హైదరాబాద్: నెలవంక దర్శనంతో సైరన్లు మోగించి రంజాన్ (Ramadan 2026) నెల ప్రారంభమైనట్లు మత గురువులు ప్రకటించారు. ముస్లింలు పరస్పరం ఆత్మీయ శుభాకాంక్షాలు తెలుపుకుంటూ పవిత్ర రంజాన్ మాసానికి ఆహ్వానం పలికారు.
నగరంలోని మసీదులన్నీ ముస్తాబయ్యాయి. గురువారం తెల్లవారుజాము నుంచి ఉపవాస దీక్షలకు సమాయత్తమయ్యారు. పవిత్ర ప్రార్థనలతో నగరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకోనుంది. నెలరోజుల పాటు మసీదులు కళకళలాడుతూ కనిపించనున్నాయి.


