breaking news
Lifestyle
-
చెఫ్ వికాస్ ఖన్నాకు రాఖీ కట్టిన రాధికా మర్చంట్
దేశమంత రాఖీ పండుగ వేడుకలతో సందడిగా ఉంది. ఈ పండుగను ప్రమఖులు సైతం తమదైన శైలిలో సెలబ్రేట్ చేసుకున్నారు. అంబానీ కుటుంబం కూడా ఈ వేడుకును అత్యంత ఘనంగా జరుపుకుంది. ఎప్పటిలో తమ ఇంటిలో కాకుండా న్యూయార్క్‌లో జరుపుకున్నారు. అనంత్ రాధికలు తమ కుటుంబంతో కలిసి న్యూయార్క్‌లోని చెఫ్ వికాస్ ఖన్నా రెస్టారెంట్ బంగళాకు వెళ్లారు. అంతేగాదు చెఫ్ వికాశ్ ఖన్నా అంబానీ కుటుంబానికి సాదర స్వాగతం పలికారు. పైగా వారి కోసం ఆ ప్రాంతాన్ని అందమైన పూలతో అలంకరించారు. గాజు బంగళా రెస్టారెంట్ పైకప్పుని చక్కగా శుభ్రం చేసి అనంత్ అంబానీ జంతు సంక్షేమ ప్రాజెక్టు అయిన "వంతార" (Vantara) పేరు వచ్చేలా పూల రేకులను అమర్చి మరి స్వాగతం పలికారు. ఆ తర్వాత రాధిక చెఫ్ వికాస్‌కి జిలేబీ ఆకారపు రాఖీని కట్టారు. ఒక్కసారిగా ఆ చర్యకు చెఫ్ వికాస్ ఖన్నా భావోద్వేగానికి గురయ్యారు. ఇది ఎన్నటికి మర్చిపోలేని అపురూపమైన క్షణంగా పేర్కొన్నారు. అందుకు సంబంధించిన వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ..పోస్ట్‌లో ఇలా రాసుకొచ్చారు. రాధిక అనే పేరుకు అర్థం ఏంటో ప్రపంచం మొత్తానికి తెలుసు. ఆమె నాకు జిలేబీ ఆకరాపు రాఖీని కట్టినప్పుడు నాలో ఏదో మార్పు కలిగింది. ఒక్క క్షణం పాటు నాలోని ఒక భాగం స్వస్థత పొదిన అనుభూతి కలిగిందన్నారు. అలాగే వంతారలో అనంత్ అంబానీ చేస్తున్న అసాధారణమైన కృషిని మెచ్చుకుంటూ..ఆయనకు జంతువుల పట్ల ఉన్న ఆపారమైన ప్రేమ, వాత్సల్యానికి తాను సదా దాసోహం అన్నారు. అనంత్‌ని అత్యంత దయగల వ్యక్తిగా పేర్కొన్నారు. అలాంటి వాళ్లకు తన బంగళా రెస్టారెంట్లో తాను ఆతిథ్యం ఇవ్వడం తనకెంతో గొప్ప విషయమని రాసుకొచ్చారు వికాస్ ఖన్నా పోస్ట్‌లో. అంతేగాదు పోస్ట్‌లో ప్రతిరోజూ ఎంతో మంది అతిథులు ఈ రాఖీ పండుగ నేపథ్యంలో తనకు రాఖీలు కడుతుంటారని, గానీ మనం ఎంతో అభిమానించే, ప్రేమించే వ్యక్తులు మనల్ని ఆశ్చర్యపర్చేలా ఇలా చేస్తారని ఊహించం. ప్రస్తుతం రాధిక చేసిన పని అలానే ఉందని, దీన్ని ఎన్నటికీ మర్చిపోలేనని అన్నారు. కొన్ని క్షణాలు ముందుగా ప్లాన్ చేసుకోలేం, కానీ అవి ఆకస్మికంగా జరిగినప్పుడు కలిగే ఆనందం మాటల్లో చెప్పలేం అన్నారు. రాధిక తనకెంతో గొప్ప అర్థాన్ని ఇచ్చేలా ఈ రాఖీని కట్టినందుకు ధన్యవాదాలు అంటూ తన పోస్ట్‌ని ముగించారు వికాస్ ఖన్నా. View this post on Instagram A post shared by Vikas Khanna (@vikaskhannagroup) (చదవండి: రక్షాబంధన్‌కి అంత మహత్తు ఉందా? ఆ పండుగ కోసమే ఆ దేవత..) -
ఏంటి..? ఏఐ ఇప్పుడు వైరస్‌లను కూడా రూపొందిస్తోందా?
ఏఐతో ఇప్పటిదాకా చిత్రాలను, చిన్నచిన్న వీడియోలను తయారు చేయడం మనకు తెలుసు... కొందరు కోడింగ్ కోసం ప్రాంప్ట్ ఇస్తారు. ప్రాజెక్టు పనులకు కోసం వివరాలు వెతుకుతారు, మరికొందరు కొత్త రకం సినిమా కథలను తయారు చేయడం, సంగీతాన్ని సృష్టించడం కోసం ఏఐని వాడుతున్నారు.అయితే, తాజా పరిశోధనల ఫలితంగా జీవుల జన్యు నిర్మాణాన్ని కూడా రూపొందించే దిశగా కృత్రిమ మేధా అడుగులు వేస్తోంది. అమెరికాలోని స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ, ఆర్క్ సంస్థ పరిశోధకులు కృత్రిమ మేధస్సును ఉపయోగించి ప్రకృతిలో ఇంతకు ముందు లేని 16 కొత్త వైరస్‌లను రూపొందించారు. వీటితో మానవాళికి ప్రమాదం లేదు. ఎందుకంటే ఇవి మనుషులకు సోకేవి కావు.మనుషులను బాధించే బ్యాక్టీరియాను నాశనం చేసే వైరస్. మందులకు లొంగని బ్యాక్టీరియాని ఈ తరహా వైరస్‌లతో ఎదుర్కోవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అయితే ఈ ప్రయత్నం ప్రయోగశాలలోనే ఉంది. ఏఐతో రూపొందించిన వైరస్ తయారై మార్కెటెక్కాలంటే మరి కొన్నేళ్లు ఆగాల్సిందే.ఇవి కూడా చదవండి: మందులు కాదు.. మ్యూజిక్ చాలు! ఏఐతో మానసిక ఒత్తిడికి చెక్! -
డేటాను విశ్లేషించే ఏఐ.. 15 ఏళ్లకే అంతర్జాతీయ గుర్తింపు!
మానసిక సమస్యలతో బాధ పడుతున్నవారు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉన్నారు. ‘జటిలమైన మందులు అవసరం లేదు. మ్యూజిక్ వినండి చాలు’ అంటూ ముందుకు వచ్చింది ఏఐ–ఆధారిత ఆడియో విజువల్ ప్లాట్‌ఫామ్... హార్మోని. ‘హార్మోని’ అనే రిసెర్చ్ ప్రాజెక్ట్ ప్రయోగదశలో సత్ఫలితాలను ఇస్తోంది. ఎంతోమందిని ఒత్తిడికి దూరం చేసింది.వాషింగ్టన్కు చెందిన అనూష అరోరా రీజెనరాన్కి పదిహేనేళ్లు. అనూష వ్యక్తిగత అనుభవం నుంచే ‘హార్మోని’ ఆవిష్కృతమైంది. ఆమె తల్లి ఒత్తిడిగా అనిపించినప్పుడు సంగీతం వినేది. ఫలితంగా ఆమెకు ఎంతో రిలీఫ్‌గా అనిపించిందేని చెప్పేది. అప్పటి నుంచి అనూష సరికొత్త మ్యూజిక్ థెరపీ ప్లాట్‌ఫామ్ గురించి ఆలోచించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెన్సార్ టెక్నాలజీ సహాయంతో మరింత పర్సనలైజ్ మ్యూజిక్ థెరపీని అందించే దిశలో పరిశోధన చేయడానికి నడుం కట్టింది. తనప్రాజెక్ట్కు ‘హార్మోని’ అని నామకరణం చేసింది.డేటాను అర్థం చేసుకొని...ముందుగా నిర్ణయించిన ప్లే లిస్ట్‌లపై ఆధార పడకుండా వ్యక్తులలోని భావోద్వేగ స్థితిగతులకు అనుగుణంగా స్పందించే ఒక పోర్టబుల్ ప్లాట్‌ఫామ్‌గా ‘హార్మోని’ రూపొందించింది అనూష. వేలి సెన్సార్లు శారీరక సమాచారాన్ని అందిస్తాయి. దానిని ‘హార్మోని సిస్టమ్ విశ్లేషిస్తుంది. ఏఐ మోడల్స్ ఆ డేటాను అర్థం చేసుకొని భావోద్వేగ స్థితికి అనుగుణంగా ఉండే సంగీతాన్ని, దృశ్యాలను అందిస్తాయి.భావోద్వేగాలను గుర్తించడానికి, సంగీతాన్ని రూపొందించడంలో వివిధ అంశాలను సమన్వయం చేయడానికి 11 ఏఐ ప్రోగ్రామ్స్‌ను ‘హార్మోని’ మిక్స్ చేస్తుంది. తద్వారా తన ఔట్‌పుట్‌ను రియల్‌టైమ్‌లో సర్దుబాటు చేసుకోగలుగుతుంది. ఇప్పటికైతే ‘హార్మోని’ ఒక రిసెర్చ్ప్రాజెక్ట్గా మాత్రమే కొనసాగుతోంది. ఏఐ–ఆధారిత మ్యూజిక్ థెరపీ ప్లాట్‌ఫామ్‌ను అభివృద్ధి చేసిన అనూష ఐఎస్ఇఎల్ 2026లో ఫ్యామిలీ ప్రైజ్ ఫర్ స్టెమ్ ఎక్స్‌లెన్స్ అవార్డును, 50 వేల డాలర్ల ప్రైజ్ మనీని గెలుచుకుని తన తోటివారికి ఆదర్శంగా నిలిచింది.ఇవీ చదవండి: ఒక్క మాట.. ఓ కవిత.. ఓ కప్పు టీ.. వాళ్ల జీవితాల్లో కొత్త వెలుగు! -
ఒక్క మాట.. ఓ కవిత.. ఓ కప్పు టీ.. వాళ్ల జీవితాల్లో కొత్త వెలుగు!
ఎదుటివారికి ఏదైనా సాయం అందించాలంటే అందుకు బోలెడంత డబ్బు ఉండాలని కొందరు. సమయం ఉండాలని మరికొందరు చెబుతుంటారు. కానీ, మనసులో కొంత దయాగుణం, మరికొంత సృజన ఉంటే చాలు అని నిరూపిస్తున్నారు కొందరు వ్యక్తులు. ఇటీవల వీరు చూపుతున్న దయార్ధహృదయానికి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలూ అందుతున్నాయి.ఇంగ్లండ్ వాసి అయిన ఫ్రేజర్ లోగాన్ ఓ యువ రచయిత. మనసును తడిచేసే కవితలను సృష్టిస్తాడని పేరు. అలాగని ఓ చోట కూర్చొని నీలి ఆకాశంలోకి చూస్తూ కాగితంపైన పదాలను ఒలికించడం లేదు. ఓ టైప్మిషన్ను మెడలో వేసుకొని, లీమింగ్టన్ స్పా వీధుల్లో తిరుగుతుంటాడు. జెఫ్సన్ పార్క్‌లోని ఒక బెంచీని ఎంచుకొని కూచుంటాడు.అయితే, ఖాళీగా కాదు. ఎవరైనా అనామకులు బాధపడుతున్నట్టు కనిపిస్తే చాలు. వారి దగ్గరకు వెళ్లి, కాసేపు మాట్లాడి బాధకు కారణం ఏంటో కనుక్కుంటాడు. వారు ఏదైనా ఒక్క భావోద్వేగ పదం చెప్పినా, దానిని పట్టుకొని అందమైన అక్షరాలతో అల్లిక మొదలుపెడతాడు. పేజీ నిండా కవిత్వం రాసి, వారిచేత చదివించి, ఆ సదరు వ్యక్తిలోని బాధను పోగొడతాడు. పనేమీ లేదు కాబోలు అనుకుంటారేమో కానీ, ఫ్రేజర్ పీహెచ్‌డి చేసి, లెక్చరర్‌గా ఉద్యోగమూ సంపాదించాడు. కానీ, ఇప్పుడా ఉద్యోగం నచ్చక వదిలేశానంటాడు. ఫ్రేజర్కి వేలాది మంది ఫాలోవర్లు ఉన్నారు. ప్రతిరోజూ తమ కోసం రాయమని చెప్పేవారు పెరుగుతూనే ఉన్నారు.కొన్ని క్షణాలు...పారిశుధ్య కార్మికులు రాత్రంతా వీధి లైట్ల వెలుగుల్లో రోడ్లను శుభ్రం చేయడానికి కష్టపడుతుంటారు. కానీ, మన బిజీలో వారి గురించి ఒక్క క్షణం కూడా పట్టించుకోం. ఇటీవల బెంగళూరు వాసి అయిన ఓ సాఫ్ట్వేర్ మహిళ రోడ్డుపై పనిచేసే కార్మికులను చూసి, చలించిపోయింది. వారికి టీ, స్నాక్స్ అందించి, కాసేపు వారితో ముచ్చటించింది.ఇటీవల అస్సాంలోని శివసాగర్ ప్రాంతంలో భారీ వరదల వల్ల ఒక మహిళ ఇల్లు, సామాన్లు అన్నీ మునిగిపోయాయి. అంతటి కష్టంలోనూ, తమను రక్షించడానికి వచ్చిన విపత్తు సహాయక సిబ్బంది అలసటను గమనించి, ఆమె వారికి జ్యూస్ ఇచ్చి, తన కృతజ్ఞతను చాటుకుంది.ఒక సాధారణ డెలివరీ రైడర్ ఎండలో కష్టపడి ఆర్డర్ తెచ్చినందుకు గీతిక అనే మహిళ అతనికి 500 నోటును టిప్‌గా ఇచ్చింది. ఆ డెలివరీ బాయ్ తన రోజువారీ సంపాదన కంటే ఆ టిప్ ఎక్కువని సంతోషంతో కన్నీళ్లు పెట్టుకున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.కాశ్మీర్‌లోని ఒక వృద్ధురాలు విధి నిర్వహణలో ఉన్న సీఆర్పీఎఫ్ జవాన్ వద్దకు వెళ్లి, ప్రేమతో పండ్లు అందించింది. అవి తను పెంచిన పెరటి తోటలో పండాయని వాటిని తెచ్చి, ఆ జవాన్ కు ఎంతో ప్రేమతో తినిపించింది. సరిహద్దుల్లో కాపలా కాసే జవాన్లను తన బిడ్డలా చూసుకున్న ఆమె మాతృత్వపు హృదయానికి అందరూ జేజేలు పలికారు.ఫలితాలను ఆశించకుండా ఎదుటివారి కష్టాన్ని కొంతైనా తగ్గిద్దామని చేస్తున్న ఇలాంటి సేవామూర్తులు ఎక్కడా ఉన్నా అభినందనలు అందుకుంటూనే ఉంటారు.– నిర్మలా రెడ్డిఇవి కూడా చదవండి: కార్లే లేవు.. నడక, సైక్లింగ్తోనే జీవనం! ఈ ప్రాంతం గురించి విన్నారా? -
మనిషి కదలికలే డేటా..! ఎందుకో తెలుసా?
ఇంట్లో ఈజీ చైర్లో కూర్చున్న వ్యక్తి ఓ పుస్తకాన్ని చదువుతున్నాడు. అతనికి కాఫీ ఇచ్చారు. అతను కాఫీ తాగుతూ, కళ్ల జోడు సరి చేసుకుంటూ, పేజీలు తిరగేస్తూ పుస్తకాన్ని చదువుతున్నాడు. ఇది ప్రతి ఇంట్లోనూ సర్వసాధారణంగా జరిగేదే కదా అని మీరంటే ఒక్క నిమిషం ఆగండి..ఇదే పనిని ఓ రోబో చేయాలంటే? ఈజీ చైర్లో కూర్చున్నప్పుడు అది ఒక వుడెన్ చైర్ అని రోబో గుర్తించాలి. కూర్చున్న తర్వాత కుర్చీ ఊగుతుండగా తనని తాను బ్యాలెన్స్ చేసుకోవాలి. పుస్తకాన్ని పట్టుకునేటప్పుడు చేతిని సరైన కోణంలో ఉంచాలి. పేజీలు తిరగేసేటప్పుడు వేళ్లతో సున్నితంగా ముట్టుకోవాలి. కాఫీ ఇస్తే ఊగుతున్న కుర్చీని బ్యాలెన్స్ చేస్తూ మరో చేతితో కప్పుని తీసుకోవాలి. మరీ ముఖ్యంగా అందులోని కాఫీ ఒలికిపోకుండా.. వీటన్నింటికీ ప్రత్యేకమైన కమాండ్స్ ఇచ్చి ఓ రోబో చేత చేయించాలంటే ఎంత సాంకేతికతతో కూడిన డేటా అవసరమో ఒక్కసారి ఆలోచించండి..ఇప్పుడు ఆ దిశగా అడుగులు వేస్తోంది హ్యుమన్ ఆర్కైవ్... మనుషుల ప్రపంచాన్ని డేటాగా మార్చి కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్న స్టార్టప్ కంపెనీయే ఈ హ్యుమన్ ఆర్కైవ్.భారతీయ మూలాలు ఉన్న ఓ నలుగురు స్నేహితులు కలిసి ఓ స్టార్టప్‌ను మొదలుపెట్టారు. అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోలో ఈ మధ్యే ప్రారంభమైన ఈ స్టార్టప్ కంపెనీ అనతి కాలంలోనే బాగా విస్తరించింది. ముఖ్యంగా ఈ కంపెనీ కార్యకలా΄ాలు భారత్‌లోనే ఎక్కువ కొనసాగుతున్నాయి. రాజ్ పటేల్, రుషీ అగర్వాల్, సమయ్ మైనీ, షోక్లా పటేల్ దీని వ్యవస్థాపకులు.æరుషీ అగర్వాల్ రెండేళ్ల కిందటే జైపూర్ నుంచి యూఎస్‌కి వెళ్లాడు. ఈ నలుగురు అమెరికాలో కంపెనీ స్థాపించినప్పటికీ డేటా కలెక్షన్‌కి భారత్‌నే ఎంచుకున్నారు. లక్ష్యంమనుషులు చేసే పనులను రోబోలతో చేయించాలంటే మనుషుల శారీరక కదలికలు, పని చేస్తున్నప్పుడు చూపే ఏకాగ్రత,, పని చేసే విధానం, హఠాత్ పరిణామాలకు స్పందించే తీరు, ఏయే పనిని ఎంత వేగంతో చేయాలి వంటి అనేకమైన భౌతిక విషయాలను వడపోసి ఆ తీరు తెన్నులను రోబోలకు అలవాటు చేయడమే ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. అంటే మన రియల్ వరల్డ్‌లో మనం చేసే పనులను వర్చువల్ వరల్డ్ లో రోబోలతో చేయించడమే ఈ కంపెనీ లక్ష్యం.ఎంత డేటా?మే 2026 నాటికి వెయ్యికి పైగా హెడ్క్యాప్లను ఉపయోగించి డేటాను సేకరించడం జరిగింది. రోజుకు ఎనిమిది గంటలు అంటే మొత్తం ఎనిమిది వేలగంటల డేటాను తీసుకున్నారు. అంటే వెయ్యి మంది వివిధ రంగాలలో పని చేసే ఉద్యోగుల పనిని రికార్డ్ చేశారన్నమాట. ఇది మాత్రమే కాదు వెయ్యిమంది నుంచి యాభై వేలమందికి హెడ్ క్యాప్‌ల అమర్చి డేటా సేకరణ చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.ఫండింగ్హ్యుమన్ ఆర్కైవ్ కంపెనీలో వివిధ కంపెనీలు పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపుతున్నాయి. వింగ్ వెంచర్ క్యాపిటల్, ఎన్వీపీ క్యాపిటల్, వై కాంబినేటర్ వంటి కంపెనీలు ఇప్పటికే పెట్టుబడులు పెట్టాయి. దాదాపు ఇప్పటివరకు హ్యుమన్ ఆర్కైవ్ స్టార్టప్‌కి 8.2 మిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి.నిజానికి ఇది ఒకసారి పూర్తయ్యే ప్రాజెక్ట్ కాదు. ఎప్పటికప్పుడు డేటా సేకరించి రోబోటిక్ మోడల్స్‌ను ట్రైన్ చేయాల్సి ఉంటుంది. అమెరికా, చైనా, ఆసియాలో కొన్ని దేశాలలో డేటా సేకరణ జరుగుతోంది. స్కేల్ ఏఐ, షిప్ట్, ఎక్స్డాఫ్, ఫిగర్ ఏఐ, యాప్ట్రానిక్స్ వంటి సంస్థలు ఇప్పటికే ఈ తరహా ప్రాజెక్టులపై దృష్టి పెట్టాయి. ఒక షిఫ్ట్ కంపెనీ మాత్రమే దాదాపు 15 దేశాల నుంచి డేటాను సేకరిస్తోంది. ఈ కంపెనీలు వీడియో డేటా మీద దృష్టి పెడితే హ్యుమన్ ఆర్కైవ్ మాత్రం ఆర్జీబీ, డెప్త్, బాడీ మోషన్ తదితర విషయాలపై డేటాను సేకరిస్తోంది. అన్ని పరిశోధనలు పూర్తయిన తర్వాత డేటాను కోడింగ్ రూపంలో రోబోలకు ట్రైనింగ్ ఇచ్చి పరీక్ష చేస్తారు. నేటిబాలలే రేపటి పౌరులు అన్నచందగా నేటి ట్రైనింగ్ రోబోలే రేపటి వెయిటర్లు, కుక్‌లు, కాంపౌండర్లు, సర్వెంట్లుగా మారనున్నాయి. .ఎలా పని చేస్తుంది?ప్రతి పనినీ దగ్గరగా పరిశీలించి రోబోలకు డేటా రూపంలో ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకోసం హోటళ్లు, రెస్టారెంట్లు, కార్యాలయాలలో పని చేసే ఉద్యోగులకు ప్రత్యేకమైన హెడ్ క్యాప్ ఇస్తారు. వీటిని ఈగో సెంట్రిక్ కెమెరా రిగ్స్ అని అంటారు. ఈ హెడ్ క్యాప్‌లో అమర్చిన ప్రత్యేకమైన కెమెరాలు ఉద్యోగి చేసే పనులు, కదలికలను రికార్డ్ చేస్తాయి. ఇలా ఫస్ట్ పర్సన్ వీడియో డేటాను సేకరిస్తారు.ఉదాహరణకు ఇంట్లో ఒక వ్యక్తి ఫ్లోర్ మాప్ చేస్తున్నాడనుకోండి. అతను నేలపై ఉన్న వస్తువును చూసి పక్కకు జరుపుతాడు. మాప్‌ను ఒక ప్రత్యేక కోణంలో తిప్పుతాడు. ఏదైనా అడ్డు తగిలితే తన కదలికను మార్చుకుంటాడు. మనకేమో ఇదంతా మామూలే కదా అనిపిస్తుంది, క్షణాల్లో జరిగిపోతుంది. కాని రోబోకు అదంతా పెద్ద టాస్క్. అందుకే వాటిని ట్రైన్ చేయడం కోసమే ఈ సమాచార సేకరణ.– శ్రావణ్ జయఇవి కూడా చదవండి: స్మార్ట్‌వాచ్‌కు మించిన ట్రాకర్.. ‘టెంపుల్’లో ఏముంది? -
తొలి సెల్ఫీ..! కిటికి నుంచి మొదలైన ప్రయోగమే ఇది..
కాలం తాలూకు ఓ ముక్కను మన చేతిలో వదిలిపోతే ఎలా ఉంటుంది? మన కంటే వందల రెట్లు కనిపించే ప్రపంచం మన అరచేతిలో చాటుగా వచ్చి చేరిపోతే ఎలా ఉంటుంది? ఫొటో ఇచ్చే కిక్కే అదే కదా..? ఫొటో తీసే ముందు వచ్చే క్లిక్‌మనిపించే శబ్దానికి అక్షరాలా రెండు శతాబ్దాలు నిండాయంటే నమ్మశక్యం కాదు.. అయినా ఇది నిజం..ఫ్రెంచ్ ఆవిష్కర్త జోసెఫ్ నిసెఫోర్ నీప్స్ 1820లలో కాంతిని ఉపయోగించి ఒక చిత్రాన్ని శాశ్వతంగా నిలుపుకోవడానికి ప్రయోగాలు చేశాడు. ఆ ప్రయోగాల ఫలితమే వ్యూ ఫ్రమ్ ద విండో అట్ లి గ్రాస్. 1826లో అతని ప్రయోగాల ఫలితంగా తొలిఫొటోను తీయగలిగాడు. ఆ ఫొటోలో నీప్స్ ఇంటి కిటికీ బయట ఉన్న భవనాలు, పైకప్పులు కనిపిస్తాయి. విశేషమేమిటంటే ఇప్పుడు ఫొటో తీయడానికి కెమెరాలో బటన్ నొక్కితే క్షణంలో ఫొటో తీయొచ్చు.. కాని ఆ రోజుల్లో నీప్స్ అదే పని చేయడానికి సూర్యకాంతి కోసం గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చేది. ఇంటి కిటికీ నుంచి మొదలైన ఆ చిన్నప్రయోగమే నేడు డిజిటల్ కెమెరాలు, మొబైల్ కెమెరాల నుంచి ఐమాక్స్ కెమెరాల వరకు అభివృద్ధి చెందింది. ఇదే ఫస్ట్ సెల్ఫీఫొటోగ్రఫీ మీద నీప్స్ తర్వాత చాలామంది పరిశోధనలు చేశారు. 1839లో అమెరికాలోని ఫిలడెల్ఫియాకు చెందిన రాబర్ట్ కార్నీలియస్ తన కుటుంబానికి చెందిన గ్యాస్ లైటింగ్ వ్యాపార ప్రాంగణంలో కెమెరాను ఏర్పాటు చేశాడు. అప్పటి కెమెరాలు నేటి ఫోన్ కెమెరాల్లా ఉండేవి కావు. ఫొటో తీయడానికి లెన్స్ క్యాప్ తొలగించి, వెంటనే కెమెరా ముందు కూర్చోవాలి. తిరిగి వెళ్లి లెన్స్‌ను మూసేయాలి. అలా కార్నీలియస్ తీసుకున్న స్వీయచిత్రాన్నే ప్రపంచంలోనే తొలి సెల్ఫీగా పరిగణిస్తున్నారు. (చదవండి: భారత వంటకాల రుచి దెబ్బకు..మరో రెసిపీని ట్రై చేయలేకపోతున్నా! అమెరికా వ్యక్తి ఆవేదన..) -
విజయానికి మచ్చ లేదు!
క్రీడాకారుల సౌందర్యం వారి రూపంలో కాదు, మైదానంలో వారు చూపే ఆత్మస్థైర్యం, సహనంలో ఉందనే దిశగా ‘వేర్ యువర్ స్కార్స్’ సరికొత్త చర్చకు తెరలేపింది. కాప్రి స్పోర్ట్స్ ఆధ్వర్యంలోని ది స్పోర్ట్స్ ఉమెన్ సంస్థ, భారత హాకీ సమాఖ్యతో కలిసి ‘‘మీ గాయాలను గర్వంగా ప్రదర్శించండి’’ అంటూ ఒక ప్రత్యేక డిజిటల్, సోషల్ మీడియా ఫొటో సిరీస్ క్యాంపెయిన్‌ను ప్రారంభించింది. క్రీడారంగంలో సమాజం చెప్పేటువంటి సాంప్రదాయ సౌందర్య ప్రమాణాలకు ఎటువంటి స్థానం లేదని ఈ ప్రచారం గట్టిగా చెబుతోంది. మహిళా అథ్లెట్లు మైదానంలో ఆడేటప్పుడు తగిలే గాయాలు, కుట్లు, కట్ మార్క్స్, కందిపోయిన గుర్తులను దాచడం లేదా ఫొటోల్లో రీటచ్ చేసి తొలగించడం సాధారణం. కానీ, ‘వేర్ యువర్ స్కార్స్’ ఈ గాయాలను దాచడానికి నిరాకరించింది. పదహారవ మహిళల ప్రపంచ కప్ హాకీ టోర్నీని పురస్కరించుకొని చేస్తున్న ఈ ప్రచారం మహిళల శరీర రూపురేఖలు, అందంపై సమాజంలో ఉన్న పాతబడిన ఆలోచనలను గట్టిగా ప్రశ్నిస్తోంది. మహిళలు ఎప్పుడూ నాజూగ్గా, మచ్చలు లేకుండా ఉండాలనే సామాజిక ఒత్తిళ్లకు, సౌందర్య ప్రమాణాలకు క్రీడా ప్రపంచం లో స్థానం లేదని అంటోంది. మైదానంలో ఆడే మహిళల శరీరాలపై పడే ప్రతి గాయం వారి అసాధారణ పోరాటానికి, విజయానికి నిజమైన ఆభరణమని చాటిచెబుతోంది. ఈ క్యాంపెయిన్‌లో అథ్లెట్లు తమ శరీరాలపై ఉన్న గాయాలను రత్నాభరణాల రీతిలో దర్పంగా ప్రదర్శించారు. ఒంటిమీద ధరించే మెరిసే ఆభరణాల్లా ఈ గాయాలపై కూడా కాంతి ప్రసరించేలా చిత్రీకరించారు. క్రీడా మైదానంలో తగిలే గాయాలు వైకల్యాలు కావు, అవి క్రీడాకారుల పట్టుదలకు, ఆత్మస్థైర్యానికి సజీవ సాక్ష్యాలని స్పష్టం చేస్తున్నారు. ఫ్యాషన్ గ్లామర్‌కూ, మైదానంలో అథ్లెట్లు చిందించే చెమట–రక్తాలకు మధ్య ఉన్న ఒక విభిన్నమైన వ్యత్యాసాన్ని ఈ ప్రచారం కళ్ళకు కట్టినట్లు చూపుతోంది. View this post on Instagram A post shared by The Word. (@thewordmagazine) (చదవండి: భారత వంటకాల రుచి దెబ్బకు..మరో రెసిపీని ట్రై చేయలేకపోతున్నా! అమెరికా వ్యక్తి ఆవేదన..) -
భారత వంటకాల రుచి దెబ్బకు..మరో రెసిపీని ట్రై చేసే ఛాన్సే లేదు!
భాతీయ వంటకాల రుచి పడిపోవని వారు లేరంటే అతిశయోక్తి కాదేమో. ఆహా ఇదేమి రుచి తినరా మైమరచి..అంటూ లొట్టలేసుకుంటూ విదేశీయులు సైతం ఆస్వాదిస్తున్నారు. ముఖ్యంగా మన వంటకాల కోసం మన భారత్‌లో పర్యటించేవాళ్లు కూడా ఉన్నారు. ఇదెంతా ఎందుకంటే మన వంటకాల టేస్ట్‌కి ఫిదా అవ్వుతూ ఓ అమెరికన్ వ్యక్తి తన ఆవేదనంత గక్కేశాడు. స్వతహాగా మాంసహార ప్రియుడినైనా తాను భారతీయ వంటకాల దెబ్బకు..మరో రుచి చూడలేకపోతున్నానంటూ బాధను వ్యక్తం చేస్తున్నాడు. ఇదేంటి మన వంటకాల టేస్ట్ నచ్చలేదా? అని తప్పుగా అనుకోకండి. ఎందుకంటే ఈ అమెరికన్ వ్యక్తి మన వంటకాల తోపాటు మన వెటకారం కూడా వంటబట్టించుకుని మరి ఇలా వ్యగ్యంగా చెబుతున్నాడు. ఇంతకీ ఏంటంటే అసలు కథ..!.స్నాక్ మాస్టర్ జనరల్‌గా అభివర్ణించే స్నాక్ డిటెక్టివ్ ఎడ్ నాథన్సన్ అనే అమెరికన్ వ్యక్తి భారతీయ వంటకాలు గురించి సోషల్‌మీడియా వేదికగా ఇలా చెప్పుకొచ్చాడు. ఆ వంటకాలు తన రుచి మొగ్గలను పాడు చేశాయట. భారతీయ వంటకాల్లోని అద్భుత రుచి, విభిన్నమైన రెసిపీల మాధుర్యానికి మరో వంటకం టేస్ట్ నాథన్సన్కి తెలియడం లేదట. మన వంటకాల రుచి ఆ రేంజ్లో ఉందని, అందులో ఉపయోగించే 47 మసాలాలే ఇందుకు కారణం అని అంటున్నాడు. ఆ కారణంగానే అతడి నాలుకు మరో టేస్ట్‌ని క్యాచ్ చేయలేక వాటి జోలికే పోవడం లేదంటూ చమత్కరిస్తున్నాడు. భారత వంటకాల రుచితో తనకు గొప్ప చిక్కొచ్చి పడిందంటూ వ్యగ్యంగా పొగడ్తల జల్లు కురిపిస్తున్నాడు. ఇది అక్షరాల మిగతా వంటకాల రుచి పాడుచేస్తోందని ఆరోపణలు చేస్తున్నాడు. తాను సుమారు నాలుగైదు ఏళ్ల నుంచి భారతీయ ఆహారం ఆస్వాదిస్తున్నట్లు వెల్లడించారు. ఒకరోజు స్వర్గంలోంచి దేవుడే తనను ఆహ్వానిస్తూ..ఈ భారతీయ వంటకాల రుచి చూడమన్నాడని ఆసువుగా కథ కూడా చెప్పేస్తున్నాడు. అంతేగాదు అస్సలు ఈ వంటకాలు టేస్ట్ చూడాలని దిగారో..మళ్లీ వెనక్కి వెళ్ల మరో వంటకం వైపుకి చూడను కూడా చూడరని శపథం చేసి మరి చెబుతున్నాడు. ఇంకా.. మన రెసిపీ పేర్లు ప్రస్తావిస్తూ ఇలా చెప్పాడు. పారీ పూరీ తిన్నారో..మళ్లీ మళ్లీ తినాలనే కోరిక చావను కూడా చావదు, ఆ చికెన్ కర్రీ టేస్ట్ చేశారో..మదిలో గుర్తుకొచ్చినప్పుడల్లా నోటిలో నీళ్లూరిపోతుంటాయని, ఇక ఆ కాలీఫ్లవర్ చూస్తే..భారతీయ వంటకం గోబీ మంచూరియన్ మనసుని తాకుతుందని..అందువల్ల నాలుకని కట్టడి చేయడం అసాధ్యం అంటూ ఇండియన్ వంటకాలపై ప్రేమనంత ఒలకపోశాడు నాథన్సన్. అంతేగాదు తాను స్వతహాగా మాంసాహార ప్రియుడినైనా తనని శాకాహార వంటకాల వైపుకి మళ్లేలా చేసిందని అంటున్నాడు. అంతేగాదు తొలిసారిగా భారతీయ వంటకాలను ట్రై చేసే ముందు ఓసారి ఆలోచించుకోండి. లేదంటే దాని రుచికి బానిసైపోతారు, మళ్లీ దాన్నుంచి బయటపడటం అంత ఈజీ కాదు సుమీ అని హాస్యంగా హెచ్చరిస్తున్నాడు నాథన్సన్. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by Ed Nathanson (@ed_nathanson) (చదవండి: మేఘాలయ ‘అహింసా పట్టు’ చీరలో కంగనా రనౌత్..! ప్రత్యేకత ఇదే) -
కార్లే లేవు.. నడక, సైక్లింగ్తోనే జీవనం! ఈ ప్రాంతం గురించి విన్నారా?
అమెరికా అంటేనే భారీ రహదారులు, కార్లు, ట్రాఫిక్ గుర్తుకొస్తాయి. కానీ అదే అమెరికాలో కార్లు లేకుండానే ప్రజలు హాయిగా జీవించే ఓ ఆధునిక ప్రాంతం ఉంది. నడక, సైక్లింగ్, ప్రజా రవాణాకే ప్రాధాన్యం ఇస్తూ.. ఆహ్లాదకరమైన వాతావరణంతో ప్రత్యేకంగా నిలిచిన ఈ ప్రాంతం ఇప్పుడు భవిష్యత్ నగరాలకు ఓ కొత్త నమూనాగా మారుతోంది. ఇంతకీ ఆ ప్రాంతం ఎక్కడుంది? అక్కడి ప్రత్యేకతలేంటి? ఇప్పుడు తెలుసుకుందాం!అమెరికాలోని అరిజోనా రాష్ట్రం టెంపేలో ఉన్న కల్డెసాక్ (Culdesac) ప్రాంతం ఇప్పుడు వినూత్నమైన నగర నిర్మాణానికి ఉదాహరణగా నిలుస్తోంది. సాధారణంగా అమెరికా నగరాల్లో కార్ల వినియోగం ఎక్కువగా ఉంటుంది. దీంతో పెద్ద రహదారులు, ట్రాఫిక్, కాలుష్యం, పార్కింగ్ కోసం భారీగా స్థలం అవసరమవుతుంది. అయితే కల్డెసాక్ మాత్రం దీనికి పూర్తిగా భిన్నంగా ఉంది. మొదటి నుంచే కార్ల రహిత ఆధునిక నివాస ప్రాంతంగా దీన్ని రూపొందించారు. ప్రజలు కార్లకు బదులుగా నడక, సైక్లింగ్, ప్రజా రవాణాను ఉపయోగించేలా ఇక్కడి నిర్మాణాన్ని ఏర్పాటు చేశారు.కల్డెసాక్ వాతావరణం, నిర్మాణ శైలి కూడా ప్రత్యేక ఆకర్షణగా మారాయి. ఇక్కడ రోడ్లపై కార్ల రద్దీ కనిపించదు. అందమైన భవనాలు, నడకదారులు, పూల మొక్కలు, అలంకరణ దీపాలతో ఆహ్లాదకరంగా కనిపించే ఈ ప్రాంతాన్ని చూసిన కొందరు పర్యాటకులు ‘ఇది అమెరికాలో ఉన్నట్టుగా అనిపించడం లేదు.. గ్రీస్‌లోని ఏదో ప్రాంతంలా ఉంది’ అని చెబుతుంటారు.సుమారు 17 ఎకరాల్లో విస్తరించిన కల్డెసాక్ ప్రాంతం మధ్యలో ఓ విశాలమైన ప్లాజాను ఏర్పాటు చేశారు. దాని చుట్టూ తక్కువ ఎత్తున్న తెల్లని భవనాలు, సన్నని నడకదారులు, గోడలపై చరిత్రకు సంబంధించిన రంగురంగుల చిత్రాలు, పూల మొక్కలు, అలంకరణ దీపాలు కనిపిస్తాయి. ఈ నిర్మాణ శైలికి ఇటలీ, ఫ్రాన్స్‌లోని కొండ ప్రాంతాలు, తీర గ్రామాల నుంచి స్ఫూర్తి పొందినట్లు ఆర్కిటెక్ట్ డేనియల్ పరోలెక్ తెలిపారు.ఇక్కడ కార్ల వినియోగం లేకపోయినా రవాణాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రజలు నడవడానికి అనువైన ఫుట్‌పాత్‌లు, సైకిళ్ల కోసం ప్రత్యేక దారులు ఏర్పాటు చేశారు. రెస్టారెంట్లు, దుకాణాలు, కొరియన్ కన్వీనియన్స్ స్టోర్, వైద్యుల కార్యాలయం, డాగ్ పార్క్, స్విమ్మింగ్ పూల్, జిమ్, కో-వర్కింగ్ స్పేస్ వంటి సదుపాయాలు కూడా అందుబాటులో ఉన్నాయి.ఇవి కూడా చదవండి: ఇది...ఇ–తాబేలు! 16 ఏళ్ల యువకుడి ఆవిష్కరణకల్డెసాక్ వెలుపలే లైట్ రైల్ స్టేషన్ ఉండటంతో డౌన్‌టౌన్ ఫీనిక్స్, విమానాశ్రయం వంటి ప్రాంతాలకు సులభంగా వెళ్లవచ్చు. దూర ప్రాంతాలకు వెళ్లేందుకు సెల్ఫ్ డ్రైవింగ్ ఎలక్ట్రిక్ వేమో రోబోటాక్సీలు కూడా అందుబాటులో ఉన్నాయి. అలాగే ఈ-బైక్‌లను అద్దెకు తీసుకునే సదుపాయం కూడా ఉంది. అవసరమైనప్పుడు షేర్డ్ ఎలక్ట్రిక్ కార్లను గంటకు సుమారు 5 డాలర్లకు అద్దెకు తీసుకోవచ్చు.అలాగే, కార్లు లేకుండా జీవించే విధానంతో పాటు ఎడారి వాతావరణంలో వేడిని తగ్గించేలా కల్డెసాక్ను రూపొందించడం మరో ప్రత్యేకత. భవనాల గోడలు, పైకప్పులకు తెల్లటి రంగు వేయడం ద్వారా సూర్యకాంతిని ఎక్కువగా ప్రతిబింబించేలా చేశారు. భవనాలను ఒకదానికొకటి దగ్గరగా నిర్మించడంతో అవి పరస్పరం నీడనిచ్చేలా ఉన్నాయి. గాలి నగరంలోకి సులభంగా వచ్చేలా ప్రజలు నడిచే దారులను, భవనాల మధ్య ప్రాంతాలను ప్రత్యేకంగా రూపొందించారు.దీంతో చుట్టుపక్కల ప్రాంతాలతో పోలిస్తే కల్డెసాక్లో నేల ఉపరితల ఉష్ణోగ్రత 30 నుంచి 40 డిగ్రీల ఫారన్‌హీట్ (సుమారు 17 నుంచి 22 డిగ్రీల సెల్సియస్) వరకు తక్కువగా ఉన్నట్లు పరిశోధకుల అధ్యయనంలో తేలింది.కల్డెసాక్ జీవన విధానం పర్యావరణానికే కాకుండా అక్కడి ప్రజల సామాజిక సంబంధాలకు కూడా ఉపయోగపడుతోందని నివాసితులు చెబుతున్నారు. ప్రస్తుతం దాదాపు 21 చిన్న వ్యాపారాలు ఇక్కడ పనిచేస్తున్నాయి. మెక్సికన్ రెస్టారెంట్లు, సిరామిక్స్, కొవ్వొత్తుల తయారీ స్టూడియోలు, బైక్ షాప్, పర్యావరణహిత దుస్తుల దుకాణాలు వంటి వ్యాపారాలు ప్రాంతాన్ని సందడిగా ఉంచుతున్నాయి.కార్ల రాకపోకలు లేకపోవడంతో పొరుగువారు, వ్యాపారులు, సందర్శకులు తరచూ ఒకరినొకరు కలుసుకునే అవకాశం పెరిగిందని అక్కడి నివాసితులు చెబుతున్నారు. దీంతో ఒంటరితనం తగ్గడంతో పాటు కమ్యూనిటీ భావన బలపడుతోందని వారు అంటున్నారు. ఇక్కడికి వచ్చే పర్యాటకులు కూడా ప్రశాంతంగా నడుచుకుంటూ ప్రాంతాన్ని ఆస్వాదించగలగడం ప్రత్యేక అనుభూతిగా చెబుతున్నారు.కార్ల వినియోగాన్ని తగ్గించి నడక, సైక్లింగ్, ప్రజా రవాణాను ప్రోత్సహించడం వల్ల వాయు కాలుష్యం, కార్బన్ ఉద్గారాలను తగ్గించవచ్చని ఐక్యరాజ్యసమితి పేర్కొంటోంది. కల్డెసాక్ పూర్తిగా అభివృద్ధి చెందిన తర్వాత ఏడాదికి సుమారు 3,000 టన్నుల గ్రీన్హౌస్ వాయువుల ఉద్గారాలను నివారించవచ్చని అంచనా.ప్రస్తుతం కల్డెసాక్లో సుమారు 760 నివాస యూనిట్లు, దాదాపు 1,000 మంది నివసించేలా అభివృద్ధి చేయాలనే ప్రణాళిక ఉంది. అమెరికాలోని ఇతర ప్రాంతాల్లోనూ కార్ల వినియోగాన్ని తగ్గించి, నడకకు అనుకూలమైన ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే ఆసక్తి పెరుగుతోంది. దీంతో కల్డెసాక్ భవిష్యత్ నగరాల రూపకల్పనకు కొత్త నమూనాగా మారుతోంది. ప్రజలు కార్లపై ఆధారపడకుండా నడక, సైక్లింగ్, ప్రజా రవాణాతో సౌకర్యవంతంగా జీవించేలా నగరాలను ఎలా రూపొందించవచ్చో ఈ ప్రాంతం చూపిస్తోంది.ఇవి కూడా చదవండి: ప్రకృతి పరీక్ష.. మానస సరోవర్ యాత్ర ఎందుకంత ప్రత్యేకం? -
మేఘాలయ ‘అహింసా పట్టు’ చీరలో కంగనా రనౌత్..! ప్రత్యేకత ఇదే
బాలీవుడ్ బ్యూటీ, బీజేపి ఎంపీ..కంనా రనౌత్ రాజీకీయాల్లోకి వచ్చినప్పటికీ అందమైన చీరలతో తన ఫ్యాషన్ శైలి ఏంటో చెప్పకనే చెబుతుంటుందామె. పార్లమెంటరీ సమావేశాల్లో పాల్గొన్నా లేదా బహిరంగ కార్యక్రమానికి హాజరవుతున్నా..సదా చేనేత చీరలతో తళుక్కుమంటూ అందర్నీ ఆశ్చర్యపరుస్తుంటుందామె. అలానే ఈసారి కూడా సరికొత్త విలక్షణమైన చీరతో అందర్నీ ఆకట్టుకున్నారామె. ఆ చీర అలాంటి ఇలాంటి శారీ కాదు. అత్యంత విభిన్నమైన పట్టుచీర అది. అందుకు సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ఆ పోస్ట్‌లో ఇలా రాసుకొచ్చారు. ఇది నా మొదటి మేఘాలయ చీర అంటూ తారా వేదా బ్రాండ్‌ను ట్యాగ్ చేస్తూ రాశారు. తారా వేదా బ్రాండ్ కూడా కంగనా రనౌతా ధరించిన పట్టుచీరకు సంబంధించిన వీడియోని షేర్చేస్తూ పోస్ట్‌లో ఆ చీర పత్యేకతను వివరించింది. View this post on Instagram A post shared by Taara Vedaa ~ A Sustainable Weave Tale (@taara.vedaa) అహింసాయుతమైన పట్టు చీర.."ఇది సహసిద్ధమైన ఊదారంగు చీర . దీన్ని నేయడానికే దాదాపు రెండున్నర నెలలపైనే పట్టిందట. ఇనుపపొడి, దానిమ్మపండు నుంచి తీసిన రంగు ఈ చీర రంగు అట. దీన్ని ఎరిసిల్క్(అహింసా సిల్క్) అని కూడా పిలుస్తారు. ఈ వస్త్రం అత్యంత మన్నికైనది. ఇది ఈశాన్య భారతదేశంలో కనిపించే 'ఫిలోసామియా రిసినీ' అనే చిమ్మట నుంచి లభిస్తుందట. ఇతర రకాల పట్టు చీరలా కాకుండా చిమ్మటాలు(ఒక రకమైన పట్టుపురుగుల్లాంటివి) గూళ్ల నుంచి బయటకు వచ్చాక దాన్నుంచి పొందిన పట్టుదారాలతో దీన్ని తయారు చేస్తారు. పత్తి లాంటి ఆకృతికి చెందిన వస్త్రం ఇది. ఇది వేసవిలో చల్లగా, శీతాకాలంలో వెచ్చదనాన్ని అందిస్తుంది." అని పేర్కొది. అంతేగాదు ఆ పోస్ట్‌లో కంగనా ఎందుకు ఈ చీను ఎంచుకుందో కూడా తెలిపింది. "ఇది స్వచ్చంగా గర్వించే క్షణం. అందంగా ఉండే కంగనా రనౌతా తన ప్రత్యేక కార్యక్రమాల కోసం చేతితో తయారు చేసి ప్రీమియం మేఘాలయ ఎరిసిల్క్ చీరును ధరించారు. ఎరిసిల్క్లోని ప్రతి దారం ఓర్పు, శాంతితో కూడిన విలాసాన్ని ప్రదర్శిస్తుంది. View this post on Instagram A post shared by Taara Vedaa ~ A Sustainable Weave Tale (@taara.vedaa) ఈ చీర అందానికి ప్రతిరూపం అని క్యాప్షన్ ఇచ్చి మరి నటి కంగనా వీడియోని పంచుకుంది తారా వేద బ్రాండ్. సరిగా కృతి సనన్ కంగనా రనౌత్‌ల మధ్య తీవ్రమైన మాటల యుద్ధం జరిగిన కొద్ది రోజులకే ఆమె ఈ చీరతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకోవడం విశేషం. -
16 ఏళ్ల స్టూడెంట్ ఘనత..! తండ్రికే జీతం ఇస్తున్న తనయుడు..
తండ్రిని పాకెట్‌మనీ అడిగే వయసులో తండ్రికే ఉపాధి ఇచ్చి..జీతం ఇస్తున్నాడో యువకుడు. పైగా తన తండ్రినే ఎందుకు నియమించుకున్నాడో ఇచ్చిన వివరణ సైతం అదుర్స్. పువ్వు పుట్టగానే పరిమిళిస్తుంది అనే మాటకు నిలువెత్తు నిదర్శనం ఈ యువకుడు. మరి పేరెంట్స్‌కే గర్వకారణమైన ఆ తనయుడు ఎవరంటే..అతడే కేరళలోని కొచ్చి, కున్నుంపురంకి చెందిన 16 ఏళ్ల రౌల్జాన్ అజు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజనెన్స్ ప్రపంచంలో ఒక ప్రముఖ వ్యక్తిగా పేరుతెచ్చుకుంటున్నాడు ఈ యువకుడు. అతడు కామర్స్ ప్రధాన సబ్జెక్టుగా ఇంటర్ చదువుతున్నప్పుడే ఏఐ కంపెనీని నడుపుతుండటం విశేషం. ఆ కంపెనీ సాయంతో ఏఐ సాధనాలను అభివృద్ధి చేయడం, ఈ టెక్నాలజీలో ప్రజలకు శిక్షణ ఇవ్వడం వంటివి చేస్తుంటాడు. నిజానికి అజుకి ఏఐ పట్ల ఉన్న అభిరుచే ఒక స్టార్టప్ కంపెనీకి దారితీసింది. పైగా తండ్రిపై ఆధారపడే టీనేజ్ యువకుల మాదిరిగా కాకుండా తన నాన్ననే తన కంపెనీలో ఉద్యోగిగా నియమించుకుని, నెలకు రూ. 2 లక్షల జీతం ఇస్తుండటం విశేషం. ఏఐలో పట్టు ఎప్పుడు సాధించాడంటే..తొమ్మిదేళ్ల ప్రాయంలోనే ఏఐ సాంకేతికతను నేర్చుకోవడంపై దృష్టి సారించాడు. ఆ తర్వాత ఒక స్టార్టప్‌ను స్థాపించాడు. అందులో ప్రస్తుతం తన తండ్రితో సహా సుమారు 15 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అంతేగాదు ఈ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఐదు లక్షల మంది విద్యార్థులకు శిక్షణ ఇస్తోంది.అజు ఈ టెక్నాలజీని వీడియో ఎడిటింగ్ ద్వారా తెలుసుకున్నాడు. ఇక తండ్రి వల్ల తనకు ఈ ఏఐ సాంకేతికపై పట్టు సాధించగలిగినట్లు చెబుతున్నాడు. ఎలాగంటే..తన తండ్రికి అడోబ్‌లో ఉద్యోగం వచ్చినప్పుడు, తనకు అన్ని ప్రీమియం టూల్స్‌కు ఉచిత యాక్సెస్ లభించిందని, దానివల్ల ఏఐ గురించి పూర్తిస్థాయిలో నేర్చుకోగలిగానని అంటున్నాడు. ఆ తర్వాత స్కూల్ సైన్స్ ప్రాజెక్ట్ కోసం మీబాట్ అనే సొంత రోబోట్‌ను తయారు చేసినట్లు తెలిపాడు. ఇక తన తండ్రినే కంపెనీలో ఎందుకు నియమించుకున్నాడంటే..తాను ఫోన్ నుంచి కావల్సినంత జ్ఞానాన్ని ఆర్జించగలను కానీ, ఆయనకున్న అపార అనుభవం తనకు లేదని చెప్పుకొచ్చాడు. పైగా ఆయనకు అమెజాన్, అడోబ్, విప్రో, ఐబీఎం వంటి కంపెనీలలో పనిచేసిన అనుభవం ఉంది, అందువల్ల ఆయన నుంచి తాను మరిన్ని విషయాలు సులభంగా నేర్చుకోగలగడం తోపాటు ఆయన అనుభవం కంపెనీ మార్కెటింగ్‌కి చక్కగా ఉపయోగాపడుతుందని చెబుతున్నాడు. కాగా, అజు స్టార్టప్ ఏఐ టెక్నాలజీస్, థింక్క్రాఫ్ట్ అకాడమీని నడుపుతోంది. ఇవి ప్రతిష్టాత్మక సంస్థలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు, విదేశీ విద్యార్థులు చాలా సునాయాసంగా ఏఐ నైపుణ్యాలను పుణికి పుచ్చుకునేలా ట్రైన్ చేస్తాయి. అక్కడితో ఆగిపోలేదు అజు వాస్తవ ప్రపంచ సమస్యలను పరిష్కరించే లక్ష్యంతో RESQ AI, MeBot, ZapGap, Investo AI, FeedFye, 15 AI సాధనాలను రూపొందించారు. అంతేగాదు అజు కంపెనీ ఏకంగా వరల్డ్‌వైడ్‌గా వివిధ రిమోట్ ఉద్యోగులను కలిగి ఉంటూ ఇంటర్నేషనల్ రేంజ్లో గుర్తింపు పొందుతుండటం విశేషం.(చదవండి: రోజువారీ కూలీ నుంచి ..రూ. 15 లక్షల వార్షిక వేతనం, పీహెచ్డీ..!) -
ఒక ఫేక్ వీడియో.. ఇద్దరి ఆత్మగౌరవ పోరాటం!
ఒక నల్లటి పొట్టి డ్రెస్.. ఒక 15 సెకన్ల వీడియో.. ఇద్దరు మహిళల జీవితాలను సవాలు చేసింది. వారిలో ఒకరు తమిళనాడు ఎంగెస్ట్ ఉమన్ మినిస్టర్. మరొకరు మలేషియా సాధారణ యువతి. ఆ సాధారణ యువతిని ‘పొట్టి డ్రస్సు వేసుకున్న మంత్రి’గా చూపి ట్రోల్ చేసిన ప్రత్యర్థులకు వారిద్దరూ కలిసి ఇచ్చిన సమాధానం ప్రతి మహిళకు స్ఫూర్తిదాయకం.సమాజంలో మహిళ ఎంత ఉన్నత స్థానానికి ఎదిగినా, లేదా తన ప్రపంచంలో తను ప్రశాంతంగా బతుకుతున్నా ఆమెను తక్కువ చేసి చూపించడానికి కొందరు వాడే పాత ఆయుధం... ఆమె వేసుకునే బట్టలు. తాజాగా తమిళనాడుకు చెందిన యువ మహిళా మంత్రి ఎస్.కీర్తన, మలేషియాకు చెందిన వినోషా రవి విషయంలో ఇదే జరిగింది. ఒక చిన్న తప్పుడు వీడియో ఇద్దరు మహిళల జీవితాలను ఎలా ప్రభావితం చేసింది? వారు దాన్ని భయంతో కాకుండా ధైర్యంతో ఎలా ఎదుర్కొన్నారు? అసలేం జరిగింది? గత 48 గంటలుగా సామాజిక మాధ్యమాల్లో ఒక వీడియో విపరీతంగా హల్చల్ చేస్తోంది. ఒక నల్లటి పొట్టి దుస్తులు వేసుకున్న మహిళ కారు దిగుతున్న దృశ్యం అది. ఆ వీడియోలో ఉన్నది తమిళనాడు పారిశ్రామిక శాఖ మంత్రి ఎస్. కీర్తన అంటూ కొందరు రాజకీయ ప్రత్యర్థులు ట్రోలింగ్ ప్రారంభించారు. ‘ఇలాంటి బట్టలతో పెట్టుబడులు తెస్తారా?’ అంటూ వెటకారం చేశారు. కానీ అసలు నిజం ఏమిటంటే... ఆ వీడియోలో ఉన్నది మంత్రి కీర్తన కాదు. ఆ వీడియోలో ఉన్న వ్యక్తి మలేషియాకు చెందిన వినోషా రవి అనే సాధారణ మహిళ. వినోషా చెప్పిన దాని ప్రకారం, ఆ వీడియోను ఎవరో గుర్తుతెలియని వ్యక్తి ఆమెకు తెలియకుండా తీసి ఇంటర్నెట్లో పెట్టి, దానికి తమిళనాడు మంత్రి పేరును తగిలించి తప్పుడు ప్రచారం చేశారు. ఒక అమాయకురాలి ప్రైవసీని దొంగిలించి, దాన్ని రాజకీయ ఆయుధంగా మార్చారు.‘నేనే అయితే తప్పేంటి?’...అయితే ఈ వివాదాన్ని ఆ ఇద్దరు మహిళలు ధైర్యంగా ఎదుర్కొన్నారు. ముందుగా మలేషియా నుంచి వినోషా రవి జాతీయ మీడియాతో మాట్లాడుతూ ‘మా కొలీగ్ ఆ వీడియో పంపితే జోక్ అనుకున్నా. కానీ ఆ తర్వాత అది సీరియస్ అయ్యింది. నా ఇన్‌బాక్స్ నిండా బూతులు, వల్గర్ కామెంట్స్, బెదిరింపులు. ఈ ఘటన జరిగినప్పటి నుంచి నేను బయటకు వెళ్లాలన్నా, ఆఫీస్‌కి వెళ్లాలన్నా భయపడుతున్నాను. అయినా నేను నా డ్రెస్సింగ్ స్టైల్ మార్చుకోను’ అని తేల్చి చెప్పారు. ఈ పై ఆమె మలేషియా పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు తమిళనాడు మంత్రి కీర్తన చాలా దీటుగా స్పందించారు.ఆగాలంటే ఏం చేయాలి? ఇలా బట్టల ఆధారంగా జరిగే మానసిక దాడులు ఆగాలంటే ముందుగా సమాజంలో మార్పు రావాలి. ఒక మహిళ క్యారెక్టర్‌ను ఆమె వేసుకునే దుస్తులను బట్టి జడ్జ్ చేసే వికృతమైన ఆలోచనా విధానాన్ని వీడాలి. ఇక ఇలాంటి వేధింపులు ఎదురైనప్పుడు మహిళలు అస్సలు భయపడకూడదు. కీర్తన, వినోషాలాగే గొంతు విప్పి ధైర్యంగా ప్రశ్నించాలి. నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్ (1930) ద్వారా ఫిర్యాదు చేయాలి. మౌనంగా ఉంటే ట్రోలర్లు మరింత రెచ్చిపోతారు.ఈ సంఘటన ఇంటర్నెట్ వాడుతున్న ప్రతి మహిళా సైబర్ భద్రత ముప్పుకు ఒక ఉదాహరణ. అయినా సరే ఒకరి వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవించకుండా, కేవలం కొన్ని వ్యూస్ కోసం ఒకరి జీవితాన్ని రోడ్డున పడేసే సైబర్ బూచీలకు చెంపదెబ్బ లాంటి సమాధానం ఇచ్చారు ఈ ఇద్దరు మహిళలు. మహిళల ప్రతిభను చూడాలే తప్ప, వారు వేసుకునే బట్టలను కాదు అనే సత్యాన్ని సమాజం ఎప్పుడు గ్రహిస్తుందో మరి!‘ఆ వీడియోలో ఉన్నది నేను కాదు. కానీ ఒకవేళ నేనే అయినా అందులో తప్పేముంది? ఒక మహిళ ఏం వేసుకోవాలో మీరు డిసైడ్ చేస్తారా? ఇది పురుషాధిక్య సమాజపు సంకుచిత, కురచ ఆలోచన’ అంటూ ఎదురుదాడి చేశారు. అంతేకాదు, తన పోలికల వల్ల అనవసరంగా వివాదంలోకి లాగబడిన వినోషా రవికి క్షమాపణలు చెప్పారు. ‘నన్ను క్షమించు సోదరి. నువ్వు ఆ దుస్తుల్లో చాలా అందంగా ఉన్నావు. నీకు నచ్చినట్లుగా నువ్వు జీవించు’ అంటూ ఆమెకు అండగా నిలిచారు. ఇది రాజకీయాలకు అతీతమైన సిస్టర్ హుడ్.ఈ ఘటనపై డిఎంకె ఎంపీ కనిమొళి కూడా స్పందిస్తూ ‘ఇది దుష్ట రాజకీయం. మహిళలను ఇలా టార్గెట్ చేయడం ఆపండి’ అంటూ కీర్తనకు మద్దతు పలకడం విశేషం. కీర్తన గతంలో ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ కోసం సూట్ వేసుకుని వీడియో చేస్తే కూడా ట్రోల్ చేశారు. అంటే చీర కట్టినా, సూట్ వేసినా, షార్ట్ డ్రెస్ వేసినా.. దాడి మాత్రం ఆడవారిపైనే. -
రోజువారీ కూలీ నుంచి ..రూ. 15 లక్షల వార్షిక వేతనం, పీహెచ్డీ..!
ఆర్థిక పరిస్థితులు ఉన్నత విద్యను అందుకోవడానికి అడ్డంకి కావని ఎందరో నిరూపిస్తున్నారు. అది కూడా అసామాన్య పరిస్థితి నుంచి విదేశీ యూనివర్సిటీల్లో చదివే అవకాశం పొందే రేంజ్‌కి వెళ్తుండటం విశేషం. అచ్చం అలాంటి నేపథ్యం నుంచి వచ్చి ఈ వక్తి ఏకంగా సింగపూర్‌లోని ప్రతిష్టాత్మక కాలేజ్‌లో పీహెచ్డీ చేసే స్థాయికి చేరుకున్నాడు. పైగా పరిస్థితులు మన ఆశయాలను అడియాశలు చేసేవి కావు, సదా చదువుపై ఫోకస్ పెట్టేలా చేసే ఆయుధాలని అంటుండటం విశేషం.అతడే ఆంధ్రప్రదేశ్‌లోని మధ్యతరగతి కుటుంబానికి చెందిన రామ్‌తుల్లా షేక్(Ramthulla Shaikh). అతడు తన విద్యా ప్రస్థానం, సాధించిన విజయాల గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. తాను ఒకప్పుడు రోజు కూలీగా రూ. 300లు సంపాదిస్తుండే వాడినని చెప్పుకొచ్చారు. తన ప్రాథమిక విద్యనంత జిల్లా పరిషిత్ ఉన్నత పాఠశాలలో పూర్తి చేసినట్లు తెలిపాడు. ఆ తర్వాత శశికాంత రెడ్డి జూనియర్ కాలేజీలో ఎంపీసీ పూర్తి చేసినట్లు వెల్లడించాడు. అయితే తన విద్యా ప్రయాణంలో చాలా ఆర్థిక సమస్యలు ఎదురయ్యేవని, అందుకోసం సెలవుల్లో కూలీ పనులకు వెళ్లి డబ్బుని కూడబెట్టి చదువుకుంటుండే వాడినని తెలిపారు. ఆ తర్వాత 2021లో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో BTech పూర్తి చేసి, మల్టీనేషనల్ కంపెనీలో సిస్టమ్ ఇంజనీర్‌గా పనిచేయడం ప్రారంభించినట్లు తెలిపారు. అయితే ఆ సమయంలోనూ రామ్‌తుల్లా తన చదువుని ఆపలేదు. పూర్తికాలం పనిచేస్తూనే గేట్‌కి సన్నద్ధమైనట్లు తెలిపారు. అతడి కృషి పలితంగా 2024లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో 809వ ఆల్ ఇండియా ర్యాంకు సాధించాడు. దాని ఫలితంగా ప్రతిష్టాత్మక బెంగళూరూ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో ఎం.టెక్ చేసే అవకాశం దక్కింది. జూన్ 2026కల్లా ఎంటెక్ పూర్తి చేసి ప్రభుత్వ రంగ కంపెనీల్లో వార్షిక వేతనం రూ. 15 లక్షలు అందించే ఆఫర్లు వచ్చినా..పరిశోధన చేసేందుకు మొగ్గు చూపి.. ఆగష్టు 2026లో, తాను నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ సింగపూర్‌లో పవర్ ఎలక్ట్రానిక్స్‌లో పీహెచ్డీ చేయడం ప్రారంభించినట్లు తెలిపారు. అలాగే తాను తన విజయాలను ప్రదర్శించడం కోసం ఇలా సోషల్‌మీడియాలో పోస్ట్ చేయలేదన్నారు. ఇది కేవలం మీ నేపథ్యం, ప్రారంభస్థానం మన గమ్యాన్ని ఎన్నటికీ నిర్దేశించదని చెప్పడానికి తన విద్యా విజయాల గురించి వివరించినట్లు తెలిపాడు. ఓర్పు, నిలకడ, నిరంత కృషితో మారుమూల గ్రామ నేపథ్యం నుంచి వచ్చిన తానే సాధించినప్పుడూ..మీరెందుకు సాధించలేరంటూ ఆలోచింపచేస్తున్నాడు. తనలాగా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు తమపై తాము నమ్మకం ఉంచి ముందుగకు సాగాలని ప్రోత్సహించేందుకే తన విద్యా ప్రస్థానాన్ని షేర్ చేస్తున్నట్లు వెల్లడించాడు. చివరగా ఆయన క్రమశిక్షణకు పట్టుదల తోడైతే సాధించలేని పెద్ద కల అంటూ ఉండదు అని లింక్డ్ఇన్ పోస్ట్‌లో రాసుకొచ్చారు రామ్‌తుల్లా.(చదవండి: ఒకప్పుడు బాలీవుడ్ పనిచేసేదామె..సడెన్‌గా 29 ఏళ్లకే రిటైర్మెంట్! ఎందుకో తెలుసా..) -
నటి సమంత స్ట్రెంగ్త్ ట్రైనింగ్ వర్కౌట్లు..! ఆ టైంలో చేయొచ్చా?
మా ఇంటి బంగారం మూవీతో మంచి హిట్ అందుకున్న నటి సమంత ప్రెగ్నెన్సీ సమయంలో కూడా క్రమం తప్పకుండా జిమ్‌కి వెళ్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. అలాగే అనేకమంది సెలబ్రిటీలు గర్భధారణ అనేది రెస్ట్ తీసుకునే అనారోగ్యం లాంటిది కాదని, ఈ దశలో కూడా చురుగ్గా ఉండొచ్చని నిరూపిస్తున్నారు. ఆ కోవలోకి తాజాగా సమంత కూడా చేరిపోయారు. ఆమె జిమ్‌కి వెళ్లడం వరకు మాత్రమే కాదు, వెయిట్‌లిఫ్టింగ్, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ వంటి వర్కౌట్లు చేసేస్తోంది. పైగా అందుకు సంబంధించిన వీడియోలు కూడా అభిమానులతో పంచుకున్నారామె. మొదటి వీడియోలో కేబుల్ రో వ్యాయామం చేసింది సమంత. దానికి క్యాప్షన్‌గా ఈ రోజు భిన్నమైన వర్కౌట్ చేశా. అయితే ఎక్కువగా కష్టపడకుండా, శ్రద్ధగా వినడం నేర్చుకున్నా అంటూ రాసింది. రెండొవ వీడియోలు బరువులు ఎత్తుతూ కనపించింది సమంత. ఈ సమయంలో ఎంత మేర ఎంతగలరో అంతే పైకి ఎత్తండి అని క్యాప్షన్ పెట్టింది. అలాగే తదుపరి పోస్ట్‌ల్లో కొన్ని రోజులు బలంగా ఉన్నట్లు భావిస్తా, అందుకే వ్యాయామాలు సవరించుకుంటానని పేర్కొంది. పైగా యోగా మ్యాట్‌పై పడుకుని చేసే వర్కౌట్లే కొన్ని రోజులు హాయిగా అనిపిస్తాయని సరదాగా వ్యాఖ్యానించింది. తన జీవితాంతం జిమ్‌లో మరింతగా చేయడానికి తన పరిమితులను అధిగమించడానికి శిక్షణ తీసుకున్నానని చెప్పుకొచ్చింది వీడియోలో. అయితే ప్రెగ్నెన్సీ దశలో శరీరాన్ని గౌరవించడం. శరీరం మాట వినడం వంటివి నేర్చుకున్నానని పోస్ట్‌లో వెల్లడించింది. అలాగే ఈ సమయంలో లక్ష్యాలు భిన్నంగా ఉంటాయి. ఎందుకంటే ఇప్పటి వరకు చేసే అత్యంత బలమైన పని అమ్మ అవ్వడమేనని భావిస్తున్నానంటూ పోస్ట్‌ని ముంగించింది. అలాగే తన శక్తి శిక్షణా వ్యాయామాలు గురించి మాట్లాడుతూ..ఇవన్నీ తాను చాలా ఏళ్లుగా నిపుణుల పర్యవేక్షణలో శిక్షణ తీసుకుని మరి చేస్తున్నవని, అలాగే గర్భధారణకు అనుగుణంగా సవరించినవేనని కూడా ఆమె వెల్లడించింది. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) అలాగే తన ట్రైనర్స్ ప్రతిష్టాత్మక సంస్థల్లో సర్టిఫికేట్ పొందినవారని, పైగా తన ఆరోగ్యానికి, గర్భధారణకు అనుగుణంగా నిర్ణయించిన వ్యాయామాలని కూడా పేర్కోంది. ఈ క్రమంలో అందరూ తప్పక తెలుసుకోవాల్సింది ఏంటంటే.. ప్రతి గర్భం భిన్నంగా ఉంటుందని, అందువల్ల ఇతర ప్రెగ్నెంట్ మహిళలెవ్వరూ తన వర్కౌట్లను అనుకరించొద్దని హెచ్చరించింది సమంత. తనలా వ్యాయామాలు చేయాలనుకుంటే వైద్యుడి సలహా సూచనల మేరకు చేయాలని విజ్ఞప్తి చేసిందామె. కాగా, సమంత రూత్ ప్రభు ఈ ఏడాది జూన్ మా ఇంటి బంగారం సక్సెస్ మీట్లో తన గర్భధారణ విషయాన్ని ప్రకటించారు. అందుకోసమే కొంతకాలం షూటింగ్‌లకు విరామం ఇస్తున్నానని కూడా పేర్కొంది. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) (చదవండి: ఒకప్పుడు బాలీవుడ్ పనిచేసేదామె..సడెన్‌గా 29 ఏళ్లకే రిటైర్మెంట్! ఎందుకో తెలుసా..) -
నాన్న కల కోసం..29 ఏళ్లకే రిటైర్మెంట్! చివరికి ఇద్దరూ..
ఇటీవల ఐఐటీ, ఐఐఎం వంటి ప్రతిష్టాత్మక కాలేజ్‌లలో చదివిన చాలామంది ఒత్తిడితో కూడిన ఉద్యోగాలు వదిలి నచ్చిన పనిలో ఆనందం వెతుక్కుంటున్న వారిని ఎందరినో చూశాం. మరికొందరు లక్షల్లో జీతాలు ఆర్జించి..చీకు చింతా లేని రిటైర్మెంట్ కోసం సేవింగ్స్ ప్లాన్ చేసుకుని మరి త్వరితగతిని పదవీవిరణమ చేస్తున్న వారిని చూశాం. కానీ అలా కాకుండా సంపాదన మొదలయ్యే స్టేజ్‌లోనే రిటైర్మెంట్ ప్రకటించి ఈ మహిళ ఏం చేస్తుందో తెలిస్తే..ఆశ్చర్యపోవడమే కాదు అభినందించకుండా ఉండరు కూడా. ఎందుకంటే..ఇంతకీ ఆమె ఏం చేస్తోందంటే..మహారాష్ట్రకి చెందిన స్నేహా రాజ్‌గురు అనే మహిళ తాను ఆధునిక పోటీ ప్రపంచపు ఒత్తిడిని వద్దనుకుని మరి పెర్మాకల్చర్(కృత్రిమ ఎరువులు, రసాయనాలకు దూరంగా సహజ పద్ధతిలో వ్యవసాయం చేయడం)ను ఎంచుకున్నట్లు తెలిపింది. ఆ నిర్ణయం తనకు ఎన్ని విధాలుగా మేలు చేసిందో వివరిస్తూ..ఆ జర్నీ గురించి వీడియో రూపంలో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. తాను ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చే 29 ఏళ్లకే రిటైర్మెంట్ తీసుకున్నట్లు తెలిపింది. అంతేగాదు తాను భూమిని ఎలా కొనుగోలు చేసి, పండ్లు, కూరగాయలు పండించడం ప్రారంభించిందో వీడియోలో వివరించారు. తాను ఒకప్పుడూ.. బాలీవుడ్లో పనిచేసేదాన్ని అని, తనకు ప్రయాణాలపై ఉన్న మక్కువ కారణంగా ఈ ఫెర్మాకల్చర్ గురించి తెలుసుకునే అవకాశం ఏర్పండిందని వెల్లడించింది. ఇక తన తండ్రి టాటా మోటర్స్‌లో 30 ఏళ్లకు పైగా పనిచేశారని, పదవీవిరమణ తర్వాత ప్రకృతికి దగ్గరగా జీవించాలని ఆశించినట్లు చెప్పుకొచ్చింది. ఆ నేపథ్యంలోనే ఇలా ఇద్దరం కలిసి ఫామ్ ప్రారంభించాలని నిర్ణయానికి వచ్చామని తెలిపింది. ఇక తన ఫెర్మాకల్చర్ జర్నీ గురించి మాట్లాడుతూ..ముందుగా తాను చిన్న భూభాగాన్ని కొనడమే తన మొదటి అడుగుగా పేర్కొంది. దానికి బాప్బేటీ ఫామ్(తండ్రి కూతుళ్ల) ఫామ్ అని పేరుపెట్టినట్లు వెల్లడించింది. ఆ తర్వాత పండ్ల చెట్లను నాటినట్లు పేర్కొంది. దీనికి తక్కువ శ్రమ పైగా మనతోపాటే పెరుగుతాయి. పైగా ఏళ్ల తరబడి చక్కగా పండ్లను అందిస్తాయన్నారు. దీనివల్ల మన ఆహారాన్ని మనమే స్వయంగా పండించుకుని తింటున్న ఆనందం దక్కుతుందని అంటోంది. అలాగే లాక్డౌన్ లేదా యుద్ధం లాంటివి వచ్చినప్పుడూ ఎవ్వరిపైన ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడదని చెబుతోంది. అదీగాక అన్నింటి కన్నా ముఖ్యంగా కడుపు నింపుకునేలా మంచ ఆహారాన్ని అందించే స్థలాన్ని పొందామనే ఆనందం సొంతమవుతుందని అంటోంది. ఇక్కడ పదవీవిరమణ అనేది వయసుకి సంబంధించింది కాదని, ఒత్తిడిని వద్దని శాంతిని ఎంచుకోవడం గురించని నొక్కి చెబుతోంది. చివర్లో మీరు కూడా ఇలాంటి జీవితం గురించి కలలు కంటున్నారా అని ప్రశ్నిస్తూ.. తన సంభాషణను ముగించింది వీడియోలో. నెటిజన్లు కూడా 29 ఏళ్లకే పదవీ విరమణ చేయడం అద్భుతం!!. నిజంగా ఇది చాలా బాగుంది అంటూ పోస్టులు పెట్టారు. కాగా, ఈ బాప్బేటీ ఫామ్ మహారాష్ట్రలోని కోయాలిలో, సరస్సు కనిపించే ఒక కొండప్రాంత వ్యవసాయ క్షేత్రం. View this post on Instagram A post shared by Baapbeti Permaculture Farm | Farmstay in Pune (@baapbetifarm) (చదవండి: 'తిరంగా' దుస్తుల వివాదం..ఊర్వశి రౌతేలా స్పందన ఇదే..!) -
'తిరంగా' దుస్తుల వివాదం..ఊర్వశి రౌతేలా స్పందన ఇదే..!
మిస్ యూనివర్స్ ఇండియా 2026 గ్రాండ్ ఫినాలే ఆగస్టు 23న జైపూర్‌లోని జీ స్టూడియోస్‌లో జరిగిన సంగతి విధితమే. ఈ అందాల పోటీకి మాజీ మిస్ యూనివర్స్ ఇండియా ఊర్వశి రౌతేలా, భారత్ తొలి మిస్ యూనివర్స్ సుష్మితా సేన్, మిస్ యూనివర్స్ ఇండియా 2024 రియా సింఘా, పర్యావరణవేత్త, చిత్ర నిర్మాత ప్రజ్ఞా కపూర్, మిస్ యూనివర్స్ రన్నరప్ సెలీనా జైట్లీ తదితదరులు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం కోసం ఊర్వశి త్రివర్ణ పతాకాన్ని స్ఫూర్తిగా తీసుకున్న దుస్తులను ఎంచుకుందామె. దీనిపై నెటిజన్ల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. పలువురు భారత జెండాను దుస్తులుగా ధరించడం లేదా జెండాను నేరుగా దుస్తులపై ముద్రించడం వంటివి జాతీయ జెండా నియమావళిని ఉల్లఘించినట్లే అంటూ ఘాటుగా విమర్శలు చేశారు. అంతేగాదు చాలామంది ఇలా చేసి ఉండకూడదు, ఇది సరైనది కాదంటూ తిట్టిపోశారు కూడా. మరికొందరైతే...భారత జెండా నియమావళి గురించి ప్రస్తావిస్తూ.. దాన్ని ఉల్లంఘిస్తే పడే శిక్షలు, చట్టం గురించి కూడా మాట్లాడారు. మరి ఆ వ్యాఖ్యలపై మాజీ మిస్ యూనివర్స్ ఇండియా ఊర్వశి రౌతేలా ఏమన్నారంటే. అది యథావిధి ప్రతిరూపం కానే కాదు..తను తన దేశాన్ని కేవలం ఒక జాతీయతగా మాత్రమే కాకుండా, గుర్తింపులో భాగంగా భావిస్తాను. తాను ఎక్కడ నుంచి వచ్చానో ప్రజలకు తెలియజేయడానికే ఈ కౌచర్ని ఎంచుకున్నట్లు తెలిపారు. "దీని ఆకృతి, రంగుల కలయిక, అందులో వివరాలు కేవలం ఫ్యాషన్‌గా రూపొందించినవే. ఇది ఒక జాతీయ భావనను కళాత్మక వ్యక్తీకరణగా మార్చడం గురించి. అలాగే ఈ గౌనుకి భారత జాతీయ పతాకానికి చాలా స్పష్టమైన తేడాలు ఉన్నాయి. నిజానికి ఈ గౌను ఏమి జాతీయ పతాకానికి ఏమి యథాతథ ప్రతిరూపం మాత్రం కాదు. ఇది జస్ట్ త్రివర్ణ పతాకం నుంచి ప్రేరణ పొందిన అంశాలను ఉపయోగించి డిజైన్ చేసిన గౌను మాత్రమే". అని నొక్కి చెప్పారు ఊర్వశి. ఈ గౌనులోని మూడు రంగులు, మధ్యలోని చక్రం వంటివి జాతీయ జెండాలోని మూలాంశాలతో ఫ్యాషన్‌ని చూపించే ప్రయత్నం చేశామే తప్ప జెండా నియమావళిని అస్సలు ఉల్లంఘించలేదని కరాఖండీగా చెప్పారు. పైగా ఇవి నిలువు రంగులు, మధ్యలో ఉన్న చక్రం ఒక ఆభరణంలా మాత్రమే ధరంచానని అlhleరు. ఇది జాతీయ పతాకంలా కాకుండా స్టేజ్ లైట్ల కింద ఒక ఆకర్షణీయమైన ఫ్యాషన్ వేర్లా ప్రజెంట్ చేశానని అంటోంది. అలాగే ఈ గౌనులోఉన్నది అసలైన కాషాయరంగు కాదు, అలాగే ఆకుపచ్చరంగు కూడా వేరొక ఛాయలో తీసుకున్నార. అలాగే మధ్యలోని చిహ్నం అధికారిక నిర్దేశాలను అత్యంత భిన్నం అని వివరించారు. కాగా, ఈ డిజైనర్‌వేర్‌ని డాషా ఫ్యాషన్ కౌచర్కు చెందిన బెలారసియన్ డిజైనర్ డార్యా చెర్మాషెంట్సేవా రూపొందించారు.జాతీయ జెండా నియమావళి..2002, జాతీయ జెండా వినియోగానికి సంబంధించిన నియమ నిబంధనలను వివరిస్తుంది.జాతీయ గౌరవానికి అవమానాలను నివారించే చట్టం, 1971 ప్రకారం, జెండాను ఏ విధమైన దుస్తులు లేదా యూనిఫాంలో భాగంగా ఉపయోగించరాదు, అలాగే దానిని కుషన్లు, చేతి రుమాళ్లు, నాప్కిన్లు లేదా ఏ ఇతర వస్త్ర సామగ్రిపైన ఎంబ్రాయిడరీ లేదా ప్రింట్ చేయరాదు.ఈ చట్టం ఇంకా ఇలా పేర్కొంటుంది, జెండాని ఉద్దేశపూర్వకంగా నేలను తాకడానికి లేదా నీటిలో ఎగరడానికి అనుమతించరాదు.జాతీయ జెండాను కట్ చేసి కుట్టకూడదు.జాతీయ జెండాను నడుము కింది భాగంలో చుట్టుకోవద్దు. జెండాను అలంకరణ కోసం ఉపయోగించకూడదు. చేతులు తుడుచుకోవడం లాంటివి చెయ్యకూడదు. జాతీయ పతాకాన్ని ఏ వస్తువు మీదా కప్పవద్దు. దేశం కోసం ప్రాణాలు విడిచిన వారిపై కప్పడానికి జాతీయ జెండా అంత గౌరవాన్ని జవాన్ కు దక్కడానికే ఇలా చేస్తారు.చిరిగిన, నలిగిన, తిరగబడిన జెండాలను ఎగురవేయొద్దు.జాతీయ పతాకాన్ని ఎగరేసినప్పుడు.. అంతకంటే ఎక్కువ ఎత్తులో మరే ఇతర జెండాలు ఉండకూడదు.అలాగే వేదికపై జాతీయ పతాకాన్ని ఎగురవేసేటప్పుడూ..జెండా ఎగురవేసే వ్యక్తి ముఖం ప్రేక్షకుల వైపు, త్రివర్ణ పతాకం ఎల్లప్పుడూ అతడి కుడివైపు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. (చదవండి: సుస్మితా సేన్‌పై వెల్లువెత్తుతున్న విమర్శలు..! ఊర్వశి రౌతేలా అలా కనిపించడానికి రీజన్) -
63 కేజీల నుంచి 55 కేజీల బరువుకు..!నిలకడగా ఆ ఎనిమిది అలవాట్లు..
బరువు తగ్గాలంటే స్ట్రిక్ట్ డైట్, కఠినమైన వర్కౌట్లుతోనే సాధ్యం అనే అభిప్రాయాన్ని తుడిచిపెట్టేయండని అంటోంది ఈ కంటెంట్ క్రియేటర్ శివాని అగర్వాల్. రోజువారి అలవాటల్లో జస్ట్ చిన్న చిన్ని స్థిరమైన మార్పులతో ఈజీగా బరువు తగ్గొచ్చని నమ్మకంగా చెబుతోంది. తాను ఎనిమిది కేజీల బరువుని ఎనిమిది అలవాట్లతో తగ్గించానంటూ తన అనుభవాన్ని పంచుకున్నారామె. అదేంటో చూద్దామా..!.కంటెంట్ క్రియేటర్ శివాని అగర్వాల్ తన జీవనశైలిని పూర్తిగా మార్చుకోకుండానే బరువు తగ్గేందుకు ఉపయోగపడిన ఎనిమిది అవాట్ల గురించి మాట్లాడారు. తాను కేవలం ఆహారం, వ్యాయామాల పట్ల ఉన్న దృక్పథాన్నే మార్చుకున్నట్లు వెల్లడించారు. అయితే మార్పులు చేసిన వాటిని నిలకడగా అనుసరించానని అన్నారు. మరి ఆమె వెయిట్‌లాస్ జర్నీలో ఎనిమిది కేజీల బరువుకి చెక్‌పెట్టేందుకు హెల్ప్ అయిన ఎనిమిది అలవాట్లు లేక మార్పులు ఏంటో చూద్దామా..!జంక్ ఫుడ్‌ను పూర్తిగా మానేయవద్దుఏదైనా సరే పూర్తిగా మానేయొద్దని అంటోంది. నియంత్రించడం వల్ల తెలియకుండానే ఎక్కువ తినేస్తామని అన్నారు. తినాలి అనిపించినప్పుడూ జాగురకతతో హాయిగా ఆస్వాదించేదాన్ని అని అంటోంది. వాస్తవికంగా సాధ్యమయ్యే అవాట్లతోనే బరువు తగ్గడం అనేది జరగుతుందని చెబుతోంది ఈ ఇన్ఫ్లుయెన్సర్.ప్రతిరోజూ వాకింగ్..ఎల్లప్పుడూ పదివేల అడుగులు నడవాలనే ఒత్తిడి పెట్టుకోకూడదని, ప్రతి రోజు నడిచేలా చూస్తే చాలని అంటోంది. ఎందుకంటే తాను కొన్ని రోజులు తక్కువగానూ మరికొన్ని రోజులు మెరుగ్గా నడిచినట్లు వెల్లడించింది. అది క్రమంగా కొవ్వు తగ్గడానికి ఉపకరించిందని అంటోంది.రాత్రి భోజనంలో కార్బోహైడ్రేట్లు తగ్గించడంరాత్రిపూట అన్నం, రోటీ తీసుకోవడం తగ్గించి..గుడ్లు, పనీర్, పప్పు, చికెన్ వంటి ఆహారాల ద్వారా ప్రోటీన్ చేర్చుకున్నట్లు తెలిపింది.నెమ్మదిగా తినడం ప్రారంభించానుగతంలో తాను నిమిషాల్లోనే ఆహారం ముగించేసేదాన్ని అని చెప్పింది. అయితే నిధానంగా నెమ్మదిగా తినడం వల్ల కడుపు నిండిన అనుభూతిని ఆస్వాదించొచ్చని అంటోంది. ఎందుకంటే..కడుపు నిండిన సంకేతాలను మెదడుకు పంపడానికి సుమారు 20 నిమిషాలపైనే పడుతుంది.ప్రతి భోజనానికి ముందు నీళ్ళుఆమె భోజనానికి ముందు ఒక గ్లాసు నీళ్ళు తాగడాన్ని అలవాటు చేసుకుంది. ఈ చిన్న మార్పు, తినే ఆహార పరిమాణాన్ని సమర్థవంతంగా నియంత్రించుకోవడానికి సహాయపడుతుందని చెబుతోంది. ప్రతిరోజూ బరువు చూడొద్దు..శివాని ప్రతిరోజూ బరువు చూసుకోవడం మానేసినట్లు తెలిపింది. ఎందుకంటే అది మన మానసిక స్థితిపై ప్రతికూల ప్రభావం చూపుతుందని అంటోంది.నిద్రవేళలను సరిచేసుకోవడంబరువు తగ్గాలనుకునే వారికి తగిన నిద్ర అత్యంత ముఖ్యమని నొక్కి చెబుతోంది. సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల మన జీర్ణవ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపి ఆకలి కోరికలపై నియంత్రణ కోల్పోయే ప్రమాదం ఉందని అంటోందివాయిదాకు అవకాశం ఇవ్వకుండా..అయితే తినాలనిపించిన వాటిని దూరం పెట్టేలా వాయిదా వేయకుండా..ఒకవేళ్ల స్వీట్స్, లేదా జంక్‌ఫుడ్ లాంటి అనారోగ్యకరమైన అలవాట్లపై మనసు లాగితే..అయ్యే దూరం చేసుకున్నాననే భావం మనుసులో రాకుండా..ధైర్యంగా తినేసి..ముందుకు సాగిపోవడం నేర్చుకోవడం మంచిదని చెబుతోంది. ఎందుకంటే అది బాధకరమైన వెయిట్‌లాస్ జర్నీగా మారదని అంటోంది. ఇక్కడ శివాని చెప్పేది ఆరోగ్యకరమైన అలవాట్లనే హాయిగా తెలివిగా చేస్తే.. బరువు తగ్గడం కూడా ఒక ఎంజాయ్‌మెంట్‌గా మారుతుందని చెబుతోందామె. ఇంకెందుకు ఆలస్యం ప్రయత్నించి చూడండి మరి..!.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: Weight Loss Tips: జస్ట్ మూడు నెలల్లో 20 కేజీల బరువు..! ఐతే ఆహారంలో..) -
ఇది...ఇ–తాబేలు! 16 ఏళ్ల యువకుడి ఆవిష్కరణ
ప్రపంచాన్ని భయపెడుతున్న పర్యావరణ సమస్యలలో...మైక్రోప్లాస్టిక్ ఒకటి. ఇవాన్ బుడ్జ్ అనే పదహారేళ్ల కెనడియన్ మైక్రోప్లాస్టిక్ కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి శాస్త్రవేత్తలకు సహాయపడే ఏఐ ఆధారిత రోబో తాబేలును తయారుచేశాడు....ఒకరోజు...కుటుంబంతో కలిసి క్యాంపింగ్‌కు వెళ్లిన ఇవాన్ ఒక తాబేలు ఈత చూసి ‘వావ్’ అనుకున్నాడు. ఆ తాబేలు స్ఫూర్తితో నీటి అడుగున పని చేసే 3డీ హోలోగ్రాఫిక్ సిస్టమ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో కూడిన రోబోటిక్ తాబేలు తయారు చేయాలనుకున్నాడు. ఎన్నో నెలల పాటు కష్టపడ్డాడు. ఎట్టకేలకు తన కలను నిజం చేసుకున్నాడు. ఈ రోబో తాబేలు నీటిలోనే మైక్రోప్లాస్టిక్‌లను 94 శాతం కచ్చితత్వంతో గుర్తించగలదు. ఈ ఆవిష్కరణకు ఇవాన్‌కు రీజెనెరాన్ ఇంటర్నేషనల్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ ఫెయిర్(ఐఎస్ఇఫ్)లో ప్రతిష్ఠాతకమైన గోర్డాన్ ఇ.మూర్ అవార్డ్ వరించింది.బాధను వదిలి...ఆవిష్కరణ బాటలో...చిన్నప్పటి నుంచి ఇవాన్‌కు పర్యావరణ సంబంధిత విషయాలు, ఇంజినీంగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఇష్టం. తల్లిదండ్రులతో పాటు యాత్రలకు వెళుతుండడం వల్ల ఎన్నో సరస్సులు, అడవులను చూశాడు. ప్రకృతిపై, స్వచ్ఛమైన జలాశయాలపై ఆసక్తి మొదలైంది. ఈ క్రమంలో ప్లాస్టిక్ కాలుష్యంపై ఇవాన్‌లో ఆందోళన పెరిగింది.‘ఇలా బాధపడడం కంటే ఏదో ఒకటి చేయాలి’ అని గట్టిగా అనుకున్నాడు. అండర్ వాటర్ డ్రోన్‌ను రూపొందించడానికి బదులుగా, తాబేలుకు ఉండే సహజమైన ఈత సామర్థ్యాన్ని దృష్టిలో పెట్టుకొని తాబేలు మోడల్ రోబోను తయారుచేశాడు. సాధారణంగా తాబేళ్లు తక్కువ శక్తిని ఉపయోగించి ఎక్కువ దూరం ప్రయాణించగలవు. (చదవండి: స్టిక్కీ నోట్‌తో గిన్నిస్ రికార్డు) -
సమానత్వానికి ఉపాధే మార్గం
ఆగస్టు 26... మహిళా సమానత్వ దినోత్సవం. ఓటు హక్కు కోసం మొదలైన పోరాటం నేడు అంతరిక్షం వరకు సాగింది. కానీ ప్రశ్న మిగిలే ఉంది.నిజంగానే ఆమెకు సమాన గుర్తింపు, భద్రత, స్వేచ్ఛ దక్కాయా? జవాబు... ఇంకా లేదు. ఒకవైపు ఆమె ముందుకు దూసుకెళుతోంది. మరోవైపు సామాజిక ఆంక్షలు, గృహహింస, వివక్ష ఆమె రెక్కలను కత్తిరిస్తూనే ఉన్నాయి. సమానత్వం అంటే ‘పురుషులతో పోటీ కాదు’... ‘పురుషులతో సమానంగా బతికే హక్కు’. ఆఫీస్‌లో సమాన అవకాశం, ఇంట్లో సమాన గౌరవం దక్కినప్పుడే ‘విమెన్స్ ఈక్వాలిటీ డే’కు అర్థం. ఆమెను కేవలం బాధ్యతగల గృహిణిగా, సమర్థురాలైన ఉద్యోగిగా మాత్రమే కాదు.. ఒక మనిషిగా, నిర్ణయాలు తీసుకునే వ్యక్తిత్వంగా గౌరవించినప్పుడే అది సిసలైన సమానత్వం. అందుకై మార్పు అనివార్యం.మహిళల ఆర్థిక స్వాతంత్య్రానికి, సాధికారతకు, సమానత్వానికి.. ఉద్యోగం అనేది అత్యంత కీలకం. ఎంతోమంది ప్రతిభావంతులైన మహిళలు,ఎన్నో అద్భుతాలు చేస్తారని ఆశలు పెట్టుకున్న వాళ్లు, ఒకే ఒక మాటతో ఉసూరుమనిపిస్తారు. ‘ఉద్యోగం చేస్తూ పిల్లలను చూసుకోవడం, ఇంటిపనులు చేసుకోవడం కష్టంగా ఉంది. అందుకే ఉద్యోగం మానేశాను’ గ్లోబల్ ఆన్లైన్ ఎంప్లాయిమెంట్ వెబ్సైట్ అండ్ సెర్చ్ ఇంజిన్ ఇండీడ్ నిర్వహించిన సర్వే ప్రకారం.. భారతదేశంలో ప్రతి పదిమంది మహిళల్లో ఎనిమిది మందికి పైగా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడం లేదు. ఇంటి సంరక్షణ బాధ్యతలతో పాటు ఉద్యోగ బాధ్యతలు నిర్వహించడం కష్టం అని భావించడం వల్ల చాలామంది మహిళలు ఉద్యోగాలకు దరఖాస్తు చేయడం లేదు....మహిళలు తమ కెరీర్‌ను ఎంచుకునే విధానాన్ని కుటుంబ బా«ధ్యతలు ప్రభావితం చేస్తున్నాయని, కెరీర్‌ను ఎంచుకోవడంలో సౌలభ్యం అనేది కీలక విషయంగా మారిందని చెబుతోంది ఇండీడ్ సర్వే. మరి కొన్ని విషయాలు... ⇒ ఉద్యోగాన్ని ఎంచుకునేటప్పుడు సౌకర్యవంతమైన పనిగంటలకు ప్రాధాన్యత ఇస్తున్నారు.⇒ 48 శాతం మంది హైబ్రిడ్ లేదా రిమోట్ ఉద్యోగాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు.⇒ కుటుంబ జీవితం–వృత్తి జీవితాన్ని సమన్వయం చేసుకోవడం కోసం పది మందిలో ఎనిమిది మంది తక్కువ జీతానికైనా సరే ఉద్యోగాల్లో చేరుతున్నారు.⇒ ఆఫీసుకు హాజరు కావాల్సిన నిబంధనల కారణంగా 51 శాతం మంది ఉద్యోగ ఇంటర్వ్యూలకు హాజరు కావడం లేదు.⇒ పూర్తి సమయం ఆఫీసులో ఉండాలనే నిబంధనను 37 శాతం మంది ప్రతికూల అంశంగా భావిస్తున్నారు. ఉద్యోగ విధులలో సౌలభ్యం లేకపోవడాన్ని 34 శాతం మంది ప్రతికూల అంశంగా భావిస్తున్నారు. ఉద్యోగం చేసే తల్లులు హైబ్రిడ్, రిమోట్ వర్క్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ఈ సర్వే ఫలితాలు చెబుతున్నాయి.‘ఉద్యోగాలకు సంబంధించి మహిళలకు కలలు ఉన్నప్పటికీ, గృహ సంరక్షణ బాధ్యతలకే చాలామంది మహిళలు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు’ అంటున్నారు ఇండీడ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ శశి కుమార్.ఉద్యోగం డబ్బుల కోసం మాత్రమే కాదు...‘ఉద్యోగం అనేది కేవలం డబ్బు సం పాదించే మార్గం మాత్రమే కాదు. ఆర్థికంగానే కాదు మాససికంగా కూడా ఉపయోగపడుతుంది. వృత్తి జీవితమే వ్యక్తిగత జీవితంలో సంతృప్తిని, స్ఫూర్తిని ఇస్తుంది. పని– వ్యక్తిగత జీవితం మధ్య సమన్వయం సాధించాలి. దీని వల్ల ఒత్తిడి తగ్గుతుంది. ఉద్యోగ జీవితానికి ప్రాధాన్యత ఇస్తూనే వ్యక్తిగత జీవితాన్ని ఆస్వాదించాలి’ అంటున్నారు లైఫ్‌స్టైల్ అండ్ ఫర్నీచర్ బ్రాండ్ ‘బెంట్చైర్’ సీఈవో, కో–ఫౌండర్ నటషా జైన్.ఆ లక్ష్యాలనే ఎంచుకుంటాను‘వ్యా పారవేత్తలుగా, పారిశ్రామికవేత్తలుగా మహిళలు రాణిస్తున్న ఈరోజుల్లో ఎంతోమంది మహిళలు తమ వృత్తి, వ్యక్తిగత జీవితాలను చక్కగా సమన్వయం చేసుకుంటున్నారు. నా విషయానికి వస్తే...అసాధారణమైన లక్ష్యాలను ఏర్పాటు చేసుకోకపోవడమే పని–జీవిత సమతుల్యతకు ఒక మార్గం. నా మానసిక ప్రశాంతతకు భంగం కలగకుండా సాధించగలిగే లక్ష్యాలనే నా వృత్తి లేదా వ్యక్తిగత జీవితంలో ఎంచుకుంటాను. నేను ఉత్తమ తల్లి లేదా ఉత్తమ ఉద్యోగి అని నిరూపించుకోవడానికి నన్ను నేను అతిగా ఒత్తిడికి గురిచేసుకోను’ అంటుంది దీక్ష చాబ్ర ఫిట్నెస్ కన్సల్టేషన్ ఫౌండర్ దీక్ష చాబ్ర.లక్ష్యాల దిశగా...‘ఇంట్లో బిడ్డను చూసుకోవాల్సిన బా«ధ్యతల వల్ల మొదట్లో నా వ్యా పారప్రయాణం భారంగా అనిపించింది. పని–జీవిత సమతుల్యతను కా పాడుకోవడానికి ప్రతి ఒక్కరికీ మార్గం ఉంటుంది. లక్ష్యాల దిశగా ప్రణాళిక వేసుకోవడానికి, విశ్లేషించుకోవడానికి రోజులో కొంత సమయాన్ని నా కోసం కేటాయించుకుంటాను’ అంటున్నారు గిఫ్టింగ్ కంపెనీ జిఫ్టర్ కో–ఫౌండర్ పూజా పుంజ్.పనిని ఆస్వాదించండి‘మొదటగా మీ ప్రాధాన్యతలపై దృష్టి పెట్టండి. చేసే పనిని ఆస్వాదించండి. వర్క్–లైఫ్ బ్యాలెన్స్‌పై కృషి చేయండి. వర్క్–లైఫ్ బ్యాలెన్స్‌కు ఒక మార్గం కనుగొన్న తరువాత ఉద్యోగ జీవితంలో లభించే సంతృప్తి, ఆనందం సాటిలేనివి. కెరీర్లో మీరు ఎదిగే కొద్ది పని–వ్యక్తిగత జీవిత సమతుల్యత గురించి మార్గాలు మరిన్ని కనబడతాయని గుర్తుంచుకోవాలి. ఒక్కమాటలో చె΄్పాలంటే సమతుల్యత అనేది ఎక్కడో ఉండదు. అది మనం సృష్టించుకోవాలి’ అంటున్నారు ప్రమేయ హెల్త్ ఫౌండర్ డాక్టర్ సంధ్యా రవి.నిరాసక్తత ఎందుకంటే..?ఉద్యోగాల కొరత, పని ప్రదేశంలో కార్మిక చట్టాలు వర్తించకపోవడం, సరైన మౌలిక సౌకర్యాలు లేకపోవడం వంటి కారణాల వల్లే మహిళలు ఉద్యోగాలు చేసేందుకు ఆసక్తి చూపడం లేదని సెంటర్ ఫర్ సోషల్ అండ్ ఎకనామిక్ ప్రోగ్రెస్ నిర్వహించిన అధ్యయనంలో తేలింది. ఇందుకు అనేక రకాల కారణాలు ఉన్నాయి. భారతీయ మహిళలు మిగిలిన వారి కంటే భిన్నంగా ఉండడం, కుటుంబ వ్యవస్థకు ప్రాధాన్యం ఇవ్వడం, ఆత్మ విశ్వాసం తక్కువగా ఉండడం కుటుంబ నేపధ్యం ఇందుకు ప్రధాన కారణాలు.n భారతదేశంలో పని చేసే వయసు ఉండి ఉద్యోగం చేస్తున్న మహిళల శాతం కేవలం 35 మాత్రమే.భారత్ కూడా ఉన్నత ఆదాయ దేశాల స్థాయికి చేరాలంటే మరో 9 కోట్ల మంది మహిళలను శ్రామిక శక్తిలోకి తీసుకురావాల్సి ఉంటుంది. దీనివల్ల భారత ఆర్థిక వ్యవస్థకు సుమారుగా రూ. 116 లక్షల కోట్ల అదనపు ఆదాయం సమకూరుతుందని అంచనా. వస్త్ర పరిశ్రమ ద్వారా బంగ్లాదేశ్ మహిళలకు భారీగా ఉ పాధి కల్పించింది. భారత్ కూడా అదే స్థాయిలో శ్రామిక ఆధారిత రంగాలను ప్రోత్సహిస్తే, మూడు రెట్లు వేగంగా మహిళా ఉ పాధి పెరుగుతుందని గణాంకాలు చెబుతున్నాయి.ఇంకా అక్కడే..మహిళా సాధికారతను కొన్నేళ్లుగా విద్య, ఉద్యోగం, బ్యాంకు ఖాతాలు, మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్ సదు పాయాల ఆధారంగానే కొలుస్తూ వస్తున్నారు. ఈ ప్రాథమిక ప్రమాణాలన్నింటిలోనూ భారతదేశం గణనీయమైన ప్రగతిని సాధించినప్పటికీ ఎన్‌ఎఫ్‌హెచ్ సర్వే–6 (జాతీయ, కుటుంబ, ఆరోగ్య సర్వే) ఫలితాలు కనిపించని కోణాన్ని మన ముందుకు తెచ్చాయి. ⇒ 22.3 శాతం మంది 18 నుంచి 49 సంవత్సరాల మధ్య వయసున్న వివాహితలు తమ భర్త నుంచి భౌతిక, లైంగిక వేధింపులకు గురవుతున్నారు. గతంలో చేసిన ఎన్‌ఎఫ్‌హెచ్ –5 (2019–21) సర్వేలోని 29.2 శాతంతో పోలిస్తే ఈ సంఖ్య కొంత తగ్గినప్పటికీ, ఇప్పటికీ ప్రతి ఐదుగురు మహిళల్లో ఒకరు ఈ తరహా వైవాహిక హింసను ఎదుర్కొంటున్నారనేది ఆందోళన కలిగించే అంశం. ⇒ కేరళలో 87 శాతం మంది బాలికలు పదో తరగతి కంటే ఎక్కువ చదువుకున్నారని ఎన్‌ఎఫ్‌హెచ్–6 చెబుతోంది. అయినప్పటికీ, భర్త చేతిలో వేధింపులకు గురవుతున్న వివాహితల శాతం 9.8 నుంచి ఏకంగా 17.7 శాతానికి పెరగడం ఆందోళన కలిగిస్తోంది. విద్య, వికాసాలు ఉన్నచోట కూడా గృహహింస తీవ్ర రూపంలోనే ఉందనడానికి ఈ గణాంకాలు నిదర్శనం.⇒ మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ముందే వారి జీవితాలను దెబ్బతీస్తున్న మరో ప్రధాన సమస్య బాల్య వివాహాలు. ఆంధ్రప్రదేశ్ (25%), జార్ఖండ్ (28.1%), బీహార్ (34.6%), పశ్చిమ బెంగాల్ (36.4%) లతో బాల్య వివాహాలు ఇప్పటికీ పెద్ద సమస్యగా ఉన్నాయి. చిన్న వయసులోనే వివాహాలు కావడం వల్ల మహిళలు మానసిక, ఆర్థిక, సామాజిక సాధికారతను సాధించలేకపోతున్నారు. విద్య, ఉద్యోగ అవకాశాలు, ముఖ్య విషయాల్లో నిర్ణయాలు తీసుకోవడంలో వెనుకబడిపోతున్నారు.వర్క్–లైఫ్ బాలెన్స్ కోసం...వర్క్–లైఫ్ బ్యాలెన్స్ చేసుకోవడంలో భాగంగా ప్రతి ఉదయం మెంటల్ నోట్ క్రియేట్ చేసుకుంటాను. మెంటల్ నోట్ ద్వారా ఆరోజు నేను పూర్తి చేయాల్సిన ముఖ్యమైన పనులను దృష్టిలో పెట్టుకుంటాను. నా పని ముగించేలోపు వాటిని పూర్తి చేయడంపై దృష్టి పెడతాను. మీరు తీరికలేని జీవితాన్ని గడిపే ఉద్యోగి అయితే మీ కోరికల జాబితాలోని ప్రతిదాన్ని సాధించడం కష్టం. దీని వల్ల మనం పూర్తిగా అలసిపోతాం. వ్యక్తిగత జీవితానికి సమయం కేటాయించలేకపోతాం. వృత్తి–కుటుంబ జీవితాన్ని సమన్వయం చేసుకోవడానికి మన ఆరోగ్యం, లైఫ్‌స్టైల్‌పై దృష్టి పెట్టాలి. ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా మనం చాలా ఒత్తిడితో కూడిన జీవితాన్ని గడుపుతాం. అది అనారోగ్యానికి, డిప్రెషన్‌కు దారి తీయవచ్చు. పని నుండి పూర్తిగా విరామం తీసుకోవడానికి ప్రతి మూడు నెలలకు ఒకసారి రెండు, మూడు రోజులు సెలవు తీసుకుంటాను.– రాశీ జైన్, ఆన్‌కో.కామ్ సీయివో, కో–ఫాండర్ -
కంటతడి పెట్టించే ప్రేమకథ..! ఆఖరికి విధి సైతం..
