిన రాజేష్ మీనా జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్క అందజేశారు. ఈ సందర్భంగా ఏఎస్పీకి జిల్లా ఎస్పీ శుభాకాంక్షలు తెలిపారు. కానిస్టేబుల్ కుమార్తెకు అభినందనలు.. ఆర్మ్డ్ రిజర్వ్ కానిస్టేబుల్ రాఘవేందర్ కుమార్తె నవ్య ఇంటర్మీడియట్లో 991 మార్కులు సాధించింది. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ డా. వినీత్‌ను విద్యార్థిని మర్యాదపూర్వకంగా కలవగా ఎస్పీ ఆమెను శాలువాతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. నవ్య కృషి, పట్టుదలతో ఉన్నతస్థాయికి ఎదగాలని, భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. అలాగే కానిస్టేబుల్ రాఘవేందర్ని ప్రత్యేకంగా అభినందిస్తూ కుమార్తె ఉన్నత విద్య అభ్యసించేలా ప్రోత్సహించాలని సూచించారు. తల్లిదండ్రుల ప్రోత్సాహం, మార్గదర్శకత్వం పిల్లల విజయానికి ముఖ్యమని తెలిపారు. ఈ విజయం పోలీసుశాఖకు గర్వకారణమని పేర్కొన్నారు. కార్యక్రమంలో వనపర్తి ఏఎస్పీ రాజేష్ మీనా, కానిస్టేబుల్ రాఘవేందర్ ఉన్నారు. -
జిల్లా న్యాయమూర్తిని కలిసిన కలెక్టర్
నారాయణపేట: కలెక్టర్‌గా సోమవారం బాధ్య తలు చేపట్టిన సీహెచ్ ప్రియాంక మంగళవారం ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ న్యాయమూర్తి బోయ శ్రీనివాసులును కోర్టులో మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్క అందజేశారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అర్హులందరికీ అందేలా కృషి చేయాలని కలెక్టర్‌కు సూచించారు. సాంకేతికతను అందిపుచ్చుకోవాలి నారాయణపేట: ఉపాధినిచ్చే సాంకేతిక విద్య ను విద్యార్థులు అందిపుచ్చుకోవాలని చేనేత, జౌళిశాఖ అధికారులు బి.రాజేష్‌బాబు, ఎస్.విజయ్‌కుమార్ కోరారు. మంగళవారం జిల్లాకేంద్రంలో విద్యార్థులకు నిర్వహించిన ప్రత్యేక అవగాహన సదస్సుకు ముఖ్యఅతిథులుగా హాజరై మాట్లాడారు. పదోతరగతి పూర్తి చేసిన విద్యార్థులు సంప్రదాయ కోర్సులకు మాత్రమే పరిమితం కాకుండా 100 శాతం ఉపాధి అవకాశాలు కలిగిన సాంకేతిక వృత్తి విద్య కోర్సులపై దృష్టి సారించాలని సూచించారు. 2026–27 విద్యాసంవత్సరానికిగాను డిప్లొమా ఇన్ హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ టెక్నాలజీ కోర్సు ప్రత్యేకతలు, ప్రభుత్వ ప్రోత్సాహకాలను వివరించారు. విద్యార్థులపై ఆర్థిక భారం తగ్గించే విధంగా ప్రభుత్వం ప్రతి నెల రూ.2,500 స్టైఫండ్ అందిస్తోందని, చేనేత కుటుంబాలకు చెందిన విద్యార్థులకు అదనంగా నెలకు రూ.5 వేలు చెల్లిస్తుందని వివరించారు. ఏడాదికి కేవలం రూ.4,250 నామమాత్రపు ఫీజుతో నాణ్యమైన సాంకేతిక విద్యను అభ్యసించే ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ కోర్సు పూర్తిచేసిన వారికి ప్రముఖ వస్త్ర పరిశ్రమల్లో డిజైనర్లు, మేనేజర్లు వంటి పదవుల్లో స్థిరపడే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. డిప్లొమా ఇన్ హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ టెక్నాలజీ కోర్సులో ప్రవేశానికి కనీస అర్హత 10వ తరగతి అని, 60 సీట్లు ఉండగా.. మెరిట్ ఆధారంగా భర్తీ చేస్తారని తెలిపారు. దరఖాస్తునకు చివరి గడువు ఏప్రిల్ చివరి వారమని, హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ఉన్న దరఖా స్తు కేంద్రంలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. విద్యార్థుల సందేహాలను అధికారులు నివృత్తి చేశారు. కార్యక్రమంలో జిల్లా లోని చేనేత సహకార సంఘాల అధ్యక్షులు ఆంజనేయులు, బత్తుల సతీష్, సౌడం నర్సింహులు, ఐఐహెచ్‌టీ సిబ్బంది ఎం.శివమణి, బి.స్వప్న (అధ్యాపకులు), పలు పాఠశాలల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
85 శాతం ఎస్ఐఆర్ మ్యాపింగ్ లక్ష్యం
● కలెక్టర్ సీహెచ్ ప్రియాంక నారాయణపేట: కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా సమగ్ర, పారదర్శక ఓటరు జాబితా రూపకల్పనకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియకు శ్రీకారం చుట్టిందని.. జిల్లాలో ఈ ప్రక్రియ వేగవంతం చేసి మూడు రోజుల్లో 85 శాతం మ్యాపింగ్ చేయాలని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్లోని వీసీ హాల్లో అదనపు కలెక్టర్లు ఫణీంద్రారెడ్డి, శ్రీనుతో కలిసి ఎస్ఐఆర్, సాదా బైనామాపై తహసీల్దార్లు, డీటీలు, సూపర్వైజర్లు, ఏఈఆర్వోలతో సమీక్ష నిర్వహించారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో 85 శాతం ఎస్ఐఆర్ పూర్తి కావాలని.. లేనిపక్షంలో సంబంధిత అధికారులు, ఉద్యోగులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. జీఓ నంబర్ 74, 76 ప్రకారం సాదాబైనామా దరఖాస్తులను పరిష్కరించాలని సూచించారు. జిల్లాలో 2,075 సాదాబైనామా దరఖాస్తులు వచ్చాయని.. 2,674 సర్వేనంబర్లను విచారణ చేసి నెలాఖరు నాటికి పరిష్కరించాలని.. తిరస్కరిస్తే తగిన కారణాలను స్పష్టంగా పేర్కొనాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను తహసీల్దార్లను ఆదేశించారు. చివరగా భూ భారతి పెండింగ్ దరఖాస్తులపై చర్చించి క్లియర్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టరేట్ నిర్మాణం పూర్తి చేయాలి.. కలెక్టరేట్ నిర్మాణ పనులు మే నెలాఖరుకు పూర్తిచేసి జూన్ 2న ప్రారంభానికి సిద్ధం చేయాలని కలెక్టర్ ప్రియాంక ఆర్అండ్బీ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆమె నూతన భవనంలోని కలెక్టర్ చాంబర్, సమావేశ మందిరం, వివిధ సెక్షన్ గదులలో కొనసాగుతున్న పనులను పరిశీలించారు. జూన్ 2 వరకు పనులు పూర్తికావడం సాధ్యం కాదని, జులైలో పూర్తవుతాయని ఆర్అండ్బీ అధికారులు వివరించగా.. పనుల్లో వేగం పెంచి మే నెలాఖరుకు పూర్తి చేసే ప్రయత్నం చేయాలని కోరారు. భవన నిర్మాణానికి నిధులు సరిపోవడం లేదని.. అదనపు నిధులు కావాలని అధికారులు కోరగా.. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మంజూరుకు కృషి చేస్తానని బదులిచ్చారు. గ్రీనరీ, వాహనాల పార్కింగ్, అంతర్గత రహదారుల నిర్మాణంపై అధికారులతో చర్చించారు. ఆమె వెంట ఆర్అండ్బీ ఎస్ఈ. వెంకటరమణ, డీఈ రాములు, ఏఈలు, సూపర్వైజర్లు ఉన్నారు. జిల్లాకేంద్రంలో జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో కొనసాగుతున్న పెట్రోల్ బంక్‌కు రాష్ట్రంలో మంచి గుర్తింపు ఉందని.. లాభాల బాటలో నడుస్తుందని, ఐ అండ్ పీఆర్ కమిషనర్‌గా తాను పలు పత్రికల్లో పాజిటివ్ కథనాలు ప్రచురింప చేయించిన విషయాన్ని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక గుర్తుచేశారు. ఇప్పుడు జిల్లాకు కలెక్టర్‌గా వచ్చానని.. కొత్త ఆలోచనలతో మరిన్ని వ్యాపారాలకు శ్రీకారం చుడదామని సూచించారు. మంగళవారం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయ భవనంలో జరిగిన జిల్లా మహిళా సమాఖ్య ఈసీ సమావేశానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. గత నెలలో జరిగిన సమావేశ వివరాలపై సమీక్షించి ఎస్‌హెచ్‌జీల పనితీరు, జిల్లా సమాఖ్య, పెట్రోల్ బంక్ లావాదేవీలు, బ్యాంకు లింకేజీ, సీ్త్రనిధి తదితర అంశాలపై చర్చించారు. సమావేశంలో డీఆర్డీఓ మొగులప్ప, సెర్ప్ పీఎం బాలస్వామి, డీపీఎం గోవింద్, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్ష కార్యదర్శులు అరుంధతి, సుజాత, కోశాధికారి అంజమ్మ, సిబ్బంది పాల్గొన్నారు. -
ఇందన ఇక్కట్లు..
