79వ వార్షిక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ (Cannes Film Festival) ఈ నెల మే 12, 2026 నుంచి ము 23, 2026 వరకు ఫ్రాన్స్‌లోని కేన్స్ నగరంలో జరగనుంది. ఈ వేడుకలో అరంగేట్రం చేసేందుకు సిద్దంగా ఉంది బాలీవుడ్ నటి తారా సుతారియా. తన స్టైలిష్ లుక్‌తో ఆ వెంట్‌లో ఎలా కనిపించనుందో ముందుగానే చిన్న హింట్ ఇచ్చేసిందామె. ఎయిర్‌పోర్ట్ నుంచే పవర్ డ్రెస్సింగ్ అవుట్‌ఫిట్‌తో అందర్నీ ఆశ్చర్యపరిచింది. లగ్జరియస్ ఫ్యాషన్‌ని ఎలా నిశబ్దంగా సింపుల్‌గా ప్రదర్శించాలో తన లుక్‌తో అద్భుతంగా చూపించారామె.
తారా సుతారియా ఎయిర్‌పోర్ట్‌లో అసాధారణ దుస్తుల సముదాయంతో మెరిసింది. నల్లటి సూట్‌లో అద్వితియంగా కనిపించింది. ఈ సూట్ జర్మనీకి చెందిన 'హెల్సా' అనే ఫ్యాషన్ లేబుల్ నుంచి ఎంపిక చేసుకుంది. మ్యాచింగ్‌గా అదే బ్రాండ్‌కు చెందిన బ్యాగీ ప్యాంట్‌తో స్టైలిష్‌గా కనిపించింది. అయితే ముందు వైపు బటన్ క్లోజర్, ప్యాడెడ్ షోల్డర్స్, హెవీవెయిట్ ట్విల్ ఫ్యాబ్రిక్‌తో కూడిన ఈ ముదురు బూడిద రంగు చారల బ్లేజర్ ధర రూ. 65,789.
బటన్ క్లోజర్‌తో కూడిన జిప్-ఫ్లై ఉన్న బ్యాగీ ప్యాంట్ ధర దగ్గర దగ్గర రూ. 37 వేలు పలుకుతుందట. ఆ స్టైలిష్ డ్రెస్‌కి అనుగుణంగా నలుపు రంగు జిల్ లెదర్ హైహిల్స్‌ని ధరించింది తారా. తన లుక్‌లో అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం మినీ లేడీ డియోర్ బ్యాగ్. దీని ధర వింటే కళ్లు చెదిరిపోవాల్సిందే. ఎంతంటే సుమారు రూ. 4 లక్షలు పైనే పలుకుతుందట. నల్లటి గొర్రె చర్మంతో తయారు చేసిన ఈ లెదర్ బ్యాగ్ అత్యంత అద్భుతమైన వస్తువుగా నిలిచింది.
ఈ బ్యాగ్‌కు తీసివేయగల చైన్ షోల్డర్ స్ట్రాప్, లోపల జిప్ పాకెట్ వంటివి ఉన్నాయి. అందుకు తగ్గట్టుగా ధరించి సన్‌గ్లాసెస్ కూడా తారాను మరింత అందంగా కనిపించేలా చేసింది. అంతేకాదండోయ్ ఆ గాగుల్స్ ధర కూడా ఏకంగా రూ. 8 వేలు పైనే పలుకుతుందట. ఈ బ్యూటీ తన లగ్జరీయస్ అవుట్‌ఫిట్ లుక్‌తో ఈ కేన్స్ వేడుకలో తనెంత విలాసవంతమైన గ్లామరస్ కనిపించనుందో పరోక్షంగా చెప్పేసింది కదూ..!.
(చదవండి: గోల్డ్ డిజైనర్‌వేర్‌లో రాధికా మర్చంట్ స్టన్నింగ్ లుక్!)