అందర్నీ ఎదిరించి ప్రేమను విజయవంతంగా పెళ్లిపీటల వరుక తెచ్చుకున్నారు. ఆనందంగా మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. అంతా హాయిగా సాగిపోతుందన్న తరుణంలో విధికే కన్ను కుట్టిందో, పరీక్షే పెట్టాలనుకుందో..ఒక్క క్షణంలో వాళ్ల జీవితాలు అగాథంలో పడేలా భయానక యాక్సిడెంట్ ఒక్క కుదుపు కుదిపేసింది. నిజానికి మరొకరేవరైనా ఆ సమయంలో ఎవరి జీవితం వారు అనుకునేవారేమో..కానీ ఆమె అనలేదు. ఎవ్వరేమి చెప్పినా..అతడే తన సర్వస్వం అంటూ చూపిన తెగువకు చేతులెత్తి నమస్కరించాల్సిందే. అసలేం జరిగిందంటే..గుజరాత్‌కి సంబంధించిన దీప్తి, జయ్లు చదువుకునే రోజుల నుంచే మంచి స్నేహితులు. సాధారణ స్నేహంగా మొదలైన వారి బంధం..కాస్త ప్రేమగా మారింది. చదువులు పెరుగుతూ వస్తున్నా.. వారి మధ్య దూరం, సంభాషణలు తగ్గలేదు. చివరికి పెద్దయ్యాక కూడా కలిసే ఉండాలనే ఉద్దేశ్యంతో పెళ్లితో జీవితాన్ని పంచుకోవాలని నిర్ణయించకున్నారు. కానీ ఇరు కుటుంబసభ్యులు వారి పెళ్లికి అస్సలు ఒప్పుకోలేదు. ఏళ్ల తరబడి నిరీక్షించినా..ఫలితం కనిపించక..చేసేదిలేక..జయ్ పేరెంట్స్‌ని కాదని దీప్తిని పెళ్లి చేసుకునేందుకు మొగ్గు చూపాడు. అలా వారి పెళ్లిలో దీప్తి తరుఫు పెద్దవాళ్లున్న, జయ్ తరుఫున ఎవ్వరూ లేరు. అలా 2024లో ఇద్దరు పెళ్లిచేసుకున్నారు. ఇక నుంచి తమ జీవితాలు ఆనందంగా సాగిపోతాయి అని భావించారు ఇరువురు. అంతలోనే తమ జీవితాలు తలకిందులైపోతాయని అస్సలు ఊహించలేదు. ఎప్పటిలానే ఆఫీస్‌కి వెళ్లిన జయ్ ఆరోజు ఇంటికి రాలేదు..అతడి ఆఫీసు ఇన్ఛార్జ్ రావడంతో దీప్తిలో కంగారు, ఆందోళన మొదలయ్యాయి. అతడు వచ్చి జయ్‌కు చిన్న యాక్సిడెంట అయ్యిందనగానే చిన్న గాయాలే అనుకుని ధైర్యంగా బయలుదేరబోతుండగా..ఇద్దరి బట్టలు తెచ్చుకోవాల్సిందిగా చెప్పడంతో విస్తుపోతుంది. అయోమయంగా ..కంగారు కంగారుగా ఆస్పత్రికి వెళ్లిన దీప్తికి అక్కడ జయ్‌ని చూశాకగానీ అర్థం కాలేదు..అతడికి అయ్యింది భారీ యాక్సిడెంట్ అని. పైభాగం తప్పించి మొత్తం కింద భాగం 40% మేర కాలిపోయింది, అస్సలు స్పృహలో లేడు జయ్. ఆ దృశ్యాలను చూసి తట్టుకోలేక దీప్తి ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయింది. ఆ పరిస్థతిని అర్థం చేసుకోవడానికే చాలా సమయం పట్టిందామెకు. ఒక పక్క వైద్యులు ప్రాణాంతకమని చెప్పి.. హుటాహుటినా అహ్మదాబాద్‌కు తరలించారు. ఏడు గంటల ప్రయాణం తర్వాత అతనికి చికిత్స మొదలైంది. ఇందులో నాలుగు ప్లాస్టిక్ సర్జరీలు, చర్మ మార్పిడి తదితరాలు ఉన్నాయి. ఇక్కడ దీప్తికి ఆస్ప్రతి భయం, ఆర్థిక భయం వెంటాడుతూనే ఉన్నాయి. కానీ జయ్‌ని బతికించుకోవాలంటే తాను ధైర్యంగా ఉండాల్సిందే. అంతటి పరిస్థితిని ఒక్కత్తే చక్కబెట్టుకుంటూ..తన వద్ద ఉన్న సొమ్ము, బంగారు తాకట్టు పెట్టి కొంత, స్నేహితుల వద్ద అప్పుగా కొంత ఇలా వచ్చిన సొమ్ముతో అతడికి విజయవంతంగా చికిత్స అందేలా చేసింది. అయితే ఆ ప్రమాదం జయ్‌ని శారీరకం, మానసికంగా చాలా బలహీనంగా మార్చేసింది. అతడిలో ఇదివరకటి వ్యక్తిలాంటి చురుకుదనం కోసం మళ్లీ చాలా గట్టిగా పోరాడాల్సి వచ్చింది. తన ముఖంలో నవ్వులు విరబూసిలే తను చేయగలిగిందంతా చేసి, మాములు మనిషిగా చేసింది. జయ్ రోజువారీ పనుల చేసుకోలేకపోయినా..ప్రాణాలతో మాత్రం దక్కించుకుంది. అయితే చుట్టు పక్కల వాళ్లు వయసు చిన్నదే కదా..అతడితో ఎందుకు మరో పెళ్లిచేసుకోమని చెబుతుండేవారు. పెళ్లి రెండేళ్ల కిందటే అయ్యిందేమో..మాది 14 ఏళ్లప్రేమ బంధం అని, అతడి చేతిని ఎన్ని కష్టాలు ఎదురైనా వదిలేది లేదని తెగేసి చెప్పింది దీప్తి. మరికొందరు జయ్ పరిస్థితికి దీప్తినే కారణమని నిందించేవారు కూడా. అయినా అవేమి లెక్కచేయక అతడిని ఒక చిన్న పిల్లాడిలా చూసుకుంటూ అసలైన దాంపత్యానికి నిలువెత్తు అర్థంలా మారిందామె. అంతేగాదు ఈ ప్రమాదం తర్వాతే తాము జీవించడం గురించి నేర్చుకున్నామని చెబుతోంది దీప్తి. ఇంతకముందు తామిద్దరం భవిష్యత్తు గురించి తపన పడి సంపాదన వైపు పరుగులు తీస్తే..ప్రస్తుతం తమ ఆర్థిక పరిస్థితి ఈ రోజు గురించి ఆలోచించలే చేసిందని చెబుతోంది. అంతేగాదు రేపే ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి చిన్న చిన్న ఆనందాలను సెలబ్రేట్ చేసుకోవడం ఎలాగో తెలిసింది, అలాగే తమకు బతుకు విలువ నేర్పిందని అంటోంది దీప్తి. నిజానికి అంతటి కష్టపరిస్థితుల్లో ఒకరికొకరుగా తోడుగా నిలిచి, ఆలుమగల బంధానికి అసలైన అర్థం ఏంటో చాటిచెప్పారు. కనీసం ఈ దంపతుల అన్యోన్యతకైనా ..ఆ విధి కరిగి మళ్లీ వాళ్ల జీవితాల్లో ఆనందం విరబూసేలా చేయాలని మనసారా కోరుకుందామా.!. View this post on Instagram A post shared by People of India (@officialpeopleofindia) (చదవండి: తొలి అడుగుల నుంచి.. ఫస్ట్ ఫ్లైట్ జర్నీ వరకు..! కుమార్తె భావోద్వేగ పోస్ట్) -
కజియా లిజ్ మెజో గెలుపుపై పాకిస్తాన్ మిస్ యూనివర్స్ రియాక్షన్ ఇదే..!
ఇటీవల మిస్ యూనివర్స్ ఆయా దేశాలు తమ ప్రతినిధ్యులుగా అందగత్తెలను ఎంపిక చేశాయి. ఇటీవలే మిస్ యూనివర్స్ పాకిస్థాన్‌గా మిస్బా అర్షద్ విజయం సాదించడం చూశాం. ఆ తదనంతరమే భారత్,థాయిలాండ్‌లు కూడా మిస్ యూనివర్స్ 2026కి తమ ప్రతినిధులను ఎంపిక చేశాయి. నవంబర్ 24, 2026న ప్యూర్టో రికోలోని శాన్ జువాన్‌లో ప్రతిష్టాత్మక మిస్ యూనివర్స్ పోటీలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయా దేశాలు తమ దేశానికి ప్రాతినిధ్యం వహించే అందగత్తెలను ఎంపిక చేయడం జరుగుతుంది. అయితే భారత్ మిస్ యూనివర్స ఇండియాగా కిరీటం గెలుచుకున్న కేరళ అమ్మాయి కజియా లిజ్ మెజో గెలుపై పాకిస్థాన్ మిస్ యూనివర్స్ మిస్బా అర్షద్ ఇలా స్పందించింది. ఆమె ఇన్స్టాగ్రామ్ పేజ్‌లో మిస్ యూనివర్స్ ఇండియా 2026గా కజియా లిజ్ మెజో ఫోటోను షేర్ చేస్తూ. ‘చాలా అందంగా ఉన్నారు, మీకు అభినందనలు. దీనికి పూర్తిగా అర్హులు మీరు. త్వరలోనే ప్యూర్టో రికోలో కలుద్దాం!’ అని రాసుకొచ్చింది. అలాగే మిస్ యూనివర్స్ థాయ్‌లాండ్ 2026గా కిరీటం గెలుచుకున్న తరీనా బోటెస్ను కూడా అభినందిస్తూ..ఇది ఒక అమూల్యమైన క్షణం అని రాశారు పోస్ట్‌లో. అంతేగాదు 'పాకిస్తానీ పేజెంట్స్' అనే ఇన్స్టాగ్రామ్ పేజీ, తరీనా బోట్స్, మిస్బా అర్షద్, కజియా లిజ్ మెజోల కొలాజ్ల ఫోటోలను పంచుతూ "టీమ్ ఆసియా: బలపడుతోంది" అని రాసి ఉంది. అంతేగాదు గతవారమే ముగ్గురు అందమైన రాణులు కిరీటధారణ చేయడం చూశాం. ఇది టీమ్ ఆసియాను మరింత బలంగా, సొగసైనదిగా చేసింది అని క్యాప్షన్ జోడించి మరిపోస్ట్ చేసింది. ఆ పోస్ట్‌నే రీ షేర్చేస్తూ మిస్బా అర్షద్ హార్ట్-ఐస్ ఎమోజీతో ఇలా స్పందించిందామె.(చదవండి: Miss Universe India 2026: సుస్మితా సేన్‌పై వెల్లువెత్తుతున్న విమర్శలు..! ఊర్వశి రౌతేలా అలా కనిపించడానికి రీజన్) -
మాజీ మిస్ యూనివర్స్‌గా సుస్మితా అలానా ప్రవర్తించేది..?
మిస్ యూనివర్స్ అందాల పోటీల ఫైనల్స్ జైపూర్‌లో విజయవంతంగా పూర్తైన సంగతి తెలిసిందే. ఈవేడుకలో మిస్ యూనివర్స్‌గా కేరళ అమ్మాయి కజియా లిజ్ మెజో కిరిటాన్ని గెలుచుకుంది కూడా. అయితే ఈ వేడుకలో న్యాయనిర్ణేతలుగా వ్యవహరించిన వారిలో ఒకరైన బాలీవుడ్ బ్యూటీ, మాజీ మిస్ యూనివర్స్ సుస్మితా సేన్‌పై ఆరోపణలు వెల్లవెత్తుతున్నాయి. ఆమె తీరుపై నెటిజన్లు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నారు. ఆమె ఆ కార్యక్రమంలో ఫస్ట్ రన్నరప్ మిస్ ఇంటర్నేషనల్ ఇండియా 2026 వైష్ణవి గణేష్‌కు అనుకూలంగా వ్యవహరించారంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుస్మితా మిస్ ఇండియా టైటిల్‌ని గెలిచిన కజియాని ఎలా విస్తరిస్తున్నావ్ అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఆగస్టు 24న 'మెజెస్టిక్ మూమెంట్స్' అనే ఇన్స్టాగ్రామ్ పేజీ ఒక వీడియోను షేర్ చేసింది. ఆ నేపథ్యంలోనే నెటిజన్లు ఆగ్రహావేశాలు వెల్లగక్కుతున్నారు. ఆ వీడియోలో సుస్మిత కొత్తగా కిరీటం గెలుచుకున్న కజియాని అభినందిస్తున్నప్పటికీ..ఆమె నేరుగా వైష్ణవి వైపుకి నడుస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. అంతేగాదు విన్నర్ కజియాకి ఏదో మొక్కబడిగా కంగ్రాట్స్ చెబుతున్నట్లుగా క్లియర్‌గా కనిపిస్తుంది. ఆ తర్వాత సుస్మిత వైష్ణవిని ఓదారుస్తూ..తలపై ఉన్న మిస్ ఇంటర్నేషనల్ ఇండియా 2026 కిరీటాన్ని సరిచేస్తూ కనిపిస్తుంది. అదే సమయంలో సెలీనా జైట్లీ, ఊర్వశి రౌతేలాతో సహా ఇతరులు కూడా అక్కడున్న అందగత్తెలందర్నీ అభినందిస్తున్నారు. కానీ సుస్మిత మరోసారి కజియాని దాటి వెళ్లిపోవడం మరింత స్పష్టంగా కనిపిస్తుంది. దాంతో నెటిజన్లు ఒక్కసారిగా మండిపడ్డారు. View this post on Instagram A post shared by Majestic Moments (@elegancereignss)విజేత వద్దకు వెళ్లి రన్నరప్ వద్దకు వెళ్లి ఉంటే బాగుండేదని, అది వేదిక మర్యాద అంటూ విమర్శల వర్షం కురిపించారు. ఒక మాజీ మిస్ యూనివర్స్ ఇలా ప్రవర్తించాలా అంటూ ఆమె వైఖరిపై నిప్పులు చెరుగుతున్నారు. అంతేగాదు సుస్మిత మీలాంటి వాళ్లు న్యాయనిర్ణేతగా ఉండకూడదు అంటూ తింటిపోస్తూ పోస్టులు పెట్టారు. ఇదిలా ఉండగా, ఈ వేడుకలో ఊర్వశి రౌతేలా తన దుస్తులతో అందరి దృష్టిని ఆకర్షించింది.త్రివర్ణ పతాక స్ఫూర్తితో మెరిసింది..భారత జాతీయ జెండాలోని కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగుల స్ఫూర్తితో రూపొందించిన గౌన్‌ను ఆమె ధరించింది. ఈ కార్యక్రమానికి తాను ఈ గౌనులో రావడానికి గల రీజన్ కూడా వెల్లడించారు. ఈ ఏడాది జరిగిన కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్ వద్ద ఒక మీడియా సంస్థ తన గురించి ప్రశ్నించినప్పుడు..సగర్వంగా భారతీయురాలిని అని చెప్పానన్నారు. కానీ ఈ రోజు అంతకుమించి ప్రత్యేకమైన రోజు అని అందుకే ఇలా ఈ త్రివర్ణ పతాక రంగుల గౌనులో వచ్చానని చెప్పారు. #WATCH | Jaipur, Rajasthan | Grand Finale of Miss Universe India 2026 | Former Miss Universe India and Actress Urvashi Rautela says, “One should never consider failure as a failure. There is always scope to learn and to move further. I really want to wish all of them all the very… pic.twitter.com/MMK7g4WhgU— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) August 24, 2026దీన్ని అంతర్జాతీయ డిజైనర్ 'దాషా' రూపొందించారని, డిజైన్ చేయడానికే మూడునెలల సమయం పట్టిందని అన్నారు. ఇలా'మిస్ యూనివర్స్ ఇండియా' ఫినాలేలో న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తూ ఈ గౌన్ ధరించడం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. పైగా ఇలా న్యాయనిర్ణేతగా వ్యవహరించడం తనకు నాల్గోసారని చెప్పారు. కాగా, ఈ వేడుకలో న్యాయనిర్ణేతలుగా బాలీవుడ్నటి, మాజీ మిస్ యూనివర్స సుస్మితా సేన్, మాజీ మిస్ యూనివర్స్ ఇండియా ఊర్వశి రౌతేలా, మిస్ యూనివర్స్ ఇండియా 2024 రియా సింఘా, పర్యావరణవేత్త, చిత్ర నిర్మాత ప్రజ్ఞా కపూర్, మాజీ మిస్ యూనివర్స్ రన్నరప్ సెలీనా జైట్లీ తదితరులు వ్యవహరించారు. (చదవండి: ఆమెకు మిస్ యూనివర్స్ కిరీటాన్ని వరించేలా చేసిన ప్రశ్న ఇదే..!) -
జస్ట్ మూడు నెలల్లో 20 కేజీల బరువు..! ఐతే ఆహారంలో..
బరువు తగ్గడం అంటే అత్యంత కష్టమైన పని కాదని..సునాయాసం ఎంజాయ్ చేస్తే తగ్గొచ్చని చూపిస్తున్నారు పలువురు. అందుకు క్రమశిక్షణ, నిలకడ తోపాటు ఆహారంపై మంచి స్పృహ కూడా కలిగి ఉండటం అత్యంత ప్రధానం. అచ్చం అలానే తూచా తప్పకుండా అనుసరించి జస్ట్ మూడు నెలల్లో కిలోలు కొద్దీ బరువు తగ్గి అందర్నీ ఆశ్చర్యపర్చింది ఈ ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్. ఆమె బరువుని తగ్గించుకోవడంలో హెల్ప్ అయిన ఫిట్నెస్ మంత్ర ఏంటో సవివరంగా చూద్దామా..!.ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ జ్యోతి ఉపాధ్యాయ్ ఒక సాధారణ ఫిట్నెస్ మంత్రాని అనుసరించినట్లు వెల్లడించింది. అదే ఆమెకు మూడు నెలల్లో 20 కిలోలు పైనే తగ్గడానికి సహాయపడినట్లు పేర్కొంది. తాను క్రమం తప్పని వ్యాయామం, ఇంట్లో చేసిన సాధారణ భోజనం తదితరాలన్నింటిని నిలకడగా చేయడం వంటి వాటిపై దృష్టిపెట్టినట్లు తెలిపింది. అంతేగాదు భారతీయ ఆహారంలో సులభంగా లభించే, అత్యంత సుపరిచితమైన పదార్థాలనే తన డైట్లో చేర్చుకున్నట్లు వెల్లడించింది. అలాగే తాను వ్యాయామం చేసేముందు తప్పనిసరిగా స్వెట్ బెల్ట్ ధరిస్తానని తెలిపింది. అలాగే తన తాజా వర్కౌట్లలో 95 కేజీల డెడ్‌లిఫ్ట్‌ను కూడా పూర్తి చేసినట్లు పేర్కొంది. క్రమం తప్పని శిక్షణతో తన బలం నెమ్మదిగా మెరుగుపడుతోందని అంటోంది. ఇక ఆహారం విషయానికొస్తే..ఎండుద్రాక్ష, ఓట్స్, ఇంట్లోనే తయారుచేసే పనీర్ తీసుకుంటానని చెప్పుకొచ్చింది. అలాగే మధ్యాహ్న భోజనంలో రోటీలు, పెరుగు, కూరగాయలు, సలాడ్, పనీర్ కూర, రాత్రి భోజనంలో తేలికగా ఉండేలా బొప్పాయి మాత్రమే తీసుకుంటానని పేర్కొంది.ఇక్కడ తనకు 20 కేజీల బరువు తగ్గడం అనేది క్రమం తప్పని వ్యాయామాలు, నియంత్రిత ఆహారం, నిలకడగా పాటించే దినచర్యల వల్లే సాధ్యమైందని అంటోంది. తక్కువ కేలరీలు తీసుకుంటూ..శారీరకంగా చురుకుగా ఉన్నప్పుడే బరువు తగ్గడం సులభమవుతుందని నొక్కి చెబుతోంది. ముఖ్యంగా తగినంత నీరు తాగడం, పీచుపదార్థాలు అధికంగా ఉండే ఆహారాలు ఎక్కువగా తీసుకోవడం వంటివి బరువు తగ్గడానికి ఎంతగానో ఉపకరిస్తాయని చెబుతోందామె. చివరగా వెయిట్‌లాస్ జర్నీలో సమతుల్య ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామాలు, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లే సరైనవని నొక్కి చెప్పింది ఇన్ఫ్లుయెన్సర్ జ్యోతి. View this post on Instagram A post shared by ज्योति🖤 (@jyotii_upadhyay9)గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: తొలి అడుగుల నుంచి.. ఫస్ట్ ఫ్లైట్ జర్నీ వరకు..! కుమార్తె భావోద్వేగ పోస్ట్ -
కళ్లలోంచి తొంగిచూస్తే గుండె కనిపిస్తుందా?
గుండెల్లో ఏముందో కళ్లలో తెలుస్తుంది.... అంటూ ఏదో తెలుగు సినిమా పాట ఉంది. కవుల ఊహలు ఎలా నిజమవుతాయో ఈ పాట పల్లవితో తెలుస్తుంది. ఎందుకంటే... కళ్లతో అన్నీ చూడవచ్చు. అంతేకాదు... కళ్ల సహాయంతో గుండెనీ చూడవచ్చని కొన్ని తాజా పరిశోధన ఫలితాలూ చెబుతున్నాయి.అమెరికాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ (ఎన్ఐహెచ్)కు చెందిన నేషనల్ హార్ట్, లంగ్ అండ్ బ్లడ్ ఇన్స్టిట్యూట్ (ఎన్హెచ్ఎల్బీఐ) వర్క్‌షాప్‌కు చెందిన ‘నేచర్ రివ్యూస్ కార్డియాలజీ రోడ్‌మ్యాప్’ ప్రకారం రెటీనాలో కనిపించే బయోమార్కర్స్ సహాయంతో కరోనరీ హార్ట్ డిసీజ్, హార్ట్ ఫెయిల్యూర్స్ వంటి పరిస్థితులు, స్ట్రోక్ వంటి వాటి విషయంలో ఒక అంచనాకు రావడం సాధ్యమని తెలుస్తోంది. కానీ ఈ ప్రక్రియ ఇంకా పూర్తిగా గుండె పరీక్షలకు ఓ రొటీన్ ప్రత్యామ్నాయంగా మాత్రం లేదు. అయితే భవిష్యత్తులో కంటి సహాయంతో గుండె ఆరోగ్యాన్ని అంచనా వేయడానికి కన్ను ఓ గవాక్షంగా మరే అవకాశం ఉంటుందంటున్నారు పరిశోధకులు.ఒక్కసారి ఓ సీన్ ఊహిద్దాం. ఒక వ్యక్తి తన గుండె పరీక్ష కోసం గుండె వైద్య నిపుణుడి (కార్డియాలజిస్ట్) దగ్గరికి వెళ్తాడు. ఆ కార్డియాలజిస్ట్ మాత్రం ముందుగా ఒకసారి కంటివైద్య నిపుణుడి (ఆఫ్తాల్మాలజిస్ట్) దగ్గరికి వెళ్లి సంప్రదించమని అంటాడు. అలాగే ఒక వ్యక్తి కంటి పరీక్ష కోసం ఆఫ్తాల్మాలజిస్ట్ దగ్గరికి వెళ్లినప్పుడు... రెటీనాలోని రక్తనాళాల్లో కొన్ని మార్పులు చూసి ఆ కంటి వైద్యనిపుణుడు కూడా ఒకసారి కార్డియాలజిస్ట్‌ను కలవమంటూ సూచించవచ్చు కూడా. ఊహకు అందే విషయమేనా? ఎందుకంటే... కంటి పరీక్ష కూడా గుండె ఆరోగ్య అంచనాల్లో ఒక భాగమయ్యే రోజు రావచ్చంటూ చెబుతున్నాయి వైద్య వర్గాలు. అది ఎందుకు, ఎలా జరుగుతుందో ఇప్పుడు చూద్దాం.కంటి వెనుక భాగంలో ఉండే రెటీనా మన శరీరంలోని అత్యంత సూక్ష్మమైన రక్తనాళాలను ప్రత్యక్షంగా చూడగలిగే కీలకమైన ప్రదేశం. అదీ పెద్ద కోత లేకుండా, ఇంజెక్షన్ వంటి పరికరాలతో రక్తాన్ని లాగకుండా, దేహంలోకి ఎలాంటి పరికరాన్నీ పంపకుండానే ఈ పరీక్షలు సాధ్యం. అందుకే రెటీనాను కొందరు పరిశోధకులు ‘గుండె తాలూకు కిటికీ’గా చూస్తున్నారు. ఇంగ్లిష్‌లో చె΄్పాలంటే ‘ఎ విండో టు ద బాడీస్ వాస్క్యులార్ హెల్త్’ అంటూ చెబుతున్నారు.కంట్లో డాక్టర్ ఏం చూస్తారంటే...రెటీనాను పరిశీలించే డాక్టర్లు కేవలం ‘చూపు బాగుందా?’ అని మాత్రమే కాకుండా చాలా అంశాలు పరిశీలిస్తారు. ఉదాహరణకు... రక్తనాళాలకు సంబంధించి...- వాటి వెడల్పు / వ్యాసం- ఏ మేరకు సన్నబడ్డాయి- మెలికలు- శాఖలుగా విడిపోయిన తీరు (బ్రాచింగ్ ప్యాటర్న్)- ధమని – సిరల (ఆర్టరీ వీన్) సంబంధం- కనీకనిపంచకుండా సూక్ష్మస్థాయిలో అయ్యే రక్తస్రావాలు- రెటీనాకు సంబంధించిన ఇతర మార్పులేవైనా ఉన్నాయా... లాంటి అనేక విషయాలను పరిశీలిస్తారు. ప్రస్తుతం జరిగిన పరిశోధనల్లో బాధితుల్లో అంటే... డయాబెటిస్, హైబీపీ, కరొనరీ ఆర్టరీ డిసీజ్, హార్ట్ ఫెయిల్యూర్, పక్షవాతం వంటి జబ్బులు వచ్చినవారిలో రెటినాకు సంబంధించిన రక్తనాళాల్లోనూ మార్పులు కనిపించాయి. అంటే... దీన్ని బట్టి తెలిసేదేమిటంటే... కంటి వెనకాల ఉండే అతి చిన్న రక్తనాళాలు దేహంలో ఉన్న గుండె తదితర రక్తనాళాల్లో వచ్చిన మార్పులను సూచిస్తూ ఒక ‘రివ్యూ’ లాంటివి ఇవ్వగలవని తెలుస్తోంది.అసలు కంటికీ గుండెకీ సంబంధం ఏమిటి?గుండె రక్తాన్ని పంపుతుంది. ఆ రక్తం శరీరమంతా ప్రయాణిస్తుంది. మెదడు, మూత్రపిండాలు, గుండె, కాళ్లు... ఇలా దేహంలోని అన్ని చోట్లా రక్తనాళాలు ఓ నెట్వర్క్లా అల్లుకుపోయి ఉంటాయి. అలాగే కంటి వెనుక ఉండే రెటీనాలోనూ కూడా అతి సూక్ష్మమైన ధమనులూ, సిరలూ, వెంట్రుకలంత సన్నగా ఉండే క్యాపిల్లరీస్ ఉంటాయి. దేహంలోని రక్తనాళ వ్యవస్థలో జరిగే కొన్ని మార్పుల ప్రభావం రెటీనాలోని అతి సన్నటి రక్తనాళాల్లో ప్రతిబింబించే అవకాశముందన్నది పరిశీలకుల భావన.అంటే... బ్రాడ్‌గా చె΄్పాలంటే... గుండెలోని పెద్ద రక్తనాళాల్లో ఏం జరుగుతుందనేది... రెటీనాలో ఉండే అతి సన్నటి ధమనులూ, సిరలూ, క్యాపిల్లరీలలో తెలియవచ్చన్నది వైద్యపరిశోధకుల మాట. గుండె పెద్ద రక్తనాళాల్లో ఏం జరుగుతుందన్న విషయాలు కంట్లోని చిన్న రక్తనాళాల్లో ఓ మినియేచర్‌లా కనిపించే అవకాశముంటుందన్నమాట. మరీ ముఖ్యంగా డయాబెటిస్, హైపర్‌టెన్షన్ లాంటి వ్యాధులున్నవాళ్లలో గుండెకు జరిగే నష్టాలూ, ఒనగూరే అనర్థాలను వైద్యపరిశోధకులు చాలాకాలంగానే గమనిస్తున్నారు.మరి... అధిక రక్తపోటు కంట్లో ఎలా కనిపిస్తుంది?ఓ వ్యక్తిలో రక్తపోటు (బీపీ) చాలా ఎక్కువగా ఉందని అనుకుందాం. దాంతో అతడి రక్తనాళాల గోడలపై నిరంతరం ఎక్కువ ఒత్తిడి పడుతుంటుంది. ఫలితంగా అతడి రెటీనాకు సంబంధించిన రక్తనాళాల్లో (రెటినల్ వెసెల్స్‌లో) మార్పులు రావచ్చు. ఇలా జరగడంతో వచ్చిన మార్పుల తాలూకు దుష్ప్రభావాలను ‘హైపర్టెన్సివ్ రెటినోపతి’ అంటారు. అందుకే కొన్నిసార్లు కంటి పరీక్షలో కనిపించే రెటినల్ మార్పుల ద్వారా ఒక వ్యక్తికి హైబీపీ ఉండవచ్చనే ఆధారం దొరకవచ్చు.ఇక్కడ బాగా నైపుణ్యం ఉన్న ఓ కంటి డాక్టర్... తన పేషెంట్‌కు హైబీపీ ఉందనే విషయాన్ని కంట్లోకి చూసి చెప్పగలడు. అంటే... ‘బీపీ మెషిన్‌ను చేతికి కడితేగానీ బీపీ తెలియదు... కానీ... ఏ మెషిన్‌నూ కట్టకుండానే... కంట్లోకి తొంగిచూసేసి డాక్టర్లు బీపీని కనిపెట్టవచ్చు’. కాకపోతే... ఇలా చూసినంతమాత్రానే ఓ పేషెంట్‌కు హైబీపీ ఉందని కంటి డాక్టర్ నిర్ధారణ చేయడు. ఆ అంశాన్ని ఒక క్లూ గా పరిగణించి, మళ్లీ తగిన పరీక్షలు చేశాకే పేషెంట్‌కు హైబీపీ ఉందని డాక్టర్లు నిర్ధారణ చేస్తారు.గుండె జబ్బు ఉన్నవాళ్ల కంట్లో ఏమి కనిపించవచ్చు?ఇప్పటికి కంట్లోకి చూడటం ద్వారా...- రెటినల్ వాస్క్యులార్ మార్పులతో – హైబీపీ నీ - డయాబెటిక్ రెటినల్ మార్పులతో – డయాబెటిస్‌నూ - కొన్ని రెటినల్ మైక్రో వ్యాస్క్యులార్ ప్యాటర్న్స్‌తో – కరోనరీ ఆర్టరీ డిసీజ్నూ- రెటినల్ వాస్క్యులార్ మార్పులతో – హార్ట్ ఫెయిల్యూర్‌నూ- రెటినల్ మైక్రో వాస్క్యులార్ అబ్నార్మాలిటీస్తో – పక్షవాతం (స్ట్రోక్)... వంటి అంశాలను గుర్తుపట్టినంత మాత్రాన ‘మీ కంట్లో ఈ తరహా మార్పు ఉంటే మీకు గుండెజబ్బు ఉన్నట్టే’ అని చెప్పడం మాత్రం సరికాదు. కాకపోతే ‘కొన్ని రకాల రెటినల్ మార్పులు కొన్ని అంశాలను సూచిస్తాయి’ అనే క్లూస్ ఆధారంగా భవిష్యత్తులో రాబోయే అనేక గుండె తాలూకు ముప్పులను ముందుగానే పసిగట్టడానికీ లేదా అంచనా వేయడానికి కన్ను ఓ హై–వే అవుతుందని మాత్రం చెప్పవచ్చు.మరి డయాబెటిస్ విషయమో...?మధుమేహం (డయాబెటిస్) విషయంలో కన్ను చెప్పే కథ ఇంకా ఆసక్తికరంగా, బలంగానూ ఉంటుంది. మధుమేహం వల్ల రెటీనాలోని అతి సూక్ష్మమైన రక్తనాళాలు దెబ్బతినడం వల్ల ‘డయాబెటిక్ రెటినోపతి’ అనే వైద్యసమస్య వస్తుందన్న విషయం కొంతమందికి తెలిసినప్పటికీ... చాలామందికి... ముఖ్యంగా పెద్దగా చదువుకోని పల్లెవాసులకూ, అంతగా వైద్యపరిజ్ఞానం లేనివారికి తెలియదు. కాబట్టి ఇలాంటి డయాబెటిస్ బాధితులకు చేసే కంటి పరీక్షల్లో కేవలం ‘కంటి చూపు ఎంత ఉంది?’ అని కాకుండా రక్తనాళాల్లో దీర్ఘకాలంగా ఉన్న అధిక చక్కెర స్థాయులు... కంటిలోని అతి చిన్న సూక్ష్మమైన రక్తనాళాలపై ఏ మేరకు దుష్ప్రభావం చూపాయి అన్న పరీక్ష కూడా! అలా డయాబెటిస్ ప్రభావాన్నీ కంటిలోకి చూసి అంచనా వేస్తారు.శరీరంలో ఎక్కువకాలంగా ఉన్న అధిక రక్తచక్కెర చిన్న రక్తనాళాలను ఎంత ప్రభావితం చేసిందో తెలుసుకునే ఒక ముఖ్యమైన మార్గం కూడా. డయాబెటిస్ అన్నది అతి చిన్న రక్తనాళాలపై ఎలాంటి ప్రభావం చూపిందో తెలుసుకోవడం ద్వారా దేహంలోని పెద్ద రక్తనాళాల ఆరోగ్యం గురించి కూడా మనకు కొన్ని సంకేతాలు ఇస్తుందంటూ గ్రహించగలరు. అందుకే ‘డయాబెటిక్ రెటినోపతీ తాలూకు తీవ్రతకూ... కార్డియోవాస్క్యులార్ సమస్యల తీవ్రతకూ ఉన్న సంబంధంపై కూడా కొందరు అధ్యయనవేత్తలు సునిశితంగా పరిశోధనలు చేస్తున్నారు.ఇప్పుడు... కృత్రిమ మేధ తోడ్పాటు కూడా... ఇప్పటివరకూ రెటీనా తాలూకు రక్తనాళాల చిత్రాలను చూసి డాక్టర్లు విశ్లేషిస్తూ వచ్చారు. అయితే ఇటీవల కృత్రిమ మేధ (ఏఐ) రంగంలోకి వచ్చాక.. అవే ఫోటోలను ఏఐ చేత కూడా విశ్లేషణ చేయిస్తున్నారు. సాధారణ మనుషులుగా డాక్టర్లు కొంత ఓ మేరకు విశ్లేషించగలిగితే... ఏఐకి అప్పటికే లక్షల సంఖ్యలో ఇచ్చిన డేటా అధారంగా అది... వేలాది అతి చిన్న ప్యాటర్న్‌లను కూడా విశ్లేషించగలదు. ఉదాహరణకు ఏఐ ఆధారంగా...రక్తనాళాలు ఏ మేరకు వెడల్పు అయ్యాయి.అవి ఎంతగా శాఖోపశాఖలుగా విస్తరించాయి (బ్రాంచింగ్ జరిగింది)ఎంతగా మెలికలు /ముడతలు/ఒంపులు తిరిగాయి (టార్టస్ అయ్యాయి)రక్తనాళాల్లోని ఏ ్రపాంతంలో వాటి మందం బాగా పలుచబడింది (వెసెల్ డెన్సిటీ తగ్గింది)... ఇలాంటి అనేక ఫీచర్లను ఏఐ తాలూకు మెషిన్ లెర్నింగ్ మోడల్స్ ద్వారా అవి విశ్లేషించడం మొదలు పెట్టేలా అనేక ఏఐ మోడల్స్‌ను అభివృద్ధిపరచే పనుల్లో ఇప్పుడు పరిశోధకులు ఉన్నారు.అబ్బురపరిచే విషయాలు అనేకం...2025లో ప్రచురితమైన ఒక వైద్యపరమైన సమీక్ష (స్కోపింగ్ రివ్యూ)లో 21 రెటినల్ అధ్యయనాలను పరిశోధకులు పరిశీలించారు. ఆ పరిశోధనల్లో కొన్ని ఏఐ తాలూకు అధ్యయనాలు చెప్పిన అంశాలివి...పదేళ్లలో ‘అథెరో స్కి›్లరోటిక్ కార్డియోవాస్క్యులార్ డిసీజ్’ అనే గుండెజబ్బు ముప్పు ఎంత ఉండవచ్చో తెలుసుకోవడం.కరొనరీ ఆర్టరీ డిసీజ్ (సీఏడీ) అనే గుండెజబ్బును కనిపెట్టడంభవిష్యత్తులో రాబోయే పెద్ద పెద్ద గుండెజబ్బులను (మేజర్ కార్డియోవాస్క్యులార్)ను ముందుగానే పసిగట్టడం వంటి అంశాలు చాలా ఆశాజనకమైన ఫలితాలు ఇచ్చాయి.ఈ పనిలో చాలా మెరుగైన ఖచ్చితత్వాన్ని చూపించాయి. దాంతో మున్ముందు గుండెజబ్బులను ఇంకా త్వరగా, ఇంకా సమర్థంగా, చాలా ముందుగానే పసిగట్టవచ్చనే ఆశాభావం పెరుగుతోంది. ఈ మేరకు ఇంకా క్లినికల్ ట్రయల్స్, ప్రమాణికాల రూపకల్పన అవసరం. అయితే ఇప్పటికి మాత్రం డాక్టర్లు.. ఆ ఏఐ విశ్లేషణను పూర్తిగా నమ్మకుండా, వాటిపైనే పూర్తిగా ఆధారపడకుండా... మళ్లీ తమవైన పరీక్షలూ, విశ్లేషణల ఆధారంగా అప్పుడు మాత్రమే తుది నిర్ధారణకు వస్తారు/వస్తున్నారు. ఓసీటీఏ అనేది మరో అద్భుతమైన సాంకేతికత...ఓసీటీఏ అనేది... ‘ఆప్టికల్ కొహెరెన్స్ టోమోగ్రఫీ యాంజియోగ్రపీ’ అనే ఇంగ్లిష్ పదాల తాలూకు సంక్షిప్త రూపం. సాధారణంగా ఫండస్ అనే కంటి పరీక్షలో వచ్చే ఫండస్ ఫొటోగ్రాఫ్‌లో రెటీనా కనిపిస్తుంది. ‘ఆప్టికల కొహెరెన్స్ టోమోగ్రఫీ’లో రెటీనా తాలూకు ΄÷రలను చాలా సూక్ష్మస్థాయిలో చూడటం సాధ్యమవుతుంది. అయితే ‘ఓసీటీఏ’లో రెటీనాలోని అత్యంత సన్నటి రక్తనాళాల్లో జరిగే రక్తప్రసరణ గురించి చాలా సునిశితమైన వివరాలు ఉంటాయి. 2025లోని ఓ అధ్యయనంలో రెటీనాలోని అత్యంత సూక్ష్మ రక్తనాళాలకూ, గుండెజబ్బులకూ (కార్డియో వాస్క్యులార్ డిసీజ్)కూ ఉన్న సంబంధాలను విశ్లేషించడం, సమీక్షించడం చేశారు. ఆ సమీక్షలో తెలిసినదేమిటంటే... భవిష్యత్తులో కంట్లోని అతి సూక్ష్మ రక్తనాళాల మ్యాపింగ్‌ను బట్టి అవి దేహంలోని గుండె ఆరోగ్యానికి క్లూస్ ఇస్తాయనే కాన్సెప్ట్‌కు మరింత బలం చేకూరుతుందని అధ్యయనవేత్తలు అంచనా వేస్తున్నారు.గుండె పరీక్షలు వర్సెస్ కంటి సూక్ష్మరక్తనాళాల పరిశీలన...- ఈసీజీ - ఎకో కార్డియోగ్రామ్ - టీఎమ్‌టీ - సీటీ కరోనరీ యాంజియోగ్రఫీ - కార్డియాక్ ఎమ్మారై - కొన్ని రకాల రక్త పరీక్షలు...ఇలాంటి గుండె తాలూకు వైద్యపరీక్షలన్నీ గుండెను లేదా కార్డియోవాస్క్యులార్ సిస్టమ్‌ను వేర్వేరు కోణాల్లో పరిశీలించి వేర్వేరు అంశాలను తెలుసుకుంటాయి లేదా గుండె ఆరోగ్యాన్ని అంచనా వేస్తాయి. అయితే రెటీనా మాత్రం తనలోని అత్యంత సూక్ష్మమైన రక్తనాళాల్లో జరిగే రక్తప్రసరణ (మైక్రోసర్క్యులేషన్) ఆధారంగా గుండె తాలూకు అనేక అంశాలను డాక్టర్లకు తెలియపరుస్తుందని చెప్పవచ్చు.దీన్ని బట్టి తెలిసేదేమిటంటే... భవిష్యత్తులో ఎవరైనా ఓ పేషెంట్ తన కళ్లను పరీక్షించుకోడానికి ఓ కంటి డాక్టర్ దగ్గరికి వెళ్తే... ఆయన కంటిని పరీక్షించి, దానికి తగిన చికిత్స ఇవ్వడంతో పాటు... ఆ డాక్టర్ మరో అదనపు సేవనూ అందించడానికి అవకాశముంది. అదేమిటంటే... ‘మీరొకసారి కార్డియాలజిస్ట్‌ను కలిసి... ఆయన సూచనల మేరకు కొన్ని గుండె పరీక్షలూ చేయించుకొని కార్డియాక్ ఎవాల్యూయేషన్ చేయించుకోండి’’ అని సూచించవచ్చు.చివరగా... ఇప్పటికి ఈ కంటి పరీక్షలన్నవి గుండె పరీక్షకు ప్రత్యామ్నాయం కాదు గానీ... మన కన్ను అనేది గుండె–రక్తనాళా వ్యవస్థలో దాగి ఉన్న కొన్ని సంకేతాలను ముందుగానే చూపించే ‘కిటికీ’ అని మాత్రం చెప్పవచ్చు. అంటే ఒకనాటికి కంటి పరీక్ష అంటే కేవలం చూపును పరీక్షించడం మాత్రమే కాకుండా... మన మొత్తం రక్తనాళాలతో పాటు గుండెనూ, దాన్ని ఆరోగ్యాన్ని అంచనా వేసేందుకూ ఉపయోగపడే అంశమని మాత్రం చెప్పవచ్చు.- డాక్టర్ ఎం.ఎస్.ఎస్. ముఖర్జీ, సీనియర్ కార్డియాలజిస్ట్నిర్వహణ: యాసీన్ -
డార్క్ లైట్ టు లైమ్లైట్
కాజియాకు నలుగురిలో కలవడం అంటే ఇష్టం. టీనేజీలోకి వచ్చిన తరువాత ఆ ఇష్టం వెనకడుగు వేసింది. ‘నల్లపిల్ల’ అని ఎవరైనా వెక్కిరిస్తారేమో అనే భయం ఆమెలో ఉండేది. ఆ భయం కాస్తా ఆత్మన్యూనతగా మారింది. ఆత్మన్యూనత నుంచి ఆత్మవిశ్వాసంలోకి వచ్చిన తరువాత తనను తాను అద్భుతంగా తీర్చిదిద్దుకుంది కేరళలోని మావెళిక్కరకు చెందిన కాజియా లిజ్ మెజో.తాజాగా...ఈ నెల 23న జైపూర్‌లో జరిగిన ఫైనల్లో కాజియా లిజ్ మెజో ‘మిస్ యూనివర్స్ ఇండియా’ కిరీటాన్ని గెలుచుకుంది. ‘మిస్ యూనివర్స్ ఇండియా’ టైటిల్‌ను గెలిచిన తొలి కేరళ మహిళగా చరిత్ర సృష్టించింది. నవంబర్‌లో ప్యూర్టోరికోలో జరగనున్న 75వ మిస్ యూనివర్స్ పోటీలో మన దేశానికి ప్రాతినిధ్యం వహించనుంది. 19 సంవత్సరాల కాజియా న్యాయశాస్త్ర విద్యార్థిని. దేశవ్యాప్తంగా 52 మంది మిస్ యూనివర్స్ పోటీలో పాల్గొన్నారు. వీరందరిలో కాజియా పిన్న వయస్కురాలు. వైష్ణవి గణేష్ ఫస్ట్ రన్నరప్‌గా, అనుశీ సాత్వలేకర్ సెకండ్ రన్నరప్‌గా నిలిచారు.అబుదాబి (యూఏఈ)లో పెరిగిన కాజియా ‘బేబీ షో’లో పాల్గొనడం ద్వారా చిన్న వయసులోనే రంగస్థలంపై మెరిసింది. ఆ తరువాత కాలంలో శాస్త్రీయ నృత్యం వైపు అడుగులు వేసింది. అందరిలాగే బాల్యం అంటే కాజియాకు చాలా ఇష్టం. ‘చిన్నపిల్లగా ఉన్నప్పుడు భయమనేదే ఉండదు. సరదాగా గడపడం, అందమైన దుస్తులు ధరించడం, కార్టూన్ ప్రపంచంలోకి దూరడం..ఇలాంటి అద్భుతాలెన్నో బాల్యంలో ఉంటాయి’ అంటుంది కాజియా.అభద్రత... ఆత్మన్యూనత...టీనేజ్‌లోకి అడుగుపెట్టిన కాజియా బాల్యంలోని సంతోషానికి దూరం అయింది. డిజిటల్ ప్రపంచంలోని సోకాల్డ్ సౌందర్య ప్రమాణాల వైపు మొగ్గు చూపడం వల్ల ఆత్మవిశ్వాసం కోల్పోయింది.‘నేను నలుపుగా ఉండడం వల్ల విపరీతమైన అభద్రతాభావానికి గురయ్యేదాన్ని. రకరకాల ఫెయిర్ నెస్ క్రీమ్‌ల యాడ్స్ చూస్తుండేదాన్ని. వాటిని చూసిన తరువాత నా శరీరాకృతి సరిగ్గా లేదు అనిపించేది.నా ప్రతి ఫొటోకు ఫిల్టర్స్ ఉపయోగించేదాన్ని. కళ్లను పెద్దవిగా చేయడానికి, చర్మపు రంగులను మార్చేదాన్ని’ గతాన్ని గుర్తు తెచ్చుకుంది కాజియా.మార్పు మొదలైంది...మొదట్లో నలుగురిలో కలవడానికి ఇష్టపడే కాజియా, ‘నేను నలుపుగా ఉంటాను’ అని అతిగా ఆలోచించడం వల్ల ఆత్మన్యూనతకు గురయ్యేది. నలుగురిలో కలవడానికి ఇబ్బంది పడేది. అద్దంలో తన ముఖం తనకే నచ్చకపోయేది. అయితే, కొంతకాలం తరువాత తనను తాను సమీక్షించుకోవడం వల్ల ఆ తరువాత కాలంలో కాజియాలో చాలా మార్పు వచ్చింది. ‘బాహ్య సౌందర్యం కంటే ఆత్మ సౌందర్యం గొప్పది’ అనే విషయాన్ని తెలుసుకుంది. ఆత్మన్యూనత పోయింది. ఆత్మవిశ్వాసం పెరిగింది. ఆ ఆత్మవిశ్వాసంతోనే మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది.విజయ పరంపర...ఆత్మవిశ్వాసం దిశగా తనను తాను తీర్చిదిద్దుకున్న కాజియా 2024లో ‘మిస్ టీన్ దివా’ టైటిల్ గెలుచుకోవడం ద్వారా అంతర్జాతీయ స్థాయి పోటీలకు మార్గం సుగమం చేసుకుంది. 2025లో ‘మిస్ టీన్ ఇంటర్నేషనల్’లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి మొదటి రన్నరప్‌గా నిలిచింది. ఆ తరువాత ‘మిస్ యూనివర్స్ కేరళ’ విజేతగా నిలిచింది.అలా జరగకూడదు...‘సోషల్ మీడియా చాలా కృత్రిమమైనది. ఆ కృత్రిమత్వపు మాయలో పడిపోవద్దు. ఆత్మవిశ్వాసం లేని పిల్లలను విషపూరిత భావాలతో భయపెడితే సమాజానికి మనం ఏం సందేశం ఇస్తున్నట్లు?’ అని ప్రశిస్తోంది కాజియా. తాను ఒకప్పుడు ఎదుర్కొన్న డిజిటల్ ఒత్తిడి ఎవరూ ఎదుర్కోవద్దు అంటుంది. పరిపూర్ణత (పర్ఫెక్షన్) కోసం పాకులాడే ధోరణిని ఆమె వ్యతిరేకిస్తోంది. పేజెంట్ పోటీదారులు అనుసరించే జీవనశైలిని అనుసరించడానికి కాజియా నిరాకరిస్తోంది.మల్టీ టాలెంట్...మోడల్, శాస్త్రీయ నృత్యకారిణి మాత్రమే కాదు కాజియా గాయని కూడా. డ్రమ్స్, వయోలిన్ వాయిస్తుంది. టెడెక్స్ వేదికలపై పర్యావరణ పరిరక్షణ నుంచి ఆత్మవిశ్వాసం వరకు రకరకాల అంశాలపై స్ఫూర్తిదాయకమైన ఉపన్యాసాలు ఇస్తోంది. మాలీవుడ్ సినిమా ‘షైలాక్’తో నటిగా తొలి అడుగులు వేసింది.‘నీ లక్ష్యాలు ఏమిటో ఒక నోట్‌బుక్‌లో రాసుకో’ అని కజియాను తల్లి ప్రోత్సహించేది. ‘హాలివుడ్ వాక్ఆఫ్ ఫేమ్‌లో చోటు సంపాదించాలి’....ఇలాంటి ఎన్నో లక్ష్యాలతో ఆ నోట్‌బుక్ నిండిపోయింది. పెద్ద కలలు కనే సాహసం ఆ రోజు నుంచే మొదలైంది.‘ఆ సాహమే నన్ను ఇక్కడికి వరకు తీసుకువచ్చింది’ అంటుంది కాజియా.నిశ్శబ్దమంటే...ఫైనల్ రౌండ్లో అడిగిన ‘మీ జీవితంలో నిశ్శబ్దానికున్న శబ్దాన్ని ఎలా వర్ణిస్తారు?’ అనే ప్రశ్నకు–‘‘నేను ఈ వేదిక పైకి వచ్చే ముందు వరకు ఇక్కడ అంతా నిశబ్దమే. నటిగా, డ్యాన్సర్‌గా, అందాల పోటీలపై ఆసక్తి ఉన్న అమ్మాయిగా ఇలాంటి వేదికపైనే ఎదిగాను. ఈ వేదిక పైకి వచ్చే ముందు నిశబ్దంగా, ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంట్లో ఉన్న అనుభూతి కలుగుతుంది. అలాంటి ప్రదేశంలోనే నేను ఉన్నాను, నా దేశంలో ఉన్నాను’’ అంటూ జవాబు ఇచ్చింది కాజియా.దేవుడు ఇచ్చే తోట!విజేత అంటే ఎవరో కాదు, ఒకసారి ఓడిపోయి గెలుపు కోసం మరోసారి ప్రయత్నించిన వ్యక్తి మాత్రమే. మీరు దేవుడిని ఒక పువ్వు అడిగారు. అది వెంటనే మీకు దొరక్క పోవచ్చు. గమనించాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే... ఒక పువ్వు కాదు, ఒక తోటే మీకు ఇవ్వడానికి దేవుడు ప్రయత్నాలు చేస్తున్నాడని! అయితే దేవుడు ఆ తోట ఇచ్చే వరకు మనం ఓపికగా ఉండాలి. ఆశాభావంతో ఉండాలి. సోషల్ మీడియాలో కనిపించేవాటిని చూసి గుడ్డిగా నమ్మకూడదు. అనుసరించకూడదు.– కాజియా -
ఆమెకు మిస్ యూనివర్స్ కిరీటాన్ని వరించేలా చేసిన ప్రశ్న ఇదే..!
కేరళకు చెందిన 19 ఏళ్ల కజియా లిజ్ మెజో మిస్ యూనివర్స్ ఇండియా 2026 కిరీటాన్ని గెలుచుకున్నారు. ఆదివారం జైపూర్‌లో జరిగిన అందాల పోటీల ఫైనల్లో 52 మంది అందగత్తెలను ఓడించి జాతీయ టైటిల్‌ను గెలుచుకున్నారు. కజియా లిజ్ మెజో కొత్త మిస్ యూనివర్స్ ఇండియా 2026గా నిలిచారు. అయితే ఆమె గెలుపుకి కారణమైన సన్నివేశంకి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌గా మారింది. అదేంటంటే అందులో కజియాకే కిరీటాన్ని కట్టబెట్టేలా చేసిన ఆసక్తికర ప్రశ్న అందర్నీ ఈమితంగా ఆకర్షించింది. నిజానికి మిస్ యూనివర్స్ ఇండియా ప్రకారం, ఈ ఏడాది ఫైనలిస్టులకు 20 ప్రశ్నలు ఇచ్చి..వారికి సమాధానాలు రాయడానికి 90 నిమిషాల సమయం ఇచ్చారు. అయితే కజియా రెండుప్రశ్నలకు ఇచ్చిన సమాధానం న్యాయనిర్థేతల మనసునే గెలుచుకుంది. అవేంటో చూసేద్దామా.యాక్ట్ నౌ వ్యవస్థాపకుడు, గ్లామనంద్ గ్రూప్‌లో సోషల్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ అయిన రాజీవ్ కె. శ్రీవాస్తవ మీ జీవితంలో నిశ్శబ్దం ధ్వనిని వర్ణించగలరా అని అడగగా..అందుకు కజియా ఇలా సమాధానం ఇచ్చింది. "నాకు, నిశ్శబ్దం అంటే, నేను కొద్ది నిమిషాల క్రితం ఈ వేదికపైకి ప్రవేశించే ముందు అనుభవించిన ప్రశాంతతనే నిశబ్దంగా విశ్వసిస్తా. ఎందుకంటే నేను ఒక శాస్త్రీయ నృత్యకారిణిగా, ఒక నటిగా, అందాల పోటీల ప్రేమికురాలిగా వేదికపైనే పుట్టి పెరిగాను. అందువల్ల ఈ వేదికపైకి అడుగు పెట్టే ముందు నిశ్శబ్దాన్ని, ప్రశాంతతను, అత్యంత ప్రశాంతమైన స్థితిని అనుభవిస్తాను. ఎందుకంటే అది నాకు నా సొంత ఇంట్లో ఉన్నట్లు అనిపిస్తుంది. నా దృష్టిలో, అదే నిశ్శబ్దం. అని ఆమె చాలా అద్భుతంగా చెప్పారామె. అలాగే కజియా తన తన దృష్టిలో అందం అంటే ఏంటో కూడా పంచుకున్నారు. ఆమె ఇలా అన్నారు, "నా దృష్టిలో, నిజమైన అందం అంటే దృఢ సంకల్పం; ధైర్యం, పదే పదే పైకి లేవాలనే నిశ్శబ్ద నిర్ణయం, ఏదైనా సాధించడానికి ముందే నమ్మకం ఉంచడం. అలాగే నా దృష్టిలో, అందమైన ఆత్మవిశ్వాసంతో ఉండటం అంటే సాహసంతో ఉండటమని అర్థం." అని సగర్వంగా చెప్పారామె. 👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) View this post on Instagram A post shared by Pageantomania | Beauty Pageant (@pageantomania)(చదవండి: ట్రావెల్ వీడియోల్లో ఇంత కిక్ ఉందా? ఏడాదికి రూ.85 లక్షలు ఆర్జించే ఉద్యోగాన్నే..) -
ఐఐటీ చదివి గూగుల్‌లో జాబ్ కొట్టాలనుకుంటే..ఏకంగా ఆ కంపెనీనే..!
చాలామంది యువత ఐఐటీలో చదవాలి మంచి టెక్ కంపెనీలో జాబ్ సంపాదించాలి అని కలలు కంటారు. అయితే అందరు ఆ డ్రీమ్‌ని నిజం చేసుకోలేరు. అది కొందరికే సాధ్యమవుతుంది. ఇక్కడ ఈ యువకుడు అలానే ఆ కలను నిజం చేసుకోలేకపోయాడు. కానీ ఆ కంపెనీని తనకు స్వాగతం పలికేలా సొంతంగా తనకంటూ మార్గాన్ని సృష్టించి ఆ డ్రీమ్‌ని నెరవేర్చుకున్నాడు. కష్టించి పనిచేస్తే..అనుకున్నది మరొకరకంగా సాధించి తీరుతామనేందుకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచాడు. అతడే భవిష్య రాఘవ్. పాఠశాలల రోజుల్లో విద్యార్థిగా ఉండగా తల్లిదండ్రులు అతడిపై ఎంతగానో ఆశలు పెట్టుకున్నారు. అతడు బాగా చదివి ఐఐటీలో సీటు సాధించి గూగుల్‌లో ఉద్యోగం సంపాదించాలని కోరుకునేవారు. అతడు కూడా అలానే అనుకున్నాడు. అయితే అన్నీ అనుకున్నట్లుగా జరిపోవు కదా..! ఇక్కడ రాఘవ్ ఐఐటీలో సీటు సాధించ లేకపోయాడు. ఇక గూగుల్‌లో కెరీర్ అనే మాటకే ఛాన్స్ ఏది అనుకున్నారు అంతా. కానీ అతడు తన డ్రీమ్‌ని వదిలేయాలని అనుకోలేదు. సొంతంగా కంటెంట్ క్రియేషన్ చేయడం ప్రారంభించి..తనకంటూ ఒక ప్రత్యేక కెరీర్ మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఒక పక్క నేర్చుకుంటూ..పనిచేస్తూ..నిరంతరం ప్రయత్నిస్తూ ముందుకుసాగాడు. ఈ రోజు ఏకంగా Google Pixel 11 Series ప్రత్యేక లాంచ్ ఈవెంట్‌కు స్వయంగా Google నుంచే ఆహ్వానం లభించింది రాఘవ్‌కి. ఆ విషయాన్నే ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసుకున్నాడు. తానుసాంప్రదాయ మార్గంలో గూగుల్‌ని చేరుకోలేకపోయా..కానీ తన ప్రత్యేక మార్గం ద్వారా అదే కంపెనీకి చేరుకుని కలలు ఎన్నటికీ చెదిరిపోవు అని నిరూపించగలిగానని ఆనందంగా చెబుతున్నాడు. తన కెరీర్లో ఊహించని మలుపుకి సంబంధించిన స్ఫూర్తిదాయక కథను షేర్చేస్తూ..గూగుల్ కార్యాలయంకి వెళ్లినప్పుడు దిగిన ఫోటోలను పంచుకున్నారు. View this post on Instagram A post shared by Bhavishya Raghav | Tech Gadgets (@bhavishyaa._) (చదవండి: ట్రావెల్ వీడియోల్లో ఇంత కిక్ ఉందా? ఏడాదికి రూ.85 లక్షలు ఆర్జించే ఉద్యోగాన్నే..) -
వీల్‌చైర్‌లో మహిళ పుల్ అప్స్..! వీడియో వైరల్
దివ్యాంగులు చూపే అసాధారణ ప్రతిభ, పట్టుదల ఎవ్వరినైనా ఇట్టే కట్టిపడేస్తాయి. అవయవాలన్నీ సక్రమంగా ఉన్నవారికంటే మెరుగ్గా అద్భుతంగా డేరింగ్ ఫీట్లు చేస్తూ ఆశ్చర్యపరుస్తుంటారు. తమ శారీరక పరిస్థితికి మించి చేసి ఆదర్శంగా నిలుస్తుంటారు. అలాంటి సూమర్వుమన్ ఈ మహిళ.ఒక దివ్యాంగురాలు జిమ్‌లో సవాలుతో కూడిన వ్యాయామానికి సిద్ధమవుతుంది. పలువురు మహిళలు ఆమె వీల్‌చైర్‌ను పుల్అప్ బార్ దగ్గర ఉంచడానికి సహాయం చేస్తారు. ఆమె ఆ తర్వాత చాలా అలవోకగా ఆ పుల్ అప్స్ చేస్తుంది. నిజానికి అక్కడున్న మహిళలు ఆ వ్యాయామాన్ని పూర్తి చేయగలదో లేదా అని అనుమానంగా చూస్తారు. కానీ ఆమె చాలా సునాయాసంగా వీల్‌చైర్‌లోనే కూర్చొని పుల్ అప్స్ చేస్తుంటుంది. మొదట్లో సంకోచించినప్పటికీ..విజయవంతంగా ఆ వ్యాయామాన్ని పూర్తి చేయడమే గాక ఇంకా కొనసాగించాలనే ఉత్సుకతత కనిపిస్తుంటుంది. వీడియో చివర్లో ఆమె తన లక్ష్యాన్ని పంచుకోవడం విశేషం. తాను ఏడాది ముగిసేలోపు 10 పుల్ అప్లు చేయడమే తన లక్ష్యం అని చెప్పింది. ఈ వీడియోక్లిప్ ఆమె బలాన్ని మాత్రమే కాకుండా, ఆమె చుట్టూ ఉన్న మహిళలు మద్దతుగా నిలబడం అందర్నీ తెగ ఆకర్షించింది. నెటిజన్లు ఇది పూర్తిగా నివ్వెరపరిచే విషయం, నిజంగా ఆమె ‘సూపర్‌వుమన్’ అని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Abril Alfaro (@abrilalfarox) (చదవండి: ట్రావెల్ వీడియోల్లో ఇంత కిక్ ఉందా? ఏడాదికి రూ.85 లక్షలు ఆర్జించే ఉద్యోగాన్నే..) -
ఏడాదికి రూ.85 లక్షలు ఆర్జించే ఉద్యోగాన్ని కాదని ట్రావెల్ వీడియోలు..!
రిస్క్ ఈ వయసులో కాకుంటే ఇంకెప్పుడు తీసుకుంటారు అని అంటుంటారు పెద్దలు. కొన్ని సమయాల్లో డేర్‌గా నిర్ణయాలు తీసుకుంటేనే లైఫ్ టర్న్ అవుతుంది. కొన్ని సమయాల్లో మంచి పొజిషన్లో ఉన్నా..మనశ్శాంతి, ఆత్మసంతృప్తి కోసంకొందరు తమకు నచ్చిన రంగంలో కొనసాగుతుంటారు. అంతకుముందు జీవితంలోలా మంచి హోదా, ఎక్కువ జీతం లేకపోయినా..అందులోనే కొనసాగి తమ ఆనందాన్ని వెతుక్కుంటుంటారు. అలాంటి వ్యక్తే ఈ టెకీ. కానీ ఈ వ్యక్తి చేసిన అతిపెద్ద సాహసం తెలిస్తే విస్తుపోతారు. అంత మంచి వేతనాన్ని ఎలా వదుకోగలిగాడు అని కచ్చితంగా ఆశ్చర్యపోతారు. అతడే సాక్షమ్ రాజ్ సేథ్. అతడొక టెక్ నిపుణుడు. ట్రావెల్ కంటెంట్ క్రియేటర్‌గా పూర్తి స్థాయిలో కొనసాగాలనే ఉద్దేశ్యంతో ఏటా రూ. 85 లక్షలు పైనే ఆర్జించే ప్యాకేజ్ని తృణప్రాయంగా వదిలేశారు. ఆయన అంతపెద్ద సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నప్పటికీ..ఆయన భాగస్వామి స్మృతి సిదానా మాత్రం సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా నెలకు రూ. 1.5 లక్షల జీతంతో తన ఉద్యోగాన్ని కొనసాగిస్తుందామె. అయితే సాక్షమ్ ఈ నిర్ణయం తీసుకోవడానికి ఉద్యోగం నచ్చకపోవడం లేదా పనిచేయడం ఆపేయాలనో కాదు. కాలక్రమేణం జీవిత ఏదో యాంత్రికంగా మారిపోతున్న ఫీల్ కలిగి తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మంచి ఆదాయం వస్తున్నప్పటికీ తనకు నచ్చినట్లుగా సమాయన్ని గడిపే స్వేచ్ఛ లేకపోతున్నట్లు అనిపించి ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తాను అధిక జీతం కంటే స్వేచ్ఛ, కొత్త అనుభవాలకే ప్రాధాన్యత ఇస్తానన్నారు. View this post on Instagram A post shared by Smriti & Saksham ✈️ Adventure Couple (@smritiandsaksham) తాము అప్పటికే ట్రావెల్ కంటెంట్‌ని రూపొందిస్తుండటంతో..రిస్క్ తీసుకుని పూర్తి స్థాయిలో దీనిలో కొనసాగాలని నిర్ణయించుకున్నానని అన్నారు. ఈ నిర్ణయం ఒక్క రాత్రిలో తీసుకున్నది కూడా కాదని చెప్పారు. నిజానికి ఏకంగా రూ. 85 లక్షల జీతం వదిలేయడం అంటే..ఆర్థిక భద్రతను, సౌకర్యమంతమైన జీవనశైలిని స్వచ్ఛందంగా వదులుకోవడం, పైగా అనిశ్చితితో కూడిన మార్గాన్ని ఎంచుకోవడం లాంటిదని ఆయన పేర్కొన్నారు. ఇక్కడ అనిశ్చితి అనేది అతిపెద్ద సవాలని, ఎందుకంటే..మంచి వేతనం అందించే ఉద్యోగాన్ని వదులుకోవడం సులువు గానీ, అంతే స్థిరమైన మరో ఆదాయ వనరు ఎప్పటికీ కష్టమేనని అన్నారు. తాను సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా సంపాదించిన దానికి ప్రస్తుతం కంటెంట్ క్రియేటర్‌గా పొందే వేతనానికి ఏమాత్రం పోలిక ఉండదు. ఇలాంటి నిర్ణయాన్ని కచ్చితంగా ఆర్థికంగా వెనుకడుగు వేయడంగానే పేర్కొనవచ్చు. పైగా ఈ కొత్త కెరీర్లో విజయం సాధించాలనే ఒత్తిడి కూడా చాలా ఎక్కువుగా ఉంటుందని సాక్షమ్ అన్నారు. కంటెంట్ క్రియేషన్‌లో స్థిరమైన జీతం, గ్యారెంటీ లేని ఎదుగుదల లేదా నిర్దిష్టమైన కెరీర్ మార్గం ఉండవని అంగీకరించారు. ఈ వృత్తిలో నిరంతరం కంటెంట్‌ని రూపొందిస్తూ..కొత్త ఆలోచనలతో ప్రయోగాలు చేయడం, బ్రాండ్లను సంప్రదించడం వంటివి ఉంటాయి. ఇక్కడ ప్రయాణాలను శాశ్వత సెలవుల్లా పరిగణించలేమని అన్నారు. ఎందుకంటే కంటెంట్ క్రియేషన్, ఆర్థిక వ్యవహారాలు, వ్యక్తిగత సమయాన్ని సమతుల్యం చేసుకోవడం వంటివి నేర్చుకోవాలి. ఇక ఆయన భార్య స్మృతి వృత్తిరీత్యా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా..పార్ట్‌టైమ్‌గా ప్రయాణ జీవనశైలికి సంబంధించిన కంటెంట్‌ను కూడా సృష్టిస్తుంది. తమ జీవితం మరింత అనిశ్చితంగా మారినప్పటికీ, అది మరింత సార్థకంగా కూడా అనిపిస్తోందని ఆమె పేర్కొంది. ఇక తన భర్తలో వచ్చిన అతిపెద్ద మార్పు సమయంపై చక్కటి నియంత్రణ కలిగి ఉండటమేనని అన్నారు. ఆయన ఇప్పుడు తన రోజుని ఎలా గడాపాలనుకుంటున్నాడో స్వేచ్ఛగా నిర్ణయించుకోగలడు. అయితే ఈ జీవనశైలిని అస్సలు ఆదర్శంగా భావించొద్దని హెచ్చరించారు. ఎందుకంటే..పూర్తికాల క్రియేటర్‌గా ఉండటం కూడా ఒక పనే. ఇందులో షూట్లు, ఎడిటింగ్, బ్రాండ్ సంప్రదింపులు, ప్రణాళిక, పిచింగ్, ప్రజలు చూడాలనుకునేదాన్ని నిరంతరం సృష్టించాలనే ఒత్తిడివంటివి ఉంటాయంటూ..సోషల్ మీడియా వేదికగా తమ జీవనశైలిని వివరించారు. ఇక్కడ ప్రయణాలు మనుషుల ఆలోచన విధానాన్ని, జీవితం పట్ల వారి దృక్పథాన్నే మార్చే శక్తిని కలిగి ఉంటాయనే విషయాన్ని చాటిచెప్పాయి. View this post on Instagram A post shared by Smriti & Saksham ✈️ Adventure Couple (@smritiandsaksham) (చదవండి: ఆమె అందరిలాంటి బామ్మ కాదు..! 44 ఏళ్ల వయసులో ఎంటెక్, పీహెచ్డీ..) -
ప్రకృతి తన రహస్యాలను దాచుకున్న 5 అద్భుత ప్రదేశాలు!
ఒక చోట చెట్ల వేర్లు వంతెనలుగా మారుతాయి. మరొక చోటు నీటిపై తేలుతున్న ద్వీపాలు కనిపిస్తాయి. ఇంకొక చోటు పూలతో నిండిన లోయలు, ఆకాశాన్ని తాకిన సరస్సులు, వర్షం వచ్చినప్పుడు రంగులు మార్చుకునే మైదానాలు, లోయలు కనిపిస్తాయి. ప్రకృతి తన రహస్యాలను దాచుకున్న ప్రదేశాలు భారతదేశంలో ఎన్నో ఉంటాయి.ఈ ఐదు ప్రదేశాలు అలాంటి ప్రకృతి అద్భుతాలే. మేఘాలయలోని సజీవ వేర్ల వంతెనల నుంచి మహారాష్ట్రలోని కాస్ పీఠభూమి వరకు ప్రతి ప్రదేశంలో ప్రకృతి మనకు కొత్త రూపంలో కనిపిస్తుంది.త్సో మోరీరి సరస్సులడఖ్ అంటే చాలా మందికి ప్యాంగాంగ్ గుర్తొస్తుంది. కానీ చాంగ్థాంగ్లో ఉన్న త్సో మోరీరి ఒక ప్రశాంతమైన అనుభవాన్ని ఇస్తుంది. సుమారు 4,500 మీటర్ల ఎత్తులో, చుట్టూ కొండల మధ్య నీలం రంగులో విస్తరించిన ఈ సరస్సు ఒక పెద్ద ప్రకృతి చిత్రంలా కనిపిస్తుంది.లేహ్ నుంచి త్సో మోరీరి వైపు ప్రయాణం చేస్తుంటే భూదృశ్యం పూర్తిగా మారిపోతుంది. రాళ్లు, గడ్డి మైదానాలు, దూరంగా కనిపించే హిమ శిఖరాల మధ్య చివరికి సరస్సు కనిపించిన క్షణం మర్చిపోలేని దృశ్యంగా మిగిలిపోతుంది. కోర్జోక్ గ్రామం, కోర్జోక్ మఠం, సరస్సు చుట్టూ తిరిగే వలస పక్షులు ఈ ప్రదేశంలో ప్రత్యేక జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. చాంగ్పా సంచార జీవన విధానాన్ని కూడా చూసే అవకాశం లభిస్తుంది.నీళ్లపై తేలే జీవితంమణిపూర్లోని లోక్టక్ సరస్సును మొదటిసారి చూసినప్పుడు అది ఒక పెద్ద సినిమాటిక్ సీన్లా, ఒక కొత్త సముద్రంలా అనిపించవచ్చు. కానీ దగ్గరగా చూస్తే ఆ నీళ్లపై చిన్న చిన్న తేలియాడే ద్వీపాలు కనిపిస్తాయి. వీటిని ఫుమ్డీలు అంటారు. వాటిపై ఇళ్లు, జీవనం, చేపల వేట అన్నీ ఉంటాయి. ఇది ఒక ప్రత్యేక ప్రపంచంలా అనిపిస్తుంది.ఇంఫాల్ నుంచి సుమారు 48 కిలోమీటర్ల దూరంలో ఉన్న లోక్టక్, ఈశాన్య భారతదేశంలో అతి పెద్ద మంచినీటి సరస్సు. అదే సరస్సులో కీబుల్ లాంజోవా జాతీయ ఉద్యానవనం ఉండటం మరో అద్భుతం. ప్రకృతి, నీరు, జీవన విధానం కలిసి ఒక చిత్రంలా కనిపించే అందమైన ప్రదేశం ఇది.మేఘాలు నివసించే లోయనాగాలాండ్, మణిపూర్ మధ్య ఉన్న జుకోవ్ లోయను చూస్తే భూమిపై ఒక పచ్చని సముద్రం పరుచుకున్నట్టు అనిపిస్తుంది. సుమారు 2,452 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ లోయలో సీజనల్ పూలు, వెదురు తోటలు, చిన్న చిన్న సెలయేర్లు అందంగా ఉంటాయి.హైదరాబాద్ నుంచి ప్రయాణం మొదలు పడితే ముందుగా నాగాలాండ్ చేరుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రయాణంలో ఈశాన్య భారతదేశపు భూదృశ్యం మెల్లిగా మారుతుంది. నాగాలాండ్ కొండలు దగ్గరవుతున్న కొద్దీ రోడ్డు ప్రయాణంలోనే ప్రకతి తన రంగులను మార్చుకుంటూ వస్తుంది.జుకోవ్లో ఒక రోజు గడపడం అంటే కేవలం ట్రెక్కింగ్ అనుభవం మాత్రమే కాదు. మేఘాల లోయలో నిలిచిపోయిన సమయం, గాలిలో వెదురు ఆకుల శబ్దం, దూరంగా కనిపించే కొండలు ఇవన్నీ కలిసి ఒక అందమైన నిశ్శబ్దాన్ని సృష్టిస్తాయి. ఎండాకాలంలో కనిపించే ప్రత్యేక జుకోవ్ లిల్లీ ఈ ప్రదేశానికి మరో గుర్తింపు ఇస్తుంది.ఎలా వెళ్లాలి?హైదరాబాద్ నుంచి ఈ ఐదు గమ్యస్థానాలకు వెళ్లే మార్గం అనేది గమ్యస్థానాన్ని బట్టి మారుతుంది. మేఘాలయ, మణిపూర్, నాగాలాండ్ ప్రాంతాలకు మీరు గువాహటి, ఇంఫాల్, దిమాపూర్ నుంచి చేరుకోవచ్చు. లడఖ్ వెళ్లేందుకు హైదరాబాద్ నుంచి లేహ్ చేరుకుని, అక్కడి నుంచి చాంగ్‌థాంగ్ వైపు రోడ్డు ప్రయాణం చేసి వెళ్లవచ్చు. ఈ ప్రయాణం చాలా మందికి నచ్చుతుంది. కాస్ పీఠభూమికి పుణే లేదా సతారా మార్గంలో వెళ్లడం అనుకూలంగా ఉంటుంది.ఆసక్తికరమైన విషయాలులివింగ్ రూట్ బ్రిడ్జ్‌లు అనేవి మేఘాలయలోని ఖాసీ, జైంటియా సామాజిక వర్గాల ప్రజలు ప్రకృతితో కలిసి పెంచిన సజీవ నిర్మాణాలు.లోక్టక్ సరస్సు అనేది ఈశాన్య భారతదేశంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు. ఇందులో కనిపించే ఫుమ్డీలు దీనికి ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయి.జుకో లోయ అనేది నాగాలాండ్, మణిపూర్ సరిహద్దు ప్రాంతంలో ఉన్న లోయ. సీజనల్ పూలతో పాటు జుకోవ్ లిల్లీకి ప్రసిద్ధి.త్సో మోరీరి చాంగ్‌థాంగ్ ప్రాంతంలో సుమారు 4,500 మీటర్ల ఎత్తులో ఉన్న అందమైన, ఎత్తైన ప్రాంతంలోని సరస్సు.కాస్ పీఠభూమి అనేది పశ్చిమ కనుమల్లోని జీవవైవిధ్య ప్రాంతంగా గుర్తింపు పొందింది. ఈ పీఠభూమి యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందింది.దక్షిణాది పూల లోయమహారాష్ట్రలోని సతారా దగ్గర ఉన్న కాస్ పీఠభూమిని మహారాష్ట్రలోని పూల లోయ అని కూడా పిలుస్తారు. వర్షాకాలం తరువాత ఈ పీఠభూమిపై వందల రకాల పూలు ఒకేసారి విరిసి, భూమి మొత్తం రంగుల తివాచీలా మారుతుంది. 1200 మీటర్ల ఎత్తులో ఉన్న కాస్‌లో 850 కిపైగా పూల జాతి మొక్కలు ఉంటాయి.హైదరాబాద్ నుంచి పూణే వైపు ప్రయాణం చేసి, అక్కడి నుంచి సతారా మార్గంలో సాగాల్సి ఉంటుంది. పశ్చిమ కనుమల మధ్య సాగే ఈ ప్రయాణం ఒక ప్రత్యేక అనుభవంగా మిగిలిపోతుంది. ఆగస్ట్ నుంచి అక్టోబర్ మధ్య పూల సీజన్ లో ఈ పీఠభూమి పూర్తిగా మారిపోతుంది. దగ్గరలోని కాస్ సరస్సు, బమ్నోలి, ఠోసేఘర్ జలపాతాలు, సజ్జన్ గడ్ లాంటి ప్రదేశాలు ఈ ప్రయాణంలో ప్రత్యేక ఆకర్షణలుగా మిగిలిపోతాయి.ఏం తినాలి?మేఘాలయలో స్థానిక ఖాసీ వంటకాలు, మణిపూర్‌లో అన్నంతో తయారు చేసే సంప్రదాయ వంటకాలు, నాగాలాండ్‌లో స్థానిక మాంసాహార వంటకాలు, లడఖ్‌లో తుక్పా, మోమోలు, మహారాష్ట్రలో కంది పెఢా, పిట్లా, ఇతర స్థానిక మహారాష్ట్ర వంటకాలు మీ ప్రయాణానికి రుచికరమైన అనుభూతిని ఇస్తాయి.వేర్లతోనే వంతెనలు మేఘాలలో ఖాసీ ప్రజల జీవన విధానం ప్రకతితో మమేకమైన జీవన విధానం. దీనికి సాక్షాలే సజీవ వేర్ల వంతెనలు. ఫికస్ ఎలాస్టికా చెట్ల వేర్లను సంవత్సరాల పాటు పెంచి, నది రెండు వైపుల కలిసేలా తయారు చేసిన ఈ వంతెనలు కాంక్రీట్ నిర్మాణంలా బలంగా ఉంటాయి. కొన్ని వంతెనలు వందేళ్ల పాటు నిలిచి ఉన్నాయని మేఘాలయ పర్యాటక శాఖ చెబుతుంది.నాంగ్రియాట్, సోహ్రా, మాలినాంగ్ ప్రాంతాల్లో ఇలాంటి వంతెనలను చూడవచ్చు. పచ్చని అడవుల్లో నడుస్తుంటే కింద ప్రవహిస్తున్న నీటి మధ్య వేర్లు కలిసి వంతెనలా మారడం చూస్తే, మనిషి, ప్రకృతి మధ్య ఉన్న అనుబంధం ఎలాంటిదో అర్థం అవుతుంది.ఎక్కడ ఉండాలి?లివింగ్ రూట్ బ్రిడ్జ్‌ల సమీపంలో గ్రామీణ హోమ్‌స్టేలు, లోక్టక్ సరస్సు వద్ద సరస్సు ఒడ్డున ఉండే వసతి సౌకర్యాలు, జుకో లోయ ప్రయాణంలో పర్వత రహదారులు కనిపించే వసతి ప్రదేశాలు బాగుంటాయి.త్సో మోరీరి సమీపంలోని కొర్జోక్లో అతిథి గృహాలు, క్యాంపులు అందుబాటులో ఉంటాయి. కాస్, సతారా ప్రాంతంలో హోటళ్లు, హోమ్‌స్టేలు ఉంటాయి. ప్రతీ గమ్యస్థానంలో బస చేయడం కూడా ఒక జ్ఞాపకంగా మారిపోతుంది.ఏం చూడాలి?లివింగ్ రూట్ బ్రిడ్జ్‌ల మధ్య ప్రవహించే నీరు, లోక్టక్ సరస్సులో తేలియాడే ఫుమ్డీలు, జుకో లోయలో కనిపించే సీజనల్ పూలు, త్సో మోరీరి నీలిరంగు సరస్సు, కాస్‌లో విరబూసే సీజనల్ పువ్వులుం ఈ ఐదు గమ్యస్థానాల్లో మీరు ఎక్కడా ప్రయాణ అనుభూతిని మిస్ అవరు. ఈ గమ్యస్థానాలను వేగంగా చుట్టేయాలని కాకుండా ప్రశాంతంగా ఆస్వాదించడానికి ్రపాధాన్యత ఇవ్వండి.సందర్శనీయ ప్రదేశాలుఈ ఐదు ప్రదేశాలలో ఒక్కో ప్రదేశం ఒక్కో అనుభూతిని ఇస్తుంది. మేఘాలయలో మనిషి చేతులతో పెంచిన వేర్ల వంతెనలు ప్రకృతిని ఇబ్బంది పెట్టకుండా జీవితాన్ని కొనసాగించే సందేశాన్ని అందిస్తాయి. అలాగే లోక్టక్లో నీటిపై జీవితం, జుకోలో పూల మధ్య మేఘాలు, త్సో మోరీరిలో ఆకాశం సరస్సులో ప్రతిబింబించడం, వర్షాల తరువాత భూమి పూలనే అక్షరాలుగా మార్చుకుని మాట్లాడటం ఇవన్నీ తప్పకుండా జీవితాంతం గుర్తుండిపోయే అనుభవాలే కదా.యాక్టివిటీస్ఈ ప్రయాణంలో రూట్ బ్రిడ్జ్‌పై నడవడం, లోక్టక్ సరస్సులో తేలియాడే ప్రకతి దశ్యాలను చూడటం, జుకో లోయలో మేఘాల మధ్య నడవడం, త్సో మోరీరి సరస్సు తీరంలో పర్వతాల ప్రతిబింబాలను ఆస్వాదించడం, కాస్‌లో సీజనల్ పూల మధ్య ప్రకృతిని గమనించడం ఇవన్నీ ఒక ప్రత్యేక జ్ఞాపకంగా మిగిలిపోతాయి.యాత్ర, బడ్జెట్ వివరాలుఐదు రోజుల ట్రిప్‌లో బడ్జెట్ అనేది గమ్యస్థానాన్ని బట్టి మారిపోతుంది. హైదరాబాద్ నుంచి విమానంలో ప్రయాణించడం, స్థానిక రవాణా, బస, ఆహారం అన్నీ కలిపి బడ్జెట్ ప్రయాణానికి సుమారు రూ.25,000 నుంచి రూ.35,000 వరకు ఖర్చు అవ్వొచ్చు.సాధారణ స్థాయి ప్రయాణ బడ్జెట్‌తో వెళ్తే రూ.40,000 నుంచి రూ.60,000 వరకు, ప్రత్యేకమైన ప్రయాణ అనుభవానికి అయితే రూ.70,000కు పైగా ఖర్చు కావచ్చు. త్సో మోరీరి, జుకో లోయ, లివింగ్ రూట్ బ్రిడ్జ్‌ల వంటి ప్రాంతాల్లో స్థానిక రవాణా, బస ఆధారంగా బడ్జెట్ పెరిగే అవకాశం కూడా ఉంటుంది.బస విషయానికి వస్తే ఒక్క రాత్రికి రూ.1,000–4,000 మధ్యలో బడ్జెట్ పెట్టుకోవడం మంచిది. ప్రీమియం హోటళ్లకు మరింత ఖర్చు కావచ్చు. ఆహారం కోసం రోజుకు సుమారు రూ.500 నుంచి రూ.1,000 వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. మీ రుచికి, ఎంపికకు అనుగుణంగా ఈ ఖర్చులు మారుతాయి.- ఎం.జి. కిశోర్, ప్రయాణికుడుఇవి కూడా చదవండి: బ్రహ్మపుత్రను ‘రెడ్ రివర్’ అని ఎందుకు అంటారో తెలుసా? -
పాండవుల ధనుస్సులు, శంఖాల పేర్లు
మహా భారత యుద్ధంలో పాండవులు, ముఖ్యంగా యుద్ధానికి దిశ, దశ చూపిన శ్రీ కృష్ణ పరమాత్మ తదితరులు ఉపయోగించిన ధనుస్సులు, శంఖాల పేర్లు మీకు తెలుసా...? శ్రీ కృష్ణుని ధనుస్సు పేరు శారంగం...శంఖం పేరు పాంచజన్యంధర్మరాజు ధనుస్సు పేరు మహేంద్ర... శంఖం పేరు అనంత విజయం, భీముని ధనుస్సు పేరు వాయువ్య. అయితే చాలా మంది భీముడు గదతోనే యుద్ధం చేసాడని అనుకుంటారు. ఆ గద పేరు వృకోదర. అంతేకాకుండా భీముడు గొప్ప మల్ల యోధుడు కూడా. కాగా భీముని శంఖం పేరు పౌండ్రం. అర్జునిని ధనుస్సు పేరు గాండీవం. శంఖం పేరు దేవదత్తం. నకులుడి ధనుస్సు పేరు వైష్ణవ శంఖం పేరు సుఘోషం. సహదేవుని ధనుస్సు పేరు అశ్వివ. శంఖం పేరు మణి పుష్పకం. అభిమన్యుని ధనుస్సు పేరు రౌద్ర.ఘటోత్కచుని ధనస్సు పేరు పౌలస్త్రయ.కాగా కురుపితామహుడైన భీష్ముని శంఖం పేరు శైశాంక. ధుర్యోధనుని గద పేరు కౌముది. కర్ణుని ధనుస్సు పేరు విజయ. శంఖం పేరు హిరణ్యగర్భ.– సి.ఎన్. మూర్తి, సీనియర్ పాత్రికేయులు -
దృష్టి కొద్దీ సృష్టి!.
వేదాంత దృష్టిలో చూస్తే, సృష్టికి స్వతహాగా మంచి, చెడు అనేవి లేవు. అది ఒక ఖాళీ కాన్వాస్ లాంటిది. మనం ఏ రంగు కళ్ళద్దాలు పెట్టుకుని చూస్తే, ప్రపంచం మనకు ఆ రంగులోనే కనిపిస్తుంది. అద్దం మీద దుమ్ము పడితే మన ముఖం అందులో స్పష్టంగా కనిపించదు. అలాగే, మనస్సు అనే అద్దం మీద ‘కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు’ అనే దుమ్ము చేరినప్పుడు ఈ ప్రపంచంలోని సౌందర్యం, మంచితనం మనకు కనిపించవు.మహాభారతంలో దుర్యోధనుడికి లోకంలో ఒక్క మంచివాడు కూడా కనిపించకపోవడం, ధర్మరాజుకు ఒక్క చెడ్డవాడు కూడా దొరకకపోవడం కేవలం ఒక కథ కాదు. ధర్మరాజు మనస్సు దయ, క్షమ, సత్యం, నిష్కామంతో నిండి ఉంది. అతని చిత్తం స్వచ్ఛంగా ఉంది. అందుకే ఆయనకు ప్రతి మనిషిలోనూ ఏదో ఒక సుగుణం కనిపించింది. చివరకు తనలో ఎక్కడో దాగి ఉన్న చిన్న చిన్న లోపాలను భూతద్దంలో చూసుకుని, తనకంటే చెడ్డవారు లేరని అంగీకరించగలిగాడు. జగత్తు అనేది మన మనస్సుకు ప్రతిబింబం మాత్రమే అన్న పరమ సత్యాన్ని ఈ ఘట్టం తేటతెల్లం చేస్తుంది. ఈ ‘ఆత్మ పరిశీలన’ ఆధ్యాత్మిక సాధనలో తొలిమెట్టు. మనకు ఎదుటివారిలో కేవలం లోపాలే కనిపిస్తున్నాయంటే, లోపం వారిలో లేదు, చూసే మన దృష్టిలో ఉందని గ్రహించాలి.మంచిని నిర్మించడం ఒక సుదీర్ఘ ప్రక్రియ. దానికి వనరులు, సమయం, అధికారం, వ్యవస్థల మద్దతు, చాలా మంది సహకారం కావాలి. ఒక సామాన్యుడు ఒంటరిగా ఒక గొప్ప వ్యవస్థను రాత్రికి రాత్రే నిర్మించలేక పోవచ్చు. చెడును నిరసించడం ఒక తక్షణ బాధ్యత. దీనికి వనరులు అక్కర్లేదు. కేవలం నైతిక బలం, ‘ఇది తప్పు‘ అని చెప్పే ధైర్యం, నిజాయితీ ఉంటే చాలు. ఒకరు ధైర్యంగా గొంతెత్తితే, అది ఎంతో మందిలో స్ఫూర్తిని రగిలిస్తుంది. ఆ చెడుకు అక్కడితో ఒక అడ్డుకట్ట పడుతుంది.భగవద్గీతలో శ్రీ కృష్ణుడు చెప్పినట్లు కర్మయోగి అన్నింటినీ సమానంగా చూస్తాడు. ఎవరైనా తప్పు చేసినా, వారి పరిస్థితులను అర్థం చేసుకుని క్షమించగలగడం ధర్మరాజు లక్షణం. అది అంతర్గత శాంతికి మార్గం. ప్రపంచాన్ని మార్చడం మన చేతుల్లో లేదు, కానీ ప్రపంచాన్ని చూసే మన ‘దృష్టిని‘ మార్చుకోవడం పూర్తిగా మన చేతుల్లోనే ఉంది. మనం మారితే మన చుట్టూ ఉన్న ప్రపంచం దానంతట అదే మారుతుంది. లోపాలను వెతికే దుర్యోధనుడి దృష్టి నుండి, గుణాలను చూసే ధర్మరాజు స్థాయికి మన మనస్సును ఎదిగేలా చేసుకోవడమే నిజమైన ఆధ్యాత్మిక ప్రయాణం.– తరిగొప్పుల విఎల్లెన్ మూర్తి -
ప్రశాంతతే ఆరోగ్యానికి మూలం
మనిషి జీవితం బయట కనిపించే దానికంటే లోపల జరిగేదే ఎక్కువ. నవ్వుతున్న ముఖాల వెనుక ఎన్నో మౌనవేదనలు దాగి ఉంటాయి. చుట్టూ మనుషులు ఉన్నా, లోపల ఒంటరితనం వెంటాడుతుంటుంది. శరీరం అలసిపోయిందంటే విశ్రాంతి కోరుకుంటుంది. కానీ మనసు అలసిపోతే జీవితం మొత్తమే భారంగా అనిపిస్తుంది. అందుకే మానసిక ప్రశాంతత మనిషి ఆరోగ్యానికి అసలైన పునాది.ఇప్పటి ప్రపంచం వేగంగా పరుగులు పెడుతోంది. అయితే ఆ పరుగులో మనిషి తన మనసునే వెనక్కి వదిలేస్తున్నాడు. ఉదయం కళ్లుతెరిచిన క్షణం నుంచే ఆలోచనల రభస మొదలవుతుంది. ఎంత సంపాదించాలి? ఎలా నిలబడాలి? ఇతరులకంటే ఎలా ముందుండాలి? అనే పోటీ భావన మనిషిని నిరంతరం మానసిక ఒత్తిడిలోకి నెట్టేస్తోంది. ఈ ఆందోళనల మధ్య ప్రశాంతంగా జీవించడం కూడా ఒక కళగా మారిపోయింది. మనసు అనేది విచిత్రమైన ప్రపంచం. ఒక్క క్షణంలో ఆకాశమంత ఆనందంలో విహరిస్తుంది. మరోక్షణంలోనే అగాధమైన నిరాశలోకి జారిపోతుంది. గత జ్ఞాపకాలను మళ్లీ మళ్లీ తడిమి చూస్తుంది. జరిగిపోయిన సంఘటనలను వదలలేక బాధపడుతుంది. రానున్న భవిష్యత్తును ఊహిస్తూ భయపడుతుంది. ఈ రెండిటి మధ్య వర్తమానాన్ని ఆస్వాదించడం మరిచిపోతుంది. అందుకే మనిషి జీవితం బయట కంటే మనసులోనే ఎక్కువగా అలసిపోతుంది.మనిషి ఎదుర్కొనే ప్రతి బాధకు కారణం పరిస్థితులే కావు. ఆ పరిస్థితులను మనసు స్వీకరించే విధానం కూడా కారణమే. చిన్న అపజయాన్ని జీవితాంతం మోస్తూ ఉండటం, ఇతరుల మాటలను గుండెల్లో పెట్టుకోవడం, ప్రతి విషయాన్ని మనసుకు భారం చేసుకోవడం ఇవే మానసిక ప్రశాంతతను దూరం చేస్తున్నాయి.ఈ కాలంలో మనుషులు మాట్లాడటం తగ్గించి, మనసులో దాచుకోవడం పెంచేశారు. బాధను బయటపెడితేబలహీనులమవుతామనుకుంటున్నారు. కానీ మౌనం కూడా ఒక్కోసారి ప్రమాదకరం. మనసులో పేరుకుపోయిన వేదన నెమ్మదిగా మనిషిని లోపల కుంగదీస్తుంది. అందుకే మన భావోద్వేగాలను పంచుకోవాలి. మనల్ని అర్థం చేసుకునే వాళ్లతో మాట్లాడాలి. ఒక చిన్న ఓదార్పు కూడా కొన్నిసార్లు మనిషిని మళ్లీ నిలబెడుతుంది. జీవితంలో డబ్బు, హోదా, విజయాలు అన్నీ అవసరమే. కానీ వాటికంటే ముఖ్యమైనది ప్రశాంతమైన మనసు. రాత్రి నిద్రపోయేటప్పుడు మనసులో భయం లేకపోవడం, ఉదయం లేచినప్పుడు జీవితం మీద ఆశ ఉండటమే నిజమైన ఆనందాలు. ఎందుకంటే మానసిక ప్రశాంతత లేని జీవితం వెలుగులేని దీపంలాంటిది. అందుకే మనిషి ముందుగా తన మనసును ప్రేమించుకోవాలి. ఆలోచనలకు అదుపు నేర్పుకోవాలి. ప్రతికూల పరిస్థితుల్లో కూడా నిలబడే సహనాన్ని పెంపొందించుకోవాలి. మనసు ప్రశాంతంగా ఉంటే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. మనసు ఆరోగ్యంగా ఉంటే జీవితం అందంగా మారుతుంది. మానసిక ప్రశాంతతే ఆరోగ్యానికి మూలం. అదే జీవితానికి అసలైన అర్థం. అనవసరమైన పోలికలు కూడా మనిషిని లోపల ఖాళీ చేస్తుంటాయి. ఇతరుల విజయాన్ని చూసి తన జీవితాన్ని తక్కువగా అంచనా వేసుకునే అలవాటు నెమ్మదిగా ఆత్మన్యూనతాభావంగా మారుతోంది. నిజానికి ప్రశాంతత బయట దొరికేది కాదు. అది మన ఆలోచనలలో పుడుతుంది. మనిషి తనను తాను అర్థం చేసుకున్నప్పుడు, తన పరిమితులను అంగీకరించినప్పుడు, జీవితాన్ని సహజంగా స్వీకరించినప్పుడు మనసు నెమ్మదిగా ప్రశాంతతను అందుకుంటుంది. ప్రతిసమస్యను గుండెల్లో మోస్తూ జీవించడం కన్నా, దాన్ని ఎదుర్కొనే ధైర్యాన్ని పెంపొందించుకోవడం ముఖ్యం. ఎందుకంటే ప్రతి చీకటి శాశ్వతం కాదు. ప్రతి బాధకు ఒక ముగింపు ఉంటుంది.మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ముందుగా మనసుకి విశ్రాంతి ఇవ్వాలి. రోజంతా శరీరం పని చేసినట్టే, మనసు కూడా అలసిపోతుంది. అందుకే కొంత సమయం మనతో మనం గడపాలి. ప్రకృతిని ఆస్వాదించాలి. మంచి పుస్తకాలు చదవాలి. మనసుకు హాయినిచ్చే సంగీతం వినాలి. ధ్యానం, యోగా,ప్రాణాయామం వంటి సాధనలు అలవాటు చేసుకోవాలి. ఇవి కేవలం వ్యాయామాలు కాదు మనసును నిలకడగా ఉంచే మార్గాలు.– ఎన్. లహరి -
ఈ రాఖీ పండుగకు ఇలాంటి తీపి రెసిపీలను చేసేయండిలా..!
బెంగాలీ చమ్ చమ్కావలసినవి..ఛెనా తయారీకి– చిక్కటి పాలు: 1 లీటరు, నిమ్మరసం: 2 టేబుల్ స్పూన్లు, కార్న్‌ఫ్లోర్: టీస్పూన్, పాకం కోసం– పంచదార: ఒకటిన్నర కప్పులు, నీళ్ళు: 4 కప్పులు, ఏలకుల పొడి: 1/2 టీస్పూన్, కుంకుమపువ్వు: కొన్ని రేకలు, స్టఫింగ్ కోసం: కోవా (3–4 టేబుల్ స్పూన్లు), డ్రైఫ్రూట్స్: పిస్తా, బాదం ముక్కలు, ఎండు కొబ్బరి పొడి, ఫుడ్ కలర్: 2 చుక్కలు.తయారీ..ముందుగా పాలను ఒక గిన్నెలో పోసి బాగా మరిగించండి. పాలు మరిగిన తర్వాత స్టవ్ ఆపి, 2 నిమిషాలు చల్లారాక అందులో నీటిలో కలిపిన నిమ్మరసాన్ని కొద్దికొద్దిగా వేస్తూ పాలు విరిగేలా తిప్పాలి. పాలు, నీరు వేరయ్యాక, ఒక పలచని కాటన్ క్లాత్‌లో వడకట్టి, వెంటనే చల్లని నీటితో కడిగి నీరంతా పోయేలా 30 నిమిషాల పాటు వేలాడదీయాలి. ఇప్పుడు ఈ ఛెనాని ఒక వెడల్పాటి ప్లేట్లోకి తీసుకుని ఒక టీ స్పూన్ కార్న్‌ఫ్లోర్ వేసి అరచేతితో మెత్తగా ఒత్తాలి. రంగు కావాలనుకుంటే ఫుడ్ కలర్ వేసుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని సమానమైన భాగాలుగా చేసుకుని పగుళ్లు లేకుండా కోలగా ఒత్తుకోవాలి. తరువాత ఒక వెడల్పాటి పాత్రలో చక్కెర, 4 కప్పుల నీళ్ళు పోసి మరిగించాలి. చక్కెర కరిగిన తర్వాత పాకం బాగా మరుగుతున్నప్పుడు, తయారుచేసి పెట్టుకున్న ఛెనా రోల్స్‌ను ఒక్కొక్కటిగా నెమ్మదిగా అందులో వేయాలి. ఇవి 15–20 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌పై ఉడికిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. తరువాత పాకం నుంచి చమ్ చమ్‌లను బయటకు తీసి మధ్యలో చిన్నగా గాటు పెట్టాలి. అందులో కొద్దిగా కోవా నింపాలి. చివరిగా ఎండు కొబ్బరి పొడిలో వీటిని దొర్లించి, పైన పిస్తా, బాదం ముక్కలతో అలంకరిస్తే ఎంతో రుచికరమైన బెంగాలీ చమ్ చమ్ సిద్ధం!బనారసీ పాన్ ఫడ్జ్కావలసినవి..ఫడ్జ్ బేస్ కోసం– వైట్ చాక్లెట్: 400 గ్రాములు, స్వీటెండ్ కండెన్స్డ్ మిల్క్: 1 కప్పు, వెన్న: 2 టేబుల్ స్పూన్లు, గ్రీన్ ఫుడ్ కలర్: 2 చుక్కలు, తాజా తమలపాకులు: 8, పాన్ మసాలా (ఫ్లేవర్ కోసం), గుల్కంద్: 3 టేబుల్ స్పూన్లు, స్వీట్ సోంప్: 2 టేబుల్ స్పూన్లు, టూటీ ఫ్రూటీ: 2 టేబుల్ స్పూన్లు, ఎండు కొబ్బరి పొడి: 2 టేబుల్ స్పూన్లు, ఏలకుల పొడి: 1/2 టీస్పూన్, పాన్ ఎసెన్స్: కొన్ని చుక్కలు, గార్నిషింగ్ కోసం: సన్నగా తరిగిన పిస్తా, బాదం, ఎండిన గులాబీ రేకులు, సిల్వర్ ఫాయిల్.తయారీ..ముందుగా ఒక పాత్రలో పార్చ్మెంట్ పేపర్‌ను తీసుకుని దానికి కొద్దిగా వెన్నపూసి పక్కన పెట్టుకోవాలి. తరువాత పాన్పేస్ట్ కోసం బ్లెండర్లో తమలపాకులతో పాటు కండెన్స్డ్ మిల్క్ పోసి, మెత్తగా గ్రైండ్ చేయండి. ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్లు పోసి మరిగించి, దానిపై వేడి తగిలేలా మరొక గిన్నెను ఉంచండి. అందులో తురిమిన వైట్ చాక్లెట్, వెన్న, తయారుచేసి పెట్టుకున్న తమలపాకు–కండెన్స్డ్ మిల్క్ మిశ్రమాన్ని వేయండి. చాక్లెట్ పూర్తిగా కరిగే వరకు కలపండి. ఈ మిశ్రమంలోనే ఒక చుక్క గ్రీన్ కలర్, పాన్ ఎసెన్స్ కలపవచ్చు. తరువాత స్టవ్ ఆపి, ఆ మిశ్రమంలో గుల్కంద్, స్వీట్ సోంపు, టూటీ ఫ్రూటీ, ఎండు కొబ్బరి పొడి, ఏలకుల పొడి వేసి బాగా కలపండి. ఇపుడు సిద్ధంగా ఉన్న ట్రేలోకి ఈ మిశ్రమాన్ని పోసి, గరిటెతో సమంగా ఒత్తుకొని.. పైన తరిగిన పిస్తా, గులాబీ రేకులు, టూటీ ఫ్రూటీ, సిల్వర్ ఫాయిల్‌తో అందంగా అలంకరించండి. ఈ ట్రేని 3 నుంచి 4 గంటల పాటు ఫ్రిజ్‌లో ఉంచి.. ఫడ్జ్ బాగా గట్టిపడిన తర్వాత, పేపర్ సాయంతో బయటకు తీసి, వేడి నీటిలో ముంచి తుడిచిన పదునైన చాక్‌తో చిన్న చిన్న చతురస్రాకార ముక్కలుగా కట్ చేసుకోవాలి. అంతే బనారసీ పాన్ ఫడ్జ్ సిద్ధం. దీనిని గాలి చొరబడని డబ్బాలో ఉంచి ఫ్రిజ్‌లో పెడితే 2 వారాల వరకు తాజాగా ఉంటుంది.ఫిర్నీకావలసినవి..బాస్మతీ బియ్యం: 3 టేబుల్ స్పూన్లు, చిక్కటి పాలు: 1 లీటరు, పంచదార: 1/2 కప్పు, ఏలకుల పొడి: 1/2 టీస్పూన్, కుంకుమపువ్వు: 10–12 రేకలు (పాలలో నానబెట్టినవి), రోజ్ వాటర్: టీస్పూన్, డ్రై ఫ్రూట్స్: బాదం, జీడిపప్పు, పిస్తా ముక్కలుతయారీ..30 నిమిషాల పాటు నానబెట్టిన బాస్మతీ బియ్యాన్ని పూర్తిగా వడకట్టి, నీళ్లు కలపకుండా మిక్సీలో బరకగా గ్రైండ్ చేసుకోవాలి. తరువాత ఒక మందపాటి పాత్రలో లీటరు పాలు పోసి మీడియం ఫ్లేమ్‌పై మరిగించి.. పాలు ఒక పొంగు వచ్చాక.. ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బియ్యం రవ్వను అందులో వేయాలి. సన్నని మంటపై మిశ్రమం చిక్కగయ్యే వరకు కలుపుతూ ఉడికించాలి. బియ్యం రవ్వ పూర్తిగా మెత్తగా ఉడికి, పాలు చిక్కగా అయ్యాక అందులో పంచదార, నానబెట్టిన కుంకుమపువ్వు పాలు, ఏలకుల పొడి వేసి బాగా కలపాలి. పంచదార కరిగే వరకు మరో 5 నిమిషాలు ఉడికించాలి. స్టవ్ ఆపేసి, అందులో రోజ్‌వాటర్ వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇలా తయారైన ఫిర్నీని మట్టి గ్లాసులలో లేదా గాజు బౌల్స్‌లో పోసి, పైన తరిగిన బాదం, పిస్తా ముక్కలతో అలంకరించాలి. దీనిని కనీసం 2–3 గంటల పాటు ఫ్రిజ్‌లో ఉంచి, బాగా కూల్ అయిన తర్వాత తింటే రుచి అద్భుతంగా ఉంటుంది.(చదవండి: హై‘టెక్’ రాఖీ..! చూడ్డానికి చిన్నవే..సర్ప్రైజ్లో మాత్రం..) -
అది మలబద్ధకమేనా? పిల్లలు ఎందుకు ఆపుకుంటారు ?
