ప్రపంచంలోనే అతిపెద్ద భూ నత్త గురించి తెలుసా? | Meet Gee Geronimo, The Worlds Largest Land Snail, Check Its Record And Interesting Unknown Facts In Telugu | Sakshi
Sakshi News home page

ప్రపంచంలోనే అతిపెద్ద భూ నత్త గురించి తెలుసా?

Feb 20 2026 3:23 PM | Updated on Feb 20 2026 3:55 PM

The worlds largest Land snail check its record

ప్రపంచంలోనే అతిపెద్ద  భూనత్త (LandSnail) గురించి తెలుసా? గీ జోరోనిమో అనే పెద్ద ఆఫ్రికన్ భూనత్త  అతిపెద్ద నత్తగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకుంది. ఇంతవరకూ ఈ రికార్డు చెక్కు చెదరకుండా ఉంది ఆసక్తికరంగా. పదండి ఆ వివరాలు తెలుసుకుందాం.

సాధారణంగా నత్తచాలా చిన్న ప్రాణి.  గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం, 1978లో పశ్చిమ ససెక్స్ (West Sussex) లో కొలవబడిన 'గీ జెరోనిమో' (Gee Geronimo) అనే 27.3 సెంటీమీటర్ల పొడవుతో 'జెయింట్ ఆఫ్రికన్ ల్యాండ్ స్నేయిల్' ప్రపంచంలోనే అతిపెద్ద భూచర నత్తగా గుర్తింపు పొందింది. అయితే, సముద్రపు జాతులతో పోలిస్తే ఇది చాలా చిన్నది.

జెయింట్ ఆఫ్రికన్ భూ నత్త రికార్డు
భూ నివాస జాతులలో జెయింట్ ఆఫ్రికన్ భూమినత్తలు ప్రత్యేకం. ఇందులో రికార్డ్‌ కొట్టేసిన గీ జెరోనిమోను పెంపుడు జంతువుగా పెరిగింది. దీని యజమాని ఇంగ్లాండ్‌లోని వెస్ట్ సస్సెక్స్‌కు చెందినవాడు. ఈ నత్త షెల్ 27.3 సెంటీమీటర్ల పొడవు. బరువు దాదాపు కిలోగ్రాము బరువు. ఈ నత్తలకు మందపాటి, శంఖాకారంలో ఉండే చిప్పలు ఉంటాయి. వేడి వాతావరణం, నియంత్రిత పరిస్థితులను బట్టి వీటి పరిమాణం ఉంటుంది. అయినప్పటికీ, గీ జెరోనిమో ఇప్పటికీ ఒక అద్భుతంగానే మిగిలి ఉంది.

మూడేళ్ల పిల్లాడంత నత్త
అయితే సముద్ర నత్తలు ఇంకా పెద్దవిగా పెరుగుతాయి. ఆస్ట్రేలియన్ ట్రంపెట్ షెల్ వంటి సముద్ర జాతులు సాధారణ  నత్తలతో పోలిస్తే భారీ పరిణమాణంలో ఉంటాయి.దాదాపు  72.2 సెంటీమీటర్ల పొడవు వరకు పెరుగుతాయి. అంటే  దాదాపు మీటరు పొడవు, మూడేళ్ల పిల్లాడంత బరువు అన్నమాట. ఇండో-పసిఫిక్ సముద్ర జలాల్లోని ఇసుక పొరలలో నివసిస్తాయి. వీటి పొడవైన చిప్పలు చాలా ప్రత్యేకం.

నత్తలు 'మొలస్కా' (Mollusc) అనే విభిన్న సమూహానికి చెందినవి. వీటి పెరుగుదల ఆహారం, పర్యావరణంపై ఆధారపడి ఉంటుంది. భూమిపై ఉండే నత్తలు ఊపిరితిత్తుల వంటి కుహరం ద్వారా గాలిని పీల్చుకుంటాయి, కానీ సముద్రపు నత్తలు నీటి నుండి ఆక్సిజన్‌ను గ్రహిస్తాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement