West Godavari
-
నిర్వాసితులపై నిర్లక్ష్యం
బుట్టాయగూడెం: పోలవరం ప్రాజెక్టు కోసం సర్వం త్యాగం చేశారు.. తరాలుగా పెనవేసుకున్న బంధాన్ని వీడి కట్టుబట్టలతో తమ ప్రాంతం విడిచి నిర్వాసిత కాలనీల్లో అడుగుపెట్టారు ఈ గిరి జనులు. ఇక్కడ ఉపాధి హామీ పనులు లేక, వసతులు కరువై సమస్యలతో సహవాసం చేస్తున్నారు. గ్రామాలు విడిచి ఏడేళ్లు గడుస్తున్నా తమను పట్టించుకునే నాథుడే లేడని ఆవేదన చెందుతున్నారు. పనుల్లేక.. జీవనం సాగక.. బుట్టాయగూడెం మండలం ముప్పినవారిగూడెం సమీపంలో వేలేరుపాడు మండలంలోని చిగురు మామిడి, బోళ్లపల్లి, శ్రీరాంపురం, కొర్రాజుగూడెం, వసంతవాడ గ్రామాల నిర్వాసితుల కోసం కోసం పునరావాస కాలనీ (చిగురుమామిడి కాలనీ) నిర్మించారు. చిగురుమామిడి గ్రామానికి చెందిన 80 కుటుంబాలు, శ్రీరాంపురానికి చెందిన 10 కు టుంబాలు ఏడేళ్ల క్రితం ఇక్కడికి వచ్చారు. వీరిలో 40 మందికి మాత్రమే ఉపాధి హామీ పనులు కల్పిస్తుండగా మిగిలిన వారు జాబ్‌కార్డులు బదిలీ కా కపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. పనుల్లేక అవస్థలు పడుతున్నారు. వీరంతా పనులు కల్పించాలని కోరుతున్నారు. కాలనీకి రెండు గ్రామాల నిర్వాసితులు రాగా.. మూడు గ్రామాల నిర్వాసితులు రా వాల్సి ఉంది. వీరంతా ఆర్అండ్ఆర్ పరిహారం అందిన తర్వాత వస్తారని తెలిసింది. రాత్రిళ్లు భయం.. భయం నిర్వాసిత కాలనీలో సోలర్తో పాటు విద్యుత్ లైట్లను ఏర్పాటుచేశారు. ఇవి చాలాకాలంగా వెలగక పోవడంతో రాత్రిళ్లు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నామని నిర్వాసితులు ఆవేదన చెందుతున్నారు. కాలనీలోని ఏ వీధిలోనూ దీపాలు వెలగడం లేదని చెబుతున్నారు. అయితే రాత్రిళ్లు పాముల బెడద ఎ క్కువ ఉందని, తాము వేలేరుపాడు మండలం పరిధిలోనే ఉన్నట్టు అధికారులు చెప్పడంతో ఏం చే యాలో అర్థం కావడం లేదని ఆవేదన చెందుతున్నారు. ఖాళీ ఇళ్లు.. సమస్యల లోగిళ్లు ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఇళ్లలో పిచ్చిమొక్కలు భా రీగా పెరిగిపోయాయి. అస్తవ్యస్తంగా ఉన్న కాలనీని చూసి నిర్వాసితులు ఆందోళ చెందుతున్నారు. ఉ పాధి హామీ పథకంలో అయినా పేరుకుపోయిన పిచ్చిమొక్కలును తొలగించాలని కోరుతున్నారు. వర్షాకాలంలో వరద నీరు ముంచెత్తుతోందని, నివారణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అలాగే కాలనీలో 60 వేల లీటర్ల వాటర్ ట్యాంకు నిర్మించినా విద్యుత్ కోతల సమస్యతో నీటి సమస్య నెలకొందని అంటున్నారు. కాలనీలో చేతి పంపులు ఏర్పాటుచేయాలని నిర్వాసితులు కోరుతున్నారు. పునరావాసం.. సమస్యలతో సహవాసం చిగురుమామిడి కాలనీలో సమస్యల తిష్ట వెలగని వీధిలైట్లు, పాముల బెడద తాగునీటికి ఇక్కట్లు కొందరికే ‘ఉపాధి’ పనులు ఏడేళ్లు గడుస్తున్నా అందని జాబ్‌కార్డులు కన్నెత్తి చూడని ప్రజాప్రతినిధులు -
రెచ్చిపోతున్న మట్టి మాఫియా
జంగారెడ్డిగూడెం: ఏజెన్సీ, మెట్ట ప్రాంతంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. రేయింబవళ్లు యథేచ్ఛగా మట్టిని తవ్వి తరలించేస్తున్నారు. ఎర్రకాలువ జలాశయం, చెరువులు, కాలువ గట్లు కాదేదీ మట్టి దోపిడీకి అన్నట్టు చెలరేగిపోతున్నారు. వాస్తవానికి రైతులు తమ పొలాలను ఎత్తు చేసుకునేందుకు చె రువులు, జలాశయాల నుంచి మట్టిని తవ్వుకోవ చ్చు. దీనిని అడ్డం పెట్టుకుని అక్రమార్కులు మట్టిని అక్రమంగా తవ్వుతూ ఇటుక బట్టీలు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలిస్తున్నారు. అధికారులపై దాడులకు తెగబడుతూ.. జంగారెడ్డిగూడెం, జీలుగుమిల్లి, బుట్టాయగూడెం, కొయ్యలగూడెం, టి.నరసాపురం మండలాల్లో మట్టి దోపిడీ ఎక్కువగా ఉంది. తాజాగా ఎటువంటి అనుమతులు లేకుండా జంగారెడ్డిగూడెం మండలంలోని ఎ.పోలవరంలో చిన్న, పెద్ద చెరువు మట్టిని తరలిస్తుండగా ఇరిగేషన్ అధికారులు అడ్డుకోగా మట్టి మా ఫియా వారిపై దాడులకు పాల్పడింది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి జేసీబీ, మట్టి ట్రాక్టర్లను సీజ్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అలాగే మైనింగ్ అధికారులకు సమాచారం ఇచ్చారు. తవ్వేయ్.. దోచేయ్.. ● వేగవరం, తాడువాయి గ్రామాల పరిధిలో ఎర్రకాలువ జలాశయంలో మట్టిని ఇటుక బట్టీలకు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలిస్తున్నారు. ఒక్కో లారీ మట్టిని రూ.5 వేలకు విక్రయిస్తున్నారు. ● కొయ్యలగూడెం మండలంలో చెరువుల్లో మట్టిని తరలించేస్తున్నారు. చెరువుల్లో భారీ గోతులు పెట్టడంతో రైతులు, పశువుల కాపర్లు, పశువులు ప్రమాదాలకు గురవుతారని ఆందోళన వ్యక్తమవుతోంది. ఆయా గ్రామాల పరిధిలో రోడ్లు పాడవుతున్నాయని ప్రజలు గగ్గోలు పెడుతున్నా మాఫియా ఖాతరు చేయడం లేదు. ఇక్కడ పరిమిత క్యూబిక్ మీటర్లకు అనుమతులు తీసుకుని వేలాది క్యూబిక్ మీటర్ల మట్టిని తవ్వేస్తున్నారు. ● టి.నరసాపురం మండలం కేతవరం రెవెన్యూ పరిధిలో గ్రావెల్‌ను తవ్వి తరలించేస్తున్నారు. ● బుట్టాయగూడెం, కొయ్యలగూడెం సరిహద్దులో ఉన్న చెరువులో మట్టిని తరలించేస్తున్నారు. కొయ్యలగూడెం మండలంలో మట్టి తవ్వకాలు కేతవరంలో మట్టిని రవాణా చేస్తున్న ట్రాక్టర్ ఏజెన్సీ, మెట్ట ప్రాంతంలో దందా -
పద్మావతీ.. మాకేంటీ దుస్థితి
ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల చినవెంకన్న దే వస్థానంలో పద్మావతి హాస్పిటాలిటీ అండ్ ఫెసిలిటీ మేనేజ్మెంట్ సర్వీసెస్ (తిరుపతి) (పారిశుద్ధ్య కాంట్రాక్ట్ సంస్థ) మేనేజర్‌పై మహిళా కార్మికులు చేస్తున్న ఆరోపణలు తారాస్థాయికి చేరాయి. తమ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో పాటు పరుష పదజాలాన్ని వాడుతున్నాడని వారు అంటున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తున్న వారిని ఏదో ఒక వంకతో పనిలోంచి తీసేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే పలువురు మహిళా కార్మికులు ఆది వారం ఆలయ సూపరింటెండెంట్ ఐవీ రామారావుకు ఫిర్యాదు చేశారు. సదరు మేనేజర్‌పై ఈ ఆరోపణలు, ఫిర్యాదులు కొత్తేమీ కాదు. గతేడాది అక్టోబర్ 1న ఈ సంస్థ శ్రీవారి దేవస్థానంలో పారిశుద్ధ్య కాంట్రాక్ట్ పనులు చేపట్టినప్పటి నుంచి ఈ ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయి. కొందరు మహి ళా కార్మికులతో అసభ్యకరంగా చేసిన వాట్సాప్ చా టింగ్‌లు, ఫోన్లలో మాట్లాడిన వాయిస్ రికార్డింగ్‌లు గతంలోనే బయటపడ్డాయి. అయితే కాంట్రాక్టర్ సాక్షాత్తూ సీఎం చంద్రబాబు బంధువు కావడంతో అధికారులు మేనేజర్‌పై చర్యలు తీసుకునేందుకు వెనుకాడుతున్నారని పలువురు అంటున్నారు. అలాగే నాసిరకం మెటీరియల్ వినియోగంపై నోరు విప్పితే.. టార్గెట్ చేసి, పనిలోంచి తీసేస్తున్నారని కొందరు కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే పారిశుద్ధ్య పనులకు సంబంధించి మెషీనరీకి మాత్రమే దేవస్థానం నెలకు సుమారు రూ.3.50 లక్షలు కాంట్రాక్టర్‌కు చెల్లిస్తోంది. ఇలా రెండేళ్లకు దాదాపు రూ.84 లక్షలు చెల్లించనుంది. అయితే ఇంత విలువైన మెషినరీ ఈ దేవస్థానానికి వచ్చిందా.. అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మొత్తంగా పారిశుద్ధ్య పనులకు నెలకు రూ.18.28 లక్షలు చెల్లిస్తే ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో నెలకు సుమారు రూ.54 లక్షల వరకు చెల్లిస్తోంది. ఎప్పుడూ ఇంత ఇబ్బంది పడలేదు తాము పదేళ్ల నుంచి పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్నామని, ఇప్పటివరకు ఏ మేనేజర్ వల్ల ఇంత ఇ బ్బంది పడలేదని సూపరింటెండెంట్‌కు కార్మికులు తెలిపారు. దేవస్థానంపై ఆధారపడి బతుకుతున్న తమను అధికారులు ఆదుకోవాలని, అలాగే సదరు మేనేజర్‌పై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఇప్పటివరకూ జీతాల్లేవ్ పద్మావతి కాంట్రాక్ట్ సంస్థ కింద దేవస్థానంలో 180 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఈ సంస్థకు కాంట్రాక్ట్ ఇచ్చినప్పటి నుంచి కార్మికులకు జీతాలు ఆలస్యంగానే అందుతున్నాయి. ఈనెల 5లోపు అందాల్సిన జీతాలు, నెలలో సగం రోజులు గడిచినా.. ఇప్పటివరకు అందలేదు. పారిశుద్ధ్య కాంట్రాక్ట్ సంస్థపై కార్మికుల మండిపాటు శానిటేషన్ మేనేజర్ ఆగడాలపై ఫిర్యాదు అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడంటూ మహిళా కార్మికుల ఆరోపణలు నెలలో సగం రోజులు గడిచినా అందని జీతాలు కాంట్రాక్టర్ సీఎం చంద్రబాబు బంధువు కావడంతో చర్యలు శూన్యం -
ఆర్టీసీ ప్రైవేటీకరణ యత్నం తగదు
తాడేపల్లిగూడెం (టీఓసీ): ప్రజా రవాణాలో ఎలక్ట్రికల్ బస్సుల పేరుతో ప్రైవేటీకరణ ప్రయత్నాలు చేయడం తగదని, ఎలక్ట్రికల్ బస్సులను ఆర్టీసీనే కొనుగోలు చేయాలని ప్రజారవాణా శాఖ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఎండీ ఆలీ డిమాండ్ చేశారు. ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆర్టీసీ గ్యారేజీ గేటు వద్ద ఆదివారం రెండో రోజు జరిగిన ధర్నాలో ఆలీ మాట్లాడుతూ ఎలక్ట్రికల్ బస్సులను ఆర్టీసీనే కొనుగోలు చేయాలని, మూసివేసిన ఆర్టీసీ డిపోలను తిరిగి తెరవాలన్నారు. ఆర్టీసీలో ఖాళీలను భర్తీ చేయాలని, ఔట్ సోర్సింగ్ సిబ్బందికి ప్రభుత్వమే జీతాలు చెల్లించాలన్నారు. ఆర్టీసీ స్థలాలను ప్రైవేట్ వారికి అప్పగించే విధానం వీడాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ కమిషన్‌ను వెంటనే నియమించాలని, తాత్కాలిక భృతి ప్రకటించాలని, డీఏ బకాయిలు చెల్లించాలని డి మాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన 39 సమస్యలను పరిష్కరించాలని, లేకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. డిపో అధ్యక్షుడు టి.బుజ్జిబాబు, రాష్ట్ర నాయకులు శివ, కోశాధికారి నరసింహ, వీరన్న, బాషా తదితరులు పాల్గొన్నారు. -
సబ్సిడీ రాదు.. ఆక్వా సాగదు
భీమవరం: ఆక్వా రంగాన్ని ఆదుకుంటాం.. జోన్స్ తో ప్రమేయం లేకుండా రొయ్యలు సాగుచేస్తున్న రైతులందరికీ సబ్సిడ్ విద్యుత్ అందిస్తాం.. అంటూ హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి నాయకులు ఆక్వా రైతులను కన్నెత్తి చూడటం లేదు. ఆక్వా రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయినా పట్టించుకోవడం లేదు. సబ్సిడీ విద్యుత్ అందక సాగు భారమై రైతులు ఆవేదన చెందుతున్నారు. జిల్లాలో దాదాపు 1.30 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు చేస్తుండగా సుమారు 90 వేల ఎకరాల్లో రొయ్యల సాగు ఉంది. నరసాపురం, భీమవరం, ఉండి, పాలకొల్లు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో రొయ్యలను ఎక్కువగా సాగు చేస్తున్నారు. అలాగే ఆచంట, తణుకు, తాడేపల్లిగూడెం నియోజకవర్గాల పరిధిలోనూ వేలాది ఎకరాల్లో రొయ్యలను పండిస్తున్నారు. గత ప్రభుత్వంలోనే విద్యుత్ సబ్సిడీ జిల్లాలోని 20 మండలాల పరిధిలో దాదాపు 90 వేల ఎకరాలకు పైగా రొయ్యల సాగు ఉంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఆక్వా చెరువులను విద్యుత్ యూనిట్ రూ.1.50కే అందించారు. 2024 ఎన్నికల సమయంలో జోన్స్‌తో ప్రమేయం లేకుండా ఆక్వా రైతులందరికీ సబ్సిడీ విద్యుత్ అందిస్తామని కూటమి పార్టీల నాయకులు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. నష్టాల ఊబిలో ఉన్న తమకు సబ్సిడీ విద్యుత్ ఎంతగానో ఉపయోగపడుతుందని రైతులు ఆశించారు. అయితే చంద్రబాబు ప్రభు త్వం అధికారం చేపట్టి రెండేళ్లు కావస్తున్నా రొ య్యల రైతులందరికీ సబ్సిడీ విద్యుత్ అందకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఒక పక్క విద్యుత్ కోతలు, గత నెలలో డీజిల్ కొరత వంటి సంక్షోభాలు రైతులను అతలాకుతలం చేశాయి. జిల్లాలో 16,332 ఆక్వా విద్యుత్ కనెక్షన్లు ఉండగా 14,242 కనెక్షన్లకు ప్రతినెలా సుమారు రూ.23 కోట్లు సబ్బిడీ కింద ఇస్తుండగా.. దాదాపు 2 వేల కనెక్షన్లకు సంబంధించి రాయితీ విద్యుత్ కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. వీటిలో భీమవరం విద్యుత్ డివిజన్లో 1,235, నరసాపురం డివిజన్లో 585, తాడేపల్లిగూడెం డివిజన్లో 270 విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. దీనిపై ఆక్వారైతు సంఘాలు ప లుమార్లు ప్రభుత్వం, విద్యుత్ శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లినా అదిగో, ఇదిగో ఇస్తున్నామంటూ కా లం వెళ్లదీస్తున్నారు. సబ్బిడీ విద్యుత్ లభించని కొందరు రైతుల వద్ద విద్యుత్ శాఖ సిబ్బంది తక్కువ మీటర్ రీడింగ్‌లు తీయించి వారి వద్ద పెద్ద మొత్తంలో మామూళ్లు గుంజుతున్నట్టు తెలిసింది. ఇలా ఓ మండలంలోని విద్యుత్ లైన్మెన్ తప్పుడు విద్యుత్ రీడింగ్‌లతో పెద్ద మొత్తంలో కూడబెట్టగా అదికాస్తా బయట పడటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అతడిని భయపెట్టి కొందరు మీడియా ప్రతినిధులు, రాజకీయ నాయకులు సుమారు రూ.8 లక్షలు గుంజడంతో ఓ ప్రజాప్రతినిధి జోక్యం చే సుకుని తిరిగి ఇప్పించినట్టు ప్రచారం జరుగుతోంది. తప్పుడు రీడింగ్‌లతో ప్రభుత్వానికి న ష్టం చేకూర్చిన లైన్మెన్పై ఎటువంటి చర్యలు తీసుకోకుండా ప్రజాప్రతినిధి కొమ్ముకాయడంపై తీవ్ర చర్చ జరుతోంది. ప్రభుత్వం సబ్సిడీ వి ద్యుత్ ఇవ్వకపోవడం వల్ల రైతులు నష్టపోతుండగా కొందరు విద్యుత్ శాఖ సిబ్బంది పెద్ద మొ త్తంలో కూడబెట్టుకుంటున్నారని ఆక్వా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు సబ్సిడీ విద్యుత్‌ను ఆక్వా జోన్స్‌తో ప్రమేయం లేకుండా రైతులందరికీ ఇవ్వాలని కోరుతున్నారు. విద్యుత్ రాయితీ.. అందేది అంతంతే ! జోన్స్‌తో ప్రమేయం లేకుండా సబ్సిడీ ఇస్తామని కూటమి నాయకుల హామీ జిల్లాలో 90 వేల ఎకరాల్లో రొయ్యల సాగు సబ్సిడీ వర్తించని కనెక్షన్లు 2,090 పట్టించుకోని ప్రజాప్రతినిధులు -
ఫీడ్ ధరలు తగ్గించకపోతే ఊరుకోం
వీరవాసరం: ఆక్వా ఫీడ్ ధరలను తగ్గించకపోతే ఆందోళనలు పెద్ద ఎత్తున ఉధృతం చేస్తామని పశ్చిమగోదావరి జిల్లా భీమవరం ప్రాంత రొయ్యల రైతుల సంక్షేమ సంఘం తీర్మానం చేసింది. ఆదివారం వీరవాసరం తులసి ఫంక్షన్ హాల్లో ఐదు నియోజకవర్గాల రొయ్యల రైతుల సంక్షేమ సంఘ గ్రామస్థా యి, జిల్లాస్థాయి కమిటీల నాయకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రొయ్య రైతులకు ఎటువంటి నష్టం వాటిల్లినా అండగా ఉండటామని, సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తామన్నారు. ప్రస్తుతం రాష్ట్రస్థాయిలో జరుగుతున్న ఫీడ్ కంపెనీలు, రొ య్యల రైతుల నాయకులు, ప్రభుత్వ అధికారులు నిర్వహిస్తున్న ప్రత్యేక సమీక్ష సమావేశాలు సానుకూలంగానే ఉండటం ఆనందాన్ని ఇస్తుందన్నారు. ఆక్వా ఫీడ్ యజమానులు చేస్తున్న ప్రభుత్వ లాబీయింగ్‌కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తలొగ్గుతాయేమో అన్న అనుమానాన్ని రైతులు వ్యక్తం చేశా రు. భీమవరం ప్రాంత జిల్లా అధ్యక్షుడు మల్ల తులసీరామ్, కార్యదర్శి గాదిరాజు సుబ్బరాజు, బాపిరాజు, వీరవల్లి చంద్రశేఖర్, ఎం.వెంకట్రావు, పెద్దెత్తున రొయ్య రైతులు పాల్గొన్నారు. -
ప్రశాంతంగా జేఈఈ అడ్వాన్స్డ్
భీమవరం: స్థానిక ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఆదివారం జేఈఈ అడ్వాన్స్ పరీక్ష లు ప్రశాంతంగా జరిగాయి. 150 మంది వి ద్యార్థులకు 149 మంది హాజరయ్యారని సెంటర్ చీఫ్ సూపరింటెండెంట్ పీఆర్ఎస్ వెంకటపతిరాజు తెలిపారు. అలాగే విష్ణు ఇంజనీరింగ్ కళాశాలలో 120 మందికి 117 మంది, డీఎన్నార్ కళాశాలలో 160 మందికి 159 మంది హాజరయ్యారు. తాడేపల్లిగూడెంలో.. తాడేపల్లిగూడెం (టీఓసీ): తాడేపల్లిగూడెం శ్రీవాసవి ఇంజనీరింగ్ కళాశాలలో జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు 208 మందికి 208 మంది హాజరయ్యారు. కళాశాల ప్రిన్సిపాల్, చీఫ్ సూపరింటెండెంట్ రాంబాబు, కేంద్రం కో–ఆర్డినేటర్ నటరాజ్ తదితరులు పర్యవేక్షించారు. అలాగే శశి ఇంజనీరింగ్ కళాశాలలో 150 మందికి 148 మంది, ఏపీ నిట్‌లో 200 మందికి 197 మంది హాజరయ్యారు. తణుకు అర్బన్: జాతీయస్థాయి ఫెన్సింగ్ పోటీలకు 24 మంది క్రీడాకారులు ఎంపికై నట్టు ఏపీ ఫెన్సింగ్ ఆఫ్ అసోసియేషన్ కార్యదర్శి జీఎస్ వీ కృష్ణమోహన్ తెలిపారు. ఏపీ స్టేట్ క్యాడెట్ బాయ్స్ అండ్ గరల్స్ (అండర్ 17) ఫెన్సింగ్ చాంపియన్‌షిప్ 2026–27, 21వ నేషనల్ క్యాడెట్ ఫెన్సింగ్ ఏపీ స్టేట్ టీమ్ సెలెక్షన్స్ స్థానిక ఆకుల శ్రీరాముల ఇంజనీరింగ్ కళాశాలలో ఆదివారం నిర్వహించారు. రాష్ట్రంలోని పలుజిల్లాల నుంచి 120 మంది క్రీడాకారులు హా జరయ్యారు. ఎంపికై న క్రీడాకారులు ఈనెల 23న ఉత్తరాఖండ్‌లో జరిగే జాతీయ క్యాడెట్ ఫెన్సింగ్ పోటీల్లో పాల్గొంటారన్నారు. కళాశాల అధినేత ఆకుల విష్ణువర్థన్, ఏపీ ప్రైవేట్ ఐటీఐ మేనేజ్మెంట్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు బసవ రామకృష్ణ పోటీలను ప్రారంభించారు. భీమవరం (ప్రకాశంచౌక్): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్) కార్యక్రమాన్ని సోమవారం కలెక్టరేట్లో నిర్వహించనున్నట్టు కలెక్టర్ సీహెచ్ నాగరాణి తెలిపారు. అలాగే డి విజన్, మండల కేంద్రాల్లోనూ ఈ కార్య క్రమం నిర్వహిస్తామని, ప్రజలు అర్జీలు సమర్పించవచ్చన్నారు. అలాగే అర్జీలను అధికారిక వెబ్సైట్ ద్వారా నమోదు చేసుకోవచ్చని, 1100 కాల్ సెంటర్‌ను సంప్రదించవచ్చని పేర్కొన్నారు. -
ఉద్యాన విద్యకు క్రేజ్
● ఆకర్షిస్తున్న కోర్సులు ● ఉపాధికి, ఉద్యోగానికి ఢోకా లేదు ● విదేశీ విద్యార్థుల ఆసక్తి ఇంటర్మీడియట్ బైపీసీ చదివిన విద్యార్థులు ఈ కోర్సులో చేరవచ్చు. 31–12–2026 నాటికి వయస్సు 17 నుంచి 22 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 25 ఏళ్లు, దివ్యాంగులకు 27 ఏళ్ల వరకు వయోపరిమితి సడలింపు ఉంటుంది. వర్సిటీ పరిధిలో నాలుగు ప్రభుత్వ ఉద్యాన కళాశాలలు ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా వెంకట్రామన్నగూడెం కళాశాలలో 100 సీట్లు, అన్నమయ్య జిల్లా అనంతరాజుపేట కళాశాలలో 100 సీట్లు, వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో 60 సీట్లు, పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం, నెల్లూరు జిల్లా చినలాటరిపి కళాశాలల్లో 50 సీట్ల చొప్పున ఉన్నాయి. వర్సిటీ అనుబంధ కళాశాలలైన అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ కాలేజ్ ఆఫ్ హార్టికల్చరల్ సైన్సెస్, ప్రకాశం జిల్లా మార్కాపురం, చంద్రశేఖరపురంలోని కళాశాలల్లో కన్వీనర్ కోటా కింద 60 సీట్ల చొప్పున మొత్తం 180 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సీట్లను ఏపీ ఈఏపీసెట్ మెరిట్ ప్రాతిపదికన భర్తీ చేస్తారు. హార్టికల్చర్ డిప్లొమా పూర్తి చేసిన విద్యార్థులకు 15 శాతం కోటా ఉంటుంది. దీని ద్వారా హార్టీసెట్ మెరిట్ ఆధారంగా యూనివర్సిటీ కళాశాలల్లో 54 సీట్లు, అనుబంధ కళాశాలల్లో 27 సీట్లు భర్తీ చేస్తారు. ఐసీఏఆర్ ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపికై న వారికి 20 శాతం సీట్లు, స్టడీ ఇన్ ఇండియా పోర్టల్ ద్వారా విదేశీ విద్యార్థులకు 70 సీట్లు కేటాయిస్తారు. ఎన్ఆర్ఐ స్పాన్సర్షిప్ కోటాలో 47 సీట్లు, ఇండస్ట్రీ కోటాలో ఆరు సీట్లు ఉన్నాయి. రైతు కోటా కింద కనీసం ఒక ఎకరం పొలం కలిగిన వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థులకు నిబంధనల మేరకు సీట్లు కేటాయిస్తారు. తాడేపల్లిగూడెం : పచ్చని ప్రకృతి ఒడిలో చదువుకోవాలని ఎవరికి మాత్రం ఉండదు? అచ్చంగా ఇలాంటి వాతావరణంలోనే తాడేపల్లిగూడెం పరిధిలోని వెంకట్రామన్నగూడెంలో ఉన్న డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం విద్యార్థులకు చక్కని అవకాశాలను కల్పిస్తోంది. కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో, ప్రస్తుతం ఉద్యాన విద్యకు క్రేజ్ బాగా పెరిగింది. ఈ విద్యను అభ్యసిస్తే కొలువులకు కొదువ లేదు, ఉపాధికి బోలెడు అవకాశాలున్నాయి. డిమాండ్‌కు తగ్గట్టుగా మారుతున్న కోర్సులు విద్యార్థుల బంగారు భవితకు బాటలు వేస్తున్నాయి. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్సార్ మానస పుత్రికగా 2007లో దేశంలోనే రెండో విశ్వవిద్యాలయంగా ఇది ఊపిరి పోసుకుంది. ఐసీఏఆర్ పరిధిలో ఏ–గ్రేడ్ సాధించిన ఈ వర్సిటీ, 2026–27 విద్యాసంవత్సరానికి గాను పాలిటెక్నిక్, డిగ్రీ కోర్సులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఉద్యాన పాలిటెక్నిక్ కోర్సు ఉద్యోగం, ఉపాధి, ఉన్నత విద్యకు చక్కని అవకాశం కల్పించే ఉద్యాన పాలిటెక్నిక్ కోర్సులో ప్రవేశానికి పదో తరగతి ఉత్తీర్ణులైన వారు, ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులు అర్హులు. 31–08–2026 నాటికి 15 నుంచి 22 ఏళ్ల లోపు వయస్సు కలిగి ఉండాలి. ఈ కోర్సు కాలపరిమితి రెండేళ్లు కాగా, బోధన పూర్తిగా ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. వర్సిటీ పరిధిలోని నాలుగు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో 200 సీట్లు, మూడు ప్రైవేటు కళాశాలల్లో 120 సీట్లు అందుబాటులో ఉన్నాయి. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం, శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర కళాశాలల్లో 60 సీట్ల చొప్పున ఉన్నాయి. ఏలూరు జిల్లా నూజివీడు, అన్నమయ్య జిల్లా కలికిరి, ప్రకాశం జిల్లా పొదిలి, పల్నాడు జిల్లా మద్దిరాల, నంద్యాల జిల్లా కోయిలకుంట్ల కళాశాలల్లో 40 సీట్ల చొప్పున కేటాయించారు. ఈ ఏడాది పాలిటెక్నిక్‌లో ల్యాండ్ స్కేపింగ్, నర్సరీ మేనేజ్మెంట్ కోర్సును రామచంద్రపురం, మడకశిర కళాశాలల్లో ప్రవేశపెట్టారు. ఈ ప్రత్యేక కోర్సు కోసం మొత్తం 50 సీట్లు కేటాయించారు. మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి ఎరువులు, పురుగు మందుల కంపెనీలు, వివిధ ఉద్యాన పరిశ్రమల్లో మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. నాణ్యమైన విద్యాబోధన – వసతులు అనుభవజ్ఞులైన అధ్యాపకులు, శాస్త్రవేత్తలతో డిజిటల్ తరగతులు, అత్యాధునిక ప్రయోగశాలల ద్వారా ఇక్కడ నాణ్యమైన విద్యను అందిస్తున్నారు. ఐసీఏఆర్ ఆరవ డీన్స్ కమిటీ సిఫారసుల మేరకు ఇక్కడ పాఠ్యాంశాల బోధన జరుగుతుంది. చదువుతో పాటు ఆటలు, క్రీడలు, సెంట్రల్ లైబ్రరీ సౌకర్యాలు ఉన్నాయి. బాలురు, బాలికలకు వేర్వేరుగా సురక్షితమైన వసతి గృహాల (హాస్టల్) సదుపాయం కల్పించారు. విస్తృత ఉద్యోగావకాశాలు రాష్ట్ర సర్వీస్ కమిషన్ నిర్వహించే పరీక్షల ద్వారా అభ్యర్థులు మండల హార్టికల్చర్ ఆఫీసర్, హెచ్ఈఓ, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వంటి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించవచ్చు. ఐసీఏఆర్, డీఆర్డీఓ, స్పైసెస్ బోర్డు, కాఫీ బోర్డు, రబ్బర్ బోర్డు, టీ బోర్డులలో కూడా ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాయాలనుకునే హార్టీకల్చర్ గ్రాడ్యుయేట్లు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ( ్ఖ్కఇ) పరీక్షలకు హాజరు కావచ్చు. ప్రైవేటు రంగంలో కొలువులతో పాటు, స్వయం ఉపాధి పొందేందుకు ఉద్యాన విద్య ఎంతగానో దోహదపడుతుంది. ఉద్యాన వర్సిటీ ముఖద్వారం ఉద్యాన విద్య అనేది యువత భవిష్యత్తుకు బాటలు వేసే అత్యంత ప్రాధాన్యత కలిగిన రంగం. పండ్లు, కూరగాయలు, పూలు, ఔషధ, సుగంధ పంటల ఉత్పత్తి ద్వారా దేశ ఆహార భద్రతకు, పోషకాహార లభ్యతకు, రైతుల ఆదాయ వృద్ధికి ఉద్యానరంగం ఎంతో కీలకంగా మారింది. ప్రభుత్వం రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా అభివృద్ధి చేస్తుండటంతో, ఉద్యాన విద్యార్థులకు ఉద్యోగాలతో పాటు స్వయం ఉపాధి, అగ్రి బిజినెస్, స్టార్టప్‌లు, ఎగుమతి రంగాలలో విస్తృత అవకాశాలు లభిస్తున్నాయి. భవిష్యత్తులో ఆర్థికంగా స్థిరపడుతూ సమాజానికి సేవ చేయాలనుకునే యువత ఉద్యాన విద్యను ఎంచుకోవాలి. – డాక్టర్ కె.ధనుంజయరావు, వీసీ, ఉద్యాన విశ్వవిద్యాలయం, వెంకట్రామన్నగూడెం -
రుణాలు సద్వినియోగం చేసుకోవాలి
పెనుగొండ: డ్వాక్రా మహిళలకు, రైతులకు అందిస్తున్న వ్యవసాయ రుణాలను, ఇతర రుణాలు లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని యూనియన్ బ్యాంక్ రీజనల్ హెడ్ వీరభద్రరావు తెలిపారు. శనివారం ఆచంటలో యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో అగ్రికల్చర్ ఔట్ రీచ్ కార్యక్రమాన్ని ఆచంట చాంబర్ కమిటీ హాల్లో నిర్వహించి రుణాల చెక్కులను అందించారు. యూనియన్ బ్యాంక్‌లో వ్యవసాయ రుణాలు, ఇతర పథక రుణాలపై అవగాహన కల్పించారు. డిపాజిట్లపై వచ్చే వడ్డీని, తిరిగి తక్కువ వడ్డీకి తీసుకొనే అవకాశాలను వివరించారు. కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖాధికారి డాక్టర్ ఫణి, ఏపీఎం రామకృష్ణ, ఆచంట బ్రాంచ్ మేనేజరు కే సుధాకర్, సీహెచ్ శ్రీనివాస్, దివ్య రాంబాబు, కేతా రామకృష్ణ, కోట వెంకటేశ్వరరావులు పాల్గొన్నారు. భీమవరం: భీమవరం పట్టణం బలుసుమూడి ఎస్టీ కాలనీ చర్చిలో మేరిమాత, ఏసుప్రభు విగ్రహాలను ధ్వంసం చేశారని చర్చి పాస్టర్ ఎన్. స్టాలిన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు టూటౌన్ ఎస్ఐ రామారావు శనివారం చెప్పారు. ఈ నెల 13వ తేదీ రాత్రి చర్చి పక్కన గల ఖాళీ స్థలంలో ఐదుగురు వ్యక్తులు మద్యం సేవించి, అక్రమంగా చర్చిలోనికి ప్రవేశించి విగ్రహాలను ధ్వంసం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నట్లు ఎస్ఐ తెలిపారు. జంగారెడ్డిగూడెం: అదృశ్యమైన మహిళ మృతదేహం శనివారం జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం ఎర్రకాలువలో లభ్యమైంది. ఎస్సై ఎన్వీ ప్రసాద్ వివరాల ప్రకారం.. జంగారెడ్డిగూడెం మండలం పంగిడిగూడెంకు చెందిన తోట మేరీ (45) ఈ నెల 7న ఇంటి నుంచి అదృశ్యమైంది. మేరీ సోదరుడు గండే సురేష్ వద్ద ఉంటోంది. ఆమె కుటుంబసభ్యులు ఆమె కోసం వెతికినా.. ఆచూకీ లభించకపోవడంతో ఈ నెల 12వ తేదీన జంగారెడ్డిగూడెం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి మేరీ ఆచూకీ కోసం పోలీసులు, ఆమె కుటుంబసభ్యులు వెతుకుతున్నారు. శనివారం మధ్యాహ్న ఎర్రకాలువలో కుటుంబసభ్యులకు మృతదేహం లభించింది. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకుని మేరీ మృతదేహాన్ని గుర్తించారు. అనుమానాస్పద మృతి కేసును మార్చి దర్యాప్తు చేస్తున్నారు. -
మామిడి రైతు గుండెలధర
నూజివీడు: పండ్లలో రారాజుగా పిలుచుకునే మా మిడిని సాగుచేసే రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది. ఈ ఏడాది దిగుబడి తక్కువగా ఉన్న నేపథ్యంలో ధర ఎక్కువగా ఉంటుందని భావించిన రైతుల ఆశలు అడియాశలవుతున్నాయి. మామిడి కాయలకు గిట్టుబాటు ధర లభించక, పెట్టిన పెట్టుబడి రాక రైతులు నష్టాల పాలవుతున్నారు. నూజివీడు డివిజన్ వ్యాప్తంగా 40 వేల ఎకరాల్లో ఉన్న మామిడి తోటలకు చెందిన రైతుల దుస్థితి దయనీయంగా తయారైంది. 25 వేల ఎకరాల్లో బంగినపల్లి రకం, 10 వేల ఎకరాల్లో కలెక్టర్ రకం, మిగిలిన 5 వేల ఎకరాల్లో చిన్నరసాలు, ఇతర రకాలు సాగవుతున్నాయి. డివిజన్లో ప్రధాన వాణిజ్య పంటగా విలసిల్లుతున్న మామిడి గత కొన్నేళ్లుగా నష్టాలను పంచుతోంది. రెండేళ్లుగా అయితే పరిస్థితులు దా రుణంగా తయారయ్యాయి. అయినా ప్రభుత్వం ఏమాత్రం రైతులను పట్టించుకోవడం లేదు. పూత దశలోనే కుదేలై.. ఈ ఏడాది బంగినపల్లి, కలెక్టర్ రకాల్లో పూత బాగా వచ్చినా పిందె కట్టే దశలో నల్లతామర తెగులు ఆ శించడం, ప్రతికూల వాతావరణం వల్ల ఆశించిన స్థాయిలో పిందె కట్టకుండా పూతంతా రాలిపోయింది. దీంతో దిగుబడి పూర్తిగా పడిపోయింది. రైతులు పూత, పిందె నిలుపుకోవడం కోసం 10 నుంచి 12 సార్లు వరకు రసాయన మందులు పిచికారీ చేసినా లాభం లేకుండా పోయింది. రోజురోజుకూ ధరల పతనం మామిడి సీజన్ ప్రారంభమైన ఫిబ్రవరి ద్వితీయార్థంలో మామిడికి ధరలు మెరుగ్గా ఉన్నా రానురాను పతనమవుతున్నాయి. బంగినపల్లి రకానికి ప్రారంభంలో ముంబై మార్కెట్లో టన్నుకి రూ.1.20 లక్షలు సైతం ధర లభించింది. అది క్రమేణా పడిపోయి చివరకు రూ.40 వేలకు చేరగా ప్రస్తుతం కాయలు బాగుంటే టన్ను రూ.25 వేలు మాత్రమే లభిస్తోంది. స్థానిక మార్కెట్ల్లో టన్నుకి రూ.12 వేల నుంచి రూ.18 వేలు మాత్రమే లభిస్తోంది. దీనికి మరలా టన్నుకు వంద కిలోల కాయలను సూట్ పేరుతో తీసేస్తున్నారు. పది టన్నులు తీసుకెళ్తే టన్ను కాయలు సూట్ పేరుతో దోచుకుంటున్నారు. దీనికి తోడు కమీషన్ పేరుతో కూడా రైతులను దోచుకోవడంతో మామిడి రైతులకు కోత ఖర్చులు, కిరాయిలు రాని పరిస్థితి. వేలాది మంది రైతులు ఆధారపడిన మామిడి నష్టాలను పంచుతున్నా పాలకులు పట్టించుకోవడం లేదు. తామంటేనే ప్రభుత్వానికి అలుసుగా తయారైందని మామిడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాకు 14 ఎకరాలు మామిడి తోట ఉండగా గతేడాది రూ.4 లక్షలు నష్టం వచ్చింది. దీంతో ఏడెకరాల్లో చెట్లు నరికించేసి అందులో ఆయిల్‌పామ్ వేశా. ఈ ఏడాది కూడా రూ.2 లక్షల నష్టం వచ్చింది. దీంతో మిగిలిన ఏడెకరాల్లోని మామిడి చెట్లు తొలగించి అందులో కూడా ఆయిల్‌పామ్ వేస్తా. మామిడిపై స్థిరమైన ఆదాయం రావడం లేదు. – లావు ధనకోటేశ్వరావు, కొత్తరావిచర్ల, నూజివీడు మండలం తోతాపురి కాయలు కొనేవాళ్లే కనిపించడం లేదు. టన్ను రూ.3,500 అంటే కోత కూ లి, కిరాయిలు కూడా రావు. కోత కోసే బదులు తోటల్లోనే వదిలేస్తే ఖర్చులు అయినా మిగులుతా యి. ఇంత దారుణమైన పరిస్థితులు ఎప్పుడూ చూడలేదు. ఆదాయం రాక చాలా మంది రైతులు తోటలు తీసేస్తున్నారు. – పెద్దగమళ్ల ఆదినారాయణ, నూజివీడుమామిడి.. ధర తడబడి మరింత దిగజారిన ధరలు బంగినపల్లి టన్ను రూ.12 వేల నుంచి రూ.18 వేలు కలెక్టర్ టన్ను రూ.3,500 లబోదిబోమంటున్న రైతులు -
బీపీ లేకుండా హ్యాపీగా ఉందాం
అసంక్రమిత వ్యాధులను గుర్తించేందుకు జిల్లా వ్యాప్తంగా ఎన్సీడీ సర్వే నిర్వహిస్తున్నాం. ఈ సర్వేలో ఎక్కువగా అధిక రక్త పోటు కేసులు నమోదవుతున్నాయి. జిల్లాలో సుమారు 2 లక్షల 70 వేల మంది రక్తపోటు ఉన్న వారిని గుర్తించాం. వైద్యుల సూచనలు పాటిస్తూ బీపీ, సుగర్ వ్యాధులను నియంత్రించుకోవచ్చు. – డాక్టర్ నరేంద్రకృష్ట, ఎన్సీడీ ప్రోగ్రాం ఆఫీసర్ ప్రస్తుత జీవనశైలి కారణంగా వయసుతో సంబంధం లేకుండా అధిక రక్తపోటు బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ వ్యాధిపై అవగాహన కలిగి ఉండి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహార శైలితో అధిక రక్తపోటును అధిగమించవచ్చు. – డాక్టర్ డాక్టర్ డి.వంశీకృష్ణ, బుట్టాయగూడెం సామాజిక ఆరోగ్య కేంద్రంబుట్టాయగూడెం: ప్రపంచ వ్యాప్తంగా అతి పెద్ద అనారోగ్య సమస్యల్లో అధిక రక్తపోటు ఒకటి. బీపీతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది. సైలెంట్ కిల్లర్‌గా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోంది. అందువల్ల దీనిపై ప్రతిఒక్కరూ అవగాహన పెంచుకోవాలి. ప్రారంభ దశలో ఎలాంటి లక్షణాలు లేకుండా గుండె, బ్రెయిన్, కిడ్నీలకు తీవ్ర నష్టం కలిగిస్తుంది. అధిక రక్త పోటు కారణంగా మధుమేహం, స్ట్రోక్, గుండె జబ్బులు, మూత్రపిండాల వైఫల్యం, బ్రెయిన్‌స్ట్రోక్ వంటి అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. తరచూ రక్తపోటును పరీక్షించుకోవడం, ఆరోగ్య కరమైన జీవనశైలితో రక్తపోటు నివారించ వచ్చని డాక్టర్లు చెబుతున్నారు. నేడు ప్రపంచ అధిక రక్తపోటు నివారణ దినోత్సవం సందర్భంగా శ్రీసాక్షి శ్రీ ప్రత్యేక కథనం ఆధునిక కాలంలో మనిషి జీవనశైలి పూర్తిగా మారిపోయింది. సాంకేతిక ప్రభావం వల్ల దినచర్యలో చాలా మార్పులు వచ్చాయి. పూర్వ కాలంతో పోలిస్తే వ్యాయమం లేకపోవడం, శ్రమ లేని పనులు పెరిగిపోయాయి. ప్రతి పనిలో ఒత్తిడి పెరిగిపోయింది. దీనివల్ల బీపీ బారిన పడుతున్న వారి సంఖ్య అధికమవుతుంది. జిల్లా వ్యాప్తంగా బీపీ బాధితులపై సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో సుమారు 2.70 లక్షల మందికి రక్తపోటు ఉన్నట్లు గుర్తించారు. బీపీ అంటే.. రక్తనాళాల్లో రక్తం వేగంగా ప్రవహించి అధిక ఒత్తిడి పెరగడం వల్ల వచ్చే సమస్యే హై బీపీ. ఒక వ్యక్తి సాధారణ స్థితిలో బ్లడ్ ప్రెజర్(బీపీ) 120/80గా పేర్కొంటారు. అయితే తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ పెద్ద వయసులో కొన్ని పరిస్థితుల్లో 140/90గా ఉన్నా సాధారణ స్థితిగానే నిర్ధారిస్తున్నారు. చాలా మందికి రక్తపోటు ఉన్నట్లు తెలియకపోడం వల్ల ఉన్నట్టుండి గుండెపోటు వచ్చి కుప్పకూలిపోతున్నారు. తల నొప్పి, అలసట అనిపిస్తే ఏ మాత్రం నిర్లక్యం చేయకుండా తక్షణమే వైద్యులను సంప్రధించి బీపీ చెక్ చేయించుకోవాలి. హైపర్ టెన్షన్ అసాధరణ రీతిలో రావడంతో అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. మెదడు, గుండెలో నరాలు దెబ్బతిని ప్రాణాపాయ స్థితికి చేరుకుంటారు. పక్షవాతం, కిడ్నీ సమస్యలు, నరాల సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉంది. ఇటీవల 20 – 30 ఏళ్ల లోపు యువత గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్, కిడ్నీ సమస్యలతో మృత్యువాత పడుతున్న సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. జాగ్రత్తలు తీసుకోవాలి అధిక రక్తపోటుతో బాధపడే రోగులు ఆహార పదార్థాల్లో ఉప్పు తక్కువగా వినియోగించుకోవాలి. మసాలాలు, నిల్వ చేసిన పచ్చళ్లు, కారం తగ్గించాలి. రోజూ గంట పాటు సాధారణ వ్యాయామం, యోగా వంటివి చేయడం మంచిది. మానసిక ఒత్తిడికి దూరంగా ఉండాలి. మత్తు పదార్థాలు, ఆల్కహాల్, సిగరెట్ వంటి వాటికి దూరంగా ఉండాలి. సాధారణంగా వయసు మళ్లిన వారికి రక్తపోటు వస్తుంది. జన్యుపరమైన కారణాలతో కూడా వస్తుంది. ధూమపానం, ఊబకాయం, ఏ పని చేయకుండా ఒకే చోట గంటల తరబడి ఉండడం, హైపో థైరాయిడ్, ఒత్తిడి, అనారోగ్యకర ఆహార అలవాటుతో పాటు కంటికి సరిపడా నిద్ర లేకపోవడం, శారీరక శ్రమ లేకపోవడం, దీర్ఘకాలిక మూత్ర పిండాల జబ్బుల వల్ల బీపీ వస్తుంది. మెడ నరాల లాగేస్తున్నట్లు ఉండడం, కళ్లు తిరగడం, ఆకస్మికంగా తూలిపోవడం, తరచూ తలపోటు రావడం, ఒళ్లంతా చెమటలు పట్టడం, యూరిన్ తక్కువగా రావడం, కాళ్లు తిమ్మిరిగా ఉండడం బీపీ లక్షణాలు అధిక రక్తపోటుతో అనర్థాలు ముందస్తు గుర్తింపుతో ప్రమాద నివారణ ఆరోగ్యకరమైన జీవన శైలితోనే రక్తపోటు నివారణ నేడు ప్రపంచ అధిక రక్తపోటు నివారణ దినోత్సవం -
సార్వాకు సన్నద్ధం
● విత్తనాల సేకరణ, మెట్టదుక్కులతో బిజీ ● జిల్లాలో 2.25 లక్షల ఎకరాల్లో సాగు ● 53,750 క్వింటాళ్ల విత్తనాలు అవసరం భీమవరం: జిల్లాలో దాళ్వా మాసూళ్లు పూర్తికావస్తున్న తరుణంలో రైతులు సార్వా సాగుకు సన్నద్ధమవుతున్నారు. జిల్లాలోని 20 మండలాల్లో దా ళ్వాలో 2.35 లక్షల ఎకరాల్లో వరి సాగుచేయగా సార్వాలో 2.25 లక్షల ఎకరాల్లో నాట్లు వేయనున్నారు. సార్వాలో తుపానులు, అధిక వర్షాల నుంచి గట్టెంకేందుకు తగు విత్తన రకాలు ఎంపిక చేసువాల్సి ఉంది. ఈ మేరకు విత్తనాల సేకరణ పనిలో రైతులు నిమగ్నమయ్యారు. కొందరు రైతులు భూములను మెట్ట దుక్కులు చేస్తూ ఎత్తుపల్లాలను సరిచేసుకుంటున్నారు. మేలైన వంగడాలివే.. సార్వాలో మేలైన వరి వంగడాలను ఎంపిక చేసుకుని అధిక దిగుబడుగులు సాధించాలని వ్యవసాయ శాఖ సూచిస్తోంది. వాటిలో ఎంటీయూ 1318, ఎంటీయూ 1153,1156, స్వర్ణ రకాలను ఎంపిక చేసుకోవచ్చు. జిల్లాలో సార్వాకు సుమారు 53,750 క్వింటాళ్ల విత్తనాలు అవసరం కాగా 90 శాతానికి పైగా రైతులే నేరుగా సమకూర్చుకుంటారని అంచనా. జూన్ మొదటి వారంలో వరి నారుమడులు ప్రారంభించి ఆగస్టు 15 నాటికి నాట్లు పూర్తి చేస్తే తుపానులు, వరదల నుంచి పంటను కాపాడుకోవచ్చు. వరి నారుమడి నుంచి యాజమాన్య పద్ధతులు పాటిస్తే తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించవచ్చని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. ఈ సీజన్లో ఎక్కువ మంది రైతులు వరినాట్లు వేసే పద్ధతినే అవలంబిస్తున్నందున ఎకరాకు 25 నుంచి 30 కిలోల విత్తనాలు అవసరం కాగా, వెదజల్లు పద్ధతిలో ఎకరానికి 12 కిలోల విత్తనాలు సరిపోతాయి. నారు ఆరోగ్యం కోసం.. వరినారు దృఢంగా, ఆరోగ్యవంతంగా ఉండాలంటే నారు వేసే ముందు మడిని 12 రోజుల ముందు దమ్ముచేసి నీరు పెట్టడానికి, తొలగించడానికి వీలు గా ఏర్పాటు చేసుకోవాలి. ప్రతి సెంటు భూమిలో ఐదు కిలోల వంతున విత్తనాలు చల్లుకోవాలి. విత్త నం ఎక్కువైతే నారు బలహీనంగా ఉండి, మాగుడు తెగులు సోకే అవకాశం ఉంది. మొలక కట్టిన విత్తనాన్ని పలచటి నీటి మీద చల్లుకోవాలి. నారు రెండు, మూడు ఆకులు తొడిగే వరకూ ఆరుతడి పెడుతూ తరువాత పలుచగా నీరుండేలా చూసుకోవాలి. ఎరువులు ఇలా.. దమ్ములో ప్రతి ఐదు సెంట్ల నారుమడికి రెండు కిలోల యూరియా, 7 కిలోల సింగిల్ సూపర్ పాస్పేట్, 2 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేసుకోవాలి. విత్తనాలు వేసిన రెండు వారాల తర్వాత మరలా 2 కిలోల యూరియా పైపాటుగా వేయాలి. అవసరాన్ని బట్టి నారుమడిలో సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. జిల్లాలో ఎరువుల అవసరంపై వ్యవసాయశాఖ అంచనా వేసింది. వీటిని రైతు సేవాకేంద్రాలు, పీఏసీఎస్‌లు, ప్రైవేట్ వ్యాపారుల వద్ద నిల్వ చేయడానికి సిద్ధం చేస్తున్నారు. రకం టన్నులు యూరియా 18,000 కాంప్లెక్స్ 16,000 డీఏపీ 1,600 పొటాష్ 4,200 సూపర్ 4,200 -
ఆర్టీసీ ఉద్యోగుల ధర్నా
తాడేపల్లిగూడెం (టీఓసీ): ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఎంప్లాయీస్ యూనియన్ పిలుపు మేరకు ఆర్టీసీ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. స్థానిక ఆర్టీసీ గ్యారేజీ గేటు ఎదుట ఎర్ర బ్యాడ్జీలు ధరించి ధర్నా చేశారు. డిపో కమిటీ నాయకుడు సీహెచ్ రమణ మాట్లాడుతూ పీఆర్సీ నియమించాలని, తాత్కాలిక భృతి ప్రకటించాలని, పెండింగ్ డీఏలను విడుదల చేయాలని కోరారు. ఎలక్ట్రిక్ బస్సులు నిర్వహణ ఆర్టీసీ యాజమాన్యం ద్వారానే జరగాలని, ఈ బస్సుల నెపంతో వివిధ డిపోలను ఖాళీ చేసే చర్యలు నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. సీ్త్రశక్తి అమలు సందర్భంలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలన్నారు. హెల్త్ స్కీమ్ ద్వారా సరైన సేవలు అందించాలని కోరారు. 39 డిమాండ్లకు యాజమాన్యం స్పందించాలని నినదించారు. డిపో నాయకులు ఏవీ మనోహర్, ప్రచా ర కార్యదర్శి కె..శ్రీనివాస్, ప్రకాష్, ఎన్ఎస్ వాసు తదితరులు పాల్గొన్నారు. -
సబ్‌జైలు తనిఖీ
నరసాపురం: తగాదాలకు, నేరాలకు పాల్పడే ముందు భవిష్యత్ పరిణామాలు ఆలోచించు కోవాలని నరసాపురం జూనియర్ సివిల్ జడ్జి ఎస్.రాజ్యలక్ష్మి సూచించారు. నరసాపురం సబ్‌జైలును శనివారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఖైదీలకు అందుతున్న సదుపాయాలు, జైలు పరిసరాల పరిశుభ్రత వంటి అంశాలను, ఖైదీలకు అందిస్తున్న ఆహారాన్ని పరిశీలించా రు. నేరాలు చేసి జైలు పాలైతే కుటుంబాలు రో డ్డున పడతాయని, బంధువుల ముందు చు లకన అవుతామని అన్నారు. మండల న్యాయ సేవాధికారసంస్థ ద్వారా ఉచిత న్యాయ సహా యం అందుతుందని, సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సబ్‌జైలు సూపరింటెండెంట్ టి.అప్పారావు ఉన్నారు. భీమవరం: రాబోయే విద్యా సంవత్సరానికి ప్ర భుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలను పెంచేందుకు కృషి చేయాలని కలెక్టర్ సీహెచ్ నాగరాణి ఆదేశించారు. స్థానిక క్యాంపు కార్యాల యం నుంచి శనివారం బడి పిలుస్తోంది కార్యక్రమం అమలు తీరుపై జూమ్ కాన్ఫరెన్స్ ద్వా రా సమీక్షించారు. ప్రత్యేక ప్రచార కార్యక్రమా లు చేపట్టాలని, తల్లిదండ్రులను సమగ్ర అవగాహన కల్పించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపినా సంబంధిత సర్టిఫికెట్లు ఇవ్వకుండా ప్రైవేట్ యాజమాన్యాలు అడ్డంకులు సృష్టిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. డీఈఓ ఈ.నారాయణ తదితరులు పాల్గొన్నారు. భీమవరం (ప్రకాశంచౌక్): డెంగీ నివారణలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని డీఎంహెచ్ఓ జి.గీతాబాయి అన్నారు. జాతీయ డెంగీ దినోత్సవం సందర్భంగా శనివారం పట్టణంలోని ప్రకాశంచౌక్ నుంచి జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా గీతాబాయి మాట్లాడుతూ డెంగీ దేశవ్యాప్తంగా ప్రజారోగ్యానికి ప్రధాన సవాలుగా మారిందని, ప్రతిఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ద్వారా డెంగీ వ్యాప్తిని అరికట్టవచ్చాన్నారు. డెంగీ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. అలాగే డెంగీ నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా మలేరియా అధికారి డా. వి.క్రాంతికుమార్, ప ట్టణ ఆరోగ్య కేంద్రాల వైద్య అధికారులు, జిల్లా ఉప మలేరియా అధికారి, డిప్యూటీ హెచ్ఈఓ, ఎస్‌యుఓ, సిబ్బంది పాల్గొన్నారు. భీమవరం (ప్రకాశంచౌక్): ప్రజలంతా పర్యావరణహిత వస్తువులు వినియోగించాలని జేసీ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి అన్నారు. స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్రలో భాగంగా శనివారం పట్టణంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై అధికారులు చర్యలు చేపట్టారు. మున్సిపల్ కమిషనర్ కె.రామచంద్రారెడ్డితో కలిసి జేసీ పట్టణంలో క్యారీ బ్యాగుల విక్రయ దుకాణాలు, ప్లాస్టిక్ వస్తువు ల నిల్వ కేంద్రాలు, హోటళ్లు, రెస్టారెంట్లలో ఆకస్మిక తనిఖీలు చేశారు. ప్లాస్టిక్ నిషేధాన్ని ప్రతి వ్యాపారి కచ్చితంగా పాటించాలని లేకుంటే చ ర్యలు తప్పవని హెచ్చరించారు. పర్యావరణానికి హాని కలిగించని పదార్థాలను మాత్రమే ఉపయోగించాలని సూచించారు. మున్సిపల్ కమిషనర్ కె.రామచంద్రారెడ్డి, సహాయ కమిషనర్ ఎ.రాంబాబు పాల్గొన్నారు. పెంటపాడు: కారులో గంజాయితో వెళుతున్న ఓ వ్యక్తిని పెంటపాడు పోలీసులు అరెస్టు చేశా రు. శనివారం సీఐ రవికుమార్ అతడిని తాడేపల్లిగూడెం కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించినట్టు ఎస్సై స్వామి తెలిపారు. వివరాలిలా ఉన్నాయి.. దినవాహి కృష్ణవంశీ అలియాస్ కిట్టు అనే వ్యక్తి కారులో మూడు కి లోల గంజాయి తీసుకుని విజయవాడ వెళు తుండగా ప్రత్తిపాడు వై.జంక్షన్ వద్ద అరెస్టు చేసి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి చిరునామా వివరాలు తెలియరాలేదు. -
ఆన్లైన్ మందుల విక్రయాలతో నష్టం
పాలకొల్లు సెంట్రల్: ఆన్లైన్ మందుల విక్రయాలతో చిరు వ్యాపారులకు నష్టం వాటిల్లుతోందని, దీనికి నిరసనగా ఈనెల 20న దేశవ్యాప్త మెడికల్ షాపుల బంద్ పాటిస్తున్నట్టు జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు తటవర్తి కృష్ణమూర్తి తెలిపారు. శనివారం పట్టణంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కరోనా లాక్డౌన్ సమయంలో ఆన్లైన్ మందుల విక్రయాలపై ప్రభు త్వం జారీ చేసిన నోటిఫికేషన్ ఇప్పటికీ కొనసాగించడం దారుణమన్నారు. అక్రమ ఈ–ఫార్మసీలు ప్రజారోగ్యానికి ముప్పని, భౌతిక ధ్రువీకరణ లేకుండా మందుల విక్రయాల వల్ల ఒకే ప్రిస్కిప్షన్‌ను పదేపదే ఉపయోగించే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ఏఐ ఆధారిత నకిలీ ప్రిస్కిప్షన్లు, యాంటీ బయాటిక్స్ అలవాటు కలిగించేలా మందులపై నియంత్ర ణ లేకుంటే ప్రజారోగ్యానికి ముప్పు తప్పదన్నారు. ఈ–ఫార్మసీలు భారీ డిస్కౌంట్ల కారణంగా దేశంలో కెమిస్ట్, డ్రగ్గిస్ట్పై ఆధారపడిన సుమారు 5 కోట్ల కు టుంబాల జీవనోపాధి ప్రమాదంలో పడే అవకాశం ఉందన్నారు. ఆయా సమస్యలపై ప్రధానికి విజ్ఞప్తులు చేసినా పట్టించుకోలేదని, దీంతో దేశవ్యాప్తంగా ఒక్కరోజు బంద్‌కు పిలుపునిచ్చినట్టు చెప్పారు. సంఘం ప్రధాన కార్యదర్శి ఎ.చలపతి, ట్రెజరర్ జీవీఆర్ ఫణి తదితరులు పాల్గొన్నారు. -
పవనూ.. ఇది తగునా!