మా ఐదేళ్ల బాబుకు రోజూ మలవిసర్జన కావడం లేదు. రెండు మూడు రోజులకు ఒకసారి వెళతాడు. మలవిసర్జనకి వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బంది పడుతూ, నొప్పిగా ఉందని ఏడుస్తాడు. ఇంట్లో వాళ్లు పిల్లాడు మొండిగా చేస్తున్నాడంటున్నారు. ఇంకొందరు ఇది మలబద్ధకమే అంటున్నారు. ఏం చేయాలి? – లక్ష్మి, గుంటూరుమీ సందేహం చాలా సహజం. పిల్లలకు మలవిసర్జన సరిగ్గా రాకపోతే తల్లిదండ్రులు ముందుగా ఆందోళన పడేది ఇదే. అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి. రోజూ మలవిసర్జన రాకపోవడం ఒక్కటే మలబద్ధకం కాదు. కొంతమంది పిల్లలకు రోజూ రావచ్చు; మరికొందరికి రెండు రోజులకు ఒకసారి రావచ్చు. మలం మెత్తగా ఉండి, పిల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తుంటే పెద్దగా ఆందోళన అవసరం లేదు. కానీ మలం చాలా గట్టిగా ఉండటం, మలవిసర్జన చేసేటప్పుడు నొప్పి రావడం, బాగా ఒత్తిడి చేయాల్సి రావడం, మలం పూర్తిగా బయటకు రాకపోవడం, పిల్లలు కావాలనే మలవిసర్జన ఆపుకోవడం వంటి లక్షణాలు ఉంటే మాత్రం మలబద్ధకం గురించి ఆలోచించాలి.పిల్లలుఎందుకు ఆపుకుంటారు?ఇక్కడే చాలామంది తల్లిదండ్రులు పిల్లలను తప్పుగా అర్థం చేసుకుంటారు. పిల్లాడు కావాలనే మలవిసర్జన ఆపుకుంటున్నాడని, మొండితనం చేస్తున్నాడని అనుకుంటారు. కానీ చాలా సందర్భాల్లో అసలు కారణం నొప్పి భయం. ఒకసారి మలం చాలా గట్టిగా వచ్చి నొప్పి కలిగితే, మళ్లీ విసర్జన చేస్తే అదే నొప్పి వస్తుందని పిల్లలు భయపడతారు. అందుకే మలవిసర్జన వచ్చినా ఆపుకుంటాడు. అలా ఆపుకోవడంతో మలం మరింత గట్టిగా మారుతుంది. తర్వాత విసర్జన చేసేటప్పుడు ఇంకా ఎక్కువ నొప్పి వస్తుంది. దీంతో మళ్లీ ఆపుకుంటాడు. ఇలా నొప్పి, భయం, విసర్జన ఆపుకోవడం ఒక చక్రంలా మారుతుంది. అందుకే పిల్లలను తిట్టడం లేదా బలవంతంగా మరుగుదొడ్డిపై కూర్చోబెట్టడం సమస్యను మరింత పెంచవచ్చు. ముందుగా పిల్లవాడు ఎందుకు మలవిసర్జన ఆపుకుంటున్నాడో అర్థం చేసుకోవాలి.పండ్లు పెడితే తగ్గిపోతుందా?పండ్లు, కూరగాయలు, పీచు ఎక్కువగా ఉండే ఆహారం మలబద్ధకం తగ్గడానికి సహాయపడుతుంది. కానీ కేవలం పండ్లు పెట్టడంతోనే సమస్య వెంటనే పూర్తిగా తగ్గిపోతుందని అనుకోకండి. పిల్లల ఆహారంలో పండ్లు, కూరగాయలు, పప్పులు, సంపూర్ణ ధాన్యాలు వంటి పీచు పదార్థాలు ఉండేలా చూడాలి. అలాగే పిల్లలకు సరిపడా నీరు అందాలి. రోజూ కొంతసేపు ఆడుకోవడం, నడవడం వంటి శారీరక కదలికలు కూడా అవసరం.పాలు ఇస్తే బలంగా పెరుగుతారా?పాలు పిల్లల ఎదుగుదలకు అవసరమే. కానీ అవసరానికి మించి పాలు మాత్రమే ఇస్తూ, ఇతర ఆహారాన్ని తగ్గించడం మంచిది కాదు. అలా చేస్తే పీచు పదార్థాలు తక్కువగా తీసుకునే అవకాశం ఉంటుంది. అందుకే పాలు మాత్రమే కాకుండా పండ్లు, కూరగాయలు, పప్పులు, ధాన్యాలతో కూడిన సమతుల ఆహారం ఇవ్వాలి.అలవాటు కూడా ముఖ్యమే?ముఖ్యంగా ఉదయం అల్పాహారం తర్వాత పిల్లలను కొంతసేపు ప్రశాంతంగా మరుగుదొడ్డిపై కూర్చోబెట్టే అలవాటు చేయవచ్చు. తొందరపెట్టకుండా, భయపెట్టకుండా ప్రశాంతంగా ఉండేలా చూడాలి. మరుగుదొడ్డిపై కూర్చున్నప్పుడు పిల్లల కాళ్లు వేలాడకుండా కింద చిన్న పీట ఉంచితే మంచిది. కాళ్లకు సరైన ఆధారం ఉండటం వల్ల మలం సులభంగా బయటకు రావడానికి సహాయపడుతుంది.మలవిసర్జన చేయకపోతే తిట్టాలా? అసలు వద్దు. మలబద్ధకంలో పిల్లలను తిట్టడం, అవమానించడం, బలవంతం చేయడం వల్ల వాళ్లలో మలవిసర్జన చేయడంపై భయం మరింత పెరగవచ్చు. బదులుగా పిల్లలను ప్రోత్సహించాలి. విసర్జన చేయడానికి ప్రయత్నించినా ప్రశంసించాలి. సమస్య గురించి పిల్లలతో ఓపికగా మాట్లాడాలి.మందులు ఇవ్వొచ్చా?అవసర మైనప్పుడు వైద్యుల సూచనతో మందులు ఇవ్వవచ్చు. ముఖ్యంగా మలం చాలా గట్టిగా ఉండి పిల్లలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నప్పుడు లేదా సమస్య పదేపదే వస్తున్నప్పుడు వైద్యుడు తగిన చికిత్స సూచించవచ్చు. అయితే ఇంట్లో పెద్దలకు ఉపయోగించిన మందులను పిల్లలకు స్వయంగా ఇవ్వకండి. అలాగే ఎవరో చెప్పారని మలబద్ధకం మందులు మొదలుపెట్టి, సమస్య తగ్గగానే మీకు మీరే ఆపేయడం కూడా మంచిది కాదు. పిల్లల వయసు, బరువు, సమస్య తీవ్రతను బట్టి చికిత్స మారుతుంది.వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలి?పుట్టినప్పటి నుంచే తీవ్రమైన మలబద్ధకం ఉండటం, పుట్టిన తర్వాత మొదటి రెండు రోజుల్లో మలం రాకపోవడం, పొట్ట ఎక్కువగా ఉబ్బడం, తీవ్రమైన పొట్ట నొప్పి, పదేపదే వాంతులు, మలంలో రక్తం కనిపించడం, బరువు సరిగా పెరగకపోవడం, జ్వరం, పిల్ల చాలా నీరసంగా కనిపించడం లేదా ఇంట్లో తీసుకున్న జాగ్రత్తలతో సమస్య తగ్గకుండా పదేపదే వస్తుండటం వంటి లక్షణాలు ఉంటే పిల్లల వైద్యుడిని సంప్రదించాలి.చివరగా ఒక మాట... పిల్లవాడు విసర్జన ఆపుకుంటున్నాడంటే ముందుగా అతను ఎందుకు అలా చేస్తున్నాడో తెలుసుకోండి. చాలాసార్లు దాని వెనుక మొండితనం కాదు. నొప్పి, ఆ నొప్పిపై భయం ఉంటాయి. ఆ భయాన్ని అర్థం చేసుకోండి. మలబద్ధకాన్ని చిన్న సమస్యగా కాకుండా.. పిల్లల మాట వినండి, కారణాన్ని అర్థం చేసుకోండి, సరైన సమయంలో పరిష్కరించండి.- డా. కె. పవన్ కుమార్, సీనియర్, పీడియాట్రిషియన్, పీడియాట్రిక్ అలర్జిస్ట్, ప్రొఫెసర్ ఆఫ్ పీడియాట్రిక్స్ -
ఆమె అందరిలాంటి బామ్మ కాదు..! 44 ఏళ్ల వయసులో ఎంటెక్, పీహెచ్డీ..
కొందరు వృద్ధాప్యానికి వ్యతిరేకంగా చురుకుగా యువతలా ఉండేలా ప్రయత్నం చేయడం కాదు..ఆ వయసులో చేసే సాహాసాలను చేస్తుంటారు. యువతలా యాక్టివ్‌గా ఉంటూ అందర్నీ ఆశ్చర్యపరుస్తుంటారు. పైగా భావితరాలకు ఓ గొప్ప స్ఫూర్తిగా నిలుస్తారు. అలాంటి కోవకు చెందిందే ఈ బామ్మ. ఈమె అలాంటి ఇలాంటి బామ్మ కాదు.!.ఆషు జైన్ అనే బామ్మ అందరిలాంటి బామ్మ కాదామె. డెహ్రాడూన్‌కు చెందిన ముగ్గురు పిల్లల తల్లి. ఆమె ఒకప్పుడు అల్లికలు అల్లుతూ మనవళ్లను చూసుకుంటూ గడిపింది. కానీ ఇప్పుడామె జిమ్‌లో డెడ్‌లిఫ్ట్, జుంబా, హైరాక్స్ రేసుల వంటివి సునాయాసంగా చేస్తుంటుందామె. జీవిత చరమాంకంలో ఎలా ఫిట్నెస్తో ఉండొచ్చో చూపిస్తూ..తనలాంటి వాళ్లకు ఆదర్శంగా నిలుస్తోందామె.సాధారణ బామ్మలా కాదు..ఆమె పిల్లలు చదువుకోమని ప్రోత్సహించడంతో 44 ఏళ్ల వయసులో తిరిగి చదువుని ప్రారంబించింది. అలా ఆమె ఎంటెక్, ఐఐటీ ఢిల్లీ నుంచి పీహెచ్డీ పూర్తి చేసింది. అదే క్రమశిక్షణ ఫిట్‌నెస్‌లో కూడా సాగింది. ఫిట్నెస్ అంటే కేవలం అందంగా కనిపించడం మాత్రమే కాదు, నొప్పి లేకుండా ట్రెక్కింగ్, నృత్యం చేయడం, మనవరాలిని ఎత్తుకోగలగడం తదితరాలని అంటోంది ఈ బామ్మ. ఇది కేవలం స్వేచ్ఛకు సంబంధించినది కాదని అంటోంది. అంతేగాదు తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో తన నాలుగేళ్ల జిమ్ అలవాట్లను కూడా ఆమె షేర్ చేసుకున్నారు. అందుకు తనకు ఉపకరించిన టిప్స్‌ను కూడా పంచుకున్నారు. అవేంటంటే..కొత్తగా ఫిట్నెస్ మొదలుపెడితో చిన్నగా ప్రారంభించమని అంటోంది. చిన్నపాటి లక్ష్యాలతో సాగితే..ఆ తర్వాత పునరావృతం చేసే సంఖ్య పెంచుకుంటూ పోవచ్చని అంటోంది. ఇప్పటికే ఉన్న అలవాట్లకు రోజువారీ అలవాట్లను అనుసంధానించండి. ముందుగా ఏ రోజుకారోజు సన్నద్ధమవ్వడం వంటివి చేయాలి. రేపుచేసే వ్యాయామాలకు కావాల్సిన విధంగా రెడీ అయ్యి ఉండటం. నిలకడగా చేసేలా చూసుకోండి ఒక్కోసారి ఆటంకాలు రావడం, క్రమశిక్షణాయుతంగా చేయలేకపోవడం జరిగినా..నిలకడగా కొనసాగేలా కేర్ తీసుకోవాలిపరిపూర్ణంగా చేయడం కంటే నిలకడగా..సాగిపోవడమే అసలైన ఫిట్నెస్ మంత్ర.అలాగే ఆమె హైరాక్స్ కోసం ఎలా సన్నహామవుతుందో కూడా ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు. ఓర్పుతో కూడిన ఫంక్షనల్ వ్యాయామాలతో కూడిన గ్లోబల్ ఫిట్నెస్ రేస్. ఈ ఏడాది ప్రారంభంలోనే రెండో హైరాక్స్ను పూర్తి చేశారామె. ఆమె రోజు ఉదయం నాలుగు గంటలకు నీరు, ప్రార్థన, నానబెట్టిన నట్స్‌తో ప్రారంభమవుతుంది. ఆమె శిక్షణలో ప్రత్యేకమైన స్ట్రెంగ్త్, డెడ్‌లిఫ్ట్, రన్నింగ్, జుంబా, బాల్కనీ వాక్‌లు ఉంటాయి. కాగా డబ్ల్యూహెచ్ఓ కూడా 18 నుంచి 64 ఏళ్ల వయసుల పెద్దలు 150–300 నిమిషాల మధ్యస్థ-తీవ్రతతో కూడిన ఏరోబిక్ కార్యకలాపాలు లేదా 75–150 నిమిషాల అధిక-తీవ్రతతో కూడిన ఏరోబిక్ కార్యకలాపాలు చేయాలని సూచిస్తోంది. అలాగే వారానికి కనీసం రెండు రోజులు కండరాలను బలోపేతం చేసే ప్రధాన కార్యకలాపాలు చేయాలని సిఫార్సు చేస్తోంది. ఇక్కడ ఆషు బామ్మ దినచర్య కనీస ప్రమాణాలకు మించి పోయింది. నిజంగా ఆమె ‘హైబ్రిడ్ అథ్లెట్ బామ్మ’. View this post on Instagram A post shared by Ashu Jain (@not.just.a.grandma) (చదవండి: మూడుగంటల ట్యాక్సీ ప్రయాణం..ప్రేమకథగా ఎలా మారిందంటే..!) -
హై‘టెక్’ రాఖీ..! చూడ్డానికి చిన్నవే..సర్ప్రైజ్లో మాత్రం..
రాఖీ కట్టారు... గిఫ్ట్ ఇచ్చారు... స్వీటు తినిపించారు! ఇంతటితో అయిపోయిందనుకుంటే... ఎలా? కాస్త కొత్తగా ఆలోచించండి. ఈసారి అన్నయ్య చేతికి కట్టే రాఖీకి కాస్త క్రియేటివిటీ జోడిస్తే, ఆ చిన్న దారమే ఓ అందమైన జ్ఞాపకంగా మారొచ్చు. ఎందుకంటే, ఇవి చూడ్డానికి చిన్నవే అయినా సర్ప్రైజ్ సైజ్‌లో మాత్రం పెద్దవే!స్కాన్ చేస్తే... సెంటిమెంట్ ఓపెన్ !రాఖీ కట్టగానే సోదరుడు ‘థ్యాంక్యూ’ చెప్పి ఊరుకుంటే ఎలా? ఈసారి కాస్త టెక్నాలజీని కూడా బంధంలోకి లాగేద్దాం! ఈ ప్రత్యేక రాఖీపై ఉండే క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే, అన్నాచెల్లెళ్ల జ్ఞాపకాల చిన్న డిజిటల్ ప్రపంచమే తెరుచుకుంటుంది. చెల్లెలు ముందే ఎంపిక చేసుకున్న ఫొటోలు, వీడియోలు, ప్రత్యేక సందేశాలు అందులో కనిపిస్తాయి. పేర్లు, పర్సనల్ మెసేజ్‌లు, సరదా జ్ఞాపకాలు... ఇలా మనసులోని మాటలన్నింటినీ ఇందులో దాచుకోవచ్చు. ఒక రాఖీకి ఏకంగా 10 ఫొటోలు, ఒక వీడియో, ఐదు వ్యక్తిగత సందేశాలు జోడించుకోవచ్చు. యాప్ అవసరం లేకుండానే స్కాన్ చేసి చూడొచ్చు. ఇలా రాఖీ కట్టేది చేతికి... కానీ టచ్ అయ్యేది మాత్రం మనసుకే! ధర బ్రాండ్‌ని బట్టి ఉంటుంది.మొక్కగా మారే బంధం! రాఖీ ఒక్కరోజు చేతికి కట్టి... తర్వాత పెట్టెలో దాచేయడం పాత పద్ధతి! అందుకే, ఈసారి ఆ రాఖీకి కాస్త పచ్చదనం జోడిస్తే ఎలా ఉంటుంది? ఈ పర్యావరణహిత రాఖీతో అన్నాచెల్లెళ్ల బంధంతో పాటు, ప్రకృతితోనూ చిన్న బంధం మొదలవుతుంది. రాఖీ పండగ పూర్తయ్యాక దీన్ని నాటితే మొక్కగా పెరిగేలా పప్పులు, కూరగాయల విత్తనాలను ఇందులో పొందుపరిచారు. అలాగే, ప్లాస్టిక్ అలంకరణలకు బదులుగా సహజ పదార్థాలతో వీటిని తయారు చేశారు. రాఖీతో పాటు చిన్న కాయిర్ ప్లాంటర్, కోకోపీట్ డిస్క్, రోలి–చావల్, చిన్న స్వీట్ కూడా ఉండటంతో ఇది ఒక చిన్న ప్రకృతి పండగ కిట్లా ఉంటుంది. ధర రూ. 500 నుంచి మొదలు.చేతికి.. అన్నయ్య కలల కారు!కారంటే అబ్బాయిలకు ఎంత ఇష్టమో చెప్పడానికి గ్యారేజీకి వెళ్లాల్సిన పనిలేదు... వాళ్ల ఫోన్ లోని కార్ల ఫొటోలు చూస్తే చాలు! అలాంటి కార్ లవర్‌కి ఈసారి రాఖీ కూడా తన ఫేవరెట్ కారే అయితే? అందుకే, ఈసారి రాఖీ కోసం సోదరుడు మనసు దోచుకున్న ఏ కారునైనా ఎంచుకుని, దాన్ని ప్రత్యేకంగా రాఖీ రూపంలో కస్టమైజ్ చేయించుకోవచ్చు. అలా, అన్నయ్య కలల కారును కొనివ్వలేకపోయినా... చేతికి మాత్రం అతని డ్రీమ్ కారును కట్టేయొచ్చు! అది కూడా బడ్జెట్లోనే! చేతికి కట్టుకున్న ప్రతిసారీ ‘ఇది నా కారు’ అంటూ మురిసిపోవడానికి పర్ఫెక్ట్ గిఫ్ట్. ధర రూ. 200 నుంచి మొదలు. -
మూడుగంటల ట్యాక్సీ ప్రయాణం..ప్రేమకథగా ఎలా మారిందంటే..!
కొన్ని ప్రేమకథలు ఎలా మొదలవుతాయో తెలియదు. వింటుంటే చాలా ఆశ్చర్యంగా, అస్సలు అదెలా సాధ్యం అనేలా ఉంటాయి. అలాంటి అందమైన ప్రేమకథ నెట్టింట వైరల్‌గా మారింది. మూవీని తలపించే వారి ప్రేమకథ వింటుంటే ఆశ్చర్యం, బాధ కలుగక మానవు. అన్ని ఎమోషన్స్ పలికించే ఆ అందమైన ప్రేమకథ ఎలా చిగురించిందంటే..లోరెన్ స్టెఫానీ రెండేళ్ల క్రితం పర్యాటకురాలిగా భారత్‌లోకి అడుపెట్టి మరి కుటుంబం ఏర్పరచుకుని మరి తిరిగి పయనమైంది. అస్సలు ఆమె ఆస్ట్రేలియా నుంచి తమిళనాడులోని మధురైకి పర్యాటన నిమిత్తం వచ్చింది. కానీ ఆ పర్యాటన కాస్తా ఆమెకు భాగస్వామిని, ఓ కుటుంబాన్ని ఏర్పరిచింది. అది కూడా జస్ట్ మూడు గంటల జర్నీ ఆమె లైఫ్‌నే టర్న్ తిప్పింది. ప్రేమకు దారితీసిన ట్యాక్సీ జర్నీ..మధుర విమానాశ్రయంలో దిగిన లోరెనా స్టెఫానీ అక్కడ తమిళనాడు రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు ఒక ట్యాక్సీని మాట్లాడుకుంది. ఆ డ్రైవర్‌తో కలిసి సుమారు మూడు గంటలు ప్రయాణించింది. ఆ సమయంలో వారి మధ్య సంభాషణ స్నేహంగా, ఆ తర్వాత విడదీయరాని బంధాన్ని ఏర్పరిచి ప్రేమకు దారితీసింది. ఎంతలా అంటే..ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా మారింది. అయితే వారి మధ్య ఖండాల అంతరమే కాదు సంస్కృతుల పరంగా కూడా చాలా భేదం ఉంది. ఇక్కడ రబీక్ ముస్లిం. లోరెనా క్యాథలిక్. అంటే రెండు మతాలు. రెండు దేశాలు. రెండు పూర్తిగా భిన్నమైన ప్రపంచాలు మధ్య సాగిన అపూర్వ ప్రేమకథ. ఆ విషయం ఇరుకుటుంబాలకు తెలియజేసినప్పుడు మాములు వ్యతిరేకత రాలేదు. అస్సలు ఎవ్వరు అంగీకరించేందుకు ముందుకు రాలేదు. దాంతో ఆ జంట ప్రత్యేక వివాహ చట్టం ప్రకారం ప్రక్రియను పూర్తిచేసి, తమ బంధాన్ని అధికారం చేసుకున్నారు. ఆ మార్గంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనప్పటికీ..తమకు ఈ బంధం ఎంత ముఖ్యం అనేది ఆ క్లిష్టపరిస్థితులే అర్థమయ్యేలా చేశాయని అంటోంది ఈ జంట. సంతోషం..బాధ ఒకేసారి..ఆ ఆ తర్వాత వారి జీవితంలో సంతోషకరమైన ఘట్టం కుమార్తె జననంతో వచ్చింది. అయితే లోరెనా ఆస్ట్రేలియాలోని ఆస్పత్రిలో కుమార్తెకు జన్మనిచ్చింది. కానీ రబీక్ వీసా దృష్ట్యా భారత్‌లోనే ఉండిపోయాడు. ఫోన్లో తన బిడ్డను చూస్తూ తన ప్రేమను చాటుకుంటున్నాడు. బిడ్డ పుట్టిందని తెలిసినా రబీక్ వెళ్లి చూసుకోలేని పరిస్థితి అయినా..అది తనకు బాధకలిగిందని సగర్వంగా చెబుతోంది లోరెనా. ఎందుకంటే..ఈ బిడ్డ తమ ప్రేమకు చిహ్నమని, భౌతికంగా దూరంగా ఉన్నా మానిసికంగా తమ బిడ్డను కలిసే పెంచుతాం, సమంగా బాధ్యతలు పంచుకుంటామని అంటోంది లోరెనా. రెండు దేశాలు, ఒకే కుటుంబం..ఎప్పటికీ వదులుకోలేని ప్రేమ..ఇక్కడ లోరెనా ఆస్ట్రేలియాలో ఉన్నారు. రబీక్ భారతదేశంలో ఉన్నారు. వారి కుమార్తె ఈ రెండు దేశాల మధ్య పెరుగుతోందని ఆమెకు తోడుగా తల్లి ఉంది, తండ్రి వీసా మంజూరు కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు. అంటే..ప్రస్తుతం మా చిన్న కుటుంబం రెండు దేశాల్లో విస్తరించి ఉంది, అని నవ్వుతూ చెబుతోంది లోరెనా . రబీక్ తమ దగ్గరకు చేరే రోజు కోసం కొండంత ఆశతో ఎదురుచూస్తున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం వీసా ప్రక్రియ కొనసాగుతూనే ఉంది, దూరం అలాగే ఉంది..అయినప్పటికీ, లోరెనా ఈ కఠిన పరిస్థితిని అధిగమించి చివరికి చేరవవుతామనే నమ్మకం సడలదని ధీమాగా చెబుతోంది. ఎందుకంటే ఇప్పటికే తాము చాలా కష్టాలు ఓర్చుకుని ఇక్కడి వరకు వచ్చాం. దీన్ని కూడా కచ్చితంగా అధిగమించుతామని, తన భర్త రబీక్కు కచ్చితంగా వీసా మంజూరవుతుందని నమ్మకంగా చెబుతోందామె. తమది, మతాలు, సరిహద్దులు, వ్యతిరేకతలను దాటుకుని వచ్చిన ‘’స్వచ్చమైన ప్రేమ’’ అని అంటున్నారు ఈ దంపతులు. View this post on Instagram A post shared by People of India (@officialpeopleofindia) (చదవండి: ర్యాంకుల విషయంలో పిల్లల పట్ల అలా వ్యవహరించొద్దు..! హీరో సూర్య పేరెంటింగ్ టిప్స్) -
సంప్రదాయానికి స్టైల్ జోడిస్తే.. లుక్ తగ్గేదేలే!
అబ్బాయిల కోసం... పెళ్లి వస్తే షేర్వానీ, పండగ వస్తే కుర్తా! అంతే... కథ క్లోజ్! అనుకుంటే మీ పొరపాటే! ఇప్పుడు మెన్స్ ఫ్యాషన్ బాగా మారింది. సంప్రదాయానికి కాస్త స్టయిల్ జతచేస్తే ఫ్యాషన్ తో పోటీపడే సంప్రదాయ రాయలు మీరే అవుతారు! అయితే, ముందు మీరు ఈ టిప్స్ తెలుసుకోండి!పెళ్లికి వచ్చిన హీరో!పెళ్లి వేడుకలో అందరి చూపు మీవైపు ఉండాలంటే షేర్వానీకి మించిన ఆప్షన్ కష్టం. అయితే, అదే షేర్వానీని సిల్క్, బ్రొకేడ్ వంటి రిచ్ ఫ్యాబ్రిక్స్, ఎంబ్రాయిడరీ వర్క్‌తో రాయల్ లుక్ కనిపిస్తుంది. దీనికి ధోతీ ప్యాంట్ జత చేస్తే లుక్ పూర్తవుతుంది. అయితే ఎంబ్రాయిడరీ ఎక్కువగా ఉన్న షేర్వానీ అయితే మిగతా యాక్సెసరీస్‌ను కాస్త సింపుల్‌గా ఉంచండి.కూల్ కజిన్!షేర్వానీ రిచ్‌గా అనిపిస్తుంది... కుర్తా కాస్త క్యాజువల్‌గా అనిపిస్తుంది. ఈ రెండింటి మధ్యలో చక్కగా బ్యాలెన్స్ చేసేది యాచ్కన్ . పొడవు కాస్త తక్కువగా ఉండటంతో ఇది సంప్రదాయంగానూ, సౌకర్యంగానూ ఉంటుంది. ఎంగేజ్మెంట్, పండగ, పెళ్లి వేడుక... సందర్భాన్ని బట్టి చుడీదార్ లేదా ధోతీ ప్యాంట్‌తో జత చేసుకోవచ్చు.ఫెయిల్ కాని బ్యాక్‌బెంచర్!మెన్స్ ఎథ్నిక్ వేర్లో కుర్తా అంటే... టాప్బ్యాక్బెంచర్. కుర్తా ఒకసారి వార్డ్‌రోబ్‌లోకి వచ్చిందంటే చాలు. ఇక మిమ్మల్ని ఏ అకేషన్‌లోనూ ఫెయిల్ కానివ్వదు. ఆ ఒక్క డ్రెస్‌తో ఎన్నో అవతారాలు! కాటన్ కుర్తా అయితే సింపుల్ అండ్ కూల్. సిల్క్ లేదా ఎంబ్రాయిడరీ కుర్తా అయితే పండగ లుక్. ప్యాంట్‌తో వేసుకుంటే క్లాసీ... జీన్స్‌తో వేసుకుంటే యూత్‌ఫుల్! అయితే, కుర్తా రంగుకి కాస్త కాంట్రాస్ట్‌లో రంగులో జాకెట్ ఉంటే మరింత ఆకర్షణీయంగా ఉంటుంది.సూట్ కాస్త స్టయిల్‌గా! సంప్రదాయంగా కనిపించాలి... కానీ మరీ పెళ్లి కొడుకులా కాకూడదు అనుకుంటే జోధ్‌పురి లేదా బంధ్‌గలా బెస్ట్. సాధారణ సూట్‌కి, కాస్త ఇండియన్ స్టయిల్ కలిస్తే అదే జోధ్‌పురి మ్యాజిక్! హై నెక్ కాలర్, స్ట్రక్చర్డ్ ఫిట్ దీనికి ప్రత్యేక ఆకర్షణ. రిసెప్షన్ , ఫార్మల్ ఫంక్షన్ , కల్చరల్ ఈవెంట్... ఎక్కడైనా ఇది చాలా క్లాసీగా ఉంటుంది.మూలాలు మర్చిపోకుండా! ధోతీ అంటే పెద్దల డ్రెస్ అనుకునే రోజులు పోయాయి. సరైన కుర్తా, జాకెట్, ఫుట్‌వేర్‌తో ధోతీని కూడా చాలా స్టైలిష్‌గా క్యారీ చేయొచ్చు. పండగలు, దేవాలయ వేడుకలు, సంప్రదాయ కార్యక్రమాలకు ఇది ప్రత్యేకమైన లుక్ ఇస్తుంది. ట్రెండ్ మారొచ్చు... కానీ కొన్ని స్టయిల్స్ మన రూట్స్‌ను ఎప్పటికీ మర్చిపోనివ్వవు!చివరిగా... ఎథ్నిక్ అంటే పాతకాలం కాదు! డ్రెస్ ఏదైనా... దాన్ని ఎలా క్యారీ చేస్తున్నారన్నదే అసలైన ఫ్యాషన్! కాబట్టి ఈసారి ఎథ్నిక్ వేర్ వేసుకునేటప్పుడు సంప్రదాయాన్ని మాత్రమే కాదు, మీ స్టయిల్‌ను కూడా వెంట తీసుకెళ్లండి!- కొండి దీపిక -
పిల్లలపై ర్యాంకుల భారం మోపవద్దు..! హీరో సూర్య పేరెంటింగ్ టిప్స్
విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీతో మంచి హిట్ అందుకున్న హీరో సూర్య తల్లిదండ్రులను పిల్లలు విషయంలో అలా వ్యవహరించొద్దంటూ చక్కటి పేరెంటింగ్ సలహాలు సూచనలు ఇచ్చారు. పిల్లల పెంపకంలో ఆ విషయంలో ప్రతి పేరెంట్‌ని ఆ విధంగా ఉండొద్దని నొక్కి చెప్పారు. అందరి తల్లిదండ్రులు పిల్లల మార్కుల విషయంలో ఎలా ప్రవర్తిస్తే ప్రయోజనకరంగా ఉంటుందో వివరించడమే గాక తండ్రిగా తన అనుభవాన్ని కూడా షేర్ చేసుకున్నారు. మరి అవేంటో చూసేద్దామా..!.ఆయన ఓ మీడియా ఇంటర్వ్యూలో పిల్లల మార్కుల విషయంలో తల్లిదండ్రుల ఆలోచన తీరు గురించి చాలా ఆసక్తికరంగా మాట్లాడారు. బాల్యాన్ని ఆస్వాదించకుండా వాళ్లను ఎలా పోటీ వాతావరణంలోకి తోసేస్తున్నారో మాట్లాడారు. దయచేసి పిల్లలను పెంచేటప్పుడు ప్రతి పేరెంట్ వారి బాల్యాన్ని కోల్పోయేలా అస్సలు చేయొద్దని హితవు పలికారు. ఎందుకంటే విద్యావ్యవస్థలో అధిక కటాఫ్ మార్కుల పట్ల ఉన్న క్రేజ్‌పై తల్లిదండ్రల్లో ఉండే ఆందోళన తెలియకుండానే పిల్లలకు సంక్రమిస్తుందని అన్నారు. దాంతో వాళ్లకు 18 మార్కుల వస్తే సంతోషంగా ఉండదు..ఫస్ట్ అయితేనే హ్యాపీ అనే ఆలోచనకు వచ్చేస్తారు. తెలియకుండానే మొగ్గదశలోనే వారిలో ఆ భావన నాటుకుపోతోందన్నారు. అధిక కటాఫ్ మార్కులనేవి తీవ్రమైన పోటీకి దారితీసి..పిల్లల్లో తెలియని ఒత్తిడిని కలుగజేస్తాయి. యూనివర్సిటీలు 99.9 శాతం కటాఫ్ అడుగుతుంటాయి, అక్కడ చాలా పోటీ ఉంటుంది, అని పిల్లల్లో నూరిపోస్తుంటారు. దాంతో వాళ్లు తమ మధురమైన బాల్యాన్ని ఆస్వాదించకుండా చేసేస్తాం. నిజానికి దాన్ని ఎలా ఛాలెంజింగ్‌గా తీసుకుంటూ బాల్యాన్ని కూడా ఎలా ఎంజాయ్ చేయాలో వాళ్లకు నేర్పించమని అన్నారు. అలాగే పిల్లల సక్సెస్‌ని జరుపుకునే విధానంపై కూడా మండిపడ్డారు. "మా పిల్లాడికి ఇన్ని మార్కులు వచ్చాయంటూ పక్కంటి వాళ్లతో గర్వంగా చెప్పడంతో వాళ్ల బిడ్డ మానసిక పరిస్థితి ఎలా ఉంటుందనేది ఆలోచించరు. సక్సెస్‌ని ఆనందంగా సెలబ్రేట్ చేసుకోవచ్చు..పక్కవాళ్లకు..తక్కువ మార్కులు వచ్చే పిల్లాడి మనసులో బాధ కలుగజేసేలా కాదని." అంటున్నారు హీరో సూర్య. అదేసమయంలో తాను పోటీతత్వానికి వ్యతిరేకం కాదని అన్నారు. తీవ్రమైన పోటీతత్వం మంచిదే. కానీ దాని విషయంలో అతి అస్సలు వదని అన్నారు. ఈ సందర్భంగా తన పిల్లల విషయంలో తండ్రిగా తాను ఎదుర్కొన్న అనుభవాన్ని గుర్తుచేసుకున్నారు సూర్య. కుమారుడి స్పోర్స్ డే ఘటన..తన కుమారుడు దేవ్ పాఠశాల స్పోర్ట్స్ డే నాటి ఒక సంఘటనను ఆయన గుర్తుచేసుకున్నారు. పిల్లలు సహజంగానే ఎంతటి సానుభూతితో ఉంటారో అర్థం చేసుకోవడంలో ఆ సంఘటన తన దృక్పథాన్ని మార్చిందని ఆయన చెప్పారు. పిల్లలు పరుగెత్తుకుంటూ వెళ్లి, ఒక వాటర్ బాటిల్ తీసుకుని, తిరిగి ముగింపు రేఖకు చేరుకోవాల్సిన ఒక పరుగు పందెంలో దేవ్ పాల్గొన్నట్లు చెప్పారు. "అయితే దేవ్ అత్యంత వేగంగా పరిగెత్తే వారిలో ఒకడు, కానీ ఆ రోజు పరుగుపందెంలో తనకిష్టమైన బ్లూ కలర్ బాటిల్ తోపాటు పింక్ కలర్ బాటిల్ తీసుకొచ్చాడు. దాంతో అతడు అందులో గెలవలేకపోయాడు. ఆ తర్వాత నాతో అప్పా నాకు నీలం రంగు ఇష్టం కాబట్టి వెళ్లి నా నీలం రంగు బాటిల్ తీసుకున్నాను, కానీ అక్కకు గులాబీ రంగు అంటే ఇష్టం అందుకని ఆమె కోసం ఇది కూడా తీసుకొచ్చానని చెప్పాడు. ఇప్పుడు మన దగ్గర రెండు బాటిల్స్ ఉన్నాయి ఒకటి నా కోసం, ఇంకొకటి అక్క కోసం అని అనందంగా అన్నాడు. ఫలితం కంటే నా కుమారుడు తన అక్కు ఇచ్చిన ప్రాధాన్యత మనసుకు హత్తుకుంది. అలాగే తన సహా విద్యార్థి పట్ల దేవ్ ప్రవర్తించిన తీరు కూడా నన్ను ఆకట్టుకుందన్నారు. ఎందుకంటే దేవ్ తాను ఓడిపోయానని బాధపడకుండా తన బలాలు గుర్తిస్తూనే తరగతిలో అత్యంత వేగంగా పరుగెత్తినందుకు ఆ అబ్బాయిని ప్రశంసించాడు. పైగా అతడు అత్యంత వేగంగా పరిగెట్టగలడు, నేను బొమ్మలు బాగా గీయగలను అని అన్నాడు. అంతేగాదు అతడు నా అంత బాగా గీయలేడు నాన్న అని చెప్పిన తీరు నన్ను ఎంతగానో కదిలించింది." అని సూర్య అన్నారు. ఇక్కడ ఆ విధంగా ఆలోచించమని దేవ్‌కి ఎవ్వరూ శిక్షణ ఇవ్వలేదు, అయినా తను కొన్ని విషయాల్లో తన స్నేహితుడు కొన్ని విషయాల్లో రాణించగలడు అని చెప్పగలిగే ఒక స్పష్టత అతడికి ఉండటం నిజంగా అభింనందించదగ్గ విషయం అని అన్నారు సూర్య. కాగా సూర్య జ్యోతిక దంపతులకు 2007లో దియా అనే కుమార్తె, 2010లో దేవ్ అనే కుమారుడు జన్మించారు. తమ పిల్లలు బీ-కరికులం పాఠశాలల్లో చదవడం కోసం చెన్నై నుంచి ముంబైకి మకాం మార్చేశారు ఈ దంపతులు.(చదవండి: అనీమియా @ డిమెన్షియా!) -
అనీమియా @ డిమెన్షియా!
అరవై ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్న పెద్దవారిలో రక్తహీనత (అనీమియా) ఉంటే ‘డిమెన్షియా’ అనే ఒకరకం ‘మతిమరపు’ వచ్చే ముప్పు కూడా ఎక్కువేనంటూ ఇటీవలి ఓ అధ్యయనం పేర్కొంటోంది. జామా నెట్వర్క్ ఓపెన్ అనే జర్నల్‌లో ప్రచురితమైన ఓ అధ్యయనంలో... 60 ఏళ్లు పైబడి... అధ్యయన ప్రారంభ సమయానికి డిమెన్షియా లేని 2,282 మంది స్వీడన్ వాసులను పరిశోధకులు పరిశీలించారు. అధ్యయనం మొదట్లో వీళ్లలో సుమారు 15 శాతం మందికి రక్తహీనత ఉన్నట్లు గుర్తించారు. 10 ఏళ్ల పాటు పరిశీలించగా వాళ్లలో మొత్తం 362 మందికి డిమెన్షియా వచ్చింది. అధ్యయనం మొదట్లో రక్తహీనత లేనివారితో పోల్చినప్పుడు... ప్రారంభంలో రక్తహీనత ఉన్నవారికి డిమెన్షియా వచ్చే అవకాశం 46 శాతం ఎక్కువగా ఉన్నట్లు తేలింది.ఈ ధోరణి మహిళలతో పోలిస్తే పురుషుల్లో స్పష్టంగా కనిపించింది. దీనికి ఒక కారణం ఏమిటంటే... రక్తహీనత వల్ల కాలక్రమంలో మెదడుకు చేరే ఆక్సిజన్ మోతాదు తగ్గిపోవచ్చు. ఇదే దీర్ఘకాలం కొనసాగితే మెదడు కణాలు, రక్తనాళాలు దెబ్బతినే అవకాశం ఉంది. దాంతో న్యూరాన్లు దెబ్బతినడానికి అవకాశాలు ఉన్నాయి. రక్తహీనత ఉన్నవారి మెదడు స్కాన్లలో కూడా మెదడు సైజు తగ్గడం, కణజాలం దెబ్బతినడం వంటి మార్పులనూ కొన్ని అధ్యయనాలు గుర్తించాయి.వైద్యపరంగా చూస్తే డిమెన్షియాకు రక్తహీనత వచ్చే ముప్పునకు ఒక కారణం కావచ్చని ఈ పరిశోధన ఫలితాలు సూచిస్తున్నాయి. అంతేకాదు, రక్తహీనతను గుర్తించి తగిన విధంగా చికిత్స చేయడం ద్వారా భవిష్యత్తులో అల్జీమర్స్ వ్యాధి నివారణకు ఇది కొంతవరకు ఉపయోగపడే అవకాశం ఉందని పరిశోధకులు భావిస్తున్నారు. (చదవండి: కళ్లకింద క్యారీబ్యాగులు ఉండకూడదంటే..!) -
రాఖీ పండుగ.. మార్కెట్ అమ్మకాలు ఎన్నివేల కోట్లంటే?
మన దేశమంతటా వేడుకగా జరుపుకొనే పండుగల్లో రాఖీ పండుగ విశిష్టమైనది. సోదరీ సోదరుల అనుబంధానికి ప్రతీకగా ‘రక్షాబంధనం’ తరతరాల ఆనవాయితీగా వస్తోంది. ఏటా శ్రావణ పూర్ణిమ రోజున సోదరీమణులు తమ సోదరులకు రాఖీలు కట్టి, మిఠాయిలు తినిపిస్తారు. సోదరుల నుంచి కానుకలు అందుకుంటారు.రాఖీ పండుగ మొదలవడానికి దాదాపు నెల్లాళ్ల నుంచి మార్కెట్లో రాఖీ కళ కనిపిస్తుంది. రాఖీ పండుగ కోసం సీజనల్‌గా ఊరూరా రాఖీ దుకాణాలు వెలుస్తాయి. స్వీట్ షాపుల్లో అమ్మకాల జోరు విపరీతంగా పెరుగుతుంది. రాఖీ సీజన్లో దేశవ్యాప్తంగా జరిగే రాఖీల అమ్మకాల విలువ దాదాపు రూ.17,000 కోట్లకు పైగా ఉంటుందని ‘కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆలిండియా ట్రేడర్స్’ (సీఏఐటీ) చెబుతోంది.గత ఏడాది రాఖీ మార్కెట్లో 42 శాతం వృద్ధి నమోదైంది. ఈసారి కూడా రాఖీల అమ్మకాల విలువ మరో 40 శాతానికి పైగా పెరగవచ్చని సీఏఐటీ అంచనా. రాఖీ జోరు గురించి గణాంకాల్లో తెలుసుకుందాం...మన దేశంలో రాఖీల తయారీ సంఘటిత రంగంలో కంటే అసంఘటిత రంగంలోనే ఎక్కువగా జరుగుతుంది. సంఘటిత రంగానికి సంబంధించిన లెక్కలు మాత్రమే పారిశ్రామిక సమాఖ్యలకు, ఇతర సంస్థలకు అందుబాటులో ఉంటాయి. ఇక్కడ చూపిన అంకెల కంటే వాస్తవానికి రాఖీల తయారీ, విక్రయాలు మరింత ఎక్కువగానే జరుగుతుంటాయి. -
పెళ్లిలో అనూహ్య పరిణామం : పెళ్లి దుస్తుల్లోనే వధువు చికిత్స
కేరళలోని పనూర్లో డా. షిరీన్, డా. రిజాజ్ల వివాహ వేడుకలో ఊహించని సంఘటన చోటుచేసుకుంది. తన వివాహ వేడుకలో అనారోగ్యానికి గురైన ఇద్దరు కేటరింగ్ సిబ్బందికి ప్రథమ చికిత్స అందించేందుకు పెళ్లి వేడుకలను కాసేపు నిలిపివేయడం విశేషంగా నిలిచింది. పెళ్లి దుస్తుల్లోనే ఉన్న వధువు డా. షిరీన్ సకాలంలో వైద్యం అందించి అందరి మన్ననలు అందుకున్నారు. అంతేకాదు కొత్త పెళ్లికొడుకు, భర్త రిజాజ్ కూడా ఆమెనుకొనియాడారు కేరళమ్‌లోని కన్నూర్‌లో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.కన్నూర్ జిల్లా పనూర్‌కు చెందిన డాక్టర్ షిరిన్ సుబాయిర్కు డాక్టర్ రియాజ్‌తో పెళ్లి జరుగుతోంది. ఆ సమయంలో విందు వడ్డించే బృందంలో ఉన్న ఇద్దరు మహిళలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇది తెలిసిన వెంటనే పెళ్లి దుస్తుల్లో ఉన్న డాక్టర్ షిరిన్ అక్కడికి చేరుకున్నారు. ఇద్దరిలో ఒకరికి ముక్కు నుంచి రక్తం వస్తుండగా మరొకరు స్పృహతప్పి పడిపోయారు. ముక్కు నుంచి రక్రస్రావం ఆగేందుకు ముందుకు వంగి ముక్కులోని మెత్తడి భాగాన్ని 15 నిమిషాలు గట్టిగా పట్టుకోవాలని, ఆ సమయంలో నోటి ద్వారా శ్వాస పీల్చుకోవాలని సూచించారు. మరో మహిళను వెల్లకిలా కాళ్లు కాస్తంత ఎత్తులో ఉంచి పడుకోవాలని సూచించారు. వారిద్దరికీ కాస్త స్వస్తత చేకూరాక, ఆస్పత్రికి తీసుకెళ్లాలని అక్కడి వారికి పురమాయించారు.ఇదీ చదవండి: 16 ఏళ్లకే 275 కిలోలు బరువు : రెండు నెలల్లో 50 కిలోలు తగ్గాడు ఇదంతా కొందరు వీడియో తీసి సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో వైరల్‌గా మారింది. ‘ఆ సమయంలో వారికి అక్కడ ఏది అత్యవసరమో అదే చేశా. ఇందులో నా గొప్పతనమేదీ లేదు. ఎవరికైనా ఇలా చేస్తా. అస్వస్థతకు గురైన వారిని ఆస్పత్రికి తీసుకెళ్లడం కంటే ముందుగా ఇలాంటి చిన్నచిన్న పనులు చేస్తే, వారికి ప్రమాదం చాలా వరకు తప్పుతుంది’అని డాక్టర్ షిరీన్ అంటున్నారు. ప్రస్తుతం ఈమె ఒట్టపాలెంలోని వల్లువనాడ్ ఆస్పత్రిలో ఎమర్జెన్సీ మెడిసిన్ విభాగంలో ఎండీ ఫస్టియర్ చేస్తున్నారు. భర్త డాక్టర్ రియాజ్ ఆంధ్రప్రదేశ్‌లోని ఓ ఆస్పత్రిలో మెడిసిన్ పీజీ చేస్తున్నారు. ఇదీ చదవండి: మూడేళ్ల నుంచే వేధింపులు, చివరికి 70 కిలోలు తగ్గింది కానీ నరకం -
ఓనం కేరళం! పండుగలో పిల్లలకు మోస్ట్ ఫేవరెట్ ఏంటో తెలుసా?
పిల్లలూ... ఇప్పుడు కేరళంలో ఓనమ్ పండగ సీజన్. మనకు దసరా, సంక్రాంతి ఎలాగో... కేరళ వాళ్లకు ‘ఓనమ్’ అలా అన్నమాట. ఇది వాళ్ల పెద్ద పండుగ. పూర్వం కేరళను ‘మహాబలి’ అనే ఒక మంచి రాజు పాలించేవాడట. ఆయనంటే ప్రజలందరికీ చాలా ఇష్టం.ఆ రాజు ఏటా ఒకసారి ఆకాశం నుంచి భూమికి వచ్చి, తన ప్రజలందరూ ఎలా ఉన్నారో చూసి వెళ్తాడని అక్కడి వాళ్ల నమ్మకం. ఆ రాజుగారికి గ్రాండ్‌గా వెల్కమ్ చెప్పడానికే ఈ ఓనమ్ పండుగ చేసుకుంటారు. ఈ పండుగకు పిల్లలు చేసే హడావుడి అంతా ఇంతా కాదు! పది రోజుల పాటు రోజూ పొద్దున్నే లేచి, తోటల్లో కలర్‌ఫుల్ పూలను కోసుకొస్తారు. ఇంటి ముందు ‘పూకళం’ అంటే పూలతో పెద్ద పెద్ద ముగ్గులు భలే అందంగా పెడతారు. పట్టు లంగాలు, తెల్లటి సాంప్రదాయ బట్టలు వేసుకుని దేవదూతల్లా రెడీ అవుతారు.ఈ పండుగలో పిల్లలకు మోస్ట్ ఫేవరెట్ ఐటమ్ ఏంటో తెలుసా? ‘పులికలి’ అనే టైగర్ డ్యాన్స్! కొందరు మనుషులు ఒంటికి పులి లాగా రంగులు వేసుకుని, డప్పుల చప్పుళ్లకు వీధుల్లో డాన్స్ చేస్తుంటే పిల్లలు తెగ నవ్వుకుంటారు. అలాగే నదుల్లో పెద్ద పెద్ద పడవ పందాలు జరుగుతుంటే చూసి చప్పట్లు కొడతారు. ఇక పండగ రోజు అరిటాకులో పాయసం, బోలెడు వంటకాలతో కడుపునిండా విందు భోజనం తింటారు. మరి ఈసారి ఓనమ్ పండుగకు మీరు కూడా ఇంట్లో పూల ముగ్గులు వేసి ఎంజాయ్ చేస్తారా!ఇవి కూడా చదవండి: 'జుడో' పోటీ..! బలం కంటే తెలివితో ప్రత్యర్థిని ఓడించగలమా? -
'జుడో' పోటీ..! బలం కంటే తెలివితో ప్రత్యర్థిని ఓడించగలమా?
పిల్లలూ... మీరు ఎప్పుడైనా జుడో ఆటను చూశారా? ఇటలీలో జరుగుతున్న జూడో పోటీల్లో ఇద్దరు ఆటగాళ్లు ఒకరినొకరు పట్టుకుని ఎలా పోటీ పడుతున్నారో చూశారా! జూడో అనేది జపాన్ దేశంలో పుట్టిన ఒక అద్భుతమైన మార్షల్ ఆర్ట్.అయితే ఇది కేవలం కొట్టుకునే ఆట కాదు. జూడో అంటే జపనీస్ భాషలో ‘సున్నితమైన మార్గం’ (Gentle Way) అని అర్థం. అంటే... శత్రువు ఎంత బలంగా ఉన్నా, మన తెలివితో, సున్నితమైన పద్ధతులతో వాళ్లని కింద పడేయడం అన్నమాట!జుడో నేర్చుకోవడం వల్ల మీ చేతులు, కాళ్లు చాలా బలంగా తయారవుతాయి. మీ శరీరం స్ప్రింగ్‌లా ఫ్లెక్సిబుల్‌గా మారుతుంది. మిమ్మల్ని ఎవరైనా ఏడిపించినా లేదా అటాక్ చేసినా... మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలో ఈ ఆట నేర్పుతుంది. జుడోలో ఆట మొదలుపెట్టే ముందు, ముగించిన తర్వాత ఒకరికొకరు తల వంచి నమస్కారం (Bow) చేస్తారు.ఇది మనకు క్రమశిక్షణను, ఎదుటివారిని గౌరవించడాన్ని నేర్పుతుంది. ప్రత్యర్థి ఎటువైపు నుంచి వస్తున్నాడో గమనించాలి కాబట్టి మీ ఫోకస్, మైండ్ పవర్ బాగా పెరుగుతాయి. ఈ ఆటలో గెలవాలంటే పెద్ద పెద్ద కండలు అవసరం లేదు... పక్కా ప్లాన్, మంచి పట్టు ఉంటే చాలు. మీరు కూడా స్కూల్ అయిపోయాక ఇలాంటి ఒక మంచి మార్షల్ ఆర్ట్ నేర్చుకుంటే చాలా యాక్టివ్‌గా, హెల్తీగా ఉంటారు. -
రోజూ విమానం కోసం ఎదురుచూసే బాలుడు! చివరికి..
భారతదేశ విమానయాన రంగానికి పితామహుడిగా పిలవబడే జె.ఆర్.డి. టాటాకు పదేళ్ల వయసున్నప్పుడు వారి కుటుంబం ఉత్తర ఫ్రాన్స్‌లోని ఒక బీచ్ రిసార్ట్ పక్కన నివసించేది. అక్కడ వారి పొరుగున ప్రపంచంలోనే మొదటిసారిగా విమానంలో ఇంగ్లీష్ ఛానల్‌ను దాటి రికార్డు సృష్టించిన ప్రసిద్ధ విమానయాన పైలట్ లూయిస్ బ్లెరియట్ ఉండేవాడు.ఆయన తరచూ ఆ బీచ్‌లోని ఇసుకపై విమానాన్ని ల్యాండ్ చేస్తూ ఉండేవారు. బీచ్‌లో ఆడుకునే చిన్నారి టాటా ప్రతిరోజూ ఆ విమానం రాక కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూసేవాడు. ఆ పైలట్ సాహసాలు చూసి, చిన్నారి టాటాలో ఒక బలమైన కోరిక నాటుకుంది. నేను కూడా పెద్దయ్యాక ఖచ్చితంగా పైలట్ అవ్వాలి, ఆకాశంలో ఎగరాలి అని మనసులో నిశ్చయించుకున్నాడు.ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత 1929లో భారతదేశంలోనే మొట్టమొదటి కమర్షియల్ పైలట్ లైసెన్స్ సాధించి తన బాల్యపు కలను నిజం చేసుకున్నారు. ఆ తర్వాత ఆయనే భారతదేశపు మొదటి ఎయిర్‌లైన్స్ సంస్థను స్థాపించారు.సందేశం: బాల్యంలో మనసులో నాటుకునే బలమైన లక్ష్యాలే భవిష్యత్తులో మనల్ని గొప్ప శిఖరాలకు చేరుస్తాయి!ఇవి చదవండి: సముద్రాన్నే సవాల్ చేసిన ఈతగాడు.. కేవలం వారికోసమే! -
చీర బోర్డర్ వెనుక ఇంత చరిత్ర ఉందా?
భారతీయ వస్త్రధారణలో చీరలకు ఉన్న స్థానం ప్రత్యేకమైనది. ముఖ్యంగా చీరలకు ఉండే బంగారు రంగు బోర్డర్ కేవలం ఒక అలంకరణ మాత్రమే కాదు. దాని వెనుక ఎంతో సాంస్కృతిక, సామాజిక, చారిత్రక ప్రాధాన్యత ఉంది.భారతీయ సంస్కృతిలో స్వర్ణాన్ని పవిత్రతకు, అదృష్టానికి, ఐశ్వర్యానికి సూచికగా భావిస్తారు. చీరలకు బంగారు బోర్డర్ జోడించడం వల్ల ఆ వస్త్రానికి ఒక శుభసూచకమైన రూపం వస్తుంది. అందుకే వివాహాలు, పూజలు, పండుగలు, ఇతర వేడుకలలో బంగారు అంచు ఉన్న చీరలను ధరించడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.చారిత్రాత్మకంగా పట్టు నూలుతో పాటు అసలైన వెండి, బంగారు తీగలను ఉపయోగించి సరిహద్దులను నేయడం ఎంతో శ్రమతో కూడుకున్న పని. రాజులు, జమీందారులు, ధనిక వర్గాల మహిళలు తమ సామాజిక హోదాను ప్రతిబింబించేలా వెడల్పాటి బంగారు బోర్డర్లు ఉన్న చీరలను ధరించేవారు. బోర్డర్ ఎంత వెడల్పుగా ఉంటే, వారి హోదా అంత ఉన్నతంగా పరిగణించబడేది.తమిళనాడుకు చెందిన కాంజీవరం పట్టు చీరల ప్రధాన ఆకర్షణే వాటి కాంతివంతమైన రంగులు, దట్టమైన బంగారు జరీ బోర్డర్లు. చీర రంగుకు కాంట్రాస్ట్ రంగులో ఉండే ఈ బంగారు బోర్డర్లు దక్షిణ భారత వివాహ వేడుకలలో ప్రత్యేక కళను తీసుకువస్తాయి.కేరళ సాంప్రదాయ చీరలలో తెల్లటి లేదా లేత క్రీమ్ రంగు నూలుపై సరళమైన బంగారు అంచు మాత్రమే ఉంటుంది. మిగిలిన చీరంతా సాధారణంగా ఉన్నప్పటికీ, ఆ బంగారు బోర్డర్ మాత్రమే చీరకు పరిపూర్ణమైన సౌందర్యాన్ని ఇస్తుంది. ఓణం, విషు వంటి పండుగలలో ఇది వారి సాంస్కృతిక గుర్తింపుగా నిలుస్తుంది.ఇవి చదవండి: బట్టలను తిరగేసి ఇస్త్రీ చేస్తే ఏమవుతుంది? -
బట్టలను తిరగేసి ఇస్త్రీ చేస్తే ఏమవుతుంది?
ఇస్త్రీ పని కష్టంగా అనిపిస్తోందా? కొన్ని సులభమైన చిట్కాలు పాటిస్తే తక్కువ సమయంలోనే బట్టలను చక్కగా మడతలు లేకుండా చేసేయొచ్చు.బట్టలను తిరగేసి లోపలి భాగం వైపు ఇస్త్రీ చేయడం వల్ల సులభంగా పనిపూర్తవుతుంది.అంతేకాకుండా రంగులు వెలిసిపోకుండా ఉంటాయి. నల్లటి బట్టలపై పడే ఐరన్ మెరుపు ముద్రలను కూడా నివారించవచ్చు.బట్టల మీద చాలామంది డైరెక్టుగా నీటిని చల్లుతుంటారు. అలాకాకుండా, ఒక పలుచని తడి క్లాత్‌ని బట్టలపై పరిచి ఐరన్ చేస్తే బట్టలు సాగకుండా ఉంటాయి.షర్టులను ఇస్త్రీ చేసేపుడు బటన్లన్నీ పెట్టేయకుండా కేవలం పై బటన్ మాత్రమే పెట్టి, కాలర్ నుంచి కిందికి ఐరన్ చేయడం వల్ల కాలర్లు పాడవకుండా ఉంటాయి, టైమ్ సేవింగ్ కూడా.సిల్క్ లేదా కాటన్ బట్టలపై కాస్త నీటిని స్ప్రే చేసి, ΄్లాస్టిక్ కవర్లో పెట్టి రాత్రంతా ఫ్రీజర్‌లో ఉంచాలి. ఉదయాన్నే బయటకు తీసి 20 నిమిషాల తర్వాత ఐరన్ చేస్తే ముడతలు పోతాయి.ఇస్త్రీ చేయడానికి వాడే నీటిలో లేదా వెట్ క్లాత్ నానబెట్టిన నీటిలో కొన్ని చుక్కల పర్ఫ్యూమ్ ఆయిల్ కలిపితే, ఇస్త్రీ చేసిన బట్టల నుంచి రోజంతా మంచి సువాసన వస్తుంది.ఇవి కూడా చదవండి: థ్రిల్ కన్నా ప్రాణాలే ముఖ్యం.. టూరిస్టులకు కీలక సూచనలు! -
థ్రిల్ కన్నా ప్రాణాలే ముఖ్యం.. టూరిస్టులకు కీలక సూచనలు!
విహారం ఆహ్లాదాన్నిస్తుంది.. సాహసం ధైర్యాన్నిస్తుంది. కానీ ఒక చిన్న ఏమరపాటు ప్రాణాలమీదికి తెస్తుంది. మన దేశపు యువతలో కూడా ట్రెక్కింగ్ కల్చర్ పెరుగుతోంది. రిషికేశ్‌లో వైట్–వాటర్ రాఫ్టింగ్, బీర్ బిల్లింగ్‌లో పారాగ్లైడింగ్, దాండేలిలో జిప్‌లైన్, హిమాలయాల్లో ట్రెక్కింగ్.. ఇలా సాహస క్రీడల వైపు పర్యాటకులు క్యూ కడుతున్నారు. అయితే, ఈ క్రేజ్‌కు తగినట్లుగా పర్యాటకుల భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.ఇటీవల కర్ణాటకలోని దాండేలి రిసార్ట్‌లో జరిగిన ఒక తీవ్రమైన ప్రమాదం ఈ భద్రతా లోపాలను మరోసారి కళ్లకుకట్టింది. జూలై 3న 24 ఏళ్ల కుబేర్ సుర్పూర్ అనే యువకుడు దాండేలిలోని ఒక ప్రైవేట్ రిసార్ట్‌లో జిప్‌లైన్ చేస్తుండగా, సగం దూరంలో ఉండగానే ‘సేఫ్టీ లాక్’ ఊడిపోయింది. దాదాపు 40 అడుగుల ఎత్తు నుంచి అతను కిందపడిపోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు.వెళ్లే‘ముందు’ జాగ్రత్తలు..గుడ్డిగా నమ్మవద్దు: మీరు ఎంచుకున్న ఆపరేటర్ పర్యాటక శాఖ లేదా అడ్వెంచర్ టూర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాలో రిజిస్టర్ అయ్యాడో లేదో తెలుసుకోండి. వెబ్సైట్లో రాసింది నమ్మకుండా, వారి ఒరిజినల్ భద్రతా సర్టిఫికెట్లను చూపించమని అడగండి.స్వయంగా చూడండి: బెల్టులు, హెల్మెట్లు, తాళ్లు, లాకింగ్ సిస్టమ్స్ పాతబడిపోయాయా లేదా తుప్పు పట్టి ఉన్నాయా అనేది స్వయంగా చూసుకోండి. అనుమానం వస్తే ఆ రైడ్ మానడమే మంచిది.సేఫ్టీ బ్రీఫింగ్: యాక్టివిటీ మొదలయ్యే ముందు నిపుణులైన ఇన్ స్ట్రక్టర్ ఇచ్చే భద్రతా సూచనలు స్పష్టంగా వినండి. సేఫ్టీ లాక్స్, ఎమర్జెన్సీ బ్రేక్స్ ఎలా పనిచేస్తాయో అడిగి తెలుసుకోండి.దాచవద్దు: మీకు ఉన్న ఆరోగ్య సమస్యలు, ఇటీవలి ఆపరేషన్ల వివరాలను ముందే చెప్పండి. బరువు, ఎత్తు పరిమితులను కచ్చితంగా పాటించండి.ప్యాకేజీలకు మోసపోవద్దు: తక్కువ ధరకే ప్యాకేజీలు ఇస్తున్నారంటే వారు పరికరాల నిర్వహణ, సిబ్బంది శిక్షణలో లోపం ఉందేమో అని గమనించాలి.వాతావరణం బాగున్నప్పుడే: భారీ వర్షం, బలమైన ఈదురు గాలులు ఉన్నప్పుడు ఆపరేటర్లపై ఒత్తిడి తెచ్చి యాక్టివిటీలు చేయవద్దు. ప్రతికూల వాతావరణం వల్ల రోప్‌ల పట్టు సడలి ప్రమాదాలు జరుగుతాయి.రివ్యూలు ముఖ్యం: కేవలం పక్కన ఉన్న లొకేషన్ బాగుందని కాకుండా, ఆపరేటర్ భద్రతా పద్ధతులు, ఇన్‌స్ట్రక్టర్ల ప్రవర్తనపై ఇతర పర్యాటకులు ఇచ్చిన రివ్యూలను చదవండి.స్టంట్స్ వద్దు: రైడ్ లేదా రాఫ్టింగ్ మధ్యలో బెల్టులు తీయడం, స్టంట్స్ చేయడం వంటివి ప్రాణాలకే ప్రమాదం తెస్తాయి. సరదాగా గడిపే క్షణాలు జీవితాంతం బాధింపకూడదంటే సాహస యాత్రల్లో ఉత్సాహంతో పాటు కాస్త అప్రమత్తత కూడా చాలా అవసరం. థ్రిల్ కన్నా మీ ప్రాణాల భద్రతే ముఖ్యం!అమలులో లోపం!భారత పర్యాటక శాఖ, అడ్వెంచర్ టూర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కలిపి నేల, నీరు, ఆకాశంలో చేసే సాహస క్రీడలకు కఠిన నిబంధనలు రూపొందించాయి. కానీ ఇవన్నీ కాగితాలకే పరిమితమయ్యాయి. క్రమం తప్పకుండా పరికరాల తనిఖీలు, సర్టిఫైడ్ గైడ్లు, క్వాలిటీ హార్నెస్ సిస్టమ్స్ వాడాలని నిబంధనలు చెప్తున్నాయి. కానీ స్థానిక స్థాయిలో వీటి పర్యవేక్షణ చాలా బలహీనంగా ఉంది. దీనివల్ల అనుమతులు, భద్రతా తనిఖీలు లేని ఆపరేటర్లు పర్యాటకుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. -
ఆసై దోసై అప్పళం వడై..
ప్రతి ఇంటిలో మనం మరచి΄ోయిన ఒక నిధి ఉంటుంది. కొద్దిమందికి ఆ నిధి అకస్మాత్తుగా గుర్తుకు వచ్చి వెలుగులోకి తెస్తారు. ఆ వెలుగులు పిల్లల ప్రపంచంలోకి వస్తే ఎంత బాగుంటుంది? ఎంత బాగుంటాయో చెబుతున్నాయి అమ్మ చెప్పిన కథలు. ‘ఫోక్‌టేల్స్ ఫ్రమ్ తమిళనాడు’ పేరుతో వచ్చిన పుస్తకం సోషల్ మీడియాలో ఎట్రాక్షన్‌గా మారింది. ‘నాకు కూడా మా అమ్మ చెప్పిన కథలు గుర్తుకు వస్తున్నాయి’ అంటూ కలం పడుతున్నారు నెటిజనులలో కొందరు...చిన్నప్పుడు తల్లి తనకు చెప్పిన జానపద కథలను ఈతరం పిల్లలకు ‘ఫోక్ టేల్స్ ఫ్రమ్ తమిళనాడు’ పేరుతో చేరువ చేస్తున్నారు నారాయణ్.అమ్మ చెప్పిన ఆ కథలు ఎలా ఉంటాయి?ఏనుగు పక్కింటి అబ్బాయిలా పిల్లలతో ఫ్రెండ్లీగా మాట్లాడుతుంది.పులి గాండ్రిస్తూనే ‘హాయ్’ చెబుతుంది.గర్జిస్తూనే సింహం మన యోగక్షేమాలు అడుగుతుంది.ఒక్కటా రెండా... ఎన్నెన్ని చిత్రవిచిత్రాలో! ఈ పుస్తకంలో 21 కథలు పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తాయి. నైతిక విలువలు అంటే ఏమిటో చెప్పకనే చెబుతాయి. తెల్లగుర్రంపై ఎక్కించి మేఘాలపై స్వారీ చేయిస్తాయి.పనిదొంగ పక్షులుఅనగనగా ఒక కోడి. ఆ కోడి పిండి కలిపి చపాతీలు చేస్తుండగా, దాని పొరుగున ఉన్న కాకి, పిచ్చుక, బాతు, చిలకలాంటివి కోడికి సహాయం చేయకుండా ఏవో సాకులు చెప్పి తప్పించుకుంటాయి.అయితే, వేడి వేడి చపాతీలు రెడీ అయిన వెంటనే...‘మాకు కూడా’ అంటూ ఆత్రుతగా కోడి చుట్టూ చేరతాయి. అప్పుడు కోడి నోటి నుండి...‘ఆసై దోసై అప్పళం వడై’ అనే పాట వినిపిస్తుంది. పిల్లలకు తెగ నవ్వొస్తుంది.ఇక ‘కా...కా’ కథ విషయానికి వస్తే, ఒక సోమరి కాకి తన ఆహారాన్ని వెదుక్కోవడానికి బద్దకించి, పిచ్చుకల నుండి దొంగిలిస్తుంటుంది. ఆహారాన్ని దొంగిలించడంలో అపారమైన తెలివితేటలు చూపే కాకి అత్యంత సులువుగా ఉచ్చులో పడుతుంటుంది. తన మూర్ఖత్వాన్ని చాటుకుంటుంది.పాటల కథలు!అమ్మ చెప్పిన కథలలో పాటలు, కవితలు ఉండడం మరో విశేషం. చందమామను పిలిచే పాట ‘నిల నిల ఓడి వా’ ను పిల్లలు గట్టిగా పాడుకుంటారు. ఈ కథలు పిల్లలకు తమిళ సాంస్కృతిక విశేషాలు, ఆహారపు అలవాట్ల గురించి కూడా తెలియజేస్తాయి.‘మా అమ్మ చెప్పే కథలు వింటూ పెరిగాను. ఈ కథలను నేను మరెక్కడా వినలేదు. తన ముందుతరాల నుండి అమ్మకవి వారసత్వ సంపదగా వచ్చాయి. సంగీతంపై నాకు అవగాహన ఉన్నప్పటికీ అమ్మకు ఉన్నంత లోతైన అవగాహన లేదు. తాను కథ చెప్పే విధానానికి సంగీతం బలం అయింది. కథలను మరింత ఆసక్తికరంగా వినేలా చేసింది’ అంటారు నారాయణ్.కథాచిత్ర ప్రపంచంఅందమైన కథలకు, అద్భుతమైన చిత్రాలు తోడైతే పిల్లలకు ఎంత సంతోషం కలిగిసాయో ఈ పుస్తకంలోని కనువిందు చేసే కలర్ పెయింట్స్ సాక్ష్యం. జానపద కథలు పుస్తకరూపంలోకి వచ్చినప్పుడు ఎన్నో రకాల మార్పులకు గురవుతుంటాయి.‘అసలు మార్పులు అవసరమా?’ అనే ప్రశ్నకు నారాయణ్ ఇచ్చే జవాబు...‘అవసరమే లేదు’ ఎందుకంటే జానపద కథలు ఊహల ద్వారానే పాఠకులతో అనుసంధానం అవుతాయి.‘కొన్ని విషయాలు శాశ్వతమైనవి. ఊహాలోకంలో విహరించాలనే మన ప్రేమ కూడా అందులో ఒకటి. ప్రతీదాన్ని సమకాలీకరించాల్సిన అవసరం లేదు. జానపద కథలు యథాతథ రూపంలోనే బాగుంటాయి’ అంటున్నారు నారాయణ్.- సృజనఇవి చదవండి: పిల్లల్లో హింసాత్మక ఆలోచనలకు అసలు కారణాలేంటో తెలుసా? -
పిల్లల్లో హింసాత్మక ఆలోచనలకు అసలు కారణాలేంటో తెలుసా?
‘‘పిల్లలకు ఏదైనా మంచి చెబితే వినే రోజులు కావు ఇవి..’’ ‘‘అంతా ఫోన్ల వల్లే, ఇలా తయారవుతున్నారు..’’ ‘‘జల్సాలకు అలవాటు పడ్డారు. అందుకే అంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు..’’ ఈ రోజుల్లో పిల్లల ప్రవర్తనకు సంబంధించి ఇలాంటి మాటలు.. తరచూ వింటున్నాం.ఈ మాటలను బలపరుస్తూ...ఇటీవల తెలంగాణలోని నల్లగొండ జిల్లాలో ఓ స్కూల్ ప్రిన్సిపల్‌ని విద్యార్థులే అతి దారుణంగా చంపిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. టీచర్ పట్ల ఉండాల్సిన గౌరవం, భక్తి.. స్థానంలో కక్షపూరితమైన ఆలోచన ఎలా వచ్చింది? మైనర్ పిల్లల్లో అంతటి హింసాత్మక ప్రవృత్తి పెరగడానికి కారణం ఏంటని.. నివ్వెరపోయారు. తల్లిదండ్రుల తర్వాత గురువే దైవంగా భావించే మన సంస్కృతిలో ఇలాంటి అమానుష ఘటనలు చోటుచేసుకోవడానికి గల కారణాలు.. మరో సంఘటనకు తావు ఇవ్వకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నిపుణులు ఈ విధంగా సూచిస్తున్నారు..‘సాధారణంగా ఈ రోజుల్లో పిల్లల చదువులో ర్యాంకులే చూస్తున్నాం. కానీ, వారి ప్రవర్తన లో వస్తున్న మార్పులను గమనిస్తున్నామా.. అనేది ప్రశ్నించుకోవాలి. నేటి తరాన్ని మార్చేది శిక్ష రూపంలో కాదు.. ప్రేమ, శ్రద్ధ, అవగాహనయే ప్రధానంగా చూపాల్సింది’ అంటున్నారు మనస్తత్వ నిపుణులు డాక్టర్ జ్యోతిరాజ.ఒకప్పుడు పిల్లల ప్రపంచం చదువు, ఆటలు, స్నేహాలు, కుటుంబంతో గడిపే సమయంతో నిండి ఉండేది. కానీ నేటిరోజులు అరచేతిలో రంగుల ప్రపంచాన్ని చూపే సోషల్ మీడియా, ఖరీదైన వస్తువులపై ఆకర్షణ, ఏదో ఒక దారిలో త్వరగా డబ్బు సంపాదించి ఆనందించాలనే ఆలోచన, వ్యసనాలు.. పిల్లల మెదళ్లను కుదురుగా ఉండనివ్వడం లేదు. కష్టపడటం కన్నా తాత్కాలిక ఆనందాన్నిచ్చే వాటిని అందుకోవడంవైపే మొగ్గుచూపుతున్నారు. కారణాలు ఏవైనా కుటుంబంలో ఒకరితో ఒకరు కలిసి మాట్లాడుకోవడం అనేది ఇటీవల కాలంలో బాగా తగ్గిపోయింది. దీనివల్ల పిల్లల ప్రవర్తనల్లో వచ్చే మార్పులను పసిగట్టలేకపోతున్నారు. ఫలితంగా సరిదిద్దలేకపోతున్నారు.ఇలాంటి క్రమంలో...ఒక పిల్లవాడు తప్పు చేసినప్పుడు తోటివాళ్లముందు ‘ఈ పిల్లవాడు చెడ్డవాడు’, ‘సరిదిద్దుకోకపోతే పనిష్మెంట్ తప్పదు...’ అనే హెచ్చరికలు సమస్యకు పరిష్కారాన్ని చూపవు.పిల్లలు స్కూల్‌కి సరిగా రావడం లేదు, చదవడం లేదు అని ఎప్పటికప్పుడు టీచర్లు తల్లిదండ్రులకు తెలియజేస్తుంటారు. ఇలాంటప్పుడు తల్లిదండ్రులు దండనతో కాకుండా ‘వారి ప్రవర్తన వెనుక కారణం ఏమిటో..’ తెలుసుకోవాలి. ప్రేమతోనే మార్పును తీసుకురావాలి.స్కూళ్లలో చదువు మాత్రమే కాకుండా విలువలు నేర్పేలా ప్రవర్తనకు సంబంధించి నిపుణులచే కౌన్సెలింగ్ సెషన్స్ నిర్వహించాలి. పిల్లలు శారీరకంగా అలసిపోయేలా క్రీడలు ఉండాలి, అలాగే మానసిక వికాసం పెంపొందే వాతావరణమూ వారి చుట్టూతా ఉండాలి.వదిలేయకూడదు...కుటుంబంలో సరైన శ్రద్ధ చూపకపోవడం, స్కూల్లో వేధింపులు, స్నేహితుల ప్రభావం, ఫోన్లలో హింసాత్మక కంటెంట్ ఎక్కువ చూడటం, పదే పదే అవమానించబడుతున్నాననే భావన.. ఇవన్నీ పిల్లల ప్రవర్తనపై ప్రభావం చూపుతుంటాయి. పిల్లల్లో తీవ్రమైన కోపావేశాలు, స్కూల్లో గొడవలు, వస్తువులను పగలగొట్టడం, ఇతరులను గాయపరచడం, వ్యసనాలు.. ఇలాంటివి గుర్తిస్తాం. కానీ, పెద్దయ్యాక వాళ్లే మారుతారులే అని వదిలేయకూడదు. మార్పు తీసుకురాలేకపోతున్నాం అనిపిస్తే తల్లిదండ్రులు, టీచర్లు... నిపుణులను సంప్రదించాలి.– డా. జ్యోతిరాజ, సైకాలజిస్ట్పిల్లలు చెప్పేది ముందుగా వినాలి...పిల్లలు ఏదైనా తప్పు చేసినప్పుడు సాధారణంగా తల్లిదండ్రులు వెంటనే అరుస్తారు లేదా కొట్టడం, అవమానించడం కూడా చేస్తుంటారు. దానికి బదులుగా ...‘‘నువ్వు ఇలా ఎందుకు చేశావు?’’, ‘‘ఆ సమయంలో నీకు ఎలా అనిపించింది?’’, ‘‘ఇలా చేయడం వల్ల ఇంకొకరికి ఎలా అనిపించి ఉండొచ్చు?’’.. అనే ప్రశ్నలు ప్రైమరీ పాఠశాల స్థాయి నుంచే పిల్లలను అడుగుతూ ఉండటం, సమాధానాలు రాబట్టడం వల్ల వారిలో ఆత్మపరిశీలన, బాధ్యత, దయ పెరుగుతాయి.ఏదైనా సమస్య వచ్చినప్పుడు అది నేరుగా వారిని కాకుండా తప్పుడు ప్రవర్తనను విమర్శించాలి. ‘నువ్వు చెడ్డవాడివి’ అని చెప్పడం అంటే ఆ వ్యక్తిని రెచ్చగొట్టడమే అవుతుంది. ‘నువ్వు చేసిన పని తప్పు, నువ్వు కాదు. దీనిని సరిదిద్దుకునే అవకాశం ఉంది..’ అని చెప్పే మాటలు మరింత ప్రభావ వంతంగా పనిచేస్తాయి.నెగెటివిటీని ఎలా మార్చాలంటే...పిల్లలలో వచ్చే ప్రతి నెగెటివ్ ఆలోచనను బలవంతంగా ఆపాల్సిన అవసరం లేదు. దాని వెనుక ఉన్న భావాన్ని అర్థం చేసుకుని, దాన్ని సరైన దిశలోకి మళ్లించాలి. ఉదాహరణకు... ‘నాకు చేతకాదు’ అంటే – ‘ప్రయత్నిస్తే నువ్వూ నేర్చుకోగలవు.’‘ఎవరూ నన్ను పట్టించుకోరు’ అంటే – ‘నీ భావాలను మాతో స్వేచ్ఛగా పంచుకోవచ్చు.’‘‘అందరూ చేస్తున్నారు కాబట్టి నేనూ చేస్తాను’’ అంటే – ‘‘అందరూ చేసే పని సరైనదే కావాల్సిన అవసరం లేదు. సరైన నిర్ణయం తీసుకోవడం, అమలు చేయడం పెద్ద కష్టమైనది ఏమీ కాదు.. అని చెప్పగలగాలి.పాఠశాల అంటే పుస్తకాలు, పరీక్షలు, మార్కులు మాత్రమే కాదు అది వ్యక్విత్వాన్ని నిర్మించే కేంద్రాలు కూడా. పిల్లలు ఒంటరిగా గడపడం, చదువు పట్ల అనాసక్తి, కోపం, అసహనం.. వంటివి గమనించాలి. మామూలే అని వదిలేయకుండా సీరియస్‌గా తీసుకోవాలి. తల్లిదండ్రుల మద్దతుతో కౌన్సెలింగ్ ఇవ్వాలి. తప్పుడు దారుల్లోకి వెళ్లకుండా కాపాడగలగాలి. అప్పుడే రేపటి తరం భవిష్యత్తు అంధకారం కాకుండా చూడగలం.– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధిఇవి చదవండి: ఏజ్–టెక్‌తో స్కామ్స్‌పై ఎటాక్ -
తల వంచని తార
మంచి నటి... తొలి చిత్రం ‘షావుకారు’తోనే ఆ విషయాన్ని నిరూపించుకున్నారు జానకి. ఆ సినిమా పేరే ఆమె ఇంటి పేరుగా మారిపోయింది. మంచి వ్యక్తిత్వం... వ్యక్తిగా జానకి మీద చాలామందికి ఉన్న అభి్రపాయం ఇది. ఎలాంటి పరిస్థితుల్లోనూ తల వంచలేదు... తనని తాను తగ్గించుకోలేదు. వెండితెరపై నటిగా ఆమె షావుకారు... తెరవెనక నిజజీవితంలో తొలి దశలో పేదరికాన్ని అనుభవించినా నిఖార్సయిన వ్యక్తిగా ఉన్న జానకి వ్యక్తిత్వపరంగానూ షావుకారే! తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినిమాల్లో నటించి, నటనకు నిలువెత్తు నిదర్శనంగా పేరు తెచ్చుకోవడంతో పాటు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న ఈ ‘షావుకారు’ ఇక లేరు.‘షావుకారు’ జానకి అసలు పేరు శంకరమంచి జానకి. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో 1931 డిసెంబరు 11న శచీదేవి, టేకుమళ్ల వెంకోజీరావు దంపతులకు మూడో సంతానంగా జన్మించారు జానకి. ఆమెకు అన్నయ్య, అక్కయ్యతో పాటు చెల్లి కృష్ణకుమారి తోబుట్టువులు. జానకిది సంప్రదాయ కుటుంబం కావడంతో అమ్మ నుంచి ఆచారాలు, శుచీశుభ్రత అలవడ్డాయి. రాజమండ్రి ప్రభుత్వ బాలికల పాఠశాలలో ఏడో తరగతి వరకు చదువుకున్నారు జానకి. అయితే తండ్రి ఉద్యోగరీత్యా పలు ప్రాంతాలకు మారుతూ ఉండటం వల్ల ఆమె చదువు సరిగ్గా సాగలేదు. చెన్నై వెళ్లిన తర్వాత ఆంధ్ర మహిళా సభలో జానకిని మెట్రిక్‌లో చేర్పించారు. చిన్నతనంలోనే స్పష్టమైన ఉచ్చారణ, అద్భుతమైన వాక్చాతుర్యంతో ఆకాశవాణి నాటికల ద్వారా కళారంగంలో అడుగుపెట్టారామె. ఓ సారి చెన్నైలో ఆకాశవాణిలో ‘బాలానందం’ అనే ప్రోగ్రామ్‌లో జానకి గాత్రం ప్రముఖ దర్శక–నిర్మాత బి. నాగిరెడ్డికి నచ్చింది. దీంతో ‘నీ గాత్రం బాగుంది. పదాలను చక్కగా ఉచ్చరిస్తున్నావు. సినిమాలో చాన్స్ ఇస్తాను.. నటిస్తావా’ అన్నారట. అసలు నటనంటే ఏంటో తెలియకపోయినప్పటికీ ‘నటిస్తాను’ అని చెప్పేసి ఇంటికొచ్చిన జానకి.. జరిగిన విషయాన్నంతా తల్లిదండ్రులకు చెప్పారు. అయితే జానకిని మందలించి, శంకరమంచి శ్రీనివాసరావుతో వివాహం చేశారు తల్లిదండ్రులు. ఓవర్ కోట్ కప్పుకుని పరీక్షకు వెళ్లి... పెళ్లయినప్పుడు జానకి వయస్సు 15 ఏళ్లు. భర్తతో కలిసి విజయవాడలో కొత్త కాపురం ఆరంభించారామె. అయితే ఆర్థిక ఇబ్బందుల వల్ల అస్సాంలోని తల్లిదండ్రుల వద్దకు వెళ్లారు జానకి. అప్పట్లో జానకి చెల్లి కృష్ణకుమారి చదువుకుంటోంది. తనని చదివిస్తూ, తాను కూడా చదువుకుంటూ ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పటికీ ఓవర్ కోట్ కప్పుకుని పరీక్ష రాశారు జానకి. పెళ్లి తర్వాత ఎక్కువ రోజులు పుట్టింట్లో ఉండటం సరి కాదని చెన్నైలోని మేనమామ ఇంటికెళ్లారు. అక్కడే యజ్ఞ ప్రభకి జన్మనిచ్చారు. ఆ సమయంలో బి. నాగిరెడ్డి గతంలో తనకు ఇస్తానన్న సినిమా చాన్స్ గురించి భర్తకు చెప్పి, నటించటానికి ఒప్పించారు. చంకలో పాపాయితో ఆడిషన్స్‌కి... అవకాశం కోసం చంకలో పాపాయి, భర్తతో కలిసి బి. నాగిరెడ్డిని కలిశారు జానకి. పలు ఆడిషన్స్ తర్వాత ‘షావుకారు’ సినిమాలో హీరోయిన్గా తొలి అవకాశం వచ్చింది. మూడు నెలలు ఉన్న యజ్ఞ ప్రభని ఇంట్లో వదిలి ‘షావుకారు’లో నటించారు. ఆ సమయంలో ఓ తల్లిగా ఎంతో మానసిక వేదన అనుభవించారట ఆమె. ఆ సినిమాలో ఎన్టీఆర్‌కి జోడీగా నటించారామె. ఎల్వీ ప్రసాద్ దర్శకత్వంలో బి. నాగిరెడ్డి, చక్రపాణి నిర్మించిన ‘షావుకారు’ సినిమా 1950 ఏప్రిల్ 7న విడుదలై మంచి విజయం అందుకుంది. తొలి చిత్రంతోనే అసాధారణమైన అభినయాన్ని కనబరిచి, ఆ సినిమా పేరునే తన ఇంటిపేరుగా మార్చుకుని ‘షావుకారు జానకి’గా సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. ఐదువందల సినిమాల్లో... ‘షావుకారు’ మూవీ తర్వాత తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సుమారు 500 సినిమాల్లో నటించి, ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేశారామె. ఏడు దశాబ్దాలకు పైగా సాగిన సుదీర్ఘమైన సినీ ప్రయాణంలో కథానాయికగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో వైవిధ్యమైన పాత్రలకు జీవం పోసిన జానకి దక్షిణాది సినిమా చరిత్రలో చెరగని అధ్యాయంగా మిగిలిపోయారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎంజీఆర్, శివాజీ గణేశన్ వంటి అగ్ర కథానాయకుల సరసన సుమారు రెండు వందలకు పైగా సినిమాల్లో ఆమె కథానాయికగా నటించడం విశేషం. ‘రోజులు మారాయి, కన్యాశుల్కం, జయం మనదే, పాండురంగ మహత్యం, డాక్టర్ చక్రవర్తి, అక్కాచెల్లెలు, బడిపంతులు, సంసారం ఒక చదరంగం, మంచి మనసులు’ వంటి పలు సినిమాలు జానకి నటనా పటిమకు నిదర్శనాలు. బుల్లితెర పైనా... ‘షావుకారు’ జానకి కేవలం వెండితెరపైనే కాదు... సీరియల్స్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులను కూడా అలరించారు. తెలుగులో ‘నీడ, వరూధిని పరిణయం’, తమిళంలో ‘ఊరరింద రహస్యం, పెన్, అక్షయ’ వంటి సీరియల్స్‌లో నటించారు జానకి. వయసు మీద పడుతున్నప్పటికీ నటనపై ఉన్న మక్కువతో విశ్రాంతి తీసుకోకుండా ‘బిస్కోత్’ (తమిళం), ‘అన్నీ మంచి శకునములే’ (తెలుగు) వంటి చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారామె. తెలుగులో ఆమె నటించిన చివరి చిత్రం ‘అన్నీ మంచి శకునములే’(2023).పద్మశ్రీ జానకిషావుకారు జానకి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. 2022లో భారత ప్రభుత్వం ఆమెకు దేశంలోని అత్యున్నత ΄ûర పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీని ప్రకటించింది. అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి రెండు నంది అవార్డులు అందుకున్నారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పలు అవార్డులు అందుకున్నారు. పలు సంస్థలు ఆమెను జీవిత సాఫల్య పురస్కారాలతో గౌరవించాయి. అస్సాంలోని గౌహతి యూనివర్సిటీలో మెట్రిక్యులేషన్ వరకు చదువుకున్న జానకి కళారంగంతో పాటు సామాజిక సేవకు గాను యూనివర్సిటీ ఆఫ్ ఆరిజోనా నుంచి డాక్టరేట్ పొందారు. షావుకారు జానకి మృతితో భారతీయ చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పలువురు నటీనటులు సంతాపం తెలిపారు.ఇంట్లోకి రానివ్వని బంధువులు సినిమాల్లో వేషాలు వేయడానికి వెళ్లడం... హీరోయిన్గా హీరోలతో తాళి కట్టించుకునే సన్నివేశాలు, డ్యాన్స్ చేయడం.. వీటి వల్ల బంధువులు జానకిని ఇంట్లోకి రానిచ్చేవారు కాదట. ఒకసారి ఇల్లు వెతుక్కునే క్రమంలో చుట్టాల ఇంట్లో నిద్రపోదామని వెళ్తే.. ‘వద్దమ్మా! అంకుల్ ఏదైనా అంటారు. రావద్దు’ అని మొహం మీదే చెప్పారట. కుటుంబంలో ఎవ్వరూ ప్రోత్సహించనప్పటికీ వృత్తి పట్ల అంకితభావంతో పని చేశారు. మూడు ప్రసవాలు జరిగినా కెరీర్‌కు ఎలాంటి ఇబ్బంది రాకుండా సంవత్సరానికి 20 సినిమాలు చేయడం విశేషం. ‘నటిగా నువ్వు పనికి రావు’ అన్న కె. వి. రెడ్డితో ‘పనికి వస్తావు’ అనిపించుకునే స్థాయికి ఎదిగానని ఆమె ఓ సందర్భంలో చెప్పారు. నలుగురు ముఖ్యమంత్రులతో... భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఏ నటికీ దక్కని అరుదైన గౌరవం ‘షావుకారు’ జానకికి దక్కింది. దక్షిణాది రాజకీయాల్లో, సినీ రంగంలో తిరుగులేని చక్రవర్తులుగా వెలిగిన నలుగురు దిగ్గజ ముఖ్యమంత్రులతో ఆమె వెండితెరను పంచుకున్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్.టి. రామారావు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రులు ఎం.జి. రామచంద్రన్, జయలలిత, ఎం. కరుణానిధి... ఇలా నలుగురు సీఎంలతో కలిసి నటించారామె. వ్యక్తిత్వంలోనూ షావుకారే... కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడే అలవాటు ఉన్న జానకి దానివల్ల కొన్ని అవకాశాలు కోల్పోయారు. ఈ విషయం గురించి ఓ సందర్భంలో ఆమె చెప్పారు. ‘‘ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే ఎవరికీ నచ్చదు. కెరీర్ మొదట్లో నాకు నచ్చిన పాత్ర మాత్రమే ఎంచుకునేదాన్ని. పాత్రలో పూర్తిగా లీనమవ్వగలనన్న నమ్మకం ఉన్నప్పుడే అంగీకరించేదాన్ని. కొందరు నాకు పొగరు అన్నారు... కొందరు జానకితో సినిమా కష్టం అనేవారు... నేను మాత్రం అలా ఉండడమే నా వ్యక్తిత్వం అంటాను. అలా ఉండడం వల్ల చాలా అవకాశాలు వదులుకోవాల్సి వచ్చింది. అయినా నేను మాత్రం నా వ్యక్తిత్వాన్ని వదులుకోలేదు. కుటుంబం విషయంలోనూ ఇలానే ఉండేదాన్ని... మా అబ్బాయి 19 ఏళ్ల వయసులో చదువు కోసం అమెరికా వెళ్లాడు. అక్కడే సెటిల్ అయిపోయాడు. తిరిగి రాలేదు. అది అతని వ్యక్తిత్వం... అతని నిర్ణయం. ఇక తల్లిదండ్రులు బతికుండగా పిల్లలకు ఆస్తులు పంచకూడదు. ఏ బంధం శాశ్వతం కాదు. ఓసారి ఆరోగ్యం బాలేనప్పుడు పుట్టింటికి వెళ్లా. అప్పుడు వాళ్లకి నేను భారమని నాకు అనిపించింది. పెళ్లయిన తర్వాత ఏ ఆడపిల్లా పుట్టింటికి వెళ్లకూడదనిపించింది. నా భర్తతో విడాకులు తీసుకున్నాక రెండో పెళ్లి చేసుకోవాలనిపించినా పిల్లల కోసం వద్దనుకున్నాను. గొప్పింట్లో పుట్టినా ఆస్తులన్నీ పోయాయి. పేదరికం వల్లే నేను, నా చెల్లి కృష్ణకుమారి సినిమాల్లోకి వచ్చాం. సంపాదించాం. కుటుంబాలను చూసుకున్నాం’’ అని పేర్కొన్నారామె.ఒంటిపూట భోజనం వెండితెరపై రాణించిన జానకి వ్యక్తిగత జీవితం మాత్రం అంత సజావుగా సాగలేదు. ముఖ్యంగా వైవాహిక జీవితంలో తాను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. తాను కష్టపడి సంపాదిస్తే, తన భర్త విలాసాల కోసం ఖర్చు చేసేవారని, కొంత కాలానికి ఆస్తులన్నీ కరిగిపోయాయని ఆమె ఆ ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే నమ్మక ద్రోహానికి కూడా గురయ్యానని బాధపడ్డారామె. ఒక దశలో పిల్లల పెంపకం కూడా కష్టమౌతుందని భావించారామె. అందుకే రోజులో ఒక్క పూట మాత్రమే భోజనం చేశానని ఆమె పేర్కొన్నారు.నో బీపీ... షుగర్‘‘షూటింగ్స్ లేనప్పుడు ఇంటి పనులే నాకు పెద్ద వ్యాయామం’’ అని చెప్పేవారు జానకి. అలాగే తన ఆహారపు అలవాట్ల గురించి ఓ ఇంటర్వ్యూలో కొన్ని విషయాలు పంచుకున్నారు. ‘‘నాకు వంట చేయడం బాగా అలవాటు. స్వీట్స్‌లో అరిసెలంటే ఇష్టం. అయితే అవి తిన్నప్పుడు మిగిలినవి కట్ చేస్తాను. వెన్న, నెయ్యి, పాలు వంటి వాటిని పరిమితంగా తీసుకుంటాను. ఆరోగ్యకరమైన భోజనం రోజుకి ఒక్కసారైనా చాలు. ఆకలి లేకపోతే పండు తిని మంచినీళ్లు తాగి పడుకుంటాను. ఈ అలవాట్ల వల్ల నాకు బీపీ, షుగర్లు లేవు. అయితే రెండు మోకాళ్ళకు ఆపరేషన్ చేయించుకున్నాను. గుండె ఆపరేషన్ అయినా పని చేస్తూనే ఉన్నాను. నాకు దేవుడిపై భక్తి ఉంది. కానీ మూఢనమ్మకాలు లేవు. మంచి ఆలోచనలతో ఉంటే దేవుడు ఇక్కడే ఉన్నాడని నమ్ముతాను’’ అని చెప్పుకొచ్చారు షావుకారు జానకి. -
30 నిమిషాల నడకతో.. 33 కిలోల బరువు! అదెలాగంటే..
వాకింగ్ అనేది ఫిట్నెస్ పరంగా మంచిదని అందరికీ తెలిసిందే. బరువు తగ్గడానికి బెస్ట్ చాలా బెస్ట్ అని చెబుతారు కానీ దీంతోపాటు కార్డియో వ్యాయామాలు, ఇతర వేగవంతమైన వర్కౌట్లు, డైట్ వంటివి తోడైతేనే ప్రభావవంతంగా ఉంటుంది. అలాంటిది ఈ మహిళ చాలా తక్కువ శ్రమతో.. అది కూడా జస్ట్ 30 నిమిషాల వాకింగ్‌తో ఏకంగా 33 కిలోలు తగ్గి అందర్నీ ఆశ్చర్యఎలానో చూసేద్దామా..బరువు తగ్గడానికి వాకింగ్‌కి మించి బెస్ట్ వ్యాయామం ఇంకొకటి ఉండదు. కాబట్టి దాన్నే ఇలా చేస్తే త్వరిగతిన కేలరీలు కరిగి బరువు సులభంగా తగ్గుతామని చెబుతోంది ఈ యోగా నిపుణురాలు శ్రద్ధ. ప్రతి రోజూ జస్ట్ 30 నిమిషాలు ఇలా నడిస్తే..బరువు అమాంతం తగ్గుతారని చెబుతోంది. తాను అలా చేసే 33 కిలోలకు పైనే బరువు తగ్గినట్లు వెల్లడించింది. అదెలాగో ఇన్‌స్ట్రాగ్రామ్‌లో వీడియో రూపంలో షేర్ చేసి మరి చూపించారు. వీడియోలో ట్రెడ్మిల్ 15% వాలులో ఉండేలా చూసుకుంటూ..వాక్ చేయాలి. అంటే ఎత్తు మీద నుంచి వాకింగ్ చేయడం అన్నమాట. ఇలా వేగంగాచేస్తే చాలట. గంటకు మూడు లేదా 3.5 కిలోమీటర్ల వేగం చాలని అంటోందామె. జస్ట్ 30 నిమిషాల పాటు మూడు సార్లు చేస్తానని వెల్లడించింది. అలాగే వారానికి మూడు సార్లు వెయిట్ ట్రైనింగ్ చేస్తానని పేర్కొంది. మొదటగా 20 కిలోలు తగ్గినప్పుడూ వారానికి ఐదుసార్లు చేసినట్లు తెలిపింది. ఇక్కడ చేతులు ప్రీగా ఉండాలని హెచ్చరిస్తోంది. ట్రెడ్మీల్ని గట్టిగా అస్సలు పట్టుకోకూడదని చెబుతోంది యోగా నిపుణురాలు శ్రద్ధ. ఇదేలా ఉపకరిస్తుందంటే..ట్రెడ్‌మిల్‌తో ఫిట్నెస్ స్థాయి లక్ష్యాలకు అనుగుణంగా వ్యాయామం రూపొందించుకోవడానికి వేగాన్ని, వాలుని సులభంగా సర్దుబాటు చేసుకోవచ్చు. వాలుగా నడవడం వల్ల ఎక్కువ వేగం అవసరం లేకుండానే వ్యాయామ తీవ్రత పెరుగుతుంది. ఇది ముఖ్యంగా కాళ్లు, పిరుదలలో ఎక్కువగా కండర సముహాలను ఉత్తేజపరుస్తుంది. అంటే చదునైనా ఉపరితలంపై నడవడంతో పోలిస్తే..ఎక్కువ కేలరీలు ఖర్చవుతాయి.15% నిటారు వాలు వర్సెస్ చదునైన ఉపరితలంపై పోల్చితే దాదాపు రెట్టింపు కేలరీలు ఖర్చు అవుతాయని అంటున్నారు. అచ్చం జాగింగ్ మాదిరిలా కేలరీల ఖర్చు అవుతాయట. ఇలా నడవడం వల్ల శరీరంపై ఒత్తిడి తగ్గడమే గాక కీళ్లపై ప్రభావం కూడా తగ్గుతుందట.ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే..15% వాలు చాలా నిటారుగా ఉంటుంది కాబట్టి వేగంగా ప్రారంభిస్తే వెన్నుపై తీవ్ర ప్రభావం చూపించే ప్రమాదం ఉందనేది గ్రహించాలి.ట్రెడ్మిల్ వేగాన్ని మితంగా గంటకు 2.0 నుంచి 2.5 మైళ్లకు సెట్ చేయాలి.మొదట్లో 15% వాలు చాలా తీవ్రంగా అనిపిస్తే, 5% లేదా 7% తో ప్రారంభించి, కొన్ని వారాల పాటు క్రమంగా వాలును పెంచడానికి ప్రయత్నించాలి.వెనక్కి వాలడం, ట్రెడ్మిల్ హ్యాండిల్స్‌ను గట్టిగా పట్టుకోవడం మానుకోవాలి.ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకుని వాలుగా నడవడాన్ని దినచర్యలో భాగం చేసుకుని స్థిరంగా కొనసాగిస్తే.. బరువు తగ్గడం చాలా సులభం అని అంటున్నారు ఆరోగ్య నిపుణులు .గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: సల్మాన్ ఖాన్ సోదరి అర్పిత ఖాన్ ఇల్లు ఎలా ఉంటుందో తెలుసా..!ఏకంగా క్రికెట్, ఫుట్‌బాల్..) -
ఏకంగా 50 గ్రాముల బంగారు కడ్డీని మింగేసిన చిన్నారి.. చివరికి!
పసిపిల్లలు కనిపించిన ప్రతీవస్తువును నోట్లో పెట్టుకోవడం, దాన్ని మింగేయడం చేస్తుంటారు. ఎంత జాగ్రత్తగా ఉన్నా, ఇలాంటి చర్యలు ఒక్కోసారి ప్రమాదకరంగా మారడం చాలా సార్లు విన్నాం. తాజాగా ఏకంగా బంగారు కడ్డీని మింగేసిందో చిన్నారి. దీంతో ఆమె ప్రాణాలమీదకు తెచ్చుకుంది. మరోవైపు అంత బంగారం పాపకు అందుబాటులో ఎందుకుంచారు అనేది నెట్టింట చర్చనీయాంశంగా మారింది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక ప్రకారం, ఉత్తర చైనాలో ఐదేళ్ల బాలిక ప్రమాదవశాత్తు 50 గ్రాముల బంగారు కడ్డీని మింగేసింది. ఆ బాలిక ఇంట్లో ఆడుకుంటుండగా ఆ బంగారు కడ్డీని పొరపాటున మింగింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఆసుపత్రిలో చేర్చారు. కానీ అక్కడ పరిస్థితి విషమించడంతో, గత ఆదివారం (ఆగస్టు 16) ఆ బాలికను బీజింగ్ చిల్డ్రన్స్ హాస్పిటల్లో చేర్పించారు. ఎక్స్-రేలో వెల్లడైన ప్రకారం, 4 సెం.మీ. పొడవున్న ఆ చిన్న బంగారు కడ్డీ, బాలిక మింగిన తర్వాత కూడా కడుపులోనే ఇరుక్కుపోయింది. ఆ బంగారు కడ్డీ బాలిక జీర్ణాశయ కుహరంలో ఇరుక్కుపోయిందని వైద్యులు కనుగొన్నారు. ఆపరేషన్ చేయడానికి ఆ ప్రదేశం చాలా ఇరుకుగా ఉంటుంది. అయినప్పటికీ, వైద్యులు ఆపరేషన్ జరుగుతున్నప్పుడే ఎండోస్కోపీ చేసి, ఒక ఉచ్చు సహాయంతో ఆ కడ్డీని బయటకు తీసి, కుహరం నుండి జాగ్రత్తగా బయటకు తీశారు.ఆ బంగారు కడ్డీని తొలగించడానికి వైద్యుల బృందానికి కేవలం కొన్ని నిమిషాలు మాత్రమే పట్టింది, కానీ అది చాలా సున్నితమైన ఆపరేషన్. ఆ బాలిక కూడా కోలుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బరువుగా, గట్టిగా ఉన్న ఆ బంగారు కడ్డీ ఆమె జీర్ణాశయ పొరను గీరివేసి, తీవ్రమైన అంతర్గత రక్తస్రావం , అవయవాలకు రంధ్రాలు పడే ప్రమాదాన్ని కలిగించేదన్నారు వైద్యులు. ఈ ఆపరేషన్ వార్త వైరల్ అవ్వడంతో, సోషల్ మీడియాలోని కొంతమంది వినియోగదారులు ఆ బాలిక అంత ఖరీదైన బంగారు కడ్డీని ఎలా అందుకుందని ప్రశ్నించగా, మరికొందరు తల్లిదండ్రులు ఆ వస్తువును అందుబాటులో లేకుండా ఉంచాల్సిందని అన్నారు.ఇదీ చదవండి: 14 ఏళ్లకే సోషల్ మీడియాలో సంచలనం ఎవరీ ‘ఏలియన్ స్టార్’ నెటిజన్ల రియాక్షన్స్ "ఐదేళ్ల చిన్నారికి 50 గ్రాముల బంగారు కడ్డీని అంత సులభంగా అందేలా చేయడానికి ఆ కుటుంబం ఎంత ధనవంతులై ఉండాలి?" అని ఒక వినియోగదారు ప్రశ్నించగా, మరొకరు బాధ్యతాయుతమైన తల్లిదండ్రులు ఎల్లప్పుడూ తమ పిల్లల ప్రవర్తనను గమనిస్తూ, ప్రమాదకరమైన వస్తువులను వారికి అందుబాటులో లేకుండా ఉంచాలని సూచించారు.ఇదీ చదవండి: మహిళతో వివాదంలో గ్యాంగ్ వార్ : ఒకరి దారుణ హత్యఇదీ చదవండి: పెల్లెట్ గన్ వివాదం: సాహిల్‌తో కలిసి రాహుల్‌గాంధీ ధర్నా -
సల్మాన్ ఖాన్ సోదరి అర్పిత ఖాన్ ఇల్లు ఎలా ఉంటుందో తెలుసా..!
సల్మాన్ ఖాన్ సోదరి అర్పిత ఖాన్ శర్మ, ఆయుష్ శర్మ ముంబైలోని ఒక విశాలమైన ఇంట్లో నివశిస్తున్నారు. ఆ ఇల్లు చూస్లే మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. ఎంత విశాలంగా అంటే ఊహకందనంతా బడా ఇల్లు. యూట్యూబ్ వ్లాగ్ కోసం సందర్శించిన చిత్ర నిర్మాత ఫరాఖాన్నే ఆశ్చర్యపరిచింది. ఇంత పెద్ద ఇల్లా అని ఆమె విస్తుపోవడమే కాదు..ఈ ఇంట్లో క్రికెట్ కూడా ఆడొచ్చు అని ఫన్నీగా అన్నారు. పరాఖాన్, ఆమె కుక్ దిలీప్ అర్పిత--ఆయుష్‌ల ఇంట్లోకి ప్రవేశించగానే ఆ ఇరువురు దాని విశాలతను చూసి షాకయ్యారు. ఈ ఇంటిని సింపుల్‌గా "ముంబై కా దుబాయ్" అని ఆయుష్ పిలవగా, ఫరా ఇది దుబాయ్ కంటే బాగుంటుందని బదులిచ్చింది. ఇంటీరియర్స్ ఎక్కువగా తెలుపు, బేజ్, నలుపు రంగులతో కూడిన తటస్థ రంగుల పాలెట్‌ను అనుసరిస్తాయి. చెక్క ఫ్లోరింగ్, మార్బుల్ అంశాలు, పెద్ద సోఫాలు, ఆకట్టుకునే లైటింగ్, జాగ్రత్తగా ఎంచుకున్న అలంకరణ వస్తువులు ఇంటికి సమకాలీన రూపాన్ని ఇస్తాయి. ఇక్కడ క్రికెట్ లేదా ఫుట్‌బాల్ ఆడుకోవడానికి సరిపడా స్థలం ఉంది. ఆయుష్ తన భార్యకు పెద్ద ఇళ్లంటే ఇష్టమని అందుకే ఇంత భారీ ఇల్లు ఇచ్చారంటూ ఆటపట్టించారు. కానీ కొద్ది స్థలమే ఉపయోగిస్తుందని అన్నారు. అలాగే భాయ్ సల్మాన్ ఖాన్ తమకు ప్రత్యేకమైన కళాఖండాన్ని బహుమతిగా ఇచ్చారని, ఇది ఇంట్లో ప్రముఖ స్థానాన్ని ఆక్రమించి అత్యంత ప్రత్యేకంగా కనిపిస్తుందని చెప్పారు. దీన్ని తమ కుటుంబం చాలా అదృష్టంగా భావిస్తుందని అన్నారు. ఇక డైనింగ్ రూమ్‌లో పెద్ద నల్లటి పెండెంట్ లైట్ కింద పొడవైన డైనింగ్ టేబుల్ ఉంది. నివాసం అంతటా మార్బుల్ ఫినిషింగ్‌లు, శిల్పాలు, ఇతర కళాఖండాలు విస్తరించి ఉన్నాయి. అంతేగాదు వంటగదిలోనే నాలుగు ఏసీలు, మూడు రిఫ్రిజిరేటర్లు ఉన్నాయి. ఆ ఇంటి పర్యటలో అతి పెద్ద ఆకర్షణలలో ఒకటి భారీ కిచెన్. ఈ వంటగదిలో ఏకంగా మూడు పెద్ద రిఫ్రిజిరేటర్లు, నాలుగు ఎయిర్ కండిషనర్లు ఉండటం విశేషం. అయితే ఇక్కడ వంట తక్కువగా చేస్తామని, వంటవాడు లేడని ఆయుష్ వెల్లడించారు. ఒకప్పుడు తమకు వంటవాడు ఉండేవాడని, అతని పేరు మోంటుజీ అని, అతని జీతం తెలుసుకుని షాకయ్యానని అంటున్నాడు ఆయుష్. దానికంటే మా బిల్డింగ్ రెస్టారెంట్ నుంచి ఫుడ్ ఆర్డర్ చేసుకుని తినడం చాలా బెస్ట్ అని సరదాగా అన్నారు. అలాగే తమకు సల్మా ఖాన్ ప్రతిరోజూ ఇంటి భోజనం పంపిస్తారని, ఆయన తల్లి సల్మా ఖాన్ తప్పకుండా భోజనం పంపిస్తారని వెల్లడించారు. అయితే తాము ప్రయాణాల్లో భారతీయ ఆహారమే తినేలా కూడా వంటవాడిని తీసుకువెళ్తామని చెప్పారు. అలాగే ఈ ఇంట్లో తనకంటూ వ్యక్తిగతం ఒక గది ఉందని, దాన్ని కూడా తన భార్య అర్పిత ఆక్రమించేస్తోందంటూ ఫరాఖాన్‌కి ఫిర్యాదు చేశారు. కాగా, అర్పిత ఖాన్ -ఆయుష్ శర్మ చాలా ఏళ్లు ప్రేమించుకున్న తర్వాత, నవంబర్ 2014లో హైదరాబాద్‌లో వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు, 2016లో కుమారుడు అహిల్, 2019లో కుమార్తె ఆయత్. View this post on Instagram A post shared by Aayush Sharma (@aaysharma) (చదవండి: మిస్ యూనివర్స్ పాకిస్థాన్‌గా సైకాలజీ స్టూడెంట్..!) -
మిస్ యూనివర్స్ పాకిస్థాన్‌గా సైకాలజీ స్టూడెంట్..!