ధన్వాడలో బారులు తీరిన వాహనాలు బంకుల్లో డీజిల్, పెట్రోల్ కొరత తలెత్తడంతో మంగళవారం వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వరి కోతలు ఉపందుకోవడంతో వరి కోత యంత్రాల నిర్వాహకులు డీజిల్ కోసం బైక్‌లపై డబ్బాలతో మక్తల్, దేవరకద్ర, మరికల్ జాతీయ రహదారిపై ఉన్న బంకుల చుట్టూ చక్కర్లు కొట్టడం కనిపించింది. ఎక్కడికి వెళ్లినా నో–స్టాక్ బోర్డులు కనిపించాయి. మరికల్లో ఐదు బంకులు ఉండగా.. నాలుగింటిలో నో–స్టాక్ బోర్డులు పెట్టారు. ధన్వాడలోని పెట్రోల్ బంక్‌లో మూడురోజులుగా విక్రయాలు నిలిచిపోయాయి. మంగళవారం తెల్లవారుజామున మరికల్‌లోని ఒక బంకుకు, ధన్వాడలోని బంక్‌కు డీజిల్ ట్యాంకర్ రావడంతో పౌరసరఫరాలశాఖ అధికారుల సూచన మేరకు బంకు నిర్వాహకులు వరికోత యంత్రాల పత్రాలను పరిశీలించి డీజిల్ పోశారు. గంటల తరబడి వేచి చూసి డీజిల్ తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మరోపక్క కిలోమీటర్ల మేర వాహనాలు డీజిల్ కోసం బారులు తీరాయి. – మరికల్, ధన్వాడ మరికల్లో డీజిల్ కోసం వరుసలో పెట్టిన డబ్బాలు -
మార్కెట్ ఏర్పాటు చేయాలి..
కొల్లాపూర్‌లో వేలాది మామిడి రైతులు ఉన్నారు. వారి శ్రమను వ్యాపారులు దోస్తున్నారు. దీన్ని ప్రభుత్వం సీరియస్ అంశంగా గుర్తించారు. గతంలో మాచినేనిపల్లి సమీపంలో, ప్రభుత్వ పీజీ కళాశాల సమీపంలో మామిడి మార్కెట్ ఏర్పాటుకోసం స్థలాలను గుర్తించారు. రెండింట్లో ఏదో ఒక చోట మార్కెట్ ఏర్పాటుచేసి, వ్యాపారులు ఇక్కడే కాయలు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటే రైతులకు మేలు చేకూరుతుంది. – సాయికృష్ణగౌడ్, మామిడి రైతు, సింగోటం ధరలు తగ్గించేశారు.. రైతులకు మామిడి పంట ఇప్పుడిప్పుడే చేతికొస్తోంది. ఈ సమయంలోనే ధరలు తగ్గించడం దారుణం. గాలివానకు భయపడి రైతులు కాయలు తెంచుతున్నారు. ఇదే అదనుగా వ్యాపారులు ధరలు తగ్గించేస్తున్నారు. ఇప్పుడున్న ధరల ప్రకారం కాయలు అమ్మితే రైతుకు నష్టమే తప్ప లాభం ఉండదు. దీనిపై అధికారులు దృష్టిపెట్టాలి. రైతులకు న్యాయం జరిగేలా చూడాలి. – పెద్దూరి లక్ష్మయ్య, మామిడి రైతు, కొల్లాపూర్ ● -
ఉద్యాన కళాశాల విద్యార్థుల నిరసన
కొత్తకోట రూరల్: పెద్దమందడి మండలంలోని కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యాన కళాశాల విద్యార్థులు సోమవారం కళాశాల ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రొ. జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో బీఎస్సీ హార్టికల్చర్ కోర్సును ప్రారంభించాలనే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగినట్లు విద్యార్థులు తెలిపారు. ఉద్యానవిద్య కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యూనివర్సిటీ ఉండగా.. మరో యూనివర్సిటీలో అదే కోర్సు ప్రవేశపెట్టడంతో ఉద్యాన విద్య ప్రత్యేకత దెబ్బతింటుందని, ఈ నిర్ణయంతో అకాడమిక్ వ్యవస్థలో గందరగోళం నెలకొనే అవకాశం ఉందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకొని తమకు న్యాయం చేయాలని, లేనిపక్షంలో పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. -
వారబందీ మరో రెండ్రోజులే..
● ఆయకట్టులో తుది దశకు చేరుకున్న వరి పంటలు అమరచింత: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వల ఆయకట్టు పరిధిలో యాసంగి వరి పంటలు తుది దశకు చేరుకోవడంతో కాల్వలకు మరో రెండ్రోజులు మాత్రమే సాగునీరు వదలనున్నట్లు ప్రాజెక్టు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం వారంలో మూడురోజుల పాటు సాగునీటిని అధికారులు అందిస్తున్నారు. ప్రాజెక్టులో 1.461 టీఎంసీల నీరు ఉండటంతో వేసవి దృష్ట్యా తాగునీటి అవసరాలకు వినియోగించుకునే అవకాశం ఉంది. పీజేపీ నందిమళ్ల డివిజన్ డీఈ చెన్నకేశవరెడ్డి మాట్లాడుతూ.. నీటి అవసరం ఉందని ఒకరిద్దరు రైతులు అడుగుతున్నారని.. రెండురోజుల్లో సాగునీటి సరఫరాను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ఉన్నతాధికారులకు నివేదించినట్లు చెప్పారు. -
స్వీయగణనను వినియోగించుకోవాలి
నారాయణపేట: స్వీయగణనను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ప్రియాంక కోరారు. జనగణన ప్రక్రియలో భాగంగా సోమవారం ఆమె కలెక్టరేట్లోని తన చాంబర్లో స్వీయ నమోదు చేసుకొని మాట్లాడారు. జనగణన ప్రక్రియను సులభంగా, సమగ్రంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం డిజిటల్ స్వీయగణన విధానాన్ని అందుబాటులోకి తెచ్చిందన్నారు. ప్రజలు తమ వ్యక్తిగత, కుటుంబ వివరాలను వెబ్ పోర్టల్‌లోగాని, మొబైల్ యాప్ ద్వారా స్వయంగా నమోదు చేసుకునే వెసులుబాటు కల్పించారని తెలిపారు. వచ్చే నెల 10వ తేదీ వరకు స్వీయ నమోదుకు అవకాశం ఉందని చెప్పారు. వివరాలు నమోదు చేసిన తర్వాత ప్రత్యేక సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఐడీ జారీ అవుతుందని.. మే నెల 11 నుంచి జూన్ 9 మధ్యకాలంలో ఇంటికొచ్చిన ఎన్యూమరేటర్లకు ఐడీ నంబర్ తెలియజేయాలని సూచించారు. ప్రజలు తమ వివరాలను ఆన్లైన్ పోర్టల్‌లో చేసుకుంటే ధ్రువీకరణ సమయంలో వారు ఇంట్లో భౌతికంగా ఉండాల్సిన అవసరం లేదని.. సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఐడీ ద్వారా పరిశీలించి ధ్రువీకరిస్తారని వివరించారు. అయితే స్వీయ గణనలో కచ్చితమైన చిరునామా, సరైన వివరాలు నమోదు చేయాలన్నారు. ప్రతి ఒక్కరి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని భరోసా కల్పించారు. సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలు చేస్తూ, సమగ్ర అభివృద్ధి సాధించేందుకు ఈ వివరాలు ఎంతో దోహదపడతాయని.. ఈ ప్రక్రియ జిల్లాలో విజయవంతం చేసేందుకు సహకరించాలని కోరారు. వైద్య కళాశాల, ఆస్పత్రి తనిఖీ.. మండలంలోని అప్పక్‌పల్లి సమీపంలో ఉన్న ప్రభుత్వ జిల్లా ఆస్పతి, ప్రభుత్వ వైద్య కళాశాలను సోమవారం సాయంత్రం కలెక్టర్ సీహెచ్ ప్రియాంక ఆకస్మికంగా తనిఖీ చేశారు. రిసెప్షన్ వద్దకు వెళ్లి రోజుకు ఎంతమంది రోగులు వస్తారని అడిగి తెలుసుకున్నారు. రెండో అంతస్తులో పలు వార్డులను పరిశీలించి చికిత్స పొందుతున్న రోగులు, వారి బంధువులతో మాట్లాడి వైద్యసేవలు, వసతులపై ఆరా తీశారు. తాగునీటి సమస్య ఉందని రోగుల బంధువులు వివరించగా.. ఆర్వో ప్లాంట్ లేదా అని ఆర్ఎంఓ శ్రీనివాసులును ప్రశ్నించారు. బోరు వేస్తే నీళ్లు రాలేదని, ఆర్వో ప్లాంట్ లేదని ఆయన సమాధానమిచ్చారు. అనంతరం ఆస్పత్రి సమావేశ మందిరంలో ఆర్ఎంఓ, అన్ని విభాగాల హెచ్ఓడీలు, వైద్యులతో సమావేశమయ్యారు. ఆస్పత్రి క్యాడర్ స్ట్రెంథ్, అవసరమైన వైద్య పరికరాల గురించి అడిగి తెలుసుకున్నారు. క్యాన్సర్ స్క్రీనింగ్, టీబీ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారా అని ప్రశ్నించారు. డయాలసిస్ సేవలపై ఆరా తీయగా పాత చిన్నపిల్లల ఆస్పత్రిలో కొనసాగుతోందని ఆర్ఎంఓ తెలిపారు. వైద్య కళాశాలలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారని ప్రశ్నించగా మొదటి, రెండో సంవత్సరం కలిపి 100 మంది ఉన్నారని, నర్సింగ్ కళాశాల కొనసాగుతోందని వివరించారు. ఆస్పత్రి నిర్వహణ, ఇతర సదుపాయాలు, సమస్యలపై కలెక్టర్ చర్చించారు. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ సీహెచ్. ప్రియాంక అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని ప్రజావాణి మందిరంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆమె హాజరై అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించి సమస్యలను సావధానంగా విని పరిష్కారానికి సంబంధిత అధికారులను ఆదేశించారు. అర్జీలను పెండింగ్‌లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజావాణిలో 23 ఫిర్యాదులు వచ్చాయి. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఫణీంద్రారెడ్డి, శ్రీను, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