‘నేనేమీ సీఎం కావాలని పార్టీ పెట్టలేదు’ అంటూ జనసేన అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు హాట్‌టాఫిక్‌గా మారాయి. ఎన్నికల సభల్లో సీఎం.. సీఎం.. అని పిలిపించుకుంది ఎందుకన్న సందేహాలు తలెత్తుతున్నాయి. తమ అభిమాన నేతను ముఖ్యమంత్రిగా చూడాలన్న కేడర్ ఆశలపై ఆయన మాటలు నీళ్లు చల్లినట్లయ్యింది. ఆదివారం శ్రీ 17 శ్రీ మే శ్రీ 2026సాక్షి, భీమవరం: తమిళనాడులో సినీ హీరో విజయ్ పార్టీని స్థాపించిన రెండేళ్లకే ముఖ్యమంత్రిగా ఎన్నికై న విషయం తెలిసిందే. ఇతర పార్టీలతో పొత్తు పెట్టు కోకుండా ఒంటరిగా పోటీచేసి అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తే.. జనసేన పార్టీ పెట్టి పుష్కర కాలమైనా ఇంకా పొత్తుల కోసం పాకులాటపై ఇంటా బయట తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ విషయమై శుక్రవారం మంగళగిరిలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో జరిగిన సమావేశంలో ‘నేనేమీ సీఎం కావాలని పార్టీ పెట్టలేదు’ అన్న పవన్‌కల్యాణ్ మాటలు కేడర్‌ను నైరాశ్యంలోకి నెట్టేస్తున్నాయి. గతంలోని ఎన్నికల ప్రచారంలో ఎక్కడకు వెళ్లినా అభిమానులతో సీఎం.. సీఎం.. అని పిలిపించుకున్న పవన్ ఇప్పుడు అందుకు భిన్నంగా మాట్లాడటాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. గతంలో వామపక్షాలతో జతకట్టిన పవన్ తాజాగా తాను వామపక్షవాదిని కాదని చెప్పడం చర్చకు దారితీస్తోంది. మొదట్లో విమర్శలు టీడీపీ, వైఎస్సార్సీపీకి వ్యతిరేకంగా జనసేన పార్టీ స్థాపించినట్లు మొదట్లో పవన్‌కల్యాణ్ చెప్పుకొచ్చా రు. చంద్రబాబు పోలవరం, అమరావతిలో రాజ ధాని పేరుతో సొంత సామాజికవర్గానికే దోచి పెడుతున్నాడని ఆరోపించారు. అమరావతిలో రాజధాని ఏర్పాటుకు అన్ని వేల ఎకరాలు అవసరం లేదంటూ ధ్వజమెత్తారు. రాజధాని నిర్మాణానికి ప్రధాని మోదీ పాచిపోయిన లడ్డూలు, పిడికెడు మట్టి ఇచ్చారంటూ భారతీయ జనతా పార్టీపై ఽసైతం విమర్శలు గుప్పించారు. కూటమిలో రచ్చకెక్కిన విభేదాలు తాడేపల్లిగూడెంలో జనసేన, టీడీపీ మధ్య వైరం ఇప్పటికే రచ్చకెక్కింది. మరోపక్క టీడీపీ ఎమ్మెల్యేలు గెలుపొందిన పాలకొల్లు, ఆచంట, ఉండి, తణుకులలో తమకు తగిన ప్రాధాన్యం లేదన్న నిరాశలో పార్టీ శ్రేణులు చాలా వరకు సైలెంటైపోయారు. పార్టీ కోసం జిల్లాలో కీలకంగా పనిచేసిన నేతలకు ప్రభుత్వంలో తగిన స్థానం దక్కలేదన్న అసంతృప్తి ఉంది. పవన్ సీఎం అయితే తమకు తగిన ప్రా తినిధ్యం లభిస్తుందని ఎదురుచూస్తున్న వారు ఎంతో మంది ఉన్నారు. గతంలో లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేస్తారని ప్రచారం జరిగిన సందర్భంలో ప్ర భుత్వంలో పవన్‌కు ప్రాధాన్యత తగ్గుతుందని కేడర్ ఆందోళన చెందారు. సోషల్ మీడియా వేదికగా తమ గళం వినిపించారు. అప్పట్లో సోషల్ మీడి యాలో టీడీపీ, జనసేనలు పోటాపోటీగా పోస్టులు సైతం పెట్టుకున్నారు. ప్రభుత్వంలో తర్వాతి స్థానంలో ఉన్న పవన్ సీఎం అవుతారని ఎదురుచూస్తున్నారు. కాగా సీఎం కావాలని పార్టీ పెట్టలేదన్న పవన్ వ్యాఖ్యలు ఆయన అభిమానుల్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ మాటలు దేనికి సంకేతమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కడదాకా టీడీపీ పల్లకీ మోయాల్సిందేనా అని కేడర్ అంతర్మథనం చెందుతున్నారు. పార్టీ పెట్టింది సీఎం అయ్యేందుకు కాదా ! సభల్లో సీఎం.. సీఎం.. అని పిలిపించుకుంది ఎందుకు ? పవన్‌కల్యాణ్ వ్యాఖ్యలపై జనసేన కేడర్‌లో నిర్వేదం కడదాకా టీడీపీకి కొమ్ము కాయాల్సిందేనా..? ఇప్పటికే జనసేన ఎమ్మెల్యేలు, కేడర్‌కు దక్కని ప్రాధాన్యం జనసేన ఎమ్మెల్యేలకు పోటీగా టీడీపీ నేతలు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ, అర్జీల స్వీకరణ అసంతృప్తితో రగలిపోతున్న నేతలు -
మహిళ మృతి
గుర్తుతెలియని వాహనం ఢీకొని మహిళ మృతి చెందిన ఘటన తాడేపల్లిగూడెం మండలంలోని కుంచనపల్లి హైవేపై చోటుచేసుకుంది. 8లో uపాలకొల్లు సెంట్రల్: ఆక్వా రైతులకు సంకటంగా మారిన ఫీడ్ ధరల సమస్య పరిష్కారానికి చర్చలు కొలిక్కిరాలేదని మరోసారి సమావేశం ఏర్పాటు చేయనున్నారని జై భారత్ క్షీరారామ ఆక్వా సంఘం అధ్యక్షుడు గొట్టుముక్కల గాంధీభగవాన్‌రాజు అన్నారు. శనివారం పూలపల్లిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఫీడ్ కంపెనీలతో శుక్రవారం జరిపిన చర్చలకు మంత్రి అచ్చెన్నాయుడు రాకపోవడంతో సమస్య పరిష్కారం కాలేదన్నారు. ఫీడ్ ధరలు పెంచాల్సిందేనని కంపెనీల ప్రతినిధులు అంటే.. కుదరదని రైతులు పట్టుబట్టారన్నారు. రైతులతో చర్చలు పూర్తయితేనే పెంచిన ఫీడ్ ధరలు అమలులోకి వస్తాయని చెప్పారు. ఎక్కడైనా ధరలు పెంచి విక్రయిస్తే ఆక్వా సంఘం సభ్యులకు సమాచారం ఇవ్వాలని రైతులకు సూచించారు. అలాగే ప్రాసెసింగ్ ప్లాంట్ల యజమానులతో మూడుసార్లు చర్చలు జరగ్గా కొంత వరకూ సానుకూలత వ్యక్తం చేశారన్నారు. సమస్యలు పరిష్కారం కాకుంటే తుది కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామన్నారు. పెన్మెత్స వెంకట సత్యనారాయణరాజు, సజ్జా బుజ్జి, భూపతిరాజు శ్రీనివాసరాజు, అంగర వరప్రసాద్, గుంటూరి చంటిరాజు, మేడిది జాన్‌రాజు తదితరులు పాల్గొన్నారు. -
కూటమి నేత దర్జాగా కబ్జా
తాడేపల్లిగూడెం: జాగా కనిపిస్తే దర్జాగా కబ్జా చేసేయ్ అన్న రీతిలో నియోజకవర్గంలోని కూటమి నేత వ్యవహార శైలి ఉంది. బాల వెంకటేశ్వర స్వామి భూములను కబ్జా చేసి విక్రయించి సొమ్ములు చేసుకున్న ఘనమైన చరిత్ర కలిగిన ఈ నేత తాజాగా పట్టణంలోని రెండో టౌన్లో బాలవెంకటేశ్వరస్వామి భూమిని ఆక్రమించిన నిర్మాణాలు వివాదాస్పదమయ్యాయి. గత ప్రభుత్వ హయాంలో ఈ నేత అక్రమాలకు అప్పటి ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ చెక్ పెట్టారు. ఆక్రమణలు తొలగించి భూమిని దేవదాయ శాఖకు బదలాయించారు. కూటమి పాలన వచ్చాక సదరు నేత మళ్లీ అక్రమ నిర్మాణాలు చేశారు. కట్టడి చేయాల్సిన దేవదాయ శాఖ అధికారులు తూతూ మంత్రంగా బోర్డు ఏర్పాటుచేసి చేతులు దులిపేసుకున్నారు. ఈ నేత ఉంటున్న ఇల్లు కూడా దేవదాయ శాఖకు చెందిన భూమిలో ఉందని కేసు నమోదైంది. దేవదాయశాఖ మంత్రిగా పైడికొండల మాణిక్యాలరావు ఉన్న సమయంలో ఇదే ప్రాంతంలో అక్రమ రహదారి నిర్మాణానికి చెక్ పెట్టారు. అక్రమ నిర్మాణాలపై దేవదాయశాఖ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించింది,. కూలగొట్టడానికి మాత్రం ఆ శాఖ వెనుకడుగు వేస్తోంది. దేవదాయ శాఖ భూమిలో నిర్మాణాలు -
గోదావరి జిల్లాల ప్రజల ఆరాధ్యుడు కాటన్
భీమవరం: గోదావరి జిల్లాల ప్రజల ఆరాధ్యుడు, అపర భగీరథుడు సర్ ఆర్ధర్ కాటన్ అని పలువురు వక్తలన్నారు. శ్రీవిజ్ఞానవేదిక, రైతు కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో భీమవరం పట్టణం జువ్వలపాలెం రోడ్డులోని కాటన్ విగ్రహం వద్ద శుక్రవారం కాటన్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా కాటన్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళిలర్పించారు. రైతు కార్యాచరణ సమితి నాయకులు పాతపాటి మురళీకృష్ణంరాజు, కలిదిండి గోపాలకృష్ణంరాజు, కోళ్ల సీతారామ్, పి.రామకృష్ణంరాజు(పార్క్రాజు) మాట్లాడుతూ ధవళేశ్వరంలో ఆనకట్ట నిర్మించి ఉభయగోదావరి జిల్లాలను సస్యశ్యామలం చేసిన అపర భగీరథుడు కాటన్ అని కొనియాడారు. చెరుకువాడ రంగసాయి, కంతేటి వెంకటరాజు మాట్లాడుతూ తరాలు మారినా గోదారి గుండె చప్పుడు కాటన్ దొరేనని గోదావరి జిల్లాల వాసుల గుండెల్లో మాత్రం కాటన్ గుండె చప్పుడు ఎప్పుడూ వినిపిస్తాయన్నారు. కార్యక్రమంలో కె.కృష్ణంరాజు, టీవీవీ ప్రసాద్, భట్టిప్రోలు శ్రీనివాసరావు, గంటా సుందరకుమార్, ఎస్.సత్యనారాయణ రాజు తదితరులు పాల్గొన్నారు. -
ప్రశాంతంగా ఈఏపీసెట్ పరీక్ష
భీమవరం: భీమవరం పట్టణంలోని నాలుగు పరీక్షా కేంద్రాల్లో శుక్రవారం నిర్వహించిన ఏపీ ఈఏపీ సెట్ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం నిర్వహించిన పరీక్షకు 150 మందికి 143 మంది విద్యార్దులు హాజరుకాగా మధ్యాహ్నం పరీక్షకు 150 మందికి 144 మంది హాజరయ్యారు. విష్ణు ఇంజనీరింగ్ కళాశాలలో రెండు షిప్ట్స్‌లో 220 మంది విద్యార్థులకు 211 మంది, డీఎన్నార్ అటానమస్ కళాశాల సెంటర్లో 200 మందికి 194, ఇంజనీరింగ్ కళాశాల సెంటర్లో 200 మందికి 193 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఏలూరు జిల్లాలో 787 మంది హాజరు ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కళాశాలల్లో ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరేందుకు నిర్వహించే ఏపీ ఈఏపీ సెట్ పరీక్షలు శుక్రవారం నగరంలో ప్రశాంతంగా జరిగాయి. ఏలూరులోని మూడు పరీక్షా కేంద్రాల్లో ఉదయం, మధ్యాహ్నం షిప్టుల్లో నిర్వహించిన పరీక్షలకు మొత్తం 787 మంది హాజరయ్యారు. ఏలూరు సిద్ధార్థ క్వెస్ట్ కేంద్రంలో మధ్యాహ్నం షిప్ట్‌నకు 120 మందికి గాను 116 మంది హాజరు కాగా ఏలూరు ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 170 మందికి 163 మంది, మధ్యాహ్నం 170 మందికి 161 మంది హాజరయ్యారు. సీఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 180 మందికి 176 మంది హాజరు కాగా మధ్యాహ్నం 180 మందికి 171 మంది హాజరయ్యారు. వీరవాసరం: వైఎస్సార్సీపీ రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగ కార్యదర్శిగా వీరవాసరానికి చెందిన మద్దాల అప్పారావును నియమించినట్లు శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు వచ్చాయి. ఈ సందర్భంగా మద్దాల అప్పారావు మాట్లాడుతూ పార్టీ పురోభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామన్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగ కార్యదర్శిగా నియమించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, పార్టీ ముఖ్య నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పెనుగొండ: ఆచంట బాలంవారిపాలెంలోని పీ4 భవనంలో శుక్రవారం నిర్వహించిన పీజీఆర్ఎస్లో జేసీ టి.రాహుల్ కుమార్ రెడ్డి 238 అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాలతో ప్రత్యేక పీజీఆర్ఎస్కు జిల్లా స్థాయి అధికారులు తప్పని సరిగా హాజరు కావాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శశ్రద్ధ చూపాలన్నారు. అర్జీలపై తీసుకున్న చర్యలకు సంబంధించిన నివేదికలతో వచ్చే సమావేశానికి హజరు కావాలని సూచించారు. ఆచంట మండలం నుంచి 129, పెనుమంట్ర మండలం నుంచి 28, పోడూరు మండలం నుంచి 17, పెనుగొండ మండలం నుంచి 64 అర్జీలు వచ్చినట్లు తెలిపారు. ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, ఆర్డీవో దాసిరాజు, డ్వామా పీడీ డాక్టర్ సీహెచ్ అప్పారావు, డీఆర్డీఏ పీడీ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఏలూరు (టూటౌన్): జిల్లాలో బడి పిలుస్తోంది కార్యక్రమం ద్వారా 5,965 మంది బడి ఈడు పిల్లలను ప్రభుత్వ బడులలో చేర్పించామని కలెక్టర్ కె. వెట్రిసెల్వి రాష్ట్ర విద్యా శాఖ కార్యదర్శి కోన శశిధర్‌కు తెలిపారు. బడి పిలుస్తోంది, ఎన్రోల్మెంట్ డ్రైవ్ పై కలెక్టర్లతో విద్యా శాఖ కార్యదర్శి శనివారం జూమ్ కాన్ఫరెన్‌న్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కోన శశిధర్ మాట్లాడుతూ అంగన్వాడీలలో ప్రీ స్కూల్లో ఉన్న పిల్లలను మొదటి తరగతిలో చేర్పించేందుకు చర్యలు తీసుకోవాలని, బడి మానివేసిన వారిని తిరిగి బడులలో చేర్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అంగన్వాడీలలో ప్రీ స్కూల్ చదువుతున్న వారిలో 11,200 మంది పిల్లలను మొదటి తరగతిలో చేర్పించేందుకు లక్ష్యం కాగా, ఇంతవరకు 5,965 మందిని బడులలో చేర్పించామని, మిగిలిన వారిని కూడా త్వరలో ప్రభుత్వ బడులలో చేర్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. -
నేలసారాన్ని కాపాడుకోవాలి
తాడేపల్లిగూడెం : నేలసారాన్ని కాపాడుకుంటే మంచి దిగుబడులు సాధించవచ్చని కేవీకే శాస్త్రవేత్త డాక్టర్ దేవీవరప్రసాదరెడ్డి అన్నారు. వెంకట్రామన్నగూడెంలోని కృషి విజ్ఞాన కేంద్రంలో నాణ్యమైన చేప పిల్లల ఉత్పత్తి పద్ధతులు, నర్సరీల నిర్వహణ, సంరక్షణ పద్ధతులపై రైతులకు వివరించారు. సమతుల్య ఎరువుల వినియోగంపై అవగాహన కల్పించారు. ప్రతిరైతూ తమ నేలను పరిరక్షించుకోవాలని, దాని ఆధారంగానే ఎరువులను వాడుకోవాలన్నారు. ఎరువుల ఖర్చును తగ్గించుకొని భూసారం పెంచుకోవాలన్నారు. రసాయనిక ఎరువుల ప్రభావాన్ని తగ్గించుకునేందుకు జీవ ఎరువులు, సూక్ష్మ జీవుల వాడకం, వర్మి కంపోస్టు పద్ధతులపై విశదీకరించారు. నాణ్యమైన చేప పిల్లల ఎంపిక, ఉత్పత్తి పద్ధతులు తల్లి చేపల ఎంపిక, అఽఽధిక దిగుబడులు సాధించడం గురించి తెలిపారు. వ్యాధులులేని అధిక దిగుబడినిచ్చే రోహు, కట్ల, మృగల, గ్రాస్ కార్ప్,సిల్వర్ కార్ప్ చేపల ఎంపిక గురించి వివరించారు. హార్మోన్ ఇంజక్షన్లు, నర్సరీల నిర్వహణ గురించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జిల్లా మత్స్య శాఖాధికారి రాజ్‌కుమార్, జిల్లా సహకార సంఘం అధ్యక్షులు వసంత్ రావులు పాల్గొన్నారు. -
భారీ వాహనాల ప్రవేశంపై ఆంక్షలు
ఏలూరు టౌన్: నగరంలో ట్రాఫిక్ నియంత్రణంలో భాగంగా నగరంలోకి భారీ వాహనాల ప్రవేశంపై ఆంక్షలు విధించామని ఏలూరు ట్రాఫిక్ సీఐ లక్ష్మణరావు తెలిపారు. ఏలూరు పోలీస్ డార్మిటరీలో ఇటుకబట్టీల ట్రాక్టర్ డ్రైవర్లతో ట్రాఫిక్ సీఐ ప్రత్యేకంగా అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏలూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ నివారణకు ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకూ, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ ట్రాక్టర్లు, లారీలు, ఇతర భారీ వాహనాల ప్రవేశాన్ని నిషేధించామని స్పష్టం చేశారు. ఈ సమయంలో డ్రైవర్లు ప్రత్యామ్నాయ మార్గాల్లో తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు. ఇష్టారాజ్యంగా నగరంలోకి ప్రవేశించి ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏదైనా రోడ్డు ప్రమాదం జరిగితే క్షతగాత్రులను సకాలంలో హాస్పిటల్‌కు చేర్చేందుకు ప్రతీ ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని సూచించారు. అతివేగం ప్రమాదకరమనీ, ట్రాక్టర్ డ్రైవర్లు ముఖ్యంగా పరిమిత వేగంతోనే ప్రయాణించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్సై శ్రీధర్, ట్రాఫిక్ సిబ్బంది ఉన్నారు. -
నిమ్మకాయల యార్డులో మృతదేహం లభ్యం
ఏలూరు టౌన్: ఏలూరు నిమ్మకాయల యార్డ్ ప్రాంగణంలో గోడ పక్కగా ఒక మృతదేహాన్ని గుర్తించారు. శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో గుర్తు తెలియని సుమారు 50 ఏళ్ల వయస్సున్న వ్యక్తి ఒక మృతదేహాన్ని నిమ్మకాయల యార్డులో పనిచేసే వారు గుర్తించారు. వెంటనే ఏలూరు రూరల్ పోలీసులకు సమాచారం అందించారు. ఏలూరు వన్‌టౌన్ సీఐ జి.సత్యనారాయణ ఆధ్వర్యంలో పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్ళి పరిశీలించారు. మృతదేహం పూర్తిగా కుళ్ళిన స్థితిలో గుర్తు పట్టలేని విధంగా ఉంది. సుమారుగా వారం రోజుల క్రితం చనిపోయి ఉండవచ్చని భావిస్తున్నారు. మృతదేహంపై లేత ఆకుపచ్చ రంగు పుల్‌హ్యాండ్స్ చొక్కా, నలుపురంగు ప్యాంట్ ధరించి ఉన్నాడు. మృతుని వివరాలు తెలియాల్సి ఉందనీ... ఎవరికై నా తెలిస్తే తమను సంప్రదించాలని ఏలూరు వన్‌టౌన్ సీఐ సత్యనారాయణ తెలిపారు. -
పీఏసీఎస్‌లో ఇష్టారాజ్యంగా నియామకాలు
నూజివీడు: నూజివీడు పీఏసీఎస్‌లో అధికార పార్టీ నాయకులు నిబంధనలకు విరుద్ధంగా ఇష్టారాజ్యంగా నియామకాలు చేసుకుంటూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. తమ అనుచరులను, కావాల్సిన వారిని నియమంచుకుంటూ వారికి జీతాల రూపంలో వేల రూపాయలు చెల్లిస్తున్నారు. సొసైటీల్లో ఏవరినైనా నియమించాలంటే జిల్లా స్థాయి సాధికార కమిటీ ఉత్తర్వుల ప్రకారం నియమించుకోవాల్సి ఉండగా ఈ సొసైటీలో ప్రస్తుతం 8 మంది ప్రైవేటు వ్యక్తులను నియమించుకుని వారికి ప్రతినెలా రైతుల సొమ్మును దోచిపెడుతూ దుర్వినియోగం చేస్తున్నారు. ఈ సొసైటీలో పర్మినెంట్ పోస్టులు ఆరు ఉండగా ముగ్గురు ఉద్యోగులు పనిచేస్తున్నారు. మూడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులలో ముగ్గురు వ్యక్తులను నియమించుకుంటే సరిపోతుంది. కానీ ఇక్కడ ఎనిమిది మందిని నియమించుకున్నారు. ఇందులో ఐదుగురు గత నాలుగేళ్ల నుంచి పనిచేస్తుండగా ముగ్గురిని మాత్రం నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ఇటీవలే నియమించారు. గత ఆర్థిక సంవత్సరంలో కేవలం రూ.12 కోట్ల వ్యాపారం మాత్రమే చేసినా సొసైటీ రుణాల రికవరీ కూడా వందశాతం లేదు. ఇష్టారాజ్యంగా నియమించుకొని జీతాలకు సొసైటీ సొమ్మును దుర్వినియోగం చేస్తే తరువాత ఆడిట్ అభ్యంతరాలు వచ్చి రికవరీ చేయాలని ఉన్నతాధికారులు ఆదేశిస్తే ఎవరు భరిస్తారనే ప్రశ్నలు సైతం ఉత్పన్నమవుతున్నాయి. ఇప్పటికై నా నూజివీడు సొసైటీ తీరుపై సహకారశాఖ ఉన్నతాధికారులు దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. -
ఎస్.కొండేపాడు బాధితులకు వాసుబాబు పరామర్శ
గణపవరం: గణపవరం మండలం ఎస్. కొండేపాడు గ్రామంలో రెండు రోజుల క్రితం కలుషిత మైదాపిండితో వేసిన బజ్జీలు తిని తీవ్ర అస్వస్థతకు గురైన బాధితులను శుక్రవారం ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు పుప్పాల వాసుబాబు పరామర్శించారు. భీమవరంలోని వివిధ ప్రైవేటు ఆస్పత్రులలో చికిత్స పొందుతున్న వారి వద్దకు వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాఽధితుల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో చర్చించారు. బాధితులంతా పూర్తిగా కోలుకునే వరకూ వైద్యం అందించాలని ఆయన వైద్యులను కోరారు. ఏ అవసరం వచ్చినా తనకు తెలియజేయాలని, అవసరమైన సహాయ సహకారాలు అందిస్తానని బాధితులకు భరోసా ఇచ్చారు. వాసుబాబు వెంట గణపవరం ఎంపీపీ అర్థవరం రాము, మండల వైఎస్సార్ సీపీ కన్వీనర్ దండు రాము, వైఎస్సార్ సీపీ మండల యూత్ అధ్యక్షుడు కొట్టు నరేష్, కొండేపాడు మాజీ సర్పంచ్ తోట సత్యనారాయణ, వైఎస్సార్ సీపీ కొండేపాడు గ్రామ అధ్యక్షుడు గంగుమోలు సూరిబాబు తదితరులు ఉన్నారు. పాలకొల్లు సెంట్రల్: పట్టణంలో యడ్లబ బజారు, రామయ్యహాలు ప్రాంతాల్లో ఉన్న డంపింగ్ యార్డుల్లో పొగ వస్తుందని ఫిర్యాదులు రావడంతో ఏలూరు పర్యావరణ శాఖ ఇంజనీర్ రామచంద్రమూర్తి విచారణకు వచ్చారు. ఈ సందర్భంగా రామచంద్రమూర్తి మాట్లాడుతూ ఎన్విరాన్మెంట్ బోర్డుకు వచ్చిన ఫిర్యాదు మేరకు డంపింగ్ యార్డుకు తనిఖీ చేస్తున్నామన్నారు. మునిసిపల్ అధికారులకు నోటీసు జారీ చేసి నివేదిక కోరతామన్నారు. పట్టణానికి చెందిన ఓ వ్యక్తి పట్టణంలో ఉన్న రెండు డంపింగ్ యార్డుల్లో నిత్యం పొగ వస్తుందని చుట్టూ ఇళ్లు, ఆలయాలు ఉన్నాయని స్థానిక ప్రజలు అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారని పలు సమస్యలను తెలియజేస్తూ నేరుగా ఎన్విరాన్మెంట్ బోర్డుకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ బి.విజయసారథి, పబ్లిక్ హెల్త్ డీఈ విజయ్‌కుమార్, మునిసిపల్ డీఈ రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఉంగుటూరు : మండలంలోని బాదంపూడిలో ఉండ్రాజవరపు గంగ ఇంట్లో దొంగతనానికి పాల్పడిన కేసులో నిందితుడు తాడేపల్లిగూడేనికి చెందిన బొగత శివకు ఏడాది జైలు, 2వేలు జరిమానా విధిస్తూ తాడేపల్లిగూడెం అడిషనల్ జ్యుడిషియల్ ఫస్టు క్లాస్ మెజిస్ట్రేట్ కె.లలిత తీర్పు శుక్రవారం వెలువరించినట్లు చేబ్రోలు ఎస్సై సూర్య భగవాన్ తెలిపారు. 6–7–2025న ఉండ్రాజవరపు గంగ వరంగల్ వెళ్లగా ఎవరు ఇంట్లో లేకపోవడం చూసి తాళాలు బద్దలు కొట్టి బీరువాలో బంగారపు మంగళ సూత్రాలు 4 గ్రామలు, బంగారు కాయిన్ 2 గ్రాములు, ఒక వెండి గ్లాసును శివ దొంగలించాడు. దీంతో ఎస్సై సూర్యభగవానన్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేసి నిందితుడిని కోర్టులో హజరపరిచారు. నేరం రుజువు కావడంతో నిందితుడికి శిక్ష వేశారు. -
జీడి.. మద్దతు కొరవడి
● జీడిపిక్కల కొనుగోలుకు ప్రభుత్వం వెనుకంజ ● దళారుల గుప్పిట్లో గిరిజన రైతులు ● గిట్టుబాటు ధర రాక ఇళ్లలోనే నిల్వ బుట్టాయగూడెం: అమాయక గిరిజన రైతులు దళారులు చేతుల్లో చిక్కుకుంటున్నారు. ఆరుగాలం శ్రమించి సాగు చేసిన పంటకు కనీసం గిట్టుబాటు ధర లభించకపోవడంతో ఆ పంటలను తక్కువ ధరలకే అమ్ముకుంటున్నారు. ఈ ఏడాది చంద్రబాబు ప్రభుత్వం జీడిమామిడి పంటకు గిట్టుబాటు ధర కల్పించకపోవడంతో దళారులు చేతుల్లో గిరిజన రైతులు నిలువునా మోసపోతున్నారు. దళారుల దందా తెలిసినా ప్రభుత్వాధికారులు మిన్నకుండిపోవడం శోచనీయం. మన్యంలో 1,100 మందికి పైగా రైతులు గిరిజన ప్రాంతంలోని బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, పోలవరం, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల పరిధిలో సుమారు 11 వందల మందికి పైగా గిరిజన రైతులు సుయారు 2 వేల ఎకరాల్లో జీడిమామిడి పంటలను పండిస్తున్నారు. ప్రతిఏటా ఆరువేల టన్నులు వరకు జీడిమామిడి పిక్కల దిగుబడి వస్తుంది. సగటున 160 కిలోల దిగుబడి వస్తుందని రైతులు చెబుతున్నారు. గిరిజన ప్రాతంలో పండించే జీడి పిక్కలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. గిరిజన ప్రాంతంలో సేకరించే జీడిమామిడి పప్పు బయట పప్పుకంటే ఎంతో రుచిగా ఉంటుంది. అందుకే ఇక్కడి పప్పు కొనుగోలు చేసేందుకు బయట వ్యాపారులు ఎగబడతారు. ఎక్కడా కనిపించని కొనుగోలు కేంద్రాలు గిరిజనులు పండించిన జీడిమామిడి పంట అమ్మకోవడానికి ఈ ప్రాంతంలో ఎక్కడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు. దీంతో దళారులే గ్రామస్థాయిలో విక్రయాలు చేస్తుంటారు. ఈ ఏడాది ప్రారంభంలో కిలో రూ.170కి వ్యాపారులు జీడిమామిడి పిక్కలు కొనుగోలు చేశారు. తర్వాత కిలో రూ.150 నుంచి ప్రస్తుతం కిలో రూ. 140 కి కొనుగోలు చేస్తున్నట్లు గిరిజన రైతులు చెబుతున్నారు. దీని వల తీవ్రంగా నష్ట పోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంత మంది బయట నుంచి వచ్చిన వ్యాపారులు సిడికెట్గా ఏర్పడి ధరను పతనం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గిట్టుబాటు ధర కోసం రైతుల విజ్ఞప్తి గిరిజన ప్రాంతంలో ప్రధానంగా ఉద్యాన తోటలో జీడిమామిడి పంటల సాగు చేస్తుంటారు. ఐటీడీఏ ద్వారా ఉద్యానవన శాఖ పంటల సాగుకు ప్రోత్సహిస్తుంది. అయితే గిరిజనులు పండించిన పంటలను అమ్ముకునే సమయంలో మాత్రం పట్టించుకునే నాథుడే లేరని గిరిజన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట అమ్ముకోవడానికి కోనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని గిరిజన రైతులు కోరుతున్నారు. అలాగే తాము పండించిన పంటకు క్వింటాకు రూ.20 వేలు ధర కల్పించాలని రైతులు కోరుతున్నారు. గిరిజన ప్రాంతంలో గిరిజనలు ప్రతిసీజన్‌లో జీడిమామిడి పంటను అమ్ముకోవడాకి కొనుగోలు కేంద్రా ఏర్పాటు చేయకపోవడం అన్యాయం. ప్రభుత్వం, అధికారులు కనీసం పట్టించుకోకపోడం వల్ల గిరిజనులు దళారు చేతిలో మోసపోతున్నారు. ఐటీడీఏ అధికారులు పట్టించుకుని కనీసం జీసీసీ ద్వార నైనా జీడిపిక్కలను కొనుగోలు చేసే విధంగా కృషి చేయాలి. – కారం రాఘవ, సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా నాయకుడు, అలివేరు -
పెట్రో మంట
పశ్చిమాసియా కల్లోలంతో చమురు ధరలు సెగలు పుట్టిస్తున్నాయి. ఇప్పటికే గ్యాస్ ధరలకు రెక్కలు రాగా శుక్రవారం నుంచి పెట్రోల్‌పై లీటరుకు రూ.3.29, డీజిల్‌కు రూ.3.14 చొప్పున పెరిగాయి. దీంతో లీటరు పెట్రోల్ రూ.113.12కు, డీజిల్ రూ.100.78 చేరాయి. ఈ మేరకు జిల్లాలోని వినియోగదారులపై రోజుకు రూ. 19.6 లక్షలు భారం పడుతుందని అంచనా. సాక్షి, భీమవరం: నెలల తరబడి సాగుతున్న అమెరికా– ఇరాన్ యుద్ధం అంతర్జాతీయంగా ముడిచమురు ధరలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. మార్చి రెండో వారంలో గ్యాస్ ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచింది. డొమెస్టిక్ సిలెండర్ రూ.892 నుంచి రూ. 952కు, వాణిజ్య సిలెండర్ రూ.1850.50 నుంచి రూ. 2177కు పెరిగాయి. రెండు నెలలు తిరగకుండానే వాణిజ్య సిలెండర్ ధరను రూ.3,170కు పెంచింది. జిల్లాలో 6,21,626 గృహావసరాలు (డొమెస్టిక్) కనెక్షన్లు ఉన్నాయి. సగటున ఒక్కో కుటుంబం ఏడాదికి ఏడు సిలెండర్లు చొప్పున జిల్లాలోని వినియోగదారులు 43.5 లక్షల డొమెస్టిక్ సిలెండర్లు వినియోగిస్తారని అంచనా. వంట గ్యాస్ కోసం రెండు నెలల క్రితం వరకు ఏడాదికి రూ.6,244 వెచ్చిస్తే, తాజా పెంపుతో రూ.6,664 చెల్లించాల్సి వస్తుంది. పెరిగిన ధరలు మేరకు జిల్లా వాసులపై రూ. 24.94 కోట్ల అదనపు భారం పడుతుందని అంచనా. సామాన్యులకు సెగ : మార్కెట్లో నిత్యావసర వస్తువుల ధరలు మండిపోతున్నాయి. కంది, మినుము, పెసరపప్పులు నాణ్యత రకాన్ని బట్టి కిలో రూ.125 నుంచి రూ.135 వరకు ఉన్నాయి. పామాయిల్ ప్యాకెట్ రూ.140 వరకు ఉండగా, సన్‌ఫ్లవర్, వేరుశనగ, బ్రాన్ ఇతర ఆయిల్ ధరలు రూ.150 నుంచి రూ. 200 పైగా పలుకుతున్నాయి. నిత్యావసర సరుకులు లేనిదే రోజు గడవక సామాన్యుల జీవనం దుర్భరంగా మారింది. ఇప్పటికే గ్యాస్ ధరల పెంపుతో వారిపై అదనపు భారం పడింది. కమర్షియల్ సిలెండర్లు ధర భారీగా పెంచడంతో హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, బజ్జీల బళ్లు, స్వీట్స్ షాపులు, కర్రీ పాయింట్లలో ధరలకు రెక్కలొచ్చాయి. టిఫిన్, మీల్స్‌పై ప్లేటుకు రూ. 5 నుంచి రూ.20 వరకు ధరలు పెంచేశారు. మిగిలిన ఆహార పదార్థాల ధరలు పెరిగాయి. తాజాగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంపుతో రవాణా భారం కానుంది. సరుకుల రవాణా చార్జీలు పెరిగి కూరగాయలు, ఇతర వస్తువుల ధరలు పెరుగుతాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు.జిల్లాలో ప్రభుత్వ రంగ సంస్థలైన హిందుస్థాన్ పెట్రోలియం (హెచ్‌పీ), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీ)తో పాటు రిలయన్స్, నయారా తదితర ప్రైవేట్ కంపెనీలకు చెందిన పెట్రోల్ బంకులు 165 వరకు ఉన్నాయి. రోజుకు సుమారు 1.5 లక్షల లీటర్ల పెట్రోల్, 4.5 లక్షల లీటర్ల డీజిల్ వినియోగమవుతుంది. శుక్రవారం ఉదయం ఆరు గంటల నుంచి పెట్రోల్‌పై రూ. 3.29, డీజిల్‌పై రూ. 3.14 చొప్పున ఆయిల్ కంపెనీలు ధరలను పెరిగాయి. ఈ మేరకు వినియోగదారులపై రోజుకు పెట్రోల్‌పై రూ. 4.93 లక్షలు, డీజిల్‌పై రూ. 14.13 లక్షలు కలిపి రూ.19.6 లక్షల భారం పడుతుంది. నిత్యావసర ధరల నియంత్రణ, రేషన్ షాపుల ద్వారా సరుకుల పంపిణీని కూటమి ప్రభుత్వం గాలికొదిలేసింది. 2024 అక్టోబరులో రేషన్ దుకాణాల ద్వారా కంది పప్పు పంపిణీ ప్రారంభించిన కూటమి ప్రభుత్వం నాలుగు నెలలు తిరక్కుండానే చేతులెత్తేసింది. గత ఏడాది మార్చి నుంచి మొత్తం నిలిపివేసింది. కార్డుదారులకు రూ.20కు కిలో చొప్పున గోధుమ పిండి అందజేస్తామని చెప్పి జనవరి నుంచి పైలెట్ ప్రాజెక్టు పేరిట నగరాలు, ముఖ్య పట్టణాలకు మాత్రమే పరిమితం చేసింది. జిల్లాలో 5,67,700 రేషన్ కార్డులకు భీమవరం పరిధిలో 33,363 కార్డులకు మాత్రమే గోధుమ పిండి ఇస్తున్నారు. రేషన్ దుకాణాల ద్వారా నిత్యావసర వస్తువుల పంపిణీకి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పేదవర్గాల వారు కోరుతున్నారు. లీటరు పెట్రోల్‌కు రూ.3.29,డీజిల్‌కు రూ.3.14 పెంపు జిల్లాలో రోజుకు 4.5 లక్షల లీటర్ల డీజిల్, 1.5 లక్షల లీటర్ల వరకూ పెట్రోల్ వినియోగం వినియోగదారులపై రోజుకు రూ.19.6 లక్షల భారం ఇప్పటికే డొమెస్టిక్ సిలెండర్‌పై రూ.60, కమర్షియల్‌పై రూ.1370ల పెంపు సామాన్యులపై పెరిగిన ధరల భారం -
అక్రమంగా మట్టి తవ్వకాలు
భీమవరం (ప్రకాశంచౌక్): భీమవరం పంచారామ క్షేత్రానికి చెందిన గునుపూడి టిడ్కో ఇళ్ల సమీపంలోని వ్యవసాయ భూమిలో కొందరు అక్రమంగా మట్టి తవ్వకాలు చేస్తుండగా భక్తులు గమనించి పంచారామ క్షేత్ర అధికారులకు తెలియజేశారు. శుక్రవారం ఆలయ ఈఓ కృష్ణంరాజు, ఆలయ అధికారులు అక్రమ తవ్వకాలను అడ్డుకున్నారు. వారి ఫిర్యాదుతో రెవెన్యూ, పోలీస్ శాఖాధికారులు మట్టి తవ్వుతున్న జేసీబీ, మూడు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. అనుమతులు లేకుండా దేవస్థానం భూమిలో మట్టి తవ్వకాలకు సిద్ధపడడంపై అటు భక్తులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏలూరు (టూటౌన్): యుద్ధ సంక్షోభ పరిస్థితుల దృష్ట్యా ఇందన వనరుల వినియోగంలో పొదుపు పాటించాలని జిల్లా ఇన్చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ విజ్ఞప్తి చేశారు. కలెక్టరేట్లో శుక్రవారం మాట్లాడుతూ రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్‌కు ఎలాంటి కొరతా లేదని, సోషల్ మీడియాలో వస్తున్న అవాస్తవాలను నమ్మి ప్రజలు ఆందోళనకు గురికావద్దన్నారు. రబీ ధాన్యం సేకరణలో రైతులకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. -
మంచి పాలన అంటే కూల్చడమేనా?
● ఉండిలో రఘురామ రాక్షసరాజ్యం ● సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ఉండి: ఉండి నియోజకవర్గంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు నేతృత్వంలో బుల్డోజర్, రాక్షస రాజ్యం నడుస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఆరోపించారు. ఉండి మండలం ఉణుదుర్రు, సాగుపాడు గ్రామాల్లో అధికారులు అక్రమంగా కూల్చివేసిన ఇళ్ల బాధితులను శుక్రవారం ఆయన పరామర్శించారు. నివాసాలు కోల్పోయి రోడ్డున పడ్డ మహిళల బాధలను అడిగి తెలుసుకున్నారు. మహిళలు కన్నీటి పర్యంతమవుతుంటే వారిని ఓదార్చారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. కొందరు భూస్వాముల స్వార్థం కోసం పోలీసుల అండతో 84 కుటుంబాలకు చెందిన 71 ఇళ్లను, ఆలయాలను తెల్లవారుజామున బుల్డోజర్లతో కూల్చి వేయడం అత్యంత దుర్మార్గమన్నారు. ఇంట్లోని సామాగ్రిని కూడా బయటకు తెచ్చుకోనివ్వకుండా అధికారులు నిరంకుశంగా వ్యవహరించారని మండిపడ్డారు. భూస్వాముల ఇళ్లు, గెస్ట్‌హౌస్‌లను వదిలేసి, పేదల ఇళ్లను మాత్రమే కూల్చడం వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు. బాధితులకు సీపీఎం తరపున తాత్కాలిక పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చారు. కూల్చివేతలకు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటే సరిపోదని, నివాసయోగ్యం కాని చోట సెంటున్నర భూమి ఇస్తే న్యాయం జరిగినట్టు కాదని హితవు పలికారు. ప్రభుత్వం ఎన్నికల వాగ్దానం ప్రకారం బాధితులకు 3 సెంట్ల భూమి, ఇల్లు కట్టుకోవడానికి రూ.5 లక్షల నగదు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉండి నియోజకవర్గంలో పేదలకు జరుగుతున్న అన్యాయంపై పెద్ద ఎత్తున పోరాడతామని అన్నారు. నియోజకవర్గంలో బుల్డోజర్, రఘురామ రాక్షస పాలన సాగనివ్వబోమని పేదల పక్షాన ఉద్యమిస్తామని అన్నారు. కలెక్టర్, ఎస్పీలు చట్టవిరుద్ధమైన చర్యలను చూస్తూ మౌనంగా ఉండటం దారుణమన్నారు. పేదలకు న్యాయం జరిగే వరకు సీపీఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. ఈ పర్యటనలో సీపీఎం జిల్లా కార్యదర్శి జేఎన్వీ గోపాలన్, వాసుదేవరావు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి జేఎన్వీ గోపాలన్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు వాసుదేవరావు, కర్రి నాగేశ్వరరావు, ధనికొండ శ్రీని వాస్, జుత్తిగ నర్సింహమూర్తి, జక్కంపూడి సత్యనారా యణ, కేవీపీ జిల్లా కార్యదర్శి క్రాంతి పాల్గొన్నారు. -
విభిన్న ప్రతిభావంతులకు ప్రత్యేక గ్రీవెన్స్
భీమవరం (ప్రకాశంచౌక్): విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకుని జీవితంలో ఆత్మవిశ్వాసంతో ముందుకు నడవాలని జిల్లా రెవెన్యూ అధికారి బి.శివన్నారాయణ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో విభిన్న ప్రతిభావంతుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి బి.శివన్నారాయణ రెడ్డి, విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు బి.రామ్ కుమార్, కలెక్టరేట్ పరిపాలన అధికారి ఎన్.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ప్రత్యేక పీజీఆర్ఎస్లో మొత్తం 22 అర్జీలు అందినట్లు డీఆర్వో పేర్కొన్నారు. పీజీఆర్ఎస్కు రావడానికి దివ్యాంగులు ఎదుర్కొనే ఇబ్బందులను దష్టిలో ఉంచుకుని సేవాభావంతో స్పందించి సమస్యలను వేగంగా పరిష్కరించాలని సూచించారు. -
విద్యుత్ ఎస్ఈకి వైఎస్సార్సీపీ లీగల్ నోటీసులు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): నగరంలోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయానికి ఎలాంటి ముందస్తు నోటీసూ ఇవ్వకుండా విద్యుత్ సర్వీసును తొలగించిన అంశంపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయడంలో విఫలమైన విద్యుత్ అధికారులకు వైఎస్సార్సీపీ లీగల్ సెల్ నాయకులు శుక్రవారం నోటీసులు జారీ చేశారు. నగరంలోని వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయానికి ఇటీవల విద్యుత్ సరఫరాను తొలగించారు. ముందస్తు నోటీసులూ ఇవ్వకుండా సర్వీసును తొలగించడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో వైఎస్సార్సీపీ నాయకులు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేసిన హైకోర్టు సదరు కార్యాలయానికి మూడు రోజుల్లోపు సర్వీసును పునరుద్ధరించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రతులను నాయకులు ఈనెల 12న ఈపీడీసీఎల్ ఎస్ఈ సాల్మన్‌రాజుకు కలిసి అందచేశారు. ఈ నెల 15 తేదీలోపు విద్యుత్ సర్వీసును పునరుద్ధరించాల్సిన అధికారులు ఆ పని చేయకుండా తిరిగి వైఎస్సార్సీపీ నాయకులకు నోటీసులు పంపి చేతులు దులుపుకునే ప్రయత్నం చేశారు. లీగల్ సెల్ నాయకులు కోర్టు ధిక్కరణ నోటీసులు అందచేశారు. ఉత్తర్వులను ధిక్కరించిన నేరానికి జరిమానా, ఇతర క్రమశిక్షణ చర్యలను ఎదుర్కోవలసి వస్తుందని సదరు నోటీసులో గుర్తు చేశారు. -
పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై ఆగ్రహం
కోకో ధర పెంచాలి అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన కోకో గింజల ధరకు అనుగుణంగా రైతుల కోకో గింజలకు ధర పెంచాలని కోకో రైతులు డిమాండ్ చేస్తున్నారు. 8లో uభీమవరం: కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలతో సరుకు రవాణా చార్జీలు పెరిగి నిత్యావసర వస్తువుల ధరల ఆకాశాన్నంటాయని, పేద, మధ్యతరగతి ప్రజల జీవనం దుర్భరంగా మారనుందని సీపీఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు ఆందోళన వ్యక్తం చేశారు. చమురు ధరల పెంపును నిరసిస్తూ శుక్రవారం సీపీఐ ఆధ్వర్యంలో భీమవరం బుధవారం మార్కెట్ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్బంగా భీమారావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వానికి ముందు చూపు కొరవడిన కారణంగానే దేశానికి ఈ దుస్థితి పట్టిందన్నారు. చిరకాల మిత్రదేశంగా ఉన్న ఇరాన్ పట్ల భారత్ వైఖరి దేశానికి నష్టం కలిగిస్తుందన్నారు. మోదీ స్వార్ధపూరిత నిర్వాకం కారణంగా దేశ ప్రజలు భారీ మూల్యం చెల్లించుకోవల్సి వస్తుందన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చెల్లబోయిన రంగారావు, ఎం సీతారామ్ ప్రసాద్, కిలారి మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
గూడెంపై ఏసీబీ డేగకన్ను
సాక్షి టాస్క్‌ఫోర్స్: తాడేపల్లిగూడెం నియోజకవర్గంపై ఏసీబీ డేగకన్ను వేసిందా? గురువారం నాటి ఏసీబీ దాడితో దాడులు ఆగుతాయా? ఇది ప్రస్తుతం నియోజకవర్గంలో జరుగుతున్న చర్చ. గత రెండేళ్లుగా నియోజకవర్గంలోని అధికారులు కొందరు అవినీతి విషయంలో చురుగ్గా ఉన్నట్టు విమర్శలున్నాయి. మున్సిపాలిటీలో సర్వేయర్ రౌతు రామకృష్ణ, తాజాగా గురువారం పట్టణ ఎస్ఐ నాగరాజు, బాలకృష్ణలపై ఏసీబీ దాడులతో రానున్న నెలల్లో మరిన్ని అవినీతి జలగలను పట్టే అవకాశాలున్నట్టు విస్తృతంగా చర్చ నడుస్తోంది. బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడటంలేదు. పౌరసరఫరాల శాఖ అధికారులు, విజిలెన్స్ అధికారులు దాడులు చేస్తున్నా, లారీల అక్రమ తరలింపునకు బ్రేక్ పడటంలేదు. మున్సిపాలిటీలో కొన్ని సంవత్సరాలుగా ప్రత్యేకాధికారుల పాలన సాగుతోంది. దీంతో వచ్చిన అధికారగణం ఇష్టారాజ్యం సాగుతోంది. అధికార కేంద్రాలను ప్రసన్నం చేసుకుంటే చాలు, ఇక్కడ మన రాజ్యమే అన్నట్టుగా వ్యవహారాలున్నట్టుగా ప్రచారం ఉంది. తాజాగా మున్సిపాలిటీలో సామాజిక జాడ్యం కూడా వేళ్లూనుకున్నట్టుగా సమాచారం. ఈ నేపథ్యంలో సుపీరియారిటీ కాంప్లెక్స్ పద్ధతిలో వర్గాలుగా అధికారులు విడిపోయినట్టుగా చెబుతున్నారు. దూకుడుగా ఏసీబీ అధికారులు నియోజకవర్గానికి సుపరిచితుడుగా ఉన్న పట్టణ సర్వేయర్ రామకృష్ణపై ఏసీబీ దాడి చేసినట్టు దాడి అనంతర పరిణామాలు తేటతెల్లం చేస్తున్నాయి. తాజాగా గురువారం పట్టణ ఎస్ఐ నాగరాజు, కానిస్టేబుల్ బాలకృష్ణల ఉదంతంలో అవినీతి కోణం కన్నా, వ్యక్తిగత ప్రాబల్యాల నేపథ్యంలో దాడి జరిగినట్టుగా తెలుస్తోంది. దాడులు ఇకపై కొనసాగవచ్చని, నియోజకవర్గంలో ఆరుగురు అవినీతి అధికారుల వివరాల సేకరణలో ఏసీబీ దూకుడుగా ఉన్నట్టుగా సమాచారం. నాగరాజుపై దాడి చేయడానికి గాను 72 గంటల పాటు ఏసీబీ అధికారులు గూడెంలో మకాం వేసి, రెడ్ హ్యాండెడ్‌గా ఎస్సైను, కానిస్టేబుల్‌ను పట్టుకున్నట్టుగా తెలుస్తోంది. పట్టణ పోలీస్ స్టేషన్ కొన్ని సంవత్సరాలుగా వార్తల్లో ఉంది. ఇక్కడ రాష్ట్రంలో ఒక పోలీసు ఉన్నతాధికారికి బంధువుగా ఉన్న సిబ్బంది ఒకరి నేతృత్వంలోనే వ్యవహారాలు సాగినట్టు కలరింగ్ ఇచ్చారు. అధికారుల బదిలీలు, చేర్పులు, మార్పుల నేపథ్యంలో ఒక వ్యక్తిని హోల్డ్‌లో ఉంచినట్టుగా తెలుస్తోంది. శ్రీచైతన్యశ్రీవంతుడైన వసూలుదారుడు ఒకరు ఇద్దరు అధికారులకు కలెక్షన్ ఏజెంట్‌గా వ్యవహరించినట్టుగా బాహాటంగానే చెబుతున్నారు. వాస్తవానికి గురువారం జరిగిన ఏసీబీ దాడిలో కలెక్షన్ ఏజెంట్ బుక్ కావాల్సి ఉండగా, ట్రాప్‌లో బాలకృష్ణ పడినట్టు సమాచారం. మున్సిపాలిటీలో సర్వేయర్‌ను ట్రాప్ చేసి వాయిస్ రికార్డింగ్ ఆధారంగా మాత్రమే అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు. తర్వాత కొందరి పోద్బలంతో జరిగిన ట్రాప్ అని తేలింది. తాజా ఉదంతంలో కూడా ప్రేమజంట వ్యవహారంలో ఎస్ఐ వాయిస్ రికార్డింగ్ క్రియాశీలక భూమిక పోషించినట్టుగా తెలుస్తోంది. పట్టణంలో ఒక వ్యాపారికి సంబంధించి కుటుంబ వ్యవహారంలో వరకట్న వేధింపుల కేసును కాస్తా, హత్యాయత్నం కేసుగా నమోదు చేయించేందుకు గాను ఒక ప్రజాసంఘ నేత ద్వారా పట్టణ పోలీసులు కొందరితో సంప్రదింపులు సాగించినట్టుగా తెలుస్తోంది. హిట్ జాబితాలో ఆరుగురు అధికారులునియోజకవర్గంలో ఒక రెవెన్యూ అధికారి అక్రమ రేషన్ వ్యవహారంలో చురుగ్గా ఉన్నట్టు, ఈ క్రమంలో ఫొటోగ్రాఫర్ నేనున్నా, ఎవ్వరు నిన్ను టచ్ చేస్తారో నే చూసుకుంటా అనే భరోసా ఇచ్చినట్లు సమాచారం. వారసత్వపు ఆస్తులు, మాస్టర్ప్లాన్లు, టీడీఆర్ బాండ్లు వంటి విషయాలలో ముగ్గురు మున్సిపాలిటీ అధికారుల వ్యవహార శైలి, తదనంతర వ్యవహారాలపై ఏసీబీకి సమాచారం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఒకరు సామాజిక కార్డు బలంతో నెట్టుకొస్తున్నట్టు ప్రచారం ఉంది. ఇంకొకరు సైలెంట్‌గా వ్యవహారాలు జరపడంలో నిష్ణాతుడంటున్నారు. ఇలాంటి ఆరుగురు వ్యక్తులకు చెందిన సమాచార సేకరణలో ఏసీబీ అధికారులు ఉన్నట్టుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. -
సేంద్రియ వ్యవసాయ పద్ధతులు ఎంతో మేలు
చింతలపూడి: ప్రస్తుత రోజుల్లో రైతులు తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ పంటను పండించడానికి విచక్షణారహితంగా రసాయన ఎరువులు వాడుతున్నారు. ఫలితంగా భూముల్లో పంటలకు కావలసిన పోషకాలు అందుబాటులో లేక సమతుల్యత లోపించి ముందెన్నడూ లేని విధంగా ద్వితీయ సూక్ష్మ పోషక లోపాలు పంటల్లో కనిపిస్తుంది. ఈ పోషకాలు లోపించినప్పుడు సాగులో మిగతా యాజమాన్య పద్ధతులన్నీ సక్రమంగా పాటించకపోయినా దిగుబడులు తగ్గుతాయి. వీటిని అధిగమించడానికి సేంద్రియ వ్యవసాయ పద్ధతులు మేలని వ్యవసాయ సహాయ సంచాలకులు వై.సుబ్బారావు సూచిస్తున్నారు. చింతలపూడి సబ్‌డివిజన్ పరిధిలో ఏటా ఖరీఫ్ సీజన్లో 35,542 ఎకరాల్లో వరి పంటను సాగు చేస్తుంటారు. ఇవి కాక 340 ఎకరాల్లో మొక్కజొన్న, 157 ఎకరాల్లో వేరుశనగ పంటలు పండిస్తారు. రబీ సీజన్లో సుమారు 1,500 హెక్టారుల్లో వరి, 18,000 హెక్టారుల్లో మొక్కజొన్న, 2, 500 హెక్టారుల్లో వేరుశెనగ పంటలను రైతులు సాగు చేస్తుంటారు. ఎరువుగా జిప్సం జిప్సంలో 24 శాతం కాల్షియం, 18 శాతం గంధకం ఉంటుంది. కాల్షియం, గంధకం మొక్కల పెరుగుదలకు అవసరమైన ద్వితీయ శ్రేణి పోషకాలను అత్యంత చౌకగా జిప్సం ద్వార అందించవచ్చు. ముఖ్యంగా నూనె గింజలు, పప్పు ధాన్యాల వంటి పంటల్లో గంధకం ఆవశ్యకత అధికంగా ఉంటుంది. కాల్షియం మొక్కల్లోని జీవకణాల అంచులు గట్టిగా ఉండటానికి, కణ విభజనకు, వేర్ల అభివద్ధికి గింజకట్టడానికి అవసరమవుతుంది. దీని వల్ల మొక్కలకు చీడపీడలను ఎదుర్కొనే శక్తి సమకూరుతుంది. వేరుశనగలో ఇలా వేరుశనగ పంటలో అధిక దిగుబడులకు జిప్సంను పూత దశలో వేసుకుని భూముల్లో కలియ బెట్టడం వల్ల వేరుశనగ ఊడలు జిప్సంలోని కాల్షియం, గంధకాన్ని తీసుకుని అధిక దిగుబడులు వస్తాయి. వేరుశెనగలో జిప్సం వినియోగం వల్ల కాయలు గట్టిగా ఉండి కాయ నిండా పప్పు వద్ధి చెంది గింజల్లో అధిక నూనె శాతం కలిగి ఉంటుంది. ఫలితంగా కాయలు అధిక బరువు కలిగి మంచి ధర పలుకుతాయి. కాబట్టి పూత సమయంలో ఎకరాకు 200 కిలోల చొప్పున భూమిలో తగిన తేమ ఉన్నప్పుడు మొక్కలకు దగ్గరగా వేసుకోవాలి. బీడు ,చౌడు భూముల్లో నీరు సరిగా ఇంకదు. గాలి ప్రసరణ తక్కువగా ఉంటుంది. భూమి భౌతిక లక్షణాలు క్షీణించి ఉంటాయి. ఈ పరిస్థితుల్లో మొక్కల వేర్లు సరిగా వద్ధి చెందక మొక్కల్లో ఎదుగుదల ఉండదు. ఇలాంటి భూముల్లో జిప్సం వినియోగంవల్ల నేల గుల్లబారి భూమిలో నీరు ఇంకే స్వభావం పెరిగి మొక్కల వేర్లు బాగా వృద్ధి చెందుతాయి. పంట దిగుబడి గణనీయంగా పెరుగుతుంది. – వై సుబ్బారావు, చింతలపూడి వ్యవసాయ సబ్‌డివిజన్ ఏడీఏ పాడి–పంట -
యథేచ్ఛగా మట్టి తవ్వకాలు
పెంటపాడు: మండలంలో పలు ప్రాంతాలలో మట్టి మాఫియా ఊపందుకొంది. కాగా ఇదే అదనులో బి.కొండేపాడుకు చెందిన టీడీపీ నాయకునిడిగా చెప్పుకునే ఒక వ్యక్తి ఓల్డ్ వయ్యేరుకు ఆనుకొని ఉన్న పొలం నుంచి సమీపంలో ఉండే మరో ఈనాం భూమిగా పిలిచే సుమారు 25 సెంట్లను ట్రాక్టర్లతో హడావుడిగా పూడ్చుతున్నాడు. ఈ సమాచారం అందుకున్న గ్రామ వీఆర్ఓ పద్మ, సివిల్ సప్లయిస్ డీటీ శ్రీనివాస్, వీఆర్ఏ రాజు తదితరులు మట్టి తవ్వకాలను అడ్డుకున్నారు. అనుమతి లేకుండా మట్టి తవ్వకం చేసినా, అనుమతులు లేని భూములు పూడ్చినా చర్యలు తప్పవని హెచ్చరించారు. జంగారెడ్డిగూడెం: స్థానిక గోకుల తిరుమల పారిజాతగిరి వెంకటేశ్వర స్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఏడో రోజు శుక్రవారం స్వామివారికి పంచామృత అభిషేకం, ఉదయం ఎనిమిది గంటల నుంచి నవకల స్నపనం, అనంతరం స్వామివారికి విశేష అలంకరణ చేశారు. ఆలయ అర్చకులు నల్లూరి రవికుమార్ ఆచార్యులు మాట్లాడుతూ స్వామి వారికి 12సార్లు పూలతో అర్చన, 12 రకాల ప్రసాదాలతో నివేదన చేశామన్నారు. దాతలు వెంకటేశ్వర ఎడ్యుకేషన్ సొసైటీ విద్యాసంస్థలవారు, వెలివేటి సత్య వెంకట సూర్య రామకృష్ణ దంపతులు, శ్రీ దత్త సర్వాణి దంపతులు, జమ్మి గంగరాజు, దివంగత ముదుపాక సింగరాజు కుటుంబ సభ్యులను అర్చకులు స్వామివారి వేద ఆశీస్సులు, శేషవస్త్రాలు, ప్రసాదాలతో సన్మానించారని ఈఓ కలగర శ్రీనివాస్ తెలిపారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ అల్లూరి రామకృష్ణ, పెనుమర్తి రామకుమార్, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