సైకాలజీ విద్యార్థి మిస్బా అర్షద్ ఇటీవలే మిస్ యూనివర్స్ పాకిస్థాన్‌గా కిరీటాన్ని గెలుచుకున్నారు. ఈ విషయాన్ని మిస్ యూనివర్స్ పాకిస్థాన్ సంస్థ ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలా పంచుకుంది. తమకొత్త మిస్ యూనివర్స్ పాకిస్థాన్ 2026 మిస్బా అర్షద్ హుందాతనం, అందం, ఆత్మవిశ్వాసం, లక్ష్యంతో ప్రపంచ వేదికపై పాకిస్థాన్‌కు ప్రాతినిథ్యం వహించే గౌరవాన్ని అందుకుందని పేర్కొంది. 75వ మిస్ యూనివర్స్ పోటీ ఈ ఏడాది నవంబర్ 24న ప్యూర్టోరికోలని శాన్జువాన్లో జరగనుంది. ఈ పోటీలో ఆమె అధికారికంగా పాకిస్థాన్‌కు ప్రాతినిథ్యం వహించనుందని ఆ దేశ అందాల పోటీ సంస్థ పేర్కొంది. ఈమేరకు టైటిల్ గెలుచుకున్న మిస్బా అర్షద్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో ఇలా రాసుకొచ్చారు. ఈ గెలుపుతో తన మిస్ యూనివర్స్ పోటీ జర్నీ అధికారికంగా ప్రారంభమైందని పేర్కొంది. ఇన్నేళ్లలో తాను నేర్చుకున్న విషయం ఓటమి మనం విజేతనా కాదా అని నిర్ణయించదని తెలుసుకున్నానన్నారు. ఎల్లప్పుడు ఆశను సజీవంగా ఉంచుకోవడం, కృషి చేయడం, ప్రతి అడుగులో మెరుగవ్వడం ఇవే మనల్ని విజేతగా నిలుపుతాయని రాసుకొచ్చారామె. అలాగే అందాల పోటీల ఫైనల్లో తాన ధరించిన కాస్ట్యూమ్ గురించి కూడా ఇలా రాశారామె. తన తెల్లటి గౌను ఆశకు ప్రతిక అని, ఇది ఎల్లప్పుడు మన కలలను నమ్మడం మానేయకూడదని గుర్తుచేస్తుందని పేర్కొంది. అలాగే దానిలోని రాయల్ బ్లూరంగు స్పటికాలు, మనం నేర్చుకుంటూ మెరుగుపడే విద్యకు ప్రతికని అన్నారు. ఇక మిస్బా ధరించిన కాస్ట్యూమ్ని వియత్నామీస్ డిజైనర్ గుయెన్ టియెన్ ట్రూయెన్ డిజైన్ చేశారు. ఆయన ఈ గౌనుని సాంప్రదాయ పాకిస్థానీ మూలాంశాలతో డిజైన్ చేయడం విశేషం.ఎవరీ మిస్బా అర్షద్ మిస్బా అర్షద్ ఒక సైకాలజీ విద్యార్థిని. విద్య ద్వారానే బాలికలకు సాధికారత కల్పించగలమని నమ్ముతానని, ఇది పాకిస్తాన్ కోసం సంస్థలకు ఉన్న దార్శనికత గురించి తెలుసుకోవడం వల్ల ఈ విషయం అర్థమైందని అన్నారు. మన భవిష్యత్తు కోసం మనం పెట్టగలిగే అత్యంత శక్తిమంతమైన పెట్టుబడులలో విద్య ఒకటిగా పేర్కొంది. ఆమె సైకాలజీ స్టూడెంట్ మాత్రమే కాదు మోడలింగ్ కూడా చేస్తుందామె. అలాగే ఫ్యాషన్, బ్యూటీరంగాలలో కంటెంట్‌ను సృష్టిస్తారామె. తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న ఫోటోలను బట్టి చూస్తే..ఆమె కొత్త సంస్కృతులను అన్వేషించడం, స్థానిక వంటకాలను రుచి చూడటం, ప్రకృతిలో గడపడాన్ని బట్టి.. ఆమెను ఒక ప్రపంచ యాత్రికురాలిగా పేర్కొనవచ్చు. కాగా, ఆమె జపాన్‌లో జరిగిన మిస్ ఇంటర్నేషనల్ 2023తో సహా అనేక అందాల పోటీల్లో అంతర్జాతీయంగా పాకిస్తాన్‌కు ప్రాతినిధ్యం వహించారామె. (చదవండి: Sonam Kapoor: ట్రెడిషనల్ అనార్కలీ డ్రెస్‌లో సోనమ్ అత్యద్భుతమైన లుక్..!) -
చెత్తను డబ్బుగా మారుస్తూ..నెలకు రూ. 40 లక్షలు!
చెత్త ఏరుకుంటూ డబ్బు సంపాదించేవారిని చూశాం. అదేనండి ప్లాస్టిక్ బాటిళ్లు, వేస్ట్ సీసాలను అమ్ముకుంటూ జీవనోపాధిగా మార్చుకున్నవాళ్లు ఉన్నారు. అలాగే రీసైక్లింగ్‌తో కూడా ఆదాయం గడించిన వారు ఉన్నారు. కానీ ఏకంగా ఆ ప్లాస్టిక్‌ని రీసైకిల్ చేసి..ఇతర గృహోపకరణాలుగా మార్చి..లక్షల్లో డబ్బు ఆర్జిస్తూ లక్షాధికారిగా మారడం గురించి విన్నారా..?. ఔను వేస్టునే డబ్బుగా మార్చి ప్రభంజనం సృష్టిస్తున్నాడో వ్యక్తి. అందుకు సంబంధించిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.ప్రథమ్ అనే వ్యక్తి షేర్ చేసిన ఈ సోషల్ మీడియా పోస్ట్ ప్రకారం..ఒక కుటుంబ వివాహ వేడుకలో తన కజిన్ చేతికి ఉన్న రోలెక్స్ వాచ్‌ని చూసి మొదలైన ప్రశ్నతో ఈ విషయం వెలుగులో వచ్చింది. తాను పారేసే ప్లాస్టిక్‌ని రీసైక్లింగ్ చేసే వ్యాపారంలో లక్షలు ఆర్జిస్తున్నట్లు తెలిపాడు. అయినా చెత్త వ్యాపారం ఈ రేంజ్లో డబ్బు తెచ్చిపెడుతుందా అని ప్రథమ్ విస్తుపోయాడు. అయితే అతడు ఉన్నది సంప్రదాయ ప్లాస్టిక్ వ్యాపారం కాదు..దీని వెనుక ఏదో ఉందనే కుతూహలంతో తన కజిన్‌ని అడగగా..కేవలం ప్లాస్టిక్ వ్యర్థాలను అమ్మడంపై కాకుండా, వాటిని రీసైక్లింగ్ చేయడంపైనే ఇంతలా ఆర్జించడం అనేది ఆధారపడి ఉంటుందని చెప్పాడు. కజిన్ చెప్పిన విధానం ప్రథమ్ని మరింత ఆశ్చర్యపరిచింది. అదెలాగా చెప్పమని కోరగా.." అతడి కజిన్ తాను ఫ్యాక్టరీ వ్యర్థ సీసాలు, డబ్బాలు, ఇతర ప్లాస్టిక్ స్క్రాప్‌ను తీసుకుని, వాటిని రీసైకిల్ చేసి..ప్లాస్టిక్ గ్రాన్యూల్స్‌గా ప్రాసెస్ చేస్తున్నట్లు వివరించాడు. అయితే తాను వ్యర్థ సీసాలు, డబ్బాలు ప్లాస్టిక్ స్క్రాప్‌ను కిలోకు సుమారు రూ. 13 చొప్పున కొని, వాటిని రీసైకిల్ చేయగా వచ్చిన ప్లాస్టిక్ గ్రాన్యూల్స్‌ని కిలోకు సుమారు రూ. 8 నుంచి 90కి అమ్ముతాం. దీన్ని కార్లు, ఆటో విడిభాగాలు, ప్లాస్టిక ప్యాకేజింగ్, దుస్తుల ఫైబర్లు, పైపులు, గృహోపకరణాలు, పారిశ్రామిక విడిభాగాలు తయారు చేయడానికి ఉపయోగిస్తారు. అంతేగాదు వివిధ రకాల ప్లాస్టిక్‌లకు వేర్వేరు లక్షణాలు ఉంటాయి, కాబట్టి ఆ పదార్థాన్ని వేరు చేయడం రీసైక్లింగ్‌లో ఒక ముఖ్యమైన భాగం అని చెప్పుకొచ్చాడు ప్రథమ్ కజిన్. అంటే నెలకు 50 టన్నుల రీసైక్లింగ్ని కిలో రూ. 80ల చొప్పున అమ్మితే దాదాపు 40 లక్షల దాక అమ్మకాలు వస్తాయని చెప్పాడు. అంటే లక్షల్లో ఆదాయం గడించగలమని ప్లాస్టిక్ వ్యర్థా వెనుకున్న వ్యాపారం గురించి చెప్పుకొచ్చాడు.అప్పుడు అర్థమైంది అతడు వ్యర్థాల నుంచి సంపదను సృష్టించే వ్యాపారంలో ఉన్నాడని అంటూ పోస్ట్‌లో రాసుకొచ్చాడు ప్రథమ్. నెటిజన్లు కూడా వావ్ ఇది చాలా తెలివైన ఆలోచన, పారేసే వ్యర్థాలతో కోట్లు గడిస్తున్నాడు. పైగా ప్లాస్టిక్‌ని ముడిసరుగా మార్చడంలోనే అసలైన సంపద ఉందని భలే చూపించాడు అని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు.Recently, I met my cousin at a relative’s wedding.We rarely talk, but I noticed his limited-edition Rolex.Curious, I asked, “What do you do?”He said, “Plastic business.”I assumed it was normal plastic trading business.Then I asked, “How are you making so much money?”…— Pratham (@CapitalLens_) August 19, 2026 (చదవండి: ఉద్యోగం చేస్తూనే 64 ఏళ్ల వయసులో ఎంటెక్..! ఓ తండ్రి సక్సెస్ స్టోరీ..) -
ఉద్యోగం చేస్తూనే 64 ఏళ్ల వయసులో ఎంటెక్..!
పదవీవిరమణ వయసు వచ్చేటప్పటికీ కాస్త వేటిపై అంత ఆసక్తి ఉండదు. ముఖ్యంగా కొత్తగా ఏదైనా నేర్చుకోవాలనే ఆసక్తి చాలా అరుదు. ఒకవేళ ప్రయత్నించినా మధ్యలోనే వదిలేస్తారు. కానీ ఈ పెద్దయన రిటైర్ అయిపోయాక కూడా మరో ఉద్యోగంలో కొనసాగుతూ..ఎంటెక్ పూర్తి చేశాడు. అంతేకాదండోయ్ తన తరగతిలో టాప్ 10 విద్యార్థులలో ఒకరిగా నిలవడం విశేషం. అందుకు సంభందించిన విషయాన్ని ఆయన కుమారుడు శశాంక్ శ్రీవాస్తవ్ నెట్టిట షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. శశాంక్ శ్రీ వాస్తవ సోషల్ మీడియా పోస్ట్ ఎక్స్‌లో ఇలా రాసుకొచ్చారు. “ 64 ఏళ్ల వయసులో మా నాన్నగారు ఎం.టెక్ పూర్తి చేశారు. గతనెలలోనే ఈ కోర్సుని పూర్తి చేశారు. ఆయన వయసులో సగం వయసున్న విద్యార్థులతో పోటీపడి మరీ..టాప్ 10లో నిలిచారు. ఆయన కేవలం రిటైర్డ్ వ్యక్తి మాత్రమే కాదని 2022లో పదవీవిరమణ చేసిన వెంటనే ఉత్తరప్రదేశ్‌లోని మున్సిపల్ కార్పొరేషన్లను పర్యవేక్షంచే నియంత్రణ సంస్థలో డిప్యూటీ సీఈవోగా చేరారు. ఆయన ప్రతి వారం రోడ్డు మార్గంలో దాదాపు వెయ్యికిలోమీటర్లు మేర జిల్లాలను సందర్శిస్తూ, క్షేత్రస్థాయిలో పనులను సమీక్షిస్తారు. పని ఒత్తిడి ఉన్నప్పటికీ..తన తండ్రి చదువుకోవడానికి సమయం కేటయించుకుంటారు. ఆ ప్రయాణాల మధ్యలోనే నోట్స్ రాసుకుని వాటిని చదివి, యువ విద్యార్థుల కంటే మెరుగ్గా పరీక్షలకు సన్నద్ధమయ్యేవారు మా నాన్న గారు" అని రాసుకొచ్చారు. అయినా జీవితం మరింత బిజీగా మారేక్దొద్దీ చాలామంది నేర్చుకోవడం, నైపుణ్యాలను పెంపొందించుకోవడంపై దృష్టిపెట్టడం మానేస్తుంటారని, అది తాను చూశానని అన్నాడు. అంతేగాదు జీవితంలో ఇక కొత్తగా నేర్చకోవాలనే ఆశ ఉన్నా..ప్రాధాన్యత మాత్రం ఇవ్వలేరని, వాస్తవికతలో అది ఆచరణసాధ్యం కూడానని చెప్పుకొచ్చాడు. అయితే తన తండ్రి అలాంటి ఆలోచనను దరిదాపుల్లోకి రానివ్వలేదని, ఆయన 40, 60ల కూడా నైపుణ్యాలను పెంపొందించుకోవడంపై దృష్టి పెట్టేవారని అన్నారు. ఇక తన తండ్రి ఎంటెక్‌తో ఆగడం లేదని, ఐఐఎం లక్నోలో ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్‌లో చేరడం ఆయన తదుపరి లక్ష్యమని అన్నాడు. పైగా చాలామంది లక్ష్యాలు నిర్దేశించుకోవడం మానేసే వయసులో దరఖాస్తు పత్రాలు నింపుతారని అన్నాడు. అందువల్ల తనకు నైపుణ్యాను పెంపొందించుకోవడంలో ప్రేరణ పొందాల్సిన అవసరం ఏర్పడలేదని ఎందుకంటే అది అది తన డీఎన్ఏలోనే ఉందని చమత్కరిస్తూ.. పోస్ట్‌ని ముగించారు శశాంక్ శ్రీ వాస్తవ్. చాలామంది నెటిజన్లు చదువు కొనసాగించడంపై స్ఫూర్తిని నింపిందన్నారు. ఆయన్ను చూసి చాలా గర్వపడాలి, చాలా నేర్చుకోవాలి కూడా అంటూ పోస్టులు పెట్టారు.(చదవండి: విక్రమ్ సారాభాయ్ పతకాన్ని గెలుచుకున్న తొలి భారతీయ మహిళ..!) -
సముద్రాన్నే సవాల్ చేసిన ఈతగాడు.. కేవలం వారికోసమే!
మీరెప్పుడైనా ఓ వంద మీటర్ల దూరం ఈత కొట్టారా? బావిలోనో, స్విమ్మింగ్ పూల్లోనో, అటు నుంచి ఇటుకి ఆపసోపాలు పడి ఈత కొట్టే బ్యాచే కదా మనమంతా.. కాని సముద్రంలో సుదీర్ఘంగా ఈతకొట్టేవాళ్లను చూశారా? ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఒక దేశం నుంచి మరొక దేశానికి ఈత కొట్టే గజ ఈతగాడిని చూశారా? అంత దూరం ఎలా ఈత కొట్టాడు? అది కూడా సముద్రంలో... అని అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ మీద ఓ లుక్కేయండి...అది స్వీడన్ దేశ తీరం... గాలివాటంగా ఉంది.. సముద్రంలోని నీరు వణికించేలా ఉంది. 2022 ఆగస్టు నెల..బార్ట్లో మీజ్ కుబ్కోవ్‌స్కీ అనే 27 ఏళ్ల యువకుడు సముద్రంలోకి దిగాడు...ఈతకొట్టడంప్రారంభించాడు. ఐదు, పది కిలోమీటర్లు కాదు 32 గంటలు ఈది 115 కిలోమీటర్లు వెళ్లాడు. కాని వాతావరణం సముద్రాన్ని హెచ్చరించింది..సముద్రం ఉప్పెన రూపం దాల్చింది.. అల్లకల్లోలం అయ్యేలోపే బార్ట్లో తప్పించుకున్నాడు.అంతటితో ఆగలేదు..2023 మళ్లీ ఈదడానికి సిద్ధపడ్డాడు. ఈసారి 40 గంటలు ఈది 116.7 కిలోమీటర్ల దూరానికి చేరుకున్నాడు. కాని వాతావరణం తన ప్రతాపాన్ని చూపి మళ్లీ పైచేయి సాధించింది. తర్వాత 2024 ముచ్చటగా మూడో ప్రయత్నంప్రారంభించాడు. కాని ఈసారి 19 గంటలకే వాతావరణం బలమైన పరిస్థితిని పూర్తిగా తన అదుపులోకి తీసుకుంది... కాని బార్ట్లో71.7 కిలోమీటర్లు వెనక్కి తగ్గాడు. 2025లో నాలుగో ప్రయత్నం...ఈసారి మాత్రం విజయం చేతికి చిక్కి తప్పించుకుంది. ఆగస్టు 17న బయలుదేరిన కుబ్కోవ్‌స్కీ 55 గంటలపాటు ఈది 159 కి.మీల దూరానికి చేరుకున్నాడు. పక్కనున్న పోలాండ్ దేశ తీరానికి కాస్త దూరంలోకి వచ్చి తీవ్రమైన అలసటతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. వెంటనే సహాయక బృందం అతడిని కాపాడింది.చివరగా 2026 జూలై 31... ఈసారి కూడా 55 గంటల పది నిమిషాల పాటు నిర్విరామంగా ఈతకొట్టి పోలాండ్ తీరానికి చేరుకున్నాడు. బాల్టిక్ సముద్రాన్ని ఈదిన తొలి వ్యక్తిగా కుబ్కోవ్‌స్కీ నిలిచాడు. నాలుగుసార్లు సముద్రం అతడిని ఆపింది. ఐదోసారి మాత్రం అతడు సముద్రాన్ని గెలిచాడు. ఇంత ప్రయత్నానికి కారణం లేకపోలేదు. కేన్సర్‌తో బాధపడే పిల్లల కోసం నిధులు సేకరించాలని ప్రతి ఏటా కుబ్కోవ్‌స్కీ సముద్రంపై అలుపెరగని యుద్ధం చేశాడు. ఈ విజయాన్ని పిల్లలకు అంకితం చేసి, తన భగీరథ ప్రయత్నం ద్వారా వచ్చిన మొత్తాన్ని పిల్లల వైద్యానికే ఇచ్చేసి ధైర్యశాలిగా, ఔదార్యం నిండిన మంచి మనిషిలా మిగిలాడు.అతని అలుపెరగని ప్రయత్నం చూసి ఆశ్చర్యపోనివారంటూ లేరు.. బలమైన అలలు.. వణికించే నీళ్లు.. ఏమాత్రం తేడా వచ్చినాప్రాణానికే ప్రమాదం... కాని అవేవి అతడిని ఆపలేదు. గజినీ మహమ్మద్‌లా సముద్రం చేతిలో ఎన్నిసార్లు ఓడినా మళ్లీ ప్రతి దాడికి సిద్ధపడుతూనే ఉన్నాడు. -
2026లో ఉంటూనే.. 1996 అనుభూతుల కోసం వెతుకులు..
తరం మారేకొద్దీ మార్పులు సహజం. కాని ఇప్పుడున్న జెన్ జీలు అన్నింటినీ ట్రై చేస్తున్నారు. 90ల కాలాన్ని నిజంగా అనుభవించినవాళ్లు ఇప్పుడు పాత జ్ఞాపకాలను గుర్తు జేసుకుంటుంటే, ఆ రోజుల్ని ఎప్పుడూ చూడని ఈ తరం జెన్ జీలు ఓసారి ప్రయత్నించి చూస్తే పోలా అన్నట్టు వైఖరి మార్చుకుంటున్నారు. ప్రముఖ పత్రిక ది గార్డియన్ చేసిన పరిశోధనలో జెన్ జీల గురించి ఆశ్చర్యకరమైన నిజాలు వెల్లడయ్యాయి. ఫోన్ లో చాటింగ్, గేమింగ్, సర్ఫింగ్‌కు సెలవు చెప్పి డిజిటల్ వరల్డ్ నుంచి డిటాక్స్ అవుదామని ప్రయత్నిస్తున్నారు. ఒకప్పుడు సాయంత్రమైతే చాలు... ప్రతి ఖాళీ స్థలమూ ఓ చిన్నసైజు స్టేడియంలా తయారయ్యేది. ఆటలంటే ఆసక్తి లేకపోతే సైకిల్లో స్నేహితుడిని ఎక్కించుకుని వాక్‌మెన్ లో ఇయర్ బడ్స్‌ను ఇద్దరు చెరొకటి తగిలించుకుని పాటలు వింటూ సూరీడు పొద్దు పొడిచేదాకా షికార్లు చేసేవారు. ఇప్పుడు జెన్ జీలు అదే రకపు జీవనశైలిని తమదైన శైలిలో తిరిగి సృష్టించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇదే ట్రెండ్ వైరల్ అవుతోంది.నోస్టాలజీకి వెల్కమ్సోషల్ మీడియా నుంచి పూర్తిగా దూరంగా ఉండాలని జెన్ జీలు భావించడం లేదు. తమ ఇష్టాలను, అభిప్రాయాలను వ్యక్తీకరించాలనుకుంటున్నారు. టిక్‌టాక్, ఫేస్బుక్, ఇన్ స్టాగ్రాంలో వేలాదిమంది యువత 90ల కాలం నాటి అలవాట్లు, వేషధారణతో కనిపిస్తూ ఆ కాలాన్ని రీక్రియేట్ చేస్తున్నారు. యూఎస్‌లో అయితే యువత ఐఫోన్ ను పక్కన పెట్టి డిజిటల్ కెమెరాలు, స్పాటిఫైకి బదులు ఐపోడ్స్, మ్యూజిక్ కీబోర్డ్‌కి బదులు సంగీత వాయిద్యాలు, నోట్స్ యాప్స్‌కి బదులు కాగితంపై రాతలు, గ్రూప్ చాట్స్‌కి బదులు ఉత్తరాలు, ఆన్ లైన్ రీడింగ్‌కు బదులు పుస్తకాలు, క్రాస్ వర్డ్స్, స్కెచ్ బాక్సులు, వినైల్ ప్రింటింగ్లు, గ్రీటింగ్ కార్డ్స్ ఇలా..2026ని కాస్తా 1996లో మార్చేసుకుంటూ కొత్త అనుభూతిని పొందుతున్నారు. ఈ ట్రెండ్‌ను ’అనలాగ్ బ్యాగ్’ అంటూ పరిగణిస్తున్నారు.అగ్రదేశాలలో..అమెరికాలో ఈ అనలాగ్ బ్యాగ్ ట్రెండ్ స్పష్టంగా కనిపిస్తోంది. న్యూయార్క్‌లో ఓ మొబైల్ రహిత కార్యక్రమం నిర్వహించారు. ఆఫ్‌లైన్ డేటింగ్ నుంచి చిన్నచిన్న కళల వరకు నేర్చుకోవడానికి విద్యార్థులు ఆసక్తి చూపారు. అక్కడ పాఠశాలలో మొబైల్ అనుమతులపై పెద్ద చర్చ జరుగుతోంది. జపాన్ లో కూడా రెట్రో సంస్కృతి మరో రూపం దాల్చింది. అక్కడ డిజిటల్ కెమెరాలను వదిలి ఫిల్మీ కెమెరాల వైపు ఆసక్తి చూపుతున్నారు. వస్త్రధారణలో కూడా రెట్రో స్టైల్æను అనుసరిస్తున్నారు. ఆశ్చర్యమేమిటంటే ఈ మార్పు కూడా సోషల్ మీడియా ద్వారానే వేగం పుంజుకుంటోంది. అంటే డిజిటల్ ప్రపంచమే అనలాగ్ హాబీలకు కొత్తతరం అభిమానులను తీసుకొస్తోందన్నమాట.మనదేశంలో..మనదేశంలో కూడా జెన్ జీల లైఫ్ స్టైల్లో మార్పు కనిపిస్తోంది. ఆఫ్‌లైన్ మీటింగ్స్, స్క్రీన్ టైం తగ్గించుకోవడం, 90ల కాలాన్ని రీక్రియేట్ చేస్తూ అప్పటి పాటలకు డ్యాన్సులు వేస్తూ ఇన్ స్టాలో పోస్ట్ చేయడం, పుస్తకం పఠనం, పాత వస్తువులను కొత్తగా అలంకరించడం, ఎంబ్రైడరీ, బేకింగ్, క్లే పాట్ వర్క్స్ వంటి పనులపై ఆసక్తి చూపుతున్నారు. ఢిల్లీ, ముంబై వంటి నగరాల్లో కూడా ఆఫ్‌లైన్ మీటింగ్ క్లబ్స్, థీమ్ పార్టీలు, ప్రత్యక్ష పరిచయాలపై యువత ఆసక్తి చూపుతోంది.డిజిటల్ వరల్డ్‌లో నిరంతర నోటిఫికేన్లు, రోజుకో ఏఐ టూల్‌తో వచ్చే ప్రయోగాలు, ఎప్పుడూ ఆన్ లైన్ లో ఉండాల్సిన ఒత్తిడి, యువతలో పెరుగుతున్న అసంతృప్తి వాళ్లను 90ల కాలం వైపు ఆసక్తిచూపేలా చేశాయి. డిజిటల్‌గా కనెక్ట్ అవ్వచ్చు కాని ఎప్పుడూ మొబైల్ స్క్రీన్ కే పరిమితం కావాల్సిన పనిలేదని యువత చెప్పకనే చెబుతోంది. -
మా రాంబాబు గాడి పొల్యూషన్ పొదుపులు!
‘‘కాలుష్యం కాలుష్యం అంటూ ఏదో గగ్గోలు పెడుతూ ఉంటారు గానీ... అసలు పొల్యూషన్ వల్ల ఎంత పొదుపో తెల్సా?’’ అంటూ తెగ స్పీచుతున్నాడు మా రాంబాబుగాడు. ఏం జరిగిందంటూ వాళ్లావిడను పలకరించాన్నేను. ‘‘పొదుపూ... పొదుపూ అంటూ మీ ఫ్రెండుగారు చేస్తున్న పనులేమిటో చూస్తున్నారా. పొల్యూషన్ ఎక్కువ ఉండే పంజగుట్ట సెంటర్లో నిల్చుంటే జస్ట్ ఓ గంట సేపుంటే రోజుకు 20 సిగరెట్లు తాగినంత అట. ఓరోజు పాన్‌డబ్బా దగ్గకు వెళ్లి కాస్ట్లీ పెద్ద సిగరెట్ల పెట్టె రేటెంతో తెలుసుకున్నారు. అంతే... రోజూ ఆ పంజగుట్ట సెంటరుకెళ్లి నిల్చుండిపోతున్నారు. అదేమిటంటే... ‘చూశావా... ఒక్క సిగరెట్టూ కొనకుండా రోజూ 500 రూపాయలకు పైగా ఆదా చేస్తున్నాను తెల్సా’ అంటున్నారండీ ఆయన’’ అంటూ వాపోయింది. ‘‘నేను మాట్లాడ...’’ అంటూ ఏదో చెప్పబోతుండగానే... కట్ చేసి కంప్లెయింట్స్ కొనసాగించింది. ‘‘అంతేనా... ‘పంజగుట్టలో పొల్యూషన్ మాత్రమే కాదండీ.. ఆ రద్దీ తాలూకు ట్రాఫిక్ శబ్దాలూ, ఎడాపెడా రణగొణధ్వనులూ, ఆగకుండా హారన్లూ... బోల్డంత సౌండు పొల్యూషన్ కూడా కదండీ... వద్దండీ’ అన్నా. ఆ మాట వినగానే... ‘పిచ్చిదానా... ఈమధ్యే ఓ సర్వేలో తేలిందేమిటంటే... ఆ శబ్దాల మధ్య ఉండటం అంటే పేద్ధ పేద్ధ స్పీకర్లున్న మ్యూజిక్ సిస్టమ్‌లో డీజే సౌండ్లతో ఒక పాటను ఫుల్ వాల్యూమ్‌తో విన్నట్టట. చూశావా... ఫ్రీగా సిగరెట్లే కాదు... ఎగస్ట్రాగా బోలెడన్ని పాటలు ఫ్రీగా విన్నట్టే కదా! ఇగ... మనింట్లో మ్యూజిక్ సిస్టమ్ కొనాల్సిన అవసరమేముంది చెప్పు’ అంటూ పొదుపు పాఠాలు చెబుతున్నారండీ’’ అంటూ ఇంకా దిగులుపడిపోయింది. ‘‘అరెరె... అలాగా’’ అంటుండగానే... ‘‘అంతేనా... మొన్న సమ్మర్లో కాలుష్యం వల్ల వాతావరణంలో వేడి బాగా పెరిగిపోయి ఎక్కడో గుడ్డు పగలగొట్టి రోడ్డు మీద వేస్తే కుతకుతా ఉడికి ఆమ్లెట్ అయ్యిందని టీవీలో న్యూసొచ్చింది. అంతే... మర్నాటి నుంచీ ఎప్పుడు ఆమ్లెట్ కావాలనుకున్నా రోడ్డు మీదే వెయ్యి. అసలే ఈ మధ్య సిలెండరు ధరలు బాగా పెరిగాయి. రోడ్డుమీదే వంట చెయ్... గ్యాసు పొదుపు చెయ్యి’ అంటూ లెక్చర్లిస్తున్నారండీ’’ అంటూ మరో ఫిర్యాదు. ‘‘ఏరా’’ అంటూ వాణ్ణి పలకరించబోతుంటే ఏదో గొప్పపని సాధించినవాడిలాగా చిద్విలాసంగా కనిపిస్తూ... మాంఛి గీర పోజుతో స్టైల్‌గా చుట్టూ చూస్తున్నాడు వాడు. వాళ్లావిడ మాత్రం కళ్లనీళ్లొత్తుకుంటూ కనిపించింది. వాడి దారిలోనే వాణ్ణి ఎలా దారిలోకి తేవాలో తెలియక... చివరగా ఓ చిన్న ట్రిక్కు ప్లే చేశా. ‘‘ఒరేయ్ రాంబాబుగా... నీకో విషయం తెలుసా? ఇకపై పొల్యూషన్ మీద కూడా జీఎస్టీ వేస్తున్నారట’’ అన్నా. ‘‘ఊరుకో... పొల్యూషన్ మీద జీఎస్టీ ఏమిట్రా?’’ అన్నాడు వాడు. ‘‘ఎందుకు వేయరూ... జీఎస్టీ అంటే ఏమిటి? గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. పొల్యూషన్ ఓ వస్తువు అనుకుందాం. దాన్ని నువ్వు ఫ్రీగా వాడుకుంటున్నావు. అంతేకాదు... ఆ కాలుష్యమేమో నీకు రోజూ ఉచితంగా సిగరెట్లు సప్లైచేస్తూ, ఫ్రీగా మ్యూజిక్ వినిపిస్తూ... ఇంతటి సర్వీసు ఇస్తుంటే... మన గవర్నమెంటు ఊరికే చూస్తూ ఉంటుందా? అందుకే నీలాంటి ‘ఫ్రీగా వస్తే ఫినాయిలు’ బాపతుగాళ్లను ఐడెంటిఫై చేసి జీఎస్టీ వసూలు చేయబోతున్నారట తెల్సా!’’ అంటూ హెచ్చరించా. దాంతో... దిగులుగా చూస్తూ ఇంటికి బయల్దేరిపోయాడు మారాంబాబుగాడు.– యాసీన్ -
లివింగ్ బ్యాంకులివి లవ్ డ్రా చేసుకోండి
వయోవృద్ధులకు ఫోన్ చేసి ‘మీ ఖాతా బ్లాక్ అయ్యింది’ అని డబ్బు దొంగిలించే డిజిటల్ దొంగలున్న ఈ కాలంలో వారి వద్ద ఉండే అసలైన నిధిని పట్టించుకుంటున్నామా? 70, 80 ఏళ్లు దాటిన మన అమ్మమ్మ, తాతయ్యల గుండెల్లో ఉన్న భాష, జ్ఞాపకం, సామెత, పాట, పండుగ, రుచి... ఈ పెన్నిధులను వింటున్నామా? రికార్డు చేస్తున్నామా? ‘లివింగ్ బ్యాంక్’ వంటి పెద్దల నుంచి ఏదైనా డ్రా చేస్తున్నామా అసలు?జీవితానుభవాలతో పండిపోయిన పెద్దలు ఎదురు పడితే వారికి చెయ్యెత్తి నమస్కరించాలి. కాని వాళ్లకు తెలియని టెక్ మోసాలు చేసి ఎలా దోచుకుందామా అని చూస్తున్నారు సైబర్ దొంగలు. ఏ సమాజంలో అయినా వయోవృద్ధులు ఆ సమాజానికి అనుభవాల బ్యాంక్. సాంస్కృతిక గని, ఆచారాల టెక్స్›్టబుక్. వాళ్ల దగ్గర ఉన్నవాటిలో విలువైనది డబ్బు కాదు... డేటా కాదు... డాక్యుమెంట్ చేయని అనుభవం. గూగుల్‌లో సెర్చ్ చేస్తే రాని వంటకం, ఏఐ జనరేట్ చేయలేని సామెత, యూట్యూబ్‌లో దొరకని బుర్రకథ, ఒక తుఫాను రాత్రి తెగువ, ఏడుతరాల జ్ఞాపకాలు, కష్టాలను ఎదుర్కొన్న స్థయిర్యం... ఇవన్నీ వారి లాకర్లలో నిక్షిప్తం అయి ఉన్నాయి. ఈ తరం చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంది, కానీ వారిని గత దారుల్లో నడిపే తాత లేడు. ఈ లోటును పూరించాలి. అసలు పెద్దల నుంచి పొందాల్సిన అసలైన పెన్నిధిని పంచి పెట్టే ఖాతాలేమిటో చూద్దాం...మాటల ఖాతాఅమ్మమ్మ ‘అన్నం పరబ్రహ్మ స్వరూపం’ అంటూ పెట్టే ముద్దలో ఒక నీతి ఉంటుంది.‘చెట్టు నరికితే నీడ పోతుంది’ అనే సామెత వెనుక పర్యావరణ పాఠం ఉంటుంది. బుర్రకథ, హరికథ, జానపద గేయాలు పుస్తకాల్లోకి ఎక్కలేదు. అవి 75 ఏళ్ల నానమ్మ గొంతులోనే బతికున్నాయి. ఈరోజు పిల్లలకు రామాయణం కార్టూన్ లో చూపిస్తున్నాం, కానీ తాత చెప్పే ‘మాటల రామాయణం’లోని ఎమోషన్ వేరు. హైదరాబాద్‌లో ఒకటి రెండు ఎన్.జి.ఓలు ‘నానమ్మ కథలు’ లాంటి ప్రాజెక్ట్స్ నడుపుతున్నారు. డెబ్బయిలు దాటిన మహిళల నుంచి జానపద కథలు రికార్డ్ చేసి పిల్లలకు పాడ్‌కాస్ట్‌లుగా ఇస్తున్నారు. అంటే టెక్నాలజీని వాళ్ల కోసం కాకుండా వాళ్లతో కలిపి వాడుతున్నారు. జెన్ జి బాధ్యత ఏంటి? వారి మాటలను ఫోన్ లో రికార్డ్ చేయడం. 10 నిమిషాలు కూర్చొని ‘అమ్మమ్మా, మీ చిన్నప్పటి సంక్రాంతి ఎలా ఉండేది?’ అని అడగడం. ఆ ఒక్క వీడియో భావి తరాలకు ఆస్తి అవుతుంది.రుచి, ఆచారాల ఖాతా‘ఈ పూర్ణం బూరెలో నువ్వులు ఎందుకు వేస్తారు?’ అని అడిగితే అమ్మమ్మ చెబుతుంది– ‘చలికాలంలో ఒళ్లు వేడిగా ఉండటానికి’. ఇది వంటకం కాదు, మూలికా వైద్యం. ఉగాది పచ్చడి ఆరు రుచులు ఎందుకు, వినాయక చవితిలోని పత్రి తాలూకు ఔషధ గుణాలేమిటి, పెళ్లిలో ‘జీలకర్ర బెల్లం’ అర్థం ఏంటి – ఈ కోడ్ అంతా పెద్దల మెమరీలో ఉంది. మనం స్విగ్గీ, జొమాటోకు అలవాటు పడ్డాం. కానీ ‘చేతి రుచి’కి ప్రత్యామ్నాయం లేదు. ఈరోజు చాలా మంది 65 దాటిన మహిళలు వంటలతో వ్యాపారం మొదలుపెడుతున్నారు. అది డబ్బు కోసం కాదు. ‘నా ఆచారం చావకూడదు’ అనే పట్టుదల. వాళ్ల నుంచి ఒక వంటకం నేర్చుకోవడం అంటే ఒక సంస్కృతిని సేవ్ చేయడమే. వాళ్లు వండేది కర్రీ కాదు, వారసత్వం.జీవిత పాఠాల ఖాతాగెలుపు కోసం ఏఐ మనకు 1000 ఆప్షన్లు ఇస్తుంది. కానీ ‘ఓటమి తర్వాత ఎలా లేవాలి’ అని ఎవరు చెబుతారు? కరువు చూసిన తాత, ఎమర్జెన్సీ చూసిన అమ్మమ్మ, ఉద్యోగం కోల్పోయి మళ్లీ నిలబడిన నాన్న... వీరికి మించిన వారున్నారా? నేటి జెన్–జి చిన్న చిన్న ఒత్తిళ్లకు, కెరీర్ టెన్షన్లకు తట్టుకోలేక ‘మెంటల్ పీస్’ కోసం థెరపీల చుట్టూ, మైండ్‌ఫుల్‌నెస్ యాప్‌ల చుట్టూ తిరుగుతోంది. కానీ మీ ఇంట్లో ఉన్న అమ్మమ్మ, తాతయ్యల జీవితాలను ఒక్కసారి గమనించండి. వాళ్లు తమ జీవితంలో ఎన్నో ఆర్థిక సంక్షోభాలను చూశారు, సవాళ్లను ఎదుర్కొన్నారు. అయినా సరే ప్రశాంతంగా, నవ్వుతూ కూర్చోగలరు. వాళ్ల మైండ్ సెట్లో ఉన్న ఆ ‘మెంటల్ రెసిలియెన్స్’ (మానసిక స్థిరత్వం) నేటి తరానికి కావలసిన అసలైన పాఠం. డిప్రెషన్లను దరి చేరనీకుండా జీవితాన్ని ముందుకు సాగేలా చేసుకున్న అమ్మమ్మలు, నానమ్మలు అనే ఆ రియల్ లైఫ్ థెరపిస్ట్‌ల పక్కన కూర్చుని ఒక పది నిమిషాలు మాట్లాడితే మీ యాంగ్జైటీలన్నీ పటాపంచలవుతాయి. వాళ్ల వాలెట్లో క్రెడిట్ కార్డులు లేకపోవచ్చు.. కానీ వాళ్ల మనసులో ఉన్న ధైర్యం మన జీవితాలకు శ్రీరామరక్ష.ఈరోజు మనం ఏం చేయాలిసీనియర్ సిటిజన్స్ డే అంటే ‘శుభాకాంక్షలు’ పోస్ట్ పెట్టి వదిలేయడం కాదు. వాళ్ల ‘జ్ఞాపకాల అకౌంట్’ నుంచి మనం డ్రా చేసుకోవాలి. ఈరోజు ఒక పని చేద్దామా? ఇంట్లో పెద్దవాళ్ల దగ్గరికి వెళ్లి ఇవి అడగండి: మీకు ఇష్టమైన సామెత ఏంటి? మీరు చేసే స్పెషల్ వంట ఏంటి? మీ జీవితంలో మర్చిపోలేని రోజు ఏది? రికార్డ్ చేయండి. ఫోటో తీయండి. ఫ్యామిలీ గ్రూప్‌లో షేర్ చేయండి. అదే మనకు వచ్చే అసలైన వారసత్వం. -
14 ఏళ్లకే సోషల్ మీడియాలో సంచలనం ఎవరీ ‘ఏలియన్ స్టార్’
రాజస్థాన్‌లోని చూరూ జిల్లా సుజాన్గఢ్ ప్రాంతానికి చెందిన చురియాన్ అనే చిన్న గ్రామానికి చెందిన 14 ఏళ్ల మోతీ (మోతీలాల్) అనే కుర్రాడు ప్రస్తుతం సోషల్ మీడియాలో ‘ఏలియన్ స్టార్’ (Alien Star) పేరుతో సంచలనం సృష్టిస్తున్నాడు. స్వాతంత్ర్య దినోత్సవం (ఆగస్టు 15) సందర్భంగా పాఠశాలలో పిల్లలకు పంచే 'లడ్డూల' ప్రాముఖ్యతపై మోతీ చేసిన ఒక కామిక్ రీల్ రికార్డు స్థాయిలో 18.3 కోట్లకు (183 Million) పైగా వ్యూస్ సాధించింది. అంతేకాదు ఇంత చిన్న వయసులోనే అతనుసాధించిన పరిణతి, యాటిట్యూడ్, స్కిల్స్ చూసి అంతా మురిసిపోతున్నారు. అసలేంటీ ఏలియన్ స్టార్ కథ తెలుసుకుందాం. 2012 మార్చి 10న సాధారణ రైతు దంపతులు నెమరాం, మునిదేవిలకు దంపతులకు జన్మించారు మోతీ. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. మోతీలాల్ మేఘవాల్ జీవితం, ఆత్మవిశ్వాసానికి, విజయానికి అద్భుత నిదర్శనం. ఎందుకంటే తన విభిన్నమైన శారీరక రూపం, ముఖ కవళికల (కనుబొమ్మల మీద కొద్దిగా వెంట్రుకలు లేకుండా విచిత్రమైన అమరిక, కొంచెం ముందుకొచ్చిన పళ్లు,మూతి, చూడ్డానికి అవతార్ మూవీలోని క్యారెక్టర్లా) కారణంగా చిన్నప్పటి నుంచీ మోతీలాల్ ఎన్నో హేళనలు, ఎకసెక్కాలు ఎదుర్కొన్నాడు. తోటి పిల్లలు, చుట్టుపక్కల వారు అతనిని గేలి చేస్తూ ‘ఏలియన్’ అని పిలిచేవారు. ఆ మాటలు అతడిని మానసికంగా ఎంతో బాధపెట్టినప్పటికీ, మోతీ అధైర్యపడ లేదు.తనలోని విలక్షణ లక్షణాలనే, బలంగా మలుచుకోవాలని నిర్ణయించుకున్నాడు. తనకెదురైన అవమాననాలనే ఒక్కో మెట్టుగా పేర్చుకున్నాడు. ఒకపుడు ఎగతాళి చేయడానికి వాడిన 'ఏలియన్' అనే పదాన్నే తన సోషల్ మీడియా ఐడెంటిటీగా మార్చుకుని, దాదాపు ఏడాది క్రితం, 'Alien Star'అనే పేరుతో కామెడీ రీల్స్, ఎక్స్‌ప్రెసివ్ డ్యాన్స్ వీడియోలు చేయడం ప్రారంభించాడు తనలోని నటన, అమాయకత్వంతో కూడిన హాస్యం (Desi Comedy), ఆకర్షణీయమైన ఎక్స్‌ప్రెషన్స్‌తో రీల్స్ చేస్తూ నెటిజన్లను విశేషంగా ఆకట్టుకున్నాడు.> ప్రతి వీడియోకు మిలియన్ల కొద్దీ వ్యూస్, లైక్స్ వర్షం కురిపిస్తోంది. దీంతో సోషల్ మీడియా సెన్సేషన్‌గా మారిపోయాడు. ఇన్‌స్టా, యూట్యూబ్‌లలో లక్షలాది మంది ఫాలోవర్లతో రాజస్థాన్‌లోనే అత్యంత ప్రజాదరణ పొందిన చైల్డ్ డిజిటల్ క్రియేటర్లలో ఒకరిగా నిలిచాడు. ఒక పెర్ల్ రీల్ 18.3 కోట్లకు పైగా వీక్షణలను సంపాదించడం విశేషం. ఒకప్పుడు ఏ రూపం ఆధారంగా ఐతే సమాజం అతడిని ఎగతాళి చేసిందో, అదే రూపం , తనలోని ప్రతిభతో కోట్ల మంది అభిమానాన్ని గెలుచుకుని నిజమైన "స్టార్"గా మారాడు మోతీలాల్ మేఘవాల్.మరీ ముఖ్యంగా మోతీ చెప్పే "కొందరు నువ్వు ఏమీ చేయలేవు అంటారు, మరికొందరు చాలా ఎత్తుకు ఎదుగుతావు అంటారు.. మరి నేను ముందుకెళ్లనా?" అనే డైలాగ్ సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయింది.అంతేకాదు విదేశాల నుండి కూడా మోతీకి అభిమానులు ఏర్పడ్డారు. బడా బడా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు మోతీని ఇంటర్వ్యూ చేసేందుకు క్యూ కడుతున్నారు. చదువుతో పాటు నటన, కామెడీ, క్రికెట్ పట్ల ఆసక్తి ఉన్న మోతీ, భవిష్యత్తులో పూర్తిస్థాయి నటుడిగా స్థిరపడాలని కోరుకుంటున్నాడు. ఫాలోయర్ల ప్రేమ, మద్దతు తనకు కొండంత బలమని అదే తనన ముందుకు సాగడానికి తనను ప్రేరేపిస్తుందని భవిష్యత్తులో అదే విధంగా అలరించాలని కోరుకుంటున్నట్లు మోటి చెప్పారు.ఇదీ చదవండి: ఇన్‌స్టామార్ట్‌లో బొద్దింక : ఎఫ్‌డీఏ తుకారాంకు హీరోయిన్ విజ్ఞప్తిగ్రామస్తుల సంతోషంమోతీకి లభించిన ప్రజాదరణతో చరియాన్ గ్రామం కూడా 'ఎలియన్ స్టార్ కి విలేజ్' గా పేరొందింది అంటూ కొలాసర్ రిటైర్డ్ నైబ్ సుబేదార్ రామ్ నివాస్ టెటార్వాల్ సంతోషం ప్రకటించారు.ఇది గ్రామానికి గర్వకారణం అని అన్నారు. గ్రామంలో చాలా మంది ప్రతిభ ఉందని, సరైన వేదికను పొందాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.ఇదీ చదవండి: 14 ఏళ్ల ఐటీ జాబ్ వదిలి వ్యాపారం : ఇపుడు కోట్లలో ఆదాయం -
ట్రెడిషనల్ అనార్కలీ డ్రెస్‌లో సోనమ్ అత్యద్భుతమైన లుక్..!
బాలీవుడ్ ముద్దుగుమ్మ సోనమ్ కపూర్ ఫ్యాషన్‌లో తనకు సాటిరారెవ్వరు అన్నట్లుగా ఉంటుంది. ఏ సందర్భమైన దానికి అనుగుణంగా భారతీయ హస్తకళను చాటే సంప్రదాయ వారసత్వ దుస్తులతో తళుక్కుమంటూ అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. తన ముగ్ధమనోహరమైన ఫ్యాషన్ శైలితో కట్టిపడేస్తుంటుంది. ఈసారి కూడా అలానే అత్యంత సుందరంగా కనిపించింది సోనమ్. అదీకూడా సంప్రదాయ వింటేజ్తో కూడిన అనార్కలీ డ్రెస్‌లో సోనమ్.. చూపు తిప్పుకోనివ్వనంతా ఆకర్షణీయంగా ఉంది. సోనమ్ కపూర్ ఫ్యాషన్ పరంగా తాను ఎప్పటికీ ఎవర్గ్రీన్ అనేలా మెరిశారామె. బుధవారం సాయంత్రం ఈ నటి ఒక జ్యువెలరీ బ్రాండ్ కోసం అత్యంత అద్భుతమైన లుక్‌లో వచ్చారు. భారతీయ హస్తకళ, సాంప్రదాయ శైలిని ప్రదర్శించేలా అద్బుతమైన బ్లాక్ అనార్కలీలో తళుక్కుమంది. పోడవాటి చేతుల కుర్తా, దానికి శాంతి బనారస్ క్లిష్టమైన డిజైన్ కూడిన దుప్పటా హెలెట్‌గా నిలిచింది. టస్సర్ జార్జెట్ బేస్‌పై రూపొందించిన చేతి ఎంబ్రాయిడరీ సాంప్రదాయ పిచ్వాయి పెయింటింగ్‌ని పోలి ఉంది. ఈ నల్లటి దుప్పటా కాన్వాస్‌లా మొత్తం అంతా సూక్ష్మ కళాకృతులతో నిండి ఉండి, ఆ క్లిష్టమైన డిజైన్‌కి మరింత జీవం పోసింది. అంతేగాదు ఈ దుప్పటాపై ఉన్న ప్రతి నమునా సన్నని రేషమ్ దారాలతో చేతితో రూపొందించగా, దానిపై ఉన్న క్లిష్టమైన కళాకృతిని ప్రముఖంగా చూపించేలా కసబ్(వెండి, బంగారం లేదా రాగి రంగుల సన్నని మెటాలిక్ దారాలతో చేసే ఒక ప్రాచీనమైన ఎంబ్రాయిడరీ)ను ఉపయోగించారు. అలాగే తన రూపం మరింత అందంగా కనిపించేలా భారీ బిర్ధిచంద్ ఆభరణాలు, స్టెప్స్ వజ్రాల నెక్లెస్, చెవిపోగులు, ఉంగరాలను ధరించారు. అలాగే జుట్టుని చక్కగా దువ్వి ముడి వేయడంతో మరింత హుందాగా కనిపించింది సోనమ్. ముఖ్యంగా ఆమె లుక్‌లో ఆభరణాలు, దుపట్టా అందరి దృష్టిని అమితంగా ఆకర్షించాయి. ఈ రూపాన్ని పూర్తి చేయడానికి, సోనమ్ రత్నాలు పొదిగిన పెట్టె ఆకారపు క్లచ్‌ను పట్టుకుని, పదునైన నల్లటి పంప్ హీల్స్ ధరించి, మొత్తం రూపాన్ని అత్యంత సుందరంగా మార్చేశారామె. వారసత్వ కళను అసాధారణమైన ఆభరణాల మేళవింపుతో అత్యంత ప్రభావవంతంగా చూపించారామె. భారతీయ హస్తకళను తన ఫ్యాషన్ ఎంపికలో మేళవించి తనదైన శైలితో స్టైలిష్‌గా కనిపించడంతో సోనమ్ అగ్రస్థానంలో ఉంటుంది. View this post on Instagram A post shared by Bollywoods Closet (@thebollywoodscloset) (చదవండి: వేలాది మల్లెపూవులతో డిజైన్ చేసిన గౌనులో వధువు..! అమ్మమ్మ కోసం..) -
ఓవర్‌నైట్ సక్సెస్ కానేకాదు.. ఇది మా పన్నెండేళ్ల కష్టం!
కోటి రూపాయల వేతనం అందుకునే మంచి ఉద్యోగాన్ని కాలదన్నుకోవడం అంటే అలాంటి ఇలాంటి సాహసం కాదు. సొంతంగా వ్యాపారం చేయాలనే ధ్యేయంతో అంత పెద్ద నిర్ణయం తీసుకోవడమే కాకుండా సక్సెస్ అయ్యి యువతకు ప్రేరణగా నిలిచింది ఈ 28 ఏళ్ల వివియన్ వాంగ్. మరి అంత డేరింగ్ నిర్ణయం తీసుకుని ఈ వనిత వ్యాపారంలో ఎలా నిలదొక్కుకుందో తెలుసుకుందామా..!తండ్రి అనారోగ్యంతో కీలక నిర్ణయం..చిన్నప్పటి నుంచే తండ్రి బేకరీలో పనులు చేస్తూ పెరిగిన వివియన్‌కు సొంతంగా వ్యాపారం చేయాలనే కోరిక ఉండేది. అయితే తండ్రికి క్యాన్సర్ నిర్ధారణ కావడంతో ఇక వ్యాపారాన్ని వాయిదా వేయకూడదని నిర్ణయించుకుంది. దీంతో ఉద్యోగానికి రాజీనామా చేసి సోదరుడితో కలిసి వ్యాపారాన్ని ప్రారంభించింది.బియ్యంతో తయారు చేసిన మెత్తటి పిండిలో ఐస్‌క్రీమ్‌ను నింపి మోచి ఐస్‌క్రీమ్ బంతులను తయారు చేశారు. తొలి ఐదేళ్ల పాటు రెస్టారెంట్లు, సినిమా థియేటర్లకు విక్రయించారు. వచ్చిన లాభాలను తిరిగి వ్యాపారంలోనే పెట్టుబడిగా పెట్టారు.అన్నీ పర్ఫెక్ట్ అయ్యే ఇబ్బందులను ఎదుర్కోవాల్సిందే..వ్యాపారం ప్రారంభించిన రోజుల్లో ఖర్చులు తగ్గించుకునేందుకు ఎన్నో వ్యక్తిగత సౌకర్యాలను వదులుకుంది. కంపెనీ ఖాతాలను ఆదివారాల్లో స్వయంగా నిర్వహించడంతో పాటు ఐటీ, యంత్రాలు, ఉత్పత్తి అభివృద్ధి, సిబ్బంది నిర్వహణ వంటి ఎన్నో విషయాలను స్వయంగా నేర్చుకుంది వివియన్ వాంగ్.వ్యాపారం ప్రారంభించాలనుకునేవారు ప్రతిదీ పరిపూర్ణంగా సిద్ధమయ్యే వరకు ఎదురుచూడకూడదు. 80 శాతం ఉత్పత్తి సిద్ధమైన వెంటనే మార్కెట్లోకి తీసుకెళ్లి.. వినియోగదారుల స్పందన ఆధారంగా మిగిలిన 20 శాతాన్ని మెరుగుపరచాలి.ప్రతి అవకాశానికీ ‘అవును’ అని చెప్పకూడదు. బ్రాండ్ విలువలు, లక్ష్యాలు స్పష్టంగా ఉంటే ఏ ట్రెండ్‌ను అనుసరించాలో, దేనికి దూరంగా ఉండాలో నిర్ణయించుకోవచ్చు అనే అంశాలు సక్సెస్‌కి ఎంతో కీలకం.నిపుణులు ఇచ్చే సలహాలను కూడా గుడ్డిగా పాటించకూడదు. ఒక వ్యాపారానికి సరిపోయే సలహా.. మరో వ్యాపారానికి సరిపోకపోవచ్చని, పరిస్థితులకు అనుగుణంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.సోదరుడితో కలిసి పనిచేయడం తమకు బలంగా మారినా, ఇద్దరి మధ్య ఎన్నో వాదనలు జరిగేవని, ఒకరు రిస్క్ తీసుకోవాలని భావిస్తే.. మరొకరు జాగ్రత్తగా ఆలోచించేవారని వివియన్ తన అనుభవాన్ని పంచుకుంటోంది. ఈ భిన్నమైన అభిప్రాయాలే చివరకు మెరుగైన నిర్ణయాలు తీసుకునేందుకు సహాయపడ్డాయని చెబుతుందామె.టిక్‌టాక్‌లో వైరల్.. కానీ 12 ఏళ్ల కష్టం!కరోనా సమయంలో ‘లిటిల్ మూన్స్’ టిక్‌టాక్‌లో వైరల్ కావడంతో ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. దీంతో చాలామంది అది రాత్రికి రాత్రే సాధించిన విజయమని భావించారు. కానీ వాస్తవానికి ఆ విజయానికి ముందు సంస్థ 12 ఏళ్ల పాటు ఎన్నో కష్టాలు పడింది. ఉత్పత్తి, సిబ్బంది శిక్షణ, ఎగుమతులు, పెద్ద రిటైలర్లకు సరఫరా వంటి అంశాల్లో ఏళ్ల పాటు అనుభవం సంపాదించింది. ఆ పునాది బలంగా ఉండటమే వైరల్ అయిన సమయంలో పెరిగిన డిమాండ్‌ను ఎదుర్కోవడానికి ఉపయోగపడింది.‘ఓవర్‌నైట్ సక్సెస్ అనేది 12 ఏళ్ల కష్టానికి కనిపించే ఒక్క క్షణం మాత్రమే’ అనేది వివియన్ చెప్పే ముఖ్యమైన పాఠం. సొంత వ్యాపారం చేయాలనుకునేవారు సరైన సమయం కోసం ఎదురుచూడకుండా చిన్నగా ప్రారంభించి.. చేస్తూ నేర్చుకుంటూ ముందుకు సాగాలని ఆమె సూచిస్తోంది. -
వేలాది మల్లెపూవులతో డిజైన్ చేసిన గౌనులో వధువు..! అమ్మమ్మ కోసం..
ముంబైలో జన్మించిన వధువు అవివా మెహతా, మేరీల్యాండ్‌లో పెరిగిన డేనియల్ హాన్‌ను ఇటీవలే వివాహం చేసుకున్నారు. ఈ వివాహం కొరియన్ సంప్రదాయంలో భారతీయ ప్యాషన్ మేళవింపుతో జరిగింది. ఇక్కడ భారత వధువు ధరించిన దుస్తులు అత్యంత హైలెట్‌గా నిలిచాయి. అంతేగాదు వారి వివాహ వస్త్రధారణ రెండు సంస్కృతులు, తరతరాల కుటుంబ వారసత్వ సంపద, భారత్ ప్రసిద్ధ డిజైనర్ల కలయికగా నిలిచింది. వధువు ధరించిన డిజైనర్వేర్లివే..ఆ జంట పెళ్లి వేడుకలు సాంప్రదాయ కొరియన్ పేబెక్ కార్యక్రమంతో ప్రారంభమయ్యాయి, ఇక్కడ వధూవరులు తమ పెద్దలకు నమస్కరించి, వారికి టీ అందించి, ఇరు కుటుంబాల నుంచి ఆశీర్వాదాలు, సలహాలు అందుకుంటారు. వధువు అవివా ఐవరీ, ముత్యపు తెలుపు, లేత గులాబీ రంగుల పెళ్లికూతురి హన్బోక్ను వంశపారంపర్య ఆభరణాలతో ధరించగా, డేనియల్ ఇటీవల న్యూయార్క్ ఫ్యాషన్ వీక్‌లో తొలిసారిగా ప్రదర్శించిన 'ది హన్బోక్' వారి దుస్తులను ఎంచుకున్నాడు. ఇక డిన్నర్ కోసం, అవివా 'ఐల్ ఆఫ్ మండే' నుండి తెప్పించుకున్న పాతకాలపు బరువైన పట్టు దుస్తులలో వింటేజ్ ఫ్యాషన్‌ను అనుసరించింది. ఆమె ఈ లుక్కు 'అమారిస్ జ్యువెల్స్' వారి ఆకుపచ్చల చెవిపోగులు, 'రెనే కావోవిల్లా' బూట్లను జతచేశారు. కానీ ఆమె ఆభరణాలే అత్యంత భావోద్వేగభరితమైన స్పర్శను జోడించాయి. 'వోగ్ ఇండియా' ప్రకారం, ఆమె డిన్నర్ ఈవెంట్‌కు తన నానమ్మ నెక్లెస్‌ను, రిసెప్షన్ కార్యక్రమానికి తన నానమ్మ వజ్రాల నెక్లెస్‌ను ధరించారు. అలాగే బహిరంగంగా జరిగే వేడుకలో అవివా తరుణ్ తాహిలియాని లెహంగాలో నడిచింది. ఈ లెహంగాలో క్రిస్టల్స్, ముత్యాలు, సీక్విన్స్‌తో అలంకరించిన చేతి ఎంబ్రాయిడరీ చేసిన స్కర్ట్. దానికి మ్యాచింగ్‌గా వేలాడే లేస్ రెక్కలతో కూడిన బ్లౌజ్ ఎంచుకున్నారు. తన తల్లి పెళ్లికి తరుణ్ తాహిలియాని దుస్తులనే ఎంచుకోవడంతో అవివా కూడా అవే ఎంచుకుంది. ఆమె చివరగా కొంగల చిత్రాలతో ఎంబ్రాయిడరీ చేసిన ట్యూల్ ముసుగుతో తన రూపాన్ని పూర్తి చేసింది. ఆ పక్షి దీర్ఘాయువుకు సంబంధించిన కొరియన్ చిహ్నం, ఇది డేనియల్ వారసత్వానికి మరో సూక్ష్మమైన సూచనను అందిస్తుంది. దీంతోపాటు అవివా తన మెడలో నానమ్మ వజ్రాల నెక్లెస్‌ను కూడా ధరించింది. పువ్వులతో డిజైన్ చేసిన మోడ్రన్ గౌను..రిసెప్షన్ కోసం, అవివా గౌరవ్ గుప్తా స్ప్రింగ్/సమ్మర్ 2026 కౌచర్ కలెక్షన్లోని లుక్ 15లోకి మారింది. ఇది వేలాది చేతితో తయారు చేసిన పూగుత్తులతో కప్పబడిన ఆకర్షణీయమైన సిల్క్-షిఫాన్ ట్యూల్ గౌనులో మెరిసిందామె. ఇలా పువ్వును ఎంచుకోవడం యాదృచ్ఛికం కాదు. మల్లెపువ్వు అవివా అమ్మమ్మకు ఇష్టమైన పువ్వు. ఆమె ఆరోగ్య రీత్యా అమెరికాకు వచ్చే పరిస్థితిలో లేకపోవడంతో ఆమె తనతో ఉండేలా తనకిష్టమైన వాటితో ఆత్మీయతను చాటుకుంది. వేలాది సున్నితమైన మల్లెపూల కుచ్చుల వల్ల, ఆ కౌచర్ గౌను కేవలం రిసెప్షన్ డ్రెస్ కంటే ఎంతో అర్థవంతమైనదిగా మారింది. సముద్ర తీరపు నేపథ్యంలో, ఆ పూల అలంకరణలు స్వయంగా హాజరు కాలేకపోయిన అమ్మమ్మకు నివాళిగా నిలిచాయి. డేనియల్ పెళ్లి దుస్తులు కూడా అంతే వ్యక్తిగతంగా ఉన్నాయి. అతను టైకి బదులుగా ఓపెన్ కాలర్‌తో, వెడల్పాటి కాళ్ల ప్యాంటుతో, ప్రత్యేకంగా కుట్టించిన నలుపు రంగు డబుల్-బ్రెస్టెడ్ వాట్సన్ ఎల్లిస్ సూట్‌ను ధరించాడు. అవివా మెహతా హాన్ పేరుకు సంక్షిప్త రూపమైన AMH అనే అక్షరాలు అతని చొక్కా కఫ్ మీద ఎంబ్రాయిడరీ చేశారు. వరుడు హాన్ కూడా తన దివంగత తాతగారికి చెందిన పాతకాలపు కొరియన్ వాచ్‌ను కూడా ధరించాడు. ఈ జంట తమ ఆహార్యాన్ని విభిన్న సంస్కృతుల కలియిక. భారతీయ ఫ్యాషన్, అలాగే బంధాల గొప్పతనం చాటేలా పూర్తి చేశారు. View this post on Instagram A post shared by Aviva Mehta (@vivamehta) (చదవండి: మేఘాలను గమనిస్తూ, వీడియోలు తీస్తూ..నెలకు రూ. 8.5 లక్షలు!) -
మేఘాలను గమనిస్తూ, వీడియోలు తీస్తూ..నెలకు రూ. 8.5 లక్షలు!
పనిప్రదేశం, ఆఫీస్ డెస్క్‌లు, టార్గెట్లు లేకుండా ప్రకృతితో మమేకమై ఉద్యోగం అంటే అబ్బా అని ఎగిరిగంతేస్తాం. అయినా అలాంటి ఉద్యోగం ఎక్కడుంటుంది అని కొట్టిపారేయకండి. అలాంటి గొప్ప ఉద్యోగం కూడా ఉంది. పైగా జీతం ఎంతో తెలిస్తే..వామ్మో అని ఉబ్బితబ్బిబవ్వడం ఖాయం. ఇంతకీ ఏంటా జాబ్..? ఏం పని చేయాల్సి ఉంటుందంటే..చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌లోని లావోజున్ పర్వత సుందర ప్రాంతం ఒక అసాధారణమైన ఉద్యోగ ప్రకటన ఇచ్చింది. ఆ ఉద్యోగానికి "క్లౌడ్‌స్కేప్ అబ్జర్వర్" అని పేరు పెట్టి మరి దరఖాస్తులకు ఆహ్వానించింది. ఎంపికైన వ్యక్తి జూలై 16 నుంచి ఆగస్టు 15 వరకు పర్వతంపై ఉండి మారుతున్న మేఘాలను, ప్రకృతి దృశ్యాలను చిత్రీకరించి రోజువారీ వీడియోలు పంచుకోవాల్సి ఉంటుంది. అంఉకోసం నెలకు సుమారు రూ. 8.5 లక్షలు దాక చెల్లిస్తారట. అంతేకాదండోయ్ వసతి కూడా కల్పిస్తారట. ఈ ఆఫర్ చైనాలో చాలామంది నిరుద్యోగ యువతను ఆకర్షించింది. దీన్ని చాలామంది డ్రీమ్ జాబ్‌గా, దేవతా ఉద్యోగంగా అభివర్ణిస్తూ..ఈ ఉద్యోగాన్ని ఎలాగైన కొట్టేయాలని ఉవ్విళ్లూరారు. అయితే ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు నిర్దేశించిన హ్యాష్‌ట్యాగ్‌లను ఉపయోగించి వీడియోలను సమర్పించాల్సి ఉంటుంది. సదరు సుందరమైన ప్రాంతం నిర్వాహకులు పంపిన కంటెంట్ నాణ్యతకు వచ్చిన స్పందనను పరిగణలోనికి తీసుకుని ఎంపిక చేస్తుందట. ఈ ఉద్యోగానికి సుమారు మూడు వేలకు పైగా దరఖాస్తు చేసుకోగా, హెనాన్‌కు చెందిన 23 ఏళ్ల లీ సిచెన్ అనే వ్లాగర్ ఎంపికయ్యాడు. అతను @xiaozao అనే హ్యాండిల్‌ను ఉపయోగిస్తాడు. అతను లావోజున్ పర్వతం నెం 001 క్లౌడస్కేప్ అబ్జర్వర్‌గా ఎంపికయ్యాడు. అతని దరఖాస్తు వీడియోకు బలమైన స్పందన వచ్చింది. అలాగే ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్లతో సహా ఇతర దరఖాస్తుదారులకు విభిన్నంగా తన పనితీరుని చాటాడు. ఇక సదరు యువకుడు లీ ఇటీవలే ఈ కామర్స్‌లో డిగ్రీ పూర్తి చేశాడు. నిజానికి ఈ ఉద్యగోం విశ్రాంతి, ఆహ్లాదాన్ని ఇచ్చే ఉద్యోగంలా ఉంటుంది కానీ అతడి పనిదిన సూర్యోదయానికి ముందే మొదలవుతుంది. అలాగే సూర్యాస్తమయం వరకు కొనసాగుతుంది. ఇక్కడ రోజులో వివిధ సమయాల్లో వివిధ కోణాల నుంచి ఎక్కువ ఫుటేజ్‌లు చిత్రీకరించడమే అతడి టార్గెట్. ఆ అందమైన ప్రాంతం ఆన్లైన్ కంటెంట్ కోసం అతను మేఘాలు, పొగమంచు, పర్వత దృశ్యాలు, కాంతి ప్రదర్శనలు చిత్రీకరించాల్సి ఉంటుంది. ఒక రకంగా ఈ పని లీకి కొత్త సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి సహాయపడింది. అలాగే ఈ ఉద్యోగంలో తెలియని ఒక రకమైన ఒత్తిడిన ఎదుర్కొనక తప్పదు కూడా. అదేంటంటే తన వీడియోలు క్లిక్ అవుతాయో లేదో అనే భయం వెంటాడుతూ ఉంటుందట. ఏ వీడియో కంటెంట్ ద్వారా ఉద్యోగాన్ని సంపాదిచుకున్నాడో..అంతే స్థాయిలో ప్రతిసారి కంటెంట్ క్రియేట్ చేయడం అంటే విపరీతమైన ఒత్తిడితో కూడిన పనే అని చెప్పొచ్చు. ఒక్కోసారి ప్రతికూల పరిస్థితుల వల్ల ఫోటోలు చక్కగా రావు. నిరంతరం వాతారణ పరిస్థితులను తట్టుకుంటూ ఫోటోలు చిత్రీకరించాల్సి ఉంటుంది. ఇన్ని క్లిష్టమైన పరిస్థితులు ఉన్నా..నెల మొత్త విజయవంతంగా చిత్రీకరణ కొనసాగించడం విశేసం. ముగింపు సమయంలో ఇట్టే నెల గడిచిపోతుందని అంటున్నాడు లీ. అంతేగాదు ఆ నెల లావోజున్ పర్వతం వద్ద గడిపిన లీ కూడా ఆన్లైన్ బాగా ఫేమస్ అయ్యాడు. అతడు ఆ పర్యాటక ప్రదేశం వీడియోల తోపాటు ఆ క్రమంలో తను ఎదుర్కొన్న కష్టాలను, ఇబ్బందులను కూడా షేర్ చేసుకున్నాడు. ప్రత్యేకంగా ఇలా కంటెంట్ క్రియేటర్ ఎందుకంటే..సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక ప్రకారం, ఆ పర్యాటక ప్రదేశంలో ఇప్పటికే పూర్తి-కాలం పనిచేసే వీడియో మేకర్లు ఉన్నారు. అలాంటప్పుడు, ఇలా ప్రత్యేకంగా కంటెంట్ క్రియేటర్లు ఎందుకు అంటే..లావోజున్ పర్వతానికి చెందిన జాంగ్ అనే ప్రతినిధి మాట్లాడుతూ.. తమ పర్యాటక ప్రదేశానికి ఒక కొత్త దృక్కోణం కావాలని కోరుకున్నట్లు చెప్పారు. జాంగ్ ఆ పరిశీలకుడిని "మూడవ కన్ను"గా వర్ణించారు. భవిష్యత్తులో ఇలా క్లౌడ్‌స్కేప్ పరిశీలకులను మళ్లీ నియమించుకోవచ్చని ఆ ప్రతినిధి తెలిపారు.కాగా, ఈ లావోజున్ పర్వతం మధ్య చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌లోని లువాన్చువాన్ కౌంటీలో ఉంది. ఈ పర్వతం దాని 'మేఘాల సముద్రం'కు ప్రసిద్ధి చెందింది. ఇది చైనాలో ప్రసిద్ధి చెందిన టావోయిస్ట్ పర్వతాలలో ఒకటి. ఇది రెండు వేల ఏళ్లకు పైగా చరిత్రను కలిగి ఉంది. అంతేగాదు పర్యాటక ఆర్షణ రేటింగ్ వ్యవస్థలో దీనికి 5A-రేటింగ్ ఉండటం గమనార్హం.(చదవండి: సరిహద్దులు దాటిన ప్రేమ..! స్కాటిష్ ఎంపీని పెళ్లాడిన భారతీయ మహిళ) -
కేరళ గుడిలో విదేశీ ఎంపీతో మళ్లీ వివాహం!
ప్రేమకు సరిహద్దులు లేవని ఈ జంట కారణంగా మరోసారి నిరూపితమైంది. ప్రేమ ఎలా పుడుతుందో తెలియదు గానీ దాన్ని గెలిపించుకోవడం కోసం ఎన్ని కష్టాలైనా ఓర్చుకుంటారు, ఎంత కాలమైన నిరీక్షిస్తారు. అచ్చం అలానే ఈ స్కాటిష్ ఎంపీ పదేళ్లు నిరీక్షించి మరీ కేరళ మహిళను పెళ్లాడాడు స్కాటిష్ రాజకీయ నాయకుడు. దేశం దాటిన ఈ దంపతుల ప్రేమ కథ ఏంటో చూద్దామా..!స్కాటిష్ నేషనల్ పార్టీ (SNP) రాజకీయ నాయకుడు , పార్లమెంట్ సభ్యుడు మార్టిన్ డే కేరళకు చెందిన నిధిన్ చంద్‌ను అక్కడ ప్రఖ్యాత గాంచిన గురువాయూర్ శ్రీకృష్ణ దేవాలయంలో సాంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. ఎర్నాకులం జిల్లాలోని పిరవంకు చెందిన నిధిన్ చిరకాల కోరిక ఇన్నేళ్లకు నెరవేరిందట. ఈ వివాహ వేడుక మంగళవారం నాడు గురువాయూర్ దేవాలయ ప్రాంగణంలోని ఆడిటోరియంలో జరిగింది. ఈ కార్యక్రమానికి సన్నిహిత కుటుంబ సభ్యులు, స్నేహితులు హాజరయ్యారు. అందుకు సంబంధించిన ఫోటోలను మార్టిన్ డే ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్చేసుకోవడంతో నెట్టింట వైరల్‌గా మారింది. పదేళ్లకు పైగా నిరీక్షించక తప్పలేదు..నిజానికి ఈ జంట 2016లోనే యూకేలో వివాహం చేసుకున్నారు. కానీ నిధిన్ చాలా కాలంగా గురువాయుర్‌లో తన వివాహతంతుని పూర్తి చేయాలని కోరుకున్నారు. 2018 కేరళ వరదలు, కోవిడ్ 19 మహమ్మారి వంటి కారణాల వల్ల ఈ జంట వివాహ వేడుక చాలా ఏళ్లుగా వాయిదా పడుతూ వచ్చింది. చివరకు తమ వివాహం రిజిస్టర్ అయిన తొమ్మిదేళ్ల తర్వాత, తన నాలుగవ పర్యటనలో ఆ దంపతులు గురువాయురు ఆలయంలో వివాహం చేసుకున్నారు. ఇది తన భాగస్వామి చిరకాల కోరిక అని చెబుతున్నారు స్కాటిష్ ఎంపీ మార్టిన్ డే.ఎవరీ మార్టిన్ డే..55 ఏళ్ల మార్టిన్ డే, స్కాటిష్ నేషనల్ పార్టీకి చెందిన ఒక సీనియర్ రాజకీయ నాయకుడు. ఆయన లిన్లిత్గో ప్రాంతానికి స్థానిక, జాతీయ స్థాయిలలో ప్రాతినిధ్యం వహించారు. ఆయన 1999లో వెస్ట్ లోథియన్ కౌన్సిల్‌కు తొలిసారిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2015లో లిన్లిత్గో ఈస్ట్ ఫాల్కిర్క్ నియోజకవర్గం నుంచి ఎంపీగా యూకే హౌస్ ఆఫ్ కామన్స్లోకి ప్రవేశించారు. ఆయన 2024 వరకు ఎంపీగా పనిచేశారు. ఆరోగ్యం, సామాజిక సంరక్షణ వంటి రంగాలతో సహా SNP ఫ్రంట్‌బెంచ్ బాధ్యతలను నిర్వహించారు.2026 స్కాటిష్ పార్లమెంట్ ఎన్నికలలో, డే తిరిగి ఎన్నికై పదవిలోకి వచ్చి, ఫాల్కిర్క్ ఈస్ట్ అండ్ లిన్లిత్గో నియోజకవర్గం నుంచి MSPగా ఎన్నికయ్యారు. ఆయన ప్రస్తుతం స్కాటిష్ పార్లమెంట్ క్లైమేట్ యాక్షన్ కమిటీ అండ్ ఎకానమీ, టూరిజం అండ్ ఎనర్జీ కమిటీలలో సభ్యుడిగా ఉన్నారు. కాగా, ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించడానికి ముందు,బ్యాంకింగ్ రంగంలో పనిచేశారు. అలాగే వెస్ట్ లోథియన్‌లోని స్థానిక ప్రభుత్వంలో పాలుపంచుకున్నారు.ఎవరీ నిధిన్ చందన్..ఎర్నాకుళంలోని పిరవం ప్రాంతానికి చెందిన నిధిన్ చంద్, ఉన్నత విద్య కోసం నవంబర్ 2008లో యూకేకి వెళ్లారు. ఆమె యూకేలో ఐటీ మేనేజ్మెంట్లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. ఆమె తండ్రి కే.ఎన్. చంద్రన్ ఒక రిటైర్డ్ వెటర్నరీ అధికారి, తల్లి రాజమ్మ పంపాకుడ మాజీ గ్రామ పంచాయతీ సభ్యురాలు.అలా పరిచయమైంది..యూకేలో ఆమె పీహెచ్డీ చేస్తున్న సమయంలో, కొత్త వలస నిబంధనల వల్ల ఆమె వీసాతో సహా వేలాది విద్యార్థి వీసాలు రద్దు చేయబడ్డాయి. నిధిన్ అక్కడినుంచి వెళ్ళిపోకుండా, పార్లమెంటులో లాబీయింగ్ చేసి, కమిటీల ముందు భారతీయ విద్యార్థులకు ప్రాతినిధ్యం వహించారు. అక్కడే ఆమె లిన్లిత్గో అండ్ ఈస్ట్ ఫాల్కిర్క్ ఎంపీ అయిన మార్టిన్ డేను కలిశారు.మే నెలలో అతను ప్రపోజ్ చేసిన తర్వాత, 2016లో వారిద్దరూ వివాహం చేసుకున్నారు. తనకు 12 ఏళ్ల కొడుకు ఉన్నాడని, తాను విడాకులు తీసుకున్న మహిళనని నిధిన్ చెప్పినప్పుడు, మార్టిన్ చాలా విశాల హృదయంతో తన జీవితంలోకి ఆహ్వానించి, తన పేరెంట్స్ మార్గరెట్, రాన్ డేలకు ఆమెను పరిచయం చేశారు. ఆమె వీసా, ఉద్యోగ పరిస్థితి అనిశ్చితంగా ఉన్నప్పటికీ, వాళ్లు ఆమెను ఆప్యాయంగా తమ కుటుంబంలోకి ఆహ్వానించారు. తర్వాత మార్టిన్, నిధిన్, ఆమె కుమారుడు వేద్దిక్తో కలిసి యూకే వెళ్ళాడు.అలాగే ఆమె కుమారుడు వేద్దిక్, ఎడిన్‌బర్గ్‌లోని కంప్యూటర్షేర్లో సీనియర్ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేస్తున్నాడు. నిధిన్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్‌గా పనిచేస్తూ, స్కాటిష్ నేషనల్ పార్టీ ప్రచారాలలో కూడా చురుకుగా పాల్గొంటుంది. కాగా, మార్టిన్ డే 1999 నుంచి ప్రజా సేవలో నిమగ్నమై ఉన్నారు. అంతేగాదు తొమ్మిదేళ్లలో మూడు పర్యాయాలు యూకే పార్లమెంట్ సభ్యుడిగా సేవలందించారు. ఆయన స్కాటిష్ పార్లమెంట్లో భారతదేశం తరపున అఖిల పక్ష పార్లమెంటరీ గ్రూపుకు అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. View this post on Instagram A post shared by jith (@jith__uday) (చదవండి: లస్సీ అమ్ముతూ నెలకు రూ. 80 వేలు..!) -
Health: దోమ చిన్నదే..! కుట్టిందో ఖతమ్..!
మనుషులపై మలేరియా ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఈ వ్యాధికి దోమలే కారణం. దోమలు వృద్ధి చెందడం వల్ల మలేరియా వ్యాధి వ్యాప్తి చెందుతుంది. ఈ అనారోగ్య పరిస్థితులకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ప్రజలు ఆరోపిస్తున్నారు. గ్రామాల్లో డంపింగ్ యార్డులు లేకపోవడం, తగినంత మంది పారిశుధ్య కారి్మకులు లేకపోవడంతో చెత్త, మురుగు ఎక్కడికక్కడే పెరిగిపోయి దోమలు ప్రభావం తీవ్రంగా ఉంది. ‘వరల్డ్ మస్కిటో డే’ సందర్భంగా ఈ కథనం..దోమలు కలిగించే వ్యాధులివీఅనాఫెలస్ దోమ: ఈ దోమ వల్ల మలేరియా వ్యాధి సోకుతుంది. ఇది శుభ్రమైన నీటిలో సంచరిస్తుంది. ఇది వంద మీటర్లు మేర మాత్రమే సంచరించగలవు. క్యూలెక్స్: ఈ దోమ వల్ల ఫైలేరియా, మెదడుకు సంబంధించిన వ్యాధి సోకుతుంది. ఇది మురుగు నీటిలో మసులుతుంది. ఇది 11 కిలోమీటర్లు మేర సంచరిస్తూ ఉంటుంది. ఏడిస్: ఈ దోమ వల్ల డెంగీ, చికెన్‌గున్యా వ్యాధులు సోకుతాయి. ఇది చెట్టు తొర్రలు, నివాస ప్రాంతాల్లోని వస్తువుల్లో నిల్వ ఉంచిన నీటిలోనూ, కొబ్బరి డిప్పలు, పశువల పాకలవు వద్ద అపరిశుభ్రత పరిస్థితులమధ్య సంచరిస్తుంది.ఇది వంద మీటర్లు మేర మాత్రమే సంచరించగలవు. మేన్సోనియా: ఈ దోమ వల్ల ఫైలేరియా, చికెన్‌గున్యా వ్యా«ధులు సోకుతాయి. దీని ప్రభావం ఇండియాలో తక్కువగా ఉంది. ఇది చెరువులు, కాల్వల్లో ఉండే గుర్రపుడెక్క, మొక్కలో ఉంటుంది. ఇది వంద మీటర్లు మేర మాత్రమే సంచరించగలవు.వ్యాధుల లక్షణాలు ఇలా..మలేరియా: వణుకుతో కూడిన చలి జ్వరం వస్తుంది. రెండు రోజులకోసారి జ్వరం కనిపిస్తుంది. ప్రాథమిక దశలోనే చికిత్సను ప్రారంభించాలి. తీవ్రత పెరిగతే మెదడు ప్రభావితమై రోగి చనిపోయే పరిస్థితులుంటాయి.ఫైలేరియా: సాధారణంగా కాలు వాస్తుంది. గజ్జలో బిల్లలు వేస్తాయి. సాయంత్రం వేళ తక్కువ స్థాయిలో జ్వరం కనిపిస్తుంది.డెంగీ జ్వరం: జ్వరం తీవ్ర స్థాయిలో ఉంటుంది. తలనొప్పి, రొంప, కీళ్ల నొప్పులు, గొంతునొప్పి, కళ్ళు ఎర్రబారడం జరుగుతుంది. ప్లేట్లెట్స్ కౌంట్ పడిపోకుండా జాగ్రత్తపడాలి. శరీలంలో మచ్చలు వస్తే ప్లేట్లెట్స్ కౌంట్ పడిపోయినట్టుగా భావించవచ్చు. చికెన్‌గున్యా: ఈ వ్యాధి దీర్ఘకాలంపాటు ఉండొచ్చు. కీళ్ల నొప్పులు అధికంగా ఉంటాయి. రెండు నెలలు నుంచి ఏడాది పాటు ఈ నొప్పులు బాధించవచ్చు.వరల్డ్ మస్కిటో డే ప్రాధాన్యం ఇదీ..బ్రిటీషు దేశానికి చెందిన రొనాల్డ్ రాస్ అనే సైంటిస్ట్ ప్రజలను పట్టిపీడిస్తున్న జ్వరాలపై పరిశోధన చేశాడు. అనాఫెలస్ అనే ఆడ దోమ వల్ల మలేరియా అనే వ్యాధి సోకుతుందన్న విషయాన్ని 1897 ఆగస్టు 20న ప్రపంచానికి తన పరిశోధన ద్వారా తెలియపర్చాడు. ఆయన సేవలకు గుర్తింపుగా ఆగస్టు 20ను అంతర్జాతీయ దోమల నివారణ దినంగా ప్రకటించారు.- రొనాల్డ్ రాస్, సైంటిస్ట్ -
మనం గెలవటమే కాదు అవతలి వారినీ గెలిపించాలి!
నా వయసు 36. మాకు పెళ్లై 15 సంవత్సరాలైంది.. మా ఆయన ఒక బిల్డర్. మాకు ఆర్థికంగా ఇబ్బందులు లేవు. ఇద్దరు అబ్బాయిలు. ఇప్పటివరకు చాలా అన్యోన్యంగా, సంతోషంగా జీవించాం. కానీ కొంతకాలంగా మా ఆయన ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. సమయం దొరికినప్పుడల్లా ఫోన్ లో అసభ్యకరమైన వీడియోలు చూస్తున్నారు. వాటిలో చూసినట్లే బెడ్రూమ్లో కూడా ఉండాలని నన్ను ఒత్తిడి చేస్తున్నారు. నాకు అవన్నీ చాలా అసహ్యంగా, ఇబ్బందికరంగా అనిపిస్తున్నాయి. అందుకే నేను ఆయనకు దూరంగా ఉండడం ప్రారంభించాను. దాంతో ఈ మధ్య ఆయన చిరాకుగా ఉంటున్నారు. ఇంట్లో కూడా మునుపటిలా కలిసిమెలిసి ఉండటం లేదు. ఆలస్యంగా ఇంటికి వస్తున్నారు. ఒకసారి ఆయన ఫోన్ లో చూస్తే డేటింగ్ యాప్‌లు కూడా కనిపించాయి. అయితే ఆయనకి వేరే చెడ్డ అలవాట్లు ఏమీ లేవు. ఇన్నాళ్లూ బాగానే ఉన్న వ్యక్తి ఇలా ఒక్కసారిగా ఎందుకు మారిపోయారు? ఆయనను ఎలా అర్థం చేసుకోవాలి? ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలి? దయచేసి సలహా ఇవ్వండి. – స్వాతి, బెంగళూరుమీరు రాసిన లేఖలో మీ బాధ, ఆవేదన స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముందుగా ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఇలాంటి మార్పు కనిపించిందని వెంటనే ఆయన చెడ్డ వ్యక్తి అయిపోయారని లేదా మీ కుటుంబ జీవితం ముగిసిపోయిందని అనుకోవద్దు. ఈ రోజుల్లో ఇంటర్నెట్ చాలా సులభంగా అందుబాటులో ఉంది. దానితో పాటు అశ్లీల కంటెంట్ కూడా అందరికీ సులువుగా చేరుతోంది. కొంతమంది అలాంటి వీడియోలను తరచుగా చూస్తూ, వాటిలో చూపించే దృశ్యాలే నిజమైన దాంపత్య జీవితం అని భావిస్తారు. కానీ అవి కేవలం వినోదం కోసం రూపొందించిన చిత్రాలు మాత్రమే. మనం మిగతా సినిమాలను ఎలా చూస్తామో, వాటిలాగే ఇవి కూడా నటీనటులతో చిత్రీకరించిన వినోదాత్మక కంటెంట్. అయితే, మీ లేఖలో మరింత ఆందోళన కలిగించే విషయం డేటింగ్ యాప్‌ల వినియోగం. అది మీ ఇద్దరి మధ్య ఉన్న నమ్మకాన్ని దెబ్బతీసే అవకాశం ఉంది. చాలామంది పురుషుల్లో మధ్యవయసులో, ముఖ్యంగా జీవితంలో ఆర్థికంగా, సామాజికంగా స్థిరపడిన తర్వాత, ఒక రకమైన మిడ్ లైఫ్ క్రైసిస్ కనిపించవచ్చు. అన్నీ ఉన్నప్పటికీ జీవితంలో కొత్తదనం కావాలనే కోరిక పెరుగుతుంది. దాంపత్య జీవితంలో కూడా చాలా సంవత్సరాలు ఒకే విధమైన అనుభవాలు ఉంటే, కొంత కొత్తదనం కోరుకోవడం అసాధారణం కాదు. దాన్ని జీవిత భాగస్వామిపై బలవంతంగా రుద్దడమే అసలు సమస్య. అదేవిధంగా, జీవిత భాగస్వామి కోరికలను పూర్తిగా తిరస్కరించడం కూడా సరైంది కాదు. అది ఇద్దరిమధ్య దూరాన్ని పెంచుతుంది. దాంపత్య జీవితం అనేది ఇద్దరి అంగీకారం, పరస్పర గౌరవం, ఒకరి భావాలను మరొకరు అర్థం చేసుకోవడంపైనే ఆధారపడి ఉంటుంది. దాంపత్యంలో గెలుపు అంటే మనం గెలవడం కాదు, అవతలి వారిని గెలిపించడం!పదిసార్లు మీ భర్త మిమ్మల్ని గౌరవించినప్పుడు, ఒకసారి ఆయన కోసం, ఆయనకు నచ్చినట్లు ఉండటానికి మీరు కూడా ప్రయత్నిస్తే తప్పేమీ లేదు. మారుతున్న ప్రపంచంలో మనుషుల అభిరుచులు, ఆలోచనలు మారుతున్నాయి. అలాగని మీకు అసౌకర్యంగా అనిపించే ప్రతి విషయాన్ని మీరు అంగీకరించాల్సిన అవసరం లేదు. అదే సమయంలో, ఆయన ఎందుకు అలా కోరుకుంటున్నారో కూడా ప్రశాంతంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇద్దరూ మాట్లాడుకుని మీ ఇద్దరికీ ఆమోదయోగ్యమైన మధ్యమార్గాన్ని కనుగొంటే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. అవసరమైతే ఇద్దరూ కలిసి ఒక సైకియాట్రిస్ట్ ను సంప్రదించండి. కౌన్సెలింగ్ ద్వారా ఇద్దరి అభి్రపాయాలు, అంచనాలు, పరిమితులు చర్చించి ఒక పరిష్కారానికి రావచ్చు.డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ. మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com -
టైర్ అయ్యాం అవుదాం మినీ రిటైర్
ఉదయం లేచింది మొదలు రాత్రి స్టవ్ కట్టేసే వరకు ఉరుకుల పరుగుల జీవితం. పెళ్లి, పిల్లలు, ఇల్లు, ఆఫీస్ డెడ్‌లైన్స్... కెరీర్ రేసులో పరిగెత్తి పరిగెత్తి అలసిపోయిన ఆధునిక మహిళలు 2026లో కొత్త ట్రెండ్‌కు తెరతీశారు. అదే ‘మినీ రిటైర్మెంట్’. 60 ఏళ్లకు తీసుకునే రిటైర్మెంట్ కాకుండా కెరీర్ మధ్యలోనే 3 నుండి 6 నెలలు బ్రేక్ తీసుకుని లైఫ్‌ను రీఛార్జ్ చేసుకుంటున్నారు. మన దేశంలో ఈ ధోరణి పట్ల 85 శాతం ఆసక్తితో ఉంటే 35 శాతం ఆచరణలో చూపుతున్నారు.హైదరాబాద్‌లోని ఒక లీడింగ్ ఐటీ కంపెనీలో సీనియర్ మేనేజర్‌గా పని చేస్తున్న కావ్య (32) ఐదేళ్లుగా రాత్రింబగళ్లు ప్రాజెక్టులతో కుస్తీ పట్టింది. శారీరకంగా, మానసికంగా తీవ్రమైన ఒత్తిడి లోనైంది. రెజ్యూమేలో గ్యాప్ వస్తే కెరీర్ పాడవుతుందన్న భయాన్ని పక్కన పెట్టి ధైర్యంగా నాలుగు నెలల‘మినీ–రిటైర్మెంట్’ తీసుకుంది. ఫోన్ పక్కన పడేసి, కేరళలో ఆయుర్వేద డిటాక్స్ తీసుకుంటూ, చిన్నప్పుడు వదిలేసిన పెయింటింగ్ మళ్లీ మొదలుపెట్టింది. ఇప్పుడు సరికొత్త ఉత్సాహంతో మళ్లీ ఆఫీసులో అడుగుపెట్టింది.ఒక ఎడ్–టెక్ స్టార్టప్‌లో కస్టమర్ సపోర్ట్ హెడ్‌గా ఉన్న సుజాత (36) ఆఫీస్ ఒత్తిడికి తోడు ఇంట్లో బాధ్యతలు ఎక్కువై డిప్రెషన్ లోకి వెళ్ళింది. ఇలా అయితే లాభం లేదని దాచుకున్న డబ్బుతో మూడు నెలలు లీవ్ పెట్టి కేవలం పిల్లలతో గడపడానికి, యోగా నేర్చుకోవడానికి ఆ సమయాన్ని వాడుకుంది. ఈ చిన్న బ్రేక్ ఆమెకు కొత్తజన్మను ఇచ్చింది. ఈ ఇద్దరి కథలూ 2026లోమహిళల మానసిక స్థితికి అద్దం పడుతున్నాయి.ఎందుకీ ధోరణి?మహిళలపై సమాజం మోపుతున్న ‘సూపర్ ఉమెన్’ ట్యాగ్ వారిపై భారానికి కారణమవుతోంది. ఇటు ఆఫీసులో మగవారితో సమానంగా టార్గెట్లు రీచ్ అవ్వాలి... అటు ఇంట్లో పర్ఫెక్ట్ కోడలిగా, భార్యగా, తల్లిగా బాధ్యతలు నెరవేర్చాలి. ఈ ‘మల్టీ టాస్కింగ్’ వల్ల మహిళల్లో విపరీతమైన యాంగ్జయిటీ, ఇన్సోమ్నియా (నిద్రలేమి) వంటి సమస్యలు పెరిగిపోయాయి. ఒక్కరోజు కూడా ప్రశాంతంగా ఊపిరి పీల్చుకునే సమయం దొరకని పరిస్థితి. ‘ఇలాగే పరిగెడితే ఆరోగ్యం పాడవుతుంది, కొన్నాళ్లు బ్రేక్ తీసుకోక తప్పదు’ అనే సామాజిక అవసరం ఏర్పడింది. బాస్ భరోసా ఇస్తున్నారా? ఒకప్పుడు ‘కెరీర్ గ్యాప్’ ఉంటే రెజ్యూమేలను డస్ట్‌బిన్ లో వేసే కంపెనీలు 2026లో ఉద్యోగుల మానసిక ఆరోగ్యానికి పెద్దపీట వేస్తున్నాయి. పెద్ద పెద్ద కంపెనీలు ‘సబాటికల్ లీవ్స్’ (జీతం లేని దీర్ఘకాలిక సెలవులు) ఇస్తూ ‘మీరు బ్రేక్ తీసుకుని రండి,మీ సీటు భద్రంగా ఉంటుంది’ అని భరోసా ఇస్తున్నాయి. అయితే కుటుంబాల నుండి మద్దతు విషయంలో మిశ్రమ స్పందన కనిపిస్తోంది. విద్యావంతులైన భర్తలు, ఆధునిక కుటుంబాలు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తుంటే సంప్రదాయ మధ్యతరగతి ఇళ్లలో మాత్రం ‘ఉన్న ఉద్యోగానికి బ్రేక్ ఇవ్వడం ఏంటి? పిచ్చి కాకపోతే’ అనే ప్రశ్నలు ఎదురవుతూనే ఉన్నాయి. కానీ మహిళలు వీటన్నింటినీ దాటి తమ ఆరోగ్యానికే ప్రాధాన్యత ఇస్తున్నారు.సగటు మహిళ ఏం నేర్చుకోవాలి? మరి నెలజీతం వస్తేనే ఇల్లు గడిచే సగటు మధ్యతరగతి మహిళలు, ఒక్క రోజు కూడా లీవ్ దొరకని చిన్న ఉద్యోగాలు చేసేవారి పరిస్థితి ఏంటి? వారు ఈ ధోరణిని ఎలా అడాప్ట్ చేసుకోవాలి? దీనికి పెద్ద పెద్ద ప్లాన్స్ అక్కర్లేదు. ‘మినీ రిటైర్మెంట్’ అనే భావనను మీ రోజువారీ జీవితంలోకి మార్చుకోవచ్చు. ‘నో ఆఫీస్ టాక్’: శనివారం లేదా ఆదివారం కనీసం ఒక అరపూట ఫోన్ ను, ఆఫీస్ మెయిల్స్ ను పూర్తిగా పక్కన పెట్టేయండి.మైక్రోబ్రేక్స్: నెలకు ఒక శనివారం ఇంట్లో వంట పనికి సెలవు పెట్టి, హోటల్ నుండి తెప్పించుకోండి. ఆ సమయాన్ని మీకోసం కేటాయించుకోండి.నో చెప్పడం నేర్చుకోండి: ఆఫీసులో మీ పని పరిధి దాటి వచ్చే అదనపు ఒత్తిళ్లకు, ఇంట్లో అనవసరపు బాధ్యతలకు సున్నితంగా ‘నో’ చెప్పడం అలవాటు చేసుకోండి. పెద్ద బ్రేక్ తీసుకోకపోయినా ఈ చిన్న మార్పులు మీ మైండ్‌ను రీఛార్జ్ చేస్తాయి.జీవితం అంటే కేవలం సంపాదించడం, బాధ్యతలు మోయడమే కాదు... అందులో మనకూ ఒక స్థానం ఉండాలి. రేసుగుర్రాల్లా పరిగెత్తడం కాసేపు ఆపి, కాస్త అలసట తీర్చుకోవడంలో తప్పు లేదు. మన ఆరోగ్యం బాగుంటేనే, మన కుటుంబం, కెరీర్ బాగుంటాయి. కాబట్టి వీలైతే కొన్ని నెలలు, లేదంటే కనీసం వారంలో కొన్ని గంటలైనా మీ కోసం మీరు ‘మినీ–రిటైర్’అవ్వండి. జీవితాన్ని మళ్లీ ఆస్వాదించండి!నగరాల్లో మహిళల మినీ రిటైర్మెంట్బెంగళూరు: ఇక్కడ 35% మహిళలు టెక్ కంపెనీలలో కోడింగ్ డెడ్‌లైన్స్ తట్టుకోలేక 35 ఏళ్ల లోపే 6 నెలల సబాటికల్స్ వైపు మొగ్గు చూపుతున్నారు.హైదరాబాద్: గచ్చిబౌలి, మాదాపూర్ ఐటీ కారిడార్లలోని ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలు, ఫైనాన్షియల్ సెక్టార్లలో పని చేసే మహిళల్లో 28 శాతం ‘మెంటల్ హెల్త్ బ్రేక్స్’ కోసం కంపెనీల నుండి భరోసా పొందుతున్నారు.ముంబై: ఇక్కడ 22% మంది మహిళలు అడ్వర్టయిజింగ్, మీడియా, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ రంగాల్లో బ్రేక్స్ తీసుకుని సోలో ట్రావెలింగ్కు వెళ్తున్నారు.ఢిల్లీ: గుర్గావ్, నోయిడా పరిసర ప్రాంతాల్లో 15% మహిళలు కాలుష్యం, లాంగ్ కమ్యూటింగ్ (ప్రయాణ ఒత్తిడి) వల్ల బర్నౌట్ అయి డిజిటల్ డిటాక్స్ కోసం విరామం తీసుకుంటున్నారు. -
‘నేచర్స్ ఓజెంపిక్’ అంటే..?నిజంగానే బరువు తగ్గిస్తుందా?
ప్రాచీన ఆయుర్వేద మూలిక నెట్టింట హాట్‌టాపిక్‌గా మారింది. ఆయుర్వేదంలో దారుహరిద్ర అని పిలిచే బెర్బెరిన్ బరువు నిర్వహణ, రక్తంలోని చక్కెర నియంత్రణకు సంబంధించిన ప్రయోజనాల కారణంగా ఒక్కసారిగా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. దీని గురించి వైద్యులు ఏమంటున్నారంటే..బెర్బెరిన్ అనేది బెర్బెరిస్ కుటుంబానికి చెందిన మొక్కలలో సహజంగా లభించే ఒక సమ్మేళనం. దీన్ని ఇండియన్ బార్బెర్రీ, దారుహరిద్ర లేదా ట్రీ టర్మరిక్ అని పిలుస్తారు. ఈ మొక్క భారతదేశం పాకిస్తాన్, నేపాల్‌లోని హిమాలయాలకు చెందినది. ఇది దక్షిణ భారతదేశం, శ్రీలంకలోని కొన్ని ప్రాంతాలలో సహజంగా కనిపిస్తుంది. బెర్బెరిన్ ఒక కొత్త ఆరోగ్య ఆవిష్కరణలా అనిపించినప్పటికీ, దాని చరిత్ర శతాబ్దాల నాటిది. మూడువేల ఏళ్ల క్రితం నుంచి చైనీస్ వైద్యలో దీన్ని ఉపయోగిస్తున్నారు. అలాగే భారత ఆయుర్వేదంలో కూడా దీనికి ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా బరువు నిర్వహణపై ఆసక్తి ఉన్నవారిలో బెర్బెరిన్కు ఆదరణ పెరుగుతోందని చెబుతున్నారు వైద్యులు. ఇది బరువు నిర్వహణ, కొలెస్ట్రాల్, చక్కెర నియంత్రణ వంటి వాటిలో దీని పాత్ర రీత్యా క్రేజ్ పెరిగిందని అంటున్నారు. ఇది జీర్ణవ్యవస్థ ఆరోగ్యం నుంచి గుండె సంబంధిత సమస్యలకు సైతం మద్దతిస్తుందట. ముఖ్యంగా ఆడవాళ్లలో వచ్చే పీసీఓఎస్ సమస్యలకు కూడా చెక్పెట్టగలదట. అందువల్లే దీన్ని నేచర్స్ ఓజెంపిక్ అని పిలుస్తారట. దీన్ని సాంప్రదాయకంగా జ్వరాలు, విరేచనాలు, చర్మవ్యాధులు, కంటివ్యాధుల కోసం కూడా ఉపయోగిస్తారని చెబుతున్నారు వైద్యులు. ఆ ప్రయోజనాల రీత్యా ఇటీవలకాలంలో దీన్ని క్యాప్సూలస్, టాబ్లెట్లు, సప్లిమెంట్లు రూపాల్లో విరివిగా ఉపయోగించడంతో.. ఈ పురాతన ఆయుర్వేద మూలిక నెట్టింట ట్రెండీగా మారింది. View this post on Instagram A post shared by Sarthak Ahuja (@casarthakahuja) గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: మేయర్-రోకిటాన్స్కీ-కస్టర్-హౌజర్ సిండ్రోమ్ అంటే..! పాపం ఆ మహిళ 20 ఏళ్లుగా..) -
నా పిల్లలు కాలేజ్‌కి వెళ్లకూడదు..! భారత సంతతి సీఈవో
లిఫ్ట్, ప్రెస్టో వంటి కంపెనీల భాతర సంతతి సహవ్యవస్థాపకుడు రజత్ సూరి తరగతి గది వర్సెస్ ఏఐపై చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ ఏఐ యుగంలో కాలేజీ విద్య నిరుపయోగంగా మారుతోందంటూ చర్చను రేకెత్తించారు. పైగా ఆయన తన పిల్లలు కాలేజ్‌కి వెళ్లి చదవకపోవడమే మేలు అని సోషల్ మీడియా ఎక్స్ పోస్ట్‌లో రాసుకొచ్చారు. యువతకు అవసరమైన నైపుణ్యాలు, అనుభవాన్ని సంపాదించడానికి సాంప్రదాయ కాజేల్ చదువులు సరిపోకపోవచ్చని వాదించారు. ఆయన తన వ్యక్తిగత అనుభవాన్ని ప్రస్తావిస్తూ..తాను యూనివర్సిటీ ఆఫ్ వాటర్లూలో ఎకనామిక్స్ అండ్ ఇంజనీరింగ్‌లో డబుల్ డిగ్రీలు చేశాక, ప్రతిష్టాత్మక మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆప్ టెక్నాలజీ(ఎంఐటీ)లో పీహెచ్డీ/ఎంబీఏ ప్రోగ్రామ్ చేయడం కోసం చేరినట్లు తెలిపారు. అయితే తగరతి గదిలో నేర్చుక్నుదానికంటే వాస్తవ ప్రంపంచంలోనే అసలైన పనిని నేర్చుకున్నానని అంటున్నారు. ఆ కారణంగానే తాను వ్యవస్థాపకతపై దృష్టి సారించాలనే ఉద్దేశ్యంతోనే ఎంఐటీని మధ్యలోనే వదిలేశానని చెప్పారు. ఈ రోజు తన పిల్లలు గురించి ఆలోచిస్తుంటే వాళ్లు అసలు కాలేజ్ దరిదాపుల్లోకి వెళ్లకూడదని కోరుకుంటున్నానని అన్నారు. అలాగే వాటర్లూలో తనకు ఆరు వేర్వేరు వర్క్ప్లేస్మెంట్లు లభించాయని అన్నారు. అవి తనను వివిధ కంపెనీలు, సంస్కృతులు, మేనేజర్లు, వ్యాపార నమునాలకు పరిచయం చేశాయని అన్నారు. నిజానికి తన కోర్సు వర్క్‌లోని చాలా భాగం కంటే ఆ అనుభవాలే ఎంతో విలువైనవని అన్నారు. తాను స్కూల్లో నేర్చుకున్న చాలా విషయాలు వాటర్లూలోని వర్క్ టర్మ్స్‌లోనే నేర్చుకున్నానని చెప్పారు. అక్కడ నుంచి ఆరు వేర్వేరు కంపెనీలలో పనిచేశానని చెప్పారు. ఎంతో భిన్నమైన సంస్కృతులు, భిన్న యాజమాన్య శైలుల, టీమ్ డైనమిక్స్, వ్యాపార నమునాలు గురించి నేర్చుకున్నానని చెప్పారు. అందువల్ల ఈ రోజుల్లో తరగతి గదుల కంటే ఏఐ.. విద్యా నైపుణ్యాలను మరింత సమర్ధవంతంగా నేర్పించగలదని అన్నారు. కాబట్టి నాలుగేళ్లపాటు తరగతులకు హాజరయ్యే బదులు, యువత నేరుగా వివిధ సంస్థలలో పని అనుభవం ద్వారా నేర్చుకోవడమే మంచిదని ఆయన వాదించారు. అంతేగాదు రజత సూరి తన వర్క్‌లైఫ్ ద్వారానే చాలా నేర్చుకున్నాని, అదే తనను ప్రెస్టో, లిఫ్ట్ వంటి కంపెనీలను స్థాపించి వ్యవస్థాపకుడిగా మార్చిందన్నారు. ప్రస్తుతం ఆయన లీమా, ట్రైబ్ చాట్లకు సహా వ్యవస్థాపుకుడిగా ఉన్నారు. I went to MIT for a PhD / MBA after graduating with 2 degrees at Waterloo, and yet I'm thinking that my kids probably shouldn't go to collegeMost of what I learned at school was at my work terms at Waterloo. I worked at 6 different companies there, experienced vastly different…— Rajat Suri (@rajatsuri) August 18, 2026 (చదవండి: లస్సీ అమ్ముతూ నెలకు రూ. 80 వేలు..!) -
మేయర్-రోకిటాన్స్కీ-కస్టర్-హౌజర్ సిండ్రోమ్ అంటే..! పాపం ఆ మహిళ 20 ఏళ్లుగా..