ఆన్లైన్ ట్రక్షీట్లు
ధాన్యం కొనుగోళ్లలో కొత్త నిబంధనలు అమలు మరికల్: యాసంగి వరి ధాన్యం కొనుగోళ్లకు ప్రభుత్వం కొత్త నిబంధనలు అమలు చేస్తోంది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం వాహనంలో ఏ రోజు లోడ్ చేస్తే అదేరోజు వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉంటుంది. గతంలో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తూకం చేసిన తర్వాత మాన్యువల్ ట్రక్‌షీట్‌తో రైస్‌మిల్లులకు తరలించేవారు. అనంతరం సొసైటీ, ఐకేపీ సిబ్బంది ఆ వివరాలను ఆన్లైన్లో నమోదు చేసినప్పుడు రైతు సెల్‌ఫోన్‌కు ఓటీపీ వచ్చేది. కాగా కొత్త విధానంతో ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర జాప్యం ఏర్పడే అవకాశం ఉందని కేంద్రాల నిర్వాహకులు పేర్కొంటున్నారు. జిల్లావ్యాప్తంగా యాసంగి సీజన్లో 1.80 లక్షల ఎకరాల్లో వరి సాగుకాగా.. 2.45 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణే లక్ష్యంగా వ్యవసాయ అధికారులు ప్రణాళిక రూపొందించారు. ఇందుకుగాను 160 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి ఆ ధాన్యాన్ని 51 రైస్‌మిల్లులను తరలించాలని నిర్ణయించారు. సోమవారం నుంచి ఆయా కేంద్రాల్లో ఽఆన్‌లైన్ ధాన్యం కొనుగోళ్లు అమలులోకి వచ్చింది. అయితే ఈ విధానంలో కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ధాన్యం తూకం వేసిన వెంటనే రైతు పేరు, ఎన్ని క్వింటాళ్ల ధాన్యం విక్రయించారు తదితర వివరాలను ఆన్లైన్లో నమోదు చేయగానే రైతు మొబైల్‌కు ఓటీపీ వస్తోంది. అనంతరం ఆన్లైన్ ట్రక్‌షీట్ జారీ చేయడంతో పూర్తి వివరాలు రైతు తెలుసుకొనే అవకాశం ఉంది. అంతేగాకుండా ఆన్లైన్లో చూపించిన రైస్‌మిల్లుకు మాత్రమే జీపీఎస్ ఉన్న ట్రాక్టర్లు, లారీల్లో ధాన్యం తరలించాల్సి ఉంటుంది. అయితే మండలానికి ఒక్కటే ట్యాబ్ ఇవ్వడంతో ఏ రోజు ధాన్యం తరలిస్తే అదేరోజు వివరాలను ఆన్లైన్లో నమోదు చేయడంలో జాప్యం జరిగే అవకాశం ఉందని నిర్వాహకులు పేర్కొంటున్నారు. రైతులు నష్టపోకుండా ఉండేందుకే ప్రభుత్వం ఆన్లైన్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. కొనుగోలు కేంద్రాల్లో తూకం చేసిన ధాన్యం జీపీఎస్ ఉన్న వాహనంలో ఆన్లైన్లో ఎంపికై న మిల్లుకు ధాన్యం తరలిస్తారు. కొత్త పద్దతి విధానంలో రైతులకు ఏమైనా ఇబ్బందులుంటే మా దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తాం. – సైదులు, డీఎం, పౌరసరఫరాల సంస్థ గత సీజన్ వరకు ధాన్యాన్ని మిల్లులకు మాన్యువల్ విధానంలో కేటాయించే వారు. ధాన్యం ఏ మిల్లుకు వెళ్లనుందో కొనుగోలు కేంద్రం నిర్వాహకుడికి ముందే తెలిసేది. కొత్త విధానంలో ధాన్యం ఏ మిల్లుకు వెళ్తుందో తెలియదు. ఆన్లైన్లో ట్రక్‌షీట్ జనరేట్ అయిన తర్వాత అటోమెటిక్‌గా మిల్లు చూపిస్తుంది. ఆ మిల్లుకే డ్రైవర్ ధాన్యాన్ని తరలించాల్సి ఉంటుంది. ఇలా అంతా ఆన్లైన్లోనే ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ కొనసాగుతుంది. జీపీఎస్ వాహనాల్లో ధాన్యం మిల్లులకు తరలింపు అదే రోజున వివరాల నమోదు పూర్తి సమాచారం రైతుల సెల్‌ఫోన్‌కు.. -
సేంద్రియ సాగుతో అధిక దిగుబడులు
కోస్గి రూరల్: ౖరెతులు రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి సేంద్రియ సాగుతో అధిక దిగుబడులు పొందాలని ప్రొ. జయశంకర్ తెలంగాణ విశ్వవిద్యాలయం వ్యవసాయ శాస్త్రవేత్తలు రాజేశ్వర్‌రెడ్డి, రాజా మధుశేఖర్ అన్నారు. సోమవారం మండలంలోని చంద్రవంచలో తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం పరిగి ఆధ్వర్యంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు–2026 కార్యక్రమం నిర్వహించగా.. వారు హాజరై వానాకాలం సాగుపై అవగాహన కల్పించారు. వానాకాలంలో అధిక దిగుబడినిచ్చే వరి వంగడాల ఎంపిక, పచ్చిరొట్ట ఎరువులతో నేలసారం పెంపొందించే విధానం, అధిక రసాయన ఎరువుల వినియోగంతో పర్యావరణం, నేల ఆరోగ్యానికి కలిగే నష్టాలు, డ్రిప్, స్ప్రింక్లర్లతో నీటి పొదుపు తదితర అంశాల గురించి క్షుణ్ణంగా వివరించారు. వ్యవసాయ, ఉద్యానశాఖల ద్వారా అమలవుతున్న ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించి వాటిని పొందే విధానాలను తెలియజేశారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి రామకృష్ణ, వ్యవసాయ విస్తరణ అధికారులు అజయ్, వినోద్, సర్పంచ్ విద్యావతి, ఆదర్శ రైతులు వెంకట్రాములు, అనిత, సాయిరెడ్డి పాల్గొన్నారు. -
మామి‘డీలా’..!
కోడేరు మండలానికి చెందిన రైతు వెంకటస్వామి ఇటీవల 2.50 టన్నుల మామిడికాయలను హైదరాబాద్ మార్కెట్‌కు తీసుకెళ్లగా.. టన్నుకు రూ. 22వేల ధర పలికింది. మొత్తం కాయలకు రూ. 55వేలు వచ్చాయి. వీటిలో దళారుల కమీషన్ రూ. 6వేలు, కాయలు తెంపినందుకు కూలీలకు రూ. 8వేలు, వాహనం కిరాయి రూ. 7,500, మార్కెట్లో హమాలీ ఖర్చులు, భోజనం ఖర్చులు అన్నీ పోగా.. రైతుకు రూ. 29వేలు మిగిలాయి. మామిడితోట సాగుకోసం చేసిన ఖర్చులు కూడా రాలేదని సదరు రైతు ఆవేదన వ్యక్తంచేశారు. కొల్లాపూర్: ఈసారి మామిడి దిగుబడులు అరకొరగా ఉండటంతో ధరలు బాగానే ఉంటాయని రైతులు భావించారు. అయితే మార్కెట్లో వ్యాపారుల సిండికేట్‌కు తోడు ఏపీ నుంచి పెద్దమొత్తంలో మామిడి వస్తుండటంతో ధరలు భారీగా పడిపోయాయి. కేవలం రెండు రోజుల్లోనే ధరలను అమాంతం తగ్గించడంతో మామిడి రైతులు అయోమయంలో పడిపోయారు. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో ఉన్న ధరల ప్రకారం రైతులకు కూలి కూడా మిగలని దుస్థితి నెలకొంది. చివరలో నిలిచిన పూతలు.. ఈ ఏడాది మామిడి పూతలు గతంలో ఎన్నడూ లేనంతగా విరబూశాయి. కానీ అవి నిలవలేదు. కొన్ని తోటల్లో మాత్రమే మొదటి దశ పూతలు నిలిచాయి. జనవరిలో వచ్చిన ఆఖరి దశ పూతలు చాలా తోటల్లో నిలిచాయి. మొదటి దశ పూతలకు సంబంధించిన పంట దిగుబడి ఫిబ్రవరి, మార్చిలో వచ్చేసింది. వీటికి భారీగా ధరలు లభించాయి. టన్ను ధర పచ్చకాయలు రూ. లక్షకు పైగా, కవర్ కట్టిన కాయలు టన్నుకు రూ. 2లక్షల వరకు ధర పలికాయి. చివరలో నిలిచిన పూతలకు సంబంధించిన పంట దిగుబడి ఈ నెలలో ప్రారంభం కాగా.. మొదటి వారం నుంచే మామిడి ధరలను వ్యాపారులు తగ్గిస్తూ వస్తున్నారు. టన్నుకు కనిష్టంగా రూ.20 వేలు.. నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాల నుంచి పెద్ద మొత్తంలో మామిడికాయలను హైదరాబాద్ మార్కెట్‌కు తీసుకెళ్తారు. బాటసింగారం మార్కెట్‌యార్డుతో పాటు బాలాపూర్ మార్కెట్లో మామిడికాయల కొనుగోళ్లు సాగుతున్నాయి. వీటితో పాటు కొల్లాపూర్, పెద్దకొత్తపల్లి, జడ్చర్ల, కల్వకుర్తి ప్రాంతాల్లో కూడా వ్యాపారులు కొనుగోలు దుకాణాలను ఏర్పాటుచేశారు. మార్చి నెలాఖరు వరకు హైదరాబాద్ మార్కెట్‌కు రోజు 500 నుంచి 600 వాహనాల్లో మామిడికాయలు తరలించగా.. ఏప్రిల్ ప్రారంభం నుంచి ఈ సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. రెండు వారాలుగా రోజూ 1200 వాహనాల్లో కాయలు వస్తున్నాయి. విజయవాడ, చిత్తూరు తదితర ప్రాంతాల నుంచి హైదరాబాద్ మార్కెట్‌కు మామిడికాయలు వస్తుండటంతో వ్యాపారులు సిండికేట్ అయ్యారు. ధరలను అమాంతం కుదించేశారు. పచ్చకాయలు టన్నుకు రూ. 