కోకో గింజల ధర పెంచాలి
దెందులూరు: అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన కోకో గింజల ధరకు అనుగుణంగా రైతుల కోకో గింజలకు ధర పెంచాలని, విదేశీ కోకో గింజల దిగుమతులు వెంటనే నిలుపుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శుక్రవారం పెదవేగి మండలం విజయరాయి గాంధీనగర్ సీతారామ కల్యాణమండపంలో ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం ఆధ్వర్యంలో కోకో రైతుల సమావేశం నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు బొల్లు రామకృష్ణ అధ్యక్షత నిర్వహించిన సమావేశంలో కోకో రైతుల సమస్యలపై చర్చించి పలు తీర్మానాలు ఆమోదించారు. ఈ సందర్భంగా కె.శ్రీనివాస్ మాట్లాడుతూ అన్‌సీజన్ వర్షాకాలపు గింజలకు కిలోకు రూ.350 ధర ఇచ్చి కంపెనీలు కొనుగోలు చేశాయని, అత్యంత నాణ్యత కలిగిన సీజన్ గింజలకు ప్రస్తుతం కంపెనీలు కిలోకు రూ.300 మాత్రమే ధర ఇస్తున్నాయని చెప్పారు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్ ధర ప్రకారం కిలో గింజలకు రూ.400 ఉందని, దిగుమతి సుంకాలతో అధర రూ.600 పైగా ఉంటుందని చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్ ధర తగ్గినప్పుడు కోకో గింజలకు ధర తగ్గించిన కంపెనీలు పెరిగినప్పుడు ఎందుకు పెంచడం లేదు? అని ప్రశ్నించారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఏమీ మాట్లాడకపోవడం అన్యాయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కోకో రైతుల సంఘం, కోకో రైతులు, ఆయా కంపెనీల ప్రతినిధులతో జాయింట్ సమావేశం వెంటనే జరిపి అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా కోకో గింజలకు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పానుగంటి అచ్యుతరామయ్య (అశోక్), రాష్ట్ర సహాయ కార్యదర్శి గుదిబండి వీరారెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు కోనేరు సతీష్ బాబు,కూసం రామిరెడ్డి, ఆలపాటి శ్రీనివాసరావు, ప్రాంతీయ కొబ్బరి రైతుల సంఘం ఉపాధ్యక్షుడు మున్నంగి సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘ఆక్వా సంక్షోభానికి చంద్రబాబే కారణం’
సాక్షి, నరసాపురం: ఆక్వా సిండికేట్ చేతుల్లో కూటమి ప్రభుత్వం బందీ అయిపోయిందని, అప్సడాతో సంబంధం లేకుండా ఫీడ్ సిండికేట్ ధరలు పెంచేస్తుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోవడానికి కారణం కూడా సిండికేట్ ముఠాను నడిపించేది చంద్రబాబు బంధువుల కావడం వల్లనే అని పశ్చిమ గోదావరి జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు ఆరోపించారు.నరసాపురం వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే పెరిగిన విద్యుత్, డీజిల్ ధరలతో రైతులు అల్లాడిపోతుంటే కొత్తగా ఫీడు ధరలు పెంచి, 100 కౌంట్ రొయ్యల ధరలను ఏకంగా రూ.25 తగ్గిస్తే రైతులు బతికేదెలా అని ప్రశ్నించారు. ఎన్నికలప్పుడు ప్రతి ఎకరాకి సబ్సిడీ కరెంట్ ఇస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు, రెండేళ్లలో ఒక్క సబ్సిడీ కనెక్సన్ ఇవ్వలేదని స్పష్టం చేశారు. 100 కౌంట్ రూ.250 పలుకుతుంటే, దానికి రైతుకి రూ.350 ఖర్చవుతోందని, చంద్రబాబు చర్యల కారణంగా రైతులు క్రాప్ హాలిడే ప్రకటించే దుస్థితి దాపురించిందని మండిపడ్డారు.సిండికేట్ ముఠాకి లబ్ధి చేకూర్చాలని ఉద్దేశపూర్వకంగానే మంత్రి అచ్చెన్నాయుడు అప్సడా సమావేశానికి డుమ్మా కొట్టాడని, మంత్రి ఆదేశాలను కూడా లెక్క చేయకుండా పెంచిన ధరలకే ఫీడు అమ్మకాలు సాగిస్తున్నారని స్పష్టం చేశారు. ఫీడు వ్యాపారులు డీలర్లకు అవసరమైన మేర ఫీడు ఇవ్వకుండా కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఆక్వా రైతుపై ఒక్క రూపాయి భారం పడినా ఊరుకునేది లేదని, కాదని మొండిగా ముందుకెళితే రైతుల తరఫున వైఎస్సార్సీపీ ఉద్యమిస్తుందని మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు హెచ్చరించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే...అప్సడాతో సంబంధం లేకుండా ఎలా పెంచుతారు?:కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఫీడ్, సీడ్ ధరలు పెరిగిపోయి ఆక్వా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆక్వా సిండికేట్ చేతుల్లో ఈ ప్రభుత్వం బందీ అయిపోయింది. వారే ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. ఆక్వా రైతుల ఇబ్బందులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. గత ఫిబ్రవరిలోనే ఫీడు ధరలు టన్నుకు రూ.4 వేలు పెంచగా, ఇప్పుడు మళ్లీ మరో రూ.12 వేలు పెంచేశారు. ఫీడ్, సీడ్ రేట్లు పెంచాలన్నా, తగ్గించాలన్నా వైఎస్సార్సీపీ హయాంలో అప్సడా ద్వారానే జరిగేది. గత ఐదేళ్ల వైయస్సార్సీపీ పాలనలో అప్సడాలో రైతులు, ఎగుమతుదారులు, ప్రభుత్వం, పీడు యాజమాన్యం సభ్యులుగా ఉండి సమిష్టి నిర్ణయం తీసుకునేవారు. కానీ నేడు సిండికేట్ ముఠా అప్సడాతో సంబంధం లేకుండా ప్రభుత్వాన్నే తమ చెప్పుచేతల్లో పెట్టుకొంది. ఫీడు ధరల నియంత్రణపై ప్రభుత్వ అజమాయిషీ కరువైంది.ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం సిండికేట్ ముఠాకి పెత్తనం అప్పగించేసింది. కాబట్టే నిన్న (శుక్రవారం) జరిగిన సమావేశానికి మంత్రి అచ్చెన్నాయుడు గైర్జాజరయ్యారు. ఫీడు ధరలను ప్రభుత్వం పెంచిందా, తగ్గించిందా తెలియని పరిస్థితి నెలకొంది. ఫీడ్ వ్యాపారులు మాత్రం పెంచిన ధరలకే అమ్మకాలు చేస్తున్నారు. సరిపోయినంత ఫీడు డీలర్లకు ఇవ్వకుండా కృతిమ కొరత సృష్టిస్తున్నారు. దీంతో పంట చేతికొచ్చే సమయంలో ఫీడు అందకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.100 కౌంట్ ధర రూ.25 తగ్గించేశారు:గత వైఎస్సార్సీపీ హయాంలో వైయస్సార్సీపీ హయాంలో రూ.3,800 కోట్ల మేర ఆక్వా రైతులకు సహకారం అందించడం జరిగింది. ఫీడు ధరలు మూడుసార్లు పెంచితే ప్రభుత్వం జోక్యం చేసుకుని తగ్గించడం జరిగింది. కానీ నేడు సీఎం చంద్రబాబు నుంచి కూటమి నాయకులు ఎవరూ రైతుల పక్షాన ఉండటం లేదు. ఫీడు వ్యాపారులే ఎగుమతుదారులుగా కూడా వ్యవహరిస్తూ మొన్నటి వరకు రూ.275 వరకు ఉన్న 100 కౌంట్ ధరను ఇప్పుడు ఏకంగా రూ.25 తగ్గించేశారు. రాబోయే రెండు మూడు రోజుల్లో మరో రూ.10 తగ్గిస్తున్నారని ప్రచారం జరుగుతోంది.ఎక్స్‌పోర్టర్స్ మీటింగ్ పెట్టుకుంటే చాలు ధరలు తగ్గిపోతాయన్న భయం ఆక్వా రైతుల్లో కనిపిస్తోంది. ఒకపక్క ఫీడు ధరలు పెంచుతూ ఇంకోపక్క కౌంట్ ధరలు తగ్గిస్తూ ఆక్వా రైతుల పొట్టకొడుతున్నారు. గతంలో ఎప్పుడైనా ఫీడు ధరలు పెరిగితే వైయస్ జగన్ లంచాలు వెళ్లాయని ప్రచారం చేసేవారు. ఇప్పుడు లోకేష్ ఎంత లంచం తీసుకున్నాడో కూటమి నాయకులు చెప్పాలి. ఫీడు యాజమాన్యాలు చంద్రబాబుకి బంధువులు కాబట్టే వారి లబ్ధి కోసం రైతులను గాలికొదిలేశారు.చంద్రబాబు బంధువులదే సిండికేట్ ముఠా:ఆక్వా ఇండస్ట్రీస్‌కి సబ్సిడీ ధరకు కరెంట్ అందిస్తే రైతులకు మేలు జరుగుతుందని తెలిసినా ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మోడీతో మాట్లాడి ఫిష్ మీల్ ఇతర దేశాలకు ఎగుమతులు కాకుండా స్థానికంగా ఉపయోగపడేలా ఒప్పించాలి. అంతేకానీ రైతులు నిండా మునిగిపోతుంటే ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఎక్స్పోర్టర్కి, సీడు, ఫీడు యాజమాన్యంపై భారం పడితే అంతిమంగా ఆ నష్టం ఆక్వా రైతు మీదే పడుతోంది.సిండికేట్ నాయకులు చంద్రబాబుకి బంధువులు, తెలుగుదేశం పార్టీ నాయకులు కాబట్టి వారికి కొమ్ముకాస్తూ వైయస్ జగన్ గారు ఆక్వా రైతుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన అప్సడా చట్టానికి తిలోదకాలిస్తున్నారు. ముడి సరుకు ధరలు పెరిగినప్పుడు ఫీడు ధరలు పెంచుకుంటూ పోతున్నారు. కానీ సోయా ధర తగ్గినప్పుడు ఒక్కసారి కూడా ఫీడు ధరలు తగ్గించిన పాపానపోలేదు. మొత్తం మీద ఆక్వా సంక్షోభానికి సీఎం చంద్రబాబే కారణం అవుతున్నారు. అప్సడా ద్వారా వైయస్సార్సీపీ హయాంలో ఒక్క రూపాయి కూడా సీడు, ఫీడు ధరలు పెంచకుండా రైతులను ఆదుకోవడం జరిగింది.కొత్తగా ఒక్క కనెక్షన్ కి సబ్సిడీ విద్యుత్ ఇవ్వలేదు:వైఎస్సార్సీపీ హయాంలో 55 వేల కనెక్షన్లకు సబ్సిడీ ధరకు కరెంట్ ఇచ్చి ఆక్వా రైతులను ప్రోత్సహించడం జరిగింది. చంద్రబాబు మాత్రం ఎన్నికల సందర్భంగా ఆక్వా జోన్, నాన్ ఆక్వాజోన్‌తో సంబంధం లేకుండా అందరికీ సబ్సిడీ ధరకు కరెంట్ ఇస్తానని చెప్పి కొత్తగా ఒక్క కనెక్షన్ కూడా ఇవ్వలేదు. సిండికేట్ ముఠా ప్రభుత్వానికి తెలియకుండా ఫీడు ధరలు పది రూపాయలు పెంచింది. రేపు రూ.5 లు తగ్గించి, అది కూడా ఘనతగా ప్రభుత్వం ప్రచారం చేసుకోవాలని అనుకుంటోంది. అందుకే రొయ్యల రైతులను చిన్నచూపు చూస్తే ఊరుకునేది లేదని, రైతులపై ఒక్క రూపాయి భారం పడినా సహించబోమని, కాదని మొండిగా వ్యవహరిస్తే ఆక్వా రైతుల పక్షాన పార్టీ తరపున ప్రభుత్వాన్ని నిలదీస్తామని ముదునూరి ప్రసాదరాజు హెచ్చరించారు. -
పాలకవర్గ సమావేశం నిర్వహించాలి
ప్రతి మూడు నెలలకు ఒకసారి జరగాల్సిన ఐటీడీఏ పాలకవర్గ సమావేశం రెండున్న సంవత్సరాలుగా జరగకపోవడం బాధాకరం. కూటమి ప్రభుత్వం గిరిజన సమస్యలను పూర్తిగా గాలికి వదిలేసింది. అనేక సమస్యలతో గిరిజన గ్రామాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. – తెల్లం బాలరాజు, పోలవరం మాజీ ఎమ్మెల్యే గ్రామ స్థాయిలో గిరిజనులు ఎదుర్కొనే అన్ని సమస్యలను సభ్యులందరూ ఐటీడీఏ పాలకవర్గం దృష్టికి తీసుకువస్తారు. రెండున్నరేళ్లుగా సమావేశం జరగకపోవడం వల్ల గిరిజనులకు అన్యాయం జరుగుతుంది. ఇప్పటికై నా అధికారులు, ప్రభుత్వ పాలకులు స్పందించి చర్యలు తీసుకోవాలి – సరియం రామ్మోహన్రావు, ఏఐటీఎఫ్ జాతీయ కన్వీనర్, బుట్టాయగూడెం -
ఉచిత న్యాయ సహాయం
ఏలూరు (టూటౌన్): అవసరమైన వారికి ఉచిత న్యాయ సహాయం అందజేయనున్నట్లు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి యన్.శ్రీలక్ష్మి తెలిపారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి వారి ఆదేశాల ప్రకారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి యన్.శ్రీలక్ష్మి శనివారపుపేటలోని ప్రభుత్వ బాలుర వసతి గృహాన్ని, శ్రీరామనగర్ ఆరవరోడ్డులోని సైనిక వెల్ఫేరు ఆఫీసు నందు ఉన్న లీగల్ ఎయిడ్ క్లినిక్‌ను, జిల్లా కారాగారాన్ని గురువారం సందర్శించారు. శనివారపుపేటలోని బాలుర వసతి గృహంలో బాలలకు అందిస్తున్న ఆహార పదార్థాల నాణ్యత, మంచినీటి సౌకర్యం, పరిసరాల పరిశుభ్రతను పరిశీలించారు. అలాగే అబ్జర్వేషన్ హోమ్‌లోని బాలలకు ఉచిత న్యాయ సహాయంపై అవగాహన కల్పించారు. తదనంతరం శ్రీరామనగర్ 6వ రోడ్డులోని సైనిక సంక్షేమ కార్యాలయము నందు ఏర్పాటు చేసిన లీగల్ ఎయిడ్ క్లినికల్‌ను సందర్శించి, క్లినిక్ పనితీరు మాజీ సైనికులకు అందుతున్న న్యాయ సహాయంపై అడిగి తెలుసుకున్నారు. అలాగే జిల్లా కారాగారంలోని ఖైదీలకు అందుతున్న సౌకర్యాలపై అడిగి తెలుసుకున్నారు కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
ఫార్మర్ యాప్ రైతులకు వరం
కై కలూరు: వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానానికి ఫార్మర్ యాప్ ఒక నిదర్శనమని, ఇది రైతుల పాలిట వరంగా భావించాలని వ్యవసాయ శాఖ జిల్లా జాయింట్ డైరెక్టర్ షేక్ హబీబ్ బాషా చెప్పారు. మండలంలోని తామరకొల్లు, ముదినేపల్లి మండలం పెయ్యేరు గ్రామాల్లో ఫార్మర్ యాప్ ఉపయోగాలపై రైతులకు గురువారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్మార్ట్ ఫోన్లో గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఫార్మర్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. రైతులు తమ సాగు విస్తీర్ణం, వ్యవసాయ యాంత్రీకరణ, మార్కెట్ ధరలు ఎరువుల లభ్యత, పంట నష్టాలు, చీడపీడలపై అవగాహన, వ్యవసాయంపై సూచనలు సలహాలు ఇచ్చే ఏఐ అగ్రనమిస్ట్ వంటి సదుపాయాలు ఈ యాప్‌లో ఉన్నాయన్నారు. డౌన్లోడ్ చేసుకున్న రైతులందరూ కూడా ప్రతిరోజు యాప్‌లో లాగిన్ అయ్యి యాప్ ద్వారా అందే సమాచారాన్ని తెలుసుకుని ముందస్తుగా సాగు ప్రణాళికలు రూపొందించుకోవచ్చన్నారు. సాగు ఖర్చులు తగ్గించుకుని అధిక దిగుబడులు పొందవచ్చని సూచించారు. కార్యక్రమంలో కై కలూరు ఇన్చార్జి ఏడీఏ ఎం.శ్రీనివాస్‌కుమార్, కై కలూరు, ముదినేపల్లి మండలాల వ్యవసాయధికారులు ఆర్.దివ్య, వేణుమాధవ్, వీఏఏ చింతా బింద తదితరులు పాల్గొన్నారు. -
రొయ్య మేత.. రైతుకు వ్యథ
వేసవి తాపం.. చేపకు శాపం ఆక్వా రంగం సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఎండలు ఎక్కువగా ఉండడంతో చెరువుల్లో చేపలను రక్షించేందుకు ఆక్వా రైతులు నానా పాట్లు పడుతున్నారు. 8లో uశురకవారం శ్రీ 15 శ్రీ మే శ్రీ 2026భీమవరం: దేశానికి విదేశీమారక ద్రవ్యం తెచ్చిపెడుతున్న ఆక్వా రంగంపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. కంపెనీ యజమానులు ఆక్వా ఫీడ్ ధరలు దారుణంగా పెంచడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నా ప్రభుత్వం కంటితుడుపు చర్యలు తీసుకోవడంపై రైతులు మండిపడుతున్నారు. ఒక పక్క ఆక్వా ఫీడ్ ధరలు భగ్గుమంటున్నాయని గగ్గోలు పెడుతుంటే.. ధరల పెంపును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడాన్ని రైతులు తీవ్రంగా తప్పపడుతున్నారు. ఇప్పటికే మొన్నటివరకు విద్యుత్ కోతలు, డీజిల్ కొరతతో ఇబ్బందులు పడుతున్న రైతులకు మూలిగేనక్కపై తాడిపండు పడినట్లు ఒక్కసారిగా క్వింటాళ్ల రొయ్యల మేతను రూ.16 వేలు పెంచేశారు. దీనిని పూర్తిగా అడ్డుకోవాల్సిన ప్రభుత్వం కంపెనీ యజమానులతో మాట్లాడతామంటూ చేస్తున్న సన్నాయినొక్కులు ఎవరి కోసమంటూ ప్రశ్నిస్తున్నారు. 1.30 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు వ్యవసాయమే జీవనాధరమైన జిల్లాలో గత కొన్నేళ్లుగా రొయ్యలు, చేపల సాగుతో ఇక్కడి జీవన పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఆక్వా సాగు రైతులు, కార్మికులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తుండగా లక్షలాది మంది దీనిపై ఆధారపడి జీవిస్తున్నారు. జిల్లాలోని 20 మండలాల పరిధిలో ముందుగా తీరప్రాంతమైన నరసాపురం, భీమవరం నియోజకవర్గాల పరిధిలో ప్రారంభమైన రొయ్యలు, చేపల సాగు ప్రస్తుతం అన్ని నియోజకవర్గాలకు విస్తరించింది. దాదాపు 1.30 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు చేస్తుండగా దానిలో సుమారు 90 వేల ఎకరాల్లో రొయ్యల సాగే. ప్రతి ఏటా మూడు పంటలు పండిస్తున్న రొయ్యల రైతులకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయ, సహకారాలు లభించకపోవడంతో క్రాప్ హాలీడే ప్రకటించాలనే నిర్ణయానికి వస్తున్నారు. పెట్టుబడి ఖర్చులు భారీగా పెరగడం, ఽరొయ్యల ధరలు నిలకడగా లేకపోవడంతో రైతులు నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. 2024 ఎన్నికల సమయంలో రైతులందరికీ ఆక్వా జోన్‌తో సంబంధం లేకుండా యూనిట్ విద్యుత్ రూ.1.50 ఇస్తామని ప్రకటించిన కూటమి నాయకులు అందలమెక్కి రెండేళ్లు కావస్తున్నా సబ్సిడీ విద్యుత్ మాట ఎత్తకపోవడం పట్ల మండిపడుతున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ హయాంలో అప్సడా ఏర్పాటుచేసి రొయ్యల ధరలు నిలకడ, ఫీడ్, సీడ్ ధరలపై నియంత్రణ ఏర్పాటుచేసి రైతులకు అండగా నిలవగా నేటి చంద్రబాబు ప్రభుత్వం ఆక్వా రైతులను పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. ఫీడ్ ధరల పెంపుతో రైతులపై దాదాపుగా రూ.400 కోట్లు భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఽఫీడ్ ధరల పెంపుతో ఆందోళన బాట పట్టడానికి రైతులు సంసిద్ధం అవుతుండగా వారికి వైఎస్సార్సీపీ పూర్తి మద్దతు ప్రకటిస్తోంది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండేళ్ల కాలంలో రొయ్యల మేత ధర టన్నుకు దాదాపు రూ.40 వేలు పెరిగినట్లు రైతులు చెబుతున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో టన్ను ఫీడ్ ధర రూ.70 వేలు నుంచి రూ.80 వేలు ఉంటే, నేడు టన్ను రూ.1.22 లక్షల వరకు పెరిగిందని, అయితే రొయ్యల ధర మాత్రం 100 కౌంట్ రూ.240 కంటే తక్కువగానే ఉంటుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండు నెలల్లోనే టన్ను రొయ్యల మేత దాదాపు రూ.16 వేలు పెరగడంతో ఆందోళన చెందుతున్న రైతులకు పూర్తిస్థాయిలో ఊరట కలిగించకపోగా తాత్కాలిక తగ్గింపు అంటూ వ్యవసాయశాఖామంతి అచ్చెన్నాయుడు ప్రకటించడాన్ని తీవ్రంగా మండిపడుతున్నారు. రొయ్యల మేత తయారీ ముడిసరుకు ధరలు పెరగకపోయినా ఫీడ్ ధరలు పెంచడాన్ని ప్రభుత్వం సమర్థించడం దారుణమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆక్వా ఫీడ్ ధరలపై ఆందోళన ధరల తాత్కాలిక తగ్గింపుపై మండిపాటు పెంచిన ధరలు తగ్గించాలంటూ డిమాండ్ రెండేళ్లలో టన్నుకు దాదాపు రూ.40 వేలు పెంపు రొయ్యల ధరలు మాత్రం 100 కౌంట్ రూ.240 లోపే జిల్లాలో 1.30 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు పెరిగిన ఫీడ్ ధరతో రైతులపై రూ.400 కోట్ల భారం రైతులకు అండగా వైఎస్సార్సీపీ పోరుబాటకు సిద్ధం -
యథేచ్ఛగా మట్టి తవ్వకాలు
వీరవాసరం మండలంలో మట్టి తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. పన్నులను కట్టకుండానే అధికారులను మచ్చిక చేసుకుని మట్టి తవ్వకాలు కొనసాగిస్తున్నారు. 8లో uదేశానికి విదేశీమారక ద్రవ్యం తెచ్చిపెడుతున్న ఆక్వా రంగంపై ప్రభుత్వం చిన్నచూపు చూడడం దారుణం. ఆక్వా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఒక్కసారిగా ఫీడ్ ధరలు టన్నుకు రూ.16 వేలు పెంచేశారు. ఫీడ్ తయారీ ముడిసరుకు ధరలు తగ్గిన సమయంలో ఫీడ్ ధరలు తగ్గాల్సి ఉండగా మరింత పెంచారు. ప్రభుత్వం చర్యలు తీసుకుని వెంటనే పెంచిన ధరలు పూర్తిగా తగ్గించాలి. – గాదిరాజు వెంకట సుబ్బరాజు (కేజీఎఫ్), వెస్ట్‌గోదావరి ప్రాన్ ఫార్మర్స్ వెల్ఫేర్ ఫెడరేషన్ కార్యదర్శి, భీమవరం ఆక్వా ఫీడ్ ధరలు దారుణంగా పెంచారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా పెంచిన ధరలను పూర్తిగా తగ్గించాలి. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడం, ధరల్లో నిలకడ లేకపోవడంతో ఇప్పటికే రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రభుత్వం పూర్తిగా రైతులకు అండగా ఉండాల్సిన తరుణంలో ఫీడ్ ధరలు భారీగా పెంచడం దారుణం. పెంచిన ధరలను పూర్తిగా తగ్గించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. – భోగిరెడ్డి శ్రీనివాసరావు, ఆక్వా రైతు, తోలేరు, వీరవాసరం మండలం -
కలుషిత బజ్జీల సంఘటనపై అధికారుల దర్యాప్తు
గణపవరం: మండలంలోని కొందేపాడు గ్రామంలో నిల్వ మైదాపిండితో చేసిన బజ్జీలు తిని 13 మంది తీవ్ర అస్వస్థతకు గురైన సంఘటనకు సంబంధించి అధికారుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతుంది. గురువారం రాష్ట్ర ఫోరెన్సిక్ సహాయ సంచాలకులు శ్రీనివాస్, గణపవరం సిఐ నక్కారజనీకుమార్ వైద్య శాఖ అధికారులు కొందేపాడుగ్రామంలో బజ్జీలు వేసిన ఇంటిని పరిశీలించారు. వంట గదిలో మైదాపిండిని, నూనె తదితర వస్తువులను వారు పరిశీలించి శాంపిల్స్ సేకరించారు. ఘటనుకు గల కారణాలు తెలుసుకునే పనిలో వారు నిమగ్నమయ్యారు. కొందేపాడు గ్రామంలో బుధవారం చేపల చెరువు వద్ద గోదాములో నిల్వ ఉన్న మైదా పిండిని చెరువు వద్ద పనిచేసే మిరియాల మణికంఠ అనే వ్యక్తి తెచ్చి తమ సమీపబంధువైన ముఖమట్ల కనకదుర్గకు ఇవ్వడం, ఆమె ఆ మైదా పిండితో వేసిన బజ్జీలు కుటుంబసభ్యులతోపాటు ఇరుగు పొరుగువారికి ఇవ్వడం, అవి తిన్న 13 మంది వాంతులతో తీవ్ర అస్వస్థతకు గురై వివిధ ఆస్పత్రులలో చికిత్స పొందడం తెలిసిందే. అయితే ఒకరిద్దరు తప్ప మిగిలిన బాధితులంతా కోలుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆ ఇద్దరి పరిస్థితి కూడా మెరుగుపడుతున్నట్లు వైద్యులు ధ్రువీకరించారు. గ్రామంలో పిప్పర పీహెచ్సీ వైద్యాధికారులు కె.ప్రియాంక, రియోలతో పాటు ప్రథమ చికిత్స శిబిరం నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పటివరకూ కొత్త కేసులు ఏమీ లేవని వైద్యాధికారులు తెలిపారు. మరో 24 గంటల పాటు గ్రామంలోనే ఉండి పరిస్థితిని పరిశీలిస్తామని వారు తెలిపారు. -
యథేచ్ఛగా మట్టి తవ్వకాలు
వీరవాసరం : మండలంలో మట్టి తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. మండలంలోని మత్స్యపురి, బొబ్బనపల్లి, కొణితివాడ తదితర గ్రామాల్లో మట్టి తవ్వకాలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. వరి చేలలో మట్టిని తరలించుకోవాలంటే సీనరీజ్ను అందజేసి రెవెన్యూ అధికారులకు తెలియజేయాలి. ప్రభుత్వ అనుమతులు తీసుకుని మట్టిని తవ్వుకొని పనులు పూర్తి చేసుకోవాలి. అయితే అలాంటి పనులేమీ కట్టకుండానే సీనరీజిల్ని పన్నులను కట్టకుండానే స్థానిక గ్రామ రెవెన్యూ అధికారులను, రెవెన్యూ సిబ్బందిని మచ్చిక చేసుకుని మట్టి తవ్వకాలను పెద్ద ఎత్తున కొనసాగిస్తున్నారు. మట్టి ట్రాక్టర్లపై ఎలాంటి బరకాలను కప్పకపోవడంతో ఆ మట్టి రోడ్డుపై పడి ఇబ్బందులు పడుతున్నామని వాహనదారులు వాపోతున్నారు. సంబంధిత శాఖ అధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలను కోరుతున్నారు. అయితే మట్టి తవ్వకాలపై తహసీల్దార్ ఏవీ రామాంజనేయులును వివరణ కోరగా మండలంలో మట్టి తవ్వకాలకు అనుమతులు లేవని స్పష్టం చేశారు. ఎవరైనా మట్టి తరలిస్తే పొక్లెయిన్లను, ట్రాక్టర్లను సీజ్ చేస్తామని హెచ్చరించారు. -
ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలి
భీమడోలు: ఫ్రభుత్వ పాఠశాలల్లో బడిఈడు పిల్లలందరిని చేర్పించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదేనని కాకినాడు రీజనల్ జాయింట్ డైరెక్టర్(ఆర్జేడీ) జి.నాగమణి అన్నారు. మెగా ఎన్రోల్మెంట్ డ్రైవ్‌లో భాగంగా గురువారం భీమడోలులో ఆమె పర్యటించారు. పాఠశాల సిబ్బంది, విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. భీమడోలు నెం.1, నెం.4 పాఠశాలల్లో చేరిన విద్యార్థులకు ప్రవేశ పత్రాలను అందజేశారు. ఆమె మాట్లాడుతూ నూరుశాతం ఎన్రోల్మెంట్ జరిగేలా ఉపాధ్యాయులు పనిచేయాలన్నారు. కనీసం ఆదర్శ పాఠశాలల్లో 70 మంది విద్యార్థులుండేలా టీచర్ల సమష్టిగా కృషి చేయాలన్నారు. ఎంఈవో 1, 2 ఈదుపల్లి శ్రీనివాసరావు, అయినపర్తి భాస్కర్‌కుమార్, క్లస్టర్ హెచ్ఎం జీఎస్ పద్మజ పాల్గొన్నారు. -
కువైట్‌లో చిక్కుకున్న కలిదిండి మహిళ
కలిదిండి(కై కలూరు): ఇద్దరు ఆడ పిల్లలకు తల్లి ప్రేమ కరువైందని కువైట్‌లో చిక్కుకున్న తన భార్యను ప్రభుత్వం చొరవ తీసుకుని తిరిగి పంపించే ఏర్పాట్లు చేయాలని కలిదిండి మండలం కలిదిండి ఇందిరా కాలనీకి చెందిన బండి వెంకన్న వేడుకుంటున్నాడు. వెంకన్న భార్య ప్రశాంతి పొట్టకూటి కోసం మూడేళ్ల క్రితం కువైట్ వెళ్లిది. ఆమె కువైట్‌లో ఉండగానే ప్రశాంతి తల్లిదండ్రులు మరణించిన కడచూపుకు నోచుకోలేకపోయింది. బిడ్డల కోసం తిరిగి భారత్ రావడానికి శత విధాలా ప్రయత్నిస్తున్నా ఫలితం దక్కడం లేదు. అసలేం జరిగిందంటే..? ప్రశాంతి ఓ కాంట్రాక్టరు ద్వారా మూడేళ్ల క్రితం కువైట్ వెళ్లింది. రెండేళ్లు ఎగ్రిమెంటుపై కువైట్‌లో ఓ కుటుంబంలో పనికి కుదిరింది. ప్రతినెలా డబ్బులు కలిదిండిలో భర్త వెంకన్నకు పంపుతోంది. రెండేళ్లు పూర్తయిన తర్వాత తిరిగి ఇంటికి వెళ్తానని ఆమె యజమానులను కోరితే అందుకు నిరాకరించారు. పాస్‌పోర్టు ఇవ్వలేదు కానీ, తిరిగి ప్రశాంతిపై దొంగతనం నెపం ఆరోపించారు. చివరకు కువైట్ పోలీసులు విచారణ చేసి ప్రశాంతి తప్పు లేదని తేల్చారు. ప్రస్తుతం ఆమెకు భారత్ ఎంబసీలో ఆశ్రయం కల్పించారు. ఇదిలా ఉంటే దక్షిణాసియాలో యుద్ధం కారణంగా ఆమె ప్రయాణానికి ఆటంకం ఏర్పడింది. ప్రస్తుతం పరిస్థితులు చక్కబడ్డాయని తన భార్యను ఇండియాకు పంపించేలా చర్యలు తీసుకోవాలని భర్త వెంకన్న కోరుతున్నాడు. -
వేసవి తాపం.. చేపకు శాపం
● వాతావరణంలో మార్పులతో కొట్టుకుంటున్న మత్స్యం ● చెరువుల వద్దే పడిగాపులు కాస్తున్న ఆక్వా రైతులు భీమవరం అర్బన్: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని ఆక్వా రంగం ప్రస్తుతం వాతావరణ మార్పులతో సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంది. ఆక్వా రైతులు చెరువుల్లో చేపలను రక్షించేందుకు ఇంజిన్ బోట్లు, ఏరియేటర్లు తిప్పుతూ మరికొన్ని చోట్ల ఆక్సిజన్ ట్యాబ్లెట్లు వినియోగిస్తున్నారు. చేపలను రక్షించుకునేందుకు రైతులు రాత్రులు, పగలు తేడా లేకుండా చెరువుల వద్దే పడిగాపులు కాస్తున్నారు. జిల్లాలో భీమవరం, ఉండి, నరసాపురం, మొగల్తూరు, ఆచంట, పాలకొల్లు, కాళ్ల తదితర మండలాల్లో సుమారు లక్షా 40 వేల ఎకరాల్లో శీలావతి, కట్ల, ఫంగస్, రూప్‌చంద్, తిలాఫీ, గడ్డిచేప తదితర సప్పనీటి చేపలను పెంచుతున్నారు. చేపల పెంపకంలో నష్టాలు తక్కువగా ఉండడంతో ఎక్కువ మంది రైతులు వాటిని పెంచేందుకు మొగ్గు చూపిస్తున్నారు. రోజుకు సుమారు 1000 టన్నుల పైగా చేపలు కోల్కత్తా, బెంగాల్, మహారాష్ట్ర, ఒడిస్సా తదితర ప్రాంతాలకు ఎగుమతులు అవుతూ ఉంటాయి. దీంతో కోట్లాది రూపాయలు విదేశీ మారకద్రవ్యం జిల్లాకు చేరుకుంటుంది. దినదిన గండం గతేడాది కంటే ఈ ఏడాది ప్రారంభంలోనే ఎండలు ఎక్కువగా ఉండటంతో చేపలు చెరువుల్లోని నీరు ఇంకిపోయి ఉప్పుశాతం పెరిగిపోతుందని రైతులు వాపోతున్నారు. గత మూడు వారాలుగా వడగాల్పులు కారణంగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడంతో ఆక్సిజన్ శాతంలో హెచ్చుతగ్గులు ఏర్పడడంతో చేపలు ఉపరితలంపై అసహనంగా ఈదుతున్నాయి. దీంతో వాటికి తాటాకు తెగులు, మొప్ప తెగులు, పేను పట్టడం వంటి వ్యాధులతో మృత్యువాత పడుతున్నాయని రైతులు చెబుతున్నారు. వేసవిలో సాధారణంగా ఉప్పు శాతం నాలుగుపైగా ఉంటే చేపలు ఒక్కొక్క సారి హఠాత్తుగా మృత్యువాత పడడంమే కాకుండా ఎదుగుదల మందగిస్తుందని రైతులు చెబుతున్నారు. వేసవి అంటేనే చేపకు గడ్డు కాలం ఫిబ్రవరి నుంచి పంట కాలువల ద్వారా వచ్చే సాగునీరు వంతుల వారీ విధానంతో చేపలు చెరువులకు నీళ్లు పెట్టడానికి ఆస్కారం తక్కువ ఉండటంతో జూలై నెల వరకు వేసవి తాపానికి తట్టుకుని చెరువులో చేపలు బతికితేనే రైతుకు పెట్టుబడులు వస్తాయని లేకుంటే నష్టాలే మిగులుతాయని రైతులు చెబుతున్నారు. చేపలు చెరువు సాగు చేసే రైతులు ప్రతి వారానికి ఒకసారి నీటిని నింపడంతో పీహెచ్, అమ్మోనియా, నైట్రేట్ తదితర క్షార గుణాలు అదుపులో ఉంటాయి. సుమారు 4 నెలలు సప్పనీరు లేకపోవడంతో నీటిలో ఉన్న క్షారగుణాల్లో మార్పులు వచ్చి చేపలు మృత్యువాత పడుతున్నాయని రైతులు చెబుతున్నారు. నీటి పరమాణువులను అదుపులోకి తీసుకువచ్చేందుకు రసాయనిక మందులు, ఎరువులు వాడాల్సి వస్తుంది. చేపలు పెంపకంపై ఆధారపడ్డ సన్నచిన్న కారు రైతులు వాతావరణ మార్పులతో కుదేలవుతున్నారు. ఎండలు వల్ల చెరువులో నీటి వేడిమికి తట్టుకోలేక మృత్యుపడతున్నాయని దీంతో ఏటా తీవ్ర నష్టాలు చవి చూడాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక ఎకరం చేపల సాగు చేసేందుకు సుమారు రూ.2 లక్షలు వరకు ఖర్చు చేస్తున్నామని రైతులు చెబుతున్నారు. చేపల సాగు చేయాలంటే 15 ఎకరాలు పైగా చేపలు చెరువు ఉండాలని వెల్లడిస్తున్నారు. చేపలకు మేతలుగా డీఓపీ తవుడు, చెక్క, పత్తిపిండి, పిల్లేట్స్ వేస్తుంటారు. చేపకు పెట్టే మేతను బట్టీ 6 నుంచి 9 నెలల్లో కేజీ చేప తయారవుతుందని చెబుతున్నారు. చేప ఎదుగుదల మందగిస్తే చివరకు అప్పులు మిగులుతాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గడ్డు పరిస్థితుల్లో ఉన్న ఆక్వా రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. వాతావరణంలో మార్పులు కారణంగా ఎప్పటికప్పుడు నీటి పరీక్షలు చేయించుకుని వాటికి అనుగుణంగా మందులు వినియోగించాల్సి వస్తుంది. దీంతో పెట్టుబడులు ఎక్కువతున్నాయి. ప్రతి రోజు చెరువు వద్దే ఉండి పరిశీలించాల్సి వస్తుంది. – ఆర్ బాలకృష్ణ, ఆక్వా రైతు, దొంగపిండి నేను రెండు ఎకరాల్లో చేపల సాగు చేస్తున్నాను. అయితే ఈ ఏడాది ఎండలు ఎక్కువగా ఉండడంతో చేపలు మృత్యువాత పడుతుండడంతో పట్టుబడికి రాకముందే పట్టేశాను. దీంతో ఈ ఏడాది నష్టాలు ఎదురయ్యాయి. – వాటాల విజయకృష్ణ, ఆక్వా రైతు, నాగేంద్రపురం -
ఆక్వా రైతులకు అండగా వైఎస్సార్ సీపీ
కాళ్ల: ఆక్వా రైతుల పక్షాన వైఎస్సార్ సీపీ పోరాటం సాగిస్తుందని ఆ పార్టీ ఉండి నియోజకవర్గ ఇన్చార్జి పీవీఎల్ నరసింహరాజ అన్నారు. పెదఅమిరంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం రొయ్య మేత ధరలు కిలోకి రూ.10 పైన ఒకేసారి పెంచడం వల్ల ఆక్వా రైతులు ఇబ్బంది పడుతున్నా కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణం అన్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వం హయాంలో రొయ్య మేత ధర పెంచాలంటే ఆక్వా అధారిటీ కమిటీ ఏర్పాటు చేసి రైతులతో, ఆక్వా ఫీడ్ తయారుదారులతో మాట్లాడి అందరి అనుమతితో ఒక నిర్ణయం తీసుకునేవారని చెప్పారు. జగన్ పాలనలో ఐదేళ్లలో ఇంత పెద్ద ఎత్తున రేట్లు పెరగటం ఎప్పుడు జరగలేదని గుర్తు చేశారు. కరోనా వంటి క్లిష్ట సమయంలో కూడా రొయ్య ధరలు తగ్గినప్పుడు రొయ్య ఎగుమతిదారులతో మాట్లాడి ఆక్వా రైతులకు మద్దతు ధర కల్పించేలా కృషి చేశారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు కరెంట్ సబ్సిడీ ఇస్తామని, ఆక్వా రైతులను ఆదుకుంటామని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ఇప్పుడు రైతులను నట్టేట ముంచుతుందని అసహనం వ్యక్తం చేశారు. ఉండి నియోజకవర్గంలో ఎక్కువ శాతం ఆక్వాకల్చర్ సాగవుతుందన్నారు. డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న రఘురామ కృష్ణంరాజు రైతులపై దృష్టి పెట్టి గుళ్లు, మైకులు సమస్యలపై కాకుండా కాకుండా రొయ్య మేత ధరల పరిస్థితిపై మొదటి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రత్యేక చొరవ తీసుకుని ముఖ్యమంత్రితో మాట్లాడి ధరలు తగ్గించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయంపై వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. లేనిపక్షంలో వైఎస్సార్ సీపీ ఆక్వా రైతుల పక్షాన పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు పెన్మెత్స దుర్గాప్రసాద్‌రాజు, ఆకివీడు జెడ్పీటీసీ వేగేశ్న వెంకటరాజు, ఆకివీడు రైతులు పెన్మెత్స ఆంజనేయరాజు, రాజేష్, నాయకులు అంబటి రమేష్, ధనరాజ్ తదితరులు పాల్గొన్నారు. పార్టీ ఉండి నియోజకవర్గ ఇన్చార్జి పీవీఎల్ నరసింహరాజు -
అంగన్వాడీల పదోన్నతుల్లో అన్యాయం
భీమవరం: అంగన్వాడీ పదోన్నతుల విషయంలో అవకతవకలు జరిగాయని, కొన్ని ప్రాంతాల్లో రాజకీయ ఒత్తిడిలు పనిచేస్తున్నాయని, దీనిపై వెంటనే విచారణ జరపాలని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి డి కళ్యాణి గురువారం డీఆర్వో శ్రీమన్నారాయణరెడ్డికి ఫిర్యాదు చేశారు. హెల్పర్లకు పదోన్నతి విషయంలో అనేక పోరాటాలు చేసి జీవోలు సాధించుకున్నా అమలుకు నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పదోన్నతుల్లో విషయంలో అధికారులు సైతం అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. సమగ్ర విచారణ జరిపించేంత వరకు పోస్టుల భర్తీని పెండింగ్‌లో పెట్టాలని కోరారు. ఆమె వెంట కె జాన్సీలక్ష్మి, ఎండీ హసీనా బేగం ఉన్నారు. భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాలో వివిధ రంగాల నుంచి రావాల్సిన వాణిజ్య పన్నుల వసూళ్ల లక్ష్య సాధనకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. గురువారం వశిష్ట సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా స్థాయి సమన్వయ సమావేశంలో ఆమె మాట్లాడారు. గత ఆర్థిక సంవత్సరంలో జిల్లాకు నిర్ధేశించిన రూ.485 కోట్ల లక్ష్యానికిగాను 85.41 శాతం వసూళ్లు సాధించామని, వృత్తి పన్ను వసూళ్లలో 86.72 శాతం సాధనతో రాష్ట్రంలో జిల్లా తొమ్మిదో స్థానంలో నిలిచిందని కలెక్టర్ తెలిపారు. 2026–27 ఆర్థిక సంవత్సరానికి జిల్లాకు రూ.543.02 కోట్ల వాణిజ్య పన్నుల వసూళ్ల లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్ణయించగా ఇంకా వృత్తి పన్ను ద్వారా రూ.16.65 కోట్లు, ఇతర బకాయిల ద్వారా రూ.40.61 కోట్లు, వ్యాట్ పాత చలాన్ల ద్వారా రూ.35.42 కోట్ల వసూళ్ల లక్ష్యాలు ఉన్నాయని తెలిపారు. వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమిషనర్ బి.నాగార్జున రావు, డిప్యూటీ కమిషనర్ కేపీ శైలజశ్రీ, సహాయ కమిషనర్లు డి.సాంబశివరావు, ఏవీ శ్రీనివాస్, జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారి జీ పిచ్చయ్య, లీడ్ బ్యాంకు జిల్లా మేనేజర్ ఏ.నాగేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పీజీఆర్ఎస్ దరఖాస్తులపై సమీక్ష పీజీఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారంలో అర్జీదారులు పూర్తిస్థాయిలో సంతృప్తి చెందేలా అధికారులు పనిచేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సూచించారు. గురువారం పలువురు అర్జీదారులతో ఆమె ఫోన్ ద్వారా మాట్లాడి సమస్యల పరిష్కార స్థాయిని సమీక్షించారు. నూతన వీసీ ఆచార్య మద్దాలి లక్ష్మీనారాయణరావు నూజివీడు: రాష్ట్రంలోని ఆర్జీయూకేటీల పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలలో నాణ్యమైన సాంకేతిక విద్యను అందించేందుకు మరింత కృషి చేస్తానని వైస్ ఛాన్సలర్ ఆచార్య మద్దాలి లక్ష్మీనారాయణరావు పేర్కొన్నారు. వీసీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా నూజివీడు ట్రిపుల్ఐటీకి విచ్చేసిన ఆయన గురువారం విలేకర్లతో మాట్లాడారు. పదో తరగతి పూర్తయిన వెంటనే విద్యార్థులు ట్రిపుల్ ఐటీల్లోని ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ ఇంజినీరింగ్ కోర్సులో జాయిన్ అవుతున్నారని, వారిని దేశానికి ఉపయోగపడే భావిభారత ఇంజినీర్లుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తానన్నారు. తన 26 ఏళ్ల అధ్యాపక బోధన అనుభవంతో ట్రిపుల్ ఐటీల్లో సంస్కరణలను తీసుకువచ్చి మరింత అభివృద్ధిలోకి తీసుకెళ్తానన్నారు. విద్యార్థుల భవిష్యత్‌కు ఉపయోగపడే నాణ్యమైన సాంకేతిక విద్యను అందించడమే కాకుండా ఎప్పటికప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా బోధన సాగేలా చర్యలు చేపడతామన్నారు. బోధన, బోధనేతర సిబ్బంది సహకారంతో ఆర్జీయూకేటీ పేరు ప్రతిష్టలు మరింత ఇనుమడించేలా పనిచేస్తామన్నారు. వైస్‌ఛాన్సలర్‌ను ట్రిపుల్ ఐటీలోని అసిస్టెంట్ ప్రొఫెసర్లు, మెంటార్లు, బోధనేతర సిబ్బంది కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఏలూరు (టూటౌన్): ఏలూరు కలెక్టరేట్లోని గోదావరి సమావేశపు హాలులో శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి ‘22ఏ మెగా పరిష్కార మేళా’ నిర్వహించనున్నట్లు కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ, జిల్లా ఇన్చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొని, ప్రజల నుంచి వినతులను స్వీకరిస్తారన్నారు. ప్రజలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసు కోవాలని కలెక్టర్ వెట్రిసెల్వి విజ్ఞప్తి చేశారు. -
వైభవంగా శ్రీచక్రస్నానం, మహా పూర్ణాహుతి
జంగారెడ్డిగూడెం: స్థానిక గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజు గురువారం నిత్య హోమం, వసంతోత్సవం, శ్రీచక్రస్నానం, మహా పూర్ణాహుతి వైభవంగా నిర్వహించారు. రాత్రి గజవాహన సేవ, ధ్వజారోహణం కార్యక్రమం నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం విద్యా వికాస్ యాజమాన్యం వల్లభనేని శ్రీనివాసరావు, ప్రసన్నలక్ష్మి దంపతులు, కోటపోతుల బాబి, కోటపోతుల శ్రీనివాస్ కుటుంబ సభ్యులు ఉభయదారులుగా వ్యవహరించారు. పండితులు పోనంగి పవన్‌కుమార్ ఆచార్యులు, ఆలయ ప్రధాన అర్చకులు నల్లూరి రవికుమార్ ఆచార్యులు, ఋషికేశ్ ఆచార్యులు వైదిక కార్యక్రమాలు చేశారు. శుక్రవారం ధ్రువమూర్తికి పంచామృత అభిషేకం, నవకల స్నపనం, ద్వాదశ ఆరాధన, ద్వాదశ కోవెల ప్రదక్షిణలు, శ్రీ పుష్పయాగం నిర్వహించనున్నారు. ఆయా కార్యక్రమాలను ఆలయ చైర్మన్ అల్లూరి రామకృష్ణ, ఈఓ కలగర శ్రీనివాస్ పర్యవేక్షించారు. -
శుచి, శుభ్రతతోనే శ్రీవారి ప్రసాదాల తయారీ
దేవస్థానం ఈఓ వేండ్ర త్రినాఽథరావు వెల్లడి ద్వారకాతిరుమల: శ్రీవారి పులిహోర ప్రసాదంలో నమిలేసిన ములక్కాయ ముక్కలు వచ్చాయని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని దేవస్థానం ఈఓ వేండ్ర త్రినాథరావు స్పష్టం చేశారు. దీనిపై ఇప్పటి వరకు భక్తుల నుంచి తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదన్నారు. వివరాల్లోకి వెళితే. తూర్పుగోదావరి జిల్లా, నల్లజర్ల మండలం అనంతపల్లి గ్రామానికి చెందిన విప్పిలి నరేష్ అనే వ్యక్తి తాను తెప్పించుకున్న శ్రీవారి పులిహోర ప్రసాదంలో నమిలేసిన ములక్కాయ ముక్కలు వచ్చాయంటూ వీడియోలను సోషల్ మీడియాలో బుధవారం రాత్రి పోస్ట్ చేశాడు. అయితే ప్రసాదంలో అవి పొరపాటున వచ్చాయా.. లేక ఎవరైనా కావాలనే ఇది చేశారా.. అన్న భక్తుల అనుమానాలపై సాక్షి దినపత్రిక గురువారం ‘శ్రీవారి ప్రసాదం నాణ్యతపై దుమారం’ శీర్షికన కథనం ప్రచురించింది. దీనిపై ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి స్పందించి, అధికారులను వివరణ కోరారు. ఇదిలా ఉంటే విచారణ జరిపిన ఈఓ త్రినాథరావు వివరాలను మీడియాకు వెల్లడించారు. స్వామివారి లడ్డూ, పులిహోర, శర్కర పొంగలి ప్రసాదాలు శుచి, శుభ్రత కలిగిన ప్రత్యేక భవనం (అంబరుఖానా)లో తయారవుతాయని పేర్కొన్నారు. సిబ్బంది చేతులకు గ్లౌజ్‌లు, నోటికి మాస్క్‌లు, తలకు క్యాప్‌లు ధరించిన తరువాతే ప్రసాదాలను తయారు చేసి, ప్యాకింగ్ చేస్తారన్నారు. ఎవరైనా తిని పడేసిన ములక్కాయ ముక్కలు పులిహోర ప్రసాదంలో కలిశాయని అనుకోవడానికి ఏమాత్రం అవకాశం లేదన్నారు. ఎందుకంటే అంబరుఖానాలో అసలు ఎవరూ భోజనాలు చేయరన్నారు. అన్నప్రసాద భవనం, ప్రసాదాల తయారీ భవనం రెండూ వేరువేరుగా ఉండటం వల్ల ఇలాంటివి జరిగే వీలు లేదన్నారు. కావున భక్తులు దీన్ని గమనించాలని ఈఓ కోరారు. ఇలా జరగడం ఇది రెండోసారి.. రెండేళ్ల క్రితం ఓ వ్యక్తి శ్రీవారి పులిహోర ప్రసాదంలో పురుగు వచ్చిందంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అప్పట్లో అది తీవ్ర దుమారాన్ని రేపింది. మళ్లీ ఇప్పుడు పులిహోర ప్రసాదంలో నమిలేసిన ములక్కాయ ముక్కలు వచ్చాయంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే అధికారులకు కనీసం ఫిర్యాదు చేయకుండా సోషల్ మీడియాలో ఇలా పోస్ట్ చేయడం వల్ల ప్రసాదాల పవిత్రత, భక్తుల మనోభావాలు దెబ్బతినే ప్రమాదం ఉందని పలువురు అంటున్నారు. అసలు సోషల్ మీడియాలో పెట్టే ఈ పోస్టుల్లో వాస్తవం ఉందా.. లేదా అన్న అనుమానాలు కూడా సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఈ పోస్టులపై అధికారులు పూర్తిస్థాయిలో విచారణ జరిపి, వాస్తవాలను నిగ్గుతేల్చి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. -
అంతర్జాతీయ చెస్ పోటీల్లో ప్రతిభ
టి.నరసాపురం: అంతర్జాతీయస్థాయి చదరంగం పోటీల్లో చిన్న గుర్వాయిగూడెం మోడల్ ప్రైమరీ స్కూల్ విద్యార్థి గుడికందుల చిరన్వి బాలికల అండర్–7 విభాగంలో ద్వితీయ స్థానం సాధించినట్లు విద్యాశాఖాధికారులు టి.రామ్మూర్తి, ఎస్.కళ్యాణిలు తెలిపారు. ఈ మేరకు స్థానిక పాఠశాలలో గురువారం అభినందన సభ నిర్వహించారు. ఆంధ్ర చెస్ అసోసియేషన్, ఎస్ఆర్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గత నెల 26న విజయవాడ నగరంలో కానూరులోని స్కాట్ స్పైన్ ఇంటర్నేషనల్ స్కూల్లో నిర్వహించిన ఇంటర్నేషనల్ ఓపెన్ రాపిడ్ పిడే రేటింగ్ చెస్ టోర్నమెంట్–2026లో చిరన్వి ప్రతిభ చూపిందన్నారు. హెచ్ఎం టి.కన్నయ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం: హనుమద్ జయంతి మహోత్సవాలల సందర్భముగా గురవాయిగూడెం మద్ది ఆంజనేయ స్వామి దేవస్థానంలో గురువారం విశేష పూజలు నిర్వహించారు. ఉపాలయంలో వేంకటేశ్వరస్వామి వార్షిక కల్యాణాన్ని సామూహికంగా నిర్వహించారు. సాయంత్రం 4 గంటల నుంచి రాష్ట్రంలో పలు ఆలయాలకు చెందిన వేద పండితులతో చతుర్వేదస్వస్తి పారాయణలు చేసినట్లు ఆలయ అసిస్టెంట్ కమిషనర్, ఈఓ ఆర్వీ చందన తెలిపారు. శుక్రవారం ఆలయంలో హనుమద్ వ్రతం, మహాశాంతి హోమం నిర్వహిస్తామన్నారు. -
గిరిజనాభివృద్ధికి గ్రహణం
బుట్టాయగూడెం: కూటమి ప్రభుత్వం గిరిజనాభివృద్ధిని గాలికి వదిలేసింది. సమస్యల పరిష్కారానికి వేదిక కావల్సిన కోటరామచంద్రపురం (కేఆర్‌పురం) ఐటీడీఏ పాలకవర్గ సమావేశం రెండున్నర సంవత్సరాలుగా నిర్వహించకపోవడంపై గిరిజన ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. నిబంధనల ప్రకారం ప్రతి మూడు నెలలకు ఒకసారి జరగాల్సిన పాలకవర్గ సమావేశం రెండున్న సంవత్సరాలుగా నిర్వహించలేదు. గిరిజన సంక్షేమ పథకాల అమలు తీరు, గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలు, వార్షిక బడ్జెట్ రాబడులు, వ్యయాలపై సమీక్షకు పాలక వర్గ సమావేశం ఎంతో కీలకమైనది. అంత ప్రాముఖ్యత ఉన్న ఈ సమావేశం నిర్వహణ గురించి పట్టించుకునే నాథుడే కరువయ్యారని గిరిజన సంఘ నాయకులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. పట్టించుకునే వారే లేరు కేఆర్‌పురం ఐటీడీఏ పాలకవర్గ సమావేశం 2023 ఆగస్టు 30న నిర్వహించారు. ఆ తర్వాత మళ్లీ సమీక్ష సమావేశం నిర్వహణకు సంబంధించి ఎవ్వరూ పట్టించుకోలేదు. గిరిజన గ్రామాల్లో అనేక సమస్యలు నెలకొన్నాయని గిరిజనులు చెబుతున్నారు. గిరిజన గ్రామాలకు సరైన రహదారులు లేక గిరిపుత్రులు పడుతున్న బాధలు వర్ణనాతీతం. అలాగే పోడుభూములకు దరఖాస్తు చేసుకున్నా పట్టించుకునే వారే లేరని గిరిజనులు ఆరోపిస్తున్నారు. ఐటీడీఏ ద్వారా నిర్వహిస్తున్న పాఠశాలల్లో కొత్తగా వస్తున్న విద్యా విధానంతో అనేక మంది గిరిజన విద్యార్థులు డ్రాప్ అవుట్స్‌గా మారే అవకాశం ఉందని గిరిజన సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. ఇలా అనేక సమస్యల పరిష్కారానికి పాలకవర్గ సమావేశం వేదికగా ఉంటుంది. ఇప్పటికై నా అధికారులు స్పందించి ఐటీడీఏ పాలకవర్గ సమావేశం నిర్వహించాలని పలువురు కోరుతున్నారు. దీనిపై ఐటీడీఏ పీఓ రాములు నాయక్‌ను వివరణ కోరగా త్వరలోనే పాలకవర్గం సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారు. రెండున్నరేళ్లుగా నోచుకోని ఐటీడీఏ పాలకవర్గ సమావేశం గిరిజన ప్రాంతంలో ఎక్కడి సమస్యలు అక్కడే తక్షణమే సమీక్ష ఏర్పాటు చేయాలని గిరిజన సంఘాల డిమాండ్ -
ఉపాధ్యాయులను నాన్ వెకేషన్ డిపార్ట్మెంట్గా మార్చాలి
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఉపాధ్యాయులను వేసవి సెలవుల్లో కూడా పనిచేయిస్తున్న పరిస్థితి కనపడుతోందని, ఉపాధ్యాయులతో పూర్తి స్థాయిలో పనిచేయించాలనే ఉద్దేశ్యం ఉంటే నాన్ వెకేషన్ డిపార్ట్మెంట్గా మార్చి సంపాదిత సెలవులను పెంచాలని జాక్టో నాయకులు కోరారు. ఈమేరకు గురువారం జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకట లక్ష్మమ్మను కలిసి వినతిపత్రం సమర్పించారు. రెమిడియల్ తరగతుల నిర్వహణకు హాజరౌతున్న ఉపాధ్యాయులకు, బడి పిలుస్తోందిలో భాగంగా ఎన్రోల్మెంట్ డ్రైవ్‌లో పాల్గొన్న ఉపాధ్యాయులకు సంపాదిత సెలవులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. వేసవి తీవ్రత కూడా 40 డిగ్రీలకు పైగా నమోదవుతున్న దృష్ట్యా శిక్షణ తరగతులు వాయిదా వేయాలని, సర్వీసులో ఉన్న టీచర్లకు టెట్ అర్హత నిబంధనను రద్దు చేయాలని, మున్సిపల్, ఎయిడెడ్, ఎంటీఎస్ టీచర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జాక్టో నాయకులు పువ్వుల ఆంజనేయులు, బూక్యా రాము, టీఎల్‌ఎస్‌ఎన్ మూర్తి, తోట ఎడ్వర్డ్, ఎం. రాంబాబు, డీఎస్ ప్రసాద్, ఈ. నారాయణ ఉన్నారు. -
విద్యార్థుల రవాణా చార్జీలు ఎక్కడ?