కొన్ని అరుదైన వ్యాధులు శాపంగా మారతాయి. వైవాహిక జీవితాన్ని ఇబ్బందుల్లో పెట్టి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మార్చేస్తాయి. అలాంటి వాటిని కూడా ఆధునిక వైద్యం సరికొత్త ఆశను అందించి ఊపిరిపోస్తున్నాయి. ప్రస్తుతం అలాంటి సమస్యనే ఎదుర్కొంటున్న మహిళకు అక్క ఉదారత, ఆధునిక వైద్య ఆమె జీవితంలో నవ్వులు విరబూసేలా చేశాయి. అసలేం జరిగిందంటే..యూకేకు చెందిన 36 ఏళ్ల లారెన్ ఫౌలర్ అనే మహిళ 20 ఏళ్లుగా మాతృత్వం కోసం ఎదురుచూస్తోంది. ఎందుకంటే ఆమెకు 'మేయర్-రోకిటాన్స్కీ-కస్టర్-హౌజర్ సిండ్రోమ్' అనే అరుదైన జన్యుపరమైన వ్యాధి కారణంగా గర్భశయమే లేకుండా పుట్టింది. ఆ కారణంగా ఆమెకు పీరియడ్స్ లాంటివి ఉండవు. అందువల్ల సహజపద్ధతిలో పిల్లల్లను కనే సామర్థ్యం ఉండదామెకు. నిజానికి ఆ అరుదైన జన్యుపరమైన వ్యాధిలో గర్భాశయం అభివృద్ధి చెందదు కానీ ఆరోగ్యకరమైన అండాశయాలు ఉంటాయి. అలాగే అందరి అమ్మాయిల్లా..మిగతా అవయవాలన్నీ అభివృద్ధి చెందుతాయి తప్ప రుతక్రమం అనేది ఉండదు. అనేపథ్యంలోనే లారెన్‌కు గర్భం దాల్చే అవకాశం లేకుండా పోయింది. అలాగే ఆమెకు టైప్1 డయాబెటిస్ పేషెంట్ కూడా. దాంతో ఆమె 40 ఏళ్ల అక్క కెల్లీ తన సోదరి లారెన్‌కి గర్భశయాన్ని దానం చేసేందుకు ముందుకు వచ్చింది. ఎందుకంటే అప్పటికే ఆమెకు ముగ్గురుపిల్లలకు కూడా ఉండటంతో సోదరి కోసం ఈ త్యాగం చేసేందుకు ముందుకొచ్చిందామె. ఇక లారెన్ తన ఆరోగ్య పరిస్థితి గురించి సోషల్ మీడియాలో పంచుకోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ పోస్ట్‌లో గర్భశయ మార్పిడకి సంబంధించిన శస్త్ర చికిత్స గురించి కూడా ఇలా రాసుకొచ్చింది లారెన్. ఇది తన జీవితంలో ఎదుర్కోబోయే అతిపెద్ద అత్యంత కఠినమైన కోలుకునే ప్రక్రియగా పేర్కొంది. దీనికోసం శారీరకంగా మానసికంగా భావోద్వేగపరంగా సిద్ధంగా ఉండాలనే ముందే నిర్ణయించుకున్నట్లు తెలిపింది. ఈ శస్త్ర చికిత్స ఎలం క్లిష్టమైనదో అందరూ ముందుగానే హెచ్చరించారని, వాళ్లు అన్నట్లుగానే ఇది తనకు చాలా ఛాలెంజ్‌లు విసిరిందని చెప్పుకొచ్చింది. తన ప్రతి భావోద్వేగాన్ని, తన శరీరంలోని ప్రతి అణువు బలాన్ని గట్టిగానే పరీక్షించిందని ఆవేదనగా రాసుకొచ్చింది పోస్ట్‌లో. నిజంగానే ఇది తనను పరీక్షించి, ప్రతి కణాన్ని హరించేసి, తనలో ఎంత బలం ఉందో పరీక్ష పెట్టిందని అంటోంది. అయితే తాను 20 ఏళ్లుగా మాతృత్వం కోస పడుతున్న తపన ముందు ఈ బాధ ఎంత అని వెనక్కి తగ్గకుండా ముందుక సాగానని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తల్లిబిడ్డ ఇద్దరు వైద్య పర్యవేక్షణలో ఉన్నారని, అక్టోబర్‌లో సిజేరియన్‌చేసి బిడ్డను బయటకు తీయాలని వైద్యులు ప్లాన్ చేస్తున్నట్లు వెల్లడిస్తూ పోస్ట్‌ని ముగించింది. ఇక ఆమె సోదరి కూడా తన పిల్లలు కూడా తన చెల్లెలు కనబోయే బిడ్డ కోసం ఆత్రుతుగా ఎదురుచూస్తున్నట్లు వెల్లడించారు. ఒకే గర్భం నుంచి పుట్టిన పిల్లలు కాబట్టి వీరందరి మధ్య విడదీయరాని బంధమే ఉంటుందని ఆశిస్తున్నానని పేర్కొంది ఆమె అక్క కెల్లీ. Source: పీపుల్స్ డాట్ కామ్ ఆంగ్ల వెబ్సైట్ ఆధారంగా ఇచ్చిన కథనం ఇది. (చదవండి: ఆ బుడ్డోడు పాటపాడిన తీరుకి..పర్యాటక ప్రేమికులంతా..!) -
ఒక ఫోటో... కాలానికి అద్దం
‘ఒక చిత్రం వెయ్యి మాటలకు సమానం’ అంటారు. కానీ ఒక మంచి ఫొటో వెయ్యి మాటలకే పరిమితం కాదు; అది ఒక జ్ఞాపకాన్నీ, ఒక భావోద్వేగాన్నీ, ఒక సంఘటననూ, ఒక్కోసారి ఒక కాలాన్నే తనలో శాశ్వతంగా భద్రపరుస్తుంది. తరాలు మారిపోతాయి. కానీ ఒక ఫొటో ఆ ఒక్క క్షణాన్ని ఆపి ఉంచుతుంది. నవ్వులు, కన్నీళ్లు, విజయాలు, విషాదాలు, పోరాటాలు, సంబరాలు అందులో నిశ్శబ్దంగా జీవిస్తూనే ఉంటాయి.1839లో ఫ్రెంచ్ ఆవిష్కర్త లూయిస్–జాక్–మాండే డాగ్యేర్ అభివృద్ధి చేసిన డాగ్యేరియో టైప్ ప్రక్రియ ప్రపంచానికి పరిచయం కావడంతో ఫొటో గ్రఫీ ఒక కొత్తయుగంలోకి ప్రవేశించింది. 1839 ఆగస్టు 19న ఫ్రాన్స్‌లో ఈ ప్రక్రియను అధికారికంగా ప్రకటించడంతో ఆ రోజుకు ఫొటోగ్రఫీ చరిత్రలో ప్రత్యేక స్థానం లభించింది. అందుకే ప్రతి సంవ త్సరం ఆగస్టు 19న ‘ప్రపంచ ఫొటోగ్రఫీ’ దినోత్సవాన్ని జరుపుకొంటున్నాం.తెలంగాణ విషయానికి వస్తే ఫొటో జర్నలిజానికి ప్రత్యేకమైన ప్రాధాన్యతఉంది. హైదరాబాద్ నగర జీవితం నుంచి తెలంగాణ పల్లెల వరకు, బతుకమ్మ నుంచి బోనాల వరకు, మేడారం జాతర నుంచి వివిధ సాంస్కృతిక ఉత్సవాల వరకు, ఎన్నికల నుంచి ప్రజా సమస్యల వరకు, ప్రకృతి వైపరీత్యాల నుంచి సామాజిక పరిణామాల వరకు తెలంగాణ జీవితంలోని అనేక కోణాలను ఫొటో జర్నలిస్టులు తమ కెమెరాల్లో భద్రపరిచారు. తెలంగాణ సామాజిక, రాజకీయ చరిత్రలో జరిగిన వివిధ ఉద్యమాల సందర్భంలో కూడా ఫొటో జర్నలిజం ఒక ముఖ్యమైన దృశ్య రికార్డుగా నిలిచింది. 1969 ఉద్యమం నుంచి తరువాతి దశల వరకు జరిగిన ర్యాలీలు, విద్యార్థుల ఆందోళనలు, ప్రజా సమావేశాలు, నిరసనలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రజల భాగస్వామ్యం వంటి అనేక దృశ్యాలను ఫొటోగ్రాఫర్లు తమ కెమెరాల్లో భద్రపరిచారు. ఇదీ చదవండి: ఏ రకమైన దోమ కుడితే ఎలాంటి వ్యాధి వస్తుందో తెలుసా?ఫొటో జర్నలిస్టు పని బయటకు కనిపించేంత సులభమైనది కాదు. మంచి ఫ్రేమ్ కోసం కొన్నిసార్లు గంటల తరబడి ఎదురుచూడాలి. ఎండ, వర్షం, రద్దీ, ప్రమాదకర పరిస్థితులు... ఏవీ పట్టించుకోకుండా సరైన క్షణాన్ని కెమెరాలో బంధించాల్సి ఉంటుంది. సరైన క్షణాన్ని గుర్తించే చూపు, సంఘటనను అర్థం చేసు కునే అవగాహన... ఇవే మంచి ఫొటోగ్రాఫర్‌కు అసలైన సంపద. ఒక ఫొటో తీసిన క్షణంలో అది కేవలం ఒక చిత్రం. కానీ సంవత్సరాలు గడిచిన తరువాత అదే ఫొటో ఒక జ్ఞాపకం. మరింత కాలం గడిచిన తరువాత అదే ఫొటో ఒక చరిత్ర. కాలం మారుతుంది. తరాలు మారుతాయి. సాంకేతికత మారుతుంది. కానీ ఒక మంచి ఫొటో మాత్రం కాలాన్ని దాటి జీవిస్తూనే ఉంటుంది.– నాగులపల్లి వెంకటేశ్వరరావు సెక్రెటరీ, మీడియా అకాడమీ ఆఫ్ తెలంగాణఇదీ చదవండి: త్విషా శర్మ : నన్ను ప్రశాంతంగా చావనివ్వండి : ఆ 90నిమిషాల్లో ఏం జరిగింది? -
ఆ బుడ్డోడు పాటపాడిన తీరుకి..పర్యాటక ప్రేమికులంతా..!
యావత్తు భారతదేశంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఎటు చూసినా.. మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. చిన్నపెద్ద అనే తారతమ్యం లేకుండా వందేమాతరం.. అంటూ తమ దేశభక్తిని చాటుకున్నారు. ఈ వేడుకలు అన్ని చోట్ల ఆయా రాష్ట్రాల సాంస్కృతులకు అనుగుణంగా జరిగితే..ఈశాన్య రాష్ట్రం నాగాలాండ్‌లో మాత్రం ఓ బుడ్డోడు తన కమనీయ గొంతుతో ఆకట్టుకున్నాడు. ఆ చిన్నారి ఆలపించిన తీరుకి ఆ రాష్ట్రంలోని కమనీయ పర్యాటక ప్రదేశాలపై చర్చకు తెరలేపింది. అదెలాగో చకచక ఇది చదివేయండి మరి..పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా ఆ చిన్నారి జాతీయ గీతాన్ని ఆలపించిన వీడియోని షేర్ చేస్తూ పోస్ట్‌లో ఇలా రాసుకొచ్చారు. ఆ వీడియోలో నాగాలాండ్‌కి చెందిన ఐదేళ్ల చిన్నారి యాటో వాంగ్నావో జాతీయ గీతాన్ని చాలా అద్భుతంగా ఆలపించాడు. ఆ చిన్నారి పాట పాడిన తీరు.. ఆ రాష్ట్ర పర్యాటక ప్రదేశాలపై మనసు మళ్లేలా అందర్నీ మత్రముగ్ధుల్ని చేసిందన్నారు. ఆ రాష్ట్రంలో తప్పక చూడాల్సిన పర్యాట ప్రదేశాలు గురించి ట్రావెలింగ్ బకెట్ లిస్ట్‌లో ఎందుకు లేవని ప్రశ్నించారు. కనీసం ఈ చిన్నారి యాటో గాత్రం కారణంగానైననా నాగాలాండ్ పర్యాటక ప్రాంతాలవైపుకి మొగ్గు చూపేలా చేస్తుందంటూ అక్కడి ఆకర్షణీయమైన ప్రదేశాల జాబితా గురించి ప్రస్తావించారు. అంతేగాదు ఈ ఈశాన్య రాష్ట్రం అంటేనే పొగమంచుతో నిండిన పర్వతాలు, అడవులతో నిండిన లోయలు, మారుమూల గ్రామాలు, గిరిజన సముదాయలకు నిలయం. అంతేకాకుండా ప్రతి ఏడాది వేలాదిమంది పర్యాటకులను, ఫోటోగ్రాఫర్లను ఆకర్షించే ప్రసిద్ధ హార్న్‌బిల్ ఉత్సవాన్ని అస్సలు మర్చిపోకూడదు అంటూ తన పోస్ట్‌లో అక్కడ పర్యాట ప్రదేశాల వైభవంగా గురించి రాసుకొచ్చారు. మరి ఈ నేపథ్యంలో నాగాలాండ్ పర్యాటనలో తప్పక చూడాల్సిన పర్యాటక ప్రదేశాలేంటో చూద్దామా..!.కోహిమా, సహజమైన ప్రారంభ స్థానంనాగాలాండ్ కొండ ప్రాంత రాజధాని అయిన కోహిమాతో ప్రయాణం మొదలవుతుంది. ఈ రాష్ట్రం గిరిజన చరిత్ర, రంగురంగుల స్థానిక మార్కెట్లు, ప్రత్యేకమైన వంటకాలు కొన్ని ప్రసిద్ధ గ్రామాలు ప్రధాన ఆకర్షణగా ఉంటాయి.కిసామా, హార్న్‌బిల్ ఉత్సవానికి కేంద్రంప్రసిద్ధ హార్న్‌బిల్ ఉత్సవానికి నిలయమైన కిసామా హెరిటేజ్ విలేజ్ తప్పక చూడాలి. ఈ ఉత్సవం సాంప్రదాయ ప్రదర్శనలు, సంగీతం, ఆహారం, చేతివస్తువులు, దేశీయ ఆటలు, గ్రామ అనుభవాల ద్వారా నాగ తెగలను ఏకతాటిపైకి తెస్తుంది.అధికారిక పర్యాటక క్యాలెండర్ ప్రకారం, ఈ ఏడాది ఈఉత్సవాన్ని డిసెంబర్ 1 నుంచి 10 వరకు జరుపుకుంటారు.జుకౌ లోయజుకౌ లోయలో ఉండటం అంటే మేఘాలలో నడుస్తున్నట్లు ఉంటుంది. ఇది ప్రతి సాహస ప్రియుడికి ఒక అద్భుతమైన ప్రదేశం. ఈ లోయ సుమారు 2,452 మీటర్ల ఎత్తులో, నాగాలాండ్-మణిపూర్ సరిహద్దు వెంబడి ఉంది. ఇది పచ్చని పచ్చిక బయళ్ళు, కాలానుగుణంగా పూసే పువ్వులు, సెలయేళ్ళు, వెదురుతో కప్పబడిన ప్రకృతి దృశ్యాలకు ప్రసిద్ధి చెందింది. పుష్పించే కాలంలో, అరుదైన జుకౌ లిల్లీ పువ్వు ఈ ప్రకృతి సౌందర్యానికి మరో శోభను చేకూరుస్తుంది.ఖోనోమాఖోనోమా కోహిమా నుంచిసుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రదేశం అత్యంత ఆసక్తికరమైన గ్రామ అనుభవాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది.చారిత్రాత్మకంగా ఇది ఒక యోధుల గ్రామంగా పేరుగాంచింది. వన్యప్రాణులను రక్షించడానికి 1998లో ఖోనోమా ప్రకృతి సంరక్షణ అండ్ ట్రాగోపాన్ అభయారణ్యం స్థాపించారు. ఇక్కడే అరుదైన మొక్కలను, అంతరించిపోతున్న బ్లైత్స్ ట్రాగోపాన్ను చూడవచ్చు. అంతేగాదు ఈ ఖోనోమా ఆసియాలోనే మొట్టమొదటి గ్రీన్ విలేజ్‌గా ప్రసిద్ధి చెందింది. అలాగే ప్రయాణికులకు ఇది అనేక రకాల ఆకర్షణలను అందిస్తుంది.మొకోక్చుంగ్: ఆవో నాగా సంస్కృతిని, సాంప్రదాయ గ్రామ జీవితాన్ని అన్వేషించాలనుకునే వారికి మొకోక్చుంగ్ సరైన ప్రదేశం. ఇక్కడి వోఖా ప్రత్యేకమైనది పక్షి ప్రేమికులను ఆకర్షిస్తుంది.దోయాంగ్ జలాశయం: దోయాంగ్ జలాశయం వద్ద, వలస సమయంలో అముర్ ఫాల్కన్ పక్షులు భారీ సంఖ్యలో గుంపులుగా వస్తాయి.తువోఫెమా: ప్రామాణికమైన గ్రామ అనుభూతిని కోరుకునే ప్రయాణికులకు ఇది అనువైన ప్రదేశం. ఈ ప్రదేశం దాని గ్రామీణ హోమ్‌స్టేలకు ప్రసిద్ధి చెందింది.నాగాలాండ్‌ను సందర్శించడానికి ఉత్తమ సమయంనాగాలాండ్ను సందర్శించడానికి ఉత్తమ సమయం అక్టోబర్ , ఏప్రిల్ మధ్య ఉండే చల్లని నెలలు.హార్న్‌బిల్ పండుగ కోసం, డిసెంబర్ సరైన నెల. ఆ తర్వాత సెక్రెన్యీ, మోట్సు, సుంగ్రెమాంగ్, యెమ్షే, తోఖు ఎమాంగ్ ఉన్నాయి.నాగాలాండ్‌కు ఎలా చేరుకోవాలివిమాన మార్గం: దిమాపూర్ విమానాశ్రయం రాష్ట్రానికి సేవలు అందిస్తున్న ఏకైక దేశీయ విమానాశ్రయం. ఇక్కడి నుంచి కోల్‌కతాకు నేరుగా విమానాలు ఉన్నాయిరైలు మార్గం: దిమాపూర్ ఈశాన్య సరిహద్దు రైల్వే నెట్‌వర్క్‌లో కూడా ఉంది. గౌహతితో రైలు కనెక్టివిటీని కలిగి ఉంది, ఇది అనేక ప్రధాన భారతీయ నగరాలకు అనుసంధానిస్తుంది.దిమాపూర్ నుంచి కోహిమాకు టాక్సీలు, క్యాబ్‌లు సులభంగా అందుబాటులో ఉంటాయి. సాధారణ ఈశాన్య ప్రాంత పర్యటన పరిధిని దాటి ప్రయాణించాలనుకునే వారికి, నాగాలాండ్ ఎప్పటికీ అరుదైన ప్రకృతి అనుభూతిని అందిస్తుంది.After hearing young Yato Wangnao sing the National Anthem on our 80th Independence Day, how could Nagaland not be on top of the travel bucket list today?#SundayWanderer(Video courtesy @nehaGurung1692 ) pic.twitter.com/cSuSJQdGWb— anand mahindra (@anandmahindra) August 16, 2026 (చదవండి: మహిళా ఏఐ ఇన్ఫ్లుయెన్సర్లు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా..!) -
సోషల్ మీడియాలో సంచలనంగా కన్సల్టెంట్ కథ!
ఇండియాకు చెందిన ఓ మేనేజ్మెంట్ కన్సల్టెంట్.. త రెండున్నర ఏళ్లలో రూ.6.5 కోట్లు ఆదా చేసినట్టు, తన మొత్తం నెట్ వర్త్‌ను రూ.1 కోటి నుంచి రూ.7.5 కోట్లకు పెంచుకున్నట్టు రెడ్డిట్‌లో పంచుకున్న పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.'From Rs 1 Cr at 34 to Rs 7.5 Cr at 37: My Middle East Consulting Journey' పేరుతో పెట్టిన ఈ పోస్టులో, 37 ఏళ్ల ఈ వ్యక్తి తన కెరీర్, ఆదాయం, పొదుపు, పెట్టుబడుల వివరాలను వివరంగా పంచుకున్నాడు. ఇంజినీరింగ్ డిగ్రీతో పాటు దేశంలోని టాప్ ఇన్స్టిట్యూట్ నుంచి ఎంబీఏ పూర్తి చేసిన ఈయన, ప్రస్తుతం ఒక ప్రముఖ మేనేజ్మెంట్ కన్సల్టింగ్ సంస్థలో పనిచేస్తున్నాడు.కెరీర్, జీతం ఎలా పెరిగాయంటే...22 ఏళ్ల వయసులో గ్రాడ్యుయేట్ ట్రైనీగా కెరీర్ మొదలుపెట్టిన ఈయన, అప్పుడు ఏడాదికి రూ.10 లక్షలు సంపాదించేవాడు. ఎంబీఏ పూర్తయ్యాక 26 ఏళ్లకు మేనేజ్మెంట్ కన్సల్టింగ్లోకి అడుగుపెట్టాడు, అప్పటి వార్షిక ఆదాయం రూ.25 లక్షలు. 29 ఏళ్లకు మరో కెరీర్ మార్పుతో ఇండస్ట్రీ రోల్‌లోకి మారి, రూ.40 లక్షల ప్యాకేజీ అందుకున్నాడు. తర్వాతి ఐదేళ్లలో జీతం క్రమంగా పెరుగుతూ రూ.65 లక్షలకు చేరింది. ఈ కాలంలోనే పీఎఫ్, బంగారం, స్టాక్స్, రియల్ ఎస్టేట్లలో పెట్టుబడులతో దాదాపు రూ.1 కోటి నెట్ వర్త్ సాధించాడు.పశ్చిమాసియా మలుపు తిప్పిన సంపద34 ఏళ్ల వయసులో మళ్లీ కన్సల్టింగ్ రంగంలోకి వెళ్లి, పశ్చిమాసియాకు మారిన ఈయన జీతం ఒక్కసారిగా రూ.3.5 కోట్లకు (సుమారు 4 లక్షల డాలర్లు) పెరిగింది. అదీ పన్ను లేకుండా. ఈ భారీ జీత పెరుగుదలే ఆదా వేగాన్ని పెంచింది. "ఇప్పుడు 37 ఏళ్ల వయసులో, గత రెండున్నర ఏళ్లలో దాదాపు రూ.6.5 కోట్లు ఆదా చేశాను, నా నెట్ వర్త్ రూ.7.5 కోట్లకు చేరింది" అని ఆయన పోస్టులో పేర్కొన్నాడు.తన ప్రస్తుత ఆస్తుల గురించి కూడా వివరించాడు. ముంబైలో పూర్తిగా చెల్లించిన మూడు ప్రాపర్టీలు, భౌతిక బంగారం, సావరిన్ గోల్డ్ బాండ్ల రూపంలో సుమారు 700 గ్రాముల బంగారం, ఈక్విటీల్లో దాదాపు రూ.30 లక్షల పెట్టుబడి ఉన్నట్టు తెలిపాడు. రాబోయే కాలంలో ఈక్విటీ పోర్ట్‌ఫోలియోను మరింత పెంచుకోవడమే తన లక్ష్యమని పేర్కొన్నాడు.నెటిజన్ల స్పందనఈ పోస్ట్ రెడ్డిట్ యూజర్లను బాగా ఆకట్టుకుంది. కొందరు తమ కెరీర్, ఫైనాన్స్ గురించి సీరియస్‌గా ఆలోచించేలా ప్రేరణ ఇచ్చిందని చెప్పగా, మరికొందరు ఇంత సంపద సాధించడం వెనుక ఏళ్ల కృషి, కష్టమైన నిర్ణయాలు ఉంటాయని కొనియాడారు. అధిక జీతాలు, పన్ను మినహాయింపులతో మిడిల్ ఈస్ట్ సంపద నిర్మాణానికి 'చీట్ కోడ్' లాంటిదని కొందరు వ్యాఖ్యానించారు. విదేశాలకు మారడం ఎలా సాధ్యమైందో, కెరీర్ ప్రారంభంలోనే ఇలాంటి అవకాశాలు అందిపుచ్చుకోవడానికి ఏం చేయాలో తెలుసుకోవాలని కొందరు ఆసక్తి చూపారు. -
అంతా ఆమె జీవితం అయిపోయిందన్నారు..!కట్‌చేస్తే..
మహమ్మారి లాంటి కేన్సర్ వ్యాధులు మనుషులకు ఎలాంటి ఛాలెంజ్‌లు విసురుతాయంటే..తట్టుకుని నిలబడనివ్వకుండా ఏడిపించేస్తాయ్. ఒక్కోసారి ఆ క్రమంలో అవయవాలను కోల్పోయేలా చేసి వికృతంగా నవ్వుతుంది. అయినా సరే లేచి నిలబడి బతికి చూపించే వారియర్లు కొందరే. అలాంటి ధీర వనితే ఈ అమ్మాయి. ఆ మహమ్మారి కేన్సర్ ఆమె జీవితాన్ని అంధకారం చేసినా..మనసుతో రంగులను సృష్టించి ప్రపంచమే నివ్వెరపోయేలా ఫ్యాషన్ రంగంలో సత్తా చాటుతోంది. ఆ అమ్మాయే ఛత్తీశ్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌కి చెందిన ఆష్కా సునీల్ గోయల్. ఐదోతరగతి చదువున్నప్పుడు.. ఒకరోజు పాఠశాలలో పరీక్ష రాస్తుండగా అత్యంత భయంకరగా అనిపించి వాష్‌రూమ్‌కి పరుగెత్తింది. అంతే సింక్ దగ్గరకు కూడా రాకమునుపు రక్తపు వాంతులు దాంతో టీచర్లు ఆమె తల్లిదండ్రులకు తెలియజేయడమే గాక తక్షణమే ఆమెను ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షలు చేసి.. ఆమె నాసికా కుహరంలో ఒక అరుదైన ట్యూమర్ (కేన్సర్)ను గుర్తించారు. ఇది చివరిదశ కేన్సర్ అని, ఆమె ఎక్కువ రోజులు బతకదని తేల్చి చెప్పేశారు. ఆ తర్వాత ఆ ట్యూమర్ క్రమంగా ఆమె కంటి నరాలను దెబ్బతీయడం ప్రారంభించింది.చికిత్స కోసం ముంబై వెళ్తుండగా..చికిత్స కోసం ఆష్కా కుటుంబం రాయ్‌పూర్ నుంచి చెన్నై, ముంబై నగరాలలోని ఆస్పత్రులు చుట్టూ తిరిగింది. ఎక్కడికి వెళ్లినా చాలా కష్టం, సర్జరీ చేయడం సాధ్యం కాదు అని చేతులెత్తేసేవారు వైద్యులు. ఇక చేసేదేమి లేక ముంబై నుంచి తిరిగి విమానంలో వస్తుండగా నాన్న నాకేం కనిపించడం లేదు అంత చీకటిగా ఉంది అని చెప్పింది ఆష్కా. అంతే చూస్తుండగానే ఆమె రెండు కళ్లు చూపుని కోల్పోయాయి. ప్రశాంతంగా చనిపోనివ్వండి.. ఆష్కా బతికే అవకాశాలు తక్కువగా ఉండటంతో ‘ఆమె ఎలాగూ బతకదు, ఎందుకు డబ్బులు ఖర్చు పెట్టడం దండగా అంటూ బంధువులంతా సలహాలివ్వడం మొదలు పెట్టారు ఆష్కా తల్లిదండ్రులకు. ఆమెను ప్రశాంతంగా చనిపోనివ్వండి ఇలా చికిత్సలతో కష్టపెట్టొద్దని చెప్పేవారు. అయితే ఆమె మామయ్య మాత్రం చాలు ఆపండి, ఆమెను ఎలాగైనా.. బతికించుకుంటాం అందుకోసం ఏమైనా చేస్తాం అంటూ అందరిలో స్థైర్యాన్ని నింపాడు. అలా ఆయన ఇచ్చిన ధైర్యంతో ఆమె కేన్సర్ చికిత్స మొదలైంది. కానీ కీమోథెరపీ రేడియేషన్ వల్ల ఆమె నోరు, గొంతు దెబ్బతిన్నాయి.కనీసం చుక్క నీరు తాగలేక విలవిల్లాడేది. పొడవైన జుట్టంత రాలిపోతుండేది ఆమెకు. అద్భుతం చేసినట్లు బతికిబట్టకట్టింది..చివరకు డాక్టర్లు ధైర్యం చేసి శస్త్ర చికిత్స చేసి ఆ కణితిని తొలగించారు. అయితే ఆష్కాకు చూపు మాత్రం రాలేదు. అలా రెండేళ్లు చికిత్సల కోసం ఆస్పత్రలు చుట్టూ తిరగడంతో..మళ్లీ పుస్తకాలు చేతపట్టి చదువే సరస్వంగా అహర్నిశలు కష్టపడి చదివింది. అలాగే కంటి చూపుని కోల్పోవడంతో టెక్నాలజీ వైపుకి వెళ్లగలనా అనుకుంది. కానీ అవి కూడా చాకచక్యంగా చేసే సామర్థ్యాన్ని అందిపుచ్చుకుంది. అందుకు కారణం తన తల్లిదండ్రులేనని సగర్వంగా చెబుతోంది. తన తల్లి నువ్వు భిన్నంగా ఒక పనిచేయగలవు అంటూ ఇచ్చిన ప్రోత్సహంతోనే ఇదంతా సాధ్యమైందని అంటోంది. అదీగాక తన పేరెంట్స్ తాము పెద్ద చదువులు ఎలాగో చదువకోలేకపోయాం, అందువల్ల నువ్వు బాగా చదువుకోవాలని చెబుతుండేవారు. అదే తనను చదువుపై ఫోకస్ పెట్టేలా చేసిందని చెప్పుకొచ్చింది. అయితే ష్యాషన్ రంగంలోకి వెళ్లాలనుకున్నానని చెప్పగానే..చూపేలేని నీవు ఫ్యాషన్‌లో ఎలా రాణించగలవు అంటూ మళ్లీ ప్రశ్నలు ఎదురయ్యాయి ఆష్కాకి. మనసుతో రంగుల ప్రపంచాన్ని సృష్టించింది..ఫ్యాషన్ అంటే కేవలం కళ్లతో చూసే రంగులు మాత్రమే కాదు.. అది స్పర్శ, అనుభూతి అని ఆష్కా నమ్మింది. వస్త్రధారణ, బట్టల నిర్మాణం ఆధారంగా డిజైన్లను అర్థం చేసుకోవడం ప్రారంభించింది. బట్టలపై గుర్తులు పెట్టడానికి ప్రత్యేక మార్కర్లు, సేఫ్టీపిన్లను ఉపయోగించే సరికొత్త పద్ధతులను కనిపెట్టింది. ప్రపంచంలోనే అత్యుత్తమ సంస్థ అయిన ‘లండన్ కాలేజ్ ఆఫ్ ఫ్యాషన్’లో చదవాలనేది ఆమె కల. అయితే తల్లిదండ్రలు ఎవరిపై ఆధారపడకుండా స్వతంత్రంగా బతకడం నేర్చుకుంటే పంపిస్తామని షరతు పెట్టారు. అలా ఆమె ముంబై నగరం వెళ్లి అక్కడ చేతికర్ర సాయంతో ఒంటిరిగా బతికి చూపించి..లండన్ వెళ్లి ఫ్యాషన్ కోర్సు చదవాలనే కలను నెరవేర్చుకుంది.ప్రపంచమే నివ్వెరపోయేలా..ర్యాంప్ వాక్ చేసింది.. అలా ఆమె 22 ఏళ్ల వయసులోనే ఆష్కా ‘లండన్ కాలేజ్ ఆఫ్ ఫ్యాషన్’లో సీటు సాధించి.. బీఎస్సీ ఆనర్స్ ఫ్యాషన్ మేనేజ్మెంట్ పూర్తి చేసింది. అంతేగాదు తన సొంత ఫ్యాషన్ బ్రాండ్‌ను ప్రారంభించి.. ప్రపంచ ప్రఖ్యాత ‘లండన్ ఫ్యాషన్ వీక్’ వేదికపై తన డిజైన్లను ప్రదర్శించడమే కాకుండా సగర్వంగా ర్యాంప్‌వాక్ చేసింది. దిగ్గజ క్రికెటర్ కపిల్‌దేవ్ చేతుల మీదుగా ‘ఇన్విన్సిబుల్ స్పిరిట్ అవార్డు’, బ్రిటన్ పార్లమెంటులో ‘ఇన్స్పైరింగ్ యంగ్ టాలెంట్ అవార్డు’ అందుకుని దేశకీర్తిని పెంచింది.పైగా తనను ఒక స్ఫూర్తిదాయకమైన వ్యక్తిగా చూడొద్దని అంటున్నారు. తను ఎవరినో ప్రభావితం చేయడానికి కాదని ప్రపంచ దృక్పథాన్ని మార్చడానికి ఉన్నానంటోంది. అంతేగాదు చూపులేని అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుంటారు అనే మాటలు వద్దు..అంతకుమించి సమస్యలు ఈ ప్రపంచంలో ఉన్నాయని మర్చిపోకండని అంటోంది ఆష్కా. తనలాంటి దివ్యాంగులు అన్ని చేయగలరు అని విశ్వసించండి తప్ప తేలిక చసి చూడొద్దు అని గట్టి వార్నింగ్ ఇస్తోంది ఆష్కా. (చదవండి: రెండుసార్లు జేఈఈ ఫెయిల్..కానీ ఇవాళ నెలకు రూ. 2 లక్షలు) -
రెండుసార్లు జేఈఈ ఫెయిల్..కానీ ఇవాళ నెలకు రూ. 2 లక్షలు
సామర్థ్యాన్ని అంచనా వేయడానికి కళశాల డ్రిగీలు అవసరం లేదు. అందుకు నిదర్శనం ఈ వ్యక్తి. అతడి గురించి సోషల్ మీడియా వేదిక అంకుర్ వారికూ పంచుకున్నారు. ఫ్రీలాన్సింగ్ చేస్తూ విజయవంతంగా కెరీర్‌ని నిర్మించుకున్న వ్యక్తి సక్సెస్ జర్నీని పంచుకుంటూ..ప్రతిభ ఉంటే సరిపోదు దాన్ని సరైన విధంగా ఉపయోగించుకునే తెలివితేటలు ఉండాలన్నారు. డిగ్రీలుంటే పెద్ద పెద్ద ఉగ్యోగాలు రావని, నైపుణ్యం, అవకాశాలను సృష్టించుకునే సామర్థ్యం ఉంటేనే విజయం దక్కుతుందంటూ ఈ వ్యక్తి గురించి చెప్పుకొచ్చారు పోస్ట్‌లో ఇలా. అంకుర్ పోస్ట్‌లో ఇండోర్‌కి చెందిన వ్యక్తి గురించి చెప్పుకొచ్చారు. అతడు రెండుసార్లు జేఈఈ ఫెయిల్ అయ్యాడు. కానీ అతను రాత్రిపూట యూట్యూబ్‌లో స్వయంగా ప్రొడక్ట్ డిజైనింగ్ నేర్చుకున్నాడు. దాని సాయంతో ఫ్రీలాన్సింగ్ చేస్తూ నెలకు రెండు లక్షలు ఆర్జిస్తున్నట్లు తెలిపారు. ఐఐటీ గ్రాడ్యుయేట్లు సైతం సిగ్గుపడేలా తన కెరీర్‌ని నిర్మించుకున్నాడని అన్నారు. భారతదేశంలో ప్రతిభకు కొదువ లేదు దాన్ని ఉపయోగించుకుని టాలెంట్‌ని ప్రదర్శించడంలోనే ఇబ్బంది పడుతున్నారని అన్నారు చివరగా ఆ వ్యక్తి పేరు నమన్ అంటూ తన పోస్ట్‌ని ముగించారు. నెటిజన్లు కూడా అంకుర్ మాటలకు మద్దతిస్తూ..పట్టభద్రులైన ప్రతిఒక్కరూ అధిక జీతాలు సంపాదించలేరని అన్నారు. నిస్సందేహంగా స్వయంగా నేర్చుకుని డబ్బు సంపాదించేవారు కచ్చితంగా అత్యంత తెలివైన వారంటూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Ankur Warikoo (@ankurwarikoo) (చదవండి: ఈ వంటకం బర్గర్‌కి మించి టేస్టీ..!: హర్ష్ గోయెంక) -
ఈ వంటకం బర్గర్‌కి మించి టేస్టీ..!: హర్ష్ గోయెంక
ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంక ఎప్పటికప్పుడూ..పలు స్ఫూర్తిదాయక స్టోరీలు, ఆరోగ్యం గురించి అభిమానులతో పంచుకుంటుంటారు. ఈసారి మాత్రం తనకెంతో ఇష్టమైన వంటకం గురించి షేర్ చేశారు. ఆయన సోషల్ మీడియా ఎక్స్ పోస్ట్‌లో గుజరాత్లో అత్యంత ఇష్టపడే వీధి వంటకం గురించి పంచుకున్నారు. దాన్ని ఆయన బర్గర్‌కి మించి రుచికరంగా ఉంటుందని అన్నారు. ఆ వంటకం పుట్టుక..రుచి గురించి సవివరంగా రాసుకొచ్చారు. ఇంతకీ ఏంటా వంటకం అంటే.. గుజరాతీ స్ట్రీట్ ఫుడ్ అయిన దాబేలీ గురించి రాసుకొచ్చారు. ఈ వంటకం ఎవరికైనా ఆకలి పుట్టించేలా ఉంటుందన్నారు. దీన్ని మసాలా చిలగడదుంప, చట్నీలు, వేరుశెనగలు, సేవ్, దానిమ్మ గింజలతో కలగలిపిన మృదువైన పావ్ అని అన్నారు. బర్గర్‌కు సరైన సమాధానం ఈ గుజరాతీ వంటకం అని అన్నారు. దీన్ని చూడగానే ఎవరికైన ఆకలి పుడుతుందని అంటుననారు. తీపి, కారం, కరకరలాడే పుల్లని రుచిని కలిగి ఉంటుందన్నారు. తాను వడాపావ్, బర్గర్ కంటే ఎక్కువగా దీన్నే ఇష్టపడతానని చెప్పారు. ముంబె, గుజరాత్ వెలుపల ఉన్న ప్రజలకు ఈ దాబేలి గురించి అస్సలు తెలియదంటూ పోస్ట్ ముగించారు. కాగా, దాబేలి కచ్‌లోని మాండ్వీలో పుట్టిన వంకటం. దీన్ని కచ్చి దాబేలీ లేదా డబుల్ రోటీ అని పిలుస్తారు. గుజరాత్ కచ్ జిల్లా, మాండ్వీలో పుట్టింది ఈ ప్రసిద్ధ భారతీయ వంటకం. ఇది 1960 నుంచి వాడుకలో ఉంది.ఈ చిరుతిండిని మాండ్వీలోని కేశవ్జీ గాభా చూడాసమా అనే పాక నిపుణుడు తయారు చేశారని చెబుతుంటారు. ఆయనే మొదట దీన్ని విక్రయించారని, అప్పుడు ధర ఆరు పైసలు మాత్రమేనని చెప్పుకొచ్చారు. నేటికీ ఆయన కుటుంబమే ఈ వంటకం దుకాణాన్ని నిర్వహిస్తోందని చెప్పుకొచ్చారు.Dabeli is Gujarat’s answer to the burger 😋! A soft pav stuffed with spicy-sweet potato, chutneys, peanuts, sev and pomegranate. Sweet, spicy, crunchy and tangy. I much prefer it to vada pav and burger. Unfortunately most outside of Mumbai and Gujarat are unfamiliar with it! pic.twitter.com/15sW2qgTNw— Harsh Goenka (@hvgoenka) August 17, 2026 (చదవండి: ట్రెడిషనల్ డిజైనర్‌వేర్‌లో రిషబ్ సెట్టి స్టన్నింగ్ లుక్..! స్వయంగా ఆయన భార్య..) -
ట్రెడిషనల్ డిజైనర్‌వేర్‌లో రిషబ్ సెట్టి స్టన్నింగ్ లుక్..!
17వ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ (IIFM) 2026లో, రిషబ్ శెట్టి తన విజయాల జాబితాలో మరో రెండు కొత్త గౌరవాలను చేర్చుకున్నారు. ఈ కన్నడ నటుడు, చిత్ర నిర్మాత కాంతార చాప్టర్1కి ఉత్తమ దర్శకుడిగా అవార్డు గెలచుకోవడం తోపాటు లీడర్షిప్ ఇన్ సినిమా అవార్డు కూడా గెలుచుకున్నారు. ఈ అవార్డులు తోపాటు అంతర్జాతీయ వేదికపై ఆయన కనిపించిన తీరు అందరిని ఆకర్షించింది. ఆడంబరమైన ట్రెండీ ఫ్యాషన్ దుస్తులను ఎంచుకోకుండా తన కర్ణాటక మూలాలకు దగ్గరగా ఉండే సాంప్రదాయ లుక్‌లో అలరించారు. ఈ కాంతార చిత్రానికి కాస్ట్యూమ్ డిజైర్‌గా పనిచేసిన ఆయన భార్య ప్రగతిశెట్టి ఆయన కోసం ఒక నల్ల కుర్తాను డిజైన్ చేశారు. అంతేగాదు దానికి మ్యాచింగ్‌గా చేనేత పట్టు ధోతిని ఎంచుకున్నారామె. ఈ ఐవరీ ధోతికి జరీ అంచు ఉండగా, కుర్తాలో అత్యంత ప్రత్యేక భాగం గండబేరుండా ఎంబ్రాయిడరీ. ఇది ఆ దుస్తులకు ప్రత్యేక రూపాన్ని ఇచ్చింది. కర్ణాటక వారసత్వాన్ని ప్రదర్శించేలా..ఈ మేరకు రిషబ్ శెట్టి భార్య ప్రగతి మాట్లాడుతూ..ప్రామాణికమైన క్లాసిక్ రూపాన్ని ఇచ్చేందుకు సాంప్రదాయ ధోతి, కుర్తాను ఎంచుకున్నామని అన్నారు. ధోతి కోసం స్వచ్ఛమైన పట్టుని ఎంచుకున్నామని, అలాగే అందులో ఉండే అంచు ఆడంబరంగా కాకుండా పండుగ శోభను అందించిందన్నారు. కుర్తా కోసం చేనేత నల్ల పట్టు వస్త్రాన్ని ఎంచుకున్నామని చెప్పారు. సౌకర్యవంతంగా శుద్ధమైన ఆకృతిని కలిగి ఉంటుందన్నారు. దీంతోపాటు కర్షాటకపట్ట కృతజ్ఞాత గర్వాన్ని వ్యక్తం చేసేందుకు తమ రాష్ట్రానికి శక్తిమంతమైన ప్రతిష్టాత్మక చిహ్నమైన గండబేరుండ ఎంబ్రాయిడరీని పొందుపరిచామని అన్నారు.గండబేరుండ అంటే..ఇది రెండు తలల ఒక పౌరాణిక పక్షి. ఇది బలం ధైర్యం, శక్తి, దృఢత్వానికి ప్రతీక. కర్ణాటకలో దీనికి లోతైన సాంస్కృతిక చారిత్ర ప్రాముఖ్యత ఉంది. ఇది రాష్ట్ర వారసత్వంతో ద్గరి సంబంధ కలిగి ఉంది అని చెప్పుకొచ్చారామె. View this post on Instagram A post shared by Rishab Shetty (@rishabshettyofficial)(చదవండి: చేతితో చిత్రించిన పటచిత్ర చీరలో నీతా అంబానీ అద్భుతమైన లుక్..!) -
గుండె ఆరోగ్యం కోసం... ఈ రంగులోని పండ్లు భేష్..
ఎరుపు, నీలం, ఊదా రంగుల్లో ఉండే పండ్లు, కూరగాయల్లో సహజంగా లభించే ‘ఆంథోసయానిన్’ అనే జీవక్రియాత్మక సమ్మేళనాలు గుండె ఆరోగ్యానికి, జీవక్రియల మెరుగుదలకు తోడ్పడతాయని తాజా అధ్యయనం వెల్లడించింది. ముఖ్యంగా బ్లూబెర్రీలు వంటి పండ్లలో ఈ సమ్మేళనాలు సమృద్ధిగా ఉండటంతో, అవి గుండె ఆరోగ్యానికి తొడ్పడతాయని పరిశోధకులు పేర్కొన్నారు. అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్లో ప్రచురితమైన ఈ సమగ్ర విశ్లేషణలో 27 ప్రచురణల్లో వెల్లడైన 18 దీర్ఘకాలిక అధ్యయనాలు, అలాగే ఎలాంటి వ్యాధులు లేని పెద్దలపై నిర్వహించిన 65 ర్యాండమైజ్డ్ కంట్రోల్డ్ ట్రయల్స్‌ను పరిశీలించారు. తక్కువ స్థాయిలో ఆంథోసయానిన్లు తీసుకునే వారితో పోలిస్తే, ఎక్కువగా తీసుకునే వారిలో పలు ఆరోగ్య ప్రయోజనాలు కనిపించినట్లు అధ్యయనం తెలిపింది. కలిగే ప్రయోజనాలు..గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం 26 శాతం తగ్గింది.గుండెపోటు (మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్) ప్రమాదం 18 శాతం తగ్గింది.టైప్-2 మధుమేహం వచ్చే అవకాశం 11 శాతం తగ్గింది.గుండె సంబంధిత కారణాలతో మరణాల ప్రమాదం 9 శాతం తగ్గింది.అధిక రక్తపోటు ప్రమాదం 8 శాతం తగ్గింది.రోజుకు కనీసం 50 మిల్లీగ్రాముల ఆంథోసయానిన్లు తీసుకున్న వారిలో రక్తనాళాల పనితీరు మెరుగుపడటంతో పాటు, ఇన్సులిన్ స్థాయిల్లో సానుకూల మార్పులు కనిపించినట్లు పరిశోధకులు తెలిపారు. ఈ స్థాయిని సహజంగా రంగులున్న పండ్లు, కూరగాయలు తీసుకోవడం ద్వారా పొందవచ్చని వారు పేర్కొన్నారు.భారతదేశంలో గుండె జబ్బులు, మధుమేహం, అధిక రక్తపోటు వంటి జీవనశైలి సంబంధిత సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ పరిశోధన ఫలితాలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రతిరోజూ ఆహారంలో వివిధ రంగుల పండ్లు, కూరగాయలను చేర్చడం వంటి సమతుల ఆహారపు అలవాట్లు పెంపొందించుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.ఈ సందర్బంగా అమెరికా హైబుష్ బ్లూబెర్రీ కౌన్సిల్ భారత ప్రతినిధి రాజ్ కపూర్ మాట్లాడుతూ, “సహజ రంగులతో కూడిన ఆహార పదార్థాలను రోజువారీ భోజనంలో భాగం చేసుకోవడం ఎంతో ముఖ్యమని ఈ అధ్యయనం మరోసారి నిరూపించింది. ఆంథోసయానిన్లు సమృద్ధిగా ఉండే అమెరికన్ బ్లూబెర్రీల వంటివి కూడా భారతీయ ఆహార అలవాట్లలో సులభంగా చేర్చుకోవచ్చు” అని తెలిపారు.అయితే ఒక్క ఆహార పదార్థం మాత్రమే వ్యాధులను నివారిస్తుందని లేదా చికిత్స చేస్తుందని ఈ పరిశోధన చెప్పడం లేదని పరిశోధకులు స్పష్టం చేశారు. సమతుల ఆహారం, క్రమమైన శారీరక వ్యాయామం, సరిపడ నిద్ర, వైద్యుల సూచనలు పాటించడం వంటి ఆరోగ్యకరమైన జీవనశైలిలో భాగంగా ఆంథోసయానిన్ అధికంగా ఉండే ఆహారాలను చేర్చుకోవడం వల్ల దీర్ఘకాలిక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని పేర్కొన్నారు. ఈ అధ్యయన ప్రధాన పరిశోధకురాలు ప్రొఫెసర్ ఏడిన్ క్యాసిడీ మాట్లాడుతూ, చిన్న చిన్న ఆహారపు మార్పులు కూడా గుండె జబ్బులు, అధిక రక్తపోటు, టైప్-2 మధుమేహం ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయని అధ్యయనం తేల్చిందన్నారు.(చదవండి: ఆంథోసయనిన్ గుండె, జీవక్రియ ఆరోగ్యానికి ఎలా తోడ్పడుతుందంటే..!) -
Health: నిమోనియా హానియా? ఎవరికి ఎక్కువ ముప్పు?
మన ఊపిరితిత్తులు అనునిత్యం శ్వాస తీసుకుంటూ నిరంతరాయం పనిచేస్తూనే ఉంటాయి. అలా అవి ఏమాత్రం విశ్రాంతి లేకుండా శ్వాస తీసుకుంటూనే ఉండాలి. అప్పుడే ్రపాణాలు నిలుస్తాయి. ఈ ప్రక్రియలో ముక్కు నుంచి తీసుకున్న గాలి... ఊపిరితిత్తుల్లోని అతి చివరి అంచె అయిన ‘ఆల్వియోలై’ అనే గాలి గది (ఎయిర్ శ్యాక్)ని చేరాలి. ఈ ఆల్వియోలై నుంచే బయటి నుంచి మనం తీసుకున్న ఆక్సిజన్ మన దేహంలోని అన్ని అవయవాల్లోని కణాలకు అందడమూ, అలాగే లోపలి కలుషితమైన గాలి అక్కడి నుంచే బయటికి రావడం వంటి ‘గ్యాసెస్ ఎక్స్ఛేంజ్’ ప్రక్రియ చోటుచేసుకుంటుంది. ఏదైనా కారణం వల్ల ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ రావడం వంటి కారణాలతో... గాలి గదిలో (ఆల్వియోలైలో) ఇన్ఫ్లమేషన్ కారణంగా అందులోకి చీము లేదా తెమడ / ఫ్లెమ్ వంటి ద్రవాలు నిండటంతో శ్వాసకు అంతరాయం కలిగితే అది నిమోనియా సమస్యకు దారితీస్తుంది. ఈ నేపథ్యంలో నిమోనియా అంటే ఏమిటో చూద్దాం.నిమోనియా సమస్య ప్రధానంగా బ్యాక్టీరియా (ఉదా: స్ట్రెప్టోకోకస్), వైరస్‌లూ (ఉదా: ఫ్లూ అలాగే రెస్పిరేటరీ సిన్సీషియల్ వైరస్), ఫంగైలతో పాటు ఏవైనా ఆహార పదార్థాలూ, ద్రవాలు (ఉదా: ఆహారం, నీళ్లు వంటివి) ఊపిరితిత్తులోకి చేరడం వల్ల వచ్చే అవకాశాలెక్కువ.కారణాలు..బాక్టీరియా వల్ల – స్టెఫలోకాకస్ బ్యాక్టీరియా (ఇది పెద్దల్లో సాధారణంగా వచ్చేందుకు కారణమవుతుంది), హీమోఫీలస్ (పిల్లల్లో సాధారణంగా దీనివల్ల వస్తుంది), గ్రామ్‌నెగెటివ్, అనరోబిక్, టీబీ బ్యాక్టీరియా మొదలైన బ్యాక్టీరియాల వల్ల.వైరస్ వల్ల – ఇన్ఫ్లుయెంజా, రెస్పిరేటరీ సిన్సీషియల్ వైరస్... వంటి వైరస్‌లతో పాటు తరచూ వచ్చే కొత్త వైరస్ల వల్ల కూడా నిమోనియా రావచ్చు. ఏదైనా వైరస్ విజృంభించి ఒక చోట ఎపిడమిక్‌లా వచ్చి, తన ప్రభావం చూపిన తర్వాత నిమోనియాకు దారితీసే అవకాశాలు ఎక్కువ. ఆ వైరస్ సోకిన తర్వాత బాధితుల్లో రోగనిరోధక శక్తిని బట్టి నిమోనియా వచ్చే అవకాశాలు ఆధారపడి ఉంటాయి.ఫంగస్ వల్ల కూడా.కొద్ది ప్రదేశంలోనే ఎక్కువమంది ఉండటం (ఓవర్ క్రౌడింగ్)ఆల్కహాల్ అలవాటుతో– (దీని వల్ల వ్యక్తుల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగానూ రోగనిరోధక శక్తి (డిఫెన్స్ మెకానిజం) తగ్గుతుంది. మత్తులో దగ్గడం కూడా తక్కువే. దాంతో లోన ఉన్న పడని పదార్థాలు అక్కడే ఉండిపోవడంతో నిమోనియా రావచ్చు.మైక్రో యాస్పిరేషన్ – మనకు తెలియకుండానే ద్రవాలు గొంతునుంచి శ్వాసనాళంలోకి జారిపోతుంటాయి. ఆ ప్రక్రియనే మైక్రోయాస్పిరేషన్ అంటారు. ప్రతివ్యక్తి గొంతులో బ్యాక్టీరియా ఉంటుంది. దీన్నే ఓరోఫ్యారింజియల్ ఫ్లోరా అంటారు. ఆ బ్యాక్టీరియా గొంతు నుంచి శ్వాసనాళాల ద్వారా గాలిగదుల వరకు పోవడం వల్ల కూడా నిమోనియా రావచ్చు.లక్షణాలివే...నిమోనియాలో...జ్వరం, దగ్గు, ఒళ్లునొప్పులు, చలిగా ఉండటం, ఒక్కోసారి ఆకలి లేకపోవడంతెమడ / కఫం (ఫ్లెమ్) ఉండవచ్చు లేదా లేకపోవచ్చు. ఉంటే తెల్లగా / పసుపురంగులో ఒక్కోసారి రక్తపు చారికతోనూ కనిపించవచ్చు.నిమోనియా ఇన్ఫ్లమేషన్ ఊపిరితిత్తి తాలూకు పొర (ప్లూరా)కు చేరినప్పుడు ఛాతినొప్పి కూడా రావచ్చు.నిమోనియా మరీ తీవ్రంగా ఉంటే ఆయాసం కూగా రావచ్చు. ఇక ఇంటస్టిషియల్ నిమోనియాలో దగ్గు ఉండదు. కాని ఆయాసం మాత్రం ఉంటుంది. ఇది ఎంతటి విషమ పరిస్థితికి దారితీస్తుందంటే... ఒక్కోసారి శ్వాసప్రక్రియ ఆగిపోవచ్చు కూడా.ఆస్తమాలో పిల్లికూతలు ఉంటాయి. గాని నిమోనియాలో ఉండవు. గాలి పీలుస్తున్నా అది లోపలికి వెళ్లదు. కారణం... గాలి చేరాల్సిన ప్రదేశమైన గాలిసంచిలోని చీము వంటి ద్రవాలు లేదా తెమడ (ఫ్లెమ్) వంటివి అడ్డంకిగా ఉండవచ్చు. ఇలా గాలిగదిలో పేరుకునే పదార్థాన్ని ‘ఎగ్జుడస్’ అంటారు. ఈ ఎగ్జుడస్ కారణంగా గాలిగదిలోకి ఆక్సిజన్ చేరదు. దాంతో దేహానికీ / దేహంలోని కణాలకూ అవసరమైనంత ఆక్సిజన్ అందదు. ఫలితంగా ఊపిరితిత్తులు పని చేయలేని పరిస్థితి వస్తుంది. దీన్నే ‘హైపాక్సిక్ రెస్పిరేటరీ ఫెయిల్యూర్’ అంటారు.ఊపిరి అందకపోవడంతో నుదుటిపై చెమటలు పట్టడం, కంగారుగా ఉండటం, గుండె స్పందన వేగం పెరగడం, అయోమయం కారణంగా డీలా పడిపోవడం, బీపీ పడిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే దాన్ని ‘సివియర్ నిమోనియా’ అంటారు.కొందరు బాధితుల్లో ఛాతీలో తీక్షణమైన / తీవ్రమైన నొప్పి (షార్ప్ పెయిన్) కూడా రావచ్చు.సమయానికి చికిత్స తీసుకోకపోతే ప్రమాదమే...నిమోనియాకు సమయానికి తగిన చికిత్స తీసుకోకపోతే జబ్బు మరిన్ని కాంప్లికేషన్లకు దారితీయవచ్చు. అంటే... సెప్టిసీమియా (రక్తానికంతా ఇన్ఫెక్షన్ సోకడం, దీన్నే మామూలు భాషలో రక్తం విషపూరితంగా మారడం), రక్తపోటు పడిపోవడం, పక్షవాతం, మూత్రపిండాలు దెబ్బతినడం, మెదడుపై దుష్ప్రభావం పడటం కాంప్లికేషన్లు రావచ్చు. కొందరిలో మరణం కూడా సంభవించవచ్చు.నిమోనియా ఎవరెవరిలో... నిమోనియా ఏ వయసు వారిలోనైనా రావచ్చు. చాలా చిన్న పిల్లలు మొదలుకొని, అరవై ఏళ్లు దాటిన వృద్ధుల వరకు అందరిలోనూ కనిపించవచ్చు. సాధారణంగా ఈ వయసు వారిలో వ్యాధి నిరోధకశక్తి / వ్యాధి నిరోధక వ్యవస్థ పనితీరు తక్కువ కాబట్టి నిమోనియా చిన్నపిల్లల్లోనూ, వయస్సు పైబడ్డవారిలోనూ చాలా ఎక్కువగా కనిపిస్తుంటుంది.ఆహారంలో తగినన్ని పోషకాలు తీసుకోని వాళ్లలో రోగనిరోధక శక్తి తగ్గడంతో.సీఓపీడీ (క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మునరీ డిసీజ్ – బ్రాంకైటిస్, ఎంఫసీమా) వంటి వ్యాధులు ఉన్నవాళ్లలోగుండె సమస్యలు ఉన్నవారిలోస్పీ›్లనెక్టమీ అనే ప్రక్రియ ద్వారా స్పీ›్లన్ తొలగించిన వాళ్లలోపొగతాగేవారిలో... వీళ్లందరిలోనూ నిమోనియా వచ్చే అవకాశాలెక్కువ.మరికొన్ని జబ్బులతో కలసి...మరికొన్ని ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడేవారిలో నిమోనియా సోకడం మామూలే. ఉదాహరణకు... సాధారణంగా డయాబెటిస్ ఉన్న వారు, క్యాన్సర్ కారణంగా కీమోథెరపీ తీసుకుంటున్నావారు, ఎయిడ్స్ బాధితులు, ఆస్తమా ఉన్నవారు, ఆల్కహాల్ ఎక్కువగా తాగేవారిలో నిమోనియా రావడం చాలా సాధారణం. ఇక గర్భవతుల్లో నిమోనియాను గుర్తించి, సరిగా వైద్య చికిత్స ఇవ్వకపోవడం వల్ల అదెన్నో కాంప్లికేషన్లకు దారితీసే ముప్పు ఉంటుంది.వ్యాధి నిర్ధారణబాధితుల్లో కనిపించే లక్షణాలను బట్టి క్లినికల్‌గా.సీబీపీ, సీఎక్స్ఆర్ వంటి చాలా సాధారణ పరీక్షలతో దీన్ని నిర్ధారణ చేయవచ్చు.ఒక్కోసారి అవసరాన్ని బట్టి ఛాతీ సీటీ స్కాన్, కళ్లె పరీక్ష వంటి ఇతర పరీక్షలు కూడా చేయాల్సి రావచ్చు.వీరిలో మరింత జాగ్రత్త అవసరం...బాధితుల్లో రెండు మూడు రోజుల నుంచి జ్వరం, దగ్గు, ఊపిరి అందకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తుంటే నిమోనియా ఉందేమోనని పరీక్షించాలి. డయాబెటిస్, పక్షవాతం, ఆస్తమా, గర్భిణుల్లో వ్యాధి సోకే అవకాశాలు ఎక్కువ కాబట్టి వారిని చాలా జాగ్రత్తగా పరీక్షించాలి. ఇక ఆసుపత్రుల్లో నిమోనియా సోకే అవకాశాలు ఎక్కువ.నివారణ...పొగతాగే అలవాటు ఉంటే జ్వరం, దగ్గు, ఊపిరి అందకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తుంటే తక్షణం ఆ అలవాటును ఆపేయాలి.బయటి వాతావారణంలో పొగ ఉంటే దానికి ఎక్స్పోజ్ కాకుండా జాగ్రత్త పడాలి.ఆస్తమా రోగులు, బ్రాంకైటిస్ ఉన్నవారు తప్పనసరిగా అది నియంత్రణలోకి వచ్చేలా చికిత్స తీసుకోవాలి.క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల రోగనిరోధక శక్తి పెంపొందుతుంది. ఫలితంగా నిమోనియా వంటి ఇన్ఫెక్షన్లు తేలిగ్గా సంక్రమించవు.అన్ని పోషకాలూ ఉండే సమతులాహారం తీసుకోవడం వల్ల రోగనిరోధకశక్తి పెరిగి, నిమోనియాతో పాటు అనేక ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కలుగుతుంది.చికిత్సనిమోనియాకు తగిన యాంటీబయాటిక్స్‌తో చికిత్స చేయాల్సి ఉంటుంది. బాధితులను చాలా నిశితంగా పరిశీలించి యాంటీబయాటిక్స్ మోతాదును డాక్టర్లు చాలా జాగ్రత్తగా నిర్ణయిస్తారు. అందుకే నిమోనియాకు చికిత్స తప్పనిసరిగా డాక్టర్ల పర్యవేక్షణలోనే జరగాలి. సొంతవైద్యం ఎట్టిపరిస్థితుల్లోనూ పనికిరాదు.ఎవరికైనా మూడు రోజులకు పైబడి జ్వరం, ఛాతీనొప్పి, ఊపిరి సరిగా తీసుకోకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరి.చిన్నాపిల్లల్లో నిమోనియా!చిన్నపిల్లలందరిలోనూ కనిపించినప్పటికీ... మరీ ముఖ్యంగా ఐదేళ్ల కంటే ఇంకా చిన్నారుల్లో ఇది చాలా ఎక్కువ. పెద్దల్లో వ్యాధి నిరోధక వ్యవస్థ బాగా పనిచేస్తుంటుంది కాబట్టి కాస్త తట్టుకుంటారు. కానీ చిన్నారుల్లో ఇమ్యూనిటీ అంతే బలంగా ఉండకపోవడం వల్ల ఒక్కోసారి ఇది ్రపాణాంతకమూ అయ్యే అవకాశముంది. అయితే ఇప్పుడున్న వైద్యపరిజ్ఞానంతో దీన్ని చాలావరకు సమర్థంగా తగ్గించవచ్చు.స్ట్రెప్టోకాకస్ నిమోనే, గ్రూప్–బి స్ట్రెప్టోకాకస్, స్టెఫలోకాకస్ ఆరియస్ వంటి బ్యాక్టీరియాతో పాటు ఐదేళ్ల కంటే మరీ చిన్న పిల్లల్లో ఇది రెస్పిరేటరీ సిన్సీషియల్ వైరస్, పారా ఇన్ఫ్లుయెంజా వైరస్, అడినోవైరస్ వంటి వైరస్లతోనూ వచ్చే అవకాశం ఉంది. పెద్దల్లోలాగే కొన్ని సందర్భాల్లో ఫంగైలతోనూ నిమోనియా రావచ్చు.లక్షణాలునిమోనియా వల్ల పిల్లలందరిలోనూ ఒకేలాంటి లక్షణాలు కనిపించకపోవచ్చు. ఏ కారణంగా నిమోనియా వచ్చిందనే అంశాన్ని బట్టి లక్షణాలు మారుతుంటాయి. అయితే సాధారణంగా కనిపించే లక్షణాలివి...దగ్గు వస్తుంటుంది. ఇది తెమడ/ఫ్లెమ్ను ఉత్పత్తి చేస్తుండటం వల్ల తడిదగ్గు.తీవ్రమైన జ్వరం.ఆకలి తగ్గడం.తీవ్రమైన అలసట, నీరసం, నిస్సత్తువ.కొందరు పిల్లల్లో వాంతులు, విరేచనాలూ కావచ్చు.వైరస్ లేదా బ్యాక్టీరియా కారణంగా నిమోనియా వచ్చినా మొదట్లో లక్షణాలన్నీ దాదాపు ఒకేలా ఉంటాయి. అయితే వైరల్ నిమోనియాలో ఊపిరి తీసుకోవడం కష్టం కావడం, ఆయాసం, ఊపిరి తీసుకుంటున్నప్పుడు శబ్దం రావడం (వీజింగ్) వంటివీ కనిపించవచ్చు. బ్యాక్టీరియా కారణంగా వచ్చే నిమోనియా కంటే వైరల్ నిమోనియా కాస్త ప్రమాదకరం. పిల్లల్లో వణుకు, ఆయాసం, తలనొప్పి, అయోమయం వంటివి కనిపిస్తే అది ఒకింత ప్రమాదకరమని గుర్తించి వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.నిర్ధారణఛాతీ ఎక్స్‌రే.కొన్ని రక్తపరీక్షలు (రక్తంలో ఆక్సిజన్ మోతాదును తెలుసుకునే ఆర్టీరియల్ బ్లడ్‌గ్యాస్ వంటివి)కళ్లె పరీక్ష (స్ఫుటమ్ కల్చర్) : ఈ పరీక్ష వల్లనే నిమోనియాకు అసలు కారణం తెలుస్తుంది.సీటీ స్కాన్ (ఛాతీది)అవసరాన్ని బట్టి అరుదుగా బ్రాంకోస్కోపీ, ఊపిరితిత్తుల్లో నీరు చేరితే దాని పరీక్ష వంటివి చేస్తారు.చికిత్స బ్యాక్టీరియా వల్ల వచ్చే నిమోనియా మంచి యాంటీబయాటిక్స్‌తో తేలిగ్గా తగ్గిపోతుంది. అయితే వైరల్ ఇన్ఫెక్షన్తో నిమోనియా వస్తే దానికి నిర్దిష్టంగా మందులు లేకపోయినా కొన్నిసార్లు యాంటీవైరల్ మందులు ఇస్తారు. ఇలాంటి పిల్లలకు తగినన్ని నీళ్లు తాగించడం, గది బాగా సౌకర్యంగా ఉండటంతో పాటు అందులో తగినంత తేమ ఉండేలా చూడటం, జ్వరం, దగ్గు వంటివి తగ్గడానికి లక్షణాలను బట్టి (సింప్టమాటిక్) చికిత్స ఇవ్వడం వంటివి చేస్తారు.సెకండరీ నిమోనియాపిల్లల్లో ఇంకేదైనా వ్యాధి (ముఖ్యంగా వైరల్ జ్వరాలు) వచ్చాక, అది నిమోనియాకు దారితీస్తే దాన్ని సెకండరీ నిమోనియాగా పరిగణిస్తారు. దీనికి కాస్తంత ప్రమాదకరమైన కండిషన్. అందుకే హాస్పిటల్లో ఉంచి చికిత్స అందించాలి. ఇందులో తీవ్రతను బట్టి రక్తనాళం ద్వారా లేదా నోటి ద్వారా యాంటీబయాటిక్స్ ఇవ్వడం, వాళ్లలో నీరు, లవణాల మోతాదుల నిర్వహణ కోసం సెలైన్ వంటి ఫ్లుయిడ్స్ ఎక్కించడం, ఆక్సిజన్ ఇవ్వడం, పిల్లలు తమంతట తాము కళ్లె / గల్ల / ఫ్లెమ్ తీయలేరు కాబట్టి వారు దాన్ని ఊసేలా వివరించి చెప్పడం, బాగా ఊపిరితీసుకోగలుగుతున్నారా అని చూడాలి. అందుకే చిన్నారుల్లో సెకండరీ నిమోనియా కనిపిప్తే వారిని తప్పనిసరిగా హాస్పిటల్లో ఉంచే చికిత్స అందించడం మంచిది. నివారణపిల్లలకు చిన్నతనంలో ఇచ్చే బీసీజీ, పెర్టుసస్‌లతో పాటు నిమోకోకల్ వ్యాక్సిన్ ఇవ్వడం ద్వారా దీన్ని నివారించవచ్చు. ఇప్పుడు 13 రకాల నిమోనియాలకు తగిన వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. పిల్లలకు రెండు నెలల వయసప్పుడు నిమోనియా వ్యాక్సిన్స్ మొదటి డోసు, రెండేళ్ల పైబడ్డ పిల్లలకు సైతం వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి.అందరు పిల్లలకు ప్రతి ఏడాదీ ఫ్లూ వ్యాక్సిన్ వేయించాలి. వర్షాకాలానికి ముందు (ప్రీ–మాన్సూన్ పీరియడ్‌లో) ప్రతి ఏడాదీ ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవాలి. ఇలా తీసుకుంటే వైరల్ ఫ్లూని నియంత్రించవచ్చు.వ్యక్తిగత పరిశుభ్రత పాటించడాన్ని పిల్లలకు నేర్పడం, బాగా దగ్గుతున్న పెద్దలు, వ్యాధిగ్రస్తుల దగ్గరికి వెళ్లకుండా చూస్తూ... పిల్లలను అలాంటివారి నుంచి దూరంగా ఉంచడం, చాలాకాలం పాటు ధాన్యం నిల్వ ఉంచే గరిసెలు, అలాగే కోళ్ల వంటి పెంపుడు పక్షులకు పిల్లలను దూరంగా వంటి కొద్దిపాటి జాగ్రత్తలతో నిమోనియాను చాలావరకు నివారించవచ్చు.చివరిగా... నిమోనియాను యాంటీబయాటిక్స్‌తో చాలావరకు నయం చేయడం సాధ్యమే అయినప్పటికీ... పెద్దల్లోనైనా, పిల్లల్లో జ్వరం, ఆగకుండా దగ్గు వస్తూ, ఆయాసం వంటి లక్షణాలు కనిపిస్తున్నప్పుడు అంత తేలిగ్గా తీసుకోకుండా ఒకసారి డాక్టర్‌ను సంప్రదించి చికిత్స తీసుకోవడమే మంచిదని గుర్తుంచుకోవాలి.- డా. రమణ ప్రసాద్, సీనియర్ పల్మునాలజిస్ట్ అండ్ స్లీప్ స్పెషలిస్ట్నిర్వహణ : యాసీన్ -
విటమిన్లు తగ్గితే మతిమరుపే?
వయసు పైబడు తున్న కొద్దీ వచ్చే జ్ఞాపకశక్తి సమస్యలకు, శరీరంలో ఉండే కొన్ని ముఖ్యమైన విటమిన్ల స్థాయిలకు మధ్య అత్యంత బలమైన లంకె ఉందా? అవుననే చెబుతోంది ఐసీఎంఆర్–జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) తాజా అధ్యయనం. వృద్ధుల్లో రక్తంలోని విటమిన్ స్థాయిలు తగ్గడం వల్ల మెదడు పని తీరు మందగించి మతిమరుపు లేదా జ్ఞాపకశక్తి తగ్గే తొలి దశ వచ్చే ప్రమాదం ఉందని తేలింది.అంత ర్జాతీయ మెడికల్ జర్నల్ ’న్యూట్రియెంట్స్’లో ప్రచురితమైన ఈ ప్రత్యేక అధ్యయనంలో భాగంగా హైదరాబాద్‌కు చెందిన 55–85సంవత్సరాల మధ్య వయసు గల 184 మంది వృద్ధులపై క్షేత్ర స్థాయిలో పరిశోధనలు జరిపారు. ఇందులో తేలిన షాకింగ్ నిజం ఏమిటంటే.. వీరిలో 36.4% మంది అప్పటికే జ్ఞాపకశక్తి తగ్గే ఈ తొలి దశ బారిన పడినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.విటమిన్ల లోపమే శాపమా?జ్ఞాపకశక్తి సమస్యలతో బాధపడుతున్న వృద్ధుల రక్త నమూనాలను పరీక్షించినప్పుడు వారిలో డీ, బీ1, బీ2, బీ6, బీ9, బీ12 విటమిన్ స్థాయిలు చాలా తక్కువగా ఉన్నట్లు తేలింది. ముఖ్యంగా డీ, బీ2, బీ9 విటమిన్లలో లోపాలు వీరిలో అత్యధికంగా కనిపించాయి. శరీరంలో విటమిన్–డీ, బీ6 స్థాయిలు సమృద్ధిగా ఉన్నవారిలో ఆలోచనా శక్తి, మానసిక పనితీరు, మెదడు చురుకుదనం చాలా మెరుగ్గా ఉన్నట్లు పరిశోధకులు కనుగొన్నారు. అలాగే, జ్ఞాపకశక్తి సమస్యలు ఉన్న వృద్ధుల్లో కేవలం విటమిన్ల లోపమే కాకుండా, రక్తంలో చక్కెర స్థాయిలు, బీపీ కూడా చాలా ఎక్కువగా ఉన్నట్లు గమనించారు. అందువల్ల మధుమేహం, రక్తపోటు ఉన్నవారు మరింత అప్రమత్తంగా ఉండాలని ఈ అధ్యయనం సూచిస్తోంది.ముందస్తు జాగ్రత్తలువృద్ధాప్యంలో కేవలం వ్యాధుల నియంత్రణపైనే కాకుండా పోషకాహార భద్రతపై కూడా సమానంగా దృష్టి పెట్టాలని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. శరీరంలో తగినంత మొత్తంలో సూక్ష్మపోషకాలు ఉండేలా చూసుకోవడం, వయసు పైబడుతున్న వారిలో ప్రారంభ దశలోనే పోషకాహార లోపాలను గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని ఎన్ఐఎన్ బయోకెమిస్ట్రీ విభాగం అధిపతి, పరిశోధనకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త డాక్టర్ జి.భానుప్రకాశ్ రెడ్డి తెలిపారు. మెదడు చురుకుదనాన్ని నిలుపుకుంటూ ఆరోగ్యకర వృద్ధాప్యాన్ని ఆస్వాదించడానికి ముందస్తు పోషకాహార పరీక్షలు, సకాలంలో తీసుకునే సమతుల్య ఆహారం ఎంతగానో దోహదపడతాయని చెప్పారు. -
అతిగా అన్నం తినడమూ వ్యసనమే!
మనదేశంలో ముఖ్యంగా దక్షిణాది భోజనంలో అన్నం ప్రధానమైనది. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి.. ఇలా ప్రతి పూట కంచంలో గుప్పెడు అన్నం పడందే చాలామందికి కడుపు నిండిన భావనే రాదు. ఈ ఒక్కమాటను గమనించాలి, ‘కడుపు నిండడం కాదు కడుపు నిండిన భావన’. మోతాదుకు మించి అన్నం తినే అలవాటు ఉంటే అది కేవలం ఆకలి మాత్రమే కాదని, ఇదొక రకమైన ’కార్బోహైడ్రేట్ వ్యసనం’ కావచ్చని ఆధునిక ఆరోగ్య నిపుణులు, పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.అన్నం వ్యసనంగా ఎలా మారుతుంది?అన్నంలో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువ. అన్నం కడుపులోకి వెళ్లగానే గ్లూకోజ్‌గా మారి రక్తంలో చక్కెర స్థాయిలను ఒక్కసారిగా పెంచుతుంది. దీనివల్ల మెదడులోని ‘రివార్డ్ సిస్టమ్’ప్రేరేపితమై డోపమైన్ హార్మోన్ విడుదలవుతుంది. ఈ హార్మోన్ తాత్కాలికంగా మనకు ఒక రకమైన ఆనందాన్ని, సంతృప్తిని ఇస్తుంది. ఎప్పుడైతే ఆ సంతోష స్థాయిలు, శక్తి తగ్గిపోతాయో, మెదడు మళ్లీ అదే స్థాయి ఆనందం కోసం తక్షణ శక్తినిచ్చే అన్నం కోసం డిమాండ్ చేస్తుంది. ఇదే చక్రం పునరావృతమై క్రమంగా అది అన్నం తినాలనే బలమైన కోరికగా మారుతుంది. ఈ బలహీనతను పరిశోధకులు కార్బ్ క్రేవింగ్(పిండి పదార్థాలు లేదా తీపి పదార్థాలను మళ్లీ మళ్లీ తినాలనే తీవ్రమైన కోరిక) అంటున్నారు.పరిశోధకుల మాటల్లో...పరిశోధకుడు డాక్టర్ డేవిడ్ కిస్ ‘తెల్లటి అన్నం, రిఫైన్డ్ కార్బోహైడ్రేట్లు మెదడులోని డోపమైన్ మార్గాలను మాదకద్రవ్యాల మాదిరిగానే ఉత్తేజపరుస్తాయి. అందుకే చాలామందికి ఇతర ఆహారాలతో కడుపు నిండినప్పటికీ, మనసు సంతృప్తి చెందక అన్నం తిని సంతృప్తి చెందుతారు. ఇది శారీరక ఆకలి కాదు, మెదడు కోరుకునే వ్యసనం’అన్నారు.బిహేవియరల్ న్యూట్రిషన్ ఎక్స్పర్ట్ డాక్టర్ నికోల్ ఏ.వియెరా ‘మన సాంస్కృతిక ఆహారపు అలవాట్లలో అన్నం ఒక భాగం. ఒత్తిడిని తట్టుకోవడానికి ఇదొక స్ట్రెస్‌బస్టర్, మానసిక ప్రశాంతత కోసం కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే అన్నంపై ఆధారపడటం అలవాటుగా మారితే అది మానసిక బానిసత్వానికి దారితీస్తుంది. దీన్ని తగ్గించాలని ప్రయత్నించినప్పుడు కొందరిలో ఆందోళన, చికాకు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇది పూర్తిగా వ్యసన లక్షణమే’అన్నారు.ఈ వ్యసనం వల్ల కలిగే నష్టాలు?మధుమేహం ముప్పు: అన్నాన్ని అధికంగా తీసుకోవడం వల్ల రక్తంలో ఇన్సులిన్ స్థాయి లు అకస్మాత్తుగా పెరిగి, కాల క్రమేణా టైప్–2 డయాబెటిస్‌కు దారితీస్తుంది.బరువు పెరగడం: అన్నంలో కేలరీలు ఎక్కువ, పీచు పదార్థం తక్కువగా ఉండటం వల్ల పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయి ఊబకాయం వస్తుంది.నీరసం, అలసట: రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరిగి మళ్లీ పడిపోవడం వల్ల భోజనం చేసిన కొద్దిసేపటికే తీవ్రమైన అలసట, నిద్రమత్తు ఆవహిస్తాయి.ఈ అలవాటు నుంచి బయటపడటం ఎలా?క్రమంగా తగ్గించడం: ఒక్కసారిగా అన్నం మానేయకుండా, క్రమంగా పరిమాణాన్ని తగ్గించుకోవాలి.ప్రత్యామ్నాయాలు: వైట్ రైస్‌కు బదులుగా బ్రౌన్ రైస్, దంపుడు బియ్యం, తృణధాన్యాలు వాడటం మంచిది.- సాక్షి, స్పెషల్ డెస్క్ -
మనసున మనసై
నిరుత్సాహం కమ్ముకున్నప్పుడు, ఒంటిరితనం శాపంగా మారినప్పుడు, పీల్చే శ్వాస కూడా బరువెక్కుతుంది. బతుకు భారమవుతుంది. కాని ఆశ అనే దీపం వెలిగిస్తే ఎన్ని నిరాశల నిశీధులనైనా దాటవచ్చని నిరూపించిందో యువతి. ఆమె సెహర్ హష్మీ... స్వయంగా తానే మానసిక అంతర్మధనంలో ఎన్నో రోజులు నరకాన్ని చవిచూసింది.. ఆపై ఒక దృఢ నిశ్చయంతో నరకాన్ని దాటి తనలాంటి ఎంతోమంది మానసిక రోగులకు ఉపశమనం కలిగిస్తోంది.ఢిల్లీలో జన్మించిన సెహర్ హష్మీ, చిన్నప్పటి నుంచే సృజనాత్మకతపై ఆసక్తి పెంచుకుంది. తల్లి షబ్నం హష్మీ, తండ్రి గౌహర్ రజా. అన్నయ్య సాహిర్ రజా బాలీవుడ్లో దర్శకుడిగా పనిచేస్తున్నాడు. ఫ్యాషన్ రంగంలోకి అడుగుపెట్టిన సెహర్, ముంబయిలో ఓ డిజైనర్‌తో కలిసి పలు షూట్లలో పనిచేసింది. బయటికి అందమైన, సృజనాత్మక ప్రపంచంగా కనిపించే ఫ్యాషన్ రంగం వెనుక ఎన్నో సవాళ్లున్నాయని తెలిశాక ఆమె మొదట్లో ఆశ్చర్యపోయింది. ఆ తర్వాత తేరుకుని అంతర్గతంగా తీవ్రమైన పోరాటం సాగించింది. బోర్డర్‌లైన్ పర్సనాలిటీ డిజార్డర్ (బీపీడీ), డిప్రెషన్ తో బాధపడింది. తీవ్రమైన ఒత్తిడి, మూడ్‌లో మార్పులు, ఆత్మవిశ్వాసంలో హెచ్చుతగ్గులు, స్వీయ హింస, ఒంటరితనం, తరచూ కోపం రావడం ఇవన్నీ బీపీడీ లక్షణాలు.. ఓ దశలో పరిస్థితి తీవ్రంగా మారి రెండేళ్లపాటు దాదాపు తన గదికే పరిమితమయింది. ఆ చీకటి దశను దాటడం ఆమె జీవితంలోనే అతిపెద్ద పోరాటంగా మారింది. ఆ తర్వాత పెయింటింగ్ ఆమెకు ఆధారమైంది. తల్లి ప్రోత్సాహంతో చిత్రాలను ప్రదర్శనకు పెట్టడంతోబాటు, అక్కడి నుంచే తన అనుభవాలను ప్రజలతో ధైర్యంగా పంచుకోవాలనే ఆలోచన కూడా మొదలైంది.ప్రాజెక్ట్ బ్రేకింగ్ స్టిగ్మా...సెహర్ తనలాంటి వారికి ధైర్యం ఇవ్వడానికి ‘బ్రేకింగ్ స్టిగ్మా – ఒన్మైల్ ఎట్ ఎ టైం’ పేరుతో క్యాంపెయిన్ మొదలు పెట్టింది. ఢిల్లీలో మొదలు పెట్టి దాదాపు 22 నగరాలు, 30 గ్రామాలలో ఎంతోమందికి ఇంటరాక్టివ్ సెషన్స్ నిర్వహించింది. కోవిడ్ సమయంలో ఫేస్బుక్ లైవ్‌ల ద్వారా కూడా ఎంతోమందికి చేరువైంది. మానసిక ఆరోగ్యం, వ్యక్తిగత పోరాటం వంటి అంశాలను బహిరంగంగా మాట్లాడటం ద్వారా ఎన్నో కుటుంబాలకు ధైర్యాన్ని కల్పించింది. ఒకసారి బెంగళూరులో ఓ మహిళ సెహర్ తల్లి షబ్నం హష్మీని కలిసి.. ‘‘సెహర్ నా ప్రాణాన్ని కాపాడింది’’ అని చె΄్పారు. సెహర్ వీడియోలు చూసిన తర్వాత తన లైంగిక గుర్తింపును కుటుంబానికి చెప్పే ధైర్యం వచ్చిందని, ఒకప్పుడు జీవితం ముగించుకోవాలనుకున్న స్థితి నుంచి ఇప్పుడు తన గుర్తింపుతో స్వేచ్ఛగా జీవిస్తున్నానని ఆమె వివరించింది.రాయల్ ఎన్ ఫీల్డ్ టూర్మానసిక ఆరోగ్యంపై అవగాహన కోసం 7 వేల కిలోమీటర్లకు పైగా చేసిన ప్రయాణంలో ఎన్నో ఒడిదొడుకులు.. కాని సెహర్ వెనకడుగు వేయలేదు. ఈ ప్రయాణం రహదారులపై దూసుకెళ్లడం మాత్రమే కాదు. చిన్న పట్టణాలు, గ్రామాలు, దూర ప్రాంతాలు, కమ్యూనిటీ కేంద్రాల్లోకి నేరుగా వెళ్లి మానసిక ఆరోగ్యంపై చర్చకు అవకాశం కల్పిస్తోంది. సాధారణంగా ఇలాంటి అంశాలపై మాట్లాడని ప్రాంతాల్లోనూ మాట్లాడుకునేలా చే స్తూ తన గమనాన్ని కొనసాగిస్తోంది.విద్యలో భాగం కావాలినా గురించి నేను మాట్లాడినప్పుడు నన్ను చాలామంది సంప్రదించారు. అప్పుడు నేను ఒంటిరిదాన్ని కాదని నాకు అర్థమైంది. మెంటల్ హెల్త్ అవేర్నెస్ అనేది ఏదో ఒక్కసారి మొక్కుబడిగా నిర్వహించే కార్యక్రమం కాకూడదు. అది విద్యావ్యవస్థలో నిరంతర భాగం కావాలి. ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘మానస్’ హెల్ప్‌లైన్ అన్ని భారతీయ భాషల్లో అందుబాటులో ఉండటం చాలా మంచి విషయం. – చైతన్య వంపుగాని, సాక్షి న్యూఢిల్లీ -
పిల్లల గుండెల్లో పిచ్చుక గూళ్లు
నిద్ర లేచి పిచుకల కిచకిచలు వింటూ కాఫీ తాగడం ఒకప్పటి ముచ్చట. నేటి హైరైజ్ అపార్ట్మెంట్లు, గ్లాస్ బిల్డింగులు, సెల్ టవర్ల రేడియేషన్ మధ్య పిచుకలు బెదిరి దూరం జరిగిపోయాయి. తమిళనాడు తన తప్పు తెలుసుకొని విద్యాశాఖను, అక్కడి ‘కూడుగల్ ట్రస్ట్’ను కలిపి ‘ప్రభుత్వ స్కూళ్ల ద్వారా పిచుకల సంరక్షణ’ అనే విప్లవానికి తెరలేపింది. పిచుక గూళ్లు తయారు చేయడం నేర్చుకున్న పిల్లలు చెన్నై, కోయంబత్తూరుల్లో ఉంచిన గూళ్ల వల్ల పిచుకలు తిరిగి వచ్చాయి. మరి మనకు వద్దా పిచుకల సందడి?పిల్లలు పెద్దలను చాలా విషయాల్లో సరి చేస్తున్నారు. పెద్దలు వదిలిపెట్టిన బాధ్యతలను తీసుకుంటున్నారు. ఇప్పుడు తమిళనాడు స్కూలు పిల్లలు అదే దారిలో ఉన్నారు. పర్యావరణ, సంరక్షణ బరువును కూడా వారి చిన్ని భుజాలకు ఎత్తుకుంటున్నారు.చెట్టు, పుట్ట, మట్టి, మొలక, పిట్ట, పిచుక... అన్నీ బాగుంటేనే మనం కూడా బాగుంటామని వారికి తెలుసు. అందుకే తమిళనాడు ప్రభుత్వం, ఆ రాష్ట్రానికి చెందిన స్వచ్ఛంద సంస్థ ‘కూడుగళ్’ ట్రస్ట్ కలిసి ‘పిల్లలూ... పిచుకలు గూళ్లు లేక అవి ఊళ్లు వదిలి వెళుతున్నాయి. బతకలేకపోతున్నాయి. మీరే గూళ్లు తయారు చేసి వేళ్లాడగట్టండి’ అనంటే అలాగే అని రంగంలో దిగారు.దేశంలోనే మొదటిసారి ఒక రాష్ట్ర ప్రభుత్వం, పర్యావరణ ప్రేమికులు కలిసి పిల్లలను పిచుకుల కేర్టేకర్లుగా మార్చిన విశేషం ఇది. ఆ ఆలోచన ఫలించింది. కిచకిచలు వినిపిస్తున్నాయి. అవి తుర్రున ఎగురుతున్నాయి. ఇళ్ల కిటికీల్లో వాలి హాయ్ చెబుతున్నాయి.ఇంటికొక గూడుపిచుకలు బతకాలంటే ఇంటికొక గూడు ఉండాలి. కనీసం స్కూల్లో ఉన్న ప్రతి స్టూడెంట్ తన ఇంటి దగ్గర ఒక గూడు వేళ్లాడగడితే? ఇదీ ఆలోచన. అందుకే తమిళనాడులోని చెన్నై, కోయంబత్తూర్, ఈరోడ్, కృష్ణగిరి, రాణిపేట్ వంటి 10 జిల్లాల్లోని 50 ప్రభుత్వ పాఠశాలలను ఎంపిక చేసి, ఈ సీజన్లో స్కూళ్లు తెరిచాక పిచుకగూళ్ల వర్క్‌షాప్స్ నిర్వహిస్తున్నారు. పిల్లలకు చెక్కతో పిచుకల గూళ్లు తయారు చేయడం నేర్పిస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ కేవలం పక్షులకు ఇళ్లు ఇవ్వడంతోనే ఆగిపోదు. పిల్లలు ఆ గూళ్లను తమ ఇళ్లవద్ద అమర్చిన తర్వాత వాటికి రోజువారీ ఆహారం, నీరు కూడా ఇవ్వాలి. రోజూ ఉదయం, సాయంత్రం గూటి పక్కన సజ్జలు, రాగులు, వరి గింజలు వంటి ధాన్యాలు వేయడం, చిన్న పాత్రలో మంచినీరు అమర్చడం పిల్లల దినచర్యలో భాగం చేసుకోవాలి. ఇలా గూడుతో పాటు కూడు కూడా దొరకడంతో గత ఐదేళ్లలో తమిళనాడులో 15,000 గూళ్లను పంపిణీ చేసిన జిల్లాల్లో పిచుకల జనాభా ఏకంగా 25 శాతం పెరిగింది. వచ్చే నెలలో పిచుకలను గుర్తించేందుకు ప్రత్యేక మొబైల్ యాప్‌ను లాంచ్ చేయబోతున్నారు. దీని సాయంతో పిల్లలే స్వయంగా ‘పిచుకల గణన’ (Sparrow Census) చేయనున్నారు.బడి నుంచి ప్రకృతిమన విద్యావ్యవస్థలో మార్కులు, ర్యాంకుల గోల ఎక్కువైపోయింది. పిల్లలకు పుస్తకాల్లో పర్యావరణం గురించి పాఠాలు ఉంటాయి కానీ ప్రాక్టికల్ అవగాహన సున్నా. తమిళనాడు చేస్తున్న ఈ ప్రయోగం కేవలం పిచుకలను కాపాడటం మాత్రమే కాదు... గూడును తయారు చేయించి, ఒక ప్రాణికి రోజూ అన్నం పెట్టే బాధ్యతను ఇవ్వడం ద్వారా పిల్లల్లో ‘కరుణ’, ‘సృజనాత్మకత’, ‘బాధ్యత’ అనే గుణాలను నాటుతున్నారు. ఇలా చేయడం వల్ల ప్రకృతిపై పిల్లవాడికి ఓనర్షిప్ వస్తుంది. పెద్దయ్యాక వాడు పర్యావరణాన్ని నాశనం చేసే పనులు చేయడు. చెట్లను నరకడానికి ఒప్పుకోడు. కాబట్టి మనం ఎయిర్ కండిషన్స్డ్ గదుల్లో కూర్చుని పర్యావరణ ఉపన్యాసాలు ఇవ్వడం కంటే స్కూల్ లెవెల్లోనే ఇలాంటి ‘డు ఇట్ యువర్ సెల్ఫ్’ ప్రాజెక్టులు పెట్టడం వల్ల సమాజంలో శాశ్వత మార్పు వస్తుంది.తెలుగు రాష్ట్రాల్లో ?హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, వరంగల్ లాంటి నగరాల్లో ఈ రోజు పరిస్థితి ఏంటి? ఇక్కడ కూడా పిచుకలు కనుమరుగైపోతున్నాయి. ప్రతి ఇల్లూ కాంక్రీట్ డబ్బాగా మారిపోవడంతో పిచుకలకు ఆశ్రయం లేకుండా పోయింది. పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో పిచుకలు కీలకపాత్ర పోషిస్తాయి. అవి పంటలను నాశనం చేసే చిన్న చిన్న పురుగులను, దోమల లార్వాలను తిని రైతులకు, ప్రజలకు స్నేహితుడిగా మారతాయి. పిచుకలు లేకపోతే పురుగులు పెరుగుతాయి. మన హైదరాబాద్‌లో కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఇలాంటి హ్యాబిటాట్ బాక్సులను పంపిణీ చేస్తూ నగరంలో పిచుకలను రప్పించే ప్రయత్నం చేస్తున్నాయి. మరి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు ఇలాంటి ప్రాజెక్టులను అధికారికంగా పాఠశాలల్లో ఎందుకు ప్రవేశపెట్టకూడదు? మన విద్యాశాఖలు ఇలాంటి ఎన్విరాన్ మెంట్ ప్రాజెక్టులను సిలబస్‌లో భాగంగా మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది.మనకూ కావాలి పిచుకలు.. .గృహిణులు, విద్యార్థులు ఏం చేయాలి? పెద్ద పెద్ద బడ్జెట్లు, ప్రభుత్వ నిధుల కోసమే ఎదురు చూడనక్కర్లేదు. చిన్న అడుగు వేయవచ్చు. మీ ఇంటి బాల్కనీల్లో, కిటికీల పక్కన అట్టపెట్టెలు లేదా పాత కొబ్బరి చిప్పలతో గూళ్లను ఏర్పాటు చేయవచ్చు. వాటిల్లో కొద్దిగా బియ్యం గింజలు, సజ్జలు వేసి, ఒక చిన్న గిన్నెలో నీళ్లు పెడితే చాలు.. పిచుకలు మళ్లీ మీ ఇంటిని వెతుక్కుంటూ వస్తాయి. ఇక విద్యార్థులు తమ స్మార్ట్ఫోన్లలో గేమ్స్ ఆడటం పక్కన పెట్టి ఇళ్ల చుట్టుపక్కల ఉన్న పక్షులను గమనించడం, వాటికి దాణా వేయడం అలవాటు చేసుకోవాలి. రేపటి తరానికి కేవలం డిజిటల్ స్క్రీన్లపై పిచుక బొమ్మలను చూపించడం కాకుండా వాటి నిజమైన కిచకిచలను బహుమతిగా ఇవ్వాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. మన ఇళ్లలో, మన మనసుల్లో పిచుకల కోసం కొంచెం స్థలాన్ని కేటాయిద్దాం! -
147 కేజీల నుంచి 109 కేజీలకు..! ఆ డైట్‌తో 38 కేజీలు..
బరువు తగ్గడానికి ఆహారం, వ్యాయామం పట్ల క్రమశిక్షణతో కూడిన విధానం అవసరం. కేలరీల లెక్కింపు వ్యాయామం వంటివి బరువు తగ్గేందుకు ఉపకరించేవే. అయితే ఈ కంటెంట్ క్రియేటర్ బరువు తగ్గడానికి ఒక వెరైట్ డైట్ విధానం అనుసరించి ఏకంగా 38 కేజీల బరవు తగ్గాడు. అందుకు సంబంధించిన విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకున్నాడు. తాను భవిష్యత్తులో పుట్టబోయే బిడ్డ కోసం ఆరోగ్యకరమైన తండ్రిగా ఉండాలనే ఉద్దేశ్యంతో బరువు తగ్గానని వెల్లడించారు. మరి ఆయన అనుసరించిన డైట్ విధానం గురించి సవివరంగా తెలుసుకుందామా..!.కంటెంట్ క్రియేటర్ జెఫిన్ స్వతహాగా పెద్ద ఫుడ్డీనని అన్నారు. అనారోగ్యకరమైన స్నాక్స్ పట్ల ఉన్న ఇష్టం గురించి కూడా మాట్లాడారు. అలాగు తాను ఏళ్ల తరబడి అధిక బరువుతో పోరాడినట్లు తెలిపారు. తాను 2018లో 35 కిలోలు తగ్గానని, కానీ ప్రతి గ్రాము తిరిగి పెరిగిపోవడాన్ని చూశానని అన్నారు. అయితే 2022లో పెళ్లి కోసం మళ్లా బరువు తగ్గానని చెప్పారు. కానీ హైదరాబాద్‌కు మారిన తర్వాత ఒత్తిడి పెరిగి మళ్లీ యథావిధిగా బరువు పెరిగిపోయానని పోస్ట్‌లో రాసుకుకొచ్చారు. తన అధిక బరువు తనకు బాధకరమైన అంశంగా మారిందని అన్నారు. ఇతరులకు ఇచ్చే స్నేహపూర్వక సలహాలు కూడా ఒత్తిడిని పెంచాయని చెప్పారు. గతేడాది ఏకంగా 147 కిలోల అధిక బరువుకి చేరిపోయానని అన్నారు. పైగా టైప్ 2 డయాబెటిస్ ఉన్నట్లు నిర్థారణ అయ్యిందని చెప్పుకొచ్చారు. ఎప్పటికైనా.. తన జీవనశైలి కారణంగా తక్షణ స్ట్రోక్ ప్రమాదం వచ్చే అవకాశం ఉందని అన్నారు. పైగా తన భార్య రిన్సీ తను కలిసి ఒక బిడ్డను కనాలనే ఆలోచనలో ఉన్నామని చెప్పారు. ఆ నేపథ్యంలోనే తాము ఆరోగ్యంగా ఉండాలని నిర్ణయించుకుని..ఇలా వెయిట్‌లాస్ జర్నీకి ఉపక్రమించామని అన్నారు. అయితే తమ ఫిట్నెస్ ప్రయాణం ఎలా ప్రారంభమైందో ఇలా పంచుకుంది ఆ జంట. తాము ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్(అడపాదడపా ఉపవాసం)ని ఉపయోగించనట్లు తెలిపారు. ఆ నేపథ్యంలో సోమవారం నుంచి శుక్రవారం వరకు చిరుతిళ్లకు దూరంగా ఉండాలనే నియమం పెట్టుకున్నామని అన్నారు. అలాగే డైట్లో తన భార్య రోజుకు రెండు పూటల భోజనానికి మారగా, తాను ఒక్క పూట భోజనానికి కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. అలా ఇప్పుడు తాను 109కిలోలకు చేరానని, ఇప్పటికీ ఆ ఆహార నియమాన్ని, వ్యాయామాలను అనుసరిస్తున్నట్లు చెప్పారు. ఇప్పుడిక మరింతగా ఆరోగ్యకరమైన బరువు చేరుకోవడమే లక్ష్యంగా తామిద్దరం కలిసి పనిచేస్తున్నామని అన్నారు. ఒమాడ్ డైట్..ఒమాడ్ అంటే ఒకరకమైన ఇంటర్మిటెంట్ పాస్టింగ్. ఇది ఒక వ్యక్తి తీసుకునే కేలరీలను ఒకే భోజనానికి లేదా ఒక గంట వంటి తక్కువ సమయానికి పరిమితం చేస్తారు. అంటే రోజంతా ఒక భోజనం చేసి, ఇతర ఆహార పదార్థాలను తీసుకోకపోవడం లేదా ఒకే భోజనం చేసి, ఉపవాస సమయంలో పరిమిత పరిమాణాంలో ఆహారం తీసుకోవడం వంటివి ఉంటాయి. ఈ ఆహార పద్ధతి కేలరీల లోటుకి దారితీస్తుంది. అంటే శరీరం ఖర్చు చేసే కేలరీల కంటే తక్కువ కేలరీలను తీసుకుంటుంది. దీనివల్ల సునాయాసంగా బరువు తగ్గొచ్చు అని చెప్పారు. ఈ విధానం వల్ల ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటంటే.. రక్తంలో చక్కెర, వాపు స్థాయిలు తగ్గడం తోపాటు గుండె జబ్బుల ప్రమాద కారకాలు తగ్గుతాయని అన్నారు. కానీ ఈ ఆహార పద్ధతి పిల్లలు కౌమారదశలో ఉన్నవారికి, వృద్ధులకు, ఆహార సంబంధిత రుగ్మతలు ఉన్నవారికి, గర్భిణీ లేదా పాలిచ్చే మహిళలకు తగినది కాదని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. View this post on Instagram A post shared by Humans of Bombay (@officialhumansofbombay) గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: అంట్లు తోమే స్థాయి నుంచి..రూ. 160 కోట్ల కంపెనీ నిర్మించే రేంజ్‌కు..!) -
అంట్లు తోమే స్థాయి నుంచి..రూ. 160 కోట్ల కంపెనీ నిర్మించే రేంజ్‌కు..!
కటిక పేదరికం అందమైన బాల్యం దూరంచేసి చదువు దారిదాపుల్లోకి రానివ్వకుండా చేసింది. కానీ అతడి ఎదుగుదలను ఆపలేకపోయింది. చదువు లేకపోయినా..బతక నేర్చిన తెలివితేటలనే పెట్టుబడిగా పెట్టి..అంట్లు తోమే స్థాయి నుంచి వ్యవస్థాపకుడిగా మారి ఏకంగా 160 కోట్లు విలువ చేసే కంపెనీని నిర్మించే స్థాయికి చేరుకుని యువతకు ఆదర్శంగా నిలిచాడు. అంతేగాదు జీవితం అన్ని ఇవ్వకపోయినా..కష్టపడి సాధించుకుంటే అందులో ఉండే ఆనందమే వేరు అని చూపించాడు.ఆ వ్యక్తే రాజస్థాన్‌కు చెందిన విజయ్ వర్మ. రాజస్థాన్‌లోని ఝున్ఝును జిల్లా, బిసౌ గ్రామంలో అక్టోబర్ 1978లో జన్మించిన ఆయన బాల్యం కటిక దారిద్యంలో గడించింది. అతనికి పదేళ్లు వచ్చేసరికి తాతయ్య, నానమ్మ ఇద్దరూ చనిపోయారు. ఏడాదిలోపే తండ్రి కూడా చనిపోయారు. మిగిలింది తల్లి ఒక్కత్తే..ఆమెనే ఆరుగురు పిల్లలను పోషించాల్సి ఉంది. అయితే అక్కడ మహిళలు ఎప్పుడూ పొడవాటి ఘూంఘట్లతో గడప దాటి బయటకు రావడం చాలా అరుదు. అందువల్ల నాటి సమాజ ఆంక్షలను ధిక్కరించే అవకాశం లేక అతడి తల్లి ఆరుగురు పిల్లలను పోషించేందుకు ప్రతి రోజు సూర్యోదయానికి ముందే ఇంటి వెనుక ఉన్న అడవిలోకి వెళ్లి ఎండిన ఆకులు, పేడను సేకరించి బదులుగా 30-40 కిలోల పిండిని తెచ్చుకునేదని చెప్పుకొచ్చారు విజయ్ వర్మ. ఇంతలో అన్నయ్య అమ్మకు సాయంగా ఆస్పత్రిలో రెండు రూపాయల జీతానికి కార్మికుల భోజన పెట్టెలు మోసుకెళ్లే పనిలో చేరాడని అన్నారు. అంతా బాగానే సాగుతుంది అనుకుంటుండగా..ఒక ఏడాది తర్వాత మళ్లీ చేతిలో పనుల్లు లేక ఇబ్బందిపడాల్సి వచ్చింది. అప్పుడే తమ కుటుంబానికి తెలిసిన సీతారాం భాయ్ అనే వ్యక్తి మా అన్యయ్యను ముంబై తీసుకువెళ్లి నెలకు రూ. 500లు ఇప్పిస్తానని చెప్పారు. ఆరో తరగతిలో ఉన్నా తాను ఆ మాటలు విని పట్టుబట్టి మరి అన్యయ్య తోపాటు ముంబై వెళ్లినట్లు తెలిపారు. అయితే అక్కడ మురుగు కాలువ దుర్గంధం, దోమల బెడద తట్టుకోలే నరకం చూసి, ఇంటికి వెనుదిరిగి వెళ్లిపోదాం అనుకున్న తరుణంలో పూణే వెళ్లి పరిశుభ్రమైన వాతావరణ చూడమని సలహా ఇవ్వడంతో అక్కడికి పయనమైనట్లు తెలిపారు. అయితే తమకు సంరక్షకుడిగా ఉన్న వ్యక్తి రూ. 200లు ఇవ్వడంతో ఆ డబ్బులతో తాము రైలు ఎక్కి పూణేకి చేరుకున్నట్లు తెలిపారు. రైలు టికెట్ రూ. 20లు పోగా మిగిలినడబ్బుని ఎవరో ఎత్తుకుపోయిన ఘటన అస్సలు మరవనన్నారు. ఆ సమయంలో టాయిలెట్లు క్లీన్ చేసే ఒక అపరిచితుడు మమ్మల్ని చూసి జాలిపడి మాకు మూడు రోజులు అన్నం పెట్టి..టాయిలెట్ వాడుకునేందుఉ అనుమతించాడని అన్నారు. ఆ తర్వాత తాము అతడి వద్దే 18 రోరజు ఉండి వడా పావ్ అమ్మేవారికి గిన్నెలు కడుగుతూ రూ. 3లు సంపాదించినట్లు తెలిపారు. సరిగ్గా ఆ సమయంలోనిరాధర్ అనే రాజస్థానీ కాంట్రాక్టర్, వర్మ తనసోదరుడికి మంగళా థియేటర్లో రోజుకు రూ. 18 చొప్పున పునరుద్ధరణ పనులు చేసే పనులు అప్పగించడంతో తమ రాత మారినట్లు తెలిపాడు. అయితే విజయ్‌కి పనిచేసే వయసు తక్కువగా ఉండటంతో ఒక వృద్ధురాలికి ఇసుక జల్లించడంలో సాయం చేయమని చెప్పారు. అయితే ఆమె కంటే మూడు రెట్లు వేగంగా పనిచేయడంతో ఆశ్చర్యపోయిన కాంట్రాక్టర్ తనకు రోజుకు రూ. 8లు చెల్లించినట్లు తెలిపారు. ఆ తర్వాత నెలలో ఒక గదికి మారి రూ. 2లకు ఒక సైకిల్ని అద్దెకు తీసుకుని ఒక భవన నిర్మాణానికి సంబంధించి.. టైల్ ఫ్లోరింగ్ నుంచి ప్లాస్టరింగ్, ఆర్సీసీ వరకు ప్రతి అంశంలో నైపుణ్యం సాధించినట్లు తెలిపారు. ప్రతి నెల 25వ తేదీకి రూ. 90 నుంచి 170 వరకు మనీ ఆర్డర్లను పంపేవాళ్లమని అన్నారు. ఒక ఏడాది తర్వాత టిఫిన్ బాక్సులలో రూ. 65,000 నగదును దాచి మా ఊరికి వెళ్లి..మా ఇంటి వెనుకు ఉన్న పొదలను తొలగించి ఒక గోడను నిర్మించుకోగలిగామని గర్వంగా చెప్పారు.అన్నింటినీ మార్చేసిన ఆ అవకాశందానితో ధైర్యం తెచ్చుకున్న ఆ సోదరులు, సొంతంగా కాంట్రాక్టర్లుగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు విజయ్. ఇందుకోసం తమ గ్రామం నుంచి ఆరుగురు అబ్బాయిలను శిక్షణ కోసం చేర్చుకున్నామని అన్నారు. వారు విమల్ కుమార్ జైన్ అనే ఒక ప్రసిద్ధ బిల్డర్ వద్ద పని చేయాలని ఆశపడ్డారు. మూడు నెలల పాటు, ఆ బిల్డర్ వారిని "కేవలం పిల్లలు" అని కొట్టిపారేశాడు. చివరకు విజయ్ తాము, టైలింగ్, కిచెన్ ప్లాట్‌ఫారమ్‌లు, ఆర్‌సిసి, ప్లాస్టరింగ్ వంటి వాటిలో తనకు నైపుణ్యం ఉందని వాదించి మరి అవకాశం ఇవ్వమని అర్థించాడు. దాంతో ఆ బిల్డర్ 15 రోజుల్లో పూర్తి చేయాల్సిన ఒక శాంపిల్ ఫ్లాట్‌ను కేవలం ఎనిమిది రోజుల్లోనే పూర్తి చేయాలనే అసాధ్యమైన గడువు ఇచ్చాడు, అంతేగాదు పని పూర్తి చేయకపోతే జీతం కూడా ఉండదని హెచ్చరించాడు. కానీ విజయ్ బృందం ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా రేయింబవళ్లు పనిచేసి మూడు రోజుల్లోనే ఆ పనినని పూర్తి చేసి ఆశ్చర్యపోయేలా చేశారు. వారి వేగం, నాణ్యత చూసి ఆ ఇంజనీర్ కాంట్రాక్టర్ ఏకంగా రూ. 5100 అందజేశారు. అదే తమనుఅన్న పేరుమీద శ్యామ్‌సుందర్ చీరంజీవ్లాల్జీ కన్స్ట్రక్షన్ అనే కంపెనీని పెట్టే స్ధాయికి తీసుకెళ్లిందని చెప్పుకొచ్చారు. కొద్దిమంది కార్మికులతో మొదలైన ఆ కంపెనీ..చూస్తుండగానే ఏకంగా 350 మందికి పెరిగింది.ఆ తర్వాత కాంట్రాక్టర్ నుంచి వ్యవస్థాపకుడిగా1998 నాటికి, ఆ సంస్థలో సుమారు 850 మంది కార్మికులు పనిచేసేవారు, పైగా రూ. 8 కోట్ల వార్షిక టర్నోవర్‌ను నమోదు చేసేదని వెల్లడించారు. అయితే ఈ సంఖ్య పెరుగుతూనే ఉండి, 2004-05 నాటికి రూ. 20 కోట్లకు చేరుకుందని చెప్పారు. ఫైవ్-స్టార్ హోటళ్ల లాబీల నుంచి ఫామ్‌హౌస్‌ల వరకు, తాము అస్సలు వెనుతిరిగి చూడలేదని తెలిపారు. ఆ తర్వాత ఆయన 2008లో,సొంతంగా సాయి విజయ్ కన్‌స్ట్రక్షన్‌ను స్థాపించి, 2011లో దానిని LLPగా లాంఛనప్రాయంగా మార్చారు. 2017లో, ఆ కంపెనీ ఆదాయపు పన్ను విచారణను కూడా ఎదుర్కొన్నప్పటికీ, ఎటువంటి నష్టం లేకుండా బయటపడిందన్నారు. తమ రికార్డులు ఎంత పకడ్బందీగా ఉండేవంటే, దర్యాప్తు అధికారులు కనీసం రూ. 5,000 వ్యత్యాసాలను కూడా కనిపెట్టలేకపోయేవారని గర్వంగా చెప్పారు. ఈనాడు, ఆ కంపెనీ విలువ సుమారు రూ. 160 కోట్లు అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయనకు పూణేలో నాలుగు ఇళ్లు, ఒక ఫామ్ హౌస్ ఉన్నట్లు తెలిపారు. అంతేగాదు ఒమన్, యెమెన్ వంటి దేశాల్లో ఏకంగా రూ. 730 కోట్ల అంతర్జాతీయ ప్రాజెక్టులు కూడా ఉన్నాయని అన్నారు. అలాగే తన వద్ద శిక్షణ తీసుకున్న కార్మికులే కొందరు సొంతంగా వ్యాపారాలు కూడా చేస్తున్నట్లు వెల్లడించారు. అలాగే ఆర్థికపరిస్థితుల దృష్ట్యా కోల్పోయిన చదువుని తిరిగిపోందడం కోసం..30వ ఏట ఓపెన్ స్కూలింగ్ సాయంతో పది పూర్తి చేసి, సివిల్ ఇంజనీరింగ్ డిప్లొమా, పీహచ్‌డీ పూర్తి చేసినట్లు తెలిపారు. అంతేగాదు ఆయన ఇప్పుడు ఇంజనీరింగ్ విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస పాఠాలను చెబుతున్నారు. అరగంటగా మొదలయ్యే తన ప్రసంగాలు విద్యార్థుల ప్రోత్సాహంతో రెండు మూడు గంటల వరకు సాగుతాయని చెప్పుకొచ్చారు. అంతేగాదు విజయ్ వర్మ కుమారుడు కంప్యూటర్ ఇంజనీరింగ్ చదువుతున్నట్లు తెలిపారు.ఆయన చెప్పే జీవిత పాఠాలు..తనలాంటి జీవితాన్ని నిర్మించుకోవడానికి ఏం కావాలని అడిగితే, నిజాయితీ, కఠోర శ్రమ, పట్టుదల అని తడుముకోకుండా చెప్పేస్తారు. అంతేగాదు తాము ఎదిగే క్రమంలో ఒక రాత్రి పోలీసులో దాడిలో తీవ్రంగా గాయపడ్డమని అన్నారు. దాంతో తన అన్నయ ఆస్పత్రి పాలవ్వాల్సి వచ్చిందని అన్నారు. ఆ ఘటన తనకు గౌరవనీయమైన వ్యక్తులతో సత్ససంబంధాలు ఏర్పరుచుకోవడం అత్యంత ముఖ్యమని తెలిసొచ్చిందన్నారు. అంతేగాదు విజయ్ అందమైన జీవితాన్ని నిర్మించుకోవడమే కాదు, బాల్యంలో మిస్సైన అభిరుచుల వైపుకి మళ్లుతూ పియానో, మార్వాడీ జానపద గీతాలు వంటివి కూడా నేర్చుకుంటూ..తన బాల్యన్ని తిరిగి పొందే ప్రయత్నం చేస్తుంటానని అన్నారు.(చదవండి: చేతితో చిత్రించిన పటచిత్ర చీరలో నీతా అంబానీ అద్భుతమైన లుక్..!) -
దంపతులు అలా నిద్రిస్తేనే మంచిది..!: బ్రయాన్ జాన్సన్
టెక్ వ్యవస్థాపకుడు, దీర్ఘాయువు నిపుణుడు బ్రయాన్ జాన్సన్ ఆరోగ్యకరమైన జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను ఎప్పటికప్పుడు పంచుకుంటుంటారు. ఈసారి మాత్రం ఆయన చెప్పిన విషయం అందర్నీ విస్తుపోయేలా చేసింది. పైగా అవి కాస్త సర్వత్రా వివాదాస్పదంగా, చర్చనీయాంశంగా మారాయి. ఇంతకీ ఆయన ఏం అన్నారంటే..బ్రయాన్ జాన్సన్ మంచి నిద్ర కోసం దంపతులకు కొన్ని ఆసక్తికరమైన సూచనలు, సలహాలు ఇచ్చారు. అయితే ఇక్కడ దంపతులు ఎలా బెడ్ షేర్ చేసుకుంటే మంచిదో చెప్పడమే కాస్త చర్చలకు దారితీసింది. వేర్వేరు పడకలు అనేవి భార్యభర్త మధ్య దూరానికి సంకేతంగా చెబుతారు పెద్దలు. కానీ బ్రయాన్ మాత్రం ఆరోగ్యకరమైన నిద్ర కోసం భాగస్వామ్యులు వేర్వేరుగా పడుకుంటేనే మంచిదని బాంబు పేల్చాడు. అంతేగాదు తాను సైతం తన గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి నిద్రించనని తేల్చి చెప్పేశాడు. అది నిద్రనాణ్యతను ప్రభావితం చేస్తుందని చెబుతున్నాడు. నిజంగా జంటలు కలిసి నిద్రిస్తే..నిద్ర నాణ్యతపై ఎలాంటి ప్రభావవం చూపుతుంది అనే పరిశోధనను కూడా పంచుకున్నారు. మొత్తం 52 జంటలపై జరిపిన అధ్యయనంలో భాగస్వామి ప్రేరేపితంగా ఒక రాత్రికి సుమారు ఆరుసార్లుకు పైగా పలువురు మెలుకువగా ఉన్నట్ల జాన్సన్ చెబుతున్నారు. అయితే ఈ విషయంపై శాస్త్రవేత్తల మధ్య భిన్నాబిప్రాయాలు ఉన్నట్లు కూడా వెల్లడించారు. పరిశోధన ప్రకారం..కలిసి నిద్రపోవడం వల్ల సుమారు 10% ఎక్కువ REM (ర్యాపిడ్ ఐ మూవ్మెంట్) నిద్ర సరిగా లేదని తేలింది. ముఖ్యంగా భాగస్వామితో కలిసి పడుకుంటే మహిళల నిద్ర గణనీయంగా క్షీణిస్తున్నట్లు గమనించారు. అయితే పురుషులు బాగా నిద్రపోతున్నట్లు తెలిపారు జాన్సన్. అదే సమయంలో కలిసి నిద్రపోతున్న వెయ్యి వయోజన జంటలపై జరిపిన సర్వేలో చాలామంది బాగా నిద్రపోవడమే గాక, వారి మానసిక ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉన్నట్లు తెలిపారు. ఈ నివేదిక ఆధారంగా సంతోషంగా, ఆరోగ్యంగా ఉన్న జంటలు బెడ్ షేర్ చేసుకోవడంలో సమస్య ఉండదని వెల్లడైందని అన్నారు. చివరగా ఆయన జంటలు కలిసి నిద్రపోవాలా లేక వేర్వేరుగా నిద్రపోవాలా అనేది ఆయా జంటల వ్యక్తిగత అభిప్రాయమని అన్నారు. అయితే ఆయన వివరణ సోషల్ మీడియాలో విపరీతమైన చర్చకు దారితీసింది. కొందరు ఆయన మాటలకు మద్దతించగా, మరికొందరు మంచి నిద్ర మిమ్మల్ని మంచి భాగస్వాములుగా చేస్తుందని కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు.(చదవండి: ఆంథోసయనిన్ గుండె, జీవక్రియ ఆరోగ్యానికి ఎలా తోడ్పడుతుందంటే..!) -
సోలో ట్రావెల్ చేశారంటే.. మిమ్మల్ని మీరు తెలుసుకుంటారు!