20వేల నుంచి రూ. 50వేల వరకు మాత్రమే కొంటున్నారు. ఎవరో ఒక రైతుకు మాత్రమే రూ. 50వేల వరకు ధరను కట్టబెడుతున్నారు. మిగతా వారందరికీ రూ. 20వేల నుంచి రూ. 30వేలకే పరిమితం చేస్తున్నారు. కవర్కాయల ధరలు కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయి. టన్నుకు రూ. 70వేల నుంచి రూ. 1.30 లక్షల వరకు కొనుగోలు చేస్తున్నామని వ్యాపారులు చెబుతుండగా.. వాస్తవానికి టన్నుకు రూ. 40వేల నుంచి రూ. 70వేల వరకే కొనుగోలు చేస్తున్నారు. ఎవరో ఒక రైతుకు మాత్రమే రూ.లక్ష వరకు ధర కల్పిస్తున్నారు. స్థానికంగా మార్కెట్ లేకపోవడమే.. మామిడికి ప్రసిద్ధిగాంచిన కొల్లాపూర్‌లో మార్కెట్ లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. హైదరాబాద్ మార్కెట్లో కొల్లాపూర్ మామిడిని కొనుగోలు చేసేందుకు వ్యాపారులు పోటీపడతారు. కానీ దళారులు, వ్యాపారులు కుమ్మకై ్క ధరలను అమాంతం తగ్గించేస్తున్నారు. రైతులు అడిగితే ఏపీ నుంచి కాయలు పెద్దమొత్తంలో వస్తుండటంతో ధరలు తగ్గించామనే సమాధానం చెబుతున్నారు. హైదరాబాద్ మార్కెట్లో ధరలు తగ్గితే.. స్థానికంగా కాయలు కొనుగోలుచేసే ప్రైవేటు వ్యాపారులు కూడా ధరలను తగ్గించేస్తున్నారు. కొల్లాపూర్‌లో ప్రభుత్వమే మార్కెట్ ఏర్పాటుచేసి.. ఇక్కడి కాయలను స్థానికంగా విక్రయించుకునే వెసలుబాటు ఉంటే రైతులకు మద్దతు ధర లభించే అవకాశం ఉంటుంది. పాలకులు ఈ దిశగా చర్యలు చేపట్టాలని మామిడి రైతులు కోరుతున్నారు. మార్కెట్లో భారీగా పడిపోయిన ధరలు టన్నుకు రూ.20 వేల నుంచి రూ.45వేలకు మాత్రమే కొనుగోలు కవర్ కాయల పరిస్థితి కూడా అంతే.. ఆందోళనలో మామిడి రైతులు -
బాధ్యతలు చేపట్టిన కలెక్టర్
నారాయణపేట: జిల్లా కలెక్టర్‌గా సీహెచ్ ప్రియాంక సోమవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను, ఎస్డీసీ రాజేందర్‌గౌడ్, ఏఓ శ్రీధర్, జిల్లా అధికారులు ఆమెను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కలు, పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. బార్ అసోసియేషన్ కార్యవర్గం ఎన్నిక కోస్గి రూరల్: స్థానిక బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా గందె ఓంప్రకాశ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని ఎన్నికల అధికారి వెంకటనర్సింహగౌడ్ సోమవారం తెలిపారు. ఉపాధ్యక్షుడిగా మల్లికార్జున్, ప్రధానకార్యదర్శిగా రాజలింగం, మహిళా రిప్రజెంటేటివ్‌గా పర్వీన్‌బేగం, స్పోర్ట్స్‌లో తాజ్‌ఖాన్, సంతోష్‌నాయక్, లైబ్రరీ కార్యదర్శులుగా భీమప్ప, మురళి, సభ్యులుగా ప్రభాకర్, వీఎన్ గౌడ్, మల్లేష్ ఎన్నికయ్యారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మూడోసారి తనను ఎన్నుకున్నందుకు ఓంప్రకాశ్ న్యాయవాదులందరికి ధన్యవాదాలు తెలిపారు. కోర్టు భవన నిర్మాణానికి, న్యాయవాదుల సంక్షేమానికి కృషి చేస్తానని కార్యవర్గం హామీ ఇచ్చింది. వైద్య కళాశాలకు మృతదేహం అప్పగింత ఆత్మకూర్: పట్టణానికి చెందిన విశ్రాంత డీఏఓ రాజశేఖరరావు అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. ఆయన మృదేహాన్ని కుటుంబసభ్యులు సోమవారం వనపర్తి ప్రభుత్వ వైద్య కళాశాలకు అప్పగించారు. వైద్య విద్యార్థులకు మృతదేహం ఉపయోగపడుతుందని, ఇందుకు ముందుకొచ్చిన రాజశేఖర్‌రావు కుటుంబ సభ్యులను ప్రొఫెసర్లు అభినందించారు. అనంతరం ధ్రువీకరణ పత్రం అందజేశారు. రాజశేఖరరావు సతీమణి నాగమణి, కుమారుడు వెంకటనాంగేంద్రప్రసాద్, కుమార్తెలు విజయ లక్ష్మి, నాగజ్యోతి, బంధువులు పాల్గొన్నారు. -
వేరుశనగ @ రూ.6,899
జడ్చర్ల/ దేవరకద్ర: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్లో సోమవారం వేరుశనగ క్వింటా గరిష్టంగా రూ.6,899, కనిష్టంగా రూ.5,688 ధర పలికింది. అలాగే ఆముదాలు క్వింటాల్ రూ.6,239, జొన్నలు రూ.2,177, రాగులు రూ.3,079, ధాన్యం ఆర్ఎన్ఆర్ గరిష్టంగా రూ.2,479, కనిష్టంగా రూ.2,256, మొక్కజొన్న గరిష్టంగా రూ.1,836, కనిష్టంగా రూ.1,786, పొద్దుతిరుగుడు రూ.5,690, కందులు రూ.6,276 చొప్పున లభించాయి. ● దేవరకద్ర మార్కెట్ యార్డులో ఆర్ఎన్ఆర్ ధాన్యం ధర క్వింటాల్ గరిష్టంగా రూ.2,229, కనిష్టంగా రూ.1,959, హంస గరిష్టంగా రూ.1,800, కనిష్టంగా రూ.1,719, ఆముదాలు గరిష్టంగా రూ.6,080, కనిష్టంగా రూ.6,050 చొప్పున నమోదయ్యాయి. -
కమనీయం.. శ్రీనివాసుడి కల్యాణం
బిజినేపల్లి: వట్టెం శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానంలో సోమవారం శ్రీపద్మావతి శ్రీనివాసుడి కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. మాజీ సర్పంచ్ బత్తిని అమృత్‌రెడ్డి – భార్గవి దంపతుల కై ంకర్యంతో ఆలయ ప్రధాన అర్చకుడు శ్రీపాదస్వామి బృందం కల్యాణతంతు జరిపించారు. ముందుగా స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకరించి.. జీలకర్ర బెల్లం, మాంగళ్యధారణ, తలంబ్రాలు వంటి ఘట్టాలను కనులపండువగా నిర్వహించారు. కల్యాణం అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. -
ఎరువు.. దరవు
●మరికల్: ఆరుగాలం శ్రమించి పంటలు పండించి అందరి ఆకలి తీర్చే రైతన్నపై ఎరువుల ధరల పిడుగు ఏటా పడుతూనే ఉంది. ఈ ఏడాది కాంప్లెక్స్ ఎరువుల ధరలను ఆయా కంపెనీలు నాలుగు సార్లు పెంచడంతో వచ్చే వానాకాలంలో పంటల సాగు మరింత భారం కానుంది. గత వానాకాలం సీజన్లో బస్తాకు రూ.50 నుంచి రూ.300 పెరగగా.. ఈ యాసంగి సీజన్లో బస్తాకు రూ.50 చొప్పున రెండుసార్లు కలిపి రూ.100 పెంచారు. తాజాగా నాలుగోసారి బస్తాకు రూ.225 నుంచి ఽరూ.300 పెంచడంతో రానున్న వానాకాలం సీజన్లో రైతులపై ఎరువుల ధరల పెరుగుదల ప్రభావం పడనుంది. కాంప్లెక్స్ ఎరువులు జిల్లాలో సుమారుగా 1.14 లక్షల మెట్రిక్ టన్నులు వినియోగిస్తారని వ్యవసాయ అధికారుల లెక్కలు చెబుతున్నాయి. యుద్ధం కారణంగా సహజ వాయువు సరఫరా నిలిచిపోవడం, రవాణా చార్జీలు పెరగడం తదితర కారణాలతో ధరలు పెరుగుతున్నాయని కంపెనీల ప్రతినిధులు చెబుతున్నారు. రైతుల గగ్గోలు.. ప్రస్తుతం కూరగాయలు, ఇతర పంటలు సాగు చేసే రైతులు కాంప్లెక్స్ ఎరువుల కోసం వెళ్తే పెరిగిన ధరల బస్తాలు మాత్రమే విక్రయిస్తుండటంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. కంపెనీలు డీఏపీ, యూరియా మినహా అన్ని రకాల కాంప్లెక్స్ ఎరువుల ధరలను పెంచడంతో ఈసారి కొనుగోలు చేయలేని పరిస్థితులు నెలకొన్నాయని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కంపెనీలు కాంప్లెక్స్ ఎరువుల ధరలు పెంచినట్లు సమాచారం ఉందని జిల్లా వ్యవసాయశాఖ అధికారి జాన్ సుధాకర్ తెలిపారు. ఎరువు పాతఽ ధర కొత్త ధర పెంపు 19–19–19 2,075 2,300 225 20–20–13 1,500 1,800 300 14–35–14 2,175 2,250 225 12–32–15 2,025 2,250 225 పొటాష్ 1,850 1,975 125 ఎరువుల ధరలు ఇలా (రూ.లలో..) ఏటా పెరుగుతున్న కాంప్లెక్స్ ఎరువుల ధరలు ఈ ఏడాది నాలుగు సార్లు పెంపు రైతన్నలపై అదనపు భారం -
ఇదేం శిక్షణ!