దెందులూరు: ప్రభుత్వం పాఠశాల విద్యార్థులకు రవాణా చార్జీలు చెల్లిస్తామని హామీ ఇచ్చి, సకాలంలో చెల్లింపులు చేయకుండా కూటమి ప్రభుత్వం మాట తప్పింది. పాఠశాలల విలీనం నేపథ్యంలో విద్యార్థులకు రవాణా సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఆ మాట నిలబెట్టుకోలేదు. సమీపంలో పాఠశాలలు లేని గ్రామాల నుంచి వెళ్లే 6–14 ఏళ్ల వయసున్న విద్యార్థులకు నెలకు రూ. 600 చొప్పున, ఏడాదికి రూ.6,000 రవాణా భత్యం అందిస్తామని పేర్కొంది. ప్రాథమిక పాఠశాల ఒక కిలోమీటరు పరిధిలో లేకపోయినా, ఉన్నత ప్రాథమిక లేదా హైస్కూల్ మూడు కిలోమీటర్ల దూరంలో లేకపోయినా రవాణా భత్యం ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీనిపై గ్రామ సభలు నిర్వహించి పాఠశాలల విలీనానికి ప్రభుత్వ యంత్రాంగం ముందడుగు వేసింది. విద్యార్థులను దూర ప్రాంత పాఠశాలలకు తరలించిన తర్వాత ఒక్క రూపాయి కూడా రవాణా ఖర్చులుగా చెల్లించకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. విలీనం పేరిట విద్యా వ్యవస్థకు దెబ్బ పాఠశాలలను తొమ్మిది రకాల విభజన పేరిట పునఃవ్యవస్థీకరించి, తక్కువ విద్యార్థులు ఉన్న పాఠశాలలను ఎక్కువ విద్యార్థులు ఉన్న పాఠశాలల్లో విలీనం చేయడం వల్ల గ్రామీణ విద్యార్థులు రోజువారీ ప్రయాణ భారాన్ని భరించాల్సి వస్తోంది. రవాణా భత్యం అందకపోవడంతో పేద కుటుంబాలపై అదనపు ఆర్థిక భారం పడుతోంది. దీనివల్ల వేల సంఖ్యలో విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలను వదిలి, ఇంటి వద్దకే వస్తున్న ప్రైవేటు పాఠశాలల బస్సుల్లో తరలిపోతున్నారు. విద్యాహక్కు చట్టానికి విరుద్ధమా? ఆర్టీఈ చట్టం ప్రకారం విద్యార్థులకు సమీపంలో పాఠశాల లేదా రవాణా సౌకర్యం కల్పించడం ప్రభుత్వ బాధ్యత. ఆ రెండింటిలో ఏదీ సరైన విధంగా అమలు చేయకుండా పాఠశాలల విలీనాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. కాగితాలపై పాఠశాలలు విలీనం అయినట్లు చూపిస్తున్నప్పటికీ, భౌతికంగా విద్యార్థులు ఆ పాఠశాలలకు చేరకపోవడం గమనించాల్సిన అంశం. రవాణా సౌకర్యం లేకపోవడం, రవాణా చార్జీలు చెల్లించకపోవడం వల్ల అనేకమంది విద్యకు దూరమవుతున్నారు. పాఠశాల ఉనికికే ప్రమాదం ఈ ఏడాది ఏప్రిల్–మే నెలల్లో చేపట్టబోయే కొత్త విలీన ప్రక్రియతో జిల్లా స్థాయిలో వందలాది పాఠశాలలు కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. ఇప్పటికే అమలు కాని హామీల నేపథ్యంలో మరింత పెద్ద స్థాయిలో విద్యార్థుల భవిష్యత్తు అనిశ్చితిలో పడే అవకాశముంది. రవాణా చార్జీలు విడుదల చేయాలి విద్యార్థుల హాజరు, ప్రయాణ సౌకర్యాలపై సమగ్ర సమీక్ష చేయాలి. గ్రామీణ ప్రాంతాల్లో సమీప పాఠశాలల బలోపేతంపై దృష్టి పెట్టాలి. 1 నుంచి 5 తరగతుల ప్రాథమిక పాఠశాలలు, 1 నుంచి 8వ తరగతి ప్రాథమికోన్నత పాఠశాలలు, 6 నుంచి 10వ తరగతి ఉన్నత పాఠశాలలతో కూడిన మూడంచెల విద్యా వ్యవస్థను పునఃవ్యవస్థీకరించాలి. 2015లో కూడా గ్రామ పంచాయతీ, మున్సిపల్, కార్పొరేషన్ యూనిట్‌గా 100 మంది విద్యార్థులు గల ఆదర్శ ప్రాథమిక పాఠశాలలు ఏర్పాటు చేసినప్పుడు, సమీపంలోని రెండు మూడు పాఠశాలలను విలీనం చేస్తూ నాటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆయా పాఠశాలలకు ప్రత్యేక పద్దుల్లో నిధులు మంజూరు చేస్తూ, ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడిని, ప్రత్యేక ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయ పోస్టును, గ్రంథాలయ, భాషా ప్రయోగశాలలను ఏర్పాటు చేస్తామని ఉత్తర్వుల్లో పేర్కొంది. అవేవీ కార్యరూపం దాల్చకపోగా అనేక పాఠశాలలు మూతపడ్డాయి. -
ప్రభుత్వాన్ని శాసించే స్థాయిలో ఫీడ్ కంపెనీలు
పాలకొల్లు సెంట్రల్: ప్రభుత్వం, ఏపీ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ ఆథారిటీ (అప్సడా)ని శాసించే స్థాయిలో రాష్ట్రంలో ఫీడ్ కంపెనీలు ఉన్నాయని రాష్ట్ర ఆక్వా సంఘం సభ్యులు ఆరోపించారు. బుధవారం పాలకొల్లులో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆక్వా రైతులతో మాట్లాడిన తర్వాతే ధరలు పెంచాలని ఫిషరీస్ కమిషనర్ చెప్పినా ఫీడ్ కంపెనీలు పట్టించుకోవడం లేదన్నారు. ఒకేసారి కిలోకు రూ.8 నుంచి రూ.10 వరకు పెంచడం దారుణమన్నారు. ఫీడ్ కంపెనీల ధోరణి చూస్తుంటే అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అనే అనుమానం కలుగుతుందన్నారు. గత ఫిబ్రవరిలో కిలోకు రూ.4 ధర పెంచినప్పుడే ప్రభుత్వం చర్యలు తీసుకుని ఉంటే ప్రస్తుతం ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. ప్రభుత్వానికి మొక్కుబడిగా సూచన చేసి కంపెనీలు ఇష్టారీతిలో ధరలు పెంచేశాయన్నారు. మంత్రి, అచ్చెన్నాయుడు, అప్సడా కమిషనర్‌కు తెలియకుండా ధర లు ఎలా పెంచారని ప్రశ్నించారు. ఫీడ్ ధరలు పెంచి రొయ్య కౌంట్ ధరలు తగ్గించేశారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో మంత్రి అచ్చెన్నాయుడు స్పందించారని, శుక్రవా రం విజయవాడలో ఆక్వా రైతు సంఘ నాయకులు, అప్సడా, ఫీడ్స్ కంపెనీలతో సమావేశం ఏర్పాటు చేయనున్నారన్నారు. అనంతరం తమ కార్యాచరణ ప్రణాళిక ప్రకటిస్తామని చెప్పారు. దీనిని కొందరు రాజకీయ కోణంలో చూస్తున్నారని, తాను టీడీపీ అభిమానిని అయినా ఆక్వా సాగు చేసి నష్టపోలేము కదా.. పంటకు గిట్టుబాటు ధర లేఖ ఫీడ్ కొనలేని పరిస్థితులు ఉంటే ఎలా ఊరుకుంటామని ఓ రైతు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమన్వయ కమిటీ సభ్యు లు గొట్టుముక్కల గాంధీ భగవాన్‌రాజు, జీకేఎఫ్ సుబ్బరాజు, మళ్ల రాంబాబు, ఎం.వెంకట్రావు, బో ణం చినబాబు, మేడిది జాన్‌రాజు, పూసపాటి వెంకటరాజు తదితరులు పాల్గొన్నారు. -
పారిజాతగిరిలో గ్రామోత్సవం
జంగారెడ్డిగూడెం: గోకుల తిరుమల పారిజాతగిరి వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బుధవారం ఉదయం 8 గంటలకు నిత్య హోమం, నీరాజనం, తీర్థప్రసాద గోష్టి తదితర పూజలు వైభవంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించుకున్నారు. పొణంకి సత్య పవన్ కుమార్ ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు నల్లూరి రవికుమార్ ఆచార్యులు, ఋషి కేష్, కుమార్, రాఘవ ఆచార్యులు దాతలు బుద్దాల నాగు, కృష్ణవేణి దంపతులు, జెట్టిబోయిన సత్యనారాయణ, వసుంధర కుటుంబం సభ్యులను సన్మానించారు. అనంతరం అన్నప్రసాద వితరణ, సాయంత్రం 4 గంటల నుంచి గరుడ వాహనంపై శ్రీస్వామి వారు జంగారెడ్డిగూడెం పుర వీధులలో రథపై బయలుదేరారు. భక్తి కోలాటం, సన్నాయి మేళం, దేవతమూర్తులు వేషధారణతో పట్టణంలో సుబ్బంపేటరోడ్, రాజేశ్వరి థియేటర్ రోడ్, గంగానమ్మ గుడి, పాత బస్టాండ్ నుంచి బోస్ బొమ్మ సెంటర్, కొత్త బస్టాండ్, అక్కడ నుంచి కాకర్ల కాంప్లెక్స్ రోడ్, కాలేజ్ అడ్డరోడ్, బీఎస్ఎన్ఎల్ ఆఫీస్, తిరిగి పారిజాతగిరి ఆలయం వరకు గ్రామోత్సవం నిర్వహించారు. కార్యక్రమాలను ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ అల్లూరి రామకృష్ణ, ఆలయ కార్యనిర్వాహణ అధికారి కలగర శ్రీనివాస్ పర్యవేక్షించారు. ఈ నెల 14వ తేదీ గురువారం ఉదయం ఆలయంలోని శ్రీస్వామివారి పుష్కరిణిలో చక్రస్నానం ఉంటుందని ఈవో తెలిపారు. -
ఉణుదుర్రులో ఉద్రిక్తత
● భారీ బందోబస్తు మధ్య పేదల ఇళ్ల తొలగింపు ● రోడ్డున పడ్డ 60 కుటుంబాలు ఉండి: పిల్లాపాపలతో రోడ్డున పడతాం.. ఇక మాకు దిక్కేవరంటూ సుమారు 60 కుటుంబాలు ఘొల్లుమన్నాయి. ఎవరేమనుకున్నా.. ఎవరెన్ని కన్నీళ్లు పెట్టుకున్నా ఏమాత్రం పట్టించుకోకుండా అధికారులు పేదల ఇళ్లను కూలగొట్టేశారు. అంతా మా ఇష్టం అన్నట్టుగా ఇళ్లను నేలమట్టం చేశారు. దీంతో ఉండి మండలం ఉణుదుర్రులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. గ్రామంలోని ఆలకోడు డ్రెయినేజ్ భూ ముల్లో నివాసముంటున్న సుమారు 60 కుటుంబాలకు చెందిన ఇళ్లను బుధవారం అధికారులు భారీ బందోబస్తు సాయంతో పొక్లయిన్లతో కూలగొట్టారు. కూల్చివేతలను అడ్డుకునేందుకు మహిళలు, యువకులు ప్రయత్నించగా వారిని నిలువరించారు. దీంతో బాధిత మహిళలు రోడ్డెక్కి నిరసన తెలిపారు. కన్నీళ్లతో బోరుమని విలపించారు. కొద్దిరోజులుగా ఉణుదుర్రు బాధితులకు అండగా నిలిచిన సీపీఎం నాయకులు జిల్లా కార్యదర్శి జేఎన్వీ గోపాలన్, జిల్లా నాయకుడు ధనికొండ శ్రీనివాస్‌ను పోలీసులు ముందుగానే హౌస్ అరెస్ట్ చేశారు. వేకువజాము నుంచి ఇళ్ల తొలగింపును ప్రారంభించారు. కనీసం ఇళ్లల్లోని సామాన్లు తీసుకునేందుకు కూడా ఇబ్బంది పెట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పేదలకు మూడు సెంట్లు భూమి ఇస్తామన్నారు.. ఇప్పుడు ఉన్నపళంగా ఇళ్లల్లో నుంచి గెంటేస్తున్నారని యువకులు కన్నీటిపర్యంతమయ్యా రు. ఓట్లు వేసి గెలిపించినందుకు తమ జీవితాలు నాశనం చేశారని బోరుమన్నారు. డిప్యూటీ స్పీకర్ బంధువుల కోసమే.. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు బంధువులైన భూస్వాముల ఆక్వా చెరువులకు అడ్డులేకుండా చేసేందుకే పేదల ఇళ్లను తొలగించారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఆరోపించారు. ఇళ్ల తొలగింపును సీపీఎం తీవ్రంగా ఖండిస్తున్నట్టు ప్రకటనలో తెలిపారు. ఆక్వాచెరువులకు వారు సులభంగా వెళ్లేలా, వారికి కావాల్సిన సౌకర్యాలు కల్పించేందుకే పేదల ఇళ్లను తొలగించారని విమర్శించారు. అభివృద్ధి అంటే ఇదేనా అని ప్రశ్నించారు. హౌస్ అ రెస్టులు చేసిన సీపీఎం నాయకులను వెంటనే వదిలిపెట్టాలని, బాధితులకు తక్షణమే నష్టపరిహారం, పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు. -
కూటమి ప్రభుత్వానిది అరాచక పాలన
భీమవరం: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలుచేస్తూ ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తోందని వైఎస్సార్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు చిగురుపాటి సందీప్ ధ్వజమెత్తారు. కర్నూలు జిల్లా యువజన వి భాగం పట్టణ అధ్యక్షుడు బాలుపై అక్రమ కేసులు పెట్టి వేధించడాన్ని నిరసిస్తూ బుధవారం పట్టణంలోని అంబేడ్కర్ సెంటర్లో నిరసన తెలిపారు. కూటమి నాయకులు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడమేగాక అవినీతి, అక్రమాలతో ప్రజల సొమ్ము దోచుకుంటున్నారని సందీప్ ఆరోపించారు. వీటిపై ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారన్నారు. ప్రధానంగా వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను అణచివేసేలా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు భయపడేది లేదని స్పష్టం చేశారు. ఆచంట నియోజకవర్గ యు వజన విభాగం అధ్యక్షుడు గొట్టుముక్కల సునీల్‌వర్మ, స్టూడెంట్ వింగ్ తణుకు నియోజకవర్గ అధ్యక్షుడు గోపే ఎడ్వర్డ్పాల్, నరసాపురం టౌన్ యూత్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్, భీమవరం టౌన్ అధ్యక్షుడు గాదిరాజ రామరాజు, రాష్ట్ర ఆర్టీఐ విభాగ కార్యదర్శి గుంటి ప్రభు తదితరులు పాల్గొన్నారు. -
పుస్తకాలు అరకొరే..!
భీమవరం: త్వరలో నూతన విద్యాసంవత్సరం ప్రా రంభం కానుండగా ప్రభుత్వ పాఠశాల్లో విద్యార్థులకు అందించాల్సిన నోట్ పుస్తకాలు ఇప్పటికీ బడులకు చేరలేదు. జిల్లాలోని 20 మండలాల్లో 1,399 ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 90 వేల విద్యార్థులకు పాఠ్య, నోట్ పుస్తకాలతోపాటు స్కూల్ బ్యాగ్స్, షూస్, బెల్ట్‌లు వంటివి స్కూల్ తెరిచిన రోజునే అందించాల్సి ఉంది. వేసవి సెలవుల అనంతరం వచ్చే నెల 12న పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది ఒకటో తరగతి నుంచి 8వ తరగతి వరకు అన్ని పాఠ్య పుస్తకాలు మారుతున్నందున సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో పాఠశాలలకు ఆయా పుస్తకాలు పంపిణీ చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యాయి. మొత్తంగా విద్యార్థులకు సుమారు 4.75 లక్షల టెస్ట్ బుక్స్ అవసరమవుతాయని గుర్తించారు. నోట్ పుస్తకాలు ఎప్పుడు వస్తాయో? జిల్లాలోని మొత్తం సర్కారీ బడుల్లోని విద్యార్థులకు సుమారు 7 లక్షల వరకు నోట్ పుస్తకాలు, సుమారు 86 వేల స్కూల్ బ్యాగ్స్ అవసరమవుతాయి. అయితే ఇప్పటివరకు వీటి పంపిణీ ప్రారంభం కాలేదు. కేవలం పాఠ్య పుస్తకాలను మాత్రమే ఆయా మండలాలకు పంపుతున్నారు. ముందుగా మండలంలోని ఓ పాఠశాలకు చేరవేసి అక్కడి నుంచి అన్ని పాఠశాలలకు తరలించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే నోట్ పుస్తకాలు మాత్రం ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి. నోట్ పుస్తకాలతోపాటు బ్యాగ్స్, షూస్, బెల్ట్ వంటివి కూడా జిల్లాకు రావాల్సి ఉంది. గతేడాది పంపిణీ చేసిన స్కూల్ బ్యాగ్స్‌లో నాణ్యత లేదనే విమర్శలు వెల్లువెత్తాయి. ఇటువంటి తరుణంలో ప్రస్తుత ఏడాదికి నాణ్యమైన బ్యాగ్స్, బెల్ట్‌లు పంపిణీ చేయకుంటే తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశమున్నందున విద్యాశాఖ అధికారులు ఆందోళనకు గురవుతున్నట్టు చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి త్వరితగతిన నోట్ పుస్తకాలు, బ్యాగ్స్ మండల కేంద్రాలకు చేరితే అక్కడి నుంచి స్కూల్స్ తెరిచే సమయానికి అన్ని పాఠశాలలకు పంపిణీ చేసేందుకు అవకాశముంటుందని అధికారులు అంటున్నారు. నోట్ దిస్ పాయింట్ మొదలుకాని నోటు పుస్తకాల పంపిణీ విద్యా సామగ్రి పంపిణీపైనా స్పష్టత కరువు మండలాల వారీగా పాఠ్య పుస్తకాలు మాత్రమే అందజేత జిల్లాలో 1,399 పాఠశాలలు.. 90 వేల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు మరో వారంలో నోట్ పుస్తకాలు వచ్చే అవకాశం ఉంది. జిల్లాలోని 17 మండలాలకు సంబంధించి టెస్ట్ బుక్స్‌ను మండల కేంద్రాలకు చేరుస్తున్నాం. నోట్ బుక్స్, బ్యాగ్‌లు ప్రభుత్వం సరఫరా చేయగానే ఆయా స్కూల్స్‌కు చేర్చేలా ఏర్పాట్లు చేస్తాం. – పి.శ్యామ్‌సుందర్, ఏపీసీ, భీమవరం -
ఆర్జీయూకేటీని అత్యుత్తమ వర్సిటీగా తీర్చిదిద్దుతా
నూజివీడు: రాష్ట్రంలోని రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) వైస్ చాన్సలర్‌గా ఆచార్య మద్దాలి లక్ష్మీనారాయణరావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఉన్నత విద్యామండలి చైర్మన్, ఆర్జీయూకేటీ చాన్సలర్ ఆచార్య కొత్తా మధుమూర్తి సమక్షంలో ఆయన చార్జ్ తీసుకున్నారు. 1988లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి ఎమ్మెస్సీ డిగ్రీ, 1990లో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నుంచి ఎంఫిల్ డిగ్రీని, 1996లో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నుంచి డాక్టరేట్ డిగ్రీని పొందిన ఆచార్య మద్దాలి ఐఐటీ కాన్పూర్‌లోని కెమిస్ట్రీ విభాగంలో ఆచార్యులుగా పనిచేస్తున్నారు. శాసీ్త్రయ పరిశోధన, బోధనతో పాటు విద్యా పరిపాలన రంగాల్లో ఆయనకు విశేష అనుభవం ఉంది. జాతీయ, అంతర్జాతీయస్థాయిలో పలు పరిశోధనా పత్రాలు ప్రచురించి విద్యారంగంలో ప్రత్యేక గుర్తింపు పొందారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్జీయూకేటీని అత్యుత్తమ సాంకేతిక విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దుతామన్నారు. రిజిస్ట్రార్ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
వంతెన ఖానాలపై ఒత్తిడి
నరసాపురం వయా కై కలూరు మీదుగా ఏలూరు చేరడానికి ప్రధాన మార్గంలో పెదయడ్లగాడి, చినయడ్లగాడి, పోల్‌రాజ్ డ్రెయిన్ వంతెన కీలకంగా ఉంటాయి. వీటిలో ప్రధానమైనది పెదయడ్లగాడి వంతెన కింద 56 ఖానాలు ఉన్నాయి. రాత్రి వేళల్లో వంతెనపై లైట్లు లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. పూర్వం వీటిలో కొన్ని ఖానాలకు మాత్రమే అడుగున పేరుకుపోయిన మట్టిని తొలగించారు. ఏటా గుర్రపుడెక్క పేరుకుపోవడంతో వంతెన ఒత్తిడికి గురవుతోంది. కొన్ని సందర్భాల్లో డెక్కను తొలగించడానికి వంతెనపై పొక్లయిన్లను వినియోగించడంతో వంతెన దెబ్బతింటోంది. రహదారి మరమ్మతుల విషయమై ఏలూరు ఆర్అండ్బీ డీఈఈ వై.వెంకట్కిషోర్ను వివరణ కోరగా వంతెన మరమ్మతుల కోసం నివేదిక అందించామన్నారు. విద్యుత్ దీపాలు స్థానిక పంచాయతీ సమకూర్చుకోవాలని చెప్పారు. -
అమెరికా విధ్వంసం ప్రపంచానికి ముప్పు
తణుకు అర్బన్: అమెరికా చేస్తున్న విధ్వంసం ప్రపంచ వ్యాప్తంగా చెడు పరిణామాలకు దారితీస్తుందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. బుధవారం స్థానిక రోటరీ క్లబ్లో అమెరికా యుద్ధోన్మాదం – కారణాలు – పరిష్కారం అనే అంశంపై సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు పీవీ ప్రతాప్ అధ్యక్షతన నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌పై కమ్యూనిస్టులు తక్కువ మాట్లాడుతున్నారని మిగిలిన వారు ఎక్కువగా మాట్లాడుతున్నారని అన్నారు. అమెరికా, ఇజ్రాయేలు కలిసి చేస్తున్న యుద్ధం మామూలుది కాదని చిన్న దేశంపై చేస్తున్న పెద్ద యుద్ధమని అన్నారు. ఇరాన్‌లోని ప్రధాన బ్రిడ్జిలన్నిటినీ ధ్వంసం చేశారని, ప్రధానం క్రూడ్ ఆయిల్, పెట్రోలు, డీజిల్ తయారుచేసే శుద్ధి కర్మాగారాల్ని బాంబులు వేసి ధ్వంసం చేశారని విమర్శించారు. యుద్దంతో ధరలు విపరీతంగా పెరిగిపోయాయని, యుద్ధానికి ముందు 70 డాలర్లు ఉండే క్రూడ్ ఆయిల్ ధరలు నేడు 100 డాలర్లకు చేరిందన్నారు. ఐటీ ఉద్యోగులను మీ ఇళ్ల నుంచి పనిచేయమని ప్రధాని మోదీ చెప్పడం హస్యాస్పదమని, ప్రధాన మంత్రిని కూడా వర్క్ ఫ్రం హోం చేయమనాలని అన్నారు. భవిష్యత్తులో డీజిల్, పెట్రోలు వంటివి రేషన్ లాగా నిబంధనలు పెట్టి ఇచ్చే పరిస్థితులు వస్తాయని ఎద్దేవా చేశారు. అమెరికా చెప్పినట్లు వినకుండా యుద్ధాన్ని ఆపే విధంగా ప్రపంచ దేశాలన్నీ ఒత్తిడి తీసుకురావాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు మంతెన సీతారాం, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి.బలరామ్, దారిదీపం సంపాదకులు డీవీవీఎస్ వర్మ, లౌకిక రాజ్యాంగ వేదిక నాయకులు సంకు మనోరమ, సీపీఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు, సామాజిక న్యాయపోరాట సమితి నాయకులు పేరూరి మురళి, డాక్టర్ వంక రామదాసు తదితరులు పాల్గొన్నారు. సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు రాఘవులు -
ఇంజనీర్ తేజకు రైల్వే నుంచి ప్రశంసలు
ఏలూరు (ఆర్ఆర్ పేట): నగరానికి చెందిన సోమ కన్స్ట్రక్షన్స్ అధినేత ఇంజనీర్ సూరత్తు తేజ రైల్వే అధికారుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద ఇటీవల ఏలూరులోని పెద్ద రైల్వే స్టేషన్లో రూ.21 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు. ఈ పనుల్లో భాగంగా రైల్వే స్టేషన్ ముఖ ద్వారాన్ని ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసేలా, జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థాన రాజగోపురం మాదిరిగా డిజైన్ చేసి ఆకర్షణీయంగా మలచడంలో సూరత్తు తేజ చేసిన కృషి అభినందనీయమని పేర్కొంటూ దక్షిణ మధ్య రైల్వే సీనియర్ సెక్షన్ ఇంజనీర్ బి.నాగేశ్వరరావు తేజకు ప్రశంసాపత్రం అందజేశారు. -
●ప్రమాదకరంగా వంతెన
ఏలూరు సమీపంలో ఉన్న తమ్మిలేరుపై వంతెన ప్రమాదకరంగా మారింది. రెయిలింగ్ పూర్తిగా ధ్వంసమై, ఫుట్‌పాత్ గోతులు పడి అధ్వానంగా తయారైనా పట్టించుకునే వారు లేరు. రక్షణగా ఉండాల్సిన రేలింగ్ లేకపోవడంతో ఏదైనా వాహనం అదుపు తప్పితే తమ్మిలేరులో పడిపోయే పరిస్థితి ఉంది. చివరకు నడిచి వెళ్లే వారికి కూడా రక్షణ కల్పించలేని పరిస్థితి నెలకొంది. ఇడా ఆధీనంలో లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసిన మొక్కలు కూడా నీరు లేక ఎండిపోయి, కేవలం కుండీలు మాత్రమే మిగిలాయి. విశేషమేమిటంటే నగర మేయర్ ప్రతిరోజూ ఈ వంతెన పైనుంచే రాకపోకలు సాగిస్తున్నా కనీసం పట్టించుకున్న దాఖలాలు లేవని నగర ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏలూరులోని మార్కెట్ యార్డు సమీపంలో ఉన్న వంతెన దుస్థితి ఇది. – సాక్షి ఫొటోగ్రాఫర్, ఏలూరు -
బాధితులకు చికిత్సపై ఆరా
భీమవరం (ప్రకాశంచౌక్): గణపవరం మండలం ఎస్.కొండేపాడులో బుధవారం బజ్జీలు తిన్న రెండు కుటుంబాలకు చెందిన 11 మంది అస్వస్థతకు గురవడంతో భీమవరంలోని పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వారిని కలెక్టర్ సీహెచ్.నాగరాణి, జిల్లా వైద్యశాఖాధికారి డాక్టర్ జి.గీతాభాయి పరామర్శించి ఆసుపత్రి వైద్యులతో చర్చించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ అస్వస్థతకు గురైన 11 మందిలో తణుకు జిల్లా ఆసుపత్రిలో ముగ్గురు, భీమవరం ఆసుపత్రిలో ఐదుగురు, వర్మ ఆసుపత్రిలో ఒకరు, ఇంపీరియల్ ఆసుపత్రిలో ఇద్దరు చికిత్స పొందుతున్నారని అందరి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని తెలిపారు. పాయిజన్ కేసు బాధితులను ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు, ఎస్పీ అద్నాన్ నయీం అస్మి పరామర్శించారు. -
ప్రమాదాల నివారణకు చర్యలు
భీమవరం: ప్రజలకు రోడ్డు భద్రత, ట్రాఫిక్ నియంత్రణపై అవగాహన కల్పించాలని కలెక్టర్ సీహెచ్ నాగరాణి అన్నారు. బుధవారం కలెక్టరేట్లో రోడ్డు భద్రతా కమిటీ సమీక్షా సమావేశంలో ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచించారు. ముందుగా రోడ్డు ప్రమాదాల వివరాలు, ప్రమాదాలకు కా రణమవుతున్న అంశాలు, ప్రమాద ప్రాంతాల గుర్తింపు, ట్రాఫిక్ నియమాల అమలు అంశాలపై చర్చించారు. జాతీయ, రాష్ట్ర రహ దారులుపై బ్లాక్ స్పాట్స్ గుర్తించి ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలన్నారు. హెచ్చరిక బో ర్డులు, స్పీడ్ బ్రేకర్లు, వీధి దీపాల ఏర్పాటు వంటి వాటిపై దృష్టి పెట్టాలన్నారు. ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని, హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరిగా ఉపయోగించాలన్నా రు. జేసీ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి, డీఎంహెచ్ఓ గీతాబాయి, ఆర్డీఓలు కె.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, దాసి రాజు, డీఎస్పీ ధర్మవరపు విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు. భీమవరం: పట్టణంలోని నాలుగు కేంద్రాల్లో బుధవారం నిర్వహించిన ఏపీ ఈఏపీసెట్ పరీక్షకు 29 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. విష్ణు ఇంజనీరింగ్ కళాశాలలో 220 మందికి 214 మంది, ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో 300 మందికి 291 మంది, డీఎన్నార్ ఇంజనీరింగ్ కళాశాలలో 200 మందికి 194, డీఎన్నార్ అటానమస్ కళాశాలలో 200 మందికి 192 మంది హాజరయ్యారు. భీమవరం (ప్రకాశంచౌక్): ఒక నెలలో ఒక ని యోజకవర్గం నాలుగు వారాలు పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని జిల్లాలో తొలిసారిగా ఈనెల 15న ఆచంటలో నిర్వహించనున్నట్టు కలెక్టర్ సీహెచ్ నాగరాణి తెలిపారు. ఆచంట బాలంవారిపాలెం పీ4 భవనంలో ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పీజీఆర్ఎస్లో భాగంగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తామన్నారు. ఆచంట, పోడూరు, పెను గొండ, పెనుమంట్ర మండలాలకు చెందిన ప్రజలు అర్జీలు సమర్పించవచ్చన్నారు. భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాలో గృహ గణన కార్యక్రమాన్ని నిర్దేశిత గడువులోపు పూర్తిచేయాలని కలెక్టర్ సీహెచ్ నాగరాణి ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి బుధవారం ఆర్డీఓలు, తహసీల్దా ర్లు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లతో వీడి యో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జిల్లాలో ఇప్పటివరకు గృహగణన నమోదు 40 శాతం మాత్రమే పూర్తయిందన్నారు. అలాగే జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో డీపీఎంలతో వివిధ అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఉండి: ఉండి ఎస్సై ఎండీ నసీరుల్లాను ఉన్నతాధికారులు వీఆర్‌కు పంపారు. ఆయన స్థానంలో భీమవరం టూటౌన్లో పనిచేస్తున్న మల్లికార్జునరావును ఉండి ఎస్సైగా నియమించారు. అయితే నసీరుల్లాను ఏ కారణంతో వీఆర్‌కు పంపించారో తెలియాల్సి ఉంది. ఏలూరు (టూటౌన్)/ఉంగుటూరు: ఉంగుటూరు మండలం బాదంపూడిలోని దేశీయ జల మత్స్య సంవర్ధన శిక్షణా కేంద్రంలో శిక్షణ పొందుటకు ఈనెల 23లోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మత్స్య శాఖ అధికారి బి.రాజ్‌కుమార్ ప్రకటనలో తెలిపారు. 27న బాదంపూడిలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని ఎంపికై న వారి పేర్లు అదే రోజు ప్రకటిస్తారన్నారు. జూన్ 1 నుంచి ఆగస్టు 31 వరకు శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. 5వ తరగతి ఆపై చదివిన 18 నుంచి 30 ఏళ్లలోపు ఉండాలన్నారు. మరిన్ని వివరాలకు సెల్ 9573337484, 7286993033, 9492337649 నంబర్లలో సంప్రదించాలని కోరారు. ద్వారకాతిరుమల: ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని ఓ వ్యక్తిని బురిడీ కొట్టించి, లక్షలాది రూపాయ లు తీసుకుని మోసగించిన మహిళను బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. ఎస్సై టి.సుధీర్ తెలిపిన వివరాల ప్రకారం.. కామవరపుకోట మండలం రామన్నపాలేనికి చెందిన ఆడమిల్లి హర్షవర్ధిని ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తాన ని నమ్మించి దొరసానిపాడుకు చెందిన కర్రి బా లాజీ నుంచి రూ.2,75,000 తీసుకుని మోసగించింది. దీంతో బాలాజీ ఇచ్చిన ఫిర్యాదుపై గతనెల 19న కేసు నమోదైంది. భీమడోలు సీఐ పి.కృష్ణ ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టిన ద్వారకాతిరు మల ఎస్సై సుధీర్ ఆడమిల్లిలోని ఆమె ఇంటి వద్ద అరెస్ట్ చేశారు. భీమడోలు కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి ఆమెకు 14 రోజుల రిమాండ్ విధించినట్టు ఎస్సై చెప్పారు. -
పిల్లలు లేకున్నా హాజరు
జంగారెడ్డిగూడెం: పిల్లలు లేకున్నా రిజిస్టర్లో హాజరు వేస్తున్నారు. ఇది మండలంలోని మైసన్నగూడెం గ్రామంలోని అంగన్వాడీ ప్రీస్కూల్ పరిస్థితి. అంగన్వాడీ కేంద్రం సరిగా నిర్వహించడం లేదని వచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో విజిలెన్స్ కమిటీ సభ్యుడు డాక్టర్ వంటిపల్లి విజయకృష్ణ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో అంగన్వాడీ ప్రీ స్కూల్ పరిస్థితిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగన్వాడీ తెరిచి ఉన్నప్పటికీ పిల్లలు గాని, సిబ్బందిగానీ లేరు. విద్యార్థులు వచ్చినట్లు నమోదు చేయడాన్ని తీవ్రంగా పరిగణించారు. నిర్వాహకులు, సూపర్వైజర్పై వెంటనే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. భీమవరం: భీమవరం పట్టణానికి చెందిన గండి నానిబాబుకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్ధానం దక్కింది. ఫిబ్రవరి 2న గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు హైదరాబాద్‌లో నిర్వహించిన సామూహిక కీబోర్డు ప్లే కార్యక్రమంలో ఆర్గనైజర్‌గా సేవలందించిన నానిబాబుకు సంస్థ జ్ఞాపిక, ప్రశంసాపత్రాన్ని హెల్లెల్ మ్యూజిక్ స్కూల్ వ్యవస్థాపకుడు డి.అగస్టీన్ చేతుల మీదుగా అందించారు. ఉండి: భార్యా భర్తల మధ్య మనస్పర్ధల కారణంగా భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు కథనం ప్రకారం ఉండి మండలం పాందువ్వకు చెందిన వీధి నవీన్‌కుమార్(28)కు ఏడాది క్రితం వివాహమైంది. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు తలెత్తడంతో నవీన్‌కుమార్ ఈ నెల 11న రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయాన్ని కువైట్‌లో ఉంటున్న తల్లికి ఫోన్ చేసి చెప్పాడు. ఆమె వెంటనే గ్రామంలోని మేనమామకు సమాచారం ఇవ్వడంతో వారు వెంటనే వెళ్ళి అతనిని భీమవరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందించారు. అక్కడ నుంచి మెరుగైన చికిత్స కోసం మరో ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఉండి : ధాన్యం లోడుతో వెళుతున్న ట్రాక్టర్ బోల్తా కొట్టింది. యండగండి, ఉణుదుర్రు మధ్య ఈ ప్రమాదం సంభవించినట్లు స్థానికులు తెలిపారు. ఎవరికీ ఎలాంటి హాని జరగకపోవడంతో వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు. గణపవరం మండలం నుంచి భీమవరం మిల్లుకు ట్రాక్టర్ వెళ్తుండగా ఈ ఘటన జరిగిందని అధికారులు తెలిపారు. ట్రాక్టర్లో కొన్ని ధాన్యం బస్తాలు పక్కనే వున్న ఉండి కాలువలో పడిపోయాయి. ముసునూరు: రాళ్ల దాడి ఘటనలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై ఎం. చిరంజీవి తెలిపారు. మండలంలోని చింతలవల్లికి చెందిన డేరంగుల గంగయ్య (45) పై ఈ నెల 7వ తేదీ గురువారం గ్రామానికి చెందిన కలపాల నాగరాజు మద్యం మత్తులో విచక్షణా రహితంగా రాళ్లతో దాడి చేశాడు. కుటుంబ సభ్యులు బాధితుడిని నూజివీడు ఏరియా ఆసుపత్రికి తరలించగా, మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు శవ పంచనామా, పోస్టుమార్టం నిర్వహించి, మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించనున్నట్లు ఎస్సై తెలిపారు. జంగారెడ్డిగూడెం: బంగారు వస్తువుల చోరీకి సంబంధించి బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఎన్వీ ప్రసాద్ తెలిపారు. చైతన్యమిత్ర ఈ నెల 9న హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి కుటుంబంతో కలిసి వెళ్ళాడు. మంగళవారం చైతన్యమిత్ర ఇంటి తాళాలు పగులగొట్టి ఉండటాన్ని ఇంటి పక్కవారు గమనించి చైతన్యమిత్రకు సమాచారం ఇచ్చారు. హైదరాబాద్ నుంచి వచ్చిన చైతన్యమిత్ర ఇంట్లోకి వెళ్లి చూడగా, బీరువాలో ఉంచిన 15 గ్రాముల బంగారు వస్తువులు చోరీకి గురైనట్లు గుర్తించి, పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
సేతులెత్తేశారు..!
కైకలూరు: జిల్లా కేంద్రం ఏలూరు నుంచి కైకలూరును అనుసంధానం చేసే మణుగునూరులంక వద్ద పెదయడ్లగాడి వంతెన ప్రమాదభరితంగా మారుతోంది. పలుచోట్ల వంతెన రెయిలింగ్‌లు దెబ్బతినడంతో పాటు వంతెన బీటలు వారింది. రాత్రిళ్లు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఏటా వర్షాకాలంలో ఎగువ నుంచి పెద్దఎత్తున గుర్రపుడెక్క కొట్టుకురావడం, ఈ వంతెన ఖానాల వద్ద పేరుకుపోవడం జటిల సమస్యగా ఉంది. వంతెనకు తక్షణం మరమ్మతులు చేయాలని ఈ ప్రాంత వాసులు కోరుతున్నారు. కొల్లేరు నీరు వంతెన మీదుగా.. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లోని 12 మండలాల పరిధిలో 2,22,300 ఎకరాల విస్తీర్ణంలో కొ ల్లేరు సరస్సు విస్తరించి ఉంది. కొల్లేరు పరీవాహకంలో 122 గ్రామాలున్నాయి. బుడమేరు, రామిలేరు, తమ్మిలేరు, చంద్రాలు, వట్లూరు డ్రెయిన్లు, గుండేరు, దోసపాడు వాగు, మొండుకోడు, ఏలూరు కాల్వ, ఎస్సేపుల, తోకలపల్లి, పందికోడు, పోల్‌రాజ్, కై కలూరు శ్యాంప్ వంటి 67 డ్రెయిన్లు, వాగుల ద్వారా వరదల సమయంలో 1.10 లక్షల క్యూసెక్కుల నీరు కొల్లేరుకు చేరుతుంది. ఈ నీరంతా కొల్లేరుకు చేరిన నీరు పెదయడ్లగాడి వంతెనకు చేరుతుంది. అక్కడ నుంచి ఉప్పుటేరు ద్వారా సముద్రానికి చేరాలి. 65 వేల క్యూసెక్కుల నీరు పెదయడ్లగాడి–ఉప్పుటేరు మధ్య దూరం 18 కిలోమీటర్లు ఉంది. ప్రస్తుత కాలంలో పెదయడ్లగాడికి 65 వేల క్యూసెక్కుల నీరు వస్తుంది. ఇందులో 20 వేల క్యూసెక్కుల నీరు చినయడ్లగాడి ద్వారా పంపడానికి వంతెన నిర్మాణం గతంలోనే జరిగింది. పెదయడ్లగాడి నుంచి పెనుమాకలంక, ఇంగిలిపాకలంక రహదారి నిర్మాణం కారణంగా నీటి పారుదలకు అడ్డువచ్చి ఆ ప్రభావం వంతెనపై పడుతోంది. 50 ఏళ్లు దాటిన నిర్మాణం రెడ్డిరాజుల కాలంలో ఏలూరు–కై కలూరు మధ్య పరిపాలకరెడ్లు, పాలానా విభాగపు రెడ్లు నివసించేవారు. వీరిలో పెద్దరెడ్లు ఉండే ప్రాంతాన్ని పెదరెడ్లగాడి, చిన్న రెడ్లు నివసించే ప్రాంతాన్ని చినరెడ్లగాడి అని పిలిచేవారు. కాలక్రమంలో పెదయడ్లగాడి, చినయడ్లగాడిగా రూపాంతరం చెందాయి. 1975 జూన్ 23న అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు పెదయడ్లగాడి వంతెనను ప్రారంభించారు. ఈ వంతెన ప్రారంభంతో కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాలకు రవాణా సౌకర్యం ఏర్పడింది. ప్రమాదకరంగా పెదయడ్లగాడి వంతెన దెబ్బతిన్న బ్రిడ్జి రెయిలింగ్‌లు విద్యుత్ దీపాలు లేక ప్రమాదాలు ఏటా వంతెన ఖానాల వద్ద పేరుకుపోతున్న గుర్రపుడెక్క కై కలూరు–ఏలూరు రహదారిలో పెదయడ్లగాడి వంతెన కీలకం. రోజూ ఆక్వా సంబంధిత పనులకు వేలాది మంది ఇటుగా ప్రయాణిస్తున్నారు. ఆక్వా ఉత్పత్తుల రవాణాకు ఈ వంతెనే ప్ర ధానం. వంతెనకు పూర్తిస్థాయిలో మరమ్మ తులు చేయించాలి. బ్రిడ్జిపై విద్యుత్ దీపాలు వేయించేలా చర్యలు తీసుకోవాలి. –బలే నాగరాజు, ఆక్వారైతు, కొవ్వాడలంక, మండవల్లి మండలం -
ఏసీబీకి చిక్కిన ఎస్సై
తాడేపల్లిగూడెం అర్బన్: పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణ ఎస్సై పి.నాగరాజు రూ.70 వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డారు. తాడేపల్లిగూడెం కడకట్ల ప్రాంతానికి చెందిన ఓ ప్రేమజంట (మేజర్లు) గత నెలలో వివాహం చేసుకునేందుకు ప్రయత్నించగా... యువతి తల్లిదండ్రులు అడ్డుకుని తమ కుమార్తెను మోసగించి పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని పట్టణ పోలీస్ స్టేషన్లో యువకుడిపై ఫిర్యాదు చేశారు. పట్టణ ఎస్సై పి.నాగరాజు యువకుడు అభిలాష్, అతడి తల్లిదండ్రులను ఈ నెల 6న పోలీస్ స్టేషన్‌కు పిలిపించి అభిలాష్‌పై రౌడీషీట్ వేయిస్తానని, అత్యాచారం కేసు నమోదు చేస్తానని బెదిరించారు. రూ.2 లక్షలు ఇస్తే అభిలాష్‌ను వదిలేస్తామని చెప్పగా.. అంత ఇవ్వలేమని రూ.70 వేలు ఇస్తామనడంతో ఎస్సై నాగరాజు అంగీకరించారు.అనంతరం యువకుడి తల్లి నీలాపు కుమారి ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఏసీబీ అధికారులు ఇచ్చిన ట్రాపింగ్ నోట్లు తీసుకుని గురువారం పోలీస్ స్టేషన్లో ఎస్సై నాగరాజుకు రూ.70 వేలు ఇస్తుండగా పక్కన ఉన్న బాలసుబ్రహ్మణ్యం అనే కానిస్టేబుల్‌కు ఇవ్వమని ఎస్సై చెప్పారు. దీంతో కానిస్టేబుల్ బాలసుబ్రహ్మణ్యం రూ.70 వేలు తీసుకుంటుండగా ఏలూరు నుంచి వచ్చిన ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. ఎస్సై, కానిస్టేబుల్‌పై కేసు నమోదు చేశారు. పోలీస్ స్టేషన్లోనే సెటిల్మెంట్లు పేరుతో భారీగా అక్రమ సొమ్ములు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు రావడంతో ఎస్సై నాగరాజుతోపాటు ఆయన కుటుంబ సభ్యుల పేరున ఉన్న ఆస్తుల వివరాలపై విచారణ చేస్తున్నట్టు సమాచారం. -
16న ఆనంద సీ్త్ర శక్తి పురస్కారాలు
భీమవరం (ప్రకాశంచౌక్): ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ అధ్వర్యంలో ఉద్దరాజు వెంకట లక్ష్మీ నరసయ్య 51వ వర్ధంతి సందర్భంగా ఈ నెల 16న ఆనంద సీ్త్ర శక్తి పురస్కారాలు–2026 అందిస్తున్నట్లు ఫౌండేషన్ చైర్మన్ ఉద్ధరాజు కాశీ విశ్వనాథ్ రాజు, కంతేటి వెంకటరాజు, దాయన చంద్రజీ తెలిపారు. మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ మంత్ర మహేశ్వరీ, శ్రీ శక్తీపీఠాదిశ్వరి (తిరుపతి) మాతాజీ రమ్యానంద భారతీ స్వామిని, శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ డాక్టర్ వి ఉమ, రచయిత్రి పారిశ్రామికవేత్త మోహన ఇందుకూరి తదితరులకు ఆనంద సీ్త్ర శక్తి పురస్కారాలను అందిస్తున్నామన్నారు. అలాగే మున్సిపల్ మహిళా పారిశుద్ధ్య కార్మికులు 65 మందికి అభినందన సత్కారాలు చేస్తున్నామని తెలిపారు. భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లా సమగ్ర అభివృద్ధి, ఆర్థిక పురోగతిలో భాగంగా పారిశ్రామిక, విద్య, గృహ నిర్మాణ, స్వయం ఉపాధి రంగాలకు సంబంధించిన రుణాలను నిర్ణీత గడువులోగా మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి బ్యాంకు అధికారులకు సూచించారు. మంగళవారం భీమవరం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి సమీక్ష కమిటీ (డీఎల్ఆర్సీ) సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలో 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు పురోగతిని జిల్లా కలెక్టర్ వివరించారు. కార్యక్రమంలో ఎంపీ పాకా వెంకట సత్యనారాయణ, జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ ఎ.నాగేంద్ర ప్రసాద్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజినల్ హెడ్ వీరభద్రరావు, ఆర్బీఐ ఏజీఎం సీజీ కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. భీమవరం: నీట్ పేపర్ లీకేజీకి కేంద్ర ప్రభుత్వ అసమర్థతే కారణమంటూ మంగళవారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో భీమవరం ప్రకాశం చౌక్ సెంటర్లో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి టి.ప్రసాద్ మాట్లాడుతూ 720 మార్కులకు గానూ దాదాపు 600 మార్కుల ప్రశ్నలు లీక్ అయ్యాయంటే నిర్వహణ ఎంత అధ్వానంగా ఉందో? తెలుస్తుందన్నారు. ప్రతిష్టాత్మకమైన ప్రవేశ పరీక్షల నిర్వహణలో జరుగుతున్న అవకతవకలకు కేంద్రప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. పేపర్ లీకేజీపై సమగ్ర విచారణ జరపాలని దోషులను కఠినంగా శిక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు లక్ష్మణ, సహాయ కార్యదర్శి బి.సింధు, కె.రోహిత్, పి.సాయికృష్ణ పాల్గొన్నారు. భీమవరం: వాకింగ్‌కు వెళ్లిన తన భార్య తిరిగిరాలేదని భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు భీమవరం టూటౌన్ ఎస్సై రహమాన్ మంగళవారం విలేకరులకు తెలిపారు. వివరాల ప్రకారం పట్టణంలోని చెట్టుకింద సాయిబాబా గుడి ప్రాంతంలో గొట్టుముక్కల లక్ష్మీపతిరాజు తన భార్య గోవిందమ్మతో కలసి జీవిస్తున్నారు. ఈ నెల 8న గోవిందమ్మ డీఎన్నార్ కళాశాల ఆవరణలోనికి వాకింగ్‌కు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో లక్ష్మీపతిరాజు పోలీసులను ఆశ్రయించాడు. భీమడోలు: ఉపాధి హామీ ఏదీ? అంటూ ఈనెల 10న సాక్షిలో ప్రచురితమైన కథనానికి సంబంధిత అధికారులు స్పందించారు. కూలీలకు పనులు కల్పించకుండా నిర్లక్ష్యం వహించిన ఫీల్డ్ అసిస్టెంట్‌కు మెమో జారీ చేసినట్లు భీమడోలు ఎంపీడీఓ సీహెచ్ పద్మావతిదేవి మంగళవారం రాత్రి తెలిపారు. అలాగే ఎట్టకేలకు గుండుగొలనులో ఉపాధి హామీ పనులను మొదలు పెట్టించారు. పంచాయతీ పరిఽధిలోని రంగన్న చెర్వు నుంచి కొరుకల్లు వైపు ఉన్న మైనర్ ఇరిగేషన్ డ్రైయిన్‌ను మంగళవారం ఉపాధి హామీ కార్మికులు 100 మంది పూడిక తీశారు. భీమడోలు ఏపీఓ నాగరాజు పర్యవేక్షణలో పనులు చేపట్టారు. అయితే గ్రామంలో సుమారు వెయ్యికి పైగా ఉపాధి కూలీలు ఉన్నారని, వారికి కూడా పనులు కల్పించాలని కోరారు. -
రేషన్ మాఫియాను అరికట్టాలి
ఏలూరు (టూటౌన్): ఏలూరు జిల్లాలో అక్రమ రేషన్ మాఫియా పైన సొంత పార్టీ నేతలే జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడం చూస్తుంటే రాష్ట్రంలో పాలన ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చని వైఎస్సార్ సీపీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ సొంగ సందీప్ అన్నారు. స్థానిక కలెక్టరేట్ వద్ద నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పేద ప్రజలకు అందాల్సిన రేషన్ బియ్యం రాష్ట్రాల నుంచి దేశాలకు తరలిస్తున్న మాఫియాను అరికట్టాలని డిమాండ్ చేశారు. పౌరసరఫరాల శాఖ మంత్రి, జనసేన నేత నాదెండ్ల మనోహర్ ఈ విషయంపై స్పందించాలని డిమాండ్ చేశారు. కాకినాడలో సీజ్ ద షిప్ అన్న డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌కు నాయకులపై చర్యలు తీసుకునే దమ్ము ఉందా? అని ప్రశ్నించారు. రేషన్ మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలి ఏలూరు (టూటౌన్): జిల్లాలోని చింతలపూడి, లింగపాలెం మండలాల కేంద్రంగా రేషన్ బియ్యం అక్రమ రవాణా చేస్తున్న మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఎం ఏలూరు జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఆర్.లింగరాజు ఒక ప్రకటన విడుదల చేశారు. కొంతమంది అక్రమార్కులు పీడీఎస్ బియ్యాన్ని అక్రమ పద్ధతుల్లో సేకరించి రీసైక్లింగ్ చేసి కోట్ల రూపాయలు దండుకుంటున్నారని విమర్వించారు. తెలుగుదేశం పార్టీకి చెందిన అధికార పార్టీ నాయకులే రేషన్ బియ్యం అక్రమ రవాణా చేస్తున్నారని, పైగా ఆపార్టీ నాయకులే బయటపెడుతున్నారని, దీన్ని బట్టి రేషన్ బియ్యం అక్రమ రవాణా ఏ స్థాయిలో ఉందో తెలుస్తుందని పేర్కొన్నారు. ఇప్పటికై నా అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
భూసేకరణ ఆపాలని గిరిజనుల ధర్నా
బుట్టాయగూడెం: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల కోసం బుట్టాయగూడెం, జీలుగుమిలి మండలాల్లో భూసేకరణను నిలుపుదల చేయాలని కోరుతూ ఆదివాసీ సేనా సంఘం ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట గిరిజనులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆదివాసీ సేనా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మడకం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ నిర్వాసితులు కోసం బుట్టాయగూడెం, జీలుగుమిల్లి మండలాల్లో జరుగుతున్న భూసేకరణ భూటకపు భూసేకరణ అని విమర్శించారు. భూసేకరణలో అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. గిరిజనులకు పట్టాలు ఉన్న భూములు, గిరిజనులు ఎన్నో ఏళ్లుగా సాగులో ఉన్న భూములను సేకరించి గిరిజనేతరుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నారని ఆరోపించారు. భూసేకరణలో బ్రోకర్ల హావా నడుస్తుందని తీవ్రంగా విమర్శించారు. అనంతరం తహసీల్దార్ రాధాకృష్ణకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా తహశీల్దార్ రాధాకృష్ణ మాట్లాడుతూ భూసేకరణ ఎంతో పారదర్శకంగా చేసినట్లు, భూములకు సంబంధించి అన్ని రికార్డులు ఉన్న వారికి పూర్తి న్యాయం చేస్తున్నామని తెలిపారు. -
మద్దిలో పోటెత్తిన భక్తులు
జంగారెడ్డిగూడెం: హనుమద్ జయంతి మహా పర్వదిన సందర్భంగా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో ఉన్న శ్రీ మద్ది ఆంజనేయస్వామి వారి ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు 108 ప్రదక్షిణలు చేసి, మొక్కులు తీర్చుకున్నారు. సుమారు 30వేల మంది భక్తులు శ్రీ స్వామి వారిని దర్శించుకున్నారని, సుమారు 10,500 మంది భక్తులకు శ్రీ స్వామి వారి నిత్యాన్నదాన సత్రంలో అన్నప్రసాదాన్ని స్వీకరించినట్లు ఈఓ ఆర్వీ చందన తెలిపారు. ఆలయానికి వివిధ సేవల రూపేణా రూ.7,33,190లు ఆదాయం వచ్చిందన్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా జంగారెడ్డిగూడెం సీఐ ఎంవీ సుభాష్ ఆధ్వర్యంలో లక్కవరం ఎస్సై షేక్ జబీర్, జంగారెడ్డిగూడెం ఎస్సై ఎన్వీ ప్రసాద్, జంగారెడ్డిగూడెం ట్రాఫిక్ ఎస్సై ఎం.కుటుంబరావు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. -
మిల్లుల నుంచి కదలని బియ్యం
బుధవారం శ్రీ 13 శ్రీ మే శ్రీ 2026భీమవరం: కేంద్ర ప్రభుత్వం బియ్యం సేకరణలో నూక శాతాన్ని తగ్గించడానికి చేస్తున్న ప్రయత్నాలు మిల్లర్లకు గుదిబండగా మారాయి. గతంలో రైతులు పండించిన ధాన్యాన్ని మిల్లర్లు నేరుగా కొనుగోలు చేసి ఎఫ్‌సీఐకి విక్రయించేవారు. అప్పట్లో మిల్లర్లు తేమ శాతం ఎక్కువని, ముక్కపాయ అని సాకులు చెబుతూ రైతులకు తక్కువ ధర చెల్లించి మోసం చేసేవారు. రైతులు, మిల్లర్లకు మధ్య దళారుల పెత్తనం ఎక్కువగా ఉండటంతో రైతులు తీవ్రంగా నష్టపోయే వారు. వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత, రాష్ట్ర ప్రభుత్వమే రైతుల నుంచి నేరుగా ధాన్యం కొనుగోలు చేసి, మర ఆడించడానికి మిల్లర్లకు ఇచ్చి వారికి మజూరీ చెల్లించే విధానాన్ని తెచ్చింది. రైతుల నుంచి నేరుగా ధాన్యం కొనుగోలు చేయడానికి రైతు భరోసా కేంద్రాలు ఎంతగానో ఉపయోగపడేవి. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ కావడంతో, దళారుల బెడద లేకుండా కష్టానికి తగ్గ ఫలితం దక్కేది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కూడా అదే విధానాన్ని అనుసరిస్తుండటంతో రైతులు నిశ్చింతగా ధాన్యాన్ని విక్రయించుకుంటున్నారు. అవసరమైన గోనె సంచుల సరఫరా లేకపోవడం, ధాన్యం తూకాల్లో జరుగుతున్న మోసాల వల్ల రైతులు కొంత మేర నష్టపోతున్నారు. 8 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు లక్ష్యం జిల్లాలోని 20 మండలాల పరిధిలో 2.35 లక్షల ఎకరాల్లో దాళ్వా వరి సాగు చేయగా, వాతావరణం అనుకూలించి పంట ఏపుగా పెరిగింది. దీనివల్ల 9.30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. కొంతమంది రైతులు ఎకరాకు 60 బస్తాల వరకు దిగుబడి సాధించడంతో, ఈ అంచనా మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రభుత్వం 8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుని, రైస్ మిల్లుల సామర్థ్యాన్ని బట్టి ధాన్యాన్ని కేటాయించింది. ఇప్పటివరకు 7 వేల మంది రైతుల నుంచి దాదాపు 6.20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి, రైతులకు సుమారు రూ. 1,470 కోట్లు చెల్లించారు. కేంద్ర ప్రభుత్వం బియ్యంలో నూక శాతాన్ని మార్పు చేయడంతో సేకరణలో కొంత జాప్యం జరిగింది. గతంలో 15 శాతం నూక ఉన్నా సేకరించేవాళ్ళం. అయితే ప్రజలకు మరింత నాణ్యమైన బియ్యం అందించాలనే ఉద్దేశంతో నూక శాతాన్ని 10 శాతానికి తగ్గించారు. ప్రభుత్వ అనుమతులు రాగానే మిల్లర్ల నుంచి బియ్యాన్ని తీసుకుంటాం. – ఎండీ ఇబ్రహీం, సివిల్ సప్లయిస్ జిల్లా మేనేజర్, భీమవరం మిల్లర్లు ధాన్యాన్ని మరపట్టించి బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం బియ్యంలో నూక శాతాన్ని 15 శాతం నుంచి 10 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడంతో సేకరణలో ఇబ్బందులు తలెత్తాయి. ఈ నిర్ణయం అమలులోకి రావడంలో జాప్యం జరగడంతో, మిల్లర్ల వద్దే బియ్యం, ధాన్యం బస్తాలు పేరుకుపోయాయి. వీటిని నిల్వ చేయడానికి స్థలం లేక మిల్లర్లు ఇబ్బందులు పడుతున్నారు. ఈ వేసవిలో అకాల వర్షాలు కురుస్తుండటంతో బయట ఉన్న ధాన్యం బస్తాలు తడిసిపోతాయని ఆందోళన చెందుతున్నారు. మరోవైపు గోనె సంచుల కొరతతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం వెంటనే బియ్యాన్ని సేకరించకపోతే పరిస్థితి మరింత తీవ్రమవుతుందని మిల్లర్లు వాపోతున్నారు. నూక శాతం మార్పుతో ఇబ్బందులు జిల్లాలో 8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యం ఇప్పటికే 6.20 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు ధాన్యం, బియ్యం నిల్వకు చోటు లేక మిల్లర్ల అవస్థలు -
ప్రశాంతంగా ఏపీ ఈఏపీ సెట్ పరీక్షలు
తాడేపల్లిగూడెం (టీఓసీ): రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ సాంకేతిక విద్యా సంస్థల్లో ప్రవేశాలకు గాను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ప్రవేశ పరీక్ష ఏపీ ఈఏపీ సెట్ పరీక్షలు మంగళవారం ప్రారంభమయ్యాయి. పరీక్ష కోసం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏడు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. తాడేపల్లిగూడెం శ్రీ వాసవి ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం, సాయంత్రం రెండు పూటల పరీక్షలు జరిగాయి. ఉదయం జరిగిన పరీక్షకు 240 మందికి 231 మంది, సాయంత్రం జరిగిన పరీక్షకు 240 మందికి గానూ 230 మంది హాజరయ్యారు. ప్రిన్సిపాల్, చీఫ్ సూపరింటెండెంట్ డాక్టర్ రాంబాబు, పరీక్ష కేంద్రం కోఆర్డినేటర్ నటరాజ్, సిస్టమ్ అడ్మిన్ కొల్లా సురేష్, టీసీఎస్ సంస్థ ప్రతినిధులు పరీక్షా నిర్వహణను పర్యవేక్షించారు. భీమవరంలో.. భీమవరం: ఏపీ ఈఏపీ సెట్ పరీక్ష మంగళవారం ప్రశాంతంగా ప్రారంభమైంది. పట్టణంలో ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం, మధ్యాహ్నం రెండు షిప్టులలో జరిగిన ఈ పరీక్షకు 300 మందికిగాను 287 మంది విద్యార్థులు హాజరయ్యారు. విష్ణు ఇంజనీరింగ్ కళాశాలలో 220 మందికిగాను 216 మంది, డీఎన్నార్ అటానమస్ కళాశాలలో 200 మందికి 194 మంది హాజరయ్యారు. డీఎన్నార్ ఇంజనీరింగ్ కళాశాలలో 200 మందికిగాను ఆరుగురు గైర్హాజరయ్యారు. -
అదనపు రుసుం వసూలు చేయొద్దు
రద్దు చేసిన నీట్ పరీక్ష తిరిగి నిర్వహించే సమయంలో విద్యార్థుల నుంచి ఎలాంటి అదనపు రుసుం వసూలు చేయకూడదు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉచిత ప్రయాణ సౌకర్యాలు లేదా స్థానిక పరీక్షా కేంద్రాలను కేటాయించాలి. ప్రతి ఏటా పేపర్ లీకేజీలు జరగకుండా శాశ్వత చట్టపరమైన పరిష్కారం చూపాలి. ప్రస్తుతం ఉన్న కేంద్రీకృత పరీక్షా విధానాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయాలి. – పాతినవలస రాజేష్, వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు దేశవ్యాప్తంగా జరిగిన నీట్ ప్రవేశ పరీక్షలలో 20 లక్షలకు పైగా విద్యార్థులు రాశారు. ఈ రోజు పేపర్ లీకుతో పరీక్ష రద్దు చేయడం విద్యార్థి లోకానికి తీవ్ర అన్యాయం. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలి. చాలామంది విద్యార్థులు బాగా చదువుకొని నీట్ ప్రవేశ పరీక్షలో సీటు కొట్టాలన్న ఆశతో పరీక్ష రాస్తే పేపర్ లీకేజ్ చేయడంతో విద్యార్థుల జీవితాలు తీవ్రంగా నష్టపోతాయి. – డి.శివకుమార్, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు దేశంలో విద్యా మాఫియాను ఉక్కుపాదంతో అణచివేయాలి. పేపర్ లీకేజ్‌కు కారణమైన వారి ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. ఇది కేవలం లీకేజీ ఘటన కాదు, నిజాయితీగా చదివే విద్యార్థుల ఆశలు, కలలను హత్య చేసే నేరం. ఈ ఘటనలో ప్రమేయం ఉన్న అధికారులు, మధ్యవర్తులు, మాఫియా గ్యాంగులు, రాజకీయ సంబంధాలు ఉన్న వారందరినీ వెంటనే అరెస్ట్ చేసి దేశద్రోహం, క్రిమినల్ కుట్ర కేసులు నమోదు చేయాలి. – కాకి నాని, పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు -
ఇద్దరు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసుల జారీ
ఆగిరిపల్లి: మండలంలో ఇరువురు ఉపాధ్యాయులకు డీఈఓ ఎం.వెంకట లక్ష్మమ్మ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈదర జిల్లా పరిషత్ హైస్కూల్లో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్న గుజ్జా అమ్మాజీ, ఆగిరిపల్లి ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పని చేస్తున్న వేణుగోపాల్‌రావు ఆమెను వేరే చోటకి బదిలీ చేయిస్తానని చెప్పి 2024లో సుమారు రూ.3 లక్షలు తీసుకున్నాడు. డబ్బులు తీసుకుని సదరు ఉపాధ్యాయుడు తిరిగి ఆమెకు డబ్బులు చెల్లించకపోవడంతో ఈ సంవత్సరం జనవరిలో డీఈఓ వెంకట లక్ష్మమ్మకు ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారంపై నూజివీడు విద్యాశాఖ అధికారి సుధాకర్ విచారణ చేపట్టి ఇద్దరి ఉపాధ్యాయులకి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. నోటీసులపై ఇద్దరు ఉపాధ్యాయులు ఐదు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. గణపవరం: మండలంలోని అగ్రహార గోపవరం గ్రామానికి చెందిన కుంకట్ల రామాంజనేయులు తన భార్య ఏడుకొండలు (60) కనిపించడం లేదని పోలీసులను ఆశ్రయించాడు. ఎస్సై ఆకుల మణికుమార్ తెలిపిన వివరాల ప్రకారం ఏడుకొండలు గత 20 ఏళ్లుగా మతిస్థిమితం లేక రాజమండ్రిలో వైద్యం పొందుతుందని, ఈ నెల 2న ఆమె భర్తతో కలిసి పిప్పరలోని కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకున్న తర్వాత ఆమె కనిపించకుండా పోయింది. దీంతో ఆమె భర్త రామాంజనేయులు ఇచ్చిన ఫిర్యాదుపై మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. ఏలూరు (టూటౌన్): రొయ్యల మేత ధర పెంపు దారుణమని, మేత ధరల పెంపును వెంటనే ఉపసరించుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ డిమాండ్ చేశారు.మంగళవారం ఏలూరు అన్నే భవనంలో రొయ్యల మేత ధరల పెంపుపై ఆయన మాట్లాడారు.రొయ్యల మేత ధరల పెంపు వల్ల సాగు ఖర్చులు పెరిగి ఇప్పటికే సంక్షోభంలో ఉన్న ఆక్వా రైతులు మరింత సంక్షోభంలోకి కూరుకుపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్షుడు సుంకాల వలన, రొయ్యలకు వచ్చిన వ్యాధుల వలన ఆక్వా రైతులు ఇప్పటికే తీవ్రంగా నష్టపోయారని ఆయన గుర్తు చేశారు. రొయ్యల మేత తయారీ సంస్థలతో ప్రభుత్వం వెంటనే చర్చలు జరిపి మేత ధరల పెంపును నిలుపుదల చేయాలని కోరారు. -
