ప్రతీక్‌ యాదవ్‌ ఆకస్మిక మృతి : షాకింగ్‌ ఆరోపణలు | Prateek Yadav sudden demise be investigated by a retired judge of the High Court | Sakshi
Sakshi News home page

ప్రతీక్‌ యాదవ్‌ ఆకస్మిక మృతి : షాకింగ్‌ ఆరోపణలు

May 13 2026 7:36 PM | Updated on May 13 2026 7:43 PM

Prateek Yadav sudden demise be investigated by a retired judge of the High Court

లక్నో :  ప్రతీక్ యాదవ్  (Prateek Yadav ) ఆకస్మిక మరణంపై ఎస్పీ నేత రవిదాస్ మెహ్రోత్రా  సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతీక్‌ది సహజ మరణం కాదని, దీనిపై విచారణ జరిపించాలని కోరడం  కలకలం రేపుతోంది. ప్రతీక్ యాదవ్ ఆకస్మికంగా, అకాలంగా మరణించడంతో  తాము  తీవ్ర దిగ్భ్రాంతికి, బాధకు గురయ్యామంటూ విచారాన్ని ప్రకటించారు. అయితే  ఈ సందర్బంగా  ఆయన   కొన్ని సంచలన ఆరోపణలు చేశారు. 

ప్రతీక్ యాదవ్‌ను ఆసుపత్రికి తీసుకువచ్చే లోపే ఆయన మరణించారు. ఆసుపత్రి వైద్యులు ఆయనను చూడగానే అప్పటికే మరణించినట్లు నిర్ధారించారని పేర్కొన్నారు..ఆయన మరణం సహజమైనది కాదని అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించారన్నారు. ఆయన శరీరంపై గాయాల గుర్తులు ఉన్నాయి.  శరీరంలో నీలంగా మారిపోయింది, విషం ఆనవాళ్లు న్నాయని ఆరోపించారు. 

 > ఇదీ చదవండి: ఒక్కొక్కరికీ రూ. 5 వేలు పెట్రోలు మాత్రమే! ఎక్కడ?

 

సహజ మరణాలకు సాధారణంగా పోస్ట్‌మార్టం నిర్వహించరు.  ఆయన మరణానికి గల కారణాలపై విచారణ జరపాలని తాము డిమాండ్ చేయడంతోనే ఆయనకు పోస్ట్‌మార్టం నిర్వహించారన్నారు. పోస్ట్‌మార్టం పూర్తయ్యాక,  ఆయన శరీరంపై గాయాల గుర్తులున్నాయని, శరీరం నీలి రంగులోకి మారిపోయిందని,దీనివల్ల ఆయనకు విషప్రయోగం జరిగినట్లు అనిపిస్తోందని, వైద్యులు కూడా పేర్కొన్నారు. ఇది ఆయన మరణం సహజమైనది కాదనే విషయాన్ని మరింత స్పష్టం చేస్తోందని రవిదాస్‌ అన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రతీక్ యాదవ్ మరణంపై హైకోర్టుకు చెందిన ఒక పదవీ విరమణ పొందిన న్యాయమూర్తితో విచారణ జరిపించాలని   రవిదాస్‌ డిమాండ్  చేశారు.
ఇదీ చదవండి: ప్రతీక్‌ యాదవ్‌కు యోగి నివాళులు : కీలకంగా పోస్ట్‌మార్టం నివేదిక

Advertisement
 
Advertisement
Advertisement