ఉమ్మడి జిల్లాలో అడ్డగోలుగా కోచింగ్ సెంటర్ల నిర్వహణ ● ఐఐటీ, నీట్, ఎఫ్‌సెట్ వంటి వాటికి కొత్త ట్రెండ్ ● నవోదయ, గురుకుల, సైనిక్ స్కూల్ పోటీ పరీక్షలకు సైతం శిక్షణ ● షార్ట్, లాంగ్‌టర్మ్ కోచింగ్, హాస్టళ్లు సైతం కొనసాగింపు ● అన్నీ తెలిసినా.. పట్టనట్లుగా అధికారుల తీరు మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఆశలను ఆసరాగా చేసుకొని ప్రైవేటు కోచింగ్ సెంటర్ల యాజమాన్యాలు విచ్చలవిడిగా నిర్వహిస్తున్నారు. కోచింగ్ సెంటర్ల ఏర్పాటుకు విద్యాశాఖ నుంచి అనుమతులు తీసుకోవాలి. కానీ, ఇక్కడి కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు వాటిని తుంగలో తొక్కి ఎలాంటి అనుమతులు లేకుండా యథేచ్ఛగా ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం ఇంటర్, పదో తరగతి పరీక్షలు ముగియగా.. ఎంసెట్, ఐఐటీ, నీట్ వంటి వాటికి డిమాండ్ ఉండడంతో పెద్దఎత్తున లాంగ్‌టర్మ్, షార్ట్‌టర్మ్ కోచింగ్ ఇస్తున్నారు. గతంలో ఎస్ఐ, కానిస్టేబుల్‌కు శిక్షణ ఇచ్చిన కోచింగ్ సెంటర్లు సైతం ప్రస్తుతం ఐఐటీ, నీట్‌కు శిక్షణ ఇవ్వడం గమనార్హం. వీటితోపాటు నవోదయ, గురుకులాలు, సైనిక్ స్కూల్స్‌కు సైతం పెద్దఎత్తున కోచింగ్ సెంటర్లు వెలిశాయి. వీటికి అనుమతులు లేకపోవడంతోపాటు కనీసం ట్రేడ్ లైసెన్స్ కూడా తీసుకోకుండా ఏర్పాటు చేస్తుండగా విద్యాశాఖ అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుంది. -
సమాజాన్ని సంస్కరించడమే కవి పని
స్టేషన్ మహబూబ్‌నగర్: సమాజాన్ని సంస్కరించడమే కవి పని అని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, ప్రముఖ కవి డాక్టర్ నందిని సిధారెడ్డి అన్నారు. పాలమూరు సాహితీ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లాకేంద్రం లిటిల్ స్కాలర్స్ హైస్కూల్లోని కాళోజీ హాల్లో ప్రముఖ కవి, విద్యావేత్త కె.లక్ష్మణ్‌గౌడ్ రచించిన ‘నిశ్శబ్దం మాట్లాడితే’ కవితా సంపుటి ఆవిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా, ఆవిష్కర్తగా హాజరై మాట్లాడారు. లక్ష్మణ్‌గౌడ్ స్థానిక సమస్యలనే కాకుండా అంతర్జాతీయ సమస్యలను సైతం అద్భుతంగా కవిత్వం రాశారన్నారు. ధిక్కారంతో రాసిన కవిత్వం ఇందులో కనిపిస్తుందన్నారు. విశిష్ట అతిథిగా విచ్చేసిన ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగుశాఖ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్.రఘు మాట్లాడుతూ లక్ష్మణ్‌గౌడ్ కవిత్వం సమకాలిన సమస్యలను బలంగా ఆవిష్కరించిందన్నారు. నిరంతరం కవిత్వం రాస్తూ సమాజాన్ని తట్టిలేపే ప్రయత్నం చేయడం అభినందనీయమన్నారు. పుస్తక సమీక్షకులు, ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు డాక్టర్ వంగీపురం శ్రీనాథాచారి మాట్లాడుతూ ప్రపంచ కవులైన ఇలియట్, జాన్కిట్స్, ప్లాబో నెరుడా వంటి వారు రాసిన కవిత్వం లక్ష్మణ్‌గౌడ్ కవిత్వంలో కనిపిస్తుందన్నారు. ఆయన కవిత్వంలో శ్రీశ్రీ ధిక్కారం, కాళోజీ ప్రజాస్వరం కనిపిస్తుందన్నారు. ప్రముఖ న్యాయవాది వి.మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ లక్ష్మణ్‌గౌడ్ కవిత్వం రాస్తూ సమాజాన్ని చైతన్యపరుస్తున్నారని పేర్కొన్నారు. ఈ పుస్తకాన్ని ప్రసిద్ధ విద్యావేత్త, అనువాదకులు జలజం సత్యనారాయణకు అంకితం చేశారు. కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది బుర్రి వెంకట్రారెడ్డి, ప్రముఖ కవి కోట్ల వెంకటేశ్వరరెడ్డి, లిటిల్ స్కాలర్స్ పాఠశాల కరస్పాండెంట్ అరుంధతీరాయ్, సంయుక్తరాయ్, పాలమూరు సాహితీ అధ్యక్షుడు డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్, బాదేపల్లి వెంకటయ్య పాల్గొన్నారు. -
రైతులపైనే భారం..
ఏటా పెరుగుతున్న ఎరువుల ధరలతో రైతులపై అదనపు భారం పడుతుంది. ఈ ఏడాది ఏకంగా నాలుగు సార్లు ధరలు పెంచారు. ప్రస్తుత పరిస్థితుల్లో వాతావారణ మార్పుల కారణంగా సరైన దిగుబడులు రాక పెట్టుబడులు మీద పడుతున్నాయి. ప్రభుత్వం కంపెనీలతో మాట్లాడి పెంచిన కాంప్లెక్స్ ఎరువుల ధరలు తగ్గించేందుకు, ధరలు అందుబాటులో ఉండేలా చొరవ చూపాలి. – రాములు, రైతు, మరికల్ ధాన్యం ధరలు పెంచాలి.. ఎరువులు తయారు చేసే కంపెనీలు ఏదో సాకుతో ఇష్టానుసారంగా ధరలు పెంచుతూ రైతుల నడ్డి విరుస్తున్నాయి. కాని రైతులు పండించిన పంటకు మాత్రం ధర అడిగే హక్కు లేదా? కంపెనీల జోలికి వెళ్లని ప్రభుత్వం రైతులపై ప్రతాపం చూపి వారు నిర్ణయించిన ధరలకే పంటను అమ్మి నిలువునా మోసపోతున్నాం. రైతులు పండించిన ధాన్యం ధరలు కూడా పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. – మల్లేష్, రైతు, పెద్దచింతకుంట ● -
ఫిర్యాదు చేయండి..
జిల్లాలో విద్యాశాఖ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా కోచింగ్ సెంటర్లను నిర్వహించొద్దు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్ణీత ఫీజు చెల్లించి.. ఫిజికల్ వెరిఫికేషన్ తర్వాత అనుమతి మంజూరు చేస్తాం. కోచింగ్ సెంటర్లను ప్రభుత్వ ఉపాధ్యాయులు నిర్వహించడానికి వీల్లేదు. ఎవరైనా అక్రమంగా కోచింగ్ సెంటర్లు నిర్వహిస్తున్నట్లు తెలిస్తే మాకు ఫిర్యాదు చేయండి. – ప్రవీణ్‌కుమార్, డీఈఓ సీజ్ చేయాలి కోచింగ్ సెంటర్లలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు. ఎంత మంది వచ్చినా అడ్మిషన్లు ఇస్తున్నారు. అడ్డగోలుగా ప్రైవేటు భవనాలు తీసుకుని, కనీస వసతులు లేకుండా శిక్షణ ఇస్తున్నారు. అనుమతి లేని కోచింగ్ సెంటర్లను వెంటనే సీజ్ చేయాలి. – భరత్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి, మహబూబ్‌నగర్ అడ్డగోలుగా ఫీజులు.. ఉమ్మడి జిల్లాలో అనుమతులు లేకుండా కోచింగ్ సెంటర్లు, హాస్టర్లు నిర్వహిస్తున్నారు. అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నారు. అధికారులు జిల్లాస్థాయిలో కమిటీ వేసి విచారణ జరిపించాలి. చాలా కోచింగ్ సెంటర్లు ప్రారంభంలో చూపించిన ఆర్భాటం చివరి నాటికి ఉండదు.–మారుతి, జిల్లా అధ్యక్షుడు, పీడీఎస్‌యూ, మహబూబ్‌నగర్ ● -
రైతుల సంక్షేమమే లక్ష్యంగా పోరాటం
నారాయణపేట: రైతుల సంక్షేమమే లక్ష్యంగా తమ సంఘం ఆధ్వర్యంలో నిరంతర పోరాటాలు కొనసాగిస్తామని రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాగర్ తెలిపారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. పంటలకు మద్దతు ధరలు నిర్ణయించి చట్టబద్ధంగా అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడంతో నేడు రైతులకు రూ.4 వేల కోట్ల మేర నష్టం వాటిల్లిందని ఆరోపించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి క్వింటాకు సుమారు 5 కిలోల తరుగు చూపిస్తున్నారని.. అరికట్టడంలో అధికారులు విఫలమయ్యారన్నారు. ఇటీవల కొత్తగూడెంలో మూడురోజుల పాటు రాష్ట్ర మూడో మహాసభలు విజయవంతంగా కొనసాగాయని.. మహాసభల్లో రైతులకు సంబంధించిన 31 అంశాలపై చర్చించి తీర్మానం చేసినట్లు చెప్పారు. రైతుభరోసా పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేయడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. సంఘం జిల్లా కార్యదర్శి అంజిలయ్యగౌడ్ మాట్లాడుతూ.. పేట–కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూ నిర్వాసితులకు నష్ట పరిహారంతో పాటు అర్హులైన వారికి ఇల్లు, స్థలాలు, వారి పిల్లలకు గురుకులాల్లో చదివేందుకు అవకాశం కల్పించాలని కోరారు. సీఎంఆర్ అప్పగించని మిల్లులపై చర్యలు తీసుకోవాలని, అవినీతికి పాల్పడిన మిల్లు యజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సూచించారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి బండమీది బలరాం, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు గుండెగారి దస్తప్ప తదితరులు పాల్గొన్నారు. -
వికసిత్ భారత్‌లో యువత పాత్ర కీలకం