సోలో ట్రావెల్ అంటే లోన్లీనెస్ అని చాలా మంది అనుకుంటారు. కానీ నిజానికి ఒంటరిగా ప్రయాణిస్తున్నప్పుడు మనతో మనం ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తాము. ఎవరికోసం వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఎక్కడికి వెళ్లాలి, ఎక్కడ ఆగాలి, ఏం తినాలి, ఎవరితో మాట్లాడాలి అనే నిర్ణయాలు అన్నీ మనమే తీసుకుంటాము.నిర్ణయాలు తీసుకోవడం నేర్చుకుంటాముసోలో ట్రిప్‌లో చిన్న చిన్న నిర్ణయాలు కూడా మనమే తీసుకోవాలి. ట్రైన్ మిస్ అయితే నెక్ట్స్ ఆప్షన్స్ ఏంటి? హోటల్ నచ్చకపోతే ఏం చేయాలి? రూట్ ఛేంజ్ అయితే ఎలాప్రొసీడ్ అవ్వాలి? ఇలాంటి సిచ్చువేషన్స్ మన కాన్ఫిడెన్స్‌ని పెంచుతాయి. జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు టెన్షన్ పడకుండా సిచ్చువేషన్స్ని హ్యాండిల్ చేయడం అలవాటు అవుతుంది.కొత్తవారితో మాట్లాడే ధైర్యం వస్తుందిప్రయాణాల్లో కొత్తవారితో మాట్లాడటం సాధారణం అవుతుంది. లోకల్ షాప్ ఓనర్స్, ఆటో డ్రైవర్స్, తోటి ప్రయాణికులు లేదా ఒక చిన్న కేఫెలో కలిసిన వ్యక్తితో సంభాషణ ప్రారంభిస్తాము. ఇలా కొత్తవారితో కనెక్ట్ అవ్వడం వల్ల మన కంఫర్ట్ జోన్ మెల్లిగా పెరుగుతుంది.మన గురించి మనకు తెలుస్తుందిగ్రూప్ ట్రావెల్లో మన పర్సనాలిటీలో కొన్ని సైడ్స్ బయటికి రాకపోవచ్చు. కానీ సోలో ట్రావెల్లో మనమే మన ప్రపంచం. మనమే మనకు తోడు. సైలెన్స్‌ని ఎంజాయ్ చేయడం, అంతగా తెలియని ప్రాంతాల్లో అడ్జస్ట్ అవ్వడం, ఊహించని పరిస్థితులను హ్యాండిల్ చేయడం వల్ల మన బలాలు, బలహీనతలు రెండూ మనకు క్లియర్‌గా తెలుస్తాయి.చిన్న చిన్న ఆనందాల విలువ తెలుస్తుంది.ఒక హాట్ టీ, మార్నింగ్ స¯Œ రైజ్, కొత్త ప్రాంతంలో ప్రశాంతమైన స్ట్రీట్, లాంగ్ ట్రైన్ జర్నీంఇలాంటి సింపుల్ మూమెంట్స్ కూడా స్పెషల్‌గా అనిపిస్తాయి. ట్రావెల్ మన అటెన్షన్‌ని పెద్ద పెద్ద టాస్కుల నుంచి చిన్న చిన్న ఆనందాలవైపు మళ్లిస్తాయి.కొత్త వ్యక్తిగా తిరిగి వస్తారుసోలో ట్రిప్ కంప్లీట్ చేసి ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు సూట్‌కేస్‌లో కొన్ని కొత్త వస్తువులు, మైండ్‌లో కొత్త మెమోరీస్తో పాటు ఒక కొత్త వ్యక్తిత్వం, కొత్త ఐడియాలజీతో ఒక కొత్త వ్యక్తిగా తిరిగి వస్తారు. మనపై మనకు నమ్మకం పెరుగుతుంది. ప్రపంచం గురించి మాట్లాడటమే కాదు, మన గురించి కూడా తెలుసుకోవడానికి ట్రావెల్ ఒక బ్యూటిఫుల్ ఐడియాగా పనికొస్తుంది. మనల్ని మనకు కొత్తగా పరిచయం చేస్తుంది ఒంటరి ప్రయాణం. అందుకే జీవితంలో అప్పుడప్పుడూ సోలో ట్రిప్స్ చేస్తుండాలి. -
మొదటిసారి ఫ్లైట్ జర్నీనా? అయితే ఈ రూల్స్ తెలియాల్సిందే!
మొదటిసారి ఫ్లైట్ జర్నీ అంటే ఎక్సైట్మెంట్తో పాటు కొంచెం కన్ఫ్యూజన్ కూడా ఉంటుంది. ట్రైన్ లేదా బస్సులో మనం క్యాజువల్‌గా కేరీ చేసే వస్తువులు కొన్ని విమానాల్లో అనుమతి ఉండకపోవచ్చు. అందుకే ఎయిర్పోర్ట్ వెళ్లడానికి ముందు లగేజ్‌లో ఏం పెట్టాలి, ఏం పెట్టకూడదు అనేది తెలుసుకోవడం ముఖ్యం.పెద్ద లిక్విడ్ బాటిల్స్ వద్దు: షాంపూ, పెర్ఫ్యూమ్, లోషన్, క్రీమ్స్, జెల్స్ లాంటి ద్రవ పదార్థాలను క్యాబిన్ బ్యాగేజీలో తీసుకెళ్లేప్పుడు రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. పెద్ద బాటిల్స్ కన్నా ట్రావెల్ సైజ్ కంటెయినర్స్ తీసుకెళ్లడం బెటర్. సెక్యూరిటీ చెక్ దగ్గర అనవసర కన్ ఫ్యూజన్ రాకుండా ముందుగానే ప్యాక్ చేసుకోవాలి.షార్ప్ వస్తువులు తీసుకెళ్లరాదు: కత్తి, బ్లేడ్, కటర్, పెద్ద కత్తెర, ఐరన్ స్కేల్ లాంటి షార్ప్ వస్తువులను బ్యాగులో పెట్టుకోరాదు. వీటి వల్ల సెక్యూరిటీ చెక్‌లో ఆపేసే అవకాశం ఉంది. అవసరమైన వస్తువులు ఉంటే ఎయిర్‌లైన్ బ్యాగేజ్ రూల్స్ ప్రకారం వాటిని ప్యాక్ చేయడం మంచిది.పవర్ బ్యాంక్ చెకిన్ బ్యాగ్‌లో పెట్టకండి: ఫస్ట్ టైమ్ ట్రావెల్ చేసే వారు సాధారణంగా చేసే తప్పుల్లో పవర్ బ్యాంకును చెకిన్ బ్యాగులో పెట్టడం ఒకటి. జనరల్లీ పవర్ బ్యాంకును, స్పేర్ లిథియం బ్యాటరీలను క్యాబిన్ బ్యాగేజ్లోనే కేరీ చేయాలి. చెకిన్ బ్యాగేజీలో పెట్టడానికి అనుమతి ఉండకపోవచ్చు.లైటర్స్, అగ్గిపెట్టెలు: లైటర్స్, అగ్గిపెట్టెలు లాంటి నిప్పు సంబంధించిన వస్తువులను తీసుకెళ్లడం నిషేధం కావచ్చు. వీటిని లగేజీలో పెట్టే ముందు మీ ఎయిర్‌లైన్ రూల్స్‌ను పక్కాగా చెక్ చేయండి.బొమ్మ ఆయుధాలు కూడా వద్దు: టాయ్ గన్స్, రెప్లికా ఆయుధాలు, ఆయుధాల లాగా కనిపించే వస్తువులు ఉంటే సెక్యూరిటీ వద్దే ఆపేసే అవకాశం ఉంది. అందుకే ఇలాంటి వస్తువులను ఫ్లైట్‌లో కేరీ చేయకపోవడమే మంచిది.పేలుడు వస్తువులు తీసుకెళ్లకండి: టపాసుల వంటి ఫైర్ వర్క్స్, ఫ్యూయల్, గ్యాస్ సిలిండర్, కెమికల్స్ లాంటి ప్రమాదకరమైన వస్తువులను ఫ్లైట్‌లో తీసుకెళ్లడం నిషేధం. వీటిని చెక్డ్ బ్యాగేజీలో కూడా తీసుకెళ్లడానికి అనుమతి ఉండకపోవచ్చు.లగేజ్ బరువు: ఫస్ట్ టైమ్ అవసరం లేని వస్తువులతో బ్యాగును ఫుల్ చేయడం కన్నా అవసరమైన వస్తువులను మాత్రమే కేరీ చేయడం మంచిది. పాస్‌పోర్ట్ లేదా ఐడీ, టికెట్, ఫోన్, చార్జర్, మందులు, ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్‌ని సులభంగా లభించే ప్రదేశంలో ఉంచుకుంటే ఎయిర్పోర్ట్ ప్రాసెస్ సులభంగా ఉంటుంది.ఫ్లైట్‌కు ముందు చెక్ చేయండి: చివరిగా ప్రతీ ఎయిర్‌లైన్ లో బ్యాగేజి రూల్స్ కొంచెం డిఫరెంట్‌గా ఉండవచ్చు. కాబట్టి ఫ్లైట్‌కి బయల్దేరే ముందు మీ ఎయిర్‌లైన్ అఫిషియల్ బ్యాగేజ్ రూల్స్ ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా ముందుగానే ప్రిపేర్ అయితే ఫస్ట్ ఫ్లైట్ జర్నీ టెన్షన్ లేకుండా స్మూత్‌గా స్టార్ట్ అవుతుంది. -
దేశం చివరి అంచుల వరకు.. అద్భుత దృశ్యం!
భారత్ అంటే ఒక దేశం మాత్రమే కాదు విభిన్న ఆచారాలు, సంప్రదాయాలు, భౌగోళిక స్వరూపం ఉన్న ఒక ప్రపంచం. ఉత్తరాన హిమాలయాల నుంచి అరుణాచల్ ప్రదేశ్, దక్షిణాన సముద్ర తీరం వరకు కొన్ని ప్రదేశాలు దేశ వైభవాన్ని చాటి చెబుతాయి. మ్యాప్ మీద గీసిన గీతలు ఆగిపోయే చోట, పర్వతాలు, సముద్రం, నదులు కలిసి ఒక కొత్త భారతదేశాన్ని మనకు పరిచయం చేస్తాయి. మానా, కిబితూ, చిట్కుల్, ధార్చులా, కన్యాకుమారి.. వీటిలో ఎక్కడికి వెళ్లినా అది ప్రయాణం మాత్రమే కాదు ఒక అనుభవం.ఉత్తరాఖండ్‌లోని మానా అనేది బద్రినా«ద్‌కి దగ్గరగా సరస్వతీ నది జన్మించి.. భూ గర్భంలోకి ఇంకిపోయే ప్రదేశంలో ఉన్న చిన్నగ్రామం. ఇండో టిబెటెన్ బార్డర్ వైపు ఉన్న ఈ ప్రదేశంలో రాతి ఇల్లు, ఇరుకు వీధులు, చుట్టూ నిలబడి ఉన్న హిమాలయ కొండలు ఒక ప్రశాంతమైన దృశ్యాన్ని ఇస్తాయి.సరస్వతీ నదీ ప్రవాహం, భీముడి వంతెన, వసుధారా జలపాతం వైపు సాగే పర్వత మార్గం మానా ప్రయాణాన్ని గుర్తుండిపోయేలా చేస్తాయి.అరుణాచల్ ప్రదేశ్‌లోని కిబుతు దగ్గరికి చేరుకునే కొద్ది ప్రకృతి మరింత వైల్డ్‌గా మారిపోతుంది. లోహిత్ నది, ఎతై ్తన పైన్ వృక్షాలు, మేఘాలతో కప్పబడిన కొండలు కలిసి తూర్పు హిమాలయ ప్రపంచాన్ని చూపిస్తాయి. డాంగ్ నుంచి కిబుతు వైపు సాగే మార్గం భారత దేశ ఈశాన్య భూభాగం వైభవాన్ని చూపిస్తుంది.హిమాచల్ ప్రదేశ్‌లోని చిట్కుల్ అనేది బాస్పా లోయలో 3,450 మీటర్ల ఎత్తులో ఉన్న గ్రామం. చుట్టూ బాస్పా నది, చెక్కతో నిర్మించిన ఇల్లు, మతి దేవీ ఆలయం అన్నీ కలిసి ఒక నిశ్శబ్దమైన హిమాలయ పెయింటింగ్‌లా అనిపిస్తాయి. ఇండో టిబెటన్ బార్డర్ వద్ద ఉన్న చిట్కుల్ హిమాచల్‌లోని చివరి గ్రామ వైభవాన్ని చూపిస్తుంది.ఉత్తరాఖండ్‌లోని పితోర్ఘడ్ జిల్లాలో ఉన్న ధార్చులా అనేది కాస్త భిన్నమైన గ్రామం. ఇది ఒక చివరి గ్రామం మాత్రమే కాదు కాళీ నది ఒడ్డున నిలిచిన సరిహద్దు పట్టణం కూడా. ఒకవైపు భారత్, మరో వైపు నేపాల్ మధ్యలో ప్రవహించే కాళి నదీ రెండూ ప్రపంచాలను కలుపుతుంది. జాల్జిబి మార్కెట్, నారాయణ్ ఆశ్రమం, పంచచులి దృశ్యాలు ఈ ప్రదేశాలకు మరింత రంగులు జోడిస్తాయి.దక్షిణాన కన్యాకుమారి దగ్గరికి చేరుకుంటే హిమాలయాల నిశ్శబ్దం కాస్త ఇక్కడ సముద్ర గాలిగా మారిపోతుంది. భారత దేశ దక్షిణాదిలో చివరి భాగం అయిన కన్యాకుమారి వద్ద అరేబియన్ సముద్రం, బంగాళాఖాతం, హిందూ మహా సముద్రం కలిసే దశ్యం ఒక సినిమాలో హ్యాపీ ఎండింగ్‌లా ఉంటుంది.ఇక్కడ వివేకానందా రాక్ మెమోరియల్, తిరువళ్లూరు స్టాట్యూ, కుమారి అమ్మన్ ఆలయం ఈ తీర చరిత్ర, సంస్కృతిని రెండింటినీ అందిస్తాయి.ఏం చూడాలి?మానాలో సరస్వతి నది శబ్దాన్ని వినడం, భీమ్ పుల్ దగ్గర నిలబడి సరస్వతీ నదీ పర్వతాల మధ్యలోంచి జారిపడే సమయంలో ఏర్పడే ఇంద్రధనస్సును చూడటం, వసుధారా జలపాతం వెళ్లే దారిలో హిమాలయ వైభవాన్ని వీక్షించడం ఇవన్నీ జీవితకాలం గుర్తుంటాయి.అలాగే చిట్కుల్లో బాస్పా నది పక్కనే నడవటం, మతి దేవీ ఆలయం శిల్పకళ వైభవాన్ని గమనించడం, గ్రామాల్లో వుడెన్ హౌసెస్ మధ్య సమయం గడపటం మరొక అనుభవం.కిబుతులో లోహిత్ వ్యాలీ దృశ్యాలు, ధార్చులాలో కాళీ నది వైపు కనిపించే బార్డర్ ల్యాండ్‌స్కేప్, కన్యాకుమారిలో సముద్ర సంగమం, వివేకానంద రాక్ంఇలా ప్రతీ చోటు భారత దేశం చివరి భాగం వరకు ఎంత అందమైనదో, ఎంత విభిన్నమైనదో చూపిస్తుంది.ఎక్కడ ఉండాలి?మన ప్రయాణంలో బద్రినాథ్ లేదా జోషిమఠ్‌లో సింపుల్ హోటల్స్, గెస్ట్ హౌజ్‌ల మధ్య ఒక హిమాలయన్ స్టే అనుభవం లభిస్తుంది.చిట్కుల్, సాంగ్లా ప్రాంతాల్లో హోమ్‌స్టేస్, చిన్న హోటల్స్, గ్రామీణ జీవనాన్ని దగ్గరగా చూపిస్తాయి.ధార్చులాలో కాళీ నది వైపు ఉండే హాస్టల్స్, లాడ్జిలు బార్డర్ ప్రాంతంలో లైఫ్‌ను ఆస్వాదించేందుకు అవకాశాన్ని అందిస్తాయి.కన్యాకుమారిలో సముద్రం దగ్గర హోటల్స్‌లో సూర్యోదయం, సన్ సెట్ రెండూ ఆస్వాదించడం ప్రయాణంలో ప్రత్యేక జ్ఞాపకంగా మిగిలిపోతుంది.ఏం తినాలి?హిమాలయన్ గ్రామాల్లో లోకల్‌గా దొరికే సింపుల్ భోజనం ఆ ప్రదేశ జీవన విధానాన్ని చూపిస్తుంది.మానాలో రాజ్మా, పొటాటో లాంటివి స్థానికంగా పండిస్తారు.చిట్కుల్, కిన్నోర్ ప్రాంతాల్లో సిద్దు, చనా మాద్రా లాంటివి స్థానిక రుచులను ఆస్వాదించవచ్చు.కన్యాకుమారి చేరుకున్నప్పుడు ప్లేట్లో వడ్డించే ఫుడ్ కడుపునే కాదు మనసును కూడా నింపేస్తాయి.తీర ప్రాంతంలో సౌత్ ఇండియన్ మీల్, కొబ్బరితో చేసిన వంటకాలు, సీ ఫుడ్ ఎంజాయ్ చేయవచ్చు.ఆసక్తికరమైన విషయాలుమానా అనేది ఉత్తరాఖండ్ ఇండో టిబెటన్ బార్డర్ వైపు ఉన్న చివరి గ్రామంగా ఫేమస్ అయింది.కిబుతు అరుణాచల్ ప్రదేశ్‌లో తూర్పు వైపున ఉన్న రిమోట్ బార్డర్ డెస్టినేషన్.చిట్కుల్ అనేది బాస్పా లోయలో 3,450 మీటర్ల ఎత్తులో ఉంటుంది.ధార్చులా కాళీ నది ఒడ్డున భారత్ నేపాల్ బార్డర్ టౌన్.కన్యాకుమారి భారత ప్రధాన భూభాగానికి దక్షిణాది చివరి అంచు. ఇక్కడ అరేబియన్ సముద్రం, బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం కలిసే దృశ్యాన్ని చూడొచ్చు.ఎలా వెళ్లాలి?హైదరాబాద్ నుంచి ఈ ఐదు చివరి గ్రామాలను ఒకే ట్రిప్‌లో చూడటం కన్నా వేరు వేరు వేరుగా ప్లాన్ చేయడం బెటర్. మానా కోసం హైదరాబాద్ నుంచి డెహ్రాడూన్ వైపు ఫ్లైట్ జర్నీ అక్కడి నుంచి జోషిమఠ్, బద్రినాథ్ మార్గంలో సాగే రోడ్డు జర్నీ ఒక మంచి ట్రాన్సిషన్ లా ఉంటుంది. బద్రినాథ్ నుంచి మానా వైపు పర్వతాల మధ్య ప్రయాణం మొదలు అవుతుంది. మీరు నడుస్తూ కూడా వెళ్లవచ్చు.కిబుతు కోసం హైదరాబాద్ నుంచి అస్సాం లేదా అరుణాచల్ ప్రదేశ్‌కి ఎయిర్ జర్నీ తరువాత రోడ్డు జర్నీ చేయవచ్చు. చిట్కుల్ కోసం చండిగఢ్ లేదా షిమ్లావైపు వెళ్లాలి. అక్కడి నుంచి కిన్నౌర్ కొండల మధ్య సాగే రోడ్ జర్నీ సూపర్ మెమోరీగా మిగిలిపోతుంది. ధార్చులా కోసం ఉత్తరాఖండ్‌లోని తానక్‌పూర్ లేదా పితోర్‌గఢ్ వైపు సాగే ప్రయాణం హిమాలయాలలో మరో ముఖాన్ని చూపిస్తుంది.కన్యాకుమారి అనేది హైదరాబాద్ నుంచి రైలు, రోడ్డుమార్గంలో ఈజీగా రీచ్ అవ్వగల డెస్టినేషన్.తమిళనాడులోని ఈ ప్రాంతానికి వెళ్లే సమయంలో మీకు పర్వతాలకు బదులు సముద్రం కనిపించడం ఈ ప్రయాణంలో ఒక బ్యూటిఫుల్ ఛేంజ్‌లా కనిపిస్తుంది.ఏం చేయాలి?ఈ ప్రయాణంలో ఒకసారి అయినా మానాలో సరస్వతి నదిని చూడాలి.చిట్కుల్లో బాస్పా నది పక్కన నడవాలి.కిబుతూలో తూర్పు హిమాలయాల నిశ్శబ్దాన్ని ఆస్వాదించాలి.ధార్చులాలో కాళీ నది రెండు దేశాలను కలిపే సన్నివేశాన్ని చూడాలి.చివరగా కన్యాకుమారిలో సముద్రం ముందు నిలబడి భారత దేశ దక్షిణ అంచుని ఫీల్ అవ్వాలి.యాత్రా, బడ్జెట్ వివరాలుఈ ఐదు డెస్టినేషన్స్‌ను ఒకటే ట్రిప్‌లో లేదా 5 రోజుల్లో కవర్ చేయడం లేదా చేయాలి అనుకోవడం అంత మంచి ఐడియా కాదు. సో, 5 రోజుల ట్రిప్‌ను మానా, చిట్కుల్, కిబుత్ లాంటి దగ్గరగా ఉన్నహిమాలయన్ డెస్టినేషన్స్ కవర్ చేసేలా ప్లాన్ చేసుకోవచ్చు. ఇలా ప్లాన్ చేస్తే హైదరాబాద్ నుంచి విమానాలు, తరువాత లోకల్ ట్రాన్స్పోర్ట్, స్టే కలిపి బడ్జెట్ రేంజ్ సుమారు రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు అవుతుంది.స్టాండర్డ్ బడ్జెట్ వచ్చేసరికి రూ.30 వేల నుంచి రూ 50 వేల వరకు, ప్రీమియం అయితే రూ.60 వేల నుంచి రూ. 80 వేల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది.కిబుత్ లాంటి దూర ప్రాంతాలకు వెళ్లేప్పుడు రోడ్డు ప్రయాణమే ఎక్కువగా చేయాల్సి ఉంటుంది. కాబట్టి బడ్జెట్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ధార్చులా ట్రిప్‌ను అయితే రూ.18 వేల నుంచి రూ.35 వేల మధ్యలో ప్లాన్ చేసుకోవచ్చు.కన్యాకుమారి 5 రోజుల ట్రిప్‌ను రూ.15 వేల నుంచి రూ.30 వేల రేంజిలో ప్లాన్ చేసుకోవచ్చు. అయితే ఇది మీ ట్రావెల్ క్లాస్, ఎంచుకునే హోటల్‌ను బట్టి మారుతుంది.స్టే కోసం హిమాలయన్ డెస్టినేషన్ లో రోజుకు సుమారు రూ.1,000 నుంచి రూ.4,000 వరకు ప్రీమియం ప్రాపర్టీలలో దానికంటే ఎక్కువ ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. ఫుడ్ కోసం ప్రతీ రోజు సుమారు రూ.500 నుంచి రూ.1,200 వరకు ఖర్చు అవుతుంది. అరుణాచల్ ప్రదేశ్‌లోని మారుమూల ప్రాంతాలకు వెళ్లేందుకు ముందస్తుగానే ఇన్నర్‌లైన్ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఎంట్రీకి ముందు కావాల్సిన ఇతర రిక్వైర్మెంట్స్ కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది.– ఎం.జి. కిశోర్, ప్రయాణికుడు -
దుఃఖం అంటే శిక్ష కాదు..!
వ్యక్తులు, వస్తువులు, పరిస్థితులపై పరిమితికి మించిన వ్యామోహం పెంచుకోవడం దుఃఖానికి మూలం. దుఃఖం వచ్చినప్పుడు దాన్ని నిరోధించకుండా శ్రద్ధగా గమనిస్తే, కాలక్రమేణా ఆ భావం బలహీనపడిపోతుంది.దుఃఖం అనేది ఒక శిక్ష కాదు, అది మనల్ని మనం సరిచేసుకోవడానికి, మేల్కొలపడానికి ప్రకృతి ఇచ్చే అవకాశం. బాహ్య ప్రపంచాన్ని లేదా పరిస్థితులను మనం మార్చలేకపోవచ్చు. కానీ ఆధ్యాత్మిక సాధన ద్వారా మన ఆంతరిక ప్రపంచాన్ని, ఆలోచనా విధానాన్ని మార్చుకోవచ్చు. మనస్సును అజ్ఞానం నుండి జ్ఞానం వైపు మళ్లించినప్పుడు దుఃఖ విముక్తి మాత్రమే కాక, శాశ్వతమైన ఆత్మానందం లభిస్తుంది. రోజూ కొంతసేపు ధ్యానం చేయడం వల్ల మనస్సు ప్రశాంతపడి, ఆలోచనల శ్రమ తగ్గుతుంది. మన దగ్గర లేనిదాని కోసం బాధపడటం కంటే, ఉన్నదానిని తలచుకుని ప్రకృతికి కృతజ్ఞత కలిగి ఉండటం, ఇతరులకు సహాయం చేయడం, సమాజ సేవలో పాల్గొనడం వల్ల మన దృష్టి స్వార్థం నుంచి వైదొలగి మనస్సు ఆనందంతో నిండుతుంది.– తరిగొప్పుల వీఎల్లెన్ మూర్తి -
ప్రేమకు పసిపిల్లలే!
ఆమె పట్టణంలోనే పెద్ద పేరున్న వైద్యురాలు. వందలాది ఆపరేషన్లు విజయవంతంగా చేసి రోగుల మన్ననలు పోందిన డాక్టర్ ఆమె. అలాంటి డాక్టర్ ఓ రోజు రాత్రి పది గంటల సమయంలో ఒంటరిగా కూర్చుని ఏడుస్తోంది. అప్పుడే ప్రాక్టీసు ముగించుకుని వచ్చిన ఆమె భర్త అది చూసి ఆశ్చర్యపోయాడు. ఆయనొక పేరున్న మానసిక వైద్యుడు. వారికి పెళ్లై మూడు పుష్కరాలు దాటినా ఆమె కళ్ళలో అతడెప్పుడూ తడి చూడలేదు. దాంతో అతడు మొదటిసారిగా చలించాడు. ఎందుకు ఏడుస్తున్నావని రెండుమూడు సార్లు అడిగాడు. ఆమె ఏడుపు మరింత పెద్దది చేసింది కానీ సరైన సమాధానమివ్వలేదు.పక్కకి వెళ్ళి నర్సింగ్ హోమ్ నిర్వాహకుడికి ఫోన్ చేశాడు. ఈ రోజు రోగులతో ఇబ్బంది కానీ, పేచీ కానీ వచ్చిందేమోనని అడిగాడు. అలాంటిదేమీ లేదని అక్కడి నుంచి సమాధానమొచ్చింది. ఆమె ఏడుపునకు కారణం ఏమై ఉంటుందా అని గది అంతా కళ్ళతోనే వెదికాడు. ఆమె పక్కనే మొబైల్ ఉండటం గమనించాడు. మొబైల్ ని ఓపెన్ చేసి చూశాడు.అర్థ గంట ముందే మధురైలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న కొడుకుతో వీడియో కాల్ చేసి మాట్లాడి ఉండటం గమనించాడు. పని ఒత్తిడి వల్ల కొడుకు తల్లిని కోపంగా మాట్లాడి ఉంటాడని భావించి ఆమెను అదే విషయం అడిగాడు. ఏడుస్తూనే అలాంటిదేమీ లేదని చెప్పింది. పోనీ కోడలుతో పేచీ పడ్డావా అని ప్రశ్నించాడు. చేత్తో కన్నీటిని తుడుచుకుంటూనే తలని అడ్డంగా తిప్పింది.చిన్నగా వెన్నెల్లో నడుద్దాం రమ్మని మిద్దె మీదకు పిలిచాడు. అక్కడ కొద్దిసేపు నడిచాక ఆమె మళ్ళీ భోరున ఏడుస్తూ ‘‘మనవరాలికి ఆరవ నెలలో వేయాల్సిన టీకాలు వేశారటండీ! లేత ఒళ్ళు... ఎర్రగా కందిపోయి ఉంటుంది. లోకం తెలియని పసిబిడ్డ. గుక్క తిప్పుకోకుండా ఏడ్చిందట. పాపం... ఎంత నొప్పి ఉంటే అంతగా ఏడ్చి ఉంటుంది’’ అని ముక్కు చీదుతూ చెప్పింది. మానసిక వైద్యుడైన భర్త చిన్నగా ఆమెను ఓదారుస్తూ ‘ఆ బిడ్డ కాదు పసిపిల్ల. నువ్వు పసిపిల్ల. అందుకే అలా ఏడుస్తున్నావు. టీకాలు బిడ్డ మంచి కోసమే కదా వేసేది. ఈరోజు నొప్పి అని వేయకుంటే భవిష్యత్తులో సమస్యలొస్తాయి కదా’ అని నచ్చజెప్పి ఆమెను పడకగదికి తీసుకొచ్చి పడుకోబెట్టాడు.నిద్రపోతున్న ఆమెను చూస్తూ ‘విద్య, వైద్యం, డబ్బు, అధికారం, పేరు, ప్రతిష్ఠ, సంపద, వయసు... అన్నీ ప్రేమ ముందు బలాదూర్... అందుకే ఎంత వారలైనా మనవళ్ళపై ఉండే ప్రేమ ముందు వారు సాధారణమైన తాత, అమ్మమ్మలుగానే మారిపోతారు. అందరూ ఆ విషయంలో ప్రేమదాసులే’ అనుకున్నాడు సైక్రియాటిస్ట్. – ఆర్.సి. కృష్ణస్వామి రాజు -
మానవ పరిణామ శిఖరం
మానవ ఉనికి ఐదు అడుగుల భౌతిక పరిధులకే పరిమితం కాదు; అది అనంత విశ్వ చైతన్యానికి ఒక ప్రతిరూపం. సనాతన ధర్మం మానవ పరిణామాన్ని జ్ఞానశక్తి, క్రియాశక్తి, ఆత్మశక్తి అనే మూడు మూలస్తంభాల మీద దర్శిస్తుంది. ఇవి కేవలం తాత్విక పదాలు కావు; జీవన గమ్యాన్ని శాసించే త్రివేణీ సంగమాలు. మానవ దేహం ఒక రథమైతే, ఆత్మశక్తి దానికి ప్రాణం పోసే వాత్సల్య సారథి, జ్ఞానశక్తి మార్గం చూపే చైతన్య దివిటీ, క్రియాశక్తి గమ్యం వైపు నడిపే అకుంఠిత దీక్ష. ఈ మూడు శక్తులు సమన్వయమైనప్పుడే మనిషి ‘మనీషి’గా రూపాంతరం చెందుతాడు.జ్ఞానశక్తి: అంతరంగ ప్రకాశంచీకటిలో దారి వెతకడం కాదు, తానే వెలుగై పదిమందికి మార్గం చూపడమే అసలైన జ్ఞానం. సమాచార ప్రవాహం వెల్లువలా ముంచెత్తుతున్న నేటి కాలంలో, ‘విజ్ఞానానికి’ ‘ప్రజ్ఞకు’ మధ్య ఉన్న తేడాను గుర్తించడం ప్రాథమిక అవసరం. పుస్తకాల్లో దొరికేది అక్షర జ్ఞానమైతే, అనుభవంలో వికసించేది ఆత్మజ్ఞానం. ఏది శాశ్వతం? ఏది క్షణికం? అనే వివేచన లేని మేధస్సు చుక్కాని లేని నావ వంటిది.వేల మైళ్ల వేగం ఉన్నా, సరైన దిశ లేని ప్రయాణం గమ్యాన్ని చేరలేదు. తర్కానికి అందని పరమార్థాన్ని స్పృశించడమే వివేకం. ధర్మబద్ధమైన మార్గాన్ని ఎంచుకోవడమే మేధస్సుకు అసలైన అలంకారం. బాహ్య ప్రపంచపు హోరును కాదని, అంతరాత్మ పలికే మౌన సందేశాన్ని వినడమే నేటి యువత నేర్చుకోవాల్సిన ప్రథమ పాఠం. జ్ఞానం ఒక భారంగా కాక, ఎదుగుదలకు ఒక వరంగా మారినప్పుడే వ్యక్తిత్వం ప్రకాశిస్తుంది.క్రియాశక్తి: రగిలే కార్యాచరణంసంకల్పాన్ని సాకారం చేసే సృజనాత్మక చైతన్యమే క్రియాశక్తి. ఆలోచన ఆకాశమైతే, ఆచరణ ఈ పుడమి. మేఘం వర్షమై కురిసినప్పుడే నేల పులకించి ప్రాణం పోసుకుంటుంది. శిల్పి మనసులో ప్రతిమ ఉన్నంత మాత్రాన శిల దైవం కాదు; ఆ శిల్పి చేతిలోని ఉలి దెబ్బల శ్రమ, చెమట చుక్క తోడైనప్పుడే అది పూజలందుకుంటుంది.నిద్రాణమైన విజ్ఞానం వెలుగు ఇవ్వని దీపం వంటిది; నిరంతర ఆచరణే దానికి ప్రాణప్రతిష్ఠ. ఫలితంపై ఆశ వదిలి, చేసే ప్రతి పనిలో పరమాత్మను దర్శించడమే కర్మయోగం. నైపుణ్యం, అంకితభావమే సమాజానికి ఒక వ్యక్తి ఇచ్చే గొప్ప కానుక. కుంటి సాకులు పక్కన పెట్టి, లక్ష్యం వైపు ప్రేమతో అడుగు వేయాలి. లక్ష్యం లేని శ్రమ గానుగెద్దు పయనం; ఆత్మశక్తి: అజేయమైన స్థైర్యంవిజయం వస్తే వినమ్రతతో స్వీకరించడం, అపజయాలను ధైర్యంతో ఎదుర్కోవడం... ఈ స్థితప్రజ్ఞత పేరే ఆత్మశక్తి. ఇది కేవలం ఆత్మవిశ్వాసం కాదు, అంతర్గత దివ్యత్వం. సముద్రపు ఉపరితలంపై అలలు అల్లకల్లోలం సృష్టించినా, లోతుల్లో సముద్రం నిశ్చలంగా ఉన్నట్లు... బయట ఎన్ని తుపానులు చుట్టుముట్టినా చెదరని చిరునవ్వే మనిషి అసలైన బలం.పునాది లేని కోట ఎంత ఎత్తున్నా ఒక్క గాలివానకే కుప్పకూలుతుంది; ఆత్మశక్తి లేని వ్యక్తిత్వం అద్దాల భవంతి వంటిది. నేటి పోటీ ప్రపంచంలో విరిగిపోకుండా నిలబడటమే మానవుడు సాధించే విజయం. ఆత్మబలం ఉన్నవాడికి ఆకాశమే హద్దు; సంక్షోభ సముద్రాన్ని సునాయాసంగా దాటించే నావ ఆత్మస్థైర్యమే. పరిమితులను అధిగమించి ముందుకు నడిపించే ఈ శక్తే మనిషిని మహోన్నతుడిగా తీర్చిదిద్దుతుంది.సమగ్ర జీవనం: చరితార్థమైన ప్రయాణంజ్ఞానం లేని క్రియ అంధకారం; క్రియ లేని జ్ఞానం వ్యర్థం; ఆత్మబలం లేని బతుకు నిర్జీవం. ఈ మూడు శక్తులు త్రివేణీ సంగమమై, లోక కల్యాణం కోసం కదిలినప్పుడే మానవ జన్మ ధన్యమవుతుంది. స్వార్థపు గిరిగీసుకుని బతకడం సంకుచితత్వం; లోక శ్రేయస్సు కోసం ఈ శక్తిత్రయాన్ని ధారపోయడం మాధవత్వం.విజయం వ్యక్తిగతమైనది కాకూడదు, అది పదిమంది ముఖాల్లో చిరునవ్వు నింపాలి. చీకటిని తిట్టడం కన్నా తనలో ఉన్న చిన్న దీపాన్ని వెలిగించడం మిన్న. అంతరంగాన ఉన్న దివ్యత్వాన్ని ప్రేమతో మేల్కొలపాలి. భారతీయతను విశ్వవ్యాప్తం చేస్తూ, సనాతన విలువల వెలుగులో ఈ జగత్తును పునీతం చేద్దాం. సృష్టిలో ప్రతి అణువు ఒక గొప్ప మార్పు కోసం నిరీక్షిస్తోంది; ఆశయమే ఆయుధంగా, ఆత్మీయతే మార్గంగా ముందడుగు వేద్దాం!– కె. భాస్కర్ గుప్తా, వ్యక్తిత్వ వికాస నిపుణులు -
సహదేవుడు.. ఖడ్గ యుద్ధ ప్రవీణుడు
పాండవులలో కనిష్టుడు సహదేవుడు... పాండురాజు రెండో భార్య మాద్రికి అశ్వినీ దేవతల అనుగ్రహంతో జన్మించినవాడు. ద్రోణాచార్యుని శిక్షణ లో ఖడ్గయుద్ధంలో ఎంతో ప్రవీణుడిగా ఆరితేరాడు. అజ్ఞాతవాస సమయంలో విరాటరాజు కొలువులో ‘తంత్రీపాలుడు’ అనే పేరుతో గోపాలకుడిగా పశు సంరక్షణ చేపట్టాడు.సహదేవునికి భవిష్యత్తులో జరిగే విషయాలు ముందే తెలిసినప్పటికీ, జగన్నాటక సూత్రధారి కృష్ణ పరమాత్మ సూచనలతోపాటు చెబితే ఏం జరుగుతుందో అన్న భయం, వ్యక్తిగత భద్రత పట్ల సందేహాలు ఉండడంతో ఏ విషయం చెప్పేవాడు కాదు. బృహస్పతిలా గొప్ప వివేకం కలవాడైనా తనకు తానుగా ఎవరి భవిష్యత్తు చెప్పలేదు. గొప్ప భవిష్యద్దార్శనికుడు అయినా ఇతరులతో పంచుకోలేడు. దీనినే ‘సహదేవ నీతి’ అంటారు.సహదేవుడు అత్యంత తెలివైనవాడు. ధర్మరాజుకు సలహాదారు, ఖడ్గయుద్ధంతోపాటు ఆయుర్వేదం, పశు సంరక్షణలో ప్రవీణుడు. మంచి జ్యోతిష్యవేత్త. అతిముఖ్యంగా కురుక్షేత్ర మహాసంగ్రామానికి ముహూర్తం పెట్టినవాడు సహదేవుడేనంటారు. అత్యంత సాధుశీలుడు, ధర్మవర్తనుడు, ఓర్పు, సహన స్వభావం కలిగిన వ్యక్తి.కౌరవుల నాశనానికి కారకుడైన శకునిని తాను అంతం చేస్తానని ప్రతిజ్ఞ చేసిన సహదేవుడు మహాభారత యుద్ధంలో 17వ రోజున శకునిని హతమార్చి తన ప్రతిజ్ఞను నెరవేర్చుకున్నాడు.– సి ఎన్. మూర్తి, సీనియర్ పాత్రికేయులు -
ఆంథోసయనిన్ గుండె, జీవక్రియ ఆరోగ్యానికి ఎలా తోడ్పడుతుందంటే..!
ఎరుపు, నీలం, ఊదా రంగు ఆహారాలలో లభించే సహజ జీవక్రియాశీల సమ్మేళనాలైన ఆంథోసయనిన్లను అధికంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉన్న పెద్దలలో గుండె, జీవక్రియల ఆరోగ్యానికి మద్దతు ఇస్తుందని పరిశోధకులు చేసిన తాజా అధ్యయనంలో వెల్లడైంది. అందుకు సంబంధించిన కొత్త అధ్యయనం 'ది అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్'లో ప్రచురితమైంది.ఆంథోసయనిన్లు అనేవి మొక్కలలో సహజంగా లభించే సమ్మేళనాలు. ఇవి అనేక పండ్లు, కూరగాయలకు ఎరుపు, ఊదా, నీలం రంగులను అందిస్తాయి. బెర్రీలలో ఇది అత్యధికంగా ఉంటుంది. అమెరికా బ్లూబెర్రీలు గుండె ఆరోగ్యానికి తోడ్పడే ఆంథోసయనిన్లను అందిస్తాయి.కలిగే లాభాలు..సాధారణంగా తక్కువ ఆంథోసయనిన్ తీసుకునేవారితో పోలిస్తే, దానిని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ క్రింది ప్రయోజనాలు కనిపించాయి:గుండె జబ్బుల ప్రమాదం 26% తగ్గింది.సాధారణంగా గుండెపోటు అని పిలిచే మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ ప్రమాదం 18% తక్కువగా వుంది.టైప్ 2 మధుమేహం ప్రమాదం 11% తక్కువగా కనిపించింది.గుండె సంబంధిత మరణాల ప్రమాదం 9% తక్కువఅధిక రక్తపోటు ప్రమాదం 8% తక్కువరోజుకు 50 మిల్లీగ్రాముల నుంచి ఆహారంలో ఆంథోసయనిన్ తీసుకోవడం ప్రారంభించినప్పుడు, రక్తనాళాల పనితీరు, ఇన్సులిన్ సాంద్రతలలో మెరుగుదలలు కనిపించాయని యాదృచ్ఛిక నియంత్రిత పరీక్షలు నివేదించాయి. ఆంథోసయనిన్ అధికంగా ఉండే ఆహారాల ద్వారా ఈ స్థాయిని సాధించవచ్చని పరిశోధకులు పేర్కొన్నారు.రోజువారీ భోజనంలో సహజంగా రంగురంగుల పండ్లు , కూరగాయలను విస్తృత శ్రేణిలో చేర్చడం మొత్తం ఆహార నాణ్యతకు మద్దతు ఇస్తుంది. అమెరికా బ్లూబెర్రీలను తాజాగా, గడ్డకట్టించి లేదా ఎండబెట్టి ఆస్వాదించవచ్చు. వాటిని పెరుగు, ఓట్స్, స్మూతీలు, అల్పాహార వంటకాలు, సలాడ్లు, డెజర్ట్‌లు వంటి వంటకాల్లో సులభంగా చేర్చుకోవచ్చు.అంతేగాదు సులభమైన, ఆచరణీయమైన ఆహారపు మార్పులు గుండె జబ్బులు, అధిక రక్తపోటు మరియు టైప్ 2 మధుమేహం వంటి వాటి దీర్ఘకాలిక ప్రమాదాన్ని తగ్గించడానికి దోహదపడతాయని ఈ కొత్త పరిశోధన ఫలితాలు సూచిస్తున్నాయి. -
కేన్సర్ పరిశోధకురాలిగా తొలి ట్రాన్స్ జెండర్ మహిళ..!
మూడేళ్ల వయసుకే తల్లిదండ్రులను కోల్పోవడమే కాదు..తన పుట్టుక కూడా ఒక శాపంగా మారింది ఆ చిన్నారికి. తనెందుకు అందరికంటే భిన్నంగా ఉంటున్నా..తనలో ఈ మార్పు అందకానీ గందరగోళంలో సాగింది అతడి బాల్యం. తన శారీరక మార్పుని తప్పుగా చూపిస్తూ సమాజం చేత ఛీత్కారాలు, హేళనలతో బిక్కుబిక్కుమంటూ బతికాడు. కానీ కష్టాల కొలిమిలో అతడకి దారి చూపేది కేవలం చదువు మాత్రమే అని విశ్వసించి మొత్తం దృష్టి దాని మీదే పెట్టాడు. ఉన్నత చదువు కోసం విదేశాల వరకు వెళ్లి..తను అందరిలాంటి వాడిని కాదని తెలుసుకోవడమే గాక తనలాంటి వాళ్లు కూడా ఉన్నారని తెలసుకుని ఇన్నాళ్లు ముసుగులో బతికే ఆ బాలుడు కాస్త అమ్మాయిగా స్వతంగా సగర్వంగా బతకడమే కాదు తనలాంటి వాళ్లకు స్ఫూర్తిగా మారాడు.అతడే సూరి అనే ట్రాన్స్‌జెండర్. హర్యానాకు చెందిన సూరి మూడేళ్ల వయసుకే తల్లిదండ్రులను పోగొట్టుకున్నాడు. అమ్మమ్మ, అత్తల చెంత పెరిగాడు. తనలోని విభిన్నమైన మార్పు తనకే అర్థంకానీ తరుణంలో సమాజం నుంచి ఎదురవ్వుతున్న చీత్కారాలకు తల్లడిల్లిపోయాడు. తానెంటో తన పరిస్థితి ఏంటో అమ్మమ్మకు, అత్తకు వివరించడంతో..బయటకు ఈ విషయ పొక్కనీయకుండా బాలుడిలానే పెంచారు. ఎన్ని హేళనలు, అవమానాలు వస్తున్నా..చదువే తన గమ్యం, లక్ష్యంగా చదవడం ప్రారంభించాడు. అలా ఉన్నత చదువులు చదివి జర్మనీలో పీహెచ్డీ చేసే స్థాయికి చేరుకున్నాడు. అది కూడా బ్రెయిన్ కేన్సర్‌పై పీహెచ్డీ పరిశోధన చేస్తున్న తొలి ట్రాన్స్‌జెండర్‌గా నిలిచింది. అక్కడకు వెళ్లాకే తనలాంటి ట్రాన్సజెండర్ మహిళలు ఉన్నారని తెలుసుకుని ఇది ఒక లోపం కాదని గుర్తిస్తుంది. వాళ్ల అందరిక కథలు తనలాంటివేనని తెలుసుకుని అలాంటి వాళ్ల కోసం పాటుపడుతోందామె. అప్పటి నుంచే ముసుగు తొలగించి ట్రాన్స్‌జెండర్ మహిళ స్వేచ్ఛగా బతకడం ప్రారంభించిందామె.(చదవండి: ప్లీజ్ వెళ్లొద్దు..! కన్నీళ్లు పెట్టుకున్న అమెరికన్ మహిళ) -
తల్లిపాలే.. తొలి పెట్టుబడి!
నాకు బిడ్డ పుట్టి, పది రోజులు అవుతుంది. బిడ్డ పుట్టిన వెంటనే తల్లిపాలు ఇవ్వాలని, మొదట వచ్చే పసుపురంగు పాలను కొందరు పారేయమంటున్నారు. ఆరు నెలల వరకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలా? తల్లిపాలు బిడ్డ ఆకలి తీర్చడంతో పాటు మెదడు ఎదుగుదలకు కూడా నిజంగా అంత ఉపయోగపడతాయా?– సరస్వతి, నెల్లూరు. తల్లిపాలు కేవలం బిడ్డ ఆకలి తీర్చే ఆహారం మాత్రమే కాదు. బిడ్డ జీవితంలో ఆరోగ్యానికి వేసే తొలి అడుగు. ముఖ్యంగా మెదడు వికాసానికి అవసరమైన ఎన్నో పోషకాలను అందించే సహజ సంపద. అందుకే తల్లిపాలను వీలైనంత త్వరగా ప్రారంభించడం ఎంతో ముఖ్యం. ఈ రోజుల్లో పిల్లల మెదడు వికాసం, జ్ఞాపకశక్తి, నేర్చుకునే సామర్థ్యం, సృజనాత్మకత గురించి ఎన్నో చర్చలు జరుగుతున్నాయి. నిజానికి వీటికి పునాది పడేది బిడ్డ జీవితంలోని తొలి వెయ్యి రోజుల్లోనే. అందుకే ఆ సమయంలో సరైన పోషణ ఎంతో కీలకం. అందులో తల్లిపాలదే మొదటి స్థానం. అందుకే, తల్లిపాల గురించి, ప్రతి తల్లి గుర్తుంచుకోవాల్సిన ఐదు విషయాలు ఇవే.. పుట్టిన వెంటనే... మెదడు నిర్మాణం మొదలు!శిశువు పుట్టినప్పుడు మెదడు పూర్తిగా అభివృద్ధి చెందదు. తొలి రెండు సంవత్సరాల్లోనే మెదడు దాదాపు 80 శాతం వరకు ఎదుగుతుంది. ప్రతి సెకనుకు లక్షలాది నాడీ సంబంధాలు ఏర్పడతాయి. ఈ అద్భుతమైన ప్రక్రియకు అవసరమైన పోషకాలు, జీవకణాలు, హార్మోన్లు, ఎదుగుదల కారకాలు... అన్నీ తల్లిపాలలో సహజంగానే లభిస్తాయి.సహజమైన మెదడు బూస్టర్!తల్లిపాలలో ఉండే డీహెచ్ఏ, ఏఆర్ఏ, కోలిన్, టారిన్, లాక్టోజ్, వివిధ ఎదుగుదల కారకాలు శిశువు మెదడు కణాల నిర్మాణానికి, నాడీ సంబంధాల ఏర్పాటుకు, జ్ఞాపకశక్తి పెరుగుదలకు దోహదపడతాయి. అనేక అంతర్జాతీయ అధ్యయనాలు కూడా ఇదే విషయాన్ని సూచిస్తున్నాయి. తల్లిపాలు తాగిన పిల్లల్లో సగటు మేధస్సు మెరుగ్గా ఉండే అవకాశం ఉంది. భాషా నైపుణ్యాలు, సమస్య పరిష్కార సామర్థ్యం కూడా మెరుగవుతుంది. పాఠశాలలో విద్యా ప్రదర్శనపైనా ప్రభావం ఉండొచ్చు. కొన్ని నాడీ వికాస సంబంధిత సమస్యల ప్రమాదం కూడా తగ్గే అవకాశం ఉందని పరిశోధనలు సూచిస్తున్నాయి.ప్రేమతో పాలు... మెదడుకు శక్తి!తల్లిపాలు ఇస్తున్నప్పుడు తల్లి బిడ్డను హత్తుకోవడం, కళ్లల్లోకి చూస్తూ మాట్లాడటం, చిరునవ్వులు పంచుకోవడం... ఇవన్నీ తల్లి– శిశువు బంధాన్ని మరింత బలపరుస్తాయి. ఈ సమయంలో విడుదలయ్యే ఆక్సిటోసిన్ వంటి హార్మోన్లు తల్లి– బిడ్డ అనుబంధాన్ని బలపరచడమే కాకుండా, శిశువు భావోద్వేగ, సామాజిక అభివృద్ధికి కూడా పునాది వేస్తాయి. అందుకే తల్లిపాలు కేవలం పోషకాహారం కాదు... ప్రేమ, భద్రత, మెదడు వికాసం అనే మూడు వరాల కలయిక.తొలి బంగారు చుక్కలు!పుట్టిన తర్వాత వచ్చే పసుపు రంగు గాఢమైన పాలను చాలామంది పారేస్తారు. కానీ అది పెద్ద తప్పు. ఈ కోలస్ట్రం శిశువుకు తొలి టీకా లాంటిది. ఇందులో రోగనిరోధక శక్తిని పెంచే యాంటీబాడీలు, శిశువు ఎదుగుదలకు అవసరమైన అనేక జీవపదార్థాలు ఉంటాయి. అందుకే మొదట వచ్చే ఆ కొద్దిపాటి పాలను కూడా వృథా చేయకండి.ఆరు నెలలు... తల్లిపాలు మాత్రమే!ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచన ప్రకారం పుట్టిన ఒక గంటలోపు తల్లిపాలు ప్రారంభించడం మంచిది. మొదటి ఆరు నెలలు పూర్తిగా తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. ఆ తరువాత సరైన అనుబంధ ఆహారంతో పాటు కనీసం రెండేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం తల్లిపాలను కొనసాగించడం మంచిది. తల్లికి అండగా... సమాజం కూడా!పని చేసే తల్లులకు పాలివ్వడానికి అనుకూలమైన వాతావరణం కల్పించడం కుటుంబం, కార్యాలయాలు, సమాజం అందరి బాధ్యత. తల్లిపాలను ప్రోత్సహించడం అంటే కేవలం ఒక బిడ్డ ఆరోగ్యాన్ని కాపాడటం కాదు... భవిష్యత్ తరాల ఆరోగ్యానికి, ఎదుగుదలకు బలమైన పునాది వేయడం. పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు మంచి పాఠశాల, మంచి కోచింగ్, మంచి గాడ్జెట్లు ఇవ్వాలని ఎంతో ఆలోచిస్తారు. అవన్నీ వాటి స్థానంలో ముఖ్యమే. కానీ బిడ్డ జీవితంలో తొలి పెట్టుబడి మాత్రం పుట్టిన రోజునే మొదలవుతుంది. అది తల్లిపాలు. ప్రతి చుక్క తల్లిపాలు... ప్రతి బిడ్డ మెదడులో ఒక కొత్త భవిష్యత్తుకు పునాది!డా. కె.పవన్ కుమార్, సీనియర్ పీడియాట్రిషియన్, పీడియాట్రిక్ అలర్జిస్ట్, ప్రొఫెసర్ ఆఫ్ పీడియాట్రిక్స్ -
93 ఏళ్ల వయసులో అథ్లెటిక్‌గా బామ్మ..!
చాలామంది వృద్ధాప్యం అంటే రెస్ట్ తీసుకునే వయసుగా భావిస్తారు. వాస్తవంగా ఆ వయసులో ఏదో దేవుడి నామ జపం చేసుకుంటూ కాలం వెళ్లదీస్తుంటారు. కానీ ఈ బామ్మ మాత్రం తొమ్మిది పదుల వయసులో అథ్లెట్‌గా మారింది. పైగా ఎన్నో రికార్డులు పతకాలు గెలుచుకుని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపుని తెచ్చుకోవడమే కాదు..సాధించాలనే కోరిక ఉంటే వయసు పెద్ద అడ్డంకి కాదని నిరూపించింది. పైగా పట్టుదల, శక్తి వయసుతోపాటు సన్నగిల్వవు అని చాటిచెప్పి..యువతకు స్ఫూర్తిగా నిలిచింది ఈ సూపర్ బామ్మ.ఆ బామ్మే చండీగఢ్‌కి చెందిన మన్‌కౌర్. ఆమె 1916లో పంజాబ్‌లో జన్మించారు. ఆమె తన జీవితంలో ఎక్కువ భాగం క్రీడలకు దూరంగానే పెరిగారు. ఆమె కుమారుడు గుర్దేవ్సింగ్ మాస్టర్స్ అథ్లెటిక్స్‌లో పాల్గొనడం చూసి 93 ఏళ్ల వయసులో అథ్లెటిక్స్‌లోకి ప్రవేశించారు. కేవలం అతను పోటీపడటాన్ని చూసి ఈ బామ్ తాను కూడా పరుగును ప్రయత్నించాలని నిర్ణయించుకుంది. ఆ నిర్ణయం ఆమె జీవితాన్నే మార్చేసింది. అలా ఆమె 93వ ఏట అథ్లెటిక్ కెరీర్‌ని ప్రారంభించి ఎన్నో పతకాలు కైవసం చేసుకుంది. ఆమె విజయాలు భారతదేశం దాటి విస్తరించాయి. పోలాండ్‌లో జరిగిన వరల్డ్ మాస్టర్స్ అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్‌లో ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో నాలుగు బంగారు పతకాలను గెలుచుకున్నారు. దాంతో ఆమెను అంతా చండీగఢ్ అద్భుతంగా పిలుచుకునేవారు. ఆ తర్వాత 2013లో అమెరికాలో జరిగిన వరల్డ్ మాస్టర్స్ ఛాంపియన్‌షిప్‌లో 100మీ, 200మీ ఈవెంట్లలో బంగారు పతకాలను గెలుచుకున్నారు. అవేగాక జాతీయ, అంతర్జాతీయ మాస్టర్స్ పోటీలలో కూడా పతకాలను సాధించారు. 2016లో, అమెరికన్ మాస్టర్స్ గేమ్స్‌లో, ఆమె ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన శతాధిక వయస్కురాలిగా గుర్తింపు పొందారు. విచిత్రం ఏంటంటే.. 100 ఏళ్లు దాటిన తర్వాత కూడా ఆమె ప్రదర్శనలు కొనసాగాయి. 2017లో న్యూజిలాండ్‌లో జరిగిన వరల్డ్ మాస్టర్స్ గేమ్స్‌లో, 100మీ ఈవెంట్లో బంగారు పతకాన్ని గెలుచుకున్నారు. అలాగే అలాగే వరల్డ్ మాస్టర్స్, అమెరికన్ మాస్టర్స్ గేమ్స్‌లో 20కి పైగా పతకాలు సాధించింది. వీటితోపాటు ఆ బామ్మకు మార్చి 08, 2020లో రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా నారీశక్తి పూరస్కారాన్ని అందుకుంది. ఇక్కడ కౌర్ కథ ఒక ప్రొఫెషనల్ కెరీర్‌ను నిర్మించుకోవాలనే ఆశతో యువ అథ్లెట్‌గా పరుగు ప్రారంభించలేదు. కొత్తగా ఏదైనా ప్రయత్నించడం ఇకపై సాధ్యం కాదని చాలా మంది నమ్మే వయస్సులో, అథ్లెటిక్‌గా ట్రాక్‌పై అడుగుపెట్టి పోటీలలో పాల్గొని సరికొత్త రికార్డుని రాసి స్ఫూర్తిగా నిలిచించారామె. నిజానికి ఆ వయసులో ఆ ప్రయత్నం చేయడానికి ఎంతో ధైర్యం కావాలి. అది కౌర్ బామ్మ సొంతం. చెప్పాలంటే పట్టుదల, అపారమైన శక్తి, స్థైర్యానికి ప్రతీకగా నిలిచింది. కాగా, జూలై 31, 2021న 105 ఏళ్ల వయసులో మరణించారామె.(చదవండి: వాటితో ఫేషియల్..'గ్లో' మాములుగా లేదు..! వీడియో వైరల్) -
పిల్లలతో బయటకు వెళ్తే.. ఈ గాడ్జెట్స్ మర్చిపోవద్దు!
పిల్లలు చిన్నవాళ్లే, కానీ వాళ్ల అవసరాలకు మాత్రం పెద్ద లిస్టే ఉంటుంది. అందుకే, బుజ్జాయికి కంఫర్ట్‌తో పాటు పేరెంట్స్‌కు పీస్ ఇచ్చే ఈ చిన్న చిన్న గాడ్జెట్స్ మీకోసం...శబ్దాలకు... బుజ్జి బుజ్జి బ్రేక్!బుజ్జాయి నిద్రలోకి వెళ్లడం ఒక పెద్ద టాస్క్ అయితే, వెళ్లాక లేవకుండా కాపాడటం అంతకంటే పెద్ద టాస్క్! అందుకే, చుట్టూ ఎంత హడావుడి ఉన్నా శబ్దాన్ని తగ్గించే ఈ చిన్న ఇయర్‌మఫ్స్, ప్రతి పేరెంట్స్ బ్యాగ్‌లో ఉండాల్సిందే! ఇది చుట్టూ ఉన్న పెద్ద శబ్దాలను అనుకూలమైన వాల్యూమ్‌లో తగ్గించేలా రూపొందించారు.మృదువైన ఇయర్ ప్యాడ్స్, సర్దుబాటు చేసుకునే హెడ్‌బ్యాండ్ ఉండటంతో చిన్నారులకు సౌకర్యంగా పెట్టుకోవచ్చు. చెవులపై ఎక్కువ ఒత్తిడి పడకుండా డిజైన్ చేయడంతో విమాన ప్రయాణాలు, పెళ్లిళ్లు, ఫంక్షన్లు, కచేరీలు లేదా రద్దీ ప్రదేశాల్లోనూ ఉపయోగపడతాయి. మడిచి చిన్నగా చేసుకోవచ్చు కాబట్టి ట్రావెల్ బ్యాగ్‌లో పెట్టుకోవడమూ ఈజీ. అప్పుడే పుట్టిన బుజ్జాయిల నుంచి మూడు సంవత్సరాల వయసు బుజ్జాయిల కోసం ప్రత్యేకంగా రూపొందించిన వీటి ధర రూ.1000.కింద పడినా... స్నాక్ పడదు!అమ్మ కష్టపడి స్నాక్ రెడి చేసి పెడితే... బుజ్జోడు మాత్రం ఒక్క సెకనులో బోర్లించేయడం కామనే! ఇక స్నాక్స్ నేలపాలయ్యే సీన్ కు ఈ స్పిల్ ప్రూఫ్ కప్‌తో చెక్ పెట్టొచ్చు. పిల్లలు కప్‌ను షేక్ చేసినా, పిండినా, కింద పడేసినా... లోపలున్న స్నాక్స్ బయటకు రాకుండా సిలికాన్ ఫ్లాప్ అడ్డుకుంటుంది. ఫుడ్ గ్రేడ్ స్టెయిన్లెస్ స్టీల్‌తో తయారైన ఈ కప్ చిన్న చేతులకు సులభంగా పట్టుకునేలా ఉంటుంది. పిల్లలు తమంతట తామే స్నాక్స్ తినడం నేర్చుకోవడానికీ ఉపయోగపడుతుంది. మూత ఉండటంతో బ్యాగ్‌లో పెట్టుకుని బయటకు తీసుకెళ్లడమూ ఈజీ. కారులో, పార్కులో, ట్రావెల్లో... ఎక్కడైనా స్నాక్ టైమ్ నో టెన్షన్! అన్ని భాగాలనూ విడదీసి శుభ్రం చేసుకోవచ్చు. డిష్వాషర్లోనూ వేయొచ్చు. బుజ్జోడు కింద పడినా, స్నాక్స్ మాత్రం పడవు! ధర రూ.500.ఎక్కడైనా బుజ్జాయికి బెడ్రూమ్!పిల్లలతో ప్రయాణం అంటే... టికెట్ ఒక్కరికే, టెన్షన్ మాత్రం మొత్తం ఫ్యామిలీకి! కాసేపు కూర్చోబెట్టినా కాళ్లు చాపాలని, పడుకోవాలనిపిస్తే సీటు సరిపోదు. ఇలాంటి సమయంలో ఈ చిన్న ట్రావెల్ యాక్సెసరీ కాస్త అదనపు స్పేస్ ఇచ్చేస్తుంది.విమానం సీట్ల మధ్య అమర్చుకుని పిల్లలు కాళ్లు చాపుకోవడానికి, కాసేపు రిలాక్స్ అవ్వడానికి ఫుట్రెస్ట్లా ఉపయోగించుకోవచ్చు. నిద్రొస్తే చిన్న హ్యామాక్లా కూడా సెట్ చేసుకోవచ్చు. పాలిస్టర్ మెటీరియల్‌తో తయారైన ఇది మడిచి బ్యాగ్‌లో పెట్టేసుకుని ఈజీగా తీసుకెళ్లొచ్చు. విమానంలోనే కాదు... రైలు, షిప్ లేదా కార్ జర్నీలోనూ పనికొస్తుంది. ధర రూ.1,500. -
వాటితో ఫేషియల్..'గ్లో' మాములుగా లేదు..!
ఎన్నో బ్యూటీటిప్స్..వివిధ రకాల ఫేషియల్స్ చూసి ఉంటారు. ఇప్పుడు చెప్పుకోబోయే ఫేషియల్ అసలు చూసుండరు.ఓ సెలూన్ షాపులో బార్బర్ చేసిన ఫేషియల్ ఇది. కానీ ఇదేం ఫేషియల్ అనిపిస్తుంది గానీ చివర్లో ముఖంలో వచ్చిన అద్భుతమైన మార్పుకి నోటమాటరాదు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. సోషల్ మీడియాలో మంచి ఫాలోవర్స్ ఉన్న హెయిర్‌డ్రెస్సర్ రషీద్ ఎంకే..షేర్ చేసిన షేషియల్ రొటీన్ అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇదేంట్రా బాబు ఇవేం ఉత్పత్తులు అని విస్తుపోయారు. వాటితో ఫేషియల్ ఏంటి? అని అనిపించినా..రిజల్ట్ మాత్రం మాములుగా లేదు. ఇంతకీ అతడు వేటితో ఫేషియల్ చేశాడంటే..ఈనో, టూత్‌పేస్ట్, గులాబ్జల్తో ఓ వ్యక్తికి ఫేషియల్ చేస్తున్నట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. చక్కగా బ్యూటీపార్లర్‌లో చేసినట్లు మసాజ్ చేస్తాడు. కాసేపటి తర్వాత దాన్ని తొలగించగానే ముఖంంలో వచ్చిన గ్లోకి మైండ్‌బ్లాక్ అవుతుంది. ఎందుకంటే ఆ వ్యక్తి అంతకు ముందు ఫేస్‌కి ఆ తర్వాత మార్పు అలా ఇలా ఉండదు. నెటిజన్లు కూడా ఈ వీడియోని చూసి, వాటే క్రియేటివిటీ అని కొందరు, బాస్ ఇలాంటివి చర్మంపై రియాక్షన్ చూపించే ప్రమాదం ఉంటుంది అని కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు.గమనిక: ఇలాంటివి ప్రయత్నించేటప్పుడు వైద్యులు లేదా వ్యక్తిగత నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: అచ్చం నీలాంబరి మూవీ రమ్యకృష్ణలా రక్తంతో ఫేషియల్..! అందం కోసం ఇంత పెయిన్ తప్పదా?) -
గర్భందాల్చిన తొలిరోజుల్లో జాగ్రత్తగా లేకుంటే ముప్పు తప్పదా?
మహిళలు గర్భందాల్చిన తొలిరోజుల్లో వారు తమ పనితీరులో భాగంగా తరచూ ముందుకు వంగడం, ఎక్కువసేపు నిలబడి పనిచేయాల్సి రావడంతోపాటు ఎక్కువసేపు నడక వంటి పనులతో గర్భస్రావాల ముప్పు ఎక్కువగా ఉంటుందని ఒక డానిష్ అధ్యయనంలో తేలింది. ఈ అధ్యయన ఫలితాలు ‘ఆక్యుపేషనల్ అండ్ ఎన్విరాన్మెంట్ మెడిసిన్’అనే జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ఉద్యోగంలో లేదా తమ విధుల్లో భాగంగా మహిళలు చేసే శారీరక శ్రమ వారి గర్భధారణ/గర్భస్రావాలపై ఏ మేరకు ప్రభావం చూపుతుందనే విషయాలపై చేసిన అధ్యయనంలో భాగంగా డెన్మార్క్‌కు చెందిన అధ్యయనవేత్తలు సుమారు 4.75 లక్షల మంది ఉద్యోగినుల నుంచి సేకరించిన సమాచారాన్ని విశ్లేషించారు. ఉద్యోగంలో భాగంగా ఎక్కువసేపు నిలబడటం, నడవడం, ముందుకు వంగి పనిచేయడం వంటి అంశాలు గర్భస్రావం ముప్పును పెంచినట్లుగా ఈ విశ్లేషణలో తేలింది. నిలబడి పనిచేయడం వల్ల మాత్రం ఈ ముప్పు చాలా స్వల్పంగా పెరిగినట్లు తేలింది. (చదవండి: రోజూ ఓ మల్టీవిటమిన్ టాబ్లెట్ తీసుకుంటే..?) -
అర్జున్ ఇన్ అండర్ గ్రౌండ్..!
‘ఎవరికీ కనిపించకుండా అండర్ గ్రౌండ్ (అజ్ఞాతం)లోకి వెళ్లాడు’ అంటూ ఉంటారు. అర్జున్ మాత్రం... అందరికీ కనిపిస్తూనే అండర్‌గ్రౌండ్‌లో ఉంటున్నాడు. అర్థం కాలేదా! ఇప్పుడు టాపిక్‌లోకి వద్దాం...మధ్యప్రదేశ్‌లోని ఝుబువాకు చెందిన అర్జున్ ఇంటిపై అలిగి బయటికి వచ్చాడు. ఇది విశేషమేమీ కాదు. అసలు సిసలు విశేషం... భూగర్భ గృహాన్ని నిర్మించుకోవడం. తన వెరైటీ ఇంటి విషయాల గురించి ఎప్పటికప్పుడు అర్జున్ షేర్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.ఇంతకీ ఆ భూగర్భగృహం ఎలా ఉంటుంది?భూమి అడుగున నిర్మించిన చిన్నటి ఆవాసంలో మట్టితో చేసిన వేదిక ఉంది. దీనిపై చాప, దుప్పటి పరిచి పడుకోవడానికి వీలుగా ఏర్పాటు చేసుకున్నాడు. లోపల చేతితో చెక్కిన అరలు, వండుకోవడానికి చిన్న పొయ్యి ఉన్నాయి. పైకప్పుపై ఉండే టార్పాలిన్ వర్షం నుంచి రక్షణగా పనిచేస్తుంది.అలా అని సమస్యలు లేవని కాదు. ఒక వర్షానికి పై కప్పు పై కప్పిన టార్పాలిన్ చిరిగిపోయింది. వర్షం నీళ్లు ఇంట్లోకి రావడంతో అర్జున్ ఇబ్బంది పడ్డాడు. ఇలాంటి ఇబ్బందులు ఎదురైనా ‘డోన్ట్ కేర్’ అంటున్నాడు. ఈ భూగర్భగృహం పుణ్యమా అని సదరు అర్జున్ సోషల్ మీడియాలో ఫేమ్ అయ్యాడు! View this post on Instagram A post shared by Reel Pe Seal 🇮🇳 (@reelpesealofficial) (చదవండి: రోజూ ఓ మల్టీవిటమిన్ టాబ్లెట్ తీసుకుంటే..?) -
రోజూ ఓ మల్టీవిటమిన్ టాబ్లెట్ తీసుకుంటే..?
ప్రతిరోజూ ఓ మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ తీసుకోవడం వృద్ధాప్యాన్ని కాస్తంత ఆలస్యం చేస్తుందని హార్వర్డ్ పరిశోధకులు నిర్వహించిన ఓ పరిశోధనలో తేలింది. ఈ పరిశోధన వివరాలు ఇలా ఉన్నాయి. మన దేహం తాలూకు వయసు (బయలాజికల్ ఏజ్), మన క్యాలెండర్ వయస్సు కంటే కాస్త వేరుగా ఉండవచ్చు. అంటే ఉదాహరణకు ఒక వ్యక్తికి 70 ఏళ్లు అనుకుందాం. అయితే అతని శరీరంలోని కణాలు అంతకంటే తక్కువ వయసున్నవిగా లేదా ఎక్కువ వయసున్నవిగా ప్రవర్తించవచ్చు. శరీరం ఎంత వేగంగా వృద్ధాప్యానికి దగ్గరవుతోందో అంచనా వేయడానికి శాస్త్రవేత్తలు ఎపిజెనెటిక్ క్లాక్స్ అనే పద్ధతులను ఉపయోగిస్తారు. ఇవి కాలక్రమేణా డీఎన్ఏలో చోటుచేసుకునే చిన్న చిన్న మార్పులను పరిశీలిస్తాయి. ముఖ్యంగా, జన్యువులు ఎలా పనిచేయాలో నియంత్రించే ఈ డీఎన్ఏలోని కొన్ని ప్రాంతాల్లో జరిగే డీఎన్ఏ మిథిలేషన్ మార్పులను ఇవి కొలుస్తాయి. అంతేకాదు, ఒక వ్యక్తి ఎంత వేగంగా వృద్ధాప్యానికి లోనవుతున్నాడో, అలాగే మరణానికి చేరువయ్యే ముప్పు ఎంత ఉందో అంచనా వేయడానికి కూడా ఇవి ఉపయోగపడతాయి. ఈ అధ్యయనంలో మల్టీవిటమిన్ తీసుకున్నవారిలో వృద్ధాప్య ప్రక్రియ కొంత నెమ్మదించినట్లు కనిపించింది. మొత్తంగా చూస్తే, రెండేళ్ల కాలం పాటు మల్టీవిటమిన్ తీసుకున్నవారిలో వారి అసలు వయసు కంటే వారి బయాలజికల్ వయసు నాలుగు నెలల మేర తక్కువగా ఉన్నట్లు తేలింది. ఈ పరిశోధనల ఫలితాలు ‘నేచర్ మెడిసిన్’ అనే జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ఈ అధ్యయనం ఆధారంగా ఎవరికి వారు మల్టీ విటమిన్ ట్యాబ్లెట్ తీసుకోవడమూ అంత సరికాదు. తమ డాక్టర్‌ను సంప్రదించాకే దీనిపై నిర్ణయం తీసుకోవడం మంచిందంటున్నారు నిపుణులు. యాసిన్(చదవండి: ఎర్రమట్టితో ముఖానికి మెరుపు..!) -
ఎర్రమట్టితో ముఖానికి మెరుపు..!
కాలంతో సంబంధం లేకుండా కొందరికి పెదవులు పొడిబారి, పగులుతుంటాయి. వాతావరణ మార్పులు, డీహైడ్రేషన్ వంటివి ఇందుకు కారణాలు కావచ్చు. అందువల్ల ఇంట్లోనే తయారుచేసుకునే వాటితో కొన్ని చిట్కాలను పాటిస్తే పెదవులకు అవసరమైన తేమ అంది, మృదువుగా మారుతాయి. తేనె, కలబంద, నెయ్యి, షియా బటర్ వంటి పదార్థాలు పెదవుల్లో తేమను పట్టి ఉంచి పగుళ్లను తగ్గించడంలో సహాయపడుతాయి.ఒక స్పూన్ తేనెలో కొద్దిగా పంచదార కలిపి వారానికి రెండుసార్లు పెదాలపై సున్నితంగా రుద్దితే మృతకణాలు తొలగిపోతాయి. అదేవిధంగా అలోవెరా జెల్లో కొద్దిగా తేనె కలిపి పెదాలపై రాసుకుని, పావుగంట తరువాత కడిగితే పెదాలు మృదువుగా ఉంటాయి. రాత్రి నిద్రించే ముందు బీట్ రసాన్ని పెదవులకు రాస్తే సహజమైన గులాబీ రంగు వస్తుంది.ఎర్రమట్టితో ముఖానికి మెరుపుఈజిప్షియన్ రాచ వంశీకులు నైలు నదీ పరివాహక ప్రాంతంలోని ఎర్ర మట్టిని ఎక్కువగా ఉపయోగించేవారు. ఈజిప్టు రాణి క్లియోపాత్రా తన అందాన్ని, చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవడానికి నైలు నది ఒడ్డున దొరికే ఎర్రటి మట్టిని ఉపయోగించేదని ప్రాచీన ఆధారాలు, కథనాలు చెబుతున్నాయి. నైలు నది ఒడ్డున ఉండే ఎర్రమట్టిలో అల్యూమినియం, ఐరన్ ఆక్సైడ్తో పాటు అనేక ఖనిజాల గాఢత అత్యధికంగా ఉంటుంది. ఇది చర్మానికి పూసుకున్నప్పుడు ముఖంలోని రంధ్రాలు తక్షణమే బిగుతుగా మారేవి. అందువల్ల ఈ మట్టిని అప్పటి రాజులు, రాణులు విరివిగా ఉపయోగించేవారు. అంతేకాదు వారు చనిపోయినప్పుడు కూడా వారి సమాధుల్లో ఆహారంతో పాటు ఎర్రమట్టి ఫేస్ ప్యాక్‌లు కూడా భద్రపరచేవారట. చనిపోయిన తర్వాత కూడా వారు అందంగా కనిపించాలని నమ్మేవారు!(చదవండి: ఎర్రకోటపై మోదీ ‘బంధనీ’ సఫా.. చుక్కల వెనుక వేల ఏళ్ల భారతీయ చరిత్ర!) -
పుణ్యఫలం: ధర దగ్గరే మొదలైన అసలు పంచాయితీ..!
‘‘రేపు ఉదయమే కార్యక్రమం. ఇంకా గోవు సిద్ధం కాకపోతే ఎలా?’’‘‘మీరేం ఆందోళన చెందకండి. అనుకున్నట్టుగానే కార్యక్రమం పూర్తవుతుంది’’.‘‘పదిరోజుల నుంచి మీ వెంట పడుతున్నాను. ఇప్పటి వరకూ ఏదీ ముడిపడలేదు. అందుకే భయంగా ఉంది.’’‘‘మీకిది మొదటిసారేమో! మేము ఎన్ని కార్యక్రమాలు చేయలేదు. ఉదయం చెప్పి ఆవు పంపమని అడిగినా క్షణాల్లో సిద్ధం చేసేస్తాం’’.‘‘ఏదో మిమ్మల్నే నమ్ముకున్నాను... ’’.‘‘మనకు ఎప్పుడూ సప్లై చేసేవాడి దగ్గర ఆవు చనిపోయింది. మనుషుల్లాగానే ఇప్పుడు ఆవులకు కూడా ఇన్సూరెన్సు ఉంటోంది. ఆ గొడవల్లో మునిగి ఉన్నాడతను.’’.‘‘అతను కాకపోతే, ఇంకెవరయినా...’’.‘‘మొన్న రెండు ఆవుల ఫొటోలు పంపాను కదండీ..’’‘‘ఆ... తెల్లటిచర్మం పైన నల్లటి మచ్చలున్న ఆవు... చూడగానే అదోలా ఉంది. అందుకే...’’‘‘ఫరవాలేదు. మీకు నచ్చిన ఆవునే అనుకున్న బడ్జెట్లో వచ్చేలా చూసే పూచీ నాది. మీరేం ఫికర్ కాకండి’’.‘‘తెల్ల ఆవు అయితే బావుంటుందని చెప్పాను తప్ప రంగు పట్టింపు అంత లేదు. మంచి ఆరోగ్యంగా ఉన్న ఆవుని చూసి పంపండి.’’‘‘సరేనండి...’’‘‘మధ్నాహ్నం 12.30 కల్లా మీకు ఫొటోలు వచ్చేస్తాయి. మీకు నచ్చిన ఆవును ఎంపిక చేసుకోండి. మరణించిన మీ బంధువుల ఆత్మశాంతి కోసం ఈ పనికి పూనుకుంటున్నారు. మిమ్మల్ని అభినందించాలి’’.‘‘అంతా సజావుగా జరిగితే ఫరవాలేదు, లేకపోతే నలుగురి ముందూ నవ్వుల పాలవుతాను.’’‘‘ఆ విషయం నాకు వదిలెయ్యండి. మీరు చెప్పిన టైమ్ కంటే ఓ అర్ధగంట ముందే సత్రం దగ్గర ఆవు ఉంటుంది. నా మాట నమ్మండి’’.∙∙ ‘‘అయ్యా, సమయం 5.30 దాటుతోంది. ఆవు సంగతి తేలలేదు. అనుకున్న పని సజావుగా పూర్తవుతుందా లేదా అని భయంగా ఉంది?’’‘‘నాకొదిలెయ్మన్నా కదా... జహీరాబాద్ వాడు ఫోన్ ఎత్తటం లేదు. చాలాసార్లు ట్రై చేశా. ఇప్పుడు చింతలకుంట మార్కెట్ అతను మాట్లాడాడు. ఇప్పుడే ఫొటోలు వచ్చాయి. పంపుతున్నాను.’’‘‘మరి ధర విషయం?’’‘‘కాస్త ఎక్కువ చెబుతున్నాడు.’’‘‘మీరే మాట్లాడి నా బడ్జెట్ ప్రకారం తెగ్గొట్టండి.’’‘‘నా వంతు ప్రయత్నం చేస్తాను.’’‘‘మధ్యాహ్నం అనగా మాట్లాడాను. ఇప్పుడు రాత్రి 7.30 దాటింది. కొన్ని గంటల్లో కార్యక్రమం పెట్టుకుని ఆవు సిద్ధం కాకపోతే ఎలా?’’‘‘తను ఆవు ధర చెప్పాడు. తగ్గటం కుదరదని బిగుసుకుపోయాడు. ఏం చేయాలో తోచక..’’‘‘ఇంతకీ ఎంత చెబుతున్నాడేమిటి?’’‘‘మీకు మెసేజ్ పెట్టాను. వాట్సాప్ ఓపెన్ చేసి చూడండి.’’‘‘అమ్మో.. ఇంతా? బడ్జెట్ పదివేలు దాటుతుంది’’.‘‘అందుకే నేనే తగ్గించమని బతిమాలుతున్నా’’.‘‘ఎలాగోలా అయ్యేటట్టు చూడండి’’.‘‘చూద్దాం. మనకు బానే పరిచయం ఉన్నవాడు. తగ్గుతాడనే అనుకుంటున్నాను’’.‘‘ప్లీజ్. ఏదో రకంగా సెటిల్ చేయండి.’’∙∙ ‘‘రెండు గంటల నుంచి మీ కోసం ఎదురుచూస్తున్నాను. ఈ టెన్షన్ భరించటం నా వల్ల కావటం లేదు. ఎంతో కొంతకి సెట్ చేయండి. ఇప్పుడు రాత్రి 9 అవుతోంది’’‘‘చాలాసార్లు మాట్లాడి చూశాను. ధర తగ్గించటం కుదరదంటున్నాడు. మీరే ఆలోచించి ఏదో ఒకటి ఫైనల్ చేసుకోండి.’’‘‘ఇప్పుడు నేను మాత్రం చేయగలిగింది ఏముంది?’’‘‘అలా కాదు. మీ ఇద్దరికీ కాన్ఫరెన్సు కాల్ ఏర్పాటు చేస్తాను. మీరు కూడా మాట్లాడి ఓ నిర్ణయానికి వస్తే బావుంటుంది.’’‘‘ఆ అవసరం ఎంత మాత్రం లేదు. మీపైన బాధ్యత పెట్టాను. అతను తగ్గనంటే నేను మాత్రం ఏం చేస్తాను. ఆ రేటుకే కానిచ్చేయండి.’’‘‘సరే. వాట్సాప్‌లో లొకేషన్ పంపితే వచ్చి మీ ఇంటికొచ్చి డబ్బులు తీసికెళతాడు. పురోహితుడు కూడా కావాలన్నట్టున్నారు. మాకు తెలిసిన ఓ పెద్దాయన్ని పంపుతాను.’’‘‘ఆయనకు సంభావన, ఇతర ఖర్చులు..’’‘‘గోదానానికి రెండువేల నుంచి మూడువేల వరకూ తీసుకుంటారు. దానితో పాటు పెట్రోలు ఖర్చులు నాలుగైదు వందలు ఉంటుందేమో? అంత వరకూ ముట్టచెప్పండి చాలు...’’‘‘అలాగే. సత్రం చిరునామా పంపుతాను. ఉదయం 8, 8.30 కల్లా వచ్చెయ్యమని చెప్పండి.‘‘అలాగే..’’∙∙ ‘‘అదేంటి? ఉదయం ఆరుగంటలకే బయలుదేరతానన్నావు కదా?’’‘‘మీరు చెప్పిన ధరకయితే రాలేను.’’‘‘అదేంటి? బేరం మాట్లాడుకున్న తర్వాత ఇలా చేస్తారా ఎవరైనా?’’‘‘ఓసారి మీరన్నది గుర్తు చేసుకోండి. ఆవుకు డబ్బులిచ్చాను. మళ్లీ ట్రాన్సుపోర్టుకు అదనమని నాకు తెలీదు అని మీరు వాదించారు..’’‘‘అవును, గుర్తుంది. ఆవు అమ్మిన అతన్ని దగ్గర నంబరు తీసుకుని నీతో మాట్లాడాను. ఇప్పటికే ఖర్చు తడిసిమోపెడయ్యింది. నేను ఇంతే ఇస్తాను. మిగతా ఎమౌంట్ అతని దగ్గర తీసుకోమన్నాను.’’‘‘ఆ..’’‘‘అంటే నువ్వు ఒప్పుకున్నట్టే కదా, ఇప్పుడు పంచాయతీ చేస్తున్నావేంటి?’’‘‘బాడుగ గిట్టదు..’’‘‘సరే, ఏం చేస్తాం? నువ్వడిగినదంతా ఇస్తాను, ఆవు, దూడలతో వచ్చెయ్యి’’‘‘డబ్బులు ఫోన్ పే చెస్తే.. బయలుదేరతా.’’∙∙ ‘‘అయ్యా, కార్యక్రమం ప్రారంభిద్దాం. ఆవుని, దూడని పసుపు, కుంకుమలతో చక్కగా అలంకరించండి.’’రామశర్మ కారు దిగి అక్కడ అడుగుపెట్టగానే వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.నుదుటిన పెద్ద బొట్టు, మెడలో రుద్రాక్ష మాల, చేతికి బంగారు కడియాలు, వేళ్లకు తళతళా మెరుస్తున్న ఉంగరాలు, ఖరీదైన సిల్కులాల్చీ... బాగా ఖరీదయిన మనిషిలాగా కనిపించాడు.నిన్న ఉదయం నుంచి పడిన శ్రమ సార్థకమయ్యే సమయం వచ్చింది. క్రతువు ఘనంగా చేయాలనే సంకల్పంతో ఉన్నా. అందుకే మనసులో ఆందోళనగా ఉన్నా, మిగతా అన్ని ఆలోచనలను పక్కకు నెట్టి చేస్తున్న పనిమీద మనసు నిలిపాను. చుట్టూ ఉన్న వాళ్లని హుషారు చేశాను. ఆవు అలంకరణ పూర్తి కావటానికి ఎంతో సమయం పట్టలేదు. పసుపు, కుంకుమ అలంకరించిన తర్వాత కొత్తగా కొన్న చీర, బ్లౌజ్ పైన పరిచాం. రామశర్మ పెదవులు కదులుతున్నాయి. బయటకు వినిపించటం లేదు గానీ ఆయన ఏవో మంత్రాలు చదువుతున్నాడని అర్థమైంది. ఓ పదినిముషాల తర్వాత ‘‘మీ కుటుంబ సభ్యులంతా దంపతులుగా వచ్చి ముమ్మారు ప్రదక్షిణ చేయండి’’ గట్టిగా చెప్పారు.ఆయన ఆదేశాలు తు.చ. తప్పకుండా అమలు చేశాం. అపరకర్మల కోసం అక్కడకు వచ్చిన వాళ్లు, సత్రం గదుల్లో ఉన్న వాళ్లు బిలబిలమంటూ బయటకు వచ్చి ఈ తంతు చూడటం ప్రారంభించారు. యూట్యూబ్ వచ్చిపడ్డ తర్వాత జనాల్లో చాలా మార్పు వచ్చింది. దానిని భక్తి అనాలో, మరొకటనలో.. అంతమందిని చూడగానే రామశర్మలో ఎక్కడలేని హుషారు వచ్చింది.‘‘మీకు గోదానం ప్రాశస్త్యాన్ని వివరిస్తాను’’ ఆయన కంఠం ఖంగుమంది.‘‘గోవులను దానం చేయటం వల్ల దారిద్య్రం తొలగి సంపదలు కలుగుతాయి. అనారోగ్య, అపమృత్యు భయాలు తొలగిపోతాయి. గృహదోషాలు మాయమవుతాయి. జన్మజన్మల పాపాలు హరించుకుపోతాయి. మరణానంతరం ‘వైతరణి’ దాటే క్రమం సులభమవుతుంది. కొన్ని వేల సంవత్సరాల పాటు పితృదేవతలు ఉత్తమగతులు పొందుతారని శాస్త్రాలు చెబుతున్నాయి.’’రామశర్మ చెప్పేది అందరూ సావధానంగా వింటున్నారు. టీవీ కార్యక్రమాల్లో ప్రయోక్త మాదిరిగా హావభావాలను ప్రదర్శిస్తూ ఆయన సంభాషణను రక్తికట్టిస్తున్నాడు.‘‘గోవు సకల దేవతా స్వరూపం. శక్తి స్వరూపిణి అయిన అమ్మవారి తర్వాత, కన్నతల్లి తర్వాత, ఒక్క ఆవును మాత్రమే గోమాత అని పిలుస్తారు...’’ అని వివరించిన తర్వాత.. కాస్త విరామం ఇచ్చి.. ‘‘గోమాత నమోనమో నమోనమో నమః’’ అన్నాడు రామశర్మ.‘‘ఈ నామాన్ని మీరంతా మూడుసార్లు అనండి’’ అని అందరి చేత అనిపించాడు.అందరి మొహాలు ఒక్కసారిగా వెలిగిపోయాయి. ఈ క్షణంలో ఇక్కడ లేకపోయుంటే ఎంత పుణ్యాన్ని కోల్పోయేవాళ్లమో అనుకున్నారు.‘‘మీలో చాలా మందికి గోదానం చేయాలని ఉంటుంది. అదెలాగో తెలియదు. అలాగే కొందరికి ఆసక్తి ఉంటుంది కాని, ఆర్థికంగా స్తోమత ఉండదు. అలాంటి వాళ్లందరి కోసం నా దగ్గర చిట్కా ఉంది. మీరు నెలనెలా వెయ్యి రూపాయలు ఖర్చుపెడితే చాలు, మీ పేరుతో ఆవుకి మేత వేస్తాం. ఆవుల సంతతి పెరుగుతుంది. మీకు పుణ్యం వస్తుంది. వెయ్యి అనే కాదు. ఇవ్వగలిగిన వాళ్లు అంతకంటే ఎక్కువ ఇచ్చినా ఇబ్బంది లేదు.’’‘‘మీకు ఆవులు ఉన్నాయా పంతులు గారూ?’’ ఎవరో ఒకావిడ అడిగింది.‘‘ఎంతమాట అన్నావమ్మా! పెద్ద గోశాలనే నడుపుతున్నా. అక్కడ చాలా ఆవులు ఉంటాయి. దానాలు అవసరం అయిన వాళ్లు ఫోన్ చేయవచ్చు. కావాలనుకుంటే వచ్చి చూడొచ్చు’’.లాల్చీ జేబులో నుంచి విజిటింగ్ కార్డుల కట్ట బయటకు తీశాడు. చుట్టూ ఉన్న జనం ఒక్కసారిగా మీద పడ్డారు.‘‘వెయ్యి కష్టం అనుకున్న వాళ్లు కనీసం ఐదు వందలయినా ఇవ్వండి. పుణ్యం మూటకట్టుకోండి.’’ అప్పటికప్పుడు రాయితీ కూడా ప్రకటించారు.రామశర్మ మాటలతో మైకం కమ్మిందో, అప్పటికే పుణ్యం అన్న మాట చాలాసార్లు విని ఉండటం వల్లనో తెలియదు అందరికీ పూనకం వచ్చిందో తెలియదు గాని, వెనకా ముందు చూసుకోలేదు. జేబుల్లో నుంచి నోట్లు తీసి రామశర్మ చేతుల్లో కుక్కారు. మరికొందరు డిజిటల్ పేమెంట్ మోడ్‌లోకి వెళ్లారు. రామశర్మ ఓ వైపు నోట్లు సరిచూసుకుంటూ దాతలకు అక్షతలు వేసి ఘనంగా దీవించారు. అందరూ తలో వైపు వెళ్లిపోయారు. ఇది ప్రైవేటు కార్యక్రమం. మా కుటుంబానికి పరిమితమైన వ్యవహారం. దానిని పక్కన పెట్టి ఆయన తన సొంత బిజినెస్‌లో నిమగ్నం కావటం నాకు ఇబ్బంది అనిపించింది. అయినా నోరు మెదపలేకపోయాను. మా కుటుంబంలో మిగతావాళ్లదీ దాదాపుగా అదే పరిస్థితి. అంతలోనే ఆయన నా వైపు చూస్తూ ‘కార్యక్రమం ముగిసింది’ అన్నట్టుగా కళ్లతోనే చెప్పాడు. నేను పర్సులో నుంచి డబ్బులు తీసి ఆయన చేతిలో పెట్టాను.వాటిని లెక్క పెట్టుకుని ‘‘ఇదేంటి?’’ అన్నాడు సీరియస్‌గా.‘‘నేను ఒప్పుకున్నది అంతకేగా.. ఆవు పంపిన వ్యక్తి.. పేరు చెప్పాను. ఆయన చెప్పిన మొత్తం ఇదేగా?’’ అన్నాను అదే స్థాయిలో తీవ్రంగా స్పందిస్తూ.‘‘ఈ చిల్లర తీసుకోవటానికి నేనేం ఆషామాషీ వ్యక్తిని కాదండీ.’’ఎంత ఇవ్వాలో అంకె చెప్పాడు. అది వినేసరికి నా కళ్లు బైర్లు కమ్మాయి.‘‘జంటనగరాల్లో నేను ఫేమస్. సినిమావాళ్లు, పొలిటీషియ¯Œ ్స, బిజినెస్ బిగ్ షాట్స్ అందరూ నా క్లయింట్స్. వాళ్లందరికీ నా మాట మీద గురి. నేను చెప్పినట్టల్లా నడుచుకుంటారు. నా నాలిక మీద సరస్వతి నాట్యం చేస్తుంది. నేను ఒక మాట అన్నానంటే అంతే...’’ప్రవాహంలా ఆయన మాటలు సాగుతున్నాయి. ఆ సొద వినటం నాకు ఇబ్బందిగా ఉంది.‘‘నేను సోషల్ మీడియా చూడను. నాకు ఇవేమీ తెలియవు’’ అన్నాను చికాకు బయటకు కనపడకుండా.‘‘నా యూట్యూబ్ చానల్‌కి లక్షల్లో సబ్ స్క్రైబర్లు ఉన్నారు.’’ అన్నాడు దర్పాన్ని ప్రదర్శిస్తూ.అప్పటి వరకు నేను పెద్దగా పట్టించుకోలేదు. ఓ పన్నెండేళ్ల కుర్రాడు మొబైల్లో వీడియో తీయటాన్ని ఇంతకు ముందు గమనించాను. ఇప్పుడు ఆయన చెబుతుంటే అర్థం అవుతోంది. ఒకేసారి స్వామికార్యం, స్వకార్యం పూర్తి చేస్తున్నాడన్నమాట. డబ్బు పుచ్చుకుని కార్యక్రమాలు చేయటానికి వస్తాడు. వాటిని షూట్ చేసి యూట్యూబ్‌లో పెట్టి తిరిగి డబ్బు సంపాదిస్తాడు.ఆయన నా ఆలోచనలు తుంచేస్తూ. ‘‘సర్సరే. అవతల నాకు వేరే కార్యక్రమం ఉంది. డబ్బులిస్తే బయలుదేరతాను’’ అన్నాడు దబాయించినట్టుగా. ఆయన అడిగిన మొత్తం చేతిలో పెట్టి నమస్కారం చేశాను. ఆ డబ్బుల్ని లాల్చీలోకి నెట్టుకుని క్షణాల్లోనే మాయమయ్యాడు. నేను ఊపిరి పీల్చుకున్నాను. అప్పటికే నాకు ఓర్పు సడలింది. పని ముగించుకుని ఎప్పుడెప్పుడు అక్కడి నుంచి పారిపోదామా అనిపిస్తోంది. కాని అదంత సజావుగా ముగిసేటట్టు లేదు.∙∙ ‘‘ఉదయం 8గంటలకు రమ్మని పిలిచారు. నాలుగు గంటలు వెయిట్ చేయించారు. ఇంకో వెయ్యి అదనంగా ఇవ్వండి’’ ఆవును వెంట తెచ్చిన వ్యాన్ డ్రైవర్ డిమాండ్ చేశాడు.‘‘ఓ ఐదొందలు.. కాదంటే అదనంగా ఇంకో వంద.. తప్ప అంత కంటే ఎక్కువ ఇవ్వలేను. అంతా లెక్క వేసుకుని డబ్బులు తెచ్చాను. దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకు’’ బతిమాలుతున్నట్టుగా అడిగాను.‘‘మీరిచ్చే దానిలో రెండు వందలు చీటీకే పోతుంది’’ నిర్లక్ష్యంగా చెప్పాడతను.‘చీటీ అంటే..?’’‘‘సంతలో ఆవును కొన్నప్పుడు దానికి రిసీప్టు ఇస్తారు. మీ పేరుతో తీసుకున్నాను. కావాలంటే చూడండి’’ చీటీ తీసి నా చేతిలో ఉంచాడు.‘‘పరిస్థితి చాలా అన్యాయంలా ఉందే. ఆవు కొన్నందుకు డబ్బు చెల్లించటం కాకుండా మళ్లీ అదనంగా ఇంకో ఖర్చా? నా దగ్గర ఉన్నవి ఇవే. వీటితో సర్దుకో. విసిగించొద్దు’’.‘‘మిగిలిన డబ్బులు గూగుల్ పే చేయండి’’.‘‘బాబూ, నీకో దండం. ఈ పని తలకెత్తుకుని నేను పడ్డ నరకయాతన చాలు. ఇచ్చింది పుచ్చుకుని వెళ్లు’’.‘‘ఛీ... వెధవ బేరం’’అతని నోటి నుంచి వచ్చిన బూతులు విన్న తర్వాత డబ్బులు ఇచ్చినా బావుండేదని అనిపించింది.∙∙ ఈ తంతులో ఆఖరి ఘట్టంలోకి ప్రవేశించాం. ఓ వైపు భోజనాలకు ఏర్పాట్లు సాగుతున్నాయి. కొడుకులు, కోడళ్లు, కూతుళ్లు, అల్లుళ్లు, మనవలు, మనవరాళ్లు, మునిమనవలు, మునిమనవరాళ్లు... అటూ ఇటూ ఐదు తరాల వాళ్లు ఒకచోట చేరారు. అనుబంధాలను నెమరువేసుకుంటున్నారు.‘‘ఆవిడ పరిపూర్ణ జీవితాన్ని గడిపింది. ఇన్ని తరాల వాళ్లను చూసుకుంది అదృష్టవంతురాలు...’’‘‘పెట్టుపోతలంటే ఆవిడ తర్వాతనే ఇంకెవరయినా. ఇంటికొస్తే ఎంగిలిపడకుండా తిరిగి వెళ్లనిచ్చేది కాదు..’’‘‘ఎవరు ఎన్ని మాటలన్నా మౌనంగా ఊరుకునేది. పరుషంగా ఒక్కరిని నిందించటం చూళ్లేదు..’’‘‘ఇంత పెద్ద సంసారాన్ని ఒంటి చేతిమీద నెట్టుకొచ్చింది.’’నాకు తెలిసి నిన్న మొన్నటి వరకూ వీళ్లంతా ‘ఈ ముసలమ్మ నస భరించలేకపోతున్నాం’ అని విసుక్కున్న వాళ్లే. మరి ఇప్పుడేంటి వింతగా ప్రవర్తిస్తున్నారు? వ్యక్తుల మరణంతో అన్నీ తుడిచిపెట్టుకుపోయాయా? ఈ సంభాషణ ఒక వైపు సాగుతూండగానే మాకు కొద్ది దూరంలో.. తోడికోడళ్లు నలుగురు పోగయి మాట్లాడుకుంటున్నారు. అక్షరం పొల్లుపోకుండా అవన్నీ నా చెవిలో పడుతున్నాయి.‘‘ఇదంతా పెద్ద షో అక్కా? నెలనెలా జీతం రాళ్లతో బతికేవాళ్లు... వేలకు వేలు పోసి ఆవు కొనగల సత్తా ఉందా? ఎక్కడో ఆవును, దూడను తెచ్చి తంతు ముగించేసి ఉంటారు. దానికి పెద్దగా ఖర్చు కూడా కాదట!’’‘‘ఈ ముసల్ది కూతురికి పెద్ద మూట ఇచ్చి ఉంటుంది. అందుకే ఘనంగా గోదానం చేస్తున్నారు. ’’‘‘అమ్మ బతికున్నప్పుడు ఉన్న ఊళ్లోనే అయినా ఒక్కసారి కూడా చూడటానికి రాలేదు గానీ, టింగురంగా అంటూ ఇప్పుడొచ్చి ప్రేమ ఉన్నట్టు వేషాలేస్తోంది చూడు. ఆ అల్లుడుగాడు ఏదో గొప్ప పని చేసినట్టు ఫోజు కొడుతున్నాడు. పాపం ఊరికే పోతుందా? వీళ్లను కట్టి కుడపదూ?’’‘‘అత్తగారి వైపు నుంచి బాగా ఆస్తి వచ్చి ఉంటుంది? కొడుకు అమెరికాలో ఉన్నాడుగా.. నెలనెలా డాలర్లు పంపుతూ ఉండుంటాడు. డబ్బులు ఏం చేసుకోవాలో తెలియక, నలుగురి ముందు గొప్ప చాటుకోవాలని..’’‘‘ఇవన్నీ కాదు అక్కా... ముసలమ్మ వాటా కొట్టెయ్యటానికి ప్లాన్ చేశారేమో?’’‘‘మేం చేతగాని వాళ్లమా? అదెలా జరగుతుందో చూస్తాం...’’మా దంపతుల్ని లక్ష్యంగా చేసుకుని మాటల దాడి కొనసాగుతోంది. ఇతరుల ప్రశంసల కోసమో, గొప్ప కోసమో ఈ పని చేయలేదు. అసలు గోదానం కొడుకులు చేయవలసిన పని అన్న స్పృహ కూడా నాకు లేదు. నా సమక్షంలో గోదానం గురించి చర్చ సాగుతున్నప్పుడు ‘నేను చూసుకుంటాను’ అని చెప్పి ఇందులోకి దిగాను. అంతకు తప్ప... పక్కనే ఉన్న నా భార్య ఈ మాటలు విన్నట్టుంది. గట్టిగా శోకాలు అందుకుంది. ఆమెను అక్కడ నుంచి పక్కకు తీసికెళ్లి ఓదార్చాక గాని తను మామూలు కాలేకపోయింది. భోజనాలు ముగిశాయి. ఆ తర్వాత ఆశీర్వచన కార్యక్రమం పూర్తయ్యింది.‘‘ఎవరికీ వెళ్లొస్తామని చెప్పకూడదు. పొద్దుగూకక ముందే ఇక్కడి నుంచి వెళ్లిపోవాలి’’అక్కడున్న వాళ్లెవరో చెప్పారు. ఒక్కొక్కళ్లు లేవటం మొదలుపెట్టారు.ఏ కర్మఫలం నన్ను ఇందుకు పురిగొల్పిందో? నా పుర్రెకు పుట్టిన బుద్ధి... నా భార్యతో సహా మిగిలిన వాళ్లందరినీ ఆశ్చర్యపరచి ఉండొచ్చు. నాకు మా అత్తగారి వైపు వాళ్లతో అంత సాన్నిహిత్యం లేదు. పండగలు, పెట్టుపోతలు లాంటి వాటికి దూరంగా ఉన్న వాడిని. ఇప్పుడిలా.. ఓ మంచి పని చేయటంలో ఉండే తృప్తిని మిగుల్చుకోవాలన్న తాపత్రయం తప్ప దీని వెనక నాకు ఎలాంటి స్వార్థం లేదు. ఈ మాటలు బయట పెట్టి నేను చేసిన పని విలువను దిగజార్చుకోదలచుకోలేదు.‘‘మరణించిన పెద్దావిడకు భగవంతుడు సద్గతులు ప్రసాదించాలి’’ అనుకున్నాను.రామశర్మ చెప్పినట్టు.. ‘‘ఆమె హాయిగా వైతరణి దాటాలి. దానం చేసిన ఈ గోవు ఆమెకు దీపధారిగా నిలవాలి’’ అని వేడుకున్నాను.ఓ సత్కార్యం చేయటానికి అవకాశం ఇచ్చిన ఆ భగవంతుని మనసారా ధన్యవాదాలు చెప్పుకుని నిశ్శబ్దంగా అక్కడ నుంచి బయటపడ్డాం.సూర్యుడు పడమటి కొండల్లోకి దిగుతున్నాడు.- డాక్టర్ పార్థసారథి చిరువోలు -
పైల్స్ నివారణకు అశ్విని ముద్ర
అశ్విని ముద్ర అనేది యోగాలో పెల్విక్ ఫ్లోర్/మలద్వార ప్రాంతంలోని కండరాలను సంకోచించి–వదిలే సాధన. ‘‘అశ్విని’’ అంటే గుర్రం. గుర్రం మలవిసర్జన తర్వాత ఆ ప్రాంతాన్ని సంకోచించి, సడలించే కదలికను పోలి ఉండటం వల్ల ఈ పేరు వచ్చింది.చేసే విధానంముందుగా మలాసనంలో కూర్చోవాలి.కళ్లను మూసుకుని శ్వాసను సహజంగా తీసుకోవాలి.మలవిసర్జన ఆపుతున్నట్లుగా మలద్వార/పెల్విక్ ఫ్లోర్ కండరాలను మెల్లగా బిగించండి.2–3 సెకన్లు హోల్డ్ చేసి, పూర్తిగా రిలాక్స్ చేయండి.ఇలా 15–20 సార్లు చేయవచ్చు.చివర్లో కొన్ని క్షణాలు పూర్తిగా రిలాక్స్ అవ్వండి.ముఖ్యంగా: పొట్ట, తొడలు, పిరుదులు బిగించకుండా పెల్విక్ ఫ్లోర్ కండరాలనే కదిలించేలా ప్రయత్నించాలి. శ్వాసను బిగపట్టకండి.ప్రయోజనాలుకటి ప్రాంతంలోని కండరాలను దృఢంగా మారుస్తుంది.మలబద్ధకం, అజీర్ణం వంటి పొట్ట సమస్యలను తగ్గిస్తుంది.ఆసన ప్రాంతంలో రక్త ప్రసరణను పెంచి మొలలు తగ్గడానికి సహాయపడుతుంది.మూత్రం లీకయ్యే సమస్యను అరికట్టి బ్లాడర్ నియంత్రణను మెరుగుపరుస్తుంది.జాగ్రత్తలునొప్పి వస్తే వెంటనే ఆపాలి.పైల్స్, ఆనల్ ఫిషర్, రీసెంట్ రెక్టల్ సర్జరీ, తీవ్రమైన పెల్విక్ పెయిన్ ఉన్నవారు వైద్యుడి సలహాతోనే చేయాలి.మలవిసర్జన సమయంలో బలవంతంగా ఈ ముద్ర చేయకండి.ఎక్కువసేపు కండరాలను బిగించి ఉంచొద్దు.గర్భిణీలు లేదా ప్రసవం తర్వాత ఉన్నవారు వ్యక్తిగత పరిస్థితిని బట్టి యోగా ప్రొఫెషనల్ /డాక్టర్ గైడెన్స్ తో చేయాలి.– అనిత పాతర్ల, యోగా ట్రైనర్ మరిన్ని వివరాలకు ఈ వీడియోపై క్లిక్ చేయండి (చదవండి: వర్షాకాలంలోనే పంటి సమస్యలు ఎందుకంటే..?) -
మీ కష్టాలను సామాజిక మాధ్యమాలలో పంచుకుంటున్నారా?