ఆక్వా రైతు కన్నెర్ర
వీరవాసరంలో రొయ్యల మేత బస్తాల దహనం వీరవాసరం: గత రెండు నెలల కాలంలో రెండో రొయ్యల మేతల ధరలను కంపెనీలు పెంచడంతో ఆక్వా రైతులు భగ్గుమంటున్నారు. వీరవాసరంలో మంగళవారం రైతులు ఆందోళన నిర్వహించి, రొయ్యల మేతల బస్తాలను దహనం చేశారు. కంపెనీలు సిండికేట్‌గా మారి ధరలు పెంచేశారని ఆందోళన చేశారు. ఆక్వా రంగం తీవ్ర ఒడిదొడుకుల్లో ఉందని, రొయ్యల ధరలు పడిపోవడం.. మరోపక్క రొయ్యల మేతల కంపెనీలు ధరలు తరచూ పెంచడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము దేశానికి విదేశీ మారక ద్రవ్యం తీసుకొస్తున్నా.. తమకు సాగు మాత్రం లాభదాయంగా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆత్మహత్యలు చేసుకోక తప్పదని కొందరు రైతులు పేర్కొన్నారు. 2023 లో రొయ్యల మేత రేటు టన్నుకు రూ.75 వేలు ఉండగా ప్రస్తుతం రూ.1.10 లక్షలకు పైగా ఉందని, తాజా పెంపుతో ఫీడ్ రేట్ టన్నుకు రూ.1,22,000 పైగా పెరుగుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం రేట్లు తగ్గింపునకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వివిధ కంపెనీల మేత బస్తాలను దగ్ధం చేశారు. ఆందోళనలో రొయ్యల రైతులు సమాఖ్య సంఘం భీమవరం ప్రాంత అధ్యక్షుడు మళ్ళ రాంబాబు (తులసి రాంబాబు), యరక రాజు హరిహర రాజు, యరకరాజు గోపాలకృష్ణరాజు, తోట విజయకుమార్, అడ్డాల శ్రీరామచంద్రమూర్తి, గుండా నరసింహ రావు, కోటిపల్లి బాబు, దాసరి మాణిక్యాలరావు, వేండ్ర లీల కృష్ణా, తదితరులు పాల్గొన్నారు. -
అసమర్థ పాలనతో ఆక్వాకు గండం
వైఎస్సార్సీపీ గూడెం కన్వీనర్ వడ్డి రఘురాం తాడేపల్లిగూడెం: రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వ అసమర్థ పాలన ఆక్వా రైతుల పాలిట గండంగా మారిందని వైఎస్సార్సీపీ తాడేపల్లిగూడెం కన్వీనర్ వడ్డి రఘురాం ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఫీడ్ కంపెనీలు ఇచ్చే ముడుపులకు ఆశపడి, రైతుల ప్రయోజనాలను తుంగలో తొక్కి ప్రభుత్వం కంపెనీలకే వత్తాసు పలుకుతోందని ఆరోపించారు. వైఎస్ జగన్ నాయకత్వంలో అప్సడా ఏర్పాటు చేసి ఆక్వా రైతులకు అండగా నిలిచామని, వేలాది విద్యుత్ కనెక్షన్లకు కోట్లాది రూపాయల రాయితీలు ఇచ్చామని గుర్తు చేశారు. అంతర్జాతీయంగా సుంకాల భారం తగ్గినా, ఆ మేరకు రాయితీలను రైతులకు ఎందుకు అందించడం లేదని ప్రశ్నించారు. ఫీడ్ ధరలపై టన్నుకు రూ.25,000 తగ్గించాల్సి ఉండగా, కేవలం రూ.4,000 తగ్గించి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు. ఇప్పుడు ఏకంగా కేజీకి రూ.15 పెంచి ఆక్వా రంగాన్ని కుదేలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. జగన్ హయాంలో 50,800 ఆక్వా కనెక్షన్లకు ఐదేళ్లలో రూ.3,640 కోట్లు సబ్సిడీగా అందించిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రభుత్వం కృత్రిమంగా డీజిల్ కొరతను సృష్టించి ధరలు పెంచేందుకు ప్రయత్నించిందని, వైఎస్సార్సీపీ ఆందోళనకు సిద్ధమవడంతో వెనక్కి తగ్గిందని పేర్కొన్నారు. ఫీడ్ ధరలు పెంచే ముందు ఆక్వా రైతులతో సమావేశం ఏర్పాటు చేసి, వారి ఆమోదం తీసుకోవాలనే గత ప్రభుత్వ నియమాన్ని కూటమి ప్రభుత్వం తుంగలో తొక్కిందని రఘురాం విమర్శించారు. -
పాఠశాలలకు పాఠ్యపుస్తకాల సరఫరా
భీమవరం: నూతన విద్యా సంవత్సరానికి అవసరమైన పాఠ్యపుస్తకాలను జిల్లాలోని అన్ని పాఠశాలలకు పంపిణీ చేస్తున్నట్లు జిల్లా సమగ్రశిక్షా అదనపు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ పి శ్యామ్ సుందర్ చెప్పారు. మంగళవారం పుస్తకాల పంపిణీ తీరును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలోని 20 మండలాలకుగాను ఇప్పటికే 17 మండలాలకు పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు పంపిణీ చేసినట్లు చెప్పారు. మొత్తం టెక్ట్స్‌బుక్స్ సుమారు 4,75 లక్షల పుస్తకాలు అవసరం అవుతాయ న్నారు. ఈ ఏడాది ఒకటో తరగతి నుంచి 8వ తరగతి వరకు అన్ని టెక్ట్స్ బుక్స్ మారాయన్నారు. జూన్ 12వ తేదీన స్కూల్స్ ప్రారంభం కానున్నందున సెమిస్టర్ వన్‌కు సంబంధించిన టెస్ట్స్ బుక్స్ అన్ని మండలాలకు ముందుగానే సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. నాన్ లాంగ్వేజెస్ సబ్జెక్టులన్నింటిలోనూ తెలుగు, ఇంగ్లిషు మీడియంలో ప్రచురించినట్లు చెప్పారు. కార్యక్రమంలో సీఎంఓ చంద్రశేఖర్ పాల్గొన్నారు. భీమవరం: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 332 జీవోను వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కె నాగేశ్వరరావు, బి వాసుదేవరావు, ఉద్యోగుల యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షుడు కె రాజా రామ్మోహన్రాయ్ మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. సహకార సంఘ ఉద్యోగులు చేసిన ఆందోళన మేరకు వ్యవసాయశాఖా మంత్రి, కోఆపరేటివ్ అధికారులు ఆప్కాబ్ చైర్మన్ సమక్షంలో అనేక హామీలు ఇచ్చి జీవో విడుదలలో మాత్రం దీనికి విరుద్ధంగా చేయడాన్ని తప్పు పట్టారు. వెంటనే 332 జీవో రద్దుచేసి ఉద్యోగులకు ఉద్యోగ భద్రత, గతంలో ఇచ్చిన హామీలకు అనుగుణంగా జీవో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. భీమవరం: డీఎన్నార్ కళాశాల యాజమాన్యం, వసుధ ఫౌండేషన్ సహకారంతో వాలీబాల్ వేసవి శిక్షణ శిబిరం ఏర్పాటుకు ఈనెల 14వ తేదీన క్రీడాకారుల ఎంపిక నిర్వహిస్తున్నట్లు జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ జీవీ పవన్‌కుమార్‌రాజు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. డీఎన్నార్ కళాశాలలోని వాలీబాల్ క్రీడా ప్రాంగణంలో నెల రోజులపాటు రెసిడెన్సియల్ విధానంలో శిక్షణ ఇస్తామన్నారు. ఎంపికై న క్రీడాకారులకు ఉచిత భోజన, వసతి సదుపాయం కల్పిస్తామన్నారు. వివరాలకు సెల్: 99899 22122, 98669 22122, 63035 78996 నంబర్లలో సంప్రదించాలని ఆయన కోరారు. భీమవరం: ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలను ప్రశాంత వాతావరణంలో పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులంతా సమన్వయంతో పనిచేయాలని జిల్లా రెవెన్యూ అధికారి బి శివన్నారాయణరెడ్డి చెప్పారు. భీమవరం కలెక్టరేట్లో మంగళవారం ఇంటర్మీడియెట్ పబ్లిక్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్వో మాట్లాడుతూ జిల్లాలో 41 పరీక్షా కేంద్రాల్లో జనరల్, ఒకేషనల్ కోర్సులకు సంబంధించిన 22,061 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకావల్సి ఉందన్నారు. పరీక్షలు ఈనెల 21 నుంచి జూన్ 4వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రాక్టికల్ పరీక్షలు జూన్ 7 నుంచి 11 వరకు జరుగుతాయన్నారు. పరీక్షల నిర్వహణలో ఎటువంటి లోపాలు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా మాస్ కాపీయింగ్, ప్రశ్నాపత్రాల లీకేజీ వంటి ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన పర్యవేక్షణ చేపట్టాలన్నారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాశాఖ అధికారి జి ప్రభాకరరావు, జిల్లా విద్యాశాఖ అధికారి ఇ నారాయణ, కమిటీ సభ్యులు కేవీ రామారావు, వీకే మల్లేశ్వరరావు, బి నారాయణరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
లోక్ అదాలత్‌పై అవగాహన
ఏలూరు (టూటౌన్): సేవల్లో లోపంపై శాశ్వత లోక్ అదాలత్‌ను ఆశ్రయించవచ్చునని ఛైర్ పర్సన్ మేరీ గ్రేస్ కుమారి తెలిపారు. మంగళవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ భవనంలో శాశ్వత లోక్ అదాలత్ పురోగతి, నిర్వహణపై జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్. శ్రీలక్ష్మి ఆధ్వర్యంలో అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రేస్ కుమారి మాట్లాడుతూ రవాణా, పోస్టల్, విద్యుత్ సానిటేషన్, హాస్పిటల్, ఇన్సూరెన్స్, బ్యాంకింగ్, ఎన్ఆర్ఈజీఎస్, విద్య, హౌసింగ్, రియల్ ఎస్టేట్ విభాగాలలో సర్వీసు లోపంపై శాశ్వత లోక్ అదాలత్‌ను ఆశ్రయించవచ్చని సూచించారు. జంగారెడ్డిగూడెం: పారిజాతగిరి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసునికి కల్యాణోత్సవం మంగళవారం వైభవంగా నిర్వహించారు. పొణంకి సత్యపవన్ ఆచార్యులు ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు నల్లూరి రవికుమార్ ఆచార్యులు, ఋషికేష్ ఆచార్యులు, కుమార్ ఆచార్యులు, రాఘవా చార్యులు ఉదయం నుంచి నిత్య హోమం తీర్థప్రసాద గోష్టి తదితర పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కల్యాణం మండపంలో లోక కల్యాణర్థం శ్రీ శ్రీదేవి భూదేవి సమెత శ్రీ శ్రీనివాస కల్యాణోత్సవం వైఖానస ఆగమొక్తంగా నిర్వహించారు. సాయంత్రం చంద్రప్రభ వాహనం సేవ ఆలయ తిరువిధి ఉత్సవం నిర్వహించారు. కార్యక్రమాలను ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ అల్లూరి రామకృష్ణ, ఆలయ కార్యనిర్వాహణాధికారి కలగర శ్రీనివాస్ పర్యవేక్షించారు. అలాగే బుధవారం సాయంత్రం 4 గంటల నుంచి గరుడ వాహన సేవ జంగారెడ్డిగూడెం వీధుల్లో నిర్వహిస్తామని తెలిపారు. -
నీట్ రద్దుపై ఆగ్రహం
● ప్రశ్నార్థకంగా విద్యార్థుల భవిష్యత్ ● ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విద్యార్థి, యువజన సంఘాలు ఏలూరు (ఆర్ఆర్ పేట): కోటి ఆశలతో వైద్య విద్యలోకి ప్రవేశించాలనుకుంటున్న విద్యార్థులకు నీట్ రద్దుతో అశనిపాతంలాంటి దెబ్బ తగిలింది. సోమవారం ఉదయం నుంచి సామాజిక మాధ్యమాల్లో దేశవ్యాప్తంగా ఈ నెల 5న నిర్వహించిన నీట్ యూజీ పరీక్షను రద్దు చేసినట్లు వార్తలు రావడంతో విద్యార్థుల్లో కలకలం రేగింది. తొలుత ఈ వార్తలు అవాస్తవమని భావించినా, పరీక్ష రద్దు విషయాన్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ధ్రువీకరించడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇంటర్ విద్య పూర్తి చేసుకుని వైద్య విద్యలోకి ప్రవేశించడం కోసం కోటి ఆశలతో ఎంతో పట్టుదలతో చదివి రాసిన నీట్ ప్రవేశ పరీక్షను రద్దు చేయడం విద్యార్థులకు తీరని అన్యాయమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది ఒకే సెంటర్లో పరీక్ష రాసిన విద్యార్థులకు జాతీయ స్థాయి ర్యాంకులు రావడంతో నీట్ పరీక్షల నిర్వహణపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. దేశంలో రాజ్యమేలుతున్న అవినీతికి ఇది ముచ్చు తునక అంటూ అప్పట్లో విద్యారంగ నిపుణులు విమర్శలు గుప్పించారు. ఈ ఏడాది మరోసారి అలాంటి పరిస్థితులే పునరావృతం కావడం నీట్ పరీక్షల నిర్వహణలోని పారదర్శకతను ప్రశ్నార్థకం చేస్తోంది. ప్రశ్నార్థకంగా 1880 మంది భవిష్యత్తు ఈ ఏడాది నీట్ పరీక్షలకు ఏలూరు జిల్లా వ్యాప్తంగా 1880 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెల 5న ఏలూరుతో పాటు వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన పరీక్షలకు 1819 మంది హాజరయ్యారు. ఈ పరీక్షల రద్దుతో వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. పరీక్షలు రాసిన వారిలో ఈ ఏడాది ఇంటర్ రాసిన వారు అధిక సంఖ్యలో ఉండగా, ఎలాగైనా సరే వైద్య వృత్తిలో ప్రవేశించాలనే లక్ష్యంతో లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుని రాసిన విద్యార్థులూ కూడా ఉన్నారు. పరీక్ష విజయవంతంగా రాశామని సంతృప్తి చెందుతున్న తరుణంలో నీట్ పరీక్ష రద్దు ప్రకటన వారిని ఆందోళనకు గురిచేసింది. మరోసారి పరీక్ష రాయడం కత్తిమీద సాముగా వారు భావిస్తున్నారు. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విద్యార్థి సంఘాలు నీట్ పరీక్షను రద్దు చేయడంతో పలు విద్యార్థి, యువజన సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గతంలో జరిగిన తప్పులను సరిదిద్దుకుని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాల్సిన నీట్ పరీక్షను అధికారుల ఉదాసీనతతో మరోసారి రద్దు చేయాల్సి రావడం దేశ విద్యా వ్యవస్థ ప్రతిష్టను దెబ్బతీస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఘోర వైఫల్యం, వ్యవస్థాగత లోపాల కారణంగా లక్షలాది మంది వైద్య విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడుతోందని వైఎస్సార్ స్టూడెంట్ యూనియన్ జిల్లా ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. గత సంవత్సరం కూడా ఇదే తరహాలో హరియాణా, బిహార్ రాష్ట్రాల్లో నీట్ పరీక్ష పేపర్లు రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు అమ్ముడుపోయి లీకేజీ అయ్యాయని పేర్కొన్నారు. -
గోవు మృతిపై విచారణ
పాలకొల్లు సెంట్రల్: పంచారామక్షేత్రం శ్రీ క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయంలో మృతి చెందిన గోవు విషయంలో మంగళవారం వెటర్నరీ అధికారులు విచారణ చేశారు. జనవరి 28న పంచారామక్షేత్రం శ్రీ క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయంలో పుంగనూరు జాతికి చెందిన గోవు మృతి చెందిన సంఘటన అందరికీ తెలిసిందే. నాడు గోవు చనిపోయిన తర్వాత ఎందుకు చనిపోయింది? ఎలా చనిపోయిందనే విచారణ లేకుండా వెటర్నరీ డాక్టర్‌తో పరీక్ష చేయించకుండా ఆలయ అధికారులు వెంటనే ఖననం చేయించేశారు. క్షీరారామంలో గోవు మృతి, హడావుడిగా అంతిమ సంస్కారాలు చేయడంపై భక్తుల ఆగ్రహం అంటూ నాడు సాక్షిలో కథనం వెలువడింది. ఈ కథనానికి స్పందించిన షెడ్యూల్డ్ కులాల హక్కుల పరిరక్షణా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు పెద్దిరెడ్డి ప్రసన్నకుమార్ గోవు ఎలా చనిపోయింది? చనిపోయిన గోవును పరీక్ష చేయకుండా వెటర్నరీ వైద్యులు డెత్ సర్టిఫికెట్ ఎలా ఇచ్చారు అంటూ జిల్లా ఎండోమెంట్స్, జిల్లా పశుసంవర్థక శాక అధికారులకు ఆర్టీఐ ద్వారా సమాచారం కోరారు. వారు ఇచ్చిన సమాచారం ఆధారంగా జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు నిమిత్తం మంగళవారం జిల్లా పశుసంవర్థక శాఖ డిప్యూటి డైరెక్టర్ డాక్టర్ ఎల్.కె సుధాకర్ ఆలయంలో విచారణకు వచ్చారు. దీనిపై ఫిర్యాదుదారుడు ప్రసన్నకుమార్, గోవు మృతికి సర్టిఫికెట్ ఇచ్చిన రూరల్ వెటర్నరీ డాక్టర్ జి.వరప్రసాద్, ఆలయ ఈఓ ముచ్చర్ల శ్రీనివాసరావు తదితరులు విచారణలో పాల్గొన్నారు. దీనిపై తుది నివేదిక జిల్లా కలెక్టర్‌కు సమర్పిస్తామని విచారణ అధికారి సుధాకర్ తెలిపారు. -
రొయ్యల ఫీడ్ ధరలు వెంటనే తగ్గించాలి
వీరవాసరం: రొయ్యల ఫీడ్ ధరలు వెంటనే తగ్గించాలని శాసనమండలి సభ్యులు, వైఎస్సార్ సీపీ శెట్టి బలిజ విభాగ రాష్ట్ర అధ్యక్షుడు కవురు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. వీరవాసరం మండలం నవుడూరు జంక్షన్లో మంగళవారం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రొయ్యల సాగులో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉందన్నారు. రాష్ట్రంలో ఏటా 10 లక్షల టన్నుల రొయ్యల ఉత్పత్తి జరుగుతుందని, సగటున ప్రతి ఏడాది 15 లక్షల టన్నుల మేత వినియోగం జరుగుతుందని వివరించారు. ముడి సరుకుల రేటు పెరిగిందనే ఉద్దేశంతో ఫీడ్ కంపెనీలు ఇష్టానుసారం రేట్లను పెంచడం దారుణం అన్నారు. గతంలో ముడి సరుకుల రేట్లు తగ్గినప్పుడు కనీసం ఆ దిశగా తగ్గించిన దాఖలాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ఫీడ్ కంపెనీల్లో మెజార్టీ కంపెనీలన్నీ అధికార టీడీపీ నేతలకు చెందినవేనని గుర్తు చేశారు. ఫీడ్ కంపెనీలకు నష్టాలు వస్తున్నాయన్న కారణంతో ఫీడ్ ధరలు పెంచినప్పుడు, రొయ్యల రైతులకు సైతం నష్టాలు కలిగినప్పుడు రైతులు పండించిన రొయ్యల ధరలకు కూడా రేట్లు పెంచాల్సిన అవసరం ఉందన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో ఫీడ్ కంపెనీలు రేట్లు పెంచాలంటే రొయ్యల రైతులతో పాటు రైతు సంఘాల నేతలతో చర్చించి రేట్లు పెంచుకోవాలని నియమం ఉండేదన్నారు. కానీ ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం ఫీడ్ కంపెనీల ఒత్తిళ్లకు తలొగ్గి అప్సడా చట్టాన్ని నిర్వీర్యం చేసిందని దుయ్యబట్టారు. -
రేపటి నుంచి శుభకార్యాలకు బ్రేక్
● 36 రోజుల పాటు వివాహాలకు విరామం ● జూన్ 19 నుంచి మళ్లీ ముహూర్తాలు షురూ ద్వారకాతిరుమల: పెళ్లికి ముఖ్యమైంది ముహూర్తం. పెళ్లి పనులు ప్రారంభించడం దగ్గర నుంచి అన్ని పనులకు ముహూర్తాలు చూస్తాం. అలాంటి ముహూర్తాలకు 36 రోజుల పాటు బ్రేక్ పడనుంది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి వివాహాలు భారీగా జరిగాయి. జిల్లా వ్యాప్తంగా వేలాది జంటలు ఒక్కటయ్యాయి. ఈ నెల 18 నుంచి వచ్చేనెల జూన్ 18 వరకు అధిక జ్యేష్ఠ మాసం(మూఢమి) కావడంతో వివాహాలకు బ్రేక్ పడనుంది. ఈ క్రమంలో ఈనెలలో ఆఖరి ముహూర్తమైన 13న పెద్ద ఎత్తున పెళ్లిళ్లు జరగనున్నాయి. అందుకు ద్వారకాతిరుమల శ్రీవారి సన్నిధి వేదిక కానుంది. మళ్లీ జూన్ 19 నుంచి వివాహాధి శుభకార్యాలు ప్రారంభం కానున్నాయి. 36 రోజులు ఖాళీ వివాహాది శుభకార్యాలపై ఆధారపడి జీవనోపాధి పొందే పురోహితులు, పచ్చిపూల మండపాలు నిర్మించే వారు, డెకరేషన్ చేసేవారు, షామియానా పందిళ్లు వేసేవారు, వాయిద్యకారులు, క్యాటరింగ్ వ్యాపారులు, లైటింగ్ ఏర్పాటు చేసే వారికి 36 రోజుల పాటు పనులు లేనట్టే. వీరంతా మళ్లీ జూన్ 19 నుంచి బిజీ కానున్నారు. ఈ ఏడాది ముహూర్తాలు ఇవే వివాహాలకు ఈ ఏడాది జూన్ 19, 20, 21, 24, 25, 26, 27, 28, జులై 1, 2, 3, 4, 5, 8, 9, ఆగస్టు 16, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 30, సెప్టెంబర్ 1, 3, 4, 5, అక్టోబర్ 11, 14, 29, 30, నవంబర్ 5, 11, 12, 13, 14, 15, 18, 19, 20, 21, 22, 24, 25, 26, డిసెంబర్ 2, 3, 4, 10, 11, 12, 13, 15, 16, 17, 18, 19, 22, 23, 27, 29, 30, 31 తేదీల్లో ముహూర్తాలున్నాయి. ఈ నెల 14 నుంచి శుభకార్యాలకు విరామం ఏర్పడనుంది. మే 18 నుంచి జూన్ 18 వరకు అధిక జ్యేష్ఠమాసం కారణంగా వివాహాలు, గృహ ప్రవేశాలు, ఆస్తుల కొనుగోళ్లు, వ్యాపారాలు ప్రారంభోత్సవాలు వంటి ఏవిధమైన శుభకార్యాలు జరపకూడదు. ఇప్పటికే వివాహాలు కుదుర్చుకున్న వారు ఈ 36 రోజులు ఆగాల్సిందే. – గోవింద వఝుల వెంకటరమణ మూర్తి శర్మ, పురోహితుడు, ద్వారకాతిరుమల. -
వ్యక్తిపై దాడి
దెందులూరు: మండలంలోని రామారావుగూడెంలో పాత గొడవల నేపథ్యంలో నర్సింగ్ చదువుతున్న విద్యార్థి దాసరి భరత్‌కుమార్‌ను కోడి కత్తితో తీవ్రంగా గాయపరిచారని దెందులూరు ఎస్సై రాచమల్లు శివాజీ తెలిపారు. వివరాల ప్రకారం దాసరి భరత్ కుమార్ వంగాయగూడెంలో నర్సింగ్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. గతంలో రామారావుగూడెం గ్రామంలో అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఫ్లెక్సీ కట్టే విషయంలో గొడవ జరిగడంతో, ఆ కక్షతో ఆదివారం రాత్రి రామారావుగూడెం గ్రామం ఎన్టీఆర్ బొమ్మ ఖాళీ స్థలం వద్ద కూర్చుని ఉన్న భరత్‌కుమార్‌పై నేతల శ్యామ్ అనే వ్యక్తి ఒక్కసారిగా కోడి కత్తితో దాడి చేశాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు తీవ్రంగా గాయపడిన దాసరి భరత్‌కుమార్‌ను చికిత్స నిమిత్తం ఏలూరు ప్రభుత్వ వైద్యశాలలో చేర్పించగా ఐసీయూ చికిత్స పొందుతున్నాడు. బాధితుడు నేతల శ్యామ్, దవులూరి ఫణీంద్ర, కొడుదుల సతీష్, నంబూరి గుణ పృథ్వీలపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. కలిదిండి(కై కలూరు): కుటుంబ కలహాలు, మానసిక సమస్యలతో మద్వానిగూడెం వద్ద ఉప్పుటేరు వంతెనపై నుంచి ఓ వ్యక్తి సోమవారం రాత్రి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కలిదిండి మండలం కొండంగి గ్రామానికి చెందిన కె.సత్యసాయి కుమార్ (35)కు వివాహం కాగా భార్య, కుమార్తె ఉన్నారు. ఇంటి వద్ద స్వల్ప వివాదం జరగడంతో క్షణాకావేశంలో చనిపోవాలని నిర్ణయం తీసుకుని వంతెనపై నుంచి దూకాడు. దీంతో అతడి బంధువులు కలిదిండి ఎస్సై ఎస్ఎస్ఎస్ పవన్‌కుమార్ విషయాన్ని తెలపగా ఆయన కై కలూరు అగ్నిమాపక అధికారులకు తెలిపారు. కై కలూరు నుంచి ఫైర్ ఆఫీసర్ కె.క్రాంతికుమార్ సిబ్బంది వచ్చి మంగళవారం ఉదయం నుంచి గాలించారు. ఎట్టకేలకు ఉప్పుటేరు వంతెన నుంచి కొంత దూరంలో గుర్రపుడెక్క కింద భాగంలో సత్యసాయి కుమార్ మృతదేహాన్ని గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించామని పోలీసులు తెలిపారు. -
ఈవీఎం గోడౌన్ల తనిఖీ
వైభవంగా వెంకన్న కల్యాణోత్సవం పారిజాతగిరి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని కల్యాణోత్సవం మంగళవారం అత్యంతవైభవంగా నిర్వహించారు. 8లో uభీమవరం (ప్రకాశంచౌక్): పీపీ రోడ్డులోగల ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోడౌన్లలో భద్రపరిచిన ఈవీఎంలు ఉన్న స్ట్రాంగ్ రూమ్‌లను కలెక్టర్ చదలవాడ నాగరాణి మంగళవారం తనిఖీ చేశారు. గోడౌన్లకు ఏర్పాటు చేసిన భద్రతా వ్యవస్థ, సీసీ కెమెరాల పర్యవేక్షణను పరిశీలించారు. రెవెన్యూ క్లినిక్‌లు సద్వినియోగం చేసుకోవాలి భూ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెవెన్యూ క్లినిక్‌లను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి కోరారు. ఇప్పటివరకు మొత్తం 17 విడతలుగా నిర్వహించిన ఈ కార్యక్రమం ద్వారా మొత్తం 653 దరఖాస్తులు అందగా, 252 దరఖాస్తులను పరిష్కరించినట్లు చెప్పారు. 121 దరఖాస్తులను నిబంధనల ప్రకారం తిరస్కరించగా, ఇంకా 280 దరఖాస్తులు వివిధ దశలలో పరిశీలనలో ఉన్నాయని పేర్కొన్నారు. స్కాలర్‌షిప్‌నకు దరఖాస్తుల ఆహ్వానం వెనుకబడిన వర్గాల విద్యా సాధికారత, సామాజిక– ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం అమలు చేస్తున్న నేషనల్ ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకంనకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ నాగరాణి తెలిపారు. అర్హత గల విద్యార్థులు జూన్ 2వ తేదీలోగా ఎన్ఓఎస్ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. -
స్వార్థంతోనే పేదల ఇళ్ల కూల్చివేత
ఉండి: కొందరి స్వార్థం కోసం సుమారు 84 కుటుంబాలకు చెందిన ఇళ్లను కూల్చివేయడం ఎంత వరకు న్యాయం? అంటూ సీపీఎం జిల్లా కార్యదర్శి జేఎన్వీ గోపాలన్ అధికారులను ప్రశ్నించారు. గత కొద్దిరోజులుగా ఉణుదుర్రులో ఆలకోడు పక్కన నివాసముంటున్న నిరుపేదల ఇళ్లు కూల్చివేసేందుకు అధికారులు నోటీసులివ్వడంతో ఉద్రిక్తత తలెత్తింది. దీంతో సోమవారం రాత్రి బాధితులకు అండగా స్థానిక అంబేడ్కర్ విగ్రహం వద్ద గోపాలన్,ఽ జిల్లా నాయకుడు దనికొండ శ్రీనివాస్, కిలారి తవిటినాయుడు తదితరులు బాధితులతో కలసి నడిరోడ్డుపై నిద్రించారు. అలాగే మంగళవారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్బంగా గోపాలన్ మాట్లాడుతూ ఉణుదుర్రు గ్రామంలో ఇరిగేషన్,డ్రైనేజ్ భూముల్లో నివాసంటున్న 84 నిరుపేద కుటుంబాలకు ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం వెంటనే ఇంటి పట్టాలు మంజూరు చేసి వాటిని క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. గ్రామంలోని కొందరి కోసం నిరుపేదల ఇళ్లు కూల్చేస్తారా? అంటూ ప్రశ్నించారు. పెద్దల ఆక్రమణలో ఉన్న భూములపై అధికారులు చర్యలు తీసుకోకుండా పేదలపై మాత్రమే ఒత్తిడి తేవడం అన్యాయమని మండిపడ్డారు. కార్యక్రమంలో పెళ్ళూరి సుబ్రహ్మణ్యం, పలువురు బాధితులు పాల్గొన్నారు. -
అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి
భీమవరం (ప్రకాశంచౌక్): ప్రజల నుంచి స్వీకరించిన ప్రతి అర్జీపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి, నిర్ణీత గడువులోగా సత్వర పరిష్కారం చూపాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. అధికారులు పారదర్శకంగా, జవాబుదారీతనంతో పనిచేస్తూ ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని సూచించారు. కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో కలెక్టర్, జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, డ్వామా పీడీ అప్పారావు, జిల్లా రెవెన్యూ అధికారి శివన్నారాయణ, కలెక్టరేట్ పరిపాలన అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా వ్యవసాయ అధికారి జెడ్.వెంకటేశ్వర్లు తదితర అధికారులు ప్రజల నుంచి నేరుగా అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల నుంచి అందిన ప్రతి ఫిర్యాదును సంబంధిత శాఖల అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి, అర్జీదారులు కార్యాలయాల చుట్టూ తిరగకుండా వారికి సంతృప్తి కలిగే విధంగా శాశ్వత పరిష్కారం చూపాలని పేర్కొన్నారు. కలెక్టర్ స్వయంగా అర్జీదారుల వద్దకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకొని, సమస్య తీవ్రతను బట్టి సంబంధిత అధికారులకు తక్షణ చర్యల కోసం సూచనలు చేశారు. పీజీఆర్ఎస్ కార్యక్రమంలో మొత్తం 151 అర్జీలు, రెవెన్యూ క్లినిక్‌లో 42 అర్జీలు వచ్చినట్లు తెలిపారు. ప్రజలకు ప్రభుత్వం అందించే సేవలపై సానుకూల స్పందన పెంపొందేలా అధికారులు శక్తివంచన లేకుండా పని చేసి, జిల్లాను రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలపాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి అధ్యక్షతన మే 7, 8 తేదీల్లో జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో చర్చించిన అంశాలపై సోమవారం కలెక్టర్ శాఖల వారీగా అధికారులతో సమీక్ష నిర్వహించారు. వేసవి తీవ్రత దృష్ట్యా జిల్లాలో ఎక్కడా మంచినీటి కొరత తలెత్తకుండా సంబంధిత శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. పేదలకు మంజూరు చేసిన గృహాలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేసి లబ్ధిదారులకు అందించేందుకు చర్యలు తీసుకోవాలని గృహ నిర్మాణ శాఖ అధికారులను ఆదేశించారు. ఆచంటలో ఐటీఐ ఏర్పాటు కోసం అవసరమైన స్థల సేకరణ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. -
ఇంటర్ అడ్మిషన్ల పేరిట దోపిడీ
భీమవరం: జిల్లాలో నూతన విద్యాసంవత్సరం ప్రారంభం కాకముందే విద్యా వ్యాపారం జోరుగా సాగుతోంది. నూతన భవనాలు, ప్రభుత్వ అనుమతులు లేకుండానే అడ్మిషన్లు నిర్వహించడం విశేషం. ప్రధాన కూడళ్లు, రోడ్లపైన పెద్ద పెద్ద ఫ్లెక్సీలు, బ్యానర్లు పెట్టి అడ్మిషన్లు చేస్తున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో 15 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, రెండు ఎయిడెడ్, రెండు సోషల్ వెల్ఫేర్, 82 ప్రైవేటు కళాశాలలున్నాయి. ప్రైవేటు కళాశాలల్లో తగిన సదుపాయాలు, ఆటస్థలాలు లేకపోయినా ఇబ్బడిముబ్బడిగా ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రుల రక్తం పీల్చేస్తున్నారు. గత ప్రభుత్వాల పాలకులు ప్రభుత్వ కళాశాలలను పట్టించుకోకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ప్రైవేటు కళాశాలల పట్ల ఆసక్తి చూపించారు. దీంతో జిల్లాలోని ప్రధాన పట్టణాలతో పాటు గ్రామాల్లో సైతం ప్రైవేటు కళాశాలలు పెద్ద సంఖ్యలో వెలిశాయి. రూ.లక్షల్లో ఫీజులు వసూలు చేయడమే గాక బస్సు ఫీజులు, హాస్టల్ ఫీజులతో పాటు అడ్వాన్స్డ్, జేఈఈ మెయిన్స్, ఎంసెట్, ఐఐటీ ప్రవేశ పరీక్షలకు శిక్షణ అంటూ మరికొంత గుంజుతున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా శ్రీమనబడి నాడు–నేడుశ్రీ పథకంలో ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రభుత్వ జూనియర్ కళాశాలలను అభివృద్ధి చేశారు. అయినా విద్యార్థుల దృష్టి ప్రైవేటు విద్యాసంస్థలపైనే ఉంది. దీనిని ఆసరాగా చేసుకుని ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు పెద్ద మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఇబ్బడిముబ్బడిగా నూతన కళాశాలలు ఇప్పటికే ఉన్న ప్రైవేటు కళాశాలలతో పాటు జిల్లాలోని భీమవరం, పాలకొల్లు, తాడేపల్లిగూడెం, తణుకు తదితర పట్టణాలతో పాటు గ్రామాల్లో కూడా ప్రస్తుత విద్యా సంవత్సరానికి నూతన కళాశాలలను ప్రారంభిస్తున్నారు. పెద్ద భవనాలు, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, ల్యాబ్‌లు, ఏసీతో సహా అధునాతన సదుపాయాలతో తరగతి గదులు ఏర్పాటు చేస్తున్నామని, మీ పిల్లలను ఉన్నతులుగా తీర్చిదిద్దడమే మా లక్ష్యమంటూ పెద్ద ఫ్లెక్సీలు, బ్యానర్లు కట్టి విద్యార్థులు, వారి తల్లిదండ్రులని ఆకర్షిస్తున్నారు. నూతనంగా ఏర్పాటు చేస్తున్న కళాశాలలకు ఇప్పటివరకు భవనాల నిర్మాణం పూర్తికాకపోయినా, ప్రభుత్వం నుంచి అనుమతులు లేకపోయినా దర్జాగా అడ్మిషన్లు నిర్వహిస్తున్నారంటే వారి వెనుక బడా రాజకీయ నాయకులు, ఉన్నతాధికారుల హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అడ్మిషన్లు తీసుకున్న విద్యార్థులకు తరగతులు నిర్వహించడానికి ఎలాంటి జాగా లేకపోయినా ఒక కళాశాల యాజమాన్యం మంచి రోజులంటూ మొండి గోడల మధ్యనే తరగతులు ప్రారంభించడం విశేషం. ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా అడ్మిషన్లు నిర్వహిస్తున్న కళాశాలల యాజమాన్యాలపై అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో నిర్మాణంలో ఉన్న భవనాల్లోనే తరగతులు నిర్వహించడానికి సిద్ధమవుతున్నారని చెబుతున్నారు. ఫీజులు కూడా ఇంటర్లో అడ్వాన్స్డ్ గ్రూపునకు రూ. 95 వేల నుంచి రూ. 1.10 లక్షల వరకు, జేఈఈ మెయిన్స్‌కు రూ.75 వేల నుంచి రూ.90 వేల వరకు వసూలు చేస్తుండగా, విద్యార్థులు టెన్త్ పబ్లిక్ పరీక్షల్లో సాధించిన మార్కులను బట్టి రూ. 35 వేల వరకు తగ్గింపు ఇస్తూ, మరికొంతమందికి 50 శాతం రాయితీ అంటూ విద్యార్థులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. కళాశాలలో విద్యార్థులను చేర్పించడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసుకుని మరీ అడ్మిషన్లు ఇస్తున్నారంటే విద్య వ్యాపారం ప్రాధాన్యత అవగతమవుతోంది. ప్రభుత్వ అనుమతులు, భవన నిర్మాణాలు లేకుండా అడ్మిషన్లు చేస్తున్న కళాశాలల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అనుమతులు, భవనాలు లేకుండానే తరగతులు ఫీజు రాయితీలంటూ మభ్యపెట్టే ప్రయత్నం అడ్వాన్స్డ్, జేఈఈ మెయిన్స్‌కు శిక్షణ అంటూ జోరుగా వ్యాపారం ప్రభుత్వ అనుమతులు, భవన నిర్మాణాలు పూర్తి చేయకుండా అడ్మిషన్లు నిర్వహించే జూనియర్ కళాశాలల యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటాం. నిబంధనల ప్రకారం ప్రభుత్వ అనుమతి పొందిన తరువాతనే అడ్మిషన్లు చేయించాల్సి ఉంటుంది. అలా కాకుండా జాయినింగ్లు చేసుకుంటే చర్యలు తప్పవు. – జి.ప్రభాకరరావు, ఇంటర్మీడియట్ జిల్లా విద్యాశాఖాధికారి, భీమవరం: -
ఇంటి కోసం పోరాటం
ఉండి మండలం ఉణుదుర్రులో ఇళ్ల కోసం బాధితులు పోరాటం సాగిస్తున్నారు. తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించి తమ నిరసన తెలిపారు. 8లో uఆచంట నియోజకవర్గమంతా మట్టి మాఫియా, ఇసుక మాఫియాగా తయారైంది. అక్రమ తవ్వకాలను అడ్డుకున్న వారిపై అక్రమంగా కేసులు బనాయించి వేధిస్తున్నారు. అక్రమ కేసులకు ఎవరూ భయపడేది లేదు. రెడ్‌బుక్ పేరుతో భయభ్రాంతులకు గురిచేయాలని చూస్తున్నారు. ఎంత మంది మీద అక్రమ కేసులు బనాయించినా వెనకడుగు వేసేది లేదు. అక్రమ మట్టి, ఇసుక తవ్వకాల మీద పోరాటం చేస్తాం. వైఎస్సార్సీపీ కార్యకర్తలకు అండగా నిలుస్తాం. – చెరుకువాడ శ్రీరంగనాథరాజు, నియోజకవర్గ వైఎస్సార్సీపీ కన్వీనర్ ఆచంట నియోజకవర్గంలో రెడ్‌బుక్ రాజ్యాంగం మొదలైందని కూటమి నాయకులు సోషల్ మీడియాల్లో పోస్టులు పెడుతున్నారు. అక్రమ తవ్వకాలను అడ్డుకున్న సీనియర్ నేత సుంకర సీతారామ్‌ను అక్రమంగా అరెస్ట్ చేశారు. లోకేష్ రెడ్ బుక్ పట్టుకున్న ఫొటోతో వాట్సప్‌లో పెట్టి మరి కొంతమంది వైఎస్సార్సీపీ నాయకులను అరెస్ట్ చేస్తామని బెదిరిస్తున్నారు. కూటమి నాయకులు బెదిరింపులకు లొంగకుండా అక్రమ తవ్వకాలు, ఇసుక దందాలపై పోరాడతాం. – కె.వేణుబాబు, వైఎస్సార్సీపీ నేత -
సాయిప్రియను ఆదర్శంగా తీసుకోవాలి
ఆగిరిపల్లి: ఇరు రాష్ట్రాల్లో మానసిక ఆరోగ్య రంగంలో అందించిన సేవలకుగాను మండలంలోని కనసానపల్లికి చెందిన యువ సైకాలజిస్ట్ పేట సాయిప్రియకు హైదరాబాదులో సైకాలజిస్ట్ అసోసియేషన్ తరుఫున 2026 సంవత్సరానికి గాను ‘ఉమెన్ ఐకాన్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ సైకాలజీ’ అవార్డును ప్రదానం చేశారు. హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ చేతుల మీదుగా సాయిప్రియకు ఈ అవార్డు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్న వయసులోనే మానసిక ఆరోగ్య రంగంలో సేవలందిస్తున్న సాయిప్రియను యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో సినీ దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ, తెలంగాణ రాష్ట్ర మాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద, జాతీయ కమిషన్ మాజీ మహిళా సలహాదారురులు టి.వెంకటరత్నం, తెలంగాణ సైకాలజిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మోతుకూరి రామచందర్ పాల్గొన్నారు. వీరవాసరం: రైల్వేస్టేషన్ సమీపంలో మంటలు చెలరేగడం వీరవాసరంలో కలకలం రేపింది. వీరవాసరం రైల్వే స్టేషన్ సమీపంలో రైల్వే శాఖకు సంబంధించిన ఖాళీ స్థలం ఉంది. అక్కడ తాటి మట్టల మధ్య సోమవారం సాయంత్రం అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున మంటలు రావడంతో రైల్వే స్టేషన్‌లోని ప్రయాణికులు కంగారు పడ్డారు. స్థానికులు స్పందించి మంటలను అదుపు చేశారు. ఇది ఆకతాయిల పనిగా స్థానికులు పేర్కొంటున్నారు. ఏలూరు (టూటౌన్) : ఏలూరులో ఒకటవ అడిషనల్ సివిల్ జడ్జి(జూనియర్ డివిజన్)గా పనిచేస్తున్న వి.రఘునాఽథ్ని గుంటూరులో 3వ అడిషనల్ సివిల్ జడ్జి(జూనియర్ డివిజన్) కమ్ జేఎంఎఫ్సిగా బదిలీ చేశారు. ఆయన స్థానంలో తిరుపతిలో ప్రిన్సిపల్ సివిల్ జడ్జి(జూనియర్ డివిజన్) కమ్ జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్‌గా పనిచేస్త్నున్న బి.వాణిశ్రీని నియమించారు. ముదినేపల్లి(కై కలూరు): సింగరాయపాలెం అమృతేశ్వరస్వామి ఆలయ హుండీ చోరీకి గురైంది. దీనితో పాటు ఆలయ ఆవరణలోని ద్విచక్ర వాహనాన్ని సైతం దొంగలు అపహరించారు. అర్చకుడు రుద్రపాక శివసత్య వరప్రసాద్ సోమవారం ఉదయం ఈ విషయాన్ని గమనించి దేవస్థాన ఈవో ఆకుల కొండలరావు దృష్టికి తీసుకువెళ్లగా ఆయన ముదినేపల్లి పోలీసు స్టేషన్లో సోమవారం ఫిర్యాదు చేశారు. హుండీల్లో సుమారు రూ.10వేలు అపహరణకు గురైనట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ముదినేపల్లి ఎస్సై వీరభ్రదరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదానికి గురైన యువకుడి దుర్మరణం ద్వారకాతిరుమల: సెల్ఫోన్లో క్రికెట్ మ్యాచ్ చూస్తూ బైక్ నడుపుతున్న ఓ యువకుడు ఆ బైక్ అదుపు తప్పడంతో రోడ్డుపై పడి, తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన ద్వారకాతిరుమలలోని వీఎస్ దర్బార్ దాబా వద్ద ఆదివారం రాత్రి జరిగింది. స్థానికుల కథనం ప్రకారం. భీమవరంనకు చెందిన కుచర్లపాటి వర్మ(36) గత కొన్నేళ్లుగా తన భార్య, ఇద్దరు పిల్లలతో కలసి సత్తెన్నగూడెం రోడ్డులోని ఎస్ఎంఆర్ వెంచర్లో నివాసం ఉంటున్నాడు. సత్తెన్నగూడెంలో నాటుకోళ్ల ఫాంను నిర్వహిస్తున్నాడు. అలాగే గొల్లగూడెం సమీపంలోని ఓ కోడి పిల్లల హేచరీలో పనిచేస్తున్నట్టు స్థానికులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే హేచరీలో పనులు ముగించుకున్న వర్మ మండలంలోని తిమ్మాపురంలో నివాసం ఉంటున్న తన అన్నయ్య కుచర్లపాటి వెంకట నాగరాజు వద్దకు వెళ్లాడు. అక్కడి నుంచి బైక్‌పై రాత్రి 11.30 గంటల సమయంలో తన ఇంటికి బయల్దేరాడు. సెల్ఫోన్లో క్రికెట్ మ్యాచ్ చూస్తూ బైక్‌ను వేగంగా నడిపాడు. ఘటనా స్థలం వద్దకు వచ్చేసరికి బైక్ అదుపు తప్పి రోడ్డుపై పడటంతో, తీవ్ర గాయాలపాలైన వర్మ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి అన్నయ్య వెంకట నాగరాజు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు హెడ్ కానిస్టేబుల్ జి.దుర్గారావు తెలిపారు. -
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య
జిల్లా డీఈవో నారాయణ గణపవరం: ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులు, అర్హులైన ఉపాధ్యాయులు, ప్రణాళికాబద్ధమైన బోధనతో ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నాయని, అందువల్ల ప్రతి ఒక్కరూ తమ పిల్లలను ప్రభుత్వ బడులలో చేర్పించాలని పశ్చిమగోదావరి జిల్లా డీఈవో నారాయణ అన్నారు. సోమవారం గణపవరం మండలం పిప్పరలో బడి పిలుస్తుంది కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇంటింటికి తిరిగి ఎన్రోల్మెంట్ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపేలా అంగీకరింప చేశారు. కార్యక్రమంలో హెచ్ఎం జె.వెంకటేశ్వర్లు, ఎంఈవో–1 ప్రకాష్, విద్యా కమిటీ ఛైర్మన్ బాలాజీ, బుచ్చిమాస్టారు తదితరులు పాల్గొన్నారు. -
పరాకాష్టకు పచ్చ తెగింపు
చెరువుల జాతరకు అడ్డకట్ట పడదా...? ముదినేపల్లి మండలంలో చేపల చెరువుల జాతరకు అడ్డకట్ట పడటం లేదు. తవ్వకాలకు అనుమతులు ఉన్నాయంటూ ఎకరాలకు ఎకరాలు తవ్వేస్తున్నారు. 8లో uమంగళవారం శ్రీ 12 శ్రీ మే శ్రీ 2026సాక్షి, భీమవరం: ఆచంటలో కూటమి బరితెగింపు పరాకాష్టకు చేరింది. ఇసుక, మట్టి దోపిడీపై ఉన్నత స్థాయి అధికారులకు ఫిర్యాదు చేసిన ఎనిమిది మంది వైఎస్సార్సీపీ నేతల్లో దళిత మాజీ సర్పంచ్‌ను అక్రమంగా అరెస్టు చేశారు. మిగిలిన వారిపైనా కుట్రలు చేస్తున్నట్టు తెలుస్తోంది. రెడ్ బుక్ ఓపెన్‌న్ (8–1 = 7) జస్ట్ వెయిట్ అంటూ కూటమి నేతలు సోషల్ మీడియాలో పోస్టు చేయడం కక్షసాధింపు చర్యలకు నిదర్శనమని వైఎస్సార్సీపీ నేతలు మండిపడుతున్నారు. అక్రమ కేసులకు భయపడేది లేదని స్పష్టం చేస్తున్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా జిల్లాలో తీరప్రాంతానికి చేరువగా ఉన్న ఆచంట, పెనుగొండ, యలమంచిలి, నరసాపురం మండలాలను కోస్టల్ రెగ్యులేటరీ జోన్న్గా రెండేళ్ల క్రితం కేంద్రం ప్రకటించింది. ఈ ప్రాంతంలోని వశిష్ట గోదావరి తీరం వెంట సిద్దాంతం, కరుగోరుమిల్లి, కోడేరు, నడిపూడిలోని ఆరు ఓపెన్ రీచ్‌లు, నరసాపురంలోని ఐదు డిసిల్టేషన్ పాయింట్లు మూసివేశారు. ఇదే అదనుగా కూటమి నేతలు సీఆర్‌జెడ్ నిబంధనలు తుంగలో తొక్కి ఇసుక, మట్టి అక్రమ తవ్వకాలకు తెరలేపారు. ఏటిగట్టు, లంక భూములు, నక్కల డ్రెయిన్‌లో కోట్లాది రూపాయల సహజ సంపదను కొల్లగొడుతున్నారు. అక్రమ తవ్వకాలకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ స్థానిక నాయకులు పోరాటం చేస్తున్నారు. వైఎస్సార్సీపీ నేత, కొడమంచిలి మాజీ సర్పంచ్ సుంకర సీతారామ్ తదితరులు తవ్వకాలు జరుగుతున్న చోటకు వెళ్లి అడ్డుకుని అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు. రాజకీయ ఒత్తిళ్లతో అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. ఆచంట మండలంలో యథేచ్ఛగా సాగుతున్న ఇసుక, మట్టి అక్రమ తవ్వకాలుపై సీతారాంతో పాటు మరో ఏడుగురు పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. తవ్వకాలకు వ్యతిరేకంగా న్యాయస్థానం నుంచి ఆదేశాలు తీసుకువచ్చారు. ఈ క్రమంలో ఉపాధి పనుల్లో అవకతవకల పేరిట ఫీల్డ్ అసిస్టెంట్‌తో పాటు ముందెన్నడూ లేని విధంగా మాజీ సర్పంచ్ సీతారాంను ఇటీవల అక్రమంగా అరెస్టు చేయించడం తెలిసిందే. న్యాయస్థానం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు కూటమి అధికారంలోకి వచ్చాక వైఎస్సార్సీపీ శ్రేణుల్ని లక్ష్యంగా చేసుకుని రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు. ఆటోడ్రైవర్‌పై ఎమ్మెల్యే వీరంగం, సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు, అరెస్టులతో వేధింపులకు గురిచేసిన ఘటనలెన్నో. ఇదే క్రమంలో ఆచంటలో అక్రమ తవ్వకాలకు అడ్డు తగులుతున్న సీతారామ్‌పై అక్రమ కేసు బనాయించారు. మిగిలిన ఏడుగురిని లక్ష్యంగా చేసుకుని కుట్రలు చేస్తున్నారు. రెడ్ బుక్ ఓపెన్ (8–1 = 7) జస్ట్ వెయిట్ అంటూ కూటమికి చెందిన సోషల్ మీడియా గ్రూపుల్లో ఆ పార్టీలకు చెందిన వారు పోస్టులు పెట్టడం గమనార్హం. అధికారాన్ని అడ్డంపెట్టుకుని కూటమి నేతలు కుట్ర రాజకీయాలు చేస్తున్నారన్న చెప్పేందుకు ఈ పోస్టు నిదర్శనమని వైఎస్సార్సీపీ నేతలు మండిపడుతున్నారు. ఎన్ని కుట్రలు పన్నినా ప్రజల పక్షాన తమ పోరాటం ఆగదని స్పష్టం చేస్తున్నారు. ఇసుక, మట్టి సహజ సంపదను కొల్లగొడుతూ పర్యావరణానికి, ముంపు రూపంలో రైతులు, లోతట్టు ప్రాంతాల ప్రజలకు నష్టం కలిగిస్తుంటే ఉపేక్షించేది లేదంటున్నారు. ఆచంటలో అక్రమ మైనింగ్‌పై వైఎస్సార్సీపీ పోరుబాట సీఆర్‌జెడ్‌లో ఇసుక, మట్టి తవ్వకాలపై అధికారులకు ఫిర్యాదు వారిలో దళిత మాజీ సర్పంచ్ అక్రమ అరెస్టు రెడ్ బుక్ ఓపెన్ (8–1 =7) జస్ట్ వెయిట్ అంటూ సోషల్ మీడియాలో పోస్టు అక్రమాలపై పోరాటం ఆపేది లేదన్న వైఎస్సార్సీపీ -
డీఎస్పీ సారూ.. పీజీఆర్ఎస్కు హాజరుకారు
● జిల్లా స్థాయి పీజీఆర్ఎస్కు పోలీసు ఉన్నతాధికారులు హాజరుకాని వైనం ● పోలీసు కేసుల ఫిర్యాదుల పరిష్కారంపై అలసత్వం భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లా కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే జిల్లా స్థాయి పీజీఆర్ఎస్కు అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులు హాజరవుతుంటే డివిజన్ స్థాయిలోని డీఎస్పీ మాత్రం హాజరు కావడం లేదు. దీంతో జిల్లా వ్యాప్తంగా పోలీస్ కేసులకు సంబంధించి అనేక సమస్యలపై వచ్చే ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం చూపుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. సాధారణంగా జిల్లా స్థాయి పీజీఆర్ఎస్లో కలెక్టర్, జాయింట్ కలెక్టర్‌తోపాటు డీఎస్పీ స్థాయి అధికారి పాల్గొనాలి. దీని ప్రకారం భీమవరం కలెక్టరేట్లో జరిగే పీజీఆర్ఎస్కు సమీపంగా ఉన్న భీమవరం డీఎస్పీ రఘువీర్ విష్ణు హాజరుకావాలి. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భీమవరం డీఎస్పీలుగా పనిచేసిన అధికారులెవ్వరూ పీజీఆర్ఎస్కు రావడం లేదు. కనీసం సీఐలు కూడా హాజరుకాకపోవడం గమనార్హం. ఎస్సై లేదా ఏఎస్సై స్థాయి అధికారి మాత్రమే మొక్కబడిగా హాజరవుతున్నారు. దాంతో కలెక్టరేట్‌కు వచ్చే పోలీస్ సమస్యలు పరిష్కారం కావడం లేదు. ఆయా స్టేషన్లకు బదిలీ జిల్లా పీజీఆర్ఎస్లో ప్రతి సోమవారం పది నుంచి 15 ఫిర్యాదులు పోలీసు కేసులకు సంబంధించి వస్తున్నాయి. మండల స్థాయిలో పోలీసులు పట్టించుకోవడం లేదని మహిళలు అనేక కేసుల విషయంపై కలెక్టరేట్‌కు జరిగే పీజీఆర్ఎస్కు వచ్చి ఫిర్యాదు చేస్తున్నారు. అయితే ఇక్కడ వాటిని పరిష్కరించే పోలీసు అధికారి లేకపోవడంతో ఆ ఫిర్యాదులను తిరిగి ఆయా స్టేషన్లకు బదిలీ చేస్తున్నారు. గత ప్రభుత్వంలో క్రమం తప్పకుండా హాజరు గత ప్రభుత్వంలో కలెక్టరేట్లో జరిగే స్పందన కార్యక్రమానికి భీమవరం డీఎస్పీ క్రమం తప్పకుండా హాజరయ్యేవారు. పోలీసు కేసుకు సంబంధించి వచ్చే ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించేశారు. పై అధికారి స్థాయిలో ఉన్న సమస్యలను ఎస్పీ స్పందనకు బదిలీ చేసేవారు. దాంతో జిల్లా నలుమలూల నుంచి వచ్చే ప్రజలకు సంబంధించిన పోలీసు కేసుల సమస్యలు పరిష్కారమయ్యేవి. ఇప్పటికై నా కలెక్టర్ నాగరాణి ఈ విషయంపై ప్రత్యేక శ్రద్ధ వహించి డీఎస్పీ స్థాయి అధికారిని పీజీఆర్ఎస్కు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
సాలిపేట కుర్రాడికి ‘బకింగ్‌హామ్’ ఆహ్వానం
కాళ్ల: పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలం సాలిపేటకు చెందిన వావిలాల శ్రీనివాసులు యూకేలో తన సామాజిక సేవలకు గుర్తింపుగా బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో నిర్వహించిన ప్రతిష్టాత్మక కింగ్ గార్డెన్ పార్టీకి ప్రత్యేక ఆహ్వానం అందుకున్నారు. గత 20 ఏళ్లుగా యుకేలో ఉంటున్న ఆయన భారతీయ, స్థానిక సమాజాల కోసం అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆయన మాట్లాడుతూ ఇది నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని రోజు అని, బ్రిటిష్ రాజ కుటుంబం నుంచి వ్యక్తిగత ఆహ్వానం అందుకోవడం చాలా అరుదైన విషయం ఆనందం వ్యక్తం చేశారు. భిన్నాభిప్రాయాలు పెరుగుతున్న ఈ కాలంలో, మన సంస్కృతిని గౌరవిస్తూ సమాజానికి సేవ చేయడం ఎంతో ముఖ్యమని తాను నమ్ముతున్నానని తెలిపారు. -
ఇంటి కోసం పోరాటం
● ఉండి తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన ● తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్న ఉణుదుర్రు ఇళ్ల బాధితులు ఉండి: ఉణుదుర్రులో ఇళ్ల కోసం బాధితులు పోరాటం సాగిస్తున్నారు. ఆదివారం రాత్రి గ్రామ సచివాలయాన్ని ముట్టడించిన బాధితులు సోమవారం ఉండిలో తహసీల్దార్ కార్యాలయాన్ని సీపీఎం నాయకులతో సంయుక్తంగా ముట్టడించి తమ నిరసన తెలిపారు. అనంతరం తహసీల్దార్ కే నాగార్జునకు వినతిపపత్రం అందించి తమ గోడును వెళ్లబోసుకున్నారు. 70 ఏళ్లనుంచి ఎవరికీ ఇబ్బంది లేకుండా ఉణుదుర్రులో ఆలకోడులో నివాసముంటున్నామని, ఇప్పుడు రాజకీయ నాయకుల ప్రేరేపణలతో తమను అన్యాయంగా అధికారులు ఖాళీ చేయిస్తున్నారని వాపోయారు. తమ ఇళ్లను కూల్చవద్దంటూ వేడుకున్నారు. ఎన్నో ఏళ్లుగా ఇక్కడ ఉంటున్న తమను ఇప్పుడు వెళ్లిపోమంటే ఎక్కడికి వెళ్లాలని బోరున విలపించారు. ఇళ్లు ఖాళీ చేయట్లేదని మాకు వారంరోజులుగా మంచినీటి సరఫరాను నిలిపివేశారని బాధితులు ఆరోపించారు. ఎవరి సంతోషం కోసమో తమ జీవితాలు నాశనం చేయవద్దని మొర పెట్టుకున్నారు. ముందుగా మాకు నివాసయోగ్యమైన స్థలాలు చూపించాలని అక్కడ ఇళ్ళు కట్టుకునేందుకు సహకరించాలని బాధితులు కోరారు. -
లెజిస్లేటివ్ లీడర్షిప్ వర్క్‌షాపులో రవీంద్రనాథ్
తణుకు అర్బన్: బెంగళూరులో నిర్వహించిన జాతీయ స్థాయి స్టేట్ లెజిస్లేటివ్ లీడర్షిప్ వర్క్‌షాపులో ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ పాల్గొన్నారు. అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్శిటీలో పీఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు ఈ కార్యక్రమం జరిగింది. 14 రాష్ట్రాల నుంచి దాదాపు 40 మంది హాజరైన ఈ సదస్సులో.. విద్యా విధానంలో మార్పులు, ప్రజా ఆరోగ్య వ్యవస్థలోని సమస్యలు, రాష్ట్ర ఆర్థిక బడ్జెట్ నిర్వహణ వంటి కీలక అంశాలపై చర్చించినట్లు ఆయన వివరించారు. భీమవరం: ఎన్నికల హామీల అమలులో చంద్రబాబు ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని, దీనిపై వైఎస్సార్సీపీ పోరాటాలు చేయాలని ఆ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త చినమిల్లి వెంకటరాయుడు పిలుపునిచ్చారు. సోమవారం భీమవరంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. నిరుద్యోగ భృతి, మహిళలకు నెలకు రూ.1,800 నగదు, 50 ఏళ్లకే పెన్షన్లు వంటి వాగ్దానాలు నెరవేర్చలేదని విమర్శించారు. ధాన్యం కొనుగోలులో సంచుల కొరతతో రైతులు, రక్షణ లేక మహిళలు ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కొత్తగా పదవులు పొందిన నాయకులు నిత్యం ప్రజల్లో ఉంటూ సమస్యలపై పోరాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు గాదిరాజు రామరాజు, చవాకులు సత్యనారాయణ, చిగురుపాటి సందీప్ తదితరులు పాల్గొన్నారు. భీమవరం: పోలీస్ స్టేషన్లకు వచ్చే బాధితుల సమస్యల పట్ల స్పందించడంలో అలసత్వం ప్రదర్శించకూడదని, త్వరితగతిన న్యాయం జరిగేలా చూడాలని ఎస్పీ అద్నాన్ నయీం అస్మి పోలీసు అధికారులను ఆదేశించారు. సోమ వారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఎస్పీ స్వయంగా ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి, వారితో ముఖాముఖి మాట్లాడారు. అనంతరం సంబంధిత పోలీస్ స్టేషన్ల అధికారులతో ఫోన్లో మాట్లాడి, ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు. భీమవరం: విద్యార్థులు తమ జీవితంలో స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని జాయింట్ కలెక్టర్ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి అన్నారు. భీమవరం మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతిలో అత్యుత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులకు, మానవతా సంస్థ ఆధ్వర్యంలో సోమవారం ప్రతిభా పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్య ద్వారానే ఆర్థిక ఇబ్బందులను అధిగమించి సమాజంలో మంచి గుర్తింపు పొందవచ్చన్నారు. సంస్థ నిర్వాహకుడు ఇందుకూరి ప్రసాదరాజు మాట్లాడుతూ.. 23 ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులకు రూ.44 వేల నగదు పురస్కారాలు, జ్ఞాపికలు అందజేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఇ.నారాయణ, సంస్థ ప్రతినిధులు రామ్మోహనవర్మ, వెంకటపతిరాజు తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన సేవలు
భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి కాలు బెనకడంతో, భీమవరం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి ఓపీ నమోదు చేయించుకుని ఆర్ధోపెడిక్ విభాగంలో వైద్య చికిత్స పొందారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆసుపత్రిలోని పలు విభాగాలను స్వయంగా పరిశీలించారు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలు, మౌలిక వసతులు, పరిశుభ్రత, వైద్య సిబ్బంది పనితీరు తదితర అంశాలపై రోగులతో నేరుగా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఆసుపత్రిలో వైద్య సేవల నాణ్యత, అవసరమైన మందులు అందుతున్నాయా, వైద్యులు, సిబ్బంది మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తున్నారా, ఆసుపత్రి పరిసరాలు, వాష్‌రూమ్‌లు పరిశుభ్రంగా ఉన్నాయా, ఎవరైనా డబ్బులు అడుగుతున్నారా వంటి పలు అంశాలపై రోగులను ప్రశ్నించారు. జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన మౌలిక వసతుల కల్పనకు జిల్లా యంత్రాంగం దశలవారీగా చర్యలు చేపట్టిందన్నారు. నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు వైద్యశాఖ పనితీరును నిరంతరం సమీక్షిస్తున్నామని తెలిపారు. ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్న వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. -
చెరువుల జాతరకు అడ్డ్డుకట్ట పడదా..?
సాక్షి టాస్క్‌ఫోర్స్: ధాన్యాగారంగా పేరుగడించిన ముదినేపల్లి మండలంలో చేపల చెరువుల జాతరకు అడ్డకట్ట పడటం లేదు. రెవెన్యూ అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. తవ్వకాలకు అనుమతులు ఉన్నాయంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ ఎకరాలకు ఎకరాలు నిర్వాహకులు తవ్వేస్తున్నారు. అనమతులు మూరెడు.. తవ్వేది బారెడు అన్న చందంగా మారింది ముదినేపల్లి మండలంలో పరిస్థితి. పూర్వం కొల్లేరులో బడాబాబులు లీజులు పేరుతో విజయవాడ, హైదరాబాదు, విశాఖపట్నం నుంచి వచ్చి సాగు చేసేవారు. అదే పద్ధతి నేడు ఇక్కడ గ్రామాల్లో కనిపిస్తోంది. ఇతర ప్రాంతాల బడాబాబులు వచ్చి పచ్చని పొలాలను చేపల చెరువుల లీజుల పద్ధతుల్లో తవ్వుతున్నారు. ఉలిక్కిపడుతున్న ఊటుకూరు ప్రకృతితో కూడిన ప్రశాంతతకు నిలయంగా పేరు పొందిన ఊటుకూరులో ఇప్పుడు పొక్లెయిన్ల మోత వినిపిస్తోంది. ఇక్కడ ఓ వ్యక్తి చెరువు తవ్వకం చేస్తున్నారు. అనుమతులు 8 ఎకరాలకు ఉన్నాయని రెవెన్యూ సిబ్బందిలో ఒకరు చెబుతుంటే లేదు 20 ఎకరాల వరకు ఉందని మరొకరు చెబుతున్నారు. ప్రస్తుతం తవ్వుతున్న భూముల సమీపంలో మందబయిలు భూములు ఉన్నాయి. గ్రామ అవసరాలకు వీటిని ఉపయోగించుకోవచ్చు. ఈ భూముల విషయంపై ఇటీవల గ్రామంలో ఆందోళనలు సైతం జరిగాయి. రెవెన్యూ సర్వేయర్ హద్దులు కూడా నిర్ణయించకుండా తవ్వుతున్నారనే విమర్శలు వివిపిస్తున్నాయి. పైగా ఇక్కడ తవ్విన మట్టిని గట్లుకు ఉపయోగిస్తూ, కొన్ని ట్రాక్టర్లు గ్రామంలో భూములు పూడ్చడానికి వెళుతున్నాయని ఆరోపిస్తున్నారు. సర్వే చేయిస్తాం.. ఈ విషయంపై గ్రామ రెవెన్యూ అధికారి ఎంవీవీ సత్యంబాబును వివరణ కోరగా తవ్వకాలకు అనుమతులు ఉన్నాయన్నారు. మందబయిలు భూములు తవ్వితే అడ్డుకుంటామన్నారు. సర్వేయర్‌తో కలసి భూములను పరిశీలిస్తామన్నారు. నియోజకవర్గంలో చెరువుల తవ్వకాల విషయంలో మీడియా వెళుతోంటే ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్‌కు దృష్టికి తీసుకెళ్లామని నిర్వాహకులు ఘాటుగా సమాధానం చెబుతున్నారు. రెవెన్యూ అధికారుల పరిస్థితి ఇందుకు భిన్నంగా లేదు. ముదినేపల్లి మండలాన్ని మొత్తాన్ని శాశించే ఓ నాయకుడు కనుసన్నల్లోనే ఏపనైనా జరగాలనే హుకుం ఇక్కడ కొనసాగుతోంది. అధికారులు సైతం ఆయన ఇంటికి వెళ్లి శాఖాపర విషయాలు చర్చిస్తున్నారు. కూటమి నాయకుల్లో సైతం అతని మాటకు ఎదురు చెప్పలేక మిన్నుకుంటున్నారు. జిల్లా స్థాయి అధికారులు ముదినేపల్లి మండలంలో ఆక్వా చెరువులకు ఎన్ని ఎకరాలకు అనుమతులు ఇచ్చారనే విషయాన్ని బహిరంగంగా ప్రకటించాలని పలువురు కోరుతున్నారు. ఊటుకూరు చెరువు తవ్వకంపై వివాదం మందబయలు భూములు తేల్చకుండా తవ్వకం అనుమతులు ఉన్నాయంటున్నరెవెన్యూ సిబ్బంది ఎన్ని ఎకరాలనేది స్పష్టత కరవు -
భక్తులతో కిటకిటలాడిన త్రిలింగ క్షేత్రం
పెనుమంట్ర : త్రిలింగ క్షేత్రంగా పేరుగాంచిన నత్తరామేశ్వరం గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం సోమవారం భక్తులతో కిటకిటలాడింది. వైశాఖ మాసం ఆఖరి సోమవారం కావడంతో భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. వైశాఖ మాసంలో నెల రోజులు మాత్రమే దర్శనమిచ్చే గోస్తనీ నది గర్భాలయంలో ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామిని, నదీ ఒడ్డున ఉన్న సీతారామ ప్రతిష్ట శ్రీ ఉమా రామేశ్వర స్వామిని, ఆవలి ఒడ్డున ఉన్న శ్రీ లక్ష్మణేశ్వర స్వామిని భక్తులు ఏకకాలంలో దర్శించుకున్నారు. ఆలయ ఆవరణలో చలువ పందిరులు, కరల్రతో కట్టిన బారికేడ్లు ఏర్పాటు చేసినప్పటికీ అంచనాలకు మించి భక్తులు హాజరు కావడంతో హనుమాన్ గుడి నుంచి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి వరకు రాజగోపురం ఎదురుగా ఉన్న సుమారు 20 మీటర్ల పొడవున్న క్యూలైన్లో భక్తులు మండు టెండలో ఇబ్బందులు పడుతూ స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ సమీపంలో ప్రత్యేక టాయిలెట్లు ఏర్పాటు చేయకపోవడంతో మహిళలు ఇబ్బందులు పడ్డారు. దాతల సహకారంతో రామలింగేశ్వరుని కలమండపంలో స్థానిక ఎంపీటీసీ సభ్యులు టి. ఎన్.సత్యనారాయణ రెడ్డి పర్యవేక్షణలో నిర్వహించిన అన్నదానంలో సుమారు 6 వేలమందికి పైగా భక్తులు అన్న ప్రసాదం స్వీకరించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ ఆలయం వద్ద దాతల సహకారం ఉన్నప్పటికీ దేవదాయ శాఖ అధికారుల పనితీరు వల్ల భక్తులు ఇబ్బందులు పడవలసి వస్తోందని గ్రామస్తులు చెబుతున్నారు. -
గోపాలరాజు సేవలు ఎనలేనివి
భీమవరం (ప్రకాశంచౌక్): ప్రకృతి వైద్యుడు డాక్టర్ వేగిరాజు గోపాలరాజు సేవలు ఎనలేనివని శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేను రాజు అన్నారు. భీమవరం ప్రకృతి ఆశ్రమంలో సోమవారం డాక్టర్ వేగిరాజు గోపాలరాజు సంతాప సభ నిర్వహించారు. మోషేన్ రాజుతో పాటు డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు, రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ తాత, తల్లిందండ్రుల ఆశయాలు నిలబెడుతూ పేదలకు వైద్యం అందించిన ప్రకృతి వైద్యులు గోపాలరాజు అని అన్నారు. తానూ నమ్ముకున్న సిద్దాంతం కోసం గ్రామాన్ని వదలకుండా తాత, తండ్రి అందించిన ప్రకృతి ఆశ్రమంలోనే వైద్య సేవలు అందించిన గోపాలరాజు చిరస్మరణీయులన్నారు. కంతేటి వెంకటరాజు, చెరుకువాడ రంగసాయి, వేగిరాజు రామకృష్ణంరాజు, వేగిరాజు శివవర్మ, మూర్తి తదితరులు పాల్గొని నివాళులర్పించారు. -
నూజివీడు ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ప్రతిభ
నూజివీడు: నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఇంజినీరింగ్ తృతీయ సంవత్సరం చదువుతున్న ఎస్.నిఖిలేశ్వరరావు, సాయి మణికంఠ ఈశ్వర్ జాతీయస్థాయిలో విశేష ప్రతిభ చూపారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ శివలాల్ కేతావత్ మార్గదర్శకత్వంలో ఆయుష్మాన్ భారత్ – ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన ఆటో–అడ్జుడికేషన్ హ్యాకథాన్ షోకేస్ 2026 లో ‘డాక్యుమెంట్ ఫోర్జరీ/డీప్ ఫేక్ డిటెక్షన్’ విభాగంలో ద్వితీయ స్థానంలో నిలిచి రూ.3 లక్షల బహుమతిని కై వసం చేసుకున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ విద్యాసంస్థల నుంచి యువ ఆవిష్కర్తలు 3,500 మందికి పైగా పాల్గొన్న ఈ పోటీ ప్రతిష్టాత్మకంగా జరిగింది. తుది దశకు ఎంపికై న కొద్ది బృందాలలో నూజివీడు ట్రిపుల్ ఐటీ బృందం నిలిచి, తన వినూత్న ఆలోచనతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. టీమ్ రూపొందించిన ఫోరెన్సిక్ ఫ్రాడ్ డిటెక్షన్ సొల్యూషన్.. ఆరోగ్య బీమా క్లెయిమ్‌ల పరిశీలనలో ఉపయోగించే డాక్యుమెంట్లలో ఉండే ఫోర్జరీలు, మార్పులు, డీప్‌ఫేక్ ఆధారిత మోసాలను గుర్తించేందుకు సహాయ పడుతుంది. శ్రీఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన ఆరోగ్య యోజన్ఙ పథకంలో క్లెయిమ్‌ల ఆటో అడ్జుడికేషన్ ప్రక్రియలో ఈ పరిష్కారం ఉపయోగపడుతుంది. తక్కువ కంప్యూటింగ్ వనరులతో అధిక ఖచ్చితత్వంతో మోసాలను గుర్తించే విధానాన్ని ప్రదర్శించి ప్రశంసలు అందుకుంది. ఈ ఘనతకు గుర్తింపుగా టీంకు రూ.3 లక్షల నగదు బహుమతి అందజేశారు. విద్యార్థులు మాట్లాడుతూ.. ఆరోగ్య రంగంలో డిజిటల్ మోసాలను తగ్గించే దిశగా తమ పరిశోధన కొనసాగుతుందని, సమాజానికి ఉపయోగపడే సాంకేతిక పరిష్కారాలను అభివృద్ధి చేయడం తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మార్గదర్శకులైన అసిస్టెంట్ ప్రొఫెసర్ శివలాల్ కేతావత్ మాట్లాడుతూ విద్యార్థుల కృషి, పరిశోధనా పరమైన ఆలోచన, సమస్య పరిష్కార నైపుణ్యాలే ఈ విజయానికి ప్రధాన కారణమని, పరిమిత వనరులతో కూడా నాణ్యమైన పరిశోధన చేసి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం గర్వకారణమని తెలిపారు. డీప్ ఫేక్ డిటెక్షన్ విభాగంలో రన్నరప్ -
గిన్నిస్ బుక్‌లోకి పోతునూరు చిన్నారులు
చింతలపూడి: ఏలూరు జిల్లా చింతలపూడి మండలం పోతునూరు గ్రామానికి చెందిన ఇద్దరు చిన్నారులు అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించారు. షేక్ మదర్ సాహెబ్, హుస్సేన్ బి దంపతుల కుమార్తెలు షేక్ రిబ్కా, షేక్ కేజీయలు తమ కీబోర్డ్ ప్లేయింగ్ నైపుణ్యంతో ఈ ఘనత సాధించారు. గత ఫిబ్రవరిలో గిన్నిస్ ప్రతినిధుల సమక్షంలో జరిగిన భారీ సామూహిక కీబోర్డ్ ప్లే కార్యక్రమంలో భారత్, అమెరికా, బ్రిటన్ సహా 22 దేశాల నుంచి సుమారు 2,000 మంది పాల్గొన్నారు. కఠినమైన నిబంధనల మధ్య జరిగిన ఈ పోటీలో అద్భుత ప్రదర్శన కనబరిచిన 777 మంది విజేతలలో ఈ అక్కాచెల్లెళ్లు చోటు దక్కించుకున్నారు. చిన్నతనం నుంచే సంగీతంపై ఆసక్తితో క్రమశిక్షణగా శిక్షణ పొందిన వీరు, శుక్రవారం విజయవాడలో జరిగిన కార్యక్రమంలో ప్రశంసా పత్రాలను అందుకున్నారు. -
మండే ఎండల్లో అంగన్వాడీ కేంద్రాలు
● చిన్నారులు ఆపసోపాలు ● పౌష్టికాహారం ఇంటి వద్ద ఇవ్వాలని డిమాండ్ దెందులూరు: జిల్లాలో అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలకు వేసవి సెలవులు ఇచ్చారు. అంగన్వాడీ కేంద్రాలను మాత్రం చిన్నారుల వయసు ఎండలతో సంబంధం లేకుండా నిర్వహిస్తున్నారు. మండే ఎండల్లో కేంద్రాలు నిర్వహించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్తున్న చిన్నారులు, సిబ్బంది నానా ఇక్కట్లు పడుతున్నారు. అంగన్వాడీ కేంద్రం పరిధిలో ఉన్న గర్భిణులు, బాలింతలకు ఐసీడీఎస్ సిబ్బంది పౌష్టికాహారాన్ని ఇంటికి తీసుకువెళ్లి ఇస్తారు. ఈ మాదిరిగానే ఎండలు మండుతున్న దృష్ట్యా అంగన్వాడీ సిబ్బంది పౌష్టికాహారాన్ని చిన్నారులకు ఇంటికి వెళ్లి అందించాలని డిమాండ్ చేస్తున్నారు. ఎండల్లో అంగన్వాడీ కేంద్రాలు నిర్వహించడంపై జిల్లా వ్యాప్తంగా చిన్నారుల తల్లిదండ్రులు బంధువులు కుటుంబ సభ్యులు స్వచ్ఛంద సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం 8 గంటలకే ఎండ ప్రచండం మొదలవుతుంది. వీలైనంత త్వరగా పనులు ముగించుకుని ఇంటికి వెళ్ళాలని వ్యవసాయ కూలీలు, చిరు వ్యాపారులు, ప్రజలు ఉరుకులు పరుగులు మీద తమ పనులను చేసుకుంటున్నారు. జూన్ రెండో వారం వరకు ఇదే పరిస్దితి కొనసాగుతుందని ఇప్పటికే హెచ్చరిస్తుంటే, అంగన్వాడీ కేంద్రాల చిన్నారుల పరిస్ధితిపై అధికారులకు గానీ, ప్రజా ప్రతినిధులకు గానీ కనికరం లేకుండా పోయింది. వేసవిలో కేంద్రాలకు వెళ్ళే చిన్నారులు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అంగన్వాడీ కేంద్రాల్లో మగ్గిపోతున్నారు. అంగన్వాడీ కేంద్రాలకు సెలవులు మంజూరు చేయకపోవడంతో చిన్నారుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం సమయాల్లో మార్పు వేసవి వచ్చినప్పటికీ యథావిధిగా కేంద్రాలను కొనసాగిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు సెలవులు మంజూరు చేసింది. వేసవికాలంలో ఎండ దెబ్బ తగలకుండా విద్యార్థులను సంరక్షించాలన్న ఉద్దేశ్యంతో సెలవులు ఇస్తారు. దీనికి విరుద్ధంగా మహిళా సీ్త్ర శిశు సంక్షేమ శాఖ ద్వారా నిర్వహించే అంగనన్‌వాడీ కేంద్రాలకు మాత్రం వేసవి వేడి తగలనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఆయా అంగన్వాడీ కేంద్రాల్లో మూడు సంవత్సరాల నుంచి 5 ఏళ్ల వయస్సు కలిగిన విద్యార్ధులకు విద్యా బుద్ధులు నేర్పుతుంటారు. మండుతున్న ఎండల దష్ట్యా అంగన్వాడీలకు ఇటు యూనియన్లు, చిన్నారుల తల్లిదండ్రులు అధికారులపై ఒత్తిడి తేస్తే, సమయాల్లో స్వల్ప మార్పులు చేశారు తప్ప పూర్తిగా సెలవలు ఇవ్వలేదు. ప్రభుత్వమే ఉదయం 10 గంటల తరువాత బయటకు రావద్దని హెచ్చరిస్తుంటే, చిన్నారులు మాత్రం ఎండల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పసివాళ్ల తల్లిదండ్రులు లబోదిబోమంటున్నారు. అదికారులు ఇప్పటికై న స్పందించి అంగనన్‌వాడీ కేంద్రాలకు సెలవులు ప్రకటించి మండుతున్న ఈ భారీ ఎండల నుంచి చిన్నారులను కాపాడాలని తల్తిదండ్రులు కోరుతున్నారు. జిల్లాలో అంగన్వాడీ కేంద్రాలు – 2226 అంగన్వాడీ వర్కర్లు – 2101 హెల్పర్లు – 1827 మినీ వర్కర్లు – 66 3 నుంచి 6 ఏళ్ల లోపు చిన్నారులు – 24,483 7 నెలల చిన్నారులు – 42,529 అన్ని అంగన్వాడీ కేంద్రాల పరిధిలో ఉన్న గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారాన్ని ఇంటికి వెళ్లి సిబ్బంది ఇస్తున్నారు. అలాగే చిన్నారులకు ఎండలు తగ్గేవరకు ఇంటికి వెళ్లి పోష్ఠికాహారాన్ని అందించాలి. మండుతున్న ఎండలు దృష్ట్యా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. మండల సరస్వతి, జెడ్పీటీసీ, ఏలూరు ఉదయం అంగన్వాడీకి వెళ్లినప్పుడు బాగానే ఉంటారు. ఎండలో ఇంటికి వచ్చేటప్పటికీ అలసరిపోతున్నారు. ఏదైనా జరిగితే బాధ్యత ఎవరు తీసుకుంటారు. ప్రభుత్వం స్పందించి ఎండల్లో అంగన్వాడీ కేంద్రాలు మూసివేయాలి. నిట్టా లీలానవకాంతం, జడ్పీటీసీ, దెందులూరు -
శ్రీవారి క్షేత్రం.. అభివృద్ధి ఘనం
● 9 ఏళ్లలో రూ.99 కోట్లతో అభివృద్ధి పనులు ● మండపాలు, క్యూ కాంప్లెక్స్‌ల నిర్మాణాలు ద్వారకాతిరుమల: శ్రీవారి క్షేత్రంలో భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించాలన్న తపన, తాపత్రయం క్షేత్రాన్ని అభివృద్ధిలో పరవళ్లు తొక్కిస్తోంది. గత 9 ఏళ్లలో శ్రీవారి కొండపై సుమారు రూ. 99 కోట్ల అభివృద్ధి పనులు జరిగాయి. వాటి ద్వారా ప్రస్తుతం భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందుతున్నాయి. ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త, చైర్మన్ ఎస్వీ సుధాకరరావు, ఈఓ వేండ్ర త్రినాథరావు, ఈఈ డీవీ భాస్కర్ క్షేత్రాభివృద్ధికి శ్రమిస్తున్నారు. మాస్టర్ ప్లాన్‌కు అనుగుణంగా.. క్షేత్రంలో అభివృద్ధి పనులను మాస్టర్ ప్లాన్‌కు అనుగుణంగా చేస్తున్నారు. అందులో భాగంగా శ్రీవారి కొండపై సుమారు రూ.70 కోట్లతో నిర్మించిన శ్రీ వకుళమాత అన్నప్రసాద భవనం, అనివేట్టి మండపం, స్వామివారి నిత్యకల్యాణ మండపం, కేశఖండనశాల, పలహారశాల, ప్రసాదాలు, టికెట్ కౌంటర్లు, రెండు ఘాట్‌రోడ్లు, మాధవ కల్యాణ మండపంలో నిర్మించిన వంటశాల, భోజన శాలలు, మాధవుని కుంట, పవర్‌హౌస్, సెంట్రల్ స్టోర్, శివాలయం–దొరసానిపాడు, పలు ఘాట్ రోడ్లను 2018లో ప్రారంభించారు. తాజాగా రూ. 29 కోట్లతో నిర్మించిన శాశ్వత క్యూకాంప్లెక్స్, విస్తరించిన అనివెట్టి మండపం, 5 అంతస్తుల శివాలయం రాజగోపురాన్ని ఈనెల 9న ప్రారంభించారు. అందుబాటులోకి మరో 40 మండపాలు సామాన్య భక్తులు వివాహాలు చేసుకోవడానికి అనివెట్టి మండపాలు ఎంతగానో ఉపయోగ పడుతున్నాయి. పాత అనివెట్టి మండపంలోని 40 మండపాల్లో ప్రస్తుతం 32 మండపాలు భక్తులకు అందుబాటులో ఉన్నాయి. కొత్త మండపం ప్రారంభం కావడంతో మరో 40 మండపాలు అందుబాటులోకి వచ్చాయి. అంటే అనివెట్టి మండపాల సంఖ్య 72కి చేరింది. కేవలం రూ. 2 వేలు నామమాత్రపు రుసుముకు వీటిని అద్దెకు ఇస్తున్నారు. ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు ఇక్కడ చెరగని ముద్ర వేశారు. చినవెంకన్న ఆలయానికి ఐదోసారి ఈఓగా పనిచేసే అవకాశం ఆయనకు లభించింది. ఛైర్మన్ మద్ధతు సంపూర్ణంగా ఉండటంతో చేపట్టే ప్రతి అభివృద్ధి కార్యక్రమం సఫలీకృతం అవుతోంది. -
ఎ.గోకవరంలో యథేచ్ఛగా కంకర తవ్వకాలు
ఉంగుటూరు: ఎ.గోకవరం గ్రామ ఆయకట్టు పరిధిలో కంకర తవ్వకాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. గతంలో గ్రామస్తులు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో కొన్ని రోజులు నిలిచిన తవ్వకాలు, ఇప్పుడు తిరిగి ప్రారంభమయ్యాయి. స్థానిక అవసరాలకు కంకర లభించకుండా, నిబంధనలకు విరుద్ధంగా విచక్షణారహితంగా తవ్వకాలు జరుపుతున్నారని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పర్యావరణం దెబ్బతినేలా అత్యంత లోతైన గోతులు తవ్వడం వల్ల ప్రమాదాలు పొంచి ఉన్నాయి. పొరపాటున పశువులైనా, రైతులైనా లేదా కూలీలైనా ఆ క్వారీ గోతులలో పడితే ప్రాణాపాయం తప్పదని భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. కూటమి నాయకుల అండదండలతోనే ఈ అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని, దీనివల్ల అధికారులు సైతం మిన్నకుండిపోతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. -
అత్తపై అల్లుడి దాడి
జంగారెడ్డిగూడెం: జంగారెడ్డిగూడెంలో అత్తపై అల్లుడు కత్తితో దాడి చేసిన ఘటన కలకలం రేపింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని రాజీవ్‌నగర్‌కు చెందిన ఎల్లా వేణుగోపాల్, ఎల్లా మంగ భార్యాభర్తలు. వీరికి ఆరుగురు సంతానం కాగా, వారిలో ముగ్గురు చనిపోయారు. భర్త వేణుగోపాల్ కుటుంబాన్ని పట్టించుకోకపోవడంతో, మిగిలిన ముగ్గురు పిల్లలను మంగ కష్టపడి పోషిస్తోంది. గంజాయి, మద్యానికి బానిసైన వేణుగోపాల్ తరచూ భార్యతో గొడవ పడుతుండేవాడు. ఆదివారం ఉదయం వేణుగోపాల్ భార్యతో గొడవకు దిగాడు. పిల్లలు అమ్మమ్మ నాగుల రామలక్ష్మికి సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న రామలక్ష్మి గొడవను అడ్డుకునే ప్రయత్నం చేసింది. ఆగ్రహానికి గురైన వేణుగోపాల్ చాకుతో ఆమైపె దాడి చేశాడు. ఈ దాడిలో రామలక్ష్మి మెడ, గొంతు భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే మంగ స్థానికుల సాయంతో 108 వాహనంలో ఆమెను ఏరియా ఆసుపత్రికి తరలించింది. వైద్యులు అత్యవసర చికిత్స అందించారు. ప్రస్తుతం రామలక్ష్మి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. -
లేబర్ కోడ్లు రద్దు చేయాలి
భీమవరం: కేంద్ర ప్రభుత్వం విజయ గర్వంతో కార్మికులపై దాడిని ప్రారంభించిందని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.రాజారామ్మోహన్రాయ్ ధ్వజమెత్తారు. భీమవరంలో లేబర్ కోడ్స్‌ను రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం సీఐటీయూ నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. లేబర్ కోడ్స్ అమలు కోసం రూల్స్‌ను రూపొందించి కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో అమలు కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం దారుణమన్నారు. లేబర్ కోడ్స్ కారణంగా శ్రామికవర్గం తీవ్రంగా నష్టపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారం కోసం అడ్డమైన దారులు తొక్కుతూ ప్రజలను మభ్యపెడుతున్నారు తప్ప కార్మికులు, వ్యవసాయ కార్మికులు, రైతులు, పరిశ్రమల అభివృద్ధికి తీసుకున్న నిర్ణయాలు శూన్యమన్నారు. వేతనాలు పడిపోయి ధరలు విపరీతంగా పెరిగి ఉపాధి తగ్గి వలసలు మరింత పెరిగి దేశంలో అశాంతి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. వీటన్నింటికీ కేంద్రం మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.వాసుదేవరావు, ఎం.ఆంజనేయులు, ఎం.వైకుంఠరావు, సోమేశ్వరరావు, భూపతి సత్యనారాయణ, ఎం.శివ పాల్గొన్నారు. కదిరి అర్బన్: స్థానిక ఎస్టీఎస్ఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రెండు రోజులుగా జరుగుతున్న 48వ రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్ జూనియర్ బా లికలు, బాలుర చాంపియన్‌షిప్ పోటీల్లో బాలికల విభాగంలో పశ్చిమగోదావరి, బాలుర వి భాగంలో చిత్తూరు జట్లు విజేతలుగా నిలిచా యి. గెలుపొందిన జట్లకు చాంపియన్ ట్రోఫీని బహూకరించారు. కొయ్యలగూడెం : ఆపదలో ఉన్న బాలుడి ప్రాణాలను నిలబెట్టడానికి గ్రామ యు వత నడుం బిగించింది. ఇంటింటా విరాళాల సేకరణకు శ్రీకారం చుట్టింది. ‘సాక్షి’లో ఆదివారం ప్రచురించిన ‘సాయం కోసం ఎదురుచూపులు’ కథనానికి స్పందించడంతో పాటు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా బయ్యనగూడెంలో తలసేమియా వ్యాధితో బాధపడుతున్న సింగంశెట్టి నాగమణికంఠ పరిస్థితి తెలుసుకున్న యువకులు తొలిరోజు రూ.1.50 లక్షలు విరాళాలు సేకరించి అందజేశారు. బాలుడి వైద్యానికి రూ.22 లక్షల వరకు ఖర్చవుతుందని, ఇకపై రోజూ సమీప గ్రామాల్లో తిరుగుతూ విరాళాలు సేకరిస్తామని యువకులు తెలిపారు. ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం డబుల్ బుల్డోజర్ సర్కార్‌గా మారి ప్రజలపై భారాలు వేస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు తీవ్రంగా విమర్శించారు. దీనిపై జూన్, జూలై నెలల్లో ప్రజాపోరుకు సిద్ధమయ్యామన్నారు. స్థానిక ఉద్దరాజు రామం భవనంలో సీపీఎం జిల్లాస్థాయి విస్తృత సమావేశం ఆదివారం జిల్లా కార్యదర్శివర్గ స భ్యురాలు మొడియం నాగమణి అధ్యక్షతన ని ర్వహించారు. ముఖ్య అతిథిగా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆర్థిక సంస్కరణల పేరుతో ప్రజలపై భారాలు వేస్తున్నారని, నాలుగు లేబర్ కోడ్లను తీసుకువచ్చి కార్మికులను బానిసలుగా మారుస్తున్నారన్నారు. ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేశారన్నారు. సర్ అనే పేరుతో ప్రజల ఓటు హక్కును సైతం భ్రష్టుపట్టించారన్నారు. ఆర్ఎస్ఎస్, వీహెచ్‌పీ వంటి సంస్థలు ఆకివీడు, కడపలో మతోన్మాదాన్ని రెచ్చగొట్టి ప్రజల మధ్య చిచ్చుపెడుతున్నారని ఆరోపించారు. రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వై.వెంకటేశ్వరరావు, బి.బలరాం మాట్లాడుతూ ఆక్వా, మొక్కజొన్న రైతులు నష్టాల్లో ఉన్నారన్నారు. -
వరుస మోసాలు.. దోపిడీలు
తణుకు అర్బన్: తణుకు నియోజకవర్గంలో వరుస మోసాలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఇటీవల కాలంలో తణుకులో వెలుగులోకి వస్తున్న మోసాలతో ఎవరితో ఏం మాట్లాడితే ఏ మోసం చేస్తారోననే భయం వెంటాడుతోంది. తణుకు నియోజకవర్గం అత్తిలి మండలం ఆరవల్లిలో ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కోట్లు దోచేసిన కూటమి నేతల వ్యవహారం మరువక ముందే, తణుకు పట్టణంలో బంగారం బిస్కెట్ తక్కువ ధరకే ఇస్తామని, నగదుకు ఎక్కువ వడ్డీ ఇస్తామంటూ అమాయక మహిళల నుంచి ఒక కిలాడీ జంట రూ. 25కోట్లకు టోకరా వేసింది. అంతకుముందు తణుకు పట్టణంలో ఒక బంగారం వ్యాపారి బంగారు ఆభరణాలు చేస్తానని నమ్మించి సుమారుగా 19 మంది బాధితుల నుంచి రూ.10 కోట్లకు పైగా దోచుకుని ఉడాయించాడు. ఇలా వరుస మోసాలు, దోపిడీలతో తణుకు ప్రజలు ఎవరిని నమ్మాలో తెలియక బెంబేలెత్తిపోతున్నారు. ప్రశాంతతకు మారుపేరుగా ఉండే తణుకు ప్రాంతంలో గత ఏడాదిన్నరలో వెలుగుచూస్తున్న మోసాలు, దోపిడీలు చెడ్డ పేరు తీసుకువస్తున్నాయని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఆరవల్లి పరువు తీసిన కూటమి అత్తిలి మండలం ఆరవల్లిలో వెలుగులోకి వచ్చిన వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. అమాయకులైన నిరుద్యోగులకు ఉద్యోగాల ఎరవేసి సుమారుగా 50 మంది నుంచి రూ.3 కోట్ల వరకు దోచేసిన వ్యవహారం బట్టబయలు కావడం, నిరుద్యోగులను నమ్మించేందుకు ఏకంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, జిల్లా కలెక్టర్‌తో పాటు ఐఏఎస్ అధికారుల సంతకాలతో ఉన్న సిఫార్సు లెటర్లు సృష్టించడం సంచలనంగా మారింది. ఇందులో కూటమి నేతలు ఉన్నారంటూ వివిధ పత్రికలు, ప్రసార సాధనాల్లో రావడంతో ముందుగా జనసేన నాయకులు, ఆ తరువాత టీడీపీ నాయకులు సైతం ఎవరికి వారు విడివిడిగా తణుకు, అత్తిలి పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. ఫిర్యాదు చేసిన వారిలోనే మోసం చేసిన వారున్నారనే ఆరోపణలు ఆరవల్లిలో తలెత్తడం విశేషం. ఇచ్చిన డబ్బులు రావనే ఉద్దేశంతో పాటు దోపిడీ దొంగల బెదిరింపులతో బాధిత నిరుద్యోగులు ఇప్పటివరకు బయటపడలేదు. ఉద్యోగాల ఆశతో అప్పులు చేసి డబ్బులు ఇచ్చామంటూ బాధితులు గ్రామంలోని పెద్దల వద్దకు పంచాయతీకి వస్తున్నారే కానీ, కూటమి నేతల భయంతో ఫిర్యాదు చేసేందుకు ముందుకు రాని దుస్థితి. అంతకుముందు ఆరవల్లి గ్రామం వైఎస్సార్ కాలనీలో ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేస్తామని కాలనీ వాసుల నుంచి ఇంటికి రూ.1500 చొప్పున వసూలు చేయడాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తీసుకురాగా, వెంటనే టీడీపీ నాయకులు తిరిగి ఎవరి డబ్బులు వారికి ఇచ్చేయడం తెలిసిందే. ఈ వ్యవహారంలో విద్యుత్ శాఖకు ముట్టచెప్పాలని టీడీపీ నాయకులు వసూలు చేసినట్లుగా కాలనీ వాసులు చెబుతున్నారు. పోలీసుల ప్రేక్షక పాత్ర కిలాడీలు వరుసగా అమాయకులను మోసం చేసినా, ఆరవల్లిలో ఉద్యోగాల మోసంలో ఏకంగా పవన్ కల్యాణ్ సంతకాన్ని ఫోర్జరీ చేసిన సిఫార్సు లెటర్లు బయటపడినప్పటికీ తణుకు పట్టణ, అత్తిలి స్టేషన్ల పోలీసులు పట్టించుకోలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పవన్ కల్యాణ్ సిఫార్సు లెటర్ల వ్యవహారంలో కూడా పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లుగా ఉండటం చూస్తుంటే ఏ రాజకీయ ఒత్తిడిలో ఉన్నారోనని తణుకు నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు. మోసానికి పాల్పడిన కూటమి నాయకులు ఎవరనేది అందరికి తెలిసినప్పటికీ వారిని ఇప్పటికీ పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో తమ వెంటే ఉంచుకుని పెద్దపీట వేయడాన్ని ప్రజలు తప్పుపడుతున్నారు. తణుకు నియోజకవర్గంలో ఏడాదిన్నర కాలంలో రూ.40 కోట్ల దోపిడీ ఆరవల్లిలో ఘటన మరువక ముందే మరొకటి వెలుగులోకి పవన్ కల్యాణ్ సంతకం ఫోర్జరీ చేసినా పట్టించుకోని వైనం -
అప్పు కాదు.. ఆర్థికంగా ఆదుకోవాలి
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పేదంటి ఆడ్డబిడ్డ పెళ్లికి రూ.40 వేల నుంచి రూ.1.50 లక్షల వరకు ఆర్థికంగా సాయం అందించి ఆదుకున్నారు. అప్పట్లో మూడు నెలలకోసారి కల్యాణమస్తు, షాదీతోఫా పథకం అమలు చేసేవారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆడబిడ్డ వివాహానికి సాయం బదులు అప్పు ఇచ్చే వ్యాపార పథకం అమలు చేయడం సిగ్గుచేటు. రుణం ఇచ్చి వడ్డీతో సాయం చెల్లించాలనడం దారుణం. ప్రభుత్వం అరకొర పథకాలు ఇస్తూ సూపర్‌సిక్స్ ను అటకెక్కించింది. పేదలను ఆదుకునేలా పథకాలు ఇవ్వాలి. పెళ్లికానుకను ఉచితంగా అందించాలి. – గూడూరి ఉమాబాల, వైఎస్సార్సీపీ నరసాపురం పార్లమెంట్ ఇన్చార్జి -
ఇళ్ల తొలగింపుపై ఆగ్రహం
ఉండి: ఎవరికీ అభ్యంతరం లేని ప్రాంతంలో ఉన్న పేదల ఇళ్లను తొలగించేందుకు ప్రయత్నించడం దుర్మార్గమని సీపీఎం జిల్లా కార్యదర్శి జేఎన్వీ గోపాలన్ విమర్శించారు. మండలంలోని ఉణుదుర్రులో ఆక్రమణల తొలగింపు వ్యవహారం ఉద్రిక్తతకు దారితీసింది. ఆక్రమణల తొలగింపుపై అధికారులు నోటీసులు ఇవ్వడంతో ఆదివారం బాధితులు రోడ్డెక్కారు. నినాదాలు చేస్తూ గ్రామంలోని సచివాలయాన్ని చుట్టుముట్టారు. కూటమి ప్రభు త్వం హామీ మేరకు ప్రతి ఒక్కరికీ మూడు సెంట్ల నివాస యోగ్యమైన భూమి ఇచ్చి ఇంటి నిర్మాణానికి సహకారం అందించిన తర్వాతే తమ ఇళ్లు తొలగించాలంటూ బాధిత మహిళలు, సీపీఎం నాయకులు ధ్వజమెత్తారు. తమ ఇళ్లను తొలగించి బడాబాబులకు ఆ భూమిని అప్పగించాలని చూ స్తున్నారని విమర్శించారు. గ్రామంలో మౌలిక వసతుల కల్పనను పట్టించుకోకుండా ఆక్రమణల పేరుతో పేదల ఇళ్లు కూల్చడం ఘోరమన్నారు. నివాసయోగ్యం కాని ప్రాంతంలో సెంటున్నర చొప్పున ఇంటి స్థలాలు ఇచ్చేశాం.. అక్కడికి వెళ్లిపోండని అంటే పేదలు ఎలా బతుకుతారని గోపాలన్ ప్రశ్నించారు. ఉండి ఎస్సై ఎండీ నసీరుల్లా, గ్రామ ఇన్చార్జి కార్యదర్శి రామ్మోహన్రావు బాధితులతో చర్చించారు. సమస్యను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని సీపీఎం నాయకులు హెచ్చరించారు. నాయకుడు ధనికొండ శ్రీనివాస్, బాధిత కుటుంబాలు, గ్రామస్తులు పాల్గొన్నారు. -
ఏమార్చి.. ఎగ్గొట్టి!