● ఫిట్నెస్ను జీవితంలో భాగస్వామ్యం కావాలి ● గవర్నర్ శివప్రతాప్ శుక్లా ● ముగిసిన సంసద్ ఖేల్ మహోత్సవ్ మహబూబ్‌నగర్ క్రీడలు: యువతే వికసిత్ భారత్‌లో కీలకపాత్ర అని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. యువతలో క్రీడాస్ఫూర్తి పెంపొందించడం ద్వారా బలమైన దేశ నిర్మాణం సాధ్యమన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాకేంద్రంలోని మెయిన్ స్టేడియంలో పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవ్ బహుమతుల ప్రదానోత్సంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల ప్రతిభను ఒక వేదికపైకి తీసుకొచ్చే ఈ తరహా క్రీడా ఉత్సవాలు సమగ్ర అభివృద్ధికి దోహదపడుతాయన్నారు. యోగా, మార్షల్ ఆర్ట్స్ వంటి కళలు భారతీయ సంప్రదాయాలు, శారీరక, మనస్సు, ఆత్మల సమతుల్యతను పెంపొందిస్తాయన్నారు. ఫిట్నెస్ను ప్రతి ఒక్కరూ జీవితంలో భాగస్వామ్యం చేసుకోవాలన్నారు. విజేతలందరికీ అభినందనలు తెలిపిన గవర్నర్, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నిర్వాహకులు, కోచ్‌లు, తల్లిదండ్రులు, యువతను ప్రత్యేకంగా అభినందించారు. ప్రతిభను ప్రోత్సహిస్తూ క్రీడాస్ఫూర్తిని పెంపొందిస్తూ బలమైన ఐక్య భారతదేశ నిర్మాణానికి అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ పోటీల్లో ట్రోఫీలతో పాటు విన్నర్ జట్టుకు రూ.50 వేలు, రన్నరప్ జట్టుకు రూ.25 వేలు నగదు పారితోషికం అందజేశారు. క్రీడా ప్రతిభను వెలికి తీసేందుకు ఖేల్ మహోత్సవ్ గ్రామీణ యువతలోని క్రీడా ప్రతిభను వెలికితీసి, వారిని అంతర్జాతీయస్థాయిలో చేర్చేందుకు ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవ్ దోహదం చేస్తుందని ఎంపీ డీకే అరుణ పేర్కొన్నారు. ప్రధానమంత్రి క్రీడలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. మోదీ చొరవతో ఇటీవల అంతర్జాతీయస్థాయి క్రీడల్లో దేశం ముందంజలో నిలుస్తుందన్నారు. ఖేలో ఇండియా ద్వారా గ్రామీణ ప్రాంతాల క్రీడాకారులను ప్రోత్సాహం ఇస్తున్నట్లు తెలిపారు. ● బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు మాట్లాడుతూ పిల్లలు క్రీడల్లో పాల్గొనేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని కోరారు. క్రీడల తో మంచి సమాజ నిర్మాణం జరుగుతుందన్నా రు. క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొన్న యువతను అభినందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అంతర్జాతీయ మహిళా క్రికెటర్లు డయానా డేవిడ్, త్రిషా పూజిత, కలెక్టర్ ఖుష్బూ గుప్తా, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి మేయర్ గుమ్మాల మమత, డిప్యూటీ మేయర్ సురేందర్‌రెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ బెక్కరి అనిత, బీజేపీ నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, శ్రీవర్ధన్‌రెడ్డి, పీఎంఎస్‌కేఎం పార్లమెంట్ ఇన్చార్జి జనార్దన్‌రెడ్డి, జిల్లా కన్వీనర్ కిరణ్‌కుమార్‌రెడ్డి, నవీన్‌కుమార్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ● అంతకముందు ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల క్రీడా జట్లు మార్చ్ఫాస్ట్ నిర్వహించగా గవర్నర్ వారి నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఖేల్ మహోత్సవ్ సందర్భంగా చిన్నారుల సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. -
మూడోరోజు కొనసాగిన సమ్మె
నారాయణపేట రూరల్: జిల్లాకేంద్రంలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె మూడోరోజు శుక్రవారం ప్ర శాంతంగా కొనసాగింది. డిపో ఎదుట ఏర్పాటు చేసిన శిబిరంలో డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్‌లు కూర్చొని శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తూ త మ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని వి జ్ఞప్తి చేశారు. సీఐటీయూ, భూ నిర్వాసితుల సంఘం, జాగృతిసేన, బహుజన సమాజ్‌పార్టీ నాయకులు సమ్మె శిబిరానికి చేరుకొని ఆర్టీసీ కార్మికులకు మద్దతు తెలిపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌పార్టీ ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలని, ఆర్టీసీ కార్మికుల పక్షాన సీఎం రేవంత్‌రెడ్డి నిలబడాలని డిమాండ్ చేశారు. పట్టణంలో మౌన ర్యాలీ.. ఆత్మహత్య చేసుకున్న శంకర్‌గౌడ్ చిత్రపటానికి నారాయణపేట ఆర్టీసీ కార్మికులు పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం డిపో నుంచి సత్యనారాయణ చౌరస్తా, పాత బస్టాండ్ మీదుగా కొత్త బస్టాండ్ వరకు మౌనం పాటిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. ఆత్మహత్యలు పరిష్కారం కావని, ప్రతి ఒక్కరూ సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. మూడురోజులుగా సమ్మె చేస్తున్నా.. ప్రభుత్వం పట్టించుకోకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె శిబిరం వద్ద పోలీసు బందోబస్తు పెంచారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పెద్దఎత్తున పోలీసులు మోహరించారు. అదేవిధంగా బస్టాండ్ ప్రాంగణంలో ఫైరింజన్‌తో పాటు 108 వాహనాన్ని అందుబాటులో ఉంచారు. -
సరిహద్దు చెక్‌పోస్టులు ఏర్పాటు : ఎస్పీ
నారాయణపేట: యాసంగి వరి ధాన్యం కొనుగోలు సందర్భంగా పొరుగు రాష్ట్రాల నుంచి తెలంగాణకు వరి ధాన్యం అక్రమంగా తరలకుండా, అలాగే రాష్ట్రంలోని పీడీఎస్, సీఎంఆర్ ఇతర రాష్ట్రాలకు ఎగుమతి కాకుండా నిరోధించేందుకు జిల్లా పరిధిలో ఆరు సరిహద్దు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసిన ట్లు ఎస్పీ డా. వినీత్ శుక్రవారం వెల్లడించారు. జిల్లా లోని నారాయణపేట మండలం జలాల్పూర్, దా మరగిద్ద మండలం కానుకుర్తి, కృష్ణా మండలం చేగుంట సమీపంలోని కృష్ణానది వంతెనపై, ఊట్కూర్ మండలం సమస్తాపూర్, మాగనూర్ మండలం ఉజ్జెల్లి వద్ద చెక్‌పోస్ట్ ఏర్పాటు చేసినట్లు వివరించారు. పోలీస్, రెవెన్యూ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ పూర్తిస్థాయి నిఘా ఉంచాలని ఎస్పీ తెలిపారు. వరి ధాన్యం అక్రమంగా జిల్లాకు తరలకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని.. చెక్‌పోస్టు నుంచి వెళ్లే ప్రతి వాహనానికి సంబంధించి ఎలక్ట్రానిక్ వేబిల్స్, ఇతర రవాణా పత్రాలను తప్పనిసరిగా తనిఖీ చేయాలని, అక్ర మంగా తరలిస్తున్నట్లు నిర్ధారణ అయితే చట్టపరమై న చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే ప్ర తి వాహనం రిజిస్ట్రేషన్ నంబర్, డ్రైవర్ వివరాలు, గమ్యస్థానం వంటి సమాచారాన్ని రిజిస్టర్లో నమో దు చేయాలని, వ్యాపారులు, కమీషన్ ఏజెంట్లపై ప్రత్యేక నిఘా ఉంచాలని తెలిపారు. చెక్‌పోస్టుల వద్ద మాత్రమే కాకుండా సరిహద్దు గ్రామాల ద్వారా అక్రమ రవాణా జరగకుండా ప్రత్యేక పహారా ఏర్పాటు చేయాలని సూచించారు. అన్ని పోలీస్స్టేషన్ల హెచ్ఓలు చెక్‌పోస్టుల పనితీరుపై నిరంతరం పర్యవేక్షణ చేయాలని, విధుల్లో ఉన్న పోలీస్, రెవెన్యూ సిబ్బంది తరచూ తనిఖీ చేస్తూ అప్రమత్తంగా ఉండేలా చూడాలన్నారు. జిల్లా ప్రజలు సహకరించి, అనుమానాస్పద వాహనాలు, వరి అక్రమ రవాణాను గుర్తించే చవెంటనే సమీప పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు. పాఠశాలలు, కళాశాలలకు వేసవి సెలవులు రావడంతో ఎంతోమంది పిల్లలు, యువత ఎండ నుంచి ఉపశమనానికి ఈత నేర్చుకోవడానికి జలాశయాలు, స్విమ్మింగ్ పూల్స్‌కు వెళ్తుంటారని.. ఈ క్రమంలో ప్రమాదాలు జరిగి ప్రాణ నష్టం కలిగే అవకాశం ఉందని, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ డా. వినీత్ శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. ఈత రానివారు నదులు, బావులు, చెరువుల వద్దకు ఒంటరిగా వెళ్లరాదని, నేర్చుకునేపై వారి తల్లిదండ్రులు, శిక్షకుల పర్యవేక్షణ ఉండాలని సూచించారు. జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో గ్రామ అధికారులతో కలిసి జలాశయాల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు చెప్పారు. -
ఆటలకు వేళాయె..
