అమెరికా మ్యూజియంలో భారత మహిళా శాస్త్రవేత్త చీర..! ఎవరామె? | Nandini Harinaths Saree Is On Display at US Museum | Sakshi
Sakshi News home page

అమెరికా మ్యూజియంలో భారత మహిళా శాస్త్రవేత్త చీర..! ఎవరామె?

May 12 2026 11:03 AM | Updated on May 12 2026 12:25 PM

Nandini Harinaths Saree Is On Display at US Museum

వాషింగ్టన్, డి.సి.లోని స్మిత్సోనియన్ నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ మ్యూజియం, ప్రసిద్ధ విమానాలు , అంతరిక్షయానానికి  సంబంధించి పరికరాల ప్రదర్శనకు ప్రసిద్ధిగాంచింది. అయితే తాజాగా ఆ ప్రదర్శనలో ఒక సాధారణ భారతీయ మహిళా శాస్త్రవేత్త చీర దర్శనమిస్తోంది. ఆ చీర భూ వాతారణాన్ని దాటి వెళ్లకపోయినా..ఆ శారీని ధరించిన మహిళ భారతదేశం మరో గ్రహాన్ని చేరుకోవడంలో కీలకపాత్ర పోషించింది. ఈ చీర ఇస్రోకి చెందిన ప్రఖ్యాత మహిళా శాస్త్రవేత్తలలో ఒకరైన నందిని హరినాథ్‌ది. ఎవరామె అంటే..

భారతదేశపు మార్స్ ఆర్బిటర్ మిషన్ (మంగళ్‌యాన్)లో నందిని నాయకత్వం కీలక పాత్ర పోషించింది. ఆమె తండ్రి గణిత ఇంజనీర్‌ కాగా, తల్లి గణిత ఉపాధ్యాయురాలు. ఇస్రోలో చేరడానికి ముందు ఇంజనీరింగ్‌లో అండర్‌ గ్రాడ్యుయేట్‌, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ పూర్తి చేశారు. భారత అంతరిక్ష సంస్థలో 20 ఏళ్లకు పైగా సాగిన కెరీర్‌లో ఆమె 14కు పైగా మిషన్లకు మద్దతునిచ్చారు.  

ఒక ఇంటర్వ్యూలో నందిని తన మిషన్ల గురించి మాట్లాడుతూ.. "తాము పనిచేసే ప్రతి మిషన్ అత్యంత ముఖ్యమైనదిగా అనిపిస్తుంది. అయితే వాటిలో మంగళ్‌యాన్ చాలా ప్రత్యేకమైనది, ఎందుకంటే చాలా మంది ప్రజలు ఒక్కసారిగా మావైపు చూశారు. అది మా నైపుణ్యానికి, లభించిన గుర్తింపుగా, గర్వంగా అనిపిస్తుందని అన్నారు. అంతేగాదు ఆ మిషన్‌ విజయవంతం అవ్వడంతో సాక్షాత్తు ప్రధాని మంత్రి కరచాలనం చేసి అభినందించారు. అలాగే నాసా కూడా మమ్మల్ని అభినందించింది. అంతేగాదు ఈ గెలుపు కారణంగా నాసాతో మాతో కలిసి పని చేసేందుకు ముందుకు వచ్చింది. పైగా సోషల్‌ మీడియాలో కూడా చాలామంది మమ్మల్ని ఫాలో అవుతున్నారంటూ". సంతోషంగా చెప్పుకొచ్చారామె.

ఆ సీరియల్‌ కారణంగానే..
అంతరిక్ష పరిశోధనలంటే ఎందుకు నందిని ఇష్టమో ఓ ఇంటర్వ్యూలో ఆమెనే స్వయంగా వివరించారు. ఒక ప్రముఖ టీవీ సీరియల్ చూడటం ద్వారా తనకు అంతరిక్షంపై ఆసక్తి మొదలైందన్నారు. అప్పట్లో టీవీలో 'స్టార్ ట్రెక్‌' అనే చాలా ప్రజాదరణ పొందిన సీరియల్ ఒకటి ఉండేది, దాని కారణంగానే అంతరిక్ష ఫరిశోధనాలంటే ఇష్టం ఏర్పడిందని ఈటీ ఎంటర్‌ప్రైజ్ ఏఐ 'మేకింగ్ ఏఐ వర్క్ సమ్మిట్ 2025'లో చెప్పారామె. 

తమ కుటుంబం మొత్తం ఆ సీరియల్‌కి వీరాభిమానులమని, ఒక్క ఎపిసోడ్‌ని మిస్‌ అయ్యేవాళ్లం కాదంటు నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారామె. అలాగే తాను పదేపదే ఇష్టంగా చూసే సినిమా అపోలో 13 అని, అందులో టీమ్‌గా పనిచేసి విజయం సాధించడం తదితరాలు తన మదిలో శాశ్వతంగా నిలిచిపోయానని అన్నారామె.

ఆ చీర ఎందుకు?
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) చెందిన మహిళా శాస్త్రవేత్తలలో ఒకరైన నందిని హరినాథ్ అంగారక గ్రహాన్ని చేరుకోవడానికి సహాయపడ్డారు. ఇస్రో మంగళయాన్‌ మిషన్‌ని నవంబర్ 5, 2013న ప్రారంభించింది. సెప్టెంబర్ 24, 2014న విజయవంతంగా భూమికక్ష్యను విడిచిపెట్టి విజయవంతంగా అంగారక గ్రహ కక్ష్యలోకి ప్రవేశించింది. అంటే సుమారు 300 రోజుల ప్రయాణాన్ని విజయంవతం చేసేందుకు ఆమె ఈ చీరను ధరించి పనికి వచ్చారని స్మిత్సోనియన్ మ్యూజియం ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది 

అంతేగాదు ఆ పోస్ట్‌లో.."ఒక రాకెట్ శాస్త్రవేత్తగా, మార్స్ ఆర్బిటర్ మిషన్ డిప్యూటీ ఆపరేషన్స్ డైరెక్టర్‌గా నందిని హరినాథ్ మిషన్ ప్రణాళిక, కార్యకలాపల్లో కీలక పాత్ర షోషించారు. దాదాపు ఆరు నుంచి పది నెలల కాలపరిమిత గల తన మిషన్‌ను ఏకంగా ఎనిమిదేళ్లు అంగారక కక్ష్యలో గడిపి అక్కడి ఉపరితల వాతావరణ పరిస్థితుల్ని నమోదు చేయడం విశేషం. ఆ నేపథ్యంలోనే ఈ మిషన్‌లోని మహిళా నాయకులు ధరించిన చీరలు వారి జాతీయ గుర్తింపు, అంతరిక్షంలో భారతదేశం సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచాయి" అని సదరు మ్యూజియం పేర్కొంది. అంతేగాదు ఆ చీరకు సంబంధించిన వీడియో, ఫోటోలను కూడా మ్యూజియం పంచుకుంది. ఈ చీరలో నీలం రంగు జాకెట్‌, ఎరుపు-నీలంతో కలగలసిన డ్రేప్డ్‌ ఫాబ్రిక్‌ ఉన్నాయి. 

 

(చదవండి: జేఈఈలో రెండుసార్లు ఫెయిల్‌, ఇంటర్వూలో 520కి పైగా రిజెక్షన్స్‌..! చివరికి..)
 

Advertisement
 
Advertisement
Advertisement