కడుపులో ఉన్న కష్టాన్ని ఎవరితో పంచుకోవాలో తెలియక ఇటీవలి కాలంలో చాలామంది తమ వ్యక్తిగత బాధలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. దానివల్ల వారికి తాత్కాలిక ఉపశమనం లభించవచ్చేమో కానీ ముందు ముందు అనేక రకాల కొత్త సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది.చాణక్యుడి ప్రకారం, ఐదు రకాల వ్యక్తులకు మన సమస్యలకు చెప్పుకోవడం వల్ల లేనిపోని తలనొప్పులను కొని తెచ్చుకున్నట్టే! ఇంతకీ ఆ అయిదు రకాల వ్యక్తులెవరో తెలుసా? ఓర్వలేనివారు... నెగటివ్ ఆలోచనలు ఉన్నవారు, కుత్సిత, కుట్ర స్వభావులు, తెలివి హీనులు, దేనినీ దాటడం చేతకాని వాళ్లు.. వీరు అయిదుగురితో ఏ విషయాన్నీ పంచుకోకూడదు.మరి ఎవరితో పంచుకోవచ్చునంటారా... అక్కడికే వస్తున్నాం... సమస్యలు వచ్చినప్పుడు వాటిని గుండెల్లోనే దాచుకోవడం కూడా కష్టమే. అందుకే చాణక్యుడు ఒక పరిష్కారం చెప్పారు. మీకు అత్యంత నమ్మకమైన స్నేహితుడు, మీ గురువు లేదా మీ కుటుంబ సభ్యులతో మాత్రమే మీ మనసు విప్పి మాట్లాడండి. వీరు మాత్రమే మీకు సరైన దిశానిర్దేశం చేసి, సమస్య నుంచి గట్టెక్కించగలరు. -
వర్షాకాలంలోనే పంటి సమస్యలు ఎందుకంటే..?
వర్షాకాలం రాగానే చల్లటి వాతావరణం వల్ల వేడివేడి టీలు తాగాలని, పకోడీలు, సమోసాలు తినాలని మన మనస్సు లాగేస్తుంటుంది. అయితే, ఇవన్నీ మన దంతాల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని చాలా మందికి తెలియదు.. చిగుళ్లవాపు, పంటినొప్పి, నోటి దుర్వాసన వంటివి వేధిస్తుంటాయి. అందువల్ల చిన్నచిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్యల నుంచి దూరంగా ఉండవచ్చు.రాత్రివేళల్లో బ్రషింగ్‌ను అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. చల్లటి వాతావరణంలో బద్ధకం వల్ల బ్రష్ చేయడం మానేయడమో, హడావిడిగా ముగించడమో చేస్తుంటారు. దీనివల్ల దంతాల మధ్య మిగిలి΄ోయిన ఆహార వ్యర్థాలపై బాక్టీరియా చేరి యాసిడ్లను విడుదల చేస్తుంది. ఇది ఎనామిల్‌ను దెబ్బతీసి కేవిటీలకు దారితీస్తుంది.సాయంత్రం వేళల్లో టీ, కాఫీలతోపాటు తియ్యటి బిస్కెట్లు, వేపుళ్లు, స్వీట్లు తినడం సహజం. అయితే జిగటగా ఉండే తీపి పదార్థాలు దంతాల సందుల్లో పేరుకుపోయి బాక్టీరియాకు ప్రధాన ఆహారంగా మారతాయి. అందువల్ల ఆహారం, స్నాక్స్ తిన్న వెంటనే స్వచ్ఛమైన నీటితో నోటిని బాగా పుక్కిలించాలి. దాహం వేయకపోవడం వల్ల వర్షాకాలంలో చాలామంది నీళ్లు తక్కువగా తాగుతుంటారు. దీనివల్ల నోటిలో లాలాజలం ఊరడం తగ్గుతుంది. లాలాజలం నోటిని సహజ సిద్ధంగా శుభ్రం చేయడానికి సహాయపడుతుంది. లాలాజలం తగ్గితే నోటి దుర్వాసన, పంటి సమస్యలు పెరుగుతాయి. అందువల్ల దాహం వేయక΄ోయినా రోజంతా తగినంత కాచి చల్లార్చిన నీటిని తాగుతూ శరీరాన్ని, నోటిని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలి.వర్షాకాలంలో ఇమ్యూనిటీ కాస్త తగ్గడం వల్ల చిగుళ్ల ఇన్ఫెక్షన్లు ఎక్కువవుతాయి. బ్రష్ చేస్తున్నప్పుడు చిగుళ్ల నుంచి రక్తం రావడం లేదా వాపు రావడం గమనిస్తే చాలామంది దాన్ని సాధారణ విషయంగా వదిలేస్తారు. చిగుళ్ల రక్తస్రావం అనేది ఇన్ఫెక్షన్కు ప్రారంభ సంకేతం. అందువల్ల నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డెంటిస్ట్‌ను సంప్రదించాలి.వర్షాకాలంలో బాత్రూమ్లలో తేమ ఎక్కువగా ఉంటుంది. బ్రషింగ్ పూర్తయ్యాక టూత్‌బ్రష్‌ను బాత్రూమ్లోనే వదిలేస్తే, దానిపై బాక్టీరియా చేరే ప్రమాదం ఉంది. అందువల్ల బ్రష్ చేసిన తర్వాత దాన్ని శుభ్రంగా కడిగి, గాలి తగిలే పొడి ప్రదేశంలో నిలువుగా ఉంచాలి. (చదవండి: ముప్పైల్లో మెదడుకు మోయలేని ఒత్తిడి! ఎందుకంటే?) -
విపరీతంగా భయపడితే పొట్ట గందరగోళం! ఎందుకంటే?
మనం ఏదైనా ఎగ్జామ్‌కి వెళ్లేముందు గానీ, లేదా ఇంటర్వ్యూకి అటెండ్ అయేపుడు గానీ మనసులోనే కాకుండా పొట్టలోనూ గాబరాగా అనిపిస్తుంటుంది. అయితే ఇది వట్టి ముచ్చట కాదని.. మన జీర్ణవ్యవస్థ, మెదడు నిరంతరం ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మన పొట్టలో ఉండే బాక్టీరియా ఇచ్చే సంకేతాలే మన భావోద్వేగాలను, ఒత్తిడిని, మూడ్‌ను ప్రభావితం చేస్తాయని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.హార్వర్డ్ మెడికల్ స్కూల్ పరిశోధకుల ప్రకారం, మన జీర్ణ వ్యవస్థకు, మెదడుకు మధ్య నిరంతరం సమాచార మార్పిడి జరుగుతుంది. దీనినే ‘గట్–బ్రెయిన్ ఆక్సిస్’ అని పిలుస్తారు. బ్రెయిన్‌ను, జీర్ణ వ్యవస్థను కలిపే వేగస్ అనే ఒక ముఖ్యమైన నరాల వ్యవస్థ ద్వారా సంకేతాలు మార్పిడి చెందుతుంటాయి. అలాగే మన మనసును సంతోషంగా ఉంచే ‘సెరోటోనిన్’ అనే రసాయనం మెదడులో కాకుండా ఎక్కువగా జీర్ణ వ్యవస్థలోనే తయారుకావడం విశేషం.మనసు ఎందుకు మారుతుంది?మన జీర్ణవ్యవస్థలో ట్రిలియన్ల కొద్దీ సూక్ష్మజీవులు ఉంటాయి. ఆహారం, ఒత్తిడి, ఆల్కహాల్, లేదా ఇతర వ్యాధుల వల్ల పొట్టలో వాపు లేదా సూక్ష్మజీవుల సమతుల్యత దెబ్బతిన్నప్పుడు, జీర్ణవ్యవస్థ నుంచి మెదడుకు వెళ్లే సంకేతాలలో మార్పులు వస్తాయి.ఇది ఆందోళన, ఒత్తిడి, నీరసానికి కారణమవుతుంది. అందుకే మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు కడుపులో అసౌకర్యంగా అనిపిస్తుంది. మన శారీరక, మానసిక ఆరోగ్యం ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయని ఈ పరిశోధనలు నిరూపిస్తున్నాయి. సరైన ఆహారం తీసుకుంటూ పొట్ట ఆరోగ్యాన్ని కా΄ాడుకుంటే మానసిక ప్రశాంతతను కూడా కా΄ాడుకోవచ్చునని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. -
బంధం బలపడాలంటే.. ఆధిపత్యం కాదు అనురాగం ముఖ్యం!
భార్యాభర్తల మధ్య అనుబంధం అనేది రెండు విభిన్న మనస్తత్వాల కలయిక. ఇద్దరి మధ్య ప్రేమతో పాటు చిన్నపాటి విభేదాలు ఉంటుంటాయి. ఇలాంటివి ఎన్ని ఉన్నా.. అవతలి వ్యక్తి ఆలోచనలను, అభిప్రాయాలను తక్కువ చేసి చూడటం మొదలుపెడితే మాత్రం బంధంలో చీలికలు రావొచ్చని నిపుణులు చెబుతున్నారు. అలా కాకూడదంటే.. ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం!కొంతమంది ’నేను నీ కంటే ఎక్కువ సంపాదిస్తున్నాను’, ’అన్ని విషయాల్లోనూ నీకన్నా నాకే ఎక్కువ తెలుసు’ అనే భావనతో భాగస్వామిని చిన్నచూపు చూస్తుంటారు. ఇలాంటప్పుడు ఎదుటి వారు చెప్పేది ఎంత ముఖ్యమైనదైనా, అది వినడానికి మనసు అంగీకరించదు. ఈ క్రమంలో ఒక బంధం బలంగా ఉండాలంటే, ఆధిపత్యం చూపించడానికన్నా అనురాగంతో ఉండడం అవసరం. ఒకరి విషయాల్లో మరొకరు అనవసరంగా జోక్యం చేసుకోకూడదనే ఉద్దేశంతోనో లేదా ఎదుటివారికి అవగాహన లేదన్న భ్రమతోనో ‘నీకేం తెలియదు’ అని అంటుంటారు. అయితే, ఇది తరచూ సాగుతుంటే మాత్రం భాగస్వామి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుందని హెచ్చరిస్తున్నారు.సున్నితంగా చెప్పడంఒక సమస్య వచ్చినప్పుడు లేదా ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు ’నేను చూసుకుంటాను’ అని చెప్పడం కంటే, దీని గురించి నీ అభిప్రాయం ఏంటి? అని అడగడం మంచిది. దీనివల్ల భాగస్వామికి తాము కూడా ఈ బంధంలో ఒక ముఖ్యమైన భాగమనే నమ్మకం కలుగుతుంది. ఒకవేళ వారికి ఆ విషయంపై అవగాహన లేకపోతే, విసుక్కోకుండా సున్నితంగా వివరించాలని తెలియజేస్తున్నారు.దంపతులిద్దరూ చర్చించుకోవడంభార్యాభర్తల అనుబంధం అంటే ఒకరి భావాలను మరొకరు పంచుకోవడం. ఒకరికి తెలిసిన విద్య మరొకరికి తెలియకపోవచ్చు. అంతమాత్రాన అవతలి వారిని తక్కువ అంచనా వేయకూడదు. ఇంట్లో పనులైనా, ఆర్థిక నిర్ణయాలైనా ఇద్దరూ కలిసి చర్చించు కున్నప్పుడే కదా వారి మధ్య సామరస్యత ఏర్పడేది!బంధం బలపడడానికి...భాగస్వామి ఏదైనా తప్పు చేసినప్పుడు అందరి ముందూ లేదా కఠినంగా విమర్శించడానికి బదులుగా.. వారు చేసే చిన్న పనులను కూడా అభినందించడం వల్ల వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని అంటున్నారు. ప్రతి విషయంలోనూ మీదే పై చేయి కావాలని అనుకోవద్దని సలహా ఇస్తున్నారు. ఒక్కోసారి వెనక్కి తగ్గడం వల్ల బంధం మరింత బలపడుతుందని తెలియజేస్తున్నారు. ఏబంధమైనా నిలబడాలంటే ఒకరిపై ఒకరికి గౌరవం, అర్థం చేసుకునే స్వభావం, నమ్మకం ఉండాలి. అప్పుడే వైవాహిక జీవితం హ్యాపీగా సాగుతుంది. హ్యాపీ మ్యారీడ్ లైఫ్! -
ముప్పైల్లో మెదడుకు మోయలేని ఒత్తిడి! ఎందుకంటే?
ఇరవైల్లో వచ్చే ఒత్తిడికి, ముప్పైల్లో అనుభవించే ‘బర్నౌట్’కు చాలా తేడా ఉంటుంది. 20 ఏళ్ల వయసులో వచ్చే అలసట, నిస్సత్తువ కాస్త నిద్రపోతేనో లేదా ఒక వీకెండ్ ట్రిప్ వెళ్తేనో తగ్గిపోతుంది. 30 ఏళ్ల వయసు వచ్చేసరికి ఇదే లక్షణం తీవ్రమైన, దీర్ఘకాలిక మానసిక సమస్యగా మారుతోంది. అసలు ఈ బర్నౌట్‌కు కారణాలేంటి?బాధ్యతల ఒత్తిడి30 ఏళ్ల వయసులో జీవితంలో ఒకేసారి అనేక బాధ్యతలు వచ్చిపడతాయి. కెరీర్ కోసం పాకులాట, కుటుంబ బాధ్యతలు, సామాజిక సంబంధాలు, ఆరోగ్యం కాపాడుకోవడం వంటి వాటితో మనుషులు నలిగిపోతుంటారు. దీనివల్ల ఒత్తిడికి గురవుతుంటారు. అందువల్ల ప్రతిరోజూ కాసేపు నడక, ధ్యానం లేదా నచ్చిన పని చేస్తూ శరీరానికి, మెదడుకు కాస్త సమయం ఇవ్వాలి.దొరకని విశ్రాంతి..20ల్లో ఏదైనాప్రాజెక్ట్ కోసం రాత్రుళ్లు జాగారం చేసినా శరీరం త్వరగా కోలుకుంటుంది. కానీ ముప్పైల్లోకి అడుగుపెట్టాక దశాబ్ద కాలంగా పడుతున్న కష్టం, ఒత్తిడి ఒకేసారి బయటపడతాయి. తగినంత విశ్రాంతి దొరక్కపోవడం వల్ల శరీరం, మనస్సు నిరంతరం నిస్సత్తువలోనే ఉండిపోతాయి.ఆర్థిక ఆందోళనలు‘30 ఏళ్లు వచ్చాయంటే జీవితంలో సెటిల్ అయిపోవాలి’ అనే సామాజిక ఆలోచన పెద్ద భారంగా మారుతోంది. సొంత ఇల్లు కొన్నానా? రిటైర్మెంట్ సేవింగ్స్ ఉన్నాయా? పిల్లల చదువుల సంగతి ఏంటి? అనే ప్రశ్నలు వెంటాడుతుంటాయి. సోషల్ మీడియాలో తోటి వారి ప్రగతిని చూసి ‘నేను ఇంకా వెనుకబడే ఉన్నానా?’ అనే అభద్రతా భావం మానసిక ప్రశాంతతను దూరం చేస్తోంది. అందువల్ల సమాజం నిర్ణయించిన మైలురాళ్లతో మిమ్మల్ని మీరు పోల్చుకోవద్దు.జీవక్రియల్లో మార్పులువయసు పెరుగుతున్న కొద్దీ శారీరక శక్తి, కోలుకునే సామర్థ్యం తగ్గుతాయి. ఇరవైల్లో లాగా తక్కువ నిద్రతో సరిపెట్టుకోవడం లేదా ఆహారం సరిగా తీసుకోకపోవడం వంటివి శరీరానికి తీవ్ర నష్టం కలిగిస్తాయి. అందువల్ల ఆరోగ్యానికిప్రాధాన్యతనివ్వాలి.విశ్రాంతి తీసుకున్నా తగ్గని విపరీతమైన అలసట... ఏ పనిపైనా ఆసక్తి లేకపోవడం... నలుగురిలో ఉన్నా ఏదో తెలియని నిరాశ, ఒంటరితనం... ఈ లక్షణాలు ఈ మధ్య మీలో ఎక్కువగా కనిపిస్తున్నాయా? మీరు ముప్పైలో ఉన్నారా? అయితే మీరు ‘బర్నౌట్’బారిన పడి ఉండవచ్చు.విరామం లేని ‘వర్క్ కల్చర్’స్మార్ట్ఫోన్లు, మెయిల్స్, వర్క్–ఫ్రమ్–హోమ్ సంస్కృతి వల్ల ఆఫీసు పనికి, వ్యక్తిగత జీవితానికి మధ్య సరిహద్దులు చెరిగిపోయాయి. పని వేళలు ముగిసిన తర్వాత కూడా మెయిల్స్‌కు, మెసేజ్‌లకు అందుబాటులో ఉండాల్సి రావడం వల్ల మెదడు ఎప్పుడూ విశ్రాంతి పొందే స్థితిలోకి వెళ్లలేకపోతోంది. అందువల్ల పని వేళలు ముగిశాక వర్క్ మెయిల్స్, మెసేజ్‌లకు దూరంగా ఉండటం అలవాటు చేసుకోవాలి. -
ఓ లుక్కేయండి..? టాయిలెట్లోనే ఐడియాలు ఎందుకు వస్తాయి?
మనమందరం కాంక్రీట్ జంగిల్లో బతికే జంతువులమే.. రోడ్డు మీద ఒకడు చాయ్ తాగి సిటీ బస్ ఎక్కితే... స్టార్ హోటల్లో హెర్బల్ టీని సగం తాగి, మినరల్ వాటర్ గురించి అనవసరపు డిస్కషన్ స్టార్ట్ చేసి, హడావిడిగా బెంజ్ కారులో రోడ్డెక్కుతాడు మరొకడు.. ఎవరి పయనం ఎటున్నా, ఎవరి గమ్యం ఎటుపోయినా మనందరికీ కామన్‌గా కొన్ని అలవాట్లు ఉంటాయి. వాటిని తప్పించుకుని, ఆ అలవాట్లే మాకు లేవని చెప్పడం చాలా కష్టం.. ఒక వేళ మీరు ఈ అలవాట్లకు అతీతమైతే మీ స్కోర్ ఎంతో మీరే డిసైడ్ చేస్కోండి...1. అలారం మోగిన తర్వాత కూడా పడుకునే అలవాటు?జ. దీన్ని సైన్స్‌లో ‘స్నూజ్ ఆప్టిమిజమ్’ అంటారు. మోగిన అలారాన్ని ఆపి, నిద్రపోయే ఆ ఐదు నిమిషాల నిద్ర బ్రెయిన్‌కి చాలా హాయినిస్తుంది.2. పుస్తకాన్ని చదివితే ఐదు నిమిషాల్లో నిద్ర వస్తుంది, అయితే రీల్స్ చూస్తే రెండు గంటలైనా రాదు ఎందుకు?జ. పుస్తకంలోని విషయం ఒక పేజీతో అర్థం కాదు..కాని రీల్స్ ప్రతి 30 సెకన్లకి మారుతుండడంతో మెదడు రిఫ్రెష్ అవుతుంది.3. ఫ్రెంచ్ ఫ్రైస్ ఒకటి తిన్నా, రెండోది తిందామని ఆటోమేటిక్‌గా చూపు ఎందుకు ప్లేటు వైపు వెళ్తుంది?జ. ఉప్పు, నూనె కలయిక అనేది మెదడులో డొపమైన్‌ను సృష్టిస్తుంది. అందుకే మొదటి ఫ్రై నోటిలోకి వెళ్లగానే రెండో ఫ్రైకి బ్రెయిన్ ఆటోపైలట్ మోడ్ ఆన్ చేస్తుంది.4. టాయ్లెట్లో ఉన్నప్పుడే ఎందుకు ఐడియాలు ఎక్కువగా వస్తాయి?జ. ప్రశాంతత, ఏకాగ్రత వల్ల బ్రెయిన్ డీఫాల్ట్ మోడ్ నెట్ వర్క్ ఆన్ చేసుకుని రిలాక్స్ అవుతూ టెన్షన్ ఫ్రీగా తయారవుతుంది. అందుకే గ్రేట్ ఐడియాలు వస్తాయి.5. మనం రోజుకి ఎన్నిసార్లు అబద్ధాలు ఆడుతాం?జ. రీసెర్చ్ ప్రకారం మనుషులు రోజుకి సగటున నాలుగు అబద్ధాలు ఆడతారు. అందులో టాప్–1 తీసుకుంటే ‘నేను ఐదు నిమిషాలలో వస్తా’.6. అవసరం లేకపోయినా ఫోన్ చూసే అలవాటు?జ. సైకాలజీలో దీన్ని ఫాంటమ్ వైబ్రేషన్ అండ్ ఫోమో అని అంటారు. ప్రపంచంలో ఏదో జరిగిపోతోందనే ఉత్సుకతతో మన చేతులు ఫోన్ అన్‌లాక్ చేయడానికి పరిగెడతాయి.7. బాగా లేజీగా అయిపోయాం, రేపటి నుంచి జిమ్‌కి వెళ్తా?జ. మెదడు శ్రమ తగ్గించుకోవడానికి ప్రదర్శించే కాగ్నిటివ్ లేజీనెస్ ఇది.. పాక్షికంగా తనని తాను బాగానే ఉన్నానని చెప్పుకోవడానికి ఇదో రకం ఉపశమనం.8. అద్దం ఎక్కడ కనిపించినా అందం చూసుకునే అలవాటు?జ. మనసులోని సబ్ కాన్షియస్ మైండ్ నార్సిజమ్ అండ్ విజువల్ కన్ఫర్మేషన్ని కోరుకుంటుంది. అందుకే ఎవరి దిష్టి తగిలినా నా గ్లామర్ తగ్గేదేలా... అని రీకన్ఫర్మ్ చేసుకోవడమే ఈ అలవాటు.9. ఎగ్జామ్ లేదా ఇంటర్వ్యూకి ముందు మాత్రమే టాయిలెట్‌కి వెళ్లాలని ఎందుకు అనిపిస్తుంది.?జ. భయం లేదా టెన్షన్ వచ్చినప్పుడు శరీరంలో రిలీజ్ అయ్యే అడ్రినలిన్ హార్మోన్ పేగుల కదలికలను వేగవంతం చేస్తుంది.10. మనం ఇష్టపడే వ్యక్తి (ఫస్ట్ క్రష్)కి మెసేజ్ చేయగానే గుండె వేగం రెట్టింపవుతుంది ఎందుకు?జ. సైన్స్ ప్రకారం అది ప్రేమ కాదు. బ్రెయిన్లో హఠాత్తుగా ఎడ్రినలిన్ హార్మోన్ కంప్లీట్ బాడీకి ఇచ్చే షాక్ ఇది. -
పల్లెటూరి యువకుడి నుంచి నాసాతో ఒప్పందం వరకు..
మిగిలినవారి కంటే భిన్నంగా ఆలోచించేవారు ఏకాగ్రతతో శ్రమిస్తే అద్బుతాలు సాధించవచ్చు.. ఎక్కడో మారుమూల.. కరెంటు కోతలే తప్ప ఇంటర్నెట్ మొహమెరుగని పల్లెటూరులో పుట్టినవాడు స్టార్టప్ మొదలుపెట్టాడు. మొదలుపెట్టడమే కాదు.. ప్రపంచ అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసాతో ఒప్పందం కూడా కుదుర్చుకున్నాడు.కర్ణాటకలోని చిక్కమంగళూరు జిల్లా అల్దూర్ గ్రామానికి చెందిన అవైస్ అహ్మద్ (28) చిన్నప్పటి నుంచి పేదరికంలోనే పెరిగాడు. తనతోటి స్నేహితులు సినిమాలు, ఇన్‌స్టాగ్రామ్‌లను తెగచూస్తుంటే, అహ్మద్ మాత్రం తన తండ్రి తెచ్చిన సైన్స్ పుస్తకాలను తిరగేశాడు. బిట్స్ పిలానీలో చదివే అవకాశం పొందాడు.బిట్స్ పిలానీలో చదువుతున్న రోజుల్లో అహ్మద్ కొన్ని ఉపగ్రహ ప్రాజెక్టులలో పాల్గొన్నాడు. పంటల ఆరోగ్యాన్ని అంచనా వేయడానికి అవసరమైన ఖచ్చితమైన ఉపగ్రహ డేటా అందుబాటులో లేదన్న విషయాన్ని అహ్మద్ గ్రహించాడు. తన స్నేహితుడు క్షితిజ్ ఖండేల్వాల్తో కలిసి 2019లో ‘పిక్సల్’ పేరిట స్పేస్ టెక్ స్టార్టప్‌ను ప్రారంభించాడు.అనతికాలంలోనే ఈ స్టార్టప్ పంటల ఆరోగ్యం, కాలుష్యం, మీథేన్ లీకులు, పర్యావరణ మార్పులను అత్యంత సూక్ష్మంగా గుర్తించడం వంటి కోణాల్లో అభివృద్ధి చేసిన హైపర్ స్పెక్ట్రల్ ఉపగ్రహాలు నాసా దృష్టిని ఆకర్షించాయి. ఈ సాంకేతికతను గుర్తించిన నాసా జియోలాజికల్ రీసెర్చ్ కోసం పిక్సల్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. అలా నాసాతో అధికారికంగా పని చేసిన తొలి భారతీయ ప్రైవేట్ స్పేస్ స్టార్టప్‌గా పిక్సల్ సంస్థ నిలిచింది. -
జెన్ జీ: ఎవరి గోల వద్దు.. నా లైఫ్ నాదే!
తరం మారితే ఆలోచనా విధానం మారుతుంది కాని ఒక్క విషయంలో మాత్రం మారదు అదే ప్రేమ బంధాలు. టీనేజీ దాటకముందే ప్రేమ దోమ కుట్టిందని కూని రాగాలు తీస్తూ అల్లరి చేసే కుర్రమూక ప్రతి తరంలోనూ కనిపిస్తుంది. కాని ఇప్పుడున్న జెన్ జీలు మాత్రం ఆ ప్రేమకు నోనో అంటున్నారు. కారణం ‘సోలో మాక్సింగ్’. పరిచయం పెంచుకోవడం, ప్రేమించుకోవడం, డేటింగ్, షాపింగ్, ట్రావెలింగ్ ఇలా దేనివైపు కూడా పెద్దగా ఆసక్తి చూపడం లేదు. మాకు ఎవరి గోలా వద్దు... మా గోల ఎవరికీ వద్దు అంటూ నిర్మొహమాటంగా చెప్పేస్తున్నారు...అసలేంటీ ‘సోలో మాక్సింగ్’?ప్రేమ ముఖ్యమే కాని... అంతకంటే నన్ను నేను ప్రేమించుకోవడం ఇంకా ముఖ్యం...ఇదే సోలో మాక్సింగ్..అంటే ప్రేమ దోమ అంటూ తొక్కలో కమిట్మెంట్స్ పెట్టుకోకుండా, ఎవరితోనూ రొమాంటిక్ సంబంధాలు లేకుండా, ఉద్దేశపూర్వకంగా ఒంటరిగా ఉండటం, ఆరోగ్యంపై శ్రద్ధ చూపడం, కెరియర్‌పై దృష్టి పెట్టడం, మొత్తంగా చెప్పాలంటే స్వీయాభివృద్ధికి పెద్దపీట వేయడమే ఈ సోలో మాక్సింగ్. ఈ ట్రెండ్‌లో భాగంగా యువత ఒంటరిగా ప్రయాణాలు చేయడం, కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం, మానసిక ప్రశాంతత పొందడం, ఆర్థిక స్వావలంబన సాధించడం వంటి విషయాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. తమని తాము కోల్పోయే సంబంధాల కంటే తమని తాము ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడానికే జెన్ జీలు ఉత్సుకత చూపుతున్నారు.ఖర్చు తడిసి మోపెడుగణాంకాలు కూడా ‘సోలో మాక్సింగ్’కి అనుకూలంగానే ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ మాంట్రియల్ 2026 రియల్ ఫైనాన్షియల్ ్రపోగ్రెస్ ఇండెక్స్ ప్రకారం అమెరికన్లు గడచిన ఏడాదిలో డేటింగ్ కోసం సగటున 2323 డాలర్లు ఖర్చు చేస్తున్నారు. అలాగే భారత్‌లోని ముంబై వంటి నగరాల్లో ఒక సాధారణ డేట్ కోసం ప్రయాణం, ఆహారం, పానీయాలు, సినిమా కలిపితే ఐదు నుంచి ఆరు వేలవరకు ఖర్చవుతోంది. సరదాగా రెస్టారెంట్లో భోంచేయాలన్నా కూడా మూడు వేలు ఉండాల్సిందే.ఇక డేటింగ్ యాప్‌లలో కేవలం హుక్ అప్ అవ్వడానికే కాని మానసిక ప్రశాంతత ఉండదని జెన్జీలు భావిస్తున్నారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణంతో పాటు నెలజీతంలో పెరుగుదల లేకపోవడమే కాకుండా ఉద్యోగంలో అనిశ్చితి కూడా తోడు కోసం వెతికేవారిని ఒకింత వెనకడుగు వేసేలా ఆలోచింపజేస్తోంది. ప్రస్తుతం యూత్‌లో వైరల్ అవుతున్న ఈ ట్రెండ్‌ని కొంతమంది స్వార్థంగా పరిగణిస్తున్నా, మానసిక నిపుణులు మాత్రం దీనిని స్వీయ క్రమశిక్షణ, ఆరోగ్యకరమైన సంబంధాలకు పునాదిగా వ్యవహరిస్తున్నారు.ఎందుకిలా?నిపుణుల అభిప్రాయం ప్రకారం పెరుగుతున్న జీవన వ్యయం, ఉద్యోగాల్లో అస్థిరత, సోషల్ మీడియా ప్రభావం, ముందు తరంలో పెళ్లి వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిని ప్రత్యక్షంగా చూడడం, ద్రవ్యోల్బణం, జీతంలో పెరుగుదల లేకపోవడం వంటి కారణాల వల్ల జెన్ జీలు సంబంధాలకు దూరంగా ఉంటున్నారు. చాలా మంది యువతని పెళ్లెప్పుడు అని అడిగితే ‘సరైన వ్యక్తి కోసం ఎదురుచూస్తూ జీవితం ఆపేయడం కంటే, ముందుగా నా జీవితాన్ని అందంగా నిర్మించుకుంటున్నాను’ అనే ఆశావాద దృక్పథాన్ని వెల్లడిస్తున్నారు. -
రోజూ కనిపించే సమస్య.. ఇప్పుడు పెద్ద బిజినెస్!
ప్రతిరోజు మనం గమనించే విషయాల్లో అనేక సమస్యలు తారసపడతాయి. తార్కికంగా చూసే లక్షణం ఉండాలే గాని ప్రతి సమస్యకీ పరిష్కారం దొరకుతుంది. అలా పరిష్కారం చూపగలిగే ప్రతిపాదనే ఓ స్టార్టప్‌కి మూలమవుతుంది.ఢిల్లీలోని సీఎన్జీ పెట్రోల్ బంకుల వద్ద వాహనాలు గంటల తరబడి క్యూలో నిలబడడం చూసిన ఓ యువ ఇంజినీర్ వైభవ్ కౌశిక్‌కు కూడా అలాంటి ఆలోచనే వచ్చింది. ఎక్కడ రద్దీ ఉంది? ఏ బంక్‌లో త్వరగా ఇంధనం నింపుకోవచ్చు.. అనే చిన్న విషయానికి పరిష్కారం చూపాలన్న చిన్న ఉద్దేశమే వైభవ్‌ను ‘నాగాటి’ అనే స్టార్టప్‌ను ప్రారంభించేలా చేసింది.తొలుత ఇది కేవలం సీఎన్జీ స్టేషన్లలో రద్దీని చూపించే డిజిటల్ ప్లాట్ ఫామ్లా ప్రారంభమైనా, నేడు అది ఏఐ ఆధారిత మొబిలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీగా ఎదిగింది. రియల్ టైం డేటా ఆధారంగా వినియోగదారులకు తక్కువ రద్దీ ఉన్న స్టేషన్లను సూచించడం, ఇంధన సరఫరా సంస్థలకు డిమాండ్ అంచనాలు ఇవ్వడం, స్టేషన్ నిర్వహణను మరింత సమర్ధవంతంగా మార్చడం వంటి సేవలను అందిస్తోంది.ప్రస్తుతం ఈ సంస్థకు 30 లక్షల మంది పైగానే వినియోగదారులున్నారు. నాగాటి ప్రయాణం ఇక్కడితో ఆగలేదు..భారత ప్రభుత్వ చమురు మార్కెటింగ్ సంస్థలతో కలిసి పని చేస్తున్న ఈ స్టార్టప్ ఇప్పటికే 2.5 మిలియన్ డాలర్ల పెట్టుబడులను సమీకరించుకుంది. అంతర్జాతీయంగా యునైటెడ్ అరబ్ ఎమిరేడ్స్ (యుఏఈ) మార్కెట్లోకి కూడా అడుగుపెట్టి అక్కడ మొబిలిటీ వ్యవస్థలను కూడా తన సాంకేతిక పరిష్కారాలను అందించేందుకు సిద్ధమవుతోంది.2019లో గ్రేటర్ నోయిడాలో ఇంటర్న్‌షిప్ చేస్తున్న సమయంలో వైభవ్ ప్రతిరోజూ ఓలా, ఉబర్ క్యాబ్‌లలో ప్రయాణించేవాడు. ఆ సమయంలో సీఎన్జీ బంక్‌ల వద్ద భారీ క్యూలు కనిపించేవి. ఒక క్యాబ్ డ్రైవర్ చెప్పిన మాట వైభవ్ ఆలోచనని పూర్తిగా మార్చివేసింది. ‘రోజుకు దాదాపు గంట టైం క్యూలోనే వృథా అవుతోంది’.. ఈ ఒక్క మాటే ‘నాగాటి’ సంస్థకి నాంది పలికేలా చేసింది. స్టార్టప్ కోసం గొప్ప ఆవిష్కరణ అవసరం లేదు. ప్రతిరోజూ మనం ఎదుర్కొనే చిన్న సమస్యను గమనించి, దానికి సులభమైన పరిష్కారం చూపగలిగితే అదే పెద్ద వ్యాపార అవకాశంగా మారుతుంది. -
పొలంలో తుపాకులు నాటిన బాలుడు
పంజాబ్‌లోని బంగా గ్రామం. 1912వ సంవత్సరం. అప్పుడు భగత్‌సింగ్‌కు కేవలం 5 సంవత్సరాలు. ఒకరోజు తండ్రి కిషన్సింగ్తో కలిసి పొలానికి వెళ్లాడు. పెద్దలు రాజకీయాలు మాట్లాడుకుంటున్నారు. బ్రిటిష్ వాళ్లు భారతీయులను ఎలా హింసిస్తున్నారో చర్చించుకుంటున్నారు.చిన్న భగత్ నిశ్శబ్దంగా లేచి పొలంలో మట్టి తవ్వడం మొదలుపెట్టాడు. తండ్రి ఆశ్చర్యంగా ‘నాన్నా, ఏం చేస్తున్నావ్?’ అని అడిగాడు. ఆ చిన్నారి సమాధానం విని ఇద్దరూ అవాక్కయ్యారు. ‘తుపాకులు నాటుతున్నా నాన్నా’ అన్నాడు భగత్. ‘ఎందుకు?’ అని అడిగితే ‘తుపాకులు పండించి బ్రిటిష్ వాళ్లతో పోరాడి, జైలులో ఉన్న నా బాబాయిలను విడిపించడానికి’ అని ధైర్యంగా చెప్పాడు. 5 ఏళ్ల వయసులోనే దేశభక్తి, త్యాగం అంటే ఏమిటో అర్థం చేసుకున్నాడు. ఇంట్లో జరిగే స్వాతంత్య్ర ఉద్యమ చర్చలు, బాబాయిల కథలు అతని మనసులో బలంగా నాటుకుపోయాయి. అందుకే ఆ తర్వాత గొప్ప దేశభక్తుడిగా చరిత్రలో నిలబడిపోయాడు.‘మాకొద్దీ తెల్లదొరతనము’ – గరిమెళ్ల సత్యనారాయణశ్రీకాకుళం జిల్లాలో జన్మించిన కవి గరిమెళ్ల సత్యనారాయణ రాసిన దేశభక్తి గేయం ఇది. ఈ పాట రాసినందుకు బ్రిటిష్ ప్రభుత్వం ఆయనను అరెస్టు చేసి జైలు శిక్ష విధించింది. పేదరికంలో ఉన్నా కూడా ఆయన ఆశయాలను వదిలిపెట్టకుండా చివరి వరకు పోరాడారు.‘మాకొద్దీ తెల్లదొరతనము’ మాకొద్దీ తెల్లదొరతనము – దేవా!మాకొద్దీ తెల్లదొరతనముమా ్రపాణాలపై పొంచి మానాలు హరియించేపండ్రెండు దేశాలు పండుచున్నాగానిపట్టెడన్నము లోపమండీ!ఉప్పు ముట్టుకుంటే దోషమండీ!నోట మట్టి తెచ్చి పెడుతాడండీ! అయ్యో!కుక్కలతో పోరాడి కూడు తినమంటాడుధనము చేర్చుకొని వాడు వెళ్ళిపోతాడుమమ్ము దాస్యులుగ చేయ చూస్తాడువాడి పేరేని వినరాదండీ!కూటికైనా గతి లేదు వాడి దయ రాదండీ!గాంధీ టోపీ పెట్టి పాఠశాలకు పోతేగద్దించి చొక్కాలు ఊడదీస్తాడురాట్నములు బజార్ల పెట్టనివ్వడుమాటలాడితే కోటలకు దాటిస్తాడువాడి తాతలు సంపాదించినట్లుభూమిని వాడు పంచిపెడతాడుమన భూములను వాడు దోచుకుంటాడుమన నోళ్ళల్లో వాడు మట్టి కొడతాడుమాకొద్దీ తెల్లదొరతనము.మన్యం పులి అల్లూరిపిల్లలూ... మన దేశానికి స్వాతంత్య్రం ఊరికే రాలేదు. ఎంతోమంది వీరుల రక్తతర్పణంతో వచ్చింది. అలాంటి మహానుభావులలో మన తెలుగు నేల గర్వించదగ్గ అపర మన్యం పులి... అల్లూరి సీతారామరాజు ఒకరు!అల్లూరి 1897లో పశ్చిమగోదావరి జిల్లా మొగల్లు గ్రామంలో పుట్టారు. చిన్నప్పటి నుంచే ఆయనకు దేశభక్తి మెండు. యోగ, ఆయుర్వేదం అంటే చాలా ఇష్టం. ఆయన చదువుతోపాటు కత్తిసాము, గుర్రపుస్వారీ కూడా నేర్చుకున్నారు.అప్పట్లో బ్రిటిష్ వాళ్లు మన అటవీ ్రపాంతాల చట్టాలు తెచ్చి, గిరిజనులను అడవుల్లోకి వెళ్లనీయలేదు. వాళ్ల పొట్ట కొట్టారు. రోడ్లు వేయడానికి గిరిజనులతో బలవంతంగా పని చేయించారు. ఇది చూసి అల్లూరి చాలా బాధపడ్డారు. ‘మన దేశం, మన అడవి, మన హక్కు’ అని ఆయన నినదించారు. ఆయన దగ్గర పెద్ద సైన్యం లేదు. కానీ గిరిజనులను కూడగట్టి బాణాలు, బరిశెలతో బ్రిటిష్ పోలీస్ స్టేషన్లపై దాడులు చేశారు. ఆయన గెరిల్లా యుద్ధంలో ఎక్స్పర్ట్. అడవే ఆయన కోట.బ్రిటిష్ వాళ్లు ఎంత వెతికినా అల్లూరిని పట్టుకోలేకపోయారు. చివరికి 1924 మే 7న మోయిదా గ్రామంలో ఆయనను కాల్చి చంపారు. చనిపోతూ కూడా ‘భారత్ మాతాకీ జై’ అన్నారు. అల్లూరి గారు మనకు నేర్పింది ఏంటి? అన్యాయాన్ని ఎదిరించాలి. మన ప్రజల కోసం, మన మట్టి కోసం పోరాడాలి. ఈరోజు మనం స్వేచ్ఛగా బతుకుతున్నామంటే అల్లూరి లాంటి వీరుల త్యాగమే కారణం. మనం కూడా నిజాయితీగా చదివి, మంచి ΄ûరులుగా ఎదిగి దేశానికి సేవ చేయడమే ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళి. -
'ఓం'కి ఇంత పవర్ ఉందా? గుక్కపెట్టి ఏడుస్తున్న బిడ్డ కాస్తా..
పసిబిడ్డలు ఏడిస్తే సహజంగా ఏం చేస్తాం పాలు, లేదా డైపర్ వంటివి తనిఖీ చేస్తాం. ఒకవేళ అవి కాకపోతే భయపడ్డాడేమోనని దగ్గరకి తీసుకోవడం లేదా ఊయల్లో వేసి ఊపడం వంటివి చేస్తే ఆ పసివాడు ఏడుపు ఆపుతాడు. సహజంగా ఎవ్వరైనా ఇలానే చేస్తాం. కానీ ఈసారి నెట్టింట వైరల్ అవుత్తున్న వీడియోలో వ్యక్తి మాదిరి చేసి చూడండి. అంతేగాదు ఈ ఘటన మన ఆధ్యాత్మకి శక్తి గొప్పదనాన్ని చాటి చెప్పేలా ఉండటం విశేషం. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియో క్లిప్‌లో ఒక తండ్రి ఏడుస్తున్న బిడ్డను పట్టుకుని ..నెమ్మదిగా ఓం శబ్దాన్ని ఆలపిస్తాడు. క్షణాల్లో బిడ్డ ఏదో మత్తువచ్చినట్లుగా శాంతించి నిద్రపోవడం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ చర్య పేరెంటింగ్ హ్యాక్‌గా మారింది. కఈ వీడియోకి మిలియన్లలో వ్యూస్ లైక్‌లు రావడమే గాక నెటిజన్ల మనసుని దోచుకుంది కూడా."ఓం" అనేది భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాలలో లోతుగా పాతుకుపోయిన ఒక పవిత్రమైన మంత్రం. దీనికి భారతీయ ఆధ్యాత్మికత, యోగ సంప్రదాయాలలో "ఓం"కు సుదీర్ఘ చరిత్ర ఉంది, అక్కడ దీనిని మంత్రంగా, ధ్యానం చేసేటప్పుడు ఒక సాధనంగా ఉపయోగిస్తారు. అందువల్ల ఈ పద్ధతి భారతీయ తల్లిదండ్రులను అమితంగా ఆకర్షిస్తుంది. అయితే “ఓం” జపించడం వల్లనే శిశువు ఏడుపు ఆగిపోతుందనడానికి శాస్త్రీయ ఆధారాలు లేవు. కానీ లయబద్ధమైన శబ్దాలు, పునరావృతమయ్యే ఇంద్రియ అనుభూతి, కదలిక, సంరక్షకుని సాన్నిధ్యం వల్ల శాంతిని చేకూరుస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. అలాగే ఈ ఓం మంత్రపై పరిశోధనలు పెద్దలపైనే జరిగాయి. ఫ్రాంటియర్స్ ఇన్ సైకాలజీలో 2022లో ప్రచురించబడిన ఒక అధ్యయనంలో, ధ్యానంలో ఎటువంటి అనుభవం లేని 33 మంది పెద్దలపై పరిశోధకులు అధ్యయనం చేశారు. ఓం జపం చేయడం వల్ల, వాళ్లలో ప్రతికూల భావాలు తగ్గడమే గాక ఆలోచన విధానంలో కూడా మంచి మార్పు వచ్చింది.పేరెంట్స్ ప్రయత్నించొచ్చా?తల్లిదండ్రులు గుర్తుంచుకోవలసిన అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే, శిశువులలో కడుపునొప్పి, మితిమీరిన ఏడుపు లేదా నిద్ర సమస్యలను 'ఓం' నయం చేస్తుందనడానికి ఎలాంటి వైద్యపరమైన ఆధారాలు లేవు. అలాగే, ఈ ధ్వని శిశువు నాడీ వ్యవస్థపై ఒక ప్రత్యేకమైన ప్రభావాన్ని చూపుతుంది అని చెప్పడానికి కూడా తగినంత ఆధారాలు కూడాలేవు.అయితే శిశువులు తమ సంరక్షకుల స్వరాలకు లయబద్ధమైన ఇంద్రియ అనుభవాలకు అత్యంత వేగంగా స్పందిస్తారు. అందువల్ల, ఈ "ఓం", శిశువులకు జోలపాట లేదా గుసగుసలు లేదా "ష్ష్ష్" వంటి ఊహించదగిన శ్రవణ సంకేతంగా పనిచేయవచ్చునని చెబుతున్నారు. ఆరోగ్యకరమైన శిశువు ఏడుపు ఆపడానికి ఇలాంటి "ఓం" టెక్నిక్‌ని అనుసరించడంలో సమస్యల లేదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. కానీ దీన్ని ఓ అద్భుత పరిష్కారంగా మాత్రం చూడొద్దని హెచ్చరిస్తున్నారు. View this post on Instagram A post shared by Siqueiros Bolado (@ck.bolado)గమనిక: ఇది కేవలం మత విశ్వాసాలకు సంబంధించిన అంశం. అలాగే కొన్ని శబ్దాలు సహజంగా ప్రభావం చూపిస్తాయని అవగాహన కల్పించేందుకు మాత్రమే. మరిన్ని వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించి అనుసరించడం మంచిది. (చదవండి: ఎవరీ యాల్డా మోయిరీ..? ఏకంగా 15 ఏళ్లు..) -
అచ్చం నీలాంబరి మూవీ రమ్యకృష్ణలా.. అలాంటి ఫేషియల్..!
అందం అంటే శుభ్రంగా తినడం, ఖరీదైన చర్మ సంరక్షణ, వేలకు వేలు బ్యూటీపార్లర్ ఖర్చులు మాత్రమే కాదండోయ్. ప్రముఖ డెర్మటాలజీ చికిత్సలు కూడా ఉంటాయి. అదే సెలబ్రిటీల నవయవ్వన రహస్యం. అయితే దాని వెనుక నొప్పి కూడా భరించాల్సిందే. కేవలం మొటిమలు, లేజర్ ట్రీట్మెంట్, వంటి కాస్మెటిక్ చికిత్సలు గురించి విన్నాం. ఇంకాస్తా ముందడుగు వేస్తే..చిన్న చిన్న సూదుల చికిత్సతో వృద్ధాప్యాన్ని నివారించే వాటి గురించి విన్నాం, చూశాం కూడా. అయితే ఇదే ఏకంగా వాటిన్నిటిని మించిన షేషియల్ చికిత్స. సింపుల్‌గా చెప్పాలంటే మీ రక్తంతోటే మిరుమిట్లు గొలిపే అందం. వాట్ ఇందేంటి. అనుకోకండి. అదెలా చేస్తారు, ఎలా ఉంటుంది తదితరాల గురించి సవివరంగా తెలుసుకుందామా..!.సౌందర్యానికి సంబంధించి..వైద్య క్లినిక్స్‌లో హైడ్రా ఫేషియల్స్, ఆక్సిజన్ ఫేషియల్స్, కెమికల్ పీల్స్, LED థెరపీ ఫేషియల్స్, వైరల్ వాంపైర్ ఫేషియల్ వంటివి ఎంచుకుంటారు. ఇవే కాకుండా రక్తపిశాచి లాంటి ఒక చికిత్స ఉంది. అది అచ్చం నీలాంబరి మూవీలో అందంకోసం రమ్మకృష్ణ అందమైన యువకుల రక్తం ఎక్కించుకుంటే..అత్యంత అందంగా మారిపోతుందే అలాంటి చికిత్స ఇది. అయితే ఇందులో వేరేవాళ్ల రక్తం కాకుండా మన నుంచి తీసుకున్న బ్లడ్‌తోనే చేస్తారట.ఎలాగంటే..ఒక ప్రొఫెషనల్ వైద్యుడు సాధారణ రక్త పరీక్ష వలె చేయి నుంచి కొంత రక్తాన్ని తీసుకుంటారు. ఆ తర్వాత రక్తం నుంచి ప్లేట్లెట్లను వేరు చేసే యంత్రంలో సీనాని పెడతారు. ఆ తర్వత ముఖం అంతట చిన్న సూదులు అమర్చిన పరికరంతో ముఖంపై ఒకవైపు అంతా అప్లై చేస్తారు. చూడటానికి ఇది చాలా నొప్పిగా ఉంటుంది. కానీ అంత నొప్పి ఏ మాత్రం ఉండదట. లాస్ట్‌లో ఆ రక్తంలోని ప్లాస్మానికి ముఖానికి అంతటా అప్లై చేస్తాడు. చిన్న సూదుల గుండా ముఖంలోకి చొప్పిస్తాడు. ఆ తర్వాత ముఖం చూస్తే నిజంగా రక్తపిశాచి మాదిరిగా భయానకంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఒక వైపు అంత ఎర్రగా కందిపోయి ఉంటుంది. అయితే ఎరుపు రంగు సాయంత్రం కల్లా తగ్గిపోతుందని వైద్యులు చెబుతున్నారు. ఈ చికిత్స చేసిన ముఖం వైపు కన్ను చాలా మెరుగ్గా కనిపిస్తుందట. ఇది ఎలాంటిదంటే మన నుంచి రక్తం తీసుకుని వెయ్యిసార్లు ముఖంపై పొడిచి సౌందర్య చికిత్స అట. దీని గురించి సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు నటి షెహ్నాజ్ ట్రెజరీ. ఆమె ఎంటీవీ వీజేగా కెరీర్ ప్రారంభించి తెలుగు, హిందీ తోపాటు కొన్ని హాలీవుడ్ చిత్రాల్లోనూ నటించిందామె. View this post on Instagram A post shared by Travel, Romance, Smiles (@shenaztreasury) (చదవండి: 51 ఏళ్ల వయసులో ఎంబీబీఎస్ సీటు..!1992లోనే..) -
51 ఏళ్ల వయసులో ఎంబీబీఎస్ సీటు..!1992లోనే..
చదువుకోవాలి, కొత్త విషయాలు నేర్చుకోవాలనే తపన ఉన్నవారికి వయసు ఎన్నడూ అడ్డంకి కాదని పలువురు నిరూపిస్తున్న ఘట్టాలు చూశాం. అంతేగాదు క్షణికావేశంలో కోరుకున్న కోర్సు చదవలేకపోయామనో, అనుకున్నది సాధించలేకపోయామనో జీవితాలను అంతం చేసుకునే యువతకు కనవిప్పు కలిగించేలా స్ఫూర్తిగా నిలుస్తున్నారు. తాజాగా అలాంటి కోవలోకి చెన్నైవాసి చేరారు. పైగా ఆయన దివ్యాంగుడు, చక్కగా మరో రంగంలో కెరీర్ నిర్మించుకుని రిటైర్మెంట్ తీసుకునే వయసుకి వచ్చేశారు. అయినా తన చిరకాల కోరికను నెరవేర్చుకునే దిశగా అడుగులు వేస్తూ..యువతకు స్ఫూర్తిని రగిల్చారు. ఆయనే చెన్నైకి చెందిన 51 ఏళ్ల సురేష్ కుమార్. తమిళనాడులోని నాగపట్నం జిల్లా వేలంకన్ని నివాసి అయిన సురేష్ 1992లో 12వ తరగతి పూర్తి చేశారు . అప్పటి నుంచి ఆయనకు మెడిసిన్ చదవాలనే కోరిక ప్రబలంగా ఉండేది. అయితే అప్పట్లో మెడిసిన్ సీటు దక్కించుకోలేకపోయాడు. అదీగా కుటుంబ ఆర్థిక పరిస్థితి రీత్యా ఫార్మకాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీని పూర్తిచేశాడు. ఆ తర్వాత ఎంబీఏ, రెండు పీహెచ్చ్డీలు పూర్తిచేసి డాక్టరేట్ అందుకున్నారు. ప్రస్తుతం ఆయన డయాగ్నోస్టిక్స్ పరిశ్రమలో పనిచేస్తున్నారు. నీట్లో సీటు సాధించాడు ఇలా..2022లో, సుప్రీంకోర్టు మెడికల్ అడ్మిషన్ల వయోపరిమితిని తొలగించిన తర్వాత కుమార్ నీట్ యూజీ పరీక్షకు హాజరయ్యాడు. కానీ దానిని చేధించలేకపోయాడు. అయితే 2026లో 18 నెలల ప్రిపరేషన్ తర్వాత మళ్లీ మెడికల్ ప్రవేశ పరీక్షకు ప్రయత్నించాడు. ఈసారి 192 మార్కుల సాధించి పీడబ్ల్యూడీ కోటా కింద చెన్నైలో నాగపట్నం ప్రభుత్వ వైద్య కళాశాలలో సీటు సాధించాడు. పూర్తి సమయం పని చేస్తూనే, సురేష్ కుమార్ మెడికల్ ప్రవేశ పరీక్షకు ప్రిపరేషన్ కొనసాగించాడు. అతను తరచుగా రాత్రి 10 గంటల నుంచి అర్థరాత్రి వరకు ప్రిపరేషన్ సాగించినట్లు తెలిపాడు. తనకు అర్థంకానీ జీవశాస్త్రాన్ని కొడుకు అర్థమయ్యేలా బోధించినట్లు వివరించారు. అలాగే గత ప్రశ్నపత్రాలను ప్రాక్టీస్ చేసి తన ప్రిపరేషన్ సామర్థ్యాన్ని ట్రాక్ చేసుకున్నట్లు వెల్లడించారు. తనకు జరిగిన రోడ్డు ప్రమాదం కారణంగానే వైద్య విద్య అభ్యసించాలనే కోరిక మరింత పెరిగిందని అన్నారు. పదవీవిరమణ వయసులో ఇలా కాలేజ్‌కి వెళ్లి చదువుకోవాలన్న తన ఆశయానికి భార్య దుర్గ, కుటుంబం పూర్తి మద్దతు ఇచ్చిందని చెప్పారు. తన భార్య ఉపాధ్యాయురాలని చెప్పారు. ఇక తనకు ఎనిమిది, పది చదువుతున్న ఇద్దరు పిల్లలు ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం తాను తన 72 ఏళ్ల తల్లితో కలిసి జీవించాలని యోచిస్తున్నట్లు తెలిపారు. తనకు సీటు కేటాయించిన మెడికల్ కాలేజ్ ఏడు కి.మీల దూరంలో ఉందని అందుకని సైకిల్‌పై వెళ్లాలని భావిస్తున్నట్లు తెలిపారు. కాగా, తమిళనాడు ప్రభుత్వం చెన్నైలోని మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో స్పెషల్ కేటగిరీ అభ్యర్థులకు ఆఫ్‌లైన్ కౌన్సెలింగ్ నిర్వహించింది. అందులో స్పోర్ట్స్ కేటగిరీ కింద 15 సీట్లు, మాజీ సైనికుల పిల్లలకు 11, పీడబ్ల్యూడీ కేటగిరీ కింద 224, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు 7.5% కోటా కింద 614 సీట్లతో ఆఫ్‌లైన్ కౌన్సెలింగ్ ప్రారంభమైంది.(చదవండి: పాట పాడినందుకు విధుల నుంచి తొలగించారు..! ఇవాళ ఏకంగా..) -
స్నేహితురాలే సొంత చెళ్లెలు! 40 ఏళ్లకు డీఎన్ఏ టెస్టుతో షాక్!
కథల్లో, సినిమాల్లో మాత్రమే కనిపించే కొన్ని అద్భుత సంఘటనలు... కొన్నిసార్లు నిజజీవితంలోనూ చోటుచేసుకుంటుంటాయి. అలాంటి సంఘటనే ఇది. పుట్టిన కొన్నిరోజులకే వేర్వేరు అనాథాశ్రమాలకు చేరి, వేర్వేరు కుటుంబాల్లో పెరిగిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు. నాలుగు దశాబ్దాల తర్వాత డీఎన్ఏ టెస్టు ద్వారా తిరిగి ఒకటయ్యారు.భారతదేశంలో పుట్టిన మీనా గెల్టింక్ (43), మీనాల్ టిజ్సెన్ (44)లను చిన్నప్పుడే నెదర్లాండ్స్‌కు చెందిన రెండు వేర్వేరు కుటుంబాలు దత్తత తీసుకున్నాయి. వారిద్దరు కేవలం 130 కిలోమీటర్ల దూరంలోనే పెరుగుతున్నప్పటికీ తమకు ఒక తోబుట్టువు ఉందనే విషయం ఇద్దరికీ తెలియదు. అయితే 1996లో దత్తత పిల్ల కోసం ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో వీరిద్దరూ కలుసుకున్నారు. అప్పటి నుంచి వీరిమధ్య స్నేహం ఏర్పడి... సరదాగా ఉత్తరాలలో ‘సిస్’ అని పిలుచుకునేవారు. కానీ కాలక్రమేణా వీరిమధ్య సంబంధాలు తెగిపోయాయి. దాదాపు 15 ఏళ్లపాటు దూరంగా ఉన్నారు.అయితే ఈ ఏడాది ఏప్రిల్‌లో ‘మై హెరిటేజ్’ యాప్ ద్వారా చేసిన డీఎన్ఏ పరీక్ష వీరి జీవితాలను ఒక్కసారిగా మార్చివేసింది. ఫ్రాన్స్‌లో ఉంటున్న మీనాల్ ఫోన్‌కి ఒకరోజు ‘మీనాల్ యువర్ సిస్టర్... 100 శాతం డీఎన్ఏ మ్యాచ్’ అని నోటిఫికేషన్ వచ్చింది. మొదట నమ్మలేకపోయిన మీనాల్, సోషల్ మీడియాలో వెతికి పాత ఫోటోలను పరిశీలించాక... 30 ఏళ్ల క్రితం కలిసిన ఆనాటి టీనేజ్ స్నేహితురాలే తన సొంత చెల్లెలని తెలిసి ఆశ్చర్యపోయింది. ఆ తరువాత వీరిద్దరూ నెదర్లాండ్స్‌లో ఎంతో సంతోషంగా కలుసుకున్నారు.పెంచిన తల్లిదండ్రులున్నప్పటికీ ఇంతకాలం ఏదో ఒక తెలియని లోటు ఉండేదని... తన సోదరి రాకతో జీవితంలో తప్పిపోయిన పజిల్ ముక్క దొరికినట్లుందని మీనా చెబుతోంది. అయితే ‘‘తాము అక్కాచెల్లెళ్లమని తెలియకముందే మంచి స్నేహితులం. నిజానికి మేము మొదటినుంచీ అక్కాచెల్లెళ్లమే, కాకపోతే ఆ విషయం మాకు ఆలస్యంగా తెలిసిందని’’ ఈ సందర్భంగా మీనాల్ చెబుతోంది. -
రుద్రవీణ నిర్ణిద్ర గానం
సితార్, వీణ గురించి తెలిసినంతగా చాలామందికి ‘రుద్రవీణ’ వాద్యం గురించి తెలియదు. నేర్చుకునేవారు చా...లా తక్కువగా ఉంటారు. ‘రుద్రవీణ’ నేర్చుకునే వారికి మంచి జరగదు’ అనే అపోహ, మూఢనమ్మకాలే దీనికి కారణం. ఆ అపోహల అడ్డుగోడలను కాలదన్ని ‘రుద్రవీణ’లో ప్రావీణ్యం సాధించిన తొలి మహిళగా గుర్తింపు తెచ్చుకున్నారు బెంగళూరుకు చెందిన జ్యోతి హెగ్డే. గురుకులం ఏర్పాటు చేసి రుద్రవీణలో విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. రుద్రవీణ కళాకారిణిగా సంగీత నాటక అకాడమీ అవార్డ్ అందుకున్నారు...‘సంగీత నాటక అకాడమీ పురస్కారం వల్ల నాకు వ్యక్తిగత సంతోషం కంటే రుద్రవీణకు ఈ గుర్తింపు లభించింది అనే సంతోషమే ఎక్కువగా ఉంది’ అంటారు జ్యోతి హెగ్డే.సితార్, వీణలాంటి తంత్రి వాద్యాలతో పోలిస్తే ‘రుద్రవీణ’లో ప్రావీణ్యం సాధించిన కళాకారులు చాలా తక్కువ. ఈ వాద్యంలో ప్రావీణ్యం సాధించిన మొదటి మహిళగా గుర్తింపు తెచ్చుకున్నారు జ్యోతి హెగ్డే. అయితే ఆ గుర్తింపును సున్నితంగా తిరస్కరిస్తారు హెగ్డే.హంపీ శిల్పాల్లో రుద్రవీణ‘అజంతా, ఎల్లోరా గుహలు, హంపీ శిల్పాలను చూసినప్పుడు మహిళల చేతుల్లో రుద్రవీణ కనిపిస్తుంది. సరస్వతీదేవి, పార్వతీదేవి కూడా రుద్రవీణ వాయిస్తున్న చిత్రాలు కనిపిస్తాయి. ఈ నేపథ్యంలో నుంచి చూసినప్పుడు రుద్రవీణ వాయించిన మొదటి మహిళను నేను ఎలా అవుతాను... అనిపిస్తుంది. అయితే ఇప్పటికాలంలో రుద్రవీణను ఎంచుకున్న మొదటి మహిళను మాత్రం నేనే’ అంటారు హెగ్డే.ఆ ధ్వనిలో ఆధ్యాత్మిక పరిమళంకాలేజీ రోజుల్లో జ్యోతి హెగ్డే సితార్ తీగల మీద సాధన చేస్తుండేవారు. ఈ క్రమంలో ‘సమ్‌థింగ్ స్పెషల్’ లాంటి సంగీత పరికరం ‘రుద్రవీణ’ పరిచయం అయింది. ఆ పరిచయం తనను వీనుల విందైన రుద్రవీణ ప్రపంచంలోకి తీసుకెళ్లింది. ‘రుద్రవీణ ధ్వనిలో ఆధ్యాత్మిక పరిమళం ఉంది. తీగలను మీటుతూ స్వరాలను పలికిస్తున్నప్పుడు ఆ ధ్వని నాలో ప్రతిధ్వనిస్తుంది. ఆ ధ్వని, రాగాలను నాలో లీనం చేసుకుంటాను. నా అంతర్గత ఆధ్యాత్మిక స్థితిని తెలియజేయడానికి ఇది నాకు తోడ్పడుతుంది’ అంటారు హెగ్డే.అది మూఢనమ్మకం మాత్రమే...‘బరువైన రుద్రవీణ వాయిద్యాన్ని వాయించడం వల్ల సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గుతుంది’ అనే అపోహ, మూఢనమ్మకం ఉండడం వల్ల ఆ వాద్యానికి దగ్గరైన వారి సంఖ్య తక్కువ. ‘ఎన్నో అపోహలు ఉన్నప్పటికీ నేను రుద్రవీణ వైపు ఆకర్షితం కావడానికి కారణం... బహుశా ప్రశాంతత, ధ్యానం పట్ల ఇష్టం ఉండడం కావచ్చు. ముగ్గురు గురువుల దగ్గర శిక్షణ పొందాను. మొదట్లో వారు, నువ్వు అమ్మాయివి కదా రుద్రవీణ వాయించడం కష్టం అన్నారు. రుద్రవీణను ఎత్తి, వాయించగల శారీరక బలం నాలో ఉంది అని వారితో చె΄్పాను. ఇతరులు మూడు గంటల సాధన చేస్తే నన్ను నేను నిరూపించుకోవడానికి పది గంటలు సాధన చేసేదాన్ని’ అని గతాన్ని గుర్తు తెచ్చుకున్నారు హెగ్డే. ‘రుద్రవీణ వాయించడానికి మహిళలు శారీరకంగా, మానసికంగా సరిపోతారు. కావాల్సిందల్లా నేర్చుకోవాలనే ఆసక్తి, ఉత్సాహం మాత్రమే’ అంటున్న హెగ్డే, తన గురుకులంలో అరవైమందికి పైగా విద్యార్థులకు రుద్రవీణలో శిక్షణ ఇస్తున్నారు.గురువు దగ్గరే పరిపూర్ణతకళాకారులను తయారుచేయడానికి, వారిని తీర్చిదిద్దడానికి ఆన్లైన్ తరగతులు, నెలకొకసారి జరిగే క్లాసులు సరిపోవని కోవిడ్ కాలంలో గ్రహించాను. శిష్యులు గురువుకు దగ్గరగా ఉన్నప్పుడే, నేర్చుకోవడంలో వారికి పరిపూర్ణత వస్తుంది. ఇది మాత్రమే కాకుండా గురువు జీవనశైలి, ఆలోచనా విధానం, అంకితభావం, కళాత్మక వ్యక్తిత్వాన్ని గ్రహించే అవకాశం లభిస్తుంది.– జ్యోతి హెగ్డే -
కళ నేర్చిన కాళ్లు కవాతు నేర్పాయి..
‘ఇంత లావణ్యరాశివి. నువ్వు తుపాకీ పట్టావా?’ అన్నాడు బ్రిటిష్ అధికారి.‘క్షమాపణ అడుగు. ఉరిశిక్ష రద్దు చేస్తాను’ అని కూడా అన్నాడు. ఆమె అడగలేదు. కాన్పూర్‌లో ఆమె నాట్యగత్తె మాత్రమే కాదుతన దేశభక్తితో బ్రిటిష్‌వారిని ఉరుకులెత్తించిన వీరనారి. 400 మంది మహిళలతో సైన్యం తయారు చేసిన దళనాయకి.పేరు అజ్జన్ బాయి. వృత్తికి ‘తవాయిఫ్’. కాని దేశానికి వీరపుత్రిక.ఆడు’... అంటే ఆడాలి. ‘పాడు’ అంటే పాడాలి. నవాబుల కాలంలో ఉత్తరభారతంలో ‘తవాయిఫ్’లుగా పేరుబడ్డ నాట్యగత్తెల జీవితం అది. దక్షిణాదిన ‘దేవదాసీ’లది, ఉత్తరాదిన ‘తవాయిఫ్’లది సమాజంలో ఒకేలాంటి స్థానం. కాని ఈ ‘దేవదాసీ’ల్లో ఈ ‘తవాయిఫ్’లలోనూ చరిత్రను లిఖించిన వారు ఎందరో ఉన్నారు. కాన్పూరుకు చెందిన అజ్జన్ బాయిది అలాంటి చరిత్ర. 1857 తిరుగుబాటులో కాన్పూర్ వేదికగా సిపాయిలను నడిపించి, నాట్యగత్తె ముసుగులో గూఢచారిగా మారి, చివరకు దేశం కోసం నవ్వుతూ ప్రాణాలర్పించిన అజ్జన్‌బాయి వీరగాథ నేటికీ ఒక అద్భుతం.లక్నో నుండి కాన్పూర్ కోఠా వరకుఅజ్జన్బాయిది లక్నో. అమె అసలు పేరు అజీజున్నిసా. చిన్నతనంలోనే తల్లిని కోల్పోవడంతో ఆ రోజుల్లో అలాంటి ఆడపిల్లల్ని ‘కోఠా’ (నాట్యగత్తెలు ఉండే చోటు)లకు తరలించేవారు. అలా అజ్జన్‌బాయి లక్నో నుంచి కాన్పూర్‌కు మారి ‘లడ్కీ మహల్’ అనే కోఠాకు చేరింది. అయితే కాళ్లకు గజ్జెలు కట్టడం కంటే చేతిలో పుస్తకం పట్టడం గురించే అజ్జన్‌బాయి ధ్యాస. తన నాట్యం చూడటానికి వచ్చే పెద్దమనుషుల ద్వారా దేశ పరిస్థితులు తెలుసుకునేది. పెద్దమనుషులు ఇళ్లలోని స్త్రీలతో ఏ విషయాలూ పంచుకోకపోయినా ఇలాంటి చోట అనేకం విశదపరుస్తుంటారు. అప్పటికి తవాయఫ్ అంటే కేవలం సాహిత్యం, సంగీతం, సంస్కృతికి చిహ్నం. కానీ 1856లో బ్రిటిష్ వారు అవధ్‌ను ఆక్రమించిన తర్వాత తవాయిఫ్లను ‘వేశ్యలు’ అని ముద్ర వేశారు. దాంతో వారికి రాజాశ్రయం పోయింది. గౌరవం పోయింది. అప్పుడే అజ్జన్ గుండెలో కోపం పుట్టింది. ఆ కోపమే దేశభక్తి అయ్యింది.మస్తానీ దళం 1857 మే నెలలో మీరట్‌లో సిపాయిల తిరుగుబాటు మొదలై విప్లవజ్వాలలు దేశవ్యాప్తంగా ఎగసిపడినప్పుడు అజ్జన్‌బాయి నేరుగా రంగంలో దిగింది. కాన్పూర్‌లో ఆమె తన తోటి మహిళలతో కలిసి ‘మస్తానీ దళం’ అనే ప్రత్యేక మహిళా సైనిక విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఈ మహిళలు పగటిపూట వీధుల్లో తిరుగుతూ విప్లవకారుల్లో ధైర్యాన్ని నింపేవారు. గాయపడిన భారతీయ సైనికులకు సేవలు చేస్తూ, వారికి ఆయుధాలు, మందుగుండు సామగ్రిని సరఫరా చేసేవారు. రాత్రివేళల్లో బ్రిటిష్ అధికారుల ముందు నాట్యం చేస్తూ, వారు మత్తులో ఉన్నప్పుడు రహస్య సైనిక సమాచారాన్ని సేకరించేవారు. ఆ సమాచారాన్ని నానా సాహెబ్, తాంతియా తోపే వంటి విప్లవ నాయకులకు చేరవేస్తూ గూఢచారులుగా పని చేశారు.మగ దుస్తుల్లో యుద్ధరంగంలోకి...కాన్పూర్‌లో బ్రిటిష్ వారికి భారీ సైనిక హెడ్‌క్వార్టర్స్ ఉంది. జూన్‌లో నానాసాహెబ్ నాయకత్వంలో తిరుగుబాటుదారులు ఈ హెడ్‌క్వార్టర్స్‌ను మూడు వారాలు దిగ్బంధించారు. దెబ్బకు బ్రిటిష్ వారు ఓటమి అంగీకరించి అలహాబాద్ వెళ్లిపోవడానికి రెడీ అయ్యారు. ఆ సమయంలో అజ్జన్‌బాయి స్వయంగా మగవారి దుస్తులు ధరించి, గుర్రమెక్కి, రెండు చేతుల్లో పిస్తోళ్లు పట్టుకుని సైనికుల కవాతులో పాల్గొంది. శత్రువుల ఫిరంగి గుండ్లు ముంచెత్తుతున్నా భయపడకుండా స్వయంగా బ్రిటిష్ సైన్యంతో పోరాడింది. కేవలం 25 ఏళ్ల వయస్సులో ఆమె చూపిన ఈ రణరూపం బ్రిటిష్ సైన్యాన్ని వణికించింది.హావ్లాక్ కోర్టు మార్షల్దెబ్బ తిన్న బ్రిటిష్‌వారు శక్తి కూడదీసుకొని చెలరేగారు. కాన్పూర్ను భారీ సైన్యంతో బ్రిటిష్ జనరల్ హావ్లాక్ తిరిగి స్వాధీనం చేసుకున్నప్పుడు కాన్పూర్ వాసులను ఊచకోత కోశాడు. అజ్జన్బాయిని బంధించాక ఆమెను చూసి ‘ఇంత అందమైన మహిళ ఇంతటి వీరత్వాన్ని ఎలా ప్రదర్శించిందో’ అని హావ్లాక్ ఆశ్చర్యపోయాడు. ‘నువ్వు చేసిన తప్పుకు క్షమాపణ చెప్పి, విప్లవకారుల రహస్యాలిస్తే నిన్ను ప్రాణాలతో వదిలేస్తాం’ అని ఆశ చూపాడు. దానికి అజ్జన్‌బాయి ‘నువ్వు నా ప్రాణాలు తీయగలవు కానీ నా తల వంచలేవు. నాకు కావాల్సింది బ్రిటిష్ సామ్రాజ్య నాశనం మాత్రమే’ అని గర్జించింది. కోపంతో ఊగిపోయిన హావ్లాక్ ఆమెను కాల్చి చంపాలని ఆదేశించాడు. ఫైరింగ్ స్క్వాడ్ ఆమె ముందు నిలబడి బుల్లెట్లు గుండెల్లోకి దింపుతున్నా చిరునవ్వుతో, దేశభక్తి నినాదాలు చేస్తూ ఆమె అమరురాలయ్యింది. ఇవాళ చరిత్ర పుస్తకాల్లో అజ్జన్‌బాయి పేరు లేదు. కానీ కాన్పూర్ గల్లీల్లో ఇప్పటికీ ఆమె కథ చెప్పుకుంటారు. నృత్యానికి ఆడించాల్సిన చేతులతో ఆమె తుపాకీ పట్టింది. ఎందుకంటే ఆమెకు తెలుసు సంస్కృతి బతకాలంటే స్వాతంత్య్రం ముఖ్యమని. భావితరాల మేలు కోసం తన వర్తమానాన్ని త్యాగం చేసిన అమర వీరురాలు అజ్జన్‌బాయి. అలాంటివారిని స్మరించుకునే వేళే మన సిసలైన స్వాతంత్య్ర దినోత్సవ వేడుక. -
పాట పాడినందుకు విధుల నుంచి తొలగించారు..! ఇవాళ ఏకంగా..
డ్యూటీలో పాడపాడటమే శాపమై ఉపాధిని కోల్పోయేలా చేసింది. విధి ఒకడోర్ మూసేస్తే మరో దారి తెరుచుకుంటుంది అనేలా అతడికి మరో అవకాశం వెత్తక్కుంటూ వచ్చి..తనకు నచ్చిన విధంగా బతకేలా చేసింది. ఈ ఘటన కోల్‌కతాలో చోటుచేసుకుంది. సుమారు 40 ఏళ్ల వయసున్న షోవోన్ చక్రవర్తి, సాల్ట్ లేక్‌లోని సెక్టార్ Vలో ఒక ఆఫీసులో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. స్వతహాగా అతడు సంగీత కళాకారుడు. అతను శాంతినికేతన్‌లోని సంగీత్ భవన్లో విద్యార్థులకు సంగీతం బోధించేవాడు. అయితే ఆ చక్రవర్తికి సంగీతం ద్వారా వచ్చే ఆదాయం అతని ఖర్చులను తీర్చలేకపోయింది. అదీగాక కరోనా మహమ్మారి అతడి జీవితాన్ని పూర్తిగామార్చేసింది. ఆ టైంలో బోధించే విద్యార్థుల సంఖ్య తగ్గడంతో ఆర్థిక ఒత్తిళ్లు అధికమై..జీవనోపాధి కోసం సెక్యూరిటీ గార్డుగా పనిచేయక తప్పలేదు. అలా అతడు విధి నిర్వహణలో ఉండగా ఒకరోజు రవీంద్రనాథ్ ఠాగూర్ పాటను ఆలపిస్తుండగా ఎవరో రికార్డు చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. అతడు సంగీత విద్వాంసుడు కావడంతో చాలా అలవోకగా ఆ ప్రసిద్ధ సంగీతాన్ని సునాయాసంగా ఆలపించాడు. పైగా నెటిజన్లు కూడా అతడి గాత్రానికి మంత్రముగ్ధలై ప్రశంసల వర్షం కురిపించారు. కానీ అతడు పనిచేసే చోట యజమానులకు ఇదంత నచ్చలేదు. పైగా అతడిని తక్షణమే ఉద్యోగం నుంచి తొలగించారు. అతడి కథను చిత్రనిర్మాత ప్రతీమ్ డి గుప్తాకి నెట్టింట షేర్ చేయడంతో..యూనిఫాం ధరిస్తే..ప్రతిభను వదిలేయమనడం సరైంది కాదంటూ నెట్టింట చర్చలు మొదలయ్యాయి. అయితే చిత్ర నిర్మాత ప్రతీమ్ మాత్రం ఆయన ఆర్థికపరిస్థితులు అనుకూలించక ఈ వృత్తిలో వచ్చారే తప్ప ఆయన సెక్యూరిటీ గార్డు కాదు. పైగా పిల్లలకు సంగీత నేర్పించాలనేది అతడి ధ్యేయం. పైగా ఎవరినీ వ్యక్తి ఎలాంటి ఆర్థిక సాయం కూడా కోరలేదు. అతడి కథ వైరల్ వీడియో ద్వారా చాలామందికి చేరింది, పైగా అతడికి మద్దతిచ్చేందుకు సాయం చేసేందుకు చాలామంది ముందుకు వచ్చారు. కానీ అతడికి కావాల్సింది అది కాదంటూ బెంగాలీ గాయకుడు రూపంకర్ బాగ్చి రంగంలోకి దిగి అక్టోబర్‌లో కోల్‌కతాలోని కళా మందిర్ ఆడిటోరియంలో చక్రవర్తి కోసం సంగీత కచేరిని ఏర్పాటు చేసి ప్రోత్సహించారు. ఇలాంటి సాయం అతడికి తిరిగి సంగీతకారుడిలా జీవించే గొప్ప అవకాశంగా ఉంటుందని అన్నారు రచయిత, చిత్ర నిర్మాత ప్రతీమ్. అంతేగాదు షిప్ట్‌లో ఉండి సెక్యూరిటీ గార్డు పాటపడటం తప్పుకాదు..అతడు కొద్దిసేపు కళకారుడిగా ఉండాలని ఆశపడటమే తప్పు అని అన్నారు. (చదవండి: పర్యావరణహిత బెలూన్లు..! జస్ట్ తొమ్మిది నెలల్లో..) -
పర్యావరణహిత బెలూన్లు..! జస్ట్ తొమ్మిది నెలల్లో..
ఇటీవల కాలంలో చిన్న పిల్లల బర్త్‌డే పార్టీ నుంచి మరే ఏదైనా ఈవెంట్ అయినా ప్రధాన ఆకర్షణ బెలూన్ల డెకరేషనే ఉంటుంది. వాటితో చేసిన ఆర్చ్‌లకు క్రేజ్ ఎక్కువ. దాంతో ఎటు చూసినా..ఏ వేడుకైనా బెలున్ డెకరేషన్ అత్యంత హైలెట్‌గా ఉంటుంది. వీటివల్ల బెలూన్ వ్యర్థాలు అధికమై వన్య ప్రాణాలతో సహా పర్యావరణానికి హానికరమనేది పర్యావరణ ప్రేమికులు ఆవేదన. ఈ సమస్యకు ఎన్నో ఏళ్లుగా చెక్ పెట్టాలని మేధావులు, ప్రముఖులు ఆలోచిస్తున్న తరుణంలో లండన్ శాస్త్రవేత్తలు సరికొత్త బెలూన్లను ఆవిష్కరించారు. పైగా వీటి వ్యర్థాల ప్రభావం పరిసరాలపైన తక్కువగానే ఉంటుందట. పైగా సులభంగా భూమిలో కలిసిపోతాయట కూడా. మరి ఆ బెలూన్ల విశిషాల గురించి సవివరంగా తెలుసుకుందామా.సాధారణంగా బెలూన్లు విచ్ఛిన్నం కావడానికి ఏళ్ల తరబడి సమయం తీసుకుంటుంది. అలాగే అవి వాతావరణంలోకి హానికరమైన రసాయనాలను విడుదల చేయగలవని చెబుతున్నారు పరిశోధకులు. ముఖ్యంగా సముద్ర జీవులు, పక్షులు మరణాలకు ఈ బెలున్ వ్యర్థాలే కారణం అని పలు నివేదికలు చెబుతున్నాయి. ఆ నేపథ్యంలోనే లండన్ శాస్త్రవేత్తలు 'బయోలూన్'గా పిలిచే సరికొత్త బెలూన్లను ఆవిష్కరించారు. సాధారణ బెలూన్ కంటే ఇదేమి అంత ఖరీదైనది కాదు. ఊదడం కూడా సులభమే. సాధారణ బెలూన్లను బలంగా, సాగే గుణం వచ్చేలా చేయడానికి ఒక ప్రక్రియతో శుద్ధి చేస్తారని చెప్పుకొచ్చారు ఇంపీరియల్ పీహెచ్డీ పరిశోధకురాలు జూలియానా కమింగ్. కానీ ఆ ప్రక్రియ కారణంగా అవి పూర్తిగా విచ్ఛిన్నం కాకుండా ప్రకృతిలోకి విషపూరిత రసాయనాలను విడుదల చేస్తాయని అన్నారు. అయితే తాము రూపొందించిన ఈ బెలూన్లు పూర్తిగా విచ్ఛిన్నం కాగలవు, అలాగే ఎలాంటి సంకలితాలు లేకుండా సులభంగా మట్టిలో కలిసిపోయేలా పదార్థాలను ఉపయోగిస్తామని అన్నారు. ఇటీవల బెలూన్ ఆర్చ్‌లకు బాగా ప్రజాదరణ పెరిగింది. అదికాస్తా పర్యావరణానికి అత్యంత ప్రమాదకారంగా తయారైందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేగాదు ఒక అధ్యయనం ప్రకారం..సముద్ర పక్షులు తినడానికి కారణమయ్యే సముద్ర వ్యర్థాలలో బెలూన్ శకలాలు అత్యంత కీలకమైనవని అన్నారు. అలాగే పక్షులు గట్టి ప్లాస్టిక్‌ను మింగడం కంటే బెలూన్ల వల్ల 32 రెట్లు ఎక్కువగా మరణం సంభవిస్తుందని ఆ అధ్యయనంలో తేలింది. బయోలూన్లా కాకుండా, 100% జీవవిచ్ఛిన్నం చెందేవిగా లేబుల్ చేయబడిన బెలూన్లు కూడా తరచుగా పూర్తిగా విచ్ఛిన్నం కావని మెలియా పేర్కొన్నారు. ఇక్కడ తాము చేసిన బయోలూన్ కూడా అదే రబ్బరు పదార్థంతో మొదలవుతుంది, కానీ హానికరమైన సంకలితాలు లేకుండా పాలిమర్ గొలుసులను కలిపే ఒక పద్ధతిని ఉపయోగిస్తామని వెల్లడించారు. ఈ బెలూన్లు వచ్చే రెండేళ్ల లోపే వాణిజ్యపరంగా అందుబాటులోకి రానున్నాయని అన్నారు. అంతేగాదు ఈ పర్యావరణహిత బెలూన్ల తయారీలో ఉపయోగించిన పదార్థాలనే భవిష్యత్తులో గ్లౌజులు, సర్జికల్, నాన్ సర్జికల్ లేటెక్స్, వైద్య పరికరాలు, దుస్తులు, కండోమ్ వంటి వాటి వరకు విస్తరించాలని చూస్తున్నట్లు తెలిపారు. (చదవండి: "53 పెళ్లి సంబంధాలు".. ఓ ఎక్సెల్ షీట్.. చివరకు దొరికిన ‘మిసెస్ రైట్’!) -
తండ్రి ఉదారత..ఆ 16 ఏళ్ల యువ క్రికెటర్‌కి ఊపిరి పోసింది
తండ్రి ప్రేమకు, వైద్యుల నైపుణ్యానికి అద్దం పట్టే సంఘటన ఇది. హైదరాబాద్‌లోని మలక్‌పేటకు చెందిన 16 ఏళ్ల ఇంటర్మీడియట్ విద్యార్థి, వర్ధమాన బౌలర్‌కు ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యురాలజీ (AINU) వైద్యులు విజయవంతంగా 'ప్రీ-ఎంటివ్ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్' (డయాలసిస్ అవసరం లేకుండానే చేసే మూత్రపిండ మార్పిడి) నిర్వహించి కొత్త జీవితాన్ని ప్రసాదించారు. ఈ ప్రాణరక్షణ ప్రక్రియలో బాలుడి తండ్రి తన ఒక మూత్రపిండాన్ని దానం చేసి పితృప్రేమను చాటుకున్నారు.విరాట్ కోహ్లీని ఆరాధిస్తూ, భవిష్యత్తులో మంచి బౌలర్‌గా రాణించాలనుకుంటున్న ఈ 16 ఏళ్ల యువకుడు, పుట్టుకతోనే మూత్రనాళ సమస్య తో బాధపడుతుండేవాడు. దీనివల్ల మూత్రం వెనక్కి ప్రవహించి (యూరినరీ రిఫ్లక్స్) క్రమంగా కిడ్నీల పనితీరు దెబ్బతింది. శారీరక ఎదుగుదల ఆగిపోయి, చివరకు పరిస్థితి తీవ్రరూపం దాల్చి 'ఎండ్-స్టేజ్ రీనల్ డిసీజ్' (ESRD)కి దారితీసింది.దీర్ఘకాలిక డయాలసిస్ సమస్య నుంచి కాపాడేందుకు, ముందుజాగ్రత్త చర్యగా 'ప్రీ-ఎంటివ్ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్' చేయాలని వైద్యులు సూచించారు. ఇది రోగికి మెరుగైన ఆరోగ్యాన్ని, దీర్ఘాయువును అందిస్తుంది. విషయం తెలుసుకున్న బాలుడి తండ్రి ఖాజా అసీముద్దీన్, ఏమాత్రం సంకోచించకుండా తన మూత్రపిండాన్ని ఇచ్చేందుకు ముందుకు వచ్చారు.అన్ని రకాల క్లినికల్ పరీక్షలు, డానర్ మ్యాచింగ్ పూర్తయిన తర్వాత, 2026 జూన్ 17న శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. శస్త్రచికిత్స అనంతర సంరక్షణ తర్వాత, రోగి వేగంగా కోలుకోవడంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు.ఈ మేరకు ఏఐఎన్‌యూ (AINU) బంజారాహిల్స్ సీనియర్ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ & ట్రాన్స్‌ప్లాంట్ ఫిజిషియన్ డాక్టర్ శ్రీకాంత్ గుండ్లపల్లి మాట్లాడుతూ: "చిన్న పిల్లలు, యుక్తవయస్కుల్లో ఇవి తీవ్ర రూపం దాల్చినప్పుడు, డయాలసిస్ కంటే ముందే చేసే కిడ్నీ మార్పిడి వారి సాధారణ ఎదుగుదలకు, మెరుగైన జీవన ప్రమాణాలకు ఎంతగానో తోడ్పడుతుంది. మహమ్మద్‌కి చేసిన ఈ విజయవంతమైన శస్త్రచికిత్స, సరైన సమయంలో తీసుకున్న నిర్ణయం, తండ్రి ఉదారత కలసి ఒక వికసిస్తున్న జీవితానికి ఎలా వెలుగునివ్వవచ్చో నిరూపించింది" అని తెలిపారు. కాగా ఆ బాలుడు, తన చదువుపై దృష్టి సారించాడమే గాక మళ్లీ మైదానంలోకి దిగి బౌలింగ్ చేయడానికి ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాడు.(చదవండి: మోడల్స్‌గా మావోయిస్టు మహిళలు..!) -
"53 పెళ్లి సంబంధాలు".. ఓ ఎక్సెల్ షీట్.. చివరకు..
పెళ్లి సంబంధాల కోసం చాలామంది బంధువులు, స్నేహితుల సహాయం తీసుకుంటారు. కానీ పుణేకు చెందిన ఓ యువకుడు మాత్రం తన పెళ్లి అన్వేషణను ఎక్సెల్ షీట్లో నమోదు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఏడాది పాటు 53 సంబంధాలను పరిశీలించిన తర్వాత చివరకు తనకు నచ్చిన జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకున్నాడు. ఎలాగంటే..పుణేకు చెందిన 29 ఏళ్ల వికాస్ లోహ్టియా.. 2025లో అరేంజ్డ్ మ్యారేజ్ కోసం ప్రత్యేకంగా ఓ ఎక్సెల్ ట్రాకర్‌ను రూపొందించాడు. అందులో పెళ్లి సంబంధాల వివరాలు, అభిరుచులు, అనుకూలతలు వంటి అంశాలను నమోదు చేశాడు. ఈ విషయం బయటకు రావడంతో అతడి ఎక్సెల్ షీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.మెటల్ కంపెనీలో ప్రొక్యూర్మెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్న వికాస్.. దాదాపు ఏడాది పాటు తన పెళ్లి ప్రయత్నాలను కొనసాగించాడు. ఈ సమయంలో 53 మంది ప్రొఫైల్స్‌ను పరిశీలించాడు. చివరకు గురుగ్రామ్‌కు చెందిన ఓ ప్రొఫెసర్‌తో పరిచయం ఏర్పడగా, ఆ బంధం వివాహానికి దారితీసింది.తొమ్మిది నెలల పాటు పూర్తిగా అర్థం చేసుకున్నాకే..గత ఏడాది అక్టోబర్‌లో పెళ్లి సంబంధాల ట్రాకర్‌ను ప్రారంభించిన వికాస్‌కు నవంబర్‌లో తనకు కాబోయే భాగస్వామి పరిచయమయ్యారు. అయితే వెంటనే నిర్ణయం తీసుకోకుండా దాదాపు తొమ్మిది నెలల పాటు మాట్లాడుకుంటూ ఒకరినొకరు అర్థం చేసుకున్నారు."ట్రాకర్‌ను అప్డేట్ చేస్తూనే ఆమెతో మాట్లాడేవాడిని. మూడు, నాలుగు నెలల పాటు ఈ రెండు విషయాలు కొనసాగాయి" అని వికాస్ తెలిపాడు.వేతనం కూడా ఓకే అయ్యాకే..పెళ్లి సంబంధాల సమయంలో కొంతమంది అమ్మాయిలకు భర్త ఆదాయం విషయంలో ఎక్కువ అంచనాలు ఉన్నాయని వికాస్ చెప్పాడు. అయితే తన కాబోయే భార్యతో తొలి సంభాషణలో తాను సంపాదించే వాస్తవ ఆదాయంలో సగం మాత్రమే చెప్పానని తెలిపాడు.అయినా ఆమె తనను తిరస్కరించలేదని, తన వ్యక్తిత్వం, ఆలోచనలు ఆమెకు నచ్చాయని పేర్కొన్నాడు. ఇప్పుడు వికాస్ తన ఎక్సెల్ షీట్లో నమోదు చేసిన 53వ ప్రయత్నాల్లో ఒకటి తన జీవితంలో కీలక మలుపుగా మారింది. డేటాతో మొదలైన అతడి పెళ్లి అన్వేషణ చివరకు ఓ అందమైన బంధంతో ముగిసింది. View this post on Instagram A post shared by Vikas (@thevikkchapter) (చదవండి: మోడల్స్‌గా మావోయిస్టు మహిళలు..!) -
మోడల్స్‌గా మావోయిస్టు మహిళలు..!
మావోయిస్ట్ అనే పదం వినగానే అడువల్లో లోపల నివశిస్తూ...జన సముహానికి దూరంగా ఉండే సాయుధ మిలిటెంట్లుగా ఊహించుకుంటాం. ఎందుకంటే టీవీల్లో, మీడియాల్లో చూసినదాన్ని బట్టి వాళ్లు అలానే ఉంటారనుకుంటాం. అయితే కొందరు లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసిపోయిన వాళ్లు కూడా ఉన్నారు. అలా కలిసిపోయి కొందరు అత్యద్భుతంగా జీవిస్తున్నారు. వారిలో వచ్చిన ఆ మార్పు చూస్తే నిజంగా ఆశ్చర్యపోవడం ఖాయం. సాధారణ జీవితం గడపడం అంటే మాములు మనుషుల్లా బతికేయడం కాదు..తమకంటూ ఓ గుర్తింపు వచ్చేలా స్పూర్తిదాయకంగా బతికి చూపిస్తున్నారు ఆ మాజీ మావోయిస్టు మహిళలు. ఈ అద్భుత ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో చోటు చేసుకుంది. ఒకప్పుడు చత్తీస్‌గడ్‌లోని బస్తర్ ప్రాంతంలోని దట్టమైన అడవుల్లో ఆయుధాలు చేత పట్టుకుని తిరిగిన మాజీ మహిళా మావోయిస్టులు ఇప్పుడు ఎలా హుందాగా జీవిస్తున్నారో చూస్తే కంగుతింటారు. వారి జీవితాలు ఎంత అద్భుతంగా మారాయో చూడాలంటే చత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌కి వెళ్లిపోవాల్సిందే. అక్కడ జరిగిన జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమంలో ఈ వింత దృశ్యాలు కనువిందు చేశాయి. ఆ ఈవెంట్లో మాజీ మహిళా మావోయిస్టులు ర్యాంప్‌పై నడిచి అందర్నీ అలరించారు. ఒకప్పుడు వారికి అందని అవకాశాలను అందిపుచ్చుకుంటూ దూసుకుపోతున్నారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఆ మహిళల కట్టు బొట్టు మారిన విధం చూసి అందరూ మంత్రముగ్ధులవుతున్నారు. నెటిజన్లు కూడా నమ్మశక్యంకానీ దృశ్యాలు, ఇదే నిజమైన సాధికారత అంటూ ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు.#WATCH | Raipur, Chhattisgarh: Former women Naxals, who once carried weapons in the dense forests of Bastar, walked the ramp to huge applause at a National Handloom Day event in Raipur after joining the mainstream. (07.08) pic.twitter.com/51mc8lEXWE— ANI (@ANI) August 13, 2026 (చదవండి: టీసీఎస్‌లో టెకీ నుంచి వైమానిక దళ ఫైటర్ పైలట్‌గా..! నటుడు మాధవన్ సైతం..) -
ఉద్యోగంపోతే కంపెనీ ఇలా వ్యవహరిస్తుందా..?
కంపెనీలు ఉద్యోగులు పట్ల ఎలా వ్యవహరిస్తాయో చెప్పే సందేశాత్మక స్టోరీ నెట్టింట వైరల్‌గా మారింది. ఇటీవల కాలంలో చాలా కంపెనీలు ఉద్యోగులకు ఉద్వాసన పలికిన సంగతి తెలిసిందే. అచ్చం అలానే ఉద్యోగం కోల్పోయిన వ్యక్తి కంపెనీ ఫార్మాల్టీలు పూర్తిచేయడానికి వెళ్తే తనకు ఎదురైన అనుభవం రెడ్డిట్‌లో షేర్ చేసుకున్నాడు. తన కంపెనీలో చివరి వర్కింగ్ డే రోజు తనకు తగిన పాఠం నేర్పిందంటూ తను ఎదుర్కొన్న అనుభవాన్ని పంచుకున్నారు. ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందంటూ మాట్లాడిన మాటలు అందరి మనసులను తాకాయి. అసలేం జరిగిందంటే..బెంగళూరు టెకీ రెడిట్ పోస్ట్‌లో ఇలా రాసుకొచ్చాడు. తను ఉద్యోగం పోవడంతో కంపెనీకి తిరిగి ల్యాప్‌టాప్ ఇచ్చేసి చివరి రోజు కంపెనీ ఫార్మాల్టీలు పూర్తి చేసేందుకు తన రెండేళ్ల కుమారుడితో ఆఫీస్‌కి వెళ్లినట్లు పేర్కొన్నాడు. ఎందుకంటే తన భార్య కూడా ఉద్యోగం చేయడంతో వేరే గత్యంతరం లేక తన కుమారుడిని తీసుకుని ఆఫీసుకు వచ్చానని చెప్పాడు. అలాగే కార్యాలయం నిబంధనలను బ్రేక్ చేసే ఉద్దేశ్యం తనకు లేదని, అలాగే ఇలా పిల్లలతో రావడాన్ని కంపెనీ అనుమతించదని తెలుసని కూడా రాశారు.చివరి రోజు కంపెనీ ఇచ్చిన ల్యాప్‌టాప్ వంటి కార్యాలయ సామాగ్రిని ఇచ్చేసి..ఫార్మాల్టీస్ పూర్తి చేయడానికే కదా అని తప్పనిపరిస్థితుల్లో ఇలా కుమారుడితో వచ్చినట్లు వెల్లడించారు. తను కూడా తన పరిస్థితి వివరించినా..సెక్యూరిటీ గార్డు అందుకు నిరాకరించాడు. రిక్వస్ట్ చేసినా..కంపెనీ నుంచి నో అనే సమాధానమే వచ్చింది. చివరికి చేసేది లేక తన సహోద్యోగికి ఫోన్ చేసి, తన పిల్లాడిని ఓ ఐదు నిమిషాలు చూసుకోమని చెప్పి..కంపెనీ ఫార్మాల్టీస్ పూర్తి చేసేందుకు వెళ్లానని చెప్పారు. కానీ ఆ పని ఐదు నిమిషాల్లో పూర్తవుతుంది అనుకుంటే..అది కాస్తా 15 నిమిషాలు పైనే పట్టిందని నిజాయితీగా వివరించారు. కానీ చివరి రోజు తనకు ఎదురైన మొత్త అనుభవం తనకు చాలా బాధనే మిగిల్చిందన్నారు. అలాగే కనువిప్పు కలిగించే గొప్ప పాఠం కూడా నేర్పిందని చెప్పారు. తాను కంపెనీపై ఎలాంటి ఆరోపణలు చేయడం లేదని కూడా స్పష్టం చేశారు. అయితే ఈ సంఘటనతో పనితో ఉన్న సంబంధం గురించి పునరాలోచించేలా చేసింది. కంపెనీ అనేది కంపెనీ మాత్రమే. దానికి నీ వ్యక్తిగత పరిస్థితులతో సంబంధం ఉండదు. ఏళ్ల తరబడి పనిచేసినా..కంపెనీకి మన జీవితంలో ఎంత వరకు ప్రాముఖ్యత ఇవ్వాలో అంతే ఇవ్వాలి, ఎందుకంటే అది చివరికి ఒక వ్యాపార సంబంధంగానే మిగిలిపోతుందనేది గుర్తురెగాలి. అందుకే కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వాలి, పనికి అతీతమైన జీవితాన్ని నిర్మించుకోవడం అనేది చాలా ముఖ్యం అని రాసుకొచ్చాడు పోస్ట్‌లో. అయితే ఇక్కడ వర్క్ కూడా ముఖ్యమే కానీ కుటుంబ జీవితం కూడా అంతే ముఖ్యం అంటూ తన పోస్ట్‌ని ముగించాడు. నెటిజన్లు కూడా కంపెనీ మీరు వెళ్లిపోగానే మరో ఉద్యోగిని తక్షణమే నియమిస్తుంది అదే మీ కుటుంబానికి మీ స్థానాన్ని ఎవ్వరూ భర్తీ చేయలేరు. అందుకే ఏ కంపెనీ కూడా మన ఆరోగ్యాన్ని, మనశ్శాంతిని, ప్రేమించే వ్యక్తులతో గడిపే సమయాన్ని త్యాగం చేసేంత విలువైనది కాదు అంటూ పోస్టులు పెట్టారు.(చదవండి: తండ్రి చెంత జైలులోనే ఆ చిన్నారి..!ఆ ఐఏఎస్ అధికారి అడిగిన ప్రశ్న..) -
బయటి అందం కాదు.. అంతరంగ పవిత్రతే అసలైన అందం!