–8లో uనర్వ: గ్రామీణ ప్రాంతాల్లో ఏటా నిర్వహించే వేసవి క్రీడా శిక్షణ శిబిరాలకు వేళయింది. తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ రూపొందించిన కార్యాచరణ ప్రకారం జిల్లాలో శనివారం నుంచి జూన్ 6 వరకు పది గ్రామీణ ప్రాంతాల్లో క్రీడా శిబిరాలు నిర్వహించేందుకు ఏర్పా ట్లు చేస్తున్నారు. 41 రోజుల పాటు వివిధ ప్రాంతాల మైదానాల్లో శిబిరాలు కొనసాగనున్నాయి. వేసవి క్రీడా శిబిరాల నిర్వహణకు శిక్షకుల నుంచి దరఖా స్తులు ఆహ్వానిస్తున్నారు.ఆసక్తి కలిగిన పీ డీలు, పీఈటీలు, సీనియర్ జాతీయస్థాయి క్రీడాకారులు పూర్తి వివరాలతో శనివారం సాయంత్రం 5 గంటల్లోగా జిల్లా యువజన క్రీడాశాఖలో దర ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. శిక్షకులకు రూ.5 వేల చొప్పున గౌరవ వేతనం చెల్లిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో వేసవి శిక్షణ శిబిరాలు నేటి నుండి జూన్ 6 వరకు.. మండలస్థాయిలో శిక్షకులకు పారితోషికం ఆన్లైన్లో నమోదు.. ధ్రువపత్రాల అందజేత గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారుల్లో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికితీసేందుకు వివిధ ఆటల్లో శిక్షణ ఇవ్వడం ఈ శిబిరాల ముఖ్య ఉద్దేశం. శిబిరాల్లో 14 ఏళ్లలోపు బాలబాలికలకు మాత్రమే శిక్షణనిస్తారు. నచ్చిన క్రీడలో శిక్షణ పొంది నైపుణ్యాలను ప్రదర్శించేందుకు గొప్ప అవకాశం. కబడ్డీ, వాలీబాల్, హ్యాండ్‌బాల్, నెట్‌బాల్, హాకీ, జూడో తదితర క్రీడల్లో తర్ఫీదు ఇవ్వనున్నారు. ఆసక్తిగల విద్యార్థులు తమ వివరాలను ఆన్లైన్లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. -
దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి
కందనూలు: దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నా రు. శుక్రవారం కలెక్టరేట్ ఆవరణలో జిల్లా మహిళా, శిశు, సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దివ్యాంగు లకు 44 వాహనాలు, డిగ్రీ విద్యా ర్థులకు 17 ల్యాప్‌టాప్‌లు, 2 సెల్ఫోన్లు అందజేశారు. 20 మంది బాలికలకు సైకిళ్లు, 6 మోటార్ వీల్చైర్లు, 10 బ్యాటరీ ట్రైసైకిళ్లు, ఒక బ్యాటరీ ఆటోను లబ్ధిదారులకు అందించారు. అనంతరం మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ ప్రభుత్వం దివ్యాంగుల జీవనోపాధిని మెరుగుపర్చడం, వారి స్వయం ఆధారిత జీవనానికి తోడ్పడడం లక్ష్యంగా ఉపకరణాలను అందజేస్తుందని వివరించారు. దివ్యాంగుల సంక్షేమానికి ప్రభు త్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, వారికి అవసరమైన అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నామని పేర్కొన్నారు. భవిష్యత్‌లో కూడా అర్హులైన ప్రతి దివ్యాంగుడికి అవసరమైన ఉపకరణాలు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. క్షేత్రస్థాయిలో అర్హులైన ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూర్చడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. దివ్యాంగుల అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, వారు స్వయం సమృద్ధి సాధించేలా ప్రోత్సహించేందుకు మరిన్ని వినూత్న పథకాలను ప్రవేశపెడతామన్నారు. ఇప్పటికే ప్రభుత్వం అందిస్తున్న పింఛన్లు, ఆర్థిక సాయం నేరుగా లబ్ధిదారులకు అందుతున్నాయని, ప్రజల అవసరాలకు అనుగుణంగా పాలన సాగిస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్‌లాల్, జిల్లా సంక్షేమ శాఖ అధికారి రాజేశ్వరి, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వీరయ్య తదితరులు పాల్గొన్నారు. -
పోటీ లేకుండా ‘సహకారం’
● పీఏసీఎస్ పదవులు ఇక నామినేటెడ్ ● నూతన సంస్కరణలా..? రాజకీయ వ్యూహమా..? ● ఎమ్మెల్యేల చేతుల్లోకి పీఏసీఎస్ పగ్గాలు ● డీసీసీబీకి కూడా నామినేటేడ్ చేసే అవకాశం అచ్చంపేట: రాష్ట్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(పీఏసీఎస్)పాలక వర్గాలకు నామినేటెడ్ పద్ధతిలో కొత్త కార్యవర్గాలను నియమించాలనే నిర్ణయం రాజకీయ వేడెక్కించింది. 2025 ఫిబ్రవరిలో పాలకవర్గాల గడువు ముగిసింది. గత పాలకవర్గాలనే పర్సన్ ఇన్చార్జి మేనేజింగ్ కమిటీలుగా ఆరు నెలల పాటు కొనసాగిస్తూ ఫిబ్రవరి 14న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ తర్వాత నిరవధికంగా మరో ఆరు నెలలు గడువును పొడిగిస్తూ ఆగస్టు 14న ఉత్తర్వులు జారీ చేసింది. ఇంకా గడువు ఉన్నప్పటికీ అకస్మాత్తుగా డిసెంబర్ 19న ప్రభుత్వం పాలకవర్గాలను రద్దు చేసింది. కాగా..ఊహించినట్లుగానే గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో పదవీకాలం ముగిసిన ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాలకు త్వరలోనే నామినేటేడ్ పద్ధతిన పాలకవర్గాలను నియమించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఉమ్మడి పాలమూరులోని ఐదు జిల్లాలో 76 పీఏసీఎస్‌లు ఉన్నాయి. వీటి అన్నింటికి త్వరలోనే కొత్త పాలక వర్గాలను ఏర్పాటు చేయనున్నారు. మరో వైపు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ)జిల్లా మార్కెటింగ్ సొసైటీ(డీసీఎంఎస్)లకు కూడా పాలకవర్గాలను నామినేటేడ్ చేసే అవకాశం ఉంది. ఇక డైరెక్టర్ల ఎంపికలో పాత పద్ధతిలో అనుసరించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ముగ్గురు లేదా ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. సహకార శాఖ వర్గాల ప్రకారం ఈ కమిటీలో చైర్మన్, వైస్ చైర్మన్, మిగిలిన వారిని డైరెక్టర్లుగా ఎంపిక చేసే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి ఆమోదం తరువాత నామినేటేడ్ కమిటీల నియామక ప్రక్రియ త్వరలోనే ఏర్పాటయ్యే అవకాశం ఉంది. వ్యవసాయ మార్కెట్ కమిటీల మాదిరిగా ఇందులో స్థానిక ఎమ్మెల్యేలు, ఇన్చార్జి మంత్రుల నేతృత్వంలో కమిటీల ఎంపిక చేయనున్నారు. దీంతో అధికార పార్టీకి చెందిన నేతల్లో హర్షం వ్యక్తవుతుంటే, ప్రతిపక్షాలు దీనిని ప్రజాస్వామ్య వ్యతిరేక నిర్ణయంగా అభివర్ణిస్తున్నాయి. పీఏసీఎస్ పాలనపై నియంత్రణను స్థానిక ఎమ్మెల్యేల చేతుల్లోకి అప్పగించేలా ప్రభుత్వ ఆలోచనలు ఉన్నాయన్న ప్రచారం కూడా బలంగా వినిపిస్తోంది. ఉమ్మడి పాలమూరులోని ఐదు జిల్లాల పరిధిలో 76 సొసైటీలుంటే.. నాగర్‌కర్నూలు జిల్లాలో 23, వనపర్తి15, జోగుళాంబగద్వాల 11, మహబుబ్‌నగర్17, నారాయణపేట 10 చొప్పున సొసైటీలు పని చేస్తున్నాయి. మరో 20 కొత్త సొసైటీలు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు వెళ్లాయి. దీంతో సొసైటీల పరిధిలో 380 మంది డైరెక్టర్లకు అవకాశం ఉంటుంది. ఇందులో నుంచి 76 మంది చైర్మన్లు, 76 మంది వైస్ చైర్మన్లను నియమిస్తారు. సర్పంచ్ ఎన్నికల్లో ఓటమి చెందిన అధికార పక్షం నేతలు పీఏసీఎస్‌లను ఎలాగైనా దక్కించుకోవాలనే ప్రయత్నాలు ఇప్పటి నుంచి మొదలు పెట్టారు. ప్రభుత్వం నామినేటేడ్ వైపు మొగ్గు చూపిస్తున్న తరుణంలో అధికార పార్టీ నాయకులకు పోటీ లేకుండానే సహకార సొసైటీలో పదవులు దక్కే అవకాశం దక్కుతుంది. పీఏసీఎస్‌ల గడువు ముగిసినప్పటికీ ప్రభుత్వం ఆరు నెలల చొప్పున రెండుసార్లు గడువు పొడిగిస్తూ వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆదే జీఓను కొనసాగిస్తూ అకస్మాత్తుగా రద్దు చేయడం, తిరిగి నామినేటేడ్ పద్ధతిలో భర్తీ చేసేందుకు నిర్ణయం తీసుకోవడం రాజకీయ వర్గాలు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈసారి ఎన్నికలు నిర్వహించకుండా నామినేటేడ్ చేయనున్న నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలకు మరింత చికాకుగా మారాయి. సహకార ఎన్నికల స్వస్తి పలికి, నామినేటేడ్ విధానాన్ని ప్రభుత్వం అమలు చేసేందుకు మొగ్గు చూపుతున్న తరుణంలో రాజకీయాలను ఒక్కసారిగా కుదిపేస్తోంది. -
ఇక ఆటా.. పాట
నేటి నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు ● విద్యార్థులకు ఆన్లైన్ ప్రోగ్రెస్ కార్డుల పంపిణీ ● తల్లిదండ్రులతో ఉపాధ్యాయుల సమావేశాలు ● సెలవుల్లో పాటించాల్సిన జాగ్రత్తలపై అవగాహన ● జూన్ 12న పునఃప్రారంభం కానున్న పాఠశాలలు నారాయణపేట రూరల్: ఉపాధ్యాయ బదిలీలు.. ప దోన్నతులు.. ఎన్నికల నిర్వహణ.. ఇలా అన్ని రకా ల అవాంతరాలను అధిగమించి విజయవంతంగా విద్యా సంవత్సరం ముగిసింది. శుక్రవారం నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు ప్రారంభం కానుండగా.. గురువారం ఆన్లైన్ ప్రోగ్రెస్ కార్డులను విద్యా ర్థులకు అందించారు. జూన్ 12న తిరిగి విద్యాసంస్థలు ప్రారంభం కానున్నాయి. చివరి రోజు పాఠశాలల్లో ఉపాధ్యాయులు తల్లిదండ్రులతో సమావేశాలు ఏర్పాటుచేసి.. విద్యార్థుల ప్రగతిని వివరించారు. అదే విధంగా ఏడాది మొత్తం నిర్వహించిన నాలుగు ఎఫ్ఏ, రెండు ఎస్ఏ పరీక్షలకు సంబంధించిన మార్కులను ఆన్లైన్లో పొందుపరిచి.. ప్రగతి నివేదికను అందజేశారు. సెలవుల్లో విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తల్లిదండ్రులకు వివరించారు. గురుకులాలు, సంక్షేమ వసతిగృహాల్లో ఉన్న విద్యార్థులు ఇంటిబాట పట్టారు. ఆన్లైన్లో విద్యార్థుల ప్రగతి.. సంగ్రహణాత్మక మూల్యాంకనం (ఎస్ఏ)–2 పరీక్షలు ఈ నెల 18న పూర్తి కావడంతో ఉపాధ్యాయులు వారం రోజులపాటు సమాధాన పత్రాల మూల్యాంకనంలో బిజీగా గడిపారు. విద్యార్థుల ప్రగతిని తెలిపే ప్రోగ్రెస్ రిపోర్టులను తయారుచేసి.. గతంలో మాదిరిగా కాకుండా విద్యార్థులకు ఆన్లైన్ ద్వారా ప్రగతి పత్రాలను అందజేశారు. ఇందుకు సంబంధించి ఈ ఏడాది జరిగిన నాలుగు ఫార్మేటివ్ అసెస్మెంట్ (ఎఫ్ఏ–1, 2, 3, 4) పరీక్షలతో పాటు సమ్మేటివ్ అసెస్మెంట్ (ఎస్ఏ–1, 2) పరీక్షలకు సంబంధించిన ఫలితాలను సంబంధిత వెబ్సైట్లో పొందుపరిచారు. సమగ్ర ప్రగతి పత్రం పేరుతో ప్రోగ్రెస్ కార్డులను అధునాతన పద్ధతిలో ముద్రించి విద్యార్థులకు పంపిణీ చేశారు. జిల్లాలో విద్యార్థుల సంఖ్య ఇలా.. ప్రభుత్వ బడులు : 2,993 స్థానిక సంస్థలు : 41,721 గురుకులాలు : 7,868 -
ప్రగతి పత్రాలు అందజేశాం..