భీమవరం(ప్రకాశం చౌక్) : పేద, మధ్యతరగతి కుటుంబాల్లో ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక సా యం అందించే పథకానికి కూటమి ప్రభుత్వం మంగళం పాడింది. ఉచితంగా అందించాల్సిన సాయానికి బదులు అప్పు ఇచ్చే ‘వ్యాపార’ పథకాన్ని ప్రకటించింది. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. డ్వాక్రా గ్రూపుల్లో ఉండే సభ్యుల ఇళ్లల్లో ఆడపిల్లల వివాహాలకు రూ.లక్ష సీ్త్ర నిధి నుంచి రుణంగా ఇప్పించి 48 వాయిదాల్లో తిరిగి చెల్లించేలా కల్యాణలక్ష్మి పేరుతో పథకాన్ని రూపొందించింది. సంక్షేమాన్ని విస్మరించి, పేదలను ఏమార్చేలా తీసుకువచ్చిన ఈ పథకంపై పేదలు పెదవి విరుస్తున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీల్లోని భవన నిర్మాణ కార్మికుల ఇళ్లలో ఆడబిడ్డలు, దివ్యాంగుల వివాహాలకు రూ.40 వేల నుంచి రూ.1.50 లక్షల వరకు సాయం అందించి ఆదుకున్నారని గుర్తుచేసుకుంటున్నారు. ఇప్పటికే డ్వాక్రా రుణాలు చెల్లించేందుకు నానా అవస్థలు పడుతున్న పేద మహిళలు.. ఇప్పుడు కల్యాణలక్ష్మి అప్పు తీసుకుంటే ఎలా వాయిదాలు చెల్లించగలరని ప్రశ్నిస్తున్నారు. డ్వాక్రా గ్రూపుల్లో లేని సభ్యుల సంగతేంటని అంటున్నారు. వివాహాలకు ఆర్థిక సాయాన్ని పూర్తి ఉచితంగా అందించాలని కోరుతున్నారు. డ్వాక్రా మహిళల కుమార్తెలకు రూ.లక్ష వరకు రుణం 4 శాతం వడ్డీ 48 వాయిదాల్లో చెల్లింపు సాయం మానేసి అప్పు ఇస్తారట..కూటమి ప్రభుత్వం వచ్చిన రెండేళ్లల్లో పెళ్లికానుక పథకాన్ని అమలు చేయలేదు. దీంతో జిల్లాలో సుమారు 6 వేల మంది వరకు ఆర్థికసాయం కోల్పోయారు. 2014లోనూ చంద్రబాబు పెళ్లికానుక ఇస్తానని చెప్పినా అప్పటి టీడీపీ ప్రభుత్వంలోనూ అమలు చేసిన దాఖలాలు లేవు. కనీసం కూటమి ప్రభుత్వంలో అయినా సాయం అందిస్తారని ఎదురుచూసిన ప్రజలకు నిరాశే ఎదురైంది. తాజాగా కల్యాణలక్ష్మి (అప్పు) పథకాన్ని ప్రకటించడంపై పేద లు నిట్టూరుస్తున్నారు. 2019–24లో వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కల్యాణమస్తు, షాదీతోఫా పేరుతో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సామాజికవర్గాల వారీగా వివాహాలకు ఆర్థిక సాయం అందించారు. ప్రతి మూడు నెలలకోసారి లబ్ధిదారులను ఎంపిక చేసి పక్కాగా సాయాన్ని బ్యాంకు ఖాతాల్లో జమచేశారు. ఇలా జిల్లాలో 2,368 మందికి రూ.16.40 కోట్ల సాయం అందించి ఆయా కుటుంబాలను ఆదుకున్నారు. కూటమి వంచన పేదింట వివాహాలకు ఉచిత సాయానికి మంగళం! కల్యాణలక్ష్మి పేరుతో కొత్త పథకం డ్వాక్రా మహిళలకు రూ.లక్ష రుణం వడ్డీతో సహా తిరిగి చెల్లించాల్సిందే.. గత ప్రభుత్వంలో కల్యాణమస్తు, షాదీతోఫాతో ఆర్థిక చేయూత జిల్లాలో 2,368 మందికి రూ.16.40 కోట్ల సాయం అందజేత కూటమి ‘వ్యాపార’ పథకంపై పేదల పెదవి విరుపు -
నిజాయతీ చాటుకున్న ఆటో డ్రైవర్
జంగారెడ్డిగూడెం: పర్సును పోగొట్టుకున్న వృద్ధురాలికి దానిని అందజేసి ఓ ఆటో డ్రైవర్ తన నిజాయతీని చాటుకున్నాడు. జంగారెడ్డిగూడెంకు చెందిన ఆటో డ్రైవర్ చిట్టిబోయిన ఆంజనేయులు (అంజి) స్థానిక బుట్టాయగూడెం రోడ్డులో వెళ్తుండగా అతనికి ఒక పర్సు దొరికింది. ఆ పర్సు తెరిచి చూడగా అందులో రూ. 2,000 నగదు, మందుల చీటీ, ఆధార్ కార్డు ఉన్నాయి. ఆధార్ కార్డు ఆధారంగా ఆ పర్సు చాగంటి చంద్రమ్మ అనే వృద్ధురాలిదని గుర్తించాడు. వెంటనే విచారణ చేసి ఆమెకు సమాచారం అందించాడు. అనంతరం జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్లో ఎస్సై ఎన్వీ ప్రసాద్ సమక్షంలో ఆ పర్సును వృద్ధురాలికి అందజేశాడు. ఈ సందర్భంగా వృద్ధురాలు అంజికి కృతజ్ఞతలు తెలపగా, అతని నిజాయతీని ఎస్సై, పలువురు అభినందించారు. కై కలూరు: అమ్మా పెద్దింట్లమ్మా.. నీ కరుణా కటాక్షాలు మాపై చూపవమ్మా.. అంటూ భక్తులు ఆర్తితో వేడుకున్నారు. కొల్లేటికోట పెద్దింట్లమ్మ దేవస్థానంలో ఆదివారం భక్తుల రద్దీ అధికంగా కనిపించింది. సెలవు రోజు కావడంతో సమీప జిల్లాల నుంచి అమ్మవారి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పవిత్ర కోనేరులో స్నానాలు ఆచరించి, అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు. ఆలయ ఉప ప్రధాన అర్చకుడు పేటేటి పరమేశ్వరశర్మ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో కూచిపూడి శ్రీనివాసు మాట్లాడుతూ.. ఆదివారం ఒక్కరోజే ప్రత్యేక దర్శనాలు, అంతరాలయ దర్శనాలు, కేశఖండన, తీర్థాలు, ప్రసాద విక్రయాలు, విరాళాలు మరియు వాహన పూజల ద్వారా మొత్తం రూ. 67,350 ఆదాయం వచ్చిందని తెలిపారు. జంగారెడ్డిగూడెం: జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరిలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆదివారం ఉదయం 8 గంటలకు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, ధ్వజారోహణం, అగ్నిప్రతిష్ట, కుంభస్థాపన, నిత్యహోమం తదితర పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉభయదారులుగా అభివృద్ధి కమిటీ గౌరవ అధ్యక్షులు పేరిచర్ల జగపతిరాజు – ఝాన్సీరాణి దంపతులు, గొట్టుముక్కల భాస్కరరాజు దంపతులు వ్యవహరించారు. కోనంగపల్లి సత్యపవన్ ఆచార్యుల ఆధ్వర్యంలో ఆలయ ప్రధానార్చకులు నల్లూరి రవికుమారాచార్యులు, రుషికేష్ ఆచార్యులు, కుమారాచార్యులు, రాఘవాచార్యులు పూజా కార్యక్రమాలు పూర్తి చేశారు. సంతానం లేని భక్తులకు గరుడ ప్రసాదం అందజేశారు. జిల్లా ఎస్సీ, ఎస్టీ మేజిస్ట్రేట్ ఐ.శ్రీనివాస్‌శర్మ కుటుంబ సభ్యులు, జంగారెడ్డిగూడెం ప్రిన్సిపల్ సివిల్ జడ్జి కేఎస్ఆర్ తేజస్వి స్వామివారిని దర్శించుకుని విశేష పూజలు చేశారు. సాయంత్రం స్వామివారికి శేషవాహనంపై తిరువీధి ఉత్సవం నిర్వహించారు. భీమడోలు: పొలసానిపల్లికి చెందిన ఓ యువకుడు అదృశ్యమయ్యాడు. గ్రామానికి చెందిన బత్తిన దుర్గా శివ ప్రసాద్ ఐటీఐ చదువుకుని ముగ్గు వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ నెల 9వ తేదీ శనివారం సాయంత్రం ఏలూరు వెళ్లి వస్తానని ఇంటిలో చెప్పి తిరిగి రాలేదు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఆచూకీ కోసం ప్రయత్నించారు. ఫలితం లేకపోవడంతో తండ్రి బత్తిన మాణిక్యాలరావు ఆదివారం భీమడోలు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దెందులూరు: వైఎస్సార్సీపీ జిల్లా కమిటీ సభ్యుడు, పెరుగ్గూడెం సర్పంచ్ యలమర్తి రేవతి భర్త యలమర్తి రామకృష్ణ (50) ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. రామకృష్ణ ద్విచక్ర వాహనంపై పొరుగు గ్రామం నుంచి ఇంటికి వస్తుండగా పంగిడిగూడెం వద్ద కారు ఢీకొని తీవ్రంగా గాయపడ్డారు. అంబులెన్స్‌లో ఏలూరులో ఆస్పత్రికి తీసుకువెళుతుండగా మృతిచెందారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. -
మొగల్తూరు మామిడి.. ప్రాభవం కొరవడి
నరసాపురం: మొగల్తూరు మామిడి పూర్వ ప్రాభవం క్రమంగా కోల్పోతోంది. తీరంలో మామిడి తోటల విస్తీర్ణం రానురానూ తగ్గిపోతున్నాయి. తీర ప్రాంతంలోని ఇసుక నేల సారం ఆధారంగా అద్భుత రుచి మొగల్తూరు మామిడి ప్రత్యేకం. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వారు దేశ, విదేశాల్లోని బంధువులు, స్నేహితులకు ఏటా వేసవి సీజన్లో వీటిని పంపిస్తుంటారు. దీంతో మొగల్తూరు మామిడికి దేశ, విదేశాల్లోనూ మంచి క్రేజ్. పెరుగుతున్న పట్టణీకరణ, లేఅవుట్లతో ఏటేటా తోటలు విస్తీర్ణం తగ్గుతోంది. దీనికితోడు తోటలు తెగుళ్ల బారిన పడుతుండటంతో కాపు తగ్గుతోంది. మొగల్తూరు మామిడా.. మజాకా మొగల్తూరు, పేరుపాలెం చుట్టుప్రకల ప్రాంతాల్లో దాదాపు 1,800 ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నా యి. చెరుకురసం, చిన్నరసాలు, పెద్దరసాలు, కొ త్తపల్లి కొబ్బరి రకాలు ఇక్కడ ఫేమస్. మరీ ము ఖ్యంగా మొగల్తూరు బంగినపల్లికి మంచి పేరుంది. ఇక ఆవకాయ పచ్చళ్లకు సంబంధించి సువర్ణరేఖ, కలెక్టర్, హైజర్ రకాలు ప్రసిద్ధి. జిల్లాతో పాటు పొరుగు జిల్లాల నుంచి పలువురు ఇక్కడకు వచ్చి మామిడిపండ్లు, పచ్చడి కాయలు కొనుగోలు చేస్తుంటారు. వేసవి సీజన్లో మొగల్తూరు మామిడి మార్కెట్ కిటకిటలాడుతుంది. తెగుళ్ల బారిన తోటలు మామిడి చెట్లకు మచ్చతెగులు, మంచు తెగులు వంటివి సోకుతున్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరగడంతో ఇళ్ల స్థలాలకు లేఅవుట్స్ చేయడంతో తోటలు నరికేస్తున్నారు. దీంతో విస్తీర్ణం తగ్గిపోతుంది. ఒకప్పుడు మొగల్తూరు చుట్టుపక్క 5 వేల ఎకరాల్లో తోటలు ఉండగా ప్రస్తుతం 2 వేల ఎకరాలకు తగ్గిపోయాయి. ప్రస్తుతం తోటల రూపంలో కంటే ఇంటి పెరట్లలో వీటిని పెంచుతున్నారు. ఆదాయ మార్గం ఉండటంతో పెరట్లలో, ఖాళీ స్థలాల్లో వీటిని పెంచుతున్నారు. ఇక గాలి దుమారంతో పిందెలు, కాయలు రాలిపోవడం వంటి కారణాలతో కూడా కాపు తగ్గుతుంది. తోటల్లోనే పంట విక్రయం మొగల్తూరు మామిడి వ్యాపారం వేసవి సీజన్‌కు ముందే ప్రారంభమవుతుంది. శీతాకాలంలో పిందె దశలోనే రైతులు తోటల్లో పంటను విక్రయిస్తుంటా రు. ఒక్కో చెట్టూ రూ.20 వేల నుంచి రూ.30 వేల వ రకూ విక్రయిస్తుంటారు. చెట్లు కాపును బట్టి వ్యా పారులు కొనుగోలు చేసుకుని కాయలు తయారైన తర్వాత విక్రయిస్తుంటారు. దూరప్రాంతాలు, పక్క జిల్లాల నుంచి వచ్చి పలువురు చెట్లు వద్దే కొనుగోలు చేసి తీసుకెళ్లడం, బంధువులకు, స్నేహితులకు దేశ, విదేశాలకు పంపడం చేస్తుంటారు. ఆలస్యంగా మార్కెట్లోకి.. సాధారణంగా మార్చి, ఏప్రిల్ నుంచి మామిడి పండ్లు మార్కెట్‌కు వస్తుంటాయి. అయితే మొగల్తూరు ఆలస్యంగా కాపునకు వస్తుంది. మే ప్రారంభం నుంచి జూన్, జూలైలో కూడా మొగల్తూరు మామిడి పండ్లు దొరుకుతాయి. ఈ ఏడాదిలో ఇప్పుడిప్పుడే మొగల్తూరు మామిడిపండ్లు మార్కెట్‌కు వస్తున్నాయి. ప్రస్తుతం పరక రకాన్ని బట్టి రూ.250 వరకు విక్రయిస్తున్నారు. బంగినిపల్లి రకం కాయ ఒక్కటి రూ.40 నుంచి రూ.80 వరకు అమ్ముతున్నారు. ఏటా తగ్గుతున్న విస్తీర్ణం పట్టణీకరణ, లేఅవుట్లతో తోటలు కనుమరుగు తెగుళ్లతో ఇక్కట్లు తగ్గుతున్న దిగుబడులు -
పూర్తి ఉచితంగా ఇవ్వాలి
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల ఆడబిడ్డల వివాహాలకు గత ప్రభుత్వంలో జగన్మోహన్రెడ్డి ఆర్థికసాయం అందించారు. ఇది పేదలకు ఎంతో ఉపయోగపడింది. కూటమి ప్రభుత్వం గద్దెనెక్కి రెండేళ్లవుతున్నా పెళ్లిళ్లకు సంబంధించి ఎలాంటి సాయం అందించలేదు. ఇప్పుడు రూ.లక్ష అప్పు ఇస్తాం.. వడ్డీతో సహాయ తిరిగి చెల్లించాలంటూ కల్యాణలక్ష్మి పథకం అమలు చేస్తామంటున్నారు. ఇది ఎంత వరకు సబబు. ఆడ్డబిడ్డ పెళ్లి కి అప్పు కాకుండా ఉచితంగా ఆర్థిక సాయం అందించాలి. అలాగే గత ప్రభుత్వంలో మాదిరిగా బాలింతగా ఉన్నప్పుడే రూ.5 వేలు సాయం అందించాలి. అప్పుడే పేదలకు మేలు జరుగుతుంది. – పాలవెల్లి మంగ, భీమవరం -
గాలివాన బీభత్సం
భీమడోలు : ఈదురుగాలులు ఏలూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. సాయంత్రం ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై భారీ వర్షం కురిసింది. ముఖ్యంగా బుట్టాయగూడెం మండలంలోని ఏజెన్సీ ప్రాంతంతో పాటు ఏలూరు, భీమడోలు, కామవరపుకోట, కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం తదితర ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు కూలిపోయాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. –సాక్షి నెట్వర్క్ -
రైలు ప్రయాణం.. నరకం
ఏలూరు జిల్లా: వేసవిలో రైలు ప్రయాణం నరక ప్రాయంగా మారింది. సెలవులకు వెళ్తున్న ప్రయాణికులకు రిజర్వేషన్లు లభించక జనరల్ బోగీల్లో ప్రయణించాల్సి వస్తోంది. ఇసకేస్తే రాలనంత జనంతో జనరల్ బోగీలు కిక్కిరిసిపోతున్నాయి. వృద్ధులు, చిన్నారులు ఉక్కపోతతో విలవిల్లాడుతున్నారు. జాగా కోసం ప్రయాణికుల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి. ఈ బాధలు పడలేక తప్పని పరిస్థితుల్లో రిజర్వేషన్ల బోగిల్లో ప్రయాణిస్తే ఫైన్ల రూపంలో టిక్కెట్ కలెక్టర్లు వసూలు చేస్తున్నారు. దక్షిణ మధ్య రైల్వేలో విజయవాడ వయా ఏలూరు – విశాఖపట్నం, నరసాపురం, విశాఖపట్నం వయా నరసాపురం, భీమవరం విజయవాడ రూట్లు కీలకమైనవి. ఏలూరు నుంచి కోణార్క్, యశ్వంత్‌పూర్, కోరమండల్, ఈస్ట్‌కోస్ట్, లింగంపల్లి – జన్మభూమి, బెంగుళూరు, ప్రశాంతి, సింహాద్రి, ఎల్టీటీ, రాయ్‌గఢ్, తిరుపతి ఇలా దాదాపు 18 ఎక్స్‌ప్రెస్ రైలు సరీ్వసులు రోజూ నడుస్తోన్నాయి. అదే విధంగా విజయవాడ వయా గుడివాడ, భీమవరం మీదుగా విశాఖ, చెన్నై, తిరుపతి, హైదరాబాదు, టాటానగర్, తిరుపతి, కాకినాడ పోర్టు వంటి దాదాపు 11 ఎక్స్‌ప్రెస్ సర్వీసులు నడుస్తున్నాయి. రాత్రి ప్రయాణాల్లో రద్దీ ఎక్కువగా కనిపిస్తోంది. జనరల్ బోగీల పెంపు కలేనా? సుదూర ప్రాంతాలకు నడుస్తున్న ఎక్ర్‌ప్రెస్ రైళ్ళలో మూడు, కొన్నింటికి నాలుగు జనరల్ బోగీలు మాత్రమే ఉంటున్నాయి. ముందు భాగంలో కొన్ని, వెనుక మరికొన్ని ఉంటున్నాయి. ఒక్కో బోగిలో పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కుతున్నారు. మూత్ర విసర్జనకు సైతం వెళ్ళలేని పరిస్థితి జనరల్ బోగిల్లో కనిపిస్తోంది. కింద కూర్చునే విషయంలో ప్రయాణికుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. మరుగుదొడ్ల దుర్వాసన భరించలేక అనేక మంది ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మౌలిక వసతుల కొరత ప్రయాణికులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తాం అని గొప్పలు చెబుతున్న రైల్వే శాఖ క్షేత్ర స్థాయిలో వాటి అమలు బాధ్యత తీసుకోవడం లేదు. అనేక స్టేషన్లలో కుళాయిల్లో నీరు వస్తున్నా అవి తాగడానికి ఏ మాత్రం పనిచేయడం లేదు. పగటి పూట శివారు బోగీలకు మండుటెండలో నడిచి ఎక్కాల్సిన పరిస్థితి. ముఖ్యంగా మరుగుదొడ్ల గదులకు తాళాలు వేస్తున్నారు. అత్యవసరమైతే స్టేషన్ మాస్టార్ వద్ద తాళాలు తీసుకునే పరిస్థితి ఏర్పడుతోంది. రిజర్వేషన్లు, తత్కాల్ విషయానికి వస్తే “క్యూ’లైన్లలో నిలుచున్నా కొంత సమయానికి కోటా అయిపోయిందని సిబ్బంది చెబుతున్నారు. మౌలిక వసతులపై రైల్వే అధికారులు దృష్టి సారించాలని ప్రయాణికులు కోరుతున్నారు. ప్రయాణికులకు సౌకర్యాలు కలి్పంచండి రైలు ప్రయాణికులకు స్టేషన్లలో తాగునీరు, మరుగుదొడ్ల వంటి కనీస సౌకర్యాలు కలి్పంచాలి. కైకలూరు ప్రాంతంలో డబుల్ లైన్ ట్రాక్ వేసిన తర్వాత గూడ్సు రైళ్ళ సంఖ్య పెరిగింది. దీంతో క్రాసింగ్ గేట్ల వద్ద ఎక్కువ సమయం ప్రయాణికులు వేచి ఉంటున్నారు. బ్రిడ్జిలు, అండర్ గ్రౌండ్ వంతెనలు నిర్మించాలి. – కోమటి విష్ణువర్థనరావు, వైఎస్సార్సీపీ ముదిరాజుల విభాగ అధ్యక్షుడుజనరల్ బోగీల సంఖ్య పెంచాలి ప్రయాణికులకు తగ్గట్టుగా ఎక్స్‌ప్రెస్ రైళ్ళలో జనరల్ బోగీల సంఖ్య పెరగడం లేదు. దీంతో మధ్యతరగతి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. రైల్వేశాఖకు బోగీల సంఖ్య పెంచాలని ప్రయాణికుల నుంచి వినతులు వెళుతున్నాయి. వేసవి సెలవులకు దూర ప్రాంతాలకు వెళ్ళే ప్రయాణికులను దృష్టిలో పెట్టుకుని బోగీల సంఖ్య పెంచాలి. – చావలి శంకరశాస్త్రి, న్యాయవాది, కైకలూరు -
కిలాడీ మహిళ వెనుక జనసేన నాయకుడు?
తణుకు అర్బన్: తక్కువ ధరకే బంగారు బిస్కెట్లు, నగదుకు ఎక్కువ వడ్డీ ఇస్తామంటూ మోసం చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న తణుకు సజ్జాపురానికి చెందిన స్నేహలత, దుర్గాప్రసాద్‌ల వ్యవహారం సంచలనం రేకెత్తిస్తోంది. సుమారుగా రూ.25 కోట్లు దోచుకున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం పొందవచ్చని ఆశపడిన మహిళలు మోసపోయామని తెలుసుకుని ఆందోళన చెందుతున్నారు. ఈ నెల 8వ తేదీన తణుకులో బాధిత మహిళలు తాము మోసపోయామంటూ మీడియా ముందు వాపోయారు. దీంతో కిలాడీ జంట వ్యవహారం తణుకులో చర్చనీయాంశంగా మారింది. తాజాగా మరికొంతమంది బాధితులు బయటకువస్తున్నట్లుగా తెలుస్తోంది. స్థానికంగా కొందరు బంగారం దుకాణదారులను సైతం ఈ జంట మోసం చేసినట్లు తెలుస్తోంది. కిలాడీ జంటకు తాము చేసిన బ్యాంకు లావాదేవీలు, ఫోన్‌పేల ద్వారా పంపించిన నగదు వివరాలతోపాటు మాట్లాడిన వీడియోలు తమ వద్ద ఉన్నాయని బాధితులు చెబుతున్నారు. తమ డబ్బు, బంగారం తీసుకుని కిలాడి జంట మోసం చేశారంటూ మీడియా ముందు బాధితులు వెల్లడించడంతో వారి నుంచి బెదిరింపులు వస్తున్నాయని బాధిత మహిళలు ఆరోపిస్తున్నారు. తమపై కేసులు నమోదు చేయిస్తామని, సోషల్ మీడియా ద్వారా అల్లరి చేస్తామంటూ బెదిరిస్తున్నారని చెబుతున్నారు. తణుకుకు చెందిన ఒక జనసేన నాయకుడు వారి వెనుక ఉండి నడిపిస్తున్నారని, ఆయన ఇస్తున్న ధైర్యంతోనే మమ్మల్ని బెదిరిస్తున్నారంటూ బాధితులు ఆరోపిస్తున్నారు. గతంలోనే పట్టణ పోలీసులను ఆశ్రయించామని.. అయితే న్యాయం జరగలేదని, తీరా తమపైనే పోలీసులకు ఫిర్యాదు చేశారంటూ వాపోతున్నారు. ఈ వ్యవహారంలో పోలీసులకు ఫిర్యాదు చేసినా ఏం జరగదని స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపేస్తారని కిలాడి జంట అంటున్నారని ఆందోళన చెందుతున్నారు.డబ్బులు వస్తాయనే ఉద్దేశ్యంతో అప్పులు చేసి మరీ డబ్బు ఇచ్చి మోసపోయామని ఈ వ్యవహారాన్ని పోలీసు ఉన్నతాధికారులు విచారించాలని, లేని పక్షంలో రానున్న రోజుల్లో ఆందోళనతోపాటు నిరాహార దీక్షలకు దిగనున్నట్లుగా బాధితులు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై తణుకు ఇన్చార్జి సీఐ దేశంశెట్టి వెంకటేశ్వరరా>వును వివరణ కోరగా బాధితులు ఫిర్యాదు చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని, శనివారం కూడా ఎవరూ స్టేషన్‌కు రాలేదని తెలిపారు. -
2.5 కిలోల గంజాయి స్వాధీనం
ఉపాధి కూలీల ఆకలి కేకలు ఉపాధి హమీ పథకంలో పనులు చేస్తున్న కూలీలకు సక్రమంగా వేతనాలు అందడం లేదు. జిల్లాలో రూ.2 కోట్లకుపైగా బకాయిలు ఉన్నాయి. 8లో uకామవరపుకోట: ఇద్దరు వ్యక్తులు గంజాయి తరలిస్తుండగా తడికలపూడి పోలీసులు పట్టుకుని వారి నుంచి 2.5 కిలోల గంజాయి స్వాధీనం చే సుకున్నారు. ఎస్సై వల్లీ పద్మ తెలిపిన వివరాల ప్ర కారం.. గంజాయి సరఫరా జరుగుతోందని ముందస్తు సమాచారం మేరకు కామవరపుకోట నుంచి ద్వారకాతిరుమల వెళ్లే రోడ్డులో తనిఖీలు చేపట్టామన్నారు. నారప్పగుంట, జగనన్న కాల నీ సమీపంలో తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పదంగా ఇద్దరు వ్యక్తులు తారసపడ్డారన్నారు. వారిని అదుపులో తీసుకుని తనిఖీ చేయగా గంజాయి ఉన్నట్టు గుర్తించామన్నారు. దీంతో తహసీల్దార్ ఎలీషా, వీఆర్వో బాబురావు ఆధ్వర్యంలో వారిని విచారించగా నిందితులు నల్లజర్ల మండలం పోతవరం గ్రామానికి చెందిన పామర్తి రా జు రంపచోడవరం, అరకు ప్రాంతాల నుంచి గంజాయి తీసుకువచ్చి కామవరపుకోట మేరీల బజారుకు చెందిన వానరాసి మౌళి ద్వారా కామవరపుకోట చుట్టుపక్కల ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్టు చెప్పారు. నిందితుల వద్ద నుంచి 2 సెల్ఫోన్లు, రూ. 900, 2.5 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై వల్లీ పద్మ చెప్పారు. -
ఆనం.. ఇదేం దారుణం!
ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల క్షేత్రంలో వేంకటేశ్వరస్వామిని శనివారం ఉదయం రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి దర్శించిన వేళ భక్తులు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. మంత్రి కోసం దాదాపు 40 నిమిషాల పాటు భక్తులకు స్వామి వారి దర్శనాన్ని నిలిపివేయడంతో క్యూలైన్లలో అవస్థలు పడ్డారు. ఉక్కపోతను తట్టుకోలేక సహనాన్ని కోల్పోయిన పలువురు భక్తులు క్యూలైన్ల గేట్లను పీకి పడేసేందుకు యత్నించారు. ఓ బాలిక అస్వస్థతకు గురయ్యింది. ఈ క్రమంలో మంత్రి ఆనం తీరుపై పలువురు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వివరాల్లోకి వెళితే.. శ్రీవారి క్షేత్రంలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు పాల్గొన్నారు. వారు స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు చేయించారు. క్యూలైన్లలో కిక్కిరిసి.. ఉత్తర రాజగోపురం వద్ద క్యూలైన్లలో కిక్కిరిసిన భక్తులు ఎండ వేడిమి, ఉక్కపోతకు గురయ్యారు. అదే సమయంలో ఓ బాలిక అస్వస్థతకు గురై కుప్పకూలింది. దీంతో ఆగ్రహానికి లోనైన పలువురు భక్తులు క్యూలైన్ గేట్లను పీకేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో అక్కడికి వచ్చి గొడవ చేయొద్దన్న ఓ హోంగార్డుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. క్యూలైన్ షెడ్లలో కనీసం ఫ్యాన్లు లేవని, ఊపిరాడక విలవిల్లాడుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. తాము చచ్చిపోతే ఎవరు బాధ్యులని ప్రశ్నించారు. మంత్రి కోసం ఇంతసేపు దర్శనాన్ని నిలిపివేస్తారా.. అని నిలదీశారు. ఇదిలా ఉంటే క్యూలైన్లలో కొందరు పిల్లలను భక్తులు గేట్లు పైనుంచి బయటకు పంపారు. అవే గేట్లు మధ్య ఉన్న ఖాళీ ల్లోంచి దూరి భక్తులు బయటకు వెళ్లి ఊపిరి పీల్చుకున్నారు. అలాగే ఉత్తర ద్వారం వద్ద క్యూలైన్లలో కొందరు మహిళా భక్తులు పడిగాపులు పడ్డారు. అంతా గందరగోళం మంత్రి, ఎమ్మెల్యే ఆలయంలోకి వెళ్లే సమయంలో పెద్ద ఎత్తున కూటమి నాయకులు వారి వెంట వెళ్లే ప్రయత్నం చేశారు. అయితే ఆలయ సిబ్బంది వారిని అడ్డుకున్నారు. నాయకులతో పాటు బయట నిలిచిపోయిన వారిలో ఒకరిద్దరు దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులు కూడా ఉన్నారు. అయితే మారంపల్లికి చెందిన ఓ టీడీపీ నాయకుడు ట్రస్ట్‌బోర్డు సభ్యులను లోపలికి పంపరా అంటూ నానా హడావుడి చేశాడు. ఆ సమయంలో ఆ ప్రాంతం గందరగోళంగా మారింది. అయితే ట్రస్ట్‌బోర్డు సభ్యుడు యెలమాటి శ్రీనివాసరావు ఆ నాయకుడిని ఊరుకోమని బుజ్జగించారు. ఆలయంలో ఏకంగా 40 నిమిషాల పాటు మంత్రి కోసం పూజలు జరపడం వివాదాస్పదమైంది. రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో ఇలాంటివి చేయడం ఎంతవరకు సమంజసమనేది మంత్రి, ఎమ్మెల్యేలే ఆలోచించుకోవాలని భక్తులు అంటున్నారు. మంత్రి రాకతో ద్వారకాతిరుమలలో భక్తులకు ఇక్కట్లు దాదాపు 40 నిమిషాల పాటు నిలిచిపోయిన స్వామి దర్శనం క్యూలైన్లలో ఉక్కపోతకు అవస్థలు అస్వస్థతకు గురైన బాలిక.. గేట్లు పీకేందుకు భక్తుల యత్నం -
టీడీపీలో తృప్తి చిచ్చు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఏలూరు నగర మేయర్‌కు కోపం వచ్చింది. కార్పొరేషన్ సొమ్ముతో ఏర్పాటుచేసిన తృప్తి క్యాంటీన్ ప్రారంభంలో మేయర్‌ను పట్టించుకోలేదు. ఫ్లెక్సీలో మొక్కుబడిగా చిన్నఫొటో వేశారు.. ఎమ్మెల్యేది నిలువెత్తు కటౌట్ వేసి కుడి, ఎడమ వైపు షాడోల ఫొటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటుచేశారు. కనీసం మేయర్‌కి బొకేగాని, శాలువా కాని ఇవ్వలేదు. కారు దిగితే కనీసం పట్టించుకోకపోవడంతో కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో ఆమె వేగంగా కారు ఎక్కి వెళ్లిపోవడంతో ప్రొటోకాల్ తెలియదా అంటూ షాడో మేయర్ కేకలు వేయడం హాట్‌టాపిక్‌గా మారింది. మేయర్ సీటు కోసం అంతర్యుద్ధం రాష్ట్ర ప్రభుత్వం అన్ని కార్పొరేషన్లల్లో తృప్తి క్యాంటీన్లను ఏర్పాటు చేస్తుంది. మెప్మా నిధులతో డ్వాక్రా మహిళల సభ్యుల టీమ్‌తో క్యాంటీన్‌ను ఏర్పాటు చేసి వాటి ద్వారా వచ్చే ఆదాయం కూడా మహిళా సంఘాలకే ఇచ్చేలా కొత్త కార్యక్రమం అంటూ విపరీతంగా పబ్లిసిటీ ఇచ్చారు. కొద్దిరోజుల క్రితం మెప్మా డైరెక్టర్ ఏలూరు కమిషనర్‌కు లేఖ రాశారు. రద్దీ ప్రాంతంలో ఒక చోటు చూపించి దానిలో ఫుడ్ కంటైనర్‌ను ఏర్పాటుచేయాలని, అన్ని సౌకర్యాలు కల్పించాలని లేఖ సారాంశం. వెంటనే కమిషనర్ కృష్ణా కాల్వ గట్టుపై కొంత భూమిని చదును చేయించి మూడు రోజుల వ్యవధిలోనే ట్రక్కు, అన్ని సౌకర్యాలు ఏర్పాటుచేసి హడావుడిగా దానిని డ్వాక్రా సభ్యురాలు కోనే క్రాంతి పేరుతో కేటాయించారు. శనివారం ఎమ్మెల్యే, మేయర్‌తో ప్రారంభోత్సవానికి ఏర్పాటుచేశారు. ఇక్కడే కొత్త సమస్య మొదలైంది. కూటమిలో మేయర్ సీటు కోసం అంతర యుద్ధానికి తెరలేచింది. ప్రస్తుత మేయర్ పదవీకాలం కొద్ది నెలల్లో ముగియడం, ఆ తర్వాత జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ ఆధారంగా ప్రతి సామాజికవర్గం నుంచి ఎమ్మెల్యే టీమ్‌లో ఇద్దరు, ముగ్గురు ఆశావహుల పేర్లతో హడావుడి మొదలుపెట్టారు. మేయర్ దంపతులు మళ్లీ మూడోసారి అవకాశం కోసం టీడీపీలో లాబీయింగ్ మొదలుపెట్టారు. ఈ పరిణామాల క్రమంలో రెండు రోజుల నుంచి ఏలూరు టీడీపీలో పొలిటికల్ చర్చ కొనసాగుతోంది. ప్రాధాన్యమివ్వకపోవడంతో మేయర్‌కు ఆగ్రహం నిర్వాహకులపై ఎమ్మెల్యే మండిపాటు నిలిచిపోయిన తృప్తి క్యాంటీన్ ప్రారంభం అధికార పార్టీలో ఫ్లెక్సీ సాక్షిగా గ్రూపు వివాదం మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటైన తృప్తి క్యాంటీన్‌కు సంబంధించి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఎమ్మెల్యే ఫొటోతో పాటు మేయర్, ప్రొటోకాల్ పరిధిలోని వ్యక్తుల ఫొటోలు ఉండాలి. అయితే నగరపాలక సంస్థ అధికారులు మెప్మా సిబ్బంది అత్యుత్సాహంతో ఎమ్మెల్యేదే నిలువెత్తు కటౌట్ ఏర్పాటు చేసి కుడి, ఎడమ వైపు ఎమ్మెల్యే వ్యవహారాలన్నీ చక్కపెట్టే కంప్యూటర్ ప్రసాద్, బెల్లంకొండ కిషోర్ ఫొటోలు పెద్దవిగా ఏర్పాటుచేశారు. దీంతో ఎమ్మెల్యేతో ప్రారంభోత్సవానికి వచ్చిన మేయర్ ఫ్లెక్సీలు చూసి అసహనానికి గురికావడం, అలాగే నిర్వాహకులు మేయర్‌కు బొకే ఇచ్చి ఆహ్వానించకపోవడంతో అలిగి వెంటనే వెళ్లిపోయారు. ఆ తర్వాత ఎమ్మెల్యే నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేసి క్యాంటీన్ ప్రారంభించకుండా వెళ్లిపోయారు. ఎమ్మెల్యే కార్యాలయం నుంచి ఎమ్మెల్యేల ఫోన్లకు మేయర్ దంపతులు స్పందించలేదని సమాచారం. -
శ్రీవారి కొండపై అభివృద్ధి పనులు ప్రారంభం
ద్వారకాతిరుమల: శ్రీవారి కొండపై శనివారం రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి రూ.29 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించారు. క్యూ కాంప్లెక్స్, అనివెట్టి మండపం, ఐదు అంతస్తుల శివాలయం రాజగోపురాలను ప్రారంభించారు. ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. సామాన్య భక్తులకు ఇబ్బంది లేకుండా త్వరితగతిన శ్రీవారి దర్శనం జరిగేలా చర్యలు తీసుకోవాలని, వేసవి దృష్ట్యా క్యూలైన్లలో భక్తులకు తాగునీరు, మజ్జిగ అందించాలని ఆదేశించారు. 2027 జూన్ 26 నుంచి జులై 7 వరకు జరిగే గోదావరి పుష్కరాలకు 12 కోట్ల మందికి పైగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లోని 43 ఆలయాలను రూ.54.71 కోట్లతో అభివృద్ధి చేస్తామన్నారు. రాష్ట్రంలో దేవాలయాలకు సంబంధించి ఎన్నికల్లో ఇచ్చిన 11 హామీలను నెరవేర్చామని మంత్రి అన్నారు. ద్వారకాతిరుమల, ఐఎస్ జగన్నాధపురం, పోలవరం ప్రాజెక్ట్ వరకు గల ఆలయాలు, పర్యాటక ప్రదేశాలను దర్శించేందుకు ప్రత్యేక పర్యాటక సర్క్యూట్ ఏర్పాటు చేసేందుకు యోచిస్తున్నట్టు చెప్పారు. ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు, జేసీ ఎంజే అభిషేక్ గౌడ, ఆలయ చైర్మన్ ఎస్వీ సుధాకరరావు, అనువంశిక ధర్మకర్త ఎస్వీఎన్ఎన్ నివృతరావు, మాజీ ఎమ్మెల్యే గంటా మురళి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధి కూలీల ఆకలి కేకలు
దెందులూరు: ఉపాధి హామీ పథకం పనులు జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో విస్తృతంగా జరుగుతున్నాయి. మండుటెండలో రోజంతా కష్టపడినా సక్రమంగా వేతనాలు అందడం లేదు. చెల్లింపుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. జిల్లాలో ఉపాధి వేతనదారులకు రెండు కోట్లకు పైగా బకాయిలు చెల్లించాల్సి ఉంది. వ్యవసాయ పనులు ముగియడంతో వేరే దారి లేక ఉపాధి పనులకు వెళ్లాల్సి వస్తోంది. ఫిబ్రవరి వరకు వేతనాలు చెల్లించారు. మార్చి ఏప్రిల్ నెలలకు వేతనాలు బకాయిలు చెల్లించలేదు. అప్పుడే మే నెల రెండో వారం నడుస్తోంది. రోజుకి లక్ష మంది పైగా హాజరు: జిల్లాలో ఆరు లక్షల 53 వేల 949 జాబ్ కార్డులు ఉన్నాయి. ఐదు లక్షల 932 జాబ్ కార్డులు యాక్టివ్‌గా ఉన్నాయి. లక్ష మంది పైగా ఉపాధి పనులకు హాజరవుతున్నారని రికార్డుల ద్వారా తెలుస్తోంది. ఉపాధి పనులకు హాజరయ్యే వారికి రోజుకి రూ.300 వరకు వేతనం లభిస్తుంది. రెండు నెలలు పూర్తయినా వేతనం అందకపోవడంతో శ్రామికుల పరిస్థితి అత్యంత దైన్యంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెక్కాడితే గాని డొక్కాడని శ్రామికులు భానుడి మంటలు తట్టుకొని ఉపాధి పనులకు వస్తున్నారు. ఉపాధి వేతనాలు నెలలు తరబడి మంజూరు చేయకపోవడం బాధాకరమని విమర్శిస్తున్నారు. రెండు నెలలుగా అందని బకాయిలు మండుతున్న ఎండల్లో పనులు చేస్తున్న శ్రామికులకు కనీస సౌకర్యాలు కల్పించడం లేదు. మెడికల్ కిట్లు, టెంట్, మంచినీళ్లు వంటి కనీస అవసరాలు కల్పించాలి. – వి.రామకృష్ణ, వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శిఆన్లైన్ విధానంతో జిల్లాలో పని పూటలు తగ్గాయి. రెండు పూటలా పని విధానం రద్దు చేయాలి. జిల్లాలో ఉపాధి శ్రామికుల పెండింగ్ బిల్లులు తక్షణమే చెల్లించాలి. ప్రభుత్వం మానవతా దృక్పథంతో రావాల్సిన బకాయి వేతనాలను బ్యాంకు ఖాతాలకు జమ చేయాలి. – మిడతా రమేష్, వైఎస్సార్సీపీ మండల నాయకుడు, కామవరపుకోట -
కక్ష సాధింపులతోనే అక్రమ కేసు
పెనుగొండ: కక్ష సాధింపుల్లో భాగంగానే అక్రమ కేసు బనాయించారని బెయిల్‌పై విడుదలైన వైస్సార్సీపీ నాయకుడు, కొడమంచిలి మాజీ సర్పంచ్ సుంకర సీతారామ్ ఆరోపించారు. శనివారం బెయిల్‌పై నరసాపురం సబ్ జైలు నుంచి ఆచంట చేరుకుని దివంగత సీఎం వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం లేనిపోని ఆరోపణలతో తప్పుడు కేసులు నమోదు చేసి వేధింపులకు గురిచేస్తోందన్నారు. ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ నాయకులను టార్గెట్ చేసి స్థానిక ఎమ్మెల్యే ఫ్యాక్షన్ రాజకీయాలు తెరలేపారని విమర్శించారు. నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమాలు, కక్ష సాధింపులపై న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు. మండల కన్వీనర్ జక్కంశెట్టి శ్రీరామ్, నాయకులు కోట వెంకటేశ్వరరావు, పాస్టర్ డేవిడ్ రాజు, జక్కంశెట్టి చంటి, పిల్లి రుద్రప్రసాద్, కేతా తాతారావు, కాండ్రేగుల కనకయ్య, పెచ్చెట్టి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. భీమవరం: స్థానిక డీఎన్నార్ కళాశాలలో శనివారం పీజీ సెట్ ప్రశాంతంగా జరిగింది. డీఎన్నార్ అటానమస్ కళాశాల సెంటర్లో మూడు సెషన్స్‌లో 278 మంది విద్యార్థులకు 248 మంది హాజరయ్యారు. డీఎన్నార్ ఇంజనీరింగ్ కళాశాలలో 200 మంది 189 మంది హాజరయ్యారు. పెంటపాడు: బడిఈడు పిల్లలను బడిలో చేర్పించే ఎన్రోల్మెంట్లో పెంటపాడు మండలం జిల్లాలో ప్రథమస్థానం సాధించిందని ఎంఈఓలు ఎం.శ్రీనివాస్, టీవీ రామకృష్ణ తెలిపారు. ఐదేళ్లు పూర్తయిన వారిని బడిలో చేర్చే కార్యక్రమంలో భాగంగా ప్రతి మండలం 55 శాతం పూర్తి చేయాలని డీఈఓ ఆఆదేశించారన్నారు. పెంటపాడు మండలంలో 59.84 శాతం ఎన్రోల్మెంట్ సాధించిందన్నారు. కె.పెంటపాడు, పెంటపాడు, పలు గ్రామాల్లో శనివారం కార్యక్రమం చేపట్టి మరో ఆరుగురు పిల్లలను బడిలో చేర్పించామని చెప్పారు. క్లస్టర్ హెచ్ఎం కృష్ణ, ఉపాధ్యాయులు, సీఆర్పీలు పాల్గొన్నారు. ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఈపీఎఫ్ పెన్షన్ రూ. 7,500కు పెంచాలని కోరుతూ సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించనున్నట్టు ప్రగతిశీల ఈపీఎఫ్ పెన్షనర్ల సంఘం ఏలూరు కమి టీ తెలిపింది. స్థానిక ఐఎఫ్టీయూ కార్యాలయంలో ధర్నా పోస్టర్‌ను శనివారం ఆవిష్కరించారు. ఐఎఫ్టీయూ నగర అధ్యక్షుడు బి. సో మయ్య మాట్లాడుతూ 30 ఏళ్లుగా ఈపీఎఫ్ పెన్షన్ పెంచలేదన్నారు. పార్లమెంటరీ కమిటీ పెన్షన్ రూ.7,500 పెంచాలని, కరువు భత్యం (డీఏ) లింకు చేయాలని, పెన్షన్‌దారులకు వైద్య సౌకర్యం కల్పించాలని సిఫార్సు చేసిందన్నారు. వీటిని వెంటనే కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకురావాలని కోరారు. ధర్నాలో పెన్షనర్లు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఐఎఫ్టీయూ రాష్ట్ర సహాయ కార్యదర్శి యు. వెంకటేశ్వరరావు, ఈపీఎఫ్ పెన్షన్‌దారుల సంఘ నాయకులు కోసూరి నూకరాజు, బుద్దా నాగేశ్వరరావు, కొంపంగి కృష్ణ పాల్గొన్నారు. నరసాపురం రూరల్: బాలికపై బంధువు అఘాయిత్యానికి పాల్పడగా పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. మొగల్తూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక బంధువుల వద్ద ఉంటూ ఇంటర్మీడియెట్ చదువుతోంది. ఆమె బంధువయ్యే ఓ వివాహితుడు చనువుగా ఉంటూ మాటలతో నమ్మించి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు మొగల్తూరు ఎస్సై కె.నాగేశ్వరరావు కేసు నమోదు చేశారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు చెప్పారు. -
గోడౌన్లకు గ్రహణం
ఆదివారం శ్రీ 10 శ్రీ మే శ్రీ 2026భీమవరం: వ్యవసాయమే జీవనాధారమైన జిల్లాలో రైతులను ప్రభుత్వం పట్టించుకుంటున్న దాఖలాలు కన్పించడం లేదు. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని భద్రపర్చుకునే అవకాశం లేక రైతులు తల్లడిల్లుతున్నారు. జిల్లాలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రైతుల కోసం నిర్మాణాలు చేపట్టిన మల్టీపర్పస్ గోడౌన్లు ఇప్పటికీ పూర్తికాలేదు. దీంతో రైతులు ధాన్యం, ఇతర పంటలు నిల్వ చేసుకునేందుకు ఇబ్బంది పడుతున్నారు. 20 మండలాలు.. 2.30 లక్షల ఎకరాలు జిల్లాలోని 20 మండలాల పరిధిలో దాదాపు 2.30 లక్షల ఎకరాల్లో వరి పండిస్తున్నారు. అలాగే పలువురు రైతులు కూరగాయలు, అరటి, కొబ్బరి వంటి పంటలతో పాటు ఆక్వా సాగు చేస్తున్నారు. గత ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతులు పంటలను నిల్వ చేసుకుని గిట్టుబాటు ధర వచ్చినపుడు విక్రయించుకునేలా సహకార సంఘాల ఆధ్వర్యంలో మల్టీపర్పస్ గోడౌన్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో 21 గోడౌన్ల నిర్మాణానికి స్థల సేకరణ, ఒక్కో నిర్మాణానికి రూ.40 లక్షలు మంజూరు చేశారు. అయితే కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంతో కొన్నిచోట్ల నిర్మాణాలు పూర్తికాలేదు. పంట కోసం పాట్లు : ప్రస్తుతం జిల్లాలో దాళ్వా వరి మాసూళ్లు ముమ్మరంగా సాగుతున్న నేపథ్యంలో ధాన్యం పట్టుబడికి గోనె సంచుల కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోపక్క వాతా వరణంలో మార్పులు కారణంగా అక్కడక్కడా భారీ వర్షాలు కురవడం, మబ్బులతో రైతులు కలవరపడుతున్నారు. ఇటువంటి తరుణంలో గోడౌన్లు అందుబాటులో ఉంటే ధాన్యం నిల్వ చేసుకుని సంచులు లభించినప్పుడు విక్రయించుకునే అవకాశం ఉంటుంది. పంట కూడా సురక్షితంగా ఉంటుంది. అయితే ప్రస్తుతం ఆ పరిస్థితులు లేవు. ధాన్యం నిల్వ చేసుకునే జాగా లేకపోవడంతో వర్షానికి తడిచిపోతుందనే భయంతో తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వస్తోందని రైతులు ఆవేదన చెందుతున్నారు. జిల్లాలో గత ప్రభుత్వంలో 21 గోడౌన్ల నిర్మాణాలకు నిధులు మంజూరు కాగా అప్పట్లోనే 14 నిర్మాణాలు పూర్తయ్యాయి. 1,000 టన్నుల సామర్థ్యం గల గోడౌన్, ధాన్యం ఆరబెట్టుకోవడానికి ప్లాట్‌ఫామ్స్ నిర్మాణాలకు రూ.75 లక్షలు, 500 టన్నుల సామర్థ్యం గల గోడౌన్లకు రూ.40 లక్షలు మంజూరు చేశారు. కొన్నిచోట్ల దాతలు స్థలాలను ఉచితంగా ఇవ్వగా మరికొన్ని చోట్ల ప్రభుత్వ స్థలాలను కేటాయించారు. గోడౌన్స్‌ను పూర్తిస్థాయిలో వినియోగంలోనికి తీసుకువచ్చి కూరగాయలు, ఆక్వా ఉత్పత్తులు నిల్వచేసుకోడానికి అవసరమైన కోల్డ్‌స్టోరేజ్‌లు కూడా ఏర్పాటు చేయాలని అప్పట్లో భావించారు. ఈ క్రమంలో జిల్లాలో కాళ్ల, కాళ్లకూరు, శృంగవృక్షం, ఉండి, కేశవరం, మత్స్యపురి, అలంపురం ప్రాంతాల్లో గోడౌన్ నిర్మాణాలు పునాది, గోడలు స్థాయికి వచ్చాయి. కూటమి ప్రభుత్వం రెండేళ్లుగా వీటి పై దృష్టి సారించడం లేదు. అసంపూర్తి నిర్మాణాలు ముందుకు సాగడం లేదు. వీటిని త్వరితగతిన పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురా వాలని రైతులు కోరుతున్నారు. రైతులకు అక్కరకు రాని మల్టీపర్పస్ గోడౌన్లు గత ప్రభుత్వంలో 21 మంజూరు.. 14 పూర్తి రెండేళ్లుగా 7 గోడౌన్ల నిర్మాణాలపై కూటమి సర్కారు నిర్లక్ష్యం ధాన్యం, ఇతర పంటలు నిల్వ చేసేందుకు రైతుల అవస్థలు ధాన్యం ఆరబెట్టడానికి ప్లాట్‌ఫామ్స్ కరువు జిల్లాలో 21 గోడౌన్లు మంజూరు కాగా ఇప్పటివరకు 14 నిర్మాణాలు పూర్తయ్యాయి. మిగిలిన ఏడు గోడౌన్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. వాటి నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసి రైతులకు అందుబాటులోకి తీసుకువస్తాం. – సంకు మురళీకృష్ణ, జిల్లా సహకారశాఖాధికారి, భీమవరం -
గుర్రపుడెక్క ఇలా.. నీరు పారేదెలా?
అధ్వానంగా మురుగు డ్రెయిన్లు ఉంగుటూరు: డెల్టా ప్రాంతంలోని పంట భూముల్లో మురుగునీరు పారేందుకు ప్రధానమైన డ్రెయిన్లు పూర్తిగా గుర్రపుడెక్క, తూడుతో నిండిపోయాయి. ఏటా వర్షాకాలంతో వానలు, వరదలు వచ్చినప్పుడు చేలల్లో నీరు పారక రైతులు పంట నష్టపోతున్నారు. వేలాది ఎకరాల్లో వరి దెబ్బతింటోంది. ఈ పరిస్థితుల నుంచి గట్టెక్కేందుకు మురుగు డ్రెయిన్ల నిర్వహణ అత్యంత ముఖ్యం. ప్రస్తుతం వేసవి కాలం కావడంతో డ్రెయిన్లు తవ్వకం, గుర్రపుడెక్క, తూడు తొలగింపు వంటి పనులు చేపట్టాల్సి ఉంది. అయితే ఈ ఏడాది ఈ పనులను ఇప్పటివరకూ చేపట్టలేదు. పనులపై అనుమానాలు ఉంగుటూరు నియోజకవర్గంలో 35 వరకు మేజర్, మీడియం, మైనర్ డ్రెయిన్లు ఉన్నాయి. వీటిలో బొమ్మిడి నీటి సంఘం పరిధిలోని దొంతవరం డ్రెయిన్, రంగరావుకోడు, పొదకోడు వంటి మీడి యం డ్రెయిన్లు, ఉంగుటూరు నం.3 యూటీ తవ్వకాలకు రూ.40 లక్షలు మంజూరైనట్టు సమాచారం. అయితే పనులు మాత్రం చేపట్టలేదు. వేసవి పూర్తయ్యేలోపు పనులు మొదలు కావాల్సి ఉంది. చివరిలో పనులు మొదలుపెట్టి నామమాత్రంగా ముగిస్తారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డ్రెయిన్లలో గుర్రపుడెక్కను పూర్తిస్థాయిలో తొలగించాల్సి ఉంది. ఉంగుటూరు మండలంలోని తోకలపల్లి మేజర్ కోడు, పందికోడు డ్రెయిన్‌తో పాటు పలు డ్రెయిన్లలో గుర్రపుడెక్క నిండి ఉంది. డ్రెయిన్లలోని గుర్రపుడెక్క, తూడును తొలగిస్తాం. బొమ్మిడి నీటి సంఘం పరిధిలో రంగరావుకోడు, పొదకోడు, దొంతవరం డ్రెయిన్, ఉంగుటూరులో నం.3 యూటీ డ్రెయిన్ తవ్వకాలకు అనుమతులు వచ్చాయి. ఆయా పనులు చేపడతాం. – వెంకటేశ్వరరావు, ఏఈ డ్రెయిన్స్, ఉంగుటూరు -
ఆయాలకు ఫుల్ టైం వేతనాలు ఇవ్వాలి
తాడేపల్లిగూడెం (టీఓసీ): మున్సిపల్ స్కూల్ ఆయాలకు జీఓ నెంబర్ 193 మేరకు ఫుల్ టైం వేతనాలు ఇవ్వాలని ఈఫ్టీయూ నాయకులు మామిడి దాన వరప్రసాద్ డిమాండ్ చేశారు. ఆయాల జనరల్ బాడీ సమావేశం శనివారం ఫాతిమా మునీషా అధ్యక్షతన ఐఎఫ్టీయూ యూనియన్ కార్యాలయంలో జరిగింది. వేతనాలు ఇవ్వాలని కోరుతూ నిరసన వ్యక్తం చేశారు. దానవర ప్రసాద్ మాట్లాడుతూ మున్సిపల్ ఆయాలు రోజుకు 8 నుంచి 10 గంటల వరకు పనిచేస్తున్నారని, కేవలం వీరి వేతనాలు రూ.4 వేలు అన్నారు. గత 15 సంవత్సరాలుగా స్కూల్ ఆయాలు ఫుల్ టైం చేస్తున్నప్పటికి చాలీ చాలనీ వేతనాలతో ఇల్లు గడవటమే కష్టసాధ్యంగా మారిందన్నారు. శ్రమకు తగిన విధంగా ఆదాయం రావడం లేదని వాపోయారు. కనీస వేతనం అమలు చేయాలని, ఈఎస్ఐ, పీఎఫ్ కల్పించాలని, ఇతర సంక్షేమ పథకాలు అమలు చేయాలని, సమాన పనికి సమానం వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తాడేపల్లిగూడెం రూరల్: మండలంలోని పెదతాడేపల్లి గ్రామంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో చోరీకి పాల్పడిన సంఘటనపై కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్సై ఎస్.రవికుమార్ శనివారం తెలిపారు. ఈ సంఘటన గత నెల 28న జరిగిందని, రెండు కాసుల బంగారం, అర కిలో వెండి మాయమైనట్లు బాధితుడు గోగులమూడి సురేష్ ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిపారు. దర్యాప్తు చేస్తున్నామన్నారు. భీమవరం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందినట్లు భీమవరం టూటౌన్ ఎస్సై రామారావు శనివారం చెప్పారు. అత్తిలి మండలం లక్ష్మీ నారాయణపురం గ్రామానికి చెందిన పొలమరశెట్టి సాంబశివ(41) ఈ నెల 8 న తన ఇంటి నుంచి మోటారు సైకిల్‌పై గొల్లవానితిప్ప వెళ్తుండగా పరమ్మగుడి వద్ద బైక్ అదుపుతప్పి రోడ్డుపై పడిపోయాడు. దీంతో తలకు తీవ్రగాయం కావడంతో మరణిండాడని అతని సోదరుడు బాపూజీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. పెదపాడు: అనుమానాస్పద రీతిలో బాలుడు మృతి చెందిన సంఘటన పెదపాడు మండంలోని నాయుడుగూడెంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బండి రమేష్ కుమార్తె నీలిమ ప్రియాంకను నాయుడుగూడెం గ్రామానికి చెందిన పిట్టా వినోద్‌కు ఇచ్చి 12 ఏళ్ల క్రితం వివాహం చేశారు. వారికి బాబు పుట్టిన తరువాత నీలిమ ప్రియాంకను అనుమానిస్తూ కాపురానికి తీసుకువెళ్లకుండా 9 ఏళ్లు కాలయాపన చేసాడు. దీంతో పుట్టింటిలోనే ఉంది. కుమారుడు రిషిబాబు(11) పెదపాడులోని శ్రీకృష్ణ గురుకులంలో చదువుకుంటున్నాడు. 2024లో పెద్దల సమక్షంలో భార్య, కుమారుడిని కాపురానికి తీసుకువెళ్లాడు. తరచూ అనుమానంతో పిల్లవాడిని నువ్వు నాకు పుట్టలేదంటూ వేధిస్తున్నట్లు నీలిమ ఐసీడీఎస్‌కి ఫిర్యాదు చేసింది. రిషిని ఓ గదిలో ఇనుపచైన్తో కట్టేసి కొట్టేవాడు. 9వ తేదీ ఉదయం 8.30 గంటల సమయంలో నాయుడుగూడెం ఇంటి చుట్టు పక్కల వారు రిషి తాతకు ఫోన్ చేసి మీ మనవడు చనిపోయాడని చెప్పడంతో ఇంటికి వెళ్లి చూసే సరికి బాలుడిని ఇంటిముందు మంచంపై పడుకోబెట్టారు. వీపు, చేతిపైన, కాళ్లపైన మెడపైన కమిలిన గాయాలు కనపడంతో తాత ఫిర్యాదు మేరకు పెదపాడు ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కిలాడీ జంట మోసంపై ఫిర్యాదులు
● మహిళ వెనుక జనసేన నాయకుడు? ● పోలీసు ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవాలని బాధితుల మొర తణుకు అర్బన్: తక్కువ ధరకే బంగారు బిస్కెట్లు, నగదుకు ఎక్కువ వడ్డీ ఇస్తామంటూ మోసం చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న తణుకు సజ్జాపురానికి చెందిన స్నేహలత, దుర్గాప్రసాద్‌ల వ్యవహారం సంచలనం రేకెత్తిస్తోంది. సుమారుగా రూ.25 కోట్లు దోచుకున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం పొందవచ్చని ఆశపడిన మహిళలు మోసపోయామని తెలుసుకుని ఆందోళన చెందుతున్నారు. ఈ నెల 8వ తేదీన తణుకులో బాధిత మహిళలు తాము మోసపోయామంటూ మీడియా ముందు వాపోయారు. దీంతో కిలాడీ జంట వ్యవహారం తణుకులో చర్చనీయాంశంగా మారింది. తాజాగా మరికొంతమంది బాధితులు బయటకువస్తున్నట్లుగా తెలుస్తోంది. స్థానికంగా కొందరు బంగారం దుకాణదారులను సైతం ఈ జంట మోసం చేసినట్లు తెలుస్తోంది. కిలాడీ జంటకు తాము చేసిన బ్యాంకు లావాదేవీలు, ఫోన్‌పేల ద్వారా పంపించిన నగదు వివరాలతోపాటు మాట్లాడిన వీడియోలు తమ వద్ద ఉన్నాయని బాధితులు చెబుతున్నారు. తమ డబ్బు, బంగారం తీసుకుని కిలాడి జంట మోసం చేశారంటూ మీడియా ముందు బాధితులు వెల్లడించడంతో వారి నుంచి బెదిరింపులు వస్తున్నాయని బాధిత మహిళలు ఆరోపిస్తున్నారు. తమపై కేసులు నమోదు చేయిస్తామని, సోషల్ మీడియా ద్వారా అల్లరి చేస్తామంటూ బెదిరిస్తున్నారని చెబుతున్నారు. తణుకుకు చెందిన ఒక జనసేన నాయకుడు వారి వెనుక ఉండి నడిపిస్తున్నారని, ఆయన ఇస్తున్న ధైర్యంతోనే మమ్మల్ని బెదిరిస్తున్నారంటూ బాధితులు ఆరోపిస్తున్నారు. గతంలోనే పట్టణ పోలీసులను ఆశ్రయించామని.. అయితే న్యాయం జరగలేదని, తీరా తమపైనే పోలీసులకు ఫిర్యాదు చేశారంటూ వాపోతున్నారు. ఈ వ్యవహారంలో పోలీసులకు ఫిర్యాదు చేసినా ఏం జరగదని స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపేస్తారని కిలాడి జంట అంటున్నారని ఆందోళన చెందుతున్నారు.డబ్బులు వస్తాయనే ఉద్దేశ్యంతో అప్పులు చేసి మరీ డబ్బు ఇచ్చి మోసపోయామని ఈ వ్యవహారాన్ని పోలీసు ఉన్నతాధికారులు విచారించాలని, లేని పక్షంలో రానున్న రోజుల్లో ఆందోళనతోపాటు నిరాహార దీక్షలకు దిగనున్నట్లుగా బాధితులు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై తణుకు ఇన్చార్జి సీఐ దేశంశెట్టి వెంకటేశ్వరరాావును వివరణ కోరగా బాధితులు ఫిర్యాదు చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని, శనివారం కూడా ఎవరూ స్టేషన్‌కు రాలేదని తెలిపారు. -
రైతులను గాలికొదిలేసిన చంద్రబాబు
జంగారెడ్డిగూడెం: చంద్రబాబు సర్కారు రైతులను గాలికొదిలేసిందని వైఎస్సార్సీపీ ఏలూరు పార్ల మెంట్ ఇన్చార్జి కారుమూరి సునీల్‌కుమార్ ధ్వజమెత్తారు. శనివారం వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి, మచిలీపట్నం పార్లమెంట్ పరిశీలకుడు జెట్టి గురునాథరావు, నాయకులతో జంగారెడ్డిగూడెం మండలంలో మొక్కజొన్న రైతులను కలిసి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సునీల్ మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వ పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఎన్నికల సమయంలో పలు హామీలిచ్చి అధికారం చేపట్టిన తర్వాత విస్మరించారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులు పంటలకు గిట్టుబాటు ధర లేక నష్టాలపాలవుతున్నారన్నారు. మొక్కజొన్న రైతులు ఎకరాకు రూ.30 వేల వరకు పెట్టుబడి పెడితే మద్దతు ధర కూడా దక్కడం లేదన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రైతులను అన్నివిధాలా ఆదుకున్నామని, అయితే చంద్రబాబు సర్కారు జేబులు నింపుకోవడానికే చూస్తోంది తప్ప రైతులను, ప్రజలకు గాలికి వదిలేసిందన్నారు. రైతులతో పాటు విద్యార్థులు, మహిళలు, పేదలు ఇలా అన్నివర్గాలు ఇ బ్బందులు పడుతున్నాయన్నారు. రైతుల కష్టాన్ని గుర్తించి వెంటనే గిట్టుబాటు ధర కల్పించాలని, ప్రజలకు సక్రమంగా సంక్షేమ పథకాలు అందించాలని సునీల్‌కుమార్ డిమాండ్ చేశారు. గిట్టుబాటు ధర కల్పించాలి వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి జెట్టి గురునాథరావు మాట్లాడుతూ ఏజెన్సీ, మెట్ట ప్రాంతంలో ఎక్కువగా పొగాకు, మొక్కొజొన్న, ఆయిల్‌పామ్ వంటి పంట లు రైతులు పండిస్తున్నారని, సరైన గిట్టుబాటు ధర లేక అవస్థలు పడుతున్నారన్నారు. గత ప్రభుత్వంలో మొక్కజొన్నకు ప్రభుత్వం గిట్టుధర రూ.2,400 అందించగా.. ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం కనీసం కొనుగోలు కేంద్రాలు కూడా ఏర్పాటుచేయలేదని విమర్శించారు. దీంతో రైతులు దళారులకు మొక్కజొన్న అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. గతేడాది మొక్కజొన్న క్వింటాల్ రూ.2,200కు విక్రయిస్తే ప్రస్తుతం రూ.1,500 నుంచి రూ.1,800 మాత్రమే ధర వస్తోందన్నారు. వర్జీనియా పొగాకు పరిస్థితీ దారుణంగా ఉందని కిలోకు రూ.300 ధర దాటడం లేదన్నారు. ఏటా సాగు ఖర్చులు పెరుగుతున్నాయని, గిట్టుబాటు ధరలు లేక రైతులు అప్పులు చేసి వర్జీనియా సాగు చేశారన్నారు. పార్టీ మండల కమిటీ అధ్యక్షుడు ఓరుగంటి నాగేంద్ర, రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శులు కుక్కల ధర్మరాజు, గురజాల పార్థసారథి, ఇర్ల శ్రీనివాసరెడ్డి, మాజీ వైస్ చైర్మన్ ముప్పిడి అంజి, నాయకులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ పార్లమెంట్ ఇన్చార్జి సునీల్ ధ్వజం -
మద్దిలో అభిషేక సేవ
