నరసాపురం: తగాదాలకు, నేరాలకు పాల్పడే ముందు భవిష్యత్ పరిణామాలు ఆలోచించు కోవాలని నరసాపురం జూనియర్ సివిల్ జడ్జి ఎస్.రాజ్యలక్ష్మి సూచించారు. నరసాపురం సబ్‌జైలును శనివారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఖైదీలకు అందుతున్న సదుపాయాలు, జైలు పరిసరాల పరిశుభ్రత వంటి అంశాలను, ఖైదీలకు అందిస్తున్న ఆహారాన్ని పరిశీలించా రు. నేరాలు చేసి జైలు పాలైతే కుటుంబాలు రో డ్డున పడతాయని, బంధువుల ముందు చు లకన అవుతామని అన్నారు. మండల న్యాయ సేవాధికారసంస్థ ద్వారా ఉచిత న్యాయ సహా యం అందుతుందని, సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సబ్‌జైలు సూపరింటెండెంట్ టి.అప్పారావు ఉన్నారు.
భీమవరం: రాబోయే విద్యా సంవత్సరానికి ప్ర భుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలను పెంచేందుకు కృషి చేయాలని కలెక్టర్ సీహెచ్ నాగరాణి ఆదేశించారు. స్థానిక క్యాంపు కార్యాల యం నుంచి శనివారం బడి పిలుస్తోంది కార్యక్రమం అమలు తీరుపై జూమ్ కాన్ఫరెన్స్ ద్వా రా సమీక్షించారు. ప్రత్యేక ప్రచార కార్యక్రమా లు చేపట్టాలని, తల్లిదండ్రులను సమగ్ర అవగాహన కల్పించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపినా సంబంధిత సర్టిఫికెట్లు ఇవ్వకుండా ప్రైవేట్ యాజమాన్యాలు అడ్డంకులు సృష్టిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. డీఈఓ ఈ.నారాయణ తదితరులు పాల్గొన్నారు.
భీమవరం (ప్రకాశంచౌక్): డెంగీ నివారణలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని డీఎంహెచ్‌ఓ జి.గీతాబాయి అన్నారు. జాతీయ డెంగీ దినోత్సవం సందర్భంగా శనివారం పట్టణంలోని ప్రకాశంచౌక్ నుంచి జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా గీతాబాయి మాట్లాడుతూ డెంగీ దేశవ్యాప్తంగా ప్రజారోగ్యానికి ప్రధాన సవాలుగా మారిందని, ప్రతిఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ద్వారా డెంగీ వ్యాప్తిని అరికట్టవచ్చాన్నారు. డెంగీ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. అలాగే డెంగీ నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా మలేరియా అధికారి డా. వి.క్రాంతికుమార్, ప ట్టణ ఆరోగ్య కేంద్రాల వైద్య అధికారులు, జిల్లా ఉప మలేరియా అధికారి, డిప్యూటీ హెచ్‌ఈఓ, ఎస్‌యుఓ, సిబ్బంది పాల్గొన్నారు.
భీమవరం (ప్రకాశంచౌక్): ప్రజలంతా పర్యావరణహిత వస్తువులు వినియోగించాలని జేసీ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి అన్నారు. స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్రలో భాగంగా శనివారం పట్టణంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై అధికారులు చర్యలు చేపట్టారు. మున్సిపల్ కమిషనర్ కె.రామచంద్రారెడ్డితో కలిసి జేసీ పట్టణంలో క్యారీ బ్యాగుల విక్రయ దుకాణాలు, ప్లాస్టిక్ వస్తువు ల నిల్వ కేంద్రాలు, హోటళ్లు, రెస్టారెంట్లలో ఆకస్మిక తనిఖీలు చేశారు. ప్లాస్టిక్ నిషేధాన్ని ప్రతి వ్యాపారి కచ్చితంగా పాటించాలని లేకుంటే చ ర్యలు తప్పవని హెచ్చరించారు. పర్యావరణానికి హాని కలిగించని పదార్థాలను మాత్రమే ఉపయోగించాలని సూచించారు. మున్సిపల్ కమిషనర్ కె.రామచంద్రారెడ్డి, సహాయ కమిషనర్ ఎ.రాంబాబు పాల్గొన్నారు.
పెంటపాడు: కారులో గంజాయితో వెళుతున్న ఓ వ్యక్తిని పెంటపాడు పోలీసులు అరెస్టు చేశా రు. శనివారం సీఐ రవికుమార్ అతడిని తాడేపల్లిగూడెం కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించినట్టు ఎస్సై స్వామి తెలిపారు. వివరాలిలా ఉన్నాయి.. దినవాహి కృష్ణవంశీ అలియాస్ కిట్టు అనే వ్యక్తి కారులో మూడు కి లోల గంజాయి తీసుకుని విజయవాడ వెళు తుండగా ప్రత్తిపాడు వై.జంక్షన్ వద్ద అరెస్టు చేసి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి చిరునామా వివరాలు తెలియరాలేదు.


