పిల్లలతో  ఆటాపాటా.. వృద్ధులకు  ఉల్లాసం | Surprising Brain Benefit of Spending Time With Grandkids | Sakshi
Sakshi News home page

పిల్లలతో  ఆటాపాటా.. వృద్ధులకు  ఉల్లాసం

Feb 27 2026 6:24 AM | Updated on Feb 27 2026 6:24 AM

Surprising Brain Benefit of Spending Time With Grandkids

మనవళ్లు, మనవరాళ్లతో గడపడం అనేది వృద్ధుల బ్రెయిన్‌కు మంచి టానిక్‌లా పని చేస్తుందని   డచ్‌ శాస్త్రవేత్తలు నిర్వహించిన ఒక పరిశోధనలో తేలింది. పిల్లల సంరక్షణలో పాలు పంచుకునే వృద్ధుల జ్ఞాపకశక్తి మిగతా వారితో పోలిస్తే మెరుగ్గా ఉన్నట్లు తేలింది. అంతేకాదు, దానివల్ల వారికి వయసు పరంగా వచ్చే మానసిక సమస్యల నుంచి కూడా రక్షణ లభిస్తుందని పరిశోధకులు తెలిపారు. 

ఈ అధ్యయనం కోసం 67 ఏళ్ల సగటు వయసు కలిగిన 2887 మంది తాతాబామ్మలను ఎంపిక చేశారు. కొన్ని ఏళ్లపాటు వీరిని పరిశీలనలో ఉంచి డేటాను సేకరించారు. పిల్లలతో ఎంత సమయం గడుపుతున్నారు, వారికి కథలు చెప్పడం, సందేహాలు తీర్చడం వంటì  వాటిలో వారు ఎంత చురుగ్గా పాల్గొంటున్నారో వారి పరిశోధనలో విశ్లేషించగా... పిల్లల సంరక్షణలో పాల్గొనే వారిలో జ్ఞాపకశక్తి, పదాలను స్పష్టంగా ఉపయోగించే పరీక్షలో మెరుగైన ఫలితాలు సాధించినట్లు పరిశోధనలో తేలింది. 

పిల్లలతో అనుబంధం ఉండే వృద్ధులలో వారి శరీరంలో ఒత్తిడిని కలిగించే హార్మోన్లు తగ్గి, మానసిక ప్రశాంతత లభిస్తుంది. పిల్లలతో మాట్లాడటం, వారికి విషయాలు వివరించడం వల్ల మెదడు కణాలు చురుగ్గా ఉంటాయి. పిల్లల వెనుక పరుగెత్తడం, వారితో ఆడుకోవడం వల్ల తెలియకుండానే వ్యాయామం జరుగుతుంది. మెరుగైన రక్తప్రసరణ వల్ల మెదడుకు ఆక్సిజన్‌ అందుతుంది, ఇది మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. ఒక్కమాటలో చె΄్పాలంటే, పిల్లల ఆలనాపాలనా చూడటం అనేది కేవలం సరదా కోసం, బాధ్యత కోసం కాదు, వృద్ధాప్యంలో మెదడు చురుగ్గా ఉండటానికి కూడా ఎంతో మేలు చేస్తుందని పరిశోధకులు తెలియజేశారు.

Advertisement
 
Advertisement
Advertisement