జంగారెడ్డిగూడెం : గుర్వాయిగూడెం మద్ది క్షేత్రంలో శనివారం సందర్భంగా ఆంజనేయస్వామికి అభిషేక సేవ నిర్వహించారు. ఆలయ ముఖ మండపంపై ఆంజనేయస్వామి ఉత్సవ విగ్రహానికి పంచామృతాలతో అర్చకులు, వేదపండితుల ఆధ్వర్యంలో అభిషేకం నిర్వహించారు. ఆలయానికి వివిధ సేవల రూపేణా రూ.1,81,683 ఆదాయం వచ్చినట్లు ఈవో ఆర్వీ చందన తెలిపారు. నిత్యాన్నదాన సత్రంలో సుమారు 1779 మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించినట్లు ఈవో తెలిపారు. నూజివీడు: గతంలో అనధికారికంగా మద్యం విక్రయిస్తూ పట్టుబడి కేసుల్లో బుక్ అయిన నిందితులకు లోక్‌అదాలత్ ద్వారా తమ కేసులను పరిష్కరించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించిందని ఎకై ్సజ్ సీఐ ఏ మస్తానయ్య శనివారం పేర్కొన్నారు. స్థానిక ఎకై ్సజ్ స్టేషన్ వద్ద అనధికారికంగా మద్యం విక్రయిస్తూ పట్టుబడిన నిందితులతో సమావేశం నిర్వహించిన ఎకై ్సజ్ సీఐ మాట్లాడుతూ తమపై ఉన్న కేసులను పరిష్కరించుకోవడానికి ప్రభుత్వం జీవోను విడుదల చేసిందన్నారు. పట్టుబడిన మద్యం సీసాల విలువకు మూడు రెట్లు జరిమానాను ప్రభుత్వ ఖజానాకు చలానా రూపంలో చెల్లిస్తే అక్రమ మద్యం విక్రయదారులపై ఉన్న కేసులను లోక్‌అదాలత్ ద్వారా పరిష్కరించుకోవచ్చన్నారు. ఈ అవకాశాన్ని నిందితులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. తణుకు అర్బన్: తణుకు ఆర్టీసీ డిపోలో రోజూవారీ వేతనంతో అవుట్సోర్సింగ్ విధానంలో డ్రైవర్స్‌ను తీసుకుంటున్నట్లు డిపో మేనేజరు ఏడీఎల్ సుధారాణి తెలిపారు. హెవీ డ్రైవింగ్ లైసెనన్స్ వచ్చి 18 నెలలు పూర్తికావాలని, గతంలో ఎలాంటి ప్రమాదాలకు పాల్పడలేదని మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్తో ధ్రువపత్రం, ఆధార్ కార్డు, హెవీ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుని డిపోలో హాజరుకావాలని సూచించారు. రికార్డు పరిశీలన అనంతరం మెడికల్ పరీక్షలు చేయించి ట్రైనింగ్‌లో సెలెక్ట్ అయినవారిని తీసుకుంటామని చెప్పారు. దరఖాస్తులను డిపో అసిస్టెంట్ మేనేజరు కార్యాలయంలో అందచేయాలని, ఇతర వివరాలకు 7382903287, 7382908959 నంబర్లలో సంప్రదించి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చని చెప్పారు. -
రైలు ప్రయాణం.. నరకం
● జనరల్ బోగీల్లో చోటు లేక అవస్థలు ● రిజర్వేషన్లు లభించక ప్రయాణికుల పాట్లు ● రైల్వేస్టేషన్లలో తాగునీటికి కటకట, మరుగుదొడ్ల కొరత కై కలూరు: వేసవిలో రైలు ప్రయాణం నరక ప్రాయంగా మారింది. సెలవులకు వెళ్తున్న ప్రయాణికులకు రిజర్వేషన్లు లభించక జనరల్ బోగీల్లో ప్రయణించాల్సి వస్తోంది. ఇసకేస్తే రాలనంత జనంతో జనరల్ బోగీలు కిక్కిరిసిపోతున్నాయి. వృద్ధులు, చిన్నారులు ఉక్కపోతతో విలవిల్లాడుతున్నారు. జాగా కోసం ప్రయాణికుల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి. ఈ బాధలు పడలేక తప్పని పరిస్థితుల్లో రిజర్వేషన్ల బోగిల్లో ప్రయాణిస్తే ఫైన్ల రూపంలో టిక్కెట్ కలెక్టర్లు వసూలు చేస్తున్నారు. దక్షిణ మధ్య రైల్వేలో విజయవాడ వయా ఏలూరు – విశాఖపట్నం, నరసాపురం, విశాఖపట్నం వయా నరసాపురం, భీమవరం విజయవాడ రూట్లు కీలకమైనవి. ఏలూరు నుంచి కోణార్క్, యశ్వంత్‌పూర్, కోరమండల్, ఈస్ట్‌కోస్ట్, లింగంపల్లి – జన్మభూమి, బెంగుళూరు, ప్రశాంతి, సింహాద్రి, ఎల్టీటీ, రాయ్‌గఢ్, తిరుపతి ఇలా దాదాపు 18 ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసులు రోజూ నడుస్తోన్నాయి. అదే విధంగా విజయవాడ వయా గుడివాడ, భీమవరం మీదుగా విశాఖ, చైన్నె, తిరుపతి, హైదరాబాదు, టాటానగర్, తిరుపతి, కాకినాడ పోర్టు వంటి దాదాపు 11 ఎక్స్‌ప్రెస్ సర్వీసులు నడుస్తున్నాయి. రాత్రి ప్రయాణాల్లో రద్దీ ఎక్కువగా కనిపిస్తోంది. జనరల్ బోగీల పెంపు కలేనా? సుదూర ప్రాంతాలకు నడుస్తున్న ఎక్ర్‌ప్రెస్ రైళ్ళలో మూడు, కొన్నింటికి నాలుగు జనరల్ బోగీలు మాత్రమే ఉంటున్నాయి. ముందు భాగంలో కొన్ని, వెనుక మరికొన్ని ఉంటున్నాయి. ఒక్కో బోగిలో పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కుతున్నారు. మూత్ర విసర్జనకు సైతం వెళ్ళలేని పరిస్థితి జనరల్ బోగిల్లో కనిపిస్తోంది. కింద కూర్చునే విషయంలో ప్రయాణికుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. మరుగుదొడ్ల దుర్వాసన భరించలేక అనేక మంది ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మౌలిక వసతుల కొరత ప్రయాణికులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తాం అని గొప్పలు చెబుతున్న రైల్వే శాఖ క్షేత్ర స్థాయిలో వాటి అమలు బాధ్యత తీసుకోవడం లేదు. అనేక స్టేషన్లలో కుళాయిల్లో నీరు వస్తున్నా అవి తాగడానికి ఏ మాత్రం పనిచేయడం లేదు. పగటి పూట శివారు బోగీలకు మండుటెండలో నడిచి ఎక్కాల్సిన పరిస్థితి. ముఖ్యంగా మరుగుదొడ్ల గదులకు తాళాలు వేస్తున్నారు. అత్యవసరమైతే స్టేషన్ మాస్టార్ వద్ద తాళాలు తీసుకునే పరిస్థితి ఏర్పడుతోంది. రిజర్వేషన్లు, తత్కాల్ విషయానికి వస్తే శ్రీక్యూశ్రీలైన్లలో నిలుచున్నా కొంత సమయానికి కోటా అయిపోయిందని సిబ్బంది చెబుతున్నారు. మౌలిక వసతులపై రైల్వే అధికారులు దృష్టి సారించాలని ప్రయాణికులు కోరుతున్నారు. ప్రయాణికులకు తగ్గట్టుగా ఎక్స్‌ప్రెస్ రైళ్ళలో జనరల్ బోగీల సంఖ్య పెరగడం లేదు. దీంతో మధ్యతరగతి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. రైల్వేశాఖకు బోగీల సంఖ్య పెంచాలని ప్రయాణికుల నుంచి వినతులు వెళుతున్నాయి. వేసవి సెలవులకు దూర ప్రాంతాలకు వెళ్ళే ప్రయాణికులను దృష్టిలో పెట్టుకుని బోగీల సంఖ్య పెంచాలి. – చావలి శంకరశాస్త్రి, న్యాయవాది, కై కలూరురైలు ప్రయాణికులకు స్టేషన్లలో తాగునీరు, మరుగుదొడ్ల వంటి కనీస సౌకర్యాలు కల్పించాలి. కై కలూరు ప్రాంతంలో డబుల్ లైన్ ట్రాక్ వేసిన తర్వాత గూడ్సు రైళ్ళ సంఖ్య పెరిగింది. దీంతో క్రాసింగ్ గేట్ల వద్ద ఎక్కువ సమయం ప్రయాణికులు వేచి ఉంటున్నారు. బ్రిడ్జిలు, అండర్ గ్రౌండ్ వంతెనలు నిర్మించాలి. – కోమటి విష్ణువర్థనరావు, వైఎస్సార్సీపీ ముదిరాజుల విభాగ అధ్యక్షుడు -
పాస్టర్ ముసుగులో బాలికపై అఘాయిత్యం
● 3 నెలలుగా బాలికపై లైంగిక దాడి.. ● గర్భనిరోధక మాత్రలు వేయడంతో బాలికకు తీవ్ర అస్వస్థత ● కామవరపుకోట మండలంలో దారుణం కామవరపుకోట: పాస్టర్ ముసుగులో ఓ కామాంధుడు 14 ఏళ్ల బాలికను చెరబట్టాడు. భక్తి ముసుగులో పాస్టర్ అవతారమెత్తిన కీచకుడు బాలికకు మాయమాటలు చెప్పి పలుమార్లు అత్యాచారం చేసిన ఘటన ఏలూరు జిల్లా కామవరపుకోట మండలంలో ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల ప్రకారం కామవరపుకోట మండలంలోని ఓ గ్రామానికి చెందిన సీహెచ్ రాంబాబు అలియాస్ హోసన్న కూలీ పనులు చేసుకుంటూ, పాస్టర్‌నని చెప్పుకుంటూ తిరుగుతున్నాడు. అతడి భార్య కొన్నేళ్ల క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో రాంబాబు కొంతకాలంగా ఓ కుటుంబానికి దగ్గరయ్యాడు. ఆ ఇంట్లోని బాలికకు మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడు. మూడు నెలలుగా తన ఇంటికి బాలికను రప్పించుకుని పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇటీవల బాలిక గర్భం దాల్చిందనే అనుమానంతో ఆమె తల్లిదండ్రులకు తెలియకుండా పాస్టర్ రాంబాబు మోతాదుకు మించి గర్భ నిరోధక మాత్రలు వేయడంతో బాలిక తీవ్ర అస్వస్థతకు గురైంది. దీంతో బాలికను తల్లిదండ్రులు ఏలూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి అక్కడి నుంచి మెరుగైన వైద్య నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ ఆస్పత్రి సిబ్బంది బాలికను ఆరా తీయడంతో పాస్టర్ రాంబాబు బండారం బయటపడింది. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తడికలపూడి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. ఏలూరు ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్న బాలిక పరిస్థితి చూసి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధిస్తున్నారు. నిందితుడు రాంబాబుకు కఠిన శిక్ష పడాలని పలువురు కోరుతున్నారు. -
చివరిలో కంగారు
ఆరుగాలం కష్టపడి పండించిన దాళ్వా పంట చేతికొచ్చింది. ఇప్పటికే 70 శాతం రైతులు మాసూళ్లు పూర్తి చేసి, ధాన్యం అమ్ముకోగా, మిగిలిన రైతులు వరికోతలు కోయడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ దశలో వాతావరణ మార్పులు రైతుల గుండెల్లో గుబులు రేపుతుంది. గురువారం మధ్యాహ్నం ఉన్నట్టుండి ఒకల్కసారిగా వాతావరణం మబ్బులతో నిండి వర్షం జల్లులు పడటంతో రైతులు ఆగమేఘాలపై ఽరాశులు చేసిన ధాన్యం, రోడ్లు, పుంతగట్లపై ఎండబెట్టిన ధాన్యం, ఎగుమతి చేయడానికి నెట్టుకట్టిన బస్తాలు వర్షం పాలు కాకుండా సంరక్షించుకోవడానికి నానా తంటాలు పడ్డారు. – గణపవరం -
గైర్హాజరే ప్రత్యేకం
భీమవరం: టెన్త్పబ్లిక్ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతుల్లో గైర్హజారే ప్రత్యేకంగా నిలుస్తుంది. గత వైఎస్సార్ సీపీ హయాంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో ఫెయిల్ అయిన విద్యార్థులకు రెండు పూటలా ప్రత్యేక తరగతులు నిర్వహించి వారికి భోజన సదుపాయం ఏర్పాటు చేసేవారు. కానీ నేటి కూటమి ప్రభుత్వం ఒక్క పూట మాత్రమే తరగతులు నిర్వహిస్తూ విద్యార్థులకు భోజనాలు పెట్టకపోవడంతో ప్రత్యేక తరగతలకు హాజరయ్యే విద్యార్థుల సంఖ్య చాలా తక్కువగా ఉంటోంది. జిల్లాలోని 20 మండలాల పరిధిలో మార్చిలో నిర్వహించిన పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు ప్రభుత్వ, ప్రైవేటు స్కూల్స్‌కు చెందిన విద్యార్థులు 22,369 మంది పరీక్షలకు హాజరుకాగా వారిలో 19,141 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో 275 ప్రభుత్వ పాఠశాలల నుంచి 12,387 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా వారిలో 9,567 మంది ఉత్తీర్ణత పొందారు. 269 ప్రభుత్వ హైస్కూల్స్‌లో ప్రత్యేక తరగతులు జిల్లాలోని 275 ప్రభుత్వం హైస్కూల్క్కు గానూ 6 పాఠశాలలోని విద్యార్థులు నూరు శాతం ఉత్తీర్ణత సాధించగా మిగిలిన 269 స్కూల్స్‌లోని 2,820 మంది ఫెయిల్ అయిన విద్యార్థులకు ఆయా స్కూల్స్‌లో ప్రత్యేక తరగతులు నిర్వహించి ఉత్తీర్ణత సాధించే విధంగా కృషి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. మే 25 నుంచి జూన్ 4 వరకు నిర్వహించే అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేయడానికి ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సబ్జెట్స్ వారిగా ప్రత్యేక తరగతలు నిర్వహించాల్సి ఉంటుంది. అయితే ప్రత్యేక తరగతులకు హాజరయ్యే ఉపాధ్యాయులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సహం లేకపోగా ఫెయిల్ అయిన విద్యార్థులను తరగతులకు తీసుకువచ్చే బాధ్యత కూడా వారిపైనే పెట్టారు. ప్రతిరోజూ రెండు, మూడు సబ్జెక్ట్స్‌ను పూర్తిస్థాయిలో బోధించి విద్యార్థులు మొత్తం ఉత్తీర్ణత సాధించే విధంగా తీర్చిదిద్దాల్సి బాధ్యత ఉపాధ్యాయులదే. వేసవి సెలవుల్లో తప్పనిసరి పరిస్థితులో ఉపాధ్యాయులు పాఠశాలకు వస్తున్నా ఫెయిల్ అయిన విద్యార్థులు 40 శాతం కూడా హాజరుకాకపోవడంతో ఉపాధ్యాయులు తలలు పట్టుకుంటున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్లు చేసి తరగతులకు పంపించాలని కోరుతున్నా ఫలితం కనిపించడం లేదు. గత ప్రభుత్వ హయాంలో విద్యార్థులకు ప్రభుత్వ భోజనం, దాతల సహకారంతో స్నాక్స్ వంటివి ఏర్పాటు చేయడంతో పూర్తిస్థాయిలో హాజరుకాగా నేడు భోజనం లేకపోవడంతో దూరప్రాంతాల విద్యార్థులు ప్రత్యేక తరగతులకు హాజరుకావడం లేదని చెబుతున్నారు. దూర ప్రాంతాలకు చెందిన విద్యార్థులు హాస్టల్స్‌లో ఉండి పాఠశాలలో విద్యనభ్యసించగా నేడు హాస్టల్స్ వేసవి సెలవుల్లో మూసివేయడంతో విద్యార్థులు సొంత ఊళ్లకు వెళ్లిపోయారు. అలాంటి వారు ఎక్కడి నుంచో తాను చదువుకున్న పాఠశాలకు ప్రత్యేక తరగతులకు హాజరుకావడం ఇబ్బందికరంగా ఉండడంతో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుంది. ప్రత్యేక తరగతులకు హాజరయ్యే విద్యార్థులకు గతంలో మాదిరిగా భోజనం సదుపాయం కల్పిస్తే విద్యార్థులు పూర్తిస్థాయిలో హాజరయ్యే అవకాశం ఉంటుందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. టెన్త్ ఫెయిల్ అయిన విద్యార్థులకు నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులకు పూర్తిస్థాయిలో విద్యార్థులు హాజరయ్యే విధంగా కృషి చేస్తున్నాం. దానికి గానూ ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు ఫెయిల్ అయిన విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రతిరోజూ ఫోన్ చేసి స్కూల్‌కు పంపించాలని కోరుతున్నారు. –ఇ.నారాయణ, జిల్లా విద్యాశాఖాధికారి, భీమవరం పదో తరగతి ప్రత్యేక తరగతులకు స్పందన కరువు 40 శాతం హాజరు కూడా లేని వైనం భోజనం, స్నాక్స్ లేక విద్యార్థుల ఇబ్బందులు -
చెట్టుపై నుంచి పడి వ్యక్తి మృతి
ఆగిరిపల్లి: మండలంలోని తోటపల్లికి చెందిన వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకుడు, దుగ్గిరాల బాల రావమ్మ తల్లి ఆలయ మాజీ చైర్మన్ వీరంకి వీరాంజనేయులు(55) ప్రమాదవశాత్తు మామిడి చెట్టుపై నుంచి కాలుజారి కింద పడి మృతి చెందాడు. గురువారం రాత్రి వీరాంజనేయులు తన మామిడితోటలో చెట్టు ఎక్కి మామిడికాయలు కోస్తుండగా ప్రమాదవశాత్తు కాలుజారి కింద పడిపోయాడు. తలకి తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మరణించాడు. ఆయన మృతదేహానికి వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షులు బెజవాడ రాంబాబు, జిల్లా ఉపాధ్యక్షుడు పల్లగాని నరసింహారావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నాయకులు బెజవాడ శ్రీహర్ష, గ్రామ పార్టీ అధ్యక్షులు దాసరి శరత్, వీరాంజనేయులు పాల్గొన్నారు. కామవరపుకోట: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన గురువారం రాత్రి తడికలపూడిలో చోటు చేసుకుంది. తడికలపూడి ఎస్సై వల్లి పద్మ తెలిపిన వివరాల ప్రకారం ఏలూరు శనివారపేటకు చెందిన బెల్లాని సతీష్ (34) గురువారం సొంత పని మీద శనివారపుపేట ఇంటి నుంచి ద్విచక్ర వాహనంపై బయలుదేరి జంగారెడ్డిగూడెం వెళ్లి అదే రోజు రాత్రి తిరిగి ప్రయాణమై ఇంటికి వస్తుండగా తడికలపూడి సెంటర్లోని ఆంజనేయ స్వామి గుడి దగ్గరకు వచ్చేసరికి గుర్తు తెలియని వాహనం అతి వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో సతీష్ తలకు తీవ్ర గాయాలై అక్కడే మృతి చెందాడు. మృతుడు సోదరుడు బెల్లాని రవికుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వల్లి పద్మ తెలిపారు. జంగారెడ్డిగూడెం: ఎర్రకాలువ జలాశయం నుంచి మట్టిని అక్రమంగా రవాణా చేస్తున్న రెండు మట్టి లారీలను సీజ్ చేసినట్లు ఎస్సై ఎన్వీ ప్రసాద్ తెలిపారు. రాత్రి సమయాల్లో జలాశయం నుంచి మట్టిని తరలిస్తుండడంతో రెండు లారీల ను సీజ్ చేసి రెవెన్యూ శాఖకు తెలిపామన్నారు. తహసీల్దార్ కె.స్లీవజోజి ఒక్కొక్క లారీకి రూ. 10వేలు జరిమానా విధించినట్లు ఎస్సై చెప్పారు. ముదినేపల్లి(కై కలూరు): తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించడానికి గుడివాడ వెళ్లిన భార్య, కుమార్తె కనిపించడం లేదంటూ ఓ వ్యక్తి శుక్రవారం ముదినేపల్లి పోలీసులను ఆశ్రయించాడు. వారు తెలిపిన వివరాల ప్రకారం పెదపాలపర్రు గ్రామంలో చిట్టెం చౌదరీ, భార్య నాగరాణి(31), కుమార్తె యస్విక(5) నివసిస్తున్నారు. చౌదరీ సోదరుడు వివాహం శనివారం జరగనుంది. దీంతో గురువారం పొలంలో అమ్మిన మినుములు డబ్బులు రూ.50 వేలను భార్య నాగమణికి ఇచ్చి గుడివాడలో తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించుకుని రావడంతో పాటు కొత్త బట్టలు కొనుక్కోమని చెప్పాడు. దీంతో తల్లి, కూతురు గుడివాడ వెళ్లారు. సాయంత్రం 6 గంటల వరకు వారు తిరిగి రాకపోవడంతో గుడివాడలో బంగారు కొట్టు యజమానితో మాట్లాడితే భర్త పేరుతో తాకట్టు ఉందని, ఆయన రావాలని చెప్పడంతో నాగమణి వెళ్లిపోయినట్లు చెప్పారు. దీంతో గాలించిన భర్త ఇద్దరూ కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎస్సై వీరభద్రరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పాలకొల్లు సెంట్రల్: మండలంలోని కాపవరం గ్రామంలో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ జరిగిన సంఘటన వెలుగులోకి వచ్చింది. శుక్రవారం రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన గూడూరి వెంకరమణ వైద్య చికిత్స నిమిత్తం గత నెల 27 న హైదరాబాద్ వెళ్లి శుక్రవారం ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి చూడగా తాళం పగలగొట్టి ఉండడాన్ని గమనించారు. ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువాలో ఉన్న ఐదు కాసులు బంగారం, 400 గ్రాములు వెండి, కొంత నగదు చోరీకి గురైనట్లు గుర్తించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎస్సై సురేంద్రకుమార్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భీమడోలు: తన భర్త తనును శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడని ఓ భార్య శుక్రవారం భీమడోలు పోలీసులను ఆశ్రయించింది. వారు తెలిపిన వివరాల ప్రకారం పూళ్ల పంచాయతీ పరిధిలోని ఎంఎం పురానికి చెందిన యాగంటి జ్యోతిర్మయి అనే మహిళ అదే గ్రామానికి చెందిన రొంటపల్లి ఏసుపాదాన్ని 2017లో రెండో పెళ్లి చేసుకుంది. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఏడాది క్రితం కతార్ నుంచి ఇంటికి వచ్చిన భర్త ఏసుపాదం భార్య యాగంటి జ్యోతిర్మయిని అదనపు కట్నం తేవాలని శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడు. దీంతో విసుగు చెందిన ఆమె తన భర్తపై భీమడోలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఎస్సై ఎస్కే మదీనా బాషా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సారు.. చాలా బిజీ !
సాక్షి, భీమవరం: ఇసుక అమ్ముకోవచ్చు.. మట్టి అమ్ముకోవచ్చు.. రియల్ ఎస్టేట్‌లో.. బ్రాందీషాపుల్లో వాటాలు తీసుకోవచ్చు.. రిజిస్ట్రేషన్లలోనూ డ బ్బులు వసూలు చేయొచ్చు.. ‘అసలు రియల్ ఎస్టేట్ వ్యాపారి, కాంట్రాక్టర్ ఏ విధంగా డబ్బులు ఇస్తారు.. పోలీస్స్టేషన్ల సెటిల్మెంట్లలో నాయకుల కు డబ్బులు ఎలా వస్తాయో..’ ఇటీవల కూటమి ప్రజాప్రతినిధి ఒకరు చెప్పిన వీడియో వైరలైన విషయం తెలిసిందే. కూటమి పాలనకు అప్పుడే రెండేళ్లు గడిచిపోగా మూడేళ్లు మాత్రమే మిగిలింది. దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకునే పనిలో కొందరు నేతలు తలమునకలైనట్టు తెలుస్తోంది. ఇసుక, మట్టి అక్రమ తవ్వకాలు, ఆస్తి తగాదాలు, 22ఏ నిషేధిత భూవివాదాలు, కాంట్రాక్టులు, పేకాట క్లబ్బులు, రేషన్ బియ్యం అక్రమ రవాణా, పోలీస్‌స్టేషన్ సెటిల్మెంట్లు, ఇలా ప్రతి పనికీ రేటు పెట్టి పైసావసూల్ పనులకే ప్రాధాన్యమిస్తున్నట్టు సొంత క్యాడరే గుసగుసలాడుకుంటున్నారు. ఆయా వ్యవహారాలు చక్కబెట్టుకునే పనిలో తీరిక లేకుండా ఉంటున్నారని చెప్పుకుంటున్నారు. హామీలు గాలికి.. జిల్లాలోని పట్టణాలు, పల్లెలను డంపింగ్‌యార్డు స మస్య వేధిస్తోంది. పారిశుద్ధ్య నిర్వహణ సరిగాలేక ప్రజలు తీవ్ర అగచాట్లు పడుతున్నారు. శివారు ప్రాంతాలను తాగునీరు, రోడ్లు, డ్రైన్లు తదితర మౌ లిక వసతుల లేమి సమస్యలు పట్టిపీడిస్తున్నాయి. పేదల పక్కా ఇళ్ల నిర్మాణం పడకేసింది. ఇదిలా ఉంటే తాము అధికారంలోకి వస్తే అవిచేస్తాం.. ఇవి చేస్తామంటూ ఎన్నికల ముందు ఎన్నో హామీలిచ్చారు. పింఛన్ ఇప్పిస్తాం, ఇళ్ల స్థలం, ఇళ్లు మంజూరు చేయిస్తాం. మీ బిడ్డలకు ఉద్యోగమిప్పిస్తాం, మీకు ఉపాధి కల్పిస్తాం, మీ వీధికి రోడ్డు వేయిస్తాం, డ్రెయిన్ నిర్మిస్తాం, తాగునీరు అందిస్తాం, కమ్యూనిటీ హాళ్లు కట్టిస్తాం.. అంటూ ఇంటింటా ప్రచారంలో చెప్పుకొచ్చారు. వాటి కోసం రోజుల తరబడి సదరు నేతల క్యాంపు కార్యాలయాలకు వెళుతున్న వారికి పడిగాపులే తప్ప పనులు కావడం లేదని, గంటల తరబడి నిరీక్షించినా వారి గోడు పట్టించుకునే వారుండటం లేదంటున్నారు. వచ్చిన వారు సామాన్యులైతే సారు చాలా బిజీగా ఉన్నారు.. ఇప్పుడు కలవడం కుదరదంటూ సిబ్బంది చెప్పి పంపించేస్తున్నారు. కలిసి వెళతామంటే మాత్రం గంటల తరబడి నిరీక్షించాల్సిందే. కావాల్సిన వారితో మంతనాలు పూర్తయ్యాక హడావుడిగా బయటకు వెళ్లే క్రమంలో అక్కడ వేచి ఉన్న వారికి చిన్న చిరునవ్వు విసిరి ఏమిటో చెప్పడంటూ కంగారు పెట్టడం, ఎదుటవారు చెప్పేది పూర్తిగా ఆలకించకుండానే ఇదేమిటో కాస్త చూడమంటూ కార్యాలయంలోని సిబ్బందికి పురమాయించి వెళ్లిపోవడం పలువురి నేతల కార్యాలయాల వద్ద జరుగుతున్న తంతుగా వినిపిస్తోంది. ఏంటండి.. ఏ టోకెన్‌తో వచ్చారు.. ఆర్డినరీయా.. స్పెషలా.. వెరీవెరీ స్పెషలా..మీకు అడ్డేమిటండి. మీరు రాగానే పంపమని సార్ చెప్పారు. డైరెక్టుగా లోపలికి వెళ్లిపోండి.. – ఇది ఒక నేత కార్యాలయానికి వచ్చిన బడాబాబుతో సదరు నేత పీఏ సరదా సంభాషణ తమ సమస్యలను పరిష్కరిస్తారన్న గంపెడాశతో సామాన్యులు గంటల కొద్ద్దీ నిరీక్షించినా నేతల దర్శన భాగ్యం దక్కదు. సెక్యూరిటీ సిబ్బంది కనీసం వారిని డోర్ వద్దకు కూడా వెళ్లనివ్వరు. వచ్చిన వారు బడా కాంట్రాక్టరో, వ్యాపారవేత్తో, సంపన్నుడో, పలుకుబడి ఉన్న వారో, సదరు నేత కుల సంఘం పెద్దో అయితే.. వెంటుండి మరీ నేరుగా నాయకుడి రూమ్‌లోకి సాగనంపుతుంటారు. – ఇది జిల్లాలోని పలువురు నేతల క్యాంపు కార్యాలయాల వద్ద పరిస్థితినేతలు సొంత వ్యవహరాల్లో మునిగిపోతుండటంతో వారి తనయులు, కుటుంబసభ్యులు, ముఖ్య అనుచరులు షాడోలుగా చలామణి అవు తున్నారు. నియోజకవర్గాల్లో పెత్తనమంతా వీరి దే. బదిలీలు, నియామకాలు, పాలన వ్యవహరాలు, పేకాట క్లబ్బులు, కోడిపందేల నిర్వహణ అన్నింటిలోనూ చక్రం తిప్పుతున్నారు. అధికారులు షాడోల అడుగులకు మడుగులొత్తుతున్నారన్న విమర్శలున్నాయి. తామేమీ తక్కువ కాద న్నట్టు కొందరు అధికారిక, వ్యక్తిగత సహాయకులతో పాటు గన్మెన్లు సైతం వ్యవహారాలు చక్కబెట్టుకుంటూ వెనకేసుకునే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. కాగా కూటమిలోని మిగిలిన నేతలకు షాడోల వైఖరి మింగుడు పడటం లేదు. పార్టీ పిలుపు మేరకు కూటమి అభ్యర్థి గెలుపు కోసం పనిచేస్తే షాడోలతో తమకు సరైన గుర్తింపు లేక ఉనికిని కోల్పోతున్నామని సన్నిహితుల వద్ద వీరు వాపోతున్నారు. -
పార్టీ శ్రేణులకు అధిక ప్రాధాన్యం
మాజీ మంత్రి కారుమూరి తణుకు అర్బన్: జగన్ 2.0లో పార్టీ కోసం శ్రమించిన కార్యకర్తలు, నాయకులకు పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కొండంత అండగా ఉంటారని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. తణుకులోని పార్టీ కా ర్యాలయంలో శుక్రవారం 34 వార్డుల పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ అధ్యక్షుడు జగన్ ఆదేశాలతో పార్టీ నాయకులు, కార్యకర్తలకు గుర్తింపు కోసం ఐడీ కార్డు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచే నేరుగా వస్తుందన్నారు. ప్రతి కార్యకర్త వివరాలు జగన్ పరిశీలనలోనే ఉంటాయని స్పష్టం చేశారు. పార్టీ సంస్థాగత నిర్మాణమే ముఖ్య లక్ష్యంగా పార్టీ కార్యకర్తలంతా పనిచేయాలని పిలుపునిచ్చారు. పట్టణ పరిధిలో వార్డు నాయకులు, పార్టీ వివిధ కమిటీల నాయకులు పార్టీ బలోపేతానికి తీవ్రంగా శ్రమించాలని కోరారు. భవిష్యత్తులో కార్యకర్తలకు మంచి ప్రయోజనాలు ఉంటాయని, దేశవ్యాప్తంగా కార్యకర్తలకు అండగా నిలబడింది వైఎస్సార్సీపీ ఒక్కటేననే గుర్తింపు వస్తుందని కారుమూరి అన్నారు. తణుకులో బలమైన నాయకత్వం తణుకులో వైఎస్సార్సీపీకి బలమైన నాయకత్వం ఉందని నియోజకవర్గ పరిశీలకుడు కొట్టు వెంకట నాగు అన్నారు. అధికార పార్టీ ఎన్ని ఒత్తిళ్లు తీసుకువచ్చినా ఇక్కడ క్యాడర్ ధైర్యంగా ఉందని, ఇందుకు మాజీ మంత్రి కారుమూరి కారణమన్నారు. రానున్న రోజుల్లో పార్టీ కోసం అధికంగా శ్రమించాల్సిన పరిస్థితులు రానున్నాయని అందుకు అందరూ సిద్ధంగా ఉండాలని కోరారు. కూ టమి ప్రభుత్వం ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ చేసే క్రమంలో వైఎస్సార్సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ రాష్ట్రంలోనే ఇక్కడ అధికంగా జరిగిందని, ఇదే స్ఫూర్తితో పార్టీ శ్రేణులు పనిచేయాలన్నారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు మారిశెట్టి శేషగిరి, పంచాయితీరాజ్ వింగ్ రాష్ట్ర కార్యదర్శి వడ్లూరి సీతారాం, నియోజకవర్గ మహిళాధ్యక్షురా లు మెహర్ అన్సారీ, డాక్టర్ దాట్ల సుందరరామరాజు, నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు కొత్తపల్లి చ రణ్, పట్టణ యూత్ అధ్యక్షుడు కలిశెట్టి ప్రకాష్, ని యోజకవర్గ ప్రచార కమిటీ అధ్యక్షుడు గెల్లా జగన్, ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షుడు పెనుమాల రాజేష్ తదితరులు పాల్గొన్నారు. -
గిరిజన ప్రాంతాల్లో మెరుగైన వైద్య సేవలు
బుట్టాయగూడెం: గిరిజన ప్రాంతంలోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా వైద్యాధికారి శోభారాణి తెలిపారు. మండలంలోని మారుమూల గామమైన దొరమామిడిలో ఆమె శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా పీహెచ్‌సీని సందర్శించారు. అక్కడ వైద్యం పొందుతున్న రోగులకు అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించారు. అనంతరం డీఎంహెచ్‌వో మాట్లాడుతూ ఆసుపత్రిల్లో ప చేస్తున్న వైద్యులు అందుబాటులో ఉంటూ ఆసుపత్రికి వచ్చే వారికి సకాలంలో వైద్యం అందేలా కృషి చేయాలని ఆదేశాలు ఇచ్చారు. అలాగే అదే గ్రామంలో ఆర్ఎంపీ ఆసుపత్రి రూమ్, మెడికల్ షాపును సీజ్ చేశారు. ఇటివల కోర్సవారిగూడెం గ్రామానికి చెందిన ఒక చిన్నారి మృతి చెందిన నేపథ్యంలో ఆర్ఎంపీ షాపును సీజ్ చేశామని చెప్పారు. అయితే ఆర్ఎంపీ వ్యవహారంపై తెలుసుకునేందేకు వెళ్లిన డీఎంహెచ్‌వోకు గ్రామస్తులు అడ్డపడ్డారు. మాజీ సర్పంచ్ తెల్లం రాముడు ఆధ్వర్యంలో గ్రామస్తులు ఎందుకు ఆర్ఎంపీపై చర్యలు తీసుకుటున్నారు? అని ప్రశ్నించారు. ఈ వ్యవహరంలో ఆర్ఎంపీకి గ్రామస్తులు అండగా నిలబడ్డారు. అతనికి నాయ్యం చేయకపోతే ఏలూరు జిల్లా కార్యాలయానికి వచ్చి అందోళనలు చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ జె.సురేష్, డాక్టర్ నందిని, డీఎంఓ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
ఆహ్లాదం.. గోదావరి విహారం
● పాపికొండల యాత్రకు పర్యాటకుల తాకిడి ● వేసవి కావడంతో అధిక సంఖ్యలో రాక ● నదిపై బోటు ప్రయాణానికి ఆసక్తి పాపికొండల విహార యాత్రకు వెళుతున్న పర్యాటక బోట్లు బుట్టాయగూడెం: పాపికొండల మధ్య గోదావరి నదిపై లాంచీలో ప్రయాణం అద్భుతమైన అనుభూతి. వేసవిలో సైతం లాంచీలపై ప్రయాణం ఆహ్లాదా న్ని కలిగించడంతో ప్రస్తుతం పాపికొండలకు పర్యాటకుల తాకిడి పెరుగుతోంది. సాధారణంగా ఆదివారం, సెలవు రోజుల్లో అధిక సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. అయితే ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో పర్యాటకుల రద్దీ కనిపిస్తోంది. రెండు రోజులుగా పాపికొండల యాత్రకు తాకిడి ఎక్కువగా ఉందని అధికారులు చెబుతున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా గండిపోచమ్మ గుడి దగ్గర నుంచి పేరంటాలపల్లి వరకూ లాంచీల్లో ప్రయాణం చేస్తూ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ పర్యాటకులు ఆహ్లాదంగా గడుపుతున్నారు. విహార యాత్రకు విశాఖ, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, భద్రాచలం, జంగారెడ్డిగూడెం తదితర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో పర్యాటకులు వస్తున్నారు. సందర్శనా స్థలాలు పాపికొండల యాత్రలో భాగంగా పలు సందర్శనా స్థలాలను చూడవచ్చు. అల్లూరి జిల్లాలోని దేవీ పట్నం మండలంలోని గండిపోచమ్మ గుడి, బ్రిటిష్ కాలపు పోలీస్‌స్టేషన్, 11వ శతాబ్దం నాటి ఉమాచోడేశ్వర స్వామి ఆలయం, కొరుటూరులో అటవీశాఖ కాటేజీలు, పేరంటాలపల్లి ఆశ్రమాన్ని సందర్శించవచ్చు. గోదావరి తీరానికి ఇరువైపులా గట్లపై దర్శనమిచ్చే గిరిజన గ్రామాల్లోని ఇళ్లు కనువిందు చేస్తాయి. అలాగే పోలవరం ప్రాజెక్టు అందాలను తిలకించవచ్చు. గిరిజనుల ఆప్యాయత, ఆదరణ పేరంటాలపల్లి పర్యాటకులకు గిరిజనుల ఆప్యాయత, ఆదరణ నాగరిక సమాజానికే తలమానికం. అక్కడి కొండరెడ్డి గిరిజనులు పర్యాటకులకు వెదురుతో తయారు చేసిన కళాకృతులను విక్రయిస్తూ జీవనం సాగిస్తుంటారు. అవి విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. యాత్రకు వెళ్లిన ప్రతిఒక్కరూ వాటిని తప్పనిసరిగా కొనుగోలు చేస్తుంటారు. గండిపోచమ్మ గుడి నుంచి ప్రశాంతమైన, సుందరమైన గోదావరి అలలపై సాగే యాత్ర సుమారు 5 గంటలకు పైగా ఉంటుంది. ఇదిలా ఉండగా ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ప్రభుత్వం, అధికారులు అన్ని ఏర్పాట్లు చేయడంతో యాత్రికుల సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. -
గ్రంథాలయాల సెస్ చెల్లించాలి
భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లా గ్రంథాలయ సంస్థకు మున్సిపాలిటీలు, పంచాయతీలు ప్రతినెలా గ్రంథాలయ సెస్ చెల్లించేలా చర్యలు తీసుకోవాలని జేసీ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ నుంచి గ్రంథాలయ సెస్ చెల్లింపులు, వేసవి విజ్ఞాన శిబిరాల నిర్వహణ తదితర అంశాలపై డీపీఓ, మున్సిపల్ కమిషనర్లు, డిప్యూటీ ఎంపీడీఓలు, శాఖా గ్రంథాలయ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వా రా సమీక్షించారు. మున్సిపాలిటీల వారీగా సెస్ బకాయిల వివరాలను తెలుసుకున్నారు. సెస్ వసూళ్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని డీపీఓ వై.దోసిరెడ్డిని ఆదేశించారు. జిల్లాలోని 31 గ్రంథాలయాల్లో నిర్వహిస్తున్న వేసవి విజ్ఞాన శిబిరాలపై పిల్లలకు అవగాహన కల్పించాలన్నారు. అలాగే గ్రంథాలయాలకు పుస్తకాలను విరాళంగా అందజేసే దాతల పేర్లను ప్రత్యేక బోర్డుపై ప్రదర్శించాలని, దీని ద్వారా మరింత మంది ప్రేరణ పొందుతారన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జుత్తిగ నాగరాజు, గ్రంథాలయ సంస్థ కార్యదర్శి శేఖర్‌బాబు తదితరులు పాల్గొన్నారు. ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): బీఈడీ కోర్సులో ప్రవేశాల నిమిత్తం నిర్వహించే ఎడ్‌సెట్ పరీక్షలు శుక్రవారం నగరంలోని 3 కేంద్రాల్లో ప్రశాంతంగా జరిగాయి. సిద్ధార్థ క్వెస్ట్ స్కూల్లో ఉదయం 170 మందికి 119 మంది, సీఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో 201 మందికి 166 మంది, మ ధ్యాహ్నం 199 మందికి 150 మంది, ఏలూరు ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 135 మందికి 106 మంది హాజరయ్యారు. -
తాగునీటిపై శ్రద్ధ చూపాలి
తణుకు అర్బన్: వేసవి దృష్ట్యా మున్సిపాలిటీల్లో తాగునీటి ఎద్దడి లేకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని పురపరిపాలనా శాఖ ప్రాంతీ య సంచాలకుడు (ఆర్డీ) సీహెచ్ నాగనరసింహారావు సూచించారు. శుక్రవారం తణుకు మున్సిపల్ కార్యాలయంలో జిల్లాలోని మున్సి పల్ కమిషనర్లతో సమావేశం నిర్వహించారు. ఆస్తి పన్నుల వసూళ్లు, స్వచ్ఛ సర్వేక్షణ్ అమలు తీరు, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, డ్రెయినేజీల పూడికతీత, వేసవిలో నీటి ఎద్దడి నివారణ చ ర్యలు, వీధి కుక్కల నియంత్రణలో భాగంగా ఆ పరేషన్లు చేపట్టే అంశాలపై సూచనలు చేశారు. ముందుగా పట్టణంలోని కంపోస్టు యార్డు, వీధి కుక్కల స్టెరిలైజేషన్ సెంటర్, పారిశుద్ధ్య నిర్వహణ, బాక్సు క్రికెట్ గ్రౌండ్‌ను పరిశీలించా రు. మున్సిపల్ కమిషనర్లు టి.రామ్‌కుమార్, కె. రామచంద్రారెడ్డి, ఎం.యేసుబాబు, ఆర్.వెంకటరామిరెడ్డి, బి.విజయసారథి, కృష్ణమోహన్, తణుకు మున్సిపల్ డీఈ కొవ్వూరి ఈశ్వరరెడ్డి, అధికారులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం: విద్య, పరిశోధనల్లో విద్యార్థులను విజ్ఞానవంతులుగా తీర్చిదిద్దడానికి డిజి టల్ లైబ్రరీ దోహదపడుతుందని తాడేపల్లిగూడెంలోని ఏపీ నిట్ ఇన్చార్జి డైరెక్టర్ ప్రొఫెసర్ ఎన్వీ రమణరావు అన్నారు. ఏపీ నిట్‌లో గ్రంథాలయ చైర్మన్ కార్తికేయ శర్మ ఆధ్వర్యంలో ప్రాంగణంలోని బీఆర్ అంబేడ్కర్ సెంట్రల్ లై బ్రరీలో ఎక్కడైనా కూర్చుని డిజిటల్ కంటెంట్‌ను పొందేలా ల్యాప్‌టాప్‌లతో కూడిన అధు నాతన డిజిటల్ లైబ్రరీని, రెండు డిస్కషన్ రూమ్‌లను శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా రమణరావు మాట్లాడుతూ వేలాది పుస్తకాలు, పరిశోధనా పత్రాలు, ప్రశ్న పత్రాలు అందుబాటులో ఉన్నాయన్నారు. రిజిస్ట్రార్ పి.దినేష్ శంకరరెడ్డి, డీన్లు రవికిరణ్, సందీప్, ఎన్.జయరామ్, వీరేష్‌కుమార్, హిమబిందు, ప్రొఫెసర్లు పాల్గొన్నారు. పెనుగొండ: కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా అరెస్ట్ అయిన ఆచంట నియోజకవర్గ వైఎస్సార్ సీపీ నాయకులు సుంకర సీతారామ్, కోటే శశి మధులకు పాలకొల్లు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కొడమంచిలి పంచాయతీ పరిఽధిలో ఉపాధి హామీ పథకంలో అక్రమ చెల్లింపులకు పాల్పడ్డారంటూ అప్పటి ఫీల్డ్ అసిస్టెంట్, వైఎస్సార్ సీపీ యువజన విభాగం మండల కన్వీనర్ కోటే శశి మధు, మాజీ సర్పంచ్ సుంకర సీతారామ్‌ను ఎంపీడీఓ బి.కృష్ణమోహన్ ఫిర్యాదు మేరకు బు ధవారం అరెస్ట్ చేసి కోర్టుకు హజరు పరచగా 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. కూటమి నాయకుల ఇసుక, మట్టి అక్రమ త వ్వకాలకు అడ్డు తగులుతుండటంతో అక్రమ అరెస్ట్‌కు పాల్పడ్డారంటూ వైఎస్సార్ సీపీ నేతలు ఆరోపించి తీవ్ర నిరశన వ్యక్తం చేశారు. ఈ తరుణంలో వైఎస్సార్సీపీ నాయకుల తరఫున మంగెన శ్రీనివాస మెహర్‌బాబా పాలకొ ల్లు కోర్టులో బెయిల్ కోసం వాదించగా, జూనియర్ సివిల్ జడ్జి, జుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజి స్ట్రేట్ బెయిల్ మంజూరు చేశారు. శుక్రవారం సాయంత్రం బెయిల్ మంజూరు కావడంతో, శనివారం ఉదయం సుంకర సీతారామ్, కోటే శశి మధు విడుదల కానున్నారు. భీమవరం: టెన్త్ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్న తరుణంలో వారికి మధ్యాహ్న భోజనం అందజేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. జిల్లా కార్యదర్శి టి.ప్రసాద్ శుక్రవారం డీఈఓ ఈ.నారాయణను కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం ప్రసాద్ మాట్లా డుతూ ఫెయిలైన విద్యార్థులకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష రాయడానికి ప్రత్యేక తరగతులు నిర్వహించడం అభినందనీయమని, అయితే మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించే తరగతుల్లో భోజనం లేకపోవడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. వీరికి డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజన పథకం కొనసాగించాలని కోరారు. జిల్లా ఉపాధ్యక్షుడు లక్ష్మణ్, భీమవరం పట్టణ అధ్యక్షుడు సాయికృష్ణ ఉన్నారు. -
మద్యం మత్తులో కొడుకును చంపిన తండ్రి
అత్తిలి: మద్యం మత్తులో కన్న కొడుకునే కత్తెరతో పొడిచి చంపిన ఘటన శుక్రవారం సాయంత్రం అత్తిలి మండలం ఈడూరు గ్రామంలో చోటు చేసుకుంది. స్ధానికుల కథనం ప్రకారం పాలకొల్లుకు చెందిన కొయ్యన గణేష్‌తో అత్తిలి మండలం ఈడూరు గ్రామానికి చెందిన శేషవేణితో వివాహమైంది. వివాహం అనంతరం గణేష్ అత్తవారింటికి వచ్చి ఇక్కడే జీవిస్తున్నాడు. ఇతనికి కుమారుడు శామ్యూల్‌రాజు, కుమార్తె జాహ్నవి ఉన్నారు. గణేష్ రొయ్యల చెరువుల్లో వాడే ఎయిరేటర్స్ మోటార్ల మరమ్మతులు చేస్తుంటాడు. కుమారుడు శామ్యూల్‌రాజు(21) ఐటీఐ చదివి తండ్రికి చేదోడువాదోడుగా ఉంటున్నాడు. మద్యానికి బానిసైన గణేష్ నిత్యం భార్యతో గొడవపడుతూ, వేధిస్తుంటాడు. అయితే శుక్రవారం తండ్రీకొడుకులు ఇద్దరూ మోటార్ల మరమ్మతుల నిమిత్తం బయటకు వెళ్లి సాయంత్రానికి ఇంటికి తిరిగివచ్చారు. మద్యం మత్తులో ఉన్న గణేష్, భార్యతో గొడవకు దిగాడు. తల్లిదండ్రుల గొడవ నేపథ్యంలో కుమారుడు సర్ది చెప్పే ప్రయత్నం చేశాడు. విచక్షణ కోల్పోయిన తండ్రి గణేష్ అకస్మాత్తుగా వచ్చి మంచంపై పడుకున్న కొడుకు శామ్యూల్‌రాజు ఛాతిపై పలుమార్లు విచక్షణారహితంగా కత్తెరతో పొడవడంతో తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడిని చికిత్స నిమిత్తం 108లో తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే శామ్యూల్‌రాజు మృతి చెందాడు. సమాచారం అందుకున్న సంఘటనా ప్రదేశానికి అత్తిలి పోలీసులు చేరుకుని వివరాలను సేకరించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని తెలిపారు. -
కవులు, రచయితలు ఏకతాటిపైకి రావాలి
భీమవరం: సాంస్కృతిక విప్లవం పునరేకీకరణ, సాంస్కృతిక వికాసం కోసం కవులు, రచయితలు ఏకతాటిపైకి రావాల్సిన సమయం ఆసన్నమైందని ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం (అరసం) రాష్ట్ర కార్యదర్శి బీఎన్ సాగర్ పిలుపునిచ్చారు. శుక్రవారం భీమవరంలో అరసం 14వ జిల్లా మహాసభలో ముఖ్య అతిథిగా ఆయన మాట్లాడారు. శ్రమ, స్వేదం సంపదను సృష్టిస్తున్న నాటి కాలంలో నిర్బంధ పెట్టుబడీదారి వ్యవస్థల కబంధహస్తాల నుంచి సృజనకారులు పుట్టుకొచ్చి భావప్రకటన స్వేచ్ఛకు పునాదులు వేశారన్నారు. ఏఐటీయూసీ జిల్లా గౌరవాధ్యక్షుడు కోనాల భీమారావు మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో దేశం వందేళ్ల వెనక్కి వెళ్లిపోయిందని, ఫాసిస్టులు విజృంభిస్తున్న తరుణంలో అరసం ముఖ్య భూమిక పోషించాలన్నారు. అరసం అధ్యక్షుడు వేల్పుల నాగేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో రచయితలు పంపన సాయిబాబా, కొత్తపల్లి త్రినాథరాజు, జవ్వాజి దాశరధి శ్రీనివాసరావు, గొన్నాబత్తల మల్లేశ్వరరావు, అల్లు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
శ్రీవారి క్షేత్రంలో భారీగా వివాహాలు
ద్వారకాతిరుమల: చినవెంకన్న క్షేత్రంలో శుక్రవారం రాత్రి వివాహాలు భారీగా జరిగాయి. దీంతో క్షేత్రంలో పెళ్లిసందడి నెలకొంది. సాయంత్రం నుంచే పెళ్లి జనాల వాహనాలు టోల్గేట్ మీదుగా శ్రీవారి కొండపైకి చేరుకున్నాయి. కొండపైన పార్కింగ్ ప్రదేశాలు, ఘాట్ రోడ్లు పెళ్లి జనాల వాహనాలతో రద్దీగా మారాయి. గుడి సెంటర్లో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పోలీస్ సిబ్బంది, ఎప్పటికప్పుడు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ఆలయ తూర్పురాజగోపుర ప్రాంతంలోని అనివేటి మండపాల్లో, స్వామివారి పాదుకా మండపం వద్ద ఉన్న పాత కల్యాణ మండపంలో, కొండపైన, దిగువన కల్యా ణ మండపాల్లో పెద్ద ఎత్తున వివాహాలు జరిగాయి. దాదాపు అన్ని ప్రైవేట్ కల్యాణ మండపాల్లోనూ వివాహాలు జరిగాయి. నూతన వధూవరులు శనివారం వేకువజామున స్వామి, అమ్మవార్లను దర్శించుకోనున్నారు. -
నేలతల్లి ఆరోగ్యం.. రైతుకు సౌభాగ్యం
● భూసార పరీక్షలతోనే సాగులో సిరి సంపదలు ● మెట్ట ప్రాంతంలో మట్టి నమూనాల సేకరణ చింతలపూడి: ‘ఏరువాక సాగే ముందు.. నేల తల్లి నాడి చూడాలి’ అనే నినాదంతో వ్యవసాయ శాఖ అడుగులు వేస్తోంది. సాగు ఖర్చులు తగ్గించుకుంటూ, అధిక దిగుబడులు సాధించడమే లక్ష్యంగా భూసార పరీక్షలపై రైతులకు అవగాహన కల్పిస్తోంది. 2025–26 ఖరీఫ్ సీజన్ నేపథ్యంలో చింతలపూడి సబ్ డివిజన్ పరిధిలోని రైతులు తమ పొలాల్లో మట్టి నమూనాలు సేకరించి, పరీక్షలు చేయించుకోవడం ద్వారా లాభదాయక వ్యవసాయానికి బాటలు వేసుకుంటున్నారు. చింతలపూడి సబ్ డివిజన్ పరిధిలో చింతలపూడి, లింగపాలెం, కామవరపుకోట, టి.నర్సాపురం మండలాల్లో గత ఏడాది ఖరీఫ్ సీజన్లో మొత్తం 5,680 మట్టి నమూనాలను సేకరించారు. ఈ ఏడాది రసాయన రహిత సాగు వైపు మళ్లుతున్న ప్రకృతి వ్యవసాయ రైతుల నుంచి కూడా 4,045 నమూనాలను సేకరించి భూసార పరీక్షలకు పంపారు. భూసార పరీక్షలతో ఎంతో మేలు మట్టి నమూనాల పరీక్ష ద్వారా రైతులకు అందే ‘భూసార ఆరోగ్య పత్రం’ సాగులో దిక్సూచిలా పని చేస్తుంది. భూమిలో ఏ పోషకాలు తక్కువగా ఉన్నాయో? ఏవి ఎక్కువగా ఉన్నాయో?తెలుస్తుంది. దీనివల్ల అనవసరంగా ఎరువులు వాడి డబ్బు వృథా చేయాల్సిన పని ఉండదు. యూరియా,డీఏపీ వంటి ఎరువులను మోతాదుకు మించి వాడకుండా నిరోధించవచ్చు. ఫలితంగా పెట్టుబడి ఖర్చు 20 శాతం నుంచి 30 శాతం వరకు తగ్గుతుంది. మితిమీరిన రసాయనాల వినియోగం వల్ల చవుడు భూములుగా మారుతున్న నేలలను రక్షించుకోవచ్చు. భూమిలోని ఉదజని సూచిక లవణ సాంద్రతను బట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చు. పంటకు అవసరమైన సూక్ష్మ పోషకాలు (జింక్, బోరాన్, ఇనుము వంటివి) అందించడం వల్ల గింజ గట్టిపడి, దిగుబడి పెరుగుతుంది. పొలంలో మట్టి నమూనా తీసేటప్పుడు రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పొలం మధ్యలో కాకుండా, పొలం అంతటా 15 నుండి 30 సెంటీమీటర్ల లోతు వరకు మట్టిని సేకరించాలి. చెట్ల కింద, గట్ల పక్కన, ఎరువులు వేసిన చోట మట్టిని సేకరించకూడదు. రైతులు గుడ్డిగా ఎరువులు వేసి నష్టపోకూడదనే ఉద్దేశంతో చింతలపూడి సబ్ డివిజన్ వ్యాప్తంగా నమూనాల సేకరణ చేపట్టాం. ఆరోగ్యకరమైన నేల నుంచే నాణ్యమైన ఆహారం లభిస్తుందని ప్రతి రైతు గుర్తించాలి. – వై.సుబ్బారావు, వ్యవసాయ శాఖ ఏడీ, చింతలపూడి సబ్ డివిజన్ -
ఇష్టారాజ్యంగా మట్టి అక్రమ రవాణా
పాలకోడేరు: నిబంధనలకు విరుద్ధంగా మండలంలో ఇష్టారాజ్యంగా మట్టి అక్రమ రవాణా సాగుతోంది. మోగల్లు, పాలకోడేరు, వేండ్ర, శృంగవృక్షం, గొల్లలకోడేరు, గరగపర్రు, విస్సాకోడేరు, పెన్నాడ, కోరుకొల్లు తదితర గ్రామాల్లో మట్టి లారీలు, ట్రాక్టర్లు వేగంగా తిరుగుతూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. దీనికితోడు రోడ్లపై మట్టి ముద్దలు పడడంతో రోడ్లు సైతం ధ్వంసం అవుతున్నాయి. రోడ్లపై పడిన మట్టి గడ్డల వల్ల వర్షం వస్తే చిత్తడిగా మారి వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై తహసీల్దార్ పీవీఎన్ఎస్ఎస్ లక్ష్మిని వివరణ కోరగా ఇప్పటివరకు తమ దృష్టికి రాలేదని, వెంటనే చర్యలు చేపడతామని చెప్పారు. -
జిల్లా రెడ్‌క్రాస్‌కు అవార్డు
భీమవరం అర్బన్ : పశ్చిమగోదావరి జిల్లా రెడ్‌క్రాస్ శాఖ 2025–26లో నిర్వహించిన సేవా కార్యక్రమాలు, నిధుల సమీకరణలో చూపిన ప్రతిభకు గుర్తింపుగా అవార్డు లభించింది. ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం ఆంధ్రప్రదేశ్ లోక్ భవన్లో నిర్వహించిన రాష్ట్రస్థాయి కార్యక్రమంలో గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా జిల్లా రెడ్‌క్రాస్ చైర్మన్ డాక్టర్ ఎంఎస్‌వీఎస్ భద్రిరాజు అవార్డును స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ అవార్డు జిల్లా బృందం సమష్టి కృషికి ప్రతిఫలం అన్నారు. జిల్లా రెడ్ క్రాస్ అధ్యక్షురాలు, కలెక్టర్ చదలవాడ నాగరాణి, జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. భీమవరం: పట్టణంలోని ఏఎస్ఆర్ నగర్లో ఉన్న అల్లూరి సీతారామరాజు స్మృతి వనం వద్ద గురువారం ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్, అల్లూరి సీతారామరాజు సేవా సమితి ఆధ్వర్యంలో అల్లూరి 102వ వర్థంతి సందర్భం నిర్వహించారు. డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు, భీమవరం ఎమ్మెల్యే రామాంజనేయులు, జాయింట్ కలెక్టర్ టి.రాహుల్‌కుమార్ రెడ్డి, అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహం వద్ద చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అల్లూరి పోరాట స్ఫూర్తిని కొనియాడారు. అనంతరం ఆనంద ఫౌండేషన్ ఆధ్వర్యంలో సుమారు రూ.25 లక్షలతో వ్యయంతో నిర్మించిన డిజిటల్ స్క్రీన్, వాటర్ ప్లాంట్, వాటర్ మౌంటెన్స్‌ను ప్రారంభించారు. పాఠశాలల విద్యార్థులు అల్లూరి వేషధారణలో పాల్గొని అందరినీ ఆకట్టుకున్నారు. అల్లూరి సీతారామరాజు విగ్రహ కమిటీ అధ్యక్షుడు ఉద్దరాజు విశ్వనాథరాజు, కార్యదర్శి కంతేటి వెంకటరాజు, కోశాధికారి సీహెచ్ కృష్ణంరాజు, వైస్ ప్రెసిడెంట్ గాదిరాజు సుబ్బరాజు, ఆర్డీవో కే ప్రవీణ్ కుమార్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి, డీఎస్పీ రఘువీర్ విష్ణు, తహసీల్దార్ రావి రాంబాబు, వైఎస్సార్ సీపీ ప్రతినిధి గూడూరి ఉమాబాల పాల్గొన్నారు. ఏలూరు(ఆర్‌ఆర్‌పేట): జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నూతన కార్యదర్శిగా ఎన్.శ్రీలక్ష్మి గురు వారం బాధ్యతలు స్వీకరించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శిగా పనిచేసిన ఆమెను హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఏలూరు జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శిగా నియమించారు. ఇంతకుముందు ఇక్కడ పనిచేసిన కె.రత్నప్రసాద్ మొదటి అదనపు సీనియర్ సివిల్ జడ్జిగా రాజమహేంద్రవరం బదిలీపై వెళ్లారు. భీమవరం (ప్రకాశంచౌక్): ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన అమరావతి సచివాలయంలో నిర్వహించిన 7వ కలెక్టర్ల కాన్ఫెరెన్స్ తొలి రోజు సమావేశంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొన్నారు. జిల్లాలో అవసరమైన ప్రాజెక్టులకు స్థలాల అవసరతపై చర్చ సందర్భంగా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ఆచంటలో ఐటీఐ సమర్థవంతంగా కొనసాగుతున్నప్పటికీ, స్థలం లేక సొంత భవనాల నిర్మాణం చేపట్టలేకపోతున్నామని ముఖ్యమంత్రికి వివరించారు. ఐటీఐ భవన నిర్మాణానికి కనీసం రెండు ఎకరాల స్థలం అవసరమని విన్నవించారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి అవసరమైన ప్రతిపాదనలు వెంటనే పంపించాలని ఆదేశించారు. ప్రభుత్వ స్థలం అందుబాటులో లేకపోతే భూసేకరణ ద్వారా స్థలం సమకూర్చే చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. -
బిల్లుల మంజూరులో జాప్యాన్ని నివారించండి
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఉపాధ్యాయుల మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లుల మంజూరులో జాప్యాన్ని తక్షణం నివారించాలని జిల్లా సర్వజన ఆసుపత్రి ఇన్చార్జ్ సూపరింటెండెంట్ అచ్యుత రామయ్యను పీఆర్టీయూ నాయకులు కోరారు. ఈ మేరకు గురువారం ఆసుపత్రిలో ఆయన్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. కేన్సర్, గుండె సంబంధిత వ్యాధులకు సంబంధించి పెట్టుకున్న వైద్య ఖర్చుల బిల్లులు సకాలంలో అందక ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతున్నారన్నారు. కొందరికి సంబంధించి ఏడాది కాలం గడిచినా మంజూరుకు నోచుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే పెండింగ్‌లో ఉన్న మెడికల్ రీయింబర్స్మెంట్ ఫైళ్లన్నీ తక్షణం పర్యవేక్షించి వెంటనే మంజూరు చేసే విధంగా కృషి చేయాలని కోరారు. సూపరింటెండెంట్‌ను కలిసిన వారిలో పీఆర్టీయూ ఏలూరు జిల్లా అధ్యక్షుడు పువ్వుల ఆంజనేయులు, పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు సీహెచ్‌ఎల్‌వీ చలం ఉన్నారు. ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చేపట్టిన ‘వన్ మంత్, వన్ విలేజ్, 4 విజిట్స్’ కార్యక్రమాన్ని ప్రజలు, రైతులు సద్వినియోగం చేసుకోవాలని జాయింట్ కలెక్టరు ఎంజే అభిషేక్ గౌడ కోరారు. గురువారం ఆయన అధ్యక్షతన స్థానిక శనివారపుపేట–1 స్వర్ణవార్డు సచివాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.