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ఒకటి నుంచి తొ మ్మిదో తరగతి విద్యార్థులకు ఆన్లైన్ ద్వారా ప్రగతి పత్రాలను అందజేశాం. ఇప్పటికే పాఠశాలలో నిర్వహించిన అన్ని రకాల పరీక్షల మార్కులను సంబంధిత హెచ్ఎంలు వెబ్సైట్లో పొందుపరిచారు. మార్కులు క్రాస్ చెక్ చేసుకుని గురువారం పిల్లల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించి.. ప్రోగ్రెస్ కార్డులను అందించారు. సెలవుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. – గోవిందరాజులు, డీఈఓ ● -
భగీరథుడి దీక్ష సంకల్పం స్ఫూర్తిదాయకం
నారాయణపేట: భగీరథ మహర్షి దీక్ష సంకల్పం, నిస్వార్థ సేవాభావం అందరికీ స్ఫూర్తిదాయక మని అదనపు కలెక్టర్ ఫణీంద్రారెడ్డి అన్నారు. గురువారం కలెక్టరేట్లోని వీసీ హాల్లో జిల్లా బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో భగీరథ మహర్షి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. కఠోర దీక్ష, పట్టుదలకు భగీరథ మహర్షి ప్రతీకగా నిలుస్తారన్నారు.సమాజంలో ఉన్న అసమానతలు, అన్యాయాలను తొలగించేందుకు భగీరథుడి అ డుగుజాడల్లో నడవాల్సిన అవసరం ఉందన్నా రు. ముఖ్యంగా యువత ఆయన జీవితం నుంచి స్ఫూర్తి పొందాలని సూచించారు. కార్యక్రమంలో కలెక్టరేట్ ఏఓ శ్రీధర్, జిల్లా బీసీ సంక్షే మశాఖ అధికారి అబ్దుల్ ఖలీల్, డీపీఆర్వో ఎంఏ రషీద్, సగర సంఘం జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు సాగర్, ప్రధాన కార్యదర్శి వెంకటయ్య, పట్టణ అధ్యక్షుడు విజయ్ సాగర్, సంఘం సభ్యులు ఆంజనేయులు, నరేందర్, వెంకటేశ్, మన్నె లక్ష్మణ్, హన్మంతు, రవి, రాంపూర్ హన్మంతు తదితరులు పాల్గొన్నారు. -
చాలీచాలని బస్సులు!
● రెండో రోజు కొనసాగిన ఆర్టీసీ కార్మికుల సమ్మె ● నామమాత్రపు సర్వీసులతో ప్రయాణికుల ఇక్కట్లు ● ప్రైవేటు వాహనాల్లో రెట్టింపు ధరతో దోపిడీ నారాయణపేట రూరల్: ఆర్టీసీ కార్మికుల సమ్మె రెండో రోజు కొనసాగింది. జిల్లాలోని ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్లు విధులకు హాజరుకాలేదు. స్థానిక బస్టాండ్ ఆవరణలో శాంతియుతంగా నిరసన వ్యక్తంచేశారు. పోలీసులతో కలిసి ఆర్టీసీ అధికారులు ప్రైవేటు బస్సులను రోడ్డుపైకి పంపించారు. తాత్కాలిక పద్ధతిన కాంట్రాక్టు సిబ్బందిని ఎంపికచేసి.. సంస్థకు చెందిన బస్సులను సైతం నడిపించారు. మొత్తానికి గురువారం నారాయణపేట డిపోలో 94 సర్వీసులకు గాను 56 బస్సులు ప్రధాన రూట్లలో ఆపరేట్ చేశారు. వీటిలో 8 సంస్థకు చెందినవి కాగా.. 48 అద్దె బస్సులను మహబూబ్‌నగర్, హైదరాబాద్, మక్తల్, మద్దూరు, కోస్గి మార్గాల్లో ప్రయాణికులకు అందుబాటులో ఉంచారు. ఆదాయం లేకుండానే? కార్మికుల సమ్మె ప్రభావం కనిపించకుండా.. ప్రయాణికులకు రవాణా ఇబ్బందులు తొలగించాలనే ఉద్దేశంతో ఆర్టీసీ అధికారులు చాలావరకు బస్సులను రోడ్లపైకి పంపించారు. పూర్తిస్థాయిలో అద్దె బస్సులను నడిపించగా.. వాటిలో కొంతవరకు డ్రైవర్లే టికెట్ పేరుతో డబ్బులు సేకరించారు. మరోవైపు పల్లెవెలుగు బస్సుల్లో ఆడ, మగవారికి డబ్బులు లేకుండానే గమ్యస్థానాలకు చేర్చారు. ఒక బస్సులో అలా.. మరో బస్సులో ఇలా.. టికెట్టు పేరుతో డబ్బులను తీసుకోవడంపై గొడవలు జరిగాయి. ఏదేమైనా రోజువారీగా రూ. లక్షల్లో వచ్చే ఆదాయం.. సమ్మె కాలంలో కనీసం రూ.వేలల్లో కూడా లేకపోవడం గమనార్హం. ఆదాయం లేకుండానే ఆర్టీసీ బస్సులను నడిపిస్తుంది. కార్మికులకు మద్దతు.. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు పలు సంఘాలు ప్రత్యక్షంగా మద్దతు తెలిపాయి. కార్మికులకు బీసీ జాగృతి సేన, టీయూసీఐ, బీజేపీ, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం, సామాజిక కార్యకర్తలు అండగా నిలిచారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి.. సమ్మె విరమణకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలని వారు కోరారు. భద్రతా చర్యలను పరిశీలించిన ఎస్పీ.. జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపోను ఎస్పీ డా.వినీత్ సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. కార్మికుల సమ్మె నేపథ్యంలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని ఎస్ఐ వెంకటేశ్వర్లకు సూచించారు. అనంతరం ఆర్టీసీ జేఏసీ నాయకులతో మాట్లాడారు. అదే విధంగా భద్రతా ఏర్పాట్లను సీఐ శివశంకర్ పర్యవేక్షించారు. ఆర్టీసీ బస్సులు రోడ్లపైకి వచ్చాయని విషయం తెలుసుకున్న ప్రజలు యథావిధిగా తమ కార్యకలాపాల నిర్వహణకు బస్సులపై ఆధారపడ్డారు. అయితే ప్రధాన మార్గాల్లోనే బస్సులు నడవడంతో గ్రామీణ ప్రాంత ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఇక ఉద్యోగులు, వ్యాపారుల సైతం చాలీచాలని బస్సుల్లో కిక్కిరిసి ప్రయాణించారు. ఉదయం వేళలోనే సమయపాలన లేకుండా నడపడంతో సాయంత్రానికి బస్సుల కొరత తీవ్రంగా కనిపించింది. దీంతో ప్రయాణికులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించారు. ఇదే అదునుగా భావించిన ప్రైవేటు వాహనదారులు రెట్టింపు ధరలతో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చారు. రీజియన్‌లో 426 బస్సులు రోడ్డెక్కాయి.. రెండు రోజు గురువారం మహబూబ్‌నగర్ రీజియన్ పరిధిలో సాయంత్రం 5 గంటల వరకు ఆర్టీసీ అధికారుల వివరాలు మేరకు 925 బస్సులకుగాను 426 బస్సులు మాత్రమే నడిచాయి. 57 ఆర్టీసీ బస్సులు, 346 ప్రైవేట్ హైర్ బస్సులు, 23 ఈవీ బస్సులు నడిచాయి.