ప్రపంచం ఎంత వేగంగా మారుతున్నా, మనిషి అన్వేషణ మాత్రం ఒకటే–శాంతి, ఆనందం, పరిపూర్ణత. ధనం, హోదా, సాంకేతిక విజ్ఞానం, సామాజిక గుర్తింపుం ఇవన్నీ జీవితాన్ని సౌకర్యవంతం చేయగలవేమో గానీ, అంతరంగాన్ని ప్రశాంతంగా ఉంచలేవు. మనసులో కలత, అసంతృప్తి, భయం, అసూయ, కోపం, అహంకారం వంటి భావాలు తొలగినప్పుడే నిజమైన ఆనందం లభిస్తుంది.ఆ అంతరంగ శాంతికి, ఆత్మసాక్షాత్కారానికి, దైవానుభూతికి మూలం పవిత్రత అని భారతీయ ఋషులు వేల సంవత్సరాల క్రితమే చెప్పారు. సహజయోగ వ్యవస్థాపకురాలు పరమపూజ్య శ్రీ మాతాజీ నిర్మలా దేవి 1985 ఆగస్టు 4న ఇచ్చిన సందేశంలో ఈ సత్యాన్ని అత్యంత సరళంగా వివరించారు. ఆమె మాటల్లో ‘‘పవిత్రత కుండలినిని బలపరుస్తుంది.’’ ఈ ఒక్క వాక్యంలోనే ఆధ్యాత్మిక జీవిత సారాంశం దాగి ఉంది.కుండలిని అంటే ఏమిటి?భారతీయ యోగశాస్త్రం ప్రకారం ప్రతి మనిషిలో జన్మతః ఒక దివ్యశక్తి నిద్రాణంగా ఉంటుంది. అదే కుండలిని. ఇది కేవలం ఒక తాత్విక భావన కాదు; ప్రతి మనిషిలో ఉన్న ఆధ్యాత్మిక పరిణామ శక్తికి ప్రతీక. ఈ శక్తి జాగృతమైతే మనిషి తన అసలైన స్వరూపాన్ని తెలుసుకుంటాడు. ఆలోచనలు నిర్మలమవుతాయి. కోపం, భయం, ద్వేషం క్రమంగా తగ్గిపోతాయి. మనసు ప్రశాంతంగా మారుతుంది. ఇతరుల పట్ల ప్రేమ, కరుణ, క్షమాగుణం సహజంగా వికసిస్తాయి. అయితే ఈ దివ్యశక్తి వికసించడానికి అత్యంత అవసరమైన నేల పవిత్రత. మురికినీటిలో తామర పువ్వు వికసించదు. అలాగే కలుషితమైన మనస్సులో దైవచైతన్యం పూర్తిగా వికసించదు.నేటి సమాజం – పరుగు...ప్రస్తుత కాలంలో వ్యక్తి విలువను అతని వ్యక్తిత్వంతో కాకుండా, అతని బాహ్య రూపం, వస్త్రధారణ, ఆస్తి, సామాజిక మాధ్యమాల్లోని ్రపాచుర్యం ఆధారంగా కొలిచే పరిస్థితి ఏర్పడుతోంది. అందంగా కనిపించడానికి గంటల సమయం వెచ్చిస్తాం. ఇతరుల ప్రశంసలు పొందడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. మన గురించి నలుగురు ఏమనుకుంటారో అనే ఆందోళనలోనే జీవితాన్ని గడిపేస్తాం.కానీ ఈ ప్రయాసలన్నీ బాహ్య ప్రపంచానికే పరిమితం. అవి మనసును శాశ్వతంగా తృప్తిపరచవు. అంతేకాదు, అనవసరమైన పోలికలు, అసూయ, అహంకారం, నిరాశలకు కూడా కారణమవుతాయి. ఈ పరిస్థితిలో మనిషి తనలోని సహజ శక్తిని బయట ప్రపంచం కోసం ఖర్చు చేస్తూ, తన ఆత్మసంపదను కోల్పోతాడు. శ్రీ మాతాజీ అందుకే హెచ్చరిస్తారు–‘‘ఇతరులను ఆకర్షించడానికి మీ శక్తిని వృథా చేయకండి. సాధువులలాగే జీవించండి.’’– డా. ప్రతాని రాకేశ్, సహజ యోగ సాధకులునిర్వహణ: డి.వి.ఆర్. భాస్కర్ -
మట్టితో మనిషికి విడదీయరాని బంధం..
మానవ అంతరాత్మలో స్వేచ్ఛ ఎంతటి సహజసిద్ధమైన కాంక్షో, తాను జన్మించిన నేల పట్ల అనురాగం కూడా అంతే సహజమైన ప్రకృతి ధర్మం. మాతృభూమిని ప్రేమించడం విశ్వాసంలో ఒక అంతర్భాగం. సృష్టికర్తను మాత్రమే ఆరాధిస్తూ, ప్రతి ప్రాపంచిక దాస్యం నుండి విముక్తి పొందిన ఆత్మ మాత్రమే తన జన్మభూమి పవిత్రతను, స్వేచ్ఛను సంపూర్ణంగా ఆస్వాదించగలదు. ఈ ఆత్మస్వేచ్ఛే మాతృభూమితో ఒక విడదీయరాని ఆధ్యాత్మిక బంధాన్ని ఏర్పరుస్తుంది.మక్కాను వీడుతూ ప్రవక్త పలికిన అమృత వాక్కులుదైవప్రవక్త ముహమ్మద్ (స) మక్కా నగరాన్ని వీడి మదీనాకు హిజ్రత్ (వలస) వెళ్తున్న ఆ భావోద్వేగ ఘట్టం మాతృభూమి పట్ల ఉండే ఆ΄్యాయతకు సజీవ సాక్ష్యం. స్వదేశాన్ని వదిలి వెళ్తున్న వేళ, మక్కా సరిహద్దుల్లో ఆగి, ఆ నేలవైపు ప్రేమోద్వేగంతో చూస్తూ ప్రవక్త పలికిన మాటలు విశ్వచరిత్రలోనే అత్యంత ఆర్ద్రమైనవి:‘ఓ మక్కా! అల్లాహ్ సాక్షిగా... ఈ భూ మండలంపై ఉన్న సమస్త ప్రదేశాల కంటే నీవే నాకు అత్యంత ప్రియమైనదానివి. అల్లాహ్‌కు కూడా నీవే అత్యంత ఇష్టమైన నిలయానివి. నీ ఒడిలో పెరిగిన నా ప్రజలే నన్ను ఇక్కడి నుండి వెళ్లగొట్టి ఉండకపోతే, నేను నిన్ను వదిలి వేరే ఏ చోటుకూ వెళ్లేవాడిని కాను.’ ప్రవక్త (స) తన జన్మభూమి పట్ల వ్యక్తపరిచిన ఈ అపరిమితమైన ప్రేమ, మాతృభూమి పట్ల ప్రతి మనిషికి ఉండాల్సిన అనురాగానికి శాశ్వతమైన మార్గదర్శిగా నిలిచింది.సజ్దా – పుట్టిన నేలతో ఆత్మిక విలీనంప్రవక్త చూపిన ఈ స్వేచ్ఛా స్ఫూర్తి, మాతృభూమి ప్రేమ ముస్లింల రోజువారీ ఆరాధనలో జీవకళగా నిలుస్తాయి. ఇస్లామ్‌లో రోజుకు ఐదు పూటలా చేసే ప్రార్థనలో అత్యంత పవిత్రమైన ఘట్టం ‘సజ్దా’ (సాష్టాంగ ప్రణామం). మనిషి తన అహంకారాన్ని, సమస్త లౌకిక బంధనాలను త్యజించి, తన శరీరంలోనే అత్యంత గౌరవప్రదమైన శిరస్సును భూమికి ఆనించి దైవానికి ప్రణమిల్లే క్షణమది.ఈ సజ్దా కేవలం ఒక ఆరాధనా ప్రక్రియ మాత్రమే కాదు; అది మనిషి తాను పుట్టిన నేలతో ఏర్పరుచుకునే ఒక ఆత్మీయ ఆధ్యాత్మిక అనుబంధం. రోజువారీ ఫర్జ్ నమాజుల్లోనే కనీసం 34 సార్లు (సున్నత్, నఫిల్, వాజిబ్ లు కాక) తన నుదుటిని నేలకు ఆనించడం ద్వారా విశ్వాసి మాతృభూమి మట్టితో విడదీయరాని ఐక్యతను చాటుకుంటాడు. మట్టి నుండి పుట్టిన మనిషి, నిరంతరం ఆ మట్టికే ప్రణమిల్లడం వల్ల ఆ నేల పట్ల భక్తి, గౌరవం, రక్షణ భావం అతని నరనరాల్లో ఇంకిపోతాయి. మాతృభూమి మట్టిని పదే పదే తాకే ఆ శిరస్సు ఏ పరాయి దాస్యానికీ లొంగదు; ఆ నేల స్వేచ్ఛకోసం ప్రాణాలను సైతం త్యాగం చేయడానికి వెనుకాడదు. చరిత్రే దీనికి సాక్ష్యం.త్యాగానికి మూలమైన ఆధ్యాత్మిక నిరూపణసజ్దాలో దైవానికి లొంగిన ఆత్మ, ప్రపంచంలో మరే శక్తికీ బానిస కాజాలదు. అందుకే, ఏ నేలనైతే రోజువారీ సజ్దాలతో పునీతం చేస్తాడో, ఆ నేల స్వేచ్ఛకు ముప్పు వాటిల్లితే ముస్లిం సమాజం తిరుగుబాటు బావుటా ఎగురవేస్తుంది. భారతదేశ స్వాతంత్య్ర సంగ్రామంలో ముస్లిం యోధులు చిందించిన ప్రతీ రక్తపుబొట్టు వెనుక, దైవప్రవక్త నేర్పిన జన్మభూమి ప్రేమ, నమాజ్‌లో చేసిన ప్రతీ సజ్దా అందించిన ఆత్మబలమే నిలిచి ఉన్నాయి. జన్మభూమిని ప్రేమించడం, దాని స్వేచ్ఛ కోసం పోరాడటం కేవలం రాజకీయ బాధ్యత కాదు; అది విశ్వాసి నైజంలోనే కలిసిపోయిన పరమసత్యం.– మదీహా అర్జుమంద్ ఖాన్నిర్వహణ: డి.వి.ఆర్. భాస్కర్ -
గౌరవం అంటే?
ప్రతి మనిషి, ప్రతి కుటుంబం గౌరవం నిలబెట్టుకోవాలన్న ఆలోచనతోనే ఉంటారు... గౌరవం కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు.. అసలు గౌరవం అంటే ఏమిటీ, గౌరవం ఎలా పొందాలో, ఎలా కాపాడుకోవాలో తెలుసుకుందాం... ఉన్నారుగా మనకు మార్గదర్శులు.. శతక రచయితలు...కులములోన నొకడు గుణవంతుడుండెకులము వెలయు వాని గుణము చేతవెలయు వనములో న మలయజంబున్నట్లువిశ్వదాభిరామ వినుర వేమఅడవిలో గంధం చెట్టుంటే దాని సువాసన అడవి అంతటికి పాకుతుంది.. అలాగే వంశంలో గుణవంతుడైన కొడుకు ఉంటే ఆ వంశానికి కీర్తి గౌరవం లభిస్తాయి... అంటూ వేమనే పై పద్యానికి వ్యతిరేకం కూడా చె΄్పారు.కులములోన నొకడు గుణహీనుడుండెనాకులము చెడును వాని గుణము వలన చెఱుకుతుద ఎన్ను పుట్టినచెఱుకున తీపెల్ల జెరుచు సిద్ధము సుమతీ అంటాడు బద్దెన కవి వేమన గౌరవం కులం ధనం వల్ల రాదు అన్నాడుకులము గొప్పది కాదురాకులమున గౌరవమ్ము లేదు కొంపలు కూలన్నడవడి గొప్పది సుమ్మీనడవడి గలవాడు పూజ్యుడగు వేమాఅర్థం: కులం వల్ల గౌరవం రాదు. మంచి నడవడి ఉన్నవాడే లోకంలో పూజ్యుడు.ఎంగిలి మెతుకులు తిన్ననుసంగతి గలవాడు గౌరవమున బ్రతుకునుసంగతి లేని ధనికుడుకంగారు పడును లోకమందు వేమాపేదవాడైనా మంచి నడవడి ఉంటే గౌరవంగా బతుకుతాడు. నడవడి లేని ధనికుడు లోకంలో చులకన అవుతాడు. గౌరవం మాట, మర్యాద, దానం వల్ల వస్తుందన్నాడు బద్దెన.– డా. కందాళ సత్యనారాయణ మూర్తినిర్వహణ: డి.వి.ఆర్. భాస్కర్ -
నా భార్యకు రెండేళ్లుగా అవే ఆలోచనలు.. గంటల కొద్దీ అక్కడే!
నా భార్యకు 35 ఏళ్లు. ఆమెకు గత రెండేళ్ల నుండి పూజలు, భక్తి విపరీతంగా పెరిగిపోయాయి. పెళ్లయిన కొత్తలో ఏదో కొంతసేపు దేవుడి గదిలో గడిపేది. ఈమధ్య రోజంతా పూజల్లోనే ఉంటుంది. రోజుకు మూడుసార్లు తలస్నానం చేయటం, బాత్రూంలో గంటకు పైగా గడపటం, గదులన్నీ మాటిమాటికీ శుభ్రం చేయటం చేస్తుంది. దీనివల్ల ఇంట్లో పనులన్నీ చాలా ఆలస్యం అవుతున్నాయి. పిల్లలకు, నాకు కూడా ఆఫీసు సమయానికి క్యారేజీ కట్టలేకపోతోంది. అదేమని అడిగితే అలా చేయకపోతే కుటుంబానికి అరిష్టం కలుగుతుందని, దేవుడికి కోపం వస్తుందని చెబుతుంది. వీటిని కంట్రోల్ చేసుకోవాలని ఎంత ప్రయత్నించినా తన వల్ల కావడం లేదని, ఈ విషయంలో ఎవరూ జోక్యం చేసుకోవద్దని చెబుతుంది. ఆమె చేయడమే కాదు, నన్ను, పిల్లలను కూడా తనలాగే చేయమని ఒత్తిడి చేస్తోంది. మాకేం చెయ్యాలో తెలియటం లేదు. ఇలా అతిగా పూజలు చేయటం కూడా ఏదైనా జబ్బంటారా?– రామసుబ్రహ్మణ్యం, మహబూబ్ నగర్ మీ బాధ నాకు అర్థం అయింది. పూజలు చేయడం, భక్తి భావం ఉండటం తప్పుకాదు. చాలామంది రోజూ వారివారి నమ్మకాల ప్రకారం దేవుడికి దండం పెట్టుకోవడం, కొంతసేపు పూజ చేయడం మామూలే! కానీ మీ భార్య లాగా, రోజులో ఎక్కువ సమయం పూజలు చేయడం, దేవుడి గదిలోనే రోజంతా గడపటం, ఇంటిని, వంటను సరిగా పట్టించుకోకపోవడం, పిల్లలకు, మీకు సమయానికి వండి పెట్టి స్కూలుకు, ఆఫీసుకు సమయానికి పంపక పోవటం... ఇవన్నీ ఆమెలోని ఒక మానసిక సమస్యను సూచిస్తున్నాయి. అయితే వీటిని తగ్గించుకోవాలని ప్రయత్నం చేసినా సాధ్యం కావడం లేదని, ఒకవేళ అలా చేయలేకపోతే, కుటుంబానికి ఏదైనా కీడు జరుగుతుందన్న భయంతో ఇలా చేస్తున్నట్లు ఆమె చెబుతోందంటున్నారు. ఇలా ఏదైనా ఒక పనిని పదేపదే చేస్తూ, మిగతా పనులను నిర్లక్ష్యం చేయడం, వద్దనుకున్నా కంట్రోల్ చేసుకోలేకపోవడం లాంటి లక్షణాలన్నీ‘‘అబ్సెసివ్–కంపల్సివ్ డిజార్డర్ (ఓసీడీ)’’ అనే మానసిక రుగ్మతకు లోనైన వారిలో ఉంటాయి. ఇది కూడా ఒక మానసిక రుగ్మతే! మెదడులోని సెరటోనిన్ అనే ఒక ప్రత్యేక రసాయనిక పదార్థం సమతుల్యత తేడా వచ్చినప్పుడు, ఈ జబ్బు లక్షణాలు బయటపడతాయి. కొందరిలో వారసత్వంగా కూడా ఈ సమస్య రావచ్చు. ఇలాంటి వారికి మానసిక వైద్యశాస్త్రంలో మంచి చికిత్స ఉంది. కొన్ని మందుల ద్వారాను, ‘‘కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ’అనే ప్రత్యేక మానసిక చికిత్స ద్వారానూ వీరిని ఈ సమస్య నుండి పూర్తిగా బయటపడేయవచ్చు. ఏదైనా అతి మంచిది కాదు, ‘అతి సర్వత్ర వర్జయేత్’ అని మన పెద్దలు అన్నది అక్షరాలా నిజం. మీరు వెంటనే మీ భార్యని దగ్గర్లోని మంచి సైకియాట్రిస్టుకు చూపించి తగిన చికిత్స చేయించండి. ఆమెలో తప్పకుండా మార్పు వచ్చి మళ్లీ పూర్వస్థితికి వస్తుంది. మీరంతా మనశ్శాంతిగా ఉంటారు. ఆల్ ది బెస్ట్!డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ. మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com -
రొమాన్స్ స్కామ్!
పెళ్లి కోసమై వలలో పడెనే పాపం పసివాడు...అని పాడుకోవచ్చునేమో! ఇది పెళ్లిళ్ల పేరయ్యల కాలం కాదు. వివాహాలకు సంబంధించి చాలా మంది మాట్రిమోనియల్ వెబ్సైట్లపై ఆధారపడుతున్న కాలం. దీన్ని ఆసరాగా చేసుకొని మాట్రిమోనియల్ స్కామ్స్ జరుగుతున్నాయి. జీవిత భాగస్వామి కోసం వెదుక్కునే క్రమంలో కొందరు సైబర్ నేరగాళ్ల బారిన పడుతున్నారు. ఏఐ సాంకేతికత వల్ల మాట్రిమోనియల్ మోసాలను కనిపెట్టడం కష్టంగా మారింది. రొమాన్స్ స్కామ్ ప్రొఫైల్స్ విషయంలో భారతదేశం ప్రపంచంలోనే మూడవ స్థానంలో ఉంది! సైబర్ మోసగాళ్లు మాట్రిమోనియల్ సైట్లను విరివిగా ఉపయోగిస్తున్నారని నివేదికలు తెలియజేస్తున్నాయి...ఒక మాట్రిమోనియల్ ప్లాట్‌ఫామ్ నుంచి ముప్పై అయిదేళ్ల సాప్ట్వేర్ ఇంజినీర్ నీరజ్‌కు ఆసక్తికరమైన రిక్వెస్ట్ వచ్చింది. తనను తాను క్వాలిఫైడ్ ఆర్కిటెక్ట్ అని పరిచయం చేసుకున్న ఆమె తన పేరు రీతిక అని చెప్పింది. కొన్ని వారాలపాటు ఇద్దరూ మాట్లాడుకున్నారు. తన కుటుంబం, తాను చేసే ఉద్యోగం, మ్యారేజ్ ప్లాన్స్ గురించి వివరంగా చెప్పింది. ఈ క్రమంలోనే ఫారెక్స్ ట్రేడింగ్ (ఫారిన్ ఎక్సే ్చంజ్ ట్రేడింగ్)లో ‘సేఫ్ రిటర్న్స్’ గురించి ప్రస్తావించింది. ‘మీరు ఇన్వెస్ట్ చేస్తే నేను సహాయం చేస్తాను’ అని కూడా చెప్పింది. ఆమె చెప్పిన ట్రేడింగ్ ప్లాట్ఫామ్లోకి వెళ్లిన సాఫ్ట్వేర్ ఇంజినీర్‌కు అది చట్టబద్ధమైన ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్ అనే నమ్మకం వచ్చింది. డ్యాష్‌బోర్డ్‌లో ప్రాఫిట్స్ కనిపించాయి. ‘ఫరవాలేదు. ఇన్వెస్ట్ చేయవచ్చు’ అనే నమ్మకాన్ని కలిగించాయి.ఆ తరువాత ఏమైందంటే...ఆ ట్రేడింగ్ ప్లాట్ఫామ్లో ఇన్వెస్ట్ చేశాడు నీరజ్. కొంత లాభాలు వచ్చిన తర్వాత తన డబ్బును విత్‌డ్రా చేసుకోవాలనుకున్నాడు. అయితే ఆ ట్రేడింగ్(?) ప్లాట్‌ఫామ్ స్పందించడం మానేసింది. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రీతిక అనే పేరుతో ఎవరూ లేరని, ఆ ఫొటోగ్రాఫ్‌లను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో సృష్టించారని, వీడియో కాల్స్‌ను ఏఐ టూల్స్‌తో మానిప్యులేట్ చేశారని, గుర్తింపు పత్రాలను ఫోర్జరీ చేశారనే విషయం దర్యాప్తులో బయటపడింది. డజన్ల కొద్దీ నకిలీ మాట్రిమోనియల్ ప్రొఫైల్స్‌ను నిర్వహిస్తున్న ఒక నెట్వర్క్ స్కామ్ ఇది అని తేలింది.నమ్మకాన్ని క్యాష్ చేసుకుంటున్నారునకిలీ మాట్రిమోనియల్ ప్రొఫైల్స్, నకిలీ ఫారెక్స్ ఇన్వెస్ట్మెంట్ పథకం ద్వారా సూరత్‌కు చెందిన కొందరిని మోసం చేసిన సైబర్ మోసాల ముఠా సభ్యులను ఇటీవల గుజరాత్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో ఒక వైద్యుడు కూడా ఉన్నాడు! మ్యాట్రిమోనీ ప్లాట్‌ఫామ్‌లు సైబర్ నేరగాళ్లకు ఆకర్షణీయమైన కేంద్రాలుగా మారాయి. మాట్రిమోనియల్ ప్లాట్‌ఫామ్‌లకు నమ్మకం అనేది ప్రధానం. ఆ నమ్మకాన్నే ఆధారంగా చేసుకొని మోసగాళ్లు చేతివాటం చూపుతున్నారు. తమ జీవితభాగస్వామి గురించి వెదుకుతున్నప్పుడు కుటుంబ నేపథ్యం నుంచి వృత్తి వివరాల వరకు షేర్ చేసుకుంటూ ఉంటారు. ఈ సమాచారం మోసగాళ్ల చేతికి చిక్కడం వల్ల దుర్వినియోగం అవుతోంది.నకిలీ పేర్లు, దొంగిలించిన ఫొటోల స్థాయిని దాటి రొమాన్స్ స్కామ్స్ చాలా ముందుకువెళ్లాయి. సంభాషణలు నమ్మశక్యంగా, సహజంగా ఉండడానికి ఇమేజ్ ఎడిటింగ్, వాయిస్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. జనరేటివ్ ఏఐ ద్వారా రొమాన్స్ స్కామ్స్‌ని కన్విన్సింగ్‌గా చేయడం సులువైంది. తక్కువ టైమ్‌లోనే వీలైనంత ఎక్కువ మందిని మోసం చేయవచ్చు.ఆ తరువాతే...‘గతంతో పోల్చితే మోసాలను గుర్తించడం కష్టమవుతుంది. ప్లాట్‌ఫామ్‌లు తమ ధ్రువీకరణ ప్రక్రియను బలోపేతం చేయాలి. తద్వారా మోసాలు జరగకుండా చేయవచ్చు’ అంటున్నారు నిపుణులు. గతంలో మాదిరిగా ‘వెంటనే మోసం చేయాలి–డబ్బులు దండుకోవాలి’ అని తొందరపడడం లేదు సైబర్ నేరగాళ్లు.‘తగిన సమయం వెచ్చించాలి. నమ్మకాన్ని పెంచుకోవాలి. ఆ తరువాతే డబ్బులు దండుకోవాలి’ అనే పాలసీని అనుసరిస్తున్నారు. మోసపోతే...→ చాట్ రికార్డులు, స్క్రీన్ షాట్లు, చెల్లింపు రసీదులు, మొబైల్ నంబర్లు, ఇ–మెయిల్ ఐడీలు, ప్రొఫైల్ లింక్‌లతో సహా అన్ని ఆధారాలను భద్రపరచండి.→ వీలైనంత త్వరగా సైబర్‌క్రైమ్ హెల్ప్‌లైన్ 1930కు కాల్ చేయాలి. లేదా నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలి.→ నకిలీ ప్రొఫైల్ గురించి మాట్రిమోనియల్ ప్లాట్‌ఫామ్‌కు తెలియజేయండి. తద్వారా ఇతరులు మోసాల బారిన పడకుండా చూడవచ్చు.ఇలా అయితే అనుమానించాల్సిందే!→ నకిలీ లేదా ఏఐ రూపొందించిన ప్రొఫైల్‌ను గుర్తించే హెచ్చరికలను నిర్లక్ష్యం చేయకూడదు. → వ్యక్తిగత వివరాలు తక్కువగా ఉన్న ప్రొఫైల్, అసాధారణంగా, అతి వివరాలు ఉన్న ప్రొఫైల్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. → కొత్తగా పరిచయం అయిన వ్యక్తి సాధారణ ప్రశ్నలకు కూడా అస్పష్టమైన, పొంతన లేని సమాధానాలు ఇస్తే అనుమానించాలి. → లైవ్ వీడియో కాల్స్‌ను నిరాకరిస్తే, వ్యక్తిగతంగా కలవడానికి ‘నో’ చెబితే అనుమానించాల్సిందే. → పరిచయం అయిన కొద్దికాలంలోనే డబ్బు, బహుమతులు, వ్యక్తిగత సమాచారం అడిగినా, ‘ఇన్వెస్ట్ చేయండి’ అని సలహా ఇచ్చినా...వీటిని ప్రమాద సంకేతాలుగా పరిగణించాలి → కస్టమ్స్ చార్జీలు, వీసా సమస్యలు, వైద్య ఖర్చులు... మొదలైన వాటి పేర్లతో డబ్బు దండుకోవడానికి ప్రయత్నిస్తుంటారు → ఆన్లైన్ సంభాషణల ఆధారంగా ఆర్థిక నిర్ణయాలు తీసుకోకూడదు. -
బ్రిటిష్ గుండెల్లో 14 ఏళ్ల బుల్లెట్
1931 డిసెంబర్ 14. కమిల్లా జిల్లా కోర్టు. మేజిస్ట్రేట్ చార్లెస్ స్టీవెన్స్ ఎదుట చేతిలో రివాల్వర్‌తో14 ఏళ్ల స్కూల్ అమ్మాయి. తర్వాతి 10 సెకన్లలో పేలిన 5 గుళ్లు బ్రిటిష్ సామ్రాజ్యపు పునాదులనే కదిలించాయి. ఆ అమ్మాయి పేరు సునీతి చౌదరి. భారత స్వాతంత్య్ర సంగ్రామ చరిత్రలో యంగెస్ట్ విప్లవకారిణి. చరిత్రలో మూలకు నెట్టివేయబడ్డ అగ్ని జ్వాల. ఆమె సాహసభరిత గాథ ఇది.భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్ ఉరితీతతో దేశమంతా రగిలిపోతున్న కాలమది. ‘ఇంకా ఎంతకాలం ఈ బానిస సంకెళ్లు?’ అని ప్రతి యువకుడు ప్రశ్నిస్తున్న రోజులవి. బెంగాల్‌లోని కమిల్లా అనే చిన్న పట్టణంలో ఒక స్కూల్ అమ్మాయి ఈ ప్రశ్నకు తుపాకీతో జవాబు ఇచ్చింది. వయసు 14. పేరు సునీతి చౌదరి. పాఠాలు చదవాల్సిన వయసులో చరిత్ర రాసింది.బాల్యమే విప్లవ పాఠశాలసునీతి 1917 మే 22న కమిల్లా (నేటి బంగ్లాదేశ్)లో జన్మించింది. తండ్రి ఉమాచరణ్ చౌదరి. ఆమె అన్నయ్యలు స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొంటూ ఉండటం వల్ల ఇంట్లో రోజూ దేశభక్తి, బ్రిటిష్ దౌర్జన్యాల గురించి చర్చ జరిగేది. బెంగాల్ అప్పటికే విప్లవ సంఘాలకు కేంద్రం. స్కూల్లో చదువుతూనే సునీతి రహస్య విప్లవ సభలకు హాజరయ్యేది. ఆమె ప్రాణస్నేహితురాలు 15 ఏళ్ల శాంతి ఘోష్ కూడా సునీతికి తోడైంది. ఇద్దరూ కలిసి ‘మనం ఏదో చేయాలి’ అని ప్రతిజ్ఞ చేశారు. శత్రువును శత్రువు భాషలోనే ఎదుర్కోవాలని భావించిన సునీతి ‘యుగాంతర్’ అనే విప్లవ సంస్థలో చేరింది. అక్కడ కర్రసాము, కత్తిసాముతోపాటు తుపాకీ కాల్చడంలో అసాధారణ శిక్షణ పొందింది. వయసు చిన్నదైనా, ఆమె గురి మాత్రం ఎప్పుడూ తప్పేది కాదు.రెచ్చగొట్టిన కలెక్టర్1931 సెప్టెంబర్‌లో కమిల్లా జిల్లా మేజిస్ట్రేట్ చార్లెస్ స్టీవెన్స్ స్వయంగా సునీతి, శాంతి చదువుతున్న గవర్నమెంట్ హైస్కూల్‌కి వచ్చాడు. అమ్మాయిలను లైన్ లో నిలబెట్టి ‘గాడ్ సేవ్ ది కింగ్’ అని నినదించమన్నాడు. ఒప్పుకోని పిల్లలను చెంపలు వాయించాడు. అతని మీద అప్పటికే అత్యాచార ఆరోపణలు ఉన్నాయి. ‘పిల్లల మీద చేయి వేసేవాడు మనిషే కాదు’ అని సునీతి, శాంతి డిసైడ్ అయ్యారు. టార్గెట్ ఫిక్స్ అయ్యింది. గర్జించిన గుళ్లు1931 డిసెంబర్ 14. ఉదయం 10 గంటలు. సునీతి, శాంతి ఇద్దరూ స్కూల్ యూనిఫాం, చేతిలో పుస్తకాలు పట్టుకుని కోర్టుకు వచ్చారు. కలెక్టర్ స్టీవెన్స్ కు పిటిషన్ ఇవ్వడానికి వచ్చినట్టు నటించారు. కలెక్టర్ టేబుల్ దగ్గరికి వెళ్లగానే ఒక్కసారిగా పుస్తకాల్లో దాచిన రివాల్వర్లు బయటికి తీసి ఎడాపెడా 5 గుళ్లు పేల్చారు. స్టీవెన్స్ అక్కడికక్కడే కుప్పకూలాడు. అందరూ షాక్‌లో ఉండగా ఇద్దరూ పారిపోలేదు. నిలబడి ‘జై హింద్! భారత్ మాతా కీ జై!’ అని నినదించారు. పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారు.దేశం కోసం చేశాం కోర్టులో జడ్జి అడిగాడు– ‘ఎందుకు చేశారు?’. 14 ఏళ్ల సునీతి తడబడకుండా చెప్పింది– ‘మా దేశం కోసం చేశాం’. ఈ ఒక్క వాక్యంతో బ్రిటిష్ చట్టం కూడా తలవంచింది. చిన్న పిల్లలు కాబట్టి ఉరిశిక్ష వేయలేక పోయారు. ఇద్దరికీ యావజ్జీవ కారాగార శిక్ష పడింది. బ్రిటిష్ పత్రికలు ‘Two School Girls Kill DM‘ అని మొదటి పేజీలో రాశాయి. లండన్ వరకు వార్త పాకింది. సునీతిని అలీపూర్ సెంట్రల్ జైలుకు పంపారు.బ్రిటిష్ జైల్లో నరకం..హత్య జరిగిన వెంటనే బ్రిటిష్ సైనికులు సునీతిని, శాంతిని బంధించారు. 14 ఏళ్ల పసిపిల్ల అని కూడా చూడకుండా సునీతిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. విప్లవ సంస్థ రహస్యాలు చెప్పాలంటూ బూట్లతో తన్నారు. కానీ ఆ పసిపెదవుల నుంచి కేవలం ‘వందేమాతరం’ అనే నినాదం తప్ప ఒక్క రహస్యం కూడా బయటకు రాలేదు. ఆమె వయసు చిన్నది కావడం వల్ల ఉరిశిక్ష తప్పి యావజ్జీవం పడింది. జైల్లో ఆమెకు కనీస సదుపాయాలు లేకుండా నరకం చూపించారు. అయినా ఆమె కళ్లలోని ధైర్యం, ముఖంలోని చిరునవ్వు చెదరలేదు. జ్లైలోనే చదువుకుంది. రాజకీయ ఖైదీలతో మాట్లాడి దేశ చరిత్ర, త్యాగాల గురించి ఇంకా తెలుసుకుంది. 1939లో ఆమ్నెస్టీ, గాంధీ జోక్యం కారణంగా బ్రిటిష్ ప్రభుత్వం రాజకీయ ఖైదీలను విడుదల చేసింది. అలా ఎనిమిదేళ్ల తర్వాత సునీతి బయటికి వచ్చింది.విడుదలైన తర్వాత విడుదల తర్వాత సునీతి మరో విప్లవ యోధుడు ప్రద్యోత్ కుమార్ గుహను పెళ్లి చేసుకుంది. అతను కూడా జైలుశిక్ష అనుభవించినవాడే. 1947లో దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. కానీ సునీతి ఎప్పుడూ లైమ్‌లైట్‌లోకి రాలేదు. ఇంటర్వ్యూలు ఇవ్వలేదు. ‘మేము చేసింది మా కర్తవ్యం’ అని మాత్రమే చెప్పేది. ప్రశాంతంగా కుటుంబంతో జీవితం గడిపి 1988 జనవరి 12న కలకత్తాలో కన్నుమూసింది. ఆమెతో పాటు కాల్పులు జరిపిన శాంతి ఘోష్ తర్వాత కాంగ్రెస్ నాయకురాలిగా మారింది. పశ్చిమ బెంగాల్ ఎం.ఎల్.ఏగా కూడా పని చేసింది. ఇద్దరూ కలిసి ‘కమిల్లా కన్యలు’ (ది గర్ల్స్ ఆఫ్ కమిల్లా) గా చరిత్రలో నిలిచారు. మనం ఇవాళ అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛా వాయువుల వెనుక 14 ఏళ్ల వయసులోనే నవ్వుతూ జైలు పాలైన ఇలాంటి పసి హృదయాల రక్తం ఉందనే సత్యాన్ని మనం మరువలేము. వీర విప్లవ కిశోరం సునీతి చౌదరికి జోహార్లు! – కె. -
బడా బాబులైనా శిక్ష పడాల్సిందే...
‘‘ఒక్కరోజులో మా భవిష్యత్తు కళ్లెదుటనే కుప్పకూలిపోయింది. డాక్టరుగా పుట్టిన గడ్డకు ఎంతో సేవ చేయాలని తపించిన మా కూతురిని మాకు లేకుండా చేశారు. తప్పతాగి .. రోడ్ల మీదకు వచ్చి, ఇతరుల బిడ్డలను పొట్టన పెట్టుకోకండి..’’ అంటూ పుట్టెడు దుఃఖంతో వేడుకుంటున్నారు డాక్టర్ ప్రియాంక తల్లిదండ్రులు వెంకటేష్, చంద్రమ్మ. రాజమండ్రి జీఎస్ఎల్ మెడికల్ కాలేజీలో పీజీ చదువుతున్న డాక్టర్ ప్రియాంక, మూడు రోజుల క్రితం మద్యం మత్తులో కారుతో ఉన్మాదులు ఆమె స్కూటర్‌ను ఢీకొట్టి, చేసిన వీరంగానికి బలైపోయింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ ఘటన కలకలం రేపింది. తెలంగాణలోని గద్వాల్ జిల్లా అయిజ మండంలోని ఎక్లాస్పురంలో పుట్టి పెరిగిన పెరిగింది ప్రియాంక. దోషులకు శిక్ష పడాలని, సమాజంలో మార్పు రావాలని, ప్రభుత్వాలు తమ బిడ్డకు న్యాయం చేయాలని వెంకటేశ్, చంద్రమ్మలు ‘సాక్షి’తో తమ ఆవేదనను పంచుకున్నారు..చదువులో టాపర్‌గా ఉండే ప్రియాంక మెడిసిన్‌లో ర్యాంకు తెచ్చుకొని ఫ్రీ సీట్ సంపాదించింది.. మరికొన్నాళ్లలో పీజీ పూర్తి చేసి, వైద్యరంగంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలనుకుంది. ‘‘కానీ ఆ కలలను కొందరు దుర్మార్గులు గద్దల్లా ఎత్తుకుపోయారు. మా అమ్మాయి మరణాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నాం. ఎన్ని చేసినా మా అమ్మాయి తిరిగి రాదు. కానీ, వాళ్లను శిక్షిస్తేనే మా అమ్మాయికి న్యాయం జరుగుతుంది. పిల్లల భవిష్యత్తు బాగుండాలని తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు పడతారు. ఉన్న ఊరును వదిలి, అయినవారందకీ దూరంగా పిల్లల చదువుల కోసం శ్రమిస్తాం. ఎంతో కష్టపడి బిడ్డలను చదివించుకుంటున్నాం. కానీ, కొందరు తమ తండ్రులకు, కుటుంబాలకు పలుకుబడి ఉందని, ఏం చేసినా చెల్లుతుందనే ఆలోచనల్లో ఉంటారు. తాగినవాళ్లు ఇంటిదగ్గర ఉండకుండా బయట పెద్ద పెద్ద కార్లు వేసుకొని షికార్లు చేస్తారు. డబ్బు, హోదా ఉందనే పొగరు, సంపన్నులకు శిక్షలు ఉండవనే ధైర్యం వారిది. రాజకీయ పలుకుబడి ఉందనే ధీమా వారిది. కొవ్వెక్కి చేసిన పనులకు తగిన శిక్ష పడాలి. ప్రాణాలను తీసే హక్కు మీకు ఎవరిచ్చారు. దోషులను కఠినంగా శిక్షించి, ఉరి తీయందే మా కడుపు మంట చల్లారదు’ అని తెలిపారు చంద్రమ్మ.చట్టపరంగా శిక్షించాల్సిందే..! వెంకటేష్ మాట్లాడుతూ –‘‘దోషులకు మరణ శిక్ష పడాల్సిందే. ఇలాంటి శిక్షలు అమలు చేస్తేనే సమాజంలో భయం అనేది ఉంటుంది. అప్పుడే మాలాంటి తల్లిదండ్రుల కడుపుకోతలు, ఆర్తనాదాలు ఉండవు. ఇంకా ఎంతమందికి ఇలాంటివి జరుగుతాయో. దోషులకు సరైన శిక్ష పడకపోతే ‘మేం ఏం చేసినా చెల్లుతుంది’ అని తేలిక భావనతో ఉంటారు. ఇలాంటి పోకిరీగాళ్లు ‘మాకు ఏమవుతుందిలే, మా దగ్గర డబ్బు ఉంది, పలుకుబడి ఉంది’ అనుకుంటారు. చట్టపరంగా కఠినంగా శిక్షిస్తే భయం ఉంటుంది. ఇలాంటి దోషులకు మరణశిక్ష , యావజ్జీవ కారాగార శిక్ష పడితేనే సమాజంలో కూడా మార్పు వస్తుంది. శిక్షలు కరెక్ట్‌గా అమలు అవ్వాలి. రాజకీయ ఒత్తిడి లేకుండా చూస్తాం అని పోలీసులు చెప్పారు. ప్రజలు కూడా ఇలాంటి అన్యాయాలు జరగడం సరికాదని పదే పదే చెబుతున్నారు. కరెక్ట్‌గా శిక్షలు పడితే సరే, లేదంటే మా గొంతు, మా కడుపుకోత, మా బాధ రాజమండ్రి వేదికగా పోరాటం చేస్తాం. మాకు న్యాయం జరగకపోతే మా ప్రాణాలు పోయేంతవరకు పోరాడుతూనే ఉంటాం. మాలాంటి ఎంతోమంది తల్లిదండ్రల మద్దతుతో అందరి ముం దుకు వస్తాం’’ అన్నారు వెంకటేష్.తీరని లోటు...తల్లితండ్రులు ఇద్దరూ తమ కూతురు గురించి వివరిస్తూ –‘‘మా ప్రియాంక ఎవరినీ నొప్పించేది కాదు. అందరితో కలివిడిగా ఉండేది. తొందరపడి ఎవరినీ ఎమీ అనేది కాదు. ప్రాపర్‌గా పనులు జరగాలి. ఒక మంచి డాక్టర్‌గా పేరు తెచ్చుకోవాలని ఉండేది. మా ఊరు నుంచి కానీ, మా కుటుంబంలో కానీ ఎవరూ డాక్టర్లు లేరు. అలాంటిది ప్రియాంక డాక్టర్ అయి ఆ పేరు నేను నిలబెడతా అనేది. కర్నూలు మెడికల్ కాలేజీలో ఫ్రీ సీటు వచ్చింది. పీజీ సీటు కూడా మంచి ర్యాంకుతో తెచ్చుకుంది. ఎక్కడా ఒక్క రిమార్క్ లేదు. చదువు చక్కగా సాగుతున్న సమయంలో, మరో రెండేళ్లలో స్పెషలిస్ట్‌గా బయటకు వచ్చేది. ఇలాంటి సమయంలో ఇలాంటి దారుణం జరిగింది. మా జీవితాంతం తీరని లోటు మిగిలింది. మాకు ఏ మాత్రం అన్యాయం జరుగుతుందని తెలిసినా ఊరుకోం. మా ప్రాణాలను పణంగా పెట్టి అయినా మా బిడ్డకు ఆత్మ శాంతి కలిగిస్తాం’’ అని తమ ఆవేదనను, ఆవేశాన్ని మన ముందు ఉంచారు వెంకటేష్, చంద్రమ్మలు. ఏ మాత్రం సహించం..మా కమ్యూనిటీలోనే డాక్టర్లు ఎవరూ లేరు. అమ్మాయిలను చదివించడం అనేది ఇప్పటి వరకు మా దగ్గర ఏ కుటుంబంలోనూ 28 ఏళ్లుగా లేదు. ఇరవై ఏళ్లు రాగానే పెళ్లి చేసి, అత్తారింటికి పంపించేస్తారు. అలాంటిది ప్రియాంకకు చదువు మీద ఉన్న శ్రద్ధతో ఆమె కలకే ప్రాముఖ్యం ఇచ్చాం. తను మా ఊరుకు పెళ్లి చూపులకని వచ్చి, తిరిగి కాలేజీకి వెళ్లిపోయింది. ఇంకో ఆర్నెల్లలో పెళ్లి అవుతుందని, అమ్మాయి జీవితం బాగుంటుందని ఎన్నో కలలు కన్నాం. ఊరు నుంచి వెళ్లిన ఒక్కరోజులోనే.. ‘మీ అమ్మాయి ప్రియాంకకు యాక్సిడెంట్ అయ్యింది, తీవ్ర రక్త స్రావం అవుతోంది’ అని ఫోన్ వచ్చింది. ఆ తర్వాత బ్రెయిన్ డెడ్ అయ్యిందని చెప్పారు. ఇన్నాళ్లూ తను పడిన కష్టానికి తగిన ఫలితం రాకుండానే దుర్మార్గులు మాకు దూరం చేశారు. తనకు సరైన న్యాయం జరగకపోతే ఏ మాత్రం సహించం. – చంద్రమ్మ, ప్రియాంక తల్లి– నిర్మలారెడ్డి, ఇన్పుట్స్ వాగు గడ్డ నరసింహారెడ్డి, సాక్షి, గద్వాల్ -
135 రోజుల్లో 45 కేజీలు: నో స్ట్రిక్ట్ డైట్, జస్ట్ నడకతో..
బరువు తగ్గడం అనేది చాలామందికి ఒక అసాధారణమైన లక్ష్యంగా ఉండిపోతుంటుంది. తీవ్రమైన డైట్లు, డిటాక్స్ క్లెన్సింగ్లు, అధిక తీవ్రత గల వర్కౌట్లు వంటి ఎన్నో ట్రెండ్లతో చాలామంది బరువు తగ్గొచ్చని నిరూపిస్తుంటారు. కానీ అవి కూడా మళ్లీ యథావిధికి వచ్చేలా అమాంతం బరువుని పెంచేస్తాయి. దాంతో స్థిరమైన ఆరోగ్యకరమైన బరువుని మెయింటైన్ చేయలేక చతికిలపడుతుంటారు. కానీ ఈ వ్యక్తి అలాంటి ట్రెండ్లు ఏం పాటించకుండా కేవలం వాకింగ్‌తోనే ప్రభావవంతంగా బరువు తగ్గొచ్చని నిరూపించి అందర్నీ ఆశ్చర్యపరిచేలా ఏకంగా 45 కేజీలు తగ్గాడు. మరి అతడికి ఇదెలా సాధ్యమైందంటే.. వివేక్ సిద్ధా అనే ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ కేవలం వాకింగ్‌తో జస్ట్ 135 రోజుల్లో 45 కేజీలు తగ్గినట్లు పేర్కొన్నాడు. ప్రత్యేకమైన డైట్లు, ఖరీదైన సప్లిమెంట్లు గానీ, షార్ట్కట్లు లేవు అంటూ సోషల్ మీడియా వేదికగా తన వెయిట్‌లాస్ జర్నీ గురించి షేర్ చేసుకున్నాడు. గురుగావ్‌లో పనిచేసే సిద్ధా, ప్రతిరోజూ ఢిల్లీలోని తన ఇంటికి నడిచి వెళ్తానని చెబుతున్నాడు. అతడు పదివేల అడుగులతో ప్రారంభించి..క్రమంగా 20 వేల దాక అడుగులు పెంచుకుంటూ వాక్ చేశానని తెలిపాడు.ఆహారం కూడా అంతే ముఖ్యంఒకప్పుడు సిద్దా 128 కేజీల బరువుతో ఉండేవాడు. అలాంటి ఆయన నడకతో కిలోల కొద్దీ బరువు తగ్గడం విశేషం. ఆయన వాకింగ్ తోపాటు అధిక ప్రోటీన్ కలిగిన ఆహారంపై దృష్టి పెట్టానని చెప్పారు. అందుకోసమే రెండుపూటల భోజనంతో ప్రారంభించి..ఓమాడ్ శైలి దినచర్యకు మారినట్లు తెలిపారు.బరువు తగ్గడానికి నడక ఎంత ప్రభావవంతమైనదంటే..బరువు తగ్గడానికి నడక చాలా ప్రభావవంతమైనది, ఇది అందుబాటులో ఉంటుంది, నిలకడగా చేస్తే..కొవ్వును కరిగించి, లీన్ కండరాలను కాపాడటంలో శక్తిమంతంగా ఉంటుంది. రోజువారీ దినచర్యలో కేవలం 30 నిమిషాల వేగవంతమైన నడకను జోడించడం ద్వారా రోజుకు సుమారుగా 150 అదనపు కేలరీలను కరిగించవచ్చు. అయితే, దీని నిజమైన ప్రభావం వేగం, నిలకడ, మొత్తం ఆహారపు అలవాట్లపై ఆధారపడి ఉంటుందని చెబుతున్నాడు వివేక్.నడక నాడీ వ్యవస్థను ప్రశాంతపరుస్తుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది.నడక కోరికలను విపరీతంగా పెంచకుండా కేలరీలను దహిస్తుంది.ఇది సురక్షితమేనా?135 రోజుల్లో 45 కిలోలు తగ్గాలంటే, మీరు ప్రతిరోజూ సుమారు 2,567 కేలరీల శక్తి లోటును కొనసాగించాల్సి ఉంటుంది. చాలా మందికి, వారి మొత్తం జీవక్రియ ఒక రోజులో అన్ని కేలరీలను దహించదు. దీనిని సాధించడానికి దాదాపు పూర్తి ఉపవాసంతో పాటు గంటల తరబడి తీవ్రమైన రోజువారీ వ్యాయామం చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే..వేగంగా బరువు తగ్గడం వల్ల... పిత్తాశయ రాళ్లు, కండరాల క్షీణత, జీవక్రియ పతనం, జుట్టు రాలడం, ఎలక్ట్రోలైట్ అసమతుల్యతలతో సహా అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.సురక్షితమైన 45 కిలోల బరువు తగ్గాలంటే,వాస్తవికంగా 11 నుంచి 22 నెలల సమయాన్ని కేటాయించుకోవాలి. ఈ నెమ్మదైన కాలవ్యవధికి సహనం అవసరమైనప్పటికీ, ఇది కండరాలకు బదులుగా స్వచ్ఛమైన కొవ్వును కోల్పోవడానికి, చర్మం వదులుగా మారడాన్ని నివారించడానికి, అలాగే జీవితాంతం పాటించగలిగే ఆహారపు అలవాట్లను పెంపొందించుకోవడానికి వీలు కల్పిస్తుంది. View this post on Instagram A post shared by Vivek siddhaa (@the_vivek_siddhaa)గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. పూర్తి వివరాలకు వైద్యులు లేదా వ్యక్తిగత నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: తండ్రి చెంత జైలులోనే ఆ చిన్నారి..!ఆ ఐఏఎస్ అధికారి అడిగిన ప్రశ్న..) -
తండ్రి చెంత జైలులోనే ఆ చిన్నారి..!ఆ ఐఏఎస్ అధికారి అడిగిన ప్రశ్న..
తల్లిదండ్రులు చేసే తప్పులకు ఒక్కోసారి పిల్లల భవిష్యత్తు అంధకారంలో మగ్గిపోతుంటుంది. అంతేగాదు కొందరు అనాధలుగా మిగిలిపోతుంటారు. ఆదుకునేవాళ్లు ఉంటే..మంచి భవిష్యత్తు లభిస్తుంది లేదంటే ప్రశ్నార్థకంగా మిగిలిపోతుంటాయి వారి జీవితాలు. అలాంటి జీవితాన్నే గడుపుతున్న ఓ చిన్నారిని ఐఏఎస్ అధికారి అడిగిన ప్రశ్న ఆమె జీవితాన్నే మార్చేసింది. ఈ ఘటన చత్తీశ్‌గఢ్‌లోని బిలాస్పూర్ సెంట్రల్ జైలులో చోటు చేసుకుంది. అక్కడ ఖుషీ అనే ఆరేళ్ల చిన్నారి బాల్యం జైలులో సాగుతోంది. ఆమె తండ్రి జైలులో సుదీర్ఘ శిక్ష అనుభవిస్తుండటంతో ఆ చిన్నారి కూడా తండ్రితోపాటే జైలులో గడుపుతోంది. ఎందుకంటే ఆమెకు కేవలం 15 రోజుల వయసు ఉన్నప్పుడే తల్లి కామెర్ల వ్యాధితో మరణించింది. దాంతో ఆమె బాధ్యత తీసుకునేవారెవ్వరూ లేకపోవడంతో..ఆ చిన్నారిని కూడా తండ్రి తోపాటు జైలుకు తీసుకువచ్చారు. అయితే 2019లో ఐఏఎస్ అధికారి సంజయ్ కుమార్ అలంగ్ జైలుని సందర్శించేంత వరకు ఆమె బాల్యం జైలులోనే గడిచింది. ఆయన జైలు పనితీరు పరిశీలించడానికి రావడంతో మహిళా ఖైదీలతో ఆడుకుంటున్న చిన్నారి ఖుషీని గమనించారు. ఆమెలో ఏదో ఆకర్షణీయమైన విషయం ఆయన్ని కదిలించింది. అసలు ఆ చిన్నారి జైలుకి ఎందుకు వచ్చింది అని తెలుసుకోవాలనే కుతూహలం ఏర్పడి..ఆమె గురించి క్షుణ్ణంగా ఆరా తీయడం ప్రారంభించారు. అప్పుడే ఖుషీ గురించి మొత్తం తెలుస్తుంది ఆ అధికారికి. ఆ తర్వాత ఆయన ఆ చిన్నారిని దగ్గరకు తీసుకుని జీవితంలో ఏం చేయాలనుకుంటున్నావని అడిగారు. దానికి ఆ చిన్నారి అమాయకంగా స్కూల్లో చదువుకుంటానని తడుముకోకుండా చెప్పేసింది. దాంతో ఆయన ఆ చిన్నారిని జైలు నుంచి బయటకు రప్పించి పాఠశాలలో చేర్పించే మార్గాల గురించి అన్వేషించడం ప్రారంభించారు. ఆ అధికారి ప్రయత్నాల కారణంగా.. బిలాస్‌పూర్‌లోని జైన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆ చిన్నారికి చదువు, వసతికి మద్దతు ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. ప్రారంభంతో ఆమె కోసం సంరక్షకురాలిని కూడా ఏర్పాటు చేశారు. ఒక నేరస్థుడి కూతురిగా జైల్లో మగ్గిపోతున్న ఆమె బాల్యాన్ని అనుకోని పరిస్థితులు మంచి స్థితి వైపుకి నడిచేలా చేసి..కొత్త జీవితాన్ని ప్రసాదించింది. ఇక్కడ ఖుషీ కథ పిల్లలు అద్భుతమైన పరిస్థితుల్లో పుట్టాల్సిన అవసరం లేకపోయినా..అంధకారం ముసిరినా..అభ్యున్నతి అనే వెలుగు ద్వారం, ఐఏఎస్ అధికారి రూపంలో తెరుచుకుంది. ఎత్తుగా ఉండే జైలు గోడల మధ్య సాగిన ఆమె బాల్యం బయట ప్రపంచాలన్ని చూడాలనే ఆరాటాన్ని రేకెత్తించి ఇలా చదువుకోవాలనే కోరికను వెలిబుచ్చేందుకు దారితీసింది. అలాగే ఆ ఐఏఎస్ అధికారి ఖుషీని అడిగిన ప్రశ్న..పరిస్థితుల కారణంగా మూసుకుపోయిన ద్వారాన్ని తెరిచింది. పైగా ఆ చిన్నారి కథ కేవలం సంరక్షణ మాత్రమే కాదు, సామర్థ్యాన్ని , వారి కోరికలు, ఆకాంక్షలు వినేవారు, మార్గం చూపేవారు కావలని చెబుతోంది. సరైన సమయంలో కల్పించే చిన్న అవకాశం ఒక బిడ్డ జీవిత గమనాన్నే మార్చగలదు అనేందుకు ఖుషీ జీవితమే ఉదాహరణ కదూ..!.(చదవండి: లాయర్‌గా కంటే కంటెంట్ క్రియేటర్‌గానే ఎక్కువ సంపాదించా..!) -
లాయర్‌గా కంటే కంటెంట్ క్రియేటర్‌గానే ఎక్కువ సంపాదించా..!
స్థిరమైన ఆదాయం అంటే..రిస్క్‌లు, టెన్షన్ లేని జాబ్ అనిపిస్తుంది. అలాంటి మంచి ఉద్యోగాన్ని వదులుకోవాలని అనిపించదు. ఇక్కడ ఈ మహిళ కూడా లాయర్‌గా మంచి జీతం ఆర్జిస్తోంది. చెప్పాలంటే వెల్ సెటిల్ జాబ్ అనొచ్చు. అలాంటి ఉద్యోగాన్ని వద్దనుకుని జస్ట్ పదివేలు జీతం ఇచ్చే జాబ్వైపుకి మొగ్గు చూపింది. ఆ తర్వాత ఏమైందంటే..ఆ మహిళే మెహర్ వర్మ టాక్స్ లాయర్‌గా హాయిగా నెలకు రూ. 1 లక్ష దాక జీతం పొందేది. అలాంటి ఉద్యోగాన్ని రూ. 10 వేలు జీతం ఇచ్చే జాబ్ కోసం వదిలేసింది. ఇదేంటిది అని విస్తుపోకండి. స్వేచ్చగా పనిచేసే జాబ్ కోసం ఇదంతా చేసింది. హాయిగా కంటెంట్ క్రియేటర్‌గా ఆర్జించేందుకు ఇలా చేసింది. మరి నిలదొక్కుకుందా అంటే..మూడేళ్ల తర్వాత ఏకంగా అంతకురెట్టింపు కంటెంట్ క్రిఏయటర్ కమ్ సోషల్ మీడియ స్టాటజిస్ట్గా ఆర్జించింది. అయితే స్థిరమైన ఉద్యోగం వదిలేయడం అంటే చాలా పెద్ద రిస్క్ అని అంగీకరించిందామె. అయితే తన నిర్ణయం చివరికి ఫలించి..ఎక్కువ ఆర్జించగలిగానంటోంది. అంతకుముందు టాక్స్ లాయర్‌గా చేస్తూ.మంచి ఆర్థిక స్వాతంత్ర్యాన్ని పోందాను, పైగా కంపెనీ కూడా బాగుందని పేర్కొంది. అయితే రాను రాను శని, ఆదివారాలు రాగానే సోమవారం అంటే భయమేసిందని చెప్పింది. దాంతో చక్కగా మధ్యలో కంటెంట్ క్రియేటర్‌గా వీడియోలు షేర్ చేస్తూ ఉండేది. అలా తన పూర్తికాలపు ఉద్యోగం తోపాటు కంటెంట్ క్రియేషన్‌ను కూడా బ్యాలెన్స్ చేసేందుకు ట్రై చేసినట్లు తెలిపింది. అందుకోసం ఫోటోగ్రఫీ కోర్సు కూడా చేసినట్లు వెల్లడించింది. చివరికి క్రియేటివ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడం ప్రారంభించానని, కానీ రిజెక్ట్ అయ్యేవని తెలిపింది. ఆ తర్వాత 2004లో ఎలాగోలా మొదటి ఫ్రీలాన్స్ ప్రాజెక్ట్ దొరికిందని, దాని కోసం ఏడు నుంచి ఎనిమిది వీడియోలు రూపొందించడంతో రూ. 10 వేలు చెల్లించినట్లు వెల్లడించింది. ఆ తర్వాత తాను దీంట్లోనే పూర్తి స్థాయిలో కొనసాగాలనే ఉద్దేశ్యంతో స్థిరమైన న్యాయవాద ఉద్యోగాన్ని వదిలేసినట్లు పేర్కొన్నారు. తన నిర్ణయం అంత తెలివైనది కాదని కూడా ఆమె ఒప్పుకుంది. కానీ తాను ఉద్యోగం మానేయాలని అనుకోవడంతోనే ఈ సాహసం చేసినట్లు పేర్కొంది. చివరికి తాను కంటెంట్ క్రియేటర్‌గా రాణించేలా ఎడిటింగ్, స్టోరీటెల్లింగ్, ఫోటోగ్రఫీ, యూజీసీ, స్ట్రాటజీ తోసహా, కోర్సుల్లో జాయినవ్వడం, పుస్తకాలు చదడం వంటివి చేసినట్లు వెల్లడించింది. అలాగే పలువురిని సంప్రదించి..తన ఆలోచనలను వివరించడంతో..నెమ్మదిగా ఫ్రీలాన్స్ క్లయింట్లను సంపాదించగలిగానని చెప్పుకొచ్చింది. చివరికి లాయర్‌గా సంపాదించిన దానికంటే కంటెంట్ క్రియేటర్‌గా రెండింతలు సంపాదించే స్థాయికి చేరానని తెలిపింది. అయితే ఈ లైఫే బాగుందని చెబుతుండటం విశేషం. ఎందుకుంటే ప్రయాణాలు చేసే స్వేచ్ఛ, అభిరుచులకు సమయం అన్ని ఉన్నాయని ఆనందంగా చెబుతోంది. అయితే కంటెంట్ క్రియేటర్‌గా అన్ని రోజులు బాగోవని, క్లయింట్లు వస్తుపోతుంటారు..అలాగే ప్రతిసారి భారీ విజయం వచ్చేయదు అని హెచ్చరిస్తోంది కూడా. అయినప్పటికీ ఈ లైఫే నచ్చిందని, ధైర్యంగా ముందుకు సాగిపోగలననే నమ్మకం ఉందంటూ ఈ 27 ఏళ్ల కంటెంట్ క్రియేటర్ వర్మ తన సక్సెస్జర్నీని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. View this post on Instagram A post shared by Mehar Verma | UGC Creator | SMM (@meharverma99) (చదవండి: ఆఫ్రికన్ పాఠశాల విద్యార్థి నోట మన దేశ మహారాజు ప్రసంగం ..!) -
79 ఏళ్ల తర్వాత..మా ఊరికి బస్సొచ్చిందహో!
ఒకప్పుడు ఆ ఊరివాళ్లు బస్సు ఎక్కాలంటే ఎన్నో కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు వారికి ఆ శ్రమ తప్పింది. బస్సు వారిని వెదుక్కుంటూ వచ్చింది. రాజస్థాన్‌లోని అజ్మీర్ జిల్లాలోని మారుమూల గ్రామం కుర్తాల్లో తొలిసారిగా బస్సు సర్వీస్ మొదలైంది. ఈ బస్సుకు గ్రామస్తులు మేళతాళాలతో ఘనస్వాగతం పలికారు. ఆనందంతో నృత్యాలు చేశారు. సెల్ఫీలు తీసుకున్నారు.ఈ సరికొత్త బస్సు సర్వీసు గ్రామస్తుల దైనందిన జీవితంలో గణనీయమైన మార్పు తీసుకురానుంది. తమ అవసరాలకు సమీపంలోని పట్టణాలకు వెళ్లడం సులువు అవుతుంది. సమీప పట్టణానికి వెళ్లడానికి ఇప్పటివరకు ప్రైవేట్ వాహనాలపై ఆధారపడుతున్న గ్రామస్తులకు ఈ బస్సు సర్వీస్ ఊరటనిస్తోంది. ‘స్వాతంత్య్రం వచ్చిన ఎన్నో దశాబ్దాల తరువాత ఒక గ్రామానికి తొలిసారిగా బస్సు వచ్చింది. ఇందుకు కారణం ఏమిటి?’ అనే కోణంలో నెటిజనుల మధ్య ఆసక్తికరమైన చర్చ జరిగింది. View this post on Instagram A post shared by Mahnoud Khalil (@mahmoudkhalil9101) -
బ్యాంకు వారితో రాజీ కుదుర్చుకోవచ్చు!
నేను సాఫ్ట్వేర్ ఉద్యోగిని. బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సిల నుంచి దాదాపు 80 లక్షల వ్యక్తిగత, పూచీకత్తులేని రుణాలు తీసుకుని, గత మూడు సంవత్సరాల్లో స్టాక్ మార్కెట్, చిన్న స్టార్టప్ కంపెనీలో పెట్టుబడులు పెట్టి నష్టపోయాను. ప్రస్తుతం నా నెలవారీ ఈఎంఐలు నా జీతం కంటే రెండింతలు ఎక్కువగా ఉన్నాయి. నాకు ఎలాంటి ఆస్తులు లేవు. కుటుంబ సభ్యులు, స్నేహితుల నుంచి కూడా ఆర్థిక సహాయం పొందే పరిస్థితి లేదు. వచ్చే నెల నుంచి ఈఎంఐలు కట్టే పరిస్థితి కూడా లేదు కాబట్టి బ్యాంకు వారు వేధిస్తారని అనుకుంటున్నాను. భవిష్యత్తులో ఇలాంటి చట్టపరమైన ఇబ్బందులు తగ్గించుకోవడానికి ఇప్పుడు నేను తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో తెలుపగలరు?– నరేష్, హైదరాబాదు రుణం చెల్లించలేకపోవడం వల్ల సాధారణంగా సివిల్ రికవరీ ప్రక్రియ ప్రారంభమవుతుంది. మీరు లోను కట్టని పక్షంలో రుణదాత/బ్యాంకు ముందుగా డిమాండ్ నోటీసు పంపవచ్చు. అలాంటి నోటీసు వచ్చినప్పుడు, మీ నిజమైన ఆర్థిక పరిస్థితిని వివరించి, చెల్లింపు కోసం సహేతుకమైన గడువు లేదా రాజీ కోరుతూ సమాధానం ఇవ్వండి. నిజానికి అంతవరకూ వేచి చూడకుండా మీరే ముందుగా బ్యాంకు వారితో, ఎన్బీఎఫ్సిలతో పారదర్శకంగా వ్యవహరించడం మంచిది. సమస్యను దాచిపెట్టకుండా, మీ ఆర్థిక పరిస్థితిని లిఖితపూర్వకంగా తెలియజేయడం ఉత్తమ మార్గం. మీ ఆదాయం, నెలవారీ ఖర్చులు, స్టాక్ ట్రేడింగ్‌లో జరిగిన నష్టాలను వివరించి, ఈఎంఐల పునర్వ్యవస్థీకరణ, వాయిదాల పునర్నిర్ణయం లేదా ఒకేసారి రాజీ వంటి అవకాశాలను పరిశీలించాలని అభ్యర్థించండి. బ్యాంకులు ప్రతి కేసును దాని పరిస్థితుల ఆధారంగా పరిశీలిస్తాయి. మీకు కావాల్సిన విధంగా ఇవ్వాలి అనే రూల్ లేదు. రుణం చెల్లించలేకపోవడం వల్ల సాధారణంగా సివిల్ రికవరీ ప్రక్రియ ప్రారంభమవుతుంది. అదలా ఉంటే, బ్యాంకువారు వసూళ్లకు ఇబ్బంది పెడతారు అని మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఆర్బీఐ జారీ చేసిన ఫెయిర్ ప్రాక్టీసెస్ కోడ్, రికవరీ ఏజెంట్ల ప్రవర్తనా మార్గదర్శకాల ప్రకారం, రుణగ్రహీతను బెదిరించడం, అవమానించడం, బలవంతంగా వసూలు చేయడం లేదా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడానికి అనుమతి లేదు. అలాంటి పరిస్థితుల్లో సంబంధిత బ్యాంకు, ఎన్బీఎఫ్సి ఫిర్యాదు వ్యవస్థను ఆశ్రయించవచ్చు. అవసరమైతే పోలీసులకు లేదా ఆర్బీఐ సమగ్ర ఫిర్యాదు వ్యవస్థ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు. ఖచ్చితంగా వసూలు చేయాలని కానీ, అందుకు వేధించడాన్ని కానీ చట్టం ఒప్పుకోదు. కేసులు వేసినాక కూడా బ్యాంకు వారితో రాజీ కుదుర్చుకోవచ్చు. నోటీసులు లేదా కోర్టు ప్రక్రియ ప్రారంభమైనా, చట్టబద్ధమైన సమాధానం ఇవ్వడం, సెటిల్మెంట్కు ప్రయత్నించడం ద్వారా భవిష్యత్తులో వచ్చే ఇబ్బందులను గణనీయంగా తగ్గించుకోవచ్చు.– శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాది(మీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాల కోసం sakshifamily3@gmail.comకు మెయిల్ చేయవచ్చు.) (చదవండి: మహిళలూ.. ఆ విషయాలకు క్షమాపణ చెప్పొద్దు..!) -
మహిళలూ.. ఆ విషయాలకు క్షమాపణ చెప్పొద్దు..!
భారతీయ అమ్మాయిలకు చిన్నప్పటి నుంచి క్షమాపణలు చెప్పడం నేర్చుకుంటుంటారు. గదిలో గట్టిగా నవ్వినందుకు. ఎక్కువుగా తిన్నందుకు, ఎవరికైనా నొప్పి కలిగినప్పుడు, వద్దని చెప్పాలనుకున్నప్పడు, భావోద్వేగాలను వ్యక్తపరిచనిందుకు ఇలా ప్రతిదాంట్లో క్షమాపణలు చెబుతుంటారు. నిజానికి సారీ వాళ్ల లైఫ్‌లో భాగమైపోతుంది. అదొక నిశబ్ద శిక్షణగా మారిపోతుంది. ఇది ఒకరకంగా తమను తాము చిన్నవారిగా చేసుకునే అలవాటుగా మారిపోతుంటుంది. ముఖ్యంగా మహిళలు క్షమాపణలు చెప్పేలా చేస్తున్న మూడు విషయాలు ఏంటో తెలుసా అంటూ వాటి గురించి వివరించారు సైకాలజీ నిపుణులు. మరి అవేంటో తెలుసుకుందామా..!.మన భారతీయ సమాజంలో అమ్మాయిల కోసం చాలా ఎక్కువగా నియమాలు విధిస్తుంటారు. వాటిలో కొన్ని.. గట్టిగా నవ్వొద్దు, గట్టిగా మాట్లాడకు, ఎక్కువగా తినకు, అలా కూర్చోకు, ఇవి వేసుకోవద్దు, ఆత్మవిశ్వాసంతో ఉండకు ..అలా చేస్తే నిన్ను అహంకారిగా అనుకునే ప్రమాదం ఉందంటూ కట్టడి చేస్తుంటారు చాలామంది. ఆఖరికి సైలెంట్ ఉన్నా, తన అభిప్రాయాలకే కట్టుబడి ఉన్నా, అందరితో సరదాగా ఉన్న ఇలా ప్రతిదాంట్లో ఆంక్షలు ఉంటాయి. నిజానికి ఇవి మనల్ని అలసిపోయేలా చేసేవి, ఒత్తిడికి గురిచేసేవి. వాటన్నింటి వెనుక ఉన్న ఉద్దేశ్యం.. ఒక్కటే నువ్వు సహజంగా ఉన్న తీరు అంత సరైనది కాదు అని చెప్పడమే అని అంటున్నారు సైకాలజీ నిపుణులు. ఈ ప్రపంచంలో ఇమడటానికి ఇవే అర్హతలంటే వాటిని తప్పక వ్యతిరేకించాలని అంటున్నారు. ఇతరుల కోసం నిన్ను నువ్వు మార్చుకోవాల్సి అవసరం లేదని చెబుతున్నారు. నీ చుట్టూ ఉన్నవారి సౌకర్యం కోసం నీ వ్యక్తిత్వాన్ని మార్చుకోవాల్సిన పనిలేదు. నువ్వు ఎలా ఉన్నావో అలా ఉన్నందుకు అస్సలు సారీ చెప్పాల్సిన పనిలేదంటున్నారు. తమను తాము విజయవంతంగా అణచివేసుకుని ఇతరుల ఆమోదాన్ని పొందిన మహిళలు ఈ ప్రపంచానికి అవసరం లేదని, తమను తాము ఉన్నది ఉన్నట్లుగా, సంపూర్ణంగా, ఎలాంటి సంకోచం లేకుండా వ్యక్తపరిచే ధైర్యం ఉన్న మహిళలే కావాలని చెబుతున్నారు మానసిక నిపుణులు. అలాగే భావోద్వేగపూరితంగా ఉన్నందుకు క్షమాపణలు చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే అమ్మాయిలు స్వభావరీత్యా భావోద్వేగపూరితంగా ఉంటారు. మన భారతీయ సమాజం తరతరాలుగా అలాంటి భావోద్వేగాన్ని వ్యక్తపరచడాన్ని సిగ్గుపడే అంశంగా చెబుతుంటారు. ఉదాహరణకు సినిమా చూసి ఏడవడం బలహీనత, అతిగా ఆలోచించడాన్ని వ్యక్తిత్వ లోపంగానూ, విషయాలను లోతుగా అనుభూతి చెందడాన్ని డ్రామాగా, ప్రతిదానికి బాధపడటాన్ని సున్నితత్వంగా చూస్తుంటారు. ఈ భావాలను వ్యక్తపరచడం అనేది సిగ్గుపడే విషయం కాదని నొక్కి చెబుతున్నారు. అవేమి లోపాలు కాదని స్త్రీలను లోతైన సానుభూతిపరులుగా, లోతైన అనుబంధం ఉన్నవారుగా, లోతైన మానవత్వం ఉన్నవారుగా చూసే గుణాలని అన్నారు. అలాగే "కాదు" అని చెప్పేందుకు కూడా క్షమాపణ వద్దనే చెబుతున్నారు. సహజంగా "కాదు" అని చెప్పే అమ్మాయిని సంస్కారహీనురాలుగా, మొండిది, నిర్దయురాలు, స్వార్థపరురాలుగా ముద్రవేసేస్తుంటారు. కానీ ఇక్కడ కాదు అనేది మిమ్మల్ని గౌరవించుకుంటున్నారని అర్థమట. మీకు సరిగా అనిపించని విషయాలకు నిర్మొహమాటంగా కాదు అని చెప్పడమే సరి అని అంటున్నారు. అంటే ఒక పరిస్థితికి, ఒక అభ్యర్థన, ఒక సంబంధానికి ఆత్మగౌరవాన్ని, భద్రతను లేదా శాంతిని పణంగా పెట్టమని కోరే దేనికైనా కాదు అని చెప్పడం అంటే.. ఆమె తాను ముఖ్యమైనదాన్ని అని చెప్పే గీతను నిర్మిస్తున్నట్లు భావం అని అంటున్నారు. అంతేగాదు ఆమె సౌకర్యం, హద్దులు ముఖ్యమైనవని చెప్పడమే అని అంటున్నారు. అందుకే కాదు అని చెప్పడంలో తప్పు లేదు కాబట్టి అందుకోసం క్షమాపణ చెప్పొద్దు. అలాగే నిజాయితీగా ఉన్నందుకు క్షమాపణ చెప్పకండి. అందువల్ల మీరు మీలా ఉండటం, మీ భావాలను అనుభూతి చెందడం, కాదు అని చెప్పడం అనేవి మానవ విలువలు. ఇవి మన ఆత్మగౌరవం, హుందాతనం, అవగాహనతో పాతుకుపోయిన విలువలు అని నొక్కి చెబుతున్నారు మానిసిక నిపుణులు. సో "సారీ" చెప్పేటప్పుడూ ఆలోచించండి..వనితలు..!. -
'వివాహం'పై కిరణ్ బేడీ షాకింగ్ వ్యాఖ్యలు..!
మాజీ టెన్నిస్ క్రీడాకారిణి, మాజీ ఐపీఎస్ అధికారిణి డాక్టర్ కిరణ్ బేడీ ఏ విషయాన్ని అయినా చాలా ముక్కుసూటిగా నిష్కపటంగా చెబుతుంటారు. మహిళల సమస్యల విషయానికి వస్తే, ఆమె ఏమాత్రం భయపడకుండా, సాంప్రదాయాలను సవాలు చేసేలా..చాలా సూటిగా మాట్లాడతారు. నెల రోజుల క్రితం అభిషేక్ వ్యాస్‌తో జరిగిన ఒక పాడ్‌కాస్ట్‌లో, భారతీయ మహిళలకు వివాహం ఎలాంటిదో చాలా ఓపెన్‌గా చెప్పారు. ప్రతి ఆడపిల్ల ఆ విషయంలో ఎందుకు ఫెయిల్ అవుతుందో కూడా మాట్లాడారు. మరి అవేంటో చూద్దామా..!పెళ్లి చాలా అందంగా ఉంటుంది, పెళ్లి ఊరేగింపు అట్టహాసంగా, వైభవంగా ఉంటుంది అంతే..అని అన్నారు. ఎందుకంటే అప్పటి వరకు ఆ మహిళకు చాలా సురక్షితమైన, ప్రేమగా, అండగా నిలిచే ఇంటిని వెళ్లిపోవాల్సి వస్తుంది కాబట్టి అది ఆమెకు 'మానసిక క్షోభే' అని నర్మగర్భంగా చెప్పారామె. అంతేగాదు ఒక మహిళ తన పుట్టింటిని విడిచి వెళ్లడమే కాకుండా, తన అత్తమామలను కూడా సొంత తల్లిదండ్రుల్లా చూడాలని ఆశిస్తారని, ఇది చాలా హాస్యాస్పదమైనదని అన్నారు. ఎందుకంటే అది ఆచరణ సాధ్యమైనది కాదని తేల్చి చెప్పారు. అసలు ఎవరైనా ఏదో ఒక మహిళను 'అమ్మా' అని పిలవగలరా? అది అసలు సాధ్యమేనా అని నిలదీశారు. వాస్తవం ఏంటంటే అసలు ఎవరూ అలా చేయలేరు, కానీ పెళ్లైన భారతీయ మహిళపై అలా చేయమని ఒత్తిడి చేస్తుంటారని అన్నారు. కొత్తగా పెళ్లయిన మహిళ తన భర్త ఇంటి వాతావరణం ఎలా ఉన్నా సరే, దానికి అనుగుణంగా సర్దుకుపోవాల్సి ఉంటుందని అన్నారు. ఎందుకంటే పెళ్లి అన్న రెండు అక్షరాలతో ఆమె ఇంటికి 'యజమాని'గా మారుతుంది కాబట్టి అని అన్నారు. అయినా ఒక మహిళ గృహిణిగా ఉండాలనుకుంటుందా లేదా అనే విషయాన్ని కుటుంబాలు అసలు ఆలోచించవని అన్నారు. ఒకవేళ వివాహిత ఉద్యోగం చేస్తుంటే, ఇంటి పనుల కోసం సహాయకులను (domestic help) నియమించుకోవచ్చని ఆమె సూచించారు. వివాహానికి ముందే జంటలు ఈ విషయం గురించి ఎందుకు చర్చించరని డాక్టర్ బేడీ ప్రశ్నించారు. అలాగే పెళ్లి తర్వాత కూడా ఉద్యోగం కొనసాగిస్తానని, ఇంటి పని కోసం సహాయకులను నియమించుకుంటానని, ఇద్దరూ కలిసి బాధ్యతలు పంచుకుంటూ ఇంటిని నడుపుకోవచ్చని మహిళ స్పష్టంగా చెప్పాలని అన్నారు. తద్వారా ఆమెకు తన ఉద్యోగాన్ని వదులుకోవాల్సిన అవసరం ఉండదని అన్నారు. నిజానికి పురుషులు తమ ఉద్యోగాలను వదలాల్సిన అవసరం ఉండదు కానీ మహిళలకే ఈ పరిస్థితి ఎదురవుతుంటుంది. చాలా సందర్భాల్లో మహిళలు వారి సొంత నిర్ణయంతోనే ఉద్యోగాలు వదిలేస్తుంటారని..ఇది ముమ్మాటికి వాళ్ల తప్పిదమేనని అన్నారు. ఎందుకంటే తాము కూడా సంపాదించి, తమ నిబంధనల ప్రకారం ఇంటిని నడపాలని వారు భావించరు. ఇద్దరూ ఆర్థికంగా సహకరించుకుంటూ మెరుగైన జీవితాన్ని గడపవచ్చని వాళ్లసలు ఆలోచించరు.అలాగే ప్రపంచ బ్యాంక్ 2024 నివేదిక ప్రకారం, మహిళలు "వివాహపరమైన ప్రతికూలత"ను (marriage penalty) ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నాయి. భారతదేశంలో పిల్లలు లేకపోయినప్పటికీ, వివాహం తర్వాత మహిళల ఉపాధి రేటు 12% తగ్గుతుంది. అశోక యూనివర్సిటీ నివేదిక ప్రకారం, దాదాపు 73% మంది భారతీయ మహిళలు పిల్లలు పుట్టిన తర్వాత తమ ఉద్యోగాలను వదిలేస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అంటే ఇక్కడ పెళ్లయిన మహిళ త్వరలోనే ఇల్లు, కుటుంబం, భర్తను చూసుకునే వ్యక్తిగా మారిపోతుందని డాక్టర్ కిరణ్ బేడీ అన్నారు. ఇప్పుడు అదే మహిళ ఉద్యోగం కూడా చేస్తానంటే..ఆమెకు వివాహ జీవితం కష్టమైపోతుందని అన్నారు. ఇక్కడ ఆడపిల్లలు తెలుకోవాల్సింది ఏంటంటే..భర్త నుంచి తగిన మద్దతు లభించడం లేదని భావిస్తే, పెళ్లి తర్వాత కూడా తమ తల్లిదండ్రులతో కలిసి జీవించేంత ధైర్యం, ఆర్థిక స్వాతంత్ర్యం మహిళలకు ఉండాలని ఆమె అన్నారు. పెళ్లి తర్వాత తల్లిదండ్రులను చూసుకోవడానికి వారితో కలిసి ఉండాలనుకునే మహిళను తక్కువగా చూడకూడదని, పైగా అటువంటి నిర్ణయాన్ని అభినందించాలని డాక్టర్ బేడీ పేర్కొన్నారు. (చదవండి: మూతపడిపోవాల్సిన వ్యాపారాన్ని కూతురు నిలబెట్టింది..! ఇవాళ అదికాస్తా..) -
మూతపడిపోవాల్సిన వ్యాపారాన్ని కూతురు నిలబెట్టింది..! ఇవాళ అదికాస్తా..
పిల్లలు తల్లిదండ్రులకెప్పుడూ చిన్నపిల్లలుగానే కనిపిస్తారు. వాళ్లకు ఏం తెలియదనే అనుకుంటారు. అలానే భావించాడు ఈ తండ్రి. కానీ అతడి కూతురు వ్యాపారం సవ్యంగా సాగక ఇబ్బంది పడుతున్న తండ్రి కష్టాన్ని గమనించింది. తనకు తోచిన విధంగా ఏదైనా సాయం అందించి తండ్రి వ్యాపారాన్ని కాపాడేందుకు ప్రయత్నించింది. చివరికి ఆమె కారణంగానే మూతపడాల్సిన వ్యాపారం కాస్త ఊహించన విధంగా లాభాల బాటపట్టింది. పేరెంటింగ్‌కి కొత్త నిర్వచనం నేర్పేలా తండ్రి ఉపాధిని రక్షించింది. అసలేం జరిగిందంటే..లండన్‌కి చెందిన రషీద్ లజ్రాక్ షోర్డిచ్లో షూ దుకాణాన్ని నడిపేవారు. వినియోగదారుల నమ్మకాన్ని గెలుచుకుని కొద్ది కాలంలోనే చిన్న దుకాణాన్ని కాస్త పెద్ద వ్యాపారంగా మార్చారు. అయితే చూస్తుండగానే అతడి 34 ఏళ్ల నాటి షాపు ఉన్న ప్రాంతం ఆధునికరించబడటంతో..అక్కడ ఉండే స్థానిక కస్టమర్ల ఆలోచనలు కూడా మారాయి. చుట్టూ చైన్ స్టోర్లు, కాఫీ షాపులు వంటి కొత్త దుకాణాల రాకతో..కుటుంబ వ్యాపారం కాస్త కష్టాల్లో పడింది. ఇక తన షూ షోరూమ్ 'రిచ్ కలెక్షన్ ఇటాలియా'ని మూసేయ్యడానికి రెడీ అయిపోయాడు. అప్పుడే అతడి కూతురు జినెబ్ లజ్రాక్, రంగంలోకి దిగి, ఏళ్ల తరబడి అమ్ముతున్న బూట్లు కచ్చితంగా సరికొత్త తరానికి నచ్చుతాయని గుర్తించింది. దశాబ్దాలుగా అతను అమ్ముతున్న బూట్లను యువ వినియోగదారులకు చూపించడానికి టిక్‌టాక్‌ను ఉపయోగించి..ప్రమోషన్ ఇచ్చే పని చేసింది. జినెబ్ టిక్‌టాక్ ద్వారా చేస్తున్న ప్రచారంతో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఆఖరికి కస్టమర్లు క్యూలో నిలబడి మరి కొనేలా క్రేజ్ సంపాదించుకుంది ఆ షాపు. ఇంతకుమునుపు ఆధునీకరణ కారణంగా రెగ్యులర్ కస్టమర్లు తగ్గిపోయారు. దాంతో ఆ టైంలో తన తండ్రికి ప్రాథమిక కస్టమర్లు ఆఫ్రికన్లేనని చెప్పిందామె. వాళ్లు కూడా రాను రాను మానేశారు. దాంతో వ్యాపారం ఇక కొనసాగించ లేని పరిస్థితి ఎదురైందని వెల్లడించింది. దాదాపు మూతపడుతుంది అనుకున్న తరుణంలో కూతురు జినెబ్ టిక్‌టాక్ వీడియోలతో నిలదొక్కుకునేలా చేసింది. ఆ వీడియోలలో తన తండ్రి షాపులో షూ కలక్షన్ల గురించి పూసగుచ్చినట్లుగా తెలిపింది. దాంతో ఒక ఫ్రెంచ్ టిక్‌టాకర్ ఆ దుకాణాన్ని సందర్శించి..ఆ షాపుని "దాగి ఉన్న ఆణిముత్యం"గా వర్ణించడంతో..ఊహించని విధంగా కస్టమర్ల రద్దీ పెరిగింది. అలాగే తన తండ్రి ప్రధానంగా "వయసు పైబడిన మహిళల కోసం ఆంటీ షూస్" అమ్ముతారంటూ..వాటి వివరాలను కూడా వివరించింది. అలాగే ఆ షాపులో కొన్ని రకాల కలెక్షన్లు..Y2K ఫ్యాషన్ ట్రెండ్‌కు సరిపోతాయని ఆమెకు తెలియదు. ఏదో సరగా తన తండ్రి దుకాణం గురించి వివరిస్తూ..Y2K-శైలి చెప్పుల శైలి గురించి మాట్లాడింది. అంతే ఒక్కసారిగా కస్టమర్ల తాకిడి ఎక్కువై..ఊహించని విధంగా అమ్మకాలు జోరందుకున్నాయి. ఫలితంగా ఒంటి చేత్తో షాపుని నిర్వహించడం కష్టమైపోయింది. చివరికి హెల్పర్లు అవసరమయ్యారు. దాంతో జినెబ్ స్వయంగా రిటైల్ అనుభవం లేనప్పటికీ, షాపులో పనిచేయడం ప్రారంభించింది. అలాగే ఎప్పటికప్పుడూ కొత్త సరుకుని తీసుకువచ్చి..కస్టమర్లను ఆకర్షిస్తూ..లాభల బాటలో దూసుకుపోతోంది. అంతేగాదు జినాబ్ త్వరలో ఆన్లైన్ బ్రాండ్‌ని కూడా ఏర్పాటు చేయాలని భావిస్తోంది. వివిధ దేశాల ప్రజలు నుంచి డిమాండ్ అధికమవ్వడంతో 'టిక్‌టాక్ షాప్' (TikTok Shop)ను కూడా ప్రారంభించింది. కాగా కూతురు కారణంగా మూసేద్దాం అనుకున్న షాపు దినదినాభివృద్ధి చెందడంతో అతడికి సోషల్‌మీడియా పట్ల ఉన్న దృక్ఫథం మారిపోయింది. ఒక చిన్న వ్యాపారానికి సోషల్ మీడియా ఉండటం ఎంత ముఖ్యమో తెలిసొచ్చింది. పైగా పరిస్థితులు కష్టంగా మారినప్పుడు కూడా ఎలా వ్యాపారాన్ని కొనసాగించాలో తెలుసుకున్నారు రషీద్. అంతేగాదు ఈ తండ్రీ కూతుళ్ల కథ ఒక ఆచరణాత్మక పాఠాన్ని కూడా అందిస్తోంది. అదేమిటంటే, పిల్లల కొత్త పోకడలు, సాంకేతికత, మారుతున్న వినియోగదారుల అభిరుచిని పేరెంట్స్ అంచనా వేయలేకపోయినా..పిల్లలు అర్థం చేసుకోగలరని తెలియజేసింది. అలాగే తనకు ఉన్న వ్యాపార అనుభవానికి సోషల్ మీడియా వంటి సాంకేతిక శక్తి కూడా తోడైతే..విజయవంతంగా వ్యాపారాన్ని నిర్వహించొచ్చని రషీద్ కథ తెలుపుతోంది కదూ..!.(చదవండి: ప్రోస్టేట్ కేన్సర్ ఎముకలకు వ్యాపిస్తుందా..? అమెరికా మాజీ అధ్యక్షుడు జోబైడెన్ కూడా..) -
వర్షాకాలంలో ఫ్యాషన్ కంటే కంఫర్ట్‌కే ప్రాధాన్యం! ఎందుకంటే?
వర్షాకాలం వచ్చిందంటే చల్లటి వాతావరణంతో పాటు ఉక్కపోత, అధిక తేమ, అకస్మాత్తుగా కురిసే వర్షాలు ఇబ్బంది పెడుతుంటాయి. ఇలాంటి సమయంలో దుస్తుల ఎంపిక చాలా ముఖ్యం. తేలికగా ఉండి, గాలి ప్రసరణకు వీలుగా, త్వరగా ఆరిపోయే వస్త్రాలను ఎంచుకుంటే తడిసిన దుస్తులతో ఇబ్బంది పడకుండా రోజంతా సౌకర్యంగా ఉండొచ్చు.తేలికపాటి వస్త్రాలకే ప్రాధాన్యం..కాటన్, లినెన్, రేయాన్, తేలికపాటి బ్లెండెడ్ ఫ్యాబ్రిక్స్ వంటి వస్త్రాలు వర్షాకాలంలో అనుకూలంగా ఉంటాయి. ఇవి గాలి ప్రసరణకు సహాయపడటంతో పాటు తేమ ఎక్కువగా ఉన్నప్పుడు శరీరానికి సౌకర్యవంతంగా ఉంటాయి. అయితే, పూర్తిగా తడిసిన కాటన్ దుస్తులు ఆరడానికి ఎక్కువ సమయం తీసుకోవచ్చు. దీంతో వర్షంలో ఎక్కువగా తిరిగేవారు త్వరగా ఆరిపోయే బ్లెండెడ్ లేదా సింథటిక్ వస్త్రాలను కూడా ఎంచుకోవచ్చు.జీన్స్, మందపాటి దుస్తులకు దూరంగా..వర్షంలో తడిస్తే డెనిమ్, ఉన్ని వంటి మందపాటి వస్త్రాలు బరువుగా మారడంతో పాటు ఆరడానికి చాలా సమయం పడుతుంది. దీంతో రోజంతా తడి, అసౌకర్యంగా అనిపించవచ్చు. అయితే, వర్షాకాలంలో పలుచటి, తేలికైన దుస్తులకు ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. అలాగే శరీరానికి బాగా అతుక్కుపోయే దుస్తుల కంటే కాస్త వదులుగా ఉండే దుస్తులు ధరించడం వల్ల తేమ, ఉక్కపోత నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది.వర్షం కోసం రెయిన్‌కోట్.. పాదాలకు వాటర్‌ప్రూఫ్ షూస్!రెయిన్ సీజన్లో అకస్మాత్తుగా వర్షం పడే అవకాశం ఉన్నప్పుడు బ్యాగ్‌లో తేలికపాటి రెయిన్‌కోట్, గొడుగు ఉంచుకోవడం చాలా ముఖ్యం. బయట ఎక్కువగా తిరిగేవారు నీటిని తట్టుకునే పాదరక్షలు ఉపయోగించడం ఎంతో ముఖ్యం. తడిసిన దుస్తులను ఎక్కువసేపు ధరించకుండా వీలైనంత త్వరగా మార్చుకోవడం కూడా ముఖ్యం. వర్షాకాలంలో ఫ్యాషన్ కంటే త్వరగా ఆరిపోయే, తేలికైన, శరీరానికి సౌకర్యంగా ఉండే దుస్తులకే ప్రాధాన్యం ఇవ్వడం ఉత్తమం. -
ప్రోస్టేట్ కేన్సర్ ఎముకలకు వ్యాపిస్తుందా..? అమెరికా మాజీ అధ్యక్షుడు జోబైడెన్ కూడా..
అమెరికా మాజీ అధ్యక్షుడు జోబైడెన్‌కి గతేడాది మే నెలలో తీవ్రమైన ప్రోస్టేట్ కేన్సర్ ఉన్నట్లు నిర్థారణ అయ్యింది. ఆ కేనర్స్కు గ్లీసన్ స్కోర్ 9 (గ్రేడ్ గ్రూప్ 5)" ఉన్నట్లు వెల్లడిచారు అమెరికా వైద్యులు. అమెరికన్ కేన్సర్ సొసైటీ ప్రకారం..కేన్సర్ చాలా అసాధారణంగా కనిపిస్తే..గ్రేడ్ 5 కేటాయిస్తారు. ఇక్కడ గ్లీసన్ స్కోర్, గ్రేడ్ గ్రూప్ అనేవి కేన్సర్ ఎంత వేగంగా పెరుగుతుందో తెలియజేసే సంఖ్యలు. గ్లీసన్ స్కోర్ 8-10 ఉంటే..కేన్సర్ ప్రోస్టేట్ నుంచి శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించే అవకాశాలు అధికం. ప్రస్తుతం జోబైడెన్ పరిస్థితి కూడా ఇలానే ఉంది. ఆయనకు కూడా కేన్సర్ మరింత విస్తరించిందని, చికిత్సలో తీవ్ర నొప్పితో బాధపడుతున్నారని ఆయన కుమారుడు హంటర్ బైడెన్ స్వయంగా వెల్లడించారు. అది ఎముకలను దాటి ఇతర ప్రాంతాలకు కూడా వ్యాపించిందని ఆయన తెలిపారు.ప్రోస్టేట్‌కు ఆ స్వభావం ఉంది..ఈ కేన్సర్ వెన్నుముక, కటి, తుంటి, పక్కటెముకలను ప్రభావితం చేస్తంఉది. దాదాపు అన్ని రకాల కేన్సర్లు ఎముకలకు వ్యాపించగలవు. కానీ కొన్ని రకాల కేన్సరలు ఎముకలకు వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వాటిలో రొమ్ము కేన్సర్, ప్రోస్టేట్ కేన్సర్ ఉన్నాయి. ప్రోస్టేట్ కేన్సర్ కణాలు ప్రాథమిక కణితి నుంచి విడిపోయి, రక్తప్రవాహం లేదా శోషరస వ్యవస్థ ద్వారా ప్రయాణించి..ఎముకల లోపల చేరి పెరుగుతాయి. ఫలితంగా కలిగే పరిణామాలు..ఎముకలకు కేన్సర్ వ్యాప్తి చెందడంతో అనేక తీవ్రమైన సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. వాటిలో కొన్ని..1. తీవ్రమైన ఎముక నొప్పిరాత్రిపూట లేదా కదలికల సమయంలో తీవ్రమయ్యే నిరంతర, మందమైన లేదా కొట్టుకుంటున్నట్లు ఉండే నొప్పి అత్యంత సాధారణ లక్షణాలలో ఒకటి. ఎందుకంటే కేన్సర్ సాధారణ ఎముక నిర్మాణాన్ని దెబ్బతీసి, గణనీయమైన అసౌకర్యాన్ని కలిగిస్తుంది.2. ఎముకలు విరగడంఅత్యంత బలహీనమైన నిర్మాణం కారణంగా, చిన్నపాటి కదలికలు లేదా జస్ట్ కిందపడటంతోనే ఎముకలు విరిగిపోతాయి.3. హైపర్కాల్షిమియాఎముకలకు కేన్సర్ వ్యాపించడం వల్ల రక్తంలో కాల్షియం స్థాయిలు పెరిగి, వికారం, డీహైడ్రేషన్, గందరగోళం, ఇతర తీవ్రమైన ఆరోగ్య సమస్యలు కలుగుతాయి.4. వెన్నుపాముపై ఒత్తిడివెన్నుపూసకు సమీపంలో మెటాస్టేసిస్ సంభవిస్తే, అవి వెన్నుపామును ఒత్తిడికి గురిచేసి, బలహీనత, స్పర్శజ్ఞానం కోల్పోవడం లేదా పక్షవాతానికి దారితీయవచ్చు.5. కదలిక తగ్గడంనొప్పి, ఎముకలు విరగడం వల్ల రోగి కదలడం పరిమితం కావచ్చు, ఇది వారి జీవన నాణ్యత, స్వాతంత్ర్యంపై ప్రభావం చూపుతుంది.6. ఎముక మజ్జపై ప్రభావంఎముక మజ్జలో చేరిన కేన్సర్, శరీరం ఎర్ర, తెల్ల రక్త కణాలను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది, దీనివల్ల అలసట తోపాటు తరచుగా ఇన్ఫెక్షన్లు వస్తాయి.చికిత్సా పద్ధతులుసాధారణంగా ఎముకలకు వ్యాపించిన కేన్సర్‌ను నయం చేయలేనప్పటికీ, ఈ వ్యాధిని నియంత్రించడానికి, లక్షణాలను తగ్గించడానికి అనేక చికిత్సా పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో హార్మోన్ థెరపీ, రేడియేషన్ థెరపీ, బిస్ఫాస్ఫోనేట్లు, కీమోథెరపీ, టార్గెటెడ్ థెరపీలు, శస్త్రచికిత్స వంటి ఉపశమన చికిత్సలు ఉన్నాయి.ఎముకలకు వ్యాపించిన కేన్సర్ అనేది ముదిరిన దశకు ఒక సంకేతం. దీనిని అధికారికంగా స్టేజ్ IV ముదిరిన వ్యాధిగా వర్గీకరించారు. అంటే కేన్సర్ ఇకపై ప్రోస్టేట్ గ్రంథికి మాత్రమే పరిమితం కాకుండా, శరీరమంతటా వ్యాపించి వ్యాధిగా మారిందని అన్నారు. దీనికి కేవలం ఒక నిర్దిష్ట ప్రదేశంలోనే చికిత్స కాకుండా, పూర్తి శరీర చికిత్స అవసరం అని వైద్యులు చెబుతున్నారు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాకలు వ్యక్తిగత వైద్యలు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: నో జిమ్, నో సప్లిమెంట్లు..! 75 ఏళ్ల వయసులోనూ ఆ అమ్మమ్మ..) -
నో జిమ్, నో సప్లిమెంట్లు..! 75 ఏళ్ల వయసులోనూ ఆ అమ్మమ్మ..
జీవితంలో ఏదో ఒక దశలో ఒంటిరిగా జీవించక తప్పని పరిస్థితి ఎదురవుతుంటుంది. దాంతో చాలామంది బెంగగా ఫీలవ్వతూ బతకేందుకు ఆందోళన చెందుతుంటారు. కొందరు మాత్రం ఒకరికీ భారంగా కాకుండా హుషారుగా, మంచి అభిరుచిని ఏర్పరుచుకుని సాగిపోతుంటారు. ఇతరులకు మార్గదర్శకంగా నిలుస్తుంటారు. అలాంటి కోవకు చెందిందే ఈ 75 ఏళ్ల అమ్మమ్మ. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ బామ్మ 'పరివృత్త జాను శిరాసన', 'ఉత్థిత పద్మాసనం', 'బైసెప్ కర్ల్స్', 'సీటెడ్ ఫార్వర్డ్ బెండ్' వంటి యోగాసనాలను ఎంతో సునాయాసంగా వేసేస్తుంటుంది. అంతేగాదు ఆమె బరువు కూడా ఆరోగ్యకరమైన స్థిరమైన బరువుని మెయింటైన్ చేయడం విశేషం. చాలామంది ఇదెలా మీకు సాధ్యం అని అడుగుతుంటారు. నిజం చెప్పాలంటే ఒకప్పుడు ఆమెకు ఫిట్నెస్ గురించి ఆలోచించడానికి సమయమే దొరికేది కాదు. ఎందుకంటే 15 ఏళ్లకే పెళ్లై, ఉమ్మడి కుటుంబంలో అడుగుపెట్టింది. ఉదయం 5 గంటలకు ప్రార్థనలతో మొదలై, ఆరు గంటలకల్లా సందడిగా మాపోయేది. వంట చేయడం నుంచి చేతితో బట్టలు ఉతడకం, పిల్లలను పెంచడం, ప్రతిరోజు అతిథులు రావడం తదితర పనులతో గడిచిపోయేది. ఆమె అందరినీ చూసుకోవడంలో పడి, తనని తాను చూసుకోవడం మర్చిపోయానని చెప్పుకొచ్చింది. తన జీవితంలో క్లిష్ట దశ ఒకటి ఉందంటూ..ఆ దురదృష్టకరమైన పరిస్థితిని గుర్తుతెచ్చుకొన్నారు. పదేళ్ల క్రితం భర్త చనిపోవడం మొత్తం పరిస్థితి మారిపోయిందని చెప్పుకొచ్చింది. ఎందుకంటే ఒక్కసారిగా ఇల్లంతా నిశబ్దంగా మారిపోయింది. ఒంటరితనం ఆవహించేస్తున్నా..దాన్ని అదిగమించేలా మేడమీదకు వెళ్లి స్ట్రెచింగ్ చేయడం మొదలుపెట్టింది. టీవీలో యోగాసనాలను చూడటం లేదా దగ్గర్లో ఎవరైనా సాధన చేస్తుంటే గమనించడం చేస్తుండేది..అలా ఆమె జీవితంలో యోగా ఒక దినచర్యగా మారిపోయింది. అంతేగాదు ఆమె రోజు.. ఉదయం నాలుగు గంటలకు మొదలవుతుంది. వాకింగ్ , యోగా, పుస్తకాలు చదవడం, ఇల్లంతా శుభ్రం చేయడం వంటి పనులతో ముగుస్తుంది. తన ముగ్గురు కుమార్తెలు, కుమారుడు వేర్వేరు ప్రదేశాల్లో నివశిస్తున్నారని, కొందరు విదేశాల్లో ఉన్నారని, వాళ్లంతా తన గురించి ఆందోళన చెందకుండా ఉండేలా బతుకుతున్నానని అన్నారు. అలాగే పొరుగువారికి పాపడ్లు వంటి ఇతర పనుల్లో సహాయం చేస్తుంటానని అన్నారు. బహుశా అందుకేనేమో 75 ఏళ్ల వయసులో కూడా జీవితం నెమ్మదించిందని అనిపించదు. ఇప్పటికీ ప్రతి ఉదయం ఏదైనా కొత్త విషయం నేర్చుకోవాలనే ఉత్సాహంతో నిద్రలేస్తాను అలా ఒంటిరితనాన్ని జయించి, అర్థవంతంగా మార్చుకున్నానని చెప్పుకొచ్చింది. అందువల్లే స్థిరమైన ఆరోగ్యకరమైన బరువుతో ఉన్నట్లు తెలిపారు. ఎలాంటి జిమ్, సప్లిమెంట్లు మాత్రం లేవు అని చమత్కరిస్తూ రాసుకొచ్చారు పోస్ట్‌లో. View this post on Instagram A post shared by Humans of Bombay (@officialhumansofbombay) (చదవండి: సహారా ఎడారి అడుగున దాగున్న అద్భుతాలు.. కాలగర్భంలో కలిసిపోయిన రహస్యాలు ఇవే!) -
సహారా ఎడారి అడుగున దాగున్న అద్భుతాలు.. కాలగర్భంలో కలిసిపోయిన రహస్యాలు ఇవే!
ప్రపంచంలోనే అతిపెద్ద ఉష్ణ ఎడారిగా పేరుగాంచిన సహారా ఎడారి గురించి అందరికీ తెలుసు. ఆఫ్రికా ఖండంలో దాదాపు మూడో వంతు ఆక్రమించి ఉన్న ఈ ఎడారి అపారమైన విశాలత్వానికి, నిర్జన ప్రదేశాలకు మారుపేరు. ఎటు చూచినా మైళ్ల కొద్దీ ఇసుక దిబ్బలు, ఏ మనుషులూ, చెట్లు కనిపించని ఈ భయంకరమైన వాతావరణంలో వేసవిలో ఉష్ణోగ్రతలు దాదాపు 50 డిగ్రీల సెల్సియస్ వరకు చేరుకుంటాయి. అయితే, చూడటానికి కేవలం ఇసుక మేటల వలె కనిపించే ఈ సహారా ఎడారి కింద మానవ చరిత్రను మార్చేయగల ఎన్నో అద్భుతమైన రహస్యాలు, విస్మయకరమైన నిజాలు ఇసుక అడుగున దాగున్నాయని ఆధునిక శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.రెండో ప్రపంచ యుద్ధ శకానికి చెందిన విమాన అవశేషాలు:రెండో ప్రపంచ యుద్ధ సమయంలో నార్త్ ఆఫ్రికా క్యాంపెయిన్‌లో భాగంగా సహారా ఎడారి ప్రాంతం ఒక ప్రధాన వైమానిక యుద్ధ రణరంగంగా మారింది. ఈ పోరులో వేలాది యుద్ధ విమానాలు కూలిపోయాయి. వాటిలో చాలా వరకు ఎడారిలో అదృశ్యమయ్యాయి. ఉదాహరణకు, 1943లో కూలిపోయిన అమెరికన్ 'లేడీ బి గుడ్' (Lady Be Good) బాంబర్ విమానం, దాదాపు 15 ఏళ్ల తర్వాత 1958లో ఎడారి మధ్యలో యాదృచ్ఛికంగా బయటపడింది. అలాగే, 70 సంవత్సరాల తర్వాత 2012లో బయటపడిన బ్రిటిష్ ఫైటర్ పైలట్ డెన్నిస్ కాప్పింగ్ (Dennis Coppings) పీ-40 కిట్టిహాక్ విమానం ఇందుకు నిదర్శనం. ఇసుకలో కూరుకుపోయినా చెక్కుచెదరకుండా ఉన్న ఈ విమానాలు, ఆనాటి భయంకరమైన యుద్ధ పరిస్థితులకు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి.తిమింగలాల శ్మశాన వాటిక (Valley of the Whales):ఈజిప్ట్‌లోని కైరోకు నైరుతి దిశలో ఉన్న 'వాడి అల్-హిటాన్' (Valley of the Whales) ప్రాంతం ప్రపంచంలోనే అత్యంత విస్మయకరమైన ప్రదేశం. సముద్రానికి వందల మైళ్ల దూరంలో, ఎడారి మధ్యలో ఉన్న ఈ ప్రాంతంలో వేలాది తిమింగలాల శిలాజాలు (Fossils) బయటపడ్డాయి. ఇంచుమించు 4 కోట్ల సంవత్సరాల క్రితం ఇక్కడ 'టెథిస్ సముద్రం' ఉండేదని, ఆ కాలంలో ఇవి జీవించాయని పరిశోధకులు తేల్చారు. ఇక్కడ లభించిన బాసిలోసారస్ (Basilosaurus) శిలాజాలకు చిన్నపాటి వెనుక కాళ్లు ఉండటం, తిమింగలాలు భూమిపై నుంచి సముద్రంలోకి ఎలా పరిణామం చెందాయనేదానికి తిరుగులేని శాస్త్రీయ ఆధారాలను అందించింది.గరామాంటెస్ సామ్రాజ్యం - అద్భుతమైన నీటి నెట్వర్క్:దక్షిణ లీబియాలోని ఎడారి మధ్యలో ఎవరికీ అంతుచిక్కని మరో రహస్యం ఉంది. 2011లో శాస్త్రవేత్తలు శాటిలైట్ చిత్రాల ద్వారా 'గరామాంటెస్' (Garamantes) అనే శక్తివంతమైన ప్రాచీన ఆఫ్రికా సామ్రాజ్య అవశేషాలను కనుగొన్నారు. వర్షపాతమే లేని ఈ కఠినమైన ఎడారిలో వీరు వేలాది మంది జనాభాతో పట్టణాలు, కోటలు నిర్మించారు. భూగర్భం గుండా కిలోమీటర్ల కొద్దీ 'ఫోగారాస్' (Fogaras) అనే నీటి కాలువలను తవ్వి, అడవులను తలపించేలా వ్యవసాయం చేసిన వీరు గొప్ప ఇంజనీర్లుగా నిరూపించుకున్నారు.గ్రీన్ సహారా 'గెబరో' (Goberro) శ్మశాన వాటిక:సహారా ఎడారి ఎప్పుడూ ఇలాగే లేదు. భూమి భ్రమణంలో జరిగే మార్పుల (Precession) కారణంగా ప్రతి 21 వేల సంవత్సరాలకు ఒకసారి ఈ ప్రాంతంలో రుతుపవనాలు మారి, వర్షాలు కురిసి పచ్చని అడవులుగా మారుతుంది. చివరిసారిగా 14,000 నుంచి 5,500 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతం దట్టమైన అడవులు, నదులతో కళకళలాడింది. నైగర్ దేశంలోని 'గెబరో' (Goberro) ప్రాంతంలో జరిపిన తవ్వకాల్లో 9,500 ఏళ్ల కిందటి మానవ సమాధులు బయటపడ్డాయి. చేపలు, మొసళ్లు, జిరాఫీలు జీవించిన ఆ కాలంలో.. మానవులు ఇక్కడ సంతోషంగా జీవించి, ఆ తర్వాత ఎడారిగా మారుతున్నప్పుడు ఈ ప్రాంతాన్ని విడిచి వెళ్లిపోయారు.తామ్రసెట్ (Tamanrasset) మహా నది:గ్రీన్ సహారా కాలంలో ఈ ఎడారి గుండా 'తామ్రసెట్' అనే అతిపెద్ద నది ప్రవహించేదని శాస్త్రవేత్తలు 2015లో కనుగొన్నారు. ఆఫ్రికాలోనే రెండవ అతిపెద్ద నదిగా నిలిచే ఈ నది జాడలు మైక్రోవేవ్ రాడార్ శాటిలైట్ల ద్వారా వెలుగులోకి వచ్చాయి. ఈ నది ఒడ్డున కూడా ప్రాచీన నాగరికతలు వర్ధిల్లి ఉంటాయని పరిశోధకులు భావిస్తున్నారు.మొత్తానికి, పైన ఎడారి రూపంలో నిశ్శబ్దంగా కనిపిస్తున్న ఈ సహారా ఇసుక దిబ్బల కింద మానవ చరిత్రకు సంబంధించిన ఎన్నో అద్భుతాలు, మరెన్నో వింతలు భవిష్యత్ తరాల కోసం ఇంకా దాగున్నాయి!.(చదవండి: ఐదు పదుల వయసులోనూ అంతే యంగ్‌గా ప్రిన్స్ మహేశ్..! ఆకర్షణీయమైన రూపం కోసం..)


