60 సెకన్లలో కేరళ ట్రూ స్టోరీ : ఒట్టపాలెం కథ కావాలి స్ఫూర్తి! | Moving bus catches fire in Kerala Ottapalam True Story in 60 Seconds | Sakshi
Sakshi News home page

60 సెకన్లలో కేరళ ట్రూ స్టోరీ : ఒట్టపాలెం కథ కావాలి స్ఫూర్తి!

Feb 19 2026 2:52 PM | Updated on Feb 19 2026 3:07 PM

Moving bus catches fire in Kerala Ottapalam True Story in 60 Seconds

సోషల్‌ మీడియా రెండువైపులా పదును ఉన్న కత్తి లాంటిది. దాన్ని ఎపుడు ఎలా  వినియోగించుకుంటున్నా మన్నదానిమీదే  మనుషుల విజ్ఞత ఆధారపడి ఉంటుంది. సరైన సమయంలో సరిగ్గా వాడుకోవాలి. ముఖ్యంగా ప్రమాదాల సమయంలో బాధితులను సాయం అందించేందుకు ముందుకు రావాలి తప్ప, వీడియోలు తీస్తూ కాలయాపన చేయకూడదు. క్రైసిస్‌ మేనేజ్‌మెంట్‌ చాలా ముఖ్యం. ఈ విషయాన్నే ఇటీవల కేరళలో జరిగిన బస్సు ప్రమాద ఘటన నిరూపించింది. క్రైసిస్‌ మేనేజ్‌మెంట్‌  అంటే  ఎలా ఉండాలి? అతి క్లిష్టమైన సమయంలో  పౌర సమాజం  తక్షణమే స్పందించి  బాధ్యతగా ఎలా ప్రవర్తించాలనే దానిపై ఒక వీడియో నెట్టింట ఆసక్తికరంగా మారింది. దీనికి సంబంధించిన వివరాలు ఉన్నాయి.

పాలక్కాడ్‌లోని ఒక చిన్న పట్టణం ఒట్టపాలెం, కానీ అక్కడ జరిగిన ఉదంతాన్ని ఉదాహరిస్తూ సంక్షోభ నిర్వహణలో ఒక మాస్టర్ క్లాస్ అంటూ   ఎక్స్‌లో ఒక  వీడియో షేర్‌ అయింది. దీని ప్రకారం కదులుతున్న బస్సుకు మంటలు అంటుకున్నాయి.  పౌరసమాజం స్పందించిన తీరు,  చూపింని ధైర్యసాహసాలను  60 సెకన్ల వీడియో చూడవచ్చు.

థాయ్‌లాండ్‌లో అరుదైన దృశ్యం : ఇలా వచ్చి..అలా!


 

​10వ సెకన్‌: బస్సు తలుపులు తెరుచుకున్నాయి.  జనం బయటకు రావడం ప్రారంభించారు.

​30వ సెకన్‌: స్థానికంగా ఉన్న  ఏ  ఒక్కరూ  ఈ సంఘటనను రికార్డ్‌ చేయడానికి రాలేదు. ప్రమాదంలో  ఉన్న వారిని ఆదుకునేందుకు అగ్నిమాపక యంత్రంతో వచ్చాడు.

​35వ సెకన్‌: అగ్నిమాపక యంత్రంతో మరో ముగ్గురు నలుగురు మంటల్ని ఆర్పుతున్నారు. 

50వ సెకన్‌: ప్రతీ ప్రయాణికులు సురక్షితంగా, క్షేమంగా బయటికి వచ్చాడు.

60వ సెకన్‌: మంటలు  ఆరిపోయాయి.  

ఏం జరిగిందంటే..

కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో మంగళవారం (ఫిబ్రవరి 17) ఒట్టపాలెంలో ఈ ఘటన జరిగింది. పాలక్కాడ్ నుండి గురువాయూర్‌కు వెళ్తున్న ఒక ప్రైవేట్ బస్సు మంటల్లో చిక్కుకుంది. వెనుక ఉన్న డోర్‌ తెరుచుకుంది కానీ ముందు ఆటోమేటిక్ తలుపు మూసుకుపోయింది. దీంతో తీవ్ర ఆందోళన రేగింది.  ఒక పొక్క చుట్టు ముడుతున్న పొగ మరోపక్క ప్రాణాపాయంలో పదుల సంఖ్యలో ప్రయాణీకులు.  అటుగా వచ్చిన డెలివరీ ఏజెంట్  ఇది చూసి వెంటనే స్పందించాడు తలుపును పగలగొట్టడంతో పెను ముప్పు తప్పింది.  సమీపంలోని ఆటో-రిక్షా డ్రైవర్లు ,దుకాణదారులు అగ్నిమాపక యంత్రాలతో సాయుధంగా సంఘటనా స్థలానికి చేరుకుని, మంటలను అదుపు చేసేందుకు కృషి చేశారు. బస్సు సిబ్బంది, ఇతర స్థానికులు సహాయక చర్యల్లో చేరి, సకాలంలో అందరినీ సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.

ఇదీ చదవండి: ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌లో మరో కలకలం : ఉమ్మెత్త పూలతో అరాచకాలు

నోట్‌ : అక్కడున్న ఎవ్వరూ తమ మొబైల్‌తో వీడియోలను తీయడం లేదంటూ ఒక ముఖ్యమైన సందేశాన్ని చెప్పకనే చెప్పారు. ఇలాంటి ప్రమాదాలు జరిగినపుడు సాధారణంగా అందరూ చేసేది స్మార్ట్‌ఫోన్‌తో వీడియో తీసే పనిలో మునిగిపోతారు. నిజానికి అది కాదు చేయాల్సింది. వెంటనే బాధితులను ఆదుకునేందుకు, ప్రమాద తీవ్రతను తగ్గించేందుకు తమ వంతు సాయం చేయాలి. ఇలా చేస్తూనే సంబంధిత అధికారులకు సమాచారాన్ని చేయడం. తత్ఫలితంగా చాలా ప్రాణాలను కాపాడవచ్చు. ఎన్నో కుటుంబాలు అనాథలు కాకుండా కాపాడవచ్చు. ఏమంటారు?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement